ఎలిబీ శ్రీరామ్ హార్ట్ ఫిలిం -పసుపు కుంకుమ

ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను

ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు  కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు -మాటల్లేని మౌన గౌరవ ప్రేమలతో . అంతే అప్పటిదాకా కూతురు పై కరకు  గుండె గా ఉన్న శ్రీరామ్ ,కూతురుకు దస్తావేజులిచ్చి ఆమె ఏమీ అడగకుండా సంతకాలు చేసి ఆమె హక్కుభుక్తమైన 10 ఎకరాల కోటిరూపాయల ఆస్తిని వదులు కొని అతని మనసు మారిస్తే ,అల్లుడు అత్యంత గౌరవమర్యాదలు చూపిస్తే ,ఒకే ఒక మాట పట్టింపుతో అనుకున్నవాడిని పెళ్లాడిన కూతురు  గుమ్మం ఎన్నో ఏళ్లుగా తొక్కని ఈ తండ్రి ఆమె సంతకాలకోసం  మాత్రమే వస్తే ఇచ్చిన మంచినీళ్లు కాఫీ వగైరాలు  కూడా తాగకుండా ,పలకరించకుండా ఆమె సంతకాలకోసమే ఆత్రంగా ఎదురు చూస్తూ, ఆమెకూడా తండ్రికి తగ్గ కూతురుగా  అందులో ఏముందని అడగకుండా నిర్నిమిత్తముగా సంతకాలు చేస్తే ,ఏ కర్కోటకుడు హృదయం కరిగి నీరు కాదూ  ?అలాగే కరిగిపోయాడు అప్పటిదాకా ముఖం లో  ఆమెపై కోపం తప్ప ఏ భావం వ్యక్తపరచని శ్రీరామ్ ,ఆమె ప్రవర్తించిన మంచితనపు తీరుకు మ్రాన్పడి కూతురు చేతిలో ఓడిపోయిన తండ్రి అయి మనవరాలు అల్లుడు చూపిన ప్రేమామృతం లో తడిసి ముద్ద అయి ముఖం లో చిరునవ్వు చూపి మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మంచినీళ్లు కాఫీ వగైరాలు  తీసుకుని ఆమెకూ పెట్టి తిరిపించి మంచిమనసుకున్న మనో ధర్మం అన్నిటికన్నా విలువైనదని దాన్ని జయించటం ఎవరికీ సాధ్యంకాదని గ్రహించి పసుపు కుంకుమగా కూతురు కు దాఖలయ్యే ఆస్తిని ఆమెతో  విడుదల దస్తావేజు పై సంతకం పెట్టించిన కాగితాలను చించి పారేసి తానూ మానవ ధర్మాన్ని మనో ధర్మాన్నీ చూపి కనువిప్పు పొంది మన కనుకొనలలో ఆనందపు బాష్పాలు  రాల్పిస్తాడు దటీజ్ ఎల్బీ శ్రీరామ్స్ హార్ట్ ఫిలిం లోని ఆర్ట్ .ఈ ఆర్ట్ కె హాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది .

కొసమెరుపు -మొన్నరాత్రి ”రంగ స్థల” మహా పాపం  ఈ పసుపు కుంకుమతో కొట్టుకు పోయి గొప్ప పర్గే షన్ కలిగించింది .హృదయం ఉన్న ప్రతివారూ చూసి అనుభూతి పొందాల్సిన హార్ట్ ఆర్ట్ ఫిలిం ఇది ..
  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-18 -కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్
Posted in సినిమా | Tagged | Leave a comment

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’

(‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )

మేరేజ్ డే ,పుట్టిన రోజున కోరి తెచ్చుకున్న తలకాయ నెప్పి

‘’వద్దురా బాబూ నేను ఆ సినిమా చూడలేను .ఇంతవరకు ఆ హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చూసిన పాపానికి నోచుకోని వాడిని నన్ను బలవంత పెట్టొద్దు బాబో ‘’అని మొత్తుకున్నా నిన్న మా అబ్బాయి చి .శాస్త్రి ,కోడలుశ్రీమతి  సమత ల వివాహ వార్షిక మహోత్సవం ,మామనవడు చి భువన్ పుట్టిన రోజు నాడు .అయినా వినకుండా మా వాడు ‘’బ్రహ్మాండం, బాక్సులు బద్దలు ,చూడకపోతే పాపం ‘’అంటూ ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఊదర పెడుతున్నాడు .నాకు అసలు నమ్మకం లేదు .నిన్న వాడి బామ్మర్ది రమేష్ కొడుకు ఉపనయనం .అందరం ఆ హడావిడిలో ఉన్నా,అంతకు రెండు రోజుల ముందు 2 వతేదీ సోమవారం మా మనవడు చి శ్రీకేత్ యశస్వి ఉపనయనం మా అమ్మాయి వాళ్ళు దీనికోసం అమెరికానుంచి రావటం ఆ హడావిడి లో అందరం ఫుల్ బిజీ . నిద్ర ఎవరికీ లేదు . రాత్రికి సినిమా మోజు తీర్చుకోవటానికి మావాడు 9 మందికి నిన్నరాత్రి 9 గంటలాటకు  కుషాయి గూడా హాల్ లో  టికెట్లు ముందే బుక్ చేయించాడు .మల్లాపూర్ నుంచి దీనికి రవాణాకు రెండు’’ కాబుల చమురు’’ వదిలించుకుని రాత్రి 8-30 కి బయల్దేరుతూ ఆపసోపాలు పడి సినిమా హాల్ కు చేరుకున్నాం .మా శ్రీమతి ఎలాగూ రోజూ రాత్రిళ్ళు నిద్ర పట్టటం లేదుకదా అని తానూ రోజూ ఏదీ సయించక ఇంత చప్పిడికూడు మజ్జిగన్నం తో సరి పుచ్చుకుంటున్నా  తానూ మాతో తయారైంది హాల్ లోనైనా హాయిగా నిద్రపడుతుందన్న గంపెడాశతో .మేమిద్దరం ,మా అబ్బాయి కోడలు కొడుకు ,మా అమ్మాయి చి సౌ విజ్జి ,కొడుకులు చి శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ఇదీ మా ‘’రంగ బృందం’’ . మా అల్లుడు రాను అని ముందే జాగ్రత్త పడ్డాడు .మేమిద్దరం అమెరికాలో షార్లెట్ లో ‘దువ్వాడ జగన్నాధం ‘’సినిమా తర్వాత సుమారు 8 నెలలకు మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాం .కొంత ఆటవిడుపుగా ఉంటుందని ఆశ -నీరసం అలసట మధ్య మమ్మల్ని హాలుకు లాక్కెళ్ళింది .  సినిమా టైటిల్సే మసక మసక గా కనిపించాయి .కారణం వెదికితే ఈ సినీ నేపధ్యం 1985ట .అంటే కేవలం 33 ఏళ్ళ క్రితం .అంతమాత్రాన ఆకలర్ వాడాల్సిన పనే లేదు అని పించింది .

మెగా తారాగణం , వారి సుపుత్రుల సినిమాలలో కధ కోసం వెదకటం ఎందుకు ?పాపం జగపతి బాబు ‘’బందరు అంబర్ బీడీ ‘’నోట్లో పెట్టుకుని లుంగీతో కూర్చోటం తప్ప ఏమీ లేదు .మరో గొప్ప విషయం అండోయ్ –ఆయన గత 30 ఏళ్ళుగా రంగ స్థల గ్రామ అనప్పోజేడ్ ప్రెసిడెంట్ .బాంక్ కు కూడాఆయనే .అందుకని అందరూ ఆయన్ను ‘’ప్రెసిడెంట్ గారు ‘’అని పిలుస్తున్డటం తో ఆయన పేరే మర్చిపోయారు ఊరిజనం .ఆయనకూడా మర్చి పోతే హీరో అన్న గుర్తు చేస్తాడు .ఆ గర్వం డాబు దర్జా తో బతుకుతున్నాడు .మా ఊర్లో కూడా ‘’ప్రెసిడెంట్ రామారావు ‘’అనే ఆయన ఉండేవాడు .ఆయన పేరు మావాళ్ళు మర్చిపోలేదు . సరే బాగుంది అనుకుంటే పాపం ప్రకాష్ రాజు మంచానికీ ,హాస్పిటల్ కు అతుక్కు పోయి డైలాగ్ లేకుండా గడుపుతాడు .ఇక హీరో గారి విషయానికొస్తే ఆయనకు పుట్టెడు చెవుడు .చెవిటి మిషన్ కు వ్యతిరేకి ఆయన అరుపులు మన గుండెల్లో మంటలు రేపుతాయి .ఆయన్ను చూసి అందరూ అదే ధోరణిలో మాట్లాడుతూ మనకి కిక్కేచ్చాల్సింది పోయి పిచ్చెక్కిస్తారు .సినిమాలో కూర్చున్నమనం కూడా మన పక్కవాళ్లతో  అంతే ‘’హై పిచ్’’లో మాట్లాడితెకాని మన ప్రక్కన కూర్చున్న మన ఆవిడ కూడా మంచి నీళ్ళు కూడా ఇవ్వదు .ఇదీ పరిస్థితి . ఇంత ‘’చెవిటి పిచ్చ’’ పట్టేస్తుంది అందరికి .

పాపం హీరో లుంగీ పైకి ఎగకట్టి ఒకే ‘’రకమైన ఫోజు ‘’తో ,ఒకే రకమైన డాన్స్ తో వంద సందర్భాలలో కనిపించి అభిమానులకు కిర్రెక్కి౦చాడడేమో తెలీదు కాని మనకు చిర్రెత్తించాడు .’దేవీ శ్రీ మార్క్ ‘’పాటలు వినేవాడికి బాగానే ఉంటాయి .మాలాంటి వారికి బధిర శంఖారావమే  .హీరోయిన్ సమంత ‘’గ్లామర్’’ కాస్తా ‘’డీగ్లేమర్ ‘’అయి అప్పుడప్పుడు హీరోను అకస్మాత్తుగా ‘’హగ్గు కు ముద్దుకు’’ పనికొచ్చింది .హీరో అన్న గా వేసింది రవిరాజా పినిశెట్టి గారబ్బాయి .పాంటు షార్ట్ నలక్కుండా జాగ్రత్త పడ్డాడు .బ్యాంకి ఆఫీసర్లు ‘’జగపతి ‘’చేసే అన్యాయాలు తెలిసినా ,తమవంతు బాధ్యత వహించకుండా ఎంక్వైరీ గట్రా చేయకుండా ‘’ఎవరో రావాలీ ఏదో చేయాలి ‘’అని పాడుకుంటూ  ఉండటం ఆ నాటి రాజకీయానికి అద్దం పడుతుందని డైరెక్టర్ ఊహించి ఉంటాడు .ఎదురు తిరిగిన ప్రతివాడూ ప్రెసిడెంట్ చేతిలో అప్పడంలాగా నలిగిపోయిన సంగతి తెలిసినా పదవికి పోటీ చేసిన పినిసెట్టి కొడుకు జాగ్రత్తలు తీసుకోడు .కధ ట్విస్ట్ చేయటానికేమో అనుకుంటే పొరబాటే .

ఇంటర్వెల్ దాకా ఏదోరకం గా లాగిన సినిమా తర్వాతన్నా మలుపు తిరుగుందేమోననుకున్నవారికి ఆశాభంగమే .అక్కడా అవే సీన్లు రిపీట్ అయి పరమ బోరు కలిగిస్తాయి .హీరో అన్న అడవిలో హత్య చేయబడగానే ఇక సినిమా చూడలేక మేము అయిదుగురం బయటికోచ్చేసి ‘కాబెక్కి ‘’కొంపకు రాత్రి 12 కు చేరాం. ఆతర్వాత సినిమా యెంతసేపు  ‘’సా —గిందో ‘’ తెలీదు.ఇంటికొచ్చి నాలుగు మెతుకులు కతికి హాయిగా నిద్రపోయాం .మా మనవడు చి ఆశుతోష్ కి సినిమా ఏమీ నచ్చలేదట .దాన్ని ఇమిటేట్ చేసి మాకు నవ్వు తెప్పించాడు .చివరిదాకా సినిమా చూసినవాళ్ళు మా అబ్బాయి శాస్త్రి , వాడికొడుకు భువన్ ,మా అమ్మాయి కొడుకులు శ్రీకేత్ పీయూష్ లు మాత్రమె .ఈ ఉదయం వాళ్ళను అడిగితె వాళ్ళూ అదే ఫీలింగ్ బోర్ తెలియ జేశారు .ఇందులో ‘’టైలర్ ‘’పాత్రలో నరేష్ కూడా ఉన్నాడండోయ్.హీరో మేనత్త పాత్రలో అమ్మాయి కాస్త బాగా చేసింది .సౌండ్ ఇంజనీర్ హీరో ‘’పక్కన ఉండే హెల్పర్ భారత యుద్ధం లో ‘’ సంజయుడు’’పాత్రలాగా  బాగానటించాడు .మంచిగా కనిపించే ప్రకాష్ రాజ్ చివర్లో విలనైతే అతన్ని రక్షించిన హీరో అతడే తన మేనత్త మొగుణ్ణి చంపిందని తెలిసి చంపేస్తాడని ,మేనత్త ప్రెసిడెంట్ అవుతుందని చూసిన మా వాళ్ళ కధనం .సుకుమార్ అంటే  చాలా సుకుమారంగా  డైరెక్ట్ చేస్తాడనుకొంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ‘’మొరటు ‘’గా తీశాడని పించింది చూసిన కాసేపూ .అసలు విషయం చెప్పటం మర్చిపోయా – సినిమా మొదలైన పావు గంట తర్వాత చెవుల్లో  చేతులు ,కళ్ళకు రుమాలు కప్పుకున్నాను ఆ కర్ణ కరోరం ఆ దారుణ సీన్లు చూడలేక .

టైల్ పీస్ –  ఈ సినిమాలో హీరో గొప్ప ‘’సౌండ్ ఇంజనీర్ ‘’.ఆ ఇంజనీరింగ్ అందులోని పాత్రలకూ బాగా ఎక్కి చివరికి చూసిన వాళ్ళనూ సౌండ్ ఇంజనీర్లను చేస్తుందేమో నన్న భయం నాకుంది .అందుకనే హెచ్చరిక .

మా వాళ్ళ పెళ్లి రోజు, మనవడి పుట్టిన  రోజుఉదయం అంతా ఎంతో బాగా ఎంజాయ్ చేసిన మేము రాత్రిమాత్రం   ఇంతటి’’ దారుణ మారణ హోమం ‘’సినిమా చూస్తామని ఊహించలేదు. ‘’బాహుబలి తర్వాత మరో బలికి బలి అయ్యాం . ‘’సారీ ఐ పిటీ యు రంగస్థలం’’  .

బాబూ జగ్జీవన్ రాం జయంతి శుభాకాంక్షలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-3 -18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in రచనలు, సినిమా | Tagged | 2 Comments

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

బ్రజిల్ దేశపు మొట్టమొదటి మహిళాధ్యక్షురాలు గా గుర్తింపు పొందిన దిల్మావానా రౌసెల్ 14-12-1947 జన్మించింది . ఆర్ధిక ,రాజకీయ వేత్తగా ప్రసిద్ధి చెందిన ఆమె బ్రజిల్ దేశపు 36 వ ప్రెసిడెంట్ అయింది .అంతేకాదు .ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన బ్రజిల్ దేశపు తొలి మహిళా ప్రెసిడెంట్ గా రికార్డ్ సృష్టించింది..2011 లో ఎన్నిక కాబడి 2016 వరకు దేశాధ్యక్షురాలుగా పాలించింది .

బల్గేరియన్ ప్రవాస దంపతులకు జన్మించిన దిల్మా, బేలో హారిజాంటి లోని ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినమహిళ.యవ్వనం లో సోషలిస్ట్ భావాలతో ఉన్న ఈమె ,1964కుట్ర తర్వాత ,వామ పక్ష భావాలకు ఆకర్షితురాలై సైనిక నియంతృత్వాన్నిఎదిరించి పోరాడే మార్క్సిస్ట్ అర్బన్ గెరిల్లా గ్రూప్స్ లో చేరింది .1970 లో అరెస్ట్ కాబడి 1972 వరకు జైలు లో నిర్బంధించ బడి అనేక చిత్ర హింసలకు గురైంది .జైలు నుండి విడుదల అయ్యాక కారియోస్ అరాజో ను పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు వైవాహిక జీవితాన్ని సుఖమయంగా పోర్టో అలిగ్రే లో గడిపింది .భార్యాభర్తలిద్దరూ కలిసి రియోగ్రాండి డో సుల్ లో ‘’డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ‘’ స్థాపించారు .పార్టీ తరఫున చాలా ఎన్నిక ప్రచారాలు నిర్వహించారు .పోర్టో అలేగ్రే కు దిల్మా, ఆల్సు కోలారిస్ ప్రభుత్వం లో ట్రెజరీ సెక్రెటరి గా పని చేసింది .తర్వాత రియో గ్రాండి డో సుల్ కు కొల్లారేస్ ,ఒలీవియో దుత్రా ల ప్రభుత్వం లో సెక్రెటరి ఆఫ్ ఎనర్జీ గా సేవలు అందించింది .2000 సంవత్సరం లో దుత్రా ప్రభుత్వం లో ఆంతరంగిక తగాదాలు ఏర్పడటం తో ఆమె డెమోక్రాటిక్ పార్టీని వదిలేసి వర్కర్స్ పార్టీ లో చేరింది .అప్పటికే ఆమె ప్రసంగాలతో ,కార్య దీక్ష తో ప్రజా హృదయాలను ఆకట్టు కున్నది .మహిళా రాజకీయ వేత్తగా సుస్థిర స్థానం సంపాదించుకున్నది .

2002 లో బ్రజిల్ ప్రెసిడెంట్ అభ్యర్ధి అయిన లూయిస్ ఇనాషియో డా సిల్వా కు సలహాదారై ,బలమైన శక్తి యుక్తులతో సహాయం చేసింది .డా సిల్వా ప్రెసిడెంట్ గా ఎన్నికైన వెంటనే దిల్మా వానా రౌసెల్ ను మంత్రి వర్గం లోకి ఆహ్వానించి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ శాఖను అప్పగించాడు .సమర్ధతతో పని చేసి సత్తా చూపించింది .2005లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్న జోస్ దిరిస్యు అవినీతి కుంభ కోణం ఎదుర్కొని రాజీనామా చేశాడు .ప్రెసిడెంట్ డా సిల్వా వెంటనే దిల్మాకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నిచ్చాడు .ఈ పదవిలో2010 మార్చి 31 వరకు అయిదేళ్ళు పని చేసింది . తానె ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న నిర్ణయం తో ఆమె తన పదవికి రాజీ నామా చేసి ఎన్నికలలో పోటీ చేసింది .

.2010 అక్టోబర్31 ఎన్నికలలో ఆమె ప్రెసిడెంట్ గా ఎన్నికైనది .ఈ ఎన్నికలో ఆమె బ్రజిలియాన్ సోషల్ డెమోక్రసీ పార్టీ అభ్యర్ధి జోస్ సేర్రాను ఓడించింది .20 14 అక్టోబర్ 26 న ఆమె అతి తక్కువ మేజార్టి తో రెండవ సారి ఎన్నికలో డెమోక్రాటిక్ అభ్యర్ధి ఏసియో నేవేస్ ను ఓడించి ప్రెసిడెంట్ గా ఎన్నికైంది .ఇది చారిత్రాత్మక విజయం .బ్రజిల్ దేశపు తొలి మహిళా ప్రెసిడెంట్ గా రౌసెల్ చరిత్ర సృష్టించింది .

అయితే ఆమె పై ఇంపీచ్ మెంట్ కేసును ‘’చేంబర్ ఆఫ్ డేప్యూటీస్’’ పెట్టి 3-12- 20 15 విచారించారు .12-5-20 16 న బ్రజిల్ సెనేట్ ,ప్రెసిడెంట్ దిల్మా వానా రౌసెల్ ను సస్పెండ్ చేసి ఆమె అధికారాలను విధులను ఆరునెలలపాటు తొలగించింది .వైస్ ప్రెసిడెంట్ మైకేల్ టేమర్ కు యాక్టింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది .2016 ఆగస్ట్ 31 న సెనేట్ 61-20 మెజార్టీతో రౌసెల్ నేరస్తురాలని ,చట్టాలను తన చేతిలోకి తీసుకున్నదని ఆరోపించి రుజువైన కారణంగా శాశ్వతంగా ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది .

‘’అందరికి విద్యుత్తు ‘’అనే నినాదం తో రౌసెల్ గ్రామీణ విద్యుదీకరణ కు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ,పూర్తి చేయటానికి సమయాన్ని నిర్ధారించి సఫలీకృతురాలైంది .అంతకు ముందు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా తన సాంకేతిక విజ్ఞానాన్ని చొరవ ను జోడించి ఆ శాఖకే నూతన జవ జీవాలు చేకూర్చింది.ప్రజాసేవలో ఆమె కృతకృ త్యురాలై అత్యధిక ప్రజల మద్దత్తు అభిమానం సంపాదించింది .ఫెడరల్ టాక్స్ తగ్గించి ,ఎనర్జీ బిల్లులను తగ్గించి ప్రజాభిమానం పొందింది .నిత్యావసర వస్తువులపై సుంకం గణ నీయంగా తగ్గించి గృహిణుల అభిమానం పొందింది .అయితే 2015 నుంచి ఆమె పాప్యులారిటీ క్రమగా తగ్గి పోయింది .అనేక అభియోగాలను ఎదుర్కున్నది .కానీ రస్సౌల్ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది. సమర్దురాలైన దేశాధినేతగా అందరూ మెచ్చుకున్నారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి

———- Forwarded message ———-
From: Andukuri Sastry
Date: 2018-04-03 16:03 GMT+05:30
Subject: Re: అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
To: gabbita prasad

వటువుకి ఆశీర్వచనములు.

శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రయ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి

దుర్గాప్రసాద్ గారికి.
నమస్కారములు. ఎంతో తప్పకుండా వద్దామని అనుకున్నాను..జ్ణాపకం లేకపోవటం ఒక కారణమైతే stomach disorder ఇంకొక కారణము. మొన్న సంధ్యావందనం పుస్తకం ఆవిష్కర ణకు కూడా వెళ్లలేకపోయినాను.
మీరు వడుగు దృశ్యం కార్యక్రమాలు వర్ణించిన తరువాత . నా బాధ ఇంకా ఎక్కువ అయింది

వటువుకి

అగ్నిరాయుష్మాన్త్సవనస్పతిభి రాయుష్మాన్తేన త్వాzzయుషాzzయుష్మన్తం కరోమి

అగ్నిహోత్రుడు సమిత్తులచేత ఆయుర్దాయముకలవాడు. అటువంటి ఆయుర్దాయముచేత నిన్ను ఆయుర్దాయము గలవానినిగా చేసెదను.

యజ్ఞ ఆయుష్మాన్థ్సదక్షిణాభిరాయుష్మాన్తేన త్వా ఆయుషా ఆయష్మన్తం కరోమి

యజ్ఞము దక్షిణలచేత ఆయస్సు కలది. గాన అట్టి ఆయుస్సు చే నిన్ను ఆయుష్మంతునిగా జేసెదను

బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణై రాయుష్మత్
తేన త్వా ఆయుషా ఆయుషన్తమ్ కరోమి

బ్రహ్మము బ్రాహ్మణులచేత ప్రకటింప జేయబడుచున్నది .కాన ఆయుస్సుగలది అని చెప్పబడియె .అటువంటి ఆయుర్దాయముచే నిన్ను ఆయుర్దాయము గలవానిగా చేసెదను.
ACPSastry

gdurgaprasad's avatarసరసభారతి ఉయ్యూరు

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో  ప్రవహించిన  వేద,సంగీత ఝరి

అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ లోని  అహోబిల మఠం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం లో శాస్త్రోక్తంగా తెల్లవారు ఝామున ౩- ౩౦ నుండి ఉదయం 11-30 వరకు 8 గంటల సేపు జరిగింది .చివరలో ఆరుగురు వేదపండితులు వేద స్వస్తి పలికి వేదగానం తో వాతావరణాన్ని పునీతం చేస్తూ దంపతులకు, వటువుకు వేదాశీర్వచనం చేశారు ,వారికి కోమలి దంపతులు తలొక 5 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు .

       ఆ తర్వాత  మా మనవళ్ళు చి .ఆశుతోష్ ,పీయూష్ కవల సోదరులు షార్లెట్ లో తమ గురువు శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ గారు నేర్పిన త్యాగరాజ మంగళహారతి కీర్తన ‘’జానకీ నాయక నీకు జయ మంగళం –నీకు శుభ మంగళం ‘’ను సుశ్రావ్యంగా గానం చేసి ఉపనయనానికి హాజరైన సుమారు 150 మంది రసజ్నులను అలరించారు .అందరు కరతాళ ధ్వనులతో తమ ఆనందాను భూతులను తెలియ జేసి చిర౦జీవులను ఆశీర్వదించారు .సరసభారతి తరఫున ఈ చిరంజీవులకు 2,11 6రూపాయలు నగదు కానుక అందజేసి ,శాలువా…

View original post 578 more words

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో  ప్రవహించిన  వేద,సంగీత ఝరి

అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ లోని  అహోబిల మఠం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం లో శాస్త్రోక్తంగా తెల్లవారు ఝామున ౩- ౩౦ నుండి ఉదయం 11-30 వరకు 8 గంటల సేపు జరిగింది .చివరలో ఆరుగురు వేదపండితులు వేద స్వస్తి పలికి వేదగానం తో వాతావరణాన్ని పునీతం చేస్తూ దంపతులకు, వటువుకు వేదాశీర్వచనం చేశారు ,వారికి కోమలి దంపతులు తలొక 5 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు .

       ఆ తర్వాత  మా మనవళ్ళు చి .ఆశుతోష్ ,పీయూష్ కవల సోదరులు షార్లెట్ లో తమ గురువు శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ గారు నేర్పిన త్యాగరాజ మంగళహారతి కీర్తన ‘’జానకీ నాయక నీకు జయ మంగళం –నీకు శుభ మంగళం ‘’ను సుశ్రావ్యంగా గానం చేసి ఉపనయనానికి హాజరైన సుమారు 150 మంది రసజ్నులను అలరించారు .అందరు కరతాళ ధ్వనులతో తమ ఆనందాను భూతులను తెలియ జేసి చిర౦జీవులను ఆశీర్వదించారు .సరసభారతి తరఫున ఈ చిరంజీవులకు 2,11 6రూపాయలు నగదు కానుక అందజేసి ,శాలువా కప్పి ,శంకరాచార్యుల జ్ఞాపిక ను శ్రీ పోతుకూచి దంపతులు ,మా తమ్ముడు గబ్బిట కృష్ణమోహన్ ,అమెరికాలోని షార్లెట్ లో ఉంటున్న శ్రీ రాంకీ ,శ్రీమతి ఉష దంపతుల తలిదండ్రులు చేత అందజేయించి ఆశీర్వ దింపజేశాం .

  ఆ పిమ్మట షార్లెట్ లో మా మనవళ్ళకు సంగీతం నేర్పిన శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ తల్లిగారు శ్రీమతి పోతుకూచిగారు వయసుకు మించిన గాన సౌరభం తో సభాసదులను అలరించారు .ఆమెకు ,భర్తగారికీ  సరసభారతి శాలువా కప్పి ,1,116 నగదుతో  జ్ఞాపికతో గబ్బిట కృష్ణ మోహన్ , శ్రీమతి పారుపూడి ఉషా రాంకీ తలి దండ్రుల చేత సత్కరింప జేశాం .పోతుకూచి దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారి, కృతజ్ఞత తో తడిసి ముద్ద అయ్యారు .మమ్మల్ని ఎంతో అభినందించారు .

   ఉపనయనం చివరలో వచ్చిన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్ర మాజీ డిప్యూటీ జనరల్ మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ,ప్రపంచ ప్రసిద్ధ ఈల సంగీత విద్వాంసులు ,విజిల్ విజార్డ్ శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు దంపతులు  విచ్చేయటం తో ప్రాముఖ్యత మరింత సంతరించు కొన్నది. వారికి ఘన స్వాగతం పలికి మా ఆనందాన్ని వ్యక్త పరచాం. వారు కూడా తమ  ఆనందాను భూతిని వ్యక్తం చేశారు .ముందుగా నేను శ్రీ ఆదిత్య ప్రసాద్ గారిని అందరికి పరిచయం చేసి,వారి సంగీత  విద్వత్తును తెలియజేసి , ప్రస్తుతం వారు అమరగాయకుడు  ఘంటసాల సంగీత మాధుర్యాన్ని ,రాగాల పలకరింపులు లోని మెలకువలను లోకానికి తెలియ జేస్తూ  ,సుస్వరాల ఘంటసాల స్వరాలను అజరామరం చేస్తున్నారనీ ,స్వయంగా ఫిడేల్ కచేరీ ,గానకచేరీ తోపాటు తానె జుగల్ బందీ కూడా నిర్వహిస్తూ ‘అపర ఘంటసాల ‘’అని పించుకున్నారని ఆయన సాధన ,తప,కృషి అనితర సాధ్యం అని ,హైదరాబాద్ రేడియో ద్వారా విశ్వనాథవారి  ‘’వేయిపడగలు ‘’నవలను ధారా వాహికంగా ప్రసారం చేసి విశ్వనాధ కీర్తి కిరీటానికి మరొక కలికితురాయి ని అలం కరించారని నాపై, సరసభారతిపై వారికి   అవ్యాజానురాగం ఉందని సరసభారతి కార్యక్రమాలకు తప్పక విచ్చేసేవారని గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-2 రెండవభాగం వారి అమృత హస్తాల చేత ఆవిష్కరి౦ప బడిందని,సరసభారతి ప్రచురించే ప్రతి ఆహ్వానం,ఆఇశ్కరిమ్పబదె ప్రతి పుస్తకం  శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికే ముందు పంపిస్తానని ,అది నాకొక సెంటిమెంట్ అని ,వారుకూడా తాము చేసే ప్రతికచేరీ ప్రోగ్రాం ను నాకు పంపుతారని నేను అందరికీ ఫార్వార్డ్ చేస్తానని    తెలియ జేయగా కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి  .సరసభారతి తరఫున వారికి 2,116 రూపాయలునగదు కానుక  శాలువా ,జ్ఞాపిక నూతన వస్త్రాలు పైన పేర్కొన్న పెద్దలచేత శివ ప్రసాద్ గారి సమక్షం లో సత్కరి౦పజేశాం .అనుకోకుండా జరిగిన ఈ సన్మానానికి వారు పొంగిపోయి ,తమ మనసులోని భావాలను వ్యక్తపరచి ‘’నేను దుర్గాప్రసాద్ గారిని సర్ప్రైజ్ చేయటానికే చివరలో వచ్చాను ‘’అని చెప్పి  తమ అద్భుత గాన లహరి తో  సభను ఆనంద పారవశ్యం లో ముంచి తేల్చారు .

  శ్రీ శివ ప్రసాద్ గారిని సభకు పరిచయం చేస్తూ ఈల ను ఒక కళా రూపం గా తీర్చిదిద్ది ,దానిని విశ్వ వ్యాప్తం చేస్తూ ,ప్రపంచ రంగస్థలం పై ఈల కచేరి కి గుర్తింపు గౌరవం తెచ్చిన ఏకైక ఈల సంగీత కళా మర్మజ్నులని ,20 12 లో షార్లెట్ లో  మా అమ్మాయి గారింట్లో మొదటి సారి పరిచయ భాగ్యం కలిగిందని అక్కడ రేడియోలో వారిని ఇంటర్ వ్యూ చేసే అదృష్టం కలిగిందని ,ఈ స్వల్ప పరిచయానికే ,వారిని సరసభారతి 20 14ఉగాది వేడుకలకు  ఆహ్వానిస్తే తమ బృందం తో ఉయ్యూరు విచ్చేసి రెండున్నరగంటల సేపు గాన వాహినిలో తన్మయులను చేశారని వారి సౌజన్యం మరువలేనిదని తెలియ జేశాను .ఉపనయన ఆహ్వానాన్ని మెయిల్ చేయగానే చూసి తప్పక హాజరౌతానని బదులు రాసిన సహ్రుదయులని , అనుకున్నట్లుగానే విచ్చేసి తమ అభిమానం చాటారని తెలియజేయగానే ,చిరునవ్వులు చిందిస్తూ శివప్రసాద్ గారు తలపంకించారు .శివప్రసాద్ దంపతులకు సరసభారతి తరఫున 2 116 రూపాయల నగదుకానుక ,శాలువా ,జ్ఞాపిక  సరసభారతి గ్రంధాలు అందజేసి ,మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్  గారితోపాటు పైన పేర్కొన్న పెద్దలతో సత్కరింప జేశాం .వారు మనసారా పులకరించిపోయారు ఈ హఠాత్ సత్కారానికి.దీనికి తగిన రీతిలో శివప్రసాద్ గారు స్పందించి మాట్లాడుతూ ఉయ్యూరుతో సరసభారతి తో కోమలి వారితో తమకున్న పరిచయాన్ని వివరించి కృతజ్ఞతలు తెలియజేసి ,చివరికి తమ ఈల సుస్వరాలతో జనాలను మంత్రం ముగ్ధులను చేసి ’’ విజిల్ విజార్డ్ ‘’  బిరుదాన్ని సార్ధకత చేశారు .సభలోని రసజ్నులందరూ ఈసంగీత’’ సూర్య చంద్రుల ‘’ప్రతిభకు తన్మయులై కరతాళ ధ్వనులతో అభినందన చందనం సమర్పించి కృతజ్ఞత చాటుకున్నారు .అనుకోకుండా సరసభారతి ఇంతటి ఘనకార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించటం అందరికి గొప్ప మధురానుభూతిగా నిలిచింది .

  ఈ విధంగా మా మనవడు చి శ్రీకేత్ యశస్వి ఉపనయనం ఆద్యంతం ఆహ్లాదంగా వేదోక్తంగా సంగీత మాధుర్యంగా వన్నె కెక్కి అందరికి ఆనందం తో పాటు సంతృప్తిని కలిగించింది .అనుకోకుండాఉపనయనం చివరలో సరసభారతి 121 కార్యక్రమ౦గా మలుపు తిరిగిన ఈ వేద ,సంగీత రస ఝరి వైశాఖ మాస పవిత్రతను సంతరించుకున్నది .

  శ్రీ విళంబి ఉగాది వేడుకలో సరసభారతి ఆవిష్కరించిన 1-నేను రాసిన’’ షార్లెట్ సాహితీ మైత్రీ బంధం’’(యాత్రా సాహిత్యం )-  2- 2017 శ్రీ హేవళంబి ఉగాది కవితల సంకలనం’’ వసుధైక కుటుంబం ‘’పుస్తకాలను  ,శంకరాచార్యుల ‘’శివానంద లహరి’’ ని ఉపనయనానికి హాజరైన వారందరికీ అందజేశాం .ఈ కార్యక్రమాన్ని సరసభారతి 121 కార్యక్రమగా భావిస్తూ ,సరసభారతి హైదరాబాద్ లో అంటే మరొక తెలుగు రాష్ట్రం లోనూ కార్యక్రమం నిర్వహించిన ఘనకీర్తి దక్కించుకుని రికార్డ్ సృష్టించిందని  సవినయంగా మనవి చేస్తున్నాను .

  ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసిన మా అబ్బాయిలు, కోడళ్ళు, అమ్మాయి, అల్లుడు ,మనవళ్ళు మనవరాళ్ళు అందరు అభిన౦దనీయులు .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

శుభం భూయాత్ – శ్రీ జివిఎల్ నరసింహారావు

శుభం భూయాత్

ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు శ్రీ జివిఎల్ నరసింహారావు ఎన్నో ఏళ్ళక్రితం

మా పెద్ద అబ్బయి శాస్త్రి కి IRMA ఆనంద్ లో క్లాసుమేట్. NDDB ఆనంద్ గుజరాత్ లో పని చేసి, న్యూ ఢిల్లీ లో సెఫాలజిస్ట్ గా స్థిరపడ్డాడు. చాల చానెల్స్ కి ఎగ్జిట్ పోల్స్ చేశాడు. 1994 లో రామారావు పెద్ద మెజారిటీ లో గెలుస్తాడని. సర్వ్ చేసాడు. ప్రభుత్వం నిర్వహించే పధకాలు , PDS సర్వేలు నిర్వహిచే వారు.

హైదరాబాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రికి ,నాలుగవవాడు రమణకు .మా రెండోవాడు శర్మకు రూమ్ మేట్.అప్పటి ఆ పరిచయం అవిచ్చిన్నంగా కుటుబ బంధంగా కొనసాగుతోంది .ఆటను భార్యాసమేతంగా ఉయ్యూరు మా ఇంటికి వచ్చాడు మా శాస్స్త్రి తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడు రమణకు మంచి మిత్రుడు తరచూ ఈ ముగ్గురు ఫోన్ లోమాట్లాడుకుంటారు
.19 9 8 లో మేము బద్రీ కేదారనాద్ యాత్ర చేసి ఢిల్లీ ఆతని కుటుంబంతో ఒకగంట గడిపాము మంచి అవగాహన చొరవ ఉన్న మేధావిగా అతను మాకందరికీ బాగా పరిచయం ప్రధాని వాజ్ పాయి ముందస్తు ఎన్నికలు నిర్వహించినపుడు ఆయనతో పాటు బాబు కూడా మునిగిన సంగతి మనకు తెలుసు .అప్పుడు జివిఎల్ రాచకీయ విశ్లేషకుడుగా ఉన్నాడు ఫలితాల పోస్ట్ మార్టెం చేస్తూ ఆతను బెజవాడ ఐలాపురం హోటల్ లో సమీక్ష సమావేశం నిర్వహిచినప్పుడు ఆహ్వానం వస్తే నేనూ హాజరయ్యాను .అంచనాలు తలక్రిండైనందుకు చాలా బాధ పడ్డాడు ఆవిషయాలన్నీ అక్కడ తెలియజేశాడు .అది రెండవ సారి అతనిని చూడటం
తర్వాత ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ పై ఆతను పుస్తకం రాసి నాకు పంపితే పూర్తిగా చదివి అతని భావాలతో ఏకీభావించాను .ఆవిషయం మెయిల్ ద్వారా ఫోన్ ద్వారా కూడా తెలియ జేసినట్లు గుర్తు .

2011 నుంచి మోడీ కి దగ్గర పని చెయ్యటం. గుజరాత్ స్టేట్ / పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల నాడ్ తెలుసుకోవటం, అమిత్ షా కి బీజేపీ కి చాలా క్లోజ్ గా పనిచేసాడు.

NAMO – మోడీ ప్లాన్స్ లో కీలక పాత్ర వహించాడు.


ఇటీవల యుపినుంచి రాజ్య సభకు ఎన్నికైనందుకు అభినది౦చాము

. గుంటూరు బిడ్డడైన మన జివిఎల్ ను.త్వరలో కేంద్ర మంత్రిగా చూడాలని మా అందరి కోరిక నెరవేరుతుందని ఆశ -దుర్గాప్రసాద్

 


Posted in రాజకీయం | Tagged | 1 Comment

  విశ్వనాథ వారి ”నా రాముడు ”

  విశ్వనాథ వారి ”నా రాముడు ”

కవిసామ్రాట్ విశ్వనాధ రాసిన రచనలలో ”మా స్వామి ” ”నా రాముడు ”ప్రత్యేకమైనవి కారణం వేటిలో విశ్వనాధ మహా భక్తుడుగా కనిపించటమే భక్తీ హృదయానికి సంబంధించింది అయితే జ్ఞానం బుద్ధికి చెందినది భక్తికి విశ్వాసమే ముఖ్యం జ్ఞానానికితత్వ చింతన ముఖ్యం జ్ఞానులకు దైవం .రూపం లేని  ఒక శక్తిగా కనిపిస్తాడు ఈ రెండుమర్గాలలోనూ మహా నిష్ణాతుడు విశ్వనాధ ,తాత్విక చింతనతో పాటు భక్త్యావేశామూ ఆయనలో సమపాళ్ళలో ఉన్నాయి మాస్వామిలో ఆయన భక్తీ . నా రాముడులో ఆయన తాత్విక చింతన కనిపిస్తాయి శివుడిని భక్తికీ .,తాత్విక చింతనకు రాముడిని ఆయన ఎంచుకున్నాడు అంటే ఆత్మలో శివ కేశవులనిద్దర్నీ ప్రతిష్టించు కుని హరిహరాద్వైతం లో పయనించారు .. ఈ రామ కావ్యం రచించి శివునికి అంకితమిచ్చిన మహానుభావుడు ఆయన. ప్రస్తుతం . ”నా రాముడు ”గురించి ఆలోచిద్దాం .

“నా రాముడు” ”మాస్వామికి ” పూర్తి వ్యత్యస్తంగా ఉంటుంది. ఇందులో భక్తి లేదా అంటే ఉంది. కానీ తాత్త్విక చింతనదే పై చేయి. ఎంతటి భక్తుడైనా, విశ్వనాథ అద్వైతాన్ని సంపూర్ణంగా నమ్మినవారు. అందుకే రామాయణ కల్పవృక్షాన్ని అద్వైత సిద్ధాంత పరంగా నిర్మించారు. కల్పవృక్షం రస ఫలాలతో, అలంకార సుమాలతో, నానా కల్పనలు శాఖోపశాఖలుగా విస్తరిల్లిన వృక్షమైతే, “నా రాముడు” దానికి ప్రాణభూతమైన మూలకందం. కల్పవృక్షం ఏ తాత్త్విక చింతన ఆధారంగా నిర్మించబడిందో దాని సారమంతా “నా రాముడు”లో ఉంది. ఇందులో కవిత్వం లేదు. ఉన్నదల్లా శుద్ధ వేదాంతం. సంస్కృతంలో ఉన్న శంకరుల అద్వైతాన్ని తెలుగువాళ్ళు అర్థం చేసుకోడానికి పద్యాలుగా వ్రాసి దానికి మళ్ళీ తన వ్యాఖ్యానాన్ని జోడించి మనకి “నా రాముడు”గా అందించారు విశ్వనాథ. బహుశా యిదే విశ్వనాథవారి చివరి రచన అయ్యుండవచ్చు. ఇది విశ్వనాథ పరమపదించిన తర్వాత ముద్రితమైంది.

ఇందులో రాముడు మనకి పది రకాలుగా కనిపిస్తాడు. ఆనందమయుడు, ఆనందమూర్తి, అవతారమూర్తి, బాలరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు, దశరథరాముడు, జానకీరాముడు, రఘురాముడు, ఆత్మారాముడు.

శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన రాముడు ఆనందమయుడు, విష్ణువుగా ఆనందమూర్తి అయి, అవతారమూర్తిగా భౌతిక జగత్తులో జన్మనెత్తి, బాలరామునిగా తాటకవధా అహల్యాశాప విమోచనమూ చేసి, శివధనుస్సు విఱిచి విష్ణుధనుస్సుని చేపట్టి కోదండరాముడై సీతని వివాహమాడి, అయోధ్యారామునిగా అయోధ్యప్రజలందరికీ ప్రీతిపాత్రుడై, తండ్రి ఆజ్ఞని శిరసావహించి దశరథరాముడై అడవులకేగి, జానకీదేవి పంపగా బంగారు లేడి వెంటబడి అటుపైన ఆమె కోసం లంకదాకా పోయి రావణ సంహారం చేసిన జానకీరాముడై, చివరకు తన వంశ గౌరవం ఇనుమడించేలా రాజ్యం చేసి రఘురాముడయిన విధానమంతా ఇందులో చిత్రించబడింది. చివరకి విశ్వనాథ ఆత్మలో ఆత్మారాముడుగా నిలిచిపోయాడా రాముడు.

ఆ యానందమయుండె బ్రహ్మయని యభ్యాసంబుచే నిశ్చితం
బై యేర్పాటుగ వేదపంక్తులను భాష్య ప్రోక్తమై యొప్పగా
నా యానందమయుండు రాముడని వ్యాఖ్యానించె వాల్మీకి నాన్
ఆ యానందములన్ రఘూత్తముడు మూడై యొక్కడైనట్లుగా

శుద్ధ బ్రహ్మము నిర్గుణమై ఆలోచనకి అందని ఒక భావన (concept). అలాంటి బ్రహ్మాన్ని సచ్చిదానందమనే త్రిగుణాల ద్వారా అర్థం చేసుకొనే ప్రయత్నం వేదాలలో జరిగింది. ఇందులో ఆనందం మనిషి అనుభూతికి అందేది. అయితే ఇది మామూలు లౌకికమైన ఆనందం కాదు. బ్రహ్మానందానికి అతి దగ్గరగా వచ్చేది రసానందం. ఇది కవిత్వం వల్ల సిద్ధిస్తుంది. తొలి కావ్యానికి నాయకుడు రాముడు. అతనిలో యీ రసానందం నిండి ఉంది. అందుకే రాముడు ఆనందమయుడు. అందువల్ల తరచి చూస్తే – బ్రహ్మ, ఆనందము, రాముడూ ముగ్గురూ ఒకటే.

ఇదీ విశ్వనాథ వారి చింతన. ఆ ఆనందమయుడిని ఆత్మలో నింపుకొనే ప్రయత్నమే కల్పవృక్ష రచన. రాముని అవతారంలోని ప్రతి అంశలోనూ, ప్రతి చేష్టలోనూ, ప్రతి రూపంలోనూ ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించారు విశ్వనాథ. అలా దర్శించి దర్శించి, అనుభవించి అనుభవించి చివరకి తనలో ఆత్మారామునిగా నిలుపుకున్నారు.

కల్పవృక్షం చివరలో అరణ్యవాసం పూర్తిచేసి రాముడు తిరిగివస్తున్నాడన్న వార్త హనుమంతుడు భరతునికి వినిపిస్తాడు. అగ్నిప్రవేశం చెయ్యబోతున్న భరతునికి వార్త విన్న ఆనందంలో గొంతులోంచి ఒక వింత ధ్వని వెలువడిందిట! అది ఎలా ఉందో విశ్వనాథ ఊహకి అందలేదు. పద్యంలో నాల్గవ పాదం ఆగిపోయింది. చాలా గంటలు నిద్రాహారాలు మానేసి ఆలోచించారట. చివరకి ఆ రాముడే తనకి చెప్పినట్టుగా అది స్ఫురించిందట. “జైత్ర యాత్రాంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణమైనట్టులన్”. ఆ ముందుపాదంలోనే భరతునిది “కంబుకంఠం” అని వర్ణించారు. ఆ పోలికని యిది సంపూర్ణం చేస్తోంది! జైత్రయాత్ర చేస్తూ విష్ణుమూర్తి పూరించిన గాలితో నిండిన శంఖంనుంచి వచ్చిన ధ్వనిలా ఉందట ఆ నాదం. భరతుడు శంఖావతారం కదా మరి! పైగా వాయుపుత్రుడైన హనుమంతుని ద్వారా రాముడు పంపిన వార్త దీనికి కారణం. ఇలాంటి పోలిక ఇంత సంపూర్ణంగా కుదరడం అనేది ఆ రాముడు స్వయంగా చెప్పడం వల్లనే సాధ్యమని విశ్వనాథ ప్రగాఢ నమ్మకం. అప్పుడు మరి విశ్వనాథ అహంకార మేమయినట్లు?!

అంతా వివరించి చివరకి అంటారూ,

ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వ సంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటె మంచిది పోనీ!

తన ఆత్మలో తను నమ్మిన రాముడు కొలువై ఉండగా ఇక మనం నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత! నమ్మితే మంచిదే. నమ్మకపోతే పోనీ, మరీ మంచిది!

రచన -శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు

రేపు శ్రీరామనవమి సందర్భంగా  ప్రత్యేక కానుక

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-18 -కాంప్ -మల్లాపూర్ -హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు

విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు

ఈ సారి విలంబి ఉగాదికి హోసూరు తెలుగు వారు 53 కవితల  ‘’అనపపువ్వులు ‘’పూయించారు .అనుములు ఒకరకమైన ధాన్యం అని అనుకొంటాను .వాటిపూలు తెల్లగా స్వచ్చంగా మన చిక్కుడు పూలలాగా ఉంటాయని పిస్తోంది .రాయలసీమలో అనపకాయల వాడకం ఎక్కువ అని తోస్తోంది .కనుక అర్ధవంతమైన నామ ధేయం ఈ కవితా సంకలనానికి డా వసంత్ మాటలలో  ఈ ’’ కూర్పుకు’’పెట్టారు .వివిధ ప్రాంతాలనుండి వేర్వేరు కవులనుండి సేకరించిన కవితల సమాహారం ఇది .ఇందులో ఉగాది ,తెలుగు ,పంటలు, సేద్యం ,సినారె లపై కవితలున్నాయి .అన్ని రకాల కవితలతో చక్కని చిక్కుడు పూలు కాయలవంటి అనపపువ్వులు కాయల ముఖ చిత్రం తో మిలమిల లాడింది పుస్తకం .ముచ్చటైన ముద్రణ మరింత వన్నె తెచ్చింది .విషయాలు సమస్యలూ మారనివి తీరనివి కనుక కవితలలో కొంత పాత వాసన ఉండటం సహజం .అన్నీ మంచికవితలే అయినా మెరుపులా మెరిసి నా మనసుకు నచ్చిన కొన్ని పంక్తులను ఉదహరిస్తాను .

  జానపద కవి గోరేటి వెంకన్న ‘’రావే మా చైత్రమా ‘’కవిత మకుటాయమానం అని చెప్పక తప్పదు.ఆ సౌరభం ఆఘ్రాణి౦చండి  -‘’మావిళ్ళు సిగురేసి మారాకు తొడిగె-మంచు తెమ్మెర కరిగి శిశిర వెనుకకు జరిగె-కాడకు మూడేసి కాయ పిందెలు గాయ –తనువొంచి పాలిచ్చ తల్లులా చందం –కొమ్మ లన్నీ వంగి అమ్మ ప్రేమను చాటె-రావే మా చైత్రమా అలరించే పద చిత్రమా ‘’చాలు వెంకన్న భావుకత కు పదాల కూర్పుకు జేజేలు పలకటానికి . .మోదుగు పూల గురించి చెబుతూ –‘’మన్మధుని విరిశరం గురి తప్పి మోదుగుల-తనువెల్ల నాటుకుని తాపమయి విరిసెనో  -అణువణువువల కెంపు లలరించి గుబురుల ‘’అని అగ్గిపూల సౌరు పరమ రామణీయకంగా చెప్పాడు .వ్యవసాయ పనుల ఆరంభం ‘’యాగిడి’’గురించి వర్ణిస్తూ –‘’రాగి చెంబుకు మామిడాకు పట్టిని గట్టి –కోవెల కోనేటి పుణ్య తీర్ధము నింపి –ముంగిట ఎద్దులకు మువ్వ జతలమరించి –పొడువై కాడకు పొదిగిన గొడ్డలితో –‘’యాగిడెల్లె’’అన్న దాతను దీవింప ‘’అని చైత్రానికి  పొలం పనులకు స్వాగతం పలికి సంప్రదాయ వైభవాన్ని కనుల ముందు నిలిపాడు .

‘’రాణి ‘’కవి ‘’కాలం దొంగ లంజ –దాన్నేవడూ అర్ధం చేసుకోలేడు’’అని నిట్టూర్చాడు .’’నేను మునిగినా నిన్ను ఒడ్డుకు చేరుస్తాను ‘’అని భరోసా ఇచ్చాడు ఆశారాజు –‘’కవికి ఆ తృప్తి చాలు ‘’అంటాడు.లోకం పోకడ చెబుతూ దేవీప్రియ –‘’నువ్వు వాడి సేవలో అస్తమించు –వాడు నీ సమాధి మీద ఉదయిస్తాడు ‘’అన్నాడు .భావుక కవి శివారెడ్డి –పూరింటి పంచలో పిచ్చుకలకోసం వరికంకుల గుత్తులు వేలాడదీసినట్లు  జనం ‘’లోకం గుమ్మం ముందు తమను తాము వేలాడ దీసుకున్నా’’రనినిస్టుర  సత్యం చెప్పాడు  .చీకటి వెళ్ళిపోతూ సూర్యునిపై అరిచే అరుపులే కాకుల రొద’’ వస్తున్న సూర్యుడు క్షణ క్షణం మారుతూ లోకాన్నీ మారుస్తాడు ‘’అన్న కాల సత్యం ఆవిష్కరించాడు  గోపి.

‘’రూపు నల్లనే కాని మనసు పుచ్చపువ్వు తెల్లన ,బూరుగదూది మెత్తన ,చలిగంజే చల్లన ‘’అని బాప్పను వర్ణించాడు శిఖామణి .’’పాలమూరు పిల్లలమర్రిమానులా విస్తరించినా –మా బాప్ప ఎప్పుడూ పరిగె పరక ‘’లాగానే ఉండిపోయిందని బాధ పడ్డాడు .’’భూమికీ ఆకాశానికీ ,మట్టికీ మమకారానికీ –అనాది వారసులు –లోకం మెచ్చే పువ్వులు ‘’గా కనిపించారు పిల్లలు పలమనేరు బాలాజీకి .ఇంకో అడుగు ము౦దుకెళ్ళిన దేశరాజు –‘’పిల్లలే ప్రకృతి ,ప్రకృతే పిల్లలు –మనమే చేజేతులా వారిని మనుషుల్ని చేస్తాం ‘’అని మన వికృత చేస్ట ను బయట పెట్టాడు .కల్తీ విత్తనం కల్తీ ఎరువులు మందులతో  తో మిరపపంట పండించి  ఆరుగాలాలు కస్టిస్తే’’మా బతుకులు తాలుగాయ బతుకులై పోయే –ఈళ్ళ కొంపల్లో మిరపగాయలేసి తగలబెట్టా ‘’అని కసిగా తిట్టాడు బండ్ల మాధవరావు .’’నవ్వును పెదాలపైకి ఆహ్వానించకపోతే ‘’ఖచ్చితంగా మరణి౦చి నట్లే అన్నాడు  కుమారస్వామి రెడ్డి .’’హక్కులు అనేవి ఎవడూ ఇయడు-నువ్వే అవి గుంజుకోవాలి ‘’అని సమకాలీన చాణక్య నీతి చెప్పింది వేముల శ్రీదేవి .’’పట్టిపంట పరాయై పొతే –వరిపంట వాచి  ‘’వరి బీజం ‘’అయింది అని చమత్కరించాడు విస్తావి .వడలి రాధాకృష్ణ  ‘’భానోదయం ‘’కోసం ఎదురు చూశాడు .అది భానూదయం ఏమో !’’బాకీ ‘’తుపాకీ మాటగా ‘’మనుషుల్ని ఒకటి చేయటానికి మతం పుడితే –ఆ బతుకు నేర్చి మాన్యుడయ్యాడు –అలాంటప్పుడు ‘’మనుషుల విడదీయ మత మెట్లౌను’’అని ప్రశ్నించాడు .సినారె కు ఘన నివాళి ఇస్తూ –‘’నీవొక స్పూర్తి స్పోరక అమర కావ్యం –‘’అన్నాడు కలువకుంట నారాయణ .చివరి కవితగా కూర్పుకర్త పల్లవి ‘’ పాడుతూ –‘’అమ్మానాన్నా గురువు దైవం –ప్రేమకు ప్రతి రూపం –మన జంటకు దారి దీపం –జగతిని నడిపించే ప్రగతే మనప్రేమ –పోరును జయించే పల్లవి తానమ్మా’’అని హక్కులకోసం భాష వ్యాప్తికోసం సంస్కృతి ప్రదీపనకోసం అహరహం  అనేక పోరాటాలు చేసిన డా అగరం వసంత్ .ఇంతమందికవులను సంప్రదించి వారిని కవితలు రాయమని కోరి అనుకున్న సమయం లో సేకరించి చక్కగా కూర్చటం లోమనో ధర్మమెరిగిన డాక్టర్ గా  వసంత్ ప్రతిభ ద్యోతకమౌతోంది .మిక్కిలి అభినందనీయుడు డా వసంత్

పుస్తకం ముఖ చిత్రాన్ని జత చేశాను చూడండి

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in కవితలు | Tagged | Leave a comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -3(చివరి భాగం )

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -3(చివరి భాగం )

తాతగారి కాల జ్ఞానామృతం

కాలజ్ఞానం అంటే విదేశీయులలో నోస్ట్రా డామస్ ,స్వదేశీయులలో వీర బ్రహ్మేంద్రస్వామి ముందు గుర్తుకొస్తారు .కైవారం తాతగారు కూడా కాలజ్ఞానం 1813-14 కాలం లో రచించాడు .సూక్ష్మ భీమ ఖండ శతకం లో 28పద్యాలు ,ప్రచండ నారేయణ కవి పద్యాలుగా 16 పద్యాలలో కాలజ్ఞానం గురించి ఉన్నట్లు వసంత్ తెలిపాడు .తాతగారి కాలజ్ఞానం లో విశ్వం లోని వింతలూ ,  ప్రకృతి వైపరీత్యాలు ,అతి వృష్టి అనావృస్టి ,ఆంగ్లేయుల పాలన అంతరించటం ,వెట్టి చాకిరి నశించటం ,వడ్డీ వ్యాపారం గుత్తాధిపత్యం హెచ్చటం ,వెండి బంగారు నాణాలు డబ్బు రూపం లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరటం ,ప్రపంచమంతా ఒకే ఒకడి అధీనం లోకి రావటం వగైరాలున్నాయని వసంత్ విశ్లేషించి చెప్పాడు .ముందుగా తెల్లవారి పాలన అ౦త మౌతు౦దని వారిని వానరులతో పోల్చి చెప్పాడు తాత.-‘’వానరుల వసుధ పాలన తీరెను –పలాయనమై పోదురు ‘’అనీ ‘’పడి చత్తురు –పరంగి వారి పట్టణము పాడౌను ‘’అన్నాడు .పరంగిపండు అంటే బొప్పాయి పండు .తెలుపు ,ఎరుపు రంగులో ఉంటారుకనుక వాళ్లకు ఆ పేరోచ్చిందట .సమస్త ప్రకృతిని ‘’అరణ్య పురం ‘’అన్నాడు తాత .ప్రకృతికి విఘాతం కలిగించవద్దని ఆనాడే హెచ్చరించాడు –‘’అరణ్య పురము నిండా శక్తి పుట్టినది ‘’అన్నాడు అందుకనే ,తన హృదయ సత్యమే కాలజ్ఞానం అన్నాడు .వేశ్యావృత్తి, దళారి ప్రవృత్తి పెరుగుతాయని ,ఆడ మగ వస్త్రధారణ మానాన్ని కప్పుకునే విధంగా కాకుండా అమ్ముకునే విధంగా ఉంటాయని .పశువులు వాటిమేత స్త్రీలు వృక్షాలు భిక్షగాండ్లు వగైరాలపై గుత్తాధిపత్యం హెచ్చుతు౦దన్నాడు –‘’పశులమేత భూమి పచ్చి పచ్చిక గుత్త-చెడ్డ స్త్రీలకు గుత్తచెట్ల గుత్త-ఫలవ్రుక్షములు గుత్తపండ్లు కాయలు గుత్త-భిక్షగా౦డ్ల కు  గుత్త,బీడు గుత్త –చాకి వాండ్లకు గుత్త సారాయి గుత్త –హరిదాసు గుత్త అడవి గుత్త ‘’అని అన్నిటినీ నిలువునా దోచుకొనే వారు పెరిగిపోతారని ముందే చెప్పాడు .ఇప్పుడు జరుగుతున్న తంతు అదేకదా .

నాద బ్రహ్మానంద నారేయణ కవి శతకం

‘’నాద బ్రహ్మానంద నారేయణకవి ‘’మకుటం గా సాగే ఈ శతకం లో పెద్దలను మెచ్చుకొని మాల,కవుల ,నోముల ,మతాల జాతుల పై తన అభిప్రాయాన్ని నిష్కర్షగా తాత వెలి బుచ్చాడు .ఇంటి ప్రణయం వంటికి మేలు అని నీతి చెబుతూ –‘’పంట చేను విధము పడతి ఇంటను ఉండ –వారకాంతల మీద వలపు యాల ?చేతికాసు పొవ్వు ,చెడు వ్యాధులు వచ్చురా ‘’అని బయటి సుఖం మరిగితే ఇల్లూ ఒళ్ళూ గుల్ల అవుతాయని,సుఖం ఏమోకాని సుఖ వ్యాధులు పెరుగుతాయని  హెచ్చరిక .’’ప్రాణ లింగము తనలో ప్రత్యక్షమై వుండ-చరలింగ పూజలు చేయనేల ?’’అనీ ‘’ఓంకార ప్రణవంబు వైభవం బెరుగక – వాదించు వాడు వైరాగ్యుడౌనే’’ ?అని ప్రశ్నించి ,’’బ్రహ్మ ఎరుగని బ్రాహ్మడే శూద్రుడు?’’అని ఉపనిషద్రహస్యాన్ని వివరించి,’’రేచక ,పూరక ,కు౦బక –సాహస పరుడైన వాని సహావాసమున-కనవలె కాయము మర్మము ‘’అంటూ యోగ రహస్య వివరణ చేశాడు .మొత్తం 100పద్యాలను ఈ పుస్తకం లో చేర్చి వసంత్ మంచిపని చేశాడు. తాతగారి జ్ఞాన మూలధనం అందుకోవటానికి అనువైన తీరిది .

అమర నారేయణ శతకం

లో 110 సీసపద్యాలున్నాయి.సీసాలో సెంటు వాసన గుప్పు మాననట్లు ప్రతి సీసం లొనూ విజ్ఞాన పరిమళం వెదజల్లెట్లుగా ఉన్నాయి .మచ్చుకి –‘’మతములన్ని యు వేరే –మార్గంబు ఒక్కటే –వర్ణ భేదములు వేరే –వస్త్ర మొకటే-శృంగారములు వేరే –బంగారమొక్కటే ,పసుల వన్నెలు వేరే పాలు ఒకటే –జీవ బొందులు వేరే –జీవుండు ఒక్కడే –జాతి రీతులు వేరే –జన్మమొకటే –దర్శనంబులు వేరే –దైవంబు ఒకడే-పుష్పజాతులు వేరే –పూజ వఘటే-‘’ఈవిషయాలు తెలియక మనుషులు భ్రాంతి విడువకుండ భవ రోగబద్ధులైనారు అని బాధ పడ్డాడు తాత .

శివ భక్తులు శివుని పూజిస్తారేకాని శివుడున్న చోటు తెలుసుకోరు ,అల్లాను ఆత్మలో చూడని ముస్లిం లకు ముక్తి ఎలాకలుగుతుంది ?నిష్టలు పాటించే వైష్ణవులు తత్త్వం తెలుసుకోకపోతే ప్రయోజనం ఏమిటి ?అని ప్రశ్నించాడు .ఆవులకు పచ్చిగడ్డి మీద ,పిల్లికి మాంసం మీద ,పక్షులకు పండ్లమీద ,అడవి జంతువులకు చీకటి మీద ,జలజీవులకు నీటిపైనా  ,తుమ్మెదకు పుష్పపరిమళంపైనా ,గ్రామ దేవతలకు జంతు బలిమీద ,ఆశ ఉంటె అల్పులైన నరులకు అన్నిటి పైనా ఆశ ఎక్కువ అని చురకలేశాడు .

శ్రీ కృష్ణ తత్వామృత యోగ సారం

లో బాలకృష్ణుని చిలిపి చేష్టలు తోపాటు శ్రీ కృష్ణ తత్వాన్ని సుబోధకంగా బోధించాడు నారాయణ తాత .చిలిపి కన్నయ్య లీలల్ని తప్పుగా అర్ధం చేసుకున్న భర్త భార్యను శంకిస్తూ తమ జాతి వారిని పేరు పెట్టి పిలిచే విధానం లో హాస్యం తొణికిసలాడుతుంది.

తలకాయ కొండ ద్విపద

లో కృష్ణ దేవరాయల ప్రస్తావన ఉన్నది .రాయల ఆస్థానం లో వీర రాఘవ భట్టు అనే పురోహితుడు శ్రీరంగ నాధుని సేవించాలని యాత్ర చేస్తూ ,కోలారు దగ్గరున్న తలకాయ కొండకు వచ్చి అక్కడ ఒక ఆవు పొదుగు పాలను దాని దూడతోపాటు పులి పిల్ల కూడా తాగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి ,తిరిగి వెళ్లి అప్పాజీకి తిమ్మరాజుకు తెలియ జేశాడు .అప్పాజీ ఇది విష్ణు మహిమ అని చెప్పి ,రాయలకు నివేదించాడు .రాయలు భార్యలతో ససైన్యంగా ఆ ప్రదేశానికి వచ్చి అడవి మధ్యలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి గుడి చుట్టూఉన్న పొదలను తొలగించి తన సేనాధిపతి చంద్ర శేఖర శెట్టి ద్వారా అక్కడి రాళ్ళపై చక్ర ముద్ర వేయించి ,సాతాని వైష్ణవుడైన తిరు వెంగళప్పయ్యను అర్చకునిగా నియమించాడట .ఈ వృత్తాంతాన్ని తాత ద్విపదలో చక్కగా వివరించాడు –‘’ఆ వేళ రాయలు అతి భక్తీ తోను –అర్చకుడు తిరుగ వెంగళప్పయ్య చేత –హరిపూజ గావించె ఆన౦దముగను’’.ఈ విధంగా చారిత్రిక ఇతి వృత్తాన్ని ద్విపదలలో భద్రపరచి గాన యోగ్యం చేశాడు నారాయణ తాత .

బ్రహ్మాండ పురి శతకం

లో మొగుడిని అర్ధం చేసుకోలేని స్త్రీ ఎలాఉంటుందో చెప్పి ,యోగి సుజ్ఞాని ,జ్ఞానం ,ప్రేమ ,ఆత్మ జ్యోతి మొదలైన విషయాలపై పద్యాలు చెప్పాడు కైవారం తాత .ఇదంతా సమాజ సంస్కరణాభి లాషతో చెప్పినదే

మచ్చుకి ఒకటి –‘’అక్షరము లన్నీ నాల్గేసిగా భాగించి అందులోన నిలువు తీసి –తీసిన నిలువులో ఐదేసిగా భాగించి లబ్ధభాగ మేర్పరచి  -లబ్ధమున ఉన్నట్టి నాల్గక్షరములకు  నామ మొక్కటి దాని లగువు తెలిసి –ఏకాక్షరంబని ఎరిగిన నెర యోద ఎరుక మానసుడతడు యోగ శాలి .

మర్మ మిడవక పరులను మాటలాడు ముగ్ధు డని పించుకొని తాను మురియు చుండు.

భక్త మందార బ్రహ్మాండ పుర విహార జయతు జగదీశ అమర నారేయణేశ ‘’

ఈ చివరి పద్యం బ్రహ్మ భేద్యంగా ఉందని వసంత్ భావించి ఎవరైనా విడమర్చి అర్ధం చెబితే చాలా సంతోషిస్తానని చెప్పాడు. నాదీ అదే కోరిక.  కనుక ‘’బాలు మీ కోర్టులో’’ ఉందని మనవి .అయినా వసంత్ ‘’చూచాయగా దీనికి’’ ఓం’’ అని అర్ధం వస్తుంది ‘’అని క్లూ కూడా ఇచ్చాడు .

తారక బ్రహ్మానంద ద్వయ కంద శతకం

230పద్యాలున్న ఈ శతకం సమాజం లోని దూర్తజనాలపై పద్యాలతో ఎక్కు పెట్టి విడిచిన బాణాలే.

‘’కొట్టకుమీ  పసిబాలల –కొట్టకుమీ స్త్రీల అశ్వ పులి వర్గంబుల్ –కొట్టకుమీ దీనాత్ముల-కొట్టకు మీ సన్యాసి ,కవుల నారేయణ కవీ ‘’అని సకల జీవులపైనా తనకున్న ప్రేమభావాన్ని,జాలినీ అనుకంప నూ  తెలియ జేశాడు .వంకాయ తోటలో టెంకాయలు వెదకటం వేస్ట్అని –‘’తలకిందైతపసు చేసిన –తలనిండా జలడు పెంచి గడ్డము మీసం-దీక్షాక్రమమున వుండిన –మోక్షము తనకెట్ల వచ్చు మనసు చపలునకు ‘’అని ముగించాడు తాత .

ఆత్మ బోదామృత వచనములు

కైవారం తాత తన ప్రియ శిష్యుడు ముత్తప్ప స్వామికి బోధించిన సత్యాలే ఇవి  .ఇందులో ఒకటి రెండు –1-‘’అష్టాంగ యోగ ముద్రలను సమాధిలో వెలసి ,ప్రకాశ స్వరూపముగా ఉండే ఆత్మను ,ఓంకార శబ్ద మూలకముగా తేలిస్తే తక్షణం  మోక్షం పొందటానికి అనుమానం లేదు .2-జాగ్రత్ ,స్వప్న ,సుషుప్తులలో నిశ్చల ధ్యానం చేస్తే ,అజ్ఞానం అనే మలాన్ని కడిగి ,ముక్తుడు అవటానికి ఏ సందేహమూ లేదు .గురు ధ్యానం చేసే వారి కర్మలు నాశనమై ఆనందం పొందుతారు .వంటి సుబోధక వాక్యాలతో తత్వాన్ని కరతలామలకం చేశాడు తాత .

తాత తాను  ఎంతటి జ్ఞాని సుజ్ఞాని కాలజ్ఞాని క్రాంత దర్శీ  అయినా పూర్వపు కవులను యోగులను స్మరించి కృతజ్ఞత చూపటం సంస్కారానికి గొప్ప నిదర్శనం ,మనకు ఆదర్శం .-మచ్చుకి –‘’వాల్మీకి నారద శుక వ్యాస భట్టరు –వేమ యోగుల వారు ఎరుక పరులు ‘’.’’కనకదాస ,పురందర  దాసులను కన్నడం లో ప్రస్తుతించాడు .’’శ్రీ గణేశ శ్రీశారద కాళిదాసాది కవులనెల్లా –భావమున బ్రస్తుతి౦తునురా ‘’అని ‘’రామానుజా చార్యుల ను కీర్తిస్తూ ‘’తిరుమంత్రము జీవనము పావనము –రామానుజ గురుడిచ్చు మోక్షము  ‘’అన్నాడు .శ్రీనాధ మహాకవిని ప్రస్తుతిస్తూ ‘’శ్రీనాధ సకల శాస్త్రముల౦దు ప్రఖ్యాతా –తెలిసి తెలియక మూల మర్మము –తెరవు మరుపుల చేత ఉంటివి ‘’అనీ భక్త పోతన్న ను ‘’కవినాయకుల కెల్ల కల్ప వ్రుక్షంబైన –బమ్మెర పోతయ్య భక్త వరుని ‘’అని మెచ్చాడు నాకు తెలిసినంతవరకూ పోతనను ‘కవి కల్ప వృక్షం ‘’అని కీర్తి౦చినవాడు కైవారం తాతయ్య ఒక్కడే అని పించింది .

కైవారం తాతగారి సాహిత్యాన్ని కన్నడీకరించి 10 భాగాలుగా తెచ్చి ప్రాచుర్యం తెచ్చారు .తాత గారి కీర్తనలను బాలమురళి ,నేదునూరి ,స్వరపరచి పాడి సిడిలుగా ,కేసేట్టులుగా కైవారం మఠం లో అందుబాటులో ఉంచారు కావలసిన వారు మఠం వారిని సంప్రదించి పొందవచ్చు .బెంగుళూర్ నుండి వెలువడే కన్నడ మాసపత్రిక ‘’మల్లార ‘’ తాతయ్య కీర్తనలను ధారావాహికంగా ప్రచురిస్తోంది .కైవారం తాత జీవిత చరిత్రను బ్లాక్ అండ్ వైట్ లోను కలర్ లోనూ కన్నడం లో సినిమాలుగా తీశారు .అచ్చ తెలుగువారైన ఆంధ్రా, తెలంగాణా వారికి ఇంతవరకు అ ఆలోచన రాక పోవటం సిగ్గు చేటు తల వంచు కోవాల్సిన పరిస్థితి అని సవివరంగా డా అగరం వసంత్ తెలియ జేశాడు .ఒక గొప్ప పురుషుని కాలాతీత వ్యక్తినీ మనకు ‘’కైవారం నారాయణ తాత గారి రచనలు –చిరు పరిశీలన ‘’ద్వారా పరిచయం చేసిన వసంత్ ధన్యుడై ,మనల్నీ ధన్యులను చేసినందుకు ,అతనికి ఏమిచ్చినా ఋణం తీరదు .అందుకని కృతజ్ఞత చెప్పి తప్పించుకొంటున్నాను .అతని చిరు పరిచయం నాతో ఇంత పెద్ద వ్యాసం రాయించింది .తెలియని విషయాలెన్నో నాకు తెలిసి, ఆ ఆనందంతో మీకూ తెలియ జేశాను.శ్రమ వసంత్ ది.ఫలితం మనందరిది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-3-18-కాంప్-మల్లాపూర్-హైదరాబాద్

 

 

 

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

         తాతగారి రచన తత్వబోధామృతం

‘’తాతే లిల్లియలో –శివతాతే లిల్లియలో’’ అన్న కైవారం నారాయణ తాత గారి తత్త్వం నోటికి రాని వాళ్ళు, భజనలో పాడని వారూ అరుదు .అయన రాసిన తత్వాలు కీర్తనలు 162 లో తెలుగులో రాసినవి 144 అయితే కన్నడం లో 18 ఉన్నాయి .వీటిని ‘’శ్రీ అమర నారేయణ యతీంద్ర వేదాంత సారావళి ‘’గా పేర్కొంటారు .కొన్ని తెలుగు,కన్నడమిశ్రితాలుగా ఉన్నాయి .అంటే తెలుగులో మొదలై ,కన్నడం తో ముగుస్తుంది -మణి ప్రవాళ శైలి లాగా .వినాయకునికి అగ్ర తాంబూలం ఇచ్చి –‘’ఏకదంతా మూషికవాహన వేదముని గణ వందితా –సకల విద్యల కాదికర్తవు  సన్మునీ విఘ్నేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’సంశయింపక వాక్కు నొసగుము సరసుడవు విఘ్నేశ్వరా –ధరను కైవర పుర విహరుడవై వెలసి యున్న హరునకు –ప్రియ సుతుడవై నట్టి గజముఖ దేవుడవు విఘ్నేశ్వరా ‘’అని కీర్తించాడు భక్తిగా .కైవార క్షేత్ర దైవం అమర నారేయణ స్వామి తాతగారి ఆరాధ్య దైవం .స్థానిక మాండలికం లో ‘’అంబ ‘’ను ‘’అంబను చూడరమ్మా జగదంబ ను చూడరమ్మా –అఖిలా౦డేశ్వరి శంభుని సతి తాకొలువై యున్నది –పంజులు ,,కమ్మలు ,పాపట బొట్టును తళుకు బుడగలు ,తాళీపదకము –చక్కని తల్లికి ముత్యపు ముక్కర –పరమేశ్వరి తా కొలువై యున్నది ‘’.కైవారం తాత గారి సమాధి వద్ద రోజూఆయన రాసిన రామనామామృతగానం వినబడటం ఒక ప్రత్యేకత .-‘’రామరామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవా –రామ దశరధ తనయ దేవా –రామశ్రీ నారేయణా-చూడ చూడగ  వెన్నెలాయెను-చూపు నిన్నే చూచెనూ –అన్నింటాను నీదే కళలు అమర శ్రీ నారేయణా’’కీర్తన అక్కడ ప్రతిధ్వనిస్తుంటుంది .అన్నిటా హరి ఉన్నాడనే తత్త్వం బోధిస్తూ ,ఆత్మ సాక్షాత్కారం పొంది తమలోనే హరిని దర్శించమని హితవు చెప్పాడు –‘’ఏమందురా  శంభో,ఏమందు-ఏమందు ప్రజలకు నీ మందు దొరకాదు’’అంటూ మందు అంటే పరమాత్మ తత్త్వం అని ఎరుక పరచాడు .అన్ని చోట్లా జరిగే జాతర అక్కడ ఇచ్చే జీవబలి తాతకు ఇష్టం లేదు .దీనికి విరుగుడుగా చక్కని తత్త్వం బోధిస్తూ –

‘’జాతర చేతామా శక్తికి జాతర చేతామా –ఎప్పుడు గృహమున వప్పుగ ఉన్నది –ముద్దులాడి ముక్తికాంతా సతికి –జాతర చేదామా ‘’అని –‘’మీదగు మానస దీపము చేసి ముద్దుగ శక్తికి ముందర ఉంచి –క్రూర దున్నలను మూటిని దెచ్చి నారాయణేస్త్రమున నరికి యాలుచును –గూడమైన గుండు మల్లెలు దెచ్చి ప్రీతిగా శక్తికి అలంకరించి –పంచ భూతముల బలిగా నిచ్చి –తారక జ్యోతిని ధ్యానము చేసి ,రామామృతమనే పొంగలి బెట్టి జాతర ‘’చేదామని మానసిక పూజా విధాన ఉత్క్రుస్టత వివరించాడు.  ఇలా చేస్తే జీవకోటికి ప్రమాదం ఉండదుకదా .అజ్ఞానమనే చీకటి తొలగించి బ్రహ్మ రాతను సైతం మార్చే శక్తి గురువుకు ఉన్నదని గురు బోధ చేశాడు .దైవ భక్తితో పాటు తాతకు దీనజన రక్షణా ముఖ్యమే.  ఆ నాటి అనా వృష్టి ని పద్యాలలో వర్ణించి వారి బాధను కళ్ళకు కట్టించాడు .

‘’తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం  ‘’అని పాండురంగ మహాత్మ్యం సినిమాలో కస్తూరి శివరావు బృందం పాడిన పాట మాదిరే తాత –‘’తొమ్మిది వాకి౦డ్లు కొంప –దుఖమునకిది మూల దుంప –ఎంచితే కలగూర గంప –తెలుసుకో నీ తాడు తె౦పా –డెబ్బది రెండు వేల నాళ్ళు అరువది తొమ్మిది కీళ్ళు –తోకపురుగులు మూడు సార్లు –నిండి ఉన్నది నీచు నీళ్ళు –మలమూత్రముల కుంట,మాంసము నెత్తార పెంట –మురికి పేగుల ముద్దు జంట కూడినది మలకోవి తుంటా ‘’అని శరీర మర్మాన్ని వివరించి దేహం పై మొహం వదిలేయమన్నాడు .కైవారం కొండ ఎక్కమని ‘’బకు డుండు గుండు చూడండా –భీమేశ్వరును మీద నిండా –భక్తీ భాగ్యము వేడు కొండా –పశ్చిమ ద్వారమున పొండా –అమర నారేయుణుని నమ్ముకొండా’’అని తన క్షేత్రానికి జి.పి.ఎస్ .సిస్టం లో మార్గం చూపించాడు .

  మతాలన్నీ చిక్కు పురాణాలు అని చెప్పి ,అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే అని తెలియ జేశాడు .దొంగ సన్యాసులను ,కపట వేష దారులనుఎండగడుతూ -‘’ఏనుగు నెక్కిన యోగీశ్వరునకు –ఏపి మొరిగితే భయమౌనా ?’’అని ఎద్దేవా చేశాడు  .

మణి ప్రవాళ శైలిలో రాసిన అరుదైన కీర్తన వైభవం చూద్దాం –‘’బిత్తరి గురువు బెత్తాలు బట్టుక కట్ట్యేలమీదను నడిచేరురా –కళ్ళు కడవ రీతి కడుపులు పెంచుక మైనిండ గంధము పూసేరురా ‘’అని తెలుగులో మొదలుపెట్టి –‘’జ౦గకెక్కుల విల్లా లింగెక్క హోలెయిల్ల శివ భక్త కరిగెఈగ సారిదినో –బేడరమనెపూటమాడిద నంజుండ ఇద్దస్టు హేళిదేఇదు కేళిరి-నారాయణ స్వామి  హేళిదశిందు నుడి సుల్లెంద  బాయిగె ముళ్ళాకిరో’’అని రాసి జ౦గా నికి కులం ,లింగానికి అంటూ లేవు అని సత్యం చెప్పాడు .బహిస్టైన స్త్రీలలో కూడా శివుడు ఆ సమయం లోనూ ఉంటాడు అనే కఠోర సత్యాన్ని ,బోయవాడు పెట్టిన మాంసం శివుడు తినలేదా అని తత్వ బోధ చేసి చివరికి ‘’నా మాటలను ఎవరైనా  తప్పు అంటే వాళ్ళ నోళ్లల్లో ముళ్ళు కొట్టండి ‘’అని ఖచ్చితంగా చెప్పాడు కైవారం తాత .

  తాత చెప్పిన కాలజ్ఞానాదుల గురించి తరువాత ముచ్చటించు కుందాం –

సశేషం

  మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -23-3-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -1

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -1

తమిళనాడు హోసూరు లో ‘’కృష్ణరసం ‘’అంటే కృష్ణగిరి రచయితల సంఘం ,బస్తీ మే సవాల్ అన్నట్లుగా ‘’బస్తీ యువజన సంఘం తెలుగు భాషకు సంస్కృతికి ,మాండలికానికి ఇస్తున్న ప్రాచుర్యం అనన్య సామాన్య మైనది .ప్రతి ఉగాదికి కవితా సంకలనం,  కతల సంకలనం వంటివి గత ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తూ తెలుగు వారికి  ఆదర్శప్రాయం అవుతున్నారు .అందులో చురుకైన పాత్ర పోషించే డా అగరం వసంత్ మార్గ దర్శకత్వం లో ఏటి కేడాది వారి సాహిత్య సేవ ఇనుమడిస్తూనే ఉంది .ఈ విలంబి ఉగాదికీ కొత్త పొత్తాలు వెలువరించారు .వాటిని నాకు పంపారు . అందులో శ్రీ వసంత్ రాసిన ‘’కైవారం నారాయణ తాత గారి రచనలు –చిరు పరిశీలన ‘’గొప్పగా ఉన్నది .రచయిత’’ చిరు ‘’అని అన్నా ‘’మేరు ‘’నగ గంభీరం గా ఉన్నది .అందరు తప్పక చదవాల్సిన పుస్తకం .తాత మామూలోడు కాదు క్రాంత దర్శి .ఆంధ్ర దేశం లో పుట్టినా ,తెలుగు వాళ్ళు ఎవరూ పట్టించుకోక పోయినా కస్తూరి వాసన దశ దిశలా వెదజల్లబడినట్లు  కర్నాటక ,తమిళనాడు మొదలైన రాష్ట్రాలలో తాతగారి రచనలను తత్వాలను అనువదించుకుని పాడుకుంటూ భావ వ్యాప్తి చేస్తున్నారు .పెరటి చెట్టు వైద్యానికి  పనికి రాదన్న సామెత ఆంధ్రులకు బాగా వర్తిస్తుందని రుజువైంది ఈ విషయం లో .వసంత్ కు తాత గార౦టే ఆరాధ్య దేవతే . ఆయన ప్రభావం లో పెరిగిన జీవితం తనదిగా భావిస్తాడు . కనుక తాతగారి జీవితం ,రచనలను తలస్పర్శగా సమీక్షించాడు .అందులో ముఖ్యంగా తాతగారి జీవితం ,రచనలలో  నేను ఒడిసిపట్టిన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .ఇది చదివే దాకా నాకూ తాత గారిపై పూర్తీ అవగాహన రాలేదు మనలో చాలామందికి తెలియక పోవనూ వచ్చు .అందుకని ఈ ప్రయత్నం చేస్తున్నాను .ఇది ఉభయులకు శ్రేయోదాయకం లోక కళ్యాణ కారకం కూడా .

                కైవారం నారాయణ తాత గారు

మహా భారతం లో ఉన్న ‘’ఏక చక్ర పుర’’మే కైవార క్షేత్రం .భీముడు బకాసురుని చంపి  శవాన్ని ఒక గుహలో పడేసి  గుహ ద్వారాన్ని  పెద్ద బండరాయి తో మూసేశాడు .ఆ గుండును ఇప్పటికీ ఇక్కడ ‘’బకుని గుండు ‘’గా జనం చెప్పు కుంటారు . తాతగారి రచనలో కూడా దీని ప్రస్తావన ఉన్నది .ఇప్పటి కర్నాటక రాష్ట్రము చిక్క బళ్ళాపురం జిల్లా చింతామణి తాలూకా కైవార క్షేత్రం ‘’కొత్తపల్లి ‘’అనే పల్లె టూరిలో క్రీ.శ.1726లో కొండప్ప ,ముద్దమ్మ దంపతులకు కైవారం  నారాయణప్ప పేరుతొ  తాత జన్మించాడు .చిన్నతనం లోనే తల్లీ తండ్రీ చనిపోవటం తో ఊరి వారి సంరక్షణలో పెరిగాడు తాత .కైవారం లోని ‘’అమర నారేయణస్వామి ‘’ని సేవిస్తూ ,భక్తి భావంతో పారవశ్య౦గా పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ఊరి జనం చేత బాల ప్రహ్లాదునిగా గుర్తింపు పొందాడు .మేనత్త కూతురు ‘’మునెమ్మ’’ను  పెళ్ళాడి పెద్దకొండప్ప ,చిన్న కొండప్ప కొడుకులకు ,ముద్దమ్మ కూతురికి తండ్రి అయ్యాడు .గాజుల వ్యాపారం చేసే నారాయణప్ప యాభై వ ఏట చిత్తూరు జిల్లా మొగిలి వెంకట గిరి కనుమల్లో వానప్రస్థాశ్రమం లో ఉన్న ‘’పర దేశి స్వామి ‘’దర్శన ప్రభావం తో సంసారం త్యజించి సన్యాసిగా మారి’’ నారాయణ తాత ‘’గా ప్రసిద్ధి చెందాడు .

  చదువు పెద్దగా లేని తాత పామరులకు కూడా తేలికగా అర్ధమయ్యే రీతిలో వేదాంత సారాన్ని భక్తీ ,రక్తి విరక్తి తో రంగరించి త్రివేణీ సంగమం చేసి పవిత్రత కల్గించి ప్రచారం చేశాడు .తత్వాలు ,కీర్తనలు ,కాలజ్ఞానం ,అమర నారేయణ శతకం ,,బ్రహ్మా౦డపురి శతకం ,నాద బ్రహ్మానంద నారేయణ కవి శతకం ,శ్రీ కృష్ణ చరిత తత్వామృత యోగసారం ,తారక బ్రహ్మానంద ద్వయ కంద శతకం రచించి మహా కవులు,  మహాయోగులు చేసినంత సాహిత్య సేవ చేసి  ,దార్శనికత ప్రదర్శించాడు  .సమాజం లోని జాతి,మత కుల విభేదాలను రూపుమాపటానికి సంఘ సంస్కరణకు  కృషి చేశాడు .అయన తత్వాలు గీతాలు కోలారు జిల్లా జానపదులే కాక చిక్కబళ్ళాపురం ,బెంగుళూరు మైసూరు జిల్లాలలో  తమిళనాడు హోసూరు ,డెంకణి,వేపనపల్లి ,ఆంధ్రాలో చిత్తూరు జిల్లాలో ప్రజల నోళ్ళలో నిత్యం నానుతూ రసాలూరిస్తాయి .లక్షలాది అభిమాన భక్త బృందమేర్పడింది తాతకు .

   1836-37 సంవత్సరం జ్యేష్ట శుద్ధ తదియ రాత్రి 12 గంటలకు అంటే 110 ఏళ్ళ వయసులో తాను  సమాధి చెందుతానని శిష్యులకు తాత ముందే తెలియ జేశాడు .అన్నట్లే అదే రోజు సమాధి గతుడై నాడు .ముఖ్య శిష్యుడు ముత్తప్ప స్వాములు తాతగారి సమాధి నిర్మించి ,నిత్య పూజాదికాలు నిర్వహిస్తూ తాత భావ వ్యాప్తికి కృషి చేశాడు ..తర్వాత లింగాచార్యులు ,ముని అవధూత ఆ బాధ్యతలు చేబట్టారు. తాళపత్రాలలో లిఖించబడిన తాత సాహిత్యాన్ని 19 12 లో సీతారామాచార్యులు మఠ నిర్వహణలో భాగంగా మొదటి సారిగా ముద్రించి లోకానికి అందుబాటు లోకి తెచ్చాడు .ఆ తర్వాత నారాయణ సింగ్ ,మేలూరు ముని శ్యామప్ప,చిక్కబళ్ళాపురం చిన్న నారాయణ స్వామి ,కట్టకింది జయరామి రెడ్డి మొదలైనవారు తాత సేవలో పునీతులయ్యారు .మాలూరు శ్రీ టి. సొణ్ణప్ప దాసు తాత జీవిత చరిత్రను హరికధా రూపంగా మార్చి గానం చేస్తూ తత్వ ప్రచారం చేశాడు .1978-79 లో బెంగుళూరుకు చెందిన మత్తికరయ సంపంగప్పకుమారుడు ఏం ఎస్ రామయ్య తాతగారి ఆశ్రమాన్ని సందర్శించి అనుభూతికి లోనై,స్వంత ఖర్చుతో ఆశ్రమ రూపు రేఖలే మార్చి కొత్త భవనాలు నిర్మించి కైవారం తాతకు కైమోడ్పు క్రియా రూపంగా అందశాడు .ఈయన పెద్దకొడుకు డా.ఏం ఆర్ జయరాం 1998 నుండి ఆశ్రమ ధర్మాదికారిగా వ్యవహరిస్తున్నాడు . ప్రతి ఆదివారం వచ్చి భక్త బృందం తో ఒక్కో గ్రామం లో కీర్తనలు పాడుతూ తాత   తత్వాలను సజీవం చేస్తున్నాడు .హోసూరు లో తాతగారి ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వాములు తనజీవితాన్ని తాత గారి సేవకు అంకితమిచ్చి నిత్యభజన ,తత్వ ప్రచారం ఊరూరా నిర్వహిస్తున్నారు.

  ఇలా కైవారంనారాయణ తాత గారు వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతి అమరదీపం లా విజ్ఞాన జ్యోతులను వెలయిస్తూ ఆస్తిక జనాలకు మార్గ దర్శకం గా ఉన్నది . ఈ ప్రభావం తోనే డా వసంత్ తాతగారి జీవితం రచనలు ఒక చోట చేర్చాలన్న సత్ సంకల్పం తో ఈ పొత్తం రాసి అందజేశాడు .తాతగారి జీవితం పై ఎన్నో వెలుగు రేకలు ప్రసారితమైనాయి.   తాత జీవితం మనవళ్ళ ,ముని మనవళ్ళ,ఇని మనవళ్ళతరం దాకా ప్రసరించి శాశ్వతత్వాన్ని పొందింది .ఒక రకం గా ఈ పొత్తం  కైవారం తాత గారికి  డా .వసంత్ సమర్పించిన ఘన కైవారం అని పిస్తుంది .

  ఇక తాత గారి రచనల గురించి తర్వాత భాగం లో తెలుసుకొందాం .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం 

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం

అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు తెలంగాణాలోని రాకొండ లో క్షామం వస్తే శ్రీ ఆంజనేయ స్వామికి కరన్యాస ,అంగన్యాస పూర్వకంగా మన్యుసూక్తమ్ తో అభిషేకం , అర్చన చేయించి స్వామి శరీరానికి తేనెలో మిరియాలపొడి కలిపిన చూర్ణం పట్టించారు . ఆ రోజు రాత్రి భారీ వర్షం ఉరుములు మెరుపులతో కురిసి చెరువులు కుంటలు  సమృద్ధిగా నీటితో నిండి  బంగారు పంటలు పండి దుర్భిక్షం తొలగి సుభిక్షం ఏర్పడింది .
  ఆధారం -అభినవ కాళిదాస తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి  గ్రంథం లో శ్రీ కపిలవాయి లింగమూర్తి గారి వ్యాసం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ

                   భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ

‘’లేదు ‘’అనే సిద్ధాంతాన్ని సింగం పల్లి సిద్ధాంతి అని పిలువబడిన ‘’అనంతుని సీతారామ సిద్ధాంతి ‘’తాను రాసిన ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’గ్రంధం లో అనేక ఉపపత్తులతో రుజువు చేశాడు .ఈయన -తెలంగాణా సంస్కృతాంధ్ర మహాకవి ,పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర  వేత్త ,’’అభినవ  కాళిదాస ,కవికులాలంకార ,కవి కల్పద్రుమ ,అలంకార నటరాజ ‘’బిరుదాంకితులు శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారి సమకాలీనుడు .సిద్ధాంతి ‘’రాజా ధరం కరణ్ బహద్దర్ ఆసఫ్ జాహీ సదరుల్ మహా రాజా ‘’ఆస్థాన జ్యోతిష విద్వాంసుడు .రాజ మండ్రి,కోన సీమలలో మహా పండితుల వద్ద జ్యోతిషం నేర్చినవాడు .గణిత  శాస్త్రం లో అఖండ ప్రజ్ఞానిధి. మాహా రాజసంగా జీవించాడు .ఎన్నో ఎకరాల భూమి ,వ్యవసాయం ఎడ్లు పాడి గొడ్లు పాడి పంట లతో  వడ్డీ వ్యాపారం తనఖా లతో సరస్వతీ సంపన్నం తో పాటు లక్ష్మీ సాక్షత్కారమూ పొందటం తో గృహం ఎల్లప్పుడు కళకళలాడేది .

  ఇంతటి ఉద్దండ పండిత సిద్ధాంతి  మన తెల్క పల్లి వారి సాయం  తో పై గ్రంధాన్ని రాసి కాదు ఆయనతోనే రాయించి తానె రాశానని చెప్పుకుని గురువుకు పెద్ద పంగనామాలు పెట్టిన ఘనుడు ‘’మోసం గురో ‘’కు ఆద్యుడు ..ఆ వివరాలు తెలుసు కుందాం .

ఈ సిద్ధాంతి జైన ,బౌద్ధ మత గ్రంధాలను క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకుని ,37ఉపపత్తులతో ‘’భూమికి చలనం లేదు .అంటే భూమి తిరగటం లేదు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .ఆ సిద్ధాంత ప్రతిపాదనకోసమే ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’రాసే ప్రయత్నం చేశాడు .దీనికోసం ఆయన తిరగవేయని గ్రంథం,సేకరించని పుస్తకం ,పరిశీలించని విషయం లేనే లేదు .అంత శ్రమ పడ్డాడు .విషయ సేకరణ అంతా పూర్తిగా చేసినతర్వాత తన పరిశోధన ను కాగితం పై పెట్టె సమయం లో ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు శ్రీ తెల్కపల్లి రామ చంద్ర  శాస్త్రి  గారు పరిచయమయ్యారు .తన శ్రమ అంతా శాస్త్రి గారికి వివరించి రచనలో సాయం  చేయమని కోరాడు సిద్ధాంతి .ఒక మహత్తర గ్రంథానికి తాను  కారకుడౌతున్న ఆనందం తో, ఆ గ్రంథం తమకు గొప్ప పేరు కీర్తి ఇస్తాయన్న  నమ్మకం తో సరే నన్నారు శాస్త్రి గారు .

  శుక్లనామ సంవత్సరం నుంచి ఆంగీరస నామ సంవత్సరం వరకు నాలుగు సంవత్సరాలు సిద్ధాంతి కోరికపై సిద్ధాంతి  ఇంట్లోనే భార్యతో సహా ఉండిపోయారు .మొదట సిద్ధాంతి తనభావాలను శాస్త్రి గారికి వివరించేవాడు .వాటిని శాస్త్రిగారు శ్రద్ధగా విని ,ఆకళింపు చేసుకుని ,వాటిని క్రమబద్ధం చేసి అతని కుమారుడికి చెప్పి రాయి౦చేవాడు .అవసరమైన చోట ‘’కారికలు ‘’కూడా శాస్త్రి గారే రాసి ,నిర్వచనాలు సైతం తానే వ్రాశారు .సిద్ధాంతి ఎప్పుడూ బిజీ బిజీ .సమయం దొరికేది కాదు కుదురుగా కూర్చుని రాయటానికి .అయితే శాస్త్రి గారు వచ్చి కూర్చునే లోపు సిద్ధాంతి విషయానికి తగ్గ రిఫరెన్స్ లు  రెడీ గా ఉంచేవాడు .వీటినన్నిటిని క్రోడీకరించి శాస్త్రిగారు శ్రమ దమాదులకోర్చి ,సిద్ధాంతి భావాలకు చక్కని సమన్వయము తో రూప కల్పన చేసి,మనస్పూర్తిగా  గ్రంథం రాశారు  ..సిద్ధాంతి తన గ్రంథానికి ‘’భూ భ్రమణ భ్రాంతి నిరసనం ‘’అని మొదట్లో పేరు పెడదామనుకుని  , ఆంగ్లేయుల సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం అని పేరు లోనే తెలిసిపోతుందని భయ పడి ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’అని పేరు మార్చాడు .

  అమాయకులైన శాస్త్రి గారు సిద్ధాంతి ఊహాపోహలను కనిపెట్టలేక పోయారు .గ్రంథ రచన పూర్తికాగానే శాస్త్రి గారితో ‘’అభిప్రాయం ‘’రాయి౦చుకుని శాస్త్రి గారిని బిగించేశాడు .ఇది మొదటి స్టెప్పు .1931లో శాస్త్రి  గారిని వెంట బెట్టుకుని మైసూర్ విరూపాక్ష పీఠాన్ని సందర్శించి అక్కడి పీఠాధిపతికి తన గ్రంధాన్ని చదివి వినిపించాడు .ఆయన విని మెచ్చి ‘’ప్రమాణ పత్రిక ‘’రాయించి ఇచ్చారు .ఇది రెండవ స్టెప్పు .మూడవ  స్టెప్పు గా వెల్లాల శివ శంకర శాస్త్రి చేత ,మైసూర్ మహారాజా సంస్కృత మహా కళాశాల ఉద్దండ పండితుల చేత ,పరకాల పీఠాధిపతి చేత ,’’ప్రశస్తి పత్రికలు ‘’ పొంది తన చాకచక్యాన్ని, చాణక్య నీతినీ ప్రదర్శించాడు .పరకాల స్వామి సిద్ధాంతిని గ్రంథ రచన ఎవరు చేశారని ప్రశ్నించగా శాస్త్రిగారి పేరు ఊసెత్తకుండా   అంతా తానె రాశానని ప్రగల్భాలు పలకగా శాస్త్రిగారు చాలా ఖిన్నులయ్యారు .అప్పుడు అర్ధమయింది’’మోసం గురో ‘’అని .”భూమి తిరగటం లేదు ”అన్నమాట ఏమోకాని శాస్త్రిగారి కళ్ళు తిరిగి బైర్లు కమ్మేట్లు చేశాడు కపట సిద్ధాంతి .

ఆధారం -మహబూబ్ నగర్ తెలంగాణా వికాస సమితి ఆధ్వర్యం లో శ్రీ సంబరాజు ప్రకాశరావు సంపాదకుడుగా  శ్రీ తెల్కపల్లి రాజ శేఖర శర్మ సహ సంపాదకుడు గా ప్రచురించిన ‘’ అభినవ కాళిదాస తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి’’పుస్తకం లో శ్రీ కపిలవాయి లింగ మూర్తి గారి వ్యాసం .

   శ్రీ శాస్త్రి గారిపై రాసిన పై పుస్తకాన్ని  శ్రీ శాస్త్రి గారికుమారులు శ్రీ రాజ శేఖర శర్మగారు నాకు 27-2-18 న అభిమానం తో ,ఆదరణతో పంపారు .వారికి ధన్యవాదాలు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ?

ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ?

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కిచెన్ కేబినెట్ అన్ని వ్యవహారాలూ చూస్తూ  ఇండియా ఏ ఇందిరా అని వందిమాగధ స్తోత్రాలు చేసి ఉబ్బేస్తే నిజమేననుకొని ఆవిడ పట్ట పగ్గాల్లేకుండా విజృంభించించిన కాలం లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ మొదలైన నలుగురైదుగురు ఇందిర ధోరణి నియంతృత్వానికి దారి తీస్తోందని ముందే హెచ్చరించి దేశానికి దిశా నిర్దేశం చేశారు . సరైన సమయం లో సరైన హిత బోధ చేశారు .అధికారమత్తు బాగా వంటబట్టిన ఆమె చివరికి ఎవరినీ లెక్క చేయకుండా ప్రజాస్వామ్యముసుగులో నియంతలా వ్యవహరించిన సంగతి మనకు తెలుసు .నాయకులు దారి తప్పుతుంటే వక్రమార్గాన ప్రయాణిస్తుంటే సక్రమ మార్గం  చూపించటం విజ్ఞుల లక్షణం .నాయకత్వానికి భయపడి ,ప్రజాస్వామ్యాన్ని భగ్న పరుస్తుంటే ఉపేక్ష తగదు .అలా  చేయలేకపోతే నాయకునితో సహా తామూమట్టి కొట్టుకు పోతారు .చివరికి ఇందిరా ఎమర్జెన్సీ పెట్టటం వాజ్ పేయ్ అద్వాని వంటి వారిని అరెస్ట్ చేయించటం ,దాని ఫలితంగా జనతాపార్టీ ఏర్పడటం ఇందిర పతనం మనకళ్లముందు జరిగిన సత్యాలే .
  ఇవాళ దేశ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అవే  రోజులు పునరావృత్తం కాబోతున్నాయా అని పిస్తోంది . ఎన్నికలలో గెలుపే ప్రధాన లక్షణం గా నాడు ఇందిర భావించినట్లే నేడు మోడీ కూడా భావిస్తున్నాడు .గెలుపు వినమ్రతకు సూచనకావాలి అహంభావానికి దారి కారాదు .ఈశాన్య ఎన్నికల గెలుపుతో గర్వం తో దేశానికి ప్రజాస్వామ్యబద్ధం గా ఎంతోకాలం సేవ చేసి పార్టీకి అపూర్వ వైభవం సంతరించి పెట్టి కష్టకాలం కాపుగా ఉన్న ,ప్రతిపక్షంకూడా చేతులెత్తి నమస్కరించే లాల్ కృష్ణ అద్వానీని నిండు సభలో అవమానపరచి,నమస్కరించినా  ప్రతినమస్కారం చేయకుండా పట్టించుకోకుండా పోయిన మోడీ వైఖరి దేనికి నిదర్శనం ? సోమనాధ్ దేవాలయం లో చేసిన వాగ్దానం బుట్ట దాఖలు చేసినవాడికి పార్లమెంట్ లోనూ అన్ని సభల్లో ఆంధ్రాకు అన్ని రకాల సాయం చేస్తానని హామీలు గుప్పించి ఇప్పుడు నెత్తిన టోపీ పెట్టటం పెద్ద వింతకాదు . సహజ లక్షణం .. ఇంత  జరుగుతున్నా మోడీ కి భయపడి పార్టీలోని పెద్దనాయకులు ఒక్కరూ మందలించకపోవటం విడ్డూరం గా ఉంది .ఆ నాటి చంద్ర శేఖర్ ,కృష్ణకాంత్ బృందం ధైర్యం చేసి ఇందిరా నియంతృత్వ పోకడలను హెచ్చరించారు దారి మార్చుకోమన్నారు .చివరికి పార్టీని వదిలి బయటికి వచ్చి ప్రజాస్వామ్య రక్షణలో భాగస్వామ్యులయ్యారు.  .ఇప్పటికైనా బిజెపి నాయకులు పెదవి విప్పి నియంతృత్వాన్ని ఎదిరించి పార్టీకి, దేశానికి మేలు చేస్తే మంచిది లేకపోతే ఈ అధికారగర్వం తోబిజెపి కూడా మరో రూపం లో ఎమర్జెన్సీ ప్రకటిస్తుందేమోనని భయమేస్తోంది .ప్రజాస్వామ్య సంరక్షకులందరూ ఏకం కావాలసిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది . చేతులుకాలాకా ఆకులతో పనేమీ ఉండదు.  తస్మాత్ జాగ్రత , జాగ్రత ..
  మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -19-3-18-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు  

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు

‘’చివురులు వేసిన కలలన్నీ ‘’పాట వినగానే ఆ స్వర మాధుర్యానికి పరవశమౌతాం .ఒక కొత్త కోయిల తెలుగు నేలమీద నవవసంత గానం చేసిందని సంబర పడ్డా౦ . ఆ తీయని పలుకుబడికి పులకించాం.మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్నాం .యెద నిండా ఆన౦దపు అనుభూతులు పంచుకున్నాం .ఇంతటి గాయకుడికి అవకాశాలు ఎందుకు ఇవ్వటం లేదని బాధపడ్డాం.వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని సత్తా చాటి ప్రతిభను నిరూపించాడు మోహన రాజు .అందరికీ కేబికే మోహనరాజు అంటే బాగా తెలుస్తుంది .అలా బాగా నలిగిన పేరే అది .ఆ సుస్వరం శ్రీ విళంబి వసంతం ప్రవేశించటానికి రెండు రోజులముందే 16-3-18 శుక్రవారం 73 వ ఏట కనుమరుగవటం ఆశ్చర్యాన్ని ,ఆవేదనను కలిగించింది .ప్రతిభకు తగిన స్వర పట్టాభిషేకం జరగలేదు అని బాధ కలిగించింది .

తెలుగు సినీ గాయక దిగ్గజాలైన ఘంటసాల ,బాలు ,సుశీల ,జానకి లతో కలిసి పాడిన అదృష్టవంతుడు రాజు .ప్రముఖ సంగీత దర్శకులురాజేశ్వరరావు  మహదేవన్ ,సత్యం ,మాస్టర్ వేణు ల స్వరాలకు తన మోహన సమ్మోహన గానం తో చిరస్మరణీయం చేశాడు .సుదీర్ఘమైన సినీ ,టివి జీవితం ఆయనది .విజయవాడ లో మోహనరాజు   1945 అక్టోబర్ 10న శ్రీమతి  ఉషాకన్య శ్రీ శేషయ్య దంపతులకు జన్మించాడు .సంగీతం లో తొలి గురువు తండ్రి శేషయ్యగారే .తర్వాత ఘంటసాల ,కస్తూరినరసింహారావు లు . ఆంద్ర ప్రదేశ్  ఎలెక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ లో చేరి అసిస్టెంట్  సెక్రెటరి అయ్యారు .కమలాదేవిని వివాహం చేసుకుని నలుగురు కుమారులకు ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు .లలితగీతాలు ఆలాపించటం లో మహా నేర్పున్న మోహనరాజు అందులో తన ప్రతిభను చాటాడు . విజయవాడలో మొదటి సంగీత ప్రదర్శన చేసి అప్రతి హతంగా దూసుకు పోతూ కనీసం 10 వేల ప్రదర్శనలు దాకా ఇచ్చిన ఘనకీర్తి మొహనరాజు ది.’’రామదాసుకీర్తనలు ‘’మొదటి కేసెట్ గా విడుదల చేశాడు దీనితో ఆయన కీర్తి శిఖరారోహణం చేసింది ‘’పదములు చాలు రామా ‘’అనే గీతం ఆయనకు బాగా నచ్చినది .విదేశాలలోనూ అనేక ప్రదర్శనలు నిర్వహించి లలిత సంగీత మోహన రారాజు ‘’అని పించుకున్నారు .1977 సంగీత సమ్మేళనం ,న్యుఢిల్లీ ఎయిర్ న్యుఢిల్లీ ,దూరదర్శన్ లలో మంచి గుర్తింపు పొందాడు .రాజు సేవను గుర్తించి   ఆకాశవాణి ,దూర దర్శన్ కేంద్రాల సలహా సంఘం లో సభ్యుని చేసి గౌరవించారు .చిత్తరంజన్ స్వరపరచిన పాటలు ఎక్కువగా ఆతర్వాత పాలగుమ్మి వారిపాటలు మంచాల జగన్నాధ రావు గార్లు స్వరపరచిన గీతాలు పాడాడు .ఘంటసాల అవార్డ్ ను పొందిన మొదటిగాయకుడు రాజు .బాంబే రేబర్ట్స్ స్టేడియం లో జరిగిన లలిత సంగీతం పాటల గొప్ప పోటీలో 30 వేల మంది ప్రేక్షకుల సమక్షం లో  పాడి గొప్ప అనుభూతికి లోనయ్యాడు .భారత దేశం లో అదే మొట్టమొదటి భారీ పోటీ .దీనిని నిర్వహించినవారు డా ఈమని శంకర శాస్త్రి గారు .ఈ ప్రదర్శన ద్వారా ఈమనివారు శాస్త్రీయ సంగీతానికి లలిత సంగీతం ఏ మాత్రం తీసి పోలేదు అని రుజువు చేశారు  .

సత్య హరిశ్చంద్ర నాటకం లో లోహితాస్యుని పాత్రతో నాటక రంగ నటుడు అయ్యాడు రాజు .లలిత, భక్తి గీతాలు ఆలాపించటం లో అందెవేసిన చేయి  సారీ గొంతు అని పించాడు . రామదాసు కీర్తనలు ,అన్నమాచార్య కీర్తనలు పాడి వాటి విలువ పెంచాడు .వైవిధ్యమైన కీర్తనలు అతి సునాయాసంగా నేర్చి పాడి ఆకట్టుకున్నాడు .’’నీదేరా భారత దేశం ‘అనే మొహనరాజు పాడిన దేశభక్తి గీతం బాగా ప్రాచుర్యం పొందింది .పాలగుమ్మి విశ్వనాధం స్వరపరచిన ‘’నిను కోలుచునోయి  జగమంతా –ధన్యుడవోయి హనుమంతా ‘’వంటి చాలాపాటలు పాడి తన దైవభక్తిని ప్రదర్శించాడు .చిత్తరంజన్ స్వరకల్పనలో ‘’శ్రీ శేషాచల వాసా ‘’వంటి మధుర భక్తి భావ గీతాలు ఆలపించాడు రాజు .’’నా బతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవ ‘’తనకు మంచిపేరు తెచ్చిందని చెప్పుకున్నాడు.’’వినవమ్మా చెల్లెలా ,గుణభద్రా తుంగ భద్రా –వినవా నాచెల్లెలా గంగాయమునల జోరు –గౌతమికే సై జోడు –బాలవై సయ్యాటలాడు ఈడు పోయెనమ్మ –  పోయిన జీవితముమళ్ళీ పొందవు చెల్లీ –ఈ ఇల పండించుటయే నీ ధర్మము  తల్లీ ‘’ గీతాన్ని చాలా ఏళ్ళ క్రితమే కృష్ణ శాస్త్రి గారు రాశారు.  దానిని పాడే అదృష్టం తనకు కలిగించారు’ .’’సినీకవులలో,ముఖ్యంగా లలిత సంగీత కవులలో  కృష్ణ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా అని నా నిశ్చితాభిప్రాయం ‘’అని ఘంటాపధంగా చెప్పాడు  గాన మోహనరాజు .’’రాత్రి పూట బాలమురళి పాటలు వింటూ నిద్రపోవటం నాకు అలవాటు .నన్ను పరవశం చేసి , వేరే లోకం లో విహరి౦పజేసే  పాటలు అవి ‘’అని మహాగాయకుడికి స్వరార్చనగా అన్నాడు  .సంగీతం తనజీవితం లో ఒక భాగమే అన్నాడు .

తెలుగు చలన చిత్రాలలో 50కి పైగా సినిమాలలో పాడాడు .అందులో సాక్షి ,పూలరంగడు ,దేవుడమ్మవంటివి ఉన్నాయి  .సాక్షి సినిమాలో బాపు దర్శకత్వం లో మహదేవన్ సంగీత కర్తృత్వం లో ఆరుద్ర రాసిన ‘’ఎవరికి ఎవరూ ఈలోకం లో –రారు ఎవ్వరూ నీ కోసం ‘’ను మోహనరాజు అద్భుతంగా విషాద గర్భితంగా పాడాడు .ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లో పూల రంగడు చిత్రం లో నారాయణ రెడ్డి రాసిన ‘’చిగురులు వేసిన కలలన్నీ ‘’పాటను సుశీలతో కలిసి మోహన రాజు పాడాడు దీనికి మంచి గుర్తింపు వచ్చింది

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ

సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను…

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం 2:

దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు.. నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు…

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం 3:

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ…ఆ ఆ ఆ…
పరిమళాల తరగలలోనే కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ…ఓ…ఓ

చలం నటించిన దేవుడమ్మ సినిమాలో సత్యం సంగీతం లో నారాయణ రెడ్డి  ‘’చిన్నారి చెల్లి మా చిన్నారి చెల్లి ‘’పాటను బాలు తో కలిసిపాడాడు

73 ఏళ్ళలలిత సంగీత  మధురమోహన రాజు ‘’నింగి లోని కలువ కోసం  నింగికే ఎగసి పోయాడు ‘’ ఆ లోటు తీర్చలేనిది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-3-18 –ఉయ్యూరు

 

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

8-౩-18 ఆదివారం ఉదయం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

8-౩-18 ఆదివారం ఉదయం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

 

https://photos.google.com/share/AF1QipO_jpXm4ZQv3EvU7yFsCCQQLx6HPkNGP7i4uwXNhi3feaygjQT1cdx8UFB20LAP6Q/photo/AF1QipNIr_f_ZuvWiHibrrRXKJa97LHpzFHHcELIgFu2?key=aERKYzNiR09GVGEzTm5yVzJyclhSakI1LWUwc2d3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

18-3-18 సాయంత్రం 6-30 కు గండిగుంట దత్త గుడిలో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

18-3-18 సాయంత్రం 6-30 కు గండిగుంట దత్త గుడిలో శ్రీ

విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

 

https://photos.google.com/share/AF1QipOyABLN446v167xqde4Fz3T9YcIohp0oC0WudiUMESJe5nKDdKS-uc2EIcNaOnvdQ?key=cV9YUWZmQjBDQWhidHpXdXp3VnVEYl81cmF3UmF3

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి షార్లెట్ విళంబి ఉగాది వేదిక 

సరసభారతి షార్లెట్ విళంబి ఉగాది వేదిక
18-మార్చి-2018
17.45: దీపారాధన/ ప్రార్థనా శ్లోకాలు మరియు భజనలు (పిల్లలు)
18.00: వేద పారాయణ
18.15: పంచాంగ శ్రవణం
19.00: శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారి విళంబి ఉగాది కానుక – “షార్లెట్ సాహితీ మైత్రీ బంధం” పుస్తక ఆవిష్కరణ
19.15: భజన్ / హారతి
19.30: విందు (సామూహిక  సహకారంతో)
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం

సాహితీ బంధువులకు శ్రీ విళంబి ఉగాది శుభాకాంక్షలు -గత 14 ఏళ్లుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సరసభారతి కి ఇచ్చిన ప్రోత్సాహం ,హార్దిక ,ఆర్ధిక సహకారం ఎన్నటికీ మరచి పోలేనివి .దీనికి సరసభారతి సర్వదా కృతజ్ఞతా గా ఉంటుంది . గత డిసెంబర్ లో సరసభారతి ప్రచురించిన ”గ్రంథ ద్వయం ”కు వారి భారీ ఆర్ధిక భారం అత్యధికమైనది . ఎక్కడ మేము డబ్బుకు ఇబ్బంది పడతామో నని కంగారు పడుతూ నాకూ శ్రీ చలపాక ప్రకాష్ గారికి అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు పంపారు . ఎప్పటికప్పుడు ఈ పధ్నాలు గేళ్లుగా  మేమిద్దరం  వారికి లెక్కలు తెలియ జేస్తూనే ఉన్నాం .వారు సంతోషిస్తూనే ఉన్నారు .  . 

  గ్రంథద్వయం  రేపల్లె లో ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ  ఖర్చు కూడా మైనేని గారే ఆనందంగా భరించారు . మైనేని దంపతుల   వయోభారం ఆరోగ్య సమస్యలు తో కొంత కలత చెంది ,జన జీవితం నుంచి దూరం అవ్వాలని భావించి ఆ విషయం మాకు తెలియ జేసి,వారు అధికంగా పంపిన డబ్బులో   మా వద్ద నిల్వ ఉన్న దానిని సరసభారతి కార్యక్రమాలకు ,శ్రీ సువర్చలాంజనేయ స్వామి సేవలకు వినియోగించవలసినదిగా కోరారు ..సంతోషం గా అంగీకరించాము  . ఖర్చులు పోను నా దగ్గర ఉన్న వారి డబ్బు రూ 19 ,300 ,మరియు శ్రీ చలపాక ప్రకాష్ గారి వద్ద నిల్వ ఉన్నడబ్బురూ  16 ,102 నాకే పంపగా, కలిసి మొత్తం ఈ  నాటికి రూ 35 ,402 ఉన్నది   దీన్ని సార్ధకం చేయాలన్న తలంపుతో ఈ మొత్తానికి రూ 14 ,598  జత చేసి మొత్తం రూ  50 000 చేసి శ్రీ మైనేని దంపతుల కానుకగా  ఈ రోజే  అంటే ఉగాది కి ముందు రోజే ,3 సంవత్సరాలకు ఫిక్సెడ్ డిపాజిట్ చేశాను  దీనిపై వచ్చే వడ్డీ తో సరసభారతి ,నిర్వహించే కార్యక్రమాలకు  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి సేవలకు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో వినియోగిస్తామని తెలియ జేస్తున్నాను .వారిద్దరూ నాపై ఉంచిన విశ్వాసానికి ,నమ్మకానికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు .తెలుపు కుంటున్నాను .ఈ డబ్బును శ్రీ మైనేని దంపతుల శ్రీ విళంబి ఉగాది కానుకగా అందరం భావిద్దాం -దుర్గా ప్రసాద్ 
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సాహితీ బంధువులకు 18-3-18 ఆదివారం శ్రీ విళంబి ఉగాది శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్

సాహితీ బంధువులకు 18-3-18 ఆదివారం శ్రీ విళంబి ఉగాది శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మొవ్వ లో 17-3-18 శనివారం ఉగాది కార్యక్రమం

మొవ్వ లో 17-3-18 శనివారం ఉగాది కార్యక్రమం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి  

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి  

నటనలో వెలుగులు జీవిత చరమాంకం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి

సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం తక్కువే అన్న విషయం చాలా సందర్భాలలో చాలా మంది విషయం లో రుజువైన కఠోర సత్యం . తమ వైదుష్యం తో అనేక అవార్డులు ,రివార్డులు అందుకున్నా జీవిత సాయం వేళ కస్టాలు అనుభ వించిన వారు మనకు తెలుసు  .సరైన దృక్పధం గమ్యం లేక  అప్పులపాలై గర్భ దరిద్రం అను భవించారుకొందరు . .మరి కొందరు ఎవరికీ తీసిపోని విధంగా ధన సంపాదన చేసి ,చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి చేతిలో చిల్లి గవ్వలేకుండా ,అంత్యదశలో పరాధీనం పాలై అతీ గతీ కనుక్కునే వారే లేకుండా ఈలోకం నుంచి నిష్క్రమించారు .బ్రతికున్నప్పుడు వారిని అంటకాగి,దండుకున్న ,పిండుకున్నవారే చివర్లో ముఖం కూడా చూపించలేదని ఎందరెందరి జీవితాలలోనో మనకు కనిపించిన సత్యం .విధి బలీయం అని సరిపెట్టుకోవటమే తప్ప ఎవరూ ఏమీచేయలేరు .కవులు రచయితలూ దీనికి మినహాయింపు కాదు .ముఖ్యంగా రంగస్థల, చలన చిత్ర నటీ నటుల విషయం లో మనకందరికీ తెలిసిన నిష్టుర సత్యాలే ఇవన్నీ.  .

శ్రీ గబ్బిట బాల సుందర శాస్త్రి 1895 జులై 2న కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ గబ్బిట గురునాధం శ్రీమతి వేదాంతి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .25 ఏళ్ళ వయసులో 1920 లో గాంధీజీ పిలుపు అందుకుని   చదువుతున్న బి .ఏ .డిగ్రీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉత్సాహం ఉరకలు వేసి భారత స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నారు .తర్వాత ఆయన దృష్టి నాటక కళపై పడింది .బందరు అంటే ఆనాడు నాటకాలకు పోతుగడ్డ .ఆ ప్రభావం తో నాటకాలు ఆడారు .బందరు లోని ‘’ఇండియన్ డ్రమటిక్ కంపెనీ ‘’లో చేరి ముఖ్య పాత్ర ధారిగా రాణించి ప్రశంసలు అందుకున్నారు .నటులకు తమ విశేష నటనానుభవం తో క్రమశిక్షణతో  శిక్షణ నిచ్చి ఎందరెందరినో ఉత్తమ నటులుగా తీర్చి దిద్దారు  .దీనితో పాటు ఆధ్యాత్మిక చింతనా బలీయమైంది .కనుక జీవన విధానం లో ఎక్కడా తప్పటడుగులు పడలేదు .సవ్యంగా జీవితం, నట జీవితం  సాగి పోయాయి .  గబ్బిట శాస్త్రి గారు నాటకాలలో చిరస్మరణీయ పాత్రలు ధరించి కీర్తి సాధించారు .సత్య హరిశ్చంద్ర నాటకం లో విశ్వామిత్ర పాత్ర లో వారి నటనా వైదుష్యం చిరస్మరణీయం అంటారు .ఆంగ్లనాటకం ‘’ఒథెల్లో’’లో చక్కని వాచికం అభినయం తో అచ్చంగా ఆంగ్ల నటుడు నటించినట్లు నటించి సుభాష్ అని పించుకున్నారట .పౌరాణిక నాటకాలలో ధర్మరాజు ,దుర్యోధనుడు ,కంసుడు ,ఆంజనేయుడు ,సుదర్శన చక్రవర్తి ,కలి,సుదేవుడు గా పాత్రలు ధరించి మెప్పించారు .చారిత్రాత్మక నాటకాల లో రామరాజు ,ఔరంగ జేబు ,పెద్దన గా నటించారు .సా౦ఘిక నాటకాలలో గిరీశం ,శతమిత్రుడు ,స్వామి నాధం వంటి పాత్రలలో జీవించారు .పాత్రలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి .వచ్చినవాటికి తన నటనా వైదుష్యం తో న్యాయం చేకూర్చి చిరకీర్తి నార్జించారు .నాటక రంగానికి యెనలేని సేవలు అందించి తాను వెలిగి, నాటక రంగానికీ వెలుగులు అందజేశారు .

కాని విధి అనుకూలించలేదు .పుష్కలంగా ధనం కీర్తి  ప్రతిస్టలతో వెలిగిన గబ్బిట బాల సుందర శాస్త్రిగారి జీవితం వార్ధక్యం లో ఒడి దుడుకులకు లోనై చేతిలో చిల్లిగవ్వకూడాలేని పరిస్థితి కలిగి గర్భ దరిద్రం తో చీకటిలో కూరుకు పోయారు .అలసి సొలసి అలమటించి 66 ఏళ్ళ వయసులోనే 1961 జులై నెల రెండవ తేదీ కన్ను మూశారు .  ఒక నట నక్షత్రం రాలిపోయింది .

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -15-3-18 –ఉయ్యూరు    .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ చండ్ర ప్రసాద్

శ్రీ చండ్ర ప్రసాద్
14-3-18 బుధవారం సాయంత్రం మా ఇంట్లో -ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు స్వర్గీయ చండ్ర రాజేశ్వర రావు గారి తమ్ముడు శ్రీ చండ్ర ప్రసాద్ గారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్

శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం

12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం

 

https://photos.google.com/share/AF1QipMHxBQjpKvVKpEerkaRILrF6sJCy3U7gAxcPT65TLF2tgnP-MxdoCgFA15J5kkQqQ?key=dkNIZEg3VzRHRzk2MW8yZG1IckJpV3BoQTkzcmRB

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-౩-18 ఆదివారం సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకల చిత్రోత్సవం

11-౩-18 ఆదివారం సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకల చిత్రోత్సవం

https://www.google.com/url?hl=en&q=https://photos.google.com/share/AF1QipNcy2GpF5BrV3sgf6JDnbOAkRtRnTmxAidqfrzNiRVpks7vS-4k_ewdnI3mNm49tA?key%3DaXhVUGVKRmxFUlBkdGoyanVWTzFsamxUYmc5RWhR&source=gmail&ust=1520912219736000&usg=AFQjCNHvfKEMWmHUJ2-eFtRl9fPB0IGvXQ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం

వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

విష్ణు కుండిన రాజ వంశీకులు క్రీ.శ.358 నుండి 624 వరకు ఆంద్ర దేశాన్ని పాలించారు .అమరావతి బెజవాడలు వీరి రాజధానులు .ఈ వంశం లో నాలుగవ మాధవ వర్మ మహారాజు క్రీ.శ. 580-620 వరకు పాలించాడు .కవిజనులకు ఆశ్రయమైన వాడుకనుక ‘’జనాశ్రయుడు ‘’అనే బిరుదు పొందాడు . మూడువందల ఏళ్ళ తర్వాత పాలించిన ,కవిజనాశ్రయం అనే లక్షణ గ్రంథాన్ని రాసిన మల్లియ రేచనకు కూడా  ‘’కవి జనాశ్రయుడు ‘’అనే బిరుదు ఉన్నది .ఇతడు మయూర ధ్వజుడు .హిందూ మతాన్ని వదలి బౌద్ధాన్ని స్వీకరించాడు .మాధవవర్మ మహారాజు ‘’జానాశ్రయీ ‘’అనే ఛందో గ్రంథం రచించాడు .రాజు బిరుదు పేరనే ఈ గ్రంధం ప్రాచుర్యం పొందింది .అంతే కాదు తెలంగాణలో సంస్కృతం లో వచ్చిన మొట్ట మొదటి ఛందో గ్రంథం గా గుర్తింపు పొందింది .

  మాధవవర్మ సమకాలీన బౌద్ధ  కవి గుణస్వామి దీనికి ‘’ఛందో విచితిః’’అనే  వ్యాఖ్యానం రాస్తూ ‘’అధాతః ఛందో వృత్త జాతీనాం తత్వ జిజ్ఞాసవే పౌరాణికేషు పై౦గలాదిచందోవిచితిషు  యధా సంభవం న్యూనాతిరేకం పరీక్ష్య పరి హృత్య తద్దోష పరి హృతామి మా ప్రపంచామ నాకులం జనాశ్రయీం ఛందో విచితం గుణ స్వామి రచిత వ్యాఖ్యానం వ్యాఖ్యాసామః ‘’అని చెప్పాడు . మూలం లోని వివిధ లక్షణ సూత్రాలకు రాసిన వ్యాఖ్యలలో రఘు వంశ, కుమార సంభవ ,జానకీ హరణ ,సౌ౦దరనంద , నాట్య శాస్త్ర ,మేఘదూత  ఉభాయాభిసారికా  బుద్ధచరిత,శాకుంతలం ల నుండి ,పాండ్యునిశ్లోకాలను లక్ష్యాలుగా ఉదాహరించాడు .ఇందులో బౌద్ధ గ్రంధాలే ఎక్కువ అన్న సంగతి మనకు తెలుసు .

  జానాశ్రయీ గ్రంధం లో 6 అధ్యాయాలు –పారి భాషిక ,విషమ వృత్త ,అర్ధ సమవృత్త ,సమవృత్త ,జాత్య ,ప్రిక్రియాధ్యాలున్నాయి   మొదటి దానిలో 46, రెండు లో 27  ,మూడులో 15 ,నాలుగులో 118,అయిదులో 66 ,చివరి దానిలో 28 సూత్రాలు –మొత్తం 300 సూత్రాలున్నాయి .మొదటి అధ్యాయం లో గణ సంఖ్యలు చెప్పాడు వీటిలో రెండక్షర గణాలనుంచి ఆరు అక్షర గణాలవరకు సూచించాడు .పింగళ చందం కంటే దీనిలో లక్షణం క్లుప్తంగా లక్షణంగా ఉందని విమర్శకులు మెచ్చారు .మొత్తం 18 రకాల గణాలు చెప్పాడు .పింగలం లోనివి కూడా కొన్ని ఇందులో ఉన్నాయి .నందినీ, రత్న మంజూష  వృత్త పాదాల విషయం లో ఇద్దరికీ భేదం కనిపిస్తుంది .

  విషమ వృత్తాధ్యాయం లో సమాన ,ప్రమాణ ,కీర్తి వితాన ,ఉద్గాతా ,సౌరభక అల్లలిత ,ఉపస్థిత ,ప్రచుపిత ,వర్ధమాన  శుద్ధ విరాద్రుషభ,మంజరీ ,లవలీ ,అమృత ధారా ,ప్రత్యాపీడ,పద్యా విపరీతి పద్యా చపల ,విపుల మొదలైన విషమ వృత్త వివరణ ఉంది .అర్ధ సమ వృత్తాధ్యాయంలో ఉపచిత్రకం ,ద్రుత మధ్యా ,భద్ర విరాట్ ,కేతుమతీ ,ఆఖ్యానికా ,విపరీతాఖ్యానికా హరిణ ,ప్లుతా ,అపర వక్త్రా ,పుష్పితాగ్రా ,యవవతీ ,దేవ గీతికా ,శిఖా మొదలైన అర్ధ సమ వృత్త లక్షణ లక్ష్యాలు చెప్పబడినాయి .నాలుగవది అయిన సమా వృత్తాధ్యాయం లో ఉక్తమొదలు ఉధృతి వరకు గల 26 ఛందాలలో కొన్ని పద్యాలకు లక్షణాలు చెప్పాడు .ఇవికాక దండకాలలో  భేదాలూ తెలియ జేశాడు మేఘ ,పిపీలికా ,ప్రణవ ,కరభ  లలిత అనే అయిదు దండక లక్షణాలను  జలద ,చందా వృష్టి ,ప్రయాత దండక భేదాల లక్షణాలు వివరించాడు  .పింగాళ వృత్తాలకు దీనికీ కొంత తేడా కనిపిస్తుంది .

 జాత్యాధ్యాం లో జాతి ఉపజాతి పద్య లక్షణాలు చెప్పాడు .ఇవి తెలుగు జాతి ఉపజాతులకు దగ్గరలో ఉన్నాయి .గద్య ,పద్యాల గణ యతి ప్రాస నియమాలు  తెలిపాడు ‘’శీర్షిక ‘’అనే పద్యం ఏడు రకాలనీ ,చివరలో ‘’గతం ‘’పద్యం ఉండాలని నిబంధన చెప్పాడు ఇది తెలుగు సీసపద్యానికి దగ్గర .కనుక విష్ణు కుండినుల కాలం లోనే తెలంగాణా లో తెలుగు పద్య రచన ఉన్నట్లు అర్ధమవుతోంది .చివరిదైన ప్రక్రియాధ్యాయం లో ప్రస్తారం ,నష్ట లబ్ది ,ఉద్దిస్టం ,సంఖ్యా లగ క్రియ ,అద్వం ల వివరణ ఉన్నది .

  ఇంతటి ప్రసిద్ధ తొలిసంస్కృత ఛందో గ్రంధం తెలంగాణలో  వెలువడినందుకు మనకు గర్వం గా ఉన్నా కవుల సాహిత్య చరిత్రలో ‘’జనాశ్రయీ ‘’ గురించి కాని గ్రంథ కర్త జానాశ్రయ బిరుదాంకిత నాలుగవ మాధవవర్మ మహా రాజు గురించి కాని విషయాలు విశేషం గా లేవు . అంతేకాదు దీని  వ్యాఖ్యానం ‘’జానాశ్రాయీ ఛందో విచితిహ్ ‘’ గురించీ ,రాసిన గుణస్వామి గూర్చికాని వివరాలు లభించకపోవటం దురదృష్టం .బహుశా బౌద్ద  కవులు  కర్తలు అవటం వలన మనవాళ్ళు పక్కకి నేట్టేశారేమో !

  ఆధారం –2018 మార్చి ‘’మూసీ ‘’మాసపత్రికలో శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు రచించిన ‘’తెలంగాణా నుండి సంస్కృతం లో వెలువడిన ప్రప్రధమ ఛందో గ్రంథం-‘’జానాశ్రాయీ ‘’

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వేదసభలు వాయిదా 

వేదసభలు వాయిదా

సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో ఏప్రిల్ చివరి వారం లో నిర్వహించాలనుకున్న  ”వేద శాస్త్ర సభలను” ప్రస్తుత పరిస్థితుల ననుసరించి డా శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రై గారితో ఈ రోజు చర్చించి వాయిదా వేయాలని ,.అందరకు  అనుకూలమైన సమయం లో నిర్వహించాలని నేడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సభ లో నిర్ణయం చేసి ప్రకటించామని అందరికి తెలియ  జేస్తున్నాను -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

https://photos.google.com/share/AF1QipPFpH1Vsled5LOT3DAFKBxcOGG0KjPD4lMBCIedJS8Adax4ve9gCLPoiAjIwa2ejA?key=aldmSXY3czktVXNkTkZsbGJoYjhSdmZ4eDY0TDBB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్

1-బాల్య నైన్ద్యాన్ని ఎదిరించిన యూన్ మీరే.

ఆఫ్రికన్ అమెరికన్ తండ్రికి, కొరియన్ తల్లికి జన్మించిన గాయకు రాలుయూన్ మీరే . సుహృద్భావ వాతావరణం  నెలకొని ఉన్న దక్షిణ కొరియాలో క్రమంగా జాత్యహంకారం  వర్ణ విచక్షత పెరగటం సహించ లేక పోయింది .’’హిప్ హాప్’’ అనే ‘’రాప్ సంగీత ఉద్యమం’’ ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్న సమయం లో ఈమె త్వరగా అవగాహన పెంచుకుని ఉద్యమనేతగా ఎదిగి దక్షిణ కొరియా  రాప్ సంగీత గాయకు రాలిగా ప్రసిద్ధి పొందింది .తన గానం తో సకల సంస్కృతీ వికాస యువ సభలలో స్వచ్చందంగా పాల్గొంటూ వోగ్ కొరియా స్టాప్ అండ్ లవ్ ఉద్యమనాయకు రాలుగా పెరిగింది  .బాల్య నైన్ద్యా న్ని అన్ని స్థాయిలలోనూ ఎదిర్చింది .బాల్య నింద వ్యతిరేక ఉద్యమం లో భర్త టైగర్ జేకే తోకలిసి పాల్గొని మంచి ఊపు తెచ్చింది .అనేక సంస్థలు ,సంఘాలను కూడా బాల్య నింద వ్యతి రేక ఉద్యమం లో పాల్గోనేట్లు చేసి వారి పట్ల సానుభూతి  కలిగించి  ఆదుకునేట్లు చేయగలిగింది .ముఖ్యంగా దక్షిణ కొరియా ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ కళ్ళు తెరిపించి బాల్యానికి హాని కలుగ కుండా చర్యలు తీసుకునేట్లు చేసిన మానవీయ మూర్తి యూన్ మీరే .

బాల్య నైన్ద్య౦ చాలారకాలు .దంపతులు సత్సంతానాన్ని పొందాలి పిల్లలను అభి వృద్ధి లోకి తేవాలి .దక్షిణ కొరియాలో కుటుంబం లోని కొడుకు అప్రయోజకుడైతే తండ్రి వాడిని చంపేసేవాడు .ఎవరికీ తెలియ కుండా పాతిపెట్టె వాడు .తల్లి కూడా కూతురుపై మమకారం తో కొడుకును చులకనగా చూసేది .తలిదండ్రులు బతికి ఉన్నంతవరకు పిల్లలకు స్వేచ్చ ఉండేదికాదు .బానిసల లాగానే బతికే వారు .తప్పు చేస్తే చావు దెబ్బలే. అంటే చచ్చే దాకా కొట్టటమే .కారుణ్య కటాక్షాలు కుటుంబాలలో ఉండేవి కావన్నమాట .సానుభూతి ,సహవేదన అక్కడ నిఘంటువులలో కూడా దొరికేవి కావు .వీటినుంచి బాల్యాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న సానుభూతి పరురాలు సాహసురాలు సంగీత నిధి మియాన్ మీరే .

2-కొరియా లో అతి ప్రాచీన అబ్జర్వేటరీ నెలకొల్పిన  రాణి –క్వీన్ సియోన్ డియోక్

దక్షిణ కొరియాను పాలించిన వారిలో పురుషులే చాలా ఎక్కువ . మహిళలు పాలించింది చాలా తక్కువ కాలమే .క్రీ.పూ 5 7 నుంచి క్రీశ.9 35 వరకు సెల్లియా యుగం లో మాత్రమె రాణుల పాలన ఉన్నది .ఆకాలం లో ప్రసిద్ధి చెందిన రాణి క్వీన్ సియోన్ డియోక్ క్రీ.ష 632 నుంచి 64 7 వరకు పాలించి అనేక ప్రత్యేకతలు సాధించి చరిత్రలో ఘనం గా నిల్చి పోయింది శక్తి సామర్ధ్యాలతో పాటు ప్రజా రంజకమైన పరిపాలనకు ఈ నాటికీ ఆమెను గుర్తుంచు కుంటారు .విద్యార్ధులను చైనాలో చదువుకోవటానికి అన్ని రకాల అవకాశాలు కల్పింఛి విద్యా వ్యాప్తి చేసిన ప్రాతస్మరణీయురాలు .పున్ష్ వాంగ్ ,యాంగ్ మియో దేవాలయ నిర్మాణం లో ఆమె కనబరచిన  ఔదార్యం దాతృత్వం ,తపన వంనేకేక్కాయి .వీటి నిర్మాణం తో కొరియాలో బౌద్ధమత వ్యాప్తికి పెద్ద అవకాశాలు కలిగాయి .ఆసియా లోనే అతి ప్రాచీన అబ్జర్వేటరీ ‘’’’చెయోసి మొంగ్డే ‘’జియాంగ్ జు లో ఏర్పడటానికి చక్కగా పర్యవేక్షణ చేసింది .

3-సర్వ కళా వల్లభి, శాకాహారి –లీ హియోరి

దక్షిణ కొరియాలో అందరి ఆహారం మాంసం అయితే ,స్వచ్చందంగా మాంసాహారం విసర్జించి శాకాహారిగా జీవిస్తూ అందరిని అవాక్కు చేస్తున్నది లీ హియోరి .ఆవిడ ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుని శాకాహారిగా ఉందా అంటే అదేమీ లేదు –ఆమె మహా గాయకురాలు నటి ,నిర్మాత ,క్రియా శీలి ,టెలివిజన్  ప్రేజెంటర్ .అందుకే ఆమెను ‘’ఫెయిర్ లేడీ ‘’అంటారు అభిమానంగా .19 9 8 లోగాయనిగా కెపాప్ గర్ల్ గ్రూప్ లో చేరి క్రమగా ఎదిగి అనేక సంగీత ఆల్బం పాడి లను విడుదల చేసింది .20 06 లో దక్షిణ కొరియా గాయకులలో అత్యంత ఎక్కువ పారి తోశికం తీసుకునే గాయనిగా రికార్డ్ సృష్టించింది .

శాకాహార జీవనానికి అలవాటు పడిన సుప్రసిద్ధ గాయని లీ హియోరి వన్య మృగ సంరక్షణకు,వాటి హక్కుల పరిరక్షణకు  దీక్ష పట్టి కృషి చేస్తోంది .20 12 లో ‘’క్లోజర్ ‘’అనే ఫోటో బుక్ ను విడుదల చేసింది అందులో తన గురించి కుటుంబం  నిరాశ్రయురాలైన కుక్కకు ఆశ్రయంకల్పించి పెంచుకుంటున్న  తన పెంపుడు కుక్క మొదలైన అరుదైన ఫోటోలు ఇందులో చూడవచ్చు .

4-కొరియా స్వాతంత్రోద్యమ నాయకురాలు –యు గ్వాన్సన్.

కొరియాలో జపాన్ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన మార్చ్ ఫస్ట్ ఉద్యమాన్ని  సర్వ సమర్ధంగా ముందుకు నడిపించిన దైర్య సాహసోపేతురాలు యు గ్వాన్సన్.దేశ స్వాతంత్ర్యం కోసం అహింసాయుత ప్రజా ఉద్యమం నడిపిన దీరురాలామే .అందుకే ఆమెను ‘’కొరియా జోనాఫ్ ఆర్క్ ‘’అంటారు .17 ఏళ్ళ వయసులో జపాన్ కు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఆ వీర ధీర శోర్య యువతిని 19 19 లో జపాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆమె తల్లిదండ్రులు ఈ ఉద్యమం లో అసువులు బాశారు ఏడేళ్ళ కారాగార వాసం లో పోలీసుల విచాక్షణారహిత దెబ్బలు అనేక శారీరక మానసిక క్షోభానూ అనుభవించింది  దేశ స్వతంత్రం కోసం  .18 వ ఏట ఆ రాక్షసత్వానికి బలై మరణించిన త్యాగ శీలి .మరణా నంతరం యు గ్వాన్సన్ కు ‘’ఆర్డర్ ఆఫ్ ఇండిపెండెన్స్ మెరిట్ ‘’ను 196 2 లో ప్రదానం చేసి గౌరవించారు .

5-కొరియన్ అగ్రగామి మహిళా రిపోర్టర్-కిమ్ యంగ్ మి

కొరియా దేశ మహిళా రిపోర్టర్ లలో అగ్రగామి కిం యంగ్ మి .ఇండిపెండెంట్ డాక్యుమెంటరి డైరెక్టర్ గా సుప్రసిద్దురాలు .రిపోర్టర్ లలో మగ మహా రాజులదే హవా గా ఉన్నకాలం లో తన సృజన ,ప్రాతిభ ,ముందు చూపు ,ప్రగతి షీలా భావాలతో ధైర్యం గా ముందుకు దూసుకు వెళ్లి చరిత్ర సృష్టించి తనకంటూ ఒఅ ప్రత్యెక స్థానాన్ని సాధించింది మి .’’మి ‘’అంటే నేనూ ఉన్నాను మీతో పాటు ,ఇంకొంచెం ఎక్కువగా అని రుజువు చేసింది స్మీ ‘’మీ’’.80 దేశాలలో పర్యటించి ,అందులో ముఖ్యంగా కల్లోల పరిస్తితులలో ఉన్న  సిరియా ,ఆఫ్గనిస్తాన్ ,ఇరాక్ దేశాలలో అక్కడి ఇస్లామిక్ స్టేట్  గురించి సమగ్ర సమాచారం తెలుసుకుని ప్రచురించింది .కాఫీ వాణిజ్యం, ఈస్ట్ టిమర్ మొదలైన వాటిపై సమగ్ర డాక్యు మెంతరీలు తీసి అనేక విషయాలను వెలుగు లోకి తెచ్చింది .ఆమె కృషికి తగిన ప్రతిఫలం అవార్డ్ ళ రూపేణ పొందింది .అందులో ఎం బి సి బ్రాడ్ కాస్ట్ హై అచీవ్ మెంట్ అవార్డ్ ,వై ఎంసి ఏ కొరియా వుమెన్ లీడర్షిప్ అవార్డ్ ముఖ్యమైనవి .

–  గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

డా మక్కెన శ్రీను గారు పశు వైద్యశస్త్ర  శిఖామణి .అసోసియేట్ ప్రొఫెసర్,ప్రొఫెసర్  గా సుదీర్ఘ అనుభవమున్నవారు .ఆ వృత్తిలో ఉన్నా ,సరళ హృదయులు .సున్నిత మనస్కులు ప్రపంచ పోకడ కని పెట్టె సూక్ష్మ పరిశీలకులు .మనసులోని భావాలను కాగితం పై అందంగా హృద్య౦గా  చెప్పే నేర్పున్నవారు .కవితలతో హృదయాలను కదిలించి ఆలోచింప జేస్తారు .వ్యవసాయ నేపధ్యం నుంచి వచ్చిన వారు కనుక మట్టి వాసన గుబాళించే కవితలెన్నో రాశారు .చిద్రమైపోతున్న రైతన్నల బతుకులను ఇప్పటికే చక్కగా చిత్రించారు .వారి పుస్తకాలు నిరుడు నాకు పంపటం దానిపై నేను స్పందించి రాయటం మీకు తెలిసిన విషయమే .ఇవాళ అకస్మాత్తుగా ఉరుము ఉరమకుండా మెరుపు మెరవకుండా వారు పంపిన ‘’మౌన సవ్వడి ‘’నాదరికి చేరింది .కమ్మని కవిత్వానికి కేరాఫ్ మక్కెనగారు కనుక వెంటనే చదివేసి ,అందులోని నాకు అర్ధమైన విషయాలు మీకు తెలియ జేస్తున్నా ‘.

సమకాలీన సమస్యలను స్పృసించి రాసిన 36 కవితల సమాహారమే’’ మౌనసవ్వడి’’..ఈ సవ్వడి ఎప్పుడు వస్తుందో ఆయనే కవితగా తెలియజేశారు –‘’సమాజం లో ప్రశ్నించే అవకాశం లేక ,-గొంతులు మూగ పోయినపుడు –నిరంతరం శబ్దించే గుండె –మౌనం గానే సవ్వడి చేస్తుంది ‘’అనేదే తన ఈ పుస్తకానికి ప్రేరణ  అన్నారు .పాపాయిముందు పలకా బలపం నగానట్రా పెట్టి పట్టుకోమంటే ఈ శతాబ్ది ముదుళ్ళు’’చరవాణి’’నిముద్దాడితే రేపటి ప్రపంచ తీరు ఇదే అని ‘’గిలక్కాయ అవాక్కైంది’’అన్నారు .’’రేటు’’పుష్కలంగా ఉండే కార్పోరేట్ కాలేజి   కుర్రోళ్ళ ప్రపంచీకరణ భజన లో ‘’తెంగ్లీష్ యువత ‘’చిందు లేస్తున్నందుకు వాపోయారు .నూత్న వత్సరం లోనూ ‘’మొలకెత్తని ఆశల విత్తనాల ‘’ను చూసి పెదవి విరిచారు .వెళ్ళే ఏడాదిని ‘’స్వ’’గత ‘’మన్నారు .తెలుగు గడ్డ రెండు ముక్కలైనందుకు తల్లడిల్లవద్దని తెలుగు తల్లిని వేడుకొని ,’’నీ జెండా రెపరెపలు ధరిత్రి నిండా ఎగిరేలా ‘’శ్రమిస్తామని ప్రతిన చేశారు .

బాపు బొమ్మను గురించి బాపురేగా ‘’సత్తి రాజు కుంచె ఆడితే తాండవమే –నటరాజు నర్తించు కుంచె యందే’’అని ఇంతవరకు ఎవరూ చెప్పని కవిత చెప్పారు .’’బాపు గీసిన గీతలు తెలుగు భాగ్య రేఖలు’’అని గొప్ప నిర్వచనం చేశారు .మరో అడుగు ముందుకు వెళ్లి ‘’తెలుగు వాడి గుండెల్లో రామాలయం నీవు ‘’అన్నారు .ఎవడో ఒకడు వచ్చి మార్పు సూచీ  మార్గ దర్శీ ‘’కావాలని కోరుకున్నారు .జీవితపు నడక అలుపు సొలుపు లేకుండా సహనం తో ,గెలుపే గమ్యంగా సాగాలని హితవు చెప్పారు .పండే భూమిని అమ్ముకుంటే అమ్మను కోల్పోయినట్లే అన్నారు .చివరికి ఏమీ చేయలేక వైరాగ్యమావహించి ‘’మానవాళి మనుగడకు కొవ్వొత్తి నవుతా –సస్య సన్యాసిలా –జీవశ్చవం లా జీవిస్తా ‘’నంటారు పాపం .ఆశ ఆరిపోక ‘’ఎన్నడో సాలు దీవెన –రైతు వాసన? ‘’ఎదురు చూస్తున్నట్లుగా అన్నారు .

ప్రయోగ శాలలు, పరిశోధనలు విరివిగా ఉన్నా వాటి ఫలితాలు ‘’ప్రగతి కాముక క్షేత్రానికందేనా””?అని ప్రశ్నించి ‘’’’నేటి సమాజ జన దైన్యాన్ని  ‘’అనవసర అజ గళ స్తన్యం ‘’తో పోల్చారు . గొప్ప పోలిక ఇది .’’ప్రతిభ ఉన్నోడే లోకాన స్వయం ప్రకాశం ‘’అని ప్రతిభను ప్రోత్సహిస్తేనే ప్రగతి ,సుగతి  అని చెప్పారు . .’’చక్రభ్రమణం లో జాతి సంస్కృతీ సంప్రదాయం వారసత్వమై’’సృష్టికి అను వంశికం అవుతుందని జెనెటిక్స్ సూత్రంగా చెప్పారు .నేడు మనిషికి ఉన్నఅత్యల్ప  విలువను ‘’మనిషితనం నేడు వాడి పారేసిన కాగితం ‘’అన్నారు..’’చులకన జలరుహ తంతువు చులకన దూదికణము ‘’అని అనంతామాత్యుని ఆవు దూడకు బోధించిన నీతి గుర్తొస్తుంది .

ఎందుకింత శోధన వేదనా అని అడుగుతారేమోనని తానె ప్రశ్నించుకుని సమాధానంగా ‘’నాకు లేదిక్కడ శాశ్వత చిరునామా –నాకు నేను చెబుతున్నా ఇది నా వీలునామా ‘’ అంటూ’’ విల్లు’’ రాసి  మనమోహాన కొట్టినట్లు గా కొట్టి ‘’బుద్ధిగా బతకండి బుద్ధుడిగా మారండి ‘’అన్నారు శ్రీను గారు .మనిషి అస్తిత్వం పై రాస్తూ ‘’నేను నేనుగా లేనప్పుడు –పత్రాల్లోకెక్కా-అక్కడే ప్రశ్నకు గుర్తింపుగా ఉన్నా ‘’అన్నారు కృష్ణ శాస్త్రి లా.

‘’కర్షకుని చరిత్ర అముద్రిత పత్రం ‘’అయిందే  ‘’అని వ్యధ చెందిన రైతుకవి డా మక్కెన. ఆల్కహాలిక్ కాలం లో  శల్య  ,హృదయ గతమైన ‘’హాలికత్వం ‘’శ్రీనుగారిని ఎన్నడూ విడిచి ఉండలేదు .సస్యోపనిషత్ గా ‘’జలానికి జత కూడి విత్తన ఉద్దీపనం –విత్తన వృద్ధితో ఆహార ధాన్య అవతరణం –ఆహార శక్తితో పరిపుస్ట మనిషి జననం –జనన మరణ నిక్కచ్చి  సత్యాంకురం-నమ్మకం లేని జననం ధరిత్రి తిరస్కృతం  ‘’అని చెబుతూనే ‘’యుజేనిక్స్’’ను కూడా మిశ్రమం చేశారు .ఆయనను  ‘’కలుపు తీయాలా ?ఆకలికడుపులు నింపాలా’?అన్న ప్రశ్న  వేధిస్తోంది ’ –ఆయనే తనకు తాను భూమిని చూసి సమాధానం చెప్పుకున్నారు ‘’క్షమయా ధరిత్రీ ‘’అనేది తనకే కాదు అందరికీ ఆదర్శం అన్నట్లు తెలియ జేశారు .

మంచిభావానాలు ,సమకాలీన చైతన్యం ,మనిషి హృదయం విస్తరిల్లటం లేదనే బాధ ,రైతు గతి ఇంతే అన్న ఆరాటం మక్కెనవారి కవిత్వానికి ప్రాతిపదిక .చక్కని పదాలతో అనవసర్ ఆర్భాటాలు లేని సూటి కవిత్వం తో మనకు చేరువౌతారు శ్రీనుగారు  .వారి మనసు సవ్వడి లో నాకు వినిపించిన కనిపించినదానిలో కొద్దో గొప్పో మాత్రమె చెప్పాను .మిగిలినకవితలు చదివి అనుభవించమని కోరుతున్నా .మరిన్ని కవితా సంపుటాలు వెలువరించాలని కోరుతున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-18 ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

త్రిపుర సంహారం 

    త్రిపుర సంహారం

పాతికేళ్ల నుంచి పట్టుకు కూచున్న కమ్మీ పార్టీ డమ్మీ అయి, హస్తం పార్టీ భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొంటే , ఈశాన్య రాష్ట్రాలలో వీరికి ”త్రిపుర సంహారం ”చేసింది మెత్తని సహస్ర దళ కమలం . ”సర్కార్” సుపరిపాలన  మాయాజాలం , ”మాణిక్య” దీధితులు  కాషాయం రెపరెపలకు  ఢమాల్ . అమిత్ షాకే షాకిచ్చిన ఫలితాలివి -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి 

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి

కంచి  శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి  నిర్యాణం సందర్భంగా సరసభారతి 6-3- 18 మంగళవారం సాయంత్రం 6-30 గం .లకు  ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ స్వామీజీకి శ్రద్ధాంజలి  నిర్వహిస్తోంది . కంచి పీఠం తోనూ ,శ్రీ జయేంద్ర స్వామి వారితోనూ సన్నిహిత సంబంధం ఉన్న బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ న్యాయ దర్శన శాఖాధిపతులు  డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ అనుభవాలను వివరిస్తారు . అందరం పాల్గొని స్వామీజీ కి  ఘన నివాళి అర్పిద్దాం . దుర్గా ప్రసాద్ -3-3-18

— 

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి

మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి

ధర్మ ప్రచారానికి సేవా ధర్మాన్ని కలిపి ,మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మానికి అనన్య ప్రచారం చేసి ,ప్రచారం తో సరిపుచ్చుకోక కార్యాచరణతో పరమార్ధాన్ని సాధించి చూపి ,మతం ఏదైనా అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ తత్వమే నని బోధించి ,అనుసరించి అందరికీ మార్గ దర్శులైన మహనీయ మానవతా మూర్తి కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి .క్లిష్ట సమస్యలను కూడా పలువిధ చర్చలద్వారా పరిష్కరించిన మహా నేర్పరి .దీనికి ఉదాహరణ అయోధ్యలో రామాలయ నిర్మాణ విషయం ముస్లిం పెద్దలను ఆహ్వానించి వారి మనో భావాలు తెలుసుకుని వారి మద్దతు కూడా కూడ గట్టె ప్రయత్నం లో సఫలత సాధించారు .భారతదేశ ప్రతిష్టకు ఆధారం హిందూ ధర్మమే నని నమ్మి మనసా వాచా కర్మణా ఆచరించి మార్గదర్శి అయ్యారు .ప్రతి మనిషిలో నారాయణు ని దర్సి౦చాలన్నది ఆయన సిద్ధాంతం .పరమాచార్య మార్గానికి మరింత సొబగులు కూర్చి,అందరికి అవకాశం కల్గించిన మానవీయ మూర్తి .

  ముఖ్యంగా తెలుగు ప్రజలకు అత్యంత ఆరాధనీయులయ్యారు .ప్రతి గ్రామం పర్యటించి ధర్మ బోధ తో మరీ దగ్గరయ్యారు .వారి కాలం లో ఎన్నో దేవాలయాలు నూతనంగా నిర్మించబడి మరెన్నో వాటికి జీర్ణోద్ధరణ జరిగి ,ఇంకెన్నో వాటికి మహా సంప్రోక్షణాదులు జరిగాయి . క్రియా శీలకం గా ఉండటం వలననే ప్రజలకు మరింత చేరువయ్యారు .చాలా దేవాలయాలను  కంచి మఠం. స్వీకరించి పరి రక్షించింది .దిక్కూ దివాణం లేని అనేక దేవాలయాల  జీర్ణోద్ధరణ కోసం ప్రభుత్వాలను ఒప్పించి వాటికి వెలుగులు తెప్పించారు స్వామి.  ఇదంతా వారి పూనికా సంకల్పమే .ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యం సామాజిక సేవాకార్యక్రమాలకూ ఇవ్వట౦  వారి ప్రత్యేకత . గోశాలలు నిర్మించి గోవులను పెంచే కృషిని అమలు పరచారు . అనుక్షణ ‘’నారాయణ మంత్ర’’ఉచ్చారణ వారిని శివకేశవ భేద రహితులను చేసి హరిహరాద్వైతాన్ని ఆచరణలోకి తెచ్చింది .

  మారుతున్నకాలం  లో విస్తరిల్లుతున్న విజ్ఞానం అందరికి అందుబాటు లోకి తెచ్చే యోచనతో కంచి పీఠం ద్వారా కంప్యూటర్  ట్రెయినింగ్,టైప్ రైటింగ్  సంస్థలను స్థాపించి యువతీ యువకుల శక్తి యుక్తులను సార్ధకం చేయిస్తున్నారు .పరమా చార్యుల వారి స్పూర్తి నరనరానా జీర్ణించుకున్న జయేంద్ర సరస్వతీ  స్వామి ‘’చంద్ర శేఖర విశ్వ మహా విద్యాలయం ‘’నిర్మించి వేలాది మందికి విద్యాదానం చేశారు . హిందూ ధర్మ పరి రక్షణకోసం విస్తృతమైన సమావేశాలెన్నో నిర్వహించి స్పూర్తి ప్రేరణ కలిగించారు .సామాన్య మానవుల హృదయాలలో దైవాన్ని ప్రతిస్టింప జేయటమే  లక్ష్యంగా వారు ప్రతి అడుగూ వేశారు .సనాతన కంచి పీఠ ధర్మాలను సంప్రదాయ బద్ధంగా పాటిస్తున్నా, వారి హృదయపు లోతులలో లౌకిక భావ దీప్తి ఉన్నది.  అందుకే శంకర నేత్రాలయాలలో, ఇతర వైద్యాలయాలలో అన్ని మతస్తులవారు ఉచిత వైద్య సేవలు అందుకుంటున్నారు .ఇదే వివేకానందుని అనుస్టాన వేదాంతం .మానవుని మహోన్నత మానవునిగా చేయటమే ధ్యేయంగా వారు ప్రవర్తించి సర్వమానవులకు ఆదర్శ ప్రాయులయ్యారు .అందుకే వారిని ‘’సనాతన దీప్తి ,సాంస్కృతిక ప్రదీప్తి ‘’అన్నది ఆంద్ర భూమి .శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి  ఆధ్యాత్మిక తేజస్సు స్పూర్తి ప్రేరణ అందరకు మార్గ దర్శనం చేస్తాయి .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-18-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం

మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం  మహా కధకులు మునిపల్లె రాజు  గారి నిర్యాణం నుంచి తేరుకోకముందే ఇవాళ కంచి మహాస్వామి శ్రీశ్రీ జయేంద్ర సరస్వతుల మహానిర్యాణ వార్త ఆస్తిక జన హృదయాలను కల్లోల పరచింది .82ఏళ్ళ వృద్ధాప్యం లో వారు సిద్ధిపొందారు .అందులో 64సంవత్సరాలు పీఠాది పత్యం వహించి ఆస్తిక జన జాగృతం చేశారు .శ్రీ పరమాచార్యులకు వారసులై 69వ పీఠాధిపతి గా తమ సమర్ధతను లోకానికి చాటిన ఆదర్శ మూర్తి .

 తమిళనాడు తంజావూర్ జిల్లా ఇరుల్ నీకి లో బాల సుబ్రహ్మణ్య అయ్యర్ గా 1935 జనవరి 18 జన్మించారు .సుబ్రహ్మణ్య మహాదేవ గా పిలువబడ్డారు .పదమూడవ ఏటనే ఋగ్వేద సంహిత పూర్తి చేసి కంచి జగద్గురు విద్యాస్థాన్ లో చేరారు .కంచి పీఠ ఆస్థాన విద్వాంసుడు కృష్ణ శాస్త్రి  గారి దృష్టిలో పడి పీఠానికి ఉత్తరాదికారానికి   యోగ్యుడని గుర్తింపు పొందారు .సమైక్య వాదిగా పేరుపొందిన జయేంద్ర సరస్వతీ స్వామి పరమాచార్య, నడిచే దైవం అయిన శ్రీశ్రీ చంద్ర శేఖర యతీ౦ద్రులవారితో పాటు మూడు సార్లు భారత దేశమంతా కాలినడకన పర్యటించారు .1954మార్చి 22నపీఠాదిపత్యం వహించారు .మరొకమారు సపరివారంగా భారత దేశం నాలుగు మూలలా పాదచారియై పర్యటించి ఆధ్యాత్మిక భావ దీప్తి కలిగించారు .మృదు స్వభావి మధురవాక్కు ఉన్న స్వామి భక్తుల హృదయాలను చిరునవ్వు తో ఆకర్షించారు. వారి జ్ఞానబోధ పరమ ప్రసన్నంగా ఉండేది .

  మానససరోవరం చేరి అక్కడ ఆది శంకరా చార్యుల  శిలకు పూజాదికాలు నిర్వహించి ప్రతిస్టిం చటం అపూర్వ విషయం .ఇతర దేశాలైన బంగ్లాదేశ్ వంటి వాటిలో కూడా పర్యటించి కొత్త వరవడి సృష్టించారు .పశ్చిమ బెంగాల్ లోని శ్రీ రామకృష్ణ పరమహంస ఆవాసమైన కాళికా దేవాలయం లో ‘’శంకరాచార్య గేటు ‘’నెలకొల్పారు .చాతుర్మాస్య దీక్షులు క్రమబద్ధంగా నిర్వహించి ఆయా ప్రాంతలలో వైదిక ధర్మ వ్యాపి కలిగించిన మనీషి .చంద్ర శేఖరస్వామి వేదపాఠ శాలలు స్థాపించి శాస్త్రాధ్యయనానికి కృషి  చేస్తే  జయే౦ద్రులు ప్రజోపకార కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత నిచ్చారు .మానవ సేవే మాధవ సేవగా భావించి శంకర నేత్రాలయ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులను నెలకొల్పి సేవలందించారు . మత మార్పిడులను నిరోధించటానికి పీఠాదిపతుల,ధార్మిక సంస్థ ల  సహకారం తీసుకున్నారు . దళిత వాడలలో హిందూ ధర్మ ప్రచారం చేశారు.  వారినీ జనజీవన స్రవంతి లో కలిసేట్లు చేశారు .వారిలో సనాతన హైందవ ధర్మం పట్ల అభిరుచిని కలిగించి చైతన్యం తెచ్చారు .

  సనాతన భారతీయ హిందూ ధర్మ పై అపార జ్ఞాన సంపన్ను లైన జయేంద్ర స్వామి అందరిచేతా ఆరాధింప బడిన మహోన్నత వ్యక్తి .కంచి పీఠం బలమైన సంస్థగా ఎదగటానికి వారు చేసిన కృషి అనితర సాధ్యం .అనేక పాఠశాలలు నేత్రాలయాలు నిర్మించి ప్రజలకు మఠాన్ని చాలా దగ్గరకు చేర్చారు .అస్సాం లో గౌహతి వద్ద శంకర నేత్రాలయం స్థాపించి ఈశాన్య రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలు చేబట్టారు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బాలల ఆస్పత్రులు ,హిందూ మిషన్ హాస్పిటల్ ,తమిళనాడు హాస్పిటల్ వంటివి నిర్మించి ప్రజా సంక్షేమమే భగవత్సేవ గా నిర్వహించారు .

  1987ఆగస్ట్ 22  అకస్మాత్తుగా అదృశ్యమై చివరికి తలకావేరి లో ప్రత్యక్షమై మొదటి సారిగా వివాదం లో పడ్డారు పెద్దస్వామి వాత్సల్యం సంపూర్ణం గా ఉండటం చేత ఆహ్వాని౦పబడి మళ్ళీ పీఠం ఎక్కారు .తర్వాత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత అనేక ఆరోపణలతో జైలు పాలు చేసిందీ .ఏ ఒక్కటీ కోర్టులో రుజువు కాలేదు .ధర్మం కోసం వేద విజ్ఞాన వ్యాప్తికోసం ,మానవ సేవ కోసం పరితపించి కృషి చేసిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మా ఉయ్యూరుకు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామానికి మూడు నాలుగు సార్లు వచ్చారు .   పరమాచార్యులవారితో ఉయ్యూరుకూడా వచ్చారు .వచ్చిన ప్రతిసారీ వారిని దర్శించుకున్న ప్రసంగాలు విన్న  అదృష్టవంతులం అయ్యాం  వీరిద్దరి గురు శిష్య బంధం దృఢమై ఆదర్శప్రాయమై నిలిచింది .

  శ్రీ జయేంద్ర సరస్వతి ఇవాళ 28- ఫిబ్రవరి 2018 న  శివైక్యం  చెందారు .వారి ప్రేరణ స్పూర్తి మనలను కలకాలం తీర్చి దిద్దాలని ఆశిద్దాం .

   మీ—గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-18 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )

మిధిలకు చెందిన హలయూద 11 వ శతాబ్దపు కవి .’’పింగళఛందస్సూత్ర౦ ‘’రాశాడు .ఇదికాక ‘’బ్రాహ్మణ శాస్త్రం ‘’అనే పేరు మోసిన గ్రంధాన్ని కూడా రాశాడు. అనేక ధర్మశాస్త్ర గ్రంధాలు  హలయూదను ,రచనలను పెర్కొన్నాయి .

298- ప్రాకృత పింగళ శాస్త్ర కర్త –రవికార మిశ్ర (12 వశతాబ్దం )

12 వ శతాబ్ది రవికార మిశ్ర దీర్ఘ ఘోష వంశీకుడు .దామోదర మిశ్రాకు పూర్వీకుడు .రవికార వృత్త రత్నావళి ,ప్రాకృత పి౦గళశాస్త్రం అనే ఛందో గ్రంధాలు రాశాడు  .ఇది పింగళసార వివేక శైలిలో ఉంటుంది .

299-వాణీభూషణ కర్త –దామోదర మిశ్ర (14 వ శతాబ్దం )

14 వ శతాబ్ది  ఉత్తరార్ధం 15 వశతాబ్ది పూర్వార్ధపు కవి దామోదర మిశ్ర వాణీభూషణంఅనే ఛందో శాస్స్త్రాన్ని రాశాడు .1402 -1410 వరకు పాలించిన కీర్తి సింహ రాజు ఆస్థానకవి.

 హరిహర కవి ‘’పింగళరంగిణి’’అనే వ్యాఖ్యానాన్ని పింగళ ఛందస్సూత్రానికి రాశాడు .

300-వృత్తిసార కర్త –రమాపతి ఉపాధ్యాయ (15 వ శతాబ్దం )

కవి శేఖర యశోధరునికుమారుడే రమాపతి ఉపాధ్యాయ .పాళీ వంశం లోమంగరౌని శాఖవాడు .వృత్తి సార ఛందస్సు గ్రంధం రాశాడు తానె దీనికి  వ్రుత్తిసారాలోకం  అనే వ్యాఖ్యానమూ రాసుకున్నాడు .

   దామోదర మిశ్ర కొడుకు పద్మసార మిశ్ర ‘’ఛందో రత్న ‘’స్వతంత్రంగా రాశాడు .యితడు దిఘవాయ వంశీకుడు .

301-చందోమంజరికర్త –గంగదాసు (16 వ శతాబ్దం )

వైద్య గోపాలదాస కొడుకు గంగదాసు 16 వ శతాబ్దివాడు చందోమంజరి రాశాడు .

వ్రుత్తి రహస్యం ను దిగంబర దక్కూర రాశాడు

302- వృత్త ముక్తావళి కర్త –దుర్గాదత్త మిశ్ర (16 వ శతాబ్దం )

16 వశతాబ్దానికి చెందిన దుర్గా దత్త మిశ్ర వృత్త ముక్తావళి రాశాడు .

303-శ్రుత బోధ కర్త –కాళిదాసమిశ్ర (16 వశతాబ్దం )

కాళిదాస మిశ్ర 43శ్లోకాల శ్రుత బోధ రాశాడు .దీనిపై చాలామంది వ్యాఖ్యానాలు రాశారు .అందులో మనోహర రాసిన సుబోధిని ,లక్ష్మీ నారాయణ రాసిన మనోరమ ముఖ్యమైనవి .

304-వృత్త దర్పణ కర్త –భీష్మ మిశ్ర  (18 వ శతాబ్దం )

మహామహోపాధ్యాయ భీష్మ మిశ్ర 18 వ శతాబ్దివాడు తండ్రి మహోపాధ్యాయ ధీరమిశ్ర ..బాలీశ వంశీకుడు ‘’వృత్త దర్పణం ‘’అనే ఛందో గ్రంధం రాశాడు

305-చందః కల్పతరువు కర్త –రాఘవ ఝా

తరౌరి గ్రామవాసి రాఘవ ఝా చందః కల్ప తరు రాశాడు .

306-విద్వన్మనోరమ వ్యాఖ్యాత –విద్యానంద మిశ్ర

పింగళ చ్చంద సూత్రానికి విద్యానంద మిశ్ర విద్వన్మనోరమా వ్యాఖ్యానం రాశాడు

జానకేనందన కవీంద్ర వృత్తదర్పణం రచించాడు

307-చందః సిద్ధాంత భాస్కరః కర్త –కేశవ

కేశవ కవి చందః సిద్ధాంత భాస్కరః రాశాడు .మధుసూదనకవి మాత్రా వృత్తం రచించాడు .

308-వృత్తరత్నావళి కర్త-చిరంజీవ

మిధిలకు చెందిన చిరంజీవకవి వృత్త రత్నావళి రాశాడు ‘

309- ఛందస్సుదాకరం కర్త –బాబూజన ఝా (19 వ శతాబ్దం )

19 వ శతాబ్దికి చెందిన మహామహోపాధ్యాయ బాబూజన ఝా ఛందస్సుదాకరం రచించాడు .ఈయన తండ్రిదీనబందు అలియాస్ నేనన ఝా .ఖనాల వంశం లోసుఖేట శాఖవాడు .నివాసం మధుబని దగ్గర పిలఖ వార.

310-చందోలత కర్త –వసంత మిశ్ర (19 వ శతాబ్దం )

చందోలత అనే ఛందో గ్రంధాన్ని రచించిన వసంత మిశ్ర 19 వ శతాబ్దికవి .సమస్తిపూర్ జిల్లా తబక గ్రామవాసి 291నుండి 310వరకు ఆధారం ‘’Contribution O f Mithila To Sanskrit ‘’

మనవి-ఇప్పటికి  అచ్చైన  గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ 1,2, 3భాగాలలో 1090మంది సంస్కృత కవులను గురించి రాసి ,ఇవాల్టికి గీర్వాణ౦ -4 లో 310మంది గీర్వాణ కవులను గూర్చి రచించి   నాలుగు భాగాలలో మొత్తం 1400మంది దేవభాషా కవుల గురించి రాసిన అదృష్ట వంతుడనయ్యాను .. ప్రస్తుతానికి విరామ చిహ్నం అంటే కామా పెడుతున్నాను .వీలుని బట్టి మిగిలిన  వందలాది కవుల  గురించీ త్వరలో రాయటం ప్రారంభిస్తాను.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 )

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4

293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592  )

మిధిల కవి పండితుడైన కేశవమిశ్రా ‘’అలంకార శేఖర ‘’రాశాడు .మహామహోపాధ్యాయ నరహరికి కొడుకు ,మహామహోపాధ్యాయ పరమగురు వాచస్పతి కి మనవడు సంమిశ్ర గిరిపతి కి మునిమనవడు.పాళీ కుటుంబం లో సామౌతి శాఖవాడు .వత్స గోత్రీకుడు .తాత వాచస్పతి రాసిన ద్వైత నిర్ణయ కు ‘’ద్వైత పరిశిష్ట ‘’రాశాడు .అలంకార శేఖరం రాయకముందే ఏడు అలంకార శాస్త్రాలు రాసినట్లు చెప్పుకున్నాడు  .అయితే ఇవి మహా పండితులకే కొరుకుడు పడనట్లున్నాయని గ్రహించి పద్ధతిమార్చి శులభ విధానం లో శేఖరం రాశాడు .ఆ ఏడూ అలభ్యాలే .కోట –కాంగ్రా పాలకులు మహారాజా రామచంద్ర మనవడు మహారాజా ధర్మ చంద్ర కొడుకు అయిన మహా రాజా మాణిక్య చంద్ర ఆస్థానకవి .ఈ ఆస్థానం లో ఉన్నప్పుడే పై అలంకార శాస్స్త్రం రాశాడు .

ఈ అలంకార శాస్త్రం లో ఏడుభాగాలున్నాయి .వీటికి రత్న అని ,ఉపవిభాగాలైన 22 లను ‘’మరీచి ‘’అని పిలిచాడు .దీని కారికలను సౌద్దోదనుడు వృత్తులను కేశవ మిశ్రాయే రాశాడు .

రామచంద్ర దక్కూర రాసిన రసతరంగిణిలో ఏడు తరంగాలున్నాయి .నాయక నాయిక భేదాలను చెప్పటానికే రాశాడు .ఉదాహరణలను తనకావ్యాలనుంచీ ఇతరకావ్యాలనుండి ఇచ్చాడు .ముగ్ధ నాయిక ను కొత్త విధానం లో ఆవిష్కరించాడు రామ చంద్ర .ఆమెను జ్ఞాతాజ్ఞాతస్వయోవన అన్నాడు .

కవేంద్ర గంగానంద 1-కర్ణ భూషణ 2-కావ్య దాకిని,అలసామోదిని  శృంగార వనమాల , అనే నాలుగు  అలంకార గ్రంధాలు రాశాడు.కర్ణ భూషణలో 5 పరిచ్చేదాలున్నాయి .మొదటి భాగాలలో రస చర్చ చేశాడు .మిగిలినవాటిలో భావాలను చర్చించి  శ్రీ కృష్ణ భక్తీ పులకా౦కితమ్  చేస్తూ వర్ణించాడు .కావ్యదాకిని పూర్తిగా అలంకార చర్చ .దీనిలోని భాగాలకు ద్రిస్టి అని పేరుపెట్టాడు .శృంగార మణిమాల శృంగార రసాను సారంగా రాసింది .నాయికను ఆగచ్చత్ పతిక అన్నాడు .అలసామోదిని అలంకార శాస్త్రం నేర్చుకొనే వారికి కరదీపిక .ఇది ఈకవి ఇతర రచనలకు ఉపకరణం .

గోకులనాధుని రస మహార్ణవం లక్షణ విభాగానికి చెందినది .అభిద వ్యంజన భేదాల చర్చ ఉన్నది.

294-పేరు లేని అలంకార శాస్త్ర కర్త –ఇంద్రపతి (18 వశతాబ్దం )

కే ఎస్ డి ఎస్ యూని వర్సిటిలో భద్రపరచబడిన వ్రాతపటిగా ఒక అలంకార శాస్త్ర గ్రంధం ఉన్నది దీనికర్త మహామహోపాధ్యాయ ఇంద్రపతి .మధ్యలో కొంతపోయి ఇరవై రెండు భాగాలే ఉన్నాయి .ఇంద్రపతి ‘’మీమాంస పల్లవం ‘’రాశాడు .రుచిపతి కొడుకు ,నీలకంఠ మనవడు కరమహా కుటుంబం వాడు .గ్రంధం అలంకార చర్చకు కేటాయించాడు .

మిధిలకు చెందిన వేణీ దత్త ,చిత్రధర కూడా అలంకార గ్రంధాలు రాసినట్లు తెలుస్తోంది .

295-రస కౌస్తుభ కర్త –వేణీ దత్తుడు (18 వ శతాబ్దం )

వేణీదత్తుడు సాదుపాధ్య కుమారుడు ,కవి జయ కృష్ణ మనవడు .కరమహా వంశస్తుడు .ఇతని చివరి చెల్లెలు సతీ మహారాణి 17 39లో 14 వ ఏట’’ సతి ‘’అయింది .మరొక సోదరిని మహారాజా మాధవ సింహ తండ్రి ఏకనాధ దక్కూరా పెళ్లి చేసుకున్నాడు .ఈ దంపతుల కుమారుడు మహారాజా మాధవ ఆస్థానం లో వేణీ దత్తుడు ఉన్నాడు ఇతను రాసిన రస కౌస్తుభం ,అలంకార మంజరి ప్రసిద్ధాలు .మొదటి దానిలో నాయికా నాయక భేదాలను రెండవది అలంకార శాస్త్రం లో తప్పటడుగులతో ప్రవేశించే వారికోసం రాసింది .రస కౌస్తుభ విరుదావలి లనుంచి అనేక ఉదాహరణలు ఇచ్చాడు

చిత్రధరుని శృంగార సరణి శృంగార ,రతి,కామదశ ,నాయికా నాయకుల విషయాలను చర్చించింది .వీర తరంగిణి లఘు గ్రంధం .వీరరస విభాగాలను చర్చించింది .లేఖనాధ ఝా రసచంద్రిక అనే చిన్న అల౦కార గ్రంధం రాశాడు .స్వంత నిర్వచనాలు ,ఉదాహరణలు ఇచ్చాడు .కవి శేఖర బదరీనాధ ఝా’’సాహిత్య మీమాంస ‘’రాశాడు .

296- వ్యంజన వాదకర్త –యదునాధ మిశ్ర (18 85)

18 8 5 లో పుట్టిన యదునాద మిశ్ర వ్యన్జనవాద వ్యాప్తికోసం వ్యంజన వాద గ్రంధం రాశాడు .సోదరపుర వంశం లో సారిసవ శాఖకు చెందినశ్రోత్రియ బ్రాహ్మణుడు .పండిత జయనాద మిశ్రా కుమారుడు మధుబని జిల్లా లాలాగంజ్ లో నివాసం .వ్యంజనా వృత్తిని సమగ్రంగా ఆవిష్కరించాడు .

బాలకృష్ణ మిశ్ర లక్షణ పరీక్ష ,వ్యక్తి నిరాశా అలంకార పుస్తకాలూ రాశాడు .అనంత ఝా ధ్వనికల్లోలిని రాయగా ,గిరిజానంద ఝా అలంకార కుసుమ రాశాడు .హాటక మిశ్రా కొడుకు భావమిశ్రా శృంగార సరసి,సభ్యాలంకరణ  రాశాడు .సుఖదేవ మిశ్రా ‘’శృంగారలత ,శ్రీకర మిశ్రా అలంకార తిలకం  శంకర మిశ్రా సాహిత్య కలిక రాశారు ..హిరణ అనేకవి ఉపమాకంతుక ,రాశాడు .

వీరేకాక అలంకార శాస్త్రాలకు వ్యాఖ్యానాలు రాసిన వారూ చాలామందే ఉన్నారు మిదిలలో . కొందరి పరిచయం-కావ్యప్రకాశకు అచ్యుతధక్కూర ,వ్యంగ్యార్ధ కౌముదికి అనంతుడు ,ధ్వన్యాలోకానికి ‘’దీధితి ‘’వ్యాఖ్యను బదరీనాధుడు ,కావ్యాదర్శానికి భాగీరధ కావ్యప్రకాశికకు సాహిత్య దీపికను భాస్కర మిశ్రా ,సాహిత్య దర్పణానికి లక్ష్మి అనే వ్యాఖ్యను కృష్ణమోహన దక్కూర ,దీనికే ఖుద్దూ ఝా వంటివారు సంస్కృత వ్యాఖ్యానాలు రాసి గీర్వాణవాణిని ప్రచారం చేయటమేకాదు అలంకార గ్రంథ వ్యాప్తికి దోహదమూచేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –26-2-18 –ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦  -4

291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)

1890 లో పుట్టి  1970లో మరణించిన రుద్ధినాద ఝా,మహామహోపాధ్యాయ  హర్ష నాద  ఝా కుమారుడు .దర్భంగా జిల్లా ఉజానా వద్ద శారదాపుర వాసి .శాకారాధి వంశీకుడు .అయిదు సంస్కృత నాటకాలు -1-శశికళా పరిణయ నాటకం 2-పూర్నకామ ౩-ప్రసాద నాటకం 4-దక్షిణామూర్తి నాటకం 5-అపర ప్రవాస నాటకం రాశాడు .వీటిలో మొదటి రెండు ముద్రితాలు మిగిలిన మూడు అముద్రితాలు .మొదటి నాటకాన్ని కుమార జీవేశ్వర సింహా  రాజు ఉపనయన మహోత్సవ సందర్భంగా ప్రదర్శించటానికి రాశాడు .రెండవదాన్ని కతిహార్ కు చెందిన ఉమానాద మిశ్రా మనవడు జన్మ దిన సందర్భంగా రాశాడు .

  శశికళ నాటకం ఏడు అంకాలు .మొదటింకానికి ‘’నాయికా హృదయగత భావ ప్రకాశం .అని రెండవదానికి ‘’స్వస్వదూత ప్రస్తాపన మూడవ దానికి కాశీ ప్రస్తానం ,నాల్గవదానికి ‘’పరిణయ సముద్యోగం ,చివరిదానికి’’వర ప్రాప్తి ‘’అని సార్ధక నామాలు పెట్టాడు  . నాయిక శశికళ  నాయకుడు సుదర్శనుడు వీరి ప్రేమ వివాహమే కధ.

  పూర్నకామం ఏకాంకిక అద్భుత రస ప్రధానం .శృంగారాది రసాలతో అద్భుతరసాన్ని పండించాడు .పూర్ణ కామ అనే యువ యోగి తపస్సులో ఉంటె ఇంద్రుడు విఘ్నాలు కలిగిస్తే,అతని ముందు పప్పులు ఉడక్క ఇంద్రుడు మాతలిని పంపి స్వర్గానికి ఆహ్వానిస్తాడు .స్వర్గ సుఖాలేవీ అతనిని ఆకర్షించక మందాకినీ నదీస్నానం ధ్యాన యోగాలతో అక్కడ గడిపాడు.ఇంద్రుని గర్వం ఖర్వమై పగబట్టాడు .నారద విష్ణువులు  ప్రత్యక్షమై పూర్నకాముడిని వైకుంఠానికి  సాదరంగా తీసుకు వెళ్ళటం కధ .

మూడ౦కాల ‘’ప్రసాద నాటకం ‘’భారత స్వాతంత్ర్య సిద్ధికోసం పోరాటం అందులో బాబూ రాజేంద్ర  ప్రసాద్ పోషించిన ముఖ్య పాత్ర ఉన్నాయి .శివుడు దక్షిణామూర్తిగా ఆవిర్భవించే నాటకమే దక్షిణామూర్తి నాటకం .చివరిదైన’’అపర ప్రవాస నాటకం ‘’శ్రీరాముడు అయోధ్యలో పట్టాభి షిక్తు డైనతర్వాత మొదటి సారిగా మామగారిల్లు జనక పురం మిధిలకు వెళ్ళటం కద .హాస్యభరిత నాటకం .

గిరిజానంద ఝా ‘’ద్వికుసుమ’’నాటకం ,గంగేశ మిశ్రా గురుదక్షిణ ,రఘు చరిత్ర నాటకాలు ,రాశాడు కౌత్సుకుడు గురువు వరతంత్రునికి  గురు దక్షిణ చెల్లించటం మొదటి నాటక ఇతి వృత్తం ఏడు అంకాల నాటకం .రెండవదిరఘుమహారాజు అనిర్వచనీయ త్యాగం ఇతి వృత్తంగా కలది .

అలాగే ఆనంద ఝా కవి మూడు నాటకాలు –హ్రుత్పరివర్తన ,పునస్సంగమం ,దాహ్య ప్రతోన్మీలనం రాశాడు .మొదటి నాటక కధ భోజమహా రాజు ఆయన మామ ముంజ కు మధ్య జరిగిన విషయం .భోజుని చంపటానికి ముంజ కిరాయి మనుషులను పంపుతాడు .భోజుని విశుద్ధ ప్రవర్తనకు వాళ్ళ మనసులు మారి ముంజ కు తెలియజేస్తే అతని ప్రతీకారేచ్చ నశించి కూతురునిచ్చి పెళ్లి చేసి అల్లుడిని చేసుకుంటాడు .పూర్ణ సంగమనాటక ఇతి వృత్తం  పార్వతీపరమేశ్వరుల ప్రణయ పరిణయాలే .

 గంగాధర మిశ్ర ఏడు ఏకాంకికలు రాసి ‘’సప్తలా ‘’పేరుపెట్టాడు .మతినాద మిశ్రా గుజరాత్ లోని సోమనాధ దేవాలయ నిర్మాణ నేపధ్యంగా అయిదు అంకాల ‘’రాష్ట్ర బంధు ‘’నాటకం రాశాడు .

292-పాంజి ప్రబంధ నాటకకర్త –డా.శశినాద ఝా (1954)

1954లో మధుబని జిల్లా దూపాలో పుట్టిన శశికాంత ఝా దర్భంగా కే ఎస్ డి ఎస్ యూని వర్సిటి లో వ్యాకరణం బోధించాడు . .అచ్చుకాని గ్రంధాలను ,పునర్ముద్రణ గ్రంధాలను ప్రచురించాడు .మిధిలలో పాంజీ రికార్డ్ లను భద్ర పరచటం నేపధ్యంగా ‘’పాంజీ ప్రబంధం ‘’అనే నాటకం రాశాడు .ఇదికాక బాణకవి పార్వతీ  పరిణయం పై విపుల వ్యాఖ్యానం రాశాడు.  తన కవితలను’’మధుధార ‘’  సంపుటిగా ప్రచురిద్దామనుకున్నాడుకాని సాధ్యం కాలేదు

 మిధిలకు చెందిన 35 మంది విమర్శక కవులు అనేక సంస్కృత నాటకాలపై వ్యాఖ్యానాలు రచించారు అందులో కొందరి గురించిమాత్రమే తెలియ జేస్తా –

హనుమన్నాట కానికి బలభద్రుడు దీపిక ,అనర్ఘ రాఘవానికి భావనాద మిశ్రా ,వేణీ సంహారానికి ధీరసిమ్హుడు సుబోధ జనికా ,ముదితమదాలసకు స్వయంగా గోకులనాదుడే టిప్పణ౦ ,ముద్రారాక్షసానికి ముద్రాదీపికను గ్రహేశ్వరుడు ,అభిజ్ఞాన శాకున్తలానికి వివ్రుతి పేరుతో అన్ఖిఝా  ,మాలతీ మాధవానికి ప్రజాపతి ,ప్రబోధ చంద్రోదయానికి దుర్నిరూప నపదార్ధ వివేక ను రుచికార , అమృతోదయ సుఖ బోధినికి ‘’సరళా ‘’పేరుతో వ్యాఖ్యానాన్ని ముకుంద ఝా బక్షి  రాశారు .కనుక మిధిల జానకీ మాతకే కాక కవిత్వ నాటక చంపు లకు వ్యాఖ్యానాలకు కూడా పుట్టినిల్లె .

  సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కథక” ముని” రాజు గారు 

కథక” ముని” రాజు గారు

సౌజన్యం సంస్కారం మూర్తీభవించిన కధారచయిత మునిపల్లె  రాజుగారు అస్తమించటం తెలుగు సాహిత్యానికి ,ముఖ్యంగా కధానికా ప్రక్రియకు పెద్ద లోటు కవిగా .,నవలా కారునిగా వ్యాస రచయితగా ప్రసిద్ధులైన రాజుగారు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో సర్వేయర్ గా సేవలందించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం ఆయన స్వగ్రామం 19 25 మార్చి నెల 15 కాకునూరు మండలం గరికపాడు లో అన్మించారు . తలిదండ్రులు హనుమంతరావు జానకమ్మ. అసలుపేరు  ”ముని పల్లె బక్క రాజు” .. కాని మునిపల్లె రాజుగా సుప్రసిద్దులయ్యారు . రాజుగారికి సాహిత్యం లో ఆసక్తి కలిగించినవారు తెలుగు పండితుడు జమ్మలమడక రామ మూర్తిగారు.  రాజు గారి చదువు ఎస్ ఎస్ ఎల్ సి తో ఆగిపోయింది ‘.అయినా ఏ విశ్వ విద్యాలయం లో చదివినా రానంత చదువు ఆయనకు వచ్చింది కథలద్వారా దాన్ని అందరికి నేర్పారు
   18 వ ఏటనే 19 43లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చింది.  అందులో సివిల్ ఇంజనీరింగ్ లో సర్వేయర్ గా చేరి ,40 ఏళ్ళు సంపూర్తిగా సేవలందించి 1983లో రిటైరయ్యారు  కదా ప్రక్రియ ఆయనకు అమిత ఇష్టమైన   విషయం . వందలాది ఆణిముత్యాలవంటి కధలు రాసి  విశేష కీర్తి  పొందారు . మేటి అని పించుకున్నారు . అసలు సిసలైన తెలుగు వాతావరణం లో రాసిన కధలవి మట్టి వాసన గుబాళిస్తాయి . మధ్యతరగతి ఇతివృత్తం నేపధ్యం గా ఉండటం మరో ప్రత్యేకత ”అంతావిషాదాంతం కాదు ”అనే పాజిటివ్ దృక్పధంతో  ఆయన కధానికా ప్రక్రియప్రారంభమై  అనంతంగా సాగింది . అమావాస్య పున్నమి అరణ్యం లో మానవ యంత్రం , ఇంటి తనఖా దస్తావేజు ,చెప్పులదానం జ్ఞానదార దానధార .,నిశ్శబ్దం ఒక పదం కాదు ,పుష్పాలు ప్రేమికులు పశువులు .,బడుగు పేదను బాబయ్యా,భోగం మనిషి ,  ,మహా బోధి చాయలో ,వారాలపిల్లాడు ,వేరే లోకపుస్వగాతాల్లో , స్మశానం చిగిర్చిందివంటి అర్ధవంతమైన శీర్షికలతో మనసుకు హత్తుకునే కధలెన్నో రాశారు వాటినన్నిటిని 1-అస్తిత్వ నదం అవతలి తీరాన 2-దివాస్వప్నాలతో ముఖా ముఖి 3-పుష్పాలు ప్రేమికులు పశువులు 4-మునిపల్లె రాజు కధలు  సంకలనాలుగా తెచ్చారు.  కధలలో అందే వేసిన చేయి  అని పించుకున్న రాజుగారు   కవిత్వం లోనూ అదేపోకడ పోయి బహు విధకవితలు రాసి 1-అలసిపోయిన వాడి అరణ్యకాలు 2-వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు కవితా సంకలనాలు వెలువరించారు .

 నవలా ప్రక్రియలోనూ తనదైన శైలితో హృదయపు లోతులను తరచే ”పూజారి ”నవల రాశారు దీనినే ప్రఖ్యాత సినీ దర్శకుడు మల్లీశ్వరి ఫేమ్ బి యెన్ రెడ్డి గారు ”పూజా ఫలం ”చలన చిత్రంగా తీసి అవార్డులు రివార్డులు అందుకున్నారు . అందులో నారాయణ రెడ్డిగారి పాటలు ,రాజేశ్వర రావు గారి సంగీతం ఘంటసాలగానం  ఆ సినిమాను  క్లాసిక్ ను చేశాయి  సృజనాత్మక సాహిత్యం తన అసమాన ప్రతిభను ఆవిష్కరించిన రాజుగారు సాహిత్య విమర్శలోనూ ముందున్నారు తన సాహితీ వ్యాసాలను 1-సాహితీ మంత్రనగరి లో సుస్వరాలు 2-జర్నలిజం లో సృజన రాగాలు గా సాహితీ లోకానికి అందజేశారు .
 మునిపల్లె రాజుగారు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు  .  ఆయన కదా సంకలనం ”అస్తిత్వనాదం అవతలి తీరాన ”కు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం 2006లో   లభించింది. దీనికే పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయ పురస్కారం 20 04లోనే ఇచ్చింది .   20 04లో గోపీచంద్ పురస్కారం తోపాటు  నూతులపాటి గంగాధరం పురస్కారం ,జ్యేష్ట లిటరరీ పురస్కారం,రావి శాస్త్రి స్మారక పురస్కారం ,పులికంటి సాహితీ సత్కృతి ,అందుకున్నారు ఆంద్ర సారస్వత సమితి సహృదయ సాహితీ సంస్థ వంటి ప్రసిద్ధ సాహితీ సంస్థలెన్నో రాజుగారిని గౌరవించి అవార్డ్ లు అందజేశాయి . ఆంద్ర దేశం లో అనేక ప్రదేశాలలో జరిగిన  సభలలో రాజుగారు ప్రసంగించి స్పూర్తి కలిగించారు ఆసక్తి రేకెత్తించారు ”సమకాలీన సాహితీ నావికులకు ముని పల్లె రాజు గారు ఒక లైట్ హౌస్ .-కదా ఋషి”అని గొప్ప కితాబు ఇచ్చారు మహా కధకులు  శ్రీ మధురాంతకం రాజా రాం . సాహితీ సమర్ధతను అంచనా వేయటం లో దిట్ట అయిన మంజుశ్రీ అనే అక్కిరాజు రమాపతి రావు గారు ”కధకుల కధకుడు మునిపల్లె రాజు ”అని రాజుగారి మహోత్క్రుస్ట తను సమర్ధతను చాటారు  
 మేజికల్ రియలిజం కు కొత్త ఒరవడి సృస్టించినవారు   ముని పల్లె రాజుగారు . రాజుగారిప్రతి కధలో అంతస్సంఘర్షణ ,అస్తిత్వ వేదన ,తాత్విక శోధన ఉంటాయి ఇవే ఆయన్ను మిగిలిన సమకాలీనులుర కంటే  గొప్పవారిని చేశాయి  ఇంతకీ మేజికల్ రియలిజం అంటే ఏమిటి .?సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలను ఆధ్యాత్మిక కోణాలలో అన్వయించి మానవులకు ,జరుగుతున్న సంఘటనలకు మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించటం అన్నమాట . ఇందులో నిష్ణాతులై ”రాజు”అనిపించుకున్నారు మునిపల్లెవారు. 
 

ఆంగ్లేయుల బానిస సంకెళ్ళనుంచి మనదేశం విముక్తి కాకముందు నుంచి నేటి స్త్రీ దళిత బహుజన గిరిజన మైనారిటీ వాదాల వరకు, నాటకరంగం మొదలుకొని మూకీ టాకీల నుంచి నేటి ఐ మాక్స్‌ల వరకు, ఏతాలు, గూడలు, కపిలలు, ఎడ్లబండ్లు మొదలు కార్లు విమానాలు ఉపగ్రహాల వరకు, గ్రామ ఫోను రికార్డులు, టేప్‌ రికార్డులూ, సీడీలు మొదలుకొని నేటి అతర్జాలం వరకు ఒక ప్రవాహంలో వచ్చిన మార్పులకు ప్రత్యక్షసాక్షిగా నేటికీ కలం వదలని అరుదైన కథకుడు మునిపల్లె రాజు.

సోషల్‌ రియాలిటీ సోషల్‌ ఫిలాసఫీ మొదలుకొని మేజిక్‌ రియలిజమ్‌ వరకు, మార్క్సిస్టు భావజాలం దగ్గర నుంచి మానవ జీవితాలను శాసించే సూత్రాల వరకు అన్నింటినీ తన కథలలో ప్రతిభావంతంగా ప్రయోగించి మెప్పించిన ఏకైక కథారచయిత మునిపల్లె రాజు.

వీరి కథా కథనం గంభీరంగా ప్రవహించే గంగా ప్రవాహంలా జీవిత పార్శ్వాలను స్పృశిస్తూ పాఠకుల్ని కథాకాలం నుంచి సమాజంలోకి లాక్కెళుతుంది. పాఠకుడి మనసు ప్రక్షాళనం చేస్తుంది. ఆతని హృదయ క్షేత్రంలో మానవత్వపు విత్తనాలను నాటి జీవితాన్ని సారవంతం చేస్తుంది. వీరి కథలు మదురానుభూతినే గాక జీవిత రహస్యాలవగతమయ్యే జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మనసుకు పట్టిన తుప్పును వదిలిస్తాయి.

మునిపల్లె రాజు ప్రతి కథా ఒక లయాత్మకమైన జీవన సంగీతాన్ని కలిగివుంటుంది. అయితే ఆ సంగీతం సాధారణమైంది కాదు. అమరత్వాన్ని సాధించే మాధుర్యం కలిగిన సంగీతమది. కాబట్టి ఈ కథలు రచయితకు, పాఠకుడికి మధ్యన ఒక భావాతీత ఆత్మికబంధాన్ని పదిలపరుస్తాయి. మరి అలాంటి అద్భుతమైన అనుభూతిని, సాహిత్య అనుబంధాన్ని నేటి యువత పెంపొందించుకోవాలంటే ఈ కథల్ని చదవాల్సిందే.

రాజుగారి కధలు ”హృదయపు పునాదిమీద కట్టినవి ”అందుకే అంత విశిష్టంగా ఉంటాయి

93ఏళ్ళు జీవించి 24-2-18 శనివారం హైదరాబాద్ లోని సైనికపురి లో స్వర్గస్తులయ్యారు మునిపల్లె రాజుగారు .ఆయన ప్రసంగాలు ఆలోచనాత్మకాలు .హృదయాలను తాకి మానవత్వాన్ని చిగురింప జేసే శక్తి ఉంటుంది వారిమాటలలో రాతలలో.  మహా  కథకులు శ్రీ మునిపల్లె రాజుగారు లేని లోటు తెలుగు సాహిత్యం లో తీర్చలేనిది పూడ్చలేనిది .శ్రీ మునిపల్లె రాజు అమర్ రహే .

గబ్బిట దుర్గాప్రసాద్- 26-2-18 -ఉయ్యూరు

Inline image 1


 
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం

”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం

తెలుగులోసినీ  హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో  బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది . కానీ ”అమృతం ”సీరియల్ లో అంజనేయులు అనే అంజిగాడి పాత్రను అత్యద్భుతంగా పోషించి మూడువందలకు పైబడిన ఎపిసోడ్ లలో తనదైన ముద్ర వేశాడు .అందులోని మిగిలిన పాత్రధారులు మారుతూ వచ్చినా చివరిదాకా నిలిచింది హనుమంతరావు అప్పాజీ వేషధారి నారి పెద్ది మాత్రమే . పోటా పోటీగా నటించారు ”.  సమస్య ఎదురైతే  తనదైన శైలిలో  . ”మై  హూనా”అంటూ అందరికంటే ఆరిందాగా తెలివైనవాడినని చెప్పుకుంటూ అసామాన్యమైన ఆలోచనలు చేసి ,చివరికి బొక్క బోర్లా పడి  ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకున్న కేరక్టర్ అంజి ది .ఎక్కడా సహజత్వానికి భిన్నంగా నటించలేదు . అందులోని ప్రతి ఎపిసోడ్ లోనూ జీవించాడు .డైలాగ్ డెలివరీ అత్యద్భుతం .సహజ హాస్య నటుడు .ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాడు మిగిలిన వారికి భిన్నంగా .అతని హాస్యం ”అమృతం ”అందుకే అమృత హాస్యం పండించాడని అంటాను .ఆ సీరియల్ చూస్తున్నంత సేపూ మనల్ని మనం మర్చిపోతాము   .ఆఅందం వచ్చినా దుఃఖమొచ్చినా అతని హావభావాలు హద్దులు దాటవు .అందులోనూ ఒక మెరుపు కనిపిస్తుంది .హాయి అనిపిస్తుంది .బహుశా ఆయనమనసు అమృతోపమానం అవటం వలననే అది సాధ్యమైనదని అను  కొంటాను.   .మిఠాయి వ్యాపారం బిస్కట్ల వ్యాపారమూకూడా  ఆయన మనసుని అమృత తుల్యమే ఆరోగ్య ప్రదాయమే చేశాయని అనిపిస్తుంది   .మన మనసుకు ఆరోగ్య ఆనంద అమృతాలిచ్చిఅతని  శరీరాన్ని అవి దెబ్బతీసి షుగర్ వ్యాధికి కారణమవటం బాధించింది .ఎందరెందరు సహనటులకో సహ్యా సహకారాలందించి నాటకరంగం లోనూ ఓ వెలుగు వెలిగినాడు 20 16 సరసభారతి సభకు ఆహ్వానిస్తే వస్తామని చెబితే ఆహ్వాన పత్రికలో పేరు వేసి ,,రెండు రోజులముందు ఫోన్ చేస్తే తీవ్ర అనారోగ్యం వలన రాలేక పోతున్నానని తెలియజేశాడు .అనారోగ్యం తో ఉన్న కన్నతండ్రిని దగ్గరుండి చూసుకోవటానికి అమెరికాఉద్యోగం మానేసి రెండేళ్లకు పైగా తండ్రిని కంటికి రెప్పలాగా కాపాడుకున్న అతని కుమారుడుఅందరికి ఆదర్శమే అయ్యాడు ..డయాలిసిస్ కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తే ,తగినంత డబ్బు రాగానే ఇక డబ్బు పంపవద్దు అని వినయంగా చెప్పిన సంస్కారి హనుమంతరావు
   సినిమాలలోనూ అతని హాస్యం శృతి మించలేదు అన్నమయ్య లో బ్రహ్మానందం తో కలిసి ”ఆహుమ్  ”అంటూ మంత్రం లాగా అనటం భలే నవ్వు తెప్పిస్తుంది .రాజేంద్రుడు గజేంద్రుడు ,అతనికి గొప్ప బ్రేక్ ఇచ్చింది .పుట్ట చెవిటి కేరక్టర్ లో ”వినబళ్లా ”అని నెమ్మదిగా చెబితే నాకు చెవుడా అంటూ దబాయించే పాత్ర మారవా లేము మరణించి వారమే అయింది . ఆరోగ్యాత్మక అమృత హాస్యాన్ని చిందించి పండించిన గుండు హనుమంతరావు  మరణించి వారమే అయింది .తెలుగు తెర  హాస్యనటులు ఒక్కొక్కరుగా కనుమరుగై పోతున్నారు
   ఇప్పుడు ఇవాళ మరో అందాలరాశి అతిలోక సుందరి ముగ్ధ మోహన మూర్తి తెలుగు తెర అందాలకే అందం తెచ్చిన శ్రీ దేవి మరణించింది .తెలుగు తమిళ ,మళయాళ హిందీ సినిమాలలో నటించి తన అతిలోక సౌందర్యాన్ని  అంద  ఛందా లను హద్దు మీరకుండా  నటించి పద్మశ్రీ అయింది .బాలనటిగా బడిపంతులు ,కన్నెపిల్లగా ,పదారేళ్ళ వయసు అందా లను ఆరబోసిన అందాలరాశిగా ,అడవి రాముడు వంటి వాటిలో యవ్వనం విరబూసి  అందాలను పూరి విప్పి నాట్యం చేయించి ,దా0పత్య సౌఖ్యాన్ని పొందిన ఇల్లాలుగా ,బిడ్డకోసం తాపత్రయ పడిన తల్లిగా ,”క్షణక్షణ0” భయాందోళనలతో”దేవుడా దేవుడా ”అంటూ  తాను  భయపడుతూ మనల్ని భయపెట్టిన  అమాయక అమ్మాయిగా తెలుగులో ఆమె నటన శిఖరోరోహణమే చేసింది   .అతి లోక సుందరిగా అప్సరసగా ,ముద్దుముద్దుమాటలతో హృదయాలనే గిలి గింతలు పెట్టించింది .మిస్టర్ ఇండియా హిందీ సినిమాలో ఆమె నటన కు జనం హారతులు పట్టారు .వందేళ్ళసినీ చరిత్రలో గ్రేటెస్ట్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందింది . సభ్య శృంగారాన్ని తన అంద  చందాలకు జోడించి నటించి ఎదిగిన మహోన్నత అందాలనాటి శ్రీదేవి అమరలోకానికి చేరుకొని సినిమా రంగానికి తీవ్ర లోటు కలిగించింది .
అమృత హాస్యనటుడు గుండు హనుమంతరావు అందాలరాశి ,అతిలోక సుందరి సహజ నటి శ్రీ దేవి మరణాలకు విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మ లకు శాంతికలగజేయమని  భగవంతుని కోరుతున్నాను -దుర్గాప్రసాద్ 

— Inline image 1Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –

284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )

13 వ శతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ జయదేవ మిశ్రానే పీయూష వర్ష అంటారు .సుమిత్ర,మహాదేవ ల పుత్రుడు .కౌండిన్య గోత్రుడు .అమృతం లాంటికవిత్వాన్ని వర్షిస్తాడు కనుక జయదేవ మిశ్రాను ‘పీయూష వర్ష ‘’అంటారు .ఈయన రాసిన ఏడు అంకాల ప్రసన్నరాఘవం నాటకం .రసార్ణవం రాసిన సింహభూపాలునికి ఈ కవి బాగా తెలుసు .1464 కు చెందిన పక్షధర జయదేవుడు విష్ణు పురాణం రాసినట్లు తెలుస్తోంది .

285- ధూర్త విడంబన నాటక కర్త –అమరేశ (14 వ శతాబ్దం )

సర్వేశునికొడుకు అమరేశ లేక అమరేశ్వర బ్రహ్మదత్తుని మనవడు .దరిహర వంశం లో  బ్రహ్మపుర శాఖకు చెందినవాడు .ఇతను రాసిన రెండంకాల ధూర్త విడంబన నాటకం హాస్యం పుట్టిస్తుంది.

286-ధూర్త సమాగమ నాటకకర్త –కవి శేఖరాచార్య జ్యోతిరేశ్వర (1240)

ధర్మేశ్వరుని కొడుకు దీరేశ్వరుని మనుమడు జ్యోతిరేశ్వర హరి సింహ దేవుని ఆస్థానకవి .ఇతని ధూర్త సమాగమం ఏకాంకిక .సుల్తానులను ఓడించిన తనరాజు జైత్ర యాత్ర సందర్భంగా రాశాడు .దురాచార ,అతని గురువు విశ్వనగర అనంగ సేనను ప్రేమిస్తారు . ఎవరికి వారు ఆమె తనకే దక్కాలని ప్రయత్నిస్తారు .ఆమెకు ఈవిషయం తెలిసి వారిద్దరిమధ్య తగాదా పరిష్కరించుకో మంటుంది .ఎత్తులు జిత్తులు  విదూషకుని ప్రవేశాలతో బాగా రక్తి కట్టించాడు కవి .ఈ కవి మరోప్రహసనం ‘’ముండజత ప్రహసనం కూడా  ‘’రాశాడట .మిధిల నేపధ్యంగా నాలుగు నాటకాలు వచ్చాయి .పంచాశాయక ,రంగ శేఖర అనే మరో రెండు రచనలు జ్యోతిరేశ్వర రాశాడు .మిదిలకవులలో వచనం రాసిన వారిలో ఇతడే మొదటివాడు ఆ రచనే ‘’వర్ణ రత్నాకర ‘’.

   గౌరీ దిగంబర ప్రహసనం ను మహామహోపాధ్యాయ శంకర మిశ్రా రాశాడు . హాస్యం కారి ఊరించే ప్రహసనం .శివ పార్వతుల కళ్యాణ౦ లో  కన్యాదాన సమయం లో శివుడు తన గోత్రనామాలను, తన తండ్రి,తాత ,ముత్తాత ల పేర్లను చెప్పలేక పోతాడు . అందరు పగలబడి నవ్వుతారు .ఈ కవి మరో రెండు నాటకాలు  -మనోభావ ప్రభావం ,కృష్ణ వినోదం రాశాడు .కాని అలభ్యాలు

287-అతంద్ర చంద్రిక నాటకకర్త –జగద్ధార(17 వ శతాబ్దం )

మహా మహోపాధ్యాయ జగద్ధార లేక జగన్నాధ ఉపాధ్యాయ గోకులనాధ ఉపాధ్యాయుని తమ్ముడు .ఘర్వాల్ రాజు ఫతే షా కోసం అతంద్ర చంద్రిక నాటకం రాశాడు .ఇతడు గోమ్దీ మిశ్రా సంప్రదాయం లోసారయాన్త్రి విభాగం లో  పదవ గురువు .

మహోపాధ్యాయ వంశ మణి ఝా ‘’గీతా దిగంబర ‘’నాటకం రాస్తే ఖాట్మండులో ప్రతాపమల్ల రాజు 1655లో పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రదర్శించారు .

17 వశతాబ్దం లో త్రిభాషా నాటకాలు వచ్చాయి .అందులో గోవిన్దమిశ్ర నలచరిత ,రామదాస ఝా –రాదా  కృష్ణుల అమర ప్రేమను నాలుగంకాల నాటిక’గా రాసిన ’ఆనంద విజయం’’ ,దేవాన౦దుని ‘’ఉషారణ ‘’ప్రసిద్ధాలు .

18 వ శతాబ్దం లో బాలకవి క్రిష్ణదత్త  కువలయాశ్వీయ ,పురంజన చరిత్ర నాటకాలు రాశాడు .మొదటిది 7 ,రెండవది 5 అంకాల నాటకాలు .

1856- 1924 కాలం వాడు మహామహోపాధ్యాయ పరమేశ్వర ఝా ‘’మహిషాసుర వధ నాటకం ‘’రాశాడు .మహామహోపాధ్యాయ హర్షనాధ ఝా (1847-1898)అయిదు అంకాల రెండునాటకాలు ‘’ఉషార్నవ ‘’మాధవానంద రాశాడు

288-జానకీ పరిణయ నాటకకర్త -దేవకీ నందన(1840 )

ముకుంద ,మధుసూదన ,దేవకీ నందన అని పిలువబడిన ఈకవి అభిరామకవి మనవడు .నైయాయకుడుగా ప్రసిద్ధి .మహారాజా మహేశ్వర సింహా ఆస్థాన పండితుడు .నాలుగు అంకాల జానకీ పరిణయ నాటకం ఒక్కటే రాశాడు .

భాను నాధుడు మైధిలి సంస్కృత మిశ్రనాటకం ‘’ప్రభావతీ హరణం ‘’రాశాడు.

289-గజానన చరితం నాటకకర్త –శివానంద మిశ్రా(1880-1930)

1880లోపుట్టిన శివానంద మిశ్రా గజానన చరితంఅనే 7 అంకాల  నాటకం రాశాడు .కృష్ణ సింహ ధక్కూర శిష్యుడు .ఖండ బాల వంశీకుడు .1930 లో 50 ఏళ్ళకే చనిపోయాడు

290-అర్ఘ్య లంబోదర నాటకకర్త –రవినాద ఝా(19 వశతాబ్దం )

రావినాద ఝా బాబుదత్త ఝా కొడుకు .మందార వంశీకుడు కాశ్యప గోత్రీకుడు .తాధి గ్రామ నివాసి .మహా వ్యాకరణ వేత్త .ముజఫర్ పూర్ డి ఎస్ ఎస్ కాలేజి వ్యాకరణ శాఖ హెడ్ గా పని చేశాడు . గణేశుని ప్రతాప పరాక్రమాలను తెలియ జేసే ‘’అర్ఘ్య లంబోదర ‘’నాటకం రాశాడు .

దేవీకాంత దక్కూర కవి దుర్గా సప్తశతి ఆధారంగా ‘’మహిషాసుర వధ ‘’నాటకం రాశాడు .

284 నుండి  290 వరకు ఆధారం ‘’Contribution Of Midhila To Sanskrit

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –25-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment