సంగమేశ్వర శతకం

 సంగమేశ్వర శతకం

కృష్ణా –తుంగభద్రా సంగమం లో చామర్ల పూడి(సంగం జాగర్లమూడి ) గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామిపై శ్రీ పరిమి వేంకటాచలకవి శతకం రాయగా ,గుంటూరు వాసి శ్రీ పరిమి కృష్ణయ్య గారిచే  బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో శ్రీ క.కోదండరామయ్య చే 1931లో ప్రచురింపబడింది. వెల.రెండు అణాలు .

  విజ్ఞప్తిలో’’ ఈకవి ఆది శాఖీయబ్రాహ్మణుడుఅని,పేరు పరిమి వేంకటాచల౦  అని ,హరితస గోత్రం ,తండ్రి రఘునాయకుడు ,తల్లి సూరమాంబ .ఈకవి నూట ఇరవై ఏళ్ళ క్రిందటివాడు అంటే సుమారు 1811 నాటివాడు .వీరి సంతానం గుంటూరు మండలం లో వ్యాపించి ఉంది .గుంటూరు పుర పారిశుధ్య సంఘ కార్యాలయ ఉద్యోగి పరిమి సూర్యనారాయణ ,విజయవాడ ప్రభుత్వ ఔషధాలయ ఉద్యోగి పరిమి సీతారామయ్య ఈ కవి సంతతి లోని వారే ..సూర్యనారాయణ ఈకవికి అయిదవ తరం వాడు .సంస్కృత ఆంధ్రాలలో కవికి అసామాన్య పాండిత్యం ఉంది .శతకం సంస్కృత పద భూయిష్టం అయినా,మూలపదాలుకాని కటువైన పదాలుకానీ లేకుండా నిరర్గళ ధారాశుద్ధి ,తో ద్రాక్షాపాకం తో,భక్తిరసం వెల్లి విరిసేట్లు ,ఇప్పటిశతకాలకు ఏ మాత్రం తీసిపోకుండా సలక్షణంగా ఉంది ‘’  అని కర్లేపాలెం కోదండ రామయ్యగారు శ్లాఘించారు .ఉత్పలమాలా శతకం ఇది .’’కూడలి సంగమేశ్వరా ‘’అనేది శతకం మకుటం .

  మొదటి పద్యం –‘’శ్రీ గిరిజా పయోధర పరిస్ఫుట చర్చిత సారగంధ గం –దధాగరు కుంకుమాంకిత ,సమంచి దురస్కజగత్ప్రపాలనో –ద్యోగ మనస్క ,శారద పయోద సమాన యశస్క ,సంతతా –భోగ వయస్క ,సర్వమునిపూజిత ‘’కూడలి సంగమేశ్వరా ‘’..రెండవ పద్యం లో’’వృషాధి రాజ కంఖాణ,మురారిబాణ’’అని విచిత్ర పద ప్రయోగం చేశారు కవి .తర్వాత ‘’భాసిత మందహాస ,పరిపాలిత దాస ,వ్రతోగ్ర కల్మష త్రాస ,పరాక్రమానల విదగ్ధ నిశాచర ఘాస ,సంతతోల్లాస ,శివా మనోహర విలాస ,సురాద్రి శరాస ,దివ్య కైలాస నివాస ‘’అ౦టూ సకార ప్రయోగంతో కవితాప్రాకారం కట్టి  కదను తొక్కించారు .తర్వాత టకార ప్రయోగంతో వృషాద్రిప ఘోట , హిమాద్రి మనోబ్జాట లసత్కిరీట ,సుజనౌఘ భవాబ్ది కృపీట,జాహ్నవీ జూట ,కరాగ్ర శోభిమృగ శూల విధాత్రుక కోట,వాజ్నిరాఘాట విపత్కవాట ‘’అంటూ టకటక లాడించారు పద్యాన్ని.భాషపై ఎంతటి పట్టు ఉందొ ప్రకటించారు .ఆతర్వాత డకార ,దంభ రంభ డింభ స్తంభ లతో మరి రెండు పద్యాలు ఢంకా మోగించి చెప్పారు .ఈశ వినాశ ,దినేశ పాశ ,కేశాలతో పద్యం జడ అల్లారు  .ఇలా ప్రతిపద్యంలో సంగమేశుని  కీర్తించి కవితా కృష్ణా తుంగ లను సంగమింప జేసి ఉత్పల మాలికలల్లి అర్చించారు .

   ఆతర్వాత మాదిరాజు ,పండితార్య బసవయ్య ,కాటకోటయ్య ,కేశిరాజు శిరియాళు,చోళ మహేశు ,సిద్ధరామయ్య బాచి రాజు వరదయ్య లనే శివ భక్తులను కీర్తించారు .’’తల్లికి ఉండే దయ బిడ్డపై దాసికి ఉంటుందా ‘’అంటూ నువ్వే దిక్కు అన్నారు .రారా చలమేరరా ,వినరాఏలుకోరా ,పలకరా మది నమ్మితిరా పదభక్తినియ్యరా ‘’అని వేడుకున్నారు  చనువు మీరా .నీమిత్రుడు ధనదుడు ఇల్లు వెండికొండ ,కాంచన గిరి చాపం ,సర్వ విభూతులు కలిగికూడా  ‘’ తనయుని పెండ్లి చేయని ఉదార గుణుడవు .అలాంటి నిన్ను వెంబడించే నన్ను అనాలికాని నిన్నని ప్రయోజనం ఏమిటి అని నర్మగర్భంగా పలికారుకవి .

  రోకలి తోకోట్టినా ,రాళ్ళు రువ్వినా ,నంజుడు తి౦డిపెట్టినా ,సహిఛి మోక్షం ఇచ్చావు నన్నుమాత్రం వదిలేశావ్ అన్నారు .గళసీమలో మాణిక్యం ఉన్నా ,గాజుపూస కోసం అర్రులు చాస్తారుమానవులు అతి దగ్గరలో నువ్వున్నా నిన్ను పట్టించుకోరు వెర్రిజనం .ఉదరం లో ‘’పయోజ భవాండ శతాలు ఉంటె ,’’నీకడుపు ని౦డేట్లు భోజనం పెట్టటం మాకుసాధ్యమా ? ‘’ఎవ్వనిచే జగమ్ము జనియించు వసించు ,నశించు అవ్యయుడు,ఎవ్వడు ,కార్యకారణములలెవ్వడు ,భూత సమాశ్రయుడు ,చిత్కలా సహితుడు ఎవ్వరు ‘’అలాంటి నీవే మాకు దిక్కు అంటూ పోతనగారి పద్యాన్ని అనుకరిస్తూ శివ పరంగా  అల్లారు .

‘’మూడిటి రెండిటిన్ గెలిచి  మూటిని మూటిని రూపుమాపి ,మున్మూడిటిమూసి ,అయిదిటిని పొందుగా నేకము చేసి ,మూడిటన్ మూడిటి దాటి ,రెంటి నడుమన్ శివయోగి మూడిటన్ గూడిన చోటు మీరి నిను చేరతాడు ‘’అని వేదాంతపరంగా అద్భుత పద్యం రాశారు కవి. ఆపద కలిగిన వేళ,భయారతునిగా మొరబెట్ట నా సంతాపం మాన్పకున్నావు ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టకపోవటం న్యాయమా  ఆది భిక్షూ అన్నారు ,  తు౦గ భద్రవద్ద అమరావతీనగరాన్నిపోలిన చామర్లపూడి లో సర్వ మంగళతో కొలువైన స్వామీ భక్తజనానికి అభయ ప్రదాతవు .

 చివరిపద్యం –‘’మంగళమంబికా సహిత ,మంగళ మార్య శుభ ప్రదాయకా –మంగళమాహవ ప్రకట ,మంగళ మ౦బుజ నేత్ర,సాయకా –మంగళమిందుఖండ ధర ,మంగళ ముగ్ర మహాఘ శోషణా-మంగళ మభ్ర కేశ గుణ మండన కూడలి సంగమేశ్వరా ‘’అని శతకం ముగించారు .

  చక్కని సంప్రదాయ బద్ధంగా శతకం సాగింది .భక్తి ఆర్తి ప్రపన్నత శరణాగతం తో  భక్త చింతామణి గా శతకం రాశారు కవి.ధారాశుద్ధి అద్భుతం .భక్తి శతకాలలో తల మాణిక్యం గా ఉంది .ఈశతకం గురించి మనకవులు ఎవ్వరూ పేర్కొన్న దాఖలా కనిపించలేదు .ఈ కవినీ, ఈశతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .33వభాగం 23.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .33వభాగం 23.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పెదరావూరుకీర్తిపతాకలు

పెదరావూరు కీర్తిపతాకలు  

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పెదరావూరు గ్రామం లోని కొందరు ప్రముఖులను ‘’పెదరావూరు కీర్తి పతాకలు’’  గా పరి చయం చేస్తున్నాను .

1-శ్రీ రావూరి రంగారావు

శ్రీ రావూరి రంగారావు పెదరావూరు గ్రామం లో 1895లో రైతు కుటుంబం లో జన్మించారు .తండ్రి నారాయణ.1917లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1921లో జాతీయ ఉద్యమం లో దూకారు .తిలక్ స్వరాజ్యనిధికి బాగా కృషి చేశారు .1921-22లో పెద నందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ఒక ఏడాది కఠిన శిక్ష అనుభవించారు .సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమం లోనూ తీవ్రంగా పాల్గొన్నారు .శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొని 1930లో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి ,ఆలీపూర్ జైళ్ళలో అనుభవించారు .రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆడిటింగ్ ఇన్స్పెక్టర్ గా రెండున్నర ఏళ్ళు పని చేశారు .1941వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఆరునెలలు రాజమండ్రి ,ఆలీపూర్ కారాగారాలలో కఠిన శిక్ష అనుభవించారు .1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో చేతిబామ్బులు తన అధీనం లో ఉంచుకొన్నందుకు , ,రహస్య బులెటిన్ లు తెనిగించి నందుకు,డిటిన్యు గా నిర్బందింప బడ్డారు .తెనాలిపట్టణ ,తాలూకా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులుగా ,గుంటూరుజిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా సేవ లందించారు

2-శ్రీ కొడాలి గోపాలరావు గారు

పెదరావూరు కు చెందిన కొడాలి గోపాలరావు గారు గొప్ప నాటక రచయిత. అనేక ఎమేచ్యూర్ నాటక  సమాజాలు ఆయన నాటకాలను భారీగా ప్రదర్శించాయి .శివాలయం ప్రక్కనే ఉన్న ప్రభుత్వ పాథశాలలో మూడవ తరగతి వరకు చదువుకొన్నారు .ముఖ్యంగా రైతు కూలీ సమస్యలపై ,భూస్వాముల ,అధికారుల పెత్తనాలపై అనేక నాటక ,నాటికలు రాశారు .పేద రైతు ,,తిరుగుబాటు ,కూలీ ,,లంకెల బిందెలు ,దొంగ వీరడు , నిరుద్యోగి ,చైర్మన్ నాటకాలను రసవత్తరంగా ,ప్రయోగాత్మకం గా రచించారు .అవి ఆంధ్రదేశం లో విస్తృతంగా ప్రజానీకాలకు నచ్చాయి .స్వతహాగా రైతు బిడ్డ అవటం వలన వీరి నాటకాలు సజీవంగా దర్శన మిస్తాయి .వందకు పైగా నాటకాలు రాసి ‘’శత నాటక కర్త ‘’అనే పేరు పొందారు .గ్రామీణ ప్రజలు జమీందార్లు ,రాజకీయ నాయకులు ,వడ్డీ వ్యాపరస్తులు ,,కూలీలు పేదలు వీరినాటకాలలో ప్రముఖ పాత్రలు వారి మధ్య సంఘర్షణ లను అత్యద్భుతంగా చిత్రించారు .అనేక నాటక పరిషత్తులలో 170కి పైగా బహుమతులు పొందారు .తెనాలిలో ‘’జనతా ఆర్ట్ థియేటర్ ‘’స౦స్థాపకులు .వీరి చైర్మన్ ,లంకె బిందెలు దొంగ వీరడు నాటకాలు ఆంధ్ర దేశం లో సంచలనమే సృష్టించాయి అడిగిన వారికల్లా నాటకాలు రచించిన ఉదారుడాయన  ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ‘’కల చెదిరింది ‘’సినిమాకు కొడాలి గోపాలరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సంగతి చాలామందికి తెలియదు .

 ఈ నెల 15వ తేదీ అమర్తలూరు  వెళ్లి నప్పుడు మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి శుభాషిణి ఇంటికి ఎదురుగా ,ఒక చెట్టు కింద ఒక విగ్రహం ఉంటె ఎవరిదీ అని అడిగితె కొడాలి గోపాలరావు గారిది అని చెప్పింది .కానీ నాకు అప్పుడు బల్బు వెలగలేదు .ఇవాళ తెలిసింది ఆమహనుభావుడి విగ్రహం అని .దాదాపుఆవూరి జనం కూడా ఆయన్ను మార్చే పోయి ఉంటారేమో .

3-శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు

 ప్రముఖ హరిభక్త శిఖామణి శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు పెదరావూరు లో జన్మించారు .వీరు కృష్ణా జిల్లా దివి తాలూకా కోడూరు గ్రామం లో ‘’శ్రీ రామ దాసు ‘’హరికథా గానం చేస్తూ ప్రజోత్పత్తి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ ఏకాదశి సోమవారం నాడు సప్తాహమండపం లో ‘’శ్రీరామ ప్రభో ‘’అని ఆలపించి ఒక్క సారిగా కుప్పకూలి అసువులు బాసి శ్రీ రామసాన్నిధ్యం చేరిన హరికథా శిఖామణి . ఈ ముగ్గురు మూడు రంగాలలో ప్రముఖులు .శ్రీరావూరి రంగారావు గారు భారత స్వాతంత్రోద్యమ నాయకులు .శ్రీ కొడాలి గోపాలరావు గారు శతాధిక నాటక నవలాకర్తలు అయిన సాహిత్యోపజీవి .శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు హరికథకులైన భక్త శిఖా మణులు .ఆధ్యాత్మిక ప్రముఖులు .పెదరావూరు గ్రామ కీర్తి పతాకలు .వీరి గురించి ఇంతకంటే వివరాలు దొరకలేదు .

  ఈ వివరాలు నాకు ముందే తెలిసి ఉంటె మొన్న ఆదివారం పెదరావూరు సదస్సులో వారిని గుర్తు చేసి ఉండేవాడిని .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-22-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .32వ భాగం.22.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .32వ భాగం.22.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మార్గశిర మాసంలో వేదాంత దేశికులు

మార్గశిర మాసంలో వేదాంత దేశికులు

 సాహితీ బంధువులకు శుభ కామనలు  .24-11-22 గురు వారం నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతున్నందున ఆ రోజు సాయంతం నుండి శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు రచించిన ”వేదాంత దేశికులు ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .ప్రస్తుతం చేస్తున్న మత్ష్యపురాణం తాత్కాలికంగా  వాయిదా వేస్తున్నాము .ఉదయం మాత్రం మహాభారత తత్వ కధనం  కొనసాగుతూనే ఉంటుంది .మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -22-11-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

మత్స్య పురాణం.8వ భాగం.21.11.22.

మత్స్య పురాణం.8వ భాగం.21.11.22.

Video link

Posted in రచనలు | Leave a comment

ఇదం బ్రాహ్మం

ఇదం బ్రాహ్మం –
ఈ నెల 14వ తేదీ న ఆంధ్రభూమి లో పని చేసిన ,సరసభారతి సభలకు ఒకటి రెండు సార్లు వచ్చిన శ్రీమతి స్వాతి ఫోన్ చేసి ,భూమి ఎడిటర్ గా పదేళ్ళు పని చేసి దాని కి వెలుగురేఖలు తీర్చిదిద్దిన సీనియర్ ఎడిటర్ శ్రీ ఎం వి ఆర్ శాస్త్రి గారు రిటైరయ్యాక ,’’ఇదం బ్రాహ్మ౦’’అనే సంస్థను స్థాపించి కృషి చేస్తున్నారనీ ,ఆసంస్థ ఆత్మీయ సమావేశం తెనాలిదగ్గరపెదరావూరు లో 20వ తేదీ ఆదివారం ఉదయం జరుగుతుందని ,నన్నూ,శ్రీ పూర్ణ చ౦ద్ లను అతిధులుగా పిలుస్తున్నా మని తప్పక రమ్మని కోరగా సరే అన్నాను .పెదరావూరు అంటే ఒక సామెత జ్ఞాపకం వచ్చింది .’’ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చి వసూలుకాకపోతే దాన్ని పెదరావూరు ఖాతా ‘’అంటారని బాగా అనుకొనేవారు .ఈనెలలోనే మా అమ్మాయి విజ్జి అమెరికానుంచి ఒక పదిరోజులు ఉండటానికి ఉయ్యూరు వస్తే ,10,11తేదీలు మేమిద్దరం మా అమ్మాయి హైదరాబాద్ వెళ్లి అక్కడ మా అబ్బాయిల్ని మాబావగారిని ,మాఅమ్మాయి పాలిటెక్నిక్ స్నేహితురాళ్ళను చూసి వస్తుంటే మేము వచ్చిన సంగతి ఫోటోలద్వారా తెలుసుకొని మా మేనకోడలు పద్మ భర్త రామకృష్ణ ఫోన్ చేసి 20వ తేదీ తమ ఇంట్లో అభిషేకం వగైరా ఉంటాయనీ ,తప్పక రమ్మని చెబితే ,ఉండటం లేదని చెప్పాం .ఇంటికి రాగానే నాకు ఉయ్యూరు హైస్కూల్ లో సహోద్యోగి లెక్కలమాస్టారు శ్రీ పసుమర్తి ఆన్జనేయశాస్త్రిగారు ఫోన్ చేసి ,20వ తేదీ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా కూడేరులోతమ టెంపుల్ కాంప్లెక్స్ లో రుద్రాభిషేకం ,వగైరాలున్నాయని మమ్మల్నందర్నీ రమ్మని ఆహ్వానిస్తే ,పెదరావూరు సంగతి చెప్పి రాలేమన్నాను .మా అమ్మాయి 15 మంగళవారం రాత్రి గన్నవరం నుంచి అమెరికా వెళ్ళింది .శుక్రవారం రాత్రి నాకు ఫేస్ బుక్ లో రావూరు సమావేశం ఆహ్వాన పత్రిక వచ్చింది .అందులో నన్ను ఆత్మీయ అతిధిగా వేశారు .అప్పటిదాకా వెళ్లి అక్కడ భోజనం చేసి రావటమే కదా అనుకొన్నాను .ఈ ‘’మేకు బిగింపు ‘’చూశాక అసలు ఇదం బ్రాహ్మం అనే సంస్థ గురించి నాకేమీ తెలీదని ఎప్పుడూ వినలేదని అనుకోని యుట్యూబ్ లో ఆరాత్రి వెతికా .అందులో సద్గురు శివానందమూర్తి గారి ‘’మాని ఫెస్తేషన్ గురించి ఏమ్విఆర్ శాస్త్రిగారు శ్రీరమణ్ అనే ఆయన డిస్కషన్ చూశా .అందులో ఏమీ సంస్థ గురించి నాకు తెలీలేదు .తర్వాత ఇంకోదానిలో ఒకావిడ కొంచెం లావుగా ఉండీఆవిడ తాను చేసిన కార్యక్రమాలు ఏవో తెలియేసింది. చాలాకాష్టపడుతున్నట్లు అర్ధమయింది .అప్పటికే రాత్రి 11దాటటం తో పడుకొన్నాను .శనివారం ‘’మహాభారత తత్వకథనం ‘’లైవ్ పూర్తి చేశాక, ఉదయం 11కు మళ్ళీ వెతకటం మొదలెడితే కొంత సమాచారం దొరికింది .కొంత నేను రాసిన ‘’దైవ చిత్తం ‘’నుంచి నోట్స్ రాసుకొని మాట్లాడమంటే కనీసం అయిదారు నిమిషాలైనా మాట్లాడటానికి సిద్ధమయ్యా .ఆదివారం ఉదయం 4.30కే లేచి స్నానం సంధ్య పూజ కార్తీక అభిషేకం పూర్తి చేసి 6-30కి సిద్ధంగా ఉన్నా .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు వచ్చాడు .అంతకుముందు మా శ్రీమతి ,మా మూడు ,నాలుగు కోడళ్ళు వస్తామని అన్నవారు ,ఇంతపొద్దున్నే వెళ్లి సాయంత్రందాకా ఉండలేమని రాలేమన్నారు .మేమిద్దరమే కారులో బయల్దేరి 9కి పెదరావూరు ‘’అభయహస్త శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ‘’కు చేరాం శ్రీమతి స్వాతి మాకు స్వాగతం చెప్పింది .ఉయ్యూరునుంచి నేనురాసిన, సరసభారతి ప్రచురించిన ‘’ దైవ చిత్తం ,వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’పుస్తకాలు 25సెట్లు తీసుకొని వెళ్లాను. ఒక సెట్ స్వాతికి ఇచ్చాను .శాస్త్రిగారువచ్చారు .నన్ను చూడగానే ‘’స్వాతి మిమ్మల్ని గురించి చాలాచేప్పింది సంతోషం ‘’అన్నారు అప్పటికి మేమిద్దరమే వచ్చాము.ఉప్మా టిఫిన్ కాఫీ తాగాం ఇంకెవరూ కనపడలేదు శరవణ దర్శనం ,శంకరాచార్య దర్శనాలు పూర్తి చేశాక శ్రీ పూర్ణ చ౦ద్ దంపతులు ,శ్రీమతి అన్నపూర్ణ కనిపించారు.ఆలయం చక్కని పంటపొలాలమధ్య కంచిపీఠం అధ్వర్యంలో బాగాకట్టారు .స్వామి పళనిలో ఉన్నట్లు ఆకర్షణీయంగా ఉన్నాడు .సమావేశమందిరం ‘’పరమాచార్య వేదిక ‘’గా పేరుపెట్టారు .
ఉదయం 10గంటలకు సమావేశం శ్రీ శాస్త్రిగారి అధ్యక్షత న ప్రారంభమైంది .న్యాయమూర్తి శ్రీ బులుసు శివ శంకరరావు గారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయంతో బ్రాహ్మీమూర్తిగా విచ్చేశారు .ఆధ్యాత్మిక వేత్తలు శ్రీ చిలకలపాటి వీరరాఘవాచార్యులు ,శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ ,శ్రీ గోవింద వజ్ఝల కామేశ్వరశర్మ ,శ్రీ మేళ్ళ చెర్వు చంద్రమౌళి శర్మ ,అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ ద్రోణం రాజు రవికుమార్ , ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ శ్రీ ఎస్ వి ప్రసాదరావు ,నేనూ శ్రీపూర్ణ చ౦ద్ లతోసభ ప్రారంభమైంది .పూర్ణచంద్ ఆహారం ఆరోగ్యం పై మాట్లాడారు .తర్వాత నన్ను మాట్లాడమంటే ఇదం బ్రాహ్మం గురించి ఏడెనిమిది నిమిషాలు మాట్లాడాను .తర్వాత అందర్నీ మాట్లడించటానికి జస్టిస్ గారు ప్రయత్నించారు. స్పందన తక్కువ .మా రాంబాబు నాలుగు ముక్కలు మాట్లాడాడు .11గం లకు పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీ ముత్తేవి సీతారాం గురుదేవులు 45నిమిషాలు అనుగ్రహ భాషణం చేశారు .ఆయన ఏమి చెప్పారో ఎవరికీ తెలియలేదు .ఆయన మైక్ ను అందుకోలేకపోయారు అదేకారణం .బెజవాడ నుంచి ఇతర చోట్లనుంచి వేద విద్యార్ధులను తీసుకొని వచ్చి వారిని వస్త్రాలు వగైరా లతో సత్కరించి వేదం పఠనం చేయించారు .తర్వాత వారి గురువుల సమక్షం లో అందరూ వేదికపై ఆహ్వాని౦ప బడి వేదాశీస్సులు పలికారు.గురు సత్కారమూ జరిగింది .ఇంతలో గజల్ శ్రీనివాస్ రాగా ఆయననూ వేదిక ఎక్కించి ఆయన ఇటీవల కూర్చిన గజల్ గానం చేయించారు .మధ్యమధ్యలో ఎవరేవర్నో పిలవటం వారు వచ్చి మాట్లాడటం జరిగింది .పాపం శాస్త్రి గారి చేతిలోనుంచి సభానిర్వహణ జారిపోయింది .అన్యాయ౦ పై నిప్పులుకక్కే శాస్త్రిగారు నిరుత్తరులయ్యారు .ఒకరకంగా వేదిక కబ్జా అయింది .మళ్ళీ శాస్త్రిగార్ని వేదికపై పిలిచి అతిధులకు ఆయనతోశాలువా ఉత్తరీయం జ్ఞాపిక లతో సన్మానం చేయించారు .అంతా అయ్యేసరికి ఒంటిగంట దాటింది .ఈలోగా ఫుడ్ కోర్ట్ తెరిచారు .మొదట్లో సభలో పల్చగా ఉన్నజనం భోజన సమయానికి నిండిపోయారు .రెండవ బాచ్ లో మాకు భోజనాలు పెట్టారు వేదం విద్యార్ధులకు గురువులకు లోపల విడిగా భోజనాలు ఏర్పాటు చేశారు .టమేటా పప్పు నేను కాశీలో వదిలేసిన దొండకాయకూర ,క౦దా బచ్చలికూర, గుంటూరు గోంగూరపచ్చడి,నేతి బీరకాయ పచ్చడి నాకిష్టమైన మైసూర్ పాక్ ,పులిహోర ,పులుసు సంగం గడ్డ పెరుగు ,స్వామి ప్రసాదంగా మైసూర్ పాక్ లతో విందు .పెద్దగా రుచికరంగా ఏవీ లేవనిపించాయి నా మైసూర్ పాక్ నాకు మూడు సార్లు దక్కింది .నేను తెచ్చిన పుస్తకాలు శాస్త్రిగారికీ ,జస్టిస్ గారికి ,మిగిలిన పెద్దలందరికీ ఇచ్చేసి సంతృప్తి చెందాను .భోజనానికి ముందు స్వాతి నా దగ్గరకు వచ్చి ‘’ఎలాసంస్థను నడపాలి ‘’అనేది చర్చిద్దామనుకొన్న ఈ సమావేశం వనభోజనాలతో సరిపోయింది .ఆశయం నెరవేరలేదు మాస్టారు ‘’అని బాధ పడింది .నేను ఫీల్ అయిందే ఆవిడా చెప్పింది .సభానిర్వహణకు భోజనాలకు స్థానికి స్త్రీలు పురుషులు గొప్పగా సహకరించారు అందరూ అభినందనీయులే .నాకు ఈకార్యక్రమం లో పాల్గొనటానికి అవకాశమిచ్చినశ్రీమతి స్వాతి, శ్రీ శాస్త్రి గార్లకు ధన్యవాదాలు .
మధ్యాహ్నం రెండున్నరకు అందరికీ వీడ్కోలు చెప్పి ,మేము బయల్దేరి అమృతలూరు అని అందరూ పిలిచే’’ అమర్తలూరు’’ కు వెళ్లి ,మా అమ్మాయి కి గుంటూరు పాలిటెక్నిక్ లో క్లాస్ మేట్ అయియన్ శ్రీమతి శుభాషిణి ఇంటికి వెళ్లాం .ఆమె, కొడుకుతో 14వ తేదీఉదయ౦ మా అమ్మాయిని చూడటానికి ఉయ్యూరు వచ్చింది .అందుకే ఇంతదూరం వచ్చి ఆమెను చూడకుండా వెళ్ళటానికి మనసొప్పక వెళ్లాం .ఆమె సుగంధిపాల అందరికీ ఇచ్చి ఒక బాటిల్ మా శ్రీమతికి ఇవ్వటమేకాక తమ పొలం లో పండిన పెసలు నాలుగుగైదు సేర్లు మూటకట్టి ఇచ్చింది . అక్కడి పల్లె రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి .అక్కడ ఎవర్ని కదిలించినా గతమూడేళ్ళుగా గంపెడు మట్టి కూడా వేయలేదని ఆవేదనతో చెప్పారు .నాకు ఒక కుళ్ళు జోకు మనస్సులో మెదిలింది –‘’ఆడవాళ్ళకు ఈజీ డెలివరి రోడ్లు ‘’అనచ్చు నెమో శాంతం పాపం .మంచిరోజులెప్పుడు వస్తాయో అని ఎదురు చూడటమే మిగిలి౦ది అందరికీ .అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి మా శిష్యుడు రెండేళ్ళ క్రితం అకస్మాత్తుగా మరణించిన కాళీప్రసాద్ ఇంటికి వెళ్లి భార్యను ,ఇద్దరబ్బాయిలను పలకరించి ,ఉయ్యూరుకు సాయంత్రం 6-15కు చేరి 6-30కి ‘’మత్యపురాణ౦ ‘’లైవ్ చేశాను .ఈలోపు ఎప్పటిఫోటోలు అప్పుడే వాట్సాప్ లో తోసేశాను .ఇప్పుడు నేను సభలో మాట్లాడాలనుకొన్న విషయాలు మీకోసం అందిస్తున్నాను .
‘’అగ్రతః చతురో వేదః –పృష్టతః సశరం ధనుః-ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం –శాపాదపి శరాదపి ‘’అనేది అసలు శ్లోకం .ఇది భాసనాటకం లో పరశురాముని వాక్యం .అందుకే బ్రాహ్మణులకు పరశురాముడే ఆదర్శం .బ్రాహ్మీ మూర్తి అవసరమైనప్పుడు ధర్మహాని జరిగినప్పుడు క్షాత్ర శీలం చూపించాలి అని భావం . బ్రాహ్మీ శక్తి ,క్షాత్ర శక్తి అనే రెండు శక్తులున్నాయి .ఈరెండు ఆత్మకు అన్న౦అ వుతున్నాయి .అంటే ఈరెండిటిని ఆత్మ తినేస్తుంది .ఏది చేయాలో చెప్పేది బ్రాహ్మీ శక్తి .దాన్ని విధాయక శక్తి అంటారు .దీనివలన స్థిత ప్రజ్ఞత కలుగుతుంది .అ౦ టేధర్మాన్ని అనుసరించి మోక్షం పొందటం .శరీర బలంతో వ్యావహారిక శక్తితో ,అర్ధకామ బలం తో పురుషార్ధాలను ధర్మ బద్ధంగా ,పాలనా బలం తో చేయటం క్షాత్ర తేజం .దీన్ని దారకం అంటారు .దీని వలన సంక్షోభ సమయం లో పోరాట పటిమ పెరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరిస్తాడు .ఈ రెండూ కలిసి పని చేస్తే సాధించ లేనిది ఉండదు .
మత్స్య పురాణం లోయయాతి కథ నీతి దాయకం . నహుషుడి కొడుకు యయాతి తన రాజ్యాన్ని కొడుకు ‘’పూరుడు ‘’కు ఇచ్చేసి ,వానప్రస్థాశ్రమం లో ధర్మాలు పాటిస్తూ స్వర్గం చేరాడు .కొంతకాలం తర్వాత ఇంద్రుడు కిందికి తోసేశాడు .భూమి మీదపడకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు .అక్కడ వసుమంతుడు ,అనేరాజు ,అష్టకుడు ,ప్రతర్దనుడు ,శిబి కనిపిస్తారు .కొంతకాలం వారితో గడిపి మళ్ళీ స్వర్గం చేరాడు యయాతి .ఎందుకు ఇలా జరిగింది అని శతానీకుడు అడిగితె శౌనకుడు ‘’ఒకరోజు ఇంద్రుడు ‘’నీ కొడుక్కి రాజ్యం అప్పగించి నీ ముసలితనం తీసుకోమన్నప్పుడు ఏమి చెప్పావు అనిఅడిగితే యయాతి ‘’కోపం పనికిరాదు ,ఇతరుల్ని బాధపెట్ట రాదు.మైత్రి, దానం ,మధురభాషణం లకు మించిన ఉత్తమ గుణం లేదు .పూజ్యులను పూజించాలి ‘’అని చెప్పాను అన్నాడు .ఇంద్రుడు ‘’నువ్వు గొప్ప తపస్సంపన్నుడవు కదా .నీతో సమానులు ఎవరు ‘’అని అడిగితె యయాతి ‘’నాతోసమాన తపస్సు చేసినవాడు ఎవడూ లేడు ‘’ అన్నాడు .ఇంద్రుడికికోపం వచ్చి ‘’తరతమ భేదం ఎంచకుండా మాట్లాడావు కనుక స్వర్గలోక౦ లో ఉండతగవు ‘’అని తోసేస్తే ‘’అయితే నన్ను సత్పురుషులమధ్య పడెయ్యి చాలు ‘’అనగా అలానే చేశాడు .అష్టకాదులను కలిసినప్పుడు వాళ్ళు అడిగిన అనేక ధార్మిక విషయాలు వివరించి చెప్పాడు యయాతి .అందులో –విద్య తపస్సు పుట్టుక చేత ద్విజుడు వృద్ధుడు అవుతాడు అని చెప్పాడు. అష్టక వసుమంతశిబి లు తమ పుణ్య గతులు ఇస్తాం నువ్వు క్షేత్రజ్నుడివి స్వర్గం చేరమన్నారు .వద్దన్నాడు. అందరి పుణ్యం కలిపి ఇస్తామన్నా వద్దన్నాడు ‘’నేను సత్యవ్రతిని ధర్మావలంబిని .భూ మండలం అంతాజయించి ,బ్రాహ్మణులకు దానం చేశాను. నేను స్వయంగా సాధించిన పుణ్యం తోనే మళ్ళీ స్వర్గం చేరతాను .మీ పుణ్య ఫలాలు నాకు వద్దు ఇచ్చేవాడినేకాని తీసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు .ఉత్తములైన పై వారి మధ్య ఉండటం చేత పుణ్యం కలిగి వాళ్లకు తాను మాతామహుడను అని తెలియ జేసి యయాతి మళ్ళీ స్వర్గం చేరాడు .ఇందులో మన౦ నేర్వాల్సిన విషయాలెన్నో ఉన్నాయి .అవి తెలుసుకొంటే చాలు మనకూ ఉత్తమ గతులు లభిస్తాయి .
మన పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి ఇవాల్టి వారికి అందించాలి .అప్పుడే వాటిపై గౌరవం పెరుగుతంది .హైదరాబాద్ కు చెందిన శ్రీ ఎసిసి శాస్త్రి గారు ‘’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అనే ఇంగ్లీష్ పుస్తకం ప్రఖ్యాత భౌతిక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘’బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’ఆధారంగా ఆయన అభిప్రాయాలను మన పురాణాలతో అంతకు ముందే చెప్పబడిన విషయాలను విశ్లేషిస్తూ రాస్తే ,దాన్ని నేను ‘’దైవ చిత్తం ‘’గా అనువదించి సరసభారతి తరఫున ప్రచురించాను .అందులోని విషయాలు అందరూ తెలుసుకొని మన పురాణ,ఉపనిషత్తుల వైశిష్ట్యాలను అర్ధంచేసుకోవాలి .అందులో ముఖ్యవిషయాలు మాత్రమె మీ ముందు ఉంచుతున్నాను .
వ్యక్తీ చిత్తాన్ని ,దైవ చిత్తాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే ,నిర్జీవ శక్తి అంటే మాటర్,సజీవ శక్తి అంటే లైఫ్ ,.ఈ రెండిటి సామర్ధ్యతతో శిలాపదార్ధం రాక్ అంటే నిగూఢ శక్తి ఏర్పడింది .దీన్ని శాస్త్రవేత్తలు అరవిందుడు ఆవిష్కరించారు .రెండు వేల ఏళ్ళ క్రితమే ఆది శంకరులు ‘’శివ శ్శక్త్యాయుక్తో యది భవతి శక్తిః ప్రభవితం ‘’అని చెప్పారు .
విష్ణుమూర్తి మొదటి అవతారం మత్శ్యావతారం . చేపను ‘’ధీ ‘’అంటారు అంటే బుద్ధి .వివేకానికి ప్రతీక .సృష్టికర్తకు శత్రువు సోమకాసురుడు. వేదాలను అపహరించి ధ్వంసం చేయబోతే వాడిని చంపి వేదోద్ధరణ చేశాడు .అంటే బుద్ధి ,వివేకం నశించకుండా కాపాడాడు అన్నమాట .రెండవది కూర్మావతారం .ఇది ప్రతీకాత్మకం గా అంతరిక్ష కథ.ఇందులో సృష్టి పరిణామ సంఘటన ఉంది .పాలసముద్రం అంటే మిల్కీ వె .వాసుకి సర్పం గమనానికి సహకరించే దీర్ఘ వృత్తం అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ .మంధర పర్వతం అయస్కాంత ధృవం.మధనానికి సహకరించేది మిల్కీ వె సెంటర్ .మధనం లో వచ్చిన గరళం ఓజోన్.తర్వాత వచ్చింది అమృతం అంటే ఆక్సిజన్ ,నీరు .
టైం,స్పేస్ లు సరళ రేఖా మర్గాలుకావు .చక్రీయాలు అంటే సైక్లిక్ .అదే అది కూర్మం వీపు .ఒకప్పుడు ప్రఖ్యాత సైంటిస్ట్, తత్వ వేత్త బెర్ట్రాండ్ రసెల్ ఒక చోట ఉపన్యాసం ఇస్తూ భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా సూర్యుడు అనేక నక్షత్ర సముదాయాలతో ఉన్న మన గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతాడోవివరిస్తుంటే ఒక ముసలావిడ ‘’నువ్వు చెప్పింది అంతా చెత్తగా ఉంది .ప్రపంచం నిజంగా సమతలం గా ఉంది.ఒక బలమైన తాబేలు వీపు మీద ఆధార పడి ఉంది ‘’అన్నది ఆశ్చర్యపోయి రసెల్ ‘’ఆతాబేలు దేని మీద ఆధార పడి ఉండమ్మా ‘’అని అడిగితె ‘’నువ్వు తెలివైన వాడివే .అదెప్పుడూ కిందనే ఉంటుంది ‘’అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది .దిమ్మతిరిగి బొమ్మకనిపించింది సైంటిస్ట్ కు .ఇది జరిగిందియూరప్ దేశం లో .మన ఆది కూర్మ విషయం ఆమెకెలాగ తెలిసిందో అని అ౦దరూ ఆశ్చర్యపోయారట .
స్పేస్ ,టైం ల కర్వ్ చాలాపెద్దది అనంతం .అప్పుడు సరళ రేఖలా కనిపిస్తుంది .అంటే లీనియర్ గా .పాలసముద్రం మన విశ్వమే .పాలపుంత నక్షత్రసముదాయానికి చిహ్నం .శేషుడు కాలానికి ప్రతీక .శేషం అంటే మిగిలి ఉండేది .సృష్టి లయం అయితే మిగిలి ఉండేది కాలమే .మనం ఒక గెలాక్సీ లో ఉన్నాం.అది ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరం లో ఉండి,నెమ్మదిగా భ్రమిస్తోంది .స్పైరల్ బాహువులలోని నక్షత్రాలు కేంద్రం చుట్టూ అనేక వందల మిలియన్ల కాలం లో ఒకే ఒక చుట్టూ తిరుగుతాయి అని స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు .ఈ స్థిర నక్షత్రాన్నే మన వాళ్ళు ధ్రువ నక్షత్రమన్నారు కొత్తగా పెళ్ళైన దంపతులకు శాశ్వతంగా శృంగార బాంధవ్యం ఉండాలని ఆ ధ్రువ నక్షత్రాన్ని అర్థిస్తారు .
ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి వచ్చింది ?అని హాకింగ్ సైంటిస్ట్ బుర్ర బద్దలు కొట్టుకొన్నా సమాధానం పొందలేక పోయాడు .దీనికి మన ఉపనిషత్తులు సమాధానం చెప్పాయి భేషుగ్గా .విశ్వానికి ఆధారం ఆత్మ.,వనరు అంటే సోర్స్ ,రూపకర్తా అంటే డిజైనర్ కూడా . దీన్ని ఉపాదాన కారణం అన్నారు .స్టీఫెన్ హాకింగ్ సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు పరిశీలించాడు ‘’మైండ్ ఆఫ్ గాడ్ ‘’ను తెలుసుకొనే ఆఖరి ప్రయత్నం చేశాడు .మన అద్వైతం ఎప్పుడో సమాధానం చెప్పింది సృష్టికి కారణం ఆత్మ.ఆత్మ సృష్టించటం లేదు అది అలాగే ఉంది –‘’ఇట్ఈజ్ జస్ట్ ఈజ్ ‘’సృష్టికి ఆద్యంతాలు లేవు. దేవుడు ఈ విశ్వ రూపం లో కనిపించటమే దైవ చిత్తం అంటే దిమైండ్ ఆఫ్ గాడ్ .
ఇలాంటి విషయాలు ఆధునికకాలం లో యువతకు నేర్పాలి .అప్పుడే వాళ్లకు మన సంస్కృతీ సంప్రదాయాలపట్ల గౌరవ మర్యాదలుకలుగుతాయి .పరిరక్షించటానికి నడుం కడతారు .
ఎమ్వీ ఆర్ శాస్త్రి గారు తలపెట్టిన ‘’ఇదం బ్రాహ్మం ‘’పూర్తి జవసత్వాలతో దేహమంతటా శాఖలతో ఉత్సాహవంతులైన కార్యకర్తలతో పరిపుష్టమై, ఆయనకు వెన్ను దన్నుగా నిలిచి అభీష్టసిద్ధి కలిగించాలని ఆశిస్తున్నాను .భగవంతుని ప్రార్ధిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-22-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం31వభాగం.21.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం31వభాగం.21.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

మత్స్య పురాణం.7 వ భాగం.20.11.22

మత్స్య పురాణం.7 వ భాగం.20.11.22\

Video link

Posted in రచనలు | Leave a comment

మత్స్య పురాణం.6.,వభాగం.19.11.22

మత్స్య పురాణం.6.,వభాగం.19.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ మత్పుష్పగిరి  చంద్రమౌళీశ్వర శతకం  

శ్రీ మత్పుష్పగిరి  చంద్రమౌళీశ్వర శతకం  

శ్రీ మత్పుష్పగిరి  చంద్ర మౌళీశ్వర శతకాన్ని కావ్య విశారద శ్రీ శంకరమంచి రామ కృష్ణ శర్మ రచించి,బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి చూపించి పరిష్కరి౦ప జేసి ,రెంటపాళ్ళ అగ్రహారం లో మకాం చేసి ఉన్న  పుష్పగిరి పీఠాధిపతులకు చూపించి వారి అనుగ్రహం పొంది ,ముద్రణకు ద్రవ్యమిచ్ఛి ప్రోత్సహించగా ,ముద్రించి .శ్రీ పుష్పగిరి పీఠాదిపతులు జగద్గురు శంకరాచార్య స్వామి వారికి అంకితమిచ్చారు –‘’శ్రీ పుష్పగిరి పీఠస్థః శంకరాచార్య వేష ధృత్ – శ్రీకరశ్చంద్ర మౌళీశో-జీయాదాచంద్ర తారార్కం ‘’అని శుభం పలికారు .శార్దూల ,మత్తేభ పద్యాల శతకం ఇది .’’చంద్ర మౌళీశ్వరా ‘’అనేది మకుటం .1939 కృష్ణపక్ష తదియనాడు శతకం పూర్తి చేశారు కవి .కవి ఆపస్తంభ సూత్రుడు .ఆత్రేయస గోత్రీకుడు .నర్సరాట్పురం నివాసి  .కావ్య రసజ్ఞుడు .వెల ఇవ్వలేదు .

 మొదటి శార్దూలం లో –‘’శ్రీ రాజిల్ల సమస్త చేతనలకున్ స్వీయ ప్రసన్నావనో  -దారత్వమెరింగి౦చు టే విమల తత్వార్ధంబు బోధించు నా –చారంబంచు దలంచి పుష్పగిరి వాసబుండివెల్గొందునోం-కారాకార ,నమస్కరించెద శుభాంగా ‘’చంద్ర మౌళీశ్వరా ‘’ అని చెప్పి ,సద్భక్తితోరాశానని ,సాహిత్యం సున్నా ,వృద్ధజన సాంగత్యం  పూజ్యం ,ధన సంపత్తి హుళక్కి ,తెల్వినహి ,శ్రద్ధాభక్తి శూన్యం ,ఉక్తి నియుక్తులు ‘’బండిగల్లు ‘’అయినా  కీర్తిస్తున్నా ఆదరించు అని లౌక్యంగా చెప్పారు’’కావ్య విశారదులు .’’తనకావ్యకుమారి మోహం కలిగించే సుందరికాదు  నూతన చమత్కారాలు చూపే నేర్పరీకాదుఅయినా ఎలాస్వీకరిస్తానని సందేహించక నన్ను కృతార్ధుని చేసి కన్యాదానఫలితం ఇమ్మన్నారు .ఒకావిడ నెత్తికెక్కి కూర్చుంది ఇ౦కొఆవిడ అర్ధ శరీరం ఆక్రమించింది ,మీఅమ్మాయికి ఇక నేను ఏమివ్వగలను అని అనుకోవద్దు .మాఅమ్మాయి వృధాకోరికలు కోరని కన్య అన్నారు ..’’బోళాశంకరుడ వంచు భక్తతతి సంబోధించుతాన్ జేసి ‘’నా మేలు నువ్వే చూస్తావనే ధైర్యంతో ఉన్నాను .

  ధనగర్వంతో విర్రవీగే వారు నీపై దృష్టిపెట్టరు సంపదతో ఉబ్బి తబ్బిబ్బౌతారు .అలాంటి వారి తలపై తన్ని బుద్ధి చెప్పేవాడివి నువ్వే .’’ఆరాధ్యుడవు ,పుణ్య శీలుడవు ,నిత్యానంద నిష్కామ ,నిర్వైరాయత్తుడవు ,ఆదిమూర్తివి .’’గిరికన్యా హృదయాబ్జ రంజనం,సాక్షీభూత నిర్మోహ సుందరమైన రూపం నీది .జగత్స౦జీ వనౌషధమ్ ‘’నీ పంచాక్షరి ‘’.వైరం ఎందుకు అన్నా,హెచ్చుఫలముల్ వంచించను అన్నా ,నేరాలు భరించమన్నా ,ఎప్పుడూ నీవాడినే అన్నా,సత్యార్యం చూపమన్నా ,హితం చేకూర్చమన్నా ,ఆధారం నువ్వే అన్నా .’’నేర్పరివై సర్వము నామ భేదాలుఅదర్పం జూచే వాడవు మామ దక్షుడి యాగం ఆగం చేసి బుద్ది చెప్పావ్ . భూమికి ‘’ప్రాజ్ఞుడు మూలం అసలైన మూర్తి నీవే .’’శివ శంభో గిరిజాపతీ శుభద,దాక్షిణ్యైక  భావాన్వితా ,భవ  ,గంగాధరా ,శూలపాణి హర సౌభాగ్యప్రదా హర ధవళా౦గా ‘’అంటూహర  నామాలన్నీ చెప్పారుపద్యంలో .

  పార్ధునిపై శశాంశాకు నిపై ,భళ్లాణుపై ,సిరియాలునిపై ఉషాజనకునిపై శ్రీ గౌరిపై గంగపై పరమానందం,ఆదరం  చూపించావు ..’’నేను నీమొర ఆలించను ‘’అంటావేమో .నీగుట్టు మట్టులన్నీ నాకు తెలుసు .బి౦కాలుపోకు .కాలుస్తావా సై.లేక నేనే నిన్ను గెలుస్తానో కాచుకో అన్న భక్తశిఖామణి కవి .ఆతర్వాత శివ భక్తిమహాత్మ్య కథలన్నీ వరసబెట్టి చెప్పారు .తన మొరను అరణ్య రోదనం చేయద్దని వేడుకొన్నారు .నీ వాహనం ఎద్దు మీ ఆవిడ వాహనం వ్యాఘ్రం .వీటిమధ్య ఉన్న క్రూరత్వాన్ని బాపటానికే సమయం చాలదంటావా ,లేక నన్ను మర్చేపోయావా .?ఘోరపాతకాలలో కూరుకుపోయి నేను నిన్ను ‘’శివ శంభో గిరిజాపతీ హర శ్రీ పుష్పశైలేశ్వరా  ,భవ బంధా ‘’అని పిలుస్తూనే ఉంటా .అన్నారు ఈపద్యం భీమఖండంలో శ్రీనాథుని ‘’శంభున్ శివుణ్ శ్రీ కంఠు నిన్ ‘’అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది .తన్మయభక్తికి గొప్ప ఉదాహరణ ,నరకం అనేది ఉందని ఇప్పుడే తెలిసి జ౦కు తున్నాను .చేసినపాపాల చిట్టా విప్పుతున్నాను –నీ పాదద్వయమే నాకుఏడుగడ రక్షా .

  బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు మాయ చుట్టాలు .అవి పట్టుకొంటే నీ ధ్యానం చేయటం ఎవరి తరమూకాదు .’’నిను బూజి౦ప గా ,నిన్ను జూడగను ,నీ నిత్యప్రభావంబు వర్ణన చేయగను కేశవాదులకైనా అసాధ్యం ‘’నాకు అనువౌనే కుజనుడను ఘోర దురితాహ౦కారుడిని .కాదనకయ్యా గిరీశా .నన్ను భరించటం నీకు తప్పదు.ఎందుకు ?నేను నీవాడిని కనుక .నాకవితా కుమారిని నీ చేతిలో పెడుతున్నా .ఇవ్వటానికి చేతిలో కానీ లేదు .రాద్ధాంతం చేయకుండా ‘’వేయార్లట్టుల’’ ఎంచి ,తృప్తి చెంది ఆదరించు అని కన్యాశుల్కం లో రామప్పపంతులు లౌక్యం చూపారు కవి .నీ చేతిలో ఉంచా .అంటూ అగ్నిహోత్రావధాన్లు ‘’తామ్బూలాలిచ్చా తన్నుకు చావండి ‘’అన్నట్లుగా భారమంతా అల్లుడు చంద్రమౌళి పైనే పెట్టారు మామ కవీశ్వరుడు భక్తిగా .చివరి రెండుపద్యాలో భావం ముందే చెప్పేశాను .ఖచ్చితంగా 100పద్యాల శతకం ఇది .

 భక్తీ ఆర్తి శరణాగతి ,లౌక్యం లోకజ్ఞత ,కథా సంవిధానం ,పుష్కలంగా ఉన్న శతకం శైలి ద్రాక్షాపాకం .కవితాప్రవాహం పుష్పగిరి ప్రక్కన ప్రవహించే పెన్నా నదీ ప్రవాహమే .పుష్ప గిరిలోని పుష్ప సౌందర్యం ,మాధుర్యం ,పరిమళం ప్రతిపద్యం లోనూ దర్శన మిస్తుంది .ఈ శతకం ,ఈకవి గురించి మనవారికెవరికీ పట్టినట్లు లేదు .నాకు ఈకవిగారినీ శతకాన్నీ  పరిచయం చేసే మహద్భాగ్యం ఆ చంద్ర మౌళీశ్వరుని కృపాకటాక్షం వలన లభించింది .2019లో ఒంటిమిట్ట తోపాటు పుష్పగిరి సందర్శనం మాకు లభించింది .అదిఇలా సార్ధకమయింది .  శ్రీ చంద్ర మౌళీశ్వర లింగం ఆదిశంకరాచార్య ప్రతిష్టితం .విద్యారణ్యస్వామి శ్రీ చక్రం ప్రతిష్టించారు .శివ ,కేశవ ఆలయాలు ఇక్కడ ఉండటం మరో విశేషం .దక్షిణ కాశిగా ,రెండవ హంపిగా భావిస్తారు శైవులు మధ్య కైలాసంగా వైష్ణవులు మధ్య అహోబిలం గా పిలుస్తారు .గ్రామానికీ ,క్షేత్రానికి మధ్య పెన్నానది ఉంది .దీనిలో పాపాఘ్ని కుముద్వతి,వల్కల ,మాండవి నదులు కలుస్తాయి .ఆంద్ర దేశం లో ఉన్న ఏకైక శంకరాచార్య పీఠం పుష్పగిరిలో నే ఉంది .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .30వ భాగం.19.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .30వ భాగం.19.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -354

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -354

· 354-రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ,విశ్వరూపం సినీ నిర్మాత ,కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్

· చంద్రహాసన్ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత. ఆయన ప్రముఖ భారతీయ సినిమా నటులైన కమల్ హాసన్, చారుహాసన్ ల సోదరుడు.[1]

జీవిత విశేషాలు
ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన కమల్‌ హాసన్ నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ‘హేరామ్‌’, ‘విరుమాండి’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’, ‘ఉన్నైపోల్‌ ఒరువన్’ చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు. చంద్రహాసన్‌ ప్రస్తుతం కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌’కి అధినేతగా వ్యవహరిస్తున్నారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటించినప్పటికీ ఆయన మాత్రం తెర వెనుక ఉండి పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఆయన కుమార్తె అను హాసన్‌ ఇందిర, రన్‌, ఆల్వంధన్‌ తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ‘ఈజ్‌ దిస్‌ నౌ’ అనే ఇంగ్లీష్‌ సినిమాలో చేస్తున్నారు. ‘విశ్వరూపం’ సినిమా విడుదల విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు చంద్రహాసన్‌ తన వెంటే ఉండి ధైర్యం చెప్పారని ఆయనే తన బలమని కమల్‌హాసన్‌ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రహాసన్‌ ‘విరుమంది’, ‘విశ్వరూపం’, ‘థూంగవనమ్‌’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.[2]

అస్తమయ౦]
ఆయన లండన్‌లో ఉన్న తన కుమార్తె అనుహాసన్ వద్ద మార్చి 18 2017 న గుండెపోటుతో మరణించారు.[3] ఆయన భార్య గీతామణి (73) జనవరి 7 2017న మరణించారు.[4]

355-కేరక్టర్ నటుడు నిర్మాత –చలపతిరావు

చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి .

వ్యక్తిగత వివరాలు
ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.

నటుడుగా

  1. గూఢచారి 116 (1966)
  2. సాక్షి (1967)
  3. బుద్దిమంతుడు (1969)
  4. తక్కరి దొంగ చక్కని చుక్క (1969)
  5. కథానాయకుడు (1969)
  6. పెళ్లి కూతురు (1970)
  7. మాయని మమత (1970)
  8. సంపూర్ణ రామాయణం (1971)
  9. కాలం మారింది (1972)
  10. అందాల రాముడు (1973)
  11. తాతమ్మకల (1974)
  12. యమగోల (1975)
  13. అన్నదమ్ముల అనుబంధం (1975)
  14. మనుషులంతా ఒక్కటే (1976)
  15. యమగోల (1977)
  16. దాన వీర శూర కర్ణ (1977)
  17. వేటగాడు (1979)
  18. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
  19. అక్బర్ సలీమ్ అనార్కలి (1979)
  20. యువతరం కదిలింది (1980)
  21. సరదా రాముడు (1980)
  22. బుచ్చిబాబు (1980)
  23. కొండవీటి సింహం (1981)
  24. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
  25. గురు శిష్యులు (1981)
  26. జీవనధార (1982)
  27. త్రిశూలం (సినిమా) (1982)
  28. రుద్రకాళి (1983)
  29. శ్రీరంగనీతులు (సినిమా) (1983)
  30. ముందడుగు (1983 సినిమా) (1983)
  31. ఖైదీ (1983)
  32. ప్రజా రాజ్యం (1983)[2]
  33. బొబ్బిలి బ్రహ్మన్న (1984)
  34. అనుబంధం (1984)
  35. మెరుపు దాడి (1984)
  36. Srimadvirat Veerabrahmendra Swami Charitra (1984)
  37. Chattamtho Poratam (1985)
  38. Shri Datta Darshanam (1985)
  39. Adavi Donga (1985)
  40. Pattabhishekam (1985)
  41. Kirathakudu (1986)
  42. Kaliyuga Pandavulu (1986)
  43. Apoorva Sahodarudu (1986)
  44. అనసూయమ్మ గారి అల్లుడు (1986)
  45. Allari Krishnaiah (1986)
  46. Agni Putrudu (1987)
  47. Bharatamlo Arjunudu (1987)
  48. Bhargava Ramudu (1987)
  49. Sahasa Samrat (1987)
  50. Janaki Ramudu (1988)
  51. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  52. Donga Ramudu (1988)
  53. Tiragabadda Telugubidda (1988)
  54. Ramudu Bheemudu (1988)
  55. సంకెళ్ళు (1988)
  56. Prema (1989)
  57. విజయ్ (1989)
  58. సింహ (1989)
  59. Ashoka Chakravarthy (1989)
  60. భలే దొంగ (1989)
  61. Aggiramudu (1990)
  62. జయసింహ (1990)
  63. ఆడది (1990)[3]
  64. మా ఇంటి మహరాజు (1990)

వగైరా 1200సినిమాలు

నిర్మాతగా
[17]

  1. Kaliyuga Krishnudu
  2. Kadapareddamma
  3. జగన్నాటకం
  4. Pellante Nurella Panta
  5. Presidentigari Alludu
  6. Ardharatri Hatyalu
  7. Raktham Chindina Raatr

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మత్స్య పురాణం.5వ భాగం.18.11.22

మత్స్య పురాణం.5వ భాగం.18.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ విశ్వేశ్వర శతకం

శ్రీ విశ్వేశ్వర శతకం

కవికోకిల విద్వాన్ శ్రీ వేమూరి వెంకటరామయ్య శర్మ రచించిన శ్రీ విశ్వేశ్వరశతకం కు పరిష్కర్త శతావధాని  శ్రీ కాటూరి వెంకటేశ్వరావు గారు .దీనికి తొలిపలుకులు కైకలూరు స్థానికోన్నత పాఠశాల ప్రధాన ఆంధ్రా ధ్యాపకులు విద్వాన్ నందుల సుబ్బరాయ శర్మగారు రాశారు. అందులో –కృష్ణా ,ఉభయగోదావరి గుంటూరు నెల్లూరు మండల భక్తి ప్రచారకులు ,అభినవ ప్రహ్లాద ,భాగవతకులా౦కార  ,,పరమ భాగావతాగ్రగణ్య ,భక్త కులశేఖర ,భక్తిమూర్తి ,భక్త్యుపన్యాస కేసరి మున్నగు బిరుదాంకితులు ,మధుర వాగ్విశారదులు బ్రహ్మశ్రీ ములుకుట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు శ్రీ సనాతన భాగవత భక్తసమాజ స్థాపకులు .విష్ణు భక్తులే అయినా ఆయనకు శివ కేశవులు సమానులు .శ్రీరాముడు రామేశ్వరంలో శివ లింగ ప్రతిష్ట చేసినట్లు ,శాస్త్రిగారు శివ ప్రతిష్ట చేయాలను కోగానే తక్షణమే సాఫల్యం జరిగి ,సత్తెనపల్లి తాలూకా నుదురుబాడు నివాసిశ్రీపానకాలు రెడ్డి మహాశయులు ,భారమంతా పైన వేసుకొని ఆలయ నిర్మాణం చేశారు .వారణాసి నుంచి శ్రీ విశ్వేశ్వరుడు పలనాటికి విచ్చేసే సందర్భం లో ,మా శిష్యుడు కవికోకిల ఈ శతకం రాసి కృతి సమర్పణం చేయటం చరితార్ధకమైంది .మా శిష్యుని శ్రీ విశ్వేశ్వర శతకం దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకానికి తుల్యం అని నా భావన .’’అన్నారు .శతకం బందరు మినర్వా ప్రెస్ లో ముద్రితం .సంవత్సరం ,వెల తెలుపలేదు .’’లక్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా ‘’అనేది శతకం మకుటం .శార్దూల పద్య శతకం .

 మొదటిపద్యం –‘’శ్రీ నారాయణ నామ చింతన సుధా సేవారతిం దన్మయుం- డై నారాయణి కా విశేష రుచులింపై తోప ,ఝ౦కార ని-స్వానంబు బొనరించు ,శ్వేత మధుపస్వామి న్నినుం గొల్తు ల –క్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా  ‘’అని నివేదించి మనసులో శతకం రాయాలనుకోగానే శతశార్దూలాలు మదిలో మెలిగాయని ,ఆయన కటాక్ష శ్రీ ఎక్కడ వాలుతుందో తెలీదని ,లక్ష్మీ నారాయణ శాస్త్రిగారి మనోవా౦ఛితం నెరవేరి ఈ ఆలయంలో ప్రవేశించావనీ ,శివభక్తుల చరిత్రతోపాటు లీలలూ ఇందులో వర్ణిస్తాననీ చెప్పుకొన్నారుకవి .

  ‘’దీను౦ డైపోలలేమి బోయ శివరాత్రి న్ శ్రీ ఫలంబెక్కి తా-నే ణమ్మున్ గురిసేయ దిత్తియుదకంబింతింత నీపైబడన్-వానినిన్ముక్తుని జేయ నర్బుద గిరిన్ వ్యాథేశ్వర స్వామి ‘’గా వెలిశావు అన్నారు పాతకథ చెప్పి .సానిని సంతృప్తిచేసి మోక్షమిచ్చావు .తారకాసుర సంహారంకోసం దేవతలు ప్రార్ధిస్తే పార్వతిని చేబట్టి కుమారస్వామికి జన్మనిచ్చి సంహరి౦ప జేశావు .’’నీకల్యాణ సమయం లో ముల్లోకాలజనం రాగా భూమి కుంగితే ,’’దయా దీనత్వమునన్ కు౦భజు బనిచి ,యార్తిన్ ద్రోయగా లేదా ‘’అన్నారు .మూడోకన్ను మంటతో మన్మధ సంహారం చేసి ఆతని భార్య వేడుకొనగా పతిని దానంగా సమర్పించిన కరుణా సముద్రుడివి .శిష్యుడైన వి౦ధ్యపర్వతాన్ని తాను  దక్షిణ దేశం నుంచి తిరిగివచ్చేదాకా అలాగే వంగి ఉండమన్న అగస్త్యుడుభక్తితో నిన్ను సేవించి తరించాడు .అలాగే వాతాపి ఇల్వల సంహారం నీదయతో అగస్త్యర్షి చేయగలిగాడు .మామగారు దక్షుడు  శపిస్తే’’ ఏణా౦కు ని ‘’తలమీద దాల్చి గౌరవం కలిగించావు .

  క్షీరసాగర మధనంలో విషం పుడితే సంకోచించకుండా తాగి లోకరక్షణ చేశావ్ .దేవతలు ప్రార్ధిస్తే ‘’మేష శీర్ష౦బుగంఠాన౦ జిత్రముగా ఘటించి అసుదానం ‘’ఇచ్చావు నీ మామ దక్షుడికి .’’శ్వానంబుంగపి పెంచి ,వేశ్య మెడలం బంధింప నక్షంబు ల-ద్దానన్ వారి కమాత్యరాజ తనయత్వం ‘’ఇచ్చి మోక్షం ఇచ్చావు .తర్వాత రుద్రాక్షమహిమ చెప్పిఎలా ఎవరెవరి ప్రాణాలు కాపాడాడో  వర్ణించారు కవి ‘’మౌని శ్రేష్టుడు వ్యాసుడచ్యుత డబ్రహ్మం బంచు జేయెత్తిని౦-బొనాడన్’’ఆ చేతులు అలాగే నిల్చిపోగా ,గోవిందుడు కాపాడమని వేడితే కరుణతో కాపాడావు .పాలకోసం ఏడ్చే బీద పిల్లాడి ఆకలి తీర్చమని ఆతల్లి ప్రార్ధిస్తే  ‘’దుగ్ధాబ్ది ‘’నే ఇచ్చిన కరుణామయుడివి .మృకండ సూతిని కాపాడి యముని కాలితోతన్ని పంపావ్ .నీభక్తుడైన వైశ్యుడు అడవిలో తిరుగుతూ లింగం దొరక్క కుంచమే లింగంగా భావించి అర్చిస్తే ‘’కు౦చేశ్వరుడి గా వెలిశావు .చోళరాజు భక్తికి పరవశి౦చావు  .రాజుకోర్కేపై కావేరీనదికి ఆనకట్ట కట్టావ్ .భైరవుడికి మామిడిఫలాలు ఇచ్చావు .వెయ్యికి ఒక్కపువ్వు తగ్గితే తలనరికి నీకుసమర్పించిన వాడికి ముక్తిప్రసాది౦చావు  .

‘’ఈ నా ఈప్సితమిమ్ము నీవు బసవా యిప్డన్న సంతుష్టిగా –డా నీజాలినవాడ టంచసమ నేత్ర౦ బీవు యాచింప న –ద్దానన్నీకను నీకే చూపడె యదార్ధం బేర్పడన్నాడు ‘’అని మరొకథా ప్రసంగం చేశారు ..పాలుత్రాగకపోతే నామీద ఒట్టు అని ఒక బుడుతడు మారాం చేస్తే ‘’ఆ కూనం గాచి కుంచెడు పయస్సు గ్రోలి ‘’వాడికి సంతృప్తి కల్గించిన దయారాశివి .’’నీ చిత్తము దారువో శిలయో లోహమ్మో ‘’మాకు అర్ధంకాదు .కిరాతవేషంలో అర్జునుని పౌరుషాన్ని పరీక్షించి పాశుపతాస్త్రం ప్రసాది౦చావ్ .జంగమ దేవరలకు అభయప్రదాతవు .’’నీచ బౌద్ధ జైనాలను త్రుంచమని నిన్నుకోరుతూ రాళ్ళతో నీలి౦గాన్నికోట్టిన వాడికి వరాలిచ్చి ముక్తినిచ్చావ్ .సౌరాష్ట్రం వెడుతూ కుష్టు వ్యాధితో బాధ భరించలేక ‘’గౌరీనాథా ‘’అని ఆర్తిగా పిలిస్తే ఆర్తిబాపిన దయాసింధువు నువ్వు .అప్పుడెప్పుడో గరళం మెక్కావు .ఇప్పుడు ఈ విషముష్టి పండు తిను చూద్దాం  నీ దమ్ము ఏమిటో ‘’అని భక్తుడు సవాలు విసిరి పెట్టిన దాన్ని తినేసిన కాల కంఠుడవు .

 చివరి పద్యం –‘’నేనీ దివ్య కథామహత్వముల వర్ణింప నెట్టోర్తున-జ్ఞానిన్ వేమురి వాని చాపలయుతున్ సాక౦గదే భక్త బం-ధూ,నన్  వేంకట రాము ‘’విశ్వ పతయే తుభ్యం నమోస్త౦ టి ‘’ల-కక్ష్మీ నారాయణశాస్త్రి హృత్కమల కాశీవాస విశ్వేశ్వరా ‘’

   నిజంగా నే భక్తదూర్జటి మహాకవి కవిత్వం స్ఫురణకు తెస్తుంది ఈ శతకం .కవిగారు విద్వాన్ అవటంతో పండితలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శతకం లో కవికోకిల కావటంతో హాయిగా పాడుకోటానికి వీలుగా ఉన్నాయి ఇంపైన పద్యాలు .విశ్వేశ్వరునికి నిజమైన నీరాజనం ,ఇంపైన ఇష్టనైవేద్యం ఈశతకం .తమాషాగా పద్యం మొదలుపెట్టి ఆసక్తికరంగా ముగించటం ఈ కవి ప్రత్యేకత .ఈకవిగారినీ ఈశతకాన్ని పరిచయం చేసి నేను ధన్యుడనయ్యాను .నిత్య పఠనీయ శతకం ఇది .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-18-11-22-ఉయ్యూరు .     

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -351

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -351

· 351-పద్మాలయా సంస్థ భాగస్వామి ,సింహాసనం ,ఈనాడు సినీ నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత, హీరో కృష్ణ సోదరుడు –ఘట్టమనేని హనుమంతరావు

· ఘట్టమనేని హనుమంతరావు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరుడు ఘట్టమనేని కృష్ణ సినీనటుడు, రాజకీయ నాయకుడు. మరొక సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. అతను సోదరులతో కలసి కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవాడు.

· అతని భార్య పార్వతి. వారికి ఇద్దరు కొడుకులు – ప్రసాద్, నర్సయ్య , కుమార్తె జయప్రద. ఉన్నారు.

సినీ ప్రస్థానం
నిర్మాతగా
· 1994 – పోలీసు అల్లుడు

· 1994 – పచ్చ తోరణం

· 1993 – అన్నాచెల్లెలు

· 1988 – కన్వర్‌లాల్ (Kanwarlal-హిందీ)

· 1988 – రాజకీయ చదరంగం

· 1986 – సింహాసనం

· 1983 – మావాలీ (Mawaali-హిందీ)

· 1985 – పతాల్ భైరవి (Pataal Bhairavi-హిందీ)

· 1984 – ఖైదీ

· 1983 – హిమ్మత్‌వాలా (Himmatwala-హిందీ)

· 1982 – ఈనాడు

· 1982 – త్యాగి (Thyagi-హిందీ)

· 1981 – మేరీ ఆవాజ్ సునో (Meri Aawaz Suno-హిందీ)

· 1978 – పట్నవాసం

· 1977 – కురుక్షేత్రం

· 1974 – అల్లూరి సీతారామరాజు

· 1973 – దేవుడు చేసిన మనుషులు

రచయితగా
· 1976 – రామరాజ్యంలో రక్తపాతం (స్క్రీన్‌ప్లే)

· 352-టెన్త్ క్లాస్ సినీ దర్శక ఫేం –చందు

· చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డి) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

జీవిత విషయాలు
చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.

సినిమారంగం
2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]

సినిమాలు
దర్శకుడిగా

· టెన్త్ క్లాస్ (2006)[3]

· నోట్ బుక్ (2007)

· ప్రేమ ఒక మైకం (2013)

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

· కళ్యాణ రాముడు (2003)

· సాంబ (2004)

· 353-ఆ నలుగురు సినీ దర్శక ఫేం ,నిర్మాత ,నందీ అవార్డీ-చంద్ర సిద్ధార్ధ

· చంద్ర సిద్దార్థ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత.

నేపధ్యము
చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.[1] హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు దగ్గర జైత్రయాత్ర చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియాలో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.

పురస్కారములు
· నంది ఉత్తమ చిత్ర పురస్కారము – ఆ నలుగురు

· నంది ఉత్తమ కుటుంబ కథా చిత్ర పురస్కారము – అందరి బంధువయ

· నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారము -అందరి బంధువయ

సినీప్రస్థానము
దర్శకుడిగా
· ఆటగదరా శివ (2018)

· ఏమో గుర్రం ఎగరావచ్చు (2013)

· మధుమాసం

· అందరి బంధువయ

· ఇదీ సంగతి (2008)

· ఆ నలుగురు

అప్పుడప్పుడు (2003)
నిర్మాతగా
· నిరంతరం

· హౌస్‌ఫుల్

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మత్స్య పురాణం.4వ భాగం.17.11.22

మత్స్య పురాణం.4వ భాగం.17.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

మహా భారత తత్వ కథనం.28వ భాగం.17.11.22

మహా భారత తత్వ కథనం.28వ భాగం.17.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

· 349-మాధవి పిక్చర్స్ అధినేత –గోరంట్ల రాజేంద్ర ప్రసాద్

గోరంట్ల రాజేంద్రప్రసాద్ రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 1963లో రాముడు భీముడు చిత్రం భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, దొరబాబు ,ఆటగాడు ,కురుక్షేత్రం నిర్మించాడు .
మరణం
86 సంవత్సరాల గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యం కారణంగా 2022 జులై 7న కన్నుమూశారు.[1]

· 350-సీతారామరాజు లో బాలనటుడుగా పరిచయమై ,సామ్రాట్ లో హీరో అయిన ,సూర్యవంశం ,దూకుడు చిత్రాల నిర్మాత, హీరో కృష్ణ కుమారుడు –రమేష్ బాబు

· రమేశ్ బాబు (అక్టోబర్ 13, 1965 – జనవరి 8, 2022) 1965లో అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించాడు. 1974లో ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సామ్రాట్ తో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.

చిత్రసమాహారం
నటుడిగా
Year

Title

Role(s)

Co-Star

Director

Notes

1977

మనుషులు చేసిన దొంగలు

కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు

ఎం. మల్లిఖార్జునరావు

చైల్డ్ ఆర్టిస్ట్

1979

నీడ

మురళీ మోహన్

దాసరి నారాయణరావు

చైల్డ్ ఆర్టిస్ట్ [1]

1981

పాలు నీళ్ళు

మోహన్ బాబు, జయప్రద

దాసరి నారాయణరావు

చైల్డ్ ఆర్టిస్ట్

1987

సామ్రాట్

సామ్రాట్

సోనమ్, శారద

వి.మధుసూధన్ రావు

అరంగేట్రం

1988

చిన్ని కృష్ణుడు

కుష్బూ, శరత్ బాబు

జంధ్యాల

[2]

1988

బజారు రౌడీ

రంజిత్

నదియా, గౌతమి, కైకాల సత్యనారాయణ

ఎ. కోదండరామి రెడ్డి

1988

కలియుగ కర్ణుడు

జూహీ చావ్లా, కృష్ణ, జయప్రద

కృష్ణ

1988

ముగ్గురు కొడుకులు

రాజేంద్ర

కృష్ణ, మహేష్ బాబు, రాధ

కృష్ణ

1989

బ్లాక్ టైగర్

భానుప్రియ, మోహన్ బాబు

దాసరి నారాయణరావు

1989

కృష్ణ గారి అబ్బాయి

గౌతమి, నీతు, అంజలి దేవి

వి.మధుసూధన్ రావు

1990

ఆయుధం

వాణీ విశ్వనాథ్, కృష్ణ, రాధ

కె. మురళీ మోహన్ రావు

1990

కలియుగ అభిమన్యుడు

శాంతి ప్రియ

S. S. రవిచంద్ర

1991

నా ఇల్లే నా స్వర్గం

దివ్య భారతి, కృష్ణ

కె. రుష్యేందర్ రెడ్డి

1993

మామా కోడలు

వాణీ విశ్వనాథ్, దాసరి నారాయణరావు

దాసరి నారాయణరావు

1993

అన్నా చెల్లెలు

రవి

ఆమని, సౌందర్య

పి.చంద్రశేఖర్ రెడ్డి

1994

పచ్చతోరణం

వేణు

రంభ, అర్చన

ఆదుర్తి సాయిభాస్కర్

1997

ఎన్‌కౌంటర్

సూర్యం

కృష్ణ, రోజా

ఎన్ శంకర్

సపోర్టింగ్ రోల్

నిర్మాతగా
Year

Title

Director

Language

Notes

1999

సూర్యవంశం

ఇ.వి.వి.సత్యనారాయణ

హిందీ

Executive producer

2004

అర్జున్

గుణశేఖర్

తెలుగు

2007

అతిథి

సురేందర్ రెడ్డి

తెలుగు

In collaboration with UTV Motion Pictures

2011

దూకుడు

శ్రీను వైట్ల

తెలుగు

Presenter

మరణం
రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[3]

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మత్స్య పురాణం .3వ భాగం.16.11.22

మత్స్య పురాణం .3వ భాగం.16.11.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

మహాభారత తత్వ కథనం.27వ భాగం

మహాభారత తత్వ కథనం.27వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

కార్తీక నాలుగవ మంగళ వారం శ్రీ సువర్చలా ఆంజనేయం

Posted in రచనలు | Leave a comment

వింత నిజాలు.2వ చివరి భాగం

వింత నిజాలు.2వ చివరి భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

వింత నిజాలు.1వ భాగం గ

వింత నిజాలు.1వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

2022 జూన్ లో జరిగిన శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సహస్రచంద్ర దర్సనం\

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సహస్రచంద్ర దర్సనం

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సహస్రచంద్ర దర్సనం

Video link

Video link

Video link

Posted in రచనలు | Tagged | 1 Comment

సహృదయా భి సరణం

సహృదయా భి సరణం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా.కేతు విశ్వ నాథ రెడ్డి కథలు.2వ చివరి భాగం

డా.కేతు విశ్వ నాథ రెడ్డి కథలు.2వ చివరి భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

09.11.2022 గురువారం మా గబ్బిట వారి రామారావు గూడెం అగ్రహారం లోఅంజనేయ స్వామి, ద్వారకా తిరుమల దర్శనం

09.11.2022 గురువారం మా గబ్బిట వారి రామారావు గూడెం అగ్రహారం లోఅంజనేయ స్వామి, ద్వారకా తిరుమల దర్శనం

https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w/community

Video link

Posted in రచనలు | Leave a comment

మత్స్య పురాణం.2వ భాగం.8.11.22

మత్స్య పురాణం.2వ భాగం.8.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 26వ భాగం.8.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 26వ భాగం.8.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఉత్తర రామాయణం

Video link

ఉత్తర రామాయణం.1వ భాగం

ఉత్తర రామాయణం.2 వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

మత్స్య పురాణం.1వ భాగం.6.11.22

మత్స్య పురాణం.1వ భాగం.6.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మార్కండేయ మహాపురాణం1వభాగం5.11.22

మార్కండేయ మహాపురాణం1వభాగం5.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ద్వాదశి వ్రత కథ

క్షీరాబ్ధి ద్వాదశి పూజ – క్షీరాబ్ధిశయన వ్రతం – కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం

ఆషాడ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేసినయెడల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది.

క్షీరాబ్ధి ద్వాదశి పూజ లేదా క్షీరాబ్ధిశయన వ్రతం లేదా కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రత విధానం, ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.

How To Perform Ksheerabdi Dwadasi Vratam Pooja
శ్రీ పసుపు గణపతి పూజ:
శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

క్షీరాబ్ధి పూజ విధానము:
ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే
చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే
దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,
స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(పుష్పము వేయవలెను).

ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం
రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద
పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,
ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || ఆర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక
గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం
పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ ||
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || పంచామృతస్నానం సమర్పయామి.
టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,
వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే
కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)

అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,
గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః || అక్షితాన్ సమర్పయామి.
(అక్షితలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం
పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.
(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,
గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,
జగన్నాథాయ నమః జంఘే పూజయామి,
జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,
ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,
కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,
నిరంజనాయ నమః నితంబర పూజయామి,
నారయణాయ నమః నాభిమ్ పూజయామి,
వామ్నాయ నమః వళిత్రయం పూజ,
కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,
హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,
లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,
పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,
మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,
హరయే నమః హస్తాన్ పూజయామి,
అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,
శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,
వరదాయనమః స్తనౌ పూజయామి,
అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,
ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,
దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,
పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,
గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,
నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,
నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,
భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,
భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,
కుండలినే నమః శ్రోత్రే పూజయామి,
లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,
శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,
సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి
శ్రీకృష్ణ అష్టోత్తర పూజ:

ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || 10 ||
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం సంఖాంబుజా యుదాయుజాయ నమః
ఓం దేవాకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగా సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియనుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః || 20 ||
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటనాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్దీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః || 30 ||
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీ కృత తృణా వర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 ||
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః || 50 ||
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషనాయ నమః || 60 ||
ఓం శమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్ద విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || 70 ||
ఓం నారాకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః || 80 ||
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః || 90 ||
ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధదియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత
శ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 100 ||
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త నమః
ఓం గోపీవస్త్రాపహారాకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహ రుపిణే నమః
ఓం పరాత్పరాయ నమః || 108 ||
ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం
ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

శ్లో|| అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే
ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,
దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం
కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం
గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో||యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.
సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం
తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు
శ్రీ కృష్ణార్పణమస్తు.
(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ:

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో ‘స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు ‘నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా – ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ‘ దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. ‘యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.’ అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. ‘యాన్ములే….’ అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ‘ నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని’ అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ‘ ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.’ అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.’ అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.

Posted in రచనలు | Tagged | Leave a comment

“మార్కండేయ మహాపురాణం.10వ భాగం.4.11.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు”

Posted in రచనలు | Leave a comment

“బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .25వ భాగం.4.10.22”

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహాత్మజ్యోతి 1

మహాత్మజ్యోతి -1

మానవ ప్రవర్తన భావోద్వేగ ,తార్కిక స్థాయి లలో మాత్రమేకాదు ఆధ్యాత్మిక స్థాయిలోనూ చూడాలి .ఆధ్యాత్మిక ఊహాజనితమే కాదు. అందులో తర్క ,కారణ సంబంధమూ ఉన్నాయి .కొందరికి సాధారణానికి ఎక్కువగా అంటే అతీత శక్తులు ఉంటాయి .వీటిని సిద్ధులు అంటారు సిద్ధులు కారణాతీత౦గా ఉంటాయి .ఇవాళ దీన్ని యోగా అంటున్నారు .గాంధీ మహాత్ముడురాజకీయ కార్యానికి ఆధ్యాత్మికత జోడింఛి మార్గదర్శనం చేశాడు .ఆయన సత్యాగ్రహం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించటానికే .దాన్నే ఆయన ‘’సత్య శక్తి ‘’అన్నాడు .ఇది అహింస సాధన వలన కలిగి ,సంక్లిష్ట స్థితులలో పరిష్కారంచూపిస్తుంది .

రాజకీయాలను ఆధ్యాత్మీకరించటంను సర్వోదయం అన్నాడు .ఇవాల్టి మతాతీత రాజ్యంలో దాన్ని సాధించటానికి గాంధీ ఎన్నో ప్రయోగాలుచేశాడు .పాశ్చాత్య మేధావులు తిడ్రిక్ లాంటి వారు ఆయనను తప్పుగా అర్ధం చేసుకొన్నారు . శరీరాన్ని శుద్ధి చేయటం తప్పుకాదు యోగా లో అదేముఖ్యం .విధులకంటే హక్కులు గొప్పవని పాశ్చాత్యులు భావిస్తే, హక్కులకంటే విధులు అంటే ధర్మం గొప్పఅని భారతీయులు భావిస్తారు .విశ్లేషణ విభజిస్తుంది ,ఆధ్యాత్మికత సంశ్లేషణ చేస్తుంది అంటే కలుపుతుంది .చట్రంలో ఉన్న భౌతికత కంటే ఆధ్యాత్మికత శక్తి ఉత్పాదకంగా ఉంటుంది .

ఈ నాటి ప్రపంచంలో అస్తిత్వ సంక్షోభం ఎక్కువైపోయింది .అస్తిత్వం రాజకీయంగా మతపరంగా కూడా ఉంది .అది వ్యక్తిగతమై సంతృప్తి పొందకపోతే సామూహికమై హింసకు దారితీస్తుంది. అస్తిత్వంముఖ్యమే అది జాతీయ సమైక్యత కు దారితీయాలి .అందులో ముఖ్యంగా ఇండియాలాంటి సెక్యులర్ దేశానికి .సైన్స్ ,స్పిరిటియువాలిటి చేతులుకలిపి నడవాలి .మహాత్ముని సిద్ధాంతాలలో సైకాలజీ ఫిలాసఫీలు పెనవేసుకుపోయాయి .

ఆధారం డా.కోనేరు రామకృష్ణారావు గారి ‘’గాంధీ అండ్ అప్లైడ్ స్పిరిట్యువాలిటి ‘’గ్రంథం.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు

—

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం.9వ భాగం.3.11.22.

మార్కండేయ మహాపురాణం.9వ భాగం.3.11.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆదినారాయణ శతకం

ఆదినారాయణ శతకం

ఆదినారాయణ శతకం  శ్రీ మదాంధ్ర మాఘపురాణనిర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణఅబ్బరాజు శేషాచలామాత్య మణి ప్రణీతం .తత్పుత్ర హనుమంతరాయ శర్మ పాకయాజి పరిశోదితం .శ్రీ దోనేపూడి పార్ధ సారధి సహాయంతో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంముద్రాలయం లో క.కోదండరామ శర్మగారిచే1934లో  ముద్రితం. వెల-ఒక అణా.

  విజ్ఞప్తిలో కుమారుడు –తనతండ్రిగారు 28ఏళ్ళకు పూర్వం ఈ శతకం రాశారని ,భక్తిశతకాలలో దేనికీ తీసిపోదని తాను  ముద్రించటానికి అనేక సార్లు ప్రయత్నించినా ,ద్రవ్యాభావ ,ఇతరకారణాల చేత చేయలేకపోయాననీ ,దోనేపూడి వారు ఈ వ్రాతప్రతి చూసి వెంటనే ముద్రిద్దామని పూర్తిగా ద్రవ్య సాయం చేశారని చెప్పారు .శార్దూల ,మత్తేభాలశతకమిది .’’ఆదినారాయణా ‘’మకుటం .

 మొదటిశార్దూల పద్యం –‘’శ్రీ వాణీశ భవాదిసన్నుత ,రమా చిత్తేశ,మౌనీంద్ర స౦ –సేవా౦ఘ్రిద్వయ ,భాస్కరేందు నయనా చిద్రూప,భక్తప్రియా  – భావాతీత సురేంద్ర వందిత ,మహా బ్రహ్మాండ భాండోదరా –వేవేగం గరుణింప నా దెసకు రావే యాది నారాయణా ‘’అని రాసి తర్వాత గణేశ త్రిమూర్తులను,వారి సతులను వ్యాసాది మౌనులను స్తుతించి కాకుత్స్థ అన్వయ పూర్ణశశి శ్రీరామ చంద్రునికి ఒకనూలుపోగేసి ,తర్వాత తనబాధలు చెప్పుకోవటం ప్రారంభించారు కవి .

  సప్తజలధులు ఏకార్ణవం  అయిన వేళ,బ్రహ్మాండాన్ని గర్భంలో దాచి రక్షించావనీ ,కరిరాజును బ్రోచావనీ ,ఇల్లు ,సంసారం జంజాటంలో మునిగి మనుషులు నిన్ను మర్చి ,కాలుని చేత దండన పొందుతున్నారనీ , నీ మంత్రాక్షర జపం ముక్తిమార్గమనీ ,’’సిరియుం, బంట వెలందియు గెలకులన్ సేవింప ,దిక్పాలకుల్-పరి వేష్టింప సనందనాది మునులున్ బ్రార్ధింప ,నీ మూర్తిని  ‘’  ,కుజన క్షోభం ,సత్యాత్మక స్థిర తోషం ‘’కలిగిస్తావు .అరవి౦దాలకంటే అందంగా స్వామి చరణాలుంటాయి.నారాయణ మంత్రరాజ మహాత్మ్యం తెలిసినవారికి కొంగుబంగారమే చివరకు మోక్షమే .కలి దోషం అనే బాధకు స్వామి కళ్యాణ చరిత్ర దివ్యౌషధం .అమరాదీశ్వరుడు ఒకసారి ప్రమదా వినోదంలో మునిగితేలుతూ ‘’వాచస్పతి ‘’ని గౌరవి౦చక పోతె,స్వర్గంతో సహా అన్నీ నష్టపోయి ‘’నీ నామ మార్గము దాల్పన్ సుర సేవ్యుడైనాడు .

  తర్వాత సోమకాసురవధ పాలసముద్రమధనం,’’త్రివి ‘’రూపంలో హిరణ్యాక్ష నిధనం ,  హేమకశిపుని నృసింహావతారం లో వధించి భక్త ప్రహ్లాదుని కాపాడి లోకాలకు హ్లాదం కలిగించటం ,ముల్లోకాలఏలిక బలిని ‘’బాకారి బంనంబులన్ దొలగం ద్రోసి ,రమాఢ్యు చేయుటకునై ,భూతాఘుడైనట్టి తద్బలిచే గొన్న పదత్రయావనిని –సర్వ వ్యాపివై నాకమున్ బలిమిన్వజ్రికి’’ఇచ్చావు .ఇలా దశావతార  వర్ణన చేశారు.

 పురుహూతుడు అసురెంద్రునితో పోరాడితే ఆఇన్ద్రునికరిమ్రి౦గితె,వృత్రు గర్భంలో పుట్టి వేగంగాచించి ‘’నారాయణ మంత్రం ‘’తో బయటికి వచ్చాడని మంత్రమహిమను కీర్తించారు .బాలకృష్ణుని లీలలు మేనమామ కంస వధ ,తృణావర్త వృత్తాంతం ,తల్లియశోదకు ‘’బ్రహ్మాండంబు నోర జూపగటం’’కాళింగు బిగబట్టి ,వానిపడగల్  కాళ్ళన్జెడన్, మట్టి-యా కాలిందీనది బాపి తజ్జలము ‘’చక్కగా ప్రాణులకు ఉపయోగ పడేట్లు చేశావ్..మురళీగానంతో గోపసతులకు మొహమ్ కల్గించి ,ఒక్కొక్కరికి ఒక్కొక్కడి వై రాసక్రీడ జగన్మోహనంగా ఆడావు .నరకుని తల్లి సత్యభామచేతనే  నరికి౦చావ్ యుద్ధంలో .ధర్మరాజు రాజసూయంలో అగ్రతాంబూలం అందుకున్నావ్ .కురుక్షేత్ర యుద్ధంలో ‘’పార్దునకు చేదోడుగా ఉంటూధరాభారం తగ్గించావ్ .ఆపత్కాలం లోఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారికి ‘’దాపై గాచెదవు ‘’.

  నహుష గర్వభంగం వర్ణించారు ‘’ఒకదీపం లోఉన్న తేజం వేరొక్కొక్క దీపంబు నన్ బ్రకటంబై నట్లు బ్రహ్మాండం లో  ‘నీ ఒక్క రూపమే అనేక రూపాలుగా ఉత్పత్తి సంస్థితి వికలానికి కారణమవుతుంది .చివరగా –‘’శ్రీ కౌండిన్య మునీంద్ర గోత్రభవు డర్దిన్ దేవ భాషామాంధ్రభా-షాకావ్యామృతపానలాలసుడిలన్,శార్దూల ,మత్తేభ వృ-త్తాకారోజ్వల సూనమాలికను నమ్మక్కా౦బికా,నారసిం-హాకా౦క్షోద్భవ శేషయాహ్వయుడు ,కొమ్మీ యాదినారాయణా ‘’అని చెప్పి

  పరాభవ నామ సంవత్సరంలో ద్రోణపురంలో ఆర్యులు ప్రమోదం పలుకగఈ శతకమ్ రాశానని ,ఆదినారాయణుడికి అన్కితమిచ్చాననీ ప్రకటించారు కవి .అన్ని విధాలా భక్తీ చిప్పిలింది .ముఖ్యంగా నారాయణ మంత్రం రాజ శ్రేష్టను గొప్పగా  వర్ణించారు.మంచి భక్తిశతకమే వారబ్బాయి గారన్నట్లు .ఈ శతకాన్నీ, కవి గారిని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు         

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 నౌపడా ఉప్పు సత్యాగ్రహ నాయకురాలు ,త్యాగి – శ్రీమతి వేదాంతం కమలాదేవి (వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -నవంబర్ 

కడపజిల్లా నందలూరులో శ్రీమతి వేదాంతం కమలాదేవి 5-5-1897న ప్రతాపగిరి రామ గోపాల కృష్ణయ్య,శ్రీమతి భ్రమరాంబ దంపతులకు జన్మించింది .తండ్రి ప్లీడర్.అయన గారాబు పుత్రిక కనుక రోజూ ఆమెను తనతో కోర్టుకు తీసుకు వెళ్ళేవాడు .అందువల్ల అర్ధం లేని సిగ్గు జంకు ఆమెకు ఉండేవికావు .రాజకీయ ,సాంఘిక పరిజ్ఞానం అలవడింది 12వ ఏటనే .ఆమె వివాహాన్ని బాపట్ల వాసి వేదాంతం వెంకట కృష్ణయ్యయ్య తో  చేశారు .భర్త విద్యావంతుడు, సంస్కారజీవి .బ్రహ్మసమాజ మతానికిఆనాటి అందరు యువకుల్లాగానే ఈయనా ఆకర్షితుడయ్యాడు.పిల్లని అత్తారింటికి కొంతకాలం ప౦ప కుండా ఉంటె , అతడే దారికోస్తాడనుకొన్నారు ఆమె తలిదండ్రులు .కానీ వారి ఆలోచనలకు భిన్నంగా కమలాదేవి 13ఏటనే భర్త భావాలతో ఏకీభవించి కాకినాడకు కాపురానికి వెళ్ళింది .

  ఆమె భర్త అప్పుడు కాకినాడలో హెడ్ మాస్టర్ .పిఠాపురం రాజాగారు స్థాపించిన అనాధ ఆశ్రమ నిర్వాహకుడుగా కూడా ఉండేవాడు .  అందువల్ల కమలాదేవికి జాలి కరుణ ,ప్రేమ ,కార్యనిర్వహణ అభిలాష సేవాభావం అ వయసులోనే కలిగాయి .పని చేసి యేదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఆమె నేర్పు ,పట్టుదల అందరికి వి౦తగొలిపేవి .భర్త డాక్టర్ పరీక్ష చదవటానికి కలకత్తా వెడితే, ఈమెకూడా వెంట వెళ్ళింది .అక్కడ మహిళాభ్యుదయానికి ఎంతగానో కృషిచేస్తున్న శ్రీమతి సుప్రభాదేవికి శిష్యురాలై౦ది .బెంగాలీ నేర్చుకొని బెంగాలీతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలూ చదివే సామర్ధ్యం సాధించింది .బెంగాలీ పుస్తకాలను కొన్నిటిని తెలుగులోకి అనువాదం చేసింది .

  కలకత్తా చదువు పూర్తిచేసి భర్త వెంకట కృష్ణయ్య కాకినాడ లో 1919లో డాక్టర్ గా స్థిరపడ్డాడు .సంఘానికీ దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేయాలన్న విశాలభావాలతో కమలాదేవి కలకత్తా నుంచి కాకినాడ చేరింది .1920లో  గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం ఈ దంపతుల హృదయాలను ఊపేసింది.జాతీయోద్యమ బీజం మొలకరించి వృక్షంగా పెరిగింది .విదేశీ వస్త్ర బహిష్కారం ,నూలు వడకటం ఖాదీ ధరించటం,ఇంటింటికీ  తిరిగి ఖాదీ వస్త్రాలమ్మటం నిత్య కృత్యమైంది .శాసనోల్లంఘన పై ప్రజాభిప్రాయ సేకరణ కు 1921లో అఖిలభారత శాసనోల్ల౦ఘన సంఘం సామర్లకోటకు వచ్చింది .అప్పటికి కొన్ని రోజులక్రితమే కమలాదేవి బిడ్డస్వరాజ్యం  చనిపోయింది .ఆ బాధను మనసులో దిగమింగుకొని ,విచారణ సంఘాన్ని ఆహ్వానించి వినతిపత్రం సమర్పించింది .ఆనాటికీ నేటికీ ఒక్క సారే కాంగ్రెస్ మహాసభలు ఆంధ్రదేశంలో 1923లో మాత్రమె జరిగాయి .

  కాకినాడలో జరిగిన ఆమహాసభలు రంగరంగ వైభవంగా జరగటానికి కమలాదేవి చేసిన కృషి అనన్య సదృశం .ఘోషా వదిలేసి మహిళలు మహోత్సాహంగా వేలాదిగాపాల్గొని విజయవంతం చేశారు .వారిలో అణువు అణువునా ఉత్సాహం ఉద్రేకం పెల్లుబికింది .కమలాదేవి నాయకత్వంలో అనేక బాలికా ,మహిళా వాల౦టీర్ దళాలు  ఏర్పడి  ఇరవైనాలుగుగంటలు విసుగు విరామం లేకుండా  సేవలందించారు ..స్త్రీల శాంతిదళానికి కమలాదేవి  ఆధిపత్యం వహించింది .భర్త కృష్ణయ్య వైద్య దళానికి నాయకుడు .మహిళాసంఘ కార్య దర్శినిగా కమలాదేవి  ఆంధ్ర దేశమంతా తిరిగి, ఖాదీ ప్రచారం చేసి ,తిలక్ స్వరాజ్యనిధికి భారీగా విరాళాలు సేకరించింది .

   1930లో ఉప్పు సత్యాగ్రహం నాటికి కమలాదేవి ఆరోగ్య౦ ఏమీ బాగాలేదు .ఇంట్లో అంతా పసిపిల్లలు ,ఇల్లు’’ఆనందనిలయం’’ కాంగ్రెస్ ఆస్పత్రి అయింది .అతిధి అభ్యాగతులతో, క్షతగాత్రులతో కిటకిట లాడేది .విశాఖ జిల్లా ఉద్యమం నడపటానికి మహిళా నాయిక కోసం మహర్షి బులుసు సాంబమూర్తి వెతుకుతున్నారు .ఈమె అన్ని ఇబ్బందుల్నీ వదిలేసి ,రంగంలోదూకింది .ఆవేశంగా ఉపన్యాసాలిస్తూ ఉద్బోధిస్తూ చాకచక్యంగా పురుషులతోపాటు చొచ్చుకుపోయింది .ఒక గొప్ప ప్రజానాయికగా ,ఉద్యమకారిణిగా గొప్ప పేరు తెచ్చుకొన్నది .ఏ జిల్లావారు ఆజిల్లో శాసనోల్లంఘన చేయాలని కాంగ్రెస్ నియమాన్ని అనుసరించి కమలాదేవి ‘’నౌపడా ఉప్పు కొఠార్ల మీదికి దండెత్తింది .ఆ ఉద్రేక౦ , సంరంభం ,పట్టుదల అసామాన్యం అనిపించాయి .లాఠీ దెబ్బలకు జంకలేదు ,అరెస్ట్ లకు భయపడలేదు .సాశనోల్లంఘన ఒక పవిత్రయజ్ఞం లా  ప్రజలు  భావించి ముందుకు కదిలారు. అనేకమంది స్త్రీ పురుషులతో కలిసి ఆమె నౌపడా ఉప్పు కొఠార్లవద్ద ఉప్పు సత్యాగ్రహం చేసి 1930మే 20న అరెస్ట్ అయింది .రాయవెల్లూరు జైలులో ఆరు నెలలు బిక్లాస్ ఖిదీగా శిక్ష అనుభవించింది .

   రాయవెల్లూరు జైలులో శ్రీమతి ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ,శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయమ్మ ,దువ్వూరి సుబ్బమ్మ గార్లవంటి అగ్ర నాయకులతో పరిచయం కలిగింది .కళాత్మక హృదయమున్న ఈమె ఏపనైనా ఉత్తమంగా ,నాణ్యంగా చేసేది .చమ్కీ ,పట్టు ,జరీ ,అల్లికలు పూలతోట పెంపకం ,చక్కగా వంట చేయటం మధురంగా పాడటం వంటివి ఆమెకు కరతలామలకం .ఖైదీగా తనకు వంటపని డ్యూటీ వచ్చినపుడు వంటిల్లు ను ముందు అద్దం లాగా పరిశుభ్రం చేసి ,ఆటర్వాతే కమ్మని వంటచేసేది .1930నవంబర్ 12న  విడుదలై ఇల్లు  చేరింది .అనారోగ్యంగా ఉన్నా ఏపనీ మానలేదు .1931లో ఇచ్చాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిలళాసభకు అధ్యక్షతవహించింది .

  1932 రెండవ సారి శాసనోల్లంఘన లో ప్రభుత్వం లాఠీ లను ఉపయోగించి ఉద్యమకారుల్ని భయ భ్రాతుల్ని చేసింది .భారీసభలు జరగకుండా అడ్డగించింది 144 సెక్షన్ విధించింది .సభ జరిపితే రాజద్రోహ నేరం మోపేవారు .ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం జరపరాదాని  ఆంక్షపెట్టింది ప్రభుత్వం. అయినా లెక్క చేయకుండా కొండా వెంకటప్పయ్య ,ఉన్నవా లక్ష్మీ బాయమమ్మగార్లు వెళ్లగా స్టేషన్ లోనే వందలాది మందిని అరెస్ట్ చేశారు .కానీ తెలివిగా ప్రకటించిన చోటకాకుండా గుట్టు చప్పుడు కాకుండా వేరొక చోట సభనిర్వహించారు కమలాదేవి ప్రభ్రుతులు .

  ఈ సందర్భంగా కమలాదేవి తెలివి తేటలు చాతుర్యానికి సంబంధించిన ఒక ఉదంతం తప్పక చెప్పుకోవాలి .గుంటూరు జిల్లాలో శ్రీమతి వేదాంతం కమలాదేవి అధ్యక్షతన 5-6-1932న ఆంధ్రరాష్ట్ర మహా సభ జుగుతుందని అందరూ పాల్గొనాలనీ పత్రికలలో ప్రకటించారు .గోడలమీద కాగితాలు అంటించారు .ఆ సభను ఎలాగైనా జరగనివ్వకుండా చూడాలని నిశ్చయించి పోలీసులు అప్రమత్తులై కమలాదేవి అరెస్ట్ చేయటానికి సర్వ సన్నద్ధంగా ఉన్నారు.నాలుగవ తేదీ అర్ధ రాత్రి గడిచినా ఆమెజాడ కనబడలేదు.అగ్రహారంలో సంపత్కుమారా చార్యులవారి వ్యాయామ శాలలో నాలుగవ తేదీ ఉదయంనుంచి రాములవారి భజన కార్యక్రమాలు రాత్రిదాకాజరిగి రాత్రి పది గంటలకు తీర్ధ ప్రసాదాల సందడి జరిగింది .ఆసమయం లో నలుగురు మనుషులు చేరితే ఆరుగురుపోలీసులు వచ్చేవారు .ఆ రోజు ఆ పోలీసులు కూడా ప్రసాదాలు తీసుకొని ,చుట్టు ప్రక్కలున్న అరుగులపై ఆదమరిచి హాయిగా నిద్రపోయారు .తెల్లవారి కళ్ళు నులుముకొంటూ కలవర పాటుతో పరిగెత్తి లాఠీచార్జి చేస్తున్న పోలీసులతో కలిశారు .తెల్లని ఖాదీ ధరించి జండాలు పట్టుకొని జాతీయగీతాలు పాడుతూ వందే ‘’మాతరం మనదే రాజ్యం ‘’అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లు సింహ గర్జన చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ,పౌరులమధ్య విజయోత్సాహం విజయ గర్వం ముఖాన తాండడ విస్తూ ,వేదాంతం కమలాదేవి నిలబడి ఉంది .ఆమె అనుకున్న ప్రకారమే కాకినాడలో బయల్దేరి ,గుంటూరుకు ముందు  స్టేషన్లోనే దిగి ,పల్లెటూరి పెళ్లి ముత్తైదువలాగా తయారై రైల్లోనే గుంటూరుచేరింది .వ్యాయామశాల చుట్టూ ఉన్న చాలా ఇళ్ళల్లో రహస్యంగా వచ్చి దిగిన ప్రతినిధులు ,పొరుగూరి ప్రేక్షకులతోపాటు ఆమె కూడా వచ్చింది .తెల్లవారుజామున కోనేరు గట్టుపై అందరూ చేరి జండా వందన చేశారు .కమలాదేవి అచ్చు వేయించిన తన అధ్యక్షోపన్యాసాన్ని చదివింది .కాంగ్రెస్ మహా సభ ఆమోదించిన శాసన ధిక్కార తీర్మానాలన్నీ చదివి ,ఆమోదించారు .మరికొన్ని ఉపన్యాసాలు ప్రబోధాలు అయ్యేసరికి తెల్లారింది .మహాసభ అద్భుతంగా విజయమైనందుకు అందరూ ఆనందంగా జాతీయగీతాలుపాడుతూ ఊరేగి౦పు గావచ్చారు .తెల్లవారి తెలివిపై తెలివిగా దెబ్బకొట్టి తెల్ల బోయేట్లుచేసిన సాహసి కమలాదేవి .తర్వాత అందరిని  అరెస్ట్ చేశారు .గుంటూరు సబ్ జైలులో పది హేను రోజులుంచి ,ఆరునెలలశిక్షవేసి, రాయవెల్లూరుకు పంపారు .ఈమెతోపాటు అరెస్ట్ అయిన కొండా సత్యవతమ్మగారికి జైలులో టైఫాయిడ్ వచ్చింది .కమలాదేవి ఆమెను కంటికి రెప్పలాగా కాపాడి ఆరోగ్యం కుడుటబడేట్లు చేసింది .

  రెండవ సారి అరెస్ట్ అయి విడుదలయ్యాక 1929,1930,1934లలో అఖిలభారత కాంగ్రెస్ స్థాయీసంఘ సభ్యురాలుగా గౌరవం పొందింది .మూడు సార్లు కాకినాడ మునిసిపల్ కౌన్సిలర్ గా ఉన్నది .ప్రాధమిక విద్యావ్యాప్తి చేసింది .స్త్రీలలో జాతీయభావ స్పూర్తి పెంచింది .తర్వాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ప్రచారం చేసింది .ప్రత్యర్ధులు కొన్ని చోట్ల ఆమెకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేశారు. అయినా అత్యధికం కాంగ్రెస్ వారు గెలిచారు ఆమె కృషి ఫలించి సంతృప్తి చెందింది .మద్రాస్ కార్పోరేషన్ ఎన్నికలలో ఆచంట రుక్మిణీ లక్ష్మీ పతికి తోడ్పడింది .స్వాతంత్ర్యం రాక మునుపే ఇంతటి దక్షతకల నాయకురాలు,త్యాగమయి  , శ్రీమతి వేదాంతం కమలాదేవి 43వయేటనే14-7-1940న పక్షవాతంతో మరణించింది .

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 24వ భాగం.3.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 24వ భాగం.3.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -349

· 349-టివి సీరియల్ నటుడు ,ఆనంద్ సినిమా నటుడు ,సిటీ బీట్స్ దర్శకుడు –లగడపాటి గోపీ చంద్

· గోపీచంద్ లగడపాటి (English: Gopichand Lagadapati) [1] సిని నటుడు, నిర్మాత, దర్శకుడు ఇంకా రచయిత . లగడపాటి తెలుగు చిత్రం ఆనంద్ తో సినిమా రంగప్రవేశం చేసారు .తర్వాత మిస్టర్ మేధావి సినిమాను ఆయన తాతగారితో కలిసి నిర్మించారు.

మునుపటి జీవితం
గోపీచంద్ లగడపాటి 1981 జూలై 16, లగడపాటి సంగయ్య, రమాదేవి దంపతులకు జన్మించారు.[2] లగడపాటి తల్లిగారి తండ్రి శ్రీ రామారావు బొద్దులూరి సిని నిర్మాతగానే గాక ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా కూడా ఉన్నారు. గోపీచంద్ హోటల్ మేనేజ్మెంట్ నుండి డిగ్రీ చేసారు.

వృత్తి
గోపీచంద్ లగడపాటి [3] మొట్టమొదటిగా ప్రియనేస్తం అనే తెలుగు ధారావాహికంలో నటిచారు.ఇది జెమినీ టెలివిజన్లో 2000 సంవత్సరంలో ప్రసారం అయ్యింది . తర్వాత గోపీచంద్ లగడపాటి ప్రేమించి చూడు అనే సినిమాకు దర్శకత్వ శాకలో పనిచేసారు. కొంత కాలం చదువుల కొరకు సినిమాకు దూరంగా ఉన్న గోపీచంద్ మరల తన చదువులు పూర్తైన తర్వాత యాద్రుచికంగా తన స్నేహితుల ద్వారా శేఖర్ కమ్ములను కలుసుకున్నారు.ఆ విధంగా ఆనంద్ తో నటుడిగా సిని రంగ ప్రవేశం చేసారు. ఆనంద్ సినిమా తదుపరి, రెండేళ్ళ తరువాత అనే చిత్రంలో మరొక ఇద్దరితో కలిసి కథానాయకునిగా నటించారు. ఈ చిత్రం 2005 జూలైలో విడుదలయ్యింది . ఈ చిత్రం విడుదల వరకు అంచనాలు ఉన్నప్పటికీ జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది . తరువాత గోపీచంద్ ఇండియన్ బ్యూటీ అనే చిత్రంలో ప్రతి నాయకుని పాత్రలో నటించారు.ఈ చిత్రం కూడా జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది .ఈ చిత్రం 2006వ సంవత్సరంలో విడుదల అయ్యింది . గోపీచంద్ తదుపరి చిత్రం ఆన్ ది అదర్ సైడ్ అనే ఇంగ్లీష్ సినిమాలో. ఈ చిత్రంలో కూడా గోపీచంద్ ప్రతినాయకుని పాత్రలోనే నటించారు. ఇది 2007వ సంవత్సరంలో అమెరికాలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను హార్లం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నుండి ఉత్తమ చిత్రంగా 2007 సంవత్సరానికి గాను ఎంపికయ్యింది. గోపీచంద్ లగడపాటి 2007 లో తన తాత గారితో కలిసి మిస్టర్ మేధావి అనే చిత్రాన్ని నిర్మించారు . దీనికి ఆయన ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. .ఈ చిత్రం తర్వాత గోపీచంద్ హాలీవుడ్ సినిమా భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ అనే చిత్రంలో దర్శకత్వశాఖలో ప్రముఖ హాలీవుడ్ నటులైన మార్టిన్ షీన్, మిస్చా బార్టన్, కాల్పెన్, తదితరులతో కలిసి పనిచేసారు. ఈ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది.గోపీచంద్ లగడపాటి జంజీర్ అనే హిందీ సినిమాలో కూడా దర్శకత్వ శాఖలో పనిచేసారు.ఇది తెలుగులో తూఫాన్ అనే పేరుతో విడుదల అయ్యింది. గోపీచంద్ లగడపాటి సినిమాలోనే కాక పలు జాతీయ అంతర్జాతీయ లఘు చిత్రాలు, ప్రకటనలకు రచయితగా ఇంకా సహాయ దర్శకుడుగా ; పని చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా పనిచేసారు.

చిత్ర వివరములు

  1. ప్రియనేస్తం ( 2000 ) – ధారావాహికం – నటుడు
  2. ప్రేమించి చూడు (2001) – సినిమా – సహాయ దర్శకుడు
  3. ఆనంద్ (2004) – సినిమా – నటుడు
  4. సిటీ బీట్స్ (2004 ) -డైలీ – దర్శకుడు
  5. రెండేళ్ళ తర్వాత (2005) – సినిమా – నటుడు
  6. ఇండియన్ బ్యూటీ (2006) – సినిమా – నటుడు
  7. ఆన్ ది అదర్ సైడ్ (2007) – సినిమా – నటుడు
  8. మిస్టర్ మేధావి (2008) – సినిమా – సహ నిర్మాత
  9. అడ్వెంచర్స్ ఇన్ ఒడిస్సీ (2010 ) – ధారావాహికం- సహాయ దర్శకుడు
  10. యొప్లైత్ (2010) -ప్రకటన -సహాయ దర్శకుడు
  11. డెత్ (2011) -లఘు చిత్రం -సహాయ దర్శకుడు, నటుడు
  12. జంజీర్ (2013) -సినిమా – సహాయ దర్శకుడు
  13. తూఫాన్ (2013) -సినిమా – సహాయ దర్శకుడు
  14. భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ ( 2014) -సినిమా – సహాయ దర్శకుడు, నటుడు

· 350-మాధవిపిక్చార్స్ అధినేత ,శ్రీకృష్ణ తులాభారం,కురుక్షేత్రం ఫేం –గోరంట్ల రాజేంద్ర ప్రసాద్

· గోరంట్ల రాజేంద్రప్రసాద్ రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 1963లో రాముడు భీముడు చిత్రం భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు నిర్మించారు.

· మరణం
· 86 సంవత్సరాల గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యం కారణంగా 2022 జులై 7న కన్నుమూశారు.[1]

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(

ఓలేటి వారి ‘’వ్యాసార్ధం ‘’-4(చివరి భాగం )
‘కొవ్వలి నవలలు –పఠనాసక్తి ‘’వ్యాసంలో చదివే ఆసక్తి ఉంటేనే రచన కాలంతోపాటు చెల్లుబాటౌతు౦దనీ ,సామాన్య చదువరులచేత అనూహ్య ఆదరణపొందిన నవలారచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అనీ ,విశ్వనాథ ఆర్ష సంప్రదాయాన్ని కాపాడుతూ ,చలం స్త్రీలకు బయటి ప్రపంచాన్ని చూపిస్తూ కొడవటిగంటి సమాజంలోని స్తబ్దతను వదిలించి చైతన్యం కలిగిస్తూ రచనలు చేస్తున్నకాలం లో కొవ్వలి ఆకర్షణ ,ఉత్సుకతలతో ఒక సంచలన రచయితగా ఆవిష్క్రుతుయ్యాడని,చదువరి పుస్తకం లోనుంచి తన మస్తాకాన్ని పక్కకు తిప్పే వీల్లేకుండా నియంత్రించే మంత్ర శక్తి కొవ్వలికి ఉందనీ ,ఇంట్లో వాళ్ళు ఏమనుకొంటారో అని పుస్తకాల చాటున ,పడగ్గదిలో దాచుకొని చదివే వారనీ ,రైల్వే స్టేషన్లలో, రైళ్ళలో కొవ్వలి నవలలు ‘’హాట్ కేకులు ‘’గా అమ్ముడుపోయేవని ,అలాంటి వాడు ఇంకోడు రావాలనుకోవటం ఎండమావి లాంటి దేమో ?’’ అన్నారు .కొవ్వలి నవలలు ‘’కాలక్షేపం బఠానీ’’లు అని అనేవారు .
ఘంటసాలను ‘’వాగ్దేవి స్వరనైవేద్యం ‘’అని ఆవిష్కరించిన వ్యాసంలో కరుణ శ్రీ పద్యం ముందు తన గొంతును అద్దంలో పెట్టి ఘంటసాల భావ ప్రతిబింబాన్ని చూపాడు అని చెప్పటం నాకు తెలిసినంతవరకూ ఎవరూ ఇంతగొప్పగా ఆవిష్కరించలేదు .కవి అస్తిత్వాన్నీ కవిత్వ స్థితిగతుల్ని గళమాధుర్యంతో ప్రకటించగల ఘనత ఘంటసాలది అన్నారు .అలిగితివా సఖీ పాటలోఅనునయం అర్ధం కోసం నిఘంటువులలో వెతకక్కరలేదు ఆయన పాడే తీరులో పుష్కలంగా లభిస్తుంది .’’ధారుణి రాజ్య సంపద ‘’పద్యంలో భీముడి ఉద్రేకం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది .రౌద్రానికిస్థాయీభావంగా కనిపించే క్రోధం యొక్క ఔద్ధత్యం శ్రవ్య చిత్రంగా నిల్పి శరీరం రోమాంచితం చేస్తారు .’’మాణిక్య వీణా ముపలాలయ౦ తీం ‘’అన్న కాళిదాసు శ్లోకానికి తన స్వరంతో ‘’అమృత తుల్యం చేశారు .ధ్వన్యనుకరణలు చేయకుండా అగ్ర నటులకు గాత్రదానం చేసిన స్వర మాంత్రికుడు .పాట ,పద్యంతో వాగ్దేవికి స్వరనైవేద్యం చేసిన పూజారి .
‘’అతడొక త్రివర్ణమాల ‘’అంటూ శ్రీరంగం నారాయణ బాబు ‘ను పరిచయం చేశారు వోలేటి .ఆనాటి ఆంధ్రపత్రికలో ‘’మనకు సహకారి యగుచు మన్మధుడు వెదకి-వాడి యడుగుల గాడి త్రవ్వంగ కొత్త –చెలమలేర్పడి తేటలౌ జలములూరే ‘’అని రాసి భావకవిగా అస్తిత్వాన్ని చాటుకొని ,చీకటిలో మిణుగురు లను వెతికాడు.’’మువ్వపు వలపుతారల మువ్వ మ్రోత’’ఆయన మాత్రమె అనగలడు .’’దంతపు వీణైతేనేమి వొళ్ళు –తెగిపోయిన తీగ బతుకు –మేళన చేయని హృదయం –నీ వ్రేళ్ళకు బాధ మిగులు-నను ముట్టకు ‘’అంటూ వేశ్యను వర్ణించిన తీరు అనితరసాధ్యం –వెలకట్టబడిన తనువుతో వేదనా మయిగా జీవించే వెలది కరుణా౦తరంగాన్ని ,మానవీయకోణ౦తో ఎత్తిన పతాక .’’నా నివాసంము తొలుత గాంధర్వ లోక –మధుర సుషమా సుధాగాన మంజువాటి-ఏనొక వియోగ గీతిక ‘’అని కృష్ణశాస్త్రిని ,’’లోకాలు నాకేలనే –కోకిలా బాలకృష్ణుడు చాలునే ‘’అంటూ తురగా వెంకటరామయ్యను బాబు పాడుతుంటే ‘’ఇంతకంటే కవిత్వానికి పరమావధి ఏముంది ‘’అని శ్రీశ్రీ కూడా అంటే ఇంకేం కావాలని మనకు తెలీని విషయం ఆవిష్కరించారు పార్వతీశం .తనకాలంనాటి యువకవులకవితలను ఆయన గానం చేస్తుంటే ‘’విజీనగరంరసప్లావితం ‘’అయీదట .నారాయణ బాబు భావకవిత్వ ఆదర్శ వాద కవితా శాఖనుంచి వాస్తవిక శాఖకు ,అక్కడినుంచి వాస్తవిక అధివాస్తవికత కు ప్రయాణించాడు అతనికి పౌరాణిక కథలపైనా ,శాస్త్రీయ సంగీతం పైనా సమస్కంధమైన అవగాహన ఉందన్నారు .’’మంటల్లోపుట్టి మంటల్లోపెరిగి మంటల్లోనే మడిశాడు ‘’అని భగత్ సింగ్ ను ఒక అగ్ని శిఖగా చేసి రాశాడు .రాగ,తాళ లక్ష్యాలు సాకల్యంగా తెలిసి ‘’చెప్పవా –కష్టమైనా –సంకీర్ణపు –నరజాతికి –ఆకలి –ద్రువతాళ౦ –ఆకలితో –నా కడుపు –అగ్ని వీణ వాయిస్తే –దీపకరాగం-దిక్కు లెగబాకి-ఆకాశం అంటుకుంది –ఆర్పండి –ఆర్పండి ‘’రాత్రిని జీవితాన్నీ పడుగు పేకల్లా వర్ణించి ‘తెలుగు ధాత్రి ‘’రాశాడు .సర్రియలిజాన్ని శ్రీశ్రీ అతి వాస్తవికత అంటే నారాయణబాబు అది వాస్తవికత అని మౌన శంఖం పూరించి విలక్షణప్రయోగం చేశాడు –‘’మౌనము శంఖమై చెరగు మాయగా నేత్ర పాతనగ బింబ వి-ధ్వానము కొంగ నెత్తురులు త్రాగెను నల్లతురాయిపూవుగా —‘’
మారుషులు మార్క్స్ ,ఫ్రాయిడ్ లు అన్నాడు .ప్రయోజనాన్ని వినియోగించుకొని ,అనర్ధాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చేయగలపని అన్నాడు .బాబు వ్యాసాలూ కతలూ రాశాడు .వీటిలో సినిమాలు నాటకాలూ ఉన్నాయి .కొమ్మూరి వెంకట్రామయ్య పత్రిక ‘’తెలుగు సినిమా ‘’లో వ్యాసాలురాశాడు .అబ్బూరివారి ‘’నటాలి’’లోనూ పనిచేశాడు .భావకవి అధివాస్తవిగా ,చివరికి అభ్యుదయకవిగా రూప విక్రియ చెంది తెలుగు వాళ్ళ కవనాకాశం లో త్రివ ర్ణమాలగా ఆవిష్క్రుతుడు అయ్యాడు నారాయణ బాబు అంటూ ఎస్టిమేట్ చేశారు పార్వతీశం .
‘’చివరకు మగిలిన సగం ‘’లో శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి రాస్తూ భర్తబుచ్చిబాబు అనే వెంకట సుబ్బారావు గారి కీర్తిలో అర్ధభాగం దక్కించుకొన్న విదుషీమణి అనీ ,ఆయనకోసం వచ్చే కవులు కళాకారులు రచయితలకోసం’’ వండ నలయదు వేవురు వచ్చి రేని ‘’అన్నట్లు ప్రవరునిభార్యలాగా అన్నపూర్ణకు ఉద్ది అయిన ఉత్తమా ఇల్లాలు .ఆమెగాయని, చిత్రకారిణి రచయిత్రి కనుక ఆ అర్ధ గౌరవం సంపాది౦చు కొన్నారని ,నిరంతర సౌన్దర్యాన్వేషి అయిన భర్త కు తగ్గట్లు ఇల్లు ఆహ్లాదంగా తీర్చిదిద్దేవారని ,ఇదంతా ఆయన వలన కలిగిన కీర్తి .మహిళాచైతన్యానికి ప్రేరణ గా నిలిచి కావ్య సుందరివంటి కథా సంపుటాలు,తీర్పు వంటి నవలలు రాసి’’భర్తకంటే ఉత్తమకథలు రాయాలని ‘’. పింగళివారి ఆశీర్వాదం పొందిన భాగ్యశాలి .’’రేపటి విరాణ్మూర్తిగా వెలగానున్న ‘’బాపు ‘’కు గురువన్న సంగతి వేదగిరి రాంబాబు తెలియజేశారనీ ,మంచి ప్రాజెక్ట్ ప్రారంభించేముందు సీతారాముల బొమ్మలు గీసుకొని పని ప్రారంభించే బాపు ,ఒకానొక సమయంలో బుచ్చిబాబు శివలక్ష్మి దంపతుల బొమ్మలు వేసి పని ప్రారంభించే వారన్న విషయంకూడావేదగిరి ఉవాచ .మిసిమి పత్రికకు ఆమెతో చేసిన ఇంటర్వ్యు సారాంశం –పాశ్చాత్య దేశాలసాహిత్యం బాగా చదివి అక్కడి కొత్తదనాన్ని తెలుగులో ప్రవేశ పెట్టాలని ఆయన అబిరుచి .మద్రాస్ రేడియో లొనే ఈ ప్రయోగాలు మొదలుపెట్టారు ‘’రాయల కరుణ నృత్యం ‘’చేసినపుడు బిఎన్ రెడ్డిగారితో ముందుమాటలు చెప్పించారు .ఇదే మల్లీశ్వరి సినీకథ .అడ్డదిడ్డంగా విమర్శిస్తే కోపం వచ్చేది ఆయనకు .పరోక్షంలో తక్కువ చేసిమాట్లాడటం సహి౦చె వారుకాదు .చివరకు మిగిలేది నవలలో తన ఊహలన్నీ అందులో పెట్టేశారు అందుకే ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది .సహృదయులతో శేషే౦ద్ర లాంటి వారితో ఎంతసేపైనా మాట్లాడేవారు .రామాయణం లోతులు బహు చక్కగా చెబుతుంటే ఆసక్తిగా తానూ వినే దాన్ని అన్నారు .వర్ణనలు చేయాలంటే మావారే .అందుకే నాకథలలో వర్ణనలు లేకు౦డారాశాను .తనకథల్లో అందరూ సామాన్య స్త్రీలే ఇద్దరం చిత్రాలు చాలానే వేశాం.ఒరిజినల్ దాట్స్ బాగుంతాయనేవారు .చిత్రకళలో తనకు గురువులేరని ఆసక్తిగా స్వయంగా నేర్చినదే అని అన్నారు .ఆయన లాండ్ స్కేప్స్ ఎక్కువ వేశారు తాను వ్యక్తుల బొమ్మలు వేశారు .గాంధీ గారి బొమ్మ గీశారు. గాంధీ మద్రాస్ లో ఉన్న నెలనాళ్లు ఆమె రోజూ బస్సెక్కి వెళ్లి ఆయన ఎక్కడ ఉంటె అక్కడ చూసే వారు. అతి సన్నిహితంగా బాపును చూడటం తన అదృష్టం .సంస్కృతం ఇష్టం అ౦దులొ కావ్యాలు చదివారు .ఆయనకు హార్మోనియం ఇష్టం .పద్యాలు మహా ఇష్టం . .ఈలపాట రఘురామయ్య తరచూ ఇంటికి వచ్చి పద్యాలుపాదడి ఆయనకు సంతృప్తికలిగించేవారు .బుచ్చిబాబు శతజయ౦తి వరకు ఆమె ప్రతి ఏడూ ఆయన పుట్టిన రోజు జరిపేవారు .ఆయనకు పుట్టిన రోజు అంటే భలే ఇష్టం నాకు నువ్వు చెయ్యి నీకు నేను చేస్తాను అనేవారు .ఆఖరి సంవత్సరం ‘’షేక్స్పియర్ సాహితీ ప్రస్థానంను ‘’స్థానం నరసింహారావు గారికి హైదరాబాద్ లో అంకితమిచ్చారు దేవులపల్లివారి అధ్యక్షతన తమ ఇంట్లోనే జరిపి అందరికీ భోజనాలు పెట్టటం మరుపుకురాని సంఘటన అన్నారు .ఆయన చిత్రాలలో ముఖ్యమైనవి ఒక సంపుటిగా తెచ్చారు ఈమె ‘’.
సుబ్బలక్ష్మి గారు మహిళాలోకపు మూర్ధన్య ‘’అని ముగించారు ఓలేటి .
స్వవిషయం -1970-80లలో ద్విప్లేట్స్ అనీ ప్రాసక్రీడలని చాపల్యంతో కొన్నిగిలికాను .అప్పడు బుచ్చిబాబుపై –‘’చివరకు మిగిలిందేమిటి బుచ్చిబాబూ –‘’కోమలి ‘’నమైనా ,’’అమృత’’మైనా ఒక్కటే కదా ప్రేమ పిచ్చిబాబు ‘’అని రాసింది గుర్తుకొచ్చింది .
‘’అమృతాశ్రువులు ‘’ ఆధునిక కవులగురించి నివాళి .భావకవితా ప్రతిష్టాపకుడు రాయప్రోలు తనగురువు రవీంద్రుని అస్తమయం పై –‘’ఆరిపోయినదిదివ్యస్నేహ శృంగార దీపంబు –నివాళితీసినట్లు ‘’అని ఆత్మీయత ప్రదర్శించారని ,తనకుమారుని మరణాన్ని కూడా కరుణార్ద్రంగా చెప్పారనీ ,వ్యక్తులు పోయినప్పుడేకాక అనేక విషయాలపైనా ఎలిజీ రాస్తారని ఎలిజాయిక్అనే ఛందస్సు ఉందని అందులో రాసిన ఏవిషయమైనా ఎలిజీ గా భావిస్తారని తెలియజేశారు .అబ్బూరి చేజారిన బాల్యాన్ని జ్ఞాపకాలలో భద్రపరచి –‘’పెంచితి నీరుపోసి ,మొలిపించిన స్వాదు పరార్ధ్ర సాహితీ –కాంచన రాగ వల్లికల గాఢ తమో మలినమము బాపి ‘’అని పద్యం చెక్కారని ,బసవరాజు అప్పారాగారికిఎంతో శోకంకుమారుని మరణం వల్ల కలిగితే ‘’వేదాద్రి శిఖరాన వెలిగిన్న జ్యోతి-మినుకు మినుకుమని –కాసేపు కునికి పోయిందని ‘’పద్యంలో తాత్వికాన్ని భావ స్ఫోరకంగా ప్రకటించారని ,ఆంధ్ర రత్న ఈయనతో యమునాకల్యాణి రాగం పాడించుకొని వినేవారనీ ,ఆయన మరణం ఈయనకు ఆశనిపాతమై ‘’ఎలాపాడెద నింక యమునా కల్యాణి నే-లీల మానవుడు గోపాలుడు లేడాయే-ఎంత చి౦చు కొన్నా గొంతు పెగలదాయే –కన్నీళ్లు గారవకే కడుపు చెరువయ్యే ‘’అని విలవిల లాడి వలవల కన్నీరు కార్చారట .విశ్వనాథ ,దువ్వూరి కూడా అద్భుత స్మృతి గీతాలురాశారని ,బాపి బావ కొడుకుమరణాన్ని –‘’మబ్బుల౦దు బుట్టి మాయమౌ నింద్ర చాపంరీతి –స్వల్పకాలమే వాసనలజిమ్మి వడలు పుష్పంబు బోలి ‘’తమను బాసి వెళ్లిపోయాడని బావురుమన్నారు .కృష్ణ శాస్త్రి భార్య మరణం తట్టుకోలేక ‘’హృదయ నాళము తెగియె ,నా హృదయ ధనము –తొలగిపోయెను జీవిత ఫలము స్రుక్కి ‘’అని జీవితంపై ఇచ్చ నశించి నంతగా సతీ వియోగం కలవరపెట్టి౦దన్నారు .నాయనితల్లిమరణాన్ని ‘’నీవు మడిగట్టుకొని పోయినావు పండ్లు –పుష్పములు తీసుకొని దేవ పూజ కెటకో-నేనునీ కొంగు పట్టుక నీదు వెంట –పోవుటకు లేక కన్నీటి బొట్లు రాల్తు ‘’అని బాధపడ్డారు .గురువు వెంకటశాస్త్రి గారి మరణం జీర్ణించుకోలేని శిష్యులు పింగళి, కాటూరి –‘’ఎనుబదేండ్లు దైన్య మెరిగిక జీవించచె –బెంచె శిష్యకోటి –యరిగె పూర్ణకాముడగుచు గురుడు ‘అనిగు స్మృతికిసాక్షి సంతకం చేశారట .మానాప్రగడ ,కూడా రాశారు రావూరిభరద్వాజ భార్య మరణం పై ‘’కాంతం నీవు నానుంచి వెళ్ళిపోయాకా-నేను అర్ధం లేని శబ్దాన్ని భాష లేని భావాన్ని శక్తిలేని ద్రవ్యాన్ని వేగంలేని ప్రవాహాన్ని శిల్పిలేని శిలను అయ్యాను నాకిప్పుడే విలువాలేదు –భగవంతుడుకూడా ఇప్పుడు నీరూపం లో కనిపిస్తే తప్ప నేను గుర్తించలేను కాంతం ‘’అని అక్షరలక్షలు విలువ చేసే ఎలిజీ రాశారు .
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గార్ని ‘’అక్షరాల బాట సారి ‘’గా పరిచయం చేశారు పార్వతీశం .1500గ్రామనామాలు అధ్యయనం చేసి పిహెచ్ డి పొంది ,దానికి నామవిజ్ఞానం పెరేట్టి,దాన్ని తనకు అంకితం చేసి యూనివర్సిటిపాఠ్యప్రణాళికలో దాన్ని చేర్పించి బోధి౦ప జేసి బోధించి తన సిద్ధాంత వ్యాసానికి సోపానపంక్తి నిర్మించినవారు యార్లగడ్డ .విశ్వ విద్యాలయ బోధనా శాఖకు విజిటింగ్ ప్రొఫెసర్. పన్లు అయ్యాక బెజవాడలో మకాం పెట్టి భారతాన్ని విశేష వ్యాఖ్యతో రచించి ఎన్నెన్నో రెడియోప్రసంగాలు చేసి ,ఆయన చేసిన ప్రతిపాదనలు సంచలనాలకు కారణమై ‘నిజం వెలికి తీసే ప్రయత్నానికి తానొక కారణమౌతానని చెప్పుకొనేవారు .జీవితంలో సింహభాగం అక్షరాల మధ్య గడిపారని అక్షరయజ్ఞం చేసిన సోమయాజి అని ఆకాశానికి ఎత్తేశారు .
ఇక్కడ స్వవిషయం –నేను 1963లో మోపిదేవి హైస్కూల్ లో మొదటిసారిగా సైన్స్ మాస్టారు గా చేరినప్పుడు పెదప్రోలు లో కాపురం ఉండేవాడిని .అక్కడే బాలగంగాధరరావు ఉండేవారు. అప్పటికి సేకండరీగ్రేడ్ ట్రెయినింగ్ పాసై ఉద్యోగం లేక ఎదురు చూస్తూ ఉ౦ డేవారు.సాయ౦త్రాలలో మాతోపాటు ఒక వంతెనపై కూర్చుని కబుర్లు సాహిత్య విషయాలు మాట్లాడేవారు,రాగాలు తీసేవారు .తర్వాత నేను ఉయ్యూరు వచ్చేశాను .ఆతర్వాత చాలాకాలానికి నాగార్జున యూని వర్సిటిలో లెక్చరర్ గా చేరటం రీడర్ అవటం దోణప్ప గారి శిష్యరికం ,పత్రికలలో వ్యాసాలవలన ఆయన్ను గుర్తుపట్టాను .తర్వాత ఆయనతో మళ్ళీ ప్రత్యక్ష పరిచయం కలిగతం బెజవాడ సాహిత్య సభలలో తరచూ కలుసుకోవటం నేనంటే విపరీతమైనఅభిమానం కలగటం ,పరస్పరం ఫోన్ సంభాషణలు జరగటం ఆంధ్రా యూనివర్సిటిలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండటం అప్పుడూ తరచూ మాట్లాడుకోవటం జరిగింది .ఒక సారినేను విజయనగరంజిల్లా గరివిడిలో మా అన్నయ్యగారమ్మాయి వాళ్ళ ఇంటికి వెడుతున్నప్పుడు కొన్ని ఊళ్లపేళ్ళు తమాషాగా ఉంటె ఇంటికి వచ్చాక ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన గ్రామనామాలపై రాసిన పుస్తకాలు పంపారు .మాపుస్తకాలుకూడా పంపేవాడిని ఒకసారి ఉయ్యూరుకు ఆహ్వానించాం కూడా .ఆయన తానె ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు .తన వద్ద చాలాపుస్తకాలున్నాయని వచ్చి తీసుకు వెళ్ళమనేవారు.కాని ఆభాగ్యం నాకు దక్కకుండానే ఆయన పోయారు .
‘’ప్రణయద్వయం నుంచి శరణు త్రయానికి ప్రస్థానం సౌందరనందం ‘’ పింగళి కాటూరి వారి సౌ౦దర నంద కావ్యం .వ్యక్తిగత ప్రేమ విశ్వ మానవ ప్రేమగా మారటమే కథ .వినగవినగ బుద్ధునిఉపదెశ౦ మనసుకుపట్టి ప్రణయజీవనం సాధు జీవనమైంది .భార్యమాత్రం ఎందుకు కాకూడదు అని భావించి శాక్యమునినే నందుడు అడిగితె అభ్యంతరం లేదంటే ధర్మాచరణకు అనువైన మనస్థితి ఉండాలికాని స్త్రీపురుష భేదం చూపక్కరలేదని అనుజ్ఞ ఇద్దరూ భిక్షుకులౌతారు సుందరీనందులు .’’భావమొక్కడుగాగ భావన యోక్కడై –రసభావ పరిణతి యొసగ జేసి –మిత్రభావము లిమ్మెయి మేళవించి –సృష్టి చేసితిమీ కావ్య శిల్పమూర్తి ‘’అని ఈ జంటకవులు చెప్పుకొన్నారు .
ఇక్కడా స్వవిషయం –సుమారు 1953-54లో కాటూరి, దేవులపల్లి ఉయ్యూరులో మా పెంకుటింటికి వచ్చి హాలులో తూర్పు వైపు గోడకు అ అనుకుని కుర్చీలలో రెండు గంటలు కూర్చోటం ఇంకా నా స్మృతితి పధం లో నిలిచిఉంది .కృష్ణ శాస్త్రిగారు మా పెద్దక్కయ్య గాడే పల్లి సూర్యనారాయణ గారనే పండిట్ రావు గారి పెద్దకోడలు .మాబావ కృపానిధిగారు .ఈయనతండ్రిగారి తమ్ముడే కృష్ణ శాస్త్రి గారి మామగారు రెడియోబావగారైన చిన్న సూర్యనారాయణ గారు. అదీ బంధుత్వం .మా అక్కయ్యగారింటికి మద్రాస్ వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని మా అక్కయ్య కృష్ణ శాస్త్రి గారింటికి తీసుకు వెళ్ళేది .ఆయన చనిపోవటానికిసుమారు పదిహేను రోజులక్రితం నేను మద్రాస్ లో వారింటికి మావాళ్ళతో వెళ్లాను. స్క్రిబ్లింగ్ పాడ్ పై చాలాసంగతులు ముచ్చటి౦చు కొన్నాం . .నన్ను మామేనకోడలు కళను కారులో ఎక్కించుకొని చాలాచోట్లకు తిప్పారు .అదీ మరువలేనిఅనుభవమే .
తరవాతది ‘’ దృశ్య శ్రవ్య మాధ్యమాలలో తెలుగు భాషా సాహిత్యం ‘’మల్లవరపు విశ్వేశ్వరరావు గారి రూపకాలన్నీ సంగీతరూపకాలలో పతాక చిహ్నాలన్నారు –ఓలేటి .ఇక్కడా స్వవిషయం -2017లో మేము అమెరికాలో షార్లెట్ కు మా అమ్మాయి గారింటికి వెళ్ళినప్పుడు మల్లవరపు గారికుమారుడు పరిచయమయ్యారు వారిన్తికిఆహ్వానిన్చి దసరా బొమ్మలకొలువు చూపించి డిన్నర్ ఇచ్చారు .పాటకు దీర్ఘాయువిచ్చింది ప్రసార మాధ్యమమే పక్షిలాంటిది పాటఅన్నారట కృష్ణ శాస్త్రిగారు .పాటలోని చైతన్యాన్ని ఊపిరులుగా ఊదింది ఆకాశవాణి అన్నారు పార్వతీశం.జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి ‘’రావోయి నవమానవా రసరాజ్య రమాధవా ,అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ ‘’లాంటి అమృత గుళికలు రెడియోవలననే దక్కాయి .’’సుమదళాలు ఎన్నైనా సురభిళ౦ ఒక్కటే ‘’అన్నట్లు ప్రసార మాధ్యమం గొప్ప సాహిత్య సంస్కృతిని ప్రజలమధ్య నెలకొల్పింది అని నీరాజనం పట్టారు .
చివరిది –‘’తల్లీ నిన్ను దలంచి ‘’లో తల్లిగారు వోలేటి హైమవతి గారి గురించి స్తవనీయ వ్యాసం .కస్టాలువచ్చేటప్పుడు అమెలోదైన్యం ఉండేదికాదు ధైర్యం తప్ప అన్నారు. తనకు జన్మతో పాటు ధన్యతనూ ప్రసాదించిన మాతృమూర్తికి నమస్సులర్పించారు పార్వతీశం . సాధారణంగా కవులు ‘’తల్లీ నిన్ను దలంచి ‘’అని సరస్వతిని స్తుతించి కావ్య౦ మొదలుపెడితే , ఈయన తల్లీ నిన్ను తలంచి ‘’తో మాతృ వందనంచేసి వ్యాసార్ధం ముగించి విలక్షణత చూపారు .ఇంతవరకు నేను రాసింది అంతా దాదాపు వోలేటి గారికలం నుంచి వచ్చిందే .
ఇప్పుడు నా భావం చెబుతున్నా .ఈ పుస్తకం ‘’స్వర్ణఖని.’’లోతుకు వెళ్లి వెతికే సాహసం చేయకుండా ఒడ్డున కూచుని నెరుసులు పోగేశా .అదే ఇంత సు’’వర్ణ ‘’రాసిఅయింది ,.లోతులు తరిస్తే పట్టిందంతా బంగారమే .ఇదొక రస ధుని .త్రాగేవారికి కావలసినంత అమృతం .ఆయన పుస్తకం చదువుతుంటే పూల సెజ్జలపై నడుస్తున్నట్లు నందనవనం లో విహరిస్తూ పారిజాత పరిమళాలుఆఘ్రాణిస్తున్నట్లు ఉంది .మరోలోకపు అంచులమీద తేలియాడుతున్నట్లని పిస్తుంది .అచ్చరల్లాంటి అక్షరాలూ ,కిన్నెర గానం లాంటి పదాలు ,కింపురుష నృత్యంలాంటి వాక్యాలు మనకు గొప్ప అనుభూతినిస్తాయి .ముఖ చిత్రం, మిసిమి వెన్నెలలాంటి పేజీలు .ప్రతి వ్యాసానికి ముందు కలర్ ఫోటో లో అందులోని ప్రముఖుల చిత్రాలు మనోజ్ఞం గా ఉన్నాయి .చదివి ఆన౦దించి అనుభూతి పొందాల్సిన రసరేఖలు వ్యాసార్ధంలోని వ్యాస మంజీరాలు .పార్వతీశంగారిని మనసారా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment