రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్

నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం  చేస్తున్నాయి

నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్

దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది

ఇవన్నీ ఎవరి వలన  నీకొచ్చాయో చెప్పగలవా  ?

ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు పూయబడిందో

వాటిని కూలిస్తేనే నువ్వు చూడగలవ్

ప్రతి ఇటుకమీద స్పష్టంగా పేర్లు రాయబడి ఉన్నాయ్

నీకు బహుశా తెలియకపోవచ్చు కాని ప్రతిధూళి కణానికీ

 నీ రోడ్ల ,నౌకల, రైళ్ళ ,విలాస హర్న్య వర్ణాల

 అర్ధాల భాగవతమంతా  తెలుసు

త్వరలోనే మంచి రోజులొస్తున్నాయ్

రోజు రోజుకీ నీ అప్పులపాపం పెరిగిపోతుంది

 ఆభారీ రుణాలను నువ్వు తీర్చుకోక తప్పదు

బండ రాళ్ళను గొడ్డలి గునపం కొడవలి

 కఠినశ్రమశక్తితో ముక్కలు చేసిన దినకూలీల  శరీరాలు

 నీ రోడ్డు మీదే నీ కోసం కార్చిన చెమటతో తడిసి

  అటూ ఇటూ విసరివేయబడి ఉన్నాయ్ .

నీకు సేవ చేసిన దేహాలే అవి దినకూలీలవే

దుమ్ము ధూళి లో కప్పబడిన ఆ శరీరాలే

నిన్నూ నీ వాటినీ మోసుకు పోయేవి

వాళ్ళు నిజంగా మానవులే ,రుషి తుల్యులే

వారి అంతరాత్మ గీతాలను నా పాటలతో  పాడుతా

వారి బాధామయ శోకమయ చాతీలపై కవాతు చేస్తూ

కొత్త విప్లవం కొత్త మెదడులోని ఉద్భవిస్తుంది

మేము కింద పడి కుళ్ళి పోతుంటే

హాయిగా మూడో అంతస్తుపై

సుఖ నిద్రపోతున్నావ్ కదూ !

అయినా నువ్వు ప్రభువా అని పించుకోవటం

దారుణం అసంబద్ధం అహేతుకం

ఈ ప్రపంచ అధికారం తనువూ మనసు

 ప్రేమతో అంకితభావంతో ‘జన్మభూమీ కోసం

స్వేదం తో తడిసిముద్దయిన వారిదే

అలుపెరుగనినడకతో  రోడ్లపై

అలసట లేని ప్రయాణం చేసిన వారి పాద ధూళి

నా శిరసుపై పవిత్రమైనదిగా ధరిస్తాను

మానవాళి బాధలు ఇక్కట్లు తొలగిపోతున్నాయ్

నూతన ప్రభాతాన కొత్త సూర్యుడుదయిస్తాడు

ఆ ధూళి దూసరితమైన రోడ్లను కడిగి ‘

త్రుప్పుపట్టిన నీ గుండె ఇరుకు తలుపులను బార్లాతీసి

స్వేచ్చావాయువులనాహ్వానించి ప్రవేశిస్తారు

ఆ ఉప్పొంగే ఉత్సాహంతో

ఉరకలు వేసే వారిని లోనికి స్వేచ్చగా రానివ్వు .

నేరుగా నీ గుండెల్లో దూరిపోతారు

అడ్డంగా ఉన్నవన్నీ కూల్చి ప్రవేశిస్తారు

మొత్తం నీలి స్వర్గం అంతా నీ కళ్ళముందే కూలి పోతుంది

సూర్య చంద్ర నక్షత్రాలు మాపై కురవనివ్వు

అన్నికాలాలప్రజలు , అన్ని రకాల శీతోష్ణ స్థితులు

 గొప్ప సంగమం లా కలిసి వచ్చి

ఒకే జెండా కింద నిలబడి ఐక్య జాతీయ గీతాన్ని ఆలపిస్తారు

ఇక్కడ నువ్వు ఒక్కప్రాణికి హాని తలపెట్టినా

 ఆబాధ దిగంతాలకు పతాక సన్నివేశంగా వ్యాపించి

ప్రతి హృదయంలో తీవ్ర ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తుంది

ఒక వ్యక్తికీ జరిగే అవమానం

సకలమాన వాళినీచేసిన అవమానమే

మానవత్వానికి చేసిన ద్రోహమే అవుతుందని గుర్తుంచుకో

ఇవాళే ప్రపంచమానవాళి అనుభవించిన

హృదయవిదారక బాధ  వేదన పై తిరుగు బాటు రోజు అని గుర్తుంచుకో

ఆధారం – పద్మ భూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు అమీర్ హుస్సేన్ చౌదరి ఆంగ్లానువాదం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | 1 Comment

ప్రపంచ దేశాల సారస్వతం 125-ది గాంబియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

125-ది గాంబియా దేశ సాహిత్యం

 పశ్చిమాఫ్రికాలో చిన్న దేశం ది గాంబియా .అట్లాంటిక్ తీరాన ఉన్నది ,వైవిధ్య ఈకో సిస్టం కు ఉదాహరణ .సెంట్రల్ గాంబియా నది ప్రాణం .రాజధాని –బెనుజి.కరెన్సీ –గామ్బియన్ డలాసి.జనాభా -23లక్షలు .అన్నిమతాలవారు ఉన్న మతసామరస్య దేశం .అధికారభాష –ఇంగ్లీష్ .మండింక,ఒలోఫ్ భాషాజనం కూడా ఉన్నారు .అక్షరాస్యత -64శాతం .7సంవత్సరాల బ్రిటన్ మోడల్ చదువు .వ్యవసాయమే ముఖ్య ఆదాయం. వేరుసెనగ ,మిల్లెట్ ,కాటన్ కస్సావా ముఖ్యపంటలు .గాంబియా రివర్ సేర్రెకుండా ,మార్కెట్ కోలోలి బీచెస్ .మొసళ్ళ బీచ్ ,సఫారి టూరిజం స్పాట్స్ .

 గాంబియా సాహిత్యం –డయో ఫారేస్టర్ మొదటి నవల ఆఫ్రికా రీజియన్ రీడింగ్ దిసీలింగ్ కు కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ 2008లో వచ్చింది .శాలీ శాడిల్ సిన్ఘలె మొదటి నవల ‘’క్రిస్టీస్ క్రైసిస్.రెండవది ది సన్ షైన్స్ .ఎబౌ గాయే ‘’ఫేక్ లవ్’’,రోహా ఫోలి ఒదాం ‘’కాస్ట్లి ప్రైసెస్’’ముఖ్యమైనవి

జానెట్ బద్జాన్ యాంగ్ –దేశం లో ప్రముఖ స్త్రీ నాటకకర్త .గాంబియా దేశ సాహితీ సేవకు అవార్డ్ పొందింది .దిఅల్టిమేట్ ఇన్ హీరిటేన్స్,దిబాటిల్ ఆఫ్ సన్కాండ్,దిడాన్స్ ఆఫ్ కచ్చికాలి ,దిహాండ్ ఆఫ్ ఫేట్,చైన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాటకాలు ,కలెక్టివ్ వార్ ఎగైనెస్ట్ పావెర్టి వ్యాసాసంపుటి రాసినది .విలియం ఫర్కుహార్ కాంటన్-రాసిన 12పుస్తకాలలో ది ఆఫ్రికన్ ఒకటి.దీనికి సీక్వెల్ గా దిఫ్లైట్స్ .వెస్ట్ ఆఫ్రికా ఇన్ హిస్టరీ కూడా రాశాడు .హస్సౌం సీసే –హిస్తోరియాన్ మ్యూజియం క్యురేటర్. గామ్బియన్ వుమెన్ , పేట్రియట్స్ , ఫౌండింగ్ ఫాదర్ రాశాడు విజ్ఞానసర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొన్నాడు, చాలావ్యాసాలురాసిన టివి పెర్సనాలిటి మిగిలినవారిలో వుయేడ్రమ్మే  ,అబౌ డిబ్బా,హస్సాన్ బుబాకర్,అగుస్టాజవారా ,జోసెఫ్ హెన్రి జూఫ్ ,అల్హాజి అలియు ఎబ్రిమా చాం జూఫ్ ,టాంసియర్ జూఫ్ ,అగాస్టామొహానే ,సుల్యమాన్ నియాంగ్ ,లేన్రి పీటర్స్ ,టిజాన్సల్లా ,సాలి సిన్ఘేటాలామిన్ సిన్నేహా ,ఫిలిప్స్ వీట్లీ ఉన్నారు ‘

126-గినియా దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ కు పడమట గినియా దేశం ఉన్నది .మౌంట్ నిమ్బా నేచర్ కు ప్రసిద్ధి .రాజధాని –కొనాక్రీ .కరెన్సీ –గినియన్ ఫ్రాంక్ .జనాభా -1.24కోట్లు .అధికారభాష –ఫ్రెంచ్ .ఇతరభాషలు –ఫుల ,కిస్సి ,కేపెల్లా,సుసు  వగైరా.మతం -85శాతం ముస్లిం లు .ఫ్రాన్స్ విద్యావ్యవస్థ అమలులో ఉంది .అక్షరాస్యత 32శాతం మాత్రమె .  కొనాక్రీ ఐలాండ్స్ ,కిన్డ్లా నేచర్,కంకాన్ యాత్రాస్తలాలు .నేరాలెక్కువ సురక్షితం కాదు .ప్రపంచ బాక్సైట్ గనులలో 25శాతం ఇక్కడే ఉన్నాయి .వజ్రాలు బంగారం కూడా లభిస్తాయి .అల్యూమిన ఉత్పత్తులు 80శాతం ఆదాయ వనరులు .

  • గినియన్ సాహిత్యం –మొదట్లో మౌఖికమే .పాపువా యూనివర్సిటి చొరవతో రచనలు జరుగుతున్నాయి .మొదటి మేగజైన్ కోవావే .1968లో ఆల్బర్ట్ మావొరీ కికి ‘’టెన్ దౌసండ్ యియర్స్ ఇన్ లైఫ్ టైం’’రాశాడు .పురుషరచయితలు-మొహముడ్ బా –Construire la Guinée après Sékou Touré, Éditions L’Harmattan, 1990
  • Guinée 1958-2008 :  రాశాడు .
  •  టీర్నో అబ్దుల్ రహ్మానే –వచనరచనలు చాలచేశాడు .ఫ్రూట్స్ ఆఫ్ మై దాట్స్ కవితా సంపుటి
  • సైడో బోకోం –చైనే నవల రాశాడు .బౌబుకర్ యాసినో డయల్లో –మానవహక్కుల పోరాట యోధుడు రచయితా .దేర్నో డయావోపెల్లేట్ -409కప్లేట్స్ రాశాడు .సలోమనా కాంటే-నుకో ఆల్ఫబేట్ సృష్టికర్త .ఫోదేబా కీటా-నాటకరంగ రచయితా దర్శకుడు .కమారాలాయే –దిఆఫ్రికన్ చైల్డ్ ,దిరేడియన్స్ ఆఫ్ దికింగ్ ,దిగార్డియన్ ఆఫ్ ది వరల్డ్ రాశాడు .టేర్నోమొనేమేమ్బో –లెస్ క్రాప్డ్స్ బిసె ,పెల్పోర్నియో ,పీయస్ సేయుల్ ,బీడ్ స్యూల్ వగైరారాశాడు .దిబ్రిల్ తామసిన్ నియానే – the father of the late model Katou.ఆలు –చారిత్రాత్మక రచనలు –లా టైతే,రెసిస్టన్స్ మొదలైనవి  లివ్రేట్ డీ బాల్లేట్ మేరీ మొదలైన నాటకాలు .హిస్టరీ డిఅఫ్రికి ,జాగ్రఫీ ,ఎడ్యుకేషన్ సివిక్ ,మొన్ బియు పేస్ లాగినీ చారిత్రకాలు రాచ్శాడు .విలియమ్స్ సస్సినే –అల్ఫాబీటే ,మెమొరి దీం పియూ ,లిజున్ హోమ్మేవగైరా.రాశాడు .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 123-ఇధియోపియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాల సారస్వతం

123-ఇధియోపియా  దేశ సాహిత్యం

గ్రేట్ రిఫ్ట్ వాలీతో విభజింప బడిన ఇథియోపియా దేశం ఆఫ్రికా కొమ్ము భాగాన ఉన్న ది.3మిలియన్ల సంవత్సరాలక్రిందటి శిధిలాలున్నాయి .12,13శతాబ్దాల రాక్ కట్ చర్చిలు,సమాధులు గోపురాలు  ఆకర్షణ .లేడీమేరీ జియాన్ చర్చ్ యాత్రాస్థలం .రాజధాని –ఆడిస్ అబాబా ,కరెన్సీ –ఇథియోపియన్ బిర్ర్. జనాభా -11కోట్లు .అధికారభాష –అమ్ హరిక్.ఇటాలియన్ ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు మతం –ఆర్ధడాక్స్ క్రిస్టియానిటి రోమన్ కేధలిక్ ,కొద్దిమంది యూదులు ఉన్నారు .అక్షరాస్యత 52శాతం .8ఏళ్ళ ప్రాధమిక ,నాలుగేళ్ల సెకండరి ఉన్నాయి .వ్యవసాయమే ముఖ్య ఆదాయవనరు .కాఫీ పప్పు ధాన్యాలు ,సేరియల్స్ ,బంగాళాదుంప చెరుకు ,కూరగాయలు పండిస్తారు .సురక్షిత దేశం .బ్లూ నైల్ ఫాల్స్ ,సిమీన్ పర్వతాలు ,లేక్ టానా మొదలైనవి టూరిస్ట్ స్పాట్స్ .

ఇధియోపియా సాహిత్యం –మూడు భాగాలలో సాహిత్యం ఉంటుంది .క్లాసికల్ సాహిత్యం లో చారిత్రిక విషయాలు వీరులపై కవిత్వం ,ఊహాత్మక తాత్విక రచనలు ,రొమాంటిక్,రాజకీయ సాహిత్యం .ఇదంతా గేఎజ్ సెమెటిక్ భాషలో ఉంటుంది .ఇవి హృదయాలలో చొరబడవు సాహిత్య సంస్కృతీ ప్రతిబింబించవు.

ఆక్సుమైట్ సాహిత్యం –క్రీ.శ 330-900-2000బిసి నుంచే ఈదేశం లో సెమెటిక్ భాష ప్రచారం లో ఉంది .340లో క్రిస్టియానిటి వచ్చాక గీజ్ భాష అధికారభాష అయి సాహిత్యం వచ్చింది.ఒకటవ శతాబ్దినుంచి ఇక్కడ క్రైస్తవం ఉంది .5,6శతాబ్దాలకు చెందిన గోఎజ్ స్క్రిప్ట్ లో గరిమ గాస్పెల్స్ దొరికాయి .ఆక్సుమైట్ కాలం లో వచ్చినదంతా క్రిస్టియన్ సాహిత్యమే .

పోస్ట్ ఆక్సు మైట్ సాహిత్యం -1200-1600ఆక్సుమైట్ కు దీనికీ మధ్య ఉన్న 300ఏళ్ళలో ఏ సాహిత్యమూ రాలేదు 1270లో సాల్మన్ రాజవంశకాల౦  లోరచనలు ఉన్నాయి. ఇది గేఎజ్ భాషా సాహిత్యానికి స్వర్ణయుగం గా భావిస్తారు అప్పటికి గేఎజ్ భాష అదృశ్యమైనా .ఈభాష స్థానం లో    ఆం హెరిక్ భాష వచ్చింది . 15వ శతాబ్దంలో ‘’దిఎక్స్ప్లికేషన్ ఆఫ్ జీసెస్ ‘’ఒకరాజు గారి జోస్యం.దీనికి 19వ శతాబ్దిలో ప్రాచుర్యం కలిగి రెండవ ధియోడరస్ రాజు ఈదేశానికి ఈ పేరు పెట్టాడు  .జరా యాకోబ్ కాలం లో సాహిత్యం వృద్ధి చెందింది .ఆయనే దిబుక్ ఆఫ్ లైట్ ,దిబుక్ ఆఫ్ నేటివిటి రాశాడు .ట్రూ ఆర్ధడాక్సి ని జాన్ క్రిసోస్టో౦  రాశాడు .లాస్ ఆఫ్ కింగ్స్ అనేది గేఎజ్ భాషలో ఉన్న దానికి అనువాదంగా వచ్చింది  అబ్బా ఏమ్బకోంరాసినుత్తరం హబాకుక్ ,గేట్ఆఫ్ది ఫెయిత్  లో ఇస్లాం ను ఎందుకు వదిలేయాలో ఉన్నది .17వ శతాబ్ది ఆఫ్రికన్ బయాగ్రఫి ఆఫ్ యాన్ ఆఫిదియోపియన్ వుమన్ ను  1672లో  గాలా వుడవోస్ రాస్తే ,ఇంగ్లీష్ అనువాదం పొంది 2017లో పాల్ హెయిర్ ప్రైజ్ పొందింది .

  16-18శతాబ్దాలకాలం లో అమ్హెరిక్ భాషవ్రాతభాషగా రూపు దిద్దుకొని  సాహిత్యం మొలకలు తొడిగింది  అబ్బా గోగోరిస్ ,స్నేహితుడు హియాబ్ లుడాల్ఫ్కలిసి ఈభాషలో మొదటి వ్యాకరణం, అమ్హేరిక్ –లాటిన్ నిఘంటువు  రాశారు  .ఏ హిస్టరీ ఆఫ్ ఇథియోపియా తోపాటు విజ్ఞానసర్వస్వమూ వెలువడింది .అబ్బా బోహ్రె అనే మాంక్ చారిత్రక రచయిత ,ఎత్నోగ్రాఫార్ .1593లో ‘’దిహిస్టరీ ఆఫ్ దిగల్లా ‘’గ్రంధం రాసి ప్రసిద్ధి  పొందాడు .ఇందులో 16శతాబ్దపు ఒరోమో ప్రజల గురించికూడా ఉంది .ఇతడే ‘’కింగ్ ఆఫ్ సరసా డేన్గేల్’’కూడా  సరసా డేన్గెల్ రాజుపాలన గురించి రాశాడు .

19వ శతాబ్దం నుంచి నేటిదాకా –అడ్డిస్ అలమాహేయు ట్రాజిక్ నవల ‘’లవ్ టు ది గ్రేవ్ ‘’రాశాడు .ఇదే ఆధునిక సాహిత్యం లో మాస్టర్ పీస్ అంటారు

పురుష రచయితలు  –జియోర్గిస్ ఆఫ్ సేగ్లా-మతగ్రన్ధరచయిత .బెఫెకూడు హైలు-నెట్ లో బ్లాగు నిర్వహిస్తాడు .2012లో బర్ట్ అవార్డ్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డ్  గ్రహీత .చిల్ద్రెన్ ఆఫ్ దెయిర్ పేరెంట్స్ గొప్పరచన .మెంగిస్టూ లెమా-మరేజేస్ బై అబ్డక్షన్ నాటకం తో పేరొచ్చింది .మారేజేస్ ఆఫ్ అన్ ఈక్వల్స్  బలేకాబా ఏనా ,ఎలేచ్చా గబిచ్చ నాటకాలు కూడా రాశాడు.జిబ్రేబ్ టేఫరి –కవి ,నాటకరచయిత .లైఫ్ పోషన్ ,డోంట్ ఫర్గెట్ యువర్  మిలిటరి డ్యూటి ,ఏ సోల్జర్ ఈజ్ నాట్ అఫ్రైడ్ ,లవ్ ఈజ్ ది డాక్టర్ మొదలైనవి రాశాడు

స్త్రీ రచయితలు  –ఎమోడిష్ బెకేలే –కవిత్వం,కధాసంపుటి  తో పాటు ఏడురచనలు చేసిన క్రైం జర్నలిస్ట్ .రివల్యూషనరి పోయెమ్స్ ,వేస్టెడ్ టైం,ఫ్రూట్ వితౌట్ ఫ్రూట్, మడ్ ఈజ్ బెటర్ నవల ,లైఫ్ వాంట్స్ లవ్-క్రైంనవల వగైరా రాసింది .బెల్లిని సియోం వోల్డీస్-సమానహక్కుల ఉద్యమకారిణి కవి రచయిత్రి .’’ధింగ్స్ ఐ ఇమాజిన్  టెల్లింగ్ మై డాటర్ ‘’కవితాసంపుటి .మోడరన్ స్లేవరి ఇన్ ఇధియోపియా,ఇధియోపియ వయోలెన్స్ ఎగైనెస్ట్ వుమెన్ ఆన్ ది రైజ్ వ్యాసావళి .ట్రాన్స్ ఫర్మేటివ్ స్పేస్ వగైరా .సేనేడు గేబ్రు –పార్లమెంట్ కు ఎన్నికైన మొదటి మహిళా .మేక్లిట్ హేడేరో –సంగీతరాణి.నాటకాలు రాసి ప్రదర్శించింది .వుయ్ ఆర్ అలైవ్. మొదలైన ఆల్బమ్స్ తెచ్చింది .మార్తా నసిబు -2005లో జ్ఞాపకాలురాసి ప్రచురించింది .మేరియా అబ్బేబు వయరెంగో-ఒరోమోభాష , దేశ సంస్కృతీ జ్ఞాపకాలు  లపై రచనలు చేసింది

124-గాబన్ దేశ సాహిత్యం

మధ్య ఆఫ్రికా అట్లాంటిక్ తీరాన దట్టమైన అరణ్యాలు అడవి మృగాలు ఉన్న  దేశం గాబన్ .రాజధాని –లిబ్రేవిల్ .కరెన్సీ –సె౦ట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 21లక్షలు .అధికారభాష –ఫ్రెంచ్ .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 84.7శాతం .6-16ఏళ్ళవారందరికి నిర్బంధ విద్య .ఆయిల్ ఉత్పత్తిలో ఆఫ్రికాలో అయిదవ స్థానం ఇదే ఆదాయవనరు .నేషనల్ పార్క్ లు దర్శనీయాలు .

గాబన్ సాహిత్యం –అమెరికా యూరోపియన్ రచయితల రచనలే ఉంటాయి  .ఏ థౌజండ్లీగ్స్ ఇంటూ దిఅన్ నోన్ పుస్తకం  బాగా ప్రాచుర్యం పొందింది.

ఈతరం రచయితలలో జస్టిన్ మింటేసా హానోరిన్ నూగు ,సిల్వి నేస్టెంఅన్గేలి రవ్రి స్త్రీరచయితలు .ఇంతకంటే వివరాలు దొరకలేదు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

121-ఈక్విటోరియల్ గినియా దేశ సాహిత్యం

మధ్య ఆఫ్రికాలో రియో ముని మెయిన్ లాండ్ తోపాటు అయిదు వల్కానిక్ ఆఫ్ షోర్ ఐలాండ్స్ ఉన్న దేశమే ఈక్విటోరియల్ గినియా.రాజధాని –మాలాబో .స్పానిష్ కలోనియల్ అర్కి టేక్చర్ కు ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధి .ఎరీనా బ్లాంకా బీచ్ డ్రై సీజన్ సీతాకోక చిలుకలు ఆకర్షణ .కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -13లక్షలు .రోమన్ కేధలిక్కులు ఎక్కువ .అక్షరాస్యత 95శాతం .ప్రీ స్కూల్ ప్రైమరీ సెకండరి హయ్యర్ విద్యావిధానం .14వ ఏడువరకు ఉచిత కంపల్సరి విద్య .  అధికార భాషలు –స్పానిష్ ,పోర్చుగీస్ ,ఫ్రెంచ్ .గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు –ఫాంగ్, బూబే ,కొమ్బే ,పిడిజిన్ ఇంగ్లిష్ ,అన్నబోనేస్సి ,ఇగ్బో ఆఫ్రికాలో స్పానిష్ మాట్లాడే దేశం ఇది .ఆఫ్రికా ఖండం లో అత్యంత సంపన్న దేశం .నల్లబంగారం అంటే బొగ్గు గనులకు ప్రసిద్ధి .చిన్న కమతాల రైతులు మాత్రం పేదవారు ,తగిన సహకారం లేకపోవటమే కారణం .కోకా పంట ఉత్పత్తి ,ఆయిల్ వగైరా ఆదాయ వనరులు .

ఈక్విటోరియల్ గినియా సాహిత్యం -1778-1968మధ్య కాలనీ ప్రభుత్వకాలం లో ఇతర ఆఫ్రికా దేశాలకు భిన్నంగా ఈ దేశం లో స్పానిష్ భాషలోమాత్రమే సాహిత్యం వర్ధిల్లింది .అదే ఇప్పటిదాకా కొనసాగు తోంది.కాని అప్పటి సాహిత్యం చాలాతక్కువగా లభ్యమౌతోంది .మోర్గాన్ స్టేట్ యూని వర్సిటి ప్రొఫెసర్ స్పానిష్ భాషలో1979-91కాలం లో  ప్రచురితమైన 30ఆన్దాలజీలపై రిసెర్చ్ చేస్తే ఈ దేశపు రచయిత రాసిన ఒక్క పుస్తకమూ దొరకలేదట .

   ఈ దేశ సాహిత్యం పై మొదటి రచన స్పానిష్ జర్నల్-స్పానిష్ గినియా .కాని ఇందులో ఈదేశ రచయితల రచనలేవీ లేవు .మొదటి ఈక్విటోరియల్ నవల లివెంసియో ఎవిటాఎనాయ్ రాసిన  ‘వెన్ ది కొమ్బేస్ ఫాట్’’.ఇందులో జాతులమధ్య పోరాటం ఉంటుంది .రెండవ నవల ‘’ఎ స్పియర్ ఫర్ ది బోబి ‘’.రచయిత డేనియల్ జోన్స్ మతామా .దాదాపు ఆత్మా కథవంటిది .1962-68మధ్య దేశ స్వతంత్ర పోరాటకాలం లో గొప్పరచనలేవీ రాలేదు .కొందరు కథలు లెజెండ్స్ ఎడిట్ చేసిజర్నల్స్ లో  వేశారు.వీరిలో ఫ్రాన్సిస్కో ఓబ్లాంగ్ ,రాఫెల్ మేరియా నుజే మొదలైనవారున్నారు .అప్పుడే మొలకెత్తుతున్న సాహిత్యపు మొలకల్ని ఫ్రాన్సిస్కో నకియాస్ నగూమా ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి డిక్టేటర్ అయి తొక్కేశాడు .చాలామందిప్రజలు దేశం వదిలి ప్రవాసం వెళ్ళారు .దీనినే బల్బోరా బొమ్కేస్ ‘’lost జనరేషన్ ‘’అన్నాడు .

  ప్రక్క దేశాల్లో స్థిరపడ్డ ఈదేశ రచయితలు   రెండుభాషల్లోనూ రచనలు చేశారు. వారిలో ఎల్ సుయోనో ‘’డ్రీం ‘’,డొనాటో’’దిక్రాసింగ్ ‘’,మోప్లాల్ లబోజ్  ‘’దిలాస్ట్ లెటర్స్ ఆఫ్ ఫాదర్ ఫ్లుజెంషియోఅబద్’’,లలోతమ స్వాతంత్ర్య హరణం గొప్పగా చిత్రించారు .హిస్టరీ ఆఫ్ ట్రాజేడి ఆఫ్ ఈక్విటోరియల్ గినియా ‘’ను డొనాటో బిడ్యోగా రాశాడు .’’వేర్ ఆర్ యు గినియా ‘’అని జువాన్ బాల్బొవా బోనేకా రాశాడు .ఈయనే ‘’ఎక్సైల్’’కూడా రాశాడు .ఆంథాలజిఆఫ్ గినియన్  లిటరేచర్ కూడా రాశాడు .

  1984నుంచి సాహిత్యానికి మంచి రోజులు వచ్చాయి .మేగజైన్ లలో సాంస్కృతిక సాహిత్య విశేషాలు ప్రచురించేవారు .సెంటర్ ఫర్ఇస్పానిక్ గినియా కల్చర్ ను 1982లో మలాబోలో స్థాపించి ఈ దేశ రచయితలకు  ప్రోత్సాహం కలిగించారు .దిఫైత్ఫుల్ ఫ్రెండ్ ,ను అన్నా లూద్రాస్ సోహోరా ,’’అఫేన్ దిలిటిల్ గోట్ క్వీన్ ‘’,ది లాస్ట్ లెసన్ ఆఫ్ ది వెనరబుల్ ఏమగా ఎలా ‘’నుఆన్టిమోఎసోనో నోడోమ్గో ,దిబూటే చీబా ‘’ను పెడ్రో క్రిస్టినో బురిబెరి 1987నుంచి 92వరకు రాశారు .’’షౌట్స్ ఆఫ్ లిబర్టి అండ్ హాప్’’కవితా సంపుటి ని అనాక్లిటోఓలా ముబే,’’డెలిరియం’’ ను మేరియా నుయో అంగూ 1991లో రాశారు .

  రెండవ తరం రచయితలు  ఆ దేశ జీవితాన్ని సింబాలిక్ గా చిత్రించారు .1985లో మేరియాలూసే అంగు మొదటినవల ‘’ఎకోమో’’పబ్లిష్ అయింది .అప్పుడే జువాన్ బోలోబా బోనేకా ‘’ది రీయూనియన్  దిరిటర్న్ ఆఫ్ ది ఎక్సైల్’’నవల వచ్చింది .’’వాయిసెస్ ఫ్రం ది సర్ఫ్’’మొదటి గినియా కవితా సంపుటి లో  సిరాకో బోకాసా తన బాధలు వ్యక్తపరిస్తే ,బోనేకా మొదటి ఆంథాలజిఆఫ్ పోయెట్రి’’డ్రీమ్స్ ఫ్రం మై జంగిల్ ‘’కవితా సంపుటి ప్రచురణ జరిగింది .1987లో ‘’ది డార్క్ నెస్ ఆఫ్ యువర్ బ్లాక్ మెమరి’’నవల డొనాటో బిడ్యోగో రాసి ప్రచురించాడు .

  సమకాలీన రచయితలలో కొందరు –ఆన్తిమో ఎసోనో ,మెర్సేడేస్ జోరా,జేరార్డోబేహారి ,మాక్సిమిలనో నుకోబో ,జోస్ఎనేమే ఒయోనో వగైరా .

122-ఎరిట్రియా  దేశ సాహిత్యం

ఈశాన్య ఆఫ్రికాలో యెర్ర సముద్రం ప్రక్కన ఇధియోపియా సరిహద్దులో ఎరిట్రియా  దేశం ఉన్నది .రాజధాని –అస్మారా .కరెన్సీ –ఎరిట్రియన్ నక్ఫా .జనాభా -32లక్షలు .ఆర్ధడాక్స్ క్రైస్తవులు సున్ని మతస్తులు ,రోమన్ కేథలిక్కులు ఉంటారు .టిగ్రినా టీగ్రె,దాహ్లిక్ ,ట్రిగ్రిన్యాలు మిగిలిన భాషలు .అధిరార భాష –ట్రి గ్రిన్యా .అక్షరాస్యత 84శాతం .ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ,  ,మిడిల్ ,సెకండరి విద్యా విధానం .వ్యవసాయం ముఖ్య ఆదాయం .జొన్న మొక్కజొన్న బార్లి ,గోధుమ సోర్ఘం ము ఖ్యపంటలు .అనుమతుఅలతోనే దేశంలో యాత్ర చేయాలి .రిస్క్ ఎక్కువ .

ఎరిట్రియా  సాహిత్యం –ఈ సాహిత్యం లో చారిత్రకకథలు ఎక్కువ .మత కవిత్వాలూ ఎక్కువే . ట్రిగ్రిన్యా భాషలో మొదట వెలువడిన పుస్తకం ‘’గాస్పెల్స్ అనువాదం’’1830లో రాయబడి ,1866లో ప్రచురితం .సాహిత్యభాషగా గీఎజ్ డామినేట్ చేసింది .తర్వాత టిగ్రినియ దాని స్థానం పొందింది .20వ శతాబ్దిలో మరిన్ని రచనలొచ్చాయి .గేబ్రే మేదిన్ దిఘ్నేయి జానపద కథలు,గాథలు సేకరించి1902లో రోమ్ లో  ప్రచురించాడు .34కథలలో ది బాయ్ హు క్రైడ్ ఉల్ఫ్ ఒకటి .కార్లో కొంటిరోస్సాని మౌఖిక కవిత్వం  సేకరించి ముద్రించాడు. దోగా విషాదగీతాలూ అచ్చు అయ్యాయి .రాస్ వాల్దామిక్ హీల్స్ ఆఫ్ హేజ్జేగా దిగ్గియాట్ హాలు ఆఫ్ జాజేగ్గా లు 19వ శతాబ్ది పోరాటాలనుంచి ఇప్పటివరకు సేకరించి ప్రచురించారు .

  సృజన రచన ‘’హౌ ది వరల్డ్ వజ్ సెట్ అబ్లేజ్  బికాజ్ ఆఫ్ ది టు సర్పెంట్స్’’అనే 270లైన్ల కవిత్వం 1916లో రోమ్ లో పబ్లిష్ అయింది .ఇది మొదటి ప్రపంచ యుద్ధ౦పై కామెంటరి.స్వతంత్రం ముందు ,తర్వాత నాటకం మాంచి ఊపు పొందింది .సోలోమన్ దిలార్ ,ఎస్సలాస్ సెగ్గాయ్మాస్గుం ,జెరియా నాటకాలు ప్రసిద్ధం .ఆ దేశ నాటక చరిత్రలో ఇవి మణిపూసలు .’’టిగ్రినియా  ట్రడిషనల్ ప్రావెర్బ్స్ అండ్ సాంగ్స్’’1942లో పబ్లిష్ అయింది .రినైసేన్స్ ఉద్యమం ఇక్కడా వచ్చి టిగ్రిన్యా భాషలో ఘెబ్రియాస్ హైలు ‘’ఎ స్టోరి ఆఫ్ ఎ కాన్స్క్రిప్ట్’’నవల రాశాడు .టేక్లాయ్  జేవేల్డి’’ డాన్ఆఫ్ ఫ్రీడం ‘’1954లోనవలరాశాడు రిసరక్షన్అండ్ విక్టరి’’నవల జగ్గా ఇలూసియాస్ జేవేల్డిరాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్

శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్

 

శంకర్ అని అందరూ ఆప్యాయంగా పిలిచే అంతర్జాతీయ పోర్ట్రైట్ చిత్రకారులు శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు 84వ ఏట నిన్న 9-7-20గురువారం హైదరాబాద్ లో మరణించారన్న ఇవాల్టి ఆంధ్రజ్యోతి వార్త చదివి బాధ పడ్డాను .వారితో నాకు ఎనిమిదేళ్లుగా సాహితీ అనుబంధం ఉంది .సరసభారతి పుస్తకాలు బాపు రమణ ల గారితో పాటు చెన్నై తిరువన్మయూర్ లో ఉంటున్న శంకర్ గారికి కూడా పంపమని ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సూచనమేరకు 2012నుంచి పంపిస్తూనే ఉన్నాను .అందగానే వారు ఫోన్ చేసి చెబుతూనే ఉన్నారు .ఒక వేళ వారు మద్రాస్ లో లేకపోతే ,పుస్తకాలు అందాయని అక్కడి వారు జాగ్రత్త చేశారని తానూ వెళ్ళాక తీసుకొంటాననీ చెప్పే సౌజన్యం శంకర్ గారిది .మొదట్లో ఫోన్లో తాను బాపు గారి తమ్ముడు శంకర్ అని పరిచయం చేసుకొని మరీ మాట్లాడేవారు .గోపాలకృష్ణ గారితోనూ మాంచి పరిచయమే ఉండేది బాపు రమణల గారితో పాటు .శంకర్ వేసిన తన పోర్ట్రైట్ ను నాకు మైనేని గారు పంపిస్తూ దాన్నే తానూ అన్నిటికీ వాడుతున్నానని ఆరాధనా భావం గా చెప్పారు అంతబాగా వచ్చింది చిత్రం .ఆతర్వాత నేను అడగకుండానే నా చిత్రమూ గీసి పంపిన  సహృదయులు శంకర్ గారు .

  ఇలా కొనసాగుతున్న మా సాహితీ బంధుత్వం తో నేను చొరవ తీసుకొని 2019 సరసభారతి ఉగాది వేడుకలలో పురస్కారం అందజేస్తాం రమ్మని ఫోన్ లో  ఆహ్వానించాను .’’బాపుగారిని మీలో చూసుకొంటాం .తప్పక అంగీకరించి విచ్చేయండి ‘’అని ఆహ్వానించాను .తన వయసు ప్రయాణానికి సహకరించటం లేదని కనుక రాలేనని చెప్పారు .వారు వస్తే బాపు గారిని సన్మానించుకోలేక పోయిన అదృష్టం వీరి సన్మానం తో తీరుతుందని భావించాను .వారి రాలేని అశక్తత ను కాదన లేకపోయాను .హైదరాబాద్ లో శ్రీ శంకర్ గారికి తమ అన్నగారు బాపుగారి పురస్కారం అందించినపుడు మనసారా అభినందించి ఫోన్ చేసి మెయిల్ కూడా రాశాను రెండిటికీ వారు చక్కగా స్పందించారు వినయంగా .

  అంతకు  నాలుగేళ్ల క్రితమే వాగ్గేయకారులపై తాము చిత్రించిన చిత్రాల పుస్తకం నాకు పంపారు .ఆనందంగా అందుకొని ధన్యవాదాలు చెప్పాను. మెయిల్ లో .ఒక సారి వారు మెయిల్ రాసి ‘’మీకు అభ్యనతరం లేకపోతె నాపుస్తకాలు కొన్ని మీకు పంపితాను వాటిని మీ లైబ్రరీలో అందజేయగలరా ?’’అని కమ్మని ఆంగ్లం లో రాశారు .వారెప్పుడు రాసినా ఇంగ్లీష్ లోనే రాస్తారు .మహద్భాగ్యంగా అందజేస్తానని తెలియజేయగా, వారు పంపటం, నేను ఉయ్యూరు లైబ్రరీలోలో ఇచ్చి ,లైబ్రేరియన్ కు  అందజేసిన  ఫోటోలుకూడా వారికి పంపాను .దీనికి పరమానందం పొందారు శంకర్ .’భోళాశంకరులు’’ అనిపించింది .

   ఈ మధ్య ఫేస్ బుక్ లో వారి పోర్ట్రైట్ లను నిత్యమూ చూస్తూ అందులోని పర్సనాలిటీలపై ,నా   వారి చిత్ర నైపుణ్యం పై నా కామెంట్స్ సర్వ సాధారణ మయ్యాయి .ఒకటి రెండు చిత్రాలలో వ్యక్తుల స్వరూప స్వభావాలు రాలేదని కామెంట్ కూడా చేశాను .దాన్ని స్పోర్టివ్ గా  తీసుకొని ,అది తనకు దొరికిన పాత ఫోటో ఆధారంగా  గీసిందనీ లేటెస్ట్ గా గీశాను మళ్ళీ చూడమని వెంటనే స్పందించటం నన్ను మహ దానంద పరచింది.  వారిలోని సంస్కారానికి నమస్కరించాను .ఆర్టిస్ట్ ఎవరైనా తానూ వేసిన బొమ్మ బాగులేదని అంటే సహించటం చాలా కష్టం . ఒక వేళ శంకర్ గారి చిత్రం ఏ కాకారణం వల్లనో ఫేస్ బుక్ లోనేను చూసి అకామేంట్ చేయక పొతే, ఆమర్నాడు విడిగా నాకు మెయిల్ లో పంపేవారు .ఇలాంటి వారు ఉంటారా అనిపిస్తుంది .

  ఈ సందర్భంగా శంకర్ గారు కిందటి నెల మొదట్లో నాకు మెయిల్ రాస్తూ  కర్నాటక లో ఒక మేగజైన్ కవుల రచయితల ప్రసిద్ధ వ్యక్తుల జయంతి , వర్ధంతి  నాడు తన చిత్రాలను ప్రచురించి వారికి ఘననివాళి అర్పిస్తోందని చెప్పి మనతెలుగులో ఇలా కవుల రచయితల ప్రసిద్ధ వ్యక్తుల పుట్టిన రోజు మరణతేదీ లున్న పుస్తకం ఏదైనా ప్రచురితమైనదా ‘’అని అడిగారు .నేను వెంటనే ‘’అలా ఉన్నట్లు నాకు తేలేదు .సుమారుగా పదేళ్ళ క్రితం శ్రీ జివి పూర్ణ చ౦ద్  నాకు ఫోన్ చేసి తయారు చేయమని కోరితే రెండు రోజుల్లో సుమారు వందమంది పై రాసి ఆయనకే పంపానని, దాన్ని కొంతకాలం నడుస్తున్న చరిత్ర మాసపత్రిక అనుసరించిందని ,ఇప్పుడు ఆలిస్ట్ నా దగ్గర లేదనీ చెప్పాను .ఆయన ఇంటరెస్ట్ నన్ను కదిలించింది .మళ్ళీ నేనే సుమారు 20మంది పుట్టిన గిట్టిన తేదీలు సేకరించి వెంటనే శంకర్ గారికి పంపాను .నిజంగా ఆయనకు ఇది అక్కరలేదు .ఆయన చిత్రాలన్నీ  ఈ తేదీల లను అనుసరించి గీసినవే .

    బహుశా కిందటి డిసెంబర్ లో ననుకొంటా రమణగారిశ్రీమతి శ్రీమతి  శ్రీ దేవి దేవి గారు రాసిన రామాయణ రమణీయం పుస్తకం నాకు పంపారు .వెంటనే చదివి మెయిల్ రాయటమే కాక దానిపై ఆర్టికల్ కూడా నెట్ లో రాస్తే ,చదివి  శ్రీదేవిగారికి కూడా చదివి వినిపించాననీ ,ఆమెకు వాట్సాప్ లో పంపానని చెప్పిన అల్పసంతోషి .శ్రీదేవిగారు నా ఆర్టికల్ చదివిసంతోషంగా  ఫోన్ చేసి మాట్లాడారు .అప్పటిదాకా శంకర్ గారి అమ్మాయిని రమణ శ్రీదేవి గార్ల అబ్బాయి ప్రముఖ టివి సీరియల్స్ నిర్మాత రచయిత ‘’వరముళ్ళపూడి’’ గారికిచ్చి వివాహం చేశారని ,శంకర్ గారు వారికి వియ్యంకులనీ నాకు తెలీదు .అప్పటినుంచి శ్రీదేవిగారుకూడా నాతో ఫోన్ లో మాట్లాడటం శంకర్ గారి సౌజన్యమే .

  సరసభారతి శ్రీ శార్వరి ఆవిష్కరణ మూడు పుస్తకాలు జూన్ మొదటివారం లోనే శంకర్ గారికి పంపాను .అందగానే యథా ప్రకారం ఫోన్ చేసి అందాయని చెబుతూ ‘’ఈ సారి మీరు పుస్తకాలు ప్రచురిస్తే అందులో నేను గీసిన చిత్రాలేమైనా కావాలంటే నేనే మీకు పంపిస్తాను .ఎవరివైనా అందులో చిత్రాలు వేయాలంటే నేనే వేసి నేనూ మీ సరసభారతి సాహిత్య సేవలో పాలు పంచుకొంటాను మొహమాట పడకండి ‘’అని కమ్మని తెలుగులలో అతి ప్రశాంత వాక్కులతో  అత్యంత శుద్ధ మనస్సుతో చెప్పిన వినయ వివేకశాలి శంకర్ గారు .’’అలాగే ఈ సారి తప్పక మీసేవలనూ సరసభారతి వినియోగించుకొంటు౦ది  .మీ సహృదయత కు ధన్యవాదాలు ‘’అని చెప్పాను .బాపూ గారబ్బాయి పేరు వెంకటరమణ గారేనాని అడిగితె అవునని చెప్పిబాపుగారిల్లు డెవలప్ మెంట్ కు ఇచ్చారని అబ్బాయి  ఆ యింటి ప్రక్కనే  తమ సోదరి ఇంట్లో ఉంటున్నారని బాపుగారి అడ్రస్ కు పుస్తకాలుపంపితే వారే అందజేస్తారనీ చెప్పారు ఫోన్ లో .అలాగే నేనుపంపటం బాపుగారబ్బాయి అందాయని ఫోన్ చేసి చెప్పటం జరిగింది .బాపు గారు  వారి అబ్బాయి గారు ,తమ్ముడు శంకర్ గారు, రమణగారు  వారి శ్రీమతి శ్రీదేవి గార్లు అందరూ గొప్ప సంస్కార శీలురే .బహుశా రామాయణం చదివి అనుసరిస్తూ ఆసుగుణాలు పుణికి పుచ్చుకొని ఉంటారనిపిస్తుంది నాకు .

    సుమారు 20 రోజులక్రితం శ్రీదేవిగారుఫోన్ చేసి శంకర్ గారికి నేనుపంపిన ఊసుల్లో ఉయ్యూరు పుస్తకం చదివాననీ ,చాలా బాగా ఉందనీ తన చిన్నప్పటి ఆరుగొలను సంగతులన్నీ మళ్ళీ  తన కళ్ళముందు  కదలాడాయని చెబుతూ ,నేను రమణ గారిపై రాసిన ‘’హాస్య రమారమణుడు ‘’వ్యాసం గొప్పగా ఉందని దాన్ని రాజమండ్రిలో శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యంగారు ఆయన స్నేహితుడెవరో చదివి బాగుందని చెప్పి పంపితే తన ‘’గోదావరి ప్రభ ‘’మార్చి మాసపత్రికలో ప్రచురించి తనకు పంపారని చెప్పటం ,ఆతర్వాత సుబ్రహ్మణ్యంగారు నాతో మాట్లాడటం ,దాన్ని నాకూపంపటం గురించి ఇదివరకే రాశాను చర్విత చర్వణం చేశాను .ఈ సందర్భంలోనే శ్రీదేవిగారు శంకర్ గారికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్నారని చెప్పారు .నేను వెంటనే శంకర్ గారికి మెయిల్ రాసి త్వరలో కోలుకోవాలని కోరాను .ఇవాళ పేపర్ లో వారి మరణవార్త చూసి బాధపడ్డాను .ఇవాళ ఉదయం శ్రీదేవిగారు ఫోన్ చేసి ఈ విచారకరవార్త తెలియజేశారు .ఉదయమే జ్యోతి పేపర్ చూసి తెలుసుకొని అందరికీ ఆ విషయాలు పంపానని చెప్పాను . ఇంకా ఎన్నో అవార్డ్ లు పొందాల్సిన మహా వ్యక్తీ శంకర్ గారు .శంకర్ గారు ఇంత సాధారణంగా గా ఉండటం చూసి ఆయనేదో సాధారణ చిత్రకారులే లే అనుకున్నాను .తీరా నెట్ లో వెతికితే వారి మహోత్కృష్ట     స్థితి చూసి దిమ్మతిరిగిపోయింది .సూక్ష్మ౦గా ఆ వివరాలు తెలియ జేస్తాను

  ఆకాశవాణిలో 1963 నుండి కొలువులో ఉండి, అనేక విధాలుగా సేవలందించి 1995 లో చెన్నై స్టేషను డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక, తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగంలో కృషి చేస్తున్నారు. పలు రంగాలలో ఉన్న ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నారు. 2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది. శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు అక్టోబరు 2011 లో, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతిలో ప్రదర్శించబడ్డాయి.పెన్సిల్ తోనూ, చారోకోల్ తోనూ అనేకమంది ప్రముఖుల క్యారికేచర్ లు చిత్రించారు.దాదాపు 1500 కు పైగా అటువంటి అద్భుతమైన బొమ్మలు వేసి ఆయన ఇటీవలే’’ ఇండీయన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’’ లో స్థానం పొందారుకూడాను.

శ్రీ శంకర్  ప్రతిభను గుర్తించి ‘తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్’ లో కూడా స్థానం ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని 2014 లో అందజేసింది..

శంకర్ గారి ఆత్మకు శాంతికలగాలనీ కోరుతూ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

image.pngimage.png

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-20-ఉయ్యూరు

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 119-డిజి బౌటి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

119-డిజి బౌటి దేశ సాహిత్యం

తూర్పు ఆఫ్రికాలో వల్కనోలు బీచెస్ ,ప్రపంచంలోనే అత్యంతఉప్పుశాతం ఉన్న సముద్రం ,పొదలు డనాకిల్ ఎడారి  ఉన్నసిటీ  దేశం డిజిబౌటి .లేక్అబ్బే వద్ద నోమాడిక్ అఫార్ తెగల ప్రజలు అతిప్రాచీనకాలం లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .చిమ్నీ లాంటి మినరల్ ఫార్మేషన్స్ వి౦తగా ఉంటాయి .కరెన్సీ- డిజబౌటి ఫ్రాంక్ .జనాభా -9.5లక్షలు .ఫ్రెంచ్ అరబిక్ అధికార భాషలు.ప్రజలభాష డిజిబౌటి.సున్ని ముస్లిం ఇస్లాం దేశం . 30శాతం మగ ,15శాత౦ ఆడ మాత్రమె అక్షరాస్యులు .ఇప్పుడిప్పుడే నిర్బంధ విద్య అమలులోకి వచ్చింది .చర్మాలు కాఫీ రద్దు ఇనుము ఆదాయవనరులు .లాక్ అస్సల్ ,మౌచా ఐలాండ్ ,డే ఫారెస్ట్ నేషనల్ పార్క్ దర్శనీయ ప్రదేశాలు .సురక్షిత దేశం .దేశాన్ని నెక్స్ట్  టు  దుబాయ్ అంటారు

డిజిబౌటి సాహిత్యం –అనాదిగా కవిత్వ౦ ఉన్నది .అభి వృద్ధి చెందిన సొమాలి రకమైన ,గాబే ,జిఫ్ఫో ,గీరార్ ,విగ్లో ,బురాన్ బుర్,బీర్ కేడ్ మొదలైన గీతాలు ప్రచారం లో ఉన్నాయి .సాహిత్యమంతా ఇస్లాం కు సంబంధించిందే ఎక్కువ .ఎలిజి , స్తుతి శృంగారం ,దూషణ ,ఆనందం ,మార్గదర్శకత్వం పై కవిత్వం ఉంటుంది .బరురోడిక్ అనేది ఒక ప్రసిద్ధుని పై స్మ్రుతి .యుద్ధవీరుడు ,దైవీ భూతుడు కవి లపై రాసినవి అఫార్ లు .ఇవన్నీ జానపదాలే తరతరాలుగా మౌఖికంగా నిలచినవే . యుద్ధ గీతాలు బాగా ప్రచారమయ్యాయి. శిహాబ్ ఆల్ దిన్-రాసిన ‘’ఫుటా అల్ అబాష్ ‘’అనే మధ్యయుగ చరిత్ర ముఖ్యమైనది .అబిసీనియ  ను ఆడాల్ సుల్తాన్ సైన్యం  యుద్ధం లోఓడించినప్పటి 16శతాబ్ది చారిత్రిక కధనం అది .ఇటీవల చాలామంది కవులు రచయితలూ తమజ్ఞాపకాలను రచనలలో పొందు పరుస్తున్నారు

 డిజి బౌటి సాహిత్యం ఇంకా యవ్వనం లోనే ఉన్నది .1960లో ప్రారంభమైంది .మొట్టమొదటి కవయిత్రి,రచయిత్రి అబ్డౌ రుహ్మాన్ వబెరి మల్లెల సుగంధ కవిత్వం రాసి పరిమళాలు వెదజల్లింది .విలియం జే ఎస్ స్వాద్ ఈదేశ కవిత్వ పిత .కాస్మిన్ అనే కవితా సంపుటితో దేశంలోనూ ఇతరదేశాలలో ప్రసిద్ధిపొందాడు .ఫ్రెంచ్ భాషకు పయనీర్ గా భావిస్తారు .లీ రివీల్ అనేది ఒక్కటే ఇక్కడి  పత్రిక  .హౌసీన్ అబేది రాసిన –అబిది దిచైల్డ్ ఆఫ్ ది ఫ్రెంచ్ టేర్రిటరిఆఫ్ అసర్సండ్ ఇస్సాస్ 1972ప్రచురితం .దీన్ జోమినిక్ పీనల్ బయగ్రఫిగా ఒక పుస్తకం రాశాడు .ఒబర్ ఒస్మాన్ రబెహ్ –దిసర్కిల్ అండ్ దిస్పైరల్ రాశాడు .దేబార్రే నటుడు నాటకకర్త ప్రయోక్త దర్శకుడు .

120-ఈజిప్ట్ దేశ సాహిత్యం

 ఉత్తర ఆఫ్రికాను మధ్య ప్రాచ్యంతో కలిపేది ఈజిప్ట్ దేశం .నైలునది పరివాహక ప్రాంతం పారాలు అనే చారిత్రాత్మక కట్టడాలు స్మ్రుతి చిహ్నాలు ,పిరమిడ్లు ,రాజుల సమాధులు వగైరాలకు నిలయం.కర్నాక్ దేవాలయం ప్రసిద్ధి .రాజధాని –కైరో .కరీన్సి –ఈజిప్షియన్ పౌండ్ .జనాభా .దాదాపు 10కోట్లు . అధికశాతం ముస్లిం లు కొద్దిమంది క్రిస్టియన్లు ఉన్నారు .అరబిక్ భాష అధికార భాష .అక్షరాస్యత 71శాతం .నిర్బంధ విద్యావిధానం బేసిక్ విద్య కి౦డర్ గార్డెన్,ప్రాధమిక విద్య ఉంటాయి .వ్యవసాయం మీడియా ,పెట్రోలియం  సహజ వాయువు ,టూరిజం ఆదాయవనరులు .ఆరబ్ లీగ్ లో సభ్యదేశం .

 ఈజిప్ట్ సాహిత్యం –సాహిత్యం అంతా రోమన్ ఆధిపత్యం వరకు  ఈజిప్షియన్ భాషలోనే ఉండేది .పుస్తక సంస్కృతికి నాంది పలికింది ఈజిప్ట్ .మొదట్లో పేపిరస్ పై రాసేవారు .మొదటి సాహిత్యం సిన్హూయీ కధ.తర్వాత ది ఫేమస్ బుక్ ఆఫ్ డెడ్.ఇక్కడి సాహిత్యాన్ని విస్డం లిటరేచర్ –జ్ఞాన సాహిత్యం అంటారు .ప్రాచీన ఈజిప్షియన్లపై నైలునది ప్రభావం జాస్తి .ప్రక్కదేశాలనుంచి మేధావులు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు .ఈజిప్ట్ కవి ,రచయితా ‘అపల్లోనియాస్  ఆఫ్ రోడ్స్’’, డయనోసియా కా అనే ఎపిక్ కావ్యం రాసిన నానోస్ ఆఫ్ పానాపోలిస్ చాలా ప్రసిద్ధులు .మధ్యయుగ గాధ సినూయే క్లాసిక్ గా భావిస్తారు

 1-4శతాబ్దాలమధ్య అలెగ్జాండ్రియా క్రైస్తవానికి ప్రాధాన్యం కలిగింది .కాప్టిక్ రచనలు వచ్చాయి .నాగ్ హమ్మాది లైబ్రరి లెక్కలేనన్ని గ్రంధాలను రక్షించింది .18వ శతాబ్దిలో ముస్లిం లు ఈ దేశాన్ని ఆక్రమించి పాలించారు .పాపిరస్ బదులు   పేపర్ వాడకం లోకి వచ్చింది .ప్రజలంతా ఇస్లాం తీసుకొన్నారు .ఐబాల్ అల్ నఫీస్ అనే నవల ఆరబ్ ఈజిప్ట్ లో వచ్చిన మొదటినవల .అరేబియన్ నైట్స్ కధలు మధ్యయుగ కధనానికి ప్రతిబింబం .పర్షియా బాగ్దాద్ కధలూ బాగా ప్రచారమయ్యాయి .1798లో నెపోలియన్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది .1805లో మహామ్మదాలి ‘’ అమీరి ప్రెస్’’ ఏర్పాటు చేశాడు .మొదట్లో అరబిక్ అటోమాన్ టర్కిష్ రచనలే ముద్రించారు .ఆల్ వకత్ న్యూస్పేపర్ వచ్చింది

  19 వ శతాబ్దిలో నహ్డా ఉద్యమమ అంటే రినైసేన్స్ ఉద్యమం వచ్చి సంస్కృతితో పాటు సాహిత్యాన్నికూడా ప్రభావితం చేసింది .పాన్ఇస్లామిక్ రివల్యూషనరి ని మొహమ్మద అబ్డూ మొదలైనవారు తెచ్చారుకాని ఎక్కువకాలం నిలవలేదు.ఇస్లామిక్ మోడర్నిజం కు ఆద్యుడు అబ్డూ .ప్రభావవంతమైన రచనలు రిసలత్ అత్తావుహ్ద్,షర్హ్నః అల్ బాలాఘా ,మొదలైనవి రాశాడు .మొహమ్మద్ హుస్యాన్ హే కాల్ మొదటి ఈజిప్షియన్  ఇస్లామిక్ నవల ‘జేనాబ్ ‘’రాశాడు .ఈ శతాబ్దిలో తాహా హుస్సీన్ , నగూబ్ మెత్ ఫౌజ్ లు కూడా ప్రదిద్ధులైన రచయితలే  .మెత్ ఫౌజ్ కు సాహిత్యం లో మొదటి నోబెల్ ప్రైజ్ వచ్చింది .

  1990తర్వాత స్త్రీలు విజ్రుమ్భించి రాస్తున్నారు .ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ అరెబిక్ ఫిక్షన్ ఏర్పాటుచేసి సమర్ధులకు అందిస్తున్నారు .చాలామంది క్లాసిక్ ఆరబ్ లోనే రాస్తున్నారు

ముఖ్య రచయితలలో కొందరు –తాహాహుసేన్ ,యూసఫ్ ఇడ్రిస్,సోనల్లా ఇబ్రహీం ,నయుబ్ మతాఫౌజ్ ,నూర్ అబ్దుల్ మజీద్

ముఖ్యనవలలు –దిబ్లూ ఎలిఫెంట్-ఆహ్దాఫ్ సోయి , ,దిలాంప్ ఆఫ్ హం హసీద్ ,హెప్తా ,దియాకూబియన్ బిల్డింగ్ ,పాలస్ వాక్ ,పాలస్ డిజైర్ ,షుగర్ స్ట్రీట్-నాగాబ్ మౌత్  ,దిఓపెన్ డోర్,ఎస్పారో ఫ్రం దిఈస్ట్,ది కాల్ఆఫ్ దికర్లూ-కాహాహుస్సే .డెత్ ఆన్ దినైల్ –అగతా క్రిస్టి,దిగోల్డెన్ గాబ్లిట్-ఈలోస్ జార్వి ,దిఈజిప్షియన్-మికా వాల్టర్

నాగుబ్ మొహఫౌజ్ ఒక్కరికే సాహిత్య నోబెల్ ప్రైజ్ వచ్చింది

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 117-కామోరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

117-కామోరస్ దేశ సాహిత్యం

 ఆఫ్రికా తూర్పు తీరం లో అగ్నిపర్వత ఆర్చిపేలగో లో ,హిందూ సముద్ర జలాలలో మొజాంబిక్ చానల్ లో కామోరస్ దేశం ఉన్నది.అనేక బీచుల సముదాయం .రాజధాని –మొరోని .కరెన్సీ –కామోరియన్ ఫ్రాంక్ .జనాభా -8లక్షల 30వేలు .ఆఫ్రో ఆరబ్ లు ఎక్కువ శాతం ,మలగాస్సి వారు తక్కువ శాతం జనం ఉన్నారు .అతి బీద దేశం .యాత్రిక సురక్షిత ప్రదేశం .సున్నిముస్లిం మతం .ఫ్రెంచ్ అధికార భాష .కామోరియన్ ,అరబిక్ భాషలు మాట్లాడుతారు .ఆరేళ్ళ ప్రాధమిక విద్య అమలులో ఉన్నది .అక్షరాస్యత 59 శాతం .వ్యవసాయ సబ్సిడీలద్వారా నే దేశం గడుపుతోంది .

కామోరియన్ సాహిత్యం –మహిళా రచయితలు- కోరేలీ ఫ్రీ – నర్స్ ,మొదటి నవలా రచయిత్రి,కవయిత్రి .జీవితాంతం కవిత్వం ఫిక్షన్ రాస్తూనే ఉన్నది ఫ్రెంచ్ ,జర్మన్ భాషలు రెండిట్లోనూ రాసేది ఆరుపుస్తాకాలు రెండు సిడిలు తెచ్చింది ఆమెకవిత్వానికి సంగీతం కూడా కూర్చబడినది .లా పెరీ డెస్కొమేరెస్,లాట్రేకోటేలోషియన్,డి జర్నల్ డి మాయా కాన్ఫిడెన్స్ డి అన్ చట్ లు ఆమె రచనలు .

తౌఫట్ మౌహ్టారే-ఫారిన్ లాంగ్వేజెస్ లో డిప్లోమాహోల్డర్ .కామోరియన్ వచనం లో రచనలు చేసింది. కవిత్వం కూడా రాసింది .నవలలు రాసి ఆ నవలా సంపుటికి ‘’ఆమెస్ సస్పెండియస్’’అని పేరుపెట్టింది  .చాలా విషయాలపై రచనలు చేసింది .

ఫైజా సోలె యూసఫ్ –జర్నలిస్ట్ ,నావలిస్ట్ .2015లో గిజ్జా నవలరాసి ప్రచురించింది .ఆల్ వతన్ పత్రిక సంపాదకురాలు .రచనలకు అవార్డ్ లు అందుకొన్నది .

కొన్ని ముఖ్యమైన పుస్తకాలు –లే కాఫిర్ డుకర్తాలా –మహమ్మద్ తోహిరి ,ఎఫిష్ కాట్ ఇన్ టైం-సమంతా వీన్ బెర్గ్ ,అంగుళి సోల్స్ రోచే –అలీ జమీర్ ,దిబోన్ మాన్ ఆఫ్ బెనారస్ –టేర్రి టారోఫీ,టేల్స్ ఫ్రం ది టారిడ్ జోన్ –అలెక్షన్దర్ ఫ్రేటర్,దికాస్మోపాలిటీస్-అట్రోసా అరెక్సియ వగైరా .118-కాంగో దేశ సాహిత్యం

మధ్య ఆఫ్రికాలో ఒంటరి దేశం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని పిలువబడే కాంగో దేశం .ప్రపంచ పెద్దనదులలో కాంగో లేక జిరో రివర్ ఒకటి.ఈ నదిని బట్టేదేశం పేరు వచ్చింది .పూర్వపుపేరు జైర్.సబ్ సహారా ప్రాంతం లో పెద్ద దేశం .ఆఫ్రికాలో రెండవపెద్ద దేశం .ప్రపంచంలోనే 11వ పెద్ద దేశం కూడా .రాజధాని –కిన్షాసా .కరెన్సీ –కాన్గోలీస్ ఫ్రాంక్ .జనాభా .8న్నర కోట్లు .అధికార భాష ఫ్రెంచ్ .సగం మంది కేధలిక్కులు మిగిలినవారు ప్రోటేస్ట౦ట్లు పెంతేకోస్తులు .కికొంగా ,లింగాలా ,స్వాహిల్లి ,సులూబా భాషలు మాట్లాడుతారు .అక్షరాస్యత శాతం 83.అందరికి 13ఏళ్ళ విద్య తప్పని సరి .వ్యవసాయం ముఖ్య ఆదాయం పశుపోషణ ఫిషింగ్ ,అడవులు కూడా ఆదాయవనరులే .అగ్నిపర్వతాలు వైల్డ్ లైఫ్  మొదలైన 10టూరిస్ట్ స్పాట్ లున్నాయి .

కాంగో సాహిత్యం -1950నుంచే ఆధునిక సాహిత్యం వచ్చింది .1937లొటికాయాడీ బోఎమ్పైర్,దాదత్ డోమాన్గోముఖ్య రచయితలు ,.జీన్ మలోనా , 1954లో ‘’కోఎర్ డీఆర్యేన్ని’’రాసి 1954లో ప్రచురించాడు .ముగ్గురు ముఖ్య రచయితలగురించి తెలు  సుకొందాం .ఎ.మోబనాకో –చాలానవలలు రాశాడు .ఇతని ‘పెట్టి పిమేంట్ ‘’నవలకు 2015లో మాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది.కోలి జీన్ బొఫేన్ –కాంగో ఇన్క్ ది  టెస్ట మెంట్ ఆఫ్  బిస్మార్క్  నవలతో బాగా పేరుపొందాడు.స్థానిక భాషా భావాలతో తీర్చి దిద్దిన నవల .కాంగో అంటే దేశం కాదుఒక కంపెని అని అభిప్రాయపడ్డాడు .యూరప్ ఎలా తనకున్న వనరులతో వృద్ధిపొందిందో కాంగో కూడా అలాటి అభి వృద్ధిసాధించి౦దనిదని తెలిపాడు  .ఫిస్టన్ మువాన్జా ముజిల –‘’ట్రామ్-83’’నవల రాసిన ఈతరం రచయిత.కాకిగోలలాంటి వచనం కట్ డైలాగులు ,తీవ్రస్వరం తో రాసిన నవల ఇది .ఎన్నోపాత్రలు విభిన్న మనస్తత్వాలు అన్నిటా సెక్సువాలిటిలతో ఓ కానర్, స్కాట్ ఫిట్జ రాల్డ్ ను గుర్తుకు తెస్తాడు .మరి కొందరు రచయితలలో- లియిని ఆబో ,లోకోల్ బోలంబే ,అమిని కిశుగి ,కామాస్వయూర్ కమండ ,పాట్రిక్ ముకాబల ,లి ఏం యొకా ,సంగా విరింగియానా మొదలైనవారున్నారు ‘.

కాంగో గైనకాలజిస్ట్ ,’’డాక్టర్ మిరకిల్ ‘’అని ప్రసిద్ధి చెందిన డెనిస్ ముక్ వేజ్ కు 2018లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

115- సెంట్రల్ ఆఫ్రికా దేశ సాహిత్యం

  సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం మధ్య ఆఫ్రికాలో సూడాన్ కు ఆగ్నేయంగా ఉంది.దీనిలో భాగం గా కామెరూన్ ,చాడ్ ,కాంగో ,బ్రజవిల్లీ , డెమోక్రాటిక్,ఈక్విటోరియల్ గినియా,గబాన్ సావో టోమ్అండ్ ప్రిన్సిపి దేశాలున్నాయి . రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు  బంగూయి రాజధాని .కరెన్సీ –సేన్త్రలాఫ్రికన్ CFA ఫ్రాంక్ –జనాభా -47లక్షలు .అధికార భాషలు-సాంగో ,ఫ్రెంచ్ .స్థానిక భాషలు 72ఉన్నాయి .విపరీతనేరాలు సాయుధ దోపిడీ కి కేంద్రం చాలాభాగం సైన్యం పర్యవేక్షణలో ఉంటుంది .ఖనిజాలు ,క్రూడాయిల్ ,గోల్డ్ ,డైమ౦డ్  ,యురేనియం, కోబాల్ట్ నిలయం. ప్రపంచ పదిపేద దేశాలలో ఒకటి .అత్యల్ప జిడిపి ఉన్న దేశం.క్రిస్టియన్లు ముస్లిం లు ఉన్న దేశం  .ఉచిత నిర్బంధ విద్య ఆలులో ఉన్నది .37శాత౦మాత్రమె అక్షరాస్యులు.వ్యవసాయం అడవులు ఆర్దికవనరులు .

  సెంట్రల్ ఆఫ్రికన్ సాహిత్యం –మహిళా రచయితలు –ఆండ్రీ బోవిన్ –మానవహక్కుల ఉద్యమకారిణి .మై కంట్రీ అనే ఆటో బయాగ్రఫి రాసింది .జార్జేట్ ఫ్లారెన్స్ కోట్ డిబల్లీ –ఇంగ్లిష్ ప్రొఫెసర్ .కవితా సంపుటి’’ క్లేస్ట్ లా వీ ‘’207లో రాసి ప్రచురించింది .’’నాగో ఓయు కామెంట్ సెన్ సోటిర్ 2008లో రాసింది .ఎడ్రిన్ ఎబౌజా –బాలసాహిత్యం తోపాటు చాలానవలలు రాసింది .అందులో బెంగూ అల్లోయ్ ,లీ బియు డు బియాన్ బియాన్ వంటివి ఉన్నాయి .

 పురుషులలో –ర్రఫెల్ నజబొమడ యకోమా చారిత్రిక రచనలు చేశాడు .ఎలిజబెత్ లాన్కిఒలొఫియొ జర్నలిస్ట్ .ఎబ్రెల్ గౌమ్బా ,ఎటేన్నీగోయమిడే,మార్టిన్ జిగు ,జీన్ పాల్ నగాపుండేలు కూరా ప్రసిద్ధరచయితలే .

116-చాద్ దేశ సాహిత్యం

 చాద్ దేశం మధ్యఉత్తర ఆఫ్రికాలో ఉంది.సరిహద్దు లిబియా .రాజధాని –నడజమేనా .కరెన్సీ  సెంట్రల్ ఆఫ్రికన్  CFA ఫ్రాంక్ .జనాభా –ఒకటిన్నర కోట్లు .చాద్ అంటే సరస్సు .ఇది లక్షా ముప్పై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న 7000నాటి పురాతన సరస్సు .గొప్పయాత్రా కేంద్రం .87శాతం ప్రజలు పేదలు .టెర్రరిజం కిడ్నాపింగ్ ,నేరాలు ఘోరాలకు నిలయం .సగం జనాభా ముస్లిం లు మిగతావారు క్రైస్తవులు ఫ్రెంచ్ ,చాద్ భాషలేకాక 120తెగల భాషలున్నాయి .23శాతంమాత్రమే అక్షరాస్యత .ఆయిల్ కాటన్ కాటిల్ పశుసంపద ఆదాయవనరులు .

చాదియన్ సాహిత్యం –నిత్యం అస్థిర కల్లోల రాకీయంతో సాహిత్యంరూపు దిద్దుకోలేదు తరతరాల మౌఖిక  జానపదగీతాలు గాధలే ఉన్నాయి .చాద్ భాషలో కంటే ఫ్రెంచ్ లోనేరచనలు  చేస్తారు .ఆహ్మాట్ తబోయే అనే ఆదేశ ఏకైక సాహిత్య విమర్శకుడు Anthologie de la littérature tchadienne   2003లో రాశాడు .జోసెఫ్ బ్రహిం సీయాద్ ,బాబా ముస్తఫా ,ఆంటోని బంగూయి ,కౌల్సి లాంకో వంటి కొద్దిమంది రచయితలూ మాత్రమె ఉన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 113-కామెరాన్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

113-కామెరాన్ దేశ సాహిత్యం

.మధ్య ఆఫ్రికా లోని గల్ఫ్ ఆఫ్ గినియా లో కామెరాన్ దేశం ఉంది.రాజధాని –యవౌండే.కరెన్సీ –సెంట్రల్ ఆఫ్రికాన్ CFA ఫ్రాంక్ .జనాభా 2.52కోట్లు .అధికార భాషలు –ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ .30శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు .ప్రకృతి వనరులు పుష్కలం .ఆయిల్ ,గాస్ నాణ్యమైన కలప ,ఖనిజాలు ఎక్కువ .వ్యావసాయిక దేశం కూడా .కాఫీ ,కాటన్ కోకా .మైజ్ కస్సావా పంటలు బాగా పండిస్తారు .’’ఎల్ హాది బాబా అహ్మద్ దాన్ పూలలో’’ దేశంలో 561మిలియన్ CFA ఫ్రాంక్ లున్న అత్యంత ధనవంతుడు .యాత్రిక భద్రత ఉంటుంది .క్రిస్టియానిటి ,ఇస్లాం ముఖ్యమతాలు .77శాతం ప్రజలు అక్షరాస్యులు .ఆరేళ్ళ ప్రాధమిక అయిదేళ్ళ మాధ్యమిక రెండేళ్ళసేకండరి విద్యావ్యవస్థ ఉన్నది .విద్యార్ధుల విద్యకు అన్నిరకాల ప్రోత్సాహం ప్రభుత్వం కల్పిస్తుంది .

  కామెరాన్ సాహిత్యం –కాలనీ ప్రభుత్వ హయాములో లూయీ మేరీ పోల్కా ,సంకీ మైమో  రచయితలను యూరోపియన్ మిషినరి సొసైటీలు చదివింఛి దేశాన్ని ఆధునిక ప్రపంచం లో ఉంచటానికి దోహదం చేశాయి .జీన్ లూయీ నిజేమ్బా మేడుసైన్స్ ఫిక్షన్ నవల ‘’నంగా కోన్ ‘’ను బులుభాషలో1932లో రాశాడు .ప్రపంచయుద్ధం తర్వాత మొంగో బెట్టి ,ఫెర్డినాండ్ఒయోనో ఆలనీ వ్యవస్థను విమర్శించి అందులో కలవటానికి నిరాకరించాడు .ముసలితరం రచయితలలో గుల్లియామే ఒయానో మిబియా ,మేబెల్లా సొన్నే డిపోక్కో,ఫ్రాన్సిస్ బేబియ,కేంజో జుమ్బాన్ ఉన్నారు .

గొప్పరచయితలుగా పేరు పొందినవారిలో ఇమ్బోలో ముబూ ,ఫ్రాన్సిస్  నిగనా౦గ్ ,లీనాస్ టిఅసొంగ్ ఉన్నారు .2014లో ఇమ్బోలోముబే తన మాన్యుస్క్రిప్ట్ కు ఒక మిలియన్ డాలర్ల డీల్ ను రాండం హౌస్ తో కుదుర్చుకొన్న గొప్ప రచయిత్రి .నవలపేరు ‘’బిహోల్డ్ ది డ్రీమర్స్ ‘’.ఈ దేశంలో గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ లిటరరీ అసోసియేషన్స్ 2013లో ఏర్పడి అర్హులకు ప్రైజులు ఇస్తున్నారు .బెల్లిస్ ఎండి రెండు సార్లు ఈ అవార్డ్ పొందటం ఆశ్చర్యం .చార్లెస్ సేల్.ఫిస్తం మోవాన్జా ముసులియ ,సాంకీ మైమో లు కూడా పొందారు .

 అఫుంగ్ ఫెగే ఎవిటా,బో యి అమాంగ్ ,ఎస్ సి అబెగా ,పాల్ చార్లెస్ ఆటంగానా,మిమ్బు మిమ్బు టేన్ను,జాక్వెస్ బెంగోనా ,ఐజాక్ ముమే ఎలిటా ,షె డుకుటుమొదలైన వర్ధమాన రచయితలెందరో ఉన్నారు

  కామెరాన్ దేశం పై రాయబడిన పుస్తకాలు –దిఓల్డ్ మాన్ అండ్ దిమెడల్ ,ప్రిజనర్ వితౌట్ ఎ క్రైం,ఫుట్ప్రింట్స్ ఆఫ్ డెస్టిని వగైరా .

114-కేప్ వెర్డే దేశ సాహిత్యం

రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే గా పిలువబడే కేప్ వేర్డే దేశం అట్లాంటిక్ సముద్రమధ్యంలో ఉన్న ఐలాండ్ .అగ్నిపర్వత ప్రాంతం .రాజధాని-ప్రై యా .కరెన్సీ –కేప్ వేర్దియన్ ఎస్కుడో .జనాభా -5న్నర లక్షలు .రోమన్ కేధలిక్కులు  ఎక్కువ .పోర్చుగీస్ అధికారభాష .క్రియోల్ భాష ప్రజలభాష .అక్షరాస్యత 87శాతం .ఉచిత ప్రాధమిక మాధ్యమిక విద్య .ఆదాయవనరులు –ఫిషింగ్ ,వ్యవసాయం రవాణా ,పబ్లిక్ సర్వీసులు .పశ్చిమ ఆఫ్రికాలో రెండవ ధనిక దేశం .

కేప్ వేర్డేసాహిత్యం –ఎక్కువభాగం పోర్చుగీస్ భాషలోనే ఉంటుంది .కొందరు క్రియోల్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ భాషల్లోనూ రాశారు .ఈదేశకవి ‘’యూజీనియో టావరెస్ రచనలు ప్రపంచ మంతా వ్యాపించాయి ,మాన్యూల్ లోప్స్ ,బల్ట సార్ లోప్స్ డ సిల్వా అనే ఒస్లాండో అల్కంటర,జార్జి బార్బోసా లుకూడా ప్రసిద్ధులు .16వ శతాబ్ది కవి ఆండ్రే అల్వారెస్ డి అల్మడ ఈ దేశం లో నదులగురించి రాశాడు .1890వరకు ఈ దేశ సాహిత్యం రికార్డ్ అవలేదు .అప్పుడే యుజినియో టావరెస్’’మొర్మా పోయెమ్స్ ‘’ బ్రావా క్రియోల్ భాషలో  రాశాడు .క్రియోల్ భాషలో రెండవ పుస్తకం ‘’దిసారో ఆఫ్ లవ్’’ను జేవియర్ డాకున్హారాసి 1893లో ప్రచురించాడు .ఈఆర్చి పెలగలో రెండు లైబ్రరీలు కాలనీ ప్రభుత్వ కాలం లో 1890 లో  ఏర్పడ్డాయి .అవే నేషనల్ లైబ్రరి ,మూజియం లు .

  జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాలు వచ్చాక 20వ శతాబ్దిలో ఈ దేశ సాహిత్యం విస్త్రుతమైనది .ఆంటోనియో పెడ్రో’’డయారియో ‘’రాసి 1929లో ప్రింట్ చేశాడు .రచయిత గాయకుడు బి లేజా 1933లో చాలారచనలు చేశాడు అందులో   ‘’ఉమా పర్టిక్యుల డ లిరకాబో వెర్డియానో ‘’వంటివి ఉన్నాయి .ఈ దేశ సంగీత వివరాలున్న పుస్తకం ఇది .అగూ నాల్డో ఫోన్ సేక ఈ దేశ  విస్మృత కవి .

   1975జులై 5 న ఈదేశం స్వతంత్రం పొంది ‘’దిఐలాండ్ ఆఫ్ కన్టే౦డాప్రచురణ జరిగింది .హెన్రిక్ టేక్సీరియా డీ సౌసా ,గేబ్రియల్ మేరియానోలు రచనలు చేసి ముద్రించారు .జేర్మనో అల్మీడియా1982లో ‘’ఓ డియా డాస్ కల్కస్ రోలడాస్’’ ది లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ఆఫ్ సేన్హార్  డాసిల్వా అరుజో 1989రాసి అచ్చువేశాడు .ఇందులో కఠినవాస్తవికతకు హాస్యం జోడించాడు .తర్వాత ఆ దేశ చరిత్ర ‘’కాబో వేర్డే’’2003లో రాశాడు .ఈ ఐలాండ్ ప్రపంచం లో అయిదవ అందమైన దేశంగా గుర్తింపు పో౦దినపుడు De Monte Cara vê-se o mundo iరాశాడు

  మహిళా రచయితలు ఎలీన్ బార్బోసా ,యారా డోస్  సాన్టోస్,వేరా డువార్టే రచనలతో ముందున్నారు  డువార్టేకు2001లోరాసిన ఆఫ్రికన్ పోయెట్రికి ‘’కామోస్ ప్రైజ్ వచ్చింది ఇది కేప్ వేర్డేలోరాయబడిన రాయబదినఎకైక కవితాసంపుటి .

  ఆధునిక రచయితలలో మాన్యూల్ వీగా ,జేర్మనో అల్మేడియ,అర్మేనియో వియరియ మిల్టో ఎలియాస్ ఉన్నారు  వియరియా రాసిన కవితా సంపుటికి 2009లో కామోస్ ప్రైజ్ వచ్చింది

 రచయితలలో –జేర్మానో అల్మీదియా ,ఓర్లాండో అమరిల్లిస్ ,డేనియల్ ఫిల్పి సెర్జియో ఫ్రుసోని వగైరాలు ముఖ్యులు కవులలో –జార్జి బార్బోసా ,అజవేడోకాబ్రాల్ ,యోలాండా మొరాజో,ఒవిడోమార్టినస్ వగైరాముఖ్యులు .ఇక్కడి పుస్తకాలలో –ట్రాన్స్ నేషనల్ ఆర్చిపేలగో ,చిక్విన్హో ,చువా బ్రాబా దిఫార్చునేట్ ఐల్స్ వగైరా .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడులఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం )సమాజ సేవే ఉచ్చ్వాసనిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం )

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన  డా .చర్ల సిస్టర్స్

చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే  డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి చర్ల మృదల గార్లు  .వివాహాలు చేసుకోకుండా తమ జీవితాలను సాంఘిక సేవారంగానికి ,తండ్రిగారి సాహితీ సేవా రంగానికి అంకిత భావంతో కృషి జేస్తున్న ఆదర్శ మహిళామణులు .తలిదండ్రుల ఆదర్శ జీవన విధానం వీరిని ప్రభావితులను చేసి ఆమార్గంలోనే పయని౦చేట్లు చేసింది .అకు౦ఠిత దీక్షతో ,మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగుతున్నారు .తండ్రి గారికి ఆంగ్ల విద్యపై ఆసక్తి లేకపోవటంతో,ఈ ఇద్దరూ ఇంటి వద్దనే చదువుకొన్నారు .

  క్రమంగా తల్లి సుశీల,సోదరుడు శ్రీ బుద్ధ నారాయణ శాస్త్రి గారల ప్రోత్సాహం తో  ఉన్నత విద్య అభ్యసించారు .వీరిలో పెద్దవారైన శ్రీమతి విదుల13-3-1939న నిడదవోలు లో జన్మించారు .రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో 1960లో బి. ఏ.,విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఎం.ఏ. చదివారు .తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి లో హిందీలో పి.హెచ్ .డి .చేశారు .విశాఖ పట్నం సెయింట్ ఆన్స్ కాలేజిలో లెక్చరర్ గా 20ఏళ్ళు పని చేశారు .అదే సమయం లో ఎన్ .ఎస్. ఎస్ .ప్రోగ్రాం అధికారిగా 15సంవత్సరాలు సేవ చేశారు .ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గానూ సామాజిక సేవ చేశారు .విశాఖ లో ఉద్యోగం లో ఉన్నప్పుడే 1996లో అక్కడ ‘’విశ్రాంతి ‘’పేరున వృద్ధాశ్రమం ప్రారంభించి వృద్ధుల సేవకు నాంది పలికారు .తండ్రి గారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు విశాఖ చైర్మన్ గా వ్యవహరించారు .తల్లిగారి పేరిట నిడదవోలులో చర్ల సోదరీమణులు2000వ సంవత్సరం లో  స్థాపించిన’’ చర్ల సుశీల వృద్ధాశ్రమ౦’’కు  విదులగారు  అధ్యక్షురాలు . ‘’చర్ల సుశీల –గణపతి శాస్త్రి ఫౌండేషన్’’కు ప్రెసిడెంట్,నిడదవోలు ‘’కస్తూరిబాయి మహిళా సమాజం ‘’కు కార్య దర్శి .నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా పని చేశారు .విశాఖ ‘’విశ్రాంతి వృద్ధాశ్రమం ‘’కు సహాయ కార్య దర్శి. విశాఖ ‘’ బాలప్రగతి’’ సెంటర్ సభ్యురాలు .ఇలా వివిధ సంస్థలతో కార్యనిర్వాహక బాధ్యతలను 81ఏళ్ళ వయసులో 18ఏళ్ళ యువతిలాగా చలాకీగా సెల్ ఫోన్ లో అనుక్షణం ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ సలహాలిస్తూ గడిపే మానవ యంత్రం విదుల గారు .

 శ్రీమతి చర్లమృదులగారు 26-7-1941న నిడదవోలు లో జన్మించారు .హిందీసాహిత్యం లో ఎం .ఏ.,బి.యి.డిచేసి ,తర్వాత డాక్టరేట్ పట్టా పొందారు ‘’సేక్రేడ్ హార్ట్స్ హైస్కూల్ లో హిందీ అధ్యాపకురాలుగా కొంతకాలం పని చేసి ,తర్వాత విశాఖ ఏ .ఎయెన్.రాజా జూనియర్  కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తూ పదోన్నతి పొందారు .విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ వారి ‘’విద్యా పీఠ్’’డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్  చేసి రిటైరయ్యారు .తండ్రిగారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు అధ్యక్షురాలు .నిడదవోలు లయన్స్ క్లబ్ సెక్రెటరి .’’ఆత్మ విద్య చారిటబుల్ ట్రస్ట్’’కు వైస్ ప్రెసిడెంట్ .‘’చర్ల శుశీల వృద్ధాశ్రమ౦ ‘’,చర్ల సుశీల గణపతి శాస్త్రి ఫౌండేషన్ ‘’లకు కోశాధికారి  .బాలప్రగతి సెంటర్  మెంబర్ .వివిధ సంఘాలలో వివిధ హోదాలలో సమాజ సేవ చేస్తున్నారు .80వ పడిలోకూడా నిత్యోత్సాహంగా కృషి చేస్తూ 8ఏళ్ళ కన్యలా ఉండటం ముచ్చట గొలుపుతుంది .

చర్ల సిస్టర్స్ ‘’రెస్ట్ ఇన్ సర్వీస్ ‘’కు ఉదాత్త ఉదాహరణ .సేవా రంగం లో కలిసి పని చేస్తున్నఅరుదైన  జంట ఈ చర్ల సిస్టర్స్ .మానవ సేవే మాధవ సేవ అన్నమహాత్ముని  ఆదర్శాన్ని పాటిస్తూ, సమాజానికి మనం ఏం చేశామన్న స్పూర్తితో పని చేస్తూ ,స్వార్ధ సంకుచిత కుల,మత,జాతి,ప్రాంత , భాషాభేద భావాలకు అతీత౦గా కృషిచేస్తున్న ఆణిముత్యాలు వీరు .తల్లిదండ్రుల ఉద్బోధలను నిరంతరం పాటిస్తూ వారిని తాము చేస్తున్న సేవలలో ప్రతిఫలించేట్లు  చేస్తున్న త్యాగ మూర్తులు .తండ్రిగారిలాగా గా౦ధీమార్గంలోనే నడుస్తూ సాధారణ జీవితాలు గడుపుతూ ఖద్దరు వస్త్రాలు మాత్రమే ధరిస్తూ  అందరిలో కలిసిపోతూ ఉంటారు .స్త్రీ జనోద్దరణ ,మహిళా చైతన్యం ఈ సిస్టర్స్ కు రెండు కళ్ళు .వివాహం చేసుకొంటే తలిదండ్రుల, తమ ఆశయాలకు అడ్డం వస్తుందని భావించి అవివాహితలుగా ఉండిపోయిన చైతన్య స్రవంతులు .గుడిలో దీపాలకంటే జీవితాలలో సుఖ శాంతి దీపాలు వెలిగించాలన్న తపన వారిది .అన్నదానం ,విద్యాదానం వారి ఉచ్వాస నిశ్వాసాలు.ప్రతి రోజూఉదయం 11-12గంటల మధ్య  నిడదవోలు రైల్వే స్టేషన్,  బస్టాండ్ ,ఇతర ప్రధాన కూడళ్ళకు మొబైల్ వాన్ లో వారే స్వయంగా వెళ్లి యాచకులకు భోజనం పెడతారు .ఇదే ఉత్కృష్ట దైవ సేవగా భావిస్తారు .దరిద్ర నారాయణ సేవ దామోదర, శంకర దైవ సేవగా చేస్తారు .నిదదవోలె కాక మల్లవరం ,బొబ్బర్లంక,రామ చంద్రాపురం గ్రామాల్లోనూ సమర్ధవంతంగా వృద్ధాశ్రమాలు నడుపుతూ సమాజ సేవ చేస్తున్నారు.

   సామాజిక సేవారంగం లో ఊపిరాడనంత పనులలో గడుపుతున్నా, ఈ చర్లద్వయ౦ సాహిత్య రంగం లోనూ రాణిస్తున్నారు .తండ్రి గణపతి శాస్త్రిగారి సాహితీ సంపదను అవిచ్చిన్నంగా తరతరాలకు అందించే కార్యక్రమం చేస్తున్నారు ..’’మీ పుస్తకాలను ఆజన్మాంతం ప్రచారం చేస్తాం ‘’అని తండ్రిగారికిచ్చిన వాగ్దానం నిబద్ధతతో నిలబెట్టు కొంటున్నారు ఈ సరస్వతీ మూర్తులు .తమకుమార్తెల సాహితీసేవకు ముచ్చటపడి తండ్రిగారు ఒకపద్యం రాసి వారుభయుల్నీ ఆశీర్వదించారు –

‘’మదమిడి  సద్గుణముల చే-విధిగా కుడి భుజములవలె బ్రియులగు తనయుల్

విదుల,మృదులకృతి రథసా-రాధులయి కన దీర్చినాక రామాయణమునన్ ‘’

కనుక సేవ సాహిత్యం కూడారెండు కళ్ళుగా భావించింది చర్ల సోదరీమణులద్వయం .

  తండ్రి గారి సాహిత్య వ్యాప్తి తో తృప్తి పడకుండా, తామూ రచనలు చేసి సరస్వతీ పుత్రికలనిపించారు .శ్రీమతి విదులగారు ‘’తీరం చేరిన నావ ‘’,మురళీ కృష్ణ ,సృజన స్మృతి,పునర్జన్మ ,బ్రహ్మ సూత్రాలు మొదలైనవి రచించారు .శ్రీమతిమృదులగారు ‘’మృదుభావ వీచికలు ‘’,గీతామృతం ,ప్రతిభకు పట్టాభి షేకం ,పరివర్తన ,అమృత గుళికలు,చర్ల గణపతి శాస్త్రి చరిత్ర ,సుశీలమ్మ చరిత్ర ,చర్ల గణపతి శాస్త్రి శత వసంత ప్రత్యేక సంచిక ,వామన పురాణం (ఆధునీకరణ )రచించారు .ఏమైనా ఇంగువకట్టిన గుడ్డలు కదా తండ్రిగారి సాహిత్య గుబాళింపు ఎక్కడికి పోతుంది ?అనువంశికంగా అబ్బి పరిమళించింది .

చర్ల సిస్టర్సను ఆహ్వానించి సన్మానించని  సాహిత్య , సాంస్కృతిక  సేవా సంస్థలు లేవు అంటే అతిశయోక్తికాదు .జూన్ 28ఆదివారం సరసభారతి నిడదవోలు వెళ్లి, వీరిని సత్కరించి,మా తలిదండ్రులు కీ శే గబ్బిత మ్రుత్యున్జ్యశాస్త్రి శ్రీమతి భావానమ్మగారాల స్మారక శ్రీ శార్వరి ఉగాది ఉగాది పురస్కారం అందజేసి  ధన్యమైంది .జిల్లా ,రాష్ట్ర స్థాయి అవార్డులెన్నో అందుకొన్నారు జాతీయ స్థాయిలో పద్మ పురస్కారం త్వరలో రావాలని ఆశిద్దాం.

  డాక్టరేట్ లు అయినా ,ఎన్నో పదవులలో రాణిస్తున్నా ,శక్తికి మించి సేవాధర్మ౦ నిర్వహిస్తున్నా అలుపు సొలుపు ఎరుగని థీమూర్తులు వీరిద్దరూ .దైవీ శక్తి ఆవహించిన మానవీయ సేవా తత్పరులు .’’లీడ్ కైండ్లీ లైట్ ‘’కు ప్రత్యక్ష ఉదాహరణలు ‘’.సుగుణ సంపత్తికి ,వినయ సౌజన్యాలకు మారుపేరు .అందుకే వీరు ఏ బృహత్ కార్యక్రమం నిర్వహించినా స్వచ్చందంగా దాతలు ముందుకు వచ్చి అండగా నిలబడి విజయవంతం చేస్తారు .లయన్స్ క్లబ్ మిత్రుల చే స్థాపించబడిన’’డాక్టర్ చర్ల విదుల , డాక్టర్లయన్స్ క్లబ్  వృద్ధాశ్రమం ద్వారానూ సేవలందిస్తున్నారు ఈ సిస్టర్స్ .  ‘’లాంగ్ లివ్ చర్ల సిస్టర్స్’’.

అవార్డుల ప్రభ –కూచిభొట్ల వాణీ ప్రభాకరి –కాకరపర్రులో తమ కుటుంబ మూలాలున్న శ్రీమతి కూచిభొట్ల వాణీ ప్రభాకరి సూర్యనారాయణ మూర్తి ,వెంకట లక్ష్మి గార్ల కుమార్తె .సంగీత సాహిత్య సరస్వతి .తణుకులో ఉంటూ ఎన్నో సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు .ఎన్నో బిరుదులూ మరిన్నో అవార్డ్ లు పొందిన విదుషీమణి .లయన్స్ క్లబ్ ద్వారాకూడా సేవ చేస్తున్నారు .తారకాపురి (తణుకు )న్యూస్ నిర్వాహకురాలు .’’తెలుగు  బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘’లో స్థానం సాధించారు.మంచి వీణా వాదకురాలు .శ్రావ్యమైన స్వరంతో గొప్ప సంగీతం పాడి, వీనుల విందు చేస్తారు  ఇంతతిఘనకీర్తి ఉన్నా వినయంగా ‘’నేను కళారాధనలో వెలుగుతున్న ఓ చిరు దివ్వె ను మాత్రమే ‘’అని చెప్పుకొన్న సంస్కారి వాణిగారు .వీరికి ,గో.ర.సం.అధ్యక్షులు శ్రీ శిస్టు సత్యరాజేష్ కు నిడదవోలులోజూన్ 28ఆదివారం  సరసభారతి శ్రీ శార్వరి ఉగాది’’ స్వయం సిద్ధ’’ పురస్కారం అంద జేసి సత్కరించింది .

  సమాప్తం

ఈ 9ఎపిసోడ్ ల ‘’ఆరామ ద్రావిడుల ఆలయం కాకరపర్రు ‘’రచనకు ఆధారం -మొదటి ఎపిసోడ్ లోనే మనవి చేసినట్లు శ్రీ కానూరి బదరీ నాథ్ రచన –‘’తరతరాల సరస్వతీ పీఠం-మన కాకర పర్రు ‘’గ్రంథం.

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -70(చివరిభాగం )

హనుమ కొనసాగిస్తూ’’నర శ్రేష్ట  రామా !నీపైఅనురాగం తో నీ హితం కోరే  నాపై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను

పై విశ్వాసంతో ఇక్కడికి రావాలని తొందరపడుతున్న నన్ను ఆదరంగా మళ్ళీ పిలిచి ‘’రాముడు యుద్ధం లో రావణ సంహారం చేసి వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళే ట్లు పలువిధాలుగా చెప్పు .శత్రుసంహారహనుమా !నువ్వు ఇక్కడ ఉండాలనుకొంటే రహస్య ప్రదేశం లో ఒక రోజు విశ్రమించి వెళ్ళు .నువ్వు ఇంకొక్క రోజు ఇక్కడ ఉంటె మండభాగ్యురలనైన నా దుఖం కొంతతీరి ఉపశాంతి లభిస్తుంది .నువ్వు తిరుగు ప్రయాణమై వెడితే నాప్రానాలు నిలుస్తాయో లేదో అని సందేహిస్తున్నాను –

‘’ఏవం బహువిధం వాచ్యో రామో దాశరధి స్త్వయా –యథా మా మాప్నుయా చ్ఛీఘ్రం హత్వా రావణ మాహవే ‘’

‘’మమచాప్యల్ప భాగ్యాయాః సాన్నిధ్యా తత్వ వీర్యవన్ –  అస్య శోక విపాకస్య ముహూర్తం సాద్విమోక్షణం ‘’’’గతే హిత్వయి విక్రాంతే పునరాగమనాయ వై –ప్రాణానామపి సందేహో మమ స్యా న్నాత్ర సంశయః ‘’

‘’హనుమా ! నా భర్తను ఎడబాసి దుఖాలపాలై దుర్గతి పొందుతున్న నాకు ,నువ్వు కనపడకుండా వెళ్ళటం మరింత శొకకారణ  మౌతుంది .నీ సహాయులైన ఋక్ష,వానరుల పై నాకు సందేహం ఉంది .వారూ రామలక్ష్మణులు దాటరాని సముద్రాన్ని ఎలా దాటుతారు ?ఈసముద్ర లంఘనం గరుత్మనుడికి నీకు వాయు దేవుడికి ముగ్గురికి మాత్రమె సాధ్యం .మిగిలినవారికి అలాంటి శక్తి కలిలిగి ఉండకపోవచ్చు .ఇలాంటి దుష్కరమైన కార్యానికి ఏ ఉపాయం ఆలోచించావు నువ్వు ?నువ్వు ఒక్కడివే రావణ ,సకలరాక్షాస సంహారం చేసి నన్ను రామునిసంనిదికి తీసుకు పోగలిగిన సమర్దుడివే దీనివలన కీర్తి నీకు దక్కుతున్దికాని రాముడికి కాదు కదా .కాని రాముడే ఇక్కడి ససైన్యంగా వచ్చి రావణునిపై విజయం సాధించి నన్ను తీసుకుపోవటం ఆయనకు యశస్కరం –

‘’త్వా దర్శన జ శ్శోకో భూయో మాం పరితాపయేత్-దుఃఖా ద్దుఖ పరాభూతా౦ దుర్గతాం దుఃఖ భాగినీం’’

‘’కథం ను ఖలు  దుష్పారం తరిష్యంతి మహోదధిం-తాని హర్యక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ ‘త్రయాణా మేవ భూతానాం సాగారస్యాస్య లంఘనే –శక్తిః స్యా ద్వైతేయస్య తవ వా మారుతస్య వా ‘’

‘’కామమస్య త్వమే వైకః కార్యస్య పరిసాధనే -, పర్యాప్తః పరవీరఘ్న యశస్య  స్తే బలోదయః ‘’

‘’బలై స్సమగ్రైర్యది మాం-హత్వా రావణ మాహవే –విజయీ స్వాం పురీం రామో –నయే త్తత్స్యా ద్యశస్కరం’’

‘’హనుమా !పూర్వం రావణుడు నన్ను రాముడు నా దగ్గర లేనప్పుడు మాయోపాయం తో తీసుకు వెళ్ళాడు .కాని రాముడు అలాకపతమార్గం లో నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళటం ఉచితం కాదు .రాముడు తనసైన్యంతో లంకను నింపి ,అప్పుడు అందరి సమక్షం లో నన్ను తీసుకు వెళ్ళటం తగిన పని .యుద్ధ పరాక్రమ శాలిరాముడు ఎలా సముచితంగా చేయటం తగునో, అలా నువ్వు చెయ్యి  ‘’-

‘’యథాహం తస్య వీరస్య వనా దుపధినా హృతా-రక్షసా తద్భయా’’ దేవ తథా నార్హతి ‘’రాఘవః ‘’బలైస్తు సంకులాం కృత్వాలంకాంపర బలార్దనః –మాం నయేద్యదికాకుత్ స్థ  స్తత్తస్య సదృశం భవేత్’’

‘’’’తధ్యథా తస్య విక్రాన్త మనురూపం మహాత్మనా –భవ త్యాహవ శూరస్య తథా త్వ ముపపాదయ-‘’

హుమా రామునితో చెబుతూ ‘’రామా !యుక్తియుక్తాలు అర్ధవంతాలు ఐన ఆమె మాటలు విని నేను ఇలా చెప్పాను –‘’అమ్మా సీతా దేవీ!ఋక్ష,కపి సైన్యనాయకుడు రాజు సుగ్రీవుడు రాముడికి తోడుగా ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకు వెళ్ళటానికి కృత నిశ్చయుడై ఉన్నాడు .బుద్ధి పరాక్రమంశక్తి మనో వేగం ఉన్న వానరులెన్దరొఆయన సైన్యం లో ఉన్నారు వాళ్ళంతా భూమి ఆకాశం పాతాళాలలో అడ్డు లేని సంచారం చేయగలవారు అమిత తెజస్శాలురు మహాకార్య దురంధరులు .వాళ్ళు ఆకాశమార్గం లో భూమిని చాలాసార్లు చుట్టి వచ్చారు .మా సైన్యం లో నాతో సమానులు నాకంటేశ్రేస్తులుచాలా మన్దిఉన్నారు నాకంటే తక్కువ వారేవ్వరూసుగ్రీవ సైన్యం లో లేనేలేరు .నా వంటి సామాన్యుడే సముద్రాన్ని అవలీలగా దాటి వస్తే  ఆమహా బలశాలుర విషయం చెప్పాలా ?నేను వచ్చింది దూతకార్యం కనుక సామాన్యుడైనవాదినే దూతగా పంపాలికనుక నన్ను పంపారు శ్రేస్తులను దూత క్రుత్యానికి పంపరు’’

‘’సుగ్రీవ స్సత్వ సంపన్నస్తవార్థే కృత నిశ్చయః ‘’

‘’తస్య విక్రమ సంపన్నా స్సత్వ వంతోమహా బలాః-మనస్స౦కల్పసంపాతానిదేశే హరయః స్థితాః’’

‘’ప్రదక్షిణీకృతా భూమి ర్వాయుమార్గాను సారిభిః’’-మద్విశిష్టాశ్చ,తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః ‘’-మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ’’

‘’అహం తావ దిహ ప్రాప్తః కిం పునస్తే-మహాబలాః-‘’న హిప్రకృస్టాఃప్రేష్యంతే హీతరే జనాః’’

‘’అమ్మా సీతా దేవీ !ఇంకా చింత మాను .శోకం వదిలేయి ఆవానరులు ఒకే ఒక గంతులో లంక చేరుతారు .నా బుజాలపై రామ లలక్ష్మణులు కూర్చుని సూర్య చంద్రులులాగా నీ దగ్గరకు వస్తారు .సింహ సదృశ అరి వీరభీకరరాముడు ,ధనుర్ధారి లక్ష్మణుడు త్వరలో లంకాద్వారానికి చేరటం నువ్వు చూస్తావు .గోళ్ళు ,పండ్లు ఆయుధాలుగా ఉన్న వీరులు సిమ్హాలుపులులవంటి పరాక్రా శాలురు ,ఎనుగుల్లాగా మహా శ్రేస్తులైన వారు అయిన వానరులు త్వరలో లంకలో ప్రవేశి౦చతమ్ చూస్తావు .కొండల్లాగా,మేఘాల్లాగా ఉన్నతులై లంకలోని మాలయ పర్వత ప్రాంతం లో సింహ నాదం చేసే కపిశ్రేస్టుల మహాధ్వని త్వరలోనే వింటావు .’’అని సీతాదేవి దుఖాన్ని మాన్చాతానికి సకల ప్రయత్నాలు చేసి విశ్వాసం కలిగించాను రామా ‘’అని హనుమ అన్నాడు –

మామ పృష్ఠ గతౌ తౌ చ చంద్ర సూర్యా వివోదితౌ-‘’త్వత్సకాశం మహాభాగే నృసింహా వాగమిష్యతః-‘’

‘’ అరిగ్హ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం –లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వార ముపస్థితం’’

‘’నఖ దంష్ట్రాయుధాన్వీరాన్ సింహ శార్దూల విక్రమాన్ –వానరా న్వార ణే౦ద్రాభాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్ ‘’

‘’శైలా౦బుద నికాశానాం లంకా మలయా సానుషు-నర్దతాంకపి ముఖ్యా నామచిరా చ్చ్రోష్యసి స్వనం’’

 రామా !నేను అమ్మా !శత్రుదమనుడు రాముడు వనవాస దీక్ష పూర్తీ చేసి ,నీతోకలిసి అయోధ్యకు చేరి పట్టాభి షిక్తుడు అవటం త్వరలోచూస్తావు ‘’అని,నువ్వు ఆమె కోసం పరితపిస్తున్నావని నేను చెప్పిన వెంటనే శోకం తో తట్టకోలేక పోయిన సీతాదేవితో ఆమె దుఖం,శోకం తొలగే ఉచితమైన ఇష్టమైన మాటలు చెప్పగా ఆమె దుఃఖ శోకాలు వీడి ప్రసన్ను రాలై,శాంతి పొందింది ‘’అని దూత హనుమ శ్రీరాముడికి సీతా వృత్తాంతమంతా సవిస్తరంగా తెలియ జేశాడు –

‘’నివృత్త వనవాసం చ త్వయా సార్థమరిందమం –అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ‘’

‘’తతో మయా వాగ్భిరదీన భాషణా-శివాభి రిష్టాభిరభిప్రసాదితా –జగామ శాంతం మామ మైథిలాత్మజా –తవాపి శోకేన తదాభి పీడితా ‘’

 అనే అనుష్టుప్ శ్లోకం తో మహా కవి వాల్మీకి సుందర కాండ ముగించాడు .

ఇదిసుందర కాండలో  29శ్లోకాల చివరి 68 వ సర్గ .

 ఇందులో సీతకాని రాముడుకాని హనుమంతుడుకాని ప్రయోగించిన శబ్దాలు అర్ధవంతాలు అవతలి శక్తిసామర్ధ్యాలను పూర్తిగా తెలియే జేసేవి .చివరగా చెప్పిన పట్టాభి షేక శుభవార్త రామాయణానికి ఫలశ్రుతి .దానికోసమే ఇన్ని కస్టాలు బాధలు .సుందరకాండ చివరలో  ఆశుభవార్త చెప్పటం సుందర కాండను మరింత సుందరంతరం చేసినట్లైంది

   సీతాదేవిని హనుమ యెంత కస్టపడి ఊరడించాడోఈ సర్గలో కళ్ళకు కట్టినట్లు రాముడికి తెలియ జేస్తూ మనకు ఎరిగించాడు .తనకంటే తక్కువబలవంతులు సుగ్రీవ సైన్యం లో లేరు అని భరోసా ఇచ్చాడు సీతకు .తానూ సామాన్యుడు కనుక తనను దూతగా పంపారు అనటం అతని సంస్కారం, వినయం, విధేయత ,రామదూతగా హనుమ గొప్ప విజయం సాధించాడు సీతా శోక నివారణ ,ఉపశమనం రామ వియోగ దుఃఖ నివారణ ఆమె కుశలమనే వార్తతో ఆయనకోఉపశమనమ౦ కలిగించాడు.తనను దూతగా పంపిన సుగ్రీవునికీ స్వామి కార్యం నెరవేర్చిన విధేయుడిగా నిలిచాడు దానితో వారరాజుకూ  ఆనందం ,ఉపశమనం .

  సుందరకాండ తర్వాత రామరావణ యుద్ధం ,అగస్త్యమహర్షి రామునికి ఆదిత్యహృదయం వివరించి బలోపేతుడినినచేయటం ,రావణ సంహారం ,దేవతలు రాముని ప్రస్తుతి౦చటం ,సీతతో సహారామ లక్ష్మణ సుగ్రీవ విభీషనాదులు  అందరూ పుష్పకం పై అయోధ్యకురావటం భరతుడి దీక్ష విరమి౦ప జేయటం  శ్రీ రామ పట్టాభిషేకం ,రామరాజ్య విషయాలతో రామాయణం పూర్తి-స్వస్తి.

మనవి -14-4-20మంగళవారం ‘’సుందర కాండలో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’ధారావాహిక ప్రారంభించి ఇవాళ 7-7-20 మంగళవారం సుమారు రెండున్నర నెలలకాలం లో మిగతావి కూడా రాస్తూ68సర్గలను 70ఎపిసోడ్ లలో రాసి , ఈ 70 వ ఎపిసోడ్ తో పూర్తి చేయగలిగాను .మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా మొదలు పెట్టి ,పూర్తి చేశాను .ప్రతిరోజూ ఆ రోజు రాసే సర్గను చదువుతూ ,రాస్తూ ,నాకు అనిపించిన విశేషాలు రాశాను .ఇది ఆదికావ్యం కనుక కావ్య గుణాలను సాధ్యమైనంతవరకు చెప్పే ప్రయత్నమూ చేశాను .ఎక్కడ వీలయితే అక్కడ హనుమ వ్యక్తిత్వాన్ని వివరించాను .ఇవాల్టి వరకు అంతే చేశాను .ఎలా మొదలుపెట్టానో ఎలా పూర్తి చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది .మా స్వామి రాయించుకొని ఉంటాడు .అంతకంటే నేను చెప్పేది లేదు  .హనుమ అనుగ్రహం ,సరస్వతీమాత కటాక్షం  ,మా తలిదండ్రుల ఆశీస్సులు లేకపోతే ఇలా రాయగలిగే వాడిని కాను అని సవినయంగా మనవి చేస్తున్నాను .నాతోపాటు సుందరకాండలో విహరింఛి, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు.  

 సుందర కాండ పారాయణ పద్ధతులు –మనసులోని కోరిక తీరటానికి సుందర కాండ పారాయణ చేస్తారు .పారాయణ చేయాలనుకోనేవారు ఉదయం పూజాదికాలు పూర్తి చేసి శుచి అయిన ప్రదేశం లో కూర్చుని ప్రతిరోజూ స్మార్తులైతే శ్రీమహాగణపతిధ్యానం  మిగిలినవారు వారివారి విధానాలలో ధ్యానం ,వాల్మీకి నమస్క్రియ,ఆంజనేయ నమస్క్రియ ,రామాయణ ప్రార్ధనా ,శ్రీరామ ధ్యానం శ్లోకాలు చదవాలి .పారాయణ పూర్తి అయ్యాక నైవేద్యం పెట్టి హారతిచ్చి ‘’స్వస్తిప్రజాభ్యః –నుంచి యద్యత్కర్మ కరోమి తట్టదఖిలం రామాస్తుతేపూజనం ‘’దాకాఉన్న శ్లోకాలు చదివి ముగించాలి .

పారాయణ మొదటి రోజున సంక్షిప్త రామాయణసర్గ ,శ్రీరామావతార సర్గ ,శ్రీసీతారామ కళ్యాణ సర్గ ,సీతారామ సుఖజీవన సర్గ చదివిన తర్వాతే సుందరకాండ మొదటి సర్గతో ప్రారంభించాలి

  చివరి రోజు పారాయణ నాడు అంటే సుందరకాండ 68వ సర్గ పూర్తి చేసిన రోజున నాగపాశ విమోచన సర్గ ,ఆదిత్య హృదయ సర్గ ,రావణ వధ సర్గ ,శ్రీరామ స్తుతి సర్గ ,శ్రీరామ పట్టాభి షేక సర్గ చదవాలి

1-ఒక్క రోజులో పారాయణ పూర్తి  చేయాలనుకొంటే పైన చెప్పినవన్నీ అదే వరుసలో చేయాలి

2-2రోజుల్లో –మొదటి రోజు సుందరకాండ 1నుంచి 36వ సర్గవరకు ,రెండవ రోజు37నుంచి 68వరకు పారాయణ చేయాలి

3-3రోజుల్లో –మొదటిరోజు 27వ సర్గ వరకు ,రెండవరోజు 28నుంచి 41వరకు మూడోరోజు 42నుంచి 68సర్గవరకు

4-5రోజులపారాయణ –మొదటి రోజు 15వ సర్గవరకు రెండో రోజు 27వరకు మూడోరోజు 38వరకు నాల్గవ నాడు54 వరకు ఐదవరోజు 55నుంచి 68వరకు

5-8రోజుల్లో –రోజుకు 9సర్గల వంతున ,7రోజులు మిగిలినవి 8వ రోజు పారాయణ చేయాలి

6-9రోజుల పారాయణ –మొదటి రోజు 1-5,రెండు -6-15,మూడు-16-20,నాలుగు -21-26,ఐదవరోజు -27-33,ఆరవరోజు -34-40,ఏడవరోజు  -41-52,ఎనిమిదవ రోజు – 53-60,తొమ్మిదవ రోజు -61-68 సర్గలు పారాయణ చేయాలి

  ఎన్ని రోజులు చేసినా చిత్తశుద్ధి ముఖ్యం .పారాయణ రోజుల్లో అంటూ మైలలకు దూరంగా ఉండాలి .దాన్నిబట్టి ప్లాన్ చేసుకోవాలి ఇదంతా ఒక దీక్షగా భావి౦చిచేయాలి .అప్పుడే ఫలితం .శ్రీ సుందరకాండ పరాయణ ఫలప్రాప్తి రస్తు

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-20-ఉయ్యూరు .   

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను చిత్రకూటం లో ఆమెఒకరోజు  నీ దగ్గర సుఖంగా నిద్రి౦చి ముందుగా మేల్కొనగా ఒకకాకి అకస్మాత్తుగా వచ్చి ఆమె స్తనం పై గీరింది .తర్వాత నువ్వు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రింఛి నప్పుడు  ఆ కాకి మళ్ళీ వచ్చి ఆమెను బాధించింది .అది ఆతర్వాత మాటిమాటికీ వచ్చి ఆమె స్తన ప్రదేశాన్ని ముక్కుతో పొడవగా గాయమై ,రక్తం స్రవించి నీ శరీరం తడిస్తే, నిద్ర లేచావు .ఆమె గాయాన్ని చూసి కోపించిన సర్పం లాగా ఆమెతో ‘’పిరికి దానా !నీ స్తనాన్ని గోళ్ళతో గీరిందెవరు?కోపించిన పంచముఖ సర్పం తో చెలగాటమాడింది ఎవరు ?’’అంటూ నాలుగు వైపులాచూసి ,వాడిగా ఉన్న రక్త సిక్తమైన  గోళ్ళ తో ఆమెకు ఎదురుగా ఉన్న కాకినిచూశావు పక్షిశ్రేస్టమైన ఆ  కాకి దేవేంద్రుడి కొడుకట.వాడు భూమ్మీద వాయు వేగంతో సంచరించగలవాడట.అప్పుడు నువ్వు కొపపు  యెర్రని కనులతో ,ఆ కాకిపై క్రూరమైన ఆలోచన చేసి ,దర్భాసనం నుంచి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్ర మంత్రంతో అభి మంత్రించి వదిలితే అది మండుతున్న ప్రళయాగ్ని లాగా దానివైపు వెళ్లి కాకిని వెంటాడింది .కాకిని కాపాడలేక వాడి  తండ్రి ఇంద్రుడు ,దేవతలు మహర్షులు దాన్ని రక్షించలేక వాడి ఖర్మకి వాడిని వదిలేశారు .మూడులోకాలూ తిరిగినా రక్షించేవారు లేక ,శత్రుదమనుడ వైనశరణాగతుడవైన  నీ దగ్గరకే వచ్చింది  ,

‘’కః క్రీడతి సరోషేణ పంచ వక్త్రేణ భోగినా –నిరీక్ష మాణ స్సహసా వాయసం సామవై క్షథాః’’

‘’సుతః కిల స శక్రస్య వాయసః పతతాం వరః –ధరాతరా౦చర శీఘ్రం పవనస్య గతౌ సమః ‘’

‘’తతస్తాస్మిన్ మహా బాహో కోప సమవర్తి తేక్షణః-వయసే త్వం కృథాః క్రూరాంమతిం మతిమతాం వర ‘’   

‘’స దర్భం సంస్తరా ద్గ్రుహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయః –స దీప్త ఇవ కాలాగ్ని ర్జజ్వాలాభిముఖః ఖగం ‘’

క్షిప్తవా౦ స్త్వం ప్రదీప్తం హి దర్భం తమ్ వాయసం ప్రతి-తతస్తువాయసం దీప్తః సదర్భోనుజగామ హ’’

‘’స పిత్రాచ పరిత్యక్త స్సురై శ్చ సమహర్షిః-త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాది గచ్ఛతి-పునరేవాగత స్త్రస్త’’  స్త్వకాశ మరిందమ’’

భూమిపై నీ పాదాల చెంత పడిన  ఆ కాకిని , చంపదగినదే అయినా దాన్ని దయతో కాపాడావు .నువ్వు ప్రయోగించిన అస్త్రం విఫలం కారాదు అని నువ్వు దానికి చెప్పగా ,దానికోరికపై దాని కుడి కంటిని దహించావు .బతుకు జీవుడా అనుకొంటూ అది నిన్ను మీ తండ్రినీ ప్రస్తుతించి నమస్కరించి ,తనమానాన తాను తననివాసానికి యెగిరి  పోయింది –

‘’స తతం నిపత౦ భూమౌ శరణ్య శ్శరణా గతం –వదార్హమసి కాకుత్ స్థ కృపయా పర్యపాలయః ‘’మోఘమస్త్రం న శక్యం తు కర్తు మిత్యేవ రాఘవ భవాం స్తస్యాక్షికాకస్య హినస్తి స్మస దక్షిణం ‘’రామా త్వాం నమస్కృత్య రాజ్ఞే దశరథాయచ –విసృ స్టస్తుతదా కాకః ప్రతి పేదే స్వమాలయం ‘ రామా !సీతాదేవి ఇంకా ‘’ఇలా అస్త్ర విశారదుడు,శౌర్య ధైర్య పరాక్రమాల  రాముడు రాక్షసులపై ఎందుకు అస్త్రాలు ప్రయోగించటం లేదు ?నాగ గ౦ధర్వ యక్ష మరుద్గణాలు కూడా రాముని ముందు యుద్ధం లో నిలువ లేరే ? అలాంటి పరాక్రమశాలి రాముడు రావణుడిపై అస్త్రప్రయోగం చేసియుద్ధం లో  చంపాలి.శత్రు తపనుడు, నర శ్రేష్టుడు రఘువంశ మణి దీపం ఐన లక్ష్మణుడు అయినా అన్న అనుమతి తో నన్ను ఎందుకు రక్షించడు ? సమర్ధులైన ఆ రామ సోదరద్వయం అగ్ని వాయు తేజో సంపన్నులు .దేవతలకూ ఎదిరింప అసాధ్యులే ,మరి నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు .శత్రుసంహార సమర్ధతకల వారిద్దరూ నన్ను దయ చూడకపోవటం అంటే నేనేదో బలమైన పాపం చేశానేమో అనిపిస్తోంది ‘’అని కన్నీరు కారుస్తూ జానకి పలికింది జానకిరామా ‘’అన్నాడు తానూ దుఖిస్తూహనుమ –

ఏవం అస్త్ర విడం శ్రేస్టఃసత్వవాన్ శీలవానపి-  కిమర్ధమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః –‘’

‘’క్షిప్రం సునిశితైర్బాణై ర్హన్యతాంయుధి రావణః ‘’

‘’భ్రాతు రాదేశ మాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః –స కిమర్దం నరవరో న మాంరక్షతి రాఘవః ‘’

‘’శక్తౌ తే పురుష వ్యాఘ్రౌ వాయ్వగ్ని సమతేజసౌ-సురాణా మపి దుర్ధర్షౌకిమర్దం మా ముపేక్షతః’’

మమైవ దుష్కృతంకించి న్మహ దస్తి నసంశయః –సమర్ధౌసహితౌ యన్మాంనా వేక్షతేపరంతపౌ’’

రామా!వైదేహి అన్న ఆమాటలు విని నాగుండె చేరువై ఆమెకు ఉపశా౦తి కలిగించాలని ‘’అమ్మా !రాముడు నీ ఎడబాటు తో దుఖమనస్కుడై ఏపనీ చేయటం లేదు .అన్నను చూసి తమ్ముడూ అలాగే ఉన్నాడు .నేను ఎలాగో నిన్ను చూడగలిగాను .ఇక ఇది దుఖి౦ చాల్సిన సమయం కాదు .ఈ క్షణం లోనే నీ శోకం తొలగటం చూస్తావు .రామ సోదరులు ఇక్కడికి వచ్చి నిన్ను చూసి లంకను భస్మం చేస్తారు .భయంకర క్రూర దుస్ట రావణుడిని,అతని బంధుమిత్ర పరివారాన్నీ పరిమార్చి ,నిన్ను అయోధ్యకు తప్పక తీసుకు వెడతాడు .నేను నిన్ను చూసినట్లు నీ గుర్తు ఒకటి నాకు ఇవ్వు .అని అడిగాను ఆమె అన్ని వైపులా చూసి ఎవరూ చూడటం లేదని తెలుసుకొని తన జడకు ఆభరణమైన చూడామణి ని ‘’ కొంగు నుంచి తీసి ‘’నాకు ఇచ్చింది . ఆ అభిజ్ఞానాన్ని తీసుకొని శిరసువంచి నమస్కరించి ఇక్కడికి రావటానికి సన్నాహ పడ్డాను ‘’అన్నాడు రాముడితో హనుమ .-

‘’త్వ చ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే –రామే దుఖాభిభూతేతు లక్ష్మణఃపరితప్యతే ‘’

‘’కథం ఛి ద్భవతీదృష్టా న కాలః పరి శోచితుం –అస్మిన్ముహూర్తే దుఖానా మంతం ద్రక్ష్యసి భామిని ‘’

‘’తా ఉభౌ నారా శార్దూలౌ రాజపుత్రా వని౦దితౌ –త్వద్దర్శన కృతోత్సాహౌ భస్మీకరిష్యతః’’

‘’హత్వా  చ సమరే  రౌద్రం రావణం సహబా౦ధవమ్ –రాఘవస్త్వాంవరారోహే స్వాం పురీం నయతేధ్రు వం ‘’

‘’తస్య రామో విజానీయా దభిజ్ఞాన మని౦దితే-ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వ మిహార్హసి ‘’

‘’సా భి వేక్ష్య దిశ స్సర్వా వేణ్యుగ్రథితముత్తమం –ముక్త్వా వస్త్రా ద్దదౌమహ్యం మణి మేతం మహాబల ‘’.

  రామా !ఇక్కడికి త్వరగా రావాలనే ఉత్సాహంతో శరీరం పెంచిన  నన్ను చూసి సీతమ్మ కన్నీటితో ‘’హనుమా !రామలక్ష్న్మణ సుగ్రీవుని అతని మంత్రులను కుశలం అడిగానని చెప్పు .రాముడు ఈ దుఖసాగరాన్నించి నన్ను దాటించేట్లు నువ్వు సన్నాహం చెయ్యి .రాముడినికలిసి పెల్లుబికే నా దుఖాన్ని ,రాక్షస్త్రీలు పెట్టె బాధల్ని భయాన్ని ఆయనకు తెలియజేయి .నీ ప్రయాణం సుఖంగా జరుగు గాక !’’అని చివరిసారిగా  నా వీడ్కోలు దుఖాన్ని భరిస్తూ గుడ్ల నీరు కుక్కుకొంటూ దీనాతి దీనంగా పలికింది .పూజ్య రామా !ఇలా అత్య౦త విషాదం తో నీ భార్య పలికి౦దయ్యా  .నేను చెప్పిందంతా యోచించి ,సీత సమగ్రంగా క్షేమగానే ఉన్నదని నమ్ము ,విశ్వసించు ‘’అన్నాడు రామదూత పవనసుత హనుమ’’-

‘’హనుమాన్ సింహ సంకాశా ఉభౌ రామ లక్ష్మణౌ-సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయం ‘’

‘’యథా చ మహా బాహూ ర్మాంతారయతి రాఘవః –అస్మాద్దుఖాంబు సంరోధాత్వం సమాధాతు మర్హసి ‘’

‘’ఇమ౦  చతీవ్రం మామ శోక వేగం –రక్షోభి రేభిః పరి భర్త్సనం  చ –బ్రూయాంతు రామస్య గతస్సమీప౦ –‘’శివశ్చ’’ తే ధ్వాస్తు హరి ప్రవీర’’

‘’ఏ తత్తవార్యా నృపరాజ సింహ-సీతా వచః ప్రాహ విషాద పూర్వకం-ఏతచ్చ బుద్ధ్వా గదితం మయాత్వం –శ్రద్ధత్స్వ సీతాంకుశలాం సమగ్రా౦’’

ఇది 37శ్లోకాల 67 వ సర్గ .

రాముడు సమగ్రంగా లంకలో జరిగినది అంతా తెలియ జేయమంటే హనుమ అంతా ‘’సినేమా రీలు’’లేక నేటి వీడియోలాగా  లాగా చెప్పి చూపించాడు .ఎందుకింత హైరానా ,టెన్షన్ రాముడికి ?సీత అక్కడ  ఏ రూపం లో ఉందొ అసలుందో లేదో ,ఈ కోతి నిజంగా చూశాడో లేదో ,చూస్తె ఆమెను గుర్తుపట్టాడో లేదో  , మాట్లాడాడో లేదో ,ఆమె అసలు తనకోసం ఎదురు చూస్తుందో లేదో ,వస్తాననే నమ్మకం కలిగిఉందో లేదో ,తన శౌర్య పరాక్రమాలు గుర్తున్నాయో లేదో ,ఏదో కాకమ్మ కబుర్లు చెబుతున్నాడేమో,అభిజ్ఞానమైన చూడామణి ఆమెదో కాదో లాంటి సవా లక్ష సందేహాలతో సతమతమై నిగ్గు తేల్చుకోవాలని అంత తపన పడ్డాడు రాముడు .ఆమె తన రాకకోసం రావణ సంహారం కోసం నిరీక్షోందా లేదా అనేసదేహమూ తీరాలి .అప్పుడే కదా తక్షణ కర్తవ్యం తాను  ఆలోచించాలి లేకపోతె కుక్క తోకపట్టుకొని గోదారి ఈదినట్లవుతుంది .ఇవన్నీ కన్ఫర్మ్ అవ్వాలి .

  హనుమకు భయమేముంది ?అత్యంత వినయ సౌశీల్యగుణమున్న ఉన్నవాడు నిజమైన రుజు ప్రవర్తన ఉన్నవాడుకనుక  బొ౦కాల్సిన  అగత్యం అవసరం ఆయనకేముంది ?అందుకే యుట్యూబ్ లో కాంటా సుబ్బారావు లాగా ‘’కుండ బద్దలు కొట్టి ‘’నట్లు ప్రతిమాటా చెప్పాడు .ఆమె శీల పవిత్రత చెప్పి రాముని నిజగుణ గరిస్టతను, సీతా విరహవేదననూ ఆమెకు చెప్పి సమన్యాయం చేశాడు .నవవ్యాకరణ  పండితుడా మజాకానా ?  కాకాసుర వృత్తాంతం పరమనాటకీయంగా ప్రదర్శింఛి గొప్ప ఎఫెక్ట్ కలిగించాడు .రాముడి మనసులో ఉన్న ,ఇతరులకు చెప్పలేని ,ఇతరులతో పంచుకోలేని ధర్మ సందేహాలన్నీహనుమ సీతమ్మ మాటలతో తీర్చుకొన్నాడు .ఇక్కడ హనుమ మరో ఉషశ్రీ యో, మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారో  అనిపించాడు .

  రాముడుకూడా ‘’కడుపు నిండా ‘’సీతా వియోగ దుఖాన్నిఏడ్చి ఏడ్చి  తీర్చుకొన్నాడు .దుఖం పొతే సుఖమే కదా వచ్చేది ?ఆ సుఖం రాముడికీ  సీతకూ అతిత్వరలోనే నెలరోజులలోపలే రాబోతోంది ‘’ సీతాపహరణ కథ ‘’సుఖా౦త మౌతోంది  .అందరి కన్నీటికి తెర పడ బోతోంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910–

ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు 1950-70కాలలో రాజమండ్రి భీమవరం కాకినాడ లలో వందలాది రోజులు వాటిపైనా, ఆధ్యాత్మిక విషయాలపైనా ఉపన్యాసాలిచ్ఛి అనంత జన సందోహాన్ని ఉర్రూత లూగించే వారు .ఆత్మగౌరవ ఆభిజాత్యాలెక్కువ .ఒకసారిఉమ్మడిమద్రాస్ రాష్ట్ర గవర్నరునుకూడా తనకోసం కూర్చోబెట్టిన ఘనులు .చినజీయర్ ఆశ్రమ స్వీకారం చేసిన మొదట్లో వీరివద్దనే పురాణపఠనం  నేర్చారు .పండితాగ్రణి జమ్మలమదకమాధవరామ శర్మగారువీరి ఉపన్యాసం విని అబ్బురపడ్డారు. మహామహోపాధ్యాయ ,ఉపన్యాస కేసరి బిరుదాంకితులు

సరస్వతీ కంఠాభరణ వేదుల సూర్యనారాయణ శర్మ -1911-1999-సూర్యనారాయణ ,గౌరమా౦బల పుత్రులు .కాకరపర్రులో ఆకొండి వ్యాసశర్మ ,వ్యాసలింగ శాస్త్రుల వద్ద సంస్కృత,సాహిత్యాలంకారాలు, వేదుల రామమూర్తిగారి వద్ద సంస్కృత వ్యాకరణం నేర్చారు .తణుకు ఉన్నత పాఠ శాలలో  తెలుగు  పండితులు .వ్యక్తిత్వ వికాసం పెంచేట్లు చదువు నేర్పేవారు .విద్యార్ధులతో పద్యాలు కథలు చెప్పించి వాటిని ‘’  స్టోరీపొఎమ్స్ ‘’గా ముద్రించి ప్రోత్సహించేవారు .కుర్తాళ పీఠాధిపతి బంధకవి సీతా రామాంజనేయులుగారు వీరిశిష్యులు .ప్రవచనం ద్వారాకాక, ప్రవర్తన ద్వారా విద్యార్ధుల ఆదరాభిమానాలు పొందారని ఆచార్య ఎస్వీ జోగారావు అన్నారు .నిత్య విద్యార్ధి ఐన శర్మగారు ఇంగ్లీష్ పాళీ భాషల్లోనూ ప్రావీణ్యం సాధించారు .

  శర్మగారు 1940-60లమధ్య ఎన్నోరచనలు చేశారు –లక్ష్మీ సహస్ర కావ్యం ,శృంగార నలీయం శ్రీ శంకర భగవద్గీత , సౌందర్య  లహరి తెలుగు వెలుగు భగవద్గీత ,నరేంద్రుడు ,బ్రహ్మ గీతాసారం ,శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం ,ఆర్య చాణక్యుడు ,కాకతి ప్రోలరాజు ,కాకతీయ చరితం ,బౌద్ధ దమ్మపదానికి అనువాదంగా –బుద్ధ గీత ,రక్షక భట తత్వ శాస్త్రం ,వేద తత్వ దర్శనం ,అంతరార్ధ రామాయణ, భాగవత ,భారతాలు ,అంతరార్ధ  విష్ణు పురాణంగా దేవీ భాగవతం ,మొదలైనవి. కొన్ని ముళ్ళపూడి తిమ్మరాజు గారికి అంకితమిచ్చారు .ఆర్య చాణక్యుడు లో చాక్యుడు ఆంధ్రుడే అని ,మాతామహ గోత్రం శ్రీవత్స కావచ్చు ననీ అన్నారు .

ఆపన్నులపాలిటి అన్నపూర్ణ ,సేవా తత్పర చారుశీల- చర్ల సుశీల -1911-1976.తండ్రి వేదుల సూర్యనారాయణ శాస్త్రిగారు చిన్నప్పుడే ఈతకొట్టటం సైకిల్ తొక్కిన సాహసి ఉత్సాహి  . బాల్యం నుండి మానవ సేవపై ఆసక్తి .భర్త చర్లగణపతి శాస్త్రిగారు .ఇల్లు అతిధి అభ్యాగతుల్తో కళకళ లాడేది .పేద అనాధ సేవ చేసేవారు .అందరిబాదా తనబాదగా భావించటం దాతృత్వం సహజ లక్షణాలు .భర్తగారి భగవద్గీత శ్లోకాలు ప్రార్ధనా గీతాలు బ్రహ్మసమాజ పాటలు శ్రావ్యంగా పాడేవారు. ఉదయం సత్సంగం లో పాల్గొనే వారు .నిత్యమూ కుటుంబ సభ్యులతోకలిసి యోగాసనాలుసూర్య నమస్కారాలు చేసి కాలువలో అందరూ స్నానం చేసేవారు .రాట్నం పై నూలు తీయటం నిత్యకృత్యం గాంధేయ వాదాన్నే అనుసరించి కస్తూరిబాయిలా ఖద్దరు చీరలేకట్టేవారు .విదేశీవస్త్ర బహిష్కరణ, దహనంచేసిన దేశభాక్తురలు  .మహా వక్తగా గంభీర ఉపన్యాసాలిచ్చి ప్రేరణకల్గించేవారు .దుర్గాబాయ్ దేశముఖ్ వీరి ఉపన్యాసాలకు ఆకర్షితురాలైంది .

   1950లో గణపతి శాస్రి సుశీల దంపతులు నిడదవోలులో ‘’కస్తూరిబాయి మహిళా సమాజం’’స్థాపించగా  దాని అధ్యక్షురాలుగా ప్రశస్తమైన సేవలు అందించారు సుశీలగారు .బాలరామాయణం మాతృశ్రీ స్తోత్ర రత్నాలు రాశారు .ఒక సారిపుట్ట పర్తి వెళ్లి సత్య సాయిబాబాపై –

‘’నిరుపేదలు ఆకలికిఅల్లాడు చుండ –బుట్టతలఏల పట్టుబట్ట లేల “-నిరుపేదలు వాసములేక అల్లాడు చుండ –భవనములేల బంగారు స్లాబులేల?’’అని పద్యం రాసి,ధైర్యంగా  చదివారు.ఆయన ఏమీ మాట్లాడలేదు ‘’

మర్నాడు   బాబా ఒక కవరులో 300రూపాయలు పెట్టి ‘’సుశీలమ్మ ‘’అని రాసి పంపించారు

1976 డిసెంబర్ లో   తనకుమారుడు బుద్ధ నారాయణ శాస్త్రి హఠాత్తుగా విపరీతమమైన గుండెపోటు వచ్చివిశాఖలోమరణించాడు  భర్త హైదరాబాద్ లో, ఈమె నిడదవోలులో ఉన్నారు .వెంటనే విశాఖకు రైలులో  బయల్దేరి దారిపొడుగునా దేవుడిని ప్రార్ధిస్తూ ఆగిన స్టేషన్లలో బీదలకు పండ్లు పంచిపెడుతూ విశాఖ చేరారు ,  కొడుకు మృత దేహం చూసి చలించిపోయి , ని శ్చేస్టు రాలై  అతడి గుండెదగ్గర తల ఆన్చి, రెండు నిమిషాలు ఆగి ‘’వాడిని పడుకో నివ్వండి నేను’’కూడా’’ వెడుతున్నాను ‘’అంటూ భర్తతో ‘’కోడలు చిన్నపిల్ల .ఆమెను జాగ్రత్తగా చూడండి ‘’అని చెప్పి  చెప్పి ,దేవుడి గదిలోకి వెళ్లి రెండు నిమిషాలు నిలబడి అక్కడేకిందికి ఒరిగి  ప్రాణం విడిచారు .అందర్నీ కన్న తల్లిలా ఆదరించిన ఆమెకు పుట్టెడు పుత్రశోకం కలిగించాడు భగవంతుడు .ప్రేమ వాత్సల్య పూరిత మైన దయార్ద్ర హృదయంకల కరుణామయి చర్ల సుశీలగారి  జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం ,మార్గదర్శకం ,ప్రేరణ.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .-

‘’యథైవ దేనుః స్రవతి స్నేహా ద్వత్సస్యవత్సలా –తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్ ‘’

‘’మణిరత్నమిదం దత్తం వైదేహ్యాఃశ్వశురేణ మే –వధూ కాలే యథా బద్ధ మధికం మూర్ధ్నిశోభతే ‘’

‘’ఈ మణి సముద్రాన పుట్టింది .సజ్జన పూజితమైనది .జనకుని యజ్ఞానికి సంతోషించి దేవేంద్రుడు ఇచ్చిన కానుక .శ్రేష్ట హనుమంతా !ఈ మణిని చూసి మా తండ్రి దశరథుని,మామామగారు విదేహ దేశాదిపతిని చూసినట్లైంది.ఈ మణి నా సీత శిరసుపై బాగా శోబిల్లింది .ఇవాళ ఆ మణిని చూడగానే ఆమెను సంపాదించి నట్లైంది .

‘’అయం హి జల సంభూతోమణిస్సజ్జనపూజితః –యజ్ఞే పరమ తుస్టేన దత్త శ్శక్రేణ ధీమతా –ఇమాం దృష్ట్వామణి శ్రేష్టం యథా తాతస్య దర్శనం –ఆద్యాస్మ్వ్యవగత స్సౌమ్య వైదేహస్య తథా విభో ‘’

‘’అయం హి శోభతే తస్యాః-ప్రియాయా మూర్ధ్నిమే మణిః-అస్యాద్యదర్శనే నాహం –ప్రాప్తాంతామివ చింతయే’’

హనుమా !వైదేహి ఏమి చెప్పిందో ఆ మాటలను మళ్ళీ మళ్ళీ చెప్పి దప్పిక గొన్న వాడికి నీటితో సంతృప్తి చెంది౦చినట్లు చెప్పి ఆ మాటల నీటితోనాకు సంతృప్తి కలిగించు .లక్ష్మణా !సముద్ర౦ లో పుట్టిన మణిని చూశానుకానీ ,సీత రావటం  మాత్రం చూడ లేకపోయాను ఇంతకంటే నాకు దుఖం ఏముంటుంది ?’’

‘’కిమాహ సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునఃపునః –పిపాసు మివ తోయేన సిందంతీ వాక్య వారిణః’’

ఇతస్తు కిం దుఖతరం యదిమం వారి సంభవం –మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతాం వినా ‘’

సీత ఇంకొక్క నెల  బతికి ఉంటె చాలు, కలకాలం జీవి౦చినట్లే .ఆనల్లకలువల కనుల సీత లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను .సీతను ఎక్కడ చూశావో అక్కడకు నన్ను తీసుకొనిపో .ఆమె క్షేమవార్త తెలిసి౦దికనుక ఇక ఒక్క క్షణం కూడా నిలవలేను హనుమా .రాక్షసులమధ్య బెదురూ దైన్యం భయంతో ఆమె ఎలా ఉండగలుగు తోందో ?-

‘’’’చిరం జీవతి వైదేహీ యది మాసం’ధరిష్యతి ‘’-క్షణం సౌమ్య న జీవేయం వినా తా సీతేక్షణాం ‘’  

‘’నయ మామపి తమ్ దేశం యాత్ర దృష్టామమప్రియా –న తిష్టేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్యచ ‘’

‘’కథం సా మమసుశ్రోణీభీరుభీరు స్సతీ సదా –భయావహానాం ఘోరాణాంమధ్యేతిష్టతిరాక్షసాం’’

శరదృతువులో చీకటే లేకుండా   వెన్నెల కాసేచంద్రుడిని మేఘాలు కమ్మినట్లు ,రాక్షస్త్రీలమధ్య ఉన్న సీతముఖానికి  సుఖం అనే వెన్నెల లేకుండా పోయింది  .హనుమా !సీత ఏయే మాటలు నాకు చెప్పమని నీకు చెప్పిందో ఒక్కమాట కూడా వదిలిపెట్టకుండా నాకు చెప్పు .అప్పుడు ఔషదాలవలన రోగి బతికినట్లు ఆ మాటలతో నేను బతుకుతాను .నన్నుఎడ బాసి ఉన్న సీత ఏమన్నదో సవివరంగా చెప్పు చెప్పు చెప్పు ‘’అని దుఃఖ వివశుడయ్యాడు రామయ తండ్రి .

‘’శారద స్తిమిరోన్ముక్తోనూనం చంద్ర ఇవాంబుదైః-ఆ వృతం వదనం తస్యా న విరాజతి  రాక్ష సైః’’

‘’కిమాహ సీతా హనుమం స్తత్వతః  కథ యాద్య మే –ఏతేన ఖలు జీవిష్యే భేషజే నాతురో యథా’’

‘’మధురా మధురాలాపా కిమాహ మమ భామినీ – మద్విహీనా వరారోహా హనుమన్ కథ యస్వ మే’’

ఇది 15శ్లోకాల 66వ సర్గ .

దుఃఖ వివశత్వంతో రాముడు పిచ్చివాడై ఉన్మత్త రాఘవుడిగా మాట్లాడాడు .ఇదంతా చూడా మణి మహాత్మ్యం .దాన్ని చూడగానే పాతగాథలన్నీ తవ్వి తీశాడు తన తండ్రి, మామ గుర్తుకొచ్చారు. సీత జ్ఞాపకం వచ్చి ఆమె దాన్ని అల౦క రించు కొనికోతన అందాన్ని ఎలా పెంచుకున్నదో మనకు హనుమద్వారాతెలిపాడు .మణి ఉత్కృష్టతను సీత ద్వారా మనం విన్నదే .ఇక్కడ తమ వివాహ సమయం లో ఆమె తండ్రి ఇచ్చిన కానుక గా గుర్తు చేశాడు చేసిన యజ్ఞానికి సంతృప్తి చెంది ఇంద్రుడు ప్రసాదించిన అమూల్య మణి అది. సజ్జనుల చేత పూజి౦ప బడిందని  చెప్పి దాని గౌరవాన్ని మరింత పెంచాడు .దూడను చూడగానే సంతోషంతో ఆవు పాలను చెపినట్లు ,శరత్ చంద్రుని మేఘం కప్పిట్లు వెన్నెల మసకబారటం ,రోగికి  ఔషధాలతో రోగం తగ్గట౦  మ౦చి ఉపమానాలు .మణిలో సీత దర్శనం చేశాడు రాముడు .కనుక ఇక ఆగలేకపోయాడు .ప్రతిబి౦బ౦తో లేక ఫోటోతో సంతృప్తి ఉండదు .అసలు విషయం చూస్తేనే పరమ తృప్తి . అది సీతను తాను  స్వయ౦గా చూస్తేనే కలుగుతుంది .ఇక ఆగలేడు .అందుకే హనుమను  సీత ఉన్న చోటుకు తీసుకొని పొమ్మని త్వర పెట్టాడు .ఆమె ఇంకో నెల బతికుంటే చాలు శాశ్వతం గా జీవి౦చేట్లు తాను  చేయగలను అనే ధీమాను   చెప్పకనే చెప్పాడు .అంటే ఇక ఆలస్యం చేయకుండా లంకకు వెళ్లి రావణ సంహారం చేసి సీతను దక్కి౦చు కొంటాడు అన్న భావం వ్యక్తమౌతోంది .

  దేనికైనా దోహదం ఒకటి ఉండాలి .రామునికి ఇక సీత పలికిన మాటలే దోహదం అన్నమాట. కనుకనే హనుమను ఆమె పలికిన ప్రతిమాటా తనకు తెలియజేయమన్నాడు .అవి కేటలిస్ట్ ల్లాగా  అంటే ఉత్ప్రేరకాల్లాగా వాటిని మరింత వేగవంతం చేసే ప్రమోటర్స్ లాగా  పని చేస్తాయి అన్నమాట .అప్పుడే రియాక్షన్ అత్యంత వేగంగా జరుగుతుంది .రావణ సంహారం అనే రసాయన ప్రక్రియ వేగవంతం చేయటానికి సీత పలుకులు కేటలిస్ట్ ల్లాగా ఆమె దుఖం బాధ దీనత్వాలు ప్రమోటర్లులాగా సహకరిస్తాయని రాముడి మనోభావం .దివ్యమణి దర్శనం దివ్య ప్రభావాన్నే అత్యంత శీఘ్రంగా కలిగిస్తుంది .అందుకే రాముడి తహతహ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు  విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు .సహాయ నిరాకరణ ఉద్యమం కాలం లో శాస్త్రిగారు ఒక ఇంగ్లీష్ స్కూల్ లో చదువుతుండగా ,జాతీయ పాఠ శాల చూడటానికి వెడితే మాస్టారు కొట్ట గా ,ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పిన దేశాభిమాని .1929లో మహాత్మా గాంధీ ప.గోజి లో పర్యటన చేస్తూ చేసిన ఉపన్యాసాలకు ప్రభావితులై అప్పటినుంచి ,జీవిత పర్యంతం ఖద్దరు వస్త్రాలే ధరించారు .అభిమానం,ఆచరణ, దీక్షకు గొప్ప ఉదాహరణగా నిలిచారు.అప్పటినుంచి భారత జాతీయోద్యమం లో వీరి ప్రస్తానం కొనసాగింది .

  1929-31లో  ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి ‘’ఉభయభాషా ప్రవీణ ‘’పట్టా అందుకొని ,తమ మామగారు వేదుల సూర్యనారాయణ గారి స్థానం లో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1933నుంచి సంస్కృత పండితులుగా పని చేశారు .తర్వాత నిడదవోలు కు మారారు .అప్పుడు వీరిల్లు కాంగ్రెస్ వాదులకు పెళ్లి వారి విడిదిగా ఉండేది కోలాహలంగా .వృత్తిలో నిబద్ధత పాటించి, ఆదర్శ ఉపాధ్యాయులుగా గౌరవం పొందారు .స్వాతంత్ర్యోధ్యమ స్పూర్తి నరనరానా జీర్ణించి ,ఉద్యోగానికి స్వస్తి చెప్పి, సంఘ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .

   1940లో నిడదవోలు దగ్గరున్న ‘’సమిశ్ర గూడెం ‘’లో ఇల్లు కట్టుకొన్నారు .పోతన త్యాగయ్య ల స్పూర్తితో వ్యవసాయమూ చేశారు  .ప్రతి రోజూ రాత్రి చేతిలో’’ లాంతరు’’ పట్టుకొని హరిజన వాడ కు వెళ్లి రాత్రి పాఠశాల నడిపారు .ఫ్లారెన్స్ నైటింగేల్ ప్రతి రోజూ అర్ధరాత్రి  వేళ చేత్తో దీపం పట్టుకొని హాస్పిటల్స్ లోని రోగులను పరామర్శించి ‘’లేడీ విత్ ది లాంప్ ‘’అని పించుకున్నట్లే శాస్త్రిగారు ‘’మాన్ విత్ ది లాంప్ ‘’అయ్యారు .వీరి దీపం వారికి జ్ఞాన జ్యోతికి తోడ్పడింది .ఆమె దీపం బాధితుల ఉపశమనానికి దోహద పడింది .అస్పృశ్యతా నివారణకు శాయశక్తులా కృషి చేస్తూ మాటలతోకాక చేతలతో తన ఇంట్లో ఒక  హరిజన యువకుడికి  ఆశ్రయమిచ్చి ఆదర్శంగా ,మార్గదర్శి గా నిలిచారు.1942లో చాగల్లు జాతీయ పాఠశాలకు శాస్త్రిగారు కార్య దర్శి ,కోశాధికారి బాధ్యతలు సమర్ధంగా నిర్వహింఛి ,పేరు పొందారు .

 మంచికీ మా వత్వాని కీ గొప్ప విలువనిచ్చిన శాస్త్రి గారు నిరాడంబర జీవితం గడిపారు .గాంధీ వినోబాల ఆదర్శాలకు ప్రభావితులై ఆ బాటలోనే నడిచి వారి ఆశయ  సాధనకు తీవ్ర కృషి చేశారు  .భూదాన యాత్ర ఉద్యమం లో వినోబా పగోజిలో పర్యటించినపుడు శాస్త్రిగారు తన 5ఎకరాల భూమి భావే కు దానంగా ఇచ్చారు .భూదాన ,సర్వోదయ సిద్ధాంత ప్రచారమూ నిర్వహించారు .స్వాతంత్ర్యం వచ్చాక వీరికి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుడుగా చేసిన సేవలను గుర్తించి భూమిని ,పెన్షన్ ను గ్రాంట్ చేస్తే ‘’నా తల్లికి నేను చేసిన సేవకు  వెల కడతానా ?’’అని నిస్వార్ధంగా త్యాగబుద్ధితో నిరాయకరించి ఉత్తములు, ఆదర్శప్రాయులు శాస్త్రి గారు .1950’’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’స్థాపించి ,1953లో ‘’ఆర్ష గ్రంథ మాల ‘’కు శ్రీకారం చుట్టి ,’’లలితా ఆర్ట్స్ ప్రెస్’’ నెలకొల్పి తమ గ్రంథాలను వారే స్వయంగా ముద్రించుకొన్నారు .ఈ పరిషత్ ద్వారా జీవితాంతం ఆర్ష ధర్మ ప్రచారం  చేశారు .

  తమ 17వ ఏటనే రచనలు చేయటం మొదలుపెట్టిన శాస్త్రిగారు మొదట ‘’కాళీ శతకం ‘’రాశారు  .తర్వాత వివిధ ప్రక్రియలలో 75  రచనలు చేశారు .స్వయంగా గొప్ప రచయితే అయినా అనువాద రచనకు ఎక్కువ ప్రాధాన్యత  కల్పించారు  .ప్రాచీన సాహిత్యాన్ని ఆనాటి తరానికి  సుబోధకంగా  అందించాలనే తపన వారిది .వేద ,పురాణ విజ్ఞానాన్ని తెలుగులో అందించటానికి కృషి చేశారు .బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు తెలిగించి,అధ్యయనం చేసి అనుసరించి  ఆ మార్గం లో జీవితాన్ని గడిపారు .రచనలపై సహజంగానే గాంధేయ ప్రభావం ఉంటుంది .తండ్రి నారాయణ శాస్త్రి గారి ‘’నారాయణీయా౦ధ్ర వ్యాకరణం ‘’కు వచనంలో ‘’నారాయణీయాంధ్రవ్యాకరణ వ్యాఖ్యానం,వివరణ  ‘’రాసి తండ్రికి తగ్గ తనయులని పించారు.స్వాతంత్ర్య దీక్ష పద్యకావ్యం రాశారు .బుద్ధ చరిత్ర చంపూకావ్యం ,వర్ధమాన మహా వీర గ్రంథాలు అహింసా వ్రతానికి పట్టుగొమ్మలు  .శాస్త్రిగారి ‘’మహాభారత మీమాంస ‘’ఉత్తమవిమర్శ  గ్రంథంగా కవిపండిత విమర్శకుల మన్ననలు అందుకొన్నది.

  గణపతి శాస్త్రిగారి ‘’అమృత గీతాంజలి ‘’వచన గేయ కవితా సంపుటి .లియో టాల్ స్టాయ్ నాటికకు అను సృజనగా సామ్యవాద భావాలతో ‘’చీకటిలో జ్యోతి ‘’రాశారు .’’రఘు వంశ లహరి ‘’పుస్తక పీఠికలో సూర్య వంశ చరిత్ర వివరంగా రాశారు .కాళిదాసకవి ‘’మేఘ సందేశం వీరి చేతిలో ‘’మొయిలు రాయబారం ‘’గా రూపు దిద్దుకొన్నది .వాల్మీకి రామాయణం ను ‘’గణపతి రామాయణ సుధ’’గా అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ అందుకొన్నారు.భగవద్గీతను ‘’తెలుగు గీత ‘’గా అనువాదం చేసి అది తనకు అత్యంత సంతృప్తికరమైన ,ఇష్టమైన గ్రంథంగా చెప్పుకొన్నారు  .శాస్త్రిగారి రచనలపై పై శ్రీ బొడ్డేపల్లి ప్రసాదరావు పరిశోధన చేసి శాస్త్రిగారి మొత్తం రచనలు 75అని తేల్చారు .స్వతంత్రంగా నాటికలు గేయాలు బుర్రకధలు రాశారు .1961లో హైదరాబాద్ లో లలితా ప్రెస్ పెట్టి   నిర్వహింఛి ,1979లో విశాఖకు మార్చారు .

  క్లిష్ట సంస్కృత శ్లోకాలెన్నిటికో తేట తెలుగు పద్యాలురాసి పండితుల మన్ననలు అందుకొన్నారు .విజ్ఞానాత్మకం, కర్తవ్య బోధ గ్రంధ రచన ముఖ్య లక్షణంగా ఉండాలని భావించిన ఉత్తమ శ్రేణి రచయిత శాస్త్రిగారు .శాస్త్రిగారి సాహితీ సేవను గుర్తించిన ఆంద్ర విశ్వవిద్యాలయం వీరికి 1988లో ‘’కళాప్రపూర్ణ’’ తో సత్కరించి గౌరవించింది .1990 లో కేంద్ర సాహిత్య ఆకడేమి అవార్డ్ పొందారు .1995లో ఏలూరు’’ గుప్తా ఫౌండేషన్’’ సాహితీ పురస్కారం స్వీకరించారు .ఎన్నెన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు సభ్యులుగా ఉన్నారు .

  1976లో శాస్త్రిగారి ఏకైక కుమారుడు శ్రీ బుద్ధ నారాయణ శాస్త్రి విశాఖలో అకస్మాత్తుగా మరణిస్తే ,ఆవార్తవిని ఆయన తల్లి ,శాస్త్రిగారి సతీమణి శ్రీమతి సుశీలగారు కుప్పకూలిపోయి మరణించారు .ఈ రెండు దుర్ఘటనలకు ఏమాత్రం కుంగిపోకుండా ,స్థిత ప్రజ్ఞతతో  నిల్చి ,విశాఖకు  నివాసం మార్చారు .సాగర తీర విశాఖ లో ఆ రోజుల్లో శాస్త్రిగారులేని సాహిత్య కార్యక్రమం ఉండేదికాదు .చివరి దశలో విశాఖ రామకృష్ణాశ్రమం లో సంస్కృత బోధ చేస్తూ ,,యోగాసనాలు నేర్పిస్తూ ,కృష్ణాశ్రమం లో సారస్వత బోధ గావిస్తూ ,గోస్టులు ,వ్యాపకాలతో సవ్య సాచిలాగా గడుపుతూ 87ఏళ్ళ సార్ధక నిండు జీవితాన్నిగడిపిన చర్ల గణపతి శాస్త్రిగారు 15-8-1996 జీవితం లో చివరి స్వాతంత్రోత్సవ దినాన్నీ చూసి ,మర్నాడు పరమ పదించారు .సాహిత్యసేవ, సంఘసేవ శాస్త్రిగారికి రెండు కళ్ళు.గణపతి పేరును సార్ధకం చేసుకొన్న శిఖరాయమాన వ్యక్తి చర్ల గణపతి శాస్త్రి గారు .

‘’యోగి,జ్ఞాని ,గుణాతీతుడు ఆత్మ నిస్టుడు,స్థిత ప్రజ్ఞుడు వైరాగ్య భావన శాస్త్రిగారి గొప్ప లక్షణాలు .నడిచే గ్రంధాలయం ,మూర్తీభవించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం ,సంస్కృత సాహిత్య సింధు .దేశ భక్తీ , జాతీయభావం ,చిత్త శుద్ధి ,దీక్షా దక్షతకు మారుపేరు .వారి జీవితం నవతరానికి దివ్య సందేశం .నిగర్వి, నిరహంకారి, పరోపకార పారాయణుడు ,వితరణ శీలి సౌజన్య మూర్తి .సత్యమార్గ దర్శి .అవధులులేని మానవ సేవ ఆయన పరమావధి ‘’అని ఉత్తమ ప్రశంసలు అందుకొన్న శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారు ధన్యజీవి .గురు పూర్ణిమ సందర్భంగా  ఈ ఉత్తమోత్తమ  దేశికోత్తముని గురించి తెలుసుకొని మనమూ ధన్యులమయ్యాం .

  సశేషం

గురుపూర్ణమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై  ఆమెకున్న అవ్యాజ  అనురాగం ,  రాక్షసరాజు ఇచ్చిన  రెండు నెలల  గడువు విషయం హనుమనుంచి తాము విన్నది చెప్పారు .సీతా దేవి క్షేమం అని తెలిసి రాముడు ‘’సీత ఎక్కడ ఉంది ?నాపై ఆమె అభిప్రాయమేమిటి ?సీత గురించి అన్ని విషయాలు చెప్పండి   ‘’అనగా వారంతా హనుమవైపు చూసి ఆయననే చెప్పమన్నారు –

‘’క్వ  సీతా వర్తతే దేవీ కథం చమయివర్తతే –ఏతస్మే సర్వ మాఖ్యాత వైదీహీం ప్రతివానరాః’’

వానరుల సాభిప్రాయం గ్రహించి, ప్రాజ్ఞ హనుమ దక్షిణ దిశకు తిరిగి, సీతాదేవికి మొక్కి ,రాముడితో ‘’నేను నూరు యోజనాల పొడవైన సముద్రం దాటి ,సీతా దేవిని వెతుకుతూ ,దక్షిణ తీరం లో దురాత్మరావణపాలిత  లంకానగరం వెళ్లి,అతడి అంతపురం లో నీమీదే మనసంతాలగ్నం చేసి, జీవిస్తున్న సీతాదేవిని  చూశాను .ప్రమదావనం లో రక్కసి వనితలామెను కావలి కాస్తున్నారు .వారు మాటిమాటికీ భయపెడుతున్నారు .ఆమె సుఖం అనుభవించటానికి  పుట్టింది  .కాని దురంత దుఖం అనుభవిస్తోంది .ఒంటి జడతో దీనురాలై,నిన్నే తలుస్తూ అక్కడ బందీగా ఉంది .నేలపైనే నిద్రిస్తోంది .హేమంత తామర తీగలాగా ఆమె శరీరం కాంతి  విహీనంగా ఉంది .రావణునిపై వైముఖ్య౦ తో చావటానికి నిశ్చయించిన ఆమెను ఎలాగో వెతికి కనుగొన్నాను .నేను ఇక్ష్వాకు వంశ కీర్తి ని మెల్లగా ప్రస్తుతించి ,ఆమెకు నాపై విశ్వాసం కలిగేట్లు చేయగలిగాను .

‘’ దుఃఖ మాసాద్యతే దేవీ తథాదుఖోచితా సతీ ‘’

రావణా౦తః పురే రుద్ధారాక్షసీభిస్సురక్షితా –ఏక వేణీధరా దీనా త్వయి చి౦తాపరాయణా’’

‘’అథ శ్శయ్యా వివర్ణా౦గీ పద్మినీవ హిమాగతే-రావణా ద్విని వృత్తార్థా మర్తవ్యకృత నిశ్చయా ‘’ 

‘’ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తి యతా నఘ –సా మయా నర శార్దూల విశ్వాస ముపసాదితా ‘’

నాపై విశ్వాసం కలిగి సీతాదేవి నాతో మాట్లాడింది.నీ పరిస్థిని కూడా సాకల్యంగా ఆమెకు తెలియజేశాను .రామ సుగ్రీవ మైత్రివిని చాలాసంతోషించింది  .నీపై అచంచల ప్రేమ భక్తీ తో ఆమె ఉంది .నిరాహారంగా నీకోసం భయంకరతపస్సు చేస్తోంది !చిత్రకూటం లో జరిగిన కాకాసుర వృత్తాంతం జ్ఞాపకం చేయమన్నది .ఆమె స్వయంగానాకు  ‘’అక్కడ నువ్వు  ఏం చూశావో  అక్షరం పొల్లుపోకుండా  సుగ్రీవుడు కూడా వింటుండగా రాముడికి  నివేది౦చు  .నేను ఇప్పటిదాకా చాలాజాగ్రత్తగా దాచుకొన్న చూడామణిని నా రాముడికివ్వు.శ్రీమంతమైన ఈ చూడామణిని నేను ఎంతో శ్రద్ధగా కాపాడుకొన్నాను .పూర్వం ఒక సారి నా నుదుటి బొట్టు కరిగి నీకు కనిపిస్తే ,నువ్వు మణి శిల  నా నుదుట బొట్టుగా ప్రతిఫలిం చేట్లు న నుదుట  గుండ్రాతిపై ఉంచావు దాన్ని ఒక్కసారి స్మరించు .అనర్ఘ రాఘవా !సముద్రం లో పుట్టిన శ్రీమంతమైన చూడామణి నీ కోసం పంపాను .నేను ఇప్పటివరకు దుఖం లో దీన్ని చూసుకొంటూ నిన్ను చూసినంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను .దాశరధ రామా !ఇంకా ఒక్కనెల మాత్రమె బతికి ఉంటాను .ఆతర్వాత ఈ రాక్షసులకు వశమై జీవి౦చనే జీవించను ‘’అని కృశాంగి ధర్మచారిణి సీత రావణ బందీయై నాతో చెప్పింది .రామా !ఆమె చెప్పింది అంతా ఆమె మాటలతోనే నీకు విన్నవించాను .ఇంకా ఆలస్యం చేయకుండా సముద్ర లంఘనం విషయం ఆలోచించు ‘’అని హనుమ సవివరంగా తెలిపాడు .తనమాటలు విని రామ సోదరులు ఊరట పొందారని  గ్రహించి ,సీతాదేవి ఇచ్చిన చూడామణి ని రామునికి అందజేసి ,ఆమె చెప్పింద౦తా సవిస్తరంగా చెప్పాడు హనుమ .

‘’రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగమా ‘’

‘’నియతస్సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి –ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ ‘’అభిజ్ఞానం చ మే దత్తం యథా వృత్తంతవాన్తికే –చిత్ర కూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ ‘’అయం చాస్మైప్రదాతవ్యో యత్నాత్ సుప్రరిరక్షితః-బ్రువతా వచనా న్యేవం సుగ్రీవ స్యోప శృణ్వతః-ఏష చూడామణిః శ్రీమాన్ మయా సుపరిరక్షితః’’

‘’మన శ్శిలా యా స్తిలకో గండ పార్శ్వేనివేశితః –త్వయా ప్రణస్టే తిలకే త్వంకిల స్మర్తు మర్హసి ‘’

‘’ఏష నిర్యా తితః శ్రీమాన్ మయాతే వారి సంభవః –ఏతం దృష్ట్వాప్రమోదిష్యే వ్యసనే త్వామివానఘ ‘’

‘’జీవితం ధార యిష్యామి మాసం దశరథాత్మజ –ఊర్ధ్వం మాసా న్న జీవేయ౦ రాక్షసా వశ మాగతా’’

‘’సర్వథా సాగర జలే  సంతారః ప్రవిధీయతాం’’

‘’తౌజాతా శ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా –తచ్ఛాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ – దేవ్యా చాఖ్యాతాం సర్వమే వాను పూర్వ్యాత్ –వాచా సంపూర్ణం యాయుపుత్రః శశంస’’

 ఇది 28 శ్లోకాల 65 వ సర్గ .

 హనుమ లంక విశేషాలన్నీ చాలాసంక్షిప్త వివరంగా రాముడికి సుగ్రీవ సముఖంలోనే సీత కోరినట్లు తెలిపాడు .’’చూడామణి , మణి శ్శిలాఫలకం విషయాలు నెలకంటే ఎక్కువకాలం బ్రతకని విషయమ సీత చెప్పినట్లే డైరెక్ట్ స్పీచ్ తో హనుమ తెలియ జేసి రాముడికి సీత చెబుతున్న అనుభూతి కలిగించి గోప్పఎఫెక్ట్ తెచ్చాడు .తక్షణ కర్తవ్య పరాయణుడిని చేయటానికిది బాగా తోడ్పడింది .,చూడామణి మహాత్మ్యం చాలాగొప్పదని దాన్ని తాను ఇంతవరకు ప్రాణప్రదంగా తన పవిత్ర శీలంతో పాటు కాపడుకొన్నది సీత . అన్దుకెఆ విషయాన్ని  నొక్కి వక్కా ణి౦చింది.దీనితోనైనా   రాముడిలో చలనం కలుగుతుందని ,తనకు మోక్షం కలుగుతుందని ఆశించింది .ఆమె కోరినట్లే రామసోదరసుగ్రీవ సమక్షం లో అంద జేసి,దూత కార్యాన్ని అత్యంత సఫలం చేశాడు .సీత తనతో చెప్పిన కాకికథ తో సహా, మిగిలినదంతా హనుమ తాను తనకళ్ళతో చూసిన సర్వవిషయాలు రామాదులకు చెప్పాడు  తక్షణ కర్తవ్యం సముద్రం దాటటం ఎట్లాగో ఆలోచించమని త్వర పెట్టాడు . ఇక తాను  చేయవలసిందేమీ లేదు.  రామసోదరులు, వానరరాజు సుగ్రీవుడి చేతుల్లోనే ఇక మిగిలింది అంతా ఉన్నది .ఇప్పటిదాకా   హనుమ సఫల పవిత్ర రామకార్య దూత .ఇక తాను కేవలం వారి బంటు .వారేమి ఆలోచించి నిర్ణయిస్తే దాన్ని తూచా పాటిస్తాడు .కానీ సీతను లంక చెర విడిపించి రావణ సంహారం చేసి  నెలలోపలె లంకనుంచి రాముడు తీసుకు రావాలి తప్పదు.  ఇదే ఇప్పుడు అందరి తక్షణ కర్తవ్యమ్ .

  సశేషం

గురు పూర్ణిమ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6

పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918

 వెంకట రామకృష్ణ  ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు  జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా ప్రవీణులు .వేదుల ఆంగ్లాన్ని తర్వాత నేర్చారు .కాకరపర్రు లో ఓలేటి కవిత్వాన్ని మెచ్చిన వారని చూసి ,వేదుల తానూ రాయటం మొదలుపెట్టారు  కాళిదాస త్రయం సిద్ధాంత కౌముది పూర్తి  చేసి  కవిత్వ రచన ఉత్సాహంగా మొదలుపెట్టి రామాయణ సంగ్రహం ,విఘ్నేశ్వర చరిత్ర ,నరకాసుర వ్యాయోగం 13ఏట ,దమయంతీ కల్యాణం శుద్ధాంధ్ర ప్రబంధాన్ని 14వ ఏట రాసి కుకవినింద ,ప్రాకృతం లో ,కర్ణ విజయ ‘’ వ్యయోగం సంస్కృతం లో రాశారు .ఓలేటి వేదులను ‘’సరస్వతీ అవతారంగా భావించేవారు .వేదుల 20ఏళ్ళకే పుంభావ సరస్వతి అనిపించుకొన్నారు .

  అప్పటికే ఓలేటి వ్యాసాభ్యుదయ ప్రబంధం రాసి ,కాకరపర్రు సీతారామస్వామికి అంకితమిచ్చారు .ఇద్దరూకలిసి వేంకటాధ్వరి ,విశ్వ గుణాదర్శం  ,భవభూతి ఉత్తరరామ చరిత భల్లాల కవి భోజ చరిత్ర లను ఆంధ్రీకరించారు. క్షేమేంద్రుని ‘’ఔచిత్య విచార చర్చ , సువృత్తితిలకం ,కవి కంఠా భరణాలనే లక్షణ గ్రంథాలను  అనువదించారు.మదాలస అనే 5అంకాల స్వతంత్ర నాటకం ,ఇందిరాదేవి ,సుభద్ర దమయంతి నవలలు రాశారు .వీరి కొండవీటి రథయాత్రకు మద్రాస్ విద్వ త్సమాజం స్వర్ణపతకమిచ్చింది .

  ఇద్దరూకలిసి పిఠాపురం రాజా వారిని పద్యాలతో మెప్పించి 1919లో దేవులపల్లి సోదరుల స్థానం లో ఆస్థానకవు లయ్యారు  .అప్పటికీ ఓలేటికి 22,వేదులకు 16 వయసు . ఈ జంట  శతావధానం  గుర్రపుస్వారీగా బహువేగంగా ఉంటూ 8మంది లేఖకులకుకూడా  రాయటం కష్టంగా గంటకు నూరు పద్యాలు చెప్పేవారు .సూర్యరాయ ప్రభు ఆస్థానం లో శతావధాన ,శతవిదాన ,శతప్రసాది అవధానాలు చేసినట్లు చెప్పుకొంటారు .ఈ విద్వత్కవులు ‘’సిరి మనరావు సూర్య నృపశేఖరు నింటవసించు గాత’’అని మొదలుపెట్టి భారత కథ వచ్చేలా వంద పాదాలు గబగబా గుక్క తిప్పుకోకుండా చెప్పారట .

  ఓలేటి రాసిన 30 లో ‘’కథాసరిత్సాగరం ‘’అనే అనువాద కృతి గొప్పది .యువ రాజాగంగాధర రామారావుకు  ,విశ్వ  గుణాదర్శం సూర్యారాయ ప్రభువుకు  అంకితం .ఆంధ్రకవుల అపరాధములు ఖండకావ్యం ,కొత్తకవిత్వంతో ‘’నూట పదియార్లు ‘’సీస శతకం విలక్షణం .మూడు ఛందో విన్యాసాలతో సువృత్తి తిలకం రాశారు .అరుదైన ఛందస్సులకు లక్షణాలు రాసి కవిత్రయం నుంచి సాక్ష్యాలు చూపారు .ఇది సాహితీ జిజ్ఞాసులకు అమూల్యకానుక ,కరదీపిక .తిరుపతి వేంకటకవుల ‘’పాశుపతం ‘’కు ఈ జంట ‘’పరాస్తు పాశుపతం ‘’సమాధానంగా రాశారు .తర్వాత ‘’అట్టహాసం ‘’రాశారు .ఇలా మహా కవుల వివాదాలు సాహిత్య పుష్టికి ,భాషాభి వృద్ధికీ సాహిత్య ప్రయోజనానికి తోడ్పడ్డాయి ,వీరిద్దరిపై డా. పాలంకి లక్ష్మీదేవి పరిశోధన చేసి ‘’సారస్వత వరివస్య ‘’రాసింది .

సంస్కృతాంధ్ర సాహిత్య సామ్రాట్ –వేదుల వెంకట సత్యనారాయణ శాస్త్రి -188-1969-40ఎకరాల ఆసామి .ఉభయభాషా ప్రవీణ. వెంకయ్య మహాలక్ష్మి  దంపతులకుమారుడు .అన్నదాన ,విద్యాదానాలలో మేరువు. ఉచిత విద్యాబోధన ,అమోఘ ధారణా శక్తి .వర్ణమాలలోని అ నుంచి క్ష వరకుప్రారంభంగా  ఉన్న వేల శ్లోకాలు ,పద్యాలు అలవోకగా చెప్పేనేర్పు .దర్జా వస్త్ర ధారణా చేతులకు సింహ తలాటాలు , బరం పుర౦ అత్తరు సాయిబు గారి సెంటు పూసుకొని  సాహిత్యంపరిమళం తోపాటు ఈపరిమళమూ  వెదజల్లెవారు .విలాస జీవితం .ఇంటికి వచ్చిన పండితులకు సత్కారం చేయకుండా పంపటం లేనేలేదు . బ్రహ్మసూత్ర భాష్య ప్రవచన దిట్ట .శిష్యులు తణుకులో 26-7-1962న ఘనసత్కారం చేసి ‘’సంస్కృతాంధ్ర సాహిత్య సామ్రాట్ ‘’బిరుద ప్రదానం చేశారు.

సాహిత్య రారాజు –పెన్మత్స సత్యనారాయణ రాజు -1899-1980-ఉభయభాషా ప్రవీణ ప్రభుత్వ శాఖలో అనువాదకుడు ,అసిస్టెంట్ పబ్లిసిటి ఆఫీసర్ .గుడివాడ ఆంద్ర నలందకాలేజీలో ఆంద్ర శాఖాధ్యక్షులు ,నార్ల, సూరి భవంతం ,మొదలైనవారు శిష్యులు .బహు గ్రంథకర్త .జయపురం విక్రమదేవ రాజుకు సన్నిహితులు .ఆస్థాన గౌరవ ఆస్థానకవి .ఆయనగ్ర౦ థాలు ‘’తెలుగు రాజు కృతులు ‘’గా ప్రచురితాలు.చంపక మాలినీ  పరిణయం ,అచ్చతెనుగు కావ్యం ,పతిభక్తి ,దాక్షారామ భీమేశ్వరశతకం ,రసాతలం ,జ్ఞానాంజలి – (న్యూక్లియర్ సైంటిస్ట్ స్వామి జ్ఞానానందపై)

రాజానంద అలంకార శాస్త్రం ,తపోభూమి ,ఉత్తరరామాయణం మొగల్తుర్రు సంస్థాన నేపధ్యంలో ‘’మొగలిరేకు ,తూర్పు  చాళుక్యులపై  గోరువంక ,హరిజన దేవాలయ ప్రవేశం పై ఆరాధన ,ఉయ్యూరు కెసీపి వ్యవస్థాపకులు వెలగపూడి రామకృష్ణపై ‘’రామ కృష్ణ చరిత్రం ‘’ఆత్మకథగా ‘’తెలుగు రాజు’’ ,పరిశోధనాత్మక గ్రంథం-ఆచ్ఛిక పద కోశం ,మన్మథ హేల ,రసమంజరి .వేడంగిలో, పుట్టి తణుకు స్థిరపడినా ,చర్ల నారాయణ శాస్త్రిగారి శిష్యుడై కాకరపర్రు పై అభిమానం పెంచుకొన్నారు  .కవిరాజు, కవితా విశారద,కళాప్రపూర్ణ బిరుదాంకితులు .కాకరపర్రులో ఈ సాహిత్య రాజుగారి శిలా విగ్రహం ఏర్పాటు చేశారు .ఆంద్ర సోషలిస్ట్ పార్టీ ప్రముఖులలో రాజుగారొకరు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -66

సుగ్రీవాజ్ఞ శిరసా వహించి,సంతోషం తో  దదిముఖుడు ,ఆయనకు, రామసోదరులకు నమస్కరించి ,తనబృందంతో ఆకాశానికి ఎగిరి ,మధువనం ప్రవేశించాడు .అప్పుడు ‘’వానరగురువుల ‘’మత్తు అంతా దిగిపోయి ,మర్యాదగా లేచి నిలబడ్డారు .దధి కూడా వారందరికీ అంజలి ఘటించి  అంగదునితో ‘’సౌమ్యుడా ! ఈ వనరక్షకులు మిమ్మల్ని వారి౦చారని కోపం వద్దు అజ్ఞా, తో వారు చేసిన పని అది .నువ్వు యువరాజువు కనుక మధువనానికి అధిపతివి .అజ్ఞానం తో చేసిన అపచారానికి క్షమించు .మీ పినతండ్రి దగ్గరకు వెళ్లి ,మీరంతా మధువనానికి వచ్చారని చెప్పాను .ఆయన, అక్కడి మిగిలినవారు మీరిక్కడికి రావటం, వనభంగం చేయటం విని సంతోషించాడే కాని కోపించలేదు .వెంటనే మిమ్మల్నందర్నీతనదగ్గరకు పంపమని  నాకు చెప్పాడు ‘’అని చెప్పాడు –దదిముఖుడుకూడా రాజాజ్ఞకు బద్ధుడై జరిగిన దానిలో వానరుల తప్పేమీలేదని’’ సర్టిఫికేట్ ‘’ఇవ్వటమే కాక వనపాలురు వారి యెడల ప్రవర్తించిన  తీరు అజ్ఞానం మాత్రమె అని క్షమించమనీ కోరటం రాజాజ్ఞను సంపూర్తిగా నెరవేర్చటం లో భాగమే .సుగ్రీవుడు వారందర్నీ  క్షమించాడనే చల్లని వార్తకూడా తెలియ జేశాడు తనకర్తవ్యంగా .

‘’స తా సుసాగమ ద్వీరోబద్ధ్యాకరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణమిదం హృస్టవ ద౦గదం’’

‘’సౌమ్య రోషో న కర్తవ్యో యదేతి రభివారితః-అజ్ఞానా ద్రక్షభిః క్రోధాద్బవంతః ప్రతి షేదితాః’’

‘’యువ రా త్వమీశశ్చ వనస్యాస్య మహాబలః –మౌర్ఖ్యా త్పూర్వం కృతో దోషస్తం భవాన్ క్షంతు మర్హసి ‘’

‘’ఆఖ్యాతం హి మయా గత్వా పితృప్యస్య తవానఘః-ఇహోపయాత౦  సర్వేషా మేతేషాం వనచారిణ౦’’

‘’త త్వదాగమనం శ్రుత్వా సహైభి ర్హరి యూథపైః-ప్రహృస్టో సౌ వనం శ్రుత్వా ప్రధర్శితం ‘’

‘’ప్ర హృస్టో మాం పితృవ్యస్తేసుగ్రీవో వానరేశ్వరః –శీఘ్రం ప్రేషయ సర్వాం స్తానితి హోవాచ పార్థివః’’

  ఈ శ్లోకాలలో హృష్ట ,ప్రహృష్ట శబ్దాలు పునరావృత్తం  అయేట్లు మహర్షి రాశాడు .ప్రకృష్టమైన హర్షం అందరూ పొందారని ‘’సూపర్లేటివ్ డిగ్రీ ‘’ఉపయోగించి చెప్పటం సీతాదేవిని చూసిన వార్తకు కలిగిన మహోత్కృ స్ట ఆనందాను భూతి అన్నమాట ..

దదిముఖుని  మాటలు విని అంగదుడు వానరులతో ‘’రాముడు ఈ వృత్తాంతం వినే ఉంటాడని అనుమానంగా ఉంది .కనుక శత్రుతాపక వానర మహా శయులారా,కార్యం సాధించాక ఇక ఆలస్యం చేయటం తగదు మా బాబాయ్ సుగ్రీవుడి దగ్గరకే అందరం వెళ్ళటమే మిగిలింది .మీ రంతా ఎలా చెబితే అలా చేద్దాం .కర్తవ్య విషయం లో నేను మీకు పరాదీనుడనే .యువరాజునైనా ,మిమ్మాజ్ఞాపించే సమర్ధత లేదు .కార్య సాధకులైన మీకు నేను అనాదరం చేయటం తగని పని ‘’అన్నాడు.బాధ్యత తాను తీసుకోకుండా సమష్టి నిర్ణయం చేయమని దానికి తానూ బద్ధుడనే ననీ  ‘’యువర్స్ మోస్ట్ ఒబీడిఎంట్’’లాగా ‘’ప్రజాస్వామ్య పాలకుడు ‘’లా  చెప్పాడు –ఇప్పుడుమనల్ని ఎలుతున్నాదినాయకులకు ఈ ఆలోచనే ఉంటే మూడుపూలు ఆరుకాయల్లాగా వర్దిల్లధా.వానర రాజుకున్న ఇంగితం కూడా మనల్ని యేలుతున్న మహా ప్రభువులకు లేకపోవటం సిగ్గుచేటు .అక్కడ రాజరిక వ్యవస్తలో ప్రజాస్వామ్యం పూసింది .ఇక్కడమనకు ప్రజాస్వామ్యంలో ఆటవికత ,మొనార్కీ వేరి తలలు వేస్తోంది .’’వాట్ ఎ పిటీ మై  కంట్రీ మెన్ ?  

‘’శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూథ పాః-తత్ క్షమం నేహ నః స్థాతుం కృతే కార్యే పరంతపాః’’

‘’కిం శేష౦ గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః’’

‘’సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః-తథాస్మి కర్తా కర్తవ్యే భఃవద్భి పరవా నహం ‘’

అంగదుడు వానరులను చాలా సాభిప్రాయంగా హరియూథపాపరంతపాఅని వారి శౌర్య పరాక్రమ విక్రమాలకు తగినట్లు సంబోధించాడు .పరంతపుడు అంటే శత్రు సంహారకుడు ,అనీ సూర్యుడు అనీ అర్ధాలున్నాయి .వారు శత్రు సంహారకులైన పరాక్రమ శౌర్య సూర్యులని అతని భావం .

యువరాజు వచనాలకు ప్రీతి చెంది అందరూ ఏకగ్రీవంగా ‘’యువరాజా !ప్రభువు అయి కూడా ఇంత వినయంగా ఎవరు మాట్లాడుతారు ?అధికార మదం తో మత్తిల్లి ప్రతివాడూ అహంకారి అవుతాడు .నీ పలుకులు నీస్వభావ ,యోగ్యతలను తెలియ జేస్తున్నాయి .ఇంకోడు ఎవడూ ఇలా మాట్లాడడు.నీ వినయం ,నీకు రాబోయే శుభానికి సూచనగా, యోగ్యతగా ఉన్నది .మేమే౦తా మనరాజు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళే అవకాశం కోసమే  నిరీక్షిస్తునాం.అయినా నీ ఆజ్ఞ లేకుండా అడుగుకూడా ముందుకు వేయ లేని ‘’అశక్తులం’’ .ఇది ముమ్మాటికీ నిజం .’’అనగానే ‘’సరే అలాగే వెడదాం’’అన్నాడు అంగద యువరాజు . ఇక్కడ అంగదుని సౌశీల్య వినయ గుణాలు ప్రస్ఫుటంగా గోచరి౦చటమేకాక ,పెద్దల యెడ ఉన్న గౌరవభావాన్నీ,ప్రజాస్వామ్య విలువను  తెలియ ఇస్తోంది .వానరులుకూడా తక్కువ వాళ్ళేమీ కాదు –ఆయనకూ ‘’ధూపం ‘’బాగానే వేశారు .రాజుతో పని కదా-క్షణక్షణ చిత్తులు రాజులు .ఎప్పుడు ఆగ్రహం చూపిస్తారో యెప్పుదుఅనాదరణ చూపుతారో చెప్పలేం .అందుకే చాలా ఆలోచించి  వీళ్ళుకూడా తమమీద భారం, నెపం వేసుకోకుండా చాకచక్యంగా నే సమాధానమిచ్చారు .ముందడుగు వేయాలని ఉన్నా,రాజాజ్ఞను కాదని  కదలలేని ‘’అశక్తులం’’అని సాభిప్రాయంగా అన్నారు .అంగదుని మాటలు అతనికి భావి రామరావణ యుద్ధం లో రామవిజయాన్ని సూచించటమే కాక కిష్కింధకు తిరుగులేని యౌవ్వరాజ్య పట్టాభి షేక శుభవార్త కూడా ఇందులో ఊహించి అన్నారు .అతడు యువరాజు అయినా ఆశక్తుడను అంటే ,వీరు మహాబలశాలురు కార్యసాధకులు అయినా ‘’అశక్తులం ‘’అని వినయంవిజ్నత చూపారు ..అందరూ ఎవరి పరిధి మేరకు వారు చక్కగా ప్రవర్తించారు అందరిదీ ఔచిత్యమైన పలుకులే .సాభిప్రాయమైన సంబోధనలే చేశారుకూడా .

.’’ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభ –ఐశ్వర్య మదమత్తో హి సర్వో హమితి మన్యతే ‘’తవ చేదం సుసదృశం వాక్యం నాన్యస్య కస్య చిత్ –సన్నతి ర్హితవాఖ్యాతి’’భవిష్య చ్ఛుభ యోగ్యతాం ‘’

‘’సర్వే వయమపి పాప్తా స్తత్ర గంతుం కృతక్షణాః-స యాత్ర హరి వీరాణాం సుగ్రీవః పతి రవ్యయః’’

‘త్వయ హన్యుక్తై ర్హరిభి’’ర్నైవ శక్యం పదా త్పదం—క్వచిద్గంతుం హరి శ్రేష్ట బ్రూమస్సత్య మిదం తు తే ‘’

 అంగదునినితో సహా అనదరూ ఆకాశానికి యెగిరి ,యంత్రాలతో ఎగర గొట్టబడిన కొండల్లాగాఅంటే ఫిరంగుల్లోన్చిదూసుకు వెళ్ళిన ‘’తూటాలు’’లాగా  ఆకాశం లో ఏ మాత్రం ఖాళీ లేకుండా ఆక్రమించి,సంతోషంతో అరుస్తూ కేకలు వేస్తూ  వెళ్ళారు .శోకంతో కనుల నీరునిండిఉన్న రామునితో సుగ్రీవుడు ‘’రామా !కొంచెం తమాయించుకో .సీతాదేవి కనబడింది కార్య సాధన లేకుండా వానరులు ఆలస్యంగా రారు .యువరాజు అంగదుడు కార్యం చెడితే ,నా దగ్గరకు రానే రాడు.కార్యఫల సిద్ధి లేకుండా వస్తే మధువన భంజనం చేయడు.దీనం గా కలవరంగా ఉంటాడు . సీతను  చూడకపోతే తరతరాల మా వనాన్ని పాడు చేయడు.సీత క్షేమం తెలిసింది. నువ్వు కుశలంగా ఉన్నందున మీ తల్లి కౌసల్య సత్సంతానవతి అయింది .శోకం వదిలి ఊరడిల్లు .హనుమ సీతా దేవి దర్శనం చేశాడు అనటం లో  సందేహం లేదు అతడు తప్ప అంతఘనకార్యం సాధించేవారులేరు. సూర్యునిలోని తేజస్సులాగా హనుమలో సిద్ధి ,మతి ,పట్టుదల ,పరాక్రమం ఉన్నాయనటం నిశ్చయం .జాంబవంతుడు నాయకుడుగా, అంగదుడు సేనాపతిగా ,హనుమ సహాయకుడుగా ఉంటె చేబట్టినపని విజయవంతమే అవుతుంది ‘’అని దుఖం పోగొట్టే మాటలు ధైర్య వచనాలు సీతా సందర్శన శుభవార్త చేవిన వేశాడు మిత్ర సుగ్రీవ .హనుమపై ఉన్న అపారమైన నమ్మకం .’’జాంబవంత హనుమంత అంగద త్రయం ‘’సాది౦ప రానిది లేదని ‘’సర్టిఫికేట్ ‘’ఇచ్చాడు .అంగదుడి లక్షణాలు తెలిసినవాడుకనుక అతడూ కార్యసాధన కాకుండా తన ఎదుటకు రాడనీ చెప్పాడు .’అన్నీ మంచి శకునములే సీతా దర్శన ‘’శుభ వార్తలే ‘’అన్నట్లు మాట్లాడాడు –

‘’కౌసల్య సుప్రజా రామా సమాశ్వసి హిసువ్రత –దృష్టా దేవీ న సందేహో న ‘’చాన్యన్యేన హనూమతా-

‘’హనూ మతి హిసిద్ధి శ్చమతిశ్చమతి సత్తమ –వ్యవసాయ శ్చవీర్యం చ సూర్యేతేజ ఇవద్రువం’’

‘’జామ్బవాన్యత్ర నేతాస్యా దంగదశ్చ బలేశ్వరః –హనూమాం శ్చాప్యధిస్టితా న తస్య గతి రన్యథా’’

 ఇంతలో ఆకాశం లో కిలకిల శబ్దాలు ఆనందోత్సవ కేరింతలు దగ్గరగా వినిపించాయి .వానరుల ఆ ‘’ఆనంద రవళికి ‘’సుగ్రీవుడు తనతోక పెంచి తలపై మాలలాగా చేసుకొని మహా సంతోష పడ్డాడు .ఆయనకు పట్టరాని సంతోషం వస్తే ఇలా చేస్తాడని వాల్మీకి శ్లోకం లో బొమ్మ గీసి చూపించాడు

‘’తతః శ్రుత్వా నినాదం తమ్ కపీంకపి సత్తమః –‘’ఆయతాంచితలాంగూల’’స్సోభవ  ద్ధృష్టమానసః ‘’

అంగద,హనుమంతులను ముందుపెట్టుకొని వానరులు రాముని చూడాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు .ఆనంద పులకితగాత్రులై, వారంతా రామ సుగ్రీవుల చెంతకు చేరారు .మహాభుజ హనుమ శిరసువంచి రామపాదాలకు నమస్కరించాడు ‘’సీతాదేవి పాతివ్రత్యమహిమతో క్షేమ౦గా ఉన్నది ‘’అని రామునికి విన్నవించాడు –

‘’హనూ మాం శ్చమహా బాహుః ప్రణమ్య శిరసా తతః –‘’నియతా మక్షతాం దేవీం  రాఘవాయ న్యవేదయత్ ‘’

 హనుమ కార్యసాధకుడై తిరిగి వచ్చాడని సుగ్రీవుడు లక్ష్మణుడు కూడా  నిశ్చయింఛి .సంతోషంతో హనుమను ఆదరంగా చూశారు..అప్పుడు శత్రు సంహార రామ  గొప్ప ఆదరం తో హనుమంతుని చూశాడు .రాముడికి శత్రు సంహార శబ్దం ఇక్కడ చాలా ఔచిత్యంగా ప్రయోగించాడు మహర్షి వాల్మీకి .ఇక మిగిలిన కార్యం శత్రు సంహారమే అని తెలియ జేయటానికి .

‘’నిశ్చితార్ధ స్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే –లక్ష్మణఃప్రీతిమాన్  ప్రీతం బహుమానా దవైక్షత’’

‘’ప్రీత్యా చ రమమాణోథ రాఘవః వరవీరహా –బహుమానేన మహతా హనుమంత మవైక్షత ‘’

 సుగ్రీవ రామ లక్ష్మణుల ఆదరపు చూపులే ప్రస్తుతానికి హన్మకు బహుమతులు .అంతకంటే ఆయనకు ఏమీ అక్కర్లేని నిమిత్తమాత్రుడు .అప్పగించిన కార్యం అనుకొన్నసమయంలో విజయవంతంగా నిర్వహించి  ,వాడి పోయిన హృదయాలకు సంతోషపు వసంతాన్ని పంచిపెట్టాడు .అందరూ హనుమ  గొప్పతనాన్ని బహువిధాలుగా మెచ్చారు .ఇలా ‘’మిషన్ హనుమ ‘’  గ్రాండ్ సక్సెస్ ‘’ అయింది .అందరికీ ఊరట లభించింది .

‘’ఇది39 శ్లోకాల 64వ సర్గ .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5

 సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల  స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు  .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు .

పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట .మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు తెలుసు .ఒక సారి వీధి అరుగు మీద కూర్చున్నప్పుడు జిల్లా కలెక్టర్ వీరిని చూడటానికి వచ్చి ఇంగ్లీష్ లో ప్రశ్నలడిగితే అర్ధం చేసుకొని ,అన్నిటికీ తెలుగులో చెప్పటం కలెక్టర్ అర్ధం చేసుకోవటం ఇప్పటికీ జనం చెప్పుకొంటారు .ప్రతి ఆదివారం కలెక్టర్ పెరవలి బంగ్లాలో శాస్త్రిగారు కలెక్టర్కు బ్రహ్మ సూత్రా భాష్యం బోధించారు .ఆయన ప్రజ్ఞ ను నవద్వీపం లో చదువు వుకున్నారని అందరూ  పొరబాటు గా అభిప్రాయ పడేవారట .

సత్కవిరాట్-వేదుల రామ శాస్త్రి -19-20వ శతాబ్ది – అప్పకవీయ వివరణ,కా౦చీపతి ,చిత్ర శతకం రాశారు .శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్య ,అమరం రాజేశ్వర శర్మ ,వడ్లమూడి గోపాల కృష్ణమూర్తి వారణాసి గంగాధర శాస్త్రి , ,శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు, అవధాన శిరోమణి రావూరి వెంకటేశ్వర్లు వంటి మహా మహులకు గురువు.

వేదుల వేంకట శాస్త్రి -19-20-శతాబ్ది సుబ్బారాయుడు ,లక్ష్మమ్మలకుమారుడు కాశీలో తర్కవ్యాకరణాలు నేర్చారు .నిత్యాగ్ని హోత్రమే కాక వ్యవసాయం కూడా చేసేవారు .ఎందరికో ఉచిత భోజన వసతి కల్పించి విద్యా నేర్పారు .అగ్నిహోత్రం చేయనిదే అన్నపానాలు ముట్టేవారుకాడు. కుమారుల వివాహ సమయాలలోనూ అంతే.

వేదుల రామ చంద్ర శాస్త్రి -19-20శతాబ్ది –వేంకటాధ్వరి రచన ‘’లక్ష్మీ సహస్ర కావ్యం ‘’కు వ్యాఖ్యరాసిన మహా పండితుడు దీన్ని వేదుల సూర్యనారాయణ శర్మ ఆంధ్రీకరించారు

దానకర్ణ –సుందర రామయ శాస్త్రి -19-20శతాబ్ది –వల్లూరిపల్లిలో మందేశ్వరాలయనిర్మాత సత్రం కూడా కట్టారు ఆయన దాతృత్వ విషయాలు ఇప్పటికీ అక్కడ చెవుల్లోగింగురులు పెడుతూనే ఉంటుందట .

మహా మనీషి –చర్ల నారాయణ శాస్త్రి -1881-1939-చర్ల బ్రహ్మయ్యగారి వంశీకులు జనార్దన శాస్త్రి ,వెంకమ్మగార్ల తనయుడు .తాత కామశాస్త్రి సంస్కృతాంధ్ర నిధి .ఈయన సంస్కృత ఆంద్ర వేద,వేదంగ తర్క వ్యాకరణ అలంకార శాస్త్రాలో లోతు ముట్టినవారు .శిష్యకోటి విపరీతం పితాపుర విద్వత్కవులు వెంకట రామ కృష్ణ జంట  కవులకు సాహిత్య గురువులు.అందులో  వేదుల రామకృష్ణశాస్త్రి ముఖ్య శిష్యుడు .స్వతంత్ర జీవులు.ఆగ్రామం వదిలి ఎక్కడికీ కొలువుకు వెళ్ళలేదు .పిఠాపురం రాజావారి ‘’సూర్యరాయాంధ్ర నిఘంటువు కు పండితాదికారి .వీరి మహాభారత మీమాంస  5భాగాలు లు ఆధ్రులకు గొప్ప వరం.ఎన్నెన్నో విషయాలు మనకు తెలియనివి అందులో లభిస్తాయి  .దీనికి మూలం మరాఠీ లోని రావుబహదూర్ చింతామణి వైద్య రాసిన ‘’ఉపసంహార్ ‘’కు హిందీలో మాధవరావు సప్రే అనువాదం  శాస్త్రిగారు తెలుగు చేశారు . నా అదృష్టవశాత్తు సుమారు 30ఏళ్ళ క్రితం హైదరాబాద్ అసెంబ్లీహాల్ ముందు చర్ల సిస్టర్స్ రోడ్డు మీద పెట్టి సగం రేటు కే అమ్ముతుంటే సరస్వతీ ప్రసాదంగా కొని చదివిన అదృష్ట వంతుడిని .  సంస్కృత మహిష శతకాన్ని తెలుగులోకి అదేపేరుతో అనువదించారు .5 అంకాల భర్తృహరి నిర్వేదం నాటకం ను సంస్కృతం లో హరిహర కవి రాసినదానికి అనువాదం చేశారు నన్నయ సంస్కృతాంధ్ర ‘’ఆంద్ర శబ్ద చింతామణి ,అధర్వణుడి ‘’అధర్వణ కారిక లకు ఇది తెలుగు పద్యానువాదం. వృషభ శతకం ,కావ్యాదర్శం ,నీలకంఠ విజయ చంపు ఇతర రచనలు .ఒక బ్రాహ్మణేతరుడు సంస్కృతం నేర్వటానికి వీరిదగ్గరకొస్తే ,వ ఊరివారు అభ్యంతం చెబితే ,శిష్యుడు వేదుల రామ శాస్త్రి తో చెప్పించిన సంస్కారి .తణుకు నారాయణభట్టు అస్పృశ్యతా నివారణ సంఘం అధ్యక్షులుగా చేశారు .1920లోనే పంచములు కూడా మనుషులే అని అయిదు రోజులపాటు సభ నిర్వహించారు .స్వాతంత్ర్యం పై లెక్కలేనన్ని ఉపన్యాసాలిచ్చి ఉద్యమ స్పూర్తి కల్గించారు .గాంధేయవాదిగా చిరకీర్తి పొందారు నారాయణ శాస్త్రిగారు  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పండిత కవి డా చింతలపాటి పద్య ఆశీస్సు

అలుపెరుగని హాలికుడా
నిరుపమానలేఖకుడా
తరతరాల బాంధవుడా
ఆంజనేయ సేవకుడా
సరసభారతీప్రియుడా
నవరసకవి శేఖరుడా
గబ్బిటదుర్గాప్రసాదసమ్యగ్వరుడా
అభినందనలివిగ్రహింపుమోయిగురుండా!!
నమస్కారం .

 sastry S.R.S.  రాజమండ్రి నుండి మీ అడ్రస్ పంపారు. అయన నా సీనియర్ .
మీరు రచియించిన ఆధునిక ఆంధ్ర శాస్త్ర మణి రత్నాలు పుస్తకం చూసాను.
ఈ దౌర్భాగ్యము ఇంత  గొప్ప వారి గురించి  ఆ సబ్జక్ట్ లో Ph.D పొందిన వారికీ కూడా తెలియక పోవటం . మిగతా రాష్ట్రాల వారికీ తెలియక పోవటం క్షమార్హం కాదు . తెలుగు రాష్ట్రాల వారికీ తెలియక పోవటం దుర్మార్గము .
ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి అంత  ప్రచారము జరిగినా తెలియదు, ఇక కొలచల వారి గురించి ఎలా తెలుస్తుంది!
ఈ పుస్తకాన్ని గవర్మెంట్ వారు నాన్ -డిటైల్డ్ text లాగా పెట్ట టానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి? నాకు తెలిసిన పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తాను.
నాకు కాపీలు కావాలి. కొన్ని స్కూళ్లలో ప్రెసెంట్ చేస్తాను . ఎంత, ఎలా payment  చెయ్యాలి వివరాలు తెలుప గలరు.
Dr.M.Bapuji
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె తండ్రికి మాత్రమె ఇష్టమైనవి కాక ,ఇతర సబ్జెక్ట్ లనూ ఆమెకు బోధించారు .రజస్వల కాగానే చదువు మానిపించారు ..కాని ఇంటివద్ద ట్యూషన్ చెప్పించి చదువుకు ప్రోత్సహించారు . ఆమెకు మిగిలిన సామాన్య ఆడపిల్లలగా ఉండటానికి ఇష్టం లేక స్వంత,స్వతంత్ర అభిప్రాయాలను ఏర్పరచుకొన్నది .తల్లి పై ఆదరంతో దేవదాసి వ్యవస్థను అధ్యయనం చేసి వారిపై ,వారి సమస్యలపై సాను భూతి చూపేది .సమాజంలో ,ఇంట్లో పురుషాధిక్యతను సహి౦ చేదికాదు . విద్య మగవారికే అన్న దానిపై తీవ్రంగా ఆగ్రహించి స్త్రీలకూ విద్యకావాలి వాదించేది . అవసరం వచ్చినప్పుడల్లా మహిళలకుమద్దతునిచ్చేది .

మెట్రిక్ పాసై , మహారాజా కాలేజిలో చేరటానికి అప్లికేషన్ పెడితే ,ప్రిన్సిపాల్ తోపాటు మగపిల్లల తలి దండ్రులూ ఆడపిల్లకు చదువేమిటి అనీ మగపిల్లలను చెడ గొడుతుందని భయపడి వ్యతిరేకించారు .సంస్కారవ౦తుడైన పుదుక్కొట మహారాజు ఈ అభ్య౦తరాలను తోసి రాజని ,చేర్చుకొని ,స్కాలర్ షిప్ కూడా ఏర్పాటు చేశాడు .తండ్రికి ఆమె టీచర్ గా ఉంటె చాలు అనుకొంటే ,ఆమెమద్రాస్ మెడికల్ కాలేజి లో చేరి ,తెలివి తేటలతో చదువులో అందరికన్నా ముందు నిలిచి,బంగారు పతకం తో సహా అనేక అవార్డులు పొందింది .1912లో మెడిసిన్ పాసై, భారతదేశం లో తొలి తరం మహిళా డాక్టర్లలో ఒకరుగా గుర్తింపు పొందింది .మద్రాస్ మహిళా శిశు సంక్షేమ హాస్పిటల్ హౌస్ సర్జన్ గా చేరింది .అంతేకాదు పురుషులకాలేజిలో చదివిన మొదటి మహిళ ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,శాసనమండలి మొదటి మహిళా సభ్యురాలు ,సోషల్ వెల్ఫేర్అడ్వైజరీ బోర్డ్ కు మొదటి మహిళా చైర్ పర్సన్,లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొదటి డెప్యూటీ ప్రెసిడెంట్ ,మద్రాస్ కార్పోరేషన్ అవ్వై హోమ్ కు మొట్టమొదటి ఆల్డర్ వుమన్ .ఇన్నిటా ప్రధమంగా నిలిచిన మహోన్నత మహిళా రత్నం ముత్తులక్ష్మీ రెడ్డి . మొదట్లో ఆనీబిసేంట్ ప్రభావానికి తర్వాత మహాత్మా గాంధీ ప్రభావానికి లోనైంది .

సుందర రెడ్డి తనను ఎప్పుడూ గౌరవంగా,సమానంగా చూస్తానని వాగ్దానం చేశాక మాత్రమే 1914లో 28 వ ఏట’’1872నేటివ్ మారేజ్ యాక్ట్’’ ప్రకారం పెళ్లిచేసుకొన్నది.కాలేజీలో చదువుతున్నప్పుడే సరోజినీనాయుడు మహిళా మీటింగ్ లకు వెళ్లి ,స్త్రీలు తమ హక్కులకోసం పోరాడాలని చెప్పేది.ఆనీబీసేంట్ ,మహాత్మాగాంధీ మహోన్నత వ్యక్తిత్వాలు ఆమెను ప్రభావితం చేశాయి .ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లి తిరిగి వచ్చి ,మాంచి ఊపులో ఉన్న డాక్టరీ వృత్తిని,అఖిలభారత మహిళా సంఘం అభ్యర్ధన మేరకు వదిలేసి మద్రాస్ శాసనమండలికి పోటీ చేసి ఏకగ్రీవంగా డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది .మునిసిపల్ ,శాసన సభలలో మహిళలకు ఓటు హక్కు కావాలని ఆందోళన చేసింది .అనాథులపట్ల, అందులోనూ ముఖ్యంగాఅనాథ బాలికలపట్ల విపరీతమైన సాను భూతి చూపుతూ ,వారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తూ ‘’అవ్వై హోం’’ను స్థాపించింది .

ముత్తులక్ష్మి అనేక మహిళా సంస్కరణలకు ఆద్యురాలైంది.ఆమె రాసిన ‘’మై ఎక్స్పీరిఎన్సేస్ ఆజ్ ఎ లేజీ స్లేటర్ ‘’ పుస్తకం లో తాను చేసిన సేవలను వివరంగా రాసింది . స్త్రీ శిశు సంక్షేమ ప్రత్యేక హాస్పిటల్ నిర్మించాలన్నతీర్మానాన్ని ఆమోదించింది .ఆమెకోర్కెను అంగీకరించి ప్రభుత్వం ప్రసూతి హాస్పత్రిలో విడిగా శిశుసంక్షేమ శాఖను ఏర్పాటు చేసింది .మునిసిపాలిటీలు ,ఇతర స్థానిక సంస్థల స్కూళ్ళు,కాలేజీలలో క్రమబద్ధమైన మెడికల్ ఇన్స్పెక్షన్ జరిగేట్లు చేసింది .ట్రిప్లికేన్ లో ఏర్పాటైన కస్తూర్బా హాస్పిటల్ ఆమె కృషిఫలితమే.

అఖిలభారత మహిళా సంఘానికి శ్రీమతి రెడ్డి అధ్యక్షురాలైనది .వ్యభిచారం ,వారిపై అక్రమ కేసులు ,స్త్రీలను బాలికలను ఆ వృత్తి లో బలాత్కారంగా దించే ప్రయత్నాలు అరికట్టటానికిఒక బిల్లు పాస్ చేసింది .వ్యభిచార వృత్తినుంచి విడుదల చేయబడిన బాలికలకు రక్షణగా ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయించింది .ఆమె ప్రయత్నం తో ముస్లిం బాలికలకు హాస్టల్ ఏర్పడింది .హరిజన బాలికలకు స్కాలర్ షిప్ లు వచ్చాయి .మగపిల్లలకు 21 ఆడపిల్లలకు 16ఏళ్ళ వయసు దాటనిదే వివాహం చేయరాదనిచట్టం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ‘

కేన్సర్ రిలీఫ్ ఫండ్ ను ఏర్పాటు చేసి౦ది .ఇది అఖిలభారత సంస్థగా మారి చికిత్స ,రిసెర్చ్ కు అవకాశం ఏర్పడి,ఇండియాలోని అన్నిప్రాంతాల కేన్సర్ రోగులకు అందుబాటులోకి వచ్చింది నేడుఏటా 80వేలమందికి ఆసరాగా ఉన్నది .ఆమె రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డ్ కుమొదటి మహిళా చైర్ పర్సన్ గా నియమింప బడి అమూల్యమైన సేవలు అందించింది .భారత దేశం లో విద్యా పురోగతిని అధ్యయనం చేసే ‘’హార్టాగ్ ఎడ్యు కేషనల్ కమిటీ ‘సభ్యురాలుగా ఆమె కృషి అమోఘమని అందరి ప్రశంసలు పొందింది .దేశమంతా విస్తృతంగా పర్యటించి విద్యాభి వృద్ధిని అంచనా వేస్తూ ,స్త్రీవిద్యాభి వృద్ధి నికూడా అధ్యయనం చేసింది .ఆ కమిటీలో ఆమె ఒక్కతే మహిళా సభ్యురాలు .తన నివేదికతో విద్యలో ఎన్నో అభి వృద్ధికార్యక్రమాలు అమలు జరిగేట్లు చేయగలిగింది.రోషిణి మేగజైన్ కు ఎడిటర్ గా కూడా సేవలు అందించింది .ఆమె జీవితకాలం లో ఏపని తలపెట్టినా అవరోధం ఆటంకం ఎదురుకాలేదు .వచ్చినా నిర్భయంగా ఎదిరించి అనుకొన్నది సాధి౦చి౦ది.అదే ఆమె ప్రత్యేకత . 80ఏళ్ళ వయసులోనూ ఆమెలో సంకల్పబలం కార్యాచరణ ఏమాత్రం తగ్గలేదు .రాజకీయాలకు అతీతంగా అలోచించి సేవలందించింది .ఇన్నిరకాల అనితర సాధ్యమైన సేవలు అందించిన ముత్తులక్ష్మికి 1956లో భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారమందించి గౌరవించింది .ఆమెకు లభించిన పురస్కారాలు,ప్రైజులు అన్నీ మద్రాస్ అవ్వై హోంలో, కేన్సర్ ఇన్ స్టి ట్యూట్ లో భద్రపరచారు .1927లో ఆమెను సాక్షి హరిహరన్ మద్రాస్ శాసనమండలి సభ్యురాలుగా నామినేట్ చేశాడు .దీనితో భారత దేశం లో శాసన సభ లేక మండలికి ఎన్నికైన మొదటి ఏకైక మహిళగా రికార్డ్ సాధించింది .దేవదాసి వ్యవస్థ రద్దుకు ఆమె చేసిన కృషి అనితర సాధ్యమైనది .22-7-1968న 81వ ఏట త్యాగమయి , సేవామూర్తి ,అన్నిటా ప్రథమురాలుగా నిలిచిన తొలితరం డాక్టర్, పద్మభూషణ్ శ్రీమతి ముత్తు లక్ష్మీ రెడ్డి మరణించింది .ఆమె జీవితం ధన్యం .తరతరాలకు ఆదర్శప్రాయం .

Posted in రచనలు | Tagged | Leave a comment

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం

అల్లాహు అక్బర్ –

అల్లాహు అక్బర్

ఇవాళ అల్లానుంచి వస్తున్నారు –

రహ్మత్ ,కౌతర్

వారిద్దరికీ అల్లా రక్షకుడు

ఈ విజయం వారిదే.

దేవుని అభీస్టానికిది విజయం

మన వ్యర్ధ కీర్తికి మాత్రం కాదు

ఇది విజయమే ,కానీ

అది ఏమాత్రమూ మెట్టు కాదు

పెద్ద బానిసత్వంఉపద్రవం నుంచి

మనం పైకి ఎగరా(దగా)లి .

 అంతటి విభజన ,అంతః కలహం

ఈర్ష్య ,అసూయ ,అత్యాశ ,అహంకారం

అన్నీ పరమాత్మ దయా వీక్షణం తో

తేలిగ్గా అదృశ్యమైపోతాయి .

మీరంతా కొత్త ప్రయాణీకులు

ఆ పరమాత్మఆజ్ఞకు బద్ధులు  

మీ అడుగుల జాడన నుసరించి

ఇక్కడికి స్వర్గ కాంతిపుంజం ప్రసరిస్తుంది .

అవును వస్తున్నారు పథికులు

కొత్తతరానికి చెందిన యువ యుద్ధ వీరులు

త్వరలోనే ప్రపంచ కస్టాలు ,బాధలు

వాళ్ళ పంజరం లో  బందీలై పోతాయి

ఆధారం –ఖాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత’’కబిర్ ప్రొషొస్తి’’.కి మొహమ్మద్ ఉమర్ ఖరీఫ్ ఆంగ్లాను వాదం.

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4

అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి.

పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య కర్త  .ఉపనిషత్ కథలూ రాశారు .రామమ్మ ,భద్రయ్య శాస్త్రి జననీ జనకులు

అపర వ్యాసులు ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి -1860-1916-గారు రాజమండ్రి హైస్కూల్  ట్రెయినింగ్ కాలేజి లో ,ఆర్ట్స్ కాలేజి లో సంస్కృత ,ఆంధ్ర ఉపన్యాసకులు .తర్క వ్యాకరణ అలంకార ఉపనిషత్ వేదాంత శాస్త్రాలలో  తిరుగు లేని వారు .ఎందరో కవిపండితులకు విద్యా గురువు .రాజా మంత్రిప్రగడ భుజంగరావు ఆస్థాన పండితులు .సూర్య శతకం, భామినీ విలాసం ,శుద్ధాంధ్ర ఋతు సంహారం ,అనర్ఘ రాఘవం ,ప్రబోధ చంద్రోదయం ,ఆంద్ర నైషధం ,విదుల ,భారత ఫక్కి ,శ్రీ మహా భారత నవనీతం-13పర్వాలు  ,ఆధ్యాత్మ రామాయణం ,పరాశర స్మృతి,కృష్ణా పుష్కర మాహాత్మ్యం రాశారు .

ఆంధ్రా మిల్టన్,కళా ప్రపూర్ణ  చిలకమర్తి లక్ష్మీ నరసింహం -1867-1945-తణుకు దగ్గర ఖండవల్లిలో పుట్టినా చివరి దశ ఇక్కడే గడిపారు .అభిషేక నాటకం ,స్వప్న వాసవ దత్త ,ప్రతిమ ,ప్రతిజ్ఞా యౌగంధరాయణం ,గయోపాఖ్యానం మొదలైన నాటకాలు ,కర్పూరమంజరి గణపతి సౌందర్య తిలక ,గయ్యాలిగంగమ్మ  ,మొదలైనవి రాశారు ప్రహసనాలకు మంచి పేరు తెచ్చారు .1942లో రాజమండ్రినుంచి కాకరపర్రుకు మకాం మార్చి శేష జీవితం గడిపారు .’’కళ్ళు లేకపోయినా, తెలుగు భాషకు కళ్ళు ఇచ్చిన సాహిత్య మహా దాత’’ .రత్నమ్మ, వెంకయ్య తలిదండ్రులు .

ఆశు కవితా చక్రవర్తి కాకరపర్తి వెంకట శాస్త్రి -1874-1964-పుస్తక అధ్యయనం తోనే జీవితం గడిపారు .వీరింట లక్ష్మీ సరస్వతులు కొలువుండేవారని ప్రతీతి .ఒకసారి తిరుపతి కవులజంట దివాకర్ల తిరుపతి శాస్త్రి , చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఇక్కడికి రాగా ఇద్దరిమధ్యా చర్చ జరిగి ,ఈ జంట కాకరపర్తి వారి పాండిత్యం ముందు ఓడిపోగా ‘’రెండుభాషల్లో తామే కవీశ్వరులం అని గొప్పగా మీసాలు పెంచి ,ఓడిస్తే మీసాలు తీసి పాద సమీపం లో పెడతాము ‘’అన్న చాలెంజి ‘’కాకరపర్తికి మినహాయింపు ‘’అని చెప్పి తప్పించుకొన్నారు .ఈ సంఘటన పై శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రిగారు గొప్ప పద్యాలు రాశారట .

పుంభావ సరస్వతి చర్ల భాష్యకార శాస్త్రి -1878-1949-కామమాంబ వెంకటశాస్త్రిగార్ల పుత్రులు .వీరి ఇల్లు సరస్వతీ నిలయం .తమ వంశస్తులకు నూజివీడు మేకా వంశరాజులు ఇచ్చిన జాగీరు ను కృతజ్ఞాతభావంతో గుర్తుంచుకొని ‘’మేకాదీశ ‘’అనే నాలుగు బీజాక్షరాల శ్లోకాలతో తర్క వ్యాకరణ ,గీత మొదలైన వాటిపై గ్రంథాలు రాశారు . ఎందరికో  వేద విద్య నేర్పారు .పూర్వశృంగేరి పీఠాదిపతులు శ్రీ శ్రీ అభినవ విద్యా తీర్ధస్వామి వీరి వద్ద తర్కశాస్త్రం అధ్యయనం చేశారు .కంచి పరమ గురువులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి ఈ గ్రామానికి వస్తే వారి పీఠానికి ఆతిధ్యమిచ్చారు .చాలగ్రంథాలు రాసినా, విజయ విలాస చరిత్ర ,మేకాధీశ శబ్ద శతకోటి ,మేకాధీశ శబ్దార్ధ కల్పతరువు అనే అలంకార శాస్త్రం ,భువనగుణ మహాదర్పణం వంటి అద్భుత రచనలు చేశారు .సంస్కృతంలో అనర్గళంగా భాషించటం వీరి నేర్పు .

అల్లంరాజు రామశాస్త్రి -19-20శతాబ్ది –హిందూమత ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పిన మనీషి .భారత రాష్ట్రపతి మహా తత్వవేత్త ఆచార్యులకే ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడే వీరివద్ద సంస్కృతం నేర్చుకొన్నారు .

శ్రీమతి డా.అల్లంరాజు గాయత్రీ దేవి –ఉషశ్రీ అంటే పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు, ,వ్యాస  వెంకట సత్యవతి దంపతుల కుమార్తె .ఆయుర్వేద ,యోగాలలో ఏం ఎస్.సి 1999నుంచి ‘’రుషి పీఠం’’ద్వారా వైద్య సేవ ,సలహాలు అందిస్తున్నారు తండ్రి ‘’అసంపూర్ణ రామాయణం లో హనుమంతుడు ‘’పూర్తి చేసి హాస్యాహాస్య కధలు,అనేక రేడియో రచనలు చేశారు. చాలా అవార్డ్ లు అందుకొన్న విదుషీమణి

వేదుల సూర్యనారాయణ శాస్త్రి -19-20శతాబ్ది –సమాజ ప్రగతిని  కాంక్షిస్తూ  రచనలు  చేశారు,’’డబ్బి దాంశుకంమ’’,డిద్దడబిద్ధం ,దురభ్యాసములు ,శ్రీ పతి శతకం, ప్రతాప రుద్రీయం బంగారం రాశారు .చర్ల గణపతి శాస్త్రిగారికి పిల్లనిచ్చిన మామగారు , సుశీలగారి తండ్రిగారు.ఈ బంగారం కథ చదివే సుశీలగారు బంగారం పై వ్యామోహం పోగొట్టుకొన్నారు .

అపర రామ దాసు ఆకొండి వ్యాసమూర్తి సిద్ధాంతి –కాకరపర్రులో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన రాజరాజేశ్వరాలయానికి తరతరాల ధర్మకర్త .ఏటా 8పుట్ల ధాన్యం పండే సుక్షేత్రామైన మాగాణి భూమిని ,నిల్వ ధనాన్ని స్వామికి సమర్పించిన వదాన్యులైన ధర్మకర్త .అందుకే వీరిని ‘’అపర రామదాసు ‘’,అపర గోపన్న ‘’అని గౌరవంగా సంబోధిస్తారు .

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ –2-7-20-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65

దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ అన్నవాలి కాలం లోకానీ మధువనం ఎప్పుడూ ఇలా విధ్వంసం కాలేదు .ఇప్పుడు వానరులు మధు భక్షణ చేసి పాడు చేశారు .మధుపాన మత్తులో ఉన్న వాళ్ళను మన  కాపలా వాళ్ళు బెదిరిస్తే లక్ష్యం చేయకుండా ఫలాలు కోసి తింటూ తేనే తాగుతూ ,త్రాగగామిగిలింది పారబోస్తూ ఉంటె అదలించగా వెక్కిరించారు .వనం లోని తేనే తాగద్దని మన రక్షకులు వారిస్తుంటే అంగదాదులు,మన వాళ్ళనే  బెదిరించారు .కోపం తో వానరులు వీళ్ళందర్నీ తరిమేశారు .చేతులతో కాళ్ళతో కొట్టారు కొందరు అటూ ఇటూలాగి అపానద్వారం (దేవమార్గం )చూపించారు .నువ్వు పాలకుడవై ఉండగా ఈ శూరుల్ని వాళ్ళు కొట్టారు .వారి స్వేచ్చను అడ్డుకోలేక పోయాం ‘’అని పూస గ్రుచ్చినట్లు తెలియ జేశాడు –అపానమార్గానికి గౌరవప్రద నామం ‘’దేవమార్గం ‘’.తన్ను అంగదుడు కిందపడేసి కొట్టిన సంగతి చెప్పకుండా వదిలేశాడు ఎందుకో ?నీ పాలనలో ఇలా జరిగింది అని కొంచెం నిష్టూరంగా చెప్పినట్లు భావించాలి .అంటే రాజుకు  కోపం తెప్పించే అన్నిరకాలమాటలూ చెప్పాడు –

‘’ప్రాణిభిర్నిహితాఃకేచిత్ కే చిజ్జానుభి రాహతాః-ప్రకృస్టాశ్చ యథా కామం ‘’దేవమార్గం ‘’చ దర్శితాః’’

సుగ్రీవునితో అతడు  చెబుతుండగా లక్ష్మణుడు వచ్చి ‘’వనపాలకుడైన యితడు ఎందుకు వచ్చాడు .దుఖంతో నీకేమి చెప్పి ఏమికావాలని కోరాడు ?’’అని అడిగాడు .మాటల నేర్పరి సుగ్రీవుడు ‘’పూజ్య లక్ష్మణా!సీతాన్వేషణకు దక్షిణ దిశకు వెళ్ళిన వానర పుంగవులు తిరిగి వచ్చారని ,అంగదాదులు మధువన మదు భక్షణ చేశారని యితడు చెప్పాడు .ఇలా చేశారంటే వాళ్ళు కార్యం సాధించారనే అనిపిస్తోంది .అందుకే అంతటి ఉత్సాహం ప్రదర్శించి ఉంటారు .నా అనుమతి లేదని భయపడకుండా మధువన ప్రవేశం వారు చేశారంటే కార్య౦  సఫలంగా సాధించారనే అర్ధం .సందేహం లేదు –

‘’అంగదప్రముఖై ర్వీరైర్భక్షితం మధు వానరైః-విచిత్య దక్షిణా మాశామాగతై రహరి పుంగవైః’’

‘’నైషామకృత  కృత్యానామీదృశఃస్యా దుపక్రమః-ఆగతై శ్చప్రమథితం యథా మధువనం హితైః

ధర్షితం చ వనం కృత్శ్న ముపయుక్తం చ వానరైః’’

‘’దృష్ట్వా దేవీ న సందేహో న చాన్యేన హనూమతాః’’

 లక్ష్మణా ! సీతాదేవినే హనుమంతుడే చూశాడు .సందేహం లేదు. అతడికి కాక ఈకార్యసాధన ఎవరి వలన అవుతుంది ?అతడిలో వివేకం బుద్ధిసూక్ష్మత పట్టుదల ,పరాక్రమం ,విద్యా ది మహాగుణాలున్నాయి –

‘’కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానర పు౦గ వే-వ్యవసాయ శ్చవీర్యం చ శ్రుతం చాపి ప్రతి స్టితమ్’’

‘’ఏ పనిలో జాంబవంత , అంగదులు నాయకులుగా ఉంటారో ,వారికి హనుమ తోడుగా ఉంటాడో ఆ పని తప్పక నేర వేరి తీరుతుంది –

‘’జామ్బవన్యత్ర నేతా స్యా దంగద శ్చమహాబలః –హనూమాం శ్చాప్యధిస్టాతా న తస్య గతిరణ్య థా’’

‘’అంగదాదులు మధువనం పాడు చేసి ,వాళ్ళను వనపాలురు వారిస్తే ,వాళ్ళతో దెబ్బలులుతిన్నారు.ఈ విషయం నాకు నివేది౦చ టానికే రక్షకుడు దధిముఖుడు వచ్చాడు .సీతా దేవిని వానరులు చూశారు .బ్రహ్మ చే నా తండ్రి ఋక్ష రాజస్సుకు ఇవ్వబడిన ఈ దివ్య వన౦ లో పడి యధేచ్చగా తేనే తాగారంటే,వారి ప్రవృత్తిని ఊహించ వచ్చు .సీతా దేవిని చూడకపోతే మధువన ధ్వంసం చేసే వాళ్ళు కాదు ‘’అని చాలా సంతృప్త ప్రశాంత చిత్తంతో సుగ్రీవుడు రామానుజునికి నివేదించాడు –.ముందు మంత్రికి విన్నవించి తర్వాత రాజుకు చెప్పటం లోక సహజం .అందుకే ముందు రామానుజునికి చెప్పాడు .

‘’న చా ప్రదృస్ట్వ్యావైదేహీ౦ విశ్రుతాః పురుషర్షభ-వనం దత్త వరం దివ్యం ధర్ష యేయు ర్వనౌకసః ‘’ సుగ్రీవుని నోటినుండి  వెలువడిన ఈ వీనుల విందైన పలుకులు విని రామ లక్ష్మణులు మిక్కిలి హర్షించారు –

‘’శ్రుత్వా కర్ణ సుఖాంవాణీ౦ సుగ్రీవ వదనా చ్చ్యుతాం-ప్రాహృష్యత భ్రుశం రామో లక్ష్మణ శ్చమహా బలః’’

తర్వాతసుగ్రీవుడు వనరక్షక దధిముఖునితో ‘’కార్య సాధకులై వచ్చిన అంగదాదులు మధు వనం లో మధు భక్షణ చేయటం విని సంతోషం కలిగింది నాకు .వారి చిలిపి చేష్టలు క్షమించదగినవే కనుక వారిని క్షమించాను .సీతా దేవిని చూసిన సింహ సదృశ బలపరాక్రమ వీరుడు హనుమను ,అతనితో వెళ్ళిన వానర వీరులను చూడాలని, వారు చేసిన ప్రయత్న విషయాలు వినాలని  రామసోదరులు, నేను ఆసక్తిగా ఉన్నాం ‘’అన్నాడు .కార్యసిద్ధి తో సంతోషం తో పులకిట గాత్రం తో వికసించిన నేత్రాలతో ఉన్న రామ సోదరులను చూసి వానరరాజు సుగ్రీవుడు సంతోషించి ,రామ కార్యసిద్ధి అయిందని మిక్కిలిగా ఆనందించాడు –

‘’ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్ –శాఖా మృగాంస్తాన్ మృగరాజ దర్పాన్ –ద్రస్టుం కృతార్ధాన్ సహా రాఘవాభ్యాం –శ్రోతుం చసీతాథిగమే ప్రయత్నం ‘’

‘’ప్రీతిస్ఫీతాక్షౌ సంప్ర హృ స్టౌకుమారౌ –దృష్ట్వా సిద్ధార్దౌ వానరాణాం చ రాజా అంగైస్సంహృస్టైః-కర్మ సిద్ధిం విదిత్వా –బాహ్వో రాసన్నాం సోతిమాత్రం ననంద’’

 ఇది 28శ్లోకాల 63వ సర్గ

ఇందులో ఎక్కడికక్కడే అక్కడి ముఖ్య విశేషాలు చెప్పేశాను .దదిముఖుడు చెప్పినది సావధానంగా విన్నాడుకానీ సుగ్రీవుడు ,వానర విధ్వంసం తో వనరక్షణకు వారు పడిన కష్టం దుఖాన్ని మాటలతో ఉపశమనం కలిగించలేదు.హనుమంతుడు కార్య సిద్ధి చేసివచ్చాడు కనుకనే అంత విలయంసృస్టించారు వానరులు అని అర్ధం చేసుకొన్నాడు .వారినీ పల్లెత్తు మాట కూడా అనలేదు .తన ‘’మెజెస్టీ’’ ప్రదర్శించాడు .వారు సాధించిన మహా కార్యం ముందు తెనేతాగటం, వనం పాడు చేయటం ,కాపలా వారిని  కొట్టటం వగైరా  చాలా అత్యల్ప విషయాలని భావించాడు .అందుకే దధి ముఖుని సమక్షంలోనే వానరుల౦దర్నీ పొగిడాడు .వాడు మళ్ళీ అక్కడికి వెళ్లి ఏదో గిల్లికజ్జా పెట్టుకోకుండా .అందర్నీ క్షమించాను అనీ చెప్పాడు రాజే ఆ మాట అన్నప్పుడు ‘’కోన్కిస్కా’’ కాపలాదారు ఏం మాట్లాడుతాడు ?గమ్మున ఉండిపోవటం తప్ప .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి

ఉపమన్యుని  బాల్యం లో  తల్లితో కలిసి అరణ్యం లో ఉండేవాడు .ఒకరోజు పాలకోసంఏడిస్తే తల్లి పిండిపాలు  ఇచ్హింది ,తాగి అవి అసలైన పాలుకావని గ్రహించి మళ్ళీ ఏడ్చాడు.ఆ అడవిలో పాలు ఎక్కడి నుంచి వస్తాయని తల్లి అంటే ,తానే సంపాదిస్తానని శివుడిని ప్రార్ధించాడు .కొంతకాలం ఎడమకాలి బొటన వేలుపై నిలిచితపస్సు చేశాడు   ,వందేళ్ళు పళ్ళు మాత్రమె తిని మరొక వందేళ్ళు ఆకులు ,ఇంకో నూరేళ్ళు గాలిమాత్రమే పీల్చి మొత్తం మీద వెయ్యేళ్ళు తపస్సు చేశాడు బాల ఉపమన్యువు .

శివుడు పరీక్షించటానికి ఇంద్రుని రూపం లో వచ్చి ఏం కావాలని అడిగాడు .నిన్నేమీ కోరను నాతపస్సు శివుడి కోసం అన్నాడు .భోగ భాగ్యాలిస్తాను .శివుడు  ఏమిస్తాడు బూడిద తప్ప అన్నాడు .నువ్వు పసివాడివి అంతటి తపస్సు చేయలేవు నీకు కావాల్సింది నేనే ఇస్తాను అన్నాడు .శివ నింద భరించలేక ,చెవులు మూసుకొని తక్షణం అక్కడినుంచి  వెళ్లి పొమ్మన్నాడు  .శివుడిని తప్ప ఎవరినీ ఏమీ కోరను అని తెగేసి చెప్పాడు.ఇంకా తాత్సారం చేస్తున్న ఇంద్ర రూప శివునిపై ,తల్లి తనకు తపస్సులో రక్షగా ఉంటుందని ఇచ్చిన   విభూతిని పిడికిలిలో  పట్టుకొని ‘’అఘోరాస్త్ర మంత్రం ‘’జపించి చల్లే లోపు, శివుడు ప్రత్యక్షమయ్యాడు ,అతడు కోరినప్పుడల్లా లభించటానికి’’ దధి ,క్షీర  సముద్రాలు’’  సృష్టించాడు .తర్వాత అతడు చాలాకాలం శివభక్తితో జీవించి కైలాసం చేరాడు .

 ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అష్టభార్యలలో జాంబవతి పుత్రసంతానం కోసం భర్తను ప్రార్ధించింది. ఆయన ఉపమన్యు మహర్షిని సందర్శించి భార్య కోరిక చెప్పగా ,కృష్ణుడిని 12ఏళ్ళు శివుని కోసం తపస్సు చేయమని శివానుగ్రహంతో జాంబవతి కి పుత్రులు  కలుగుతారని చెబితే అలాగే చేసి పది మంది కుమారులను జాంబవతి వలన పొందాడు .పెద్దవాడు సాంబుడు .మిగిలినవారు సుమిత్ర ,పురుజిత ,సత్యజిత, సహస్రజిత ,విజయ ,చిత్రకేతు,వసుమంత ,ద్రవిడ,క్రుతు లు.

 సంస్కృత భారతం ఆనుశాసనిక పర్వంలో వ్యాఘ్రపాద మహర్షి కుమారులు ఉపమన్యువు ధౌమ్యుడు అని ఉన్నది .తిక్కనగారు ఈ విషయం రాయలేదు .

తొలి ఏకాదశి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3

మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది కానీ  ధ్వజస్తంభం1976లో కూలిపోయింది .అపర శంకరుఅలని పించుకొన్న అప్పయ్య దీక్షితులూ ఇక్కడి వాడే అంటారు .భారత రత్న,మొదటి కేంద్ర హో౦ శాఖామంత్రి  పండిట్ గోవింద వల్లభ పంత్ కూడా ఇక్కడి వాడే అంటారు వీటికి చారిత్రాకాధారాలు లేవు . అక్కన్నమాదన్నలు ఇక్కడికి వచ్చి అనిసింగ రామకృష్ణుడు ను దర్శించి  ఆయన  ఉపాసన  మహిమవలన గోల్కొండ నవాబు తానీషామంత్రులయ్యారట

 అణి వీళ్ళవెంకటసోమయాజులు-18శతాబ్దం –ఈ గ్రామంలో పుట్టి నూజి వీడు ప్రభువు మేకా వెంకట నరసింహ అప్పారాయ ల కోరికపై ‘’అప్పారాయ యశ శ్చంద్రోదయం ‘’అలంకార శాస్త్రం రాసి అంకితమిచ్చాడు .ఆయనకు వల్లూరుపల్లి అగ్రహారం ఈనాం గా ఇచ్చాడు . ‘’అణి విళ్ళ శ్రౌత వ్యాఖ్య ‘’రాశాడు .పుష్పగిరి పీఠానికివ్యాకరణ బోధకుడు .ఒకసారి ఆంద్ర ప్రదేశ తొలి ఆస్థానకవి శ్రీ పాద కృష్ణ శాస్త్రిగారు 10ఏట కాకరపర్రు మీదుగా ముక్కామల వెడుతుంటే అరుగు మీద కూర్చున్న పండితుడు ఏ వూరు వెడుతున్నావుఅని అడిగితె ముక్కామల అంటే ,ఏం చదివావు అంటే ‘’నాకు చదువు రాదు ‘’అనగా ,’’నీకు కాకరపర్రులో అడుగు పెట్టె అధికారం లేదు ‘’అన్నాడట ఈ విషయం శాస్త్రిగారే స్వీయ చరిత్రలో రాసుకొన్నారు .

  శంకరాచార్యుల తర్వాత  అంతటి వారు అనిపించుకొన్న శ్రీ విద్యారణ్యులు  శ్రీ శృంగేరీ పీఠాన్ని అధిరోహింఛి అయిదేళ్ళ వ్యవధిలో 1336లో శ్రీ హంపీవిరూపాక్ష పీఠం నెలకొల్పి పీఠాధిపతుఅలయ్యారు .దీనినుంచి శ్రీ పుష్పగిరి ,శ్రీఅభినవ విరూపాక్ష జగద్గురు పీఠంఏర్పడ్డాయి .చాలాకాలం తర్వాత కాకరపర్రులోఉద్దండ భారతి జ్యేష్ట శిష్యుడిగా ఒకబాగం తెచ్చి 1765లో ఇక్కడ పేఠం ఏర్పరచి తామే తొలిపీఠాధిపతి అయ్యారు .ఇప్పుడు 2000సంవత్సరం నుంచి శ్రీ విద్యారణ్య భారతీస్వామి అధిపతిగా ఉన్నారు .

 మాక్స్ ముల్లర్ ఈగ్రామ ప్రభావ విశేషాలు తెలుసుకొని ‘’There are a few Brahmins in the village Kakaraparru .They are loined clothes  and they are capable of Governing the entire world in a better way ‘’అని రాశాడని 2008అక్టోబర్ ఇంటర్నెట్ పత్రిక ‘’సారస్వతం ‘’తెలిపింది .

సశేషం

శయన ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64

హనుమ వానరులకు ‘’జ౦కకండి మీ ఇష్టం వచ్చినట్లు మధువు తాగండి .మిమ్మల్ని అడ్డగించే వారిని నేను చూసుకొంటాను ‘’అనగానే అంగదుడు కూడా ‘’మీరు తేనే తాగండి ‘’అన్నాడు’’ తానా త౦దానా’’గా .’’ అని వారిద్దరూ అన్నదాన్నీ  ‘’బాగు బాగు ‘’అంటూ  ‘’భేష్ భేష్ అంటూ వానరులు ఆనందం వ్యక్తం చేశారు .హనుమ సీతఃను చూశాడని జాంబవంత అ౦గదులు  మధువును గ్రోలమని అనుమతిచ్చారన్న సంతోషంతో మధువనం చేరి ,కాపుదార్ల ను విదిలి౦చి ,ఇష్టం వచ్చినట్లు తెనేత్రాగి పండ్లుకోసి తిన్నారు ,వనరక్షకులపై పడి బాదారు .’’తూమెడు తేనే తుట్ట’’లనుఒక్కొక్కడు చేత్తో పట్టుకొని తేనే అంతా తాగి ఖాళీ చేశారు .మిగిలినవాటిని త్రెంచి పారేశారు ,కొందరు విసిరేశారు ,మత్తుబాగా ఎక్కి ఆ తుట్టేలతోనే కొట్టుకున్నారు –

‘’మధూని ద్రోణ మాత్రాణి బాహుభిః పరి గృహ్యతే –పిబంతి సహితా స్సర్వేనిఘ్నంతి స్మతథా పరే ‘’

‘’కేచిత్ పీత్వా పవిధ్యంతిమధూని మధు పింగళాః-మధూ చ్ఛి స్టేన కేచిచ్చ జఘ్ను రన్యోన్య ముత్కటాః’’

 మదించిన వానరులు కొందరు చెట్ల కింద చేరి ,కొమ్మల్ని పట్టుకొని మత్తు బాగా పెరిగి ఆకులు నేలపై రాల్చి వాటిపై పడుకొన్నారు .సంతోషంతో ఒకరినొకరు కింద  పడేసు కొని  తన్నుకొన్నారు ,తోసుకొన్నారు .కొందరు సింహనాదం చేస్తే ,కొందరు పక్షుల్లాగా అరచారు   .మరికొందరు హాయిగా నేలపై పడి దొర్లారు –ఇవన్నీ కోతి చేస్టలే .చూస్తుంటే ముచ్చటగా ఉండేవే .

‘’ఉన్మత్త భూతాః ప్లవగా మధు మత్తా శ్చహృష్ట వత్ –క్షిపంతి చ తదాన్యోన్యం స్కలంతి చ తథాపరే’’

‘’కేచిత్ క్ష్వేళా౦ ప్రకుర్వంతి,కేచిత్ కూజంతి హృష్ట వత్ –హరయో మధునా మత్తాః కేచిత్ సుప్తామహీతలే ‘’

కొందరు పల్లెటూరి పనులు చేసి నవ్వుకొన్నారు .మరికొందరు అలాగే చేస్తూ నవ్వుకొన్నారు .మేమిలా చేశాం మేమలాగా చేశాం మేమిట్లా చేశాం  మేము ఇలా చేస్తాం అని చెప్పుకొంటూ పగలబడి నవ్వుకొన్నారు-

‘’కృత్వా కేచిద్ధ సంత్య న్యే కేచిత్కుర్వంతి చేతరత్ –కృత్వా కేచి ద్వదంతనయే కేచిత్ ద్భుధ్యంతి చేతరత్’’

‘’’మధువానాన్ని కాపాడే వారు వానరుల ఆగడాలకు భయపడి నలుదిక్కులకూ పారిపోయారు .వాళ్ళను  వెంబడించి మోకాళ్ళు పట్టి లాగి ,అపానద్వారం చూపగా భయం దుఖం తో దదిముఖుడి దగ్గరకెళ్ళి మొరపెట్టుకొన్నారు .అంటే చాలా మోటుగా ఉచ్చ నీచాలు లేకుండా కోతిమూక ప్రవర్తి౦చిందన్నమాట –రాయటానికే నాకుఇప్పుడు  ఇబ్బందిగా ఉంటె అసలు ఆదృశ్యం చూస్తె ఎంత జుగుప్సగా ఉంటుందో ?-కానీ మా చిన్నతనాలలో మేము కూడా అవతలవాడిని ఏడిపించటానికి పోట్టిలాగు కిందికి జార్చి ‘’ముందు ,వెనక ‘’చూపిస్తూ నవ్వుకోవటం నాకు గుర్తే .మానవుడు కోతినుంచి దిగుమతి అయ్యాడు అనటానికి ఇదికూడా బలమైన సాక్ష్యమేమో ?

‘’జాను భిస్తు ప్రకృష్టాశ్చ’’దేవమార్గం ‘’ప్రదర్శితాః- అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః’’

వనపాలకులు ‘’హనుమంతుని అనుమతి తో వానరులు మధువనం పాడు చేశారు .మమ్మల్ని మోకాళ్ళు పట్టి లాగి అపానద్వారం చూపించారు ‘’అనిసిగ్గు విడిచి చెప్పి  గగ్గోలుపెట్టారు.ఆమాటలు విని ఓదార్ఛి ‘’నాతో రండి .మనం కలిసి మనబలం చూపించి అడ్డు కొందాం ‘’అని చెప్పి  వాళ్ళతో కలిసి వనానికి వచ్చాడు .పెద్ద చెట్టు పీకి, చేత్తో పట్టుకొని కోతులపైకి  వెళ్ళాడు .అనుచరులూఅనేక రకాల చెట్లు పీకి చేతులతో పట్టుకొని  అలానే చేశారు.హనుమకు కోపం రాగా వానరులతోకలిసి వనపాలురందరిపై దాడి చేశాడు .అంగదుడు తనతాత దదిముఖుని కిందపడేసి ,చేతులతో కొట్టాడు బందుత్వం,ముసలితనం కూడా మరచి .ఈ దెబ్బలకు అతడు తట్టుకోలేక వివశుడై కాసేపు మూర్చపోయాడు –

‘’ఆర్యకం ప్రాహర త్తత్ర బాహూభ్యాం కుపితో౦ గదః ‘’

‘’స భగ్న బాహూరుభుజో విహ్వల శ్శో‘ణితోక్షితః -’ముమోహ సహసా వీరో ముహూర్తం కపికున్జరః  ‘’

కాస్త తేరుకొని దదిముఖుడు మత్తెక్కివొడలు మరచిన ఆవానరులను దండం చేతబట్టి పారద్రోలాడు .అందుకే ‘’దండం దశ గుణం భవేత్ ‘’అన్నారు.దూరంగా పోయి అతడు తన సేవకులతో ‘’వాళ్ళ ఏడుపు వాళ్ళని ఏడవనియ్యండి .మనం రాజు సుగ్రీవుని వద్దకు వెళ్లి మనరాజుకు అంగదుడు చేసిన అపకారం అంతా చెబుతాను .అసలే సుగ్రీవుడికి కోపం ఎప్పుడూ తారాస్థాయిలో ఉంటుంది .మనం చెప్పినమాటవిని వీళ్ళందర్నీ చంపించి వేస్తాడు .ఈ వనం ఆయనకు చాలా ఇష్టమైనది తండ్రితాతలనుంచి సంక్రమించింది దేవతలకుకూడా చొరరానిది –

‘’సర్వం చైవాంగదే దోషం శ్రావ యిష్యామి పార్థివే-అమర్షీ వచనం శ్రుత్వాఘాతయిష్యతి వానరాన్ ‘’

‘’ఇష్టం మధువనం హ్యేతత్ సుగ్రీవస్య మహాత్మనః –పితృపైతాహం దివ్యం దేవైరపిదురాసదం ‘’

‘’సుగ్రీవుడికి ఈ తేనే తాగే వారు ,పోగాలం దాపురించిన వారు ఐన వానరులకు  ,మిత్రులకు కూడా మరణ శిక్ష వేస్తాడు .సుగ్రీవాజ్ఞ పరమ భీషణమైనది .దాన్ని యెదిర్చి ఎవరూ బతికి బట్టకట్ట లేరు  .రాజాజ్ఞ  ధిక్కరించిన వీళ్ళకు చావు మూడుతుంది .అప్పుడు వాళ్ళ వల్ల బాధలుపడ్డ మన కోపం శాంతిస్తుంది ‘’అని వనపాలురను ఊరడించి, వారితో సహా దదిముఖుడు అమాంతం ఆకాశం లోకి యెగిరి క్షణం లో రాజు రామ లక్ష్మణ సుగ్రీవుల  ముందు వాలాడు .మహాపరాక్రమశాలి ఐన అతడు దీనవదనం తో సుగ్రీవుని పాదాలకు ప్రణామం చేసి నిల బడ్డాడు ‘’

‘’’స వానరా నిమాన్ సర్వాన్ మధు లుబ్ధాన్ గతాయుషః-ఘాత ఇష్యతి దండేన సుగ్రీవఃససుహృజ్జనాన్ ‘’

‘’వాద్యా యేత్యే దురాత్మానో నృపాజ్ఞాపరిభావినః –అమర్ష ప్రభవో రోషఃసఫలో నో భవిష్యతి ‘’

‘’సన్నీ పత్య మహా వీర్యః సర్వైస్తైః పరి వారితః –హరి ర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః ‘’

‘’స దీన వదనో భూత్వా కృత్వా శిరశి చాంజలిం-సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్య పీడయత్ ‘’

 

ఇది 40 శ్లోకాల 62వ సర్గ .

 ఇందులో వానరుల కోతి చేస్టల పొడిగింపూ,వాళ్ళ సభ్యత లేని ప్రవర్తన ,అంగదుడు తాత అని చూడకుండా ముసలి దధిముఖుడిని నేలపై పడేసి భుజాలతో పొడవటం కొంత హద్దుమీరిన ప్రవర్తన కనిపిస్తుంది .అంగద హనుమలు సుస్టుగా మధువు తాగమని ‘’ఫుల్ లైసెన్స్’’ ఇవ్వటం తో వానరులలో సీతాన్వేషణ సమయం లో కోల్పోయిన శక్తీ ,పొందిన అలసట  దూరం చేసుకోవటానికి ఫుల్లుగా తాగి తాగుబోతుల వీరంగం సృష్టించారు .ఇంత చేస్తే కానీ వాళ్ళు మామూలు వానరులు కాలేక పోయారన్నమాట. సుగ్రీవుడికి పరమ ప్రీతిపాత్రమైన తరతరాలుగా దక్కిన మధు వనం పాడు చేయటం అంటే ఆయనకు తెలిస్తే ప్రాణాలు కోల్పోవటమే .బహుశా ఇంత దూరం ఆలొచి౦చి ఉండరు హనుమదాదులతో సహా .ఒక వేళ ఈ ఆనంద సమయం లో అవేవీ గుర్తుకు రాక పోయి ఉండవచ్చు .తెలిస్తే ఏం చేస్తాడే౦ అనే ధీమా కూడా కావచ్చు .తాము  తెచ్చిన అత్యంత శుభ ప్రదమైన వార్త విని ,ఆయన ఈ చిన్న చిన్న విషయాలను పట్టించు కోడులే అనే భరోసా కూడా కావచ్చు .తాగితే బాగానే ఉంది వనద్వంసం ఎందుకు చేయాలి ?’’ఆనంద లహరి’’ కి అడ్డూ, ఆపూ ఉండవు .వేరేది ఏదీ కనిపించదు వినిపించదు.గుడ్డిలో మెల్ల జాంబవంత హనుమ అ౦గదులు మాత్రం ‘’తీర్ధం ‘’పుచ్చుకోలేదు .వానరుల ‘’ఎంజాయ్ మెంట్’’ ను హాయిగా వారూ ఆస్వాదించారు .వారి పర్మిషన్ ఉండబట్టే ఇంత తెగించారు .వాళ్ళు నాయకులు, మనకేమైనా అయితే వాళ్ళే చూసుకొంటారు అనే  తెంపరితనం ఉండచ్చు.హనుమకూడా దధిముఖునిపైకి పోరాటానికి వెళ్ళటం స్వజన సంరక్షణలో భాగమే .

  మేనమామ అయిన, వయసులో పెద్ద వాడు ముసలి వాడూ అయిన దదిముఖుడు రాజైన సుగ్రీవునికి పాద ప్రణామం చేసి ,మధు వనపాలకాధికారిగా నమస్కరించి సంస్కారం చూపాడు .తనపాలన ధర్మాన్ని కూడా సమర్దవంతం గానే నిర్వహించాడు మధువన సంరక్షణ విషయం లో .అయినా’’ తెగించిన వాడికి  తెడ్డే లింగం ‘’అన్నట్లు బరితెగించిన ఆ కోతి మూక ను అడ్డుకోలేక విధ్వంసాన్ని ఆపలేకపోయాడు పాపం .వాళ్ళతోనూ, మనవడు అంగదుడి తోనూ దెబ్బలు కూడా తిన్నాడు విధి నిర్వహణలో .

  సశేషం

తొలి (శయన )ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగాది పుస్తకత్రయం పై ఆచార్యఇప్పగుంట సాయిబాబా -హైదరాబాద్ ,శ్రీలేఖ సాహితీ అధ్యక్షులు డా.టి రంగస్వామి గార్ల స్పాండన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అంద జే త

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అందజేత

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2

వేద వేదంగ శాస్త్రాలను బోధించే విశ్వ విద్యాలయాల లాంటి వాటికి ‘’ఘటికా స్థానాలు ‘’అంటారు .అక్కడ అధ్యయన అధ్యాపనలు బ్రాహ్మణులే చేసేవారు .ఆయుర్వేద ,ధనుర్వేద ,గాంధర్వ ,అర్ధ శాస్త్రాది బోధనలు కూడా అక్కడ జరిగేవి ,ఉత్తర భారతం లో కాశీ ఒక ఘటికాస్థలం ..నిడు మర్రు శాసనగ్రహీత ,పురాణ ధర్మశాస్త్ర ఆగమ ఉపనిషత్సాన్గుడు   కటి శర్మ తాత’’మండ శర్మ ‘’కల్ప,పురాణ ఇతిహాస ధర్మ శాస్త్రాలలో కూడా పండితుడై,కమ్మ రాష్ట్రంలోని ’’అసనపుర ఆస్థానం ‘’లో ఘటికా సామాన్య పదవి అలంకరించాడు  .హేమవతి అనబడే హోన్జేరు లో నోసంబెశ్వరాలయం మరో ఘటికా స్థాన౦  ,అక్కడ 94మంది విద్యార్ధులకు భోజన సౌకర్యం కలిపించారు .అలాంటిదే కాకర పర్రులో ఉంది .ఇది ‘’శాతాబ్దాలనుంచి ఒక విద్యా పీఠం’’అని విశ్వనాధ,’’భారతీయ సాంప్రదాయ విద్యలకు దక్షిణ కాశి ‘’అని  ఆచార్య ఎస్వి జోగారావు పేర్కొన్నారు .7వ శతాబ్ది చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఇక్కడికివచ్చి పండితులను ప్రశంసి౦చాడని అంటారు .జర్మనీ పండితుడు మాక్స్ ముల్లర్ (మోక్ష మూల భట్టర్)’’కాకరపర్రు లో ప్రతి ఇంటి అరుగు ఒక విశ్వ విద్యాలయం ‘’అని మెచ్చాడు .

చాలాకాలం క్రితం ఉద్దండ భారతీస్వామి అనే యతి సకల శాస్త విద్యా పార౦గ్తుడను అనే గర్వం తో తనతో శాస్త్ర వాదం చేస్తేనే కాని భిక్ష తీసుకొననే  వాడు  .ఒక బంగారు చీపురు దగ్గర పెట్టుకొని విద్వాంసులను ‘’ఇలా చెరిగి అలా తుడిచి పారేస్తాను’’ప్రగల్భాలు పలికేవాడు  . .ఒకసారి కాకరపర్రు రాగా భిక్ష తీసుకోమంటే ముందు శాస్త్ర చర్చ చేయాలన్నాడు .అక్కడి పండితులు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటమే కాక ,వాళ్ళే ప్రశ్నలు సంధించారు వారి వైదుష్యానికి విస్మయం చెంది ఓడిపోయానంటే పరువు తక్కువకనుక కవిత్వం పై ప్రశ్న  వేస్తానని  ‘’ఆశ్చర్య మాశ్చర్య మతః పరం కిం ‘’అనే సమస్య ఇచ్చాడు .అక్కడి యువకవి ఒకడు –

‘’యోగీశ్వరో వా యతీశ్వరోవా –విద్వత్ప్రభు ర్వాదమదనాన్తకోవా –కాన్తాల కాంతానన చిత్త వృత్తిః-’ఆశ్చర్య మాశ్చర్య మతః పరం కిం ‘’అని పూరిస్తే ,ఉద్దండ స్వామి తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు .పూర్వం ఇక్కడ’’ కుండలీ గ్రంథాల’’ను అన్వయం చేసే సమర్దులుకూడా ఉండేవారు .కాశీలాగా దీటుగా  కాకరపర్రు ఒక ఘటికా స్థానమే .క్రీ పూ 9-10 శతాబ్ద కాలం లో కాకర్త్య గుండ్యనవంశం వారు జైనమతమవలంబించారు.ఇక్కడి కనక మహా లక్ష్మి అమ్మవారి దేవాలయం 19వ శతాబ్దిలో పెమ్మరాజు వెంకటరత్నం నిర్మించాడు .అమ్మవారి పేరే చాలామంది పెట్టుకొనేవారు .9వ శతాబ్దిలో నరేంద్ర మృగరాజు అనే చాళుక్య ప్రభువు రాజరాజేశ్వర రాజేశ్వరీ దేవాలయం కట్టించాడు .హనుంమ౦తుడు ప్రతిష్ట చేసినట్లు చెప్పబడే సీతారామస్వామి దేవాలయం ఉంది .తర్వాత వేణుగోపాల సుబ్రహ్మణ్యే శ్వర,సాయిబాబా ,పాండురంగ దేవాలయాలు వచ్చాయి .త్రిమూర్తుల ప్రతి రూపంగా రావి ,వేప మర్రి చెట్ల పండగ చేస్తారు .

మొదటి ఆంద్ర మహాకావ్యం భారతం రాసిన ,వాగనుశాసనుడు   11వ శాతాబ్దినన్నయభట్టు తణుకు దగ్గర లో  యజ్ఞంచేసి ,భారత రచన మొదలుపెట్టాడని భావిస్తారు .ఆయన అనుంగు మిత్రుడు నారాయణ భట్టు   ,కూడా ఇక్కడి వారే అన్నారు చాలామంది .కానీ కాకరపర్రు పండితులు పెన్మత్స సత్యనారాయణ రాజు ,ఆకుండి వెంకటేశ్వరరావు ,కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మ,ఆచార్య దివాకర్ల ,నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి గార్ల విపుల పరిశోధన సారంగా నన్నయ తణుకు వాడే ,కాని యజ్ఞం చేసింది కాకరపర్రు లోనే అని తేల్చారు .రాజరాజ నరేంద్రుని కోరికపై భారతం ఆంధ్రీకరణ కు పూనుకొనగా  రాజుగారు ఏనుగు అ౦బారీపై కాకరపర్రు చేరి ,ఊరి బయట పెద్ద రావి చెట్టుకు ఏనుగును కట్టి ,నన్నయగారింటికి రత్నకనుకలతో నడిచి వెళ్లి  అక్కడ ఏర్పాటు చేసిన పండిత సభలో కవిపండితులను సత్కరించి ఆశీస్సులు పొందగా నారాయణభట్టు నన్నయ గురించి ప్రశంసా వాక్యాలు పలికాడు .రాజరాజు కవిని అపూర్వ కానుకలతో సత్కరించి ,రాజమహేంద్రవరం కు రమ్మని  ఆహ్వానించాడు .ఆయన నారాయణభట్టువైపు సాభిప్రాయంగా చూసి ‘’తథాస్తు ‘’అన్నాడు .పండితవర్గం హర్షా మోదం వ్యక్తం చేసింది .నన్నయ తూర్పు చాళుక్యుల రాయబారి ,నారాయణ పశ్చిమ చాళుక్యుల రాయబారి. కవిత్రయం లో మూడవవాడు ఎర్రాప్రగడ కాకరపర్రు వాడే అని మల్లంపల్లి వారు చెప్పారు.

14-16శాతాబ్ద౦ వాడైన అనిసింగరాజు రామ కృష్ణుడు ఇక్కడివాడే జ్యోతిశ్శాస్త్ర పండితుడు ఒక సారి విజయనగర రాజాశ్రయం కోసం వెడితే రాజ దర్శనం కాకపొతే ,ఒక రోజు తెల్లవారు ఝామున నదిలో స్నానం చేస్తుంటేభిక్షాటన చేసే బ్రాహ్మణుడు కనిపిస్తే ,మర్నాడు సూర్యగ్రహణం అన్నమాట రాజుగారికి చెప్పద్దని ,రాణివాస స్త్రీలు అడిగితె ఆరోజు గ్రహణం పట్టదు అని భయపడకుండా  చెప్పమని, తానూఎక్కడు౦టాడోకూడా చెప్పాడు .మర్నాడు గ్రహణ స్నానానికి రాణి వాస స్త్రీలు బంధువులు అందరూ తరలి వచ్చారు .కానీ గ్రహణం పట్టలేదు .రాజుగారికి తెలిసి ఆ యాయవార బ్రాహ్మణుడిద్వారా రామ కృష్ణుడును ఆస్థానానికి రమ్మని చెప్పమన్నాడు   .తనకు వీలులేదని రాజునే రమ్మని చెప్పాడు .తానున్నగదిలో ముగ్గులతో గ్రహ వ్యవస్థ రూపొందించాడు.అనిసిన్గరాజు .  కుడికాలు బొటన వ్రేలితో గ్రహణాన్ని త్రొక్కి ఉంచి ,రాజుగారిని కిటికీ లోంచి చూడమని చెప్పాడు.  రాజు అది చూసి ఆశ్చర్యపోయి ,ఆయనగురించి వివరాలు అడిగి  రాజ దర్శనం కాకపోవటం వల్లనే ఇలా  కాలస్థంభనవిద్యతో గ్రహణాన్ని ఆపేసినట్లు తెలియ జేశాడు .రాజు అతని జ్యోతిష్య పాండిత్యానికి అబ్బురపడి కొంత లంకభూమిని రామకృష్ణుడికిఈనాముగా ఇచ్చాడు .అది ‘’అనిసిన్గరాజు లంకభూమి’’గా గ్రామ రికార్డు లలో ఉన్నది. వేదుల సూర్యనారాయణ శర్మగారు ‘’కన్నీళ్లు ‘’గ్రంథంలో ‘’అన్సిన్గ్రాజు రామకృష్ణుడ౦డీ —-గ్రహణము నిల్పిన –సూర్యగ్రహణము నిల్పిన దంసిన్గ్రాజు రామకృష్ణు డండీ’’అని ఆవిషయం ప్రస్తావించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-20-ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63

జాంబవంతుని సలహాను అంగద హనుమదాది కపివీరులంతా ఆమోదించారు .తర్వాత అందరూ కలిసి మహేంద్ర పర్వతం వదిలి ఆకాశంలోకి ఎగిరారు .మహా గజాలలాగా మహాశరీరాలున్న వారవటం తో ఆకాశం కప్పి వేయబడినట్లు అనిపించింది .సర్వభూత పూజ్యుడు ,వీర ధీర మహాబల మహావేగుడు ఐన హనుమను రెప్ప వేయకుండా చూస్తూ తమ చూపుల మీదనే ఆయన్ను కూర్చో పెట్టుకొని మోసుకు పోతున్నట్లుగా అనిపించింది –

‘’సభాజ్యమానం భూతై స్తమాత్మవంతం మహాబలం –హనుమంతం మహావేగం’’ వహంత ఇతి దృష్టి భిః’’’’

రామకార్య సాధన చేసి మహాయశం పొంది ,మిగిలిన దిక్కులకు సీతాన్వేషణకుతే  వెళ్ళిన వానరులకంటే వీరు  ఘనులయ్యారు –

‘’రాఘవే చార్థ నివృత్తిం కర్తుం చ పరమం యశః –సమాధాయ  సమృద్థార్థాః కార్ము సిద్దిభి రున్నతా ‘’

సీతా  దర్శన వార్త రాముడికి చెప్పాలనే తహతహతో ,రావణుడితో యుద్ధం చేయాలన్న కాంక్షతో ,రాముడికి ప్రత్యుపకారం చేయాలన్న కోరికతోవానరులు  అనేక వృక్షాలు తీగలతో నందన వనం లాంటి ,సుగ్రీవుని ఆజ్ఞ చేత కాపలా కాయబడుతున్న ,ఏ ప్రాణీ  చొరరానంత కట్టు దిట్టమైన ,సకలమనోహరమైన మధు వనం చేరారు –

‘’నందనోపమ మాసేదు  ర్వనంద్రుమలతా యుతం ‘’

‘’యత్తన్మదు వనం నామ సుగ్రీవస్యాభి రక్షితం –అదృష్య౦ సర్వభూతానాం సర్వ భూత మనోహరం ‘’

మధువనాన్ని సుగ్రీవుని మేనమామ దధిముఖుడు  సదా రక్షిస్తూ ఉంటాడు .వానరులంతా మధువనం లో దిగి సుగ్రీవుని మనసుకు ఆందం కలిగించే మధువనం లోని మధువు తాగాలాని ఉబలాట పడ్డారు –

‘’తే తద్వన ముపాగమ్య బభూవుః పరమోత్కటాః –వానరా వాన రేంద్రస్య  మనః కాన్తతమం మహత్ ‘’

తెనేలాగా పింగళ వర్ణం తో ఉన్న వానరులు  తేనే త్రాగటానికి యువరాజు అంగదుని అనుమతి కోరారు –

‘’తతస్తే వానరా హృస్టాదృష్ట్వామధువనం మహత్ కుమార మభ్యయా చంత మధూని  మధు పింగళాః’’

 అంగదడు,జాంబవంతాది పెద్దల అనుమతి పొంది తర్వాతనే తేనే తాగటానికి వానరును  అనుమతించాడు –అంటే తనను అడిగినా ,పెద్దరికం జామ్బవంతునికిచ్చి ,ఆయన సరే నన్న తర్వాతే తన అనుమతి మంజూరు చేశాడు –

‘’తతః కుమారస్తాన్ వృ-ద్ధాన్ జా౦బ వత్ప్రముఖాన్  కపీన్ –అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధు భక్షణే’’

అంగదుని అనుమతి లభించగానే ఆనంద పరవశత్వం తో ననౌకసులైన  వానరులు నృత్యం చేశారు-ఇక్కడ వనౌకసులు అనటం పరమ ఔచిత్యమైన మాట .వాళ్ళు ఉండేది వనాలలోనే కనుక ఆ శబ్దం చక్కని అర్ధ ప్రబోధకంగా ప్రయోగించాడు కవి వాల్మీకి –

‘’తత శ్చాను మతా స్సర్వే సంప్ర హృష్టా వనౌకసః –ముదితాఃప్రేరితా శ్చాపి ప్రవృత్యంతో భావం స్తతః

కోతికి కొబ్బరి కాయ దొరికితే అనే సామెత లోకం లో ఉంది .అలాగే ఇక్కడా వానరుల ఆనందానికి అంతులేకుండా పోయింది .కొందరు పాడితే ,కొందరు వంగితే మరి కొందరు నృత్యం చేస్తే ఇంకొందరు అట్టహాసం చేస్తే ,కొందరు పడి లేస్తూ ,కొందరు అటూ ఇటూ తిరుగుతూ ,కొందరు అరుస్తూ ‘’ హల్ చల్’’చేశారు –

‘’గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ –నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ –పతంతి కేచిత్ ద్విచర౦తి కేచిత్ –ప్లవంతి కేచిత్ ప్రలవంతి కేచిత్ ‘’

  ఒకళ్ల నొకళ్ళు కావలించుకొంటూ ,కొందరు ఒకళ్ళను ఒకళ్ళు పట్టుకొంటూ ,కొందరు మాట్లాడుకొంటూ ,కొందరు కలిసి విహరించి ఆనందం అనుభవించారు –

‘’పరస్పరం కేచి దుపాశ్రయంతే-పరస్పరం కేచి దుపాక్రమంతే-పరస్పరం కేచి దుపబ్రువంతే-పరస్పరం కేచి దుపారమంతే’’

కొందరు ఒక చెట్టు మీదనుంచి ఇంకో దానిమీదకు పరిగెత్తారు .కొందరు చెట్టు చివరి కొమ్మలపైకి చేరి కిందికి దూకారు ,మరికొందరు గడుగ్గాయలు మహా వేగంతో చెట్టుకి౦ది  వృక్షాగ్రం ఎక్కేశారు-

‘’ద్రుమా ద్ద్రుమం కేచి దభి ద్రవంతే-క్షితౌ నగాగ్రా న్నిపతంతి కేచిత్ –మహీతలానన్ త్కేచి దుదీర్ణ  వేగా –మహాద్రుమాగ్రా ణ్యభి సంపతంతి’’

‘’ఒకడు పాడుతుంటే ఇంకోడు నవ్వుతూ వాడి దగ్గరకు వెళ్ళాడు .ఇంకోడు నవ్వేవాడి దగ్గరకు ఏడుస్తూ పోయాడు .ఇంకోడు  ఏడ్చేవాడిని త్రోసేసి దగ్గర కెళ్ళాడు.మరో గడుసు పిండం అరుస్తూ ఆ తోసిన వాడి దగ్గర కెళ్ళాడు –ముక్తపద గ్రస్తం లాగా తమాషాగా వర్ణన చేసాడు మహర్షి .

‘’గాయంతి మన్యః ప్రహసన్నుపైతి-హసంత మన్యః ప్రరుదన్నుపైతి-రుదంత మన్యః ప్రణుద న్నుపైతి-నుదంత మన్యః ప్రణద న్నుపైతి’’

  బాగా తేనే కడుపారా తాగి ,మత్తెక్కి విపరీత చేష్టలు చేస్తూ కల్లోలం సృష్టించారు .తాగి తృప్తి పొందనివాడు  మత్తెక్కని వాడు లేదు అంటే అతిశయోక్తిలేదు .కల్లుపాకల దగ్గర’’ తాగు బోతుల సీను’’ ఇదంతా లాగా అనిపిస్తుంది .-

‘’సమాకులం తత్కపి సైన్య మాసీ –న్మధు ప్రసానోత్కటసత్వ చేస్ట౦-న చాత్ర కశ్చిన్న బభూవమత్తో-న చాత్ర కశ్చి న్న బభూవతృప్తః ‘’

 తాగి తందనాలాడటం  అంటే ఇదే నెమో ? తాగినమత్తులో మధువనం చెట్లు విరగ్గొట్టారు ,ఆకులు పూలు పళ్ళు రాల్చి నేలపాలు చేస్తుంటే కాపలాదారు దధి ముఖుడు అడ్డు వచ్చాడు .అసలే ముసలాడు ,ఆయన మనల్ని బెదిరించటం ఏమిటని ఇంకా చెలరేగిపోయారు కోతిమూక .పాపం శాయశక్తులా వనాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు సుగ్రీవ మేనమామ- .కొందర్ని తీవ్రంగా తిట్టాడు .కొందర్ని అరచేత్తో కొట్టాడు ,కొందరితో పోట్లడాడు .కొందర్ని వనం పాడు చేయకండిరా బాబూ అని బుజ్జగించాడు . పాపం ఒళ్ళు ఎరగని మత్తులో తిట్లూ శాపనార్ధాలు దెబ్బలూ తిన్నారు వానరులు –

‘’ఉవాచ కాంశ్చిత్పరుషాని ధృష్ట-మసక్త మన్యా౦శ్చతలై ర్ణఘాన –సమేత్య కైశ్చిత్కలాహం చకార –తథై వసామ్నోపజగామ కాం శ్చిత్’’

మధుపానమత్తులై ,కపలాదారును లెక్క చేయకుండా భయం లేకుండా రెచ్చిపోయి ,అతడి చుట్టూ చేరి ,వనరక్షకుడు అతడిని ఏమీ చేయరాదనే ఇంగితం కూడా లేకుండా తిట్టారు ,అటూ ఇటూ లాగారు .గోళ్ళతో గీరి పళ్ళతో కరిచి,చేతులు కాళ్ళతో బాదుతూ  ఆవనం లో తినటానికి ఉన్న సర్వం భోజ్యం చేసి మిగలకుండా పూజ్యం చేసేశారు కపి సేన కసికసిగా విజయోత్సాహంతో  -అసలైన ‘’కిష్కింధకాండ ‘’సినిమా ఆడారు. మనకు వారికీ వినోదం ,ఆనందం సంతృప్తీ ,ఆటవిడుపు దధిముఖుడికి పరాభవం ,దుఖం  అవమానం దూషణ తిరస్కారాలు .

  ఇది 23శ్లోకాల 61వ సర్గ

 కోతి మూక ఆగడాలను కవి రుషి వాల్మీకి అనుస్టుప్పులలో మన చెవుల తుప్పు వదిలేట్లు పరమ మనోహరంగా వర్ణించాడు .తీవ్రమైన అనుభూతి ఆనందం సంతృప్తి సంఘటనలలో ఈ విధమైన శ్లోకాలతో వర్ణిస్తూ గొప్ప’’ ఎఫెక్ట్ ‘’కలిగిస్తాడు లోగడ రెండు మూడు ఘట్టాలలో చూశాం .ఇన్ని మంచి శ్లోకాలను ఏ ప్రవచన కారుడూ ముట్టుకోడు .అదే నాకు ఆశ్చర్యం .ఒక సారి కైకలూరుకు చెందిన ప్రవచన కారులు  బ్రహ్మశ్రీ పరిమి రామకృష్ణ శాస్త్రిగారు ఉయ్యూరు విష్ణ్వాలయం లో సుందర కాండ చెబుతూ అంతా అయ్యాక ఆయన్ను సన్మానిస్తూ నన్ను మాట్లాడమంటే ఈ సర్గ శ్లోకాలు చదివి వినిపిస్తే ‘’అలాగా మాస్టారూ ‘’అని ఆశ్చర్యపోయారు .మల్లాది వారూ ఎక్కడా ఉటంకి౦చినట్లు లేదు .నాకెందుకో ఈ సర్గ పరమాద్భుతం అనిపిస్తుంది .సహజత్వానికి నిలువుటద్దం.వీనులవిందైన శబ్ద లాలిత్యానికి గొప్ప ఉదారణ .

  అసలు ఈ మధువనం  సీను ఎందుకు పెట్టాడు కవి ?ఎవరైనా ఏదైనా అద్భుత కార్యం సాధిస్తే ,పరీక్ష పాసైతే రాంకు వస్తే మాంచి ఉద్యోగం సంపాదిస్తే తన  ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం లోక రివాజు .స్వీట్,హాట్ టీ వగైరాలిచ్చి తృప్తి చెందుతారు .ఇంకా’’ ఖరీదైన ‘’వారు ‘’మందుపార్టీ ‘’చేసుకొంటారు .కాక్ టైల్ పార్టీ వగైరాలు చేస్తారు .ఇక్కడ కూడా అంతే.వానర విజయోత్సాహానికి తగిన’’ కిక్కు’’ రావాలి .అందుకే మధు వన విహారం .తేనే త్రాగటం .వనౌకసుల సహజ లక్షణం .తేనే తుట్టె దులిపి తేనే తాగటం .ఆ పనే వీళ్ళు చేశారు .మాత్తేక్కితే పిచ్చిప్రేలాపనలు ,చేష్టలు చేయటమూ సహజమే .అలాగే తమ జాతి లక్షణాలనీ ప్రదర్శించారు  .ధిక్కారమూ సహజమే అదీచేశారు మత్తు గమ్మత్తులో .వద్దని వారించిన వారిని దుమ్మెత్తి పోయటమూ సహజమే .అదీ చూపించారిక్కడ. అన్నీ సహజ లక్షణ సుందర బంధురంగా ఉన్నాయి .ఆశ్లోకాలలో వాల్మీకు తేనే కారేట్లు రాశాడు .చదువుతుంటే మనకూ కిక్ వస్తుంది .చక్కని లయాత్మకమైన శ్లోకాలు .భావ సుందరాలు .మనోజ్ఞాలు .మధుమదురాలు .మరొక్క సారి మహర్షికి నమస్కరిస్తున్నాను ఈసర్గను సర్వతో మనోజ్ఞంగా తీర్చి దిద్దినందుకు .

  హనుమ అంగద జాంబవంతాది’’ ఎల్డర్స్’’ ఈ మధువు జోలికి వెళ్ళినట్లు చెప్పలేదు .అనుచరుల సంతోషమే తమ సంతోషంగా భావించి ఉంటారు .కపులు తమ కపిత్వం తో వన ధ్వంసం చేయటం తప్పని పిస్తుంది .కానీ ఇక్కడ తప్పని విషయమే అది .ఆనందానికి పరాకాష్ట అది అని సర్దుకోవాలి .సుగ్రీవుడికి పరమానందం కలిగించేది,కుకనే మేనమామను ముసలివాడైనా జాగ్రత్త గా చూసుకొంటాడని కాపలాగా పెట్టాడు .అలాంటి దాన్ని ధ్వంసం చేస్తే సుగ్రీవుడు అగ్గిమీద గుగ్గిలం  అవుతాడు .కానీ లెక్క చేయలేదు కపి మూక .తెలిసినా తమ విజయం ముందు ఈ తోట ధ్వంసం ఒక లెక్కా అను కొ౦టాడని తెలుసేమో వీరికి ? అసలు అంగద జాంబవంతులు కూడా కిమిన్నాస్తిగా మౌనంగా ఉండి పోయారు .ఏదో ఆంతర్యం వారికి తెలుసు అనిపిస్తుంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం -1

ఆరామ ద్రావిడుల ఆలయం -1

నిన్నటి నిడదవోలు పర్యటనలో మల్లవరం లో నాకు శ్రీమతి చర్ల మృదుల గారిచేత శ్రీ కానూరి బదరీ నాథ్ రాసిన  ‘’తరతరాల సరస్వతీపీఠం-మన కాకర పర్రు’’పుస్తకాన్ని  అంది౦ప జేశారు ‘’నేను బదరీ నాద్ గారి భార్యను ‘’అని పరిచయం చేసుకొని ఒకావిడ .ఆమె లో ఎంతో సౌజన్య సంస్కారాలు నాకు కనిపించాయి .ఇవాళ ఆ పుస్తకం చదవటం ప్రారంభించాను .తరతరాల కాకరపర్రు గ్రామ విశేషాలు అక్కడి చారిత్రిక ,సాహిత్య ,సంగీత విశేషాలు అక్కడ జన్మించి దాన్ని పునీత౦చెసిన మహా మహుల గురించి ,ఎంతో వివరంగా విషయ సేకరణ చేసి రాసిన  రచయితకు అభినందనలు తెలియజేసి ,అందులోని విశేషాలను టూకీగా మీకు తెలియ జేయాలనే ఉద్దేశ్యంతో ‘’ ఆరామ ద్రావిడుల ఆలయం’ శీర్షిక పేరుతొ కొన్ని వ్యాసాలు  దాన్నిఆదారంగా రాయాలనుకొని ,పుస్తకం నాకు ఇచ్చిన ,ఆమె పేరు ఏమిటో అందులో లేకపోవటం ఆశ్చర్యం కలిగించి ,ఇంత చరిత్ర త్రవ్వి తీసిన ఆయన ,తనభార్య పేరు రాయకపోవటం బాధకలిగించి , ఆ పేరు లేకుండా రాయటం ఔచిత్యం కాదని పించి ,వాణీ ప్రభాకరి గారికి  మెసేజ్ పెడితే ఆమెవెంటనే స్పందించి ,ఆ ఇల్లాలి పేరు’’ శ్రీమతి రమా మురళి రాజేశ్వరి ‘’అని తెలియ జేశారు .రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉపక్రమిస్తున్నాను .. పశ్చిమ గోదారి జిల్లా పెరవలి మండలం లో కాకరపర్రు పండితాగ్రహారం  ఉంది.అది సంస్కృత ,వ్యాకరణ  వేదం వేదాంగాల అధ్యయన కేంద్రం .తెలుగు భాష ఔన్నత్య ,వికాసాలకు పట్టుకొమ్మ తెలుగు జాతి యశస్సు ,వైభవ ,ప్రాభవాలకు జీవ ధాతువు .బ్రహ్మ గారి సృజన ప్రతిభకు సాక్ష్యం .తెలుగు సరస్వతికి ఆలయ శిఖరం .ద్రావిడులు దక్షిణా పధంనుంచి గోదావరీ ముఖ ద్వారాలకు చేరి ,పంచారామ క్షేత్రాలలో స్థిర పడి’’ఆరామ ద్రావిడులు ‘’అయ్యారు .కనుక ఇది విలువైన చారిత్రిక గ్రామం .

‘’కాకర పర్తిని  చూస్తె కాశీకే కన్నెర్ర ‘’గాఉండేది .కాశీ పండితులే ఇక్కడికి వచ్చి తమ సందేహాలు ఇక్కడి పండితుల నుంచి తీర్చుకొనేవారు .అందుకే దక్షిణ కాశి అయి సరస్వతీ పీరమైంది .పల్లవ సామ్రాజ్య రాజధానిగా కంచి ఉండేది .అక్కడ వేద వేదంగావిదులు ,వైదికులు ,రాజనీతి విశారదులైన నియోగులు ,క్షత్రియులు ,వ్యాపార వేత్తలైన వైశ్యులు ,వ్యవసాయ నిపుణులైన తక్కిన కులాల వారు రాజాదరణ పొంది సుఖంగా జీవించా రక్కడ .పల్లవ విజయాదిత్య వర్మ బ్రాహ్మణులకువేంగీ దేశం లోని 204అగ్రహారాలుదానమిచ్చాడు .ఈ గ్రామమలలో  కాకరపర్రు, కానూరు ,తీపర్రు కూడా ఉండి ఉంటాయి .వారు అక్కడనుండి గోదావరి ప్రాంతానికి వచ్చి10వ శతాబ్ది లో  గోస్తనీ నదీ తీర అగ్రహార బ్రాహ్మణులు అయ్యారు.బౌద్ధాన్ని రూపుమాపి  వైదిక మత పునరుద్ధరణ చేశారు వేగినాటి  ‘’ కాకర్త్యపురం ‘’ నేటి కాకరపర్రు .పూర్వ చాళుక్య రాజుల మూల పురుషుడు నాల్గవ  విష్ణు వర్ధనుడికొడుకు రెండవ విజయాదిత్యుడు .ఇతడికి అతని సోదరుడు ‘’భీమ సళుక్కి’’ల మధ్య 108 యుద్ధాలు జరిగి అందులో ఒకయుద్ధం గుండ్యన కుటుంబాలకు నిలయమైన కాకర పర్రు లోనూ జరిగి ,’’నరేంద్ర వర్మ మృగరాజ ‘’బిరుదాంకితుడు రెండవ విజయాదిత్యుడు శత్రువుఅను అందర్నీ ఓడించి ,రాజు అయ్యాడు అనేక శివాలయాలు చెరువులు ఉద్యానవనాలు సత్రాలు కట్టించాడు వాటిలో కృష్ణా జిల్లా దివి సీమలోని ‘’న౦గే గడ్డ ‘’లోని’’నగేంద్ర మృగేశ్వరాలయం ‘’,నందిగామ తాలూకా కొణకంచిలోని ‘’నరేంద్రస్వామి ఆలయం ‘’ఉన్నాయి ,

ముక్కంటి త్రిలోచన వర్మ మహారాజు ఆహ్వానం పై ఇక్కడికి వచ్చిన ఆర్వేల నియోగులలో కంచి రాజు వంశస్థులు గోదావరి ముఖద్వారమైన ,వశిష్ట నది తీర గ్రామం కాకర పర్రు కు సుమారు 700ఏళ్ళ క్రితమే వచ్చి స్థిర పడ్డారు .సప్తగోదావరిపాపికొందలద్వారా ప్రవహించి  లోని ఏడు పాయలై-తుల్యభాగ ,ఆత్రేయ ,గౌతమి ,వృద్ధ గౌతమి ,భారద్వాజ ,,కౌశిక ,వశిష్ట పేర్లతో విలసిల్లాయి .ఇంతటి నదీ శోభ ఉన్న గోదావరి నదిని ‘’ది రైన్ ఆఫ్ ఇండియా ‘’అన్నారు .ఐరోపా లోని అతి పెద్దనది రైన్ నది .వశిష్ట పాయ చెంత కాకరపర్రు అగ్రహారం ఉన్నది .

అగస్త్య మహర్షికాలం లో బ్రాహ్మణులు ఉత్తరాదినుంచి దక్షిణాదికి వచ్చి కర్మిస్టు లై పేరూరి ద్రావిడులు ,దివిలి ద్రావిడులు ,పుత్తూరు ద్రావిడులు ,తుమ్మగుంట ద్రావిడులు ,ఆరామ ద్రావిడులు అనే అయిదు శాఖలుగా చీలిపోయారు .కౌశికీ నది తీరానున్న పెరియ గ్రామం లో ఉన్నవారు పేరూరు ద్రావిడులు ,సర్వసిద్ది తాలూకా దివిలి గ్రామంలోని వారు దివిలి ద్రావిడులు,నెల్లూరు ,పుత్తూరు ప్రాంతంలో చేరినవారు పుత్తూరు ద్రావిడులు , నెల్లూరు జిల్లా తుమ్మగుంటవారు తుమ్మగుంట ద్రావిడులు ,తోటలు ఆరామాలలో ఉన్నవారు ఆరామ ద్రావిడులు అయ్యారని కధనం .వీరిని ‘’తోట అరవలు ‘’అనీ అంటారట .

ఆరామ ద్రావిడుల తొలి ఆవాసం కాకరపర్రు .ఇక్కడినుంచే తర్వాత తరాలలో బొబ్బిలి విజయనగరం మొదలైన ప్రాంతాలకు వ్యాపించారు .కాకరపర్రు ,ఇంజరం ఆరామ ద్రావిడులకు ముఖ్యగ్రామాలు .ఆకొండి, వేదుల ,చర్ల ,ఆణివిళ్ళ,ఓలేటి ,కాకరపర్తి ,కామవరపు ,కూచిభొట్ల ,ఇంటిపేర్లు .ఆరామ ద్రావిడులకు ఆలయం అనీ , చతుర్వేద , శాస్త్రార్ద, తర్క ,వేదార్ధ, సాహిత్య ,కవిత్వాలతో ఈ గ్రామం లోని ప్రతి ఇల్లూ ‘’ఒక యూని వర్సిటి ‘’అన్నారు కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారు .

కలియుగం లో కృష్ణాజిల్లా శ్రీకాకుళం లోని శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు కొంతకాలం గుడీ ,ప్రాకారాలతో సహా అంతర్ధానమై భూగర్భ నాగలోకం లో నివాసమున్నాడట .ఆహిచ్చ పురానికి వెళ్ళాడని మరో కథనం .ఒరిస్సారాజు అంగపాల కొడుకు అనంతపాలుడు ,మంత్రి సైన్యాధ్యక్షుడు,నరసింహ వర్మ దక్షిణ యాత్ర చేస్తూ శ్రీకాకుళం వచ్చి తన తలి దండ్రులను కలిసి నప్పుడు రాత్రికలలో స్వామి కనిపించి తాను  ‘’ఆహిచ్చపురం బ్రహ్మ కుండం నది ఒడ్డున వామన శర్మ దొడ్లో ‘’కాకర వల్లిక ‘’మొక్క మొదట్లో భూమిలో నిద్రావస్థలో ఉన్నాననీ ,తాను  శ్రీకాకుళం లోనే స్థిరంగా ఉండాలని  నిశ్చ యించు కొన్నాననీ  చెప్పగా ,మంత్రి ఒక పురోహితుడిని పంపి విగ్రహం తెప్పించి ,శ్రీకాకుళం లో దేవాలయం కట్టించి స్వామిని ప్రతిస్టిం చాడట ,ఆహిచ్చ అంటే భూమికి గొడుగు .కాకరపర్రు అన్నిటికీ గొడుగుగా ఉండేది కనుక కాకరపాదు పేరున్నదీ కనుక కాకరపర్రు ఆహిచ్చపురంగా పిలువబడేదని అంటారు .

అలాగే కృష్ణాజిల్లా హంసలదీవిలోని శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం కాకరపర్రు చెరువులో దొరికిందనే  జనవాక్యం ప్రచారం లో ఉందిట .చారిత్రిక ఆధారాలు లేవు కనుక  నమ్మటానికి వీల్లేదు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-20-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

112- బురుండీ దేశ సాహిత్యం

పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు .అన్నిటికీ వ్యవసాయమే ఆధారమైన బీద దేశం ప్రత్తిపంట విస్తారం .ఆరేళ్ళ కంపల్సరి విద్య అమలులో ఉంది .65శాతం అక్షరాస్యులు .కనువిందు చేసే 15 యాత్రాస్థలాలున్నాయి .

బురుండీ సాహిత్యం –అంతా ఆ దేశప్రజలు ఫ్రెంచ్ భాషలో రాసిందే ఎక్కువ .మొదట్లో మౌఖికంగానే సాహిత్య వ్యాప్తి పాటలు గీతాలు కధలు ద్వారా వ్యాప్తి చెందింది.

   ఆధునిక స్త్రీ రచయితలూ –ప్రిన్సెస్ ఈస్తర్ కమటారి-రాజ కుటుంబానికి చెందినది .1962దేశం స్వాతంత్రం పొందాక ,రాజును మిలిటరిజుంటాతొలగించి రాజరికపాలన రద్దు చేసింది .1972లో రాజును హత్యచేశారు .తర్వాత మెజార్టీ హుటు,మైనారిటి  టుట్సిజాతులమధ్య పోరాటాలు జరిగి ,సివిల్ వార్ వచ్చి ,వేలాది బాలయుద్ధ నేరస్తులు ఈస్తర్ నాయకత్వాన్ని బలపరచి ఫ్రాన్స్ లో అసోసియేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ బురుండి ఏర్పడి  ఆమె  ప్రాజాస్వామ్యపద్ధతులకు మద్దతుఇవ్వగా తర్వాత ‘అబాహుజా ‘’అంటే ప్రజల ఐక్యత పార్టీ పేరుతొ ఎన్నికలలో నిలబడి ఈస్తర్ కమటారి పాలన చేసింది పుస్తకాలు రాసి౦ది

కెట్టి  నివ్యా బంది-కవయిత్రి .స్త్రీ హక్కుల ఉద్యమకారిణి .నోబెల్ వుమెన్ ఇనీషిఏటివ్ఏర్పరచింది

పెర్పెత్యునిసిమ్హరిమాన –యుఎన్ వో లో శాశ్వత సభ్యురాలు .లిట్టేర్ ఏ ఇస్డోరే అనే స్వీయ చరిత్ర రాసింది

మేరి లూసీ సిబజూరి –స్త్రీలహక్కు ఉద్యమకారిణి .అనేక రేడియో సీరియల్స్ రాసింది .షొప్ ఒపేరా నిర్వహించింది .లెస్ సీన్స్ నాస్ అనే మొదటినవల 2013లో రాసింది బెల్జియం లో కొన్నేళ్ళు ఉండి వచ్చి నాటకరంగం లో కృషి చేసింది .బురున్డియన్ జానపద కథలను2019లో ప్రచురించింది .

 అగస్టిన్ సంజె –చరిత్ర ,రాజకీయ నిధి. డిప్లోమాట్ .ఇంతకంటే విషయాలు లభించలేదు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62

  హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని  తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో పరాక్రమం లో కాని దేవదైత్యులలో హనుంతుడికి సాటి ఎవరూ లేరు .అలాంటి హనుమ లంకలో రాక్షస వీరులను మట్టుపెట్టగా,ఇకమనకు వేరే పని ఏముంది ?సీతను  తీసుకొని వచ్చాక మాత్రమే రాముని చూడటానికి వెడదాం.’’అన్నాడు .అంగదుని మాటలు విన్న జాంబవంతుడు అతనితో ‘’రాజపుత్రా !నువ్వు చెప్పింది అయుక్తం కాదు .అయినా యుక్తమైనా సరే ,రామాజ్ఞ ప్ర కారమే మనం నడుచుకోవటం మన విధి .స్వత౦త్రి౦చి  మనం ఏ పనీ చేయకూడదు .కనుక  ఆ ప్రకారం కార్య సిద్ధి ఆయే ఉపాయం ఆలోచించాలిచాలన్నాడు .

‘’తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూను రాభషత-‘’అయుక్తం తు వినా దేవీం ‘’ దృష్ట వద్భి శ్చవానరాః’’

‘’దృష్ట్వా దేవీ న చానీతా ఇతి తత్ర నివేదనం –అయుక్త మివ పశ్యామి భవద్భిః ఖ్యాత విక్రమైః’’

‘’తే ష్వేనం హతవీరేషు రాక్ష శేషు హనూమతా –కిమస్య దత్ర కర్తవ్యమ్ ‘’గృహీత్వా యామ జానకీం ‘’

‘’న తావ దేషా మతి రక్షమానో –యథా భవాన్ పశ్యతి రాజపుత్ర –యథా తు రామస్య మతి ర్నివి ష్టా-తథాభవాన్ పశ్యతు కార్య సిద్ధిం ‘’

ఇది 6శ్లోకాలు మాత్రమే ఉన్న 60వ సర్గ .

యువరాజు అంగదుడు ఆవేశ పరుడు .ఈ’’ ఎక్ష్పెడిషన్ ‘’కు తానే  నాయకుడు .అతని ఆజ్ఞకు లోబడే హనువ వెళ్లి సీతను లంకలో చూసి వచ్చినా ,నాయకుడిగా తనకు రావాల్సిన కీర్తిరాదు . సీతను తీసుకురాకుండా చూసి వచ్చాం అని రాముడికి చెప్పటానికి మొహం చెల్లటం లేదు .అది తన నాయకత్వానికి’’ ఫెయిల్యూర్ ‘’అవుతుందని మధన, బాధ, అవమానం అతనిది .కనుక తక్షణ కర్తవ్య౦ .అక్కడ ఉన్న సమర్ధ వానర వీరులో కొందరుకానీ అందరూ కానీ  లంకకు వెళ్లి ఎలాగైనా సీతనుతీసుకు రావాలి .అప్పుడే ఆమెతో కలిసి రామ దర్శనం చేయాలి .ఉడుకురక్తం ఆలోచన .అప్పుడే తన’’ ప్రిస్టేజ్’’ తన బాబాయ్ ముందు నిలుస్తుంది .లేకపోతే ‘’డామేజ్ ‘’అవుతుంది అనుకొన్నాడు కుర్రాడు ,యువరాజు కనుక .ఆపైన ఆలోచి౦చ లేకపోయాడు .ఇలాంటి సమయాలలోనే అనుభవజ్ఞుల ఆలోచన ,సలహా ‘’టంకం’’ అతికి నట్లు సరిగ్గా అతికి, పని చేస్తుంది

  అందుకే జాబవంతుడు తన అనుభవ సారం  అంతాపిండి వడగట్టి తానే అంగడుడికి,అందరి తరఫున ‘’మా౦ఛి డోసు’’లాంటి సలహా ఇచ్చి మారుమాట్లాడకుండా చేశాడు .అదే- నిర్ణయం తాము తీసుకోకూడదని ,యువరాజు అంగదుని తో సహా అందరు రామాజ్ఞకు బద్ధులుగా నడవాల్సిందే అని ఖరాఖండిగా చెప్పి,అంగదుడితోపాటు అందరి నోళ్లకు తాళం వేశాడు .లేకపోతే ఏమయ్యేది ?ఎవరికి వారు తమపరాక్రమ డబ్బాలు స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలు కొట్టుకొని,కృష్ణరాయబారం లో దుర్యోధన ,కర్ణ ,అశ్వత్ధామ , ద్రోణ క్రుపాదులు  నిండు సభలో తమలో తాము’’ సిగపట్ల గోత్రం’’పట్టి ,రాయబారి ముందు పలుచనై పరువు పోయినట్లు జరిగేది . అటునుంచి ఆటే లంకకు పరిగెత్తేవారు .తర్వాత ఏమై పోతారో తెలీదు. రామ సుగ్రీవాదులకు  సీతా దర్శన వార్త చేర వేసే వారు ఉండరు .ఒక వేల హనుమ అక్కడే ఉండిపోయినా  వాళ్ళంతా తరిగి వచ్చేదాకా సుగ్రీవ రాములను చూడటానికి వెళ్ళే సాహసం చేసేవాడు కాదు . దు౦దుడుకు స్వభావి  అంగదునినపై రాజు సుగ్రీవుడికి కోపం వస్తే ,అతన్ని  రక్షించగలిగే  వారెవరూ ఉండరు సుగ్రీవాజ్ఞ అంత  తీక్ష్ణమైనది .ఇప్పటిదాకా చేసిన అన్వేషణ అంతా నిష్ఫలమై పోతు౦ది. ఆప్రమాదం జరక్కుండా ఎంతో ముందు చూపుతో రామకార్య సాఫల్యానికి ,హనుమ అన్వేషణ ఫలితానికి చక్కని’’ డ్రమాటిక్ ఫినిషింగ్ ‘’ఇచ్చాడు జా౦బవాన్ అని నాకనిపించింది .చిన్నసర్గ అయినా చాలా’’ పవర్ ఫుల్ ‘’సర్గ అని నేను అనుకొంటున్నాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 29-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా నిడదవోలు పర్యటన

 

మా నిడదవోలు పర్యటన

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో 22-3-20న మా తలిదండ్రులు కీశే .విద్వాన్ శ్రీ  గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ దంపతులస్మారక ఉగాది పురస్కారాలను కరోనా లాక్ డౌన్ వలనవాయిదా వసి  అందించలేక పోయాం .నిన్నజూన్ 27శనివారం రాత్రి  మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లోస్థానికంగా ఉన్న వారికి స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారాలు అందజేశాం . మూడు నెలలనుంచీ నిడదవోలు లోని డాశ్రీమతి చర్ల మృదుల డా ,విదుల (చర్ల సిస్టర్స్ )  మా తలిదండ్రుల స్మారక పురస్కారం ఇద్దామనుకోవటం ,లాక్ డౌన్ పొడిగించటం వలన చేయలేకపోయాం  .వారిని పిలవకుండా ముందే చెప్పి ఈ రోజు 28-6-20 ఆదివారం నేనూ మాశ్రీమతి ,మా మూడవకోడలు శ్రీమతి రాణి ,నాల్గవ అబ్బాయి రమణ కారులో ఉదయం  స్నాన సంధ్య పూజాదికాలు టిఫిన్ కాఫీలు అయ్యాక 7-30కు బయల్దేరి ,తాడేపల్లి గూడెం ,ప్రత్తిపాడు మీదుగా నిడదవోలు కు ఉదయం 10-45కు చేరి శ్రీమతి చర్ల సుశీల  వృద్ధాశ్రమానికి చేరగా చర్ల సిస్టర్స్ మాకు పుష్ప గుచ్ఛాలతో ఆత్మీయంగా స్వాగత౦ చెప్పి ,మమ్మల్నిదగ్గరలో ఉన్న  జువ్వలపాలెం లోని శ్రీమతి చర్ల విదుల ,మృదుల మాధురి మినీ ఫంక్షన్ హాల్ కు తీసుకు వెళ్ళారు .ఈ హాల్ ఈమధ్యనే నిర్మాణం పూర్తయిందని ,ఇదే మొదటి కార్యక్రమం అనీ తెలియ జేసి దీన్ని నా పుట్టిన రోజు పండుగగా చేయాలని అనుకొని చేస్తున్నామని చెప్పి ,మమ్మల్ని అవాక్కయేట్లు చేశారు .వారిని  సన్మానించాలని  మేము వెడితే ,నాకు సన్మానం అనటం వింతగా అనిపించి వారి సహృదయతకు ధన్యవాదాలు చెప్పాను .మేము రావటం వారెంతో ఆన౦దంగా భావించారు  .ముందే ప్రభుత్వం పర్మిషన్(50కి మించకుండా ) కూడాతీసుకొని నిర్వహిస్తున్న కార్యక్రమ౦ . సాంఘిక దూరం పాటిస్తూ కుర్చీలు, సానటైజేషన్,మాస్కులు తో పకడ్బందీ గా ఏర్పాటు  చేసి అందరీ  అభినందనలు పొందారు నిర్వాహకులు .వీరికి స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతిమంత్రిప్రగడ మాధవి ,లయన్స్ క్లబ్ చైర్మన్ శ్రీ బండి వెంకటేశ్వరరావు ,స్థానిక సిటీ  కేబుల్ నిర్వాహకులు  మా రమణకు ఫేస్ బుక్ దోస్త్  శ్రీ భాను ,తారకాపురి పత్రిక సంపాదకురాలు, విదుషీమణి అనేక అవార్డ్ ల విన్నర్ ,సంగీత సరస్వతి శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి మొదలైనవారు చక్కగా సహకరించారు .మా అందరికి వేడి వేడి ఇడ్లి గారే టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాక కార్యక్రమం ప్రారంభమైంది .

  ఉదయం 11-30కు ప్రార్ధనతో కార్యక్రమం మొదలైంది .చర్ల సిస్టర్స్ ను ,మా దంపతులను ,మాకోడలు రాణి ని కూడా వేదిక పై ఆహ్వాని౦చారు .అప్పుడు నేను గోదావరిజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ శిస్టు రాజేష్ ,తణుకు నుంచి వచ్చిన శ్రీ మతి ప్రభాకరి గార్లకు స్వయం సిద్ధ పురస్కారాలు ఇవ్వటానికి ముందే ఆహ్వానించి చెప్పానని చెప్పి, వారిద్దరినీ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానింప జేశాను .సభకు అధ్యక్షత వహించిన  శ్రీమతి విదుల సభ ఉద్దేశ్యం చెప్పి నాకు ఇక్కడ సన్మానం చేసి ఫంక్షన్ హాల్ ను ప్రారంభం చేయటం తమకందరకు మహదానందంగా ఉందని చెప్పారు .తర్వాతనన్ను మాట్లాడమన్నారు.నేను మాట్లాడుతూ నాకు ఇక్కడ సన్మానం జరుగుతుందని అసలు తెలియదనీ ,కాని ఇంతటి అభిమానం చూపిస్తున్నందుకు తప్పక ఒప్పుకు౦టున్నానని ,సరస్వతీ మూర్తులు,విదుషీమణులు,సేవాపరాయణులు చర్ల సిస్టర్స్ -వారి తండ్రిగారు మహాపండితులు ,భారత రామాయణ వేదోపనిషత్తుల లోతులు తరచి బహు గ్రంథాలురచించిన కళాప్రపూర్ణ ,ఆర్ష విద్యా పరిషత్ స్థాపకులు  బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి  సాహిత్య సేవను  ,తమతల్లిగారు శ్రీమతి చర్ల సుశీల గారికి నిరుపేదల ఉన్నతి పై,  వారి ఆహార వసతులకల్పనపై  ఉన్న,అపారమైన దీక్షనూ,ఆమె పేరిట ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందునవారిని  ఉయ్యూరుకు ఆహ్వానించి సత్కారం చేయాలనుకొన్నామని ,అదికుదరక మేమే వచ్చి ఇక్కడ అభిమానుల సమక్షం లో చేస్తున్నామనీ,అలాగే సంగీత సాహితీ సరస్వతి శ్రీమతి వాణిగారికీ ,గోరసం అధ్యక్షుడు యువ చైతన్యం  రాజేష్ కు ఈ వేదికపై సన్మానించటం సంతోషంగా నదని చెప్పి  ముందుగా మాసన్మానం స్వీకరించి ఆతర్వాత  వారు సన్మానం నాకు చేస్తే సముచితంగా ఉంటుందని నచ్చచెప్పి అలాగే చేశాం .చర్ల సిస్టర్స్ కు ఇద్దరికీ వేర్వేరుగా చీరా,జాకెట్లు  ,జాయంట్ గా శాలువా, జ్ఞాపిక, సరసభారతి ఉగాది ఆవిష్కరణ 3పుస్తకాల తోపాటు మిగిలిన 12పుస్తకాలు ,ఫలాలతో అందించాం .వారిఅకు౦ఠిత సేవకు సరసభారతి 15 వేలరూపాయలు అందజేస్తోందనీ ,మేము ఇస్తున్నామని తెలిసి హైదరాబాద్ లో ఉన్న మా రెండవ బావగారు శ్రీ వేలూరి వివేకానందగారు ,మా అక్కయ్య కీ.శే .శ్రీమతి వేలూరి దుర్గ గారి స్మారకార్ధం 5 వేలరూపాయలు అందించమని చెప్పి దాన్ని మాఅక్కగారి తిథి ‘’చైత్ర బహుళ ద్వాదశి’’ నాడు ఆమెపేర అన్నదానం చేయమని ,ఒకకవర్ లోపెట్టిన ఆడబ్బు ,బావ గారి అడ్రస్ ,ఫోన్ నంబర్  ఉన్నకవర్ ను ,ఆతర్వాత ఈ విషయం తెలిసి మా అబావగారి అన్నగారి అబ్బాయి అమెరికా లో ఉంటున్న శ్రీ వేలూరి పవన్ తమ తండ్రిగారు కీ.శే. వేలూరి ముకు౦ద౦ గారి ‘’తిధి జులై2 ‘’న ఆయనపపేరిట అన్నదానం  నిర్వహించమని నాకు పంపిన 10వేలరూపాయలున్నకవర్ అతని అడ్రస్ ఈమెయిల్ వాట్సాప్ నంబర్ తో సహా రాసి మొత్తం 30వేలరూపాయలు వృద్ధాశ్రమ నిర్వహణకు విరాళంగా చర్ల సిస్టర్స్ కు’’ సరస భారతి’’ ద్వారా  అందజేయగా హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి .ఇలా ఇస్తున్నట్లు వేదికపై చెప్పటమే కానీ అంతు ముందు ఎప్పుడూ నేను వారికి తెలియజేయకుండా రహస్యంగా నే ఉంచాను .తర్వాత ప్రభాకరిగారికి చీర జాకెట్ ,పళ్ళు ,జ్ఞాపిక సరసభారతి పుస్తకాల సెట్ ,2వేల రూపాయల నగదు పురస్కారం తో శాలువా కప్పి సత్కరించాం .రాజేష్ కు కూడా మొత్తం పుస్తకాలు జ్ఞాపిక,పాంట్, షర్ట్,పళ్ళు 2వేలరూపాయల నగదు తో శాలువా కప్పి అందించాము .తర్వాత చర్ల సిస్టర్స్ మాదంపతులకు శాలువావగైరాలతో ,మాకోడలికి కూడా అలాగే సన్మానం చేశారు .అందరం ఉచిత రీతిగాసమాధానం చెప్పాం .లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మాధవి ,చైర్మన్ వెంకటేశ్వరరావు ,సిటీ కేబుల్ నిర్వాహకులు భానుగార్లకు కూడా పుస్తకాలు శాలువా జ్ఞాపికలతో సత్కరించాము .విశాఖ నుంచి ఈకార్యక్రమ చూడటానికి వచ్చిన ఆక్కడి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికీ ,ఇక్కడే పరిచయమైనా మా ఇంటి పేరువారైన శ్రీ గబ్బిట గోపాలకృష్ణమూర్తిగారికి  పై విధంగానే సరసభారతి సత్కారం చేశాం .

  తర్వాత అందరికి కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు .భోజనాలయ్యాక  మమ్మల్ని నిడదవోలు ఆశ్రమానికి తీసుకు వెళ్లి చర్ల సిస్టర్స్ అక్కడి ఆశ్రమ వాసుల సమక్షం లో నాపుట్టిన రోజు వేడుక జరిపి ‘’హాపీ బర్త్  డే పాటను ఒక అందురాలితోశ్రావ్యంగా పాడింఛి శాలువాకప్పి అభిమానం చాటారు .ఒకేరోజు రెండు చోట్ల రెండు సన్మానాలు అందుకొన్న అదృష్టవంతుడనయ్యాను  .వీరందరి ఆత్మీయత అనురాగాలు మరచిపోలేనివి .మృదుల గారు ఒక విషయం చెప్పారక్కడ .ఈ ఆశ్రమానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం ను యామానితో తమ ఆశ్రమానికి అమ్మమని కోరితే స్పందనలేకపోవటమే కాకు చాలా హెచ్చు రేటు చెబుతున్నారనీ ,కానీ ఇవాళ నేను వచ్చిన వేళా విశేషమేమిటోకానీ  ఆ యజమాని తానే ఫోన్ చేసి అమ్మటానికి రెడీ అన్నారని సంతోషంగా చెప్పారు. శ్రీబండీ వారిని దీనికి డబ్బు ఎలా సమకూరుస్తారు అని అడిగా .ఇంతగొప్ప సేవ చేస్తున్న చర్ల సిస్టర్స్ అంటే అందరికీ  గొప్ప అభిమానం అనీ ,ఎవరో దాతలు వారంతకువారే ముందుకొచ్చి కొని, అందజేస్తారనీ అన్నారు .అలా త్వరలో జరిగి ఆస్థలం ఆశ్రమానికి  దక్కేట్లు చేయమని మనసారా భగవంతుని కోరుతున్నాను.

 అక్కడ నుంచి మమ్మల్ని 20కిలో మీటర్ల దూరం లో ఉన్నమల్లవరం  వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్లి చూపించారు .ఇక్కడికి మహాత్మాగాంధీ 1927న వచ్చారట .అప్పుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు గాంధీకి స్వాగతం చెప్పారట .అందుకే అక్కడ గాంధీగారి విగ్రహం పెట్టారు .నాకు ‘’శ్రీ సీతా రామ  లక్ష్మణ ఆంజనేయసమేత’’ చిన్న విగ్రహాన్ని ఈ ఆశ్రమం లో బహూకరించి అభిమానం చాటారు .  .పచ్చని పంటపొలాలమధ్య ఉన్న ఈఆశ్రమం కనులకు విందు చేస్తుంది .ఇక్కడ ఆశ్రమానికి పొలం కూడా ఉందని వ్యవసాయం చేయించి ఆపంటాను కాయగూరలను పళ్లనూ  ఆశ్రమాలకు వాడుతామని  మృదులగారు చెప్పగా మరింత ఆశ్చర్యమేసింది .అక్కడి ప్రకృతిని చూసి పులకిస్తాం .వృద్ధులకు సగం ఆరోగ్యం ఈ వాతావరణ౦ తోనే బాగు పడుతుంది  అనిపించింది . మృదులగారు ఇక్కడ, విదులగారు నిదదవోలుఆశ్రమ లో ఉంటూ నిర్వహిస్తున్నారు .మీటింగులు ఉంటె కలుస్తూ ఉంటారు .అందరికీ వీడ్కోలు చెప్పి మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి సాయంత్రం 5-15కు ఉయ్యూరు చేరి ,మృదుల,వాణీ గార్లకు ,రాజేష్ కు ఫోన్ చేసి చేరినట్లు చెప్పాను .మృదులగారిని ఆశ్రమ విషయాలు అడిగి తెలుసుకొని నోట్ చేసుకొన్నా .ఆ వివరాలన్నీ ఇప్పుడు సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను .

 శ్రీమతి చర్ల సుశీల వృద్ధాశ్రమం –నిడదవోలు

స్వాతంత్రోద్యమకాలం లో గాంధీ బోధనలకు ఆశయాలకు ప్రభావితులైన శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు 1953లో కస్తూరీబాయి మహిళా సమాజం స్థాపించారు  .శాస్త్రిగారికి భార్య శ్రీమతి సుశీల సేవలు తోడ్పాటు బాగా ఉండేది .కార్యక్రమాలలోనూ , స్త్రీ జనోద్దరణ,,స్వయం ఉపాధికల్పన ,నిరాశ్రయులను ఆదుకోవటం లోనూ  చురుకుగా పాల్గొనేవారు .ఆమె రైల్వే స్టేషన్ కు మిగిలిన చోట్లకు వెళ్లి తిండిలేని నిరుపేదలను ఇంటికి ఆహ్వానించి వారికి కదపు నిండా తిండి పెట్టి పంపేది .ఇది గ్రహించిన  భర్త శాస్త్రిగారు ఆమె సేవకు అందుబాటులో ఉండేట్లు కసూరిబాయి ఆశ్రమాన్ని స్థాపించారు .స్త్రీలకూ కుట్టు పనులలో  ,హిందీ,టైలరింగ్ లో  శిక్షణ ఇస్తూ మహిళలను చైతన్యవంతుల్ని చేశారు కుమార్తెలు చర్ల సిస్టర్స్ .

  చర్ల విదుల ,మృదుల సిస్టర్స్ హిందీ లెక్చరర్స్ గా పని చేసి రిటైరయ్యారు .తండ్రిగారు హిందీలో మహా నిష్ణాతులైన పండితులు .కస్తూరిబాయి మహిళా సమాజం ప్రాంతం లో 2000లో శ్రీమతి చర్ల సుశీల వృద్ధాశ్రమం స్థాపించి సిస్టర్స్ నిరాటంకంగా దాతల, వదాన్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు 20ఏళ్ళనుంచి .ప్రస్తుతం 250మందికి పైగా ఆశ్రయం కలిపించి ,దగ్గరలో ఉన్న చాగల్లు ,మల్లవరం ,కొవ్వూరు ,తూగోజి బొబ్బర్లంక ప్రాంతాలలో శాఖలు ఏర్పరచి అన్నిటినీ అత్యంత సమర్ధంగా  నిర్వహిస్తూ  సమాజంలో నిస్వార్ధ సేవకు మంచి పేరు పొందారు.స్థానిక ప్రజలు ,సేవా దృక్పధమున్నవారు శక్తికొలది వీరికి సాయమందిస్తున్నారు .ప్రచార మాధ్యమాలు నిడదవోలు సిటీ కేబుల్ మొదలైన దాతలే కాకుండా,అమెరికాలో ఉంటున్న’’ స్వామిని లలితానంద మాతాజీ ‘’,నేతృత్వంలోని ‘’ఆత్మ విద్యాశ్రమం ,‘ తత్వవిధానంద ‘’ స్వామీజీ మొదలైన మానవీయ మూర్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భూరి విరాళాలను అందజేయటమేకాక అందింప జేస్తున్నారు ,బిల్డింగులు నిర్మించి సాయం చేస్తున్నారు ,నిర్వహణలో ముఖ్యపాత్ర వహిస్తున్నారు  .స్వామీజే ఒక రొం ను తమపూర్వాశ్రమ కుమార్తెకోసం కట్టించారిక్కడ. పరిసర గ్రామ ,మండలాల ప్రజలూ తమవంతు సహాయం చేస్తున్నారు .పుట్టిన రోజులు  ,పెళ్లిరోజులు ,పెద్దల జ్ఞాపకాలను (తిధులు)కూడా ఈ సంస్థద్వారా నిర్వహింప జేసుకొంటున్నారు   .సేవకే అంకితమైన ఈ  సంస్థ అనేక జాతీయ అవార్డులు , సాంస్కృతిక  సంస్థల అవార్డులు అందుకొన్నది .ప్రముఖులు స్వచ్చందంగా వచ్చి సన్మానిస్తున్నారు .

ఆశ్రమ వాసులకే  కాకుండా రోడ్ల ప్రక్కన ,బస్టాండ్ ,రైల్వే స్టేషన్ లోనూ ఉండే వృద్ధులు  ,వికలాంగులకు ఉదయ౦ అల్పాహారం ,రెండు పూటలా భోజనం మొబైల్ వాన్స్ ద్వారా అందించట౦ అత్యంత శ్లాఘనీయం . సేవకు పరాకాష్ట.’’పరమాత్మ కలడందురు దీనులయెడ’’అంటారు . దరిద్ర నారాయణసేవ సేవకంటే ఉత్తమమైనదిలేదు .చర్ల సిస్టర్స్ లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా పని చేయటం వలన, లయన్స్ మిత్రులువారి గౌరవార్ధం  ‘’లయన్ డాక్టర్ చర్ల విదుల ,లయన్ డాక్టర్ చర్ల మృదుల లయన్స్  వృద్ధాశ్రమం ‘’ఏర్పాటు చేయటంతో ఈ సంస్థద్వారాకూడా వృద్ధ జనుల సేవ విస్తరణ జరుగుతో౦ది .

  చర్ల వారి వృద్ధాశ్రమం లోగో ‘’ఆర్జించిన ధనానికి దానమే కవచం ‘’చాలా ఆకర్షణీయంగా ప్రేరణాత్మకంగా,స్పూర్తి దాయకంగా ఉంది .వదాన్యులు దీన్ని సద్విని యోగం చేసుకోవాలని మనవి .

   ఈశ్రమాన్ని చూశాక 2012లో మేము అమెరికా నార్త్ కారోలీనా లోని మా అమ్మాయి వాళ్ళు ఉంటున్న షార్లెట్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ‘’CARRINGTON CARES’’  అనే వృద్ధాశ్రమాన్ని చూసి  అక్కడి నిర్వాహకుల  సేవాతత్పరతకు చలించి ‘’ఆశోపహతుల పాలిటి హరి విల్లు -’CARRINGTON CARES’’  అనే వ్యాసాన్ని నా అమెరికా డైరీ లో రాసిన విషయం గుర్తుకు వచ్చింది .దీన్నే ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’అనే నేను రాసిన పుస్తకం లో కూడా చేర్చాను .ఈ సంస్థకూడా దానికి దీటైనదే .

  1953లో బాలిక విద్య ఉపాధి కోసమే ఏర్పాటైన  నిడద వోలు సంస్థ క్రమ వికాసం పొంది నేడు వృద్ధులందరికీ ఆశ్రయమయింది .ఇక్కడ ఏ భేదభావమూలేదు..అందరికీ సమ న్యాయం జరుగుతుంది .70,80ఏళ్ళు దాటినా వృద్ధులను ఏ ఆశ్రమం తీసుకోవటం లేదు కాని ఇక్కడ చర్ల సిస్టర్స్  వారినికూడా ఆహ్వానించి డాక్టర్ నర్సు ఏర్పాటు చేసి ఆరోగ్య విషయాలు చూస్తూ అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నారని శ్రీ బండి వారు నాతో చెప్పారు  . ఎంతటి ఉత్కృష్ట సేవ చేస్తున్నారో అని అభినందించాను .1976లో మల్లవరం ఆశ్రమం ప్రారంభమైంది .డబున్నవారు తమ పేరిట ఒక రూము కట్టించుకొని  ఉంటున్నారు .భరి౦చగలవారు  రూమును బట్టి  నెల అద్దె చెల్లించి మిగతా సదుపాయాలన్నీపొందవచ్చు .1996లో చాగల్లు ,2010లో బొబ్బర్లంక ,2016లో రామచంద్రాపురం వృద్ధాశ్రమాలు ప్రాంభమై నడుస్తున్నాయి .వీటన్నిటి నిర్వహణకు నెలకు సుమారు 2లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని మృదులగారు చెప్పారు .ఇన్ని సంస్థలను 81ఏళ్ళ విదులగారు,ఆమెకంటే కొంచెం చిన్నవారైన మృదుల గారు అనుక్షణ పర్యవేక్షణతో నిర్వహిస్తున్నారు అంటే వారిలో ‘’ఏదో దైవీ శక్తి ‘’ఉన్నదనిపిస్తుంది.విదుల గారికి భగవద్గీత  దానికి, వారినాన్నగారి వ్యాఖ్యానం స్పూర్తి .నిరంతరం ఆ శ్లోకాలు భావాలూఆమె  మాటలలో దొర్లుతుంటాయి .సిస్టర్స్ వేరేకాని ఇద్దరి ఆత్మ ఒక్కటే .ఒకే నాణానికి బొమ్మా బొరుసు వారిద్దరూ .ఇంతటి విశిష్ట సేవానిరతులను ఇవాళ మేము చూసినందుకు మా జీవితాలు ధన్యత చెందాయని భావిస్తున్నాను .చర్ల సోదరీమణులు ‘’మహిళా జాతి మాణిక్యాలు ‘’   .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-20-ఉయ్యూరు

ఇవాళ ఉదయం 7.30.కి నిడదవోలు

 

 

 

← Back

Thank you for your response. ✨

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఇవాళ ఉదయం 7.30.కి నిడదవోలు

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

112-బర్కినాఫాసో దేశ సాహిత్యం

పీపుల్స్ రిపబ్లి క్ఆఫ్ బర్కినాఫాసో దేశం పశ్చిమాఫ్రికాలో ఉంది .రాజధాని క్వాగడౌ కౌవు .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా సుమారు 2కోట్లు .సున్ని ముస్లిం దేశం .అధికారభాష ఫ్రెంచ్ .వ్యవసాయమే వనరులు .మధ్యతరగతి ఆదాయమున్న దేశం .సురక్షిత దేశం .10ముఖ్య యాత్రాస్థలాలున్నాయి .

బర్కీనా ఫాసో సాహిత్యం –ఈ దేశ సాహిత్యాన్ని బర్కినాబ్ సాహిత్యం అంటారు కాలనీ పాలన రాకముందు సాహిత్యం లేదు .మౌఖికంగానే తరతరాలుగా కధలు గాధలు గీతాలు ప్రచారమయ్యాయి .సంస్కృతి సంగీతం ద్వారానే వ్యాప్తి చెందింది .ఈ విషయాన్ని 1992లో తిటింగా ఫ్రెడరిక్ పెసేర్ర్ ‘’లీ లాంగేజ్ డెస్ టాం టామ్స్ ఎట్ డెస్ మాస్కి ఆఫ్రికి ‘’పుస్తకం లో వివరించాడు .ఇక్కడ గ్రయట్స్ ఆదిమజాతి .1934లో డండలోబ్సం క్వెడ్రోగా’’మాక్షిమ్స దాట్స్ ,అండ్ రిడిల్స్ ఆఫ్ ది మొస్సి ‘’పుస్తకం రాశాడు .అందులో మొస్సిసామ్రాజ్యం తర్వాత బర్కినాఫాసోఏర్పడింది అని చెప్పాడు .

  దేశం స్వతంత్రం పొందాక బర్కినేబ్ రచయిత నాజి బోని ‘’దిడౌన్ ఆఫ్ ఎన్శేంట్ టైమ్స్ ఆర్ ‘’దిట్విలైట్ ఆఫ్ ది బైగాన్ డేస్’’రాసి 1962లో ముద్రించాడు  .బోనీ స్వతంత్ర సమరంలో నాయకుడు .ది ట్రడిషన్స్ ఆఫ్ బ్వోము పీపుల్ నవల రాశాడు .ఇది ఎథ్నోగ్రాఫిక్ నవల .రోజర్ నికిమా’’మైజర్ మోగా ఏ కామెడి ఆఫ్ మానర్స్ ‘’నవల రాశాడు .పియర్రి డేబిరి  -సంసోవా ,అండ్ మౌసా సమడోగా –డాటర్ ఆఫ్ దివోల్టా ,దిఆరకిల్ నవలలు రాశారు

1970లో తరువాతతరం నవలాకారులు  ఆగస్టేన్ ,కోలిన్ నోఎట్లేన్నీ స్వాదోగా .ఇటీవలి వారిలో జాక్వెస్ ప్రాస్పర్ ,జీన్ బాప్టిస్ట్ సోమేనార్బెర్ట్ జొన్గో వగైరాలు .స్త్రీ రచయితలలో ,పియరేట్టీ సాండ్రాకాంజీ ,బెర్మాడేట్టీ డోవా,గేల్ కోన్,సారాబయూలిన్ ,అందరిలో ప్రముఖరచయిత ఫ్రెడరిక్ పాసేర్రి టిటింగా  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61

సీతాన్వేషణ వృత్తాంతాన్ని సవిస్తరంగా హనుమ తెలియజేశాక,మళ్ళీ హనుమ ‘’శ్రీరామ కార్యం సఫలమైంది .సుగ్రీవుని ఉత్సాహం ఫలించింది .సీతాదేవి పాతివ్రత్యాన్ని చూసి నా మనసు పరవశించింది .రావణుడు మహాతపస్సంపంనుడు ,తపస్సుచేత పెరిగిన అతడి కోపానికి లోకాలే దహించుకు పోతాయి .అందుకే సీతా దేవిని తాకినా అతడి శరీరం దగ్ధం కాలేదు . సీతాదేవి  కోపిస్తే ఎలా తగలబెట్టగలదో అగ్నికూడా అంతగా  కాల్చలేడు.

‘’సఫలో రాఘవోద్యోగ స్సుగ్రీవస్య చ సంభ్రమః –శీల మాసాద్య సీతాయా మమ చ ప్రణవం ‘’మనః

‘’తపసా దారయే ల్లోకాన్  క్రుద్ధోవా  నిర్ద హేదపి-సర్వధాతి ప్రవృద్ధో సౌ రావణోరాక్షసాధిపః

తస్య తాంస్పృశతో గాత్రం తపసా న వినాశితం ‘’

‘’న తగగ్ని శిఖా కుర్యాత్ స౦స్పృ ష్టాపాణినా సతీ –జనక స్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీ కృతా ‘’

‘’పెద్దలు జామ్బవంతాదుల అనుమతితో జరిగిన కార్యం అంతా నివేది౦చాను మ్చాను .భ్రుత్య విజయం స్వామి విజయమేకనుక ,ఇప్పుడు లంకకు వెళ్లి సీతాదేవిని తెచ్చి ,ఆమెతో కూడా రామ లక్ష్మణులను చూడటం యుక్తం గా ఉంటుంది అని పిస్తోంది .నేను ఒక్కడినే రావణుడితో సహా సకల రాక్షస సంహారం చేయగలను .మీరు కూడా కలిసి వస్తే జయించటం తేలికే .యుద్ధంలో రావణ ,పుత్ర అనుచర సోదర సైన్యాలను చంపుతాను .ఇంద్రజిత్ ప్రయోగించే బ్రహ్మ ,యింద్ర ,రౌద్ర ,వాయవ్య ,వారుణాది అస్త్రాలను నిష్ఫలం చేసి సర్వ రాక్షస సంహారం చేస్తాను .మీరు అనుమతిస్తే రావణుని బంధిస్తాను ‘’

‘’అహం తు రావణం యుద్ధే ససైన్యం న పురస్సరం –సహపుత్రం వదిష్యామి సహోదరయుతమ్ యుధి’’

‘’బ్రహ్మ మైన్ద్రం ,చ రౌద్రం చ వాయవ్యం వారుణం తథా –యది శక్ర జితో స్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే ‘’

‘’యుద్ధంలో నేను కురిపించే రాళ్ళవాన తో దేవతలే నశిస్తారు .ఇక రాక్షసులసంగతి చెప్పాలా ?సముద్రం చెలియలి కట్ట దాటవచ్చు. మంధర పర్వతం కదలచ్చు. కాని శత్రు సైన్యం జాంబవంతుని  ఏమీ చేయలేదు ‘’-

‘’సాగరో ప్యతియా ద్వేలాం మందరః ప్రచలేదపి- న జామ్బవంతం సమరే కంపయే దరివహినీ’’-

‘’ మనమంతా ఎందుకు ?వాలిసుత అంగదుడు ఒక్కడు చాలు. సకల అగ్ర రాక్షస సంహారం చేయటానికి –

‘’సర్వ రాక్షస సంఘానాం రాక్షసా ఏ చ పూర్వతాః-అల మేకో వినాశాయ  వీరో వాలిసుతః కపిః-‘’’’మహాత్ముడు పనసుడు ,నీలుడు ,తొడల వేగంతో మందర పర్వతాన్నే బ్రద్దలు చేయగలరు .రాక్షసులు ఒక లెక్కా ?

‘’పనస స్యోరు వేగేన నీలస్య చ మహాత్మనః –మందరో ప్యవ శీర్యత కిం పునర్యుధి రాక్షసాః’’

‘’మైంద ,ద్వివిదు లతో ఎదుర్కొనే సామర్ధ్యం దేవ ,అసుర ,యక్ష ,గ౦ధర్వ ,ఉరగులకుకూడా లేదు .వారిద్దరూ ఆశ్వినీదేవతలకుమారులు .బ్రహ్మవరం పొంది అమృతం త్రాగి అమరులై ,సకల వానరులలో శ్రేస్టులని పించుకొన్నారు  .

‘’అశ్వి పుత్రౌ మహా భాగా వేతా ప్లవగ సత్తమౌ –ఏతయోఃప్రతి యోద్ధారం న పశ్యామి రణా జిరే ‘’అమృత ప్రాశినా వేతౌ  ఏను లంకను సర్వ వానర సత్తమౌ ‘’

‘’నేను లంకనుపాడు చేశాను .అన్ని రాజమర్గాల్లో నా పేరు మారు మ్రోగేట్లు చాటాను .’రామసుగ్రీవులకు జయం అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాను . లంకలో శింశుపా వృక్షం కింద ,రాక్షస స్త్రీల మధ్య సీత దుఖంతో దీనంగా విలపిస్తోంది. నిరంతర రామ ధ్యానం తో గడుపు తోంది .రావణుడు తనకు వశం కమ్మని కోరుతూ బెదిరిస్తున్నాడు .ఆమె రాముడినే నమ్ముకొని వాడివైపు కన్నెత్తికూడా చూడటం లేదు .భర్తపై ఆమె అనురాగం అచంచలం .పాపి రావణుడిని ఐనా చంపకుండా వదిలింది అంటే వాడు మహానుభావుడే .వాడిని వాదించటం నిమిత్తమాత్రమే సీతాపహరణమే వాడి వినాశానికి మూలం –

‘’నియతస్సముదాచారో భక్తిర్భర్తరి చోత్తమా –యన్నహంతి దశగ్రీవం సమహాత్మా కృతాగసం’’

నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి

‘’అనధ్యయనం నాడువిద్య ఎలా క్షీణిస్తుందో అలా సీతాదేవి క్షీణించి ఉన్నది .కనుక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమేమిటో దాన్ని ఆచరించండి ‘’అని హనుమ తనసహచర వానర వీరులతో చెప్పాడు .

‘’సా ప్రకృత్యైవ తన్వంగీ తన్వంగీ తద్వియోగాచ్చకర్శితా-ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా ‘’

‘’ఏవమాస్తే  మహాభాగా సీతా శోక పరాయణా-యదత్ర ప్రతి కర్తవ్యమ్ తత్సర్య ముపపద్యతాం’’

ఇది 35శ్లోకాల 59వ సర్గ .

ఇందులో హనుమ ఒక్కో వానర వీరుని బలపరాక్రమాలను విశ్లేషించి చక్కగా చెప్పాడు.ఇవి  అతిశయోక్తులు కావు యదార్ధాలే.ఇలా చెప్పటం లో ఉద్దేశ్యం ఏమిటి అంటే వాళ్ళల్లో ఒక సారి పౌరుషాగ్ని రగుల్కొల్పటమే. రాబోయే రామ రావణ సంగ్రామానికి వాళ్ళను సమాయత్తం చేయటమే .అనధ్యయనం నాడు విద్య క్షీణించినట్లే సీత క్షీణించింది అనటం గొప్పమాట .సీత ను ఎత్తుకురావటం  తోనే సగం చచ్చాడు .ఇకరాముని పని నిమిత్తమాత్రమేఅనటమూ బాగుంది .తన బలపరాక్రమ శౌర్యాలనూ దీటుగానే చెప్పుకొన్నాడు హనుమ .సీత కోపాగ్ని ప్రభావంకూడా చాలా గొప్పగా చెప్పాడు .ఇదంతా యుద్ధ వ్యూహం లో భాగమే అనిపిస్తుంది .మైంద ద్వివిదులు అమృతం త్రాగినట్లు ఇప్పుడే మనకు హనుమద్వారా తెలిసింది .జాంబవంతుని పరాక్రమమూ శ్లాఘించి ఉత్సాహ పరచాడు .ఈసర్గలో హనుమ పలికిన ప్రతిమాటా తగిన ఆలోచనతో చెప్పిందే భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొని చెప్పినదే .ఈ సర్గకూడా చాలా ఉపయోగ మైనదే ,ముఖ్యమైనదే .  

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవాళ నా పుట్టినరోజు

ఇవాళ నా పుట్టిన రోజు e

ఇవాళ జూన్ 27వ తేదీ శనివారం నా పుట్టిన రోజు 80నిండి 81వయసులోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-2020-ఉయ్యూరు


Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

సౌదీ అరేబియా మిత్రుని ఫోన్

ఇవాళ ఉదయమ శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి భార్య శ్రీమతి శ్రీదేవి గారు ఫోన్ చేసి ఊసుల్లో ఉయ్యూరు చాలా ప్రేరణగా ఉందనీ ,నే ను రమణగారిపై ఎప్పుడో రాసిన ”రమారమణుడు”వ్యాసం చాలాబాగా నచ్చి  రాజమండ్రిలో ఉన్న ఒకాయన  అక్కడ పత్రిక నడిపే  శ్రీవారనాసి సుబ్రహ్మణ్యం గారికి పంపితే ఆయన వెంటనే ముద్రించారనీ రమణగారిని ఇంతగొప్పగా ఆవిష్కరించిన వ్యాసం నాదేనని అన్నారని తీపి వార్త చెప్పారు 

  ఈ రోజు రాత్రి సౌదీ అరేబియానుంచి కామేశ్వరరావు అనే ఆయన ఫోన్ చేసి ,తాను పదేళ్లకు పైగా అక్కడ ఉంటున్నానీ ,రెగ్యులర్ గా సరసభారతి బ్లాగ్ చదువుతానని,ఎన్నెన్నో విషయాలు రోజూ తెలుసుకోగలుగుతున్నానని ఆనందంగా సంతృప్తి గా చెప్పారు .ఇంతకంటే సంతృప్తి ఇంకా ఏమి ఉందనిపించింది .

 మూడో సంతోషవార్త -సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ బ్లాగ్ ల వీక్షకుల సంఖ్య 9లక్షలు దాటారని తెలియజేయటానికి మరింత సంతోషంగా ఉంది. ఈవిజయానికి కారకులైన సాహితీ బంధువులు, సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు –దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -60

‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -60

‘’మనసులో మరో సారి నిశ్చయానికి వచ్చి సీతాదేవి నాతో ‘’నా వృత్తాంతం అంతాచెప్పి విన్నంతనే రామలక్ష్మణ సుగ్రీవులు కలిసి ఇక్కడికి వెంటనే వచ్చేట్లు చెయ్యి .రెండు నెలలుదాటితే, నేను బ్రతకను ఆతర్వాత ఆయన వచ్చినా వ్యర్ధమే –

‘’యద్యన్యథాదేత ద్ద్వౌమాసౌ జీవితం మమ-న మాం ద్రక్ష్యతి కాకుస్థో మ్రియేసాహ మనాథవత్’’

‘’సీతాదేవి దీనాలాపాలతో నాకు రాక్షసరాజు పై విపరీతమైన కోపం వచ్చి మిగిలిన పని పూర్తి చేయాలనుకొన్నాను .నా శరీరాన్ని పర్వతంలాగా పెంచి యుద్ధం చేయాలనుకొని అశోకవన ధ్వంసం చేశాను .రాక్షస స్త్రీలు మేల్కొని అక్కడి మృగ పక్షులు పారి పోవటం చూసి ,అక్కడ నన్ను చూసి వెంటనే రావణుడి దగ్గరకు వెళ్లి ‘’రాజా !ఇతరులు ప్రవేశించజాలని నీవనాన్ని ,నీ బలపరాక్రమాలు తెలీక ఒక దుర్మార్గ వానరుడు పాడు చేశాడు .వాడి దుర్భిద్ధికి తగినట్లుగా వెంటనే మరణ శిక్ష విధించు ‘’అన్నారు.’’ఏ శిక్ష వెయ్యాలో వాళ్ళే రాజుకు సూచించారు .42వ సర్గలో మాత్రం తీవ్ర శిక్ష వెయ్యమని చెప్పబడింది .హనుమ కొంత మార్చి చెప్పాడు .-

‘’వధ మాజ్ఞాపయ  క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్ ‘’

‘’అప్పుడు తనమాట వినే జయి౦పనలవికాని కింకరులను నాపైకి  రాజు ఆజ్ఞాపించి పంపాడు .నాపై పడిన 80వేలమంది కింకరులను అక్కడే పరిఘ తో చంపిపారేశాను .చావగా మిగిలి తప్పించుకొన్నవారు రాజుకు వెళ్లి చెప్పగా నేను చైత్యప్రాసాదం ఎక్కి, దాని రక్షకులను చంపాను ‘.అప్పుడు చాలామంది రాక్షసులతో ప్రహస్తుని కొడుకు జంబుమాలిని నాపైకి పంపాడు. వాళ్ళందర్నీ పరిఘతోనే మట్టుపెట్టాను .మంత్రికుమారుల్ని పంపాడు రాజు. వాళ్ళనీ పరిఘతోనే యమపురికి పంపాను .తర్వాత అయిదుగురు సేనానాయకులను పంపగా అందర్నీ ససైన్యంగా చంపేశాను .మండోదరి కొడుకు అక్షకుమారుని గొప్ప సైన్యం తో పంపగా వాడితో ఆకాశాయుద్ధం చేసి రెండు పాదాలు గట్టిగా పట్టుకొని వందసార్లు ఆకాశం లో త్రిప్పి

నేలపై పడగొట్టి చంపాను .పంపినవారందర్నీ చంపేస్తున్న నాపై కోపం విపరీతమై తనకొడుకు ఇంద్రజిత్ ను పంపగా వాడి సైన్యాన్ని గుక్క తిప్పుకోకు౦డాకూల్చగా,వాడికీ మండి, బ్రహ్మాస్త్రం ప్రయోగింఛి నన్ను బంధించగా వాడిభటులు నన్ను త్రాళ్ళతో కట్టి రావణదర్బారుకు తీసుకు వెళ్ళారు .

‘’నన్ను లంకకు ఎందుకు ఏపనిమీద వచ్చానో ,సీతను ఎందుకు చూశానో చెప్పమని ప్రశ్నించారు .నేను ‘’సీతాదేవిని చూడటానికే వచ్చాను వాయుకుమారుడైన హనుమను రామదూతగా వచ్చాను సుగ్రీవుని మంత్రిగా వచ్చాను సుగ్రీవుడు నిన్ను క్షేమం అడిగాడు నీకు ఇహపర సాధకమైన హితోపదేశం నాతో పంపాడు .’’ఋష్యమూక పర్వతం పై రాముడు నాకు మిత్రుడయ్యాడు .నాభార్యను రావణుడు ఎత్తుకుపోయాడని కనుక ఆమెను వెతకటానికి సాయం చేయి అని కోరగా ,నేను మా అన్నవాలి  నాకు అపకారం చేశాడు , వాడిని వధించి నాకు న్యాయం చేయి ‘’అనికోరాడు అని సుగ్రీవ వాక్యంగా చెప్పాడు హనుమ .రాజా !వారిద్దరూ అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు .రాముడు ఒకేబాణ౦ తో వాలిని చంపి వానర రాజ్యం కిష్కింధకు సుగ్రీవుని రాజును చేశాడు  .కనుకమేము రామునికి అన్నివిధాలా సాయం చేయాలి .అందుకే ధర్మసంమిటంగా నన్ను నీదగ్గరకు దూతగా పంపాడు .వానరసైన్యం నీ రాక్షససైన్యాన్ని చంపకముందే నువ్వు సీతను రాముడికి సమర్పించు .దేవతలే వానరుల సహాయం కోరితే వెళ్లి విజయం చేకూర్చిన వానరుల ప్రభావం  అందరికీతెలుసు ‘’అని హితవు చెప్పాను ‘’ ఈమాటలు 51వ సర్గలో లేవు .అక్కడ వేలాది వానర వీరులు సర్వదిశలో  వాయువేగంతో సంచరించే బలపరాక్రమవంతులైన వారున్నారు అనిమాత్రమే చెప్పాడు .ఇక్కడ కొంచెం  పెంచి చెప్పాడు .

‘’వానరాణా౦ ప్రభావోహి న కేన విదితః పురా –దేవతానాం సకాశం చ యేగచ్ఛ౦ తి నిమంత్రితాః’’

‘’నా ప్రభావం తెలీక నన్ను చంపని రావణుడు ఆజ్ఞాపిస్తే ,బుద్ధిశాలి సోదరుడు విభీషణుడు దూతవధ రాజశాస్త్రానికి విరుద్ధమని ,దూత స్వామిహితం కోసమే నిజం చెబుతాడు కనుక చంపటం ధర్మకాదని ,ఆకపి అపకారమే చేసిఉంటే అంగవైకల్యం కలిగించవచ్చు అని చెప్పగా ,నా తోక కాల్చమని ఆజ్ఞాపించాడు రాజు .వెంటనే సేవకులు  జనపనార గుడ్డపీలికలతో నా తొకకుచుట్టి నన్ను కొడుతూ తోక కాల్చారు .నాలుగు వీధులూ తిప్పుతూ ‘’ఈకోతి చేసిన అపరాధానికి శిక్షగా బంధనం ,పుచ్చదహనం చేయబడుతో౦ దహో ‘’అని బిగ్గరగా అరుస్తూ త్రిప్పారు .ఈవిషయం 53వ సర్గలో లేదు .అక్కడ ‘’వీడుదొంగ వీడుదొంగ ‘’అని అరుస్తూ తిప్పారని ఉన్నది –

తతస్తే రాక్షసాస్సూరా బద్ధం మా మగని సంవృతం -‘అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగాతా’’

‘’నేను తెలివిగా నారూపం తగ్గించుకోగానే కట్లు తెగిపోగా,మళ్ళీ శరీరం పెంచి ఇనుప గుదియ తో ఆ రాక్షసులని చంపి ,నగరద్వారంపైకి యెగిరి నాతోక కున్న అగ్నితో లంకాదహనం చేశాను .సీత సంగతి మర్చిపోయాను .సిగ్గుపడి పశ్చాత్తాపం చెందగా చారణులు సీత క్షేమంగా ఉన్నది అని చెప్పిన  శుభవార్త విని సంతోషించాను .తోకకాలుతున్నా అగ్ని నన్ను దహించలేదు .మనసు ప్రశా౦త౦గా ఉంది  వాయువు చల్లగా వీచింది ,సీతాదేవిని మళ్ళీ దర్శించి స్వయంగా ఆమె కుశలం అర్ధం చేసుకొని ,తిరుగుప్రయాణానికి ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరి ,సముద్రం దాటి మళ్ళీ మీదగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడగలిగాను .శ్రీరామచంద్రుని ప్రభావం ,మీ తేజస్సు ,కారణంగా  మన రాజు సుగ్రీవుని కార్యాన్ని చక్కగా నిర్వహించగలిగాను .నేను ఇక్కడి నుంచి బయల్దేరిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేదాకా చేసిన పనులన్నీ సవివరంగా మీకు తెలియ జేశాను .ఇక ఇప్పుడు నేను ఏమి వదిలి వేశానో అది అంతా చెయ్యాలి ‘’అని హనుమ గుక్క తిప్పుకోకుండా చెప్పి కూర్చున్నాడు .

‘’రాఘవస్య ప్రభావేన భవతాంచైవ తేజసా –సుగ్రీవస్య చ కార్యార్ధం మయాసర్వ మనుస్టితం’’

‘’ఏతత్సర్వం మయాతత్ర యథావ దుపపాదిత౦ –  అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి’’

 ఇది 165శ్లోకాల 58 వసర్గ .

 విషయం అంతా తెలిసి౦దేకనుక పెద్దగా వివరణ అవసరం లేదు .తేడాలున్న చోటమాత్రమే మీ దృష్టికి తెచ్చాను .ఇందులో హనుమ వ్యక్తిత్వం ఎక్కడుంది ?అంటే తన దూతకార్యం అంతా తనగొప్ప కాదు .అది రాముని ప్రభావం, వానర ఋక్ష సేన తేజస్సు మాత్రమే అని అత్యంత వినయంగా చెప్పటం లో ఉన్నది. కాదా మరి? అవును మరి .అంతేగా మరి ?వారి ఆశీర్వాద ప్రోత్సాహ బలం తో అంతటిఘనకార్య నిర్వహణ చేయగలిగాను అని వినమ్రంగా విన్న వించిన హనుమ ఎంతో ఎత్తుకు ఎదిగి’’ఎంత ఎదిగి పోయావయ్యా ‘’అని మనతో అనిపించుకొన్నాడు  మనకు గొప్ప  ఆదర్శ ప్రాయుడౌతున్నాడు  .చెప్పాల్సింది పూస గ్రుచ్చినట్లుగా చెప్పానని ఏదీ దాయలేదనీ అన్నట్లు తెలియజేశాడు .ఇకతాను మిగిలినపని ఎలా చేయాలో సలహా ఇవ్వమని కోరి తన విజ్ఞత చాటుకున్నాడు హరి ప్రవీణ హనుమ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 109-అల్జీరియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

109-అల్జీరియా దేశ సాహిత్యం

ఉత్తర ఆఫ్రికాలో అల్జీరియా దేశం మధ్యధరా తీరరేఖ ,సహారఎడారి లోపల ఉన్నది .పురాతన రోమన్ సంస్కృతీ శిధిలాలు ,బైజా౦టిక్ సామ్రాజ్య శిధిలాలు ఉన్న దేశం .రాజధాని అల్జీర్స్ .కరెన్సీ అల్జీరియాన్ దీనార్ .జనాభా 4.25కోట్లు .అరబ్బీ భాష .సున్నీ ఇస్లాం మత౦  .పర్యాటకులకు సురక్షిత దేశం .క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవటంతో ఆర్ధికంగా కుంగి బీద దేశమైంది .దర్శించతగిన 15ముఖ్యవిషయాలున్నాయి .నిర్బంధ విద్య అమలులో ఉన్నందున అక్షరాస్యత పెరిగింది .

  అల్జీరియన్ సాహిత్యం –పై ఆరబ్ ,ఫ్రెంచ్ ప్రభావం ఎక్కువ .స్వతంత్రం కోసం చేసిన యుద్ధం తర్వాత అసలైన సాహిత్యం ప్రారంభమైంది .బెర్బెర్ భాష మాట్లాడే వారుకూడా ఫ్రెంచ్ లోనే రాసేవారు .చాలామంది సాంఘిక రాజకీయ సమస్యలపై స్పందించి రాశారు .ఫ్రెంచ్ అల్జీరియాకు చెందిన ఆల్బర్ట్ కామూ-దిస్ట్రేంజర్,దిప్లేగ్ అద్భుత నవలలు రాసి ఎందరినో ప్రభావితం చేసి నోబెల్ ప్రైజ్ పొందాడు  .ఇసబెల్లా ఎబెర్ హార్ట్ దేశమంతా పర్యటించి నవలలో చిత్రించింది .మహమ్మద్ డిబ్ నవలలు కవిత్వం రాశాడు .కబిలియాకు చెందినా మోలోడ్ ఫెరోన్1950తన అర్ధజీవిత చరిత్రగా ‘’సన్ఆఫ్ దిపూర్ ‘’నవలరాశాడు  ఇస్లామిజం పెరిగాక రిచార్డ్ మిమౌంటి దానిపై అసహాయత వ్యక్త౦ చేసి 1980-90కాలం లో రాసిన నవల ‘’ది కర్స్’’లో అల్జీరియాను అస్తిరైన తలక్రి౦దు గా ఉన్న హాస్పిటల్ ,అనీ మతవాదులు పాలనలోకి వస్తే పరిస్థితి మరింత క్షీణిస్తుందని అన్నాడు .రచయిత తహార్దిజౌట్ ను ఇస్లాం తీవ్రవాదులు 1993లోహత్య చేశారు.అతని నవల ‘’ది బోన్ కలెక్టర్స్ ‘’లో యుద్ధం తర్వాత నిత్యజీవిత విధానం గురించి రాశాడు .

ఉత్తమరచనలు –దిప్లేగ్ –ఆల్బర్ట్ కామూ ,నేద్జిమ-కటేబ్ యాసిన్ ,ల గ్రాండి మాసన్-మొహమ్మద్ డిబ్ ,లే ఫైల్స్ డుపావ్రే –మోలౌడ్ ఫెరోన్,ది రెచ్డ్ఆఫ్ ది ఎర్త్ –ఫ్రాన్త్జ్ ఫానన్ ,లా అమోర్ లా ఫాన్తాసియ –అసియా జేబార్ ,అల్ లాజ్ –తాహిర్ వాట్టర్,ఇన్ ది నేఁ ఆఫ్ గాడ్ –యాస్మినా ఖాద్రా –

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం రాసిన దేశాలు

ప్రపంచ దేశాల సారస్వతం

రాసిన దేశాలు

1-ఆస్ట్రియా2ఆస్ట్రేలియా 3-డెన్మార్క్ 4-ఫిన్లాండ్ 5-స్వీడన్6-ఐస్లాండ్ -7-నార్వే  8-స్కాండినేవియ 9-కొరియా 10-స్కాట్ లాండ్ 11-ఐర్లాండ్ 12-జపాన్ 13-ధాయ్ లాండ్ 14-టర్కీ 15-పర్షియ 16-బర్మా 17-మలయా 18-సింహళ 19-హిబ్రూ 20-గ్రీక్21-ఆరబ్ 22-ఇటలి23-హాలండ్ -డచ్ 24 –పోలాండ్ 25-లాటిన్ 26-మాలీ 27-సౌత్ సూడాన్ 28-ఆఫ్రికా 29-ఉగాండా 30-ఘనా

31-నికరుగ్వ32-కోస్టారికా 33-పెరు34-వెనిజుల 35-గయానా 36-పరాగ్వే 37-ఉరుగ్వే 38పాక్ లాండ్ 39సౌత్ జార్జియా 40గ్రీన్లాండ్ 41-ఫ్రాన్స్ 42-రష్యా 43-కిరబటిన్ 44-లేసితోనియ 45-మార్టిన్ ఐలాండ్ 46-మక్రోనేశియ 47-నౌరు 48-ఉత్తర కొరియా 49-పలావు 50-సోమోవా 51-సావో బొమ్ ప్రిన్సిపి 52-సాల్మన్ ఐలాండ్స్ 53-తజకిస్తాన్ 54-అంగోలా 55-తు ర్కెమేని నిస్తాన్ 56-తువాలు 57-వనౌతు58-జర్మని 59-హంగేరి 60-బోస్నియ హెర్జ్ గోసిన

61-బల్గేరియా 62-క్రోషియా 63-సైప్రస్ 64-అల్బేనియా 65-అండొర్రా66-బెలారస్ 67-జెకోస్లోవేకియ 68-ఎస్టోనియా69-కోసోవే 70-లాట్వియా 71-లీ చేస్టేస్72-లిదూనియా 73-లక్సం బర్గ్ 74-నార్త్ మాసిడోనియా 75-మాల్టా 76-మాల్టోవా77-మొనాకో 78-మాన్టిగ్రో 79-రొమేనియా 80-సాన్ మెరినో 81-సెర్బియా 82-స్లోవేకియా 83-స్లోవేనియా 84-యుక్రెన్ 85-వాటికన్ సిటి 86-అజర్ బైజాన్ 87-బ్రూనీ 88-బహరైన్ 89ఆర్మేనియా 90-యెమెన్ 91కబార్ 92టిమోర్ లేస్ట్-93-మాల్దీవ్స్ 94-సైప్రస్ 95-మంగోలియా 96-జార్జియా 97-కువైట్ 98-కిర్జిస్తాన్ 99-కంబోడియ 100-సింగపూర్

101-వియత్నాం2 102-ఆఫ్ఘనిస్తాన్ 103-బంగ్లాదేశ్ 104-పాకిస్తాన్ 105-సౌది అరేబియా 106-ఎమిరేట్స్ 107-చైనా 108-బ్రిటన్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59

‘’రావణుడు అలా సీతను బెదిరించి వెళ్ళగానే కాపలా రక్కసులు వినరానిమాటలతో ఆమెను బెదిరించారు .వాళ్ళ మాటలను ఆమె గడ్డిపోచలాగా తీసిపారేసింది –

‘’తృణవద్భాషితం తాసాం గణయామాసజానకీ ‘’

సీత దృఢ నిశ్చయాన్ని వాళ్ళు రావణుడికినివేది౦చారు.తమప్రయత్నాలన్నీ భగ్నం కాగా వాళ్ళు సీతను చుట్టుకొని నిద్ర పోయారు .24వ సర్గలో రాక్షసస్త్రీలు వేర్వేరుగా సీతను ఎలా బెదిరించారో వివరంగా ఉంది. దాన్నిక్కడ హనుమ వదిలేశాడు .వాళ్ళమాటలను గడ్డిపరకగా భావించినట్లు ఇక్కడ హనుమ చెప్పాడు .అక్కడ ఆమాట లేదు .రావణుడికి తెలియజేసినట్లూ అక్కడ లేదు .ఆమె చుట్టూమూగి నిద్రించారు అని ఇక్కడ ఉన్నది .అక్కడ ఆమాట లేదు .అవసరాన్ని బట్టి పెంపు కుదింపు చేయటమేకాక ‘’ఎమ్ఫాటిక్’’గా చెప్పటం హనుమ ఉద్దేశ్యమేమో ?

‘’వాళ్ళు అలా నిద్ర పోగా ,పతి హితమేకోరే సీత దయనీయంగా శోకంతో ఏడ్చి౦ది .రాక్షస స్త్రీల మధ్య ఉన్న  త్రిజట నిద్ర లేచి ‘’పాపులారా !కావాలంటే నన్ను చంపండి .సీత జోలికి మాత్రం వెళ్ళకండి .నేనిప్పుడే గగుర్పాటు కలిగించే ఒక కల గన్నాను .దాన్ని బట్టి రాక్షస నాశనం ,ఆమె పతి విజయ సూచకం గా ఆ కల ఉన్నది .మనల్ని కాపాడమని ఆమెనే ప్రార్ధిద్దాం .కొద్దిరోజుల్లో ఆమె సకల దుఃఖ విముక్తురాలై గొప్ప సుఖాలు పొందుతుంది .తనకు ప్రణమిల్లిన వారిని జానకీ దేవి వారి అపరాధాలు మన్నించి ప్రసన్ను రాలు అవుతుంది ‘’అనగానే ‘’త్రిజట చెప్పింది నిజమే అయితే ,నేను మిమ్మల్ని కాపాడుతాను ‘’అని సీత చెప్పింది .ఈమాటకూడా 27వ త్రిజటా స్వప్న సర్గ లో లేదు .

‘’తస్సా సా హ్రీమతీబాలా భర్తుర్విజయ హర్షితా –‘’అవోచ ద్యది తత్తధ్యం భవేయం శరణం హివః’’

‘’నేనప్పుడు సీత దారుణ దుఖం చూసి,  ఆమెను చూశాను అనే ఆనందంకూడా కలగలేదు .సీతతో ఎలామాట్లాడాలా అని ఆలోచించి దానికి అనుగుణంగా ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించాను .ఆమె విని కన్నీటితోనే నాతో ‘’వానర శ్రేష్టా!ఎవరు నువ్వు ఎలావచ్చావ్ ,నీకు రామునిపై ఆదరం ఎందుకు కలిగింది ?ఆ వివరాలన్నీ చెప్పు ‘’అని అడిగింది .ఈమాటలు చాలా సందర్భ శుద్ధిగా ఉన్నాయి –

‘’కా చ రామేణ తే ప్రీతి స్తన్మేశంసితు మర్హసి ‘’

నేను ఆమె మాటలకు సమాధానంగా ‘’అమ్మా !నీ భర్తకు సహాయకుడు వానరరాజు సుగ్రీవుడి సేవకుడనైన హనుమంతుడను .మహా కార్య నిర్వాహకుడు రాముడు పంపగా వచ్చాను .ఈ ఉంగరం నీకు గుర్తుగా ఇమ్మన్నాడు .ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?దాన్ని బట్టే చేస్తాను .నీకు ఇష్టమైతే నిన్ను రామ లక్షణుల దగ్గరకు తీసుకు వెడతాను’’అన్నాను ఆమె క్షణం ఆలోచించకుండా ‘’రాముడు రావణుడిని చంపి నన్ను తీసుకు పోవుగాక ‘’అన్నది –

‘’అహ రావణ ముత్సాద్య రాఘవో మాం నయత్వితి ‘’

‘నేను ఆమె మాటలకు సంతోషించి ఆమె ఆనవాలు ఇమ్మని అడిగాను .ఆమె తన చూడామణి నాకు ఇస్తూ ‘’దీన్ని చూసి రాముడు నిన్ను మహా గౌరవిస్తాడు ‘’అని రామునికి చెప్పాల్సిన మాటలన్నీ వివరంగా నాకు చెప్పింది .నేను వెంటనే ఇక్కడికి రావాలనే తొందరలో ఆమెకు ప్రదక్షిణ చేసి ,ప్రణమిల్లాను  –

‘మణి ర్యేవమహాబాహో రామస్త్వాం బహుమన్యతే’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

‘’

 

 

 

‘’

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment