నా దారి తీరు -104
—
నా దారి తీరు -104
—
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42
మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి . కనుక విమర్శనా విశ్లేషణ వ్యాఖ్యానాలతో అగ్రభాగాన ఉన్న మల్లినాథుడు కవిగా కూడా సమున్నత స్థానం లో ఉన్నాడని తెలుస్తుంది ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే లభ్యమౌతున్నాయి .ఈ రెండిటిపై సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకొందాం
నా దారి తీరు -103
—
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41
—
షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్
49 NERS BONNIE E CONE
వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40
గొల్లపూడి
—
తత్ఫల త్వాత్ -తస్యాపి కదా సాధ్యత్వే వాదస్య -తత్వ నిర్ణేయ ఫాలేత్వాత్ ”(తార్కిక రక్ష కారిక పై సూరి వ్యాఖ్య )
షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి
—
This gallery contains 7 photos.
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38
నా దారి తీరు -102
—
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36
—
నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2
డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు ప్రసాద్ ,తెలుగుమేస్టర్ శర్మ హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా రామమోహనరావు గారి జమానాలోవాళ్ళు . వాళ్ళదగ్గర అతివినయంగా ఉండటమే తప్ప బోధనలో మెళకువలు లేవు .మరో తమాషా నేను గమనించింది సాయంకాలానికి రామ మోహన రావు గారబ్బాయి దగ్గరకు స్కూల్ లోని అన్నివిషయాలూ చేరేసే వాళ్ళు .వీళ్ళనే గడప పూజారులు అనేవాళ్ళం గుమాస్తా ఉయ్యూరయ్య నిఖార్సైన మనిషి .లెక్క అంతా పకడ్బందీ స్కూల్ అకౌంట్ డబ్బులు కూడా అతని చేతికే ఇచ్చాను .ఎక్కడా తేడా రాదు .అంత నమ్మకం .గొల్లలు అతనే రిటైరయ్యాక మేడూరు సర్పంచ్ గా ఎన్నికై మంచి పనులు చేశాడు . అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఇరుకు గదిలో నేనున్నట్లు ఫీలయ్యాను . నాకు స్వతంత్రం గా ఉండి అన్నిపనులు సమర్ధంగా చేయటం ఇప్పటిదాకా అలవాటు .ఇక్కడ సాంస్కృతిక విషయాలేమిటో టీచర్లకూ పిల్లలకూ తెలియదు .ఇంతవరకు అల్లాంటివి ఇక్కడ జరగ లేదని చెప్పేవారు . అయినా నా పద్ధతిలో వీటిని అధిగమించి నడపాలని నిర్ణయానికొచ్చాను .ముందుగా ప్రతిరెండవ బుధవారం మిగతా చోట్ల చేసినట్లే సాయంత్రం చివరి పిరియడ్ లో వాటిని క్లాస్ టీచర్ల చేత నిర్వహించే పధ్ధతి మొదలుపెట్టాను వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు గా వీటిని చేయించాను సైన్స్ క్లబ్ అంటే కూడా వీళ్లకు తెలీదు సైన్స్ మేష్టర్లతో దాన్ని ఏర్పాటు చేయించి సైన్స్ రూమ్ లో నెలకొక ప్రోగ్రామ్ చేయించాను .ప్రసిద్ధులైన సైన్టిస్ట్ ల జీవితాలను వారి పరిశోధనలను ఒకరిద్దరు విద్యార్థుల చేత సైన్స్ టీచర్ పర్య వేక్షణలో తయారు చేయించి మాట్లాడించాను .ఇవి విద్యార్థులలో బాగా క్లిక్ అయి నాపై విశ్వాసం కలిగించాయి ..అంతా బాగానే ఉంది అనిపించిన సమయం లో ఒక తమాషా జరిగింది .
—
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35
– |
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34
—
టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ
లో లైబ్రరీజర్నేల్ ఆ నవలను ”ఈ శతాబ్దపు ఉత్తమ నవల ”అని ఎన్నికద్వారా తేల్చింది ఇదిఒక రకం గా ఆమె జీవిత చరిత్రే .పూర్తి యదార్ధ సంఘటనల తోనే రాసింది అందుకే జీవత్వం తో తొణికిసలాడింది
సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
నా దారి తీరు -100
మేడూరు లో ఉద్యోగం
2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .
సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .
తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది
లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది
సత్యనారాయణ పురం లో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .
అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .
మేడూరు స్కూల్ విశేషాలు
ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్ గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .
సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్ ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం
మళ్ళీ ప్రయాణం తిప్పలు
మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .
సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .
శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు
మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33
— ఏకావాలి లో అలంకార చర్చ
వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )
—
This gallery contains 13 photos.
1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు భూషణం ఫోన్ చేసి అక్కడ నేను పని చేసినప్పుడు దివాకర్లవారు రాసిన ”భారతావతరణం ”పద్యనాటిక నేను వేయించటం అందులో తానూ నన్నయ పాత్ర వేయటం జ్ఞాపకం చేశాడు .నిజమే అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎస్ సి వాళ్ళు .వాళ్లకు మాటలు పలకటమే రాదు కానీ సాహసంగా తీసుకొని వాళ్ళతో పద్యాలు ప్రాక్టీస్ చేయించి వేయించాను చాలా చక్కగా చెప్పారు .అదొక సాహసం . మల్లినాథ సూరి 29 వ ఎపిసోడ్ రాసి సుమారు 5 నెలలయింది .మళ్ళీ ఇవాళ మొదలుపెట్టి 30 వ ఎపిసోడ్ రాశాను .
—
This gallery contains 7 photos.
ఘోరకలి -5(చివరిభాగం )
–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్ మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్ డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్ గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్ బెర్గ్ అప్టాన్ సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్ మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు
ఘోరకలి -4
హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..
మాలీ లోని హన్నాకు కు చెందిన ఎత్నో బయాలజిస్ట్ ఇసాబెల్లా కాకియా యు యాంగ్ లోనా అబ్బట్ హవాయిలో సైన్స్ లో పి .హెచ్ డి .పొందిన ప్రధమ మహిళ. చైనా ,హవాయిన్ మిశ్రమ జాతికి చెందిన ఈమె హవాయియన్ ఆల్గె ను తన హవాయియన్ తల్లి వలన విని గుర్తించి పరిశోధన చేసింది . అకాడెమిక్ రికార్డ్ ప్రకారం ఆమె ఫసిఫిక్ ఆల్గె పై ఎక్స్పర్ట్ .రెడ్ ఆల్గె అని పిలువబడే కుటుంబానికి చెందిన రోడో మేలాషియా తో సహా 200 స్పెసీస్ ను ఇసబెల్లా కనిపెట్టి రికార్డ్ సృష్టించింది . ఆమె కృషిని గుర్తించి రోడోమెలాషియా ను ´´ఆబ్బొట్టెల్లా ´అని ఆమె పేరు తో గౌరవంగా పిలుస్తున్నారు . తన ప్రతిభా సర్వస్వ0 తో ఆమె ఎనిమిది గ్రంధాలు రాసింది . కాలిఫోర్నియా మాంటెరి పెనిన్సుల కు చెందిన మెరైన్ ఆల్గె గ్రంధానికి సంపాదకత్వం వహించింది . సుమారు 150 రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది .
ఘోరకలి -3
—
ఘోరకలి -2
—
This gallery contains 8 photos.
ఘోరకలి -1 ,
—
వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32
వైకింగ్ శకం -3
1014 లో శ్వీన్ ఫోర్క్ బియర్డ్ లంకా షైర్ లోని గెయిన్స్ బర్గ్ లో ఫిబ్రవరి 3 చనిపోయాడు డెన్మార్క్ లో ఖననం చేశారు . ఏదెల్ రెడ్ నురాజుగా పిలవగాశ్వీన్ కొడుకు క్నాట్ ది గ్రేట్ ను తరిమికొట్టి సోదరుడు హరాల్డ్ -2 ను డెన్మార్క్ రాజును చేశాడు క్లాన్ టార్ఫ్ బ్రియాన్ బోరు ,హై కింగ్ ఆఫ్ ఐర్లాండ్ యుద్ధాలలో లీన్ స్టర్ రాజును డబ్లిన్ రాజు సిల్క్ బియర్డ్ ఎరల్ ఆఫ్ ఆర్కెని ఐలాండ్స్ లాడ్ వేసేం ల సాయం తో ఓడించి చివరికి తానె చనిపోయాడు . 1015 లో క్నాట్ ఇంగ్లాన్డ్ కు 200 షిప్పులతో 10 వేల సైన్యం తో తిరిగివచ్చాడు . 1016 ఆషింగ్టన్ యుద్ధం లో ఏదెలా రెడ్ సాయాన్ని దుంప నాశనం చేసి థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న ఇంగ్లాన్డ్ ను స్వాధీనం చేసుకొని దేనిలా వెళ్ళాడు .ఏదేరాల్డ్ చనిపోగా పాత సెయింట్ పీటర్ పాల్ కాధెడ్రల్ లో ఉంచారు . 1017లో క్నాట్ ది గ్రేట్ ఇంగ్లాన్డ్ రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు .తర్వాత డెన్మార్క్ రాజు క్నాట్ తమ్ముడు హెరాల్డ్ చనిపోగా డెన్మార్క్ వచ్చేసి దానికీ రాజయ్యాడు . 1027 లో రోమ్ సందర్శించి రెండవ కాన్రాడ్ కారోనేషన్ కు హాజరయ్యాడు . 1028 లో క్నట్ ఇంగ్లాన్డ్ డెన్మార్క్ నార్వే లకు రాజుగా గుర్తింపు పొందాడు .అంటే విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి వైకింగ్ కింగ్ చక్రవర్తి అనిపించుకున్నాడు . 7ఏళ్ళు పాలించి 1035 లో చనిపోతే వెస్ట్ మినిష్టర్ కెదెడ్రల్ లో అంత్యక్రియలు జరిపారు .కొడుకు హెరాల్డ్ హేర్ ఫుట్ ఇంగ్లాన్డ్ రాజయి 1040లో చనిపోయాడు మూడవ కెనాట్ 10 42 వరకు రాజు నార్వే జార్చుకున్నాడు 1040లో ఆర్దాక్న్తట్ ఇంగ్లాన్డ్ రాజుగా హెరాల్డ్ మరణం తర్వాత అయ్యాడు . 1042 లో హెర్లాడ్ ది కన్ఫెస్సర్ రాజయ్యాడు నార్వే రాజుగా హరాల్డ్ హార్ డ్రాతా ఉన్నాడు ఇతనికజిన్ డెన్మార్క్ రాజై 1066 దాకా ఉన్నాడు డెన్మార్క్ రాజు హరాల్డ్ శ్వీన్ యేస్ట్రర్ సన్ 1074 దాకా రాజ్యమేలాడు . 1066 లో కన్ఫెస్సర్ చనిపోగా ఎడ్వార్డ్ భార్య తమ్ముడు గా డ్ విన్సన్ తాత్కాలిక రాజయ్యాడు .హరాల్డ్ హర్ డ్రాడా ఇంగ్లాన్డ్ పై దాడి చేసి ఓడిపోయాడు స్టామ్ఫోర్డ్ బ్రిడ్జ్ బాటిల్ లో చనిపోయాడు వైకింగ్ రాజు రోల్లో మునిముని మనవడు విలియం నార్మాండి ఇంగ్లాన్డ్ ను 7 వేల మంది సైన్యం తో ముట్టడించి హరాల్డ్ ను ఓడించి చంపి క్రిస్మస్ రోజున వెస్ట్ మినిష్టర్ అబ్బే లో ఇంగ్లాండ్ రాజయ్యాడు . 1069 లోనార్వే రాజు శ్వీన్ యేస్త్రిడ్సన్ తమ్ముడు ఆస్ బోరన్ ”యార్క్ ”అన్వేషణకు మద్దతిచ్చి విలియం కు వ్యతిరేకంగా పెద్ద సైన్యం తయారు చేయించాడు .కానీ అతని అన్వేషణ పూర్తికాలేదు 1094 లో చివరి డబ్లిన్ వైకింగ్ కింగ్ గాడ్ఫ్రెడ్ తొలగింపబడ్డాడు 1098లో నార్వే రాజు మాగ్నస్ బేర్ లెగ్స్ ఆర్కనీ హెబ్రీడ్స్ కు అన్వేషణకు వెళ్లి స్కాటిష్ రాజుచేత రికగ్నిషన్ పొందాడు . 1263 లో వెస్టర్న్ ఐల్స్ లో వైకింగులపాలనపై స్కాట్ ల తిరుగుబాటుకు ప్రతిగా వైకింగ్ రాజు నాలుగవ హాక్సన్ లార్గ్స్ లో యుద్ధం చేసి ఓడిపోయాడు .చరిత్రలో వైకింగ్ ల చివరి దండ యాత్ర ఇదే .దీనితో సుమారు 500 ఏళ్ళ వైకింగ్ శకం సమాప్తమైంది .
వైకింగ్ శకం -2
—
వైకింగు శకం
వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31
-4-జహ దజ హాత్సవర్యా – వారణేంద్రస్య దేశకాల విశిష్టహ సమాసోక్త్యాది
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30
‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3
ఏకావలి లో రసవిధానం -3
రస విధానం లో 2 వభాగం 23-12-16 న రాశాను .మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాను .
కావ్యాలలోరాముడు మొదలైన పాత్రలు కొద్ది గానే ఉన్నాయి .అవీ పూర్వకాలం పాత్రలు నటుడు ఈ పాత్రలను పోషించే టప్పుడు ఆ రస భావం అనుభావైకం కాదు అతని దృష్టి అంతా నటనపైనా వినోదం ఇవ్వటం పైనా డబ్బు సంపాదనపైనా కేంద్రీకరించి ఉంటుంది . రసభావన కలగాలంటే నటుడు ప్రేక్షక స్థానం లో ఉండాలి .మరి అప్పుడు రసం పరిధి ఏమిటి ?అప్పుడతను ప్రేక్షకులే పరిధి గా నిరూపిస్తాడు ‘’సామాజికానామితి ‘’.ప్రేక్షకులలో రసానందం కలుగుతుందా ?కాదన్నాడు .ప్రేక్షకుడికి తనకు అనుభావాలైన ప్రేమ మొదలైన వి వాసనా రూపం లో ఉంటాయి .అంటే ప్రేక్షకునిలో వాసనా రూపం లో ప్రేమ ,శృంగారం వంటికి శాశ్వత స్థాయి ఉంటుంది .ఈ స్థాయి ఆనందాన్నివ్వటం లో ఉన్న నిర్ణాయకాలలో అనేక తేడాలుంటాయి .ఈ తేడాలురసం కంటే భిన్నం కాకపొతే వాటి ఉనికికి సార్ధకమేమిటి ?దీనికి సమాధానం ‘’పానక రసన్యాయం .పానకం లో అనేకం కలిసిఉన్నా మొత్తం మీద దాని రుచి వేరుగా ఉంటుంది .అంటే అన్నీ కలిసి ఒక కొత్త అనుభవాన్ని స్తాయి .అందులోని పదార్ధ ప్రత్యేకతలన్నీ కరిగిపోతాయి . ‘’.ఇక్కడ కూడా అంతే .ప్రతిదీ కూడా రసం లాగానే అనుభూతమౌతుంది .కాని చివరికి వాటి సమాహార భావనఅలౌకిక ఆనందాన్నిస్తుంది ఆనందం ఎలాగో ఇదీ అలానే .’’చార్వ్య మాణాతైకప్రాణాఇతి -అనుభవైక జీవిత ఇత్యర్ధః ‘’దీనితో దాని అసాధారణ ,అసామాన్యమైన స్వభావం ఎలా స్థాపించ బడుతుంది ?దీన్ని ఊహించిన రచయిత రసం అంటే బ్రహ్మాను భూతి అన్నాడు ‘’బ్రహ్మాస్వాద సబ్రహ్మ చారీ-బ్రహ్మాస్వాదకల్ప ఇత్యర్ధః ‘’బ్రహ్మానందం శాశ్వతం గా ఉన్నప్పటికీ అంతరాయం లేని నిరంతర ధ్యానం వలన పొందగలుగుతారు అంతకు ముందు కాని ,ఆ ఆతర్వాత కాని అది ఉండదు. అలాగే రసం కూడా స్వయం ప్రకాశకం (సెల్ఫ్ లూమినస్ ).అదిసదా కట్టుబడి ఉండే ఆనంద సారం యొక్క స్వభావం .అది మానసిక గుణం .అది సూచన అనే ‘’వ్యాణీ జన ‘’తో కలిసి ఉంటుంది .జ్ఞానం మొదలైన వాటినుండి వేరు చేయబడి ఉండి వ్యక్తమౌతుంది అది స్వయం ప్రకాశకం గా దర్శన మిస్తుంది .ప్రాపంచిక ఆనందం ఇలా ఉండడు అయితే అసాధారణ అసామాన్య మైన రస స్వభావాన్ని ఎలా కాదనగలం ?రసం బ్రహ్మానందమే .బ్రహ్మానుభవాన్ని యోగ సాధన వలన సాధించ వచ్చు .ఇదే తేడా .ఇక్కడ సరైన విభావ ,అనుభావాదులవలన అనుభవించగలం .ఇదొక్కటే ఈ రెండిటికి ఉన్న తేడా -’’కిం చ బ్రహ్మానంద ఏవాయ మన్యత్ర యోగా గమ్యః-అత్ర తువిభావాదను సంధాను సంధానం గమ్య ఇతీయన్ ‘’
రసానుభవం అనేది సౌందర్య రసజ్నులందరి మనసుల కు సాక్షి .దీని వశీకరణ ఇంద్రియాతీతమైనది .దాని రహస్యాన్ని ఎవరూ విప్పి చెప్పలేరు నిరూపించలేరుకూడా ..అందుకే ఈ ఉద్దేశ్యం తోనే ‘’లోకోత్తర చమత్కారి ‘’అనే పదాన్ని ప్రయోగించాడు దీనిపై రూడేన్ బెర్గ్ చక్కని వివరణ ఇచ్చాడు దాన్ని ముందే మనం తెలుసుకొన్నాం .ప్రేమ మొదలైనవి విభావాలనుండి పుడతాయి అవి ఆలంబన కారణాలయి స్త్రీలలో విభావ నలను చంద్రుడు,కోకిల స్వరం మలయా మారుతం ,అందమైన ఉద్యానవనాలు మొదలైన ఉద్దీప కారణాల వలన అనుభలవుతాయి .విద్యాధరుడు మొదటి అధ్యాయం లోనే ధ్వని సిద్ధాంత సూచన చేశాడు .ధ్వన్యాలంకార కర్త ఆనంద వర్ధనుని సిద్ధాంతాన్ని మరో సారి సమర్ధించి చెప్పాడన్నమాట .ధ్వనిని వ్యతిరేకించేవారిని వ్యతిరేకించాడు విద్యాధరుడు .ఈ విషయం లో మల్లినాద సూరి వ్యాఖ్యానం చాలా సరళం సంక్షిప్తం వివాదాస్పదం .
దీని తర్వాత ఏకావలి లో అలంకారాలను గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—
వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం )
24-4-17 నుండి 30-4-17 వరకు
మూడు విందులు రెండు పూజల వారం .
శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది .ఏప్రిల్ వర్షాలు మేలో పూలు రావటానికి బాగా తోడ్పడతాయని భావం .మా అమ్మాయి విజ్జి ఉదయం 6-30 కే డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం లీవ్ పెట్టి ఒంటిగంటకు వచ్చి మమ్మల్ని గోసుకొండ అరుణ ఇంటికి భోజనానికి తీసుకు వెళ్ళింది వీళ్ళ కమ్యూనిటీలోనే ఆ చివర ఉంటారు .అప్పటికే ‘’మణిద్వీప’’పూజ పూర్తీ చేసి మా కోసం రెడీ గా ఉంది అరుణ ..మణిద్వీపపూజ ఇప్పటికి 8 వారాలుగా ప్రతి శుక్రవారంచేస్తూ ఆఖరి9 వ వారం ఇవాళ చేసి మాశ్రీమతికి వాయనం ఇవ్వాలని ఆమె సంకల్పం .దేవుడిగది చాలా బాగా ఉంది అమ్మవారి అలంకారం పూలతో శోభాయ మానంగా ఉంది .లలితా పరమేశ్వరీ అమ్మవారు మణి ద్వీపం లో ఉంటుందని మనకు తెలుసు .మణి ద్వీపేశ్వరి పై అస్తోత్తరం ఉంది అది ప్రతివారం చదివి పూజ చేస్తారు .32 శ్లోకాల మణి ద్వీప వర్ణన స్తోత్రం,మణిద్వీప స్తోత్రం ,పంచ దశీ మంత్రం 40 చరణాల ‘’లలితా చాలీసా ‘’ నిత్య పారాయణ శ్లోకం ,దీప ప్రార్ధన ,లలితా నవ విధ భక్తిమాలిక భక్తీ నీరాజనం మంగళ హారతి చదివి పూజ పూర్తీ చేస్తారు .మేము ఈ పూజను వినటం ఇదే మొదటి సారి .ఈ విషయాలన్నీ ఉన్న చిన్నపుస్తకాన్ని పెద్ద బాల శిక్ష సంకలన కర్త శ్రీ గాజుల సత్యనారాయణ ప్రచురించారు అ పుస్తకం మాకు ఇచ్చింది .దాన్ని బట్టే వివరం తెలిసింది .
‘’పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతలు మా ఇంటికి వచ్చారు ‘’అంటూ అరుణ పొంగిపోయింది మా శ్రీమతికి నాకూ పూజ చేసి నూతన వస్త్రాలు అందజేసి మా శ్రీమతికి వాయనమిచ్చింది . తర్వాత భోజనాలు .మా కోసం కారం ఉప్పు తగ్గించి ప్రత్యేకంగా చేసింది .టమేటా పప్పు వంకాయ కూర ,బీన్స్ కూర కొత్త ఆవకాయ ,చట్నీ పూర్ణపు బూరెలు ,గారెలు పాయసం ,పులిహోర ,కర్నాటక బేడల(పప్పు) చారు అనే రసం పెరుగు మాంగో సలాడ్ లతో కమ్మని భోజనం పెట్టింది .దగ్గర కూర్చుని అన్నీ అడిగి వడ్డించి కొసరి కొసరి తినిపించింది అరుణ అక్కడ సుమారు 15 మంది ఆడవాళ్ళు కూడా మాతో ఉన్నారు భోజనానికి .గురువారం ఉదయం మా ఇంటికొచ్చిన పద్మ అనే అమ్మాయి కబుర్లతో జోకులతో మంచి సందడి చేసింది .ఈ బాచ్ ని చూస్తే మా అమ్మాయికి ట్విన్స్ పుట్టినప్పుడు2005 లో మేము మిచిగాన్ లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న జ్యోతి ప్రీతీ బిందు మొదలైన వారంతా గుర్తుకొచ్చారు .అక్కడ వారానికొకరింట్లో భోజనాలు కబుర్లు సరదాలు పుట్టిన రోజు ,సీమంతం వేడుకలతో కాలం యిట్టె గడిచిపోయింది .అందరం అరుణ ఇంట్లో గ్రూప్ ఫోటో దిగాం ..మా అమ్మాయి అరుణకు చీర జాకెట్ పెట్టింది .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 -30 అయింది .సాయంత్రం స్వామి బ్రహ్మానంద సరస్వతి పై రాశా .రాత్రి యు ట్యూబ్ లో కామెడీ చూశాం .
ఈవారం లో ‘’హ్యూమరిస్త్స్ ‘’,బిగ్ జోక్స్ ,బైజాంటిన్ ఎంపైర్ ,ది నాజిహోలో కాస్ట్,చదివాను .దీనిపై రాయానిపిస్తోంది ఇవికాక ది వైకింగ్స్ ఇంట రెస్ట్ గా ఉంటె చదువుతున్నా ‘’.28 టు యాక్టర్ ప్లేస్ ‘’ డ్రైవింగ్ త్రూసౌది’’మొదలుపెట్టాకాని రుచించలేదు .
శనివారం మా ఇంట్లో శ్రీ శంకర జయంతి .మా అల్లుడి సంకల్పం అమ్మాయి సహకారం .ఉదయం 7 గంటలకే ఆవాహనతో ప్రారంభమైంది .రాంకీ తమ్ముడు ఇంకొక ఆయన వచ్చారు . ఉపనిషత్తులు ఆదిత్య హృదయం అరుణం చదివారు .తర్వాత ఒక 10 మంది వచ్చారు మధ్యాహ్నం 12 30 కు కేసరి ఉప్మా కాఫీ లతో ఫలహారం . తర్వాత నమక చమకాలు .మధ్యాహ్నం 3 కు ఒక 25 మంది అయ్యారు .అప్పటికే రాంకీ వగైరాలు వచ్చారు .ఒకాయన భజగోవిందం పై పది నిమిషాలు మాట్లాడాడు .తరువాత ఆడవాళ్ళు పాటలు పాడారు .మా అమ్మాయి చెప్పే అపర ఘ౦టసాల గారుపూర్వపు కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాలోని భక్తీ గీతం పాడారు .రాంకీ తమ్ముడిభార్య పద్మశ్రీ త్యాగ రాజక్రుతులు బహుకమ్మగా గానం చేసింది .ఇద్దరు పిల్లలూ బాగా పాడారు గాయత్రి అనే అమ్మాయి కూడా చక్కగా స్వర రాగ యుక్తంగా పాడింది ఈమెను ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’అన్నాను ..రాంకీ తమ్ముడు పంచాంగ శ్రవణం చేశారు సరైన హోమ్ వర్క్ చేయనట్లు అనిపించింది .మధ్యమధ్య నేను కొంత చెప్పా .తర్వాత శ్రీ శంకరాచార్యస్వామికి అస్టోత్తర పూజ జరిగింది. రాంకీ పురోహితునిగా ఉన్నాడు . చివరికి మధ్యప్రదేశ్ లోపుట్టి బొంబాయిలో పెరిగి అమెరికా చేరిన ఒక యోగా మాస్టర్ తేలికైన ఇంగ్లీష్ ,హిందీలలో యోగా గురించి డిమాన్ స్ట్రేషన్ లెసన్ చెప్పాడు అందరూ మెచ్చారు .కేరళ లోని 92 ఏళ్ళ స్త్రీ యోగాసనాలు చాలా సునాయాసంగా చేస్తున్న వీడియో క్లిప్పింగ్ చూపించాడు .అందరూ చప్పట్లు చరిచారు .తర్వాత మహా నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం తో కార్యక్రమం పూర్తి .నాలుగు మాటలు నన్ను మాట్లాడమని రాంకీ అడిగితె ‘’ఇండియాలో మేము మరచిపోతున్న శంకరాచార్య స్వామిని అమెరికాలో గుర్తుంచుకొని మా అమ్మాయి అల్లుడూ శ్రర్దగా ఉదయం 7-30 నుంచి సాయంత్రాం 6-30 వరకు నిర్వహించటం గొప్ప విషయమని వారిద్దరిని అభినందిస్తున్నానని ,కంచి పెద్ద స్వామి శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ‘’మైత్రీ భజతే ‘’అనే సంస్కృత గీతాన్ని రచిస్తే అంతర్జాతీయ సమితి యు యెన్ వో 50 వ వార్షికోత్సవం లో భారత రత్న ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గానం చేసిందని దానికి అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారని,సరస భారతి మార్చి 26 ఉగాది వేడుకలో ‘’వసుధైక కుటుంబం ‘’శీర్షికపై కవి సమ్మేళనం నిర్వ హించిందని దాన్ని పుస్తకంగా తెస్తున్నామని ,అప్పుడు జ్ఞాపికగా వసుధైక కుటుంబం చిత్రం పరమాచార్య ఫోటో, వారి మైత్రీ గీతం లో చివరిభాగం తో జ్ఞాపిక తయారు చేయించి అందరికీ ఇచ్చామని చెప్పి జ్ఞాపిక చూపించా . పద్మశ్రీ వెంటనే ఆ గీతాన్ని బహు శ్రావ్యంగా పాడింది. అందరూ అభినందించారు .కార్యక్రమం పూర్తి ఆయే సమయానికి 45 మందిఉన్నారు పొద్దున్న కొందరు వచ్చి వెళ్ళారు .’’రాలీ’’లో భగవద్రామానుజ జయంతి చేస్తున్నారని అక్కడ సినీ ,టీవీ గాయని శ్రీమతి ఉష సంగీత విభావరి ఉందని చాలా మంది ఇక్కడికి రాలేదు లేక పోతే మరో 15 మంది వచ్చి ఉండేవాళ్ళు ఉష అమెరికాలోనే ఉండి ప్రోగ్రాములున్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తుంది .ఉష అక్క ఉదయమే వచ్చి కాసేపు ఉండి వెళ్ళింది .
తర్వాత మా అమ్మాయి అందరికీ చేసిన వంట కాలతో కమ్మని విందు భోజనం-టమేటా పప్పు వంకాయ చిక్కుడు కాయ కూర ,ఆవకాయ పూరీలు ,బంగాళాదుంప కూరా ,కేసరి ,బూరెలు గారెలు ,పెరుగు పచ్చడి సాంబారు ,పెరుగన్నం .అందరూ సంతృప్తిగా భోజనం చేశారు .5 ఏళ్ళక్రితం పరిచయమైనా మంజుల .ప్రక్కి అరుణ చక్కగా పలకరించారు .
భోజనాలతర్వాతగాయత్రి తో అందరూ అడిగి పాటలు పాడించాం .ప్రక్కి వాళ్ళమ్మాయి అబ్బాయి కూడా పాడారు . గాయత్రికి ‘’షార్లెట్ కౌమార కోకిల ‘’అని సరదాగా బిరుదు ఇచ్చి ఆ పేరేరే రాసి శతకత్రయం సరసభారతి ఉగాది జ్ఞాపిక అంద జేశాం ..ఆ అమ్మాయి తలిదండ్రులు బాగాశ్రర్ధ తీసుకొని సంగీతం నేర్పిస్తుంటే ఆ అమ్మాయి సార్ధకం చేస్తోంది ఇక్కడ పాడిన వారందరి తలిదండ్రులను అభి నందిస్తున్నాను .సరదాగా నేను ఇద్దరు అరుణలలో ఒకమ్మాయిని ఇంటిపేరుతో ప్రక్కి అరుణ అని రెండో అమ్మాయి మాటల్లో చాలాసార్లు ‘’కరెక్ట్ అంకుల్ మీరుకరేక్ట్ ఆంటీ ‘’అనటం మూలంగా ఆ అమ్మాయిని ‘’కరెక్ట్ అరుణ ‘’అన్నా.అందరూ పగలబడినవ్వారు అరుణ ‘’కరెక్ట్ అంకుల్ ‘’అంది సరదాగా .ఇదంతా పూర్తి అయేసరికి రాత్రి 9 అయింది .పవన్ భార్య రాదఉదయం నుంచి విజ్జికి చాలా సహాయంగా ఉంది .చివరికి అన్నీ సర్ది పవన్ దంపతులు మా ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు .
పవన్ రెండో కూతురు మా రెండవ బావ గారు వేలూరి వివేకానంద్ గారి చెల్లెలు శాంతమ్మగారు లాగా నవ్వుతూ నవ్విస్తూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పుతూ అచ్చంగా ఆవిడ పోలికలే వచ్చినట్లు అనిపించింది .ఈ విషయం హైదరాబాద్ వెళ్ళినప్పుడు శాంతమ్మగారితో చెప్పాలని మా ఆవిడ తహ తహ లాడుతోంది .తాత గారి చెల్లెలి అంటే మేనత్త పోలిక అన్నమాట .
కొస ముక్క -తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధననాడు ఆయనకూ శివునికి అభిషేకం చేస్తారు .శంకర జయంతి నాడు కూడా శంకరా చార్యులు అపర శంకరులే కనుక ఆయనకు మహన్యాసం తో అభిషేకం చేస్తే బాగుంటుంది .వ్యాస మహర్షి వేద వాజ్మయాన్ని పురాణ ఇతిహాసాలను మనకు వరం గా ప్రసాదించారు .శ్రీ శంకర భగవత్పాదులు ప్రస్తానత్రయానికి వ్యాఖ్యానం రాసి జ్ఞానానికి మార్గ౦ సుగమం చేశారు. ఇది ఒక స్థాయి ఉన్నవారికే పనికొస్తుంది .సామాన్యులు తరించటానికి మార్గం వారు రాసిన స్తోత్రాలు ,శివానంద సౌందర్య లహరి మొదలైనవి అందులో వేద వేదాంత సారం అంతా నిక్షిప్తం చేశారు . సంస్కృతాన్ని సామాన్య జనం స్థాయికి స్తోత్రాల ద్వారాతెచ్చి తరుణోపాయం చూపారు .కనుక జయంతి నాడు కనీసం రెండు గంటలు శివానంద సౌందర్య లహరి ,స్తోత్రాలను విడివిడిగా సామూహికంగా గానం చేస్తేనే ఆయన ఋణం తీరుతుంది .అప్పుడే గొప్ప అనుభూతి కలుగుతుంది. సౌందర్య లహరి అందరికీ అందుబాటు లో ఉండటం కష్టం .శివానంద లహరి చాలా సులభం అందరూ నేర్చుకొని పాడచ్చు అలాగే స్తోత్రాలు కూడా సామూహికంగా పాడాలి .అప్పుడే దాని ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది .
మరో విషయం శంకర జయంతినాడు సంస్కృతం లో కృషి చేసినవారికి కాని ,స్తోత్ర గానం చేసినవారికి కాని సంగీత నృత్యాలలో రాణించినవారికి కాని ప్రోత్సాహక బహుమతులు అందిస్తే సార్ధకమౌతుంది ..దేశం కాని దేశం లో చేస్తున్నప్పుడు ఈ రెండూ బాగా రాణిస్తాయి .కనుక ఈ సారి శంకర జయంతికి ఈ ఆలోచన చేస్తే బాగుంటుందని నా భావన .ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పవచ్చు .దిగితే కానీ లోతు తెలియదని నాకు తెలుసు .అందుకే సరసభారతి గాయత్రికి శ్రీ సువర్చలాన్జనేయ శతక త్రయం, ఉగాది జ్ఞాపిక అందజేసి మార్గం చూపించింది .
రాత్రి భారవి తీసిన శంకరాచార్య తెలుగు సినిమా చూశాం యు ట్యూబ్ లో .పైత్యం ఎక్కువ శ్రీహరిని మోహన బాబు ను ,సుమన్ ను భరణి నిఎక్కడపడితే అక్కడ చూపించి పలచన చేశాడు . హు౦దాతనం ఉత్క్రు స్టతలోపించి చౌకబారు సినిమాగా గ్రాఫిక్ మయం గా మారింది. నిద్ర పోయే సరికి రాత్రి 12 .
30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి .వీలు ప్రకారం శనివారం చేశారు మా వాళ్ళు . నేను ఉదయం 6 -30 కే లేచి కాలకృత్యాలు పూర్తీ చేసి ఉదయం 7-30 కు పూజలో కూర్చున్నా .మామూలు నిత్య పూజ చేసి శ౦కరా చార్య అస్తోత్తరం శివ అస్తోత్తరం సహస్రం ,లలితా సహస్రం దక్షిణా మూర్తి దత్త్రేయ అస్తోత్తరాలతో పూజ చేసి శివానంద లహరి సౌందర్య లహరి చదివి ,మహాన్యాసం తో నమక చమకాలు దశ శాంతి సామ్రాజ్య పట్టాభి షేకం తో ఏక రుద్రం చేసి(చదివి) , బిల్వ అష్టోత్తర౦ తో పూర్తీ చేసే సరికి ఉదయం 10-30 అయింది అంటే మూడు గంటలు పట్టింది ధన్యుడను అనుకొన్నా ..తర్వాత టిఫిన్ .
వీక్లీ అమెరికా 4 మొదలు పెట్టి కొంత రాశా .కాలి ఫోర్నియా నుంచి మేనల్లుడు శాస్త్రి భార్య విజయ లక్ష్మి కొడుకు కృష్ణ ఫోన్ చేసి మాట్లాడారు . కృష్ణకు సాన్ ఫ్రాసిస్కో లో మంచి కొత్త ఉద్యోగం వచ్చిందని మే 15 చేరుతాడని ,విజయలక్ష్మి అమ్మగారు మే 7 న కొడుకుతో ఇండియా నుండి అమెరికా వస్తున్నారని ,మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండేట్లు రమ్మని కోరారు .సరే అన్నాం. మా ప్రయాణం మా చేతుల్లో లేదుకదా .
ఈ వారమంతా బాహుబలి హడావిడి ఇండియాలో టికెట్ వెయ్యి రూపాయలు అమెరికాలో 42 డాలర్లని అంటున్నారు .అయినా కొని చూస్తూనే ఉన్నారట .80 కోట్లు కూడా ఉండని తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి 450కోట్ల స్థాయికి తెచ్చి బాలీ వుడ్ ను మించి అతనిపై నమ్మకం తో నిర్మాతలు అంత డబ్బూ పెట్టు బడి పెట్టారు . వాళ్ళ పంట పండినదని కాసులవర్షం కురుస్తోందని మీడియా కోడై కూస్తోంది .రాజమౌళి తీసిన్న మగ ధీరకాని బాహు బలి 1 కాని నేను చూడలేదు ఆ సీన్లు ఏదైనా చానల్ లో వచ్చిన స్కిప్ చేస్తా . సినిమా హృదయాన్ని కదిలించాలి కాని గ్రాఫిక్స్ కాదు
విజ్జి ఉదయం 9-30 కు తెలుగు క్లాసు నిర్వహించి మధ్యాహ్నం 12 కు ఆఫీస్ కు వెళ్ళింది .రాత్రి 8 కి వచ్చింది .కాసేపు ఫ్యాన్ బకెట్ చూశా .అయ్యర్ సంస్కృత శ౦కరాచార్య కాసేపు చూశా .1970 దశకం లో తమిళ నుంచో మలయాళం నుంచో తెలుగులోకి డబ్బింగ్ అయిన ఆది శంకరాచార్య సినిమా బాగా ఆడింది అందరికీ నచ్చింది అద్భుతమ నిపించింది అది యెక్కదైనా దొరుకుతుందేమోనని యు ట్యూబ్ లో వెతికితే కనపడలేదు .ఇక ఈ వారానికి స్వస్తి .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 – కాంప్ -షార్లెట్ -అమెరికా
వీక్లీ అమెరికా -4 –1
24-4-17 నుండి 30-4-17 వరకు
మూడు విందులు రెండు పూజల వారం .
24 వ తేది సోమవారం ఇంకా బెడ్ మీద ఉండగానే సెల్ మోగింది .నిద్రలో ఎత్తా.విశాఖ నుంచి స్వామిగారట మెయిల్ రాశాను జవాబు లేదని ఫిర్యాదు .తెలివి తెచ్చుకొని అమెరికాలో ఉన్నా తడిసి మోపెడవుతుంది అని కట్టేశా అయినా 30 రూపాయలు బొక్క పొద్దున్నే .అలాగే ఇక్కడికి వచ్చిన 7 వ తేది వాషింగ్టన్ నుంచి కారులో వస్తుంటే రావి శాస్త్రిగారి అబ్బాయి ప్రసాద్ గారు ఫోన్ చేశారు .అప్పటికి రోమింగ్ విషయం గుర్తులేక కాసేపు వాయి౦చామ్ .మా అమ్మాయి అరుస్తూనేఉంది. ఉండమని ఆపేశా .90 రూపాయలు తోసింది .అప్పటినుంచి మ్యూట్ లో పెడుతున్నా సెల్ .రెండు రోజులుగా వర్షం పడుతోంది . శ్రీ గండికోట సుబ్బారావు ,సోమలత గుర్తించినవైద్య భైరవ దత్త లపై నెట్ లో రాశా ..ఇల్లంతా ఇద్దరు ఆడవాళ్ళు బహుశా మెక్సికన్లు అన్నీ సర్ది క్లీన్ చేశారు .
హైదరాబాద్ లో జ్యోతి శ్శాస్త్ర వేత్త ,పంచాంగ కర్త శ్రీ అడుసుమిల్లి (బ్రాహ్మణుల ఇంటిపేరు కమ్మవారింటి పేరుకాదు )లీలాప్రసాద్ గారబ్బాయి రాంకీ ,భార్య ఉష లు అయిదేళ్ళ క్రితం వచ్చినప్పుడే బాగా పరిచయం .వాళ్ళ ఇంట్లో ఇవాళ రాత్రి సాయి భజనకు పిలిస్తే మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 7-30 కు బయల్దేరి 8 కి చేరాం .సుమారు 50 మంది వచ్చారు . రాంకీ ఉషా దంపతులకు శతకత్రయం ఇచ్చాము ఆతను’’ వేద మాల ‘’అనే సంస్కృత శ్లోకాల పుస్తకం ఇచ్చాడు తర్వాత భోజనాలు .మూడు స్వీట్లు రెండుహాట్లు రెండుకూరలు పప్పు అప్పడం సాంబారు ,పెరుగు ,పుచ్చముక్కలు వగైరా లతో భోజనం .అన్నీ బాగానే ఉన్నాయి .రాంకీ తమ్ముడు భార్య ఇక్కడే ఉంటున్నారు .ఆమె పద్మశ్రీ సంగీతం బాగా పాడింది. మా మనవళ్ళు ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీత గురువు .అక్కడ ఒక డాన్స్ టీచర్ పరిచయమైంది .అలాగే పవన్ డోమేనికన్ రిపబ్లిక్ కు చెందిన ఆవిడను పరిచయం చేశాడు ఆవిడను ఆరాధన రోజూ చూశా .ఇప్పుడు మాట్లాడా .ఆమె అక్కడ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ వచ్చినా వదిలేసి ఇక్కడ కొడుకుతో ఉంటోంది .మన సంప్రదాయాలు తెలుసు .ఉష బొట్టుపెడితే చక్కగా పెట్టి౦చు కోన్నది .పవన్ చెబితే ఆవిడపై నెట్ లో వ్యాసం రాద్దామని అనుకొన్నాను .ఆవిడకు నా మెయిల్ ఐడి ఇక్కడి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమె గురించి విషయాలు మెయిల్ చేయమన్నాను .అందగానే తెలుగులో రాస్తానని చెప్పా. .ఈ రోజు వరకు ఆమె నుండి విషయం రాలేదు .ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిఅయింది
మంగళవారం మధ్యాహ్నం మాంచి నిద్రలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు విజయ వాడ నుంచి నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు చదివిన భూషణం బాబు వాట్సాఫ్ లో రెండు సార్లు ప్రయత్నిస్తే నేను ఎత్తలేదు .మూడో సారీ చేస్తే అప్పుడు మెసేజ్ లో తాను స్టూడెంట్ అని ఉంటె నేనే ఫోన్ చేశా .దర్వాజా అయ్యాడు పాపం ఆనందం పట్టలేక .చాలా విషయాలు మాట్లాడుకున్నాం అతనిప్రక్కనే సురేష్ అనే అదే బాచి కుర్రాడుకూడా మాట్లాడాడు. అడ్డాడ వదిలి సుమారు 20 ఏళ్ళు అయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఈ బాచ్ వాల్లందరూ కలిసి అక్టోబర్ లో నేను ఇండియా వచ్చినతర్వాత ఒక గెట్ టు గెదర్ పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు .వీళ్ళతో పాటే 12 ఏళ్ళుగా ఇక్కడున్న పావని అనే అమ్మాయి దుబాయ్ లో ఉన్న ఆనంద్ కూడా ఇదివరకే మాట్లాడారు .నిద్రపట్టక మైనేనిగారికి వాట్సప్ లో ప్రయత్నిస్తే దొరక్క పొతే మెయిల్ పెట్టాను .తర్వాత ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .తర్వాత డా. యెన్ ఇన్నయ్యగారు ఫోన్ చేసి మాట్లాడుతూ చిత్రకారులు శ్రీ ఎస్వి రామారావు గారు చికాగో వచ్చి వారమయిందని తెలుగు విద్యార్ధి పత్రికకు ఆర్టికల్ రాయమంటే రాశానని చెప్పారు ..బైజాంటిన్ సామ్రాజ్యం చదవటం మొదలుపెట్టి దాని నాగరకతపై ఒక వ్యాసం రాశాను గీర్వాణ౦ లో 12 5 వరకు లాగాను .
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాద్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు .విశ్వనాధ ,మొల్ల, వెంగమాంబ పోస్తేజ్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది. రాత్రి 12 వరకు నిద్ర పట్టలేదు
బుధవారం ఎండ బాగానే వచ్చింది రెండుపూటలా వాకింగ్ కు వెళ్ళా .ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో బి జెపి ‘’ఆప్’’ను వాళ్ళ ‘’చీపిరి ‘’తోనే తుడిచేసి 18 2 స్థానాలు 3 మునిసిపాల్తీలు గెల్చింది రాత్రి యు ట్యూబ్ లో క్రిష్ సినిమా ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’చూశాం .పేరుకీ సినిమాకు లంకె లేదు సీన్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు తీసి అతికించినట్లు అనిపించింది నయనతార ఎందుకున్నదో ఎవరికీ తెలీదు .దగ్గుబాటి రాణా బానే చేశాడు టార్జాన్ సినిమాలకు బ్రహ్మాండంగా పనికోస్తాడని పించింది .మణిశర్మ సంగీతం సిరివెన్నెల పాటలూ వినసొంపు .పిక్చరై జేషన్ బాగుంది సాయంత్రం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు అంటే కూతురు వేదవల్లి కొడుకు వేలూరి హరి ఫోన్ చేశాడు భార్య కూడా మాట్లాడింది .
గురువారం గీర్వాణం 13 5 వరకు దేకా .రెండుపూటలా నడక .స్వామి రామా పుస్తకం ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’పూర్తి చేసి హిమాలయ యోగులపై రాశా .విజ్జి వాళ్ళ ఇంటి ప్రక్క రవి గాయత్రి పలకరించి మాట్లాడారు రవి తలిదండ్రులు బుధవారం వస్తారట ఇండియా నుంచి
మధ్యాహ్నం విజ్జి స్నేహితురాలు వీటూరి పద్మ వచ్చి పలకరించింది .తర్వాత గోసుకొండ అరుణ కూడా వచ్చి శుక్రవారం వాళ్ళ ఇంట్లో అమ్మవారి మణి ద్వీప పూజ ఉందని తాంబూలాని భోజనానికి రమ్మని పిలిచింది .నేనెందుకు ‘’పోతు పేరంటాలు ‘’లాగా అనిపించింది కాని అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్ళాలి అనుకొన్నా .రాత్రి ఏమీ తోచక ‘’ఫ్యన్ బకెట్ ‘’చూశా౦ .ఒక జోకు మురికిదే అయినా బాగుంది -అది చెప్పకపోతే నా కడుపుబ్బరం తగ్గదు .ఒక భార్యా భర్తా తగువులాడుకొని విడాకులిప్పించమని పోలీస్ స్టేషన్ కొచ్చి సబిన్స్పెక్టర్ను . అడుగుతారు .సరేనని ఆమె దగ్గర లక్ష రూపాయలు కాష్ ఉందని సగం భర్త కిస్తానని అంది ఒకే ఇంటిలో వంటిల్లు భార్యకు బెడ్ రూమ్ భర్తకు పంచాడు .ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలని సమస్య .ఎస్ ఐ నాలుగో సంతానం కన్నాక విడాకుల సంగతి చూద్దామన్నాడు .భార్య ‘’ఈ యనపై నమ్మకం పెట్టుకొంటే ఆ ముగ్గురూ కూడా పుట్టేవాళ్ళు కాదు ‘’అని గబుక్కున నోరు నొక్కు కుంది. అవాక్కవటం భర్త ,ఎస్ ఐ ల వంతు అయింది .పనిలో పని మరోకుళ్ళు జోకూ చెప్పకపోతే ఆగలేదు .బిగ్ జోక్స్ అనే పుస్తకం చదువుతున్నా .అందులో రాజకీయ నాయకుల మీద ఏదో కల్పిత జోకులు చాలా ఉన్నాయి అందులో ఒకటి చదివి నవ్వు ఆపుకోలేక పోయా . అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇంగ్లాండ్ వెళ్ళాడట. రాణి ఆరుగుర్రాల బండీలో ఆయన్ను రాజ సౌధానికి తీసుకు వస్తోందట .అందులో ఒక గుర్రం కొంత దూరం వెళ్లేసరికిడామ్మని పెద్ద శబ్దం తో పిత్తిందిట .పిచ్చకంపుట .ఇద్దరూ అవాక్కయి ‘’పిత్తినన ముత్తయిదుల్లా ముక్కు మీద కర్చీఫ్ పెట్టుకొని భరి.స్తున్నారట .కాసేపయ్యాక రాణి ఇకమర్యాదగా ఉండదని’’మిస్టర్ ప్రెసిడెంట్ ! మహా రాణీ అయినా కొన్ని విషయాలు ఆవిడ చేతుల్లో ఉండవు ‘’అన్నదట .అప్పుడు ఒబామా కూడా నవ్వుతూ ‘’ఇప్పటిదాకా ఆశబ్దం గుర్రానిదనుకోన్నాను మీదా ?’’అన్నాడట ఆశ్చర్యంగా .ఆ పుస్తకం చదివితే జోకులు ఎలా పుట్టాయో మొదటి అధ్యాయం లో రాస్తూ ఇలాంటి కుళ్ళు జోకులే ముందు పుట్టాయని అన్నాడు రచయిత .కొన్ని జోకులు తరువాత రాస్తా. ఇప్పటికే వాసన భరించ లేక పోతున్నారేమో ?
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
29-4-17 శనివారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో చక్కని సంగీతస్వరాలతో భక్తి కీర్తనలు గానం చేసిన సంగీతం టీచర్ శ్రీమతి పద్మశ్రీ ,గారికి ”షార్లెట్ స్కై లార్క్ ”అనే బిరుదు ను ,కుమారి గాయత్రికి ”షార్లెట్ కౌమార కోకిల ”బిరుదాన్నీ సరదాగా అందరి సమక్షం లో ఇచ్చి గాయత్రికి సరసభారతి పురస్కారం గా ఉగాది జ్ఞాపిక ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతక త్రయం బహూకరించిన ఫోటోలు
కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు
ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను సంసార నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని , ఆనంద మయుడవైన నువ్వు పరకాయ ప్రవేశం చేశానని ,నికృష్ట జీవితం గడుపుతున్నానని ఎందుకు అనుకున్నావు ?నిజానికి చావు లేదు ,పుట్టుక లేదు చావటానికి ఎవరూ పుట్టటానికి చావటానికి ఉండరు .అసలు అలాంటిదేమీ లేదు .మరి ఉన్నదేమిటి అని అనుమానం వస్తుంది .ఆది అంతం లేని అద్వైతమైన బంధనం లేని సర్వ స్వతంత్రమైన ఏక ఆనంద సత్య చిదానందమే .మరి ఈ బాధలూ అవి ఎందుక౦ టే అద్వైత శక్తిని పూర్తిగా సరిగా అర్ధం చేసుకోకపోవటం వలన .మాయా మొహం వలన .అది ఎందుకు ఏర్పడుతుంది ?అజ్ఞానం అవిద్యవలన అలా అనిపిస్తుంది .సరే అజ్ఞానం అంటే ?శరీరం నేను అనే భావాన్ని కలిగిస్తుంది దానినే జీవాత్మ అనుకొంటుంది .ఈ జీవాత్మ ఈ కనిపించేది అంతా నిజమని తానేఅన్నీ చేస్తున్నానిఅనుకుని సుఖ దుఖాలు పొందుతాడు .అదికావాలి ఇదికావాలని ఆరాట పడతాడు .అంతేకాని తనను తానూ తెలుసుకోడు .తన స్వీయజ్ఞానాన్ని ఉపయోగించడు .’’నేనెవరు ? ఈ ప్రపంచం ఏమిటి ’’అని ప్రశ్నించుకోడు .కనుక సంసార లంపటం లో పడి స్వస్వరూపాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మర్చిపోతాడు ఇదే అజ్ఞానం
శాస్త్రాలన్నీ మాయ వలననే సంసారం ప్రపంచం ఏర్పడుతున్నాయని అంటారు కదా మరి అజ్ఞానం వలన అంటారెందుకు ?ఈ రెండిటిని ఎలా సమన్వయించాలి ?మంచి ప్రశ్నే ఇది అజ్ఞానికి అనేక పేర్లున్నాయి అవే మాయ ,ప్రధాన ,అవ్యక్త ,అవిద్య ,ప్రకృతి చీకటి మొదలైనవి .అజ్ఞానం వలనననే సంసారం ఏర్పడుతుంది .అజ్ఞానం రెండు విధాలుగా ఆవరణ విక్షేపణ లా పని చేస్తుంది ఆవరణ లో రెండురకాలు -ఇదికాదు అనేది ,అది ప్రకాశించదుఅని చెప్పేవి .మరి వీటినుండి దూరమై అసలు స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి ?గురువులవద్ద శాస్త్రాలు చదివి అర్ధం చేసుకొని .అప్పటికీ అద్వైత భావన అర్ధం కాకపొతే సత్యం ప్రకాశించడు అనిపిస్తుంది .దీనివలన కొంత జ్ఞానం కలిగి ఇంకా భ్రమలోనే ఉండటం జరుగుతుంది .ఇదే ఆవరణలో రెండవ దశ .
విక్షేపం అంటే ?తాను అద్వైత సచ్చిదానంద స్వరూపం అయినా తనను శరీరిగా భావి౦చటం వాడు వీడు అనుకోవటం అన్నీ తానే చేస్తున్నట్లు చెప్పుకోవటం ను విక్షేపం అంటారు .ఇక్కడ అద్వైత సత్యం విక్షేపం లో చుట్టబడి ఉంటుంది . దీనినే అధ్యారోపణ౦ సూపర్ ఇంపోజిషన్ అంటారు .దీనిభావమేమి తిరుమలేశ ?తాడు పాముగా భావించటం స్తంభాన్ని దొంగగా భావించటం ఎండమావి ని నీరుగా అనుకోవటం లాంటిది .అసలు వస్తువును వేరొకటి అని భ్రమించటమే అధ్యారోపణ. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే అద్వైత సచిదానంద పరమాత్మ సత్యమైనది .దీనిపై ప్రపంచం లోని జ్ఞాన అజ్ఞాన విషయాలు వస్తువులు విక్షేపిస్తాయి .ఇది నిజం కాని భావన -అన్ రియల్ ఫినామిన .అలా అయితే అద్వైతం కానిది ఏది ఎవరు విక్షేపం కలిగిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది .సమాధానం మాయ .మాయ అంటే బ్రహ్మ గురించి తెలియకపోవటం
సృష్టికి ముందు లయం తరవాత ప్రపంచం లేదు అంటే ఏది ఉన్నట్లు ? సజాతీయ ,విజాతీయ ,స్వగత భేదాలు లేని ఆధార భూతమైన ది మాత్రమె ఉంది . అదే సత్యజ్ఞానమన0తమ్ బ్రహ్మ .దాన్ని తెలియటం యెట్లా ?వేదం ఏం చెప్పిందంటే -సృష్టికి పూర్వం శుద్ధ ఆత్మ మాత్రమే ఉన్నది .యోగ వాశిస్టం వలన కూడా అర్ధం చేసుకోవచ్చు .కొంచెం వివరంగా చెప్పాలంటే -ప్రళయం లో ఏక శుద్ధాత్మ తప్ప అంతా వెనక్కి తీసుకోబడుతుంది -విత్ డ్రాన్..శుద్ధాత్మ కదలదు మాట్లాడదుఆలోచించదు .కా౦తిచీకటికాని ఉండవు అయినా పరిపూర్ణంగా అవాచ్యం గ అంటే చెప్పటానికి వీలులేనిదిగా శూన్యం కానిదిగా ఉంటుంది .అలాంటి అద్వైత స్థితిలో సృష్టి ఎలా జరిగింది ?అంటే మాయ వలన .దానితో అనేక రూపాలు పేర్లు వచ్చాయి .ఈ మాయ మనసుగా మారి అన్నీ సృష్టిస్తుంది .ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా ?శ్రీరాముడికి వశిష్టుడు చెప్పాడు .ఎలా ? బ్రహ్మ౦ శక్తి అనంతం .అ శక్తులు మార్పు చెంది అన్నీ ఏర్పడతాయి . బ్రహ్మానికున్న విశేష శక్తు లేమిటి?జ్ఞానులలో జగృతికలిగించటం ,ఆకాశగమనం భూమిని ఘనంగా చేయటం ,నీటికి ద్రవత్వం ,అగ్నికి వేడి ఆకాశం లో శూన్యం ,మృతజీవులను కుళ్లి౦ప జేయటం ,మొదలైనవి దాని అనంత శక్తులో కొన్నిమాత్రమే ఈ లక్షణాలన్నీ వాటిలో అంతర్గతంగా ఉంటాయి . బ్రహ్మ౦ వలన చైతన్యమౌతాయి . అద్వైత బ్రహ్మం లో ఇవన్నీ పైకి కనిపించకుండా లోపలే ఉండి నెమలి పురివిప్పినప్పుడు కనిపించే వివిధ రంగుల్లా విత్తనం లో దాగిన వృక్షంలా గుడ్డులోని పక్షిలా బయట పడతాయి .
బానే ఉంది ఇన్ని శక్తులు బ్రహ్మం లొ అంతర్గతంగా ఉంటె అన్నీ ఒక్కసారే ఎందుకు బయట పడవు అని అనుమానం రావచ్చు . భూమిమట్టిలో అనేక రకాల విత్తనాలు కాలాన్ని బట్టి ప్రదేశాన్నిబట్టి అనుకూల పరిస్తితులబట్టి ఎలా మొలకెత్తి వృద్ధి చెందుతాయో ఇక్కడా అంతే.బ్రహ్మం మాయ ను మనసుగా మార్చటం తో దాని శక్తులన్నీ విజ్రుమ్భించి ఈ ప్రపంచం ఆవిర్భ విస్తుంది అని రాముడికి వశిష్టుడు బోధించాడు .
రేపు 30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భం గా శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )
19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి బ్రహ్మానంద సరస్వతి కి ముఖ్య శిష్యుడు .వార ణాసి లో ‘’ధర్మ సంఘం ‘’స్థాపించాడు .జీవితం లో ఎక్కువకాలం కాశీ లో నే గడిపాడు .అద్వైత వేదాంతాన్ని బహుళ ప్రచారం చేసిన వారిలో కరపత్రి స్వామి ఒకడు 19 4 8 లో ‘’రామ రాజ్య పరిషత్ ‘’అనే రాజకీయ పార్టీ నెలకొల్పాడు .19 51లో లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికలలో ఈ పార్టీ 3 సీట్లు ఉత్తర ప్రదేశ్ లో గెలిచింది .దీనిద్వారా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు భారతీయులందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండాలని, అది ధర్మ శాస్త్రాలపై ఆధార పడి ఉండాలని కరపత్రి స్వామి వాదన . కాని ఆపలేక పోయాడు 19 5 8 లో తనపర్తీని జన సంఘ్ పార్టీలో స్వామి విలీనం చేశాడు .19 6 6 లో గో సంరక్షణ ఉద్యమం చేబట్టి ఆవులను చంపరాదని ,గో మాంసాన్ని నిషేధించాలని తీవ్రంగా దేశ వ్యాప్త ఉద్యమం చేశాడు .సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి 19 48 ఏప్రిల్ 18 న’’సన్మార్గ్ ‘’అనే దిన పత్రిక పెట్టి నడిపాడు 19 8 2 లో 7 5 వయేట మరణించాడు .
కరపత్ర స్వామి సంస్కృతం లో ‘’అద్వైత బోధ దీపిక ‘’అనే గ్రంధాన్ని 12 అద్యాయాలతో రాశాడు ఇది తమిళ ఇంగ్లీష్ భాషలలో అనువాదమైంది .’’టాక్స్ విత్ రమణ మహర్షి’’ నిరికార్డ్ చేసిన మునగాల వెంకట రామయ్య 8 అధ్యాయాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు.అద్వైత బోధ దీపిక శంకరాచార్యులవారి అద్వైతాన్ని అతి సులభంగా తేలికగా అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది .భగవాన్ రమణ మహర్షి ఎవరికైనా సందేహాలుంటే అద్వైత కర దీపికను చదివి హాయిగా అనుమాన నివృత్తి చేసుకోవచ్చునని దీనిని రికమెండ్ చేసేవారు .’’శ్రీ విద్య -వరివస్య ‘’అనే కరపత్రిస్వామి వ్యాసాలను సంకలనం చేసి స్వామి దత్తాత్రేయానంద అనే సీతారామ కవిరాజ ప్రచురించాడు
.
13 7-చైతన్య చరితామృత కర్త -కృష్ణ దాస కవిరాజ గోస్వామి (15 20-16 17)
భాగీరధ ,సునందల కుమారుడైన కృష్ణ దాస బీహార్ లో కత్వా లోని బర్ద్వాన్ జిల్లా జమాత్ పూర్ దగ్గర సాలారాలో 15 20 లో బ్రాహ్మణ వంశం లో జన్మించాడు మరణం 16 17 . .కలలో చైతన్యుడు దర్శనమిచ్చి బృందావనం వెళ్ళమని బోధించాడు .బృందావనం చేరి తన గత జీవితాన్ని ఎవరికి చెప్పలేదు .హరికధలతో హరి కీర్తనలతో కాలక్షేపం చేశాడు నిత్యానంద స్వామి ,మణికేతన రామ దాసు లు ఆహ్వానితులు గా వచ్చేవారు .విష్ణు దైవం వైష్ణవ భక్తుల సహకారం లేకుండా చైతన్య చరితామృతం రాయలేనని భావించి ప్రతి అధ్యాయం లో చైతన్య ప్రభుని అద్వైత ప్రచారకర్త నిత్యానంద ప్రభులను స్మరించాడు .వ్యాసమహర్షి భాగవతం లో క్రష్ణలీలను వర్ణించినట్లే బృందావన గోస్వామి అయిన కృష్ణదాసు చైతన్య లీలా విలాసాలను వర్ణించాడు .దీనిని చైతన్య గౌడీయమతం ప్రచురించింది .మదన మోహనుడు చెబితే నేను ఒక చిలకలాగామళ్ళీ పలికాను అన్నాడు కృష్ణదాస .దీన్ని రాయటానికి స్వరూప దామోదరుని నోట్స్ ను ఆధారంగా చేసుకున్నాడు .కృష్ణదాస్ హృదయం లో చైతన్య నామం భావం మూర్తి బోధనా భక్తీ అన్నీ సంగమించాయి .చైతన్య చరితకు విశ్వనాధ చక్రవర్తి టీక రాశాడు .
కృష్ణ దాస కవిరాజ స్వగ్రామం జమతాపుర లో ఒక చిన్న గుడిలో స్వామి నిత్యానంద పాద ముద్రలున్నాయి .క్రష్ణదాసుకు నిత్యానందుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడని ని స్థానికులు భావించారు .అందుకనే అదే ప్రదేశం లో నిత్యానంద పాదుకలను ఏర్పాటు చేసి స్మరిస్తారు .కాని కృష్ణదాస రఘునాధ గోస్వామివద్ద దీక్ష తీసుకున్నాడని ప్రేమ విలాసలో ఉన్నట్లు చెబుతారు .ఇక్కడి దేవాలయం లో క్రష్ణదాసుని కొయ్య పాదుకలుఅంటే పాంకోళ్ళున్నాయి .కృష్ణదాస విగ్రహం, సమాధి రాదా కుండ్ లో ఉన్నాయి .రఘునాధ దాస స్వామి మరణం తరవాత కృష్ణదాస కవిరాజ గోస్వామి అశ్విని మాసం కృష్ణ ద్వాదశినాడు మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా