పుస్తక మహోత్సవం లో సరసభారతి పుస్తకాలు
—
పుస్తక మహోత్సవం లో సరసభారతి పుస్తకాలు
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం
3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2
‘’భారతీ తారామాల ‘’ప్రతి జటప్రోలు సంస్థానం లో ఉన్న వెల్లాల సదాశివ శాస్త్రి గారికి చేరి విమర్శ తో ఒక పుస్తకమే రాశారు .దీనికిశాస్త్రిగారు ప్రతిఖండనం రాసి గ్రంధంగా ప్రచురించారు .శాస్త్రిగారు బెజవాడలో ఉన్నప్పుడు మరుపూరి వారు ,బాలక్రిష్ణారెడ్డి గారు సంస్కృతం అభ్యసించారు .ఆరునెలలలో తెనాలిలో ‘’ప్రౌఢ మనోరమ ‘’చదివి ఆరి తేరారు .ఇరవై రెండు ఏళ్ళ వయసులో వనపర్తి అయ్యప్పగారి కూతురు కృష్ణ వేణమ్మను మేనరిక వివాహమాడారు . ఈ సందర్భంగా శాస్త్రిగారు ‘’కాంతా స్వయం వరం ‘’కావ్యం రాశారు. ప్రతి ఏడాది మన్నెం కొండ నుండి గద్వాల జాతరకు వెళ్ళేవారు .రాణీ గారిపై శ్లోకాలు రాసి చదివారు. చివరి శ్లోకం లో ‘’ఫలకారీ ‘’అనే ప్రయోగం చేశారు .సభలోని పండిత కవి బృందం ఆనందంగా చప్పట్లు కొట్టి అభినందించారు. శృంగేరి వెళ్లి విద్యా తీర్ధ స్వామి ఆశ్రమ స్వీకార మహోత్సవం లో ‘’శారదా నవరత్న మాలిక ‘’ఆశువుగా చెప్పారు. లలితాంబ ను ద్వితీయం చేసుకొని అమ్మవారిపై .’’లలితా స్తవ ఝరి’’రెండవ కావ్యం రాశారు .రాజాపురం గ్రామప్రజలు ఏకగ్రీవంగా శాస్త్రి గారిని సర్పంచ్ గా ఎన్నుకోగా ఆయన గ్రామాభి వృద్ధికి గొప్ప కృషి చేశారు .ఒకసారి రాణి గారి ఎదుట ‘’హయగ్రీవ శతకం ‘’నుండి కొన్ని శ్లోకాలు వినిపించగా రాణి గారు ముప్పై రూపాయల వార్షికం ఏర్పాటు చేశారు .ఒక శ్లోకం –
‘’యద్రాజ్యం ప్రావి మాశ్య గుణ్య సచివం ధర్మాత్మ భీరాజభిః-సన్యాయం సజనాభి వృద్ధి సబుధా మేనం పురా రక్షితం
తుద్యు చ్ఛేజ్జన మధ్య దుర్జన క్షిత క్షోభం కలౌతే యుగే –హా కష్టం విధ వాహ్య వంతి మకుటిలా నేపధ్య మధ్యస్థితా’’
కంచికామ కోటి స్వామి గద్వాల వచ్చి రాణీ గారి ఆతిధ్యాన్ని అందుకుని ,అగ్రహారం లో శాస్త్రి గారి ఆధ్వర్యం లో భిక్ష గ్రహించిహైదరాబాద్ వెళ్ళిపోయారు .సత్సంతానం పొంది సతీ సమేతంగా తీర్ధ యాత్రలు చేసి పుణ్యఫలం మూటగట్టుకున్నారు .
27-3-1914 న ‘’యావర్ణ సప్తాహం’’ గోవింద నాయక్ నిర్వహించారు .108 బ్రాహ్మణులు రామాయణ పారాయణ ,చేయగా ,రుద్రయాగం లో 40 మందిపాల్గొనగా వేలాది మంది వీక్షించారు .12 ఏళ్ళ శాస్త్రి గారు పాల్గొన్నారు . రోజూ నాలుగు వేలమందికి భోజనం . 1927 లో హైదరాబాద్ గౌళి గూడ లో ‘’కృష్ణాజీ సప్తాహం ‘’జరిగింది .అలాగె ఉల్లెండ కొండ సప్తాహం ,పెంట్ల వెల్లి సప్తహాలలో పాల్గొని సత్కారాలు అందుకున్నారు .
శాస్త్రి గారి విద్వత్తు కు తగిన ‘’అభినవ కాళిదాస ‘’’’కవి కులాలంకార ‘’,కవి కల్ప ద్రుమ ‘’బిరుదులు పొందారు .1970 లో ఉత్తమ సంస్కృత విద్వాంసుని గా అకాడెమి గుర్తించి సత్కరించింది . అకాడెమీ అధ్యక్షులు బెజవాడ గోపాల రెడ్డిగారు .సన్మానపత్రం రాసి చదివినవారు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు .శాస్త్రిగారు కేశవపంతుల నరసింహ శాస్త్రిగారికి సుందరకాండ మంత్రోపదేశం చేసి అకాడెమీ నుండి ఆర్ధిక సాయం వచ్చే ఏర్పాటు చేయించారు .2016 కృష్ణా పుష్కరాలలో శాస్త్రి గారు 40 ఏళ్ళ క్రితం రచించిన ‘’భజే కృష్ణ వేణీం ‘’స్తోత్రాన్ని సిడి గా విడుదల చేసి గౌరవించారు .
శాస్త్రి గారి గీర్వాణ రచనలు 29 ఉన్నాయి .అందులో వాసర సరస్వతీ స్తుతి ,భారత ధరణి స్తుతి ,చెన్నకేశవ కుసుమాంజలి, చంద్ర శేఖర సరస్వతీ పంచ రత్న స్తుతి ,శ్రీ జయేంద్ర సరస్వతీ స్తుతి ,శారదా శతకం ,హయగ్రీవ శతకం ,ధూమ శకట ప్రమాదం ,రవీంద్ర తపః ఫలం ,అయ్యప్ప పంచ రత్నాలు ,జితామిత్ర స్వామి చరిత్ర ,బీచుపల్లి ఆంజనేయ సుప్రభాతం మొదలైనవి .శాస్త్రి గారి సంస్కృత రచనలోని విశేషాలను తర్వాత తెలుసుకొందాము .
ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన –‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’మోనోగ్రాఫ్
సశేషం
2018 నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-17-ఉయ్యూరు
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం
3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )
6-12-19 02 జన్మించిన తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారికి 12 వ ఏట ఉపనయనం జరిగింది .వీరిది తెలంగాణా మహబూబ్ నగర్ గోపాల్ పేట .పానుగంటి ప్రభువుల చేత ఈ కుటుంబానికి మడులు మాన్యాలు లభించాయి తలిదండ్రులు శేషమ్మ ,సుబ్బయ్య దంపతులు .ముగ్గురు సంతానం లో శాస్త్రి గారు రెండవ వారు .సాహిత్యం లో గొప్ప కృషి చేసి అభినవ కాళిదాసుగా ప్రసిద్ధి చెందారు .తొలి గురువు పల్లా యజ్ఞనారాయణ శర్మ గారు వనపర్తి చుట్టుప్రక్కల గ్రామాలకు యజ్ఞనారాయణ శర్మగారి విద్యా పీఠమే విద్యా కేంద్రం .వనపర్తి దగ్గరలో రాణిగారు భర్త పేర రాజానగరం స్థాపించి ఏటా కార్తీక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు .శాస్త్రిగారి అక్కగారిని రాజానగరం ఇచ్చారు .నగరం లోని విక్రాల వెంకటాచార్యులు ,నరసింహా చార్యులు అనే పండిత సోదరులతో మన శాస్త్రి గారికి పరిచయం కలిగింది .వెంకటాచార్యులవారు శాస్త్రిగారికి దక్షిణామూర్తి మంత్రోప దేశం చేశారు .వనపర్తి లో’’ పంచ దశలు ‘’ చెప్పుకుని ,వేదం పై మమకారం కలిగి కర్నూలు వెళ్లి ఇంద్రగంటి శేషావదానుల గారి వేద పాఠ శాలలో చేరి యజుర్వేద౦ లో ఒక అష్టకం పూర్తి చేశారు .అక్కడ పని చేస్తున్న కాళహస్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ కారణాంతరాలవల్ల కాశీ వెళ్ళిపోతే ,అక్కడే పని చేస్తున్న సాహిత్య పండితుడు వెల్లాల శంకర శాస్త్రి గారి వద్ద విజయ దశమినాడు అపరాజితా దేవి ఉత్సవాల సమయం లో శబ్ద మంజరి ప్రారంభించారు .వెల్లాల వారి బోధనా విధానం ప్రత్యేకం .శ్లోక వివరణలో శబ్దాలు కారకాలు ,ధాతువులు ,లకారాది సంధి ,సమాసం విగ్రహం వాటి సూత్రాలు వివరించి ,ఖండాన్వయ ,దండాన్వయాలు చెప్పేవారు .గురు శిక్షణ లో రాటు దేరి ఒక్క ఏడాదిలోనే కొత్త శ్లోకాన్ని ఆన్వయించుకునే శక్తి కలిగింది .
సంస్కృతానికి అప్పుడు కోనసీమ’’ ఆంధ్రా కాశ్మీర్’’ గా ఉండేది .మోడెకుర్రు చేరి శ్రీపాద సుబ్బరాయ శాస్త్రి గారి వద్ద విద్య నేరుస్తూ భారవి నాలుగు ,మాఘం రెండు సర్గలు ,భోజుని రామాయణ చంపువు ఆరు కండలు పూర్తి చేశారు .అక్కడ’’అనధ్యయన కాలం’’ త్రయోదశి నుండి విదియ వరకే. పాఠాలు లేని ఆ నాలుగు రోజులలో లో గృహస్తులు వచ్చి విద్యార్ధులను తమ ఇళ్ళకు భోజనాలకు పిలిచేవారు . శిష్యులు కర్రా ,చెంబు పట్టుకుని ఆతిధ్యానికి వెళ్ళేవారు వారి ఆతిధ్యానికి ఏ లోటూ ఉండేదికాదు .దక్షిణా లభించేది .ఇలా కోనసీమలో ఏడాది గడిపారు .మళ్ళీ కర్నూలు వెళ్లి కాశీ వఝల సత్యనారాయణ శాస్త్రిగారివద్ద కౌముది అభ్యసింఛి నాటుకోటు శెట్టి అన్నామలై శెట్టి స్థాపించిన కాళహస్తి సంస్కృత పాఠ శాలలో చేరి చదివారు .సకల సదుపాయాలతో పాఠశాలలో ఉన్నా అక్కడి నీరు పడక ,ఉండలేక కృష్ణాజిల్లా ‘’ఆకిరిపల్లి ‘’చేరి ,విద్వత్ పరీక్షలో జానకీ పరిణయం , ,భాగవతం బహుమతులుగా అందుకున్నారు వీరికి అక్కడ సూరి మార్కండేయ శాస్త్రి,సంగమేశ్వర శాస్త్రి గార్లు సహాధ్యాయులు .గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపుకు స్పందించి తన దుస్తులు కాల్చేసి ఖద్దరు ధారణ ప్రారంభించారు .ఇక్కడ వీరిని ‘’నైజాం శాస్త్రి ‘’అని పిలిచేవారు పాఠశాల లోని పెద్ద గ్రంధాలయాన్ని శాస్త్రి గారే నిర్వహించేవారు .తర్వాత బందరు దగ్గర చిట్టి గూడూరులో వరదాచార్యులవారి సంస్కృత పాఠ శాలలో చేరి,గొడవర్తి యతి రాజాచార్యులవద్ద వ్యాకరణం ,గరికపాటి సుబ్బయ్యగారి వద్ద కావ్య పాఠం నేర్చారు .ఆచార్యులగారి ఇంటికి వెళ్లి అలంకార శాస్త్రం చెప్పించుకున్నారు పాఠశాలలో కౌముది ,ఇంటి వద్ద చంద్రా లోక, కువలయానండాలు ,సాహిత్య దర్పణ ,ప్రతాప రుద్రీయాలు పూర్తి చేసి హర్ష చరిత్ర ,దశకుమార చరిత్ర చదివారు .అంతా బాగానే ఉన్నా చిట్టి గూడూరు నీరు వీరికి పడలేదు .
బందరులో కోపల్లె హనుమంతరావు గారు ఏర్పరచిన జాతీయ కళాశాలలోవ్యాకరణ పండితుడు కంభం పాటి రామమూర్తి గారి సిఫారసుతో చేరి,’’వారాల భోజనం ‘’చేస్తూ చదివారు . వారాలిచ్చినవారిలో డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారూ ఉన్నారు .వేదాల రంగాచార్యులు తెలుగు ,సుసర్ల సుబ్బారావు గారు (సంస్కృతం బి ఏ ఆనర్స్) శాస్త్రి గారి తో తెలుగు నాటకాలు చదివి౦చుకునేవారు విశ్వనాధ వారు శాస్త్రిగారి ఇంటికి వచ్చి గీత గోవిందం చెప్పించుకునేవారు. శాస్త్రి గారి క్లాస్ మేట్స్ బెజవాడ గోపాల రెడ్డి ,మరుపూరు కోదండ రామి రెడ్డి బాలకృష్ణా రెడ్డి ,కౌతా ఆనందమొహన్ , కౌతా రామ్మోహన్ గార్లు .ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు తన కుమారుడు అర్జునరావు ను శాస్త్రి గారింటి వద్ద సంస్కృతం నేర్చుకునే ఏర్పాటు చేసి కళా శాలలో చేర్పించారు .అప్పుడు బందరు తుఫాను వచ్చి అతలాకుతలం చేసింది. శాస్త్రిగారు ఆశువుగా తుఫాను భీభత్సాన్ని శ్లోకంలో బంధించారు –
‘’హా కష్టం పర దేశ దూర గమనం తత్రాన్య గేహే స్థితిః –కష్టాత్ కష్టతరాత్య నాదరమయే ,వారాన్న భుక్తి ర్విధే
కష్టం తత్రహి భుక్తి వర్ణిత దినం తత్రాప్య పాఠం దినం –నైవం కష్టయుతే జనే తవ కథం కించిత్ గయా నాస్తి భో ‘’
బందరులో ఉన్నప్పుడే గాంధీ 1922 -23 లో బెజవాడ వస్తే వెళ్లి దర్శించుకున్నారు .ఆ ఏడాదే శాస్త్రి గారి స్వప్నం లో వీణాపాణి సరస్వతి దర్శనమిచ్చింది ఆ క్షణం నుంచే శాస్త్రి గారికి కవితా ధార అలవడింది .వెంటనే ‘’భారతీ తారామాల ‘’27 వృత్తాలలో రచించి గురువుగారికి చూపి మెప్పుపొంది స్నేహితుడు దుర్గా మల్లికార్జునం అయిదు వందల రూపాయలు ఖర్చు చేసి అచ్చు వేయించి అందజేశాడు .కాకినాడ కాంగ్రెస్ సభలకు వెళ్లి ఆ పుస్తకాలన్నీ ఉచితంగా పంచేశారు .
సశేషం
20 18 నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-17 –ఉయ్యూరు
—
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం
2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం )
అప్పాల వారు ‘’శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతి శేఖరం –భావనా బలసంపన్నం భావానంద గురుం భజే ‘’అనే శ్లోకం తో తండ్రిగారైన భావానంద భారతీ స్వామిపై స్తోత్రం రాశారు .ఈశ్లోకం ఒక మహా మంత్రం లాంటిది. ఆశ్రమం లో ప్రతి రోజూ ఏకార్యక్రమం జరిగినా ఈ శ్లోకం తోనే ప్రారంభిస్తారు .శివ,కృష్ణ,ఆంజనేయ ,రాజరాజేశ్వరి లపై స్తోత్రాలు అష్టకాలు రాశారు .’’భావ నవనీతం ‘’,’’ప్రపన్న శతకం ‘’’’నమామి మురళీధరం సంస్కృత శ్లోకాలు రచించారు భావనవనీతాన్ని ప్రశంసిస్తూ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ‘’అక్షరాంజలి ‘’పేరుతో తమ అభిప్రాయం తెలిపారు ‘’అత్యంత గహనమై ,దివ్య మాధుర్య సంభరితమైన రాదా కృష్ణ తత్వాన్ని అనుభూత మొనర్చుకున్న మహాత్ములు అప్పాలవారు .ప్రతి రచనలో మృదు మధుర పదజాలం భక్తియుత గాంభీర్యం ,భావానుగణమైన నాద లయ త్రివేణులై ప్రవహిస్తాయి .దర్శించిన అనుభవానికి భక్త్యావేశం తో పెల్లుబికిన అక్షరాకృతి .ఈ స్తోత్రాలన్నీ మంత్రం స్వరూపాలే. వీటి పఠనం దేవతా తాదాత్మ్యాన్ని ప్రసాదించే అనుభూతి ప్రధాన గీతాలు ‘’అన్నారు .ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారు ‘’భావనవనీత మిద మాస్వాదమానామ వశ్యమేవ భక్తానాం హృదయం హరి ప్రియం నవనీతం జాయతే ఇత్యత్ర న సందేహ లేశః –తేన తేషా మపి జీవనం భావనవనీత తాదాత్మ్య మనుభవతి –జడమపి సచేతన మనేన భావతీత్యాశానే ‘’అని అమూల్యాభిప్రాయం తెలిపారు
‘’శ్రీ రుక్మిణీ విమల చారు ముఖాబ్జ భ్రుంగ-శ్రీ రాధికా రసిక శేఖర మంగళా౦గ’’అంటూ శ్రీ పాండురంగ సుప్రభాతం రాశారు –‘’స్వామిన్ దయానిధే –భవ సింధు మధ్యే మగ్నం విహాయ కధమద్య సుఖేన శేషే ?మా ముద్ధరస్వ సమయో న హి దీనబంధో –శ్రీ పాండురంగ భగవం స్తవ సుప్రభాతం ‘’.తండ్రి భావానంద స్వామి పై సుప్రభాతం రాస్తూ ‘’భావానంద యతీంద్ర జాగృహి గురో –భక్తౌఘ చింతామణే’’అని నిద్ర లేపారు .జగద్గురు శ్రీ శంకరాచార్యులవారి శివ పంచాయతనం గురించి స్తోత్రం రాసి –‘’గౌరీ పతే !భవతు తే శివ –సుప్రభాతం ‘’మకుటం తోశివుని ‘’ఉత్తిష్ట హే౦బ లలితే తవ సుప్రభాతం ‘’అని లలితమ్మ వారినీ ,’’లక్ష్మీ పతే భవతు తే శుభ సుప్రభాతం ‘’అంటూ నారాయణమూర్తినీ ,’’శ్రీ విఘ్నవారక –విభో తవ సుప్రభాతం ‘’అని గణపతి ని ,’’చాయా పతే –భవతు తే సుప్రభాతం ‘’అని సూర్యుడిని అలాగే కాలభైరవుడినీ ,వీరభద్రుడినీ చేర్చి శివ పంచాయతన సుప్రభాతం రాశారు .’’భావయామి నిరంతరం మామ మానసే మురళీధరం’’అంటూ మురళీ సప్త వింశతి స్తోత్రం రాశారు .’’ఘనశ్యామః కృష్ణో వసతు మమహృద్ధామ్నిసతతం ‘’అంటూ శ్రీ కృష్ణ ప్రేమాస్టకం’’’’భజే సర్వదా చిన్మయం రుద్ర దేవం ‘’అని రుద్ర దేవాస్టకం మహా భక్తి యుతంగా రచించారు .ఆశ్రమ క్షేత్ర పాలకుడైన ‘’బాలవీర ప్రతాప మారుతి ‘’పై స్తోత్రం మొదలైనవి నిత్య పఠనీయం గా రచించి మధుర భక్తి ప్రవాహాన్ని పారించారు . శ్రీ ఆంజనేయ స్వామికి బెల్లం తో చేసిన ‘’అప్పాలు ‘’నైవేద్యం మహా ఇష్టం . వాటిరుచి దేనికీ రాదు .అప్పాల ఇంటిపేరున్నశర్మగారు తాము రచించిన స్తోత్ర, సుప్రభాతాదులలో ఆ ‘’అప్పాల మాధుర్య రుచి’’చూపించి ఇంటిపేరు సార్ధకం చేసుకున్నారు . పాండు రంగాశ్రమ నినాదం శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంతం ,–‘’నాదం సాధం ‘’అంటే భగవన్నామాన్ని నాదయుత౦ గా జపించటం ,సాధం అంటే వచ్చినవారికి ఆప్యాయంగా భోజనం పెట్టటం . దీనిని అప్పాల విశ్వనాధ శర్మగారి తండ్రిగారు ,కుమారుడు కూడా శ్రద్ధగా అమలు పరచి నామ గానాన్ని తెలంగాణా ప్రాంతమంతా విస్తరింప జేశారు .పాండురంగ ఆశ్రమం లో భోజనం అంటే ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తజనం వచ్చి ప్రసాదంగా భావించి భుజించి వెళ్ళేవారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-17 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 (నాలుగవ భాగం )
సాహితీ బంధువులకు వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలు –
—
మా అబ్బాయి శర్మ గ్రంధ ద్వయ ఆవిష్కరణ సభకు ఉయ్యూరు వస్తూ కెసిఆర్ సభలలో అమ్మకానికి పెట్టిన 15 రూపాయల పుస్తకాలు 5 తెచ్చాడు అందులో సంస్కృత కవుల గురించి ఉన్న పుస్తకాలలో ఇప్పటికి మనం తెచ్చిన మూడు గీర్వాణాల లో లేని కవులు కనిపించారు .నిన్న డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ‘’నేను రాయకుండా వదిలేసినా సంస్కృత కవులు ఎవరైనా ఉంటె చెప్పి వారి వివరాలు ఇవ్వండి ‘’అని అడిగితె ‘’అన్నగారూ !దాదాపు అందర్నీ రాశారు .కాని కొందరికి వాటిలో చోటు దొరకలేదు ‘’అని సుమారు పది మందికవుల పేర్లు చెప్పారు .కాశీ వెళ్ళాక వారి వివరాలు సేకరించి పంపిస్తానన్నారు .ఇలా ఒక సారి వారబ్బాయి ఛి డా జయమానిక్య శాస్త్రి కూడా చెప్పాడు .కాని ఫలితం కనిపించలేదు ఇంతవరకు .సరే ఇవాళ పవిత్రమైన ముక్కోటి ఏకాదశిపర్వదినాన ముక్కోటి దేవతలా ఆశీస్సులతో మా శర్మ ఇచ్చిన వాటిలో శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి రాస్తూ నాలుగవ గీర్వాణం కు శ్రీకారం చుడుతున్నాను .చూద్దాం ఎంత మంది దీనిలో చోటు చేసుకొంటారో ..మీకు తెలిసిన ,నేను స్పృశించని సంస్కృత కవులు ఎవరైనా మీకు తటస్థ పడితే వారి పేర్లు వివరాలు అందించి సహకరించమని మనవి చేస్తున్నాను .
గమనిక –అని చెబుతూ నేను గీర్వాణం -1 లోనే శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి ‘’సంస్కృతమే అన్నీ ‘’శీర్షికతో రాశాను అన్నసంగతి విస్మరించి మళ్ళీ శాస్త్రిగారి గురించి నిన్న నాల్గవ గీర్వాణం లో మొదటి కవిగా వారి గురించి రాసి అందరికీ పంపాను .ఇవాళ నేను చేసిన పొరబాటు గ్రహించాను .అందులో ఉన్నవి ఇందులో లేనివి కలిపి సమగ్ర మైన సరి కొత్త వ్యాసం(రివైజ్డ్ ) రాసి అందిస్తున్నాను . నాలుగవభాగం కప్పగంతుల వారితోనే ప్రారంభం . మరోపొరబాటు కూడా దొర్లింది .శాస్త్రి గారి బిరుదు ‘’ఆంధ్ర బిల్హణ’’అయితే నిన్నటి వ్యాసం లో ‘’ఆంధ్ర కల్హణ ‘’అని నేను రాశాను .నా కుప్పి గంతులకు ,కప్ప గంతులకు ఈ ‘’కప్పగంతుల ‘’వారి పై ఈ వ్యాసమే సాక్షి –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-12-17 –ఉయ్యూరు
1-,ఆంధ్ర-సంస్కృత నిఘంటు కర్త – ‘’ఆంధ్ర బిల్హణ’’- శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి (1911 –1981)9( మార్పులు చేర్పులుచేశాక )
బాల్య విద్యాభ్యాసాలు
శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వెలనాటి బ్రాహ్మణ శాఖలో కప్పగంతుల శ్రీనివాసులు ,శ్రీమతి పద్మావతి దంపతులకు 2-7-1911 న మెహబూబ్ నగర్ జిల్లా వనపర్తి లో జన్మించారు.తండ్రి ,తల్లి ఉభయ వంశాలు పాండిత్య కవిత్వాలకు ప్రసిద్ధి చెందాయి . ఇరువంశాలవారు ‘’ శ్రుతి స్మృతి ప్రేస్టాధ్వర ప్రజ్ఞులు’’.శాస్త్రిగారి విద్యాభ్యాసం అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద జరిగింది .1930 లో తిరుపతి లో ఉన్నత విద్య నేర్చారు .చిన్ననాటనే తండ్రిని కోల్పోయిన శాస్త్రిగారిని వనపర్తి వాస్తవ్యులు స్వాతంత్ర సమరయోధులు వదాన్యులు అయిన ‘’వామన నాయక్ ‘’ పుత్ర వాత్సల్యం తో ఆదరించి విద్యా బుద్ధులు నేర్పారు .
లక్ష్మణ శాస్త్రి మురారి వలెనె ‘’గురుకుల క్లిస్టుడు’’.తిరుపతి వెంకటేశ్వర సాస్కృత కళాశాలలో పదేళ్ళు అలంకరణ –వ్యాకరణ శాస్త్రాలు చదివి స్నాతక పరిణతి పొందారు .’’సాహిత్య శిరోమణి ‘’పట్టా పట్టుకొని మద్రాస్ చేరి మైలాపూర్ సంస్కృత కళాశాలలో అద్వైత విద్యలో ఆరితేరి ‘’విద్వత్ శిరోమణి’’ అని పించారు .అన్నామలై విశ్వ విద్యాలయం లో శ్రీ పులిసి కృష్ణమాచార్యులు ,లక్ష్మీ నరసింహ శాస్త్రి ,సేతు మాధవరావు ,కురు౦గళం కృష్ణ శాస్త్రి ,రామ చంద్ర దీక్షితులు ,వెంకటేశ్వర దీక్షితులు ,చక్రాల నరసింహా చార్యులు ,గిరిధరాచార్యులు వంటి ఉద్దండుల వద్ద వ్యాకరణ శాస్త్రం నేర్చి వ్యాకరణ ఉద్దండ పండితులయ్యారు . తిరుపతి లో విద్య నేర్చేటప్పుడు ‘’మదూకరం ‘’ఎత్తి అంటే ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుకొని దానిని మిత్రులతోకలిసి భుజిస్తూ అయిదు నెలలు గడిపారని శ్రీ తిరుమల రామ చంద్ర ‘’భవతీ భిక్షాం దేహి ‘’శీర్షిక కింది ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’పుస్తకం లో రాశారు .అప్పటికి ఆయన వయస్సు 10 లేక 11 సంవత్సరాలు .తిరుమలవారి సహాధ్యాయి శాస్త్రిగారు
లక్ష్మణ శాస్త్రి పేరు సార్ధకం చేసుకున్నారు .లక్ష్మణుడు ఆది శేషుని అవతారం .విద్యలకు ఆయనే పెద్ద .అందుకే శాస్త్రిగారికి పారశీక ఆంగ్ల ,ఆంద్ర ,కన్నడ తమిళ హిందీ మరాటీ భాషలలో గొప్ప పాండిత్యం అబ్బింది .అనర్గళంగా ఆభాషలలో సంభాషించేవారు .వారే ‘’పారశీక మహారాష్ట్ర భవ్య తమిళ –కన్నడాంగ్ల హిందీ భాష లున్నతముగ-నేర్చి రచనలు సేయగా నేర్చినాడ –నస్మదాచార్య పాద పద్మాషిముల’’అని చెప్పుకున్నారు .
ఉద్యోగ విశేషాలు –రెడ్డి –శాస్త్రీయం
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆత్మీయ ఆహ్వాననం అందుకుని హైదరాబాద్ వివేక వర్ధినిఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరి ,తర్వాత వనపర్తి హైస్కూల్ లో పదేళ్ళు పని చేసి విశేఖ ఖ్యాతి చెందారు. వీరి శిష్యులు గురువు కీర్తిని పెంచి ఘనత వహించారు .వనపర్తి రాజా వారికి కొందరు అసూయా పరులు ‘’మూటలు మోసి ‘’అంటే చాడీలు (తాకట్లు )చెప్పి రాజుగారు వాటిని నమ్మటం తో వనపర్తి వదిలి 1947లో హైదరాబాద్ చేరారు .సిటీ కాలేజిలో కొద్దికాలం ,పనిచేసి 1948 లో ‘’సమాచార పౌర సంబంధ శాఖలో ‘’అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’పత్రిక కు ‘’ హైదరాబాద్ టుడే’’ పత్రికకు సంపాదకులుగా ,ప్రచురణ శాఖాధిపతి గా ఉన్నారు .విద్యా శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయి ప్రాచ్యభాషాబి వృద్ధికి ‘’ఓరియెంటల్ కళాశాలల’’ స్థాపనకు కృషి చేశారు .ఈ కళాశాలలో పని చేసే ఉపాధ్యాయులకు మిగిలిన డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా జీతాలు వచ్చేట్లు చేసి ,భాషా పండితులకు గౌరవప్రదమైన జీతాలు లభించేట్లు కృషి చేసి వారి విశేష మన్ననలు అందుకున్నారు 1970లో పదవీ విరమణ చేశారు .రెడ్డిగారు –శాస్త్రిగారు అనునిత్యం కలుసుకొని సాహితీ చర్చలు చేసేవారు .రెడ్డిగారు తమశబ్ద ‘’రత్నాకరం ‘’శాస్త్రిగారికి కానుకగా అందించారు .ఈ నిఘంటువులో అన్నిపేజీలలోనూ అందులో లేని శబ్దాలను అర్ధాలను సురవరం వారు రాసుకున్నారు .ఈ గ్రంధాన్ని శాస్త్రిగారు రెడ్డిగారి స్మృతి చిహ్నంగా పవిత్రంగా దాచుకున్నారు .శాస్త్రిగారిని రెడ్డిగారు నిజంగా నే ‘’సురవరం ‘’అయ్యారు .సంస్కృత భాష ‘’స్పెషల్ ఆఫీసర్ ‘’గా కొనసాగి ,దేశమంతా పర్యటించి ,గీర్వాణభాషావ్యాప్తికి నిరంతర కృషి చేశారు .సమాచార శాఖలో మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్ అయి ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకులయ్యారు .
ప్రతాపరెడ్డిగారు హైదరాబాద్ లో తెలుగులో పటిష్టమైన రచయితలను తయారు చేసే ఉద్దేశ్యం తో మిత్రులతో కలిసి ‘’విజ్ఞాన వర్ధిని పరిషత్ ‘’స్థాపింఛి ‘’మృత్యు సిద్ధాంతం ,ఆంద్ర ప్రతాప రుద్ర యశోభూషణం ,అలంకార వసంతం ,,గంగాపుర మహాత్మ్యం ,రామాయణ విశేషాలు మొదలైన చాలాపుస్తకాలు ప్రచురించారు .ఇదంతా గోల్కొండ పత్రిక కార్యాలయం లోనే జరిగేది .దీని సభ్యులలో ముఖ్యులు కప్పగంతులవారు కేశవ పంతుల నరసింహ శాస్త్రి, ఖండవల్లి లక్ష్మీ రంజనం వంటి ప్రముఖ సాహితీ దిగ్గజాలున్నారు .శాస్త్రిగారు ఎన్నో గ్రంధాలను అనువదించారు .
కుటుంబం
శాస్త్రిగారి తల్లి పద్మావతి గారు ,భర్త ను కోల్పోయి కుమారుడిని వనపర్తి నుంచి తిరుపతి తీసుకు వెళ్లి పట్టు బట్టి సంస్కృత౦ నేర్పించిన మాతృమూర్తి అనేక భాషలలో రాణించటానికి విద్యలో ఉన్నతస్థానం సాధించటానికి తన మాతృ మూర్తియే కారణం అని శాస్త్రి గారు చెప్పుకున్నారు . ‘’పద్మావతీ పుత్రుండ ,లక్ష్మణ కవీన్ద్రుండ’’అని రాసుకున్నారు ఆమెతో కాశీ మొదలైన క్షేత్ర యాత్ర చేయించి ,భాగవత సప్తాహాలు నిర్వహించి మాతృభక్తిని చాటుకున్నారు .
శాస్త్రిగారి భార్య అన్నపూర్ణమ్మ గారు అపర అన్నపూర్ణా దేవిగా వ్యవహరించేవారు ‘’అన్నపూర్ణ కు నుద్దియౌ నన్నపూర్ణ ‘’అని చెప్పుకున్నారు .శాస్త్రి గారి మరణా నంతరం ఆమె .ఆయన తెలుగు వచనం లో రాసిన ‘’వ్యాస భారతం ‘’ను తనవద్ద ఉన్న కొద్ది ధనం తో ముద్రించి భర్త కీర్తి వ్యాప్తికి కి కారణభూతులయ్యారు .ఇందులోని ఏడుపర్వాలకు కుమార్తె డా శ్రీమతి కమల సంపాదకత్వం వహించారు .సంస్కృత విద్యలో ఆరితేరిన కమల ఎం ఏ చేసి ‘’సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ లాంగ్వేజెస్ ‘’పొందింది .ఉస్మానియాలో ‘’లైఫ్ ఇన్ ఎన్శేంట్ ఇండియా యాజ్ డేపిక్టేడ్ఇన్ ప్రాకృత్ లిటరేచర్ ‘’అంశం పై పరిశోధన చేసి పి హెచ్ డిపొందింది . ఉస్మానియాలో సంస్కృత లెక్చరర్ గా ప్రొఫెసర్ ,శాఖాధిపతి గా ఉన్నది. ’’సంస్కృత భాషా సేవ ‘’అవార్డ్ అందుకున్నది .పదవీ విరమణ తర్వాత కూడా భండార్కర్ ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్ గ్రంధాలయం తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నది .’’నేను సంస్కృతం నేర్చింది ఋషులు ,మునులు పుట్టిన భారత దేశం లో ప్రచారం చేయటానికే కాని ,భారతీయ ఆత్మను గ్రహించలేని యూరోపియన్లకు కాదు .భారతీయ సంస్కృతీ ,సంస్కృతం పెనవేసుకొన్నాయి కనుక ఆ భాష ఇక్కడే బాగా రాణిస్తుంది ‘’అని డా కమల దృఢ విశ్వాసం
శాస్త్రి గారి జైత్ర యాత్ర
1944 లో వనపర్తి ప్రభువు ఆస్థానం లో ఆస్థాన విద్వాంసులుగా గౌరవ స్థానం అలంకరించారు శాస్త్రిగారు .మూడవ రామేశ్వరరావు పట్టాభి షేకం జరిగినప్పుడు శాస్త్రిగారు ‘’నవరత్నాలు ‘’రాసి ఉపదగా అందించారు .ఆస్థానం లో జరిగే కవి గాయక విద్వత్ సభలలో శాస్త్రిగారిదే అగ్ర తాంబూలం .చాలా సంస్థానాలు సందర్శించి కవిత్వ పాండిత్య ప్రకర్ష చేత మెప్పించి ఘన సత్కారాలు అందుకున్నారు.
లక్ష్మణ రచనా శాస్త్రీయం
‘’సంస్కృత భాష పాఠమాల’’ను రెండుభాగాలలో శాస్త్రిగారు రచించారు .ఆంద్ర –సంస్కృత నిఘంటువు ను ఆచార్య శ్రీ పుల్లెల రామచంద్రుడుగారితో కలిసి కూర్చారు .మాదిరాజు విశ్వనాధ రావు అనే కవితో కలిసి సంస్కృతం లో బిల్హణకవి రచించిన ‘’విక్రమాంక దేవ చరిత్ర ‘’కావ్యాన్ని ‘’కర్ణ సుందరి నాటకాన్ని ప్రబంధ శైలిలో ఆంధ్రీకరించారు . ‘’విజ్ఞానసర్వస్వం ‘’,’’సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం ‘’లలో నూ వివిధ పత్రికలోనూ లెక్కకు మించిన వ్యాసాలూ రాశారు .మణిమంజూష కధలు రాశారు ,వ్యాసభారతం ,బదరీశతకం బౌద్ధ దర్శనం శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల యతీంద్రుల ‘’సూర్యోప రాగ దర్పణం ‘’సంస్కృత రచనకు తెలుగులో తాత్పర్యం భారతీయసదా చార్ వ్యవహార –హిందీ రచనకు తెలుగు అనువాదం చేశారు .’’శాస్త్రీయ విజ్ఞానం ‘’వ్యాససంపుటికి సంపాదకత్వం వహించారు .అమర సాహిత్యం తెలంగాణా నాటకాలు వసంత సేన ,మహాకవి శ్రీ హర్షుడు మొదలైన 8 వ్యాసాలూ రాశారు .లెక్కలేనన్ని రేడియో ప్రసంగాలు చేశారు.శాస్త్రి గారి 101 జయంతినాడు ‘’లక్ష్మణ రేఖలు –భారతీయ సదాచార వ్యవహార దీపిక ‘’ను శాస్త్రి గారి కుమారుడు డా ప్రభాకర శాస్త్రి వెలువరించారు.సంస్కృత ,కన్నడ తెలుగు మళయాళ మరాటీ ,ఉర్దూ హిందీ ,పారశీక భాషలలో అనర్గళంగా ప్రసంగించే నేర్పున్నవారు .ఏభాష వారు కనిపిస్తే ఆభాష తోనే వారితో మాట్లాడేవారు .ఈ భాష రచనలను తెలుగులోకి అనువదించిన నేర్పరి ..భారత ప్రధమ రాష్ట్రపతి డా శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ సందర్శించినపుడు లక్ష్మణ శాస్త్రిగారు కావ్య ప్రబంధ ధోరణిలో స్వాగత శ్లోకాలు రాసి ఆహ్వానించారు .ఆ శోభ చూద్దాం –
‘’నిష్ణాతః ప్రాచ్య విద్యా స్వనితర ధిషణే-దుర్గమే రాజ్య తంత్రే –విద్వాన్ పాశ్చాత్య తంత్రేష్వఖిల భారత భూ –వాసినాంభాగ్య సీమా –రాజ్యానామ్ పాలనే చ ప్రభురతి నిపుణో-ప్యప్రద్రుశ్యొభిగ్యః –జీయాత్ రాజేంద్ర విద్వానతి శత శరద౦ –భారతం సేవమాన ‘’
పురస్కార బిరుద ప్రదానాలు
లక్ష్మణ శాస్త్రిగారు కాశీ సంస్కృత విశ్వ విద్యాలయం ,ఆంధ్రా ,ఉస్మానియా విశ్వ విద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా గౌరవి౦పబడి ఎనలేని సేవ లందించారు .హైదరాబాద్ లో ‘’సురభారతి ‘’వ్యవస్థాపక అధ్యక్షులు .’’ఆంద్ర సారస్వత పరిషత్ ‘’స్థాపక అధ్యక్షులు .2-1-1844 న తిరుపతి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్ధులు ‘’ఆంద్ర బిల్హణ ‘’బిరుదు ప్రదానం చేశారు .వారి సన్మాన పత్రం లో మచ్చుకు ఒక శ్లోకం –‘’ఆంధ్రీ సంస్కృత దేశ వాగ్విలసితా భాషామలారాజతే –శబ్ద ద్వంద్వ మిదం మనోజ్ఞ మధురం ,కర్తుం సుదీర్బిల్హణః-శ్రీమల్లక్ష్మణ-విశ్వనాథ కవి రాడ్రూపేన విద్యోతతే –ఏతావాంధ్ర సరస్వతీ పతివరౌ శ్రీ బిల్హ ణౌ రాజతాం ‘’ .ఇదికాక ‘’విమర్శక శిరోభూషణ ,సుధీంద్ర మౌళి మొదలైన సార్ధక బిరుదులెన్నో శాస్త్రిగారిని . ఉత్తర ప్రదేసశ్ మదన మోహన మాలవ్యా విద్యా సంస్థాన్ ‘’సుధీంద్ర మౌళి ‘’బిరుదం తో సత్కరించింది .’’బ్రహ్మ భూషణ ‘’వీరి సాహితీ గరిమకు లభించింది .కాశీ విద్వత్ పరిషత్ ‘’మహా మహోపాధ్యాయ ‘’నిచ్చి ఘన సన్మానం చేసింది .తిరువాన్కూర్ ,గ్వాలియర్ సంస్థానాదిపతులు జగద్గురు శంకరాచార్యులవారు శాస్త్రిగారిని ఘనం గా అపూర్వంగా సంమానించారు.విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి నిర్వహణ లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహా సభలలో లక్ష్మణ శాస్త్రిగారికి ప్రత్యేక సన్మానం చేశారు .శాస్త్రిగారిని సన్మానించి వారి ఉపన్యాస లహరిలో తడిసి ముద్దై గౌరవించని సాహితీ సంస్థ లేదు అంటే అతి శయోక్తి కాదు .లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు .వీలైనప్పుడల్లా వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఆప్రాంత భాషలో అనర్గళంగా ప్రసంగించి నివ్వెర పోయేట్లు చేసేవారు .వారి పాండితీ గరిమ అంతటిది . వీరి ఆధ్వర్యం లో ఏర్పడిన ‘’సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం ‘’కు అధ్యక్షులుగా ఉన్నారు శాస్త్రి గారి గీర్వాణ భాషా పాండిత్యానికి ముగ్ధులైన పండిత ద్వివేదీ శాస్త్రి సంస్కృతం లో వీరిని –‘’మూర్తిర్మత్త గజేంద్ర దర్ప దళినీ వాణీ వినోద ప్రియా –వ్యాఖ్యా లేఖ కవిత్వ కౌశల కళా పారంగతా,శేముషీ –శక్తిః సంస్కృత భాషణే ష్యనుపమావిద్వజ్జనే ష్వాదరః –శ్రీమల్లక్ష్మణశాస్త్రిణా౦ గుణ గణాః కేషాంస తోషా సహాః’’అని ప్రస్తుతించారు . ప్రధాని పివి నరసింహారావు గారి తో చాలా సన్నిహిత సంబంధం శాస్త్రిగారికి ఉన్నది. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొని వన్నె తెచ్చారు
శాస్త్రిగారు తుది శ్వాస వదిలే వరకు ‘’కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’ఎమిరిటిస్ ప్రోఫెసార్ గా (సమ్మాన్య ప్రాచార్యులు )గా ఉన్నారు .శాస్త్రిగారికి అందరూ మిత్రులే .వారికి తర తమ భేదం లేదు .అందరూ ఆయనకు ఆత్మీయులే ,మిత్ర బృందం లోని వారే అంతటి అజాత శత్రువు శాస్త్రిగారు .80 సంవత్సరాల సార్ధక జీవనం గడిపి 10-1-1981 న మహామహోపాధ్యాయ ఆంద్ర బిల్హణ శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనే సంస్కృత వాజ్మయ శిఖరం నేల వ్రాలినది .
ఆధారం—1- ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణగా ‘’తెలంగాణా మహనీయులు’’ పేరుతో శ్రీ సంబరాజు రవి ప్రకాశరావు రచించిన ‘’కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ‘’మోనోగ్రాఫ్
2- నా రచన –గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం .
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-17 –-,30-12-17 ఉయ్యూరు
సరసభారతి ఏర్పడి 8 సంవత్సరాలు దాటి 9 వ సంవత్సరం లో ప్రవేశించింది .అన్నికార్యక్రమాల విశేషాలూమీకు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నాం .8 ఏళ్ళకు నెలకొకటి లెక్కేస్తే 96 కార్యక్రమాలు జరగాలి .కాని ఈ ఆవిష్కరణ సభ 116 వ సభకావటం మరింత ఉత్సాహాన్నిస్తోంది .ఇప్పటికి సరసభారతి ,సువర్చలాన్జనేయ బ్లాగుల వీక్షకుల సంఖ్య 5 లక్షల 30 వేలకు దాటటం మరొక శుభవార్త .ఇప్పుడు నిన్నటి సభా విశేషాలు తెలియ జేస్తాను .
24-12-17 ఆదివారం మధ్యాహ్నం 1-15 కు నాలుగు కార్లలో మేమందరం రేపల్లెకు బయల్దేరి దేవరపల్లి వద్ద కృష్ణ కరకట్ట ఎక్కి పెనుమూడి వంతెన మీదుగా మండలి కృష్ణారావు వంతెన దాటి రేపల్లెలో ప్రవేశించి ఉప్పూడి రోడ్డులో ఉన్న రామకోటయ్య కళ్యాణ మండపానికి మధ్యాహ్నం 2-25 కి అంటే గంట 10 నిమిషాలో చేరాం .సభ రెండవ అంతస్తులో . మా వెంట రెండు గ్రంధాలు చెరొక 200 పుస్తకాలు తీసుకు వెళ్లాం . అతిధులకు ,కవులకు శాలువాలు ,గీర్వాణం -3 లో చోటు చేసుకున్న కవులకు రెండిటినీ సభకు సభకు పరిచయం చేసినవారికీ ,అతిధులకు శాలువాలు జ్ఞాపికలు వెంట తీసుకు వెళ్లి వేదిక వద్దకు చేర్చాం .మాకు మధ్యలో ,పైనా చెరొక గదీ కేటాయించారు . అలసట తీర్చుకోవటానికి ఆడవాళ్ళకు అవకాశం కలిగింది .మాతో మేమిద్దరం కాకుండా ,హైదరాబాద్ నుంచి వచ్చిన మా రెండో అబ్బాయి శర్మ ,మనవడు ఛి హర్ష ,ఉయ్యూరులో ఉన్నమూడవకోడలు రాణి మనవడు చరణ్ మనవరాలు రమ్య ,మా నాలుగోవాడు రమణ కోడలు మహేశ్వరి ,మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ బాబు , మాదిరాజు శివలక్ష్మి, భర్త శర్మగారు ,కుమార్తె బిందు ,శ్రీ బలరాం ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు వీడియో గ్రాఫర్ ,అన్నిటికి సహాయానికి ఇద్దరు మనుషులు మందీ మార్బలం తో మగపెళ్లి వారిలా రాజసంగా,దర్జాగా ‘’శీతల’’ కార్లలో తరలి వెళ్లాం .డబ్బుమాదికాదుకదా-మైనేని వారిదే కదా అన్న ధీమా .పైగా వారు మేము ఎసి కార్ లలో తప్ప రేపల్లెకు వెళ్ళ రాదు అనే ఆజ్న ముందేజారీ చేశారు . వారిది మాకు సుగ్రీవాజ్న .
బానర్ రేపల్లె లోనే ప్రింట్ చేయించాడు రమణ .మధ్యాహ్నం మూడున్నరకు వేదికపై బానర్ రమణ ,శర్మ వీడియో గ్రాఫర్ లు కస్టపడి కట్టారు అక్కడ ఎవరూ సహాయానికి రానే లేదు .సందట్లో సడేమియా –బానర్ లోని ‘గీర్వాణం -3పుస్తకం తిరగబడి ప్రింట్ అయింది .అడికవార్ చేయటానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది .అల్పాహార విందు 3 గంటలకు .కాని అవీ ఆలస్యంగా నే చేరాయి .కుర్చీలు కూడా మా సహాయకులే వేశారు .అప్పుడు దిగారు’’ మైకాసురులు ‘’.అన్నీ సిద్ధం అయేసరికి సరిగ్గా సాయంత్రం 4 అయింది .ఇక ఆలస్యం చేయకుండా కార్య క్రమం ప్రారంభించాం . ఉయ్యూరులోనే తయారు చేయించిన కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి రెండు ఫోటోలను వేదికపై ఏర్పాటు చేసి ,సభకు విచ్చేసిన డా శ్రీ వేదాల వెంకట సీతారామాచార్యులు ,డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గార్లతో పుష్పహారాలు వేయించి నేను నోరి వారిని సభకు పరిచయం ఇలా చేశాను –
‘’శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు 6-2-1900 న గుంటూరు లో శ్రీ నోరి హనుమచ్ఛాస్త్రి ,మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి తాతగార్లు గోప్పపండితులేకాక మహా రచయితలుకూడా .శాస్త్రిగారికి బాల్యం లోనే సంప్రదాయ కవిత్వం అబ్బింది .19 వ ఏట ‘’గీత మాలిక ‘’పద్య సంపుటి రాసి ప్రచురించారు 23 వ ఏట ‘’సోమనాధ విజయం ‘’నాటకం రాశారు .గుంటూరు చదువులో శ్రీ తల్లావఝల శివ శంకర శాస్త్రి గారితో పరిచయమేర్పడి ‘’నవ్య కవితా ధోరణి’’ అబ్బింది మద్రాస్ లో బి ఎల్ చదివి ,గుంటూరులో ప్రాక్టీస్ ప్రారంభించారు .
1928 లో రేపల్లె చేరి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ,శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొన్న దేశభక్తులు నోరివారు ఆంద్ర ,ఆంగ్ల సాహిత్యాల లోతులు తరచారు .కన్నడ భాషలోనూ మంచి ప్రవేశం కలిగింది . నోరి వారంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది వారి చారిత్రాత్మక నవలలే చారిత్రాత్మక తెలుగు నవలలు మార్గ దర్శకులు వారే .శాస్త్రి గారు రచించిన ’’రుద్రమ దేవి ,నారాయణ భట్టు ,మల్లారెడ్డి ,ధూర్జటి ,వాఘీరా ,కవి సార్వ భౌముడు ,కవిద్వయం’’ నవలలు ఆ రోజుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించి గొప్ప హిట్ అయ్యాయి .’వీరి తర్వాత డా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు లల్లాదేవి వగైరా 11 6 కు పైగా చారిత్రాత్మక నవలలు రాశారు .శాస్త్రి గారి ’నారాయణ భట్టు ‘’నవలకు 1950లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది .బాలలకోసం ‘’కర్పూర ద్వీప యాత్ర ‘’రాసి మన సంస్కృతీ సంప్రదాయాలపై వారికి గొప్ప ప్రేరణ కలిగించారు .24 వచన గేయ నాటికలు రాశారు .అందులో సోమనాధ విజయం ,భాగవతావతరణం ,తేనే తెట్టే,సర్ప సత్రం ,ఖేమా భిక్షుని ,శబ్ద వేది ,షన్నవతి ముఖ్యమైనవి .
శాస్త్రిగారి సంస్కృత జ్ఞానమూ గొప్పదే .సంస్కృతం లోని’’దేవీ భాగవతం ‘’లోని రెండు ,మూడు స్కందాలను వెయ్యి పద్యాలలో తెనిగించారు .అంతే కాదు నారాయణ తీర్దులవారి ‘’కృష్ణ లీలాతరంగిణి’’ని దేవ నాగర లిపి లో సంస్కృత ,ఆంగ్ల ,హిందీ భాషలలో సుదీర్ఘ భూమిక రాసి ప్రచురించారు .శాస్త్రి గారు మంచి కథలెన్నొ రాశారు .అందులో ‘’వదూసర ,మరు విషయం ,పరీక్షా ఫలితాలు గానభంగి ‘’మొదలైనవి .పాశ్చాత్య ,భారతీయ విమర్శనా ధోరణి ని సమన్వయ పరచి ఎన్నో మంచి వ్యాసాలూ రచించారు .శాస్త్రి గారి బహుభాషా పాండిత్యానికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి గుర్తించి సభ్యులను చేసి గౌరవించింది ఈ పదవిలో 12 ఏళ్ళు న్నారు .
శాస్త్రి గారికి క్రమంగా లౌకిక విషయాలపై ఆసక్తి తగ్గి ,ఆధ్యాత్మిక తపై దృష్టి నిలిపారు .1941లో పూర్ణ దీక్ష పొంది ‘’విజ్ఞానానంద స్వామి ‘’నామధేయంతో గడిపారు .వారి సాహిత్య తపస్సుకు ‘’కవి సమ్రాట్ ‘’,’’కవి మార్తాండ ‘’బిరుదు గౌరవం పొందారు .1977 లో రేపల్లె వదలి ,హైదరాబాద్ చేరి అక్కడే ఉండిపోయి 80 వ ఏట 1980 లో మరణించారు .
రేపల్లెలో అర్ద శతాబ్దం సాహిత్య సేవ చేసిన శ్రీ నోరి వారిపేరును ఈ వేదికకు నామకరణం, చేసి ఈ రోజు మొత్తం కార్యక్రమం వారికి అంకితమిస్తున్నాము ‘’అని చెప్పగానే అందరూ హర్ష ధ్వానాలతో ఆమోదం తెలిపారు .మళ్ళీ నేను అందుకుని’’రేపల్లెలో శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు ‘’సంస్కృత పాఠ శాల స్థాపించి దిగ్విజయంగా నడిపారని ‘’పుత్ర సంజీవనం ‘’అనే సంస్కృత కావ్యం రాశారని ,వారి కుమారులు డా శ్రీ జయ సీతా రామ శాస్త్రి గారు హర్ష నైషద సంస్కృత కావ్యం లో దర్శన విభాగం పై పరిశోధన చేసి దిట్ట అనీ ,అలాగే రేపల్లె వాసులు శ్రీ ఇసుకపల్లి నరసింహ శాస్త్రి (ఐ ఎల్ యెన్ శాస్త్రి ),శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి శాస్త్రి ,ఇసుకపల్లి కుటుంబ శాస్త్రి గార్లు గొప్ప కధానికలు నవలలు రాసి ప్రసిద్ధి చెందారని తెలియ జేశాను .
తర్వాత గీర్వాణం -3 ప్రాయోజకులు ప్రొఫెసర్ శ్రీయల్లాప్రగడ రామ మోహనరావు గారి అన్నగారుచేన్నైలో మరణించటం వలన సభకు రాలేక పోయారని తెలియ జేసి, రావు గారి కుటుంబం తో సంబంధం ఉన్నకార్యక్రామం కనుక రావుగారి దివంగత అన్నగారికి రెండు నిమిషాలు మౌనం పాటించాం .
సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళనం లో పాల్గొనే గుంటూరు కృష్ణా కవులను వేదికపైకి ఆహ్వానించగా శ్రీ వృషాద్రిపతి గారిని శుభాశీస్సులు పలుకమని కోరగా చక్కగా మాట్లాడి ఆశీర్వ దించారు .ఇంతటి సాహితీ మూర్తి సమక్షం లో కవి సమ్మేళనం జరుగు తున్నందుకు అందరూ ఆనందించారు .శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మగారు కార్య క్రమాన్ని చాకచక్యంగా నిర్వహించారు .కవులు కూడా సూటిగా సుత్తి లేకుండా కవితలు చదివి అభినందనలు పొందారు .శ్రీ వృషాద్రి పతిగారికి పుష్పహారం శాలువా జ్ఞాపిక వెయ్యిన్నూట పదహార్లు నగదు ఇచ్చి గంధ తాంబూల౦తో పన్నీరు ,సెంట్ జల్లి సంప్రదాయ బద్ధంగా నేనూ నా శ్రీమతి సత్కరించాం . పాల్గొన్న కవులందరికీ తలొక 500 రూపాయలు నగదు ,పై విధంగా నే సన్మానం చేశాము .హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరికీ ,గుంటూరు నుంచి వచ్చిన మరో ఇద్దరికీ విజయవాడనుంచి వచ్చిన శ్రీ చావాలి సుబ్రహ్మణ్యం గార్నీ కూడా పై విధంగానే సమ్మాని౦చా౦ .వేదికపైకి ఆహ్వాని౦పబడిన ప్రతివారికీ కమలాఫల ద్వయం ‘’తో స్వాగతం పలికి ఉయ్యూరు సంప్రదాయాన్ని రేపల్లె లోనూ కొన సాగించాం . కవులు ఎంతో సంతృప్తి చెంది ఆనందం ప్రకటించారు .
కవి సమ్మేళనానినికి ముందు పదినిమిషాలు ఒక అమ్మాయి చక్కగా స్వాగత నాట్యం చేసింది .ఆమెకూ పై విధంగానే అయిదు వందల నగదు తో సహా సన్మానం చేశాం .
తర్వాత మహామహోపాధ్యాయ భారత భారతి ప్రవచన సమ్రాట్ ,తర్క వ్యాకరణ శిరోమణి విశ్రాంత సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా శ్రీమాన్ వేదాల వెంకట సీతారామ శాస్త్రి గారిని ‘’ఆశీరనుగ్రహ భాషణం ‘’చేయవలసినదిగా వేదికపైకి ఆహ్వానించి ,ముఖ్య అతిధి ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు ,పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,వరంగల్ డాక్టర్ ,శతాధిక గ్రంధకర్త ,నాలుగు భాషలో అద్వితీయ పాండిత్యం ఉన్న డా శ్రీ లంకా శివరాం ప్రసాద్ ,నాగార్జున విశ్వ విద్యాలయ మాజీ రిజిస్ట్రార్ డా శ్రీ రావెల సాంబ శివరావు ,కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి గ్రహీత ,కవి విమర్శక విశ్లేషకులు డా శ్రీ పాపినేని శివ శంకర్ ,రేపల్లె మునిసిపల్ చైర్మన్ శ్రీ తాడివాక శ్రీనివాసరావు కమీషనర్ శ్రీ ఏ ఎస్ యెన్ వి ఎం దివాకర రావు ,జి డి సిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ ముమ్మలనేని వెంకట సుబ్బయ్య,మాజీ శాసన సభ్యులు శ్రీ దేవినేని మల్లికార్జున రావు ,కొ ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ కొర్రపాటి రామ మోహనరావు డా శ్రీగబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా శ్రీ ఇనగంటి ఉమా రామారావు ,అసమాన అవధాన సార్వభౌమ ,కాశీకవి ప్రాచార్య డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,మచిలీపట్నం హిందూ కాలేజి చరిత్ర శాఖాధిపతి డా.శ్రీ సవరం వెంకటేశ్వరరావు మున్నగు దిగ్దంతులు వేదికను సుసంపన్నం చేయగా శ్రీ వేదాల వారు తమ అమూల్య భావధారను ప్రవహింప జేసి సభను ధార్మిక ధారతో ఉత్తేజపరచారు .
తరువాత గంధ ద్వయం ఆవిష్కరణ సభ జరిగింది .శ్రీ సోమేపల్లి ,మునిసిపల్ చైర్మన్ గార్లు ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గ్రంధాన్ని ఆవిష్కరించారు . గ్రంథ పరిచయం చేశారు శ్రీ సవరం వారు .తర్వాత’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం ‘’ను శ్రీ రావెల ,శ్రీపాపినేని ,శ్రీ లంకా ,మునిసిపల్ కమీషనర్ గార్లు ఆవిష్కరించారు .దీనిని సభకు పరిచయంచేశారు శ్రీ పాలపర్తి వారు .ఈ రెండు గ్రంథాల రచన ,ప్రచురణ ,అంకిత ప్రాయోజక, విశేషాలను సరసభారతి ప్రగతినీ ఇవి సరసభారతి 27, 28 పుస్తకాలు ,నేను రాసిన 15, 16 పుస్తకాలని సంక్షి ప్తంగా వివరించాను .29 వ పుస్తకంగా ‘’వసుధైక కుటుంబం ‘’కవితా సంకలనం జనవరిలో గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యం లోనూ సరసభారతి నిర్వహించే శ్రీ విలంబి ఉగాది వేడుకలలో 18-3-18 ఆదివారం నా యాత్రా రచన ‘’షార్లెట్ మైత్రీ బంధం ‘’30 వ పుస్తకం గా ఆవిష్కారం ఉయ్యూరులోను అక్కడ అమెరికాలో షార్లెట్ లోనూ జరుగుతుందని ,దీనిని షార్లెట్ సరసభారతి కి కానుకగా అందిస్తున్నామని తెలియ జేశాను .
శ్రీ గబ్బిట ,ఇనగంటి ,లంకా ,సవరం ,పాలపర్తిగార్లకు తలొక వెయ్యి నూట పదహార్లు నూతన వస్త్రాలు నగదు తో , శ్రీ సోమేపల్లి ,శ్రీ పాపినేని ,శ్రీరావెల ,మైనేనిగారి బావమరది శ్రీనాద్ గార్లకు సంప్రదాయ బద్ధంగాకవులకు చేసినట్లే పుష్పహారం జ్ఞాపిక ,శాలువా చందన తాంబూల పన్నీరు లతో సత్కారం చేశాం
ఈ సభలో మరొక అమ్మాయి ,నృత్యం చేసి అలరిస్తే ఒక కుర్రాడు మిమిక్రీ చేసి మురిపించాడు .ఇద్దరికీ కవులకిచ్చిన మర్యాద తోనే నగదు తోపాటు మిగిలినవాటితోనూ సత్కరించాం .
శ్రీ లంకావారు మా దంపతులను కూర్చోబెట్టి శాలువా కప్పిపుష్ప హారం వగైరాలతో పైవిధంగా నే ‘’సువర్ణ పతకం ‘’తోనూ సత్కరించారు .తర్వాత శ్రీనాద్ గారికీ చేసి ,ఒక పతకం శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి అందజేయమని ఆయనకు అందజేశారు .వీడియోగ్రాఫర్ కు, శివలక్ష్మి కుటుంబానికి రామనాద్ ,బలరాం చంద్ర శేఖర రావు గార్లకు కూడా జ్ఞాపికలు అందజేశాం .సభకు వచ్చిన వారందరికీ గ్రంథ ద్వయం అందజేశాం .సుమారుగా 150 సెట్లు రేపల్లె సభ లో ఉచితంగా పంచిపెట్టాం .ఈ టీవీ విలేకరి నన్ను చక్కగా ఇంటర్వ్యు చేశారు .సోమేపల్లిగారినీ చేశారు .బహుశా ప్రసారం చేసి ఉంటారు .ఇవాళ ఈ టీవీలో అయిదు నిమిషాలకు పైగా ప్రసారం చేశారని మా అబ్బాయి శర్మ ఫోన్ చేశాడు .ఇవాళ అన్ని వార్తాపత్రికలలోనూ మంచి కవరేజ్ వచ్చింది . మీడియా మిత్రుల సహకారం మరువ లేనిది .
.సభ పూర్తయ్యేసరికి రాత్రి 8-30 అయింది .అప్పుడు అందరికీ విందు .శాఖాహారం పై అంతస్తులో ,మాంసాహారం కింది దానిలో ఏర్పాటు చేశారు .రాత్రి 9-45 కు బయల్దేరి అందరం ఉయ్యూరుకు రాత్రి 10-30 కు చేరాం
ఈ కార్యక్రమం మొత్తం ఇంట్లో కూర్చుని కంప్యూటర్ లో వీక్షించటానికి మంచి నాణ్యత తో ప్రత్యక్షంగా ప్రసారం చేయించాం . చూసినవారందరూ అద్భుతంగా ఉందని ఫీడ్ బాక్ చేశారు .మంచి సంతృప్తితో ఈ 116 వ కార్యక్రమం గా ;గ్రంథ ద్వయ ఆవిష్కరణ ‘’సభ రేపల్లెలో జరిగింది .ఇప్పటికి కృష్ణా జిల్లాలో వివిధ ప్రదేశాలలో కార్యక్రమాలు చేశాం .ఇప్పుడు జిల్లాదాటి గుంటూరు జిల్లా రేపల్లె లో జరిపాం .ఏప్రిల్ అక్టోబర్ మధ్య ఖండాంతర సభలు నాలుగు నార్త్ కరోలినా రాష్ట్రం ‘’షార్లెట్ ‘’లో జరిపాం . అక్కడ సరసభారతి శాఖా కూడా ఏర్పాటు చేశామని హర్ష ద్వానాలమధ్య తెలియ జేశాను .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-17- ఉయ్యూరు
సరస భారతి 116 వ సమావేశంగా ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2
శ్రీ రావెల సాంబశివరావు గారు ,శ్రీ పాపినేని శివ శంకరరావు గారు ,రోజూ అయిదు నిమిషాలు కూడా ఖాళీ ఉండని బిజీ డాక్టర్ అయినా వందకు పైగా ఉద్గ్రంధాలు రచించి సాహిత్య సేవలోనూ డాక్టర్ అనిపించిన డా శ్రీ లంకా శివరామ్ ప్రసాద్ గారు ఈ ఆవిష్కరణ సభకు రావటం సభ స్థాయి ని విపరీతంగా పెంచి చాలా గొప్ప సాహిత్య గౌరవం లభించింది .వీరితో పాటు శ్రీ వేదాల వారు, శ్రీ వృషాద్రిపతి గారు , శ్రీ పాలపర్తి వారు, శ్రీ గబ్బిట వారు, శ్రీ ఇనగంటివారు, డా సవరం గారు వేదికను అలంకరించటం, వారందరి సమక్షం లో గంథ ద్వయం ఆవిష్కరింప బడటం, కవి సమ్మేళనం లో గుంటూరు –కృష్ణా జిల్లాలకు ‘’సాహితీ బంధాన్ని’’కూర్చిన లబ్ధ ప్రతిస్టు లైన కవి మిత్రులు ,హైదరాబాద్ కవులూ సభలో ఉండటం సరస్వతీ దేవి కొలువు కూటం లో జరిగిన సాహితీ సమ్మేళనం అని పించింది .కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది .ఒక గొప్పమదురానుభూతిగా నిలిచింది .
శ్రీ వృషాద్రిపతి గారి కవిత్వపు తేనే సోనలు మధు మధురంగా ఉన్నాయి .శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి తెలుగు ఎం ఏ లో ప్రధములుగా వచ్చారు .శ్రీ ప్రసాదరాయ కులపతిగారికి అర్ధశతబ్దంగా ఆత్మీయులు .సాహితీ సరి జోడు .గొప్పకవి గాయక నటులు కూడా .మహా ఉపన్యాసకులు .వేల సభలలో ప్రసంగించిన సామర్ధ్యం వారిది .తిరుపతి దేవస్థాన కార్యక్రమాలకు లెక్కలేనన్ని సార్లు ప్రత్యక్ష వ్యాఖ్యాత .చాలా భువన విజయ సభలలో రాణించిన కవి శ్రేస్టులు .శ్రీ కులపతిగారితోను ,ఐ ఏ ఎస్ ఆఫీసర్ శ్రీ కనుపుల శివయ్యగారితో కలిసి ‘’భారతం పై తుది తీర్పు ‘’ లో పోటాపోటీగా నటించారు .నేను గంద్రాయిలో సైన్స్ మేస్టారు గా ఉన్నప్పుడు 1986 లో జగ్గయ్యపేట గెంటేల శకు౦తలమ్మ కాలేజి లో ఈ త్రయం వారి ‘’తీర్పు ‘’చూశాను .అద్భుతం అనిపి౦చి౦ది .చిన్నకాగితం పై పై వారికి ‘’ఎప్పుడూ భువన విజయాలేనా ?ఇంకో సబ్జెక్ట్ దొరకలేదా ?బందరులో శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి దర్బారు ను ప్రదర్శించవచ్చు కదా ‘’అని రాసి ఇచ్చి వెళ్ళిపోయాను .ఆతర్వాత సుమారు అయిదేళ్లకు అనుకుంటా నా కోరిక నెరవేరి ‘ముట్నూరి వారి దర్బారు ‘’ప్రదర్శి౦చి నట్లు వార్తాపత్రికలో చదివి పరమానందం పొందాను .నా ఆలోచన నచ్చి,వారు చేశారో లేక వారికే ఆలోచన వచ్చిందో తెలియదు .మొవ్వ వారు ‘’శ్రీ కృష్ణ రాయ విజయ యాత్ర ‘’గా ప్రబంధం రాశారు .’’సాహితీ వాచస్పతి ,’’ఉపన్యాస చతురాననన ‘’బిరుదాంకితులు .
ఇవాళ సాయంత్రం వారు ఫోన్ చేసి ఆవిష్కరణ గ్రంథాలపై మనసులోని మాట చెప్పి అభినందించారు .తాము శ్రీ ఆంజనేయ స్వామి భక్తులమని ‘’కసాపురం ఆంజనేయ చరిత్ర ‘’కావ్యాన్ని వెయ్యి పద్యాలతో రచించానని తెలిపి తమ గ్రంథాలను నాకు పంపుతామన్నారు .నేను ధన్యవాదాలు తెలియ జేసి సరసభారతి గ్రంధాలు వారికి పపుతామని చెప్పాను .మొదటి సారిగా వారితో ప్రత్యక్ష పరిచయం ఆదివారం నాడే జరిగింది .అదొక చారిత్రాత్మక సంఘటన అని పించింది . శ్రీ రావెల వారిని సుమారు పాతికేళ్ళ క్రితం మచిలీ పట్నం లో వివేకానంద మందిరం లో శ్రీ రావి రంగారావు గారి సాహితీ మిత్రులు కృష్ణశాస్త్రి గారి పై ఏర్పాటు చేసిన సభలో చూశాను . వారి ప్రసంగం ఆసాంతం విని ‘’ఫిదా ‘’అయిపోయాను .వారి అడ్రస్ తీసుకొని మర్నాడే అభినందిస్తూ కార్డ్ రాశాను .వారు వెంటనే స్పందించి జవాబు రాశారు .అప్పటి నుంచి సుమారు రెండేళ్ళు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి వారి రేడియో ప్రసంగాలను విని స్పందించి రాసేవాడిని .వేల లేని వాక్కు రావెల వారిది .అందరూ విని తీరాల్సినదే.
శ్రీ పాపినేని శివ శంకర్ కృష్ణా జిల్లా రచయితల సంఘానికి సుపరిచితులు .చాలా సభలలో చూశాను .వారికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ వచ్చినప్పుడు’’ సంఘం ‘’వారికి సాహితీ నగదు పురస్కారం అందజేసిన సభలో నేనూ ఉన్నాను .లంకా వారు సుమారు పదేళ్లుగా సాహితీ మిత్రులు .నేను రాసిన ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’కు వారం రోజుల్లోనే స్వదస్తూరితో అద్భుతమైన ఆలోచనాత్మకమైన ప్రేరణాత్మక మైన సాహితీ విలువలు కల ముందుమాటలు రాశారు .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటమే కాని ప్రత్యక్షంగా చూసింది ఈ వేదిక మీదనే. పాలపర్తి వారిగురించి గీర్వాణం -2 లో రాశాను .వారు పంపిన పుస్తక౦’’సంహూతిః’’ ఆధారంగాకృష్ణాజిల్లా ,రాష్ట్రం లోని మిగిలిన జిల్లాల లోని చాలామంది గీర్వాణ కవుల గురించి రాయగలిగాను .అనేక సభలో వారితో ఉన్నాను .గీర్వాణం -2 ను మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు 4-12- 16 న ఆవిష్కరించినపుడు ‘’గీర్వాణ భాషా వైభవం ‘’పై జరిపిన పద్య కవి సమ్మేళనాన్ని వారు నా కోరికపై నిర్వహించిన సహృదయులు .సవరం వారు మా సభలకు తరచూ వస్తారు . నేనంటే అమితమైన ఆప్యాయత .అనారోగ్యం లో ఉండి కూడా నెట్ లో ఈ బృహద్గ్రంధం చదివి చక్కని ముందుమాటలు రాశారు .పుస్తక ముద్రణకు రెండు నెలలు ముందు వారు ఫోన్ లో దొరకలేదు భయమేసింది .శ్రీమతి గుడిపూడి రాధికా రాణికి ఆ బాధ్యత అప్పగించగా ఆమె అలుపు లేని ప్రయత్నం చేసి సమయానికి వారి ముందు మాటలు సేకరించి పంపింది .ఆమెను ‘’పట్టు వదలని విక్రమార్కి ‘’అన్నాను .
దాదాపు నాలుగు లక్షలు ఈ రెండు గ్రందాల ముద్రణ ,ఈ సభా వేదిక ,మా రవాణా ,అందరికివస్త్రాలు , శాలువలు జ్ఞాపికలు,ఆహ్వానాల ప్రింటింగ్ వగైరాలకు ఖర్చు చేసిన సరసభారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ఔదార్యం మాటలతో చెప్పలేనిది .గీర్వాణం -3 స్పాన్సర్ ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహనరావు గారు ఈ సభకోసం అమెరికా నుంచి వచ్చారు .కాని అకస్మాత్తుగా వారి అన్నగారు చెన్నైలో మరణించటం వలన సభకు రాలేక పోయారు .వారి ఔదార్యమూ గొప్పదే . మైనేని వారి బావమరది శ్రీ పరుచూరి శ్రీనాద్ గారు అమెరికానుంచి ఈ సభకోసమే వచ్చారు .’’గోపాల రాముడు ‘’బావగారికి రామ భక్త హనుమాన్ లాగా శ్రీనాద్ ఈ కార్యక్రమ విజయానికి అత్యంత శ్రద్ధా శక్తులతో కృషి చేశారు .సభా కార్యక్రమ౦ వరకు నాది బాధ్యతా .అంటే ఇండోర్ వర్క్ నాది .అవుట్ డోర్ వర్క్ అంటే ఆహ్వాన డిజైన్ , బానర్ ,జ్ఞాపికలు , మైనేని గారితో ,శ్రీనాద్ గారితో కొ ఆర్డినేషన్ అడపాదడపా నేను వేసే ‘’అక్షింతలు ‘’అన్నీ మౌనంగా భరిస్తూ మైనేని వారి గౌరవానికి ఏ మాత్రం భంగం రాకూడదని భావిస్తూ కార్య క్రమ విజయానికి నా తర్వాత ముఖ్యకారకుడు మాఅబ్బాయి ,సరసభారతి కోశాధికారి గబ్బిట వెంకట రమణ ది .
నగదు బహుమతులు ,జ్ఞాపికలు నూతన వస్త్రాలు , శాలువాలు వగైరా బాధ్యత అంతా మా అబ్బాయికి శర్మకు అప్పగించాను. వాడు మా అన్నయ్య గారబ్బాయి రామనాద్ సహకారం తో సమర్ధంగా నిర్వహించాడు .గ్రంధ ద్వయ పంపిణీ బాధ్యత శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ గారు ఎప్పటిలాగానే తమ బాధ్యత సంతృప్తి గా చేశారు . చేతి లో కర్ర లేనిదే నడవ లేని నా శ్రీమతి ప్రభావతి వేదికపై అతిధులను సత్కరించటానికి అత్యంత ఉత్సాహం గా నాకు సహకరించింది .అతిధి సత్కారం అంటే ఆమెకు ఎనలేని అభిమానం. అందుకే ఇలాంటి కార్యక్రమాలు జయప్రదంగా చేయగలుగుతున్నాం .వేదికపై ఉన్న పెద్దలను సత్కరించటానికి నాకు తోడ్పడిన కుమారి బిందు ,మామనవరాలు రమ్య మొదలైనవారి సహకారం మరువ లేనిది .
ఫలద్వయంగా అతిధులకు అందజేసిన కమలాఫలాలు పెద్దగా నాణ్యంగా ఉన్నాయి .అతిధుల సత్కారానికి ఏర్పాటు చేసిన తెల్ల చేమంతి దండలు బహు అందంగా చిక్కగా సువాసన భరితంగా శోభాయమానంగా ఉన్నాయి .వాడకుండా మిగిలిపోయిన దండలను ఉయ్యూరు కు తెచ్చి మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు నిన్నా ఇవాళా అలంకరించి శోభ చేకూర్చాం .
వేదిక ను అలంకరించాలని ఆహ్వానించిన శ్రీ వెంపటి వారు, శ్రీ రేమెళ్ళవారు ,శ్రీ తూములూరు వారు ,శ్రీ నిష్ఠలవారు ,శ్రీ పరాశరం వారు ,శ్రీ రామడుగువారు రాక పోవటం చాలా నిరుత్సాహం కలిగించింది . వెంపటి వారు పూర్తి అనారోగ్యం వలన రాలేక పోయానని ఆ రోజే ఫోన్ చేసి చెప్పారు .తర్వాత కూడా మెయిల్స్ రాస్తూనే ఉన్నారు సభా విషయాలన్నీ వారికి తెలియ జేస్తూనే ఉన్నాను . తూములూరు వారికి నాపై అత్యంత ఆత్మీయత ఉన్నది .తిరుపతి వెళ్ళటం వలన రాలేక పోతున్నానని ,వారం క్రితమే నాకు చెప్పి ,ఇవాళ ఫోన్ చేసి సభ ఎలా జరిగిందో వివరంగా అడిగి తెలుసుకున్న సౌజన్యం వారిది .వేదాల వారిని ఆహ్వానించమని చెప్పిన సహృదయ శ్రీ దక్షిణా మూర్తి గారిది
అంతా బాగానే ఉంది కాని రాత్రి డిన్నర్ లో మంచి రుచికరమైన పదార్ధాలు చేయించమని ముందే చెప్పాం .కాని చాలా తక్కువ విలువగల పదార్ధాలు చేయించటం బాధ కలిగించింది . రుచి కూడా దారుణం .నోట్లో పెట్టుకుంటే ఒట్టు .పోనీ ఏదో సర్దుకు పోదాం అంటే సాహిత్య సభలో ‘’ముక్కా –చెక్కా ‘’భోజనం పెట్టటం అత్యంత గర్హణీయ విషయం .ఇది క్లబ్బు సమావేశం కాదు .పవిత్ర సాహితీ కార్యక్రమం .మూడు ప్రపంచ సభలు సరిపినా, వేలాది మందికి అందరికీ శాకాహార భోజనమే పెట్టారు .నాన్ వెజ్ భోజనం అంటూ వేరే ఎవరికీ పెట్టలేదు .నాకు, మైనేని గారికీ ఈ ‘’నీచు ‘’సంగతి తెలిస్తే ముందే చీదరించుకొని వారించే వారమేమో .ఇది జరగటం దురదృష్టం .మన్నించమని అందరినీ కోరుతున్నాను .
కవి సమ్మేళనం కవితలు ఇంకా నా చేతికి రాలేదు .మూడవభాగం లో వాటిని రాస్తాను .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-17- ఉయ్యూరు
—
సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’?
కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ‘’న్యాయ శాస్త్ర ‘’ప్రొఫెసర్ ,సంస్కృతం లో మహాదిట్ట ,కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామస్తులు ,గీర్వాణం -3 లో చోటు చేసుకొన్న కవి ,గ్రంథద్వయ ఆవిష్కరణ సభకు కాశీ నుంచి శ్రమపడి రేపల్లెకు విచ్చేసిన గీర్వాణ భాషాభిమాని డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రిగారు నిన్న మా ఇంటికి వచ్చి తాము ఆదివారం సభలో అందరికీ చెప్పాలనుకొన్న విషయం సభ హడావిడిలో మర్చిపోయానని,దానిని నాకు చెప్పటానికి వచ్చానన్నారు .సంతోషం అన్నాను .
శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి మనసులో ఉయ్యూరులో సరసభారతి ఆధ్వర్యం లో ఘనం గా వేద సభలు నిర్వహించాలని ఉన్నదట .అదేదో సరసభారతి సభల్లా తేలికే అనుకోని ‘’సరే ‘’అన్నా . ‘’అన్నగారూ !సంస్కృత కవుల పై ఇంత విస్తృతంగా వరుసగా మూడు గ్రంధాలు మూడేళ్ళలో రాసి ప్రచురించిన మీరు సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో వేద సభలు నిర్వహించి వేదమాత సేవ కూడా చేస్తే ,పుణ్యం పురుషార్ధం దక్కటమే కాదు వేద పండితులకు సహకారం చేసి, వేద వ్యాప్తికి దోహదం చేసిన వారవుతారు ‘’అన్నారు .’’బాగానే ఉంది.ఎన్ని రోజులు ,ఎంత మంది వేద పండితులు వస్తారు ,వారికి ఎంత సంభావన ఇవ్వాలి వారి వసతి భోజన భాజనాదుల సంగతి ఏమిటి ?’’అని అడిగాను .దానికి వారు 3 రోజులు జరిపితే బాగుంటుంది .మూడు రోజులూరెండుపూటలా కాఫీ టిఫిన్లు భోజనాల ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను .సంభావన ,దారి ఖర్చులు మీరు ఏర్పాటు చేయాలి ‘’అన్నారు .నేను మనసులో తలా ఒక వెయ్యో రెండు వేలో ఇవ్వచ్చులే అనుకోని వారినిఅడిగా ‘’ఒక్కో వేద పండితునికి 10 వేల రూపాయలు ,వారు వచ్చిన ప్రదేశాన్నుంచి రానూ పోనూ ఖర్చులు ఇవ్వాలి ‘’అన్నారు .లెక్క వేస్తె సుమారు 6 లక్షలకు పైమాటే అయింది .ఒక్కసారి అవాక్కయ్యాను .ఇది మనవల్ల కాదులే అనిపించి వారికి చెప్పేశాను .వారు ‘’పోనీ రెండు రోజులే జరుపుదాం ‘’అన్నారు .’’భోజనం ఖర్చు తగ్గవచ్చుకాని సంభావన ఖర్చు లో మార్పు రాదుకదా’’ అన్నాను .’’అవునని’’ఏకీభవించారు .’’ఇంత భారీగా చేయాలంటే నాకు, సరసభారతికి ఉన్న పరిచయాలు చాలాతక్కువ .అందులో మాకు సభ్యులు అంటూ ఎవరూలేరు. సభ్యత్వ రుసుమూ ఉండదు .’’అన్నాను .’’దాతలను వెతికి పట్టుకోవాలి ‘’అన్నారు .’’లక్ష రూపాయల చందా ఇచ్చేవారు కనీసం 7 గురు దొరకాలి .లేకపోతె 50 వేలు ఇచ్చేవారు కనీసం 14 మంది , లేకుంటే 25 వేలు ఇచ్చేవారు సుమారు 30 మంది ,దొరకాలి .లేనిచో 11, 116 లు ఇచ్చేవారు 60 మంది ఉండాలి . అంత ఖర్చు పెట్టె వారు దొరకటం కష్టం .మేము ఎవరినీ ఏ కార్యక్రమాలకు డబ్బు అడగము .కార్యక్రమం తెలియ జేస్తాం .ఇచ్చేవారు ముందుకొచ్చి సహకరిస్తారు తప్ప డిమాండ్ చేయం ‘’అన్నాను .వారు ‘’అన్నగారూ !ఎలాగైనా మీ, మా ఆధ్వర్యం లో మనం జరపాలి ‘’అన్నారు .’’నేనేమీ మాట ఇవ్వలేను .నెట్ ద్వారా విషయం అందరికీ తెలియ జేస్తాను .ఇది వేద విధి కనుక దీనికి మాస్వామి శ్రీ సువర్చలాన్జనేయుల అనుగ్రహం కూడా కావాలి కనుక మా గుడిలో కూడా ఈ విషయం ప్రకటిస్తాను . స్పందనను బట్టి ఆలోచన చేద్దాం ‘’అని చెప్పాను .’’సరే’’నన్నారు వారు .
ఇవాళ మంగళవారం ధనుర్మాస ప్రభాత పూజలో భక్త జనం క్రిక్కిరిసి ఆలయానికి వచ్చారు .మంత్రపుష్పానికి ముందు స్వామి సమక్షం లో పై విషయాలన్నీ తెలియ జేసి ,భారం స్వామిదే నని ఆయనపైనే భారం వేశాను .ఇప్పటిదాకా జరిగిన వన్నీ ఆయన అనుగ్రహం తో జరిగినవే కదా .మేము నిమిత్తమాత్రులం .ఇదీ విషయం . దీనిపై భక్తులు ,సరసభారతి సాహితీ బంధువులు ,వేదాభిమానులు,దాతలు ,వితరణ శీలురు స్పందించే తీరు ను బట్టి ‘’ముందుకు ‘’అడుగు వేస్తాం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-17- ఉయ్యూరు
|
||||
|
||||
జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు
రచన –మైనేని గోపాలకృష్ణ –హ౦ట్స్ విల్-యు. ఎస్ .ఏ .
19 ,20 శతాబ్దాలను ప్రభావితం చేసి జగత్ అభివృద్ధి అభ్యుదయాలకు కారణభూతులైన మహానుభావులను గురించి తెలుసుకొని అవగాహన కలిగించుకోవటానికి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గ్రంథం నేటి యువతరానికి ఉపయుక్తంగా ఉంటుంది .ఇందులోని మహనీయులు జీవితం లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నారు .కాని తమ లక్ష్యాన్ని మాత్రం విస్మరించక ముందుకు సాగారు, అనుకొన్నది సాధించారు .అవహేళనలు అవమానాలు వారికి పూలదండలే అయ్యాయి . వీరి సిద్ధాంత,ప్రయోగ,ప్రవచనాలను అర్ధం చేసుకొన్నవారు కొందరైతే, అపార్ధంచేసుకొన్నవారు మరికొందరు . అయినా లక్ష్యపెట్టక ముందుకే మును ముందుకే సాగిపోయారు .అందుకే చిరస్మరణీయులై ఆరాధ నీయులయ్యారు . వారి జీవితాలు స్పూర్తిదాయకాలు మాత్రమే కాదు వారు వేసిన తప్పుటడుగులు మనం వెయ్యకుండా జాగ్రత్తపడాలి . నిశితంగా వ్యక్తులను పరిశీలించి విమర్శించటం నేర్చుకోవాలి .లేకుంటే వారి అభి వృద్ధిమార్గానికి అవరోధం కలిగించిన వారమవుతాం . కొత్తది అంతా మోతా ,పాతది అంతా రోతా అనుకోకూడదు .రెంటిలోని మంచినీ గ్రహించి ముందుకు అడుగు వేయాలి . ఆత్మ సాక్షిగా మాత్రమే వీరు అభ్యుదయ మార్గం లోపయనించారు .అందుకే వీరిని చదవాలి, అర్ధం చేసుకోవాలి . మన ప్రయత్నం లో స్పూర్తి నింపుకోవాలి .వీటికి ఈ గ్రంథం కరదీపికగా నిలుస్తుంది .
డార్విన్ తాత మన ఆలోచనా విధానం లోనే గొప్పమార్పు తెచ్చాడు .ఎన్నో జీవిత సత్యాలను పరిణామ సిద్ధాంతం ద్వారా వ్యాప్తి చెందించాడు .మార్కొని వైర్ లెస్ కనుక్కొని ప్రసార వ్యవస్థలో కీలక వ్యవస్థకు రూపకల్పన చేశాడు . బాక్టీరియా అంటే హాని కలిగించేవి మాత్రమే కావని అందులోనూ మన జీవికకు ఉపయోగపడేవీ రోగ నిరోధక శక్తి కలిగించేవి ఉన్నాయని లూయీ పాశ్చర్ కనుగొని ఉండకపోతే ప్రపంచం శవాల గుట్టగా మారి ఉండేది .పెన్సిలిన్ మందు కనిపెట్టి ఫ్లెమింగ్ మానవాభ్యుదయాన్ని కొత్తదారి పట్టించాడు . అకాల మరణాలను ఆపి ,జీవనఅభి వృద్ధి రేటుకు , ,రోగ రహిత సమాజానికి బాటలు వేశాడు . క్యూరీ రేడియం మొదలైన ధాతువులను కనిపెట్టి రోగ నిర్ణయం రోగ నివారణలకు నూతన ఆవిష్కారం చేసింది .మహా మేధావి ఐన్ స్టీన్ సాపేక్ష్య సిద్ధాంతం ఆధునిక భౌతిక శాస్త్ర చరిత్రనే మార్చేసింది .రైట్ సోదరుల పుణ్యమా అని ఇవాళ ప్రపంచమంతా ‘’లోహ విహంగ’’-ఎయిరోప్లేన్స్ లలోగంటల్లో ప్రపంచం చుట్టివస్తున్నాం .ప్రపంచాన్ని ఒక కుగ్రామమే చేసేశాం .నిమిషానికో విమానం గగన తలం లో ఎగురుతుంటే పక్షులేమో ననే భ్రమ కలుగుతోంది .ఎడిసన్ మహాశయుడే లేకుంటే ఇంకా చీకట్లోనే బ్రతుకులు తెల్లారేవి. అందరికి వెలుగు వెన్నెలలు పంచిపెట్టాడు ఆ నిరంత పరిశోధక సృజన శీలి . మాక్స్ ప్లాంక్ క్వాంటం థీరీ వేల మైళ్ళు ముందుకు నడిపించింది .వీరంతా సైన్స్ ద్వారా మానవ సమాజం లో ,జీవితాలలో గణనీయమైన మార్పులు తెచ్చినవారు .
మానవుడు భౌతికంగా ఎదగటమేకాదు ఆధ్యాత్మికం గానూ ఎదగాలి అన్న సత్యాన్నిఆవిష్కరించే వారు తత్వవేత్తలు .వారి అంతరంగం స్వచ్ఛం ,నిర్మలం . వీరిలో ఎన్నో సిద్ధాంతాలు ఉండ వచ్చు . కాని వారివి మానవ మానసిక అభి వృద్ధి మార్గాలు . అంతరంగాన్ని ఆవిష్కరించే పధాలు .కిర్క్ గార్డ్ అస్తిత్వవాదం ,సైకాలజీ ద్వారా మార్పు తెచ్చిన విలియం జేమ్స్ ,నీషే ,ఫ్రీవిల్ చెప్పిన బెర్గ్ సన్ ,వ్యవహారిక సత్తా వాదప్రముఖుడు జాన్ డ్యుయీ ,విధిపై మానవ విజయాన్ని చెప్పిన మాల్రక్స్ అందరూ అందరే .ఆదర్శ ప్రాయులే .
అడవులలో తపస్సు చేసుకొనే మునీశ్వరులకు శాంత౦ భూషణం .అహింస వ్రతం .కాని నిత్య జీవితం లో దాన్ని అమలు చేయటం అసాధ్యమని పిస్తుంది. సాధ్యం చేసి చూపాడు గౌతమ బుద్ధుడు ఆనాడు . నేటి రాజకీయాలలో అందునా పరాయి బ్రిటిష్ పాలనలో ఉంటూ భారత స్వాతంత్ర్య౦ కోసం వారిపై నిత్య పోరాటం చేస్తూ శాంతి అహింసలకు పట్టాభిషేకం చేసి, అదే సత్యవ్రత౦ గా దీక్ష చేబూని సత్యాగ్రహాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించి స్వాతంత్ర సిద్ధిని సుసాధ్యం చేసిన అహింసా మూర్తి భారత జాతిపిత పూజ్య బాపూజీ మనకే కాదు విశ్వ వంద్యుదయ్యాడు ,ప్రాతస్మరణీయుడయ్యాడు . ఆయనపై థోరో ప్రభావం ఉన్నా దాన్ని సమస్యల సాధనకు ఆయుధంగా మార్చి విజేత అయి ,నెల్సన్ మండేలా ,మార్టిన్ లూధర్ కింగ్ , ఆన్ సాంగ్ సూకీ వంటి వారికి ఆదర్శమైనాడు మహాత్మా గాంధీ .ఆయన సాధించిన శాంతి విప్లవం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాధ్యాయం .
ఆధునిక రష్యా నిర్మాతలు లెనిన్, స్టాలిన్, చైనా భవిష్యత్తు తీర్చిదిద్దిన సన్యట్ సేన్ ,బ్రిటిష్ ప్రధాని చర్చిల్ నిశిత బుద్ధి ,యుద్ధతంత్ర నైపుణ్యం ,న్యు డీల్ తో అమెరికా భవితవ్యాన్నే మార్చేసిన అమెరికా అధ్యక్షుడు రెండవ ప్రపంచ యుద్ధం లో కీలక పాత్ర పోషించిన రూజ్ వెల్ట్ లు స్మరణీయులు .వీరు రాజకీయ నాయకులేకాదు-వరల్డ్ ఫేమస్ గ్రేట్ స్టేట్స్ మెన్ కూడా .
చిత్రలేఖనం లో వినూత్న మార్గాలకై అన్వేషించి ,నూత్న మార్గాలకు మార్గ దర్శులై కళలో సంపూర్ణత్వం కోసం జీవితా౦త౦ కృషిచేసిన పికాసో ,మాటిస్సే,సిజేన్ ,రేనార్డ్ ,మహాశిల్పి రోడిన్ ,ఆర్కిటెక్ట్ లాయడ్ రైట్ మొదలైనవారు ముళ్ళ బాటలలో ప్రయాణించి పూలబాటలలో హారతుల౦దుకొన్నారు .వారి సృజనే వారి కీర్తికి కిరీటం పెట్టింది .రష్యన్ స్వరకర్త ఇగార్ స్ట్రా విన్స్కి , ఫ్రెంచ్ సంగీతాన్ని బంగారు ఉయ్యాలలో ఊపిన రిచార్డ్ వాగ్నర్ ఆల్బర్ట్ స్క్వీజర్ ,సంగీతానికి ఎల్లలు లేవని నిరూపించారు .నవ్వుకే ఒక కొత్త అర్ధాని సృష్టించి ,నవ్వుకు డిక్షనరీ అనిపించి ,హాస్య సర్వస్వం అని తన మూకాభినయం తో ప్రపంచాన్నే ఆకర్షించిన నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ ను మర్చిపోగలమా ?అతడు ఏ దేశం వాడో మనకు అవసరమా ?ఆ ప్రభావం అలాంటిది .విశ్వ జన హృదయ విజేత చార్లీ చాప్లిన్ . నృత్యం లో విప్లవం సాధించిన ఇసదోరా డంకన్ సాహసమే ఊపిరిగా జీవించిన అమెరికన్ నృత్యకళాకారిణి.
సాహిత్య౦లొ కవిత్వం విషయానికి వస్తే గడ్డిపరకలతో వెంటి పేని ఏనుగునే బంధించవచ్చు .అలాంటి ‘’గడ్డిపరకలు ‘’అంటే లీవ్స్ ఆఫ్ గ్రాస్ కు సాహిత్యగౌరవం తెచ్చి ,అట్టడుగు వర్గాలవారిని హీరోలను చేసి ,అభ్యుదయమార్గాన్ని పట్టించి మానవీయతకు పట్టాభిషేకంచేసి అమెరికన్ జాతీయ కవి మహర్షి అనిపించుకొన్న వాల్ట్ విట్మన్ ప్రభావం పడని దేశం లేదు . ఎమిలీ డికేన్సన్ ,శతాబ్దాల వారధి హార్డీ ,సి౦బాలిజ౦ తో మనసుదోచిన పాల్ వేర్లేన్ ,స్ప్రింగ్ రిధం కర్త మాన్లి హాప్కిన్స్ ,నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న రాబిన్సన్,వ్యావహారిక భాషా కవిత్వ సారధి రాబర్ట్ ఫ్రాస్ట్ , చైతన్య స్రవంతి కి ప్రాణంపోసిన జేమ్స్ జాయిస్ ,ప్రతీక కవిత్వ మార్గ దర్శిఎజ్రా పౌండ్ ,ఆధునిక కవిత్వ రధ సారధి ఇలియేట్ ,కవిత్వ సంకెళ్ళు తెగ గొట్టిన ఆడెన్ ,,జ్వలించే విప్లభావ కవి డిలాన్ ధామస్ ప్రపంచ కవులలో ఎన్నదగిన వారిలో ఉన్నారు .
అమెరికన్ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు మార్క్ ట్వేన్ , కథ , నవల కు జీవం పోసిన హెమింగ్వే,ఫాక్నర్ ఫిట్జెరాల్డ్ ,అంతఃకరణకు విలువనిచ్చిన నవలారచయిత డి .హెచ్. లారెన్స్,ప్రభావ శాలి కాఫ్కా ,స్టీఫెన్ క్రేన్ ,యేట్స్, సైంటిఫిక్ ఫిక్షన్ కు దారి వేసిన హెచ్ జి వెల్స్ ,ఎమిలీ జోలా ,బెర్నార్డ్ షా ప్రపంచ వ్యాప్త అభిమానులున్న రష్యా నవలారచయిత, టాల్ స్టాయ్ ఫారం స్థాపించిన రష్యన్ రచనా మహర్షి టాల్ స్టాయ్ ,చిన్నకథ ల చెకోవ్ ,రియలిజ౦ వ్యాప్తి చేసిన ఫ్లాబర్ట్ , నేటివ్ అమెరికా నాటకానికి ఆద్యుడు యూజీన్ ఓ నీల్ ,నార్వేజియన్ నాటక పిత ఇబ్సన్ మొదలైనవారున్నారు . స్త్రీ జన హక్కులకోసం పోరాడిన సుశాన్ ఆంధోని ,క్రిస్టియన్ సైన్స్ ఉద్యమకారిణి మేరీ బేకర్ ఎడ్డీ ,సామాన్యుడికి కారు ఎక్కే అదృష్టం కల్పించిన హెన్రిఫోర్డ్ ,ఆధునిక జర్నలిజానికి ప్రతీక ధామస్ ఉల్ఫ్ వంటి సృజన శీలురు ,ప్రాతిభాసంపన్నులు ,భావితరాలకు ,ప్రపంచ దేశాలకు ఆదర్శ మూర్తులు అందరు మీకు ఒక్క చోటే దొరుకుతారు .చదివి ప్రేరణ పొందటం మీ కర్తవ్య౦ .వీరంతా ప్రపంచాభివృద్ధికి అభ్యుదయానికి కారకులు .వారందరికీ జేజేలు .
91 మంది మహనీయుల జీవిత చరిత్రలలో వెలుగుతోపాటు చీకట్లనూ ఆవిష్కరించి ,సరళమైన భాషలో ,అందరికి అందుబాటులో ఉండేట్లు రాశారు మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు . దీని ఆంగ్ల మాతృక రచయిత అమెరికా కు చెందిన లూయీ అంటర్ మేయర్ .దానికి పరిపుష్టి కలిగించారు తెలుగులో, తెలిగింపు లో శ్రీ దుర్గా ప్రసాద్ .దీన్నిసరసభారతి ద్వారా ప్రచురిస్తున్నందుకు ,ప్రపంచ ప్రసిద్ధ స్టాటిస్టిక్స్ గణిత శాస్త్ర వేత్త కీ .శే .డా శ్రీ పరుచూరి రామక్రిష్ణయ్యగారికి అంకితం ఇవ్వటం చాల సముచితంగా ఉంది .ఇంతటి ఉత్కృష్ట రచన సరస భారతి ద్వారా ముద్రింప జేయటానికి మా దంపతులం ప్రాయోజకులుగా ఉండటం మాకు దొరకిన అరుదైన అవకాశం గా అదృష్టంగా భావిస్తున్నాము . ఇది తెలుగు సాహిత్యం లో నూతన మార్గానికి ఆవిష్కరణ అవుతుంది అనటం లో సందేహం లేదు .
మైనేని గోపాల కృష్ణ
12-11-17 –
— సాహిత్యమే శ్వాస గా జీవించిన అమెరికా ఆస్థానకవి లూయీ అంటర్ మేయర్
వందకు పైగా గ్రంధాలు రాసిన లూయీ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్రకారుడు అగ్ర శ్రేణి విమర్శకుడు ,ప్రముఖ పత్రిక సంపాదకుడు అమెరికా దేశపు 14 వ ప్రభుత్వ ఆస్థానకవి అయిన బహుముఖ ప్రజ్ఞాని .వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో ,కొత్తదారులు తొక్కి మార్గ దర్శకులైన ఇగ్లాండ్ ,అమెరికా దేశ కవుల కవిత్వం జీవిత సరళి గురించి ‘’లీవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’ఉద్గ్రంధాన్ని 1959 లో రాశాడు .భావుకత పుష్కలం గా ఉన్న కవి అంటర్ మేయర్ .ఫస్ట్ లవ్ ఫ్రెంచ్ ,చాలెంజ్ సెంచరీ ,వన్ అండ్ వన్అండ్ వన్ అండ్ వన్ ,మొదలైన 20 కి పైగా కవితా సంపుటాలను ,’’ఫ్రం అనదర్ వరల్డ్ ‘’,బైగాన్స్ అనే స్వీయ చరిత్రనూ రాసుకొన్నాడు .’’ప్లే ఇన్ పోయెట్రి ,ది లోయెస్ట్ ఫారం ఆఫ్ విట్ ,ది పర్సూట్ ఆఫ్ పోయెట్రి మున్నగు 6 వ్యాస సంపుటాలను రచించాడు .మోజెస్ నవల ,ది డాగ్ ఆఫ్ పంపే మొదలైన 7 కాల్పనిక సాహిత్య గ్రంధాలనూ రాసి పాఠకులకు సన్నిహితుడయ్యాడు .ట్రెజరీ ఆఫ్ గ్రేట్ పోయెమ్స్ , మోడరన్ అమెరికన్ పోయెట్రి ,మోడరన్ బ్రిటిష్ పొయెట్రి ,న్యు సాంగ్స్ ఫర్ న్యు వాయిసెస్ ,గెలాక్సీ ఆఫ్ వెర్స్ ,ట్రెజరీ ఆఫ్ లాఫ్టర్ ,ఆంథాలజి ఆఫ్ న్యు ఇంగ్లాండ్ బెస్ట్ పోయెట్స్ ,హ్యూమర్ యాన్యువల్ ,ది గోల్డెన్ బుక్ ఆఫ్ పోయెమ్స్ ఫర్ ది వెరి యంగ్, మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ మొదలైన 30 కి పైగా జీవిత చరిత్రలు కూర్చాడు .వండర్ఫుల్ అడ్వెంచర్స్ ఆఫ్ పాల్ బన్యన్ ,ఈసప్స్ ఫేబుల్స్ , వరల్డ్స్ గ్రేట్ స్టోరీస్ వగైరా అనువాద గ్రంథాలు డజను కు పైగా వెలువరించాడు .బాల సాహిత్యాన్నీ లూయీ సుసంపన్నం చేసి తాను స్పృశించి స్వర్ణమయం చేయని ప్రక్రియ లేదని నిరూపించాడు .
1885 అక్టోబర్ 1 న అమెరికాలో న్యూయార్క్ నగరం లో జన్మించిన మేయర్ ,ఒక జామెట్రి లెక్క చేయ లేక పోయినందుకు గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .ఇరవై ఏళ్ళు తీవ్ర కృషి చేసి సాహిత్య ,సంస్కృతులను స్వయంగా అభ్యసించి ,ఏ యూని వర్సిటి లో చదివిన దానికంటే అధిక జ్ఞానాన్ని సాధించాడు .ఇంగ్లాండ్ వెళ్లి కొంత కాలం గడిపి , ఆస్ట్రియ ,ఇటలీ లు చూసి ,అమెరికా తిరిగి వచ్చి,రచనా వ్యాసంగం ,సాహిత్యోపన్యాసాలు ,వ్యవసాయం తోనూ కాలం గడిపాడు .అనేక యూని వర్సిటీలలో ‘’ పోయెట్ ఇన్ రెసిడెన్స్ ‘’గౌరవం పొందాడు .యుద్ధ సమాచార రచయితగా ,ఆర్మ్డ్ సర్వీసెస్ ఎడిషన్ లకు సంపాదకుడిగా ఉన్నాడు .తర్వాత ప్రముఖ టి .వి. చానల్ లో ముఖ్య ప్రోగ్రామర్ భూమికను గొప్పగా పోషించాడు .అమెరికా లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు ఆంగ్ల కవిత్వం లో కన్సల్టంట్ గా వ్యవహరించాడు .లూయీ రాసిన ‘’మోజెస్ ‘’నవల విశ్వ విఖ్యాత మైంది .అతని ఉద్గ్రంథాలన్నీ పలు ప్రచురణలు పొంది ప్రాచుర్యం పొందాయి .92 వ ఏట లూయీ అంటర్ మేయర్ 18-12-1977 న మరణించాడు .పేరు లోని మేయర్ పదానికి సాహిత్యంలో ,మేయరై మేరువై ప్రకాశించాడు .
మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ప్రత్యేకత
ఈ గ్రంథానికి ముందుమాట రాస్తూ అంటర్ మేయర్ ‘’మన కాలం లోనిప్రముఖ వ్యక్తులందరి గురించి రాయటానికి నేను దీన్ని మొదలు పెట్టలేదు .92 మంది ప్రముఖ స్త్రీ ,పురుషులకు మాత్రమే నేను తీసుకొన్నాను .వారు గత శతాబ్దం లో నూతనత్వానికి దారి చూపారు ,మన సాంస్కృతిక తీరు తెన్నులను మార్చారు ,మన జీవిత విధానాన్నే సమూలంగా మార్చేశారు .వీరంతా బీజాణువులవంటి వారు .’’కదిలించి చైతన్యం తెచ్చినవారు –మువర్స్ అండ్ షేకర్స్అన్నమాట .వారిని అనుసరించిన వారి పై వారి ప్రభావం స్పష్టం ,అమోఘం అద్వితీయం .వారి భావాలు ,విప్లవాత్మక ఆలోచనలు ,వ్యక్తీకరణ వలన నే ఆధునిక ప్రపంచం ఇప్పుడున్న రీతిలో ప్రకాశమానమై ఉన్నది .
వీరిపై రాయటానికి నేను చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది .కొందరు దారి తప్పించే ప్రయత్నం చేశారు .కాని వారిలోని ప్రయోగ శీలతను ,మార్గ దర్శకత్వానికి మాత్రమే నేను మొగ్గు చూపాను.తటస్తుల మాట వినక తప్పలేదు ఇందులో కళా జీవితం లో సృజనాత్మకంగా నూతనత్వాన్ని ఆవిష్కరించినవారు అధిక్షే పించ బడ్డారు ,చులకన పాలయ్యారు కూడా . సృజనకారులై నవారు, సైంటిస్ట్ లు ,ఆటవిక అవహేళనకు ఎదురు నిలిచి వీరుల్లా యుద్ధం చేయాల్సి వచ్చింది .అందరూ నడిచేదారి నుంచి వైదొలగినవారు ,లేక కట్టు బాటు ను కాదన్నవారందరూ ,అచంచల విశ్వాసం ,పట్టుదల ,అపనమ్మకం ,అడ్డంకులను ఎదుర్కొని ప్రప౦ఛ వ్యాప్త నిరసన వ్యతిరేకతను చవి చూశారు .సమాజం ఎప్పుడూ యధా స్థితినే కోరుకొన్నది .దానికి భంగం కలిగించిన వారిని అనుమానం తో క్షమించలేదు . స్పష్టమైన అభి వృద్ధి, కొత్త ఆలోచనలతోనే స్థిరం గా సాధ్యపడుతుంది .దీనివలన వ్యక్తిగత శతృత్వం ,సాదారణవ్యతిరేకత తప్పదు . తర్వాత విరుద్ధం నిరంతరం సాగి ,చివరికి అవహేళన చేసి హింసించిన ప్రపంచమే వారిని అర్ధం చేసుకొని మహా గొప్పగా ఆరాధిస్తుంది .ఈ 92 మంది మహానుభావుల జీవిత చిత్రణలో ప్రపంచం కృతజ్ఞత చూపలేక పోయిన వారినీ ఇందులో రాశాను .వారి ప్రభావం ఈ శతాబ్దం పై చాలా మొరటుగా, హింసాత్మకం గా ,అత్యంత అధికార క్రూర రాక్షస ఆధిపత్యాన్ని చెలాయించిన వారిని కూడా వారు విస్మరించ తగరు అని భావించి వారి గురించీ రాశాను .
ప్రముఖుల ఎన్నికలో వారిని తప్పని సరిగా రాయాల్సి రావటం మాత్రమే కాక వారి ప్రాధాన్యత కూడా గణనలోకి తీసుకున్నాను .చరిత్ర రాయాలి అని మాత్రమే కాక రాస్తూనే ఉండాలి అనే నియమం ఉన్నది .ఇందులో కొందరి గురించి పదేళ్ళ క్రితం తిరిగి రాశాను.అంతమాత్రం చేత మిగిలిన వారి విషయం లో విశ్లేషణలో ప్రాధాన్యాన్ని ఏమీ తగ్గించలేదు .డార్విన్ ,వాన్ గొ ,ప్రౌస్ట్ ఐన్ స్టీన్ ,ఎడిసన్ ల కృషి వారి కాలానికి ఉన్న ప్రాధాన్యత ను తెలియ జేస్తుంది .చార్లీ చాప్లిన్ ,ఇసడోరా డంకన్ జీరార్డ్ మాన్లి హాప్కిన్స్ వంటి వారు అత్యవసరం అని పించక పోవచ్చు కాని ,వారి రంగాలలో వాళ్ళ ప్రభావం చాలా విలక్షణమైనది .
కొందరు ప్రముఖులను వదిలేశాను. ఎందుకు అని ప్రశ్నిస్తే –వారిని చేరిస్తే వచ్చే ప్రశ్నలు అధికమౌతాయనే .రిచర్డ్ స్ట్రాస్ ను గురించి నేను రాయలేదు .దీనికి కారణం ఆయన రిచార్డ్ వాగ్నర్ నుంచి అంగుళం కూడా కదిలి ముందుకు ,ప్రక్కకు కాని పోలేదు .పైగా ఆయన ‘’రిచార్డ్ ది సెకండ్’’అని ముద్ర పడ్డాడు కనుక. చెవులకింపైన సంగీతం కూర్చిన గ్రీగ్ , చెకోవ్ స్కి లు గొప్ప ప్రతిభా వంతులే కాని ,ప్రాచుర్యం పొందినవారే కాని ఈ త్రయం లో ఏ ఒక్కరూ కొత్త సంగీత శబ్ద జాలాన్ని సృస్టించనే లేదు . సృజనకారులైన స్కాన్బెర్గ్ ,బార్టోక్ ల , ప్రభావం విస్మరించ తగనిదే బాగా ప్రత్యేమైనదేకాని వదిలేయాల్సి వచ్చింది .
కవులలో కారల్ సాండ్ బర్గ్ , వాలెస్ స్టీవెన్స్ ,మేరియాన్నే మూర్ ల కృషి గొప్పదే కాని వారు సెల్ఫ్ ఎంక్లోసేడ్ ,సెల్ఫ్ కంప్లీట్ గా గిరి గీసుకొని ఉండిపోవటం తో వదిలేశాను .కొందరు పియానో వాద్యకారులను కూడా వదిలేయాల్సి వచ్చింది .కారణం వీరి కృషిని కొందరు ముందే ఊహించి చెప్పటమే .లిస్టర్ పరి శోధనలు పాశ్చర్ అధ్యాయం లో తెరమరుగై పోయాయి .
ఇందులో ఉన్న స్త్రీ ,పురుషులలో వారి ముఖ్య గుణ గణాలను గురించే రాశాను .యదార్ధానికి అత్యంత సన్నిహితంగా ఉండాలన్నదే నా ధ్యేయం . కాని వ్యాఖ్యాత దృష్టికోణం కాదు .రచయిత నిష్పాక్షికంగా ఉండాలన్నది నా లక్ష్యం .నేను ఏ ఒక్క ఆలోచనా సంప్రదాయానికి అను చరుడిని కాని , లేక ఎవరికీ శిష్యుడను కూడా కాను .ఏదో ఒక సిద్ధాంతాన్ని రుబ్బి రుచి చూపించేవాడినీ కాను.న్యాయమైన సూక్ష్మ బుద్ధితో సత్యాలనే వెతికి రాసి అంతిమ విలువకు ప్రాధాన్యమిచ్చే వాడినే తప్ప, ఊహాగానాలతో సంచారం చేసే వాడిని కాదు .
పుస్తక౦ లో కవులు ,చిత్రకారులు ,ఫిలాసఫర్లు ,ఫిజిసిస్ట్ లు ,రాజకీయ నాయకులు మొదలైన శీర్షికలు ఎందుకు నేను పెట్టలేదు అనే ప్రశ్న రావచ్చు .దీనికి ముఖ్య కారణం ఇందులో చాలామంది ఒకే కేటగిరి లో ఇమిడేవారు కాదు .బెర్ట్రాండ్ రసెల్ గణితం లో అతి ప్రతిభా వంతుడు మాత్రమేకాక గొప్ప ఫిలాసఫర్ కూడా ..టి ఎస్ .ఇలియట్ కవి మాత్రమేకాదు ,మహా నాటక రచయితా వ్యాసకర్త కూడా .అలాగే గాంధీ ని రాజకీయ నాయకుడి గా మాత్రమే చిత్రించి ఆయన ఇతర రంగాలలోని సేవా కార్య కలాపాలను ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని విస్మరించలేము .ఆల్బర్ట్ స్వీట్జర్ ను ‘’సెయింట్స్ ‘’లో పెట్టి ,ఆయన మిగిలిన విశేషాలను వదిలేయ లేము .కనుక శీర్షికలు పెట్టలేదు . వారి బహుముఖీయ ప్రతిభను పరిమితం చేయలేక నే శీర్షికలు పెట్టలేదు .
నేను కూర్చిన దానిలో ఒక మంచి సమతుల్యత ,ఒక ప్రత్యేక విరుద్ధత కూడా ఉన్నాయి .ఎకడమిక్ విషయాలు తక్కువగా ఆసక్తికర విషయాల ప్రాధాన్యతతో మార్పుల ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని రచించాను .కాలాన్ని అనుసరించి రాయటం వలన సంఘటనలు ఆ కాలానికి ప్రాతినిధ్యం వహించటమేకాక వాటి ప్రభావం కూడా తెలుసుకొనే వీలున్నది .దీనివలన చారిత్రాత్మక అభివృద్ధి నేపధ్యం వరుసగా సోపానాలుగా దర్శనమిచ్చి వారి వ్యక్తిత్వాలకు మెరుగు పెట్టినట్లు అవుతుంది .పుస్తకం మొదటి నుంచి చివరిదాకా స్వతంత్రమైన క్రాస్ రిఫరెన్స్ లను అందజేసి చదువరికి ప్రభావాల మెరుగు తరుగులను అర్ధం చేసుకొనే వీలు కల్పించాను .ఇలాంటి అంతర్గత సంబంధాలు నీషే ,వాగ్నర్ ,హిట్లర్ ,లలో బాగా కనిపించి ”అన్ని వైపులా రచయిత చూసి రాశాడు”అనే అభి ప్రాయాన్ని కలిగించాను .ఇందులో మరీ ప్రత్యేకంగా కర్క్ గార్డ్ ,కాఫ్కా, సాత్రే లలో ఇది బాగా కని పిస్తుంది .
ఈ గ్రంధం స్పెషలిస్ట్ ల కోసమో ,విమర్శనా దృష్టి తో చూసే విద్యా వేత్తలకో కాదు .వారికి నా అంచనాలు స్పష్టంగా ,అసంపూర్ణ నమూనా లుగా అని పించవచ్చు .కాని దీనికి విరుద్ధంగా కొంత విషయజ్ఞానం , ముందు ఊహ ,సైంటిఫిక్ సాంకేతికాలలో ఉన్నవారికి సాహిత్య టెక్నిక్ ఉన్నవారికి ఉపయోగ పడుతుంది .ఈ 92 మంది ప్రభావం ఇప్పుడున్న మనం ఉంటున్న కాలం పై ఎలా ఉంది అని నిర్వచి౦చాలను కోవటం సహజమే ., అందుకని వారి కృషి రసాన్ని వడబోయాల్సి వచ్చింది .ఈ బృహత్తర రచన కోసం నేను 600 గ్రంథాలను తిరగేయటమో వాటినుండి అభిప్రాయ సేకరణ చేయటమో జరిగింది .అందుకని నాకు ముందు రాసిన జీవిత చరిత్ర కారులకు విమర్శక విశ్లేషకులకు , నేను ఎంతో రుణపడి ఉన్నానని సవినయంగా మనవి చేస్తున్నాను .వారి వివరాలన్నీ గ్రంథం చివర పొందుపరచాను . ఈ గ్రంథం లోని కొన్ని పేరాలు పూర్వం నేను రాసిన వ్యాసాలలో కనిపించి ఉండవచ్చు .వాటిని నేను యధాతధంగా వాడుకోవటానికి అనుమతించిన ఆ పబ్లిషర్ లు ‘’హార్ కోర్ట్ బ్రెస్ అండ్ కంపెని ‘’,కంపెని ఫర్ మోడరన్ అమెరికన్ అండ్ బ్రిటిష్ పోయెట్రి ,ది కాలేజ్ సర్వే ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ,హెన్రి హాల్ట్ అండ్ కంపెని ,జార్జి మేకీ కంపనీస్ మొదలైన వారికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను . ఈ గ్రంథం రాస్తూ ఉండగా నాకు ఎన్నో సలహాలనిచ్చి ప్రోత్సహించిన జాక్ గుడ్ మాన్ ,ఫిలిప్ వా౦డోరన్ స్టెర్న్, మెర్రిల్ మూర్ ,స్టాన్లీ బర్న్ షా లకు కృతజ్ఞతలు .నా రిసెర్చ్ లో సహాయపడిన అల్రిక్ కాషెల్,ఎలైన్ లార్బర్ ,బీట్రిస్ బ్రాడే ,మా కోడలు నార్మా ఆన్చిన్ అంటర్ మేయర్ లకు ఏమిచ్చి ఋణం తీర్చు కోగలను ?కృతజ్ఞతలు చెప్పటం తప్ప .
ముఖ్యంగా సైంటిఫిక్ డేటా విషయం లో సేకరించిన విషయాలను చెక్ ,కౌంటర్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది .దీనికి నాకొడుకు జాన్ మూర్ చాలా సహాయం చేశాడు .ప్లాంక్ , ఎడ్డింగ్టన్ ల పై రాసిన చాప్టర్లలో అతను అంద జేసిన విలువైన సమాచారం ఉంది.సంపాదకత్వం లో చక్కని చతురత ,నిపుణత ఉన్న నా భార్య బ్రినా ఐవెన్స్ నా వెన్నంటి ఉండి నడిపించి ఈ మహత్తర గ్రంధాన్ని గట్టెక్కించటానికి చేసిన తోడ్పాటుకు ఆమెకు జీవితాంతం కృతజ్ఞుడను .’’
అని అతి స్పష్టంగా అత్యంత వినయం గా తన ప్రణాలికను వివరించి ,సహకరించినవారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన సహృదయ మూర్తి లూయీ అంటర్ మేయర్ . ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’ బృహద్గ్రంధాన్ని1955 లో అంటర్ మేయర్ ప్రచురింఛి లోకానికి మహోపకారం చేశాడు .అది 20-10-2014 న అంటే సుమారుగా 60 ఏళ్ళకు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ద్వారా నాకు చేరింది .దీన్ని ఆ రోజునుంచే చదవటం ప్రారంభించి 23-1-2015 కు అంటే 3 నెలల లోపు చదివి పూ ర్తి చేశాను .ఆతర్వాత కథ అంతా ముందే వివరించాను .ఇంతమంచి ఉపయుక్త గ్రంథాన్ని అనుసరించి తెలుగులో ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’గా అంతర్జాలం లో రాసి, ఇప్పుడు పుస్తక రూపం లో అందజేస్తున్నందుకు ఆనందంగా ఉంది.దీనికి సహకరించిన వారందరికీ మరో మారు కృతజ్ఞతలు .ఇందులోని గుణాలన్నీ అంటర్ మేయర్ కు, దోషాలన్నీ నాకు దక్కుతాయని సవినయంగా మనవి చేసుకొంటున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-3-17 –ఉయ్యూరు
స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితం
లూయీ అంటర్ మేయర్ ఆంగ్లం లో రాసిన బృహద్గ్రంథం’’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’ఆధారం గా నేను దాదాపు సంవత్సరన్నర కాలంగా అంతర్జాలం లో 245 ఎపిసోడ్ లుగా 91 మంది మహానుభావులపై రాసిన ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’ను ఎవరికి అంకితం ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే ఆప్తమిత్రులు ,సరస భారతి శ్రేయోభిలాషి ,ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు (అమెరికా ) తమ బావమరది ,ప్రపంచ ప్రముఖ స్టాటిస్టిక్స్ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి, సుమనస్కులు స్వర్గీయడా. శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి ఇంతటి విశిష్ట రచన అంకిత మిస్తే గ్రంథ ప్రాముఖ్యత ద్విగుణీకృతం అవుతుందని సూచించి,నా అనుమతిని కోరటం, నేను క్షణం కూడా ఆలోచించకుండా ఆమోదించటం క్షణాల మీద జరిగి పోయింది .ఈ గ్రంథాన్నిసరసభారతి ద్వారా ముద్రించటానికి అవసరమైన ధనాన్ని శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు రేపల్లె వాస్తవ్యులు కీ శే .పరుచూరిభావనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారిని సంప్రదించి వారి ఆమోదాన్ని నాకు తెలియ బరచారు . ఇంతటి బృహత్ గ్రంధానికి బృహత్ ప్రోత్సాహం నన్ను సంతృప్తి పరచింది . .ఇంతటి ఆచూకీ గ్రంధం అంటే రిఫరెన్స్ పుస్తకం సరసభారతి 26 వ గ్రంథంగా వెలువడటం ,నేను రాసిన 15 వ పుస్తకం కావటం మహదానందంగా ఉన్నది .ఒక సర్వ శ్రేష్ట గ్రంథం ఒక సర్వ శ్రేష్ట మహాన్నత వ్యక్తి స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామ క్రష్ణయ్యగారికి అంకితం ఇస్తున్నందుకు సంతోషిస్తూ వారి గురించి వ్రాయటానికి ఉపక్రమిస్తున్నాను .
స్టాటిస్టిక్స్ లో శాశ్వత కీర్తి నార్జించిన స్వర్గీయ డా శ్రీ పరుచూరి రామ కృష్ణయ్యగారు
జనన విద్యాభ్యాసాలు
శ్రీ పరుచూరి రామ క్రష్ణయ్యగారు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర నల్లూరు అనే చిన్న గ్రామం లో 15-7-1932 న మధ్యతరగతి రైతు కుటుంబం లో శ్రీ పరుచూరి భావన్నారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు.వీరి బాల్య విద్యాభ్యాసం నల్లూరు, రేపల్లె లో జరిగింది .నేటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో సెకండరీ విద్య పూర్తి చేశారు . మద్రాస్ లయోలాకాలేజి లో ఇంటర్ చదివి ,ప్రెసిడెన్సి కళాశాలనుండి గణిత శాస్త్రం లో ‘’స్టాటిస్టిక్స్ ‘’అభిమాన విషయంగా బి .ఎస్ .సి .ఆనర్స్ డిగ్రీ పొందారు .అమెరికాలోని మిన్నెసోటా యూని వర్సిటి లో చేరి తమ అభిమాన స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ (గణాంక శాస్త్రం )లో ఎం .ఎస్ . ను పి .హెచ్ .డి.సాధించారు .1956 లో నార్త్ కరోలిన యూని వర్సిటి ప్రొఫెసర్ శ్రీ ఎస్. యెన్. రాయ్ మిన్నెసోటా సందర్శించినపుడు క్రష్ణయ్యగారిని ‘’మల్టి వేరియేట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కోర్స్ ‘’లో చేరమని ప్రోత్సహించగా ,కొలరాడో లోని బోల్డర్ లో ఉన్న ఐ .ఎం. ఎస్ .సమ్మర్ ఇన్ స్టి ట్యూట్ లో 1957 లో స్టూడెంట్ మెంబర్ గా చేరారు .ఇక్కడ ఉండగానే అనాలిసిస్ ఆఫ్ వేరిఎన్స్, దానికి సంబంధించిన సమస్యలపై జరిగిన సెమినార్ లలో బోస్ , కెం ఫ్టోర్నే ,కృస్కాల్ , షెఫే మొదలైన ప్రొఫెసర్ ల ప్రభావం తో తన ప్రతిభకు రాణింపు తెచ్చుకొన్నారు .ఏడాది తర్వాత మిన్నెసోటా లో జరిగిన మరొక సెమినార్ లో శ్రీ క్రష్ణయ్య’’రా0కింగ్ అండ్ సెలెక్షన్ ప్రాబ్లెమ్స్ ‘’పై ఆకర్షితులయ్యారు .ఈ మూడు ప్రత్యేక విషయాలే ఆ తర్వాత ఆయన కు కన్సల్టేషన్ ,పబ్లికేషన్ కు బాగా తోడ్పడినాయి .1959- -60 లో ఆయన చాపెల్ హిల్ లో ఒక ఏడాది గడిపి ఈ సబ్జెక్ట్ ల పై ప్రొఫెసర్ రాయ్ తో విస్తృతం గా చర్చించారు .
గణిత శాస్త్ర మేధావి –పరిశోధన
మిన్నెసోటా యూని వర్సిటి లో విదార్ధిగా 1955 – 60 వరకు బ్యూరో ఆఫ్ ఎడ్యు కేషనల్ రిసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ‘’స్టాటిస్టికల్ అనలిస్ట్ ‘’గా సేవ లందించారు . 1960-నుండి1962 వరకు పెన్సిల్వేనియాలో బ్లూబెల్ లో ఉన్న రెమింగ్ట న్ రాండ్ కంపెనీలో సీనియర్ స్టాటిస్టీషియన్ గా పని చేశారు . ,1963 నుంచి 1976 వరకు ఒహాయో లో డేటన్ లోని రైట్ పాటర్సన్ వైమానిక స్థావరం మాధమాటికల్ స్టాటిస్టీషియన్ గా ఉండి .గణిత శాస్త్ర పరిశోధన ,అభి వృద్ధి లో కృషి చేశారు .1976 లో పిట్స్ బర్గ్ యూని వర్సిటి స్టాటిస్టిక్స్ శాఖ లో ప్రొఫెసర్ గా బోధనా వ్రుత్తి లో ప్రవేశించి ఉత్తమ ఆచార్యునిగా గుర్తింపు పొందారు .స్టాటిస్టిక్స్ లో ఆధునిక ప్రోగ్రాం రూపొందించి స్టాటిస్టిక్స్ కు అమెరికాలో విశేషమైన ,విశిష్ట స్థానాన్ని చేకూర్చారు .ఎన్నో ప్రభుత్వ ,ప్రైవేట్ రిసెర్చ్ ప్రాజెక్ట్ లకు నిర్దుష్టంగా ప్రపోజల్స్ తయారు చేసి ,సకాలం లో వాటిని పూర్టి చేసి,వందల వేల డాలర్ల ఫండ్ ను డిపార్ట్ ట్ కు సమకూర్చి ,ఆర్ధిక పరి పుష్టి కి తోడ్పడి అడ్మినిస్ట్రేషన్ వారి గౌరవ ప్రశంసలకు ప్రీతి పాత్రులై , ఆ శాఖ కు, యూని వర్సిటి కి గొప్ప పేరు ప్రతిష్టలను చేకూర్చారు . . .ఇక్కడితో ఆగిపోకుండా ‘’మల్టి వేరియేట్ విశ్లేషణా కేంద్రం ‘’ను 1982 లో స్థాపింఛి వ్యవస్థాపక డైరెక్టర్ గా ఉంటూ ,గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా,కార్నెగి మెల్లన్ విశ్వ విద్యాలయం లో కన్సల్టంట్ గా వ్యవహరించారు . . మల్టి వేరియేట్ విశ్లేషణ పై 1965 ,68 ,72 ,75 ,78 ,1983 సంవత్సరాలలో 6 అంతర్జాతీయ సింపోజియం లను నిర్వహించిన ఘనత శ్రీ రామ క్రష్ణయ్యగారిది . ఈ సి౦పోజియం ‘’ప్రొసీడింగ్స్ ‘’ను ప్రచురించి శాశ్వతం చేశారు ..అందులోమొదటి సమావేశ ప్రొసీడింగ్స్ ను ఈ రంగం లో తమకు విశేష అభి రుచి కలిగించి ,మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ ఎస్ .యెన్ .రాయ్ జ్ఞాపకార్ధం ప్రచురించారు .తరువాతి వాటిని తమ అభివృద్ధికి సాయపడిన హెచ్ .హోటెల్లింగ్, పి .సి. మహలనోబిస్ ,హెచ్ .షెఫే ల కు కృతజ్ఞతగా అంకితమిచ్చిఋణం తీర్చుకున్నారు . , దీనిపై భావధార కోసం ఒక ప్రత్యేక పత్రిక’’జర్నల్ ఆఫ్ మల్టి వేరియేట్ అనాలిసిస్ ‘’ స్థాపించి ,దానికి అంతర్జాతీయ గుర్తింపు కలిగించారు . నార్త్ హాలండ్ ప్రచురించిన ‘’హాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ‘’కు జనరల్ ఎడిటర్ గా ఉన్నారు .ఇవి కాక ‘’స్టాటిస్టికల్ ప్లానింగ్ అండ్ ఇన్ఫరెన్స్ ‘’ కు ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులుగా ,నార్త్ హాలండ్ సిరీస్ ‘’స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్ ‘’కు కోఆర్దినేటింగ్ ఎడిటర్ గా సేవలందించారు .నిరంతర పరిశోధన ,అమలు వీరి అభిమాన విషయాలు .’’ప్రాబబిలిటి అండ్ మాధమాటికల్ స్టాటి స్టిక్స్ ‘’పై రష్యాలోని వెల్నియస్ లో జరిగిన మూడు అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వాని౦ప బడి విలువైన ప్రొఫెషనల్ పత్రాలను సమర్పించి దిశా నిర్దేశనం చేశారు .1981 లో చైనా లో యూనివర్సిటీల ఆహ్వానం పై మూడు వారాలు పర్యటించారు . జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ సైన్స్ ఫెలోషిప్ అందుకోవటానికి 1986 -87 లో ఒక నెలరోజులకు ఆహ్వానించగా కేన్సర్ వ్యాధి తో తీవ్ర అస్వస్థులైనందువలన వెళ్ళ లేక పోయారు . . 1966 లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టి ట్యూట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ,వార్సాలోని బెనాక్ సెంటర్ కు ,పోలిష్ అండ్ యు .ఎస్ .నేషనల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు చెందిన మాధమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .. 1960 లో ఆంధ్రా యూని వర్సిటి మాధమాటిక్స్ డిపార్ట్ మెంట్ ,1968 లో మద్రాస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మాధమాటికల్ సైన్సెస్ యాజమాన్యాల ఆహ్వానం మేరకు ‘’మాధమాటికల్ మరియు స్టాటిస్టికల్ సైన్సెస్ లో నూతన పరిణామాలు ‘’ పై ప్రసంగాలు చేశారు .
వివాహం సంతానం
శ్రీ రామ క్రష్ణయ్యగారు 1960 లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాస్తవ్యులు ప్రముఖ న్యాయవాది శ్రీ కాను మిల్లి రామ చంద్ర రావు శ్రీమతి లీలావతి గార్ల జ్యేష్ట పుత్రిక శ్రీమతి ఇందిర ,బి .ఏ . గారిని వివాహమాడారు.ఈ దంపతులకు శ్రీ రఘురాం , శ్రీ నిరంజన్ రాం అనే ఇద్దరు కుమారులు . చిన్నతనం లోనే తండ్రి ని కోల్పోయిన వీరిద్దరినీ ఆదర్శ సతీమణి శ్రీమతి ఇందిర గారు మాతృ మూర్తిగా వారికి సద్బుద్ధులు గరపి ,తీర్చి దిద్దిన ఆదర్శ మూర్తి . వీరిద్దరూ తమకు అభిమానమున్న ప్రముఖ విద్యా ,పారిశ్రామిక ర౦గాలలో రాణిస్తూ ,వివాహాలు చేసుకొని సత్సంతానం తో అభి వృద్ధి చెంది ,తండ్రి గారి పేరు నిలబెడుతూ ,తల్లి గారిని గౌరవ ,ప్రేమాభిమానాలతో కంటికి రెప్ప లాగా కాపాడు కొంటూ జీవితాలను సార్ధకం చేసుకొని ధన్యులై కుటుంబ గౌరవాన్ని చక్కగా కాపాడు కొంటున్నారు .. శ్రీమతి ఇందిర గారు ప్రస్తుతం పిట్స్ బర్గ్ కమ్యూనిటి కాలేజి లో డెవలప్ మెంట్ రీడింగ్ ఇన్ స్ట్రక్టర్ గా ఉన్నారు . శ్రీ రామ కృష్ణయ్య గారి పేరు లోని ‘’కృష్ణయ్య’’ పదం ఇప్పుడు వారికీ ,వారి వారసులకు ఇంటి పేరు(ఫామిలి నేం )గా మారిపోయి స్థిరపడి పోయి గౌరవాన్ని కల్గించింది .
గ్రంథ ప్రచురణ –పరిశోధకులకు చేయూత
తమ అభిమాన స్టాటిస్టిక్స్ లో ఆధునిక నైపుణ్యాలను వివరిస్తూ వీరి సంపాదకత్వం లో అనేక విశిష్ట గ్రంథాలను ప్రచురించారు .పిట్స్ బర్గ్ యూని వర్సిటి లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ మాధమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అభి వృద్ధికి కీలక పాత్ర పోషించారు . ఎన్నో యూని వర్సిటీలు ఆహ్వానించినా ప్రొఫెసర్ సి .ఆర్ .రావు గారిని ఒప్పించి ఈ డిపార్ట్ మెంట్ కు ఆహ్వానించి వారి సేవలను అందింప జేయటం లో రామక్రష్ణయ్యగారి పాత్ర ,కృషి అద్వితీయమైనది . ఆయన బహుముఖ ప్రతిభకు ఉదాహరణలే ‘’థీరిటికల్ అండ్ కంప్యు టేషనల్ స్టాటిస్టిక్స్ ,సిగ్నల్ ప్రాసెసింగ్ ,పాటర్న్ రికగ్నిషన్ ,మెడికల్ స్టాటిస్టిక్స్ ,ఎకనామెట్రిక్స్ లలో ఆయన అమోఘ సృజనాత్మక కృషి .అనేక రంగాలలోని సైంటిస్ట్ లకు 30 ఏళ్ళు విలువైన సంతృప్తికరమైన సేవలు అందించారు శ్రీ రామ కృష్ణయ్య గారు . మూడవ ప్రపంచ దేశాలలో సైంటిఫిక్ హెల్త్ ,అల్లైడ్ రిసెర్చ్ ఎడ్యుకేషన్ ల కోసం అంకిత భావం తో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ ‘’SH A R E ‘’సంస్థకు అధ్యక్షులుగా రామ క్రష్ణయ్యగారు మరణించే వరకు సేవ చేశారు . ఆయన 19 విలువైన గ్రంథాలకు , మోనోగ్రాఫ్ లకు సంపాదకులుగా ఉన్నారు. రెండు రిఫరెన్స్ గ్రంథాల ను రచించారు .1976 నుండి చనిపోయే దాకా పిట్స్ బర్గ్ యూని వర్సిటి కు రిసెర్చ్ కాన్ ట్రాక్ట్స్ కు ప్రిన్సిపల్ ఇన్వెస్టి గేటర్ గా ఉన్నారు . థీరిటికల్ స్టాటిస్టిక్స్ ఆయన అభిమాన విషయమే అయినా అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ను ఎప్పుడూ దృష్టి లో ఉంచుకొనేవారు ..
గణిత శాస్త్రం లో పరిశోధన చేసే అనేక మంది విద్యార్ధులకు వేలాది డాలర్ల స్కాలర్షిప్ లను మంజూరు చేస్తూ ప్రపంచ వ్యాప్త ప్రశంసలను అందుకున్నారు .వీరి పర్య వేక్షణ లో డాక్టరేట్ పొందిన విద్యార్ధులు పలు దేశాలలో ప్రముఖ శాస్త్రజ్ఞులు గా రాణిస్తూ గౌరవం పొందుతున్నారు .ఆరోగ్య రంగం లో డాక్టర్ల నైపుణ్యం పెంచటానికి అమెరికన్ షేర్ సంస్థ ఏర్పరచి తాము చైర్ పర్సన్ గా ఉన్నారు .దీనికి అనుబంధంగా ఇండియాలో హైదరాబాద్ లో ఒక శాఖ ను ఏర్పాటు చేశారు .వీరి సేవానిరతికి గుర్తింపుగా అమెరికాలో పెన్సిల్వేనియా యూని వర్సిటి లో ‘’పెన్ –రామ కృష్ణయ్య ఫండ్ ‘’ను ఏర్పరచి విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందజేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు .
గౌరవ పురస్కారాలు
డా రామకృష్ణయ్య గారి బహుముఖీన ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్టాటిస్టికల్ సంస్థ ,అమెరికా స్టాటిస్టికల్ అసోసియేషన్ ,అమెరికా సైన్స్ పురోభి వృద్ధి అసోసియేషన్ ,స్టాటిస్టికల్ విద్యా సంస్థ మొదలైనవి సభ్యత్వమిచ్చి గౌరవించి వారి సేవలను అందుకొన్నాయి . శ్రీ కృష్ణయ్య రూపొందించిన స్టాటిస్టికల్ టెస్ట్ ‘’కృష్ణయ్యాస్ ఫైనైట్ ఇంటర్ సెక్షన్ టెస్ట్ ‘’ గా వారి పేర గౌరవం గా నామకరణం చేయబడి ప్రసిద్ధి చెందింది . భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 19 80 దశకం లో శ్రీ రామ కృష్ణయ్య గారితో పాటు ,ప్రముఖ శాస్త్ర వేత్తలను ఢిల్లీ లో సత్కరించి వారి విశిష్ట సేవలకు గుర్తింపు కలిగించారు . 1985 లో అమెరికాలోని తెలుగు సంస్థ ‘’తానా ‘’శ్రీ రామ క్రష్ణయ్యగారిని ‘’గొప్ప శాస్త్ర వేత్త ‘’గా గుర్తించి ఘనంగా సన్మానించింది .శ్రీ రామకృష్ణ య్య గారు మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి విద్యార్ధిగా ఉన్నప్పుడు ‘’సత్యాగ్రహం ‘’నాటికలో బాపూజీ గా నటించి ,వాస్తవికత కోసం తల వెంట్రుకలు తీయించుకొని (గుండు చేయించుకొని ) నటించి ,అందరి ప్రశంసలు అందుకొన్నారు .
‘’చిరంజీవి’’డా .పరుచూరి రామకృష్ణయ్య
డా .పరుచూరి రామ కృష్ణయ్య గారి స్మృతులను శాశ్వతం చేయటానికి 1992లో పెన్సిల్వేనియా స్టేట్ యూని వర్సిటి లో ‘’విజిటింగ్ స్కాలర్స్ ప్రోగ్రాం ‘’ను ప్రారంభించి ,శ్రీ రామ కృష్ణయ్య స్మారక ఉపన్యాసాలను ,లేక ఈ ప్రోగ్రాం లో రిసెర్చ్ వర్క్ లో పాల్గొనే కార్యక్రమాన్ని ‘’పి .ఆర్ .కృష్ణయ్య మెమోరియల్ లెక్చర్స్ ‘’అని నామకరణం చేసి ,అసాదారణ ప్రతిభా విశేషాలున్న వారిని ఆహ్వానించి ప్రసంగాలు చేయిస్తూ గౌరవిస్తూ రామ క్రష్ణయ్యగారిని స్మృతి పధం లో చిరంజీవి ని చేస్తున్నారు .
ఈ ప్రోగ్రాం లో పాల్గొని ఉపన్యసించి గౌరవ పురస్కారాలు అందుకున్న విజిటింగ్ స్కాలర్స్
1-1992-సర్ డేవిడ్ ఆర్ .కాక్స్
2-1993-హెర్మన్ చెనాఫ్
3-1994- బ్రాడ్లీ ఎఫ్రాన్ మరియు పీటర్ జే బ్రికేట్
4-1995- శ్రీనివాస ఆర్ .ఎస్ .వర్ధన్
5-1999-డేవిడ్ మ౦ ఫోర్డ్
6-2000 –డేవిడ్ ఎల్ .డోనోహో
7-2001-లియో బ్రీమన్
8-2003-జేమ్స్ ఓ బెర్జెర్
9-2006 –జీన్ హెచ్ .గోలబ్
10-2008-ఎలిజబెత్ ధాంప్సన్
11-2013 –స్టీఫెన్ ఫీన్ బెర్గ్
12-2015 –నాన్సీ రీడ్
13-2017-సతీష్ అయ్యంగార్
కుటుంబానికి ప్రోత్సాహం
వీరి అన్నగారు శ్రీ సుదర్శన రావు గారు ‘’పరుచూరి వారి పాక శాస్త్రం ‘’రాసి ప్రచురించారు .ఈ పుస్తక విక్రయం వలన లభించిన వేలాది డాలర్లను పై ఫండ్ కు అందజేసి తమ వితరణ శీలత్వాన్ని ప్రకటించుకున్నారు . రామ క్రష్ణయ్యగారు తమ అన్నగారిని నలుగురు తమ్ముళ్ళను ,ఇద్దరు అక్క చెల్లెళ్ళను అమెరికా కు తీసుకొని వచ్చి అక్కడే స్థిరపడేట్లు చేశారు . శ్రీ రామ కృష్ణయ్య గారిది నిష్కల్మష, నిర్మల, నిష్కపట గుణం .వీరిది అతి సుకుమారమైన చిన్న పిల్లల మనస్తత్వం.ఊహలో కూడా ఎవరికీ హాని తలపెట్టని సంస్కారం వారిది .మొదటి నుండి తండ్రి గారి కస్ట సుఖాలలో పాలు పంచుకొని ,కుటుంబ సభ్యుల ,సన్నిహితుల మేలు కోసం పరితపించిన విశాల, ఉన్నత గుణ సంపన్నులు శ్రీ రామ కృష్ణయ్యగారు “.”.తెలుగు దేశం నుండి అమెరికా వెళ్ళిన వారికి రామ క్రష్ణయ్యగారు సహాయ సహకారాలు అందించి ఆదుకున్నారు .1977 లో సృష్టించిన దివి సీమ ఉప్పెన భీభత్సం వలన శకలం కోల్పోయిన వారి కుటుంబాల కడగండ్లను స్వయం గా చూసి ,చలించిన శ్రీ రామ కృష్ణయ్య గారు రేపల్లె సమీపం లో నగరంలో ఉన్న వెలగ పూడి రామ కృష్ణ కాలేజి వారి తో కలిసి , నష్ట పోయిన ఆ ప్రాంతం లోనూ, దివి తాలూకా లోను తమ శాయ శక్తులా సహాయ సహకారాలు అందించి మానవత్వానికి ఎత్తిన పతాక గా నిలిచిన మహోదారులు .
.. మహా ప్రస్థాన౦
ఇండియాలో ఒక చిన్న పల్లెటూరు లో జన్మించి తమ మేధా సంపత్తి చేత స్టాటిస్టిక్స్ గణిత శాస్త్ర౦ లో అంతర్జాతీయ ప్రముఖులై ,ఎందరికో విద్యాదానం చేసి ,ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ,మేధావి ,వితరణ శీలి ,సుమనస్కులు డా ,పరుచూరి రామ క్రష్ణయ్యగారు 1-8-1987 న 55 వ ఏట కేన్సర్ వ్యాధి తో మరణించటం దురదృష్ట కరం ..
.
‘’అయం నిజః పరో వేది గణనా లఘు చేతసాం
‘ఉదార చరితానాం తు పురుషాణా౦ వసుధైక కుటుంబకం’’ ‘
భావం –వీడు నా వాడు, వాడు పరాయి వాడు అనే బుద్ధి అల్ప మనస్కులకే ఉంటుంది .ఉదాత్త చరిత్ర కల పురుషులకు విశ్వమంతా తన కుటుంబమే నని పిస్తుంది .
శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారి సంగ్రహ జీవిత చరిత్రకు ఆధారం –
1- 20 వ శతాబ్దపు తెలుగు వెలుగులు -2-ప్రొఫెసర్ ఎం .ఎం .రావు మరియు పద్మ విభూషణ్ ప్రొఫెసర్ సి. ఆర్. రావు గార్లు రచించిన గ్రంథం 3- శ్రీ రామ కృష్ణయ్య గారి అర్ధాంగి శ్రీమతి ఇందిర గారు ,సోదరులు శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్లు అందజేసిన సమాచారం ,4-వీకీ పీడియా 5- అన్నిటికి మించి శ్రీ రామ కృష్ణయ్య గారి బావగారు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ,శ్రీమతి సత్యవతి దంపతులు సమకూర్చిన అత్యంత విలువైన సమాచారమే కాక ప్రతి విషయం లో నిర్దుస్టతకు చేసిన మార్గ దర్శనం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -14–3-17 –ఉయ్యూరు
— వినయం తో విన్నపం
గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17
ఎందరో మహానుభావులు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు – ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు అన్న ఈ గ్రంథానికి ముందుమాటలు రాసిన మచిలీపట్నం హిందూ కళాశాల చరిత్ర విభాగం అధిపతి డా శ్రీ సవరం వెంకటేశ్వరరావు గారికి , ,అభిలషణీయమైన ఆకర్షణీయ అర్ధవంతమైన ముఖ చిత్రాలను డిజైన్ చేసిన శ్రీ కళాసాగర్ గారికి ,డిటిపి చేసి సరసభారతి తరఫున అందంగా ముద్రి0పజేసి ,అందజేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి ,రమ్య భారతి సంపాదకులు ,సరసభారతి ఆత్మీయులు శ్రీ చలపాక ప్రకాష్ గారికీ , కీ శే డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితమిప్పించి సార్ధకత కల్పించి ,ప్రాయోజకులుగా సరసభారతి తరఫున గ్రంథ ముద్రణకు తోడ్పడిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులకు , నాతోపాటు అడుగులేస్తూ సహకరిస్తున్న సరసభారతి కార్యవర్గానికి కృతజ్ఞతలు . నా రచనలకు ప్రోత్సాహమిస్తున్న నా అర్ధాంగి శ్రీమతి ప్రభావతికి ,నా కుటుంబ సభ్యులకు అభినందనలు. గబ్బిట దుర్గాప్రసాద్ –
వదాన్యులకు వందనాలు
…
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం ) రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
అంకితం
దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు
శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి ,డా. శ్రీమతి సులోచన దంపతులకు
జీవిత విశేషాలు
జననం
ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా నదీ తీరాన నందిగామ తాలూకా వేములపల్లి గ్రామం లో శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తిగారు కీ. శే . శ్రీ బండారు రాజేశ్వర రావు ,కీ.శే .శ్రీమతి సత్యవతి దంపతులకు 1-7-1929 న జన్మించారు .వీరి అన్నగారు శ్రీభోగేశ్వరావు గారు స్వాతంత్ర సమర యోధులు ,నందిగామలో ప్రముఖ సాంఘిక సేవకులు .వీరికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు .అమరావతి పాలకులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీరి కుటుంబానికి వేములపల్లి గ్రామాన్నిఈనాముగా రాసిచ్చారు .కనుక వీరు వేములపల్లి అగ్రహారీకులు .
కళాశాల విద్య –ఉద్యమ నిర్వహణ
శ్రీ రాధాకృష్ణ మూర్తిగారు 1946 లో విజయవాడ లోని ఎస్ ఆర్ ఆర్ . అండ్ .సి.వి . ఆర్.కాలేజీ లో ఇంటర్ చదివి ఉత్తీర్ణులయ్యారు . స్వాతంత్రోద్యమం దేశం లో విస్తృతంగా విస్తరిస్తున్న కాలంలో దేశభక్తి వారిలో పురివిప్పగా మాతృదేశ సేవలో తరించాలన్న ధ్యేయం తో నాయకుల పిలుపు నందుకొని విద్యకు ఎగనామం పెట్టి స్వాతంత్రోద్యమం లో స్వచ్చందం గా చేరి,తమ వంతు పాత్ర పోషించిన దేశభక్తులు . . తరువాత 1947 లో దేశం స్వతంత్ర పొందాక భారత దేశం లోని సంస్థానాలను భారత దేశ అంతర్భాగంలో చేయటానికి నాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలకు దాదాపు అందరు సంస్థానాధిపతులు స్వచ్చందంగా కలిసి వస్తే ,ఒక్క నైజాం నవాబుమాత్రం మొండి కేసి నయానా భయానా చెప్పినా లొంగకపోతే , నైజాం నవాబు పెంచి పోషించిన రజాకార్లు ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తుంటే రజాకార్ ల దౌష్ట్యాన్ని యెదిరించి పోరాడే ప్రజా ఉద్యమం లో ప్రజల తరఫున ప్రాణాలకుతెగించి పోరాడిన పోరాట యోధులు శ్రీ మూర్తిగారు . గత్య0తరం లేని పరిస్థితులలో సర్దార్ పటేల్ 1949 లో పోలీస్ యాక్షన్ జరిపి తరతరాలబూజు నైజాం నవాబును గద్దె దింపి నైజాం సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చేశాడు .
ఉన్నత విద్యాభ్యాసం –ఉద్యోగం–రచన
పోలీస్ యాక్షన్ తర్వాత నాటి ముఖ్యమంత్రి మహా విద్యావేత్త డా బూర్గుల రామకృష్ణారావు ,డా మేల్కొటే మొదలైన ప్రముఖుల సలహా తోశ్రీ మూర్తిగారు ఉస్మానియా యూని వర్సిటీ లో చేరి ఆగిపోయిన విద్యను కొనసాగించి విద్యారంగంలోను మేటి అనిపించారు .ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ,మహా విద్యావేత్త , గ్రంథకర్త , ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రధమ సభాపతి డా శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారు వీరికి ముఖ్య బంధువు .
మూర్తిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 1953 లో ఏం ఎస్ సి ,1958 లో పి. హెచ్ . డి .పొందారు . 19 53 నుంచి 61 వరకు యూనివర్సిటీ సైన్స్ కాలేజీ లెక్చరర్ గా పని చేశారు . 1961 లో ‘’ఫుల్ బ్రైట్ఎక్స్చేంజి ప్రోగ్రాం ‘’లో అమెరికాలోని లూసియానా రాష్ట్రయూనివర్సిటీ కాలేజీ మెడికల్ కాలేజీ లో హృద్రోగ0పై రీసెర్చ్ చేయటానికి ,గ్రాడ్యుయేట్ స్కూల్ లో బయో కెమిస్ట్రీ బోధించటానికి అమెరికా వెళ్లారు . 1961 నుంచి 1992 వరకులూసియానా స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది మూడు దశాబ్దాలు సేవలందించారు . 1992 నుంచి టులేన్ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్పబ్లిక్ హెల్త్ లో గుండె జబ్బులపై పరిశోధనలు చేశారు .హృద్రోగాలకు సంబంధిన అనేక అమెరికా జాతీయ , అంతర్జాతీయ రీసెర్చ్ సమావేశాలలో ఆహ్వానితులుగా పాల్గొన్నారు .గుండె జబ్బులపై 200 లకు పైగా రీసెర్చ్పేపర్లుసమర్పించారు . ”గుండె జబ్బు -నివారణోపాయాలు ”పుస్తకాన్నిమూర్తిగారు ఆంగ్లం లో రచిస్తే ,వారి అర్ధాంగి సులోచనగారు తెలుగులోకి అనువాదం ,చేసి ప్రచురించిన ఘన వైద్యులు శ్రీ మూర్తిగారు .
వివాహ బంధం –సంతానం
రాధా కృష్ణ మూర్తిగారు శ్రీమతి శకుంతల గారిని వివాహమాడా రు .వీరి సంతానం 1-శ్రీ రాజేశ్వరరావు2- శ్రీమతి ఉమ3-కుమారి హేమ 4-శ్రీనివాస ప్రసాద్ గార్లు . ఈ నలుగురూ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లో ఆరోగ్య శాఖా సంబంధ వృత్తులలో స్థిరపడ్డారు . దురదృష్ట వశాత్తు శ్రీమతి శకుంతలగారు కేన్సర్ వ్యాధితో 1981 లో మరణించి కుటుంబానికి తీరని శోకం కలిగించారు .
బండారు వారి బంగారు దాంపత్యo
1983 లో మూర్తిగారు గుంటూరు జిల్లా రేపల్లె లోని యల్లాప్రగడ వారి ఆడబడుచుప్రొఫెసర్ శ్రీ యల్లాప్రగడ రామ మోహన రావు గారి చెల్లెలు డా శ్రీమతి సులోచన ఏం డి . గారిని ద్వితీయ వివాహం చేసుకొన్నారు .శ్రీమతి సులోచనగారు 1969 కాకతీయ యూని వర్సిటీ లో ఏం. బి . బి. ఎస్.,1973 లో ఉస్మానియా యూనివర్సిటీలో డి. జి
…
కేసీఆర్ సభలు
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులైన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారిని ,శ్రీ చలపాక ప్రకాష్ గారినీ పిలవని సభలు ప్రాంతీయ సభలే కాదా ? మనకు అవమానం జరిగిందని వీరు బాధపడలేదా ?తెలంగాణా వారికి ప్రతినిధి రుసుము ౩౦౦ రూపాలు ,ఆంధ్రా వారికైతే 500రూపాయలు పెట్టటం లో తెలుగు వారిలో వివక్షత చూపటం కాదా ?గడువు తేదీకి ముందు రోజు వియవాడలో సామల వారు మీటింగ్ పెట్టటం దేనికి సంకేతమో ?అన్నిటినీ కడిగి పారేసే ఆయన దృష్టికి ఇవన్నీ కనపడలేదా ? వీటన్నిటికీ మించి సాటి తెలుగు ముఖ్య మంత్రిని ఏదో ఎవరో ఎక్కడో తప్పు చేశారని ఆహ్వానించకపోవటం తెలుగు అన్న గుండెపై గుద్దటం కాదా ? ప్రాంతం విడిపోయినంతమాత్రాన భాషా గౌరవం మారుతుందా ? మద్రాసీలు అని పించుకునే తెలుగు వారికి ఆత్మ గౌరవం కలిగించిన శ్రీ నందమూరి పేరు ఎత్తకపోవటం ఏం తెలియ జేస్తుంది ?
ఇవన్నీ సరే వదిలేద్దాం –మొదటి ప్రపంచ మహాసభల ఆలోచన చేసి ఆచరణలో అద్వితీయంగా నిర్వహించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారిని స్మరించకపోవటం తెలుగు సభలకు కీర్తియా ?
ఇదికాక ప్రతి ఏడాది తెలుగు సభలు జరుపుతాననటం విడ్డూరం కాదా? అలా చేస్తే అవే కవి సమ్మేళనాలు ,అవే భువన విజయాలు ,వారే పాత్ర దారులు ,కప్పిన వారికే శాలువాలు కప్పటాలు అవవా ?వైవిధ్యం ,చలన శీలత లేకుంటే సభలు రాణిస్తాయా?ప్రతిభ గుర్తించి గౌరవించి ,జీవన భ్రుతి లేనివారికి కల్పించటం లో సభలు సార్ధకం అవుతాయి .విశాల దృక్పధం లో జరిగే సభలు మరింత విశాల భావాలకు ఆలవాలౌతాయి .ఇదే సంకుచిత దృష్టిలో ఎన్ని సభలు పెట్టినా వచ్చేది మిగిలేది సంకుచిత తత్వమే .
మన ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదని ,,తనకు ఆహ్వానం వచ్చినా వెళ్ళని శ్రీ గరికపాటిని,తాను తెలంగాణా తెలుగు గ్రంథాలెన్ని రాసినా గుర్తి౦చనందుకు పత్రికా ముఖంగా ధైర్యంగా బాధ వ్యక్తం చేసిన శ్రీ జొన్న విత్తుల వారినీ అభినందిస్తునాను .ఇవన్నీ మనకెందుకు ,మనల్ని పిలిచారు ,వెళ్లి శాలువా కప్పుకొందాం అని వెళ్ళిన వారినీ మనసార అభినందిస్తున్నాను .వారు సంకుచిత పరిధి దాటి ఉంటారన్న నమ్మకం తో .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-17- ఉయ్యూరు
— మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14
అద్వితీయ అమోఘ మహోన్నత వ్యక్తిత్వం
వెంకటేశ్వర్లు గారి గురించి ఎంత చెప్పినా ,ఆయన అమోఘ అద్వితీయ వ్యక్తిత్వం గురించి ఆవిష్కరించకపోతే అది సమగ్రం,పరిపూర్ణం కానేరదు . స్థిరచిత్తం,పట్టిన పట్టు విడవని సామర్ధ్యం ,పని పూర్తయ్యేదాకా అలసట ఎరుగని మహోన్నత వ్యక్తిత్వం వెంకటేశ్వర్లు గారిది .కాని అత్యంత దయార్ద్ర హృదయులు .ఎవరిపై నా కోపం,ద్వేషం లేని జితేంద్రియత్వం ఆయన్ను అందరి వాడిని చేశాయి .ఆయన భావాలను వ్యతిరేకించే వారైనా ,విభేధించేవారైనా ఆయనకు ద్వేషం ఉండేదికాదు .దీనికి ఉదాహరణ-తనబృందం లో చేరటానికి ఆసక్తి కన బరచిన వారెవరైనా ,వారు అంతకు పూర్వం స్వతంత్రంగా ప్రతిభ చూపి రాణించిన వారైనా ఆయన సహృదయత తో ఆహ్వానించేవారు .తాను కష్టపడి పని చేస్తూ మిగిలిన వారికీ స్పూర్తినిచ్చి పని చేసేట్లు చేయించటం ఆయన నైజం .ప్రేరణకలిగించి ,వారిలో ఆత్మ విశ్వాసం కలిగించి ,వారినుండి తనకు కావలసిన అద్భుత ఫలితాలను రాబట్ట గలిగే నేర్పున్నవారు .దీనికి సాక్ష్యమే ఆయన వద్ద పి.హెచ్. డి .చేసిన 51మంది విద్యార్దులలో సగం మంది ఇండియా, యు.ఎస్. ఏ. ,కెనడాల లో ప్రొఫెసర్ లు అయ్యారు .మిగిలిన వారిలో చాలామంది జాతీయ లాబ్ ,లేక ఇండస్ట్రి లలో గ్రూప్ మేనేజర్లు అయ్యారు .ఆయనలో ఉన్నఅరుదైన గొప్ప సుగుణం తన శిష్యులను తన కుటుంబ సభ్యులుగా భావించి గౌరవించటం. అంతే కాదు వారి కుటుంబాలతోనూ సన్నిహత సంబంధాలు కలిగిఉండి,వారి సంక్షేమకోసం కృషి చేయటం .తన స్వగ్రామం అన్నా అక్కడ తన వ్యవసాయ క్షేత్రం అన్నా ఆయనకు మిక్కిలి మక్కువే కాదు వేసవి సెలవులలో తన విద్యార్ధులను అక్కడికి తనతోపాటు తీసుకువెళ్ళి చూపిస్తూ అక్కడే వారి థిసీస్ కు సాయం చేసేవారు . చనిపోయే ము౦దుదాకా ,ఈ జన్మభూమి మమకారం ఆయనను వదలలేదు .ఆయన మనసులో ఎప్పుడూ తాను అమెరికా లో రిటైరయ్యాక తన స్వగ్రామం వచ్చి స్థిరపడాలన్నదే ధ్యేయంగా ఉండేది .అందుకోసమే ఆయన తన భారతీయ పౌరసత్వాన్ని నిలబెట్టు కున్నారు .
వెంకటేశ్వర్లుగారే తనకు మార్గ దర్శి అని ,కడదాకా తనను ఆయనతోపాటు రిసెర్చ్ వర్క్ లో నడిపించారని ,తమ మధ్య అనుబంధం రెండున్నర దశాబ్దాలకాలం అని, అది చిరస్మరణీయమైనదని అత్యంత కృతజ్ఞతా భావంతో జార్జి హారిజాన్ స్పెక్ట్రో స్కోపి లాబ్ ఇంచార్జ్(మాసాచూట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –కేంబ్రిడ్జ్ –యు .ఎస్. ఏ. ) శ్రీ రామ చంద్ర రావు దాసరి రాశారు .తామిద్దరం వేరు వేరు చోట్ల పని చేస్తున్నా వెంకటేశ్వర్లుగారి స్నేహం ,మార్గదర్శకం తనకు ఎప్పుడూ లభించేవని ,అంతేకాక తనను వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా భావించి ఆతిధ్యమిచ్చిన వారి అర్ధాంగి శ్రీమతి సరస్వతిగారికి కూడా జీవితాంతం రుణ పడి ఉన్నానని శ్రీ దాసరి తెలియ జేశారు .తానుఆవిష్కరించిన శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లుగారి జీవితం ,పరిశోధనా విశేషాలకు రచనా సహకారం అందజేసిన వివిధ రచయితలకు ,ముఖ్యంగా ఇందులో ఒక ప్రత్యేక వ్యాసం రాసి , వ్యాస పరంపరలను ఎడిట్ చేసిన డా.అరవింద్ పరాస్నిస్ కు శ్రీ దాసరి రామ చంద్ర రావు కృతజ్ఞతలు తెలుపు కున్నారు .
మనవి- మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు ధారా వాహిక కు ఆధారం –ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నాకు అభిమానం తో పంపిన – శ్రీ దాసరి రామ చంద్ర రావు గారి ఆంగ్ల రచన -‘’PUTCHA VENKATESWARLU(1921-1997) Elected Fellow 1970’’.
ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న సైన్స్ ,టెక్నాలజీ మేటి శ్రీ పుచ్చావారిపై ఇలా ధారావాహికం రాయటం నాకు దొరికిన అదృష్టం . నిజంగా చెప్పాలంటే ఆ టెర్మినాలజి , ఆ సైంటిఫిక్ భావాలు నాకు చాలా కొత్త .ఏదో పూర్వం ఫిజికల్ సైన్స్ ‘’మిణికాను’’కనుక నెట్టుకు రాగలిగాను . అదీకాక ఇంతటి మహనీయ మూర్తి అయిన తెలుగు తేజాన్ని తెలుగు వారికి పరిచయం చేస్తున్నానన్న గొప్ప సంతృప్తి నన్ను ముందుకు నడిపిచింది .ఇందులో ఒప్పులన్నీ శ్రీ దాసరి గారివి ,తప్పులన్నీ నావి అని వినమ్రంగా మనవి చేస్తున్నాను . ఈ పుస్తకాన్ని నాకు పంపి నన్ను రాసేట్లు ప్రేరణ కలిగించిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారికి మరిన్ని కృతజ్ఞతలు .
శ్రీ మైనేనిగారు శ్రీ పుచ్చావారిపై మరి రెండు ఇంగ్లిష్ ఆర్టికల్స్ నాకు పంపారు .వాటినీ తెనిగించి తెలియ జేస్తాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-17 –ఉయ్యూరు
మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -13
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -7
3-నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్
నేషనల్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ నాన్ లీనియర్ ఆప్టిక్స్ అండ్ మెటీరియల్స్ సంస్థ ఇచ్చిన నిధితో ఈ రంగం లో వెంకటేశ్వర్లుగారు రిసెర్చ్ కృషి ప్రారంభించారు .1988- 1999వరకు పదేళ్ళు ఈ సంస్థ ఆప్టిక్ లేబ రేటరీలు ఆర్ట్ లేజర్ సిస్టమ్స్ ,ఆప్టిక్స్ ,మెటీరియల్స్ మొదలైన సైన్స్ రిసెర్చ్ కు సంబంధించినవన్నీ చేకూరాయి .ఆకాలం లో ఈయన డైరెక్టర్ గా ఉన్నారు . డై డోప్డ్ గ్లాసెస్ , ద్రవ మాధ్యమం లో నాన్ లీనియర్ ప్రభావాల అన్వేషణ జరిగింది. అల్ట్రా లేజర్ ఉపయోగించి చైనీస్ టీ లో ధర్డ్ ఆర్డర్ నాన్ లీనియర్ ససెప్టబిలిటిలో ట్రాన్సెంట్ మల్టిపుల్ డిఫ్రాక్షన్ రింగ్స్ శోధన జరిగింది .సింగిల్ మోడ్ ,ఫ్యు మోడ్ ఆప్టికల్ ఫైబర్స్ లో ఫోర్ వేవ్ మిక్సింగ్ ,స్టిమ్యు లేటేడ్ రామన్ స్కాటరింగ్ లను అన్వేషించారు .నాన్ లీనియర్ పదార్ధాలలో ఆర్గానిక్ పదార్ధా లవాడకం బాగా ప్రోత్సాహాన్నిచ్చింది .కారణం ఇవి ఎక్కువగా నాన్ లీనియారిటీలను ఇవ్వడమే . పలుచని ఆర్గానిక్ ఫిలిం ల నాన్ లీనియర్ ఆప్టికల్ లక్షణాల కోసం డార్క్ లైన్ స్పెక్ట్రో స్కోపి టెక్నిక్ కూడా విని యోగించారు .ట్రా న్సెంట్ నాన్ లీనియర్ ప్రభావం ఆర్గానిక్ ఫిలిం లపై అధ్యయనానికి పీకో సెకండ్ లేజర్స్ నుకూడా ప్రయోగించారు .థాలో సియానైన్ డోప్డ్ పోలి మీరిక్ ఫిలిం ల నాన్ లీనియర్ గుణాలను తెలుసుకోవటానికి డీ జెనరేట్ ఫోర్ వే మిక్సింగ్ పధ్ధతి వాడారు .థిన్ ఫిలిమ్స్ లో థర్డ్ ఆర్డర్ నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ తెలుసుకునేందుకు Z స్కాన్ టెక్నిక్ ఉపయోగించారు .నాన్ లీనియర్ ఆప్టిక్స్ రిసెర్చ్ లో ముగ్గురు విద్యార్ధులకు వెంకటేశ్వర్లుగారు మార్గ దర్శనం చేశారు .
4-మైక్రో స్పెరికల్ లేజర్స్ ,పౌడర్ లేజర్స్ ,ప్లానార్ వేవ్ గైడ్ లలో కృషి
జీవిత చరమాంకం లో వీటిపై ఎక్కువ కృషి చేశారు వెంకటేశ్వర్లుగారు.నాసా అందించిన రిసెర్చ్ ఫండ్ తో అనేక లేజర్ డైస్ తో పోలిస్టేరీన్ మైక్రో స్పియర్ లు మార్ఫాలజీ డిఫెండెంట్ రెసోనెన్స్(MDR) ఫ్లోరసేంట్ స్పెక్ట్రా లో చూపాయి .ఇవే స్టిమ్యులేటేడ్ ఎమిషన్ లేక లేజింగ్ . ఈ రెజోనేన్స్ లేక అనునాదాలను అంతరిక్షం లో మైక్రో గ్రావిటి స్థితి లో ఫాబ్రికేట్ చేయబడిన మైక్రో స్పియర్ల లక్షణాలను తెలుసుకోవటానికి ఉపయోగించవచ్చు.Nd Al3 (B o 3 )4 ,Nd Sc 3 (Bo 3 )4, Nd S r5 (.P O 4 )3Fల లేజర్ క్రిస్టల్స్ పౌడర్ లలో షార్ట్ పల్స్ స్టి మ్యులేటేడ్ ఎమిషన్ (ఉద్గారం )లను గమనించారు .అనేక ఇనార్గానిక్ క్రిస్టల్స్ అయిన Li N b O 3,మరియు ఫ్తాలో సేనైన్ తో డోప్ చేయబడిన ఆర్గానిక్ పదార్ధాలైన పోలీ మెరిక్ ఫిలిమ్స్ లలో నాన్ లీనియర్ కారక్ట రిస్టిక్స్ కోసం అనేక ప్లానార్ వేవ్ గైడ్ లను తయారు చేశారు . ఈ వేవ్ గైడ్ లు కెమికల్ సెన్సింగ్ అధ్యయనానికీ ఉపయోగించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-17- ఉయ్యూరు
— మనిషిలో మనిషి
‘’ కాంగ్రెస్ ను ‘’ మోదీ ‘’చావుదెబ్బలతో మోది మోది
బిజెపి ని గుజరాత్ లో గెలిపించాడు
పటేల్ కుంపటి పెట్టినా ,దానికి కాంగీ అంటకాగినా
ఓట్ల నిప్పు కమలానికే రాజుకొని హస్తాన్ని ఆర్పేసింది
‘’యువ రాజు ‘’పట్టాభి షేకమైన రెండో రోజే
గుజరాత్ ఎన్నిక చావు కబురు చల్లగా తెలిసింది
నాడు తమిళ నాట’’ బయటి ఎన్నికలు’’(ఎక్సిట్ పోల్స్ )
జయ ఓడిపోతుందని కోళ్లై కూసినా ,
రెండాకులు విస్తరించి జయ గెలిచింది కదా
అన్న ఆశ పెట్టుకున్న ‘’కాంగిరేసు ‘’
ఈ ఎన్నిక రేసులో ఆశ’’ నీఱై’’ ఆరిపోయింది
‘’మోడీ సింహ బలుని’’ముందు చిట్టెలుకల ఆట సాగునా ?
19 రాష్ట్రాల బలసంపన్నం తో కమల వికాసం’’ మోడీ చందమామ’’ వల్లనే
ఎదురు లేదు ఎవరూ ఆపలేరు ,
మోడీజగన్నాధ రధ చక్రాలను
అడ్డుకుంటే చక్రోపహతులే ‘’ అని పొంగి పోతూ ఒక మనిషి .
‘’ఇరవై ఏళ్ళు పాలించి ,’’పైన ప్రభుత్వం’’ లో ఉంటే
ఈ మాత్రం గెలుపు కే విర్ర వీగక్కర్లేదు
‘’చావుతప్పి కన్ను లోట్టై’’ గెలిచిన దానికి వీరంగం అక్కర్లేదు
చెమటలు పట్టించి ,’’కారేట్లు ‘’చేశాడు యువ కిశోరం
పోటాపోటీ గా డీ అంటే డీ గా ఎదురు నిల్చి
అనుక్షణం గుండెల్లో నిద్రపోయాడు
నిద్ర పట్టకుండా చేశాడు కదా
‘’మెషీన్లనూ’’మాయ చేసినా
బొటాబొటి మెజారిటి –ఇదో గోప్పేంటి?
కల్లబొల్లి కబుర్లు ,’’సరిహద్దు ‘’దాటిన ఆరోపణలు
‘’గోబెల్ ప్రచారాలు’’ ,ప్రసారాలు తో
ఓటర్లను మభ్య పెట్టి, సాధించిన
అత్తెసరు మార్కులివి.
నగరాల గెలుపు నాగారాలే కానీ
పల్లెసీమల్లో ఓట్ల మతాబాలేవి ?
‘’మా వంశ పాలన’’ కు
వచ్చిన సరికొత్త మారాజు
రారాజు ఇక దులుపుతాడు
రోజూ మీ బూజు .’’అంటూ
ఆ మనిషిలోమరో మనిషి గోల .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-17- ఉయ్యూరు
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-12
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -7
7-నాన్ లీనియర్ ఆప్టిక్స్ లో సేవలు
అలబామా అగ్రి మెకానికల్ సంస్థలో 1992 లో చేరి 15 ఏళ్ళు సేవ చేసి 1997 లో చనిపోయే దాకా వెంకటేశ్వర్లు గారు ఆప్టిక్స్ లో అనేక రంగాలలో చాలా ప్రాముఖ్యమైన కృషి చేశారు .వీటిని 5 విభాగాలుగా వివరంగా తెలుసుకొందాం .1-స్పెక్ట్రో స్కోపి మరియు అప్ కన్వర్షన్ అధ్యయనం 2-ఇంటర్ ఫేరో మెట్రి 3-ఆప్టికల్ ఫేజ్ కాంజు గేషన్ అండ్ హోలోగ్రాఫింగ్ గ్రేటింగ్స్4-నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ 4-మైక్రో స్పెరికల్ లేజర్స్ ,పౌడర్ లేజర్స్ ,ప్లానార్ వేవ్ గైడ్స్
1- ఇంటర్ ఫేరో మెట్రి-
ఈ రిసెర్చ్ రంగం వెంకటేశ్వర్లుగారి ఆధ్వర్యం లో హ౦ట్స్ విల్ లోని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుంచి నిధులు ప్రాధమికంగా పొంది రిసెర్చ్ పని ప్రారంభించారు .అనేక ఇంటర్ ఫేరో మెట్రిక్ టెక్నిక్ లను లెన్సులు ,మిర్రర్ గ్లాస్ లఉపరితల నాణ్యత పెంచే ఏర్పాటు చేశారు .ట్విమాన్ –గ్రీన్ ఇంటర్ ఫేరో మీటర్ ను అభి వృద్ధి చేసి స్పెరికల్ సర్ఫేసేస్ ,లెన్సేస్ ను పరీక్షించి ద్రవ ఘన పదార్ధ మాధ్యమాల రిఫ్రాక్టివ్ ఇండిసేస్ లను గణించారు .ఆప్టికల్ పదార్ధాల బైర్ ఫ్రింజెన్స్ ను గణించ టానికి వెద్జేడ్ ఇంటర్ ఫెరోమీటర్ ను ఉపయోగించారు .నాన్ కాంటాక్ట్ ప్రాఫిలో మీటర్ ను వృద్ధి చెందించి ఆప్టికల్ సాంపిల్స్ లో సర్ఫేస్ రఫ్ నెస్,ఆప్టికల్ సాంపిల్స్ లో జారుడు (టిల్త్ట్స్ )ను నిర్దుష్టం చేయటానికి ప్రయోగించారు .లేజర్ బీం కొల్లి మేషన్ టెక్నిక్ లను వృద్ధి చేశారు .దీనికోసం ఫేజ్ కాన్జుగేట్ ట్విమాన్ –గ్రీన్ ఇంటర్ ఫెరోమీటర్ ,టాల్బాట్ ఇంటర్ ఫేరో మీటర్ లను తయారు చేశారు .
2-ఆప్టికల్ ఫేజ్ కాంజు గేషన్ అండ్ హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్
అలబామా లో చేరిన దగ్గరనుంచి జీవితాంతం వెంకటేశ్వర్లు గారు దీనిపైనే రిసెర్చ్ సాగించారు.మొదటి రోజులలో అధ్యయనం అంతా Ba Ti O 3 స్పటికం లో వాల్యూం హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్ మరియు ఆప్టికల్ ఫేజ్ కా౦జు గేషన్ లపై ఉండేది .రిఫ్లెక్షన్ ,ట్రాన్స్ మిషన్ లలో బీం కప్లింగ్స్ ,ఫేజ్ కాంజుగేట్ ప్రభావాలు ,కౌంటర్ ప్రాపగేటింగ్ బీమ్స్ లో బీం ప్లానింగ్ ,ఆప్టికల్ బై స్టేబిలిటి,సెల్ఫ్ పల్సేషన్స్ ,ఎనర్జీ ట్రాన్స్ ఫర్,ఫేజ్ షిఫ్ట్ మెజర్ మెంట్స్ లను ఈ క్రిస్టల్స్ లో ప్రదర్శించ గలిగారు .డబుల్ ఫేజ్ కాంజుగేట్ మిర్రర్ లో ఎక్స్టర్నల్ సీడింగ్ ను కనిపెట్టారు .ఫేజ్ కాంజుగేట్ అధ్యయనం , ఆర్గానిక్ డైస్ డోపేడ్ ఇన్ బొరిక్ యాసిడ్ గ్లాసెస్ హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్ వలన వచ్చిన ఇమేజ్ ప్రాసెసింగ్ ,కూడా తెలుసుకొన్నారు . రియల్ టైం ఇంఫెరో మెట్రి లోBi 12, Ti O 20 లలో హోలోగ్రాఫిక్ గ్రేటింగ్ లను కనుక్కున్నారు .Y 3 Sc 2Ga3O12 లేజర్ క్రిస్టల్ కనిపెట్టి ఎక్సై టేషన్ డిఫ్ఫ్యూజన్ ను ట్రాన్సెంట్ లైట్ ఇండ్యూ సేడ్ గ్రేటింగ్ ను వాడారు .Er ,Tm Ho డోప్ద్Y SG G లేజర్ క్రిస్టల్స్ లో లైట్ ఇన్ డ్యూ స్డ్ గ్రేటింగ్ కనిపెట్టారు .ఫోటో రిఫ్రాక్టివ్ పదార్ధాలలో గ్రేటింగ్ ఫార్మేషన్ స్టడీ చేయటానికి EPRస్పెక్ట్రో మీటర్ వాడారు .దీనికి ఉదాహరణ –BSOలో Fe 3నుండి ఫోటో ఇంద్యూస్ద్ చార్జి ట్రాన్స్ ఫర్ .దీనిని హీలియం నియాన్ లేజర్ ఇల్ల్యూమి నేషన్ లో చేశారు . డై డోప్డ్ బొరిక్ యాసిడ్ ,పోలి కార్బోనేట్ హోస్ట్ లలో ఆప్టికల్ ఫేజ్ కాంజుగేట్ స్టడీ చేశారు .ధర్డ్ ఆర్డర్ ససెప్టబిలిటి మెజర్ మెంట్స్ కూడా చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-17 –ఉయ్యూరు
– మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-11
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -6
6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి -2
సమయాధార అధ్యయనం స్థానికంగా తయారు చేసిన నైట్రోజెన్ లేజర్ ,క్షీణ వక్రతల ఫోటోగ్రాఫింగ్ లను స్టోరేజ్ ఆసిలో స్కోప్ తో చేయగలిగారు .ఈ టెక్నిక్ చాలా మొరటు విధానమే అయినా ,ఉత్తేజిత౦ ,ఫ్లారసేన్స్ మార్గాలను ఖచ్చితమైన లైఫ్ టైం గుర్తించటానికి సరిపోయింది.
దీనితర్వాత ఉత్తేజిత మూలాల తో వాణిజ్య పరమైన ట్యూ నబుల్ పల్స్ డై లేజర్ వైపు అడుగులేయటం తో మరో దశ ప్రారంభమైంది .నైట్రోజెన్ లేజర్ తో చేసిన బ్రూట్ ఫోర్స్ ఎక్సై టేషన్ కంటే ఇది నిర్దుష్టంగా ఉన్నది .పిమ్మట బాక్స్ కార్ యావరేజర్ కూడా కాన్పూర్ సంస్థలో అందుబాటులోకి వచ్చింది .అద్భుతమైన ఈ యావరేజర్ తో డీకే ప్రోఫైల్స్ ను అత్యంత నిర్దుష్టంగా రికార్డ్ చేయగలిగారు .CROతో చేసిన దానికంటే దీనితో వచ్చిన ఫలితాలు చాలా ఖచ్చితంగా, అత్యంత సంతృప్తిగా ఉన్నాయి .అందువలన రేడియేషన్ ట్రాన్సిషన్ రేట్స్ డేటా ,అయాన్ పైర్ రిలాక్సేషన్ ప్రాసేసేస్ ,అన్ కన్వర్షన్ ఫినామినా మొదలైన వాటిపై , చాలా ఎక్కువగా సమాచారం దొరికింది . ఈ ఫలితాలు సైట్ సెలెక్టివ్ స్పెక్ట్రో స్కోపి అన్వేషణకు చక్కని రాజమార్గాన్ని ఏర్పరచాయి .
మొత్తం మీద కాన్పూర్ ఐ ఐ టిలో ఆప్టి కల్ స్పెక్ట్రో స్కోపి పరిశీలనలు రేర్ ఎర్త్ అయాన్ డోపేడ్ ఫ్లొరసైడ్ క్రిస్టల్స్ ల దీప్తి అధ్యనానికి మార్గం సుగమమం చేశాయి .ఇందులో అబ్సార్ప్షన్,లేజర్ ఇండ్యూసేడ్ ఫ్లారసేన్స్ ,లైఫ్ టైం మెజర్ మెంట్స్ కూడా ఉన్నాయి .వెంకటేశ్వర్లుగారికి అత్యంత సునిసిత దూర దృష్టి ఉంది.కాన్పూర్ ఐ . ఐ .టి.లో చేసిన అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి ఆ కాలానికి సమయానికి తగిన అభిరుచి .ఇక్కడ చేసిన ఎనర్జి అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి పని ఆధారం గా ఐబి ఎం సైంటిస్ట్ లు La F3,Nd +3లను ఉపయోగించి వయొలెట్ అప్ కన్వేర్షన్ లేజర్ ను అభి వృద్ధి చేశారు .తర్వాత 15 ఏళ్ళవరకు అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి /లేజర్ వర్క్ లకు ఇదే అందరికీ సిద్దాన్తమైంది .
అందుకనే అలబామాలో అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన కొనసాగించారు .ఆప్టికల్ ఫిజిక్స్ లో ప్రయోగాత్మక పరిశోధనకు వెంకటేశ్వర్లు గారే శ్రీకారం చుట్టారు .ఆయనద్వారానే అనేక ప్రభుత్వ సంస్థలనుంచి విరాళాలు వెల్లువగా ప్రవహించాయి .ఆప్టో గాల్వనిక్ స్పెక్త్రో స్కోపి ,ఇంటర్ ఫేరో మెట్రి ,ఆర్గానిక్ మీడియా నాన్ లీనియర్ స్పెక్ట్రో స్కోపి ,నాన్ లీనియర్ ఆప్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ ,ఫైబర్ ఆప్టిక్స్ ,ఆప్టికల్ స్పెక్ట్రా ఆఫ్ క్రిస్టల్స్ పై ప్రయోగాలు చేశారు .అలబామాలో Er3+,HO 3+,N d 3+మొదలైనవి ,డోపేడ్ ఫ్లూరైడ్స్ గార్నేట్స్ ,గ్లాసెస్ ల పై ముఖ్యంగా దృష్టి పెట్టారు .చాలాకాలం ఆప్టికల్ గ్లాసులు అప్ కన్వర్షన్ లో అంతగా ప్రాచుర్యం పొందలేదు .కారణం వాటికి ఉన్నఫోనన్ ఫ్రీక్వెన్సీ యే.హయ్యర్ రేడియేషన్ లెవెల్స్ ను అణచటానికి మల్టి ఫోనాన్ రిలాక్సేషన్స్ ఉపయోగించారు .టేల్ల్యురియం ఆక్సైడ్ కలిగి ఉన్న Er3+ మల్టి ఎలిమెంటల్ ఆక్సైడ్ గ్లాస్ ను అలబామా సంస్థలో ఇన్ఫ్రా రెడ్ రేడియేషన్ కు సమీపం లో తయారు చేస్తే కాంతివంతమైన అప్ కన్వర్షన్ ఏర్పరచింది .అదే సమయం లో చాలా ప్రయోగశాలల్లో ఇలాంటి పనే జరిగింది .ఈ కాలం లోజపాన్ లో తయారయ్యే రేర్ ఎర్త్ ఆయాన్ డోపేడ్ టేల్యు రైడ్ ఫైబర్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి .దీనిని బట్టి వెంకటేశ్వర్లు గారి బృందం అలబామా సంస్థలో చేసిన కృషి ఎంతటి విశిస్ట మైనదో అర్ధమవుతోంది .ఇవన్నీ జర్నల్స్ లో చోటు చేసుకొని చారిత్రాత్మక విజయాలుగా పరిగణింప బడ్డాయి .ఈ సంస్థ లో విజిబుల్ కన్వర్షన్ ఫినామినా లో నియర్ ఇన్ఫ్రా రెడ్ పై కేంద్రీకరణ జరిగింది .HO 3+,డోపేడ్ Ca F2 ల సైట్ సెలెక్టివ్ అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి లు అనూహ్య ఆసక్తికర ఫలితాలనిచ్చాయి .హాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర్లు గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-17 – ఉయ్యూరు
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-10
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -5
6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి
నలుగురు నడిచే నలిగిన దారిలో నడిచే అలవాటు లేని వెంకటేశ్వర్లుగారు చేసినపనే చేస్తూ కూర్చోవటం లో సంతృప్తి పడేవారు కాదు .1964 లో కాన్పూర్ ఐ ఐ టిలో ప్రయోగాత్మక పరిశోధన చేస్తున్నప్పుడు ,చాలాకాలం గా పని చేస్తున్న మాలిక్యులర్ స్పెక్ట్రో గ్రఫి కి మాత్రమె పరిమితం అవకుండా ,సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి పై కూడా దృష్టి సారించి దానికవసరమైన వేరియర్ EPR మెషీన్ ,కెరీ 14ఆప్టికల్ స్పెక్ట్రో మీటర్లను కూడా డిపార్ట్ మెంట్ లో నిర్మించే లాబరేటరీ తోపాటు నెలకొల్పారు .సింగిల్ క్రిస్టల్స్ లోయిపిఆర్ పరివర్తన లోహ అయాన్ లపై గొప్ప కృషి చేశారు .ఈ అయాన్ ల ఆప్టికల్ స్పెక్ట్రో స్కోపి తాను పూర్వం చేసినదానికి కొనసాగింపు మాత్రమె .
Rb Mn F3 ఎలక్ట్రాన్ అబ్సార్ప్షన్ కృషి ఫలితంగా ఉత్తేజిత Mn 2+ లో స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ను మొట్టమొదటిసారిగా నిర్ణయించ గలిగారు .క్రిస్టల్ ఫీల్డ్ ,రికా పారామీటర్స్ దృష్టిలో స్పెక్ట్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ సాధ్యమైంది .ఈ ఫలితాలన్నీ ఫిజికల్ రివ్యు లెటర్స్ లో ప్రచురించారు .వెంకటేశ్వర్లు శిష్య బృందం కలిసి అమోనియం క్లోరైడ్ సింగిల్ క్రిస్టల్స్ లోడైవలేంట్ కాపర్ ,నికెల్ ఎలెక్ట్రానిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రా ను ఆర్దర్డ్ ,డిసార్దర్డ్ స్థాయిలలో డోపైన్ అయాన్స్ ఎలక్ట్రా నిక్ సైట్స్ , లామ్డా ట్రాన్సిషన్ ల ప్రభావాలపై అన్వేషణ చేశారు .
1973 లో ఆయన దృష్టి, అభిరుచి రేర్ ఎర్త్ మెటల్ అయాన్స్ పై కేంద్రీకరించి లాంథనం ఫ్లోరైడ్ ,కాల్షియం ఫ్లోరైడ్ మొదలైన క్రిస్టల్స్ పై అన్వేషణ చేశారు .12 ఏళ్ళలోఈ రంగం లో గణనీయమైన అభి వృద్ధి సాధించారు .Nd 3+,Dy 3+,Eu3+,Pr 3+లపై కూడా పరిశోధించారు . ఆకాలం అంతా గొప్ప ఉత్తేజం అభిరుచి లతో చాలామంది విద్యార్ధులు ఇలాంటి వాటిపైనే కృషి చేసి వాటి స్పెక్ట్రా లపై అసక్తికరమైన విషయాలు కనుగొన్నారు .ఈ అయాన్స్ ల అబ్సార్ప్షన్ స్పెక్ట్రా లను ఫోటోలు తీసి ,స్థానికంగా తయారు చేసిన నైట్రోజెన్ లేజర్ ద్వారా ఫ్లారసేన్స్ ను గుర్తించారు .స్పెక్ట్రో గ్రాఫ్ ను తర్వాత లాబ్ లో రికార్డింగ్ స్పెక్ట్రో ఫోటోమీటర్ గా పరి వర్తన చెందించారు .వాణిజ్య పరమైన ఉత్తేజిత CW ఆర్గాన్ అయాన్ లేజర్ ద్వారా వెలువడిన ఫ్లారసేన్స్ ను రికార్డ్ చేశారు .క్రిస్టల్స్ ను పోలరైజేడ్ లైట్ ద్వారా అనేక కోణాలో ఉత్తేజిత పరచి 77 K ఉష్ణోగ్రత ,ఆ పై ఉష్ణోగ్రత ల వద్ద ఫ్లారసేన్స్ లను రికార్డ్ చేశారు .
శక్తి స్థాయిలను సైట్ సిమ్మెట్రి గుర్తింపు కోసం స్టేడీ స్టేట్ స్పెక్ట్రా ను వాడారు .కాల్షియం ఫ్లోరైడ్ లో అనేక క్రియాశీలక క్షేత్రాలను గమనించారు .గమనించిన మరి కొన్ని ఆసక్తికర విషయాలలో సెల్ఫ్ అబ్సార్ప్షన్ ,యాంటి స్టోక్స్ ఫ్లారసేన్స్ తర్వాత వరుసగా జరిగే రెండు ఫోటాన్ ల శోషణ,అయాన్ జంటల మార్పు లను ఈ పదార్ధాల స్పెక్ట్రా ఆధారం గా కనిపెట్ట గలిగారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-17 –ఉయ్యూరు
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -4
ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్
3-నూతన విధానాలు
అయాన్స్ యొక్క EPR విశ్లేషణ లో భాగం గా స్పిన్ విలువ ఒకటి లేక ఒకటి కంటే ఎక్కువ ఉంటె ,సున్నా క్షేత్రం వద్ద క్రిస్టల్ ఫీల్డ్ పారామీటర్ విషయాలు తెలిసే వీలున్నది.సూటిగా ఈ సమాచారం రాబట్టటానికి వెంకటేశ్వర్లు గారి బృందం జీరో ఫీల్డ్ EPR స్పెక్ట్రా మీటర్ ను మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ గా నిర్మించి GHz పరిధిలో సాలిడ్ సాంపిల్స్ యొక్క శోషణ (అబ్సార్ప్సన్ )గణించారు .ఇలాంటి స్పెక్ట్రా మీటర్ ఇండియాలో ఇదే మొట్టమొదటిది .ఇది X,K బాండ్ లలో పని చేసే సామర్ధ్యం కలిగి ఉన్నది .ఈ స్పెక్త్రా మీటర్ ఉపయోగించి ఆయన బృందం అమ్మోనియం క్లోరైడ్ యొక్క డై వలేంట్ Mn ,ట్రైవలేంట్ Fe ల జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ల సమాచారం తెలుసుకున్నారు .EPR వలన ఎక్కువ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ సమాచారం గ్రహించటం చాలా కష్టతరం అయినందున వీరు రాబట్టిన సమాచారం చాలా ప్రాముఖ్యమైంది .
4-NLO పదార్ధాల EPR
ప్రేరణ ,అంతర్ దృష్టి ఆధారం గా వెంకటేశ్వర్లు గారు ఘన పదార్ధాలలో పాయింట్ డిఫెక్ట్ ల నిర్మాణ ధర్మాలను ,తాను నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,హోలోగ్రఫీ లపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నా కనిపెట్టగలిగారు .ఫోటో EPRఅధ్యయనానికి అలబామా A and M యూని వర్సిటిలో ఒక లేబరేటరి నెలకొల్పి ,Ba Ti O3,Li Nb O3,బిస్మత్ సిలికాన్ ఆక్సైడ్ ల ,ఫోటో రిఫ్రాక్టివ్ ల మెకానికల్ అన్వేషణ హాలోగ్రఫీ సంయుక్త పరిశోధనలకు తగినట్లు దీని నిర్మాణం చేశారు .ఆయన బృందం సూటిగా Fe3+మలినాలు ఫోటో ఇండ్యూసేడ్ చార్జి మార్పు తెస్తాయని ప్రయోగాత్మక పరిశోధనా సాక్ష్యాలుగా నిరూపించి ,ఇది B a T I O 3స్పటికాల నిర్మాణ గ్రేటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తుందని చూపారు .దీని ఆధారం గా ఫోటో రిఫ్రాక్టివ్ B a T I O 3స్పటికాలు ,మిగిలిన పీజో ఎలక్ట్రిక్ సిస్టం ల గ్రేటింగ్ లమోడల్స్ నిర్మాణాలకు కొత్త సూచనలు చేయగలిగారు .
5-న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజోనెన్స్
ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీలో ఉండగానే వెంకటేశ్వర్లుగారు NMRలో రిసెర్చ్ సౌకర్యాలు కల్పించారు .భారతీయ యూని వర్సిటీలలో ఇలాంటిది ఇక్కడే ప్రారంభమై దిశా నిర్దేశం చేసింది .తర్వాత కాన్పూర్ ఐ. ఐ.టి. లోనూ ఇలాంటి సౌకర్యం యేర్పరచారాయన .ఆయనా ఆయన విద్యార్ధులు H1,F19 ,Cl35,C13లలో న్యూక్లియర్ మాగ్నెటిక్ రిజోనేన్స్ పరిశోధనా ఫలితాలను అనేక రిసెర్చ్ పేపర్లుగా రాసి ప్రచురించారు .అతి ముఖ్యంగా NMR స్పెక్ట్రా యొక్క నాలుగు స్పిన్ విధానాలను అత్యంత స్పష్టంగా అధ్యయనం చేయగలిగారు .1- ఫ్లోరో 2-డై నైట్రో బెంజీన్ ,3-పారా డిస్ట్రిబ్యునల్ బ్యూటేడ్ బెంజీన్స్,ఆల్ఫా బీటా, గామా పైకోలైన్స్ లH1 ,F1ల రెజోనేన్స్ స్పెక్ట్రా అధ్యయానాలు చాలా ముఖ్యమైనవి .ఫ్లోరో బెంజీన్స్ .పారా సబ్స్టి ట్యూ టెడ్ ఫ్లోరియో బెంజీన్స్ లో H1,F19 NMRస్పెక్ట్రా అధ్యయనాలు చాలా ప్రశస్తమైనవి .ఆల్కలి క్లోరైడ్ లలో Cl 35 రెజోనేన్స్ అబ్జర్వేషన్స్ కూడా చేశారు .
సి .యెన్ ఆర్ .రావు గ్రూప్ తో కలిసి థయో బెంజాయడ్ ఆసిడ్ ,ఫినాల్ ,అనిలిన్ ధయో ఫినాల్ ,ఇథనాల్ ,2,2,2 ట్రై ఫ్లోరో ఇథనాల్ మొదలైన మాలిక్యూల్స్ లలోని హైడ్రోజెన్ బాండింగ్ ను ఆసక్తికరంగా అధ్యయనం చేసి ఎన్నో కొత్త ఆసక్తికర అవసరంమైన విషయాలు లోకానికి తెలియజేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-17 –ఉయ్యూరు
—
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-8
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -3
అయస్కాంత అనునాదం (మాగ్నెటిక్ రేజో నెన్స్)లో అద్వితీయ కృషి
1- ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్
1960 ప్రధమార్ధం లో ఘనీకృత పదార్ధాలపై న్యూక్లియర్ మరియు స్పెక్ట్రో స్కోపిక్ టెక్నిక్ ల అను వర్తనం (అప్లికేషన్ ) విషయం లో పరిశోధన కొంత అభి వృద్ధి సాధించింది .ఘన పదార్ధాలలో స్థానిక ఆకృతి ,బాండింగ్ ప్రోబ్ అయాన్ ఖచ్చితమైన సమాచారం ఎలక్ట్రానిక్ లెవెల్స్ పై హైపర్ ఫైన్ ఇంటరాక్షన్స్ , ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రేడి ఎంట్స్ ప్రభావం కోసం ఈ టెక్నిక్ లనుచక్కగా ఉపయోగించారు .ఈ పరిశోధనా ఫలితాలు 3d,4f అయాన్ ల అయానిక్ స్పెక్ట్రాలపై నూతన సమాచారం అందించింది. అంతేకాదు ఘనీ కృతాలలో లాపోర్డ్ నిషేధాలను అధిగమించటానికి అవకాశాలు మెరుగైనాయి .1962 లోనే వెంకటేశ్వర్లుగారు అత్యంత వేగంగా దీని ప్రాముఖ్యాన్ని గుర్తించారు .ఆలస్యం చేయకుండా,ఘన 3d,4f అయాన్ ల క్రిస్టల్ స్పెక్ట్రా ,పారా మాగ్నెటిక్ రేజో నెన్స్(EPR)లను క్రయోజెనిక్ ఉష్ణోగ్రత ల వద్ద అధ్యాయనానికి నిర్దుష్ట ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు .అంతటి వేగ వంతమైనది ఆయన ఆలోచనా సరణి .
అన్వేషణ రంగాలు
వెంకటేశ్వర్లు గారి బృందం అనేక పారా మాగ్నెటిక్ ఘన పదార్ధాల సింగిల్ క్రిస్టల్స్ నిర్మాణం ,బాండింగ్ లపై ఎన్నో ఆసక్తికర విషయాలను ఆవిష్కరించింది .ముఖ్యంగా పూర్తిగా అయానిక్ క్రిస్టల్స్ అయిన సోడియం క్లోరైడ్ ,పొటాషియం క్లోరైడ్ ,హైడ్రోజెన్ బాండ్ ఉన్నKDPవంటి ఫెర్రో ఎలక్ట్రిక్స్,హైడ్రోజెన్ బాండింగ్ ఉన్నవి ,లేనివీ అయిన అనేక సల్ఫేట్స్,సాలినేట్స్.మాలిక్యులర్ ఘనాలైన ఆలమ్స్ ,అమ్మోనియం సల్ఫేట్స్,,హాలైడ్స్ ,అనేక పరి వర్తక లోహాలు ,అల్కలిన్ ఎర్త్ పెర్క్లో రేట్స్ పై నూతన విషయాలను కనిపెట్టారు .పారామాగ్నేటిక్ సంక్లిస్టాల నిర్మాణం పై కొత్త సమాచారం రాబట్టటమే కాకుండా ,ఈ బృందం మొట్టమొదటి సారిగా EPR టెక్నిక్ ను ఘనాల సంక్లిష్ట ధర్మాలను అర్ధం చేసుకోవటానికి,పారామాగ్నేటిక్ అయాన్స్ లను గుర్తించటానికి ప్రయోగించారు . హైడ్రోజెన్ బాండ్ ఉన్న KDP లో నిర్మాణ దశా పరివర్తనం,అమోనియం హాలైడ్స్ లోలామ్డా పరివర్తనకు దగ్గరలో ఉన్న మాలిక్యులర్ డైనమిక్స్ లపై అద్భుత అన్వేషణ చేశారు . ఆల్కలైన్ నైట్రేట్స్, ట్రాన్సిషన్ లోహాలు ,ఆల్కలైన్ యెర్త్ లోహాల ఆల్కలైన్ నైట్రేట్స్,పెర్ క్లోరేట్స్ పై పరిశోధన చేసి ,విలువైన సమాచారం అందించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 13-12-17- ఉయ్యూరు
తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు
—
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -2
2-మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లో
డ్యూక్ యూని వర్సిటీలో ఉండగా వెంకటేశ్వర్లుగారు మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన ప్రారంభించారు .1953-54 కాలం లో రెండేళ్ళు ఆ పనిలోనే ఉన్నారు .ఆ సమయం లో వాయువుల మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి ప్రారంభ దశ లోనే ఉన్నది ఆ యూని వర్సిటి లో గార్డీ,ఆయన అనుచరులు మార్గ గాములుగా ఉన్నారు .వెంకటేశ్వర్లుగారు సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేశారు .మిధైల్ ఆల్కహాల్ కొద్దిగా అసౌస్టవ మాలిక్యూల్ గుప్తంగా అంతరిక భ్రమణాలు (హిండర్డ్ ఇంటర్నల్ రొటే షన్స్) కలిగి ఉంటుంది .అందులోని ప్రాధమిక కంపనాలు ( ఫండ మెంటల్ వైబ్రేషన్స్ హైడ్రాక్సిల్ గ్రూప్ )పురి(టార్సనల్ )తో మిధైల్ గ్రూప్ కు అనుబంధంగా ఉంటాయి .ఈ కదలిక నే హిండర్డ్ అంటే గుప్త భ్రమణాలు అంటారు .ఇవి మాలిక్యూల్ స్పెక్ట్రం యొక్క భ్రమణాలను క్లిష్ట తరం చేస్తాయి .వీటిపై ప్రాధమిక పరిశోధన ,విచారణలను డేన్నిసన్ ,అతని అనుచరులు చేశారు .1953 లో దీనిపై పరిశోధనా పత్రం రాసి ప్రచురించగానే వెంకటేశ్వర్లుగారు ఆయన సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను పరిశోధించారు .దీనిపై మొదట గా ఈ మాలిక్యూల్ యొక్క రోటేషనల్ స్పెక్ట్రం మొదటి ప్రాధమిక అధ్యయన విషయాలను రెండు పేపర్లుగా ప్రచురించారు .ఈ మాలిక్యూల్ యొక్క మైక్రోవేవ్ ,మిల్లి మీటర్ వేవ్ స్పెక్ట్రం లను మైక్రో వేవ్ ఆస్ట్రనాట్స్ దట్టమైన మాలిక్యులర్ క్లౌడ్స్ లో మైక్రో వేవ్ ఉద్గారం (ఎమిషన్ ) వలన గుర్తుపట్ట గలరు .అప్పటి నుంచి ఓరియన్ మాలిక్యులర్ క్లౌడ్స్ లో అనేక చోట్ల అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు .మైక్రో వేవ్ ఆస్ట్ర నామర్స్ కు ఈ మాలిక్యూల్ ను గుర్తించటానికి ఈ ఊహలు పరిశోధనాలయం లో గమనించిన విషయాలు బాగా తోడ్పడ్డాయి .అంతరిక్ష భౌతిక శాస్త్రం లో అత్యధిక ప్రాముఖ్యం కల ఈ మాలిక్యూల్ యొక్క మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేసిన మొట్ట మొదటి శాస్త్ర వేత్తలుగా శ్రీ వెంకటేశ్వర్లు గారి బృందం చరిత్ర ప్రసిద్ధులయ్యారు .
డ్యూక్ యూని వర్సిటి లో మిజు షీమా, వెంకటేశ్వర్లు గారు కలిసి గ్రూప్Vd,Td మాలిక్యూల్స్ లో మైక్రో వేవ్ శోషణ (అబ్సార్ప్షన్)పై అన్వేషణ చేశారు .వీటికి శాశ్వత డైపోల్ గమనం ఆధార స్థితి లో లేదని ,కనుక ఆ స్థితిలో మైక్రోవేవ్ శోషణ లేదని కనిపెట్టారు .ఈ శాస్త్ర ద్వయం ఈ మాలిక్యూల్స్ యొక్క ఉత్తేజిత క్షీణ కంపన స్థితిలో పూర్తిగా రోటేషనల్ అబ్సార్ప్షన్ కనపరుస్తాయని చెప్పారు ..ఇలాగే మిదేన్ మాలిక్యూల్ విషయం లో ఒజీర్ ,అయన అనుచరులు1973 లో పరిశోధించి చెప్పారు . ఇవన్నీ వెంకటేశ్వర్లుగారి అంతర్ దృష్టి (ఇంట్యూషన్ ),శాస్త్రీయ అవగాహనలకు ప్రతిబింబాలు .
1954 లో ఇండియా కు తిరిగి వచ్చిన .వెంకటేశ్వర్లు గారు వెంటనే ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి ఫాకల్టీ లో చేరారు .చేరిన ఏడాదికే యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్ మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లాబరేటరి నిర్మించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .అప్పటికి భారత దేశం సాంకేతిక ,పారిశ్రామిక అభి వృద్ధిలో కాలు మోపి నెమ్మదిగా అడుగులు కదుల్చుతోంది .మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ నిర్మాణానికి కావలసిన విడిభాగాలన్నీ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలి .ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ పరికరాలు లాగా మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్లు మనకు కావలసినన్ని దొరకవు .విడిభాగాలు తెప్పించి సమకూర్చుకుని లాబరేటరి లో నిర్మించు కోవాల్సిందే .వీరు ఎక్కువ భాగం డ్యూక్ యూని వర్సిటీ నుంచి తెప్పించుకున్నారు .వేవ్ గైడ్ కంపో నెంట్స్ వంటికి ఇండియాలోనే సమకూర్చుకున్నారు .ఒక్క ఏడాదిలోనే భారత దేశం లో మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లాబ రేటరి సిద్ధం చేసే శారు .ఇండియాలో ఇది అపూర్వ కార్య సిద్ధి ,సాఫల్య విజయం గా చరిత్ర పుటల్లో నిలిచింది .వెంకటేశ్వర్లు గారి ముందు చూపు ,దీక్ష ,తపన ,పట్టుదలతోనే ఈ అపూర్వ సృష్టి జరిగింది .ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి లో వెంకటేశ్వర్లు బృందం మిధైల్ ఆల్కహాల్ ,మిధైల్ ఎమైన్ వంటి ముఖ్య మైన మాలిక్యూల్స్ ల మైక్రో వేవ్ స్పెక్ట్రా లను అన్వేషింఛి ,విజయ వంతంగా ఆవిష్కరించారు .ఇది’’ వన్ మోర్ ఫెదర్ ఇన్ హిజ్ కాప్’’ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-17 –ఉయ్యూరు
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-6
పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర
సాటి లేని డిపార్ట్ మెంట్ ను అలబామాలో ఏర్పరచి ,దాని నిర్వహణ కోసం 4 మిలియన్ డాలర్ల నిధి ని చేకూర్చిన దార్శనికులు శ్రీ వెంకటేశ్వర్లు .అలబామా రాష్ట్రం లో మొట్టమొదటి ఆఫ్రికన్ –అమెరికన్ మహిళతో పి హెచ్ డిచేయించిన విశాలహృదయుడు .ఆమె ఇప్పుడు అలబామాలోని హాంట్స్ విల్ లో ఉన్న మార్షల్ స్పేస్ సెంటర్ ఏయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ (నాసా )లో పని చేస్తోంది .ఆమె కు ఇంతటి ఉజ్వల భవిష్యత్తు కల్పించినవారు ఆయన .
1-మొదటగా ఎలెక్ట్రానిక్ స్పెక్ట్రో స్కోపి లో కృషి, సహకారం
1930 కాలం లో ఆర్.ఎస్.మల్లికాన్ ‘’మాలిక్యులర్ ఆర్బిటల్ థీరీ’’ని ప్రతిపాదించాడు .ఇదే ఆయనకు నోబెల్ పురస్కారం అందజేయించింది .ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి మాలిక్యూల్స్ ల ఎలక్ట్రానిక్ స్థితి ని తెలుసుకోవచ్చు .మల్లికేన్ తన సిద్ధాంతాన్ని విస్తృత పరచి ద్వి అణు మాలిక్యూల్స్ ల ఆధార (గ్రౌండ్ ),ఉత్తేజిత ,ప్రేరేపిత (ఎక్సైటేడ్)స్థితులను ఊహించి చెప్పాడు .40-50 దశాబ్దాల కాలం లో మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి లో విస్తృతమైన అభి వృద్ధి జరిగింది .ఈ కాలం లో తన సత్తా చూపిన వారు యువ వెంకటేశ్వర్లు గారు . బెనారస్ హిందూ యూని వర్సిటి లో మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి లో బహు ప్రసిద్ధి పొందిన ఆర్ .కె అసుంది వద్ద తన పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ని చేశారు.
అసుంది పర్య వేక్షణలో వెంకటేశ్వర్లుగారు హాలోజెన్ మాలిక్యూల్స్ యొక్క కాంప్లెక్స్ స్పెక్ట్రా పై పరిశోధన ప్రారంభించారు.30 దశకం లోనే మల్లికాన్ –హాలోజెన్ డయాటమిక్ మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రానిక్ స్థితులను ఊహించి చెప్పాడు .ఇక మిగిలింది గమనించిన హాలోజెన్ స్పెక్ట్రా ను ఎలక్ట్రానిక్ పరివర్తన (ట్రాన్సిషన్ )దృష్టితో వ్యాఖ్యానించటమే .దీనినొక సవాలుగా తీసుకొని వెంకటేశ్వర్లుగారు తన గ్రాడ్యుయేట్ రిసెర్చ్ కాలం లో మాలిక్యులర్ ఆర్బిటల్ సిద్ధాంతాన్ని అనుసరించి తాను గమనించిన హెచ్చు తగ్గులు (ఫ్లక్యు యేషన్స్ ),ఉత్తేజిత కిందిపాక్షిక ఆధారిత హాలోజెన్ ఎలక్ట్రానిక్ స్థితుల నిరంతర హాలోజెన్ బాండ్ ల గురించి విపులమైన వ్యాఖ్యానాలు విశ్లేషణలతో అనేక రిసెర్చ్ పేపర్లు రాశారు .మాలిక్యులర్ ఆర్బిటల్ సిద్ధాంతం పై క్లిష్టమైన పరిశీలన జరుగుతున్న ఆ కాలం లో ఆయన చేసిన కృషి గొప్ప ఉత్తేజాన్ని ,ఉత్సాహాన్ని ఇచ్చి మార్గం సుగమం అయింది .
ఆయన చేసిన రిసెర్చ్ కృషికాలం లో హాలోజెన్ స్పెక్ట్రా పై అభి రుచి, ఆసక్తి అలాగే కొన సాగింది .అనేక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులను హాలోజెన్ ఎలెక్ట్రానిక్ స్పెక్ట్రా పై మరింత పరిశోధనలకుప్రోత్సహించారు .తగినట్లుగా వాళ్ళు స్పందించి డయాటమిక్ హాలోజెన్ మాలిక్యూల్స్ I2,Br2 ,C l 2,I B r ,IClమొదలైన హాలోజెన్ ఆటం కలిగిన అనేక డయాటమిక్ మాలిక్యూల్స్ పై విస్తృత పరిశోధనలు చేసి అప్పటి వరకు ఉన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృత పరచారు .వెంకటేశ్వర్లు గారు స్వయంగా అయోడిన్ ,బ్రోమిన్ డయాటమిక్ మాలిక్యూల్స్ ల ఎలక్ట్రానిక్ స్పెక్త్రా పై G.H ertz Berg లాబరేటరిలో పరిశోధనలు చేశారు .మొదటి సారిగా హై రిజల్యూషన్ తో ఏర్పరచిన ఈ రెండు మాలిక్యూల్స్ ల మొదటి అబ్సార్ప్షన్ బాండ్ ల విశ్లేషణ కు మల్లికేన్ ఊహించిన ఎలక్ట్రానిక్ స్థితి ఆధారంగా వివరించటానికి చాలా కస్ట పడాల్సి వచ్చింది .ఈ బాండ్ లన్నీ అయోడిన్ బ్రోమిన్ దయాటమిక్ ఆధార స్థితి ఉత్తేజ స్థితి కి చెందిన బాండ్ లని వర్గీకరించి మాలిక్యులర్ ఆర్బిటల్ దీరీ ననుసరించి చెప్పటం లో కృత క్రుత్యుడయ్యారు .
అతి ముఖ్యమైన హాలోజెన్ డయాటామిక్ మాలిక్యూల్స్ విశ్లేషణ తో పాటు ట్రయాటమిక్ మాలిక్యూల్ అయిన CF 2 యొక్క ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా కూడా కనుగొనటం లో విశేష కీర్తి పొందారు .తర్వాత ఒక విద్యార్ధి Si F 2 ట్రయాటమిక్ స్పెక్ట్రా కనిపెట్టటానికి మార్గ దర్శనం చేశారు .కనుక ‘’డయటామిక్ ట్రయటామిక్ స్పెక్ట్రా మార్గ దర్శి ‘’ గా వెంకటేశ్వర్లుగారిని భావించవచ్చు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-17- ఉయ్యూరు
—
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5
అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో అందించిన సేవలు -2
1992లో ప్రొఫెసర్ పుచ్చా వెంకటేశ్వర్లు అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు .దురదృష్ట వశాత్తు 76 ఏళ్ళ వయసులో 1997 ఆగస్ట్ 8 న చేరిన అయదేళ్ళకే అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోయారు .ఎప్పటిలాగానే అంకిత భావం తో తుది శ్వాస వరకు కృషి చేస్తూ సేవలందించారు .ఆ రోజు కూడా సాయంత్రం 6 గంటలవరకు పని చేసి ,ఇంటికి వెళ్లి ఆ రాత్రే చనిపోయారు .
ప్రయోగాత్మక ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనలు చేస్తూ దీనికోసం యు ఎస్ .ఆర్మీ మిసైల్ కమాండ్ సంస్థ నుంచి మొదటి సారిగా రిసెర్చ్ గ్రాంట్ పొందారు .ఇదే ఈసంస్థలో ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనకు నాంది అయింది .ఇది కాక నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,ఆప్టికల్ మెటీరియల్స్ రిసెర్చ్ కోసం మరొక 10 మిలియన్ డాలర్ల గ్రాంట్ ను పదేళ్లకు గాను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుంచి అందుకున్నారు .ఇలా 12 రిసెర్చ్ గ్రాంట్ లను NSF,DOE,NASA AIR FORCE ARMY RESEARCH OFFICE వంటి , అనేక ఫెడరల్ ఏజేన్సీలనుండి సాధించిన ఘనత ఆయనది .చారిత్రాత్మక బ్లాక్ కాలేజీలు యూని వర్సిటీలలో AAMU అగ్రశ్రేణి ప్రగతి పధ గామి విద్యా సంస్థగా పేరెన్నిక గన్నది .అమెరికాలో ఆప్టిక్స్ /లేజర్ కోర్సు లో పి .హెచ్. డి.. చేసే అవకాశమున్న అతి కొద్ది సంస్థలలో ఒకటిగా నిలిచింది .ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో ఇప్పుడున్న ఫాకల్టి సభ్యులు ఆయన రిసెర్చ్ గ్రాంట్ లవలన పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్స్ లనుండి నియామకం పొందినవారే .
అలబామా సంస్థ మొదటి పిహెచ్ డి విద్యార్ధి హోసేన్ అబ్దిల్ డయెం వెంకటేశ్వర్లుగారి పర్య వేక్షణలో 1991 లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు .ఇప్పుడు అతను నాసా /మేరీ లాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో పని చేస్తున్నాడు .తరువాత సంవత్సరాలలో చాలామంది పిహెచ్ డి ,,ఎం .ఎస్ .విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు .1991 -97 కాలం లో 10 మందికి రిసెర్చ్ గైడ్ గా ఉన్నారు .ఆయన నిరంతర కృషి ఫలితంగా ఆ నాటికి 47 మంది డాక్టరేట్ లు అయ్యారు .ఇది ఆసంస్థ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు అత్యంత గర్వకారణమైంది .వెంకటేశ్వర్లుగారి అమెరికా అసోసియేట్ లందరూ కలిసి ఆయన సాధించిన విజయాలపై ఒక సింపోజియం 1997అక్టోబర్ లో నిర్వహించి ఘన సన్మానం చేయాలని సంకల్పించారు . కాని ఆగస్ట్ లోనే ఆయన మృతి చెందటం వలన ఆ సమావేశం స్మ్రుతి నివాళిగా నిర్వహించాల్సి వచ్చింది .
వెంకటేశ్వర్ల గారి సేవానిరతి కి గుర్తుగా ఈ అలబామా సంస్థ ప్రెసిడెంట్ జాన్ గిబ్సన్ నాయకత్వం లో వార్షిక స్మారక ప్రసంగాలను నిర్వ హించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .మొదటి మెమోరియల్ లెక్చర్ అక్టోబర్ 1998 లో రైస్ యూని వర్సిటి కిచెండిన నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కర్ల్ చేశాడు .మరుసటి ఏడాది నేషనల్ ఇన్ స్టి ట్యూట్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన మరొక నోబెల్ లారియేట్ విలియం ఫిలిప్స్ , 2000లో కొలంబియాకు చెందిన నోబెల్ గ్రహీత హార్స్ట్ స్టార్మర్,20 01 లో నోబెల్ లారియేట్ నికొలాస్ బ్లోమేర్జెన్ ,2002 లో నోబెల్ గ్రహీత డగ్లాస్ ఒషేరాఫ్ ,2003లో నోబెల్ గ్రహీత ఎరిక్ కార్నెల్ ,2004 లో నోబెల్ లారియేట్ అలాన్ ఈగర్ లు స్మారక ప్రసంగాలు చేసి వెంకటేశ్వర్లుగారికి ఘనం గా నీరాజనాలు అందజేశారు .ప్రతి సంవత్సరం వెంకటేశ్వర్లుగారి స్మారక ప్రసంగాలను నోబెల్ బహుమతి పొందిన వారితోనే చేయించాలని నిర్ణయింఛి చేస్తున్నారు .అలబామా మరియు A and M యూని వర్సిటీల సభ్యులు శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారిని ‘’ఫాదర్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ ఆప్టిక్స్ రిసెర్చ్ యట్ అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి’’గా మనసులలో భద్రం గా పదిల పరచుకున్నారు . .ఇలా శ్రీ పుచ్చావెంకటేశ్వర్లు గారు ‘’అలబామా ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత ‘’ అయ్యారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-17 –ఉయ్యూరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3
కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సేవ
ఐ. ఐ. టి.కాన్పూర్ గా పిలువబడే ఈ విద్యాకేంద్రం స్వర్గీయ పీ.కే .కేల్కర్ అనేక సంప్రదాయేతర నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయటం తో విభిన్న ,వినూత్న విద్యాకేంద్రంగా భారత దేశం లో శోభించింది .ఈ అదృష్టానికి కారకుడు కేల్కర్ .దీనికి నిర్దుష్టమైన ,సరైన బోధనా సిబ్బంది ని నియమించటం లో కేల్కర్ బహు జాగ్రత్త వహించి దీనిస్థాయి పెంఛి ఆకర్షణీయం చేశాడు . ఆయన నియమించిన మొదటి నలుగురు ఫాకల్టి సభ్యులలో శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారు౦డటం విశేషం .కేల్కర్ కు కుడి భుజంగా ఉంటూ, చొరవ తీసుకొని అత్యున్నత అత్యుత్తమ ఫాకల్టి నియామకానికి వెంకటేశ్వర్లు గారి కృషి చిరస్థాయి గా నిలిచింది .దేశం అంతా అత్యున్నత ప్రమాణ సాంకేతిక విద్య కోసం కాన్పూర్ ఐ. ఐ. టి . వైపు చూసేట్లు చేశారు .
1960 నాటికే అత్యంత ప్రతిభావంత శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగాఇండియాలోనూ విదేశాలలోనూ గుర్తింపబడి,మరింత ఉత్తమ భవిష్యత్తు ఉన్న శ్రీ వెంకటేశ్వర్లు లోని వినూత్న ఆలోచనా సరళి ఈ నూతన విద్యాసంస్థ ఏర్పడటం ,దాని అభి వృద్ధికి అహరహం కృషి చేయటం కేల్కర్ గమనించాడు .ఆయనలోని అకు౦ఠిత దీక్ష ,తపన ,అంకితభావం ఈయనకు ఎంతో నచ్చాయి.తన పరిశోధనకే పరిమితం కాకుండా మొత్తం ఆ విద్య సంస్థ కోసం ఆయన చేస్తున్న ,అమలు బరుస్తున్న ప్రణాళికలు కేల్కర్ ను ముగ్దుడిని చేశాయి . కేల్కర్ చాలా మందితో పని చేస్తున్నా ,వెంకటేశ్వర్లు వంటి మార్గ దర్శి ,స్పూర్తి నిచ్చే వ్యక్తి వేరొకరు లేరనుకొన్నాడు .మేధస్సు ,సునిసిత జ్ఞానం ,చొరవ ,నాయకత్వ లక్షణం ఉన్నప్పటికీ అనుచరుడుగా సంస్థ అభ్యున్నతికి ఆయన అరమరికలు లేకుండా పని చేసే అపూర్వ వ్యక్తిగా గుర్తించాడు కేల్కర్ .
విద్యా వేత్తగా అనేక రంగాలలో పని చేస్తున్నా వెంకటేశ్వర్లు గారికి పరిశోధనే ప్రాణం .ఇక్కడ చేరిన కొద్దికాలం లోనే తన బృందానికి కావలసిన పరిశోధనా సామగ్రి కోసం ఆర్డర్ వేసి ,తనతోపని చేస్తున్న యువ పరిశోధకులను ఉత్సాహ పరుస్తూ ,ఉన్న స్థలంలోనే ,అందుబాటులోఉన్న పరికరాలతోనే పని చేయించారు .ఫిజిక్స్ లోనే కాక కెమిస్ట్రి లో కూడా ప్రతిభ ఉన్నవారిని ఆకట్టుకొన్నారు ఇండియాలో జరిగే ముఖ్య శాస్త్రీయ సమావేశాలకు హాజరవుతూ,అక్కడున్న వారిలో తన డ్రీం ప్రాజెక్ట్ ఐ .ఐ .టి.కాన్పూర్ తత్వానికి తగిన ప్రతిభావంతులను ఎంపిక చేసేవారు.
కేల్కర్ సారధ్యం లో వెంకటేశ్వర్లు మనదేశం లోని సమర్ధులైన సైంటిస్ట్ లతో తరచూ సంభాషణలు జరుపుతూ ,వారి వద్ద ‘’మేధో నవనీతం ‘’(క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్) ఉన్నవారిని ,తన విద్యా సంస్థ నాణ్యత పెంచే వారిని వెతికి ఆహ్వానించి మరింత ఉన్నత స్థాయి కలిపించారు .సాధారణంగా ఐఐ టి లో ఇంటర్వ్యు కమిటీల ద్వారా ఎంపిక చేయటం సంప్రదాయం .కానీ వెంకటేశ్వర్లు అంత దాకా ఆగే స్వభావం కలవారుకాదు .ఆయనకు పనులన్నీ వేగంగా జరిగిపోవాలి .
వెంకటేశ్వర్లు గారి కార్య క్షేత్రం అంటే కర్మ భూమి ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ . 1961 నుండి 1967 వరకు పని చేసిన 6 సంవత్సరాలలొ ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ..ఈ కాలం లో ఆయన చేసిన అనేక పనులతో పాటు లేజర్ శక్తి సామర్ధ్యాలను గుర్తించటం ముఖ్య విషయమై పోయింది.లేజర్ ను ఉపయోగించి స్పెక్ట్రో స్కోపి పరిశోధింఛటమేకాదు ఫిజిక్స్ ,కెమికల్ ఇంజినీరింగ్ ,ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని తన సహచరులకు కూడా లేజర్ టెక్నాలజీ పై అభిరుచి , అభిలాష కలిగేట్లు చేశారు . దీనికి ఉదాహరణ తన సహచరుడు ఆర్ .ఆర్. దాసరి ని రెండేళ్ళు ఎం. ఐ .టి . లాబ్ లో పనిచేయించటం . ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని మరొక సహచరుడు కె .ఆర్. శర్మ ఒక ఏడాది ఎం. ఐ .టిలో గడిపి ,ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో బోధనకు ,పరిశోధనకు సమర్ధుడ య్యాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-17 –ఉయ్యూరు
—
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2
బోధన పరిశోధన
శాస్త్రీయ రంగం లో శ్రీ వెంకటేశ్వర్లు గారి అమూల్య సేవ1954 -1997 కాలం లో మూడు గొప్ప విద్యాకేంద్రాలు1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి 2-,కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , 3-అమెరికాలో హ౦ట్స్ విల్ లోఉన్న అలబామా అగ్రికల్చర్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ ల ఏర్పాటు తో విస్త్రుతమై ,విశ్వవ్యాప్తమై ,చిరస్మరణీయమైంది .ఈ మూడిటిలో 50 మందికి పైగా పి .హెచ్ .డి.లకు అత్యున్నత శిక్షణ నిచ్చారు .జీవితమంతా ఏదో ఒక వినూత్న ప్రయోగ ,పరిశోధన లతో గడిపిన ఆలోచనాపర మైన మేధస్సు ఆయనది .ఇదివరకు చేసిన ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ ,మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పై పరిశోధనలతో పాటు పూర్తిగా నూతన రంగాలైన న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ,సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి ,లేజర్స్ ,లేజర్ ఇంఫ్యూజ్డ్ ఫ్లోరొసెన్స్ స్పెక్ట్రో స్కోపి ,అన్ కన్వర్షన్ స్టడీస్ ,ఇంటర్ ఫెరోమెట్రి ,ఆప్టికల్ ఫేజ్ కా౦జుగేషన్,హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్,నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ ,మైక్రో స్పెరికల్ లేజర్స్ ,పౌడర్ లేజర్స్ మరియు ప్లానార్ వేవ్ గైడ్స్ లోను విస్తృత పరిశోధనలు జరిపిన నిత్యాన్వేషి శ్రీ వెంకటేశ్వర్లు .అన్ని సైంటిఫిక్ జర్నల్స్ లో ఆయన రాసిన 200 కు పైగా వ్యాసాలు ప్రచురితమై ,ఆయన కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది .పైన పేర్కొనబడిన మూడు విద్యాకేంద్రాలలో ఆయన మార్గదర్శక మహత్తర సేవ ,తోడ్పాటు లను సంక్షిప్తంగా తెలుసుకొందాం .ఆయన ప్రతిభకు గుర్తుగా ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీలకు ఫెలో గా ఎన్నుకోబడ్డారు .రామన్ సెంటినరి అవార్డ్ అందుకున్నారు.అమెరికన్ ఫిజికల్ సొసైటీ ,ఆప్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా లలో ఆయన కు సభ్యత్వ మిచ్చి గౌరవించారు .
1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ లో సేవ
విద్యారంగం లోమొట్ట మొదటి సారిగా శ్రీ వెంకటేశ్వర్లు గారు ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ రీడర్ గా 1954 లో నియామకం పొందారు .ఒకప్పుడు ఇది ప్రొఫెసర్స్ ఆర్.శామ్యూల్ ,ఆర్. కె.అసుంది ఆధ్వర్యం లో స్పెక్ట్రో స్కోపిక్ రిసెర్చ్ కు ముఖ్య కేంద్రంగా విలసిల్లింది.రెండవ ప్రపంచ యుద్ధకాలం లో శామ్యూల్ జర్మనీకి ,అసుంది బెనారస్ కు వెళ్లి పోవటం తో లాబరేటరి దాదాపు మూత పడి,20 ఏళ్ళు పరికరాలన్నీ తాళాలు పడి నిరుపయోగ౦గా ఉండి పోయాయి .వెంకటేశ్వర్లు గారు ఇక్కడ చేరిన మరుక్షణం నుంచి కార్య రంగం లోకి దూకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ డైయటామిక్ మాలిక్యూల్స్ పరిశోధన క్షేత్రం లో మహత్తర చైతన్యం తెచ్చారు .ప్రొఫెసర్లు శామ్యూల్ ,అసుంది లు 1930 కాలం లో ఉపయోగించిన లో రిజల్యూషన్ స్పెక్ట్రో గ్రాఫ్ లనే వాడుతూ ,విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్ పై మార్గ దర్శనం చేశారు .వెంకటేశ్వర్లుగారి బెనారస్ డిగ్రీ చదువు నుండి అత్యంత అభిమానమైన విషయం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్అని మనకు తెలుసు . దీనినే ఆయన కొనసాగించి జీవితం తుది ఘట్టం వరకు వదిలి పెట్టకపోవటం విశేషం .స్పెక్ట్రో స్కోపి లోపరిశోధనకోసం పరికరాన్ని కొనటానికి కావలసిన భారీ మొత్తం లో చాలాభాగం వెంకటేశ్వర్లు గారికి మొదటి సారిగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సంస్థ కానుకగా అందజేసింది. తాను ఇదివరకెన్నడూ పరిశోధించని కొత్త విభాగం లో ఆయన కొన్న మొట్టమొదటి పరికరం యెన్.ఎం. ఆర్. స్పెక్ట్రో మీటర్ .ఇండియాలో నే మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో మీటర్ ను విడి భాగాలన్నీ కూర్చి తయారు చేసి,ముగ్గురు పిహెచ్ డి విద్యార్ధులకు శిక్షణ నిచ్చారు పుచ్చావారు .ఇదేకాక వాక్యూం అల్ట్రా వయొలెట్ స్పెక్ట్రోస్కోపిని కూడా మొదటిసారిగా ప్రారంభించిన ఘనత శ్రీ వెంకటేశ్వర్లు గారిదే అని తెలిస్తే అవాక్కై పోతాం .ఆలిఘర్ యూని వర్సిటి లో 9 మంది విద్యార్దులకు ఇందులో శిక్షణ నివ్వగా ,అందులో ఏడుగురు ఇండియా ,అమెరికా ,కెనడా లలో ప్రొఫెసర్ లుగా రాణిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు
మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1
కుటుంబ నేపధ్యం
శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు 25-10-1921న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీ పుచ్చా చంద్ర మౌళి శాస్త్రి ,శ్రీమతి బాలా త్రిపుర సుందరి .అయిదుగురు సంతానం లో కడగొట్టు ఏకైక మగ పిల్లాడు .ఆయన వంశ పూర్వీకులందరూ వేద శాస్త్ర పారంగతులైన విద్యా వేత్తలైనందుకు శ్రీ వెంకటేశ్వర్లు గారు గర్వపడే వారు .పదేళ్ళ బాల్యం లోనే తల్లిని పోగొట్టుకున్నఅభాగ్యుడు . బి ఎస్ సి డిగ్రీ వరకు గుంటూరు లోనే చదివి,తరువాత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో చేరి 1944లో ఎం. ఎస్. సి.డిగ్రీ ,1947 లో డి .ఎస్. సి .సాధింఛి ప్రొఫెసర్ అయ్యారు . . శ్రీమతి ఈమని సరస్వతి గారిని వివాహమాడి ఒక కుమార్తెకు నలుగురు కుమారులకు జన్మ నిచ్చారు .ఇద్దరు కుమారులు అమెరికాలో ప్రొఫెసర్లు.మిగిలిన ముగ్గురు అక్కడే కన్సల్టింగ్ ఫర్మ్ లకు అధినేతలు .
విద్య శాస్త్ర సేవలు
ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు బెనారస్ హిందూ యూని వర్సిటి లో స్వర్గీయ ఆర్. కె. అసుంది తో కలిసి రిసెర్చ్ చేసి 1947లో డి.ఎస్. సి .డిగ్రీ పొంది , రిఫెర్రేడ్ పేపర్లను డిగ్రీ లో నేచర్ పై రాసినది ,హాలోజెన్స్ ల ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాపై రాసినది కాక ,మరొక 9 తను ప్రత్యేకంగా వ్రాసిన వాటిని కలిపి మొత్తం 11 రిఫెర్రేడ్ పేపర్లు రాసి ప్రచురించారు .వీటిలో దాదాపు సగం ఆయన వ్యక్తిగతమైనవి గానే ఉన్నట్లు ,తరువాత జీవితం లో యూరప్ ,అమెరికా ,కెనడా లలో ప్రముఖ లాబరేటరీలలో పోస్ట్ –గ్రాడ్యుయేట్ అసోసియేట్ గా ఉన్నప్పుడు కూడా ఇలాగే కొనసాగించారు .యవ్వనం నుంచే ధైర్య సాహసాలతో తాను వినూత్న ,విశిష్ట ,సాహసోపేత కార్యాలను చేయగలననే ఆత్మస్థైర్యం ఉన్నవారు .దీనికి గొప్ప ఉదాహరణే ఆయన బెనారస్ లో డిగ్రీ పొందిన వెంటనే నీల్స్ బోర్ లాబరేటరి న్యూక్లియర్ ఫిజిక్స్ లో పనిచేయటానికి తీసుకొన్న సాహసోపేత నిర్ణయం .ఇక్కడ’’ లో రిజల్యూషన్ ప్రిజం స్పెక్ట్రోగ్రాఫ్’’ లను మాత్రమే ఉపయోగించి మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన చేశారు .నిజంగా ఈ రెండిటికి సంబంధమేలేదు ,పోలికాలేదు ,ప్రయోగ సా౦కేతికతలో ,సైద్ధాంతిక పరంగా కూడాఇవి పూర్తిగా భిన్న స్వభావం కలవి కూడా .తర్వాత తన బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సర్వ సర్ధమైన అత్యంత నాణ్యమైన కెనడాలోని యెన్ .ఆర్ .సి .లో ఉన్న గెర్హార్డ్ హెర్జ్ బెర్గ్,చికాగో యూని వర్సిటి లోని రాబర్ట్ మల్లికేన్ ,డ్యూక్ యూని వర్సిటి లోని వాల్టర్ గార్డి కేంద్రాలను,ఇన్ఫ్రా రెడ్ స్పెక్ట్రో స్కోపి కి ఎం. ఐ. టి.లోని రిచార్డ్ లార్డ్ విద్యా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు . నోబెల్ బహుమతి గ్రహీతలైన ముగ్గురి పేరిట ఉన్న ఈ విద్యాలయాలలో విద్య కొనసాగించటం వలన వెంకటేశ్వర్లు గారికి ,వారిలోని పట్టుదల ,కృషి ,ముందుచూపు ,నిరంతర శ్రమ ప్రేరణగా నిలిచి జీవితాంతం ముందుకు నడిపించాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు
పుచ్చావారి ఫోటో జత చేశాను చూడ0డి dr.puccha venkateshvarlu (1)
This gallery contains 35 photos.
This gallery contains 33 photos.
“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ -2
“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ ”
మా ఇంట్లో 23-11-17 గురువారం శ్రీ విష్ణుభొట్ల అవధాని గారి దంపతులు ,24-11-17 శుక్రవారం ఆత్మీయులు శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు గారు
అక్షరం లోక రక్షకం
సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరసభారతి ఆధ్వర్యం లో రేపల్లె వాస్తవ్యులు డా .శ్రీ యల్లాప్రగడ రామ మోహనరావు ,శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్ల సౌజన్య సహకారాలతో సంయుక్తంగా గుంటూరు జిల్లా రేపల్లె లో నిర్వహిస్తున్న
సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ
సాహితీ బంధువులకు శుభకామనలు – సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంథాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె(పరుచూరి ,ఎల్లా ప్రగఢ వారి స్వగ్రామం ) లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు
గుంటూరు ,కృష్ణా జిల్లాల లో ప్రసిద్ధ కవులచే
‘’సాహితీ బంధం ‘’అంశం పై కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది .
పాల్గొన నున్న ప్రముఖ అతిథులు
శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్- పులిచింతల మరియు ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు) డా .శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి (ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ,పారిస్ ),శ్రీమాన్ వేదాల వెంకట సీతారామాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు ) ,అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా సవరం వెంకటేశ్వరరావు(చరిత్ర శాఖాధిపతి హిందూ కాలేజి ,మచిలీపట్నం ) ,డా. శ్రీతూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు )డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి(రిటైర్డ్ సంస్కృత అధ్యాపకులు ,శ్రీ పరశు రామాయణాది గీర్వాణగ్రంథకర్త ) డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ ,(ప్రముఖ కవి) డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –వారణాసి ) , డా శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం –పూరీ ) – డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి ( ప్రాచ్య సాఖ్యాన వివరణ కర్త –వారణాసి ) — డా రేమెళ్ళఅవధానులు(వేద గణిత నిధి,శ్రీ వేద భారతి నిర్వాహకులు ) ) శ్రీపరాశరం భావనారాయణా చార్యులు(వనౌషధి నిఘంటు కర్త ) –డా శ్రీమతి అయ్యగారి ప్రభావతీదేవి(విశ్వనాథ ‘’వేయి పడగలు’’ నవల కు సంస్కృతానువాదకర్త ) -డా శ్రీ ఇనగంటి ఉమారావు(తత్వ చింతామణి సిద్దా౦జన కర్త ) – శ్రీ చలపాక ప్రకాష్ (రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి ) మొదలగు విశిష్ట అతిథులతో పాటు-
రేపల్లె పుర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య ,సంగీత ప్రియులందరికీ ఆహ్వానం . పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
ఆవిష్కరింపబడే గ్రంథాలు
1-ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు
తమ సృజనాత్మక ప్రతిభతో ప్రపంచ ప్రగతిని మార్చి మలుపు త్రిప్పి ,ఆధునిక ప్రపంచానికి దారులు వేసిన వేదాంతం, తత్వశాస్త్రం ,కవిత్వం ,నాటకం నవల సంగీతం,నాట్యం, సినిమా ,శిల్పం, చిత్రకళ మొదలైన రంగాలలో లబ్ధ ప్రతిష్టు లైన 91 మంది మహానుభావుల జీవిత చిత్రణ .
అంకితం – రేపల్లె లో జన్మించి స్టాటిస్టిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతులైన గణిత శాస్త్ర వేత్త కీ శే . డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య (అమెరికా )గారికి
ప్రాయోజకులు -సరసభారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ(రేపల్లె అల్లుడుగారు ) శ్రీమతి సత్యవతి(రేపల్లె ఆడపడుచు ) దంపతులు -అమెరికా (పరుచూరి వారికి బావగారు ,సోదరి
—
ముందు మాటలు -డా .శ్రీ సవరం వెంకటేశ్వర రావు – చరిత్ర శాఖాధిపతి -హిందూకాలేజి -మచిలీ పట్నం
2- గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 -మూడవ భాగం
భారత దేశం లోని అన్ని రాష్ట్రాలకు,అన్నికాలాలకు చెందిన 462 మంది సంస్కృత కవుల జీవితాలు, ,దర్శనం ,కావ్యం ,నాటకం ,కధ నవల ,చరిత్ర ,సాహిత్యం ,వ్యాఖ్యానం మొదలైన ప్రక్రియలలో వారి రచనా విశేషాలపై వెలువడిన ముచ్చటైన మూడవ గ్రంథం .
అంకితం – దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి(రేపల్లె అల్లుడుగారు ) ,శ్రీమతి డా సులోచన –రేపల్లె ఆడపడుచు- (అమెరికా ) దంపతులకు
ప్రాయోజకులు –రేపల్లె లో జన్మించిన విద్యాసంపన్నులు , వితరణ శీలి ,దేశభక్తి పరాయణులు,
ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహన రావు గారు(అమెరికా )
(మూర్తిగారి బావమరిది ,సులోచనగారి అన్నగారు )
ముందుమాటలు -అవధాన సరస్వతి డా శ్రీ పాపపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు
— వేదిక తో సహా అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం డిసెంబర్ మొదటి వారం లో అంద జేస్తాం
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –
డా .ఎల్లాప్రగడ రామమోహనరావు-రేపల్లె
పరుచూరి శ్రీనాథ్(కీ శే .డా పరుచూరి రామ కృష్ణయ్య గారి సోదరుడు )-రేపల్లె
23-11-17
—
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 ) (చివరి ఆర్టికల్ )
చిన్మయ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యం లో ‘’సంస్కృతం లో నూతన ఎల్లలు ,భారతీయ విజ్ఞానం ‘’పై 2017 జూన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ బి .యెన్ .శశికిరణ్ ,శ్రీ హరి రవికుమార్ లు సంయుక్తంగా ఒక పరి శోధనా పత్రాన్ని సమర్పించారు .అందులోని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను ..
‘’ ప్రపంచం లో భారత దేశానికి సంస్కృతభాష దైవమిచ్చిన విశేష వరం . అనేక విధాలుగా దాని ప్రత్యేకత ఉంది . వ్యాకరణం లో పాణిని పధ్ధతి ఉత్కృష్ట మైనది . భాషకు అది గొప్ప శక్తి సామర్ధ్యాలను చేకూర్చింది . శబ్దోత్పత్తికి దాని తోడ్పాటు చిరస్మరణీయ౦ . . ఇతర భాషా బోధనా విధానాలు సంస్కృతానికి నప్పవని ,శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి ,శ్రీ ఆర్ జి భండార్కర్ ,ఎ.ఎ.మాగ్డోనెల్ ,డి .యెన్. షాన్ బాగ్ మొదలైన ప్రముఖులు ,సంస్కృత భారతి ,బెనారస్ హిందూ యూనివర్సిటి ,రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ,సుర సరస్వతి సభ ,కర్నాటక స్టేట్ ఓపెన్ యూని వర్సిటి ప్రసిద్ధ సంస్థలు ఆధునిక కాలం లో వారి వారి విధానాలలో సంస్కృతం నేర్పుతున్నారు .ఇందులో కొన్ని సత్ఫలితాలనిస్తే ,మరికొన్ని అంతగా ప్రయోజనం చేకూర్చలేదు .కనుక ప్రాక్ ,పశ్చిమ దేశాలలో సంస్కృత బోధనకు ‘’కావ్య ఆధార విధానం ‘’(కావ్య సెంట్రిక్ అప్రోచ్ )చాలాబాగా ప్రయోజనాన్ని కలిగిస్తుందిఅని అధ్యయనం లో తేలింది .ఇది సంప్రదాయ విధానం ఆధారంగా ఉన్నప్పటికీ ,ఆధునిక సాంకేతికను సమకూర్చటం తో విశేష ఫలితాలు వస్తున్నాయి .వ్యక్తి విధానానికి అనుకూలంగా ఉంటూ , నేర్చేవారిని 1-సంస్కృతం తో ఏమాత్రం పరిచయం లేనివారు 2-భారతీయ సంస్కృతి పై అవగాహన ఉన్నా ,ప్రాంతీయ భాషపై అవగాహన లేనివారు 3-భారతీయ భాషా సంస్కృతి ,పరంపరాగత భాష లో అవగాహనఉండి ఏదోఒక భాష బాగా తెలిసినవారు 4- ఒకప్పుడు సంప్రదాయ పద్ధతిలోనో వేరొక విధానం లోనో నేర్చి ,మరలా దానిపై అభిమానం తో నేర్వాలనుకోనేవారు గా విభజన చేశారు . పైన చెప్పిన ద్వయం వీరందరికోసం ఎనిమిదిరకాల భాషాభ్యసన పరికరాలను(లెర్నింగ్ టూల్స్ ) తయారు చేశారు .ఇవి రెడీ మేడ్ దుస్తులు లాగా ఎవరికి ఏది కావాలంటే వారికి అది సరిపోయేటట్లుగా ఉంటాయన్నమాట .అవేమిటో ఇప్పుడు చూద్దాం –
1-సంప్రదాయ భారతీయ కళా సంస్కృతులపై అవగాహన 2-వివిధ రకాల సంస్కృత శ్లోకాలు వినటం ధారణ చేయటం 3-దేవనాగరి లిపి వర్ణక్రమం తెలుసుకొని రాయటం 4-సంస్కృత కవిత్వం కథలు,నాటికలు వినటం ,తెలుసుకొని అభిరుచి పొందటం 5-వ్యాకరణం ,నిఘంటువుల ను ఉపయోగించి భాషాభివృద్ధి సాధించటం 6-సాంప్రదాయ శిక్షణను ఈ క్రింది 8 విధానాలలోపొందటం –
1- వాదనం –గురువు చెప్పిన ఒక శ్లోక ధారణ 2-అనువాదనం –అదే శ్లోకాన్నిరెండు సార్లు ధారణ చేయటం .3-పదచ్చేదం –పదాలను విడదీయటం 4-ఆకాంక్ష –శ్లోక భావం అర్ధం చేసుకోవటం 5-అన్వయం –పదాలను వరుసక్రమం లో పేర్చటం 6-వ్యాకరణ విశేషః –శ్లోకం లోని వ్యాకరణ సూత్రాలను గ్రహించి అర్ధం చేసుకోవటం 7-అన్య విశేషః –అలంకారాలు ,ఛందస్సు వగైరా విషయాలు తెలుసుకోవటం 8-భావార్ధం –శ్లోక సారాన్ని గ్రహించి అనుభవింఛి ఆనందించటం . ఇలా 8 పద్ధతులలో 6 వ దైన ‘’సాంప్రదాయ శిక్షణ’’ పొందాలన్నమాట .
7-భాషాభ్యసన పరి పుష్టి కోసం పదాలతో సరదాగా ఆటలాడుకోవటం 8-భాషలో అదనపు బలసామర్ధ్యాలు పొందటానికి శ్రేణీయ సాధనాలు (గ్రేడెడ్ ఎక్సర్ సైజెస్ ) చేయటం.
విద్య ర్చేటప్పుడు అన్ని స్థాయిలలోనూ సంస్కృతం మాత్రమే ఉపయోగించాలి .
సంస్కృతం అంటే బాగా పరిశుద్ధం చేయబడిన భాష అని ,చక్కగా కలిపి ఉంచేది అని అర్ధం .అనేక వేల సంవత్సరాలుగా అభి వృద్ధి చెందిన భాష సంస్కృతం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-17 -ఉయ్యూరు
సమాప్తం -17-11-17 –ఉయ్యూరు
—
విన్నపం -గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవభాగం పై తాజా ఆర్టికల్ తో 462 మంది కవులతో వెలువడుతోంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్
16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం చిత్ర మాల
15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం లో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి – మధుర్యపాత్ర మన్మధ చాపం చెరకు గడ -మాకు ఏడుగడ కవి కర్షక కార్మిక హృదయ మాధుర్యం మాకు శిరోధార్యం విద్యా వైద్య ఆధ్యాత్మిక కేంద్రస్థానం మా ఊరు ఆటు పోటులేని జీవన మాధుర్యం మాది మా చేలల్లో తీపి చెరకే కాదు వరిలోనూ మాధుర్య రస ఝరులున్నాయి మా పుల్లేరు నీరు రష్యా వోల్గాను చేరింది నూనెలో నూతనావిష్కరణ కు దారి చూపింది మా కేమోటాలజిపిత” కొలాచల సీతారామయ్య” మా వూరి విద్యామాణిక్యం మాకు గర్వకారణం ఇండో- సోవియెట్ శాస్త్ర సాంకేతిక స్నేహ వారధి మా కెసీపి దృఢానికే కాదు మధుర చక్కెరకూ కాణాచి జిల్లాలో మా రాజకీయ౦ బలవత్తరం ,దిశా నిర్దేశం కూడా మాది ఆదర్శప్రాయ అనుసరణీయ జీవన విధానం మా క్షేత్రాలు పాడిపంటలకే కాదు మాదుర్య సాహిత్య సస్య కేదారాలు కూడా సిరి సంపదలకు ,వితరణ శీలతకు సంస్కృతీ సంప్రదాయాలకు మార్గ దర్శి మా వూరు ఆధ్యాత్మికత వెల్లి విరిసిన మాధుర్య సీమమాది అందుకే ”కృష్ణాజిల్లా వైభవం ”లో మా ఉయ్యూరు ది ”మాధుర్య పాత్ర ”. గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-17 -ఉయ్యూరు —
50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం లో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –
—