తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్  బోల్లిని మునుస్వామి నాయుడు గారు

  రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి బడిలో ప్రాధమిక విద్య పూర్తి చేసి ,తిరుత్తణి లో మూడవ ఫారం వరకు ఇంగ్లీష్ చదివారు .హైస్కూలు చదువుకోసం తండ్రి మద్రాసులో కాపురం పెట్టి చదివించారు .మొదటినుంచి చదువు పై ఆసక్తి ఉండటం వలన ,దేహారోగ్యం కాపాడుకొంటూ వ్యసనాలకు బానిస కాకుండా బుద్ధిగా చదివి మెట్రిక్ పాసై ,క్రిస్టియన్ కాలేజి లో బి . ఎల్ .చదివి లాయర్ పట్టాపొంది హై కోర్ట్ జడ్జిశ్రీ పిఆర్ సుందరయ్యగారి ఆఫీస్ లో  అప్రెంటిస్ గా చేరి న్యాయవాదిగా మారారు .

  1909 నుంచి తమ స్వంత జిల్లా చిత్తూరు లో ప్రాక్టీస్ ప్రారంభింఛి ,క్రమాభి వృద్ధి చెంది రైతుల కష్టాలు స్వయంగా గ్రహించారు .ఉభయ పార్టీల వాదనలు సాకల్యం గా వినిరాజీ కుదర్చటానికే ఎక్కువగా ప్రయత్నించేవారు .రాజీ పత్రం లో ఉభయుల ఎదుటా ఎవరికీ అనుమానం రాకుండా తాను కూడా సంతకం పెట్టేవారు.అప్పటి జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ రావు బహదూర్ టి.వి .రంగాచార్యులు  మన నాయుడుగారిని డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ గా నామినేట్ చేసి ,వైస్ ప్రెసిడెంట్ ను చేశారు .లోకల్ బోర్డ్ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకొన్నారు .

    1920లో శ్రీ మునుస్వామి నాయుడు మద్రాస్ శాసన సభకు ఎన్నికయ్యారు .తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యారు .స్వలాభానికి కాక ,రైతుల కష్ట నష్టాలు తీర్చటానికి పూనుకొన్నారు .పండించిన ధాన్యం మార్కెట్ కు తోలటానికి ,గిట్టుబాటు ధర పొందటానికి నానా అగచాట్లు పడేవారు రైతులు .పిల్లల చదువులకు దగ్గరలో బడులు లేవు  .అందుకోసం రాకపోకల సౌకర్యానికి ముందుగా నాయుడుగారు రోడ్లు వేయించారు .గ్రామాలలో చక్కని రోడ్డు సౌకర్యం కలగటం వలన గ్రామీణులకు ఎంతో వెసులు బాటుగా ఉండేది .

   గవర్నమెంట్ నియమించిన అగ్రి కల్చర్ కమీషన్ లో బాంకింగ్ ఎంక్వైరీ కమిటీలో మెంబర్ అయ్యారు .సరళ స్వభావి శాంతమూర్తి అవటం రో అన్ని జాతుల మతాల వయసు వారు ఆబాల వృద్ధులు ,అధికార అనధికార ప్రజలంతా ఆయనకు సమానులే .కోపం ఉండేది కాదు  .సర్వజన మాన్యుడు అయ్యారు నాయుడుగారు .

   1930లో జస్టిస్ పార్టీ కి  నాయకత్వం వహించారు.అప్పట్లో ఆ కక్షి వారికి బ్రాహ్మణులంటే ద్వేషం ఉండేది .ద్వేషం ప్రగతికి నిరోధం అని చెప్పి ఒప్పించి బ్రాహ్మణులను కూడా సభ్యులుగా చేర్చు కోవటానికి తీర్మానం చేసి పాస్ చేయటానికి నెల్లూరులో జరిగిన బ్రాహ్మణేతర సదస్సులో పాల్గొన్నారు .అప్పట్లో ఆంధ్రనుంచి వచ్చినవారు ఆక్షేపించారు .నాయుడుగారి మాట వేదవాక్కుగా అందరూ భావించి తీర్మానం నెగ్గించారు .అందరికి అందుబాటులో ఉంటూ గాంధీగారి ఆదర్శాలను సాధ్యమైనత వరకు పాటించే వారు .

  27-10-1930న శ్రీ మునుస్వామి నాయుడుగారు మద్రాస్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా నియమింప బడ్డారు .పదవి చేబట్ట గానే   రైతులు డిస్ట్రిక్ట్ బోర్డ్ టోల్ గేట్లకు చెల్లించే పన్నులు తీసివేసే చట్టాన్ని పాస్ చేయించి రైతులకు మహోపకారం చేశారు .యూరోపియనలను మాత్రమె నియమించే ఎలెక్ట్రిక్ కార్పోరేషన్ వగైరా సంస్థలలో ,అలాంటి పనులు భారతీయలు కూడా సమర్ధవంతంగా చేయగలరు అని రాజధానిలో ,కోయంబత్తూరు నీలగిరి ,చిత్తూరు మొదలగు చోట్ల ఎలెక్ట్రిక్ కార్పో రేషన్ లు స్థాపించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయం సాధించారు .నాయుడుగారు ఈ పదవి అలంకరించటం చిత్తూరు జిల్లాకే గౌరవం కాకుండా కమ్మవారికి గర్వ కారణమైంది .జస్టిస్ పార్టీ లో అభి ప్రాయ భేదాలు రావటం వలన ,తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించటం ఇష్టం లేక  మంత్రి పదవికి రాజీనామా చేసి ,జస్టిస్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపించి అధ్యక్షులయ్యారు . జస్టిస్ పార్టీ వీరి నాయకత్వం లేకపోవటం వలన బాగా బలహీనమై నామ రూపాలు కోల్పోయే స్థితిలో ఉంటే ,,ఆపార్టీ వారొచ్చి నాయుడుగారిని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి మళ్ళీ నాయకులై నడిపించమని ప్రాధేయపడ్డారు .కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని ఒప్పుకొంటే తనకు అభ్యంతరం లేదన్నారు .

  పార్టీ ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరమైన తరుణం లో నాయుడుగారికి జబ్బు చేసి ఆరు రోజుల తర్వాత 13-1-1935న  51ఏళ్ళ వయసులో  రాత్రి రామనామ స్మరణ చేస్తూ ,ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే విష్ణు సాయుజ్యం పొందారు .  ,జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.

  మద్రాస్ రాష్ట్ర తోలి తెలుగు ప్రధాని శ్రీ బలినేని మునుస్వామి నాయుడు గారు పదవిలో ఉండగా సాధించిన ఘన విజయాలు ఒక్క సారి చూద్దాం-

1-పట్టాభూమికి ఒక మైలు దూరం వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉండకూడదని తీర్మానం చేసి పాస్ చేయించారు

2-అడవి పంచాయితీలు ఏర్పాటు చేసి ,పశువులు మేపుకోవటానికి పంచాయితీలకు స్వాధీనం చేశారు .

3-చిత్తూరు జిల్లాలో పశువుల ఆస్పత్రి ఏర్పాటు చేశారు

4-డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనాదరణకు గురైన గ్రామాలకు రోడ్లు వేయించారు

5-చంద్ర గిరి రెంట్ కోర్ట్ కాంప్ పోవటం వలన జమీందారీ రైతులు అనేక కష్టనష్టాలు పడాల్సి వచ్చిన తరుణం లోచంద్రగిరిలోనే స్థిరంగా ఉండే ఏర్పాటు చేశారు

6-టోల్ గెట్ పన్నులు తీసేసిరైతులకు , ఎలెక్ట్రిక్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి స్వదేశీయులకు ఉద్యోగాలు కల్పించారు

   సర్వ మానవ  సౌభ్రాతృత్వం , అందరిపై ఆదరణ,ప్రేమ వల్లనే కార్యాలు సాధించవచ్చుననీ నాయుడు గారు రుజువు చేశారు .

‘’శాంతమే జనులకు జయము నంది౦చును –శాంతమున  నెరుగని జాడ తెలియు

శాంతభావ మహిమ –జర్చింప లేమయా –విశ్వదాభి రామ వినుర వేమ’’.

  ఈ రచనకు ఆధారం – చిత్తూరుకు చెందిన జర్నలిస్ట్, సోషల్ వర్కర్,పెర్సనల్ క్లార్క్ టు ది లేట్ దివాన్ బి.మునుస్వామి నాయుడు అయిన  శ్రీ టి .ఎన్ .ఉమాపతి అయ్య గారు రాసిన ‘’శ్రీయుత దివాన్ బహద్దూర్ శ్రీ మునుస్వామి నాయుడుగారి జీవిత చరిత్రము.

   ఈ పుస్తకం   1935లో చిత్తూరులో రచయిత చేత ప్రచురింపబడింది .వెల కేవలం ఒక్క అణా మాత్రమే .‘’

  ఇంతటి మహనీయుని గురించి మనకు దాదాపుగా తెలియదు .వారిజీవితాన్ని వెలుగులోకితెచ్చిన శ్రీ ఉమాపతి అయ్యా గారు ధన్యులు . దానినాదారంగా నాయుడు గారిని గురించే రాసే అదృష్టం  నాకు కలిగింది .

‘’నాయుడు గారి జీవిత చరిత్ర బాలురు అందరూ తప్పక చదివి ,ఆయనలాగా దేశానికి కీర్తి తేవలయు నని కోరు చున్నాను ‘’అని మనస్పూర్తిగా కోరుకొన్న ఉమాపతి అయ్యగారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకొందాం మనస్పూర్తిగా .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష | Leave a comment

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం

స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం

27-6-21 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి  దేవాలయం లో  స్థానికులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను  సరసభారతి 157వ కార్యక్రమం లో  అంద జేస్తోందని తెలియ జేస్తున్నాము.  .

             పురస్కార గ్రహీతలు

1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

2-డా.దీవి చిన్మయ – సరసభారతి ఉపాధ్యక్షులు ,ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

3-శ్రీ జ౦పాన శ్రీనివాస గౌడ్ –  మాజీసర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవా  కర్త

4-శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు

5-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు-ప్రముఖ సాంఘిక, ధార్మిక, సా౦స్కృతిక సేవా కర్త  

6-శ్రీ పామర్తి సత్యపవన్ –కంప్యూటర్ నిపుణుడు

7-శ్రీ శిరిగుడి సురేష్ –ఎలెక్ట్రికల్ నిపుణుడు

8- శ్రీ సుధాకర్ —హ్యూమన్ కంప్యూటర్  బిల్ కలెక్టర్

  జోశ్యులశ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ

   గౌరవాధ్యక్షులు           కార్య దర్శి                కోశాధికారి

                                        గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                                         21-6-21-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం )

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -11(చివరిభాగం )

 రామ నామ మయ రూపం

వాసుదాసు గారు రామమంత్ర మహిమ బోధించిన నాటి నుంచి నరస దాసుగారి మనసంతా రామనామం తో నిండిపోయింది .రోజుకు 21వేలకు పైగా జపం చేస్తూ ,10 వేలకు పైగా రామకోటి రాస్తూ ,రాత్రిళ్ళు రామభజన చేస్తూ ,అర్ధరాత్రి ధ్యాననిమగ్నమౌతూ  మంత్ర సిద్ధిపొందారు .మనో నిశ్చయానికి జపం ముఖ్య సాధన .పద్మాసనం లో నిటారుగాకూర్చుని ,మనసులో రామ చంద్రుని మూర్తి ని నిలిపి ,పాదాలలో ఒక వంద ,మోకాళ్ళపై ఒక వంద ప్రక్కల ఒక వంద ,ముఖం లో ఒక వంద ముఖం నుంచి పాదాలవరకూ అక్షరమాలతో జపం చేస్తూ ఉండటం తో దాసుగారి మనసులో రాముడు పూర్తిగా కొలువై ఉన్నాడు  .ఆయనలో దాసుగారు లీనమయ్యారు .వారి వాక్కులు రోజుకు ఎన్ని నామ స్మరణాలు చేశాయో లెక్క లేదు .భజనలో నామ సంకీర్తనం లో ఉపన్యాసాలలో హార్మోనియం పైనా ,వార్షికోత్సవాలలో ,ఎన్ని గంటలు రామనామం స్మరించారో చెప్పలేము .

 తులసీ రామాయణం శ్రీ రామ శరణ్ గారి వాలకు మరింత మాధుర్యం కలిగించింది .రామ చరితమానస ను ఎన్నిచోట్ల ఎన్ని సార్లు ప్రవచనం చేశారో లెక్క లేదు .అన్ని వేళలో రామనామమే. ఉపవాసం నాడు మరీను .2కోట్ల రామనామం రాసి అరుదైన రికార్డ్ నెలకొల్పారు ,రాసేటప్పుడుకూడా శ్రీరామ శ్రీరామ అనాల్సిందే .రామాయణాన్ని అంతటినీ బొమ్మలుగా చిత్రించారు వాటిని గుంటూరు రామకోటి మందిరం లో చూడవచ్చు .రామనామం తో బియ్యపు గింజలు ఏరి వాటితో అన్న౦ వండుకొని రాముడికి నైవేద్యం పెట్టి భోజనం చేసేవారు .ఆనంద రామాయణం లో రామ భక్తులు రామనామ వస్త్రాలు ధరించాలి అని ఉన్నదాన్ని ఆచరణలో పెట్టి నిత్యం ధరించేవారు .

      స్వభావం

మనిషి స్వభావమే సుందరమైన ఆభరణం ..స్వార్ధ రహితమై  నిష్కల్మష మై ,ప్రజాహితమైనది శ్రీ రాం శరణ్ గారి స్వభావం .కోమల హృదయులు .ఉన్నత విశాల భావాలు వారిలో ఉన్నాయి .ఆదరాభిమానాలు చూపటం లో ఎవరూ ఆయనకు సాటిరారు .చిరునవ్వుతో ఆహ్వానించి ఆప్యాయంగా  ఆత్మీయంగా ఆతిధ్యమిస్తారు .బాధా సర్ప దష్టులకు వారి ఉపదేశాలు అమృతపు ఊటలుగా ఉంటాయి  ,అందరూ వారికి సమానులే .అందరూ శ్రీరామ సంతానమే వారికి. వారి ఆదరణ ఆనంద మయం చేస్తుంది .

  నిరాడంబర సద్గురు శిరోమణి మన దాసుగారు .కామినీ కా౦చనాలకు దూరం కీర్తి కాంక్ష లేదు .వినయ విధేయతలు,సదా చారం  వారి సహజ ఆభరణాలు .ప్రేమ పూర్వకంగా ఎవరైనా వస్త్రాలు ఇస్తే ధరిస్తారు కానీ విలాసవంతమైన దుస్తులు ధరించరు .శుద్ధ సాత్విక భోజనమే ఆహారం .ప్రతి దానినీ సద్వినియోగం చేస్తారు .ఆయనలో భక్తిజ్ఞాన కర్మలు త్రివేణీ సంగమం లాఉంతాయి .అంతులేని శిష్యవాత్సలయం ఉన్నవారాయన. పుట్టపర్తి సాయి బాబాగారితో తమ శిష్యులకు మోక్షాన్ని ప్రదానం చేయమని కోరారంటే వారు మెచ్చారంటే వారికి ఎంతటి శిష్యవాత్సల్యమున్నదో అర్ధమౌతుంది .ఎందరెందరో సాదు పురుషులతో దివ్యపురుషులతో మహాత్ములతో వారికి అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .

     షష్టిపూర్తి ఉత్సవం

 నరసదాసు గారికి అరవై ఏళ్ళు  నిండగానే శిష్యులు అభిమానులు మిత్రులు పెద్దలు 27-4-65 నుండి మూడు రోజులు త్రయాహ్నికంగా ప్రయాగ లోషష్టి పూర్తీ మహోత్సవం నిర్వహించారు .శ్రీ మహా మండలేశ్వర ,శ్రీ భాగవత చరిత వ్యాస,శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య దాసు పాకయాజి గారి షష్టి పూర్తీ మహోత్సవం లో వారి అభిమానులు శిష్యులు అ౦దరితోపాటు శ్రీగాయత్రీ పీతులు శ్రీవిద్యా శంకర భారతీ స్వామి పాల్గొని ఆధ్వర్యాన్ని వహించారు .సంకీర్తన హరికధ ,ఉపన్యాసాదులు నిర్విరామంగా మూడురోజులు మహా వైభవంగా జరిగాయి .

  26-4-65 న బుద్దాం దగ్గర తుంగభద్ర వద్ద దాసుగారికి క్షుర కర్మాదులు,ప్రాయశ్చిత్త మృత్తికా స్నానాలు జరిగి  ,అర్నాడు హరేర్నామ ఏకాహం నిర్వహించారు చైత్ర బహుళ ద్వాదశి 28-4-65 శ్రేఆమ శరణ్ దంపతులు శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారికి పాద పూజ,చేశారు తర్వాత దాసుగారి దంపతులకు  శిష్యబృంద౦  గురుపూజ  చేశారు .శ్రీ నేటి వెంకట నారాయణ మూర్తి దంపతులు ,విస్సం శెట్టి నాగభూషణం దంపతులు  గంగాజలం తో దాసుగారికి అభిషేకం ,పాద పూజ జరిపారు .సాయంత్రం వంగీత సుబ్బరాయ శాస్త్రులవారి ఉపన్యాసం ,శ్రీ పద్యాల వేంకటేశ్వర భాగవతార్ ,అమ్ముల రంగనాధ దాసు భాగవతార్ లు హరికదాగానం చేశారు .శ్రీ రాగం ఆంజనేయులు ,శ్రీ కంభం మెట్టు మధుసూదన రావు లు కదా సంకీర్తనం చేశారు .

  29-4-65చైత్రబహుల త్రయోదశినాడు ఉదయం విఘ్నేశ్వరపూజ ,పున్యాహవాచనం ,మంటపారాధన చేసి ,శ్రీ అర్వపల్లి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ పీసపాటి  మృత్యుంజయావదానులుగారు హోమాలు ,పూర్ణాహుతి నిర్వహించారు సాయంత్రం షష్టి పూర్తీ అభినందన సభ జరిగింది .శ్రీ గాయత్రీ పీథాదిపతులు అధ్యక్షత వహింఛి దాసుగారి ప్రతిభావిశేశాలు సేవా విశేషాలు సవివరంగా తెలిపారు పెద్దాలందరూ దాసుగారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు .ఈ సందర్బహంగా శిష్యులు గురువుగారికి ఒక యకరం పోలంకొని అండ జేస్తే వారికిక ఏ లోటు రాదనీ భావించారు శ్రీ పోలిశెట్టి ఆంజనేయ గుప్త పట్టువస్త్రాలతో పాటు అయిదు వందలరూపాయలు  శ్రీ బోలిశెట్టి సీతారామయ్యగారు కూడా అలానే సమర్పించారు .అభిమానులు భక్తులు శక్తికొలది విరాళాలు ప్రకటించారు .అవేమీ తమకు అవసరం లేదనీ అదంతా శ్రీ నామప్రయాగ స్వామికే సమర్పిస్తున్నాననీ ప్రకటించారు .దేశం నలుమూలలనుండీ ఎందరో పెద్దలు కవులు భక్త శిఖామణులు అభిమానులు సందేశాలు ఆశీర్వచనాలు పంపగా అన్నీ వేదికపై చదివి అందరికి తెలియ జేశారు .

  శ్రీ కాశీ కృష్ణా చార్య వారు సంస్కృతం లో అభినందన సందేశం పంపారు .శ్రీ విద్యారణ్య స్వామి ,శ్రీ సన్నిధానం లక్ష్మీ నారాయణ మూర్తి అవధానిగారు సంస్కృతం లో అభినందన ఆశీస్సులు అందించారు శ్రీ చిరంతనానందస్వామి ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ రామ కృష్ణా నంద స్వామి సందేశాలు వచనం లో శ్రీ చావాలి వామన మూర్తి పద్యాలలోరాసిపంపారు .శ్రీ భాగవతుల కుటుంబరావు  , శ్రీ కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి ,శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ,ప్రశంస పేరుతొ పద్యాలను శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారు ,శ్రీ మాధవపెద్ది నాగేశ్వరరావు వచనం లో ,పంచరత్నాలలో శ్రీజాస్తి వెంకట నరసయ్య ,శ్రీ రామ శరణ ప్రశంసగా పద్యాలలో  శ్రీ శి స రాజశేఖరం ,పండిత శ్రీ పెమ్మరాజు రాజారావు గారు పుష్పాంజలి పేరిట పద్యాలు ,శ్రీ చిర్రావూరి అనంత పద్మ నాభ శాస్త్రిగారు సంస్కృత ఆశీర్వచనం ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు ‘’వీరు భుజించు ఓదనము రామనామ సందీపితమై ,వీరి జీవన లహరి గంగా శైవలినికి సహపాఠి’’అని మెచ్చుకొన్నారు .వీరుగాక శ్రీ చిలుకూరి వీరభద్ర శాస్త్రి ,శ్రీ బాపట్ల హనుమంతరావు ,శ్రీ వెంపటి సూర్యనారాయణ శ్రీ ధనకుధరం వరదాచార్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి ,శ్రీ ధూళిపాళ వెంకట సుబ్రహ్మణ్యంగారు పద్య నీరాజనం ,శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు పద్య నమోవాక భక్తీ కుసుమాలు సమర్పించారు .శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు ,శ్రీ పద్యాల సోదరులు పద్యాలలో దాసుగారి నిరాడంబరత ఆదరణ శిష్యవాత్సల్యం సర్వ సమానత్వం ,సభా పాండిత్యం ,సుబోధకత్వం కదా సంకీర్తన,సద్గురు ప్రాప్తి అదృష్టం ,రామనామ ప్రచారం మొదలైన విషయాలపై తమ గురువుగారు శ్రీ శ్రీరామ శరణ్ గారిపై భక్తిభావబందుర సుమధుర పద్య హారతి సమర్పించారు .వారి పద్యం తోనే సమాప్తి పలుకుతున్నాను –

‘’హరినామ బోధకు ,నాశ్రిత వత్సలు –మందస్మితానను ,మధుర భాషు

కమనీయ కళ్యాణ ఘన గుణ శోభితు –వైరాగ్యయుటు వేణు పత్రపాలు

నామ సంభాషు,శ్రీరామ లేఖన లోలు –నిన్డునిభాస్యు నానంద దాయు

సంచిత రామనారాయణహృదయస్ధు-శ్రీరామనామ సుచేల ధారు

నఖిల తీర్ధ సంచరణు,శేషంబ రమణు –షమ దమాభరణు,పవిత్ర చారు శరణు

లోక మంగళ కరణు భక్తైక శరణు-గురు శిరోమణి శ్రీరమ శరణుదలతు ‘’.

 ఈ 11 ఎపిసోడ్ ల వ్యాసానికి శ్రీ పద్యాల సోదరులు రాసిన’’శ్రీ కుందుర్తి వెంకట నరసయ్యగారి జీవితము ‘’ పుస్తకమే ఆధారం .

  సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -10

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -10

            శ్రీ రామ శరణ్ గారి రచనలు

 శ్రీ రామ శరణ్ గారు ‘’రామ మంత్రానుష్టాన క్రమం’’రాశారు అందులో సర్వమత సమ్మతం కనిపిస్తుంది .రామ తత్వాన్ని బహు సుందరంగా దానిలో నిక్షిప్తం చేశారు .శ్రీరాముడు సకల శక్తి స్వరూపుడు .ఆయనే శివుడు ,సూర్యుడు విష్ణువు ,వినాయకుడు అని చెప్పారు .శివ ,నారాయణ ,గాయత్రి మంత్రాలలోని బీజాక్షరాలు రామ  మంత్రం లోనివే అనీ , మంత్రానునుష్టానికి మడిగా కట్టుకోవాల్సిన దవళీ వగైరా విశేషాలనూ వివరించారు . వేద సంహిత ,ఉపనిషత్ ,పురాణాలనుంచి ఎన్నో ఉదాహరించారు .

  వీరి ‘’నవవిధ భక్తులు ‘’లో వాటిని పూర్తిగా అనుభవించి రాసినదే .భగవంతుని అవ్యాజ కరుణా విశేషాలు ,భగవంతుడు భక్తుల యెడ ప్రవర్తించే విధానం సంపూర్ణంగా వివరించారు .’’కలిసంతనోప నిషత్ ‘’ లో కలియుగం లో అందరూ సులభ సాధ్యంగా ఆచరించాల్సిన విధానాలు ,శ్రీరామనామ ప్రభావం ,సంకీర్తన పధ్ధతి మొదలైనవి రాశారు .

శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి గారి అయిదు భాగాల ‘’చరితా వళి’’ ని చక్కని తెలుగులో అనువదించారు .శ్రీ బల దేవ ఉపాధ్యాయ్ గారి ‘’భారతీయం ‘’అనే ఉత్తమ వేదాంత గ్రంథాన్ని సరళ తెలుగులో అనువదించారు .శ్రీ హనుమాన్ పొద్దార్ గారు హిందీ లో రాసిన ‘’బ్రహ్మ ‘’అనే గ్రంథాన్ని తెలుగు చేశారు .

   మందిర స్థాపనలు

శ్రీరాం శరణ్ గారు బుద్దాం లో శ్రీ రమాచ్యుత మందిరాన్ని నిర్మించటమేకాక వారి శిష్య బృందం ఉన్న చోట్లకూడా మందిరాలు స్థాపించారు .నెల్లూరుజిల్లా రామ గోవిందాపురం అనేచిన్నగ్రామం లో సూర్పరాజు సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు దాసుగారిశిష్యుడు .తనడబ్బును ఊరిజనులు సంతోషంగా ఇచ్చిన విరాళాలతో సీతారామ లక్ష్మణుల చలువరాతి విగ్రహాలను గురువుగారి ద్వారా తెప్పించి ,తన ఇంటి ప్రక్కనే అందమైన మందిరం లో ప్రతిష్టింప జేశారు .కొన్నేళ్ళు గురువుగారి ఆధ్వర్యం లో వార్షికోత్సవాలు జరిపారు .ఆర్దికభారం పెరిగిపోవటం తో ఆ తర్వాత  మానేశారు .

  కృష్ణా జిల్లా దివి తాలూకాలోరాం శరణ్ గారి ఆధ్వర్యం లో చాలామందిరాలు వెలిశాయి .కమ్మనా మోలులో స్త్రీ పురుషులు అందరూ కమ్మగా సంకీర్తన చేస్తారు .శిష్యుడు మద్ది ఆంజనేయులు గురువు  ఆశీర్వాద  బలం తో చందాలు వసూలు చేసి చాలా గ్రామాలలో చలువరాతి సీతారామంజేయ విగ్రహాలు స్థాపించారు .చిన్న గ్రామాలైనా ప్రతిష్టలు మహా గొప్పగా జరిగేవి .గుంటూరు క్షేత్ర సభ్యులు ప్రతి ఏడాదీ వచ్చి స౦కీర్తన చేసేవారు .శ్రీ రఘువర దాసుగారు ఒక నెలరోజులు అక్కడే ఉండి వైభవోపేతంగా సంకీర్తన నిర్వహించారు .వీటన్నిటికి ముఖ్యకారకులు మన దాసు గారే .

  తమ తర్వాత అర్చకులుగా ఒక సద్బ్రాహ్మణుడు శ్రీ శాస్త్రిగారిని దాసుగారు నియమించారు .మందిర నిర్మాణం దగ్గర్నుంచి పదేళ్ళు ఉత్సవాలు ఘనంగా జరిగేవి .నిత్యం ఉదయం సాయంత్రం సహస్రనామ పూజ ,రాత్రి భజన ,పవళింపు సేవ ఉదయం సుప్రభాతం జరిపేవారు .దీనికి దగ్గరే ఉన్న తుంగలవారి పాలెం లో గురువుగారి శిష్యులు సంకీర్తన చేశారు .ఇక్కడ గురువుగారు ‘’అష్టోత్తర శత ఏకాహ అఖండ హరేర్నామ సంఘం ‘’స్థాపించారు .ఈ సంఘం పరిసరగ్రామాలలో ప్రతి ఏకాదశికి ఏకాహం చేసేవారు .ఆహ్వానం రాకున్నా వెళ్లి పాల్గొనేవారు .ఎనిమిది ఏకాహ దశు లలో 108 ఏకాహాలు చేశారు .వీరి నామ ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది .గురువుగారుపాల్గొని మందిర నిర్మాణం నామ ప్రాశస్త్యం లపై ఉపన్యాసాలిచ్చేవారు పాలరాతి విగ్రహ స్థాపన చేయించేవారు .తుంగల నాగభూషణం  సంకీర్తన ప్రియులు .వీరి ఆధ్వర్యం లో ఆనందంగా ఆకర్షణ గా భజనలు జరిగేవి .దీనికొక మైలు దూరం లో కృష్ణానది ఒడ్డునే(నాగాయలంక ) శ్రీ రామపాద క్షేత్ర దేవాలయం ఉంది  .ముందు రామపటం పెట్టి మందిరం కట్టి తర్వాత విగ్రహాలు పెట్టారు. ఇక్కడి రేవు నుంచి పెనుమూడికి లాంచీలు నడుస్తాయి .శ్రీరామ శరణ్ గారు ఈమందిరం దర్శించి ప్రసంగం చేశారు .దీనికి దగ్గరున్న మర్రిపాలెం లోనూ మందిర నిర్మాణం చేశారు .ఇక్కడ గొప్ప సంకీర్తన సంఘం ఉన్నది .ఇక్కడి వారంతా దాసుగారి శిష్యులే .అత్య౦త ఉత్సాహం తో ఏకాదశినాడు అఖండనామం చేస్తారు .కార్యదర్శి సనకా వెంకటేశ్వరరావు చాలా శ్రద్ధగా అన్నీ జరిపిస్తారు .దీనికి 5మైళ్ళ దూరం లో అవనిగడ్డ పోలీసు స్టేషన్ లో ఒక మందిరం కట్టి శ్రీమా శరణ్ గారి ద్వారా శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ప్రతిష్టించారు .దీని ముఖ్యకార్య కర్త జి వె౦క టప్పయ్య నాయుడు గారు .

  అవని గద్దకు దగ్గరలో  ఉన్న బందలాయ చెరువు గ్రామ వాసులు భౌతిక వాదులే అయినా నైతికానికి ప్రాధాన్యమిస్తారు .ఈగ్రామం లో దాసుగారి శిష్యులు 20 మంది ఉన్నారు అందులో పర్చూరు పోతురాజుగారు అద్వితీయ భక్తులు .ఆయన ప్రోద్బలం లో అక్కడ రామమందిర నిర్మాణం జరిగింది .దాసుగారి ద్వారా శ్రీ సీతా రామ ఆంజనేయ  పాలరాతి విగ్రహాలు తెప్పించి శ్రీరామజయరామ జయజయరామ అనే అఖండ నామం మారుమోగుతుండగా ప్రతిష్టించారు  .అఖండ నామ సంకీర్తనలు వార్షికోత్సవాలు గొప్పగా జరిపేవారు .

   బాపట్లలోని శంకర విద్యాలయం లో వేదం సంస్కృతం స్మార్తం బోధిస్తున్నారు .శ్రీరమ శరణ్ గారు దీనికి నాలుగు వందల రూపాయలు అందించి ఒక శ్రీరామ శరణ మ౦ డపాన్ని కట్టించారు  .దీన్నిశ్రీ శృంగేరీ పీఠాదిపతులు ఉద్ఘాటనం చేశారు .దాసుగారు అనేక చోట్ల దేవాలయాల అవసరం ,అవి భక్తీ శ్రద్ధలకు ఎలా తోడ్పడుతాయో ,దేవాలయ ఉత్సవాల ప్రాశస్త్యం మొదలైన ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగాలు చేసేవారు .సంకీర్తన ఉపన్యాసం భజన ,పురాణ ప్రవచనాల అవసరాలను వివరించేవారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-21-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -9

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -9

   మహాత్ముల సాంగత్యం ,పరిచయాలు

అపర వ్యాసులుగా ప్రసిద్ధులైన శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ప్రయాగ వాసి .బ్రహ్మ చర్యం లో శుక మహర్షి .పరమ తపో నిష్టా గరిష్టులు ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ,హి నాథ నారాయణ వాసుదేవ ‘’మాత్రమె ఉచ్చరిస్తారే కానీ  ఇతర మాటలేవీ మాట్లాడారు  .ఉదయం త్రివేణీ స్నానం ఆతర్వాత ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4 వరకు జపధ్యాన పూజ,పురాణ ప్రవచానాదులు ,రాత్రి భజన వారి దిన చర్య .గంగ ఒడ్డున ప్రతిష్టానపురం అనే ఝూసీ లో ఆశ్రమం లో ఉంటారు .అనుష్టానం భజన ఒక చోట ,ప్రవచనం వేరొక చోట జరుగుతుంది .ఆశ్రమవాసులు యాభై మంది దాక ఉంటారు. భోజన శాల వేరు .ఇవికాక సంకీర్తన మందిరం వేరుగా ఉంది .ఇందులో పగలు అఖండ నామం జరుగుతుంది .సంస్కృతం నేర్చుకొనే విద్యార్ధులు  పాళీలు  గా నామం చేస్తారు .గొప్ప పండితులు ఉంటారు .వీరు బ్రహ్మ చారిగారు రాసిన ..భగవత్ చరిత ‘’ను నిత్యం పురాణంగా ప్రవచనం చేస్తారు .

  బ్రహ్మ చారి గారు గొప్ప హిందీ కవి .భాగవతాన్ని హిందీలోవ్రజభాషలో  రాశారు .అవి’’ చప్పలు ‘’(చౌపాయి)అంటే హిందీ పద్యాలుగా ఉండి,గానానికి అనుకూలంగా మహా రసోపేతంగా ఉంటాయి .ఇదికాక బడరీనాద్ దర్శన్ ,మహాకర్ణ ,భక్త మీరాబాయి వంటి గద్య రచనలు కూడా రాశారు .వీరు రాసిన చైతన్య చారితావళి5సంపుటాల బృహద్గ్రంధం .1941లో నిరాట౦క సంకీర్తన మహాయజ్ఞం  జరిగినపుడు మన శ్రీ రామ శరణ గారికి బ్రహ్మ చారి గారితో పరిచయమేర్పడింది .వారి సమక్షం లో హిందీలో చక్కని ప్రసంగం చేశారు మన దాసుగారు .అది తెలిసి మహదానందం తో దగ్గరకు పిలిచి ,దాసు గారి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్నారు .తమ చైతన్య చరితావళి ని తెలుగులోకి అనువది౦చమని  దాసుగారిని కోరారు .సుందర మధుర తెలుగులో దాసుగారు అనువాదం చేశారు .అది స్వయంగా ఆయనే తెలుగులో రాసిన గ్రంథం గా ఉంది .చైతన్యప్రభు బాల్య యవ్వన కౌమారాది దశలు అందులో వారు చిందించిన హాస్యలహరి రమణీయంగా రాశారు .

   మొదటి సారిగా శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారిగారిని గుంటూరుకు ఆహ్వానించి ఆంధ్రులకు పరిచయం చేశారు దాసుగారు .బుద్దాం లో దాసు గారింటికి ఆయన వెళ్ళారు .అక్కడి రమచ్యుత మందిరానికి పాలరాతి విగ్రహాలు ఆయనే అందించారు .ఆతర్వాత చాలా సార్లు వచ్చారు .బ్రహ్మ చారిగారు భాగవత చరితలోని చౌపాయీలను ‘’ భాగవతీ కథా’’ అంటే భాగవత దర్శనం అనే పేరుతొ108 గ్రంథాలు రాయటం ప్రారంభించి ,60పూర్తి చేశారు .ఇదేకాక భారత భాగవత పురాణ ఉననిషత్తు లు సంహితలలోని విశేషాలను క్రోడీకరించి సందర్భాన్ని బట్టి భాగవత దర్శనం లో నిక్షిప్తం చేశారు .18పురాణాలను స్వయంగా చదివి ,పండితులద్వారాకూడా విని దానిలోని సారాన్ని అందించారు .ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా అంతటి గొప్ప రచనను  వెలు వ రించి ఉండలేదు  .ఒంటిచేతితో బ్రహ్మ చారి గారొక్కరే అంతటి బృహత్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు .ఈ ఉత్తమ గ్రంథ ప్రచారానికి సమర్ధులు నరస దాసుగారే అని విశ్వసించి  దాన్ని తెలుగులో అనువదించమని ఆదేశించగా 48భాగాలు అత్యంత సు౦దరమైన ఆంధ్రం లో అనువాదం చేశారు .అన్నిటినీ ఒకే సారి ముద్రించే శక్తి లేక ఒక్కొక్కటిగా ముద్రించారు .’’భాగవత గ్రంధమాల ‘’అనే సంస్థ స్థాపించి మహారాజపోషకులు ,రాజపోషకులు ,సభ్యులు అని వేర్వేరుగా విభజించి 14భాగాలు ముద్రించారు .ఒక వందరూపాయలు చందా కట్టిన సభ్యులకు ప్రతి పుస్తకం ఉచితంగా అందించారు .నెలకు రెండు రూపాయలు పంపిస్తే చాలు పుస్తకం పంపేవారు . ఇంటింటికీ ఆపుస్తక మహాప్రసాదం అందేట్లు చేశారు దాసుగారు .

  మర్రిపూడిలో  హరేర్నామ సప్త సప్తాహం మహా వైభవంగా జరిగింది .దాని కి వీరయ్యగారు ప్రధాన కార్యకర్త .ఎన్నో భక్త బృందాలు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి పాల్గొని వీనుల విందు చేశాయి .శ్రీ అవదూతేంద్ర సరస్వతి శ్రీ రామ శరణ గారు యాజమాన్యం వహించి తమ తమ అనుయాయులతో మహావైభవంగా దిగ్విజయం చేశారు .ప్రభుదత్త బ్రహ్మ చారిగారిని ఆహ్వాని౦చ గా విచ్చేసి పాల్గొని ఆతర్వాత చాలా గ్రామాలలో పర్యటించారు .ప్రతి చోటా నరసదాసుగారి కథాసంకీర్తన ఉండాల్సిందే .ఆమహోత్సవ  సందర్భంగా మన దాసుగారికి ‘’మహా మండలేశ్వర ‘’బిరుదునిచ్చి సత్కరించారు .

 బ్రహ్మ చారిగారు బృందావనం లో ఉన్నారు .యమున ఒడ్డున సుందరభవనాన్ని ఆశ్రమ౦గా నిర్మించుకొని నిత్యకార్యక్రమాలు చేస్తున్నారు . యమున అవతలి ఒడ్డున యాభై ఎకరాలలో గోవులను మేపుతూ గోసేవ చేస్తూ ఆరునెలలు ఉన్నారు .దీనికి ‘’గోలోకం ‘’అనిపేరు .అది పూర్తికాగానే 50రోజులు అఖిలభారత ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు .దేశం నలుమూలలనుండి మహా పండితులు ,కవులు గాయకులూ పాల్గొని విజయవంతం చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు .అఖండ నామ సంకీర్తనలు కూడా జరిగాయి .శ్రీ రామ శరణ దాసుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘’భాగవత చరిత వ్యాస్ ‘’బిరుదు ప్రదానం చేసి ఆత్మీయంగా సన్మానించి గౌరవించారు .దాసుగారి నామ ప్రచారాన్ని సభలో గొప్పగా కీర్తించారు .

    నిరంతర బ్రహ్మ నిష్ఠ లో ఉండే శ్రీ  ఉడీరాం బాబాజీ దాసుగారిని ప్రేమ ఆప్యాయతలలతో వీక్షించారు .శ్రీ శివానంద బ్రహ్మ చారిద్వారా శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందిన హరిబాబా గారు పరిచయమయ్యారు .జగన్మాతగా ప్రసిద్ధి చెందిన మాతా ఆన౦ద  మయీ గారు కూడా పరిచయాయ్యారు .బృందావన్ లో సరోజినీ మాతా ,బిదుబ్రహ్మచారి ,ఆచార్య రాఘవా చారి ,చక్రపాణి జీ మహారాజ్ ,మాతా మీరాబాయి జీ ,బంకే బిహార్ లాల్ జీ మొదలైన మహానుభావులతో దాసుగారికి పరిచయభాగ్యం లభించింది .నైమిశారణ్య నరనారాయణ సోదరులు ప్రయాగలో దాసుగారికి దర్శనమిచ్చారు .ఆజానుబాహులు అద్వితీయ బలసంపన్నులు అయిన ఆసోదరులలో తేడా ఏమీ కనిపించకపోవటం ఆశ్చర్యమేసింది .ఇద్దరూ పద్మాసనం లో కూర్చుంటే ఆ సోదరులకు రోజులు కొన్ని క్షణాలుగా గడిచిపోతాయి.బీహార్ లో బరైలీ రాజు శ్యామానంద జీ ప్రయాగలో విరాట్ సంకీర్తన సభలో మన దాసుగారి ఉపన్యాసం విని పరవశించారు . .ఆయన బరైలీ ప్రాంతమంతతా వాయిద్యాలు సప్ప్లై చేసి సంకీర్తన  సంఘాలు  స్థాపించాడు .శ్రీ పండిత సుదర్శన్ శ్రీ శరణానంద జీ , శ్రీ హరేరాం బాబా ,మున్షీ కన్హయలాల్ జీ మొదలైన సాదుపు౦గవులతో పరిచయమేర్పడింది .కాశీలో 150 ఏళ్ల శ్రీ హరిహరబాబా దర్శనం లభించింది .అక్కడే రామరాజ్య పరిషత్ అధ్యక్షులు శ్రీ కరపత్ర స్వామి తో మాట్లాడే అవకాశం కలిలిగింది .రుషీ కేశ్ లో  స్వర్గాశ్రమం లో గీతాభవన్ ప్రతిష్టాపకులు ,మహాదాత శ్రీ జయదయాల్ గోయంకా గారితో ఘనిష్ట పరిచయం కలిగింది .స్వామి శివానంద అనుగ్రహమూ లభించింది .

  పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాతో దాసుగారి పరిచయం కలిగి ఆయన నిర్వహించిన సనాతన భాగవత సప్తాహం లోతామూ సభ్యులుకనుక 104 డిగ్రీలజ్వరం తో తుగలపాలెం నుంచి వెళ్లి  పాల్గొనగా ,అక్కడికి చేరగానే జ్వరం మాయమైంది .బాబాగారికి నమస్కరించగానే బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడారు .మంత్ర శాస్త్ర ప్రవీణులు హనుమదుపాసకులు శ్రీ శిష్ట్లా చంద్ర మౌళిగారు అధ్యక్షత వహించిన సభలో బాబా గారు మన దాస్సుగారి దగ్గరకు వచ్చి చెవిలో సంకీర్తన ప్రాధాన్యతపై  ఉపన్యాసం చేయమని చెప్పారు  .నరసయ్య గారి ఉపన్యాసం మహా రసవత్తరంగా శ్రోతలమనసులను రంజిల్ల జేసింది ..బాబా బాగా సంతోషించి సంఘ సభ్యులందరికీ తలొక వంద రూపాయలు అందజేసి సన్మానించారు .వారి అనుచరులకు కూడా చార్జీలు ఇచ్చారు .నరస దాసుగారిని ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి ఆప్యాయంగా భుజాలపై చేయి వేసి ,ఆప్యాయంగా మాట్లాడి ఒక బంగారు రూపాయను మెడలో ధరించటానికి ఇచ్చారు .పట్టు వస్తారాలతో పాటు రెండువందల రోపాయలు కూడా అందించి సత్కరించారు .శివరాత్రి నాడు 500మంది బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేసి వారికి అయిదువందల పళ్ళాలులు ఉద్ధరిణలు అయిదు వందల రూపాయలు అందించారు .అప్పుడు శ్రీ రామ శరణ గారు గాయత్రీ మంత్రాన్ని గురించి రామనామాన్ని గురించి రెండిటిని సమన్వయము చేస్తూ అద్భితమైన ప్రసంగం చేశారు .’’బాగు బాగు ‘’అని బాబా బహు మెచ్చారు .

   తర్వాత మహా వైభవంగా జరిగిన బాబా గారి జన్మ దినోత్సవానికి  కూడా దాసుగారు వెళ్లి పాల్గొన్నారు .వేలకొలది యాత్రికులకు బాబా ప్రసాదం లభించింది ,హడావిడి తగ్గాక బాబా దాసుగారి వద్దకు వచ్చి మహా ఆప్యాయంగా సంభాషించారు .ఇంటి విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పారు .’’మీ ముఖ్యమైన  కోరిక చెప్పండి ‘’అని అడిగితె దాసుగారు ‘’స్వామీ !మీ  స్మరణ చాలునాకు .నన్ను నమ్ముకొన్న నాశిష్యులకు మోక్షం ఇవ్వటానికి అనుగ్రహించండి .ఇదే నాకోరిక ఇంకే కోరికా నాకు లేదు ‘’అనగా బాబా సంతోషించి ‘’ఇలాంటి కోరిక ఉన్నవారినినేనేక్కడా చూడలేదు .మీది చాలా దయార్ద్ర హృదయం .శిష్యవాత్సల్యం నిజంగా మీదగ్గరే ఉంది ‘’అని మృదుహస్తం తో దాసుగారి శరీరాన్ని నిమిరారు .దాసుగారికి బాబా గారి పరిచయం వల్లనే గుంటూరు భక్త సమాజం వారికి బాబా గారి దర్శన భాగ్యం  కలిగింది.అప్పుడు ఆధ్యాత్మిక సాధన గురించి బాబా  అమృతోపమానమైన ప్రసంగం చేసి సభ్యులను ఆన౦ద డోలికలలో ఉర్రూత లూగించారు .

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8 నామ ప్రచారం

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8
నామ ప్రచారం
అ కాలంలో శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు నామ ప్రచారం లో దూసుకు పోతున్నారు .పగోజి అత్తిలి లో పుట్టి న వీరికి తలిదండ్రులు పెట్టినపేరు విశ్వేశ్వరావు .వీరి 12వ ఏట మహాభక్తులైన తండ్రి మరణించారు .రావు గారు నాటకాలాడి పేరు ప్రఖ్యాతులు పొందారు .తల్లి కూడా చనిపోయాక వైరాగ్యం పెరిగి ,బ్రహ్మ చర్యం పాటిస్తూ ప్రయాగ వెళ్లి ,బ్రహ్మ చారి ఆశ్రమం లో సాధన చేసి అయోధ్య చేరి ,మంత్రం దీక్ష పొంది ‘’షియా రఘువర దాస్’’అనే దీక్షానామ ధారియై హిందుస్తానీ సంగీతం నేర్చి ,ఆగాన౦లో నామాన్ని లీనం చేశారు .ఆ నామ గానా మృతం తో జనాలను పరవశ పరచారు .ఆంద్ర దేశం చేరి చాందస భావాలను పారద్రోలటానికి నామాన్ని ప్రయోగించి మనసులను గెలుచుకొన్నారు .
శ్రీ రఘువర దాసుగారు మన నరసదాసు అంటే శ్రీరామ శరణ గారికి బాగా సన్నిహితులయ్యారు .శరీరాలు వేరే కాని ఆత్మ ఒక్కటే .ఇద్దరివీ రామాయత్త చిత్తాలే.ఆయన గానం యెంత మాధుర్యమో ఈయన ప్రవచనం అంతటి మాధుర్యాన్ని కలిగి ఉండేది .ఆధునికకాలం లో రామనామ ప్రచారం లో వీరిద్దరూ అద్వితేయులై నిలిచారు
తులసే రామాయణ ప్రవచనం
శ్రీ రామ శరణ గారు ఉత్తర దేశం లో ఉండి అక్కడ అందర్నీ ప్రభావితం చేసే తులసీ దాసు రాసిన రామ చరిత మానసం ను పూర్తిగా తెలుసుకొన్నారు ..అందులోని విశేషాలు అనేకార్ధాలను చక్కగా విశదీకరించి చెప్పేవారు .ఉన్నత భావ వ్యాప్తియే వారి ముఖ్యోద్దేశం ..బాపట్ల ఆంజనేయ దేవాలయం లో భానువార సంకీర్తనలో పాల్గొనటానికి రాగా సభ్యులు రామనామ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పమని కోరారు . వెంటనే తులసీ రామాయణం లోని ‘’వందవు నామ రామ రఘువరకో , హేతు కృశాను భాను హిమకరకో –విధి హరే హరమయ వేద ప్రాణసో,అగుణ అమాపమ గుణ నిదానసా ‘’అనే చౌపాయి ని ఒక గంట సేపు ఉపన్యాసంగా చెప్పారు . ఆ సంఘ సభ్యురాలు శ్రీమతి వల్లూరి రాజమ్మగారు ‘’స్వామీ !మీద్వారా మాకు తులసీ రామాయణం ఆసాంతం తెలుసుకోవాలని కోరిక గా ఉంది ‘’అనగా సరే అన్నారు దాసుగారు .
ఆమె ఒక వారం లోపే ముహూర్తం పెట్టి ఆహ్వానించారు .అప్పటికి దాసు గారు తులసీ రామాయణం లో రెండు మూడు ఘట్టాలు తప్ప చదివి ఉండలేదు .ఎలా చెప్పాలో అంతుపట్టక రెండు రోజులు సంస్కృత శ్లోకాలతో కాలక్షేపం చేశారు .మూడవ రోజు మందిరం లో కూర్చుని శ్రీరామునితో ‘’రామా !ఏదో మొహమాటానికి తులసీ రామాయణ ప్రవచనానికి ఒప్పుకొన్నాను .నాకు ఆభాష కొత్త.నువ్వు తులసీ దాసు హృదయాన్నుంచి పలికించావు .ఇప్పుడు మీరిద్దరూ నా హృదయం లో ఉండి పలికించాలి ‘’అనగా రాముడు నవ్వి నట్లు కనిపించగా ,ఆ ధైర్యం తో అవధి భాషలోని తులసీ రామాయణ ప్రవచనం మొదలు పెట్టారు .కొన్ని ఘట్టాలు తాను ఎలా పలికారో ఆయనకే తెలీదు .ఆ ఉపాధి ద్వారా ఎన్నెన్నో విషయాలు జనరంజకం గా ప్రవచనం చేశారు .శ్రీరమ చంద్ర మూర్తి స్వయంగా తనద్వారా పలికి౦చాడని దాసుగారి పూర్తీ విశ్వాసం .
కథా సంకీర్తనం
పట్టు వస్త్రాలుకట్టి చేతిలో చిడతలు ధరించి ఆర్తిగా రామా రామా అంటూ చిందులేస్తూ ,నామనామ గానం మధురాతిమధురం చేస్తూ చూపరులకు పరవశం కలిగించేవారు శ్రీ రామ శరణ .తానూ తన్మయులై భక్తులను తన్మయత్వం లో ముంచి తేల్చేవారు .ఎవ్వరికీ ఇహ లోక స్పృహ ఉండేదికాదు .భక్తి మహా సముద్రంలో మునిగి తేలేవారు అందరూ .
ఉపన్యాసం
శ్రీ రామ శరణ గారు ఉపన్యసిస్తుంటే మాటలు తేనెల ఊటలు గా జాలు వారేవి వేదం శాస్త్ర పురాణ ఉపనిషత్తులనుండి ఎన్నో ఉదాహాహరణలు దొర్లి ,ప్రేక్షకహృదయాలు ఆన౦దరస ప్లావితమయ్యేవి .భగవన్నామముతో ప్రారంభించి అందరి చేతా చేయిస్తూ ఆపైన ఉపన్యాసం ప్రారంభించి గొప్ప నేపధ్యాన్ని కలిగించేవారు .కంతేరు గ్రామం లో వారు చెప్పిన ఉపన్యాసం చిర స్మరణీయం .సంకీర్తన విగ్రహారాధన ఇష్టం లేని ఆగ్రామ ప్రజలు అత్యంత ఆశ్చర్యం తో విని ,ముగ్ధులై అనుమానాలన్నీ పటాపంచలు చేసుకొని భక్తివాహినిలో కలిసిపోయారు .దురా చారులు వీరి ఉపన్యాసంతో సదా చారులయ్యారు .చాలామంది నాస్తికులు ఆస్తికులయ్యారు ఇదంతా దాసుగారి ప్రభావమే .
కృష్ణా జిల్లా దివి తాలూకా వేక నూరు గ్రామం లో నామ సప్తాహం జరుపుతుంటే కొందరు పాషండులు రామనామం తో ముక్తి రాదనీ వాదిస్తే ‘’రామేతి వర్ణద్వాయ మాదరే ణ సదా స్మరన్ ముక్తి సముపైతి ,జంతుః’’,’’రామయను రెండక్షరములు నాదరముతో సదాస్మరించిన ముక్తి పొందును ‘’అనీ , ‘’రామనామ సముత్పన్నఃప్రణవో మోక్షదాయకః ‘’7కోట్ల మహా మంత్రాలలో రామనామమే గొప్పదని ,అనేక ఉదాహరణలతో ప్రసంగం చేసి సంకీర్తన ప్రారంభించగా భక్తులు పరవశంతో ఉర్రూత లూగి పోయారు .గ్రామప్రజలు పశ్చాత్తాపం ప్రకటించి మన్నించమని కోరారు .రామ శరణ గారి ఉపన్యాస మహిమ గానగరిమ అంత గొప్పవి .ఆంద్ర దేశం లోని వార్షికోత్సవాలలో తప్పక వారి ప్రసంగం ఉండి తీరాల్సిందే .లాక్షణిక ,తార్కిక ,వైయాకరణ సభలలో కూడా వారి ప్రసంగం హై లైట్ గా ఉండేది .
పగోజి ఆకుల ఇల్లిందపల్లి లో సప్త సప్తాహాలు దాసుగారి ఆధ్వర్యం లో జరిగాయి .తులసీ రామాయణ ఉపన్యాసం నామ సంకీర్తన ధార్మిక ప్రసంగాలతో ఆ సప్తాహాలు గొప్ప విజయం సాధించాయి అక్కడ నారాయణ స్వామి అనే భక్తునికి దాసుగారు ‘’హరేరాం ‘’దీక్షనిచ్చారు .ఆయన హరేరాం బాబా గా ప్రసిద్ధి చెందారు .ఈబాబా గారి ఆధ్వర్యం లో కవిటిం అనే ఊర్లో 100 రోజులు అఖండ హరేరామ సంకీర్తన జరిగింది .కాకుల ఇల్లిందపల్లి లో ద్వాదశ వార్షిక హరి రామ నామ సంకీర్తన జరిగింది .
రామకోటి మన శ్రీ రామ శరణ గారికి చాలా ఇష్టం ..2కోట్ల రామ నామం రాసిన పుణ్యాత్ములాయన .రామకోటి ప్రభావాన్ని చెప్పి ఎందరితోనో రాయించారు .1946నుంచి రామనామంతో ఏరిన బియ్యాన్నే వండుకొని తింటున్నారు .గ్రామస్తులతో కూడా అలాగే చేయిస్తూ మరోరకమైన రామనామ ప్రచారం సాగించారు .రామనామ బియ్యపు అన్నమే తాను తినటానికి కారణాన్ని వివరిస్తూ ‘’నేను కంటితో రాముని ,రామభక్తులి రామనామాన్నీ,ప్రపంచాన్నీ సీతారామ మయంగా చూస్తున్నాను .చెవులతో రామ చరిత వింటాను .నోటితో రామనామమే పలుకుతాను ,దాన్ని గురించే మాట్లాడతాను .ముక్కు శ్వాస మీద రామనామ జపం చేస్తాను .చేతులతో రామనామం రామకధలు రాస్తూ ఉంటాను.కాళ్ళతో రామభక్తుల దగ్గరకు, రామాలయాలకు వెడతాను .మనసులో రామ రూప ధ్యానమే చేస్తాను .ఇక మిగిలిన ఈ పంచ భౌతిక శరీరాన్ని అంటే అన్నమయ కోశాన్ని రామ నామం తో ఏరిన బియ్యాన్నే అన్నంగా వండి రాముడికి నైవేద్యం పెట్టి తింటాను .అప్పుడు నేను ఈ పాంచ భౌతిక శరీరం తో సహా శ్రీరముడినే అవుతాను .నేను రామ సాగరం లో ,రామనామం తో పుడతాను .రామనామం తో పెరుగుతాను రామనామం తో చనిపోతాను ‘’అదీ నరసదాస శ్రీరామ శరణ గారి అనన్య భక్తీ .ఇలాంటి వారిని మనం చూసి ఉండం.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -7

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -7

   ఆచార్య పీఠం

దాసుగారిని అందరూ అయ్యవారు అని పిలిచేవారు .శిష్యులుగా చేర్చుకొని మార్గదర్శనం చేయమని చాలా గ్రామాల వారు కోరారు .ఒక రోజు ఒక మహా తెజస్వంతుడు వచ్చి సమాజం లోని అందర్నీ పలకరిస్తూ ,ఆలింగనం చేసుకొంటూ దాసు గారిని ‘’నువ్వు ఎవరు ‘’అని అడిగితె శ్రీరామ చంద్ర మూర్తి పటంవైపు   చెయ్యి చూపారు .ఆయన సంతోషించి మళ్ళీ కనపడ లేదు .కమ్మనమోలు భజన సమాజం వారు దాసుగారిని ఆహ్వానించ గా దాని నాయకుడు సభ్యులకు దాసుగారిని సాక్షాత్తు శ్రీ రామ చంద్ర మూర్తి అని పరిచయం చేశారు .వారంతా దాసుగారి నవవిధ భక్తులు పుస్తకం చదివి ప్రేరణ పొందినవారే .వారూ తమల్ని శిష్యులుగా స్వీకరించమని బలంగా కోరారు .శిష్యులు పెరిగితే సాధనకు ఇబ్బంది కలిగి వాళ్ళు గుది బండలు అవుతారని ఒప్పుకోలేదు .

   బుద్దాం లో ఉండగా దాసుకి ఒక రోజు రాత్రి కలలో  వాసుదాసు  గారు కనిపించి ‘’నాయనా !ఎందరో నీ మార్గదర్శనం కోసం పలవరిస్తున్నారు శిష్యులుగా చేర్చుకొని వారికి ఊరడింపు కల్గించు .ఆచార్త్య పీఠం ఎక్కి వారి కోర్కె తీర్చి మార్గ దర్శనం చేయి .నీ సాధనకు భజనలకు పుస్తక రచనలకు వీరు తోడ్పడతారు .ఇది నా ఆజ్ఞ‘’అని దిశా నిర్దేశం చేశారు దాసుగారి మనసు కుదుట బడింది .

  పునశ్చరణ ,మంత్రం సిద్ధి

  వాసుదాసు గారి ఆజ్ఞను శిరసా వహించి నరసదాసు గారు నెలరోజులు స్కూలుకు సెలవు పెట్టి ప్రయాగ వెళ్ళారు .అదిమాఘ మాసం .చలి విపరీతం .అందరిలాగానే ఒక పందిరికింద పునశ్చరణ ప్రారంభించారు .పల్లి ఆంజనేయులుగారు కూడా ఆయన వెంట ఉన్నారు .దాసుగారు అప్పుడు కనిపించి అంతర్ధానమైన మహర్షితో మాట్లాడాలని కోరికగా ఉన్నారు .పగటిపూట పూజా జపం చేస్తూ ,రాత్రి పదిగంటలకు ఇంతచప్పిడి కూడు తింటూ ,తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానాదులు చేసి గడగడ వనకుతూ జపం  చేసేవారు .ఆంజనేయులుగారు రాత్రి వినోదాలు చూస్తూ ఉదయం 7కు లేచి 10 గంటలకు స్నానం  చేసేవారు .

   దాసుగారు దీక్షగా రోజుకు కనీసం 90 వేల సార్లు మంత్ర జపం క్రమం తప్పకుండా చేసేవారు .సాయంకాలం ఆ మహర్షికోసం ఎదురు చూసేవారు .ఒక వారం తర్వాత ఒకసాయంత్ర అంతర్ధానమైన మహర్షి రావటం ఆంజనేయులు గారు చూసి చెప్పగానే పద్మాసనం వేసి పద్మనాభుని మనసునిండా నింపుకొని ధ్యానిస్తున్న దాసు గారి దగ్గరకు వచ్చి ‘’స్నేహితుడా !నువ్వు చెప్పిన చిహ్నాలున్నాయన వస్తున్నాడు ‘’అని చెప్పగా ,కళ్ళు తెరిచి చూడగా మందగమనం గా వస్తున్న ఆయన్ను చూడగా ఆయన చేయిపట్టుకొని దాసుగారిని లెవ నెత్తి ‘’నాయనా !నీ సాధన అమోఘం .నీకు అలవాటుకాని వాతావరణం లో ఇంతచలిలో నువ్వు దీక్షగా అనుకొన్నది చేస్తున్నావు .నీ హృదయం ధర్మ మార్గాన్ని కోరుతోంది .నువ్వు ధన్యుడవు ‘’అని పలికి తన చేతులతో దాసుగారి శరీరాన్ని నిమిరారు .నరసయ్య గారు ఆనంద పరవశమయ్యారు .సాక్షాత్తు భగవంతుడే  ఆ రూపం లో వచ్చి తనకు మార్గ దర్శనం చేశాడని దాసుగారు భావించారు

  ఆ మహాత్ముని తమ కుటీరానికి తీసుకువెళ్ళి త్రివేణీ జలం తో కాళ్ళు కడిగి పవిత్రజలం శిరసున చల్లుకొన్నారు . తాను  తయారు చేసిన మధురపదార్ధాలు పెట్టగా కమ్మగా భుజించాడాయన .ఆయన నోటికి అందించినవే తిన్నాడు. చేతితో తీసుకొని తినలేదు .ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన దాసుగారి వినయ విదేయతలకు మెచ్చి ,సరస సల్లాపాలు చేసి దాసుగారి సందేహాలన్నీ తీర్చి ,తమ పవిత్ర హస్తాన్ని నరసదాసుగారి మస్తకం పై ప్రేమగా ఉంచగా దాసుగారు వెంటనే నిర్వికల్పసమాధిలోకి వెళ్ళిపోయారు .ఆ అనుభూతి వర్ణనా తీతం .కొంత సేపటికి సమాధినుంచి బయటకు వచ్చి దాసుగారు పరమానందం పొందారు .దాసుగారికి ఆమహర్షి’’ శ్రీరామ త్రయోదశాక్షర మంత్రం ‘’ఉపదేశించి ‘’నీ ఉగ్ర సాధన ఫలించింది .సంపూర్ణ సిద్ధిపొందావు .సందేహాలు తీర్చే సామర్ధ్యం అలిగింది .ఆచార్య పీఠం అది రోహించి ఆశ్రితులకు ఆశ్రయం ఇవ్వు .నిన్ను ఆశ్రయించిన వారు కష్టాల పాలుకాకుండా ,ఆముష్మిక సుఖాలు పొందుతారు .హరిని కీర్తించే సులభోపాయం బోధి౦చటమే నీ ఆధునిక సాధన .నామ ప్రచారం లో నువ్వు ధన్యుడవు అవుతావు ‘’అని చెబుతూ ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు .

  దాసుగారు ప్రయాగలో పునశ్చరణ దీక్ష ఫలప్రదంగా పూర్తీ చేసుకొని మనసంతా రామమయం చేసుకొని ,జపం చేస్తుంటే సరయూనది నుంచి శ్రీరాముడు బయటికి వచ్చి చేతిని దాసుగారి శిరసుపై ఉంచిన భావన కలిగి కళ్ళు తెరిచి చూస్తె ఎవరూ కనిపించలేదు .రామ సాక్షాత్కారం కలగ లేదని బాధ పడగా ఒక మహాత్ముడు దర్శనమిచ్చారు లేచి పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు .ఆయనే రామతత్వాన్ని ఔపోసనపట్టిన శియారఘునాధ శరణ మహారాజ్ .వారినోటి నుండి నిరంతరం సీతారాం సీతారం నామం వెలువడుతుంది .వారు ‘’భక్త శిరోమణీ !నీ జపం ఫలించింది .నీ నిష్టా నియమాలు నన్ను ముగ్దుడిని చేశాయి నీతోమాట్లాదాలని చాలాకాలంగా నాకు కోరిక .’’అని చెప్పి తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి ,రామ పంచాయత మంత్రోప దేశం చేసి ,అనుష్టానక్రమం బోధించి ‘’శ్రీరామ శరణ్’’ అనే దీక్షానామం ఇచ్చారు .ఆమంత్ర జపమూ చేసి నరసదాసుగారు కాశీ వెళ్ళారు .

  కాశీలో మంత్రం సిద్ధిపొందాలనుకొని గంగ ఒడ్డున శృంగేరిమఠం మెడ ఏడవ అంతస్తులో గది తీసుకొని ,శివ పంచాక్షరి మహామంత్ర జపం చేశారు .తెల్లవారుజామున గంగాస్నానం ,విశ్వేశ్వరాభిషేకం చేసి ,జపానికి కూర్చునేవారు .మూడు రోజులతర్వాత ఒకరాత్రి విశ్వేశ్వరుడు కలలో కనిపించి ‘’రామ భక్త రత్నమా !నీ సాధన సంతోషం కలిగించింది .రామనామం నిండిన నా హృదయమే నీకు దగ్గరైంది .నువ్వు రామునికి ప్రేమపాత్రుడవు నాకు మిక్కిలి సన్నిహితుడవు .నీ రామ నామ ప్రచారం లో నా శక్తి కూడా నిన్ను ఆవహించి ఫలితమిస్తుంది .రామనామ ప్రచార రత్నంగా కీర్తి పొందుతావు ‘’అని ఆశీర్వ దించాడు .అక్కడ పని పూర్తీ చేసుకొని శ్రీరామ శరణ గారు బృందావనం చేరారు .

  బృందావనం లో అడుగడుగునా రాధేశ్యాం భజన అపూర్వమని పించింది దాసుగారికి .అక్కడ శ్రీ ఉడియా బాబా ఆశ్రమం గుహ లో ఉంటూ పునశ్చరణ ప్రారంభింఛి పూర్తీ చేసేలోపు వారికి శ్రీరాధా కృష్ణుల దివ్య దర్శనమైంది .ఎందరో మహాత్ములతో పరిచయభాగ్యం కలిగింది .అక్కడినుంచి గోవర్ధన క్షేత్రం వెళ్లి ,రాధాకృష్ణుల విహార స్థలాలను చూసి పులకి౦చారు  .కుసుమ సరోవరం వద్ద ఉంటూ పునశ్చరణ పూర్తీ చేశారు .ఇక్కడా రాధాకృష్ణ సాక్షాత్కారం పొంది,హరిద్వారం చేరారు .భగీరధుని తపస్సు ఫలించి ఆకాశ గంగ భూమిపై కాలుపెట్టిన పవిత్ర క్షేత్రం అది .ఇది నిజంగా వైకుంఠ ద్వారమే .చలి ఎక్కువ .అక్కడ గంగాస్నానం చేస్తూ పునశ్చరణ పూర్తీ చేశారు .అక్కడ శ్రీ కరపత్ర స్వామి దర్శనం లభించి అయన భాషణలు భూషణాలు అనిపించాయి .కొద్దిగా అనారోగ్యమేర్పడగా బుద్దాం వచ్చేశారు .

  శ్రీ రామ శరణ్ గారి దర్శనం తో ప్రజల  ఆనందానికి అవధిలేదు .అందరూ ఆయన పదపద్మాలను ఆశ్రయించాలని భావించారు .శ్రద్ధ ఉన్నవారికి మంత్ర దీక్ష ఇచ్చారు .గుంటూరు ,కృష్ణా జిల్లాలో ఆయన శిష్యబృందం విశేషంగా ఉన్నారు .ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాలో బెంగుళూరులో కూడా శిష్య బృందం ఏర్పడింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వరిష్ట కర్మిష్టి వర్మగారు

వరిష్ట కర్మిష్టి వర్మగారు

వర్మగారు అని అందరికీ పరిచయమైన శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారు జూన్ 6వ తేదీ ఆదివారం గన్నవరం లో స్వగృహం లో 94వ ఏట మరణించారు .వారితో సుదీర్ఘకాలం పరిచయమున్న ఉపాధ్యాయులు ,కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ తో అనుబంధం ఉన్నవారెవరైనా  వర్మగారి గురించి స్పూర్తి నిచ్చే వ్యాసం రాస్తారేమో నని ఎదురు చూసి ఆశాభంగమై ,నాకు

వారితో ఉన్న అనుబంధాన్ని విద్యారంగానికి వారు చేసిన సేవలను  నాకు జ్ఞాపకం ఉన్న మేరకు అందరికి తెలియజేయాలని ఈ రచన మొ దలుపెట్టాను. వారి  విశేషాలపై నాకు పూర్తి అవగాహనా, లేదు అధారిటీ కూడా నాకు లేదు . ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి విషయాలను   ఏకరువు పెడతాను .ఇందులో క్రానలాజికల్ ఆర్డర్ ఏమీ లేదు .

 నేను సైన్స్ టీచర్ గా కృష్ణాజిల్లా మోపిదేవి హైస్కూల్ లో 1963 ఆగస్ట్ లో చేరాను .హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు .అప్పుడు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా   సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ పటమట హై స్కూల్ లో పని చేస్తున్న శ్రీ ఆరిగపూడి పూర్ణ చంద్రరావు గారు .నాకు అప్పటికి గిల్డ్ అంటేఏమిటో తెలీదు .కాని ఆయనపై అభియోగాలు చాలావినిపించేవి .ఆయన్ను తీసేసి వేరే వారిని నియమించాలని గిల్డ్ సభ్యులకు నాయకులకు కలిగింది .కానీ ఆయన అన్ని విధాలా  పలుకు బడి ఉన్నవారట .దీనిపై వ్యూహానికి పామర్రు హై స్కూల్ లో ఒక ఆదివారం టీచర్స్ సమావేశం  నిర్వహించారు తూమాటి వారి  ఆధ్వర్యం లో .అప్పటి వారిలో  వర్మగారు శ్రీ పాలేటి లక్ష్మణ స్వామి శ్రీ కాకరాల రాధాకృష్ణ మూర్తి ,శ్రీ వల్లభనేని  ప్రభాకరరావు శ్రీ ఏం వి కృష్ణారావు(మొవ్వ కృష్ణారావు ) గార్లు అధ్క్షా మార్పు అవసరం గురించి వివరించారు .

 తర్వాత ఒక సారి పడమట హై స్కూల్ లోనో ఎక్కడో మళ్ళీ సమావేశం జరిగింది .ఈలోగా రావు గారిని మర్యాదగా దిగిపొమ్మని చాలా రాయబారాలు జరిగాయి .ఆయన ససేమిరా అన్నారు .వీళ్ళకీ పట్టు దల పెరిగి ఎలా అయినా దించాలని నిర్ణయించారు .మీటింగ్ జరుగుతుండగా మినిట్స్  బుక్ ను ఎవరో ఎత్తుకు పోయారనే గొడతొ  వాయిదా పడుతూ చివరికి కొత్త పుస్తకం తో ఉన్న వారి హాజరీతో పూర్ణ చంద్ర రావు గారిని  తొలగించి ,మా హెడ్మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారిని గిల్డ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోన్నట్లు జ్ఞాపకం అప్పటి నుంచి నేను గిల్డ్ లో మెంబర్ గా ఉన్నాను .

   ఆతర్వాత గిల్డ్ బాగా పని చేస్తూ అందరి కి దగ్గరైంది .కార్యవర్గ సమావేశాలు సర్వ సభ్య సామావేశాలు రెగ్యులర్ గా జరిగేవి .ఉయ్యూరునుంచి నేనూ లేక్కలమేస్తారు ఆంజనేయ శాస్త్రి సైన్స్ మాస్టారు కాంతారావు, హిందీ మాస్టారు రామారావు నతెలుగుపందిట్ శ్రీ అన్నే పిచ్చిబాబు  వగైరాలం వెళ్లి  వస్తూ ఉండేవాళ్ళం  ఆసమావేశ లలో నన్ను మాట్లాడమంటే మాట్లాడే వాడిని. అంతా నన్ను అభి నంది౦చేవారు .తర్వాత ప్రభాకరరావు గారు ప్రెసిడెంట్ అయినట్లు గుర్తు .ఆయన చాలాకాలం కార్యదర్శిగా ఉన్నారు సీనియర్ మోస్ట్  సేకండరి టీచర్ . రూల్స్ అన్నీ బాగా తెలిసినవారు ఆయనకొక గ్రూప్ ప్రత్యేకంగా ఉండేది

  తర్వాత నేను మోపిదేవిలో పని చేసినప్పుడు సోషల్ మాస్టర్ గా ఉంటూ నాకూ లెక్కల మేష్టారు శ్రీ రమణా రావు గారికి ఆప్యాయం గా ఉన్న శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు అప్పుడే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చి వెళ్లి పొయీరు ,ఆతర్వాత పటమట హై స్కూల్ హెడ్ అయి ఆయన వివాదరహితుడు పెద్దమనిషి అని అందరూ గుర్తించి శర్మగారిని  గిల్డ్ ప్రెసిడెంట్ ను చేశారు .అప్పుడు వర్మగారు సెక్రెటరి అయారు తనకున్న అనుభవం .తో . ఆసమావేశం లో నన్ను మాట్లాడ మంటే ‘’శర్మ ,వర్మా కలిసి గిల్డ్ కు బర్మా వేయకండి ‘’అన్నాను వాళ్ళిద్దరితో పాటు అందరూ పగలబడి నవ్వారు నేను ఎప్పుడు కనబడినా ఈమాటే చెప్పేవారు .ఆతర్వాత తాడంకి హెడ్ మాస్టర్ శ్రీ కే మంగళగిరి శాస్త్రి గారు ప్రెసిడెంట్ చేశారు తాడంకి హిందీమాస్టారు శ్రీ  లక్ష్మణ స్వామి  సెక్రెటరి .ఆతర్వాత వర్మగారిని మేమంతా బలపరచి ప్రెసిడెంట్ ను చేశాం .ఆతర్వాత  చాలామంది మారారు .

  కృష్ణా జిల్లా గిల్డ్ అభ్యర్ధిగా శాసనమండలికి శ్రీ కొల్లూరి కోటేశ్వరావు గారిని ప్రతిపాది౦చటం ఆయనకోసం అహరహం ప్రచారం నిర్వహించి అందర్నీ ఒప్పించి మూడు సార్లు ఆయనను గెలిపించటం లో వర్మ గారి పాత్ర చిరస్మరణీయం .గిల్డ్ నిర్వహించే  టీచర్స్ ఓరిఎంటేష న్ క్లాసులు విజయవంతం అయెట్లు చేయటం లో వర్మగారి కృషి  అభినందనీయం .సిలబస్ మార్పులు ,ప్రశ్నపత్రాలలో మార్పులు వగైరాలకు ప్రత్యెక సమావేశాలు నిర్వహించటం లో ఆరి తేరిన చెయ్యి .మంగినపూడి సెమినార్ గొల్వే పల్లి సెమినార్ ఉయ్యూరు సెమినార్ వంటివి లెక్కలేనన్ని .

  కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులైన శ్రీ మాగంటి అంకినీడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు ,శ్రీ సుంకర సత్యనారాయణ శ్రీ రాఘవ రావు గార్లతో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగే చాతుర్యమున్నవారు వర్మగారు .టీచర్స్ బదిలీలలో సమర్ధమైన టీచర్లను సమర్ధమైన స్కూళ్ళలో నియమించటం లో ఆయన చైర్మన్ లకు మంచి సలహా ఇచ్చేవారు .ఉపాధ్యాయ సంక్షేమం పట్ల మక్కువ ఎక్కువ .విజయవాడ శ్రీ కాకాని వెంకటరత్నం టీచర్స్ గిల్డ్, బందరులో శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు టీచర్స్ గిల్డ్ నిర్మాణం లో వర్మగారు నిర్వహించిన పాత్ర ప్రశస్తమైనది .గిల్డ్ హో౦ లలో అన్ని రకాల సదుపాయాలూ కలిపించటానికి  టీచర్లను   ప్రోత్సహించిన వైనం ,గిల్డ్ నిర్వహణలో  ఎలోపం జరుగకుండా చేయటం  లో ఆయన చూపిన విజ్ఞత మరువలేనివి .పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ టీచర్లకు అందుబాటులోనే ఉండేవారు వారి సమస్యల పరిష్కారినికి చొరవ చూపి ఫలితం సాధించేవారు .జిల్లాపరిషత్ చైర్మన్ నిర్వహించే హెడ్ మాస్టర్లసమావేశం జిల్లా విద్యాధికారి నిర్వహించే సమావేశాలలో ఆయనతో వారు సంప్రదించి విజయం కావటానికి కృషి చేయమని కోరేవారు .

   నేనంటే వర్మగారికి అమితమైన  అభిమానం .నాకూ ఆయన౦టే యెనలేని గౌరవం .మా పెద్దబ్బాయి శాస్త్రి రెండోవాడు శర్మవివాహాలు విజయవాడలో జరిగితే హాజరై ఆశీర్వదించారు ఉయ్యూరులో జరిగిన మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మీ అవధాని వివాహానికి విచ్చేసి ఆశీర్వదించిన డొడ్డమనసు వర్మగారిది .

  నా సర్వీసులో ఎప్పుడూ నాకు బదిలీల గండమే .జరిగినప్పుడల్లా ఆయన కు తెలియ ఎసేవాడిని. వీలున్నమేరకు సాయపడేవారు .ఒక్కోసారి ఉయ్యూరు వచ్చి విషయం  ఏదైనా ఉంటె నాకు నేను ఇంట్లో లేకపోతే,మాశ్రీమటికీ చెప్పి వెళ్ళే సంస్కారం ఆయనది .నన్ను ఒకసారి ఉయ్యూరు హై స్కూల్ నుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవులలో ట్రాన్స్ ఫర్ చేశారు .విపరీతమైన వర్షాలు వరదలు . సెలవాల్లోనే జాయిన్ అయాను  అప్పుడు హెడ్మాస్టర్ ఎల్వి .రామ గోపాలం గారు .ఆయన మేనమామ ,మామగారు శ్రీ ఉమా రామలిన్గామూర్తిగారు జిల్లాలో పేరెన్నికగన్న హెడ్ మాస్టర్ .సెలవల తర్వాత స్కూల్ లో నేను సుమారు పది రోజులు పని చేశాను .అక్కడే వర్మగారితో పని చేసే అదృష్టం కలిగింది నాకు .రోజూ ఉయ్యూరునుంచే వెళ్ళేవాడిని .ఆతర్వాత అక్కడ పని చేసి పామర్రు ట్రాన్స ఫర్ అయిన సైన్స్ మాస్టారు వచ్చి మేమిద్దరం మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పెట్టుకుందామని కోరాడు సరే అని వర్మగారికి చెప్పాను ఆయనా ఒప్పుకున్నారు .వెంటనే మళ్ళీ పామర్రు కు మారాను .వీడ్కోలు మీటింగ్ లో వర్మగారు నాగురించి చాలామంచి మాటలుచేప్పారు .

  ఆయనా నేనూ కూడా రిటైరైనా ఆయనకు ఉత్తరాలు రాయటం ఫోన్ తో మాట్లాడటం జరిగేది .ఒకసారి ఆయన భార్యగారి మరణ వార్త పేపర్లో చదివి పలకరించటానికి వెళ్లి వచ్చాను .మరో సారి నేనూ ఆంజనేయ శాస్త్రి గారు కలిసి వెళ్లి పరామర్శించి వచ్చాం .సరసభారతి పుస్తకాలుకూడా వర్మగారికి పంపేవాడిని .అందినట్లు ఫోన్ చేసి చెప్పేవారు .వర్మగారిపెద్దబ్బాయి శ్రీ ప్రసాద్ ఉత్సావంతుడైన డ్రిల్ మాస్టర్ .గ్రిగ్ స్పోర్ట్స్ లో ప్రాతిఏడూ కలిసేవాళ్ళం .వర్మ గారి విషయాలు అడిగి తెలుసుకొనే వాడిని .రెండో అబ్బాయి శ్రీ రాజేంద్ర ప్రసాద్ తానా అధ్యక్షుడయ్యారు .తానా వారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒక ఏడాది జనవరిలో విజయవాడ సిద్ధార్ధ కాలేజిలో కృష్ణా ఉత్సవాలు జరిపితే ఆయన తో పరిచయమైంది .ఆతర్వాత కూడా రెండు మూడు సార్లు కలుసుకొన్నా౦.

   ఖద్దరు పంచె ఖద్దరు చొక్కా ఖద్దరువుత్తరీయం తో  చిరునవ్వుతో కొంచెం భారీ పర్సనాలిటీ తో వర్మగారు ఎప్పుడూ ఉండేవారు .మంచి హాస్యప్రియత్వం ఉండేది .నవ్వుతూ పలకరించేవారు  .కొంచెం కీచు గొంతు.విషయాన్ని విస్పష్టంగా  మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారు .అందుకే మా ఇద్దరి మధ్య కెమిష్ట్రి బాగా కుదిరిందేమో .నిరంతర ఆలోచనాపరులు వరిష్ట కర్మిష్టి శ్రీ అప్పారాయ వర్మ గారి మరణం బాధాకరం .వారికి ఉత్తమగతులు కలగాలని కోరుతున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6 

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -6

బుద్దాం లో శ్రీరమా చ్యుత మందిర నిర్మాణం

ఒకప్పటి బౌద్ధుల ఆవాస భూమికనుక బుద్దాం అనే పేరు వచ్చి ఉంటుంది ఇప్పటికి అక్కడ బౌద్ధ నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి .గుంటూరు సీతారామ నామ సంకీర్తన సంఘానికి ఒక ఏడాది మేనేజర్ గా పని చేసి నరసయ్యగారు బుద్దాం వచ్చి అక్కడ మేనేజి మెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ కాపురం పెట్టారు .అక్కడకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ కలరా తీవ్రంగా వ్యాపించి ,ఒకే వారం లో సుమారు 80మంది చనిపోయారు .జనం భయభ్రాంతులయ్యారు అక్కడ కనీసం ఒక్క దేవాలయం కూడా లేదు .కలరా వ్యాధి బారి పడకుండా జనాలకుధైర్యం చెప్పటానికి నరసయ్యగారు మాధవ కీర్తన సప్తాహం నిర్వహించారు .మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే వ్యాధి తగ్గటం మొదలైంది .ఇది సంకీర్తన ప్రభావం అని జనం విశ్వ సించారు .శ్రద్ధగా అందరూ పాల్గొనేవారు .నరసయ్య గారిని ‘’నరసదాసు ‘’గారని గౌరవంగా  సంబోధిం చేవారు  .అరిష్టాలను అరికట్టటానికి ఆ౦జనేయ విగ్రహం స్థాపించి పూజ కూడా జరిపించారు .మంగళ శనివారాలలో  తమలపాకు పూజలు అప్పాల నైవేద్యం చేయించేవారు .దేవాలయం ,అర్చన  లేని గ్రామం లో ఒక్కపూట కూడా ఉండరాదనే ఆర్యోక్తి ని అక్కడిజనాలకు నిత్యం చెప్పేవారు .

 మందిర నిర్మాణానికి ఆయనకు తగిన ఆర్ధిక స్థోమత లేదు. తల్లి చనిపోయింది .కొడుకు ,కూతురు  భార్యాభర్తల పోషణ జరగాలి .శేషమ్మగారు ఎక్కడెక్కడో అప్పు చెసి కొంపగాడుపుతూ , జీతం రాగానే తీర్చేవారు .ఒక సారి ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్ళారు .దాసు గారొక్కరే ఇంట్లో ఉన్నారు .రోజూ నియమమ తప్పకుండా గాయత్రీజపం , ఏమీ తినకుండా బడికి వెళ్లి ,సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాక అన్నం వండి తినేవారు .ఒకరోజు భోజన సామగ్రి లేక అసంపూర్తిగా భోజనం కానిచ్చేవారు .తన బాధ ఎవరికీ చెప్పేవారు కాదు .అలాగే ఒక సారి రాత్రి సంకీర్తన చేసి నిద్రకు ఉపక్రమించారు  .ఆకలి గా ఉండటం తో నిద్ర పట్ట లేదు .చిన్న కునుకు తీశారు .అందులోనే ఒక కల వచ్చింది .శ్రీరాముడు కనిపించాడు ఆయన అలసిపోయినట్లు ఒళ్ళంతా చెమట కారుతున్నట్లు దాసుగారు చూశారు .పైన ఒక ఉత్తరీయం మాత్రమె ఉంది .బరువైన ధావళి కొంత ఊడింది .పాదాలు దుమ్మూ ధూళితో ఉన్నాయి .శ్వాస మహా వేగం గా ఉండటం తో పరిగెత్తుకొని వచ్చినట్లు అనిపించారు .మొహం తెల్లబడి కళ్ళ వెంట నీరు కారుతోంది .ఏదో చెప్పాలన్న తపన తో ‘’వత్సా !ఆకలితో ఎంత బాధ పడుతున్నావోకదా.వెంటనే రాలేకపోయాను ..నా భక్తుల ఆర్తి పోగొట్టటం నా ధర్మం .నీకోసం ఆహారం తెచ్చాను త్వరగా లేచి తిని కడుపు నింపుకో ‘’అని కుడి చేయిని దాసు గారి ఛాతీపై ఉంచాడు రామయ్య .ఆస్పర్షకు దాసుగారికి మెలకువ వచ్చి లేచారు .ఇంటిగుమ్మం తెరిచి ఉంది .దీపం వెలుగుతూనే ఉంది .ఆశ్చర్యం తో లోపలి వెళ్ళారు .అక్కడ ఒక పళ్ళెం లో నాలుగు గోధుమ రొట్టెలు ,వాటిపై పెద్ద వెన్నముద్ద కనిపించాయి .దాసుగారి హృదయం ఉప్పొంగి పోయింది .మనసులో దైవ ధ్యానం చేసి వాటిని తినటానికి కూర్చున్నారు .అవి అప్పటికప్పుడే తయారు చేసినట్లు వేడిగా  వెన్నతో ఉండటం తో రాముడే తాను తినే ఆహారాన్ని తెచ్చి పెట్టాడని నిశ్చయించారు .రామమంత్ర పునశ్చరణ చేయాలనే తలంపు వచ్చి ,మంత్రానికి ఎన్ని అక్షరాలు  ఉంటె అన్ని లక్షల సార్లు నియమం తో జపి౦చాలని  నిర్ణయించుకొన్నారు .దీక్షగా  ఒక్క నెలరోజుల్లో అనుకున్నది పూర్తీ చేశారు .అహర్నిశలు రామనామ జపమే ,మనసంతా రామమందిరమే చేసుకొన్నారు .దీనితో అంతా రామమయం గా కనిపించింది .వారి భక్తి పరాకాష్టకు చేరింది .రాముడిని చూడటానికి తహతహ లాడారు .

  మళ్ళీ ఒకరోజు రాముడు స్వప్న సాక్షాత్కార భాగ్యం కలిగించి ‘’భక్తావతంసా !నీ సాధన తీవ్ర సిద్ధి పొందింది .నీ ప్రేమ హృదయం పరమ మధురం .నీ భావాలు నన్ను ఆకర్షించాయి .నీతో చాలా సన్నిహితంగా ఉండాలనే తీవ్ర మైన కోరిక నాకు కలిగింది .నువ్వు సిద్ధి సాధించిన ఈ స్థలం లోనే నీతో ఉండి పోవాలని పిస్తోంది .నీ నామ ప్రచారానికి నువ్వు నిర్మించాలనుకొన్న మందిరం గొప్ప ప్రచార సాధనమౌతుంది ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .

  ఐడియా బాగానే ఉంది.చేతిలో దమ్మిడీ కూడా లేదు .శేషమ్మగారి నగలు అమ్మితే వచ్చిన రెండు వేల రూపాయలోతో మందిర స్థాపనమొదలు పెట్టాలనుకొని ప్రారంభించి చిన్న మందిరం కట్టారు .దానిలో సీతారామ ఆంజనేయ మట్టి విగ్రహాలు పెట్టి పూజించేవారు .శ్రీ 108ప్రభుదత్త బ్రహ్మ చారి గారు ,శ్రీ శియా రఘువర దాసు గార్లు మనదాసు గారి మందిరం చూడాలనే ఉత్సాహం తో వచ్చారు .పవిత్రమైన ఆమందిరం లో పాలరాతి విగ్రహాలు పెడితే దివ్య తెజోమయంగా ఉంటుంది అని అన్నారు దాసు గారితో .వారిద్దరితో తమ స్థితి గతులు పూస గుచ్చినట్లు దాసు గారు విన్నవించారు .వెంటనే వారు చంద్రకాంత శిలా నిర్మిత శ్రీ రమాచ్యుత’’ విగ్రహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు  .అది రాజస్థాన్ లో మాత్రమె దొరికే జైపూర్ శిల్పం .నరసదాసుగారు అక్కడికి వెళ్లి శ్రీ సీతారామ ,శ్రీ రాధా కృష్ణుల  విగ్రహాలను ఎంపిక చేసి తీసుకొని  వచ్చి మందిరం లో ప్రతిష్టించారు .సగుణ నిర్గుణ నామాలు అయిన ఓంకారం, హరేరాం ఫలకాలను కూడా ప్రతిష్టించారు .ఈ మందిరానికి ‘’నామ ప్రయాగ ‘’అని పవిత్ర నామం  పెట్టారు .భగవదవతార జ్యోతకమైన సంపూర్ణ ప్రభావమే ఆ మందిరం యొక్క ప్రత్యేకత .దీనితో బుద్ధాం లో దేవాలయం లేని కొరత తీరింది .రోజూ రాత్రి భజన చేసేవారు .ప్రతి ఏకాదశినాడు అక్షండ నామ సంకీర్తన నిర్వహించారు .స్త్రీ భక్తులు కమ్మగా గానం భజన లతో అలరించేవారు .త్యాగరాజకీర్తనామృతం జాలు వారి౦ చేవారు .శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి  శ్రీ సీతారామ దాసుగారు ,శ్రీ ఓంకార దాసుగారు ,శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు గొప్ప ప్రేరణ కలిగించేవారు .

  నాలుగేళ్ళు వరుసగా గ్రామస్తుల సహకారం తో ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు జరిపారు .దాతలు ముందుకు వచ్చి మందిర విస్తరణకు ఆర్ధికసాయం చేశారు .మందిరం విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోయేది నరసయ్యగారి ఆర్ధిక బాధలు తగ్గాయి .కుమారునికి , కూతురికి మంచి సంబంధాలు తెచ్చి వివాహాలు చేశారు.భార్య శేషమ్మగారు భర్త నరస దాసుగారికి అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ అతిధి , అభ్యాగ్తులను ఆదరిస్తూ  తలలో నాలుకగా వ్యవహరించి అందరి మన్ననలు ఆదంపతులు పొందారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -5

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -5

నరసయ్యగారికి రోజూ దేవుడికి మృదు మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలని ఉండేది .కాని ఆర్ధిక పరిస్థితికి అది  గొంతెమ్మ కోరికే .ఒకరోజు ఇదే ధ్యాసతో ఆలోచిస్తూ నిద్రపోయారు .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి పెట్టెలో నాలుగు పంచదార లడ్డూలు ఒక కాగితం పోట్లంలో కనిపించాయి.కాగితం మీద ‘’శ్రీరామ నిలయం –అయోధ్య ‘’అని హిందీలో రాయబడి ఉండటం చూసి అమితాశ్చర్యపడ్డారు .వాటిని అందరికి ప్రసాదంగా పంచిపెట్టారు .ఇలా రోజూ ఏదో ఒక మహిమ కనిపించేది .శేషమ్మగారి డబ్బు పోతూ, మళ్ళీ కనిపిస్తూ ఆమెకు నమ్మకం కలిగేది .ఒకసారి నరసయ్యగారు గురువు వాసుదాసు  గారి కి  అలాంటి మహిమలు ఇక తనకు వద్దు అని కోరారు .తన శిష్యుని యోగ సిద్ధి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోటానికి ఆయన జమ్ముల పాలెం వచ్చారు .గురువుగారికి అత్యంత భక్తితో శిష్యుడు స్వాగతం పలికారు ఆయన అమిత శిష్య వాత్సలయం తో దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ‘’’’నాయనా ! నీ యోగసిద్ధి వినయ విధేయతలు ఆధ్యాత్మిక వివేకం మృదుమధుర భాషణం ,నిర్మల మనసు ,నీ మనసులోని ధర్మమూ నాకు తెలిశాయి .మహిమలు అధోగతికి సోపానాలు .జాగ్రత్తగా మసలు కో ‘’అని హితవు చెప్పి వెళ్ళారు .ఇక తనకు ఏరకమైన మహిమలు చూపవద్దని ఆర్తిగా దేవుని నరసయ్యగారు ప్రార్ధించారు .

  యోగం చేశాక తన శరీరం శవాకారంగా కనపడేది .ఒకరోజు రాత్రి అన్ని శరీర భాగాలనుంచి ప్రాణం పైకి వెడుతూ శిరసు దగ్గరకు వచ్చాయి .వెంటనే ఎవరో నెత్తిన చెయ్యి వేయటం అవి మళ్ళీ యధాస్థానలకు వెళ్ళిపోవటం కనిపించి ఆశ్చర్యపోయారు లేచి చూస్తె ఎవ్వరూ కనపడలేదు .

   గుంటూరుశ్రీ రామ నామ క్షేత్ర సందర్శనం

వంగిపురం లో వాసుదాసుగారు శ్రీ కోదండరామ సేవక సమాజం వార్షికోత్సవాలలో నరసయ్యగారు కూడా పాల్గొన్నారు .జనం తండోప తండాలుగా వచ్చారు .రాగం ఆంజనేయులు,పెండ్యాల రామ సుబ్బయ్య ,పన్నాల లక్ష్మీ నరసింహం ,పన్నాల రామ కృష్ణయ్య గార్లుకూడాగుంటూరు నుంచి వచ్చి  పాల్గొన్నారు .సాయంత్రం 4నుంచి నరసయ్య గారు భక్తీ ఉపన్యాసాలు చేశారు .ముందు సంకీర్తన చేసి తర్వాత ప్రసంగం చేసేవారు .పరమాద్భుతమైన తేజస్సుతో విరాజిల్లుతూ ప్రతిపలుకు కలకండ మాధుర్య౦గా ఉండేది ..శ్రీరాముని లీల విలాసాలను శ్రోతల మనస్సులోచొచ్చుకుపోయేట్లు మాట్లాడేవారు  .ఉపన్యాసం పూర్తీ అవగానే శ్రోతలు అందరూ వచ్చి ఆయనకు పాదాభి వందనం చేసేవారు అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆలింగం చేసేవారు .గుంటూరు వారు ‘’స్వామీ !మీ దర్శనం మాకు శ్రేయోదాయకం .గుంటూరులో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఉన్నది మేము దాని సభ్యులం .అది చిన్న సంఘమే కాని మీరు విచ్చేసి అక్కడ నామ సంకీర్తన ఉపన్యాసాలు చేయవలయునని మాకోరిక .మీరు సందర్శిస్తే దాని అభివృద్ధి దిగ్విజయంగా జరుగుతుందని మా విశ్వాసం ‘’అని  రాగం ఆంజనేయులు బృందం వారు  విన్నవించారు .

  నరసయ్యగారు చాలా సంతోషంగా వారి వెంట గుంటూరు వెళ్ళారు .అప్పటినుంచి నరసయ్యగారిని ఆ సంఘ సభ్యులుగా చేర్చుకొని ,ప్రచారం చేసే ప్రతి చోటుకూ తమ వెంట తీసుకు వెళ్ళేవారు .దీనితో ఆ సంఘం విలువ నాలుగు మూలాలకు ప్రాకింది .నరసయ్యగారు జమ్ముపాలెం నుంచి బుద్ధాం వచ్చి ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా పని చేశారు .బుద్ధాం నుంచి 8మైళ్ళ దూరం లో ఉన్న బాపట్లకు వారం లో నాలుగైదు రోజులు భజనకు వెళ్ళేవారు సాయంత్రం 5గంటలకు బయల్దేరి నడిచి వెళ్ళటం ,రాత్రి 11,12వరకు భజన చేసి తిరిగి నడిచి ఇంటికి రావటం చేసేవారు .తెల్లవారుజామున నాలుగుకే లేచి పనులన్నీ  చూసుకొని బుద్దాం స్కూల్ లో బోధనా చేసేవారు .

 గురువు  లేకుండాయోగాభ్యాసం చేయటం అధిక శ్రమ యోగం లో పనికి రాని భోజనాలు తినటం నిద్ర చాలక పోవటం వలన అనారోగ్యం పాలయ్యారు .ఉప్పు కారం ఉన్న తిండి తినటం తో కలిగిన బాధ ఇది .కీళ్ళ వాతం వచ్చి  కదలలేక మెదల లేక ఒక’’ మూట గా’ ఉండిపోయారు .పల్లెటూరుకనుక వైద్య సదుపాయం లేదు .యాచన గిట్టని మనస్తత్వం వారిది .క్రమంగా మనసును స్వాధీనం చేసుకొని చివరికి దాన్నికూడా  త్యాజ్యం చేసి శ్వాసకార్యాన్ని బంధించటం చేత ఆయన చనిపోయారని అందరూ గుసగుసలాడు తుంటు౦టే కొంతసేపటికి బాహ్య స్మృతి కలిగి .ఆపదలో ఆదుకొనే వారే కనిపించలేదు  .వాత౦ హరి౦చ టానికి పూసిన పూతలవల్ల కొంత గుణం కనిపించింది .ఈ అనుభవంతో గురువు లేకుండా యోగాభ్యాసం చెయవద్దుఅని అందరికీ బోధించేవారు .వాసు దాసు గారు రాసిన ‘’మందరం ‘’ను  నరసయ్య గారి చేతితోఅందంగా  రాయించాలని ఆయనకు అప్పగించారు గురువుగారు .ఆరోగ్యం కొంచెం కుదుట బడింది కనుక ఇక వృధా కాలక్షేపం పనికి రాదనుకొని వాలుకుర్చీలో కూర్చుని నెమ్మదిగా మందరం ను ముత్యాల వంటి అక్షరాలో రాసి గురువుగారికి అందించారు నరసయ్యగారు .

  నరసయ్యగారు చాలా కాలం గా బాపట్లకు రాకపోవటం తో స్నేహితుడు పుల్లె శేషగిరిరావు బుద్దాం వచ్చారు . ఈ బాల్య స్నేహితుడు ,సహాధ్యాయి దుర్వ్యసనాలకు బానిసై పతనం చెందుతు ఉంటే సరైన మార్గం లో పెట్టారు నరసయ్యగారు .నరసయ్యగారి దీన స్థితి చూసి ఆయన హృదయం ద్రవించి,వెంటనే సరైన వైద్యం కోసం బాపట్లకు తీసుకు వెళ్ళారు .స్వంతడబ్బు చాలా ఖర్చు చేసి నరసయ్యగారిని మళ్ళీ ఆరొగ్యవంతుల్ని చేసి స్నేహఋణం తీర్చుకున్నారు శేషగిరి రావు .

   ఆతర్వాత గుంటూరు రామనామ క్షేత్రం వారు వచ్చి నరసయ్యగారిని గుంటూరు తీసుకువెళ్ళి తమ సంఘానికి మేనేజర్ ను చేశారు .గుంటూరులో కాపురం పెట్టి ఆసమాజనికి సేవ చేశారు .కంతేరులో జరిగిన వార్షికోత్సవానికి గుంటూరు సంఘాన్ని ఆహ్వానించగా ,నరసయ్యగారు వెళ్లి భక్తీ ఉపన్యాసంతో వారి మనసులను జ్ఞానం నుంచి భక్తికి  మరల్చారు .మూడురోజులు నవవిధ భక్తిగురించి ప్రసంగించారు .ఆ ఉపన్యాసాల సారాంశం ‘’నవవిధ భక్తులు ‘’పుస్తకంగా ముద్రణ పొందింది .

  రాగం ఆంజనేయులుగారి తండ్రి పిచ్చయ్యగారు గొప్ప భక్తులు .రామకోటి రాసేవారు అప్పటికి ఆ సంఘ సభ్యులలో నరసయ్యగారు ఒక్కరే రామ కోటి రాసిన వారు .అందుకని ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది .పిచ్చయ్యగారు రామకోటి పేరుతొ ఉత్సవాలు నిర్వహి౦చాలనుకొన్నారు. పిచ్చయ్యగారు తమ రామకోటికి భద్రాచలం తీసుకువెళ్ళి సీతారామ స్వామికి సమర్పించి అక్కడే పరమపదించారు .

  నరసదసుగారు నిర్ణయించిన ముహూర్తానికి రామకోటి పూజలు చేసి ,రామకోటి ఉత్సవాలను ప్రారంభించారుగుంటూరులో  .ఆతర్వాత ‘’భానువార సంకీర్తనం ‘’పేరుతొ ప్రతి ఆదివారం భజన,ఉపన్యాసాలు జరిపించారు.నరసదాసుగారు ‘’భక్త రామ దాసు ‘’కథా సంకీర్తనం చేశారు ఇదే కథా సంకీర్తనకు పునాది అయింది .కథా సంకీర్తనలో భక్తి ప్రవహించి  ఉర్రూత లూగిస్తుంది .

 ఒకసారి ఈసభవారు సేకూరు సభలకు వెళ్ళారు .అక్కడ క్రమ శిక్షణ లేకపోవటం చూసి ఏవగించుకొని భక్తీ సమాజ౦ అందరికీ  ఆదర్శంగా ఉండాలిఅని  నిశ్చయించారు .పెండ్యాల రామ సుబ్బయ్య గారితో చర్చించి నియమాలు ఏర్పాటు చేశారు .అప్పటికే నరసదాసుగారు వాసు దాసుగారి వద్ద దిన చర్య రాసి మూడు సోపానాలలో అగ్రస్థానం పొందారు .ఒక రోజు గురువుగారు దిన చార్య రాయాల్సిన అవసరం లేదని చెప్పారు .నరసయ్య గారు సభ్యులను సమావేశ పరచి దిన చర్యరాయటం లో ఉన్న నియమాలు అందరూ పాటించాలని ‘’నియమమే ఊర్ధ్వ అయనం.దాన్ని పాటించే వాడే సాటిలేనిమేటి .దానిలోనే మనుష్యత్వం ఇమిడి ఉంది .మనం చేసేపనులన్నీ దిన చర్యరాసేటప్పుడుగుర్తుకు వస్తాయి .మన తప్పు ఇతరులకు చెప్పాలి .నిర్బంధం లోనే బంధ విముక్తి ఉంది ‘’అనిసాకల్యంగా వివరించారు .అందరూ నియమాలను పాటిస్తామని వాగ్దానం చేసి అమలు పరచారు .నెలకోసారి సమావేశం జరిగి సమీక్ష చేసుకొనేవారు .సాధన శాఖకు నరసయ్యగారిని అధ్యక్షులను చేశారు .మొదటి సమావేశం సంగం జాగర్ల మూడి దేవాలయం లో 25 మంది సభ్యులతోజరిగింది .క్రమ౦గా సంఖ్య 200 దాటింది .తర్వాత గుంటూరి క్షేత్రం లోనే సమావేశాలు నిర్వహించారు .1938 నుండి శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి గారి ప్రోత్సాహంతో  ‘’అవిరామంగా హరేరామ నామ సంకీర్తన’’ జరుగుతోంది .నరసయ్య, ఆంజనేయులు గారి నేతృత్వం తో సమాజం ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతోంది .నామారాధన ,,అధః పతనాను రోదధిని ,విషయ వాంఛా నిరోధిని ,సన్మార్గ సులభోపాయ బోధినీ ,సంశయ విచ్చేదినీ ,వైరాగ్యబోధినీ అయిన ‘’మోక్ష సాధన ‘’అనే మాసపత్రికనరసదాసు గారి సంపాదకత్వం లో వెలువడి ఆస్తికాభ్యుదయానికి విశేషంగా తోడ్పడింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -4

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -4õ

      ఉపాధ్యాయ వృత్తి

ఇంటివద్ద ప్రైవేట్ చెపుతున్నా సరైన ట్రెయినింగ్ లేకపోవటం వలన విద్యార్ధులు పల్చబడగా ,ఒంగోలులో ట్రెయినింగ్ స్కూల్ లో విద్యార్ధిగా చేరారు నరసదాసు గారు .దాసుగారున్నది బ్రాహ్మణ హాస్టల్ .మడీ ఆచారం పాటించటానికి తప్పక పాటించేవారు  .మిగిలిన వారు అవన్నీ పాటిస్తూ   నీతి బాహ్యంగా వ్యవహరించేవారు .ఇది దాసు గారికి నచ్చక ,తన ప్రవర్తన చేత వారిని అంతర్బహిశుద్ధులుగా తీర్చి దిద్దారు .అన్నిటా ఫస్ట్ గా ఉండటం వలన విద్యార్ధి లీడర్ గా ఉపాధ్యాయ విద్యార్ధుల అధికారుల మన్నన పొందారు .రాత్రి 9నుండి 12వరకు భజనలో పాల్గొన్నారు .శ్రీరామనవమి శ్రీ కృష్ణాష్టమి శ్రీ శంకర జయ౦తు లను ఘనంగా నిర్వహించారు .ఉపన్యాసాలు హరికధలు చెప్పించారు .ఇలా బ్రాహ్మణ హాస్టలు ను సదాచార కోష్టంగా మార్చారు .

  విద్యాధికారి ,క్రైస్తవుడు అయిన వర్గీస్ ఒక సారి తనిఖీకి వచ్చాడు .స్క్ల్లు హాస్టలు తనిఖీచేశాడు చాలామంది విద్యార్ధులు గైర్ హాజరయ్యారు .హెడ్ మాస్టర్ లీడర్ దాసుగారిని పిలిపించి కారణం అడిగారు.తాము భోజనం చేయలేదనీ ,భోజనహాస్టలు అపవిత్రం అయిందని ,పుణ్యాహవాచనం   చేయించాలని, అప్పటిదాకా తాము భోజనం చేయమని చెప్పారు .చేసేదిలేకరెండురోజులు సెలవిచ్చాడు హెడ్ మాస్టర్ .అందరి తరఫున పుణ్యాహవాచనం కార్యక్రమం దాసు గారే నిర్వహించి ,మళ్ళీ విద్యాలయాన్ని సక్రమంగా నడి చెట్లు చేశారు .దాసుగారి నిష్టాగారిష్టాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి .ట్రెయినింగ్ లో ఉండగా దాసు గారు ఎందరో మహాత్ముల ఆశీస్సులు పొందారు .మహాభక్తులు బొమ్మరాజు సీతారామయ్యగారిని దర్శించి నమస్కరించగా పరమ వాత్సల్యంతో ఆయన దాసుగారిని ఆప్యాయంగా కౌగలించుకొని ,శరీరమంతా నిమురుతూ ‘’నువ్వు శుద్ధ సాత్విక మూర్తివి .ఆధునికులకు సంసార బాధలు నివారించే మాధవుడిని చేరే సాధనం బోధించే మేదావి అవుతావు ‘’అని దీవించారు .బొమ్మరాజు జానకి రామయ్య ,మల్లవరపు సుబ్బారావు ,నీలంరాజు ఆది మూర్తి ,విక్రాల రామ చంద్రా చార్యులు వంటి పెద్దలు హాస్టలుకు వచ్చి ఆశీర్వదించేవారు .వారి సేవాభాగ్యం దాసుగారికి దక్కింది .

  మెట్టప్రాంతమైన ఒంగోలులో వేసవిలో వదగాడ్పులేక్కువ .వీరి స్కూలుకు ఒక మైలు దూరం లో  ఒక పంచమ జాతివాడు వడదెబ్బ తగిలి రోడ్డుమీదనే పడిపోయాడని తెలిసి ,ఒక స్నేహితుడితో అక్కడికి వెళ్ళగా అతడు స్పృహతప్పి ఉండటం గ్రహించి .అతడికి గోచీ తప్ప ఏమీలేదు. అదికూడా మలం తో నిండి ఉంది .దాసుగారు దాన్ని తీసేసి శుభ్రంగా కడిగి ,తన  అంగోస్త్రాన్ని కప్పి ,అతడిని స్నేహితులిద్దరూ భుజాలపై మోసుకొని సత్రానికి తీసుకు వెళ్ళారు .అక్కడే ఉంచి ,మంచి భోజనం పెట్టించి రెండు రోజులతర్వాత అతన్ని వాళ్ళ ఇంటికి పంపించిన దయామూర్తి నరసదాసుగారు .ఎంతటి నిష్టాగరిష్టులో అంతరి ఉదారహృదయులు దాసుగారు .ఇలా గాంధీ గారి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మానవతా మూర్తి దాసుగారు .

   ట్రెయినింగ్ పూర్తి అవజోచ్చింది .టీచర్స్ అసోసియేషన్ జరిపారు .దానికి విద్యాశాఖాధికారి వర్గీస్ అధ్యషత వహించాడు .ఆయన ప్రతి ట్రెయినీని క్షుణ్ణంగా పరిశీలించి నరసదాసుగారిని ఉత్తమ ఉపాధ్యాయునిగా నిర్ణయించాడు .దాసుగారు ఇంగ్లీష్ లో  లో వర్గీస్ గారికి స్వాగత సన్మాన పత్రం రాసి చదివి అందరికీ ఆశ్చర్యం కలిగించారు .అప్పటి ఒంగోలు కలెక్టర్  ఆల్ రౌండర్ అయిన ఏం సి పాయ్ ‘’సర్వతో సమర్ధత పతకం ‘’దాసుగారికి ప్రదానం చేశారు .ఆ ఏడాది 1931లో  మద్రాస్ ప్రెసిడెన్సిలో నరసయ్యగారు ప్రధమ శ్రేణిలో ప్రధమ స్థానం లో ఉత్తీర్ణులయ్యారు .అప్పటివరకు ఏ ఆంధ్రుడూ సాధించని ఘనవిజయం నరసయ్యగారు సాధింఛి ,జమ్ములపాలెం లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపబడి  పని చేశారు .

        యోగా భ్యాస మహిమలు

యోగ సాధనంతో శారీరక మానసిక ఆరోగ్యం సాధించాలని నరసయ్యగారు భావించి హఠయోగ ప్రక్రియ చదివి ,స్వయంగా యోగాభ్యాసం చేశారు .పాడి ఆవును కొని ఆవుపాలు ,  ,ఉప్పు కారం లేని చప్పిడి కూరలతో ,ఆవుపెరుగన్నం మాత్రమె భుజిస్తూ జిహ్వ చాపల్యానికి కళ్ళెం వేశారు .రెండేళ్ళు ఇలా గడపటం తో ఓజస్సు తేజస్సు ఏర్పడి పరమ ఆకర్షణీయులుగా కనిపించారు.జపధ్యానాలతో మరింత శక్తి సాధించారు .పద్మాసనం లో ఉదయం సాయంత్రం 21వేల 600 జపం చేస్తూ ,రాత్రి 11గంటలకు భజన చేస్తూ ,తెల్లవారుజామున 4గంటలకే లేస్తూ యోగ జీవితాన్ని అత్యంత నిష్టా గరిష్టంగా గడిపారు .

  ఒకరోజు రాత్రి స్వప్నం లో సీతామాతః సర్వాలంకార భూషిత గా మెరుపు తీగలాగా దర్శనమివ్వగా తదేక దృష్టితో ఆమెను చూస్తూ ఉండగా ఆమె పసిపాపలాగా మారి ఆయన ఒడిలో కూర్చున్నది .ముద్దులొలికే ఆ చిన్నారిపాపను ఎత్తుకొని ముద్దాడ బోగా కల మాయమయింది  మెలకువ వచ్చి భార్యకు అంతా చెప్పారు .ఆ పిల్లముచ్చట్లు ఆదంపతులు ముచ్చటగా చెప్పుకొన్నారు .ఇంతలో భార్య శేషమ్మగారికి ప్రసవ వేదన కలిగింది .అప్పటిదాకా ఆమెకు ప్రసవ చిహ్నాలేవీ లేనేలేవు .ఆశ్చర్యంగా ఆడపిల్ల పుట్టింది .సీతా దేవి అనుగ్రహం తో పుట్టిన ఆపాప కు సీతా కల్యాణి అని పేరు పెట్టుకొన్నారు .

  నవవిధ భక్తి రసాలను నరసయ్యగారు ఆస్వాదించారు .సఖ్యభక్తిలోశ్రీరాముడు ఆయనతో ఆటలాడే వాడు .ఒకరోజు రాత్రి రాముడు స్నేహితుడుగా వచ్చి ఆయన ప్రక్క పడుకొన్నారు .భార్య అనుకోని కాలు వేస్తె ,రాముడు లేచి ‘’నీమీదున్న స్నేహంతో వచ్చి నీ పక్కన పడుకొంటే ,నామీదనే కాలు వేస్తావా ‘’ఇది నీకు న్యాయమా ‘’అని అలుకతో పలుకగా నరసయ్యగారు తెల్లపోగా, రాముడు  ‘’మిత్రమా ! నీపాదం నాకు మోదం చేకూర్చింది .నన్నే నమ్మి భజి౦ చేవారంటే నాకు పరమ ప్రీతి .సుజనుల చరణ ధూళి నాకు పరమ పవిత్రం .దాన్ని ధరించటానికే నీ దగ్గరకు వచ్చాను ‘’అని  రామ చంద్రమూర్తి అదృశ్యమయ్యాడు .అమితాశ్చర్యపడ్డారు నరసయగారు .

   రామ భజనకు హనుమ ఉపాసన ముఖ్యం .ఆయన రామునికి నామానికి వారధి .అందుకే నరసయ్యగారు హనుమను అత్యంత భక్తితో అర్చించేవారు .ఒకరోజు రాత్రి 11గంటలకు చేసే భజన పూర్తికాగానే భార్య శేషమ్మగారు ‘’మనం బాగా బీద వాళ్ళం. ఇల్లు గడవటం కష్టంగా ఉంది .సంపాదన యావ లేకుండా మీరు రామభజన చేస్తుంటే సంసారం గతేమిటి వయసులో కాక ముసలితనం లో డబ్బు సంపాదించలేరు కదా ‘’అని భజన గురించి కొంచెం అవహేళనగా మాట్లాడితే ఆయన ‘’అన్నిటికీ రాముడే దిక్కు అని నమ్మి ఉన్నాము మనం .ఆయనే  చూసుకొంటాడు . ఆందోళన పడకు ‘’అని ఊరడించారు .ఆమెకు తలకెక్కలేదు ‘’రొక్కం లేక పొతే డొక్క నిండుతుండా శుష్కవేదాంతం తో కడుపు ని౦ డుతుండా అని వాకిలి తలుపు గడియ పెట్టటానికి గుమ్మం దగ్గరకు వెడితే ,ఒక కోటి అమాంతం వచ్చి బలంగా ఆమె వెంట్రుకలు పీకింది .భయంతో అరిచి కిందపడిపోయింది .నరసయ్యగారు దీపం తో వచ్చి లేపి ,ఆమె తలమధ్యభాగంలో  వెంట్రుకలుకత్తి రించి ఉండటం చూసి ‘’భాగవతాపచారం చేశావు .క్షమాపణ వేడుకో ‘’అనగా ఆమె ‘’నా తలపోటు తగ్గితే నా బంగారు గొలుసు ఇస్తాను .అప్పాలు పానకం చేసి నైవేద్యం పెడతాను అని మొక్కుకోన్నది .వెంటనే ఆమె బాధ అంతా తగ్గింది .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి ఉన్న చిన్న పెట్టెలో 72రూయాలు కనిపించాయి .ఇదంతా ఆంజనేయ మహిమ అని గ్రహించారు ఇద్దరూ .ఆడబ్బును భగవంతుని పటాలు కొనటానికి ఖర్చు చేశారు .ఆరోజు నుంచి వారి బియ్యపు డబ్బాలో ఎప్పుడూ ఒక శేరు బియ్యం నిలవ ఉండేవి .రోజూ చేసే భోజనానికి భగవంతుడు లోటు రానీయడు అని గ్రహించారు దంపతులు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-21-ఉయ్యూరు   ‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న  విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు

 శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న  విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు

కృష్ణా జిల్లా పరిషత్ షత్ ఉపాధ్యాయునిగా  జీవితం ప్రారంభించి ,ప్రదానోపాధ్యాయులై ,సమర్ధత తో అందరినీ ఆకర్షించి ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షులై దక్షతతో నడిపి ,ఆంద్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ కార్యదర్శి ఆపైన అధ్యక్షులుగా పని చేసి అన్ని జిల్లాలోనూ తమ ముద్ర వేసి ,విద్యారంగ పురోభి వృద్ధికి అను నిత్యం పాటు పడి ,నాకూ శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి శ్రీ కోసూరు ఆదినారాయణ రావు  శ్రీ వైవి రాజు  ,శ్రీశర్మ ,శ్రీమతి ప్రమీలారాణి, శ్రీమతి భారతి, శ్రీమతి కస్తూరి మొదలైన మా సహచరులకు మార్గదర్శిగా ,గాడ్ ఫాదర్ గా వ్యవహరించిన కథా రచయిత, బాల వాజ్మయ కర్త, రేడియో ప్రయోక్త ,ప్రదానోపాధ్యయులకు కరదీపిక రాసి ,రూల్స్ విషయాలుకరతలామలకం అయెట్లు చేసి ,కర్తవ్య  నిర్వహణ సామర్ధ్యం పెంచుకోవటానికి తోడ్పడి ,జిల్లా ,రాష్ట్ర .కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ్ ఉత్తమ ప్రధానోపాధ్యాయ వంటి అనేక సత్కారాలందుకొని ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి నూత్న మార్గదర్శకత్వం కలిగించి ,సంస్థను జవ జీవాలతో  తొణికిసలాడేట్లు చేసి ,జిల్లాస్థాయి ,రాష్ట్ర స్థాయి అధికారులకు తలలో నాలుకగా ,ఉపాధ్యాయ ప్రధానొపాధ్యాయులకు అత్యంత సన్నిహితంగా , రిటైరీలకు  చేయూతగా ఉంటూ ,వారి సమస్యలపై కథలు నాటికలు రాసి  ఎంతో సాహిత్యాన్ని సృష్టించిననా  ,ఒక్క పుస్తకం కూడా అచ్చువేసుకొని  ,మా సారధి సచివులు మార్గదర్శి ,ఆత్మీయులు ,జిల్లాలో రాష్ట్రం లో విద్యారంగ వ్యాప్తికి అభి వృద్ధికి అలుపెరుగని సేవలందించి సెమినార్లలో ,,సదస్సులలో ,సిలబస్ నిర్మాణం లో,ప్రశ్న పత్రాల మార్పులో ,భారమైన సిలబస్  ను కుదించటం లో  విలువలతో కూడిన విద్యను బోధించటం లో తనదైన శైలిని ప్రదర్శించి,ప్రతిఫలం ఆశించక అంకిత భావంతో సేవలందించిన  ,అందరికీ ‘’సోమంచి రామం ‘’గా అతి సన్నిహితులైన శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తి గారు ఈ రోజు 11-6-21 శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో కుమారుని స్వగృహం లో 95వ ఏట మరణించినట్లు మిత్రుడు శ్రీ కోసూరు ఆదినారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు .శ్రీ రామం గారికి ఉత్తమ గతులు కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

   సుమారు రెండేళ్ళ క్రితం వారిని బందరులో ఫోర్ట్ రోడ్ లో ఉన్న వారి స్వగృహం లో కలిసి మాట్లాడాను .వారి శ్రీమతి గారు మాకందరికీ గురుపత్ని లాంటి వారు సౌమ్యులు ,ఆదర్శ ధర్మపత్ని .ఆదంపతులతో ఫోటోలుతీసుకోన్నాను. ఆ ఫోటోలు పోస్ట్ లో వారికి పంపాను కూడా  .

    రామంగారి సంతానం పూనుకొని తమతండ్రి చేయలేక పోయిన పనిని అంటే  రామంగారి అమూల్యమైన సాహిత్యాన్ని ముద్రించి లోకానికి అందించమని  మనసారా కోరుతున్నాను

 గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-21

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి స్పందన ,పరామర్శ

మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి స్పందన ,పరామర్శ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -3

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -3

  ఆధ్యాత్మిక సాధన వైరాగ్య ప్రాప్తి

నరసయ్యగారి మనసు బుద్ధి ఆధ్యాత్మిక లగ్నంయ్యాయి .ఆయనకు సరైన సమయం లో ఉపనయన సంస్కారం చేశారు తలిదండ్రులు .నిత్య సంధ్యావందన గాయత్రీ జపానికి అవకాశ ఎక్కువ కల్పించారు .ఒక రోజు రాత్రి ఆయనకు ముక్తావిద్రుమ హేమ నీల ధవళ దేహం తో శ్రీసరస్వతీమాత   సాక్షాత్కారం జరిగి ‘’నీ నిష్టాగరిష్టాలు నాకు నచ్చాయి .నీజపదీక్ష నన్ను ఆకర్షించింది .’’మంత్రాధీనం తు దైవం ‘’అని మర్చిపోకు ‘’అని చెప్పి అంతర్ధానమయింది .మేలుకొని తన జన్మం ,మంత్రజపం సఫలమైందని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆమెతో మాట్లాడే అవకాశం కలిగించనందుకు బాధపడ్డారు .భక్తీ పెరిగింది కానీ ఆదాయం లేదు. భుక్తి గడవటం కష్టమైంది .స్థిర చరాస్తులు హారతి కర్పూరమయ్యాయి .ఇల్లులేదు తినటానికి తిండికూడా లేదు .ఊరిలో మర్యాదా మన్ననా తగ్గి పోయాయి .చిత్తం శ్రీకాంతు స్వా౦తమైంది .భవబంధాలు తెంచుకొని వైరాగ్యం ద్వారా ఆనంద సామ్రాజ్యం అందుకోవాలని కోరిక గట్టి పడింది .

           వివాహం, ఉదర పోషణ

తండ్రిగారు తన కొడుకును ఆదర్శ కుటుంబిగా తీర్చి దిద్దాలనుకొని ,నరసయ్య గారి మేనమామ కూతురుశేషా౦బతో తన కొడుకుకు వివాహం జరిపించారు .ఆమె సద్గుణ గరిష్ట ..ఆదాంపత్యాన్ని లోకం బాగా మెచ్చింది .ముసలి తలిదండ్రులు పైగా కొత్త సంసారం .భారమంతా ఈ దంపతులపై పడగా ,నరసయ్యగారు మద్రాస్ దగ్గర కమీషన్ వ్యాపారం చేసే షావుకారు దగ్గర గుమస్తాగా చేరారు .ఒకరోజు మరో కమీషన్ వ్యాపారి దాసుగారి దగ్గరకు వచ్చి అయిదువందల రూపాయలు ఇమ్మన్నాడు .డబ్బు ఉందికాని ఇచ్చె  అధికారం తనకు లేదనీ యజమానినే అడిగి తీసుకోమని చెప్పారు .ఆయన యజమాని దగ్గరకు వెళ్లిజరిగింది చెప్పారు .అలా చెప్పటం తప్పు అన్నాడు యజమాని .లౌక్యం తెలీని దాసుగారు బాధ పడి,అక్కడ పని చేయలేక గుంటూరు తిరిగి వచ్చేశారు .

  గుంటూరులో ప్లీడరు గుమాస్తాగా చేరి ,ఇక్కడా అంతా అబద్ధం మీదే నడుస్తోందని గ్రహించారు ఇంతలో తెనాలిలో చతుర్భుజ దాసు అనే ఆయన జ్యోతిషాలయం స్థాపించి  ముఖం చూసి జ్యోతిషం చెప్పి డబ్బు బాగా గడించాడు . ఆయనదగ్గర గుమాస్తాగా చేరారు .కావలి నెల్లూరులలో కూడా బ్రాంచులు పెట్టాడు .డబ్బు వ్యవహారం దాసుగారికే అప్పగించాడు .క్రమంగా అతడి శీలం మంచిదికాదనీ ‘’పంచమకారాలపై ‘’ఆయనకు వ్యామోహం ఎక్కువని గ్రహించి ,శీలవంతుడు కాని వాడి వద్ద ఉద్యోగం చేయరాదని మానేశారు నరసయ్యగారు .

  జమ్ములపాలెం లో పిల్లలకు ట్యూషన్ చెప్పారు .ట్రెయినింగ్ లేదుకనుక ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదు .వచ్చిన డబ్బు తోనే కుటుంబ పోషణ చేసేవారు .ఈ పాలెం లో మంచి భక్తులను చేరదీసి భజన సంఘం స్థాపించి ,నామ సంకీర్తన బోధించి ఆస్తికత వ్యాప్తికి బాగా తోడ్పడ్డారు ప్రతిరాత్రీ 10గంటలనుంచి 12 వరకు సామూహిక భజన చేయించేవారు .అందరి సహకారం తో గ్రంధాలయం స్థాపించి ,అక్కడా నిత్య సంకీర్తన జరిగేట్లు చేశారు .పెదకొత్తపల్లి వాసి చదలవాడ వెంకట సుబ్బయ్య గారి దగ్గర తరంగాలు నేర్చారు .

      ఆచార్యానుగ్రహం

1926లో భగవదతారమూర్తి అయిన ఆంద్ర వాల్మీకి వాసు దాసు గారు అనేక ప్రాంతాలలో పర్యటించి భక్తిజ్ఞాన వైరాగ్యాలు బోధిస్తూ జమ్ములపాలెం వచ్చారు .రామాలయం లో రామతత్వాన్ని బోధిస్తూ రామతత్వానికి మించింది ,రామనామానికి,రామ మంత్రానికీ  మించిందీ ,రాముడికి మించిన పరదైవం లేదని నాలుగు గంటలు ప్రసంగం చేశారు .ఆ ఉపన్యాసానికి దాసుగారిలో ఆర్తి ఆవేశం ఆనందం ఆకర్షణ కలిగి ఆయన మార్గం లో జీవితం గడపాలనుకొన్నారు .రామకోటి రాముని చేరే సూటి మార్గం అని వారు చెప్పింది మనసులో నాటింది .తాము చెప్పిన నియమాలను పాటిస్తాం అనే వారు చేతులుఎత్తమని కోరితే నరసయ్యగారు ఆయన స్నేహితుడు బాపట్ల హనుమంతరాయ కవి మాత్రమె ఎత్తారు .వాల్మీకి వారి దృష్టి నరసయ్య గారిపై పడింది .ఆయనవచ్చి పాద నమస్కారం చేయగా ,లేపి కౌగిలించుకొని ‘’కుమారా !నీ చిరునవ్వు ముఖం చూసి నాకు ఆనందం కలిగింది .నీ మనసు తెలుసుకోవాలనే కోరిక కలిగింది .నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది .నీకీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాపిస్తాయి .లోకాన్ని ఉద్ధరించటానికే నువ్వు పుట్టావ్ .రామ తారక మంత్రం ఉపదేశానికి సర్వ విధాలా అర్హుడవు ‘’అని చెప్పి తారకమంత్రం ఉపదేశించి నిశ్చలభక్తితో జపించమని ఆజ్ఞాపించారు .తన జన్మ ధన్యమైనదని దాసుగారు భావించి వినయంతో వాసుదాసుగారితో ‘’స్వామీ !మీరు చెప్పినట్లు త్రికరణ శుద్ధిగా రామమంత్రాన్ని జపిస్తాను ‘’అనగా ఆశీర్వదించి వాసుదాసుగారు వెళ్ళిపోయారు .

  మంత్రం సిద్ధి పొందాలనే కాంక్ష తీవ్రమై నరసదాసుగారు రోజుకు 21,600నామ జపం చేశారు .రోజుకు పదివేల రామకోటి రాశారు .రాత్రీ పగలూ రామధ్యానంతోనే గడిపారు .ఒకరోజు చిన్ని కృష్ణుడు కలలో కన్పించి కన్నీరు కారుస్తూ ‘’ఎన్నో రోజులనుంచి నీ సున్నిత హృదయం లో నన్ను ప్రతిష్ట చేసుకొని ,ఇప్పుడు మరొకరిపై మనసుపడ్డావు. ఇది అన్యాయం ‘’అనగా నరసదాసుగారు ‘’స్వామీ !మీరేగా ఆచార్యరూపం లో వచ్చి నాకు దీక్షనిచ్చి రామతారక మంత్రోపదేశం చేసింది .ఇప్పుడు తప్పు నాది అయినట్లు నెపం వేస్తున్నారు ఇదేమైనా బాగుందా ?’’అని అడిగారు .బాలకృష్ణమూర్తి చిరునవ్వు చిందిస్తూ ‘’నీ సాధన గొప్పది నీజపం సఫలమైంది .నువ్వు సిద్ధిపొందుతావు ‘’అని అభయమిచ్చి  ఆ వేణుగానలోలుడు కోదండ రామ మూర్తిగా బహువిదాలంకారాలతో పట్టు పీతాంబరాలతో దర్శనమిచ్చి దాసుగారికి పరమాన౦ద౦ , పరవశం కలిగించారు .ఇలా నిరంతర రామ ధ్యానం తో ఒకకోటి పది లక్షల రామకోటి రాసి తాను  నేర్చిన చిత్రలేఖనం తో రామాయణమంతా రామనామాలతో చిత్రించారు నరసదాసుగారు .ఇదొకకోటి అయింది .ఈ మొత్తాన్నిన శ్రీరామ చంద్రునికి అంకితమిచ్చారు .ఆంద్ర వాల్మీకి ఆశీస్సులతో దాసుగారు సంస్కృతం లో ‘’గురు పూజా విధానం ‘’రాశారు .ఇలా నిత్యనిరంతర రామనామ కాలక్షేపం తో నరసదాసుగారుకొంతకాలం జమ్ము  పాలెం లోనే ఉన్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు -2

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి  వేంకట నరసదాసు గారు  -2

  నరస దాసుగారు మూడవ తరగతి పూర్తి చేసి ,ప్రైవేట్ గా ఇంగ్లీష్ చదివి ,పొన్నూరు హైస్కూల్ లో 7వ తరగతిలో చేరి ,రోజూ ఇంటినుంచి పొన్నూరు వెళ్ళిరావటం కొడుకు కు కష్టం అవుతుందని తండ్రి గారు కాపురం పొన్నూరులోనే పెట్టారు .ఆడుతూ పాడుతో తోటిపిల్లలతో బడికి వెళ్ళేవారు .తెలుగులో తప్ప అన్ని విషయాలలో  మెరిక లాగా ఉండేవారు.అందుకని మిగిలిన విద్యార్ధులు ఆయనతో స్నేహం బాగా చేసేవారు .వారిలో బీడీ సిగరెట్ త్రాగే వారు కూడా ఉండేవారు .ఆ చెడు సావాసం వలన ఒక రోజు సాయంత్రం బీడీ తాగుతూ గుప్పు గుప్పున పొగ బయటికి వదుల్తుంటే  దీక్షితులు పంతులు గారు చూశారు .ఈయనకు ఆ సంగతి తెలియదు  . మర్నాడు ఆయన నరసయ్యను తనగదిలోకి పిల్చి బీడీలు తాగుతున్నావా అని అడిగితె లేదని బొ౦క గా ,నిన్న సాయంత్రం నువ్వు తాగుతుంటే చూశాను పైగా అబద్ధమూ ఆడావు అని రెండు పేముబెట్టాలతో ఒళ్ళంతా వాతలు తేలేట్లు,రక్తం కారేట్లు బెత్తాలు విరిగేట్లు  కొట్టారు. .ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పలేదు .నిద్రరాలేదు. ఆ రాత్రి దీక్షితులగారికీ నిద్రపట్టక మంచి కుర్రాడిని విచక్షణా రహితంగా కొట్టానే అని బాధ ,మధన పడ్డారు .మర్నాడు స్కూలుకు వెళ్ళగానే నరసయ్యను పిలివగానే వెళ్లి తాను  తప్పు చేశానని ఇక పొగ తాగనని ,అబద్ధం ఆడనని  ఒట్టు పెట్టారు .’’మంచిది బాగా వృద్ధి లోకి వస్తావు ‘’అని దీవించారు .పంతులుగారు దీక్షితులుగారు .

  అప్పుడప్పుడు కాఫీ హోటలుకు వెళ్ళే అలవాటు కూడా ఉండేది .ఆయన బంధువే ఒక హోటల్ ను మడీ ,ఆచారాలతో నడిపేవాడు .బ్రాహ్మణులే అన్నీ తయారు చేసేవారు ,సర్వర్లు కూడా బ్రాహ్మణులే   .బ్రాహ్మణులే మడితో వచ్చి తినేవారు .నరసయ్యగారూ అప్పుడప్పుడు వెళ్లి తినేవారు .ఒకరోజు మధ్యాహ్నం నరసయ్యగారు  ఆ హోటల్ వంటగదిలోకి వెళ్లి చూడగా ,ఒక బ్రాహ్మణేతర స్త్రీ ఇడ్లీ పిండిరుబ్బట౦ కనబడి అవాక్కయ్యారు .ఆమె ఎవరని అక్కడి కుర్రాడిని అడిగితే ‘’మా మేనేజరు గారి ఇలాకా .ఆమె రుబ్బిస్తే మేము మడితో ఇడ్లీ వేస్తాం ‘’అని నిజం చెప్పాడు .పైన ఆచారం లోన దురాచారం ఉన్న ఆ హోటల్ ను చూసి అసహ్యమేసి ,ఆ రోజునుంచి కాఫీ హోటల్ కు వెళ్ళటం కానీ అక్కడి పదార్ధాలు తినటం కానీ చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు .పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదుకదా .

  పొన్నూరులో లక్ష్మీ నరసయ్య గారు చావలి సుబ్బారాయుడు గారింట్లో అద్దెకు ఉండేవారు .రాయుడుగారింట్లో రాత్రి నిత్యభజన జరిగేది .భజనతర్వాత ప్రసాదం పంచేవారు .నరసయ్యగారుప్రసాడం సమయానికి వెళ్ళేవారు .ప్రసాదం మీద భక్తీ కాని అసలు భక్తి ఉండేదికాదు .క్రమంగా భజన పై ఆసక్తికలిగి  సంకీర్తనలలో తాళం వేస్తూ పాల్గొనేవారు .ఆతర్వాత భక్తీ పెరిగింది .ఆ భజనల్లో పాతూరి రామయ్య శాస్త్రిగారు ప్రవచనం చేసేవారు సత్కాలక్షేపం మోక్షానికి దారి అని రోజూ చెప్పేవారు అది నరసయ్యగారి మనసుపై గాఢ ముద్ర వేసింది .అప్పుడు కొల్లూరులో శ్రీ కృష్ణ జయంతి ప్రతిఏడాది జరిపేవారు .ఒకసారి తండ్రితో తానూ వెళ్ళారు .అక్కడ ములుకుట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు శ్రీ కృష్ణ చరిత్ర అద్భుతంగా వివరించేవారు .బాలకృష్ణుని చిలిపి చేష్టలు నరసయ్యగారి మనసంతా ఆక్రమించాయి .ఆ తన్మయ స్థితో నరసయ్యగారు ‘’లాలకు రారా గోపాల కృష్ణా –నీ వేలా చిక్కవునాకు ‘’అనే కీర్తన శ్రీరాగం ఆదితాళం లో రాశారు .బాలకృష్ణునిపై తల్లి యశోదకున్న వాత్సల్యమంతా కళ్ళకు కట్టించారు .ఆ కీర్తనను ఇప్పటికీ అక్కడ గానం చేస్తూనే ఉన్నారు .ఆయన బంధువు గుంటూరు వెంకటప్పయ్య గారు ‘’ఆంధ్రుడై పుట్టి ఆంధ్రాన్ని అర్ధం చేసుకోకపోతే అంధుడౌతాడు ‘’అని నిత్యం చెప్పేమాటలు మనసుకు పట్టి ,పొన్నూరు లైబ్రరీ లో వెంకట పార్వతీశ కవుల నవలలు చదివి ,ఒక్క ఏడాదిలో తెలుగులో నిష్ణాతులై ,అనేక వృత్తాలలో పద్యాలు రాశారు .అందులో  వారు రాసిన ‘’గోపాల కృష్ణ శతకం ‘’ప్రసిద్ధి చెందింది .అందులోని రెండుపద్యాలు-

1-తే.గీ.‘’శ్రీ రమామణి చిత్త చోర –భక్తజన మానసోద్యాన పారిజాత –రాధికాకుచ సరసిజ రాజహంస –వందనమిదే వేణు గోపాలకృష్ణ ‘’’’

2-ముక్తపద గ్రస్తం-‘’సరసతర వేష రత్న భూషా విశేష –శేష భూషణ హృత్సరసిజ నివాస –వాసవాది సురవినుత పాద పద్మ –పద్మ దళ నేత్ర వేణు గోపాల కృష్ణ ‘’

  ఈ శతకమే కాక ‘’నరసదాస కీర్తనలు ‘’అనే మూడు భాగాలు కూడా రాశారు .భక్తీ మధురభావ విలసితాలు దాసుగారి రచనలు .

     సహాయ నిరాకరణ ఉద్యమం లోపాల్గొనటం

23-8-1920లో మహాత్మా గాంధీ విజయవాడకు షౌకతాలీహో కలిసి వచ్చాడు .గాంధీని చూడాలని నరసయ్యగారు బెజవాడ వచ్చారు .గాంధీ ఉపన్యాసం ఆయన చెవులలో తేనే ఊటలు అనిపించాయి .గాంధీ పిలుపు అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొనగా నరసయ్యగారిని బడినుంచి వెళ్ళగొట్టారు .తర్వాత బందరులో ఆంధ్రజాతీయ కళాశాలలో చేరి ,అక్కడ చిల్లరిగి శ్రీనివాసరావు ,కోపల్లె హనుమంతరావు గార్లవద్ద సంస్కృతం ,హిందీ కొద్దిగా నేర్చారు .దీనివలననే వారికి నామ ప్రచార దక్షత బాగా అలవడింది .అక్కడే పురాణ శాస్త్రాల ఉపన్యాసాలు,తులసీ దాసు రామ చరిత మానసం  విని భక్తీ పులకా౦కి తులయ్యారు .శ్రీ వెంకట శాస్త్రి గారి వద్ద కొద్దికాలం లో చిత్రలేఖనం కూడా నేర్చారు .రామనామంతో రామాయణం అంతాచిత్రాలుగా చిత్రించి కొత్త వరవడికి నాంది పలికారు .గుంటూరు రామనామ క్షేత్రం లో వీటిని ఇప్పుడూ చూడచ్చు .బందరులో ఉండగానే సంగీతం ,వడ్రంగం ,తివాచీ నేత ,రాట్నం వడకటం అబ్బాయి .గాంధీ పద్ధతులు మహా ఇష్టంగా అలవాటు చేసుకొన్నారు .

  దేశమంతా స్వాతంత్ర్య ఉద్యమం చాలా వేగంగా పాకిపోయింది. బందరులో పట్టాభి పద్యాలు గద్యాలతో దేశభక్తిని ప్రబోధించేవాడు .ఆప్రభావంతో నరసయ్యగారు ప్రతిపేట లో ఊరిలో స్వాతంత్రోద్యమ స్పూర్తి రగిలి౦చేవారు .వారి ఉపన్యాసాలు వీనుల విందుగా మనసులకు హత్తుకొనేవి .పద్యాలతో పాటలతో జన్నాన్ని ఉర్రూత లూగించేవారు దాసు గారు .ఆ సమయంలో బాపట్ల తాలూకా  పెదనందిపాడు లోపర్వత నేని వీరయ్య చౌదరి గారి నాయకత్వం లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది .ప్రజలు పన్నులు కట్టలేదు .రాత్రిళ్ళు నరసయ్యగారు పొన్నూరు నుంచి 10మైళ్ళ దూరం లో ఉన్న పెదనందిపాడుకు నడిచి వచ్చి ,ప్రజలకు ప్రభుత్వ దమననీతి వివరించి మళ్ళీ తెల్లవారు జామున బయల్దేరి పొన్నూరు చేరేవారు .వాలంటీర్ పని చేసేవారు .ఉద్యమాన్ని అణచటానికి తెల్ల వారు మరఫిరంగులతో పొన్నూరుకు రాగా ,కొందరు కాంగ్రెస్  వాలంటీర్లు భయపడి తమల్ని నాయకులు తప్పుదోవ తొక్కి౦చారని, తమకు ఉద్యమంతో సంబంధం లేదని చెప్పి తప్పుకొన్నారు నరసయ్యగారు ,ఆయన అనుచరుడు తూములూరి శివరామయ్య గార్లు చిన్నవారైనా ధైర్యంగా ,ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ,ఖద్దరు టోపీలు పెట్టుకొని ,చొక్కాలు విప్పేసి ,ఆతెల్లదొరలకు ఆశ్చర్యం కలిగించారు ,తెల్ల సైనికులతో నరసయ్యగారు ‘’పవిత్ర భారత మాతను మీ లాంటి కుటిల దుర్మార్గ పాలకులను౦డి కాపాడటానికి ధర్మాన్ని కాపాడటానికి మేము వచ్చాం .మీ ఫిరంగులతో మా చాతీలపై కాల్చండి .మా తలలు తీసి మమ్మల్ని చంపండి .మా నియమానికి మీకు భయం దేనికి ‘’?అని గట్టిగా చెప్పారు .తెల్లవారు తెల్లమొహాలు వేసి ఏమీ చేయలేక ‘’మీ నిబ్బరానికి ముచ్చటపడి మిమ్మల్ని వదిలేస్తున్నాం .మీరు వెళ్లి పోవచ్చు ‘’అన్నారు .అక్కడ చేరిన వారంతా ‘’స్వతంత్ర భారత మాతకూ జై ‘’  అనే నినాదాలు మిన్ను ముత్తెట్లు పలికి వెళ్ళిపోయారు .అదీ నరసయ్యగారి దేశ భక్తీ, తెగువ ,సాహసం, పట్టుదల ,దీక్ష ..

  ఆతర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యం లో గుంటూరులో శాసనోల్లంఘన జరిగింది .నరసయ్యగారు కూడా పాల్గొని సత్యాగ్రహం చేశారు .అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళారు నరసయ్యగారు జైలు జీవితం ఆనందాన్ని కలిగించలేదు .మనసు భౌతికం నుంచి పారమార్దికానికి చేరి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-21-ఉయ్యూరు  .

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీఅప్పరాయ వర్మ (94)మృతి

కృష్ణా జిల్లా గిల్డ్ మాజీ అధ్యక్షులు ,కృష్ణా జిల్లా విద్యాభి వృద్ధికి అనేక రంగాలలో సేవలన్దిన్చినవారు ,ప్రతి కార్యకర్తకు ఆత్మీయులు ,మాజీ సీనియర్ హిందీ పండితులు  నాకు పరమ ఆప్తులు శ్రీ తోటకూర అప్పారాయ వర్మ*(94)నిన్న6వ తేది  స్వగ్రామం గన్నవరం లో మరణించారు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సాను భూతి తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -ఉయ్యూ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేలూరి ,గంధం వారల కధలు జీవిత సాహిత్య విశేషాలు  సరసభారతి ప్రత్యక్ష ప్రసారం

వేలూరి ,గంధం వారల కధలు జీవిత సాహిత్య విశేషాలు  సరసభారతి ప్రత్యక్ష ప్రసారం లో

–సాహితీ బంధువులకు శుభకామనలు -నిన్నటితో 18భాగాల జ్ఞానదుడు నారదుడు సరసభారతి ఫేస్ బుక్ లో ప్రాత్యక్ష ప్రసారంగా పూర్తిచేశాము

 ఈ రోజు 7-6-21సోమవారం ఉదయం 10 గం లనుంచి 1-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కధలు,సాహిత్యం జీవిత విశేషాలు 2-శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి కధలు జీవిత సాహిత్య విశేషాలు ఒకటిపూర్తి అయ్యాక మరొకటి ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయని తెలియ జేస్తున్నాను -మీ దుర్గాప్రసాద్ -7-6-21-ఉయ్యూరు
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు  

నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి నరసదాసు గారు  

కలియుగం లో 5వేల సంవత్సరాలు దాటాక భగవన్నామ సంకీర్తనకు, రూప భక్తి ప్రచారానికి ఎక్కువ అవసర మేర్పడింది .ఉత్తర భారతదేశం లో శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ,శ్రీ హరేరాం బాబాజీ ,శ్రీ సియా రఘునాధ శరణ గార్లను భగవంతుడు తన అంశతో జన్మింప జేసి ,వారిద్వారా నామ సంకీర్తనా రూప భక్తీ ప్రచారం చేయించాడు .ఆంద్ర దేశం లో అలాంటి ప్రచారానికి శ్రీ కుందుర్తి నరస దాసు గారినీ ,శ్రీ రఘువర దాసు గారినీ సృష్టించి ప్రచారం చేయించాడు విశ్వాత్మ .శ్రీ రఘువర దాసు పూర్వాశ్రమం లోనూ ,సన్యాసాశ్రమం తీసుకొని శ్రీ అవదూతేంద్ర సరస్వతి పేరుతొ ప్రసిద్ధి చెందారు .

   శ్రీ కుందుర్తి నరసదాసుగారు భగవదంశ సంభూతులు ,కారణ జన్ములు .పుట్టిన దగ్గర్నుంచి భగవన్నామ సంకీర్తన చేస్తూ ,సంకీర్తనా మాధుర్యాన్ని రుచి చూసి ,క్రమంగా నామ సంకీర్తనావతార పురుషులుగా మారారు .వీరికి ఆంద్ర వాల్మీకి వాసుదాసు గారు అనే శ్రీ వావికొలను సుబ్బారావు గారు గురువులై రామమంత్ర ఉపదేశాన్ని పొంది   ,శ్రీరామ కోటి రాస్తూ ,రామనామ సంకీర్తనలో పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు .వాసుదాసుగారు వీరిని చూసి ‘’లోక కల్యాణం కోసమే నీ మూర్తి అవతరించింది .కనుక రామనామ ప్రభావాన్ని ప్రచారం చేస్తూ తరించు ‘’అని ఆశీర్వదించారు .

   నరస దాసు గారు త్రివేణీ సంగమ జపమహాత్మ్యం విని ,అక్కడికి వెళ్లి ,మాఘమాసమంతా అక్కడే తపస్సు చేస్తూ రోజుకు 80వేల రామనామాన్నిజపిస్తూఉండగా ఫలితంగా ఒక మహా పురుషుడు ప్రత్యక్షమై ,దాసుగారికి హస్తమస్తక సంయోగం తో ‘’శ్రీరామ త్రయోదశాక్షర మంత్రం ‘’ఉపదేశించి ,నామ ప్రచారం తో ప్రజలను  తరింప జేయమని ఆశీర్వదించి , అంతర్ధానమయ్యారు  .తర్వాత దాసుగారు శ్రీరామ జన్మ క్షేత్రం అయోధ్యకు వెళ్లి ,అక్కడ ఆమంత్రాన్ని అక్షర లక్షలుగా పునశ్చరణ చేయగా కనులు మూసుకొని ఉన్న సమయం లో శ్రీ రామ సాక్షాత్కారం లభించింది .కళ్ళు తెరువగానే అదృశ్యమై  ఎదుట శ్రీ శియా రఘు నాద శరణ్ గారు దాసుగారియోగ్యతను గుర్తించి ,శ్రీరామ పంచాయతన మంత్రాన్ని కూడా ఉపదేశించి ‘’శ్రీరామ శరణ్’’అనే దీక్షానామ౦ ఇచ్చి ఆశీర్వదించారు .కాశీ వెళ్లి శివపంచాక్షరి ,బృందావనం లో శ్రీ కృష్ణ మంత్రాలను పునశ్చరణ చేసి ,ఆ దేవతలా అనుగ్రహం పొంది ,శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశీస్సులు పొంది  ఆంధ్ర దేశానికి తిరిగి వచ్చారు నరస దాసుగారు .

     ఆంధ్ర దేశం లో రామ నామ సంకీర్తనలు చేస్తూ చేయిస్తూ ,రామనామం స్మరిస్తూ బియ్యాన్ని ఏరి ,దానినే అన్నంగా తినేవారు .ఒక కోటి రామకోటి రాసి,కోటిన్నర రామ కోటితో రామజననం మొదలు  పట్టాభి షేకం దాకా చిత్రాలను చిత్రించి ,గుంటూరులోని శ్రీరామనామ  క్షేత్రం లో ఆవిష్కరింప జేశారు .మొత్తం మీద 8కోట్ల రామనామం రాశారాయన .ఆయన నివసించిన బుద్దాం అనే గ్రామం లో రామమందిరాన్ని నిర్మించి ,ప్రజలను రామభక్తులుగా మార్చి ఆగ్రామానికి ‘’నామ ప్రయాగ ‘’అనే కొత్త పేరు పెట్టారు .రామమందిర నిర్మాణానికి తనకున్న యావదాస్తి చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు నరస దాసుగారు .ఇదికాకా చాల గ్రామాలలో రామమందిర నిర్మాణం చేశారు .చాలా గ్రంథాలు రాశారు .సకాల సంధ్యావందనం సహస్ర గాయత్రీ జపం,వైశ్వ దేవం  మొదలైనవి వారికి నిత్య కృత్యం .శ్రీ శంకరుల అద్వైతాన్ని అధ్యయనం చేసి అందరికీ సుబోధకంగా బోధించారు .నిరాడంబర పవిత్ర జీవనం గడిపారు .ఎందరో నాస్తికులు వారి ప్రభావం తో ఆస్తికులయ్యారు .దాసుగారి జీవిత చరిత్రను వారి శిష్యులు శ్రీ పద్యాల సోదరులు వ్రాయగా శ్రీ గాయత్రీ పీఠాదిపులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి వారు ఆశీర్వచన౦ పలుకగా, సర్వతంత్ర విశారద శ్రీ కుప్పా ఆంజనేయ శాస్త్రిగారు అభినందన వచనాలు రాశారు .ఇది 1986 డిసెంబర్ 26 న ముద్రణ పొందింది .ఇప్పుడు పూర్తి జీవిత విశేషాలు తెలుసుకొందాం .

  నరస దాసు గారి బాల్యం విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా నరసరావు పేట ,వినుకొండ లకు మధ్యలో కుందుర్తి అనే గ్రామం లో నరసదాసుగారు జన్మించారు .వీరి పూర్వీకులు లక్ష్మీ నరసయ్యగారు పాత గుంటూరు జమీందారు మానూరి వారి దగ్గర సముద్దారుగా చేశారు .ఉప్పుటూరు దగ్గర పెద్ద చెరుకూరులో నివాసం .ఆవంశం లో ఏడవ తరం వారు లక్ష్మీ నరసయ్యగారు .కొంతకాలాని కి పదవులు పోయాయి .కానీ చక్కని హాస్యప్రియులు అని శ్రీ కాశీనాధుని నాగేశ్వరావు ,శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చెప్పేవారు .వారే వీరికి ‘’హాస్య కళాప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చారు .తిరుపతి కవులు వీరిపై శతకం చెప్పారు .వేంకటగిరి ,పిఠాపురం, చల్లపల్లి బొబ్బిలి మొదలైన సంస్థానాలలోనూ ,పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతీ స్వామి సన్నిధానం లోనూ ఆయన హాస్యప్రసంగాలు చేసి ఘన సన్మానాలు పొందారు .వీరిసతీమణి సీతమ్మగారు .ఈ దంపతులకు 2-5-1905విశ్వావసు చైత్ర బహుళ త్రయోదశి ,రేవతీ నక్షత్రయుక్త మకర లగ్నం లో రాత్రి 10గంటలకు నరసదాసుగారు జన్మించారు .

  ఒక రోజున తల్లి నీళ్ళు తేవటానికి బావి దగ్గరకు వెడితే చిన్నారి దాసు ఏడుపు లంకి౦చు కొంటే ఒక భిక్షువు ‘’రామా దయ చూడవే ‘’అనే కీర్తన పాడగా ఏడుపు ఆపేశాడు .ఇంతలో తల్లి వస్తే ,పాడటం ఆపేస్తే మళ్ళీ ఏడ్చాడు .పాటపాడితే మానేశాడు ఇలా చాలా సార్లు జరిగింది అప్పుడా భిక్షువు ‘’అమ్మా నీ కొడుకు సంకీర్తన మిత్రుడు .నామగానం లో లీనమౌతున్నాడు .కొద్దికాలానికి రామభక్త రత్నం గా భాసిస్తాడు ‘’అని చెప్పి దీవించి వెళ్లి పోయాడు .5వ ఏడు ని౦డగానే  తుర్లపాటి నరసింహం గారి తో అక్షరాభ్యాసం చేయించారు .

  1910లో చెరుకూరుకు నిమ్మగడ్డ రమణమ్మ గారింటికి నియమ నిష్టలున్న స్వాములవారోకరు వచ్చి ఒక జీర్ణ దేవాలయం లో వేదాంత ప్రవచనాలు చెప్పారు  .ఆ గుడిని పునరుద్ధరించాలని స్వామి ఊరివారందర్నీ పిలిచి  చెప్పారు . .ముందువరుసలో కూర్చున్న బాలనరసయ్యను  ‘’దేవుడు ఎక్కడ ఉన్నాడు ??’’అని  అడిగారు ‘’ఆయన తడుముకోకుండా ‘’దేవుడు గుడిలోనే కాదు  .అన్ని చోట్లా  ఉన్నాడు ‘’అని చెప్పగా ఆశ్చర్యపోయారుస్వామి .ఆయన పులకించి అతడినిపిల్చి తన ఒడిలో కూర్చోపెట్టుకొని అందరితో ‘’వీడు ప్రహ్లాదుడి లాగా లోకానికి ఆహ్లాదం కలిగిస్తాడు ‘’అని మనస్పూర్తిగా ఆశీర్వదించారు .జనం అవాక్కై తమ ఊర్లో మరో భక్త రామదాసు జన్మించినందుకు గర్వపడ్డారు ..

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )

గోళకి మఠాలలోఅన్నసత్రం వైద్య విధానం ,విద్యా దానం జరిగేవని మందడ శాసనం వలన తెలుస్తోంది .గంగాపురపండితులు అనెక విద్యా సంస్థలు నడిపి ఉంటారు .ఇప్పుడు ఆమఠాలు దిబ్బలై కనిపిస్తున్నాయి.500ఏళ్ళక్రితం గంగాపురం ఒక శైవ విద్యాలయం గా ఉండేది .

                గంగాపుర ప్రాచీనత

పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు త్రయో దశ గుణ సంకీర్తనం లో గణ సహస్రనామాలలో కొన్ని చెప్పాడు –‘’సంగయ్య ,వనిపుర శంకరదేవ –డింగులి వైజవ్వ ,గంగాపురంబు –బసవయ్య ఫణిహారిబసవయ్య —-ఆదిగా గల గణ సహస్రములు –ఆదర ణీయంబులై యొప్పు నిట్లు ‘’’’అని ఉంది .ఇది అంతా యదార్ధం .స్థలపురాణం కూడా ఉండి ఉంటుంది .దాని ఆధారంగానే మల్లా రెడ్ది కవి గంగాపుర మహాత్మ్యం రాశాడు .

   ఈ మహాత్మ్యం లో కవి –చాళుక్య రాజులలో వీర గంబాలుడు అనే ఒక రాజు ఉండేవాడు .ఇతదికోడుకులే జగదేకమల్ల ,త్రిభువనమల్ల , చాళుక్య మల్లులు .గంగాపుర ఆలయాన్ని ఉద్ధరి౦చారు .చారిత్రికంగా ఇందులో కొన్ని దోషాలున్నాయి .వీర హోమ్బాలుని కాలం కంటే ముందే అంటే జగదేకమల్లుని తండ్రి తైలపుడి కాలంలోనే ఇక్కడ కేశవాలయ నిర్మాణం జరిగింది  .అంతకు పూర్వరాజులు శైవులుకనుక వైష్ణవాలయాలు కట్టించి ఉండరు .మూడవ తైలపుని కాలం నుంచే ఈరాజులు వైష్ణవులయ్యారు .వీర హోంబాలుని కాలం వరకు ఈరాజులు వైష్ణవులే .

  మల్లారెడ్డి కవి కాలాదులు

తనకావ్యం లో మల్లారెడ్డి తన ఇంటిపేరు రెడ్డి రెడ్డి లేక రెండ్రేడ్డి అనీ ,గోత్రం –పోల్వాల ..మోటవాడ వంశం వాడు .దీన్ని ఇప్పుడు మోటాడి అంటున్నారు  మోటవాడ అనే పేరు కూడా మల్లారెడ్డి వాడాడు .ఆకాలం లో మోటాడ రెడ్లు ,పాకనాటి రెడ్లు ,పంటి రెడ్లు, రేనాటి రెడ్లు ,పలనాటి రెడ్లు మొదలైన శాఖలు౦డేవి.తాత పర్వత రెడ్డి .మల్లారెడ్డి పెదతాత  కుతుబ్ షాహీ కాలం వాడు .కవితాత బూర్గుల పట్టన చౌదరిగా ఉండేవాడు .చౌదరి దేశాయి దేశముఖ్ పేర్లు మహారాష్ట్రులవి .భూమి శిస్తు వసూలు చేసేవారిని ఈపెర్లతో పిలిచేవారు . చౌధరి అంటే చౌద్ ను అంటే భూమి పన్ను వసూలు చేసేవాడు అని అర్ధం .మహారాష్ట్రు రాజులు ఆదాయం లో నాలుగవ వంతు పన్ను వసూలు చేసేవారు చతుర్ధ నుంచి చౌద్ ఏర్పడింది .

  మల్లా రెడ్డికవి వంశం వారు తెలంగాణా పాలమూరు జిల్లా లో చాలాగ్రామాలలో ఉన్నారు .బూర్గులగ్రామం గంగాపురానికి నాలుగు మైళ్ళ దూరం లోనే ఉంది .తండ్రి ‘’మల్లపల్లి పుర మందిర నివాసుడు ‘’అని చెప్పాడు .అదీ సమీప గ్రామమే .మల్లారెడ్డి నలుగురుకోడుకులు –గంగారెడ్డి హేమారెడ్డి లక్కరెడ్డి ,బక్క రెడ్డి.

   గంగాపుర మహాత్మ్యం రాసిన రెండ్రేడ్డి మల్లారెడ్డి దేశాయి కవిత్వం దారాశుద్ధితో ,సరళ శైలిలో ఉంది .శేషాద్రి రమణ కవులలో ఒకరైన వెంకట రమణాచారి గారి వద్ద ఈ కావ్య ప్రతి దొరికింది .ఈప్రతి ఆచార్యులకు మల్లారెడ్డి తాత ఉండే మల్లేపల్లిలో దొరికింది .బారిస్టర్ ఆర్ దామోదర రెడ్డి గారు ఆ ప్రతికి నకలు రాయింఛి ముద్రిచమని కోరగా వారు కొద్ది కాలానికే చనిపోతే ,ముద్రణ ఆలస్యమైంది .దామోదర రెడ్డిగారు మల్లారెడ్డి వంశీయులే .విజ్ఞాన వర్దినీ పరిషత్తు వారు ముద్రణ చేబట్టి  ఈ మహాత్మ్యాన్ని దామోదర రెడ్డి గారి స్మృతి చిహ్నంగా వారి పితృవ్యులు శ్రీ రామకృష్ణా రెడ్డిదేశముఖ్  గారి ఆర్ధిక సహకారం తో ముద్రించి లోకానికి అందించారు’’ అని ఆ పరిషత్ అధ్యక్షులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ముందుమాటలో కవి ,కాలం, గంగాపుర కావ్య సమీక్ష, చేస్తూ తెలియజేశారు  .విజ్ఞాన వర్ధిని కార్యదర్శి శ్రీ చలమ చర్ల రంగాచార్యుల సహాయ సహకారాలు కూడా లభించాయి .ఈకావ్యం 15-8-1948 వ్యయ నామ సంవత్సర భాద్రపదమాసం లో సికందరాబాద్ ఓరిఎంట్ ముద్రణాలయం లో ముదిగొండ సాంబశివరావు చేత ముద్రిప బడింది .వెల కేవలం రూపాయిన్నర .ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం .410పద్య గద్యాలున్నాయి .అక్కడినుంచి కావ్యం శిధిలమైంది .

  మల్లారెడ్డి వ్యాకరణ విరుద్ధ ‘’అన్నమరుచయ్యే’’వంటి ప్రయోగాలు కావాలనే చేశాడు .వర్ణనలు  ‘’ప్రబంధ రీతిలో రాశాడు .మధ్యయుగ కవులపోకడ బాగా కనిపిస్తుంది.శైలికి మచ్చుకు ఒక పద్యం –‘’కాలవ్యాధుడు వెంటనంటి తరుమన్ గంజాప్త  సారంగమున్ –చాలం దవ్వుగ నేగ ,తేవర శరమున్  సంధించి బిట్టే- యనట్లోలిం బశ్చిమ వార్ధి వ్రాలునటులీ యుగ్రాశుం డుగ్రు౦డే ద-త్కాలాలంబాన సాంధ్య రాగ మమరెన్  గెంపెక్కి నల్దిక్కులన్’’ . సురవరం ప్రతాపరెడ్డి గారి ముందుమాటలు ఈకావ్యానికి నిజంగా ‘’సుర వరమే’’ అయి మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు తెలియజేసింది .వారికి ఆంధ్రలోకం రుణ పడి ఉంది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

గంగాపుర మహాత్మ్యం -1

గంగాపుర మహాత్మ్యం -1 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న గంగాపురం 2వేల జనం ఉన్న జాగీర్ గ్రామం .అధికారి ముస్లిం .గ్రామం లో చౌదీశ్వరాలయం ,ఒక చెరువు దానిపై పది కుంటలు ఉన్నాయి అందులో న౦బులకుంట వెయ్యేళ్ళ నాటిదని చాళుక్య శాసనం తెలియజేస్తోంది .గ్రామం లో ఎక్కాడ చూసినా శాసనాలు శిదిలాలయాలు ,సుందర విగ్రహాలు విరిగిన విగ్రహాలు కనిపిస్తాయి .ఇదీ గంగాపురగ్రామ నేటి దుస్థితి .గ్రామానికి మైలుదూరం లో ‘’గొల్లత్తగుళ్ళు’’అనే శిదిలాలయాలున్నాయి .దీనికి దగ్గర రెండు మూడు ఊళ్ళల్లో కూడా శిదిలాలయాలు శాసనాలు కనిపిస్తాయి .ఈ గ్రామాలకు దగ్గరలో మీనాంబరి అనే పెద్ద వాగున్నది .ఇది పవిత్రనది అని స్థల పురాణం లో ఉంది .దీని ఒడ్డున అనేక లింగాలు ఒక శివాలయం ఉన్నాయి .ఈవాగు కృష్ణానదిలో కలుస్తుంది . పునరుద్దరింప బడి పూజా దికాలు జరుగుతున్న కేశవాలయం చాళుక్యరాజులు శైవం నుంచి వైష్ణవానికి మారిన కాలం లో అంటే సుమారు వెయ్యి సంవత్సరాలక్రితం నిర్మింపబడింది .బయటి గోడలపై చాళుక్య శాసనాలున్నాయి .ఆలయం లో మాఘ శుద్ధ సప్తమి నుంచి అయిదు రోజులు పెద్ద జాతర జరుగుతుంది . గంగాపుర నిర్మాణం బాగా ప్రాచీనమైనది .అక్కడ ఒకటి రెండు జైన శిల్పాలు కనిపిస్తాయి .శివాలయం వెనక ఒక జైన విగ్రహం కనిపిస్తుంది .గంగాపురానికి పూర్వపు పేరు మాయాపురి అని వెంగయ్య కవి రాసిన నరపతి విజయం అనే రామరాజీయ కావ్యం లో ఉంది.బుద్ధుని తల్లి పేరు మాయదేవికనుక ఆ ప్రేరణతో దీనికి మాయాపురి పేరు వచ్చి ఉండచ్చు .మీనా౦ బరీ తీరం లో ఉ౦ది కనుక మత్సపురి అనే పేరు కూడా ఉంది .’’దురిత కోలాహలం’’ అనే మరో పేరు కూడా ఉంది .చాళుక్యులు గంగాపురి అనే పేర్కొన్నారు .గంగేశ్వర లింగం ఉండేదేమో ?ఇక్కడి శాసనం లో భీమ సముద్రం అనే గ్రామం పేరు ఉంది .ఈపేరున్న చెరువు గంగాపురం లో లేనేలేదు .మాయాపురి పేరును బట్టి ఈ గ్రామమ కనీసం 15వందల ఏళ్ళ నాటిది అంటారు . గొల్లత్తగుళ్ళు గంగాపురానికి మైలు దూరం లో ఈ గొల్లత్త గుళ్ళున్నాయి .ఇప్పుడు ఒకే ఒక గుడి మాత్రమె కనిపిస్తోంది .20అడుగుల ఎత్తున్న ఈ గుడీ కూలటానికి సిద్ధంగా ఉంది .నాలుగు అడుగుల మందమున్న గోడలున్నాయి .ఇటుకరాయి నిర్మాణం .గుడిపక్క రెండు పెద్ద దిబ్బలున్నాయి .బహుశా ఇవి శిధిల ఆలయాలు అయి ఉండవచ్చు .గుళ్ళు అన్నారు కనుక కనీసం ఇక్కడ మూడు గుళ్ళు అయినా ఒకప్పుడు ఉండి ఉంటాయి .ఈ గుళ్ళను గురించి స్థానికులు ఇలా చెబుతారు –పాలు,పెరుగు అమ్మే ఒక గొల్ల ఇల్లాలు భక్తితో ఆస్తింతా ఖర్చు చేసి ఈ గుళ్ళు కట్టించింది .అందుకే గొల్లత్త గుళ్ళు అనే పేరొచ్చింది .కానీ ఇది నిజం కాదు .శైవులలో గోళకి మఠాలు అని వింధ్యకు దక్షిణం లో వ్యాపించి ఉన్నాయి .ఆ గోళకి కాలక్రమం లో గొల్లక్క-గొల్లత్త అయి ఉంటుంది .ఈ మఠాల గురించి మల్లంపల్లి వారు అమరావతీ స్తూపములు పుస్తకం లో వివరంగా రాశారు .ఈమతాలు కడప మండలం , త్రిపురాంతకం ,గుంటూరు మండలం మందడం లో 11వ శతాబ్ది నుంచి ఉన్నట్లు శాసనాలలో ఉంది ‘’అన్నారు .కాకతి రుద్రమ దేవి మండడం లో విశ్వేశ్వర గోళకి మతానికి దానాలు చేసి అన్ని వర్ణాలవారికీ అన్నదానం చేసింది .అందులో విద్యాలయం వైద్యాలయమూ ఉన్నాయి .కర్నూలు జిల్లా త్రిపురాంతకం లో ఒక గోళకి మఠం ఉన్నట్లు స్థానిక శాసనం తెలియజేస్తోంది . గంగాపురం లో శివాలయాలు చాలా ఉండేవని పాల్కురికి సోమనాధుడు పండితారాధ్య చరిత్రలో రాశాడు .అక్కడున్న వెయ్యి మంది శివ భక్తుల గురించి పేర్కొన్నాడు .త్రిభువనమల్ల చక్రవర్తి జ్యోతిషశాస్త్రం లో పరీక్ష పెట్టి భట్టో పాధ్యాయునికి ,పెద్దభట్టుకు దానం చేసినట్లు ఆరాధ్యగురువు ప్రవేశ భట్టారకుడు చెప్పిన శాసనం ఉంది .గోళకి మత స్థాపకులు వీర శైవం లోని పాశుపత మతాన్ని అను సరించేవారు .ఈఠం దేవకీ పురం లో మొదలై దక్షిణ దేశమంతా వ్యాపించింది .వీరిలో విశ్వేశ్వర శివ దేశికుడు కాకతి గణపతి చక్రవర్తికి దీక్షా గురువు .ఈమఠానికే రుద్రమ దేవి దానమిచ్చింది .త్రిభువనమల్లుని దీక్షా గురువు సకల ప్రవేశ భట్టారకుడు కదా .ఆ దీక్షా గురుని గోళకి మఠమే’’గొల్లత్త గుళ్ళు ‘’అయ్యాయి కాలక్రమం లో .గంగాపురం లో పైన చెప్పిన పండితులే కాక శ్రీగిరి పండితుడు ,గణగ రాజ పండితుడు కూడా ఉన్నట్లు తెలంగాణా శాసనం ,చాళుక్య శాసనాలు తెలియ జేస్తున్నాయి .సశేషం ఆధారం –శ్రీ రేడ్రేడ్డి మల్లారెడ్డి రాసిన –గంగాపుర మహాత్మ్యం శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం -4(చివరిభాగం

కొత్త శకం –కొత్త కొలమానం  -4(చివరిభాగం )

మానవాళికి మేధా శక్తి లోపం ఏమాత్రం లేదు .నిజానికి పుష్కలం గా ఉంది  .అది ఒక్కోసారి ఇవల్యూషన్ కు  దె బ్బకోడుతోంది .దానికి నైతికత సానుభూతి లోపిస్తోంది .ప్రకృతిపై దురహంకారం పెరిగి ,పాత గట్టి వాటినే అంటుకొని పోతోంది .కనుక మనం విపత్తు అనే నిద్రలో నడుస్తున్నట్లు ప్రవర్తిస్తాం . నిద్రలేపటానికి ఇదే సరైన సమయం మిత్రులారా గుర్తించండి .అనేక సందర్భాలలో మనకున్న మేధస్సును సరిగ్గా అర్ధం చేసుకొని తగినట్లుధనాత్మకంగా  ప్రవర్తించటం లో ఉపయోగించలేకపోతున్నామని రుజువయ్యింది .అంటేమన తెల్వి తేటల్ని పెంచుకొని సరైన నిర్ణయం చేసేవిగా వాడటం లేదన్నమాట .అలా ఎలా కొత్తగా చేయవచ్చో ఇప్పుడు మనం తెలుసుకొందాం .

  కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)

కొద్దికాలం లోనే మనం మానవ మేధస్సు కంటే మిలియన్ రెట్ల శక్తి సామర్ధ్యాలున్న కంప్యూటర్ లను వాడబోతున్నాం .దీనితో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మానవ మేధస్సు ను దాటిపోబోతోంది .భూమిపై అధిక మేధ ఉన్న వస్తువులు ఆటోమాటిక్ గా వాటి పనులు అవి చేసుకు పోతాయి .అప్పుడు మానవులకు తామేమి చేస్తున్నామో తెలియని వింత స్థితి ఏర్పడుతుంది .జీవ సంబంధికాకుండా బాగా అభి వృద్ధి చెందిన కృత్రిమ మేధస్సు వలన శక్తి వనరుల లో నానో టెక్నాలజీ ,  బయో టెక్నాలజి,  రోబోటిక్స్ లో పెను మార్పులు తెస్తున్నాయి .ఇదంతా మహా అద్భుతంగా  అత్యంత ఆశాజనకం గా అనిపిస్తుంది. అవాక్కై పోతాం . మానవ సంక్షేమానికి దాన్ని ఉపయోగించి నియంత్రించ గలగటం అత్యంత క్లిష్టం .ఇది తెలియకపోతే మళ్ళీ  మనం  అణుశక్తికి  సమాంతరంగా  ప్రయాణించి భారీమానవ హనన ప్రేలుడు పదార్ధాలు  తయారుచేసే దశలోకి వెడతామని జాగ్రత్త పడాలి .లేకపోతె మన వినాశాన్ని చేజేతులా మనమే తెచ్చుకొన్న వాళ్ళం అయిపోతాం .

  మొక్క ,జంతు మేధస్సు

మన పూర్వీకులకు మొక్కలో జంతువులో వాటివాటి అంతశ్చేతన ఉన్నట్లు చాలాకాలం క్రితమే తెలుసు .ఈతరం మనుషులమైనమనం కొత్త టెక్నాలజీ వ్యామోహంతో వాటితో  కమ్యూనికేట్  చేయలేక పోయాం .ఇది తెలిసిన వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో మొక్క జంతువులతో సహజీవనం చేస్తున్నారు  వాటి హృదయ ఘోష వింటున్నారు .బుద్ధిజీవులం అనుకొంటున్నమనం వాటిని సంహరిస్తున్నాం .ప్రస్తుత వైరస్ మనల్ని దూర దూరంగా ఉంచుతోంది .భూమి అధిక జనాభాతో నిండిపోతే ,వినాశ విధానాలు మనం అమలు చేస్తుంటే మనం ఆరోగ్యం గా ,వివాద రహితంగా ఉండగలమా ?ఈ సంక్లిష్ట  సమస్యా పరిష్కారానికి ప్రకృతి ఇప్పటికే కోట్లాది పరిష్కారాలు అందించింది .అవి చూసి తెలుసుకొని మన అవసరాలకు అనుసరిస్తే మంచిది .సహజ నివారణ ప్రకృతికి ఉన్న అతంత శక్తివంతమైన విధానం .దానితో నూతన సమతుల్యాలను నిరంతరం నెలకొల్పుతూ ఉంటుంది .సైన్స్ మాత్రం జీవిత రహస్యం లో అతి తక్కువ శాతాన్ని మాత్రమె బహిర్గతం చేయగలుగు తుంది .

      కనుగొన బడని మేధస్సు

భూగ్రహం  మనకు ఎందరో స్త్రీ పురుషులనిచ్చింది .వీరు జాగృతి లేక మేధో సామర్ధ్య లక్షణాలు  (జీనియస్ )కలిగి ఉన్నారు .అవి సహజ సిద్ధంగా ,అంతరంగికంగా నైతికతమానవ విలువలను కలిగి ఉన్నవారే .అలాంటి ఉన్నత సహజ మేదను మొరటుగా మనం తిరస్కరిస్తే ,మళ్ళీ అది మనకు లభ్యం కాదు .అది పిడివాదంగా ముద్రపడి  సామాన్యులకు పనికిరాని చపల ,విపరీతమైన చేష్ట అనిపించుకొంటుంది .ఈరకమైన ఋణాత్మక తీర్పులు సహజ సిద్ధ మేధస్సును అడ్డుకొని అభ్యుదయానికి తోడ్పడదు .విద్య లక్ష్యం పరమార్ధం ఇదికాకూడదు కారాదుకూడా .

              విద్యా విజ్ఞానం

  అన్ని దేశాలలో విద్యకు అత్యంత  ప్రాముఖ్యం ఉందికాని ఎప్పటికప్పుడు నవీకరణం చెందటం అంటే అప్ డేటింగ్ జరగటం లేదు .ఇప్పుడు మనం ఉన్నత మేధస్సు ను మన జీవితాలలోకి ముఖ్యంగా యువకుల మనస్సులలో కి ఆహ్వానించాల్సిన సమయం వచ్చింది .సాధారణ విద్యా విధానం ఉండనే ఉంది .బోధకులు పుస్తకాలు చర్చలు గోష్టులు జరుపుతూనే ఉంటారు .కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలికి ఆదరించి ఆమలు చేయాలి. ఆ ఆలోచనలు మానవ సంబంధంగా సృజనాత్మకం గా ,పర్యావరణ జీవావరణ సంక్షేమ౦గా ఉండాలి .ఈ జాగృతం మన ఇంట్లో బడిలో సమాజం లో స్నేహితులలో బంధువులలో కలిగించటమే ప్రధమ కర్తవ్య౦ .

  ఐడియా బాగానే ఉంది ఎలా చేయాలి అనేది సమస్య .శాంతి సహృద్భావ చేతనా ,,మరింత ఉన్నత జాగృతి .మరికాస్త అనుకూలంగా సామరస్యంగా మేధో వికసనం జరగాలి .దీనికోసం కొత్త కర్రిక్యులం ,బోధనా సామర్ధ్యం పెంచటం పోటీలు నిర్వహించటం వంటివి అక్కర్లేదు .మనదరికి డబ్బు సంపాదన ఒత్తిడి ,మనం ఎంచుకున్న రంగం లో పని సామర్ధ్యంలో నేర్పు చూపించటం,మానవత్వంతో తోటివారికి సేవచేయాలనే కోరికా,  ఉంటుంది .మనం అనేక సాంఘిక ఒత్తిళ్ళు మనపై ఇంటా బయటా  పని చేస్తూ ఉంటాయి .కాని మనం మార్పుకు భయపడరాదు.అది సహజం ఆరోగ్యకరం కూడా .

   ప్రపంచం లోని యువత అంతా చాలాస్మార్ట్ గా ఉంది .వాళ్లకు నువ్వేమీ చెప్పక్కర్లేదు  వాళ్లంతకు వాళ్ళే నేర్చుకోగలరు .వాళ్ళు నిజాయితీగా హృదయపూర్వక౦గా ,వినయంగా హృదయం లో ముఖంలో చిరునవ్వు తో దయాగుణం గా ,దురాశ,భయం కన్ఫ్యూజన్ లేకుండా తాము అవగాహన కలిగి ఉంటామనే భావం తో చేయాలి ,చేస్తారు కూడా .వారిని ప్రభావితంచేసి , ప్రేరేపించటానికి ఇది చాలు .మనం శాంతి గురించి ప్రబోదించవచ్చు .అది చాలా గౌరవ ప్రదమైన ముఖ్యమైన విషయమే .శాంతి అనేది విజ్డం కంటే ,మనసుకంటే గొప్పది .మనం ఊహించని మార్గాలలో అది విశేషంగా అనూహ్య రీతిలో ప్రవహించి , స్వయం గతంగా ,ప్రకాశమానమై ఉంటుంది .శాంతియుత మనసు బుద్ధి ఉన్న వారిలో మాత్రమె అది అభి వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ) .

 మనం మనకు తెలియకుండానే ,ఒక్కోసారి చాలా ఉదారంగా,స్వీకరణ విధానంగా  వ్యవహరించవచ్చు .ఒక్కో సారి ఆబ్స్ట్రాక్ట్ లేక లోతైన విషయాలను అధ్యయనం చేస్తూ బిజీగా ఉండచ్చు .కాని మనం ఫ్రీగా ,మనమంతా ఫ్రీగా ఉండే హక్కు మనకు ఉన్నది .ఉన్నత చేతనవైపు  ఉత్తమ జీవిత విధానం వైపు ,మరింత పారదర్శక మనస్సు వైపు మనమనస్సులను ట్యూన్ చేసుకొంటే మనకు తప్పకుండా ఆకస్మిక (స్పాంటేనియస్ )ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయి .ఇది ఏ రాజకీయ ఎజెండాకు,జాతీయతకు ,వయసు జెండర్ ,మతాలకు  అందనంత ఉన్నతంగా ఉంటుంది .

  లాటిన్ భాష లో ఇంటలిజెన్స్ కు అర్ధం ‘’అంతరార్ధం గ్రహించటం ‘’(టు రీడ్ బిట్వీన్ ది లైన్స్ ‘’అనే అర్ధం కూడా ఉంది .ప్రత్యక్షంగా చెప్పబడిన దాని వెనుకఉన్న  నిగూఢ రహస్య సత్యాన్ని ఆవిష్కరించటం అన్నమాట .ప్లేటో విధానం లో ‘’సంఘటనలను లోతుగా చదవటం కాదు అందులో నిక్షిప్తమైన ఉన్నత మేధను  దర్శించటమే ,కనిపించని దానిలోంచి తొంగి చూడటమే ఇంటలిజెన్స్ అంటే .కనుక ఇప్పుడు మనకున్న విపత్తు కలిగించే కరోనా వైరస్ ను పూర్తిగా అధ్యయనం చేయాలి .దానినుంచి శాంతి సంజ్ఞలను కనుక్కోవాలి .ఆ వైరస్ చాలాసూక్ష్మమైనదే .అలాగే సూక్ష్మ విషయాలు కూడా విస్తృతంగా వ్యాపిస్తాయి .దీనినుంచి అత్యంత ఉన్నత అవగాహన పొందటానికి గొప్ప అవకాశం మనకు లభించింది .మనమందరం పరిశోధించి ఎదురు చూసే నూతన సమాధానాలు రాబట్టే వీలు దొరికింది .’’ఇదే కొత్త శకం  అయితే,  మనకు తప్పక కావాలి నూతన కొలమానం ‘’.

  సమాప్తం

ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యూ ఎరా,న్యు డైమెన్షన్.

రేపు 4-6-21 శుక్రవారం శ్రీ హనుమజ్జయ౦తి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-21-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

01/06/2021గబ్బిట దుర్గాప్రసాద్

మహర్షి దేవేంద్ర నాథ టాగూర్ కుమార్తెలలో నాల్గవ కుమార్తె స్వర్ణ కుమారీ దేవి 28-8-1855న జన్మించింది .తాతగారు ద్వారకానాథ టాగూర్ .ఈమె ముగ్గురు సోదరిలు సౌదామిని ,సుకుమారి ,శరత్ కుమారి .బర్నకుమారి చివరి చెల్లెలు .కలకత్తా బెతూన్ కాలేజిలో చదిన మొదటి తరం విద్యార్ధిని సౌదామిని .మిగిలిన వారంతా ఈమెనే అనుసరించారు .స్వర్ణకుమారి మాత్రం ప్రాధమిక విద్య ఇంటి వద్దనే నేర్చింది .విశ్వకవి రవీ౦ద్ర నాథ టాగూర్ కంటే ఈమె అయిదేళ్ళు పెద్దది.

జోరా సంకో బారి లో విద్య కు అధిక ప్రాదాన్యమిచ్చేవారు .ఇంటివద్ద చదువు చెప్పే గవర్నెస్ ,పలక మీద రాసి ,పిల్లలచేత దాన్నికాపీ చేయించటం తండ్రి ఒక రోజు గమనించాడు .ఈ యాంత్రిక విధానపు చదువు నచ్చక గవర్నెస్ దృష్టికి తెచ్చాడు .అంతే కాక ఆమెను మాన్పించి కొత్త టీచర్ ను ఏర్పాటు చేశాడు .ఈవిషయాలను రవీంద్రుడు ‘’బడిలో నేర్చుకోనేదాని కంటే చాలా ఎక్కువగానే మేము ఇంటి వద్దనే నేర్చుకొన్నాం ‘’అని తన జ్ఞాపకాలలో రాశాడు .

చురుకుపాలు ఎక్కువైన స్వర్ణకుమారి బాల్యం లోనే చాలామంది స్నేహితురాళ్ల తో పరిచయం సాధించింది .ఆ రోజుల్లో ప్రతి జంట స్నేహితులకు ఒక సామాన్యపేరు ఉండేది ఆపేరు తోనే ఒకరినొకరు పిలుచుకోనేవారు .స్వర్ణకుమారికి చాలామంది తో స్నేహం ఉండేది .ఆమె ముఖ్య స్నేహితురాళ్ళు మిష్టిహసి ,మిలన్ ,బిహ౦గిని.మొదలైన వారు .

1868 లో పదమూడవ ఏట స్వర్ణ కుమారి వివాహం మహా విద్యావంతుడు ,స్థిర మనస్కుడు ,నాడియా జిల్లాలో సంపన్న కుటుంబానికి చెందిన జానకీనాథ్ ఘోషాల్ తో జరిగింది .బ్రహ్మ సమాజ అభిమాని ,ఆ సమాజ కట్టుబాట్లతో వివాహం చేసుకొన్న జానకీ నాథుని అతని కుటుంబం వెలివేసి ,,పిత్రార్జితం లో చిల్లి గవ్వకూడా ఇవ్వకుండా బహిష్కరించింది .కాని అతని అమోఘ సంకల్పం ,దీక్ష శక్తి సామర్ధ్యాలతో బిజినెస్ లో విజయం సాధించి స్వంత జమీందారిని ఏర్పాటు చేసుకొన్నాడు .ప్రభుత్వం చేత ‘’రాజ ‘’బిరుదు కూడా పొందాడు .దివ్యజ్ఞాన సమాజం తో మంచి సంబంధాలు కలిగి ఉంటూ ,భారత జాతీయ కాంగ్రెస్ సంస్థతో కలిసి పని చేసేవాడు .భారత జాతీయ కాంగ్రెస్ సంస్థాపకులలో జానకీనాథ ఘోషాల్ ముఖ్య పాత్ర పోషించాడు.

ఘోషాల్, స్వర్ణ కుమారీ దేవి దంపతులకు హిరణ్మయీ దేవి ,జ్యోత్స్నానాథ్ ఘోషాల్ ,సరళాదేవి చౌదరాణి సంతానం . జ్యోత్స్నానాథ్ ఐ.సి.ఎస్ .కు సెలెక్ట్ అయి ,పశ్చిమ భారతం లో సేవలందించాడు .టాగూర్ కుటుంబం లోని వారు సంగీత ,నాటక ,రచనలలో ప్రసిద్ధులవటం వలన స్వర్ణకుమారికి సహజం గా అవి అబ్బాయి .జ్యోతిరింద్ర నాథ టాగూర్ ,సంగీతం,నాటకం ,రచనలతో లో ప్రయోగాలు చేస్తూ ,అక్షయ చంద్ర చౌదరి , రవీంద్రుల సహాయం పొందాడు .తన ‘’జ్యోతిరి౦ద్ర స్మృతి’’లో ‘’జానకి ఇంగ్లాండ్ వెళ్ళటం ,మా చిన్న చెల్లెలు స్వర్ణకుమారి మా ఇంట్లో ఉండటం తో సాహిత్యప్రయోగాలలో మా కుటుంబంలో మరొక తో్డు మాకు చేకూరింది ‘’అని రాసుకొన్నాడు .జ్ఞానదానందినీ దేవి కుటుంబం లోని స్త్రీలపై ఉన్న చాదస్త నిషేధాలను అతిక్రమిస్తే ,స్వర్ణకుమారి సృజనాత్మక రచనలతో వికసించింది .

స్వర్ణకుమారి స్వీయ ప్రతిభతో మొట్టమొదటి నవల ‘’దీప్ నిర్వాణ్’’ రాసి ,1876లో ప్రచురించింది .హనా కేధరిన్ ముల్లెన్స్ బెంగాలీ భాషలో మొదటి నవలా రచయిత్రిగా ‘’ఫూల్మణి ఓ కరుణార్ బిబరణ్’’అనే 1952లో ప్రచురించిన మొదటి నవలతో గుర్తింపు పొందితే ,స్వర్ణకుమారీ దేవి ‘’బెంగాల్ ప్రజలలో మొదటి మహిళా నవలారచయిత్రిగా’’ పేరుపొందింది .ఈమె రాసిన నవల జాతీయభావాన్ని ప్రజలలో పాదుకొల్పింది .మొదటి జాతీయభావ నవల రాసిందీ కూడా స్వర్ణకుమారియే .ఆ తర్వాత స్వర్ణకుమారి పుంఖాను పుంఖాలుగా నవలలు ,నాటకాలు కవితలు ,శాస్త్రీయ వ్యాసాలు రాసేసింది .బెంగాలీ భాషలో సైంటిఫిక్ టర్మినాలజి ని అభి వృద్ధి చేసింది స్వర్ణ .అనేక గీతాలను రాసి సంగీతం కూర్చింది .బెంగాలీ సాహిత్యం లో స్వర్ణకుమారి ,కామినీ రాయ్ ల పాత్ర స్వర్ణయుగమే అయి ,వారి ప్రాధాన్యత కు గుర్తింపు అభించిందని ప్రముఖ విశ్లేషకుడు స్వపన్ మజుందార్ అభి ప్రాయ పడ్డాడు . They “represented a flourishing generation of educated women writers, discharging with total zeal the responsibilities of their pursuit”.అని కీర్తించాడు మనస్పూర్తిగా .1879లో స్వర్ణకుమారి బెంగాలీ భాషలో మొట్టమొదటి ఒపేరా ‘’’బసంత ఉత్సవ్ ‘’రచించింది .బెంగాలీ ఒపేరా రచన లో కూడా ఆద్యురాలయింది .

1877లో జ్యోతిరింద్ర నాద టాగూర్ ‘’భారతి ‘’అనే కుటుంబ మేగజైన్ ను ప్రారంభించి ,ద్విజేంద్రనాథ టాగూర్ సంపాదకత్వం లో ప్రచురించాడు .భారతి పత్రికకు 7ఏళ్ళు ఎడిటర్ గా ద్విజేంద్ర ఉండగా ,ఆతర్వాత స్వర్ణకుమారి 11 సంవత్సరాలు భారతి మేగజైన్ కు సంపాదకురాలుగా సమర్ధవంతంగా నిర్వహించింది .రవీంద్రుడు ఒక ఏడాది మాత్రమె ఎడిటర్ గా ఉన్నాడు . 9ఏళ్ళ విరామం తర్వాత స్వర్ణకుమారి మళ్ళీ సంపాదక బాధ్యతలు తీసుకొని రెండేళ్ళు నడిపి చివరికి భారతి మేగజైన్ ముద్రణ ఆపేసింది .దాదాపుగా అర్ధశతబ్దికాలం బెంగాల్ ను సాహితీ రంగంలో ముందుకు నడిపించింది భారతి పత్రిక .భారతి మొదటి ప్రచురణ నాటికి రవీంద్రుని వయసు 16 ఏళ్ళు మాత్రమే .మొదటి సంచికనుండి తన రచనలతో భారతి పత్రికకు నిరంతరంగా రచనలు చేశాడు .భారతిలో రవీంద్రుని రచనలకోసం అత్యంత ఉత్కంఠ తో పాఠకులు ప్రతినెలా ఎదురు చూసేవారు .

భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శి గా భర్త ఉండటం తో స్వర్ణకుమారి ,రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించింది . 1889,1890 కాలం లో స్వర్ణ కాంగ్రెస్ లో పని చేసింది .భారత జాతీయ కాంగ్రెస్ లో మొట్టమొదటిసారిగా మహిళలు పాల్గొనటం స్వర్ణకుమారి తోనే మొదలైంది .1896లో స్వర్ణకుమారి నిస్సహాయ అనాధల ,విధవలకు సాయం చేయటానికి ‘’సాక్షి సమితి ‘’అంటే ఫ్రెండ్స్ సొసైటీ స్థాపించి ,తన టాగూర్ కుటుంబం వారందర్నీ చేర్పించింది .సభ్యత్వ రుసుము నిర్వహణకు చాలక పోవటం తో బెతూన్ కాలేజ్ లో ప్రతి ఏడాది ఎక్సిబిషన్ నిర్వహించి నిధులు సమకూర్చింది .ఢక్కా ,శాంతిపూర్ లనుంచి చీరలు ,కృష్ణనగర్ కాశ్మీర్ ,మురాదాబాద్ ,వారణాసి ఆగ్రా ,జైపూర్ ,బొంబాయి మొదలైన చోట్ల నుంచి చేతి తో తయారైన వస్తువులు తెప్పించి ప్రదర్శన నిర్వహించింది .ఆ రోజుల్లో ఈ ప్రదర్శనలు పెద్ద సెన్సేషన్ గా ఉండేవి .1906దాకా ఈ ప్రదర్శనలు నిర్వహించి తర్వాత ‘’విధవ ఆశ్రమం ‘’కు అప్పగించింది స్వర్ణకుమారి ..బారానగర్ లో శశిపాద ముఖర్జీ విధవాశ్రమాన్ని స్థాపించాడు .దేశం లో అదే మొట్టమొదటి ఆ తరహా ఆశ్రమం .స్వర్ణకుమారి కుమార్తె హిరణ్మయీ దేవి, దీనితో ప్రేరణ పొంది ‘’మహిళా విధవ ఆశ్రమం ‘’నెలకొల్పి సేవలు కోన సాగించింది .ఈమె మరణం తర్వాత ఆశ్రమం ఆమె పేరుతొ పిలువబడింది .ఈ సంస్థ కార్యనిర్వాహక మండలిలో స్వర్ణకుమారి ,మయూర్ భంజ్ మహారాణి సుచారు దేవి ,కూచ్ బిహార్ రాణి ( కేశవ చంద్ర సేన్ కుమార్తె ) సునీతి దేవి ,లేడీ హామిల్టన్,ప్రియం వదాదేవి ,మిసెస్ చాప్మన్ ,మిసెస్ ఎ.స్పి’ సిన్హా ,,హిరణ్మయీ దేవి వంటి ప్రముఖ మహిళలున్నారు .హిరణ్మయి సెక్రేటరిగా సేవలందించింది .ఇప్పటికీ ఈ సంస్థ నిర్విఘ్నంగా సమర్దులచేత నిర్వహి౦ప బడుతూ విధవ మహిళా సేవలో ధన్యమౌతోంది .తర్వాతకాలం లో సరళారాయ్ కోరికపై దీన్ని రవీంద్రుడు’’ సాక్షి సమితి’’ గా పేరు మార్చాడు .దీని నిధులకోసం రవీంద్రుడు ‘’మాయార్ ఖేలా ‘’అనే సంగీత నృత్యనాటిక రాసి ప్రదర్శించాడు .

రచనలు –స్వర్నకుమారీ దేవి –దీప నిర్వాన్ ,మిబార్ రాజ్ ,చిన్న ముకుల్ ,మాలతి ,హుగిర్ ఇమాం బాది,విద్రోహ ,స్నేహలతా బా పలిత,ఫులేమాల ,కహాకే ,బిచిత్ర ,స్వప్నాబని ,మిలన్ రతి,ఫూలేర్ మాలా అనే 13నవలు ,కోనేబాదా,పాక్ చక్ర ,రాజ్ కన్య , ,దివ్యకమల్ అనే నాలుగు నాటకాలు ,బసంత్ ఉత్సవ్ అనే ఒపేరా ,పృధివి అనే వ్యాస సంపుటి రాసి ప్రచురించింది .

కలకత్తా యూని వర్సిటి స్వర్ణకుమారికి 1927లో ‘’జగత్తారిణి’’పురస్కారం అందించి సత్కరించింది .కవి, రచయిత్రి నవలాకారిణి,,మహిళాభ్యుదయం కోసం అందులోనూ నిస్సహాయులైన విధవల ఆలనా పాలనా కోసం అహర్నిశలు పని చేసి,భారత స్వాతంత్ర్య ఉద్యమం లోనూ పాల్గొన్న మహిళా జాతి మాణిక్యం స్వర్ణకుమారీ దేవి 76వ ఏట 3-7-1932 న మరణించింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

   కొత్త శకం –కొత్త కొలమానం -3

   కొత్త శకం –కొత్త కొలమానం  -3

                       నైతికత

చాలామందికి మంచితెలివి తేటలుంటాయి ,కానీ వాళ్ళు వినాశకర పద్ధతులలోనే వ్యవహరిస్తారు లేదా సరైన నిర్మాణాత్మక మార్గం లో పనిచేయరు .వాళ్ళ తెలివి తేటల్ని నేర ప్రవృత్తిలో,పర్యావరణ నాశనం లో ,ఇతరులను తిట్టటం లో ఉపయోగిస్తారు .అన్ని దేశాల సంస్కృతిలో మానవులు ధర్మపరులుగా ,ఇతరులఎడ దయా సానుభూతి పరులుగా ఉండమనే మౌలిక సిద్ధాంతం .ప్లేటో వేదాంతి భావనలో ‘’మంచిగా ఉండటం అనేది కేంద్రం గా ఉండాలి .అన్ని సంస్కృతులకు ఇదే స్వర్ణ నియమం .చైనావేదాంతం  మరింత ముందుకు వెళ్లి నీతిని ,దయాగుణాన్ని మేధస్సు పెంచాలని చెప్పింది .కంఫ్యూషియస్ వేదాంతి సిద్ధాంతం లో మేధాస్సుసరైన న్యాయ నిర్ణయాలు ,తీర్పులుచేయాలని అందుకే మేధావి అంటే కలవరపాటు(పెర్ప్లేక్సిటి) లేని వాడు అన్నాడు .మేధావి  మంచి చెడులపై తన తీర్పుపై తొట్రుపాటు పడరాదు .కానీ ఇది పేర్కొన తగిన సూక్తికాదు.ఇవాల్టి గ్లోబల్ క్రైసిస్ అనైకత ,దయా రాహిత్యం లపై స్థాపించబడింది .ఇదంతా మేధావుల దురాశా, ద్వేషాలపై నిర్మాణమైంది.

           ప్రకృతి

మానవాళి ఈ భూమిపైకి వచ్చిన కొత్త ,పరిపక్వం కాని జీవరాశి  .పరిపక్వత లేనివారు ప్రకృతిని జయి౦చ గలమని అనుకొంటారు .నేను అంతముసలి వాడిని కాకపోయినా ,నాకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు ప్రకృతిని జయించలేరు .అది అసాధ్యం కూడా .మనలో ఏ ఒక్కరికన్నా ప్రకృతి బలీయమైనది ,గొప్పది .మనం డబ్బు బాగా సంపాదించవచ్చు ,చాలా మంది డాక్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు .గొప్ప సంపూర్ణాహారాన్నితినవచ్చు .దంతాలు కట్టించుకోవచ్చు .పిర్రల్ని మార్పించుకోవచ్చు.కానీ మనం ముసలితనానికి దగ్గరవటం చావటం తధ్యం .ప్రకృతి అంటే ఇదే .అది వ్యాధికాదు.ఆరోగ్యకరమైనది . ఈ విషయం మనకు తెలిసినా మర్చిపోతాం మనం .

  జీవులు ఆహార అన్వేషణలో అడవుల్ని సముద్రాలను నాశనం చేస్తూ ఉంటాయి .ఇది ఇలాగే చిరకాలం కొనసాగితే దారుణంగా మారి మహా విపత్తును(కెటోష్ట్రఫీ) కలిగిస్తుంది .దీనికి సాక్ష్యం గా మనదగ్గర సరైన శాస్త్రీయ ప్రతిపాదన ఇప్పటికి లేదుకానీ ,మనందరికీ తెలుసు ,మనం అనుభవిస్తున్నాం కూడా .పాశ్చాత్య పర్యావరణ వేత్తలు దీనిపై గత వందేళ్లుగా చర్చిస్తూనే ఉన్నారు .వాళ్ళకంటే ముందున్న చైనాలోని క్వింగ్ వంశ పండితుడు లియు ఇమింగ్ ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పాడు –మానవ మేధస్సు వేగవంతమైనదీ ,సృజనాత్మకమైనదీ ,కాని తేలికగా నాశనమౌతుంది .దానికి స్వీయ క్రమ శిక్షణ కావాలి ,ప్రకృతిపిలుపును శ్రద్ధ గా వినాలి .అప్పుడే ఒక రకమైన సమతుల్యత ,సామరస్యం ,శాశ్వత ఆనందం లభిస్తుంది .

  కనుక ప్రాకృతి వనరులను నాశనం చేయరాదు .ముఖ్యంగా మానవ జాతి దీన్ని ఖచ్చితంగా పాటించాలి .కానీ వాళ్ళు మనమాట పెడ చెవిన పెడుతున్నారు.కనుక మన తెలివి తేటల్ని పునః రూప కల్పన చేసుకోవాలి .దీనికి మనం ముఖ్యంగా చేయాల్సిందిమనం నాశనం చేస్తున్న  ప్రకృతి మాట వినాలి .

            స్థిరమైన ఊహలు

మొదట్లోనే మనం ఆయిన్ స్టీన్ గురించి చెప్పుకొన్నాం .ఆయనకు సహకరిస్తూ నడిచిన డేవిడ్ బోమ్ –David Bohm లండన్ యూనివర్సిటి దీరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈయన ఫిలాసఫర్,కాస్మాలజిస్ట్  కూడా .ఆయన ‘’చెప్పుకోదగిన గుర్తింపదగిన ఒక ఇంటలిజెన్స్ మనలో ఉంది .దాన్ని దాటి ఇప్పటిమానవులు ఉపయోగిస్తున్నారు .మనం దాన్ని అందుకొక పోవటానికి ముఖ్యకారణం మనకున్నపరంపరాగతంగా సంక్రమించిన అధికారుల విధానాలు అనే  స్థిరమైన భావనలో బందీ గా ఉండిపోవటమే .వీటినే ఆయన ఫిక్సెడ్ అసంప్షన్స్అన్నాడు .ఆర్ధిక విధానాలలో ముఖ్యమైన ప్రమాదం అవి అప్రకటిత ఊహారూపం లో ఉండిపోవటమే .అవి స్వయం సమృద్దినిచ్చేవి స్వయంగా నేరవేర్చేవి అనే విషయం తెలియక పోవటమే.మానవులు తమ ఊహను పరీక్షించుకొని ,అప్పుడు అదే యదార్ధం అనుకొంటారు .కనుక ఇప్పుడు ఈస్థితిలో మనం అన్వేషకులం అవ్వాలి .బుద్ధి ఒక స్థిర అభిప్రాయానికే పాతుకు పోకుండా,ఇరుక్కుపోకుండా  అన్వేషణకు సిద్ధపడాలి.మానవ జాతి చరిత్ర సమస్తం  అపస్మారక స్థితి లో లేక స్థిరంగా ఉన్నఅంటే బ్లాకై పోయిన కదలని ఊహల సముదాయమే .నిజానికి మానవులు  ఈ ఊహలనుంచే మొదలుపెడతారు అవి తమలోనే ఉన్నాయనే స్పృహ లేకుండానే .పగ్గాలకు కట్టి వేయబడినవే ఇవి .మనమంతా ఏదో విధంగా బోనులో లేదా ఉచ్చులో పడిపోయాం అనే ఫీలింగ్ లో ఉంటా౦  అన్నాడు .

  ముఖ్యమైన విషయం ఏమిటి అంటే –మనం సరైన దారిలో నడవటం లేదు వారిని కుట్రపాలు చేయటం లోనే ఉంటున్నాం  .మూడు లోకాల భ్రమ  నాకిష్టం-ఆవే భ్రాంతి ,మాయ ,కలయిక (ఇల్యూజన్, డెల్యూజన్, కొల్యూజన్ )  ఆట అన్నమాట.  తప్పుగా ఆడటం  ఇల్యూజన్ ,అవగాహనతో ఆడటం డెల్యూజన్ ,ఆలోచనతో ఆడటం కొల్యూజన్ .తమ భ్రమలనుఇల్యూజన్ డెల్యూజన్ లను  సమర్ది౦చు కోవటానికి మనిషి తప్పుగా ఆడుతాడు .సమాజమంతా కొల్యూజన్ లోనే అంటే తప్పుడు ఊహలలోనే ఉంది .ప్రతి సమాజం లోనూ ఈ తప్పుడు ఊహలు చాలా ఉన్నాయి .కొందరుమాత్రమే వీటిని ప్రశ్నిస్తారు ,మరికొద్దిమంది మాత్రమె ఇంకొంచెం ఘాటుగా విమర్శిస్తారు .కనుక మనమే మనల్ని తప్పుడు విధానం పైఆదారపడిన ,స్వీయ మోసపూరితమైన ,ఇతరులను మోసపుచ్చే జీవితం విలువ ఏమిటి , అని ప్రశ్నించుకోవాలి  ‘’అన్నాడు లండన్ సైంటిస్ట్ ,ఫిలాసఫర్ కాస్మాలజిస్ట్ David Bohm.

  ఆధారం – అలాన్ హంటర్ వ్యాసం –న్యు ఎరా న్యు డైమెన్షన్

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత

అందుకే నువ్వు నాకు నచ్చావ్ -పేరడి కవిత

వేసవిలో కడుపు ని౦డా తినటాకికి చిన్న రసాలిచ్చావ్

అవిబాగా కాయటానికి నూజివీడు ఆగిరిపల్లి మామిడి తోటలిచ్చావ్

వాటిని దించటానికి ఉగ్గాల పగ్గాలిచ్చావ్ ,రవాణాకు రోడ్లు, లారీలిచ్చావ్

 అందుకే ఓ దేవుడా !నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ .

అమ్మకోటానికి సంతనిచ్చావ్ ,అ౦దులో శివా కొట్టు నిచ్చావ్

కొనటానికి నాన్నకు డబ్బులు ,   బేరమాడటానికి తెలివి తేటలిచ్చావ్

సర్దటానికి  సంచీ నిచ్చావ్ ,సంచీని ,నన్ను మోయటానికి స్కూటరిచ్చావ్

స్కూటర్ జాగ్రత్తగా తోలటానికి రమణ,రమ్య ,చరణ్ డ్రైవర్ల నిచ్చావ్

అందుకే నువ్వు నాకు బాగా నచ్చావ్ .

రసాలు కడిగి  నానబెట్టటానికి మున్సిపల్ పంపు, బకెట్ కూడా ఇచ్చావ్

పెరుగన్నంలో  నంజుకు తినటానికి అవకాశమిచ్చావ్ ,

తినకపోతే నార తీసే  నాన్న నిచ్చావ్ ,పారేస్తే తోలు తీసే తల్లి నిచ్చావ్

అందుకే ఓ దేవుడా నువ్వు నాకు మరింత ఇదిగా నచ్చావ్

హాయిగా జుర్రుకొని తినటానికి చేతులు మూతులు పొట్ట ఇచ్చావ్

 పీకటానికి పీచునిచ్చావ్ ,చీకటానికి టెంక నిచ్చావ్ మడుచుకోటానికి ముడతలిచ్చావ్

తినగామిగిలిన టెంకలు తోళ్ళు పారెయ్యటానికి పక్కన , ఎదురు దొడ్లని చ్చావ్

కానీ ఎందుకయ్యా ఇలా రేట్లు పెంచి చచ్చావ్ ? –

ఏదిఏమైనా ఠంఛన్ గా వేసవి సీజన్ కు అదరహో రసోత్పత్తి చేస్తూ

మమ్మల్ని తినిపిస్తున్న  ఓ దేవుడా !

నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ .

  ఈ పేరడీ కి స్పూర్తి ,రచనా సహకారం –మా అమ్మాయి విజ్జి

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-21-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  -2     జాగృత పరచే మేధస్సు –

కొత్త శకం –కొత్త కొలమానం  -2

    జాగృత పరచే మేధస్సు –

  మానవ మాత్రులమైన నువ్వుకానీ నేనుకానీ,మనతరవాత వచ్చే తరం వాళ్ళు కానీ ఒక విశిష్ట మేధస్సును గ్రహించగలమా అవగాహన చేసుకోగలమా ? గ్రహించటం అంటే ముందుగా ఒకకోత్తదారిని చేరుకోగలమా ?తర్వాత దాన్ని ప్రజలందరికోసం ఉపయోగం లోకి తేగలమా ?ఇది శాంతిఅనే భావనకు చాలా దూరం అని పిస్తుంది .బహుశా యుద్ధం కంటే శాంతి  మేధస్సుకు మరో గొప్ప చెందిన  పరిస్థితి అనుకొంటే ,అదే శారీరక మానసిక౦గా,పర్యావరణ రీత్యా  రోగాలపాలైన మనకు సరైన మందు అని తప్పక నమ్మకం కలిగిస్తుంది .

  రాజకీయ తప్పుల తడక కార్యాలతో శాంతి సాధించలేము .దీనికి ఎందరెందరో మేధావులు అధర్మ యుద్ధాలకు వైముఖ్యం చూపిన ప్రేరణాత్మకమైన ,గౌరవప్రదమైన ఉదాహరణలున్నాయి .ఉదాహరణకు నా జనరేషన్ లోనే అమెరికా చేసిన వియత్నాం యుద్ధం పై అంతర్జాతీయ వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసి ఆ భయానక ఘర్షణ ను నివారించ గలిగింది .కానీ ప్రస్తుతం అంతరిక ,అంతర్జాతీయ సంఘర్షణలు  అంటే పర్యావరణ ,ఆర్ధిక సంఘర్షణలను ప్రజా ప్రదర్శనలతో లేక రాజకీయ క్రియా కలాపాలతో నివారించలేము అని పిస్తోంది .

  పరిష్కార మార్గాలను కనిపెడితే ,అవి సూక్ష్మ౦గా ప్రత్యక్షంగా ఉంటాయి .సంక్లిష్ట సమస్యలు సూక్ష్మ పరిష్కారం ఆశిస్తాయి .వీటికి అత్యున్నతమైన అవగాహన అవసరం .ఇవాళ ఇంటర్ లాకింగ్ గ్లోబల్ సమస్యలనుఅంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి జటిలంగా మారిన వాటిని ‘’సూపర్ కాంప్లెక్స్ ‘’అంటున్నారు .కనుక సమస్యా పరిష్కారానికి అత్యంత సూక్షస్పృహ (సటిల్ కాన్షస్)కావాలి .కనుక మనం అధికమౌతున్న మిలిటరీ ఖర్చు పై ,ఏదో ఒక ప్రత్యెక దేశ౦ దాని రాకీయం లపై నిరసన ప్రదర్శన ,విమర్శలపై దృష్టి కేంద్రీకరించ కూడదు .ఇలాంటి విధానాలు ఇదివరకు మనం చాలా చేసి ఉన్నాం .అవి చెడ్డవీ ,పనికి రానివీ కాకపోయినా ,ఇప్పటి సంక్షోభ నివారణకు వీటికి భిన్నమైన ప్రత్యెక మార్గాలను అనుసరించే సమయం ఆసన్నమైంది .

  తెలివి తేటలు లేక మేధస్సు పదాన్ని మనం  విభిన్న రకాలుగా ఉపయోగిస్తాం .దీనికి ప్రపంచమంతా ఏకగ్రీవంగా అంగీకరించే నిర్వచనం లేదు .స్థూలంగా చెప్పాలంటే బుద్ధియొక్క ఉన్నత మైన స్థితి (హయ్యర్ ఫాకల్టి ఆఫ్ మైండ్ )ఇందులో అవగాహన ,తార్కికత ,నేర్వటం సృజన ,సమస్యా పరిష్కారం ,నమూనాలను గుర్తించట ,విధానం ,నిర్ణయాలుతీసుకోవటం ,అర్ధమయేట్లు వివరించటం ,ప్రజాబాహుళ్య౦తో  సత్సంబంధాలు ఏర్పరచుకోవటం వంటివి ఉంటాయి .ఏదైనా ఒకటి విపత్తు అనిపిస్తే ,,అప్పుడుఅది అత్యవసర పరిస్థితి అని భావించి  మనలోని ఇంటలిజెన్స్ ను మేల్కొల్పి,ప్రజలను జాగృతం చేసి  ,అందరి మనసు బుద్ధి కేంద్రీకరించి అసాధ్యం అన్న దానినుంచి సాధ్యం గా మార్చి ,శూన్యం నుంచి పరిష్కార మార్గం రాబట్టాలి .

  ఇప్పుడు ఇవాల్టి గ్లోబల్ పరిస్థితి మన మేధో శక్తి వైఫల్యమే అని గట్టిగా అర్ధమౌతోంది .మనం సాంకేతిక అభి వృద్ధి చాలా సాధించాం .అందులో చాలా  మేదాశక్తి ని ఆలోచనపరంగా, క్రియా పరంగా నిక్షిప్తం చేశాం .కాని అది మానవాళికి కానీ మన భూగ్రహ సంక్షేమానికి కానీ ఆశావహ ఫలితాలనివ్వలేకపోయింది .చాలా సందర్భాలలో వ్యతిరేక ఫలితాలనిచ్చింది .ఎందుకిలా జరిగింది ?ఇది తెలియాలంటే నాలుగు ముఖ్య విషయాలను తెలుసుకోవాలి మనం .1-మానవ మెదడు పరిణామం చెందిన దాన్ని బట్టి మానవుని తెలివి తేటలు గందరగోళం లో పడిపోయాయి .2-ప్రజ్ఞ అంటే విజ్డం నుంచి ,నైతిక విలువలనుంచి మానవుని ఇంటలిజెన్స్ అంటే తెలివి తేటలు తప్పు దారిలో పడింది 3.మానవ మేధస్సును ప్రకృతికి అణకువగా  మేలు చేసే విధంగా కాకుండా వినాశనం చేసే విధంగా ఉపయోగించం 4-స్థిరమైన అంచనాలలో  మానవ తెలివి తేటలను బంధించేశాం.

  పరిణామం –మెదడు ,చేతనలయొక్క అధ్యయనంలో తేలింది ఏమిటి అంటే పరిణామం ఇంకా శిశు దశలోనే అంటే ప్రారంభ దశలోనే ఉంది .దీనిపై చైనా గొప్ప రిసెర్చ్ చేసి కొత్త విషయాలు తెలిపింది .కాని ఆల్బర్టో విల్లోల్డో అనే యాన్త్రోపాలాజిస్ట్ ‘’మానవ మెదడు కనీసం నాలుగు క్రియాత్మక స్థాయిలనుంచి పరిణామం చెందింది .అవి 1.సరీ సృపాలు 2-క్షీరదాలు 3-నియో కార్టెక్స్ 4-ప్రి ఫ్ర౦టల్ కార్టెక్స్.సరీ సృపాలుకేవలం బతకటానికి సంరక్షి౦చు కోవటానికి  ఎదురుదాడికి ,ఆహారసంపాదనకు ,దాంపత్యానికి తమ శక్తుల్ని ఉపయోగిస్తాయి .లిమ్బోనిక్ లేకమామల్స్ లేక క్షీరదాలు మనపూర్వీకులైన నియండార్తల్స్ పాలిచ్చి   తమసంతానాన్ని వృద్ధిచేస్తాయి .వాటిలో సాంఘిక బాంధవ్యం ఉంటుంది .బతకటానికి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉంటాయి.చిన్న చిన్న పరికరాలు చేయటం ,ఆహారం నిలువ చేయటం ,వలస వెళ్ళటం ,పోట్లాడటం ,ఆవాసాల నిర్మాణం చేయటం లో తెలివి తేటలు చూపించాయి .వీటి మెదడు 2లక్షల ఏళ్ళ క్రితపు  సరీసృపాల బ్రెయిన్ కంటే వృద్ధి చెందిదన్నమాట .మానవుడు నిప్పు రాజేయటం వండటం నేర్చుకోవటానికి 50వేల సంవత్సరాలు పట్టింది .నియో కార్టెక్స్ స్థాయి కి చేరి పరికరాలు చేయటం సృజనాత్మక కళ లాంటి సంజ్ఞా విధానం ,గణితం వంటి విప్లవాత్మక మార్పులు పొందాడు .ఈ స్థాయినుంచి  ప్రి ఫ్రంటల్  కార్టెక్స్ స్థాయికి రావటానికి 6వేల ఏళ్ళు పట్టింది  .ఈస్థాయిలో సెటిల్ మెంట్లు ,రాతకోతలు ఖగోళ విజ్ఞానం మొదలైనవి అబ్బాయి .ఇదంతా చాలాపెద్ద టాపిక్ .కానీ జీవులుగా మనం ఇంకా పరిణామ యొక్క సంక్లిష్టత ను జీర్ణం చేసుకోలేక పోయాం .ఒక్కోసారి మనం త్రాచుల్లా విరుచుకు పడతాం .ఒక్కోసారి మనలో మనమే కోతుల గు౦పుల్లా పోట్లాడుకొంటాం  .ఒక్కోసారి చాలాఉదారంగా ,సంరక్షణ చేస్తాం .సరీ సృపాల, క్షీరదాల బ్రెయిన్ చర్యలు బాధాకరం బాల్య చేష్టలఅనుభవాలకు ప్రతిబింబాలై ,ఆకలి ,యుద్ధం ను ఎదుర్కోటానికి మనలోని చేతనను తార్కిక భావంతో ము౦చేస్తాం .మనలోని తటస్థ నెట్ వర్క్ లు తీవ్రంగా దెబ్బతిని క్షీణించి పోయి ఉంటాయి .మన ప్రపంచం ప్రమాద భరితంగా భయానక పర్యావరణంగా అనిపిస్తుంది .భయ పెడుతున్నట్లు , మనల్ని తేలికగా నచ్చచేప్పి ఒప్పిస్తున్నట్లు అనిపిస్తుంది .అందుకని మన రక్షణకోసం పోరాడాలని పిస్తుంది .సుదూరమైన గతం లో మన జీవితం లో కొంత ఇరుక్కుపోయాం . అంతర్గతంగా  నాడీ మండల స్థాయి లో కూడా మనం సంక్లిష్టం జీవులం .

  ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యు ఎరా న్యు డైమెన్షన్

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆనందయ్య మందు

ఆనందయ్య మందు…. పచ్చడేనా ?

1.నాది 30 యియర్స్ ఆయుర్వేదం ఇండస్ట్రీ.. మా’ అమ్మ ‘ తోడు అన్నిటికీ ఇదే మందు….
2.ముందు అద్భుతహా వేస్తే పడుకొన్న వాడు పరుగేత్తటమే అని… ఈ మందు కృష్ణ పట్టు అంటే …రోజుకు పాతిక వేల కార్లు
3.మందు సంగతి పక్కన పెట్టీ వచ్చిన వాళ్ళ మూలం గా కరోనా అని లాక్ వేసిన లోకాయుక్త.
4. అది పచ్చి పసరు మందు టీవీ9 అది వేస్తే ఇంక GGH కే.. అని ప్రచారం వీడియోలు లైవ్ మాస్క్ వేసుకొని సెట్లో మూస్కొని రచ్చ రచ్చ చెయ్యడమే పని..
.5. ఆకులను మేము టెస్ట్ చెయ్యము పొమ్మన్న ఇసిఎంఆర్
6 పంచటానికి మళ్లీ ప్రయత్నం చేస్తే ఏమీ చెల్లని కా ‘ కాని ‘ లేని బోణీ..
7. జగన్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి .400 బకెట్స్ బొక్కేసారు. వండి వార్చి పంచిన పచ్చ మీడియా…
8.అది ఆయుర్వేదం కాదు కానేరదు కానీ మేమే సర్టిఫై చెయ్యాలి మందు కు ఆయుష్ పోయని రాముడు….
9.అది నాటు మందు కాదు నేటి మందు అని మీడియా ముందు తొడ కొడుతున్న నాటు మేధావులు.
10. చక్కగా చల్లగా వినోదం చూస్తున్న హా హా హా ఆల్లో పతి
11. మీరు ఆ మందు పంచితే మా యునాని. కల్వ్ కొబ్బరి నూనె కూడా ప్రజలు వద్దన్నా మీరే పంచాలి అంటూ ప్రభుత్వం పై కత్తులు పెట్టిన సెక్యులర్ సున్నాలు.
12 ఇంక ఇచ్చేస్తారు రిపోర్ట్ మందు హాని లేదు పని చేస్తే మీ అదృష్టం . మాకు సం.. .బంధం లేదు ఢిల్లీ ఐసీఎం … ఐ స్
13. ఇంకా ఏమిటి ఆలస్యం ? మాకు పెట్టకుండా ఎలా తీర్పు ? ఎప్పుడూ కలం తో మొట్టికాయలు వేసేందుకు మేము ఎప్పుడూ రెఢీ హైకో…
14 పాలన అంతా అరచకమే మహానాడులో తీర్మానం చేశాము పైన పసుపు చల్లి వెంటనే పంపిణీ చెయ్యాలి అని.. నా తీర్మానం మీకు శాసనం జూమ్ బా.
15 సరుకు లేదు ఆకులు పువ్వులు లేవు కానీ కృష్ణుడు నీలం మాది నీలం అని కృష్ణ ..పట్నం మొత్తం బులు గు
టెంట్లు బలుగు కర్రలు. బులు గు జెండా లు. బులు గు బక్కెట్లు దింపేసారు
16. తిరుమల రండి లడ్డూ బదులు ప్రసాదం గా ఇచ్చేస్తం …’ చెవి ‘ కోసిన …. మే …
17.ఎంత కష్టం నష్టం ఉన్నా ఆన్నియ చిరు నవ్వు (మాస్క్ తో ముయ్య రు గా) చెరగలేదు.

చివరిగా ఇదే ఆనందయ్య పచ్చి/ పసరు./నాటు./కాని ఆయుర్వేద ).. /ఆకుల తొక్కు../ మూలికా మసాలా/ ఘాటు పేస్ట్ / గట్టి కషాయం/.. ప్రసాదం./. ఆ మందు/ … చివరికి పచ్చడి పచ్చడి ..అయ్యిందా చేసేసారా?????

Posted in రచనలు | Tagged | Leave a comment

కొత్త శకం –కొత్త కొలమానం  

కొత్త శకం –కొత్త కొలమానం

కరోనా వైరస్ వలన మానమంతా ఒక కొత్త విషయానికి అలావాటు పడ్డాం .మళ్ళీ మన ముసలి తలిదండ్రులయెడ అలాగే ఉందామా ?కొత్త ఆలోచనలకు ,నూతన అవగాహనలు ఇదే మనకున్న మంచి అవకాశం .మానవులం గా మన పాత పద్ధతులను మార్చుకోవాల్సిన తరుణం .సమూల మార్పుకోసం ఆలోచంచాల్సిన సరైన సమయం ఇదే అని మర్చి పోరాదు.సమాజం,శాంతి లపై కొత్త దృక్పధం ఇప్పుడే రావాలి .

 మానవులం గా మనం ఉన్నతమైన విజ్ఞానానికి శిక్షణ ,పెంపకం ఇచ్చుకోవాలి .సమస్యలను హాయిగా పరిష్కరించుకొనే బుద్ధి మానవ జాతికి పుష్కలంగా ఉంది .కాని ఏవేవో కారణాలవలన అది మూసుకు పోయింది లేక గందర గోళం లో పడిపోయింది .ఆణుశక్తి ఉత్పాదన తర్వాత ప్రముఖ సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ‘’అణుశక్తి కనిపెట్టిన తర్వాత మన జీవిత విధానం తప్ప అంతా మారిపోయింది .మనం భావనకు అందనంత సంక్షోభం లోకి నెట్టి వేయబడుతున్నాం .కనుక ఇప్పుడు  మానవాళి బ్రతకటం కోసం మనకు కొత్త ఆలోచనలు రావాలి ‘’అన్నాడు .

  ఇప్పుడు మనం కోవిడ్ 19వైరస్ ప్రభావం లో ఉన్నాం .అది మానవ జీవిత విదానాలన్నటిపైనా తీవ్ర ప్రభావం చూపింది .దీని విపరీత పరిణామం కోట్లాది జనులకు ధనాదాయం లేక ,ఆరోగ్యంలేక , చివరికి ప్రాణాలు కోల్పోవటం జరిగింది.గ్లోబల్ సొసైటీ సహకారం లేకుండా ఈ సంక్షోభం నుంచి మనం బయటపడలేము .అందుకని మనం కొత్త నిర్వాహక విధానం అంటే మానెజీరియల్ అప్రోచ్ ను స్వీకరించాం .లేక మనం నిజం గా లోతైన మార్పుల్ని చూస్తున్నామా ?ఏ ఆకస్మిక విపత్తయినా ,మనకు పునరాలోచనకు అవకాశమిస్తుంది .అందుకే మనకు కొన్ని ఆశావహ  ధనాత్మక మార్పులు కనిపిస్తున్నాయి .ఉదాహరణకు కమ్యూనికేషన్ తగ్గటం ,కుటుంబంతో హాయిగా గడిపే సమయం పెరగటం ,పచ్చదనాన్ని పెంచుకోవటం ,గాలి కాలుష్యం తగ్గిపోవటం .అంతేకాదు డబ్బుతో  మాత్రమె సంతోషాన్ని ఆరోగ్యాన్ని కొనుక్కో వచ్చు  అనే భ్రమ తొలగింది .సంక్షేమం  కోసం డబ్బుబాగా ఉపయోగపడుతుందని తెలుసుకొన్నాం .కొన్ని ప్రభుత్వాలు తమ ప్రజల ఆరోగ్యం ,భద్రత లపై కాకుండాతమ ఆర్ధిక స్థితిని పెంచుకోవటం లో శ్రద్ధ చూపాయి .

  వైరస్ అనేది మెడికల్ ,సోషల్ కూడా ..సందర్భాన్ని బట్టి విజ్రుమ్భిస్తుంది .ఇవాల్టి పరిస్థితిలో గ్లోబల్ పర్యావరణం ,మానవ సమాజం  విపరీతమైన పెళుసుతనం అంచున (ఫ్రగైల్)ఉన్నాయి .ప్రతి ఏడూ అత్య౦త శక్తివంతమైన కొత్త టెక్నాలజీ ని అభి వృద్ధి చేస్తూనే ఉన్నారు .యువత ఇదివరకు ఎన్నడూ లేనంత నూతన  సాంకేతిక విద్య నేరుస్తూనే ఉన్నది.కానీ  సహజ ప్రకృతి వనరులు అంటే అడవులు, పచ్చగడ్డిమైదానాలు ,నదులు సముద్రాలు అన్నీ పూర్వం కంటే అధికమైన దారుణ స్థితిలో ఉన్నాయి .ఆహరం మంచినీరు ఆరోగ్యం ,శక్తిజనకాలు ,భద్రతా మొదలైనవి దినదిన గండంగా జీవితం గడిపే కోట్లాది మానవులకు గగన కుసుమంగా ఉంది.నిరక్షరాస్యులు ,యేవో నాలుగు అక్షరాలూ నేర్చినవారి బతుకులు ఆరోగ్య హీనంగా  గాలి బతుకులైపోయాయి .విద్యా ఆరోగ్యభద్రత వారికి అందుబాటులో లేనేలేవు.చాలా ప్రాంతాల్లో విపరీతమైన హింస రాజ్యమేలుతోంది .బుద్ధిజీవులైన మానవులు యుద్ధ ప్రాంతాలలో ,శరణార్ధ శిబిరాలలో జీవితాలను వ్యర్ధం చేసుకొంటున్నారు .

  మనం ఈ లోకానికి ఎలా వచ్చామో అర్ధం చేసుకొంటే ,మనం సర్దు బాటుకు  అలవాటు పడతాం .ఈ విషయం లో కరోనా వైరస్ మనకు జ్ఞాన కాంతి నిస్తోంది .అధిక, అనవసర ప్రయాణాలు ,మైనారిటీల భోగ విలాస జీవితం,గృహం ఆరోగ్యం ,ఆదాయం లో విపరీతమైన వ్యత్యాసాలు ,ఆధార వలయాలు ,ఆలోచనలేని  అర్ధరహిత ప్రభుత్వ నిర్ణయాలు ,స్థూల కాయత్వం –ఒబీసిటి,కాలుష్యం మొదలైన భౌతిక విషయాలపై అవగాహన బాగా పెంచుకొనే సావకాశమిచ్చింది  .

  పరిస్థితి విపర్యం పారడాక్సికల్ గా ఉంది. కారణం ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలోఅంటే విద్యా వైద్య పారిశ్రామిక రంగం లోని  పని చేసే వారంతా తమకు తమ తోటి వారికీ  యుద్ధం కంటే శాంతినే కోరతారు .ఆకలిబాధతోమరణం కంటే సంక్షేమమే వా౦ఛిస్తారు  ,రోగాలకంటే మంచి ఆరోగ్యాన్నే కోరుకొంటారు .సద్భావన ,ప్రయత్నలోపం వలన సంక్షోభం తలెత్తదు.పరిస్తితులు చాలా సంక్లిష్టమై ,అధిగమించరానిదై అఖండమై తామే సృష్టించుకొన్న సంక్షోభాన్ని ఉపశమింప జేసుకోవటానికి   అధిగమించటానికి శక్తికి మించినదైఉంటుంది .బ్రేకులు లేని రైలు అగాధం అంచుకు చేరితే ,దాన్ని సారైన సమయం లో ఆపటానికి ఎవరూ సమర్ధులు కాలేరు

  అయినా మనకు ఇంకా ఒక అవకాశం ఉంది .ట్రెయిన్ ను ఆపవచ్చు బ్రేకుల్ని రిపైర్ చేయచ్చు .రైలు మార్గాన్ని వెనక్కి మరల్చవచ్చుకూడా ,వీలయితే నడిపే డ్రైవర్ ముసలాడు అయితే అతడిస్థానం లో వేరొకర్ని నియమించవచ్చుకూడా . మానవులు అఖండ మేధావులు అపూర్వ సృష్టికర్తలు .అద్భుత చాతుర్యం కలవారు .మరోఉత్కృష్ట  ప్రపంచ నాగరకత ను సృజి౦ప గలరు ,ఇప్పటికే మనం సాంఘిక సంక్షేమం ,స్త్రీవాదం ,పచ్చదనం పరిశుభ్రత ,శాంతి క్రియాశీలత ,అంతర్జాతీయ సహకారం మొదలైన మార్గాలను  ప్రయత్నించాం .కాని దురదృష్ట వశాత్తు అవేవీ పని చేయటం లేదు అనుకొన్న ఫలితాలు కల్గించలేదు .ఒకవేళ అవి బాగా పని చేసి ఉండక పోవనూ వచ్చు .సంక్షోభాన్ని అతిపెద్ద ఎత్తున నివారించే సమర్ధత చూపించలేక పోవచ్చు .ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు మళ్ళీ  ఆ మూస విధానాలనే అనుసరించటం విజ్ఞత అని పించు కొంటు౦దా?ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసి పునరాలోచించుకొనే అత్యవసర సమయం వచ్చిందని మనమందరం గ్రహించాలి

సశేషం

ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యూ ఎరా న్యు డైమెన్షన్

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య (చివరి భాగం )

స్త్రీలకు సన్యాసాశ్రమ౦ -2 చివరి భాగం )

 ఆనాటి బ్రహ్మవాదినులు పొందిన విద్యా వైదుష్యాలు,ప్రతి వాదం చేసే నేర్పు ,రచనా కౌశల్యం ఆశ్చర్యం కలిగిస్తాయి .వారిలో ముఖ్యంగా ‘’గోధా ఘోషా విశ్వవారా పాలోపనిషత్ –బ్రహ్మ జాయా జాహుర్నామా గన్తవ్య స్వ సాధితిః-ఇంద్రాణి చేంద్రమాతా చ సరమా రోమ శోర్వరీ ,లోపముద్రా చ సద్యశ్చయామీ నారీ చ శాశ్వతీ –శ్రీ ర్లాక్షా సర్వ రాజ్ఞీ వాక్ శ్రద్ధా మేదాచ దక్షిణాః-రాత్రిం సూర్యాచ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః’’అని ‘’బృహద్దేవతః’’ లో చెప్పబడింది .గోధా ,ఘోషా ,విశ్వవారా ,ఆపాల ,ఉపనిషత్ ,బ్రహ్మపత్నీ ,,అగస్త్య సోదరి ,జుహూ ,ఇంద్రాణి ,ఇంద్రమాతా సరమా ,రోమశ ,ఊర్వశీ ,లోపాముద్రా ,సదలయామీ ,నారీ ,శాశ్వతీ, లాక్షా సర్వరాజ్నీ వాక్ ,శ్రద్ధా ,మేధా దక్షిణా ,రాత్రి ,సూర్యా ,సావిత్రి మొదలైన వారంతా బ్రహ్మవాదినులే .వీరిలో గోదా తపస్విని యై ఋగ్వేద మంత్రాలను 10,134-7 కర్త్రిగా స్తుతి౦పబడింది ,,క్షత్రియ కుమారి ఘోషా బ్రహ్మ చర్యం లో ఉంటూ తనకున్న కష్టు రోగాన్ని కొన్ని మంత్రాలతో నివారించుకొన్నది ఆమంత్రాలే10-39,40-1,117-7 రుక్కులయ్యాయి . అత్రి మహర్షివంశానికి చెందిన విశ్వవార యజ్ఞాలు చేస్తూ ,చేయిస్తూ , ఆరు రుక్కులకు 5,28,3కర్త్రి అయిన మహా మేధావిగా పేర్కొనబడింది ఆత్రి ముని కూతురు ఆపాల అనే బ్రహ్మవాదిని వివాహం చేసుకొని బొల్లి ఉండటం చేత భర్త పరిత్యజిస్తే ,జనకరాజు ను ఆశ్రయించి ,తపస్సు చేసి ,ఇంద్రుని స్తుతించి ఆయన అనుగ్రహం తో బొల్లిని పోగొట్టుకొన్నది .ఆ వ్యాధి నివారక మంత్రాలు 5-28,3-8,30-7వేదం లోకి చేరాయి .యజ్ఞాలు నిర్వహించటం లోనూ ఆమె ప్రతిభ అగణితమే సోమయజ్ఞంచేసి స్త్రీల యజ్ఞాదికారత్వాన్ని సుస్తాపితం చేసింది అగస్త్యముని సోదరి జుహూ బ్రహ్మవాదిని భర్త బృహస్పతి చేత త్యజి౦పబడి ,తన తపో బలం తో మళ్ళీ భర్తను చేరింది .బ్రాహ్మవాదినిగానే జీవితం గడిపింది ఈమె ప్రార్ధనలు 10,11-6 రుక్కులయ్యాయి .

            ఇంద్రుని తల్లి అదితి ,ఇంద్రుని భార్య శచీ దేవి ఇద్దరూ బ్రహ్మవాదినులే అని ఋగ్వేదం లోని 10,49,153,10-145,2 తెలియ జేస్తున్నాయి. రోమశ కూడా ఋగ్వేద మంత్రాలు 1,125-7కు కర్త్రి అగస్త్యమహర్షి ధర్మపత్ని లోపాముద్ర చేసిన స్తుతులు రుగ్వేదంలో ప్రఖ్యాతాలైనాయి .అంగిరస మహర్షి కుమార్తె  శాశ్వతి కూడా ప్రముఖ ఋగ్వేద 8-1,34మంత్ర కర్త్రి-,సర్వ రాజ్ఞి బ్రహ్మవాదిని అగ్ని సూత్ర మంత్ర -10,1899నిర్మాత .ఈమె యజ్ఞ యాగాదులకు అధ్యక్షత కూడా వహించేది అ౦భ్రిణ మహర్షి కుమార్తె వాక్ అనే బ్రహ్మవాదిని ఋగ్వేదం లో జీవ  బ్రాహ్మైక్యాన్నిప్రతిపాదించే మంత్రాల నిర్మాత. ఆమె సూక్తాలలో దేవీ సూక్తం ముఖ్యమైనది-10-125,1,4 .ఈమె సాక్షాత్తు సరస్వతీ స్వరూపం కనుక వాగ్దేవి అనే పేరుతొ పిలువబడేది ఋగ్వేదం -10-151,1.శ్రద్ధాళువైనఒక బ్రహ్మవాదిని మంత్రాలను దర్శించి శ్రద్ధా అనే పేరుపొందింది .ప్రముఖ సన్యాసిని అయిన ఈమె యజ్ఞాలు చేస్తూ చేయిస్తూ ఉండేది .

   రాత్రి సూక్తాన్ని రచించిన బ్రహ్మవాదిని రాత్రి అనే పేరుతోనే ప్రసిద్ధమైంది .రుగ్వేదంలో 10-85రుక్కు కు కర్త్రి సూర్యా .సుకన్య ముసలి వాడిని పెళ్ళాడి బ్రహ్మవాదిని అయి ,విరాజిల్లింది .శచీ పౌలోమి ఋగ్వేదం 10-159 మంత్రం కర్త్రి అయిన బ్రహ్మవాదిని ..బృహదారణ్యక ఉపనిషత్ లో ప్రశస్తి పొందిన మైత్రేయి ,కాత్యాయని ,గార్గి ఉన్నారు .యాజ్ఞ్య వల్క్య మహర్షి భార్యలైన మైత్రేయి ,కాత్యాయని భర్త ఆశ్రమ సంరక్షకులు కూడా .మైత్రేయి శిష్యుల విద్యా విషయాలను పర్యవేక్షిస్తూ భర్తకు శ్రమ తగ్గించేది. గార్గి శ్రేష్ఠ బ్రహ్మవాదిని అని జగద్విదితమే .పడవా పాత్రి దేయం అనే బ్రహ్మవాదిని ,శాండిల్యముని పుత్రిక స్వయం ప్రభ గొప్ప తపస్వినులు .దేవశ మహర్షి కుమార్తె సువర్చల శ్వేతకేతుడిని పెళ్ళాడి బ్రహ్మవాదినిగా పేరు పొందింది .

   ఈ విధంగా శంకరా చార్యకు పూర్వమే అనేకమంది  బ్రహ్మవాదినులు ఉండేవారు. కొన్ని చోట్ల భర్తల పేర్లు ఉన్నప్పటికీ ఆ భర్తలు సన్యసించటం కాని ,చనిపోవటం కానీ జరిగి సన్యాసం తీసుకొని ఉంటారు .స్త్రీలకూ ఋషులతో పాటు సర్వాధికారాలు ఉన్నట్లు విదితమౌతోంది .పతంజలి మహర్షి స్త్రీసన్యాసినులకు శ్రమణా,పరివ్రాజితా ,తాపసి ,కుమారాశ్రమణా అనే పేర్లు పెట్టాడు శంకరానంతరం కూడా స్త్రీలు .సన్యాసాశ్రమాన్ని తీసుకొని ,విద్యాధ్యయనం చేసినట్లు చరిత్ర ఉన్నది .జ్ఞాన స్వరూపమైన వేద శాస్త్రాలు ‘అభేద దర్శనం జ్ఞానం ‘’అనే మైత్రేయ ఉపనిషత్ సూక్తి చేత పక్ష పాత దృష్టితో వ్యవహరించకుండా ‘’వర్ణాశ్రమ మాచార యుతావిమూఢాః-కర్మాను సారేణఫలం లభంతే-వర్నాది ధర్మం హి పరిత్యజంతః స్వానంద తృప్తాః పురుషా భవంతి’’అని మైత్రేయ ఉపనిషత్ లో చెప్పినట్లు వర్ణాశ్రమ ఆచారం తో ఉన్న మూఢులు కర్మాను సార ఫలితాలను పొందుతారు వర్ణాదులను త్యజించిన వారు తృప్తులై బ్రహ్మాన్ని పొందుతారు అంటే జ్ఞానాస్వాదనానికి అందరూ అర్హులే అన్నారు శ్రీ అనుభవానంద స్వామి .

  ఆధారం –శ్రీఅనుభవాన౦ద స్వామి రచించిన –‘’సకల సిద్ధాంత సౌరభం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-5-21-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య స్త్రీలకు సన్యాసాశ్రమ౦

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

స్త్రీలకు సన్యాసాశ్రమ౦

ఉపనయన సంస్కారం శూద్రులకు లేదుకనుక వారు సన్యాసానికి అనర్హులు అనే వాదం ఉంది కానీ పూర్వకాలం లో స్త్రీలకూ ఉపనయనం మొదలైన సంస్కారాలు ఉండటం చేత గురుకులం లో ఉంటూ వేదాధ్యయనం చేసి నిష్ణాతులై వేద సభలలో చర్చా గోష్టులలో పాల్గొనే వారు .’’పురా కల్పే కుమారీణాంమౌ౦జీ బంధన మిష్యతే –అధ్యాపనం చ వేదానాం,సావిత్రీ వచనం తధా’’అంటే పూర్వం బాలికలు ఉపనయన సంస్కారం పొంది వేదాలు నేర్వటం బోధించటం లో ,సావిత్రీ మంత్రాన్ని జపించటం లో అధికారులై ఉన్నారు అని ‘’యమ స్మ్రుతి ‘’పేర్కొన్నది  ‘’.’’యత్తు హారీ నోక్తం ద్వివిధాః స్త్రియో బ్రహ్మవాదిన్యః సద్యో వద్యశ్చ తత్ర బ్రహ్మ వాదినాం ఉపనయన మగ్నీన్ధనం,వేదాధ్యయనం స్వగృహే చ భిక్షా చర్యేతి’’.హారీతుని వాక్యం ప్రకారం స్త్రీలు బ్రహ్మవాదినులని ,సద్యో వధువులు అని రెండు రకాలు .బ్రహ్మ వాదినులకు ఉపనయనం అగ్నికార్యం వేదాధ్యయనం స్వగృహం లో భిక్షా చర్య కలిగి ఉన్నారని హరీతధర్మ సూత్రం తెలియ జేసింది .అందుకే ఆర్ ఆర్ దివాకర్ ‘’It is now usually admitted that the Upanayana  ceremony  is Vedic and was common t both boys and girls ‘’ఉపనయనం వైదికమై బాల బాలికలందరికి సామాన్యం గా ఉండేదని ,కనుక ప్రస్తుతం అంగీకారమే అని డా.ఆర్ ఆర్ దివాకర్ ప్రబుద్ధ భారత లో రాశాడు .సిజి బిస్వాస్ కూడా ప్రబుద్ధ భారత లో ‘’శాస్త్రాధ్యయనానికి ముందు బాలికలు కూడా ఉపనయనం పొందాలి అనే నియమం కూడా ఉందని రాశాడు.’’బ్రహ్మ చర్యేణకన్యా యువాన౦ విందతే పతిం’’బ్రహ్మ చర్యాశ్రమం చేత కన్య యువకుడైన భర్త ను పొందుతోంది అని అధర్వణ వేద వాక్యం .బృహద్దేవత  సూత్ర ప్రకారం ‘’నైష్టికులై తురీయాశ్రమాన్ని తీసుకొంటే ,బ్రహ్మ వాదినులనీ ,గృహస్తాశ్రమ౦  తీసుకొంటే సద్యో వదువులని పిలువబదేవారు .కనుక వేదాలలో స్త్రీలకూ ఉపనయన  వేదాధ్యయన యుక్త బ్రహ్మ చర్య ,ఆతర్వాత వారి ఇష్టప్రకారం బ్రహ్మవాదినిగా సన్యాసం ఉన్నాయని తాత్పర్యం.

  మహా భారతం శాంతి పర్వం లో ‘’భిక్షుకీత్య నేనా స్త్రీణామపిప్రాగ్వివాహాద్వావైధవాచూర్ధ్వం సంనాసాధి కారో స్తీతి దర్శితం –తేన భిక్షా చర్యం మోక్ష శాస్త్ర శ్రావణ మేకాంతేఆత్మా ధ్యానం చ తాభిరతికర్తవ్య౦త్రి చ దండాదికంచ ‘’అంటే స్త్రీకి పెళ్ళికాక ము౦దు,వైధవ్యం కలిగిన తర్వాతకానీ కాని ,సన్యాసాశ్రమ అర్హత ఉంది .దీని వల్ల భిక్షాచర్యం ,వేదాంత శ్రవణం ఏకాంతవాసం లో ఆత్మ ధ్యానం అర్హతలు లభిస్తాయి .త్రిండడం ధరించి సన్య సి౦చటం కూడా ఉంది.’’సులభ’’ అనే  భిక్షుణి గురించి పేర్కొన్నది .’’అటంత్యా’’లో పరివ్రజకత్వాన్ని తెలియజేస్తూ ,’’తత్ర తర శ్రుతోమోక్షో కధ్యమాన త్రిదండినః’’ఆమెకు త్రిదండ ధారణాదికారం కూడా ఉన్నది అన్నది.ఇది తెలిసి జనకమహారాజు ఆమెను బ్రాహ్మణ  బ్రహ్మవాదినిగా భావించి ,సత్కరించి ,గౌరవించి ,ఆతర్వాత ఆమె క్షత్రియ స్త్రీ అని ఆమె వల్లనే తెలుసుకొన్నాడు .కనుక ఆకాలం లో బ్రాహ్మణ క్షత్రియ బ్రహ్మ వాదినులు ఉన్నారని తెలుస్తోంది .ఆర్ ఆర్ దివాకర్’’మహాభారత కాలం లో కూడా కురుక్షేత్రం దగ్గర ఒక ఆశ్రమం లో ఒక బ్రాహ్మణ కన్య యోగ శక్తులను పొంది తపస్సిద్ది సాధించింది ‘’అని రాశాడు ప్రబుద్ధ భారత లో .

  వేదాలలో వేదేతర గ్రంథాలలోబ్రహ్మ చారిణి ,తాపసి ,సిద్దా అనే పేర్లతో పిలువబడే వారు కనుక పురుషులతోపాటు స్త్రీలు కూడా సరి సమానంగా ఆధ్యాత్మిక సాధన ,వేదాధ్యయనం చేసేవారు అన్నాడు దివాకర పండితుడు ‘’The intellectual eminence of women was proved by her capacity for debates and discussions in the royal courts and in Samitis and  Sabhas ‘’రాజాస్థానాలలో సమితులు పండిత సభలలో ప్రసంగించి చర్చించటం స్త్రీ శక్తి సామర్ధ్యాల మేధా ఔన్నత్యాలను గుర్తించే జరిగి నిరూపితమైంది ‘’అన్నాడు డా కాళిదాస నాగ్ –ప్రబుద్ధ భారతి లో .

ఆరణ్యక ,ఉపనినిషత్తులలోఉన్న వైదిక వాజ్మయం లో బ్రహ్మవాదినులు అని పేరొందిన స్త్రీ ఋషులచే దర్శి౦ప బడిన అనేక వైదిక మంత్రాలను జాగ్రత్త చేయటం చేత ,ఆస్త్రీ బ్రహ్మవాదినుల ఆధ్యాత్మిక ఔన్నత్యం ఇనుమడించింది అని కాళిదాస నాగ్ స్పష్టంగా రాశాడు. ఏ.సి బోస్ కూడా ‘’వేదాధ్యయనానికి స్త్రీలకుఅర్హతలెదనటం చరిత్రను  దూషించట మే’’అన్నాడు .

  మరిన్ని విషయాలు మరోసారి

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

సశేషం

బుద్ధ, అన్నమయ్యజయంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

దుఖానికి ముఖ్యకారణం ఒక శరీరాన్నుంచి ఇంకొక శరీరానికి సంక్రమించే అంటే పరకాయ ప్రవేశం చేసేదే అంటే సంసారమే .బృహదారణ్యక ఉపనిషత్ లో దీన్ని బాగా వర్ణించారు .పుట్టుక అంటే ఏమిటి ?జీవి శరీర౦, అవయవాలు పొందుతాడు. వాటినే పాప్మాలు అంటారు .అవి సంక్రమించాక చెడు భావాలు వ్యాపిస్తాయి .అవే దుఖాలకు కారణాలౌతాయి.చావు అంటే ఏమిటి ?జీవి శరీరాన్ని ,అవయవాలను వదిలటమే మరణం . ఇది ఎలా జరుగుతుంది ?బాగా బరువుతో నిండిన బండి  ఘర్షణకు లోనై కీచు ధ్వని కల్గి౦చినట్లు ,జీవుడుకూడా శ్వాస అందక యేవో అస్పష్ట శబ్దాలు చేస్తూఉండగా ఊపిరి ఆగిపోవటమే చావు .శరీరం దుర్బలమై  ముసలితనం తోనో జబ్బులతోనో  కృశించి పోతుంది .పండిన పండు చెట్టును వదిలి రాలిపోయినట్లు ,జీవికూడా శరీరం లోకి ఎలా ప్రవేశించాడో అలాగే అందులోఉండే అన్ని అవయవాల నుంచి విడివడి  బయటికి వెళ్ళిపోతాడు .శరీరగతమైన జీవి చావుకు ముందు బాధలతో అనేక శబ్దాలు చేస్తూ,జీవపదార్ధమంతా ఖర్చైపోగా ఊపిరి పీల్చుకోవటానికి నానా బాధలు పడుతూ ,జ్ఞాపకశక్తికోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉంటాడు అని   శంకరాచార్యులు వివరించారు.

  కస్టాలు, అశాశ్వతత్వం లతో ప్రపంచం ఏర్పడింది అని భగవద్గీత చెప్పింది –‘’అనిత్యం అసుఖం లోకం ఇమాం ప్రాప్య భజస్వమాం’’.అశాశ్వతత్వాన్ని బోధిస్తూ ఒకే ఒక విషయం దుఖం ,దాని విరమణ ‘’గూర్చే చెప్పాను అన్నాడు భగవాన్ .దుఖం అంటే భౌతిక ,మానసికమైనది కాదు .బౌద్ధమేధావి’’ ప్రియదర్శి తేరా’’చెప్పినట్లు అసాధారణమైన అస్తిత్వం యొక్క అసంతృప్తి విధానమే దుఖం .బుద్ధుడికి ఆయన సందేశాలకు అర్ధం దుఖాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం ,ఈ అసంతృప్తులనుంచి బయట పడటం మాత్రమె .బౌద్ధ సిద్ధాంతం నిరాశావాదమూ కాదు, అశావాదమూ కాదు .కానీయదార్ధమైనది .దుఖం అనేది జీవితం లో మూల తత్వమే .అశాశ్వతాలు, అసంతృప్తి కారకాలను పట్టుకొని వ్రేలాడటమే దుఖం.జీవితాన్నీ ,లోకాన్నీ నిజస్వరూపం లో అర్ధం చేసుకోవటానికి తోడ్పదేదే దుఖం .

  ‘’లామా సూర్య దాస్ ‘’అనే పండితుడు దుఖ స్వభావాన్ని బాగా వర్ణించాడు .ప్రతివాడూ దుఖంతో బాధపడుతున్నాడని బౌద్ధం చెప్పలేదు .బౌద్ధం ప్రకారం జీవితం అంటే కష్టతరమైనదీ అసంపూర్తిగా ఉండేది  ‘ఇదే జీవితం యొక్క స్వభావం .ప్రపంచంలో సుఖ సంతోషాలను త్రోసిపుచ్చాలని బౌద్ధం చెప్పలేదు  .అయితే ఈ సంతోషం అశాశ్వతం ,మార్పు చెందేది అని బోధించింది .ఈ అశాశ్వత  స్వభావం వలన ,మనం అనుభవించేది అంతా మూల దుఃఖ భాగమే ,అసంతృప్తి నిచ్చేదే .సంతోషంగా ఉన్నప్పటికీ దుఖం ,అసంతృప్తి వెంటనంటే ఉంటాయి అని బౌద్ధం బోధించింది .

  దుఖాలు మూడు రకాలు -1-సాధారణ దుఖం .అంటే శారీరక మానసిక దుఖం .పుట్టుక ,రోగాలు ముసలితనం ,చావు ,ఆదుర్దా ,ఫ్రష్ట్రేషన్,కోరింది లభించని  అసంతృప్తి .జోసెఫ్ గోల్డ్ స్టెయిన్ అనే బౌద్ధపడితుడు యుద్ధాలు ఆకలి హింస ,జబ్బులు మొదలైనవి కూడా దుఖాన్ని కలిగించేవే అన్నాడు .ఇవి అనుల్లంఘనీయాలుకావు కానీ ఆ సమయానికి వచ్చేవి .

2-విపరిణామ దుఖం –ఈ స్థాయి దుఖం లో పరిస్థితులు మారిపోతాయి .ఇందులో యంక్సైటీ,స్ట్రెస్ ఉంటాయి అనుకొన్నది జరగకపోయినా ,కోరింది దొరకక పోయినా ఈ స్థితి కలుగుతుంది .ఈస్థితిలో అసంతృప్తి ,ప్రపంచ స్వభావం నిజంగా లేదనే భావం ,వాటిలో వస్తున్న మార్పూ కనిపిస్తాయి .ఇదే అశాశ్వతభావన అంటుంది బౌద్ధం .వస్తువులు మనజీవితం లో ఎలా ప్రవేశించి నిలిచి కనుమరుగై పోతాయో అర్ధమౌతుంది .ఇంతమాత్రం చేత ఆన౦దాన్నిచ్చేవి అనుభవి౦చ వద్దనికాదు .మన సుఖ దుఖాలకు సంబంధంలేకుండా పదార్ధాలు స్వతంత్రంగా ఉంటాయి .మనభావనలకు కొత్తదనాన్నీ ,చూసే దృక్పధం లో మార్పును తెలియ జేస్తాయి .

3-శంకర దుఖం –దీన్నే కండిషన్డ్  ఎక్స్పీరిఎన్స్ అంటారు .జీవితం లో అన్ని అస్తిత్వాలు అన్ని రూపాలు అస్థిరమని  వస్తువులమార్పులు లేకపోవటాలవలన తెలిసి వస్తుంది .బౌద్ధ పండితుడు ‘’ప్రేమ చోడ్రాన్ ‘’ఈ స్థితిలో మన ఈగో తో ఆటలాడటం గా దాన్ని వర్ణించాడు .’’ఫిలిప్ మొట్ ఫిట్’’ వేదాంతి పరిస్థితులపై కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లు ఏర్పడి ,అస్తిత్వం పైనే అనుమానం కలుగుతుంది .దీనిపై బుద్ధుడు స్పందిస్తూ ‘’జీవితం లో అసంతృప్తులు మనం ఉన్న ప్రతిక్షణ అనుభూతి వలన కలుగుతాయన్నాడు .’’గేషె తాషి సెర్వింగ్ ‘’అనే టిబెట్ లామా ఇదంతా తప్పించుకోలేని దుఖం, బాధలు .మనం ఎక్కడ ఎప్పుడు పుట్టినా ఉండేవే అన్నాడు .

దుఖానికి వేదాంత నివృత్తి మార్గం –దుఖమనేదిమన దినదిన సమస్యకాదు .అనిత్యాలైన వాటికోసం ప్రాకులాడి చేతులారాడుఖాన్ని కొని తెచ్చుకొంటున్నాం  .వీటికంటే శాశ్వత మైన సత్యాన్ని మనం గ్రహించాలి .విశ్వ చైతన్యం మనకు ఎండమావిలా చుట్టూ కనిపిస్తుంది .అశాశ్వతాలను పట్టుకొని, శాశ్వతమైన దాన్ని అందుకోలేము .ప్రపంచాతీత స్థిర శాశ్వత సత్యాన్వేషణ జరపాలి .మాండూక్య ఉపనిషత్ లో ‘’పరీక్షస్య లోకానకర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదం ఆయాన్ నాశ్చయ కృతః క్రితేన’’అంటే బుద్ధిమంతుడు కర్మల చేతఎర్పడిన ప్రపంచాన్ని పరీక్షించి కర్మల చేత శాశ్వతమైనది సాధింపబడదు అని గ్రహిస్తాడు .సుఖాలనిచ్చే లోకాలన్నీ కర్మజన్యాలే .అవి శాశ్వతాలు కావుకనుక, శాశ్వత సుఖాన్నిచ్చేవికావు .ఉపనిషత్తుల సారాంశం ఏమిటంటే శాశ్వతాన్ని అందుకోకపోవటమే దుఖాలకు కారణం .కనుక సద్గురువును ఆశ్రయించి పరబ్రహ్మజ్ఞానం సాధించాలి .సర్వోత్కృష్టమైన దాన్ని సాధించే ప్రయత్నం చేయనంతవరకూ దుఖం బాధిస్తూనే ఉంటుందని వేదాంతం చెబుతోంది .దుఃఖ నివారణకు మరో మార్గమే లేదు .శ్వేతాశ్వతర ఉపనిషత్ లో ఒక బుద్ధిజీవి’’ చీకటిని చీల్చుకొని సూర్య చంద్రుల్లాగా ప్రకాశామానమైన వాడిని నేను చూశాను .ఒంటరిగా అతడిని అర్ధం చేసుకోవటం వలన దుఖాన్ని మృత్యువును జయించవచ్చు ‘’అని చెప్పాడు .ఆత్మజ్ఞానం పొందాలని ఒకడు ఒక గురువును ఆశ్రయి౦చాలి .దీన్ని వివేక  చూడామణిలో  శంకరభగవత్పాదులు ‘’నన్ను చావునుంచి తప్పించండి .తప్పించుకోలేని ప్రపంచంలోని అరణ్యాగ్ని  మధ్య ఉన్నాను .భయోత్పాతం కలిగించే జంఝామారుతం లాగి కొడుతోంది .నువ్వేనాకు శరణ్యం నన్ను రక్షించే దిక్కు వేరే లేదు ‘’అన్నారు .

   దుఃఖ నివారణకు బౌద్ధ మార్గాలు

గౌతమబుద్ధుడు చెప్పిన నాలుగు సత్యాలపై ఆధారపడి దుఃఖ నివారణ మార్గం బుద్ధుడు ఉపదేశించాడు .ఒకప్పుడు ప్రయాగ దగ్గరున్న కౌశాంబి లోని గుహలో ఆయన ఉండగా,అక్కడి  భిక్షువుల నుద్దేశించి బుద్ధుడు ఇలా ప్రవచించాడు ‘-‘’భిక్షువుల్లారా !మీ దగ్గరుండే నాలుగు వస్తువుల్ని వదిలేయాలి .అందులో ఒకటి దుఖం .ఇదే కష్టాలకు మూలం .ఇదే బాదానివారణ .ఇదే ఉత్తమ మార్గమైన నిర్యాణానికి దారి .బౌద్ధ ఆచారం లో బుద్ధుడిని ‘’భిక్షో ‘’అని సంబోధిస్తారు .అంటే గొప్ప వైద్యుడు అని అర్ధం .దుఖం తో బాధపడే వారి వ్యాధులను నివారించే ఘనవైద్యుడు బుద్ధుడు అని వారి భావం .ఆయన చెప్పిన నాలుగు సూత్రాలు రోగికి వైద్యుడు సూచి౦చేవే .మొదటి సూత్రం లో దుఖం ఒక వ్యాధి అని నిర్ధారణ చేయటం .రెండవ సూత్రం లో దుఖం అనే వ్యాధికి కారణం కోరిక అని కనిపెట్టటం .మూడవది మందు వేయటం కోరికపై నిరోధమే గొప్పమందు దుఖం పోవటానికి .

  మానవ జీవితం లో దుఖాన్ని గుర్తించకుండా ఎప్పుడూ ఉండరాదు .దాని గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి .దుఖం అంటే అభిన్నేయం .అంటే తీవ్రమైన రోగం .దీనికి శాశ్వత నివారణ కోరిక లేకుండా చేసుకోవటమే  కోరిక  పహతాభ కనుక వెంటనే విసర్జించాలి .మరి ఏమి ఆచరించాలి అంటే -అష్టాంగ మార్గం .ఇదే దుఖానికి శాశ్వతమైన నివారణ మార్గం మందు .అప్పుడే నిర్వాణ మార్గం సాధ్యమౌతుంది .అష్టాంగ మార్గం లో 1-సరైన దృక్పధం అంటే సత్యాన్ని,దుఖాన్నీ  అర్ధం చేసుకోవటం 2-సరైన నిర్ణయం –మంచి మార్గంలో మంచి ఆలోచనలు చేయటం 3-సత్యం పలకటం అంటే నిజాలు మాట్లాడటం బాధకలిగించే మాటలు ఉపయోగించ కుండా ఉండటం 4-సరైన పనిచేయటం –దొంగతనం హింస మొదలైనవి చేయకుండా మంచి ఉపయోగమైన కార్యాలు చేయటం 5-మంచి జీవిక –నిజాయితీగా యోగ్యమైన మార్గం లో సంపాదించటం 6-సత్ ప్రయత్నం –పనులన్నీ శక్తివంచన లేకుండా అంకితభావంతో నైపుణ్యంగా చేయటం 7-సద్భావన –శారీరక మానసిక భావాలలపై నియంత్రణ కలిగి ఉండటం 8-సరైన ధ్యానం –బుద్ధి కేంద్రీకరించి నిశ్చల చిత్తం తో ధ్యానం చేయటం .

‘’విషయ స్పర్శ లేనివాడికి సంసార బంధం ఉండదు .ఆంతరిక స్వేచ్చ పొందినవాడికి ,ఏ రకమైన భ్రాంతులూ ఏమీ చేయలేవు .విషయ సుఖా పేక్ష నిండా ఉన్నవాడికి ,కనిపించేదంతా నిజం అనుకుని భ్రమపడే వాడు ఈ ప్రపంచంలో వ్రేలాడుతూనే ఉంటాడు ‘’అని గౌతమ బుద్ధుడు తన అనుభవాలను ఆధారంగా బోధించాడు .’’సేలుడు’’ అనే ఒక బ్రాహ్మణుడు బుద్ధుని ప్రజ్ఞపై  తనకు అనుమానం ఉందని ఆయనతోనే అన్నాడు .దానికి గౌతముడు ‘’ఏదితెలుసుకోవాలో దాన్ని తెలుసుకొన్నాను .దేన్నీ అలవరుచు కోవాలో దాన్ని అలవరచుకొన్నాను .దేన్నీ త్యజించాలో దాన్ని త్యజించాను .కనుక ఓపండితా !నేను ‘’బుద్ధుడిని ‘’‘’అన్నాడు

  ఆధునిక ప్రపంచానికి గౌతమ బుద్ధుని సందేశం

బాధ అనేది మానవ జీవితంలో తప్పించరానిది .దాన్ని గూర్చి భయపడరాదు.యదార్ధమైన దాన్ని ఉపనిషత్తులు చెప్పినట్లు, బుద్ధుడు బోధించినట్లు తెలుసుకోవాలి .వీటి సారాన్ని వివేకాన౦దులు ఇలా తెలియజేశారు –‘’తల్లి గర్భం నుంచి నగ్నంగా బయటికి వచ్చాను అలాగే జీవితం ను౦చి కూడా నిష్క్రమించాను .’’దైవం ఇచ్చాడు ఆయనే ఇచ్చిన దాన్ని  తీసుకు వెళ్ళాడు ‘’అన్నాడు గొప్ప జ్యూయిష్ వేదాంతి .బాధ కష్టాలలో కూడా ప్రశాంతత అలవాటు చేసుకోవాలి కాని తప్పుచేయరాదు.ఇందులోనే జీవిత పరమార్ధమంతా ఉంది .తుఫానుకు సముద్ర కెరటాలు విజ్రు౦భిస్తాయి .కాని సముద్రపు అట్టడుగున పరమ ప్రశాంతంగా ఉంటుంది .దుఃఖించే వారిని పైవాడు ఓదారుస్తాడు  నిరాశా నిస్పృహ నిర్వేదం పొందినవాడికి తల్లీ తండ్రీ సంసారం ఆసమయం లో గుర్తుకు రావు తర్వాత వివేకం కలిగి దుఖం నశించి కల చెదిరిపోతే ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని ముఖాముఖిగా చూసి స్పష్టంగా ఏది యదార్ధమో అర్ధం చేసుకొంటాం ‘’అన్నాడు వివేకానంద.ఎంతటి కఠోర స్థితిలోనైనా స్వామి వివేకానందకు ఆశా కిరణం గోచరించేది .

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రికరుణముదితఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు అందరికీ  అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్థితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తాను కూడా సంతోషం పొందటాన్ని ‘’ముదిత ‘’అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్థాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వాలను  సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్థితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని, అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్థితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్థితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని ” దీర్ఘ నికాయం ” లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. ” తేవిజ్జ సూత్ర ” అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని ” విశుద్ది మార్గం ” లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.
ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.

  ఈరోజు26-5-21 బుధ వారం  వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి సందర్భంగా  ఈ ప్రత్యేక వ్యాసం

“పాపం – పుణ్యం – జ్ఞానం”“పాపం – పుణ్యం  జ్ఞానం”

ధమ్మపదం లో

బుద్ధుడు చెప్పాడు

ఇద సోచతిపెచ్చ సోచతిపాపకారీ ఉభయత్థ సోచతి . .

ఇథ మోదతిపెచ్చ మోదతికతపుజ్ఞ ఉభయత్థ మోదతి” (పాళీ భాష)

“పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;

పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు”

పాపం            =                 అజ్ఞానం, అధర్మాచరణం వలన

పుణ్యం           =                 ధర్మాచరణం వలన

దివ్యజ్ఞానం       =                 ధ్యానం వలన

అధర్మాచరణ వలన ఈ లోకం లోనూ, పరలోకాల్లోనూ,

దుఃఖప్రాప్తి, మరి తిరిగి జననం కలుగుతాయి;

ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ,

సుఖప్రాప్తి లభిస్తుంది;

అయితే, తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది

క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నారు కదా గీతాచార్యులు కానీ,

దివ్యజ్ఞానప్రకాశం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ

అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్యస్థితి కూడా లభిస్తుంది

  • కనుకమన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ,మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞానప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి;అలా జీవితం మొత్తం గడపాలిఅదే సరియైన జీవితం.
  • గౌతమ బుద్ధుడు సన్మార్గ దార్శనికుడు .తనకు తానూ దేవుదినిఅని ఎప్పుడూ చెప్పుకోలేదు .అవతార పురుషుడనని నమ్మించలేదు .ఎలాంటి మహిమలు ప్రదర్శించలేదు .అయినా ఆయన కన్నుల్లో కరుణ ,మాటలలో ప్రేమ ఉట్టిపడేవి ..త్యాగశీలత ,తనలోనిజ్ఞాన దీపాన్ని అందరిలో వెలిగించాలని తాపత్రయపడ్డాడు .అందుకే బుద్ధభగవానుడు అని పించుకొన్నాడు .
  •   ఈరోజు26-5-21 బుధ వారం  వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి సందర్భంగా  ఈ ప్రత్యేక వ్యాసం
  • బుద్ధ జయంతి శుభాకాంక్షలతో
  • మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-21-ఉయ్యూరు 

సన్మార్గ దార్శనికుడు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం -4(చివరి భాగం )

శంకర స్తోత్రాలు

శంకర స్తోత్ర గ్రంథాలలో చాలాభాగం సగుణ బ్రహ్మో పాసన ఉండటంవలన కొందరు ఆయన రాయలేదంటారు .కానీ శంకరులు సూత్ర భాష్య రచనలలో అనేక  సందర్భాలలో ఈశ్వరానుగ్రహ ప్రసక్తి ఉన్నది అనీ, అది లేనిదే అపరోక్షానుభూతి దుర్లభమనీ  చెప్పారు .స్తోత్రాలలో కొన్ని కొన్ని కవితా ధోరణిలో, ఛందస్సు ప్రధానంగా ,చిత్ర ఛందస్సులలోను ,అలంకారికంగా కూడా ఉన్నాయి కనుక అవి శంకరులు రాయలేదనే వాదం ఉంది .శాక్త తంత్ర భావాలను ప్రతిపాదించి వర్ణించే ,సౌందర్య లహరి ,ప్రపంచ సార లలో శృంగారం కూడా ఉండటం తో ఆయన రాయలేదన్నారు .’’though there is a tradition that Shiva was the family deity of Sankara ,it is also held he was by birth a Shakta ‘’శంకరుని కులదైవం శివుడనే వాడుక లోకం లో ఉందికనుక ఆయన జన్మతః శాక్తేయుడు ,’’అనే అభిప్రాయం ఉందని రాధాకృష్ణ పండితుడు భావించాడు .వాటిలోని తాంత్రిక భావం అద్వైత వేదాంతం లో ఉత్కృష్ట అనుభూతికి సహకారంగా ఉంది అన్నారు సూర్య నారాయణ శాస్త్రి .తాను స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో శంకరులు శ్రీ చక్ర ప్రతిష్ట కూడా చేశారు కనుక దేవీ పూజకు ప్రాదాన్యమూ కల్పించారు .అలాగే మధుర కంచి జంబుకేశ్వరం ,కాశ్మీర్ మొదలైన చోట్ల దేవీ మూర్తుల్ని ఉపాసించి ,ఆ మూర్తుల అనుగ్రహం సాధించారు .కనుక శంకరులు శాక్తేయ సూత్రాలు రాయలేదనటం అసంబద్ధం అన్నారు శ్రీ అనుభవాన౦దులు .అతిగా శృంగారం ఉన్నవి ఆయన రాయలేదనవచ్చు .బెల్వాల్కర్ శంకరులు రాయని 214 ఉంటాయన్నాడు .

  శంకర కృతాలుగా408స్తోత్ర రచనలలో 8భాష్యాలు 8ప్రకరణాలు ,8స్తోత్రాలు శంకరులే రాశారని ,మిగిలిన 384 లపై సందేహం ఉందన్నాడు బెల్వాల్కర్ .ఈ నిర్ణయం అంగీకార యోగ్య౦ కాదనీ ,పూర్తి ఆధారాలు లభించినప్పుడే అవి శంకర రచనలు కావు అని చెప్పాలనీ శ్రీ అనుభవానంద స్వామి ఉవాచ .

   సన్యాస ప్రాశస్త్యం

‘’Frend  that  is false  -which clings to love for selfish sweets of love –But ,,who love these more than the joys of mine –Yea, more than joys of theirs depart to save –Them and all flesh ,if utmost love avail ‘’స్వార్ధ ప్రేమ మాధుర్యం కోసం ప్రేమానుబంధంగా ఉండే ప్రేమ తత్త్వం వాస్తవం కాదు .కానీ నేను ,నా సుఖం కంటే వాటిని ప్రేమించి ,వారి సుఖాలకోసం వారిపై ప్రేమ చూపి౦చె ప్రేమ ప్రయోజనకరం అయితే ,వారినీ సర్వ ప్రాణికోటినీ రక్షించటానికి అన్నీ వదిలి వెళ్ళటం సర్వోత్క్రుష్ట త్యాగం ‘’అన్నారు స్వామి రామ తీర్ధ తమ ‘’లైట్ ఆఫ్ ఏసియా .ఇలాంటి త్యాగమే చేశాడు భగవాన్ గౌతమ బుద్ధుడు .సంసారం లో ఉన్నవారంతా తరించాలి ,సర్వ ప్రాణులు ఆనంద సుఖాలు పొందాలి .ప్రపంచమంతా సమ్యక్ జ్ఞానం పొందాలి ‘’అన్నది భారతీయ ఆర్ష సంస్కృతి .బృహదారణ్యకం లో బ్రహ్మవేత్తలు ఈషణ త్రయాన్ని త్యజించి ,సన్యాసం స్వీకరిస్తారు అని చెప్పబడింది .సన్యాసానికి ఇదే పరమోత్కృష్ట ఆదర్శం .’’The renunciation is only a process of growth preparing for the birth of a fuller life ‘’సమగ్ర జీవిత ఆవరణానికి సంసిద్ధం చెందించే పరిణామ క్రమమే సన్యాసం అని స్వామి రామతీర్ధ వాక్యం .మహాభారతం లో కూడా ‘’త్యేజేదేకం కులస్యార్దే ,గ్రామస్యార్దేకులం త్యజేత్ –గ్రామం జానపదస్యార్ధే,ఆత్మార్ధం పృధివీ త్యజేత్’’అంటే కులం కోసం స్వార్దాన్నీ ,గ్రామం కోసం కులాన్నీ ,దేశం కోసం గ్రామాన్నీ ,ఆత్మానుభూతి కోసం ప్రపంచాన్ని త్యజించాలి భారతం పేర్కొన్నది .’’కొద్దిగా నైనా త్యాగ లక్షణం ఉంటేకానీ ,సమగ్ర ఉన్నత ఉత్తమ సంస్కృతిఏర్పడదు .త్యాగమంటే నిస్వార్ధం .తనలో ఉన్న హేయ గుణాన్నినిరోధించి ,ఉన్నతస్థాయికి తన స్వభావాన్ని అభి వృద్ధి చేసుకోవటమే సన్యాసం అన్నారు అరవింద యోగి .కనుక ప్రపంచం లో త్యాగం లేని ఘట్టం ,ప్రదేశం లేదు .త్యాగం సర్వశ్రేష్ఠ ఆదర్శం .తలిదంద్రులిచ్చిన జన్మను సార్ధకం చేసుకొని నాలుగు ఆశ్రమాలలో హాయిగా జీవించి ,చివరికి సన్యాసం తీసుకోవాలని శాస్త్రాలన్నీ ఘోషించాయి.సన్యాసం ఆత్మోద్ధరణకు ,ఆత్మాదర్శానికి ,పవిత్రతకు దేశైక క్షేమానికి ఉద్దేశింపబడింది .’’సన్యాసం అనవసరం అనే వారికి మానవ ఉన్నత గమ్యం తెలియదు ‘’అన్నాడు రాధాకృష్ణ న్.’’ఉత్కృష్ట సన్యాస విధానం ఒక్క భారత దేశం లోనే పుట్టి వికసించి ఫలవంతమైంది ‘’అని వేదాంతం లోతులు తరచిన ప్రొఫెసర్ జి.ఎస్. ఘుర్యే    తన ‘’ఇండియన్ సాధూస్ ‘’లో రాశాడు .Asceticism  and monastic organization ,are two unique contributions which Indian civilization has made to the common stock of culture ‘’సన్యాసం ,సంప్రదాయం సామాన్య సంస్కృతికి భారతీయ విజ్ఞానం అందించిన అపూర్వ ప్రధానాలు ‘’అన్నాడు ప్రొఫెసర్ ఘుర్యే .’’అందుకే  నిస్సందేహంగా ‘’The mother of asceticism ‘’భారతి సన్యాసానికి తల్లి ‘’అనీ అన్నాడాయన ..ఈ సంగీత అమృత ధారను అతి పిన్నవయసులోనే స్వీకరించి రామకృష్ణ పరమహంస శిష్యుడై ,వేదాంత సింహమై ,ప్రపంచ పర్యటన చేసి ,అసంఖ్యాక ముముక్షలోకానికి తరుణోపాయాన్ని ప్రసాదించారు వివేకానంద స్వామి అన్నారు శ్రీ అనుభవానందులు .’’కంఠం ఎత్తి పాడు యతివరా –దీరా ఓం తత్సత్ అంటూ –అతిదూరం లో విషయ వాసనలకు అందని చోట ఈ గీతం పుట్టింది –కామ ధన కీర్తి కాంక్షలకు కలత పడని,శాంతిమయ కంరారణ్యం లో ఉద్భవించింది ఈ గీతం –చారుతర సచ్చిదానంద పూరం లో కంఠం విస్పష్టంగా ఎలుగెత్తి పాడు –యతివరా,దీరా ఓం సత్సత్ అంటూ ‘’అని రాసి గానం చేశాడు కానందుడైన వివేకానందుడు  .

  ఆధారం – శ్రీ అనుభవానంద స్వామి రచించిన –‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

   రేపు 26-5-21-బుధవారం వైశాఖ పౌర్ణమి -శ్రీ బుద్ధ జయంతి ,శ్రీ అన్నమాచార్య  జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం -3

శంకర భాష్యాలు -2

ఉపనిషత్తులను వ్యాఖ్యాని౦చేటప్పుడు శ్రీ శంకరులు ,బాదరాయణ సూత్రాలకు అనుగుణంగా భాష్యం రాయలేదని ప్రొఫెసర్ సురేంద్రనాథ దాస్ గుప్త –ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో రాశాడు ,బాదరాయణుడు  అద్వైతి కాదు సగుణ బ్రహ్మవాది అయినా శంకరభాష్య౦ ‘’Attained  wonderful celebrity both on account of subtle and deep ideas it contains ,and also it contains ,and also on account of the association of the illustrious personality of Sankara ‘’అంటే అందులోని అతి గాఢ,సూక్ష్మ భావజాల ప్రభావం చేత శంకర ప్రఖ్యాత వ్యక్తిత్వ కారణం గా అద్భుత ప్రశస్తి పొందింది అని దాస్ గుప్త అభిప్రాయ పడ్డాడు .’’గ్రంథప్రభావం ఎక్కువగా వ్యక్తి ప్రభావం తాత్కాలికంగా ఉంటుందని అందుకే శంకర వ్యక్త్యాకర్షణ భాష్యం లో ముఖ్యంగా ఉన్నా ,అందులోని సారమే సకల జనాలను ఆకర్షించి౦ది .ఉపనిషత్తుల భావ వైవిధ్యాన్ని వ్యాసుడు తొలగించగా ,శంకర భాష్యం ఉపనిషత్ ప్రమాణాలై  ఉండగా వ్యాసుని భావాలకు విరుద్ధం అనటం తప్పు .ఉపనిషత్ ఆధార సూత్ర గ్రంథాన్ని ఉపనిషద్భాష్య గ్రంథాల ద్వారా రక్షించి ,దాని నిర్మల స్థానాన్ని పదిలపరచాడు ‘’అన్న శ్రీ అనుభావానందుల వాక్యాలు సప్రమాణాలు . అందుకే వివేకానందుడు ‘’వ్యాస భావాలకు అత్యద్భుత రూపాన్నిచ్చే అసామాన్య ప్రజ్ఞా శక్తి భాష్యకారుడైన శ్రీ శంకరా చార్య మహిమ ‘’అన్నాడు .

   ఈ విధంగా శ్రుతి,యుక్తి ల ననుసరించి ఉపనిషత్ సూత్రాలకు భాష్యం రాసి ,అనుభవ భాష్య రచనకోసం ‘’The most beautiful perhaps the only true philosophical song existing in any known language ‘’ఏ భాషలోనైనా అత్యంత సుందరమైన బహుశా యదార్ధ తాత్విక గీత౦’’అని  విలియం వాన్ హువార్ బోల్ట్అని ప్రశంసించిన భగవద్గీతా శాస్త్రాన్ని తీసుకొని శంకరులు భాష్యరచన చేశారు .భగవద్గీత ‘’is rightly regarded as one of the greatest master piece of Hindu Vedanta ‘’భారతీయ వేదాంతం లో సర్వోత్తమ శిరో భూషణం ‘’అన్నాడు దాస్ గుప్తా .ఇందులో కృష్ణ పరమాత్మ స్వానుభవ యుక్తంగా బ్రహ్మ సిద్ధికి ఉపాయాలను ప్రతిపాదించి ,దాని ఫలితమైన స్థిత ప్రజ్ఞత్వం మొదలైన సిద్ధి లక్షణాలు బోధించి ‘’అహం బ్రహ్మాస్మి ‘’అనే చరమ వృత్తి సూచకంగా ఉన్న అద్వైత అనుభూతికి ముఖ్యమైన ‘’సగుణ బ్రహ్మైవాహం ‘’అనే విధంగా తన విరాట్ స్వరూపాన్ని కూడా వ్యక్తపరచి వేదప్రతిపాదితమై,సూత్రాలచేత నిర్ధారితమైన స్థితిని అనుభూతి గా దర్శించటానికి గీతా శాస్త్రాన్ని శంకరులు ఉచితమైనదిగా తోచి ,అంతకు ముందు అది ముఖ్యమైనదిగా కాక ,ప్రఖ్యాతి పొందక ఏరకమైన భాష్యాలు ఉన్నాయనే ఆధారం లేకపోయినా ,శంకరులు దాన్ని గ్రహించి ,భాష్యం రాయటం తో అంతకు ముందున్న వాటి కంటే మహా ప్రాముఖ్యం కలిగి ,ఆనాటి నుంచి అనేక భాష్య వ్యాఖ్య వివరణలు రాయబడి ప్రపంచ వ్యాప్తి పొంది ,అందరి హస్తాలకు ఆభరణమై,సర్వోత్కృష్ట గ్రంథ రాజం గా విరాజిల్లుతోంది. ఇది శంకర హస్త స్పర్శా మహాత్మ్య ఫలితమేమో ?’’అని కీర్తించారు శ్రీ అనుభవానందులు .ఈ విధంగా బ్రహ్మ విద్యా శిఖరానికి తీసుకు పోయే ప్రస్థాన త్రయమైన బ్రహ్మ సూత్రా ఉపనిషత్ సూత్రా ,గీతా భాష్యాలు మూడింటిని అత్యంత ప్రతిభతో చిత్రించిన శ్రీ శంకర భగవత్పాదులు ,తన అద్వైత సిద్ధాంతానికి ఒక అద్భుత రూపాన్ని సృష్టించి ,ఆతర్వాత స్వంతరచనలకు శ్రీకారం చుట్టారు.

              శ్రీశంకర  ప్రకరణ గ్రంథాలు

‘’శాస్త్రైక దేశ విషయం ,శాస్త్ర కార్యా౦తరేస్థితం –ఆహుః ప్రకరణం నామ గ్రంథ భేదం మనీషిణః’’-అంటే శాస్త్రం లో చెప్పిన విషయాన్నే కలిగి ,ఆశాస్త్రానికి ప్రత్యేకంగా నిర్మించిన గ్రంథమే ప్రకరణం .పూర్వం తన చేత భాష్యగ్రందాలలో ప్రతిపాదింప బడి,లోకం లో స్థిరమైన అద్వైత   విషయాలనే  ఇంకా సులభంగా అందరికి తేలికగా అర్ధమయ్యేట్లు చెయ్యాలని శ్రీ శంకరులు ఈ ప్రకరణ గ్రంథ రచన చేయాలని సంకల్పించారు .అంతేకాక ,భాష్యాలలో తన మనసులోని విషయప్రవచనానికి ఆయా రచనలలోని భావాలు నిరోధిస్తూ ,నిరటంకానికి అడ్డుగా ఉన్నాయని తెలుసుకొని ప్రత్యెక రచనలు చేయాలని ఆయనకు అనిపించి ఉండవచ్చు .ప్రకరణ సాహిత్యం లోనూ ఆయన ఆయన మేధాశక్తి అవిచ్చిన్నంగా స్పష్టంగా ,అజేయంగా ప్రజ్వరిల్లింది. కనుక అద్వైత జిజ్ఞాసువులకు భాష్య గ్రంథాలకంటే,ప్రకరణాలే ప్రధానంగా ,సులభ గ్రాహ్యాలుగా కనిపించి ఆయన ఆలోచనకు అద్దంపట్టాయి .

   శంకర కృత ప్రకరణాలు 41-1-ఉపదేశ సాహస్రి 2-వివేక చూడామణి ,3-ప్రపంచ సార ,4-మహావాక్య దర్పణ ,5-అపరోక్షానుభూతి ,6-శత శ్లోకి ,7-ప్రబోధ సుధాకర ,8-వేదాంత సార ,9-వేదాంత డిండిమ,10-సదాచార ,11-వాక్య వృత్తి,12-ఆత్మ బోధ ,13-ఆత్మానాత్మ వివేక 14,ఆత్మ చింతన ,15-హరి మీడేస్తుతి ,16- ,విజ్ఞాన నౌక ,17-యోగ తారావళి 18-స్వాత్మానంద ప్రకాశ ,19-జీవన్ముక్తానంద లహరి,20 శివానంద లహరి ,21-సౌందర్య లహరి ,22-ప్రశ్నోత్తర మాల ,23-పంచీకరణ ,24-రాజయోగ ,25-బ్రహ్మ విద్యా విలాస ,26-దశ శ్లోకి ,27-అద్వైతానుభూతి 28- అనాత్మ శ్రీ నిగర్హణ,29-స్వరూపాను సంధాన ,30-ప్రౌఢానుభూతి ,31-బ్రహ్మజ్ఞానావళీ మాల ,32-లఘు వాక్య వృత్తి,33-నిర్వాణ మంజరి ,34-బ్రహ్మాను చింతనం ,35-తత్వోపదేశ,36-మాయా పంచక 37-ఏక శ్లోకి ,38-రామకర్ణామృత ,39-గాయత్రీ భాష్య ,40-సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహ ,41దేవ పూజా విధానం .

  ఇందులోని శివానంద లహరి సౌందర్యలహరి ,హరిమీడే స్తోత్రం లను కొందరు స్తోత్ర గ్రంథాలలో చేర్చారు  .ప్రకరణాలలో వివేక చూడామణి ,ఉపదేశ సాహస్రి,సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అతి ముఖ్యమైనవి .బెల్వార్కర్ పండితుడు ప్రకరణాల సంఖ్య112అని తేల్చాడు .వీటిలో అపర్క్షానుభూతి ఆత్మబోధ ,ఉపదేశి సాహస్రిలోని పద్యభాగం, పంచీకరణ ప్రక్రియ,శతశ్లోకి అనే ఎనిమిదింటిని మాత్రమె శంకర కృతాలన్నాడు  .

  తర్వాత శంకర స్తోత్ర రచనలు తెలుసుకొందాం .

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ  సిద్ధాంత  సౌరభం’’

రేపు 25-5-21 మంగళవారం వైశాఖ శుద్ధ చతుర్దశి –‘’శ్రీ నృసింహ  జయంతి ‘’శుభా కాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం -2

శ్రీ శంకర భాష్యాలు –‘’సూత్రార్దో వర్ణతో ఏన సదైహ్సూత్రాను సారిభిః స్వవచనాని వర్ణ్యతే భాష్యం-భాష్య విదోవిదుః’’స్వంతవాక్యాల సూత్రాభి ప్రాయాలను అనుసరించి ,సూత్రార్ధాన్ని వర్ణించేది భాష్యం అని భాష్యజ్ఞుల అభిప్రాయం .అంటే గ్రంథం లో ఉన్న భావాన్ని తనమాటలతో వర్ణించి ,అందులో స్వంతభావాలను చెప్పటమే భాష్యం .తన ప్రత్యేకభావాలు ,అనుభూతి నుంచి వాటి నిరూపణకోసం వేదోక్తులను ఉపయోగించటం కూడా భాష్యమే .రచయిత స్వతంత్ర వ్యక్తిత్వం నిరూపించబడాలి .భాష్య రచనచేసిన భగవత్పాదులకు తత్వ శాస్త్ర వేత్తలలో ఉన్నత స్థానం ఉన్నది .’’Philosophers greatness lies in two things ,originality of subject matter and the critical method of presentation ‘’విషయ స్వాపేక్షిత్వానికి, ఉక్తి రచనా విధానానికీ తత్వ వేత్తల గొప్పతనం ఇమిడి ఉండినట్లేశంకరులు కొన్ని స్వతంత్ర భావాలు కలిగి ఉండి,వాటిని శాస్త్రాదులలోనూ చూసి ,,ఉప్పొంగి ,గురు సాన్నిధ్యం లో తపో కృషి వలన వాటిని స్థిరం చేసుకొని వాటికి అనుగుణంగా బోధించి రచించటం వలన ఆయన ప్రపంచ తత్వ వేత్తలలో అగ్రగణ్యులు అనటం సముచితం ‘’అన్నారు మాహానామ వ్రతబ్రహ్మచారి తమ ‘’కళ్యాణ కల్ప తరు ‘’లో .శ్రుతి ప్రమాణాలను విరివిగా చూపించటం,తనభావాలను సమర్ధించే పూర్వ గ్రంథ ఆచార్యులకు తన కృతజ్ఞత చెప్పటం వలన తాను వేద తాత్పర్యాన్నే బోధిస్తున్నానని ,శంకరులు సప్రమాణంగా  చూపించారు ‘’అని డా. ద్రుపద్ఎస్ దేశాయ్ ‘’ప్రబుద్ధ భారత’’లో రాశాడు .అందుకే అతి తక్కువ కాలం లోనే వేదవేదాంగాధ్యయనం పూర్తి చేసి ,తన సంస్కారానికి అనువైన అద్వైతాన్ని వాటిని నుంచి గ్రహించి ,గోవింద భగవత్పాద గురువుల సన్నిధానం లో దాన్ని పెంచి పోషించి ,అంతగా విజ్రు౦భి౦చ గలిగారాయన .అందుకే అద్వైత వాదం వైదికమై ,ఉపనిషత్ ప్రబోధకమై ఉంటూ,దాన్ని లోకం లో ప్రసరిప జేసిన శంకరుల వ్యక్తిత్వం ఆయా శాస్త్రాల్ని కప్పి పుచ్చి ,తానె దాని కర్త అయినట్లు  విపర్యయ జ్ఞానాన్ని ,అజాగ్రత్ ప్రజ్ఞులలో కలుగ జేసింది ‘’అంటారు అనుభవాన౦దులు .

 ‘’ ఉపనిషత్తులలో అనేకరీతులుగా ఉన్న విషయాన్ని ‘’A consistent philosophical system ‘ఒక సుస్థిర తత్వ సిద్ధాంతంగా ’ నిర్మించటం అంత సులభమైన పనికాదు ‘’అంటాడు ప్రొఫెసర్ పాల్ దేవ్ సేన్ .అయినా జీవులకు హిమాలయమ అనీ ,నిత్యాలని పేరుపొందిన భారతీయ ఆధ్యాత్మిక తత్వ సారాలైన ఉపనిషత్తులనే ప్రధానంగాతీసుకొని,వాటికి అనుగుణంగా సమన్వయాలు  చేసి,ఒక విశిష్ట సిద్ధాంతాన్ని శంకరాచార్య రూపొందించారు .గౌడ పాదుడు అద్వైత సిద్ధాంత గ్రంథాలు రాసినా ,శంకరులే తన సర్వకాల ,సర్వావస్థ సర్వ శక్తులను అద్వైత సిద్ధాంత నిర్మాణానికి ఉపయోగించి ,పూర్వ విషయాలను అను సంధించి మహాద్భుత సిద్ధాంత నిర్మాణం చేశారు ,’’అందుచేతనే ‘’We must admit without hesitation that Sankara’s   doctrine faithfully represents the prevailing teachings of the Upanishads ‘’ఉపనిషత్ బోధలను అనుసరించేశంకర వాదం ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నాడు ప్రముఖ వేదాంతి ,పండితుడు డా.జార్జి తిబౌట్ .శంకరవాదం అత్యంత మృదువుగా వివిధ సిద్ధాంతాల సమన్వయంగాఉంది అంటూ  ‘’Its fundamental doctrines are manifestly in greater harmony with the essential teachings of Upanishads ,than those other systems ‘’ఇతర  సిద్ధాంతాలకంటే ఉపనిషత్తుల ముఖ్య సూత్రాలను ,దీని మూల సిద్ధాంతాలు మరింత ఎక్కువగా అనుగుణంగా ఉన్నాయి ,శంకర వాద చాతుర్యం అద్భుతమనీ ,’’He does more justice to Upanishads ‘’ఉపనిషత్తులకు అత్యధిక న్యాయం చేకూర్చినవాడుశంకరుడే ‘’అనీ డా.ఎబి కీత్ పండితుడు –ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్’’లో రాశాడు.

 ‘’శంకరుడు దేనికది ప్రత్యేకంగా ఉపనిషత్తులను పరిశీలించి ,అక్కడికక్కడే సిద్ధాంత సమన్వయము చేసి ,అందులో ఇతర సిద్ధాంత అన్వయం కు కూడా తగినట్లు మంత్రార్ధాలను అద్వైతపరంగా ఏకీకృతం చేసినట్లు ,పూర్వకాలం లో బాదరాయణ వ్యాసుడు కూడా ఉపనిషత్ వాక్ ఐక్యత ప్రతిపాదన కోసం బ్రహ్మ సూత్ర రచన చేసి ఉంటాడు ‘’అన్నారు అత్యంత అనుభవంతో శ్రీ అనుభవానందస్వామి..ఇద్దరి గమ్యం ఒక్కటే .శంకర భావ ధారకు వ్యాస తాత్పర్యం విరుద్ధంగా ఉంటె ,శంకరులు ఆగ్రంథ ప్రశంస అస్సలు చేసే వారు కాదేమో .

 ‘’లఘూని సూచితార్ధాని స్వల్పాక్షర ప్రధానిచః  సర్వతః సారభూతాని సూత్రాణ్యా హుర్మనీషిణః’’అని భామతిలో చెప్పబడినట్లు స్వల్పాలై ,అర్ధ స్పూర్తిగా అల్పాక్షర పదాలతో సారభూతాలైన సూత్ర రూపంగా రచించటం చేతనే అవి సామాన్య ప్రజ్ఞకు అతీతంగా ఉన్నాయి.ఈ విధమైన రచనావిధానం ప్రపంచం లో ఒక్క భారత దేశం లో మాత్రమె జన్మించి ప్రావీణ్యత పొందింది ‘’అని డా.ఎం.వింటర్నిట్జ్ పండితుడు ప్రశంసించాడు .ప్రతి కొత్త మతశాఖ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యాస సూత్రాలకు ఒక కొత్త వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తుంది ‘’అన్నారు వివేకానంద స్వామి .శంకరాచార్యకాలం లో ‘’తత్వ విచార’’ కర్త  ఉమామహేశ్వరుని వాక్యాలను బట్టి 99వ్యాఖ్యానాల ను ఈ వ్యాస సూత్రం లో ఉన్నాయి  .అందులో ముఖ్యమైనవి ఉపవర్ష,బోధాయన ,భర్త్రుప్రపంచ ,ద్రావిడా చార్య ,తంక,గుహాదేవ ,కపర్ది ,భరుచి మొదలైన వారి వ్యాఖ్యానాలు ప్రసిద్ధమైనవి .అందుకే శంకరులు శ్రుతివిరుద్ధమైన కల్పనల నుంచి సూత్రాలను ఉద్ధరించే కార్యక్రమం లో ‘’భాష్యం ప్రసన్న గంభీరం ‘’అని వాచస్పతి మిశ్రుడు భామతి లో చెప్పినట్లు శంకరులు సూత్ర భాష్యంరాశారు .శంకరుల సూత్ర భాష్య రచనతో పూర్వ వ్యాఖ్యానాలన్నీ అప్రదానాలై కాలక్రమ౦లో నశించిపోయాయి .’’సర్వ సూత్ర భాష్య  గ్రంధాలకేఅతి ప్రాచీనమై ,’’Master piece of Sankaracharya’s life’’శంకరాచార్య జీవితం లో అది శిరో భూషణమైంది అన్న సోదరి నివేదిత వాక్యం పూజనీయం స్వామి రామతీర్ధ దీన్ని ‘’The oldest and the best ‘’సర్వోత్తమ ,ప్రాచీన శ్రేష్టం ‘’అన్నారు .’’His expositions agree in all essentials with the meaning of the Brahma  Sutras ‘’ అన్ని ముఖ్య విషయాలలో బ్రహ్మ సూత్రార్ధాలకు అనుగుణమైన వివరణం .ఇతర భాష్యాలకంటే శంకర భాష్యమే ‘’The only true representative of the Sankara’s views ‘’బ్రహ్మసూత్ర కారుడు వ్యాసుని తత్పర్యాలకు సరియైన ప్రతిబింబాలుగా ,శంకర భాష్యసూత్రాలు  సర్వ ముఖ ప్రశస్తి పొందాయి’’అన్నారు స్వామి రామతీర్ధ .’’శంకర భాష్యం ఉపనిషత్తులలో బ్రహ్మ౦ అనీ ,పరమాత్మ అనీ చెప్పబడే తత్వాన్ని ఖండితంగా సమర్ధించే సనాతన వైదిక మతాన్ని ప్రవచిస్తోంది .ఆయన తాత్విక సిద్ధాంతం  భారత దేశం లో  పురుడుపోసుకొన్న అనేక సిద్ధాంతాల కంటేఅతి ముఖ్యమైంది .దానిలో ప్రకటింప బడిన ‘’ boldness ,depth ,subtility of speculation ‘’ధైర్య౦ అగాధత్వం సూక్ష్మత్వం ఆలోచనా పటిమ అసాదారణాలు ‘’అన్నాడు శంకర ,రామానుజ భాష్యాలను ఇంగ్లీష్ లోకి అనువదించిన ప్రముఖ సంస్కృత విద్వాంసుడు తిబౌట్ పండితుడు.సూత్రభాష్య ఉపోద్ఘాతం లో అగాధ అధ్యాస భాష్యంచూసి అవాక్కైపోవాల్సిందే అన్నాడు సి .మహాదేవయ్య .’’శంకరుల మేధాశక్తి వ్యాస సూత్రాలలో కాకుండా భాష్యంలోదర్శించవచ్చు ‘.’’ఆయన భాష్యం పూర్వ భాష్యాలను మరుగు పరచి సూక్ష్మ హిందూ చిత్తాలనుకదిలించి ఈనాటికీ ఆశ్చర్య పరుస్తోంది ‘’ ‘’అన్నాడు ఆచార్య ఎర్నెస్ట్ పి.హార్విట్జ్. నిస్సందేహంగా భాష్య రచనా విధానానికి శంకర భాగవత్పాదులే మిగిలిన వారికి ప్రమాణం అన్నారు శ్రీ అనుభవానందులు .

    ఆధారం –శ్రీ అనుభవాన౦ద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య శ్రీశంకర సాహిత్యం

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం

‘’శ్రీ శంకరుని గూర్చి ఏం చెప్పగలం?పరమ పావన ఉదకాలై ,పర్వతం నుంచి జాలువారే నిత్య స్రవంతులుగా ఉపనిషత్తులకు ,మిక్కిలి ప్రశా౦త అరణ్య సరోవరమైన భగవద్గీతకు ,చివరికి అగాధ కాసారమైన బ్రహ్మసూత్ర భాష్యాలకు ,తన కరుణామయ ప్రజ్ఞా సంపదనుంచి వివేక చూడామణిని ,కాల మత్సరం అనే మలినం నుంచి కాపాడిన ధర్మపాలకుడు శంకరులు ‘’అని పొంగిపోయి కీర్తించాడు డా.చార్లెస్ జాన్స్టన్ తన ‘’శంకరాచార్య ఆఫ్ ఎస్.ఎస్.ఎస్ .శాస్త్రి పుస్తకం లో .వేదా౦తార్ధ రస సంరక్షకుడై ,భారతీయ తత్వ శాస్త్ర నిర్మాతలలో అతి ముఖ్యుడై ,తాను  ఆ ఆధ్యాత్మిక ఆనందం లో మునిగి ఉండే సాధరనానుభవజ్ఞుడి లాగా ఉండిపోయే తృప్తి పొందకుండా ,ఆ ఆనంద విభూతులను అసాధారణ ప్రజ్ఞతో శ్రుతి,యుక్తి ,అనుభవ బద్ధం చేసి ,శ్రుతులకు ఆధారాలుగా  ఉపనిషత్తుల భాష్యం రాసి ,అనుభవ సారంతో భగవద్గీతకు భాష్యాన్ని అందరికి ఉపయోగపడేట్లుగా రచించారు శంకరులు ‘’అని కొనియాడాడు జి.తిబౌట్.ఆయన మాట ప్రకారం శంకరులు ‘’Un  doubtedly occupies high rank ‘’నిస్సందేహంగా శంకరులు అత్యున్నతస్థానం ఆక్రమించారు .

  ‘’Bewitching and marvelous and simple .It is at once the language of the child ,and the philosopher is one ‘’శంకరులశైలి సమ్మోహనమై అద్భుతమై స్పష్టంగా శిశు భాష లాగా ,తత్వ వేత్త భాష తో ఏకమై ఉండటం చేత అత్యంత ప్రశస్తి పొందాయి ఆయన రచనలు ‘’అన్నాడు సి యెన్ కృష్ణస్వామి అయ్యర్ .చిత్త సంస్థితి కి శైలినే భావిస్తే అది శంకరునిలో పుష్కలం .అత్యున్నత భావాలను అతి సులభాభాషలో చెప్పటం లో బహు నేర్పరి ఆయన .ఏ దృష్టి తో చూసినా ,ఆయన రచనలు కొద్దిగా చదివినా ,ఆయన శ్లోకాలు విన్నా ,అది అరుదైన అదృష్టమే ‘’అంటాడు కృష్ణస్వామి అయ్యర్ .’’ఆయన రచనలు కేవలం యుక్తి యుక్తంగా మాత్రమె గాక ,’’but rather that of a scientific treatise ‘’అవి శాస్త్రీయ రచనలు నిగూఢాలు,.కాని ఆయన వివరణం స్పష్టం తేట తెల్లం ‘’’’clear and transparent ‘’అని మెచ్చాడు  మాక్దోనాల్ద్ పండితుడు .’’In clearness of vision ,singleness f purpose ,clarity and depth of the style of expression few if any can rival Shankara ,while none has excelled him ‘’ ఆయన భాష్యం ప్రసన్న గంభీరం .విస్పష్ట దృక్పధం లో ,ఏకీ కృత సంకల్పం లో ,శైలిలో ఉన్న ఆగాధత్వం,స్పష్టత్వంలలో కొందరు ఆయనతో పోటీ పడవచ్చుకానీ ,ఎవ్వరూ ఆయన్ను మించిపోలేరు .ఈరాచనా విధానానికి అనుకూలం గా ,ఇతరులు తమ జీవితాలను ప్రారంభించని లేత ప్రాయం లోనే సర్వ సంగ త్యాగం చేసి ,,తన జీవిత కార్యాన్ని ముగించిన ఆ లేత యవ్వన సన్యాసి కి అద్భుత ఆకర్షణ శక్తి ఉన్నది ‘’అన్నారు ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారు .

   శంకరుల రచనలను 1-భాష్యాలు 2-ప్రకరణాలు 3-స్తోత్రాలు గా విభజించవచ్చు .వీటికి కాల నిర్ణయం చేయటం చాలా కష్టం .దీనిపై పండితులు అనేక ఊహాగానాలు చేశారు .దాని ప్రకారం శంకరుల విష్ణు సహస్రనామ భాష్యం అన్నిటికంటే ము౦దురాశారు .భగవద్గీతా భాష్యం చివరకు రాశారు .కానీ అది ఉచితం కాదు స్తోత్ర రచనలతో ప్రారంభించి ,క్రమంగా ప్రకరణ భాష్య రచనలు చేశారు అని భావించటం సరైనది అన్నారు శ్రీ అనుభవానంద స్వామి.

   శ్రీ శంకర భాష్య గ్రంథాలు

‘’ఈశ కేన కఠప్రశ్నముండ,మాండుక్య తిత్తిరః-ఐతరేయం చ ఛాందోగ్యం,బృహదారణ్యకం దశః ‘’అని 10 ముఖ్యమైన ఉపనిషత్తులున్నాయని ముక్తికోపనిషత్ చెప్పింది .ఇవికాక నృసింహ తాపిన్యుప నిషత్తు  శ్వేతాశ్వరోపనిషత్తు ,సనత్సుజాతీయం, ఆధ్యాత్మ పటలం ,హస్తామలకీయం ,విష్ణు సహస్రనామం ,లలితా త్రిశతి ,బ్రహ్మ సూత్ర శారీరకం ,భగవద్గీత అనే మొత్తం 19గ్రంథాలకు శంకరులు భాష్యాలు రాశారు .ఇందులో 1-రూఢిగాశంకర రచనలు 2-సంశయాస్పదాలు 3-ఇతరాలు అని ఉన్నాయని ఎస్ కే బెల్వార్కర్ పండితుడు తెలిపాడు .బ్రహ్మ సూత్ర ,దశోపనిషత్,గీతా  భాష్యాలు శంకరులు రాసినవే అని గట్టిగా భావించాడు .కానీ ఉపనిషత్ భాష్యాల విషయాలపై కొంత సందేహం ఉంది .శంకరులు మొత్తం 108ఉపనిషత్తులకు భాష్యం రాయలేదు .వాటిలో దశోప నిషత్తులకు మాత్రం భాష్యం రాశారు .శ్వేతాశ్వతర ,నృసి౦హ తాపీనులకు రాసి ఉండరని ఆతర్వాత వారు రాసి ఆయనపెరుపెట్టారని ఊహించాడు .మా౦డూక్యకారికా భాష్యం కూడా శంకర కృతం కాదన్నాడు .కారణం భాష్యరచనంలో తేడా ఉండటం అన్నాడు .కానీ ఇంతమాత్రం చేత ఇవి శంకర రచనలు కాదనటం  సముచితం కాదన్నారు శ్రీ అనుభవానందులు .అద్వైతం లో పూర్వ ఆచార్యుల భావాలను శంకరులు ఉపయోగించుకొన్నారు .శంకరులు రాయలేదని 31 గ్రంధాలను బెల్వార్కర్ త్రోసి పుచ్చాడు .సాంఖ్యయోగ సంబంధం వాత్సాయన కామశాస్త్రం ,అమరుక శతకం శంకరకృతం కాదంటాడు .

  శంకర భాష్య రచనా విధానం తర్వాత తెలుసుకొందాం

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

 

ద్వారకలో శారదా పీఠం నెలకొల్పి ,అక్కడి నుంచి మధ్యభారతం లో ఉన్న ఉజ్జయిని చేరి ,గంగాతీరం వెంట ప్రయాణించి భట్టభాస్కరాదులను జయించి ,కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం విషయం విని ,దాన్ని అధిష్టించాలని శ్రీ శంకరులు కాశ్మీరం చేరారు .అక్కడున్న ఒక దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి .ఒక్క దక్షిణ ద్వారం మాత్రం సరైన సర్వజ్ఞుడైన పండితుడు లేక మూయబడి ఉంది.ఆ ఆలయం చేరి ,పరివేష్టించి ,సర్వజ్ఞపీఠాన్ని కాపాడుతున్న పండితులు శంకరుల విద్యా పాటవం పై పలు ప్రశ్నలు సంధించగా ,అన్నిటికీ సమాధానాలు సంతృప్తిగా చెప్పి ,వారు పూర్తిగా సమర్ధించగా ఆలయ ప్రవేశం చేశారు .కానీ దక్షిణ ద్వారం దగ్గరకురాగానే సరస్వతీ దేవి సాక్షాత్కరించి సర్వజ్ఞత్వమే కాక బ్రహ్మ చర్యం కూడా పీఠాధి రోహణకు ముఖ్యమని ,తన పూర్వ కర్మలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నిరూపించుకోమని కోరింది .తాను  అమరుక దేహంలో ప్రవేశించిన విషయం పై అడిగిన విషయంగాతెలుసుకొని ,అది జరిగింది అమరుక శరీరంలోనే కానీ శంకర దేహం లో కాదని సమర్ధించుకోగా శారదామాత ఆ సమాధానానికి సంతోషించి సంతృప్తి చెంది శంకరులు సర్వవిధాలా స్సర్వజ్ఞ శారదా పీఠం అది రోహించటానికి  పూర్తిగా అర్హుడే అని తీర్పు చెప్పగా ,పండితులందరి  హర్షధ్వానాలమధ్య శ్రీ శంకర భగవత్పాదులు కాశ్మీర సర్వజ్ఞ శారదా పీఠం అధిష్టించి దక్షిణ భారత దేశానికే కాక యావద్భారతదేశానికీ అపూర్వ గౌరవాన్ని కల్గించారు అని ఆనంద గిరి మొదలైన వారు రాశారు .కానీ ప్రమాణాలు సరిగ్గాలేవు అంటారు శ్రీ అనుభవానందులు .

  కాశ్మీర రాజధాని శ్రీనగర్ లో శంకరాచార్యులకు ఒక ప్రాచీన దేవాలయం 100 అడుగుల ఎత్తున ఉన్న కొండపై ఇప్పటికీ ఉన్నది .శంకర సర్వజ్ఞ పీఠాదిరోహణ గాథ విన్న ,తెలుసుకొన్న గోపాదిత్యుడు అనే రాజు క్రీ.పూ.36-306మధ్యలో శంకర ఆధ్యాత్మిక జ్ఞాన చేతనత్వం అందరికీ తెలియ జేయటానికి ఆ శంకరాలయం నిర్మించాడని డా.పి.ఘ్వాషాలాల్ తన ‘’ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ ‘’లో రాశాడు .కాలక్రమం లో ఈ ఆలయం శిధిలమై పోగా ,జైన్ ఉల్ అబ్దిన్అనే మహమ్మదీయ రాజు దాన్ని పునరుద్ధరించాడని ఆ ఆలయంలో శాసనాలున్నట్లు 17-7-1949 ది హిందూ పత్రిక ప్రచురించింది .

   చేయాల్సిన పని ఇంకా కొంత మిగిలి ఉందని భావించి,దాన్ని సాఫల్యం చేయటానికి నిశ్చయించి , శంకరులు ,కాశ్మీర్ నుంచి కామరూప దేశం అని పిలువబడే పూర్తిగా శాక్తేయులతో నిండి ఉన్న అస్సాం వెళ్ళారు  .అక్కడ వారి నాయకుడు అభినవ గుప్త అసాధారణ  ప్రజ్ఞా పాటవాలు కలవాడు .శంకరుని ముందు వాదం లో నిలవలేక ఓడిపోయి,ఆచారం ప్రకారం మండనుడు మొదలైన ఇతర సిద్ధాంతుల్లాగా శంకరుని అనుసరించి ,సన్యాసం తీసుకోక పోయినా ,అద్వైతాన్ని అనుసరించక ,కుయుక్తి పన్ని శంకరునిపై ప్రయోగం చేసి తీవ్రమూల వ్యాధి   పాలు చేసి పాపి అయ్యాడు .ఆవ్యాధితో నిరంతర రక్త స్రావముతో శంకరులు విపరీతమైన బాధ పొందారు .వైద్య చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు .పద్మపాదుడు ఆచార్యునిపై ఎవరో విష ప్రయోగం చేశారని అవగాహన చేసుకొని ,అది అభినవ గుప్తుడి పరాభవ ప్రతీకారమే అని తెలుసుకొని ,ఆతడిపైనే మళ్ళీ ప్రయోగం చేయగా  శంకరుని ఆరోగ్యం కుదుటబడి ఆ వ్యాధి అభినవ గుప్తుడిలో ప్రవేశించి ప్రాణం తీసింది .

         అస్సాం నుంచి నేపాల దేశం చేరి ,అనేక ప్రదేశాలలో పర్యటించి ,అక్కడి రాజు వృష సేన వర్మకు అతిధిగా ఉంటూ ,అద్వైత మత వ్యాప్తి చేసి ,  .శంకరానుగ్రహం తో జన్మించిన తనకుమారునికి వృష వర్మ శంకరవర్మ అనే పేరు పెట్టుకొన్నాడు  తర్వాత శంకరులు బదరికాశ్రమం చేరారు.నేపాల చరిత్రలో శంకరులు ఆ దేశానికి క్రీ.పూ.488-487లో వచ్చినట్లు లిఖి౦పబడి ఉంది .

              శ్రీ శంకరుల బ్రహ్మైక్యం

బదరీ క్షేత్రాన్ని చేరిన శంకరులకు అస్సాం లో సంక్రమించిన వ్యాధి పూర్తిగా నివారణ కాక చాలా ఇబ్బంది పడ్డారు .శిష్యులకు భాష్యం బోధించటం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు .తమ చే స్థాపింపబడిన పీఠాలు శృంగేరికి సురేశ్వరాచార్యులను ,ద్వారకకు హస్తామలకా చార్యుని ,జగన్నాధగోవర్ధన పీఠానికిపద్మపాదా చార్యులను ,బదరీ జ్యోతిర్మఠానికి తోటకాచార్యులను నియమించి ,వాటి నిర్వహణకు నిబంధనావళి తయారు చేయించారు .విశ్రాంతి తీసుకోవటానికి బదరి నుంచి కేదార క్షేత్రం చేరారు .అక్కడి శీతల బాధ నివారణకోసం ఉష్ణోదక గుండాన్ని నిర్మించారు .తమ 32వ ఏట కలియుగం 2625అంటే క్రీ.పూ.477 శ్రీ రక్తాక్షినామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ శంకర భగవత్పాదులు బ్రహ్మైక్యం చెందారు అని మాధవ విద్యారణ్య శంకర విజయం లో ఉన్నది .

  కాని ‘’గురువంశ కావ్యం’’ ప్రకారం శంకరులు బదరికాశ్రమం లో ఉండగానే ,దత్తాత్రేయ మహర్షి ఆనందించి శంకరుని దగ్గరకు వచ్చి తన గుహలోనికి తీసుకు వెళ్ళినట్లు మాత్రం ఉంది కానీ శంకర నిర్యాణ విషయం చెప్పబడ లేదు .చిత్సుఖాచార్యుని బృహత్ శంకర విజయం ,ఆన౦దగిరి కృత శంకర విజయం ,లలో శంకరులు దేశ పర్యటన పూర్తి చేసి కాంచీపురం వచ్ఛి అక్కడే సిద్ధిపొందారని ఉన్నది .కంచిలో కామాక్షీ దేవి ప్రతిష్టచేసి ,,ఆనగరం లో పండిత ప్రకా౦డులు వెంటరాగా ,వేద ఘోష మిన్నంటుతుండగా శ్రీ రాజ రాజేశ్వరీ సన్నిధానం లో శ్రీ సర్వజ్ఞ పీఠంఅధిరోహించారు .ఇదే తర్వాత కామకోటి పీఠం గా ప్రసిద్ధి చెందింది .ఈ కంచికామకోటి పీఠానికి’’సర్వజ్ఞాత్ముని ‘’ఆచార్యునిగా నియమించారు .తర్వాత కాలం లో కామాక్షీ అమ్మవారి ఆలయం లో బ్రహ్మనిష్ఠ పూని శంకరులు ,బ్రహ్మైక్యం చెందారని బృహత్ శంకర విజయం చెప్పింది .దీనికి ప్రమాణం ఆలయంలోని శంకరుల శిలా విగ్రహం ఉంది అంటారు .ఇది బలీయమైన ఆధారం కాదన్నారు శ్రీశ్రేష్టులూరి కృష్ణస్వామయ్య తమ ‘’జగద్గురు శంకరాచార్య చరిత్రం ‘’లో .ఇప్పటికీ శంకర నిర్యాణ ప్రదేశం నిర్దారణకాలేదు జగద్గురువై ,ప్రజ్ఞా శక్తియై ,జగత్ ఉద్ధరణ చేసిన అద్భుత పవిత్ర మూర్తి శ్రీ శంకర భగవత్పాదులకుఉచితమైన స్మారక చిహ్నాన్ని నిర్మించటం అత్యావశ్యకం అని సుమారు అరవై ఏళ్ళ క్రితం ద్వారకా పీఠాధిపతి దేశం లోని పండితులందరికి శ్రీముఖం పంపారు ,అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా.సంపూర్ణానంద్ చేసిన కృషి కూడా అభినందనీయం ‘’అన్నారు శ్రీ అనుభవానంద స్వామి.

  ‘’The greatest expositor of the Upanishads ‘’ఉపనిషత్తులకు ఉన్నతోన్నత వ్యాఖ్యాత అని పేరుపొందినవారు శంకరులు అన్నాడు డా.ఆర్చి బాల్డ్ ఎడ్వర్డ్ తన ‘’దిఫిలాసఫీ ఆఫ్ ఉపనిషద్స్’’లో ‘’ అనాదిగా ఉన్న అవిద్యా ప్రాబల్యాన్ని ,అహంకారాన్ని రూపుమాపి,అసంఖ్యాక మానవ కోటి నిజతత్వ పరిశీలన తో సర్వ పరిమిత ,సంకుచిత్వాదులకు అతీతమైన ,’’అఖండానంత బ్రహ్మ రూపం తానే ‘’అనే పరమార్ధాన్ని ,స్థూలత్వ ,పశుత్వాది లక్షణాలను ,అగోచరత్వాది సర్వ విలక్షణ సంస్థితి నొందించ టానికి జన్మించి ,శ్రమించి ,తపించి ,సంకల్ప సిద్ధిని సాధించిన జగద్గురువులు శ్రీ ఆది శంకర భాగవత్పాదా చార్యుల  సన్మూర్తి స్థూల దేహాన్ని త్యజించినా ,అన౦త ముముక్షు హృదయాలను వికసింప జేసి ,ప్రకాశింప జేసి ,ప్రకాశిస్తూనే ఉంటారు .అందు చేత ఆయన మూర్తి నాటికీ నేటికీ నవ యౌవనమై ,కుశలమై ,తేజో పూర్ణమై,శుద్ధమై ,జరామరణ దూరమై ,అద్భుతమై వెలుగొందుతూనే ఉన్నది .అలాంటి పరమ పావన మూర్తికి ,సర్వ బంధ విచ్ఛేద కోపాయ ప్రదాతకు ,త్రాత కు నమ్ర నమోవాకాలు .,శ్రేష్ఠ సాష్టాంగ దండ ప్రణామాలు ,సర్వార్పణం ‘’అని పులకిత గాత్రం తో పలికిన శ్రీ అనుభావానంద స్వామికి శత సహస్ర వందనాలు .

  ‘’సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మా ద్వైత వేదినే –శ్రీమతే శంకరార్యాయ  వేదాంత గురవే నమః ‘’(విద్యారణ్యులు )

   తర్వాత శ్రీ శంకర సారస్వతం గూర్చి తెలుసుకొందాం .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2

శ్రీ శంకరుల  దేశ పర్యటన -2

శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ మరణం

 శంకరులు శృంగేరిలో ఉండగానే తల్లి అవసాన దశ లో ఉన్నదని గ్రహించారు .కానీ బృహత్ శంకర విజయం లో శంకరులు గోవింద భాగవత్పాడులవద్ద తురీయ ఆశ్రమమం తీసుకొని , బదరీ కైలాసాలు దర్శించి మళ్ళీ బదరిని చేరాక తల్లి అనారోగ్యం  తెలిసింది అని ఉన్నది .అగ్ని శర్మ అనే బంధువు శంకరుని తల్లి సందేశాన్ని తెలియ జేయగా ,చిత్సుఖా చార్యునితో కలిసి శంకరులు స్వగ్రామం కాలడి చేరారు ,విద్యారణ్య రచన ప్రకారం శృంగేరి స్థాపన తర్వాతనే తల్లి మరణం జరిగిందని ఉంది .ఇంటికి వెళ్లి తల్లికి సేవలు చేసి ,ఆమెనిత్యం  నదీ స్నానానికి వెళ్ళలేని  స్థితి గమనించి తపోశక్తి తో పూర్ణానది దిశమార్చి తనింటి ముందు ప్రవహించేట్లు చేశారు .అప్పటినుంచి అది ‘’అంబా నది ‘’పేరుతొ పిలువబడింది.అవసాన దశలో తనకు తత్వోపదేశం చేయమని కుమారుని కోరితే, శంకరులు ‘’తత్వ బోధ ‘’అనే గ్రంథం రాసి ,బోధించటం మొదలుపెడితే ఆమెకు అర్ధంకాక ఇంకొంచెం సులభంగా చేసి చెప్పమని కోరితే ,శ్రీ కృష్ణ పరమైన శ్లోకాలు రాసి వివరించారు .భగవధ్యానం తో తన్మయురాలై ఆర్యాంబ తనువు చాలించింది .పూర్వాశ్రమ బంధువులను పిలిచి ,తాను తల్లికి  చేసే దహన సంస్కారాలకు ఆహ్వానించగా ,వాళ్ళంతా బహిష్కరించారు.శంకరుడు తల్లికిచ్చిన వాగ్దానం నెరవేర్చాలని కృత నిశ్చయంతో ఉంటె ,సన్యాసి దహన సంస్కారాలకు అర్హుడు కాదని వారు వాదించి భీష్మించారు .ఈ విధ౦గా సి.ఎన్ .కృష్ణస్వామి అయ్యర్ చెప్పినట్లు ‘’Shankara  failed to become a prophet in his own land ‘’ స్వస్థలం లో’’ జగద్గురువు’’ అని పించుకోలేక పోయిన శంకరులు ,తల్లిని స్మశానానికి ఒక్కడే తీసుకు వెళ్ళలేక ,తన ఇంటి ఆవరణ లోనే ఒకమూల తల్లిపార్ధివ దేహానికి దహన సంస్కారం చేయాల్సి వచ్చింది .ఉత్తర క్రియలనూ యధావిధిగా నిర్వహించారు .విద్యారణ్య శంకర విజయం ప్రకారం అప్పుడు శంకరులతో పాటు ఒక్కశిష్యుడు కూడా లేడు.వెంట వచ్చిన చిత్సుఖా చార్యుడు ఏమయ్యాడో తెలియదు .గత్యంతరం  లేక తల్లి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి ,సమిధలు కూడా లేకపోవటం చేత ఎండిన అరటి ఆకులతో అగ్ని సంస్కారం చేసినట్లు తెలుస్తోంది .అందుకనే బంధువులమీద విపరీతమైన కోపం వచ్చి శపించటం చేత అప్పటినుంచీ  దేశం లో శవదహనాలు తమ ఇంటి ప్రాంగణం లోనే నిర్వర్తిస్తున్నారు .శవం పై కత్తితో అక్కడక్కడ గాయాలు చేసి మరీ దహనం చేస్తున్నారని కృష్ణస్వామి అయ్యర్ ఉవాచ  .’’మాతృమూర్తిపై ఉన్న ప్రేమాతిశయాలతో ఎన్ని ప్రతిబంధాలు ఏర్పడినా ,శాస్త్రం నిషేధించినా ,ఆప్తులు బహిష్కరించినా ,తల్లిప్రేమ ముందు ఇవన్నీ తృణప్రాయంగా భావించి, తల్లి అంత్యక్రియలు నిర్వహించి తల్లికిచ్చిన మాట నిలబెట్టుకొన్నారు శంకులు .ఆయన సంకల్ప బలం ఎంత అమోఘమో ,పట్టుదల ఎలాంటిదో ,మనో ధైర్యం ఎంతటి   ఉత్కృష్టమైనదో తెలియ జేసే సంఘటన ఇది.అందు చేతనే అతి తక్కువకాలం లో సాధారణ మానవ ప్రజ్ఞకు అందరాని విద్యా వైదుష్యాన్ని సాధించి ,పండిత చక్రవర్తులను సునాయాసంగా ఓడించి ,రాజాధిరాజుల్ని పాదాక్రాంతుల్ని చేసుకొని ,సర్వ శాస్త్రాతీతమై ,అనంతమైన అఖండ  అద్వైతసిద్ధాంతాన్ని స్థాపించి, తానుకూడా ,సామాన్యమానవ ప్రజ్ఞాతీతుడై ,అతి దూరుడై ,దుర్ఘట సమస్యయై ,అతీతుడై ,సర్వ ప్రపంచ మానవ కోటికి అలంకారమై శంకర భగవత్పాదులు భాసి౦చారు ‘’ అన్న శ్రీ అనుభవానందుల వారి అమృతోపమానమైన వాక్కులు శిరో ధార్యం . ఆయనది ఒక అద్భుత మూర్తిమత్వం ,,అతిమానుషం ,దివ్యం .

   తల్లి దహన సంస్కారాలు పూర్తి చేసి ,శంకరులు మళ్ళీ  శృంగేరి చేరారు .పద్మపాదుడు రామేశ్వరయాత్ర పూర్తి చేసుకొని శృంగేరి చేరుకొన్నాడు .శంకరులు దేశ పర్యటన కొనసాగించాలనే సంకల్పంతో తూర్పు తీర దేశాలవైపు బయల్దేరారు .ముందుగా శాక్తేయులకు ఆలవాలమైన కాంచీనగరం చేరారు .కొంతకాలం ఉండి ,పరమత సిద్ధాంతాలను  ఖండించి ,ముఖ్యులను వాదం లో ఓడించి ,శిష్యులను చేసుకొని ,కామాక్షీ దేవికి ముందుభాగంలో శ్రీ చక్రం స్థాపించి ,ఆమెలోని  రౌద్రాన్ని తగ్గించి సౌమ్యత్వాన్ని ప్రకటింప జేశారు .ఆమె అనుగ్రహం కోసం తపస్సు చేసి ,కృపా సిద్ధిపొంది ,హృదయం నిండా అమందానందాన్ని పొందారు .అక్కడినుంచి జంబుకేశ్వరం వెళ్లి ,అక్కడి అమ్మవారు అఖిలా౦డేశ్వరి ఉగ్రరూపాన్ని కూడా సౌమ్యంగా మార్చటానికి శ్రీ చక్రకమలం స్థాపించి  ఆమె ఎదురుగా వినాయక విగ్రహం ప్రతిష్టించి జనాలపై పుత్ర వాత్సల్యం కలిగేట్లు చేశారు .అమ్మ అనుగ్రహం పొంది ,మధుర వెళ్లి మీనాక్షీ సుందరేశ్వర దర్శనం చేసి ,మీనాక్షీదేవిని కొంతకాలం ఉపాసించి అనుగ్రహం సాధించారు . .ఈకాలం లోనే దక్షిణాది రాజుల అండ మెండుగా లభించింది .పరమత ఖండనం చేసి అద్వైత మతస్థాపనాన్ని సుస్థిరం చేసి శృంగేరి పీఠాన్ని సర్వ శక్తి మంతం గావించారు ..

  క్రీపూ .494లో శంకరులు కాలడిలో తల్లి దహన సంస్కారాలుపూర్తిచేసిన సమయం లో నర్మదానదీ తీరంలోని మాంధాత ద్వీపం లో  అమరేశ్వరం లో ఉన్న గోవింద భగవత్పాదులు వ్యాధి గ్రస్తులై ఉన్నారని తెలిసి ,వెంటనే బయల్దేరి వెళ్లి గురుపాదులను దర్శింఛి సేవలు చేస్తూ ఉన్నారు శంకరులు .కార్తీక శుద్ధ పౌర్ణమినాడు గోవింద భగవత్పాదులు బ్రహ్మైక్యం చెందారని బృహత్ శంకర విజయం  తెలిపింది .

  నర్మదా తీరం నుంచి తూర్పున ఉన్న పూరీ జగన్నాధ క్షేత్రం చేరి ,కొంతకాలం ఉండి  మఠ స్థాపన చేసి’’ గోవర్ధన మఠం ‘’అని పేరుపెట్టారు .సేతు రామేశ్వరం నుంచి ప్రారంభమైన ఈ తూర్పు దేశ యాత్ర లో ద్రవిడ,పాండ్య , చోళ ,ఆంద్ర రాజ్యాలలో ఉన్న క్షేత్రాలను విద్యాస్థానాలను దర్శిస్తూ ,రామేశ్వర మధుర ,శ్రీరంగం, కంచి వేంకటాచల ,జగన్నాధాది క్షేత్రాలను దర్శించి ,ఆయా దేవతల అనుగ్రహం పొంది శంకరులు విదర్భ దేశం ప్రవేశించారు .

   విదర్భనుంచి కర్నాటకం వెళ్లి అక్కడి కాపాలిక నాయకుడు శ్రీకచుడు మొదలైనవారిని వాదం లో ఓడించి ,భూకైలాసం అనబడే గోకర్ణ  క్షేత్రం చేరి ,అక్కడినుంచి సౌరాష్ట్ర దేశం వెళ్ళారు .అక్కడి రాజు సుధన్వుడు పూర్వం జైన బౌద్ధమతావలంబి అయినా ,కుమారిలభట్టు ప్రభావంతో వైదిక మతావలంబి అయ్యాడని పూర్వమే చెప్పుకొన్నాం .సుధన్వుడిని అద్వైతానికి మార్చి ,అతని ప్రోత్సాహంతో శ్రీకృష్ణ ద్వారకలో ఒక మఠం స్థాపించి ‘’శారదా పీఠం’’అని పేరుపెట్టారు .రాజు సుధన్వుడు శంకరుల వెంట నడుస్తూ అద్వైత వ్యాప్తికి గొప్ప కృషి చేసి శంకరాభిమానం పొందాడు .ఎందరో రాజులు శంకరులకుసహాయం చేసినా సుధన్వుడి ని మాత్రమె ఆదర్శ ప్రభువు గా   గ్రంథాలు పేర్కొన్నాయి .శంకరాచార్యులు కూడా అతడిని అమరుడిని చేయటం ఆరాజు గొప్ప అదృష్టం .

ఆధారం -శ్రీ అనుభవానంద స్వామి వారి -”సర్వ సిద్ధాంత సౌరభం ”

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-21-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకరుల దేశ పర్యటన

శ్రీ శంకరుల  దేశ పర్యటన

ఆతర్వాత శంకర  యతీ౦ద్రులు దేశం నలుమూలలా అద్వైత మతాన్ని స్థాపించటం కోసం  శిష్య గణం తో  భారత దేశమంతా పర్యటన ప్రారంభించారు .అన్ని రాష్ట్రాలపాలకులు శంకరుని గౌరవంగా ఆహ్వానించి అద్వైత ప్రచారానికి బాగా తోడ్పడుతున్నారు .ముందుగా మాహిష్మతి నుంచి ,మహారాష్ట్ర మీదుగా దక్షిణాప్రయాణమయ్యారు .మహారాష్ట్రలో మల్లరులు ,కాపాలికులు ,భైరవారాధకులైన తాంత్రికులు న్నారు..వీరి మత సిద్ధాంతాలను అనుష్టానవిధానాలను ఖండిస్తూ ,వారిఅనుచరులను మార్చి ,శిష్యులను చేసుకొని దిగ్విజయ యాత్ర చేశారు .శంకర వాద విధానం లో   ఒక సామరస్యం ఉన్నట్లు ఆనందగిరి రాశాడు .ఒక చోటుకు చేరగానే శంకరులు ఆదేశం లోని పండితులను  సమావేశానికి  ఆహ్వానించి,వారి మతవాదాన్ని దాని సాధనా విధానాన్ని వారితోనే చెప్పించి శ్రద్ధగా వినేవారు .తర్వాత ఆ మత వాదం పై వారితో సాకల్యం గా చర్చించి ,ముందుగా అందులో తనకు అంగీకారం అయిన  విషయాలను చెప్పి , తర్వాత అంగీకారం కాని విషయాలపై తీవ్రంగా వారితో చర్చించి ,తన సిద్ధాంతాన్ని సమర్ధించి ,వారి సిద్ధాంతం లోని దోషాలను ఎత్తి చూపటం తో ప్రత్యర్ధులు సులభంగా శంకర భావ ధారకు లొంగి ,అనుచరులు శిష్యులవటం ముఖ్య విశేషం .

   ఈ ప్రయాణం లో మహారాష్ట్రలో ఒక చోట ఒక కాపాలికుడు కుటిల ప్రయత్నాల చేత చంపాలని భావించాడు .’’Man’s  unhappiness comes of his greatness ‘’తన ప్రతిష్టవల్లనే మానవుడికి దుఖం కలుగు తుంది అనే మహాకవి కార్లైల్ నానుడి ననుసరించి శంకరుని కీర్తి ప్రతిష్టలు చాలామందికి అసూయకు కారణమయ్యాయి .ఈకాపాలికుడు మూఢ౦గా తెగించటం చేత అతని పేరు లోకానికి తెలిసింది కానీ ,ఇంకా యెంత మంది ఉన్నారో తెలీదు .వీడు అంతా నిద్రించే సమయంలో శంకరుని తల నరకటానికి వచ్చాడు .వాడికి మించిన శక్తి సామర్ధ్యాలున్న పద్మపాదునికి తెలిసి .వచ్చి వాడి చేతిలోకత్తిలాగేసి వాడిని చంపేశాడు .దీనికి భిన్నంగా కాపాలిడు ఒకసారి శంకర సన్నిధానానికి వచ్చి ఒక మహాత్ముని శిరస్సు కాళికా దేవికి అర్పించాలను కొన్నాననీ అమహాత్ముడు శంకరుడే అని ,శిరసు ఖండించిన మాత్రం చేత ఆత్మ అవిచ్చేద్యం కదా అని ఆయనకే బోధించగా శిష్యులు లేని సమయంలో వచ్చి తల తీసుకోమని శంకరులు చెప్పగా వాడు వచ్చి తల తెగేయ్యటానికి సిద్ధమై పద్మపాడుడిని నిద్రలేపగా , పద్మపాదుడు ఆ కాపాలికుని  వధించాడని కథనం.ఈ సంఘటన మన శ్రీశైలం లోనే జరిగిందని పలువురి నమ్మకం .

  శ్రీశైలం నుంచి కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం చేరి స్వామిని దర్శించి ,శ్రీ వల్లిఅనే చోటుకు శంకరులు వచ్చారు .ఇక్కడ మూఢుడు లాగా ఉండే ఒకడు వచ్చి శిష్యుడయ్యాడు .ఇక్కడ కాదు ప్రయాగలో ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు శంకరుని వద్దకు తనమూఢ కుమారుని తీసుకొనివచ్చాడని వాడిని అనుగ్రహించి కొన్ని ప్రశ్నలు అడిగితె పృధ్వీ ధరుడు అనే ఆ బాలుడు తన నిజతత్వాన్ని తెలుపుతూ అద్వైత ప్రసంగం చేశాడనీ ,అందరూ ఆశ్చర్యపోయారనీ ,అతడు చెప్పిన శ్లోకాలకే  శంకరులు ’’ హస్తామలకం ‘’ అనే వ్యాఖ్య రాశారని అతడిని శిష్యుడిని చేసుకోన్నారనీ ఉంది .మొదట్లో ఇతడి పేరు ఉదంకుడు అనీ ,కానీ సన్యాసం స్వీకరించి హస్తామలకాచార్యుడై ప్రసిద్ధి పొందాడని చరిత్ర .ఇతడి తండ్రి ప్రభాకరుడే మీమాంసా చార్యుడైన ప్రభాకర మిశ్ర అన్నారు .కాలం లో చాలా తేడా ఉంది కనుక ఇది నిజం కాదన్నారు శ్రీ అనుభవానందులు.

   కాశీలో మణికర్ణికా క్షేత్రం లో శంకరులు ఉండగా అక్కడే ఉంటున్న విశ్వనాథాధ్వరి కొడుకు కలానాథుడు శంకర దర్శనం చేసి ,మనోహరమైన తోటక వృత్తాలతో గానం చేసి ,శుశ్రూష చేసి శిష్యుడై ,సన్యాసం తీసుకొని తోటకాచార్యునిగా పిలువబడ్డాడు .ఇతడి పూర్వనామం గిరిలేక ఆనంద గిరి .ఇతడు శంకర భాష్యపాఠాలకు,ఆలస్యంగా వచ్చినా అతడికోసం ఆగి ,వచ్చాకనే చెప్పేవారు .అతడు మందమతి అతడికోసం ఎదురు చూడటం దండగ అని ఇతర శిష్యులు ఫిర్యాదు చేయగా ,అతనిపైప్రత్యేక దయ చూపించి అనుగ్రహించగా క్రితం సారి చెప్పిన పాఠాలను తోటక వృత్తం లో శ్లోకాలుగాచేప్పి అందర్నీ విస్మయాన౦ద భరితుల్ని చేశాడు .ఈవిధంగా పద్మపాద సురేశ్వర ,హస్తామలక ,తోటకాచార్యుడు అనే నలుగురు ముఖ్య శిష్యులు ఏర్పడ్డారు .

  తర్వాత దక్షిణాభి ముఖంగా ప్రయాణించి,తుంగభద్రానదీ తీరం చేరి ,అక్కడి ప్రకృతి సౌందర్యం ,ప్రశాంత వాతావరణానికి సంతోషించి శంకరులు ఆనందంతో అక్కడ శృంగేరి లో ఒక మఠాన్ని స్థాపించి ,అందులో శారదా దేవిని ప్రతిష్టించి ,వీర సేనమహారాజు సాయంతో దేవాలయం నిర్మించి ,అఖండ విద్వత్ వరుడైన సురేశ్వరుని పీఠాధిపతి గా నియోగించారు .

  అప్పటికే తాను రాసిన భాష్యాది గ్రంథాలు అందరూ అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉన్నాయని గ్రహించిన శంకరులు వాటికీ వివరాలు అవసరమని భావించారు .ఒక రోజు శిష్యులను పిలిచి ,తన సంకల్పం చెప్పి ,తన రచనలలో మణిపూస లాంటి’’ బ్రహ్మ సూత్ర భాష్యం ‘’కు వార్తికం రాయమని సురేశ్వరునికి అప్పగించారు .మిగిలినవారికీ పనులు అప్పగించారు. కానీ సురేశ్వరుడు సమర్దుడుకాదని అతడు కర్మిష్టి అనీ గురువుకు విన్నవించారు .ఏక భావం రానందున పద్మ పాడునికి ఆబధ్యత అప్పగించి ,సురేశ్వరునికి బృహదారణ్యకం మొదలైన వాటికి వార్తికాలు రాయమన్నారు.అతడు వాటిని రాసి చూపించి అంగీకారం పొందగా శంకరులు అతడిని ఒక అద్వైత రచన చేయమని ఆదేశించారు .అతి తక్కువకాలం లోనే  ‘’నైష్కర్మ సిద్ధి ‘’అనే గ్రంథాన్నిరాసి అద్వైత భావ గరిమతో శంకరుని మనసు దోచుకొన్నాడు .

  పూర్వం కాశీలో పద్మపాదుడు ప్రభాకరుని మీమాంసా శాస్త్రంను అధ్యయనం చేసిన వాడు అవటం చేత ,దాన్ని అనేకరకాలుగా ఖండిస్తూ భాష్య వివరణం రాశాడు .గుర్వాజ్ఞతోదాన్ని తీసుకొని తన స్వగ్రామం చిదంబరం,అక్కడినుంచి రామేశ్వరం దర్శించాలని బయల్దేరి చిదంబరం లో పిన తండ్రి  ఇంట్లో ఉంచి వెళ్ళగా ,అతడు ప్రభాకరుని అభిమాని అవటం తో దాన్ని తగలబెట్టాడు అసూయతో .యాత్రనుంచి తిరిగివచ్చి తనగ్రంధం విషయం అడిగితె అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం లో దహనం చెందిందని మొసలి కన్నీరు కార్చాడు పినతండ్రి .దుఖభారంతో శృంగేరిలో ఉన్న శంకర గురువును దర్శించి జరిగినది వివరించాడు .శిష్యుని ఓదార్చి పూర్వం ఆగ్రంథాన్ని తనకు చదివి వినిపించాడు కనుక దాన్ని స్మరించి అయిదు పాదాలు మాత్రమె చెప్పగా పద్మపాదుడు మళ్ళీ రాసి లోకానికి అందించాడు ,అది ‘’పంచపాదికా వివరణం ‘’అనే పేరుతొ లోక ప్రసిద్ధమైనా ఇప్పుడు అదీ దొరకక బ్రహ్మ సూత్రాలలో మొదటి సూత్రాచతుష్టయం లో మాత్రమె పద్మపాదుని వివరణ మిగిలి ఉంది .ఇందులో శంకర అధ్యాస భాష్యం చాలా విపులంగా ఉండి,దీనికి అనేక వృత్తులు,టీకలు కలిగి ప్రఖ్యాతి పొందింది .ఇదే శంకర భాష్యానికి మొదటి వివరణ గ్రంధం మాత్రమేకాదు శంకరుని ప్రియశిష్యుడు పద్మపాదాచార్య కృతం కూడా  .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

కాశీ రాజు రత్న సింహుడు శ్రీ శంకరాచార్యుల అప్రతిహత విద్యా వైభవ సంపత్తి గుర్తించి ,గౌరవించి ,కాశీలోనే ఉంటూ తనకు ఆనందాన్ని కలిగించమని ప్రార్ధించాడు .సన్యాసి అలా ఒకే చోట ఉండటం ధర్మం కాదని చెప్పి ,ఒకచోటే కాలక్షేపం చేయటానికి తాను  పుట్టలేదని తెలియజేసి ,అక్కడి నుంచి బయల్దేరారు.ఆనంద గిరి ,చిద్విలాసుల కథనం ప్రకారం శంకరులు సామాన్య యతీశ్వరుడిగా కాక ,కాశీరాజు ప్రాపకం తో లభించిన అనేక రాజ లాంఛనాలతో పటాతోపంగా దిగ్విజయ యాత్ర ప్రారంభించారు .ద్వారక రాజు సుధన్వుడు శంకరుని గురువుగా స్వీకరించి ,సేవ చేయాలనే కోరికతో ఆయన వెంట నడిచాడు .అప్పుడు భగవత్పాదుల వయస్సు 25ఏళ్ళు .కొందరి లెక్కప్రకారం కుమారిల భట్టును కలిసే నాటికి శంకరుల వయసు 15మాత్రమే .

  మొదటిసారిగా ప్రయాగ క్షేత్రం చేరి త్రివేణీ సంగమ స్నానాలు చేస్తూ ,జిజ్ఞాసులకు బోధ చేస్తూ ,ప్రత్యర్ధులను ఓడిస్తూ ,మీమాంసా శాస్త్ర దురంధరుడైన కుమారిల భట్టు ఆత్మ పవిత్రత కోసం తుషాగ్నిలో  ప్రవేశించ బోతున్నాడని తెలిసి ,అంతకు ముందే ఆయనతో సంభాషించాలనే కోరిక ఉండటం చేత శంకరులు రుద్రపురంలో ఉన్న కుమారిలుని చూడటానికి వెళ్ళారు .ఈయన జైన ,బౌద్ధ సిద్ధాంతాలను ఆయా గురువులనుంచి రహస్యంగా గ్రహించి ,దొరికిపోయి ,బహిష్కరింపబడి,క్రోధా వేశాలతో రాజాశ్రయాన్ని పొంది ,ఆమతాలను రూపుమాపి ,అవసానకాలం లో గురు ద్రోహ మహాపాతకం నివారణకోసం ,ప్రాయశ్చిత్తంగా’’ ఊక కొలిమి’’లో ప్రవేశించి చనిపోవాలని భావించాడు .శంకరులు అక్కడికి చేరే సమయానికే ఆయన అగ్ని ప్రవేశం చేసి కొంతవరకు దహింప బడినా, శంకరునితో ఆనందంగా మాట్లాడి ,మాహిష్మతి నగరంలో ఉన్న తన శిష్యుడు మండన మిశ్రుని కలిసి ఓడింఛి శిష్యునిగా గ్రహించమని  చెప్పి చనిపోయాడు .  కుమారిలభట్టు సుధాన్వాదిఅనేక బౌద్ధరాజులను సంస్కరించి వైదిక మార్గ ప్రవర్తకులను చేసి ,వారిద్వారా దేశం లో వైదికాన్ని స్థాపించిన మహాపురుషుడు గా కీర్తి పొందాడు .ఆ కాలం లో ఆయనకు ఎదురు లేదు .కుమారిలుడు కామరూపం అనబడే అస్సాం కు చెందినవాడని కొందరు ,తమిళ దేశం వాడని కొందరు అంటారు .అతని ప్రత్యర్ధులైన ‘’జిన విజయ ‘’కర్తలు కుమారిలుడు ఆంధ్రుడే అన్నారు .కానీ ఆయన జీవితమంతా ఉత్తర దేశం లోనే గడిచిపోయింది కనుక అతని ప్రభావం ఆంద్ర దేశం లో కనిపించలేదు .క్రీ.పూ 494లో శంకరుల 15వ ఏట కుమారిలభట్టు మరణించాడు .’’శంకర –కుమారిల సమాగమనం కు చారిత్రక సాక్ష్యాదారాలు  దొరకక పోవటం చేత దాన్ని సమ్మ తి౦చటం లో ప్రాముఖ్యం లేదన్నారు ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి .కుమారిలుడు శంకరులకు చాలా ప్రాచీనుడు కనుక వీళ్ళిద్దరూ కలుసుకోవటం అసంభవం అన్నారు కృష్ణస్వామి మొదలైన ఆధునికులు .

  కుమారిల యతి సార్వ భౌముడితో చర్చించే అవకాశం దొరకక పోయినందుకు శంకర యతీంద్రులు ,నిరాశ చెంది ,కుమారిలుని ముఖ్య శిష్యుడేకాక ,బావమరిది కూడా అయిన మండన మిశ్రుని తో వాదించటానికి మాహిష్మతీ నగరం చేరారు .అది మగధ సామ్రాజ్య రాజధాని అని విద్యారణ్యులు చెబితే, హస్తినాపురానికి దగ్గరలో ఉందని ఆనంద గిరి రాశాడు .ఈనగరం నర్మదా నదీ తీరంలో ఉందని రఘువంశం,మాఘకావ్యం  అన్నాయని ‘’తెలంగ్’’ తెలిపాడు .మండన మిశ్రుడు రాజ గురువు అవటం చేత అత్యధిక భోగాభాగ్యాలతో వర్ధిల్లుతున్నాడు .శిష్యులనేకులున్నారు .వారికి కర్మకాండ బోధిస్తూఉంటె ఇంటి ప్రాంగణం లోని పంజరపు చిలకలు ‘’వేదాలు స్వతః ,పరతః ప్రమాణాలే-  ‘’స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరా౦గనా యత్ర గిరం గిర౦తి ‘’పలుకుతుంటాయి .అంటే సంపూర్ణ వైదిక కర్మభావ వాతావరణాన్ని ఆయన స్వయంగా నిర్మించాడు .’’మీమా౦సాను క్రమణినిక ‘’,విధి వివేకం ‘’అనే అపూర్వ గ్రంథాలు రాసి మహా ప్రఖ్యాతుడైనాడు .ఇలాంటి బలమైన ప్రత్యర్ధితో వాదించిజయించి అద్వైత ప్రతిష్ట చేయాలని  శంకరుల కోరిక . ఈ సంఘటన అత్య౦త ప్రధానమై శంకరుల జీవితం కొత్తమలుపు తిరిగింది .మండనుని ఓటమితో ,ఆనాటి కర్మ వాదులంతా తలవంచి మగధ రాజుతో సహా అనేకమంది రాజులు శంకరులకు అధీనులైనందున  ,శంకర సంకల్పమైన అద్వైత సిద్ధాంత స్థాపన కార్యక్రమం జయప్రదమైంది .మండన పండితుడే విశ్వరూపాచార్యుడు .శంకర శిష్యుడై సురేశ్వరాచార్యుడు అయ్యాడు .

  మండన మిశ్ర ,శంకరులు ఏడు రోజులు చర్చోపచర్చలు ఉభయభారతి అధ్యక్షతలో జరిపారు .శంకరుల ప్రజ్ఞకు సమాధానాలు చెప్పలేక మండనుడు ఉక్కిరి బిక్కిరై భార్య ఉభయభారతి ప్రకటించినట్లుగా ఓటమిని అంగీకరించాడు .శంకర ఉభయభారతి వాదాలు తర్వాత సాగి ,ఆధ్యాత్మిక విద్యా స్వరూపుడై ,చిద్రూపుడైన అపర శంకరునికి ,సర్వ విద్యాపాదపమైన అపర శారద కు జరిగే వాదాలను చూడటానికి దేవ ముని గణం అంతా తిలకించి పులకించింది .చివరికి ఆమెకూడా ఓడిపోయి శంకరుని సత్కారం చేసి భర్త మండనుడి  సన్యాస  దీక్షకు ఒప్పుకొని శంకర సూటి వాద ఘాతాలకు తీవ్రంగా బాధపడి అపరసరస్వతి ఉభయ భారతి శంకరుల భాగవత్పాదులతో శృంగేరి చేరి శారదామాతగా పూజ లండుకొంటున్నది అని ‘’గురు వంశ కావ్యం ‘’తెలియ ఎసింది .

  అమరుక రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసిన శంకరులు శృంగారాన్ని గ్రహించి ,ఉభాయభారతితో వాదించి ఓడించాడు .మండన మిశ్రునికి ఆత్మబోధ చేసి మహావాక్యాలు ఉపదేశించి తురీయాశ్రమమిచ్చి క్రీ.పూ.491లో సురేశ్వరాచార్యుడనే ఆశ్రమనామం అందించారు .వీటితో ఉత్తర భారతం లో శంకరునికి ఎదురు లేకపోయింది పండితపామరులు, రాజులు శిష్యలయ్యారు .అద్వైతామృతసారం గ్రోలారు.ఇతర మతాలను నిరాకరిస్తూ ,శంకర ప్రోక్త అద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జన్మ ధన్యం చేసుకొని ముక్తి పొందారు .ఉభయభారతి కూడా శంకరుని  సన్యాసిని గా అనుసరిస్తూ,  సంపూర్ణ వైరాగ్యంతో కాలం గడుపుతూ ,శృంగేరి మఠ స్థాపన వరకు శంకర భాగవత్పాదులతో పర్యటన చేస్తూ , తీవ్రమైన సాధనాలతో అనేక అనుభూతులు పొంది ,అందరికి ఆరాధ్యయై ,చివరికి శృంగేరిలో ఒక ఆలయం లో పూజింప బడుతోంది చరిత్ర తెలిపింది .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ వేదాంత సౌరభం ‘’.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-21-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చతురామ్నాయ పీఠాలు

చతురామ్నాయ పీఠాలు

శ్రీ శ౦కర భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలోశృంగేరి పీఠం అతి ప్రాచీనమైనది .క్రీ శ 1331నుంచి -1386వరకు శృంగేరి 12వ పీతాఠాధ్యక్షులుగా శ్రీ విద్యారణ్యస్వామి ఉన్నారు అంతకు ముందున్న 11 గురి పేర్లు తెలియవు .క్రీశ.773న శ్రీ విశ్వ రూపాచార్య నిర్యాణం చెందాక ఆయనే ఈ పరంపరకు మొదటి పీతాచార్యుడు అయి ఉంటాడు .ఈయన క్రీ.పూ.27 న శంకరాచార్యస్వామి ఆదేశం పై మొదటి ఆచార్యుడైనాడు అని శృంగేరి పీఠం తెలియజేసింది .వీరిలెక్క ప్రకారం శంకరులు క్రీ.పూ.11న సిద్ధిపొందారు .కనుక శంకరాచార్య ఉండగానే ,శంకరుల 16వ ఏట  విశ్వరూపుడు పీఠాధిపతి అయ్యాడు .ఆతర్వాత 16 ఏళ్ళు శంకర భగవత్పాదులు జీవించారు .ఈ లెక్క ప్రకారం విశ్వ రూపుడు క్రీ.పూ.27నుంచి ,క్రీశ .73వరకు పూర్తిగా 300 సంవత్సరాలు జీవించి ఉన్నట్లు తెలుస్తోంది .’’ఇదంతా అసంభవం ,ఆయన బతికింది కేవలం 80ఏళ్ళు మాత్రమె అనీ కనుక శంకరులు క్రీశ 7 వ శతాబ్ది వాడు’’ అని పండిట్ ఎన్.భాష్యాచార్య ‘’ ది ఏజ్ ఆఫ్ శంకరాచార్య ‘’గ్రంథం లో ఊహింఛి చెప్పాడు .

   శృంగేరి పీఠాన్ని అధిష్టించిన ఆచార్యులలో క్రీ.శ.6 శతాబ్దికి చెందిన9వ పీఠాధిపతి.విద్యాశంకరులు సిద్ధిపొందాక ,సుమారు 800ఏళ్ళు పీఠానికి అధ్యక్షులే లేరని ,14వ శతాబ్ది విద్యాతీర్ధ అభిమతం ప్రకారం విద్యారణ్యస్వామి తనగురువైన భారతీ కృష్ణ తీర్ధుని పీఠాదిపతిని చేశాడని శ్రేష్టులూరి క్రిష్ణస్వామయ్య తన జగద్గురు శ్రీ శంకరాచార్య చరిత్రం లో రాశాడు .భారతీ కృష్ణ తీర్ధుడు ,శంకరానంద విద్యాతీర్దుల శిష్యుడనీ,విద్యారణ్యుల  సోదరుడు అనీ చెప్పాడు .విద్యాతీర్ధుడు కుంభకోణం, కంచి కామకోటి పీఠాల అధ్యక్షుడై ,జీర్ణమైన శృంగేరి పీఠాన్ని విద్యారణ్యుని ద్వారా పునరుద్ధరించాడని కొందరంటారు .విద్యారణ్యుడు శృంగేరి స్వామియే అనీ ,కామకోటి పీఠానికి తీర్ధ సంప్రదాయం లేదని మరికొందరి వాదం .ఇవన్నీ ఆలోచిస్తే ,క్రీ.శ 773నుంచి శృంగేరికి క్రమరీతిలో ఆచార్యులు వారికాలాలు ఉన్నాయికనుక త్రోసివేయటానికి వీల్లేదు.అన్ని వాదాలకు స్వస్తి చెప్పి ,శంకరాచార్యుల వారి తర్వాత ఈ పీఠానికి విశ్వరూపాచార్యుడే అధిపతిఅయి  .క్రీ శ.778వరకు నిత్యబోధ  ఘనాచార్యుడు అధ్యక్షుడు అయ్యేదాకా కాలక్షేపం చేసి ఉంటాడు అనుకొంటే ఇబ్బంది లేదన్నారు శ్రీ అనుభవానంద స్వామి .ఈ అసంపూర్ణ ఆచార్య పరంపరను సమన్వయపరచి శంకరాచార్య క్రీశ.788లో జన్మించారని మాక్స్ ముల్లర్ చెప్పిన మాట సరైనదే అన్నాడు  కృష్ణస్వామి అయ్యర్ . 

  ద్వారకలోని శారదా పీఠం ప్రకారం శంకరాచార్య యుధిష్టిర శకం 2633వైశాఖ శుద్ధపంచమి పునర్వసు నక్షత్రం నాడు జన్మించినట్లు ,2636లో ఉపనయనం,2639లో సన్యాసం ,2640లో గోవింద  భగవత్పాదులవద్ద  బ్రహ్మోపదేశం ,2638కార్తీక బహుళ త్రయోదశినుంచి  ,మాఘ శుద్ధ దశమి వరకు ద్వారకా పీఠ స్థాపన 2648 ఫాల్గుణ శుద్ధ నవమి నుంచి శృంగేరి పీఠ ప్రతిష్ట 2649లో మండన మిశ్రునికి  సన్యాస మిచ్చి ద్వారక పీఠాధ్యక్షుని చేశారని ,2654లో హస్తామలకుని శృంగేరి పీఠాధిపతిని చేశారనీ ,2655లో పూరీ గోవర్ధన పీఠ స్థాపన చేసి పద్మపాదుని ఆచార్యునిగా చేశారనీ ,యుధిష్టిర శకం 2666కార్తీక పౌర్ణమినాడు శంకరులు సిద్ధిపొందారని ఉంది .అంటే క్రీ.పూ.50లొ జన్మించి క్రీపూ 472లో శంకరులు సిద్ధిపొందినట్లు నిర్ణయించారు .

  పూరీపీఠ గురుపరంపరను బట్టి యుదిష్టిరశకం 2655వైశాఖ శుద్ధ దశమి నాడు జగన్నాధ పీఠాన్ని స్థాపించి శంకరాచార్య పద్మపాదుని ఆచార్యుని చేశారనీ ఉంది. ఇది గోవర్ధలో పీఠ లెక్కలకు దగ్గరలో ఉంది

  బదరికాశ్రమ జ్యోతిర్మఠ పీఠ0చాలాకాలం శిధిలమై ఉండి ఇటీవలే పునరుద్దరింప బడటం వలన అక్కడి గురుపరంపర లభ్యం గా లేదు .

  ఈనాలుగే కాక కంచిలోని కామకోటి పీఠం శంకరాచార్య స్థాపితమే అనె అభిప్రాయం ఒకటి ఉన్నది .దీన్ని బట్టి కలియుగ 2593నందన సంవత్సర వైశాఖ శుద్ధపంచమి ,పునర్వసు నక్షత్రంలో శంకర జననం అని ఉంది .’’పుణ్యశ్లోక మంజరి ‘’ప్రకారం కలియుగం 2625రక్తాక్షి సంవత్సర అంటే క్రీ.పూ.77 శుద్ధ ఏకాదశి నాడు శంకరులు బ్రహ్మైక్యంచెందారు .కామకోటిలోని ‘’గురు రత్నమాల ‘’కూడా వీటినే సమర్ధించింది.

1-       శృంగేరి  మఠం క్రీ.పూ.43నుంచి క్రీ.పూ 11వరకు 2-కామకోటి పీఠం  క్రీ.పూ.508-509,క్రీపూ 477వరకు ,3-ద్వారక పీఠం-క్రీ.పూ 50నుంచి క్రీ.పూ.473వరకు ,4-గోవర్ధన పీఠం కూడా ఇదే కాలం లో నే ఉన్నది .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో  

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు -2

అమానుష శక్తి సామర్ధ్యాలకు నిలయమైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రాచీన ,ఆధునిక ,ప్రాక్ పశ్చిమ పండితులచే కొనియాడబడ్డారు .’’The life of Shankara makes a strong impression of contraries .He is a philosopher and a poet,a savant and a saint mystic and a reformer ‘’అన్నాడు రాధాకృష్ణన్ .’’బలీయం పరస్పర వైరుధ్యంగా  శంకరాచార్య జీవితం కనిపిస్తుంది .కానీ ఆయన తాత్వికుడు కవి ,విద్వాంసుడు మహాత్ముడు అనుభవ సంపన్నుడు ,మత సంస్కర్త గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తాడు .’’యవ్వనం లో ప్రజ్ఞాన తృష్ణా దాహం తో అచంచల నిర్భయ వాదిగాఒకరికి కనిపిస్తే ,ఏకత్వాన్ని ప్రజా బాహుళ్యం లోకి ప్రవేశపెట్టే సునిశిత రాజకీయ వేత్తగా వేరొకరికి ,జీవితం లోని వైవిధ్యాలను బయట పెడుతూ అజేయమైన  తీక్షణత కలిగిఉన్న ,ప్రశాంత తత్వ వేత్తగా,మనకు తెలిసినదానికంటే మనం గొప్పగా చెప్పుకొనే అనుభవ వేత్త గా  మరొకరికి కనిపిస్తాడు ‘’అంటూ రాధా కృష్ణ పండితుడు ‘’There have been few minds more universal than his ‘’అంటే శంకరుని కంటే సర్వతోముఖమైన చిత్తాలు చాలా అరుదు అంటాడు పండిత రాధాకృష్ణ ‘’ముప్పై ఒక్క సంవత్సరాలలో తత్వశాస్త్రాన్ని అంతా మధించి’’Also wrote tremendous  lot and tour all over the country from Cape Comarin  right up to Himlayas ‘’బండ్లకొద్దీ సాహిత్యాన్ని రచించి ,కన్యాకుమారినుంచి హిమాలయాలవరకు దేశామంతటినీ పర్యటించటం,అసాధారణం ,ఆసమయం ,పరమాద్భుతం ‘’అంటాడుప్రధమ రాష్ట్రపతి  బాబూ రాజేంద్ర ప్రసాద్ .

  తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు ‘’శంకరాచార్య తత్వవేత్త మరియు ,పండితుడు అనుభవ వేత్త,,కవి ,మహాత్ముడు .వీటికి అన్నిటికి ఆచరణ యోగ్యమైన సంస్కర్త ,సమర్ధ నిర్మాత ‘’అన్నాడు .సోదరి నివేదిత ‘’పాశ్చాత్యులు శంకరుని అవగాహన చేసుకోలేరు .చిరుప్రాయం లోనే ‘’దశ నామి ‘’సంప్రదాయాన్ని నెలకొల్పి ప్రత్యేక మత సంస్థాపనకు అవసరమైన సంస్కృత విజ్ఞానాన్ని  సాధించి ,సంభ్రమ ఆశ్చర్యాలు కలిగించే స్తోత్రావళి రచించినప్పటికీ అనుభవ వేత్తలాగా ,నిశ్చింతగా ,తేజోమయ జీవితాన్ని గడిపిన శంకరాచార్య ను ‘’The greatness that we may appreciate but can not understand ‘’ఆయన ఔన్నత్యాన్ని స్తుతించగలం కానీ, గ్రహి౦పజాలం ‘’అని కీర్తించింది .’’అజేయమైన తత్వ వేత్త అయి ,తార్కికుడై ,ప్రశాంత సువిశాల సమరస మూర్తియై Sankara taught us to love truth ,respect reason ,and realize the purpose of life .Twelve centuries have passed and yet his influence is visible ‘’సత్యాన్ని ప్రేమించటానికి ,హేతువును గౌరవి౦చటానికి ,జీవితాదర్శాన్ని పొందటానికి ఆయన ఉద్బోధించాడు .12శతాబ్దాలు గడిచినా శంకర ప్రభావం ప్రస్ఫుటంగానే ఉంది’’అన్నాడు డా రాధాకృష్ణన్ .డాసూర్య నారాయణ  శాస్త్రి’’ఆ కాలం లో ఆయన దేశం నాలుగు మూలలా పర్యటింఛి తనప్రభావాన్ని సమకాలికులపై ప్రసరింప జేశాడు  అంటారు  కానీ , ‘’Many of them flourish even today shedding a kindly luster that inspires the week ‘’ ఆ ప్రభావాలు అనేకం ఇంకా దుర్బలులకు కరుణార్ద్ర ప్రకాశం చేత ఉత్తేజం అలిగిస్తూనే ఉన్నాయి ‘’అన్నారు .

  ‘’భగవత్పాదుల అసాధారణ ప్రజ్ఞ,నిర్మలాత్మ ,గంభీర హృదయం ,ప్రశాంత చిత్తం ,ఘనమైన మనోభావం పొందిన మరొక మానవుడు లేనేలేడు .దీనికి కారణం ‘’He spoke of things as he saw and not as imagined ‘’తాను ఊహించినట్లుకాక ,తాను  చూసిన విషయాలే శంకరులు ప్రసంగిస్తూ ముఖతహా కాక హృదయం తో పలుకుతూ ,విశ్వ హృదయుడై విరాజిల్లటం శంకర ప్రఖ్యాతికి ముఖ్యకారణం ‘’అన్నారు శ్రీ అనుభవానంద స్వామి .

   ‘’వేదకాలం నుంచి లెక్కలేనంతమంది తత్వ వేత్తలు మానవ మనో వృత్తుల్ని సంస్కరి౦చి చారిత్రిక పురుషులయ్యారు –yet there are general synthesis ,systematic conceptions ,

Put for word by a Badarayana or a Sankara  which will remain land marks of human genius ‘’సర్వ సామాన్య సమన్వయము బాదరాయణ వ్యాస, ,శంకరాచార్యులచే ప్రతిపాదింప బడే సక్రమ భావ విధానం ‘’The more trustworthy exponent  of the Arya dharma  was the great teacher Sankara ‘’ఆర్య ధర్మానికి సముచితమైన ,విశ్వసనీయ వ్యాఖ్యాత జగద్గురు శంకరాచార్యుడే అనీ సర్ మో౦టర్,విలియమ్స్ అన్నాడు .’’ఆ ధర్మ గ్రహణానికి ‘’We look to Sankara rather than to the legendary Vyasa ,even though the latter be the reputed author of the Vedanta  Sutras ‘’వేదా౦తసూత్రకర్తగా ప్రఖ్యాతి పొందిన పౌరాణికుడైన  వేద వ్యాసమహర్షి కంటే శంకరాచార్యులనే మనం ప్రమాణం గా చూడాలి ‘’అన్నాడు మాక్స్ ముల్లర్ పండితుడు .ఇదీ శంకర భగవత్పాదుల శ్రేష్టత్వం .రేపు శంకర జయంతి సందర్భంగా ఆ అద్వైత భాస్కరునికి ఇలా అక్షరాంజలి ఘటించే అదృష్టం నాకు దక్కిందని సంతోషంగా ఉంది .మిగిలిన వివరాలు రేపు తెలుసుకొందాం .

  సశేషం

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్యులు

      అద్వైతం

‘’సదసత్సదసచ్చేతివికల్పాత్ప్రాగ్య ధిష్యతే  తదద్వైతం సమత్వాత్తు నిత్యం చాన్య ద్వికల్పితాత్ ‘’సత్ ,అసత్ సదసత్ అనే వికల్పాలకు పూర్వం ఉన్నదే అద్వైతం .అది ఏకం ,నిత్యం ,మిగిలినదంతా వికల్పమే .బ్రహ్మమే జీవుడు ,సకల విశ్వమూ అతడే అనే  వేదాంత సిద్ధాంతం .అఖండ స్థితి మోక్షం .బ్రహ్మ అద్వితీయతకు వేదాలే ప్రమాణం అని శంకర భగవత్పాదులు అద్వైత విషయం చెప్పారు .’’వక్తవ్యం  కిము విద్యతే ,తర బహుధా బ్రహ్మైవ జీవః స్వయం బ్రహ్మైతజ్జగదాపరాణు సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేహ్- బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయః-సత్యకం బాహ్యా హ్ స్ఫుటం బ్రాహ్మీ భూయ వసంతి సతతం చిదానందాత్మ నైవ ధృవం ‘’’’అని ‘’వివేక చూడామణి’’లో శంకరులు చెప్పారు .స్వయంగా జీవుడు బ్రహ్మమే. అణువునుంచి సకల జగత్ పర్యంతం బ్రహ్మమే అని శ్రుతులు ఘోషించాయి .’’అహం బ్రహ్మాస్మి ‘’అని జ్ఞానులు బయటి విషయాల జోలికి పోకుండా  బ్రాహ్మీ భూతులై ఎప్పుడూ చిదానంద రూపం లో ఉంటారు అనేది నిశ్చయం .బ్రహ్మ ,ఆత్మల ఏకత్వం వేదం చెప్పిందే .అది అవిరుద్ధం  అనే దే అద్వైతంలో గొప్పతనం

  ఋగ్వేదం లోని ‘’సహస్ర శీర్షాఃపురుషః సహస్రాక్షః సహస్ర పాత్ ‘’అంటే పురుషునిలోని అనేక శిరస్సులు ,నేత్రాలు పాదాలు అనంతత్వాన్ని సూచిస్తుంది .ఆతడి మహిమ దేశ ,కాల వ్యాప్తం అతడు సర్వానికీ అతీతుడు భూతగణాలన్నీ అతడికి ఒకపాదంఅయితే మిగిలిన మూడు పాదాలు అమృతమయమైన ద్యులోకం ,ఆనంద పర్ణాలున్న  ఆత్మ ఏకంగా ఉండగా ,బుధులు తమ రచనలలో అనేక రకాలుగా కల్పించుకొన్నారు .అన్యదేవతను ఉపాసించే వాడు  అజ్ఞుడు .తేజో వంతం ఆశరీరం ,నిర్మలం ,శుద్ధం ,పాపరహితం అయిన బ్రహ్మాన్ని బ్రహ్మ విదుడు పొందుతాడు అని వేదంలోని మంత్రాలు స్పష్టంగా చెప్పాయి .వేదసారమంతాఉపనిషత్ ఆరామ క్షేత్రం లో ప్రవహించి ,నిగూఢ మైన బ్రహ్మాన్ని ప్రత్యక్షం చేశాయి .దేని చేత అశ్రుతాలు శ్రుతాలయ్యాయో ,అదృశ్యాలు దృశ్యాలయ్యాయోఅదే బ్రహ్మం  ,బ్రహ్మం ఉన్నాడనే జ్ఞానమే అపరోక్షజ్ఞానం.అదే సాక్షాత్కారం అంటారు .రుద్ర హృదయం లో ‘’అద్వైతం పరమానందం ,శివం యాతితు కేవలం ‘’   అంటే అద్వైతం పరమానందం శ్రేయస్కరం .జీవేశ్వర తత్వాలు కేవలం కల్పితాలు ‘’జీవో దేవా స్సదా శివః ‘’అనే స్కాందం బట్టి ,అహం బ్రహ్మాస్మి ,ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా జీవ ఈశ్వర ఐక్యాన్ని చెప్పిమహావాక్యాలు సార్ధకమయ్యాయి .అద్వైత వాహిని ఉపనిషత్ క్షేత్రాలనుంచి పొంగి పొరలి ,బాదరాయణ సూత్రాలలో ప్రవేశించి ,,పొంగి ,మను వాది స్మృతులను  ముంచి , భాగవతాది పురాణాలలో స్రవించి ,భారత రామయణాది ఇతిహాసాలలో ,శైవ శాక్తాది తంత్రాలపై పొంగి ప్రవహించి ,ఏకోన్ముఖంగా బౌద్ధవాదం లో చేరి, ఏక ప్రవాహంగా గౌడ కారికలద్వారా శంకరుని చేరి౦ది అన్నారు అనుభవానందస్వామీజీ .

  ‘’శంకర సిద్ధాంత౦ అద్వైతానికి ముఖ్య శక్తి సమకూర్చింది  ‘’అన్నారు పండిత సూర్యనారాయణ శాస్త్రి .’’అద్వైతం అద్భుత యుక్తితో సిద్ధాంతమై క్రమబద్ద ఉపనిషత్తు లని కూడా పేరుపొందాయి .అదొక మహా సాహసం తార్కిక సూక్ష్మం .మానవుని విశ్వాసాలపై  నిర్లక్ష్యంగా  ప్రవహించే ,దాని కర్కశ మేధాశక్తి ,నిర్దాక్షిణ్య తర్కం ,వైదిక అవరోధాలను అధిగమించి స్వాతంత్ర్యం శుద్ధత్వం పొంది ,శుద్ధ తాత్విక విధానంగా లోకం లో గొప్ప ఆదర్శం గా నిలిచింది .విశాల పాండిత్యం కుశాగ్రబుద్ధి ఫలితమే శంకరాద్వైత౦.తక్కువ స్థితి లో  ఉండాలనుకొనే మనకు చాలా జటిలంగా ఉన్నట్లు కనిపిస్తుంది ‘’అన్నాడు హెరాల్డ్ స్మిత్ .

 ‘’It is only for the strong hearted ‘’ ,అన్నాడు సతీష్ చంద్ర చటర్జీ  ‘’The majority of best thinkers of  India have been men belonging to this school ‘’అన్నాడు డా జార్జి ధిబౌట్.ప్రొఫెసర్ పౌల్ డస్సెన్ తన ‘’ది ఫిలాసఫీ ఆఫ్ వేదాంత ‘’లో వందమంది వేదా౦తు లలో

పదిహేను మంది రామానుజుని ,అయిదుగురు మధ్వా చార్యులను ,మరో అయిదుమంది వల్లభా చార్యులను అభిమానించి అనుసరిస్తే ,75మంది శ౦కరాచార్యులకు   చెందిఉన్నారు .ఇలా అద్వైతం లౌకిక ,ధార్మిక ,పారమార్ధిక రంగాలో అన్ని విధాలా ఉత్కృష్ట స్థానం ఆక్రమించి,సర్వతో ముఖమై ,అఖిలమానవాభ్యుదయానికి కారణ శక్తియై విరాజిల్లుతూ ఉండటం మనకు గర్వకారణం .

   శ్రీ శంకర భగవత్పాదులు  

   ‘’కాషాయాంబర ధారిణం గురువరం వీరాసనాధ్యాసితం –ముద్రం జ్ఞానమయీం దాదాన మపరే హస్తాంబుజే పుస్తకం

శిష్యాన్ పార్శ్వగతాన్ సుపుస్తకక ధరాన్ తేజోధికాన్నిర్మలాన్ –పశ్య౦త౦ కరుణా కరం గుణ నిధిం శ్రీ శంకరాచార్యం భజే ‘’

‘’Shankara  is one of the greatest men who have appeared in India ‘’ భారత దేశంలో అవతరించిన సర్వ శ్రేష్ఠులలోఒకరు శంకరాచార్య అని డా ,కైలాసనాథ తెలంగ్ కీర్తించాడు .’’భారతీయ ప్రజ్ఞా నిధులలో ఒకడు ‘’అని కే ఏం ఫనిక్కర్ అంటే ,’’మానవ శరీరంలో అపూర్వంగా వసించిన ఉత్కృష్ట ప్రజ్ఞా మూర్తి ‘’అని ప్రొఫెసర్ డగ్లాస్,’’అన్నిటిపై తన సుతీక్ష్ణ హేతువాదాన్ని ప్రసరింపజేసిన మహాద్భుత మేధాశక్తి ‘’అని వివేకానడుడు ,’’Primarily a seer of highest type ,who realized the truth with his un erring intuitive vision ‘’,తన అకు౦ఠిత అంతర్ దృష్టి తో సత్యాన్ని గ్రహించిన సర్వోత్కృష్ట శ్రేణికి చెందిన మహనీయుడు’’అని వేదాంత కేసరి సంపాదకుడు ,’’the whole of the national genius awoke once more in Shankaracharya ‘’  అని సోదరి నివేదిత ,శంకరులు అపర శివావతారమే అనీ ‘’పుంగవ కేతస ,’’అభినవ శంకర ,శంకరశ్శ౦కర ,సాక్షాత్ ‘’అని అనేకులు అనేక విధాల శంకరాచార్యులను స్తుతించారు   ముఖ్య శిష్యుడు పద్మపాదుడూ  బహువిధ గుణగానం చేశాడు

   ‘’శంకరుని ప్రజ్ఞా కిరణాలు అనేక అంధకార బంధుర భావ స్థానాలను ప్రకాశింపజేసి ,గతి లేని హృదయగత దుఖాన్ని తుడిచి వేశాయి ‘’అన్నాడు పండిత రాధా కృష్ణన్.సిస్టర్ నివేదిత ‘’ Never was any prophecy more conclusively  vindicated than this ,by the appearance of Shankara charya ‘’శంకర అవతరణం కంటే ఏ జోశ్యం కూడా విస్పష్టంగా స్థాపించ బడలేదు’’యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత –అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ‘’అనే గీతావాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని సోదరి నివేదిత తెలియజేసింది.దివ్యజ్ఞానసమాజ స్థాపకురాలు మేడం బ్లావిట్స్కి ‘’He belongs t౦ the humanity of Shukra ‘’  శంకరులు మానవ జాతి వాడుకాదు శుక్రగ్రహం లోని అమానుష దివ్య పురుషుడు అని మనస్పూర్తిగా శ్లాఘించింది .’’శ౦కరాద్వైతాన్ని అంగీకరించని వాళ్ళు కూడా శంకరుని అనుసరి౦చటానికి వెనకడుగు వేయరు’’ అన్నాడు రాధాకృష్ణ పండితుడు .’’శంకరనామం భారత దేశం లోనే కాదు ,ప్రపంచమంతటా మంత్ర ముగ్ధుల్ని చేసింది ‘’అన్నారు ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ .’’నిజానికి ఆయన పరిసరాలు ఆకర్ష వంతంగా ఉంటూ ,ఆశ్చర్యం కలిగిస్తూ ,ప్రజలచేత భగవంతుని అవతారం గా భావింప బడుతూ ఉండటం లో ఆశ్చర్యం లేదు అన్నాడు ఎల్డి బార్నెట్..’’ శంకరుని  ‘’ఆచార్య ‘’బిరుదు కష్టార్జితం ,సముచితం అనీ అన్నాడు బార్నెట్.

  మిగిలిన విషయాలు రేపు తెలుసుకొందాం

సశేషం

ఆధారం –శ్రీ అనుభవానందస్వామివారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం )

కణాద సిద్ధాంతం లో ఈశ్వర స్థానం ఏమిటి ?అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి .ఈశ్వరుని గూర్చి ఆయన ప్రస్ఫుటంగా చెప్పలేదనీ ,విశ్వ సమస్యా పరిష్కారం లో అదృష్ట సిద్ధాంతం తో తృప్తి పొందాడని ,పండిత రాధాకృష్ణన్ భావించాడు .వైశేషిక సూత్రాలలో కొన్ని ఈశ్వర అస్తిత్వం తెలిపేవి ఉన్నాయని  అంటారుకాని అది సత్యదూరం అన్నాడు పండితుడు .ఈశ్వరుడినికాని ,పరమ సృష్టికర్తను కాని కణాదుడు సూచి౦చ లేదని శ్రీని వాస అయ్యంగార్ కూడా చెప్పాడు .కానీ సృష్టి కారణానికి అధిష్టానం అయిన పరమాణు స్పందనకు ,జీవ సంచలనానికీ అదృష్టమే కారణమని వైశేషికం నమ్మింది .కణాదుని అనుచరులు మాత్రం అదృష్ట సిద్ధాంతం అవిస్పస్టం అనాధ్యాత్మికం అని నమ్మి ,ఈశ్వర సంకల్పానికి దాన్ని అధీనంగా చేశారు –Made it dependent on God’s will.కనుక తర్వాతకాలం లో ‘’ఈశ్వరుడు విశ్వానికి నిమిత్తకారణమనీ ,పరమాణువులు ఉపాదానకారణం’’ అనీ భావించారని రాధాకృష్ణన్ చెప్పాడు .

 ‘’ భౌతిక ప్రపంచానికి తమ సిద్ధాంతాలు సంబంధించి ఉండటం వలన ,దానికి అతీతంగా కణాదుడు మొదట్లో ఈశ్వర ప్రస్తావన చేసి ఉండక పోవచ్చుననీ ,అభౌతిక కతృత్వాలను కోరకుండా సూత్ర కర్తలు .భౌతిక విషయాలపైనే దృష్టిపెట్టి ఉంటారనీ ,భాష్యకర్తలు దీన్ని లోపంగా భావించి ,అవకాశం ఉన్న ప్రతిచోటా ఈశ్వర భావాన్ని చొప్పించి ,ఆ లోపాన్ని పూరిచారు ‘’అని  ‘’అథల్యే ‘’అభిప్రాయ పడ్డాడు .వీటిని బట్టి కణాదుడు నాస్తికుడు కాదు .సృష్టి  సిద్ధా౦తానికి ఈశ్వరుడు అక్కర్లేదు అనిభావించి ప్రస్తావించలేదు .త్యాజ్యమైన ఈ సృష్టిని అధిగమించటానికి మొదట్లో ప్రకృతి విధానం తీసుకోవటం ముఖ్యావసరమై ,సాంఖ్యం కూడా ఈశ్వర విషయం లో మౌనంగా ఉండటం వలన ,యోగం వైశేషికాలు పరమాత్మను ఒప్పుకొంటూ ,అతడికి విశ్వ కర్త్రుత్వాన్ని మాత్రం కట్టబెట్టలేదు .దర్శనాలు వచ్చిన క్రమాలను ఆలోచిస్తే ,న్యాయ, వైశేషికాలు స్థూలాన్నీ ,సాంఖ్య,యోగాలు మానసికాన్ని ,మీమా౦సా ద్వయం అద్వైతాన్ని నొక్కి చెప్పాయి .కనుక వైశేషిక ప్రతిపాదన అంతా స్థూల విశ్వాన్ని గూర్చి మాత్రమె అని తెలుస్తోంది .ఈ మూల రహస్యాన్ని పాటించకుండా బహుశా శంకరాచార్యులు తమ సూత్ర భాష్యం లో ప్రధానమైన పరమాణు సృష్టి కర్త్రుత్వాన్ని ఖండించి ,’’తదేవ మసారతర తర్క సందృబ్ధత్వా దీశ్వర కారణ శ్రుతి విరుద్ధత్వా చ్చ్రుతి ప్రవణై శ్చ శిష్టైర్మన్వాదిరపరీ గృహీతత్వా దత్య౦త మేవాన పేక్షా స్మిన్,పరమాణుకారణ వాదేకార్యార్యైహ్-శ్రేయో నర్ధి భిరితి ‘’భావం-నిస్సార మైన మాటలతో కూడినదికనుక, , ఈశ్వర జగత్కారణం చెప్పే శ్రుతులకు విరుద్ధం కనుక ,వేదాదులపై ఆదరమున్న మనువు మొదలైనవారు దీన్ని స్వీకరించ లేదు కనుక పరమాణు కారణ వాదం పై శ్రేయస్సు కోరే ఆచార్యులు ఉపేక్ష వహించారు .శిష్టులు గ్రహించకపోయినా ,ప్రతిష్ట ప్రాబల్యాలకు లోపం  వచ్చేఅవకాశమున్నా ,తమ సిద్ధాంతాలను వాటి ప్రతిఫలాన్నీ ,తత్వ వేత్తలు మరుగున పడేట్లు చేయక పోవటం చేతనే భారతీయ తత్వ శాస్త్రం లో తాను ఎక్కువగా మెచ్చుకొనే అంశం ‘’అన్నాడు మాక్స్ ముల్లర్ పండితుడు .ఇతరులచేత నాస్తికం ,అవైదికం గా పరిగణింప బడుతున్నా ,గౌరవ మర్యాదలు పొందకపోయినా .లక్ష్య పెట్టక తన దారిలో తాను  వైశేషికం నడుస్తూ ప్రత్యేకత చాటుతోంది అని శ్రీ అనుభావానంద స్వామి అభిప్రాయం .

     ‘’ప్రశస్తమైన ఉపనిషత్ లలో న్యాయ వైశేషికాలు కనిపించవు .పతంజలి ,కణాదపేర్లు కూడా కనిపించవు.అయినా సూత్రకర్తలుగా చెప్పబడే తత్వ వేత్తలు భారత తత్వ శాస్త్రం లో ఆదిపురుషులుగా  గుర్తింప బడటానికిఅవకాశం లేదు ‘’అన్న మాక్స్ ముల్లర్ మాటలు గణనీయాలు  .’’ఈ సూత్ర కర్తలకుఆధార౦గా ఒక భావ ధార ఉండాలి.మీరు చూసిన విన్న దర్శనాలన్నీ ఉపనిషత్ ప్రమాణం పై ఆధార పడి ఉన్నవే ‘’అన్నాడు వివేకాన౦ద స్వామి .’’ఉపనిషత్కాలం తర్వాత  ఒక్కొక్క సిద్దా౦తాన్నీ గ్రహించి ,తమ తత్వ విజ్ఞాన పాఠ శాలలలోగురు పరంపరగా బోధిస్తూ అభి వృద్ధి చేయబడుతూ ఉన్న సిద్ధాంతాలకు ఒక ప్రస్ఫుట స్వరూపం ఇచ్చే కాలం వచ్చింది.దర్శనాలకు మూలాధారం ఉపనిషత్తులే’’అని బల్లగుద్ది మరీ చెప్పాడు   మాక్డోనాల్డ్ .

‘’తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం’’-‘’తస్మాదాగమికం’’- , ‘’వేదం లింగాచ్చ’’,వైదికం చ ,బుద్ధిపూర్వా వాక్య కృతిర్వేదే’’మొదలైన సూత్రాలు ప్రత్యక్షంగా వేదాన్ని ప్రస్తావించి ,ప్రమాణంగా గ్రహించింది కనుక వైశేషికం అవైదికం అనటం అసంబద్ధం అసమంజసం అన్నారు అనుభవానందులు . అన్ని దర్శనాలకు వేదమే ప్రమాణం .ఆయా దర్శనాలు వాటిలో తమకు ఉచితమైన స్వంత సిద్ధాంత ప్రతిపాదనకు ఉపయుక్తాలైన విషయాలను మాత్రమె గ్రహించి ,దర్శన  నిర్మాణం చేసి భారతీయ తత్వ జ్ఞానాన్ని షట్ దర్శనాలలో సమగ్రత పొందింది ‘’అని కీర్తించిన మాక్స్ ముల్లర్ పండితుని మాటలను ,బట్టి భారతీయ తత్వ శాస్త్ర భావ సంపత్తు ఆకాశాన్ని అంటి,అసమాన యశస్సు ప్రసాదించి అమృతత్వాన్ని ఆర్జించాయి అనటం ఉత్తమోత్తమం అన్నారు శ్రీ అనుభావానంద స్వామీజీ .

   పరమాణువు

  వైశేషికం లో పరమాణువు ,అంటే ఆటం,గురుత్వం అంటే గ్రావిటిఅనే మాటలు బాగా ప్రాధాన్యం వహించాయి .ఇందులోని నిర్వచనాలకు ఇప్పుడు మనం చెప్పుకొనే నిర్వచనాలకు తేడా ఉంది .త్రికాలాభాద్యమైన వస్తువు ఉంది అని సాంఖ్యం,సర్వ సృష్టికి ఆధారమై నిత్యమైన పరమాణువు ఉందని వైశేషికం , నిత్య శబ్దం నుంచే సృష్టి జరిగిందని మీమాంసకులు చెప్పారు .ప్రాచీన ఋషులకు ద్రవ్యం యొక్క అనశ్వరత్వం తెలియక పోలేదు .కపిల గౌతమ కణాద,పతంజలి జైమిని మొదలైన వారికి పదార్ధం యొక్క నిత్యత్వం తెల్సు అని రామకృష్ణానందులు చెప్పారు  .ఆధునిక విజ్ఞాన శాస్త్ర పారిభాషిక పదాలే భారతీయ విజ్ఞాన శాస్త్రం లో ఉండటం చేత ,ముఖ్యంగా వైశేషికం పరమాణు సిద్ధాంతం ,గురుత్వాన్నీ సూచించి ఉండటం చేత ,వాటిని ఈనాటి సైన్స్ కు అన్వయి౦చ కూడదనీ ,,అలా చేస్తే అనేక సమస్యలేర్పడతాయనీ ,ప్రాచీనుల దృక్పధం భౌతికమూ అభౌతికమూ కనుక తత్వ విషయం లో సంకలనం చేయటం సర్వ సాధారణం కాదనీ మాక్డోనాల్డ్ అన్నాడు .ఇతడి భావనలో వైశేషికంలోని పరమాణు సిద్ధాంతం సమగ్రం కాకపోవచ్చు .కానీ సైన్స్ ఎప్పటికీ సంపూర్ణం కానేరదు .ప్రాచీన ఆధునిక కాలాలో పరమాణు సిద్ధాంతం ఎప్పుడూ సక్రమంగా నిరూపి౦చ బడలేదన్నాడు రాధాకృష్ణన్ .కనుక సమగ్రం కాకపోయినా ,ప్రపంచం లో మొట్టమొదట పరమాణు సిద్ధాంతం ప్రతిపాది౦చిన వాడు మాత్రం కణాద మహర్షియే.లౌకిక అలౌకికాలకు ,ప్రాపంచిక ,ఆధ్యాత్మికతలకు ,భౌతిక విజ్ఞాన ఆధ్యాత్మిక విజ్ఞానానికి కణాద మహర్షి సమన్వయము చేశాడు అన్నది నిర్వివాద విషయం .’’sciece without religion is lame ,religion without science is blind ‘’అని చెప్పిన ఆధునిక విజ్ఞానఖని ఆల్బర్ట్ అయిన్ స్టీన్ వాక్య రహస్యాన్ని ఆనాడే కాణాద ముని గ్రహించాడు .

     గురుత్వ సిద్ధాంతం

  గ్రావిటి అంటే గురుత్వ సిద్ధాంతాన్ని కూడా  వైశేషికం లో కణాదముని చెప్పాడు .ఇది కూడా సర్వ ప్రపంచానికి ఆశ్చర్య విషయమే –గురుత్వ ప్రయత్నా సంయోగానాత్ క్షేపణ౦’,,సంయోగ భావే గురుత్వాత్ పతనం ,సంస్కారభావే గురుత్వాత్ పతనం ,,అపాం సంయోగ భావే గురుత్వాత్ పతనం ,మొదలైన సూత్రాలలో గురుత్వాకర్షణ చెప్పబడింది .మొదటి సూత్రానికి ఉపస్కార కారుడు ‘’అత్ర గురుత్వ స్య హస్త లోష్టాది వర్తినో నిమిత్త కారణత్వం ‘’అంటే గురుత్వం హస్తాదికాలలో కలిగి ఉత్ క్షేపణ కార్యానికి –అంటే పైకి వెళ్ళటానికి నిమిత్తమౌతుంది .అలాగే ‘’ప్రతి బంధ భావే గురుత్వా దసమవాయి కారణాత్ పతనం అథ  సంయోగ  ఫలికా క్రియా  జాయతే ‘’అంటే ప్రతిబందికా భావం లో అసమవాయి కారణమైన గురుత్వం వలన పతనం ,ఆతర్వాత సంయోగరూప ఫలితం లభిస్తుంది .’’ఫలాదౌ ‘’పడే పండు నే వ్యాఖ్యాత ఉదాహరణగాతీసుకొన్నాడు.దీన్నే న్యూటన్ ఆపిల్ పండు పడటం చూసి గ్రావిటి చెప్పాడు .గురుత్వం పృధివీ జల వృత్తిహ్ ‘’ అని తర్క స సంగ్రహణం కూడా సమర్ధించింది .గురుత్వం అనే శక్తి భూమి నీరు లలో ఉన్నా ,ఇంద్రియ గోచరం కాదు .’’సామగ్ర్య భావా న్న గురుత్వా దేహ్ ప్రత్యక్షం ‘’కంటికి కనిపించటానికి సామగ్ర్యం లేక పోవటం చేత  గురుత్వం  అగోచరం ‘’అని రాస్తూ ,గురుత్వం స్పర్శ చేత కనిపిస్తుందని వల్లభా చార్యుడు ఉదాహరించాడని వృత్తి కారుడు చెప్పాడు .కారికా వలీకర్త కూడా ‘’  ,గురుత్వం స్యాత్ ,పృధిర్యాది ద్వయే తుతత్ ‘’ గురుత్వం అతీంద్రియమై భూమి నీరు లలో ఉందనీ ,’’తదేవాసమవాయిస్యాత్ పతనాఖ్యే తు కర్మణి’’అంటే అది అసమవాయి కారణంగా ఉంటూ పతన క్రియను కలగ జేస్తోంది అని రాశాడు .’’సంయోగ జన్య క్రియాదిత్యమనుమానే న గురుత్వ సిద్ధిరితిభావః ‘’అనగా సంయోగం జన్యాన్ని బట్టి ,గురుత్వం ఉన్నట్లు సిద్ధమని ముక్తావళి చెప్పింది .కనుక గురుత్వం ఫలాదులలో ,భూమిలో ఉన్నది అని భావం .ఇది ఆధునిక గ్రావిటి కి అతి దగ్గరభావమే ‘’gravitation was kown by the Indians thousands of years before Newton was born ‘’అని వివేకానందుడు  నిర్ద్వంద్వంగా  మరీ చెప్పాడు  .’’భౌతిక ,విజ్ఞాన తత్వాలను సమన్వయ పరచి ,జిజ్ఞాసువు లందరికీ అతి సూక్ష్మ౦గా పరిశోధనా విధానాన్ని ప్రసాదించి ,ముముక్షువులకు తరుణోపాయాన్ని కటాక్షించిన  కణాదమహర్షి మిక్కిలి స్తవనీయుడు ,చిరస్మరణీయుడు ,ఆమహామహుడికి సర్వ విజ్ఞానలోకం సదా తజ్ఞులై ఉండాలి అన్నారు స్వామి అనుభవానంద స్వామీజీ ‘’

    17వ తేది సోమవారం శ్రీ శంకర జయ౦తి సందర్భంగా రేపటినుంచి శంకరాద్వైతం గురించి  తెలుసుకొందాం .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కణాద వైశేషిక విశేషాలు

కణాద వైశేషిక విశేషాలు

ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత  వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ రెండూ లభించలేదని రాధాకృష్ణ పండితుడు అన్నాడు .తర్వాత లభించిన భాష్యాలలో ‘’ప్రశస్త పాదాచార్యుడు ‘’రాసిన ‘’పదార్ధ ధర్మ సంగ్రహం ‘’ముఖ్యమైనది అనుకొన్నా ‘’అది సర్వ స్వతంత్రమైనది’’ అన్నాడు మాక్డోనాల్డ్.కాని అందులో విషయం మాత్రం సక్రమంగా ఉందనీ ,కొన్ని ముఖ్యవిషయాలు కలిపితే అది సంపూర్ణ,వినూత్న  గ్రంథం అవుతుందని మాక్డోనాల్డ్ ఉవాచ .’’ఈభాష్య౦ వ్యాఖ్య కాక ,వైశేషిక దర్శనం యొక్క సక్రమ సంక్షిప్తరూపం ‘’అన్నారు శ్రీనివాస అయ్యంగార్ .ప్రశస్త పాదుని రచన వైశేషికం పై భాష్యం కాక స్వతంత్ర గ్రంథం అన్నాడు రాధాకృష్ణన్ కూడా .’’ప్రశస్త పాదుడు పతంజలి న్యాయ భాష్యకర్త వాత్సాయనుని భావాలను తీసుకొన్నాడు కనుక క్రీ.శ 4వ శతాబ్ది వాడు అయి ఉంటాడు  ‘’అన్నాడు రాధాకృష్ణ పండిట్ .’’న్యాయ సిద్ధాంత ప్రభావం కణాద సూత్రాల ప్రశస్త పాదుని పదార్ధ ధర్మ సంగ్రహణం లో లేదుకానీ ,వైశేషిక భావాల గౌతమ సూత్రాలు ,వాత్సాయన భాష్య౦ తీసుకున్నాడని చెప్పటానికి ఆధారాలున్నాయి .తర్కభావాలను దిగ్నాగుని నుంచి ,తీసుకోన్నాడుకనుక ఆకాలం పై ఆధారపడాలి కనుక క్రీశ 5వ శతాబ్దివాడు ప్రశస్త పాడుదు’’ అన్నాడు మాక్డోనాల్డ్.కాని ఇది తప్పు ,అతడికాలం క్రీశ 1వ శతాబ్దికి తర్వాత మాత్రమె అన్నారు శ్రీనివాస అయ్యంగార్.

  పండితలోకం ప్రశస్త పాదుని భాష్యాన్ని’’ లైట్ తీసుకోక పోయినా’’ , శంకర మిశ్రరాసిన ‘’ఉపస్కార ‘’ అనేది వైశేషిక సూత్రా’’లకు సరైన మొదటిభాష్య౦  అన్నాడు మాక్డోనాల్డ్. సాంప్రదాయక నిర్వచనం అంతరించి పోయాక చాలాకాలం తర్వాత క్రీశ 1600లో రాయబడింది కనుక ప్రాధాన్యం పొందలేదు.ప్రశస్త పాద భాష్యానికి న్యాయాచార్యుడు ఉదయనుడు ‘’కిరణావళి’’అనే వృత్తి,శ్రీధరాచార్యులు’’న్యాయ కండలి’’అనే టీకా రాశారు .క్రీశ 1400లో శివాదిత్యుడు రాసిన ‘’సప్త పదార్ధి ‘’కి విశ్వనాథపంచానన భట్టా చార్యుడు ‘’భాషా పరిచ్ఛేదం’’అనేకారిక ,దీనికి ‘’న్యాయ సిద్ధాంత ముక్తావళి ‘’అనే ప్రశస్త రచన చేశాడు .

    ‘’వైశేషిక దర్శన దృక్పధం ఊహకంటే శాస్త్రీయం, సంకలనం కంటే విమర్శారూపం కనుక అరుదైన గొప్ప వైజ్ఞానిక శాస్త్రం ‘’అన్నాడు రాధాకృష్ణన్ .’’సర్వ ధర్మాలకుఆధారమై ,అన్ని కర్మలకు అనుష్టానమై ,ఉండే తత్వ శాస్త్రం సర్వ విజ్ఞానానికి వెలుగు బంతి’’అని చెప్పిన కౌటిల్యుని మాటను బట్టి న్యాయ వైశేషికాలు  మాత్రమె సైన్స్ ను ,సామాన్య జ్ఞానాన్ని సమర్ధిస్తూ,పరిశీలంతో ఉన్న తత్వ శాస్త్రాన్ని తెలియజేస్తాయి .కనుక వైశేషికం తత్వ శాస్త్ర రాజం .న్యాయ వైశేషికాలు ఒకదానిభావాలు మరొకటి తీసుకున్నా ,న్యాయం పూర్తిగా తర్కాన్నిస్తే ,ప్రాకృతిక ప్రపంచానికి ఆధారమైన పరమాణువులు ఉన్నాయనే భౌతిక భావాన్ని తెలియ జేసింది వైశేషికం మాత్రమె  అంటాడు సర్వేపల్లి పండితుడు .బాహ్య, అంతర ప్రపంచాలను తీసుకొని న్యాయం, వాద జ్ఞానం ద్వారా ,అంతాభ్రాంతి అనే వాదాన్ని ఖండిస్తే ,అనుభవ జ్ఞాన మీమాంస ను వైశేషికం సమర్ధించి ప్రత్యక్ష అనుమాన ఆగమాలద్వారా తెలియబడే విషయాలకు అన్వయించే సామాన్య సూత్రాలను ఇది నిర్మించింది .’’అన్నాడు రాధా కృష్ణన్ .ఫలప్రదమైన సర్వ తత్వ శాస్త్రం కూడా భౌతిక ప్రపంచ నిర్మాణాన్ని గురించి ఆలోచించాలి అని వైశేషికం  హెచ్చరించి ,పరమావధి అయిన సత్యం లోనేకాక ,నానాత్వమైన భౌతికం పై కూడా శ్రద్ధ చూపించింది .అందుకే పరమాణు వస్తుత్వ విచారాన్ని అభి వృద్ధి చేసింది .పదార్ధ పరిశోధనా రహస్యాలను చాటే వైశేషికానికి తర్కం అనే పునాది పైన కాక ,సుస్థిర తత్వ శాస్త్రము మిగిలిన వాటిపై ఆధారపడి నిర్మించబడ జాలదు .న్యాయ దర్శనం ,తర్కాన్నీ పూరిస్తే ,ఈ రెండు దర్శనాలు పరస్పర అపేక్షకాలై సమానమైన తంత్రాలయ్యాయి ‘’అంటాడు పండిత రాధాకృష్ణన్ .ఇంతటి సన్నిహిత సంబంధం తో గౌతమ ,కణాదులు సోదరులులాగా సోమశర్మ పాదాల వద్ద విద్య నేర్వటం వలన వారి దర్శనాలు కూడా పరస్పర అన్యోన్యతతో కలిసి ఒకటిగా అనిపించటం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.అనటం అత్య౦త సముచితం .ఈ సిద్ధాంత ద్వయ సమన్వయ వాక్యమా అన్నట్లు ‘’వ్యావహారికం అనాశ్రిత్య నిర్వాణం నోప లభ్యతే ‘’అని తంత్ర శాస్త్రం కూడా స్పష్టంగా చెప్పింది .దేన్ని ఎదుర్కోవాలో దేన్ని జయించాలో తెలుసుకొని పోరాడితేకాని విజయశ్రీ లభించదు –‘’యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా,తదేవ వీర్య వత్తరం భవతి ‘’అన్న ఛాందోగ్య ఉపనిషత్ ను అనుసరించి దేన్నీ తెలిసికొని శ్రద్ధా శక్తులతో చేస్తామో ఆకార్యం సంపూర్ణం గా ఫలప్రదమౌతుంది .దీన్ని బట్టి ‘’ప్రపంచ తత్త్వాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించి ,నానాత్వ ,వికార ,విభేదన రూప ప్రపంచానికి జంకని వాడే వైశేషికుడు’’అనే సామెత లోకంలో వ్యాప్తి చెందింది .’’సాధన సముదాయానికి ధీరత్వం ,జ్ఞానం ప్రసాదించి ,తత్వ శాస్త్రం లో ప్రస్ఫుటంగా ,నిరాటంకం గా ,చర్చించ బడనట్టి విషయం ఒక్కటి కూడా వైశేషికం లో లేనే లేదు ‘’అన్న మాక్స్ ముల్లర్ పండితుని శేముషీ గరిమకు జోహార్లు .

  వైశేషికంపై మరిన్ని విషయాలు మరో సారి తెలుసుకొందాం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏది సత్యం, ఏది అసత్యం

ఏది సత్యం, ఏది అసత్యం , కన్ఫ్యూషన్ !కన్ఫ్యూషన్!! కరోనా వచ్చిన తర్వాత అంతా కన్ఫ్యూషన్!!!
కరోనా రెండవ 🌊 ప్రారంభం (రెండు నెలలో) మార్చి 15 అప్పుడు … 60 రోజుల తర్వాత మే 15 డాక్టర్స్ ఆఫ్ .యూట్యూబ్.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా , న్యూస్ వాట్సప్.. సోషల్ (సైన్స్) మీడియా

  1. ఆవిరి పడితే మాయం వేడి నీళ్ళీ తాగండి ==> ఆవిరి పట్టకండి పడితే ఛాతీ క్ వైరస్ వేడి నీళ్ళ ఆబ్బె లాభంలేదు. కాచి చల్లార్చిన వి తాగండి
  2. రెమిడిసివర్ ఉందిగా భయం లేదు ==> . అది దొరకదు..వేసినా లాభం లేదు అసలు ఉపయోగ పడదు. ఎదో వేస్తున్నాము అంతే -డాక్టర్స్
    3.. మాస్క్ చాలు ఏమీకాదు ఆబ్బె ఇంట్లో మాస్క్ వద్దు ==> . రెండు, మూడు పెట్టుకోండి ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోండి చెప్పలేం
  3. -రుచి వాసనా పోయిందా అయితే కస్టమే జాగర్త ==> అదృష్టవంతులు రుచి వాసన మాత్రమే పోయింది ఇంక భయం లేదు.
  4. ఎక్కువ సేపు మాస్క్ తో ఇబ్బంది – ==> 24 గంటలూ మాస్క్ లేకపోతే … ఇక …..’ అంతే ‘
  5. తిప్పా తీగ రసం దివ్య ఓషదం (గ్రామాల లో తీగ మొత్తం తాగేశారు) ==> పెరుగు, పులిసిన మజ్జిగ దాన్ని మించిన మందు ఇంతకు ముందు లేదు
  6. ఆక్సిజెన్ 98% చూపిస్తోందా పల్స్ ఆక్సీయే మీటర్ అన్నీ టెస్ట్స్ చేయించండి ===>93- 94% తగ్గితేనే రండి బెలూన్లు ఊదండి అదే పెరుగుతుంది 6 నిముషాలు నడిచి అప్పుడు చూడండి
  7. నోటి నీటి తుంపరలు వ్యాప్తి కి కారణం ==> ఆబ్బె అది కాదు మనం పీల్చే గాలి, వదిలే గాలి ద్వారా వ్యాప్తి.
    9 అమెజాన్ లో ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్స్ వచ్చాయి కొనేద్దాం ==> కొనద్దు అవి పనికి రావు 35% ప్యూరిటీ కోవిడ్ కి 95% ప్యూరిటీ కావాలి
  8. వైరస్ సైజు 1/20mm సర్జికల్ మాస్క్ చాలు ==> వైరస్ సైజు మారింది 1/100 సైజుకి మారింది (ఇండియా, తెలుగు, ఆంధ్రా పేర్లు పెడుతున్నారు ) ప్రమాదమే మాస్క్లు 3,4 వెయ్యండి ఎక్కడో అక్కడ ఫిల్టర్ అయితే అవుతుంది
  9. డోలో, అజితారో,సి,డి ,మల్టీ విటమిన్ జింక్ చాలు వైరస్ ని రానియ్యవు 15/ నెలరోజులు వాడండి ==> 3 రోజులు దాటితే ఏవీ పనిచేయవు., అయినా అవి ఎవరు చెప్పారో. ఎందుకు వాడుతున్నారు ? ముందు మమ్మల్ని కలవండి పేరు మార్చి మేమె ఇస్తాము గోల గోళీలు — డాక్టర్లు
  10. పదునాల్గు రోజుల్లో వైరస్ చచ్చిపోతుంది మీ శరీరం లో – ==> వైరస్ చస్తోంది కానీ బ్లాక్ ఫంగస్ ( నల్ల పాచి ) మిమ్మల్ని తినేస్తోంది. అందుకే నెగటివ్ వచ్చినా అన్ని మరణాలు
    13.లొక్డౌన్ అవసరం లేదు. మోడీ వెంటిలేటర్స్ వచ్చాయి భయం లేదు ==> ఆమ్మో మీకు ఇంకా లొక్డౌన్ పెట్టలేదా అదే శరణ్యం , జనరేటర్ ఉంది డీజల్ లేదు అన్నట్లుగా వెంటిలేటర్ ఉంది —> ఆక్సిజెన్ స్వస్తి
  11. ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ. ఓటమి భయంతో వద్దు అంటున్నాయి ప్రభుత్వాలు -ప్రతి పక్షాలు, కోర్టు , పత్రికలూ మీడియా,, ఎన్నికల సంఘం.. ==> మేము ముందే చెప్పాము, మా మాట కి విలువ లేదు. ఆగి ఉంటె బాగుండేది –> అదే మీడియా
  12. హాస్పిటల్ కి వెళ్ళవద్దు 95% ఇంట్ దగ్గరే రోగం మాయం ==> ఇంట్ఐ దగ్గర్ ఉంటె 95% రోగులు మాయం
  13. మనకు మంచి మెడికల్ ప్రోటోకాల్ ఉంది ==> స్టీరియడ్స్, బ్లడ్ తిన్నెర్స్ ఎందుకు ఇస్తున్నారు ? ఇంటి పెద్ద ఇప్పుడు పట్టా లేని అవసరం లేని వైద్యుడు గా మారాలి. 5 రోజుల వరకూ ఆయనే ఇంటి వైద్యుడు
  14. ఇంకేముంది రెండు నెల్లలో అందరికీ వాక్సిన్ ==> ఆబ్బె ఇంకో నెలలో అందరికీ వైరస్
    18 ఆమ్మో రోజుకు లక్షా కేసులా ==> ఎందుకో వైరస్ మందగించింది ICMR రోజుకు 5లక్షలు. దాటుతాయి అని చెప్పింది అని , మే 15 కి తిరోగమనం అని ప్రముఖ వైద్య జాతక శిఖామణులు
  15. SMS శానిటైజ్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ చాలు రాదు అంతే ==> మీ భ్రమ, కనబడనిది. ఎలా కరుగుతుంది ? అయినా రోజుకు 5 SMS వాడి చూడండి
    20 మన తెలుగు మంతెన , వెలగ పూడి రామకృష్ణ, ఖాదర్ వాలీ చెప్పింది చెప్పినట్లు చేస్తే మన వైపు చూడడు ==> గురవ , ముఖర్జీ , అగర్వాల్, వరప్రసాద్ రెడ్డి వాళ్ళని ఫాలో అవుదాము కొన్నాళ్ళు
  16. ఆత్మ నిర్భర్ వాక్సిన్ మనదే 100 దేశాలకు సప్లై మనమే కింగ్ మీడియా ==> ఏమి పీకుతున్నారు అస్సలు ప్లానింగ్ లేదు 130 కోట్లకి ఎంత కావాలో తెలియదా ? అదే మీడియా . అయన దిగాల్సిందే, ఈయన ఎక్కాల్సిందే చచ్చిన పాముకు పాలు పోస్తాము . లేస్తుందో లేదో చూస్తాము
    22 ఇమ్మ్యూనిటీ ఫుడ్,, కాషాయాలు,, జూసిస్ తాగండి, రక్షణ -==> ఫుడ్ సరిపోదు పొద్దున్నే పెరుగు లో మెంతలు రాత్రి నాన పెట్టి తినండి మెంతులు వాడితే అది రెమిడిసివర్ లాగా పని చేస్తుంది.
  17. సెంటర్ లొక్డౌన్ పెడితే బాగుండు క్రిందటి సారి లాగ -==> ఆరోగ్యం, పారిశుధ్యం రాష్ట్ర పరిధి అని ఈ మధ్యే మీడియా రాస్తోంది.
  18. పెద్ద వాళ్లకు చాల ప్రమాదం ఇంటి దగ్గర ఉంచండి ==> కొరోనా వయస్సుతో పని ఏమిటి ? కానీ పిల్లలు తొందరగా బయట పడుతున్నారు. కొరోనా ఎందుకో మగ వాళ్లే టార్గెట్ అనిపిస్తోంది.
    25 ఒక్క డోస్ అయినా చాలు అమృతం, అద్భుతం కొరోనా వచ్చినా 70-80% రికవరీ ==> కొరోనా—- నాకు వాక్సిన్ మీద నమ్మకం లేదు మీ భయమే నాకు పెట్టుబడి. గుర్తుంచుకోండి … ఒక్కసారి కమిట్ అయినా తర్వాత నా మాట నేనే వినను

మరింత కన్ఫ్యూషన్. అయితే మీకు అర్ధం అయినట్లే. మీరే మీ కుటుంబ ఆరోగ్య నిర్ణేతలు

Posted in రచనలు | Tagged , | Leave a comment

దుంప రాష్ట్రం

దుంప రాష్ట్రం

అదొక దుంప రాష్ట్రం .కరోనా కోరల్లో నలిగి గిలగిలలాడుతోంది .నాయకుడు ప్రతిపక్షాల ఇళ్ళపై జులుం చేయిస్తున్నాడు .పోలీస్ పెద్దాయన ఎస్ బాసిజం తో లాక్కొస్తున్నాడు .ఇసి అడుగులకు మడుగు లోత్తుతూ కప్పదాటు యవారంలో ఉంది .సినీ ప్రముఖులు అధినాయకుని కి భుజకీర్తులమరుస్తూ ,ప్రక్కరాస్ట్రం విలన్  దాన శూర వీర కర్నుడుగా వెలిగిపోతుంటే ,షూటింగ్ లలో విదేశీ పర్యటనలలో తేలిమునిగిపోతున్నారు .జేబులోంచి పైసా కూడా విడల్చటం లేదు .నెలకు కోట్లాది రూప్యములు పొందుతున్న రెండో౦దలకు పైన ఉన్న   సలహాదారులు పని లేక బట్టతల బాదు కొంటున్నారు.ప్రజాప్రతినిధులు ,మంత్రులు  ఇసుక భూ, గనుల మట్టి ,దేవాలయం కబ్జా మాయాజాలం ప్రదర్శిస్తూ నాయకునికి నమ్మిన బంటుల్లా వీరనటన ప్రదర్శిస్తున్నారు .కల్లు సారాయి దుకాణాలు ఉదయం అయిదింటికే పోలీసు చేత తెరిపించి అమ్మకాల జోరుతో ఊగిపోతున్నారు .తాగితాగి జనం పరవశులైతందానా ఆట  ఆడుతూ మురిపిస్తున్నారు . .అర్చకులు దైవ సేవ కంటే నాయక సేవలో బిరుదప్రదానం లో యధాశక్తి పూజిస్తున్నారు అధి దేవుళ్ళను .బూతులమంత్రులు  రెండేళ్లుగా తిట్టినా బూతు తిట్టకుండా   ఉన్నవన్నీ వాడేసి ,కొత్తపుస్తకాల కొనుబడిలో బిజీబిజీ .

   పాపం నర్సులు డాక్టర్లు క్షణం తీరిక లేక రోగుల సేవలో మదర్ తెరీసాలుగా ఫ్లారెన్స్ నైటిం గేల్స్,లాగా ,మా ఉయ్యూరు సిబిం యం  టింపిణి దొరసానిలా ,డా సుశీలమ్మలా అలుపు లేని  లేని సేవలందిస్తూ ,ప్రాణాలు కోల్పోతున్నారు. .హాస్పిటల్స్ లో వాక్సిన్లు ,ఆక్సిజన ,టెస్ట్ లకోరత .బెడ్లకు నిమిషానికో రేటు ,శ్మశానాలలో దందా.మార్చురీలలో దగా ,మోసం అంతా డబ్బు మీదే నడుస్తోంది .ఆరోగ్యశ్రీ అదో అందీ అందని దౌర్భాగ్యశ్రీ అయింది లేనివాడికి ..ఉన్నవాడికి ఆస్పత్రిలో చేరి బతికి బయటికొచ్చినా, చనిపోయినా లక్షల మూల్యం చెల్లించుకోవాల్సిందే కనికరం కంటే కారం ఎక్కువైంది .పుండుమీద కారం రాసినట్లు గాస్ ,పెట్రోల్ ధర శరాఘాతం .

  మరిప్పుడు ఏం చేయాలో అని అంతా జుట్టు పీక్కుంటున్నారు .ఏ వాక్సిన్ మంచిది అనే రభస .అందుకని కులానికో రకమైన వాక్సిన్ తయారు చేయిస్తే భేష్ అని డబ్బుచ్చుకొని సలహాలు పారేసే మగదీరులన్నారు .వీలయితే ఆడకో రకం ,మగకో రకం ,ముసలీ  ముతక కో రకం తయారు చేయిస్తే శుభం కార్డు పడుతుందని తీర్మానించారు మమ్మేలినవారు .శుభం భూయాత్ .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-21-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment