కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ రామకృష్ణప్రభ -ఆగస్టు

దేహం లో శ్రీరాముడు కొలువున్నకనకమ్మగారు -జులై ఆగస్ట్ శ్రీరామ కృష్ణ ప్రభ

 

 

తంత్ర్యోద్యమ ధీర బెంగాలీ నారి మాతంగిని హాజ్రా –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం 

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం
—

ఉదార గుణమే ఉన్నతాశయం

‘.’శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది .

వీళ్ళు నావాళ్ళు , వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు .ఉదార స్వభావులకు ఈ జగమంతా ఒకే కుటుంబంగా గోచరిస్తుంది అని తాత్పర్యం .కర్తవ్య దృష్టి ఉంటేనే ఇహపర సాధనం .

బాగా డబ్బున్న లోభికంటే ,ఉదార గుణం ఉన్న పేదవాడు గొప్ప అన్నాడు 17-18 శతాబ్దాలకు చెందిన  గువ్వల చెన్న శతకకర్త –

‘’కలిమి గల లోభికన్నను –విలసితముగ పేద మేలు వితరిణి యైనన్

చలి చెలమ  మేలు గాదా  –కుల నిధి యంబోధి కన్న ,గువ్వల చెన్నా ‘’

సముద్రం లో ఎంతనీరున్నా ,దాహమైతే గుక్కెడు నీళ్ళు కూడా తాగటానికి  పనికి  రాదు. .అందులో నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నా, తాగటానికి పనికి రాని ఉప్పునీరే ఉంటుంది .చలి చలమలో నీళ్ళు తక్కువగా ఉన్నా ,ఆ నీటిని తాగితే , చల్లగా ,మధురంగాఉండి  దాహ శా౦తినిచ్చి ,ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త నీరు ఊరుతూ, ఎందరెందరికో ఉపయోగపడుతుంది .కనుక కలిమి ఉన్న లోభి కంటే, ఉదారగుణం ఉన్న పేద వాడు శ్రేష్టుడు అని కవి వివరించాడు .. ..  నిత్యజీవితం లో డబ్బు అవసరమే, కాని ధనమే జీవితం కాకూడదు .డబ్బు సంపాదన పై శ్రద్ధ ఉండాలి కాని ,ఆర్జనే అర్ధానికి మూలం కారాదు .సంపాదించిన డబ్బు ఖర్చు చేసేటప్పుడు మనిషి విజ్ఞత చూపాలి .ఆర్జన ,వినియోగం మనిషి స్వభావానికి ,ఔన్నత్యానికి ,సార్ధక్యానికి అద్దం పడతాయి .వ్యక్తికి  ఈ రెండిటిపై గొప్ప అవగాహన ఉండాలి .

ధనాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అప్పుడే  మనశ్శాంతి , సౌఖ్యం ,పేరు ప్రతిష్టలు కలుగుతాయి .లేకపోతే ఆ ధనమే శీలహానికి, అపకీర్తికి, పాపానికి, మానసిక క్షోభకు  కారణమౌతుంది .ఆర్జనతోపాటు అనుభవ యోగమూ ఉంటేనే పరమార్ధం .అంటే తనకు, తన కుటుంబానికి ఖర్చుచేస్తే చాలదు .తోటివారికి, బాధలలో ఉన్నవారికీ  సాయపడి  వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు పూయించాలి .అప్పుడే  ఆ ధనం సార్ధకమై  ,మానసిక ఆనందాన్నిస్తుంది .

అంతమాత్రం చేత,  ఎవడికి పడితే వాడికి డబ్బు ఇచ్చి, అపాత్ర  దానం చేసి ,అనర్ధాన్ని తెచ్చుకోకూడదు .దానం వెనుక ఉన్న మనసు చాలా ముఖ్యం .దానం లో గర్వం ఉంటే ,పతన హేతు వౌతుంది . .వ్యక్తికి సాయం చేసే అదృష్టం కలిగింది అని భావిస్తే ,ఆ దానం పవిత్రమై ఆనందాన్నిస్తుంది .ఆత్మీయత ,అనురాగం, మనసు పంచుకోవటం వలన ఐహిక ఆనందం కలుగుతుంది .ఇదే లేకపోతే ,జీవితం రసహీనమై  నిరర్ధకమని పిస్తుంది .కర్మ, జ్ఞాన, భక్తులు ఆముష్మికానికి యెంత అవసరమో ,ఆర్జన, అనుభవం ,ఆనందం, ఐహికానికి అంత ముఖ్యం. రైల్వే లో పనిచేసే పాముల నరసయ్యగారు ఒక్క గారుడీ మంత్రం తో  ,ఒకే ఒక్క ఫోన్ కాల్ తో , పాముకాటుకు గురైన వేలాది మంది జనాలకు  ప్రాణదానం చేసి, ప్రాణదాత అయ్యారు .దీనికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు .నిస్వార్ధ సేవ చేసి చరితార్దులై ఉదాత్త పురుషులయ్యారు ..’’మనం ఇతరులకు మన స్పూర్తిగా సాయం చేయాలనుకొన్నప్పుడు ,సహాయం చేస్తున్నప్పుడు మన మనస్సు ,బుద్ధీ పరిశుద్ధమౌతాయి .ఈ ప్రతిఫల౦ ఒక్కటే చాలు చేసే సాయానికి ‘’అంటారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు . ‘’ఎప్పుడూ నీటిలోనే ఉండే చేప దుర్గంధంతో నిండిన నీచును దూరం చేసుకోలేనట్లే మనిషి, సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా ,మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని  భక్త కబీరు చెప్పాడు. కబీర్ సూక్తులే  తనకు ఆదర్శం అన్నాడు మహాత్మాగాంధీ .

మనం వీటిని అన్నిటిని  సమన్వయ పరచుకొంటూ ,ఉన్నంతలో ఒక చలి చలమ లాగా  ఆర్తులకు ఉపయోగ పడుతూ  జీవితం గడిపితేనే ,జీవితానికి నిండుదనం, శోభ ,సార్ధకత  కలుగుతాయి  అని గువ్వల చెన్న ‘’  చెన్నా’’ అంటే బాగా  చెప్పాడు .,అంతే కాదు తెలుగు పద్యం శాశ్వతత్వాన్ని కూడా ఇలా చెప్పాడు .

గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును,, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న, గువ్వల చెన్నా

 మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -6-8-19 -ఉయ్యూరు  

Posted in రేడియో లో | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా   5-9-19   సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,144 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

 

ముఖ్య అతిధి –

–శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

ఆత్మీయ అతిధులు –   శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

మొదలగు ప్రముఖులు

 

కార్యక్రమ వివరం

 

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-శ్రీ బొడ్డపాటి  విశ్వేశ్వరరావు –93 సంవత్సరాల పౌరాణిక నాటక రంగ స్థల నటులు –గుడివాడ

2-శ్రీ పెర్నేటి గంగాధరరావు –విశ్రాంత ప్రధానొపాధ్యాయులు ,ఆధ్యాత్మిక గ్రంథ కర్త-మచిలీపట్నం

3-శ్రీ కోసూరు ఆదిరాయణ రావు –విశ్రాంత ప్రధానొపాధ్యాయులు –   కోసూరు

4-శ్రీ మతి కొల్లి భారతీ దేవి –విశ్రాంత ప్రదానోపాధ్యాయిని     -మచిలీపట్నం

5శ్రీమతి వి.కస్తూరి బాయి –విశ్రాంత ప్రదానోపాద్యాయిని –విజయవాడ

6-శ్రీ గబ్బిట రామనాథ బాబు –విశ్రాంత ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు –ఉయ్యూరు

మొదలైనవారు

 

ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

 

1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు

2- అమరవాణి పాఠశాల విద్యార్థిని  -కుమారి   ఎస్.సాహితి   10/10 –కు  2,000 రూపాయలు

3-..అమరవాణి పాఠశాల  విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు  2,000 రూపాయలు

4.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం(పేర్లు తరువాత ప్రకటిస్తాం ) –

 

.-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి   5,116 గా ఏర్పాటు చేసిన  స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

5-2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.5/10మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక . నారాయణ  జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గబ్బిట  రమ్య కు 5,116రూపాయలు

5-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఛి .యనమండ్ర రోహిత్ కుమార్ కు 5,116 రూపాయలను

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

 

మిగిలిన వివరాలతో  అంతర్జాల ఆహ్వానం ఆగస్ట్ చివరివారం లో అంద జేస్తాము .

 

ఆహ్వాని౦చు వారు

గబ్బిట దుర్గా ప్రసాద్ సరసభారతి అధ్యక్షులు

,

పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

 

ఉయ్యూరు -5-8-19 ఉయ్యూరు

 

— 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131

           ధ్వజస్తంభ ప్రతిష్ట

వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ జాలాది దాన్యాదివాసాలు ,ప్రతిష్ట ,హోమాలు అన్నీ ఆగమోక్తంగా జరగాలి . దైనందిన  దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏటికేడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది .ధ్వజ ప్రతిష్ట ఎప్పుడుఅని అడుగుతూనే ఉన్నారు .సమయం రావాలి అని చెప్పేవాళ్ళం . ధనుర్మాస  ఉత్సవాలు కూడా చేబట్టాం .దీనితో భక్తులలో ఔత్సుక్యం మరింత పెరిగింది .ఆలయానికి ఏ రూపంగా నైనా సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు .మార్గశిర శుద్ధ   త్రయోదశి నాడు శ్రీ హనుమద్ వ్రతాన్ని మూడు రోజుల కార్యక్రమ౦గా చేస్తున్నాము .

 ఈనోటా ,ఆనోటా చినవోగిరాల వాస్తవ్యులు వదాన్యులు సంపన్నులు శ్రీ పాలడుగు నాగేశ్వర దాసు గారు చాలా దేవాలయాలకు ధ్వజ స్తంభాన్ని కొని అందజేసినట్లు విన్నాం. వారే ఉయ్యూరు రోటరీ క్లబ్ వారు కాటూరు రోడ్డు లో నిర్మించిన రోటరీ కంటి ఆసుపత్రికి ,జనరల్ హాస్పిటల్ కు తమ పొలాలను ఉచితంగా అందజేసిన పూజ్యులు .ఆయన ఇంటి క్షురకుడు నాదస్వర బృందం నాయకుడు మాకు పరిచయమై మమ్మల్ని ఒక సారి దాసుగారిని కలవమని ఈలోపు ఆయన చెవిలో విషయం వేసి ఉంచుతానని చెప్పాడు .అలాగే ఒకరోజు మేము ముగ్గురం ఆయనవద్దకు చినవోగిరాల వెళ్లాం .ఆయన, భార్యగారూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆలయ విశేషాలు అడిగి తెలుసుకొన్నారు .అప్పుడు మేము వారి దృష్టికి ధ్వజస్తంభం విషయం తీసుకోచ్చాము .రెండోమాట లేకుండా ‘’నేనే మీ గుడికి ధ్వజం కర్ర కొని ఇస్తాను .ప్రతిష్ట ఏర్పాట్లు మీరు చేసుకోండి ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పి తిరుగివచ్చాం .

   ఒక రోజు దాసుగారి నుంచి ఫోన్ వచ్చింది .మర్నాడే తెనాలి వెళ్లి ‘’అడితీ’’లో ధ్వజస్తంభం టేకు కర్ర కొని ఇప్పిస్తాను తనకారులో వెడదామని చెప్పారు .అలాగే వారికారులోనే మర్నాడు ఉదయమే  అందరం కలిసి తెనాలి వెళ్లాం .కాలువ వొడ్డున అన్నీ అడితీలే .ఆయన ఎప్పుడూ కొనే అడితీలో నాణ్యమైన టేకు దూలం ,మా ఆలయానికి కావలసిన ఎత్తు ఉన్న సాఫీగా ఉన్న కర్ర సెలెక్ట్ చేశాం .ఆయనే డబ్బు చెల్లించి రసీదు తీసుకొని ,అడితీ వారికే ఉయ్యూరు చేర్చే బాధ్యత అప్పగించారు .దాన్ని దీవాలయం దగ్గర బయట పడేస్తే చెదలు పట్టి ఒకవేళ ప్రతిష్ట ఆలస్యం అయితే వానకు తడిసి ఎండకు ఎండి దెబ్బ తింటుందని ముందుగానే భావించి పెద్ద వంతెన దగ్గరున్న రామకోటయ్యగారి అడితీ ప్రక్కనున్న మరో అడితీలో వారిని సంప్రదించి అక్కడ ఉంచుతామని చెప్పగా ఆయన గొప్పభక్తుడు , దాసుగారికి మంచి మిత్రుడు అవటం తో ఒప్పుకోగా అక్కడికే డైరేక్ట్ గా తోలించి చేర్చమని చెప్పగా అలాగే చేశారు .దాసుగారి దాతృత్వానికి జోహార్లు .

  ధ్వజస్తంభం కర్ర వచ్చింది .అది పాడుకాకుండా వరిగడ్డి వెంట్లు చుట్టించి భద్రం చేశాము .ఇక ఇత్తడి తొడుగు తయారు చేయించటం ,ప్రతిష్ట జరగాలి .మళ్ళీ మేమే పీటలమీద కూర్చోకుండా వేరెవరికైనా ఆసక్తి ఉన్నవారికి అప్పచెబుదాం అని నా ఆలోచన . మా నాయనమ్మ గారి తండ్రిగారుకూడా ఆలయ ప్రతిష్ట ఆయన చేసి ధ్వజప్రతిస్ట ,ఆయన చిన్నకుమార్తే కుమార్తె శ్రీమతి  సూరి సౌభాగ్యమ్మ దంపతులతో చేయించారని మా అమ్మగారు చెప్పేవారు .మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం . సహాయం కోసం కరపత్రాలు వేసి  పంపిణీ చేశాం .ఏమీ జరగకుండానే నాలుగేళ్ళు యిట్టె గడిచిపోయాయి .ఐదో ఏడు ప్రవేశించింది .ఏమైనా సరే ప్రతిష్ట జరపాలి అని పూర్తి నిర్ణయానికి వచ్చాం . శైవులైన వడ్లమాని సిద్దా౦తిగారు సంజీవరావు గారికి బంధువులు .బాగా పరిచయం ఉన్నవారు .ఆయనా విశ్వ ప్రయత్నం చేశారు. సిద్ధాంతిగారిని ఒకసారి ఆలయానికి పిలిచి మాట్లాడాం .త్వరలోనే ప్రతిష్ట జరుగుతుంది అని అభయం ఇచ్చారు .వారితోనే ముహూర్తం పెట్టిద్దామనుకొన్నాం .మరి ప్రతిష్ట చేసేదేవరో తెలియాలి .వారి పేరు నక్షత్రాలకు కుదరాలి .అప్పుడు అందరూ ‘’రత్తయ్య ‘’అని పిలిచే ,శ్రీ దొడ్డా వెంకటరత్నం మాతో తమదంపతులు కూర్చుని ప్రతిష్ట చేస్తామని ముందుకు వచ్చారు .హమ్మయ్య అనుకొని సిద్ధాంతి గారి చేత ముహూర్తం పెట్టి౦చాము  .ఒకసారి ధ్వజాన్ని పాతిపెడితే మళ్ళీ తీయటం కుదరదుకనుక కష్టమో నిస్టూరమో దానికి ఇత్తడి తొడుగు కూడా చేయించి ప్రతిష్ట చేయాలని నిర్ణయించాం .ఇందులో నాకుకాని వీరభద్రరావు కుకాని అనుభవం లేదు .సంజీవరావు గారికే బాధ్యతా అప్పగించాం .ఆయన అన్ని చోట్లా విచారించిగుంటూరుజిల్లా  ఫిరంగిపురం లేక పిడుగురాళ్ళ సాయిబులు బాగా చేస్తారని తెలుసుకొని ,మా ద్వారా ఆ మేస్త్రీకి డబ్బు అడ్వాన్స్ ఇప్పించారు .

   ఫిరంగిపురం బాచ్ వచ్చింది .వాళ్లకు విష్ణ్వాలయం లో ఉండటానికి వసతి ఏర్పాటు చేయించాం .రోజూ వాళ్లకు రెండుపూటలా కాఫీ టిఫిన్లు ,భోజనాలు అన్నీ ఏర్పాటు చేశాం .కావలసిన నాణ్యమైన ఇత్తడిని బెజవాడ వన్ టౌన్ ఇత్తడి కొట్లో కొని అందించాం .కొలిమి ఏర్పాటుకు, బొగ్గులకు  వెలిగారం వగైరా లకు సహకరించాం  ..ధ్వజస్తంభం కర్రను ఉయ్యూరు అడితీ నుంచి తీసుకువచ్చి గుడిదగ్గర పెట్టించాం. .చాలా కస్టపడి ఇత్తడి కుందులు ధ్వజస్తంభం సైజును బట్టి తయారు చేశారు.స్వామి విగ్రహానికి ఎదురుగా వచ్చేకుందిపై ఒంటె బొమ్మ నగిషీ ,ప్రక్కల స్వస్తిక్ మార్కు చెక్కిన్చాం .ఇదంతా సంజీవరాయ మహిమే .మాకేమీ ఇందులో ఓనమాలు తెలియవు . జరుగుతున్న పనిని చూసి అందరూ  సంతోషించారు .ధ్వజం ప్రతిస్టించ టానికి లోతుగా గొయ్యి తీయి౦చా౦.ధ్వజాన్ని అందులో కూర్చోపెట్ట టానికి   క్రేన్ కావాలని ,పంపమని  కెసీపి కి వెళ్లి ప్లాంట్ మేనేజర్ బసవయ్యగారికి కోరాం  .ఆయన సరే అని ముహూర్తం సమయానికి ఒకగంట ముందు క్రేన్ ,ఆపరేటర్ వస్తారని చెప్పారు.

 స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్సర జ్యేష్ట బహుళ నవమి 13-6-1993  ఆదివారం ఉదయం 7-29గం.లకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ యందు ఇత్తడి తొడుగుతో సహా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా  అశేష జన సందోహం జయజయ ద్వానాలమధ్య కన్నులపండుగాలాగా జరిగింది . స్వర్గీయ  శ్రీ దొడ్డా వెంకటరత్నం దంపతులు ,శ్రీ పరాశరం రామకృష్ణమాచార్యులవారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట చేశారు . స్వర్గీయ మండా వీరభద్రరావు ,స్వర్గీయ లంకా సంజీవరావు గారల అవిశ్రాంత కృషి ,అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలంగా నిలిచాయి .స్వామివారి కరుణాకటాక్షం చెప్పనలవికానిది . ఈ పవిత్ర కార్యానికీ చందాలు వరదలా పారాయి .అంతా సద్వినియోగపరచాము .ఇత్తడి తొడుగు చేసినవారికి నూతన వస్త్రాలు ,మిగిలిన డబ్బు ఇచ్చి సంతృప్తి పరచాం .ఈ సారి నేనే ఎప్పటికప్పుడు జమాఖర్చులు రాసి ,వారిద్దరికీ  చూపించి లిస్టు తయారు చేసి ముగ్గురం సంతకాలు పెట్టి జమాఖర్చులు తెలియ జేసే తేదీ ప్రతిష్ట జరిగిన మూడు రోజులకే ప్రకటించి వచ్చినవారికి చదివి వినిపించి బోర్డ్ మీద అంటించి బాధ్యత తీర్చుకొన్నాం . ఒకమహత్తర యజ్నంలాగా విగ్రహ ప్రతిష్ట ,ధ్వజ  ప్రతిష్ట జరిగి మాకు  అత్యంత  ఆనందాన్ని కలిగించాయి .జీవితం లో ఈ రెండూ మరచిపోలేని మరువరాని పవిత్ర ఘట్టాలై మమ్మల్ని మా కుటుంబాన్నీ  తరి౦పజేశాయి .

  ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణం

అప్పటినుంచి వందలాది భక్తులు నిత్యం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించి సేవించి తరిస్తున్నారు .ప్రతి మంగళ, శనివారాలలో నాగవల్లి అంటే తమలపాకు పూజ ,విశేషంగా జరుగుతుంది .ధనుర్మాసం లో వేలాదిభక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి ,తమ మనో భీస్టాన్ని స్వామిని నివేదించి ,అభీష్ట సిద్ధి పొందుతున్నారు .ప్రాతః కాలపూజ ,గోదాదేవి తిరుప్పావై , కుల శేఖర ఆళ్వార్ ముకుందమాల ,సుందరకాండ స్తోత్ర పారాయణలతో ఆలయం మరింత పవిత్రత చేకూర్చు కొంటున్నది .స్వామి భక్తులపాలిటి కొంగుబంగారం .

  భోగినాడు శాకంబరిపూజ ,శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ గోదా రంగనాధ స్వాముల శాంతి కల్యాణం నిర్వహించి ఒంటె వాహనం పై గ్రామోత్సవం చేస్తాం .ప్రతి ఏడాది జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం నాడు ఉదయాన్నే స్వాములకు లడ్డూలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా అందజేస్తాము .జనవరి 10న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవ సందర్భంగా అరిసెలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా పెడతాము .స్వామికి గారెలదండ అంటే వడమాల మామూలే .భక్తులు ఎప్పుడూ చేయించి వేయిస్తూనే ఉంటారు .ప్రతిమంగళవారం స్వామికి అత్య౦త ప్రీతికరమైన అప్పాలు చేయించి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తాం .తులసిమాలలు నిమ్మకాయమాలలు ,జిల్లేడు వ్రేళ్ళతో జిల్లెడుపూలతో ,పుష్పహారాలతో స్వామి దివ్య సు౦దర౦ గా , దేదీప్యమానంగా శోభిస్తాడు ,భాసిస్తాడు .భజనలు, కోలాటాలు హనుమాన్ చాలీసా,లలితా, విష్ణు సహస్ర  పారాయణాలు సామూహిక కుంకుమ, గంధ సిందూరం పూజలు మా ఆలయం ప్రత్యేకత .

   స్వామి నక్షత్రం పూర్వా భాద్రనాడు మన్యు సూక్తం తో ప్రత్యేక అభిషేకం జరుపుతాం .వైశాఖ బహుళ దశమి  శ్రీ హనుమ పుట్టినరోజు నాడు శ్రీ హనుమజ్జయంతి ని మూడురోజుల కార్యక్రమంగా త్రయాహ్నికంగా నిర్వహిస్తాము .మొదటి రోజు స్వామివారికి   అష్ట కలశ  స్నపన ,  మన్యు సూక్తం తో అభిషేకం నూతన వస్త్ర ధారణా అన౦తరం గంధ సిందూరం మల్లెపూలతో ,  ,రెండవరోజు రసం మామిడి పండ్లతో ,మూడవరోజు శ్రీ హనుమత్ జయంతినాడు తమలపాకులతో విశేష పూజ జరుపుతాము .తరువాత  స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం .సాయంకాలం చాలీసా పారాయణ ,స్వామికి వడమాల ఉంటాయి .

ప్రతి శ్రీరామనవమికి శ్రీ సీతారామ కల్యాణం ,శ్రీ  కృష్ణాష్టమి కి బాలబాలికల వేషధారణ వేడుకలు  ,శంకరజయంతి  త్యాగరాజారాధనోత్సవ౦  జరుపుతాం ,కార్తీకమాసం ప్రతిమంగళవారం దీపాలంకరణ  ,పౌర్ణమినాడు లక్ష దీపాలంకారం ఉంటాయి .మాఘమాసం లోఒక ఆదివారం నాడు  ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తాం .దసరా నవరాత్రులలో అమ్మవారిని ఏర్పాటు చేసి రోజుకొక  అలంకరణ చేసి సాయం వేళ సహస్రనామ అష్టోత్తరపూజ అమ్మవారికీ సువర్చలాన్జనేయస్వాములకు చేస్తాం.విజయదశమినాటి రాత్రి శమీ పూజ ఉంటుంది . ముక్కోటి   ఏకాదశినాడు తెల్లవారుఝామున  స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగాజరుగుతుంది .వందలాది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసి పులకించి పోతారు .  మార్గ శిరశుద్ధ  త్రయోదశినాడు శ్రీ హనుమద్ వ్రతం అత్యంత వైభవంగా మూడురోజులు నిర్వహిస్తాం . ఇలా ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అభివృద్ధి చెందుతోంది . ధనుర్మాసంలో అపర వైకుంఠంలాగా ,నవరాత్రులలలో సకల శక్తి  వంతుడు అభయప్రదాత స్వామి శ్రీ లలితా పరమేశ్వరి కొలువైఉన్న అపర శక్తి క్షేత్రంగా ,కార్తీకమాసం అపర కైలాసంగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం శోభిల్లుతుంది. స్వామి శివ విష్ణు శక్తి అంశ సంభూతుడుగా దర్శనమిస్తాడు ,ఉగాది ఉదయం పంచాంగ శ్రవణం ప్రత్యేకత .సంక్రాంతి ఉదయం సంక్రాంతి పురుష స్వరూపస్వభావాల వివరణ జరుగుతాయి .

   పత్యేక కార్యక్రమ నిర్వహణ

ఆలయ నిర్మాణం జరిగి 20ఏళ్ళు దాటిన సందర్భంగా 11రోజల ప్రత్యేకకార్యక్రమం జరిపిచాం .ప్రతి రోజు ఉదయం మన్యుసూక్తంతో స్వామివారలకు అభిషేకం   హోమ౦ , సహస్రనామార్చన ,సాయంత్రం మళ్ళీ హామ౦ ,స్వామి వారలకు శాంతి కల్యాణం జరిపాం .భక్తుల స్పందన అపూర్వం .గీతామందిరం అర్చకస్వాములు శ్రీ స్వర్ణ నాగేశ్వరరావు గారిఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏలూరుకు చెందిన వేదపండితులు అత్యంత శ్రద్ధాసక్తులతో పరమ నైస్టికంగా మహా వైభవంగా  మా దంపతులతో నిర్వహింప జేశారు .మా  దంపతులతోపాటు  సాయంత్రం శాంతికల్యాణానికి 11రోజులు ఒకరిద్దరు దంపతులు పాల్గొని మహద్భాగ్యం పొందారు

  2015లో 5 రోజులపాటు శ్రీ హనుమజ్జయన్తిని ఉదయ౦ హోమం,పుష్పయాగం ,మామిడి పళ్ళపూజ  ,సాయంత్రం కల్యాణం తో నిర్వహించాం .జయంతి రోజున నేను రాసిన సరసభారతిప్రచురించిన  201దర్శనీయ ఆంజనేయ దేవాలయ పుస్తకం ఆవిష్కరింప జేశాం .2016లో శ్రీ హనుమజ్జయంతిని ,నిత్య సాయం కల్యాణం తో 3 రోజులు జరిపాం .సరసభారతి కార్యక్రమాలు ఎక్కువభాగం ఆలయం లోనే జరుపుతాం  .ఆలయం లో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులు  ఆసక్తిగా ముందుకు వచ్చి అన్నివిధాలా సహకరి౦చి జయప్రదం చేస్తున్నారు .అర్చకస్వామి ఛి వేదాంతం మురళీ కృష్ణ నా శిష్యుడు .బాధ్యతగా అన్నీ నిర్వహిస్తూ భక్తులకు సంతృప్తి కలిగిస్తున్నాడు .2017ధనుర్మాసం లో ప్రభాత సీవ లో వెన్నపూస తో మూల విరాట్ కు అభిషేకం జరిపించి తర్వాత ప్రసాదంగా పంచి పెట్టి ,ప్రతియేడూ అలానే చేస్తున్నాం .

  శ్రీ సువర్చలాంజ నేయ స్వామిపై శతకం రాయి౦చాలన్న కోరిక నాకు ఉండేది .స్వామి అనుగ్రహం తో శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులు చేత ‘’శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకం ‘’,మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారిచే ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకం ‘’శ్రీ మంకు శ్రీనుగారిచే ‘’శ్రీ సువర్చలేశ్వర శతకం ‘’రాయించి, సరసభారతి తరఫున ముద్రించి  2017 ఫిబ్రవరి 5వ తేదీ మాఘశుద్ధ నవమి  ఆదివారం   ఉదయం ఆలయం లో సామూహిక పాలు పొంగింపుకార్యక్రమం చేసి , 9 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపి ఉదయం 11-30గంటలకు పై శతక త్రయాన్ని స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యుడు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరిమ్పజేసి,కవులకు తలొక 10వేలరూపాయలు ,పట్టుబట్టలు శాలువాలతో   సత్కరించి    కృతజ్ఞత తెలుపుకున్నాం  .మొదటిశతకం  లో  నూటపదహారు రూపాయలు ఆపైన ఇచ్చిన దాతల పేర్లు గోత్రనామాలతో ప్రచురించాం. రెండవ శతకం శ్రీ గోవిందరాజు శ్రీనివాస్ శ్రీ వేణుమాధవ్ సోదరులు తమ తండ్రిగారు స్వర్గీయ  గోవిందరాజు  పరబ్రహ్మానంద శర్మ గారి జ్ఞాపకార్ధం స్పాన్సర్లు గా ఉండటానికి ముందుకు వచ్చారు .మూడవదానిని మా దేవాలయమే ముద్రించింది .శతక త్రయాన్ని శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకే అ౦కితమిచ్చాం .అందరికి కమ్మని విందు భోజనం ఏర్పాటు చేసి సంతృప్తి చెందాం .భక్తుల తోడ్పాటు తో ఇన్ని కార్యక్రమాలు  ఆలయం లో నిర్వహిస్తున్నాము .వీటన్నిటికి శ్రీ సువర్చలాన్జనేయస్వాముల సంపూర్ణ కరుణా కటాక్షాలే మాకు రక్ష .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130

ఎయిత్ వండర్ Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -129 సువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా దారి తీరు -129

శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని  ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు రావిచెట్టుబజారు లో ,పుల్లేరు కాలువకు ఇవతల ఉన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ‘’గబ్బిట’’వారి దేవాలయంగా ప్రసిద్ధమైంది .సుమారు 300 ఏళ్ళక్రితం మా నాన్నగారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారి మాతామహులు అంటే మా నాయనమ్మ నాగమ్మగారి  తండ్రిగారు శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులుగారు ఇప్పుడు ఆలయం ఉన్న చోట స్వంత స్థలం లో స్వంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించి ,ఉత్సవ మూర్తులనూ,ధ్వజస్తంభ ప్రతిష్ట చేసి ,ధూప దీప నైవేద్యాలకు కొరత లేకుండా ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి శ్రీ ఆ౦జ నేయస్వామి పుట్టినరోజు ‘’శ్రీ హనుమజ్జయంతి ‘’తో పాటు శ్రీ సువర్చలాన్జనేయస్వాముల శాంతికల్యాణాన్నీ ఘనంగా నిర్వహించేవారు .ఆలయం లోనే ఈశాన్యభాగాన  రోడ్డుకు దగ్గరగా కళ్యాణ మంటపం ఉండేది .కోరిన రోరికలు తీర్చే దైవంగా అండా,దండా గా  స్వామి సుప్రసిద్దుడయ్యాడు .అర్చకస్వాములు కూడా అత్య౦త భక్తీ శ్రద్ధలతో స్వామి కైంకర్యం చేసి పునీతులయేవారు .నరసి౦హావధానులుగారి మరణానంతరం ,మా తండ్రిగారు ఆలయ ధర్మకర్త గా ఉండి, అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరిపించేవారు .ఐతే ఆలయంతూర్పు వైపుకు  బాగా ముందుకు ఉండి,వెనుక పడమర వైపు ఎక్కువ ఖాళీ ఉండటం వలన ,ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగేదికాదు. అయినా కల్యాణం ,హనుమజ్జయంతి ఘనంగానే జరిగేవి .ఈలోగా కాలక్రమంలో ఆలయానికి ముందున్న రోడ్డు ఎత్తు పెరగటం ,ఆలయం లోతుగా ఉండటం తో వర్షాకాలం లో నీరు అంతా ఆలయం లోనే ఉండిపోయి,లోపలి వెళ్లి దర్శనం చేయటం కూడా దుర్లభమైంది .నిజంగా చెప్పాలంటే ఆ బురద వాసన నీటిలో ఈదుతున్నట్లుగా  బట్టలు పైకి మడిచి ,వెళ్ళాల్సి వచ్చేది .దక్షిణ ప్రక్కన పందుల పెంపకం వాళ్ళు ఉండేవారు .కనుక ఆ పందులన్నీ ఆలయం లో బురద నీటిలో చేరి పిల్లాపాపలతో జుగుప్స కలిగించేవి .ఇదంతా భరిస్తూనే ఉన్నాం .పూజారులకు, మాకూ , భక్తులకు అందరికి  చెప్పలేని అసౌకర్యం కలిగేది .స్వామి ఎలా భరించాడో ఆశ్చర్యమేస్తుంది  .అయినా నిత్య ధూప దీప నైవేద్యాలు యధాప్రకారం జరిగేవి .గర్భాలయం ఇటుకలతో  సున్నం తో కట్టబడి, శిఖర,విమానాలు ఉన్నాయి .ముందుభాగం చిన్న తారసరాయి డాబా .దానికే ఘంట .కూర్చోటానికి నాపరాళ్ళు .నిర్మించి చాలాకాలం అవటంతో ఆలయగోడల రాళ్ళు ఊడిపోవటం, సున్నం రాలిపోవటం, కళ్యాణమండపం కూడా దెబ్బతినిపోవటం ,తో ఆలయం ఎప్పుడు కూలిపోతుందో అనే భయం ఏర్పడింది .1961లో మా తండ్రిగారి నిర్యాణం తర్వాత నేను వంశపారంపర్య ధర్మకర్తగా  బాధ్యతలు చేపట్టాను .జయంతి, కల్యాణం జరుపుతూనే ఉన్నాము .ఆలయం లోకి ప్రవేశించాలంటే భయపడే పరిస్థితి .రోజు రోజుకూ శిధిలమై పోవట౦ ,తాపీ మేస్త్రిని పెట్టి   ఏదో బొక్కలు పూడ్పిస్తూ కాలక్షేపం చేశాము .అదొక రకమైన నిస్సహాయ స్థితి .మా కుటుంబం ఒక్కరివల్లా అయ్యేపనికాదని పించింది .ఒకసారి ఉయ్యూరు విష్ణ్వాలయం లో అందరినీ సమావేశ పరచి ఆలయ దుస్థితి వివరించి సహకారం కోసం అర్ధించాము .కాని స్వామి అనుగ్రహం కలగలేదు . ఒకరూపాయి, రెండు రూపాయలు మాత్రమె చందాలు ఇచ్చారు.ఒకరిద్దరు దాతలు వందరూపాయలు ఇచ్చారు .ఇదంతా సుమారు ఏడెనిమిది వందలు అయి ఉంటుంది .నాకు అత్యంత ఆప్తుడు ,ఎల్ ఐసి ,సేవింగ్స్ నిర్వహించే ,నిఖార్సైన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ,ధర్మానికి, న్యాయానికి, నిజాయితీకి నిలబడే మా బజారులోనే రాజాగారి కోటదగ్గర స్వంత డాబాలో చిల్లర కొట్టు నడిపే   శ్రీ మండా వీరభద్రరావు  నాకు పూర్తి సహాయకారి .మా ఇద్దరి జాయంట్ అకౌంట్ లో ఆ డబ్బును స్టేట్ బాంక్ లో జమ చేశాము .నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతూనే ఉన్నాయి .అర్చకస్వాములు ఎప్పటికప్పుడు నన్ను కలిసి హెచ్చరిస్తూనే ఉన్నారు .స్వామిపై అచంచల విశ్వాసం భక్తులకు ఉండేది .తమ అనుభవాలను చెప్పుకొనేవారు కూడా .

                         నూతన ఆలయ నిర్మాణం

    భక్తరామ దాసు సినిమాలో మహా భక్తురాలు పోకల దమ్మక్క ‘’మన సీతారామ స్వామికి మంచి గడియలు  వచ్చేశాయి . ‘’అని పాడినట్లు ,మా ఆలయానికీ మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నాం .పదేళ్ళ తర్వాత ఆలయానికి ముందున్న రోడ్డుకు దక్షిణాన  పుల్లేరుకాలువ పై వంతెన నిర్మించారు .అప్పుడు నాకూ మా కుటుంబ సభ్యులకు ,శ్రేయోభిలాషులకు ,గ్రామస్తులకు బలీయమైన ఆలోచనకలిగి ,స్వామి అనుగ్రహం తోడై ,ఒక కమిటీ ఏర్పడి నూతన ఆలయం నిర్మించాలన్న దృఢ మైన సంకల్పం కలిగింది .ఈ సారి స్వామి అందరి మనసులలో స్థిరంగా కూర్చున్నాడేమో ఇప్పుడు ఎవరిని  అడిగినా 1,116రూపాయలు కు తక్కువ చందా ఇవ్వలేదు. అప్పుడు మా మనసు కుదుట బడింది .నాకూ వీరభద్రరావు కు ఉయ్యూరు ఎలేక్త్రిసిటి  డిపార్ట్మెంట్ లో లైన్ మాన్ చేసిన మహా  హనుమ భక్తుడు శ్రీలంకా  సంజీవరావుగారి సహకారం లభించింది ..

           మహా భారతం లో అర్జునుని ధర్మ సంకటం లో నేను

   రసీదు పుస్తకాలు అచ్చు వేయించాము .డబ్బు ఇచ్చినవారికి రసీదులిస్తున్నాము .మేముముగ్గురం కాలికి బలపం కట్టుకొని నేను లూనామీద ,వాళ్ళిద్దరూ వీరభద్రరావు టివిఎస్ మీద ఉయ్యూరులో చుట్టుప్రక్కల గ్రామాలలో కరపత్రాలు పంచుతూ ,ఇచ్చినడబ్బుకు రసీదులిస్తూ  సమకూరిన ధనాన్ని స్టేట్ బాంక్ లో మళ్ళీ నాపేర వీరభద్రరావు పేరా ఇద్దరి జాయింట్  అకౌంట్ లో జమ చేస్తున్నాము .కొంతవరకు ఆశా జనకంగా పనులు మొదలు పెట్టటానికి తగిన ధనం చేకూరింది .మా కుటుంబం తరఫున 10 వేల రూపాయలు అందజేశాను .

   నూతన ఆలయం నిర్మించాలి అంటే పాతఆలయాన్ని కూల్చాలి .ఆస్వామిని వేరొక చోట తాత్కాలికంగా పెట్టి నిత్యదూప దీప నైవేద్యాలు కలిగించాలి అని పూజారులు చెప్పారు .సరే అని పూజారి శ్రీ వేదాంతం వాసుదేవాచార్యులు గారి సలహాతో మేము నలుగురం బందరు వెళ్లి ఆలయ శాస్త్రంలో ఘనాపాటి ,ఆయుర్వేద వైద్యం లో మేటి ,ఇంట్లో శ్రీ హయగ్రీవ ఉపాసనతో ఎందరెందరికో జబ్బులు నయం చేసిన జ్యోతిష్ శాస్త్రవేత్త ,పంచాంగ కర్త శ్రీమాన్ వేదాంతం అనంత పద్మనాభాచార్యులవారిని దర్శించి మంచి  ముహూర్తం పెట్టమని కోరాం.వారు మేము చెప్పినదంతా ఆలకించి ,తాము ఒకసారి ఆలయం సందర్శించి వచ్చి ముహూర్తం పెడతానన్నారు .సరే అని వారికి కారు ఏర్పాటు చేసి రప్పించి ఆలయం అంతా చూపించాం .వారు కొలతలుకొలుచుకొని వెళ్లి ,పాత ఆలయం తీసేయటానికి ,నైరుతిపెరగకుండా నూతన ఆలయ నిర్మాణానికి సుమూహుర్తం పెట్టారు వారిని యధాశక్తి సత్కరించి ముహూర్త పత్రాలు తెచ్చుకోన్నాము .

  ఇంతవరకు బాగానే ఉంది .పనులలో నేను పాల్గొంటున్నాకాని ,మనసులో ఏదో బాధగా ఉంది .పాత ఆలయం కూల్చే ముహూర్తానికి సుమారు రెండు నెలలక్రితమే మా అన్నయ్యగారి అబ్బాయి చి.రామనాధ బాబు కు మద్రాస్ లో  ఉండేమా పెద్దక్కయ్య బావలు శ్రీమతి గాడేపల్లి లోపాముద్ర శ్రీ కృపానిధి దంపతుల  రెండవకుమార్తె చి.ల.సౌ .జయలక్ష్మి నిచ్చి ఉయ్యూరులోనే వివాహం జరిపించాం.మా అన్నగారు రామనాథ్ నెలపిల్లాడప్పుడే నేచనిపోవటం చేత ,మా అమ్మానాన్న ఆకుటుంబాన్ని  వాడినీ వాడి అక్క శ్రీమతి వేదవల్లిని పెంచి పెద్ద చేశారు .అంతా ఉమ్మడి కుటుంబమే.కనుక  మానాన్నగారు మరణించారుకనుక వేదవల్లి పెళ్లి ,వీడి పెళ్లి  మా దంపతులు పీటలమీద కూర్చుని వివాహం చేశాం .కనుక నాకు ఒక ధర్మ సందేహం పీడిస్తోంది .పెళ్లి జరిగి కనీసం ఆరునెలలు కాలేదు ఇప్పుడు ఆలయం కూల్చటం బాగుంటుందా ?మనసుకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాను .గుంజాటన పడ్డాను .ముహూర్తం పెట్టించుకొచ్చిన మర్నాడు ఉదయమే వీరభద్రరావు దగ్గరకు వెళ్లి పాత ఆలయం కూల్చటానికి మనసు ఒప్పటంలేదని ,కొత్త ఆలయం నిర్మాణం మనవల్లకాదని కనుక ఇంతటితో పనులు ఆపేద్దాం అని అర్జున విషాద యోగం చూపించాను .అతడు చాలా తాపీగా  నాకు అన్ని విధాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు .అయినా నా మొండి పట్టు వదలలేదు .చివరికి ‘’మాస్టారూ !మీ కుటుంబం లో మీరు తప్ప ఇంకెవరూ ఈ పనికి పూనుకోరు .పూనుకోలేరు .మీ వల్లనే కొత్తాలయ నిర్మాణం సాధ్యం .స్వామి మనకు మంచి దారి చూపించాడు .ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చి ఇప్పుడు ఇలా కాడి పారెయ్యకండి .మేమంతా మీ వెనుక ఉంటాం .కష్ట నష్టాలు భరిద్దాం .మంచి అవకాశం ,ఇక వెంక అడుగు వేయకండి .’’అని చెప్పాక మనసుకుదుటబడి   పొంగినహనుమ లాగా సంతోషంతో ఆలయ నిర్మాణ పూనిక నిశ్చయంతో ఇంటికి తిరిగి వచ్చాను . అంతే మళ్ళీ వెనకడుగు వేయనే లేదు అన్నీ యధాప్రకారం స్వామి అనుగ్రహంతో చకచకా పనులు జరిగిపోయాయి .

   ఆలయ నిర్మాణ పర్యవేక్షణ భావన నిర్మాణం లో అనుభవమున్న ,భక్తులు శ్రీ కొల్లి సుబ్బారావు గారికి అప్పగించాం .తమాషా ఏమిటి అంటే తాపీ మేస్త్రి ముస్లిం .అతడే మిగిలినవారి తోడ్పాటుతో కూలీలతో పాత ఆలయాన్ని తీసేశాడు .కొత్తదికట్టాడు . స్వామిని విష్ణ్వాలయం లో పంచపట్టాభి రామస్వామి సన్నిధిలో ఉంచి ,అర్చకస్వామి వేదాంతం రామా చార్యులవారికి ధూప దీప నైవేద్యాల బాధ్యత అప్పగించాం .ఆయన అంతేశ్రద్ధగా నిర్వహించారు .ఆలయ ప్లాన్ కూడా సుబ్బారావు గారిదే .కొందరు జియ్యర్ స్వామిని ,మరికొందరు వేరొక స్వామీజీ ని తీసుకొచ్చి చూపిస్తే మంచిది అని సలహా ఇచ్చారు .మేము  వాటిని పెడ చేవినపెట్టి సుబ్బారావుగారికే పూర్తి స్వేచ్ఛ  ఇచ్చి ఆలయ నిర్మాణం చేయించాం . మరికొంతమంది కొత్తగుడి కడుతున్నారుకదా స్వామి విగ్రహం కూడా కొత్తది చేయించి  పెడితే బాగుంటుంది అన్నారు .నేను ససేమిరా అని ‘’ఈ స్వామి పై మనకు అపారమైన విశ్వాసం ఉంది .ఆయన మనలో ప్రవేశించకపోతే ఇంతటి పని మనవల్ల అయ్యేదికాదు .కనుక ఆస్వామినే పునః ప్రతిస్టిద్దాం.రెండోమాటలేదు  ‘’అని తెగేసి చెప్పిఅలానే పూర్వపు అడుగున్నర  నల్లరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్నే పునః ప్రతిష్టించే ఏర్పాటు చేశాము .తెనాలి వెళ్లి విగ్రహ నిర్మాణ నిపుణులైన శ్రీ  అక్కల కోటయ్య గారిని కలిసి ఉత్సవ విగ్రహాలకు  కిరీటాలకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం .కనుక కల్యాణానికీ ఇబ్బంది లేదు .ముందుజాగ్రత్తగా ఆలయాన్ని రోడ్డులెవెల్ కన్నా దాదాపు మూడు గజాల ఎత్తున నిర్మించాం .గర్భాలయం తో పాటు అంతరాలయమూ ఏర్పాటు చేసి ,దానితర్వాత కూర్చోవటానికి హాలు నిర్మించాము. దీనికి గ్రిల్ ను  మా అమ్మగారి బాల్య స్నేహితురాలు  శ్రీమతి చోడవరపు అమ్మన్నగారిపేరిట కుమారులు ఏర్పాటు చేయించారు .

  స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర నిజ  జ్యేష్ట నవమి గురువారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరా౦శ  యందు 23-6-1988 న శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ  విధానం లో ఆలయ నిర్మాణ ప్రతిస్టాదికాలలో నిష్ణాతులు శ్రీమాన్  వేదాంతం శ్రీ రామాచార్యుల వారి ఆధ్వర్యం లో నేనూ ,నా ధర్మపత్ని శ్రీమతి ప్రభావతి శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశాము .ఆ నాటి కెసీపి ప్లాంట్ మేనేజర్ ,మహా భక్తులు సౌజన్య శీలి శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు ,శాసన సభ్యులు శ్రీ అన్నే బాబూ రాగారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు  .ఆలయ నిర్మాణం లో అన్ని రకాల సహకారాలు అందించిన కెసీపి వారి వదాన్యత ,ఉయ్యూరు ,పరిసర గ్రామస్తుల దాతృత్వం ,సహాయ సహకారాలు మర్చిపోలేనివి . ఉయ్యూరులోని ఊర ,పువ్వాడ ,వెంట్రప్రగడ ,మండా ,వాగిచర్ల ,చోడవరపు మొదలైన కుటుంబాలవారు ,వారూ వీరూ అని ఏమిటి  సమస్తజనం ఇది తమ ఇంటి శుభాకార్యంగా భావించి,పెద్దమనసుతో ఈ పవిత్ర భగవత్ కార్యానికి  అండగా నిలిచి చేయూత నిచ్చారు .ఉత్స విగ్రహాలతో ఆలయం శోభాయమానం అయింది . లారీతో ఇసుక ఉచితంగా కొందరుభక్తులు తోలిస్తే ,కొందరు సిమెంట్ బస్తాలు అందజేశారు .స్వామిపై ఉన్న అచంచల విశ్వాసమే  భక్తీ తాత్పర్యాలే మా అందరి చేత ఇంతటి బృహత్కార్యక్రమాన్ని చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనంతో ,సేవలతో సహకరించారు .

  ఆలయ నిర్మాణ సమయం లో నేను జగ్గయ్యపేట దగ్గర వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది పని చేస్తున్నాను .ప్రతివారం ఉయ్యూరు రావటం నిర్మాణ వ్యవహారాలను చూడటం ,అవసరమైన డబ్బు బాంక్ నుంచి తీసి ఇవ్వటం బండీలమీద మేముముగ్గురం చందాలకు తిరిగి పోగు చేయటం  మళ్ళీ  సోమవారం ఉదయం డ్యూటీకి వత్సవాయి వెళ్ళటం జరిగేది .నేను ఇక్కడ లేకపోయినాపూర్తిబాధ్యత తీసుకొని స్వర్గీయమండా వీరభద్రరావు  స్వర్గీయ లంకా సంజీవరావు గారు పనులన్నీ సక్రమంగా జరిగేట్లు చేశారు .ఆలయ నిర్మాణానికి సుమారు సంవత్సర కాలం పట్టింది . భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది .స్వామిపై విశ్వాసం  పది రెట్లు పెరిగింది .శ్రీ వాగి చర్ల నాగేశ్వరరావు గారు గర్భాలయం లో ఖరీదైన మంచి టైల్స్ వేయించారు .బయట హాలులో మార్బుల్స్ పరిపించారుశ్రీ బూరగడ్డ కృష్ణమోహన్ .శ్రీ ఊర మోహనరావు స్వామికి వెండి తొడుగు చేయించారు .తర్వాత అర్చకులు శ్రీ వేదాంతం లక్ష్మణ దీక్షితుల సహాయం తో ఉస్ట్ర వాహనాన్ని తెనాలి అక్కలవారితో చేయించి తెచ్చాం .తమకోరికలు నేరవేరుస్తున్నందుకు స్వామివార్లకు ఏదో ఓకే రకమైన ఆభారణమో,అవసరమైన స్టీలు ,వెండి సామగ్రియో సమకూరుస్తున్నారు .ఎస్ టి వో ఆఫీస్ లో పని చేసే ఒక అటెండర్ పంచ పట్టాభి రామ స్వాముల సిమెంట్ విగ్రహాలు కొని తెచ్చి సమర్పించాడు .దీనితో శ్రీరామనవమినాడు సీతారామ  కల్యాణం కూడా చేసే వీలుకలిగింది .ఇవి కొంత దెబ్బతింటే బిటెక్ చదివి ,ఉద్యోగిస్తున్న అప్పటికుమారి ఇప్పటి శ్రీమతి గుర్రాల శ్రీదేవి నాలు గేళ్ళక్రితం కొత్త విగ్రహాలు కొని అందించింది .శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు ,ఆయన కుమారుడు కళ్యాణ్ కుటుంబం చిన్న వెండి  ఆంజనేయస్వామిని  తయారు చేయించి సమర్పించారు .కుమారి బిందు దత్తశ్రీ ప్రయాగలో భగవద్గీతా పఠనం లో పాల్గొని సేవ చేసినందుకుశ్రీ గణపతి సచ్చిదాన౦ద స్వామి అనుగ్రహం తో బహూకరించిన వెండి శ్రీ కృష్ణ విగ్రహాన్ని తలిదండ్రులు శ్రీమాదిరాజు శ్రీనివాస శర్మ, శ్రీమతి శివ లక్ష్మి దంపతులు మన ఆలయానికి భక్తితో సమర్పించారు .ఇలా ఎందరో భక్తులు తమకానుకలతోస్వామి అనుగ్రహం పొందుతున్నారు .

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దేవదాస్ కనకాల కన్నుమూత:

దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం By Santhosh Kumar Bojja| Updated: Friday, August 2, 2019, 17:50 [IST] యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. యానం సమీపంలోని కనకాల పేటలో జననం 1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమారంగం వైపు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు ఎందరికో శిక్షణ నటీనటులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. దేవదాస్ కనకాల కుటుంబం దేవదాస్ కనకాల 1971లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే . వీరికి కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ ఉన్నారు. రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ వివాహం యాంకర్ సుమను పెళ్లాడారు. More RAJEEV

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

కవయిత్రి ,నవలా రచయిత, అమృతా ప్రీతం పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది .1919 ఆగస్ట్ 31నలో ఆ నాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో అమృత కౌర్ జన్మించింది .తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ సింగ్ హిత్కారి స్కూల్ టీచర్,పత్రికా సంపాదకుడు ,సిఖ్ మత ప్రచారకుడు .11 యేళ్లకే తల్లి చనిపోతే తండ్రి తోపాటు లాహోర్ చేరి,1947లో జరిగిన దేశ విభజన దాకా అక్కడే ఉన్నది .ఆ సమయం లోనే ‘’అమృత్ లేహ్రాన్ ‘’(అమృత తరంగాలు )కవిత 1936లో 16 వ యేటనే రాసి ప్రచురించింది .ఆ వయసులోనే ప్రీతం సింగ్ అనే సంపాదకుని వివాహం చేసుకొని అమృతా ప్రీతంగా పేరు మార్చు కొన్నది. 1936-43 మధ్యకాలం లో అమృత ఆరు కవితా సంపుటాలు రచించి వెలువరించింది .

రొమాంటిక్ కవితలతో ప్రారంభించి, తర్వాత అభ్యుదయవాద కవిత్వం రాయటం మొదలుపెట్టింది .1943లో వచ్చిన ఘోరమైన బెంగాల్ కరువు కు స్పందించి 1944లో ఆమె వెలువరించిన ‘’లోక్ పీడ్’’ (ప్రజా వేదన )కవిత సంపుటిలో స్పష్టంగా ఈ మార్పు కనిపిస్తుంది .అభ్యుదయవాద కవిత్వోద్యమంలో అమృత పాలుపంచుకొన్నదికూడా .విభజనకుపూర్వం లాహోర్ రేడియో స్టేషన్ లో కొంతకాలం పని చేసింది .దేశ విభజన తర్వాత దంపతులు ఢిల్లీచేరి సాంఘిక సేవాకార్యక్రమాలలోనూ పాల్గొని గురు రాధ కృష్ణ నెలకొల్పి,బాలరాజ్ సహానీ ,అరుణా ఆసఫాలీ లు ఆవిష్కరించిన నమొట్టమొదటి జనతా గ్రంథాలయం కార్యక్రమంలో చురుకైన పాత్ర వహించింది .ఇప్పటికీ ఈ లైబ్రరీ క్లాక్ టవర్ ప్రాంతం లో ఉండి,,ప్రజలకు అందుబాటులో ఉంది.నటుడు ,దర్శకుడు ,దేశ విభజనపై ‘’గరం హవా ‘’సినిమా తీసిన ఎం. యెస్. సత్యు అమృతా ప్రీతం నటన కవిత్వాలకు నివాళి ఆర్పిస్తూ ‘’ఏక్ ధీ అమృతా ‘’అని ప్రశంసించాడు .

1947లో జరిగిన దేశ విభజన తర్వాత 1948 లో లాహోర్ వదలి పంజాబీ శరణార్థి గా 28వ యేట గర్భవతిగా ఉన్న అమృతా ప్రీతం , కొడుకుతో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి చేరింది .తన ప్రయాణ బాధలను, వేలాది శరణార్థుల కస్టాలను కళ్ళకు కట్టినట్లు ఒక కాగితంపై ‘’అజ్జ్ అఖాన్ వారిస్ షాహ్ ను ‘’(వారిష్ షా ను ఇవాళ అడుగుతున్నా )కవిత రాసింది . .ఈ కవితను 16 వ శతాబ్దపు ప్రముఖ పంజాబీ సూఫీ కవి,’’హీర్ అండ్ రంజా ‘’ అనే విషాద కావ్య నిర్మాత ,లాహోర్ లో తన ఆరాధ్య కవి అయిన వారిష్ షా ను ఉద్దేశించి స్మారక కవిత గా (ఎలిజీ) గా రాసింది .

అమృత 1961వరకు ఢిల్లీ ఆకాశ వాణిలో పని చేసింది .1960 లో భర్తతో విడాకులు తీసుకొన్నతర్వాత స్త్రీవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది .ఆమె కవితలలో కధలలో తన విఫల దాంపత్య జీవితాన్నే చిత్రించింది .పంజాబీ ,ఉర్దు భాషలలొ రాసిన ఆమె రచనలన్నీ ఇంగ్లీష్, ఫ్రెంచ్, డేనిష్ ,జపనీస్ ,మండారిన్ మొదలైన వివిధ భాషలలోకి అనువాదం పొంది విశ్వ వ్యాప్తమై ఘన కీర్తి పొందాయి .ఆమె స్వీయ చరిత్ర ‘’బ్లాక్ రోజ్ ,‘’రసీదీ టికెట్ (రెవెన్యూ స్టాంప్ )రచనలు కూడా అనువదింపబడి ఆమె ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి అయింది .ఆమె నవల ‘’ధర్తి సాగర్ తే సిప్పియాన్ ‘’ను ‘’కాదంబరి ‘’సినిమాగా 1965లో మొదటగా తెర కెక్కించారు .తర్వాత ‘’ఉనాహ్ కి కహానీ ‘’ని ప్రముఖ దర్శకుడు బాసు భట్టాచార్య ‘’డాకూ’’ (బందిపోటు )గా తీశారు . ఆమె రాసిన ‘’పింజర్ ‘’(ఆస్తి పంజరం )నవలలో పార్టిషన్ సమయంలో ఇండియా ,పాకిస్తాన్ లలో జరిగిన ఘోరాలు అవమానాలు దౌర్జన్యాలు ,స్త్రీలు పడిన అంతులేని బాధలు చిత్రించింది .ఇందులో ‘’ప్యూరో ‘’అనే పాత్ర స్త్రీలపై చేసిన దుష్కృత్యాలకు ,,హింసకు ప్రతినిధి గా మలచింది .దీన్ని చంద్ర ప్రకాష్ ద్వివేది చలన చిత్రంగా అద్భుతంగా తీయగా అందులోని మానవత్వ విలువలకు ఈ సినిమా అవార్డ్ పొందింది .రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలైన రాజస్థాన్ ,పంజాబ్ లలో దీన్ని చిత్రించారు .ఆమె ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలలోనూ అభిమాన రచయిత్రిగా గౌరవం పొందింది .పాకిస్తాన్ లో తన సమకాలీన రచయితలైన మోహన్ సింగ్, శివకుమార్ బటాల్డి లతో సమమైన కీర్తి, గౌరవాలు అందుకొన్నది .ఆమె కూడా అలాగే రెండు దేశాలమీద అభిమానం చూపింది .

‘’నాగమణి ‘’అనే పంజాబీ మాసపత్రిక సంపాదకురాలుగా అమృతా ప్రీతం 33 యేళ్ల సుదీర్ఘకాలం పని చేసింది .ఇండియా వచ్చాక హిందీలోనూ రాయటం ప్రారంభించింది .తర్వాత ఆమె ఓషో బావ లహరికి దగ్గరై ‘’ఏక్ ఓంకార్ సత్నామ్ ‘’వంటి అనేక రచనలు చేసింది .ఆధ్యాత్మిక పుస్తకాలుగా ‘’కాల్ చేతన ‘’అజ్నాత కా నిమంత్రణ్’’మొదలైనవి రచించింది .తన జీవిత చరిత్ర మూడోభాగ౦ గా ‘’అక్షరోమ్ కె సయీ ‘’(మాటల నీడలు )రాసింది .

సాహిత్య కృషికి తగిన పురస్కారాలు ప్రీతం అందుకొన్నది .మొదటగా ‘’పంజాబ్ రత్తన్ అవార్డ్ ‘’ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతులమీదుగా అందుకొన్నది .1956లో’’సునేహాదే ‘’(సందేశాలు )రచనకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని మొట్టమొదటి మహిళా రచియితగా రికార్డ్ సృష్టించింది .’’కాగజ్ తే కాన్వాస్ ‘’రచనకు భారతీయ జ్ణానపీఠ్ అవార్డ్ కూడా ఆమెను వరించి కీర్తిని మరింత ఇనుమడింపజేసింది .భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ ,తర్వాత పద్మ విభూషణ్ పురస్కారాలు అందించి గౌరవించింది .2004లో సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ,ఢిల్లీ యూని వర్శిటీ,విశ్వభారతి ,జైపూర్ యూని వర్శిటీ ల నుండి గౌరవ డి.లిట్.అందుకొన్న మహిళా మణి అమృతా ప్రీతం .

అంతర్జాతీయ అవార్డ్ లుకూడా అందుకొన్నది .బల్గేరియా ప్రభుత్వం ‘’వాప్సరోవ్ ‘’అవార్డ్ ను 19 79 లో, 19 87 లో ఫ్రెంచ్ ప్రభుత్వం ‘’డిగ్రీ ఆఫ్ ఆఫీసర్స్ డెన్స్ ‘’అవార్డ్ ,అందజేశాయి .భారతప్రభుత్వం ఆమెను రాజ్య సభకు నామినేట్ చేయగా 1986 నుండి 92 వరకు ప్రజా సేవ చేసింది .జీవిత చరమాంక౦ లో ఆమెకు పాకిస్తాన్ లోని పంజాబ్ అకాడెమీ ఆమెకు అవార్డ్ ఇచ్చింది దీనిపై స్పందిస్తూ ఆమె ‘’నా మాతృదేశం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు నన్ను గుర్తించింది ‘’అన్నది .పాకిస్తాన్ సిక్కు సమాజం ఆమెకు ప్రముఖ సూఫీ కవి వారిస్ షా , బుల్లే షా ,సుల్తాన్ బాహూ ల సమాధులపై కప్పే పవిత్ర వస్త్రాలను ఆమెకు పంపారు .

భర్తనుంచి విడిపోయాక అమృతా ప్రీతం ఒంటరితనం బాధ అనుభవించి ,ప్రముఖ కళాకారుడు రచయిత ఇమ్రోజ్ కు దగ్గరై , చివరి నలభైయేళ్లు అతనితో కలిసి జీవించింది .అతనే ఆమె పుస్తకాల డిజైనర్ .ఆమె రచనలను పెయింటింగ్స్ గా చిత్రించాడు .వీరిద్దరి ప్రేమ జీవిత చిత్రణ గా ’’అమృతా ఇమ్రోజ్ ఎ లవ్ స్టోరీ ‘’పుస్తకం రాసింది .86 యేళ్ళ వయసులో తొలి పంజాబీ రచయిత్రి పద్మ విభూషణ్ శ్రీమతి అమృతా ప్రీతం శాశ్వత కీర్తి గడించి మరణించి అమృతత్వాన్ని పొందింది .

అమృతా ప్రీతం రచించిన కవితలను ప్రసిద్ధ హిందీ సినీ పాటల రచయిత గుల్జార్ తన గొంతుతో అద్భుతంగా గానం చేసి రికార్డ్ చేసి 2007 లో విడుదల చేశాడు .60 యేళ్ళ సుదీర్ఘకాలం రచయిత్రిగా రాణించిన అమృతాప్రీతం 28 నవలలు ,18 జీవిత చరిత్రలు ,అయిదు కధా సంపుటాలు,16 ఇతర రచనలు రచించింది .

image.png

-గబ్బిట  దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .అయితే నాకు బాగా ఇష్టుడైన రచయిత ఆచార్య ఎస్వి జోగారావు గారు పట్టిన ‘’నీరాజనం ‘’లో అన్ని విషయాల్లు ఉన్నందున ,’’ఏది తెలిస్తే సకలం తెలుస్తుంది ‘’అన్న ఉపనిషత్ వాక్యం పై నమ్మికగా ,దానిలోని ముఖ్యవిషయాలతో సాహితీ బంధువులకు, ఈ తరం పాఠకులకు శ్రీవారి శేముషిని తెలియ జేస్తున్నాను .

  ‘’పువ్వాడ వారి రచనలు ప్రాచీన ,అధునాతన రీతుల సమ్మేళనం .సంప్రదాయం ,నవ్యత్వాల సమన్వయము .సంస్కృతాంధ్ర పదాల పోహళింపు తో వారి పద్యాలు మధుర గంభీర ప్రసన్న ధారా విలసితాలు. కవితా శైలి లాలిత్య ,ప్రౌఢ గుణ శోభిత౦గా  ,వైదర్భీ రీతితో సహృదయ రంజకాలుగా ఉంటాయి .కవిత ,పాలవెల్లి ,శతపత్రం ఖండికలు ,గోవత్సం ,తాజమహలు ,దారా ఖండకావ్యాలు ఆకాశవాణి ద్వారా విస్తృత ప్రచారం పొందాయి .రాసిన 15 నాటికలలో 9మాత్రమె ముద్రితాలు .వ్యాస సంపుటులుగా ఏరువాక ,మధుకలశం ,ఆంద్ర తేజం మొదలైనవి ఆయన శేముషికి నిదర్శనాలు . ముఖ్యంగా చారిత్రిక వస్తువులను తీసుకొని కవిత రూపకం నవలలు గా రసరమ్య శైలిలో మలచారు .వీరికి అత్యంత అభిమాని సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణ దేవరాయలు .ఆయనపై ప్రచారం లో ఉన్న గాథలకు అక్షర రూపమిచ్చి ‘’ఔరా !,ఎవరు ? చారిత్రిక నవలలు అల్లారు .ఆంద్ర సామ్రాజ్యం రాయలనాటి చారిత్రిక విషయమైన పద్యకావ్యం .రాయలనేకాదు,మహామంత్రి తిమ్మరుసు వ్యక్తిత్వాలను ఉదాత్తంగా  వర్ణించి  శోభ కూర్చారు .పాలవెల్లిలోని ‘’ఆంద్ర భోజ ‘’,ఆంద్ర తేజం లోని ‘’రాయలు –తిమ్మరుసు ‘’కూడా విజయనగర సామ్రాజ్య గాథలే .ప్రతాప రుద్రమదేవి కాకతీయ వీరుల ,సహపంక్తి పల్నాటి వీరుల చారిత్రిక నాటికలే .కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత తెలంగాణాలో జరిగిన సంఘటనలకు స్పందించి ‘’రక్త తర్పణం ‘’బుర్రకథ’రాశారు .ఇందులో వారి పరిశోదనా దృష్టి గోచరమౌతుంది .పువ్వాడ వారి విమర్శ వివేకానికి అద్దంపట్టేవి తిక్కన ,శ్రీనాధ ,పోతనలపై వ్యాసాలు .

 ‘’  దేశ భక్తి పులకా౦కితులై జాతీయ నాయకులైన లాలాలజపతి రాయ్ మహాత్మా గాంధీ మున్నగు వారిపై ప్రశంసా కవితలు కూర్చి మూర్తీభవించిన తమ జాతీయాభిమానాన్ని చాటారు .’’గోవత్సం ‘’కరుణ రస స్వతంత్ర కావ్యం .భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీక .ధర్మం నాలుగుపాదాలతో వర్ధిల్లాలి అన్నట్లుగా నాలుగు భాగాలుగా విజ్ఞతత తో రాశారు .విభాగ శీర్షికలలో  ప్రజ్ఞ కనబరచి, కృతులకు సౌస్టవాకృతి కూర్చారు .’’దారా ‘’కావ్యం అయిదుఖందాలు గా రాయటం లో నాయకుని పంచప్రాణాలు ప్రకృతిలో విలీనం కావటాన్ని సూచిస్తుంది .అలాగే ‘’ఆంద్ర సామ్రాజ్యం ‘’లో అయిదు సర్గలు –రాజాజ్న,అసిధార ,ధర్మ సూచీ ,ఉపదేశం ,అభిషేకం ఈ దృష్టి నే సూచిస్తాయి .కావ్యం అసంపూర్ణమే అయినా రాయల పట్టాభి షేకం తో ముగిసి సమగ్రరూపం పొందింది .లాక్షణికుల పంచ సందుల సూత్రాన్ని ఒడిసిపట్టుకొని రాశారు .చోడవరపు జానకి రామయ్యగారితో కలిసి అల్లిన ‘’కవిత ‘’సంపుటి లో శీర్షికలు తొలిచూపు ,మలిచూపు,తుది చూపు అర్ధవంతాలై ప్రత్యేకత కనపరుస్తాయి .

 ‘’ జాతీయాభిమానం పుష్కలంగా ఉన్న పువ్వాడవారు సంకుచిత మనస్కులు కారు .మొఘల్ సామ్రాజ్య షాజహాన్ ,దారా ల కరుణ గాథను కళ్ళకు కట్టించారు .వీరి తాజమహల్ ,దారా కావ్యాలను జంటకావ్యాలనవచ్చు ,జాషువాగారి ‘’ముంతాజమహల్’’తర్వాత అంతటి  ప్రాచుర్యం పొందింది పువ్వాడవారి ‘’తాజమహల్ ‘’.జాషువా గారి ‘’రాణి విడచిపోయె రాజు నొంటరి జేసి-రాజు విడిచిపోయె రాజ్యరమను –రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర-తాజీ విడువ లేదు రాజసంబు ‘’అనే చివరిపద్య భావానికి , పువ్వాడ వారి –‘’మొగలు ప్రభుత య౦తర్హితమగుట కేమి –చందురుని చల్వతో తాజి చలువ   నిలుచు –కాలవాహిని తాజి మ్రింగగలనాడు –నిలుచు నీ తాజిప్రణయ సందేశగీతి ‘’పొడిగింపుగా ఉందన్నారు ఆచార్య ఎస్వీ .జాతీయ సమైక్యతకు ప్రాతినిధ్య మైన పువ్వాడ వారి గోవత్సం,తాజమహల్ ,దారా లు కరుణ రస పోషణలో ఆయన వైదగ్ధ్యాన్ని ఎలుగెత్తి చాటాయి అని ఎస్టిమేట్ చేశారు .

‘’  బందరులో 40 ఏళ్ళు గడిపిన శేషగిరిరావుగారికి బందరు అంటే పంచప్రాణాలు ,వీరాభిమానం ‘’రస ప్రబుద్ధులకు స్వస్థాన వేషభాషలు సహజాలంకారం ‘’అన్నాడట ఆదికవి నన్నయ .అలాగే రావు గారు బందరుపై ‘’  బృందావనం’’శీర్షికతో కోపల్లె హనుమంతరావు ,పట్టాభి సీతారామయ్య ,ముట్నూరి కృష్ణారావు ప్రభ్రుతుల పై ప్రశంసా పద్య లహరి పారించారు .బందరును సాహితీ సుక్షేత్రంగా మలచిన కవితా గురుపీఠాలైనచెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి ,పింగళి లక్ష్మీకాంతం ల పైనా ఆరాధనాభావ పద్య సుమమాలలల్లారు .విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో తన నాటికా ప్రసారానికికి ప్రోత్సహించిన శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారిని విశిష్టంగా స్మరిస్తూ ‘’సహపంక్తి ‘’రూపకాన్ని అంకితమిచ్చారు .

‘’సృష్టిలో కాని ,విమర్శలోకాని ఏదైనా  వైశిష్ట్యం లేకపోతె రచయితకు కలం పట్టవలసిన పని లేదు ‘’అని పువ్వాడ వారిసిద్ధాంతం.

‘’నీ జగన్నాధ పండితరాయలె షాజహాన్ ఆస్థానకవిమణి,నీ శిల్ప చాతుర్యమే ముంతాజ్ వెండి  కుంకుమ బరిణ,నీ అమరావతీ అఖిల విద్యలే ఖండఖండా౦తరాక్రాంత కళలు ,నీ త్యాగరాజ వాణి మరందమే దక్షిణ దేశ సంతర్పణ –

‘’భారతీయుల సంస్కృతి ప్రాభవమున –నాడు నేడును ,నీవాడు నాణె గాడు

నాడు మరువకు ,నేడు వెన్కాడ బోకు –  రమ్ము రమ్మాంధ్ర  కొమ్ము నీరాజనమ్ము ‘’అని తెలుగు దేశానికి నీరాజనం పలికి ,తెలుగువారిని ఎలుగెత్తి పిలిచారు కవిపాదుషా.’’

 ఇంతవరకు చెప్పినది అంతా శ్రీ ఎస్వి జోగారావుగారి గారు చెప్పిందే .నేను  పుస్తకం ,ఆయన సాహిత్య వ్యక్తిత్వాలన్నీ చదివి  రాయాల్సిన పెద్దపని ఆచార్యశ్రీ వ్యాసం తప్పించింది .వారికి నమోవాకాలు .

  ఇవికాక కొన్ని విషయాలు .కృష్ణాజిల్లా మొవ్వలో శేషగిరిరావుగారు 12-7-1906లో శ్రీమతి అన్నపూర్ణమ్మ ,శ్రీ సుందరరామయ్య దంపతులకు జన్మించారు .స్వయం కృషితో ఉభయభాషా ప్రవీణ ,పిఒఎల్ పట్టాలు పొందారు .విజయవాడలో 1928నుంచి 34వరకు ,6ఏళ్ళు ,బందరుహిందూ హైస్కూల్ లో 1934నుంచి -35వరకు తెలుగుపండితులుగా 1 ఏడాది ,ఉద్యోగించి ,బందరు హిందూ కళాశాలలో 1935నుంచి 47వరకు 12ఏళ్ళు ,విజయనగరం మహారాజా కాలేజిలో 1947నుంచి 51 వరకు 4ఏళ్ళు,మచిలీ పట్నం ఆంద్ర జాతీయ కళాశాలలో 1951నుంచి 70వరకు 19ఏళ్ళు  ఆంధ్రోపన్యాసకులుగా ,మొత్తం 42సంవత్సరాలసుదీర్ఘకాలం తెలుగు భాషా బోధనచేసిన ఘనచరిత్ర వారిది .సాహితీ క్షేత్రం లో తనకై ఒక విశిష్ట స్థానం సంపాదించుకొని 75 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 24-5-1981న ‘’దివిజ కవివరుల గుండియల్ దిగ్గురనగ దివిసీమలో జన్మించిన  ‘’కవిపాదుషా  పువ్వాడ శేషగిరిరావుగారు  దివిని చేరారు.

 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు పువ్వాడవారికి బందరులో శిష్యులు. పువ్వాడ వారిలాంటి గురు ప్రముఖులను స్మరించటానికి 1973-74లోనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురుపూజోత్సవంగా ప్రకటించారు మండలి .నాటిముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి సమక్షం లో తమ గురుదేవులైన పువ్వాడ వారిని అత్య౦త భక్తి శ్రద్ధలతో గౌరవంగా సత్కరించి గురూణ౦  తీర్చుకొన్నారు .

  భ.రా.గో పువ్వాడవారికి’’ విజీనగరం’’ లో శిష్యుడు.1950డిసెంబర్ లో హాఫ్ యియర్లి తెలుగుపేపర్లు దిద్ది ,కట్ట తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో టేబుల్ మీదపెట్టి, పువ్వడమాస్టారు నిలబడే ఉన్నారు. ఆయన కూచు౦టేనే అందరూ సిట్ డౌన్.గురూజీ కూర్చోలేదు. శిష్యులూ అంతే.ఉన్నట్లుండి పువ్వాడవారు ‘’నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను ‘’అన్నారు  . అవాక్కయింది విద్యార్ధి బృందం  .వారిలో ముదురు వయసు వాసుదేవరావు ‘’బందర్లో బాగాలేదని ఇక్కడికొచ్చారు .మీ పిల్లలు చిన్నవాళ్ళు .మీరు రాజీనామా చేస్తే —?’’అని అర్దోక్తిగా అన్నాడు .అప్పటికీ మాస్టారి గుండె కరగలేదు .నిలబడే ఉండి,కట్టలోంచి ఒక ఆన్సర్ పేపర్ తీసి ‘’రామగోపాలానికి నూటికి 9మార్కులొచ్చాయి .ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేయన్రా “?అన్నారు .అందరూ భ.రా.గో.ను హీనంగా చూసి ఏవగించుకొన్నారు . గోపాలం రెక్కట్టుకొని వాసు స్టేజి పైకి తీసుకెళ్ళి మాస్టారిని కుర్చీలో కూర్చోపెట్టి ,పిల్లల్ని కూచోమని సంజ్ఞ చేయగా, వాళ్ళూ కూర్చున్నారు .తనకు తక్కువ మార్కులు రావటానికి సంజాయిషీ చెప్పాడు గోపాలం .డిసెంబర్ 15లోపు బి.ఏ .పరీక్ష ఫీజు 60 రూపాయలు ఫైన్ లేకుండా కట్టాలని యూని వర్సిటి హుకుం .ఎలాగో అలా తంటాలుపడి  రెండు  నెలల ముందునుంచి కస్టపడి 55 రూపాయలు కూడబెట్టాడు .ఇంకొక్క అయిదు రూపాయలు కావాలి .14సాయంత్రం ‘’గండ కత్తెర వ్యాపారస్తుడు’’గా పేరుపొందిన బత్తుల వజ్రం గారిని కలిసి గోడు చెప్పుకున్నాడు .తానూ 5 రూపాయలు ఇస్తానని , ఆ రోజు దీపాలు పెట్టేశారుకనుక మర్నాడు పొద్దున్న 9 గంటలకు వస్తే ఇస్తా అన్నాడు  షావుకారు .ఉదయం 8 కే తెలుగు క్వశ్సిన్ పేపర్ ఇస్తారుకనుక ,అరగంట దాటితే కాని ,బయటకు పంపరు కనుక  ఎనిమిదిన్నర వరకు రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసి  ఆన్సర్ పేపర్ ఇచ్చేసి, షావుకారు దగ్గరకెళ్ళి వాగ్దానం చేసిన 5రూపాయలు తెచ్చుకున్నానని సవివరంగా చెప్పాడు కుర్ర భరాగో .ద్రవించిన పువ్వాడ తెలుగుమాస్టారు’’అలా చెప్పు .లేకపోతె నీకు 70 మార్కులు రావాలి .అవునూ ఆ ఐదు రూపాయలు నన్నెందుకు అడగలేదు “’అన్నారు అని భరాగో ‘’  మా తెలుగు మాస్టారు ‘’వ్యాసం లో రాశారు .ఇందులో తాను బోధించిన సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినదుకు బాధ ,అవమానం ,బాధ్యతా ,అంకితభావంతో పాటు ,  ఆడబ్బు తానె ఇచ్చేవాడిని అనే కారుణ్యం  స్పష్టంగా కనిపిస్తాయి  .సమర్ధుడైన ,తర్వాతకాలం లో కరుణా విలసితుడైన ,హాస్య రచనలో సమర్ధుడైన మంచి శిష్యుడు భరాగో ను  తయారు చేసిన పువ్వాడ మాస్టారు  అభిన౦దనీయులు .

   చివరగా ఆచార్య ఎస్వి ఉటంకించిన మధురకవి మూలా పేరన్న శాస్త్రి గారి

‘’ధారా శుద్ధి ,రస ప్రవృద్ధి ,పదసంధాన క్రియా చాతురీ –పారీణత్వవిశుద్ధి ,భక్తిగుణ సంపన్మాధురీ వృద్ధి ,సం

స్కారోదార కవిత్వ సంభ్రుత కళాసంబద్ధ చిత్రోక్త్యలం—కారాత్యంత సమృద్ధి,తత్కవితలో గర్భించు సంశుద్ధిగా ‘’

పద్యంతో పువ్వాడ వారికి నీరాజనం పలుకుతున్నాను –

 తొలి శ్రావణ శుక్రవార శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది  నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి కనుక  దానికి పూర్తి న్యాయం చేశారు .వృద్ధ దొమ్మరిసాని వర్ణనలో –

‘’ప్రత్యక్ష పాంచాల ,బాహానటనల –ప్రాస యతి చ్ఛేక పాకశయ్య

దేవ భాషా గ్రామ్య దేశ్యప భ్రంశల –తత్సమానా౦ ద్రోక్తుల దప్పకుండ

నవరసాలంకార నానార్ధ శబ్దముల్ –వగలయ క్రియలు నగుపడంగ

గూడార్ధ భావముల్ రూఢిగా  దెల్పుచు-బర తత్వ సిద్ధాంత పటిమ నెరయ

బహు చమత్కార యుక్త వాచా ప్రగల్భ్య –స్పుట నిరాఘాట పద గు౦ఫ పటిమ యొదవు’’

అని చెప్పిన దాన్ని బట్టి అవన్నీ ఆయనకవిత్వం లో రాశీ భూతమైనాయి .

  సంప్రదాయ విధానం లో శ్రీకారం తో పద్య రచన ఆరంభించి ,ఇష్టదేవత స్తుతి ,శేష గరుడ విశ్వక్సేనాదుల వర్ణన ,పూర్వకవి స్తుతి కుకవినింద ,కృతిపతి ఐన నల్లగొండ జిల్లా పెద్దవూరమండలంచిన్న గూడెం దగ్గర గుహలో వెలసిన తమ కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రశంసా చేసి  షష్ట్యంతాలు చెప్పారు .తమకావ్యాన్ని మహా ప్రబంధంగా పేర్కొన్న కవిగారు గురు సేవ మోక్షప్రసాది కనుక  ఆచార్య ప్రాశస్త్యాన్ని తెలియజేసి శ్రీహరి చిద్రూప ధారాకృతి తో ప్రజలను దీమంతులను చేయటానికి  ‘’దేశికాకృతి’’దాలుస్తాడని ఒక పద్యం చెప్పారు –

‘’ఆరున్మూడును ,రెండు నేడు,నొకటిన్నజ్ఞాన సంబందమై –జేరం గన్గొని,చిత్తగించి ,,హరియుం జిద్రూప ధారా కృతిం

గారుణ్యంబున ,దేశికాకృతి యు నై,గన్పట్టె నీ ధాత్రిలో –దీరోదారత చేత నౌఘములనున్ దీమంతులుం జేయగా ‘

’  క్షాత్ర వంశం లో పుట్టినా క్షాత్ర ధర్మానికి దూరమై ,మహాపాపియై  ‘’క్షత్రబందు ‘’అనే చెడ్డపేరు తో ఉపనయనం అయినా తీరుమారక   కొడుకుకు చెప్పలేక తండ్రి వానప్ర స్థాశ్రమం తీసుకోగా ,ఏక చత్రాది పత్యంగా పాలిస్తూ మరింత పాపియై స్త్రీ హింస కూడా చేయించాడు . ధర్మ భ్రస్టత సహించని వ్యాసమహర్షి   వచ్చి హితోపదేశం చేసినా మారలేదు .కోపంతో ఆయన రాక్షసుడివి కావలసినదని శపించాడు .కాళ్ళమీద పడితే 12ఏళ్ళు రాక్షసుడి వై జీవించి ‘’దుర్జన సహవాసముచే –నిర్జన ప్రధమా౦గ మున ను ,నెగడుచు ధరణీ

నిర్జరు సహవాసముచే –నర్జర రిపు రూపు వదలు నీకు నృపాలా “’అని శాప విముక్తి అనుగ్రహించాడు.

 వాడు అలాగే 12ఏళ్ళు భ్రస్ట జీవితం గడిపి ,తర్వాత ఒక రోజు పుండరీక ముని ఆదారిలో వస్తూ దుర్వాసన గమనించి ఆ ఆవాసం వాడిదే అని గ్రహించి  వెళ్లగా వాడు చంపి తింటాను అని బెదిరించాడు .కానీ ఆయన వాడిని పట్టుకొని మంచిమాటలు చెప్పి ,గౌతమీ స్నానం చేయించి  తిరుపు౦డ్రాదులు  ధరింపజేసి శిష్యుడిని చేసుకొని ,శాప విముక్తుడిని చేసి ,విష్ణు గాధలు బోధించి తనతో తీసుకు  వెడతాడు .

  చివరి భాగం లో తిరుమంత్ర ప్రభావం వలన క్షత్ర బంధు  దీనుల హీనులను సేవించి భానుమతిని పెళ్ళాడి సుమిత్రుడు అనే పుత్రుని పొంది ,సర్వ సౌఖ్యాలు పొందాడు .దొమ్మరులకు కూడా తిరుమంత్రార్ధం బోధించి పునీతుల్ని చేస్తాడు .ఇలా కథను క్లిష్టత లేకుండా రసబందురంగా సులభరీతిలో రాశారు కవి

  ప్రబంథం కనుక అష్టాదశ  వర్ణనలు ఉన్నాయి .కరువును వర్ణిస్తూ అది ‘నిఖిల నరశుష్క కాంతార వ్రాతంబు దహించే వహ్ని ‘’ఆని ,’’లేమి గాదిది మనుజ హామిక శైలాలి పాటనం బనరించు పవి యనంగ ‘’క్షామం కాదు ఇది ‘’ప్రాణుల విలయం చేసే హాలాహలం ‘’అని వర్ణించారు .వసంతం ను వర్ణించే ఆరుపద్యాలు రసగుళికలే –

‘’అంత,నిశాంత కాంతిశిశిరాంత దినా౦తమునన్ ,దిగంతులన్ –వింతగ ,నంతతంటను వేడ్క దలిర్ప నుద్భవిల్లె,శ్రీ

మంతము ,సద్విజ ప్రకర మానస రంజిత నవ్య సౌరభా –క్రాంతము ,నామిళింద వరగాన సుమంతము  నా వసంతమున్ ‘’

  రాక్ష రూపం పొందిన క్షత్ర బంధు  ను ‘’సురపొన్నలతోసారి తూగే తల పర్వత శిఖరంగా ,తామరతూడులవంటి  బాహువులు ఏనుగు తొండాలు ,సింహమధ్యమం అయిన నడుము పటువైన గోలెం లాగా అరటి బోదెలవంటి తొడలు గానుగ దూలాలులాగా ,మేఘమండలం దాకా పెరిగిన శరీరం ,కందెన నూనె వంటి రంగు గాడిద  వొండ్రలాంటి స్వర తో పెనుభూతంగా మారాడు .కవి సారాలంకారం తోపాటు అన్ని అలంకారాలు వాడాడు  .సామెతలు జాతీయాలు గుదిగ్రుచ్చారు .నాటకీయత తో రక్తికట్టించారు .విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పరిపోషించి కథకు గొప్ప న్యాయం చేకూర్చారు .బహుముఖీన పాండిత్యం తో దారాశుద్ధికవిత్వం తో సంప్రదాయానుసరణంగా  ఈ మహా ప్రబంధాన్ని శ్రీ నరసింహా చార్యులవారు తీర్చి దిద్దారు .ఇంటిపేరు లోఉన్న ‘’ఆ సూరి ‘’లోని ‘’సూరి ‘’పదానికి సార్ధకత చేకూర్చారు.

  ఇన్ని విషయాలను తన సిద్ధాంత గ్రంథం లో పొందుపరచిన డా .సర్వా సీతారామ చిదంబర శాస్త్రిగారు అభినందనీయులు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లాది వారి  భారత  ప్రవచనం 

మల్లాది వారి  భారత  ప్రవచనం

గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర వివరణలతో ఆసాంతం  శ్రవణ పేయంగా ,మార్గ దర్శనంగా భాసించి , ఒక దంపుడుకు ,పల్లీ బఠాణీల కు తావు లేకుండా మహదానంద0 కలిగిస్తోంది . ఆసక్తి ఉన్న వారు చూసి ధన్యులు కాగలరు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం

ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని అపూర్వ విషయాలు క్లుప్తంగా మీకు అందజేస్తున్నాను .

ఈ ఉపాఖ్యాన కర్త ఆసూరి  నరసింహా చార్యులు . భగవద్రామానుజుల వారి  గృహనామమే ఇది .ఆసూరి ఇంటిపేరుకు కవిగారి పూర్వీకులు ‘’భట్టర్ ‘’చేర్చి ‘’ఆసూరి భట్టరు ‘’వారయ్యారు .కొంత కాలానికి ‘’మఱిం గంటి ‘’పదం కూడా చేర్చుకొని ‘’ఆసూరి భట్టరు మఱిం గంటి ‘’అయ్యారు .తర్వాత ఎందుకో భట్టరు వదిలేసి ‘’ఆసూరి మఱిం గంటి ‘’ని ఇంటిపేరుగా ఖాయం చేసుకొన్నారు .కనుక మనకవి గారి పేరు ఆసూరి మఱిం గంటి నరసింహ చార్యులు .అసలు ఈ మఱిం గంటి పదం ఎందుకు ఎలా వచ్చి దూరింది ?అనే దానిపై తలొకమాటా చెప్పినా చివరికి ఒకదాన్ని అందరూ అంగీకరించారు .వీరి పూర్వులైన లక్ష్మణ దేశికులవారు 12 వేలమంది త్రిదండి సన్యాసులు ,7 వేలమంది జనవరులు ,74పేర్లున్న గురువులు ,ఒక లక్ష తిరునామ ధారులతో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తూ, భక్తులను అనుగ్రహిస్తూ ,దుస్ట శిక్షణ శిస్ట రక్షణ గావిస్తూ శ్రీ రంగనాధ స్వామి దర్శనార్ధం శ్రీరంగం వెళ్ళారు .అప్పటికే రామానుజా చర్యులవారు ,కొందరు సాదు భట్టారకులు ,కూర నాయకులు ,ముదలి యా౦డాన్ తో కలిసి అక్కడ ఉన్నారు .శ్రీ రంగనాధుడు రామానుజులవారితో ‘’మిమ్ములను గంటిని ,మీ వెంట వచ్చిన ఈ ఘనుల ‘’మఱిం గంటిని ‘’అన్నాడు .అప్పటి నుంచి ఆసూరి వారి గృహనామంలో ‘’మఱిం గంటి ‘’చేరింది . ఈవిషయాన్ని మఱింగంటి సింగరాచార్యులు తనకావ్యాలన్నిటిలో రాశారు .

‘’క౦టిన్ లక్షణమునివరు –గంటిన్ గూరేశ దేశిక స్వామి –‘’మఱిం

గంటి’’ వీరెవ్వరన  ‘’మఱిం –గంటి మహాన్వయము దనరె  గణ్య౦బగుచున్   ‘’అని రాశారు .క్షత్ర బందూపాఖ్యానం లో నరసింహా చార్యులుకూడా –

‘’భాష్య కారుల వెంట బనివిని  శ్రీరంగ –ధాముని సేవించ దలచ దయ దలిర్ప

గంటి కంటి ‘’మఱిం గంటి ‘’ వీరెవ్వరు –ననెడు శ్రీ సూక్తియే నన్వయముగ’’అని రాశారు .రంగనాధుడు తెలుగులో ఈ మాట అన్నాడా ?అనే కుశంక అక్కరలేదు .మనకవులకు దేవుళ్ళు కలలో కనపడి తెలుగులోనే కావ్యాలు రాయమని ఆనతిచ్చిన సంగతి మర్చి పోరాదు .’’యదన్నా వై మానవాః-‘’తదన్నావై దేవతాః ‘’అంటారుకదా అలాగే ‘’ యద్భాషావై మానవాః తద్భాషావై దేవతాః’’అవకూడదా?అని నా చిన్నబుర్రకు తోచింది .

మన కవి కాలం క్రీశ -1710-1770గా సర్వా వారు సర్వే రాయిపాతినట్లు ఖచ్చితంగా తేల్చారు.తెలంగాణలో ‘’కనగల్లు ‘’లో ఉండి,తర్వాత మిర్యాలగూడెం తాలూకా ‘’అనుముల ‘’గ్రామం చేరారు .వీరిది మౌద్గల్యస గోత్రం . ఈ గోత్రజుడు ఆది శేషుని అవతారంగా భావించే మాధవాచార్యులు జన్మించి అరణ్యాలలో ఏనుగులను ,పులులను బాధిస్తున్నబ్రహ్మ రాక్షసుని చేత సపర్యలు చేయి౦చుకొంటూ సూర్యసమాన తేజస్సుతో విరాజిల్లుతూ అనేక దాన ధర్మాలు చేసేవారు అని ఈ ఉపాఖ్యానం లో రాశారు .ఈయన పుత్రులు  తిరుమలాచార్యులు ,భట్టరు ,సింగరాచార్యులు  .భట్టార్ గారికొడుకు తిరువెంగళ ,.ఈయనకు తిరుమల ,భట్టరు కొడుకులు .తిరుమలాచార్యులకు తిరు వెంగళాచార్యులు ,నరసింహా చార్యులు ,అనంతాచార్యులు ,సింగరాచార్యులు అనే నలుగురు కొడుకులు .వీరిలో సంపన్నుడైన వెంగళాచార్యులు’’యాత వాకిళ్ళ ‘’గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి మండపం  గోపురం కట్టించాడు .ఇలా వీరి వంశం అభి వృద్ధి చెంది వెంకటార్య ,రంగామాంబ దంపతులకు   మనకవి నరసింహా చార్యులు జన్మించారు .

ఆసూరి మఱిం గంటి నరసింహా చార్యులు కావ్య ,భాణ,నాటకాలు16 రాసినట్లు చెప్పుకొన్నా11మాత్రమె లభ్యం .శ్రీనాధుని ‘’చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు ‘’పద్య౦ లో లాగా ఈకవీ –

‘’పదియేండ్ల  వాడనై,బహు చమత్కృతియైన –‘’శల్వ పింగ ళరాయ చరితమొకటి ‘’

వ్రాసితి పదియొక్క వత్సరంబున నేను –‘’నంద నందన శతానంద ‘’మొకటి

పది రెండు వర్షముల్ పరగ ‘’నలంకార కృష్ణ విలాసమున్ ‘’గృతియు నొకటి

యైదైదు మూడును హాయనంబులలో –‘’జనకరాయని బిడ్డ చరిత మొకటి ‘’అంటూ రాశారు కానీ పద్యం పూర్తిగా దొరకలేదు .పైన చెప్పినవికాక –విష్వక్సేన ప్రభాకరం ,శ్రీ రామానుజాభ్య్దయం , జాంబవతీ కుమారా శృంగార విలాసం ,శ్రీ కృష్ణ తులాభారం ,తారక బ్రహ్మ రాజీయం,పద్మినీ కన్యకాభ్యుదయం మొదలైనవిఉన్నాయి .  తన గ్రంథాలనన్నిటినితమ కులదైవమైన ‘సిరిసెన గండ్ల నరసింహ స్వామి కే అంకితమిచ్చారు .12 చాటువులు చెప్పినట్లున్నా, రెండుమాత్రమే లభ్యం.

‘’ క్షత్ర బందూపాఖ్యానం ‘’కు మాతృక భవిష్యోత్తర పురాణం అని కవి చెప్పుకొన్నా  ,సర్వా వారు ఎంతవెదికినా అది దొరకలేదట .అది అష్టాదశ పురాణాలలోనిదికాదు. 30 ఉపపురాణాలలో కూడా దాని పేరు లేదట . కవిగారికాలం లో ఉండి తర్వాతకాలం లో లుప్తమై ఉండచ్చు అంటారు సర్వాజీ .అయితే విప్రనారాయణాచార్యులు  రాసిన ‘’తిరుమాల ‘’లో ఒక పాశురం లో క్షత్రబందు గూర్చి ఉందని ,అతనికంటే పాపి భూమి మీద లేడని, కానీ గోవింద నామోచ్చరణతో   పరమగతి పొందాడని దాని తాత్పర్యం .బ్రాహ్మణులలో అధముడిని ‘’బ్రహ్మ బంధు ‘’అన్నట్లే క్షత్రియాధముడిని ‘’క్షత్ర బంధు’’అనటం ఉన్నది .ఇలాంటివారి పేరు వినిపిస్తే చెవులు మూసుకోనేవారట .

పద్మ పురాణం 97 అధ్యాయం లో దీని మూల కథ ఉంది .’’సూర్య వంశం లో విశ్వరదుడి కొడుకు క్షత్రబంధువు మహాపాపి .అడవులలో తిరుగుతూ ,జీవహి౦స తో పొట్టపోసుకోనేవాడు .ఒకరోజు బాగా అలసిపోయి, అటు వైపు వస్తూన మహామునికి సపర్యలు చేయాగా , అయన ‘’గోవింద ‘’నామం ఉచ్చరించమన్నాడు  .అలా స్మరించి తర్వాత జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి సంసారం వదిలేసి గోవింద పద ధ్యానం తో ముక్తిపొందాడు అనేది ముఖ్య కథ.

తెలుగుభారత౦  ఆనుశాసనికపర్వం లో 101అధ్యాయం లో 9పద్యాలలో క్షత్రబందుకథకొంచెం మార్పుతో  ఉంది. అతని దర్శనం తో ఒకమాలవాని శాపం పోయి బ్రాహ్మణత్వం పొందినట్లు ఉంది .బ్రాహ్మణుడికోస౦  క్షత్రబందు ప్రాణాలు విడవటం ‘’పూర్వ గాథాలహరి ‘’లో భారత కథగా ఉంది  . కాని పైకథలో ఈ విషయం లేదు .ఏతావాతా  తేలినదేమిటి అంటే యెంత పతితుడైనా సత్సంగత్వం తో ముక్తుడౌతాడు .పుండరీక ముని వలన క్షత్రబందు  భగవద్భక్తుడై ముక్తిపొం దాడని ఈ ఉపాఖ్యానం లో నరసింహా చార్యులవారు చక్కగా వివరించారని సర్వా శాస్త్రిగారు ఉవాచ .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి

భువి నుంచి దివికి పాకిన ‘’జూకామల్లి

 ఎత్తైన విగ్రహం  ,అంతే ఎత్తైన సాహితీ మూర్తిమత్వం ,నల్లని పలుచని శరీరం ,చిన్న కళ్ళు అయినా కాటుక రేఖలతో పొందిన  కాంతిమత్వం ,చేతులకు గాజులు ,తలలో పూలు ,నుదుట బొట్టు ,ముదురు రంగు పట్టు చీర ,దానికి తగిన జాకెట్టు ,కోలముఖం ,నవ్వు తూ ఉండే పలువరస ,సాంప్రదాయ భారతీయత ఉట్టిపడే చీరకట్టు ,ముఖం లో సౌమ్యత ,పలకరింపు లో ఆప్యాయత ,సౌజన్యం ,మాట తీరు లో  మల్లెల సౌరు ,ఆకర్షణలో జూకామల్లె తీరు ,చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి అయ్యే స్పురద్రూపం ,ప్రసంగం లో’’విపుల ‘’ విద్యా వైదుష్యం ,చర్చలలో’’ చతుర ‘’సంభాషణా ,పదునైన ఆలోచనా ధోరణి ,నడిచి వచ్చే వాణీ  స్వరూపమా అనిపించే ఆ సాహితీ సరస్వతి వేరెవరోకాదు, కే.బి.లక్ష్మిగా అందరూ పిలిచే డా .కొల్లూరు భాగ్య లక్ష్మి .

   కేబి లక్ష్మి గారిని మొట్ట మొదట సారిగా హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో అమెరికా చిట్టెన్ రాజు గారు ప్రపంచ తెలుగు సభలు ,బాపు –రమణల స్నేహ షష్టి పూర్తీ కలిపి నిర్వహించినపుడు మొదటి రోజు ఉదయం భోజన విరామ సమయానికి ముందు, ఆమె కిచ్చిన 10 నిమిషాల సమయంలో కరుణశ్రీ గారి ‘’విజయశ్రీ ‘’గురించి అద్భుతంగా మాట్లాడి ,భోజన సమయం లో బయటకు వచ్చినప్పుడు దగ్గరకు వెళ్లి అభినందించాను .అదే మొదటిసారి చూడటం ,మాట్లాడటం .అప్పటిదాకా ఆమె ఎవరో నాకు తెలీనే తెలీదు .నా అభినందనకు కారణం కూడా ఉంది .ఎవరు మాట్లాడినా కరుణశ్రీ రాసిన ఉదయశ్రీ గురించే చెబుతారుకాని నాకు అత్యంత ఇష్టమైన ‘’విజయశ్రీ ‘’గురించి మాట్లాడకపోవటం ,ఆమె దానికి నూటికి వెయ్యి శాతం న్యాయం చేయటం ,పద్యాలను అలవోకగా చదవటం ఆశ్చర్యం కలిగించి ఆమె పై అభిమానం కలిగింది . ఆ సభలో శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కూడా ఉన్నట్లు జ్ఞాపకం .విజయశ్రీ లో కరుణశ్రీ కవితా వీర విహారం చేశాడు .అందులోని మొత్తం పద్యాలు నాకు కంఠతా వచ్చు .అంతేకాదు ఉయ్యూరు సాహితీ మండలి సమావేశం లో ఒకసారి అందులోని పాత్రలకు ఆ పద్యాలు రాసి ఇచ్చి చిన్న ప్రదర్శనగా చేయించి  అందరి మెప్పూ పొందాను . విజయశ్రీ పై అంతటి వీరాభిమానం నాకు .

   క్రమంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం సమావేశాలకు వెళ్ళటం ,నాకూ వారు తగిన పాత్ర ఇచ్చి ప్రోత్సహించటం జరిగింది .వారి అన్ని ప్రచురణలలో నాతో విలువైన వ్యాసాలు  రాయించారు శ్రీ పూర్ణచంద్.ఆ సభల్లో లక్ష్మిగారితో సాహితీ బంధం బలపడింది .ఒక సారి అకస్మాత్తుగా ఆమె ‘’నేను  మీ ఫాన్  ను .మీ బ్లాగ్ చదవకుండా ఉండను .ప్రొద్దున్నే మేము పేపర్లు తిరగేయ్యాల్సిన పని లేకుండా ముఖ్యవిశేషాలు లు సాహిత్యం మీరు పోస్ట్ పెడుతున్నారు .అవి చదివి యెన్ లైటన్ అవుతున్నాను .మీ పోస్ట్ లన్నీ ఒక ఫైల్ లో ఉంచుతున్నాను ‘’అన్నప్పుడు ‘’ములగచెట్టు ఎక్కిస్తున్నారేమో ‘’?అని భయపడ్డాను .కాదని అవి ఆమె హృదయం లోతుల్లోంచి వచ్చిన మాటలే  అని గ్రహించాను .మరో సారి ఆమె  తమ్ముడు  కూడా బెజవాడలో ఆమెతో పాటుకనిపించి తానూ సరసభారతి బ్లాగ్ ఫాలోయర్  అనటం మరింతగా ఆనందాన్నిచ్చింది .

 లక్ష్మి గారికి బందరు చుట్టుప్రక్కల పొలాలు ఉండటం ,సుబ్బారావుగారు క్లాస్ మేట్ అవటం వారి కుటుంబాలు చాలాసఖ్యతతో ఉండటం వలన ఆమె ప్రతి ఏడాది బందరువచ్చి రైతులనుంచి పంట డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళేవారు .ఒకసారి వేసవి లో ఆమె వస్తున్నట్లు నాకు తెలియజేసి ఏదైనా సాహిత్య కార్యక్రమ౦ ఏర్పాటు చేయగలరా అని సుబ్బారావు గారు ఫోన్ చేస్తే, వేసవిలో  జనం రావటం కష్టమని చెప్పి, జులై లో ఫ్లోరా స్కూల్ లో సరసభారతి కార్యక్రమ౦ ఏర్పాటు చేసి సుబ్బారావు గారి అధ్యక్షతన ఆమెను మహిళాభ్యుదయం పై మాట్లాడించి చిరు సత్కారం చేశాం .

  నేను రాసిన ప్రతి ఆర్టికల్ ఆమె చదివి స్పందించేవారు .సరసభారతి ప్రచురణలు ఆమెకు పోస్ట్ లో పంపేవాడిని .ఆమె తన ‘’జూకా మల్లి ‘’నాకు పంపారు .  ఆపుస్తకానికి తగిన జూకామల్లి చిత్రం అచ్చు అవలేదని బాధపడి , నన్ను వెతికి పంపమని కోరితే,  హైదరాబాద్ లోని దేవరాజు మహారాజుగారికి ఫోన్ చేసి ,దాని బొటానికల్ నేం సంపాదించి గూగుల్ లో ఆపూల ఫోటోలు వెతికి పట్టుకొని, ఆమెకు పంపితే పరమానందం పొంది ‘’మీకు చెబితే ఏదైనా సాధిస్తారు ‘’అని కితాబిచ్చారు  . మరోసారి మా దొడ్లో ‘’శంకు పూలు ‘’ఫోటో పెడితే చూసి, ఆ విత్తనాలు కావాలని కోరితే పోస్ట్ లో పంపితే సంతోషించారు .మరొకసారి చినుకు మాసపత్రికలో ఆమె ‘’కవులైన కథకులు’’  శీర్షికలో ఎందేరెందరో మహానుభావులను గురించి ధారావాహికగా  రాస్తూ ,ఎవరో కవి గురించి, ఆయన పుస్తకాలు గురించి వివరాలు కావాలని కోరితే    హైదరాబాద్  అమీర్ పేట దగ్గర జైన దేవాలయం దగ్గర ఉన్న నాకు అత్యంత ఆప్తుడైన శ్యాం సుందర్ గారి ఫోన్  నంబర్ ఇచ్చి వెళ్లి కలవమని చెప్పి ఆయనకూ ఫోన్ చేసి చెబితే , ఆమె వెళ్లి కావలసిన ఇన్ఫర్మేషన్   అంతా ఆయననుంచి సంపాదించుకొన్నది . చాలాసార్లు ఎన్నో విషయాలపై నన్ను వివరాలు అడిగితె నాకు తెలిస్తే వెంటనే చెప్పటం, లేకపోతె తెలుసుకొని చెప్పటం జరిగేది.దానికే  ఆన౦దించే అల్ప సంతోషి ఆమె . మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ  ,సరసభారతి,మా పెరటి చెట్ల వైభోగం ,ఉసిరి చెట్టుకింద కార్తీక వనభోజనాలు ,బంధువుల రాక ల ఫోటో లన్నీ చూసి ముచ్చట పడేవారు .  వెంటనే స్పందించేవారు . లక్ష్మిగారు శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారింటికి వెళ్లి చేసిన ఇంటవ్యు మా శ్రీమతికి చాలా ఇష్టం .ఈ ఇద్దరిపై ఆమెకున్న అభిమానం అది .

   సుమారు నాలుగైదు ఏళ్ళనుంచి ఆమె ఆరోగ్యం లో ఏదో మార్పు గమనించాం నేనూ మాశ్రీమతీ .ఆమె కనబడినప్పుడు అడిగితె నవ్వి ఊరుకొనేది .ఈ కాలం లోనే ఆమె నుంచి ఫోన్లు ,మెయిల్ తగ్గాయి .నేనూ సరసభారతి పుస్తకాలు పంపలేదు .సభలలో కలిసినప్పుడు ఇచ్చేవాడిని .శ్రీమతి చలసాని వసుమతి గారు విజయవాడలో పుస్తకం  ఆవిష్కరణ సభలో  లక్ష్మిగారికి ,శ్రీ విహారి గారికి వారి ఫౌండేషన్ తరఫున చెరి 10వేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించినపుడు మేమిద్దరం వెళ్లి అభినంది౦చా౦ . అప్పుడు వారి కుమారుడు,కుమార్తె లను కూడా చూశాం .  మే 17న గుడివాడ లో పుట్టివారి పురస్కారం  ‘’ఆమెకూ నాకు మరికొంతమందికి ఒకే వేదికపై జరగటం నాకు మహద్భాగ్యం .ఆమెకు ‘’కథా కల్పవల్లి ‘’బిరుదు నిచ్చారు .జులై 14ఆదివారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాజగాన సభలో గురు పౌర్ణమి సందర్భంగా నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు నాకు గురు పురస్కారం గా ‘’కళా సుబ్బారావు అవార్డ్ ‘’అందజేసినపుడు కేబిలక్ష్మిగారు వేదికపై ఉన్న నా దగ్గరకు వచ్చి పలకరించి అభినందించి అక్కడి వారితో ‘’దుర్గాప్రసాద్ గారుమా గురువు గారు ‘’అని చెప్పటం ఇంకా చెవులలో మారు మోగుతూనే ఉంది .అంతటి సంస్కారం ఆమెది .పదిహేను రోజుల్లో ఆమె మనముందు నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు అంటే ఊహించ లేకపోతున్నాము  .ఇక బెజవాడలో ఆమె లేని సాహిత్య సభలను ఊహించటం కష్టం .కృష్ణా జిల్లా రచయితల సంఘ సారధులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ గార్లు ఆమె మరణం జీర్ణించుకోవటం కష్టమే .

  విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన కేబి లక్ష్మిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం లో తెలుగు ఎం .ఏ .చేసి ,ఆచార్య యెన్ గోపి పర్యవేక్షణలో ‘’అచ్యుతవల్లి కథలు  ‘’పై పరిశోధన చేసి పిహెచ్.డి.పొందారు .విపుల,  చతుర మాసపత్రికలలో  మూడు దశాబ్దాలు పనిచేసి శ్రీ చలసాని ప్రసాద్ పదవీవిరమణ తర్వాత సంపాదక బాధ్యత వహించారు. ఆమె వేలకొద్దీ కథలను ఎడిట్ చేసి ఉంటారు .తన స్వీయ కథలను ‘’మనసున మనసై ‘’,జూకామల్లి ‘’అనే రెండు సంపుటాలు, కవితలను ‘’వీక్షణం ‘’,గమనం ‘’అనే రెండు సంపుటాలుగా ప్రచురించారు .ఇందులో ‘’గమనం ‘’ప్రముఖ సాహితీవేత్త శ్రీ సుధామ చేతి రాతతో వెలువడటం విశేషం .1967నుంచి ‘’యువభారతి ‘’లో వనితా విభాగ అధ్యక్షురాలు .సాహిత్యాభిమాని శ్రీ భీమాని కామేశ్వరరావు గారిని ప్రేమించి పెళ్ళాడి ,ప్రవీణ్ ,సమీర లను సంతానంగా పొందారు .అందరితో స్నేహం గా ఉండటం ఆమె సహజ లక్షణం కనుక ఇంటికి ‘’స్నేహ నికుంజ్ ‘’సార్ధకనామం పెట్టుకొన్నారు .

 ఏ విషయం పైనైనా అనర్గళం గా  ‘’విపులం ‘’గా ,’’చతురం ‘’గా మాట్లాడే నేర్పు లక్ష్మి గారిది .ఆమె ‘’గమనం ‘’లో ఆమె కున్న గమనించే లక్షణం ,ఆమె గమనమూ ,లోక గమనమూ కనిపిస్తాయి ,ఆమె ‘’వీక్షణం ‘’తీక్ష్ణ మైనది .నిశిత దృష్టి వీక్షించవచ్చు .ఆమె స్నేహం ‘’మనసునమనసై ‘’పరిమళిస్తుంది .మల్లెలు చాలా రకాలైనా ఆమెకు ‘’జూకామల్లె ‘’పై అభిమానం ఎక్కువ . ఆ పువ్వునే ’’ రాదా మనోహరం ‘’అంటారని మాశ్రీమతి ఉవాచ .కొంచెం నీలిరంగు తెల్లపువ్వే జూకా మల్లి .మనోహరమైన అందం ,మనసును పరవశపరచే పరిమళం దాని ప్రత్యేకత .లక్ష్మిగారికీ ఈ సుమ లక్షణాలు ఉండటం వలన అంత అభిమానం . ఈ కథలలో  వాటిని  పంచిపెట్టారు .’’దాంపత్య జీవిత సౌరభాన్ని వెదజల్లే ఆణి ముత్యాలు ఆమె కథలు ‘’అన్న సుధామ మాటలు  అక్షర సత్యాలు .’

’జర చాయ్ తాగి పో’’కవితలో ఆమె కవితా విశ్వ రూపం  కనిపిస్తుంది .తెలంగాణా యాస అక్షర రమణీయం గా ఉంది ,పరకాయ ప్రవేశం చేసి రాశారా అనిపిస్తుంది .ఎన్నెన్నో ఊసులు కలిపి మరగించిన చాయ్ నాకు మాత్రం మహా రుచిగా ఉంది .’’చారణా చాయ్ కు  చాలీస్ రుపయా  విలువ కలిగించి ఫిదా చేశారామే .ఆమెకు ఆత్యంత ఇష్టమైన ‘’జూకా మల్లి ‘’ని భువి నుండి దివికి పాకించిన నట్లుగా , సాహితీ మూర్తి కె.బి.లక్ష్మి  గారు జులై 22 సోమవారం 70 వ ఏట అకాల మరణం  చెంది సాహితీ లోకానికి  తీవ్ర దిగ్భ్రమ కలిగించారు .ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు

image.png

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )

ఉగ్రవాదం భయోత్పాతం

‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే ద్రవ ధనాన్ని ,మందుగుండు సామగ్రిని ,చంపటానికి లైసెన్స్ లతోపాటు ప్రపంచమంతా  దమ్మిడీ ఖర్చులేకుండా పర్య టి౦చటానికి పాస్ పోర్ట్ లు, వీసాలు అవకాశాలు పుష్కలంగా సమకూరుస్తుంది .

 ముఖ్యమైన వాటి నిర్వచనాలు

ముఖ్యంగా మూడు రకాల ఉగ్రవాదాలున్నాయి .అవి 1-తిరుగుబాటు(ఇన్సర్జెంసి ) 2-తీవ్రవాదం(మిలిటెన్సి ) 3-ఉగ్రవాదం (టెర్రరిజం) .ఇందులో తిరుగుబాటు లో విప్లవం ,గెరిల్లా కార్యక్రమాలు దేశ మిలిటరీ శక్తిపై జరపటం ఉంటాయి .మిలిటెన్సి అనే తీవ్రవాదం, పైదానికన్నా చాలా శక్తి వంతమైన ఒక పార్టీ విభాగం .దీని లక్ష్యం దేశ  మిలిటరీ ,పారామిలిటరీ ,యంత్ర సామగ్రి ,సాయుధ సైనికులు ,పోలీస్ సిబ్బంది పై దాడులు .తమ లక్ష్య సాధనకు యెంత కైనా తెగించే తీవ్ర లక్షణం .టెర్రరిజం అనే ఉగ్రవాదం అమాయక ప్రజా సమూహాలను  నిర్దాక్షిణ్యంగా నిర్హేతుకంగా  సంహరింఛి అంతటా భయోత్పాతం కలిగించి  పాలకుల దృష్టిని ఆకర్షింఛి, తాము అనుకొన్న కొన్నిటిని సాధించటం .ఈ మూడు విధానాలు వినాశ కారణాలైన హింసాత్మక  చర్యలే . సందేహం లేదు  ఈ  నిర్వచనాలను ఇండియాలోని సీనియర్ ఎయిర్ ఫోర్స్ ,సైనిక పోలీస్ ఆఫీసర్ల తోనూ , దేశ విదేశాలలోని అనేక అకాడమీ, యూని వర్సిటీ లతో  ఎన్నో ఏళ్ళు జరిపిన  ఇంటర్వ్యూల ఫలితం గా ఇవ్వబడినవే  .

           కార్య కలాపాలు

 ఈ రోజుల్లో టెర్రరిస్ట్ లు ఫైవ్ స్టార్ హోటళ్ళలో దర్జాగా అన్నీ సుఖాలు అనుభవిస్తూ ,టెర్రరిస్ట్ కార్య కలాపాలు జరుపుతున్నారు తప్ప భయంకర  అడవులలోనో , లోయలలోనో ఉండి కాదు అని గ్రహించాలి .పోలీస్ ,సైన్యం ,ఎయిర్ ఫోర్స్ ,ఇంటలిజెన్స్ సర్వీసులు  (నిఘా విభాగాలు )రోజు రోజుకూ తీవ్రమౌతున్న తీవ్ర వాదాన్ని అదుపు చేయ లేక పోతున్నాయి  అన్నది పూర్తి యదార్ధం.

  సంఘటిత వ్యూహం (ఫెడరేటేడ్ నెట్ వర్క్ )

  టెర్రరిస్ట్ ల నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ,సమర్ధ వంతమైన శాఖలతో ,కేంద్రాలతో ప్రతి దేశం నుంచి పకడ్బందీ వ్యూహం తో జరుగు తోంది .టెర్రరిస్ట్ లు  లెక్కలేనంత నకిలీ కరెన్సీ కలిగి మాంచి ఆర్ధిక పరి పుస్టితో బాగా బలిసి ఉన్నారు .అమెరికా డాలర్లు ఇండియా,రూపాయలు బ్రిటిష్ పౌండ్లు  ,ఒక టేమిటి అన్ని దేశాల కరెన్సీని కొన్ని వంచక(రోగ్) దేశాల  సాయంతో క్షణాలమీద అచ్చుగుద్దేసి వినియోగం లోకి తెస్తున్నారు  .ఇంతేకాదు మాదక ద్రవ్యాల సరఫరా  అండర్ వరల్డ్  యాక్టివిటీస్, స్మగ్లింగ్ ,అనైతిక ఆయుధ వ్యాపారం ,కిడ్నాపింగ్ , దోపిడీ  ,డాన్  గిరీ మొదలైనవాటితో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సమకూర్చుకొంటున్నారు .వీటిని అదుపు చేసే నాధుడే లేడు .

  ఉగ్రవాద దీవులు

ఇప్పుడు టెర్రరిస్ట్ లు జాతీయ ,అంతర్జాతీయ బాంక్ సేవలను ఆపేస్తున్నారు .సామూహిక హనన ఆయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్  డిస్ట్ర క్షన్-W.M.Ds)కూడా సమకూర్చుకొని  దేశాలను భయపెడుతూ ,ఎదుర్కోవటం ఒక సమస్యగా మార్చి ,.ప్రపంచమంతా ఉగ్రవాద దీవులుగా మార్చేశారు .

  సామూహిక వినాశనం

ఈరోజుల్లో టెర్రరిజం ఒక ఫాషన్ ,ఒక వృత్తి ,ఒక సంస్థ అయింది .జోసెఫ్ కాన్రాడ్ దీనిపై తీవ్రంగా స్పందించి ‘’బాంబు దౌర్జన్యం ప్రజాభిప్రాయం పై ఎలాంటి ప్రభావం కలిగించదు.దీని పరిధిని దాటి ప్రతీకారం ,ఉగ్రవాదాల ఉద్దేశ్యం వైపు తిరిగి ఆలోచించాలి .ప్రభుత్వాలు కొత్త ఆయుధాలు సమకూర్చుకొంటే ఉగ్రవాదులుకూడా అదే వేగంతో వాటిని తమ స్వంతం చేసుకొంటున్నారు .ఇప్పుడు టెర్రరిస్ట్ లు  బాధ్యతారాహిత్యంగా అణ్వాయుధాలను సమకూర్చుకొంటే  ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి ?ఇది చాలా కల్లోలం రేపే సమస్య అయి౦దిప్పుడు.వాస్తవం ఏమిటంటే చాలా టెర్రరిస్ట్ గ్రూపులు కెమికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడాయి .1995 జపాన్ లోని  టోక్యో  సబ్ వె సిస్టం లో ‘’సిన్రిక్లియోస్ ‘’ను వాడారు .  ‘’క్వాడే నెట్ వర్క్ ‘’క్వేడా ఇన్ స్పైరేడ్ గ్రూప్ ‘’లు కొత్త తరహా యుద్దానికి సన్నద్ధం  అవుతున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి .

  టెర్రరిస్ట్ లు ప్రపంచ వ్యాప్త నెట్ వర్క్ సమాచారాన్ని కలిగి ఉన్నారు .దేశం యెంత భద్రంగా ఉంటుందో  వాళ్ళు కూడా అంతర్జాతీయంగా ఎవరికీ కనిపించకుండా తమ తీవ్రవాద చర్యలు చేస్తూ భద్రంగా ఉన్నారు .దేశం, అది స్పాన్సర్ చేసే టెర్రరిజం గ్రూపులు ,,కౌంటర్ టెర్రరిజం సూటిగా ,రహస్యంగా ఒక దాని ఆధారంగా ఒకటి నడుస్తున్నాయి ,బతుకు తున్నాయి .ఇదొక పెద్ద విషవలయమైపోయింది .దీని నియంత్రణ ఎలా అన్నది అనూహ్యం గా మారింది .వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే టెర్రరిజ అంతమొందాలి అంటే అహింసా శక్తిపై తిరుగు లేని విశ్వాసం పెరగాలి .ఈ విశ్వాసం ప్రతి వ్యక్తిలో,సమాజం లో, ప్రతి  సంస్థలోనూ ఏర్పడాలి .

  అసలు ప్రమాదం

   21 వ శతాబ్దం   ప్రపంచీకరణ  ఫ్లడ్ గేట్ లను టెర్రరిజాన్ని తెరచుకొని దూకి వచ్చింది .అమెరికాలో సెప్టెంబర్ 11 విషాదం సామూహిక హింస ,సామూహిక హనన ఆయుధ ఫలితమే .ఇది ఒక  దృష్టాంతమై ,చర్యలకు దారి తీసింది .ఐతే ట్రెండ్ సెట్టర్ లు ఇందులోని యదార్ధం గమనించలేదు .ఈ రకమైన హింస ఒక అంటువ్యాధి గామారి ,క్రమంగా చాలావరకు  ప్రొఫెషనల్ అయి పోయింది .మహాత్ముడు చెప్పినట్లు ఉగ్రవాదాన్ని ,దానిపై  అత్యంత సహనం తోనే ఎడుర్కొవాలే తప్ప వేరే గత్యంతరం లేనే లేదు .

       సమాప్తం

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

            గాంధి వ్యూహం

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ  బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం ఐతే ఇవి గాంధీ పోరాట సిద్ధాంతానికి విఘాతం కలిగించేవి ,సమస్యా పరిష్కారానికి అవరోధం కలిగించేవి .టెర్రరిజం  వెనుక ఉన్న సమస్యలకు ఆయన మార్గాలు కొన్ని ఉన్నాయి ,ఉగ్రవాద కార్యాలపై ఊర్తిగా దృష్టి కేంద్రీకరించాలి .జాతి ద్వేషం నిలువరించటానికికి పూనుకోవాలి .ఉగ్రవాదానికి పూను కొనే వారు అలా ప్రవర్తించటానికి వెనుక ఉన్న కారణాలు అన్వేషించాలి .

  ఉన్నతమైన నీతి తో ప్రవర్తించాలి . వారి విశుద్ధ ప్రవర్తన అపమార్గ గాములకు కను విప్పు కలిగిస్తుంది .అధికారులు హింసా విధానం తో ప్రవర్తిస్తే బలప్రయోగానికి దారి తీస్తుంది .అందుకే గాంధీ నెత్తీ నోరూ కొట్టుకొని నైతిక లక్ష్యం మాత్రమె సమస్యకు మార్గ దర్శనం చేస్తుంది అన్నాడు .వినటానికి ఈ నీతి సూత్రాలు బానే ఉంటాయి .అవి పని చేసి ,ప్రభావం చూపుతాయా అనేది మిలియన్ డాలర్ల  ప్రశ్న .బలమైన హి౦సాత్మకత ముందు అహింసా విధానాలు చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లుగా నిష్పలమౌతాయని చాలామంది అనేక సందర్భాలలో ఆయన్ను ప్రశ్నించారు .ఇజ్రాయిల్ లో పాలస్తీనా హింసకు కఠిన ప్రతిస్పందన  హమాస్ కు ఉప్పెనలాగా ఉపయోగపడి ,టెర్రరిస్ట్ కార్యాలను పెంచాయి . అమెరికాలో సెప్టెంబర్ 11 దాడి తర్వాత, జిహాదీ ఉద్యమంపై ప్రతీకార చర్య ,ఉగ్ర  దాడులు  ప్రపంచ వ్యాప్తంగా తగ్గ క పోవటం మనకు అనుభవమే . టెర్రరిజం పై  అమిత బలప్రయోగం మంచి ఫలితాల నిచ్చిన దాఖలాలు పెద్దగాలేవు .

   హింస హింసనే  సృష్టిస్తుంది .పూర్తి హింస పూర్తి  వినాశనమే కలిగిస్తుంది .కానీ అహింస హింస మూలాలనే  ఛేదిస్తుంది .అహింస శాంతి కి మార్గమై అంతిమ విజయం చేకూరుస్తుంది .ఇందులో కోల్పోయిన వారు గాయపడరు . బ్రిటిష్ ప్రభుత్వ టెర్రరిజం పై గాంధీ అహింసా పద్ధతులతోనే అనేకసమస్యలపై  పోరాటాలు చేసి ,ఘన విజయాలు  మనకు సాధించి పెట్టాడు .ఒక్కోసారి గత్యంతరం లేని పరిస్థితులలో హింసను ప్రయోగించటం .తప్పదని ఆయన చెప్పిన విషయం ఇదివరకే తెలుసుకొన్నాం .ఏది ఏమైనా హింస స్వయం వినాశకం .అహింస చిరంజీవి .హింస మనుష్యులను చంపితే ,అహింస మనుష్యులను చంపనే చంపదు.అందుకనే  ఐక్యరాజ్య సంస్థ  మొదలైనవి అహింసా విధాన పరిష్కారాలకోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.దీనికి సహన శీలత తో కూడిన రాజకీయ విజ్ఞత ,పూనిక ,నిశ్చయ బుద్ధి ,ఓపిక ,పట్టుదల ,తోపాటు అహింసపై పూర్తి  విశ్వాసం  కావాలి .హింస  ఎప్పుడూ విజయం సాధించదు.

   ఆధునిక ఉగ్రవాదం ఎవరో ఒక వ్యక్తీ లేక  అలాంటి  వ్యక్తుల సమూహం  అడపాదడపా చేసే  హింసా  కృత్యాలు కాదు .అది జాతీయ సీమలను దాటి ఉన్న సుశిక్షితులైన  అత్యాధునిక ఆయుధ సైనిక పటాలం.వాళ్ళ సిద్ధాంతాలు వారివి .వారి నైతికత,వారిది   .వారి నెట్ వర్క్ ,ఆయుధ సామగ్రి నుంచే వాళ్ళ అసలైన బలం వస్తుంది .దానినే నమ్మి మిగిలినవారిని ఆకర్షించి శిక్షణ నిచ్చి ఉగ్రవాదం పెంచుతున్నారు .అదే మంచి అని నమ్ముతున్నారు .వాళ్ళ ఈగోలను  తృప్తి పరచుకొంటున్నారు  . పిచ్చి వాళ్ళ స్వర్గం అనే ఊహా స్వర్గం లో విహరిస్తూంటారు.వీరిని కూడా అహింసా విధానం లోనే ఎదుర్కోవాలి .బలమైన యదార్ధ నైతికత వారి మనసులను మారుస్తుంది అప్పుడే జనజీవన స్రవంతిలో కలిసిపోతారు .లేకపోతె టెర్రరిజం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.తాము నమ్మిన కుహనా సిద్ధాంతాన్నే నమ్ముకొంటూ టెర్రరిస్ట్ లు మరింత పేట్రేగి క్రూర హింసకు పాల్పడుతారు అంటాడు   ఆవేదనతో ఆహి౦సామూర్తి మహాత్మా గాంధీజీ .

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

   సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు

 .

ఎనుక

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

 ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3

ఘర్షణ పై గాంధీ అభిప్రాయం

ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ మాత్రమె’’ అని స్పష్టం చేశాడు .అదే సమయం లో భారత ఉపఖండానికి  బ్రిటిష్ సర్కార్  రోడ్ల నిర్మాణం దగ్గర్నుంచి ,ఆఫీస్ పరిపాలన దాకా చేసిన  మంచిపనులను మెచ్చాడు .

  పరిష్కారం ఊహించాక ,రెండవ దశ పోరాటం దాన్ని సాధించటం గురించి .అంటే పోరాటమే .ఐతే అది స్థిర పరిష్కారం కోసమే అవ్వాలి .’’లక్ష్యం సాధన ను సమర్ధిస్తుంది ‘’అనేదాన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు .సాదనా ,లక్ష్యమూ చివరికి ఒకటిగా నే ఉంటాయి అని వాదించాడు .హింసతో పోరాటం చేస్తే ,ఉత్తమ  లక్ష్య సాధనకూ హింసా విధానమే శరణ్యం అనే తప్పుడు భావన కలుగుతుంది .’’టెర్రరిస్ట్ లు బ్రిటిష్ వారిని తరిమేసి విజయం సాధిస్తే  వారి బదులు దేశాన్ని ఎవరు పాలిస్తారు ?”’అని ప్రశ్నించాడు .ఆయనే సమాధానం చెప్పాడు ‘’బహుశా ఇండియా విముక్తికి  హంతకు లైనవారు పాలిస్తారేమో ?,అలా అయితే హంతకుల వలన ఇండియాకు ఏమీ లాభం ఉండదు ‘అని ఖచ్చితంగా చెప్పాడు .

 పోరాటం శక్తి మంతంగా తరచుగా ప్రదర్శనలతో మొదలవ్వాలి .అవమాన పరచే వాటికి  నిరభ్యంతరంగా సహకరణకు తిరస్కరించాలి .అయినా హింసాత్మకంగా ఉండకూడదు .ఈ నాశనకర విధానాలు ఘర్షణ పరిష్కార విజయానికి   ధనాత్మక ఫలితాలు ఇవ్వక పోవచ్చు.పోరాటం సత్యమార్గం లో మొదలైతే, అది క్రమంగా అది వ్యక్తీ శీలాన్ని  ,విధానాన్ని  క్రమంగా  పెంచుతుంది ఆలోచనాపరిది విస్త్రుతమౌతుంది .ఉదాత్త  లక్ష్యసాధనకోసం మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోయి దిగజారి ప్రవర్తి౦చకూడదు అని అభిప్రాయ పడ్డాడు .ఇదే ఉగ్రవాదానికి ఆయన సమాధానం .  మొదలు పెట్టటానికి ఏదో రకమైన  ప్రతిస్పందన  రావాలని గట్టిగా కోరాడు .ఏమీ చేయకు౦ డాచేతులు కట్టుకొని కూర్చోమని ఏనాడూ ఆయన చెప్పలేదు ‘’ అగ్ని ప్రమాదం లో  క్రియా శూన్యత క్షమి౦చరానిది ‘’అన్నాడు.

  దిక్క్కారం అడుగున

‘’ధిక్కారం అడుగున పిరికి తనం ఉంటుంది .హింసలేని పోరాటం అనైతికం ఎన్నడూ కాదు .కాని పిరికితనం అనైతికమే ‘’అన్నాడు గాంధీ .’’ పిరికితనానికి  హింసకు మధ్య దేన్ని ఎంచుకోవాలి అని నన్ను అడిగితె నేను హింసనే ఎంచు కోవాలి గట్టిగా చెబుతాను అన్నాడు ఒక్కోసారి  హింస మాత్రమే పరిష్కారం అనిపిస్తుంది .పిచ్చి కుక్క వల్ల సమాజానికి ప్రమాదం దాన్ని అదుపులోనైనా పెట్టాలి లేదా చంపనైనా చంపాలి .వేరే దారి లేదు .దారుణ మానభంగాలు చేసిన ‘’మృగాడు .’’ స్పాట్ లో దొరికితే ,నిర్దాక్షిణ్యంగా వాడిని హతం చేయాలి . వీరోచిత హింస ,పిరికివాడి అహింస కన్నా తక్కువే అన్నాడు మహాత్ముడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీవేత్త ,స్నేహశీలి ,భేషజం లేని వ్యక్తి ,వ్యక్తిత్వమే ఆభరణంగా ఉన్న శ్రీమతి కె బి లక్ష్మి (70)హఠాన్మరణం

నాకు అత్యంత సాహితీ ఆప్తురాలు ,ఒకరకంగా నా ఫాన్ ,నేనూ ఆమె మాట రచనలకు ఫిదా అయ్యే అభిమానిని ..మే 6 గుడివాడలో ”దుర్గాప్రసాద్ గారు ఉయ్యూరులో నాకు సరసభారతి సన్మానం చేయలేదు ”అని అలకగా బుల్లి మూతి పెట్టి , జులై 14 హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నా కు కళా సుబ్బారావు అవార్డు ఇచ్చినప్పుడు వచ్చి ప్రత్యేకంగా వేదిక మీద నన్ను  పలకరించి ,అభినందించిన సహృదయురాలు ,”దుర్గాప్రసాద్ గారు మా గురువు గారు ”అని అక్కడ అందరికి నవ్వుతూ చెప్పిన లక్ష్మి గారు సాహితీ  లక్ష్మీ   సరస్వతుల ప్రతి రూపం . ప్రతి సభలోనూ నాతో ఫోటో దిగటం ఆమెకు చాలా ఇష్టం గా ఉండేది శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణచంద్ నేనూ లక్ష్మిగారు చాలాసార్లు కార్ లో సభలకు వెళ్ళటం ఆమె తో సంభాషణ ఒక ఎడ్యుకేషన్ గా ఉండటం మరువలేనిది . సరసభారతి బ్లాగ్ లను ఆమె నిత్యం చదివే వారు దానికి ఒక ఫైల్ ప్రత్యేకంగా పెట్టుకున్నానని చాలా సార్లు నాకు చెప్పారు . ఉయ్యూరులో ఆమెకు ఘన సన్మానం చేద్దామనే ఆలోచనలో నే ఉన్నాను ఒక సారి సుబ్బారావు గారి అధ్యక్షతన ఉయ్యూరు ఫ్లోరా స్కూల్   లో మహిళా విషయం పై మాట్లాడించి సరసభారతి చిరు సత్కారం మాత్రమే చేయగలిగింది . ఇంతలో ఈ  అశనిపాత వార్త.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ  , వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్

image.png

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2

           హింద్ స్వరాజ్

  కొన్ని వారాల తర్వాత గాంధీ ,మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళటానికి స్టీం షిప్ ఎక్కినప్పుడు  మరలా ఈ విషయాలపై ఆలోచనలో పడ్డాడు .వాటిని రాసి  బుక్ లెట్ గా లండన్ లోని జాతీయ వాదులకు పంపాడు .ప్రాధమికంగా ఈ వ్యాసాన్ని గాంధీ మొదటి సారిగా  ఒకే చేతితో రాయటం మొదలుపెట్టి  చేయి బాధ పెడితే రెండవ చేతితో వడివడిగా కంగారుగా రాసి ,తన సంఘర్షణ నిర్ణయానికి చేరిక మార్గం గా ,అ తర్వాత తాను  జీవితాంతం అనుసరించి ,సాగించే విధానంగా రాశాడు .ఈ చిన్న పుస్తకమే ‘’హింద్ స్వరాజ్ ‘’లేక ఇండియన్ హోమ్ రూల్ .’’ ఇందులో రూపు దిద్దుకో బోతున్న భారత స్వాతంత్ర్య ఉద్యమం ,దానికి తీసుకోవాల్సిన సరైన విధానాల లక్ష్యాలు వివరించాడు .లండన్ లోని భారతీయ తీవ్రవాదులు బ్రిటిష్ వారు భారత దేశ  ఆర్దికాన్ని  దోచేస్తున్నారు అని  చెబుతున్న లండన్ లోని భారతీయ తీవ్రవాదులు’’ బ్రిటిష్ వారికి ఇండియాలో స్థానం లేదు ‘’అన్న అభిప్రాయాన్ని సమర్ధించాడు  .అదే కాక ఇండియా  భౌతిక భావనలతో పాశ్చాత్య నాగరికతను అనుకరించటం సమర్ధనీయం కాదని అది ఒక వ్యాధి అని చెప్పాడు .

 ఈ పుస్తకం టెర్రరిజం పై అధికమైన వ్యతిరేక ఒత్తిడిని పెంచింది .గాంధీ తన అహింసా సిద్ధాంత మార్గానికి  సంఘర్షణ స్వభావానికి పరీక్ష గా ఒక స్కెచ్ తయారు చేశాడు .ఎంచుకొన్నస్వాతంత్ర్యం అనే  ఉత్తమ లక్ష్యం ముందు వ్యక్తిగత ఘర్షణలను దాటి ఆలోచించాలని కోరాడు .’’ప్రతి ఘర్షణ రెండు స్థాయిలలో ఉంటుంది .అవి వ్యక్తులమధ్యా , ,సిద్దా౦ తాల మధ్యా  ఉంటుంది .పోరాటం చేసే ప్రతి వాడికి అదొక సమస్య అవుతుంది .అలాగే అనేక భావాలమధ్య ఘర్షణ కూడా అంతే’’అన్నాడు గాంధి .పోరాటం చేసి అలసిపోయాక పరిష్కారానికి దారి వెతుకు తారు .కనుక గాంధీ విధానాలు శత్రువును ఎదుర్కోవటానికి మించిన భావన ఉంటుంది .ఘర్షణ నే ఎదుర్కొనే  ,తుదముట్టించే  మార్గాలు సూచించాడు .దీనికి తాను ఎంచుకొన్న మార్గానికి ‘’పాసివ్ రెసిస్టన్స్’’అంటే ‘’నిష్క్రియాత్మక నిరోధకత ‘’అనే ముద్ర వేసినందుకు బాధపడ్డాడు .దీనినే ఆయన దక్షిణాఫ్రికాలో అమలు చేసి విజయం పొందాడు  .ఇందులో నిష్క్రియత అనేది లేనే లేదు .నిజానికి ఆయన తుఫాను వంటి ఘర్షణ లను ప్రభుత్వ అధికారులతో ఎదుర్కొన్నాడు .అవి ప్రతిఘటన, నిరోదాలకు మించి ఉండేవి .అది సత్యమార్గమేది ?,దానికోసం నిలబడటం ఎలా? ,అధికారం కోసం సత్య మార్గమేది? అని తెలియ జేసే నిరంతర శోధన అన్నాడు మహాత్ముడు .

  ఘర్షణ లో నిమగ్నమై పని చేయటానికి 1906లోనే గాంధీ ఒక కొత్త పేరు ఆలోచించాడు. తన ‘’ఇండియన్ ఒపినియన్ ‘’పేపర్ లో సరైన పదాన్ని సూచించమని పాఠకు లకు పరీక్ష పెట్టాడు .సరైన పదాన్ని సూచించి గెలుపొందినవారికి పుస్తకం బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు .ఐతే ఆయన కజిన్ మదన్ లాల్ సూచించిన పదానికి  గాంధీ నగిషీ చెక్కి ‘’సత్యాగ్రహం ‘’అని పేరు పెట్టాడు .ఇందులో రెండు సంస్కృత  పదాలు సత్య ,ఆగ్రహం ఉన్నాయి .సత్యం అంటే నిజం .ఆగ్రహం అంటే కోపం కాదు ‘’గట్టిగా పట్టుకోవటం ‘’ఈ రెండుకలిపితే సత్యాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే ఆచరించటం .దీన్ని గాంధి ‘’సత్య శక్తి ‘’అని  సిమ్ప్లి ఫై చేశాడు . ఈ శోధనలో ఆయన  దృష్టి అంతా సత్యం పైనే నిలిచింది .దీనిపై ఎవరికీ సరైన అభి ప్రాయం ఉండక పొవచ్చు అన్నాడు .ప్రతి సంఘర్షణ అస్తిత్వం   లోతైన తేడాను  ఏది సరైనది అన్నదానిపై రెండు భిన్న అభిప్రాయాలు చెబుతుంది .మొదటగా సంఘర్షణ చేసే పని చెప్పి ,తర్వాత దాన్ని ఆసమస్యకు రెండు వైపులనుంచి చూడటం చెబుతుంది .ఇందులో ప్రత్యర్ధి మాటను  ,అభిప్రాయాన్ని కూడా తన అభిప్రాయం తోపాటు  అర్ధం చేసుకోమని చెబుతుంది.దీనినే అమెరికా మాజీ రక్షణ సెక్రెటరి రాబర్ట్ మాక్ నమారా ‘’ది ఫాగ్ ఆఫ్ వార్ ‘’డాక్యుమెంటరి సినిమాలో  సలహా ఇస్తూ ‘’Emphathize with the enemy ‘’ ( అవతలి వాడి ని  అర్ధం చేసుకొని, అతని మనోభావాలు పంచుకోవటం )అని నొక్కి వక్కాణించాడు.

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

      సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-19-ఉయ్యూరు  . .  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి

  మహాత్మాగాంధీ ఉగ్రవాదాన్ని  ఈషణ్మాత్రం కూడా సహించలేదు .హింస పై ఏనాడూ రాజీ పడలేదు .ఉగ్రవాదులు గా చిత్రి౦పబడిన సర్దార్ భగత్ సింగ్ వంటి వారిని కాపాడటానికి విశ్వప్రయత్నమే చేశాడు .అలా  ఎందుకు చేశాడు ?అనేది పెద్ద ప్రశ్న .తాను  చెప్పేదానికీ, అనుసరించేదానికి తేడా ఉందా ?ఆయన వివాదాల ,వైరుధ్యాల పుట్టా ?అసలు ఉగ్రవాదాన్ని ఊహించగలమా ?ఉగ్రవాదానికి  ఒక సిద్ధాంతం ఉన్నదా ?

గాంధీజీ హింస ,ఉగ్రవాదాల మధ్య ఇప్పుడు మనం జీవిస్తున్నట్లే జీవించాడు .ఆయన 1915లో దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చే నాటికే దేశం లో హింస ఉద్ధృతంగా ఉన్నది .ఇండియాకు రాకముందే అక్కడ దక్షిణాఫ్రికాలో హింస కు తీవ్రంగా బాధ పడ్డాడు .కాని హింసకు హింస ప్రతీకారం అని ఆయన భావించలేదు .హింసను అహింసా సిద్ధాంత ఆయుధం తోనే ఎదుర్కొని నిలిచి విజయం సాధించాడు .హింస పై ఆయన భావాలను పరిశీలిస్తే ,హింస అరుదుగానే విజయం సాధించింది .జార్గంస్ మేయర్ రాసిన ‘’గాంధీ వర్సెస్ టెర్రరిజం ‘’లో ఉన్న కొన్ని విషయాలను పరిశీలిద్దాం .’’1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చేసరికి దేశం బ్రిటిష్ వ్యతిరేకతతో ,ఘర్షణలతో  హింస అంచున ఉంది.భారత స్వాతంత్ర ఉద్యమం తెలిసి ,అక్కడ ఆయన లాయర్ గా ఉంటూ అక్కడి వలస భారతీయుల సాంఘిక సమానత కోసం చేస్తున్న పోరాటం  ఆయన్ను ఇండియాకు రప్పించింది .అప్పుడు దక్షిణాఫ్రికాలో ,ఇండియాలో బ్రిటిష్ వారి మిలిటరీ బలం అత్యధిక శక్తి వంతంగా ఉండి,దాన్నిపూర్తిగా  ఉపయోగించటానికి ఏమాత్రం భయపడని స్థితి లో ఉన్నది .1919లో పంజాబ్ లోని అమృత సర్ లో  ప్రశాంతంగా నిరసన తెలియ జేయటానికి  జలియన్ వాలాబాగ్ కు చేరిన  400మంది భారతీయులను విచక్షణా రహితంగా ,కోపోద్రిక్తుడైన నరరూప రాక్షస బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ ఎటు వంటి ముందు హెచ్చరికలు లేకుండానే కాల్పులు  జరిపి , ఊచకోత కోసి ,నరమేధం సృష్టించాడు .

   దీనికి ప్రతీకారంగా  జాతీయవాదులుతమకు తామే  ఎవరి ప్రేరేపణా లేకుండానే  దేశం లో చాలా చోట్ల హింసతో  బదులు చెప్పారు .బెంగాల్ లో సుభాష్ చంద్ర బోస్ ‘’ఇండియన్ నేషనల్ ఆర్మీ ‘’నిర్వహించాడు .పంజాబ్ లో ఘదర్ ఉద్యమకారులు  అమెరికాలోని కాలిఫోర్నియాకు లో ఉన్న పంజాబీ వలస దారుల మద్దతు తో ఒక బోటు నిండా ఆయుధాలను అమెరికా నుండి దిగుమతి చేసుకొని   హింసా విప్లవానికి పధకం రచించారు .. అరాచకవాదులు అని ముద్రపడిన ఈ భారతీయులు బ్రిటిష్ దౌష్ట్యాన్ని యెదిర్చి , వారి అధికారాన్ని అంతమొందించి భారత దేశం స్వాతంత్ర్యం పొందటానికి హింస ఒక్కటే పరిష్కార మార్గం అని గాఢంగా నమ్మారు .  ఒక బ్రిటిష్ అధికారిపై  భారతీయ కార్యకర్తలు  చేసిన హింసాత్మక దాడి  వలన,  గాంధీజీ  హింస పై తనకున్న అభిప్రాయాలకు పదును పెట్టాడు .ఈ సంఘటన    దక్షిణాఫ్రికా భారతీయుల తరఫున బ్రిటిష్ ప్రభుత్వం తో లాబీయింగ్ చేయటానికి- అంటే మధ్యవర్తిత్వం  వహించటానికి 1909లో గాంధీ లండన్ లో కాలుపెట్ట టానికి కొన్ని రోజులు ముందు  జరిగింది .లండన్ లోని ఒక భారతీయుడు మదన్ లాల్ ధింగ్రే,బ్రిటిష్ ఇండియన్ ఆఫీస్ లో బ్రిటిష్ అధికారి సర్ విలియం  హెచ్ కర్జన్ వైలీ పై, ఇండియాపై కాలనీ ప్రభుత్వ పాలనకు ,నియంత్రణ కు  తీవ్ర నిరసన గా దాడి చేశాడు .సాధారణ  వేడుకలో ధింగ్రే అకస్మాత్తుగా గన్ తీసి ,అతి దగ్గరగా అధికారి ముఖం పై అయిదు షాట్లు కాల్చేశాడు .అతడు అక్కడికక్కడే కిక్కురుమనకుండా చచ్చాడు .అప్రమత్తమైన పోలీసులు వెంటనే ధింగ్రే ను నిర్బంధం లోకి తీసుకొనగా బయట ప్రజలు ‘’హంతకుడు హంతకుడు ‘’అని అరుస్తుంటే అతడుమాత్రం ‘’నేను భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాను ‘’అన్నాడు గంభీరంగా .

  గాంధీ లండన్ చేరుకొన్న కొన్ని వారాల తర్వాత  లండన్ లోని బహిష్కృత ఇండియన్ జాతీయ వాదులు ఆయనను ,పై సంఘటనపై చర్చ జరగాలని కోరారు .అప్పుడు ఆయనకు ముఖ్య ప్రత్యర్ధి  వినాయక్ సావర్కార్ . సావర్కార్ పై ,బ్రిటిష్ అధికారి హత్యకు ఆయుధాలు ,ఆయుధ సామగ్రి అందజేశాడని బలంగా అభియోగం మోపారు .విచారణలో ధింగ్రే ధైర్యంగా ‘’నేను చావటానికైనా సిద్ధం .నా బలిదానంతో  అమరత్వం పొందుతాను ‘’అన్నాడు .

  చర్చకు ముందు గాంధీజీ లండన్ లోని తన స్నేహితుని ఉత్తరం రాస్తూ ‘’ఇండియాకు స్వాతంత్ర్యం అహింస తో నే వస్తుంది అని నమ్మే ఒక్క భారతీయుడూ నాకు ఇక్కడ కనిపించలేదు ‘’అని బాధ పడ్డాడు . ‘’తీవ్రవాదుల పరి స్థితి సాధారణ విప్లవానికి ముందు  ఉగ్రవాదం  లాగా ఉంటుందని గాంధీ వర్ణించాడు .తీవ్రవాదులు ముందుగా కొందరు బ్రిటిష్ వారిని చంపి ,ఉగ్రవాదానికి పాల్పడతారు .తర్వాత ఒక గ్రూపుగా ఏర్పడి ఆయుధాలు పట్టుకొని బహిరంగం గానే పోరాటం చేస్తారు .చివరికి  కష్ట నష్టాలు తప్ప తాము సాధించేది ఏమీ లేదని ,దాదాపు పావుమిలియన్ మంది ని పోగొట్టుకొంటామని  గ్రహిస్తారు ‘’అన్నాడు మహాత్మూడు .కానీ దేశీయ జాతీయవాదులు మాత్రం ‘’గెరిల్లా యుద్ధం బ్రిటిష్ వారిని ఓడించి ,దేశానికి స్వాతంత్ర్యం తెస్తుంది ‘’అని నమ్మారు .

  జరిగిన చర్చలో గాంధీ సాయుధ పోరాటాన్ని రాజకీయ వాస్తవికత ఆధారంగా ఆలోచించమని కోరాడు .అడపా దడపా చేసే ఉగ్రవాద  ,గెరిల్లా దాడుల తో అత్యంత సైనిక సామర్ధ్యమున్న బ్రిటిష్ రాజ్యాన్ని ఓడిస్తామనుకోవటం అవివేకం .ఈ రకమైన  హింసాత్మకత భారత జాతీయ ఉద్యమానికి భంగం కలిగిస్తుంది .అలాగే  బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేస్తే ,అదే భారతీయ జాతీయ  స్వభావం అని భావించే ప్రమాదం ఉందని గాంధీ గట్టిగా   హెచ్చరించాడు .

ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ  అండ్ టెర్రరిజం ‘’

   సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

సుమారు  నెలన్నర  కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా

 సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు  నా అధ్యక్షతన జరిగింది .డా దీవి చిన్మయ ,అమరవాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు ,విశ్రాంత తెలుగు లెక్చరర్ శ్రీ పి.విజయ సారధి ,లైబ్రేరియన్ శ్రీ కృష్ణారావు అతిధులుగా పాల్గొని దివంగత నాయకుల  గురించి ప్రసంగించారు  .ఆపది మంది ఫోటోలను కార్డ్ బోర్డ్ పై  అంటించి,పుష్పమాల వేసి ,అందరం శ్రద్ధాంజలిగా పూలు సమర్పణ చేశాము .అందరం లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు  శాంతికలగాలని ప్రార్ది౦చాం.కుమారి బిందు దత్తశ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారి ‘’తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’’గీతాన్ని శ్రావ్యంగా ప్రార్ధన గీతంగా పాడింది .నేను మాట్లాడినదానిలో ముఖ్య విషయాలు తెలియ జేస్తున్నాను .చనిపోయిన వారి మరణ తేదీ ని బట్టి వారి గురించి రాస్తున్నాను .

 1-హాస్య ,కేరెక్టర్ పాత్రలలో తనదైన శైలి కనబరచిన రాళ్ళపల్లి

రాళ్ళపల్లి గా అందరూ పిలిచే రాళ్ళపల్లి వెంకట నరసింహారావు పశ్చిమగోదావరి జిల్లా రాచపల్లిలో 10-10-1945న జన్మించాడు 17-5-2019న73 వ ఏట హైదరాబాద్ లో మరణించాడు .1960నుంచి 74వరకు నాటకాలలో నటించాడు .గురజాడ కన్యా శుల్కం నాటకం లో కరటక శాస్త్రి శిష్యుడు మహేశం పాత్ర పదవ తరగతి చదువుతుండగా వేశాడు .డిగ్రీలో ‘’మారని సంసారం ‘’నాటకం రాసి నటించాడు .సినీ నటి భానుమతి చేతులమీదుగా ప్రైజ్ తీసుకొన్నాడు  .వర విక్రయం ,అనగా అనగా ఒక అమ్మాయి నాటకాలు 20 సార్లు ప్రదర్శించాడు .1966లో రాష్ట్ర  పతిరాధాకృష్ణన్ సమక్షం లో రాష్ట్రపతి భవన్ లో ‘’మృచ్చకటిక ‘’నాటకం ప్రదర్శించి మెప్పు పొందాడు . మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ లో పని చేశాడు .

 1974లో సినీ రంగప్రవేశం చేసి 850 సినిమాలో నటించాడు .మనిషి భాష యాస ,నడక మాటతీరు బానపొట్ట చూడగానే నవ్వు తన్నుకొస్తుంది .బాపు తీసిన ‘’తూర్పు వెళ్ళే రైలు ‘’లో మంచి పాత్ర లభించి ‘’ఇక నువ్వు ఉద్యోగం చెయ్యక్కర్లేదు .అదే నిన్ను వరించి వస్తుంది ‘’అన్న బాపుమాట నిజమై బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు జంధ్యాల ,వంశీ లు బాగా ప్రోత్సహించి వేషాలిచ్చారు . ఊరు ఉమ్మడి బ్రతుకులు ‘’సినిమాలో నటించిన పాత్రకు జాతీయ పురస్కారం లభించింది .మణిరత్నం సినిమా ‘’బొంబాయి ‘’లో హిజ్రా వేషం వేసి నభూతో గా నటించాడు .

 రఘుపతి వెంకయ్య అవార్డ్ బంగారుపతకం పొందాడు రాళ్ళపల్లి . ఎన్టి. ఆర్ జాతీయ అవార్డ్ ,నాగి రెడ్డి-చక్రపాణి అవార్డ్ లు దక్కాయి .భార్య పేరిట ప్రతిఏడాది నాటకరంగ నటులకు అవార్డ్ లు ఇచ్చేవాడు .పోట్టిప్రసాద్ ,తనికెళ్ళ భరణి ,చలపతిరావు మొదలైన వారు ఈ అవార్డ్ అందుకొన్నారు .

  టివి లో ‘’జననీ జన్మ భూమిశ్చ ‘’టేలి ఫిలిం కు నంది అవార్డ్ వచ్చింది .చిలకమర్తి వారి ‘’గణపతి ‘’టేలి సీరియల్ లో మంచి పాత్ర పోషించాడు .1994లో పెద్దకూతురు రష్యా వెడుతూ విష జ్వరం తో మరణించి అతన్ని కుంగదీసింది .చిన్న కూతురు అమెరికాలో సెటిల్ అయింది .తనికెళ్ళ భరణి ని కొడుకుగా భావిస్తాడు .అతడు కూడా రాళ్ళపల్లి పై అమిత భక్టి గౌరవం  ఉన్నవాడు .ఇద్దరూ కలుసుకోని రోజు ఉండదు .ఎందరో వర్ధమాన నటులకు రాళ్లబండి తరిఫీదు ఇచ్చి , మెరికలుగా తీర్చి దిద్దాడు .ఈమధ్య ఎందరో  ప్రముఖ హాస్య నటులు మరణించారు .రాళ్ళపల్లి మరణం మళ్ళీ కొంత శూన్యాన్ని ఏర్పాటు చేసింది .

2- సాహిత్యమే ఊపిరిగా జీవించిన  రామ తీర్ధ

17-7-1960 న పలాసలో పుట్టిన యాబలూరు  సుందర రాం బాబు  రామతీర్దగా సాహితీలోకం లో సుపరిచితుడు.తెలుగు, ఇంగ్లిష్ ,బెంగాలి, ఒరియా, ఉర్దూ భాషా సాహిత్యాలను మధించాడు  .1961లో పారాదీప్ లో కార్మిక రక్షణ విభాగం  లో ఉద్యోగం చేసి ,శ్రీమతి కామేశ్వరిని పెళ్ళాడి ,విశాఖకు బదిలీ యై ఇక్కడే స్థిరపడి అనునిత్య సాహితీ సేవలో ధన్యుడయ్యాడు .తెల్ల మిరియం కవితా సంపుటి ,శతాబ్ది శ్రీశ్రీ ,జన స్వరాంజలి,టాగూర్ నాటిక పోస్టాఫీస్ కు అనువాదం ,కన్యాశుల్క కవితోత్సవం, డా రాచకొండ నరసింహ శర్మ  ఆంగ్ల కవితలకు అనువాదం ‘’అన్నపూర్ణాక్షరం ‘’  నిర్భయ  జ్యోతి మొదలైన రచనలతో ‘’సంఘటనాత్మక కవి ‘’గా సుప్రసిద్దుడయ్యాడు .ఎక్కడ అన్యాయం జరిగినా నిరసనగళం వెంటనే వినిపించిన చైతన్య మూర్తి .ఆయన ఆలోచన ,ఆవేశం  అక్షరాలలో దూరి కదిలిస్తాయి  మృగాడు, హీరోగి, శెనిమా ,రేప్ క్లాక్ వంటి పదాలను కాయినేజ్ చేశాడు . .గురజాడ ,వీరేశలింగం అంటే వీరాభిమాని .వీరి భావనా విలువలు సమాజంలోకి చొచ్చుకు పోయేందుకు శ్రమించాడు .2003లో సాహితీ బాంధవి జగద్దాత్రితో కలిసి మొజాయిక్ సాహితీ సంస్థ స్థాపించి , జాతీయ సదస్సులు ,సెమినార్లు, పుస్తకా విష్కరణలు, ఒరియా కవుల పరిచయాలు ,సమీక్షలు ,చర్చలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలు పబ్లిక్ లైబ్రరి వేదికగా నిర్వహించాడు .    అమెరికాలోని న్యూయార్క్ లో నల్లజాతి వారి నిరసన గళం వినిపించే సాహిత్య సంస్థ ‘’మొజాయిక్ ‘’ .ఆ పేరునే ఎంచుకోవటం లో రామ తీర్ధ ఆలోచన, ఆచరణ కనిపిస్తాయి .ఇదొక కళ కూడా. చిన్నచిన్న రంగుపలకలతో గోడలపై నగిషీలతో చిత్రాలను అద్దె కళ.అంటే భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక అన్నమాట  ..’’మండే మొజాయిక్ ‘’పేర ప్రతి సోమవారం సాయంత్రం లైబ్రరీలో సాహితీ సందడి చేసేవాడు .మొజాయిక్ పత్రికతోపాటు  వాం వారం వెబ్ మాగజైన్ ప్రచురించాడు .మొజాయిక్ తరఫున 10 వేల రూపాయల పారితోషికం ఏర్పాటు చేసి మొదటగా 2019 శ్రీ ఉపాధ్యాయుల నరసింహం గారికి అందజేశాడు .మొజాయిక్ సాహిత్య సురభి ,రిత్విక్ ఫౌండేషన్ కలిసి ‘’అక్షర గోదావరి ‘’పురస్కారాలు అందించాడు .చలం కథలను పాత్రాభినయం  చేశాడు .విశాఖ రేడియో కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను ‘’సాహితీ సమీరాలు ‘’గా తెలియ జేశాడు .ప్రముఖ ఆంగ్లకవి టి.ఎస్.ఇలియట్ ‘’వేస్ట్ లాండ్ ‘’ను ‘’వృధా ధాత్రి ‘’ గా అనువదించటమేకాక ‘సత్యవతీ చరిత్ర’’ను ఆంగ్లీకరింఛిన అనువాద ఘటికుడు అనిపించాడు .కన్యా శుల్క నాటకాన్ని డా. వెల్చేరు నారాయణరావు ఆంగ్లం లోకి అనువది౦చి నపుడు అందులోని దోషాలను చేటలతో చెరిగిపారేసిన ఆంగ్లభాషా నిష్ణాతుడు ,జ్ఞాని రామతీర్ధ .  రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురజాడ అవార్డ్ ,రావి శాస్త్రి అవార్డ్ ,మునిపల్లె రాజు అవార్డ్ అందుకొన్న సాహితీ మూర్తి రామతీర్ధ ..కందుకూరి శతవర్ధంతిని అన్ని సాహితీ సంస్థలను కలుపుకొని ఘనంగా చేశాడు .జూన్ 1న సమాపనోత్సవం కు భారీ ఏర్పాట్లు చేశాడు .కానీ 30-5-19న 59 ఏళ్ళవయసు లోనే రామతీర్ధ మరణింఛటం తో  నిరసన గళం మూగపోయింది  .

 రామ తీర్ధ నాకు మంచి సాహితీ మిత్రుడు .కృష్ణా జిల్లా రచయితల  సంఘం  సభలలో కలిసేవాళ్ళం .శ్రీమతి జగద్ధాత్రి ని చూస్తె నుదుట పెద్ద కుంకుమ బొట్టు ,ఒళ్ళంతా కప్పుకొన్న నేత చీర తో అచ్చం అమ్మవారి అవతారం లాగా ఉండేది .చేతులెత్తినమస్కరించ బుద్ధి పుట్టేది .ఎంతో సంస్కారం ఉన్న మహిళ. బహుభాషా కోవిదురాలు .గొప్ప రచయిత్రి .విజయ వాడ లో రెండవ ప్రపంచ తెలుగు మహా సభలలో ‘’వజ్రాయుధం’’ ఫేం శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి వెబ్ సైట్ ను ఆవిష్కరించే కార్యక్రమం రామ తీర్ధ తీసుకొన్నాడు .నన్నూ ,జగద్ధాత్రి గారిని అందులో భాగాస్వామ్యులను చేశాడు .నా గురించి పరిచయస్తులతో గొప్పగా చెప్పేవాడు .శ్రీ కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లాపరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు యెన్ ఆర్ ఐ లతో బెజవాడలో ఒక కార్యక్రమం రామ తీర్ధ ఆధ్వర్యం లో  నిర్వహించి  జిల్లా అభి వృద్ధికి సూచనలు చేయించి ప్రవాసుల సహాయం అపేక్షించారు .రామతీర్ధ నాకు కృష్ణా జిల్లా విద్యా విషయం అప్పగించి పేపర్ తయారు చేయమని చెప్పి సభలో ప్రసంగింప జేశాడు .ఆ సందర్భంగా చాలా సార్లు విశాఖ నుంచి ఫోన్ చేసి మాట్లాడేవాడు .నేనంటే ప్రత్యెక అభిమానం ఉండేది ‘’మీరు మా విశాఖ వచ్చి మా  సభలలో మాట్లాడాలి ‘’ అనేవాడు కాని అది జరగలేదు  చాలా కాలం ఫోన్ లో పలకరించుకోనేవాళ్ళం  ..మొజాయిక్ పత్రిక నాకు పంపేవాడు .

3-  మానవ హితైషి – మహా స్వప్న

కవిత్వాన్ని శాసించిన దిగంబర కవులలో ఒకడైన  మహాస్వప్నఅనబడే  కమ్మి శెట్టి ఈశ్వరరావు  రైతుగా జీవిస్తూ సాహితీ సేద్యం చేశాడు. ప్రకాశం జిల్లా లింగ సముద్ర గ్రామం లో జన్మించి , నెల్లూరు లో ఇంటర్ చదివి హైదరాబాద్ వివేకవర్ధనికాలేజి లో బి.ఎ.లో చేరి ,అభ్యుదయ ప్రగతి శీల సాహిత్యంతో పరిచయం ఏర్పరచుకొన్నాడు   .నార్ల చిరంజీవి సాయంతో 18వ ఏట ‘’చందమామ ‘’అనే బాలకవితా సంపుటి వెలువరించాడు .1964లో ‘’అగ్ని శిఖలు ‘’మంచు జడులు ‘’స్వర్ణదూళి’’కవితా సంపుటలు ప్రచురించాడు .తెలుగు కవితా స్వరూప స్వభావాలను సమూలంగా మార్చేయాలన్న ఆలోచన మనసంతా నిండిపోయింది .ఇదే ఆలోచన ఉన్న  కవులు ‘’చెరబండ రాజు ‘’, ‘’నగ్నముని ‘’   , ‘’జ్వాలాముఖి ‘’ ’’భైరవయ్య ‘’ ’మానసిక దిగంబరత్వం కోసం ’’దిగంబర కవులు ‘’అయ్యారు .నిత్య సచేతన ఆత్మ స్పూర్తితో జీవి౦చటమే తమ ఆశయం అన్నారు .మనసు పొరల్లో దాక్కున్న ఆరాటం అసంతోషం విసుగు లను అక్షరాలలో వ్యక్తీకరించి ,ప్రతి వ్యక్తిలో నూతన విశ్వాసం ,ఆశ కలిగించాలని ఆరాట పడ్డారు .జడత్వం తో బండబారిపోయిన సమాజానికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి చేతనకలిగి౦ చాలనుకొన్నారు .కనుక పరుష పదజాలమే తగిన మందు అని ఎంచుకొన్నారు .వీరు ప్రచురించిన కవితా సంకలనం లో పేర్లు ఉండేవికావు .

   వీరిలో మహాస్వప్న శైలి ,మహా గొప్పగా మిగిలినవారి కంటే భిన్నంగా ఉండేది .చెరబండరాజు ,జ్వాలాముఖి చనిపోగా మహాస్వప్న హైదరాబాద్ లో పత్రికా సంపాదకునిగా ,బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి,స్వగ్రామం లింగ సముద్రం వెళ్లి  సేద్యం ,కవితా సేద్యం చేస్తూ అక్కడే ఉండి పోయాడు  మహాస్వప్న సాహిత్యం లో కొత్త అధ్యాయం తెచ్చాడు  ‘’కిటికీకి రెక్కల్లేవు-కళ్ళకు రెప్పల్లేవు –గిటార్ మీద దిక్కుల్ని మీటే –దిగంబరుడి చేతికి వేళ్ళులేవు ‘’అన్న ఆయన కవిత చాలా పేరుపొందింది ,’’గ్లానిర్భవతి భారత ‘’, నటసామ్రాట్,’’మొదలైన ఆరుకవితలు మాత్రమే రాశాడు ‘’.విజ్ఞానం విరజిమ్ముతున్న   విష వనాల్లో-వేదికలు వెదజల్లుతున్న చీకటి పొగల్లో –నాగరికత మత్తు ఇంజెక్షన్ లో  సమాజం జీవచ్చవమైనప్పుడు –దిగంబరకవి అవతరిస్తున్నాడు ‘’అంటాడు .’’మేం మనుషులం కాదు –ఇంకేదో పేరుంది మాకు ‘’శీర్షిక ‘’కోటబుల్ కోట్ ‘’అయింది .సమకాలీన వాస్తవతకు అద్దం పట్టే కవిత ‘’ఇంకమోయలేను ఈ దేవుళ్ళనీ –ఉద్గ్రంథాల్నీ –ఇకమోయలేను ఈ జైళ్ళనీ – సంకెళ్ళనీ ‘-శాసనాల్నీ –బీట లెత్తిన చరిత్రనీ ‘’.పరిపూర్ణ మానవుడుగా పరిణతి చెంది ,ఆచరణలో అద్వితీయుడిగా నిలిచి ,కవి కంటే మనిషి ముఖ్యం  అని  ఎలుగెత్తి చాటి,’’మహా అకవి’’ అనిపించుకొన్న  దిగంబర కవి మహాస్వప్న ‘’పుడుతున్నా పుడుతున్నా –కడుపు రగిలి పుడమి పగిలి –నవ ప్రపంచ వీధుల్లో నగ్నంగా ‘’అంటూ79 వ ఏట 25-6-19న  అంబరానికి వెళ్ళిపోయాడు.’

 4- అనుభవాల ఛాయా మార్గ గామి  అబ్బూరి  ఛాయాదేవి

  తన ఇంట్లోనూ, చుట్టూ ఉన్న ఆడవారి తీరును గమనించి చక్కని కథలు రాసిన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి పముఖ జర్నలిస్ట్,  పద్యకవి, అధికారా భాషా సంఘం అధ్యక్షులు  శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు భార్య,శ్రీ శ్రీ ఆరుద్ర లకు గురువైన ఆంధ్రా యూని వర్సిటి లైబ్రేరియన్ ,అబ్బూరి రామకృష్ణారావు గారి కోడలు .సమాజం నుంచి ఎదుర్కొన్న ఆంక్షలే ఆమె రచనకు తొలి ప్రేరణ .అనేకానేక మహిళా సమస్యలకు ఆమె కధలు కేంద్ర బిందువులు .పురుషాధిక్యాన్ని ధిక్కరించి ,స్త్రీ స్వేచ్చకోరిన రచయిత్రి .మానవ సంబంధాల అనుబంధానికి కట్టిన గోపురం .సృజన శీలి .ఎందరికో ప్రేరణ .తెలుగు వెలుగు సాహితీజిలుగు ఆమె .పరదీనతను చెండాడిన కలం ఆమెది .స్త్రీవాదం అంటే హక్కులు అవకాశాలు అందరికీ ఉండాలని నిర్వచించింది .తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ స్త్రీల౦దరిదీ అన్న విశాలహృదయ .స్త్రీవాదం కంటే మానవతకు ఎక్కువ  విలువనిచ్చింది .

  ఆమెకు లభించిన  అవార్డులు లెక్కలేనన్ని .రంగనాయకమ్మ సాహితీ పురస్కారం సుశీలా నారాయణ రెడ్డి  అవార్డ్, ‘’మృత్యుంజయ’’ నవలకు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి రచయిత్రి ఉత్తమ రచనాపురస్కారం,అజో -విభో ,సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అవార్డ్ వంటివి  అనేకం .ధైర్యంగా ముందుకు అడుగేస్తే మహిళ సాధించలేనిది లేదు అని బోధించింది .13-10-1933న  రాజమండ్రిలో జన్మించిన చాయాదేవి రచనకంటే మిన్నగా జీవించింది .పొలిటికల్ సైన్స్ లో ఎం. ఏ .కొత్తఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా చేసింది .చాయా దేవికథలు ,తనమార్గం కథా సంకలనం ,వ్యాస చిత్రాలు,ట్రావేలోగ్ గా చైనాలో చాయా చిత్రాలు మొదలైనవి రాసింది .వరద స్మృతితి ,కవిత ,వనితా మోడరన్ తెలుగు పోయెట్రి లకు సంపాదకత్వం వహించింది .1993లో భర్త ‘’వరద ‘’చనిపోయినతర్వాత ‘’అబ్బూరి ట్రస్ట్‘’స్థాపించి ‘’వరద స్మృతి’’అనే ఉద్గ్రంధాన్ని  అబ్బూరి చాటువులు ,మంగళసూత్రం వగైరా ప్రచురించింది .28-6-19న 86వ ఏట తెలుగు మహిళా వెలుగు అబ్బూరి చాయాదేవి మరణించింది.

 5-జ్ఞానపీఠ పురస్కారం పొందిన  నటుడు దర్శకుడు ,పత్రికా స్వేచ్చ ప్రియుడు పద్మభూషణ్ –గిరీష్ కర్నాడ్   Rhodes Scholorఐన గిరీష్ కర్నాడ్ 19-5-1938 న మహారాష్ట్ర లోని మదేరాలో  జన్మించి ,10-6-2019 న  బెంగళూరు లో 81 వ ఏట మరణించాడు . విద్యాభ్యాసం కర్ణాటకలోని శిరసిలో ,దార్వాడలో జరిగింది .రోడ్స్ స్కాలర్షిప్ పొంది ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చదివాడు అక్కడి ఆక్స్ ఫర్డ్ డిబేట్ క్లబ్ కు అధ్యక్షుడై ఆసియాలోనే మొదటి అధ్యక్షుడి రికార్డ్ సృష్టించాడు .అమెరికా చికాగో యూని వర్సిటి విజిటింగ్ లెక్చరర్ గా ఉన్నాడు .ఇంగ్లాండ్ నెహ్రు సెంటర్ కు డైరెక్టర్ గా  పని చేశాడు

తుగ్లక్ ,హయవదన ,వెడ్డింగ్ ఆల్బం ,యయాతి  నాగమండల ,బాలి ,అగ్నిమత్తు మాలే,ఓడకలు బింబ ,అన్జుమల్లిగే,మా నిషాద ,టిప్పు విన కనసుగలు (టిప్పు సుల్తాన్ కలలు)తలెదండ ,హిట్టిన హుంజ  నాటక రచనల తో   గొప్ప కన్నడ నాటక రచయితగా గుర్తింపు పొందాడు .తన రచనలను తానె ఇంగ్లీష్ లోకి అనువాదం చేసుకొన్న ద్విభాషా పండితుడు . అప్పటిదాకా కర్నాటక సాహిత్యం పై ఇంగ్లీష్ ప్రభావం ఉండేది .దీన్ని తొలగించి నేటివ్ సాహిత్యాన్ని అందలం ఎక్కించాడు .బెంగాల్ లో బాదల్ సర్కార్ ,మరాఠీ లో విజయ్ టెండూల్కర్ ,హిందీలో మోహన్ రాకేశ్ లు యెంత స్థాయి రచయితలో గిరీష్ కర్నాడ్ కన్నడం లో అంతే స్థాయి రచయిత .చరిత్ర ,పౌరాణికాలను కలిపి  ఆధునికత దట్టించి రాసిన రచనలు ఆయనవి .ఆయన నాటకాలను ప్రముఖ దర్శకులు ఇబ్రహీం హల్కాజి ,బి.వి.కార౦త్ ,సత్యదేవ్ దూబే మొదలైనవారు ఇతరభాషలలోకి అనువదించి డైరెక్ట్ చేశారు .

కన్నడ రచయిత యు ఆర్ అనంతమూర్తి రాసిన నవలను ‘’సంస్కార ‘’సినిమాగా తీశాడు .దీనికి డైరెక్టర్ ‘’పఠాభి’’అని అందరూ పిలిచే తిక్కవరపు పట్టాభి రామరెడ్డి .దీనికి ‘’ప్రెసిడెంట్ గోల్డెన్ లోటస్ ‘’అవార్డ్ వచ్చింది .1971లో ఎస్.ఎల్ భైరప్ప కన్నడ రచన ను ‘’వంశ వృక్ష ‘’తీసి డైరెక్ట్ చేశాడు .డైరెక్షన్ కు ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది .గోధూళి ,ఉత్సవ్ సినిమాలకు దర్శకత్వం వహించి గొప్ప డైరెక్టర్ గా రుజువు చేసుకొన్నాడు .ఒకరకంగా ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ .అతని ‘’ఒందానొందు కాలదల్లి ‘’చెలువి ,కాడు సినిమాలు హృదయాలకు చేరువయ్యాయి .కన్నడ రచయిత కు .వెంపు నవల ఆధారంగా ‘’హెగ్గదతి’’డైరెక్ట్ చేశాడు .నిశాంత్ మంథన్,స్వామి ,పుకార్ చిత్రాలు గొప్ప చిత్రాలుగా పేరుపొందాయి .మొత్తం మీద నాలుగు ఫిలిం ఫేం అవార్డ్ లు అందుకొన్నాడు .కన్నడ సాహిత్యానికి అందులోనూ నాటక సాహిత్యానికి చేసిన సేవకు మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాడు  ఆ అవార్డ్ తనకన్నా మరాఠీ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ కు ఇచ్చి వుంటే బాగుండేది అన్న వినయ శీలి ఇద్దరు కన్నడ జ్ఞాన పీఠ అవార్డీ ల రచనలను తెరకెక్కించిన ఘనత కూడా ఆయనదే .

 దూర దర్శన్ లో ‘’టర్నింగ్ పాయింట్ ‘’ అనే సైన్స్ మేగజైన్ ను 1991లో నిర్వహించాడు .ప్రముఖ రచయిత ఆర్ కే నారాయణ్  రాసిన’’ మాల్గుడి డేస్’’టెలి సీరియల్ లో  కుర్రాడు స్వామి కి తండ్రిగా నటించాడు .కన్నడ భక్తకవులైన కనకదాసు పురందరదాసు లపై ఇంగ్లీష్ లో ‘’కనక-పురందర ‘’డాక్యుమెంటరి తీసిన మట్టిమనిషి కర్నాడ్ .

 కర్నాటక స్టేట్ అవార్డ్ ,గుబ్బి వీరన్న అవార్డ్ ,కేంద్రనాటక సంగీత అవార్డ్ ,పద్మశ్రీ ,పద్మభూషణ్ పురస్కారాలు పొందాడు .2008-09 సంవత్సరం లో  లో జీవన సాఫల్య పురస్కారం అయిన పుట్టన్న అవార్డ్ ఇచ్చినా , తిరస్కరించాడు .

  తెలుగు లో కూడా  ధర్మ చక్రం ,శంకర్ దాదా ,ఆనందభైరవి ,ప్రేమికుడు ,రక్షకుడు సినిమాలలో నటించాడు .  వ్యక్తి స్వేచ్చకు, పత్రికా స్వేచకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడు. నిరశన గళం విని పించేవాడు .ఆరోగ్యంసహకరించకపోయినా ,శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నా ,వీపున ఆక్సిజన్ సిలిండర్ తో ప్రత్యక్షమై సంఘీభావం ప్రకటించే స్వేచ్చా ప్రియుడు   రక్షకుడు గిరీష్ కర్నాడ్ .

 సుమారు పాతిక ఏళ్ళక్రితం మా ఉయ్యూరు స్టేట్ బాంక్ లో పని చేసిన సుబ్రహ్మణ్యం అనే అతను, స్నేహితులు కలిసి ఫిలిం క్లబ్ స్థాపించి  నెలకు ఒకటి రెండు ఆర్ట్ సినిమాలు ప్రదర్శించేవారు .సంవత్సరానికి ఇంటికి రెండువందల రూపాయలు  మెంబర్ షిప్ .ఇంట్లోని వారు అందరూ  వెళ్లి చూడచ్చు .అప్పుడు  గిరీష్ కర్నాడ్  సినిమాలు ,సత్యజిత్ రే  కళాఖండాలు , హిందీ  తెలుగు తమిళ పంజాబీ ఆర్ట్ సినిమాలు  చూసే అదృష్టం నాకు కలిగింది .ఇది మరచిపోలేని అనుభవం .

6- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందిన మహిళా దర్శకురాలు –విజయ నిర్మల

రామారావు తీసిన పాండురంగ మహాత్మ్యం లో బాలనటిగా రంగప్రవేశం చేసి కృష్ణుడి వేషం తో మెప్పించి ‘’పెద్దాయన ‘’తో కృష్ణా అని పిలిపించుకొని బిఎన్ రెడ్డి రంగుల రాట్రం చిత్రం లో చంద్రమోహన్  చెల్లెలుగా నటించి అతనిచే ‘’నాకు తోడబుట్టని చెల్లి ‘’అని పించుకొన్న నటి  డేరింగ్ ,డాషింగ్ దర్శకురాలు ,అందరికి’’ మేడం ‘’ తనకు పెళ్లి అయి పిల్లాడు ఉన్నా ,కృష్ణకూ అలాగే సంతానం ఉన్నా అతన్ని పెళ్ళాడి ,ఇరువైపులా వారిని రెండు కళ్ళుగా  చూసుకొంటూ ,పొరపొచ్చాలు లేకుండా సుమారు యాభై ఏళ్ళు ఆదర్శ దంపతులుగా జీవించిన విజయ నిర్మల జీవితం చారిత్రాత్మకం .ధన్యం స్పూర్తిదాయకం .

  20-6-1946న జన్మించిన విజయ నిర్మల 73 వ ఏట 27-6-2019 న మరణించింది .నిడదవోలు ఇంటిపేరున్న బ్రాహ్మణ కుటుంబం లో పుట్టింది. ప్రముఖ పరిశోధకుడు నిడదవోలు వెంకటరావుగారు పెదతండ్రి .వెంకటరావు గారిమనవరాలు నటి జయసుధ .ప్రఖ్యాత గాయకురాలుశ్రీమతి  బాలసరస్వతి విజయనిర్మల తండ్రికి సోదరి కనుక వదిన అవుతుంది . తెలుగు తమిళ మళయాళ సినిమాలలో  ప్రముఖ నటులందరితో నటించి,ఎవరిదగ్గరా అసిస్టెంట్ గా పని చేయకుండానే సూటిగా దర్శకురాలైంది .

  చాలా చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ చేసింది .మళయాళ సినిమా ‘’కవిత ‘’కు 1973లో దర్శకురాలు .అప్పుడే తెలుగులో ‘’మీనా ‘’సినిమాకు డైరెక్టర్ .మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించి ,27 సినిమాలకు మాత్రమె డైరెక్టర్ అయిన  ఇటలీ దర్శకురాలి ని మించి, గిన్నిస్ బుకాఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందింది .భర్త కృష్ణ  నటించిన 30 సినిమాల డైరెక్టర్ ఆమె .ఆయనతో 51సినిమాలు చేసింది .భానుమతి తర్వాత రెండవ మహిళా దర్శకురాలు విజయ నిర్మల .2008లో రఘుపతి వెంకయ్య అవార్డ్ మాత్రమె పొందింది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె ప్రతిభను గుర్తించకపోవటం శోచనీయం .వ్యవసాయం చాలా ఇష్టం పండించటం ,పెంచటం ,పంచటం ఆమె హాబీ .హోటల్ మేనేజిమెంట్ లో నిపుణురాలు ‘’నవీన్ ఇంటర్నేషనల్ ‘’అనే త్రీ స్టార్ హోటల్ యజమాని .విజయ కృష్ణ డబ్బింగ్ దియేటర్ నిర్వహించింది .ప్లానెట్ 10పేరుతొ ఫామిలీ క్లబ్ స్థాపించి నడిపింది .విద్యాలయాలు నెలకొల్పింది .బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందింది .

  ఈ జంటతీసిన  ఆమె డైరెక్ట్ చేసిన ‘’దేవదాసు ‘’కలర్ సినిమా మంచి ప్రమాణాలతో ఉన్నా ,అక్కినేని అక్కసుతో తన దేవదాసును అదే సమయం లో విడుదలచేసి దెబ్బ తీశాడని సినీ ప్రపంచం గగ్గోలు పెట్టింది .’’ఇక డైరెక్షన్ జోలికి వెళ్ళను ‘’అని తీర్మాని౦చు కొన్న ఆమె మనసుమార్చి జయాపజయాలకు భయపడరాదని ధైర్యం చెప్పి కృష్ణ  మళ్ళీ  మెగాఫోన్ పట్టేట్లు చేశాడు .అల్లూరి సీతారామ రాజు డైరెక్టర్ వి .రామచంద్రరావు సగం సినిమా తీసి  అకస్మాత్తుగా చనిపోతే విజయనిర్మలే మిగతా సినిమాకు దర్శకత్వం చేసిందని కృష్ణ చెప్పాడు అంతటి సమర్ధురాలు .గొప్పగా నటించేది నటి౦ప జేసేది .అన్నీ సక్సేస్ సాధించిన సినిమాలే ఆమెవి .పద్మ పురస్కారం రాకపోవటం విచారకరం .

7-సీమసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన డా యెన్ .రామ చంద్రరావు

ప్రముఖ రచయితా,రాయల సీమ సాహితీ మండలి అధ్యక్షుడు గా చాలా సాహిత్య సభలు నిర్వహించిన డా యెన్ .రామ చంద్రరావు రాయల సీమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయిత కార్యశీలి .’’తెలుగుభాష ప్రాచీన హోదా తక్షణ కర్తవ్యమ్ ‘’పై నిర్వహించిన పోటీలో, జాతీయ స్థాయి కధానికా పోటీలలో సోమేపల్లి వారి పురస్కారం అందుకొన్న సమర్ధుడు.పురస్కార ప్రదానోత్సవానికి రావాల్సి ఉండగా వయసు, అనారోగ్యం వలన రాలేక పోయారు .జూన్ 29న మరణించారు  .ఇంతకంటే వివరాలు తెలియదు .

8-మొదటి మాంటిస్సొరి స్కూల్ స్థాపకురాలు ,రచయిత్రి సాంఘిక సేవా తత్పరురాలు పద్మశ్రీ శ్రీమతి వి .కోటేశ్వరమ్మ

5-3-1925న కృష్ణాజిల్లా గోసాలలో జన్మించిన శ్రీమతి కోటేశ్వరమ్మ 1-7-2019న 93వ ఏట మరణించింది ..కాకినాడలో చదివి ,తెలుగు ఏం ఎచేసి ,1979-80లో నాగార్జున యూని వర్సిటి నుంచి పిహెచ్ డి పొందింది .బెజవాడ నెల్లూరులలో కొంతకాలం సైన్స్ టీచర్ గా పని చేసింది .1955లో విజయవాడలో చిల్డ్రన్స్ మాంటిస్సొరి స్కూల్ ను ఇంటింటికి తిరిగి తలిదండ్రులను ఒప్పించి 10మంది పిల్లలతో స్థాపించింది .అది దినదిన ప్రవర్ధమానమై అప్పర్ ప్రైమరీ ,హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి సాధించి ,ఇంజనీరింగ్ ,కాలేజీ నీ ఏర్పాటు చేసి ,ఫార్మసి ,ఏం బి ఏ ,ఏం సి ఏ ఫిజియో దేరపి కోర్సులకు నిలయమైన విద్యా కల్ప వృక్షం గా మారింది ‘.ప్రాచీన కళారూపాలపై శిక్షణ నిచ్చింది .

మంచి రచయితకూడా అయిన కోటేశ్వరమ్మ ‘’భారత దేశం లో స్త్రీలు,నేటి మహిళాప్రపంచం ,జాతి జ్యోతులు వంటి ఉపయుక్తమైన 37పుస్తకాలు రాసింది  .మహిళా చైతన్యం కోసం శ్రమించింది .తెలుగు సాహిత్యం పై చాలా జాతీయ సదస్సులు నిర్వహించింది .1945 లో బెజవాడలో గ్రాడ్యుయేట్ అయిన తొలిమహిళగారికార్డ్ స్థాపించింది .ఎన్నో అవార్డ్ లు రివార్డ్ లు ఆమె సొంతం అయ్యాయి 92వ ఏట ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది .2015లో ‘’విద్యా సాంఘిక సేవలకు ‘’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ‘’లో స్థానం లభించింది .

  కోటేశ్వరమ్మగారి భర్త విజయవాడ లయోలా కాలేజి ఫిజిక్స్ హెడ్ .ఆయన ఇంటర్ డిగ్రీలకు ఫిజిక్స్ బుక్స్, గైడ్స్ రాసేవాడు .మంచి బోధకుడుగా గుర్తింపు పొందారు .

9-15 ఏళ్ళు ధిల్లీ ని పాలి౦చిన ముఖ్యమంత్రి- శ్రీమతి షీలా దీక్షిత్

పంజాబ్ లో షీలా కౌర్ గా 31-3-1938లో జన్మించి,ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉమాశంకర్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నాయకడు,కోశాధికారి కొడుకు వినోద్ దీక్షిత్ ను పెళ్ళాడి షీలా దీక్షిత్ అయి ,నాలుగుసార్లు ధిల్లీ ముఖ్యమంత్రిగా చేసి 20-7-2019న 81ఏళ్ళ వయసులో మరణించింది .

 షీలా దీక్షిత్ ఢిల్లీ యూని వర్సిటి హిస్టరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ .మూడుసార్లు కాంగ్రెస్  పార్టీని గెలిపించి ఢిల్లీ పీఠం కట్టబెట్టిన యోద్ధ .అలుపెరుగని కార్యశీలి .ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రివర్గం లో కేంద్రమంత్రిగా 1984లోపని చేసింది .ఉత్తరప్రదేశ్ కన్నోజ్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికైంది .2014లో కేరళ గవర్నర్  అయింది  .యునైటెడ్ నేషన్స్ లో ‘’కమిషన్ ఆఫ్ స్టేటస్ ఫర్ వుమెన్ ‘’కు రిప్ర రెంటటివ్’’గా ఉన్నది .ఉత్తరప్రదేశ్ లో స్త్రీలపై జరిగిన దౌర్జన్యాలను నిరసనగా82మంది మహళలతోకలిసి 23రోజులు నిరసన దీక్ష నిర్వహించి ప్రభుత్వాన్ని లొంగ దీసింది  . తెగువకల మహిళా నాయకురాలిగా ఎందరికో స్పూర్తిగా షీలాదీక్షిత్ .మార్గదర్శనం చేసింది .

10-రచయిత,విమర్శకుడు సంస్కృతాంధ్ర భాషావేత్త ,పత్రికాసంపాదకుడు , ఆకాశవాణి   అసిస్టెంట్ డైరెక్టర్ –శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

తూ .గో.జి. రామ చంద్రాపురం లో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 29-5-1944 న జన్మించి 25-7-2019న హైదరాబాద్ లో 75వ ఏట మరణించాడు .తండ్రి హనుమచ్చాస్త్రి పేరుమోసిన కవి పండితుడు .భార్య జానకీబాల నవలా కదా రచయిత్రి విమర్శకురాలు .కొడుకు మోహన కృష్ణ ‘’అష్టా చెమ్మా ‘’సినిమాతో పాటు  ,అనేక హిట్ చిత్రాల దర్శకుడుగా ప్రసిద్ధుడు .అంటే శర్మ తండ్రికి తగ్గ కొడుకు .భార్య భర్తకు తగిన భార్య. కొడుకు మళ్ళీ తండ్రికి తగిన తనయుడు అన్నమాట .

  తెలుగు ఎం .ఏ.డిగ్రీ పాసైన శర్మ విద్యార్ధి దశలోనే రచనలో అడుగుపెట్టాడు .ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్ గా 1969-76 మధ్య పని చేసి ఎందరో రచయితలకు కవులకు ప్రోత్సాహమిచ్చాడు .అభ్యుదయవాదిగా ప్రసిద్ధి పొందాడు .1976లో విజయవాడ ఆకాశవాణి లో అసిస్టెంట్ ఎడిటర్ (స్క్రిప్ట్స్ )చేరి ఉషశ్రీకి సహాయకుడిగా ఉన్నాడు .సంస్కృతం లో మంచి పట్టు ఉన్న శర్మ  సంస్కృత కార్యక్రమాల రూపకల్పనకు ప్రసారానికి ఇతోధిక కృషి చేశాడు .ఎన్నో సంస్కృత నాటకాలు అతనికాలం లోరూపుదాల్చి ప్రసారమై రెడియోకేంద్రానికి జాతీయస్థాయిలో అవార్డ్ లు  వచ్చాయి  .అప్పుడు స్టేషన్ డైరెక్టర్ శ్రీ రజనీ కాంతారావు గారు ఉండటం  ,ఈ ముగ్గురు ఉన్న ఆకాలం స్వర్ణయుగం అనిపించింది .

    శ్రీకాంత శర్మ కవితలు విమర్శలు నాటికలు ,పాటలు నవలలు రాసిన సాహితీ మూర్తి .అనేక  డాక్యు మెంటరీలు ,సంగీత రూపకాలు రచించాడు.1994లో నిజామాబాద్ రేడియో కేంద్రం ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా వెళ్లి 1995 వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ఎడిటర్ గా చేరాడు .కొన్ని సినిమాలకు పాటలు రాశాడు అందులో బాపు గారి కృష్ణావతారం   జంధ్యాల నెలవంక ,రావు –గోపాలరావు మొదలైనవి లైనవి ఉన్నాయి మొత్తం 30పాటలే రాసినా ఆణిముత్యాలనిపించాయి .నెలవంక కు అన్నిపాటలూ రాయించాడు జంధ్యాల .అనేక అవార్డ్ లు రివార్డ్ లు అందుకొన్నాడు .74 వ ఏట అంటే ఏడాది క్రితం కొడుకు మోహన  కృష్ణ  సినిమా ‘’సమ్మోహనం ‘’కు  సమ్మోహ పరచే పాట రాశాడు .

  శర్మ రెడియోకోసం రాసిన గీతం ‘’తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదము ‘’అనే పాట విస్తృత ప్రచారమై ,ప్రతి ఇంటా మారుమోగి తెలుగు వారికి జాతీయగీతమైంది .’’ఇంటిపేరు ఇంద్రగంటి ‘’అనే ఆత్మకథ రాసుకొన్నాడు .’ఆతను రాసిన ‘’హరహర మహా దేవ నాటిక ‘’అనేక ప్రదర్శనలు పొందింది .ఇందులో నటించిన శర్మ, పాండురంగ ,కోట శంకరరావు లకు అవార్డుల వర్షమే కురిసింది .’’అప్పు సత్యాగ్రహం ‘’అనే నాటిక ఇటీవలే బెజవాడ రెడియోకేంద్రం నుంచి ప్రసారమైంది .

  ఉయ్యూరు హైస్కూల్ లో నేనూ  ప్రముకః సాహితీ విమర్స్ఝాకుడు విశ్లేషకుడు  శ్రీ శ్రీ పై అధారిటి  ఉన్న టి.ఎల్ .కాంతారావు సైన్స్ మేస్టర్లుగా పని చేసినప్పుడు మాసైన్స్ రూమ్ సాహితీ కేంద్రం గా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం .మేమందరం కలిసి ‘’వేమన త్రిశతి జయంతి ‘’ఘనంగా జరిపి ,ఇంద్రగంటి శీకాంత శర్మను అధ్యక్షుడిగా ,ఈ తరం ఇంటలెక్ట్ డా జి వి కృష్ణారావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఆయన ప్రసంగం ఏర్పాటు చేసి , ఘనంగా సత్కరించాం .శ్రీఅద్దేపల్లి రామమోహనరావుగారినీ ఆహ్వానించి మాట్లాడి౦ చాం  .ఆరోజు అంతా శ్రీ కాంత శర్మగారు మాతోనే ఉండి  మా ఇంట్లో అందరం భోజనం చేశాం. రాత్రి కూడా మా ఇంట్లోనే పడుకున్నారు నేనూ కాంతారావు అద్దేపల్లి ,పసుమర్తి ఆ౦జనేయ శాస్త్రి శర్మతో కబుర్లు చెబుతూ ఆయన చెప్పినవి వింటూ  తెల్లవార్లూ గడిపిన మధుర క్షణాలు మర్చి పోలేనివి .ఆది అంతా ఆయన సౌజన్యమే .సుమారు పదేళ్ళ క్రితం హైదరాబాద్ లో  అమెరికా చిట్టెన్ రాజు గారు ‘’బాపు రమణ ల స్నేహ షష్టి మహోత్సవం’’ తెలుగు మహాసభలు కలిపి త్యాగరాజ గాన సభలో నిర్వహించినపుడు ఇంద్రగంటిని కలిసి  నా పేరు చెప్పగానే ఉయ్యూరు అనుభవం అంతా గుర్తు చేసుకొన్నాడు .ఆతర్వాత ఎపుడు సభలో కలిసినా పేరు పెట్టి పిలిచి యోగ క్షేఆలు అడిగేవాడు .ఇలాంటి సహృదయుల పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తాను .

  దశావతారాలని పించే పై ప్రముఖులకు మరొక సారి అక్షర నివాళి అర్పిస్తూ ,  ఇంతమంది ప్రసిద్ధులకు ఒకే వేదికపై నివాళి అర్పించే అవకాశ౦  ఆంద్ర దేశం లో ఏ సాహితీ సంస్థకురాలేదని,  ఏ సంస్థా చేయని పని సరసభారతికి దక్కిందని విషాదంగా నే అంగీకరిస్తూ  వారి స్పూర్తి మనలను చిరకాలం మార్గ దర్శన౦ చేయాలని  సవినయంగా మనవి చేస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-19-ఉయ్యూరు

—


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు

అష్టావధాని  ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు

గుంటూరు జిల్లా రావెల గ్రామం లో 27-6-1920న జన్మించిన శ్రీ పూసపాటి నాగేశ్వర రావు తలిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ ,,శ్రీ బ్రహ్మయ్య .రావెల గ్రామం కవి బ్రహ్మ తిక్కన సోమయాజి మనుమరాలు  చిట్టా౦బిక మెట్టినిల్లు ,భర్త అల్లాడ మంత్రి .అల్లాడమంత్రిని గురించి ఆయనమనుమడు మడికి సింగన తన ‘’వాసిష్ట రామాయణం ‘’లో పేర్కొని ‘’కృష్ణానదీ దక్షిణ తటమున ధన్యలీల నలరు రావెల యను నగ్రహారము ‘’అని ఈ గ్రామ గురించి రాశాడు . బాలమేధావి అవటం తో మనకవి గారు మూడేళ్లకే అక్షరాలునేర్చి రామాయణం చదివి అందర్నీ ఆశ్చర్య పరచారు .స్వగ్రామం లోమేనేజిమెంట్ స్కూల్ లో ప్రాధమిక విద్య చదివి ,సత్తెనపల్లి లో ధర్డ్ ఫారం పూర్తి చేశారు .గుంటూరు మిషన్ స్కూల్ లో తొమ్మిది చదువుతూ కవిత్వా భినివేశం లో కూరుకుపోయి ఎస్సే సెల్సి. తప్పి తర్వాత పాసయ్యారు.7వ తరగతి నుంచి కవిత్వం అల్లటం వచ్చి,16వ ఏట27పద్యాల  ‘’విశ్వకర్మ తారావళి ‘’రాశారు .చదువు ఆపి మళ్ళీ స్వంతవూరు, స్వంతస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ శ్రీమతి ఈశ్వరమ్మను పెళ్ళాడి ,సంతానం పొంది ,స్వయం కృషితో ఆంద్ర ఆంగ్ల  సంస్కృత భాషలలో పట్టు సాధించి ‘’శిల్ప సుందరి ‘’ఖండకావ్యం రాసి 1946లో నూజివీడు జమీందార్ కుమారరాజా కు అంకితమిచ్చారు .

 రావెల  బోర్డ్ హైస్కూల్ లో 1951లో గ్రేడ్ -2 తెలుగు పండిట్ గా చేరి ,ఒక ఏడాది చేసి ,పిడుగు రాళ్ళ  దగ్గర పిల్లుట్ల లో అనాధ శరణాలయ హైస్కూల్ లో పని చేసి 1954లో రాజీనామా చేశారు  .ఇక్కడే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం ఆయనకు సహ ఉపాధ్యాయుడు .తర్వాత ఫిరంగిపురం లో పని చేసి ,మంగళగిరిలో కనకయ్య హైస్కూల్ లో గ్రేడ్ వన్ పండిట్ అయ్యారు .ఇది హయ్యర్ సెకండరీ గా మారాక  హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటిలో   షార్ట్ టర్మ్ కోర్స్ చేసి ,ప్రధాన తెలుగు పండిట్ గా ఉండి30-6-1976న రిటైరయ్యారు .

  ఇప్పటికే అనేక ఖండకావ్యాలు రాసిన రావు ‘’శ్రీ వీర బ్రహ్మేంద్ర చరిత్ర ‘’ను చంపూ కావ్యంగా రాయటం ప్రారంభించి ,1973లో ముగించి ,తలిదండ్రులు శ్రీ పేరయ్య ,శ్రీమతి ఈశ్వరమ్మలకు అంకితమిచ్చి  ముద్రించారు .21-11-1973న  ,, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి ,కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య ,శ్రీ పోకూరి కాశీపత్యవధానులు ,,శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ,శ్రీ యర్రోజు మాధవాచార్యులు వంటి ఉద్దండ కవి పండితుల సమక్షం లో ఆవిష్కరణ జరిపించారు .

‘’సహజ కవి పంచానన ,కవి శేఖర ,అవధాని శిరోమణి,కవి బ్రహ్మ  బిరుదాంకితులైన రావుగారు కవి గండర పెండార  సన్మానితులు .

  రావు గారి ‘’శిల్ప సుందరి ‘’ఖండకావ్యం లో విగ్రహ నిర్మాణం, దేవాలయ నిర్మాణం , యజ్నవేది నిర్మాణం మొదలైన వన్నీ శిల్పానికి చెందినవే అని ,శిల్పం అభివృద్ధి ,సుభిక్షతకు సంకేతమని  చెప్పారు .’’ఆదర్శ పద్మిని ‘’కావ్యం  చిత్తూర్ రాణి పద్మిని కథ.ఇది విశ్వ విద్యాలయం లో పాఠ్య గ్రంథమైంది .మహాకావ్యమైన ‘’శ్రీ వీర బ్రహ్మేంద్ర చరిత్ర ‘’విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దివ్య చరితమే .శ్రీ వాసవీ కన్యకా చరిత్ర పెనుగొండ వాసవీ అమ్మవారి చరిత్ర .రావు గారు పద్యంలోనే కాదు వచనం లోనూ మేటి.  సవ్యసాచి .’’గుర్రం వీర గోపాల కృష్ణారెడ్ల చరిత్ర ‘’వచనం లో రాశారు .రావు గారుఅనేక గ్రంథాలకు పరిచయం రాసి రచయితలను ప్రోత్సహించారు .

  పూసపాటి వారికి కవిత్వం నల్లేరు పై బండి .క౦దాలను అందంగా చెక్కారు .పద్య రహస్యం తెలిసిన శిల్పి. అందుకే ఆయనపద్యం కమ్మచ్చు తీర్చినట్లు ఉంటుంది .పండిత ,పామరులను అలరిస్తుంది  .ఛందో వైవిధ్యం చూపారు .’’చంపకమాలికా బంధం’’ తో పద్యానికి పరిమళం అద్దారు . సామాజిక స్పృహ  కోల్పోని కవి,అవధాని .

  కవి గారు గొప్ప అవధాని .డా .ఇలపావులూరి పాండురంగారావు ,మహీధర రామమోహనరావు ల ప్రశంసలు పొందారు .1975లో మంగళగిరి లో ప్రారంభమైన అవధాన యాత్ర చివరిదాకా కొనసాగింది .ఉద్యోగ విరమణ తర్వాత అష్టావదానాలు బాగా ఊపు అందుకొన్నాయి .సమస్యలను బహు చమత్కారంగా పూరి౦చేవారు . అనేక పట్టణాలలో ఘన సన్మానాలు  అందుకొన్నారు .గండ పెండార సమయం లో వినయంగా పూసపాటి వారు చెప్పినపద్యం –

‘’కవి గండ పెండరం బిది –యవునేనియు సుకవి పండితాభి నవాశీః

ప్రవచన పవిత్ర రక్షా –కవచముగ ధరింతు నేను గయి మోడ్పుతోన్’’అని చెప్పిన నిగర్వి.

‘’నా కేలా వెనుకంజ ! బ్రహ్మగురు రాణ్మందార  మారంద ధా-రా కారుణ్యము ,విశ్వనాథ కవి సమ్రాణ్మంగళాశీ స్సుధా

వాకో వాక్యము ,మాధవాభయకర ప్రాబల్య ముత్సాహ రే-ఖా కల్పంబగు,హేమ నూపుర ,ఝణ త్కారంబు తోరంబుగన్ ‘’అని విశ్వనాథకు మాధవాచార్యులకు వినయ కుసుమాంజలి ఘటించిన వినయ శీలి .

‘’అంబుధి గంభీరాశయు –డంబేద్కరు శాత జయంతి యనగా ,వినగా

సంబరమగు హృదయంబున –కంబర మున కెగయు మానవాభ్యుదయ రుచుల్ ‘’అని బాబాసాహెబ్ హృదయాన్ని ఆవిష్కరించారు .

‘’శంకరు డుగ్ర రూపమున జంపె ,విభీషణు,రావణానుజున్ ‘’అని ఇచ్చిన సమస్యకు పూసపాటి అవధానిగారి పూరణం రసరమ్యంగా ఉంది –

‘’సా౦కవ  గంధి యైన యమ సంగతి జేర్పగ నున్నయట్టిమీ-నా౦ కుని , దేవదేవుడు  హిమాచల మందుననేమి సేసె?ని

శ్శంకత రామ చంద్రు ని ప్రసన్నకటాక్షమె వాని నేలెనో- ’శంకరు డుగ్ర రూపమున జంపె ,విభీషణు,రావణానుజున్.

 ఉమాదేవికి దగ్గర చేద్దామని ప్రయత్నించిన మన్మధుడిని శివుడు చంపాడు .సహాయం కోరిన రావణు తమ్ముడు విభీషణుడిని అనుమానం లేకుండా శ్రీ రాముడు రక్షించాడు అని భావం .

కొత్త ధిల్లీ పూసా లో భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ లో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన 25-8-1978న పూసపాటి వారి అష్టావధాన కార్యక్రమం జరిగింది .యూనియన్ పబిక్ సర్వీస్ సభ్యులు డా ఇలపావులూరి పాండురంగారావు సభాధక్షులు ,అప్పుడు అవధాని

‘’శ్రీ కృష్ణ జన్మ దినమున –నాకును సమకూడె హస్తినాపురి నవదా

నైకోద్యమంబు ,కవి బుధ –లోకోత్సవ మగుత ,మా తెలుగు తల్లి దయన్ ‘’అని కైమోడ్పు ఘటించారు .అవధానం దిగ్విజమైంది . సభను అలంకరించిన  డా మహీధర రామమోహనరావు ‘’పూసపాటి వారి అవధానం తిరుపతికవుల అవధానానం కోవలో ఉంది ‘’అని మెచ్చారు .

డా ఇలపావులూరి వారు అవధాని అవధాన సరళిని పద్యంలో కమ్మగా చెప్పి ప్రశంసించారు –

‘’తత గీతితోనోటితాకుగా సాగించె-నాశుదారలు సునాయాసముగను

శివలీల స్మరియించి ,చిన్న చిక్కులు దీర్చి –కోరిన వర్ణనల్ కూర్చి చెప్పె

‘’నాతి జాతికి కోతిమూతి ‘’నేర్చిన దత్త –పద విధి కధిక సంపద ను గూర్చె

ప్రత్యక్షర నిషేధ బాధల నవలీల –దాటి కందాల నందలము గూర్చె

మధ్యమధ్య పురాణ గాథలలోని-అర్ధ గంభీర్యంబు నదికి చెప్పె-

అప్రస్తుతము గూడ సుప్రసిద్ధము గాగ –సరస సంభాషణా సక్తిజూపె

నడుమ నెడనెడ మృడుని సవ్వడులు వోలె- జెవిని జేర్చి,గంటల లెక్క చెప్పజాలె

విందుగా నున్న దవదాన విద్యయనగ-బలికె నవధాని నాగేశ పండితుడు ‘’

ఉ-‘’నశ్వర భాగ్యములు ,నశ్యముతో జమకట్టి ,యీమహిన్ –శాశ్వత సాహితీ గరిమ సాధన చేసిన పూసపాటి నా

గేశ్వర సత్కవీశ్వరుని ,క్షీర సముద్ర వినిద్ర ముద్ర ,కా –మేశ్వరి సత్కరించుత,సమీర కుమారవచశ్చు చిస్మితిన్’’

అనగానే సభాప్రాంగణం కరతాళ ధ్వనులతో   మారుమ్రోగి అవధాన సరస్వతీ  జయజయ ధ్వానాలయ్యాయి . ఇది పూసపాటి వారి జీవితంలో మరపు రాని ఘట్టం .

వీర బ్రహ్మేశ్వర శతకం లో ఒక పద్యం –

‘’హితమాలి౦పనివారలే బధిరు లిస్సి !నీతి బోనాడి దు-ర్గతుల౦ గానని వారె యంధులు ,తగంగాసత్య మూహించి యున్

ప్రతి వాదోత్కటభీతి న్యాయము వచి౦ప౦ బోని  వార్మూగ ,లా –రస్కారిజనంబె,వానరులు ,వీర బ్రహ్మ సర్వేశ్వరా ‘’

పూసపాటి కవి చంద్రులు నాగేశ్వరరావు గారు 74 వ ఏట లింగైక్యం పొందారు .

ఇంతటి గొప్ప కవి ,ప్రజ్ఞా శాలిని ఆంద్ర దేశం మర్చి పోయిందో లేక నేనే తెలుసుకోలేక పోయానో?

నాకు ఆప్తమిత్రుడు ,పామర్రు హైస్కూల్ సీనియర్ తెలుగుపందిట్ ,సాహితీ లోక రవి ,కన్నడ భాషా వేత్త శ్రీ నల్లూరి బసవలింగం గారు పూసపాటివారిపై రాసిన అనర్ఘ రత్నమైన

‘’మానికము రతనమనంగ మణి చెలంగు -నదియు సచ్చిద్రమైన పూసన దనర్చు ‘

కాని  యచ్చిద్రమణియును ,కవియు నైన –మిమ్ములను పూసపాటిగా నమ్ము టెట్లు”?

 పద్యాన్ని మెచ్చారు  నాగార్జున విశ్వ విద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ డా రావెల సాంబశివరావు .ఇందులో ఇద్దరిప్రతిభ జ్యోతకమౌతుంది .

ఆధారం-మిత్రుడు , కృష్ణాజిల్లాపరిషత్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ,పామర్రులో నాకు పరిచయం అయిన డా.శ్రీ పూసపాటి శంకరరావు  ,వాలంటరి రిటైర్మెంట్ తీసుకొని ,హైదరాబాద్ లో స్థిరపడి ,తెలుగు ఎం. ఏ .చేసి , పి.హెచ్ .డి. కోసం పూసపాటి వారిపై పరిశోధన చేసి,పి.హెచ్ .డి. 2015లో పొంది , వెలువరించి, నాకు 14-7-19ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో అందజేసిన  ‘’పూసపాటి నాగేశ్వర రావు  బహు ముఖీన ప్రతిభ ‘’ ఉద్గ్రంథం.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ  భాగవతార్

మాయవరం కృష్ణస్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా ,  ఆప్యాయంగా M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా  మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు త్యాగరాజ భాగవతార్ .

  తమిళనాడు తంజావూర్ జిల్లా మాయిల్ల దుత్తూర్ లో 1-3-1910లో విశ్వబ్రాహ్మణ కుటుంబం లో  జన్మించాడు భాగవతార్ .తండ్రి కృష్ణ స్వామి ఆచారి .కొంతకాలానికి కుటుంబం తిరుచునాపల్లికి చేరింది .బాల్యం లోనే చదువుమీద శ్రద్ధ చూపక గాయకుడు కావాలని కలలు కన్నాడు .కాని తలిదండ్రులు అది గౌరవమైన  వృత్తి కాదని ప్రోత్సహించలేదు .కాని ఒకసారి ఆంద్ర దేశం లోని కడపలో కొడుకు  వందలాది అభిమానుల సమక్షం లో పాటలు పాడుతూ ప్రశంసలు పొందటం చూసి తండ్రి సంగీతానికి ప్రోత్సహించాడు .  తర్వాత భజనలు భక్తి గీతాలు పాడి జనాలను అలరించాడు .

  తిరుచ్చి లో’’ రసిక  రంజన సభ  ‘’అనే ఔత్సాహిక సంస్థ నిర్వాహకుడు ఎఫ్.జి .నటేశ అయ్యర్ భాగవతార్ లో ఉన్న ‘’ఫైర్’’ గమనించి మొదటిసారి స్టేజిపై పాడే అవకాశం కలిగించాడు.తర్వాత తండ్రిని ఒప్పించి తన నాటకం హరిశ్చ౦ద్రలో ‘’లోహితాస్య ‘’పాత్రనిచ్చి నటి౦పజేశాడు .పది ఏళ్ళు మాత్రమె ఉన్న  భాగవతార్ గొప్పగా నటించి అందరి అభిమానం పొందాడు .అక్కడి అనుభవమున్న నటులు ,దర్శకుల  వద్ద శిక్షణ  పొందాడు ,కర్నాటక సంగీతాన్ని మదురై పొన్ను అయ్యంగార్ అనే గొప్ప  వయోలిన్  విద్వాంసుని వద్ద  ఆరేళ్ళు కఠోరశ్రమ  చేసి అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .

  1934లో వ్యాపార వేత్తలు లక్షణ చెట్టియార్ ,అలగప్ప చెట్టియార్ ,సినీ దర్శకుడు కే సుబ్రహ్మణ్యం లు భాగవతార్ అర్జునుడుగా నటించిన ‘’పావలక్కోడి ‘’పౌరాణిక నాటకం చూడటం జరిగింది .అతని నటనకు ముగ్ధుడై చెట్టియార్ ,భాగవతార్ ను అదే కధాంశం కల సినిమాలో హీరో పాత్రకు ఎంపిక చేసి మద్రాస్ అడయార్ లో చిత్రించి ,విడుదల చేయగా గొప్ప విజయం సాధించింది .దర్శకుడు సుబ్రహ్మణ్యం .భాగవతార్ రెండవ సినిమా  ఆ డై రెక్టర్ 1935లో తీసిన నవీన సారంగధర .మూడవ సినిమా భాగవతార్ స్వయంగా’’ట్రిచి త్యాగరాజ ఫిలిమ్స్ ‘’బానర్ పై 1936లో నటించి ,సమర్పించిన ‘’సత్య శీలం ‘’..ఇందులో మొదటిసారిగా ద్విపాత్రాభినయం కూడా చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు .అంటే సత్య శీలన్ పాత్రతో పాటు ,రాజ దర్బార్ లో ఆస్థాన గాయకపాత్ర కూడా ధరించాడు అన్నమాట .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు .వరుసగా చిత్రాలు వచ్చి వరించాయి .

   1937లో దర్శకుడు వై వి రావు తీసిన ‘’చింతామణి ‘’సినిమాలో’’ బిల్వమంగళుడు’’గా నటించాడు .ఈ సినిమా  అత్యద్భుత విజయం సాధించి  ఒక ఏడాది  నాన్ స్టాప్ గా ప్రదర్శింప బడి  కనక వర్షం కురిపించి తమిళలో  తొలి రికార్డ్ బ్రేక్ సినిమా అయింది .సినిమాలో భాగవతార్ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి .ఆ గానామృతానికి జేజేలు పలికారు ప్రేక్షక జనం .అందులోని ’’మాయాప్రపంచత్తి’’  పాటను ప్రతి గృహిణి ఇంట్లో కాఫీ చేస్తూ పాడేది ,భర్త ‘’రాధే ఉనక్కు  కోబం’’అనే పాటపాడేవాడు అని  తమిళ రచయిత కల్కి కృష్ణ మూర్తి రాశాడు ,అంటే భాగవతార్ సినిమా అంతటి ప్రభావం చూపిందన్నమాట .అయితే ఈ పాటలను సరస్వతి స్టోర్స్ వాళ్ళు గ్రామ ఫోన్ రికార్డ్ లు తెచ్చినా   దురదృష్ట వశాత్తు  వ్యాపార రహస్యాలు తెలియని భాగవతార్ పాడలేదు .ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ లు రాయల్ టాకీస్ వారు  సినిమాపై వచ్చిన డబ్బుతో మదురై లో సినిమా హాల్ కట్టి ‘’చింతామణి ‘’పేరు పెట్టారు  .

  అమెరికా దర్శకుడు ఎల్లిస్ ఆర్ డంకన్ భాగవతార్ నటుడుగా తీసిన ‘’అంబికా పతి ‘’సినిమా కూడా సక్సేస్ సాధించి రెండవ భారీ విజయం ఆయనఖాతాలో జమ చేసి,చింతామణి రికార్డ్ బ్రద్దలు చేసింది .1938లో శైవ మహాభక్తుడు శివ నీలకంఠ నయనార్ పాత్రను ‘’తిరు నీల కంఠార్   ‘’చిత్రం లో ధరించాడు .ఇలా 1937నుంచి 1944వరకు 7 ఏళ్ళు తమిళ సినీ రంగాన్ని ఏలాడు భాగవతార్ .విలాసవంతమైన భవనం నౌకర్లు చాకర్లు దానాలు ధర్మాలు తో ఇల్లు ఎప్పుడూ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉండేదని ,గుప్తదానాలు ఎన్నో చేశాడని ఎందరెందరికో సాయపడ్డాడని ,’’రోజూ పన్నీరు తో మాత్రమె స్నానం చేసేవాడని’’ ప్రముఖ సినీ విశ్లేషకుడు శ్రీ ఇమంది రామారావు చెప్పారు .అదొక స్వర్ణయుగం .

  గాయకుడుగా ఆయన భక్తి సంగీతానికే అధిక ప్రముఖ్యమిచ్చాడు .పాపనాశం శివన్ తో కలిసి ‘’ఉనయ్ అలై’’,నీలకంఠ,అంబా మనం కన్నిదు,జ్ఞానకాన్,సత్వ గుణ బోధన,రాజన్ మహారాజన్ ,కృష్ణా ముకుందా మురారి ,రాదే ఉనక్కు కొబం ఆగాదది,వసంత ఋతు వంటి ఎన్నో పాటలు రాసి పాడాడు .మొత్తం 14 సినిమాలలో నటిస్తే దాదాపు అన్నీ రికార్డ్ బ్రేకర్స్ అయ్యాయి .అందుకే తమిళ తొలి సూపర్ స్టార్ అయ్యాడు త్యాగరాజ భాగవతార్ .1944లో విడుదలైన ఆయన సినిమా ‘’హరిదాస్ ‘’మద్రాస్ బ్రాడ్వే దియేటర్ లో మూడేళ్ళు ప్రదర్శింప బడి అన్ని రికార్డ్ లను బద్దలు చేసింది .తమిళ సినీ రంగం లో తొలిద్విపాత్రాభినయనం చేసిన వారిలో మొదటివాడు భాగవతార్ కాగా, రెండవవాడు చెన్నప్ప గా  రికార్డ్ సృష్టించారు .

  1944లో భాగవతార్ ,కోయంబత్తూర్  స్టూడియోయజమాని శ్రీరాములు నాయుడు లపై లక్ష్మీ కాంతన్ హత్య కేసు విషయం లో అభి యోగం మోపబడి,అరెస్ట్ అయి , ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్లి మూడేళ్ళ తర్వాత 1947 ఏప్రిల్ లో భాగవతార్ విడుదలయ్యాడు .తర్వాత నటించిన సినిమాలుఅపజయం పాలైనాయి .ఆ నాటి ముఖ్యమంత్రి అన్నాదురై ,భాగవతార్ ను D.M.K. పార్టీలో చేరమని ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా  జీవితాంతం భక్తుడుగానే ఉండిపోయాడు .భాగవతార్ సినిమాలకు కచేరీలకు దూరమైనకాలం  అన్నాదురైకి బాగా కలిసొచ్చి తనపార్టీ ని విపరీతంగా పెంచుకొనే అవకాశం వచ్చింది .

  జీవిత చరమాంకం లో దేవుడు ,గుళ్ళు పై ఆసక్తికలిగి దేశవ్యాప్తంగా  తీర్ధయాత్రలు చేసి జీవితం  సార్ధకం చేసుకొన్నాడు .డబ్బుపైనా కీర్తిపైనా వ్యామోహం వదుల్చుకొని అసలైన భాగవతార్ అని పించుకొన్నాడు .డయాబెటిస్ వ్యాధికి గురై ,ఇన్సులిన్ తప్పని సరి చివరి రోజులు గడిపాడు .దీనికి బ్లడ్ ప్రెజర్ కూడా తోడైంది .చనిపోవటానికి 10రోజుల ముందు పోల్లాచిలో కచేరి చేశాడు .అక్కడున్న ఒకాయన  డయాబెటిస్ కు ఆయుర్వేద మందు ఇస్తే వేసుకోగా ,తగ్గక పోగా  వికటించి ప్రాణాపాయం రాగా ,మద్రాస్ తీసుకు వెళ్లి జనరల్ హాస్పిటల్ లో 1959అక్టోబర్ 22న చేర్ఛి చికిత్స చేయించారు .ఒక వారం గడిచింది .అకస్మాత్తుగా నవంబర్ 1 సాయంత్రం 6-20 కి త్యాగరాజ భాగవతార్ 59వ ఏట మరణింఛి త్యాగరాజ శివ సన్నిధి చేరుకొన్నాడు .

  సహాయం చేయటం లో ముందు ఉండే భాగవతార్ బంధువుల ఇళ్ళల్లో వివాహాలకు ఉచితంగా సంగీత కచేరి చేసేవాడు  .సహాయ నిధులకు ప్రతిఫలం ఆశించకుండా కచేరీ చేసేవాడు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భాగవతార్ ను నాటకాలు ప్రదర్శించి వచ్చిన డబ్బును రెడ్ క్రాస్ సంఘానికి ఇమ్మని బ్రిటిష్ ప్రభుత్వం కోరగా వెంటనే స్పందించి ,నాటకాలు ఆడి వచ్చిన డబ్బును  రెడ్ క్రాస్ కు అందించాడు .యుద్ధ సమయం లో మద్రాస్ గవర్నర్ ఆర్ధర్ ఆస్వాల్డ్ జేమ్స్ హోప్ యుద్ధ  నిధికి సహకరించమని కోరగా కచేరీలు చేసి నాటకాలు ప్రదర్శించి వసూలైన ధనాన్ని యుద్ధ నిదిగా ప్రభుత్వానికి అందజేశాడు .యుద్ధం అయిపోయాక ప్రభుత్వం కృతజ్ఞతగా ఆయనకు ‘’దివాన్  బహదూర్ ‘’బిరుదు ప్రదానం చేయాలని  భావించి తెలియబరచగా తాను మానవత్వ కార్యానికి సాయం చేశానే కాని అవార్డ్ కోసం కాదని సున్నితంగా తిరస్కరించిన త్యాగ ధనుడు .  తన పేరు త్యాగరాజును ,భాగవాతార్ ను సార్ధకం చేసుకొన్నా మహానుభావుడు త్యాగరాజ భాగవతార్ .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-19 –ఉయ్యూరు

—

image.png

—

image.png

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పరమాచార్యులు పరమాత్ములే

పరమాచార్యులు  పరమాత్ములే

శ్రీ పళ్ళెం పాటి వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్ లో రెండు దేవాలయాలు నిర్మించి అనేక పుణ్యకార్యాలు చేసి ,18పురాణాలకు తెలుగు అనువాదం చేసిన వారు .1962లోపరమచార్యులవారిని మొదటి సారి దర్శించారు ..’’భవిష్యత్తులో ఉన్నత స్థితి కి రాగలవు ‘’అని ఆశీర్వదించారు స్వామి .

1968లో స్వామి హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కంధగిరి పద్మారావు నగర్ లో కంచికామ కోటితరఫున ‘’శంకర మఠం’నిర్మించ టానికి సంకల్పించారు .హైదరాబాద్ లోఎంతో  అనుభవమున్న నిర్మాణ సంస్థలున్నా  స్వామివారు  పళ్ళెం పాటి వారికి కబురు చేసి ,నెలరోజుల్లో మఠం నిర్మాణం పూర్తి చేయాలని వెంటనే ప్రతిష్ట జరగాలని ఆదేశించారు  .

  మర్నాడే స్వామి వారితో శంకుస్థాపన  చేయించి మందిర నిర్మాణం ప్రారంభిచారు పల్లెంపాటి .స్వామి అనుగ్రహం తో నిర్మాణం 21 రోజుల్లోనే పూర్తయి ,వైభవంగా  ప్రతిష్ట జరిగింది .ఇదంతా తన కృషి కాదని శ్రీ వారి సంకల్పబలం అనీ వారు సాక్షాత్తు దైవ స్వరూపులని ఆయన నమ్మారు .కొన్ని రోజులతర్వాత శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మాణం  చేద్దామని ప్రారంభించిన ధర్మకర్తలు పునాదులవరకే కట్టి ఇక కట్టలేకపోయారు .అప్పుడు శ్రీవారు మళ్ళీ పల్లెంపాటి  వెంకటేశ్వర్లు గారిని పిలిపించి ,15రోజులలో తాము హైదరాఆద్ నుండి  వెళ్ళిపోతున్నామని ఆలోపల నిర్మాణం పూర్తి అవ్వాలని ఆదేశించారు .వారి ఆదేశం పై వెంటనే పని ప్రారంభించి 14రోజులలో గర్భగుడితో సహా ఆలయం  అంతా కట్టేశారు .శ్రీ వారి సంకలసిద్ధికి ఇది మరొక ఉదాహరణ .

 1981 శ్రీవారి ఆశీర్వాదం తో పల్లెంపాటి వారు నల్గొండ జిల్లాలోకాకతీయ  సిమెంట్ ఫాక్టరీ నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశారు .యెన్ జే ఎఫ్   కంపెనీ నుంచి 600 హార్స్ పవర్ ఉన్న2 మోటార్లు 12 లక్షలకు కొనాలని భావించారు .కాని అంత డబ్బు చేతిలో లేదు .ఫాక్టరీ పని ప్రారంభించాక డబ్బు చెల్లిస్తానని చెప్పారు .కానీ ఆ  కంపెని  ఒప్పుకోలేదు .మార్చి 1 ఫాక్టరీ ప్రారంభోత్సవ ముహూర్తం కూడా పెట్టుకొన్నారు .’’శ్రీవారే నన్ను కాపాడాలి ‘’అని మనసులో బలంగా  ప్రార్ధించారు  . రెండు రోజుల తర్వాత కంపెనీ  ముందుగా డబ్బు చెల్లించాలి అన్న షరతును వదిలేసి ,స్వంతఖర్చులతో తామే  రెండు మోటార్లను తీసుకు వచ్చి డెలివరి చేసి  ఆశ్చర్యం  కలిగించారు  . ఇదంతా స్వామి అనుగ్రహం కాక మరొకటి కాదు అని గ్రహించారు. అనుకోన్నముహూర్తానికి ఫాక్టరీ ప్రారంభమైంది. మూడు నెలలలో 12లక్షలు  చెల్లించే శారు .

  హైదరాబాద్ అశోక్ నగర్ లో పల్లెంపాటివారు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించి కంచి పరమాచార్యులవారిచే శంకుస్థాపన చేయించారు .ఆ కాలనీ వాసుల తరఫున ముగ్గురు వచ్చి  అక్కడ గుడికడితే  నిరంతర ఘంటా రావంవలన   ప్రజలకు నిద్రా భంగామౌతు౦దని  ,అడుక్కు తినేవారు ఆలయం చుట్టూ మూగుతారని కనుక నిర్మాణం ఆపించవలసిందని ,ఆపకపోతే కోర్టుకు  వెడతామని  నిష్టూరంగా స్వామి వారిని బెదిరించారు  ,స్వామి విని, నవ్వి, మౌనంగా ఉండిపోయారు .ఆలయ నిర్మాణం అనుకొన్నట్లు దివ్యంగా జరిగి ప్రతిష్ట కూడా పూర్తయి ,అనునిత్య పూజలతో సత్యనారాయణ వ్రతాలతో వర్ధిల్లుతోంది.

  ఎవరైతే వచ్చి ఆలయనిర్మాణం ఆపమని స్వామివారి తో నిష్టూరంగా బెదిరించారో   వారు కొద్దికాలానికే తమకర్మఫల౦  అను భవించి తీవ్రంగా నష్టపోయారు .కామకోటి స్వామి సాక్షాత్తు భగవంతుని నిస్వరూపులే అని తాను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నానని శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు ‘’సాక్షాత్తు భగవంతుడే ‘’అనే వ్యాసం లో రాశారు .

పల్లెంపాటి వారి పెద్దకుమార్తె లక్ష్మీ నళిని భర్త గారే సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్  .పల్లెంపాటివారు 90 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి మరణించారు

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి

దశావతారాలు  అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు  శ్రద్ధాంజలి

సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా

 సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర  నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన .

1-ప్రముఖ నవలా ,కథా రచయిత్రి  న్యు ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి లైబ్రేరియన్

 శ్రీమతి అబ్బూరి ఛాయా దేవి

2-మాంటిస్సొరి ప్రిన్సిపాల్ అని పిలువబడి ,అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తూ, బహు గ్రంధ కర్త , సాంఘిక సేవా కార్యకర్త ఐన పద్మశ్రీ  –డా .వి.కోటేశ్వరమ్మ

3- నాలుగు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించి , అలుపెరుగని రాజకీయ పోరాట యోదురాలుగా గుర్తింపు పొందిన శ్రీమతి షీలా దీక్షిత్

4- బాలనటి గా చిత్ర రంగ ప్రవేశం చేసి ,44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందిన అరుదైన నటనా ,దర్శకమాణిక్యం –శ్రీ మతి విజయ నిర్మల

5-జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న కన్నడ రచయిత ,నటుడు ,ప్రయోక్త, దర్శకుడు ,పత్రికా స్వేచ్చకు నిరంతరం పోరాడిన పద్మ భూషణ్ శ్రీ గిరీష్ కర్నాడ్

6-సాహిత్యమే ఊపిరిగా జీవించిన  తెలుగు ,ఆంగ్లభాషల  సవ్య సాచి ,నిరంతర సాహితీ శ్రామికుడు  విశాఖ కు చెందిన శ్రీ రామ తీర్ధ

7-నాటకాలలో నటనతో పండి , వెండి తెరపై స్వచ్చ తెలుగు హాస్యం పండించిన  కేరక్టర్ నటుడు శ్రీ రాళ్ళపల్లి

8-దిగంబర కవులలో తనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న మానవ హితైషి శ్రీ మహాస్వప్న

9-‘’సీమ’’సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన డా యెన్ .రామ చంద్రరావు

10-ఆంధ్రజ్యోతి దినపత్రిక , ,ఆంధ్రప్రభ వార్తాపత్రికల సంపాదకులు , విజయవాడఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ,అనేక సంస్కృత కార్యక్రామాల రూప శిల్పి ,లలిత ,సినీ గీత రచయిత  బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ   ఇంద్రగంటి  శ్రీకాంత శర్మ

  ల అకాల మరణానికి అక్షర నివాళి అర్పించి ధన్యులమవుదాం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

మాదిరాజు శివ లక్ష్మి –  ‘’కార్య దర్శి .

 ఉయ్యూరు -26-7-19 ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”

ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వారం క్రితం ”ఆలోచనాలోచనం ”కు నాలుగు ఎపిసోడ్ లు రాసి ,వచ్చి రికార్డ్ చేయవలసిందిగా ఫోన్ రాగా ,1-అజ్ఞానం నశిస్తే అంతా  అమృతమయమే 2-ఉదార గుణమే ఉన్నతాశయం 3-గురువు గరిష్ఠత 4-త్రికాలజ్ఞానం సుఖం  కలిగిస్తుందా ? అనే నాలుగు ఎపిసోడ్ లు రాసి ఇవాళ గురువారం 25-7-19 ఉదయం విజయవాడవెళ్లి రేడియో స్టేషన్ లో చదివి రికార్డింగ్ చేయించి వచ్చాను .ఇవి ఆగస్టు 6 13,20 ,27 తేదీలలో మంగళవారం ఉదయం 7-15గం  లకు ప్రసారమౌతాయని తెలియజేస్తున్నాను -మీ దుర్గాప్రసాద్
Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి

ఉయ్యూరు శాఖా గ్రంథాలయం లో అయ్యంకి వారి 129 వ జయంతి గ్రంథాలయ పితామహ ,సరస్వతీ రమా రమణ ,గ్రంథాలయ విశారద శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి 129 వ జయంతి 24-7-19 బుధవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శాఖా గ్రంధాలయం లో జరిగింది . అయ్యంకి వారి స్మారక నగదు పురస్కారంగా 100 రూపాయలను లైబ్రరీని బాగా ఉపయోగించుకొంటున్న విద్యార్ధిని కి సరస భారతి తరఫున ప్రదానం చేశాము -దుర్గా ప్రసాద్

https://photos.google.com/share/AF1QipNC7mHYekGxMxYSxQA8oZXTahjuhUI2AVW28Jh48Dwnyvoh2-OwCiioQV_Yln2H9w/photo/AF1QipMqEVsOTidZPPm6582Doe53MxbgG170zmgw2tuQ?key=ZWdpcGxKWEVlY2xndzlSRGFDd0l5REpPN0xDVWhB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు

‘’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు

కృష్ణా జిల్లా నాగాయ లంక లాంచీల రేవు ఒడ్డున  సంత రోజున  చేపలు  అమ్ముకొనేవారు కొనేవారు కనీసం వెయ్యి  మంది వస్తారు .అక్కడనుంచి లాంచీలమీద పెనుమూడి రేవు ద్వారా గుంటూరు వెడతారు .ఇలాంటి చోట భగవంతుని జ్ఞాపకం చేసే ఆలయం కట్టాలని శ్రీ రాం చరణ్ కుందుర్తి వెంకట నరసయ్య గారికి సంకల్పం కలిగింది .తన స్వంత ద్రవ్యం ప్రజలిచ్చిన సహకారం తో శ్రీ కోదండ రామాలయం ,శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించారు .రాజస్థాన్ జైపూర్ నుంచి చలువరాతి విగ్రహాలు తెప్పించారు .1964 మేనెల 31 న ప్రతిష్ట చేయాలని ముహూర్తం నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు  చేశారు .

మే  25న కంచి పరమాచార్యుల షష్టి పూర్తి మహోత్సవం కంచికి మూడుమైళ్ళ దూరం లో ఉన్న ‘’అంబి’’గ్రామం లో జరుగుతుందని తెలిసింది .రాం చరణ్ గారు ఆయన శిష్యుడు తుంగం నాగభూషణం ఆ మహోత్సవాన్ని చూడాలని .ప్రతిస్ట లోపలే వస్తామని జలాధివాస దాన్యాధివాసాల ఏర్పాటు చేయమని అక్కడి వారికి చెప్పి ఇద్దరూ బయల్దేరారు .అప్పటికే శ్రీ మండలీక  వేంకటశాస్త్రి గారు ,శ్రీ కుప్పా లక్ష్మావదానులుగారు ,శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేరుకొన్నారు .

షష్టి పూర్తి రోజున  వీరికి  శ్రీ వారి దర్శనం కాలేదు .మర్నాడు దర్శనానికి వెళ్ళారు .శ్రీ రామ శరణ్ గారికి అదే మొదటి సారి స్వామి వారిని చూడటం .స్వామి వారు తీర్ధమిచ్చి ,ఉద్దేరిణ కిందపెట్టి ,’’ప్రతిష్ట ఎప్పుడు “’?అని అడిగారు .’’మా ఇంట్లో మందిరం లో ఎప్పుడో అయింది ‘’అన్నారు శ్రీరామ శరణ గారు .’’అదికాదు .నది ఒడ్డున ఏర్పాటు చేశావే ‘’రామపాద క్షేత్రం ‘’అక్కడి ప్రతిష్ట సంగతి అడిగాను ‘’అన్నారు. అవాక్కయ్యారు ఈయన .’’మే 31న చేద్దామనుకొంటున్నాము ‘’అన్నారు .స్వామి ‘’31 న చేస్తారా ?’’అని ప్రశ్నార్ధకంగా అడిగారు .ఈయనకు  ఆ రోజున ప్రతిష్ట జరగదేమో నని అనుమానం వచ్చింది .స్వామి వారు అక్షితలు కుంకుమ ,కిస్ మిస్ పళ్ళు ప్రసాదంగా ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహం క్రింద ఉంచమని చెప్పారు .

ఇంతలో మే 28న భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మరణించటం ,రైళ్ళు ,బస్సులు నడవకపోవటం తో 29న బయల్దేరి 30 సాయంత్రానికి నాగాయలంక చేరారు .’’గురువుగారు లేకుండా ప్రతిష్టా?’’అని ఊరి వారందరూ భావించి ఏ పనీ మొదలు పెట్టలేదు .మళ్ళీ అందరూ ఆలోచించి జూన్ 11న ప్రతిష్టకు ముహూర్తం  పెట్టించి  కార్యక్రమం పూర్తి చేశారు .

స్వామి ఈ క్షేత్రాన్ని ‘’రామ పాద క్షేత్రం ‘’అని ఎందుకు అన్నారో వీరికి అర్ధం కాలేదు .తర్వాత రెండు నెలలకు నాగార్జున సాగర్ డాం విరిగి ,కృష్ణా నదికి అంతులేని వరద నీరు వచ్చి   ,నాగాయలంకలో నూతనంగా ప్రతిస్టింప బడిన  శ్రీరామ పాదుకలకు , అంటే దాకా వరద నీరు వచ్చి ,వెనక్కి తగ్గింది .వరద ఇంకొక అంగుళం పెరిగితే ,దివి తాలూకాలో 70గ్రామాలు వరదనీటిలో  కొట్టుకు పోయేవి .అదీ రామపాద క్షేత్రం మహాత్మ్యం .ఆ పేరు పెట్టిన శ్రీ వారి దివ్యానుగ్రహం .అప్పటినుంచి నిత్యపూజలు కార్తీక మాసం లో 108 సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ క్షేత్ర వైభవాన్ని పెంచుతున్నారు .తర్వాత వినాయక, ఆంజనేయ ,కేదారేశ్వర విగ్రహాల ప్రతిష్ట కూడా జరిపారు అని ‘’ప్రతిష్ట ఎప్పుడు ?’’అనే వ్యాసం లో శ్రీ రామ శరణ్ కుందుర్తి వెంకటనరసయ్య రాశారు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 143 వ కార్యక్రమ౦ రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళిస్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు

రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు నివాళి

సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 9 మంది ప్రముఖులకు నివాళిగా సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన .

1-ప్రముఖ నవలా ,కథా రచయిత్రి  న్యు ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి లైబ్రేరియన్

 శ్రీమతి అబ్బూరి ఛాయా దేవి

2-మాంటిస్సొరి ప్రిన్సిపాల్ అని పిలువబడి ,అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తూ, బహు గ్రంధ కర్త , సాంఘిక సేవా కార్యకర్త ఐన పద్మశ్రీ  –డా .వి.కోటేశ్వరమ్మ

3- నాలుగు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించి , అలుపెరుగని రాజకీయ పోరాట యోదురాలుగా గుర్తింపు పొందిన శ్రీమతి షీలా దీక్షిత్

4- బాలనటి గా చిత్ర రంగ ప్రవేశం చేసి ,44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందిన అరుదైన నటనా ,దర్శకమాణిక్యం –శ్రీ మతి విజయ నిర్మల

5-జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న కన్నడ రచయిత ,నటుడు ,ప్రయోక్త, దర్శకుడు ,పత్రికా స్వేచ్చకు నిరంతరం పోరాడిన పద్మ భూషణ్ శ్రీ గిరీష్ కర్నాడ్

6-సాహిత్యమే ఊపిరిగా జీవించిన  తెలుగు ,ఆంగ్లభాషల  సవ్య సాచి ,నిరంతర సాహితీ శ్రామికుడు  విశాఖ కు చెందిన శ్రీ రామ తీర్ధ

7-నాటకాలలో నటనతో పండి , వెండి తెరపై స్వచ్చ తెలుగు హాస్యం పండించిన  కేరక్టర్ నటుడు శ్రీ రాళ్ళపల్లి

8-దిగంబర కవులలో తనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న మానవ హితైషి శ్రీ మహాస్వప్న

9-‘’సీమ’’సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన డా యెన్ .రామ చంద్రరావు

  ల అకాల మరణానికి నివాళి అర్పించి ధన్యులమవుదాం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

మాదిరాజు శివ లక్ష్మి –      ‘’  ‘’కార్య దర్శి .

 ఉయ్యూరు -23-7-19 ఉయ్యూరు

— 

image.png

—

image.png
image.png
image.png

image.png
image.png
image.png
 
image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యులవారిని స్మరించి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డా పిన్నమనేని వెంకటేశ్వరావు

విజయవాడ లబ్బీ పేట లో పిన్నమనేని పోలీ క్లినిక్ విశేషమైన ఖ్యాతి  నార్జించింది  .రోగులపాలిటి స్వర్గ ధామం  అనిపించి ఎన్నో ఏళ్ళు నడిచింది .అందులో పని చేయటానికి ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వచ్చి చేరి తమబాధ్యత సక్రమంగా నిర్వహించి వైద్యాలయం కీర్తిని ఇనుమడింప జేశారు దీని స్థాపకులు డా .పిన్నమనేని వెంకటేశ్వరరావు .వారికుమార్తెలు కూడా డాక్టర్లు గా సేవలందించారు .

  1967కాలం లో కంచి పరమాచార్యులపై వ్యాసాలూ వారి అనుగ్రహ భాషణలు  ఆంధ్ర ప్రభలో వచ్చేవి .డాక్టర్ గారి కుటుంబం వాటిని అతి శ్రద్ధగా చదివి  మననం చేసుకొనేవారు .ఆ కాలం లో  వారి కుమార్తె మరణించటం ,వారి  రెండవ కుమారునికి తీవ్ర అనారోగ్యం చేయటం వలన కుటుంబం లో మనశాంతి లేకుండా పోయింది .కొడుకు జబ్బు ఏమిటో తెలుసుకోవటానికి వారు దేశం లో తిరగని హాస్పిటల్ లేదు .కానీ ఎవరూ రోగ నిర్ణయం చేయలేకపోయారు .చివరికి ఢిల్లీ వెళ్లి ఆలిండియా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో చూపించి డయాగ్నైజ్  చేయించాలనుకొన్నారు   .

  ఢిల్లీ వెళ్ళే ముందు పరమాచార్యులను దర్శించాలనుకొని నరసరావు పేట లో దర్శించారు .సుమారు 45 నిమిషాలు  శ్రీవారితో గడిపారు .ఢిల్లీ వెడుతున్నామని చెప్పగానే ,కురుక్షేత్రం లో దేవుని దర్శించి ఢిల్లీ వెళ్ళమని ఆదేశించారు .అలాగే కురుక్షేత్ర వెళ్లి స్వామి దర్శనం చేసుకొని ఢిల్లీ వెళ్లి మెడికల్ సైన్సెస్ ఇన్ స్టి ట్యూట్ లో కుమారుని చేర్పించి ,పరీక్ష చేయించారు  .అన్ని పరీక్షలు చేశాక వారి అబ్బాయికి ఏ రకమైన జబ్బు లేదని డాక్టర్లు ధృవీకరించారు  .అప్పటిదాకా మనసు లో ఉన్న అశాంతి ఒక్క సారిగా మటుమాయమై కుటుంబానికి శాంతి లభించింది . ఆరోజు నుంచి  ఆ కుమారుడికి ఏ రకమైన జబ్బూ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు .

 పిన్నమనేని వారికి జీవితం లో ఏ సమస్యలు వచ్చినా శ్రీ వారి దర్శనం చేస్తారు. అవి వెంటనే పరిష్కారమవుతాయి .శ్రీ వారి దర్శనం తో తమకు కలిగే ఆనందాను భూతులు మాటలలో  వర్ణించలేమని అంటారు డా వెంకటేశ్వరరావు .ఉదయం, రాత్రి శ్రీవారిని స్మరించకుండా వారు రోజు గడపరు .అంతే కాదు అప్పటినుంచి తాను ఏ రోగికి శస్త్ర చికిత్స చేసినా ,స్వామిని స్మరించిమాత్రమే చేస్తాను అని చెప్పారు డా .పిన్నమ నేని .ఈ విషయాన్ని ‘’స్వామిని  స్మరించి శస్త్ర చికిత్స ‘’వ్యాసం రాశారు .

image.png

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-19 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు

  కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి అనుగ్రహించటం వారి ప్రత్యేకత .వారి ఔదార్యాన్ని అనుభవించిన వారెందరెందరో ఉన్నారు .ఒక్కొక్కరిది ఒక్కో దివ్యానుభవం .అలాంట వారిలో విజయవాడ లో ఇప్పడు బెంజ్ సర్కిల్ అని పిలువబడే చోట దాదాపు యాభై ఏళ్ళక్రితం ‘’బెజవాడ మోటార్స్’’అధినేత ,వితరణ శీలి బెజవాడలో వైదిక మహా సభలు పెద్ద ఎత్తున నిర్వహించి అందరి చేతా ‘’పంతులు గారు ‘’అని గౌరవంగా పిలువబడే బ్రహ్మశ్రీ మాగంటి సూర్యనారాయణ గారొకరు .  వీరికి రామవరప్పాడులో గొప్ప ఎస్టేట్ ఉండేది .  మాగంటి వారు శ్రీవారిని 1962లో ఇలత్తాన్ గుడిలో మొదటి సారిగా దర్శించుకొన్నారు .అప్పుడు మాగంటివారి అల్లుడు పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మూర్ఛ వ్యాదివలన బాగా బాధపడ్డారు .డాక్టర్ల నందర్నీ సంప్రదించి మందులు వాడారు .గుణం కనపడ లేదు .పూజ్యులు ,పండితులు ,శ్రీవారికి పరమ భక్తులు బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారి సలహాపై శ్రీవారిని దర్శించారు .వ్యాధి విషయం గ్రహించి తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా ‘’పంచగవ్యాలు ‘’ఇప్పించమని ఆదేశించారు .అలాగే చేశారు మాగంటివారు   .తొమ్మిది ఆదివారాలు అవగానే మాగంటి వారి అల్లుడికి  మూర్ఛ రోగం మటుమాయమైంది .

  అప్పటికే సూర్యనారాయణగారు మోటారు కార్ల విక్రయం చేస్తున్నారు .పోటీ ఎక్కువగా ఉండటం తో అమ్మకాలు తగ్గాయి  వర్కర్లు మానేసి వెళ్ళిపోయారు .దిక్కు తోచని పరిస్థితి లో పడ్డారు .అన్నిటికీ పరమాచార్య పైనే భారం వేసి ,కుటుంబం తో కాంచీపురం వెళ్లి మఠం లో  భిక్ష చేశారు .భిక్ష అవగానే పరమాచార్యస్వామి ఆశీర్వదిస్తూ ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’ అని ఆశీర్వదించారు .

  అప్పటిదాకా మాగంటివారు మోటారుకారు వ్యాపారం మీద నెలకు మూడు వేలరూపాయలు అమ్మకం పన్ను చెల్లించేవారు .స్వామి వారి  ఆశీర్వాదం తర్వాత  స్వామి అనుగ్రహం తో నెలకు లక్షరూపాయ;ల పన్ను చెల్లించారు .అప్పుడు ఆయనవద్ద ఒకే ఒక పని వాడు అంటి పెట్టుకొని నమ్మకం తో ఉండేవాడు . బయటకు వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారు లేకపోయారు .కాని స్వామి వారి అనుగ్రహం తో ,  ఆశీర్వాద బలం తో నాలుగైదుజిల్లాల నుండి తెలిగ్రాములద్వారా ఆర్డర్లు వచ్చేవి .కంపెనీ వారికి ఈ విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయారు .ఇదంతా పరమా చార్యుల ప్రభావం కాక వేరొకటి కానే కాదు అని పంతులుగారు మనస్పూర్తిగా నమ్మారు .స్వామి సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాత్రుడు కాదు అని విశ్వసి౦చారు .ఈ విషయాలన్నీ మాగంటి  సూర్యనారాయణ పంతులుగారు  ‘’నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ‘’అనే  వ్యాసం లో రాశారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-19-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

1937 ప్రారంభం లో కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు కాశీ యాత్ర పూర్తి చేసి ,ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ,గోదావరి జిల్లాలో సంచారం ప్రారంభించారు .గ్రామాలలో తమ దివ్య సందేశాలతో ఆస్తిక జనులను ఉత్తేజితులను చేశారు .తర్వాత అక్కడి కోన సీమ లో ముక్కామల గ్రామం చేరారు .అక్కడున్న ఉద్దండ పండితులైన శ్రీ దువ్వూరి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ భమిడిపాటి సోమనాధ శాస్త్రిగారు మొదలైనవారు మంగళవాద్య, పూర్ణ కుంభం లతో స్వాగతం పలికి పుష్పమాలాలంకృతులను చేసి ,స్వస్తి  వాచకాలతో ముక్కామల గ్రామం లోకి ప్రవేశపెట్టారు .

  అది స్వామి వారి జయంతి మహోత్సవ సమయం కనుక శ్రీ దువ్వూరి బాలకృష్ణ మూర్తి గారు శ్రీ వారి అధ్యక్షతన తొమ్మిది రోజులు ‘’బ్రహ్మ సత్రం ‘’జరపాలని ఉన్నదని ఎరిగించి వారి అనుగ్రహం పొందారు .బ్రహ్మానంద భరితులైన మూర్తిగారు ఈవిషయాన్ని దేశం లో ఉన్న అనేక మంది పండితులకు గృహస్తులకు ఆ క్రతు మహోత్సవం లో పాల్గొనవలసినదని ఆహ్వానాలు పంపారు .వారిఆహ్వానానికి విశేష  స్పందన కలిగి ముక్కామల గ్రామం యతులతో ,పండితులతో  గృహస్తులతో నిండి పోయి కను విందు చేసింది .

   అప్పుడు నెల్లూరులో ఉన్న బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు తనకు అందిన ఆహ్వానాన్ని మహా భాగ్యంగా భావించి విచ్చేశారు .ఆ రోజే శ్రీవారి ప్రధమ దర్శన భాగ్యం వారికి దక్కింది .క్రతు సమాప్తి వరకు అక్కడే ఉండి, శ్రీవారి అధ్యక్షతన’’బ్రహ్మ సభ ‘’గా జరురుగుతున్న   సభలో పాల్గొని వారి అనుజ్ఞ తో ప్రవచనాలు చేస్తూ , స్వామి దివ్య దర్శనం తో పులకించిపోయారు .క్రతువు పరిసమాప్తి అయ్యాక శ్రీవారి అనుమతితో నెల్లూరు చేరారు .

  1938లో శ్రీవారు చాతుర్మాస్య వ్రతానుస్టానం పూర్తి చేసి ,మార్కాపురం లో శరన్నవరాత్రుల ఉత్సవాలను జరిపి ,మార్గ శిరమాసం లో నెల్లూరు చేరారు .గ్రామజనుల కోరికపై అక్కడే మూడు నెలలు ఉండి పోయారు .ఒక రోజు వారి సమక్షం లో ప్రవచనం చేస్తున్న మండలీక వేంకట శాస్త్రిగారు ప్రసంగవశాన ‘’చరమ వృత్తి ‘’అని ఏదో చెప్పబోయారు .వెంటనే శ్రీవారు ‘’శాస్త్రీ !చరమ వృత్తి అంటే ఏమిటి ‘’?అని ప్రశ్నించారు .అప్పటికప్పుడు శాస్త్రిగారు ‘’మరణ కాలీనమైన వృత్తి’’అని చెప్పారు . వెంటనే పరమాచార్యులవారు ‘’ధ్యాన పరిపాక అవస్థ లో కలిగే అఖండ బ్రహ్మాకార వృత్తి నే’’ చరమ వృత్తి’’అంటారు అని సెలవిచ్చారు .శ్రీవారు చెప్పారు అంటే అది పరమ సిద్ధాంతమే అని శాస్త్రిగారు నమ్మి ,తాను  చెప్పింది కూడా ఎక్కడో ఉన్నది తానూ చదివిందే అని గుర్తుకు వచ్చి ‘’స్వామీ ! రేపు ఈ విషయం గూర్చి మనవి చేస్తాను ‘’అని చెప్పి ,ఆరాత్రి తమవద్ద ఉన్న ‘’అద్వైత సిద్ధి ‘’గ్రంథాన్నితిరగేశారు .అందులో మూడు చోట్ల ‘’చరమ  వృత్తిః మరణ కాలినా , అఖండ బ్రహ్మాకార వృత్తిః’’అని అని ఉండటం తో తాము  చెప్పింది సరైనదే అని నిశ్చయం చేసుకొని  వాటిని గుర్తుపెట్టుకొని ,మర్నాడు శ్రీవారి సన్నిధి చేరి వాటిని వివరించారు .

  స్వామీజీ ‘’ఇంకా రెండు చోట్ల ఉండాలి .చదివి వినిపిస్తావా “”? అని అడిగారు .ఆశ్చర్యపోయిన శాస్త్రిగారు ఇంకా తను వేరే చదవాల్సింది ఏమీ లేదని వినమ్రంగా చెప్పారు .అప్పుడు శ్రీవారు ‘’నువ్వు చెప్పిన దానికి ప్రమాణం చూపావు బాగానే ఉంది .మరి నేను చెప్పిందానికీ ప్రమాణం చూపించు ‘’అన్నారు చలోక్తిగా .మండలీక శాస్త్రిగారు ‘’నేను మానవ మాత్రుడిని కనుక నా వాక్యానికి ప్రమాణం కావాలి. తమరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు .భగవంతుని ముఖం నుంచి నిర్గతమైన వేదం లాగా శ్రీవారి ముఖ నిర్గత వాక్యానికి ప్రమాణం అవసరం లేనే లేదు ‘’అన్నారు. .శ్రీవారు ఉదారం గా నవ్వుతూ ‘’నీకు వకాల్తా ఇస్తున్నాను .నేను చెప్పిన వాక్యానికి కూడా ప్రమాణం చూపించి చెప్పు ‘’అని ఆదేశంలాంటి అనుగ్రహం చేశారు .

  స్వామివారు చెప్పిన వాక్యానికి ప్రమాణం ఎక్కడ వెతకాలో అర్ధంకాక శాస్త్రిగారు  ఇంటికి చేరి అదే ఆలోచనలో ఉండి పోయారు .కాకతాళీయంగా శాస్త్రిగారు తమ పుస్తకాల బీరువా వెతుకుతుండగా భగవద్గీత కు శ్రీ మధు సూదన సరస్వతి స్వాములవారు రాసిన ‘’గూడార్ధ దీపిక ‘’అనే వ్యాఖ్యానం కనిపించి. అందులో 18 వ అధ్యాయం పై దృష్టిపడింది  .చూశారు .అందులో అద్వైతులకు దేహాదుల స్థితి ఎలా కలుగుతుంది అనే  ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి .1-  బ్రహ్మజ్ఞానం కలుగగానే అజ్ఞానం పూర్తిగా నశించదు .ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది .ఈ కొద్దిదానివలన మళ్ళీ శరీర ధారికావచ్చు .ఈ లేశమైన అజ్ఞానం మరణ సమయం లో అఖండ బ్రహ్మాకార వృత్తి మళ్ళీ కలిగి నశిస్తుంది .అప్పుడే విదేహ ముక్తి సిద్ధిస్తుంది .ఈ విషయం లో ‘’చరమ  వృత్తి అంటే మరణకాలీన అఖండ బ్రహ్మాకార వృత్తి అని అర్ధం .కాని అజ్ఞానం కొద్దిగా అంటే లేశమాత్రంగా మిగలటం అసంభవం అని భావించి ,అజ్ఞాన సంస్కారాను  వృత్తి ని చెప్పారు .

2-కరెంట్ స్విచ్ ఆన్ చేయగానే ఫాన్ తిరిగి ,కరెంట్ ఆపేసినా కొంతకాలం తిరిగి ఆగిపోతుంది .అలాగే బ్రహ్మవేత్తకు ధ్యాన పరిపాకం చివర కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూప జ్ఞానం వలన  దేహ ఇంద్రియాలకు చెందిన అజ్ఞానం నశిస్తుంది .ఫాన్ ఉదాహరణలో చెప్పినట్లే ,సంస్కార వశంతో కొంతకాలం దేహే౦ద్రియాదులు తిరిగి ,తర్వాత సంస్కారం నశించటం వలన ,మరణకాలం లో బ్రహ్మ జ్ఞానం అవసరం లేకుండానే స్వయంగా దేహెం దేహే౦ద్రియాదులు పోతాయి .ఈ పద్ధతిలో చరమ వృత్తి అంటే ధ్యాన పరిపాకం చివర కలిగే వృత్తి ‘’అని చెప్పబడింది. దీనినే శ్రీవారు ఉటంకించింది .

  మర్నాడు స్వామి వారి సన్నిధికి వెళ్లి శాస్త్రిగారు తాను చూసిన విషయాలు చెప్పారు .వెంటనే ‘’ఆ పుస్తకం చూడాలని  నీకుఎలా  తోచింది  ?’’అని ప్రశ్నించారు .శాస్త్రిగారు ‘’నాకు తెలియకుండా ,నాకు కనిపించకుండా ఎవరో ఈ సాయం చేశారు .అంతకంటే నేనేమీ చెప్పలేను ‘’అన్నారు నతమస్తకులై శాస్త్రిగారు .శ్రీవారి  సన్నిధిలోఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ,వారితో సంభాషిస్తే ఎన్నో సిద్దా౦త రహస్యాలు బయటపడతాయని, వారి దివ్య దర్శనం తో ఎందరికో వ్యాధులు నయమయ్యాయని శ్రీవారి దివ్య ఉపదేశ అమృత సేవనం తో ప్రజలకు అత్యంత శాంతి లభిస్తుందని బ్రహ్మశ్రీ మండలీక  వేంకట శాస్త్రి గారు పరమాచార్యుల సప్తతి జయంతి మహోత్సవ సందర్భంగా ఆంద్ర ప్రభలో రాశారు .అందులోని ముఖ్య విషయాలు నా భాషలో మీకు తెలియజేశాను .శ్రీ వారిపై శాస్త్రిగారు రచించిన శ్లోకం –

‘’అజ్ఞానా౦తర్గహన  పతితా ,నాత్మ విద్యోప దేశైః-త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాపపాప చ్యమానాన్ ‘’

ముక్ష్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ- శంభో ర్మూర్తిః,చరతి భువనే శంకరాచార్య రూపా ‘’

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-19-ఉయ్యూరు

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

 

శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు


ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక సభ్యులు ,ఆర్గనైజర్ జాగృతి వారపత్రికల కాలమిస్టు  వీటికి మించి మహా గొప్ప కథా రచయితా   జాగృతి లో  ప్రతివారం సినిమాలపై హాస్య స్పోరకంగా సమీక్ష రాసేవారు, సరస సంభాషణా చతురులు మర్యాదా పురుషోత్తములు ,నాకు మార్గదర్శి ,రోల్ మోడల్ ,మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మా మేనల్లుళ్ళు అశోక్ ,శాస్త్రి లకు ,మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ కు బందరులో లెక్కల గురువు ,  R.S.K.గా అందరూ  పిలిచే స్వర్గీయ శ్రీ రాజనాల శివ రామ కృష్ణ మూర్తి  గారు 10-4-1996 న అంటే 23 ఏళ్ళ క్రితం నాకు బందరునుంచి రాసిన కార్డ్ శిధిలమై చీకి  చినిగి అంచులు కనిపించని స్థితిలో  ఇవాళ దేనికోసమో వెతుకుతుంటే దొరికింది . ఇది నాకు గొప్ప” ట్రెజర్ ”అని పించింది . కార్డు లోనే సర్వ విషయాలు సరిపుచ్చారు వారికి నా యెడల ఉన్న ఔదార్యానికి ఇది నిదర్శనం.  వారి రాజకీయ పరిజ్ఞానానికి  దర్పణం . -మీ దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు
Posted in సమీక్ష | Tagged | Leave a comment

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లా రచయిప్రచురణార్థంతల సంఘం సహకారంతో, 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి.

కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలి మహాసభలు మాతృభాషోద్యమ నిర్మాణం లక్ష్యంగా జరుగగా, 2011లో సాంకేతిక తెలుగు అంశం పైన రెండవ మహాసభలు జరిగాయి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భాషపరంగా తెలుగు వారంతా ఒక్కటేననే అంశాన్ని చాటుతూ 2015లో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగిన వైనం తెలిసినదే!

2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించిన నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించవలసిందిగా అటు తెలుగు ప్రభుత్వాలు ఇటు తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టే లక్ష్యంతో 2019 డిసెంబరు 27, 28, 29 తేదీలలో విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ 4వ మహాసభలు జరుగుతున్నాయి. మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ ఈ మహాసభల ప్రధాన ధ్యేయం.

తెలుగుతోపాటు తెలుగు నేలపైన కోలమి, కోయ, గోండి, కువి, కుయి, యెరుకల, సవర, పర్జి, కుపియా, బంజారా లాంటి భాషల్ని మాతృభాషలుగా కలిగిన ప్రజలు, అలాగే ఉర్దూ మాట్లాడే ప్రజలు తెలుగువారిగానే జీవిస్తున్నారు. తెలుగుతో పాటుగా ఈ మాతృభాషలన్నీ ప్రపంచీకరణం కోరల్లో చిక్కుకున్నవే! మాతృభాషల్ని మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోయి చివరికి అవి తమ ఉనికినే కోల్పోతాయి. ఇప్పటికే మాతృభాష లెన్నో అంతరించి పోయాయి. దీన్ని నివారించ గలగాలి.

ఈ మహాసభలలో ముఖ్య చర్చనీయాంశాలు:

·         తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్రం మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి…

·         తెలుగు నేలపైన అన్ని విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న వివిధ జాతుల మాతృభాషల పరిరక్షణ కోసం

ప్రత్యేకంగా “మాతృభాషల పీఠాలు” ఏర్పరచి నిధులు, నిధులు సమకూర్చటం గురించి…

·         తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల గురించి..

·         అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష

విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి…

·         రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పనగురించి…

·         ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి గురించీ…

·         తెలుగు విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలుగురించి…

·         తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకునేందుకు కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి…

·         తెలుగేతర ప్రాంతాల్లో జీవిస్తున్న తెలుగు వారికి హిందీ మాదిరే ప్రాధమిక, మాధ్యమిక పద్దతిలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ గురించి…

·         యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచటం గురించి,

·         గత ఐదేళ్లుగా ఆగిపోయిన సాహితీ గ్రంథాల కొనుగోళ్ల గురించి…

·         ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా లోతైన అధ్యయనం జరిగేందుకు వీలుగా మరిన్ని చర్చనీయాంశాలు సూచించ వలసిందిగా ఆయారంగ ప్రముఖులను కోరుతున్నారు.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

2007 ప్రధమ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పడింది. 2011 రెండవ మహాసభలలో “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యత కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.

2019 జనవరిలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిష్ట్రేషన్ చేయించారు. గౌరవాధ్యక్షులుగా డా. మండలి బుద్ధప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

అధ్యక్షులుగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ గోళ్ల నారాయణ రావు, కార్యదర్శిగా డా. జి వి పూర్ణచందు, సహాయకార్యదర్శిగా డా. గుమ్మా సాంబశివరావు, కోశాధికారిగా శ్రీ టి శోభనాద్రి, కార్యవర్గ సభ్యులుగా డా. ఈమని శివనాగిరెడ్డి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ పంతుల వెంకటేశ్వర రావు, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గార్లతో ఏర్పడిన కార్యవర్గం ఈ మహాసభలను నిర్వహిస్తోంది.  

రేపటి మహాసభల నాటికి ప్రపంచ వ్యాప్తంగా సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గం కలిగిన ఒక అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా తెలుగు భాషాసంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేస్టూ, “ప్రపంచ తెలుగు” కలను నిజం చేయటం ఈ సంస్థ లక్ష్యం.  తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది.    “ప్రపంచ తెలుగు రచయితల సంఘం”లో రూ. 2000/-(విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, జీవిత సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన. రచయితలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యాభిమానులైన ప్రతీ ఒక్కరూ ఈ సంస్థలో జీవిత సభ్యులుగా చేరవచ్చు.

మహాసభల ప్రతినిథులకు సూచనలు

ప్రతినిధులుగా పాల్గొనేవారు ఈ మహాసభల కోసం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితసభ్యులుగా చేరిన వారు అదనంగా ఈ ప్రతినిథి రుసుము చెల్లించనవసరం లేకుండా మినహాయింపు నిస్తున్నారు. ప్రతినిధి రుసుమునుగానీ, జీవిత సభ్యత్వాన్ని గానీ డి.డి. లేదా చెక్కు రూపేణా   PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగా వ్రాసి, కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం, 1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ-520002 చిరునామాకు పంపవలసి ఉంటుంది.

ప్రతినిధులు, జీవిత సభ్యులకు, ప్రతినిధులకు  మాత్రమే ఈ మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహారాలుంటాయి. వసతి ఏర్పాట్లు మాత్రం ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది.

ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 అక్టోబరు 31.

జీవిత సభ్యులుగానూ, ప్రతినిధులుగా నమోదయిన వారికి కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలోనూ ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ‘ప్రపంచతెలుగు’ వ్యాస సంపుటిలోనూ  ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది.

సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఎప్పటిలానే  కల్పిస్తున్నారు.  

మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి. ఎవరో వచ్చి ఆహ్వానించా లనుకోకుండా, మాతృభాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని నిర్వాహకులు ప్రార్థిస్తున్నారు.

ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం http://www.prapanchatelugu.com వెబ్‘సైట్ చూడగలరు. మీ సమాచారాన్ని ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com కు పంపవచ్చు.  శ్రీ గుత్తికొండ సుబ్బారావు,అధ్యక్షుడు 9440167697, డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి  9440172642లతో సంప్రదించవచ్చు.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్ 

డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్

మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ
” ఏంట్రా విశేషాలు ?”అడిగా .
”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ  వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా ?”అన్నాడు
”విన్నాను ”అన్నాను .
”మళ్ళీ ఇన్ని శతాబ్దాల తర్వాత మన రాష్ట్రం లో గోల్డ్ రష్ లాగా జాబ్ రష్ వచ్చి జాబులే జాబులు బావా . యెంత అదృష్టమో మన రాష్ట్రానికి పట్టింది తేనే తుట్టెలాగా అన్నాడు
”తలా తోకా లేని ఈ కమామీషు ఏంట్రా ?” అన్నా
”పేపర్ చదవవు.  చానల్స్ చూడవు.  ఇంటర్వ్యుల జోలికి పోవు.  నువ్వు బావ అని చెప్పుకోటానికి కూడా సిగ్గుగా ఉంది  లోకజ్ఞానం ఎలావస్తుంది బావా .?”అన్నాడు నిస్సిగ్గుగా
”అసలు విషయం ఏడవక ఈ నాన్చుడేమిట్రా?”అన్నాను గద్దించి
”పాకీ పని చేసేవారు  రోజుకు  గంటమాత్రమే పని చేస్తారని ,ఆపని తానుకాని చీఫ్ సేక్రేటరికాని లక్షరూపాయలిచ్చినా   చేయరని కనుక వారిజీతం భారిగా 18వెలరూపాయలుఇవ్వాలని సిఎం ఆదేశంట ఇది లీక్ అయి అందరికీ ”డిగ్నిటి ఆఫ్ లేబర్ ”గుర్తుకొచ్చి జనం కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలకోసం అప్లికేషన్లు పెట్టటం పైరవీలు చేయటం సాగించారట .
”పోన్లేరా  మంచి  ప్రోగ్రెసివ్ ఐడియా బాగుంది పాపం కిందతరగతి వాళ్లకు ఇప్పటిదాకా ఆపనే చేస్తూ ఎదుగూ బోదుగూలేనివారికి గోల్డెన్ ఆపర్ట్యూనిటి”అన్నాను
”నిజమే నేనూ అలానే అనుకొన్నా -కానీ ”అన్నాడు
”ఈ కానీ, అర్ధణాలేమిట్రా ”?అడిగా
”అక్కడే ఉంది తిరాకాసు దీనికి క్వాలిఫికేషన్ యెస్. సి పెట్టారు
”మంచిదేగా ఎస్సీలైనా బాగుపడతారు ”అన్నా
”అక్కడే తప్పులో కాలేశావు . యెస్. సి లంటే వేరే అర్ధం ఉందిలే . నీకు తెలీదు ”అన్నాడు
”మరి రష్ ఎందుకురా ?”
ఆప్రత్యేక  యెస్. సి  ప్రజాప్రతినిధులు ,అన్ని వర్గాలవారు గంట పనికి 18వేలు అనగానే డిగ్నిటి ఆఫ్ లేబర్ గుర్తుకొచ్చి ,పార్ట్ టైం జాబ్ కదా అని  పరి గెత్తుకోస్తున్నారని,సెలెక్షన్స్ కూడా వాళ్లవాళ్లేకనుక జాబ్ గ్యారంటి అనీ అంతగా అవసరమైతే ”ఉత్తరాయణం దక్షిణాయనం ”  ఉన్నాయి అనే ధీమా గా ఉన్నారని చెవులు కోరుక్కొంటున్నారు బావా ”అన్నాడు
”విలేజ్ వర్కర్లుగా  వాళ్ళ వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకొన్నారని అంటున్నారు కదా మళ్ళీ ఈ కక్కూర్తి ఏమిట్రా ?”అన్నాను
”డబ్బెవరి చేదుబావా  అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటేనే కదా ఎన్నికలలో తాము పెట్టింది అంతా పూడ్చుకోగలుగుతారు ”
”మంచి విషయాలు చెప్పి నాకు జ్ఞానబోధ చేశావు . మంచి జరుగుంతోందేమో అని ఆశించిన నా ఆశలపై నీళ్ళు కుమ్మరించావు ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అన్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు
 
Posted in రచనలు, రాజకీయం | Tagged | Leave a comment

కొత్త కొలువుకూటం 

కొత్త కొలువుకూటం 

ఈ మధ్యదాకా ”గౌరవ సభ ”

నలభై రోజుల్నించి ”కౌరవ సభ ”
ఇప్పటిదాకా ”పూతు ”సభ 
ఇప్పుడేమో ”బూతు సభ ”
మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం 
నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం  
ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం 
ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం 
 మాటకు  చేత కు నాడు ఆదర్శం 
  చేతకు  మాటకు నేడు  మైళ్ళ దూరం 
వివేకం విజ్ఞానం దూరదృష్టి నాడు 

అజ్ఞానం ,అహంకారం ,అసహనం నేడు 

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-19-ఉయ్యూరు 
Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రముఖులకు సరసభారతి నివాళి 

ప్రముఖులకు సరసభారతి నివాళి

 ఇటీవల నెల రోజులలో మరణించిన ప్రముఖ రచయితలు1- శ్రీ రామతీర్థ , 2-మహాస్వప్న ,3-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ,4-దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ 5-,శ్రీమతి విజయనిర్మల ,6-నటుడు శ్రీ రాళ్ళపల్లి ,7-సాంఘిక విద్యా సేవకురాలు శ్రీమతి వి కోటేశ్వరమ్మ గార్లకు నివాళి కార్యక్రమాన్ని సరసభారతి 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గం లకు స్థానిక ఏ సి గ్రంధాలయం లో నిర్వ హిస్తోంది .సాహిత్య సంగీతాభిమానులు  పాల్గొని నివాళి సమర్పించవలసినదిగా కోరుతున్నాము
  గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
 మాదిరాజు శివ లక్ష్మి -కార్యదర్శి
 20-7-19 -ఉయ్యూరు  

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

జులై రమ్యభారతి మాసపత్రికలో శ్రీ రామతీర్థ శ్రీ మహాస్వప్న ,శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గార్లపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

                        నేపధ్యం  

సరసభారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు మా తలిదండ్రులు కీ శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ  గారల స్మారక ఉగాది పురస్కారం అందజేయటానికి హైదరాబాద్ లో ఉన్న నోరి నరసింహ శాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఎం.ఇ. గారిని ఆహ్వానించి పురస్కారం అందించి సత్కరించాము .అప్పుడు వారు  జులై 14 ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో వ్యాస పౌర్ణమి సందర్భంగా నాకు గురు పురస్కారం అందిస్తామని రహస్యం గా చెప్పారు .సరే అన్నాను .కానీ యెవరికీ నేను చెప్పలేదు .జూన్ 20కు అందెట్లుగా నాకు ఆహ్వాన పత్రాలు పంపారు .అందులో త్యాగరాజ గాన సభ నిర్మాత , లలితకళా ప్రపూర్ణ  శ్రీ కళా సుబ్బారావు పురస్కారం అందిస్తున్నట్లు ఉన్నది .ఈ ఆహ్వానాన్ని అందరికీ పంపాను .అందరూ అభినందించారు .డా .రామడుగు వేంకటేశ్వర శర్మగారు గుంటూరు నుండి తనకు నేనుపంపిన ఆహ్వానం అందగానే ఫోన్ చేసి యెంతో సంతోషించి  కళా సుబ్బారావు గారి సాహిత్య ,కళా సేవలను వివరించి ‘’మీకు వారి అవార్డ్ రావటం ‘’చాలా అభినందనీయ విషయం అని నన్ను అభినందించారు .ఒక గొప్పవారి పేరిట  ఒకప్పుడు మన  రాస్ట్రమే అయినా నేడు వేరొక రాస్త్రం అయిన తెలంగాణాలో అందునా రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో అందులోనూ ఘనత వహించిన త్యాగ రాజ గాన సభ లో పురస్కారం అందుకోవటం నేను ఊహించని విషయం .అది జరుగబోతున్నందుకు మా కుటుంబం అంతా యెంత గానో సంతోషింఛారు .

      ప్రయాణ సన్నాహం

https://photos.app.goo.gl/BPE4LARCx1K3Ks4q8

 జులై 12 శుక్రవారం తొలి ఏకాదశి పర్వదినం కనుక ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం నుంచి  బయల్దేరాలను కొన్నాం  . 14 వ తేదీ సభకు నాతోపాటు ఉన్న పురస్కారగ్రహీతలు అతిధులు కలిపి 12 మండి ఉన్నారు  వీరికి నేను రాసి ,సరసభారతి  ప్రచురించిన ‘’ గీర్వాణకవుల  కవితా గీర్వాణం 3 భాగాలు  దైవచిత్తం మొత్తం 4పుస్తకాలు అందజేయాలని 16 సెట్లు దేనికది ఒక ఒక కవర్ లో పెట్టి రెడీ చేసి రెండు అట్ట పెట్టెలలో పాక్ చేసి సిద్ధం చేశాను . వీటి బరువు చూసి మా శ్రీమతి గుండె బాదుకొని బస్ లో వద్దు కారులో వెళ్దాం అన్నది .నేను ‘’కొండవలస ‘’లాగా ‘’ఐతే వాకే’’అన్నాను  .మా సంగతి ముందే తెలిసిన మా అబ్బాయి   రమణ కారు బుక్ చేస్తానని చెప్పాడు .సరే అన్నాను .  మా ఆన్నయ్య గారబ్బాయి రామనాధ్ శిష్యుడు మా అందరికీ బాగా పరిచయమున్న ఉయ్యూరులోని యమహాకంపెనీ మేనేజర్ దావూద్ గురువారం ఉదయం తాను కొత్త కారు కొన్నానని , రమణకు చ్చెప్పాడట  .వాడు మా హైదారాబాద్ ప్రయాణం సంగతి చెబితే ‘’మొదటి రైడింగ్  తాతయ్య్గ  గారు అమ్మమ్మగారి తో చేయిద్దా0’’అని చెప్పి డ్రైవర్ ను మాట్లాడి కారు తెచ్చి మా వాటర్ ప్లాంట్ లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టాడు.   మేమిద్దరం మా మనవడు చరణ్ మధ్యాహ్నం 12 కే భోజనం చేసి  పావుతక్కువ 2 కు కాఫీ లు తాగి రెడీ అయ్యా0.దావూద్ ,మా రమణ వచ్చారు .మొదటి సారి కారు ప్రయాణం కనుక దావూద్ చేతిలో యెంతైనా కొంత డబ్బు పెట్టమన్నాడు ,దావూద్ పది రూపాయలు పెట్టండి తాతయ్యగారు అన్నాడు .అది పద్ధతి కదనుకొని అయిదువందల ఒక్క రూపాయి చేతిలోపెట్టి‘’ఇలాంటికార్లు రెండుమూడు కొనాలి ‘’అని భుజం తట్టాను అతడు మా ఇద్దరికాళ్ళకు నమస్కారం చేసి ‘’తాతయ్యగారూ ఇదంతా మీ  ఆశీర్వాదమేనండీ’’అని ఆనందంగా చెప్పాడు . మధ్యాహ్నం 2-15కు అందరికీ బై చెప్పి బయల్దేరా0 .సూర్యాపేటలో టిఫిన్ చేసి మళ్ళీ బయల్దేరి రాత్రి 7-45కు హైదారాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంటికి మల్లాపూర్ చేరా0.

                           సభ -పురస్కార సత్కారం

 14 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 30 కి కాబ్ లో  మేమిద్దరం ,చరణ్ ,పెద్ద కోడలు శ్రీమతి సమత  బయల్దేరి 5 గంటలకు త్యాగరాజ గాన సభకు చేరా0 .మణికొండనుంచి స్టేట్ బాంక్ లో పని చేస్తున్న మా బావమరది ఆనంద్ ,బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మా కోడలు శ్రీమతి ఇందిర మనవడు హర్ష మనవరాలు హర్షిత  చేరుకున్నారు. సత్కారం సంగతి మా  రమణద్వారా తెలుసుకున్న హైదారాబాద్ లో ఉంటున్న మా ఉయ్యూరు శిష్యుడు వేగరాజు రాజా ,ఉయ్యూరులో యెలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్  స్వర్గీయ వెంపటి శర్మగారబ్బాయి ప్రభాకర  కూడా వచ్చారు .54యేళ్లక్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యుడు అత్యంత వినయ సంపన్నుడు  ఉద్యోగం చేసి రిటైరై హైదరాబాద్ లో ఉంటున్న నజీరుద్దీన్ మధ్యాహ్నం ఫోన్ చేసి సన్మానం సంగతి తెలిసి తను  జలుబు ,తుమ్ముల వలన ఇబ్బంది పడుతున్నానని యే మాత్రం వీలున్నా వస్తానని చెప్పాడు సరే అన్నాను .రాలేక పోయానని తర్వాత మెసేజ్ పెట్టాడు .ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదివిన లంకావారబ్బాయి  ప్రభాకర్  స్నేహితుడు పరిచయం  చేసుకొని  చెప్పాడు . నా అభిమానిడా శ్రీమతి కే బి లక్ష్మి గారు వచ్చి వేదికమీద నాతో మాట్లాడి అభినందనలు తెలిపి అక్కడి వారితో ‘’మా గురువుగారు దుర్గా ప్రసాద్ గారు ‘’అని చెప్పటం నాకు పరమానందం కలిగించి అవాక్కయ్యాను  .దాదాపు పాతిక యేళ్ళ క్రితం పామర్రు హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ ,అనేక అవార్డులు పొందిన నేను యెప్పుడు కనిపించినా ‘’సార్ !ఇంతమంది సైన్స్ మేస్టర్లు పామర్రు హైస్కూల్ లో పని చేసినా ,ఇప్పటికీ మిమ్మల్నే బాగా గుర్తుపెట్టుకొని అందరూ అభిమానిస్తారు కారణం  యేమిటి?’’అని అమాయకంగానో గడుసుగానో ప్రశ్నించే  ,రిటైర్ అయి హైదారాబాద్ లో ఉంటున్న ,తమ తండ్రి గారు శ్రీ పూసపాటి నాగేశ్వర రావు గారి జీవితం రచనలపై పిహెచ్ డి చేసిన శ్రీ పూసపాటి శంకరరావు గారూ వచ్చారు .ప్రముఖ కథారచయిత అత్యుత్తమ శ్రేణి విమర్శక విశ్లేషకులు ,పద చిత్ర రామాయణ కర్త శ్రీ విహారిగారు వాట్సాప్ లో అభినందించారు .వారం ముందే ‘’నేనువస్తాను కలుస్తాను ‘’అని మెయిల్ పెట్టి ఊరించిన హైదారాబాద్ వాసి  శ్రీ ఎ. సి.పి . శాస్త్రిగారు ‘’యథాప్రకారం’’ చెయ్యిచ్చారు .

  సాయంత్రం 5 -30 కి సభ ప్రారంభమైంది .ముందుగా  శ్రీ వారణాసి వెంకట నారాయణ శాస్త్రి గారు రచించిన ‘’భగవద్గీత ‘’బుర్రకధను  శ్రీ పిసుపాటి వేంకటేశ్వర శర్మగారు శ్రావ్యం గా గానం చేసి సమ్మోహపరచారు .తరువాత అతిధులకు పురస్కార గ్రహీతలకు నాదస్వర వాద్యం తో పూర్ణ కుంభం తో వేదాశీస్సులతో స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు .నేను తెచ్చిన పుస్తకాల సెట్లు సభ ప్రారంభం ముందే అందరికీ పంచేశాను .’’దర్శనం ‘’పత్రిక లో పని చేస్తున్న శర్మగారు ‘’ఒక సెట్ ఉంటే ఇవ్వండి ‘’అని అడిగితే ప్రభాకర్ కిచ్చిన సెట్ తీసుకొని అతనికి  పోస్ట్ లో పంపిస్తానని చెప్పి తీసుకొని దర్శనం గారికిచ్చాను

 సభా సంచాలకులు శ్రీ పి.ఎం. గాంధీ సుశబ్ద సుమధుర వచనాలతో  ఒక్కొక్కరిపై రాసిన ప్రత్యేక పద్యం తో అపూర్వంగా రాగ భావాలతో ఆలపిస్తూ అందరినీ వేదికపైకి ఆహ్వానించారు .బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రీ గారు అధ్యక్షత వహించి సభ నిర్వహించారు .నోరి ఛారిటబుల్ ట్రస్ట్ గురించి తాము చేబడుతున్న కార్యక్రమాలగురించి పురస్కార గ్రహీతలగూర్చి క్లుప్తంగా అర్థవంతంగా వివరించారు .తరువాత శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి సంస్కృతం లో రచించి ,డా వారణాసి వెంకటేశ్వర్లు గారు తెలుగు అనువాదం చేసి నోరి ట్రస్ట్ వారు ప్రచురించిన ‘’బ్రహ్మ కలా’’గ్రంధాన్ని శ్రే శ్రీ విజ్ణానంద భారతీ స్వామి ఆవిష్కరించారు .ముఖ్య అతిధిగా శ్రీ పిల్లుట్ల విశ్వనాధ్ గారు ,విశిస్ట అతిధిగా డా వారణాసి వెంకటేశ్వర్లు ,ఆత్మీయ అతిథి శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు పురస్కార గ్రహీతలు వేదికను సుసంపన్నం చేశారు .

మొదటగా అనుగ్రహణ భాషణం చేసిన స్వామీజీ చెప్పిన ‘’గుర్రబ్బండీ వాడి ‘’ అన్యాపదేశ కధ అందరినీ ఆకట్టుకొన్నది .

  ఆ పిమ్మట పురస్కార ప్రదానోత్సవం సన్మానం ఘనంగా నోరివారు అందరి సహకారం తో నిర్వహించారు .శ్రే వేద వ్యాసపురస్కారం ను బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మగారికి ,శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి పురస్కారం బ్రహ్మశ్రీ మున్నంగి వేంకటరాయ శర్మగారికి ,కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కారం శ్రీ రాధశ్రీ అనబడే పద్యకవి దిడుగు అనంత రాధ కృష్ణ ప్రసాద్ గారికి ,శ్రీ మునిమాణిక్యం నరసింహారావు పురస్కారం ప్రముఖ రచయిత్రి డా.శ్రీమతి వాసా ప్రభావతిగారికి ,డా సర్వేపల్లి రాధ కృష్ణ లౌకిక గురు పురస్కారం డా శ్రీమతి శరత్ జ్యోత్స్నారాణి గారెకి ,డా.బెర్జాగీ పురస్కారం ప్రొఫెసర్ యెస్. వెంకటరావు గారికి ,తెలుగు తల్లి పురస్కారం శ్రీ సాధన నరసింహ శర్మగారికి ,శ్రీ కళాసుబ్బారాఓ పురస్కారం శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్  అనే నాకు  అందజేశారు .  దంపతులను ఆశీనులను చేసి సత్కరించిన తీరు  ఆకర్షణీయం, అభిలషణీయంగా ఉన్నది .మా దంపతులకు నోరివారి సన్మానమే కాకుండా మా బావమర్ది ఆనంద్  గులాబీ దండ శాలువాలతో మిమ్మల్ని సత్కరిస్తే ,శ్రీమతి కంలాకర్ భారతి గారు శాలువా కప్పి అభిమానం చాటితే  మా ఇద్దరబ్బాయిలు  కోడళ్ళు మనవళ్లు మనవరాలు శాలువాలుకప్పి  హైదారాబాద్ లోనూ ‘’గబ్బిటవారి హవా’’ చూపెట్టారు .శాస్త్రిగారు  అందరికీ శాలువా పుష్పమాల ,జ్ణాపిక ,మెడల్ ,దీన్ని భద్రపరచుకోవటానికి చిన్న భరిణ ,నోరి నరసింహ శాస్త్రిగారి పుస్తకాలు ,రెండు బత్తాయిపళ్లు  అన్నీ నోరి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ప్రత్యేకమైన పెద్ద నాణ్యమైన ‘’Duffelబాగ్ ‘’లో పెట్టి అందించారు  . డా శివప్రసాద్ గారు శాస్త్రిగారితో  వారి తండ్రిగారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు .డా వెంకటేశ్వర్లు ఆవిష్కరింపబడిన గ్రంధం లోని ముఖ్యాంశాలను స్పృశించారు .వృద్ధురాలైన ప్రభావతిగారు అనారోగ్య రీత్యా సన్మానం అందుకొనగానే వెళ్ళిపోయారు .పురస్కార గ్రహీతలు   ఇవ్వబడిన రెండుమూడు నిమిషాలలో తమ మనో భావాలను స్పందనగా తెలియబరచారు .చివరి వాడిని నేనే కావటం 9గంటలకు వేదిక ఖాళీ చేసి  వెళ్లాల్సిన  అవసరం ఉండటం తో నాకు ఒక్క నిమిషమే కేటాయిస్తే అందులోనే చెప్పాల్సింది చెప్పేశాను .తర్వాత సన్మానితులందరి తరఫున నేను తెచ్చిన శాలువాను మేమందరం కలిసి శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారికప్పి కృతజ్నాత తెలియ జేయటం హైలైట్ అయింది .నేను మాట్లాడుదామనుకొని తయారు చేసిన దాన్ని ఇప్పుడు మీకు తెలియ జేస్తాను .  సభ అవగానే  మేమందరం దగ్గరలోనే ఉన్న హోటల్ కు వెళ్ళి టిఫిన్లు చేశా0  మా మనవడు హర్ష ఇంటర్ పాసై ,ఇంజనీరింగ్ లో చేరిన సందర్భంగా మా అబ్బాయి శర్మ హోటల్ ఖర్చు  3,500రూపాయల బిల్లుకట్టిమిమ్మల్ని ఆశ్చర్యం లో పడేశాడు .శర్మావాళ్లు బాచుపల్లి ,మా బామ్మర్ది మనికొండ,వెళ్లారు మేము మల్లాపూర్ చేరేసరికి రాత్రి 11-30 అయింది .

  నా ప్రసంగ పాఠం

‘’గురుః ఆది రనంత శ్చ-గురుః పరమ దైవతం -గురోఃపరతరం నాస్తి -తస్మై శ్రీ గురవేనమః’’

ఈ శ్లోకం ‘’విశ్వ సార తంత్ర ‘’లోనిది .యెందుకో దీనికి లోకం లో యెక్కడా ప్రచారం లేక పోవటం  ఆశ్చర్యంగా ఉంది .ఆషాఢ పౌర్ణమి వ్యాసమహర్షి జన్మించిన రోజు .ఆయన వసిస్టమహర్షి మునిమనవడు ,శక్తిమహర్షి మనవడు ,పరాశర సత్యవతీ దంపతులపుత్రుడు శుకమహర్షికి తండ్రి .వ్యాసపౌర్ణమినాడు బ్రహ్మసూత్ర పఠనంచేస్తారు .స్త్రీలు ‘’గో పద్మ వ్రతం ‘’విష్ణుమూర్తి అనుగ్రహం కోసం  చేస్తారు .నాలుగు ముఖాలులేని బ్రహ్మ అంటే జ్నాన చైతన్య ప్రదాత ,నాలుగు భుజాలు లేని విష్ణువు అంటే రక్షకుడు ,అపమార్గం నుంచి తప్పించేవాద్దు ,మూడు నేత్రాలులేని శివుడు అంటే అజ్నానాన్ని నశింప చేసే వాడు గురువు అంటారు అంటే త్రిమూర్తి అవతారం. జ్నానజ్యోతి ప్రసాద్దించే ప్రత్యక్ష దైవం కనుక గురువు ‘’గురు దేవుడు ‘’అయ్యాడు .అంతేకాక ‘’ఆచార్య దేవో భవ ‘’కూడా .

  నేపాల్ లో తానాహు జిల్లాలో ‘’దమాలీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు వేద విభజన చేసిన గుహ ఉంది .గొప్ప యాత్రాస్థలమైంది .వ్యాసుడు ‘’కాలావతారం ‘’అన్నారు .వ్యాస అనేది ఒక అధికారం అంటే ఒక పదవి .ప్రతియుగం లో ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు .ఇప్పటికీ 27 గురు వ్యాసులయ్యారు మొదటి ద్వాపరమ్ లో స్వాయంభువ్డుమొదటి  వ్యాసుడు ,రెండవ ద్వాపరమ్ లో ప్రజాపతి వ్యాసుడు మూడవ ద్వాపరమ్ లో శుక్రుడు వ్యాసుడు ,ఆతర్వాత వరుసగా వసిస్ట ,త్రివర్ష ,మొదలైనవారు వ్యాసులై 27 వ వ్యాసుడుగా సనద్వాజుడు అయ్యాడు .ఇప్పుడున్న బాదరాయణుడు లేక కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాసుడు 28 వ వ్యాసుడు .దీని తర్వాత ఈయన సూర్య సావర్ణికాలం లో సప్తరుషులలో ఒకడు ఔతాడు .

  కాశ్మీర్ లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అనే అర్ధం .వ్యాసర్షి భారత హరివంశ0 తోకలిపి 1 లక్ష ఇరవై అయిదు వేల శ్లోకాలు ,పురాణాలలో 5 లక్షలశ్లోకాలు రాసీనా  మహానుభావుడు .మానవ మనస్తత్వం మారడం లేదని భారతం లో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యెషు ,నహి కశ్చిత్ శ్రుణో తిమే-పరోపకార పుణ్యాయ,పాపాయ పరపీడనం ‘’అని  నెత్తీనోరూ బాదుకున్నాడు . జనాలకు చేతులెక్కి మొక్కాడు పాపం .దీని అర్ధం యేమిటంటే ‘’ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం అపకారం చేస్తే పాపం ‘అని నేను మొత్తుకున్నా యెవ్వరూ నా మాట వినటం లేదే ‘’అని పరితపించిన మానవీయ మూర్తి విశాల హృదయుడు భగవాన్ వేద వ్యాసుడు .ఇప్పటికీ యెవరూ ఆమాట వినటం లేదుకదా .

  అటుకులు తీసుకొని తన చెలికాడు  శ్రీ కృష్ణుని దర్శించిన కుచేలుడు తనమిత్రుడు చేసిన సపర్యలకు ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు అంతేకాక గురువు సాందీపమహర్షి ని తలచుకోవటం అక్కడ గడిపిన రోజులు గుర్తుకు చేసుకున్నాడు .దీనికి ఆశ్చర్యపోయాడు కుచేలుడు –‘’

‘’గురు మతి దలపగ-త్రిజగద్గురుడ వనం దగిన నీకు -గురువనగా నొరు డెవ్వ దింతయును నీ -కరాయంగా – విడంబన0 బగు గాదె హరీ ‘’అన్నాడు –

 భావం -త్రిజత్తులకు గురువైన నువ్వు గురువు సాందీపమునిని   తలచుకోవటం ఆశ్చర్యంగా ఉంది ‘’అని అంటే లోకం లో గురువు కున్న ఉత్కృస్ట స్థితిని ఆచరణలో చూపి లోకానికి గొప్ప మార్గ దర్శి అయ్యాడు భగవాన్ శ్రీ కృష్ణుడు  వ్యాసర్షి కృష్ణుని అవతార మే కనుక కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు .కృష్ణావతార ఘట్టం లో దేవతలంతా చేసిన ప్రార్థన ఇద్దరికీ వర్తిస్తుంది

‘’గురు పాఠీనమవై ,జలగ్రహమవై ,కోలంబవై ,శ్రీ నృ కే-సరివై ,భిక్షు0డవై ,హయాననుడవై  ,క్ష్మా దేవతా భర్తవై

ధరణీ నాధుడవై ,దయా గుణోదారు0 డవై ,లోకముల్ -పరి రక్షించిన నీకు  మ్రోక్కెద ,మిలాభారంబు వారింపవే ‘’

 గురుపౌర్ణమి శుభాకాంక్షలతో

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-19-కాంప్ -మల్లాపూర్ -హైదారాబాద్

— 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా శ్రీ కళా సుబ్బారావు గారి గురు పురస్కారం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

తొలి లేక శయన ఏకాదశి

ఒకప్పుడు భగవాన్ శ్రీ కృష్ణుడు ,యుదిస్టిరుడైన ధర్మరాజుకు ప్రధమ లేక తొలి లేక శయన ఏకాదశి విశేషాలను తెలియ జేశాడు .దీన్ని బ్రహ్మదేవుడు తన పుత్రుడు నారదమహర్షికి తెలిపాడు అని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది .ఈ సందర్భం గా మాంధాత మహారాజు వృత్తాంతం తెలియ జేయబడింది .మాంధాత పాలనలో ఒకసారి తీవ్ర అనావృస్టి ఏర్పడి భయంకర మైన కరువు సంభవించింది .ప్రజలను ఈ కరువు బాధ నుంచి ఎలా  తప్పించాలో ఆయనకు బోధ పడలేదు .అప్పుడు ఆంగీరస మహర్షి రాజుకు వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ,ముందుగా ‘’దేవ శయన ఏకాదశి వ్రతం ‘’ఆచరించమని సలహా ఇచ్చాడు .మహారాజు  ఆవ్రతాన్ని నిష్టగా చేయగా విష్ణు మూర్తి ప్రీతి చెంది దేశం లో వర్షాలు తగినట్లు కురిసేట్లు చేశాడు.కరువు కాటకాలనుంచి దేశానికి ముప్పు తప్పింది .ఉపవాసం ముఖ్యంగా ఏకాదశి వ్రతం చేయాలి .

విష్ణుమూర్తి  ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు  క్షీర సాగరం లో  శేష శయనం  పై నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక శయన ఏకాదశి లేక దేవ శయన ఏకాదశి అంటారు .దీనికే తొలి లేక ప్రథమ ఏకాదశి అనిపేరు .ఇప్పటినుంచే పండుగలు ప్రారంభమౌతాయి  శయన ఏకాదశి నుంచి నాలుగు నెలలు  నిద్రపోయి  కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి  మేలుకొంటాడు.ఈ ఏకాదశిని ఉత్ధాన ఏకాదశి లేక  ప్రబోధిని ఏకాదశి అంటారు .ఈ నాలుగు నెలలు వర్షాకాలం కనుక యతీశ్వరులు, సన్యాసులు పీఠాదిపతులు ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలరు .దీనినే చాతుర్మాస దీక్ష అంటారు .

మహారాష్ట్రలో శయన ఏకాదశి నాడు చంద్ర భాగా నదీ తీరం లో ఉన్న పాండురంగడు కొలువై ఉన్న పండరి పురానికి   రాష్ట్రం నలుమూలలనుంచి కాలినడకన పండరి శోభ యాత్ర చేసి వచ్చి చంద్ర భాగ లో స్నానించి  పాండురంగ స్వామిని  దర్శించి పునీతులౌతారు  .ఈ యాత్రలో మహారాష్ట్రలోని అలంది నుంచి సంత్ జ్ఞానేశ్వర్  విగ్రహం ,నార్సి నాం దేవ్ నుంచి సంత్ నామదేవ్ విగ్రహం ,దేహు నుంచి సంత్ తుకారాం విగ్రహం ,పైఠాన్ నుంచి సంత్ ఏకనాథ్ విగ్రహం ,త్రయంబకేశ్వర్ నుంచి సంత్ నివృత్తినాథ్ విగ్రహం ,ముక్తానగర్ నుంచి సంత్ ముక్తాబాయి విగ్రహం ,సస్వాద్ నుంచి సంత్ సోపాన్ విగ్రహం ,షేగావ్ నుంచి గజానన్ మహారాజ్ విగ్రహం లను మోసుకొంటూ పండరి పురం చేరుతారు .ఈయాత్రికులను ‘’వర్కారీలు ‘’అంటారు ,వీరంతా జ్ఞాన దేవ, తుకారాం ల అభంగాలను భక్తి పారవశ్యంతో గానం చేస్తూ పండరి  యాత్ర చేయటం విశేషం .

రేపు 12-7-19 శుక్రవారం పవిత్ర  తొలి ఏకాదశి శుబాకా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు

 

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి

అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని” అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి ”వ్యాసం జులై గురు సాయిస్థాన్  లో ప్రచురితమైంది -దుర్గాప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు 49 –‘’ఇ మెయిల్ ఇన్ఫార్మర్’’ సృష్టికర్త –టి.సోనీ రాయ్(చివరిభాగం )

ఇ మెయిల్స్ చెక్ చెక్ చేసుకోవటానికి డెస్క్ టాప్ మీద  ఆధారపడి వచ్చేది .ఈ ఇబ్బందిని అధిగమించటానికి హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త సోనీ రాయ్ పరి శోధకుడిగా మారి తానె ఒక యంత్రాన్ని సృష్టించాడు .2001లో రూపొందించిన ఈ గాడ్జెట్ అంటే’’ ఇ మెయిల్ ఇన్ఫార్మర్ ‘’ ఎప్పుడు ఇ మెయిల్ వచ్చినా అందించి కాలాన్ని ఆదా చేస్తుంది .దీన్ని టెలిఫోన్ కు రిసీవర్ తో సిరీస్ లో  కలపాలి. సోని రాయ్ ఇన వెంటర్స్ అసోసియేషన్ సంస్థాపక అధ్యక్షుడు ..E.S.P.అంటే ఇ మెయిల్ సర్వీస్ ప్రోవైడర్ లో వినియోగదారులు తమ ఫోన్ నంబర్లతో ఇ మెయిల్ అడ్రస్ లను రిజిస్టర్ చేసుకోవాలి .ఇన్ బాక్స్ లో కొత్త మెయిల్ రాగానే యి .ఎస్. పి ‘’లైట్ ఎమిటింగ్ డయోడ్ ‘’C.E.D.ఒక బజ్ శబ్దం చేస్తుంది .ఇది P.C.మరియు I.S.P.ల చార్జి లవలన కలిగే విద్యుత్తును ,టెలిఫోన్ చార్జీలను ఆదా చేస్తుంది .

image.png

సోనీ రాయ్ ‘’చెక్ అథెంటిక్ సిస్టం ‘’C.A.S.పరికరాన్ని కూడా సృష్టించారు .ఇది బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం పై పని చేసి బ్యాంక్ చెక్ ల నిజస్వరూపాన్ని తెలిపి ,నకిలీ చెక్కుల వాడకాన్ని నిరోధిస్తుంది .ఈ ఎక్విప్ మెంట్ లోనే సిరా రహత వేలి ముద్రల సాంకేతిక పరిజ్ఞానం ,ఫింగర్ ప్రింట్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ కూడా  ఉంది.చెక్ నిస్కాన్ చేసి చదివే  అవకాశమూ ఉన్నది  .ఇంతేకాదు ఒక హై స్పీడ్ కంప్యూటర్ కూడా ఇందులో ఉండటం విశేషం .C.A.S.ద్వారా ప్రతి చెక్కును నిర్దుష్టంగా పరిశీలించే అవకాశం కలిగింది .

సోనీ రాయ్ మేధస్సు కు తగిన అవార్డులు రివార్డ్ లు దక్కాయి .1905లో య౦గ్ సైంటిస్ట్ అవార్డ్ ,2001లో  చెస్ట్ ఇన్వెన్షన్ అవార్డ్ ,  నేషనల్  ఇన్నోవోషన్ ఫౌండేషన్ అవార్డ్ లను అందుకున్న ఆధునిక యువ సాంకేతిక శాస్త్ర వేత్త సోనీ రాయ్ .

50-హై స్పీడ్ చిప్ డిజైనర్ –శ్రీ రాం సుదీర్ రెడ్డి

ఖమ్మం జిల్లా భద్రాచలం లో 1968లో జన్మించిన శ్రీ రాం సుదీర్ రెడ్డి ,కోరుకొండ హై స్కూల్ చదువు తర్వాత కృష్ణాజిల్లా మచిలీపట్నం లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్ ఇంజనీరింగ్ చదివి పాసై ,అమెరికా వెళ్లి క౦ ప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎం.యెస్.చేసి ,కొద్దికాలం లోనే విజయవంతమైన పారిశ్రామిక వేత్త అయ్యారు .బోస్టన్ నగరం లో ఐ .టి .లో.అకు౦ఠితదీక్ష తో  విశేష పరిశోధనలు చేశారు .

హైస్పీడ్ కమ్యూని కేషన్ కు అవసరమైన ‘’చిప్ డిజైనింగ్ ‘’లో అత్యంత ప్రతిభ కనబరచారు .అనేక మల్టీ నేషనల్ హార్డ్ వేర్ కంపెనీలు ఈయన అపార మేధాశక్తిని గుర్తించాయి .బోస్టన్ లో స్వంతంగా ‘’సిమ్రాన్ కమ్యూని  కేషన్స్’’కంపెనీ ప్రారంభించి ,ఒక్క ఏడాదిలో రెండు రకాల చిప్ లను అందించిన ఘనుడిగా గుర్తింపు పొందారు .నాన్ డాక్ లిస్టెడ్ కంపెనీ అయిన అప్లైడ్ మైక్రో సర్క్యూట్స్ కార్పో రేషన్, రెడ్డి గారి  సిమ్రాన్ కంపెనీని 120 మిలియన్ల డాలర్ల తో (575కోట్లరూపాయలు )కొను గోలు చేసింది .ఈ డీల్ వలన కొన్నకంపెనీ షేరు విలువ 4 డాలర్లనుంచి పదిరెట్లు పెరిగి 40 డాలర్లుగా దూసుకుపోయింది .ఈ కంపెని కాపిటలైజేషన్ 2,500కోట్ల డాలర్లకు  చేరింది .

image.png

2002కు రెడ్డిగారు అప్లైడ్ మైక్రో సర్క్యూట్ కార్పోరేషన్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్  అండ్ జనరల్ మేనేజర్ హోదాలో ‘’ఫ్రేమర్ లేయర్ ప్రాడక్ట్స్’’ కు ఇన్ చార్జి అయినారు .ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ విశేష ప్రతిభా పాటవాలు చూపిన ఈయన తన స్వంతప్రాంతం తెలంగాణలో ఒక ఆర్ అండ్ డి నెలకొల్పటానికి 2002 ఏప్రిల్ లో విశ్వ ప్రయత్నం చేశారు  , 25కోట్ల పెట్టుబడితో ఏర్పడే దీనికోసం జూబ్లి హిల్స్ లో భవన నిర్మాణం చేబట్టారు కూడా .ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఐ టి వర్గాలతో సంప్రదింపులు జరిపినా స్పందన కరువైనందున నిరాశతో విరమించుకు-న్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’

మనవి-‘’ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు’’ ధారావాహిక ఈ 50మంది శాస్త్ర వేత్తలతో ప్రస్తుతం ముగిస్తున్నాను .ప్రజల  దృష్టిలో ఎక్కువగా పడనీ వారినే ఎక్కువమందిని తీసుకొని రాశాను .ఇంకాఎందరో మహాను భావులున్నారు .వీలున్నప్పుడు వారి గురించి తెలియ జేస్తాను .ఇప్పటికి ఇది విరామం .

రేపు 12-7-19 శుక్రవారం ‘’తొలి ఏకాదశి ‘’శుభా కాంక్షలు’’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

—


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు 47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ

ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు

47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ

గుంటూరు జిల్లా ఇంటూరులో శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ 26-9-1906 న జన్మించారు .మద్రాస్ వేస్లికాలేజిలో ఎం.ఏ.చదివి ,1921లో బ్రిటన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఏకాగ్రత కుదరక అమెరికా వెళ్లి  హార్వర్డ్ యూని వర్సిటిలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేశారు .ఇక్కడే రెండు సార్లు వరుసగా ఫెలోషిప్ పొందిన  తొలి భారతీయ మేధావిగా గుర్తింపు పొందారు .సామాజిక ,అర్ధ తత్వ, శాస్త్రాలను కూలంకషంగా మధించారు .సిద్ధాంతవ్యాసం రాసి యూని వర్సిటీ వారి చే పిహెచ్ డి పొందారు .1939లో గ్రంథ ప్రచురణ జరిగింది  .అనేకమంది మేధావులతో ,సామాజిక సంస్థలతో అనుబంధం పెంచుకొన్నారు .

  ఇండియాకు తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య పోరాటం లోపాల్గొని అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలు లో ఉన్నారు .విడుదల అయ్యాక  బెల్గాం యూని వర్సిటిలో ,బొంబాయి టాటా సంస్థలో ఉద్యోగించారుకాని ఇమడ లేకపోయారు .వైవిధ్యభరిత సామాజిక అంశాలు ముఖ్యంగా మైనారిటీల సమస్యలపై అత్యద్భుత గ్రంథ రచన చేసి ,తామే మైనారిటీ గా రూపొంది శారీరకంగా ,మానసికం గా కుంగిపోయిన బడుగు జనోద్దరణ శీలి బాలకృష్ణగారు .ఆయన అముద్రిత రచనలు చాలా ఉన్నాయి .వాటిని ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది .మానసికంగా కుంగిపోయిన కాట్రగడ్డ బాలకృష్ణగారు అతి తక్కువవయసు 42 ఏళ్ళకే భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాలుగు నెలలకే 18-12-1948 న పరమపదించారు .

48-ఆర్కిడాలజి శాస్త్రవేత్త –శ్రీ ఎ.నాగేశ్వరరావు

గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించిన శ్రీ ఎ.నాగేశ్వరరావు ఆంధ్రా యూని వర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ‘’ఆర్కిడ్స్ ఆఫ్ అరుణాచల ప్రదేశ్ ‘’అనే సిద్ధాంతవ్యాసం రాసి ,టి.పి.ఆర్కిడ్ పరిశోధన  కేంద్రం లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ గా చేరి ,అరుణాచల ప్రదేశ్ అరణ్యాలలో విస్తృతంగా తిరిగి ఆ సబ్జెక్ట్ పై అపార విజ్ఞానం సంపాదించారు .

  1980లో టి.పి.ఆర్కిడ్ స్టేషన్ లో చేరి ఆర్కిడ్స్ పై విస్తృత పరిశోధనలు చేశారు .అస్సాం లో తేజపూర్ కు 65కిలోమీటర్లలో టి.పి.ఉంది ఇక్కడ పది హెక్టార్ల అంటే పాతిక ఎకరాలలో ఈ పరిశోధన కేంద్రం ఉన్నది .ఇక్కడే పరిశోధనలు చేసి నాగేశ్వరరావు గారు 250  ఆర్కిడ్ లను సృష్టించి   రికార్డ్ చేశారు .ఒకటి రెండు రోజుల్లో వాడిపోయి స్వరూపస్వభావాలు కోల్పోయే పూల స్థానం లో ఆర్కిడ్ లు ప్రవేశం చేయటానికి రావు గారి కృషి అద్వితీయం .వీటికోసం విదేశాలలో లక్షలాది డాలర్లు కుమ్మరిస్తున్నారు .ఆర్కిడ్స్ తాజాతనం కోల్పోకుండా ఆకర్షణీయంగా ఉంచటానికి రావు గారి కృషి ఫలించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .

   ఇంతకీ ఆర్కిడ్స్ అంటే ?పుష్పించే సాధారణ మొక్కల లాగానే ఉండే ఒకజాతి గడ్డి మొక్కలను ఆర్కిడ్స్ అంటారు .ఇవి ’’ఆర్కిడిసి ‘’కుటుంబానికి చెందినవి .పుష్పాలంకరణ లో వీటికి విశేష ప్రాధాన్యత ఉన్నది .దేశం మొత్తం మీద 1200రకాల ఆర్కిడ్స్ ఉంటె నాగేశ్వరరావు గారి పరిశోధనఫలిత౦ గా  అరుణాచల ప్రదేశ్ లో 250రకాలు ఉండి దేశం లో అగ్రస్థానం గా అరుణాచలప్రదేశ్ ను  నిలిపిన ఘనత నాగేశ్వరరావు గారిదే .ఇందులోని 30రకాల ఆర్కిడ్స్ ప్రపంచం లో మరెక్కడా లేవు .అందుకే అరుణాచలప్రదేశ్’’ఆర్కిడ్స్ రాజధాని –కేపిటల్ ఆఫ్ ఆర్కిడ్స్ ‘’అయింది .

  ప్రపంచం లో సహజ సిద్ధంగా ఉన్న ఆర్కిడ్స్ 30 వేల రకాలు ఉంటాయి .వాటిద్వారా శాస్త్రవేత్తలు క లక్షా ముప్ఫై వేల రకాల ఆర్కిడ్స్ సృష్టించారని తాజా నివేదికలు తెలియ జేస్తున్నాయి .డాక్టర్ నాగేశ్వరరావు  సృష్టించిన 250  ఆర్కిడ్స్  లో అయిదారు కొత్తరకాల హైబ్రిడ్ లను రిజిస్టర్ చేశారు .ఆర్కిడ్స్ విజ్ఞాన రంగం లో అంతర్జాతీయ ప్రతిభ ఉన్న కొద్ది మంది శాస్త్రవేత్తలలో నాగేశ్వరరావు గారు ఉండటం అందునా ఆంధ్రులు కావటం అందరికి గర్వకారణం . ‘అరుణాచలేన్సిస్ ,బీర్ మానియా ,జైనియానా ,ఒజోరోనియా ,కంలాంగినేస్ మొదలైన ప్రజాతి ఆర్కిడ్ లను అభి వృద్ధి చేసిన గొప్పఆర్కిడ్  శాస్త్రవేత్త శ్రీ ఎ.నాగేశ్వరరావు గారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19 ఉయ్యూరు

image.pngimage.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు

46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్  –శ్రీ పంచేటి కోటేశ్వరం

25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి ఎస్ సి పాసై ,1943లో డి ఎస్ సి పట్టా పొందారు ఇండియన్ మెటియోరోలాజికల్  సర్వీస్ లో అసిస్టెంట్ గా  1940లో చేరారు .తర్వాత డైరెక్టర్ జనరల్ అయ్యారు .ఇరాన్ ప్రభుత్వం లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుడుగా ,వాతావరణ సలహా దారుగా 1975నుంచి మూడేళ్ళు ఉన్నారు .ఇండియాకు తిరిగి వచ్చి, విశాఖ ఆంధ్రా యూని వర్సిటి లో మెటిరియోరోలాజికల్ అండ్ వోషనోగ్రఫీ కి గౌరవ ఆచార్యులై 1972నుండి 82 వరకు  పదేళ్ళు పని చేశారు .

  కోటేశ్వరం గారు 1974లో ఇ౦ డియన్ నేషనల్ సైన్స్ అకాడెమి  లో ఫెలో అయ్యారు .ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్స్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ల ఫెలోషిప్ పొందారు .ఇండియన్  మెటియోరోలాజికల్ సంస్థకు అధ్యక్షులై విశేష సేవ లందించారు .వాతావరణ శాస్త్రం లో ఆర్ధిక శాస్త్రం లో వాతావరణ శాస్త్ర వినియోగానికి ముఖ్యమైన పరిశోధనలు చేశారు .1963లోపూనాలోని  ఇండియన్ ట్రాపికల్ మెటియోరోలజికి ,1960-65 మధ్య న్యుఢిల్లీ లోని నార్దర్న్  హేమి స్ఫియర్  ఎక్స్ చేంజ్ అండ్ అనాలిసిస్ సెంటర్ స్థాపనకు అద్భుత కృషి చేశారు .ఆయన మార్గ దర్శకత్వం లోనే 1970-73 కాలం లో దేశం లోని తూర్పు కోస్తా వెంబడి తుఫాన్ హెచ్చరిక రాడార్ సిస్టం ఏర్పాటైంది .ఇదే కాదు ఉత్తర భారతం ,మధ్యభారతం లలో వరదలు సృష్టించే నదుల ఆయకట్టు ల వద్ద ఫ్లడ్  మెటిరియోరోలాజికల్ సెంటర్ లను ఏర్పాటు చేసిన ఘనతా ఆయనదే .తన శాఖవారితో ‘’శాటిలైట్ మానిటరింగ్  సెంటర్’’ లు ఏర్పాటు చేయి౦ఛి  వాతావరణ సేవలలో ఆధునికత తెచ్చినదీ కోటేశ్వరం  గారే .శీతోష్ణస్థితి  సంబంధ ప్రయోజనాలు ,ముందస్తు సమాచార సేకరణకు ,గణాంకాల అంచనాలకు మొదటిసారిగా కంప్యూటర్ వ్యవస్థ నేర్పరచి ,దేశీయ వాతావరణ శాస్త్రం లో  విప్లవాత్మక మార్పులు తెచ్చి కొత్త అధ్యాయం సృష్టించి ,విదేశాలకు దీటుగా నిలబడేట్లు చేశారు .ఋతుపవనాలు అల్పపీడనాలు తుఫానులు ,వరదలు వాతావరణ మార్పులు పై అవిశ్రాంత పరిశోధన సాగింఛి తమ ఫలితాలను అందరికీ పంచేవారు ’’పంచేటి వారు’’.

  వరల్డ్  మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ ,అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్  ఆఫ్ ఇండియా సంస్థలకు ఉపాధ్యక్షులుగా 1971నుంచి 75వరకు నాలుగేళ్ళు విలువైన సేవలు అందించారు .ఆంధ్రా యూని వర్సిటి నుండి  గౌరవ పురస్కారం  అయిన D.S.C.(HON-Cau)పొందారు .1975లో భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’ పురస్కారం అందించి ,  గౌరవించి,సత్కరించింది . ఢిల్లీ తెలుగు అసోసియేషన్ కు అధ్యక్షులుగా1959నుండి 10ఏళ్ళు 1969 వరకు సేవలందించి ,అక్కడి తెలుగు వారికి విశేషమైన సేవలందించారు  .చికాగో లో ఇండియన్ అసోసియేషన్ కు కూడా1955-56లో  అధ్యక్షులై  ప్రవాస తెలుగు ప్రజలకు   అండదండగా ఉన్నారు.

  వాతావరణ శాస్త్ర పరిశోధనలకు అమెరికాలోని చికాగో,మియామీ  లకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళారు .వీరి సేవలను గుర్తించి ప్రపంచ వాతావరణ సంస్థ  గౌరవ  అధ్యక్షునిగా ఎంపిక చేసింది .70కి పైగా పరిశోధన వ్యాసాలను దేశీయ విదేశీయ మేగజైన్స్ లో రాశారు .వాతావరణ శాస్త్రం పై ఇంతటి అభి రుచి ఏర్పడటానికి కారణం 1927లో  ఆయన 12ఏళ్ళవయసులో వచ్చిన తీవ్రతుఫాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం  చేసి భీభత్సం సృష్టించి విశేష జనప్రాణ నష్టం  కలిగించటమే .తనప్రజలను ఈ తుఫానులనుండి కాపాడాలి అనే సంకల్పం అప్పుడే ఆయన మనసులో బీజ రూపం లో ఏర్పడి  వట వృక్షమై ,ఈ  విశేష కృషికి దారితీసింది .

  వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని డా .పంచేటి కోటేశ్వరం గారు 1997 నవంబర్ 1 న  82ఏళ్ళ వయసులో పంచత్వం చెందారు .ఆయన భార్య శ్రీమతి సరోజినీ .వీరికి నలుగురు కుమార్తెలు  ఒక కుమారుడు .

  పంచేటి వారి రచనలు – Low and high Raman frequencies for water”. , “Additional Raman frequencies for water” ,The Surface Structure of the Tropical Cyclones in the Indian Area, The Easterly Jet Stream over the tropics” ,Study of Pre-monsoon Thunderstorms over Gangetic West Bengal by Radar ,Vertical Development of Precipitation Echoes from Cumulus Clouds near Calcutta during the Pre-monsoon season”., The Upper-tropospheric and Lower-stratospheric Structure of Several Hurricanes, “On the Structure of Hurricanes in the upper Troposphere and lower Stratosphere”.

  ఈ శాఖలో పని చేసిన శ్రీ యడవల్లి పరమ శివరావు నెల్లూరు జిల్లాలోనే1920లో జన్మించి   కేంద్ర వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ అయిన రెండవ తెలుగు వారుగా (మొదటివారు శ్రీ పంచేటి కోటేశ్వరం )రికార్డ్ సృష్టించారు ,వాతావరణ అబ్జర్వేటివ్ డైరెక్టర్ కూడా అయ్యారు.’’సౌత్ వెస్ట్ మాన్సూన్ ‘’పరిశోధన గ్రంథం రాశారు .

  మరో శాస్త్రవేత్త శ్రీటి. ఎస్ మూర్తి (తాడేపల్లి సత్యనారాయణ మూర్తి )1937ఆగస్ట్ 5న జన్మించి చికాగోలో వాతావరణ శాస్త్రం లో పిహెచ్ డి పొంది ,అక్కడే లెక్చర గా చేరి కెనడా వెళ్లి  ఓషన్ సైన్సెస్ వారి ఫిషరీస్ లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ అయి ,చికాగో కెనడాలలో లో డిస్టింగ్ విష్డ్ మెడల్, అప్లైడ్ ఓషనోగ్రఫీ ప్రైజ్  పొందారు .ఐతే ఆంధ్రాలో పుట్టినా వీరి సేవలు ఇండియాలో జరగలేదు.  మన దేశం కొత్తగా అడుగు లేస్తున్న వాతావరణ శాస్త్రానికి తొలితరం శాస్త్రవేత్త మూర్తిగారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంధ్రశాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19-ఉయ్యూరు

image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment