డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -6

   నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి

రామచంద్రగారి తాతగారు శిదిలమౌతున్న  పాత ఇంటిని  కూల్చి కొత్తది కట్టించటానికి కలపకొని ఒకగదిలో పెట్టారు .అదంతా అరణ్య ప్రదేశం కనుక పాములెక్కువ .ఒకరోజు నాగుపాము పిల్ల వీరంతా అన్నాలు తింటుండగా వంటింట్లోకి వచ్చింది .అన్నం ముందు నుంచి లేవకూదదని కట్టడి ఉండేది .ఈయన బాబాయి ‘ఎప్పుడూ ’నా చేతిలో గరుడ రేఖ ఉంది .నేను చేయెత్తి అరచెయ్యి చూపితే యెంత పెద్దపామైనా ఆగిపోతుంది ‘’అని చెప్పేవాడు .వచ్చింది నాగుబాము కనుక చంపరాదనే నియమం ఉండేది అప్పుడు  .చంపితే దాని నోట్లో బంగారు నాణెం పెట్టిదహనం చేయాలి .బంగారు ఖరీదుకనుక ప్రత్యామ్నాయంగా రాగిలో బంగారం ఉంటు౦ది కనుక రాగి నాణెం పెట్టి కాల్చేవారు .బాబాయిని గరుడ రేఖతో ఆ పాముపిల్లనుఆపలేవా అని అడిగాడు .వెంటనే అరచేయి చాచి పడగలాగా విప్పి ఆపామువైపు చూశాడు .అది తోకముడిచి వెనక్కి వెళ్లి కలపలో దాక్కుంది .

  ఒక రోజు రామచంద్ర అమ్మగారు చెరువు నీటికి వెళ్ళింది .ఈయనకు ఆరేళ్ళు చెల్లెలుకి మూడు తమ్ముడికి ఏడాది వయసు .అమ్మవచ్చేదాక వీళ్ళిద్దర్నీ ఆడించే బాధ్యత ఈయనదే .ఒకరోజు చెల్లెలు పెద్దపిల్లీ చిన్నపిల్లీ ఆడుకొంటున్నాయని చెబితే లోపలి వెళ్లి చూడగా ఇంట్లోని వంటతూము మూయకపోవటం వలన అందులోంచి పెద్ద నాగపాము లోపలికొచ్చి పడగా విప్పి నిటారుగా ఉన్నది .దానికి నాలుగడుగుల దూరం లో ఇంట్లోనిపెద్ద పిల్లి  పంజా విసిరి దాన్ని కొట్టటానికి సిద్ధంగా ఉంది .తమ్ముడు ఈరెంటినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈయనకు కేక వేసే ధైర్యం లేకపోయింది .వాడిని లాగేద్దామంటే పాము వెటపడుతుందనే భయం .పిల్లి పంజాకు పాము భయపడుతుందట .పడగకు దెబ్బతగిలితే పాము సగం చచ్చినట్లే నట.భయం ,ఏడుపూ ముంచుకొచ్చాయి ఈయనకు .ఏం చేయటానికీ తోచక తల్లి నేర్పిన ‘’పంచ్చాయుధ స్తోత్రం ‘’రెండు  శ్లోకాలు ,ఫలశ్రుతి చదవటం మొదలెట్టారు .ఆ కంగారులో మిగిలినవి గుర్తుకు రాలేదు .వంటింట్లో కనుక బయటివారిని పిలువకూడదు .

  ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది .ఆమె నీటి బిందెలు దింపి వచ్చి చూసి స్థాణువై నిలబడిపోయింది .ఈయన్ను పక్కకు తోసేసి ,పిల్లాడికాలు పట్టుకొని లాగేసింది .మనుష్యులు ఎక్కువయ్యారనో పిల్లిపంజా కు  భయపడో పాము మెల్లగా జారుకుంది .పాము  వెళ్లి పోయేసరికి , పిల్లి మ్యావ్ మ్యావ్ మంటూ వచ్చి తల్లి కాళ్ళను పెనవేసుకొంది.బిడ్డను కాపాడిందని దాని ఒళ్ళంతా ఆప్యాయంగా నిమిరారు తల్లిగారు .

  మరో సారి రామచంద్ర ఆయన స్నేహితులు బాబాయి తోకలిసి ఊరి బయటితోటకు వెడుతుంటే,మధ్యలో ఒక  పెద్ద గోధుమరంగు త్రాచుపాము  అడ్డంగా వచ్చింది. యధాలాపం గా ఎవరూచూడలేదు. దానికి రెండు అడుగుల దూరం ఉండగా చూడగా అలికిడికి అది పడగా విప్పి బుసకొడుతూ నిలబడింది.ఒక్క అడుగు వెనక్కి వేశారంతా .బాబాయి నదురూ బెదురూ లేక అరచేతిని పడగలా చేసి దాని ఎదురుగా నిలిచాడు .అంతే.అది పడగా దింపి జారుకొని పారి పోయింది .హమ్మయ్య అనుకొన్నారందరూ .ఆయన్ను అడిగి గరుడ రేఖ విశేషాలు తెలుసుకకొన్నారు  .

ఇప్పుడు పంచాయుధ స్తోత్ర శ్లోకాలు తెలుసుకొందాం –

1-స్పురస్సహస్రార  శిఖాది తీవ్రం –సుదర్శనం భాస్కర కోటితుల్యం –సురద్విషాంప్రాణ వినాశి విష్ణోః-చక్రం సదాహం శరణం ప్రపద్యే ‘’

భావం –వెయ్యి ఆకులు కొనలతో ,వాడిగా ఉంటూ ,కోటి సూర్య కాంతి తో వెలిగే ,రాక్షస ప్రాణాలు తీసే విష్ణు చక్రాన్ని నేను నిరంతరం శరణు పొందుతున్నాను .

2-విష్ణో ముఖోత్థానిల పూరితస్య –యస్య ధ్వనిః దానవ దర్ప హంతా-తమ్ పాంచజన్యం శశికోటిశుభ్రం –శంఖం సదాహం శరణం ప్రపద్యే ‘’

భావం –విష్ణు ముఖం నుంచి వెలువడే గాలితో నిండి, తన ధ్వనితో   దానవ దర్పాన్ని అణచే,కోటి చంద్ర శ్వేతమైనవిష్ణువు పాంచజన్య శంఖాన్ని నిర౦తర౦ శరణు వేడుతున్నాను .

3’’ఫలశ్రుతి –‘’వనే రణే,శత్రు జలాగ్ని మధ్యే –యదృచ్చయాపత్సుమహాభయేషు ఇద౦ పఠన్ స్తోత్ర మనాకులాత్మా –సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః ‘’

భావం –అడవిలో యుద్ధం లో శత్రువులమధ్య ,మంటల్లో ,హఠాత్తు ఆపదలలో మహాభయం కలిగితే కలత చెందకుండా ఈస్తోత్రం చదివే మానవుడిని విష్ణువు పంచాయుధాలు అన్ని విధాలుగా రక్షిస్తాయి అతడు సుఖపడుతాడు.

మిగిలిన మూడు శ్లోకాలు –

3-హిరణ్మయీంమేరుసమానసారాం-కౌమోదకీం దైత్య కులైక హంత్రీం-వైకుంఠ వామాగ్ర మృస్టాం-గదాం సదాహం శరణం ప్రపద్యే’’

4-యజ్జ్యా నినాదశ్రవణాత్సురాణాం-చేతాంసి నిర్ముక్త భయాని సద్యః –భవంతి దైత్యాశని బాణ వర్షైః-శార్ఞంసదాహం శరణం ప్రపద్యే ‘’

5-రక్షో సురాణా౦కఠినోగ్ర కంఠ- చ్ఛేద రక్షత్ క్షోణితదిగ్ధ సారం –తమ్ నందకం నామ హరేః ప్రదీప్తం –ఖడ్గం సదా హం శరణం ప్రపద్యే ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 175-హైతి దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 175-హైతి దేశ సాహిత్యం
  • ఉత్తర అమెరికాలో  కరోబియన్ దేశం .రాజధాని పోర్ట్ ఆవు ప్రిన్స్ .కరెన్సీ –హైతియన్ గూర్డే.జనాభా -1.18కోట్లు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష ,ఫ్రెంచ్ భాషలున్నాయి .61శాతం  అక్షరాస్యత .15,200 ప్రైమరీ స్కూల్స్ లో 90శాతం నాన్ పబ్లిక్ .కమ్యూనిటీల నిర్వహణలో ఉంటాయి .ఉన్నత విద్య యూనివర్సిటీలు ,పబ్లిక్ ప్రైవేట్ యాజమన్యాలు అందిస్తాయి .వ్యవసాయం ఎక్కువ. సువాసన నూనె వెటివర్ ఆయిల్ ఉత్పత్తి ,బనానా ,కోకా ,మామిడు పంట ఎగుమతులు ఆదాయ వనరులు .సిటడేల్లా లే ఫెరీరా ,సాన్ సౌసి పాలెస్ ,నేషనల్ పార్క్ చూడతగినవి .అత్యాచారాలు సాయుధ దోపిడీ ,హత్యలు కిడ్నాపింగ్ ,రేప్ లు ఎక్కువ .
  • హైతి సాహిత్యం -1804లో తిరుబాటు తర్వాత ఫ్రెంచ్ కాలనీ ప్రభుత్వాన్ని కూల్చాకనే సాహిత్యం వచ్చింది .మొదట్లో జాతీయ రచనలు వచ్చాయి .తర్వాత రోమాన్టిజం చేరింది .జీన్ పెర్రి బోఎర్స్ 23ఏళ్ళు దేశాధ్యక్షుడుగా ఉండగా కవిత్వానికి వికాసం కలిగింది .ఒస్వాల్ద్ డ్యురాన్డ్ 1896లో-రైర్స్ ఎట్ పియర్స్ అంటే  ‘’లాఫ్టర్ అండ్ టియర్స్ ‘’అక్కడి జీవ జంతుజాల వర్ణన .క్రియోల్ భాషను చక్కగా ఉపయోగించిన మొదటి కవి .మొదటి కవిత ‘’చౌకౌన్ ‘’కు సంగీతం కూడా సమకూర్చారు .దీనితో వచనరచనకూ ప్రోత్సాహం లభించింది .లా రోండే జర్నల్ లో కవులు విస్తృతంగా రాసేవారు .జోసెఫ్ ఆర్ధర్ ప్రవాసానికి వెళ్లి ‘’లేట్రిస్ డీ   సెయింట్ ధామస్ ‘’రాసి 1919లో పారిస్ లో పబ్లిష్ చేశాడు .తర్వాత యువ రాడికల్ గ్రూప్ రచయితలు వచ్చి మేధావి వర్గాన్ని ప్రభావితం చేశారు.జీన్ ప్రైస్మార్స్ అంత్రోపాలజిస్ట్ .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నవలారచయిత అలెక్సీ 1951నుంచి 61వరకు ధారగా రాశాడు .సోషలిస్ట్ రియలిజం ను ఫాంటసి తో కలిపి రాయటం మొదలైంది .అలెక్సీ చివరి నవల ‘’దిఫ్లిక్కర్ ఆఫ్ యాన్ ఐ లిడ్’’.ఫ్రాంక్ ఎటిన్నె1975లో దేజాఫీ ప్రముఖ నవల రాశాడు .పియర్రే ‘’కేతెడ్రల్ ఆఫ్ ది ఆగస్ట్ హీట్ ‘’నవలలో పట్టణ పేదల జీవితగాథా వర్ణన ఉంది .మేరీ చౌవెట్1968’’లవ్ ,యాన్గర్ ,మాడ్ నెస్’’రాసింది .నగర బ్రుటాలిటి ని ఎండగట్టింది
  •    1985తర్వాత డీ క్లాడే చార్లెస్ ,దేని లేఫెరేరి లు ట్రాన్స్ నేషనల్ సాహిత్య౦ సృస్టించారు .’’హౌ టు మెక్ లవ్ విత్ ఏ నీగ్రో వితౌట్ గెత్తింగ్ టైర్డ్’’నవల  మాన్ హట్టన్ బ్లూస్ రాశాడు .ఎమిలి ఆలివర్ ‘’ది సీల్డ్ అరన్స్’’డయాస్పోరా రచన .స్త్రీలలో ఎడ్విడ్జ్ డంటి కాట్ ,బ్రెత్ ఐస్ మెమరి అనే గోప్పనవల 1994లోరాసి హైతీ యువతుల అనుభవాలు చిత్రించింది .తర్వాత రాజకీయంగా ‘’దిఫార్మింగ్ ఆఫ్ బోన్స్’’1998లో రాసి ఆ దేశ చెరుకు నరికే వారి పై నరమేధం గురించి రాసింది .
  • మరికొన్ని మంచి పుస్తకాలు –జనరల్ సన్ మై బ్రదర్ –అలెక్సిస్ ,మేమాయిర్ ఆఫ్ యాన్ ఆమ్నేషియాక్-జాన్ డోమినిక్యు,యాన్దాలజీస్ సీక్రెట్ –ఇడా ఫాబెర్ట్ .మాస్టర్స్ ఆఫ్ ది డ్యు –జాక్వెస్ రొమైన్ వగైరా .
  • 176-డొమెనికన్ రిపబ్లిక్ దేశ సాహిత్యం.
  • ఉత్తర అమెరికాలో డొమెనికన్ రిపబ్లిక్ దేశ౦అందమైన బీచ్ లకు ,రిసార్ట్, గొల్ఫింగ్ లకు ప్రసిద్ధి .రైన్ ఫారెస్ట్ లు, సవన్నా లు ,హైలాండ్స్ ఉంటాయి .రాజధాని –శాంటో డొమింగో.జనాభా –ఒక కోటి .కరెన్సీ –డొమినికన్ పెకో.రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష .93.78శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .సెకండరీ లో ఫ్రీ బట్ మాండేటరి.మైని౦గ్, వ్యవసాయం .లాటిన్ అమెరికా దేశాలల అత్యధిక బంగారు గనులున్న ఏకైక దేశం . ఇవే ఆదాయం .కోకా, టుబాకో, షుగర్ కేన్, కాఫీ ,వరి,కాటన్,బీన్స్ , బనానా పండిస్తారు .లాస్ హెటిస్ నేషనల్ పార్క్ ,కొసా డీ కాంపో రిసార్ట్ ,ఆల్టోస్ డీచవోన్ దర్శనీయాలు .నేర భయం జాస్తి .
  • డొమెనికన్ రిపబ్లిక్  సాహిత్యం-చాలామంది రచయితలున్నారు .కొందర్ని గూర్చి తెలుసుకొందాం .ఐడా కార్ట జినా పోర్టాలాటిన్ –కవి, రచయిత్రి-ఎ వుమన్ ఈజ్ ఎలోన్ ,నిదర్ వైట్ నార్ బ్లాక్ ప్రసిద్ధకవితలు.ప్రీమియో సీక్స్ బార్రెల్ అనే అంతర్జాతీయ ప్రైజ్ పొందింది .10కవితా సంపుటులు ,ఒక నవల ఎస్కేలేర పర్వా ఎలెక్ట్రా తోపాటు యాన్దాలజి రాసింది  .అంగీ క్రూజ్ –సోలేడాడ్,లెట్ ఇట్ రైన్ కాఫీ మొదలైనవి రాసింది ఫ్రాంక్ బఎజ్ –పోయేట్ ఎడిటర్ రైటర్ ,-పోస్ట రీస్,ఎన్రోసారియో వగైరా రాశాడు  .రీ బెర్రోవా -25కవితా సంపుటులు రాశాడు .ఇందులో బుక్ ఆఫ్ ఫ్రాగ్ మెంట్స్ గొప్పది .ఎడ్గార్ స్మిత్ –కవి .వేర్సేనల్ మొదలైన కవితా సంపుటులు ,శివ ,తాండవ –షార్ట్ స్టోరి బుక్స్ ,పూరో కుఎంటో మొదలైన నవలలు రాశాడు .మాన్యుల్ డీ కార్బెల్ –ట్రోపికో నీగ్రో ,క్యుఎంటాస్,పోయెమ్స్ డీ అమొరి,ఆన్దాలిజా పోఎటికా,ఓబ్రా పోఎటికా వంటి డజను రచనలు చేశాడు క్రిస్టినోగొమేజ్—అగ్రానమిస్ట్ ,కవి ప్రొఫెసర్ .యో డిజోఎల్అమర్,అర్రెంకాడోడీరైజ్ పు  స్తకాలు రాశాడు .
  •   సశేషం
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 173-గ్వాటె మాలా దేశ సాహిత్యం
  • గ్వాటె మాలా మధ్య అమెరికా దేశం .మెక్సికో కు దక్షిణాన ఉంటుంది  వల్క నోలు రైన్ ఫారెస్ట్ ల నిలయం .రాజధాని –గ్వాటెమాల సిటి .కరెన్సీ –గ్వాటెమాలాక్విజ్జర్ .జనాభా .1.72 కోట్లు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష అన్నిటికీ .81.29శాతం .ఆరేళ్ళ ఉచిత కంపల్సరి విద్య.ప్రైమరీ సెకండరి టేరిటరి స్థాయి .సుగర్ కాఫీ  బనానా పంటల ఉత్పత్తి ఎగుమతి పెట్రోలియం ఫార్మాస్యూటికల్స్ ఆదాయవనరులు .టికల్,నేచురల్ మాన్యుమెంట్,పకేయా అగ్ని పర్వతం యాత్రా స్థలాలు .సేఫ్ దేశం .
  •  గ్వాటె మాలా సాహిత్యం –ఈ దేశ సాహిత్యం లో ప్రముఖమైనదికవిచి భాష లోని  ‘’పోపోల్ వుహ్’’.స్టోరీస్ లిజెండ్ ల మాయం .దీన్ని స్పానిష్ లోకి ఫ్రాన్సిస్కో జేమేన్జేస్ 18వ శతాబ్ది లో అనువదించాడు.కేల్చిప్రజలకు చెందిన ‘’రాబినల్ ఆచి ‘’మరో గొప్పరచన .16-19శతాబ్దుల కాలం నాటి కాలనీ ప్రభుత్వాలలో స్పానిష్ బాషలో సోర్ జువానా డీ మాల్డో నాల్డో ప్రముఖకవి ,నాటకకర్త .ఫ్రాన్సిస్కో ఆంటోనియో డీఫ్యుఎంటేస్ గొప్ప చరిత్రకారుడు .రాఫెల్ లాండివార్ -1731-93గ్వాటిమాల కవులలో మహాకవి .రుస్టి కాషియోమేక్సికానా తో పాటు కవితలెన్నో రాశాడు .మాన్యుల్ జోస్ డీ క్విరోస్ ,పెడ్రో నేలాకో ఎస్త్రేడాఎల్స్తేండో,రాఫెల్ ఆంటోనియోకాస్తెల్లనాస్  ఆకాలపు ముఖ్యకవులు .18వ శతాబ్దిలో నియో క్లాసిజం సాహిత్యం లో ప్రవేశించి రాఫెల్ గార్సియా గోఎనా ,మాటిసా డీకోర్దోబా దానిలో రాసి ప్రసిద్ధులయ్యారు .
  • 1821లో    స్వాతంత్ర్యం పొందాక 19 వ శతాబ్దిలో ఇతరదేశాలతో సంబందాలుకలిగి సాహిత్యాభి వృద్ధి పెరిగింది .జర్నలిజం కూడా ఆంటోనియో జోస్ డీ ఇర్సానితో  వచ్చింది .మేరియా జోసేఫా గార్సియా ,,జోస్ బాట్రేస్ కవులు మంచి కవిత్వం రాశారు .మిల్లా విడుయూరె’’లా హిజా ఆడేలండో,లోస్ నజ్రారెనోస్,ఎలి ఇబ్రోసిన్ నోమ్బ్రేరాశారు .మోడర్నిజం, సింబాలిజం ,పార్నాషియనిజం ,డ్రైవెన్ ప్రాక్రియాలలో కవిత్వం రాశారు .డోమి౦గోఎస్త్రేడా,మాక్సిమో సోటో,మేరియా క్రూజ్ గోప్పరచయితలు .ఎన్రికో గొమేజ్ కార్రిలో మోడర్నిజం  ప్ప్రోజ్ లో లో వెర్సటైల్ రచయిత.
  • 20వ శతాబ్దిలో గ్వాటె మాలా సాహిత్యం ఇతర లాటి అమెరికా సాహిత్యం తో పోటీపడి ఉన్నతిపొందింది .మిగుల్ ఏంజెల్ ఆస్త్రియాస్ నవలా సాహిత్యంలో 1967 నోబెల్ ప్రైజ్ పొందాడు –ఎల్సేనార్ ప్రేసిడేంటే,హోమ్బ్రేస్ డీమైజ్ నవలలు రాశాడు .లూయిస్ కార్డోజ్ఆరగాన్ గొప్పకవి ,కధకుడు .అగస్తో మొంటరోసో 2000లో ఆస్ట్రియన్ ప్రైజ్ పొందాడు. కార్లోస్ సోలర్జనో నాటకరచయిత .20వ శత్బాది సాహిత్యం రాజకీయ ప్రభావితమే
  • 174-క్యూబా దేశ సాహిత్యం
  • రిపబ్లిక్ ఆఫ్ క్యూబా ఐలాండ్ దేశం చాలాఆర్చిపెలగొలున్నాయి . ఉత్తర కరోబియన్ సముద్ర దేశం .కాన్బెర్రా సి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ,అట్లాంటిక్ సముద్రం కలిసీ సంగమ దేశం .రాజదాని-హవానా .కరెన్సీ –క్యూబన్ పెకో .జనాభా -1.13కోట్లు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష .96శాతం అక్షరాస్యత .ప్రైమరీ -1-6 గ్రేడ్స్ ,బేసిక్ సెకండరి,ప్రీయూనివర్సిటిబేసిక్ సెకండరి అయ్యాక టెక్నికల్ కాని ప్రీ యూని వర్సిటికాని చదవచ్చు .పెట్రోలియం నికెల్ ,పొగాకు స్టీల్ సిమెంట్ ,వ్యవసాయ ఉత్పత్తులు ఆదాయవనరులు .పంచదార ఉత్పత్తిలో ప్రపంచం లో టాప్ ‘’షుగర్ బౌల్’’అంటారు క్యూబా ను .వరిపంటకూడా ఎక్కువే .మాలేకాన్ ,వినాలేస్ వాలీ ,నేషనల్ కాపిటల్ దర్శనీయాలు.సురక్షితం .
  • క్యూబన్ సాహిత్యం – స్పానిష్ భాషలో ఉంటుంది .19వశతాబ్దిలో గణనీయ సాహిత్యం వచ్చింది .జేట్రూడస్ గోమెజ్,సిలివో విలవార్డేముఖ్యరచయితలు .జోస్ మార్టి ఆధునిక సాహిత్య మార్గదర్శి .నికొలాస్ డీ గుల్లెన్ సాంఘిక నిరసనపై రాశాడు .దూయిస్ మేరియా ,లేజామా లిమా ,అలేజో కార్పెంటియర్ స్వీయ, ప్రపంచ్చ సమస్యలపై రాశారు.నవలా సాహిత్యమూ వచ్చింది .పైలాక్ ఎల్ ప్రిస్టిజి టడార్ నవలను రీనాల్డో అరినాస్ రాశాడు .ట్రీస్ ట్రిస్తీస్ టైగ్రెస్ ను గులిర్మో రాశాడు .చిన్న కధలు ఎస్టేబాన్బోరేరో రాశాడు .వ్యాసాలూ ఏమిల్లో రోగాస్ ,జువాన్ మారినేల్లో వగైరాలు రాశారు .స్త్రీలలో మేరి ,కేధరిన్ బాల సాహిత్యాన్ని రువాల్ ఫెరేర్  మగిల్ సాన్చేజ్ మొదలైనవారు రాశారు
  •  క్యూబా రివల్యూషనరి నాయకుడు ఫిడేల్ కాస్ట్రో 1959నుంచి 76వరకు ప్రధానిగా ,ప్రెసిడెంట్ గా ఉండి అమెరికాను భయపెట్టి దేశాన్ని అన్ని విధాలా అభి వృద్ధి చేశాడు  .మై లైఫ్ ఏ స్పోకెన్ ఆటోలాగ్ ,హిస్టరీ విల్ అబ్సాల్వ్ రాశాడు. చేగు వేరా క్యూబన్ రివల్యూషన్కు సాయపడిన అర్జెంటీన దేశస్తుడు .మంత్రి అయి ప్రజలకుపయోగాపడే అనేక సంస్కరణలు తెచ్చాడు ..దిమోటార్ సైకిల్ డైరీస్ ,గెరిల్లా వార్ ఫేర్,దిబొలీవియన్ డైరీ ,ఎపిసోడ్స్ ఆఫ్ క్యూబన్ రివల్యుషన్ వగైరా రాశాడు .
  •     సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -5

                        పన్నా

మధ్య పరగణాలు అంటే ఈనాటిమధ్య ప్రదేశ్ లో పన్నా చిన్న స్వతంత్ర సంస్థానం .పన్నాఅంటే పచ్చ ,మరకతం .ఈ ప్రాంతం లో పచ్చలు విచ్చలవిడిగా దొరుకుతాయి కనుక ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రాంతం పూర్వం సామాన్య పట్టణమే.వానలకు వరదలకు పచ్చలు కొట్టు కొచ్చేవి .జనం ఏరుకొని దాచుకొనేవారు .బుందేల్ ఖండ్ రాజు చత్రపాల్ ఈ పట్టణాన్ని 1675లో రాజధాని చేసుకొని పాలించాడు .అప్పటినుంచి దీని ప్రాముఖ్యం పెరిగింది .పంటలకు ,పరిశ్రమలకు కేంద్రమైంది .చేనేత పరిశ్రమకు కేంద్రం. వస్త్రవ్యాపారం బాగా జరిగేది .చుట్టూ ఉన్న అరణ్యాలలో  నాణ్యమైన కలప దొరికేది .

 పన్నా లోని ప్రసిద్ధ కట్టడాలలో ‘’ప్రాణ నాథ’’దేవాలయం ,బలదేవ్ మందిరం ముఖ్యమైనవి.గోడలు స్తంభాలు గోపురాలు అన్నీ చలువరాతి నిర్మాణాలే .ఈ నిర్మాణం 18శతాబ్ది చివర్లో జరిగింది .ఆనాటిపన్నా రాకుమారుడు రాజ్యార్హత ఉన్నవాడు పినతండ్రితో తగాదా పడ్డాడు. మాటామాటా పెరిగి రివాల్వర్ తో కాల్చేశాడు .అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కనుక సంస్థానాధీశులు కాని వారి వారసులుకాని తప్పు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉండేవి .కనుక  పినతండ్రి చంపినా పన్నా రాకుమారుడిని బంధించి బళ్ళారి జిల్లా లో నిర్బంధం లో ఉంచారు .జిల్లాదాటి బయటకు పోకూడదని ,జిల్లాలో తిరిగితే ఎప్పటికప్పుడు సమాచారం కలెక్టర్ కు తెలియజేయాలని హుకుం జారీ చేశారు  .రామచంద్రగారు వారి తండ్రిగారితో వెళ్లి ఒకరోజు పరిచయం చేసుకొని మాట్లాడారట .ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లాడాడట .1938లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాజకుమారుడి నిర్బంధాన్ని తొలగించింది .

  బళ్ళారి ప్రాంతం లో చిరుతలు అడవిపందులు ఎలుగు బంట్ల భయం జాస్తి. అడవిపందులు చెరుకు తోటల్లో దూరి కరికి పాడు చేసేవి .ఎలుగు బంట్లు వయసులో ఉన్న ఆడవారిని ఎత్తుకు పోయి గుహలలో శృంగారం చేస్తూ కాపురాలు చేసేవట .అలాంటి ఆడవారికి రోమాలు పెరిగి ఎలుగు బంట్లుగా మారిపోతారని రామచంద్రగారి కాలం లో చెప్పుకొనే వారట .మనిషిపై పడి రక్కి ,గొంతుపిసికి చంపటం వాటికి సర్వ సాధారణమే.రామచంద్రగారి కమలాపురం జనం తుంగభద్రకు వెళ్లి నీళ్ళు తెచ్చుకొని తాగాల్సి వచ్చేది .లేక పొతే ‘’తురత కాలువ’’నుంచి నీరు తెచ్చుకొని తాగేవారు .తురతకాలువకు ఒక కథ ఉంది .హరిహర ,బుక్కరాయలిద్దరూ కాకతీయ సేనాపతులుగా ఉంటూ అల్లాఉద్దీన్ ఖిల్జీకి పట్టుబడ్డారు .వాళ్ళను ముస్లిములుగా మార్చి, వరంగల్ కు పంపి ,తనతరఫున  రాజ్యం  చేయమన్నాడు  .వాళ్ళు తెలంగాణాకు వచ్చి రాజ్యస్థాపన ప్రయత్నం చేశారు .ప్రజలు తిరగబడ్డారు .భయంతో హంపీ కి పారిపోయి విద్యారణ్య స్వామికి మొరపెట్టుకొని శరణు వేడారు . .ఆయన శరణు ఇచ్చి ‘’మనఃపూర్వకం గా తీసుకొంటేనే మత౦ . బలవంత మతాంతరం చెల్లదు .మహావీరులైనమీరు వైదిక మతావలంబులే ‘’అని ధైర్యం చెప్పి ,ప్రాయశ్చిత్తం వగైరా చేయించి వేద మతోద్ధరణకు వారు జన్మించారని  ప్రకటించి విద్యానగరానికి శంకు స్థాపన చేసి ,విజయనగర సామ్రాజ్యానికి మూల పురుషులను చేశారు విద్యారణ్యులు .

    విద్యానగరం విస్తరించి విజయనగరమైంది .దానికి నీటివసతికోసం బుక్కరాయ సముద్రం లేక మల్లాపురం నుంచి బుక్కసాగరం  అనే పెద్ద చెరువు తవ్వించారు హరిహరబుక్కరాయలు .దానిలోకి నీరు నింపాలంటే  మల్లాపురం నుంచి కాలువ త్రవ్వాలి అని వాస్తునిపుణులు రాయలకు చెప్పారు .ఎలా అని ఆలోచిస్తూ నిద్రపోయిన బుక్కరాయలకలలో ఆది శేషుడు ప్రత్యక్షమై ‘’మల్లాపురం వద్ద ఆనకట్ట కట్టి కాలువద్వారా నీరు మళ్ళించు.శుచిగా వరుణ దేవుడికి పూజచేసి ,వెనక్కి తిరగకుండా పరిగెత్తు.నీ వెంట నేను వస్తాను .నేను వస్తుంటే నావెనక నేను వచ్చినంతదూరం  ఒకపెద్ద గొయ్యి పడుతుంది  .తిరిగి చూడకుండా వెళ్ళు తిరిగి చూస్తే కాలవ ఆగిపోతుంది అని హెచ్చరించి చెప్పాడు .మర్నాడు ఈవిషయం హరిహరరాయలకు విద్యారణ్యు  లకు మంత్రి సామంతులకు తెలియ జేశాడు .అది ఆది శేషుని ఆనతి కనుక అందరికీ శిరోధార్యమే అన్నారు అందరూ .

  బుక్క రాయలు ఒక శుభముహూర్తాన  స్నాన  సంధ్య పూజాదులుచేసి శుచయై  ,మల్లాపురం మలుపు వద్ద పూజ చేసి ,అక్కడి నుంచి ఒంటరిగా బుక్క సాగరం వరకు పరిగెత్తుకొని వచ్చి శేషుడు వెనకవస్తున్నాడా లేదా అనే అనుమానం వచ్చి వెనక్కి తరిగి చూశాడు .అంతవరకూ పడగవిప్పి కాలువ పడేలా జరజరా వస్తున్న ఆది శేషుడు ముందే హెచ్చరించినట్లు అంతర్ధానమయ్యాడు .పశ్చాత్తాపం చెందిని బుక్కరాయలు తాను  వెనక్కి తిరిగి చూడకపోతే, కాలువ మరికొంతదూరం చెరువుదాకా పాకేదికదా అనుకొన్నాడు .మల్లాపురం నుంచి బుక్కసాగరం వరకు ఉన్న ముప్ఫై మైళ్ళ దూరం అంతా కాలువగండి పడటం చూసి ఆశ్చర్యపోయాడు .ఊరిజనం అబ్బురపడ్డారు .తరువాత చెరువు త్రవ్వించి మల్లాపురం దగ్గర ఆనకట్ట కట్టించి ,తుంగభద్ర నీరు కాలువకు మళ్ళించారు. దీనికి ‘’రాయకాలువ ‘’అని పేరు .ఎత్తునుంచి పల్లానికి త్వరగా పారడాన్ని ‘’త్వరిత కాలువ అంటారు అదే కాలక్రమంలో తురత కాలువ గా మారింది .

  రామచంద్రగారి చిన్నతనం లో ఆకాలం లో ప్లేగు, మలేరియా తీవ్రంగా ఉండేవి ప్లేగు వస్తే ,జనం ఊరు వదిలేసి పాడుపట్నం అడవుల్లో కాపురాలు ఉండేవారు .అవి మిలటరికా౦పులు గా ఉండేవి .

  తుంగభద్రానది రాతి గు౦డ్లపై ప్రవహిస్తుంది .ఆనీరు తాగితే మలేరియా ,కడుపులో బల్లలు ,వరుస జ్వరాలు  వచ్చేవి .వరుసజ్వరాలవల్ల పేద ప్రజానీకం బాగా ఇబ్బందిపడేవారు .రెక్కాడితేకాని డొక్కాడని రోజులవి .ఆజ్వరాలతో విపరీతమైన నీరసం వచ్చి పనిపాటలకు వెళ్ళగలిగే వారుకాదు .రామచంద్ర గారింటికి వైద్యానికి వచ్చేవారు .వీరి తల్లిగారు ఆ జ్వరాలకు మంచి మందు కనిపెట్టారు .కుప్పెంటాకులో మిరియాలు సాలీడు గుడ్లు కలిపి నూరి ,తమలపాకులో పెట్టి ఎడమ మణికట్టు నాడిపై కట్టుకట్టేది .యిట్టె తీసేసినట్లు ఆవరుస జ్వరాలు తగ్గిపోయేవి .సాలీడు గుడ్లను ‘’బల్లి పోర ‘’అంటారు  .కుప్పెంటాకు, సాలీడు విషం కలిస్తే జ్వరహరం అవుతుంది .నూరినముద్దనుదేవుడి గదిలో సాలగ్రామాలకు ఎదురుగా పెట్టి ‘’ఓం నమో నారాయణ’’ అని మూలమంత్రం జపించి ‘స్వామీ అనుగ్రహించు ‘’అని ప్రార్ధించి మణికట్టుకు తమలపాకులో పెట్టి కట్టేది .ఆవిడ మడిలో ఉంటె, రామచంద్రగారితో కట్టించేది .ఒకసారి ఈయన గుడ్లను నూరటం పాపంకాదాఅని అడిగితె ‘’నువ్వు పిల్లాడివి ధర్మ సూక్ష్మం తెలీదు. పెద్ద ప్రాణిని రక్షించటానికి చిన్నప్రాణిని ఉపయోగించుకోవచ్చు .శ్రేష్టమైన మనిషి జన్మ ను  కాపాడితే లోకానికి మహోపకారం చేస్తాడు .కనుక మనిషిని రక్షించటం ముఖ్యం అందుకే ఇందులో దోషం లేదు ‘’అని చెప్పిందట .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4  

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4

శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం )

ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి రాయలవారి వేటలో ఒక కారెనుబోతు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం వెడల్పు .దుర్గాస్టమి నాడు  బలివ్వాలనుకొన్నారు .దాని మెడను ఒకేదెబ్బతో ననరక గలవారున్నారా అని రాయలు ప్రశ్నించాడు .కొలువులో ఉన్న మహా దండనాయకులు, దుర్గాదిపతులు కిక్కురుమనలేదు .అప్పుడు నాగమనాయుడి కొడుకు యువకుడు విశ్వనాథ నాయకుడు లేచి అనుమతిస్తే తాను  ఆపని చేస్తానన్నాడు .రాజు అంగీకారించగా ఒక్క దెబ్బ వ్రేటుతో దాని తల నరికేశాడు .మహర్నవమి దిబ్బ శిధిల శిల్పాలలో కత్తి ఎత్తి నిలబడిన వీరుడు విశ్వనాథ నాయుకుడే అన్నారు తిరుమల రామచంద్ర .

  హంపీ విరూపాక్షస్వామిని ‘’పంపాపతి ‘’అని కూడా పిలుస్తారు .పంప హంప అయింది కాలక్రమం లో .ఈస్వామి రథోత్సవమూ ఒక ముచ్చటే .సాధారణంగా స్వామికీ, అమ్మవారికీఒకే రథం ఉంటుంది .రథోత్సవం రోజు ఇద్దర్నీ ఒకే రథం లో ఊరేగిస్తారు .కానీ హంపీ రథోత్సవం నాడు  స్వామినీ ,అమ్మవారు పార్వతీ దేవినీ వేర్వేరు రథాలలో ఊరేగిస్తారు .ఇక్కడినుంచి మెయిలు దూరం  లో ఉన్న కృష్ణస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు .ఈ సంప్రదాయం ఎలా ప్రవేశించిది ?ఓఢ్ర గజపతిని రాయలు ఓడించాక ,అక్కడ జగన్నాథ రథ యాత్రలో  బలభద్ర సుభద్ర ,జగన్నాథ స్వాములను  వేర్వేరు రథాలపై ఊరేగించటం చూసి రాయలు విజయనగరం లో ఆ సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాడని రామ చంద్రగారి తాతగారు చెప్పారట .

   శిథిలమైన హంపీ కోట గోడల్ని చూస్తే చాలా ఎత్తైనవి సుమారు 35అడుగుల ఎత్తుగా ఉండేవి అనిపిస్తాయి .మనిషి సగటు  ఎత్తు అయిదున్నర అడుగులు అనుకొంటే ,ఈ గోడలు సుమారు ఏడు నిలువుల ఎత్తు ఉంటాయి కనుక 35అడుగుల ఎత్తు ఉండచ్చు అని అంచనా .గోడల గానుగసున్నం అంటే గార, రాళ్ళ సందులనుంచి పడిపోయి చాలాచోట్ల కనిపిస్తుంది .రామ చంద్ర ఆయన స్నేహితులబృందం ఆగోడ సందుల్లో వ్రేళ్ళు దూర్చి కోటగోడలమీదకు ఉడుముల్లాగా ప్రాకేవారట .ఎక్కటం తెలికేకాని దిగటం కష్టం .దూకితే పాదాలు నుజ్జు నుజ్జు .అందుకని పైనుంచి నెమ్మదిగా జారేవారు .మోకాళ్ళు మోచేతులు డోక్కు పోయేవి .ఒకసారి తల్లిగారు చూసి ప్రమాదం అని హెచ్చరించింది .

  తుంగభద్రా నది ఇసుక చాలా సన్నం .ముత్యాలు పొడి చేసి పరచినట్లు నదీ తీరం ఇసుకతో కనిపిస్తుంది  .ఆప్రాంతం లో నదిని దాటించే తెప్పను ‘’హరిగోలు ‘’అంటారు .వెదురు బద్దలతో సుమారు పది మంది కూర్చునేట్లు గట్టిగా గుండ్రంగా కట్టి దానిపై దళసరి తోలు కప్పుతారు .దీన్నే పెద్ద కొప్పెర లేక హరి గోలు అంటారు .అరుగు అంటే వెళ్ళటం గోలు అంటే గోళం అంటే నదిని దాటించే గోళం.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 171-మెక్సికో దేశ సాహిత్యం

     ప్రపంచ దేశాల సారస్వతం

  • 171-మెక్సికో దేశ సాహిత్యం
  • ఉత్తర అమెరికాలో యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ గా పిలువబడే దేశం మెక్సికో.రాజధాని మెక్సికో సిటి .గుర్తింపబడిన భాషలు –స్పానిష్ తోపాటు 68అమేరిండియన్ భాషలు .జాతీయ భాష- స్పానిష్ .జనాభా  12.62కోట్లు .కేధలిక్ క్రిస్టియానిటి మతం .కరెన్సీ –మెక్సికో పెకో .పెట్రోలియం మైనింగ్ ,పొగాకు కెమికల్స్ మోటార్ వెహికల్స్ , ఐరన్, ఫుడ్ఆదాయవనరులు .98.53శాతం అక్షరాస్యత .ప్రైమరీ లో 1-6గ్రేడులు ,జూనియర్ హైస్కూల్ -7-9గ్రేడులు హైస్కూల్ -10-12 గ్రేడులు .కాన్కన్ బీచెస్ ,మెక్సికో సిటి ,చిచెన్ ఇజ్రా ,టులూం విజిటింగ్ స్పాట్స్ .నిబంధనలు పాటించి చేయాలి .
  • మెక్సికో దేశ సాహిత్యం –మెక్సికన్ సాహిత్యంస్పానిష్ భాషలో ఉంటుంది .ఘనతవహించిన రచయితలలో ఆక్టేవియా పాజ్ ,అల్ఫాంసో రోయేస్,కార్లోస్ ఫ్లున్టేస్,సేర్జియోపిటాల్,ఏమిల్లో పాచేకో ,ఏలినా పోనాలియా వోట్స్కా ,ఫెర్నాండో డెల్పాసో ,జువాన్ రుల్ఫో ,అమెడో నేర్వో ,జువానా ఐరిస్ డిలా క్రూజ్ ,కార్లోస్ డిసిగు౦జా , వై గో౦గూర .
  •   కలోనియల్ కాల సాహిత్యం లో చాలా పీరియడ్లున్నాయి .ఇది 16వ శతాబ్ది వరకు సాగింది 17వ శతాబ్దం లో బరాక్ లిటరేచర్ బాగా అభి వృద్ధి చెంది సాహిత్య ఆటలు కూడా ప్రవేశించాయి అనాగ్రమ్స్,ఏమ్బ్లెంస్ అండ్ మేజెస్ వంటివి .కార్లోస్ డి సోగుంజా గోంగూర ,గువాన్ రిజ్ ,జువానా ఐన్స్ డీగోడీ రేబెలాలు ప్రముఖరచయితలు. 18వ శతాబ్దిలో కలోనియల్ పాలన అంతాన జోస్ జాక్విన్ ఫెర్నాండెజ్ రాసిన ఎల్పెరిక్విలో సర్మిఎంటోనవల ను ఏమ్బ్లేమాటిక్ ఆఫ్మెక్సికన్ పికారేక్క్యు అంటారు .లా క్విజో టిటాయు సు ప్రీమా ,డాన్కార్టిన్డేలా ఫిచేండానవలలు  అమెరికన్స్ రాసిన మొదటి నవలలు .క్లాసిక్ రచయితలుగా గుర్తింపు పొందినవారిలో –డియగోజోస్ అబాడ్,ఫ్రాన్సిస్కో జేవియర్ అలేగ్రే ,లఫెల్ లాండివార్ మొదలైనవారు .
  •   స్వతంత్ర్యానంతరం 19వ శతాబ్దం లో సాహిత్యంలోనే కాక ఇతర కళలలోకూడా  తగ్గింది .శతాబ్ది ఉత్తరార్ధం లో ఉత్తేజకర సాహిత్యం లాస్ మేక్సికనోస్ పింట్ర డోస్ పోర్ సిమిస్మోస్ పుస్తకం ఆనాటి మేధావులు తమ సమకాలీనులను ఎలా చూశారో ఉంటు౦ది .శతాబ్దం చివర్లో అమోడో నేర్వో ,మాన్యుల్ గూటరేజ్నజేరా కవులు మోడర్నిస్ట్ లుగా ప్రసిద్ధిపొందారు .రోమాన్టిజం,రియలిజం –నాచురలిజం ,మోడర్నిజం కవిత్వాలు ప్రవేశించాయి .వందలాది సాహిత్య సంస్థలేర్పడ్డాయి .కొత్తతరం కవులు రచయితలూ ఉత్సాహంగా రాశారు .వీరిలో జోస్ మాన్యుల్ ,మార్టినేజ్ డీ నవరెటే,విసేంటే రివా పలాసియో ,జాక్విన్ అర్కాడియోకాస్పియన్ వగైరా ఉన్నారు  .పాజిటివిజం కాలం లో లూయిస్ జి ఇంసియన్ ,రాఫెల్ డీలగాడో,ఏమిల్లో రబాసా ,ఏంజెల్ డీ కంపో  బాగా వెలిగారు .
  •   వ్యాస రచయితలలో –లూకాస్ అలామన్ ,సేలాపియో బకీరో బారెర,జోస్ వాస్కోసేలాస్కాల్డేరాన్ ముఖ్యులు .నవలలు ,కధలు రాసిన వారిలో ప్రసిద్ధులు –ఏంజెల్ డీ కంపో ,రాఫెల్ డేల్గాడో,జోస్ రూమేన్ రోమేరో ఫ్రాన్సిస్కో జేవియర్ మోరెనో .వగైరా .కవులలో-మాన్యుల్ అకునా,మాన్యుల్ కార్పియో ,సాల్వడార్ డియాజ్ మిరాన్ ,జువాన్ డీ డయోస్ పేజా ,అలియానా అల్వరేజ్ వగైరా .
  •   21వ శతాబ్దం లో మెక్సికన్ రివల్యూషన్ తర్వాత దృక్పధాలు మారాయి .నవల నాటకం బాగా రాశారు .మేరియానో అజులా ,రోడాల్ఫో ఉసిగి  జాతీయ సాహిత్యం రాశారు .ఇండీజినస్ లిటరేచర్ ప్రాముఖ్యం పొంది రికార్డోపోజాస్ ,ఫ్రాన్సిస్కో రోజా గొంజలేజ్ అందులో రాశారు .ఆగస్టిన్ ఎనెజేజ్-ఆల్ ఫిలో డెల్ అగువా నవల ను సమకాలీన మెక్సికన్ నవల అన్నారు .1960ఆన్దాలజి ని తెచ్చారు .చరిత్రకారుల్లో –ఆల్ఫాన్సో జంకో ,కార్లోస్ పెరి య్రా ,మేరియానో కువేసా లూకాస్ అలామన్ వగైరా ప్రసిద్ధులు .ఆక్టేవియాపాజ్ కు 1990లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ ‘’సన్ స్టోన్’’కవిత్వానికి లభించింది .172-కెనడా దేశ సాహిత్యం
  • ఉత్తర అమెరికా ఉత్తరాన పది ప్రావిన్సేస్ మూడు టేర్రిటరీలు ఉన్న దేశం ప్రపంచం లో రెండవ పెద్ద దేశం కెనడా ..3.76కోట్ల జనాభా .రాజధాని అట్టావా.కరెన్సీ –కెనెడియన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషలు .99శాతం అక్షరాస్యత .అత్యున్నత విద్యా ప్రమాణాలాతో విద్య .కెమికల్స్ మినరల్స్ ,కలప ఫుడ్ ప్రొడక్షన్ ,పెట్రోలియం ఫిషింగ్ ఆదాయవనరులు .బెనిఫ్ నేషనల్ పార్క్ ,స్టాన్లీపార్క్ ,cn టవర్ వగైరా చూడదగినవి .సురక్షితం .
  • కెనడా దేశ సాహిత్యం –కెనెడియన్ సాహిత్యం కెనెడియన్ ఇంగ్లీష్,కెనెడియన్  ఫ్రెంచ్ ,కెనెడియన్ గేలిక్ భాషలలో ఉంటుంది .ఇంగ్లిష్ లో ఇ౦డిజినస్ సాహిత్యం అంటే దేశీయ సాహిత్యం  ఎక్కువ .జెంనేట్టి ఆర్మ్ స్ట్రాంగ్ మాటలలో “I would stay away from the idea of “Native” literature, there is no such thing. There is Mohawk literature, there is Okanagan literature, but there is no generic Native in Canada”.[
  • ఫ్రెంచ్ కెనెడియన్ సాహిత్యం -1937క్యూబెక్ దేశభక్తి ఉద్యమం వచ్చి ఫిక్షన్ రచన బాగా జరిగింది మొదటినవల – L’influence d’un livreను Philippe-Ignace-Francois Aubert de Gaspé, or simply Philippe Aubert de Gaspé (1814– 41రాశాడు
  •    1967కాన్ఫెడరేషన్ తర్వాత చార్లెస్ రాబర్ట్ ,ఆర్చిబాల్డ్ లాంప్ మన్, బ్లిస్ కర్మాన్,డంకన్ కాంప్ బెల్ స్కాట్ విలియం విల్ఫ్రెడ్ కాంప్  బెల్ ప్రసిద్ధ రచయితలుగా గుర్తింపు పొందారు .పాలిన్  జాన్సన్ ,పాలిన్ జాన్సన్ డ్రమ్మాండ్ లుపాప్యులర్ కవులు అప్పుడు .ఎల్ ఏం మాంట్ గోమరి నవల ‘’అన్నే ఆఫ్ గ్రీన్ గేబుల్స్ ‘’1908లో ప్రచురితమై 50మిలియంకాపీలు అమ్ము డుపోయింది .లియోనార్డ్ కోహేన్స్ నవల బ్యూటిఫుల్ లూజర్స్ ను మోస్ట్ రివోల్టింగ్ బుక్ గా భావించారు .యితడు ఫోక్ సింగర్ సాంగ్ రైటర్ కూడా .ఫార్లీ మోవాట్రాసిన ‘’నేవర్ క్రై ఉల్ఫ్ ‘’ బెస్ట్ నవల. అతడి లాస్ట్ ఇన్ దిబార్రెల్ అనే బాల సాహిత్యరచనకు గవర్నర్ జనరల్ అవార్డ్ లభించింది .విమర్శ నవల కవిత్వం రాసినవారు – మార్గరెట్ అట్వుడ్ .షార్ట్ స్టోరీస్ రాసిన ఆలిస్ మన్రో 2013లో నోబెల్ ప్రైజ్ రావటం తో సాహిత్యానికి గొప్ప దశ ఏర్పడింది కెనడియన మహిళకు దక్కిన అరుదైన మొదటి ప్రైజ్ ఇది ..నవలాకారులుగా కరోల్ షీల్డ్స్ ,లారెన్స్ హిల్ ,గుర్తింపుపొందారు ,కరోల్ నవల –ది స్టోన్ డయరీస్ ‘’కు 1955పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .లారిస్ పార్టి కి ఆరంజ్ ప్రైజ్ దక్కింది .
  •   అంతర్జాతీయ ఖ్యాతి పొందిన  కెనెడియన్ రచయితలు  –ఆలిస్ మన్రో ,మైకేల్ ఒండటాజే,మార్గరెట్ అట్వుడ్,యాన్ మార్తెల్ ,కార్లోస్ షీల్డ్స్ ,అరిస్టాల్ మాక్లియో డ్,రవి హూజ్ ,అన్నే మైకేల్స్ ,ఆలివ్ సీనియర్ ,రిచ్లర్ ,రోహింటన్ మిస్త్రి ,ఆస్టిన్ క్లార్క్ ,లారెన్స్ హిల్ .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -3

              శిధిల హంపీ వైభవం

శ్రీ కృష్ణ దేవరయలనాటి విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమమైనదని  చరిత్రకారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి ప్రాకార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20మైళ్ళు .ఇక్కడినుంచి తుంగభద్రానదీ తీరం వరకు వ్యాపించిన నగరమే విజయనగరం .ఎంతటి మహా నగరమో ఆశ్చర్యమేస్తుంది. కమలాపురానికి దగ్గరలోనే సార్వభౌమూల అన్తఃపురాలున్నాయి .ఆనగరం గొప్ప విడ్యాపీఠం.పురందరదాసు కనకదాసు ,వ్యాసరాయ తీర్ధులు మొదలైన మహా వాగ్గేయకారులు ,విద్వాంసులున్న ఊరు .పెద్దనామాత్యుడూ కమలాపురం లోనే కాపురం ఉండి ఉండచ్చు అంటారు రామ చంద్ర .బహమనీ సుల్తాన్ 2లక్షల సైన్యం తో వచ్చి’’ ఓవర్ టైం’’కూడా చేసి విజయనగర వైభవాన్ని ఆరు నెలలలో ధ్వంసం చేశాడు .అంతటి మహాపట్నం నేడు ‘’హాళుపట్నం ‘’అంటే పాడైపోయిన ఊరు అయింది .కానీ కమలాపురం చెక్కు చెదరలేదు .

  ఇప్పుడు కమలాపురం నుంచే విజయనగర శిదిలాలుప్రారంభమౌతాయి . ఈ ఊరిలో  ఒక మ్యూజియం లో శిధిలాలు భద్రపరచారు .ఈ గ్రామానికి హంపీవిరూపాక్ష దేవాలయం కేవలం నాలుగు మైళ్ళదూరం లో ఉంది .ఈఊరు మెట్టమీద ఉంటె, హంపీ తుంగభద్రతీరం లో లోయలో ఉంటుంది .అక్కడికి వెళ్ళాలంటే హేమకూట౦ అనే కొండ దారిదిగిపోవాలి. కొండ శిఖరం పై విఘ్నేశ్వరాలయం ,కొండ లోయలో విరూపాక్షాలయం ఉంటాయి .హంపీ శిధిలాలో ఇప్పటికీ పూజలు అందుకొంటున్న దేవాలయాలు -విరూపాక్ష ఆలయం ,చక్రతీర్ధ కోదండరామాలయం ,కమలాపురం శివారులోని మాల్యవంత రామాలయం ,హేమకూట శిఖర విఘ్నేశ్వరాలయం ,బడివే లింగాలయం ,ఎల్లమ్మ దేవాలయం .రామాలయం లో రామ లక్ష్మణ విగ్రహాలు మాత్రమె ఉంటాయి .అంటే సీతాపహరణం జరిగాక రామ సోదరులు ఇక్కడికి వచ్చారనటానికి గుర్తు .

  శిదిలపట్టణం లో ఒక పెద్ద విఘ్నేశ్వరాలయం హేమకూటం పై ఉన్నది.ఈ దేవుడిని ‘’కడళే కాళ్ బెణకప్ప’’అంటారు .అంటే సెనగగింజ వినాయకుడు . రెండవ చిన్న వినాయకుడిని ‘’సాస్వీ రేళ్ బెణకప్ప’’అంటే ఆవగింజ వినాయకుడు అంటారు .పెద్దాయన ఎత్తు20అడుగులు చిన్నాయన ఎత్తు 10అడుగులు ..పురందరదాసు ‘’పిళ్ళారి గీతాలు ‘’లోని లంబోదరుడు ,హేమకూట సి౦హాసనుడు,శ్రీ విరూపాక్ష స్వరూపుడు ఈ  పెద్దవినాయకుడే

  కృష్ణ దేవరాయలు తన విజయ చిహ్నాలను విజయనగరం లో నిర్మించాడు దక్షిణాన కన్యాకుమారి వరకు జయించిఅ తర్వాత కమలాపురానికీ హాస్పేట్ కు మధ్య హాస్పేట దగ్గరలో ‘’అనంతశయనం ‘’ఆలయం కట్టించాడు .ఇది తిరువనంతపురం అన౦త పద్మనాభాలయానికి పూర్తి నమూనాదేవాలయం .ఇప్పుడు ‘’అనంతసేన్ గుడి ‘’అంటున్నారు .కళింగ విజయం తర్వాత రాయలు ఏకఖండ  ఉగ్ర నరసింహవిగ్రహం సి౦హాచలానికి ప్రతిరూపంగా నిర్మించాడు .ముఖలింగాని ప్రతిరూపం గా ‘’బడివేలింగ ‘’ను స్థాపిచాడు .బదివే అంటే చాలాపెద్దది అని అర్ధం బడా లాగా .విజయనగర  శివలింగాలన్నిటి కంటె ఇది పెద్ద లింగం .ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక్క  ‘’భువన విజయ సభాభవనం ‘’మాత్రమె .ఆ నాడు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుచి  దశమి వరకుసంరంభంగా  జరిగిన  మహర్నవమి దసరా ఉత్సవాలు నేడు ‘’మహర్నవమి దిబ్బ ‘’గా చూసి ఊహించుకోవాల్సిందే .ఆనాడు పూజలందుకొన్న కళా నిలయమైన హజార రామస్వామి గుడి , రత్నాల రాసులు పోసి అమ్మిన వీధిలో ఉన్న కృష్ణస్వామి గుడి శిధిలావ శేషాలై కన్నీరు తెప్పిస్తాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం

  • ప్రపంచ సారస్వతం
  • 169-టోకె లావు దేశ సాహిత్యం
  • దక్షిణ ఫసిఫిక్ లో సుదూర ‘’అటోల్స్’’ అనే ఉంగరంలాగుండ్రగా ఉన్న ముత్యపు దీవుల సమూహమైన హవాయి ,న్యూజిలాండ్ ల మధ్య ఉన్న దేశం .సమోవా నుంచి బోట్ లో  వెళ్ళాలి .24గంటల ట్రిప్.మెరైన్ లైఫ్ బాగాఉన్న’’ నుకు నోను’’ దీని రాజధాని .న్యూజిలాండ్ అధీన దేశం .జనాభా 1,414మాత్రమేకరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .కాన్గ్రిగేషనల్ క్రిస్టియన్ దేశం ఇంగ్లీష్ ,టోకు లావన్ భాషలు .అక్షరాస్యత 90.14 శాతం .చిన్నతనం నుంచి 11వ ఏడువరకు ఒక దశ .12వ ఏడు నుంచి మరో దశ .న్యూజిలాండ్ సబ్సిడీలపై ఆధారం .ఫెనువా ఫలా,ముసిఫెనులువా చూడతగినవి .యాత్రకు సురక్షితం ..
  • టోకె లావు దేశ సాహిత్యం –ఈ దేశం గురించి బైరన్ కవి,ఎడ్వర్డ్స్,క్విరోస్ ,విల్కీస్ రాశారు బర్రోస్ ,విలియమ్స్ లుకూడా ఫకలోవు గురించి రాస్తే ,హేల్,హరాషియోలు ఆంధ్రోపాలజి ఫిలాసఫి రాశారు .జేజే లిస్టర్ ఇక్కడి నేటివ్స్ గురించి , స్మిత్ ,పెర్సి లు ఈ ఐలాండ్ గ్రూపులగూర్చి రాశారు .
  •   అనాదిగా తరతరాలుగావాగ్రూపంలో ఉన్న  సాహిత్యాన్ని సేకరించి ‘’వర్డ్స్ ఫ్రం టోకెలావు ‘’ను పోలినీషియన్ భాషలో తెచ్చారు .ఈభాషను ఈ మూడు ఐలాండ్ లలో 1600మంది ,న్యూజిలాండ్ లో ఉంటున్న 3వేలమంది టోకే లావు ప్రజలు మాట్లాడే భాష .తర్వాత ఈపుస్తకానికి ఆంగ్లానువాదాలు విస్తృతమైన నోట్సు కూడా అచ్చయ్యాయి .ఏఒక్క ప్రక్రియను వదిలిపెట్టకుండా   సేకరించి భద్రపరచిన అపూర్వ గ్రంథం .ఇందులో ఫైలలాజికల్ అనాలిసిస్ అంటే భాషా శాస్త్ర సంబంధ విశ్లేషణ కూడా చేరింది .
  •   టోకెలావు లాంగ్వేజ్ పుస్తకాన్ని ఆంథోని హూపర్ ,జుడిత్ హన్ట్స్ మాన్,కేలిధానోకాలాలో లు కలిసి రాశారు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  • 170-వాలిస్ అండ్ ఫుటూనా దేశ సాహిత్యం
  • ది టేరిటరి ఆఫ్ వాలిస్ అండ్ ఫుటూనా అనే ఈ ఐలాండ్ దేశం  సౌత్ ఫసిఫిక్ లో తవాలుకు ,ఆగ్నేయ ఫిజికి మధ్యలో ఉంది .రాజధాని-మటౌటు.కరెన్సీ-CFPఫ్రాంక్ .జనాభా -15,289.రోమన్ కేధలిక్ మతస్తులు .అధికార వ్యవహార భాషకూడా ఫ్రెంచ్ .వాలిషియన్ భాషకూడా .అక్షరాస్యత -50శాతం .6-16వయసువారందరికి ఉచిత కంపల్సరి విద్య .ఫిషింగ్ ,సబ్సిడీలే ఆదాయ౦ .ఆర్దికవనరుల కొరత ,సహజవనరులు తగ్గటం ఇంధనంగా కలపవాడకం అరణ్యాలు నశించి బీద దేశమైంది .హార్నే ఐలాండ్స్ ,లేక్ లాలో లాలో ,టాలీటూము చూడతగినవి .కాని యాత్ర అసాధ్యం .
  •  వాలిస్ అండ్ ఫుటూనా సాహిత్యం –ఈ దేశంలో వచ్చిన పుస్తకాలలో –కన్ఫెషన్స్ ఆఫ్ ఎకంప్లీట్లీఇన్సేన్ మదర్-కేరెస్టెన్ కాంప్ బెల్ .దిటుకింగ్డమ్స్-12మంది దేశీయ రచయితలు  రాశారు .యువేయా-క్రిస్టోఫే శాండ్ రాశాడు .హు కంట్రీ కో ఆపరేషన్ స్ట్రాటేజిఫర్ వాలిస్ అండ్ ఫుటూనా-దేశ ప్రభుత్వ ప్రచురణ .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  •  దీనితో ఆస్ట్రేలియా ,ఖండం ,ఓషియానా కాంటినెంట్లోని దేశాలన్నిటి సాహిత్యం రాయటం పూర్త యింది .ఇక అమెరికన్ దేశాల సాహిత్యం రాయాలి .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం
  • ఫసిఫిక్ సముద్రం లో యుఎస్ కామన్ వెల్త్ గా నార్దర్న్ మారియానా ఐలాండ్స్ దేశం ఉంది,ఇందులిని సఫాన్ ఐలా౦డ్ సాండీ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని –సైఫాన్ .కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -56,882.స్పానిక్ రోమన్ కాధలిక్ మతం .ఇంగ్లీష్, చమర్రో కరోలియన్ భాషలు .టూరిజం ,కాటిల్ రా౦చెస్ ఆదాయ వనరులు .సూసైడ్ క్లిఫ్ ,మౌంట్ టపోచావు ,ది గ్రొట్టోచూడతగినవి .సురక్షిత దేశం .97శాతం అక్షరాస్యత .పబ్లిక్ స్కూల్ సిస్టం విద్య .
  • నార్దర్న్ మారియానా సాహిత్యం –హరాల్డ్ .జె.గోల్డ్ బెర్గ్ –డి-డే ఇన్ ది ఫసిఫిక్ –దిబాటిల్ ఆఫ్ సైఫాన్ రాశాడు .నాధన్ ఎన్.ప్రెఫెర్-లెయ్ టే-దిసోల్జేర్స్ బాటిల్ 1944 రాశాడు .ఎడిటర్స్ ఆఫ్ వైల్డ్ బిల్ల్స్ కేఫ్ –జేన్ మాక్ ,జో రేస్జిం వెర్గేరా,విల్లియా గోమేజ్  లు కలిసి స్టోరీస్ ఫ్రం వైల్డ్ బిల్ల్స్ కేఫ్,లవ్ అండ్ స్పైసిటోఫు ఇన్ నార్దర్న్ మారియానా  తెచ్చారు .
  • కొన్ని ముఖ్యపుస్తకాలు – సైఫాన్ దిబాటిల్ –జేమ్స్ హెచ్ అల్లాస్ ,దెయిర్ బాక్స్ ఎగైనెస్ట్ ది సి –స్లోవాన్ ,బాట్లింగ్ ఫర్ సైపాన్ –ఫ్రాన్సిస్  ఒ బేరిన్ ,లెటర్స్ ఫ్రం దిటినియన్-పాలినా డేన్మాన్ వెబ్ ,ట్రబుల్ ఇన్ పారడైజ్ –స్టీవెన్ ఫిలిప్ క్రేమేర్ ,వుయ్ ఆర్ గోయింగ్ టు విన్ ఆర్ డై-రాయ్ హెచ్ హెల్రోడ్,ఫసిఫిక్ ఐలాండ్స్ –కేదేరిన్ క్రిస్టిన్,మాస్ సూసైడ్స్ ఆన్ సైపాన్ –అలెగ్జాండర్ఆస్ట్రోత్ వగైరా.
  • 168-పిట్కారిన్ ఐలాండ్స్ సాహిత్యం
  • దక్షిణ ఫసిఫిక్ లో నాలుగు వల్కానిక్ అలండ్స్ సముదాయమే పిట్కారిన్ ఐలాండ్స్ దేశం .వీటి భూభాగం 18చరపు మైళ్ళు .మొదటగా పాలినేషియన్లు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నారు .1767రాబర్ట్ పిక్టారిన్ వీటిని కనిపెట్టటం వల ఆయనపెరనే ఐలాండ్స్ పిలువబడుతున్నాయి .తర్వాత బ్రిటిషర్స్ కాలనీ ఏర్పరచుకొన్నారు
  •  ఇక్కడ పైన ఆపిల్స్ మామిడి పుచ్చ,కా0టలోప్స్ ,కొబ్బరి ,అవోకేడోస్  పంటలు యెక్కువ.వీటిపైనే ఆదాయం .మాంగనీస్ ఐరన్ కాపర్ గోల్డ్ సిల్వర్ జింక్ గనులున్నాయి .తేనే ఉత్పత్తి కూడా గొప్ప ఆదాయమే .టూరిజం కూడా ఆదాయమే .బౌంటీ జాతి ప్రజలు .పెట్కేరిన్,ఇంగ్లీష్ మాట్లాడుతారు .సెవెంత్ డేఅడ్వెన్ టిస్ట్ క్రైస్తవులెక్కువ 5-15వయసువారికి కంపల్సరి విద్య
  •   రాజధాని –ఆడమ్స్ టౌన్ .జనాభా –కేవలం 67మందిమాత్రమే .అక్షరాస్యత 100శాతం .కరెన్సీ-న్యూజిలాండ్ డాలర్ .అధికారభాష –ఇంగ్లీష్ ఒకేఒక స్కూలు .ఒకే ఒక టీచర్ .న్యూజిలాండ్ విద్యావిధానం .పిట్కారిన్ ఐలాండ్ ,డూసీఐలాండ్ ,బౌంటి బే ముఖ్య ఆకర్షణలు .సురక్షితం .
  • పిట్కారిన్ ఐలాండ్స్ సాహిత్యం –చార్లెస్ నార్డ్ హాఫ్ –ఫిక్షనల్ ట్రయాలజిజేమ్స్ నార్మన్ హాల్ -బౌంటీమ్యుటినీ గురించి రాశారు .తర్వాత మ్యుటినీ ఆన్ ది బౌంటి,మెన్ అగైనేస్ట్ ది సి నవలలు వచ్చాయి
  •  టుబుయ్ ఐలాండ్ పై ఆవాసానికి  రెండు సార్ల విఫలప్రయత్నం తర్వాత దిబౌంటీ మ్యుటినీలు తాహితి కి తిరిగి వచ్చి విడిపోయారు .ఫ్లెచర్ క్రిస్టియన్ ,అతని ఎనిమిది మంది అనుచరులు ,18మంది పోలి నీషియన్లతో కలిసి 1789సెప్టెంబర్ లో తాహితి నుంచి బయల్దేరి సముద్రమార్గం పట్టారు 1 8 ఏళ్ళవరకు వారి జాడ తెలియలేదు .1808లో అమెరికన్ నావ’’ టోపాజ్ ‘’కు పిక్టోరియన్ ఐలాండ్ పై మిశ్రమ రక్త సంబంధమున్న ఒక తెగ అలేగ్జాండర్ స్మిత్ పాలనలో గుర్తించింది .ఆస్మిత్ ఎవరోకాదు చాలాకాలం క్రితం అక్కడ కు వచ్చి,బతికిన 15మందిలో ఒకడు –జాన్ ఆడమ్స్ .ఇదీ ఆపుస్తకాలలో ఉన్న చరిత్రకు సంక్షిప్త రూపం .
  • ముఖ్యపుస్తకాలు –సర్పెంట్ ఇన్ దిపారడైజ్ ,-డీ బ్రికేట్ ,lostపారడైజ్ –కేథీ మార్క్ ,పిక్టో రియన్ ఐలాండ్స్ –మారిస్ ఆలి ,దిమ్యుటినీర్-ఎ రోమాన్స్ –జార్జి లే,పిక్టోరియన్ ఐలాండ్ లైఫ్ –రాబర్ట్ ఉ మొదలైనవి .
  • సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కీ శే డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి సతీమణి వాట్స్ అప్ మెసేజ్, నాసమాధానం

[12:38 PM, 7/23/2020] +91 94411 95437: బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన దుర్గా ప్రసాద్ గారికి మాదిరాజు పర్వత వర్ధని నమస్కరించి  వ్రాయునది.మీరంతా క్షేమమని తలుస్తాను. మేము క్షేమమే.మీరు సరసభారతి లో మా వారిని గురించి  వ్రాసిన వ్యాసం సుమారు నెలరోజుల తర్వాత చూశాను. మీకు అప్పుడే వ్రాయాలని వున్నా మనసు సహకరించలేదు.కాలం గాయాన్నిమాన్పలేక పోయినా భరించటం అలవాటు చేస్తోంది. మీరు వ్రాసిన దాన్ని పదేపదే చదువుకుంటూ వుంటాను. మీకు ఆయన పట్ల ఎంత అభిమానం లేకపోతేఅంతరాయగలరు అనుకుంటూ ఉంటాము.మీవంటి పెద్దల అభిమానాన్ని పొందిన ఆయన అదృష్టవంతులు. ఆయనను మీ వ్యాసం ద్వారా మాకన్నులముందునిలిపి మమ్మల్ని అదృష్టవంతులను చేశారు. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!మీకు కృతజ్ఞతావందనములు.మహాలక్ష్మీసమానురాలైన మీ శ్రీమతి గారికి నమస్కారములు. ఏమైనా తప్పుగా వ్రాస్తే మన్నించగలరు.మీరు చేసే సాహిత్య సేవ చూస్తూనే వున్నాను. చాలా హర్షదాయకం.అభినందనీయం. మరొక్కసారి చొరవ తీసుకుని. వ్రాసినందుకు  క్షమించగోరుతాను.
ఇట్లు
మాదిరాజు  పర్వత వర్ధని
[10:26 PM, 7/23/2020] Gabbita Durga Prasad: అమ్మా నమస్తే నేను రాసిన దానికంటేమీరు రాసిన వాక్యాలు నన్ను కదిలించాయి మీ అభిమానం పొందటం నా అదృష్టం విదు షి అయిన మీరు రాస్తే తప్పు.లుంటాయా అమ్మా అదిమీ వినయమే-దుర్గాప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 165-నియే దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 165-నియే దేశ సాహిత్యం
  • దక్షిణ ఫసిఫిక్ సముద్రం లో చిన్న ఐలాండ్ దేశం న్యు .లైం స్టోన్ క్లిఫ్స్,కోరల్ రీఫ్స్ డైవ్ సైట్స్ ,మైగ్రేటింగ్ వేల్స్ జులై నుంచి అక్టోబర్ దాకా ఇక్కడి జలాలో తిరుగుతూ కనువిందు చేస్తాయి .రాజధాని –అలోపీ .జనాభా –ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు మాత్రమె .కరెన్సీ-న్యూజిలాండ్ డాలర్ .అధికారభాష –ఎకలేషియా న్యుప్రోటేస్టెంట్ మతం .ఇంగ్లీష్ అధికారభాష .8ఏళ్ళ ఫ్రీ కంపల్సరి విద్య .ఒకేఒక ప్రైమరీ స్కూల్ ఉన్నది .వేల్ వాచింగ్ , డైవింగ్ ,యాచింగ్ ఆదాయ వనరులు .లిము పూల్స్ ,ఉటుకు బీచ్ ,పలహాకేవ్ లు దర్శనీయలు .యాత్రా సురక్షిత దేశం .
  • నియే దేశ సాహిత్యం –ఈఐలాండ్ దేశం లో ఒకే ఒక రచయిత,కవి నావలిస్ట్ జాన్ పూలే ఉన్నాడు .ఆయన ‘’ది షార్క్ దట్ ఏట్ ది సన్’’అంటే సూర్యుని తిన్న షార్క్ నవల1992లో రాశాడు .బర్న్ మై హెడ్ ఇన్ హెవెన్ 2000లో ,రెస్ట్ లెస్ పీపుల్ 2004నవలలతోపాటు చాలాకవితలు రాశాడు
  • 166-నార్ ఫోక్ ఐలాండ్ దేశ సాహిత్యం
  • దక్షిణ ఫసిఫిక్ లో  ఆస్ట్రేలియాకు చెందిన అతి చిల్ల ఐలాండ్ నార్ ఫోక్ ఐలాండ్ దేశం .పైన్ వృక్షాలు ,శాండీ బీచెస్ ,ఉన్న ఐలాండ్ .బౌంటీ మ్యుటినీర్స్ ఆవాస స్థానం .హిస్టారికల్ రూయిన్స్ కు ప్రసిద్ధి . రాజధాని కింగ్ స్టన్.జనాభా -2,169.కరెన్సీ –ఆస్ట్రే లియన్ డాలర్ .అన్నిరకాల క్రిస్టియన్లు ఉన్నారు .టూరిజం, బీఫ్ ,ఎగ్స్, పౌల్ట్రీ ఆదాయ వనరులు .ఇంకం టక్స్ లేని దేశం .ఫిలిప్ ఐలాండ్ ,,నేషనల్ పార్క్ ,ఎమిలిబే యత్రాస్థలాలు .సురక్షితం .
  • నార్ ఫోక్ ఐలాండ్ సాహిత్యం –కొల్లీన్ మార్గరెట్టా మెకలో- ఒకామె మాత్రమె రచయిత్రి .న్యురోసర్జన్ .భర్త రాబిన్సన్ –నార్ఫోక్ ఐలాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ …దిధార్న్ బర్డ్స్,నవల ప్రపంచ వ్యాప్తంగా 30మిలియన్ కాపీలు అమ్ముడై రికార్డ్ సృష్టించింది .లేడీస్ ఆఫ్ మిసలోన్ఘి నవల రాసింది .2008లో వివాదాస్పద నవల –ది ఇండి పెండేన్స్ ఆఫ్మిస్ మేరీ బెన్నెట్ రాసింది .ఇతరరచనలు –ఎ క్రీడ్ ఫర్ దిధర్డ్ మిల్లినియం ,ది సాంగ్ ఆఫ్ ట్రాయ్,మొర్గాన్స్ రన్,దిటచ్ ,ఏంజెల్స్ పస్,బిట్టర్ స్వీట్ .
  • మాస్టర్స్ ఆఫ్ రోమ్ సిరీస్ గా –ది ఫస్ట్ మాన్ ఇన్ రోమ్ దిగ్రాస్ క్రౌన్ ,ఫార్ట్యూన్స్ ఫేవరెట్స్,సీజర్స్ వుమెన్ ,సీజర్,దిఅక్టోబర్ హార్స్ ,అంటని అండ్ క్లియోపాట్రా రాసింది .
  • మర్డర్ సిరీస్ గా –ఆన్, ఆఫ్ ,టూమెని మర్డర్స్ ,నెకేడ్ క్రుయల్టి,దిప్రాడిగల్ సన్,సీంస్ ఆఫ్ ది ఫ్లెష్ .
  • ఆత్మకదగా –దికరేజ్ అండ్ ది విల్ రాసుకొన్నది .జ్ఞాపకాలుగా ‘’అలీఫ్ వితౌట్ ది బోరింగ్ బిట్స్ రాసింది
  • ఆర్చ్ బాల్డ్ ప్రైజ్ ,ఆమె వేసిన పెయింటింగ్ కు లభించింది .డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవం పొందింది .
  • ఈమె ఆస్ట్రేలియాలో 1-6-1937పుట్టి ,నార్ ఫోక్ ఐలాన్డ్స్ లో 29-1-2015న 78వయేత చనిపోయింది .
  •  సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

గొడుగు పాలుడు

విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు పాలుడు ‘’అనే బోయ .ఒకసారి రాయలు వేసవి విడిది పెనుగొండ నుంచి విజయనగరానికి అడ్డదారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తుంటే గొడుగు పాలుడు అదే   వేగంతో గొడుగు పడుతూ పరిగెత్తు కొచ్చాడట .రాయలు చాలామెచ్చి అతడి కోరిక ప్రకారం ఒక రోజు రాజ్యపాలన ఇచ్చాడు .ఆ రోజంతా పగలూ రాత్రీ క్షణం తీరికలేకుండా  అర్హులైన వారందరికీ దానాలు చేసి కలం దించాడట .దీనికి నిదర్శనంగా కృతజ్ఞతగా ఈనాటికీ బళ్ళారి ,అన౦తపురం జిల్లాల లో అనేక పొలాలలో ‘’గోడుగుపట్టుకొని నిలుచున్న ఒక వ్యక్తి బొమ్మ ఉన్న భూమిలో నాటబడిన  బండలు కనిపిస్తాయి ,ఈ భూములకు ‘’గొడుగుపాలుని భూములు’’ అంటారు .ఈభూములు  కవిలకట్టేలలో ‘’గోడుగుపాలుని భూముల పత్రాలు’’అని కాయితాలు రికార్డ్ లుగా లభ్యమౌతాయి .ఎప్పుడూ బాణాకట్టె ధరించి గొడుగుపాలుడు రాయలకు  అంగరక్షకుడుగా  ఉండేవాడు .అతనిపేర వెలసిన ఊరే ‘’దొణ్ణే నాయకపురం ‘’ దొణ్ణే అంటే బాణాకర్ర.క్రమ౦గా డణాపురంగా పేరు మారింది

రాఘవమ్మ పల్లె

విజయనగరం సామ్రాజ్యం లో తాడిమర్రు సంస్థానాధీశులు బ్రిటిష్ వారి నెదిరించిచేసిన  పోరాటం లో తిరుమల రామ చంద్ర గారి పూర్వీకులు గురువులుగా ఉంటూ మంత్రతంత్రాలతో ప్రోత్సహించేవారు .సంస్థానం కూలిపోగానే హోస్పేట తాలూకా కమలాపురానికి వెళ్ళారు .

తాడిమర్రు పాలకుడు ఒక రోజు వేటకు వెళ్లి  సాయంకాలం దాకా వేటాడి అలసిపోయి ఆకలి దహించి వేయగా, సహచర అనుచరులు దూరమైపోగా నడుచుకుంటూ  ఒకబ్రాహ్మణ పల్లె శివారు చేరి ,ఒక ఇంటిముందు ఆగి ఆకలిగా ఉన్నాను అన్నం పెట్ట౦డమ్మాఅని ఆర్తిగా అడిగాడు .ఇంట్లో ఉన్న ఇల్లాలు రాఘవమ్మబయటికివచ్చి వేటదుస్తులతో అతడినిచూసి గొప్ప ఇంటివాడని గ్రహించి ,ఒకపంచే ఇచ్చి దిగుడుబావి నీటి లో స్నానం చేసి రమ్మని అన్నం వడ్డిస్తానని చెప్పింది .వెళ్ళాడు .అన్నదే కాని ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు’’ గా ఉంది .రాచిప్పలో కొద్దిగా మజ్జిగ మాత్రం ఉన్నాయి .దొడ్లోకెళ్ళి’’అటకమామిడాకు’’పోచలు కొన్ని లాగి కడిగి బాణలి లో కాల్చి  చింతపండు బెల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి రోట్లో వేసి నూరి పచ్చడి చేసింది .మోదుగాకులు కోసి శుభ్రం చేసి విస్తరికుట్టి ,ఉన్న అన్నానికి మరికొంతతోడుగా ఎసరు పెట్టి వండి వార్చి అతడిని భోజనానికి రమ్మంది .

స్నానం చేసి బట్టకట్టుకు వచ్చిన అతడితో ‘’నాయనా !పచ్చడీ మజ్జిగా తప్ప ఏమీలేవు ఎలాఉంటుందో ఎమీఅనుకోకు ‘’అని చెప్పి ,స్థలశుద్ధి చేసి  నీళ్ళగ్లాసు చెంబు పెట్టి . విస్తరేసి పచ్చడి వేసి అన్నం వడ్డించింది .రాజు భోజనానికి కూర్చుని పచ్చడి మహాద్భుతంగా అమృతోపమానంగా ఉందని రెండుసార్లు కలుపుకు తిన్నాడు ,మజ్జిగ పోసుకొని అన్నం తిని తృప్తి గా లేచి ,విస్తరి తీసి బయట పడేసి ,తిన్న చోట  ఆవు పేడతో  శుద్ధి చేశాడు .కాసేపు కూర్చుని , ‘’అమ్మా !అమృతంగా ఉంది ఆ పచ్చడి ఏమిటమ్మా ‘’?అని అడిగాడు ఆప్యాయంగా .సంకోచపడుతూ ఆమె ‘’నాయనా !నువ్వెవరోనాకు తెలీదు. వేళకాని వేళ వచ్చావు .పచ్చడిమెతుకులు పెట్టినందుకు బాధగా ఉంది ‘’అన్నది రాఘవమ్మ గారు .రాజు వెళ్ళబోతూ ‘’అమృతం లాంటి భోజనం పచ్చడితోపెట్టారు .పచ్చడి ఇంకోసారి కలుపుకోనేవాడినే కడుపులో ఖాళీ లేదు ‘’అని కృతజ్ఞతలు చెప్పి సాగిలపడి నమస్కరించి ఆశీర్వదించమని కోరగా ,’’శ్రియః పతి రంగనాయకుడు,యదు గిరీశుడు సకలకల్యాణాలు నీకు అనుగ్రహించు గాక ‘’అని ఆశీర్వదించగా   రాజు  వెళ్ళిపోయాడు .

ఒక వారం తర్వాత రాజభటులు వచ్చి ‘’రాఘవమ్మ గారిల్లు ఇదేనా ?’’అని అడగగా ఇంటిల్లిపాదీ భయపడి పోయి ,తర్వాత రాఘవమ్మ గారు తెప్పరిల్లి లోపలి రమ్మని చెప్పగా వాళ్ళు ‘’తాడిమర్రి దొరగారు తమరిని పెద్దలతోపాటు రెండు మూడు రోజుల్లో తీరిక చూసుకొని ఆస్థానానికి రమ్మన్నారు ‘’అని చెప్పారు .ఆవిడ ‘’మాతో రాజుగారికి పనేమిటి నాయనా ‘?మా పనుల్లో మేముంటాము .రాజకార్యాలు మాకేముంటాయి’’అన్నారు .వాళ్ళు తమకు తెలీదని వార్త అందజేయటమే తమపని అని చెప్పి వెళ్ళిపోయారు .భర్త ఇంటికి  వచ్చాకవిషయం చెప్పింది  చ. ఆయన సాదాసీదా వైష్ణవుడు .రాజాజ్ఞ తప్పదు కనుక మర్నాడే ఇద్దరూ బయల్దేరి వెళ్లి  .,లోపలి అధికారులు వివరం తెలుసుకొని లోనికి పంపారు .రాజు వారిని చూడంగానే లేచి నుంచుని ఎదురొచ్చి స్వాగతం పలికి సుఖాసీనుల్ని చేశాడు .

రాజు దగ్గరకు వచ్చి ‘’అమ్మగారూ !నన్ను గుర్తుపట్టలేదా “”?అని అడిగితె ‘’నాయనా !ఎప్పుడూ చూసినట్లు లేదు .రాజుగారు రమ్మంటే వచ్చాం .ఏం అపరాధమో ఆయన్ను కలుసుకోవటం ఎలాగో ?’’అన్నది ,రాజు ‘’నేను వారం క్రితం మీ ఇంటికొచ్చి మీరు వడ్డించిన పచ్చడితో హాయిగా భోజనం చేశాను .ఆపచ్చడి చాలాబాగుంది .అప్పుడే నన్ను మర్చిపోయారా ??’’అని నవ్వగా ఆమె ఆశ్చర్యపోయి ‘’సంతోషం నాయనా !తెలిసినవాడివి కనిపించావు రాజుగారు ఎందుకు పిలిపించారో కనుక్కొని చెప్పు ‘’అన్నది .కాసేపు ఆటపట్టిద్దాని రాజు ‘’ఎందుకు పిలిపించారబ్బా !నాకు చెప్పనే లేదే .శిస్తుబాకీ ఉన్నారా ఆస్తులకోసం పోట్లాడుకున్నారా. అయినా నేనెంత చెబితే అంత రాజుగారు ‘’ అని బుజాలెగరేశాడు  .ఆమెభర్త  ‘’రామ రామ ,మాకు ఆస్తులా పోరాటాలా పంపకాలా ?కొద్దిపోలం ఉంటె మేమిద్దరం ,పిల్లాడు పెరుమాళ్ళ ధ్యానంతో కాలక్షేపం చేస్తున్నాం ‘’అన్నాడు .ఆమె మధ్యలో కలగజేసుకొని ‘’నాయనా మాకు ఆస్తులే ఉంటె ఆనాడు నీకు పచ్చడి మెతుకులు పెడతానా ?’’అంది .రాజు వాళ్ళను విశ్రాంతి తీసుకోమని ,సాయంత్రం రాజుగారి కొలువుకు పంపే ఏర్పాటు చేస్తానని చెప్పాడు .

సాయంకాలం రాజభటుడు వచ్చి దంపతులను కొలువుకు తీసుకు వెళ్ళాడు .అక్కడ ఏర్పాటు చేసిన ఆసనాలపై కూర్చున్నారు .రాజు రాజలాంచనాలతో ప్రవేశించగానే రాఘవమ్మగారికి అతడిని ఎప్పుడో చూసిన అనుమానం  వచ్చింది .ఆతడే రాజు అనే జ్ఞాపకం రాలేదు .రాజు సభలోని వారికి వారం క్రితం జరిగిన సంఘటన అంతా వివరించాడు .రాఘవమ్మగారి ఆతిధ్యానికి కృతజ్ఞతగా ఒక పల్లెను సర్వహక్కులతో దానమిస్తున్నట్లు ప్రకటించాడు .అందరూ జయజయధ్వానాలు చేశారు .ఆనాడు పచ్చడి మెతుకులు తిన్నవాడే రాజు అని దంపతులు ఆశ్చర్య సంతోషాలతో ఉక్కిరిబిక్కిరవగా, రాఘవమ్మగారు స్థాణువే అయ్యారు .ఆ పల్లె శ్రోత్రియులకు, వేదాధ్యయన పరులకు యజ్ఞయాగాదులు చేసేవారికి ఇచ్చే గ్రామం .తాడిమర్రికి 12మైళ్ళ దూరం.రాఘవమ్మ గారి కుటుంబం ఈ గ్రామానికి మారారు .వీరికోసం రాజు ఎనిమిదిగదుల భవంతి కట్టించి ఇచ్చాడు .జ్ఞాతులు ఉండటానికి ప్రక్కన మరో ఇల్లు కట్టించాడు .ఆవూరికి ‘’రాఘవమ్మ పల్లె ‘’అని పేరొచ్చింది .కాలక్రమలో అదే’’ రాగం పల్లె ‘’అయింది .ఈ రాగం పల్లె వారే తిరుమలరామచ౦ద్ర గారి మాతామహులు .మాతామహునిపేరు వెంకట రాఘవాచార్యులు. ఆయన మూడవ కూతురు  జానకమ్మ రామ చంద్ర గారి తల్లి .ఈమె అక్క గారు ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారి పెద్దకోడలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు

రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు

అని హైహయ వంశం లో పుట్టిన దత్తాత్రేయ వరప్రసాది అనీ,ఏఇద్దరి మధ్య తగాదాలువచ్చినా   ప్రత్యక్షమై తగవు తీర్చి శాంతి చేకూర్చేవాడని మహా పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు పురాణప్రవచనం లో తరచుగా చెబుతూ ఉంటారు .

హైహయ వంశము ఒక పురాణాలలోని ప్రసిద్ధమైన వంశము. మహావిష్ణువు లక్ష్మీదేవి అశ్వం రూపంలో ఉండగా జన్మించిన హైహయుని ద్వారా ఈ వంశం వృద్ధిచెంది౦ది. కార్తవీర్యార్జునుడు ఈ వంశానికి చెందిన వీరుడు. హయము  అంటే గుర్రం  .

సూర్యుని కుమారుడు రేవంతుడు ఉచ్చైశ్రవం మీద వైకుంఠానికి వస్తుండగా చూసిన లక్ష్మీదేవికి మనోవికారం కలిగింది. గమనించిన విష్ణుమూర్తి బడబ (ఆడగుర్రము) గా భూలోకంలో జన్మించమని శాపమిస్తాడు. కలత చెందిన లక్ష్మీదేవి ప్రార్థించగా, తనకు పుత్రుడు జన్మించిన తరువాత శాపవిమోచనమౌతుందని అనుగ్రహిస్తాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మి తమసా, కాళింది నదుల సంగమ స్థలంలో శివున్ని ధ్యానిస్తూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుని కోరిక మేరకు విష్ణువు అశ్వరూపుడై భూలోకంలో లక్ష్మిని చేరి ఆనందంగా విహరించారు. కొంతకాలానికి లక్ష్మీదేవి దివ్య సుందరుడైన కొడుకును ప్రసవించింది. ఆమెకు శాపవిమోచనమై వైకుంఠం చేరినది.

యయాతి కొడుకు తుర్వసుడు పుత్ర సంతతికై తపస్సు చేస్తున్నాడు. విష్ణువు ప్రత్యక్షమై తాను సృష్టించిన పుత్రుడిని తెచ్చి పెంచుకొమ్మని ఆనతిస్తాడు. ఆ శిశువుకు జాతకర్మాదికం చేసి ఏకవీరుడు అని నామకరణం చేశాడు. ఇతనికి హైహయుడు అని పేరు కూడా ఉంది. ఇతడు రభ్యుని కూతురైన ఏకావళిని వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుడు కృతవీర్యుడు. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యార్జునుడు.

హైహయులు తాము యదువంశపు రాజులమని చెప్పుకొన్నారు. హరి వంశము (34.1898) గ్రంథం ప్రకారం ఐదు హైహయ వంశముల వారు కలిసి తాళజంఘులని (విష్ణు పురాణము (4.11) అన్నారు. ఆ వంశాలు – వితిహోత్రులు, శర్యాతులు (శర్యాతి సంతతి), భోజులు, అవంతీయులు, తుండికేరులు. వీరు పశ్చిమ భారతం నుండి మధ్యభారతం (మాళ్వా ప్రాంతం) కు వలస వెళ్ళారు. వారిలో మహిష్మంతుడు స్థాపించిన మహిష్మతీ నగరం (హరి వంశం 33.1847) తరువాత వారి రాజధాని అయ్యింది. అదే ఇప్పటి “మహేశ్వర్” పట్టణం. మహిషుడనేవాడు ఈ నగరాన్ని స్థాపించాడని పద్మ పురాణము (6.115) లో ఉంది. హైహయులలో గొప్ప రాజైన కార్త వీర్యార్జునుడు “కర్కోటక నాగుడు” నుండి ఈ నగరాన్ని గెలుచుకొని తన రాజధాని చేసుకొన్నాడు. హైహయుల విజయ పరంపరలో ఉత్తరదేశ దండయాత్రలకు ఇక్ష్వాకు రాజైన సగరుడు అడ్డుకట్ట వేసి ఉండవచ్చును. కార్తవీర్యార్జుని మనుమడు, తాళజంఘుని కొడుకు అయిన వీతిహోత్రుని పేరుమీద హైహయులలో వీతిహోత్రులు ముఖ్య వంశమైంది. వీతిహోత్రుని కాలంలో వింధ్యకు ఇరువైపులా ఉన్న ప్రాంతం మహిష్మతి, ఉజ్జయిని రాజధానులుగా రెండు విభాగాలై ఉండవచ్చును. వీతిహోత్రుల చివరి రాజైన రిపుంజయుని అతని మంత్రి పులికుడు చంపేశాక పులికుని కొడుకు ప్రద్యోతనుడు రాజై ఉండవచ్చును (మత్స్య పురాణము 5.37). హైహయులు వేదవిద్యా పారంగతులని చెబుతారు.[1] నాగవ రాజ్యం అంతమైనాక ఆ రాజు వంశస్తుడు పురోహితుడైనాడు.[2] మధ్యయగంలో హైహయులు ముస్లిం రాజులతో యుద్ధాలకు తలపడి ఉండవచ్చును.[3]

కార్తవీర్యార్జునుడు..

ఈతడు కృతవీర్యుని కొడుకు.

హైహయ వంశరాజు.

అసలు నామం అర్జునుడు.

కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడుగా వ్యవహారం.

.

వింధ్య పర్వతానికి దక్షిణంగా వున్న నర్మదా నదీతీరము లోని మాహిష్మతీ పురం ఇతని రాజధాని.

ఇతను దత్తాత్రేయ భక్తుడు.

దత్తాత్రేయుని వరం వల్ల సహస్ర బాహుడవుతాడు.

యుద్ధంలో సర్వదా జయమే కలుగుతుందనీ,

అపార రాజ్యసంపద కలుగుతుందనీ

వరం పొందుతాడు.

ఒక బంగారు రథం కూడా పొందుతాడు.

అది అతన్ని యేవేళప్పుడైనా యెక్కడికైనా తీసుకొని పోగలదు.

విఖ్యాతుడైన ఒక వ్యక్తి చేతులో తప్ప అతనికి మరణం వుండదు.

ఈ ఘన సంపద గురించి విని రావణుడు ఇతని మీదికి దండెత్తి వస్తాడు.

ఆ సమయములో కార్తవీర్యార్జునుడు వన విహారంలో వుంటాడు.నా రాక విని పారిపోయి ఉంటాడని రావణుడు యెగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు.

తర్వాత నర్మదా ఒడ్డున శివపూజ చేసుకుంటూండగా కార్తవీర్యార్జునుని సహస్ర బాహువుల్లో చిక్కి నర్మదా నది పొంగి వచ్చి రావణుడి పూజాద్రవ్యాలన్నిటినీ తోసి పారేస్తుంది.(కార్తవీరుడు రావణుణ్ణి

తన వేయి బాహువుల మధ్య ఇరికించి ఊపిరాడకుండా చేశాడని . అప్పుడు పులస్త్యుడువచ్చి రావణుణ్ణి విడిపిస్తాడని ఒక కథనం కూడా వుంది. )

రావణుడికి కోపము వచ్చి దండెత్తి వెళతాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని విడిపించుకొని తీసుకెళ్తాడు.

ఒకసారి ఆహారనిమిత్తం అగ్ని వస్తాడు.

గిరి నగరారణ్యాన్నంతటినీ భక్షించమని చెప్తాడు.

అక్కడే మైత్రావరుణ ముని యొక్క ఆశ్రమం వుంటుంది.అదీ దగ్ధమైపోతుంది.

మైత్రావరుణుడి కొడుక్కు కోపం వచ్చి కార్తవీర్యుని సహస్ర బాహువులనూ పరశురాముడు ఖండిచివేస్తాడని శాపమిస్తాడు.

అందుకు భయపడి మంచివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు

కానీ కొడుకులు దుర్మార్గులై చెడ్డ పనులు చేస్తుంటారు.

ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. జమదగ్ని భార్య రాజుకీ పరివారానికి సకలమర్యాదలూ చేస్తుంది. ఇంతమందికి ఎలా సపర్యలూ,భోజనాలూ

చేశారని అడుగుతాడు.మా దగ్గర నందినీ ధేనువు (కామధేనువు) వుంది. అది అడిగినవన్నీ ఇస్తుందని జమదగ్ని చెప్తాడు.

ఇటువంటి ధేనువు రాజుదగ్గర వుండాలి. మీ దగ్గర ఎందుకు? నాకిచ్చేయమంటాడు కార్తవీర్యుడు.

దానికి జమదగ్ని నిరాకరిస్తాడు.

దానితో కోపగించిన కార్తవీర్యుడు ఆశ్రమంలోనున్న వనాన్నంతా ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువుని తీసికెళ్ళి పోతాడు.

పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యుని దౌష్ట్యానికి

ఆగ్రహించి అతన్ని వెంటాడి అతని సహస్రబాహువులూ ఖండించి అతన్ని వధిస్తాడు.

ఆ తర్వాత కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జందగ్నిని చంపేసి వెళ్తారు.

పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి విషయము తెలుసుకొని క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇరవైఒక్క మార్లు రాజులందరినీ సంహరించి ఆ నెత్తురుతో అయిదు మడుగులు చేసి పితృ తర్పణం చేస్తాడు.

ఆ ప్రదేశమే శమంతపంచకమైంది.

ఆ తర్వాత కురుపాండవులు అక్కడ యుద్ధం చేస్తారు. అదే కురుక్షేత్రం.

కార్తీక శుక్ల అష్టమి…

శ్రీ కార్తవీర్యార్జున జయంతి… ఈ రోజంతా ”శ్రీ కార్తవీర్యార్జున మహామంత్ర పఠనం వలన నానావిధ మంచి జరుగును.

చాలా అద్భుతమైన రోజు…….

సుమంతో,సుమంతో,శ్రీ కార్తవీర్యార్జునాయ నమః..

అనే మంత్రముతో..జపిస్తే..

పోయిన వస్తువులు,

ఇంటినుండి వెల్లిపోయిన మనుషులు,

ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు,

పశువులు,

వివాహము కావలసిన వారు,

ఇలా జపిస్తే, తప్పక తిరిగి పొందగలరు,

సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లు అయితే త్వరలో అభీష్ట సిద్ది కల్గును!

కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్

తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే….

ఈ పై మంత్రమును ధృడ సంకల్పంతో చేసేవారికి చాలా వేగవంతమైన మంచి ఫలితం తప్పక కలిగితీరుతుంది…..

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి..

భాగవత భారత మారకం డేయ పురాణ ,ఉత్తర రామాయణాల  ప్రకారం -కార్త వీర్యుని పురోహితుడు గర్గ మహర్షి .గర్గుని ఆదేశంతో దత్తాత్రేయుని ఆరాధించాడు .దత్తాత్రేయుడు వివిధ రూపాలలో వింతవింత చేష్టలతో భక్తులను పరీక్షిస్తాడని మనకు తెలుసు .ఒకసారి అలాంటి పరీక్షే కార్తుని పై చేశాడు .  రోటా పుట్టించే అపానవాయువు వదిలాడు దాని నుంచి  నుంచి పుట్టిన అగ్నికి  కార్త వీర్యుని బాహువులు మాడిపోయాయి .అయినా వదలక ధ్యానం చేస్తూనే ఉన్నాడు . ‘’నేను భార్యాసక్తుడను ఎందుకు నన్ను కొలుస్తావు ‘’?అని అడిగాడు దత్తుడు .’’నువ్వు విష్ణు మూర్తివని నాకు తెలిసి సేవిస్తున్నాను ‘’అని చెప్పి స్తోత్రం చేశాడు కార్త .దత్తుడు సంప్రీతి చెంది వరం కోరుకోమనగా ‘’నాకు సహస్ర బాహువులు ఉండాలి .యుద్ధం లో ఎప్పుడూ ఓడిపోకూడదు. రాజ్యం కావాలి ‘’అని కోరాడు .సరే అని అనుగ్రహించాడు దత్తాత్రేయుడు .

  ఒక సారి అగ్ని వచ్చి తనకు ఆహారం కావాలని అడిగాడు .గిరినగరారణ్యం అంతా స్వాహా చేసి ఆకలి తీర్చుకోమన్నాడు వీర్యుడు .ఆ అరణ్యం లో వరుణుడికుమారుడు మైత్రావరుణుడి. ఆశ్రమం కూడా ఉంది.అగ్ని దాన్నీ కాల్చేశాడు .మైత్రావరుణుడికి కోపం వచ్చి అతడి సహస్ర బాహువులను పరశురాముడు ఖండిస్తాడని శపించాడు . ఆశాపానికి భయపడి అప్పటి నుంచి ధర్మకార్య, ధర్మ సత్య ప్రవర్తకుడయ్యాడు .కానీ కొడుకులు అవినీతిపరులైన నికృస్టులు . బలవీర్యలతో తండ్రిపేరు చెప్పుకొంటూ దుష్కార్యాలెన్నో చేశారని భారతం చెప్పింది .

  రావణాసురుడికి కార్తవీర్యుని బలదర్పాలు తెలిసి అతడితో యుద్ధం చేయాలని తహతహ తో వచ్చాడు .అప్పుడు కార్తుడు నర్మదా తీరం లో స్త్రీలతో కేళీ విలాసాలలో ఉన్నాడు .రావణుడు వచ్చి నవ్వుతూ ‘’నాతో యుద్ధం చేస్తావా ?’’అని అడిగాడు .వెంటనే యుద్ధం చేసి వాడిని బంధించాడు .రావణుడి తండ్రి పులస్య బ్రహ్మవచ్చి బ్రతిమాలి చేర విడిపించాడు .కార్తునికోడుకులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయనా కుమారుడు లేని సమయం లో మహర్షి కామదేనువును,దూడను  అపహరింఛి తీసుకుపోయారు .జామదగ్ని పరశురాముడు వచ్చి విషయం తెలిసి ,కోపం తో మాహిష్మతీ పురం వెళ్లి కార్తవీర్యుని చంపాడు అని భారతం చెప్పింది .

  మార్కండేయం,ఉత్తరారామాయణాలలో  లో కార్తికేయుడు వేటకు వెళ్లి ,అలసి జమదగ్ని ఆశ్రమానికి వస్తే మహర్షి రాజును గౌరవించి ఆతిధ్యమిచ్చి తన కామధేనువు ప్రభావం తో సమస్త పదార్ధాలు కల్పించి రాజుకు ,పరివారానికి బ్రహ్మా౦డ మైన విందు అందించాడు .సర్వము ప్రసాదించే ఆ కామదేనువును తనకిమ్మని రాజు కోరాడు .ఇవ్వనన్నాడు మహర్షి .తన సేనను పురికొల్పి మహర్షించి చంపించాడు కార్తుడు .కాని కామధేనువు వాళ్లకు పట్టు బడలేదు .కామదేనువునుంది భటులు జన్మించి రాజు సైన్యాన్ని చెల్లా చెదరు చేసేశారు .తర్వాత వచ్చిన పరశురాముడు తండ్రి మరణం తెలుసుకొని కార్తవీర్యుని నగరం పై దండెత్తి ,వాడితో యుద్ధాలు చేసి ఓడించితన  గండ్ర గొడ్డలితో కసితీరా చంపి  ఆ మాహిష్మతీ నగరాన్నితగలబెట్టాడు . క్షత్రియ జాతి పై ఆగ్రహించి ఇరవై ఒక్క మార్లు దండ యాత్ర చేసి క్షత్రియ సంహారం గావిస్తాడు. తదనంతరం అశ్వమేధ యాగం చేసి కశ్యప మహర్షి కి భూమిని దానం చేస్తాడు. అందుకే భూమిని ‘’కాశ్యపి’’ అనే పేరు వచ్చింది. . అని ఉన్నది .

  మరో కధనం –విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఆయన విజయాలన్నిటికీ తానె కారణం అనే గర్వం తో విర్రవీగుతోంది  .విజయాలుతనవీ కీర్తి ప్రతిస్టలు  శ్రీహరివీ  అని భావించేది .గ్రహించిన విష్ణుమూర్తి  దాన్ని భూలోకం లో ‘’సొట్ట చేతులతో ‘’జన్మించమని శపిస్తాడు .దానితో దిమ్మతిరిగి బొమ్మకనిపించిసుదర్శనుడు మన్నించమని, శాపాన్ని ఉపసంహరించమని  ప్రార్ధిస్తాడు .అలాగే అంటూ తాను  దత్తాత్రేయ అవతారం ఎత్తి శాపాన్ని ఉపసంహరిస్తానన్నాడు .అలా సొట్ట చేతులతో పుట్టి దత్తుని అనుగ్రహం తో శాపం నుంచి విముక్తుడౌతాడు సుదర్శనుడుఅనే విష్ణు చక్రం .

బ్రహ్మ పురాణం లో యోగియగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యుడాయెను. మేఘముతానేయయ్యెను. వింటివారిదెబ్బలచే కఠినమైన చర్మముగలబాహుసహస్రముచే నాతడు శరత్కాలమందు వేయికిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను. అని ఉన్నది

 మరో విశేషం –షట్చక్ర వర్తులలో కార్తవీర్యార్యర్జునుడు ఆరవవాడు .ముందున్న అయిదుగురు హరిశ్చంద్ర ,నల ,పురుకుత్స ,పురూరవ ,సగరులు .

ఇంకో విశేషం –కుమార స్వామి క్షేత్రాలలో పళని తర్వాత అతిముఖ్యమైంది కుంభకోణం దగ్గర ఉన్న స్వామి మలై క్షేత్రం  అతిపురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు అతడి శిల్పం ఆలయం లో ఉన్నది . భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు.  ఆయన ఒకసారి తపస్సు ప్రారంభించేముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు.  ఆ తపోశక్తి ఊర్ధ్వ లోకాలకి వ్యాపించగా, ఆ వేడిమిని భరించ లేని దేవతలు పరమ శివుని శరణు జొచ్చారు.  అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి  దేవ లోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు.  దానితో పరమ శివునంత వానికి జ్ఞానం నశించింది. తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు.  నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడుకార్తికేయుడు .  ఇంకేముంది.  కుమారుడు గురువైనాడు.  తండ్రి శివుడు శిష్యుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించి పోయాడు.

కనుక కార్తవీర్యార్జునుడు ‘’మామూలోడు కాదు ‘’షట్చక్ర వర్తులలోఒకడు .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధనం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా  నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా ‘’అని పేరుపెట్టాను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో చెప్పుకొన్నవిషయాలు మీకోసం .

‘’డాక్టర్ తిరుమల రామ చంద్ర విచిత్ర వ్యక్తీ ,వైరుధ్యాలపుట్ట ,వైపరీత్యాల మెట్ట.పాదర్సాన్ని పరిహరించే పరుగు .మెరుపును మించిన చాంచల్యం .

ఇంతటి వైరుధ్యాల వైవిధ్యం లో వైపరీత్యాల వైరూప్యం లో రచయిత కనిపిస్తాడు .విమర్శకుడు  తొంగిచూస్తాడు .భాషా వేత్త భాసిస్తాడు.ప్రతిదాని పుట్టు పూర్వోత్తరాలూ పరిశీలించే పరిశోధకుడు పలకరిస్తాడు .కనిపించిన దాన్నల్లా కలం తో కబళిద్దామనే భావుకుడు గోచరిస్తాడు .తెలిసిన దాన్నే తేటమాటలతో అందించే పత్రికా రచయిత తారట్లాడుతాడు ఉపనిషత్కాలం స్వర్ణయుగం అవతరించాలనే దురాశా పరుడు ప్రత్యక్షమౌతాడు .

  ఇలాంటి స్థితి కి కారణమేమిటి?పరిసరాలు ఎందుకు వికటించాయి?లోపాలు ఎక్కడ ఉన్నాయి ?అవి సరిదిద్దుకోవటానికి వీలు లేనివా ?విధి బలీయమా ?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ‘’ఈ హంపీ నుంచి హరప్పా దాకా ‘’

  నేను తిరుపతిలో సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు దిన చర్య వ్రాసేవాడిని .ప్రతిదినమూ ఏదైనా మంచి పని చేయాలనే నియమం పాటించేవాడిని .రాత్రి పడుకోబోయే ముందు దిన చర్యను ఒక సూక్తితో ముగించే వాడను .

  స్వాతంత్ర్యోద్యమ౦ లో  క్రియాశీల కార్యకర్త నైన తర్వాత ,ఆనాటి పనులన్నీ దిన చర్యలో చేరేవి .అది పోలీసుల  చేతుల్లో పడి ,న్యాయస్థానం లో నాకే కాక ,నా మిత్రులకూ ప్రతి కూల సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది .అప్పటి నుంచి దిన చర్య వ్రాయటం మానుకున్నాను .

 ఈ ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’పర్యటనలో తిదులవారీగా సంఘటనలు గుది గుచ్చటం అందువలననే సాధ్యం కాలేదు .నా జ్ఞాపకాన్ని బట్టి పేర్కొన్నాను .

  నా బోటి సామాన్యుని జీవితం లో ఏమి గొప్ప సంఘటనలు ఉంటాయి కనుక ?కాని అదొక దేశ ద్రిమ్మరి అనుభవ విశేషంగా ,సత్యాన్వేషి కథనంగా ,జిజ్ఞాసువు ఆవేదనగా పాఠకుల మనసుకు దగ్గరౌతుందని ఆ విశ్వాసం .

భాషా సేవకుడు

తిరుమల రామచంద్ర .

ఇది చదివితే వారిలో ఎంతటి వినయ సంపద ఉన్నదో మనకు తెలుస్తుంది .

మూడవ ముద్రణకు సంపాదకులు శ్రీ అక్కిరాజు రమాకాంతరావు ఏమన్నారో చూద్దాం –‘’20వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలోనే తిరుమల రామచంద్ర గారు వంటి వైవిధ్యమైన జీవితం గడిపిన కవి పండిత సాహిత్య వేత్తలు లేరు .ఆయన మనస్వి .నిరాడంబర సరళసాధుప్రవృత్తికి మూర్తి మంతం .ఆయన వంటి బహు భాషా వేత్తలు ఈ శతాబ్దం లో వేళ్ళమీద కూడా లేరు .ఆయన గొప్ప పండితుడు ,పరిశోధకుడు ,పురావస్తు చరిత్ర విశారదుడు ,అత్యున్నతమైన ప్రమాణాలతో ‘’పరిశోధన ‘’పత్రిక నడిపారు .

  హంపీ నుంచి హరప్పా దాకా ఈ శతాబ్దపు’’ నవీనేతి హాసం  ‘’.సమాజ సాహిత్య ఆంతర్య సంస్కృతి త్రివేణి’’.ఆధునిక పురాణం .కమనీయ కావ్యం. అద్భుత వాస్తవికతకు దర్పణ మైన  గొప్పనవల చవులూరించే కథా సంపుటి. విస్మయావహ మైన సామాజిక సన్ని వేశ రంగస్థల సురుచిర రూపకం .ఆయన దొడ్డ వ్యక్తిత్వ నిరూపణం .మహర్షులందరూ ఒక ఎత్తూ అగస్త్యుడు ఒక ఎత్తూ అంటారే అల్లానే శ్రీ తిరుమల రామ చంద్ర సర్వ సాహిత్య సృజన ఒక ఎత్తూ ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’ఒక ఎత్తు అనవలసి ఉంటుంది .జీవితం లో డెబ్భై సంవత్సరాలు తెలుగు వారి ఉత్తమ సాహిత్యాభి రుచి ప్రవర్ధనకోసం ,సంస్కృతి ,పునరుజ్జీవనం కోసం ఆయన గొప్ప కృషి చేశారు .వ్యాసాలు సమీక్షలు వేలాది సంఖ్యలో రాశారు .ఆయన ఆర్జవం ఇతరులలో మృగ్యం .ఇతరులంటే సాహితీ రంగ ప్రముఖులని  అర్ధం  ‘’అని కీర్తి కిరీటం పెట్టారు అక్కిరాజువారు .

  అక్కిరాజు వారే రెండవ ముద్రణలో –‘’రామ చంద్ర గారు ‘’త్రిదశుడు’’అంటే ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళ వాడి గానే  జీవించారు .’’గతానికి ఆగతానికి ఆయన ఒక వారధి .’’.ఈపుస్తకం భారతీయసంస్కృతిలోని మేలిమిని సాక్షాత్కరింప జేస్తున్న సుందరపురాణం .ఆయనలాంటి ‘’మనస్వి సమకాలీనంలోఎవరూ లేరు .స్థితప్రజ్ఞుడు.కార్యార్ది కాడు.ఆయన దేశభక్తి నిరుపమానం ..’’గౌతమ ధర్మ సూత్రాలు మను స్మృతి మా గురువులను చూసే రాశారేమో ‘’అనే౦తటి గురుభక్తి,ఆత్మార్పణ, అభి నివేశం  ఆయనది .ఆయన మనస్తత్వ పరిశీలన ,మానవ స్వభావ చిత్రణ ,మనస్తత్వ ప్రతిపాదన చాలాఅద్భుతమైనవి .తెలుగులో ఇంతఆత్మనివేదనా ,ప్రణవంగా ఏ స్వీయ చరిత్రా లేనే లేదు .కరుణ సుచిరోజ్వల శృంగారం ,సుకుమార హాస్యం పరమ మనస్విత పుస్తకమంతా పరచుకొన్నాయి  .

’’తరువోపి హి జీవంతి మృగ పక్షిణః-సజీవతి మనో యస్య మనవేవ హి జీవతి ‘’

భావం –చెట్లుజీవిస్తాయి కొన్ని వేల ఏళ్ళుకూడా ,మృగాలూ పక్షులూ జీవిస్తాయి .అయితే వాటి మనసు పరిపక్వశీలం  కాదు . మనసుతో మనసారా జీవించే వారే జీవించినట్లు. వాళ్ళ జీవితమే సార్ధక౦  అనే ‘’యోగ వాసిస్టం’’లోని శ్లోకం .అలాంటి వారు తిరుమల రామ చంద్ర .ఆయనకు షష్టిపూర్తికాలేదు .సప్తతి జరగలేదు .అసీతి అసలేలేదు .సహస్ర చంద్ర దర్శనం సమకూడలేదు .అంటే తెలుగు వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు అని అర్ధం. ఆయనది ఏమీ పట్టించుకోని మనస్తత్వం . రవీంద్రునిలా నిరంతర నిత్య మనన శీలి రామ చంద్ర ‘’

అని ఆమనస్వికి ఈ సాహితీ తపస్వి శ్రీ అక్కిరాజు రమాకాంతరావు గారు 12-12-1997 న నమస్సు లర్పించారు .

ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ టి.ఉడయవర్లు  16-6-2013లో రాసిన వ్యాసం లో మరికొన్ని విశేషాలు తెలుసుకొందాం –

పరిశోధనా పారంగతుడు

సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన ‘మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు’ అయినా, ‘నుడి-నానుడి’ అయినా ‘సాహితీ సుగతుని స్వగతం’ అయినా, ‘మరుపురాని మనీషులు’ అయినా, ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే ‘పులిట్జర్’ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన ‘హంపీ నుంచి హరప్పాదాకా’ జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.

తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం ‘మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు’. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం – ‘నుడి-నానుడి’. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప – వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘మరుపురాని మనుషులు’ మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.

ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ – శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.

మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.

తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి ‘హిందువుల పండుగలు-పర్వాలు’, ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’, మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.

పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.

తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన ‘పలుకుబడి’కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
– టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

 

డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధానం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా  నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా ‘’అని పేరుపెట్టాను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో చెప్పుకొన్నవిషయాలు మీకోసం .

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

మిత్రమా అది వీధిలో జరిగిన ఎదురు దాడికాదు

ప్రక్కప్రక్కన నడుస్తూ చేసిన

అనుకోని అకస్మాత్తు సంభాషణా కాదు

అది మామూలు కరస్పర్శ కానే కాదు

ఆకస్మికయాత్రకు ముగింపూ కాదు.

క్షణ క్షణం నిన్ను నువ్వు విచ్చుకొంటూ

మా హృదయాలకు బాగాదగ్గరయ్యావ్

నువ్వు విజేతగా రాలేదు మిత్రునిలా చేరావ్ .

నీ నవ్వుతో మా మనసుల్ని గెలిచావ్

నువ్వు సింహాసనం  ఆక్రమించలేదు

మా గుండెల్లో బాగా దూరిపోయి

అక్కడే పట్టాభి షిక్తుడవయ్యావ్

అందుకే మా కంటే నువ్వే ఎక్కువ బాధ పడుతున్నావ్ .

సమయంవచ్చినప్పుడు వీడ్కోలు చెప్పి విడిపోయావ్

అన౦తకాల పరచయం ద్వారా

నువ్వు మాకు స్వంతమయ్యావ్ .

రక్తం కారుతున్న కోట్లాది  జన

హృదయాలలో నువ్వెప్పుడూ

 ప్రియ శోకంగా శాశ్వతంగా నిలిచిపోతావ్

నిన్ను మళ్ళీ నేను చూస్తాననే అనుకొంటాను

ప్రియమిత్రమా మనదేదో ఆషామాషీ కలయికకాదు.

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు –కబీర్ చౌదరి ఆంగ్లానువాదం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 163-గుయాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

  • 163-గుయాం దేశ సాహిత్యం
  • మైక్రో నేషియా సరిహద్దులో పశ్చిమ ఫసిఫిక్ లో ట్రాపికల్ బీచెస్,చామోర్రోవిలేజేస్ ఉన్న దేశం గుయాం .రెండవ ప్రపంచయుద్ధకాలం నాటి  నేషనల్ హిస్టారిక్ పార్క్ ఉంది.స్పానిష్ సంస్కృతీ వారసత్వ గ్రామాలు ఉంటాయి .రాజధాని -అగాదా ,కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -1.66లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,చామోర్రో భాషలు అధికారభాషలు.99.37శాతం అక్షరాస్యత .అమెరికన్ విద్యా విధానం .టూరిస్ట్ రెవెన్యు ,అమెరికా ఆయుధ ఖర్చే ఆదాయం .హగాతా ,టమురింగ్, టోలోఫోఫో,డేడేడో చూడతగ్గవి .సురక్షిత దేశం .
  • గుయాం దేశ సాహిత్యం –
  • కవిత్వమే తమలో రాజకీయ జాగృతి కలిగించిందని క్రైగ్ సాంటోజ్ ప్రైజ్ అన్నాడు. కరెంట్ లేని ఎన్నో రాత్రులు కుటుంబం అంతా ఆరుబయట గుండ్రంగా చేరి కబుర్లు చెప్పు కొంటూ అన్నం తింటూ  గడిపేవారమని నెత్తిపై సోనిక్ బ్లాస్ట్స్ ఆఫ్ ఫైటర్ జెట్ల ధ్వనిమాత్రమే తమకు అంతరాయమని ,తమ దేశం లో ముప్ఫై శాతం భూమి వారి అమెరికా ఆక్రమణ లోనే ఉందని, 1898నుంచి అమెరికన్ టేరిటరిగాఉందనీ ,ఈ దేశాన్ని ‘’అన్  సిన్కబుల్ ఎయిర్ క్రాఫ్ట్  కారియర్స్ ‘’అంటారని ,అంతేకాక ‘’ది టిప్ ఆఫ్  అమెరికన్ స్పియర్  ఇన్ ఏషియా ‘’అనికూడా పిలుస్తారని రాశాడు .శతాబ్ద కాలంగా తమ కోరల్ రీఫ్ లను అమెరికా విచ్చల విడిగా తవ్వేసిందని  ఫిషింగ్ పాండ్స్ ను విషపూరితం చేసిందని ,సముద్ర జీవులను క్షయం చేసిందని ,భూమిని ,త్రాగు నీటిని కలుషితం,అరణ్య ధ్వంసం ,అరుదైన జీవజాతుల విధ్వంసం చేసిందని,తమజాతిప్రజలను పారి పోయేట్లు ఖాళీ చేసేట్లు ఒత్తిడి తెచ్చిందని  వాపోయాడు .ఒకప్పుడు అద్భుత జీవ వైవిధ్యం ఉన్న దేశం నేడు సర్వం కోల్పోయిందని వేదన చెందాడు .తాము రాత్రిళ్ళు  చెప్పుకొనే కథలలో ఇరుగు పొరుగు వారికి కేన్సర్ వచ్చి చావటం లేక సోకటం గురించే ఎక్కువన్నాడు .తమశరీరాలలో టాక్సిన్లు లోతుగా ప్రేలని బాంబుల్లా  స్థాపించపించ బడ్డాయని వ్యధ చెందాడు oxins are buried in our bodies like unexploded ordnances.
  • 164-న్యు కలడోనియా దేశ సాహిత్యం
  • సౌత్ ఫసిఫిక్ లో ఫ్రెంచ్ టేరిటరి లో డజన్లకొద్దీ దీవులున్న దేశమే న్యు కలడోనియా.పాం లైన్డ్ బీచెస్ ,మహా సముద్ర జీవ సంపద ,24వేల చదరపు కిలోమీటర్లు వ్యాపించి ప్రపంచంలోనే అతి పెద్దదైన తీరప్రాంత దేశం .విస్తృత బారియర్ రీఫ్  ,స్కూజా  డైవింగ్ ఆకర్షణ .రాజధాని –నౌమియా .కరెన్సీ –CFP ఫ్రాంక్ .జనాభా -2.84లక్షలు .ఫ్రెంచ్ అధికారభాష .కనాక్ భాషాజనం ఉన్నారు .క్రిస్టియన్ దేశం .96.8అక్షరాస్యత శాతం .ఫ్రెంచ్ విధాన విద్య .నికెల్ మెగ్నీషియం ,ఐరన్ కోబాల్ట్,క్రోమియం మాంగనీస్ గనులు ,టూరిజం ఆదాయవనరులు .టిజిబావు కల్చరల్ సెంటర్ ,ఎమేడీ లైట్ హౌస్ ,ఇల్లాట్ మైట్రే దర్శనీయాలు .టూరిస్ట్ భద్రత ఉంటుంది .
  • న్యు కలడోనియా సాహిత్యం -ఇటీవలి కాలం లోనే వచ్చింది .స్త్రీ రచాయితలు-స్టెఫెనీ వైజేర్ రేలీన్ రామ్సే –‘’ది లిటరేచర్ ఆఫ్  ది ఫ్రెంచ్ ఫసిఫిక్ రాసింది .ఇది గొప్ప విశ్లేషణాత్మక రచన.అంతకు ముందు ‘’నైట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ –ఎకల్చరల్ హిస్టరీ ఆఫ్ కనాకీ –న్యు కలడోనియా రచించింది .
  • ముఖ్య పుస్తకాలు –మిస్ బెంసాన్స్ బీటిల్ –రాఖేల్ జాయ్స్ ,ది రెక్-డుయీ గోరేడే,జీన్ మేరీ టిజిబౌ-ఆత్మకథ ,దిషార్క్ గాడ్ –చార్లెస్ మాంట్ గోమరి.వగైరా .
  • సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం  

ప్రపంచ దేశాల సారస్వతం

160-అమెరికన్ సమోవా దేశ సాహిత్యం

ఏడు ఫసిఫిక్ ఐలాండ్ లతో ,వల్కానిక్ పీక్స్ వలన ఏర్పడిన నాచురల్ హార్బర్ తో  అమెరికన్ సమోవా  దేశం  ఓషియానా ఖండం లో ఉన్నది .రాజధాని –పాగోపాగో .కరెన్సీ-అమెరికన్ డాలర్ .జనాభా -55,465అధికార భాషలు –ఇంగ్లీష్ ,సమోవన్ .క్రిస్టియన్ దేశం .97శాతం అక్షరాస్యత .ప్రీ స్కూల్ ను౦చి అన్ని  దశలూ ఉంటాయి .టూనా ఫిషింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆదాయ వనరు .నేషనల్ పార్క్ ,మనువా ,అనువు చూడతగ్గవి .సురక్షితం .

అమెరికన్ సనోవా సాహిత్యం -అంతా పైన రాసిన సామోవా సాహిత్యమే – సమోవన్ సాహిత్యం 1960నుంచే ఉన్నది .ఆల్బర్ట్ వెండి’’సన్స్ ఫర్ రిటర్న్ హోమ్’1973లో  మొట్టమొదటి ’నవల రాశాడు.తర్వాత ‘’లీవ్స్ ఆఫ్ ది బన్యన్ ట్రీ-1979లో ,2004 లో ది సాంగ్ మేకర్స్ చైర్రాసి సౌత్ ఫసిఫిక్ బెస్ట్ రైటర్ అనిపించుకొన్నాడు.సౌత్ ఫసిఫిక్ ఆన్దాలజి  ‘’లాలీ ‘’ ఎడిట్ చేశాడు .సౌత్ ఫసిఫిక్ యూని వర్సిటి లో ‘’ఆర్ట్స్ సొసైటీ ‘’1973లో ఏర్పడి   రచయితలకు మంచి ప్రోత్సాహం కల్పించి,పుస్తకాలు ప్రచురించింది .తలతువా తపువా తమసేసే ఎలి –ప్రధాని అనేక సాహిత్య సంస్కృతుల శాఖలకు అధిపతి స్వయంగా రచయిత.ఏమ్మా క్రుసే వాయ్-ప్రో వైస్ చాన్సలర్ రచయిత.డా.సీనా వాయ్ క్రిటిక్ , రైటర్ రిసేర్చేర్,ఇంగ్లీష్ ప్రొఫెసర్ .షియా ఫిగీల్ -నావలిస్ట్ ,పోయేట్ .’’వేర్ వుయ్ వన్స్ బిలాంగ్డ్’’నవలకు కామన్ వెల్త్ ప్రైజ్ వచ్చింది .గర్ల్ ఇన్ ది మూన్ సర్కిల్ ,పోర్ట్రైట్ ఆఫ్ యాన్ యాంగ్ ఆర్టిస్ట్ ఇన్ కాంటెంప్లేషన్ నవలలు రాసింది  .కొత్తతరాలను ప్రభావితం చేసే కవిత్వం రాసింది .తుసియాటా అవియా,సేలినా తుసితాలా మార్ష్ ,కొత్తతరం కవులు .లాని వెండి యంగ్-నావలిస్ట్ .

161-కుక్ ఐలాండ్స్ సాహిత్యం

దక్షిణ ఫసిఫిక్ లో న్యూజిలాండ్ తో రాజకీయ సంబంధమున్న15 ఐలాండ్ ల దేశమే కుక్ ఐలాండ్స్.కోరల్ రీఫ్స్ ,చిన్న శాండీ ఐలెట్స్ ఉంటాయి .రాజధాని అవరూవా డిస్ట్రిక్ట్ .కరెన్సీ-న్యూజిలాండ్ డాలర్ ,కుక్ ఐలాండ్ డాలర్.జనాభా -15,200.క్రిస్టియన్ దేశం.అధికారభాష ఇంగ్లీష్ మయోరి భాషాజనం కూడా ఉన్నారు .91శాతం అక్షరాస్యత.న్యూజిలాండ్ విద్యావిధానమే .టూరిజం, ట్రాపికల్ ఫ్రూట్స్ ,క్లోదింగ్ హాండిక్రాఫ్ట్స్ ఆదాయవనరులు .

కుక్ ఐలాండ్స్ సాహిత్యం -1960తర్వాతే సాహిత్యం వచ్చింది .కౌరాకా కౌరాకా గొప్పకవి .బాలసాహిత్యం టుయుపోకో ఐనా ఉటంగా మోర్గాన్ రాశాడు .సం సెట్ కాక టైల్ టూర్ ,ది వాకా క్రూయిజ్ ,  హాఫ్ డే మురిలాగోన్ ముఖ్యపుస్తకాలు వచ్చాయి .ఇంతకూ మించి వివరాలు లేవు .

162-ఫ్రెంచ్ పోలినేషియాదేశ  సాహిత్యం

దక్షిణ ఫసిఫిక్ లో 100ఐలాండ్స్ సముదాయమే ఫ్రెంచ్ పోలినేషియా దేశం .వైట్ అండ్ బ్లాక్ సాండ్ బీచెస్ ,మౌటేన్స్,వాటర్ బంగ్లా హోటల్స్ .జలపాతాలు ఉంటాయి .రాజధాని –పెపెటీ.జనాభా 2.78లక్షలు .కరెన్సీ –ఫ్రెంచ్ ఫసిఫిక్ ఫ్రాంక్ .క్రిస్టియన్ దేశం .అధికార భాష ఫ్రెంచ్ .తాహీ షియన్  భాషకూడా వాడకం లో ఉంటుంది .98శాతం అక్షరాస్యత .6-16కంపల్సరి విద్య .టూరిజం పెరల్స్ ,ఫాస్ఫేట్స్,వ్యవసాయ ఉత్పత్తులు ఆదాయవనరులు .కొబ్బరి కూరగాయలు పౌల్ట్రీ,బీఫ్ కూడా ఆదాయమిస్తాయి .బోరా బోరా ,సాహిటి,పపేటీ దర్శనీయాలు .తుఫాన్ల భయమేకాని నేరభయం తక్కువ .

  • ఫ్రెంచ్ పోలి నేషియా సాహిత్యం –సాహిత్యం ఇటీవలే వచ్చింది .రచయితలూ –ఫ్లోరా డేవి యాంటినీ-తాహిలిటన్ భాషాకవి  ,ఫ్రెంచ్ లో ఫ్రీ వెర్స్ రాశాడు .వైటారేహుమెయూర్స్, Te Pahu a Hono’ura. Papeete (1998) రాశాడు
  • స్త్రీ రచయితలు-మైకోచేజ్-Vai la rivière au ciel sans nuages short stories (1990) Toriri poetry (2000) Contes Tahitiens children’s stories (2009) Avant la saison des pluies novel (2010) రాసింది .టియురాహెన్రి-కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తాహిటి రాసింది .
  • చంటాల్ స్పిజ్ –ఐలాండ్ ఆఫ్ షాట్టేర్డ్ డ్రీం తోపాటు మరో మూడుపుస్తకాలు రాసింది
  • సేలె స్టేన్ హిటియురావైటే-ఇగ్లిష్ లో-బ్రెడ్ ఫ్రూట్ ,ఫ్రాన్గిపాని ,టయారే నవలలు రాసింది
  • అంబ్రోయిస్ఎసేక్స్ మేరి-ఫ్రెంచ్ లో రాసింది Marins en campagne, Paris: Debresse, 1941 Services à la mer, Paris: Debresse, 1941 Kerfantan la Breton, Paris: Debresse, 1943 La terre des Gendru, Paris: Colbert, 1944 On ne choisit pas sa vie, Paris: La Renaissance du Livre, 1946 Zidzou matelot malgache, Paris: Ariane, 1946 L’Ange et la Femme, Paris: La Renaissance du Livre, 1946
  •    సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

158-పాపువా న్యు గినియా దేశ సాహిత్యం

ఓషియానాకంటినేంట్ లో వల్కనోలు బీచెస్ ,కోరల్ రీఫ్స్ ,బయోలాజికల్ డైవర్సిటి ,దట్టమైన వర్షారణ్యాలు ఉన్న దేశం .సంప్రదాయ భాషలెన్నో ఉన్న గ్రామాల మయం .రాజధాని-పోర్ట్ మోరేస్బై.జనాభా 86లక్షలు .కరెన్సీ –పాపువా న్యూగినియా కీనా ,850భాషలు మాట్లాడే జనం .అధికారభాష –టోక్ పిసిన్ ,ఇంగ్లీష్ ,హిరిమోటు.క్రిస్టియన్ దేశం .57శాతం అక్షరాస్యత .ప్రైమరీ సేకండరి టేరిటరి విద్యావిధానం .వ్యవసాయం మే ఆర్దికవనరులు కాఫీ ,ఆయిల్ కోకా ,కోప్రా, టీ,రబ్బర్ ,షుగర్ పంటలు .మౌంట్ విదేల్మ్,తవుర్వూర్ చూడతగ్గవి .నేరాలేక్కువ .సురక్షితం కాదు .

పాపువా న్యూగినియా సాహిత్యం –ఇటీవలే ప్రారంభమైంది .బేయర్ అనే ఆయన పాపువా పాకెట్ పోఎట్స్ ప్రచురించాడు .1968లో ఆల్బర్ట్ మ బ్యోరికికి స్వీయ చరిత్ర –టెన్ దౌజండ్ యియర్స్ ఇన్ ఎ లైఫ్ టైం రాశాడు .ఇగ్నేషియస్కిలిగే ,నోరావాగి బ్రషువా ,లౌలయా క్రౌజా ముఖ్యరచయితలు .విన్షేంట్ ఎరి’’దిక్రోకడైల్ ‘’మొదటి నవల . ఎర్స్ట్ వైల్ సావేజ్ ,యాన్ ఆఫరింగ్ ఫిట్ ఫర్ ఎ కింగ్ నవలలు వచ్చాయి .కసై పవ్లోవా –రిలక్టేంట్ ఫ్లేం ,యులి బెలేర్ –పాపువ నాటకాలు –అలైవ్.సం ధింగ్ ఇన్ ది బ్లడ్ కధలు ,మై చైల్డ్ హుడ్ ఇన్ న్యూగినియా -1972వచ్చాయి .18ఏళ్ళమైకేల్ సోమరే ‘’కోన్ టికి ఎక్స్ పెడిషన్ రాసి సౌత్ ఫసిఫిక్ కమిషన్స్ లిటరరీ బ్యూరో అవార్డ్ పొందాడు .లిజన్ అండ్ లెర్న్ బ్రాడ్ కాస్ట్ సిరీస్ రాశాడు .1975లో శానా నవల రాశాడు .రస్సల్ సవోబా –రఫ్ సీస్ 1999లో ,2010లో క్రుకేడ్ ఐస్ రాశాడు .క్రోకడైల్ టియర్స్ కు సింబు అవార్డ్ వచ్చింది.

159-సమౌవా దేశ సాహిత్యం

పశ్చిమ సమోవా గ పిలువబడే ఈ దేశం ఓషియానా కాంటినెంట్ లో రెండు ఐలాండ్స్ సవాల్, ఉపోలు కలిగిన దేశం .రాజధాని ఆపియా.జనాభా -1.96లక్షలు .కరెన్సీ –సమోవన్ తాలా .ప్రోటే స్టెంన్ట్ లు ఎక్కువ .సమోవా, ఇంగ్లీష్ అధికార భాషలు  .అక్షరాస్యత -99.1శాతం .మిషన్ స్కూల్ విద్య ,వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వనరలు .కోకోనట్ ఆయిల్ కోప్రా పంటలు .ఎపియా ,ఉపోలు,సామోవన్ ఐలాండ్స్,సవాలి చడదగినవి .సురక్షితం .

సమోవా సాహిత్యం- సమోవన్ సాహిత్యం 1960నుంచే ఉన్నది .ఆల్బర్ట్ వెండి’’సన్స్ ఫర్ రిటర్న్ హోమ్’1973లో  మొట్టమొదటి ’నవల రాశాడు.తర్వాత ‘’లీవ్స్ ఆఫ్ ది బన్యన్ ట్రీ-1979లో ,2004 లో ది సాంగ్ మేకర్స్ చైర్రాసి సౌత్ ఫసిఫిక్ బెస్ట్ రైటర్ అనిపించుకొన్నాడు.సౌత్ ఫసిఫిక్ ఆన్దాలజి  ‘’లాలీ ‘’ ఎడిట్ చేశాడు .సౌత్ ఫసిఫిక్ యూని వర్సిటి లో ‘’ఆర్ట్స్ సొసైటీ ‘’1973లో ఏర్పడి   రచయితలకు మంచి ప్రోత్సాహం కల్పించి,పుస్తకాలు ప్రచురించింది .తలతువా తపువా తమసేసే ఎలి –ప్రధాని అనేక సాహిత్య సంస్కృతుల శాఖలకు అధిపతి స్వయంగా రచయిత.ఏమ్మా క్రుసే వాయ్-ప్రో వైస్ చాన్సలర్ రచయిత.డా.సీనా వాయ్ క్రిటిక్ , రైటర్ రిసేర్చేర్,ఇంగ్లీష్ ప్రొఫెసర్ .షియా ఫిగీల్ -నావలిస్ట్ ,పోయేట్ .’’వేర్ వుయ్ వన్స్ బిలాంగ్డ్’’నవలకు కామన్ వెల్త్ ప్రైజ్ వచ్చింది .గర్ల్ ఇన్ ది మూన్ సర్కిల్ ,పోర్ట్రైట్ ఆఫ్ యాన్ యాంగ్ ఆర్టిస్ట్ ఇన్ కాంటెంప్లేషన్ నవలలు రాసింది  .కొత్తతరాలను ప్రభావితం చేసే కవిత్వం రాసింది .తుసియాటా అవియా,సేలినా తుసితాలా మార్ష్ ,కొత్తతరం కవులు .లాని వెండి యంగ్-నావలిస్ట్ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-20-ఉయ్యూరు     ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 156-న్యూజిలాండ్దేశ సాహిత్యం

పసిఫిక్ సముద్రం లో ఆగ్నేయాన న్యూ జిలాండ్ ఐలాండ్ దేశం ఉంది .సుమారు 600 చిన్న చిన్న దీవులున్న దేశం .రాజధాని వెల్లింగ్టన్.జనాభా 49లక్షలు .కరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్, మావొరీ ,న్యు జిలాండ్ సైన్ భాషలు మాట్లాడుతారు .అధికారభాష –న్యు జిలాండ్ సైన్ భాష .అక్షరాస్యత -99శాతం .5నుంచి 19వ ఏడు వయసు వరకు ఉచిత విద్య .సెకండరి విద్య -9నుంచి 13ఏడు వరకు .మాన్యు ఫాక్చరింగ్ ఎలేక్ట్రిసిటి,వేస్ట్ సర్వీసెస్ ఆదాయవనరులు .మాంసం,పాలఉ త్పత్తులు పళ్ళు కూరగాయలు  ,క్రూడాయిల్ ,కలప కూడా ఆదాయ వనరులే .ఆక్లాండ్ స్కై టవర్ ,క్వీన్స్ టౌన్ ,రోటోరువా వగైరా చూడచ్చు .సురక్షితం .

న్యూజి లాండ్ సాహిత్యం -20వ శతాబ్దం నుంచే వ్రాత సాహిత్యం వచ్చింది .బిల్ పియర్సన్ ‘’ఫ్రేట్ ఫుల్ స్లీపర్స్ ,’’ఎ స్కెచ్ ఆఫ్ న్యూజిలాండ్ బిహేవియర్ అండ్ ఇట్స్ ఇంప్లి కేషన్స్ ఫర్ ది ఆర్టిస్ట్ ‘’వంటి వ్యాసాలూ బాగా ప్రభావితం చేశాయి .న్యూజిలాండ్ సంస్కృతిలో కవిత్వం ఒక భాగం .యూరోపియన్ల సెటిల్ మెంట్ కు ముందు ‘’మావోన్ సంగ్ పోయెమ్స్’’లేక వాలటా ముఖ్యమైనవి 1950నుంచే అసలైన దేశీయ సాహిత్యం వచ్చింది .ముఖ్యకవులలో –జేనెట్ ఫ్రేం ,పాట్రీషియా గ్రేస్ ,ఆల్బర్ట్ వెండేట్ ,మారిస్ గీ ,సాం హంట్ ,బిల్ మాన్ హైర్.వీరు కవిత్వం తోపాటు నవలలూ రాశారు .బాలసాహిత్యాన్ని మార్గరెట్ మహి రాసింది ప్రభుత్వం ఆస్థానకవిని రెండేళ్లకోసారి ఏర్పాటుచేస్తుంది

  ఇవాన్ వేడ్డీ నవల డిక్ సేడాన్స్ గ్రేట్ డైవ్ బాగా పాప్యులర్ .కేరి హుల్మే రాసిన నవల ‘’ది బోన్ పీపుల్ ‘’కు బుకర్ ప్రైజ్ అవ్చ్చింది .ఎలినార్ కాటన్ 2013బుకర్ ప్రైజ్ ను తననవల ‘’ది లూమినరీస్ ‘’కు పొందింది .వీటి హిహిమేస్రా’’వేల్ రైడర్ ‘’నవలతో ప్రఖ్యాతిపొందింది .సినిమా తీశారు .డాన్ డావిన్ కేధరీన్ మాన్స్ ఫీల్డ్ గొప్ప రచయితలూ .సామ్యుల్ బట్లర్ ఇక్కడ అయిదేల్లున్న బ్రిటిష్ రచయిత.

నాటకరచనలో రెడ్ మోల్ గ్రూప్ మంచి విజయాలు సాధించింది .క్రిస్ట్ చర్చ లో ఫ్రీ దియేటర్ 1984లో ఏర్పడి ఇప్పటిదాకా నిర్విరామంగా సాగుతోంది .న్యూజిలాండ్ ప్రభుత్వం సాహిత్య అవార్డ్ లు అందజేసి బాగా ప్రోత్సహిస్తోంది

157-మార్షల్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

వకానిక్ ఐలాండ్ లతో ఒక చైన్ గా మధ్య ఫసిఫిక్ సముద్రం లో మార్షల్ ఐలాండ్స్ ఉన్నాయి .రాజధాని –మజురో. కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -58,413.క్రిస్టియన్ దేశం .అక్షరాస్యత 98.27శాతం .6-14ఏళ్ళవయసువరకు కంపల్సరి విద్య .ఎబాన్ అనే కజిన్ మొల్ భాష  మార్శలేస్ భాష ఎక్కువమంది మాట్లాడుతారు ఆస్ట్రో నేషనల్ ,మాలయో పోలి నేషియన్,మైక్రోనీషియన్ భాషా జనం .సబ్సిడీలపై జీవించే దేశం .అబెయే ,అర్నో అటోలి,రాయ్ నముర్ చూడచ్చు .సురక్షితం .

మార్షల్ ఐలాండ్స్ సాహిత్యం –ముఖ్య రచయితలు.కేతీ జేట్నికిజినెర్-పర్యావరణం క్లైమేట్ చేంజెస్ పై కవిత్వం రాసింది .లేప్ జెల్టోక్- పోయెమ్స్ ఫ్రం ఎ మార్షలీస్ డాటర్   మొదటి సంపుటి2017లో ప్రచురించింది . 2018లో ‘’రైజ్ ‘’ఫ్రం వన్ ఐలాండ్ టు అనదర్ ‘’రాసింది .ఎన్విరాన్ మెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది ఉనితెద్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ లో ప్రసంగించింది.జాక్ నీడెన్ ధాల్-ఫర్ ది గుడ్ ఆఫ్ మాన్కైండ్ –ఎహిస్టరీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ బికినీ అండ్ దెయిర్ ఐలాండ్స్ ‘’రాశాడు దిసౌండ్స్ ఆఫ్ క్రికేట్స్ యట్ నైట్  మొద్సలైన సినిమాలు తీశాడు .

మార్షల్ ఐలాండ్స్ ముఖ్య పుస్తకాలు –సర్వైవింగ్ పారడైజ్ –పీటర్ రుడియాక్,మార్షల్ ఐలాడ్స్ లెజెండ్స్ అండ్ స్టోరీస్ –డేనియల్ కెలిన్ ,మై స్టోరీ అజ్ ఏ సర్వైవర్ –కాట్నర్ టీమా,మేలాల్ నవల-రాబర్ట్ బరాక్లె ,దిబాంబ్ –దియోడర్ ,లేడీ విత్ స్పియర్ –యూజీన్ క్లార్క్ ,నిన్ డిగ్రీస్ నార్త్ –మైకేల్ బయూత్ మొదలైనవి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-20-ఉయ్యూరు

            

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేపు ఉదయం 10 గం నుంచే పేస్ బుక్ లో ”అనంత కాలం లో నేనూ”ధారావాహిక ప్రారంభం

సాహితీ బంధువులకు శుభ కామనలు .మొదటి శ్రావణ మంగళవారం 21-7-20ఉదయం 10గం .నుంచి ”అంతకాలం లో నేనూ ”ధారావాహిక ప్రారంభం –దుర్గా ప్రసాద్ -20-7-20

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

155- దక్షిణాఫ్రికా దేశ సాహిత్యం

  • ఆఫ్రికా ఖండంలో దక్షిణాగ్రాన దక్షిణ అమెరికా దేశం ఉన్నది . ఇన్ లాండ్  సఫారికి అనుకూలం .కేప్ టౌన్ ,ప్రిటోరియా ,బ్లోయెం ఫోర్టీన్ అనే మూడు రాజధానులు .కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ రాండ్ .జనాభా 5.8కోట్లు .ఎనభై శాతం క్రిస్టియన్లు .94.37శాతం అక్షరాస్యత .ఎలిమెంటరి, సెకండరి ,టేరిటరిస్థాయి విద్య .ప్రపంచంలో ప్లాటినం అత్యధికంగా ఉన్న దేశం గోల్డ్ ,క్రోమియం ,ఆటోమొబైల్, ఐరన్, టెక్స్ టైల్స్,కెమికల్స్ ,ఎరువులు ,షిప్ రిపైర్ ఆదాయ వనరులు .చెరుకు, ప్రత్తి ముఖ్యపంటలు . కేప్ టౌన్ ,క్రూగర్ నేషనల్ పార్క్ ,జోహాన్స్ బర్గ్ అపార్ధీడ్ పార్క్ ,డర్బాన్ చూడతగినవి .సురక్షిత దేశం .
  • దక్షిణాఫ్రికా సాహిత్యం –ఆఫ్రికాన్స్ ,ఇంగ్లీష్ జూలు ,క్సోసా ,సోతో ,పెడి,త్స్వానా,వెండా,సిస్వతి,సోంగా ,నెడీబెలి అనే 11భాషలలో సాహిత్యం ఉంటుంది
  • లీ పోల్డిట్,లాంగెన్ హోవెన్ లు జాతీయగీతం –డైస్టెమ్ రాశారు .అంతకు ముందు ఆంగ్లో –బోఎర్ యుద్ధ రచనలు వచ్చాయి .ఎంపి వాన్విక్ ‘’డేర్టిజర్స్’’ఉద్యమం తెచ్చాడు.దీనితో జాతీయ సాహిత్యం వచ్చింది .డిజే ఒప్పార్ మాన్ ‘’గూట్ వేర్స్ బోఎక్ ‘’అనే అన్దాలజి రాశాడు .టిటిక్లోటే  Literêre Terme en Teorieë (1992రాశాడు .జోన్ హామ్బిద్జ్ ,హెన్నీ హకామ్ప్ ,ఎర్నెస్ట్ వాన్హీర్డెన్ కవులు ప్రసిద్ధులు..గ్లేర్ట్ వాక్ నెల్,బ్రిటన్బ్రేటేన్ బాచ్ లు బెస్ట్ పోఎట్స్ .ఫారం నావెల్స్ బాగావచ్చాయి .మార్లీన్ వాన్ నీ కెర్క్ రాసిన ‘’ట్రి యోమ్ఫ్’’నవల జోహాన్స్ బర్గ్ లోని పేదల జీవితం గురించి .ఏక్ స్టామేల్ ఏక్ స్టేర్వే’’రాజకీయ నవల సరిహద్దుల ఓపెనింగ్ గురించి రాయబడింది .
  •   ఇంగ్లీష్ లో ఆలివ్ షెరినర్ ‘’దిస్టోరీ ఆఫ్ యాన్ ఆఫ్రికన్ ఫారం ‘’నవల విక్టోరియన్ సాహిత్యాన్ని గుర్తుకు తెస్తుంది .క్రై,బిలవ్డ్ కంట్రీఅలాన్ పాటన్ రాశాడు .నదీనే గోర్డ్ మెర్ కధారచన మొదలుపెట్టి ,జూలిస్ పీపుల్ నవల 1991లో వైట్ మైనారిటి ప్రభుత్వ పతనం పై రాసి మొదటి నోబెల్ పురస్కారం అందుకొన్నది  .అధాల్ ఫుగార్డ్ ‘’ట్సోట్సి’’నవలను సినిమా తీశారు .డ్రామాలూ రాశాడు .మంగెన్ వాలీ సెరోటే’’నో బేబీ మస్ట్ వీప్’’నవల జాత్యహ్మ్కారానికి గురైన వారి గురించిరాశాడు .లేవిస్ నికోసి-మేటింగ్ బర్డ్స్ ,అండర్ గ్రౌండ్ పీపుల్ ,మండేలాస్ ఈగో రాశాడు మరో ముఖ్యరచయిత జేక్స్ మడాపోయెట్రి నాటకాలు రాసి  నవల’’ది హార్ట్ ఆఫ్ రెడ్ నెస్’’రాసి కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ 2001లో పొందాడు .ఇది స్కూల్ కర్రిక్యులం లో చేరింది .జాన్ మాక్స్ వెల్ కోఎడ్జి’’మయూరీ ఎట్ మెట్రో పాలిటన్’’నవలరాసి బుకర్ ప్రైజ్ పొందాడు .లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మైకేల్ రాసి ,డిస్గ్రేస్ నవలకు రెండవసారి బుకర్ ప్రైజ్ తోపాటు కామన్ వెల్త్ ప్రైజ్ కూడా అందుకొన్నాడు  .పీటర్ అబ్రహామ్స్ ‘’మైన్ బాయ్ ‘’అలెక్స్ లా గుమా ‘’వాక్ ఇన్ దినైట్ ‘’,బ్రేటేన్ బ్రేటేన్ బాచ్’’ది ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఆల్బినో టెర్రరిస్ట్ ‘’,నాడినే రాసిన ‘’ బర్జేర్స్ డాటర్ ‘’యాండ్రీ బ్రిన్క్స్ రాసిన ‘’డ్రై వైట్ సీజన్ ‘’రిచార్డ్ రివే రాసిన ‘’బకింగ్హాం పాలస్ డిస్ట్రిక్ట్ సిక్స్ ,ఆండ్రే ప్రిన్స్ –రూమర్స్ఆఫ్ రైన్ ,సిఫోరాసిన ‘’రైడ్ ఆన్ ది విర్ల్ విండ్ ,’’మొన్గానే సోరేటే-టుఎవిరి బర్త్ ఇట్స్ బ్లడ్,,లంబ్కిన్-దిహంగింగ్ ట్రీ చెప్పుకోదగిన మంచి రచనలు .
  •  ఆల్ హోల్ ఫుగార్డ్ ‘’’మాస్టర్ హోరాల్ద్ అండ్ ది బాయ్స్ ‘’నాటకం జాతుల సంబంధాలపై రాసింది .బోస్మన్ ,లీనా నాటకాలు ఆదేశ బీదల కస్టాలు కన్నీళ్లు .ఇవి దియేటర్లలో నాటకాలుగా ప్రదర్శితాలు .జేక్స్ మిడా’’వుయ్ షల్ సింగ్ ఫర్ ది ఫాదర్ లాండ్ ‘’గొప్పనాటకం .ఇటీవలినాతకాలు క్రూరహింస పై వచ్చినవి అందులో లారా ఫుట్ న్యూటన్ నాటకం ‘’త్సెపాంగ్’’,ఫూగార్డ్ రాసిన ‘’విక్టరి ‘’,పాల్ గ్రూత్ బూమ్స్ రచన్-రిలేటివిటిఉన్నాయి .
  •   కవిత్వ విషయానికి వస్తే టోనీ యులియెట్’’ది లోన్లీ ఆర్ట్ –యాన్ ఆంధ్రాలజి ,లో ఆ దేశ ఇంగ్లీష్ కవిత్వం కనిపిస్తుంది
  •  20వ శతాబ్ది మొదటిభాగం పురుషరచయితల డామినేషన్ .సాల్ పట్జే-ముహుడి ఒక ఎపిక్ .అందులో వందేళ్ళక్రితం ఆ దేశ నేటివ్ లైఫ్ కనిపిస్తుంది .ధామస్ మోఫోలో రాసిన ‘’చాకా ‘’అంటే ట్రెయిన్స్ కూడా  ఎపిక్ లాంటిదే . మహిళా రచయితలకు ప్రోత్సాహం తక్కువే ఇప్పుడే కాస్త ము౦దు కొచ్చిరాస్తున్నారు .
  •   జులు భాషా రచయితలలో విలకాజి ,దోల్మో ,నేదేబెలె ,యియెం మేడ్,నిటూలీ ఉన్నారు. క్సోసా భాష లో –మకహి మొదటినవలరాశాడు .జోర్డాన్ ,జ్లోబే ,క్వంగూలె ,బొంగేలా ,గాడ్ఫ్రీ ,రుబుసానా ,గుయుబాన్ సేన్స్కో ,.సి౦దియే మగోనా-మదర్ టుమదర్ ‘’మొదటినవల 1998లో రాసింది .సేస్సోతో భాషలో –మఫాలా ,ఖకెట్లా,ధామస్ మోఫోలో ఉన్నారు  .పెడి భాషలో –మాట్సేపే,బోపేప్ ,మారెడి,మాచకా ,నుచ బెలేంగ్ ముఖ్యులు.ట్స్వానా భాషలో –సోల్ పలటిజి,మొలోటో,మొన్యైస్,మొరోకే ,మొడిసే,నిత్స్మి ,రేడిట్లాండి ప్రసిద్ధులు
  •   దేశం లో ఓపెన్ బుక్ ఫెస్టివల్స్ ఘనంగా నిర్వహించి సాహిత్య పోషణ చేస్తున్నారు .
  • నెల్సన్ మండేలా గాంధీ ఆదర్శాలతో తెల్లజాతి ప్రభుత్వం పై దీర్ఘకాలం పోరాడి జైలు అనుభవించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన యోధుడు .1994-95కాలం లో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ .లాంగ్ వాక్ టు ఫ్రీడం,మండేలా మొదలైన  గ్రంధకర్త .నోబెల్ శాంతి పురస్కారం ,భారతరత్న మొదలైన అత్యున్నత పురస్కార గ్రహీత.
  • డెస్మండ్ టూటో-జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు ,మానవహక్కుల కోసం శ్రమించిన గొప్ప రచయిత.నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ .దిబుక్ ఆఫ్ జాయ్,దిబుక్ ఆఫ్ ఫర్గివెన్ ,నోఫ్యూచార్ వితౌట్ ఫర్గివ్ నెస్,మేడ్ ఫర్ గాడ్ నెస్అండ్ వై’’వంటి గొప్పరచనలు చేశాడు .
  • మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలోనే తన మొదటి రాజకీయ పోరాటం మొదలుపెట్టాడు .మొదటి సారిగా జాత్యంకారం ఎదుర్కొన్నాడు .దీనికి విరుగుడుగా నటాల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశాడు .బోయర్ యుద్ధం లో 1100మంది ఇండియన్స్ తో అంబులెన్స్ కార్ప్స్ ఏర్పాటు చేసి సేవ చేశాడు .డర్బాన్ లో ఫోనిక్స్ ఫారం ఏర్పాటు చేసి అహింసా సత్యాగ్రహానికి శిక్షణ మొదలైనవి చేశాడు .అనేకరచనలు కరపత్రాలు ,ప్రస౦గాలద్వారా హక్కుల పోరాటానికి జనాన్ని సిద్ధం చేశాడు .
  • నొడిమే గోర్డిమేర్ 1991లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .
  • ఇక్కడితో ఆఫ్రికా దేశాల సాహిత్యం పూర్తయింది .మరో ఖండం లోని దేశాలలో మళ్ళీ కలుద్దాం .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 153-జాంబియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం

  • 153-జాంబియా దేశ సాహిత్యం
  • దక్షిణ ఆఫ్రికా లో వైవిధ్య జంతువులతో సఫారీకి అనుకూలమైన దేశం జాంబియా .విక్టోరియా జలపాతానికి ప్రసిద్ధి .ఈ ప్రాంతాన్ని ‘’మోసి యోవా టున్యా’’అంటే ‘’స్మోక్ దట్ దండర్స్’’అంటే ఉరిమే పొగ అంటారు .రాజధాని లుసాకా .కరెన్సీ –జామ్బియన్ క్వాచా .జనాభా 1.74.కోట్లు .మెజారిటీ క్రిస్టియన్లు..అధికార, వ్యవహార భాష కూడా ఇంగ్లీష్ .55.3అక్షరాస్యత శాతం .7-5-4విధాన విద్య.ఏడేళ్ళు ప్రైమరీ ,రెండేళ్ళు జూనియర్ ,మూడేళ్ళు హయ్యర్ సెకండరి ,నాలుగేళ్ళు యూని వర్సిటి .కాపర్ మైనింగ్ బెవేరేజస్ ,కెమికల్స్ ,టెక్స్టైల్స్ ,ఫెర్టిలైజర్ ,హార్టి కల్చర్ ఆదాయ వనరులు .విక్టోరియా ఫాల్స్ ,టైం-టైడ్మేచెంజా కాంప్, కఫ్యూ నేషనల్ పార్క్ దర్శనీయాలు .సురక్షిత ప్రాంతం .
  • జాంబియా సాహిత్యం – యువ రచయితలు  బృందంగా ఏర్పడి ‘’న్యు రైటింగ్ ఫ్రం జాంబియా ‘’సాహిత్య మేగజైన్ ప్రారంభించారు .’’ఎ బిబ్లియాగ్రఫీ ఆఫ్ జాంబియాస్ ఇంగ్లీష్ లిటరేచర్ ‘’రంకా ప్రిమోరక్ రాశాడు .సాహిత్య పోటీలు, వర్క్ షాప్ లూ నిర్వహిస్తున్నారు .ప్రసిద్ధులను ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేయటం ఇతర చోట్ల ,ఇతర దేశాలోనూ జరిగే సాహిత్య సభలలో పాల్గొనటం అక్కడ జాంబియా పుస్తక విక్రయం చేస్తున్నారు.
  •    జాంబియా యూనివర్సిటి విద్యార్ధులు 1968లో ‘’మఫాలా క్రియేటివ్ సొసైటీ ‘’ఏర్పరచి ‘’ది జ్యుఎల్ ఆఫ్ ఆఫ్రికా ‘’ప్రచురించారు .మిగిలిన జర్నల్స్ ‘’నిషిల -దివే ‘’ zమాగజైన్’’ లు ప్రచురించాయి .అదే ఏడాది ఫన్యాంగా ములికిటా ఇంగ్లిష్ లోరాసిన కథా సంపుటి ‘’ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ‘’ ను ప్రభుత్వ నేషనల్ ఎడ్యుకేషన్ కంపెని మొదటిసారిగా ప్రచురించింది .ఆండ్రూ మసియే ఇంగ్లిష్ లో రాసిన ‘’దిడాన్’’అనే పూర్తి మొదటినవల 1971లో అదే కంపెనీ ప్రచురించింది .డొమినిక్ ములైషో రాసిన ‘’ది టంగ్ ఆఫ్ ది డంబ్ ‘’ను హీనేమన్స్ ఆఫ్రికన్ రైటర్స్ సిరీస్ గా ప్రచురించారు
  • ముఖ్యమైన ఎనిమిది మంది రచయితలు –బిన్ఎల్ సిన్గాగ్వే –మొదటి నవల ‘’క్విల్స్ ఆఫ్ డిజైర్ ‘’1993లో రాశాడు .2000లో రెండవనవల ‘’ఎ కోరీ ఆఫ్ హాప్ ‘’రాసి ప్రచురించాడు .ఎఫెమియా చెలా-రచయిత్రి విమర్శకురాలు .కెయిన్ ప్రైజ్ ఫర్ఆఫ్రికన్ రైటింగ్ ను 2012లో ,2014లో ‘’చికెన్ ‘’కధకు కవేటేడ్ అవార్డ్ పొందింది .బ్రిటిల్ పేపర్ ,షాబెస్ట్ అమెరికన్ షార్ట్  షార్ప్ స్టోరీస్ అడల్ట్స్ ఓన్లి మొదలైనవి వెబ్ సైట్ లో రాసింది ‘’షార్ట్ స్టోరీ డే ఆఫ్రికా 2015’’వంటిపుస్తకాలు రాసింది. 2017’’షార్ట్ స్టోరీ కలెక్షన్ తెచ్చింది .ప్రస్తుతం జోహాన్నెస్ బర్గ్ రివ్యు ఆఫ్ బుక్స్ కు ఎడిటర్ .నాంవాలి సేర్పెల్ –ఆధర్ ,అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్  ఇంగ్లిష్ .ముజుంగు –వైట్ పర్సన్ అనే కథా సంపుటి రాసి ‘’ది  బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ గుర్తి౦పు పొంది ‘’కైనే ప్రైజ్ ఫర్ ఆఫ్రికా ‘’పొందింది ‘’.దిసాక్’’ కు కూడా ఈబహుమతి వచ్చింది .2019’’దిఓల్డ్ డ్రిఫ్ట్’’నవల రాసింది .ఎల్లెన్ బందా ఆకు –వాన్డీస్ లిటిల్ వాయిస్ రాసిమాక్మిలన్ ప్రైజ్ పొందింది సోజీస్ బాక్స్ కథా సంపుటికి కామన్ వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2012లోవచ్చింది .పిల్లలపుస్తకాలు7,2నవలలు రాసింది .కాయో చింగోన్యి-కవి ఎడిటర్ .బెస్ట్ బ్రిటిష్ పోయెట్రి,దిసాల్ట్ బుక్ ఆఫ్ యంగర్ పోఎట్స్ అవార్డ్ లు పొందాడు  . కవిత ‘’ది కలర్ ఆఫ్ జేమ్స్ బ్రౌన్స్ స్క్రీం’’కు న్యు జెనరేషన్ ఆఫ్రికన్ పోయేట్ గుర్తి౦పువచ్చింది .కు ముకందా,2017లో రాసి  ‘’డిలాన్ ధామస్ ప్రైజ్ గెల్చుకొన్నాడు .ఆటోబయాగ్రఫిక్ వ్యాసాలూ రాశాడు .కాలీ కంబందు-కలెంబా అంటే టురైట్ షార్ట్  స్టోరీప్రైజ్ 2018లో వచ్చింది .ఇంటిపని వాడి గురించి ‘’ఎ హాండ్ టు హోల్డ్ ‘’రాశాడు .విల్బర్ స్మిత్ –దిగాడ్స్ ఫస్ట్ మేక్ మాడ్ అనే మొదటినవలరాశాడు .వెన్ దిలయన్ ఫీడ్స్ రెండవరచన1964.మొత్తం 41పుస్తకాలురాస్తే 120మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి .డంబిసా మోయో –‘’డెడ్ ఎయిడ్-హౌ దివెస్ట్ వజ్ lost’’ నవల న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ గా 2009లో నిల్చింది .ఆఎడే టీం మాగజైన్ ఆమెను ‘’ది పర్సన్ ఆఫ్ ఇన్ ఫ్ల్యుఎన్స్’’అని మెచ్చింది ·         .కెన్నెత్ కౌండా –దేశ ప్రెసిడెంట్ –జాంబియా షల్ బి ఫ్రీ ,దిరిడిల్ ఆఫ్ వయలెన్స్ పుస్తకాలురాశాడు .

.

  • 154-జింబాబ్వే దేశ సాహిత్యం
  • సదరన్ ఆఫ్రికాలో డ్రమాటిక్ లాండ్ స్కేప్ లు, డైవర్స్ లాండ్ స్కేప్స్ లున్న దేశం జింబాబ్వే.విక్టోరియన్ ఫాల్స్ ఆకర్షణ రాజధాని –హరారే –కరెన్సీ-అమెరికన్ డాలర్, RTGSడాలర్ .జనాభా -1.44కోట్లు .ప్రోటేస్టంట్ క్రిస్టియన్ దేశం .షోనా, జోషా,ఇంగ్లిష్ చెవా ,నేడేబెలె , సదరన్ సోతో, ,.వెండా,ట్స్వానా అధికార భాషలు .88.7శాతం అక్షరాస్యత .రెండేళ్ళ ప్రైమరీ ,4-6సెకండరి ,తర్వాత హయ్యర్ విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .మైజ్ సోయా బీన్స్ ,వీట్,టుబాకోపంటలు .హవాన్గే నేషనల్ పార్క్ మానాపూల్స్ నేషనల్ పార్క్ ,మటాబో నేషనల్ పార్క్ చూడతగినవి .నేరాలున్నా  సురక్షితం .
  • జింబాబ్వే  సాహిత్యం -10మంది ముఖ్య రచయితలు –చార్లెస్ ముంగోషి –వైటింగ్ ఫర్ ది రైన్ నవల ఇంగ్లిష్,షోనా భాషలలో రాశాడు .బిషప్ పాట్రిక్ చకైపా –గ్రాండి చౌయా నవల బాక్ వుడ్స్ పై రాశాడు .కారికోగా గుమి రెమిసెవ్ రచన నిజంగా ఎపిక్ లా ఉంటుంది .ఎం.ఏ .అముత్యుని –ఇమాజినేటివ్ స్టోరీస్ రాశాడు .కుససానా కునోపరియా నవల రాశాడు .స్టాన్ లకేసంకంగా-హిస్టారికల్ నావలిస్ట్ .’’ఆన్ ట్రయల్ ఫర్ మై కంట్రీ’’నవల రాశాడు .యోవేన్నో వేరా –స్టోన్ వర్జిన్స్ అనే నవల రాసి మాక్మిలన్ ప్రైజ్ ,స్వీడిష్ తుచోల్కి ప్రైజ్ పొందాడు .ముసేమూరా జిమున్యా –గొప్పకవి .ఆ దేశ జీవితం పై అద్భుతకవితలు రాశాడు .’’థాట్ ట్రాక్స్ ‘’కవితా సంపుటి లో కాలనీపాలనలో నల్లజాతివారి దయనీయ జీవితం చిత్రించాడు .డంబుడ్జోమరచెరా –హౌస్ ఆఫ్  హంగర్ లో సర్రియల్ మెటాఫిజికల్ కవిత్వం రాశాడు .మసిమ్బా ముసోడ్జా-‘’హెర్బర్ట్ వాంట్స్ టు కం హోమ్’’.నవల రాశాడు .చెంజేరై హోవ్-బోన్స్ నవల, బ్లైండ్ మూన్ కవితాసంపుటి రాశాడు .షిమ్మర్  చినోద్యా-ఫరైస్ గర్ల్స్ నవల లో లిబరేషన్ వార్ విషయాలు ,స్ట్రైఫ్   నవలలో నూతన కుటుంబాల ఏర్పాటు గురించి రాశాడు .
  •    సశేషం
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ 

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ 

1982లో ఉయ్యూరు హై స్కూల్ లోనూ, ఇంటిదగ్గర ట్యూషన్ లో శిష్యుడు శివ ఇవాళ మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కనిపించాడు . ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మగారు మరణించారు .అప్పుడు మా  గొడ్లసావిడిలో  ఆవులు గేదెలు ,పాడి  పొలాల్లో పండిన పీకి ఇంటికి చేర్చిన నూర్చని మినుము తో కంగాళీగా ఉండేది డా కుమారస్వామి గారి హాస్పిటల్లో మా అమ్మమరణించారు .అక్కడినుంచి ఆమె  పార్థివ శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చేలోపు మినుము కట్ట అంతా  గొడ్లదొడ్లోకి చేర్చట ,ఇంటికి ఆనుకుని ఉన్నపాకలో ఉన్న ఆవు దూడలను గొడ్లదొడ్డ్లోకి మార్చటం ఇల్లంతా నీట్ గా  చేసి రెడీ చేశారు శివ ,అతడి మిత్రుడు వాసు మొదలైనవాళ్లు .మా కేమీ ఇబ్బందికలుగకుండా    నిర్వహించారు  ఆశిష్యులు .ఏమిచ్చి ఆరుణం తీర్చుకోగలం ?తలలో నాలుకలాగా వ్యవహరించారు .అప్పుడు పాలేరుకూడాలేడు . ఆ దినవారాల్లో ట్యూషన్ లేదని చెప్పినా ,రెండుపూటలా వచ్చి పని ఏమైనా ఉందా అని అడిగేవారు   . 12వ రోజు రాత్రి వారందర్నీ ఇంటికి పిలిచిభోజనాలు పెట్టాం  అంతకు తప్ప మేమేమీ చేయలేకపోయాము . ఆఅనుబంధం  ఇప్పుడు తలచుకొంటే ఆశ్చర్యమేస్తోంది .  . ఆ అనుబంధం  ఇప్పుడు తలచుకొంటే ఆశ్చర్యమేస్తోంది .
  దినవారాలై కాస్త వెసులు బాటు దొరికాక మినుము నూర్చటం మా ఆవిడ చేస్తుంటే సహాయం చేసి పూర్తి చేశారు . ఆశివ ఎర్రగా పొట్టిగా ఉండేవాడు కానీ చాలా చలాకీ .వాళ్ళనాన్నకు ఉయ్యూరు సెంటలో బార్బర్ షాప్ ఉండేది . మంచి మాటకారి, లౌక్యుడు .
   ఆశివ ఇవాళ 38ఏళ్లతర్వాత మా గుడిలో కనిపించాడు .ఇవన్నీ చెప్పుకున్నాం .బెజవాడ పాలిటెక్నీక్ లో చదివి పాసై తర్వాత ఇంకా ఏదేదో చదివి ఎవరూ చదవని కోర్సులు చేసి హైదరాబాద్ కూకట్ పల్లి ఢిల్లీ పబ్లిక్  స్కూల్ డైరెక్టర్ గా ఉన్నాడట .పిల్లలిద్దరినీ ఉన్నత విద్య చదివించి ఉద్యోగాలు చేస్తున్న కోడళ్లను  తెచ్చుకొన్నాడట .కొడుకులు కోడళ్ళూ అమెరికాలో ఉంటున్నారట .ఎంత  ఎదిగిపోయాడో శివ .శిష్యులు ఇలా ఎదిగితే గురువుకు ఎంత ఆనందం గర్వం ? కూకట్ పల్లిలో తానూ ఉండేచోట 30లక్షలు ఖర్చుచేసి శ్రీ ఆంజనేయ స్వామి  దేవాలయం  కట్టాడట .సంపాదించటమే కాక, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తున్నందుకు అభినందించా .”మాస్టారూ !మనగుడి కూడా ఏదైనా చేస్తాను ”అన్నాడు” సంతోషం” అన్నాను
ఇవాళగుడిలో జరిగిన శాక0బరీ పూజ ఫోటోలు వాట్సాల్ప్ లో పంపించాను  .వినయవిధేయతలు గురుభక్తి ఉన్న ఇలాంటిశిష్యులు దొరకటం నా అదృష్టం .
  మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -18-7-20 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 151-టాంజానియా దేశ సాహిత్యం

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  కవిత

నా వీక్షణానికి  రోజా నవ్వలేకపోతోంది

నా మాటల సంగీతానికి పుష్పాలు

వికసి౦చ లేకపోతున్నాయ్ .

తాజాదనమున్న హారపు నవ్వులేని

ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ?

చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో

ఒక్క క్షణమైనా  చందమామను చూడకపోతే?

దక్షిణానిలం వసంతాలు తెచ్చినా

తోటలోని కోయిల కలకూజితం చేయటం లేదు

అడవి పూలు జాబిలిని చూసి నాట్యమాడటం లేదు

ఏదో కోల్పోయాను, ఏదో తప్పిపోయింది

నా హృదయం శూన్యమై ముసలిదైంది

ఓహో ఆ క్రూర స్పర్శ తో నా గుండె

అన౦ద సంతోషాలు లేక  చల్లబడి పోయిందా?

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు –కబీర్ చౌదరి ఆంగ్లానువాదం .

14-ఒంటరిగా –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

నా కళ్ళు క్షమాపణకు వెళ్ళలేదు

అలాగే నా మనసుకూడా .

వద్దని కాని, ఏడవటం కాని చేయలేదు .

శతాబ్దాలుగా నేను రోడ్డు ప్రక్క నిలబడి

నీ కోసం ఎదురు చూస్తున్నాను .

కన్నీటి జలాశయం నుంచి

నీరు ధారాపాతంగా  కారుతున్నా

కళ్ళు తుడుచుకొనే శ్రద్ధకూడా లేదు.

అందరి మధ్య ఒంటరి వాడి నైపోయాను

అందుకే నిన్నుచూడాలన్న తహతహ

మృత్యువుకూడా నిన్ను ఆపి

గణన లోకి తీసుకోలేదు .

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’నోయోన్ జే మోర్’’కు ‘’మొహమ్మద్ నూరుల్ హుదా ఆంగ్లాను వాదం .

సశేషం

దక్షిణాయన పుణ్యకాల శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 147-సోమాలియా దేశ సాహిత్యం

  • ప్రపంచ సారస్వతం
  • 147-సోమాలియా దేశ సాహిత్యం

హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎక్కువ తీర ప్రాంతమున్న సోమాలియా దేశం ఉంది.రాజధాని -మొగడిషు .కరెన్సీ-అమెరికా డాలర్, సొమాలి షిల్లింగ్ .జనాభా -1.5కోట్లు .అధికారభాష సొమాలి .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 37.8శాతం .సరైన విద్యావిధానం లేదు .పశు సంపద, చేపలు ,చార్ కోల్ ,బనానా షుగర్, సోర్ఘం ,కార్న్ ఆదాయవనరులు .లాస్ గీల్ ,కేధలిక్ చర్చ్ దర్శనీయాలు .యాత్ర వద్దు అనే అందరి ఉద్ఘాటన .టెర్రరిజం  అస్థిరత కిడ్నాపింగ్ ,హత్యలు నిత్యకృత్యాలు .

సోమాలియా సాహిత్యం –శతాబ్దాలనుంచి షేకులు రాసిన కవిత్వం వచనరచనలున్నాయి .కవిత్వానికి పెద్ద పీట.మార్గరెట్ లారెన్స్ జాతీయకవి .ఐదాగల్లా జాతి వారు గొప్పకవిత్వం రాశారు .వందమందిలో90మందికవులే .ముహమ్మద్ అబ్దుల్లా హసన్ మాస్టర్ పోయేట్. ప్రకృతిపై అద్భుత కవిత్వం రాశాడు

 God’s Blessing are more numerous than those growing trees.

I will remind you of the victory he gave us

Listen to me my council, for you are most dear to me

ఎల్మి బూధారి –కరామి పాషన్స్ కవిత  –

Her fine-shaped bones begin her excellence;

Magnificent of bearing, tall is she; A proud grace is her body’s greatest splendor; Yet she is gentle, womanly, soft of skin. Her gums’ dark gloss is like unto blackest ink; And a careless flickering of her slanted eyes Begets a light clear as the white spring moon. My heart leaps when I see her walking by, Infinite suppleness in her body’s sway. I often fear that some malicious djinn

May envy her beauty, and wish to do her harm

అలీ బువుల్-కవి ,మిలిటరీ లీడర్ .’’గూల్వాడే’’అనేమాటను కాయినేజ్ చేశాడు ఇప్పటికీ అంతా దాన్ని వాడుతారు .తన గుర్రం పైకవిత –

 O my horse Guulside!

If his goodness

And his nature I try to describe,

He is a pool that refills itself

And I cannot plumb his secret.

I fall short.

సోమాలికి ఎంతోఘనమైన జానపద సాహిత్య సంపద ఉన్నది .దేగ్ధీర్ దికానిబాల్ వుమన్ ‘’వంటికథలు తరతరాలుగా పిల్లలకు చెబుతూనే ఉన్నారు .అలాగే  హింస వ్యతిరేకించే సైనికుడి కథ,కొల్డిడ్ దివైజ్ వారియర్కథలు కూడా ,’’ఎలయన్స్ టేల్’’ప్రసిద్ధ పిల్లలపుస్తకం .దీన్ని స్కూలు నాటకాలలో ప్రదర్శిస్తారు .

   ఆధునిక సాహిత్యం –ముస్లిం సాహిత్యం కవిత్వం నుంచి హాడిత్ దాకా విస్తరించింది .లింగ్విస్ట్ ఐన షైర్ జామా అహ్మద్ స్టాండర్డ్ ఆర్దోగ్రాఫర్ .నూరుద్దీన్ ఫరా –ఫ్రం ఎ క్రూకేడ్ రిబ్ ,లింక్స్ రచనలు చాలా విలువైనవి .వీటికి అంతర్జాతీయ బహుమతి పొందాడు Mohamed Ibrahim Warsame  – గ్రేటెస్ట్  లివింగ్ పోయేట్ .ఫరా మహమ్మద్ జామా ఔల్ –‘’డెర్విష్ ఎరా’’నవల’’ఇగ్నొరెంస్ ఈజ్ ది ఎనిమి ఆఫ్ లవ్ ‘’తో సుప్రసిద్ధుడు .గ్రేటెస్ట్ లివింగ్ పోయేట్ కూడా .క్రిస్టినా ఆలి ఫరా –కవిత్వం అనేకమాగజైన్లలో ప్రచురితం .పోయెట్రి ఆఫ్ మైగ్రేషన్ఇన్ ఇటలీ కూడా రాసింది .మదర్ ట౦గ్ అనే కవిత టోరినో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో పురాస్కారం  పొందింది  .

148-టునీషియా దేశ సాహిత్యం

ఉత్తర ఆఫ్రికా మఘ్రేబ్ ప్రాంతం లో  నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఉన్న దేశం టునీషియా .రాజధాని టునిస్.కరెన్సీ –టునీషియన్ దీనార్ ,దీనార్ లు .అధికార భాష అరబిక్ .కొద్దిమంది బెర్బెర్ ఫ్రెంచ్ మాట్లాడుతారు .సగానికిపైగా సున్నీ మతస్తులు .అనాభా 1.16కోట్లు .అక్షరాస్యత 79శాతం .విద్య సైకిల్స్ స్థాయిల్లో ఉంటుంది .మొదటి ఆరేళ్ళు ప్రైమరీ సైకిల్ తర్వాత ఆరేళ్ళు హయ్యర్ సైకిల్ .ఆయిల్ ,వ్యవసాయం ,ఫాస్ఫేట్ ,కార్ భాగాల ఉత్పత్తి ,టూరిజం ఆదాయవనరులు బార్డో నేషనల్ మ్యూజియం ,దౌగ్గా,పోర్ట్ ఎల్ కన్తోరి చూడదగ్గవి .సురక్షిత దేశం .

టునీషియా సాహిత్యం –అరబిక్ ఫ్రెంచ్ భాషలలో విస్తృతంగా సాహిత్యం ఉన్నది సాహిత్యం కోసం ఏటా 3మిలియన్ దీనార్లు కేటాయింపు ఉంటుంది .వంద దాక ప్రచురణ సంస్థలున్నాయి .

   ఆధునిక సాహిత్యం లో ఆలి దౌవాగి  150రేడియో నాటికలు,500పైగా కవితలు పాటలు  రాశాడు .బెచ్రి ఖరీఫ్ అరబిక్ నవలకు కొత్త అందాలు కూర్చాడు కధకుడుకూడా .మొన్సేఫ్ గ్రాచెం ,హస్సన్ బెన్ఓత్మన్,హబీబ్ సెల్మి,మహామౌద్ మసాది,వాలిడ్ సోలిమన్ ప్రసిద్ధులు  మసాది జాతీయభావ వ్యాప్తి చేశాడు

20వ శతాబ్దిలోనే ఫ్రెంచ్ సాహిత్యం ఇక్కడ  వచ్చింది .మొదట్లో అరబిక్ రచయితలే ఇందులోనూ రాశారు .ఆల్బర్ట్ మెమ్మి ఊహప్రకారం టునీషియన్ సాహిత్యం  యవ్వనం లోనే చావలేదు .అబ్దుల్ వహాబ్  మేడ్దేబ్,తాహర్ బెక్రి,ముస్తఫా టిల్లి ,ఈ భాషలోనే రాశారు. ఆఎమేన్ హాసేన్ ,ఫవాజి మెల్లా ఇతరదేశాలకు ఎగిరిపోయినా ‘’మెమరి అండ్ రిప్రజెంటేషన్’’పై బాగా స్పందించి రాస్తున్నారు .

  సశేషం

క్షిణాయన పుణ్యకాల  శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 149-సూడాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

149-సూడాన్ దేశ సాహిత్యం

ఆగ్నేయా ఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ దేశం ఉంది .ఖర్టుం రాజధాని –కరెన్సీ –సూడనీస్ పౌండ్ .జనాభా -4.18కోట్లు .సున్ని ఇస్లాం మతం .ఇంగ్లిష్, ఆరబిక్ భాషా జనం .జూబా అరబిక్  సాధారణ  భాష .అక్షరాస్యత -95.2శాతం .6-13ఏళ్ళ పిల్లలకు నిర్బంధ విద్య .ప్రైమరీ 8ఏళ్ళు ,సెకండరి మూడేళ్ళు .19యూని వర్సిటీలు అరెబిక్ లోనే బోధన .బంగారు గనులు ,వ్యవసాయం ఆదాయవనరులు .ఇగురు ఉత్పత్తి ఎగుమతులలో టాప్ .పప్పు ధాన్యాలు గోధుమ ,సోర్ఘం ,మిల్లెట్ కార్న్,వరి,నూనె విత్తనాలు, ప్రత్తి ,బీన్స్, చిక్ పీస్ వగైరా పంటలు .జేబెల్ మర్కాల్ ,నేషనల్ మ్యూజియం ,నూబియన్ పిరమిడ్స్ దర్శనీయాలు. .సురక్షిత యాత్రా దేశం .

సూడాన్ సాహిత్యం –సూడానియన్ సాహిత్యం మౌఖికకవితలు గీతాలు  కథలే తరతరాలుగా ప్రచారం లో ఉండేవి .స్వాతంత్ర్యానికి పూర్వం జాతీయత ,రాజకీయ విషయ కవిత్వమే ఉండేది .’’మై బిలవడ్ అజ్జా’’ దేశభక్తి గేయాన్ని ఖలీల్ ఫారా -1892-1932రాశాడు .నిరంకుశ పాలనలో మహాజూబ్ షరీఫ్ కవి ,మహమ్మద్ వార్ది గాయకుడు జైలుపాలయ్యారు .

   ఆధునిక సాహిత్యానికి దిపయనీర్ లాంటి పత్రికలూ అండగా నిలిచాయి .1960తర్వాత నవలలు బాగా రాశారు .ఆల్ఫతా ఆల్ అర్ది అంటే ‘’దివాస్ట్ హాలోనెస్’’సంచలన నవల మల్కాట్ ఎడ్  దార్ మహమ్మద్  రాశాడు .అల్ తయ్యాబి సాలిహా నవలలు, కథలు రాశాడు .’’సీజన్ ఆఫ్ మైగ్రేషన్ టు ది నార్త్ ‘’అనే ప్రఖ్యాత నవలకూడా రాశాడు .ఇందులో ఇంగ్లాండ్ నుంచి సూడాన్ కు తిరిగి వచ్చిన విద్యార్ధుల గురించి అరబిక్ లో రాశాడు .అమీర్ తాజ్ అల్ సర్ డజన్ పుస్తకాలు రాశాడు .మొదటి నవల ‘’కర్మకూల్ ‘’తోపాటు ‘’దిహంటర్ ఆఫ్ దిక్రిసల్లీస్ ‘’రాయగా రెండవది బుకర్ ప్రైజ్ కు సెలెక్ట్ అయింది .అబ్దలజీజ్ బరాకా సాకిన్- చాలానవలలు కథలురాశాడు .2009లో  స్త్రీల జైళ్ళగురించి రాసిన ‘’అల్-జన్గో సయ్యిద్ సాలిహా ప్రైజ్ వచ్చింది .2013లో సివిల్ వార్ గురించి రాసిన ‘’దిమెస్సయ్యా ఆఫ్ డార్ ఫర్ ‘’నవల ఫ్రెంచ్ లో 2016లో పబ్లిషయింది .ఆస్ట్రియా దేశం లో ఉంటూ ఫ్రాన్స్ ,జర్మని మొదలైన దేశాల సాహిత్య సభల్లో పాల్గొన్నాడు

   స్టెల్లా గైటానో – ‘’డిస్క్రిమినేషన్ ‘’,మిలిటరీ డిక్టేటర్ షిప్ నవలలురాసింది . విస్తృత పచారం పొందాయి. రానియా మమౌన్ నవలలు కథానికలు చాలారాసింది ..ధర్టీన్ మంత్స్ ఆఫ్ సన్ రైజ్ ‘’మొదలైనవి చాలామేగజైన్స్ లో వచ్చాయి .లీలా అబౌ లేలా- మిలిటరీ కూప్ పై ట్రయాలాజి’’రాశాడు ఇతని 2019నవల ‘’ఎలైన్ ఇన్ ది రివర్ ‘’ముఖ్యమైనది The last 30 years have been difficult for Sudanese artists of all kinds – among them musicians and painters, but particularly writers. The 1989 coup triggered an exodus. People left to settle in Cairo and the Gulf, North America and Europe, even Japan and Australia. Inside the country, a new generation of writers has since grown up in the shadow of repression. Despite these difficulties writers have continued to work and publish, both within the country and abroad. In a climate where newspapers are regularly censored, journalists detained and print runs seized, books have remained cherished items to be passed around with reverence. అని రాశాడు ఇది ముఖ్యమైన 10పుస్తకాలలో ఒకటిగా గుర్తింపు పొందింది .

  రచనలకు స్కాలర్షిప్ లిచ్చి ఇప్పుడు బాగా ప్రోత్సహిస్తున్నారు The Book of Khartoum,[39] Literary Sudans: An Anthology of Literature from Sudan and South Sudan[

 వంటి గొప్ప పుస్తాలు అందువల్లనే వచ్చాయి .విద్యార్ధులూ ఉత్సాహంగా సృజన రచన చేస్తున్నారు

150-స్వాజి లాండ్ దేశ సాహిత్యం

స్వాజిలాండ్ నే ఎస్వాతిని దేశం అంటారు .దక్షిణ ఆఫ్రికాలో ఉన్నది .మబబానే ,లోమాంబా రాజధానులు .కరెన్సీ –స్వాజిని లిలంగేని.జనాభా -11.4లక్షలు .జియోనిస్ట్,రోమన్ కేధలిక్స్ వగైరాలు ఉంటారు .అధికార వ్యావహారిక భాష కూడా స్వాజి.88.42అక్షరాస్యత శాతం .ఏడేళ్ళ ఎలిమెంటరి ,అయిదేళ్ళ సెకండరి విద్య .పేద దేశం .షుగర్, వుడ్ పల్ప్ ,కాటన్  యార్న్ ,రిఫ్రిజిరేటర్స్ ,సిట్రస్,కాన్నేడ్ ఫుడ్ ఆదాయవనరులు .మిల్వెన్ వైల్డ్ లైఫ్ శాన్క్త్యురి,హిలేన్ నేషనల్ పార్క్ ఖడ్గ మృగాలున్న  మిఖయా గేమ్ రిజర్వ్ చూడతగినవి .చాలా సురక్షిత దేశం .

  •  స్వాజిలాండ్ సాహిత్యం –ఇటీవలే ఏర్పడిన సాహిత్యం .మహిళా రచయితలు-పాట్రీషియా మెక్ ఫాడెన్-ఫెమినిస్ట్ , ఎడ్యుకేటర్,జాతి వివక్షతపై పోరాడిన మహిళ,ఎడిటర్ .సెక్సువాలిటిపై ఎక్కువ రాసింది . Becoming Postcolonial: African Women Changing the Meaning of Citizenship” – 2005.[5]
  • “Challenging HIV and AIDS: Resistance and Advocacy in the Lives of Black Women in Southern Africa”[1]
  • “War Through a Feminist Lens”[1]
  • “Between a Rock and a Hard Place: Positioning Feminism in the ‘Africa Debate,’ and ‘Patriarchy'”
  • “Sexuality and Globalization”[1]
  • రచించిన పుస్తకాలు -Gender in Southern Africa: A Gendered Perspective” (Sapes Books)- 1998[2]
  • “Reflections on Gender Issues in Africa” (Sapes Books) – 1999[2]
  • “Reconceptualizing the Family in a Changing Southern African Environment” with Sara C. Mvududu (Africa Institute of South Africa), 2001.[2][

Awards

సారా మిఖంజో – Hammett-Hellman Award from Human Rights Watch అవార్డ్ గ్రహీత .

  • What the Future Holds (1989), Pains of a Maid (1989) Two Stories (2007) Woman in a Tree (2008 Weeding the Flowerbeds (2008) ముఖ్య రచనలు .
  • గ్లాడిస్ లొమాఫు పాటో-షార్ట్ స్టోరీ రైటర్ –ఉమ్ ట్సాన్గో’’రాసింది
  • ఇతర రచయితలు –మాడిసన్ సలయేద్వా మగాగుల-స్వాజిల న్ నేషనల్ కౌన్సిల్ అవార్డీ.
  • 1987: Ingcamu (A Journey’s Provision) 1988: Idubukele (Dinner is Served!) 1989: Asingeni Lapho (It is None of Our Business) 1990: Tentile (Hoist with your Own Petard) 1990: Kwesukesukela (Once Upon a Time) 1997: Bungani Bebangani   రాశాడు .
  •   సశేషం
  • దక్షిణాయన శుభా కాంక్షలతో
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

పెద్ద భవంతిలో చెదలు తిన్న కొయ్య దూలాల

 గూడు వెనకాల ఒక చిన్నారి పిచుక తల్లికోసం ఏడుస్తోంది

దగ్గరలో ఉన్న పొలం లో తూనీగలు పట్టే తల్లి పిచుక విన్నది

ఎవడో తుంటరి వెధవ నా చిట్టి తల్లిని

పట్టుకు పోవాలని ప్రయత్నిస్తున్నాడనుకొంది

గుండెని౦డా ప్రేమతో కంగారుగా

నిరాశగా వేగంగా గూటికి తిరిగొచ్చి౦ది

అనుభవం లేని ఆచిన్నారి తల్లిరావటం  చూసి

‘’నేనెందుకు అమ్మ ఒడికి ఎగర లేను “?అనుకొని

ఎగిరే ప్రయత్నం అప్పుడే చేసింది

పాపం అది ఇంకాఎగరటం నేర్చుకోలేదు

ఎగిరే ప్రయత్నం లో కింద నేలపై పడిపోయింది

గుడ్ల నీరు కుక్కుకుంటూ తల్లి  చూసింది

పిల్లను తన రెక్కలమధ్య కాపాడాలని ప్రయత్నించి

 వేరే ఆలోచన లేకుండా అమాంతం కిందికి దూకింది

ఇంతలో కొందరు పిల్లలు పరిగెత్తుకొచ్చి

 చిన్నారి పిచుకను పట్టుకొన్నారు

వాళ్ళు  ఆపిల్లపై తల్లికెంత మమకారమో పట్టించుకోలేదు

దాన్ని ముందుగా గొడుగులో, తర్వాత జేబులో దాస్తూ

అందరూ పగలబడి నవ్వుతుంటే ఒకే ఒక్కడు మాత్రం

గుండె  ద్రవించి  కన్నీరు కార్చాడు .

వాడి తల్లి చనిపోయి చాలాకాలమైంది

తల్లిప్రేమ ఎలాటిదో  మర్చిపోయినవాడు

కాని గుండెల్లో ఏదోబాధ కల్గి కన్నీరు కార్చాడు .

నిచ్చెన సాయంతో ఆ చిన్నారి పిచ్చుకను గూటిలోకి చేర్చాడు

ఆ చిన్నారి పిచ్చుక కూడా

కన్నీటితో వాడిని ఆశీర్వదించింది .

తల్లి పిచ్చుక ఆకుర్రాడిని గొప్ప ఆశ్చర్యంగా చూసింది

 అదీ నీటితో నిండిన కళ్ళతో వాడికి కృతజ్ఞతలు చెప్పింది

మౌనంగా తల్లి పక్షి  అందజేసిన  ఆ కన్నీటి బిందు దీవెన కు

ఈ ప్రపంచమంతా కూడా సమానం కానే కాదు .

తుల తూగనే తూగదు.

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం  బెంగాలీ కవిత’’చోరుయ్ పఖిర్ చ్ఛానా ‘’కు సాజెద్ కమాల్ ఆంగ్లానువాదం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం

  • ప్రపంచ సారస్వతం
  • 145-సేచెల్లెస్ దేశ సాహిత్యం
  • తూర్పుఆఫ్రికాలో ఇండియన్ ఓషన్ లో 115దీవుల దేశం సేచెల్లెస్.ఆర్చిపెలాగో .అనేక బీచెస్, కోరల్ రీఫ్స్ ,జయంట్ అల్టాబ్రా టార్టాయిస్ మొదలైన అరుదైన జీవుల ఆవాస భూమి .ఇతర ఐలాండ్స్ ను చూసే హబ్ .రాజధాని –విక్టోరియా .కరెన్సీ –సేచెల్లెస్ రూపాయి .జనాభా ఒక లక్ష .సురక్షిత దేశం .రోమన్ కేధలిక్కులేక్కువ .క్రియోల్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషలు జాతీయభాషలు .ఎక్కువమంది మాట్లాడేది ఫ్రెంచ్ ఆధారిత కరోలీ భాష .అక్షరాస్యత -96శాతం .1981నుంచి ఫ్రీ కంపల్సరి విద్య 16వ ఏడు వరకు అమలు .ఫిషింగ్, టూరిజం, కొబ్బరి ,వనిల్లా ,పీచు ,బోట్ బిల్డింగ్ వగైరా ఆదాయ వనరులు .లా డిగూ,డీమాయ్ వాలీ ,అంసే లాజియో చూడదగ్గవి .
  • సేచెల్లెస్ దేశ సాహిత్యం –సాహిత్యమంతా న్యు బుక్ లో నిక్షిప్తం క్రియోల్ భాషలో ఎక్కువ సాహిత్యం ఉంటుంది .ఆంటోని ఏబెల్-1934-2004 ఈ దేశ సాహిత్య పిత .ఇక్కడి సంస్కృతిపై విస్తృతంగా రాశాడు .’’మోన్పోయేమే లెటాల్’’అతని గొప్ప రచన .ఇందులో మానవుడు ప్రకృతితో ఎలా సంచరించాలో వివరించాడు .లోరినా బార్బే –లింగ్విస్ట్ .రెండుఅనువాదాలు చేశాడు .బార్బే లోరినా రోసేలిన –కథలు రాసి మొదటి బహుమతి పొందింది .బొన్నే లెం లియాన్ –మిస్టరి సిరీస్ రాసి పాప్యులరయ్యాడు .డీ సిల్వా హజేల్-బ్లాక్ నైట్ ఆఫ్ క్విలోబా కవితాసంపుటి 80కవితలతో తెచ్చింది .హేన్రిటే ఎడ్విన్ –ప్రావెర్బ్స్ ,ఇమాజినారి ఎక్స్ ప్రే షన్స్పై రిసెర్చ్ చేసి ప్రాచుర్యం పొందింది .లారు జుమాయే  జార్గేట్ –ప్రక్రుతి ప్రేమికురాలు కవిత్వం రాసిన అనువాదకురాలు .నిత్యజీవిత విషయాలపైనే ఎక్కువగారాసింది పియర్రీ లూయీ పీటర్ ఆంథోని-క్రియేటివ్ ఆర్ట్ సెంటర్ ఉద్యోగి .ఎరోమాన్స్ అనే మొదటిపుస్తకం అనేకనవలలు కవిత్వం రాశాడు .కొత్త కవితా సంపు టులు తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు .వెల్ జునే-ఎవా అనే యువతి మరణం పై నవలరాసింది .’’మోన్  ఆర్క్  ఎన్ సియెల్ అ మోయ్’’లేటెస్ట్ రచన .రినౌడ్ క్లాడే-నేషనల్ యూత్ సర్విస్ ఉద్యోగి .మేగజైన్ ఎడిటర్ .కవితా సంపుటి, నాలుగు నవలలు రాశాడు .
  • 146-సియార్రా లియోన్ దేశ సాహిత్యం
  • పశ్చిమాఫ్రికాలో అట్లాంటిక్ తీర దేశం సియర్రా లియోన్ .వైట్  సాండ్ బీచెస్ కు ప్రత్యేకం .రాజధాని –ఫ్రీ టౌన్ .కరెన్సీ –సియార్ర లియోనిన్ లియోన్ .జనాభా -76లక్షలు .అధికారభాష ఇంగ్లీష్ .క్రియో భాష వాడకం లో ఉంది .అక్షరాస్యత 43శాతం .ఆరేళ్ళ ఉచిత తప్పని సరి ప్రైమరీ విద్య ,మూడేళ్ళ జూనియర్ సెకండరి ఉంటాయి టీచర్లు సౌకర్యాలు తీవ్ర కొరత .క్రిస్టియన్లు 60శాతం ముస్లిమ్స్ 30శాతం ఉంటారు .వ్యవసాయమే ముఖ్య ఆదాయం  .ఫిషరీస్ ,వరి,కస్సోవా పంటలు .బనానా ఐలాండ్స్ ,బున్సె ఐలాండ్ ,లూమ్లి బీచ్ యాత్రాస్థలాలు .నేరాలు బాగాఎక్కువ .రిస్క్ పడాలి .
  • సియర్రా లియోన్-సాహిత్యం -1991నుంచి 2002వరకు సివిల్ వార్స్ తో సతమతమవటంవలన సృజనసాహిత్యం పెద్దగారాలేదు .యూస్టాస్ పాల్మర్ –ప్రొఫెస్సర్ .’’స్టడీస్ ఇన్ ది ఇంగ్లీష్ నావెల్ ,,యాన్ ఇంట్ర డక్షన్ టు ఆఫ్రికన్ నావెల్ ,దిగ్రోత్ ఆఫ్ ది ఆఫ్రికన్ నావెల్ ,ఆఫ్ వార్ అండ్ వుమెన్ అప్రెషన్ అండ్ ఆప్టిమిజం ‘’న్యు ఎస్సేస్ ఆన్ ఆఫ్రికన్ నావెల్ నాలెడ్జ్ ఈజ్  మోర్దాన్ వర్డ్స్ వంటి విశ్లేషణాత్మక , విమర్శనాత్మక రచనలు చేశాడు .   డిస్టి౦గ్విష్డ్   ప్రొఫెసర్ అవార్డ్  గ్రహీత .ఎ హంగింగ్గింగ్ ఈజ్ అనౌన్స్డ్,కాన్ఫిరాస్ ట్రావెల్స్ ,ఎ టేల్ ఆఫ్ త్రీ విమెన్ ,పిలర్ ఆఫ్ ది కమ్మ్యూనిటి నవలలు రాశాడు .
  •   వీల్ ఫ్రెడ్ –డిప్లోమాట్ .మై బుక్ ఆఫ్ చ్రైమ్స్ ,దిడార్క్ రోడ్ ఫ్రం రోమరోంగ్ ,హిప్హాప్ కుజాడే,పాత్ ఆఫ్ ఎ లెజెండ్ ,దిసాన్డమాన్స్ జర్నల్స్ రాశాడు .
  • కరోమో కబ్బా –మదర్ సాగా ,యాన్ అకౌంట్ ఆఫ్ ది రెబెల్ వార్ లియోన్ మౌన్టేన్స్,ఏ పొలిటికల్ డ్రామా ఫ విష్ ఓవర్ విజ్డం.తోపాటు పావర్టి అమిడ్స్ట్ గోల్డ్ అండ్ డైమండ్స్’’మొదలైన కవితలు రాశాడు .
  • అడిలైడ్ కాసిలీ హేఫోర్డ్ –ఫెమినిస్ట్ ,చాలా కథలు సావేజేస్ ,మిస్టాకోరిఫైర్ కొబినా ,ఎలిటిల్ ఆఫ్రికన్ బాయ్ ,టుఆఫ్రికన్ సింప్లిటన్స్ ,వంటివి రాసింది
  • గ్లేడీకాష్లి హేవార్డ్ –జర్నలిస్ట్ ఎడిటర్ ,నవలా రచయిత్రి కవయిత్రి .క్రియేషన్, నేటివిటి,దిసర్వింగ్ గర్ల్ నవలలురాసింది .
  • సిల్ చేనే కోకర్ –కామన్ వెల్త్ రైటర్స్   ప్రైజ్ విన్నర్ .ఇతని ఘెట్టో వుమన్ కవిత నెగ్రిట్యూడ్ ఉద్యమాన్ని ప్రతి బి౦బి స్తుంది .ఎక్సైల్ ,దిగ్రేవ్ యార్డ్ ఆల్సో హాజ్ టీత్ ఫర్ యాన్ ఎక్సైల్, బ్లడ్ ఇన్ ది డేజేర్ట్ కవితాసంపుటులు వెలువరించాడు .
  •  at the university the professors talk about the poetry
    of Syl Cheney-Coker condemning students
    to read me in the English honours class
    my country I do not want that!
    do not want to be cloistered in books alone[5]
  • ది లాస్ట్ హర్మటాన్అలుసిన్ డంబార్ ‘’నవలరాశాడు
  • విన్స్టన్  ఫోర్డే,ఎల్విస్ గబనబాం హాలోవేల్ ,ఆంబ్రోస్ మస్సాకో ,లుసిల్డాహంటర్,షేక్ ఉమర్ కమ్రా ,డా.సిలాకా కోమా ఇతర ప్రసిద్ధ రచయితలు
  • సివిల్ వార్ కాలం లోనూ మంచి సాహిత్యం వచ్చింది
  • జో ఎడి లై –ఎ న్యు హిస్టరీ ఆఫ్ సియార్రా ,ఒస్మాన్ సంకో –ట్రాపికల్ మెడిసిన్ ఇంటర్నేషనల్ హెల్త్ ,ఐషా ఫోఫానా ఇబ్రహీం-వార్స్  అండ్ ఆదర్ వాయిసెస్ ,దిఇంటిగ్రేషన్ ఆఫ్ జెండర్ పెర్స్పేక్టివ్ రాసింది .బాలసాహిత్యం లో ‘’టిబుజాంగ్ మస్ట్ నాట్ కం ‘’మహమ్మద్ షరీఫ్ ,అమిడూస్ డే ఆఫ్ ను ఫోర్డే సావి ,సిటి గర్ల్ ను జాక్విలిన్  లీ ,అవర్ బర్డ్ ను రైనీ రిచార్డ్ ,హంటింగ్ ట్రిప్ ను అహ్మద్ దిన్ గబ్సి రాశారు .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 143-రువాండా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 143-రువాండా దేశ సాహిత్యం
  • తూర్పు ఆఫ్రికాలో ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్,గ్రేట్ రివర్ వాలీ  ఉన్న దేశం రువాండా .ఆఫ్రికాలో అతి చిన్న దేశం .రాజధాని –కివాలి .జనాభా -1.23కోట్లు .కరెన్సీ –రువా౦డన్ ఫ్రాంక్ .రోమన్ కేధలిక్స్ ఎక్కువ తర్వాత ప్రోటే స్టంట్లు ఉంటారు .జాతీయభాష రువాండా .ఫ్రెంచ్,ఇంగ్లిష్ కూడా వాడుకలో ఉన్నాయి .అక్షరాస్యత -73.2శాతం .ఆరేళ్ళ ప్రైమరీ ,మూడేళ్ళ లోయర్ సెకండరి రాష్ట్రాల స్థాయిలో విద్య .వల్కనోస్ నేషనల్ పార్క్ ,ఫారెస్ట్ నేషనల్ పార్క్ ,మౌంట్ కరి సిమ్బి దర్శనీయాలు .అత్యంత భద్రత ఉన్న దేశం .వ్యవసాయమే ముఖ్య ఆదాయం .అరటి కస్సావా,స్వీట్ పొటాటో,మైజ్ బీన్స్ పండిస్తారు .
  • రువాండా సాహిత్యం –దాదాపు మౌఖికమే .సావేరియో నైగీజికి తన స్వ్వీయ చరిత్ర –రువా౦డన్ అడ్వెంచర్ తోపాటు’’దిఆప్టి మిస్ట్ ‘’నవల   రాశాడు .పూర్వం నుంచి కథలు బాగా వ్యాప్తిలో ఉన్నాయి ఇప్పటికీ కథలు చెప్పేవారంటే అక్కడ గౌరవం ఎక్కువ .కిన్యాన్ వండాభాషలో ఉన్న సాహిత్యం చాలాతక్కువే .అలెక్సిస్ కగామే -1912-81అనేక వాల్యూం ల కవిత్వం ఆదేశ మైథాలాజి సేకరించి ప్రచురించాడు .1994నరమేధం తర్వాత బెంజమిన్ సహేనే -1959-‘’ది ఎత్నిక్ ట్రాప్ ‘’1999లో రాశాడు .ఇందులో జీనోసైడ్ జరగటానికి కారణాలు అన్వేషించాడు .ఫైర్ అండర్ ది కస్సోక్ హిస్టారికల్ నవల  హూటూ కేధలిక్ ప్రీస్ట్ పై 2005లో రాశాడు .అవర్ లేడీ ఆఫ్ ది నైల్ రాసింది ముకసొంగా అనే మహిళ.యోలాండాముకగాసానా కూడా జీనో సైడ్ పై ‘’రైటింగ్ ఆజ్ మోర్నింగ్’’రాసింది .స్కోలాస్టికాముకసొంగా ‘’కాక్రోచేస్ ‘’నవలరాసి రెనడౌట్ ప్రైజ్ పొందింది .ఈమె ‘’ఐ డోంట్ వాంట్ ఎ టుట్సి వర్జిన్ నవల రాసింది .గయేల్ ఫైయే అనే యువరచయితజీనో సైడ్ పై స్పందించి ‘’స్మాల్ కంట్రీ’’రాశాడు .రాఫెల్ నికాకా ‘’టేక్ అప్ యువర్ పెన్స్ చిల్ద్రెన్ ఆఫ్ రువాండా ‘’రాశాడు
  •   రువాండా నరమేధం అంటే -1994లో రువాండా దేశం లోని 8లక్షల టుట్సిజాతి మోడరేట్ ప్రజలను ప్రభుత్వ ప్రోత్సాహంతో హుట్సు తీవ్రవాద సైనికులు,పోలీసులు నిర్దాక్షిణ్యంగా సంహరించటమే  .దీనిపై యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఫర్ రువాండా ఏర్పడి  విచారణ జరిపింది .
  • 144-సెనెగల్ దేశ సాహిత్యం
  • ఉత్తర ఆఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ దేశం ఉంది .రాజధాని –దాకర్ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 1.60కోట్లు .అధికారభాష ఫ్రెంచ్ .36స్థానికభాషలున్నాయి .ముస్లిం దేశం .నాలుగు స్థాయిల విద్యావిధానం .అక్షరాస్యత 52శాతం .చేపలు ఫాస్ఫేట్ ,వేరుసెనగ ,తోరిజం ఆదాయ వనరులు .లేక్ రెట్బా,గోరీ ,నేషనల్ బర్డ్ సాన్ చ్యురి దర్శనీయాలు .సురక్షిత దేశం .
  • సెనెగల్ సాహిత్యం –అన్నిరకాల ప్రక్రియలు వర్ధిల్లాయి .అహ్మద్ యాన్ సిహి ధు అల్ నన్ లు  కవులుగా ప్రసిద్ధులు .కలోనియల్ పాలన తర్వాత జాతీయ సాహిత్యం వచ్చింది .చీక్ హమేదౌకానే ,బౌబాకర్ బోరిస్ డియోప్,ఔస్మోన్ సేమ్బెనే నవలలురాశారు .మహిళలలో మేరియామాబా, ఫటౌ డిమో,నేడేయాఫటౌ కామే,అమినాటా సౌ ఫాల్ ,ఫటావో సౌ ముఖ్యులు
  • కాలనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూడా చాలా మంది  రాశారు .లేయోపోల్డ్ సేడార్ సింఘాల్ ప్రామినెంట్ కవి రచయిత .చాన్త్స్ డీ ఓంబే మొదటి కవితా సంపుటి .నోక్త్యూన్స్ ,ది కలేక్టేడ్ పోయెట్రితో ఫిలాసఫీ లింగ్విస్టిక్స్ పైనా రచనలు చేశాడు .బోకారి డయాలో ,డేవిడ్ బాయ్ లాట్ లు ఆదేశ సాహిత్యానికి ఫౌండి౦గ్ ఫాదర్స్.మిష్టిజం రియలిజం వగైరాలు కూడావచ్చి వాటిలోనూ రాశారు .
  • మహిళలలో –మరియామాబా ఫెమినిస్ట్ ఆధర్ .’’సో లాంగ్ ఎ లెటర్ ,స్కార్లెట్ సాంగ్ ,నవలలురాసింది .అమినాటా సౌ ఫాల్ –ఎపిస్టోలరి గ్రాండ్ డేమ్.పాలన, అవినీతి,ఆదేశ సమాజ స్థితిగతులు ,పురుషలక్షణం గురించి విస్తృతంగా రాసింది .ఫటా సౌ- సోషియాలజిస్ట్ .ఫటాటా డియోంవగైరా లున్నారు
  •   సెనెగల్ సినిమా మంచి ప్రాచుర్యం పొందింది .ఒస్మానే సేమ్బనీ ఇందులో ఘటికుడు.
  •    సశేషం
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

11-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

ఇక్కడికి రండి

పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ

వారంతా ఇక్కడికి రండి

అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం

అన్నికులాల దేశాల వారు

‘ఆమె పాదాల చెంత

ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే

దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు

కట్టుబడకుండా చేరితేనే

ఆ దేవతను  నిర్దిష్టంగా ఆరాధించగలం

అన్నదమ్ములు ప్రక్కప్రక్కన కూర్చుని అర్చిస్తే

స్వర్గ కిరీటం వదిలి దిగివచ్చి

ఆమెనామం పలికినవారిని అక్కున చేర్చుకొంటు౦ది

భూమిపై మన్నూధూళిలో మన చెంతనే కూర్చు౦టు౦ది

ఆమె పవిత్రజలం ఆమె మనల్ని స్పర్శించి ఆశీస్సులు పొందితేనే

దేవి పీఠం పవిత్ర మౌతుంది

కారణం మనం ఆమె సందేశాన్ని నిర్లక్ష్యం చేశా౦ కనుక

సోదరుడు సోదరుని వ్యతిరేకమై

ఇవాళ ఆమె సంపూర్ణ శోభ చూసి

మనమంతా ఒకే తల్లి పిల్లలమని తప్పక  గ్రహించాలి

నిర్భయంగా మనం ఆలపించే ఐక్యగీతం

పవిత్ర మాతను  మనం పిలిచే పిలుపుతో

దివి భువి సకల విశ్వం చేతనమౌతుంది

విస్మయ విస్ఫోటనం చెందుతుంది .

ఆధారం –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు ఉదయన్ చటోపాధ్యాయ ఆంగ్లాను వాదం .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -141-నైగర్ దేశ సాహిత్యం

  • పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నదీ తీరాన నైగర్ దేశం ఉంది.రాజధాని –నయామే .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -2.24కోట్లు .అధికార వాడుకభాషకూడా -ఫ్రెంచ్ .సగం జనాభా సున్ని ముస్లిం లు .క్రిస్టియన్లు ,అనిమిజన్లు కూడా ఉంటారు.అక్షరాస్యత 30.5మాత్రమె .ఉచిత విద్య .ఉరేనియం ఖనిజం పశు సంపద వ్యవసాయం ఆదాయవనరులు.మిల్లెట్ సోర్ఘం, వరి,కస్సావా గోధుమ,ఎక్కువగా, గార్లిక్పెప్పర్స్ బంగాళాదుంప తక్కువగా పండిస్తారు .   .యురేనియం ఖనిజం అత్యధికం గా ఉన్న దేశం .60శాతం జనం బిపిఎల్ లో ఉన్నారు .టెర్రరిజం కిడ్నాపింగ్ నేరాలు సర్వసాధారణం .నయామే ,అడగేజ్ ,నైగర్ నది ఎడారి ,జి౦ డర్ ,నేష్ణల్పార్క్ చూడతగినవి సురక్షితం కాదు .
  • నైగర్ డెల్టా సాహిత్యం –జేపిక్లార్క్ ,బెన్ ఒక్రి,కెన్ సారో వివా ,గాబ్రియల్ ఒకారా ,ఎలిచి అమడి,నుడుకా ఒరియానో టమురేఆజారే మొదలైన రచయితలు  ప్రసిద్ధులు .హార్డ్ గ్రౌండ్ అండ్ ఆయిల్ ఆన్ వాటర్ పుస్తకం హేలాన్ హేబిలా రాశాడు .ఫిషేర్మేన్స్ ఇన్వొకేషన్ ఒకారా రాశాడు .అమిది –ది కామ్కుబైన్ ,క్లార్క్ –సాంగ్ ఆఫ్ ఏ గోట్ ,ఒజైడీ –లేబరింత్ ఆఫ్ దిడెల్టా ,రాశారు .
  • ప్రముఖ పుస్తకాలు –ఇల్లీగల్-ఇయాన్ కొల్ఫార్ ,హర్మట్టాన్-గావిన్ వెస్టెన్,ఇన్ సోర్సేరీస్ షాడో-పాల్ స్టోల్లర్ ,దిఎపిక్ ఆఫ్ హస్కియా మహమ్మద్ –నౌహౌ మాలియో ,స్టిల్ వాటర్స్ ఇన్ నైగర్ –కేతెలిన్ హిల్ ,సర్రౌనియా –అబ్దౌలయా మమాని ,యాంగ్రీ విండ్- జేఫ్ఫేరి టైలర్,సే యు ఆర్ వన్ఆఫ్ దెం-ఆవెం ఆప్కాం,సహారా –మాకెల్ కాలిన్ వగైరా .
  • 142-నైజీరియా దేశ సాహిత్యం
  • గల్ఫ్ ఆఫ్ గినియాలో ఉన్న ఆఫ్రికన్ దేశం నైజీరియా .అబుజా రాజధాని .కరెన్సీ-నైజీరియన్ నైరా .జనాభా-19.6కోట్లు .అధికారభాష ఇంగ్లిష్ .హౌసా ,టోరుబా,ఇగ్బో ,ఫుల్ ఫ్లుడే ,ఇబిబో వగైరాభాషలు మాట్లాడుతారు ,క్రిస్టియానిటి, ఇస్లాం ముఖ్యమతాలు .62శాతం అక్షరాస్యత .6-3-3-4ప్రైమరీ జూనియర్ సెకండరి ,సీనియర్ సెకండరి ,టేరిటరి విద్యావ్యవస్థ అమలులో ఉంది .పుష్కలంగా ఆయిల్ బావులున్నాయి. అదే ఆదాయం .లాగోస్ అబూజా ,యాంకరి గేంరిజర్వ్ ,కానో దర్శనీయాలు .సాయుధ దోపిడీ ,కిడ్నాపింగ్ రాన్సం కార్ జాకింగ్ వగైరా నేరాలు ఘోరాలు అధికం .భద్రత లేదు .
  • నైజీరియా సాహిత్యం –అంతాఇంగ్లిష్ ,ఇగ్బో ,ఉర్హోబో ,యోరుబా ,హౌసా మొదలైనభాషల్లో ఉంటుంది .
  • ఇక్కడి సాహిత్యం 4ముఖ్య పీరియడ్లుగా విభజించారు .మొదటిది -14రాజ్యాలకాలం -10-19శతాబ్డులమధ్యకాలం ..రెండు –సొకోటో పీరియడ్ -19-20శతాబ్దం .మూడు –కలోనియల్ పీరియడ్ -20వ శతాబ్దం .నాలుగు –స్వాతంత్ర్యానంత్ర పీరియడ్ -20వ శాతాబ్దినుంచి ఇప్పటివరకు .
  • ఐబన్ ఫర్టు-ఇద్రిస్ అలూమా క్రానికల్ కర్త .దిబుక్ ఆఫ్ దిబోర్ను వార్స్-1576 ,బుక్ ఆఫ్ దికనేం వార్స్-1578 రాశాడు .మహమ్మద్ అబ్ద్ అల్రజాక్ అల్ ఫలాతి-కిఫీ హత్విడ్ రాసిన 16శతాబ్ది ఫుల్బే స్కాలర్ .ఉత్మాన్ ఐబాన్ ఇద్రిస్ ఆఫ్ బోమో-ఈజిప్ట్ లోని మామ్లుక్ సుల్తాన్ కు రాసిన డిప్లమాటిక్ లేఖ చారిత్రాత్మకమైనది .మహమ్మద్ అల్మఘిలి-ఆబ్లిగేషన్స్ ఆఫ్ ప్రిన్సెస్ ఆఫ్ కానో రాశాడు .మహమ్మద్ ఐబాన్ అల్సబ్బాఘ్ –మహమ్మద్ యారి సుల్తాన్ ను ప్రస్తుతిస్తూ రాసిన 17వ శతాబ్దికవి .మహమ్మద్ ఐబాన్ మాసాని-యోర్బువా ప్రజలగురించిమాత్రమేకాకా చాలా పుస్తకాలు  రాశాడు. అబ్డుల్లాహి సుకా –రివయార్ అన్నాబి మూసా అల్ఇటియా ,ఇలి మూతి రాశాడు .శాలిహ ఐబన్ ఇసాక్ –బోర్నో నగరం గూర్చి రాశాడు .షేక్ జిబ్రీల్ ఐబాన్ ఉమర్ –ఉతిమాన్ దాన్ ఫోడియో రాసిన 18వ శాతాబ్దికవి.
  •   వీరుకాక పేరొందిన రచయితలలో –డేనియల్ ఓ ఫగున్వా ,చినువా అచేబి ,ఓలే సోయింకా ,బూచి ఏమిచేటాఉన్నారు సోయిన్కాకు 1986సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చి,మొదటి ఆఫ్రికన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ గా గుర్తింపు లభించింది ‘
  •   యువతరంలో –క్రిస్ అబాని ,అయోబెమి అడేబాయో ,  చిమండా నోజి ,,ఇగోని బారెట్ ,హెలెన్ ఒఎమి వగైరాలున్నారు .చినువా అచేబిను ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆఫ్రికన్ లిటరేచర్ అంటారు – బుకర్ ప్రైజ్ విన్నర్ .
  • సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం  లేదో నాకు తెల్సు

 దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం

ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే

  నీ ఇల్లు వదిలేశావ్.

హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే

నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే

అది అనంత కన్నీటికి దారి అని తెలీక

నీ ఇల్లు వదిలేశావ్ మిత్రమా .

నీ కళ్ళు కలిశాక ,ఆ క్షణాలజాడ తెలిశాక

అప్పు యెంత భారమో తెలిసింది

ఎందుకు నువ్వు వెనక్కి తిరిగి

చూడటం లేదో నాకు తెలుసు .

నాకు తెలుసు నువ్వెందుకు వెనుదిరిగి చూడటం లేదో

కళ్ళు కళ్ళల్లోకరిగిపోతే

ప్రపంచం నెమ్మదిగా మరణిస్తుంది.

నీ పవిత్ర గర్భగుడిలో ఒంటరిగా ఉంటే

నీ తేజోమయ కనులలో

 శుబ్రపరచే ద్రవం ఉంటే

కన్నీళ్లు రావు

నీ కాలి  అందెలలలో

ఏ వంచనా మోసం మోగదు.

,

నిర్జనప్రాంతంలో నడకలో లతలు నీపాదలపై పాకకపోయినా

నువ్వు నడుస్తూ వెనక్కి ఎందుకు తిరిగి చూడవో నాకు తెల్సు

 వేళ్ళకు దెబ్బతగలకుండా

నీగుండె కూడా పూలహారాలతో

సిగ్గుపడుతుండానే సత్యం తెలీకపోయినా

 పూలు కోశావ్ మనసు వశం లో లేకుండానే  .

దుర్భాషలాడే నోటి వెనక

ఒంటరితనం పొంచిఉంది

నాకు తెల్సు నువ్వు ఎందుకు వెనక్కి తిరిగి చూడటం లేదో .

నీ కపట నేర్పు తెలిసిన చేతన నాది

కానీ నిజానికి నీ బుగ్గలపై దానిమ్మ

 గి౦జల రంగులున్నాయని నీకు ఏమాత్రం తెలీదు .

ఆడవారి పిరికి గుండెల్లో

చెప్పరానిమాటలు తిరస్కారాల వణికే వేదన తో

తేనెటీగ వాలిన లత ఉందని  ఎన్నటికీ తెలీదు .

కనులు కన్నీరు కార్చినంత సేపూ

మర్యాద వ్యాపించదు

నీ నీడనే చూసి తెలియకుండానే  భయపడే

  పిరికి అని నాకు తెలుసు నువ్వు .

మనిషి గురించి నీకు తెలుసు వాడొక శిల

వాడి ముందు నువ్వెప్పుడూ వంగలేదు

దురాశ చేతులను కోరుకున్నావ్

హృదయం మరొక చేతి స్పర్శతో

 గీటు రాయి ఔతుందని  తెలీక

 అందుకే వంగి పాదాలకు దణ్ణం పెట్టావ్

ఓ భీరువూ! నువ్వు ఎందుకు  ఊరికే సంచరిస్తావో  నాకు తెల్సు.

గుండెలోని కోరికలు శరీరం రెండు తీరాలమధ్యా

గుసగుస లాడుతాయి కనుక

 నీ భయ మేమిటో  నాకు తెలుసు .

వికసించే హృదయ పరిమళాన్ని

దాని రేకులు అడ్డగించలేవు

నువ్వు యెంత దాచుకోవాలని ప్రయత్నించినా

చాలాదూరం వ్యాపిస్తుంది .

నీహృదయం లో పోగుపడిన రహస్యపలుకులు

నాకు తెలుసు నీ భయమేమిటో.

ఎందుకు నువ్వు బయటికి చెప్పలేకున్నావో   నాకు తెలుసు

కోయిల రహస్యసందేశం  మోసుకొచ్చింది

నువ్వు వినాలనుకొన్నమాటలు

దానికెలా తెలిశాయి మిత్రమా ?

నెమ్మదిగా కనులు పైకెత్తి

వధువు గొణిగిన మాటలే అవి .

క్రూరమైన ఆమె చేతి వేళ్ళలో అలాంటి మాయాజాలం ఉంది

నువ్వెందుకు బయటికి చెప్పటం లేదో నాకు తెలుసు

 ఎందుకు నువ్వు ఆభరణాలు ధరించటం లేదో

నీ వేదనజ్వాల నీమాంసాన్ని స్వర్ణ౦ గా మార్చిందని నాకు తెలుసు

మట్టిబొమ్మకు వస్త్రాలంకారం చేయటమా ?

ఎందుకు బంగారం  ?

కేవలం బంగారుకోరిక ?

శరీర తీరాలు వదిలేస్తే మనసు స్వచ్చమౌతుంది

ప్రియతమా నా వేదన

నీ సౌందర్యాన్ని అలంకరిస్తుంది

అందుకే ఏ ఆభరణాలు నువ్వు వేసుకోవని నాకు తెలుసు .

వాళ్ళు కట్టుబడి ఉంటారని నేననుకోను

రాత్రి నిద్రించిన కన్య ,వధువుగా మేల్కొన్నది.

ముత్యాల గృహం అని నిజంగానే  తెలియక

నురుగులో ఆమె ఈదింది.

ఆ ముత్యం నీకు దక్కింది .

కానీ కనురెప్పల చిప్పలు

కన్నీరు లో మునిగిపోయాయ్

భారం భరించలేనప్పుడు

గుండె కూడా తీవ్ర నిరాశతో

 మునుగుతుంది

ఓఅదృష్ట హీన మహిళా !

ఎప్పుడు దాన్ని స్పష్టం చేస్తావమ్మా !

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’భీరు ‘’కు సయ్యద్ ముజిబుల్ హక్ ఆంగ్లానువాదం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 139-మొజాంబిక్ దేశ సాహిత్యం

దక్షణ ఆఫ్రికాలో పొడవైన హిందూమహాసముద్ర తీరం బీచ్ లు  ఉన్న దేశం మొజాంబిక్ .క్విరంబాగాస్ ఆర్చి పేలగ.రాజధాని –మపుటో.కరెన్సీ –మొజాంబిక్ మెటికల్ .జనాభా -3కోట్లు .సగం మంది క్రైస్తవులు మిగిలినవారిలో సున్ని ముస్లిం లు వగైరా ఉంటారు .’అధికార ,వాడుక భాష –పోర్చుగీస్ .47శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .అప్పర్ ప్రైమరీ సెకండరి స్థాయి విద్య .వ్యవసాయం రొయ్యలు కాటన్,జీడిపప్పు, షుగర్, సిట్రస్ చోప్రా ,కోకోనట్స్ ఆదాయవనరులు ,బజురూటోఆర్చ్ పెలాగో ,క్విరిమ్బాస్ ఐలాండ్స్ ,ఐలాండ్ ఆఫ్ మొజాంబిక్ చూడతగినవి .అతిబీద దేశం .వీధి రౌడీలు ఎక్కువ .జాగ్రత్తగా ఉండాలి .

మొజాంబిక్ సాహిత్యం –ఆధునిక రచయితలు-పాలీనా సిజానే –నవలలు కథలు రాశాడు .మియాకౌటో-షార్ట్ స్టోరి రైటర్ ,జోస్ క్రావేరింహా –కవి ,లుయి బెర్నార్దో హన్వానా –కథారచయిత ,ఉర్గులాని బాకా ఖోసా –నవలాకారుడు ,లినామగాల – నావలిస్ట్ ,లూయీ బెర్నార్డోమలగా౦టన-కవి స్వీయచరిత్రకర్త ,ఓర్లాండో మార్కస్ డీ అల్మీడియామెండిస్-నావలిస్ట్ .మబాటే పెడ్రో-కవితా సంపుటాలు రాసి బిసియి ప్రైజ్ పొందాడు .హేల్డేర్ఫైఫ్-కవి ,సండ్రా టేమేలి-అనువాదకుడు, రోజేరో మంజాటే-నటుడు డైరెక్టర్ ,మియా కోటో-జర్నలిస్ట్ ,ప్రఖ్యాత కవి .

140-నమీబియా దేశ సాహిత్యం

ఆగ్నేయ ఆఫ్రికాలో నమీబ్ ఎడారి ఉన్న దేశం నమీబియా .చిరుతపులులు ఎక్కువ .రాజధాని –విండ్ హోక్.కరెన్సీ –సౌత్ ఆఫ్రికన్ రాండ్ ,నమీబియన్ డాలర్ .జనాభా -24.5లక్షలు .క్రిస్టియన్ దేశం .అధికార వాడుకభాష –ఇంగ్లీష్ .91.53శాతం అక్షరాస్యత .ఫ్రీ ప్రైమరీ విద్య .ఆతర్వాత గ్రేడులవారీ విద్య .వ్యవసాయం యంత్రాలు ,ఎగుమతులు డైమండ్స్,చేపలు ఆదాయ వనరులు .పెరల్ మిల్లెట్ ,సోర్ఘం ,మైజ్ ,వీట్, బీన్స్, ఆల్ఫాల్ఫా పంటలు .ఎతోషా నేషనల్ పార్క్ ,,

 నమీబియా  సాహిత్యం –ఇంగ్లీష్ లోనే ఉంటుంది .హీరోస్ ఆక్రే మెమోరియల్ సోస్సాల్వే సాల్ట్ ప్లాట్స్ ,స్వాకో మాండ్ బీచ్ చూడతగ్గవి .సేఫ్టి దేశం .

  • 20,21వ శతాబ్దం రచయితలు-నేషాని అన్డ్రియాస్-దిపర్పుల్ వయొలెట్ వోషాంటూ అనే అనుభవాలు రాసింది .జోసెఫ్ డీ షో-బారన్ ఆఫ్ ది సన్నవల రాశాడు .డోరియన్ ఆర్చాఫ్ –కవి రచయిత,గ్వెన్ లిస్టర్ –అంతర్జాతీయ అవార్డ్ పొందిన జర్నలిస్ట్ ,హన్స్ డేనియల్ నముహూజా –ఒషిన్ డాన్గా,తోపాటు పదికి పైగా పుస్తకాలు రాసిన కవి .వీటిని స్కూల్స్ లో పాఠ్య గ్రంథాలు చేశారు .బ్రియాన్ ఓ లినిన్ –ది నమీబియన్ ,ది సేక్రేడ్ ట్రస్ట్ ఆఫ్ సివిలిజేషన్ రాశాడు .సిల్వియా శ్లేట్విన్-బుల్లీస్ ,బీస్ట్స్ అండ్ బ్యూటీస్ ,కదా సంపుతులు రాసింది ఫ్రేమింగ్ ది నేషన్ కధకు మంచి గుర్తింపు వచ్చింది .హేలావో షిట్యూఎటే-‘’నేవర్ ఫాలో ది ఉల్ఫ్ ‘’ఆటోబయాగ్రఫీ ‘’రాశాసిన మిలటరికమాండర్ .హాన్స్ స్మిత్ –వేర్ ఆదర్స్ వేవర్డ్,దిఆటో బయాగ్రఫి ఆఫ్ సం నుజోమా ,రాశాడు.అనోచికా వాన్మెక్-గోల్డెన్ పోయేట్ అవార్డీ. Annerkant die Longdrop, 1998 Vaselinetjie, 2004 Essie Honiball – Die Ontwaking, 2010 రాసింది .
  • సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం

 

ప్రపంచ దేశాల సారస్వతం

137- మారిషస్ దేశ సాహిత్యం

హిదూ మహాసముద్రం లో ఒక ద్వీపం రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశం.ఆఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతం లో ఉంది .రాజధాని –పోర్ట్ లూయి దేశం లో పెద్దనగరం . అధికారభాషలు-ఇంగ్లీష్ , తెలుగు .మారిషస ,క్రియోల్, భోజ్ పూరి ,ఫ్రెంచ్ ఇతరభాషలు అభి వృద్ధి లో రెండవ దేశం .హిందూ మతం ఉన్న అతిపెద్ద ఏకైక ఆఫ్రికా దేశం .కరెన్సీ –మరీషియన్ రూపాయి .జనాభా -12.7లక్షలు .

ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు. కాకినాడ సమీపాన వున్న ‘కోరంగి’ రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు ‘కోరంగి భాష’ అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.[4] తెలుగు వారు భాషా సంస్కృతి కాపాడుకొంటున్నారు. సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది. అంచెలంచెలుగా వివిధ హోదాలు చేపట్టి, 1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.

  శ్రీరాముడు వేసిన బాణానికి మారీచుడు ఇక్కడికి వచ్చి పడ్డాడని మారీచుని దేశమే తర్వాత మారిషస్ గా మారిందని అక్కడి హిందువులనమ్మకం .91.33శాతం అక్షరాస్యత ఉంది .ప్రీప్రైమరీ,ప్రైమరీ , సెకండరి టేరిటరి సెకండరీ స్థాయి విద్య .పోర్ట్ లూయీ ,గ్రాండ్ బాజే ,ఫ్లిక్ ఎన్ ఫ్లాక్ బీచ్ ,బ్లాక్ రివర్ ,నేషనల్ పార్క్ యాత్రాస్తలాలు .సురక్షిత దేశం .వ్యవసాయం ఎగుమతులు టూరిజం ఆదాయవనరులు .భారతీయ పండుగలకు ఇక్కడ జాతీయ సెలవు దినాలివ్వటం ప్రత్యేకత .

మారిషన్ సాహిత్యం –మారిషస్ భాషలో ,ఫ్రెంచ్ లో ఎక్కువగా సాహిత్యం ఉంటుంది దేవ్ వీరాస్వామి మారిషియన్ లో విస్త్రుతంగా రాశాడు .మాల్కం డీ చాజల్ ,ఆనంద దేవి ,రేమాండ్ చాజల్ ,ఎదోవార్డ్ మాణిక్ లు ప్రసిద్ధ రచయితలు యువ రచయితలలో షెనాజ్ పటేల్ ,నటాచ అప్పన్న ,సాబా కరీం అలైన్ గార్డాన్ జెంటిల్, కార్ల్ డీ సౌజా .కవి ,విమర్శకుడు ఖాల్ టోరా బుల్లి ‘’కూలిట్యుడ్’’అనే ఇండో-మారిషణన్ సంస్కృతి వ్యాపింపజేశాడు .హస్సాం వాచిల్ ,సాడ్లీ అస్సన్ ,యూసఫ్ ఖడేల్,ఉమర్ టిమోల్ లూ గుర్తింపు పొందిన రచయితేలే .

  జే ఏం జి లె స్లేజియో  2008లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ పొందాడు .

ఫ్రెంచ్ రచయితలలో ముఖ్యులు –మేరీ టేరాసి హంబర్ట్ ,ఆక్విల్ గోపి ,అమల్ సీవో హాల్.క్రియోల్ భాషలో –దేవ్ వీరాస్వామి ,అజిజి ఆసగ రాల్లీ ,ఉన్నారు

శ్రీ సంజీవ అప్పడు నేడు మారిషస్లో తెలుగు కీర్తికి సాహిత్య సంస్కృతులకు నిలువెత్తు పతాకలాగా ఉన్నారు .అక్కడ నిత్యం భజన ,సంగీత సాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తారు స్వయ౦గా  గొప్ప రచయిత ఎన్నో రేడియో ప్రసంగాలు చేసిన మూర్తీభవించిన ఆంధ్రత్వం భాష వేషం భావాలలో .ప్రతి ఏడూ ఇండియావచ్చి విమానం దిగగానే నేలకు మొక్కిపుణ్య క్షేత్రాలన్నీ తిరిగి నదుల్లో స్నానించి  అక్కడి పవిత్ర మట్టిసేకరించి భద్రంగా మారిషస్ తీసుకు వెళ్లి అందరికీ పంచి పెడతారు.నాలుగవ ప్రపంచ తెలుగు రచయితలసభలో ఆయనే స్పెషల్ అట్రాక్షన్.

138-మొరాకో దేశ సాహిత్యం

ఉత్తర ఆఫికా అట్లాంటిక్ సముద్రతీరాన మొరాకో దేశం ఉంది అరేబియన్ యూరోపియన్ సంస్కృతుల సమ్మేళనం .రాజధాని –రాబట్.కరెన్సీ –మొరాకియన్ దిర్హాం .అధికారభాష అరబిక్ .అమా ఝిగ్ .జనాభా -3.6కోట్లు .సున్ని ముస్లిం దేశం .73.5అక్షరాస్యత శాతం .సంప్రదాయ ఇస్లాం విద్యావిధానం .వ్యవసాయం ఫాస్ఫేట్ ఖనిజం ,సముద్ర ఉత్పత్తులు ,టూరిజం ఆదాయ వనరులు .జేమాల్ ఎల్ ఫినా ,జార్డిన్ మజేరోలి ,బాహియా పాలెస్ యాత్రా స్థలాలు .సురక్షిత దేశం .

మొరాకో సాహిత్యం –ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ వగైరా భాషలలో సాహిత్యం వర్ధిల్లింది .ఫోనీషియన్ మైథాలజి లెక్సస్ లో దొరికింది .గ్రీకో రోమన్ మైథాలజికి నిలయం .ప్రపంచ చాంపియన్ హెర్క్యులస్ పుట్టిన దేశం.రెండవ జూబా రాజు విద్యావంతుడు గ్రీక్ లాటిన్ పండితుడు .ప్లిని రాసిన చరిత్రలో ఆయనగురించి ఉన్నది .ఒబీరియను జయించినప్పుడు తారిక్ బిన్ జియాద్ ఇచ్చిన స్పూర్తిదాయక ప్రసంగం ఫ్రై డే సెర్మన్ లో ముఖ్యం .ఇద్రిస్సిడ్ కాలంలో సేబ్టా,సినిగర్ ,బస్రా లు కల్చరల్ సెంటర్లు .అల్ బక్రి తన బుక్ ఆఫ్ రోడ్స్ అండ్ కింగ్డమ్స్ లో సాలిహా ఐబన్ టారిఫ్ ఒక ప్రాఫెట్ అనీ ‘’కొత్త ఖురాన్’’ ఆయనకు ‘’బహిర్గతం ‘’అయిందని దీనినే ఖురాన్ ఆఫ్ సాలిహా అంటారని రాశాడు .తర్వాతసూఫీకవులు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేశారు .అయ్యాద్ బౌన్ మౌసా ,ఐబాన్ బాజియా ,చరిత్ర కర్తలు Kitāb al-Shifāʾ bīTaʾrif Ḥuqūq al-Muṣṭafá.[ బాజియ రచన Ibn QuzmanIbn Zuhr,  లు పెర్కొనదగినవారే .ఆల్మండ్ ఉద్యమం లో ఇమాం ఐబర్ట్ టుమార్ట్-ఇయాజ్ మా యుతియాబ్అంటే దిమోస్ట్ నోబుల్ కాలింగ్ రాశాడు .మారినిద్ వంశ పాలనలో సుల్తాన్ అబూ ఇనాన్ ఫారిస్ సాహిత్యాన్ని పోషించాడు ఫేజ్ యాత్రాసాహిత్యం ఐబాన్ అబ్బాద్ ఆల్రున్ది,సాలిహ్ బెన్ షరీఫ్ ముఖ్యకవులు    Al-Kafif az-Zarhuni‘s al-Mala’b ,అల్ మారాబా రాశాడు .

  20వ శతాబ్దం లో మొహమ్మద్ బెన్ బ్రహిం,అన్డిక్రిం ఘల్లాబ్ ,అల్లాల్ ఆల్ ఫాసిలు రెండవతరం కవులు .మూడోతరం లోమహమ్మద్ చౌక్రి డ్రిస్ చిరైబీ ,,మహమ్మద్ జఫ్ జాఫ్ డ్రిస్ ఎల్ ఖౌరి ముఖ్యులు ‘’సౌఫ్లీస్ ‘’అనే మేగజైన్ కూడా నడిపారు .తహార్ బెన్ జల్లోం ,లైలాలలామీ అంతర్జాతీయఖ్యాతిపొందారు

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

135-మాలి దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో  ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ ప్రైమరీ ఆరేళ్ళ సెకండరి .గ్రామీణ వ్యవసాయం ఆదాయ వనరు .పూరెస్ట్ కంట్రీ..డిజిని ఆర్కి టేక్చార్,మోప్టి రివర్ దర్శనీయాలు .భద్రత ఉండదు .

మాలి సాహిత్యం –చాలాభాగం మౌఖికమే .హమదౌ అమ్పాటేబా  ఈ దేశ ప్రముఖ చరిత్రకారుడు 1996లో యామ్బో ఔలోగం రాసిన ‘లే డేవాయిర్ డీ వయోలెన్స్’’నవల ప్రిక్స్ రెనడాట్ ప్రైజ్ పొందింది .ది ఎపిక్ ఆఫ్ సొండియాటా ,కౌటా ట్రయాలజి రాశాడు మస్సా మకాన్ డయాబెటే .ఒసమేన్ సేమ్బెని ‘రచన –గాడ్స్ బిట్ ఆఫ్ ఉడ్స్ ఇన్ బమాకో .

 ఇతర రచయితలలో –అహ్మద్ బాబా అల్మస్సూఫీ ,ఇబ్రహాం ఆయా అమడౌ హంపాటేబా ,సిదికి డెంబెలి,అలీ డీలో వగైరా Yambo Ouologuem కు రేనడార్ ప్రైజ్ 1969లో వచ్చింది  Ibrahima LyModibo KeitaMoussa Konaté and Doumbi-Fakoly .రచయితలే.ఔవా కీటా ఆటోబయాగ్రఫీ రాసుకొన్నది .ఐచా ఫోఫేనా ‘’మారేజ్ ఆన్  కోఫి ‘’అనే ఇంటర్నేషనల్ నవలరాసింది .మాడీడయాలో Kouthy, mémoire de sang  రాసింది  Fanta-Taga Temble ‘’డెస్టిని’’నవల ,  Aminata Traoré అనే మాజీ మంత్రిణి వ్యాసాలూ ,  Fatoumata Fathy Sidibé 2006లో  ఒక నవల,ప్రెసిడెంట్ భార్య   Adame Ba Konaré ‘’Ces mots que je partage: Discours d’une Première Dame d’Afrique’’గ్రంథం రాశారు

136-మౌరిటేనియాదేశ సాహిత్యం

ఇస్మామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరి టేనియా దేశం వాయవ్యాఫ్రికాలో ఉంది .ఆఫ్రికాలో 11వ పెద్ద సావరిన్ దేశం.రాజధాని –నౌకాచోట్.జనాభా 44లక్షలు కరెన్సీ –మారిటోనియన్ ఆగుయా .హస్సానియా అరబిక్ , బెర్బెర్ ,పులార్ ,సోనేన్కే ,ఒలోఫ్ భాషాజనం ఉన్నారు .అరబిక్ అధికారభాష .సున్ని ముస్లిం దేశం .అక్షరాస్యత 55శాతం .4-6ఏళ్ళ వయసుపిల్లలు ఖోరానిక్ స్కూల్స్ లో చదివి ఆతర్వాత కంపల్సరి విద్య నేరుస్తారు .వ్యవసాయమే ఆదాయ వనరు .వరి మొక్కజొన్న మిల్లెట్ సోర్ఘం పంటలు పండిస్తారు .నౌకాచోట్ ,చిన్గుట్టి ,అటార్ ఎడారి దర్శనీయాలు .టెర్రరిస్ట్ యక్టివిటి ఎక్కువ.

మౌరిటోనియాదేశ సాహిత్యం -300ఏళ్ళ సాహిత్యచరిత్ర ఉన్నది .1800మంది రచయితలూ 10వేలకు పైనే పుస్తకాలురాశారు .డెజర్ట్అండ్ ది డ్రం నవల  Mbarek Ould Beyrouk’s Amadou రాసింది ఆంగ్లం లోకి అనువాదం పొంది ప్రైజ్ గెల్చింది

  • అహ్మద్ బాబా రాసిన మున్యత్ ఉల్ మురిద్పుస్తకం లో మహమ్మద్ భార్యల విషయం ఉంది Ahmad ibn al-Amin al-Shinqiti Al-Wasit fi tarájim udaba al-Shinqit,  రాశాడు Tène Youssouf Gueye రాసినవి –
  •  Les exilés du Goumel, play, 1968 A l’orée du Sahel, stories, 1975 Sahéliennes, poems, 1975 Rella, 1985
  • Aïchetou Mint Ahmedou  రచయిత్రి ,కవయిత్రికూడా  La couleur de vent,  నవలరాసింది Mubarkah Bent al-Barra –సాంగ్స్ ఫర్ ఏ కంట్రిఫర్ ఆలి,కవితా సంపుటి ,మోడరన్ మౌరిటోనియన్ పోయెట్రి ,మై గ్రాండ్ మదర్స్ టేల్స్అనే పిల్లలపుస్తకం రాసింది .మౌసా డయాగననాటకరంగ ప్రముఖుడు – La Légende du Wagadu, vue par Sïa Yatabéré, 1988 (theatre) Targuiya, 2001 రాశాడు . Tène Youssouf Gueyeకవి చరిత్రకారుడు . Les exilés du Goumel, play, 1968, A l’orée du Sahel, stories, 1975 Sahéliennes, poems, 1975 Rella, 1985 రాశాడు . Ahmad ibn al-Amin al-Shinqiti “The Transmission of Islamic Knowledge in Moorish Society from the Rise of the Almoravids to the 19th Century”, రాశాడు
  • సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూబే లు

ఈమధ్య దూబే ఎంకౌంటర్ చదివాక ,ఎవరో ఒక ప్రసిద్ధ వ్యక్తి దూబే ఉండాలి అని గుర్తుకొచ్చి తిరగేశా .అవును ఉన్నాడు ముచికుంద దూబే ఆయనపేరు పూర్వపుబంగ్లా దేశ్ కు  భారత రాయబారి ,ఫారిన్ సెక్రెటరీ గా పని చేసినవాడు ,.భారత ప్రభుత్వం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ హెడ్ .కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్ కూడా .పాట్నా లోని ఏషియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ చైర్మన్ ,ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూయూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ .ఫారిన్ సర్వీసెస్ ఇన్ ష్టి ట్యూట్ ప్రొఫెసర్ ఎమిరిటస్ .ప్రపంచ ఆర్ధిక విధానాలు ,,ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ట్రేడింగ్ సిస్టమ్స్ సెక్యూరిటీలను డిజార్నమెంట్ ,సౌత్ ఏషియన్ కో ఆపరేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై పరిశోధన అధ్యయనం చేసిన మేధావి .ఢిల్లీ అంబెడ్కర్ యోని వర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డెవలప్ మెంట్ స్టడీస్ లో మాస్టర్స్ ఇన్ డెవలప్ మెంట్ స్టడీస్ బోధించాడు .ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ కు ఉపయోగపడే కేంద్రం

— ముచికుంద  దూబే రాసిన ప్రసిద్ధ గ్రంథాలు

  • Communal revivalism in India: a study of external implications. .
  • Dubey, Muchkund (1995). Indian society today: challenges of equality, integration, and empowerment
  • Dubey, Muchkund (1998). Subhas Chandra Bose: the man and his vision
  • Dubey, Muchkund; Balakrishnan, Rajiv (2008). Social development in independent India: paths tread and the roads 
  • Dubey, Muchkund; Jabbi, M. K. (2009). A Social charter for India: citizens’ perspective of basic rights. .
  • Dubey, Muchkund (2013). India’s foreign policy: coping with the changing world  
  • Dubey, Muchkund; Hussain, Akmal (2014). Democracy, sustainable development, and peace: new perspectives on South Asia. .
image.png
ముచికుంద  దూబే 
 
ఇప్పటి ప్రకాష్ దూబే  గాంగ్ స్టర్ ,హంతకుడు ,సబీన్స్పెక్టర్ తలకాయ నరికి ధైర్యంగా తిరిగినవాడు ,నేటి కాషాయం వాళ్ళదగ్గర్నుంచి అందరి చేతా పోషింపబడి బండారం బయటపడుతుందని ఎంకౌంటర్ అయినవాడు .” వాట్ ఏ ఫాల్ మై కంట్రీ మెన్ ”?
 మీ గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-20-ఉయ్యూరు 
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 133-మడగాస్కర్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

133-మడగాస్కర్ దేశ సాహిత్యం

ఆఫ్రికా తూర్పు తీరానికి400కిలో మీటర్ల దూరం లో ఇండియన్ ఓషన్ లో మడగాస్కర్ ఐలాండ్ దేశం  ఉంది .592 ,800చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం తో ప్రపంచంలో రెండవ పెద్ద ఐలాండ్ దేశం .రాజధాని –అంటా నవారివో .కరెన్సీ –మలగాసి అరియారి జనాభా -2.63కోట్లు .41శాతం మలగాసి క్రిస్టియన్లు.ఈ దేశ ప్రజలు ఆండ్రియా మనిట్రా అనే ఉత్కృష్ట వ్యక్తిని పూజిస్తారు .వారి పూర్వీకులు బ్రతిన చనిపోయిన వారి ద్వారాకనిపిస్తారని నమ్మకం .అధికారభాషలు –మలగాసి ,ఫ్రెంచ్ .అక్షరాస్యత -74.8 .ఆరేళ్ళ ప్రైమరీ ఏడేళ్ళ సెకండరి ,మూడేళ్ళ సీనియర్ సెకండరి విద్య .వ్యవసాయం,యాంత్రికత టూరిజం ముఖ్య ఆదాయవనరులు .వరి,కస్సావా తోపాటు కాఫీ  వనిల్లా పండిస్తారు .బబోవా అవేన్యు, టింజిడీ బెమరాహా నేచర్ రిజర్వ్ ,ఐసాలో నేషనల్ పార్క్ దర్శనీయాలు ,నిర్భయంగా టూర్ చేయవచ్చు .

మడగాస్కర్ సాహిత్యం –ను మలగాసే సాహిత్యం అంటారు .కాలనీ ప్రభుత్వాల అన౦తరమేసాహిత్యం వచ్చింది .1906-1938కాలం రచయితలను ఎల్డర్స్ అంటారు .వీరు పూర్వం మెరినా  మొనార్కి కాలం లోపుట్టినవారు . తర్వాత ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేషన్ లోని వారిని జూనియర్స్ అంటారు .మొదటి మోడరన్ ఆఫ్రికా మెరీనా కవి జీన్ జోసెఫ్ రబీ రివెలో-1901-37సర్రియలిస్ట్ రొమాంటిక్ మోడర్నిస్ట్ కవి .చారిత్రాత్మక నవలలూ ,వెస్టర్న్ ఒపేరా స్టైల్ నాటికలూ రాశాడు .ఎలీ రాజోనారిసన్ న్యు వేవ్ కవిత్వం రాశాడు .జాక్విస్ రాబె మనంజారా ,పియర్రీ  రాండ్రినారిసోవా ,క్లారిస్సీ రాట్సి ఫండ్రి,డీ వెడ్రిసాల్మన్ మొదలైనకవులూ ఉన్నారు .లీడింగ్ పోఎట్స్ గా జీన్ లూక్రహమరిమానా ,మైకేలీ రాక్స్తంసన్,ఏమిల్సన్ డేనియల్ వగైరా .అల్సల్మేరజఫిండ్రానిబే కామిక్ పుస్తకాలు చాలారాశాడు .మలగాస్సీ భాషా సాహిత్యాలను ఎందరో రచయితలూ రచనలద్వారా పోషిస్తున్నారు వారిలో –ఎల్లె చార్లెస్ అబ్రహం డేవిడ్ జావో మనోరో ,చార్లేట్ అరిసోవా రేఫెనో మంజటోలు .

ముఖ్యమైన పుస్తకాలు –బియాండ్ దిరైస్ ఫీల్డ్స్ –నైవో ,ఓవర్ దిలిప్ ఆఫ్ దివరల్డ్ –కోలిన్ మెక్ ఎల్రాయ్ ,దిఎఇత్ కా౦టినేంట్-పీటర్ టైసన్,హాట్ఐస్-నోబా రాబర్ట్స్ .

134-మలావి దేశ సాహిత్యం –

ఆగ్నేయ ఆఫ్రికాలో గ్రేట్ రివర్ వాలీ తో వేరు చేయబడిన ఎత్తైన దేశం మలావి .సరస్సులు పార్కులు బాగా ఆకర్షణ .రాజధాని –లిలోంగ్వే.కరెన్సీ-మలవియన్ క్వాచా .జనాభా -1.81కోట్లు. అధికారభాష వాడుకభాష ఇంగ్లిష్ .మూడువంతులు క్రిస్టియన్లు.అక్షరాస్యత 61.4శాతం .6వ ఏట స్కూల్ లో చేర్చుకొని ,మొదటి నాలుగేళ్ళు స్థానిక భాష లో బోధిస్తారు .తర్వాత ఇంగ్లీష్ మీడియం .అత్యంత వెనుకబడిన దేశాలలో ఒకటి .వ్యవసాయమే ముఖ్య ఆదాయం .దాదాపు ముప్పాతికశాత౦ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు .సీజనల్ వ్యాధులు ఎక్కువ .లేక్మలావి ,నేషనల్ పార్క్ చూడచ్చు .సేఫ్ కంట్రీ.

మలావి సాహిత్యం –ఏడుగురు రచయితలు  సాహిత్యాన్ని రచనలతో పోషింఛి తీర్చి దిద్దారు . .ఉపెలి చిసాలా –సృజనాత్మక రచయిత్రి.బెస్ట్ స్టోరీ రైటర్ గా గ్లోబల్ ఫేం పొందింది .కవితాసంపుటులు తెచ్చింది  మలేవియన్ సంస్కృతీ ఆఫ్రికన్ చరిత్ర నిలబెట్టటమే ధ్యేయంగా రాస్తుంది .జోలి మాక్స్ వెల్ నటాబా-1964దేశం స్వతంత్రం పొందాక విజ్రుమ్భించి రాస్తున్నవారిలో ఒకరు .గొప్ప కథకుడు .అవెంజేర్స్ ఫ్యూరి ,మివానా వ మిన్జోకా ,మిటిమా సుకోటా వగైరా .డిడి.ఫిరి-వార్తాపత్రికలలో ఎన్నో రాశాడు .హిస్టరీ ఆఫ్ మలావి ,దినివే ఇన్ డ్రీం లాండ్ ,లెట్ అజ్ ఫైట్ ఫర్ ఆఫ్రికా ,యాన్ అప్ర్రైజింగ్ బై జాన్ చిలెంబ్వే .జాక్ మపంజే –కవి .’’ఆఫ్ చామిలియన్స్ అండ్ గాడ్ ‘’రాసినందుకు 1987లో జైలు  పాలయ్యాడు .ది చాటరింగ్ వాగటైల్స్ఆఫ్ మిఖియు పిసన్ 1993లో రాశాడు .దీనికి రాటర్ డాంపోయెట్రి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది .గాదరింగ్ సీవీడ్-ఆఫ్రికన్ ప్రిజన్ రైటింగ్ మరో కవితాసంపుటి .కెన్ లిపెంగా –ఫైనెస్ట్ లిటరరి ఫిగర్ గా గుర్తింపు .న్యూస్ పేపర్ ఎడిటర్ .వైటింగ్ ఫర్ ఏ టర్న్ సేకండరీ సిలబస్ లో చేర్చారు.ఆఫ్ బీం టోస్ ప్రతిభావంతమైన రచన .స్టీవ్ బెర్నార్డ్ మైల్స్ చిమేమ్బో –నోమా అవార్డ్ గ్రహీత .దిబాస్కెట్ గర్ల్, రాత్ ఆఫ్ నేపాల్లో నవలలు ,ది రైన్ మేకర్ ,వచియోననడాని నాటకాలు,నపోలో ,దిపైథాన్ కవితాసంపుటులు ,దిహైనా వేర్స్ డార్క్ నెస్ కథా సంపుటి రాశాడు .స్టాన్లీ ఒంజెజానీకెనాని-అంతర్జాతీయ ఖ్యాతిపొందిన రచయిత.లవ్ ఆన్ ట్రయల్ ,ఫర్ ఆనర్ అండ్ ఆదర్ స్టోరీస్ కథాసంపుటలు తెచ్చాడు .రెండు సార్లు కిని ప్రైజ్ పొందాడు

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 131-లైబేరియా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం

131-లైబేరియా దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో గునియా సరిహద్దున అట్లాంటిక్ తీరాన లైబేరియా దేశం ఉన్నది .రాజధాని మొన్రోవియ .కరేనీ –లైబెరియన్ డాలర్ .జనాభా -48లక్షలు .అధికశాతం క్రిస్టియన్లు .అధికారభాష ఇంగ్లీష్ .పాతికదాకా స్థానిక భాషలున్నాయి అందులో –కేపెల్లి బస్సా ,గ్రెబో, డాన్,క్రు ,మానో ,లోమా ,మండి౦గొ వగైరా .అక్షరాస్యత -48శాతం .ఉచిత ప్రభుత్వ ప్రాధమిక విద్య అమల్లో ఉన్నా ఉత్సాహం వసతులు తక్కువే .ప్రైవేట్ స్కూల్స్ లో తడిసి మోపెడు అవుతుంది .పుష్కలంగా నీరు ఖనిజాలు ఉన్నాయి వ్యవసాయఉత్పత్తులుఆదాయవనరులు. రబ్బరు పంట ఎక్కువ డైమండ్స్ ,బంగారం దొరుకుతాయి .నేషనల్ పార్క్ ,కేప్ పాల్మాస్ చూడతగినవి .సురక్షిత దేశం కాదు .

లైబేరియా సాహిత్యం –1800సంవత్సరం వరకు ఉన్న క్రానలాజికల్ రికార్డ్  ఆఫ్ పాస్టోరల్,ఫోక్ లిటరేచర్ దొరుకుతుంది

తరువాత కాలం స్త్రీరచయితలు – హేలేని కూపర్ –హౌస్ ఎట్  షుగర్ బీచ్ రాసిన జర్నలిస్ట్ .మూసు నోహ అడ్డాడ్-నెల్సన్ మండేలా అవార్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ బెస్ట్ జర్నలిజం కు ,పొంది౦ది .ఫాతిమా మసకోయ్ –దిఆటో బయాగ్రఫి ఆఫ్ ఆన్ ఆఫ్రికన్ ప్రిన్సెస్ ఎక్స్పీరిఎన్సేస్,ఎ ఫోక్ టేల్ ఫ్రం లైబేరియా రాసిన రాజవంశానికి చెందిన ఎఢ్యుకేటర్.మైకోలా సోంగా –నటి రచయిత్రి మాగజైన్ ఎడిటర్ .ఫిల్మోగ్రఫీలుగా –దేస్పెరేట్ గర్ల్స్ ,స్ప్లిట్ డెసిషన్ ,ది హార్ట్ ,బినీత్ దిథాట్స్,బ్లడ్ బ్రదర్స్ ,ఛీటర్స్ క్లబ్ .బెస్తేదితర్ అవార్డ్ గ్రహీత .

మగరచయితలు-ఎడ్వర్డ్ విల్మాట్ బ్లైడేన్ –కాలాఫ్ ప్రావిడెన్స్ ,క్రిస్టియానిటి,ఇస్లాం, నీగ్రో రేస్ ,ఆఫ్రికన్ లైఫ్ అండ్ కస్టమ్స్ ,వెస్ట్ ఆఫ్రికా బిఫోర్ యూరప్ రాశాడు .రోనాల్డ్ డెంపే స్టర్-ఎ సాంగ్ ఆఫ్ అవర్ మిడ్నైట్,సావెనీర్ ఆఫ్ టబ్మన్-టోల్బెర్ట్ ఇనాగరేషన్ రాశాడు .హెన్రి బోఇమా ఫన్బుల్లెహ్-వాయిసెస్ ఆఫ్ ప్రొటెస్ట్ ,లైబేరియా ఆన్ ది ఎడ్జి రాశాడు .ఎబెంజేర్ నార్మన్ –న్యు డైమెన్షన్ ఆఫ్ హాప్ స్థాపకుడు యాక్టి విస్ట్ ,-గ్లోబల్  గుడ్విల్ అంబాసడర్ అవార్డ్ గ్రహీత .క్లారెంస్ మొనిబ –దిఅఫీషియల్ గైడ్ బుక్ ఫర్ ఫుట్ బాల్రాసిన ఫుట్ బాల్ ప్లేయర్ ప్రభుత్వున్నతోద్యోగి .విల్టన్ సాన్కావులో –వై నో బడి నోస్ వెన్ హివిల్ డై,దిమేరేజ్ ఆఫ్ విస్డంమొదలైన కథలురాశాడు .గాబ్రియల్ విలియమ్స్ –లైబేరియా -దిహార్ట్ ఆఫ్ డార్క్ నెస్,అకౌంట్స్ ఆఫ్ లైబేరియా సివిల్ వార్స్ రాశాడు

132-లిబ్యా దేశ సాహిత్యం

లిబ్యా లేక దిస్టేట్ ఆఫ్ లిబ్యా ఉత్తరాఫ్రికాలో మఘ్రేబ్ ప్రాంతం లో ఉన్న దేశం .ఆగ్నేయాన నైగర్ ఉంటుంది .రాజధాని-ట్రిపోలి .కరెన్సీ-లైబేయన్ దీనార్ .జనాభా -67లక్షలు .సున్ని ముస్లిం లుఎక్కువ .అధికారభాష అరెబిక్ .అక్షరాస్యత శాతం ఎక్కువే .ఉచిత కంపల్సరి ప్రాధమిక విద్య ,సెకండరి మూడేళ్ళు .  ట్రిపోలి మ్యూజియం కాజిల్ ,శిథిలాలు ,లేప్టిస్మంగా శిధిలాలు గడామిస్ ఎడారి పురాతన త్రవ్వకాలు చూడాల్సినవి .సురక్షితం కాదు .అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశాలలో ఒకటి. ఇదే ఆదాయవనరు .

లిబ్యా సాహిత్యం –1969లో మహమ్మద్ గడ్డాఫీ అధికారం లోకి రాకముందు సాహిత్యవాసనే లేదు ఈయనవచ్చి యూనియన్ ఆఫ్ లిబియన్ రైటర్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహించాడు.

కర్మాని కాలం లో Muhammad ibn Khalil ibn Ghalbun (d. 1737ఆన్ హు హోల్డ్స్ పవర్ ట్రి పోలి’’రాశాడు  Sulaiman al-Barouni al-Azhar al-riyadiya fi aimma wa-muluk al-Ibadiya, రాశాడు .

గడాఫీ కాలం లో అహ్మద్ ఫాగి –ఐ విల్ గివ్ యు అనదర్ సిటి నవలరాశాడు .ప్రముఖ రచయిత ఇబ్రహీం అల్ కోని వార్సా మాస్కోలలో జర్నలిస్ట్ గా పని చేసి నాస్టాల్జియా గా ‘’టురేగ్’’కల్చర్ నవల రాశాడు .దీనికి ఆరబ్ నావల్ అవార్డ్ వస్తే దానివల్లవచ్చిన డబ్బును టురేగ్ జాతి పిల్లల సదుపాయాలకు అందించాడు  బ్లీడింగ్ ఆఫ్ ది స్టోన్ నవల లిబియన్ స్టేట్ అవార్డ్ పొందింది .దియానిమల్స్ లిబ్యా అండ్  మొరాకో ,పప్పెట్ నవలలు ఇంగ్లీష్ లోకి అనువాదం పొంది ప్రైజులు పొందాయి .సెర్చింగ్ ఫర్ ఎ lost ప్లేస్ కూడారాశాడు .

ఖలేఫా హుస్సేన్ ముస్తఫా ‘’దిఐ ఆఫ్ ది సన్,’’రాశాడు గద్దాఫీ కాలం లో సంస్కృతి స్వేచ్చపై ఆంక్షలు ఉండేవి మిలిటరివాళ్ళు ప్రతి బుక్ షాప్ లోకీ,లైబ్రరీకి  వెళ్లి ,వేలాది  పుస్తకాలు  తగలబెట్టినట్లు బుకర్ ప్రైజ్ గ్రహీత ఇస్మాం మతార్ రాశాడు .ఈయన రెండు నవలలు –ఇన్ దికంట్రీ ఆఫ్ మెన్ అండ్ అనాటమీఆఫ్ ఎ డిసప్పియరెన్స్.ఇవి  మాన్ బుకర్  ప్రైజ్ ,కామన్ వెల్త్ ఫస్ట్బుక్ అవార్డ్ ,రాయల్ సొసైటీ అవార్డ్ ,ఆరబ్ అమెరికన్ నేషనల్ మ్యూజియం బుక్ అవార్డ్  పొందాయి .వీటిలో అధికార రియాక్షనరీల ఆగడాలు కళ్ళకు  కట్టినట్లు వర్ణించాడు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం చలపాక ప్రకాష్

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం

on: July 12, 2020  రచన: చలపాక ప్రకాష్   ఇతర రచనలు  on: July 12, 2020
Comments: No Comments

చరిత్ర సాక్ష్యాలతో ‘యాత్రానుభవం’ – ‘భవిష్యత్ తరాలకు’ ప్రయోజనకరం

చాలామంది ‘యాత్ర’లకు వెళుతుంటారు. అలా తాము చూసిన ప్రాంతాలలోని గొప్పదనాలని, అనుభూతులని యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ స్నేహితులకో, బంధువులకో చెప్పుకొని ముచ్చట పడుతుంటారు. ఆ ముచ్చట్లు అంతటితో పరిసమాప్తమవుతుంటాయి. కొన్ని మాత్రం జ్ఞాపకాలుగా జీవితాంతం మదిలో కొలువుండి పోతాయి. అటువంటి అపురూపమైన జ్ఞాపకాలను గుర్తున్నవి… గుర్తుకొచ్చినప్పుడు మౌఖిక రూపంలో చెప్పుకోవడం తప్పించి లిఖిత రూపంలో భద్రపర్చక పోవడం వల్ల అవి భావితరాలకి అందకపోవచ్చు. ఆయా కాలాలలోని జరిగిన మార్పులు, పరిస్థితులు, చెందిన అభివృద్ధి, మంచిచెడులు వంటివి రికార్డు పర్చకపోవచ్చు. కాని ఈ గ్రంథ రచయిత గబ్బిట దుర్గాప్రసాద్ గారు తాను చూసి వచ్చిన ప్రాంతాలలోని తన అనుభూతులను మాత్రమే కాకుండా ఆ ప్రాంతాల యొక్క చరిత్రను కూడా ఎంతో ప్రయోజకరంగా ఈ గ్రంథం ద్వారా అందించి, యాత్రికుల నుండి సాధారణ పాఠకుడిలో కూడా ఆసక్తిని కలిగించే రీతిలో ఈ పుస్తకాన్ని మనకు అందించారు.

ఆ యాత్రానుభవాలు పాఠకుడితో పంచుకోవడంతోపాటు, ఆయా ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి అక్కడ లభించే భోజన వసతి సదుపాయాల వివరాలు సవివరంగా ఇందులో పొందుపర్చారు. అంతేకాకుండా చాలామంది ఆ ప్రాంతాలు చూసినప్పటికీ ఆ ప్రాంతాల యొక్క గొప్పతనం సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం కలగకపోవచ్చు. అసలు తాము వెళ్ళిన ప్రాంతాలలో చూడదగ్గవి మరెన్నో ఉన్నాయన్న సంగతీ సంపూర్ణంగా అవగాహన కలగకపోవచ్చు… కానీ ఈ గ్రంథం చదవడం వల్ల ఆ ప్రాంతాలు చూసినవారు సైతం మరెన్నో తాము చూడకుండా వచ్చేసిన ప్రాంతాల గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకొని విస్మయానికి గురికాక తప్పదు. ఈసారి వెళ్ళినప్పుడు చూసిరావాలనే ఉబలాటమూ కలగక మానదు. అలాగే ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ప్రాంతానికీ, ప్రాంతానికి మధ్య ఉన్న తేడా, అభివృద్ధి మధ్య వ్యత్యాసాల్ని గ్రహించి మనం అక్కడి నుండి కొత్తగా అవలంభించక తగ్గ విషయాలను స్వీకరించవచ్చు. మన ప్రాంతానికి… మనం చూసొచ్చిన ప్రాంతానికి మధ్య ఉన్న తేడాను బేరీజు వేసుకొని ఇంకా అభివృద్ధి పరంగా మనం చేసుకోవాల్సిన మార్పులను ఆవళింపు చేసుకోవచ్చు. ఆ విధమైన ప్రయోజనం యాత్రా అనుభవాల వల్ల చేకూరుతుంది. ‘సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా’ అనే ఈ గ్రంథంలో అంత సంపూర్ణ, విపులాత్మక యాత్రా సమాచారం అందించారు గబ్బిట వారు.

ఈ పుస్తకం చదవడం ద్వారా మరింత ప్రయోజనం కూడా ఉందని చెప్పాలి. చరిత్రలో ‘మంచి’- ‘చెడు’ అనేవి ఎంత కాలమైనా.. ఎన్ని తరాలైనా ఏ విధంగా వెంటాడి ముందుతరాలను ప్రభావిత పరుస్తాయో ఈ పుస్తకంలో చూడవచ్చు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధమైన అలనాటి మన దేశాన్ని పాలించిన చక్రవర్తుల కాలంలో… శిల్పకళా సంపద ఎంతటి విశిష్టతను కలిగించి… మన దేశ శిల్పుల గొప్పతనాన్ని ఇతర దేశాలకు ఇనుమడింపజేసిందో ఈ పుస్తకం ద్వారా తేట తెల్లమవుతుంది. ఈర్యా ద్వేషాలతో ‘మంచి’పై ‘చెడు’ ఎలా దండయాత్ర చేసి విధ్వంసం చేసిందో… దానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ‘చెడు’ కాలగర్భంలో కలిసిపోయి ‘మంచి’ శాశ్వతంగా నిలిచిందో, ఈనాటి ‘సోమనాథ్ దేవాలయ చరిత్ర’ను చదివితే మనకు అర్థమవుతుంది. ‘సోమనాథ్ దేవాలయ నిర్మణం ఎంత అద్భుత కట్టడంగా’ అలనాటి రాజులు తీర్చిదిద్దారో… ఆ దేవాలయాన్ని ఎంతమంది దుర్భుద్ధిగల ముష్కర రాజులు ఈర్ష్యతో ముట్టడించి నాశనపరచారో, మళ్ళీ దానిని ఎవరెవరు ఎన్ని విధాలుగా కాపాడుకుంటూ మరింత అద్భుత రీతిలో నిర్మాణాలు జరిపి ఈనాటికీ చరిత్ర సాక్ష్యాలుగా నిలిచిన సోమనాథ్ దేవాలయ వృత్తాంతం చదివితే నిజమైన ఈ దేశ పౌరుడికి పౌరుషంతో ఛాతీ పొంగి తీరుతుంది. మన చరిత్ర, సంస్కృతిని నాశనం చేసే కుట్రలో ఇతర మత ప్రభువులు ఏ విధంగా తాము నాశనమై కాలగర్భంలో చరిత్రహీనులుగా మిగిలిపోయినదీ ఈ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకొని పాఠకుడు… ‘మంచి-చెడు’ అనే తారతమ్యాలను అంచనా వేసుకోగలుగుతాడు… మనలోని చెడును చెరిపేసుకొని మంచి కోసం పరితపించే ఆలోచనలకు ప్రేరేపిస్తాడు. అటువంటి చరిత్ర పాఠాలు మనకి ‘సోమనాథ్’ దేవాలయ నిర్మాణం నేర్పిస్తుంది.

చాలామంది ఉద్యోగ పదవీ విరమణ చేసినవారు తమంతా చేయగలిగింది చేసేసామని… ఇక చేయగలిగింది ఏమీ లేదని… శక్తిసామర్థ్యాలు సన్నగిల్లాయని సరిపుచ్చుకుంటుంటారు. కాని ఈ సమాజానికి ఏదోకటి తమ ఊపిరి ఉన్నంతవరకూ చేస్తూ ఉండాలనే లక్ష్యంగల వాళ్ళు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. అనుకున్నది సాధించాలనుకునేవారికి వయస్సుతో పని లేదు. తము చివరి శ్వాస ఉన్నంతవరకూ ఏదోకటి సమాజానికి ఉపయోగపడే పనులు చేయలనుకునే వారు బహు అరుదు. అటువంటి అరుదైన వ్యక్తులలో గబ్బిట దుర్గాప్రసాద్ గారు ఒకరు. 80 ఏళ్ళ వయస్సులో కూడా అలుపెరుగని అక్షర సైనికుడిలా ఎందరికో స్ఫూర్తినిస్తూ ఆదర్శప్రాయులవుతున్నారు. తాను విన్నవి, కన్నవి, మరిన్ని అతి కష్టపడి సేకరించినవి నేటి తరానికి, భావితరాలకు ఉపయోగపడే రీతిలో అయన తన అక్షర యజ్ఞాన్ని నిబద్ధతగల గురువుగా, భాషాభిమానిగా, రచయితగా, సరసభారతి అధ్యక్షులుగా, కార్యకర్తగా.. ఇలా ఎన్నో… ఎన్నెన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి నిరంతర కృషికి ప్రతి తెలుగువాడూ అభినందించి తీరాలి.

***

‘సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా…’ (యాత్రాచరిత్ర)
రచన: గబ్బిట దుర్గాప్రసాద్,
పుటలు:328,
వెల:రూ.200/-,
ప్రతులకు:
గబ్బిట దుర్గాప్రసాద్,
రాజాగారి కోట వద్ద,
శివాలయం వీధి,
ఉయ్యూరు, కృష్ణాజిల్లా-521 165

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం

 ప్రపంచ దేశాల సారస్వతం

129-కెన్యా దేశ సాహిత్యం

తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు మిగిలినవారు ముస్లిం లు వగైరా . అక్షరాస్యత -81.54.విద్య -8-4-4తరహా .వ్యవసాయం ,ఫారెస్త్ట్రి,ఫిషింగ్ ,ఎగుమతులు ఆదాయ వనరులు .

కెన్యా సాహిత్యం –మౌఖిక సాహిత్యమే చాలాకాలం .తర్వాత బ్రిటిష్ ఆంధ్రాపాలజిస్ట్ లు ఎస్పెత్ హక్సలి ,ఇసాక్ దినేసన్ వాటిని సేకరించి భద్రపరచారు

కెన్యారచయితలలో గ్రేస్ ఒగోట్,మేజామివాంగి,పాల కిపచుంబ ,కిన్యాంజు కొమ్బాని ,బిన్నవాంగా వైనేనా .

స్టోరి ఆఫ్ తంబూకా ను సుల్తాన్ ఆఫ్ పేట్ ఆస్థానకవి మేవంగో 1114లో రాశాడు .అతని ఎపిక్ కవిత్వమే మొదటిది .వీప్ నాట్ చైల్డ్ మొదటి నవల ఇంగ్లీష్ లో దియాన్గో రాశాడు .ఇతనే రాసిన రివర్ బిట్వీన్ నవల సెకండరి స్కూల్ సిలబస్ లో ఉన్నది .ఇసాక్ డినేన్సన్’’అవుట్ ఆఫ్ ఆఫ్రికా ‘’.ఎల్స్ పేత్ హక్స్లీ రాసిన ది ఫ్లేం  ట్రీస్ ఆఫ్ థీకా సింక్లైర్ ప్రైజ్ వచ్చింది .బేరిన్ మర్కహాం ‘’వెస్ట్ విత్ ది నైట్ ‘’రాశాడు .

130-లెసోతో దేశ సాహిత్యం

దక్షిణాఫ్రికాలో హైఆల్టిట్యూడ్ దేశం లెసోతో .రాజధాని-మసేరు .జనాభా -21లక్షలు కరెన్సీ –లెసోతో లోటి.క్రిస్టియన్ దేశం.అధికార భాషలు – సేసోతో ,ఇంగ్లిష్ .మిగిలినవి-పూతి హోసా ,జులు వగైరా .అక్షరాస్యత -76.64శాతం విద్య -3-7-3-2విధానం .భూమి పశుపోషణ,గనులు ఆదాయవనరులు .ఆఫ్రికి పర్వతాలు ,మాలసున్యా ఫాల్స్ ,కాట్సే డాం విహార స్థలాలు .

లెసోతో సాహిత్యం –ఆంగ్లంలోనే ఉంటుంది.1931లో చోకా నవల సేసోతోభాషలో ధామస్ మొఫోలో రాశాడు .జులు చక్రవర్తి సామ్రాజ్యం ఉత్దానపతనాలు వర్ణించాడు .ఇంగ్లీష్ లోకి రెండుసార్లు తర్జుమా అయింది.ఒకరకంగా అ దేశ సాహిత్యజనకుడు . Mofolo-Plomer Prize ను ఆయన గౌరవార్ధం ఏర్పాటు చేసి ఫిక్షన్ రచయితలకు అందజేస్తున్నారు ,

ఆధునిక రచయితలు-జెడి మంగోలా –దిప్రైజ్ పోయెమ్స్ ,అమాంగ్ దిప్రిడటార్స్ అండ్  ప్రే,బంటు స్టడీస్ రాశాడు .,మోపెలి పాలస్ –టుట్రావెల్ ఈజ్ టు లెర్న్,టర్న్ టు దిడార్క్ నవలలు రాశాడు .

  • Masechele Caroline Ntseliseng Khaketla  -రచయిత్రి ,ఎడ్యుకేటర్  రచనలు – Mantsopa le Molamu oa Kotjane
  • Mosiuoa Masilo
  • Mosali eo o ‘Neileng Eena
  • Pelo ea Monna
  • Ka u Lotha
  • Mahlopha a Senya
  • Ho Isa Lefung
  • Molekane ea Tsoanang le Eena
  • Khotsoaneng
  • Selibelo sa Nkhono
  • Maoelana a hlompho (2002)

షీలాకాలా –గొప్పకవయిత్రి .ఫార్ములా ,మై పెన్ ఈజ్ ఎసోషలైట్ కవితా సంపుటులు రాసింది . Mpho ‘M’atsepo Nthunya,’’సింగింగ్ అవే ది హంగర్ లో యూనివర్సల్ ఫిమేల్ ఎక్స్ పీరియెన్స్ ను వర్ణించింది

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

అడవి పక్కన ఎవరు నడుస్తారు ?

అతడెవరో నాకు తెలుసు ననుకొంటా

లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ

అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు

లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు

నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ .

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత ‘’బోనో పోథే కే జెయ్’’కు మహమ్మద్ నూరుల్ హుదా ఆంగ్లానువాదం .

9-ప్రభూ !ఆశీర్వదించు మమ్మల్ని –పద్మభూషణ్ ఖ్వాజీ నజ్రుల్  ఇస్లాం  కవిత

మమ్మల్ని ఆశీర్వదించు ప్రభూ !మమ్మల్నందర్నీ దీవించు

ఇతరులను మేము, మమ్మల్ని  ఇతరులను ప్రేమించేట్లు చేయ్

ద్వేషం ,అసూయ ,భౌతిక బాధ ,మానసిక వేదన

మామధ్య లేకుండా చూడు ప్రభూ

భువి మరొక దివి  అవ్వాలి

జ్ఞానకాంతిని ,భీమబలాన్ని మాకు ప్రసాదించు దేవా !

నువ్వు అందించిన ఆ జ్ఞాన జ్యోతితో నిన్ను మేము అన్వేషిస్తాం

నువ్వు అందించిన బలమే మాకు,

మా కార్యక్రమాలకు శక్తి, తోడ్పాటు

మా సహచరుల నీతి ,ధర్మమే మాకు

శ్రీరామ రక్షఅయి  మా భయాలు దుఖాలు అంతమౌతాయి

కానీ ప్రభూ !ఏ ప్రమాదం వల్లనైనా మేం

ఓడిపోతే మాత్రం మమ్మల్ని రక్షించే బాధ్యతా నీదే .

ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు ఆబు రషిద్ ఆంగ్లానువాదం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -127గినియా బిస్సౌ దేశ సాహిత్యం

పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే  ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం ఫిషింగ్ ముఖ్య ఆదాయ వనరులు .జీడిపప్పు పంటకు ప్రసిద్ధి .జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలో ఆరవ దేశం .బిస్సగోస్ ఐలాండ్స్ ,తోపాటు హిప్పో పోటామస్ ,ఒరంగో జంతువులకు ప్రసిద్ధి .

గినియా బిస్సౌ సాహిత్యం –యుద్ధానంతర సాహిత్యమే ఎక్కువ అగష్టిన్హోనెటో,మేరియో పింటోవిరియాటో డా క్రూజ్ లు కవులుగా ,లువాన్డినో వీరా నవలాకారుడిగా ప్రసిద్ధులు

పోర్చుగీస్ పాలనలో 500 ఏళ్ళు విద్యాసంస్థల నిర్మాణ౦ జరగలేదు .స్వతంత్రం పొందాకే సాహిత్యారంభామైంది .1970లో మొదటి కవిత్వం ప్రచురితమైంది 1982ల రైటర్స్ యూనియన్ ఏర్పడింది .

  • మగరచయితలు –అమిక్రార్ కేబ్రెల్ –వామభావ రచయిత.రెసిస్టన్స్ అండ్ డీ కలనైజేషన్ ,రిటర్నేడ్ టు ది సోర్స్,యూనిటి అండ్ స్ట్రగుల్ పుస్తకాలురాశాడు .వాస్కో కాబ్రా –ఫైనాస్ మినిస్టర్ . A luta é a minha primavera, 1981 (poetry)  రాశాడు .ఫాస్టో ద్యుఆర్టే-బ్లాక్ నావేల్లా నవల ,జ్ఞాపకాలు మరో నాలుగుపుస్తకాలు రాశాడు .కార్లోస్ లోప్స్-ఎకనామిస్ట్ సివిల్ సర్వెంట్ .ఆఫ్రికన్ యూనియన్ కు ప్రతినిధి .అబ్డులాయ్ శిలా –పాటలరచయిత .ఎటేర్నాపెక్సావో ,అల్టిమేట్ ట్రాజేడియా.మిస్టిడా నవలలురాశాడు
  • స్త్రీ రచయిత-ఒడేటి సేమేడో-ఎంట్రి ఓ సీర్ ఇఒ అమర్ ,నో ఫన్డోడో కాంటో,లితెరేచారా డీ గినియా రాసింది
  • 128-ఐవరీ కోస్ట్ దేశ సాహిత్యం
  • ఐవరీ కోస్ట్ అనబడే కోటే డి ఎల్ వోయిర్  పశ్చిమాఫ్రికాలో బీచ్ రిసార్ట్స్ఉన్న దేశం . రాజధాని యామౌస్సోక్రా .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 2.51కోట్లు .అధికారభాష ఫ్రెంచ్ .ఆఫ్రికాభాషలైన యకౌబా ,సేనౌఫా ,బయోలె ,అట్టి,అగ్ని,దయౌలా అనే మార్కెట్ భాష మాట్లాడుతారు .కేధలిక్కు క్రైస్తవులు సున్ని ముస్లిం లు సమానంగా ఉంటారు .అక్షరాస్యత 47శాతం .ఫ్రెంచ్ కాలనీ విద్యావిధానం మూడేళ్ళ ప్రీ స్కూల్ ,ఆరేళ్ళ ప్రైమరీ ,ఏడేళ్ళ సెకండరి విద్య ఉంటుంది .సెయంట్ పాల్ కేదేద్రల్ ,గ్రాండ్ బస్సం నేషనల్ పార్క్ దర్శనీయాలు .కాఫీఉత్పత్తి,యెగుమతులలొ ప్రపంచంలో మొదటిస్థానం .కోకాబీన్స్ ,పామాయిల్ ,టింబర్,పెట్రోలియం కూడా ఆదాయ వనరులు .
  • ఐవరీ కోస్ట్ సాహిత్యం –దీన్నే ఐవోరియన్ సాహిత్యం అంటారు .అకే లోబా ,పియర్రి డూప్రే,జేగోవా బెస్సి నోకాన్ రచయితలూ .బెర్నార్డ్ డాడీ ఐవరికోస్ట్ ఫైనేస్ట్ రచయితగా గుర్తింపు పొందాడు.జీన్ మేరి అడియాఫ్ఫీ –లాకార్టేడిడెంటీ నవల కు గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చింది .మారిస్ బాండ్ మన్- Le fils de la femme maleకూ గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది .అకే లోబా రాసిన – Kocumbo, l’étudiant noirకూ ఆ ప్రైజ్ దక్కింది .ఆహ్మదౌ కౌరౌమా రాసిన Monnè, outrages et defisకూ, Les Soleils des indépendances వచ్చింది అదే ప్రైజ్ .బెర్నార్డ్ డాడీ రాసిన Patron de New-Yorkకూ La ville où nul ne meurt లభించింది
  • స్త్రీలలో –మార్గురైట్ అబౌ ఎట్ -అయాఆఫ్ యోప్ సిటినవలరాసింది    ఈదేశంలోని వైవిధ్యభరిత జనం పై రాసిననవల.ఆదేశాజాతీయత కల్చర్ , ఆర్టిస్టిక్  స్టైల్ అన్నీ ఉంటాయి
  •    సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మళ్ళీ పేస్ బుక్ లో లైవ్

మళ్ళీ పేస్  బుక్ లో లైవ్

సాహితీ బంధువులకు శుభకామనలు — సుమారు రెండు నెలల క్రితం నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు ,నాకు మిక్కిలి ఆత్మీయులు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు ఫోన్ చేసికుశలప్రశ్నల అనంతరం  ”ప్రసాద్ గారూ !ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను . కొత్తపుస్తకాలేవైనా తెచ్చారా ఉగాదికి ?మీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయా” ?అని అడిగారు  .మూడు పుస్తకాలు ఉగాదికి తెచ్చినవైనం కరోనా లాక్ డౌన్ లో వాటిని మాస్వామి పాదాలవద్ద ఉంచి ఆవిష్కరించిన విషయాలన్నీ చెప్పి ఈ హడావిడి అయ్యాక మీకు పంపిస్తాననని చెప్పాను .కొత్త రచనలేమైనాచేస్తున్నారా అంటే లిస్ట్ చదివాను .వారు అత్యంత ఆప్యాయంగా ”మీ జీవిత చరిత్ర రాశారా ?”అని ప్రశ్నిస్తే నెట్ లో ”నాదారి తీరు ”పేరుతో సుమారు 150ఎపిసోడ్ లు నా రిటైర్ మెంట్ దాకా ధారావాహికగా రాశానని చెప్పాను  .వారు చాలా సంతోషించి ”అక్కడినుంచి ఇవాళ్టి వరకు కూడా త్వరలో రాయండి .మొత్తం పుస్తకరూపం లో వచ్చే ఉగాదికి విడుదల చేయండి ”అన్నారు ఒకరకమైన ఆదేశంగా . ప్రస్తుతం అంత ” దృశ్యం ”లేదని మనసులోనే అనుకోనిమర్యాదగా ” సరే ”అని అన్నాను . .
  నాజీవితం గురించి రాస్తే మా కుటుంబం వారికైనా విషయాలు తెలుస్తాయని సుమారు పాతికేళ్ల క్రితం  శీర్షిక ఏం పెట్టాలా అని తర్జన భర్జన పడి ”అనంత కాలం లో నేనూ ”అని పెట్టి నా 1993పాత డైరీలో 25-2-1995 న మొదలుపెట్టి ,మధ్యమధ్యలో రాస్తూ 26-6-2008వరకు నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఇంటర్ చదువు పూర్తయ్యే దాకా రాసి పారేశాను . దీన్ని నేనే చదివి వాయిస్ రికార్డ్ కూడాచేశాను .అది ఎక్కడుందో తెలీదు .ఈ డైరీ ఆతర్వాత చాలాకాలం నాకు కనిపించలేదు .సుమారుగా ఏడాది క్రితం అన్నీ  వెతుకు తుంటే దొరికితే ”హ మ్మయ్య ”అనుకు ని  భద్రంగా దాచుకున్నాను.
  ఆతర్వాత జీవితం గురించి రాయాలని శీర్షికగా ”నా దారి తీరు ”అనిపెట్టి డిగ్రీ చదువు బీఎడ్ ఉద్యోగం ,ఉద్యోగ విశేషాలు ,అందులో నేను చేసిన ప్రయోగాలు నా పదవీ విరమణ వరకు సుమారు 150 ఎపిసోడ్ లు రాశాను నెట్ లో . ఇవన్నీ మీకు తెలిసినవే .ఆచార్యులవారు ఆదేశించినట్లు ఆఫ్టర్ రిటైర్ మెంట్ విషయాలు రాయాలంటే ఇంటర్ వరకు రాసింది కూడా నెట్ లో ముందు రాయాలి .కానీ ఇప్పుడు అంత ఓపిక తీరిక లేదు .కనుక పేస్  బుక్ లో లైవ్ గా చదివి రికార్డ్ చేద్దామని అనుకొంటున్నాను .
  ప్రస్తుతం ప్రపంచ దేశాల సారస్వతం పై మనసంతా ఉంది 126దేశాల సాహిత్యం నిన్నటికి రాశాను . 150 దేశాలవరకు రాసి ,కొంతవిరామం ఇచ్చి ,ఆతర్వాత  పైన చెప్పిన పని చేయాలనుకొంటున్నాను .
  శ్రావణమాసం మొదటి రోజు మంగళవారం 21-7-2020ఉదయం 10గంటలకు ”అనంతకాలం లో నేనూ” ధారావాహిక  ”పేస్  బుక్ లో లైవ్ ”ప్రారంభిస్తాను . ఇందులో కొన్ని ఊసుల్లో ఉయ్యూరు ,మరికొన్ని సరసభారతి పుస్తకాలలో సందర్భ వశాన వచ్చ్ రిపిటీషన్ అనిపించవచ్చు.అయినా నా ప్రయత్నం చేస్తాను .
ఇదిపూర్తయ్యాకే, నా రిటైర్ మెంట్ నుంచి ఉన్నవిషయాలను ”నా దారి తీరులో ”అంతర్జాలం లో రాస్తాను .మీ- గబ్బిట  దుర్గాప్రసాద్ – 12-7-20-ఉయ్యూరు
  .
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment