ఈ నెల 10వ తేది ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో గుడి వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రెండిటికీ చెడ్డ రేవణ్ణ

రెండిటికీ చెడ్డ రేవణ్ణ

 కాలువ దగ్గర రేవు లో చాకలి వారు బట్టలు ఉతకటం మనకు తెలుసు .పెద్దపెద్ద బానలు  రాళ్ళ పొయ్యి మీద పెట్టి కట్టే   అందులో మురికి బట్టలు వేసి, బట్టల సోడా, నీలిమందుకలిపి పోయ్యికిండా కట్టేపుల్లలతో మంటపెట్టి ,ఉడికించి ,బండకేసి బాది, ఆరేసి శుభ్రంగా ఇళ్ళకు తీసుకొచ్చి ఇవ్వటం చూసేఉంటాం .వీటిని చలువబట్టలు అంటారు .ఇలా ఉతకటాన్ని రేవు కెళ్లటం అనీ అంటారు.  .’’మ౦గమ్మా  నువ్వు ఉతుకు తుంటే అందం ‘’అని’’ అల్లు ‘’అల్లప్పుడేప్పుడో సినిమాలో పాడిన పాట గేపకం లేదాఏంటి?  .ఒక తెలివి తక్కువ చాకలి అంటే రేవడి కి అంటే రేవు ఉన్న అన్న రేవన్నకు రెండు బానలున్నాయి .ఒక రోజు అకస్మాత్తుగా రేవుకు వరద వచ్చింది .ఎగువనున్న బాన కాపాడుకొందామని పరిగెత్తి దగ్గరున్న బానను వదిలేశాడు .తీరా అక్కడికి వెళ్ళే సరికి అదీ , ఇదీ రెండు బానలూ మునిగిపోయాయి .ఈ కధ  ‘’రెంటికీ చెడ్డ రేవన్న(రేవడి )’’సామెతగా తెలుగు దేశం లో బాగా ప్రచారం గా ఉంది .

  ఈ సామెత ఇప్పుడు కర్నాటకలోనూ రుజువైంది .’’నువ్వు మోకాలుకు బట్ట తలకూ ముడి పెడతావ్ ,యేదీసూటిగా చెప్పవు ‘’అంటారా !దేవే గౌడ పెద్దకొడుకు కుమారస్వామి అయితే చిన్న కొడుకు పేరు రేవణ్ణ అని తెలుసుగా .ఎన్నికలై రిజల్ట్స్ డిక్లేర్ చేయగానే’’ ఎడ్డీ ‘’’12 మంది శాసన సభ్యులబలం ఉన్న జెడిఎస్ నేత రేవణ్ణ’కు ఉపముఖ్యమంత్రి పదవి ఆశ చూపాడు .యెగిరి గంతేసి దూకేసేవాడే కాని అప్పటికి ట్యూబ్ లైట్ వెలిగిన తండ్రి దేవ గౌడ ముందరికాళ్ళకు బంధమేస్తూ తాను తనువు చాలించేలోపు పెద్ద కుమారుడు కుమారస్వామిని సి .ఏం. గా చూడాలన్న ఆఖరి  కోరికను తన సభ్యులందరికీ కన్నీటి గాధగా చెప్పాడు .ఎవర్నీ పార్టీ విడిచి వెళ్ళవద్దు అని ప్రాధేయపడ్డాడు .రేవణ్ణ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది .మింగాలేడు,కక్కాలేడు.ఆశలన్నీ అణచుకుని అన్న పక్క మౌనంగా ఉండి పోయాడు .

ఇవాళ కుమారసామి గద్దె నెక్కుతాడు ముఖ్యమంత్రిగా .ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ తన్నుకు పోయింది .ఇంకోటి ఉందని ఆశపెట్టినా అదీ కాన్గీకే హస్తగతం .కనుక రేవణ్ణ కు  డిప్యుటీ సి ఏం అయ్యే అవకాశమే లేకుండా పోయింది .అన్నతో పాటు ప్రమాణం ఏసే చాన్సూ లేదు .ఇక అన్నదయగా ఇచ్చే మంత్రి పదవి మాత్రం ఖాయం .అందులో ముఖ్యమైన శాఖ ఇవ్వాలంటే సోనియమ్మ దయ కూడా ఉండాలి. ఏక పక్ష నిర్ణయం అన్న తీసుకోలేడు.అందుకనే ఆయన ‘’రెండిటికీ చెడ్డ రేవణ్ణ ‘’అయి తెలుగు సామెతను కర్నాటకలోనూ రుజువు చేశాడు పాపం .

  అయితే లోపల ఆశ ఉండొచ్చు .ఇది మూన్నాళ్ళ ముచ్చటే .తండ్రి కోరిక తీరుతుంది కనుక ఒట్టు తీసి గట్టున పెట్టవచ్చు .ఆ తర్వాత యేడ్డీ పిలవకా మానడు,తాను చేరకా మానడు డిప్యుటీ ఆవకా మానడు.ఇక్కడ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు కదా భాయీ .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-18 –ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

  ఆముగ్గురూ ఆంధ్రులే అవటం ,వారు దాదాపు కృష్ణాజిల్లాకు చెందినవారవటం మన అదృష్టం తోపాటు దురదృష్టంకూడా ..ఇందులో మొదటివారు ఈ ఏప్రిల్ 22 న మరణించిన సంగీత  సాహిత్య సృజన శీలి, గాయకుడు రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .నిడద వోలు లో జన్మించినా ఆయన కార్యక్షేత్రం విజయవాడ అవటం మన అదృష్టం .98 సంవత్సరాలు సార్ధకం గా జీవించి , అధికమాసాలతో కలిపి లెక్కిస్తే  శతమానం భవతి మాత్రమేకాకుండా శతాదికమానం భవతి అని పించుకున్నారు .ఆ ప్రతిభా వ్యుత్పత్తి నాన్యతో దర్శనీయం .

రెండవవారు 82  ఏళ్ళు జీవించి  గుంటూరు జిల్లాలో పుట్టినా బెజవాడ కార్యక్షేత్రం గా సఫల జీవితం గడిపి మధ్యతరగతి తెలుగు కధ కు పట్టాభి షేకం చేసి ,ఈ మే 18 న మరణించిన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారు .

మూడవ వారు  పుంఖాను పుంఖాలుగా , తిలక్ అన్నట్లు ‘’డూప్లి కేట్లు క్వాడ్రూ ప్లికేట్లు ‘’గానవలలు రచించి కృష్ణా జిల్లా కాజ గ్రామం లో జన్మించి  కృష్ణా జిల్లా ఆడపడుచు అనిపించి ,హైదరాబాద్ కార్యక్షేత్రంగా ,ఆతర్వాత అమెరికాలో అమ్మాయి దగ్గర ఉంటూ తెలుగు సినిమా తీయటానికి బెంగాలీ బాబుల కధలు అవసరం లేదు మనమూ రాయగలం అని సత్తా చూపి సినీ ట్రెండ్ సెట్టర్ గా ,మధ్యతరగతి ఆడపిల్లల మనస్తత్వానికి ప్రతీకగా వారి ఆత్మ ధైర్య స్తైర్యాలను ప్రతిబింబిస్తూ వారి ఆత్మ గౌరవం  నిలబెట్టే పాత్ర సృష్టి చేసి తనకంటూ ఒక నవలా శాతాబ్దినే సృష్టించుకుని ,రీడబిలిటికి పెద్ద పీట వేసి, యువతుల కు ఆదర్శంగా ఉన్న శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి 78 వ ఏట కాలిఫోర్నియాలో మే21 మరణించారు . నవలా సామ్రాజ్ఞి గా కీర్తి౦పబడ్డారు  .ఈ ముగ్గురూ ముగ్గురే –మూడు రత్నాలు .ఒకటి సంగీతానికి, రెండవది కథకు, మూడవది నవలకు ప్రతి రూపాలు . ముగ్గురూ నెలలోపే మరణించటం బాధాకరం .

                          వీరితో నా పరిచయం

                          1-రజని

నేను 1956-నుంచి 60 వరకు బెజవాడ ఎస్ ఆర్ ఆర్అండ్ సివిఆర్  కాలేజి లో  ఇంటర్ ,డిగ్రీ చదివాను  .ఇంటర్ లో ఉండగానే 1956 లో మాకాలేజీ లో సంగీత కార్యక్రమం నిర్వహించటానికి రజని వచ్చారు .తెల్ల పైజమా ,లాల్చీ తో ఉన్న ఆయన నా మనసులో స్థిరంగా నిలిచిపోయారు .కామన్ హాల్ అయిన R 4 లో శ్రీమతి వింజమూరి లక్ష్మి తో కలిసి చక్కని సంగీతం వినిపించారు .మా యువ హృదయాలను గెలుచుకున్నారు ..అందులో మొదటిసారిగా ‘’స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా ‘’అన్నపాట మనసుకు హత్తుకు పోయింది .ఆపాడిన విదానం ,ట్యూన్ నన్ను హాంట్ చేస్తూనే ఉంది .రజని గానం రజనీ గంధ సువాసనలీనుతుంది .అంత పరిమళ భరితం .నేను రాజమండ్రిలో బి ఎడ్ శిక్షణలో ఉన్నప్పుడు  మా సహాధ్యాయినులు  ,ప్రముఖ చారిత్రిక పరిశోధకులు స్వర్గీయ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మేనకోడళ్ళు శ్రీమతి ఇవటూరి వరలక్ష్మి ,ఆమె చెల్లెలు ఇవటూరి విశాలాక్షి లు  కాలేజి సాంస్కృతిక కార్యక్రమాలలో పాటలు ఆడేవారు .అందులో  సైన్స్ సబ్జెక్ట్ ఆవిడ విశాలాక్షి  ‘’స్వైరిణి అన్నారు ‘’ పాట చాలా బాగా పాడేది .అందులో పాథోస్ మనసును పట్టేసేది .ఆ తర్వాత రజని  గురించి నేను పేపర్లలో చదవటమే కాని ప్రత్యక్షంగా చూసింది లేదు .

 ఉయ్యూరు  జిల్లా పరిషత్ హై స్కూల్ సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు స్వర్గీయ టి ఎల్ కాంతారావు తో పరిచయం ,ఇద్దరం కలిసి తెలుగు ఎంయే ప్రైవేట్ గా రాసి పాసవటం ,అప్పుడు రజనీ గారు విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గా ఉండటం ,అక్కడ ఉగాది కవి సమ్మేళనాలకు నేనూ ,కాంతారావు ఆంజనేయ శాస్త్రి ,పిచ్చిబాబు, సూపర్ వైజర్ పూర్ణ చంద్ర రావు, చెంచారావు ,జ్ఞానసు౦దరరావు , హిందీ మేష్టారు కొడాలి రామారావు బృందంగా వెళ్లి ఆస్వాదించే వాళ్ళం .ఏ ఏ సంవత్సరాలు అంటే ఖచ్చితంగా చెప్పలేను .అప్పుడు విశ్వనాధ ,శ్రీ శ్రీ ఆరుద్రా కరుణశ్రీ  వంటి కవి దిగ్గజాలు వచ్చేవారు .విని పులకరించేవారం .అందరి కంటే ఆరుద్ర కవితలే ప్రభావితంగా ఉండేవి అనిపించేవినాకు .రేడియో నాటకాలు కూడా చూసేవాళ్ళం . అదొక గొప్ప అనుభూతి నిచ్చిన ఏళ్ళు ,నాళ్ళు మాకు .ఆ సంగతులే ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం .రజనితో ఎప్పుడూ మాట్లాడిన గుర్తు లేదు .రజని కాలం స్వర్ణ యుగం .ఆయన ప్రవేశ పెట్టిన ప్రతిదీ గొప్ప హిట్టే అయింది .అప్పటిగాయకులు నటులు ,అందరూ హేమాహేమీలే .బెజవాడ రేడియో నాటకం అంటే ఒళ్ళు పులకించేది . నండూరి సుబ్బారావు ,రామమోహనరావు, పాండురంగారావు ,పుచ్చాపూర్నానందం,యెన్ సి హెచ్ క్రిష్ణమాచారిగారు, వారబ్బాయి, దండమూడి రామమోహనరావు , అన్నవరపు రామస్వామి మల్లిక్ ,కోట సచ్చిదానంద శాస్స్త్రి ములుకుట్ల సదాశివ శాస్త్రి వగైరా దిగ్దంతుల హరికధలు ,ఓలేటి హిందూస్తానీ మాధ్యమ కర్నాటక సంగీతం ఒకటేమిటి అన్నీ నవరసభరితాలే .సంక్రాంతి ఉగాదులకు రేడియోలో వచ్చే హాస్య నాటకాలకు అర్రులు చాచే వాళ్ళం .విని ఒళ్ళు మరిచే వాళ్ళం .బాలమురళి భక్తీ సంగీతం ,సంగీత కచేరీలు మళ్ళీ మళ్ళీ వినాలని పించేవి .నాజర్ బుర్రకధల ఆకర్షణ చెప్పనలవికానిది   రజని తర్వాత వచ్చిన అనంత పద్మనాభ రావు గారి కాలం లోనూ మాకిదే పని .రేడియో పోషకులం అని గర్వంగా చెప్పుకొనే వాళ్ళం .ఉగాది, సంక్రాంతి రేడియో సమ్మేళ నాలు ఇంట్లో పెట్టుకుని మా బృందం విని ఆనందించేవాళ్ళం  .మా ఇంట్లో ఆడవాళ్ళకూ రేడియో అంటే విపరీతమైన క్రేజు ఉండేది .ఇప్పటికీ రాత్రిళ్ళు నాప్రక్కన రేడియో ఉండాల్సిందే .ఆపాటలు వింటే కాని నిద్రపట్టడు .మమ్మల్ని రేడియోకి ఇంతగాఎడిక్ట్ చేసిన వారు రజనీ గారే .   కాలప్రవాహం లో ఏళ్ళు గడిచిపోయాయి .ఆదివారం వస్తే రజని రాసి ,పాడిన ‘శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా దైవ చూడామణీ’’వస్తే, వింటే  ఒళ్ళు పులకింతే.అంతటి ప్రభావం దానికి ఉంది .98 ఏళ్ళు వచ్చినా రజనీ గారిలో సంగీత పటుత్వం తగ్గలేదు .సుమారుగా మూడేళ్ళ క్రితం వారింటికి మేమిద్దరం వెళ్లి ,మన సరసభారతి పుస్తకాలు అందించి వారి మంచం పై కూర్చుని  పళ్ళు అందేసి వారి పాదపద్మాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్న అదృష్ట వ౦తులం అయ్యాం మేమిద్దరం .మాకోరిక పై కొన్ని పాటలు పాడి వినిపించారు .అవి మర్చిపోలేని మధుర క్షణాలు మాకు .మా జన్మ ధన్యం అని భావించాం .రజని ఎక్కడున్నా రజనీ గంధం  మనల్ని పరవశింపజేస్తుంది .

              2- పెద్దిభొట్ల

పెద్దిభొట్ల వారి కథలు చదివా కాని నాకు అందులో ధ్రిల్ కనిపించేదికాదు .నేను ఎస్ ఆర్ ఆర్ కాలేజి, ఆయన, లయోలా కాలేజీ .బెజవాడ సభలలో తరచుగా కనిపించేవారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం తో పరిచయం అయ్యాక సుబ్బరామయ్యగారిని మరీ క్లోజు గా చూసే అవకాశం లభించింది .ఎప్పుడూ పరిచయం చేసుకుని మాట్లాడింది లేదు .కాని 2000 లో ఫ్లోరా స్కూల్ వాళ్ళు నన్ను సూపర్ వైజర్ గా పని చేయమని బలవంత పెట్టినప్పుడు చేరి రెండేళ్ళు పని చేశాను .అప్పుడే ఆ స్కూల్ పుట్టి 10 ఏళ్ళు అయిన సందర్భంగా ,కొంచెం గ్రాండ్ గానే ఉత్సవం ను మా సువర్చలాన్జనేయస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రం లో నిర్వహిస్తూ సుబ్బరామయ్యగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు .ఆయన్ను సభకు పరిచయంచేసే అవకాశం నాకు ఇవ్వగా ఆయన పై మంచి ప్రసంగం తయారు చేసి ఎవరో పిల్లాడికిచ్చి చదివించి నట్లు జ్ఞాపకం .అప్పుడే చిరంజీవి అనే ప్రయోక్త కూడా మొదటిసారి పరిచయమయ్యారు .అయితే సుబ్బరామయ్యగారితో  ముఖా ముఖీ మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడాను .

  బెజవాడలో జరిగే పుస్తక ప్రదర్శన లలో ,రచయితల సంఘం నిర్వహించేకార్యక్రమాలలో మరింత నిశితంగా చూసే అవకాశం వచ్చింది .కావాలని ఏనాడూ పరిచయం పెంచుకోలేక పోవటం నా లోపమే .ఆయన ఎప్పుడూస్నేహ హస్తం చాచే సహృదయులే . పెద్దిభోట్లకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించినప్పుడు ,రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ నాకుఫోన్ చేసి ‘’ప్రసాద్ గారూ !పెద్ది భొట్ల వారిపై ఒక వ్యాసం మీరు రాస్తే రమ్యభారతి లో ప్రచురిస్తే  బాగుంటుంది అని పించింది .వెంటనే రాసి పంపండి ‘’అని కోరితే ,అప్పుడు లైబ్రరీ మీద పడి ఆయన కథా సంపుటులు చదివి ,మిగిలిన చోట్లనుంచీ వివరాలు సేకరించి నాలుగైదు రోజుల్లో’కృష్ణా తీరం లో సాహితీ కెరటం ‘’ రాసి పంపిస్తే అన్నట్లే రమ్యభారతి లో అచ్చు అయింది.

’ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖరరావు గారితో గత మూడేళ్ళుగా పరిచయం ఉంది .బహుశా 2016లో సుబ్బరామయ్యగారి పుట్టిన రోజు ,వారు తమ పేర పురస్కారాలను అందజేసే రోజు నన్ను తప్పక రమ్మని ఆహ్వానం పంపి ఫోన్ లో కూడా చెబితే వెళ్లాను .అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది అని రావు గారు తరచూ చెప్పేవారు. రోజూ ఫోన్ చేసి మాట్లాడి ఇంటికి వచ్చి కబుర్లు చెబితేకాని  ఊరుకునే వారు కాదని చెప్పేవారు .మొగల్రాజపురం లోని పైఅంతస్తు ఫంక్షన్ హాల్ లో సభ జరిగింది .ఆయన్ను వీల్ చైర్ లో తీసుకు వచ్చారు .ప్రముఖులు రావటానికి ఇంకా సమయం ఉంది .చంద్ర శేఖరరావు గారు పెద్దిభొట్ల వారి విశేషాలు మైక్ లో చెబుతూ’’ గాప్ ఫిల్లింగ్’’ గా ఎవరైనా వచ్చి మాట్లాడమన్నారు .నేను మాట్లాడి పైన చెప్పిన విషయాలు టూకీగా చేప్పి  ఆలస్యం చేయకుండా పెద్దిభోట్లవారికి నేను ఉయ్యూరు నుంచి తెచ్చిన శాలువ సరసభారతి తరఫున కప్పి ,నమస్కారం చేసి అప్పటికే రాత్రి 7 దాటినందున బొడ్డపాటి వారికి చెప్పేసి ఉయ్యూరు వచ్చేశా .ఇలా వారిని సభా ముఖంగా సన్మానించే మహద్భాగ్యం కల్పించిన వారు బొడ్డపాటి వారే .

  ఈ సందర్భంగా ఒక చిలిపి సంఘటన చెప్పకపోతే బాగుండదేమో అని చెబుతున్నా .అవి మేము ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తున్నరోజులు .కాంతారావు వగైరా మా సాహితీ బృందం మా సైన్స్ రూమ్ ను ‘’అడ్డా’’గాఅంటే సాహితీ కేంద్రంగా  చేసి సాహిత్య కార్యక్రమాలు జరిపే రోజులు .ఒక సారి ఒక పాంఫ్లెట్ కాంతారావు కు వచ్చింది .అందులో బెజవాడ లో దాశరధి రంగా చార్యులుగారి నవల ‘’చిల్లర దేవుళ్ళు ‘’పై పెద్ది భొట్ల సుబ్బరామయ్యగారి ప్రసంగం ఉందని తెలిసింది .నాకు 8 వ తరగతి  తెలుగుమేస్టారు ,ప్రస్తుతం హై స్కూల్ లో సహాధ్యాయి  ,సెకండరీ టీచర్ శ్రీ మహంకాళి సుబ్బరామయ్య గారున్నారు .ఆయన్ను ఏ సభలో మాట్లాడమన్నా మాట్లాడటం లేదు .ఎలాగైనా మాట్లాడింప చేయాలని నేనె ఒక ఉపాయం పన్ని ఆహ్వాన పత్రం లో ఉన్న’’ పెద్దిభొట్ల’’ బదులు ‘’మహంకాళి ‘’అనిమార్చి  అటెండర్ ద్వారా అందజేయి౦చా .ఆయన చూసి ఆశ్చర్యపోయి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి ‘’ప్రసాదూ !ఇదేమిటి నన్ను మాట్లాడమని ఉంది . అసలు ఆనవల నేను చూడలేదే ‘’అన్నారు .గురువుగారు దారిలో పడ్డారని గ్రహించి ‘’నవల మన లైబ్రరీలో ఉంది .తీసుకుని చదవండి .అక్కడ మాట్లాడటానికి ముందు ఒకసారి మన సైన్స్ రూమ్ లో మాట్లాడండి అందరం వింటాం ‘’అన్నాను .సరే అని పుస్తకం చదివి సందేహాలుంటే నా దగ్గర తీర్చుకుని నోట్స్ రాసుకుని బాగా ప్రిపేర్ అయ్యారు గురువుగారు .ఒక శనివారం ఉదయం 11 గంటలకు సాహిత్య పిపాస ఉన్న స్టాఫ్  మెంబర్లు  అందర్నీ ఆహ్వానించి ,నాఖర్చుతో ,టిఫిన్ కాఫీ ఏర్పాటు చేసి గురువుగారి ని ప్రసంగించమన్నాం .అద్భుతంగా గంట ఏమాత్రం తడుముకోకుండా ‘’చిల్లర దేవుళ్ళు ‘’నవలపై మాట్లాడారు .చప్పట్లు మారు మోగించాం .ఉబ్బి తబ్బిబ్బయ్యారు మహంకాళి గారు .ఆయన ప్రసంగం అవగానే నేను లేచి ‘’మాస్టారు మమ్మల్ని క్షమించాలి .ఎన్నిసార్లు సభలో మాట్లాడమన్నా మాట్లాడక పొతే నేనె ఈ పాయం పన్నాను .వాళ్ళందరికీ  ఈ రహస్యం బయట పెట్టవద్దని చెప్పాను .మీరు అద్భుతంగా  మాట్లాడగలరు  అని అందరికీ తెలియ జేయటానికే ఈ పన్నాగం పన్నాను. ఆలోచన, ఆచరణా అంతా నాదే .శిష్యుడిని క్షమించండి ‘’అన్నాను .కళ్ళ నీళ్ళపర్యంతం అయ్యారు మాస్టారు .కొద్ది సేపు కోపంగా ఉన్నా తర్వాత సర్దుకు పోయారు .ఈ స౦ఘటన తరచుగా తలుచుకుని నవ్వుకొనే వాళ్ళం చాలా ఏళ్ళు .నాలోని చిలిపితనానికి ఇదొక నిదర్శనం అన్నమాట

     సులోచనా రాణి

 ఈమెతో ఏమీ పరిచయం లేదు .కానీ పామర్రు హై స్కూల్ లో పని చేసేటప్పుడు మాతోపాటు రాళ్ళబండి సాంబశివరావు అనే సోషల్ మాస్టారు ఉండేవాడు .ఆయన కాజ లో పని చేశాడు .తాను కాజలో పని చేసినప్పుడు యద్దనపూడి సులోచనా రాణి చదివిందని కాజ హైస్కూల్ ను చేసింది తానేఅని ఆమెకు అక్షరాభ్యాసం చేసింది కూడా తానేనని తన ఒళ్లో కూచుని చదువుకున్న చిన్నారి అని  సులోచనకు తను అంటే అధిక గురు భక్తీ ఉండేదని గొప్పగా ఒకటికి రెండు సార్లు చెప్పుకోనేవాడు .కొంచెం వాచాలత్వం ఎక్కువ అని నవ్వుకునేవాళ్ళం .ఆవిడ నవలలు సీరియల్స్ గా వచ్చినప్పుడు చదివా .టైలర్ మేడ్ దుస్తుల్లా ఉంటాయి పాత్రలుఅనిపించేవి .తర్వాత ఆనవలలను సినిమాలుగా తీస్తే అవి అత్యంత కలెక్షన్స్ తో ప్రదర్శి౦ప బడుతుంటే ఆవిడ గొప్పతనం తెలిసింది .మేము మొదటిసారి  అమెరికాకు డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ కు మా అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ,అక్కడనుంచి 15 రోజులు కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ లో ఉన్న మా మేనలుడు శాస్త్రి వాళ్ల ఇంటికి  వెళ్లాం  ఒక ఫంక్షన్ లో సులోచనా రాణీ గారి అమ్మాయి పరిచయమైంది .చాలా బాగా మాట్లాడింది .నేను అప్పుడు ఆమెకు సాంబశివరావు మాస్టారు గురించి జ్ఞాపకంచేశాను .తన తల్లిగారికి నిజంగానే ఆయన అంటే అంతటి గురుభక్తి ఉందని  మేము కృష్ణా జిల్లావాళ్ళం అవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది .తల్లి సులోచనగారు తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని వచ్చి వెడుతూ ఉంటారని చెప్పారు .ఇప్పుడు కూతురు చేతిలో సులోచనా రాణి తుది శ్వాస విడిచారు .

 

  ఈ ముగ్గురు ప్రతిభా మూర్తుల ఆత్మకు  శాంతికలగాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి  చేకూర్చిన  భారవి

‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా సన్నద్ధం చేయాలో సంసిద్ధ పరచాలో తెలియ జెప్పి వైరివీరుల విక్రమపరాక్రమాలను కళ్ళకు గట్టేట్లు చేసి  అలాంటి వారిని గెలవటం తేలిక కాదు అన్న భావన మనసులో కలిగించి ,తద్వారా సాధన సామగ్రి సంపూర్ణంగా సమకూర్చుకొని యుద్ధ సన్నద్దులవటానికి పాండవులకు మహా గొప్ప అవకాశం కల్పించాడు భారవి .ఆ పాత్ర సృష్టి జరగకుండా ఉంటె కధ బలహీనమై కావ్యం రస హీనమై  తేలిపోయేది. అంతటి దూర దృష్టి ఉన్నవాడు భారవి .ప్రస్తుతం ఇదీ నేపధ్యం ,ఇప్పుడు భారవి ఒక్కో పాత్ర ను ఎలా సృష్టించి తాను అనుకున్నది ఎలా సాధించాడో  తెలుసుకుందాం .

             భీష్ముడు

భారత కిరాతార్జునీయ మూలకధలో ఎక్కడా భీష్ముని ప్రసక్తి చేయలేదు వ్యాసర్షి .అలాంటిది తనకావ్యం లో భీష్మ పాత్ర సృష్టించాడు భారవి .వ్యాసుడు పాండవులకు ప్రత్యక్షమై రాబోయే కురుక్షేత్ర యుద్ధం లోతాము యుద్ధం చేయబోయే  భీష్ముడు అజేయ పరాక్రమ సంపద కలవాడని హెచ్చరిస్తూభీష్ముని విశిష్టతను సంగ్రహ౦గానే అయినా సమగ్రంగా తెలిపాడు .ఏ వీరుడి పరాక్రమం అయినా ఆ వీరుని గురువు యొక్క పరాక్రమం తో ముందుగా  గణించి చెప్పటం లోక సంప్రదాయం .వ్యంగ్య వైభవం గా భారవి దీనిని ఉపదేశించటం విశిష్టమైన విషయం -21 సార్లు క్షత్రియ రాజులపై దండెత్తి సంహరించిన పరశురాముడు భీష్ముని గురువు అని ముందుగా గుర్తు చేశాడు .అలాంటి గురువునే ఎదిరించి ,జయించి,తన ధనుర్వేద పాండిత్య ప్రకర్షను గురువుకే ప్రత్యక్షంగా చూపించినవాడు  భీష్ముడు అని తెలియ జేశాడు –భారవి శ్లోకం –

‘’త్రి సప్త క్రుత్వో జగతీ పతీనాం –హంతా గురుర్యస్య చ జామదగ్న్యః  –

వీర్యావదూతః స్యతదా వివేద –ప్రకర్ష మాధార వశం గుణానాం ‘’

అంటే గురువు పరశురామునే జయించిన అవక్ర పరాక్రమ శాలి భీష్ముడు కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండాలి .ఆయన్ను జయించే ప్రయత్నాలూ  అసామాన్యంగా ఉండాలి అని చెప్పకనే చెప్పాడు .మరో శ్లోకం లో –

‘యస్మిన్ననైశ్వర్య కృత వ్యళీకః-పరాభవం ప్రాప్త ఇవాంత కోపి

దున్వన్ ధనుః కస్య రణే  న కుర్యా –న్మనో భయైక ప్రవణం స భీష్మః ‘

అంటే-ప్రాణులన్నిటినీ సంహరించే సర్వ శక్తి వంతుడైన యముడు కూడా భీష్ముని చేతిలో పరాభవం చెందాడు .అలాంటి భీష్ముని చేతిలో విల్లు కదులుతూ ఉన్నంత సేపూ ,ఎంతటివాడైనా ఆయన్ను ఎదిరించేప్పుడు భయ కంపితుడు కావాల్సిందే .భీష్ముడు తండ్రి నుంచి తనకు స్వచ్చంద మరణం వరంగా పొందాడు కనుక యముడు తన ఇష్టం వచ్చినప్పుడు భీష్ముడిని చంపటానికి శక్తి మంతుడు కాడు .అందుకని భీష్ముని చేతిలో యముడు కూడా ఓడినట్లే అని భావం ‘’స భీష్మః ‘అనటం వలన అంతటి విశిష్ట బలపరాక్రమాలు కల భీష్ముడిని జయించటం మీకు శక్యంకాని పని అని వ్యాసుని వ్యంగ్యోపదేశం .

  వ్యాస మహా భారతాన్ని ఆపోసన పట్టిన భారవి రెండే రెండు శ్లోకాలలో భీష్మ ప్రతాప గ్రీష్మాన్ని కళ్ళముందు కట్టించాడు .ఇదీ పాత్ర చిత్రణలో భారవి మహాకవి ప్రత్యేకత .

     ద్రోణుడు

 మహాభారత కిరాతార్జునీయం లో ద్రోణుడి పాత్రకూడా లేదు .కాని తనకావ్యం లో ద్రోణ పాత్ర సృష్టి చేసి తాను చెప్పవలసినదానికి వన్నె చేకూర్చాడు భారవి .ఈ కావ్యం లో వ్యాసుడే స్వయంగా ద్రోణుని ప్రాశస్త్యాన్ని వివరిచటం ఒక ప్రత్యేకత .పాండవులకు ద్రోణాచార్యుని పరాక్రమ విశేషాలు తెలియ జేస్తూ –

‘’రాబోయే యుద్ధం లో పుంఖాను పు౦ఖ౦ గా బాణాలు ప్రయోగిస్తూ ,మండుతున్న ,కదులుతున్న శిఖాగ్రాలు అనే నాలుకలు గల లోకాలను మ్రింగటానికి సిద్ధమౌతున్న ,ప్రళయాగ్నికి సమానమైన ద్రోణా చార్యుని మీలో ఎవరు చంపగలరు ?’’అని ప్రశ్నించాడు –

‘’సృజంత మాజా విషుసంహతీర్వ –స్సహేత కోప జ్వలితం గురుం కః

పరిస్ఫురల్లోల శిఖాగ్ర జిహ్వ౦ –జగజ్జిషు త్సంతమివాంత వహ్నిం ?

ద్రోణుని కి ఆగ్రహోదగ్రమైన ప్రళయాగ్ని సాద్రుశం అనుపమం .పాత్ర తత్వానికి చక్కగా భారవి ప్రయోగించిన శబ్ద సౌందర్యం ఇది .

    కర్ణుడు

కూడా మూల కధలో లేడు. భారవి సృష్టి౦చికావ్యమ్ లోపెట్టాడు .వేణీ సంహార నాటకం లో అర్జునునిచేత కర్ణుని పరాక్రమాన్ని తెలియ జేయించాడు నాటకకర్త భట్ట నారాయణకవి ‘కర్ణుడిని చంపి అర్జునుదు ముసలి రాజుతో –

‘’సకల రిపు జయాశా యత్ర బద్దా సుతాస్తే-తృణమివ పరి భూతో యస్య వీర్యేణ లోకః ‘’అని కర్ణుని పరాక్రమ శైలిని మెచ్చుకుంటాడు .ఇక్కడ కిరాతార్జునీయ కావ్యం లో భారవి కర్ణ పాత్ర సృష్టి చేసి ,వ్యాసుని తో కర్ణుని జయించగల మగాడు మీలో ఎవరున్నారో చెప్పండి అని సవాలు విసురుతాడు –‘’

‘’నిరీక్ష్య సంరంభ నిరస్త ధైర్యం –రాధేయమారాధిత జామదగ్న్యం

ఆ  సంస్తు తేషు ప్రసభం భయేషు –జాయేత మృత్యోరపి పక్షపాతః ‘’

భావం – ఎంతటి మహా వీరుడైనా ఎదిరించే సందర్భం లో అయినా  కోపోద్రేకం  చేత వాడి ధైర్యాన్ని సడలింప జేసే సమర్ధత ఉన్న పరశురాముడిని కర్ణుడు ఆరాధించాడు .కర్ణుని చూసి మృత్యువే ఇది వరకేప్పుడూ చూడని ,వినని భయాలను పొందుతుంది అని వ్యాసుని మనసు .అంటే పరశురామా రాదన  వలన కర్ణుడు మృత్యువును కూడా వణికి౦చ గలడు అని వ్యాస భావం .ఇలాంటి కర్ణ పరాక్రమ విక్రమాలను ఒకే ఒక్క శ్లోకం లో వ్యాసుని వలన భారవి పాండవులకే కాదు లోకానికికూడా ఎరుక పరచాడు. అదీ  భారవి ప్రత్యేకత .

ఆధారం –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ వైవాహిక స్వర్ణోత్సవ కానుకగా,  జ్ఞాపికగా రచించి,-9-5-18 న వెలువరించి, ఆత్మీయంగా నాకు పంపగా 17-5-18 శుక్రవారం అందుకున్న   ‘’భారవి భారతి ‘’(కిరాతార్జునీయ కావ్య సమీక్ష )గ్రంథం.ఆచార్య సార్వ భౌమ వారికి కృతజ్ఞతలతో నమస్సులు .

   సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ

గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ

 చంద్ర బాబు ఎంపిక చేస్తే ప్రధాని అయిన దేవ గౌడ కు పుత్ర వాత్సల్యం మితి మీరి  పోయిందట .మొన్న కర్ణాటక రిజల్ట్స్ రాగానే గెలిచిన  జేడీఎస్ సభ్యులందరినీ పోగేసి కూర్చోబెట్టి ”నాకు 87యేళ్లు వచ్చాయి .ఇక ఎంతకాలం బతికి ఉంటానో తెలీదు .చనిపోయేలోగా మా అబ్బాయి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది .కనుక మీరందరూ సహకరించి నా కోరిక తీర్చి నామనసుకు శాంతి కలిగించండి ”అని బ్రతిమిలాడినట్లు ”ఆంద్ర జ్యోతి కధనం ”. . ఔరా పుత్రప్రేమ యెంత బలీయం ?అంతే ఈ విషయం సోనియాకు తెలియటం ,గద్దెనెక్కటానికి సిద్ధమైన సిద్ధరామయ్యకు రాజీనామా చేయించి  కుమారస్వామికి ఆయన పార్టీ బేషరతుగా మద్దతు పలకటం క్షణాలమీద జరిగిపోయాయి .తర్వాత సీన్లు  మనం మూడురోజులు తనివితీరా చూసినవే కదా .దటీజ్ పుత్ర ప్రేమ . ఈ మాత్రం ఇంగితం గుడ్డి  రాజు ధృతరాష్ట్రుడికి కూడా ఉన్నట్లు ఎక్కడా బయట పడినట్లు లేదు మనసులోనే మధనపడ్డాడుపాపం  .ఆయనకు తెలుసు ఎలాగూ తనకొడుకు దాన్ని సాధిస్తాడని అందుకే మౌనమేమో .ఇక్కడ సీను  రివర్స్ .బలం లేదు .అందులో మూడు గ్రూపులు ఆపార్టీలోనే  .అందుకే తండ్రి గౌడ చక్రం అడ్డం వేశాడు ,అనుకున్నది నిమిషాలమీద సాధించాడు . నెహ్రూ వంశం లోనూ ఈ రకం కోరిక ఉన్నట్లు ఎవరూ బయటపడినట్లు లేదు .ఎలాగో మెజార్టీ పార్టీ కనుక  బయటినుంచి నొక్కి కావాల్సింది సాధించుకొని ఉండవచ్చు .
   అయ్యో పాపం జగన్ తండ్రి బతికుండగానే ఇలాంటి ఫిట్టింగ్  పెట్టించి ఉంటె ,సి ఏం అయి ఉండేవాడు .చేతులు కాలాక ఆకులు పట్టుకుని దేశ ద్రిమ్మరిలాగా పదవికోసం పాట్లు పడుతున్నాడు ..అసహనం తో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు . అందుకే రాజకీయ నాయకులకు ముందు చూపు ఉండాలంటారు . బాబు చూడండి -తనమంత్రి వర్గం లోనే మంత్రి పదవి నిచ్చి సరసన చేర్చుకుని మురిసిపోతున్నాడు .ముసలాయన నల్లకళ్లద్దాలున్నాయన కొడుకు అధికారం హస్తగతం చేశాడు మేయర్ పదవి ఇప్పించాడు తమిళనాడు లో . అక్కడ కూడా చిన్నిల్లు ,పెద్దిల్లు గొడవలున్నా మేనల్లుడు ఒత్తిడి చేస్తున్నా చాకచక్యం తో బాలెన్స్ చేస్తున్నాడు .ఇక చెప్పేదేముంది ములాయం సంగతి కొడుకు నెక్కించి ,మళ్ళీ ఇద్దరికీ పడక పదవి కమలం చేతిలో పెట్టే శారు ఇద్దరూ తన్నుకుని .. కనుక నాయనలారా ”పుత్ర ప్రేమా జిందాబాద్ ‘దుర్గాప్రసాద్   

Posted in రాజకీయం | Tagged | Leave a comment

నోరు మెదపలేదేం 

నోరు మెదపలేదేం

కర్ణాటక లో ప్రాజాస్వామ్యం బాలి అవుతుంటే విలువలు మాన్తా గలుస్తుంటే  న్యాయం అన్యాయం అవుతుంటే టే మన రాష్ట్రానికి చెందిన యువ నాయకులు మాజీ సి ఏం కొడుకు,మాజీ కేంద్రమంత్రి  తమ్ముడు కిమ్మనకుండా కూర్చున్నారు .తప్పు ఎక్కడున్నా తప్పే అని చెప్పగలిగే ధైర్యమే లేదా ?రేపెప్పుడో పనికొస్తుందేమో మౌనంగా ఉంటె అనే సంకేతమా ?ఇలాంటి జన నాయకులు వ్యవస్థను బతికిస్తారా ? స్వార్ధం కోసాం చొంగ కార్చటం తప్ప .ఇప్పటికైనా మించి పోయింది లేదు .ప్రజలందరూ జాగ్రత్తగా గమనించండి . బుద్ధి చెప్పి వాళ్ళను సరైన దారిలో నడిచేట్లు చేయండి .తండ్రి పదవి కావాలన్న ఆరాటం ఒకాయనది ,అన్న పేరు సాధించాలన్న ఉబలాటం మరొకరిది . ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం  కారు.అందర్నీ గమనిస్తూనే ఎవరికి ఎప్పుడు బుద్ధి శుద్ధి చేయాలో తెలిసిన వివేకులు .కళ్ళు మూసుకు పాలు తాగకండి యువ నాయకుల్లారా .ఓదార్పు .కౌగిలింతలు మొసలి కన్నీళ్లతో దూషణలతో ,ప్రగతి కనిపిస్తున్నా లేదన్న బుకాయింపు లతో  ప్రజా హృదయం కరఃగదు .ప్రజా హృదయం గెలవాలంటే వారితో మమేకం కావాలె తప్ప ఏ ఎండకు ఆ గొడుగు పట్టరాదు నాయనలారా .-దుర్గాప్రసాద్
Posted in రాజకీయం | Tagged | Leave a comment

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం

దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి  బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న  కాంగీ ,జెడి ఎస్ ల గట్టి  నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం చివరి ఆదేశం తో గత్యంతరం లేక  బల పరీక్ష కు సిద్ధంకాకుండా యెడ్డీ మూడు రోజులకే చాప చుట్టేసి రాజీనామా చేసేశాడు .హత విధీ మోడీ, షా ల పరువు అరేబియా సముద్రం లోకి నెట్టి వేయబడిన చారిత్రాత్మక సంఘటన ,దీనికి కాంగీ ,జెడి ఎస్ ల గట్టి పట్టు ను అభినందించాలి . తగిన సమయంలో సుప్రీం ను ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని రక్షించగలిగించగలిగారు .హాట్స్ ఆఫ్ .
  ఇలాంటి సంఘటన  ఆనాడు ప్రధాని వాజ్ పాయికి ఎదురైతే అక్రమంగా ఒక్క సీటుకూడా కొననని చెప్పి రాజీ నామా చేశాడు .అలాంటి ఆదర్శాలతో వర్ధిల్లిన పార్టీ నేడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను  తుంగలో తొక్కి గెలుపే ధ్యేయం గా నడిచిన తీరుకు నేటి కర్ణాటక నాటకం చెంప పెట్టు …
మరో  సంఘటన కూడా గుర్తుకొస్తోంది .చౌదరి చరణ్ సింగ్ ప్రధానిగా నియమింపబడి కొన్ని రోజులు మాత్రమే ఉండి  మెజార్టీ లేక పార్లమెంట్ గుమ్మం తొక్కకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది ..వాపు  బలుపు కాదు అని అందరూ గుర్తించాలి .
   సరే ఇప్పుడు మళ్ళీ గవర్నర్ కోర్ట్ లో ప్రజాస్వామ్యం అనే బంతి ఉంది .దాన్ని ఆయన ఎలా ఆడి ,ఏం చేస్తాడో చూడాలి .. అడ్డదారులు తొక్కి దక్షిణా పదం లో చొచ్చుకు రావటానికి చేసిన ప్రయత్నం బి జెపి కి కర్ణాటక గట్టి ఎదురు దెబ్బె కొట్టింది . అయితే కాంగీ ,జె డి ఎస్ ల బంధం శాశ్వతంగా నిలుస్తుందా ,కమలాన్ని నివారించగలుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాలమే తేల్చాలి .రాష్ట్రాల ఆత్మ గౌరవాలతో ఆడుకుంటే ఇలాంటి ఎదురు దెబ్బలే మున్ముందు తగుల్తాయి అని పాలకులు గ్రహించాలి సంఘటన లనుంచి  గుణ పాఠం నేతలు నేర్చుకోకపోతే భవిష్యత్తుకు వారు యేమని మార్గ నిర్దేశం చేయగలుగుతారు ?కలిసి పని చేస్తే ఎంతటి బలగాన్నైనా ఎదిరించి ఓడించ వచ్చునన్న ప్రాచీన నీతి ఎవరూ మరువ రాదు -మీ చావు మీరు చావండి రాజకీయ నాయకుల్లారా ,ప్రజాస్వామ్యం  తో ఆడుకోకండి.  నీతి  నియమాలను అపహాస్యం చేయకండి ప్లీజ్ -దుర్గా ప్రసాద్
Posted in రాజకీయం, సమయం - సందర్భం | Tagged | Leave a comment

  నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం  

              నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం

కర్ణాటకలో గవర్నర్ తీరు సరైనది కాదన్నట్లు వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ ,ఆయనిచ్చిన 15 రోజుల గడువు సరికాదని  మర్నాడే బలనిరూపణ జరగాలని నిన్న మళ్ళీ ఉత్తర్వు లిచ్చింది .ప్రోటెం స్పీకర్ సమక్షం లో బలనిరూపణ జరగాలని చెప్పింది .కానీ ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఆయన స్పీకర్ విషయ౦  లో న్యాయం చేస్తాడనే, అంటే సీనియర్ మోస్ట్ సభ్యుడిని చేస్తాడనే నమ్మినట్లుంది .అందుకే దానిపై నిన్న చెప్పలేదు .కాని బమ్మిని తిమ్మిని చేసే మహానుభావులున్నకాలం లో దానిపైనా ఆంక్ష పెట్టి సీనియర్ మోస్ట్ సభ్యుడినే ప్రోటెం గా ప్రకటించమని సూచనకూడా చేసి ఉంటె ఇంత రాద్ధాంతం జరిగి ఉండేదికాదు .అది కోర్ట్ పరిధిలోని విషయమో కాదో మనకు తెలియదుకదా .జరిగిందానిపై మన ఆలోచన ఉంటుంది .ఘన గవర్నర్ బిజెపి ఆయన, ఒకప్పుడు కోర్ట్ చేత అక్షతలు వేయి౦చు కున్నాయనను ప్రోటెం గా డిక్లేర్ చేసి ప్రమాణం కూడా చేయించేశాడు –‘’తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి ‘’అని కన్యాశుల్క లుబ్దావదాన్లలాగా .మళ్ళీ మొదటికే వచ్చింది విషయ౦ .మళ్ళీ కోర్టు ను ఆశ్రయించటం  వారు ఈ రోజు ఉదయం అంటే కర్ణాటకలో శాసన సభ ప్రారంభ౦ అవటానికి ఒక్క అరగంట ముందు విచారణలు చేబట్టు తున్నట్లు తెలపటం జరిగింది .తెగని ఉత్కంఠ. సభ్యులను మళ్లేయ్యటం ,నిఘా ,మేపుడు ,రక్షణ ,తోలుకురావటం ,విలాస హోటళ్ళలో బస ,జారిపోకుండా కాపలా ,అసెంబ్లీకి చేర్చేదాకా గుండె దడ తో అన్ని పార్టీలు ఊపిరి పీల్చుకోలేక సతమత మవుతున్నాయి .తీరా బలనిరూపణకు ఇంకా ఖచ్చితమైన మార్గ దర్శనం లేదు .రహస్య వోటింగ్ ఉండకూడదని ముందే కోర్టు చెప్పేసింది .కనుక తలల పరీక్షే .లేక చేతులేత్తేయ్యటమే .తల అంటే మనిషికి ఒకటే ఉంటుంది .కనుక ఇబ్బంది లేదు .కానీ రెండు చేతులూ ఎత్తేస్తే ఏమిటి గతి ?లేక్కి౦చేదేవరు? లెక్క తేల్చేదేవరు ?మళ్ళీ చిక్కు ప్రశ్నే .ఇప్పటికిప్పుడు గవర్నర్ ను మార్చలేరు .స్పీకర్ దే ఇస్టా రాజ్యం .ఆయనకే జోహుకుం అందుకే అనుకూలమైన వాడినే పెట్టుకున్నది రెండురోజులుగా అధికారం లో ఉన్నపార్టీ-ఎటునుంచైనా నరుక్కు రాగలడనే ధీమాతో నేమో?ఇదీ మన ప్రజాస్వామ్యం .దీన్ని ఉద్ధరించే వారు లేరా ?అన్నిటికీ కోర్ట్ నే ఆశ్రయి౦చాలా  ? అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టాలా ?దీనికి పరిష్కారం లేదా ,రాదా, రానివ్వరా ?

  దేశీయ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ళు దాటింది .కానీ ఇప్పటికీ మెజార్టీ నిరూపణ ఎలా చేయాలి ? ముఖ్యమంత్రి లేక ప్రధానిగా ఎవరిని ఎలా నియమించాలి?అన్నవాటిల్లో  స్పష్టత లేదు .ఎవరో చేసిన తప్పుకు రాజ్యాంగం ప్రజాస్వామ్యం బలై పోతున్నాయి .విలువైన కోర్టు సమయం దీనికి వెచ్చించటం న్యాయమా ?అన్ని పార్టీలు కూర్చుని చర్చించి ఒక నిర్దుష్టమైన ఆలోచనకు వచ్చి దాన్ని బిల్లుగా ఆమోదించి అమలు చేయలేరా ?యువతకు ‘’ముసళ్ళు’’ స్పూర్తి నివ్వలేరా ?ఇలాగే గేమ్స్ ఆడుకుంటూ చోద్యం చూస్తూ ఉంటారా ? వీటిపై మీడియా స్పందించదా?అదుగో ఎమ్మెల్యేలను ఎత్తుకు పోతున్నారు ఇదిగో ఫోన్ టాపింగ్ ,అదుగో కోట్లు ఆశ పెడుతున్నారు అనే వాటి పై చూపిన శ్రద్ధ ఇలాంటి విషయాలపై చర్చలు జరపదా, జరపలేదా? అందరూ తూట్లు పొడిచే వారే కాని అతుకుల బొంత ను కుట్టి సరి చేసేవారు కనిపించటం లేదు .హతోస్మి ప్రజాస్వామ్యం. యెంత అపహాస్యం పాలౌతోంది ?సరే కాసేపట్లో కర్నాటక నాటకం షురూ అవబోతోంది  .క్లైమాక్స్ కు చేరబోతోంది .కర్నాటక విషయం లో సుప్రీం ఆఘమేఘాలమీద స్పందించటం ప్రజాస్వామ్య వాదులకు గొప్ప ఊరట నిచ్చింది .కర్నాటక తీర్పు దేశ రాకీయాలను మంచి మలుపు తిప్పుతుందని ఆశిద్దాం .

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-18 ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు 

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు

ప్రముఖ కథకులు  లెక్చరర్ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత , శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు 82 వ ఏట ఈ రోజు విజయవాడలో మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాను  . వారిఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను  .తెలుగు  సాహిత్యం లో వారు లేని లోటు పూడ్చలేనిది -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాచకీయ కలగూరగంప

రాచకీయ కలగూరగంప

ఎడ్డీ జిడ్డీ ముఖం

నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ  వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప ముఖం అంతా వైట్ సిమెంట్ పూసినట్లు ఉంది .మనసులో గద్దె నిలుస్తుందా లేదా అన్న ఆందోళన ,ఎరకు ఎమ్మెల్యేలు ఎంతమంది పడతారన్న ఆవేదన ,సుప్రీం ఏం తీర్పు ఇస్తుందో నన్నభయం  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నామేమో అన్న సంకోచ౦ నాకు కన్పించాయి .మీకు కన్పించాయో లేదో ?చూసేవాడిని బట్టి ఉంటుంది .కనుకనే గప్ చిప్ గా  9-30 కు జరగాల్సిన తంతు ను 9 కే నిమిషాలలో ముగించి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది .దీనితర్వాత అసలు ముఖ్య కార్యం క్రమం కూడా ఉందిగా .పోలీసాఫీసర్ల బదిలీలు ,అనుకూలమైనవారి నియామకాలు కాంగ్రెస్ జే డి కాంప్ లవద్ద భద్రత తొలగించటాలు  వగైరాలు చకచకా చేసి ఎడ్డీ మార్క్ ప్రజాస్వామ్యాన్ని చాటుకున్నాడు .గుబులుకు మనసులో మరో కారణం కూడా ఉండి ఉండచ్చు .’’మా౦త్రిక ద్వయ౦’లేకుండా ‘గద్దె పండగ’’ జరగటం .ఏమైతేనేం తాను ప్రకటించిన 17 వ తేదీకే  గవర్నర్ ను ఒప్పించి ప్రమాణం చేయటం .బహుశా సమీప భూతకాలం లో ఇలా జరగటం ఇదే ప్రధమమేమో ?

విలువలవలువలూడ్చి

ఇందిరా గాంధీ రాజ్యమేలిన కాలం లో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా  భ్రస్టు పట్టించింది .రాజ్యాంగం అంతా ఖానీ అయింది .ప్రజాస్వామ్య విలువల వలువలూడ దీయించి గోచీతో, బికినీ తో నిలబెట్టింది .అయ్యో ఇందిర ప్రజాస్వామ్య ద్రోహి అని గుండెలు బాదుకున్నాం .ప్రతి వ్యవస్థను తన కాలి కింద అణచిపెట్టి పాలన చేసింది. కోటరీ దే ఇష్టారాజ్యం .కాదన్నవాడు కాసుకు కొరగాకుండా చేసింది . ఎన్నికలు అంటే గెలుపే అన్నది ధ్యేయం అయింది.మూలాలన్నీ నాశనమై పోయాయి .పూచికపుల్లను నిలబెట్టినా గెలుస్తుంది అన్న అతి విశ్వాసం ఏర్పడి ఇందిరే ఇండియా అనే భజన పరుల బందీగా చిక్కింది .ప్రజలు  చేష్ట లుడిగి  చూస్తూ ఊరుకునే స్థితికి వచ్చారు .చివరికి కూష్మాండం బద్దలై ,పాపాల చిట్టా బద్దలై జయ ప్రకాష్ నారాయణ్ నేతృత్వం లో ఏర్పడిన జనతా పార్టీతో పునాదులన్నీ కదిలే పోయాయి .ఊహించని అపజయం ఏర్పడి పీచేమూడ్ అయింది .అంతర్గత వైరుధ్యాలతో జనతా కల కలగా త్వరలోనే అంతమై స్వయం కృతాపరాధమై  మళ్ళీ ఇందిరే గద్దేనేక్కింది .ఆ తర్వాత ఆమె వారసులే పాలన చేశారు .మహా ప్రజాస్వామ్య ఉదారవాది వాజ్ పేయి అన్ని పార్టీల సహకారం తో గద్దెనెక్కి మన దేశ పరువు ప్రతిష్టలను విదేశాలలోనూ చాటాడు ..’’మనపంతులు’’రావు అధికారం పొంది సంస్కరణలతో దేశ ప్రగతిని మార్చేశాడు .తర్వాత ఆయన్ను దించి తాను ఎక్కే వీలు లేక ‘’మౌన ముని ‘’’’కోటు జేబుల్లో చేతులాయన ‘’ని ఎక్కించి పదేళ్ళు బాక్ సీట్ డ్రైవింగ్ తో రాజ్యాంగేతర శక్తిగా పాలన చేసిని ఇటలీ యువతి మాజీ ప్రధాని కోడలిగా .భార్యగా అవతారం దాల్చి౦ది  .అప్పటిదాకా దేశమంతా దాదాపు కాంగ్రెస్ పాలనలోనే ఉంది .ప్రదానికాని, పార్టీ ప్రెసిడెంట్ కాని కాగితం ముక్క చేతిలో లేకుండా ఒక్క అక్షరం కూడా మాట్లాడ లేని పరిస్థితి .

దీనితో ప్రజల్లో విరక్తి పుట్టటం అవినీతి ఆరోపణలతో దిక్కు తోచని స్థితిలో మాటల గుజరాత్  మాంత్రికుడు  ఆయన శిష్యుడు కమలం పార్టీకి దిక్కు అయి ముసలి ముఠా ను మూలకు తోసి ,చరిత్రలో లిఖించదగ్గ విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యాడు .మొదట్లో మాటలలో ప్రజాస్వామ్యం విలువలు రామ రాజ్యం  క్షణం తీరిక లేకుండా విదేశీ పర్యటనలు దేశం లో మారుమూల ప్రాంతాలూ తిరుగుతూ ప్రజల మనిషిని అనే గొప్ప భ్రమకలిగించాడు .కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పోయింది .జరిగిన ప్రతి ఎన్నికలో ఓడిపోయి తెల్ల జెండా యెత్తేసింది .ఈనాటికి కర్నాటకతోకలిసి 23 రాష్ట్రాలు కమలం హస్తగత మై మరో రికార్డు  సృష్టి జరిగింది .రికార్డ్ లు బాగానే ఉన్నాయి కాని ప్రాస్వామ్యం ,అంతర్గత ప్రమాణాలు మృగ్యమైపోయాయి .ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామన్న కమల నాయకులు పితామహుడు ఆద్వానీనే నాయకుడు అవమాన పరుస్తుంటే కిం అనక పోవటం తో ప్రజాస్వామ్యం ఆహాస్యం పాలైంది .గెలవటానికి అన్ని నీచ పద్ధతులను లోగడ కాంగ్రెస్ వాడినట్లే వాడేస్తున్నారు .మీడియా లో చాలా పల్చబడి పోయింది పార్టీ ప్రతిస్ట ,ప్రభుత్వ పరువుకూడా  .బయట పల్లకీ మోత ఇంట్లో ఈగలమోత చందం అయింది కేంద్ర ప్రభుత్వం పని .ప్రజలప కాంగీ  పెనం మీదనుంచి కమలం పొయ్యిలో పడిన చందమే అయింది .ప్రజాస్వామ్య విలువల వలువలు పూర్తిగా చి౦పేసి  దబాయి౦పు  సెక్షన్  తో  నిస్సిగ్గుగా బజార్లో నిలబెట్టారు .శాంతం పాపం .

ఇప్పుడు కర్నాటక సీన్ రసకందాయం గా మారింది .ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఖూనీ చేసినవాళ్ళే అరుస్తున్నారు .శాసన సభ్యులను జారిపోకుండా కాపాడుకోవటానికి’’ కాంపుల కంపు ‘’నడిపిస్తున్నారు .తమ మనుసులమీద నమ్మకం లేక అవతలి వారిపై అరుస్తున్నారు అందరూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినవారే  పొడుస్తున్నవారే .’’దొంగతనం చేసి ‘’దొంగను పట్టుకోండి ‘’అని అరుస్తున్న వాళ్ళే .కనుక గొంగట్లో తింటూ ఎందుకు బాధ పడటం ?అనుభూతి కవి తిలక్ కోరినట్లు ‘’దేవుడా రక్షించు నా దేశాన్ని ‘’

జెపి గా మారబోతాడా జెడి

జెపి అంటే లోక్ నాయక్ కాదు .లోక్ సత్తా నాయకుడు .బంగారం లాంటి ఉద్యోగం చేసుకుని అందరికి మంచి సలహాలిస్తూ కన్సల్టంట్ గా పేరు తెచ్చుకుని కుళ్ళు రాకీయ రొంపిలోకి  పార్టీ పెట్టి దిగి తాను ఒక్కడుమాత్రమే గెల్చి చివరికి ఏమీ చేయలేనని తెలుసుకొని పార్టీని రద్దు చేసుకుని పెద్దమనిషిగా బుద్ధి మంతుడుగా ఉన్నాడు జెపి .మనలాగే దేశం అంతా  కుళ్ళిపోయింది వ్యవస్థ భ్రస్టు పట్టిందని సమూలంగా మార్చేద్దామన్న మంచి కోరికతో లక్షల జీతం వచ్చే ఉద్యోగం అధికారం వదిలేసి శ్రీ జెడి లక్ష్మీ నారాయణ రాజకీయాలలో చేరుతానని పగటి కలలు కంటున్నాడు .ఇలాంటి వాళ్ళు ఒడ్డున ఉండి జనాన్ని నడిపించ గలరేకాని  వీళ్ళమాట విని జనం ఓటు వేస్తారంటే నమ్మరానిమాట .జెపి లాగా జెడి రొంపిలోకి దిగి మునగటం  మంచిదికాదు  .ఏదైనా పార్టీలో చేరి సేవ చేయచ్చు అప్పుడు తాను అనుకున్న విలువలు ఆచరించటం అసాధ్యం అని త్వరలోనే గ్రహిస్తాడు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-18 –ఉయ్యూరు

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత

‘’దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత

‘’త్రిపుర’’నే ఓట్లతో సంహారం చేసి ,కమ్మీల ఇరవై  ఏళ్ళ పాలనలో  అసలు రెండు వేల రూపాయల నోటు మోహమే చూడని సామాన్యజనానికి ఒక్కసారిగా చేతిలో అలాంటివి పది నోట్లు పెట్టి(ఆర్. కే.కొత్తపలుకు ఆధారం )  అసలు మార్క్సిజం ఉందా అని దిమ్మ తిరిగేట్లు చేసి  ముందస్తు వ్యూహం తో కమ్మీకోటలు బద్దలు కొట్టి అధికారాన్ని కొడవలి నుంచి కమలానికి బదిలీ చేయించిన  గండర గండడు  మోడీ .సహాయకాడు అమిత్ .,నిన్న కర్ణాటకలో కూడా 50 సీట్లున్న పార్టీకి రెట్టింపు అంటే 104 సీట్లు సంపాదించి మాజిక్ ఫిగర్ కు ఒక్క ఎనిమిది మాత్రమె దూరం లో నిలపగలిగిన ‘’గుజరాత్ మాంత్రిక ద్వయం ‘’ముందే వాళ్ళు ప్రకటించినట్లు ,ఇక ఆంధ్రా ,కేరళపై పంజా విసిరెందుకు సిద్ధంగా ఉన్నారు .ఇప్పటికే నాలుగు సార్లు ఎర్రకోటపై జండాఎగరేసి ‘’యెర్ర కోట’’లనుచిద్రం చేసి చీల్చి చెండాడి’ ఆసేతు హిమాచలపర్యంతం ‘’కమల సామ్రాజ్యం ‘’విస్తరించి కాషాయధ్వజ రెపరరెపలతో మిరు మిట్లు గొలిపే వ్యూహంతో దూసుకు వస్తున్నారు ‘’ద్వయం’’  కనుక ‘’బాబూ ‘’ జాగ్రతో౦ జగ్రత్త .

 హంగు హంగామాతో కన్నడ రాజ్యలక్ష్మి కళ తప్పింది .122 మెజార్టీ సీట్లతో అధికారం లో ఉన్న కాంగీ ఇప్పుడు 78తో అంటే సుమారు సగానికి సగం సీట్లతో ,కుమారస్వామి కాళ్ళపై పడి దేబరించి సి .ఏం. పదవి ఆఫర్ చేసి గవర్నర్ అనుమతికోసం ఎదురు చూస్తోంది దిక్కు లేక . ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు అని కాంగీ ఇప్పటికీ తెలుసుకోలేక పోయింది .’’తెల్ల పైజమా లాల్చీ’’ కుర్రాడు చూపులగుర్రమే అని తెలుసుకోలేక పోయింది .లింగాయతుల బలం తో గెలుద్దామనుకొంటే వాళ్ళు అదే చూపించారు .బాబాల ,పీఠాదిపతుల పాదాలపై వ్రాలి  ప్రసన్నం చేసుకుని అవినీతి సామ్రాట్’’ గాలి ‘’ని సీట్ల ఆఫర్ తో  బంధించి ,గెలుపుబావుటా ఎగరేసింది కమలం . ఇక్కడ తప్పు ఒప్పు ప్రసక్తి లేదు .గెలుపే ధ్యేయం .ఇక తండ్రీ ఇద్దరు కొడుకుల పార్టీ మూడు ముక్కలాట లాడి చివరికి ‘’బిందాస్ ‘’అయ్యామని  గర్వపడుతోంది .కాన్గీతో కలిసిపనిచేస్తే అధికారాన్ని తేలికగా దక్కి౦చుకోనేది  .తెలుగు వాడు ,నటుడు సాయి కుమార్ కే చుక్కలు చూపించారక్కడ .ఇంతకూ కమలం తప్ప మిగిలిన పార్టీలు  ఏమాత్రం వ్యూహాత్మకంగా ముందునుంచి వ్యవహరించక పోవటమే దీనికి కారణం .క్రమక్రమ౦గా దేశమంతటా విస్తరిస్తున్న పార్టీని నిలవరించటానికి అధికారం ఉన్నా ,తగిన సామర్ధ్యం, వ్యూహం ,,క్రియాశీలత ,చారిస్మా ,చివరికి ధనబలం కూడా లేక పోవటం వలన  కాంగీ నెత్తిన చేతులు పెట్టుకుని విలవిల లాడుతోంది ఇప్పుడు .వ్యతిరేక వోటు ను కాష్ చేసుకోలేని అలసత్వ అసమర్ధత ఇది .సిద్దూ బుద్ధుడే కాని వోట్ల ఏర వేయగల జాలరి కాలేక పోయాడు .

 ఇంతకీ జాగ్రతో౦ జాగ్రత అన్నా వెందుకు అంటారా ! దానికే వస్తున్నా .ఇప్పటికే మనరాస్ట్ర పరిస్థితి కేంద్రం తో ఉప్పూ –నిప్పూ గా ఉంది .ఒకసారి ఫ్లాష్ బాక్ కు వెడితే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన దగ్గరనుంచి బ్రాహ్మలు, రెడ్లు మాత్రమె ముఖ్యమంత్రులు గా ఉన్నారు .తమను వాడుకోవటమే కాని ముఖ్యమంత్రులను చేయటం లేదన్న అసంతృప్తి ‘’ఒక వర్గం ‘’లో బలంగా వేరూనుకు పోయింది .దీనికి తోడూ కాన్గీల పాలనా అస్తవ్యస్తం గా ఉండటం తో నాదెండ్ల ,నందమూరి చేతులు కలిపి సినీ గ్లామర్ ను ముందుంచి పార్టీ పెట్టి’’ఆంధ్రుల అభిమానం ‘’జెండా ఎగరేసి  కొద్దికాలానికే ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ ను నామ రూపాలు లేకుండా చేశారు .మళ్ళీ గవర్నర్ వత్తాసుతో కాంగీ -రామారావు ను గద్దె దింపి ,అదే కులానికి చెందిన  భాస్కర రావు ను ఎక్కి౦చినా  ,చంద్ర బాబు వ్యూహం తో ఇందిరా గాంధి మెడలు వంచి  మళ్ళీ ఎన్టి ఆర్. కే .పట్టం కట్టించారు .ఆయనా ఇష్టం వచ్చిన వేషాలు కట్టి డైలాగులు చెప్పి ,పనికన్నా మాటలకు ప్రాధాన్యత పెంచి , మాయలో పడి పార్టీ, ప్రభుత్వాలకు దూరమైతే అల్లుడు చంద్రబాబు ఎదురు తిరిగి అందరినీ కూడా గట్టి పార్టీ చీల్చి గట్టి బలం తో ముఖ్య మంత్రి అయ్యాడు .రామారావు మరణం తర్వాత ఆయన పార్టీ క్షీణించి బాబుదే అసలైన తెలుగు దేశం పార్టీ గా నిరూపణ జరిగి ,ఎన్నికలలో గెలిచి పార్టీని గెలిపించి ఒక్కోసారి అధికారం కోల్పోయినా పార్టీని సమర్ధవంతంగా నడిపి ,తానున్నాను అన్న ధైర్యం ప్రజలలో కలిపించి ‘’పంచెకట్టు ‘’ఆయన  ప్రభుత్వం లో అవమానాల పాలైనా ,బాబు ఉంటేనే తెలుగు దేశం అని పించుకున్నాడు .కేడర్ ను బలవత్తరం చేశాడు బామ్మర్దులు దోబూచులాడినా ,కొత్తత్త బజారున పడి యాగీ చేసినా ఏమాత్రం బెదరలేదు .ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని చీల్చినా ఎన్నికలలో గెల్చి ‘’నవ్యాంధ్ర ‘’నిర్మాణానికి అనుక్షణం తపన చెంది మోడల్ రాష్ట్రం చేయాలన్న ధ్యేయంతో ముందుకే మును ముందుకే సాగి పోతున్నాడు   .అన్నీ అందిస్తామని ,హోదా ఇస్తామన్న  హామీతో కమలంతో పొత్తు పెట్టుకుని , గత నాలుగేళ్ళుగా అధికారం లో ఉంటూ , ,చివరికి మోడీది అంతా కల్లబొల్లి కబుర్లేఅని తెలుసుకొని ప్రజలకు ఎరుక కలిగించి స్నేహం కటాఫ్ చేసుకుని కేంద్రం తో పోరాటం చేస్తున్నాడు .

  జగన్ నాలుగేళ్ళనుండీ జనాన్ని ఓదారుస్తూ ,వీలైనప్పుడు మోడీ ని అంట కాగుతూ దగ్గరౌతూ అదను కోసం ఎదురు చూస్తున్నాడు .నాలుగేళ్ళుగా తనకున్న 40 మంది ఏం ఎల్ ఏ లను పొట్టలో పెట్టి కాపాడుకొంటున్నాడు .ఇక పవన్ విషయానికి వస్తే క్లారిటీ లేని మైండ్ అని పిస్తాడు .ఇప్పుడు రాష్ట్రం లో కాపుల కోరిక అంతా ముఖ్యమంత్రిత్వం పై నే ఉన్నట్లు కనిపిస్తోంది .బాబు చుట్టూ ఉన్న వారుకూడా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం .ఇప్పటికే ‘’సుజనా’’జనానికీ, పార్టీకీ దూరం అయ్యాడనే పుకార్లు పేపర్లలో షికార్లు చేస్తున్నాయి .ఇక ‘’ముద్రగడ ‘’లేచానంటే మనిషినికాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు .లేస్తాడో లేవగలడో లేదో చెప్పలేం .

  ఇవన్నీ ఇలా ఉంటె బిజెపి వ్యూహాత్మకంగా ‘’కన్నా ‘’ను ‘’హాయి నా కన్నా’’అని కర్నాటక పోలింగ్ అయిన మర్నాడే  కమలదళాధ్యక్షుడిని చేసేసి ఆ’’ కులానికి’’ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చాటుకున్నది .పూర్వపు సంప్రదాయాలను తుంగలో తొక్కేసింది .అలాగే రాష్ట్రం లో రాజుల కూ సమప్రాధాన్యం ఇచ్చామన్నట్లు ‘’బూతుల రాజు గారికి ‘’ఎలక్షన్ మేనేజ్ మెంట్ ‘’పదవి కట్టబెట్టింది .మేనేజ్ మెంట్ అంటే తెలుసుకదా ‘’ఎన్నికలలో గెలవటమే ధ్యేయం –‘’యైదర హుక్ ఆర్ క్రూక్ ‘’.కనుక ఇంతటి పకడ్బందీ వ్యూహం తో కమల దళ విన్యాసం, విస్తారం జరుగుతోంది .ఆంధ్రాలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ప్రతి ఊళ్లోనూ ఉన్నారు .కావాలంటే వేలాది మందిని పైనుంచి ముందే దింపి వోట్ల నిర్మాణానికి పునాదులేస్తారు .కనుకనే జాగ్రతోం జాగ్రత .

 హంగు హంగామా నుంచి కర్నాటక బయటపడి ఒక వేళ గవర్నర్ కుమారసామి ని గద్దె ఎక్కించి కాన్గీతో బరాబరులు పలికించినా ,అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది .ఎందరో జంప్ జిలానీలై కమలం శరణ్యం అని తీర్ధం పుచ్చుకోక మానరు .కమల ప్రభుత్వం రాకా మానదు .అప్పుడు ‘’ద్వయం ‘’రెట్టించిన ఉత్సాహంతో తెలుగు నేల మీద ఐరన్ లెగ్ మోపక మానరు అని పిస్తోందినాకు .అందుకే బాబూ తస్మాత్ జాగ్రత జాగ్రత .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కవి రాజ మౌళి ,కవి సార్వభౌమ మధురకవి,అష్టావధాని,కనకాభిషేకి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ

91 ఏళ్ళ వయసులోనూ అద్భుత కవితా సృష్టి చేయగల చేవ ఉన్న విద్వత్ కవి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు . గుంటూరు జిల్లా అచ్చమ్మ పేట మండలం కోగంటి పాలెం అగ్రహార నివాసి .చింతలపాటి  వెంకట నరసమాంబ ,వెంకట రామ శాస్త్రి దంపతులకు 26-6-1927జన్మించారు .కృష్ణా జిల్లా చందర్ల పాడు లో విద్యాభ్యాసం ప్రారంభించి ,హైదరాబాద్ వేదాంత వర్దినీ సంస్కృత కళాశాల లో విద్యా శిక్షణ పొంది ,గుంటూరు జిల్లా పొన్నూరు లో శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల లో ఆంద్ర భాషాధ్యయనంచేసి ,గుంటూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆంధ్రాధ్యాపకులై ,విద్యా బోధనలో తరించి పదవీ విరమణ చేశారు  .

                      రచనా దీక్షితీయం

జన్మతః కవిత్వం వంట బట్టిన  శర్మగారు 16 వ ఏటనే  రమాపతి, రాజ రాజేశ్వరశతక ద్వయం రాసిన ప్రతిభాశాలి .బాలకవిగా ,ప్రౌఢ కవిగా ,మధురభారతి గా ,కవిరాజమౌళి గా కవితా శిఖరారోహణం చేశారు . 72 కు పైగా గ్రంథాలు ఆంద్ర, సంస్కృతాలలో,వివిధ ప్రక్రియలలో రచించిన పండిత కవి . .’’శాతవాహన చరిత’’చారిత్రిక కావ్యం రాసి తన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జానకి రామయ్యకు అంకిత మిచ్చిన స్నేహ శీలి .ఇందులోని అవతారికను బట్టి శర్మగారు అప్పటికే ఋతు సంహారము ,శృంగార గోవర్ధనము , లీలాభిక్షువు ,విశ్వనాథ విజయం రచించినట్లు తెలుస్తోంది .ఇవికాక మందార మంజరి ,నాస్వామి ,త్రివేణి ,కృష్ణ చరిత్ర ,సరసోపనిషత్తు కూడా రచించారు .  అరవై ఏళ్ళ వయసులో తన షష్టి పూర్తి ఉత్సవ సందర్భంగా జగన్నాథ పండితరాయల సంస్కృత ‘’అన్యోక్తి విలాసం ‘ను ‘’చైత్ర రథం ‘’పేర తెలిగించారు .చైత్రరథం అంటే కుబేరుని ఉద్యానవనం .అది అనేక రకాల పరిమళభరిత  పుష్పజాతులతో విరాజిల్లేది .తన చైత్రరథం లోను పలు కవితా సౌరుల నంది౦చాలన్న తపనతో ఈ పేరు  పెట్టారు శర్మగారు .ఒక ఉపజాతిపద్యం దాని తరువాత ఒక వృత్తపద్యం ,మళ్ళీ ఉపజాతి, తర్వాత వృత్తం ఉండేట్లు రచన చేసి శోభ  చేకూర్చారు  .ఇందులో శర్మగారి కవితా వైదుష్యం,వైశిష్ట్యం ,భావగాంభీర్యం ,ఆలోచనాసరళి ముగ్ధులను చేస్తాయి .ఆపాత మధురంగా ,ఆలోచనామృతం గా తీర్చి దిద్దారు .’’పాలిత శబ్ద ధర్ముడు ‘’ రసగంగాధర కర్త ఐన ఆంద్ర కవి పండిత జగన్నాథ కవి రాయల  రచన నుఆంధ్రీకరించుట అంతంత మాత్రకవికి సాధ్యం కాదు .శర్మగారు దాన్ని సాధించి కీర్తి పొందారు .’’ప్రతిపద్యం ముక్తాస్వచ్చము ,మనోమోహకం ‘’అని మెచ్చిన డా ప్రసాదరాయ కులపతి గారి మాటలు అక్షర సత్యాలు .శ్రీ వేదాల సీతారామాచార్యులు వీరి విద్వత్తును ప్రశంసిస్తే , శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారు’’తెలుగుం బల్కుల తీపి మీగడలు తృప్తిం బెంచ ,గైర్వాణికోక్తులు   మేలౌ కలకండ ముక్కలుగ నెంతో తీయముల్ నించ ,నీ తెలుగుం గావ్యము తీర్చి దిద్దితివి’’అంటూ ప్రశంసాశీస్సులు అందించారు  .తాను ‘’ఉభయ భాషాను ష౦గసౌరభ తరంగములకు చలువల విలువలు కొలుపువాడ ‘’అని సవినయంగా బుధులకు విన్నవించుకున్నారు శర్మగారు .

  ఇంతటి విద్వత్కవి శర్మగారు బాలలకోసం ‘’బాలప్రబోధం’’ రాశారు .అందులో ‘’మధుర శబ్ద పాక మహితమ్ము ,సుజ్ఞాన –బోధకమ్ము ,కీర్తి సాధకమ్ము –సరస భావ యుతము ,నరసింహ దీక్షిత –కృతము కనుము రచన రీతి బాల ‘’అన్నారు ,తాను అప్పుడప్పుడు రాసిన ఖండికలను ‘మధుకణాలు ‘’గా తెచ్చారు .ఇందులో కాళిదాసు ,విశ్వనాధ మున్నగు కవి ప్రశంస ,సంక్రాంతి ,ఉగాది శోభ  వర్ణించారు  .వజ్రాయుధం కొండలను నరికి నట్లు లోకం లోని అవినీతిని ఖండించటానికి 527పద్యాల ‘’కవితా తూణీరం ‘’రాశారు .ఇందులో –‘’గోడలందు ‘’అస్పృశ్యత కూడద’’నుచు –వ్రాయు చుండుటయే అంటరాని తనము –కలదనుచు పిన్నవారికి తెలుపుటెయిది –విజ్ఞాతా శూన్యమైనట్టి వెకిలి వ్రాత ‘’అని మన సిగ్గుమాలిన తనాన్ని ఎండగట్టారు . -’’నారద శారద ‘’లో జ్యోతిశ్శాస్త్ర విశేషాలన్నీ వచనంగా రాశారు.తన పేరు లోని నరసింహ దీక్షిత శర్మ ను ‘’నదీశ ‘’గా కుదించి ‘’నదీశ కవిత ‘’ ‘’రాశారు.ఇందులో ‘’వినయము విధేయత ,సపర్య యను గుణమ్ము-గృహిణులకు రత్నభూషయై కీర్తిపెంచు –కావ్య సతికిం ,జమత్కార గరిమ సొమ్ము ‘’వంటి అనర్ఘ పద్య రత్నాలెన్నో  ఉన్నాయి .

కృష్ణం వందే జగద్గురుం,రసో వై సహ’’ అన్న దాన్ని అనుసరించి ‘’శ్రీ కృష్ణ విలాసం ‘’కావ్యాన్ని 102 తేటగీతి పద్యాలలో కవితామయంగా వర్ణనాత్మకంగా రాశారు .’’రాస లీలాది సుధల,గోపీ సుదతుల –ముంచి తేలిచి ,రస పీఠమున నిలిపె-ధాత్రి ,నాన౦దరస  నిర్వృత మ్మొనర్చె-రసమయుడు  బ్రహ్మానంద రసమయుండు ‘’.కృష్ణా జిల్లా దివితాలూకా అవనిగడ్డ –నాగాయలంక దారిలో ఉన్న వేకనూరు క్షేత్రం లో వెలసిన ఉభయ ముక్తీశ్వర స్వామి ‘’పై భక్తి చిప్పిలేట్లు’’ వేకనూరు ఉభయ ముక్తీశ్వర శతకం ‘’ రాశారు .ఇందులోని పద్యాల మొదటి అక్షరాలన్నీ కలిపితే శ్రీ వేకనూరి వాసాయ ఘంటసాల వంశ సంభవ —భారద్వాజస గోత్ర మధురభారతి కవిరాజమౌళి చింతలపాటి నరసింహ దీక్షిత కవి విరచితం ‘’అని వచ్చేట్లు చమత్కారం చేసి స్వామికార్యం, స్వకార్యం తీర్చుకున్నారు .’’ముక్తి రమ చేరుగాత ముముక్షు తతిని-భక్త కోటికి శుభములు ప్రబలు గాత-కవి వచస్సులు తేజస్సు గా౦చు గాత-ఉభయ ముక్తీశ్వారా వేకనూరి వాస ‘’ .అలాగే కృష్ణాజిల్లా నందిగామ దగ్గరున్న చింతలపాడు లో చింతలపాటి వంశీకులడైన  సోమేశ్వర స్వామి ‘’పై అవంశం వారి అభ్యర్ధనమేరకు  చింతలపాటి సోమేశ్వర శతకంను ‘’ సహస్ర చంద్ర దర్శనం’’తర్వాత పూర్తి  ఆరోగ్యం తో  ‘’కళ్యాణ మంగళ వాద్యంగా ,ఖండ శర్కర నైవేద్యం లాంటి పద్యాలతో రాసి శివభక్తి ప్రకటించుకుని’’శతకంబుల్ రచియించితి ,నభీష్ట శ్రీల గుప్పింతువో –రతనంబుల్ సమకూర్తువో –అతుల జ్ఞాన ధనాఢ్యు చేయుదువో’’అంటూ ఆర్తిగా వేడుకొన్నారు . చనిపోయిన తన చెల్లెలు ‘’సాధు అది శేషాంబ’’స్మృత్యర్ధం మేనల్లుని కోరికపై ‘’సువర్ణ దుర్గ ‘’శతకం రాసి భక్తి శతకక రచనలో తనదైన ముద్ర వేసి భక్త కవి శిఖామణి అనిపించుకొన్నారు . .’’త్రివేణి ,సువర్ణాభిషేకం ,శ్రీ వేణుగోపాలశతకం కూడా రాశారు .87 వ ఏట  ఈముదుసలి కవి మనసు సరసం పైకి పాకి,ఏకంగా ‘’సరసోపనిషత్ ’’రాసేసి –‘’విషమ శరతంత్ర వైవిధ్యమరసి-సంతసి౦చుడు’’అంటూ సరసోపనిషత్తు ‘’నిత్యకల్యాణ లక్ష్మీ వినిద్ర కీర్తి –సంపదల సొంపుపెంపుల నింపుగాత’’అని అభయమిచ్చారు      .

                          అవధాన సరస్వతి

 శర్మగారు నలభై కి పైగా అష్టావధానాలు చేశారు .అందులో వచ్చిన సమస్యలను మధుర కవిత్వం తో పూరించి ఆ  పూరణలను ‘’సమస్యా పూరణం ‘’పేరుతో ప్రచురించారు .50 భువన విజయాలలో పాల్గొన్నారు .జంధ్యాల వారి సరసన ‘’ధూర్జటి ‘’పాత్ర పోషించారు .కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ,డా నారాయణ రెడ్డి ,దివాకర్ల వేంకటావధాని  వంటి సాహితీ దిగ్గజాల  దీవెనలు అందుకున్న కవి శేఖరులు శర్మగారు .

                   బిరుద సత్కారాలు

 కృష్ణా జిల్లా నందిగామలో కుర్తాళ౦ పీతాధిపతి సమక్షం లో శర్మగారు కనకాభిషేకం పొందారు.అలాగే  అవధాన సరస్వతి శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారి  అధ్యక్షత న జరిగిన సభలో దీక్షిత శర్మ గారికి కనకాభి షేకం జరిగి ‘’కవి శిరోమణి ‘’బిరుదు నందుకున్నట్లు తెలియ జేశారు  ,ఇవి అపూర్వ విషయాలు.,చిరస్మరణీయాలు   .శర్మగారి రచనా సర్వస్వం పై ఒక విదుషీమణి ‘’సిద్ధాంత గ్రంధం ‘’రచించి ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొంది కవిగారి కీర్తి కిరీటం లో మరొక కలికితు రాయిని చేర్చింది .శర్మగారి బిరుదులు ఎన్నో ఉన్నాయి .అందులో కవి రాజ మౌళి ,కవి శిరోమణి ,మధురభారతి ,పండిత పరమేశ్వర ,కవి వతంస ,సత్కవీంద్ర ,విద్వత్కవి పుంగవ ,అభ్యుదయ భారతి ,సాహిత్య సాగర ,కవివల్లభ ఆంద్ర గోవర్ధన ,సాహిత్య జగద్గురు ,మధురకవి ,భక్త కవి వరేణ్య ,కవి సార్వభౌమ మొదలైనవి .ఇవన్నీ వారి  విద్వత్తుకు, కవితా పాండిత్యానికి, శేముషీ గరిమకు లభించిన అన్వర్దాలైన బిరుదాంకితాలే .ఈనాడు మున్నగు తెలుగు పత్రికలు   శర్మగారి కవితా సామర్ధ్యం పై అనేక వ్యాసాలు రాశాయి .కవిత్వం వీరికి వాచో విదేయం .సుగమం, సుందర పద గు౦ఫన తో ,అనితర సాధ్య శైలీ నిర్మాణం తో శర్మగారి కవిత్వం శోభిల్లు తుంది .పద్యం లోనూ ఆధునిక భావాలను అలవోకగా చెప్పగల నేర్పు వారిది .ఆధునిక భావాలనూ సమాదరించి పాత కొత్తలకు మేలు వంతెన నిర్మించారు .

   ఇంతటి ఉత్కృష్ట రచనలు చేసి ,పలుసన్మానాలు ,బిరుదులూ  పొందిన  కవి శేఖరులు,జ్ఞాన వయో వృద్ధులు శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు గుంటూరు జిల్లా స్వగ్రామంలో శేష జీవితం గడుపుతున్నారు .  ప్రభుత్వం వారి దృష్టి ,మహా మహా సాహిత్య సంస్థల దృష్టి ,  ,సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే  పత్రికల దృష్టీ,,విశ్వ విద్యాలయాల దృష్టి  ఈ పండిత కవి శ్రేస్టుని పై ప్రసరించకపోవటం విచారకరం .శర్మగారు  ప్రస్తుతం ‘’పేటికా౦తర్గత మాణిక్యం ‘’లాగా ఉండి పోయారు .వారి ప్రజ్ఞా పాండిత్య కవిత్వ శేముషీ వైభవాన్ని గురించి  ఈ తరం వారికి తెలియ జేయటానికి రమ్య భారతి సంపాదకులు,సాహితీ సుమనస్కులు  శ్రీ చలపాక ప్రకాష్ గారు పూనుకొన్నందుకు అభినందిస్తూ , ,రాసే బాధ్యత నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తూ   .అంతటి కవితావతంసుని పరిచయం  చేసే భాగ్యం ,అదృష్టం నాకు కలిగినందుకు  ధన్యుడనయ్యానని వినమ్రంగా విన్నవించుకొంటున్నాను .

‘’తే వంద్యా స్తే మహాత్మానః –తేషాం లోకేస్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని -యే చ కావ్యే ప్రతిష్టితా’’.

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూడవ జల’’ప్రళయ౦ ‘’

       

చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి  బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక  రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ ఉప్పెన పై ఎన్నో కథలు, గాథలు , దీర్ఘ కవితలు వెల్లువలా వచ్చాయి .రమ్య భారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ,కవి, కథకుడు, విమర్శకుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇప్పటికే ‘’ప్రళయం ‘’నేపధ్యంగా రెండు కథా సంకలనాలు ప్రచురించి  ,మూడవ సంకలనం గా ముగ్గురు రాసిన మూడే మూడు కథలతో ‘’మూడవ ప్రళయం ‘’సృష్టించి ఈ ఏప్రిల్ లో ఆవిష్కరణ జరిపారు .ముచ్చటైన ముఖచిత్రం తో ,ప్రళయం సృష్టించిన దృశ్యాలతో  లోపలి అంశాలకు ఆనవాలుగా పుస్తకం బాగుంది . ఏదో పని మీద నిన్న మా ఇంటికి వచ్చి  ‘’ప్రళయం ‘’తో పాటు మరికొన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళారు .ఇవాళే అన్నీ చదివేశాను .

  ఈ మూడూ మూడు ప్రాంతాలలో అంటే కృష్ణానది ఉపనది అయిన తుంగ భద్ర తీరాన ,కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ లో,సముద్ర తీరాన కృష్ణాజిల్లా ఎదురు మొండి గ్రామాన జరిగినట్లు రాయబడిన  కథలు.మొదటి కథ’’నేనున్నానుగా ‘’ రచయిత శ్రీ రంగనాథ రామ చంద్ర రావు .రెండవది ‘’ప్రళయం ‘’పేరుతొ చలపాక కథ.మూడవ కథ’’మరో ఉప్పెన ‘’శ్రీ వడలి రాధాకృష్ణ రాశారు .జల ప్రళయం వస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ,జీవితాలు ఎలా ఛిద్రమై అస్తవ్యస్తమౌతాయో ,కన్నబిడ్డలు, భర్తా భార్య ఎలా ఎడబాటుకు గురై పోతారో ,ప్రళయం మనుషుల మెదళ్ళలో ఎలాంటి ఆలోచనల సుడి గుండాలు రేపుతాయో ,ఎందరు వీటికి తట్టుకుంటారో ,ఎందరు ఆ ప్రభావానికి లోనై జీవిత  గమ్యాలను  ఆపేక్షాను రాగాలను కృష్ణార్పణం చేస్తారో తెలియ జెప్పిన ఆణిముత్యాలైన కథలివి .

 తుంగ భద్ర తీరాన  ఒక వైష్ణవ కుటుంబం లో చాలాకాలంగా మంచం పట్టిన  ముసలి తండ్రి కొడుకు ,కోడలు ,చిన్నారి మనవడు ల గురించిన దే మొదటిది . సంప్రదాయాన్ని చక్కగా కాపాడుకుంటున్న కుటుంబం అది . మామగారిని తండ్రిలా చూసుకుంటున్న కోడలు ,కోడల్ని కూతురిలా ఆదరిస్తున్న మామగారు .తండ్రికి ఏ లోటూ రానీకుండా కాపాడుకుంటున్న కొడుకు వీరందరి ప్రేమానురాగాలు పొందిన చిన్నారి బాలుడు .హాయిగా సాగుతున్న జీవితం లో ఒకరోజు అకస్మాత్తుగా తుంగ భాద్రానది ఉత్తుంగ తరంగాలతో ఎగసి రాకాసిలా ఊరి మీద విరుచుకు పడింది. ఆగాలికీ నీటి వేగానికీ ఏదీ ఆగటం లేదు . చిన్నారి కోసం తండ్రి వెతుకులాట ,గదిలో ముసలాయన కు  గుండెలలో తెలీని కలవరపాటు .ఇలాంటివి ఎన్ని చూశాడో పూర్వం .పదేసి నిమిషాలకోసారి మామగారికి ధైర్యం చెపుతోంది కోడలు విశాలాక్షి .ఆమె మనసులో భర్త ప్రహ్లాదాచారి ,కొడుకు చిట్టి మాధవుడు ఏమై పోయారో అన్నఆరాటం .ఇళ్ళల్లోఉండవద్దు ఖాళీ చేసి పొమ్మని అధికారుల ఆజ్ఞలు . దిక్కు తోచని స్తితి. ఆమె మామగారిని ఒంటరిని చేసి వెళ్ళ లేదు .ఇంటిలోని కొద్దిపాటి దనం సొమ్ములు  మూటకట్టి భర్తకిచ్చింది . లాగికోట్టిన ప్రవాహానికి అతడు ప్రవాహం లో ఎదురీదుతూ ,కొడుకుని పొదివి పట్టుకుని  సహాయకుడు వెంకన్న ఆసరాగా ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తున్నాడు .కానీ విధి బలీయం .మామగారి దగ్గరకొచ్చి ‘’మీఅబ్బాయి మనవడు కులాసాగా ఉన్నారు ‘’అని ముసలాయనకు ధైర్యం చెప్పింది ..భయపడవద్దని మామగారిని పసిపిల్లాడిగా ఒడిలోకి తీసుకున్నది ఆ మహాతల్లి విశాలాక్షి .అంతే క్షణం లో ఆగది కూడా నీటిలో మునిగి మామా కోడలు జలసమాధి చెందారు .

  మర్నాడు అంతా ప్రశాంతమే.ప్రహ్లాదా చారి తన ముందున్న మూట తెరిచాడు .అందులో డబ్బు నగలతో తనవి కొడుకువి మాత్రమె  బట్టలున్నాయి .భార్య చీర ఒక్కటికూడా లేదు కు౦గి పోయాడు ఆచారి .మామగారికి చివరదాకా ‘’ననేనున్నాను ‘’అని భరోసా ఇచ్చి రక్షించి ,చివరికి తల్లీ కొడుకు లాగా మామగారు ,కోడలు భద్రం అనుకున్న  తుంగ భద్ర ఉగ్రత్వానికి బలై పోయారు .కన్నీళ్లు తెప్పించే సంఘటన .చిక్కని కధనం .మామంచి కధ.

  శ్రీ ప్రకాష్ రాసిన ‘’ప్రళయం ‘’లో కృష్ణా నది ప్రళయమేకాదు ,వార్తా చానళ్ళ భయోత్పాతక  కదన ప్రళయాలూ ఉన్నాయి .క్రష్ణాతీరాన బెజవాడ దీని నేపధ్యం.డబ్బు మీద యావ ఉన్నవాళ్ళు తలిదండ్రుల సంగతే మర్చి పోతారని ,తాను సురక్షిత ప్రాంతానికి వెడతానని వెళ్ళిన కొడుకు అక్కడి జలప్రళయానికి  ఏమై పోయాడాఆనే ఆరాటం పడే తండ్రీ ,నిమిషానికో వార్త సృష్టించి ప్రజలకు ధైర్యం ,ఊరట ఇవ్వాల్సిన చానళ్ళు ,జరిగే దానికి చిలవలూ పలవలూ చేర్చి వండి వడ్డించే  వ్యంగ్యాస్త్రాలు సంధించే అంశమూ ఇందులో ఉంది .చానళ్ళలో వచ్చే వార్తలు క్లోజప్ లో పదేపదే చూపిస్తుంటే చూసి చూసి ఆకుటుంబ యజమాని రంగారావు గారికి మున్నెన్నడూ రాని గుండేనొప్పి అకస్మాత్తుగా వచ్చి కుప్పకూలి మరణించాడు .సహాయం అందించే దిక్కే లేదు .అందరూ ఉన్నా ఒంటరి వాడయ్యాడు .దీన్ని చక్కని కథా౦శ౦ గా చలపాక మలచిన తీరు బాగుంది .చివర్లో ఆయన సంధించిన ప్రశ్నలు ‘’ఇంతకీ రంగారావు గారి దుస్తితికి కారణం ?ప్రకృతి చిందించిన విలయ తాండవమా ?ముంచెత్తిన జలప్రలయమా ?క్షణ క్షణం టివి లుకధలు సృష్టించి భూతద్దం లో క్లోజప్ గా  బ్రేకింగ్ న్యూస్ గా చూపించటమా ?దీనికి ఎవరు బాధ్యులు ?సమాధానం చిక్కని ప్రశ్నలివి .

 మూడవదైన ‘’మరో ఉప్పెన ‘’. ఎదురుమొండి గ్రామం దివి ఉప్పెనకు ఒకసారి అతలాకుతలమై మళ్ళీ కోలుకున్నది.ఇప్పుడు మళ్ళీ ఉప్పెన ప్రమాదం.ఒక వైపు ఉప్పెన ముంచెత్తుకొస్తుంటే అమృత భర్త లో ప్రణయం ప్రళయమై వాంఛ తీర్చు కొనేదాకా వదలలేదు .ఉద్ద్రుతమైన తుఫానులో అందరూ చెల్లాచెదరయ్యారు..భర్త అనాధ శవమై దహనమైపోయాడు .కొడుకు  కనిపించలేదు .కొడుకు అమ్మకోసం పలవరిస్తున్నాడు రామకృష్ణ సేవా సదనం  లో .అమృత కాలక్రమం లో మరో అతన్ని చేరి ,లోపల కొడుకు మీద మనసునిండా ప్రేమున్నా ,సుఖ సంపదలకు బానిసై ,ఆ కొడుకు ను తెలిసినవాళ్ళు తీసుకుని వస్తే వాడు తనతల్లి ఎప్పుడూ తనను మర్చిపోదన్న గాఢమైన నమ్మకం తో ఉంటే ,ఆమె తెగించి,గుండె రాయి చేసుకుని , కడుపులో బడబాగ్ని  దహిస్తుంటే ,ధైర్యంగా తాను అమృత కాదని  తనకు కొడుకే లేడని చెప్పి ఆ కుర్రాడి మనసులో ప్రళయమే సృష్టించింది .విధి వైపరీత్యం .ప్రళయం సృష్టించిన మరో విచిత్రం ఇది .

  ఈ మూడిటి లో మొదటికథ సాంద్రం గా ,ఆర్ద్రం గా ఉంది .గుండె లోతులను తడిమింది .కోడలి త్యాగానికి పరాకాష్ట గా నిలిచింది .రెండవది లోకరీతి .కధనమూ బాగానే ఉన్నది .మూడవ దాంట్లో  కృత్రిమత కనిపిస్తుంది .పలచబడిన కధనం అనిపించింది .సాగతీత విసుగు తెప్పిస్తుంది .

 అందరు చదవాల్సిన కథా సంకలనం ‘’ప్రళయం ‘’

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

        ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

ఒకప్పుడు నూజి వీడు   చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ  ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది . అన్నం కూడా తినాలని పించేదికాదు.కాని పచ్చి పెద్దరసాలను ఆవకాయ వేసుకోవటానికి బాగా ఉపయోగించేవారు .ఇప్పుడు పెద్దరసాలు కరువై పోయాయి .చిన్నరసం కోలగా  ముడుతలతో ,పసుపు రంగు చాయతో ,చిక్కని రసం తో పరమమాదుర్యంగా తీపికే తియ్యదనం ఇచ్చేట్టు గా ఉంటాయి ,ఉండేవి .వీటిని భోజనం లో చివరగా పెరుగన్నం లేక మజ్జిగన్నం లో ముద్దముద్దకూ ఒక రసాన్ని జుర్రుతూ మహా ఇష్టంగా తినేవాళ్ళం .మా  పిల్లల,మనవళ్ళ కాలం లో కూడా అందరం చాలా ఆనందం గా నూజివీడు చిన్న రసాల వైభవాన్నిఅనుభవించాం  ,’’విస్తూనే ‘’ఉన్నాం  ,కాని ఇదివరకటి మాధుర్యం ,రంగు రుచీ వాసనా అసలు కనిపించటమేలేదు గత ఎదేనిమిదేళ్లు గా .తేడా ఎక్కడ వచ్చిందో తెలీదు కాని ,చిన్నరసం పేరుతో నానా చెత్తా చెదారం అమ్ముతున్నారు .చూడటానికి రసం ఆకారమే కాని రుచిలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా .బండ్లమీద కాని కొట్లలో కాని ఉన్న రసాలను  కొందామని పండుతీసుకుని వాసన చూస్తె  ,చిన్న రసం వాసన వస్తే ఒట్టు .అంతా దగా మోసం .రేటు మాత్రం ఆకాశంలోనే .

  అయిదారేళ్ళ క్రితం చిన్నరసాన్ని తోతాపురి అంటే కలెక్టర్ మామిడితో బ్లెండ్ చేసి రసం పేరు తో అమ్మారు .కొంతవరకు రుచిగానే ఉండేవి .చిన్నరసాలలో చెట్టుకు పండిన పళ్ళ రుచి చెప్పనలవి కాదు .చెట్టు కాపు అయి పోయె సమయం లో చిన్నరసాలలో ‘’కొసకాయలు’’పండ్లు గా అమ్ముతారు .రేటు తక్కువే కాని వీటి మాధుర్యం, రుచి న భూతో గా గా ఉంటుంది .పాతిక చెల్లగా పాతిక కొనటమే పని .మా వాళ్ళందరూ మహా ఇష్టపడి తింటారు . వీటిని  నేను పెట్టిన ముద్దుపేరు ‘’తుప్పులు ‘’.తుప్పులు కొన్నాను ఇవాళ ‘’అని రాస్తే మా అమ్మాయి అబ్బాయిలు మనవళ్ళు అందరూ అర్ధం చేసుకుంటారు .ఇటీవల తుప్పులూ దొరకటల్లేదు  . రెండేళ్ళ నుంచి చిన్నరసం పేరుతో పెద్ద మోసమే జరుగుతోంది .వీటిలో చెరుకు రసాలు ,నల్లరసాలు వగైరా పనికిమాలినవన్నీ కలుపుతున్నారు .ఊరగాయ అంటే మాగాయ కు చిన్న రసం నంబర్ వన్.మంచి ముదురు టెంకఉన్న  కాయలు వచ్చేదాకా ఆగి మాగాయ వేసేవాళ్ళం .తొక్కుడు పచ్చడికి తెల్లగులాబి లేక నాటు రకాలు వాడేవాళ్ళం .పెద్ద రసాలు తగ్గాక అదే సైజు లో లేక అంతకంటే పెద్ద సైజులో సీజన్ చివర్లో వచ్చే ‘జలాలు ‘’అనే రకం ఆవకాయకు శ్రేష్టం గా ఉంటుందని వేస్తున్నాం .కాయ 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది .కాని దాని రుచి దానిదే ఊరగాయకు .సీజన్ చివర్లో కోతిముడ్డి మామిడి పళ్ళు  లేక నీలాలు వస్తాయి ఇవి పెద్దగా రుచిగా ఉండవు .రసాలు తిన్న నోటితో వాటినీ తోతాపురి పళ్ళను తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది జిహ్వ చాపల్యానికి తప్పదు కదా తింటాం .బంగినపల్లి మామిడి చెక్కుమీద మచ్చలు వస్తే బాగాముదురు అని అర్ధం దీని రుచి అద్భుతః .వీటిలో అవనిగడ్డ కాయ సీజన్ చివర్లో వస్తాయి .వీటి రుచి ఇక దేనికీ రాదు ఉండదు .అంత గొప్ప పళ్ళు అవి .ఇవికాక ఇప్పుడు చిన్న సైజు బంగినిపల్లి అంత పళ్ళు వస్తున్నాయి ఎక్కడినుంచో ఫర్లేదు .

  అమెరికాలో మాఅమ్మాయి విజ్జి మామిడిపళ్ళు పటేల్ బ్రదర్స్ నుంచి బాక్సులకు బాక్సులు కొంటుంది అవీ మన రాసాలులాగా కింద కొన తేరి  పసుపు రంగులో ఉంటాయి .వీటి రుచీ బాగానే ఉంటుంది .

    ఆంజనేయ స్వామికే ‘’షటగోపం ‘’

  శ్రీ హనుమజ్జయంతికి ముందు రోజు ప్రతి ఏడాదీ స్వామివార్లకు మంచి శ్రేష్ట మైన రసం మామిడి పండ్లు కొని పూజ చేసి మర్నాడు  కల్యాణం అవగానే ప్రసాదంగా అందరికీ ఇవ్వటం అలవాటు .నిరుడు మేము మేము అమెరికా లో ఉన్నాం కనుక మా అబ్బాయి రమణ పళ్ళు కొని ఘనంగా పూజ చేయించి సద్వినియోగం చేశాడు .ఈ ఏడాది కూడా వాడికే అప్ప జెప్పా .సాధారణం గా ఉయ్యూరు కూరగాయల మార్కెట్ కు నూజివీడు ,పరిసర ప్రాంతాలనుంచి  రైతులు బుట్టల లలో మామిడిపళ్ళు తెచ్చి వేలంపాట ద్వారా అమ్ముకుంటారు .వేలం నిర్వహించేది శ్రీ జ౦పాన పరమేశ్వరరావు కుటుంబం .ఆకుటుంబం లో శ్రీ పూల’’ఇప్పుడు ఉయ్యూరు నగర పంచాయితి చైర్మన్ కూడా .ఆయన ద్వారానే పాట లో మామిడిపళ్ళు కొనటం అలవాటు .అలాగే ఈ ఏడాది హనుమజ్జయంతి రోజున మా వాడు ఆయన ద్వారా పాట ద్వారా 1100 చిన్నరసాలున్న గంపలు  కొన్నాడు గంపకు 50 పళ్ళు ఉంటాయి .ఇందులోనూ మోసమే .గంపలో పై వరస పండ్లకూ  కిందవరస పండ్లకు అసలు సంబంధమే ఉండదు .పైన బాగుంటాయి కిందకు వెళ్ళినకొద్దీ  సైజు తగ్గుతాయి కాయల నాణ్యతా బాగా తగ్గిపోతుంది .ఇదో రకం మోసం .దీనికి ఎవర్ని బాధ్యులని చేయాలో తెలియదు .సరే పళ్ళు గుడికి చేర్చి సహస్రనామ అష్టోత్తరాలతో పూజ చేశాం కిందవరుస కొంచెం పచ్చి రకం వి ,ఆ పై వరుస మధ్యరకం, ఆ పైన పండినపండ్ల ను పేర్చిజాగ్రత్త వహించి  పూజ చేయించాం .కన్నయ్య అనే ఆతను అరటి గెలలు మూడు ఇచ్చాడు ఖరీదుకే .అవీ నాణ్యంగా లేవు .చూడటానికే మనసొప్పలేదు .

కల్యాణం రోజు మా కోడళ్ళు వాళ్లకు సహాయం గా శ్రీదేవి, అమ్ములు అందరికీ  పంచారు .శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు దీన్ని దగ్గరుండి పర్య వేక్షించారు .ఆ రోజు రాత్రి మా పెద్దబ్బాయి శాస్త్రివాళ్ళు హైదరాబాద్ వెడుతుంటే వాళ్ళకూ ,మా అక్కయ్యా వాళ్ళకూ ప్రసాదంగా పండ్లను అట్ట పెట్టేలలో పెట్టి పంపించాం .ఎలా ఉన్నాయో తెలీదు .

  మేము కొన్ని పండ్లు ఉంచుకున్నాం .నిన్న వాటిని తిందామని చూస్తె ఆ పళ్ళు ‘’ఒకమ్మకూ ఒక  అబ్బకూ పుట్టిన’’పళ్ళు లాగా లేవు .అసలు రసం వాసనే లేదు, సైజూ లేదు,ఆ ముడతలూ లేవు .బలవంతాన ఒక పండు తిందామనుకొంటే వెగటు వాసన. కడుపులో దేవేసి నట్లుంది. డాగులు, కంపు,దుర్వాసన .కనుక వీటిని తినలేము అని నిర్ణయానికి వచ్చి ,మా అమెరికా మనవళ్ళకు,ఇక్కడి మనళ్ళు మనవరాళ్ళకూ  మామిడి తాండ్ర బాగా ఇష్టం కనుక వాటిని పిసికి జ్యూస్ చేసి  కాచి పళ్ళాలలో ఎండలో  ఆరబెట్టి తాండ్ర చేద్దామనుకున్నాం .నిన్న, ఇవాళ ఆ  నేనె కస్టపడి ఆ పళ్ళను పిసికి రసం తీశా. పిసుకు తుంటే వచ్చిన వాసన భరించ లేక పోయా.  నాముక్కులో ఆ వాసన తిష్ట వేసుకుని పోయింది . తర్వాత ఏది వాసన చూసినా ఆ కంపు వాసనే వస్తోంది .చివరికి సెంటు కూడా .ఇంతటి దారుణం ఎప్పుడూ లేదు .భక్తులు ఎలా వాటిని తిన్నారో మా  శాస్స్త్రి వాళ్ళు, బావగారు వాళ్ళు ఎలాతిన్నారో దేవుడికే ఎరుక .ఇంతకంపు హనుమ ఎలాభరించాడో ?ఇంతటి ఘోర అపచారం రసం మామిడి పండ్ల రూపాన దేవునికి ,భక్తులకు కలిగింది .మా తప్పుకాకపోయినా  ”తిలాపాపం తలాపిడికెడు ”గా బాధ్యతమాదే  కనుక సవినయంగా శ్రీ స్వాములవారికీ భక్తులకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం .మళ్ళీ ఇలాంటి మోసం జరగకుండా జాగ్రత్త వహిస్తాం .ఇక తాండ్ర ఎలా ఉంటుందో .ఈ కంపు అమెరికా దాకా పాకుతుందేమో అని భయంగా ఉంది .

  ఈ ఉదంతం  మాకు ఒక గుణ పాఠం నేర్పింది . కొనే మామిడిపళ్ళను  జాగ్రత్తగా పరిశీలించి ,కొంచెం రేటు ఎక్కువైనా నాణ్యత గల వాటినే కొనాలి . ఇలా సంతలో పాటగా మొహమాటపడి   చవకగా వస్తాయని కొంటె  ఇలానే జరుగుతుంది .మరో విషయం జయంతికి ముందురోజే తమలపాకు పూజ భారీగా చేసి జయంతి , కల్యాణం నాడు సుమారు 500 మంచి నాణ్యత ఉన్న రసాలు కొని పూజ చేసి కల్యాణం అవగానే అందరికీ పంచిపెడితే బాగుంటుంది .ఇక రాయలేను కడుపులో’’ మోసం రసం వాసన ‘’గుప్పుమంటోంది .శ్వాసతో అది మీకూ  ఇబ్బంది కలిగించవచ్చు .ఈ కంపు ను ఇక్కడితో గడిగేసుకుంటూ ,మరొకసారి మన్నించమని విజ్ఞప్తి చేస్తూ –

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   బుడ్డికి ”బుడ్డి ”

బుడ్డికి ”బుడ్డి ”

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామివార్ల  పరమభక్తుడు ,కార్తీక దీపోత్సవ విజయాలకు హంగుదారుడు ,సరసభారతి కార్యవర్గ సభ్యుడు”బడ్డీ  బుడ్డి”అని మేమంతా ఆత్మీయంగా పిలిచే బుడ్డి  కి ఈ రోజు ”బుడ్డి ”జన్మించి అందరకు ఆనందం పంచాడు వాళ్ళ కుటుంబానికి శ్రీ స్వామి వారల శుభాశీస్సులు .మా అందరి అభినందనలు -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

  నాదారి తీరు -111

అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

                     విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం

ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని ఆర్యవాక్యం కదా .కనుక లోటు మనదగ్గర పెట్టుకుని పిల్లలపై నెపం వేయటం న్యాయమా అని వితర్కి౦చుకున్నాను .పిల్లలలో నైపుణ్యం ఉన్నవారిని శోధించి పట్టుకున్నాను .వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళేమీ కాదు .సానబెడితే రాటు దేలే వాళ్ళు .వివేకానందస్వామి చికాగో లో చేసిన ప్రసంగానికి శతజయంతి దేశమంతటా ఉవ్వెత్తున జరుగుతోంది .మన స్కూల్ లో కూడా ఆయన స్పూర్తి నింపాలి అనే ఆలోచన వచ్చింది .దీనికోసం స్క్రిప్ట్ తయారు చేయాలి .పిల్లలను ఎంపిక చేసి వాళ్లకు చదవటం నేర్పించాలి .తప్పులు దొర్లకుండా చూడాలి .ఎన్నో రిహార్సిల్స్ చేస్తేనేకాని ఇది సాధ్యమయ్యే పని కాదు .పిల్లి మెడలో గంట ఎవరుకట్టాలి ?ఆలోచన నాదే కనుక ఆచరణా నాదే .అన్ని వార్తాపత్రిఅకలలో మాస వార పత్రికలలో ని విషయాలన్నీ సేకరించి విద్యార్ధుల స్థాయికి తగినట్లు వాళ్ళు సరదాగా మాట్లాడుకునే భాషలో ఒక రూపకం తయారు చేశా .చాలా బాగా వచ్చిందని పించింది .మగపిల్లలకంటే ఆడపిల్లల ఉచ్చారణ బాగా ఉందని పించి ముగ్గురు విద్యార్ధినులను ఎంపిక చేసి మధ్యాహ్నం ఇంటర్ వెల్ సమయం లో వాళ్ళకూ నాకూ ఖాళీ ఉన్న పీరియడ్స్ లో లేకపోతె స్కూల్ అయ్యాక ఒక అరగంట ప్రాక్టీస్ చేయించి ,స్క్రిప్ట్ చేతిలో నేఉంచుకుని చదివించా .బాగా చదివారు.  నా ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టు గా చదివారు .దీనిని టేప్ రికార్డర్ పై రికార్డ్ చేయించి ముందుగా వాళ్ళకే వినిపించా .వాళ్ళే ఆశ్చర్యపోయారు అంతబాగా తాము చదివామా అని .తర్వాత మీటింగ్ హాల్ లో చికాగో సభ శతజయంతి ఘనంగా చేశాం .నేను మాట్లాడి  మిగిలిన టీచర్స్ తో మాట్లాడించి ,ఒకరిద్దరు స్టూడెంట్స్ తోనూ దాని ప్రాధాన్యాన్ని వివరి౦పజేసి  చివరికి నేను తయారు చేసిన రూపకాన్ని ప్రదర్శింప జేయించా .పిన్ డ్రాప్ సైలెన్స్ గా విద్యార్ధులందరూ శ్రద్ధగా విన్నారు .వివేకాన౦దుని ప్రసంగం చాలా స్పూర్తిదాయకం గా చదివారు అందులో .చప్పట్లు మోగిపోయాయి నాన్ స్టాప్ గా .పాల్గొన్న విద్యార్దినుల పేర్లు నాకు గుర్తు లేవు .కాని గ్రాండ్ సక్సెస్ .ఇసుకలో కూడా తైలం తీయవచ్చు ననే ధీమా కలిగింది .పిల్లల తప్పు ఏమీ లేదు మన ప్రయత్న లోపమే అని అందరికీ తెలిసింది .ఊళ్ళో వాళ్లకు ఈ రూపకం విషయం తెలిసి మమ్మల్ని బాగా అభినందించారు .మా ప్రతి సభలో స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ రామ బ్రహ్మం గారు ఉండేట్లు చేసేవాడిని .పిల్లలలో ఆత్మ విశ్వాసం పెరిగింది .అదే నాకు కావలసింది .

            ఎంట్రన్స్ పరీక్ష కు ఒకే ఒక విద్యార్ధి

  రోజులు బాగానే గడిచిపోతున్నాయి .రోజూ ఉయ్యూరు నుంచే వచ్చి వెడుతున్నాను .మా దగ్గర పని చేస్తున్న సోషల్ మాస్టారు శ్రీ చీలి వెంకటేశ్వరావు గారు పామర్రు బదిలీ చేయించుకున్నారు .ఆయన స్థానం లో మేడూరు లో ణా దగ్గర పని చేసిన పామర్రు నేటివ్ మస్తాన్ గారు వచ్చారు .రావు గారు ఆయన చాలా కష్ట పడి బోధించేవారు .పిల్లలపై గొప్ప గ్రిప్ ఉండటమేకాదు వాళ్ల అభిమానాన్ని బాగా పొందారు .ఆయన మాట వేద వాక్కు గా ఉండేది వాళ్లకు .నాకు అత్యంత ఆప్తులు గా ఉండేవారు చిరునవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉండేవారు .   ఆయన ఒక రోజు వచ్చి తన ఒక్కగానొక్క కూతురు నాగ లక్ష్మి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష అడ్డాడలో రాసి జాయిన్ ఆవాలను కుంటో౦దని తనకూ ,ఆ ఆలోచన నచ్చిందని కనుక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించమని కోరారు .అప్పటికి నేను చేరి రెండేళ్ళు అయింది .ఎవరూ ఇలా అడగలేదు .సాధారణంగా పెద్ద హైస్కూల్స్ అంటే పామర్రు ఉయ్యూరు లాంటి చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తారు .ఇక్కడ నాకు మొదటి అనుభవం .ప్రశ్నా పత్రాలు  మా టీచర్స్ తోనే తయారు చేయించి దిద్దించి ఫలితాలు ప్రకటించాలి .స్టాఫ్ మీటింగ్ పెట్టి సంప్రదించాను .మనదగ్గర పని చేసిన మాస్టారు కనుక ఆయన అభ్యర్ధన మన్నించటం న్యాయం అన్నారు .సరే అని  ఆ కార్యక్రమ షెడ్యూల్ ప్రకటించి ,ప్రశ్నాపత్రాలు తయారు చేయించి పరీక్షలు నిర్వహించాం .నాగ లక్ష్మి ఒక్కతే పరీక్ష రాసింది . ఆ చిన్నారి కోసమే ఇంత ఏర్పాటు .పరీక్షలన్నీ బాగా రాసింది .పేపర్లు స్కూల్ లోనే దిద్దించి మార్కులతో సహా ఫలితాలు ప్రకటించి నాగలక్ష్మి ఉత్తీర్ణు రాలైనట్లు ప్రకటించి పై అధికారులకు వర్తమానం పంపాను .నాగ లక్ష్మి సన్నగా చలాకీగా ఎర్రగా చందమామ లాంటి వెడల్పు ముఖంతో ఆకర్షణీయంగా ఉండేది .ఆరవ తరగతి లో చేరి ,నేను ఇక్కడ రిటైర్ అయ్యే నాటికి అంటే జూన్ 1998 కి పదవ తరగతి స్కూల్ ఫస్ట్ గా వచ్చి పాసైంది .ఆ అమ్మాయి ఇక్కడ చేరటం తో మాకు ఆటలలో, పాటలలో ,సాంస్కృతిక కార్యక్రమాలలో  గొప్ప సహకారం లభించింది ఈ అయిదేళ్ళు .అన్ని సబ్జెక్ట్ లలో ఫస్ట్ మార్కులు సాధించేది .ఎప్పుడూ స్కూల్ బెస్ట్ ఆ అమ్మాయే .టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చినందున నేను రిటైరయిన సంవత్సరమే మా తలిదండ్రుల పేరిట స్కూల్ ఫస్ట్ విద్యార్ధికి 500రూపాయలు నగదు బహుమతి ప్రకటించి మొదటి సారిగా నాగలక్ష్మికి అంద జేశాను . ఆతర్వాత నాలుగైదేళ్ళు ఇక్కడి స్కూల్ ఫస్ట్ విద్యార్ధికి నగదు బహుమతి అందజేశాను తర్వాత నా ఆరాటమే కాని స్కూల్ వాళ్లకు ఎవరికీ పట్టలేదు ఉత్తరాలపై ఉత్తరాలు రాసి ,విసుగు చెంది వదిలేశాను .నాగలక్ష్మి  మా అందరి మనసులను గెలిచిన చిన్నారి అయింది .డిబేటింగ్ లో వక్తృత్వం లో  ,పాటలలో వ్యాసరచానలో కబాడీలో  ,ఖో ఖో ఆటలో ,త్రో బాల్,ఒకటేమిటి అన్నిటిలో తన సృజన ,ప్రజ్ఞా,ప్రతిభ చాటుకున్న విద్యార్ధిని నాగ లక్ష్మి .మా కార్యక్రమాలను తన ఇంట్లో ఉన్న ఫిలిప్స్ టేప్ రికార్డర్ పై రికార్డ్ చేసి భద్రపరచిన ఆలోచనా శీలి అవి అన్నీ నాదగ్గర క్షేమ౦గా ఉన్నాయి .

 టెన్త్ అవగానే ఆ అమ్మాయి గుడివాడలో చేరి ఇంటర్ చదివి మంచి మార్కులతో పాసైంది.బి టెక్ చదువుతానని పట్టు బట్టింది .తండ్రి నా దగ్గరకొచ్చి సలహా అడిగారు .అంత డబ్బు పెట్టి చదివి౦చలేను .ణా ఆరోగ్యమూ అంతంత మాత్రం అన్నారు .’’మీ ఆలోచన సరి అయినదికాదు ఆ అమ్మాయికి ఇష్టమైన చదువు చదివించాలి .అందులో చదివి సాధించగల తెలివి తేటలున్న వాళ్ళను వెనక్కి లాగటం భావ్యం కాదు .మీకు ఆర్ధికంగా ఇబ్బందే కాదనలేను ఆ అమ్మాయి స్కాలర్ షిప్  లు తెచ్చుకుని మీకు ఆర్ధిక భారం తగ్గిస్తుంది .నా మాట విని చదివించండి ‘’అని సలహా చెప్పాను .’’మీరు చెప్పారు కనుక మీ మాటనాకు శిరో దార్యం .ఎన్ని కస్టాలు పడినా నాగలక్ష్మిని బి టెక్ చదివిస్తాను ‘’అన్నారు అలాగే చదివించారు .ఆ అమ్మాయీ చక్కగా చదివి మంచి మార్కులతో పాసై ,తలిదండ్రులు కుదిర్చిన దుబాయ్ ఇంజనీర్ కుర్రాడిని పెళ్ళాడింది. వివాహాన్ని వెంకటేశ్వరరావు గారు బెజవాడలో మహా వైభవంగా చేశారు .నన్ను తప్పక రమ్మని శుభలేఖ పంపటమేకాక ఫోన్ కూడా చేశారు. వెళ్లి ఆశీర్వ దించి వచ్చాను .ప్రతి జనవరి ఫస్ట్ కు ఆయన ఉయ్యూరు వచ్చి మాకు స్వీట్ పాకెట్, పళ్ళు ఇచ్చి వెళ్ళటం ఆనవాయితీగా చేసేవారు .అప్పటిదాకా నేను దీన్ని సీరియస్ గా తీసుకోలేదు .అప్పటినుంచి నేనూ స్వీట్ పాకెట్ కొని ఇంట్లో ఉంచి జనవరి ఫస్ట్ గ్రీటింగ్స్ తెలిపినవారికి స్వీట్ ఇవ్వటం అలవాటు చేసుకున్నాను .దీనికి నాకు ఆదర్శం  నాగలక్ష్మి తండ్రిగారు వెంకటేశ్వరరావు గారే .అడ్డాడలో నాగలక్ష్మి పుట్టిన రోజు పండుగలు , ఆమె బంతి అన్నీ చాలా వైభవం గా చేసి స్టాఫ్ అందరికీ భోజనాలు పెట్టేవారు . ఆతిధ్యం ఇవ్వటం లో ఆయన ఏ లోటూ చేసేవారు కాదు .ఆయనకు ఎలమర్రు దేవాలయం లో అర్చకత్వమూ ఉండేది .అన్నీ యధావిధిగా చేసేవారు .

   రెండేళ్ళక్రితం నాగలక్ష్మి ఫోన్ నంబర్ ఎవరో అడ్డాడ కుర్రాడు ఇస్తే వాట్సప్ లో మాట్లాడా .మద్రాస్ లో ఉంటున్నానని తన తండ్రి గారు చనిపోయారని తెలిపింది .మంచిమనసున్న ఆధ్యాత్మిక పరులు వెంకటేశ్వరావు గారు .అలాగే కాటూరి ఆనంద్ అనే కుర్రాడు ,రైల్వే లో ఇంజన్ డ్రైవర్ అయిన ఇంకో కుర్రాడు బాగా జ్ఞాపకం .వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలలో నాకు బాగా సహకరించారు .వీరందరికంటే బళ్ళారి నుంచి ఇక్కడికి వచ్చి 9 ,10 తరగతులు మాత్రమె చదివి ,అందరికీ తలలో నాలుకగా మెలగిన కోడూరు పావని గురించి ,పద్యనాటకం లో నటించి నాకూ వాళ్ళకూ కీర్తి గడించిపెట్టిన విద్యార్ధుల గురించి వచ్చే వ్యాసం లో తెలియ జేస్తాను .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-18—ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged , | Leave a comment

 బాత్ నీత్

              బాత్ నీత్

గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ  చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే ఉన్నాడు ,వేదాంత ప్రవచనాలతో సామవేదం సాధిస్తూనే ఉన్నాడు ,స్వంత చానలే పెట్టి పరిపూర్ణ స్వామి ప్రవచిస్తూనే ఉన్నాడు ,కాంగీ సాధూ గా ముద్రపడ్డ విశాఖ స్వామి ఆక్రోశం వెళ్ళ బుచ్చుతూనే ఉన్నాడు ,శక్తిపాతం పేరుతో నెత్తిన చెయ్యెట్టి మరో ఆయన జవ శక్తి పూరిస్తూనే ఉన్నాడు ,జగ్గీ వాసుదేవుడు ,రవి శంకర్ మారాజు ,రాం దేవ్ బాబా లు శాయశక్తుల ప్రజలను మంచి మార్గాన నడిపించటానికి కృషి చేస్తూనే ఉన్నారు –కానీ’’ అంటూ ముక్కు చీదుకుని మళ్ళీ మొదలెట్టి ‘’ఇంతమంది ఇన్ని రకాల ధర్మ న్యాయాలు బోదిస్తున్నా ,చానెళ్ళు అణువు ను భూతద్దంలో పెట్టి భయంకరంగా చిత్రిస్తున్నా ,డిబేటింగ్ లపైడిబెటింగ్ లు కండక్ట్ చేసి  అనుక్షణ యుద్ధ వాతావరణాన్ని కలిగిస్తున్నా మనుషులకేమీ భయం లేకుండా పోతో౦దేమిటి?రోజు  రోజుకూ నేరాలు ఘోరాలు ,మోసాలు దగాలు పెరిగిపోతూనే ఉన్నాయి .ఎక్కడా వెనకడుగు వేస్తున్న జాడ కనిపించటం లేదు .ఇదివరకు లేనిది ఇప్పుడు మరీ చిన్నపిల్లలపై అత్యాచారాలు ,వృద్ధులు సైతం కామం తో అకృత్యాలు చేసి సమాజ గౌరవాన్ని భ్రస్టు పట్టిస్తున్నారు బావా .పేపర్ తిరగేయాలంటే భయం, చానల్ చూడాలంటే డోకు గా ఉంది లోకం పరిస్థితి ‘’అని బావురుమన్నాడు .

  బుజం తట్టి ,ఒదార్చా .నిజమే వాడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు యదార్ధం .ఈ నీతి వచనాలు  ప్రవచనాలు  ఉద్గ్రంధాలు ఏమీ ప్రభావం చూపించటం లేదా అనే సందేహం రావటం నిజం .వాడికి నేను ఏం చెప్పి సమాధాన పరచగలను అని పించింది  గొంగట్లో తింటున్నాం అన్న సంగతి గుర్తుకొచ్చింది .డేరాబాబా  ,మొన్నటి గుజరాతీ బాబా,ఆంధ్రా లో ఇటీవల ఎందరో బాబాలు ఎన్ని మోసాలు చేశారో ,ఎంతకు తెగి౦చారో తెలుసు .ఇవి బ్రహ్మికీ తెలియనివికావుకదా అనుకుని ‘’ఇవేరా కోతి చేష్టలంటే .చపల చిత్తాల వెర్రి చేష్టలు ‘’అన్నా .వాడి మొహం లో బల్బు వెలిగింది .’’నిజమే బావా –మంకీ చేష్టలు .అవును మన్కీ  బాత్ విన్నవాళ్ళు అలా చేస్తారంటావా ?’’అన్నాడు .వీడు మోకాలికీ బట్టతలకు లంకె వేస్తున్నాడు అనుకోని ‘’అరే!అది నువ్వు అనుకున్నట్లు  మన్కీ బాత్ కాదునాయనా –మన్ కీ బాత్ –అంటే మనసులోని మాట .ఆయన రేడియోలో జనం తో తనమనసులోని భావాలను పంచుకునే మాటలు .అందులో స్వీయానుభవాలు అవతలి వారిపై సూటీ పోటీ ఉండచ్చేమో.కాని కర్తవ్య పరాయణులను  చేసేందుకే ఆ బాత్ .దానికి పెడర్ధ తీసి ఏవేవో ఊహించి బుర్ర పాడు చేసుకోకు .ఇప్పుడు శాసనాలు పకడ్బందీ గా వస్తున్నాయి.  నేరస్తులు తప్పించుకోలేరు .చంద్ర బాబు అన్నట్లు ‘’ఆంబోతుల్లా రోడ్డు మీద కొస్తే అదే ఆఖరు  రోజు ‘’అని అందరూ తెలుసుకుంటే చిన్నారి  బతుకుల దీపాలు  ఆర్పేసే వారుండరు.’’అని చెప్పి ఊరడించి పంపించా మాబామ్మర్ది బ్రాహ్మి ని.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

   నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

   నాదారి తీరు -110

  అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

             త్రాగు నీరు సరఫరా

ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ  గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి .వేసవిలో నీటి మట్టం తగ్గిపోతుంది .చుట్టుప్రక్కలవాళ్ళు అందరికీ ఈ నుయ్యే శరణ్యం .నీళ్ళు రుచిగా ఉండటం అదృష్టం .నైట్ వాచ్ మాన్ ప్రసాద్ స్కూల్ గదులన్నీ శుభ్రంగా ఊడ్చి,  ప్రతి రెండు తరగతి గదులకు ఏర్పాటు చేయబడిన మంచి నీటి కుండలో నీరు నింపే ఏర్పాటు అప్పటికే ఉన్నది అతడు జాగ్రత్తగానే విధి నిర్వహిస్తున్నాడు .కానీ జనవరి నుంచి నీటి వాడకం ఎద్దడీ ఎక్కువే .అందుకని సైన్స్ మాస్టర్ వేంకటేశ్వర రావు గారితో సంప్రదించి ఏం చేయాలో ఆలోచించాను .అప్పుడు ఆయన లాబరేటరి  లో ఎప్పటి నుంచో ఇనపగోట్టాలు  ,ఒక మోటారు పది ఉన్నాయి .వాటిని సద్వినియోగం చేస్తే బాగుంటుంది అన్నాడు .స్టాఫ్ అస్తుంది తో చర్చించి  మోటారు ను బాగుచేయించే ఏర్పాటు ,ఉన్న తాగు నీటి పంపులకు గొట్టాలలద్వారా కనెక్షన్ ఇప్పించాము .అంటే మోటారు వేయగానే త్రాగటానికి నీళ్ళు టాప్ ల లోకి వస్తాయి  .కొంతకాలం ఇలా గడిపాం .తర్వాత సైన్స్ రూమ్ పై భాగం లో ఒక చిన్న టాంక్ కట్టించి లేక ఉన్నదాన్ని బాగు చేసి టాంక్ కు గోట్టాలద్వారా కనెక్షన్ ఇప్పించాము .దీనితో కరెంట్ ఆదా కూడా చేయగలిగాము .కనుక సమృద్ధిగా త్రాగు నీరు విద్యార్ధులందరికీ అందించ గలిగామన్నమాట .దీనితో ఊళ్ళో  వాళ్లకు పరిసరగ్రామాల వారికి అద్దాడ హైస్కూల్ లో ఏవో  మంచి  మార్పులు జరుగుతున్నాయనే నమ్మకం కలిగింది .విద్యార్ధులకూ గొప్ప తృప్తి కలిగింది .మధ్యాహ్నం ఇంటర్వల్ లో క్లాసులు సాయంకాలం స్కూల్ తర్వాత  ఏడు ,పదీ తరగతులకు రుబ్బుడూ మానలేదు . కష్టపడితేనే మార్కులోస్తాయి అనే నమ్మకం బాగా కలిగించాను .బై పాస్ ఆపరేషన్ కు స్థానం లేదు అని అందరూ గ్రహించారు .

  వరి కోతలు మినప తీతలతో ఆర్ధిక పుష్టి

 ముందే చెప్పినట్లు ఏపనికైనా డబ్బే ప్రధానం .ఇక్కడ అది తప్ప అన్నీ ఉన్నాయి .మరి విద్యార్ధులకు మంచి బహుమతులివ్వాలన్నా గేమ్స్ ఆర్టికల్స్ కొనాలన్నా లాబ్ కు కావలసిన యాసిడ్స్ వగైరాలు కొనాలన్నా డబ్బు కావాలి .ఒక సారి స్టాఫ్ మీటింగ్ లో ఈ విషయమై చర్చించాం .ఒకప్పుడు ఇది హయ్యర్ సెకండరీ స్కూల్ .గొప్ప లాబ్ ఉంది .సైన్స్ రూమ్ లో ణే బోధన చేయటానికి ప్రయోగాలు చేయటానికి అనువుగా బల్లలు టేబుల్స్ ,వగైరా సరంజామా అంతా ఉంది .వాడకం లోకి తెచ్చే స్థితి మాత్రం లేదు .కారణం ప్రయోగాలు చేయటానికి కావలసిన కెమికల్స్ వగైరా లేవు .జిల్లాపరిషత్ ఏడాదికో రెండేళ్ళకో యేవో కొన్ని వాళ్లకు లాభాలు డబ్బూ బాగా గిట్టేవి కొని మొక్కుబడిగా మాకు సరఫరా చేసే వారు .అందులో పనికొచ్చేవి తక్కువే .అలాగే వాలీబాల్ బాడ్ మింటన్ ,టేన్నికాయిట్ బేస్ బాల్ వంటి ఆటలకు కావలసినవి కొనతానికీ డబ్బుకావాలి .కనుక స్కూల్ ఆ ర్ధికంగా పరి పుష్టి పొందనిది ఏమీ చేయలేము అని అందరం నిర్ణయించాం .

  అప్పుడు నాకు ఉయ్యూరు హైస్కూల్ లో అని చేసినప్పుడు పిల్లలతో  వరి కోతలుకోయించటం ,తర్వాత అడ్డాడ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పనిచేసిన బాలబందు ,బాలానందం అన్నయ్య శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారుతన అనుభవాలు గురించి ‘’మహాత్ముల అడుగు జాడలలో ‘’అనే ఆత్మకధ ను మా బావమరది ఆనంద్ నాకు ఇస్తే చదివా.అందులో ఆయన అద్దాడ లో వారి కోతలు కోయి౦చినట్లు రాసిన విషయం గుర్తుకు వచ్చింది .స్టాఫ్ కు ఈ విషయం చెప్పాను .ఎవ్వరూ సందేహించలేదు అందరూ తప్పకుండా చేద్దాం అన్నారు .తర్వాత ఒక రోజు స్కూల్ అసెంబ్లీ లో ఈ విషయం విద్యార్ధులందరికీ తెలియజేశాం .వారు మాకంటే ఎక్కువ ఉత్సాహం చూపించి అందరం పాల్గొంటామని హామీ ఇచ్చారు .హమ్మయ్య మంచి పరిష్కారం  దొరికింది అని అందరం ఊరట చెందాం కమిటీ ప్రెసిడెంట్ రామ బ్రమం గారి చెవిలో కూడా వేయించాం  కూడా ఆయనకు సన్నిహితులైన వారి ద్వారా .ఇక ప్లాన్ అమలు చేయటమే తరువాయి .

 డ్రిల్ మాస్టారు జగన్మోహనరావు గారు తమిరిస బదిలీ అయ్యారు ఆయన స్థానం లో శ్రీ దుగ్గిరాల నాగేశ్వరరావు అనే అంగలూరు నేటివ్ ,ఉత్సాహవంతుడు యువకుడు వచ్చి చేరాడు .ఆటలు ఆడటం ఆడించటం తర్ఫీదు ఇవ్వటం లో క్షణం కూడా తీరిక లేకుండా ఉండేవాడు .మాంచి నమ్మకస్తుడు గొప్ప ఆలోచనా పరుడు కార్య సాధకుడు .దీనితో నాకు కొండంత బలం కలిగింది .రోజూ లాస్ట్ పీరియడ్ లో ఆ తర్వాత సాయంత్రం 6 వరకు వాలీబాల్ ,బాడ్ మింటన్ ఆడేవాళ్ళం . పిల్లలలో కూడా ఆటలమీద బాగా శ్రద్ధ ఏర్పడింది ఆడపిల్లలతో సహా .కోర్టులు వేయాలన్నా కబాడీ కోర్టుకు ఇసుక కావాలన్నా సున్నం వేయాలన్నా ,బాల్స్ కొనాలన్నా డబ్బు కావాలి కనుక అందరం వరి కోతలు కోసి డబ్బు సంపాదించి కూడ బెడదామనే సంకల్పం అందరిలో బలీయమైంది . కనుక ఆటకైనా చదువు కైనా డబ్బు కావాలని గ్రహింపు కలిగింది .ఇనుము వేడిమీద ఉన్నప్పుడే ఎలాకావాలంటే అలా మలచుకోవచ్చు కదా .అదే అమలు చేశాం .

   క్రాఫ్ట్ మాస్టారు మల్లికార్జునరావు  గుమాస్తా అంజిరెడ్డి ,బాలకృష్ణ  వీరభద్రరావు లు ఊళ్ళో కోతకు సిద్ధంగా ఉన్న పొలాలను చూసి  అందులో విద్యార్ధులతో కోత కోయి౦చు కోవటానికి ఇష్టపడేరైతులను  డబ్బు కోసం త్రిప్పించుకోకుండా ఇచ్చేవారినీ ,విద్యార్ధులు ఎక్కువ దూరం నడవకుండా వెళ్ళగలిగే పొలాలను ఏ రోజు కోయాలో బురద లేని పొలాలను   ఎంపిక చేసి ,ఎకరానికి ఎంత ఇస్తున్నారో వాకబు చేసి  మాకు తెలియ జేసే వారు .అసెంబ్లీ లో తెలియ జేసి  ఆ రోజుకు సిద్ధమయ్యే వాళ్ళం .పామర్రు నుంచి పండిన అరటి గెలలు  ,బిస్కట్లు తెప్పించి వాటిని రిక్షాలో కోతకోసే పొలం దగ్గరకు చేర్పించి అందరం స్కూల్ నుండినడిచి వెళ్ళేవాళ్ళం .మాస్టర్లు అందరూ మంచి సహకారం ఇచ్చేవారు .లేడీ టీచర్స్ కూడా సందేహించకుండా వచ్చేవారు .అదొక పండుగ వాతావరణం లాగా అని పించేది .ఇక్కడి విద్యార్ధులు పొలం పనిలో ఆరి తేరిన వాళ్ళే కనుక కోత ఎలా కోయాలో చెప్పే అవసరం లేకుండా పోయింది .ఏడాదికి కనీసం 15-నుంచి 20 ఎకరాలు కోసేవాళ్ళు .వాళ్లకు కడుపునిండా బిస్కట్లు ,అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళం ఎలాగూ వాళ్ల లంచ్ బాక్స్ వాళ్లకు ఉండనే ఉండేది .కనుక ఆకలికి ఎవరూ ఇబ్బంది పడలేదు రైతులు కూడా చాలా హుషారుగా ఇంతమంది మేస్టార్లు విద్యార్ధులు హెడ్ మాస్టారు తో సహా తమ పొలానికి వచ్చారని సంబర పది పోయేవారు ఇంటి దగ్గర ఉప్మా పులిహోర ,టీ చేయించి పాలేల్లతో తెప్పించి మాకు అందించేవారు .చాలా సుహ్రుద్వాతావరణం లో వరి కోతలు జరిగేవి .రైతుల వద్దనుంచి మక్తా కోత డబ్బు తెచ్చి నాకు అందాజేసేవారు దాన్ని పామర్రు ఆంధ్రాబాంక్ లో ఉన్న స్కూల్ జనరల్ ఫండ్ లో జమ చేసేవాడిని .

   వరికోతల తర్వాత అందరికీ మినపతీత తీస్తే బాగుంటుంది అని పించింది .విద్యార్ధులు కూడా చాలా సంతోషం గా ఒప్పుకున్నారు .కోత కంటే తీత కు డబ్బులు బాగా వచ్చేవి .ఏడాదికి కనీసం పది ఎకరాలు మినపతీత తీసే వాళ్ళం .డబ్బు ఇబ్బడి ముబ్బడిగావచ్చి పడిం ది .ఇక దేనికీ లోటు ఉండదు అనుకున్నాం విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించటానికి అవకాశం లభించింది .ఒక ఐడియా జీవిత విధానాన్నే మార్చేసింది .అడ్డాడ స్కూల్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాందీ వాచకం పలికే శుభ ఘడియలు వచ్చాయి .

  ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనం గా జరిపాం .విద్యార్ధులకు అన్ని విషయాలలో పోటీలు నిర్వహించి మంచి మంచి బహుమతులువారి స్థాయికి తగ్గట్లు పాయింట్ల బేస్ పై కొని అందించాం .స్కాలస్టిక్ అచీవ్ మెంట్ కు ఉపయుక్త గ్రంధాలు కొని బహూకరించాం స్కూల్ బెస్ట్ విద్యార్ధులకు జూనియర్స్ సీనియర్స్ లో ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చాం .ఎక్స్ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ లో పాల్గొని గెలుపొందినవారికీ అంద జేశాం  .టీచర్ గేమ్స్ లో గెలిచినవారికీ బహుమతులిచ్చాం .ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ లో చదువుతున్న ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక బహుమతి వచ్చేది .ఇవాళఅన్నీ విద్యార్ధులలో గొప్ప స్పూర్తి దాయకమై ,ప్రేరణకలిగించి  పాఠశాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమయే మనస్తత్వం కలిగింది .పడవ తరగతి ఫలితాలుకూడా క్రమగా పెరుగుతూనే ఉన్నాయి ,అడ్డాడ స్కూల్ అంటే ఒక రకమైన మోజు అందరిలో ఏర్పడింది .ఇది అందరి సమస్టి కృషి ఫలితమే .

  బెజవాడ వెళ్లి నేనూ డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు సైన్స్ ఎక్విప్ మెంట్ ,రసాయనాలు ,వాలీ బాల్స్ బాడ్ మింటన్ బాల్స్  కోర్ట్ లకు నెట్స్,సాఫ్ట్ బాల్స్ , స్టిక్స్ ,రింగ్ టెన్నిస్ కోసం రింగులు, లేజిమ్స్ కొన్నాం .కబాడీ కోర్ట్ లు రెండు వేయించి ఇసుక పోశాం .ఖోఖో పోల్స్ పాతించి జూనియర్ సీనియర్ ఆడ, మగ పిల్లలతో ఆడించాం .నీటికి ఇబ్బందిలేకుండా మోటారు ఎప్పటికప్పుడు బాగు చేయించటం   కొబ్బరి చెట్లకు నీళ్ళు పెట్టించి ,పురుగులు కొట్టకుండా స్ప్రే చేయించటం ,స్కూల్ చుట్టూ సీమతుమ్మ గింజలు పాతించి మొక్కలు మోలిచేదాకా నీళ్ళు పోయించి దట్టంగా అల్లుకుంట్లు చేసి  బయటివారు స్కూల్ ఆవరణలోకి రాకుండా కొంతవరకు కాపాడాం.స్కూల్ ఫంక్షన్స్  జరగటానికి ఉపయోగించే విశాలమైన హాల్ లో లైట్లు ఫాన్లు ఏర్పాటు చేయించాం .స్కూల్ మైక్ రిపేర్ చేయించి వాడుకలోకితెచ్చాం .

         పుస్తక ,సైన్స్ పరికరాల ప్రదర్శన

 స్కూల్ లో విలువైన పుస్తకాలు మంచి రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి ఇవి ఉన్నాయని చాలామందికి తెలియదు .అందుకని ఒకసారి లైబ్రరీ పుస్తకాల ప్రదర్శన రెండురోజులు నిర్వహించాం .మా విద్యార్దులేకాక ప్రక్క స్కూళ్ళ విద్యార్దులకూచూడటానికి అవకాశం కలిపించాం .అలాగే మరొక సారి ప్రయోగ శాలలోని అరుదైన ఎక్విప్ మెంట్ ను అంతటినీ లాబరేటరిలో ప్రదర్శనకు పెట్టి ,గుడివాడ తో సహా చుట్టూ ప్రక్కల పాఠశాలవిద్యార్ధులకు గ్రామాల జనాలకు చూసే వీలు కల్పించాం . జనం తండోప తండాలుగా వచ్చి చూసి ఆనందించి,అభినందించి  వెళ్ళారు .చాలాకాలం ఈ రెండు ప్రదర్శన ల గురించి బాగా చెప్పుకున్నారు .

   స్వాతంత్ర దినోత్సం ,రిపబ్లిక్ డే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యుఎన్ వో డే,గురుపూజోత్సవం మొదలైన వాటిని చాలాఘనంగా నిర్వహించాం .పెద్దలను పిలిచి సత్కరించాం .అప్పటిదాకా ఈ విషయాలేవీ ఇక్కడి వారికి తెలియదు .అన్నిటినీ ఫోటోలు తీయించి స్కూల్ ఆల్బం లో భద్రపరచాం.ఫోటో గ్రాఫర్ ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ మాస్టారు గారబ్బాయి ప్రసాద్ .ఉయ్యూరులో పరిచయం .అతనికి చెబితే జరిగే ఫంక్షన్ కుసమయానికి వచ్చి చాలా చవకగా కార్డ్ సైజ్ కలర్  ఫోటోలు తీసి ఇచ్చి వెళ్ళేవాడు .ఇదొక గొప్ప రికార్డ్ .దీని తర్వాత పిల్లలు ఏ విధంగా తమ సృజన , ప్రతిభా సామర్ధ్యాలను నిరూపించారో ఆ విషయాలుతెలియ జేస్తాను .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-18-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు చేసింది .ఇక్కడ రాష్ట్ర అంటే జాతీయ అని అర్ధం .దీనిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లో భాగం అని భావిస్తారు .కాని ఈ సంస్థ స్వచ్చంద సర్వ స్వతంత్ర మహిళా సంస్థగా వాళ్ళు పేర్కొంటారు . ఏ పేరుతొ పిలిచినా అది మహిళాభి వృద్ధి సాధనకు ఏర్పడిన సంస్థ అన్నది నిర్వివాదం .లక్ష్మీ బాయ్ కేల్కరే దీని స్థాపకురాలు .

ఈ సంస్థను ఏర్పరచటానికి ముందు కేల్కర్ ఆర్. ఎస్. ఎస్. స్థాపక అధ్యక్ష నాయకుడు డా. హెడ్గెవార్ ను 1933 లో కలిసి సంప్రదించింది .ఆయనతో మూడు సార్లు భేటీ అయి సుదీర్ఘం గా చర్చలు జరిపింది. తనమనసులోని భావాలను నిస్సంకోచంగా ఆయన కు తెలియజేసింది .ఆర్ ఎస్ ఎస్ లో మహిళలకు కూడా చోటు కలిపించాలని తన రాష్ట్ర సేవికా సంస్థ ఆర్ ఎస్ ఎస్ లో మహిళా పక్షం గా ఉంటుందని వివరించింది .హెడ్గెవార్ మాత్రం తమ సంస్థ పురుషులకు మాత్రమె ప్రవేశం కల్పిస్తుందని స్త్రీలకు దానిలో చోటు లేదని స్పష్టంగా తెలిపాడు .కాని లక్ష్మీబాయ్ సేవా దృక్పధానికి మనో నిశ్చయానికి అబ్బురపడి రాష్ట్ర మహిళా సమితి ని సర్వ స్వతంత్ర స్వచంద సంస్థగా తీర్చి దిద్ది స్త్రీ సంక్షేమం కోసం కృషి చేయమని ప్రోత్సహించాడు .ఈ సంస్థకు తానూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇచ్చాడు .లక్ష్మీ బాయ్ ఆయన హామీలకు సంతృప్తి చెంది ‘’రాష్ట్ర మహిళా సమితి’’’ని వార్థా లో 25-10-1936 ‘’స్థాపించి సర్వ స్వతంత్ర స్వచ్చంద సంస్థగా తీర్చి దిద్దింది .

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరి రక్షించే అత్యంత ప్రభావితమైన సంస్థగా ‘’రాష్ట్ర మహిళా సమితి ‘’వృద్ధి చెంది అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచింది.సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల నెన్నిటినో అమలు జరిపి మహిళలకు చేదోడువాదోడు గా సంస్థ నిలిచింది .ప్రజలలో దేశభక్తి ,సాంఘిక జాగృతి కలిగించటం లో కేల్కర్ ఈ సంస్థ ద్వారా చేసిన కృషి ప్రశంసనీయం . భారత దేశం లో అనేక ప్రాంతాలలో అనేక స్థాయిలలో అనేక సార్లు శిక్షణా తరగతులు నిర్వహించి అవగాహన కలగ జేయటానికి నిర్విరామ కృషి చేసింది .

ప్రతిపట్టణం లో మహిళా శాఖలను ఏర్పరచి ఉదయం యోగ, దేశ భక్తి గీతా లాపన చేయించింది .తరచుగా చర్చా వేదికలను నిర్వహించి వారిలోని సందేహాలను నివృత్తి చేసి అవగాహన ను మరింత పెంచింది .ప్రస్తుతం ఈ సమితికి దేశం మొత్తం మీద 5,215 సెంటర్లు ఉన్నాయి .అందులో 875 సెంటర్ లలో నిత్య శాఖ జరుగుతుంది .మొత్తం మీద ఒక లక్ష నుంచి పది లక్షల దాకా ఇందులో సభ్యులున్నారు .ఇండియాకు వెలుపల సుమారు 10 దేశాలలో ‘’హిందూ సేవికా సమితి ‘’పేరుతో ఈ సంస్థ మహిళాభ్యుదయానికి కృషి చేస్తోంది .

ఇండియాలో కుల ,ప్రాంత ,భాష లకు అతీతంగా అందరు పేదలను ,ఉపేక్షకు గురైనవారినీ ,స్త్రీబాల వృద్ధులకు అండగా నిలబడి సేవ చేస్తున్న సంస్థ ఇది .సేవలను విద్యాలయాలకు గ్రంధాలయాలకు ,అనాధ శరణాలయాలకూ,శిక్షణా శిబిరాలకు కూడా విస్తరింప జేసి ప్రజలందరి విశ్వాసం సంపూర్తిగా పొందుతోంది ఈ సంస్థ .సమాజం లో మహిళలు తాము అభి వృద్ధి చెంది ,నాయకత్వం వహించి, సమాజాభి వృద్ధికి తోడ్పడేట్లు చేస్తున్న సంస్థ ఇది .ఇందులోని మహిళలు శిక్షణ పొందినవారు ,శిక్షకులు అందరూ ‘’మాతృత్వ ,కర్తృత్వ నేతృత్వం ‘’అనే మూడు మాటలను మంత్రాలుగా మననం చేసి ,అనుసరించి సార్ధకం చేస్తారు .ధనాత్మక దృక్పధ౦, ,ఆలోచనలతో ఉంటె మహిళలు సాధించరానిది ఏదీ ఉండదు అని ఈ సంస్థ నమ్మకం కలిగించింది .భారత దేశం ఇండియా ,పాకిస్తాన్ లుగా విడిపోయి స్వాతంత్ర్యం పొందిన తర్వాత కేల్కర్ పాకిస్తాన్ రాజధాని కరాచీ సందర్శించి అక్కడ శాఖనేర్పరచి ,అక్కడి భారతీయ మహిళలకు ధైర్యం విశ్వాసం, నమ్మకం కలిగించి , వారిపై దౌర్జన్యాన్నిపూనుకొనే వారి ప్రయత్నాలను అడ్డగించి అరికట్టే ప్రయత్నం చేసి వ౦దనీయురాలైంది .

రాష్ట్ర సేవికా సమితి సంస్థాపకురాలు లక్ష్మీ బాయ్ కేల్కర్ 1936 నుండి,1978 లో చనిపోయేవరకు ఈ సంస్థ కు అధ్యక్షురాలుగా ఉంటూ బహు ముఖ సేవలు అందించి చిరస్మరణీయురాలైంది .ఆమెను ‘’మావాషి కేల్కర్’’అని కూడా అంటారు .ఈమె తర్వాత సరస్వతీ ఆప్టే ,ఉషాతాల్ చాతి,ప్రమీలా తాయ్ మీధే వరుసగా అధ్యక్షులయ్యారు.ప్రస్తుతం వి. శాంతకుమారి 2012 నుండి ఈ నాటి వరకు అధ్యక్ష బాధ్యత వహించి లక్ష్మీబాయ్ కేల్కర్ ఆశయాలకు కార్యరూప సేవలందిస్తోంది .

                                                                                                                              – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

నా దారి తీరు – 109

ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి  విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ పటాన్ని కొనిపించి పూలమాల వేయించాను .అంతకు ముందే స్టాఫ్ తో చెప్పి ,అద్దాడ లో పని చేసి ఇటీవలే రిటైర్ అయిన ఉపాధ్యాయులు ,సమర్ధులైన ఇద్దరికీ సన్మానం చేద్దాం అని చెప్పాను అందరూ చాలా సంతో షించారు .అలాంటి వారిలో ఇక్కడ అందరి హృదయాలనూ ఆకర్షించినవారు ఇద్దరున్నారని చెప్పారు .వారు  శ్రీ రత్తయ్య-ఈడుపుగంటి వెంకట రత్నం  అనే డ్రిల్ మాస్టర్ ,శ్రీ కే .సుబ్బారావు అనే సేకండరీ గ్రేడ్ టీచర్(తాడంకి వాస్తవ్యులు ) .రత్తయ్య గారు రుద్రపాక హెడ్ మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు (ఈ వి ఆర్ )సోదరుడు .  వీళ్లిద్దరితో నేను మానికొండ హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేసినప్పుడు  మా స్టాఫ్  మెంబర్లం  మా హెడ్ మాస్టారు ఏం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యం లో రుద్రపాక వెళ్లి జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారింట ఆతిధ్యం పొంది ఫ్రెండ్లీ మాచేస్ గా వాలీ బాల్ ,బాడ్ మింటన్ రెండు రోజులు సరదాగా ఆడిన విషయం గుర్తుకు కోస్తోంది .చైర్మన్ గారి ఆతిధ్యం ఆత్మీయత ,ఆయన అన్నగారి మన్నన  ఈ వి ఆర్ గారి సహృదయత మరువలేనివి .సుబ్బారావు గారు తాడంకి లో ఉండేవారుకనుక ఆయనతో కొంత పరిచయమూ ఉన్నది .ఇద్దరూ నల్లని వారే అయినా ,తెల్లని పంచె కట్టు ,తెల్ల చొక్కా ,ఖండువాలతో తెలుగుదనం మూర్తీభవించి నట్లు ఉండేవారు . ఉపాధ్యాయ దినోత్సవం నాడు సుబ్బారావు ,రత్తయ్య గార్లను ఆహ్వానించి  వారితో విద్యార్ధులకు సందేశం ఇప్పించి విద్యార్దులన్దారి సమక్షం లో వారిద్దరికీ శాలువాలు కప్పి ,పూలదండలు వేసి సత్కరించాం .ఆ ఇద్దరు ఇంతటి అపూర్వ సన్మానానికి పులకించిపోయారు .ఎంతో కృతజ్ఞత ప్రకటించారు .ఇదే ఈ స్కూల్ లో సన్మానాలకు నాంది అయి ,తర్వాత ఏడేళ్ళు అప్రతిహతంగా సాగి, అందరికీ మంచి పేరు తెచ్చింది .పెద్దలను సన్మానించాలి అనే సంప్రదాయానికి వరవడి పెట్టగలిగాను .దీనికి స్టాఫ్ ను, విద్యార్ధులను పూర్తిగా అభినందించాలి .అందరి సహకారం లేనిదే ఇవి కార్యరూపం దాల్చి ఫలవంతం కావు . అందరిలో నూతన ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .ఏపని అయినా సమర్దవంతం గా చేయగలం అనే భరోసా వచ్చింది .

విద్యా బోధన

పదవ తరగతి విద్యా బోధన పై దృష్టి పెట్టాను .తరచుగా క్లాసులకు వెళ్లి బోధనా తీరు ఎలా ఉందొ పరిశీలించి మెళకువలు చెప్పేవాడిని . అవసరమైతే ఎలా బోధించాలో వివరించేవాడిని .ఏడవతరగతి బోధన విషయం లో కూడా ఇదే అనుసరించాను .చైతన్యం తెచ్చి ముందుకు నడిపించాలన్నది నా ధ్యేయం .టెన్త్ లో తారకరాముడు అనే విద్యార్ధి మిగిలిన వాళ్ల కంటే తెలివిగా ఉండేవాడు .వాడికి అన్ని సబ్జెక్ట్ లలోనూ అత్యధిక మార్కులు రావటానికి ప్రత్యెక కృషి చేశాను .మధ్యాహ్నం ఇంటర్వల్ లో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడిని. సాయంత్రం స్కూల్ తర్వాత ఒక గంట సేపు ఉంచి లెక్కలు ఫిజిక్స్ లలో బిట్స్ పై డ్రిల్లింగ్ ఇచ్చేవాడిని .షార్ట్ ఆన్సర్ లను బాగా బట్టీ పట్టించి రాయి౦చేవాడిని .రోజూ ఉదయం నా క్లాస్ లో ఇంగ్లిష్ హోమ్ వర్క్ చూసేవాడిని .ప్రశ్నలకు ఆన్సర్లు అందరి చేతా చెప్పించేవాడిని .ఇలా ఎంతో శ్రమపడితే కాని వాళ్ళు దారికి రాలేక పోయేవారు .ప్రతి స్కూల్ లో తెలుగు గురించి పెద్దగా ఇబ్బంది ఉండేదికాదు.  కాని ఇక్కడ మాత్రం కాంతారావు గారి క్లాస్ చేపల మార్కెట్ గా ఉండేది .పావు గంటలో పాఠం అయిందనిపించి ఆతర్వాత వాళ్ళు ఏం చేస్తున్నా పట్టించుకొనే వాడుకాదు .కనుక నిరంతరం ఆయన క్లాస్ పై దృష్టి పెట్టాల్సి వచ్చేది .ఎన్ని సార్లు ఆయనకు చెప్పినా గోడకు చెప్పినట్లే అయ్యేది .ఇది చాలా ఇబ్బంది గా ఉండేది.  కనుక తెలుగు సబ్జెక్ట్ విషయం లోనూ తల దూర్చాల్సి వచ్చింది .ఛందస్సు సరిగ్గా చెప్పేవాడుకాడు .వాటిపై అవగాహన కల్పించేవాడుకాదు  .ఉపవాచక బోధన మరీ దారుణం .

తులశమ్మగారు అని హిందీ పండిట్ ఉండేవారు .నేను చేరిన నాలుగైదు నెలలకే రిటైర్ అయ్యారు . కనుక హిందీ బోధనా అందులో రావాల్సిన కనీసమార్కులు కూడా వచ్చే అవకాశం లేకపోయింది .అందుకని ఆవిడ పదవీ విరమణ రోజున ఘనం గా సన్మానం జరిపించి ఆమె ను కొత్త టీచర్ వచ్చేదాకా వచ్చి హిందీ చెప్పమని కోరాము . ఆమె అలాగే చేసి న్యాయం చేశారు . ఆమె భర్త జగపతి రావు గారు కూడా టీచరే.పెంజె౦డ్ర వాసులు వారు .అక్కడ అరవింద స్కూల్ నిర్వాహకులు  కనుక  డ్యూటీ విషయం లో వారికి ఎవరూ చెప్పక్కరలేదు కూడా .

బాలికలకు ఆటలలో ఉత్సాహం

డ్రిల్ మాస్టర్ జగన్మోహనరావు గారు డ్రిల్ క్లాస్ లను కాఖీ నిక్కర్ ,వైట్ ఇన్షర్ట్  తో పకడ్బందీ గా నిర్వహించేవారు .వారానికొకసారి మాస్ డ్రిల్ చేయించి నన్ను పిల్చి చూడమనేవారు .అంతా బాగానే ఉంది .మరి ఆడపిల్లలు  ఇక్కడ ఆడరా అని అడిగాను .’’వాళ్ళు సిగ్గు పడుతున్నారు సార్ .దాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తున్నా ‘’అన్నారు .అనుకోకండా గుడివాడలో ఆడపిల్లల గ్రిగ్ స్పోర్ట్స్ జరిగాయి .ఆయన మా స్కూల్ ఆడపిల్లలను అక్కడికి తీసుకు వెళ్లి చూపిస్తానన్నారు .సరే అన్నా ను .బస్ లో  గుడివాడ స్వంత ఖర్చులతో తీసుకు వెళ్లి చూపించారు . వాళ్ళలో ఎంతో ఉత్సాహం వచ్చి తప్పకుండా కబాడీ, ఖో-ఖో ,టెన్నికాయిట్లలో ఆడుతాం అని చెప్పారు. అక్కడ  తనకు తెలిసిన వస్త్ర వ్యాపారి కి ఈ విషయం చెప్పి వాళ్ళందరికీ బనీన్లు ఇప్ప్పించారు జగన్మోహన రావు గారు .అప్పటినుంచి అడ్డాడ ఆడపిల్లలు ఆటలలో పాల్గోనటం అనేక సార్లు ట్రోఫీలు పొందటం  ప్రారంభించారు .వార్షికోత్సవానికి ముందు వ్యాసరచన వక్తృత్వం  ,ఆటలలో మగపిల్లలతోపాటు ఆడపిల్లలకూ జూనియర్ సీనియర్స్ విడివిడిగా  పోటీ లు పెట్టి౦చి ,అలాగే తరగతి పరీక్షలలో ఆవరేజ్ మార్కు లను తీసుకుని వీరికీ బహుమతులు ఇప్పించాము .కొన్నిటిని టీచర్లు స్పాన్సర్ చేశారు .కొన్ని స్కూల్ ఇచ్చేట్లు చేశాం .

బ్యాంక్ లావాదేవీలు

విద్యార్ధులకు పోస్టాఫీస్ ,బాంక్ లావాదేవీలు అలవాటు కావాలని నా ఉద్దేశ్యం .స్టాఫ్ కు చెబితే మంచిపనే చేదాం అన్నారు .లెక్కల మేష్టారు రాజు గారి ఆధ్వర్యం లో టెన్త్ విద్యార్ధినీ విద్యార్ధులను ఎలమర్రు ఆంధ్రా బాంక్ కు పంపి అక్కడి మేనేజర్ శ్రీ గౌరీశంకర్ గారి చేత వాళ్ళందరికీ ఆక్కడి ట్రాన్సాక్షన్ విధానం అంతా క్షుణ్ణం గా నేర్పించాము .ఆయన ఆశ్చర్యపోయి ‘’రాజు గారూ !ఎవరండీ మీ హెడ్ మాస్టారు ?ఇలా విద్యార్ధులకు నేర్పించాలి అన్న ఆలోచన నావెల్ ధాట్.ఆయన్ను అభినంది౦చానని చెప్పండి .ఏ స్కూల్ వాళ్ళకూ పట్టని ఈ విధానం మీ స్కూల్ లో మీ  హెడ్మాస్టారు చేయటం చాలా ఆనందించ దగిన అభినందించదగిన విషయం ‘’అన్నారట .తర్వాత గౌరీ శంకర్ గారిని వార్షికోత్సవానికి ఆహ్వానించటం ఆయన సభాముఖంగా కూడా చెప్పటం జరిగింది .ఆయనతో స్నేహం ఆయన పామర్రు బదిలీ అయినా ఉయ్యూరు బదిలీ అయినా కొనసాగింది. ఉయ్యూరు సాహితీ మాండలి కార్యక్రమలో ఆయన్ను ఆహ్వానించి  ప్రసంగింప జేసి సత్కరించాం. గొప్పసంస్కారి పుస్తకప్రియుడు డ్యూటీ మైండెడ్ వ్యక్తి గౌరీశంకర్ గారు .అలాగేఅడ్డాడ పోస్టాఫీస్ కు పంపి విద్యార్ధులకు అవగాహన కల్పించాం .

ఆ సంవత్సరం టెన్త్ ఫలితాలు కొంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి .అందరిలో కష్టపడితే ఫలితం ఉంటుంది అని తెలిసింది .తారకరాముడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు .తర్వాత అతను నూజివీడు కాలేజి లో లెక్కల లెక్చరర్ అయ్యాడని విన్నాను. వినయం, విధేయత , విద్యా, అణకువ ఉన్న ఉత్తమ విద్యార్ధి తారక రాముడు . అతడిని మరచి పోలేను .ఏడవ తరగతి పరీక్షలు స్ట్రిక్ట్ గానే జరిపాం .ఫలితాలు బాగానే వచ్చాయి .సంచాయిక అనే పిల్లల డబ్బు పొడుపు కార్యక్రమం కూడా బాగా నిర్వహించి ఎక్కువ డబ్బు కూడ బెట్టినవారికి బహుమతులిచ్చాం .హాజరు బాగా ఉండి క్రమ శిక్షణ ,చదువు ,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండే  వారిని ఎంపిక చేసి వారికీ బహుమతులు అందించాం .బెజవాడ వెళ్లి మంచి పుస్తకాలు కొని బహుమతులుగా ఇచ్చాం .

ఏపని జరగాలన్నా డబ్బు కావాలి .ఇది ఎస్ టి ,ఎస్ సి విద్యార్ధులు ఎక్కువగా ఉన్న స్కూలు .స్పెషల్ ఫీజులు వాళ్ళు కట్టక్కరలేదు .రాయితీ ఇస్తుంది ప్రభుత్వం .మిగిలిన వారి ద్వారా వచ్చే ఆదాయం అతి స్వల్పం .చాక్ పీస్ డబ్బాలు కొనటానికి కూడా సరిపోదు .కాని అన్ని కార్యక్రమాలు పకడ్బందీ గా జరగాల్సిందే .కనుక ప్రత్యేక ఆలోచన చేయాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చాను .ఆ విషయాలు తర్వాత తెలియ జేస్తా .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-18-ఉయ్యూరు

 

— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్  ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు  గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్

నా దారి తీరు-108

అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం అడ్డాడ హై స్కూల్  హెడ్ మాస్టర్ గా చేరాను .అక్కడ నాకు గుమాస్తా అంజిరెడ్డి తెలుసు .ఇద్దరం పామర్రులో ఇదివరకుకలిసి  పని చేయటం ,వాళ్ళ  అమ్మాయిలిద్దరూ ,అబ్బాయి అక్కడ చదవటం  అతని పెద్దమ్మాయిని ఉయ్యూరు దగ్గర యాకమూరు లో ఉంటున్న నా శిష్యుడికిచ్చి వివాహం చేయటం జ్ఞాపకం వచ్చాయి . లాబ్ అసిస్టెంట్ శ్రీ బాలకృష్ణ ఎర్రగా తెల్ల గ్లాస్కో పంచెకట్టు చొక్కాతో  నవ్వుతూ పలకరించాడు . స్కూల్ లో కరెంట్ పోయి చాలాకాలమైంది .పాత హెడ్ మాస్టర్ మనం వెళ్లి పోతున్నాం కదా అని పట్టించుకోలేదు . మరి రేపు ఆగస్టు 15 జండావందనం  స్వాతంత్ర దినోత్సవం జరిపే ఏర్పాట్లు చేశారా అని అడిగితె బెల్లం కొట్టిన రాయి లాగా ఎవరూ మాట్లాడలేదు .నోటీస్ పంపారా అంటే ఇంచార్జి హెచ్ ఏం, సైన్స్ మాస్టర్ కె వెంకటేశ్వరరావు పంపించారని అన్నారు . అసలు జెండా ఉందా అని అడిగితె చినిగి పోయింది అన్నాడు రెడ్డి . నా తపన గుర్తించిన బాలకృష్ణ ‘’సార్ !ఈ రాత్రికి ఎలక్ట్రీషియన్ ను పట్టుకొని రేపు పొద్దున్న కల్లా కరెంట్ వచ్చేట్లు చేస్తాను ఖర్చు నేనే పెడతాను జండా రెడ్డి తో తెప్పించటం మిగిలిన ఏర్పాట్లు నేనే బాధ్యతగా చేస్తాను ‘’అన్నాడు .హమ్మయ్య అనుకొన్నా .అంటే ఇక్కడ అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలన్నమాట . కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామ బ్రహ్మం గారిని ఊరిలోని పెద్దలనూ కూడా ఆహ్వానించమని చెప్పాను . సరే దిగితేకాని లోతు లోతు (టు)తెలియనట్లు ఇక కార్యక్రమం ,ప్రక్షాళన ప్రారంభించాలని సంకల్పించా .ఏ శుభ ముహూర్తం లో ఈ సంకల్పం వచ్చిందో తెలియదు కానీ ,నేను1998 జూన్ 31 అంటే సుమారు 7 ఏళ్ళు ఇక్కడ పని చేసిన కాలం లో నాకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వలేదు . నేను అనుకొన్న అన్ని పనులు చేసి గుడివాడ డివిజన్ లో అడ్డాడ మోడల్ హై స్కూల్ అనే పేరు తేగలిగాను .విద్యాశాఖ ,జిల్లాపరిషత్తు ,అందరూ ఏదైనా నేర్చుకోవాలంటే అడ్డాడ హై స్కూల్ కు వెళ్లి నేర్చుకోండి .అని చెప్పేవారు .కావాలని ఇక్కడికి వచ్చినందుకు నాకూ ,పాఠశాలకు గొప్ప గుర్తింపు వచ్చింది .

                 అడ్డాడలో మొదటి స్వాతంత్ర దినోత్సవం

  15-8-1991 జండా పండుగనాడు ఉదయం ఉయ్యూరులో బయల్దేరి రెండు బస్సులు మారి 9 గంటలకే అడ్డాడ చేరాను . స్టాఫ్ అందరూ వచ్చారు .రామ బ్రహ్మం గారు వచ్చి పలకరించారు .కరెంట్ వచ్చింది కొత్త జెండా వచ్చింది .పతాకావిష్కరణ చేశాను . విద్యార్థులు వందేమాతరం  జాతీయగీతాలు పాడారు .పిల్లలందరికీ బాలకృష్ణ కొన్న బిస్కట్లు చాకోలెట్లు పంచిపెట్టాం .తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి టీ  బిస్కెట్స్ ఇప్పించాను .ఇక్కడ నాకు పామర్రులో నాతోపాటు పనిచేసిన సెకండరీగ్రేడ్ మాస్టర్ శ్రీ డి వీరభద్రరావు ఉండటం కొంత బలాన్నిచ్చింది . మంచివాడు సమర్ధుడు ,విలువలు కోరేవాడు . నన్ను నేను అందరికి పరిచయం చేసుకొని స్టాఫ్  మెంబర్లను ఒక్కొక్కరినీ ఎవరి పరిచయం వారు చెప్పమని వారి గురించి తెలుసుకున్నాను . నేచురల్ సైన్స్ బోధించే డి ఏం విజయలక్ష్మి ఇంగ్లిష్ ఏం ఏ కూడా . వెంకటేశ్వరరావు ఫిజికల్ సైన్స్ టీచర్ . యెన్ .సీతారామరాజు లెక్కల మే స్టర్ . శ్రీ టి .ఎల్ .కాంతారావు గ్రేడ్ వన్ తెలుగుపండిట్ . గ్రేడ్ 2 తెలుగుపండిట్ లేడీ శ్రీమతి పార్వతీదేవి  .  సమర్ధురాలైన టీచర్ .ప్రశాంతత ,పవిత్రత ముఖం లో స్పష్టంగా కనిపించేవి .  సోషల్ మాస్టారు శ్రీ సి హెచ్ వెంకటేశ్వరరావు మంచి దైవ భక్తి ఉన్నవారు ,ఆదర్శప్రాయుడైన టీచర్ ఆరోగ్యం తక్కువే అయినా చాలా కష్ట పడి పని చేసే తత్త్వం అరవింద శిష్యులు .  క్రాఫ్ట్ మాస్టర్ కె . మల్లికార్జునరావు  క్రాఫ్ట్ పని ఏమీలేక గార్డెన్ పని చూసేవాడు .ఎస్ సుజాతః మరొక సెకండరీ  గ్రేడ్ టీచర్ .బి ఏ బి ఎడ్ .  లైబ్రేరియన్ కూడా అప్పటికి బాలకృష్ణయే .తర్వాత రాజా రావు వచ్చి చేరాడు  .ఘంటసాలలాగా పాడగలడు . తర్వాత డ్రిల్ మాస్టర్ గా శ్రీ తుర్లపాటి  జగన్మోహనరావు గారు .’’అంతా భగవదనుగ్రహం ‘’అంటూ నవ్వు ముఖం తో పలకరించేవారు . అటెండర్ గురవయ్య  నైట్ వాచ్ మన్ ప్రసాద్ .ఈ ఇద్దరూ కుర్రాళ్లే .వినయంగా ఉండేవారు . అంజిరెడ్డి గుమాస్తా . ప్రస్తుతం వీరే స్టాఫ్ మెంబర్లు .స్టాఫ్ సెక్రెటరీ లేడు .

    నేను అడ్డాడరావాలంటే ఉయ్యూరు నుంచి పామర్రు వచ్చి ,అక్కడ గుడివాడ వెళ్లే బస్ ఎక్కి అడ్డాడ లో దిగాలి.  రోడ్డుకు బడి చాలాదగ్గరే . ఫెన్సింగ్ లేదు .అందరూ స్కూల్ నుంచే రాకపోకలు . రిటైర్డ్ నైట్ వాచ్ మన్  అబ్రహాం బడికి దగ్గరలో ఉండేవాడు .ఎప్పుడూ ‘’ఫుల్ డోస్’’ లో ఉండేవాడు .అప్పుడప్పుడు వచ్చి పలకరించేవారు .అతని భార్యా కూతురు కూడా వస్తూ ఉండేవారు  . మొదటి స్టాఫ్ మీటింగ్ పెట్టి ,స్టాఫ్ సెక్రెటరీని ఏర్పాటు చేసుకోమని చెప్పాను అందరూ ఏకగ్రీవంగా ఫిజికల్  సైన్స్ మాస్టర్ వెంకటేశ్వరరావు పేరే చెప్పారు . ఆయన్నే చేసాం ,అసిస్టెంట్ గా వీరభద్రరావు ఉంటె బాగుంటుంది అన్నారు ఒకే చేశా . ‘’నేను పొడిచేస్తా చింపేస్తా  అని చెప్పను .మనం అందరం కష్ట పడి పని చేద్దాం బడికి మంచి గుర్తింపు సాధిద్దామ్ . పదవతరగతి సెంటర్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది .తర్వాత తీసేశారు .మనం అందరం తీవ్ర ప్రయత్నం చేసి సెంటర్ తెప్పిద్దాం .క్రమశిక్షణ చాలాముఖ్యం .టెస్ట్ పరీక్షలతో సహా అన్ని పరీక్షలూ స్ట్రిక్ట్  గా నిర్వహిద్దాం . కాపీలను అనుమతించవద్దు .అన్ని జాతీయ పండగలు చేద్దాం .పిల్లలతో సృజన శక్తిని పెంచటానికి ప్రతి 15 రోజులకొకసారి డిబేట్ ,వ్యాసరచన క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిద్దాం . బహుమతులు ఇద్దాం .అప్పుడు వాళ్లలో కొంత కదలిక వస్తుంది ‘స్కూల్ అసెంబ్లీ సమయానికి అందరం హాజరవుదాం . క్లాస్ టీచర్లు క్లాస్ వెనకాల ఉండాలి . జాతీయ గీతాలు బాగా ప్రాక్టీ స్  చేయించాలి  . అటెండెన్స్ బాగా ఉండేట్లు చూడండి .పరీక్ష పెట్టిన నాలుగైదు రోజుల్లో పేపర్లు దిద్ది మార్కులు ఇవ్వండి .పిల్లలకు రాసిన ఆన్సర్ షీట్లు ఇచ్చి తప్పొప్పులు తెలియ జేయండి . మార్కుల రిజిస్టర్ లో క్లాస్ టీచర్ మార్కులు పోస్టింగ్ చేయండి .కన్సాలిడేటెడ్ ఆటేండెన్స్ రిజిస్టర్ లో పేర్లు రాసి ప్రతినెలా హాజరు నమోదు చేయండి .ప్రోగ్రెస్ రిపోర్ట్ లు తయారు చేసి మార్కులు తగ్గిన చోట్ల రెడ్ ఇన్క్ తో సున్నా చుట్టి ,నాకు చూపి నా సంతకం అయ్యాక పేరెంట్ సంతకాలు పెట్టించి కలెక్ట్ చేయండి  . లైబ్రరీ పుస్తకాలు చదివించండి . ఆటలు ఆడించండి . డ్రిల్ క్లాస్ విధిగా జరగాలి.  వారానికొకసారి మాస్ డ్రిల్ ఉండాలి .టైం టేబుల్ కూడా ఈ ప్రకారం ఉండాలి ‘’అని చెప్పి వెంకటేశ్వరరావు రాజు గార్లకు టైం టేబుల్ బాధ్యత అప్పగించి నేను ఇంగ్లిష్ ప్రోజ్ అండ్ పొయిట్రీ ,నాండీటైల్డ్ తో సహా తీసుకొన్నాను .

 ఇది ఆర్ధికంగా బాగా వెనకపడిన ఊరు .ఎక్కువమంది ఎస్ సి,  బి సి విద్యార్థులు .హాస్టల్ లో ఉంటారు .కనుక చదువు చాలాతక్కువ .ఎంతో రుద్దితే  ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటే తప్ప చదువు రాదు .పదవతరగతి ఉత్తీర్ణతా శాతం 25 మాత్రమే .కనుక నాకు ఒక సవాల్ గా మారింది .క్రమంగా నరుక్కు రావాలి .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు

1-5-18 మంగళవారం మధ్యాహ్నం మా ఇంట్లో 1987-88 పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ ఎస్ ఎస్ సి .విద్యార్థినీ విద్యార్థులు -27-5-18 పామర్రులో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను ఆహ్వానించటానికి వచ్చారు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?

 అది ఉయ్యూరు విష్ణాలయం ,శివాలయాలకు ఒకే ఎక్సి క్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకట రెడ్డి ఉన్నకాలం .అప్పుడు బ్రాహ్మణ సంఘం కూడా శ్రీ వేమూరి దుర్గయ్య గారి అధ్యక్షతన చాలా పవర్ ఫుల్ గా ఉండేది .విష్ణ్వాలయ వంశ పారంపర్య అర్చకులు ,ఆలయ ప్రతిస్టాది క్రతువులలో నిష్ణాతులు శ్రీ వేదాంతం  శ్రీ రామాచార్యులు గారు విష్ణ్వాలయం లో వైశాఖమాసం లో స్వామి వారలకు కల్యాణం జరగటం లేదని బ్రహ్మోత్సవాలు కూడా ఆగి పోయాయని కనబదడినప్పడల్లా మాతో ఆవేదనగా  చెప్పేవారు .బ్రాహ్మ సంఘం మీటింగు లలోనూ మొత్తుకునేవారు . మే మేం చేయగలం .పైన ఆఫీసర్లు వగైరాలున్నారు .మా వల్ల ఏమవుతుంది .అనుకునేవాళ్ళం .ఇలా పదే పడదే మా చెవుల్లో ఇల్లు కట్టుకుని హోరు పెడుతుంటే ఒక్కసారి నామనసు గతం లోకి ‘’గుండ్రాలు చక్రాలు ‘’ద్వారా వెళ్లి అప్పటి కళ్యాణ వైభోగం కళ్ళకు దర్శన మిచ్చింది .

   మా చిన్నతనం లో విష్ణ్వాలయ కమిటీ ప్రెసిడెంట్ గా హెడ్ కర్ణం శ్రీ ఆది రాజు నరసింహా రావు గారు ఉండేవారు .ఆయన,ఆయన శ్రీమతి పీటలమీద కూర్చుని  వైశాఖ పౌర్ణమి నాడు లేక త్రయోదశి నాడు రాత్రి పూట స్వామి వారలకు కల్యాణం చేసేవారు .పుచ్చపువ్వు లాంటి పండు వెన్నెలలో మాకు గొప్ప అనుభూతి కలిగేది .శ్రీ వేదాంతం రామచంద్రాచార్యులు శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యులు శ్రీ వేదాంతం వాసుదేవా చార్యులు మొదలైన అర్చకులు చాలా పద్దతిగా చేయిన్చేవారని జ్ఞాపకం .మా నాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారు , మా మేనమామ గంగయ్యగారు ,చోడవరపు చంద్ర శేఖరరావు గారు ,ఆది రాజు చంద్ర మౌళీశ్వరరావు గారు డా మామిళ్ళపల్లి నరసింహ మూర్తిగారు , జస్టిస్  వారణాసి సదాశివ రావు, బూరగడ్డ బసవయ్య గారు, ఊర సోదరులు, చిన్నకర్ణం సీతంరాజు లింగమూర్తి సామశివరావు గార్లు   వంటి పెద్దలు అందరూ విధిగా హాజరయ్యేవారు .ఆలయం  స్త్రీపురుషులతో కిక్కిరిసి పోయి ఉండేది .మేము పిల్లలం .కాసేపు ఇక్కడ వేడుక చూస్తూ కాసేపు రావి చెట్టు కింద ఆడుతూ ,సరిగ్గా మామిడి పళ్ళు పంచి పెట్టె సమయం లో చేరేవాళ్ళం .కళ్యాణ శోభతో పాటు  విరగ బూసిన పొగడపూల సుగంధం ఇప్పటికీ మా నాసా పుటలలో భద్రం గా కూర్చుంది .ఆ పూలు ఏరుకుని తినటం అప్పుడొక సరదా .గన్నేరురు పూలలోని మకరందం తాగటం మరో వేడుక .  కరణం గారిని చలోక్తులతో ఆట పట్టించేవాడుమామయ్య . .ఆయనకు కోపం వచ్చినా తమాయి౦చుకునేవారు .ఆయన మా మేనమామకు సహాధ్యాయి ,ఏరా అనే చనువు   .కల్యాణం రోజు రాత్రి’’పెద్ద పెద్ద బంగినపల్లి పళ్ళు ‘’. .స్వామికి నివేదన చేసి అందరికీ నరసింహారావు గారు పంచి పెట్టేవారు .వడపప్పు పానకం సరేసరి .మల్లె పూల గుబాళింపు ఉండనే ఉంది .తాటాకు విసనకర్ర ల పంపకం మరో ప్రత్యేకత .ఇలా చాలాకాలం జరిగిన జ్ఞాపకం .అవి బ్రహ్మోత్సవాలు గా జరిగాయా లేదా అన్నది నాకు తెలియని విషయం .ఎన్ని రోజులు చేసేవారో కూడా గుర్తులేదు .

  ఇంతవైభవంగా వైశాఖమాస కల్యాణం జరిగేది .తర్వాత కొంతకాలం ఆగి పోయినట్లున్నది .అర్చకులూ తమకు పట్టనట్లే ఉండేవారేమో ?ఇందరు అర్చకులున్నా రామా చార్యులగారికే ఎందుకు పట్టింది బ్రహ్మోత్సవాల పిచ్చి అను కునేవాడిని .ఆయన వీటిలో నిష్ణాతులు .మళ్ళీ ఆ వైభవం తనకాలం లో చూడాలని తహతహ .అంతేకాని వేరొకటి కాదు .ఇలా ఉండగా ఒక రోజు ఆయన మా ఇంటికి వచ్చి బ్రహ్మోత్సవాల సంగతి మళ్ళీ ప్రస్తావించి ‘’ప్రసాదూ !నువ్వు వెళ్లి రెడ్డి గారితో మాట్లాడితే ఒప్పుకుంటారు ‘’అన్నారు .’’నేను ఒక్కడినీ వెడితే  సంఘబలం ఉండదు .అందరం ఆలోచించి నిర్ణయానికి వచ్చి ఆయన్ను కలవాలి ఇంతమంది వచ్చి అడిగారు కనుక ఆయన మనసు మారవచ్చు ‘’అని నచ్చ చెప్పాను సరే అని వెళ్లి పోయారు .

  ఈ విషయం దుర్గయ్య ,సీతంరాజు లక్ష్మీనారాయణ ,మంత్రాల రాధాకృష్ణమూర్తి ,గోవిందరాజు వెంకటేశ్వరరావు ,వేగరాజు సోదరులు, బూరగడ్డ కృష్ణమోహన్ మొదలైన వారందరితో చర్చించి అందరం కలిసి ఇ వో రెడ్డి గారిని శివాలయం లో కలిసి విషయం అంతా వివరంగా చెప్పాం .ఆయన కోపం తో ‘’వీరభద్రుడే ‘’అయ్యాడు .ఎందుకో ఆయనకు అర్చకులమీద కోపం ఉన్నట్లు కనిపించింది .నెమ్మదిగా నేనూ దుర్గయ్య మాట్లాడి ‘’ఉత్త బద్రయ్య ‘’ను చేసి శాంతపరచి ‘’బ్రహ్మోత్సవాలను పునరుద్ధరించటం తప్పని సరిగా జరగాలి .ఒక వేళ మీకు నిధులు లేకపోతె  మేమందరం తలా కాస్తా వేసుకుని సహాయ పడతాం .ఆ ముసలాయన కోరిక తీరుద్దాం .ఇది  గ్రామానికి మంచిది శ్రేయస్కరం కూడా’’ అని నచ్చజెప్పాం .ఆయన కూడా ఆలోచించి ‘’ఈ ఏడాది కి మాత్రం ఒక్క రోజే చేద్దాం .ఫండ్స్ మేమే ఇస్తాం .ఆచార్లగారిని అతిగా ఆశ పడొద్దని చెప్పండి ‘’అన్నారు .హమ్మయ్య అనుకుని విష్ణ్వాలయం లో రామాచార్యులగారిని కలిసి విషయం అంతా వివరం గా చెప్పాం .ఆయన ఆనందానికి అవధులు లేవు .

 వైశాఖ మాసం పౌర్ణమి రోజో ఎప్పుడో బ్రహ్మోత్సవాల పేరిట శ్రీ పంచ పట్టాభి రామస్వాములకు శ్రీ రాజ్య లక్ష్మీ వేణుగోపాలస్వాములకు అతి నిరాడంబరం గా కళ్యాణ వైభవం శ్రీ రామాచార్యుల ఆధ్వర్యం లో రెడ్డిగారి దంపతులు పీటలపై కూర్చోబెట్టి జరిపించాం. మేమందరం హాజరయ్యాం. ప్రసాదాలు కూడా మా బృందం చేయించిందని గుర్తు .తర్వాత తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ జరుగుతూనే ఉన్నట్లు అనిపించింది .ఒకసారి మాత్రం ఆలయం లోపలా బయటా తాటాకు పందిళ్ళు వేసి రంగ రంగ వైభవం చేశారట .ఒక రోజు చూడటానికి వెడితే చేయించే ఆచార్యు స్వాములే ఎక్కువ భక్తులు తక్కువగా కనిపించారు .బహుశా కమ్యూని కేషన్ గాప్ అనుకున్నా .

   ఈ సంవత్సరం మే 1 వరకు బ్రహ్మోత్సవాలు వారం రోజులు చేస్తున్నట్లు కనిపించింది .బయట బానర్ చూసి తెలుసుకున్నా .నిన్న మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు మా ఇంటికి వస్తే బ్రహ్మోత్సవాల ప్రస్తావన వస్తే వాడిని వెళ్లి చూశావా అని అడిగితె వెళ్లి చూస్తూనే ఉన్నాను అంటే జనం బాగా వస్తున్నారా అంటే ‘’పాతిక-ముప్పై ‘’మంది కల్యాణం రోజున ఉన్నారన్నాడు .ఇంత వైభవంగా చేస్తుంటే ఊళ్ళో జనం ఎందుకు హాజరవటం లేదో ఆశ్చర్యం .వాడు చెప్పిన దాని బట్టి అర్చకులకు ,ఆలయ పాలక మండలి వారికి సరైన అవగాహన ,సయోధ్య ఉన్నట్లు లేదని అర్ధమయింది .ఏమైనా ‘’దే. పె.అం .హ’’అంటే దేవుడి పెళ్ళికి అందరి హడా విడి ఉంటేనే శోభస్కరం కదా .రాం బాబు తో మాట్లాడగానే ఇవన్నీ ఫ్లాష్ బాక్ గా వచ్చాయి .అవే ఇక్కడ రాశాను . ఇంతకంటే ఎవరికైనా వివరాలు తెలిస్తే తెలియ జేసి వ్యాసాన్ని సంపూర్తి చేయవచ్చు.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్-30-4-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నృసింహ ,అన్నమాచార్య జయంతి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు-

 1-28-4-18 శనివారం -వైశాఖ శుద్ధ చతుర్దశి -నృసింహ జయంతి
  2-29-4-18 -ఆదివారం -వైశాఖ పౌర్ణమి – అన్నమాచార్య జయంతి
                 శుభాకాంక్షలు 


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు రచనకు నాటకోత్సవ పురస్కారం 

ఉయ్యూరులో ఏప్రిల్ 13 ,14 ,15 తేదీలలో జరిగిన తెలుగు నాటకోత్సవాలలో తెలుగు రచనలో కృషి చేసినందుకు (,అనివార్య కారణాలవలన నేను హాజరు కానందున )  నాకు పరోక్షంగా అంద జేసిన పురస్కార జ్ఞాపిక -.అంద జేసిన  శ్రీ వల్లభనేని వెంకటేశ్వరావు మరియు ఉయ్యూరు ఫ్రెండ్స్ సర్కిల్ కు నా ధన్యవాదాలు దుర్గాప్రసాద్ -25-4-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ 13-4-18 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లొ మరణించటం ,14 శనివారం ఉదయానికి మా చిన్నమేనల్లుడు శాస్త్రి అమెరికా నుంచిరావటం ,వెంటనే దహన క్రియలు శాస్త్రోక్తంగా ప్రారంభించటం , 15 వతేదీ ఆదివారం అస్తి సంచయనం ,16సోమవారం నాలుగవ రోజు బీచుపల్లి కృష్ణానదిలో కొంత అస్తి నిమజ్జనం చేసి మిగిలిన దాన్ని కాశీ గంగానదిలో నిమజ్జనానికి ఉంచటం చేశారు ,అయిదవ రోజు మంగళవారం నుంచి నిత్య కర్మ ప్రారంభించి సోదరులిద్దరూ అత్యంత భక్తీ శ్రద్ధలతో నిర్వహిస్తూ ,ఏ రోజు కా రోజు ఇవ్వాల్సిన దానాలు యధాప్రకారం ఇచ్చారు . .

,10 వ రోజు 22-4-18 ఆదివారం దశాహం లొ తిలోదకాలు జ్ఞాతులతో ,ధర్మోదకాలు

బంధు మిత్రులతో ఇప్పించారుబ్రహ్మగారు ..మా బావ గారు వివేకానందం గారితో  తిలోదకాలు ఇప్పించి అమెరికా నుంచి వచ్చిన మా బావగారి అన్నగారు ముకుందం గారబ్బాయి వేలూరి పవన్ ఒక్కడే జ్ఞాతి గా వచ్చాడుకానుక అతనితో నూ తిలోదకాలు యధాప్రకారం ఇప్పించారు .తర్వాత బంధువులైన నేనూ, మాతమ్ముడు ,మద్రాస్ నుంచి వచ్చిన మా పెద్దక్కయ్య కుమారుడు గాడేపల్లి శ్రీనివాస్ ,అశోక్ అల్లుడు విశ్వనాధ మురారీ ,ముకు౦ద౦ గారి పెద్దల్లుడు బందరులో అశోక్ స్నేహితులు సాయి, సింహం గార్లు ,మా చిన్నమేనల్లుడు శాస్త్రి భార్య విజయలక్ష్మి మేనమామ శాస్త్రి బావమరదులిద్దరు సత్యనారాయణ ,కామేష్  లతో ధర్మోదకాలు ఇప్పించారు .శనివారం రాత్రికే శాస్త్రి భార్య విజయలక్ష్మి కొడుకు కృష్ణ,కూతురు వీణ బావమరది కామేష్ లు అమెరికానుంచి వచ్చారు .తర్వాత పుట్టింటి వారు ఇవ్వాల్సిన 16 జతల చేటలు వగైరాలను మా సోదరులిద్దరం ఏర్పాటు చేయించి ముత్తైదువులకు చేటలదానం ఇంటిదగ్గర ఇప్పించారు.దీన్ని తోటికోడళ్ళుఅంటే మా అక్కయ్య కోడళ్ళు సంధ్య విజయలక్ష్మి,మా  మరదలు సునీత మడితో శుద్ధిగా శ్రద్ధగా చేశారు .ఆతర్వాత కేటరింగ్ ద్వారా భోజనాలు కింద ఏర్పాటు చేశారు  .మేము మేడమీద మా మేనల్లుళ్ళపాటు మడిభోజనం చేశాం.భోజనం సమయానికి బంధు మిత్త్ర గణం అంతా మా అక్కయ్య , బావగారి కుటుంబంపై ఉన్న అమిత గౌరవం ఆపేక్ష అభిమానాలకు  హాజరై తమ ధర్మ౦ నెరవేర్చారు.హాజరైన వారిలో ముకుందం గారి కూతుళ్ళు అల్లుడు కొడుకు ,మాబావ గారి తమ్ముడు అబ్బి భార్య ,మా బావగారి అక్కయ్యల కుమార్తెలు ,కొడుకులు  అశోక్ మామగారు అత్తగారు ,బావమరదులు  వాళ్ళ భార్యలు ,శాస్త్రి అత్తగారు మారుతి గారు ,కొడుకులు  పెద్దకొడుకు భార్య  కొడుకు కూతురు ,వేదవల్లి కొడుకు రవి భార్య గాయిత్రి ,మద్రాస్ నుంచి వచ్చిన మా పెద్ద మేనకోడలు కళ ,స్నేహితులు చుట్టు ప్రక్కల వాళ్ళు అందరూ ఉన్నారు .పిచ్చాలక్కయ్య  కొడుకు వారణాసి సుబ్రహ్మణ్య౦ కూడా వచ్చాడు .ఆదివారం కావటం తో అందరికీ రావటానికి వెసులు బాటు కలిగింది .సుబ్రహ్మణ్యానికి ,మా బావ మేనకోడలు నా సాహిత్య ఫాన్  సాహిత్య అభిమాని జనమంచి వారమ్మాయికీ మన పుస్తకాలు ఇచ్చాను సుబ్రహ్మణ్యం వాటిని చూసి అమాంతం నా పాదాలపై వాలిపోయాడు అంత ఆనందం పొందాడన్నమాట .వాడికి రేపల్లెలో డిసెంబర్ 24న ఆవిష్కరించిన పుస్తకాలు 1-గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ ,2- ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు అందజేసి రేపల్లెలో వాళ్ళమాతామహుడు, మా బాబాయి- రాయప్రోలు శివ రామ దీక్షితులుగారి ఇంటిప్రక్కనే గీర్వాణం స్పాన్సర్ యల్లాప్రగడ రామ మోహన రావు గారిల్లు అని వీళ్ళ కుటుంబం  వాళ్ళు అందరూ ఆయనకు తెలుసునని ఆ వివరాలన్నీ పుస్తకాలలో ఉన్నాయని చెప్పాను .చాలా సంతోషించి ఆయన సెల్ నంబర్ తీసుకున్నాడు  .’’తెలుగు విద్యార్ధి ‘’మాసపత్రిక సంపాదకులు ,మాజీ శాసనమండలి సభ్యులు స్వర్గీయ కొల్లూరి కోటేశ్వరరావుగారి అబ్బాయి రమణ ,కుమారుడు కూడా వచ్చారు .రమణకు పద్మ కొడుకు తేజకు మంచిస్నేహం .మాఅ క్కయ్య పోయిన రోజూ హాస్పిటల్ లోను మర్నాడు ఇంటి కి వచ్చి చూసి వెళ్ళారు .

23-4-18-సోమవారం షోడషం

11 వ రోజు షోడషం ఉదయం 8- 30 కే పైన మేడమీద ప్రారంభించారు .పుణ్యాహవాచనం చేయించి 12 మంది  బ్రాహ్మణులతో రుద్రం అంటే నమకచామకాలు 20 నిమిషాలలో చెప్పించి ఒక్కొక్కరికి 1200 రూపాయలు ఇచ్చారు .అంటే నిమిషానికి ఒక్కొక్కరికి60 రూపాయలు అన్నమాట .తర్వాత వృషోత్సవం సందర్భం గా మైల బ్రాహ్మణులు భోక్తలు  షోడష పిండాలు దానాలు – భోక్తలభోజనాలు ఈ కార్యక్రమం అయ్యేసరికి మధ్యాహ్నం 2- 30అయింది .అప్పుడు మేము భోజనాలు చేశాం .మధ్యాహ్నం 3-30కి నేను కాబ్ లొ బయల్దేరి మల్లాపూర్ వచ్చి ,బట్టలన్నీ వాషింగ్ మెషీన్ లొవేసి వేడి నీటి స్నానం చేసి ,రాత్రి కొద్దిగా భోజనం చేసి పడుకున్నాను .మా బావగారి చివరి చెల్లెలు ఉమా కుమారుడు రాజమండ్రి నుంచి వచ్చారు .

24-4- 18 మంగళవారం –సపిండీకరణం

12 వ రోజు సపిండీకరణం కు నేనూ మా ఆవిడ ఉదయం మల్లాపూర్ నుంచి కాబ్ లొ బయల్దేరి బోయిన్ పల్లి సుమారు 9- కి చేరాం .అప్పటికే అక్కడ ఉదయం 7 గంటలకే కార్యక్రమం ప్రారంభించి నలుగురు మైల బ్రాహ్మణ భోక్తలతో కార్యక్రమం పూర్తీ చేయించారు.కపిల వర్ణపు గోవును 15 రోజుల దూడను తెప్పించి పూజాదికాలు నిర్వహించి ,ఆవు యజమాని గోపాలాచార్యులుగారికి అశోక్ ,శాస్త్రి సోదరులు శాస్త్రీయంగా గోదానం ఇచ్చారు .దాని పోషణ ఖర్చులకు కూడా భారీగానే ధన దానం చేశారు .

తర్వాత అందరూ  మేడ మీదకు  వచ్చి దశదాన,షోడష దానాలు యధాప్రకారం గా ఇచ్చారు ఇదంతా అయ్యేసరికి ఒంటిగంట దాటింది .కింద కేటరింగ్ భోజనాలు సిద్ధం చేయించి భోజనాలు చేసేవారికి ఇబ్బంది కలగకుండా చేశారు .ఢిల్లీ నుంచి వచ్చిన మాబావగారి పెద్దబావగారు స్వర్గీయ మైలవరపు కృష్ణశాస్త్రిగారి పెద్దమ్మాయి స్వర్గీయ డా లలిత భర్త గారు ,కృష్ణశాస్త్రి గారబ్బాయి   మేమందరం సరదాగా పిలిచే అశోక్ స్నేహితుడు జిడ్డు  పద్మ పెదమామగారబ్బాయి గారు , కృష్ణశాస్త్రిగారి ఇద్దరు కుమార్తెలు వచ్చారు .కృష్ణ శాస్త్రిగారి అల్లుడుగారికి మన పుస్తకాలు ఇస్తే పరమ సంతోషించారు .పవన్ కు గీర్వాణం ౩ ,ఆధునిక ప్రపంచ నిర్మాతలు అందజేశా .కామేష్ కు మారుతి గారికి కృష్ణ శాస్త్రిగారబ్బాయికి మరుతిగారికి అశోక్ మామగారికీ ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’ఇచ్చాను పరమానంద పడ్డారు .ఉయ్యూరులో నీలగిరి కాఫీ స్టోర్స్ ను గోసుకొండ రామ చంద్రుడితో పాటు జాయింట్ పార్టనర్ గా నడిపిన గురజాడ వాస్తవ్యులుచాల్లా సూర్యనారాయణ గారబ్బాయి ఇక్కడ వడ్డనకు వచ్చాడు అతడే నన్ను గుర్తు పట్టి పలకరించాడు .అతని తలిదండ్రులతో నేనూ మా అమ్మా కలిసి 1963 వేసవిలో శ్రీశైలం వెళ్లి సత్రం లొ నేలరోజులున్నాం .తర్వాత మహానంది చూశాం ..ఆ విషయాలు గుర్తు చేసుకున్నాం .శ్రీశైం నుండి ఉయ్యూరురాగానే నాకు కృష్ణాజిల్లా బోర్డ్ హై స్కూల్ లొ సైన్స్ మేస్టర్ ఉద్యోగం మోపిదేవి లొ వచ్చింది .ఇతని కూతురు టెన్త్ చదువుతోందని ,ఆ అమ్మాయికి షుగర్ అని రోజూ ఇన్సులిన్ చేసుకోవాల్సి వస్తోందని మాటల సందర్భం లొ చెప్పాడు ఆమె వైద్యం నిమిత్తం కొంత డబ్బు చేతిలోపెడితే ఆశ్చర్యపోయాడు .అలాగే భార్గవి మురారీల కొడుకులిద్దరూ నిన్న అస్సలు అల్లరి చేయకుండా పరమ క్రమ శిక్షణలో ఉన్నందుకు చెరొక వందా ఇచ్చి ఐస్ క్రీములు కొనుక్కో మన్నాను .

అప్పుడు మళ్ళీ పున్యాహవచనం ,విఘ్నేశ్వర పూజ చేయించి ఇద్దరు భోక్తలతో  మా మేనకోడలు పద్మ ను సువాసినీ ముత్తైదువగా కూర్చోబెట్టి మాసికం పెట్టించారు .ఇది పూర్తీ అయ్యేసరికి 2-30అయింది .మేమిద్దరం మా బావ మేనల్లుల్లతో మడి భోజనం చేశాం .

సాయంత్రం 4 గంటలకు ఆశీర్వచనం .మా  మేనల్లుల్లకు వాళ్ళ బావమరదులు నూతన వస్త్రాలు ఇచ్చారు  .అవికట్టుకుని ఆశీస్సుకు కూర్చున్నారు .మా సోదరులం మా బావగారికి ,మా ఇద్దరు  మేనల్లుళ్ళకు పంచల చాపులు పెట్టాము .ఇద్దరు వేదం పండితులు ఘన జట చదివి వేదాశీస్సు పలికారు .తర్వాత బ్రహ్మగారు సుబ్రహ్మణ్య శర్మగారు  ఈ దినవారాలు ఎందుకు చేయాలి ఏయే ఫలితాలు వస్తాయి అనే విషయాలు వివరించారు. తర్వాత నన్ను మాట్లాడమంటే ‘మా మేనల్లుళ్ళకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు .తలిదండ్రులను 24 గంటలూ ఏడురోజులూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు . ఆన్నదమ్ముల అనుబంధం అంటే నాలాంటి వాడికి కూడా వాళ్ళు ఆదర్శమే .మా బావ గారిది సున్నితమనస్సు .చిన్న పిల్లాడి తత్త్వం .కనుక ఆయనను గాజు పూసలాగా సంరక్షించుకోవాలి .మా మేనకోడలు పద్మ ఈ 12 రోజుల కార్యక్రమాన్నీ ఎంతో హుందాగా దక్షతతో ,అన్నలమనసు లెరిగి చక్కగా నిర్వహించేట్లు చేసింది  .కడుపులో దుఃఖ బడబాగ్నులు రగులుతున్నా ,ఏడుపుల సుడిగుండాలు విజ్రు౦భి స్తున్నా  ఎక్కడా పైకి కనబడ నీయకుండా గుండెలోపలి పోరాల్లోనే దాచుకుని , ఏడుపులు పెడబొబ్బలు శోకాలు లేకుండా సోదరులిద్దరు చెల్లెలు ప్రవర్తించిన తీరు చిరస్మరణీయం .అలాగే బ్రహ్మగారు శర్మగారు సమయపాలన ,విధివిధానం శాస్త్రోక్తం గా పాటించి ,యజమానుల మనసెరిగి అన్నీ సక్రమగా అందరికీ సంతృప్తి కలిగేట్లు చేసిన విధానం ప్రశంసనీయం .ఇంత మంది బ్రాహ్మణీకాన్ని సమకూర్చి అందరికీ అన్ని రకాల దానాలు వారి వారి అర్హతలను బట్టి సంతృప్తి గా ఇప్పించి అందరికీ పరమ సంతృప్తి కలిగిచారు . అందుకు వారు బహుధా అభినదనీయులు . మా అక్కా బావల కొడుకులే కాక కోడళ్ళు ఇద్దరూ తమ బాధ్యతను ఘనంగా నిర్వహించారు .వాళ్ళ పిల్లలు  అంటే మనవాళ్ళు మనవరాళ్ళు అందరు చేసిన సేవ కృషి మెచ్చదగింది .

వీటన్నిటికి మించి ఏ సంబంధం లేకపోయినా ,కేవలం కారు డ్రైవర్ గానే ఉన్న వర్మ అతని తల్లి చెల్లెలు మా అక్కాబావ ల కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడారు .ఏపనికీ విసుగు లేదు . అన్ని పనులూ చేసి ఆ కుటుంబం విశ్వసానికే కొత్త అర్ధం పరమార్ధంగా నిలిచారు .వాళ్ళను మాటలతో పొగిడి సంతృప్తి చెందిచ లేము .అనితరసాధ్యం ఆ సేవలు .ఏదో మానవాతీత శక్తి  వాళ్ళలో ఆవహించి వారితో ఇన్ని సపర్యలు చేయించింది .అలాగే మా అక్కయ్యకు సేవ చేసిన నర్సులు వంట వండి పెట్టిన ఆవిడా ఋణం తీర్చుకోవటం సాధ్యంకాదు  .’’అన్నాను .నేను ఆపేయ్యగానే లోపల దాచుకున్న దుఖం అంతా ఆనకట్ట బద్దలైనప్పుడు వచ్చే ఉద్రుతిగా మా  వాళ్ళందరి  కళ్ళలోనుంచి శోకదార కారింది . తర్వాత పద్మ పెదమామగారబ్బాయి రిటైర్డ్ స్టేట్ బాంక్ ఆఫీసర్ మాట్లాడి తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు .అంతా అయ్యేసరికి 5-30 అయింది .శాస్త్రి మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సేవలకు సరసభారతి కార్యక్రమాలకు ఉపయోగించమని  నాకు ఒక చెక్ రాసి ఇచ్చాడు.నేనుదానిని చూడకుండా నా హాండ్ బాగ్  లొ పెట్టుకున్నాను .ఉయ్యూరు వెళ్ళాక చూస్తాను .

ఇలా ఇద్దరు కొడుకులు తమల్ని కనీ పెంచి పెద్ద చేసినందుకు ,పవన్ తనను తన అక్కగార్లను తన తండ్రిగారు చనిపోయాక మా బావా అక్కయ్యా కడుపులో పెట్టుకుని వాళ్లకు ఏ లోటూ రాకుండా కాపాడి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా తమ చేతులమీదుగా జరిపించినందుకు ,శాస్త్రి ,అమెరికా తీసుకు వెళ్లి చదివించి ,ఉద్యోగానికి సాయం చేసినందుకు ,అమెరికాలోమా అక్కయ్యా బావలు శాస్త్రి దగ్గరున్నప్పుడు అక్కడికి కామేష్ వచ్చి ఉంటే అతని బాధ్యతనూ వీళ్ళు నిర్వహించినందుకు  బావ గారేకాక తానూ ‘’అత్తయ్యగారూ అత్తయ్యగారూ ‘’అంటూ వెంట వెంట తిరిగి తన ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచిన మా అక్కయ్యకు కడసారి కృతజ్ఞతలు చెప్పటానికి వచ్చి నందుకు ,అశోక్ స్నేహితులు మర్చిపోకుండా వాడి స్నేహానికున్న విలువను గుర్తు చేసుకోవటానికి వచ్చినందుకూ ,సోదరుల బావమరదులు కుటుంబాలతో వచ్చి తమ అభిమానాన్ని చాటి నందుకు ,మద్రాస్ నుంచి మా మేనకోడలు మేనల్లుడు పిన్ని పై ఉన్న ఆదరాన్ని వ్యక్తం చేయటానికి వచ్చినందుకూ ,మాబావ హితులు సన్నిహితులూ ,స్నేహితులు ,మా అక్కయ్య ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళూ వచ్చి ఆమె చూపిన ఆత్మీయతకు ప్రతిగా తాము రావటం ధర్మమని భావించి వచ్చినందుకూ మా అక్కయ్య ఆత్మ పరమ సంతోషం పొంది ఉంటుందని  భావిస్తున్నాను .

మా అక్కయ్య చివరి రోజుల్లో చూడటానికి అవకాశం కుదరని నేను దహనం రోజున, తొమ్మిదవ రోజు నుంచి 12 వ రోజూ వరకు ఇక్కడే  మేనల్లుళ్ళ దగ్గర ఉండటం నాకు కొంత ఊరటగా ఉంది   . మా విధి ధర్మం . పవన్ నేనూ రెండు రాత్రులు ఒకే మంచం మీద పడుకున్నాం  షార్లెట్ బంధాన్ని మళ్ళీ ఆరు నెలలకు దృఢం చేసుకున్నాం . ఇలా అందరూ  తమ తమ రుణాలను ఈ విధంగా తీర్చుకుని మా అక్కయ్య మనసుకు శాంతి కలిగించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-4-18 కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

  జాతీయ గీతా గానం

మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైస్కూల్ లొ చదివేటప్పుడు   జంపా రెడ్డి గారు అనే సోషల్ మాష్టారు ఉండేవారు .ఆయనే స్కౌట్ మాస్టారు కూడా .ఆయన కు మంచి నాటకానుభవం ఉండేది పాటలు బాగా పాడేవారు ,నేర్పేవారు .స్వతంత్రం వచ్చిన కొత్త కనుక జాతీయ గీతాలు చాలా ఇంటరెస్టింగ్ గా నేర్పేవారు .మా అక్కయ్య కంఠ స్వరం బాగా ఉండటం సంగీతం కూడా నేర్చుకోనటం వలన ,మా అక్కయ్య మిగిలిన ఆడపిల్లలకు ఆయన జాతీయ గీతాలు నేర్పారు వాటిని పరమ శ్రావ్యంగా మా అక్కయ్యా వాళ్ళు పాడేవారు .అక్కయ్య ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయటం తో మాకూ అవి నోటికి వచ్చేసేవి .అందులో నాకు బాగా జ్ఞాపకం ఉన్న పాటలు 1-జయజయ భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభతరుణం  2-ఎత్తవోయి జయ జండా జయజండా ౩-మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతీ .అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ లొ తాళ్ళతో ముడులు వేయటం  కుట్లు ,అల్లికలు కూడా బాగా నేర్చుకునేది .అల్లేది కూడా .

  మా పడమటింట్లో అచ్చనగాయలు ఆడుకునే వీలుండేది .ఖాళీ సమయం లొ గవ్వలు ఆచ్చనగాయలు ఆడేవారు .మా పెద్దక్కయ వీటిలో ఎక్స్పర్ట్ .ఆ రోజుల్లో స్నానాలు తలంటి అన్నీ కుంకుడు కాయలతోనూ పెసరపిండి నలుగు పిండితోనూ ఉండేవి. డబ్బాలకు డబ్బాలు సున్నిపిండి పట్టించి ఉంచేది మా అమ్మ .కుంకుడు కాయలు కారు చౌక .ఎప్పుడూ సిద్ధం .

  హిందూపురం లొ ఉండగా కాకుమాను శ్రీకృష్ణయ్య శ్రేష్టి అనే వ్యాపారి ఉండేవాడు మంచి వితరణ శీలి .ఆయన కొడుకులు మా నాన్న దగ్గర తెలుగు ప్రైవేట్ చదివే వాళ్ళు .సెట్టిగారు మంచి ఆధ్యాత్మిక పరులు .స్కూలు పిల్లలకు ఆయన భగవద్గీత పోటీలు నిర్వహించారు .మా నాన్న నాకూ అక్కయ్యకూ భగవద్గీత నేర్పారు ఆ పోటీల్లో పాల్గొనటానికి .నాకు భక్తీ యోగం మా అక్కయ్యకు పురుషోత్తమ ప్రాప్తి యోగం అధ్యాయాల లొ పరీక్ష .ఆడ పిల్లలలో మా అక్కయ్య ,మగ పిల్లలలో నేను ఫస్ట్ వచ్చాం .భక్తీ యోగం శ్లోకాలు వెనక నుంచీ ముందుకు చెప్పమంటే నేను చెప్పేశాను అందరూబాగా మెచ్చారు దీన్ని నేను చాలాగార్వంగా చెప్పుకునేవాడిని .మాకు భగవద్గీతలు బహుమానంగా ఇచ్చారు .వాటిని అపురూపంగా భద్రపరచుకున్నాం .దానిమీద శ్రేష్టి గారు ఇచ్చినట్లు స్టాంప్ కూడా ఉంది .

              సూరి కమల పెళ్లి

 మా రేపల్లె బాబాయి అంటే మా నాయనమ్మగారి అక్కగారి కుమారుడు రాయప్రోలు శివ రామ దీక్షితులు గారు ఒక్కరే మాకు తెలిసినబాబాయి .మానాన్నకు అన్నదమ్ములూ అక్క చెల్లెళ్ళు లేరు .ఈ బాబాయి పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం అనే సుబ్బులుకు ఉయ్యూరు లొ పుల్లేరు దగ్గర ఉంటున్న సూరి మంగమ్మగారబ్బాయి శ్రీరామ మూర్తి కూతురు కమల కు ఉయ్యూరులోనే వివాహం జరిగింది .పెళ్లి చూపులు మా ఇంట్లోనే అని జ్ఞాపకం .కోలచల శ్రీరామ మూర్తి ,గౌరయ్య గారిళ్ళ మధ్య ఖాళీ స్థలం లొ పందిరి వేసి రాత్రి పూట పెళ్లి చేశారు .భోజనాలు కూడా అక్కడే .పెళ్లి కూతురి సింగారింపు అంతా మా అక్కయ్యే చేసింది .దగ్గరుండి పెళ్లి జరిపించింది అప్పటికి అక్కయ్య పెళ్లి కాలేదని గుర్తు .మా బాబాయి ,లక్ష్మీకాంతం పిన్ని  మా పెద్దమామ్మ అందరూ వచ్చారు .బాబాయి కూతురే ‘’పిచ్చాలు ‘’.పిచ్చాలు కొడుకే సుబ్రహ్మణ్యం .పెళ్ళయ్యాక పిచ్చాలు అత్తారింటికి బందరు వెళ్ళింది .ఆయన వారణాసి వారబ్బాయి .చాలామంచి వాడు .మా అక్కయ్యా వాళ్ళు బందరు కాపురం పెట్టినప్పుడు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం .పే…ద్ద మండువా లోగిలి .

 మా పెళ్ళికి కోడాక్ ‘’డబ్బా కెమెరా ‘’కానుక

 1964 ఫిబ్రవరి 21 నాకూ ప్రభావతికి మా మామగారి ఊరు నూజివీడు –ఏలూరు మధ్య ఉన్న  వేల్పు చర్ల లొ పెళ్లి జరిగింది .అప్పుడు మా అక్కా బావ నాకు’’ కోడాక్ డబ్బా కెమెరా’’ కానుకగా ఇచ్చారు .అప్పటికి మా ఇళ్ళల్లో ఎవరికీ కెమెరా లేదు .’’బుజ్జి ముండ ‘’నల్లగా బాగుండేది దానితోనే పెళ్లి ఫోటోలు తీశాడు బావ .తర్వాత అది మా ఆవిడతో పాటు జీవిత భాగస్వామి అయింది .మోపిదేవి హై స్కూల్ లొ నేను మొదట సైన్స్ మాస్టర్ గా చేరి ఉద్యోగం చేస్తున్నాను .ఆస్కూల్ ఫోటోలు ,నాతో పనిచేసిన లేక్కలమేస్టారు రమణారావు గారు , సెకండరీ మాస్టారు ,కృత్తివెంటి నరసింహారావు ,తెలుగు పండిట్ కూచిభొట్ల సత్యనారాయణ (ఈయననే వాసన మాస్టారు అనేవాళ్ళం –కారణం ఆయనకు ‘’ వాసన’’ అనే మాట ఊతపదంగా ఉండేది )లతో మోపిదేవిలోనూ ఉయ్యూరులోనూ ,అలాగే శిష్యులు అడివి శ్రీరామమూర్తి  మాధవ్ లతోనూ ,కాటూరు చేను మహాసూలు అంటే కుప్ప నూర్పిళ్ళ కు ,ఉయ్యూరు హై స్కూల్ ,మానికొండ హై స్కూల్ అక్కడ ట్యూషన్ పిల్లల ఫోటోలు ,ఉయ్యూరు లొ మా పెద్దక్కయ్య బావ మేనల్లుడు మేనకోడళ్ళు మాతమ్ముడు  మా అన్నయ్యగారబ్బాయి  నేనూ అశోక్ మా బావ ఉంటున్న జమ్తారా వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా ప్రవేశపెట్టబడిన జనతా ఎక్స్ ప్రెస్ ,దానిలో మా ఇద్దరి ప్రయాణం జమ్తారా ఫోటోలు వగైరా ఫోటోలన్నీ దానితో తీసినవే. చాలా క్లారిటీ గా ఉన్నాయి .అన్నిటినీ ఆల్బం లొ ఉంచాము .. కాశీ లొ మా అమ్మ అస్తికలు నిమజ్జనం చేసి  అయిదవ మాసికం  పెట్టటం మా చిన్నక్కయ్యా బావా పాత్నానున్చిరావటం ,  ,వ్యాసకాసి, గయా , ప్రయాగ ,పాట్నా లొ మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి ఫోటోలు అన్నీ దాని పుణ్యమే .ఒకరకంగా మా అక్కా బావా నా పెళ్ళికి ‘’అపురూపమైన కానుక’’గా దాన్ని ఇచ్చారనుకోవాలి .చాలాకాలం డబ్బా కేమేరానే వాడాను తర్వాత కొత్తకేమేరాలు ,2005 లొ రెండవసారి అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళున్న డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ లొ కోడాక్ డిజిటల్ కెమెరాలు కొని నాకు మా అబ్బాయి లిద్దరికీ ఇచ్చింది మా అమ్మాయి విజ్జి .అప్పుడు కొన్న కోడాక్ డిజిటల్ కేమేరానే ఇప్పటిదాకా వాడుతున్నా .ఇదీ బుజ్జి ముండే.’’దాని అక్క డబ్బా ‘’లాగే బాగా పని చేస్తోంది .

   మా పిల్లలతో మా అక్కయ్యల పిల్లల సందడి

  మాకు పిల్లలు పుట్టాక  మా అక్కయ్యలు బావలు వేసవిలో ఉయ్యూరులో గడపటానికి వచ్చేవారు .అప్పటికి మాకు పాలేళ్ళూ  పాడీ ,వ్యవసాయం ఉంది . దొడ్లో దక్షిణవైపు నుయ్యి ఉండేది .స్నానాలగదిలో ఒక పెద్ద నీటి తొట్టె ను మా చిన్నక్కయ్య పెళ్లికే కట్టించాడు నాన్న .దీనినే మేము ‘’కుండు ‘’అనేవాళ్ళం .చుట్టూ ప్రహరీ గోడలు ,దొడ్డి నున్నగా సిమెంట్ తో గచ్చు వంటింట్లో అలమరలు ఉండేవి .మడి పచ్చళ్ళకు  ఒకటి మిగిలిన వాటి కొకటి అలమరలు .మడి అలమర అమ్మమాత్రమే మడితో ముట్టుకునేది .మేమేవరమైనా ముట్టుకోవాలంటే తడి తువ్వాలతోనే .పాలేరు రెండుపూటలా కుండు నిండా నీళ్ళు తోడి పోసేవాడు .దొడ్లో గచ్చుమీద గంగాళాలు కాగులు బిందేలనిండా నీళ్ళు నింపేవాడు .మా పిల్లలు ,మా చిన్నక్కయ్య పిల్లలు అశోక్  శాస్త్రి ,మాఅన్నయ్య కొడుకు రాంబాబు లు ‘’గోచీలు ‘’పెట్టుకుని దొడ్లో గచ్చుమీద నీళ్ళు పోసుకుంటూ ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ సరదాగా నున్నటి గచ్చుపై పడుకుని జారుతూ స్నానం చేస్తుంటే మహా ముచ్చటగా ఉండేది .మా వాళ్ళు ఎప్పుడూ ఈ సీన్ గుర్తు చేసుకునేవారు .అలాగే ఆరుబయట దొడ్లో రాత్రి భోజనాలు అందర్నీ వర్సుగా కూర్చోబెట్టి పెద్ద పెద్ద కంచాలలో అన్నం కలిపి అక్కయ్యలు, మా ఆవిడా, అందరికీ పెట్టి తినిపిస్తుంటే అది మరో గొప్ప దృశ్యం .’’అన్నం తినను’’ అని మారాం చేసే మా మేనకోడలు పద్మ ఉయ్యూరు వస్తే అందరితో కలిసిపోయి కడుపునిండా తినేది .’’అక్కడ తినవు ఇక్కడ తింటావు ఎందుకే ‘’అని మా చిన్నక్కయ్య  కూతురు పద్మ ను అడిగితె ‘’పెద్దమామయ్య వాళ్ళింట్లో తింటుంటే పెళ్లి లొ తింటున్నట్లుంది అందుకే అంత ఇష్టం గా తింటాను ‘’అనేదట అక్కయ్య చెప్పేది. అలాగే మా పెద్దమేనకోడళ్ళు అంటే పెద్దక్కయ్య కూతుళ్ళు కళ,జయ లు  మేనల్లుడు శ్రీను కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు.’’మూడో సీను’’ మరీ ప్రత్యేకమైనది .వేసవి లొ వస్తారు కనుక పుష్కలంగా మామిడిపళ్ళు దొరికేవి .అందులో అందరికీ రసాలు అంటేనే ఇష్టం .సెంటర్ కు వెళ్లి గంపలకు గంపలు పండిన చిన్న రసాలు తెచ్చేవాడిని .అక్కయ్యలతో సహా అందరూ మహా సంతోషంగా తినేవారు. మూడు పూటలా మామిడి పళ్ళే.తినటానికి వాళ్లకు విసుగు ఉండేదేమోకాని కొని తేవటానికి నాకు విసుగు ఉండేదికాదు మహా సరదాగాఉండేది .ఈ మామిడిపళ్ళ భోజనం మా మేనల్లుల్లు మేనకోడళ్ళు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారు  .అదొక మధురానుభూతిగా మిగిలి పోయింది .ఈ బాచ్ తర్వాత మా వేదవల్లి కొడుకులు రవి హరి  హవా వచ్చింది .వేసవిలో వాళ్ళు వచ్చారంటే పళ్ళే పళ్ళు .మహా ఇష్టంగా తినేవాళ్ళు అందులో హరి కడుపు బరువెక్కి ‘’తాతయ్యా ఇంక నేను తినలేను తాతయ్యా ‘’అని గోల చేసేవాడు .రసాలు పూర్తిగా అయితేనే బంగినపల్లి తినేవాళ్ళం .పెద్దరసాలు తినటం తక్కువే .

  ఇదికాక మా మేనమామ గంగయ్యగారింట్లో వేసవి లొ రెండు మూడు తద్దినాలు వచ్చేవి .ఇంటిల్లి పాదీ భోజనాలు వాళ్ళ ఇంట్లోనే .మా మామయ్యా ముందుగానే రసాలు తెప్పించి వాళ్ళ గదిలో కావ వేసి తద్దినం నాడు తిన్న వాళ్లకు  తిన్నన్ని మామిడి పళ్ళు వడ్డించేవాడు .ఒక్కో విస్తరి దగ్గర చిన్నసైజు కొండలాగా మామిడి టెంకలు గుట్టలు ఏర్పడేవి .రసాలు అయిపెతే బంగినపల్లి వాటిని తరిగి ముక్కలు చేయటానికి ఇద్దరుండేవారు.ఆయనకూ మామిడి పళ్ళు తినిపించటమంటే అంత సరదా .అందుకే వాళ్ళింటి వేసవి తద్దినాలను మేము ‘’మామిడి పళ్ళ తద్దినాలు ‘’అనేవాళ్ళం.ముంజెలు తేగలూ సీమచింతకాయలు ,ఈతపళ్ళు సరేసరి .వేసవులు ఇంత సరదాగా గడిచిపోయేవి .మా శ్రీమతికి నాకంటే ఇంకా సరదా వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ గడపటం .

                మామిడిపళ్ళ రవాణా

  మామిడి సీజన్ లొ అందరి కోసం జాడీలకు జాడీలు ఊరగాయలు పెట్టటం మామూలే .మరి వాళ్ళు ఒకరు మద్రాస్ లొ మరొకరు  బీహార్ లొ ఉంటె మామిడిపళ్ళు ఎలా తింటారు ?అక్కడ ఈ వెరైటీ దొరకవుకదా  .అందుకని బెజవాడ వన్ టౌన్ కు వెళ్లి  మామిడి కావు వేసే చోటు వెతికి కనీసం రెండు గంపలు దోరరకం చిన్నరసాలు కొని వాళ్ళతోనే పాక్ చేయించి ,రైల్వే స్టేషన్ కు రిక్షాలో తీసుకు వెళ్లి వాటిని బుక్ చేయించిపంపేవాడిని మద్రాస్ కొకటి బీహార్ కు ఒకటి .అవి వాళ్లకు చేరటానికి కనీసం వారం పట్టేది .కుళ్ళిపోకుండా జాగ్రత్తగానే చేరేవి .అందినట్లు , తిని ఆనదాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఉత్తరం రాస్తే వారానికి మాకు చేరేది . .అలాగే బియ్యం కూడా ఇద్దరికీ పంపేవాడిని .

  మా బావ బీహార్ నుంచి వచ్చినప్పుడల్లా  బంగాళా దుంపల  బస్తా తెచ్చేవాడు .అక్కడి దుంపలు చాలా బాగా ఉండేవి రుచీ ఎక్కువే .అలాగే ఎర్రగోధుమలూ తెచ్చేవారు .విశాఖ దగ్గరున్న ‘’పలాసా ‘’ స్టేషన్ లొ ములక్కాడలు కట్టలకు కట్టలు అమ్ముతారు .పలాసా ములగ మహా శ్రేష్టం బావ .ఎప్పుడూ అయిదారు కట్టలు కొని తెచ్చేవాడు .

          బావ వంట

  అశోక్ ను తీసుకుని నేను మొదటిసారి జమ్తారా కు వేసవిలో వెళ్ళా .అక్కడ గంగానది ఉంది .బావ సూపర్ వైజర్ .ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ‘’కళాసీ’’ తో ,ఇంకొక అసిస్టెంట్ తో పడవ మీద గంగానదిలో ప్రయాణం చేస్తూ అయిదారు చోట్ల నీటి మట్టం నీటి ప్రవాహం వగైరాలను కొలిచి 11 గంటలకు తిరిగి వచ్చేవారు.అందుకని ఉదయమే లేచి టిఫిన్ చేసి కాఫీ పెట్టి మాకిచ్చి ఆయనా కానిచ్చి అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడు .తర్వాత’’ ఉమ్రావ్ స్టవ్’’లేక కిరోసిన్ గాస్ స్టవ్ మీద వంట చేసేవాడు .ఆయన ఏది వండిగా అద్భుతః .ముఖ్యంగా బంగాళాదుంప వేపటం లొ కూర చేయటం లొ ఆయన మంచి ఎక్స్ పర్ట్ .పప్పు సాంబారు చేస్తే అదరహా .రోట్లో నూరి చేసిన పచ్చడి స్వర్గానికి బెత్తెడు .పెరుగు తోడుపెడితే గొడ్డలితో నరకాల్సిందే .రాత్రిళ్ళు చపాతీకాని ,పూరీ కానీ చేసి బంగాళాదుంప కూర చేసేవారు .కడుపునిండా తినేవాళ్ళం .ఆయనకొక బీహారీ బ్రాహ్మణుడు హెల్పర్ గా ఉండేవాడు గోచీపోసి పంచెకట్టి పిలకతో ఉండేవాడు నమ్మినబంటు .చాలాకాలం బావ దగ్గరే పని చేశాడు .అక్కాబావ అతనికి దైవ సమానం .

  మా బావ యమా స్ట్రిక్ట్ .రూల్స్ బాగా పాటించేవాడు .ఎవరికీ వంగి వంగి సలాములు చేసేవాడుకాడు .డ్యూటీ ఫస్ట్.అంతే. గంగ నీటిని రోజూ రెండుపూటలా గేజ్ చేసి పైకి రిపోర్ట్ రోజూ పంపాలి  . ప్రభుత్వం  కాగితాలు సరిపడా సరఫరా చెయ్యదు .ఈయన కొని బిల్లు పెట్టేవాడు .ఇవ్వటానికి ఏడ్చేవాళ్ళు .దీనిపై పై ఆఫీసర్ కు రిపోర్ట్ చేసేవాడు .వాళ్లకు గుర్రుగా ఉండేది .వాడు వినకపోతే ఆ పై ఆఫీసర్ కు పంపేవాడు .చివరికి సాధించేవాడు .నిజాయితీకి నిఖార్సైన ఉద్యోగిమా బావ .దీనితో ఆయన ప్రమోషన్ చాలాకాలం ఆగి పోయింది .కాగితాలతోనే పోరాటం చేసి పై పై అధికారులకు తాను చేస్తున్నది కరెక్ట్ అని తెలియ జెప్పి రిటైర్ మెంట్ చివరలో రావలసిన ప్రమోషన్ లు అన్నీ పొంది సంతృప్తిగా రిటైర్ అయ్యాడు .ఈ విషయం లొ మా అక్కయ్య ఎంతో ఓర్పూ నేర్పు తో వ్యవహరించి ఆయనకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించేది .సంఘం లొ ,సాటి ఉద్యోగుల్లో ఆయనకు అమిత గౌరవం ఉండేది ఎక్కడ పని చేసినా .ఆయన ఏ డ్రాఫ్ట్ రాసినా చాలా పకడ్బందీ గా ఉండేది .మా అమ్మా నాన్నలు అంటే బావకు విపరీతమైన గౌరవం .

                    కొత్తమీద మోజు

 మార్కెట్ లోకి ఏ కొత్త రేడియో వచ్చినా మా బావ కొనటం హాబీ .అలాగే నాణాల కలెక్షన్లు కూడా తర్వాత డాలర్ల కలెక్షన్లు .అయన దగ్గర నోట్లు ఎప్పుడూ సరికొత్తగా ఫెళ ఫెళ లాడుతూ ఉండాల్సిందే . మహా బోళావాడుబావ  .అవతలివాడిని యిట్టె నమ్మేస్తాడు ఒక్కోసారి .ఒకసారి జీతం  ,ఎరియర్లు అన్నీ భారీగా తీస్సుకుని డబ్బు సూట్ కేసు లొ పెట్టుకుని ఉయ్యూరు వస్తుంటే ఎవడో తెలుసుకుని తోటి ప్రయాణీకుడుగా ఉంటూ ,నమ్మకం గా కబుర్లు చెబుతూ డబ్బు సంచీ తో ఉడాయించాడు .పాపం కట్టుబట్టలతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉయ్యూరు వచ్చాడు .అప్పుడు అక్కయ్యా వాళ్ళు ఇక్కడే ఉన్నారు .జరిగింది చెప్పటానికి మొహమాటం .మేమే మా అక్కయ్యద్వారా అర్ధం చేసుకుని డబ్బు సర్ది మళ్ళీ పంపాం ఉద్యోగానికి .ఇది తప్ప ఇంకెక్కడా ఆయన మోసపోలేదు .

                 పజిల్ విజార్డ్స్

    హైదరాబాద్ లొ బోయిన్ పల్లి లొ మా అశోక్ దగ్గర ఉన్నప్పుడు వాడు బాంక్ నుంచి మేగజైన్లు తెచ్చేవాడు .వాటిని చదువుతూ క్రమంగా వాటిల్లోని పజిల్స్ పై మా అక్కయ్యా బావ ఆకర్షణ పెంచుకున్నారు .వీళ్ళిద్దరూ కలిసి పజిల్స్ పూర్తీ చేస్తే అశోక్ వాటిని పోస్ట్ లొ పంపేవాడు .ముఖ్యంగా ఆంధ్రభూమి వార మాసపత్రికల పజిల్స్ బాగా సాల్వ్ చేసేవాళ్ళు .అనుమానం వస్తే నన్ను అడిగేవాళ్ళు నాకు తెలిసిన సమాధానం చెప్పేవాడిని .ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు వీలయితే అప్పుడు ఫోన్ చేసి క్లూ అడిగేవాళ్ళు తెలిస్తే వెంటనే చెప్పేవాడిని లేకుంటే రిఫర్ చేసి నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని .హైదరాబాద్ లొ వీళ్ళ దూరపు బంధువు వేలూరి కృష్ణమోహన్ గారికీ ఇదే యావ .ఆయనాకొంత హెల్ప్ చేసేవాడు .ఎన్నో సార్లు ప్రైజ్ లు కొట్టారిద్దరూ .కొంతకాలం తమ పేర్లతో తర్వాత కొడుకులపేర కోడళ్ళ పేరా ,కూతురి పేరా మనవడు మనవ రాళ్ల రాసిపంపెవారు .ప్రైజ్ రాకపోవటం అరుదు .దీనికోసం బ్రౌన్ నిఘంటువు ,మామూలు తెలుగు నిఘంటువు కొన్నారు ఇదికాక నేను పర్యాయ పదాల నిఘంటువు కూడా అందజేశాను .వీటితో వాళ్లకు చాలా ఈజీ అయింది .అందుకే వాళ్ళని  పజిల్ విజార్డ్స్ అన్నాను ‘

   ఎమెస్కో గ్రంథాలయం

 అక్కయ్య పుస్తకాలు నవలలు బాగా చదువుతుంది .అందుకని బావ ఎమెస్కో వాళ్ళ ‘’ఇంటింటా గ్రంధాలయం ‘’పధకం లొ చేరి దాదాపు మూడు వందల పుస్తకాలు కొని అన్నిటికీ అట్టలు వేసి బీరువాలలో అందంగా అలంకరించి సరస్వతీ సేవ చేశారు .ఆయన సేకరించని నవల, కదా సంకలనం లేదంటే ఆశ్చర్యం లేదు .అన్నీ చక్కగా చదివేశారు .వాటిలోని విషయాలు బాగా విస్పష్టంగా చర్చించుకుంటారు ఇద్దరూ .

          బుల్లి తెర పోషకులు

పజిల్స్ నవల కథ మేగజైన్ లు చదవటమే కాక మా అక్కా బావాలకు గత 15 ఏళ్ళనుంచి టి వి తో అనుబంధం ఎక్కువ .అందులో వచ్చే సీరియళ్ళను చానళ్ళు మార్చి మార్చి మహా ఆసక్తిగా ఇద్దరూ కలిసి చూస్తారు .చర్చించుకుంటారు .నాకు తెలిసినంతవరకూ చూడని సీరియల్ ఉండదేమో .దూరదర్శన్ అంటే అమితాసక్తి ఇద్దరికీ .వయసు మీద పడినకొద్దీ ఈ వ్యాపకం వాళ్లకు కొంత రిలీఫ్ ఏమో !

            పూజా పునస్కారాలు

  తెల్లవారుజామునే లేవటం ఇద్దరికీ అలవాటు .కాఫీ తాగాక మా బావ పూల బుట్ట తీసుకుని బయటకు వెళ్లి దొడ్లోను రోడ్డుప్రక్కలా ఉన్న రకరకాల పూలను కోసు కోస్తాడు .స్నానం చేసి సంధ్యావందనం చేసి దేవుడి పూజ చేస్తాడు కనీసం రెండు గంటలసేపు .మొదట్లో మా అక్కయ్యే పూజ చేసేది ఈయనకేమీ పట్టేదికాదు .ఒకసారి ఇద్దరూ ఉయ్యూరు వచ్చినప్పుడు ‘’ఒరే !మీ బావ సంధ్యా లేదు పూజా లేదు .కాస్త చెప్పరా ‘’అన్నది .నేను నెమ్మదిగా ఆయనతో మాట్లాడి ఆసక్తికలిగించి సంధ్యావందనం పుస్తకం పూజా విధాన పుస్తకాలు ఇచ్చాను .క్రమ౦గా అలవాటు చేసుకుని తర్వాత చక్కగా అమలు పరుస్తున్నారు .పూజ తర్వాత రామకోటి రాయటం భగవద్గీత చదవటం అలవాటు ఆయనకు .దేవాలయ  సందర్శనాలు  చేస్తారు .సంగీత కార్యక్రమాలకు రవీంద్ర భారతి లొ జరిగే నాటకాలు సాహిత్య సభలకూ వెళ్ళేవాళ్ళు త్యాగరాజ గాన సభలో సభ్యత్వం ఉన్నది ‘ అక్కడి కార్యక్రమాలకు వెళ్ళేవారు. వెళ్లి మాకు విశేషాలు చెప్పేవాళ్ళు .నోములు వ్రతాలు అన్నీ చేశారు చేయించారు .

  మా బావ తలిదండ్రుల ఆబ్దీకాలను అతి శ్రద్దగా ఇంటి దగ్గరే పెట్టేవాడు .అన్న ముకుందం గారి తద్దినాలు కూడా హైదరాబాద్ లొ వాళ్ళుండే దర్గా లొఉన్న ఇంట్లో పెట్టేవారు .మేమూ ఒకసారి వెళ్లాం. అప్పుడు పవన్ ఇంకా చదువులో ఉన్నాడు . మా అక్కయ్య వీటికి స్వయంగా వంట చేసేది  .తర్వాత వంట బ్రాహ్మణులతో చేయించేవారు .తర్వాత తర్వాత ఓపిక తగ్గటం తో మఠాలలో పెట్టేవారు .ఈమధ్య అయిదారేళ్ళ  నుంచి ఇల్లు కదలటమే కష్టమై పోవటం తో అదీ చేయలేక శ్రీశైలం దేవాలయం లొ డబ్బుకట్టి  తిధులనాడు అన్నదానం చేసే ఏర్పాటు తో తృప్తి చెందుతున్నారు  .

  ఇలా ఏనాడూ తమ  విధ్యుక్త ధర్మాలను విడువకుండా మా చిన్నక్కయ్యా బావా జీవితాలను గడిపారు .అందరికీ ఆదర్శ ప్రాయమై ,ప్రేరణగా నిలిచిన అపురూప  దంపతులు  అని పించుకున్నారు . .మా చిన్నక్కయను మేమెవరం మరిచిపోలేము .మా అక్కయ్య లేని లోటును  మా బావ కు తట్టుకోవటం కష్టమే .గుండె దిటవు చేసుకుని ధైర్యంగా ఆయన ఉండాలి .కుటుంబ సభ్యులందరూ ఆయనకు మనోధైర్యం కలిగిస్తూ మామూలు మనిషిని చేయాలి .

  శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ –

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు –

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం )

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం )

సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి

9-శ్రీమతి గుడిపూడి రాధికారాణి-మచిలీపట్నం -9494942583

    ఆ .భం.ఆం.

తెల్ల వాళ్ళని తరిమి కొట్టి –నల్లవాళ్ళని నెత్తి కెత్తుకుని

దొంగల చేతికి తాళమిచ్చుకుని-బతుకిక భద్రమని

భ్రమలో బతుకుతూ –అలసట ఎరుగక –అదరక బెదరక

నడుస్తున్నాం –నిశ్చింతగా ,నిర్భీతిగా

నమ్ముతున్నాం భవిత మాదని  బతుకు మాదని

నవ్వుతున్నాం అమాయకంగా ,అపురూపంగా

రుణ భారానికి వంగి పోతూ –నోటుకీ మాటకీ  లొంగిపోతూ

చేయని తప్పుకు కుంగిపోతూ –ఎదురు చూపులతో ఎండిపోతూ

కరువు చూపులతో కుమిలిపోతూ –మనముందే

భుక్తాయాసపు త్రేన్పుల మోతల్లో

ఆకలి పేగుల అరుపులు సోకక

తక్కువగా దోచింది –నేనంటే నేనంటూ

నా నట్టింట్లో నేతల వీరంగా లెన్నాళ్ళు ?

హక్కును నాకివ్వక –నా హోదా రాదనీ బెదిరి౦పి౦కెన్నాళ్ళు  ?

అందుకే –ఓటు అనే ఆయుధమున్నోళ్ళూ!

అమ్ముకోకు ఆండాళ్ళు !వాడి చూడు పెరుమాళ్ళు !.

10-శ్రీమైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9290995112

   ఆశించి భంగపడ్డ దెవరు ?

ఆశించిన ఆంధ్రా వాడు అంధుడుకాడు

బతికి చెడిన ఆంధ్రా పులి –అదను కోసం వేచి ఉన్న బెబ్బులి

ఏదో ఆశించి ,మరేదో జరిగిందని భంగపాటు ఎందుకు ?

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేవాడికి –చేతిలో చిప్పెందుకు ?

అధికారం లేని హోదానా –హోదా లేని అధికారమా ?

బరి తెగించి బజార్లో రచ్చ రచ్చ చేయట మేలా?

నిన్ను నీవు దిద్దుకో –గురివింద సామెత గుర్తుంచుకో

బతికి చెడిన వాడి అసహనం  కోరలున్న పెద్దపులి

హద్దు దాటితే  పంజా విసిరి నంజు కుంటుంది జాగ్రత్త .

11-శ్రీమతి కొమాండూరి కృష్ణా –విజయవాడ -9246434485

   చాంద్రాయణం

శ్రీరామ చంద్రుని అలవోకగ వీడితి కల్వ చంద్రా

ఈ గోదారి ఆంధ్రాకై పోలవరమును వేడితి

భద్రాద్రి యాదాద్రి వేదాద్రి శైలాద్రి

ఒంటి మిట్టను వీడగ ఒంటరిగ మిగిలితి

బోధల బుద్ధుడు బాధలు కలిగించె-

ఆ ‘’సాగర ‘’హద్దుల కవుల గాధలు కరిగించే

‘’హై టెక్కు ‘’పోవగా ‘’బీ టేక్కే ‘’మిగిలెగ

ఏ టెక్ చద్విన బీటలై పొగిలెగ

చదువుల కొలువులు –పరువుల పదవులు

నిండు సభ లోన నిల్చిన ద్రౌపది చందము

మిల్లులతో బాటుగా ,కాగితపు ‘విల్లు ‘’ను వదలితి

తెల్లకాగిత రీతిగా వెలిగితిని మిగిలితిని

గనులను వనులను జనులను విడదీసె

తనవును మనసును సొగసును యెడ జేసె

దేశము ప్రాంతము భాష పై భక్తితో

నావారు ,నాదను భావముతో నేనుంటి

రంగాలు, వాని అంగాలు  ఒకటంటి

కాని కాదనె వాదముతో శుష్క  వేదాంతి నైతిని

పెరుగుట ఎరుగక తరిగేటి చందాన –చాంద్రాయణ వ్రతము చేసిన రీతిగ

తెలుగుకు వెలుగును మెరుగును కూర్చుము

జిలుగులు వెలయించి మెరుపులు  కురిపించు .

12-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య –విజయవాడ -9490400858

కోకిల వీడిన  విళంబి

ఉగాది వచ్చేసింది –నేనే దిగాలుపడి చూస్తున్నాను –దిక్కు తోచక

కొత్తపాటలు నేర్చు కోస్తానని గట్టిగా ఒట్టేసి

కుకూ కుకూ అని కూస్తూ –వెళ్ళిన కోయిలమ్మ

మళ్ళీ తిరిగి రానే లేదు –మరిచిపోయిందేమో !

సెల్ టవర్లలో చిక్కుకుందేమో

చెట్లకోసం తిరుగుతూ –చైనా రష్యాలకు చేరి పోయిందేమో !

ఉగాది మాత్రం ఆగదుగా వచ్చేసింది

వేప పూత తెస్తానని అమ్మకు మాటిచ్చి

ఉదయం నుంచీ ఉసూరు మంటూ తిరుగుతూనే ఉన్నాను

వేప చెట్ల కోసం వెయ్యి కళ్ళతో

కట్టడాలకు అడ్దోచ్చాయని-కరెంటు తీగలకు

 అడ్డంగా ఉన్నాయని నరికి పారేశారట

అమెరికావాడు మన వేప చెట్టుపై పేటెంట్ తీసుకున్నాడేమో

ఇండియాలో ఎక్కడా వేప చెట్టు ఉండకూడదని శాసనం వేశాడేమో తెలీదు .

గ్లోబల్ అడుగులకు మడుగులొత్తే దేశం మనది

ప్రపంచీకరణ పేరుతో ప్రకృతినే తాకట్టు పెట్టిన ఘనత మనది .

వేపపూత పొడి గ్రాము వెయ్యి రూపాయలంటే

వేలం వెర్రిగా కొనే వేర్రినాగన్నలం మనం .

కొత్త శోభ తెస్తానని చెప్పిన కోయిలమ్మ

పత్తా లేకుండా పోయింది

‘’రేడియేషన్ ‘’-పక్షులనే కాదు –

వాటి అండాలనూ చిదిమేస్తుంది

పిండాలనూ పిండేస్తుంది

జీవావరాణాన్ని నిర్జీవం చేసేస్తుంది .

భవిష్యత్తులో కోయిలలుండవు మిత్రమా పాటలు పాడటానికి

కాకులుండవు నేస్తమా చుట్టాల ఉనికి చెప్పటానికీ

పితృ దేవతల పిండాలు స్వీకరించటానికి

పిచ్చుకమ్మల కిచకిచలుండవు దోస్తూ

రామ చిలుకలు ,రాయ౦చలతో పాటు కనుమరుగైపోతాయ్

కొంగలు౦డవ్ దేశవాళీ కోళ్ళు కూడా ఉండవ్

 పండగకోచ్చే అల్లుళ్ళకు

రష్యాకొంగలూ ఇక్కడి పరిస్థితి గమనించి

రాము రామని రాం రాం చెప్పేస్తాయి .

కోకిలమ్మ లేని ఉగాది నాకొద్దు

ఉగాదిపచ్చడి లేని ఉగాదులెందుకు ? నాకు వద్దే వద్దు .

చెట్లన్నీ కూలిపోతే –కోయిలమ్మలు మరణిస్తే

కవితలకు స్పూర్తి ఏదీ ప్రేరణ ఎక్కడ ?

ఉగాది కవితా సదస్సులో శూన్యమనస్కంగా

నేనేమని పాడాలి యేమని చెప్పాలి ?

‘’గూగుల్లో ‘’కోయిలమ్మను చూస్తూ ‘

‘’యు ట్యూబ్ ‘’లొ పాట విని రాయనా ?

అప్పుడు వచ్చేది కవిత్వం కాదు –మాటల పోగు

కళావిహీనమైన కవిత కలకాలం మన లేదు కదా .

 అయినా అవన్నీ నాకెందుకు ?

అందరూ వెళ్ళండి –నా కోకిలమ్మను వెదకండి

కనబడితే కబురు చెప్పండి

తనపై అలిగానని ఎదురు చూస్తున్నానని  తెలపండి .

కోకిలపాట వింటేనే నాకు ఉగాది.

విళంబు లొద్దు- వికారులొద్దు

కోకిలపాట వింటేనే నాకు ఉగాదులు –ఉషస్సులు

అందాకా నాకు తమస్సే.

 13-పేరు రాయని కవి

ఆశల చిగురులు మోసుకుంటూ

పచ్చనైన నా ఆంధ్రం విచ్చిన్నమై –అడకత్తెరలో పోక చందమైతే

జీవదారల నదీమతల్లులు ఎండి ఎడారు లౌతుంటే

వాటిపై ప్రాజెక్ట్ లు కట్టే మహామహుల రాజ్యమేర్పడింది .

పచ్చనిపోలాల పిల్లగాలి ,కరకు రాజకీయ కొడవళ్ళకు చిక్కి

నశించి రాతిమేడల రాజ్యాల్లో చోటులేక తరలి పోయింది

గడియకో ఎత్తుగడతో కొమ్మకోపార్టీ,

రాచకీయ సింహాసనం కోసం కుమ్ములాటలతో

భగ్గుమంటున్న భారత దేశం

బరి తెగించిన విషనాగుల కాటుకు

కాటికి చేరుతున్న అభాగ్య జీవాలెన్నో

ఎవరికైనా పట్టిందా ?

ఆ –మనకెందుకులే

స్పెషల్ పాకేజీ మిఠాయి కోసం

పోటీపడుతున్నాం –విసిగించకు ,కసిపెంచకు

బ్రెయిన్ డెడ్ లు ఎన్ని జరిగితేనేమి

కళ్ళదగ్గర నుండి కాలేయం దాకా

అమ్ముకోవచ్చు అంతా దేశ సేవేకదా బ్రదర్

నిన్న ఉన్నది నేడు లేదు –రేపు ఉంటున్నదని నమ్మకం లేదు

అస్థిర అస్తిమిత జీవన మార్గం లో

 గమ్యమేమిటో ఎవరికీ తెలీని బ్రహ్మ పదార్ధం .

ముక్కలైన నా రాజ్య౦ ఉద్ధరించే వాడికోసం వెక్కి వెక్కి పడుతోంది

కుల మతాల కుమ్ములాటలు ,మతాల మారణ హోమాలలొ

మానవత్వం బిక్క చచ్చి న వేళ వచ్చిందో ఉగాది

ఆశల చిగురులు మోసుకుంటూ .

14-శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు –విజయవాడ -9295753960

  దగా పడిన తమ్ముళ్ళు

గుండె కుములుతున్నది –గొంతు పెగలకున్నది

నాటి మహామహుల త్యాగ నిరతి –నిష్ఫలమై పోతున్నది

శతవసంతాల తెలుగు ప్రజలపసిడి కాంక్ష

 పగిలిన అద్దమౌతున్నది

ఆంధ్రులంటే ఆది నుంచీ –కేంద్ర ప్రభుతకు చిన్న చూపే

ప్రతిసారీ మనం దగా పడిన తమ్ముళ్ళే.

తూర్పు సముద్ర తీరం లొ –దిగువ దక్షిణ ప్రాంతం లొ

తొలిసారి పాక వేసి  నివసించిన

‘’ముతరాసు ‘’చెన్నపు ఆంధ్రుడు

ముతరాసే మదరాసు గా  మద్రాసు గా మారింది .

అదే చెన్నప్ప పేర చెన్న పట్టణ మై

ఇప్పుడు’’ చెన్నై ‘’గా చలామణి లొ ఉన్నది .

 ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ అక్కడే ఆంధ్రులే అత్యధికం

తమిళనాడుకు ఈశాన్యంగా చెన్నై ఉన్నది .

సమైక్యత తమిళుల సహజ లక్షణం

అనైక్యత ఆంధ్రుల ఉగ్గుపాలతోనే వచ్చింది

మనవనుకున్నవాటిని ఎదుటి వారికి వదిలేసి

అసమర్ధులు గా ముద్రపడి బతుకుతున్నాం

అగస్త్యభ్రాతలకు ఉదాహరణగా చెల్లుబాటవుతున్నాం

తెల్లవాడి తుపాకులకు రొమ్ము చూపించి

 గర్జించాడు ఆంధ్రకేసరి టంగుటూరి

‘ఎక్కడ మీ ఆంధ్రా ?’’అని హేళన చేసిన నెహ్రూకు ‘

‘’అణా’’నాణెం తీసి దానిపై తెలుగులో ఉన్న

‘’అణా’’చూపించి నోరుమూయించాడు

భోగరాజు పట్టాభి సీతారామయ్య .

దక్షిణాది భాషల్లో ఒక్క తెలుగుకి మాత్రమె

దక్కిన అరుదైన గౌరవం అది

అదే దాని ప్రాచీనతకు నిదర్శనం .

శతాబ్దాల చరిత్ర ఉన్న తెలుగును

ఆంగ్లేయులు గుర్తించి గౌరవించారు

స్వతంత్ర భారతం మాత్రం

చులకన చేసి అగౌరవ పరచింది  .

ఆంద్ర సంస్కృతీ భాషలను

గుర్తించని కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి

మొకాలోడ్డి ఎదురు నిలిచింది

అమరజీవి పొట్టి శ్రీరాముల

ఆత్మ బలిదానంతో సహనం నశించిన ఆంధ్రుల

ఆవేశ కావేష ఆందోళనలకు మాత్రమె దిగొచ్చింది

ఆంద్ర రాష్ట్రం ఇచ్చి చేసిన ఆలస్యానికి

బుద్ధిగా  చెంపలేసుకున్నది కేంద్రం .

గరిక పోచలు ,గడ్డిపరకలు ఏకమైతే

‘’వెంటి’’ గా మారి ఏనుగునైనా బంధిస్తాయి

బిందు సమూహమే

అవధుల్లేని సింధువు అవుతుంది

శ్రమ సాధనాలు దీక్షా దక్షతలతో

ఉద్యమ ఉద్వేగాలు ఉరకలెత్తితే

సాధనకు అందనిదేమున్నది !

తలలో జేజమ్మైనా దిగి వస్తుంది

అకుంఠిత దీక్షా ,అవిరళ కృషికి

రూపొందని దేముంటుంది ?.

కవి సమ్మేళన కవితలు సమాప్తం

శ్రీ విళంబి కవి సమ్మేళనాన్నిదక్షతతో  నిర్వహించింది యువకవి ‘’శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య’’ అని మరొకసారి గుర్తు చేస్తున్నాను .

రేపు 20-4 -18 శుక్రవారం –శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం ) ఉత్తరాలకోసం నిరీక్షణ

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం )

              ఉత్తరాలకోసం నిరీక్షణ

 మా బావ వివేకానందం గారిని ఇంట్లో అందరం అదే పేరుతొ పిలిచేవాళ్ళం .పెళ్ళయ్యాక కూడా చాలా రోజులు అలాగే పిలిచి తర్వాత అలా పిలవకూడదని గ్రహించి బావగారూ అనే వాళ్ళం .పాలిటెక్నిక్ పరీక్ష పాస్ అవగానే ఆయనకు వెంటనే ఒరిస్సా లో సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో డ్రాఫ్ట్స్ మన్ ఉద్యోగం వచ్చింది .అక్కను తీసుకుని అక్కడికి వెళ్ళారు .అప్పటిదాకా మా కళ్ళముందు రోజూ కనిపించే అక్కయ్య దూరం అవటం తో మాకు పిచ్చెక్కిపోయేది.ఏమీ తోచేదికాదు. మా అమ్మా నాన్న ల పరిస్థితి మరీ దారుణం .కనుక వాళ్ళనుంచి ఉత్తరాల కోసం రోజూ ఎదురు చూసేవాళ్ళం  .అక్కడ రాసి వేసిన ఉత్తరం ఇక్కడికి చేరటానికి కనీసం వారం రోజులు పట్టేది .రోజూ నేనూ మా తమ్ముడు మా మిత్రులు ఉదయం  స్కూల్ కు వెడుతూ దారిలో ఇప్పుడు డిబి ఆర్ కాంప్లెక్స్ ఉన్న చోట అప్పుడు పెంకుటింట్లో పోస్టాఫీస్ ఉంటె కిటికీ దగ్గర నిలబడి పోస్ట్ మాన్ ‘’షేకాలీ ‘’ని ఉత్తరం వచ్చిందా అని అడిగే వాళ్ళం వస్తే ఇచ్చేవాడు లేకుంటే రాలేదని చెప్పేవాడు. ఆతను మా నాన్న శిష్యుడు అవటం తో మాకు చనువు ఎక్కువ .అతని కిర్రు చెప్పుల చప్పుడు విని పోస్ట్ వచ్చిందని తెలిసేది ఇంట్లో .అప్పుడు అంతా కార్డు మీద రాయటమే .కార్డు అర్ధణా ,కవరు బేడ అని జ్ఞాపకం .ఇన్లాండ్ లెటర్ చాలాకాల్నికి కానీ రాలేదు .అక్కయ్యనుంచి ఉత్తరం రాగానే సరాసరి ఇంటికి వెళ్లి ఇచ్చి బడికి వెళ్ళేవాళ్ళం .

  ఒరిస్సాలోని వాళ్ళున్న చోటుకు వెళ్ళాలంటే బెజవాడ వచ్చి ట్రెయిన్ ఎక్కి వెళ్ళాలి .మొదటి సారి అందరం బెజవాడ వచ్చి ట్రెయిన్ ఎక్కించి అది ఏ తెల్లవారు ఝామునో బయల్దేరే దాకా ప్లాట్ ఫాం పై పడిగాపులు కాచి ,అప్పుడు ఉయ్యూరు చేరేవాళ్ళం. ఇందులో ఎంతో ఆనందం ఉ౦డేది మాకు .ఎప్పుడైనా అరునెలలకోసారి వచ్చేవారేమో .ఒకసారి మా బావ అక్కయ్యలతో ఏలూరు వెళ్లి అక్కడ ఆయన అక్కగారి మరిది జనమంచి కృష్ణ ఇంట్లో దిగి .రాత్రి రెండవ ఆట సినిమాకు రిక్షాలో ‘’జయభేరి ‘’సినిమా చూసి ఇంటికి వచ్చి తెల్లారిన తర్వాత ట్రెయిన్ లో వాళ్ళను ఎక్కించి ఇంటికి వచ్చాను .సినిమాకు వెళ్ళేటప్పుడు ,వచ్చేటప్పుడు రిక్షాలో మా బావ ఒడిలో కూర్చుని వెళ్ళటం బాగా జ్ఞాపకం .అప్పుడు చూసిన జయభేరి ఇంకా గుండెల్లో  భద్రంగా మోగుతూనే ఉంది .అలాగే మరో సారి మాతమ్ముడు వాళ్లిద్దరు కలిసి రామారావు భానుమతి ,జమున నటించిన సినిమా రెండో ఆట చూశాం బెజవాడలో .అందులో భానుమతిపాడిన లాలిపాట బాగా ఉంటుంది .

   మా తమ్ముడి ఉపనయనానికి  వాళ్ళిద్దరూ వచ్చి వాడిని తమతో తీసుకు వెళ్ళారు .1961 నవంబర్ లో మానాన్న చనిపోయినప్పుడు వాళ్ళు బీహార్ లో ఉండేవాళ్ళు .రమ్మని టెలిగ్రాం ఇస్తూ ‘’స్టార్ట్ బై ఎయిర్ ‘’అని రాసినట్లు జ్ఞాపకం .మా నాన్న గారి మరణం మాకు పెద్ద గా బాధ కలిగించింది .అంతకు ముందుమా అన్నగారి మరణం .ఈ రెండూ మా అమ్మ జీర్ణించుకోలేక పోయింది చాలా ఏళ్ళు .బయటికి వచ్చేదేకాదు.మా నాన్నగారి మరణం తర్వాత మా నాయనమ్మ నా చేతుల్లో నే 1966లో  చని పోయింది .సుమారు 90 ఏళ్ళు ఆవిడకు అప్పుడు .పండగలా కర్మకాండ చేశాం .దీనికీ అక్కాబావా వచ్చారు .

                           బందరు జ్ఞాపకాలు

  మా బావ రాష్ట్రానికి చాలా దూరం లో పని చేస్తూ ఉండటం వలన మా బావ తాను ఒక్కడే అక్కడ వండుకు తింటూ ,పిల్లల చదువుకోసం బందరులో బచ్చుపేట లో కాపురం పెట్టించాడు .ప్రముఖ కధారచయిత ఆర్ ఎస్ ఎస్ నాయకుడు ,జాగృతి వారపత్రిక కాలమిస్ట్ హిందూ హై స్కూల్  లేక్కలమేస్టారు శ్రీ రాజనాల శివరామ కృష్ణమూర్తి (ఆర్ ఎస్ కె మూర్తి )గారి దగ్గర పిల్లల ట్యూషన్ .హిందూహైస్కూల్ కాలేజీలలో అశోక్  శాస్త్రి పద్మలు చదివారు .వీలైనప్పుడల్లా మేము బందరు వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చేవాళ్ళం నేను స్పాట్ వాల్యుయేషన్ కు వెడితే అన్ని రోజులూ అక్కడే .వాళ్ళూ పండగలకు ఉయ్యూరు వచ్చేవాళ్ళు ఒకసారి ఫోర్ట్ రోడ్ లో మెహర్ బాబా హాల్ లో మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గానకచేరీ అందరం కలిసి చూశాం . ఇక్కడే రెండు చింతల ఆయన ఇంట్లో కొంతకాలం అద్దేకున్నారు వాళ్ళతో అనుబంధం ఎవరూ మర్చిపోలేం .మరో ఇంట్లో వీళ్ళ ఇంటి సగభాగం లో పమిడిముక్కల నేటివ్  ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ‘’భక్త జయదేవ్ ‘’సినిమా దర్శకుడు పమిడి ముక్కాల రామారావు గారు అద్దెకుండేవారు ఆయనతో నాకు అంతకు ముందే పరిచయం .

ఇలా సవ్యం గా సాగుతున్న మా జీవితాలలో మరో రెండు కుదుపులు కొంత ఇబ్బంది పెట్టాయి .పూనాలో డిఫెన్స్ ఫాక్టరీ లో పని చేస్తున్న మా తమ్ముడు మాకు తెలీకుండా తనతో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు .మా అక్కయ్యా బావలకు ఇది తెలిసింది .మాకు చెప్పలేదు .ఒకసారి ఉత్తరం రాసి విషయం తెలియజేశాడు .మా అమ్మ దీన్ని జీర్ణించుకోలేక పోయింది .ఆవిడను ఆపటం మా వశంకాలేదు .వాడంటే మా అమ్మకు ప్రాణం .మా అక్కయ్యకూ అంతే.చివరికి మ బావ ఉయ్యూరు వచ్చి అందరినీ శాంతపరచి వాళ్ళిద్దరినీ మా ఇంట్లో కి ప్రవేశం కల్పించేట్లు చేశాడు .ఇందులో మా అక్కా బావల ఓర్పు నేర్పు ప్రశంసనీయం .అందరం కలిసి పోయాం .హాయిగా ఉన్నాం .

   బందరులో చదివి డిగ్రీ పాసై న౦బూర్ నాగార్జున యూనివర్సిటి లో లెక్కల ఏం ఏ లో చేరి చదువుతున్న మా మేనల్లుడు  బందరు లో తన స్నేహితుడి అక్కను ప్రేమించి  వాళ్ళ ప్రోద్బలంతో మాకు మా అక్కా బావాలకు తెలియజేయకుండా తిరుపతి లో పెళ్లి చేసుకున్నాడు .మా తమ్ముడి విషయం లో సంయమనం పాటించిన మా అక్క బావ కొడుకు విషయం లో సమాధానం పడక  తెగ తెంపులు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు .ముందుగా వాళ్ళిద్దర్నీ ఉయ్యూరు రమ్మని చెప్పి వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొంత ఉపశమనం కలిగించాం  .కలపటమే కాని చీల్చటం  కూల్చటం తెలియని నేను ,రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది .నేనూ నా భార్య ప్రభావతి ముందు గా మా అమ్మను ఒప్పించి నెమ్మదిగా మా అక్కా బావల దగ్గరకు వెళ్లి ప్రత్యక్షంగా మాట్లాడి ఎన్నో సార్ల ప్రయత్నం లో వాళ్ళను కన్విన్స్ చేయగలిగాము  .ససేమిరా అని అగ్గిమీద గుగ్గిలమై పోతున్న మా బావను వెనక తాను మా తమ్ముడి విషయం లో చేసింది గుర్తుకు తెచ్చి ,మా అక్కయ్యనూ శాంతపరచ గలిగాను .అందర్నీ కలిపే బాధ్యత నాపై పెట్టారిద్దరూ .అశోక్ బావమరదులు అత్తా మామలతో మాట్లాడి చీవాట్లు పెట్టి చేసింది తప్పే అని ఒప్పించి ,చెప్పించి రాజీ ప్రయత్నం చేశా .ఒక మంచి రోజు ఆదివారం మా అక్క బావల ఇంట్లోనే అశోక్ భార్య సంధ్య లతో సత్యనారాయణ వ్రతానికి ఏర్పాటు చేయించి , అమ్మాయి తరఫు వాళ్ళనూ  పాల్గోనేట్లు చేసి ఉయ్యూరునుంచి మేమూ వచ్చి పాల్గొని స్వామి సమక్షం లో అందరూకలిసేట్లు చేశాను .దీనికి మా అక్క బావా ఎంతో సంతోషించారు .పిల్లలపై అధిక మమకారం ప్రేమ ఉంటె  మా అమ్మలాగే, మా అక్కా బావ లాగే ఇబ్బంది పడతారని అర్ధమయింది  .ఈ ఒక్కటి తప్ప మా మేనల్లుడు అశోక్ బంగారం .వాడి హృదయం అమృతం .తర్వాత అందరూ హాయిగా కలిసిపోయారు ఏ పొరపొచ్చాలు లేకుండా .

   అశోక్ కి సిద్ధిపేట  స్టేట్ బాంక్ లో ఉద్యోగం రావటం తో చదువు మానేసి కాపురం పెట్టటం ,తలిదండ్రులు అక్కడికి వెళ్ళటం  వాడి మామ్మ తాతయ్యలనూ దగ్గరుండి చూసుకోవటం  వారిద్దరూ మరణిస్తే కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించటం తమ్ముడిని అక్కడే కాలేజి లో చేర్పిచి చదివించి గోప్పబాధ్యత తీసుకుని మా అక్కా బావల మనసు మార్చాడు .మేమూ సిద్ధిపేట వెళ్లి వచ్చేవాళ్ళం .అప్పుడే ఓరుగల్లు కోట చూపించాడు మా మేనల్లుడు శాస్త్రి .అశోక్ ఇంటిదగ్గర ఉదయం సాయంత్రం ఇంటర్ వాళ్లకు లెక్కలు ట్యూషన్ చెప్పేవాడు .కిటకిట లాడేవారు జనం లో మంచి పేరు తెచ్చుకున్నాడు .దీనితో తలిదండ్రులూ పొంగిపోయేవాళ్ళు .

  మా బావ కు హైదరాబాద్ దగ్గర కు ట్రాన్స్ ఫర్ అవటం ,కాకతీయ నగర్ లో కాపురం ,మాతమ్ముడు పూనాలో మానేసి హైదరాబాద్ డిఫెన్స్ లో చేరి కొంతకాలం మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో ఉండటం  మేమూ తరచూ అక్కయ్యా వాళ్ళింటికి వెళ్ళటం జరిగేది .ఎక్కడున్నా అక్కయ్యా వాళ్ళు అంటే మాకు మహా ప్రాణం .శాస్త్రికి ,పద్మకు హైదరాబాద్ సంబంధాలే కుదరటం తో వాళ్ళ కు మరింత ఆనందం కలిగింది .అల్లుడూ కోడలూ కూడా మంచివాళ్ళు అవటం అదృష్టం .శాస్త్రి రిజర్వ్ బాంక్ లో ఉద్యోగం పొంది ,క్వార్టర్స్ లోఅమ్మానాన్న లతో  కాపురం పెట్టి తర్వాత చదువులకు స్నేహితుల ప్రోత్సాహం తో అమెరికా వెళ్లి చదివి ఉద్యోగం సాధించి భార్య విజయలక్ష్మినీ తీసుకుని వెళ్లి ఆమె కూ ఉద్యోగం రాగా హాయిగా కాలం గడుపుతున్నారు .మా బావ అన్నగారు ముకుందం గారబ్బాయి పవన్ ను శాస్త్రి అమెరికా తీసుకువెళ్ళి చదివించి ఉద్యోగం వచ్చేట్లు చేశాడు .

  అశోక్ ఓల్డ్ బోయిన్ పల్లి లో ఇల్లు కట్టుకుని అమ్మా నాన్నలతో సహా అందులోనే ఉన్నాడు .ఇక్కడికీ తరచూ వచ్చేవాళ్ళం .మాబావకు నేనంటే విపరీతమైన మమకారం నా మాటకు విలువ నిచ్చేవారు .తర్వాత శాస్త్రి అన్న ఇంటికి దగ్గరలోనే స్థలం కొని రెండస్తుల బిల్డింగ్ కట్టించి ,తలిదండ్రులకు కన్వీనియెంట్ గా ఉంటుందని అక్కడ ఉంచాడు .అమెరికా వెళ్లి వస్తున్నాడు .కొడుకు ఉపనయనం ఇక్కడే చేశాడు .అశోక్ కూతురి పెళ్లి, కొడుకు పెళ్లి చేశాడు వీళ్ళకూ హైదరాబాద్ సంబంధాలే .కనుక కళ్ళముందే కొడుకు కోడలు మనవరాలు మనవడు,కూతురు కుటుంబం ఉండటం తో హేపీ హేపీ .

  ఇంతహాపీ గా ఉన్నా చిన్నకొడుకు దూరంగా ఉన్నాడనే బెంగ వాళ్ళిద్దరికీ .లోపలఉండి, అది తొలి చేస్తోంది .బిగపట్టుకుని పైకి గంభీరంగా ఉంటున్నారు .ఇది గ్రహించి శాస్త్రి ఇక్కడే హై టెక్ సిటీ లో కోటి రూపాయలు పెట్టి ఇల్లుకొని అమ్మానాన్నలకు దగ్గరలో ఉండి పోదామని ప్రయత్నించాడు .రెండు నెలలు ఉన్నాడుకూడా .కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి  కొన్న ఇంటిని కారు ని అమ్మేసి అమెరికాలో కాలిఫోర్నియాలోనే అప్పుడు అమ్మేసిన స్వంత ఇంటిదగ్గర్లోనే మళ్ళీ కొనుక్కుని ఉంటున్నాడు .పిల్లలిద్దరూ ప్రయోజకులై ఉద్యోగస్తులయ్యారు .తలిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు అన్నమాటే కాని వాళ్లకు కావాల్సిన సదుపాయాలూ వైద్య సౌకర్యాలు అన్నీ స్వయం గా చూస్తున్నాడు .అశోక్ బార్య పిల్లలూ  రెండుపూటలా  వచ్చి ,రోజూ అన్నం కూరలు ఆధరువులూ తెచ్చి ఏ లోపం లేకుండా చూస్తున్నారు .అయినా వాళ్ళిద్దరి మనసులలో దిగులు గూడు కట్టుకుని ఉంది.దాన్ని పొ గొట్టే అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు సోదరులిద్దరూ .ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సింది జరిగే పోయింది 13 వ తేదీ శుక్రవారం రాత్రి .మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ మరణం అందరి మనసులను కలచి వేసింది .మా బావ కు అందరూ ధైర్యం చెప్పి బాధను దూరం చేయాలి .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-18 –కాంప్-మల్లాపూర్- హైదరాఆద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చిలుకూరు ఆలయం లో 27 00 యేళ్ళనాటి ఆచారం -అర్చకుల భుజస్కంధాలపై దళితుడు ఆలయ ప్రవేశం

2700ఏళ్లనాటి ఆచారం: అర్చకుడి భుజ స్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమే : రంగరాజన్ హైదరాబాద్: దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అర్చకుడి భుజ స్కందాలపై దళితుడు సోమవారం సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వయంగా ఓ దళిత భక్తుని తన భుజస్కందాలపై ఎత్తుకుని దేవాలయంలోకి మోసుకెళ్లి శ్రీ రంగనాథుని దివ్యదర్శనం చేయించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   మనుషులంతా ఒక్కటే దేవుని ముందు ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమేనని రంగరాజన్ వివరించారు. దళితులను దేవాలయంలోకి అనుమతించరాదంటూ ఎక్కడా పురాణాల్లో లేదని రంగరాజన్ స్పష్టం చేశారు. ఓ యూనివర్శిటీలో జరిగిన చర్చలో దేశంలో జరుగుతున్న దాడుల గురించి దళిత మేధావులు, నాయకులు ప్రస్తావించారని, ఆ సందర్భంలో నేను లోక సారంగ- తిరుప్పాణాళ్వార్ వృత్తాంతాన్ని వినిపించినట్లు తెలిపారు. మంచి మనస్సుతో.. ధర్మాన్ని రక్షిస్తే.. కానీ, ఎప్పుడో జరిగిందని చెప్పడం కాదు.. ఇప్పుడు మీరు అలా చేయగలరా? అని వాళ్లు ప్రశ్నించటం వల్లే 2700 క్రితం నాటి అరుదైన సన్నివేశానికి మళ్లీ శ్రీకారం చుట్టినట్లు రంగరాజన్ తెలిపారు. శుచి, శుభ్రత, మంచి మనస్సు ఉంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చునని తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందనేది తమ సంకల్పమని రంగరాజన్ పేర్కొన్నారు. ఫెడరల్‌ఫ్రంట్: మేలో ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో కెసిఆర్ చర్చలు అమెరికాలో తోటపిల్లి కుటుంబం అదృశ్యం విషాదాంతం: ముగ్గురి మృతదేహాలు లభ్యం శ్రీరెడ్డి సహా వారికి కౌంటర్.. బాధగా ఉంటుంది, కానీ: పవన్ కళ్యాణ్ వీడియో వైరల్ Featured Posts 2700ఏళ్లనాటి ఆచారం అనంతరం చిల్కూరు దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందర్య రంగరాజన్ మాట్లాడుతూ.. దళితులకు ఆలయ ప్రవేశంలో మునివాహన సేవ అనేది కీలక ఘట్టమని తెలిపారు. క్రీ.పూ. 2700 యేళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో దళితున్ని ఆలయంలోకి రామానుజాచార్యులు వారు స్వయంగా భుజస్కంధాలపై మోసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయించారని గుర్తుచేశారు. ఇదే మునివాహన సేవ కార్యక్రమాన్ని జియాగూడలోని శ్రీ రంగనాథ్ స్వామి దేవాలయంలో నిర్వహించామని తెలిపారు.


— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

ఉయ్యూరు జ్ఞాపకాలు

1950లో మా కుటుంబం హిందూపూర్ నుంచి ఉయ్యూరు వచ్చేసింది .మేము బోర్డ్ హైస్కూల్ లో చేరాం. రోజూ ఇంటినుంచి మా అక్కయ్య ,మేమిద్దరం నా ముఠాఅంటే సూరి నరసింహం ,పెద్దిభొట్ల ఆదినారాయణ ,మామిళ్ళపల్లి సత్యనారాయణ ,కలిసి సీతంరాజు వారింటి ముందునుంచి మామయ్యగారి మామిడి తోట దాటి ప్రక్కనే ఉన్న హైస్కూల్ చేరేవాళ్ళం .ఇక్కడే రాయప్రోలు కొదందరామయ్యగారి 5 ఎకరాల దట్టమైన బంగినిపల్లి మామిడి తోట ఉండేది .మధ్యాహ్నం అలాగే ఇంటికి వచ్చి బట్టలు విప్పేసి బయట పారేసి బొందులాగూ లేక తువ్వాల కట్టుకుని అన్నం తిని మళ్ళీ బయల్దేరే వాళ్ళం .బడి బట్టలతో ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు .తప్పనిసరిగా బట్టలు మార్చాల్సిందే ఆడ అయినా మగ అయినా .మా అక్కయ్య స్నేహితురాళ్ళు సూరి మంగమ్మగారబ్బాయి శ్రీరామ మూర్తి కూతురు కమల ,హెడ్ కర్ణం ఆదిరాజు నరసింహారావు గారమ్మాయి సుందరి ,మాఅమ్మ బెస్ట్ ఫ్రెండ్ శ్రీమతి చోడవరపు  అమ్మన్న ,మానాన్న బెస్ట్ ఫ్రెండ్ చంద్రశేఖరరావు దంపతుల  కూతురు తేజ ,బట్టల షాపు యజమాని నెప్పల్లి మల్లికార్జునరావు గారమ్మాయి ,ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు గారమ్మాయి అని గుర్తు .ఆదివారాలలో వీళ్ళందరూ కలిసి ఆడుకునేవారు .మా అక్కయ్యలిద్దరూ ప్రముఖ సంగీత విద్వాంసుడు గరికపాటి కోటయ్య దేవర గారమ్మాయి వద్ద సంగీతం నేర్చుకునేవారు .స్వరాలు సరళీస్వరాలు జంటస్వరాలు అయ్యాక ‘’లంబోదర లకు మికరా –అంబా సుత అమర వినుత ‘’కృతి నేర్పేవారు. వినటం వలన మాకూ నోటికి వచ్చేసేవి .సంగీతం క్లాసులు సాయంకాలం 5 తర్వాతే .

వేసవిలో ఊరగాయలు వేయటం మామిడి కాయ ముక్కలు తరగటం లో మా అక్కయ్యలు బాగా సహకరించేవాళ్ళు మా అమ్మకు. నేను కాయలు తుడిచి దబ్బనం తో జీడి తీసేవాడిని తర్వాత ముక్కలు తరగటమూ అలవాటైంది .కాయలన్నీ మా మామయ్యగారి తోటలోనివే పాలేళ్ళతో కోయించి ఇంటికి పంపేవాడుమామయ్య .అదొక యజ్ఞం గా జరిగేది .వాళ్ళపాలేళ్ళు తాటి చెట్ల నుండి తాటి గెలలు దించి ,’’జల్లాబండీ ‘’లో తోలుకు వచ్చి వాళ్ళ దొడ్లో పడేసి పాలేళ్ళు పదునైన కొడవలితోచుట్టూ కోసి  ముంజెలు తీసి  మాకు ఇస్తే మహా కమ్మగా జుర్రేవాళ్ళం .సీమచింతకాయలు తినేవాళ్ళం కొనే వాల్లంకాడు .మా దొడ్లోను మా పెరడు వెనకున్న ‘’చామలి ‘’లోనూ ఉన్న ఈత చెట్ల నుండి పండిన ఈత  గెలలు మా స్నేహితులే కోసుకొస్తే అందరం తినేవాళ్ళం మహా రుచిగా ఉండేవి .అందులోని గింజను ఉమ్మేయటం ఒక కళ.తాటిము౦జెలు తిని  అరగటానికి మామిడి ముక్కలు లేక ఆవకాయ తినే వాళ్ళం .పోటీలు పడి తినేవాళ్ళం ఆడా మగా అందరం .

డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో రేగిపళ్ళు అమ్మవచ్చేవి. బుట్టల్లో పెట్టుకుని స్త్రీలు ఇళ్ళకు తీసుకోచి అమ్మేవారు .డబ్బులిచ్చి కొనటాలు లేవు .వడ్లు పోసి కొనటమే .రెండు గిద్దల  వడ్లకు  ఒక గిద్ద రేగిపళ్ళు ఇచ్చేవారు లేక బియ్యానికైతే సరికి సరి. బియ్యంతో కొనటానికి పెద్ద వాళ్ళు ఒప్పుకునేవారు కాదు .మా అక్కయ్య లిద్దరికీ రేగి పళ్ళు మహా ప్రాణం .వాకిట్లోకి వస్తే కొనకుండా వదిలే వారు కాదు .అంతమోజు .ఇక మామిడిపళ్ళు చెప్పక్కర్లేదు .మా ఇళ్ళ చుట్టూ మామిడిపళ్ళ ‘’కావ’’ లుండేవి .తాటాకు బుట్టలతో కొనుక్కోచ్చేవాళ్ళం. హిందూపూర్ నుంచి వచ్చిన కొత్తలో మా మామయ్యే మాకు కొనిపెట్టేవాడు .తర్వాత మేము’’ ముదిరి ‘’మేమే కొనేవాళ్ళం .స్కూలు పుస్తకాలకు అక్కయ్యలె చక్కగా అట్టలు వేసే వాళ్ళు  .అదీ ఒక కళగానే అనిపించేది నాకు .ఇప్పటికీ అట్ట వేయటం రాదు .స్కూల్ బుక్స్ అన్నీ మామయ్య దగ్గరుండి కొనిపించేవాడు .ఒక నియోగి బ్రాహ్మలాయన సెంటర్ లో ఫాన్సీ షాప్ పెట్టాడు అక్కడే కొనే వాళ్ళం అప్పుడు .

దీపావళి కి నెల రోజుల ముందు నుంచి హడావిడి .మామామయ్య మాకు మతాబాలు తయారు చేయటం నేర్పాడు మా అక్కయ్యలిద్దరూ మతాబ గొట్టాలు తయారు చేయటం లో ఎక్స్పర్ట్ లు .సురేకారం గంధకం సున్నం ఆముదం సరైనపాళ్ళ లో కలిపించేవాడు .అడుగున కొద్దిగా ఇసుకపోసి మందు దట్టించి కూరేవాళ్ళం .బాగా ఎండ బెట్టేవాళ్ళం .దీపావళికి భలే తేజస్సుతో కాలేవి .నెల రోజులు ముందునుంచే’’ రోలు- రోకలి ‘’కొని తాళ్ళుకట్టి టపాసు మందు ఒక సీసాలో పోసుకుని ,తాటాకు ముక్కతో రోట్లో వేసుకుని రోకలి బిగించి గట్టి రాయి కేసి రోకలి తగిలేట్లు కొడితే గుండెలు పగిలే శబ్దం వచ్చేది .భలే సరదా .అలాగే సంక్రాంతికి ముందు ఇంటి వాకిట్లో దొడ్లో గొబ్బెమ్మలు వాటికి అలంకారాలు గొబ్బిపాటలతో మా అక్కయ్యలు హోరేత్తించేవారు ..మేళగాళ్ళు వాయిద్యాలు ఊదుకుంటూ జోలె పుచ్చుకుని ఇళ్ళకు వస్తే పాలేల్లతో వడ్లకోట్లోనుంచి ముందే తీయించి ఉంచిన వడ్లబస్తాలోని వడ్లను మా అక్కయ్యలు చేటల్లోకి బియ్యపు డబ్బాతో పోసి రెడీ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ విసుగు లేకుండా పెట్టేవాళ్ళం .ఇంటి మంగలికి మరికాస్త ఎక్కువ పెట్టేవాళ్ళం .చాకళ్ళకు మామూళ్ళు ,తిరునాలకు మామూలు,ఏరువాక పౌర్నమి మామూళ్ళు,దసరామామూళ్ళు పశువులాసుపత్రి వాళ్ళ ,పోస్ట్ మాన్ల మామూళ్ళు ఇవ్వటం లో ఎంతో తృప్తి ఉండేది .

మా నాన్న ను ఎంతో బతిమిలాడితే తప్ప సినిమాకు తీసుకు వెళ్ళేవాడుకాడు .మా చిన్నక్కయ్య అడిగితెనో లేక మా తమ్ముడు అడిగితెనో లేకపోతె మా మామయ్య కూతురు ‘’మామయ్యా సినిమా ‘’అని పీడిస్తేనో సినిమాకు తీసుకు వెళ్ళేవాడు .రామినేని బుచ్చిబాబు వాళ్ళ ఒకే ఒక హాలు ఉండేది .దేవదాసు మల్లీశ్వరి ,పెళ్లి చేసి చూడు చూశాము .ఒకసారిమమ్మల్ని అందరిని బెజవాడ దుర్గా కళామందిరం లో ఆడుతున్న ‘’అప్పుచేసి పప్పు కూడు ‘’సినిమాకు తీసుకు  వెళ్ళిన జ్ఞాపకం.

చిన్నక్కయ్య వివాహం

తేలప్రోలుదగ్గర చిరివాడ అగ్రహారం లో శతావధాని వేలూరి శివరామ శాస్స్త్రి గారు ఉండేవారు .ఆయన తమ్ముడే వేలూరి కృష్ణ మూర్తి గారు .వీళ్ళకు రైస్ మిల్ ఉండేది. మిల్లు కృష్ణమూర్తి గారు అనే వారు ఆయన్ను .ఆయన రెండవ కుమారుడే మా బావ వివేకానందం గారు .అప్పుడాయన ఉయ్యూరు పాలిటెక్నిక్ లో ఎల్. సి .ఇ .చదివేవాడు .కొంతకాలం కంసాలి బజార్లో ,తర్వాత మా ఇంటి సందుకు ఎదురుగా ఉన్న వంగల వెంకాయమ్మగారింట్లో రూమ్ లో అద్దెకు ఉండేవాడు .స్వయంగా వంట చేసుకునేవాడు .మా అమ్మ మేనమామల ఊరుకూడా చిరివాడ కావటం తో కొంత బంధుత్వం ఉంది .తరచుగా మా ఇంటికి వచ్చి కబుర్లు చెప్పేవాడు సినిమా లు చూసి కధలు వినిపించేవాడు .ముఖ్యంగా హిందీ సినిమాలు మా అక్కయ్య లిద్దరికీ బాగా నచ్చేవి. వాటి కదలు పూస గుచ్చినట్లు చెప్పేవాడు .రాత్రి పడి గంటలదాకా ఆయనతో మాకు కాలక్షేపం .చాలా మంచి వాడు .మా అక్కయ్యకు మనసులో ఆయన బాగా నచ్చినట్లున్నాడు .ఆయనకూ మా చిన్నక్కయ్య బాగా నచ్చింది .ఈ విషయం తెలిసి అటూ ఇటూ పెద్దవాళ్ళు కూర్చుని సంబంధం ఖాయం చేసి వాళ్ళ తలిదండ్రులను పిలిపించి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ,1956 లో మాఘ శుద్ధ ఏకాదశినాడు ఉదయం పూట వివాహం జరిపించారు .చిరివాడ నుండి ఆయన బంధుగణం అంతా రెండెడ్ల బళ్ళలో ఉయ్యూరు చేరారు .విడిది కొలచల శ్రీరామమూర్తి మామయ్య ఇంట్లో .మామేనమామ అన్నీ దగ్గరుండి చూసి వివాహం వైభవోపేతంగా జరిపించారు .వంగల సుబ్బావధానులు అనే మా నాన్న శిష్యుడే మా ఇంటి పురోహితుడు .ఆయనే బ్రహ్మగారు. ఆ పెళ్లినాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను సారధి స్టూడియో అధినేత మోహన్ తీశాడు .దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు మా అక్కయ్య బావా దంపతులు .మూడు నిద్రలకు చిరివాడ వెళ్ళటం ,చిరివాడ అడ్డరోడ్డు దగ్గర ఉయ్యూరు –తేలప్రోలు బస్సు దిగటం అక్కడినుండి వాళ్ళ ఒంటేద్దుబండీలో వాళ్ళ ఇంటికి చేరటం మాకు అలవాటైంది .లేకపోతె అడ్డరోడ్డుననుండి లెఫ్ట్ అండ్ రైట్ . .వాళ్ళబండీ తోలేవాడిపేరు ‘’గడ్డెన్న’’మన సినిమా’’ బొడ్డపాటి’’కి అన్నలా ఉండే వాడు  నోట్లో పొగాకు చుట్ట బానపొట్ట తలపాగా పొట్టి మనిషి తూర్పు యాస .మందు ఎక్కితెకాని బండీ తోలేవాడుకాడు .ఒకసారి మండీలో మమ్మల్ని తీసుకొస్తూ పంటకాలువలోకి దించాడు .అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు .

చిరివాడ లో మా బావా వాళ్లకు ఇంటి వెనుక ప్రత్యేకమైన మంచినీటి చెరువు ,దానిపైనా ఇంటి చుటూ వెదురు పొదలు ,బండీ ఎడ్లు వ్యవసాయం  నౌకర్లు చాకర్లు బాగా ఉండేవారు .మాబావగారి తల్లిగారు  కాంతమ్మగారు పొట్టి మనిషి .రూపాయ బిళ్ళ అంత కుంకుమ బొట్టుతో లక్ష్మీ దేవిలా ఉండేది .తండ్రి పొడుగ్గా ఎర్రగా సన్నగా ఉండేవారు మంచి సంస్కారి.అన్ని విషయాలూ తెలుసు .వాళ్ళింట్లో హెచ్ ఏం వి గ్రామఫోన్ ఉండేది .గ్రామఫోన్ రికార్డ్ లు వినేవాళ్ళం వెళ్ళినప్పుడల్లా .కృష్ణ శాస్స్త్రి గారి పాటలు ,’’అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే ‘’అనే మోహన్ కందా పాడిన సినిమాపాట చెంచీత పాటలు మాకు ఎంతో ఇష్టం .

మా బావ చెల్లెలు శాంతమ్మగారి పెళ్ళికీ వచ్చిన గుర్తు .ఆవిడను తరచూ తేలప్రోలు స్టేషన్ లో గుంటూరు ట్రయిన్ ఎక్కించి వచ్చేవాళ్ళం .అన్నగారు ముకు౦ద౦ గారు రైస్ మిల్ బాధ్యత వహించేవారు .భార్య కూడా ఇక్కడే ఉండేది .చిరివాడ ఇల్లు రుషి ఆశ్రమ లాగా చాలా ప్రశాంతంగా ఉండేది .అత్తమ్మగారి ఫిల్టర్ కాఫీ రుచి ఇంకెక్కడా మళ్ళీ చూడలేదు .ఆవిడ వంటా బాగుండేది .చారులో బెల్లం బాగా వేసేది .మా ఇంట్లో చారు తియ్యగా ఉంటె మేము ‘’చారు చిరివాడ వెళ్లి వచ్చినట్లుంది ‘’అని యెగతాళి చేసేవాళ్ళం .

మా అక్కయ్యలు మంగళ గౌరీ నోములు నోచేవాళ్ళు .అప్పుడు పుల్లేరు కాలవదగ్గర చెరుకుపల్లి శాస్త్రి గారింట్లోనే అందరూ వెళ్లి నోచుకునేవారు . తర్వాత కోట క్రష్ణమూర్తిగారింట్లో .చివరి రోజు అమ్మవారిని కాలవ లో ‘’వాలలాడింపు ‘’ . నోచుకున్నవారందరూ సామూహిక భోజనాలు చాలా హడా విడిగా ఉండేది .చెరుకుపల్లి వారింట్లో మా మామయ్యగారింట్లో నృసింహ జయంతికి అందరం వెళ్ళేవాళ్ళం. శాస్స్త్రి గారింట్లో ఊర్లో బ్రాహ్మలందరికీ భోజనాలు ఉండేవి మర్నాడు ,మామిడిపళ్ళు వేసేవారు .తాటాకు విసినకర్ర పానకం వడపప్పు ప్రత్యేకం మహా రుచిగా శుచిగా వంట ఉండేది .పూర్ణం బూరలు తప్పని సరి. అందరినీ ఆప్యాయంగా ఆదరించి భోజనం పెట్టేవారు శాస్స్త్రిగారు భార్య అన్నపూర్ణమ్మ గారూనూ

మా మేనమామ గంగయ్యగారు ఆయన పినతండ్రి నరసింహం గారు కలిసి ఉయ్యూరు దగ్గరలో ఉన్న కనకవల్లి అగ్రహారం లో శివాలయం కట్టించి శివ లింగ ప్రతిష్ట రంగ రంగ వైభవం గా చేశారు .పదిరోజులు అందరం అక్కడే రెండుపూటలా టిఫిన్లు భోజనాలు. మాకే కాదు కనకవల్లి గ్రామ బ్రాహ్మణులందరికీ .పెద్ద పెళ్లి జరిగినట్లు జరిగింది .వంటబ్రాహ్మణులలో సన్నగా పొడవుగా ఉండే ఆయన వంటలో దిట్ట .మహా రుచికరం గా ప్రతిపదార్ధం ఉండేది .ఈయనే మా చిన్నక్క పెళ్ళికి వంట చేశాడు .మా కుటుంబం అన్ని రోజుల్లో తమలపాకులు వక్కపొడి ఏర్పాటు .మా అక్కయ్యావాళ్ళు కిళ్ళీలు కట్టి ఇచ్చేవారని జ్ఞాపకం .

అలాగే మా మామయ్య కూతురు రాజమ్మ పెళ్లి అయిదురోజులు ఘనంగా చేశారు .నా వడుగు కూడా బాగా జరిగింది .సుబ్బయ్యగారే బ్రహ్మ పసుమర్తి సీతారామయ్య వంట .చాలా బాగా చేశాడు. అప్పుడు శుభాకార్యాలంటే తాటాకు పందిళ్ళు ,అరిటాకు లేక తామరాకు విస్తళ్ళలో భోజనాలు. మూడురోజులు తప్పని పేరంటాలు .వచ్చినవారు 16 రోజుల పండగ దాకా ఉండటాలు ,ఉండకపోతే సోడ్డ్లు వేయటాలు .భోజనాలకు ఎవరు వెళ్ళినా పైన తువ్వాల చేతిలో నీళ్ళ గ్లాసు తో వెళ్ళాల్సిందే .

మల్లె పూలు వేసవిలో బాగా వచ్చేవి మా అక్కయ్యలిద్దరూ చక్కగా దండలు కట్టేవారు .శివాలయం లో నవరాత్రి ఉత్సవాలు,విష్ణ్వాలయం లో వైశాఖపౌర్ణమి కళ్యాణాలు మర్చిపోలేము .అలాగే ధనుర్మాసం లో పందిళ్ళ కింద  హరికధలు అర్ధ రాత్రి దాకా అక్కయ్యలతోకలిసి చూడటాలు ఇప్పటికీ గుర్తే .అత్తరు సాహెబ్ దగ్గర కళ్ళల్లో ‘’సుర్మా’’ పెట్టి౦చు కోవటం అత్తరు సెంటు కొనటం ఆయన యాసబాస కు నవ్వుకోటం గుర్తుకొస్తున్నాయి .మాకు శ్రీరాములు గారు అనే రిటైర్డ్ టీచర్ ఇంగ్లీష్ ను ఇంటికొచ్చి నేర్పటం ,విష్ణ్వాలయం లో మామయ్య పురాణాలు ,భాగవత సప్తాహాలు ,కాలవ అవతల గాయత్రి అనంతరామయ్యగారి(కేమోటాలజిపిత కోలాచల సీతారామయ్యగారి అన్నగారు ) మామిడి తోటలో కార్తీక వనభోజనాలు ,ఆదంపతులు మా ఇళ్ళకు రావటాలు తో మహా సందడిగా ఆ రోజులు గడిచిపోయాయి సరదాగా .మా చిన్నక్కయ్య కూ నాకూ వయసులో మూడేళ్ళే తేడా అవటం తో అక్కయ్యనాకు స్నేహితురాలుగా అనిపించేది పెళ్లి అయి ఒరిస్సాకు కాపురానికి వెళ్ళే దాకా .అప్పుడు తెలిసింది అక్కయ్య విలువ .అక్కయ్యపై ఆరాధన అప్పటినుంచే బాగా పెరిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3

                  హాస్పేట జ్ఞాపకాలు

ఏ సంవత్సరమో కరెక్ట్ గా చెప్పలేనుకానీ మేమందరం మా అన్నయ్య శర్మ స్టేషన్ మాస్టర్ గా పనిచేసిన హాస్పేట్ కు వెళ్లాం .రైల్వే క్వార్టర్స్ లోనో లేక విడిగా ఇల్లు తీసుకునో అన్నయ్య వదినలు ఉన్నారు .మేము సుమారు నెలరోజులున్నట్లు గుర్తు బహుశా వేసవి సెలవలు అయి ఉంటాయి .అక్కడ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి అదే మేము మొదట చూసిన పెద్ద నిర్మాణాలు ఆశ్చర్యం లో మునిగి పోయే వాళ్ళం .నేను మా అక్కయ్యావాళ్ళతో ‘’నేను అప్పనకొందమామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని 10 అనట్స్తుల భవనం కడతాను ‘’అని గప్పాలు కొట్టేవాడిని మా అక్కయ్యలిద్దరూ పగలబడి నవ్వేవాళ్ళు .మా చిన్నక్కయ్య ఎప్పుడూ ఈ మాట గుర్తు చేసి నన్ను ఉడికించేది .మా అన్నయ్యకు అరగంట కొకసారి కాఫీ తాగే అలవాటు ఉండేది .మేమూ తాగేవాళ్ళం .స్టేషన్ కు తీసుకు వెళ్లి అన్నీ వివరంగా మాకూ మా అక్కయ్యా వాళ్ళకూ చూపించేవాడు .నల్లటి పొడుగాటి మనిషి కోటేరు తీసినట్లుండే ముక్కు ,స్టేషన్ మాస్టర్ తెల్లని యూనిఫాం లో అన్నయ్య బహు అందంగా ఉండేవాడు .మమ్మల్ని చాలా ప్రేమించేవాడు మా చిన్నక్కయ్యను మా నాన్న ‘’బజ్జమ్మా ‘’అని మిగిలినవాళ్ళు బజ్జీ అని పిలవటం పరిపాటి .మేమూ బజ్జక్కా అనేవాళ్ళం .కోపం వచ్చేదికాదు .మానాన్న మరీ మురిపెంగా ‘’చెల్లాయమ్మా ‘’లేక చెల్లాయ్ అని తరచూ పిలిచేవాడు ఆయనకు అక్కా చెల్లెళ్ళు లేని లోటును ఈ సంబోధనతో తీర్చుకునేవాడేమో .మా పెద్దక్కయ్య లోపాముద్రను ‘’పాప ‘’అనే పిలిచేవాడు దాదాపు అందరూ అలానే పిలవటం గుర్తు .మేముమాత్రం అక్కయ్యా అనే వాళ్ళం !.వంట మా మామ్మ అమ్మ చేసేవాళ్ళు .భోజనాల సమయం లో మా మామ్మ చేసిన వంటకు అనేక  వంకలు  పెట్టేవాడునాన్న .దానికి మేమూ తందానా తాన అనేవాళ్ళం .ఆవిడ ఏమీ అనుకునేదికాదు. ముసిముసినవ్వులు నవ్వేది అంతే.మా అక్కయ్యలకు మా నాయనమ్మ నాగమ్మగారు జడలు వేసేది .అన్నం సరిగ్గా ఉడక్క పొతే సబ్బు బిళ్ళల్లా అన్నం ఉంటె  నాన్న ‘’పచామ్యన్నం చతుర్విధం ‘’అని చమత్కరించేవాడు .చారుపెడితే ‘’ఏడిచారా    ‘?అనేవాడు .మామామ్మ పులుసు అని సరిగ్గా పలకగాలిగేది కాదు .’’పుస్సు ‘’అనేది .మాకు తెగనవ్వు వచ్చేది .నాన్న ‘’అమ్మా !ఇవాళ చారా పుస్సా ‘’అని అడిగేవాడు మళ్ళీ పగలబడి నవ్వు .భోజనాలు అంత సందడిగా ఉండేవి .ఇదంతా రాత్రి వేళ.పగలు ఎవరి హడావిడి  వాళ్ళది .ఇంత  చద్దన్నం మెక్కి వెళ్ళటమే కదా .హిందూపూర్ లోనూ ఇదే తంతు .ఉయ్యూరులోనూ ఇంతే మార్పు లేదు .అన్నయ్య మమ్మల్ని సిని మాలకు తీసుకువెళ్ళి చూపించేవాడు .ఏయే సినిమాలో గుర్తులేదు .మా అమ్మ హోళిగలు బేడల చారు (పప్పు చారు )బాగా చేసేది .వంకాయలతో ‘’వాంగీ బాత్ ‘’చేస్తే రొట్ట లేస్తూ తినేవాళ్ళం .మా అమ్మ వీటిలో ఎక్స్పర్ట్ .

  తర్వాత అందరం హంపీ విజయనగరం చూశాం బహుశా ఇది రెండవసారి అనుకుంటా .తర్వాత ఎప్పుడో మాబామ్మర్ది ఆనంద్ కర్నూలు దగ్గరలో  లో పనిచేస్తుండగా అందరం వెళ్లి చూశాం మూడోసారి . పెద్దగా స్నేహితులింటికి వెళ్ళడాలు లేవు .ఎక్కువభాగం ఇంట్లోనే .అన్నయ్య ఇంగ్లీష్ లో చాలానిధి.  ధారాళంగా మాట్లాడేవాడు .ఎన్నో ఇంగ్లిష్ నవలలు పుస్తకాలు ఉండేవి .అప్పుడు వాటిని తిరగేయట మే తప్ప చదవటం రాదు .ముఖ్యంగా అన్నయ్యకు మాక్సిం గోర్కీఅంటే మహా ఇష్టం అనుకుంటా ఆయన జీవితచరిత్ర ,కధలు నవలలు చాలా ఉండేవి బీరువాలో.  అన్నయ్య 1958 లో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో చనిపోయినప్పుడు ఇవన్నీ ఉయ్యూరు వచ్చాయి .అప్పుడు,తర్వాత  కొన్ని చదవగలిగాను . ఇవన్నీ 1950 లోపే జరిగినట్లు గుర్తు .అంటే నాకు 10 సంవత్సరాల వయసులోపు జరిగినవి .1950 లో మానాన్నసర్వీస్ తో సహా హిందూపూర్ నుంచి క్రష్ణాజిల్లాబోర్డ్ కు ట్రాన్స్ ఫర్ అయి , జగ్గయ్యపేట హైస్కూల్ లో సీనియర్ తెలుగుపండిట్ గా అపాయింట్ అయి చేరారు .ఏడాదో రెండేళ్లోపనిచేసి   ఉయ్యూరు హై స్కూల్ కు బదిలీ అయి ఇక్కడే రిటైరయ్యారు .అప్పుడు నేను 8 ,మాతమ్ముడు ఏడు ,మా చిన్నక్కయ్య 9 వతరగతి లో చేరి చదివాం .ఆ విశేషాలు తర్వాత .

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2         

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2            హిందూపురం జ్ఞాపకాలు

మా చిన్నక్కయ్య దుర్గ గురించి మొదటి జ్ఞాపకాలు మేమందరం అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఉన్ననాటి వి.అంటే నాకు జ్ఞాపకమున్నంతవరకు అంటే నాకు కొంత లోకజ్ఞానం వచ్చినప్పటివి –నేను 1940 లోపుట్టాను .మాక్కయ్య నాకంటే 3ఏళ్ళు పెద్దది .కనుక సుమారు 1946 నుండి కొంత జ్ఞాపకం . మానాన్న హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్(ఇ.సి.య౦) లో సీనియర్ తెలుగు పండిట్  .రామమందిరం దగ్గర మిద్దె ఇంటిలో అద్దెకు ఉండేవాళ్ళం .కింద వంటిల్లు ,స్నానాలగది ,మధ్యాహాలు ,స్టోరు రూము ,చిన్న నేలమాలిగ,దొడ్లో బావి ,దానికి ఆనుకుని వేడినీళ్ళు కాచుకునేమట్టి ఇటుకలపై  ‘’పెద్ద రాగి అండా’’ ఉండేవి .నీళ్ళు కాచుకోవటానికి చింత కాయ పొట్టు ,లేక వేరుసెనగ పొట్టు వాడేవాళ్ళం . మధ్యహాలు నుంచి పైకి మెట్లు .పైన రెండు గదులు ,విశాలమైన హాలు .హాలుకు బయట ఆరుబయలు .రాత్రిళ్ళు భోజనం చేయటానికి పిచ్చాపాటీ కబుర్లకు ఆడవాళ్ళూ ఆడుకోవటానికి పనికొచ్చేది .లోపలిగదుల్లో ఒకటి నాన్న రామకోటి, పద్దులు రాసుకోవటానికి ,తెలుగు ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చే వారికి వీలుగా ఉండేది. రెందోగది మేము వాడుకునే వాళ్ళం .ఆడవాళ్ళు ఈ గదిలోనే బొట్టూకాటుక పెట్టుకుని అలంకారాలు చేసుకుని జడ వేసుకోనేవాళ్ళు .గాలి ధారాళంగా వచ్చే వీలు ఉండేది .అది ఎక్కువభాగం బ్రాహ్మణ పోరుగున్న ప్రదేశం .అంతకు ముందు వేరే రెండు మూడు చోట్ల అద్దెకు  ఉండేవారని అమ్మావాళ్ళు చెప్పగా విన్నాను .మ మామ్మ ,మా అమ్మ ,నాన్న ,పెద్దక్కయ్య లోపాముద్ర ,చిన్నక్కయ్య దుర్గ ,నేను ,మాతమ్ముడు మోహన్ అక్కడ ఉండేవాళ్ళం .

  మా చిన్నక్కయ్య మునిసిపల్ గర్ల్స్ స్కూల్ లో చదివేది .మా ఇంటికి దగ్గరే .నడిచి వెళ్ళేది .బహుశా 8 వ తరగతి వరకు అక్కడ చదివిన గుర్తు .స్కూల్ బాగా ఉండేది .స్కూల్ కంచే గా రబ్బరు చెట్లు అనే వెడల్పాకు చెట్లు ఉండేవి వాటి ఆకులను చీల్చి కొడితే శబ్దం వచ్చేది మాకు బలే తమాషా ఉండేది .దాని కాడలు సుమారు అరంగుళం మందంగా లో ఉండేవి .దట్టంగా గుబురుగా చెట్లు అల్లుకునేవి .మా అక్కయ్య సంగీతం కూడా ఇక్కడే కొంత నేర్చుకున్నది .మా పెద్దక్కయ్య పెళ్లి అప్పటికే అయినజ్ఞాపకం  మద్రాస్ లో  మా బావ గాడేపల్లి కృపానిధి గారు కార్పోరేషన్ లో హెల్త్ డిపార్ట్ మెంట్ లో పని చేసేవారు .వేసవికి ఇక్కడికి వచ్చేవారు అప్పటికి వాళ్లకు ఇంకా పిల్లలు పుట్టలేదు .మా అన్నయ్య లక్ష్మీనరసింహ శర్మ బళ్ళారిదగ్గర హాస్పేట్ లో రైల్వే అసిస్టంట్ స్టేషన్ మాస్టర్ .

  నేను మా ఇంటికి దగ్గరలోనే గడ్డమీద మునిసిపల్ ఎలిమెంటరి స్కూల్ లో నాలుగు, అయిదు క్లాసులు’’ మిడికాను’’ .నాలుగో తరగతి క్లాస్ టీచర్ ఆశీర్వాదం గారు .తెల్ల పంచె తెల్ల చొక్కా పైన కోటు మెడలో మఫ్లర్ తో ఉండేవారు కారునలుపు రంగు .ఉబ్బసం మనిషి .అయితే ఏమి మహాబాగా చదువు చెప్పేవారు .ఇంగ్లీషు లెక్కలు వగైరా ఆయనే బోధించేవారు.తెలుగుకు మాత్రం వెంకటరామ శాస్స్త్రి అనే ఆయన  వచ్చేవారు .ఈయన మానాన్న శిష్యుడు నన్ను బాగా గారాబం చేసేవాడు .కన్నడికుడు  .తెలుగు బాగా చెప్పేవారు .ఆయన చెప్పిన ఒకమాటకు అర్ధం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది –అది –కలకలం అనే మాట దీనికి ఆయన ‘’గద్దలం’’అనే అర్ధం చెప్పారు .ఈ రెండిటి అర్ధాలు అప్పటికి మాకు తెలిసేవికావు .మానాన్నను అడిగితే  వాటికి విపరీతమైన శబ్దం అని చెప్పారు .

  అయిదవ తరగతి క్లాస్ టీచర్ ఐరావతమ్మగారు . ముఖం కాలి పోయి వికృతంగా ఉండేది కాని మెత్తటిమనసు .బోధన బాగుండేది .మా క్లాస్ మేట్లు మా ఇంటి దగ్గరే ఉన్న ఈమని అబ్బాయి ,దక్షిణామూర్తి గుడిపూజారికొడుకు దక్షిణామూర్తి ,వైశ్యుడు చలపతిరావు ,మరొకడు సోమ సుందరరావు  .వీళ్ళంతా ఖాళీ దొరికితే మా ఇంటికి వచ్చేవాళ్ళు .చదువు ఆట పాటా తో కాలక్షేపం .నాకు లెక్కలు రావు. చలపతి బాగా చేసేవాడు. వాడికి కాల్చిన చిలగడ దుంపలు ‘’లంచమిచ్చి’’ లెక్కలు చెప్పించుకునేవాడిని .మిగిలిన సబ్జెక్ట్ లలో నేనే ఫస్ట్.లీడర్ కూడా నేనే .వీళ్ళంతా వీర విధేయులు గా ఉండేవారు .స్కూల్ లో’’ రాయలు మేష్టారు ‘’అనే ఆయన ఉండేవారు .పంచెకట్టుతో మెడలో ఉత్తరీయం తో మన స్టేజినటుడు రఘురామయ్యలాగా ఉండేవాడు .నవ్వుముఖం శాంతమూర్తి .పిల్లనగ్రోవి అంటే వేణువు  విద్వాంసుడు .పాడుతుంటే నాగులు కూడా నిద్రపోవాల్సిందే.అంత కమ్మగా ఊదేవారు .మా అందరికి ఆయనంటే పరమ భక్తీ. మా గడ్డమీది స్కూల్ కు ఆయన నడిచి మా ఇంటి ముందు నుంచే వెళ్ళేవారు .ఒకసారి మేము  అందరికంటే ముందు వెళ్లి గేటు తీయకపోతే నేను రెండు ఇనుప కడ్డీలమధ్య కొంత ఎడం ఉంటె తలకాయ దూర్చి లోపలి వెళ్ళే ప్రయత్నం చేశా .తలకాయ ఇరుక్కు పోయి బిగిసిపోయింది. ఇక లోపలి కదలలేక పోయా .మా బృందం అరుపులు కేకలు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు నాకోసం. దాదాపు అయిపొయింది నాపని అని అందరూ అనుకున్నారు .అదే టైం కి రాయలు మాస్టారు వచ్చారు. చూసి ఉపాయంగా తలకాయ తిప్పి నా తల  బయటికి  లాగి బతికించారు .లేకపోతె నా చరిత్ర అంతటితో సమాప్తం .ఇంకా ఏదో లోకాన్ని ఉద్ధరించాలి వీడు అని దేవుడు ఆయువుపోశాడేమో ?అప్పటినుంచి ఆయన అంటే నాకు ఆరాధన మరీ జాస్తి అయింది .

  ఇంట్లో భారత మాత ఫోటో ఉండేది .చాలా అరుదైన ఫోటో .అందులో దేశానాయకులందరూ ఉండేవారు పాకిస్తాన్ కూడా మనలో భాగంగా ఉండేది .ప్రతి శుక్రవారం రాత్రి భారతమాత పూజ భజన మా ఇంట్లో చేసేవాళ్ళం .మా అక్కయ్య ప్రసాదం చేసేది .దాదాపు గంట సేపు భజన జరిపేవాళ్ళం .జనం బాగా వచ్చేవారు మా అమ్మా నాన్న మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు .ఇదే మేము ఉయ్యూరు వెళ్ళాక’’శివపూజ ‘’గా కొనసాగించాం .మా ఇంటికి దగ్గరలో ఈమని వెంకటరామయ్య  ఉండేవారు ఆయన పురోహితుడు  భార్య అన్నపూర్ణమ్మ మా అమ్మకు స్నేహితురాలు .వాళ్ళబ్బాయి’’అబ్బాయి ‘’ నాకు స్నేహితుడు శిష్యుడూ జోడీ .వీదితంముడు మా తమ్ముడిమేటు. వీళ్ళ ఇంటి  ప్రక్కన సాహేబుల కుటుంబం ఉండేది .చాలామంచి ఫామిలి. సాయంకాలం మమ్మల్ని పిలిచి స్వీట్లు పెట్టేవారు .వాళ్ళప్రక్కన  రాఘ వేంద్ర రావు  అనేకన్నడ  సెకండరీ టీచర్ కుటుంబం ఉండేది .ఆయన మా నాన్న స్కూల్ లో టీచర్  .ఆయనభార్య గోదావరమ్మ మునిసిపల్ మెంబర్ .మాంచి పలుకుబడి ఉన్నావిడ .ఇంట్లో బయటా ఆవిడదే పెత్తనం .అన్నపూర్ణమ్మ ఆవిడకు నమ్మినబంటు .అన్నపూర్ణమ్మ ఇంట్లో ఏపనీ చేసేదికాడు అంటా భర్తే చేసేవాడు అన్నం వండటం అందరికీ వడ్డించటం అన్నీ ఆయన పనులే .ఆయన వడ్డించే తీరు తమాషాగా ఉండేది .’’రెండు పిర్రలమీద బట్ట పైకి లాగి వంగి వడ్డించేవాడు విపరీతంగా నవ్వుకునేవాళ్ళం .నేను ఆయన్ను బాగా ‘’ఇమిటేట్ ‘’చేసేవాడిని మా అక్కయ్యావాళ్ళు అడిగి అడిగి నాతో ఇమిటేట్ చేయించి తెగనవ్వుకునేవారు ఉయ్యూరువచ్చినా అది తప్పలేదు  .గోదావరమ్మ భర్త కంచం ముందు కూర్చుని కనీసం ముప్పావుగంట తినేవాడు ప్రతిమేతుకు నమిలి తినటం ఆయన ప్రత్యేకత ఇదీ మాకు నవ్వు తెప్పించేది .గోదావరమ్మ కూతుళ్ళు మా పెద్దక్కయ్యకు చిన్నక్కయ్యకు క్లాస్ మేట్స్.అందులో  తార అనే అమ్మాయి సునంద అనే అమ్మాయి లతో మా అందరికి మంచి స్నేహితం . సునంద ను మా నాన్న శిష్యుడు మూర్తి పెళ్లి చేసుకుని ఉయ్యూరు పాలిటెక్నిక్ కాలేజి ప్రిన్సిపాలయ్యాడు .తరచుగా మా ఇంటికి వచ్చేవారు ఇద్దరూ .రావుగారి తల్లి కావేరమ్మ శుద్ధ సనాతన పద్ధతిలోఎర్రరంగు బట్టలతో  ఉండేది. తెలుగు అసలు రాదు .వీరి అబ్బాయి బొంబాయి లోనో  ఎక్కడో డాక్టరీ చదివేవాడు .మేము అక్కడినుంచి వచ్చేశాక మునిసిపల్ చైర్మన్ అయ్యాడని విన్నాము .అన్నపూర్ణమ్మ ,గోదావరమ్మ మా ఉయ్యూరు వచ్చి రెండు రోజులు గడిపి వెళ్ళారు .వీళ్ళ ఇంటి ప్రక్కనే నా స్నేహితులు కల్లూరావు ,గుండూ రావు ల రెండు అంతస్తుల భవనం ఉండేది కన్నడం వాళ్ళు .మాకు మంచి స్నేహితులు .వాళ్ళమ్మ గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసేవారు .గోదావరమ్మగారి పెద్దమ్మాయి అల్లుడు ,మా ఇంటికి ఎడమవైపు చివర ఇంట్లో ఉండేవారు .వీళ్ళ అమ్మాయి  నాగరత్నమ్మ మాకు మంచి దోస్తు .అల్లుడు మామగారింటికి వెళ్ళడు అనుకునేవారు. మా నాన్న శిష్యుడు లెక్కల మేష్టారు రాఘవేంద్ర రావు గారు అని ఇంకొక ఆయన ఉండేవాడు .అయన సైకిల్ మీద స్కూల్ నుంచి వచ్చేసమయానికి మా సందు చివర కాపలాకాసేవాళ్ళం .ఆయన కోటు జేబునిండా చాక్ పీసులు ఉండేవి .జేబులన్నీ తెల్లబడేవి .మాకు కావలసిన చాక్ పీస్ లు ఇచ్చేవారు .ఆయన సైకిల్ దిగితే మళ్ళీ ఎక్కటానికి అరఫర్లాంగు తోసుకుంటూ ఒక్కసారి యెగిరి సీటు మీద కూర్చునేవాడు  . అది చూసి నవ్వుకునేవాళ్ళం .ఆయన అంటే మాకు మహా ఇష్టం .పంచె చోక్కాపై కోటు ఉండేది .మా నాన్న స్కూల్ నుంచి ఒక్క చాక్ పీస్ ముక్క కూడా తెచ్చేవాడు కాదు మేము అడిగి గీపెట్టి గోల చేసినా .

  అప్పుడు ఇళ్ళకు వేరుగా లెట్రిన్ లు ఉండేవికావు .అందరం చెరువు దగ్గరకో ,లేక విష్ణ్వాలయం పోస్టాఫీసు మధ్య వున్నా సందులోనో ‘’కానిచ్చేవాళ్ళం ‘’.ఈ సందులో  వైశ్యస్త్రీలు ‘’అదికానిస్తూ ‘’చెప్పుకునే ముచ్చట్లు అంటే ‘’అల్లుడోచ్చిండు.ఇంతపరమాన్నం సేస్తిని .అంత పులిహోరకలిపితిని ‘’అంటూ మాట్లాడుకునేమాటలు విని మా క్కయ్యావాళ్ళు మాకు చెబితే పగలబడి నవ్వేవాళ్ళం .

 మా చిన్నక్కయ్య స్నేహితురాళ్ళు రెండుమూడు బజారుల అవతల ఉండేవాళ్ళు. అందులో  కొందరు కన్నడం వాళ్ళు కొందరు తెలుగు వాళ్ళు .వీళ్ళు పాటలు నేర్చుకుంటూ పాడుతూ చిన్నచిన్న నాటికలు వేస్తూ ఉండేవాళ్ళు .మేము వెళ్లి చూసేవాళ్ళం.మా నాన్న తో పని చేసే డ్రాయింగ్ మాస్టారు హిందూపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అంటే దాదాపు మునిసిపల్ హై స్కూల్ దగ్గర ఉండేవారు .నెలకొకసారి అందరం వాళ్ళింటికి వెళ్లి భోజనం చేసి వచ్చెవాళ్ళం .అక్కడ వాతావరణం చాలాబాగా ఉండేది . భార్య కూడా చాల మర్యాదగా ఆప్యాయంగా మమ్మల్ని చూసేది .అలాగే సుబ్బరామయ్య అనే పురోహితుడి కూతురు కూడా మా అక్కయ్య క్లాస్ మేట్.తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం .కొబ్బరి చిప్పలు ఇచ్చెవారు .కాశీనాద్ అనే డాక్టర్ మా ఇంటి డాక్టర్ .ఏ జబ్బు చేసినా ఆయన దగ్గరకే వెళ్ళేవాళ్ళం .ఎర్రరంగు నీళ్ళు అప్పుడు ఔషధం .ఏ డాక్టర్ అయినా అదే ఇచ్చేవాడు .

  మా ఇంటికి దగ్గరలో శివాలయం  విష్ణ్వాలయం దక్షిణామూర్తి గుడి ,కన్యకాపరమేశ్వరి దేవాలయం ఉన్నాయి .తరచూ వెళ్ళేవాళ్ళం సాయంత్రం ప్రసాదాలు పెట్టేవారు .ధనుర్మాసం లో ఉదయమే మా అమ్మతో కలిసి శివాలయానికి వెళ్లి దర్శనం చేసి ప్రసాదాలు తినేవాళ్ళం .హిందూపురం వైశ్యులు గొప్ప వితరణ శీలురు .పురాణాలు హరికధలు చెప్పించి ఘన౦గా సత్కరించి పంపేవారు .కన్యకా పరమేశ్వరి గుడి ఇలాంటివాటికి గోప్పవేదిక .పిల్లలమఱ్ఱి రామదాసు అనే హరి దాసు నెలలతరబడి రామాయణ భారత భాగవాటాలు హరికధ గా చెప్పేవాడు. ఆయనకున్న ఖ్యాతి ఎవరికీ ఉండేదికాదు .ఇలాంటివారి సన్మానానికి మా నాన్న గారిని ఆహ్వానించి ఆయన ఆధ్వర్యం లో జరిపేవారు .విశ్వనాధ ,జమ్మలమడక,జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి వంటివారు మా ఇంటి ఆతిధ్యం పొంది సభలలో సత్కారాలు పొందేవారు .పిల్లలమఱ్ఱి రామదాసుగారికధలకు వేలాది మంది జనం హాజరై తన్మయత్వం తోతెల్లవారుఝాము వరకు  విని తరించటం చూసిన అదృష్టవంతులం మేము .భారత ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారిని నీలం సంజీవరెడ్డి ని బహిరంగ సభలలో చూశాం

  మా ఇంటికి అతి దగ్గరలో కల్లూరి సుబ్బారావు అనే వారు ఉండేవాడు .ఆయన ‘’రాయల కళా సమితి ‘’అనే దానిని స్థాపించి నెలకొకసారి తన ఇంట్లోనే సాహిత్య సభలు జరిపేవాడు .కనీసం పది మందిని కూడా ఎప్పుడూ మేము ఆసభలలో చూడలేదు .డాబూ దర్పం తప్ప సరుకు లేదు అని మాకే తెలిసేది .గుమ్మం మీద రోజూ అటూ ఇటూ పూలు అలంకారంగా పెట్టేవారు భార్యను గుమ్మం దాతనిచ్చేవాడుకాదని గుసగుసలాదేవారు ఒకటి రెండు సార్లు ఆవిడను చూశామేమో గుర్తు .రాయల సమితి అంటే ఒక  అవహేళన గా  ఉండేది మాకు .

  అప్పుడు హిందూపూర్ లో టూరింగ్ టాకీస్ ఒకటి ఉండేది .కొంచెం దూరమే .నడిచి ఇంటిల్లిపాదీ వెళ్లి సినిమా చూసేవాళ్ళం .నేలమీద కూర్చోవటమే .’’సంసారం ‘సినిమా చివరి సినిమాగా గుర్తు .సినిమామారినప్పడల్లా నాలుగు చక్రాల బండికి అటూ ఇటూ పోస్టర్లు అంటించి దప్పులు కొడుతూ ఊరంతా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు .ఆ సినీ కధా వివరాలను ఫామ్ప్లేట్లు గా పంచేవారు .వాటిని కలెక్ట్ చేసి దాచుకోవటం మాకు అప్పటిహాబీ .ఎవరి దగ్గర ఎన్ని రకాల వి ఉంటె వాళ్ళది విజయం .ఎప్పుడూ నేనే గెలిచేవాడిని .మా మేడమెట్లు ఎక్కుతుంటే కొంచెం పైన ఒక సొరుగు లాంటిది ఉండేది .అందులో దాచేవాడిని వీటిని .

  కమ్మని పూసలు పేరుకున్న నెయ్యి ,ఎర్రటి గడ్డ పెరుగు తో మా భోజనం మజా మజా .అప్పుడు రేషన్ రోజులు .బియ్యం దొరికేవి కావు .రాగులు కిరోసిన్ లు రేషన్ లో కొద్దిగా ఇచ్చేవారు .అయినా మానాన్న అమ్మా వారానికి నలుగురైదుగురు విద్యార్ధులకు వారాలు ఇచ్చేవారు .వాళ్ళూ మాతోపాటే రాగిసంకటి రాగిపిండి తినేవాళ్ళు .మామ్మ ,అమ్మ సంకటిలోకి భలేకమ్మగా ఉండే సాంబారు లాంటిది చేసేవారు .సంకటిలో దాన్ని నంజుకు తింటే’’స్వర్గానికి బెత్తెడు ‘’లో ఉన్నట్లు ఉండేది. రాగిపిండి బెల్లంకలుపుకు తింటే అదరహా యే.వీలున్నప్పుడు మా మామయ్య గంగయ్యగారు  ఉయ్యూరునుంచి బియ్యం మరపట్టించి పర్మిషన్లు పొంది గూడ్సులో హిందూపూర్ పంపేవాడు .

  ఇక్కడ పండగలు ఎలా చేసుకోనేవాల్లమో పెద్దగా గుర్తులేదు. కాని దసరా మాత్రం మహా వైభవం గా జరిపేవారు .విజయదశమి నాడు ‘’జంబూ సవారీ ‘’అని నిర్వహించేవారు అంటే ఆ రోజు అందరూ  ఊరి పొలిమేరలు దాటి అంటే సీమోల్లంఘనం చేయాలన్నమాట .ఆ రోజు బస్సులన్నీ ఫ్రీగా జనాలను ఎక్కించుకుని తిప్పేవారు .మాకు అయిదు కిలో మీటర్ల దూరం లోబె౦గుళూరు వెళ్ళేదారిలో   ‘’సూగూరు ‘’అనే చోట ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది .పిల్లలం అందరం సాయంత్రం  నా ముఠాతో సహా బస్సుఎక్కి అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసి తిరిగి వచ్చేవాళ్ళం ,ఇదొక గొప్ప అనుభూతి గా మిగిలింది మా అందరికి .గుడి చిన్నదేకాని ఖ్యాతిమాత్రం ఘనంగా ఉండేది .మా నాన్న శిష్యుడు ఒక సాహేబు గారికి గుర్రపు బండీ ఉండేది .ఆయనకు ఒక కాలు కుంటిఅని గుర్తు గడ్డం తో గల్లలుంగీ చొక్కాతో ఉండేవాడు .మేము ఎక్కడికి వెళ్ళాల్సివచ్చినా ఆయన బండీలోనే వెళ్ళేవాళ్ళం .ఒక్కోసారి నేనూ మా తమ్ముడు అక్కయ్యా ఆటపట్టిన్చేవాళ్ళం .గుర్రబ్బండ్లు లాంతరు  స్థంభం సెంటర్ లో ఉండేవి .పెద్ద దూరమేమీ కాదు .మేము నడిచి వెళ్లి అక్కడున్న మసీదులో జరిగే ప్రార్ధన చూసి ,ఆ సాయిబు గారిని ‘’మా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలట బండీ కట్టించుకు రమ్మన్నారు ‘’అని చెప్పేవాళ్ళం .అతను నమ్మి మమ్మల్ని ఎక్కించుకుని ఇంటిదాకా తీసుకోచ్చేవాడు .మేము దిగి సందులోనుంచి ఇంట్లోకి జారుకోనేవాళ్ళం .అతడు చూసి చూసి విసుగెత్తి వెళ్ళిపోయేవాడు లేక ఇంటికి వచ్చి అసలు విషయం తెలిసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు .ఇదో బాల్య చేస్ట మాకు .ఇందులో మా అక్కయ్యకూడా మాకు గొప్ప సపోర్టు .మా ఇంటికి కుడివైపు అరవవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వలేక చచ్చిపోయేవాళ్ళం .మా ఇంటికి ఎడమవైపు పాకలో చాకలి కుటుంబం ఉండేది .ఇంటాయన తెగతాగి తెల్లార్లూ గొడవ చేసేవాడు .

  మా ఇంటి దగ్గర రామమందిరం , దానికి దగ్గరలో ఒక ఠాణా ఉండేది .వీధి దీపాలు ఆరిపోతే మేము అక్కడ బయట ఉండే బండ రాళ్ళ చేరి రామనామం జపించేవాళ్ళం కరెంటు వచ్చేదాకా .ఇంట్లో కరెంట్ ఉండేదికాదు ,లాంతరు దీపాలు, గుడ్డిదీపాలే .

  మేమున్న రోజుల్లో మండ్రగబ్బలు విపరీతంగా ఉండేవి ప్రతి ఇంట్లోనూ .వాటిని చూసి మా అక్కయ్య తెగభయపడేది .నాకు అవి ‘’కేరేఝాట్ ‘’.జాగ్రత్తగా వాటి కొండికి తాడుకట్టి బయటికి తెచ్చి కరెంట్ స్తంభానికి కట్టేసి రోకలి బండతో చంపేసేవాడిని .అందుకని ఎవరింట్లో మండ్రగబ్బ కనిపించినా నన్నే పిలిచేవారు .వాటి పనిపట్టటం నాపని ,ఒకరోజు ఇలా 50 కి పైగా మండ్ర గబ్బలను  చంపి’’ మండ్రగబ్బ వీరుడు’’ అనిపించుకున్నాను .

  అప్పుడే ఊరంతా ప్లేగు వ్యాధి చాలా విజ్రుమ్భించింది .చాలామంది చనిపోయారు మున్సిపాలిటీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది .ఇల్లు అంతా మూసేసి ఒక చిన్న రంధ్రం ద్వారా ఎలుకలను చంపే మందు పంపేవారు .దాని ప్రభావానికి అవి నిమిషాలమీద చచ్చిపోయేవి .మున్సిపాలితీవాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు .ఆ వాసన భరించరానిదిగా ఉండేది .ఇలా ఎన్నో అనుభవాలు ఆనాడు .

  హిందూపురం లో ఉండగా లేపాక్షి ,విదురాశ్వత్దం  హోస్పేట ,హంపీ విజయనగరం చూశాం .

 మేము హిందూపూర్ లో ఉండగా మా మేనమామ వాళ్ళమ్మాయి రాజ్య లక్ష్మితో ఇక్కడికి వచ్చాడు .రాజ్యాన్ని మేము ‘’దాచ్చి ‘’అనేవాళ్ళం .కొంచెం అమాయకం గా ఉండేది .మా మామయ్య మమ్మల్ని బెంగుళూరు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడు రిజర్వేషన్ లు లేవు కదా .అందుకని ఉదయం హిందూపూర్ నుంచి బయల్దేరే పాసింజర్ ఎక్కి వెళ్ళాలి .మేము అంటే నేను మా చిన్నక్కయ్య ,రాజ్యం మామామయ్య తెల్లవారుజ్హామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాలినడకన స్టేషన్ కు బయల్దేరాం .మరచేమ్బులనిండా తాగటానికి నీళ్ళు చిన్న చేతి సంచుల్లో మగపిల్లలం  తోకల పోట్టిలాగు ,పోట్టిచోక్కా ఆడపిల్లలు లంగా జాకెట్లు ఇదే మా సామాను . స్టేషన్ చేరే లోపు మా మామయ్యకు ‘’పాసనాలు ‘’.దాదాపు పది సార్లు వెళ్లి ఉంటాడు. నీరసపడి పోయాడు .మందూ గట్రా ఏమీ లేదు .ఆయన ‘’దానికోసం ‘’వెళ్ళటం ,మేము కడుపుబ్బానవ్వుకోటం.ఈ సంఘటన చాలా ఏళ్ళు చెప్పుకుని చెప్పుకుని తెగ నవ్వుకునేవాళ్ళం .మా మామయ్యకూ చెప్పి నవ్వి౦చేవాళ్ళం నేనూ మా అక్కయ్య. రాజ్యం పాపం ఏడవలేక నవ్వేదిమాతోపాటు .అదోరకం చిలిపి తనం .

  చివరికి బెంగుళూరు చేరాం .మిట్టమధ్యాహ్నమయింది .శృంగేరి శంకర మరానికి మమ్మల్ని నడిపించుకొని తీసుకు వెళ్ళాడు. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే భోజనాలు పెడతారని ఆయన నమ్మకం .తీరా అక్కడిని వెడితే వాళ్ళెవరూ ఈయనమాట వినలేదు పట్టించుకోలేదు లేక అప్పటికే సమయం దాటిందో గుర్తులేదు  .ఖాళీకడుపుతో రోడ్లన్నీ తిరిగి ఎక్కడోహోటల్ లో ఇన్ని ఇడ్లీలు మింగి సాంబారు తాగి కడుపు నింపుకుని సాయంత్రం రైల్ లో జైపరమేశ్వారా అంటూ కొంపకు బయల్దేరి వచ్చాం .ఇదొక చిరస్మరణీయమైన సంఘటన మా చిన్నతనం లో.  .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు

13-4-18 శుక్రవారం రాత్రి 9-45గం.లకు 82 ఏళ్ళ  మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో వారం రోజుల అశ్వస్థత తో మరణించి మా అందరినీ శోక సాగరం లో ముంచేసింది .ఆమె ఆత్మకు శాంతి కలిగించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

ఆరు రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ కు

13 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే మా మేనకోడలు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ‘’మామయ్యా !అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ,కొన్నిగంటలు మాత్రమె నని డాక్టర్లు చెప్పారు .చిన్నన్నయ్య శాస్త్రి శనివారం ఉదయం 7-30 గం .అమెరికానుంచి హైదరాబాద్ వస్తున్నాడు ‘’అని చెప్పింది .ఎంతో సీరియస్ గా ఉందని అర్ధమై ఉయ్యూరు నుంచి నేనూ మాశ్రీమతీ బయల్దేరటానికి కారు వెంటనే బుక్ చేశాం ,

మా మనవడు చి శ్రీకేత్ ఉపనయనానికి మార్చి 21 కి కారులో హైదరాబాద్ వచ్చిన మేము ఏప్రిల్ 2 ఉపనయనం అయ్యాక , ఏప్రిల్ 5న మా అల్లుడు శ్రీఅవధాని ,మనవడు చి శ్రీకేత్ అమెరికావెళ్ళాక  . ,ఏప్రిల్ 9సోమవారం మా అమ్మాయి శ్రీమతి విజ్జి ,పిల్లలు చి ఆశుతోష్ ,పీయూష్ లు అమెరికా వెళ్ళేదాకా ఉందామనుకున్నాం . అప్పటికే మా అచిన్నక్కయ్యకు హిమోగ్లోబిన్ 3 శాతం కు తగ్గిపోయి ,కేర్ హాస్పిటల్ లో చేర్చినట్లు తెలిసింది.కొంత నయమయ్యాక  ఇంటికి తీసుకు వెళ్లారట .వాళ్ళు అంతా హాస్పిటల్ హడావిడిలో ఉన్నారు .నేనూ మా అమ్మాయి  శని ఆదివారాలలో వెళ్లి మా అక్కయ్యను చూసివద్దామనుకున్నాం .5వ తేదీ శుక్రవారం రాత్రి ఇక్కడ విపరీతంగా వర్షం, అంతకు ముందు కూడా రోజూ వర్షమే .అప్పటికే మజ్జిగ రసం తో లాగిస్తున్న మా ఆవిడ ఇక ఇక్కడ తట్టుకోలేనని సోమవారం దాకా ఉండలేనని వెంటనే బయల్దేరి ఉయ్యూరు వెళ్లి పోదామని అంటే,  అప్పటికప్పుడు వోలా కాబ్ బుక్ చేసే ప్రయత్నం చేసి 6 వతేదీ శనివారం మధ్యాహ్నం 2 గం లకు బయల్దేరే ఏర్పాటు చేసుకున్నాం .ఓపిక లేకపోయినా తూలుతూ దేకుతూ మా ఆవిడ శుక్రవారానికే  చలిమిడి   తయారు చేసి రెడీగా ఉంచింది .6 వ తేదీ శనివారం ఉదయం మా అమ్మాయి ఒడిలో చలిమిడి పెట్టింది .మధ్యాహ్నం 2-30కి బయల్దేరి రాత్రి 7 -30 గంటలకు ఉయ్యూరు చేరాం

.ఆదివారం మా అబ్బాయి మూర్తి సెలైన్ ఎక్కించే ఏర్పాటు చేశాడు .సాయంత్రం దాకా రెండు బాటిల్స్ ఎక్కించాక ఆవిడకు కొంత రిలీఫ్ కనిపించింది .కొద్దికొద్దిగా  అన్నం తినటం మొదలెటింది .అమ్మయ్య అనుకున్నాం .ఆదివారం సాయంత్రం మా బావ శ్రీ వివేకానంద్ గారు ఫోన్ చేసి మా అక్కయ్య పరిస్థితి బాగాలేదని ,మళ్ళీ కేర్ లో చేర్పించామని సోడియం లెవెల్స్ బాగా తగ్గాయని మనుషుల్ని గుర్తు పట్టటం లేదని కంగారుగా ఉందని  తెలియజేశారు  .ఆ రాత్రి మా మేనకోడలు పద్మకు  ,పెద్దమేనల్లుడు అశోక్ కు ఫోన్లు చేసి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను .ఆదివారం రాత్రి మాబావ మళ్ళీ ఫోన్ చేసి పరిస్థితి కొంతనయం అని చెప్పారు .పద్మ మాటలలో నైరాశ్యం కనిపించింది .అందులో అమావాస్య దగ్గరలో ఉంది కనుక చాలా విషమ పరిస్థితి అనిపించింది .10 వ తేదీ మంగళవారం ఉయ్యూరులో ‘’గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ ‘’ఆధ్వర్యం లో A A వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం హడావిడి లో ఉన్నాం అయినా మా అబ్బాయి రమణ కూడా పరిస్థితి అడిగి తెలుసుకొంటూనే ఉన్నాడు.అనుకున్న భయం నిజమే అయింది శుక్రవారం పద్మ ఫోన్ తో .ఏ స్థితిలో అక్కయ్యను చూడాల్సి వస్తుందో ననే దిగులు మాకు .మా ఆవిడ తట్టుకోలేక ఏమైనా సరే హైదరాబాద్ బయల్దేరి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టింది .అలా ఉయ్యూరు వచ్చిన 6 రోజులకే మళ్ళీ హైదరాబాద్ కు బయల్దేరాం .రాత్రి 10-15 కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి  మల్లాపూర్ చేరి సామాన్లు లిఫ్ట్ లో పెడుతుండగా మా తమ్ముడు మోహన్ ఫోన్ చేసి అరగంట క్రితమే అక్కయ్య వెళ్లి పోయింది ,ఇంటికి ఓల్డ్ బోయిన్ పల్లికి తీసుకు వెడుతున్నాం అని చెప్పాడు. సరే రేపు ఉదయం వస్తాం అని చెప్పాను .

అక్కయ్య మరణం

శుక్రవారం రాత్రి 8-30 వరకు అక్కయ్య అప్పటికే సీరియస్ నెస్ విషయం తెలిసి చూడటానికి వచ్చిన అందరితో బాగానే మాట్లాడిందట .ఆకలేస్తోంది త్వరగా అన్నం పెట్టమని నర్సుకు చెప్పండి అనికూడా అన్నదట.కాని అన్నం పెడితే వంటి అయి మరీ సీరియస్ అవుతుందని వాళ్ళు పెట్టలేదట .మనవరాలు భార్గవితో ‘’ఏమే బాబాయి వస్తాడన్నావు.ఇంకా రాలేదా ?’’అని అడిగిందట .’’బాబాయి రేపు పొద్దున్న వస్తాడుమామ్మా’అని చెప్పిందట .  భార్గవి భర్త విశ్వనాధ మురారి ‘’గుర్తుపట్టారా అమ్మమ్మ గారూ ‘’అంటే ‘’అదేమిటి నువ్వు గుర్తులేకపోవటమేమిటి మురారివి కదా ‘’అన్నదట .సరిగ్గా రాత్రి 9 గంటలకు హాస్పిటల్ వాళ్ళు అశోక్ కొడుకు ప్రత్యూష్ కు ఫోన్ చేసి రమ్మని పిలిస్తే వెళ్ళాడట .అప్పటికే కండిషన్ సీరియస్ అనిపించిందట .బయటికి వెళ్లి అందరికీ చెప్పేలోపు మళ్ళీ వాడిని పిలిపించారట .మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్లి వెళ్ళద్దని వారిస్తున్నా పద్మకొడుకు తేజా తో వెళ్లి చూశాడట .డాక్టర్ చూసి పెదవి విరిచాడట .ఫైట్స్ వస్తున్నాయట .మా బావ కూడా హాస్పిటల్ లోనే ఉన్నారు .రాత్రి 9-45 కిమా చిన్నక్కయ్య  తుది శ్వాస విడిచిందట .అప్పుడు తానూ అక్కడే ఉన్నాను అని ప్రత్యూష్ తన మామ్మ మరణాన్ని ప్రత్యక్షంగా చూశానని నేను వాడిని’’ అసలు సీరియస్ నెస్ అని ఎందుకు ఎలా అనిపించింది?’’ అని అడిగితె  గుండెలనిండా దుఖం తో నిన్న నాకు ఈ వివరాలు తెలిపాడు .

తలిదండ్రుల సేవలో సోదరులు

దాదాపు మూడు సంవత్సరాలనుండీ మా అక్కయ్య మోకాలికి ఆపరేషన్ తర్వాత పెద్దగా బయటికి రాలేదు .వాళ్ళ మనవరాలు పద్మ కూతురు చి రవళి పెళ్ళికి తప్ప .మా చిన్నమేనల్లుడు శాస్త్రి ఆవిడ సేవలకోసం 24గంటలూ ఒక నర్సు ,వంట కు దేవుడి పూజకు ఒక బ్రాహ్మణ ఆవిడను  ,కింద ఇంట్లో డ్రైవర్ వర్మ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. తలిదండ్రులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు .ఖర్చుకు వెనకాడటం లేదు .వాళ్ళిద్దరి ఆరోగ్యమే ముఖ్యం గా వాడి తపన హర్షించదగింది. ఏడాదికి కనీసం నాలుగు సార్లు అమెరికానుంచి వచ్చి చూసి వెడుతున్నాడు .భార్యాపిల్లలు ఏదాడికి రెండు సార్లు వచ్చి చూసి వెడుతున్నారు .తలిదంద్రులంటే అన్నదమ్ములు అశోక్ ,శాస్త్రి లకు అత్యంత గౌరవం ,ప్రేమ ,ఆరాధన .  ఈ ఇద్దరికీ చెల్లెలు పద్మ అంటే విపరీతమైన అనురాగం  .మా అక్కాబావలు పిల్లలను అతి గారాబంగా  అత్యంత జాగ్రత్తగా పెంచారు .అశోక్ కూతురు భార్గవి అంటే మరింత చనువు .శాస్త్రి పిల్లలు అంటే చెప్పలేని ఆప్యాయం .మాబావ యూరిన్ ప్రాబ్లెం తో సుమారు పదేళ్లనుండి ఇబ్బంది పడుతున్నారు .అయినా బ్యాంక్ పనులు బయట చిన్నచిన్నపనులు అన్నీ తానె వెళ్లి చేసుకోస్తారు .మా అక్కా బావలు ప్రేమైక జీవులు .సరిగ్గా చెప్పాలంటే ‘’జీవికా జీవులు ‘’.ఒకరిపై ఒకరికి ఆరాధనా, అవగాహనా ,ప్రేమ నిండుగా ఉన్నవారు .మాబావ కొంచెం తొందరపడినా మాక్కయ్య ఆయన్ను కను చూపుతో కట్టడి చేస్తుంది .ఒకరి స్వభావం ఒకరికి పూర్తిగా తెలిసినవారు .బంధుప్రేమ పుష్కలంగా ఉన్నవారు .అందరూ కావాలనుకొనేవారు .అందరూ తమ ఇంతకి రావాలనుకునే వారు.అందరితో ఫోన్ లో టచ్ లో ఉంటారు .అందుకే వాళ్ళు దేనికి పిలిచినా బంధువులందరూ విధిగా హాజరవుతారు .అశోక్ సోదరులు తల్లిదండ్రుల షష్టిపూర్తి, వివాహ షష్టిపూర్తి వగైరాలను చాలా ఘనంగా చేశారు . తలిదండ్రులు ఉండటానికి  అన్న అశోక్ ఇంటికి దగ్గరలోనే రెండస్తుల భవనం అన్ని హంగులతో కట్టించాడు .అశోక్ భార్య సంధ్య ,శాస్త్రిభార్య విజయలక్ష్మి అత్త మామలంటే ఎంతో భక్తీ శ్రద్ధలు .వాళ్ళ పిల్లలకూ మామ్మ తాతయ్య గారంటే అంతే గౌరవం .

మార్గ దర్శనం

అలాగే మా బావ కూడా తలిదండ్రులు శ్రీ వేలూరి కృష్ణమూర్తి  గారు అత్తమ్మగారు అనబడే శ్రీమతి కాంతమ్మ గారలను  కంటికి రెప్పలా చివరిదాకా చూసుకున్నారు . దీనికి అన్నివిధాలా సహకరించింది మా అక్కయ్య .అలాగే మాబావగారి అన్నగారు ముకుందం గారు చనిపోతే ,ఆకుటుంబాన్ని అక్కున చేర్చుకుని ,ఆయనకున్న ఇద్దరాడపిల్లలవివాహాలను, కొడుకు పవన్ వివాహాన్ని బాధ్యత మీద వేసుకుని నిర్వహించారు .ఇందులో మా బావ కంటే మా అక్కయ్య చూపిన ఓర్పు నేర్పు చాలా ప్రశంసనీయ౦  .బతికి ఉన్నప్పుడే తలిదండ్రులను  సోదరులను మర్చిపోయేకాలం లో ఇంతటి పెద్ద బాధ్యత వారిద్దరూ నిర్వహించటం ముకుందం గారి కుటుంబం చేసుకున్న అదృష్టం . వాళ్ళూ ,ముఖ్యంగా పవన్  భార్య శ్రీమతి రాధా అంతే విధేయతతో మా అక్కాబావా యెడల ఇప్పటికీ ప్రవర్తిస్తారు .ఇదీ వాళ్ళ సంస్కారం .

అమెరికాలో చూడని ప్రదేశం లేదు

మా చిన్నమేనల్లుడు మా అక్కా బావలను చాలా సార్లు అమెరికా తీసుకువెళ్ళి అక్కడి అన్ని ప్రదేశాలను చూపించాడు .బహుశా వాళ్ళు అమెరికాలో చూడని ప్రదేశమే లేదు అంటే ఆశ్చర్యం కాదు ..అలాగే నేపాల్ తో సహా భారత దేశం లోని పుణ్య క్షేత్రాలన్నీవాళ్ళు సందర్శించారు .2008లో మేము మూడవసారి అమెరికాకు  మా అమ్మాయి వాళ్ళున్న స్టెర్లింగ్ హైట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మామేనల్లుడు శాస్త్రి ఉంటున్న కాలిఫోర్నియాకు వచ్చారు .తరచూ మాట్లాడుకొనే వాళ్ళం .మాక్కయ్యకు మేనకోడలు విజ్జి అంటే మా అమ్మాయి  అంటే మంచి ఆత్మీయత .ఇద్దరూ సరదాగా గంటలు గంటలు మాట్లాడుకుంటారు

మా తో క్షేత్ర దర్శనం

మా అక్కా బావ లతో మా దంపతులం 1998 ఏప్రిల్ –మే నెలలో కేదారనాథ్ , బదరీనాథ్ సందర్శనం మధురానుభూతినిచ్చింది . వాళ్ళిద్దరి ప్రోత్సాహం తోనే ప్రోద్బలం తోనే మేమిద్దరం  వెళ్ళగలిగాము  .మాబావ ది పక్కా ప్లాన్ ప్రోగ్రాం .గవర్నర్ ప్రోగ్రాం లాగా రూపొందించి అమలు చేస్తారు .వారిద్దరితో మేమిద్దరం,మా అత్తగారు పద్మావతక్కయ్య , మా తమ్ముడు, భార్య కాశీకి వెళ్లి మా అమ్మ అయిదవ మాసికం పెట్టటం ,సారనాద్ ,బుద్ధగయ ప్రయాగ సందర్శనం ,కూడా చిరస్మరణీయం. దీనికి పక్కాప్లాన్ మా బావగారిదే .మా మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా దగ్గరఉయ్యూరు లో  ఒకటవ క్లాస్ నుంచి  ఎస్.ఎస్ .ఎల్. సి .వరకు చిదివినప్పుడు వాడికి సకల సౌకర్యాలు కలిపించేవారు .మా ఇంట్లో భోజనం నిద్రతప్ప మిగిలిన ఖర్చు అంటా వాళ్ళదే .నన్ను వాడిని తీసుకుని బీహార్ లో ఆయన పని చేసే జమ్తారా కు తీసుకు రమ్మంటే వెళ్ళా .మరోసారి మా వేదవల్లితో కలిసి మేము ముగ్గురం వెళ్లాం  మొదటి సారి వెళ్ళినప్పుడు నాలుగు రోజుల పక్కాప్లాన్ తో మమ్మల్ని కాశీ ప్రయాగ అలహాబాద్ ,శాంతినికేతన్ ,జంషెడ్పూర్  కలకత్తా వగైరాలు చూపించాడు బావ.  అప్పుడు మా అక్కయ్య ఉయ్యూరులో మా ఇంట్లో ఉంది .

తరచూ ఉయ్యూరు కు

మా అబ్బాయిల, అమ్మాయి పెళ్ళిళ్ళకూతప్పక వచ్చేవారు అక్కాబావా .మా తలిదండ్రుల ఆబ్దికాలకు కూడా వీలు చూసుకు వచ్చేవారు .మా ఇంట్లో నాతోపాటు మా బావ అభిషేకం చేసుకునేవారు .అందరం ఐలూరు  బెజవాడ కృష్ణా స్నానం ,మోపిదేవి ,హంసలదీవి క్షేత్ర దర్శన కలిసి చేశాం .ఒక క్రష్ణాపుష్కరానికి అందరం తోట్ల వల్లూరు వెళ్లి పుష్కరం పెట్టాం .ఇలా మా అనుబంధం మర్చిపోలేనిది .మా శ్రీమతికి మా అక్కయ్య అంటే విపరీతమైన గౌరవం .

వాళ్ళ ఇంటి నుంచే మా అమెరికా ప్రయాణం

2002,05,08 లలో మేమిద్దరం అమెరికా వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో మా అక్కయ్యా వాళ్ళ ఇంటి నుంచే అమెరికాకు బయల్దేరి వెళ్లాం .మాకు అదొక సెంటి మెంట్ గా ఉండేది .అశోక్ ద్వారా స్టేట్ బాంక్ లో డాలర్లు తీసుకునేవాళ్ళం .2008 తర్వాత మా వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళలేదు. ఇద్దరి ఆరోగ్యాలు బాగుండక. అంటే పదేళ్ళ నుంచి వాళ్ళు అమెరికా వెళ్ళలేదన్నమాట .అందుకే అమెరికానుంచి వాళ్ళే వస్తున్నారు .మేము అమెరికా వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకుని వెళ్ళేవాళ్ళం .అయిదోసారి మేము అమెరికా 20 17ఏప్రిల్ లో వెళ్ళినప్పుడు మా శ్రీమతి మేడమేట్లు ఎక్కలేను  అంటే నేనూ మా మనవడు చరణ్  భువన లతో వెళ్లి మాబావ నుంచి డాలర్లు తీసుకుని ఇద్దరి ఆశీర్వాదం పొందాం .అక్టోబర్ లో తిరిగి వచ్చినప్పుడు మా ఆవిడా నేనూ మనవడు లతో కస్టపడి పైకి వెళ్లి అక్కాబావాలను చూసి బట్టలు పెట్టి ఆశీర్వాదం పొందాం .అయితే మాటలహడావిడిలో బొట్టు పెట్టటాలు ఇద్దరూ మర్చిపోయారట .ఇంటినుంచి బయటికొచ్చి కాబెక్కి కొంతదూరం వెళ్ళాక  మా ఆవిడ జ్ఞాపకం చేసుకుని ‘’సెంటిమెంట్ గా ఫీలయి’’ చాలా బాధపడింది .అంటే మా అక్కయ్యను చూసి అప్పుడే 6 నెలలయింది .అదే ఆవిడను చూసి మాట్లాడిన చివరి సారిఅయి పోయింది .ఊహించని పరిణామం . మధ్యలో పండగలకూ పబ్బాలకూ ఫోన్ చేయటమే తప్ప వచ్చి చూసే అవకాశం కుదరలేదు .

గౌరమ్మ తల్లిలా వెళ్లి పోయిన దుర్గమ్మ తల్లి

13 తేదీ శుక్రవారం ఇంటికి వచ్చిన అక్కయ్యను ఓల్డ్ బోయిన్ పల్లి విఠల్ ఎన్క్లేవ్ లో స్వగృహం లో ఉంచారు .శనివారం ఉదయం 8 గంటలకు మేమిద్దరం మా పెద్దకోడలు శ్రీమతి సమత కాబ్ లో బయల్దేరి 9 గంటలకు అక్కడికి చేరాం .మా అబ్బాయి శాస్త్రి స్కూటర్ పై వచ్చాడు .అప్పటికే మామేనల్లుడు శాస్త్రి అమెరికానుంచి వచ్చాడు .మమ్మల్ని కావలించుకుని బోరున ఏడ్చేశాడు .మాబావను పట్టుకోవటం శక్యం కాలేదు .ఆయన్ను దగ్గరకూర్చుని కొంత ఓదార్చాం .పద్మ సంగతి చెప్పక్కర్లేదు . భరించరాని  దుఖాన్నిగుండెల్లో అదుముకుని ,జరగాల్సిన కార్యక్రమాలు చూస్తూ మధ్యమధ్యలో ఆనకట్టపై నుంచి దూకి పడే జలప్రవాహం గా కన్నీటిని కారుస్తూ కుమిలి పోతోంది .అప్పటికి మాన్నయ్యగారి అమ్మాయి కూతురు వేదవల్లి కొడుకు రవి, భార్య గాయత్రి వచ్చారు .మా అబ్బాయి శర్మ ,తర్వాత మోహన్ ఫామిలీ మాబావ అక్కయ్య కూతుళ్ళు అంటే జనమంచి వారు కొడుకు ,అశోక్ వియ్యంకుడు వియ్యపురాలు ,పద్మ మామగారు, ఆడబడుచులు ,అశోక్ బామ్మర్దులు భార్యలు ,ముకు౦ద౦గారి ఇద్దరమ్మాయిలు మనవడు ,శాస్త్రి ఫ్రెండ్ జిడ్డు ,మాబావ తమ్ముడు అబ్బి భార్య ,మాబావ చెల్లెలు శాంతమ్మగారు, కొడుకు రాంబాబు మొదలైన వారంతా వచ్చారు .పురోహితులిద్దరూ  మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు .కార్యక్రమం ప్రారంభించారు .శాస్త్రోక్తంగా చేయించారు అశోక్ శాస్త్రి సోదరులతో .పుట్టింటి వారు పెట్టాల్సిన ఆకుపచ్చచీర ,ఎర్ర జాకెట్ ,ఆకుపచ్చ ,ఎర్రగాజులు పూలు దండ  మురారికి డబ్బు ఇచ్చి తెప్పించమంటే  రవళికిచ్చి  వీటిని కొని తెప్పించాడు .మంచి చీర త్సేలేక్ట్ చేసి తెచ్చింది రవళి .వీటిని అలంకరించి ముఖానికి పసుపు పూసి రూపాయి కాసంత కుంకుమ బొట్టు పెడితే మా అక్కయ్య సాక్షాత్తు గౌరీ దేవిగా భాసించింది .పద్మకూడా ఎర్రసిల్కు చీరర జాకెట్ గాజులు తెప్పించి వేయించింది. మహా లక్ష్మిలాగా కనిపించింది మా అక్కయ్య . బంధుమిత్రులు  విషన్నవదనాలతో  వీక్షిస్తుండగా అందరూ కడసారి దర్శనం చేసుకున్నాక మా అక్కయ్య పార్ధివ దేహాన్ని వాహనం లోకి ఎక్కించారు .శ్మశాన వాటికి దుబాయ్ గేట్ కు నడిచే దూరం లో చాలా దగ్గరలో ఉంది  .మా బావతో సహా అందరం అక్కడికి మధ్యాహ్నం3 గంటలకు చేరాం .అన్ని విధులు నిర్వహించాక దేహాన్ని చితిపై చేర్చారు .వేద మంత్రాల పఠనం జరుగుతుండగా  పెద్దకొడుకు అశోక్ చితికి నిప్పు అంటించాడు .సుమారు 20 కిలోల ఆవునెయ్యి కట్టెలపై పోసి గంధపు చెక్కలు ముత్యం పగడం లతో శవ దహనం చేశారు .కపాల మోక్షం అయ్యే వరకు అందరం ఉండి అక్కడే స్నానాలు చేసి  ఇంటికి తిరిగి వచ్చాం .సోదరులు ఇంటికి రాగానే దీపారాధనకు నమస్కరించి ఇంటిలోకి ప్రవేశించారు .ఇలా మా చిన్నక్కయ్య సాక్షాత్తు గౌరీ దేవి రూపంగా ,మహా లక్ష్మి కళతో మా అందరి నుండి రంగరంగ వైభవంగా పుణ్య లోకాలకు తరలి పోయింది .

సేవాభాగ్యం

మేము ఇంటికి చేరే సరికి ఇల్లు కడిగి వంట బ్రాహ్మిణిలతో వంట చేయించి సిద్ధంగా ఉంచారు మేడపైన అందరం భోజనాలు చేశాం. అన్నీ రుచికరంగా చేశారు .ఈ మొత్తం కార్యక్రమానికి సారధి సచివుడు వ్యూహకర్త ,నిర్వాహకుడు సర్వం తన భుజ స్కంధాలపై వేసుకుని నిర్వహించిన  మా అక్కాబావల కుమార్తె శ్రీమతి పద్మ భర్త , ఇంటల్లుడు  శ్రీ గణపవరపు రామకృష్ణ అభినందనీయుడు .అశోక్ అల్లుడు మురారి అందరికీ తలలో నాలుకగా, సహకారం గా నిర్వహించిన తీరు మరువలేనిది . అలాగే మనవలు తేజ ,ప్రత్యూష్ లు  మనవరాళ్ళు భార్గవి ,రవళి కాలికి బలపాలు కట్టుకుని చేసిన సేవ మర్చిపోలేనిది .ముఖ్యంగా భార్గవి వాళ్ళతాతగారు అంటే మా బావ పక్కనే కూర్చునిధైర్యం చెబుతూ, క్షణ క్షణంఆయన్ను కంటికి రెప్పలాగా కనిబెడుతూ చూసిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది .  విశ్రాంతి లేకుండా వర్మ ,అతని తల్లి, చెల్లెలుఇంట్లోని మనుషులకన్నా ఎక్కువగా మా అక్కకు బావకూచేసిన, ,ఇప్పుడూ చేసిన చేస్తున్న సేవ మాటలతో చెప్పటానికి వీలు లేనిది .ఎన్నో జన్మల అనుబంధమేమో  అనిపిస్తుంది .ఇందరి మంచి మనసుల మంచి మనషుల నుంచి దూరమై వెళ్లి పోయింది మా చిన్నక్కయ్య దుర్గ .ఆమె జ్ఞాపకాలు కొన్నే రాశాను .ఎన్నెన్నో తేనే పట్టు లాగా మధురమైనవి 70ఏళ్ళుగా ఉన్నాయి . వరుసలో తెలియ జేసే ప్రయత్నం చేస్తాను .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు

మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు

ప్రతి పక్షాలు తనకు తన ప్రభుత్వానికి పార్టీకి సహకరించక ఇబ్బంది పెడుతున్నాయని పాపం మోడీ నిన్న నిరాహార దీక్ష పూనాడు .బహుశా ఒక ప్రధాని ఇలా చేయటం దేశం లో ఇదే మొదలేమో .మొరార్జీ భాయి ఇలా చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు .ఎవరికైనా తెలిస్తే చెప్పండి .కాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా నిరాహార దీక్ష పట్టి ,తర్వాత పదవి కోల్పోయిన సంఘటన కొద్దిగా జ్ఞాపకం ఉంది .ఆ వివరాలు –

పశ్చిమబెంగాల్ నాలుగవ ముఖ్యమంత్రి అజయ్ కుమార్ ముఖర్జీ .అందరూ అజయ్ ముఖర్జీ అని ఆప్యాయంగా పిలిచేవారు .బెంగాల్ గాంధీ గా ప్రసిద్ధుడు . బెంగాల్ లో 15-4-1901 లో మిడ్నపూర్ లోని తామ్లోక్ లో పుట్టాడు .క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 డిసెంబర్ 17 ఏర్పడిన  ‘’తామ్రలిప్త జాతీయ ప్రభుత్వ ‘’ముఖ్య నాయకులలో అజయ్ ముఖర్జీ ఒకరు .ఈ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం లో గొప్ప పాత్ర పోషించింది .అజయ్ ముఖరీపై స్వామి వివేకానంద ప్రభావం బాగా ఉంది .అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన ముఖర్జీ,తర్వాత బంగ్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుడయ్యాడు  బెంగాల్ లో వ్రేళ్ళు పాతుకు పోయిన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు .ఈ ఫ్రంట్ ప్రభుత్వం 1960 లోనూ 1970 లోనూ రెండుసార్లు అధికారం లో ఉన్నది . ముఖ్యమంత్రి గా  మొదటిసారి 1967 మార్చి నుంచి నవంబర్ వరకు ,మళ్ళీ ఫిబ్రవరి 69 నుంచి 70 మార్చి వరకు అజయ్ ముఖర్జీ కొద్దికాలం మాత్రమె ఉన్నాడు. ఉన్నాడు అన్నదానికంటే కమ్మీలు ఉండనివ్వలేదు అనటం సమంజసం .  .సాధువు శాంత చిత్తుడు అవటం వలన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జ్యోతిబసు దూకుడును అరికట్టలేక పోయాడు .బసు తానె ‘’బాసు’’ గా ప్రవర్తిస్తూ ,దురుసుగా ముఖ్యమంత్రినే లెక్క చేయని పరిస్థితి కల్పిస్తే ,విసిగి వేసారి కమ్మ్యూనిస్ట్ లకు నిరసనగా ముఖ్యమంత్రి అజయ్ ముఖర్జీ కలకత్తాలో నిరాహార దీక్ష పూనినట్లు గుర్తు . లోకం అంతా విస్తుపోయింది ఆనాడు .ఒక ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేశాడంటే యెంత క్షోభ అనుభవించాడో నని ఆయనకే సానుభూతి చూపి బసు లెక్కలేని తనాన్ని గర్హించింది ..

 ఈ దీక్ష తో ఆయనకు పార్టీలో ప్రభుత్వం లో పట్టు లేదని తెలిసిపోయింది .రాజకీయ సంక్షోభం ఏర్పడి  1968 ఫిబ్రవరిలో నూ ,మళ్ళీ 1970 మార్చిలోనూ రాష్ట్రం లో ప్రెసిడెంట్ పాలన ఏర్పడింది .అజయ్ ముఖర్జీ స్థానం లో ప్రఫుల్ల చంద్ర ఘోష్ 1971 ఏప్రిల్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి,జూన్ వరకు ఉన్నాడు .మళ్ళీ సంక్షోభం వచ్చి రాష్ట్రపతి పాలన జూన్ 71 నుంచి మార్చి 72 వరకు విధించారు .19 2 మార్చిలో సిద్ధార్ద శంకర రే ముఖ్యమంత్రి గద్దెను కాంగ్రెస్ తరఫున ఎక్కి1977 జూన్ వరకు  జూన్ వరకు అయిదేళ్ళు నిరాటంకంగా పాలించాడు .

  కమ్మీలు బాగా పుంజుకుని బలపడి 1977 జూన్ లో మార్క్సిస్ట్ నాయకుడు జ్యోతిబసు బెంగాల్ ముఖ్యమంత్రి అయి ఏకధాటిగా 21 ఏళ్ళు 2000నవంబర్ వరకు ఏకచ్చత్రాదిపత్యంగా పాలించాడు .బసు ఉన్నతవరకు అజయ్ కుమార్ ముఖర్జీ నిప్పుల కుంపటి లో ఉన్నట్లే ఫీలయ్యాడు .పొమ్మనలేక పొగపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు ముఖర్జీని .గాంధియన్ ముఖర్జీ బసు చేష్టలకు బలై పోయాడు .తాను చేబట్టిన నిరాహార దీక్షకు తానె అప్పుడు బలి కావాల్సి వచ్చింది అజయ్ ముఖర్జీ .

     తర్వాత ప్రణబ్ ముఖర్జీ వంటి విదేయ గణం తో అజయ్- కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ,నాటి ప్రధాని ఇందిర కేంద్ర మంత్రిగా ఆహ్వానించినా చేరక తనబదులు ప్రణబ్ కు కేంద్ర స్టేట్ మంత్రిగా స్థానం కల్పించేట్లు చేశాడు అప్పటినుంచి’’ ప్రణబ్ ఎరా’’ ప్రారంభం  .1977 లో పద్మవిభూషణ పురస్కారం పొందిన  కురు వృద్ధుడు  అజయ్ కుమార్ ముఖర్జీ 27-5-1986 న 87 వ ఏట మరణించాడు .మార్క్సిస్ట్ ల ఆగడాన్ని మొదట పసికట్టి విభేదించి నిరాహార దీక్ష చేసిన వాడు అజయ్ ముఖర్జీ .

  ఇప్పుడు మోడీ పార్లమెంట్ జరక్కుండా అవిశ్వాసం ప్రవేశపెట్టకుండా  చేయించి కుమ్మక్కైపత్తిత్తు లాగా దీక్ష పట్టాడు .పంచతంత్రం కధలన్నీ వరసగా మనకు చూపిస్తున్నాడు .2014 లో మోడీ లేకపోతె భారత్ లేదు అని అనిపించి అధః పాతాళంలోకి కాంగ్రెస్ ను నెట్టేసి  ఇకజనం ఆ పార్టీని  మర్చి పోతారేమో ననిపించి చివరికి క్రమక్రమగా   రాజకీయంగా బలిసి  ,నియంత పోకడులుపోతూ కళ్ళు మూసుకుని పిల్లి పాలుతాగుతున్నట్లు అవకతవక చేష్టలతో అచ్చిరాని సంస్కరణలతో పనికి రాని’’మంకీ బాత్ ‘’లతో విసుగుపుట్టించి కాంగ్రెస్ తో సహా సర్వ ప్రతిపక్షాలతో ఛీ ఛీ కొట్టించుకుంటూ మోడీ గోబాక్ అనే దాకా వచ్చాడంటే ఇదంతా స్వయంకృతాపరాధం కాక మరొకటికాదు .కరటక దమనకుల్లా మోడీ ,షాలు .అందరికీ కనిపిస్తున్నారు .సానుభూతిపోయి క్విట్ మోడీ అనేదాకా తెచ్చుకున్నాడు మోడీ(ఘోరీ ) మొహమ్మద్ .చరిత్ర క్షమించని సంఘటన .దీనికి బలికాక తప్పదు .ఒక్క దీక్షతో ఎంత వెనక్కి వెళ్ళామో చరిత్రలో –

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు గ్రంధం పై దుగ్గిరాల కు చెందిన ప్రముఖకవి ”మరో చలం” గారి స్పందన

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -2

శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -2

సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి

4-లయన్ శ్రీ బందా వెంకటరామారావు –విజయవాడ -9393483147

ఆశించి భంగపడిన ఆంధ్రమాత ?

ప్యాకేజీలకై ఆశించి భంగపడిన అధికార పక్షం

ప్రత్యేకహక్కులకై పోరాడి అలసిపోయిన ప్రతి పక్షం

పక్షం ఏదైనా ఎన్నికల రణ క్షేత్రం లో వారిచ్చే సాక్ష్యాలివి

వేలాది పుత్రులు సృష్టించిన పున్నామ నరకాలివి

అసామాన్యులనుండి ఆశించి భంగపడిన ఆంధ్రమాతా ?

ఇవేవీ పట్టని కోట్లాది మాన్యుల సామాన్యుల రూపం లో జీవించు

అరిషడ్వర్గ విజేత నీ పుత్రుడు ఆంధ్రకేసరి లేకున్నా

ఆత్మాభిమానమే శ్వాసగా జీవించిన నందమూరి తిరిగి రాకున్నా

వారి అంశలలో మేమున్నాం ,మమ్ము చూసి గర్వించు

మా ఉన్నతిని అమ్మలా ఆశించు –మమ్ము దీవించు .

ఆంధ్రమాతా 1 అడ్డాలనాడు బిడ్డలే కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా వీరు ?

నీ బిడ్డలలో కొందరు అమెరికా ,ఇటలీ భక్తులు

మరికొందరు రష్యా చైనా శక్తులు

ఇంకొందరు పాక్ బంగ్లా కుయుక్తుల చరితులు

నీ బిడ్డలలో ఎందరో కులమతాల మలాల్లో కుళ్ళిన భోక్తలు

వారే –వేల సంవత్సరాల వయసున్న నిన్ను వృద్ధాశ్రమం లో చేర్చారు

అంతరించి పోయే అమ్మవని నమ్మబలికారు

నీ సంస్కృతీ సంప్రదాయాలకు సమాధులు కట్టారు

వారి ఉన్నతికై వారి వారి మార్గాల్లో తరలి వెళ్ళిపోయారు

ఆంధ్రమాతా !సింగపూర్ చైనా దావోస్ జపాన్ వలె ఉండాలని నీవు కలవరిస్తావు

వాటిలా నిన్నూ మార్చేస్తామని ఉత్తర కుమారుల్లా ఊసులు చెప్పేస్తారు

నీ వలే అమ్మా నాన్నా అనకుండా ఆంగ్లం లో మమ్మీ డాడీ అనమంటారు

నీపుత్రులు సృష్టించిన పున్నామ నరకం లో అభివృద్ధిని ఆశించావా

నీకలలను సాకారం చేసేవాడికి అధికార పీఠాన్ని అందించు

ఆశించి భంగపడిన ఆంధ్రమాతా !

నిన్నుకాదని పెంపుడు తల్లులను పోషిస్తున్నారు ఘనులు

పొరిగింటి పుల్లకూర రుచి వలదని వారించు

నిన్ను నిన్నుగా చూడాలని మందలించు

నీకు మరోమారు మల్లె పూలదండ వేయాలని శాసించు

ఆంధ్రమాతా –ఇదే ఈ కాల వేదం –ఈ బందా నాదం .

5-శ్రీమతి వి. శ్రీ ఉమామహేశ్వరి –విజయవాడ -9985154331

    ఆశలు పూసిన వేళ

కలసి ఉంటె కలదు సుఖమని –అన్నదమ్ముల అనుబంధంసౌఖ్యమని

అభివృద్ధికై అహర్నిశలు శ్రమించి –రత్నగర్భను గడించి వినుతికెక్కిన వేళ

అరవై ఏళ్ళు పైబడిన షష్టిపూర్తీ నుండి తేరుకోకముందే –అర్దారాత్రి పడిందొక వెన్ను పోటు

అన్నదమ్ములని విడదీసిన అత్యాశ కాటు

అలనాడు భారత ఖండంబనెడి చక్కని పాడియావు

పొదుగు పితుకుతున్న తెల్ల దొరల వోలె

ఈ నాడు ఆంద్ర రాష్ట్ర మనెడి పాడి యావు

పొడుగు చీల్చారు తెలంగాణా దొరలు .

దగా పడ్డ తెలుగు బిడ్డ –బడబాగ్ని గుండెల్లో దాచుకుని

కష్ట జీవికి ఏ గడ్డైనా బంగారమేనని –నవనిర్మాణానికి శ్రమిస్తుంటే

ఎన్నికల వేళ చేయి అందించినవారే  –బడ్జెట్ వేళ’’చేయిస్తే ‘’

తిరగబడ్డ తెలుగు బిడ్డ –తెలుగు పౌరుషం చూపి

విదేశీ పెట్టుబడులు సాధించ –బ్రహ్మాండమైన సభ దీర్చి

చాటి చెప్పే తెలుగు గడ్డ వైభవం .

మనిషి ఆశాజీవి –ఆంధ్రుడు కష్టజీవి

కష్టమే తీరుస్తుంది ఆశల్ని

మన ఆశలు నెరవేరే రోజొస్తుంది తప్పకుండా

ఉగాదికాలం లా ఆకులు రాలినా –ఆశలు వ్రాలినా

ఆకులు మరల చిగిర్చి వసంతం వచ్చినట్లే

మన ఆశలు మళ్ళీ చిగిర్చి పూసి  ఫలవంత మౌతాయి .

6-మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –విజయవాడ -9299303035

                  దగాపడిన ఆంద్ర

1-మత్తకోకిల –ముక్కలయ్యేను తెల్గు దేశము మోదమెట్టుల కల్గునూ

 చక్కగా నిక పాలనంబును సాగుటెట్టుల చెప్పుమా

అక్కరంతయు తీరె నంచును ఆదమరచె కేంద్రమే

చెక్కు చెద్రని పట్టు తోడను  చేవ జూపగ నిల్వుడీ .

2-కందం –మద్దతిచ్చెద నంచును –పద్దతిగా మాటలాడి పదవులపొందెన్

 ఉద్ధతి తగ్గిన పిదపను –‘’మొద్దై ‘’నిలుచుండె’’మోది’’ మోసము చేయన్ .

3-కందం –ఓ విళంబి నీవు ఓర్పుతో నీ భువి –తెలుగు వెలుగు మరల దీప్తి నొసగి

  కాచి రక్ష చేయు కరుణామయి గ దల్తు-రావె ఇట కుగాది రమ్య ఫణితి .

4-ముందుకు సాగు

ఓ హస్తం విడగొట్టింది –బాధపడ్డాం

ఓ స్నేహ హస్తం ఆదుకుంటుందని –ఆశించి భంగ పడ్డాం

ఓ తెలుగువాడా !

మోసపోయానని కుంగిపోకు

అలనాటి ఆంద్ర పౌరుషాన్ని రగిలి౦చి మళ్ళీ చూపించు

ఏ యెండకాగొడుగు పట్టే స్వభావం కాదని నిరూపించు

ప్రాత్యేక హోదా భిక్షం కాదని –మనహక్కే నని తెలిసేలా చెయ్యి

నీ పాలు గౌరవంగా పొందటానికి ధైర్యంగా ముందుకు సాగు

ఆంద్ర కేసరి నిన్నావహించినట్లు గుండె దిటవు చూపించు

 ధైర్యంగా ముందుకు మునుముందుకే సాగు సాగు సాగు సాగిపో .

7-శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం –విజయవాడ -9985973239

             గీతి సుగతి

1-ఆ.వె.-ఆంధ్ర దేశమెల్ల ననుపమంబై యొప్ప –జాతి జనులలోన జాతి రత్న

మగుచు నిలుచునన్న ఆశతో  ఆ నాడు –సేవ జేసినాము క్షేమమరసి .

2-తే.గీ.స్వార్ధ రాజకీయము రెచ్చి స్వంత జనము-చీల్చి –తెలుగుజాతిని రెండు చేసినారు

        వనరులన్నియు నొకవైపు వ్రాలిపోగ-అకట!నిర్విణ్ణమై పోయె నాంధ్ర ధరణి  .

3-ఆ .వె.-రాజదానిలేక ,రహదారులును లేక –కూలినాలి చేయు కొలువులేక

          ఆత్మహత్యలంచు నట్టిట్టుపరిగెత్తు-దీన జనుల గాచు తెరవు లేదు .

4-ఆ .వె.-బాధ్యతలను తల భరియించవలసిన –రాష్ట్ర నేతలెల్ల రచ్చబడిరి

           దేశాపాలకులను దేవురించిన గూడ –ఆత్మ గౌరవమ్ము అంతరించె.

5-ఆ.వె.-సొంతబలము పెంచి సొంపార నింపార –కలసిమెలసి మనము గళము లెత్త

         ఎదురు పడెడు ఇడుము లెన్నైన దొలగును –పూర్వవైభ’’మ్మపూర్వ ‘’మగును .

6-తే.గీ.-నిత్య శ్రామికులైనట్టి నీదు బిడ్డ –లెల్ల రేపవల్ కష్టించి యెదిగి మరల

పూర్వ వైభవమ్మొసగ నపూర్వ రీతి –దీక్ష బూనుచు సేవ లంది౦తురమ్మ .

7-తే.గీ.-పాలకులకెల్ల స్వార్ధంపు పరిధి తప్ప –పాలితులగాచి పాలించు బాధ్యతేది ?

         ఆంద్ర సామాజికా౦శముల్ అరసిపట్టు –‘’సరస భారతి ‘’సౌహార్ద్ర సాంద్ర కీర్తి .

8-ఆ.వె.-హేవళంబి గడిచె  ‘’హే విళంబీ’’ రమ్ము –కాల చక్రగతుల గాచిమమ్ము

        ధర్మమార్గమందు ధరణి సర్వస్వమ్ము-వరలి ,శుభము గూర్చు వరము లిమ్ము .

8-శ్రీమతి ఎం. సరస్వతీ దేవి –ఉయ్యూరు -9040821541

   స్వప్న భంగం

ఆంద్ర అన్న పేరులోనే –వినిపిస్తుంది ఓ ఠీవి-కనిపిస్తుంది ఓ హోదా

ఆంద్ర శబ్దం కాదు నిన్నటిది –కానే కాదు ఈనాటిది

ఐతరేయ బ్రాహ్మణం లోనే చోటు చేసుకున్నది –

చరిత్ర పుటల మడతల్లో కనిపిస్తుంది దీని వైభవం

మన దౌర్భాగ్యం ,స్వయంకృతం వల్ల

నేడు మనం ప్రగతికొరకు చేతులు చాచి అర్ది౦చాల్సిన కర్మపట్టింది

మన పూర్వవైభవ హోదాలను పొందేందుకు ఉండాలి మనలో ఆరాటం

అందుకే చేయాలి అవిశ్రాంత పోరాటం .

రోడ్ల నూడ్చి ,బాంకు ‘’నోట్లనూడ్చేసి ‘’

ప్రజల నేమార్చిన ఏలికలపాలనలో

మనహోదాను,ప్రగతిని నిలుపుకొనే పోరాటం లో

మనకు మిగిలిందేమిటి ?మోచేతిదానం తప్ప .

ఇదే తగిన అదును

ఊరూ, వాడా జాతీ, మతం,భాషా, వేషం అన్నీ మరిచి

ఏకమవుదాం అందరినీ కూడగట్టి అనుకున్నది సాధిద్దాం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-18 –ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ విళంబి ఉగాది కవి సమ్మేళన కవితలు 

శ్రీ విళంబి ఉగాది కవి సమ్మేళన కవితలు 

సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి

1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

దగా దగా దగా ఆది నుంచి దగా దగా దగా

రాచకీయ ఈశాన్య వాస్తు కలిసొచ్చి –అనితర సాధ్య విజయం సాధించిన

నాయకుడికి పెరగాల్సిన ఆత్మ విశ్వాసం అహంభావమైన వేళ

అప్పుడే ఇష్టం లేకున్నా అడ్డం గా చీల్చి –ఉసురు పోసుకుంది ఒకపార్టీ

కష్టించి శ్రమించి అహరహం అందరి సహకారం తో –నవరాస్ట్ర నిర్మాణం ఘనంగా చేస్తుంటే

చేస్తామన్న సాయం ,ఇస్తామన్న హోదా –రెంటికీ ‘’లాకేత్వం –దాక్కొమ్ము ‘’ఇచ్చి

మళ్ళీ వీధిన పడేసింది మరోపార్టీ

ఆంధ్రుల పౌరుష పోరాటపటిమ తెలియని ‘’ఘూర్జరు ‘’ని అవివేక అజ్నానాలు పటాపంచలై

నైరుతి పెరిగి నైతికత తగ్గి కొంప కొల్లేరవుతుందని గ్రహించాలి

ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ కీర్తి వెల్లువగా –ప్రతివాడినీ ఆవేశించి వెన్నుతట్టి నిలబెట్టే రోజొస్తుంది .

సామరస్యం సహృదయత సానుభూతి లేని రాచకీయం విజ్ఞత అనిపించుకోదు ‘

2-ఎందుకీ వేగం ?

నీ సహజ లక్షణం విలంబనం కదా –ఎందుకింత వేగం పెంచి

నీ ఆగమనానికి ముందే సఖ్యతను కూల్చేశావు విలంబీ

ఆశల సౌధాన్ని నేలమట్టం చేశావు

ఊరించి ఊరించి ఊబిలోకి  దింపేశావ్

నమ్మక ద్రోహం ఎన్నాళ్ళు ?ఎన్నేళ్ళు ?

చేవ చచ్చిన జాతి కాదు మాది

తొడ చరచి రుచి  చూపిస్తాం

అనుకున్నది సాధించి ఆంద్ర పౌరుషం రుజువు చేస్తాం

నిండా గాయాలైనవాడికి ఇంకేం భయం ?

తాడో పేడో తేల్చేస్తాం ,తడాఖా చూపిస్తాం .

3-మాకుగాది ఏదీ !

దగాపడ్డ తమ్ముళ్ళం మేము –మాకుగాది లేదు ఉషస్సు లేదు

కారు చీకటిలో కూరుకు పోయాం

మా కోయిల వెక్కిరిస్తోంది మమ్మల్ని చూసి

వసంతం హసించాల్సిన చోట –చండ్ర గాడ్పులు విసుర్తున్నాయి

ఇకమాకు మిగిలింది అరుపులు బొబ్బలు ఆవేశ కావేషాలు

వీధిపోరాటాలు ,రాచకీయ ఎత్తులు జిత్తులు

సరిగ్గా నాలుగేళ్ల కిందటి స్థితి పునరావ్రుత్తమవగా

వెక్కిరిస్తోంది విధి మమ్మల్ని

అయినా జంకని జాతిమాది

పూనికతో ,సమైక్యత తో

జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాం

మాది న్యాయ ధర్మ పోరాటం

విలంబనమాత్రమె కాదు నీ పేరు లో రక్షణ కూడా ఉంది కదా

దాన్నిపూర్తిగా పొందేదాకా విశ్రమించం .

2-శ్రీ వసుధ బసవేశ్వరరావు –గుడివాడ -9490832787

ఆంద్ర మాత

వెలుగుకోసం పోరాడుతున్న ఆంధ్రుల కల్పవల్లి

ఇప్పుడు

చీకటి గదిలో దెబ్బలు తింటున్న పిల్లి

అదను కోసం

ఎదురు చూస్తున్నది

వోటుకోసం

తలుపు లెప్పుడు

తీస్తారో అని ‘’

3- శ్రీ కందికొండ రవికిరణ్ –విజయవాడ -9491298990

లెక్క తప్పింది

ఏవో లేక్కలేసి ఏ ఒక్కటైనా ఏలుతామనుకొని

రాజదానేదో తేలకుండానే రాష్ట్రాన్ని రెండుగా చీలిస్తే

ఏదీ దక్కక పోగా బాసూ !

గల్లంతయ్యా ధరావతు ,పోయి౦దయ్యా గ్రేసూ.

వడ్డించి ఉన్న నిండు విస్తరి వరమైంది వేరుపడిన తమ్ముడికి

అన్నీ నిండుకున్న పళ్ళేమయింది’’అన్న ఆంధ్రా ‘’పరిస్థితి

ఏమి చిదంబర రహస్యమో మరి పలికారు

ఉమ్మడి రాజధానికి ఆదెల్ల హక్కుకు మంగళం

పంచతంత్ర మిత్ర లాభం లాబీయించక పాపం

పడ్డదయ్యో ఆంధ్రా ఆశాభంగం

హా !ఖుదా !అయ్యింది ఖూనీ ప్రత్యేక హోదా

ప్రత్యేక పాకేజీ కీ కూడా తప్పదా రాజీ

హోదాతో ఒరిగేదేమిటన్నదీ వారే

ఇప్పుడు గోదాలోకి దిగినదీ వారే

ఈ పని అపుడే చేసుంటే ?

పెద్ద నోట్ల రద్దు అది బడుగు జనుల నెత్తిన పిడి గుద్దు

కాస్తంత రుణానికి సవాలక్ష ఆంక్షలు సామాన్యులకు

మరి యే తుంగలో తొక్కుతారో  మాన్య దొంగలకు సంస్థలు

ఎవరినెవరు చేశారో వంచన –దెబ్బతిన్నది ప్రజల అంచనా

గమనిస్తున్నాడన్నీ మౌనంగా ఒకడు

అగ్నిపర్వతం లాగా లోలోన రగులుతున్నాడు

మూడో కన్నును అరుదుగ తెరిచే శివుడి లా అతడు

తిరుగు లేని తన త్రిశూలం తో గింగిరాలెత్తిస్తాడు

మళ్ళీ పరిచయమెందుకు ?తెలియని దెవ్వరికతడు ?

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-18 –ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ -వాటర్ ప్లాంట్ ప్రారంభం పై ఆంద్ర జ్యోతి కధనం 11-4-18

గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ -వాటర్ ప్లాంట్ ప్రారంభం పై ఆంద్ర జ్యోతి కధనం 11-4-18

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏక వీర శివకుమారి ఆశీరభినందనలు

సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై గంటన్నర సేపు ఏకదాటి ప్రసంగం చేసిన శ్రీమతి బెల్లం కొండ శివ కుమారికి కవుల ఆశీరభినందనలు

1-శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం –విజయవాడ -99859 732 39

1-జ్ఞాన పీఠాధిపతివిశ్వనాథ కవి వ –రేణ్యు నవలా మహారాజ ‘’ఏకవీర’’

 నద్యయన జేసి ,పరిశోధనాత్మకముగ-రచన సాగించి ,లోకోత్తరముగా గీర్తి

నందిన శివ కుమారికి ఆశిసు లివె.

2-‘’వేయి పడగల’’వాని నైవేద్యమనగ-జిలుగు పదముల నెదల రంజిల్ల జేసి

ఆంద్ర భాషామతల్లి కాహార్య మనగ –సేవలందించి నావమ్మ శివకుమారి !

౩-శబ్ద దేవతోపాసన సతము సల్పి –శిష్యగణము లెల్లయు నిన్ను శిరసు దాల్చ

మాతృభాషాభిమానుల మనసు దోచి –నిలిచి యుందువు మాయమ్మ ,నిత్య దీప్తి ‘’.

2-శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –విజయవాడ -9299303035

   1-పరిశోధన చేసెం గా –పరామాద్భుత ఫణితి ,తాను పారము ముట్టన్

    సురుచిర భాషణ మంతయు –పరమానందంబు గూర్చె,భావము నిండెన్ .

 2-ఆషా మాషీ కాదిది –భాషా పరిశోధనమ్ము ,భాగ్యము గాదే

   యోషా వేసితె సరములు –భాషా యోషకు గొనుమిదె వందన శతముల్ ‘.

౩-అంచిత మైన దీక్ష గొని ,యా పరిశోధన చేసినారుగా –సంచిత పుణ్యశీలి ,తమ సాహితీ వాగ్రసపాన మందగన్

మంచిగ దోచె మా మదికి ,మాధురి నిండిన భాష ణ౦బుకున్-ఎంచగ నేనె మీ కృషిని ఈశుడు బ్రోచుత యెల్లకాలమున్.

౩-శ్రీమతి గుడిపూడి రాదికారాణి-మచిలీపట్నం -9494942583

              ‘’ఆటవెలది అభినందనలు ‘’

1-ఏకవీర నవల నేకదాటిగ చెప్పి –వినినవారికెల్ల విశద పరచ

 ధన్య జీవివమ్మ ధరణి నందు నీవు –రాదికమ్మ వాక్కు రాణ కెక్కు .

2-మమత ఊటలాగ ,మాటు దాచిన మాత –ఏక వీర మదిన యేలు తల్లి

 మనసు బెల్లంకొండ .మాట యే కలకండ-రాదికమ్మ మాట రాణకెక్కు.

౩-ముందు  మాట వినక మునుపు నే పఠియించి –మరలమరల చదివి మరులు పెరిగె

 విశ్వనాథ వారి విజయ భేరివె నారి –రాదికమ్మ వాక్కు రాణకెక్కు.

4లయన్ శ్రీ బందా వెంకట రామారావు –విజయవాడ -9393483147

‘’ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయాలపరి రక్షణలో నిరంతర కృషిని యజ్ఞం లా కొనసాగిస్తున్న శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి గారూ –

మీవైన విధి విధానాల్లో శ్రీ విశ్వనాథ కవి సామ్రాట్ విరచిత ‘’ఏకవీర ‘’చారిత్రిక నవలా సమీక్షణం ఓఅద్భుతం ,అనిర్వచనీయం

పాశ్చాత్య నాగరికతా వ్యామోహం లో ప్రేమ ,విడాకులు ,బహుభార్యత్వం ,బహు భర్తృత్వం వంటి విష వృక్ష ఫలాలను ఆరగిస్తూ పతనమవుతున్న నేటి సామాజిక విలువల పునర్జీవనానికి ఓ ప్రయత్నంగా ఉపకరిస్తుంది మీ సమీక్ష .పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ,ప్రేమించు కుంటూ కలకాలం అన్యోన్యంగా జీవించమని అంతర్లీనంగా బోధిస్తుంది విశ్వనాథ వారి వాణి.

   ఆ వాణికి సారదులై ఈ సమీక్షా కృషిని నిర్విఘ్నంగా కొనసాగించండి .మీ కృషికి భగవంతుని ఆశీస్సులు ,సభ్య సమాజపు సహకారం లభించాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను .

5-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –ఉయ్యూరు -9989066375

      ‘’ఏకవీర –ఏకనారి ‘’

ఏకవీర నవలను –ఏకవీరా దేవిగా ఆరాధిస్తూ –ఊరూరా ఊరేగిస్తూ

క్లాసిక్ కావ్య గౌరవం కల్పిస్తూ –ఏకదీక్షగా కొనసాగిస్తూ –ఆ పేరు లోని మాధుర్యాన్ని

తరతరాల విస్తరించే తపనతో -నీ కుమార్తెకూ ‘’ఏకవీర ‘’నామాన్ని సార్ధకం గా పెట్టి ధన్యురాల వైనావు

అలవోకగా ,తాదాత్మ్యంగా ,నిర్విరామంగా-అలుపెరగక  ప్రసంగించే నీ దీక్ష అమోఘం తల్లీ

అనితర సాధ్యం ఆదర్శప్రాయమూ

నవలా శిల్పానికి పరాకాష్ట ,శిఖరా రోహణంకదా అమ్మా .

విశ్వనాథ ‘’కల్ప వృక్షం’’  ఊరూ వాడా నీరాజనాలు అందుకొంటే

తెలుగువారి జీవన విధాన మైన ‘’వేయిపడగలు ‘’ఆధునిక ఆంద్ర ఇతిహాస’’మైతే

ఇప్పటి ఏకవీర అజరామరమైన వేళ-విశ్వనాథ జీవించే ఉంటె

తనువెల్లా పులకించి పరవశించి కనులవెంట  ఆనంద బాష్పాలు రాలుస్తుండగా

ఆశీరభి నందనలు  స్వయంగా అందించి  నీకు శుభం పలికేవారు

నీ ప్రసంగం లో నిర్మల  కృష్ణానదీ సోయగాలు .’’వైగై నదీ ‘’వైచిత్రాలు

మీనాక్షీ సుందరేశుల పవిత్ర ప్రేమ జీవన విధానాలు   ప్రతి ఫలించి

పరిపూర్ణత సాధించింది

చిరంజీవి అమ్మాయీ ‘’శివకుమారీ ‘’!

మీ దాంపత్యం వర్ధిల్లాలి కలకాలం ఆనందంగా

మహిళా మాణిక్యంలా నీవు  భాసించాలి

‘’నీ ఏక వ్యక్తి  సైన్యం ‘’ఇలాగే నిరంతరం

విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను –‘’నాన్నగారు’’

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-18 –ఉయ్యూరు

దీని తర్వాత ఇక వరుసగా శ్రీ విళంబి ఉగాది వేడుకలో జరిగిన ‘’ ఆశించి భంగ పడ్డ ఆంధ్రా ‘’కవిసమ్మేళన కవితలు ధారా వాహికంగా అందజేస్తాను –దుర్గాప్రసాద్

Posted in కవితలు | Tagged | Leave a comment

11-4-18 బుధవారం ఉదయం మా ఇంట్లో అలనాటి శిష్యుడు కాళీప్రసాద్ ,కొడుకు కిషోర్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శంకరాచార్య జయంతి

శ్రీ శంకరాచార్య జయంతి 

20-4-18 వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం  శ్రీ అది శంకరాచార్య జయంతి సందర్భంగా సరసభారతి 122 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ  శంకర జయంతి నిర్వహిస్తోంది .
20-4-18 శుక్రవారం -ఉదయం -9-30 గం లకు శ్రీ శంకరాచార్య స్వామికి అష్టోత్తర పూజ
              శంకర స్తోత్ర పఠనం
              సాయంత్రం -6-30 గం లకు -శంకరాచార్య జీవితం -అద్వైత భావన అంశం పై ధార్మిక ప్రసంగం
  అనంతరం శ్రీ శంకర స్తోత్ర లహరి -సామూహికంగా ,వ్యక్తిగతం గా శ్రీ శంకర స్తోత్ర గానం
సాహిత్య సంగీత ఆధ్యాత్మిక అభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన –
                                                              గబ్బిట దుర్గా ప్రసాద్ -సరస
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు

30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు

సంపద్ శుక్రవార ఉద్యాపన భోజనాలు ,1-4-18ఆదివారం మా అబ్బాయి శాస్త్రి స్వగృహం లో మామనవడు చి శ్రీకేత్ యశస్వి ని వడక పెళ్లి కొడుకును చేసే దృశ్యాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం

”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment