పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4

16-మహీ పాదా ఘాతా ద్వ్రజతిసహసా  సంశయ పదం –పదం విష్ణోః భ్రామ్యద్భుజ పరిఘ రుగ్ణ గ్రహణం

ముహుర్ద్యౌ  రౌస్ధ్యంయాత్య నిభ్రుత జాడా తాడిత తటా-జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ‘’

భావం –ఉమాపతీ !సంధ్యాసమయం లో ఒక రాక్షసుడు లోకాలను బాధిస్తుంటే ,వాడిని భయపెట్టి ,లోకాలను సంరక్షించటం కోసం నువ్వు సంధ్యా నాట్యం చేస్తున్నావు .అప్పుడునీ అడుగుల ఒత్తిడికి భూమి హటాత్తుగా తానున్నానో లేనో ననే అనుమానం పొందుతోంది  .ఆ నాట్యం లో అడ్డ గడియ లాంటి నీ భుజాల ను నువ్వు త్రిప్పు టూ ఉంటె విష్ణు స్థానమైన ఆకాశం విరిగిన గ్రహ సమూహాలై పోతోంది .చెదిరే నీ జటా జూటం చేత మాటి మాటికీ దెబ్బలు తింటున్న స్వర్గం ప్రతి దెబ్బకీ స్థితిని తప్పుతోంది .సహింప శక్యం కాని నీ తాండవనృత్యం నీకు గొప్ప ఆధిపత్యాన్ని కల్పించటం పరమ మనోహరంగా ఉంది .

17-వియద్వ్యాపీ తారా గణ గుణిత ఫేనోద్గమ రుచిః-ప్రవాహో వారాం యః పృషతలఘు దృస్టశ్శిరసితే

జగద్వ్యీపాకారం జలధి వలయం తేన కృత మి –త్యనే నైవోన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుః’’

భావం –రుద్రా ! గంగ ఆకాశమంతా వ్యాపించి ,నక్షత్ర సముదాయం చేత ఎన్నో రెట్లుగా ఆవిర్భవిస్తున్న గంగ నురుగు తెల్లగా ఉంది .ఆ గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న నీటి బిందువులుగా దర్శన మిస్తున్నాయి .జగత్తు అంతా ఆ గంగా ప్రవాహం చేత ఆవరి౦పబడి ఒక ద్వీపాకారంగా కనిపిస్తోంది .అంతటి శక్తిగల గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న చిన్న నీటి బిందువులుగా కనిపించటం చేత నీ దివ్య సుందర దేహం మహా మహిమాన్వితమైనదని స్పష్టంగా చెప్పకనే చెబుతోంది .

18-రధః క్షోణీ యంతా శతధృతి రగేంద్రో ధనురధో –రదా౦గే చంద్రార్కౌ రధ చరణ పాణిశ్శర ఇతి

దిధుక్షోభే కోయం త్రిపుర తృణ మాడంబర విధి –ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః’’

భావం –గంగాధరా !త్రిపురాసురులు నీకు గడ్డిపోచాలాంటి వారు .వాళ్ళను కాల్చాలని సంకల్పించావు .అప్పుడు భూమి అంతా నీకు రధమైంది .బ్రహ్మ సారధిగా ,మేరుపర్వతం ధనుస్సుగా ,సూర్య చంద్రులు రధ చక్రాలుగా అమరిపోయారు .ఆ అల్ప దుస్ట  రాక్షస సంహారానికి నీకు ఇంతటి ఆడంబరం అవసరమే లేదు .సమస్త లోకాలను శాసించేవారి బుద్దులు ఇతరులపై ఆధార పడవు .ప్రభువుల బుద్ధులు విధేయులతో వినోదించాలని ఉబలాట పడుతూ ఉంటాయి .అందుకే త్రిపురాసుర దహనానికి కావాలనే నువ్వు ఇంతటి పటాటోపాన్ని  ప్రదర్శించావు .

19-హరిస్తే  సాహస్రం కమల బలిమాధాయ పదయోః –యదే కోనే తస్మిన్నిజ ముదహరన్నేత్ర కమలం

గతో భక్త్యుద్రేకః పరిణతమసౌ చక్ర వపుషా –త్రయాణా౦ రక్షాయై త్రిపుర హర జాగర్తి జగతాం ‘’

భావం – త్రిపురహరా హరా!విష్ణువు నీ పదద్వయాన్ని  వెయ్యి కమలాలతో అర్చించాలని సంకల్పించి సేకరించి ఉంచితే అందులో లెక్కకు ఒకటి తగ్గింది .వెంటనే పద్మవంటి తనకన్నునే పెకలించి పద్మ౦గా సమర్పింఛి అర్చించాడు . .విష్ణుమూర్తి  అచంచ  భకక్తి యొక్క ఆవేశమే చక్రం గా మారి ఆయన హస్తాన్ని అలంకరించి విష్ణు చక్రమని పిలువ బడుతోంది .ఆ విష్ణు చక్రమే సమస్త లోక రక్షణకు జాగ్రుతమై నిత్యం మేలు కొనే ఉంటుంది .భక్త్యావేశం తో సమర్పి౦ప బడిని విష్ణు నేత్రమే చక్ర రూపం పొంది హస్తాన్ని అలంకరించి సర్వ లోక రక్షణలో నిత్య జాగృతంగా ఉన్నది .

20-క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం –క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధన మృతే

అతతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన ప్రతిభువం –శ్రుతౌ శ్రద్ధాం బధ్వా దృఢ పరికరః కర్మసు జనః ‘’

భావం –యజ్నేశా !ఏ యజ్ఞం అయినా ఎప్పుడో ఒకప్పుడు పూర్తి కావాల్సిందే. యజ్ఞం చేసినవాడికి ఫలాన్ని అందించటం లో నువ్వు ఎప్పుడూ సంసిద్ధంగా ముందే ఉంటావు. యజ్ఞం అనిత్యమైంది ,జడం కూడా .అది ఫలాన్ని ఇవ్వ లేదుకదా  ఏకర్మకైనా ఫలదాతవు పురుషోత్తముడవైన నువ్వే .నిన్ను ఆరాది౦చకపోతే ఫలం ఎలా లభిస్తుంది ?జనాలకు ఈ విషయం బాగా తెలుసుకనుక ,యజ్ఞం ద్వారా నీ అనుగ్రహం పొందాలని  వేదం పై పూర్తీ విశ్వాసం తో వేదోక్తాలైన యజ్ఞాలను నిర్వహిస్తున్నారు .

‘’పురి శరీరే శేతే పురి దేహే సీదతీతివా పురుషః ‘’అని పురుష శబ్దానికివాచకమైన పరమాత్మకు  నిర్వచనం .అంటే శరీరం లో ఉండేవాడు .’’వేదో నిత్య మదీయతాం తదుదితం కర్మ స్వనుస్టీయతాం’’అని శంకర భగవత్పాదులు ఆదేశించారు .అంటే వేదోక్త  కర్మలను  ఆచరించమని భావం. వేద ప్రతిపాదిత యజ్న కర్మలకు ఫలప్రదాత పరమేశ్వరుడే .

 

Inline image 1

Inline image 2

సశేషం

నాగుల చవితి శుభాకాంక్షలతో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6

మల్లినాధుని సృజన రచనలు

మహాకావ్య వ్యాఖ్యానం తో పాటు మల్లినాద సూరి స్వీయ రచనలూ చేసి తన కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశాడు ,ఆయన సృజలలో 1-రఘువీర చరితం అనే 17 కాండల కావ్యం .శ్రీ రాముని అరణ్య వాసంనుండి పట్టాభిషేకం వరకు .1531 శ్లోకాలున్నాయి .ఇవి కాళిదాస రఘువంశ కావ్యం కంటే కొంచెం తక్కువ శ్లోకాలతో ఉంది .

2-వైశ్య వంశ సుధాకరం –వైశ్య కులం లో వచ్చిన కొన్ని సమస్యలపై  మల్లినాధుని తీర్పు .మొదటి ప్రౌఢదేవరాయలకాలం లో ముఖ్య న్యాయ నిర్ణేతగా మల్లినాధుని నియమించి వైశ్య సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి తీర్పు చెప్పమని కోరాడు . తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసి వైశ్య కుటుంబ మూల విషయాలను త్రవ్వి తీసి ,నేపధ్యాన్ని అధ్యనం చేసి వెలువరించిన తీర్పు ఇది .వైశ్య శబ్దాలకు చారిత్రాత్మక అర్ధాలను సేకరించి వివరించాడు .అందులోని భిన్నతరగతుల వారి విధులను విధానాలను తెలియ జేశాడు. దీనివలన వారికి వర్తక వాణిజ్యాలలో గొప్ప ఉపయోగమే కలిగింది .ఆకాలం లోమల్లినాధుని తీర్పు ఒక శాసనం (టెస్ట్ మెంట్ )అయింది

అమర కోశాన్ని పూర్తిగా చదివి అర్ధం చేసుకొని దానిపై ఉన్నకాశీ రామస్వామి ,వంధ్యాగతీయ,సర్వానంద ,లింగ భట్ట హరిదీక్షిత  గురుబాల ప్రబోధిని వంటి తెలుగు సంస్కృత వ్యాఖ్యానాలను పరిశీలించి .రాసిన కావ్యం ఇది .

3-ఉదార కావ్య 4-భక్తి రహస్య 5-నక్షత్ర పాఠా ధ్యాయం కూడా మల్లినాద కృతులే అంటారు .అయితే అది పూర్తిగా నిరూపింప బడలేదు .

మల్లినాద కావ్య వ్యాఖ్యాన రచనలు

1-కాళిదాస మహాకవి రచించిన 1-రఘు వంశం

2-కుమార సంభవం

3-మేఘ దూతం లకు సంజీవని వ్యాఖ్య రాశాడు .

4–భారవి రాసిన –కిరాతార్జునీయం కు ఘంటాపాఠ వ్యాఖ్యానం

5–మాఘకవి రచన –శిశుపాల వధ కు –సర్వంకష వ్యాఖ్యానం

6 -శ్రీ హర్షుని నైషధీయ చరిత కు –జీవాతువు వ్యాఖ్యానం

7 -భట్టి రాసిన భట్టి కావ్యానికి-సర్వ పాఠీన వ్యాఖ్య రాశాడు

శాస్త్ర  గ్రంధాలకు  వ్యాఖ్య

1-      విద్యా ధరుడు రచించిన ఏకావలి అలంకార గ్రంధానికి –తరల అనే పేరుతో వ్యాఖ్యానం రాశాడు

2-      వరద రాజ కృతి –తార్కిక రక్షాస్టిక కు ఒకటవ పరిచ్చేదం పై మాత్రమే-నిష్కంటక వ్యాఖ్యానం రచించాడు

 

న్యాయ శాస్త్ర గ్రంధ వ్యాఖ్యానం

మూడు శాస్త్ర గ్రంధాలకు వ్యాఖ్యానం రాశాడు

1-తంత్ర వార్తిక –కు సిద్దా౦జన

2-స్వర మనోజ్ఞ మంజరి కి పరిమళ వ్యాఖ్య

3-ప్రశస్త పాదాభ్యాస కు నిష్కంటక వ్యాఖ్యానం రాశాడు

అంటే మొత్తం మీద 12 గ్రంధాలకు మల్లినాధుడు వ్యాఖ్యానాలు రాశాడు .ఇవికాక 1-లఘు  శబ్దేందు శేఖర 2-అమర కోశ 3-నలోదయ వ్యాఖ్యానాలకూ కర్త మల్లినాదుడే అంటారు .అయితే అది  అనుమానాస్పదం అన్నారు ‘

ఏ వ్యాఖ్య తరువాత దేన్నీ రాశాడనే దాన్ని స్పష్టంగా నిర్దుష్టంగా వివరించి చెప్పటం కష్టమే .కొన్ని సూచనలు మాత్రం కనిపిస్తాయి అవే ఆధారాలు .ఆయన రాసిన ఇతర వ్యాఖ్యానాలలో వీటి గురించి ప్రస్తావన కనిపిస్తుంది .కనుక వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం దొరుకుతుంది .

శిశుపాల వధ కు రాసిన సర్వం కష వ్యాఖ్యానం లో కాళిదాస రచనలకు రాసిన సంజీవని ప్రస్తావన చేశాడు .కనుక సర్వంకష కు ముందే రఘువంశ కుమార సంభావ మేఘ దూత లపై సంజీవని వ్యాఖ్య రాశాడని తెలుస్తుంది .మేఘ దూత భట్టి కావ్యాలలో రఘువంశ సంజీవని వ్యాఖ్య ప్రస్తావన ఉంది .కనుక ఈ రెండిటికంటే ముందే రఘువంశ వ్యాఖ్యానం రాశాడని భావించ వచ్చు .శిశుపాల వధకు రాసిన సర్వం కాషలో సర్వం కష విషయం ఉన్నది కనుక అదే పేరుతొ ఇంకోదానికి రాయలేదని అనుకోవటానికి దారితీయదు .ఘంటా పద వ్యాఖ్య విషయం సర్వం కషలో .సర్వ పాతఠీనం రఘు వంశ సంజీవనిలో కనిపిస్తుంది .కనుక మేఘ దూత, భట్టి కావ్య  వ్యాఖ్యానాలకంటే ముందే భారవి కావ్యం పై వ్యాఖ్య రాశాడని తెలుస్తోంది .జీవాతువు వ్యాఖ్య గురించి దేనిలోనూ ప్రస్తావన కనిపించలేదు .కనుక అన్ని వ్యాఖ్యానాల తరువాతే జీవాతువు రాశాడని చెప్ప వచ్చు .జీవాతువులో మల్లినాధుని ఇతర వ్యాఖ్యానాల ప్రస్తావన లేదు .ఒక వేళ దీన్ని అన్ని వ్యాఖ్యానాల కంటే ముందే రాశాడేమో ?ఏమో ,అయి ఉండచ్చు .

తరల వ్యాఖ్య ను తన ఇతర వ్యాఖ్యానాలో సూరి ప్రస్తావించలేదు .తార్కిక రక్ష కూడా అంతే.అయినప్పటికీ మల్లినాధుని ‘’పంచ కావ్యాది టీక’’కు వర్తిస్తుంది తార్కిక రక్షకు ముందే వాటికీ వ్యాఖ్యానాలు రాశాడని అనుకోవాలి .మల్లినాధుడు పంచకావ్యాలు అని అన్నాడే కాని పంచ మహా కావ్యాలు అనలేదు . అంటే అయిదు  ప్రసిద్ధ కావ్యాల గురించే ఆ మాట అని ఉంటాడు .అవే పంచ మహా కావ్యాలు .తరల వ్యాఖ్యలో తంత్ర వార్తిక వ్యాఖ్యాన ప్రస్తావన ఉన్నది  .ఏతా వాతా మల్లినాధుని వ్యాఖ్యానాల వరుసక్రమం ఈ విధంగా ఉందని చెప్పవచ్చు-ఘంటా పదం,సంజీవని ,సర్వ పాఠీన ,జీవాతువు ,స్వర మంజరి పరిమళ ,ప్రశస్త పాదాభ్యాస టీకా ,తార్కిక  రక్షా టీకా ,తంత్ర వార్తిక టీకా ,తరల, మల్లినాధుని కుమారుడు  కుమార స్వామి ప్రతాప రుద్రీయానికి రాసిన’’రత్నాపన’’వ్యాఖ్యానానికి  కు మల్లినాధుడు విద్యాధరుని ఏకావలి కి రాసిన  ‘’తరల’’ వ్యాఖ్యానం ఒక కర దీపిక ,మార్గ దర్శి అని ప్రసిద్ధ సంస్కృత విద్వా౦సుడు,విమర్శకుడు శ్రీ ప్రమోద్ గణేష్ లాల్యే అభిప్రాయ పడ్డాడు .. .    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం

విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం

మాసిడోనియా చక్ర వర్తి అలేక్సాందర్ ఒక సారి ఆఫ్రికాలో ఒక మారుమూల దేశానికి వెళ్ళాడు .ఆ దేశం బంగారుగనులతో అతి భాగ్య వంతం గా ఉంది .ఆ దేశ ప్రజలు బుట్టలనిండా బంగారు పళ్ళు తెచ్చిఇచ్చిఅలేక్సాండర్ ను దర్శించి కానుకగా ఇచ్చారు. ‘’ఈ పళ్లన్నీ మీరే తీసుకొని అనుభ వించండి  .నేను మీ సంపద చూడటానికి రాలేదు ‘.మీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవటానికి వచ్చాను ‘’అన్నాడు .ప్రజలు ఆయన్ను రాజుగారు నేరాలు విచారించి తీర్పు చెప్పే చోటికి తీసుకు వెళ్ళారు .

అదే సమయం లో ఒక పౌరుడు వచ్చితనతో వచ్చిన వాడిపై  రాజుకు కు ఒక విషయం ఫిర్యాదు చేశాడు ‘’రాజా !నేను ఈ అబ్బాయి దగ్గర ఒక బస్తా ఊక కొన్నాను .ఇంటికెళ్ళి చూస్తే ఆ బస్తాలో చాలా  బంగారం  ఉంది.నేను ఊకనే కొన్నాను కాని బంగారాన్ని కాదు .అది నాదికాదు. అమ్మినతనిదే .ఇతడు ఆ బంగారం  తీసుకో నంటున్నాడు .మీరే నచ్చ చెప్పి అతని బంగారం అతనికి ఇప్పించేయ్యండి ‘’అన్నాడు .

ఆ రెండో వాడు ‘’నాకు అన్యాయం సొమ్ము వద్దు మహాప్రభూ !నేను అతనికి ఊకతో సహా అందులో ఉన్న అమా౦ బాపతు తోపాటు  అంతా అమ్మేశా. అదంతా అతనిదే నాదికానే కాదు .ఆ సొమ్ము అతనికే చెందుతుంది. మీరే నచ్చచెప్పి అతనికి అది ఇప్పించండి ‘’అన్నాడు .పెద్ద ధర్మ సంకటమే వచ్చిందని రాజు తెలివిగా మొదటివాడిని ‘’నీకు కొడుకు ఉన్నాడా “’?అని రెండోవాడిని ‘’నీకు కూతురు ఉందా ?’’అని ప్రశ్నించాడు ఉన్నారన్నారిద్దరూ .’’అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీరు వియ్యంకులు అవండి. పెళ్ళికి బస్తాలోని బంగారం వాళ్లకు కానుకగా ఇవ్వండి ‘’అని రాజు తీర్పు చెప్పాడు ;

ఆ తీర్పు విన్న అలేక్జాండర్ అవాక్కై బోల్డు ఆశ్చర్య పోయాడు  .రాజు ప్రపంచ విజేతత తో ‘’నేనేమైనా తీర్పు తప్పు చెప్పానా ఆశ్చర్య పోతున్నారు ?’’అని అడిగాడు .’’అబ్బే .లేదు మా దేశం లో అయితే ఈ తీర్పు వేరే విధంగా ఉండేది ‘అన్నాడు .’’ఎలా ఉంటుందో చెబుతారా ?’’రాజు ప్రశ్నించాడు .

‘’వాది,ప్రతివాది లిద్దరికీ తలలు తెగి పోయేవి .ఆ బంగారం రాజుగారి కోశాగారం చేరేది ‘’అన్నాడు అలేక్సాండర్.ఇది విన్న రాజు విపరీతంగా చప్పట్లు కొట్టి ‘’మీ దేశం లో సూర్యుడు వెలుగుతాడా ,ఆకాశం మీ మీద వర్షం కురిపిస్తుందా ?’’అని అడిగాడు .’’ఆహా ‘’అన్నాడు అలేక్సా౦డర్ .’’అయితే అవి మీ దేశం లోని అమాయక జంతువులకోసమే అయి ఉంటుంది .అలాంటి మనుషులమీద సూర్యుడు ప్రకాశించకూడదు .ఆకాశం వర్షించ కూడదు ‘’అన్నాడు ఆఫ్రికా దేశ రాజు .మరోసారి అవాక్కయ్యాడు అలేక్సాండర్ .

ఇది జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డేల్(1744 -1803) సేకరించి ,రాసిన  న  ‘’ఆఫ్రికా వాసి తీర్పు ‘’కద

Inline image 1

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్

నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్

1744 -1803 కాలానికి చెందిన జర్మన్ కవి జోహాన్ గాట్  ఫ్రీడ్  హెర్డర్. ఆయన వికాసవాద సాహిత్యం లో ప్రఖ్యాతుడు .ప్రకృతితో మానవ అనుబందాలనుండే కవిత్వం పుడుతుందని అది మౌలికమని ,దానికి కృత్రిమమైన ఛందస్సు వగైరా అనవసరమని అన్నాడు హీర్దర్.కవిత్వ౦ , భాష పైన తన అభిప్రాయాలను ‘’నిజమైన కవి స్వభాష లోనే రాయాలి ‘’అనే వ్యాసం లో వివరించాడు .అందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొందాం .ఇవి ఆనాడే కాదు నేడూ అనుసరణీయం అనిపిస్తాయి .

1-నేను ఏ భాషలో పదాలను అతి సమర్ధంగా ఎన్నుకోగలనో ,ఏ భాషపై నాకు పూర్తి అధికారం ఉందో ,వాటి గురించి సమగ్రమైన జ్ఞానం నాకు ఉందో నేను విధిగా ఆ భాషలోనే రాయాలి .నిస్సంకోచంగా అది నామాతృ భాషే అవుతుంది

2-మన  వాగింద్రియాలు మనసు చెవి మాతృభాషకు అనుకూలం గా సహజం గా మలచినవి .కనుక నేను నా మాతృభాషలోనే నామనోభావాలను చక్కగా వ్యక్తం చేయగలను. మనస్వదేశం మన మాతృ భాషా మనకు ప్రియమైనవి మాతృభాష మిగిలిన భాషలకన్నా అతి మనోహరం గా కనిపిస్తుంది .

3-మన మనసు ఎప్పుడూ ఇతర భాషలను మనకు తెలియ కుండానే మాతృభాష భాషలోకి అనువది౦చు కొంటు౦ది .ఆ భాషలను నోటిలోనే ఉంచుకొని ,ఇంకా లోతులకు పోయి భాషల తార తమ్యాలు తెలుసుకొని పరిశీలిస్తుంది .వాటినీ గుర్తు పెట్టుకొంటుంది .కొన్ని విషయాలలో సంపన్నత, వైభవం విదేశ భాషలలో కనిపించినప్పుడు,అది తన భాషలోని సౌందర్యాలను గురించి ఆనందిస్తూనే ,సాధ్యమైనంతవరకు తన భాష లోని లోపాలను పూరించుకోవటానికి విదేశీ సంపదను తెచ్చుకుంటుంది .మనసును విదేశీ భాషలనే సముద్రం లో మునిగిపోకుండా కాపాడే సురక్షిత నౌక అది .ఆందోళన కలిగించే భాషా వైవిధ్యం లో అది ఐక్య భావం సాధిస్తుంది .నేను విదేశీ భాషలు నేర్చుకొంటాను, కాని అది నా భాషను మరచిపోవటానికి మాత్రం కాదు .నేను విదేశీ సంచారం చేస్తాను అక్కడి ఆచార సంప్రదాయాలు అలవర్చుకొని నేను పుట్టిన సంఘం లోని ఆచార వ్యవహార సంప్రదాయ మర్యాదలను మర్చి పోవటానికి కాదు .నేను ఇంకో దేశం లో పౌరసత్వం పొంది  నా దేశం లోని పౌరసత్వాన్ని వదులు కోను .ఇలా చేస్తే నేను ఆర్జించిన దానికంటే కోల్పోఏదేఎక్కువ .నేను విదేశ ఉద్యాన వనాలలో పచార్లు చేస్తాను. అక్కడి వింత పూలతో నా ఆరామాన్ని అల౦కరించు కొంటాను అప్పుడు నా భాష నా భావనా విధానానికి ప్రియతమమవుతుంది .నా దేశ విధానాలను వివరించటానికి విదేశీ విధానాలు నేను పరి శీలిస్తా . విదేశ సూర్య రశ్మితో పండిన పండ్ల లాగా నా స్వదేశ ప్రతిభకు కానుక లిస్తాను . .

4-భావ వ్యక్తీకరణ కోరే కవి తన జన్మ భూమికి విశ్వాసపాత్రుడై ఉండాలి .నిజమైన భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి దేశీయ భాషలోనే సాధ్యం .నా అసమర్ధతను అంగీకరిస్తున్నాను నేను ఒక్క భాష తప్ప పూర్తిగా అర్ధం చేసుకోలేనని సిగ్గు విడిచి చెబుతున్నాను .హోమర్ లాగా అంత సర్వాంగ సుందర౦గా ఎవరైనా అనేక భాషల్లో రాయగలరా ?పిండాల్ లాగా హోరేస్ లాగా ఏ మాతృభాషలోనైనా రాయ గలరా ?.షేక్స్ పియర్  ఆయన భాషలో తప్ప ఇంకే భాషలో నైనా అలా రాయగలడా ?లేరు .కనుక నేను నేల మీద  సాష్టాంగ పడి,నా తల్లి నేలను ఆలింగనం చేసుకుంటాను .ఆమె భాషే నాకవితా దేవత ‘’

అని తల్లిభాషకు వందనం చేశాడు జోహాన్ గ్రాట్ ఫ్రీడ్ హెర్డేర్.

Inline image 1

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3

11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్

శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత  మిదం ‘’

భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను ఎదిరించే వాడు లేడనుకొన్నాడు  .అతని 20 చేతులూ ఎప్పుడూ ఎవరితోనే యుద్ధం చేయడం తో తీట కు లొంగిపోయాయి .దీనికి నీ అనుగ్రహమే కారణం .నీ పాద పద్మాలను తన శిరస్సు లనే పద్మాల మాలలతో అర్చించటం చేత అది అతనికి సాధ్యమైంది. నీ పూజపై స్థిర క్తి  ఉండటం దీనికి కారణం.నీపాదారవి౦దాలపై దృఢ భక్తి వల్లనే అతనికి అది సాధ్యమైంది .12-అముష్య త్వత్సేవా సమదిగత సారం భుజ వనం –బలాత్ కైలాసే పి త్వదదివసతౌ విక్రమ యతః

అలభ్యా పాతాలే ప్యలస చలితాంగుస్ట  శిరశి-ప్రతిష్టా త్వయ్యాసీ ద్ధ్రువ ముపచితో ముహ్యతి ఖలః ‘’

భావం –ఈశ్వరా ! రావణుడు నీ అనుగ్రహానికి పాత్రుడై 20 భుజాలు పొందాడు .నీకృపతో లభించిన ఆభుజాలశక్తితో నువ్వు నివశించే కైలాసపర్వతం పైనే తన ప్రతాపం చూపించాడు. వెంటనే నువ్వు అనాయాసంగా నీ బొటన వ్రేలిమొన తో అణచి వేయగా పాతాల లోకం లో కూడా ఉండటానికి వీలు లేకపోయింది .దుష్టుడు ఉపకారం పొంది దాన్నిమరచి ఉపకారిపైనే బలప్రదర్శనకు దిగటానికి పూనుకోవటం లోక సహజం .

13-యదృద్ధిం  సుత్రామ్ణో వరద పరమోచ్చైరపై సతీ –మధశ్చక్రే బాణః పరిజన విదేయ త్రిభువనః

న తచ్చిత్రం తస్మిన్వరి వసితరి త్వచ్చరణయో –ర్న కస్యా ఉన్నత్యై భవతి శిరస స్త్వయ్య వనతిః’’

భావం-భక్తుల కు వరాలిచ్చి కోర్కె తీర్చే పరమేశా !బాణాసురుడు మూడు లోకాలను తన సైన్యం తో స్వాధీనం చేసుకొన్నాడు .సంపద విపరీతం గా సాధించి ఇంద్ర పదవిని తన  పదవి కంటే తక్కువ చేసేశాడు .నీ పద భక్తుడు కనుక అతనికిది ఒక విశేషమే కాదు .నీకు ఎవరైనా శిరసువంచి నమస్కరిస్తే  వాడు ఏ ఉన్నతినైనా సాధించగలడు .అలాంటి వరదుడవు నువ్వు .

14-అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా –విదేయస్యాసీ ద్యస్త్రి నయన విషం సంహృత వతః

స కల్మాషః కంఠే న తవ కురుతే న శ్రియ మహో –వికారో పి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః ‘’

భావం –ముక్కంటీ !అమృతం కోసం సముద్ర మధనం చేసేటప్పుడువెలువడిన కాల కూట విషాన్ని చూసి దేవ రాక్షసు లు  ప్రళయం వస్తోందని భయపడ్డారు .వాళ్ళపై నీకు పార కరుణ  ఉండటం చేత ఆ విషాన్ని మింగి నీ కంఠం లో దాచుకున్నావు .దీనితో నీ కంఠం లో ఒక నల్లని మచ్చ ఏర్పడింది .తెల్లని నీ శరీరం లో ఆ నల్ల మచ్చ కూడా నీకు శోభనే తెచ్చింది .వికారంగా లేదు కూడా .లోకుల భయాలను తొలగించే వారి శరీర వికృతి కూడా కొనియాడ దగిందే అవుతుందికదా .

15-అసిద్దార్దా నైవ క్వచిదపి స దేవాసుర నరే –నివర్త౦తే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః

స పశ్యన్నీశ త్వామితర సుర సాధారణ మభూత్ – స్మరః స్మర్తవ్యాత్మా న హి పధ్యః పరి భవః ‘’

భావం -సర్వ సృష్టికి అధిపతి ఐన సర్వేశా !సృష్టి దేవ రాక్షస మానవులతో కూడి ఉంది .మన్మధ బాణాలు ఎప్పుడూ వ్యర్ధం కావు .ఎవరిపై ప్రయోగిస్తే వారు దాని కి తగుల్కొని  బాధపడక తప్పదు .అవి జయ స్వభావం కల బాణాలు అలాంటి శక్తిగల మన్మధుడు నువ్వు సామాన్య దేవతగా భావించి నీపై పుష్పబాణాలు ప్రయోగించి  నీ మూడవ కంటి అగ్నికి  ఆహుతై శరీరం కోల్పోయి ,అనంగుడు అయ్యాడు .ఇంద్రియ నిగ్రహమున్న వారిపై అవమానం లేక బల ప్రయోగం ఆరోగ్య ప్రదం కాదు .వినాశ హేతువే అవుతుంది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాష సంస్కృతుల అభివృధ్ది కమిటీకి ది.19 అక్టోబరు 2016 నాడు సమర్పించిన నివేదిక

img051 img052

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5

మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు

సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న ఒక కధను ఉదాహరించారు .మల్లినాధుడు చిన్నతనం లోచదువు ,సంధ్యా లేక అల్లరి చిల్లరగా తిరిగేవాడు .ధనవంతుదికొడుకు కనుక పెళ్లి అయింది అత్తారింటికి వెడితే భార్య బావ మరదులు అతని విద్యా గంధ హీనతను యెగతాళి చేశారు .చివరికి సూటీపోతటీగా భార్య ‘’ఎన్ని మాటలు అన్తేనేం రోకలి చిగురిస్తుందా ?’’ముసలః కిసలాయతే’’?అని దెప్పి పొడిచింది .తనస్వగ్రామం వెళ్లి భార్య అన్నమాటలలో అర్ధాన్ని పండితులనదిగి తెలుసుకొని ,పట్టుదలపెరిగి తాను మహా సంస్కృత విద్వాంసుడు కావాలని నిర్ణ యించుకొని కావ్య నాటక అలమ్కారాది శాస్త్రాలను ,పదవాక్య ప్రమాణాలను దీక్షగా గురువులవద్ద చదివి గొప్ప విద్వాంసు డై అత్తారింటికి దారేది అని వెళ్లి నిజంగానే రోకలి చిగురించింది అనే అర్ధం వచ్చేట్లు  ‘’ముసలః కిసలాయతే ‘’అని ‘’ భార్యతో అన్నాడు .భార్తవిద్వాట్టుకు భార్య పరవశం చెంది ,ఆతనితో అత్తారింత్కి కాపురానికి వెళ్లి సుఖ జీవనం గడిపింది .సూరి అనిపించుకొన్న మల్లినాధుని పాండిత్యాన్ని కొడుకు కుమారస్వామి ‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మ యః ‘’అని కీర్తించాడు

కన్నడ దేశం లో మరో కద ప్రచారం లో ఉంది .ఇలాంటి కధలను కన్నడ కవి రచయితా అవధాని డా ఆర్ గణేష్ ‘’కవితే గోండు కధే ‘’అనే పుస్తకం లో నిక్షిప్తం చేశాడు .వీటిని ‘’దంత కద ‘’అన్నారు.కన్నడ దేశం లో చిన్న పిల్లల పుస్తకాలలో మల్లినాదునిపై ఒక కద చేరింది .మల్లినాధుడు బాల్యం లో చదువు పై శ్రద్ధ లేకుండా జులాయిగా ,రంగేళీ గా తిరిగిన సంపన్న యువకుడు .ధనికుడు కనుక పిల్లల తండ్రులు వెతుక్కుంటూ వచ్చి తమ పిల్లను అతనికిచ్చి పెళ్లి చేయాలని ఉవ్విల్లూరేవారు .ఒకాయన విద్యా వతి అయిన తన కూతుర్ని విద్యా విహీనుడైన మల్లి నాదునికిచ్చి వివాహం చేశాడు  .పెల్లియ్యాక కాని భార్యకు తన భర్త విద్యా గంధం లేని వాడని తెలియ లేదు.ఒక రోజు ఇద్దరూ రోడ్డుపై వాహ్యాళికి వెడుతుంటే రోడ్డుమీద పడ్డ ఒక పువ్వును చూసి మల్లినాధుడు ఆమెతో ‘’ఆ పువ్వు ఎంత అందంగా ఉందొ చూశావా ?అని దాని అందాన్ని గురించి పొగిడాడు అప్పుడామే ‘ఎంత అందమున్నా అది వాసన లేని పువ్వు దైవ పూజకు పనికి రాదుకదా “’క్ని నర్మ గర్భం గా అన్నది  .ఆమె మాటల భావం అర్ధమై విద్యా లో మహా పండితుదవ్వాలనే బలమైన కోరిక కలిగింది .

గురుకుల వాసం చేస్తూ విద్య నభ్యసించాలని నిశ్చయించుకొని ఒక మహా పండితుని గురుకులం లో చేరాడు గురువు మల్లినాధుని దీక్షకు సంతోషించి పరీక్షించే నెపం తో గురుపత్నికి మల్లినాదునికి పెట్టె ఆహారం   నెయ్యి తో కాఉండా వేపనూనేతో చేసి వడ్డించమని ఆదేశించాడు .ఆమె రోజూ అలాగే చేసేది పూర్తిగా చాడువు పై మనసు కేంద్రీకరింప బడిన మల్లినాదుడికి రుచి విషయం పట్టేదికాడు .చదువు పై ఏకాగ్రత తప్ప వేరే దృష్టి లేదు

ఒక రోజు గురువు గారి ప్రక్కనే కూర్చుని గురు పత్ని వడ్డిస్తుంటే భోజనం చేయ సాగాడు .రుచిలో తేడా ఉందని గ్రహించి గురుపత్నితో ‘’మాతా!ఆహారం చాలా చేదుగా ఉందేమిటి ?’’అని అన్నాడు .ప్రక్కనే ఉన్న గురువు చిరు నవ్వు నవ్వి  శిష్యుడి బుజం తట్టి ‘’నాయనా ! రోజూ మీ గురుపత్నినినెయ్యి బదులు  వేపనూనె తో తయారు చేసిన ఆహారమేనీకు  పెట్టమని  ఆదేశించాను ఆమె అలాగే చేసింది చదువు ధ్యాసలో నువ్వు రుచి గ్రహించకుండా ఇంతకాలం తిన్నావు .ఇప్పుడు నువ్వు  పరిపూర్ణ విద్య సాధించావు ఇక ఇక్కడ ఉండాల్సిన పని లేదు ఇంటికి వెళ్ళ వచ్చు ‘’అన్నాడు .గురువు గారి ఔదార్యానికి తనను అంతటి విద్వాంసునిగా మలచినందుకు కృతజ్ఞత తెలిపి,అనుజ్న పొంది ఇంటికి చేరాడు .భార్యా కుటుంబం అందరూ ఎంతో సంతోషించారు .మహా విద్వాంసుడైన మల్లినాద సూరి కాళిదాస మహాకావ్యాలకువ్యాఖ్యానం రాయటం ప్రారంభించాడు

భర్త పాండిత్యానికి ఆశ్చర్య పడిన భార్య ఒక రోజు తనపై ఒక శ్లోకం రాయమని మల్లినాధుని కోరింది .ఆయన తటపటాయిస్తూ  శూర్పణఖ తో పోలుస్తూ ఒక శ్లోకం ‘’రామ వైరి భగినీవ రాజసే ‘’అనే శ్లోకం చెప్పాడు .భార్యకు ఎక్కడో కాలింది.ప్రతీకారం తీర్చుకోవటాని ఎదురు చూస్తోంది .మల్లినధుడు తన వ్యాఖ్యానాలలో ‘’ఇత్యర్ధః ‘’-ఇదీ అర్ధం అని ,ఇతి భావః ‘’-ఇదీ దీని తాత్పర్యం అని ఎక్కువగా వాడటం అలవాటు. మామూలు సంభాషణనూ వ్యాఖ్యానాలపై పూర్తీ దృష్టితో ఉండటం వలన ఇవి వచ్చేవి .ఒక రోజు మల్లినాధుడు అన్నం లోకి ఎం చేశావు అని భార్యను అడిగితె ,ఎన్నాళ్ళనుంచో రిపార్టీ ఇవ్వాలని ఎదురు చూస్తున్న ఆమె వెంటనేసమాధానంగా  శ్లోకం లో –

‘’ఇత్యర్ధ  క్వధితం చైవేతి భావ తే మనం తధా- సంజీకృతేదయ భుక్త్యార్ధం  తుష్యతాం భావదాశయః ‘’అని చెప్పింది- దీని భావమేమి మల్లినాద –అనుకొంటే –‘’ఉడికిన ఇత్యర్ధ మజ్జ గేహులి అని భావం .ఇదే మధ్యాహ్న భోజనం హాయిగా ఆరగించి ఆనందించండి ‘’అన్నది .మల్లి నాధుడు తన భార్య పాండిత్యానికి  బహుశా గర్వ పడే ఉంటాడు

మల్లినాద సూరి తాతగారు కోలాచల౦ సుబ్బా శాస్త్రిగారు కర్నాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లాలోని  మహేంద్ర గడ నివాసి అని ,కన్నడ ,మరాటీ భాషలలో ఎన్నో హరికధలు రాశాడని అవి నీతి బోధకాలుగా ఉన్నందున ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయని ,ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని అనే గొందే సంస్థానం లో దివాన్ అని అది విజయనగర సామ్రాజ్యం లో భాగం అని ఆ వంశానికి చెందిన వాడే బళ్ళారి వాసి సంఘ సంస్కర్త విద్యా వివేక సంపన్నుడు వితరణ శీలి ,న్యాయవాది  అయిన కోలాచలం వెంకట రావు గారని ,ఆ వంశానికి చెందిన బళ్ళారి లాయర్ శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు జులైలో  పంపిన ‘’కోలాచలం ఫామిలీ ఆఫ్టర్ మల్లినాద ‘’అనే జిరాక్స్ కాగితాలలో ఉంది.దీనితో మల్లినాదుని కాలం, ఆయనపై ప్రచారం లో ఉన్న కట్టుకధలకు స్వస్తి చెప్పి ఆయన వ్యాఖ్యాన వైఖరిని ,బహుశాస్త్ర పాండిత్యాన్ని గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-16 –ఉయ్యూరు .

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1

నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు .

ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ చిత్ర రధుడు అనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు .చిత్ర రధ రాజూ గొప్ప శివ భక్తుడే .పరమేశ్వర పూజకోసం ఒక గొప్ప పూల తోటను పెంచుతాడు .అది వివిధ పుష్పాలతో ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది .పుష్పదంతుడు  ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించి పోతాడు .అందులో ప్రవేశించి పూలు కోస్తాడు .అదృశ్య రూపం లో ఉండటం వలన ఆతనిని రక్షక భటులు చూడలేక పోతారు .రెండు మూడు రోజులు ఇలాగే గడిచాక చిత్ర రధ రాజు పరమేశ్వర పూజకుతన తోటలో పూలు లేక పోవటం గమనిస్తాడు .భటులను ప్రశ్నిస్తే వాళ్ళు రాత్రీ పగలు తాము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాస్తున్నామని పూలు ఎవరు కోసి మాయం చేస్తున్నారో  అర్ధం కావటం లేదని రాజుకు విన్న వించారు .వారు అత్యంత విశ్వాస పాత్రులు కనుక వారి మాట నమ్మి రాజు పూల దొంగను ఎలా పట్టుకోవాలనే విషయమై చాలా మధన పడ్డాడు.

మర్నాడు రక్షక భటులను పిలిపించి రాజు అన్ని పూల చెట్ల కిందా మారేడు దళాలను వెదజల్లమని ఆజ్ఞాపిస్తాడు భటులు అలాగే చేశారు .మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది .దాన్ని కాలితో త్రోక్కితే పరమేశ్వరునికి విపరీతమైన  ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు .ఆ రోజు పుష్పదంతుడు యదా ప్రకారం అదృశ్య రూపం లో పూదోట లో  ప్రవేశించి   నిర్భయంగా పూలు కోస్తాడు .అలాకోయటం లో అనుకోకుండానే మారేడు దళాలను కాళ్ళతో తొక్కుతాడు .అప్పుడు శివుని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది .వెంటనే పుష్పదంతునిపై ఆగ్రహోదగ్రుడై దేవ జాతికి చెందిన గాంధర్వ రాజు పుష్పదంతుడు తనకు అత్య౦త ప్రీతికరమైన పవిత్రమైన  మారేడు దళాలను తొక్కటం ,పూల దొంగతనానికి పాల్పడటం గొప్ప నేరంగా భావిస్తాడు .గంధర్వ రాజు పుష్ప దంతుని దివ్య సర్వ శక్తులను నశింప జేస్తాడు శివుడు .ఆకారణంగా అతడు రక్షక భటులకు కనిపించి దొరికి పోతాడు .వాళ్ళు బంధించి చిత్ర రధ మహారాజు సమక్షం లోకి తీసుకు వెడతారు .రాజు విపరీతమైన కోపం తో పుష్పదంతుడిని కారాగార శిక్ష విధిస్తాడు .

చెరసాలలో బంధింప బడిన పుష్పదంతుడు విచారంతో కుమిలి పోతూ,తానేదో అపచారం చేసి పరమేశ్వరునికి ఆగ్రహం కలిగించటం వలన తన దివ్య శక్తులన్నిటినీ కోల్పోయానని గ్రహిస్తాడు .పరమ శివుని సంపూర్ణానుగ్రహం సాధించటానికి చెరసాలలో ఉంటూనే పరమ భక్తి తో శివ మహిమలను వర్ణిస్తూ  ‘’శివ మహిమమ్నః స్తోత్రం’’ రాశాడు .స్తోత్రం రచన పూర్తికాగానే పరమేశ్వరుడు,  తన మహిమలను పరమాద్భుతంగావర్ణించినందుకు పరమ ప్రీతి చెంది ,అనుగ్రహించి పుష్పదంతుని దివ్య శక్తులన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు .చెరసాల నుండి బయట పడిన పుష్పదంత గ౦ధర్వ రాజు  చిత్ర రధ మహా రాజును దర్శించి తాను చేసిన అపరాధాన్ని మన్నింఛి ,క్షమించమని  ప్రార్ధిస్తాడు  .దయాళువు అయిన మహారాజు శాంతించి,క్షమించి పుష్పదంతుని విడిచి పెడతాడు .పుష్పదంతుడు మళ్ళీ తన గ౦ధర్వ లోకానికి చేరుకొంటాడు .

ఈ కద తర తరాలుగా ప్రచారం లో ఉంది .కాని ఈ కధకు ఆధారం కాని పుష్పదంతుని కాలం కాని ఇదమిత్ధం గా నిర్ణయించటానికి వీలు లేక పోతోంది .పుష్పదంతుని శాపం మాత్రం ,ఆస్తిక జనాలకు గొప్ప వరమై పుష్పదంత గ౦ధర్వ రాజు శివ మహిమలను వర్ణిస్తూ రాసిన మహా గొప్ప శివ స్తోత్రం ‘’శివ మహిమ్నః స్తోత్రం’’ దక్కింది .

దీనికి, సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగులో అర్ధ తాత్పర్యాలు రాసి శివమహిమతోబాటు పుష్పదంత కవి కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశారు .ఇదే ఈ నా రచనకు ఆధారం అని సవినయంగా మనవి చేస్తున్నాను .

1-మహిమ్నః పారంతే పరమ విదుషో యద్య సదృశీ –స్తుతి ర్బ్రహ్మా దీనామపి  తదవసన్నా స్త్వయి గిరః

అధా వాచ్యస్సర్వః స్వమతి పరిమాణావధి గృణన్-మమాప్యేష సోత్రే హర నిరప వాదః పరికరః ‘’

తాత్పర్యం –పరమేశ్వరా !నువ్వు నన్ను పిలిచి ‘’పుష్పదంతా ! నాసంపూర్ణ మైన మహిమను స్తుతి౦చ టానికి పూనుకున్నావు .నువ్వు పండితుడవు కాదు .ఇది నీలాంటి వాళ్లకు తగిన పని కాదు ‘’అని అంటావేమో –అలాగైతే నీ మహిమ వర్ణించటానికి బ్రహ్మాది దేవతల మాటలూ శక్తిహీనాలే అవుతాయి కదా .వాళ్ళ స్తుతులూ అసమగ్రాలే .తమ బుద్ధి శక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రతివాడూ సామర్ధ్యం లేని వాడు అవటం వలన నిందింప దగ్గ వాడే అవుతాడు .కాబట్టి నేను నిన్ను స్తుతించటానికి చేస్తున్న ప్రారంభం  ఎలాంటి ఆక్షేపణా లేనిదే .మహా మహుల స్తోత్రాలే సరితూగనప్పుడు ,నేను చేసే ఈస్తుతి ఏవిధంగానైనా దోషం లేనిదే అవుతుంది .

2-అతీతః పంధానం తవ చ మహిమా వాజ్మనసయోః   -అదద్వ్యావ్రుత్యా య౦ చకిత మభిదత్తే శ్రుతి రపి

స కస్య స్తోతవ్యం ?కతి విధ గుణః ? కస్య విషయః ?-పదేత్వర్వాచీనే  పతతి న మనః కస్య న వచః ‘’?

భావం –పరమేశా !నీ మహిమ వాక్కులద్వారా ,మనసుద్వారా ,ఊహించటానికి అతీతమైనదే .వేదం కూడా నీమహిమ వర్ణించి చెప్పటానికి శక్యం కాక ఇది కాదు ,ఇదికాదు అంటూ భయం తో చెబుతోంది .అలాంటి నీ మహిమను ఎవరు స్తుతించగలరు ?గుణాల లెక్కకు అది అందదు  .నీ మహిమ వర్ణించటానికి ఏదీ విషయమే కాలేదు .నీ మహిమ వర్ణించటం లో ఎవరి మనసైనా  ,వాక్కైనా అధోగతి పాలుగాక తప్పదు .

3-మధుస్ఫీతా వాచః పరమమృతం నిర్మితవత –స్తవబ్రహ్మన్ కిం వాగపి సుర గురో ర్విస్మిత పదం ?

మమ త్వేతాం వాణీం గుణకధన పుణ్యేన భవతః –పునామీత్యర్దే స్మిన్ పుర మధన !బుద్ధి ర్వ్యవసితా .తాత్పర్యం –సర్వ వ్యాపీ ,పరబ్రహ్మ స్వరూపీ పరమేశ్వరా !అత్యంత శ్రేష్టమైన వేదవాక్కుల్ని నువ్వే కూర్చావు .అవి అమృత సమానాలు .తేనేలాగా మహా తియ్యనైనవి .అలాంటి వేదవాక్కుల్ని రచించిన నీపై  దేవ గురువు బృహస్పతి స్తుతిస్తూ చెప్పిన మాట కూడా చాలా పేలవంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది .అలాంటి నీ గుణాలను ఈ స్తోత్ర రూపం గా స్తుతించటం వలన కలిగే పుణ్యం వలన నా వాక్కును శుభ్రం చేసుకొంటాను .త్రిపుర సంహారీ ఈశ్వరా !ఈ విషయం లో నా బుద్ధి నన్ను ప్రోత్సహిస్తోంది .మన్నించు .

Inline image 1

సశేషం

కార్తీక మాస శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2

4-తవైశ్వర్యం యత్తత్  జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు

అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’

భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే మూడు వేదాలకీ నీ  విశ్వాధి పత్యమే వస్తువు .వాటి లక్ష్యం నీ సార్వ భౌమత్వాన్ని  వర్ణించటమే .అది ఒక్కటిగానే ఉంటుంది .కానీ రజోగుణ ,సత్వ గుణ ,తమో గుణ అనే మూడు రూపాలుగా విభజింప బడుతుంది .అదే బ్రహ్మ ,విష్ణు ,రుద్ర రూపాలు ధరిస్తూ సమస్తలోకాలను సృష్టిస్తూ ,రక్షిస్తూ చివరికి ప్రళయం చేస్తుంది .అలాంటి సర్వోత్క్రు స్ట మైన నీ ఆధిపత్యాన్ని ,ఎంతోరమణీయమైన దాన్ని దుర్మార్గులకు అరమణీయం గా కన్పించి నిన్ను నిందిస్తున్నారు .

5-కిమీహం కిం కాయ స్సఖలు  కిముపాయాస్త్రి భువనం –కిమాధారో ధాతా సృజతి కిముపాదన ఇతి చ

అత ర్క్యైశ్వర్యే  త్వయ్యవనసర దుస్త్దో హతదియః –కుతర్కోయం కా౦శ్చిన్ముఖర యతి మోహాయ జగతః ‘’

తా-పరమేశా !తార్కికులు కొందరు లోకాలకు సృష్టి కర్త అయిన నువ్వు ఏ కోరికతో సృష్టి చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు .నీ ఆకారం ఏమిటి ?సృష్టికి నీ ఉపాయ౦  ఏమిటి ?నీకు ఆధారం ఏమిటి ? ఏ ఉపాదానం తో సృస్తిస్తున్నావు ?అంటూ ఊహకు అందని నీ ఆధిపత్యాన్ని గూర్చి ,నీ పై ఉన్న చెడు తలంపును బట్టి ,లోకం లో భ్రాంతిని కలిగించటానికి వాచాలత ప్రదర్శిస్తున్నారు ఇదంతా .భేషజమే ,కుతర్కమే .

6-అజన్మానో లోకాః కిమవయవ వంతో పి జగతాం –అధిస్టాతారం కిం భవ విధి రానాదృత్య  భవతి

అనీశో వా కుర్యాత్  భువన జననే కః పరికరః –యతో మందస్త్వా౦ ప్రత్యమరవర !సంషేరత ఇమే ‘’

భావం –దేవతా శ్రేస్టా ఈశా !ఈ లోకాలన్నీ విభిన్న అవయవాలు కలవి .అవయవాలున్న వస్తువుకు జన్మ ఉంటుందని శాస్త్రం చెప్పింది. కనుక లోకాలు సృష్టింప బడినవే .మరి సృష్టికర్త లేకుండా సృష్టి జరుగుతుందా ?జరుగదు .లోకాల సృష్టికి పరమేశ్వరునికంటే సమర్ధుడెవ్వరు?సృష్టి నిర్వహణకు ఆయనకు పరిజనం దేనికి ?అయన సర్వ సమర్ధుడు కదా .మంద బుద్ధులు కొందరు ఇలాంటి నీ సామర్ధ్యాన్ని అనుమానిస్తున్నారు .కనుకనే లోకం లో దీనిపై చర్చ జరిగింది.

7-త్రయీ సౌఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవమితి-ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పధ్యమితి చ

రుచీనాం వైచిత్ర్యా దృజు  కుటిల నానాపధ జుషాం-నృణా మేకో  గంయస్త్వ మసి పయసా మవర్ణవ ఇవ . ‘’

భావం –సంసార విముక్తికోసం కొందరు వేదోక్త కర్మ ,కొందరు సాంఖ్యం ,కొందరు యోగం ,మరికొందరు పాశుపతం ,ఇంకొందరు వైష్ణవం అంటూ వేరు వేరు మార్గాలు ఉపదేశిస్తూ ఉంటారు .ఎవరికివారు తమదే విశిష్టమైనదని ప్రచారం చేస్తారు .మరికొంతమంది అది పధ్యం అంటారు .ఇలా వారి వారి అభిరుచి ,వైచిత్రిని బట్టి  విభిన్న  మార్గాలు నిర్ణయిస్తారు .కాని  అన్నిరకాల జలాలకు సముద్రం లాగా సమస్తమానవులకు నువ్వే చేరదగిన వాడవు .

8-మహోక్షః ఖట్ట్వాంగ౦  పరశురజినం భస్మ ఫణినః-కపాలం చేతీయత్ తవ వరద !తంత్రోపకరణం

సురాస్తాం తామృద్ధిం దధతి చ భావద్భ్రూ ప్రణిహితాం –నహి స్వాత్మా రామం విషయ మృగ తృష్ణా భ్రమయతి ‘’

భావం –ఈశా !సృష్టి కార్య నిర్వహణలో నీకు సాధన సామగ్రి వృషభ రాజమైన నంది ,మంచం కోడు ,గండ్ర గొడ్డలి ,గజ చర్మం ,విభూతి ,పాములు ,మనిషి పుర్రె అనేవి .అయినా దేవతలు నిన్నే భక్తితో కొలుస్తారు .నువ్వు నీ కంటి సంజ్న చేత వాళ్లకు కావలసిన సంపదలతోపాటు  కోరికలన్నీ తీరుస్తావు .అనంత సంపద ప్రదానం చేస్తున్నా నువ్వుమాత్రం సంపదలు అనుభవించాలన్న కోరిక ఈషన్మాత్రం కూడా లేని వాడవు .ఆత్మలోనే నిరంతరం క్రీడిస్తూ ఆనందాను భూతి పొందుతున్న నిన్ను ఏ వస్తువూ మొహాన్ని కలిగించనే లేదు. అందుకని ఏ సమప్దపైనా నీకు అనుభవి౦చాలన్న కోరికే కలగదు .

9-ధృవం కశ్చిత్ సర్వం సకల మపరస్త్వ ధ్రువ మిదం –పరో ధ్రౌవ్యే జగతి గదతి వ్యస్త విషయే

సమస్తే ప్యేతస్మిన్ పుర మధన !తైర్విస్మిత ఇవ –స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ద్రుస్టాముఖరతా ‘’

భావం –త్రిపురాసుర భంజకా శివా !జగత్తు నిత్యం అని ఒకడు అనిత్యం అని మరొకడు అంటున్నారు .మరొకడు నిత్యా నిత్య నిర్ణయం లో కొంత నిత్యం కొంత అనిత్యం అన్నాడు .వారి వాదాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి .నిన్ను స్తుతిస్తూ వాళ్ళ ప్రతిపాదనలకు సిగ్గుపడటం లేదుకాని వాళ్ళ వాచాలత్వం నింద్యం అనిపిస్తోంది .

సర్వ వ్యాపక చైతన్య స్వరూపుడు పరమాత్మ ఒక్కడే ‘’ఎకమేవా ద్వ్తీయం బ్రహ్మా ‘’అని వేదం ఘోషించింది

10-తదైశ్వర్యం యత్నాద్య ద్యుపరి విరించో హరి రధః –పరిచ్చేత్తుం యాతావనల మనల స్కంద వపుషః

తతో భక్తి శ్రద్ధా భర గురు గ్రుణద్భ్యాం గిరిశ! యత్ –స్వయం  తస్థే తాభ్యాం తవ కిమను వ్రుత్తిర్న ఫలతి ‘’

భావం –పరమ శివా !ప్రజ్వలిస్తూ ఉండే అగ్ని స్తంభంగా నువ్వు ఉండగా ,నీ మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలనే చాపల్యం తో బ్రహ్మ తన వాహనం హంస నెక్కి ఊర్ధ్వ లోకాలకు ,విష్ణువు యజ్న వరాహ రూపం తో పాతాలలోకాల క్రిందకూ వెళ్ళారు .కాని నీ శిఖరం,నీ మొదలు వాళ్లకు కనిపించనే లేదు .ప్రయత్న విఫలురైన వాళ్ళిద్దరూ నిన్ను స్తుతించారు .వారికి దర్శన భాగ్యం కలిగించి ఆదరించావు .నీకు చేసిన సేవ ఎప్పుడూ వృధా కాదని రుజువైంది .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-1-11-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“మా అన్నయ్య” – కవితా సనకలనం

maaannayya

 

 

 

మాన్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,

          నమస్కారములు !  ముందుగా ‘దీపావళి  శుభాకాంక్షలు‘ తెలుపుకుంటున్నాను.
        మీరు నాపట్ల అభిమానంతో లోగడ పంపిన ‘మా అన్నయ్య‘ కవితా సనకలనం చదివి ఏంతో  ఆనందించాను. వెంటనే నా స్పందనలను తెలుపాలని అనుకున్నా, తెనాలి వెళ్ళటం, ఏవో ఇతర రచనలు చేయటంతో కాల  యాపన అయినందుకు విచారిస్తున్నాను.
         అయినా, ఇది ఇప్పుడు చదివి అందులోని కొన్ని మధుర భావాలను ఆస్వాదించాను. వాటిపై, నా సమీక్షను రాసి ఇప్పుడే, నా మిత్రులందరికీ అంతర్జాలం లో పంపాను.  దీనితో మరల పంపుతున్నాను.  ఎన్నో మంచి కవితలను, సోదర  సోదరీమణులు  రాసి ఈ గ్రంధానికి వన్నె తెచ్చారు.  మీరు సాహితీ  సేవలో తరిస్తూ, మావంటి సాహిత్య ప్రియులను కూడా తరింపజేస్తున్నందుకు మీకు శతథా ధన్యవాదాలు తెలుపుకుంతున్నాను.

         నా సమీక్ష మీ మనసును ఆకట్టుకుంటుందని భావిస్తాను. ప్రస్తుతానికి సెలవు.

మీ గీతాంజలి మూర్తి 

000100020003

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

స్విట్జర్లాండ్ ,యూరప్ లో అనేక దేశాలలో రైతులకు లాగానే జర్మనీ రైతులు తమకూ స్వతంత్ర ,మర్యాదా పూర్వక ,పీడన రహిత జీవితం కావాలని తిరుగుబాటు చేసి తమకోర్కేలను ‘’12 సూత్రాలలో ‘’నిబంధించారు వీటిని మేమ్మేన్జేన్ లో ప్రవీణుడైన సెబాస్టియన్ లోట్టార్ అనే యాత్రికుడు రాశాడు. ఈయనకు క్రిసోఫర్ షాపెలేర్ సహకరించాడు  .  బడుగు బలహీన వర్గాల ఆవేదన ఇందులో ప్రతిధ్వనించింది.క్రైస్తవ స్వాతంత్ర భావన ఇందులో సరళ రమణీయంగా ధ్వనించింది.ఆ ద్వాదశ సూత్రాల వివరాలు తెలుసుకొందాం .

1-మేము మా మత బోధకుడిని ఎన్నుకొని నియమించు కొంటాం .ఆయన ప్రవర్తన సరిగా లేకపోతే భర్తరఫ్ చేసి కొత్త వారిని నియమించుకొనే హక్కు అధికారం మాకు ఉండాలి .సువార్తలను యధాతధంగా బోధించేవాళ్ళు మాకు కావాలి విపరీత వ్యాఖ్యాతలు వద్దు.

2-ఇప్పటిదాకా మమ్మల్ని భూస్వాముల బానిసలుగా చూశారు .ఏసు గొర్రెలకాపరి నుంచి అత్యున్నతుని వరకు సమానం గా చూడమని స్వేచ్చ నిమ్మని చెప్పాడు .మేము స్వేచ్చగా బతకాలను కొంటున్నాం. భగవంతుని ఆదేశాలప్రకారం జీవి౦చాలికాని దైహిక భీతి సూత్రాలను అనుసరి౦చి కాదు.

3-చేపలు పట్టటం ,పిట్టలు కొట్టటం పేదవాడికి హక్కు .దాన్ని మాకు ఇవ్వలేదు .మాకు నష్టం చేసి ‘’మానవ పశువులు ‘’‘’అనుభవిస్తున్నాయి .

4-అడవులను ప్రభువులు హక్కు భుక్తం చేసుకొన్నారు .మాకు వాటిపై అధికారం కావాలి .అడవులు ప్రజలందరి హక్కు భుక్తం కావాలి .

5-మేం చేసేపనులు చాలా కష్టంగా ఉన్నాయి .ఇలా పీడించి మమ్మల్ని పిప్పి చేస్తున్నారు .న్యాయం గా మాతో పని చేయించుకోవాలి .

6-భూస్మాముల పీడన ఇక మేము సాహి౦చ లేము .భూస్వాములు మాతో చేసుకొన్న ఒప్పందాలను మేము గౌరవిస్తాం .

7-మేము చెల్లించలేని శిస్తులను బలవంతంగా భూస్వాములు లాక్కో కూడదు .

8-కష్టం చేసేవారికి తగిన ప్రతిఫలం పొందే హక్కు కావాలి .

9-ప్రజలందరికీ చెందిన బీడు భూములను ,పొలాలను కొందరు స్వంతం చేసుకొని హాయిగా అనుభవిస్తున్నారు .అవి ప్రజలందరికి  చెందాలి .

10-సమస్యలను పరస్పర అంగీకారం తో దౌర్జన్య రహితంగా పరిష్కరించుకొనే వీలు హక్కు కల్పించాలి .

11-మరణ సుంక దురాచారాన్ని పూర్తిగా రద్దు చేయాలి .అనాధుల ఆస్తులను మర్యాదకు భంగం కలిగించేట్లు కాజేయటం మేము సహించం .

12-ఈ సూత్రాలలో ఏవైనా భగవద్వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని రుజువు చేస్తే మేమే వాటిని ఉపసంహరించు కొంటాం

ఈ హక్కుల కోసం రైతులు చేసిన తిరుగు బాటును సామంతులు దుర్మార్గం గా రక్తపాతం తో అణచి పారేశారు .దీనితో రైతులు తమ జీవన పరిస్తితులు మరింత అధ్వాన్నమైనాయని గ్రహించారు . ఇలా మత సంఘర్షణలకు సాంఘిక రాజకీయాలతో ముడిపెట్టారు . 1955 లో జర్మనీలో మత ద్వంద్వతానుశాసనం చేసి ఆమోదించారు .దీనితో రాజకీయ విభేదాలు మరింత పెరిగి చివరికి యూరప్ అంతా ముప్ఫై ఏళ్ళ యుద్ధం 1618-నుండి 1648  వరకు వ్యాపించింది .దీనివలన జర్మనీలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి జర్మని జనాభా లో మూడవ వంతు జనం ఈ త్రిదశ సంగ్రామం లో హతమై పోయారు .

కాని  అదే సమయం లో సాహిత్య స్థాయి ఉన్న రచనలు అనేక వచ్చాయి .ఇదొక శుభ పరిణామం .అంతకు ముందు మత సంబంధ కరపత్రాలు ,లాటిన్ లో జీవకారుణ్య  సారస్వతం కొన్ని ప్రజాహిత రచనలు మాత్రమే వచ్చాయి 15 వ శతాబ్దం జర్మన్ సాహిత్యం ఇహ లోకానికి ,పర లోకానికి మధ్య ఉయ్యాల లూగింది .ప్రజలలో జీవితేచ్చ నశించలేదు .విధి వైపరీత్యాలను సహించగల శక్తి మీదనే తమ జీవితాన్ని తీర్చి దిద్దు కొనగలగటం మీదనే జీవన సౌఖ్యం ఆధార పడి ఉందని అందరూ గ్రహించారు .ఈ వైమనస్యాల అంతిమ పరిష్కారం 18 వ శతాబ్దం లో హేతు వాదం పూర్తిగా వ్యాప్తి చెందిన తర్వాతే సాధ్యమైంది .ఇవన్నీ నవలలో బాగా వ్యక్తమయ్యాయి .

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-16 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత  ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ అయ్యాడు .ఎన్నో విలువైన గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నాడు .పూనా లో భండార్కర్ ఓరియెంటల్రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్లో ‘’మైక్రో ఫైల్మింగ్ ప్రాజెక్ట్ ‘’ను పర్య వేక్షించాడు .హైదరాబాద్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ .ఆయన 75 వ జన్మ దినోత్సవాన్ని యూని వర్సిటి 2003లో ఘనంగా నిర్వ హించి’’ప్రమోద సింధు ‘’అనే ప్రత్యేక సంచికనుఆయన గౌరవార్ధం ప్రచురించింది .   . మల్లి నాదసూరని వివిధ కోణాలలో పరిశోధించి ఇంగ్లీష్ లో ‘’మల్లినాద ‘’ మోనోగ్రాఫ్ ను రాస్తే సాహిత్య అకాడెమి ప్రచురించింది .

ప్రొఫెసర్ లాల్యేవి ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ ,సంస్కృతం ,మరాఠీ నాలుగు భాషలలో  63 రచనలు ,93 ప్రచురణలు 431 లైబ్రరి హోల్డింగ్స్ ఉన్నాయి .అందులో ముఖ్యమైనవి కొన్ని తెలుసుకొందాం – లౌకిక న్యాయ కోశ ,నవ రస మంజరి ,మల్లినాద మనీష ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి ,శివాజీ పై కవిత ,వరదాభ్యుదయ చంపు ,లలితాసహస్రనామ స్తోత్రం ,స్టడీస్ ఇన్ దేవి భాగవతం ,ఫ్రీ ఇండియా ఫోర్జేస్,ది కార్డ్స్ అండ్ బౌన్స్ ఇన్ ది  వాల్మీకి రామాయణ , ఫ్రీ ఇండియా ఫోర్సెస్ యెహెడ్ ,నిఘంటు నిర్మాణం ,మాపులు తయారు చేయటం వ్యాఖ్యానాలు, జీవిత చరిత్ర  రాయటం ఆయన చాలా ఇష్టపడి చేశాడు .

Inline image 1  Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో  బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో రీడర్ గా ఆనంద  మోహన్ కాలేజి లో చేరి 31-12-2007 న రిటైర్ అయ్యాడు .ఇంగ్లీష్ లో ఎమిరిటస్ ఫెలో ,యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ సభ్యుడు .ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రిసెర్చ్ కు విజిటింగ్ ప్రొఫెసర్ .ప్రస్తుతం కలకత్తా పావ్ లోవ్ ఇన్ స్టిట్యూట్ ఫెలో గా ఉన్నాడు .

8 వశతాబ్ది నుండి 12  వ శతాబ్ది వరకు ఉన్న చార్వాక లేక లోకాయత భౌతిక వాదం పై శాస్త్రీయ పరిశోధన చేసి ,దాని కనుమరుగుకు కారణాలు అన్వేషించి తెలియ జేశాడు .చార్వాకం లో మత భేదాలు చాలా ఉన్నప్పటికీ అవగాహన విషయం లో అందరిదీ ఏకాభిప్రాయమే అని రుజువు చేశాడు .చార్వాకు లందరూ ఇంద్రియ వాదులు అనే అభిప్రాయం తప్పు అని సాదికారికం గా రుజువు చేశాడు  .చార్వాకమతానికి ముందుకూడా ఈ భావనలు ఇండియాలో ఉన్నాయని ,కాని దానిపైనే చార్వాకం వృద్ధి చెందింది అని చెప్పటానికి ఆధారాలు లేవని వివరించాడు .మణిమేఖలలో దొరికిన  ఆదారాలను బట్టి  మహా భారతం లో అప్రత్యక్షంగా చెప్పబడిన విషయాలను బట్టి ఈ రెండు వ్యవస్థలు ఒకే సారి ఏర్పడి ఉంటాయని భావించాడు .

భట్టాచార్య ఇంగ్లీష్ లో ‘’గ్రౌండ్స్ ఫర్ హాప్,స్టడీస్ ఆన్ ది చార్వాక ,ఎమేర్జెంస్ ఆఫ్ మెటీరియలిజం ఇన్ ఇండియా ‘’గ్రంధాలు రాశాడు బెంగాలీలో 20 దాక పుస్తకాలూ రాశాడు .చార్వాకం పై 25 దాకా వ్యాసాలూ రాసి ప్రచురించాడు .8 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .

 

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-29-10-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ

—               గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

3-కృష్ణానంద ఆగమ వాగీశ

వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650  లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి  జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప వైష్ణవ భక్తుడు .శ్రీ కృష్ణ ఉపాసకుడు .ప్రణతోషిణి రాసిన రామతోష ణుడికి  7 వ తరం వాడు .బెంగాల్ ప్రాంతం లో తాంత్రిక విద్య వ్యాప్తి చేసిన వారిలో ప్రధముడు .’’ఆగమేశ్వరికాలి మా’’ అనే నవద్వీప పూజా విధానాన్ని ప్రారంభించాడు . బీర్భం లోని మోల్లెపూర్ లో యోగ సాధన చేస్తూ తనువు చాలించాడు .

కలకత్తాదక్షిణ కాళీ ఆరాధన ప్రారంభించింది కూడా ఈయనే .ఒక రోజు కాళికా దేవి కలలో కన్పించి ,మర్నాడు ఉదయం ఆయనకు ఎవరు ఏ రీతిలో కనిపిస్తే ఆ రీతిలో తనను పూజించే పద్ధతిని ప్రచారం చేయమని కోరింది .మర్నాడు ఉదయం లేవగానే ఒక యువతీ ఆవుపేడతో పిడకలు చేసి గోడకు కొడుతూ ఉండటం చూశాడు  .గోడకు పిడక కొట్టే టప్పుడు ఆమె ‘’ఆలీఢ భంగిమ ‘’ లో కుడి పాదం ముందుకు చాచి,.కృష్ణానంద ను చూడగానే ఆమె కంగారు తో  నాలుకను దంతాల మధ్య .పెట్టి కనిపించింది .కృష్ణానంద ఈ భంగిమను మరింత వాస్తవాని దగ్గరగా మలచి కాళీ మాత పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడు .క్రిష్ణానందుడు కాళీ భక్తులకు ,కవి రాం ప్రసాద్ సేన్ కు గురువు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్—29-10-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-10-16 బుధవారం కేసి పి 75 వసంతాల ఉత్సవం లో సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి -మాడున చమురు ,పిల్లల టపాకాయల కాల్పు

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి తరగతి లో  పాసై స్వర్ణ పథకం సాధింఛి , పి హెచ్ డి,పొందారు .29 ఏళ్ళుగా సంస్కృత ప్రొఫెసర్ గాపని చేస్తున్నారు .సాహిత్యం ,వ్యాకరణం ,వేద సాహిత్యం వెంకటేశ్వర అధ్యనాలపై ఆసక్తి .వేదాంత శిక్షపై పరిశోధన చేశారు .5 గురు విద్యార్ధులకు పిహెచ్ డికి గైడ్ గా ఉన్నారు .4 గురు వీరివద్ద ఎం ఫిల్ చేశారు .వీరి విద్వత్ కు భారత ప్రభుత్వం శిక్షా విద్యా పురస్కారం అందించింది  వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉత్తమ అధ్యాపక పురస్కారం ఇచ్చింది .

యు జి కర్రిక్యులం సబ్జెక్ట్ కమిటీలో మెంబర్ గా ,బి ఓ ఎస్ చైర్మన్ గా ఎక్స్టర్నల్  మెంబర్ గా ఉన్నారు . నెదర్లాండ్ లోని మహర్షి మహేష్ యోగి వేదిక్ యూని వర్సిటి వేదంగా ,శిక్ష ప్రాజెక్ట్ కు చీఫ్ ఎడిటర్ గా పని చేశారు .తిరుమల దేవ స్థానం ప్రచురించిన స్కాంద పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు యక్ష నిరుక్తాన్ని  .సాయన వ్యాఖ్యానమున్న కొన్ని ఋగ్వేద మంత్రాలను తెలుగు లో అనువదించారు.పాణినీయ శిక్ష కు సంపాదకత్వం వహించారు ,,తైత్తిరీయ ఉపనిషత్ , తెలుగు అనువాదం చేశారు వామన –పంచ మహా కావ్యాలపై పరిశోధన చేశారు .వామన –మల్లినాద లను తులనాత్మకం గా పరిశోధించి,యజుర్వేదాన్ని వేదంగా శిక్ష ఆకారం గా ,పరిశీలించారు .వేదంగ సమీక్షా ,సంస్క్రుతస్య వైశిష్యం ,గౌతమ ధర్మ సూత్రా మనుసరేణ శాసనం పాలనం, గౌతమ ధర్మ సూత్రేషు ప్రతిబింబిత సమాజ స్థితి ,వేదోక్త వర్ణ ధర్మః ,అధర్వ వేద ఔషధ విజ్ఞానం ,ది రోల్ ఆఫ్ ఆన్దాలజి ఇన్ పర్సనల్ డెవలప్ మెంట్ మున్నగువిషయాలపై   13 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు .

తిరుమల దేవాస్థాన పత్రిక సప్తగిరిలో వేదాంత మహత్వం ,తైత్తిరీయారణ్య కం ,అన్న ప్రాశస్త్యం ,ఆది శంకరులు మొదలైన విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు.

సశేషం

దీపావళి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 లోను ,సంస్కృతం లోఎం.ఏ 19 66 లోను ,సంస్కృతం లో పి హెచ్ డి .లు పొందారు .రష్యన్ భాషలో  అడ్వాన్సేడ్ డిప్లొమా 1985 లో ,గ్రాండ్ స్టెఫీన్స్ 1966 లోను అదే యూని వర్సిటి నుంచి సాధించారు .సంస్కృత సాహిత్యం ,కవిత్వాలలో తెలుగు సంస్కృత తులనాత్మక పరిశోధనలో ,ప్రాచీన న్యాయ శాస్త్రం లోను మిక్కిలి అభి రుచి ఉన్నవారు .

హైదరాబాద్ తాండూర్ ప్రభుత్వ  హై స్కూల్ లో,ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో   తెలుగు సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించి,న్యు సైన్స్ కాలేజి ,సర్దార్ పటేల్ కాలేజి లోలెక్చరర్ గా ,30 ఏళ్ళు లెక్చరర్ ,రీడర్ ,ప్రొఫెసర్ గా సైఫాబాద్ పి జి కాలేజ్ ఆఫ్ సైన్స్ ,ఈవెనింగ్ కాలేజి ,ఉస్మానియా యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఆర్త్సండ్ సైన్స్ లోను పని చేశారు .10-11-1993 నుండి 2-3-1996 వరకు జులై 9 9 నుండి జులై 20 01 వరకు ,జూన్ 2003  నుంచి జులై 2004 వరకు ,ఉస్మానియా సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేసి రిటైర్ అయ్యారు .

పూర్వపు ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా పని చేశారు .సంస్కృతం లో యు జి మరియు పి జి బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్మన్ గా ,,1996 నుండి సురభారతి సమితి సేక్రేటరిగా ,నేషనల్ అసెస్మెంట్ ,అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు .

ఆచార్యులవారు 19 మంది విద్యార్ధులకు ఎం ఫైల్ డిగ్రీకి  ,5 గురికి పి హెచ్ డి.కి గైడ్ గా వ్యవహరించారు .30 దాకా జాతీయ సెమినార్లకు హాజరయ్యారు .9 గ్రంధాలను 30 పరిశోధన పత్రాలను  రాసి ప్రచురించారు .సిలబస్ రివిజన్ కమిటీ మెంబర్ గా ,సెలెక్షన్ బోర్డ్ మెంబర్ గా ,ఉన్నారు రేడియోలో చాలా విషయాలపై ప్రసంగించారు .ఎన్నో సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు

రొడ్డం నరసింహఆంగ్లం లో  రాసిన ‘’యోగ వాసిస్టం ‘’ను తెలుగులోకి అనువదించారు.16 వ శతాబ్ది కి చెందిన యతీంద్ర మతదీపిక అనే శ్రీనివాసాచార్య సంస్కృత గ్రంధాన్ని తెలుగు చేశారు .వినోబా భావే హిందీలో రాసిన వేద చింతన ను తెలుగు లోకి అనువదించారు.మార్కండేయ పురాణం లోని హరిశ్చ౦ద్రో పాఖ్యానాన్ని తెలుగు చేశారు .సంస్కృత అకాడెమి ప్రచురించిన యోగ సూత్ర సార ,దాతు కారిక లకు సంపాదకత్వం వహించారు .

  1.   వీరిరిసేర్చ్ పేపర్లలో ముఖ్యమైనవి –ధర్మ సూరే మల్లినాధస్య ,అధమార్ణత్వం ,రాసకలిక ,సీతారామ విహార కావ్యధూర్త సమాగమం మొదలైనవి . ఈ క్రింది  12 గ్రంధాలకు పీఠికలు రాశారు .
  2. -Purvamimamsa Bhashyavartikayormatabhedanamadhyayanam, M.Phil. Thesis in Sanskrit, A. Yajnaramulu, 1993.
  3. Nirnaya Sindhu, Dr.K.Narasimhacharya, 1994.
  4. Sri Gayatri mantrakshara mala, Sri K.Suryanarayana, 1995.
  5. Sri Alavandar Strotram, Burgula Ranganatha Rao, 1995
  6. Telugu loni vinnapasahitya Samiksha, Ph.D. Thesis, K.Perumallacharya, 1996.
  7. Andhralankara Vangmaya Charita, Ph.D.Thesis, S.G. Ramanuja Charya, 1998.
  8. Vaidika Chandah Sastram, P.Koteswara Sharma, 2000.
  9. Ramanuja Sampradaya Saurabham, Sriman Samudrala Srinivasacharyulu, 2004.
  10. Kutova manusham, Dr.A.Prabhavati Devi, 2002.
  11. Nuti Manjari, Bhallamudi Radha Krishnamurthy, 2003.
  12. Surya Satakam, Ummadi Narasimha Reddy, 1999.

Inline image 1

దీపావళి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-16 -ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రత్యేక వ్యాస ధారావాహిక

నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం రాసిన పుస్తకం అందింది.  వారికి  వేంటనే ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియ జేశాను .అప్పుడు వారు .”అయ్యా 1 మీ గీర్వాణం వీలున్నప్పుడల్లా చదువుతూ ఉంటాను . అందర్నీ చదివించే గొప్ప లక్షణం అందులో ఉంది నన్ను బాగా ఆకర్షించింది .”అన్నారు పొంగిపోయాను ఆయన అంతటి మనీషి ఇలా అనటం నా అదృష్టం అని పించింది వెంటనే .”శాస్త్రి గారూ ! రెండవ గీర్వాణం 482 మందికవులతో రాశాను. డిసెంబర్ 4 న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు ”అని చెప్పగానే” చాలా సంతోషం . డిసెంబర్ 4 కోసం ఎదురు చూస్తూ ఉంటాను ”అన్న విశాల హృదయం వారిది .

 కనుక శిమ మహిమ్నః స్తోత్రాన్నే వారి వ్యాఖ్యానం తో కొంచెం సులభతరం చేసి31-10-16 సోమవారం  కార్తీక మాసప్రారంభం నుండి అంతర్జాలం లో ధారావాహిక గా మీకు అంద జేస్తున్నానని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గా ప్రసాద్ –

సాహితీ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి ఆలయం లో 31-10-16 సోమవారం నుండి 29-11-16 మంగళవారం వరకు పవిత్ర కార్తీక మాసం సందర్భం గా ప్రతి మంగళ వారం రాత్రి 7 గం .లకు కార్తీక మాస ప్రత్యేక దీపాలవంకరణ నిర్వహింప బడుతుంది . దర్శించి తరించ ప్రార్ధన.
                                         గబ్బిట దుర్గా ప్రసాద్
                                          ఆలయ ధర్మ కర్త
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం

257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత  సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా విద్య నేర్చి బాల్యం లోనే రామాయణ భాగవత భారతాదులను చదివి ఆకళించుకొని ,తాడూరి బాల కృష్ణ శాస్త్రి ,గొల్లపల్లి సాంబశివ శాస్త్రి ,పాలెపు వెంకట రాయ శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద సంస్కృత వ్యాకరణ అలంకార ,తర్క వేదాన్తాలను అధ్యయనం చేశారు .కవిత్వం శాస్త్ర విచారాలలో  లో స్వయం కృషితో పట్టు సాధించి ,కవిత్వ, రచనల ద్వారా వాసికెక్కారు .1956 లో 23 వ ఏట పూరీ గోవర్ధన పీతాదిపతులచే ‘’సాహిత్య రత్న ‘’బిరుదం పొంది ,ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత సాహిత్య విద్యా ప్రవీణ పరీక్షలో 1961 లో ఉత్తీర్ణులై కరీం నగర్ జిల్లా లో సుల్తానా బాద్ ,,రాయకల్లు ,చొప్పదండి ధర్మపురి లలో సంస్కృత ,తెలుగు పండితులుగా పని చేశారు .శ్రీ తాడూరి శివ రామయ్య శ్రీమతి లక్ష్మీ నర్సిం ల కుమార్తె శ్రీమతి సులోచనా దేవిని ఆమె కు 5 లేక 6 ఏళ్ళ వయసున్నప్పుడే వివాహమాడారు .

సంస్కృత సాహిత్య పరిశోధనకై  కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉపకార వేతనం తో ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత అకాడెమి లో  వారణాసి ధర్మ సూరి   రచించిన ‘’సాహిత్య రత్నాకరం ‘’పై గొప్ప పరిశోధన చేశారు  .ప్రైవేటుగా చదివి ఎం ఓ ఎల్ ,తెలుగు ఎం. ఏ లను ఉస్మానియా నుంచి అందుకొన్నారు .సికందరాబాద్ సర్దార్ పటేల్ కాలేజి లో 1972 నుంచి ఆంధ్రోపన్యాసకులుగా పని చేస్తూ ,యు జి సి ఫెలోషిప్ తో ‘’ధ్వని-మనుచరిత్రము ‘’విషయం పై పరిశోధన చేసి పి హెచ్ డి పొంది ,1981 నుండి ఉస్మానియా యూని వర్సిటి స్నాతకోత్తర కేంద్రం లో ఆంధ్రోపన్యాసకులుగా చేరి ,1993 లో రిటైరయ్యారు .

శాస్త్రి గారి సంస్కృత రచనలుసంస్కృత భారతి ,ఆరాధన ,భారతి వివేచన పత్రికలలో ,వారణాసి విశ్వ విద్యాలయ సాహితీ సుషమా ,సాగర్ విశ్వ విద్యాలయ సాగరిక ,భారతీయ విద్యా భవన్ వారి సంవిత్ ,స్వాధ్యాయ మండలి వారి ‘’అమృతలత ‘’,వారణాసి ధర్మ మండలి ‘’సూర్యోదయ ‘’,మద్రాస్ రామకృష్ణ ప్రభ లలో ప్రచురితాలై భారత దేశ ప్రముఖ సంస్కృత పండితులుగా గుర్తింపు పొందారు .వీరి సంస్కృత రచనలో ముఖ్యమైనదవి 1- వారణాసి ధర్మ సూరి రాసిన సాహిత్యరత్నాకరానికి ‘’ఉన్న నౌక ,మందారం అనే రెండు వ్యాఖ్యానాలను మదించి లఘువ్యాఖ్యను మూడు భాగాలుగా సంతరింఛగా ఉస్మానియా సంస్కృత అకాడెమి 1972 ,74 ,81 లలో ప్రచురించగా యావద్భారత పండిత ప్రకాండ శ్రేణిలో ఒకరైనారు .2- సుమనో౦జలిఅనే సంస్కృత కవితా సంకలనం టిప్పణి సహితంగా1973 లో  ప్రచురించారు 3-భూ సంస్కరణలపై ‘’వసుమతీ సుధాకరం ‘’నాటకం రాస్తే ఆకాశవాణి ద్వారా ప్రసారితమైంది 4- ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి  సుప్రభాతం 5-సంస్కృత పథ ప్రదర్శిని ,6-స్వీయ సంస్కృత కవితా ఖండికల సంకలనం ‘’కవితా విపంచీ ‘’ .7-షోడశీ. ‘’8-శ్రీ ఏ సి పి శాస్త్రి గారు రచించిన ‘’నల చరిత్ర ‘’తెలుగు నాటకాన్ని రాజన్న శాస్త్రి గారు  సంస్కృతం లోకి అనువదించగా ‘’సురభారతి ‘’ప్రచురించింది .20 01 లో ఢిల్లీ సంస్కృత అకాడెమి ప్రచురించిన ‘’విశ౦తి శతాబ్దీయ సంస్కృత కావ్యామృతం ‘’లో శాస్త్రి గారి కవితా ఖండికలను చేర్చి గౌరవించింది .

తెలుగులో వైశాలి నాటకం ,వీరభద్ర సుప్రభాతం ,ఏక వీర కుమారీయం ,శ్రీ రుద్ర స్తోత్రం ,శంభు శతకం ,సరస్వతీ వైభవం ,సుమగీతాలు ,మొదలైనవి రచించారు .శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య వ్యాస సమాహారాన్ని ‘’మ౦జూష ‘’గా ప్రచురించారు .

శాస్త్రి గారి  విద్వత్తు కు తగిన పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ శృంగేరి పీతదిపతులు శాస్త్రి గారిని ఆస్థాన పండిత గౌరవం కల్పించారు సారస్వత జ్యోతి ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ,సర్వార్ధ సంక్షేమ సమితి శాస్త్ర  పండిత పురస్కారం,చ్చి సత్కరించింది . దివాకర్ల పురస్కారం ,హిందూపుర స్వర్ణ భారతీ పురస్కారం ,తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం ,కందుకూరి శివానంద మూర్తిగారి అమృతోత్సవ పండిత పురస్కారం అందుకొన్నారు .

శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారు 11-3-20 13 మాఘ బహుళ అమావాస్య నాడు 80 వ ఏట ‘’రాజశేఖర సాయుజ్యాన్ని’’ పొందారు.

ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు పంపిన ‘’మంజూష ‘’లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం .

గీర్వాణ వైదుష్యం

గణేశుని స్తుతిస్తూ రాజకీయ గణ నాయకులనూ అన్యాపదేశంగా ఎత్తి పొడిచిన కవిత

‘’అది తిష్ట న్నుచ్చ పదం –రూపకళా ఖర్వా గర్వ యుక్తశ్చ

పరి భూయ త్వం ద్విజపతి –రాప్తశ్చాదర్శనీయతాం సద్యః ‘’

ఉన్నత పద౦ లో ఉంటూ రూప కళా గర్వం తో చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వి అవమానం చేసి ప్రజాదరణ కోల్పోయాడు అని భావం .

గోదావరీ నది వర్ణ న –‘’గోదావరీ విమల వీఛి మృదంగ వాద్యే –సంవాద్యమాన ఇహ గంధ వహేన హృద్యం

బాలాపికా లపతి రమ్య రవేణ గీతం –లక్ష్మీ నృసింహ  భగవంస్తవ సుప్రభాతం ‘’

నిర్మల గోదావరీ తరంగాల మృదంగ ధ్వని ని వాయువు హృద్యంగా అందిస్తుంటే పిల్లకోయిలలు రమ్యం గా గానం చేస్తున్నాయి మేలుకో లక్ష్మీ నృసింహా .

ఏది రాసినా సంప్రదాయం చరిత్ర అంతర్లీనంగా ,కవితాత్మకంగా రాశారు శాస్త్రి గారు .అందుకే వారి వైదుష్యాన్ని అంతటి గొప్ప పండితకవి శ్రీ కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి గారు బహు గొప్పగా రమ్యంగా వర్ణించారు రాజన్న శాస్త్రి గారిని –

‘’వైదుష్యం ,లేఖకత్వం ,సుగమ ఫఃణితిభిః సంస్కృతాధ్యాపకత్వం –విద్వద్గోస్టీషు చర్చానికషణ చణతా  శాస్త్ర వాదే పటుత్వం

శక్తి ర్గైర్వాణవాణ్యాం విబుధ జన సదోభాషణే నర్గళాచ-విద్వద్రాజన్న శాస్త్రిన్ !భవతి విజయతే భారతీ సుప్రసాదాత్ ‘’

ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు ,ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల సంస్కృతోపన్యాసకులు- శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు24-10-16 న  పంపిన ‘’మంజూష ‘’పుస్తకం లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘,’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు  చేప ,పిచుక,ఎలుక ,పాము ,కోడి ,కుక్క ,మేక జంతువులతో భావ శుద్ధిగా ముఖ చిత్రం పుస్తకం లోని భావాలను వ్యనజనం చేసింది .తమ తలిదండ్రులు కీ శే లు శ్రీ పొనకంటి నర్సయాచార్యులు శ్రీమతి బాలమ్మ దంపతులకు అంకిత మిచ్చారు .

కవి కరుణశ్రీ పుష్ప విలాపం స్పూర్తి తో రాసిన కావ్యమిది .పది ప్రాణుల ఆర్తిని వాటి తరఫున మనకు అందించి ఒక సారి నిలబడి ఆలోచించమని హెచ్చరించాడు .ఇందులో మొదటిది ‘’వృక్ష విలాపం ‘’జంధ్యాలవారి పుష్పవిలాపానికి అను సృజన – గొడ్డలితో అభయారణ్యం లోని ఒక వృక్షాన్ని నరక బోతుంటే దాని ఆవేదన  ‘’వృక్ష విలాప కావ్యం ‘’అయింది .భూమిలోకి వేర్లు లోతుగా పాదుకొని ,భూసారాన్ని వృద్ధి చేస్తూ ,వానలు గుమ్మరిస్తూ ,ఆశ్రితులకు సేద తీరుస్తూ ప్రశాంత చిత్తులను చేస్తూ ఉండే తమల్ని ఉక్కు రంపాలతో మేను తుక్కు చేయవద్దని చెట్టు ప్రాధేయ పడుతుంది ‘’

‘’మా తులలేని పుష్ప ఫల మానిత వృక్ష సుగంధ మౌషదీ –రీతులు ఎన్నొ మీవయి వరించి భరించి హరి౦చి పోయే,మా

చేతనమంత చెండుకొని చీలిచి, మీచితి మంట పేర్చి మ –మ్మీతరి బుగ్గి చేతురు సుమీ నరజాతికి న్యాయ మున్నదా?’’అని ప్రశ్నించింది .జాలరిగా వల తో చేపలను పట్టుకో బోతే అవి ‘’మత్స విలాపం ‘’చేసి మనసు కరగించాయి  .

‘’నీటిని శుద్ధి చేసెదము ,నీచును నాచును నోట మ్రింగి యే-నాటికి చేటు దేము ,జలనాశన మొనర్చము మీకు వోలె మీ

నోటికి జారదేమి మము నూర్పుచు ముద్దగ మ్రింగకున్న యే-పాటిది నీట మా బ్రతుకు ప్రాణము  దీయుట పాపమే కదా ‘’అన్నాయి .’’పూర్వం మీరూ మేమూ నీళ్ళలోనే కలిసి బతికాం ,తర్వాత భూమి పైకి చేరి పరిణామ క్రమలో మీరు మానవు లయ్యారు .తోటి ప్రాణులమైన మాపై సానుభూతి లేకుండా నిత్యం వేటాడి చంపి తింటారా ?మత్స్యాలను చంపి తినటం నేరం అని చట్టం చేయలేక పోయారని బాధ పడి కవిత్వం లోమాత్రం  నెరాజాణ కనులతో మమ్మల్ని పోలుస్తారుకాని వేటాడటం మానరు ,ఇంట్లో ఆక్వేరియం పెట్టి చిత్ర చిత్రాల చేపల్ని పెంచి తమ స్వేచ్చకు బంధం వేశారని ఈసడించాయి .

‘’నెత్తురు లేని ప్రాణులని  నేరుగా గొంతులు గోయ బోక మ –మ్మెత్తిలి రక్కుచు ,పోలుసులూడగ జేతురుప్రాణము౦ డ గన్

తుత్తినియల్  తెగించి మము దుర్భర హింసల పాలు జేయ ,మీ-చిత్తము లెట్టు లోప్పే జలజాతులు సైతము ప్రాణులే కదా ‘’ అంటూ తమను  చేసే చిత్రవధ వర్ణిస్తూ బావురు మన్నాయి .

ధాన్యపు కంకుల్ని నోటకరచుకొని ఇళ్ళ వసారాలలోఅంద మైన  గూళ్ళు కట్టి కిచ కిచలతో స్వేచ్చాజీవుల్లా విహరించే పిచ్చుకని ఇప్పుడు తుపాకీ గుండుకు కూడా కనిపించక మాయమై పోయాయి .దీనికి కారణం మానవ నైజమే ప్రకృతి సమతుల్యతను కాపాడక పోవటమే .వాటి ఆరాటం విన్నాడు కవి గుండె చెరువైంది వాటి శోకం తో –

‘’పుల్లలు నోట దెచ్చి ,పూరి బోయుచు గుండ్రని గూళ్ళు గట్టుకన్ –ముళ్ళ పొదళ్ళ నైన మరి ముద్దుగ నుందుము గుంపు గూడి ,మీ

కళ్లము లందు గింజలను కమ్మగా నోటితొ నార గించుచున్-అల్లన చెట్ల పైన తిరుగాడుచు నుంటిమి ఇంతకాలమున్ ‘’అని తమ పూర్వ వైభవాన్ని చెప్పుకొని ఇప్పుడు ‘’కాలం మారి పోచ్చి –కలికాలం వచ్చి గాలి నీరు ఆకాశం కలుషితాలై   భూమిపైనే కాక చంద్ర మండలం పైనా ఉండటానికి ఆరాట పడుతున్నారు మీ మానవులు .కరెంటు దీపాలవలన పగలేదో రాత్రేదో తెలియటం లేదు ప్రేలుడు శబ్దాలతో చెవులు పగిలి పోతున్నాయి .దుర్గంధం శ్వాశ నాళాలు చిల్లులు పడుతున్నాయి వాతావరణం భీతావరణం అయి  ఫాక్టరీ పొగలు వాహనాల రోడ్లు , ,కర్బనాల కాలుష్యం ఉద్గ మించే ఉద్గారాలు మధ్య పక్షిజాతి బతక లేక చస్తోంది  గుడిసెలు భవనాలై వృక్షాలను కూల్చి వేస్తుంటే కాకులు గ్రద్దలకు ఆవాస౦కరువై అతి వృష్టి అనా వృష్టి ఆశనిపాతమైతే ,అభ్రగాలన్నీ అంతరించి కరువు కాటకాలవల్ల   గండ భేరు౦డాలు గగనమే అయ్యాయి ‘’అని విలపించి

‘’పచ్చదనము లేదు –పాప పుణ్యము లేదు –నీతి లేదు ,నిలువ నీడ లేదు –చల్లదనము లేదు -,శాంతి సౌఖ్యము లేదు –బ్రతుకు లేదు బ్రతుక భవిత లేదు ‘’అని దీన ప్రాణి బాధను కళ్ళకు కట్టించారుకవి .దడులు ,దప్పర్లపై దర్శనమిచ్చే కాలకంఠాలు,పందిరి పాకలపై వాలే బండారు పిట్టలు ,తుర్రుమనే బుర్రు పిట్టలు ,ముక్కుతో  చెట్టు కాండాన్ని  తొలిచే వడ్రంగి పిట్టలు ,కన్జరీటాలు,పొట్టి గిజిగాళ్ళు ,పాలపిట్టలు ,పూరేళ్లు ,కంటికి కనిపించటమే లేదని ఇదంతా మానవ స్వయం క్రుతాపరాధమేనని ప్రకృతి హనానమే దీనికి కారణమని కవి నిష్కర్షగా చెప్పాడు చివరికి

‘’శాస్త్ర వేత్త లార ,సంఘ సేవకులార –ధర్మ నిరతులార ,ధన్యులార –సుకృత కార్యము లచె ప్రకృతిని కాపాడి –పక్షి జాతికొరకు పాటు బడరె’’అని పక్షిజాతి తరఫున వకాల్తా తీసుకొని న్యాయం చేయమని ప్రజా కోర్టును వేడుకోన్నారుకవి .ఇక మూషికశోక కావ్యాన్ని  వినిపిస్తాడు కవి .  ‘’గజ ముఖ వాహనం అని పొగుడుతూ ఇంట్లో దూరితేమాత్రం బోనులు పెట్టి మందులుపెట్టి  పిల్లుల్ని పెంచి  పచంపుతారు .పొట్టిగా ఉన్న కారణం తో ‘’చిట్టెలుక ‘’అని చీదరిస్తారు ‘’కాని

‘’ముందుగ సూది మందులను మూషిక మూకల కిచ్చు చుండి ,మీ –రందరు వాడు చుండెదరు  హాయిగ జీవిత కాల మంతయున్ ‘’అని తమలను ఎలా వాడుకొంటున్నారో మనుషులు తెలియ జేసి ,’వ్రేలెడు లేని ఎల్కలనువేదనలకుం గురి జేతురేల,మీ-జోలికి రాని మమ్ము పరిశోధన పేర ప్రయోగ శాలలన్ –మూలుగ జేసి మా బ్రతుకు ముంచుట న్యాయమా ?’’అని ప్రశ్నించింది . ‘’మీ క్షేమం కోసం మా బ్రతుకు ఏమార్చటం ఏం న్యాయం ?అంది

‘’అవని యందు నరులు అవసానము వరకు –ఆధిపత్యము గను బ్రతుకు చుండ

అల్పప్రాణికిటుల అవకాశము లేక –స్వల్ప కాలమందె సమయు  చుండె’’’’అని గోడు గోడున బాధ  వెళ్ళగక్కుకొని అల్పప్రాణులను మానవులు ఎంత నీచంగా చూస్తూ స్వార్ధానికి వాడుకొంటు న్నారో తెలియ జెప్పింది .

సర్పాల కూ స్వగతాలుంటాయి .దాన్నీ ఆవిష్కరించాడుకవి సర్ప విలాపం లో .’’చీమల పుట్టల్లో దూరి ఎప్పటికైనా బయటికి వస్తే చావ చితక కొడతారు .భూలోక వాసులు భూత దయ లేక వెంటాడి వేటాడి చంపుతారు. మాలోకమే మేలు అనుకొంటే ఆ నాగ లోకం ఎక్కడో మాకు తెలీదు ఆదిశేషుని దగ్గర మొర పెట్టుకొందామంటే వైకుంఠ ద్వారం ఎక్కడుందో అంతు బట్టటం లేదు .శంకరాభరణాల వంక చేరుదామంటే కైలాసమార్గం తెలీదు .నాగ దేవత అని కొలుస్తారుకాని కనిపిస్తే మాత్రం కాల రాస్తారు .అడవుల్ని ఆరగించటం తో అజగరాలు ,కొండా కోనా పిండి చేస్తుంటే కొండ చిలువలు ,పుట్టలు పొదలు నాశనం చేస్తుంటే నాగులు ,చెట్టూ చేమా పోయి వాన కోయిలలు అరుదై పోయాయి .పొట్టకూటికోసం పెట్టెల్లో బంధించి ఆడిస్తున్నారు  మా జీవితాలతో నే ఆడుకొంటున్నారు –అని ‘’

‘’నాగిని నృత్యమంచు నవ నాడులు పొంగగ నర్తకీమణుల్ –భోగము వోలె హస్తములు మోమున కెత్తుచు ,మొగ్గ వేయుచున్

తీగెలు సాగగన్ తనువూ తీపులు బెట్టగ దొరలు చుందురే –నాగులు నేలపై నిటుల నాట్యము సేయగ జూచినారటే’’అని మానవ వికృత చేష్టలను ఎండ గట్టింది .పాముల్ని కోసుకు తింటూ కోరలు పీకి హింసిస్తూ ,విషం తో ఔషధాలు చేసి అమ్ముకొంటూ ,చర్మాలను ఒలిచి వేష భూషణాలు తయారు చేసి ధరిస్తూ ,చాదస్తంగా చలన చిత్రాలలో చపల చిత్తంగా నటింప జేయిస్తూ ,మొక్కులు చెల్లిస్తూ చలిబిడి పె, పాలు పోస్తూ పూజిస్తూ కూడా కనబడితే హత్య చేస్తున్నారు .పాలు తాగాలంటే పెదవులేలేవు పాయసం తిందామంటే నాలుక చీలి ఉంది ,సాధ్యం కాదు కనుక మీ నైవేద్య భాగ్యాలు మేము తినలేం .కలుగులో ఎలుకలే మా ఆహారం .ప్రయాణం చేసేటప్పుడు మేము ఎదురైతే దోషమా ,

‘’గరుడ పక్షులువెంటాడి తరుము చుండు –కరకు ముంగిసల్ తనువులు తురుము చుండు

నరులు దొరికించుకొని నెల జారుచు చుండ –బ్రతుకు సాగించు టెట్టులో భద్రముగను ‘’అని పాము విలపించింది .

‘’పక్షుల మయ్యి ,పై కేగురు పాటవ మెంత యు లేక నేలపై –రక్షణ లేని మమ్ము సుకరంబుగ పోషణ జేసి మానవుల్

భక్షణ జేయ  నెంచియు కృపాణము చేసేడిచెంత జేర మా –చక్షుల నీరు జారినది జాలిగ’’కుక్కుట శోక కావ్యమై ‘’అని కోడి విలాపం మొదలు పెట్టాడుకవి .’’కంచె చేను మేసినట్లు 21 రోజులు పెంచి పోషించి పండగకో పబ్బానికో చుట్టాలోచ్చారానో కోసుకు తింటారు .కోడికూర తింటే కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుందని తెలిసినా తినటం మానరు .పు౦జుక్రీడలతో  జూదం ఆడుతారు .కోడిపుంజులాట కొంపలు ముంచినా మానలేరు

‘’బుద్ధుదహింస ధర్మమే బోధ జేసే –రామ కృష్ణు దాహిమ్సచే  ప్రేమ వడసె

గాంధి సత్యగ్రమహింస గాదె చూడ –హింస మానవ ,మానవ హితము కోరి ‘’అని కొక్కొరో కొ సూక్తి చెప్పింది .

‘’శ్వాన విలాపం ‘’లో కుక్క కూడా మనిషికి గడ్డిపెట్టింది .కనిపిస్తే రోకటితో కొడతారు .తాడుతో గొలుసుతో బంధించి పెంచుకొంటారు .విశ్వాసానికి మారుపేరని పొగడుతూనే ,కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటూ ,కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయి౦చు కొంటారు .సంకరజాతి కుక్కలపై  ఉన్నమోజు స్తానికులమైన ఊరకుక్కలపై లేదు

‘’చిత్త కార్తె లో మాత్రమేచిత్తగించి –పిల్లలను గను చుండు మా పిచ్చి తల్లి

బిడ్డ లెట్లు బ్రతుకు నంచు బెంగ టిలుచు –ఒడిని పాలిచ్చి పెంచును కడుపు నిండ’’

అని తమ వీధి బాగోతం చెప్పుకొన్నది .జంతు ప్రేమికులకు తమపై జాలి లేదని ,జీవకారుణ్యం వారికీ పట్ట లేదని వాపోయింది –‘’

‘’పక్షి మృగ జాతు లన్నింటి ప్రాణమొకటే –అన్ని ప్రాణుల నుండేడి నాత్మ యొకటే

మహిని మనిషికి కుక్కకు మరణ మొకటే –జన్మ ఏదైన ప్రాణికి జనన మొకటే’’అంటూ శంకరాచార్యునిలా అన్నమయ్య లా తత్వ బోధ చేసింది .

‘’మేష విలాపం ‘’లో మేక మేమే అంటూ మౌన రోదనతో గుండెలోని బాధ కోడిలాగానే వెళ్ళ గక్కింది .’’క్షుద్ర పూజల్లో మమ్మల్ని నరకడం న్యాయమా ,జంతుబలి నిషేధం గా ఉన్నా పాటించక పోవటం పాడికాదు అని బుద్ధి చెప్పింది

‘’భక్తి మార్గము నందునె ముక్తి గనగా –శక్తి యుక్తుల యందు నాశక్తి ఏల

సాత్వికాహార మందునే సత్తువవుండ –మాంస భక్షణ పై మీకు మక్కువేల ?అనిచీవాట్లు  పెట్టింది .

‘’లేత చిగురు మేయు లేడి పిల్లల నైన –ఆకులలములు దిను మెకమునైన –

సాదు జంతువైన చంప బూనుదు రేల-కూటి కోసమేన వేట యకట ?’’అని మృగయా వినోదం పాపం అన్నది ‘’మృగ విలాపం ‘’లో లేడి .పంచ భూతాలూ కూడా తమ గోడును  ‘’భూత విలాపం ‘’గా వినిపించాయి

‘’ఆకస మందు వాయువు అందును అగ్నియు ,అగ్ని వాయువుల్ –ఏకము కాగ నందు జలమేర్పడయా జలమందు పృథ్వి ,ని

ర్వాకము నొంద, పృథ్వి పయి వ్యస్తముగా జనియించె నోషధుల్ –ఆకర మాయే దారుణి చరాచర సృష్టికి విశ్వ మందుననన్ ‘’అని ఉపనిషత్ లలోని  ,ప్రాణి అవిష్కారాన్ని ఒక్క పద్యం లో చక్కగా చెప్పాడు కవి .చివరగా

‘’విశ్వ శోధన జేయు మీ విజ్నులకును –విశ్వ కారణ మేమియొ విదితమైన

ఆత్మ సాధన యందు తాదాత్మ్య మొంద-అంతరంగము నందునే యరయ లేర’’అని విజ్ఞాన వేత్తలకు చక్కని సుద్ది చెప్పి బాహ్య శోధనం కంటే అంతరంగ శోధన మంచిదని హితవు చెప్పాడు కవి దక్షిణా మూర్తి .

ఈ కవికి పద్యం ఒక రసప్రవాహమై నడిచింది .సందర్భ భావ శుద్ధి తో ప్రతిపద్యం హృద్యమైనది .పదాల వెదుకు లాట లేదు .అవి వాటి కవసరమైన స్థానాల్లో కూర్చుని పద్యానికి అందం లయ ,సౌభాగ్యం కల్పించాయి. కవి సహజ కవి అనిపించాడు . సుమారు అయిదేళ్ళక్రితం ఇలాగే ఒక కవి కోడి మేక ఆవు లఅంతరంగం పై పద్య కవిత్వం రాస్తే ఆ నాటి విజయవాడ ఆకాశవాణి డైరెక్టర్ మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నాకు పంపి సమీక్ష చేయించి నాతో రికార్డ్ చేయించి రేడియో లో ప్రసారం చేయించిన సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది .సమస్త ప్రాణికోటి మీదా కవి కున్న దయా దాక్షిణ్యాలు చూస్తే ఆయన్ను ‘’దయా దాక్షిణ్య  దక్షిణా మూర్తి ‘’అనటం భావ్యమని పించింది .కవి స్వగ్రామ౦ తెలంగాణా లోని ఆదిలాబాద్ మండలం లో లక్సెట్టి పేట మండలం లోని ఇటిక్యాల . మరిన్ని అర్ధవంతమైన కావ్య రచన కవి నుండి ఆశిద్దాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

—  ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23

41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ  చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం అధ్యయనం చేశాడు .1907 లో స్థానిక ఫిలసాఫికల్ చాప్టర్ కు 24 వ ఏట ప్రెసిడెంట్ అయి ,1908 లో విస్తృత పరిజ్ఞానం కోసం ఇండియాలో మద్రాస్ లో ఉన్న అడయార్ కు వెళ్ళాడు .

 అనీబిసెంట్ ఉపన్యాసాల ప్రభావవంతో దియసఫీ పై ఆసక్తి పెరిగి ,ఆ సోసైటీలో చేరి మాంచెస్టర్ లాడ్జి లో ఉన్నాడు .తర్వాత అడయార్ సొసైటీకి 1908 లో ప్రెసిడెంట్ అయిన బీసెంట్ కు ముఖ్య అనుచరుడయ్యాడు .1909 లో అడయార్ కు లీడ్ బీటర్ ,చార్లెస్ వెబ్ స్టర్ లు వచ్చి చేరారు .లీడ్ బీటర్ బాల  జిడ్డు కృష్ణ మూర్తి ని కనుగొని ఆతడే భవిష్యత్తులో ప్రపంచ గురువు అని ప్రకటించిన విషయాన్ని ఎర్నస్ట్ వుడ్ ‘’ఈజ్ దిస్ దియాసఫీ ?’’అనే  పుస్తకం లోను ఆ తర్వాత రాసిన వ్యాసాలలోను పేర్కొన్నాడు .

 బీసెంట్ సలహాతో వుడ్ విద్యా బోధనలో చేరి సొసైటీ ఏర్పాటు చేసిన స్కూళ్ళలో కాలేజీలలో బోధన చేశాడు .తరవాత సింద్ నేషనల్ కాలేజి మదన పల్లి కాలేజి లలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా చేశాడు .దియాసఫిని క్లాసులలో బహిరంగ ఉపన్యాసాలలో ,రచనల ద్వారా బాగా వ్యాప్తికి తెచ్చాడు .హెలెనా బ్రావిస్కి రాసిన ‘’సీక్రేడ్ డాక్ట్రిన్’’కు మంచి ప్రచారం తెచ్చాడు .ఇండియాలో ఆసియా ఐరోపా దేశాలలో అమెరికాలోను పర్యటించి దియాసఫీ పై ప్రసంగించి అవగాహన పెంచాడు .1932 లో ఒక నౌకా ప్రయాణం లో అవతార్ మెహర్బాబా నుచూశాడు .రెండవ ప్రపంచ యుద్ధ పరిసమాప్తి వరకు ఇండియాలోనే ఉండి తర్వాత అమెరికాకు  వెళ్ళాడు .

   దియాసఫీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమై యోగా మీద దృష్టి పెట్టి లోతులు తరచాడు .జిడ్డు కృష్ణ మూర్తి విషయమై సొసైటీ చీలిపోయి ,1933 లో అనిబిసెంట్ మరణానంతరం వుడ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .లీడ్ బీటర్ కు పూర్తీ అనుచరుడైన జార్జి అరండేల్ పావులు కదిపి ఎర్నెస్ట్ వుడ్ ను ఓడించాడు .ఇది మోసం దగా ,కుట్ర అని వుడ్ ఆరోపించాడు .దిశా నిర్దేశనం లేని సొసైటీ పై అసంత్రుప్తికలిగినా జిడ్డు వారి స్వయం వ్యక్తిత్వం పై ఆరాధనాభావమేర్పడి యోగం పై మనసు కేంద్రీకరించాడు .

           వుడ్ యోగ

భారత దేశం లోనిఎందరో యోగులను ,పండితులను కలిసి చర్చించాడు .అందరూ స్నేహితులయ్యారు చిన్ననాటి స్నేహితుడైన ఎడ్విన్ ఆర్నోల్డ్ రాసిన ‘’లైట్ ఆఫ్ ఏసియ’’గ్రంధం చదివి శాకాహారిగా ,,మద్యపానానికి దూరంగా ఉన్నాడు .మైసూర్ లోని శృంగేరి శివ గంగ సంస్థానం శంకరాచార్య స్వామి ఎర్నెస్ట్ వుడ్ యోగ సాధన సంస్కృత బోధనా  గుర్తించి ‘’శ్రీ సాత్వికాగ్రగణ్య ‘’బిరుదు ప్రదానం చేశారు ..భారతీయ యోగులలో ఏ ఒక్కరికీ వుడ్ శిష్యుడు కాడు.1928 లో అమెరికా వెళ్ళినప్పుడు జిడ్డు కృష్ణ మూర్తి ని మళ్ళీ కలుసుకొని ,అయన స్వయం వ్యక్తిత్వానికి ఆకర్షితుడై యోగ సాధనపై గ్రంధాలను చదివాడు .ఇక జీవితమంతా యోగ పై పుస్తకాలు రాస్తూ గడిపాడు .అమెరికా మళ్ళీ వెళ్లి కాలిఫోర్నియా లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఏసియన్ స్టడీస్ ‘’కు ప్రెసిడెంట్ గా ,డీన్ గా  పనిచేసి ,టెక్సాస్ లోని హూస్టన్ యూని వర్సిటి లో పని చేశాడు .

  ఇండియాకు తిరిగివచ్చి ‘’గరుడ పురాణం ‘’ఆంగ్లం లోకి అనువదించాడు .పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత ,శంకరాచార్యుల వివేక చూడామణి కూడా ఆంగ్లం లోకితర్జుమా చేశాడు .ఈ ఉద్గ్రంధాలు ,వాటి వ్యాఖ్యానాలు ఆధునిక మానవునికి కరదీపాలని స్పష్టంగా చెప్పాడు .ఇండియా లో భార్య హీల్డా తో కలిసి మేరియా మాంటిసోరి విద్యా వ్యవస్థలో కొనసాగాడు.ఇటలీ లోని ముస్సోలినీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో 1939 లో మేరియా మాంటిస్సొరి అడయార్ దియసఫికల్ సొసైటీ వారి ఆహ్వానం పై ఇండియా వచ్చి అడయార్ లో 19 37 నుండి 10 ఏళ్ళు 1948 వరకు ఉన్నది .ఆ కాలం లోనే ఇండియాలో చాలా మాంటిసోరి వద్యా సంస్థలు వెలిశాయి .

    1950  లో వుడ్ దంపతులు అమెరికాలో హూస్టన్ లో స్థిర నివాసం యేర్పచుకొన్నారు.యూని టేరియన్ ఫెలోషిప్ ఆఫ్ హూస్టన్ లో క్రియాశీలకం గా పని చేశాడు  .అక్కడ మాంటిస్సొరి స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది వుడ్ ను అనేక ప్రాంతాలవారు ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేశారు .1962 లో స్కూల్ ఏర్పరచి మాంటిస్సొరి భావ వ్యాప్తి కలిగించారు .విరిల్ రోడ్ లో ఫెలోషిప్ ప్రాపర్టి కి దగ్గర చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వుడ్, హీల్డా దంపతులు అతి నిరాడంబరం గా ప్రశాంతంగా జీవిస్తూ స్కూల్ ను సర్వతోముఖంగా అభి వృద్ధి చేసి సంతృప్తి చెందారు  .1965 లో సెప్టెంబర్ 17 న 82 వ ఏట ఎర్నెస్ట్ వుడ్ ,ఆ తర్వాత 1968 లో హీల్డా మరణించారు .తరువాత బోర్డ్ వారు ఈ స్కూల్ ను’’ ది స్కూల్ ఆఫ్ వుడ్స్ ‘’అని గౌరవ ప్రదంగా మార్చారు .వుడ్ మరణాన౦తరమే ఆయన రాసిన వివేక చూడామణి అనువాదం ‘’ది పిన్నాకిల్ ఆఫ్ ఇండియన్ థాట్ ‘’ముద్రింప బడింది .

Inline image 1  Inline image 2

 సశేషం

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’

 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల వంటి ఉద్దాదుల వద్ద ఇండాలజీ చదివాడు .19 72 – 73 కాలం లో నేపాల్ లో  మీమాంస శాస్త్రాన్ని  జనునాద పండిట్ వద్ద అభ్యసించాడు .1972 -78 మధ్య కాట్మండు లో ‘’నేపాల్ –జర్మన్ మాన్యు స్క్రిప్ట్ ప్రిజర్వేషన్ ప్రాజెక్ట్ ను ,’’నేపాల్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచాడు . టూబింజేన్ ,లీడెన్ ,లలో పని చేసి 1986 నుండి హార్వర్డ్ లో చేస్తున్నాడు .క్యోటో పారిస్ టోక్యో లకు రెండేసి సార్లు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు .1972 నుంచి సంస్కృతాన్ని బోధిస్తున్నాడు .

 వేద సంస్కృతం లో ప్రాచీన భారత దేశ చరిత్రలో ని మా౦డలీకాలు ,వేదమతాభి వృద్ధి భారత ఉప ఖండం లోని భాషా శాస్త్ర పూర్వ చరిత్ర మొదలైన వాటిపై , విస్తృత పరి శోధన చేసిన వాడుగా మైకేల్ విత్జేల్ గుర్తింపు పొందాడు .’’ఎలక్ట్రానిక్ జర్నల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ‘’కు హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ కు  ముఖ్య సంపాదకుడుగా ఉన్నాడు .1999 నుంచి ‘’స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఆఫ్ ప్రి హిస్టరీ ‘’అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నాడు .2006 నుండి ‘’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఫర్ కంపారటివ్ మైదాలజి ‘’కి ప్రెసిడెంట్ .2003  లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .2009 లో జర్మన్ ఓరియెంటల్  సొసైటీ  గౌరవ సభ్యుడయ్యాడు .  ,2012 లో రాసిన ‘’కంపారటివ్ మైదాలజి ‘’గ్రంధం గుర్తింపు వలన హార్వర్డ్ యూని వర్సిటి లో   ఫాకల్టిఅఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కు కాబట్ ఫెలో గౌరవం20 13 లో  పొందాడు   .

     విత్జేల్ ముఖ్య పరిశోధన అతి ప్రాచీనమైన వేదాలపైన వాటి వ్రాత ప్రతులు ,పారాయణ పద్ధతులపైన.అంతకు పూర్వం లభించని కొత్త ప్రతుల అన్వేషణ చేశాడు .ఆతను సాధించింది ‘’కధా ఆర్యాంక ‘’.ఋగ్వేదాన్ని జర్మన్ భాషలోకి టి గోటే తోకలిసి కొత్తగా తర్జుమా చేశాడు .వేద శాఖల గూర్చి,ఉత్తర భారతం ఆ పై ప్రాంతాలలో వేద సంస్కృతీ వీటి వలన ఎలా వ్యాపించిందీఅనే విషయాలపై  విస్తృత పరిశోధన చేశాడు .దీనికోసం వేద మా౦డలీకాలపై 1989 లోను ,వేద ప్రామాణ్య అభి వృద్ధి  పై 1997 లో , ప్రాచీన భారతం పై 2003 లో పుస్తకాలు రాశాడు ఇవికాక విస్తృత పరిశోధనతో రాసిన వ్యాసాలూ చాలానే ఉన్నాయి అందులో ‘’ది అనాలిసిస్ ఆఫ్  ఇంపార్టెంట్ రెలిజియస్ అండ్ లిటరరీ కాన్సెప్ట్స్ ,ది సెంట్రల్ ఏసియ యాంటి సిడేన్ట్స్ ,ది మహా భారత ,ది కాన్సెప్ట్ ఆఫ్ రి బర్త్ ,ది లైన్ ఆఫ్ ప్రాజేని (సంతాన రేఖ ),సెవెన్ రిషిస్ ముఖ్యమైనవి .

 విత్జేల్ మరో గొప్ప పరిశోధన –మధ్యయుగ  ,ఆధునిక భారత దేశం నేపాల్ లలో సంప్రదాయాలు భాషా శాస్త్రం ,బ్రాహ్మణులు ,కర్మ కండలు ,రాజ్యాధికారం ,ఈ నాటి సంస్కృతీ ..మరో పరిశోధన వేద గ్రందాల స్థానీకరణ .ఋగ్వేద ,కృష్ణ యజుర్వేద సంహిత ,బ్రాహ్మణాల కాలం లో ప్రాచీన భారత దేశ చరిత్ర .కౌరవులది ఢిల్లీ ప్రాంతమే అన్న మరో పరిశోధన .ఇటీవలి కాలం లో విత్జేల్ –ఇండియన్ ,యూరేషియన్ పురాణాలకు ఉన్న సంబంధం –దీనివలన చారిత్రాత్మక తులనాత్మక పురాణ బంధాలు తెలిశాయి .ఇండస్ లిపి లోని భాషాశాస్త్ర సహజత్వాన్ని ప్రశ్నించాడు .హార్వర్డ్ లో అనేక అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించి ఫలప్రదం చేశాడు .కాలి  ఫోర్నియా  స్టేట్ స్కూల్ చరిత్ర పుస్తకాలలో మార్పులు చేయాలని అమెరికాలోని వేదిక్ ఫౌండేషన్ ,హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఒత్తిడి చేస్తే విత్జేల్ నాయకత్వం లో ఒక  ఎక్స్ పర్ట్ పానెల్ ను వేసి మార్పులపై అధ్యయనం చేయమన్నారు .మధ్యవర్తిత్వం జరిపి కోరిన 58 మార్పులలో 12 మాత్రమె ఒప్పుకొని ఒక అవగాహన కుదిర్చి పుస్తకాలలోని విషయాలు మార్చనక్కర లేదని రిపోర్ట్ ఇచ్చాడు .దీనితో ఆయన హిందువులకు వ్యతిరేకి అని అభాండం వేశారు .2009 లో ఇండియా చైనాలు పర్యటించాడు .తాను హిందువులకు వ్యతిరేకిని కానని చెప్పుకోవాల్సి వచ్చింది .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-16 –ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21

39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ గా పని చేశాడు .నాలుగు దశాబ్దాలు ఇండియా లో ఉన్నాడు .భారత దేశానికి చెందినకానూన్ బీబీ ని పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలను కన్నాడు. వారిద్దరూ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులను వివాహం చేసుకొన్నారు .1786 లో బిహార్ లో పర్య టించి మిలిటరీ రూట్ సర్వే మాప్ తయారు చేశాడు .అక్కడి నుంచి బెనారస్ కు మారాడు .మొఘల్ బేగ్ అనే ముస్లిం స్నేహితుడి తోపరిచయం పెరిగి అతన్ని పండిట్ సర్వేయర్ గా భావించాడు .బేగ్ తో కలిసి వాయవ్యభారత్  ,దక్షిణ పంజాబ్,మరియు బావల్ పూర్ లకు మిలిటరీ రూట్ మాప్ లను తయారు చేశాడు .

సంస్కృత విద్వాంసుల ,ఓరియంటలిస్టు లతో ముఖ్యంగా విలియం జోన్స్ ,చార్లెస్ విల్కిన్స్ ,హెచ్ హెచ్ విల్సన్ ,హెచ్ టి కోలేరూక్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొన్నాడు .1794 లో ఆర్మీ నుండి రిటైరై బెనారస్ లో స్థిర పడ్డాడు .బ్రిటిష్ రెసిడెంట్ జోనాధన్ డంకన్ స్థాపించగా ఈస్ట్ ఇండియా కంపెనిసంస్కృత పండితులకు శిక్షణ ఇవ్వటానికి ఈస్ట్ ఇండియాకంపెని ఏర్పాటు చేసిన  వారణాసి సంస్కృత కళాశాలకు సెక్రెటరిగా చేశాడు .ఈ కాలేజి పై ఫ్రాన్సిస్ ప్రభావం విశేషంగా ఉండేది .చనిపోయే ముందు తనకు ఇష్టుడైన వాడిని ముఖ్య పండితుని స్థానం కట్ట బెట్టాడు .  విల్ ఫోర్డ్ చాలామందిపండితులను  కాపీయిస్ట్ లుగా ,అనువాదకులుగా ,సర్వేయర్లు గా నియమించాడు  .1790  సంవత్సరం అంతా పురాణాలు ఇతర సంస్కృత గ్రంధాలలో ఉన్న జాగ్రఫీ విషయాలను సేకరించాడు .చారిత్రిక కావ్యాలు ఐతిహాసాక కదల నుండి జాగ్రఫీ కి చెందిన వాటిని పొందు పరచాడు .భారతీయ సంస్కృత పండితుల మధ్య కూర్చుని వారితో పాటు స్వరం కలుపుతూ హిందూ పురాణాలు పాశ్చాత్య గాధలు బిగ్గరగా చదివే వాడని బైయిలీ రాశాడు.సాదృస్యాలను వెంటనే రికార్డ్ చేయించేవాడు .పురాణాలలో ఉన్న మిశ్ర అనే పదం ప్రాచీన ఈజిప్ట్ పేరైన అల –మిస్ర్ అని గమనించాడు .  Leask points that:

Sanskrit Cosmography had been metamorphosed into geography by ‘follow[ing] the track, real or imaginary, of [Hindu] deities and heroes; comparing all their legends with such accounts of holy places in the regions of the west…preserved by Greek mythologists; and endeavouring to provide the identity of the places by the similarity of the names and remarkable circumstances’.[3]

నోవా అతని ముగ్గురు కొడుకులు జాఫెత్ ,హాం, షేం  పేర్లు సంస్కృతం లో సత్య వ్రత కుమారులైన జపేటి చర్మ ,శర్మ అని ఇది పద్మ పురాణం లో ఉందని చెప్పాడు .శర్మ కొడుకులు నైల్ లేక కాళి నదీ తీరాలకు వలస పోయారని .చర్మ నీగ్రో కొడుకులు నోవా ను హేళన చేసినందుకు శాపం పొంది ఇండియాకు వలస వచ్చారని ,అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్ళారని వీటికి తాను ఆధారాలు సేకరించానని విల్ ఫోర్డ్ చెప్పుకొన్నాడు .ఈజిప్ట్ లోని ఆధునిక డేనిజేన్లు శర్మ కొడుకులు సేమటన్లు అన్నాడు .వీరు పూర్తిగా స్థిరపడి చర్మ కొడుకులు హాస్యాసిలన్లను  ఎడారి ప్రాంతాలకు వెళ్లి పొమ్మని బహిష్కరించారు .వాళ్ళు అక్కడ నుంచి ఆఫ్రికా వెళ్లి అక్కడే  వ్యాపించి ఉండి పోయారు .ఈ కధను నేగెల్ లీస్క్  colonial construction of racial hierarchy to subordinate Egypt to India :అన్నాడు . This subordination of Egypt to India in terms of chronological priority is accompanied by a distinctly colonial construction of racial hierarchy in which the inhabitants of contemporary Africa are equated with the aboriginal inhabitants of India, both descended from the proscribed family of Ham, Charma, or Hasyasilas(‘the laughter’).[3]

1788 లో విల్ ఫోర్డ్ ప్రాచీన ఈజిప్ట్ గురించి రాజుల గురించి  భారతీయ పురాణాల గురించి అనేక గ్రంధాలు రాశాడు .భారతీయులు నైలు ,ఈజిప్ట్ ప్రాంతాలలో స్థిర పడ్డారని గ్రీకులకు కూడా మూల పురుషులు హిందువులే అన్నాడు .17 9 లో విల్ ఫోర్డ్ ‘’ఈజిప్టు ,కాళి నదికి సమీప దేశాలు ‘’అనే వ్యాసం రాశాడు .కాళి అంటే నైలు నది ,సంస్కృత కుశద్వీపమే ఆధునిక ఇతి యోపియ లేక అబిసీనియా .మానిచేరియాన్ జాతిలో ఒక భాగం ఉత్తర పడమర భారతం లో వ్యాపించారు అన్నాడు .ప్రాచీన క్రిస్టియన్ క్రాస్ లు కేరళ త్రవ్వకాలలో బయట పడ్డాయని అందుకని క్రైస్తవానికి మూలం హిందూ దేశమే నని చెప్పాడు .దీనితో హిందూ ముస్లిం క్రైస్తవులు అభ్యంతం చెప్పారు శ్వేత ద్వీపం అంటే బ్రిటిష్ ఐల్స్ అన్నాడు . Wilford, in fact, attributed lotus-like division of Old Continent to his puranic source as:

lotus-like division of the old continent into seven ‘dwipas’ or climates centred on Mount Meru, from whence four rivers flowed to the cardinal points of the earth. Moving in a north-westerly direction from Jambu (India), the six dwipas were as follows: Cusa (the country between the Persian Gulf, the Caspian Sea, and the Western boundary of India); Placsha (Asia MinorArmenia, etc,.); Salmali (Eastern Europe, bounded on the west by the Baltic and Adriatic Seas); Crauncha (Germany, France, and the northern parts of Italy); Sacam – alternatively Swetam, the White Islands (The British Isles, surrounded by the ‘sea of milk’); Pushcara (Iceland)[3][9]

Wilford narrated the story of Salivahana that the child had born to a virgin and a carpenter, later became a mystic, and finally crucified in a Y-shaped plough. In 1805, Wilford had confessed publicly that some of the manuscripts he had been working were, in fact, forged, though, he didn’t specifically refer to the Salivahana story; later, when he had published in 1807 – 2 years after his confession -, he preceded it with a disclaimer as: The Salivahana story ‘is a most crude and undigested mass of heterogeneous legends taken from the apocryphal gospel of the infancy of Christ, the tales of the Rabbis and Talmudists concerning Solomon, with some particulars about Muhammed…jumbled together with…the history of the Persian kings of the Sassanian dynas

తాను అన్నీ విషయాలూ ఫోర్జేరి చేశానని చివరలో ఒప్పుకొన్నాడు విల్ ఫోర్డ్ .విల్ ఫోర్డ్ ను సమకాలీన చరిత్ర కారులు విపరీతంగా ద్వేషించారు విమర్శించారు Friedrich Schlegel, an author and poet, in his essay On the Language and Wisdom of India(Über die Sprache und Weisheit der Indier, in German language) applauded Wilford’s putative discovery of the Indian origin of Egyptian civilisation, establishing India as the Ursprung, to settle the long-standing controversy about the relative antiquity of the two civilisations – India and Egypt. Although Schlegel supported the extreme views of Wilford as “Everything, absolutely everything, is of Indian origin,”[3][11] yet he denounced Wilford; later, for his fanciful temerity as:

the fanciful temerity of a Wilford was bringing discredit on the Indian researches—a temerity which would necessarily provoke a re-action, and lead, as in some recent instances, to a prosaic narrow-mindedness, that would seek to bring down the whole system of Indian civilization to the dull level of its own vulgar conceptions.[12]

విశ్వ నాద వారు తన నవల’’ ఆరునదులు ‘’.ఈ విషయాలన్నీ చెప్పారని నా జ్ఞాపకం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20

38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని

9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి 1845 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు .చాలా ఏళ్ళు నార్త్ యా౦ప్టన్ లోనే బాంక్ లో పని చేసి ,పెద్దన్న జోషియా విట్నీ కి లేక్ సుపీరియర్ ప్రాంత జియలాజికల్ సర్వే కు సహకరించాడు .ఈ సమయం లోనే ఖాళీగా ఉన్నప్పుడు సంస్కృతం చదివాడు .1850 లో జర్మనీ వెళ్లి మూడేళ్ళు సంస్కృతం అధ్యయనం చేశాడు .చలికాలాలలో బెర్లిన్ లో  ఆల్బర్ట్ వేబెర్ ,ఫ్రాంజ్ బాప్ లవద్దా వేసవులలో టూబెంగిన్లో రుడాల్ఫ్ వాన్ రోత్  వద్ద సంస్కృతం లో మెళకువలు నేర్చాడు .ఈ క్షేత్రం లో గొప్ప విజ్ఞానిగా గుర్తింపు పొందాడు .

  1854 లో ఏల్ లో సంస్కృత ప్రొఫెసర్ అయి,1869 కంపారటివ్ ఫైలాలజి కి ప్రొఫెసర్ కూడా అయ్యాడు .షెఫీల్డ్ సైంటిఫిక్ స్కూల్ లో ఆధునిక భాషలు బోధించి ,అమెరికన్ ఓరియెంటల్  సొసైటీ కి 1857 నుండి సేక్రేటరిగా చేసి,1884 లో ప్రెసిడెంట్ అయ్యాడు  .1856 లో ఎలిజబెత్ వూస్టర్ బాల్డ్విన్ ను పెళ్లి చేసుకొని 6 గురు సంతానాన్ని పొందాడు అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు ఫెలో గౌరవాన్ని ,అమెరికన్  యాంటి క్వేరియన్ సొసైటీ సభ్యత్వ గౌరావాన్ని పొందాడు . విట్ని అవేన్యు లో  7-6-1894 న 67 వ ఏట మరణించాడు .

విట్ని 1864 లో అమెరికన్ వెబ్ స్టర్ నిఘంటువులో నిర్వచనాలను మార్పు చేసి రాశాడు .1869 లో అమెరికన్ ఫైలలాజికల్ అసోసియేషన్ కు సంస్థాపక అధ్యక్షుడైనాడు .వేద ఛందస్సులను అనువదించాడు .వేదాలు భాషా శాస్త్రం లపై చాలా వ్యాసాలూ రాశాడు ఇవన్నీ ‘’ఓరియెంటల్ అండ్ లింగ్విస్టిక్ స్టడీస్ సిరీస్ లో 1872-74 లో ప్రచురితాలు .ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ సంస్క్రుతాలకు వ్యాకరణ గ్రంధాలు రచించాడు .1879 లో అష్టాధ్యాయి పై రాసిన వ్యాఖ్యానం ‘’సాంస్క్రిట్ గ్రామర్ ‘’చాలా పేరు పొందింది .పాణిని రాసిన అష్టా ధ్యాయి ‘’ఉన్నతమైన కళాత్మకమైన 4 వేల ఆల్జీబ్రా లాంటి సూత్రాలతో రాయ బడింది అని సంక్షిప్తతతో సందిగ్ధానికి తావు లేకుండా ఉందని ప్రశంసించాడు విట్ని .ఐరోపా భాషా శాస్త్ర వేత్తలపై విట్నీ ప్రభావం అత్యదికమని  In his Course in General Linguistics in the chapter on the ‘Immutability and Mutability of the Sign’, Ferdinand de Saussure credits Whitney with insisting on the arbitrary nature of the linguistic sign

పై విధంగా సాసురే విట్ని ప్రతిభకు నీరాజనం పట్టాడు ..జీవిత చరమాంకం లో గుండె జబ్బుతో బాధ పడుతున్నా ‘’సెంచరి డిక్షనరీ ‘’మొదటి భాగానికి  ఎడిటర్ ఇన్ చీఫ్ గా పని చేశాడు .ఇది 1889-91కాలం లోఇది  విడుదలయింది . Although little in modern American linguistics can be traced or attributed uniquely to Whitney’s work, his writings on general linguistics have continued to be regularly praised for their “sanity,” a term reflecting his clarity of style, the care he took to provide examples drawn from actual language usage in support of thoughtful, empirically based statements, and his avoidance of the “metaphysical” mysticism of some of his contemporaries. The writing table at which he stood to prepare so many of his 360 books and articles was eventually obtained by the Linguistic Society of America, founded in 1924, and is passed on to each successive editor of that society’s journal, Language, as an honor of the office.

Inline image 1  Inline image 3   Inline image 4  Inline image 5Inline image 2

          సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-21-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్

11-12-1853 న జన్మించి 22-5-1938  న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను  గాటిం జెన్  ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి బెసేల్ యూని  వర్సిటి  లో గ్రీక్ ఫ్రొఫెసర్ గా ఫ్రెడరిక్ నీషే కు వారసు డయ్యాడు .1902 లో గాటింజెన్  యూని వర్సిటి పిలుపు నందుకొని మొదటి ప్రపంచ యుద్ధ౦ కారణం గా 1905లో తిరిగి బెసేల్ చేరాడు .1936 లో రిటైర్ అయి ,22-5-1938 న 85 వ ఏట బెసేల్ లో మరణించాడు .

 జాకబ్ ముఖ్య సాహితీ సేవ ‘’సంస్కృతానికి ‘’సమగ్ర వ్యాకరణం ‘’తయారు చేయటం .ఆధునిక భాషా శాస్త్ర వేత్తలలో ఆయన ‘’వాకర్నగల్ లా ‘’సృష్టి కర్త గా గుర్తింపు పొందాడు .ఇండో –యూరోపియన్ క్లాజేస్ లలో  (ఉప వాక్యాలు )ఒత్తిపలకని పదాల స్థానం పై పరిశోధించి ఈ సూత్రాన్ని కనిపెట్టాడు.ఆయన మరణానంతరం 1889 లో ఆయన గౌరవార్ధం ఆయన పేరుమీద ‘’వాకర్నగల్స్ లా ఇన్ కాంపోజిషన్ ‘’  ను గ్రీకు భాషలోని సమ్మేళన(కాంపౌండ్ )పదాల లో మొదటి ఇంగ్రీడిఎంట్ అచ్చుగా అంతమయి   ,రెండవ ఇంగ్రీడిఎంట్ అచ్చుగా మొదలై ఈ రెండూ కూడా  పై స్థాయిలో లేనప్పుడు మొదటి అచ్చు ఏ మార్పునూ పొందక రెండవ అచ్చు మొదటి దాని స్థానం లో దీర్ఘం గా పలకబడటం ఇందులోని విషయం .ఆయన రాసిన ‘’సింటాక్స్ లెక్చర్స్ ‘’కు మంచి పేరుంది .

Inline image 1

37 –సంస్కృతం లో వేల్స్ ప్రొఫెసర్ లు  

అమెరికాలో హార్వర్డ్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి ‘’హెన్రి వేర్ వేల్స్ ‘’(1818 -1856 ) 24-4-1849 న సంస్కృతం లో ప్రొఫెసర్ షిప్ కోసం ఎండోమెంట్ ఏర్పాటు చేసి ఒక వీలునామా రాశాడు.కాని సంస్కృత పీఠం మొదటి సారిగా 26-1–1903లో మాత్రమే ఏర్పాటై చార్లెస్ రాక్వెల్ లాన్మాన్ వ్యవస్థాపక పీఠాది పతి అయ్యాడు .ఈయన 1876 లో జాన్ హాప్కిన్స్ యూని వర్సిటి లో వృత్తి ప్రారంభించి ,అక్కడ తన అధీనం లో సంస్కృత శాఖనేర్పాటు చేసి , ,హార్వర్డ్ ప్రెసిడెంట్ చార్లెస్ విలియం ఇలియట్ ఆహ్వానం పై  హార్వర్డ్ లో 1880 లో సంస్కృత ప్రొఫెసర్ పదవిని చేబట్టాడు  ..రెండవ ప్రొఫెసర్ వాల్టర్ యూజీన్ క్లార్క్, మూడవ ఆయన డేనియల్ హెచ్ హెచ్ ఇగ్నల్స్ సీనియర్ .1987 నుండి మైకేల్ విట్జేల్ నాలుగవ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

Inline image 2  Inline image 3

ware whales                                

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

—       35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం )

దేవ భాష

చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ కృషి అయిన  ఆధ్యాత్మిక కావ్యం అయిన ‘’సావిత్రి ‘’పై స్పూర్తి దాయకమైన ,ప్రకాశ వంతమైన సారాంశం .ఇది 1960లోహరిదాస్ చౌదరి ఫ్రెడరిక్ ఫ్రీజేల్ బెర్గ్ ల సంపాదకత్వం లో వెలువడిన  ‘’ది ఇంటెగ్రల్ ఫిలాసఫీ ఆఫ్  శ్రీ అరబిందో – ఎ కమ్మేమోరేటివ్ సింపోజియం ‘’లో  ఒక అధ్యాయం గా చోటు చేసుకొన్నది .19 70  ఆమె ‘’ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్ ‘’ను తనకున్న అద్భుత సంస్కృత జ్ఞాన భండారాన్నుంచి వెలికి తీసి రాసిన మహోత్క్రుస్ట రచన గా వెలువరించింది .ఇవి కాక సంస్కృత ఉచ్చారణ టేప్ లను తనకున్న 45 ఏళ్ళ సంస్కృత బోధనా,వైదుష్యం ల అనుభవ సారంగా తెచ్చింది .వీటిని శ్రీ అరవిందుల స్మ్రుతి కి నివాళిగా సమర్పించింది .దీనికి ఆమె ముందు మాటలుగా రాసిన ఉపోద్ఘాతం’ చాలా స్పూర్తి దాయకం గా ఉంది –‘’ “In this age when men are responding to a spiritual need for unity and brotherhood among all the nations of the world, we find a spiritual vocabulary being drawn from the rich treasury of Sanskrit terminology because these words are already ripe with truths divine.”[44] .

దీని పై వివరణనిస్తూ ఆమె అన్న మాటలు –‘’ “a stress has been given to the verb-roots of the words, for they are the essential carriers of the meaning of the words as originating in the spiritual element of the Universe”  అంటూ స్పష్టం చేసింది .దీని వలన విద్యార్ధి అసలైన అర్ధాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది అని చెప్పింది .ఈ పుస్తకానికి బి ఎల్ ఆత్రేయ ,వి కె గోకక్ లిద్దరూ నాణ్యమైన ఉపోద్ఘాతాలు పరమ ప్రయోజన కరం గా రాశారు .సంస్కృతాన్ని ,హిందూ ఇజాన్ని కలిపి  తెచ్చిన ఏకైక ప్రత్యేక విషయానికి బాగా మెచ్చుకొన్నాడుఆత్రేయ . .గోకక్ సత్యం కోసం ఆమె చేస్తున్న నిరంతర అన్వేషణను ,తనకున్న అపార జ్ఞాన సంపత్తిని తోటి వారికి అంద జేయాలనుకొనే తపనను కీర్తించాడు . మంత్రం శాస్స్త్రం లో ఆమెకున్న అభినివేశం వలన అతీంద్రియ మానవుని అవగాహనకు దారి చూపుతుంది అన్నాడు .దీనిపై ఇండియాలో నూ గొప్ప పేరు వచ్చింది పత్రికలూ వేనోళ్ళ పోగిడాయి .ఆమె కృషి అద్వితీయం అన్నది ‘’ఇండియన్ లిబరేషన్ ‘’పత్రిక The Indian Libertarian wrote: “Dr. Tyberg has woven for us a magnificent fabric of primary source materials of the highest authority”, and The Indian Review hailed the “novel approach and sincerity of scholarship” ending with the words “Dr. Tyberg has laid all lovers of Sanskrit under a debt of gratitude.”[48] In Mother India, Sanat K. Banerji admired Tyberg’s “.boldness and originality” and particularly commended three major innovations: “within a reasonable compass, practically all the important terms that a students of (India’s) most valuable works is likely to come across”, the relating of “technical terms to the verbal roots from which they are derived” and the “signal service” which he felt must be emphasized: “Vedic interpretation has long suffered at the hands of scholars wholly ignorant of the spiritual endeavours the Vedas were meant to enshrine. The author has a valuable chapter on the Vedas and their spiritual meaning … compiled from Sri Aurobindo’s monumental work on the subject”. The review finished with the words: “Dr. Tyberg has justified the name Jyotipriya given her by Sri Aurobindo.”[49]

19 7 2 లో శ్రీ అరవిందుల శత జయంతి ఉత్సవాలకు కి ఇండియా వచ్చి పాండి చేరి వెళ్లి మదర్ ను సందర్శించి ఆశీస్సులు అందుకొన్నది .జూడిత్  ఉచితం గా చేస్తున్న సంస్కృత సేవ ,ఆధ్యాత్మిక బోధన ,కౌన్సెలింగ్ లకు  మదర్ బహుదా ప్రశంసించింది  .1973 లోకొత్తగా ఏర్పడిన  కాలేజ్ ఆఫ్ ఓరియెంటల్ స్టడీస్ కు బుద్ధ ధర్మ యూని వర్సిటి లో  బౌద్ధ అధ్యయన ఎమిరిటస్ స్టాఫ్ ప్రొఫెసర్ గా ఉండటానికి అంగీకరించింది .గొడ్దార్డ్ కాలేజి  గ్రాడ్యుయేట్ ఫీల్డ్ ఫాకల్టి లో సంస్కృత ,హిందూ ఇజం ప్రొఫెసర్ గాకూడా సేవలు అందించింది One academic reference attested “Tyberg’s lectures were distinguished by wide reading and research; and even more than this, she imparted to her students and hearers the spiritual aroma and inspiration of the great philosophical schools of the East.”[29] Tyberg often said that it was in the joy of teaching that she transcended all pain.[39]

19 7 8 లో  ఈస్ట్ –వెస్ట్  సంస్థ బిల్డింగ్ తనఖా బాకీ పూర్తిగా తీర్చేసి కొత్త బోర్డాఫ్ డైరెక్టర్ లకు  కొత్త యుగపు మార్గ దర్శక సూత్రాలను అందజేస్తూ ‘’ This Center is not a business or a sect or a popular or social activity. It is a service to the Divine to share and unite the best aspects of the spiritual and religious, philosophical and cultural and healing arts of the East and West for uplifting and leading to a Divine Life on Earth…. May it continue to grow thus spontaneously with Divine backing with no catering to lower standards for attracting money.”[29]

అని ప్రబోధించింది

సుదీర్ఘ కాలం నిరంత బోధనా కార్యక్రమాలలో ,సత్య, సుందర ,ఆనందాన్వేషణలో  అలసి పోయిన జూడిత్ టై బెర్గ్ అంతిమ శ్వాసను 3-10-19 8 ౦78 వ ఏట   తీసుకొని తాను ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న పరమాత్మలో తన ఆత్మను అనుసంధానం చేయటానికి ఇహ లోకం వీడింది .జ్యోతి ఆత్మా జ్యోతి లో లీనమైంది . After a life where she sought “long service … in search of truth, beauty and joy to share with all”, her final aspiration was “the speedy return of my soul to the Divine … so I may return again to serve the Light”

జూడిత్ రాసిన సంస్కృత పుస్తకాలు సంస్కృత తరగతి బోధనకు భూమికగా ఉప యోగిస్తూనే ఉన్నారు .ఆమె ఊపిరి ,శ్వాస అయిన ఈస్ట్ వెస్ట్ కల్చరల్ సెంటర్ నిర్విరామంగా కృషి చేస్తూ,ఆమె జ్ఞాపక చిహ్నంగా ఉన్నది .

Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2

అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు

1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి  ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం చార్లెస్ మూర్ ను కలిసి 1949 లోజరిగిన  ‘’తూర్పు –పడమర తత్వ వేత్తల సమావేశం ‘’ఫలితాల గురించి చర్చించింది .అందులోని భావ పరంపర సమాహారం శ్రీ అరవిందులను చేరుకోవటానికి పాశ్చాత్య మేధావి వర్గానికి నివేదించటానికి అనువుగా ఉంటు౦ద ని భావించింది .ఆమె లాస్ ఏంజిల్స్ కు రావటం అనుచర వర్గానికి గొప్ప ప్రోత్సాహమై ,రెండు వారాలలో ఆమె వెయ్యిమందికి పైగా పాల్గొన్న పది సమావేశాలలో ప్రసంగించేట్లు చేసింది .సాన్ ఫ్రాన్సిస్కో లోనూ ఇదే ఉత్సాహం వెల్లి విరిసి,స్టాన్ ఫోర్డ్ యూని వర్సిటిలో ఘన సన్మానం ఏర్పాటు చేశారు .’’ఇండియా పై నిషేధం లేని సత్యాన్నితెలుసుకోవటానికి  అమెరికా ఆతుర పడుతోందని దీనికి నాంది గా కాలి ఫోర్నియా అరవిందుని భావ జాలాన్ని అందుకునే ప్రయత్నం లో ముందు ఉందని చెప్పింది .19 5 1 లో సాన్ ఫ్రాన్సిస్కో లో కొత్తగా స్థాపించబడిన ‘’అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ‘’ ఫాకల్టి లో చేరటానికి  జూడిత్ టై బెర్గ్ ను సాదరంగా ఆహ్వానించారు .ఇది ఆసియా సంస్కృతికి పూర్తిగా అంకితమైన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ యూని వర్సిటి ‘’.1961 లో ‘’శాన్ఫ్రాన్సిస్కో పునరుజ్జీవన ‘’కు వేళ్ళు పాదుకొనే సిద్ధాంతాలకు వేదికయింది .టై బెర్గ్ ఇందులో సంస్కృతం లో ప్రొఫెసర్ గా పని చేస్తూ అలాన్ వాట్స్ ,హరిదాస్ చౌదరి ,దిలీప్ కుమార్ రాయ్ వంటి అంతర్జాతీయ మిత్ర బృందం తో కలిసి పని చేసింది .రాయ్ ,చౌదరి ఇద్దరు ఆమె తో పాటు అరవింద అనుచరులే .డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ గా ఉన్న ఫ్రెడరిక్ స్పీగెల్ బెర్గ్ కు శ్రీ అరవిందులు ఈ యుగ మార్గ దర్శి అనే అభిప్రాయం బలంగా ఉన్నవాడు .టై బెర్గ్ సంస్కృత బోధనా విధానం ప్రాచీన ,అర్వాచీన భారతీయ భావ అనుసంధానం తో ఉండటం ఆయనకు ఎంత గానో నచ్చి అభినంది౦చేవాడు .ఆమె బోధనా పటిమ అత్యుత్తమమని శ్లాఘించాడు .ప్రతిక్లాసు ను ఆమె ఎంతో వైవిధ్య భరితంగా ఉత్సాహం గా ప్రేరణగా బోధించటం అపూర్వం  గా ఉండేది ..’’ఆధునిక భారత దేశం ‘’పై 1952 వేసవిలోసాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కాలేజి లో  జరిగిన సెమినార్ లో ఆమె ఇంస్ట్రక్టర్  గా ఉంది.ఆమె టీచింగ్ ను అనూహ్యప్రతిభా  ప్రభావ సంపన్నం  గా ఉందని కీర్తించారు .ఆమెకు ఈ సబ్జెక్ట్ పై ప్రత్యక్షంగా స్వీయ అనుభవం  ఉండటం ,లోతైన అధ్యయనం చేసి ఉండటం ఆమె విజ్ఞానం అగణితంగా ఉండటం దీనికి ముఖ్య కారణమైనాయి. స్ట్రాఫోర్డ్ యూని వర్సిటీ లోనూ ఆమె లెక్చరర్ గా పని చేసింది .

ప్రాచ్య –పాశ్చాత్య సంస్కృతీ కేంద్రం

అకాడేమిలో రెండేళ్ళు పని చేశాక బెర్గ్ లాస్ ఏంజెల్స్ పై దృష్టి పెట్టి అక్కడ 1953 మే 1 న ‘’ఈస్ట్ వెస్ట్ కల్చరల్ సెంటర్ ‘’స్థాపించింది .’’అందరినీ ఏకం చేసేదే అసలైన జ్ఞానం ‘’అన్న అరవిందుల లోకోక్తిని ఆమె పాటించింది .ఈ సంస్థ విశాల దృక్పధం తో ప్రాచ్య పాశ్చాత్య సాంస్కృతిక అన్యోన్యతను నిర్మించటం ,ఆధ్యాత్మిక జీవనానికి వైవిధ్య అంశాలను ప్రతిపాదించటం కోసం పాటు పడింది .ఆమె ఒక్కతే సంస్కృతం, హిందీ, పాళీ, గ్రీక్  భాషలను ,తులనాత్మక మతం ,భారతీయ ఉత్తమ సాహిత్య గ్రంధాలను ,,సంగీత, నృత్య , యోగ ,అరవింద ,మదర్ లపై తరగతులను అద్వితీయంగా బోధించి ‘’ మానవ కంప్యూటర్’’ అనే భావన కలిగించింది . భారతీయ కళా సంస్కృతులు ,నాటక విధానం మొదలైన వాటిపై  గెస్ట్ లెక్చర్ లను ఏర్పాటు చేసింది .’’ఓరియెంటల్ లైబ్రరి ‘’ని ,బుక్ షాప్ ను ఏర్పాటు చేసి అనేక యోగ విధానాలకు చెందిన ఎన్నో పుస్తకాలను సేకరించి అందు బాటులో ఉంచింది .కొరియా యుద్ధ సమయం లో ఒంటరి భావం లో ఉన్న మైనారిటీలకు ఇది గొప్ప ఊరట కలిగించింది .1953 నుంచి 73 వరకు ఆమె ‘’ది ఈస్ట్ –వెస్ట్ కల్చరల్ స్కూల్ ఫర్ క్రిఏటివ్లి గిఫ్టేడ్ చిల్ద్రెన్ ‘’ స్థాపించగా లాస్ ఏంజెల్స్ ,కాలి ఫోర్నియా స్కూల్ బోర్డ్ వారు పూర్తీ అంగీకారం గుర్తింపు నిచ్చాయి .’’కళా సౌందర్య (ఈస్తెటిక్స్ )విద్యా సక్తి ‘’కలిగించటమే ఈ స్కూళ్ళ లక్ష్యం .రాజ యోగా స్కూల్ ట్రైనింగ్ కు ప్రతిధ్వనిగా టై బెర్గ్ ఈ స్కూళ్ళలో విద్యార్ధులలో ‘’దైవీ భావ ‘’వ్యాప్తిని కలిగించింది .అన్ని సబ్జెక్ట్ లతోపాటు సంగీతం ,పియానో తానే బోధించింది .ఈ స్కూల్స్ లో చదివి గ్రాడ్యుయేట్ అయిన వారిని ప్రముఖ కాలేజీలలో కళ్ళకు అద్దుకొని సీట్ ఇచ్చి చేర్చుకొన్నారు .అంతటి క్వాలిటీ బెసేడ్ ఎడ్యుకేషన్ ఆమె అందించింది .ఈ విద్యార్ధులను పబ్లిక్ స్కూల్స్ లో  రెండేళ్ళ  అడ్వాన్స్డ్ క్లాస్ లలో చేర్చుకోనేవారు .అందుకే  టై బెర్గ్ స్కూల్ లో  చదివిన వారికి అదొక అద్భుత, ప్రత్యేక ,అరుదైన అవకాశం గా గుర్తుండి పోయింది .

యాభైలలోని ప్రచ్చన్న యుద్ధం (కోల్డ్ వార్ )అరవై లలో కొత్త యుగానికి (న్యు ఏజ్ )కు దారి తీసి అనేక ఏళ్ళుగా  చేస్తున్న బెర్గ్ విధానాలు సంపూర్ణంగా వికసనం చెంది పూర్తీ ఫలితాలనిచ్చాయి .’’యూని వర్సిటి కోసం నాఅన్వేషణ ‘’అనే ఆమె ప్రసంగాలు ఆమెను సొత్ లాండ్ ప్రముఖ వ్యక్తిగా నిరూపించాయి .దక్షిణ కాలిఫోర్నియా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ సంస్థ ప్రముఖ స్థానం పొందింది .అది వారం మధ్యాహ్నకాలాలో ఆడిటోరియం యోగా కేంద్రంగా ఆధునిక యోగాన్ని ప్రభావితం చేసేదిగా నడుస్తోంది .స్వామి ముక్తానంద ,సచ్చిదానంద ,చిదానంద ,రామ దాస్ ,మదర్ మీరా బాయ్, సిఖ్ ,సూఫీ ,బౌద్ధ యోగా గురువులు శ్రీలంక ,జపాన్ ,కాంబోడియాలనుండి ,ఇండియా లోని సాంస్కృతిక రాజకీయ నాయకులు వచ్చిసందర్శించి సంతృప్తి చెందేవారు .పాశ్చాత్య  మిస్టిక్ లను ,మంత్రం వేత్తలను ,జ్యోతిశ్శాస్త్ర వేత్తలను బెర్గ్ ఆహ్వానించేది . ప్రముఖ నృత్య కళాకారిణులైన రూత్ సెయింట్ డెనిస్ ,ఇందిరా దేవి లు ఇక్కడ నృత్య ప్రదర్శన చేశారు .ఈ వేదిక అమెరికా ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా భాసించింది .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-16 –ఉయ్యూరు   ,,

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17

— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17

35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1

జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన  లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ కి ప్రపంచాధ్యక్షురాలు  కేధరిన్  టి౦గ్లి లోమా లాండ్ ను 1898 లో స్థాపించింది  .దీనికి జూడిత్ తలిదంద్రులైన  డేనిష్ ఫిలసాఫికల్ దంపతులు మార్జోరి ,ఓలఫ్ టై బెర్గ్ లు సహాయ సహకారాలు అందించారు .1900 లో  టింగ్లి ‘’రాజ యోగ స్కూల్ ‘’నుస్థాపించింది .ఆస్కూల్ లో  సర్వోన్నత భావనలైన సత్యం న్యాయం విజ్ఞానం విద్యార్ధులకు గొప్పగా బోధించి ఆదర్శ వంతులుగా తీర్చి దిద్దేవారు .బాల్యం నుండి టై బెర్గ్ కు ఆధ్యాత్మిక భావ జాలం ఎక్కువగా ఉండి శ్రద్ధగా నేర్చుకోనేది .మేడం టింగ్లి ఈమెను తన అసలైన రాజయోగినులలో ఒకరు అని మెచ్చుకోనేది .1942 వరకు ఆమె అక్కడే చదివి నేర్చి జీవించింది .అప్పుడే ఆమెకు ప్రముఖ ఓరియెంటలిస్ట్ లు వాల్టర్ ఇవాన్స్ వెంజ్ ,పాల్  బ్రంటన్ లతో పరిచయ మేర్పడింది .

ఫిలసాఫికల్ యూని వర్సిటీలో చదివి జూడిత్  హయ్యర్ మాధమటిక్స్,లాటిన్ గ్రీక్ హీబ్రు జర్మన్ డచ్ ,ఫ్రెంచ్ ,డానిష్ స్వీడిష్ భాషలలో బి ఏ  డిగ్రీని ,ఓరియెంటల్ ధాట్ ,ముఖ్య విషయంగా మతం ఫిలాసఫీ లలో ఎం ఏ డిగ్రీ సాధించింది . సేక్రేడ్ స్క్రిప్చర్స్ .,అండ్ యేన్షేంట్ సివిలిజేషన్ లలో బి .ధే,ఎం .ధే.లను బైబిల్ ,కబ్బాల కోణం లో చదివి అందుకొన్నది .1930 లో సంస్కృతాన్ని గోటిఫ్రైడ్ డి పరూకర్  శిష్యరికం లో చదివి సంస్కృతం లో పి .హెచ్. డి.పొందింది .అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ మెంబర్ అయింది . టీన్ ఏజ్ లోనే రాజ యోగ స్కూల్ లో విద్యాబోధన చేసింది .1932 నుండి 35 వరకు అసిస్టంట్ ప్రిన్సిపాల్ గా పని చేసి 1940  లో సంస్కృత  ,ఓరియెంటల్ శాఖ కు ముఖ్యాదిపతి అయింది .1935 నుండి 45దియసాఫికల్ యూని వర్సిటి   డీన్ఆఫ్ స్టడీస్  గా ,ట్రస్టీ గా సేవలందించింది .దియసాఫికల్ ఫోరం మేగ జైన్ కు 1930 నుంచే అనేక విలువైన వ్యాసాలను రాసి నిర్వహించింది .అందులో ఆమె రాసిన ‘’సేక్రేడ్ టెక్స్ట్ ఆఫ్ ది గుప్త విద్య ‘’అనే వ్యాసం బాగా ఆకర్షించింది .అలాగే ‘’పాసిబిలిటీస్ ఆఫ్ కలియుగ ,హిందూయిజం అండ్ బుద్ధిజం  వేర్ ఆర్ యువర్ హాంట్ ఆఫ్ కాన్షస్ నెస్  కూడా   ప్రసిద్ధి చెందాయి .డీ పరూకర్ సారధ్యం లో గ్రీకు చైనీఎస్ కబ్బాలిస్టు జోరాస్ట్రియన్ ,హిందూ ,బుద్ధిష్ట్ గ్రంధాలలో  దియాసఫీ ,డ్రాయింగ్  ఆధ్యాత్మిక శబ్ద జాలం పై  నిఘంటు నిర్మాణానికి జూడిత్ సహకరించింది .అందులో టైబెర్గ్ 2 వేల పదాలను  సమకూర్చింది.

మొదటి సంస్కృత రచనలు

టై బెర్గ్ ఋగ్వేదం నుండి ‘’హైమ్స్ టు ది ఆరిజిన్ ఆఫ్ దివరల్డ్ ‘’ ముందుగా రాసింది .1946 లో చార్లెస్ జాన్స్టన్ అనువాద రచన  ‘’Crest jewel of Wisdom ‘’ ‘’(వివేక చూడామణి )ను వరుస క్రమం లో అమర్చి ముందుమాట రాసి తన సంపాదకత్వం లో వెలువరించింది .’’విస్డం రెలిజియన్ ‘’కు సంస్కృత కీ రాసింది .ఇందులో మత ,దియసఫికల్ తంత్ర శాస్త్రాలలోని 50 0 సంస్కృత పదాలను సేకరించి కూర్చింది .ఇదే ఆమె సంస్కృత సాహిత్య మందిర నిర్మాణానికి శంకు స్థాపన గా నిలిచింది .అంతవరకూ ఇండియా తో సహా ప్రపంచం లోని మరే దేశం లోనూ ఎవ్వరూ కూడా జూడిత్ లాగా సంస్కృతాన్ని లీనో టైప్ చేసిన వారు లేరు .దియసాఫికల్ యూని వర్సిటి ప్రెస్ లో చీఫ్ లీనో టైప్ ఆపరేటర్ జాఫ్రి బాబోర్కా తో కలిసి ప్రాచీన దేవనాగర లిపి కి మొదటి సారిగా కీ బోర్డ్ తయారు చేసింది .దీనికోసం కొన్ని డజన్ల మాత్రికలు (మాట్రిక్స్ ) ఉపయోగించింది .సంస్కృత పదాలలో ఆధ్యాత్మిక అర్ధం గోచరిస్తుంది.మానవ మనస్తత్వ పరిణామంగా ప్రపంచ స్థితిని వ్యక్త పరచేవిగా ఉంటె   వీటి ఇంగ్లీష్ పదాలు   తప్పుడు అర్ధం లో మూఢత్వాన్ని సూచి౦ చేవిగా అసలైన అర్ధాన్ని తెలియ జేసేవిగా ఉండవు .1941 లో టై బెర్గ్ తన లీనో టైప్ తో ‘’ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ‘’మొదటి ముద్రణ చేసింది .ఇది 1851 లో జేమ్స్ బాల౦టైన్ తయారుచేసిన గ్రామర్ కు ఇది రివిజన్ .దీన్నిలోవా స్టేట్ యూని వర్సిటి కి చెందిన లారెన్స్ ఏ వేర్ తో కలిసి రూపొందించింది .జీవితకాలం దీన్ని మూడు సార్లు మార్పులు చేర్పులూ చేసి 1950 ,1961 ,1977 లలో ప్రచురించింది .

శ్రీ అరవి౦దులతో సమావేశం

19 4 6 లో కాలిఫోర్నియా దియసాఫికల్ సొసైటీలో అభిప్రాయ భేదాలు రావటం తో జూడిత్ డీన్ ,ట్రస్టీ పదవులకు  రాజీనామా  చేసింది . దక్షిణ కాలిఫోర్నియా యూని వర్సిటిలో కొంతకాలం బోధన చేసి  కాలిఫోర్నియా లోని గ్లెండేల్ లో సంస్కృత కేంద్రాన్నీ ,బుక్ షాప్ ను ప్రారంభించింది .దీనిలో భారతీయ ఫిలాసఫీ ,మతం భాషలు ,సంస్కృతులను బోధించింది .యూని వర్సిటీలలో ,వివిధ సంస్థలలో ఉపన్యాసాలిస్తూ తన గౌరవాన్ని ,వివిధ భాషా వేత్తలతో పరిచయాలను బాగా పెంచుకొన్నది .1946 లో ఇండియాలోని బెనారస్ యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా ఉన్న  డా సర్వేపల్లి రాధాకృష్ణన్ అమృత గంగా ప్రవాహ ఉపన్యాసాన్ని సదరన్ కాలి ఫోర్నియా లో విని ,ప్రభావితురాలై బెనారస్ హిందూ యూని వర్సిటి లో సంస్కృత రిసెర్చ్ స్కాలర్ గా చేరటానికి దరఖాస్తుపంపుతూ ‘’సంస్కృత భాషలోని మహోన్నతః వేదాంత మత  విషయాలను వ్యాప్తి చేయటానికి ,ఈ భావనలతో పాశ్చాత్యుల  ఫిలాసఫీ పై అసలైన,సంపూర్ణమైన   దివ్య కాంతి ప్రసరింప జేయటానికి జీవిత మంతా త్యాగం చేస్తాను ‘’అని తెలియ బరచింది  .తన కొద్ది జీతం ,లెక్చర్ల వలన సంపాదించిన కొంచెం సొమ్ము తో అతి సాధారణ జీవన విధానం తో  ‘’  నిస్వార్ధంగా పనిలోనే అభి వృద్ధి ఉందని నమ్మి ముందుకు సాగే వారికి  సహాయం తప్పక  లభిస్తుంది ‘’అని నమ్మి ముందడుగు వేసింది .బెనారస్ యూని వర్సిటిలోని  ‘’ఓరియెంటల్ విభాగం ‘’లో మూడేళ్ళ స్కాలర్షిప్ తో పాటు ‘’ఆలిండియా ఆర్య ధర్మసేవా సంఘం ‘’లో గౌరవ సభ్యత్వం కూడా లభించింది .

1947 జూన్ లో బెనారస్ యూని వర్సిటి లో చేరి ,ఎం ఏ .కు ‘’ వేద మత మంత్రాల ‘’ను ధిసీస్ విషయంగా ఎంచుకోన్నది .మానవాళి అత్యున్నత పవిత్ర గ్రంధాలపై 25 ఏళ్ళ అధ్యయనం ,17 ఏళ్ళ సంస్క్రుతాధ్యయనం చేసిన టై బెర్గ్ కు వేద ప్రాచీనత ,ప్రామాన్యతపై ఇంకా తెలియాల్సిన లోతైనమహత్తర  విషయాలెన్నో ఉండి పోయాయని ,వేదాలపై పాశ్చాత్యుల అభి ప్రాయాలన్నీ ‘’నాన్సెన్స్ ‘’అనీ అన్నది .కాని ఆమె తీసుకొన్న విషయానికి మార్గ దర్శకం చేసే వారెవరూ ఆసమయం లో లభించకపోవటం వలన పాపం ఆమె పరిశోధన అంశాన్నే మార్చుకోమని సలహా ఇచ్చింది బెనారస్ హిందూ యూని వర్సిటి .

ఈ విషయం తెలిసినప్రొఫెసర్ అరవింద బసు ఆమెను కారిడార్ లోకి తీసుకొని వెళ్లి ఆమెతో ఆమెకు మార్గ దర్శకత్వం చేయగల మహితాత్ముడున్నాడని ,అప్పటికి ఇంకా ప్రచురింపబడని ,వ్రాత ప్రతిగానే ఉన్నఅప్పటికే  విప్లవ రాజకీయాలనుండి విరమించుకొని ,అనేక మార్మిక భావాల ప్రభావితుడై పాండి చేరిలో ఆశ్రమం స్థాపించి ఉంటున్న  శ్రీ అరవిందుల రచన ‘’ది సీక్రెట్స్  ఆఫ్ వేద ‘’ను ఆమె కిచ్చాడు .ఆ రాత్రి అంతా దాన్ని తదేక దీక్షతో చదివి జూడిత్ టై బెర్గ్ మర్నాడు ఉదయం బసు ను కలిసి ‘’సత్యాన్వేషణ లో నాకు సరైన మార్గమే లభించి,నా జీవిత ధ్యేయం నెరవేర బోతోంది ‘’అన్నది. ఆయన సలహాపై అరవిందుల దర్శనానికి అనుమతి కోరుతూ జాబు రాసింది .

పాండిచేరి అరవిందాశ్రమం నుండి ఆమెను రెండు నెలలు ఆశ్రమం లో గడపటానికి అనుమతి రాగా 1947 శరదృతువు కాలం లో వెళ్లి నవంబర్ 24 న అరవిందుల నాలుగు రోజుల ఏకాంత వాస దీక్షా విరమణ రోజులలో ఆయన దర్శనం చేసి అక్కడే అందరి చేత’’ మదర్ ‘’ అని పిలువడే ఫ్రెంచ్ దేశీయురాలు మిర్రా ఆల్ఫస్సా తో పరిచయం పొంది,ఆధ్యాత్మిక అనుభూతికి లోనై తనలో ఏదో విద్యుత్ శక్తి ప్రవహించి ‘దైవత్వ భావన ‘’కలిగింది .అప్పుడే ‘’నా ఆత్మ స్వరూపం ఏమిటో తెలిసింది ‘’అని చెప్పింది .రహస్యంగా మదర్ ను కలిసి తనకు ఆధ్యాత్మిక నామం ప్రసాదించమని కోరగా అరవిందులు అనుగ్రహించి ‘’జ్యోతి ప్రియ ‘’(కాంతి ప్రేమికురాలు )నామం ప్రసాదించారు

బెనారస్ తిరిగి వచ్చి తన చదువు కోన సాగిస్తూ సంస్కృత హిందీ పాళీ ,గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు వేదం లోని వేదాంత విషయాలు ఆధునిక భారతీయ ఆలోచనలు పై ఎం ఏ కోర్సు చదివి,1949 మార్చి లో ‘’భారతీయ మతం ,తత్వ శాస్త్రం ‘’లో ఫస్ట్ క్లాస్ ఎం ఏ డిగ్రీ పొందింది  .ఈ విషయం మాతారవి౦దులకు కృతజ్ఞతా పూర్వక లేఖ రాసి తెలియ జేసింది .

ఎందరో భారతీయ తత్వ వేత్తలు ,యోగ మాస్టర్లు టైబెర్గ్ కున్న భారతీయ భావాలకు అవగాహనకు ,భారతీయ సంస్కృతిపై ఉన్న మక్కువకు ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయి హృదయ పూర్వకం గా అభినందించారు .మహాత్మా గాంధి ,మౌలానా ఆజాద్ ,జి గోకక్ ,బి ఎల్ ఆత్రేయ ,ఆనందమయి మా ,రమణ మహర్షి శ్రీ రామ దాస్ ,కృష్ణ ప్రేమ ,అరవిందాశ్రమం లో కపాలి స్వామి ఇంద్ర సేన్, శిసిర్ మిత్ర ,పృథ్వి సింగ్ ,స్వాతంత్ర సమార యోధులు నళినీ కాంత గుప్త ,ఏ బి పురాని వంటి ప్రముఖులు ఎందరో జూడిత్ నుమనస్పూర్తిగా ప్రశంసించి ఆశీర్వదించారు .ఆమె అరుణాశ్రమం వెళ్లి రమణ మహర్షిని దర్శించి ఒక వార౦ అక్కడ ఉన్నది .మహర్షి ఆమెతో ‘’నీకు ఇది వరకే అంతా తెలుసు అని నీకు తెలియదు ‘’అన్నారు .స్వామి శివానంద తో ఆమె కు ఆధ్యాత్మిక సత్సంబంధ ఉంది .ఆయన ప్రేరణతో 1948 లో జరిగిన ‘’వరల్డ్ యూని వర్సిటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ‘’కు భారత దేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .రాధాకృష్ణన్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టడీస్ యూనియన్ ‘’కుమొదతిఅధ్యక్షు రాలై ఆయన చేత ‘’అంతర్జాతీయ అవగాహనకు జూడిత్ అసలైన శక్తి ‘’అని ప్రశంస పొందింది .ప్రొఫెసర్ టి ఆర్ వి మూర్తి ‘’నువ్వే ఇప్పుడు ప్రాచ్య పాశ్చాత్య .ఆధ్యాత్మిక భావ సమైక్యాన్ని సాధించగల సర్వ సమర్దు రాలవు అనే నమ్మకం కలిగింది ‘’అన్నాడు .

1949 శిశిరం లోమళ్ళీ పాండిచేరి వెళ్లి ఆరునెలలు అరవిందుని అంతే వాసినిగా ఉన్నది .ఇండియాలో ఉన్న  రెండేళ్ళ కాలం లో అమెరికాలోఉన్న  ఆధ్యాత్మిక అన్వేషకులతో  ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉంది .కొందరు దీన్ని యోగాకు విరుద్ధం అని విమర్శించగా మదర్ ను సలహా అడిగింది .’’నీ లాంటి వారు ప్రజలతో కలిసి పని చేయక పోతే  భగవానుని దైవీ భావనలు ఎలా వ్యాప్తి చెందుతాయి ?’అయినా నువ్వు చాలాకాలం క్రితమే నీ మార్గాన్ని ఎంచుకొన్నావు ‘’అని సమాదానమిచ్చింది మదర్  .1950  ఫిబ్రవరి 21 న చివరి సారిగా శ్రీ అరవి౦దులను దర్శించి తన అనుభవాన్నిఈ విధంగా రికార్డ్ చేసింది  ‘’ Vast deep calm with a mighty wisdom … his consciousness seemed infinite … such currents!”[27]  

     ‘Inline image 1          సశేషం

    

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18-10-16 –ఉయ్యూరు   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైత లక్ష్మణ కన్నుమూత

Inline image 2


దైత లక్ష్మణ  కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా సుపరిచితులైన లక్ష్మణ శాస్ర్తీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు శాస్త్రంలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందారు. అనంతరం డిఎస్సీ పట్టా కూడా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు. భౌతికశాస్త్ర పరిశోధనలపై దేశ విదేశీ విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చారు. లెక్కలేనన్ని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎన్నో పుస్తకాలు రచించారు. స్వామి వివేకానంద ప్రవచనాలకు ప్రభావితులైన లక్ష్మణశాస్ర్తీ హిందూ కళాశాల ప్రాంగణంలో వివేకానందుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈడేపల్లిలో ‘మధువిహార్’ సంస్థను స్థాపించి యువతకు ఉచితంగా సంగీతం, కూచిపూడి నాట్యం, కుట్టు, అల్లికలు, కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇప్పించేవారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షులు ధన్వంతరి ఆచార్య తదితరులు లక్ష్మణశాస్ర్తీ భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం

సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం

సరసభారతి ,రోటరీ క్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో నేను రచించిన 14 వ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న 22 వ పుస్తకం ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(4 82  మందిసంస్కృత కవుల జీవిత, సాహిత్య పరామర్శ )డిసెంబర్ 4 వ తేదీ (4-12-16 )ఆదివారం మధ్యాహ్నం 3 -30 గంటలకు ఉయ్యూరు రోటరీ క్లబ్  ఆడిటోరియం నందు జరుగును . ఈ గ్రంధాన్ని మా తలి దండ్రులు కీ శే  విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి, కీ శే .శ్రీమతి భవానమ్మ దంపతులకు అంకిత మిస్తున్నాం .గ్రంథ ప్రాయోజకులు శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ). .దీనికి ముందుమాటలు డాశ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి -రిటైర్డ్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్-పొన్నూరు రాశారు .
  ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని గ్రంధా విష్కరణ చేస్తారు .
,విజయవాడమేరీ స్టెల్లా కాలేజీ సంస్కృత ఆచార్యులు డా. శ్రీ ధూళిపాళ రామ కృష్ణ, గౌరవ అతిధిగా ,,కాశీ విశ్వ విద్యాలయం సంస్కృత ప్రొఫెసర్ డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి విశిష్ట అతిధిగా విచ్చేస్తారు
మాననీయ అతిధులుగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గార్లు ,
,ఆత్మీయఅతిధులుగా ఉత్కళ యూని వర్సి తర్క శాస్త్ర ప్రొఫెసర్ డాశ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డా శ్రీ జి వి .పూర్ణ చంద్  ,రమ్య భారతి సంపాదకులు శ్రీచలపాక ప్రకాష్   మొదలైన పెద్దలు  పాల్గొంటారు . . .
  ఆవిష్కరణకు ముందు ”గీర్వాణ వైభవం ”(సంస్కృత సంస్కృతీ )శీర్షిక పై జిల్లా లోని ప్రముఖ కవుల చేత కవి సమ్మేళనం నిర్వ హింప బడుతుంది .
 సాహిత్యాభి లాషులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం నవంబర్ రెండవ వారం లో అందజేయ బడుతుంది .
జోశ్యుల శ్యామలాదేవి , మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు మరియు             కార్య దర్శి               కోశాధికారి        అధ్యక్షులు -సరస భారతి
 రోటరీ క్లబ్ అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంస్కరణ శీలి వితరణ శీలిస్వర్గీయ శ్రీ కోలాచలం వెంకట రావు (బళ్ళారి )పై నా రేడియో టాక్ 15-10-16

k-venktrao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16

33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి

6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత  విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు అమెరికాలో సంస్కృత పీఠం పై ఆచార్యుడుగా ఉన్న ఏకైక విద్వాంసుడు సాలిస్బరి .తరువాత అది ప్రొఫెసర్ షిప్ ఫర్ సాంస్క్రిట్ అండ్ కిన్ద్రేడ్  లాంగ్వేజెస్ ‘’ ,అనే ప్రత్యెక డిపార్ట్ మెంట్ గా ఏర్పడి విలియం ద్వైట్ విట్నీమొదటి అధిపతి అయ్యాడు.1863  నుండి  66 వరకు మళ్ళీ ,1873 నుంచి 1880 వరకు  అమెరికన్ ఓరిఎంటల్  సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .

పారిస్ ఏషియాటిక్ సొసైటీ కి, కనెక్టికట్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కూ మెంబర్ గా ఉన్నాడు .జర్మన్ ఓరిఎంటల్ సొసైటీకి , అమెరికన్  యాంటి క్వేరియన్ సొసైటీ కి మెంబర్ గా 1861 లో ఎన్నికయ్యాడు .ఆయనకు ఏల్ యూని వర్సిటి 1869 లోను ,హార్వర్డ్ యూని వర్సిటి 1886 లోను గౌరవ  ఎల్ ఎల్ డి నిచ్చి సత్కరించాయి .

Inline image 1

34-డచ్ –కెనెడియన్ స్కాలర్ –రాబర్ట్ జే .జిడెన్ బాస్

1957 లో కెనడాలోని టోరేంటోలో జన్మించిన రాబర్ట్ జే జిడేన్ బాస్ డచ్ కెనెడియన్ స్కాలర్ ఇండియన్ ఫిలాసఫీ ,ద్రవిడియన్ స్టడీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొంది ,నెదర్ లాండ్స్ లోని యూట్రెక్ట్    యూవర్సిటి నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించి ,సౌత్ ఆసియా ఇన్ స్టి ట్యూట్ లో ,జర్మనీలోని హీడెల్ బెర్గ్ యూని వర్సిటి లలో ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ రెలిజియన్స్ చదివాడు .హీల్డల్ బెర్గ్ వర్సిటిలో సంస్కృతం బోధించి ,తర్వాత ఇండియాలో మద్రాస్ యూని వర్సిటిలో జైనం బోధించాడు .తరువాత కెనడాలోని టోరేంటో యూని వర్సిటిలో సంస్కృతం, బౌద్ధం, దక్షిణాసియా భాషలు బోధనా చేశాడు .సమకాలీన కన్నడ ఫిక్షన్ పై డాక్టోరల్ దిసీస్ రాసిన మొట్ట మొదటి వెస్ట్రన్ స్కాలర్ రాబర్ట్ జిడేన్ బాస్.

కోఎన్రాడ్ ఎలిస్ట్ ,,యెన్ ఎస్ రాజా రాం లు ప్రచారం చేసిన’’ ఆర్యన్ ఇన్వేజన్ దీరీ ;’’ని పూర్తిగా వ్యతిరేకించాడు .అమెరికన్ ఓరి ఎంటల్ సొసైటీ జర్నల్ కు చాలా విలువైన వ్యాసాలు రాశాడు .కన్నడ సాహిత్యం పై సంపూర్ణ పాశ్చాత్య చరిత్ర ను రాశాడు. కన్నడ సాహిత్యాన్ని జర్మన్ ,ఇంగ్లీష్ భాషలలోకి అనువదించాడు .సంస్కృతం లో ఉన్న ద్వైత వీరశివ, జైన రచనలను ఆంగ్లం లోకి తర్జుమా చేశాడు .దాదాపు 20 ఏళ్ళ నుండి కర్ణాటకలోని మైసూర్ లో ఉంటున్నాడు ‘

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-16 –ఉయ్యూరు

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్జికల్ దసరా సరదా

సర్జికల్ దసరా సరదా

Inline image 1

ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా !మోడీ నవాబ్ షరీఫ్ మీద సేక్సికల్ ఆపరేషన్ చేశాడని అందరూ కోడై కూస్తుంటే ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు ‘’?అన్నాడు  .తెల్లబోయా .సేక్సికల్  ఆపరేషన్  ఏమిటో అని గాబరా పడ్డాను .కాసేపు వితర్కిన్చుకొని ‘’ఒరే ఫూలా !అది సర్జికల్ ఆపరేషన్ .దానికీ సెక్స్ కూ ఏమీ సంబంధం లేదు .సగం సగం విని వచ్చి నోటికొచ్చింది కూసి చివాట్లు తింటావు ‘’అన్నాను .’’ఏదో అదే అయి ఉంటుంది .ఎందుకు చేశాడు బావా ?అడిగాడు .’’మన సరిహద్దు దాటి పాక్ ఉగ్ర వాదులు అర్ధ రాత్రి మనమీద బాంబు లేసి మన జవాన్లను చంపి పారిపోయారు .ఊరు కొంటె ఇంతే అవుతుందని సైన్యం మనమేమిటో ,మనసత్తా ఏమిటో చూపించ టానికి అకస్మాత్తుగా వాళ్ళున్న ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రముఠాను చంపి పబ్లిగ్గా  మన వాళ్ళు  చేసిన సాంపిల్ ఆపరేషన్ నే సర్జికల్ ఆపరేషన్ అన్నారు .అంటే శస్త్ర చికిత్స . దుస్టాంగాన్ని ఖండించి ,శేషాంగాన్ని కాపాడటం అన్నమాట .’’అబ్బే వాళ్ళు మా మీదికి రానూ లేదు ,సరిహద్దు దాటనూ లేదు  మా వాళ్ళు అసలు ఎవరూ చావనూ లేదు ‘’అని బుకాయి౦ఛా డటగా నవాబ్ షరీఫ్ ‘’బామ్మర్ది ప్రశ్న .’’అరె నీకూ విషయాలు తెలుసు  నన్ను ఎందుకు మళ్ళీ వాయించటం ‘’అన్నాన్నేను .’’తెలుసనుకో బా .నీ నోటి నుంచి వింటే క్లియర్ కట్ గా ఉంటుందని నా ఏడుపు ‘’అన్నాడు .’’నిజమే .కాని వాళ్ళ సైనికాధికారి  నాలుగు రోజులక్రితం మన సర్జికల్ ఆపరేషన్ నూటికి రెండువందల శాతం నిజంగా జరిగిందని చెప్పేశాడు .పాక్ మీడియా  అంతకు ముందే చానళ్ళలో అన్నీ స్పష్టంగా చూపింది .మన దేశం లోనూ లెఫ్ట్ పార్టీలు ,వాళ్ళ తోక రాహుల్ కూడా పాక్ కే వంత పాడినా సోనియా నిక్కచ్చిగా మోడీని అభి నంది౦చి౦ది .’’అన్నాను .

‘’మన రాజకీయ నాయకులూ ఇలాంటి ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు కదా బావా ‘’?బ్రహ్మం మళ్ళీ ప్రశ్న .’’అవున్రా .కె సి ఆర్ జిల్లాలు పెంచటానికి సర్జికల్ ఆపరేషన్ చేస్తున్నాడు .అది అతి రహస్యం .ఏ జిల్లా పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలీని పరిస్థితి .అక్కడ మామా అల్లుడు కొడుకు కూతుళ్ళకు తప్ప బ్రహ్మ దేవుడికి కూడా ఆఆపరేషన్  రహస్యం తెలియదు ‘’అన్నా .’’మరి బాబు ఏమీ ఆపరేషన్ చేయటం లేదా “మరో లకోటా ప్రశ్న .’నెలకు మూడు సార్లు ధిల్లీ చుట్టూ తిరిగి శాలువాలు బొకేలతో ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసినా బిగుసుకు కూర్చున్న కేంద్రాన్ని ‘’మీతో కటీఫ్ ‘’అని సర్జికల్ ఆపరేషన్ చేశాడుకనుకనే ప్రతి పత్తి పక్కకు పెట్టి ‘’పాకేజీ అంటూ ఏదో ప్రకటించారు కదా .దీనికీ రఘువీర జగన్ లు వీరంగం వేశారు కాని ప్రస్తుత పరిస్తితులలో అంత కంటే ఊరట ఉండదుఅని బాబూ సర్దుకోవాల్సి వచ్చింది .’’చెప్పాను .’’సరే బావా ! చంద్ర బాబు ఎప్పుడూ టెలి కాన్ఫరెన్స్ లంటూ హడా విడి చేస్తాడు .వాళ్లకు విసుగు అని పించదా’’మళ్ళీ ప్రశ్న దాడి .’’కనకనే  ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు ,ఆఫీసర్లు హాయిగా సైలెంట్ గా నిద్ర అనే సర్జికల్  ఆపరేషన్ లో ఉంటున్నారని వీడియో క్లిప్పింగ్ లు ,పేపర్లు చూపిస్తున్నాయి .రుద్దుడు ఎక్కువైతే బోర్ కొట్టదా .కొంతకాలమైనా వాళ్ళు ఆలోచించుకొని పని చేయాలి కదా .ఎప్పుడూ కొరడా ఝపిస్తే తిరుగుబాటు సర్జికల్ ఆపరేషనో,సైలెంట్ నిద్ర ఆపరేష నే  ఫలితం అవుతుంది  .’’అన్నాను .’’ఎన్ని విషయాలు నీకడుపులో ఉన్నాయి బావా ‘’అన్నాడు అరగుండు బ్రహ్మానందం లాంటి మా బామ్మర్ది బ్రహ్మం .

‘’జగన్ సంగతేమిటి “”?మరో ప్రశ్న సంధించాడు .’’ఇమడలేక పోతున్నాడు .అయిన దానికీ కాని దానికి నిరశన ,వాకౌట్ ,బూతుల సర్జికల్ ఆపరేషన్ నిరంతరం చేస్తూనే ఉన్నాడు కదా .కావలి౦తల ముద్దుల ఆపరేషన్ లో దిట్ట ,పలకరింపుల ,ఓదార్పులసర్జికల్ ఆపరేషన్  సెంచరి పూర్తీ చేశాడు .కాని ఆపరేషన్  సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి అతనిది ‘’అన్నాను .’’బావా క్రికెట్ —‘’అన్నాడు నెమ్మదిగా .’’దానిదేమున్దిరా .కోహ్లీ వచ్చాక సెంచరీల సర్జికలపరేషణ్ తో క్లీన్ స్వీప్ విజయాలిస్తున్నాడు కదరా ‘’అన్నా.’’అడగచ్చో లేదో తెలీదుకాని తమిళ నాడు సంగతేంది బావా ?’’’’ఏముంది రా .ఆవిడకు ఆరోగ్యం బాగా లేకపోతే ,హాస్పిటల్ లో చేరి చికిత్స చేయి౦చు కొంటుంటే కళ్ళ జోడు ముసలాయన విమర్శల సర్జికల్ ఆపరేషన్ మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్థితి కుదుట బడింది .’’చెప్పా . ‘’బావా !అమరావతి నిర్మాణం ఆపరేషన్ సంగతేమిటి ?’’మరో బాణం .’’ప్లాన్ల మీద ప్లాన్లు మారుస్తున్నారు .అయినా పట్టు వదలని విక్రమాదిత్యుడు బాబు ‘’అల్టిమేటం అనే సర్జికల్ ఆపరేషన్ చేయగానే అందరూ బిలబిల మంటూ వచ్చి చేరి పని చేసుకొంటున్నారు .పిల్లి మెత్తనిదైతే ఎలుక ఏదో చేసిందని సామెత తెలుసుగా నీకు “.అన్నాను .’’చివరగా దసరా విషయం చెప్పు బావా ?’’అడిగాడు ఫైనల్ గా .’’ఒక రకం గా దసరా మామూలు అనే సర్జికల్ ఆప రేషన్ చేసే జేబుకు చిల్లి పడేసే జనం తగ్గి పోయారు ఈ సేవా మీ సేవా లవలన.అడిగే వాడూ లేడూ ఇచ్చే వాడూ లేక దసరా దేవాలయాలలో భక్తుల దర్శన సర్జికల్ ,అమ్మవారి అలంకార ఆపరేషన్ లతో మూడు పూలు ఆరు కాయలలాగా వర్ధిల్లు తోంది .’’అన్నాను .వెళ్ళొస్తా బావా ‘’అంటూ తుర్రుమన్నాడు బామ్మర్ది బ్రహ్మ౦.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

రామదాసుతో రామయ్య సొద

రామదాసుతో రామయ్య సొద

భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు అర్ధం కావటం లేదు . ఆయన కాళ్ళ నుండి బాష్పధార కారి పోతోంది .పరవశం అనుకోన్నారందరూ .కాని ఆయన కనులు ,మనసు శూన్యంగా ఉన్నాయి .ఏభావమూ కదలాడ లేదు .భగవంతుడికి భక్తుడి కి మధ్య ఏదో పెద్ద అగాధం  ఏర్పడింది .ఒక గంట నిశ్శబ్దమే తాండవం చేసి౦ది ఇద్దరి మధ్యా  .తర్వాత స్వామి కనులలో ఏదో ఆజ్న కనిపించి,తనను రామదాస మందిరానికి రమ్మన్న సూచన అర్ధమై ,వడి వడి అడుగులతో నిమిషం లో అక్కడికి చేరి నిలిచాడు .భక్తుడు తన భావన గ్రహించి వచ్చాడని సంతోష పడ్డాడు భగవంతుడు .ప్రసన్నం చేసుకొందామని’’పలుకే బంగార మాయేనా –కోదండ పాణి –పిలిచినా పలుకవేమి –కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి ‘’అన్న కీర్తన పాడి, వెంటనే    ‘’అంతా రామమయం ఈ జగమంతా రామమయం ‘’పాడాడు .పులకించి పలకరిస్తాడనుకొన్నస్వామి అప్రసన్నంగా ‘’ఈ పొగడ్తలకేమి దాసూ ! ఇస్టం వచ్చినట్లు కీర్తనల పేరుతో  నన్ను నీ ఇష్టం వచ్చినట్లు దులిపేశావు .కస్టాలు నీకేనా ?లోకం లో ఇంకెవరికీ లేవా ?ఆ మాత్ర౦ అర్ధం చేసుకోలేవా ?నీకస్టాల చిట్టా విప్పి,వాటికి నేనే కారణం అన్నట్లు చేతిలో కలం ఉందికదా రాసి పారేశావు .అదేమిటీ ! ‘’అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము –నెయ్యెడగానగనయ్యా ‘’ అంటావా ?అంత అన్యాయం నేనేం చేశానయ్యా నీకు ? అంతా స్వయ౦కృతాపరాధమే నీది .పైగా నన్ను దానికి దుయ్యబడతావు .భలే జాణ తనం నేర్చావయ్యా దాసూ !’’అనగానే అవాక్కయ్యాడు రాం దాసు .’’అది కాదు రామయ్యా ! పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇతడు ‘’అని కీర్తించాను కదయ్యా !నా మీద సొడ్డు వేస్తున్నావేం రామా ! ‘’అన్నాడు కొంచెం నత్తురు నత్తురు మంటూ . .’’చాలు చాలుకాని –‘’ఉన్నాడో లేడో భద్రాద్రి యందు –ఆకొని  నేనుచేకొని వేడితే రాకున్నాడయ్యయ్యో ‘’ ‘’అని లోకం లో నా మీద అనుమానం కలిగిస్తావా ?గుడికట్టి ప్రతిష్టించింది నువ్వు. ఉత్సవాలు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహి౦ఛి  వేలాది భక్తులను రప్పించింది నువ్వు .నీకే అనుమానం వస్తే నాపరువేం కాను ‘’?దబాయించాడు రామయ్య. ‘’స్వామీ !నన్ను పూర్తిగా అపార్ధం చేసుకొన్నారు .నేరం మోపుతున్నది మీరే .’’’’ఎంతో మహానుభావుడవు –ఎంతో చక్కని దేవుడవు ‘’అని పోగిడాను కదా రామ చంద్రా !’’’—’ఏదో గిల్లి జోలపాడినట్లుంది నీవైఖరి .కప్పి పుచ్చటం బాగా అలవాటైంది నీకు భక్త రామదాసూ !’’కొంచెం కోపం తో అంటించాడు స్వామి .అల్లల్లాడి పోయాడు రామ చరణ దాసు .’’అన్నిటికి అన్నీ చెబుతున్నావు దాసూ !’’ఇక్ష్వాకు కుల తిలకా !ఇకనైనా బలుకవా ‘’అని బాగానే ఎత్తుకొని ‘’ఆ ప్రాకారమునకు బట్టే పది వేల వరహాలు ,భరతునకు జేయిస్తి పచ్చల పతకము అంటూ శత్రుఘ్నుని మొలత్రాడుకు  పది వేల వరహాలు ,లక్ష్మణుని ముత్యాలపతకానికి మరో పది వేలు  ,సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి ఇంకో పది వేలు ఖర్చు చేశానని గొప్పలు చెప్పుకోన్నావు.అసలు నిన్ను ఎవడు చేయించమన్నాడు వీటిని ?.ప్రభుత్వ సొమ్ము అంటే అంత చులకనా ?మంచినీళ్ళు లాగా ఖర్చు చేసి మా మీద నింద వేస్తావా ?పైగా ‘’సర్కారు సొమ్ము తృణంగా భావించ వద్దు ‘’అని నాకే శ్రీరంగ నీతులు –అదే లేవయ్యా భద్రాద్రి నీతులు చెబుతావా ?గడుసు పిండానివయ్యా దాసూ ! పోనీ అంతటితో ఆగావా ? నేను కలికితురాయి పెట్టుకొని కులుకుతున్నానని ,పైగా నీ బాబు చేయించాడా నీ మామ చేయించాడా ?.’’అని వీరంగం వేస్తావా ? ఇది చాలక ‘’అబ్బా తిట్టితి నని ఆయాస పడవద్దు ‘’అని జాలిం లోషన్ రాస్తావా ?‘’ అని  కొంచెం ఘాటుగానే అన్నాడు భద్రాద్రి రాముడు .కాని భద్రాద్రి రామ దాసు మొహం మాడిపోయింది .స్వామి ఎదుట దోషిగానిలబడి పోయాడు .అయినా ధైర్యం కొంచెం తెచ్చుకొని’’అయ్యా !దెబ్బలకోర్వక తిట్టితి నయ్యా ‘’అని చెంప లేసుకొన్నా గా రామ ప్రభూ.నిన్ను పూజించినట్టి చేతుల నిదిగోకట్ట బెట్టి రెటు తాళుదు నయ్యా’’   అని బతిమి లాడుకొన్నాను గదా స్వామీ ‘’అన్నాడు వేడుకొంటూ .

ఏది చెప్పినా రామస్వామి అపార్ధం చేసుకొంటున్నాడను కొని ‘’సీతా రామ స్వామీ నే జేసిన నేరంబేమి ?ఖ్యాతిగా నీ పద పంకజములు నే ప్రీతిగ దలపక భేద మెంచితినా “’అని లంకించుకొన్నాడు .’’చాల్చాల్చాల్లేవయ్యా దాసయ్యా!ఎత్తు కోవటం బాగానే ఎత్తు కున్నావ్ తర్వాత ఏమన్నావ్ ? ‘’రంగుగా నాపది వేళ్ళకు రత్నపు టు౦గరములు నిన్నడిగితినా ‘’అంటూ మొదలెట్టి  నీబంగారు  శాలువాలు ,పాగాలు అంగీలు నడికట్లు ముత్యాల సరాలు ,నవ రత్నాల హేమ కిరీటం  ,మురుగులు గొలుసులు,సరి గజ్జెలు ,గజ తురగాలు,   అడిగానా  ,ప్రభుత్వం ఇమ్మన్నానా ?దాన కంకణం ,మేలిమి మొలనూలు అడిగానా ?అని మరీ చింతకాయ దులుపుడు దులిపెశావు  .కలలో నన్నా నిన్ను వీటిని అడిగానా ఎప్పుడైనా భక్త స్వామీ !ఏదో నర్మ గర్భం గానో ,నిందా స్తుతో,వ్యాజ స్తుతో అను కోవటానికి వీల్లేకుండా సూటిగా మాటల ఈటెలతో నా గుండె గాయం చేశావు .నా కీర్తి ప్రతిష్టలు ‘’గోదాట్లో ‘’కలిపేసి ,సాటి దేవుళ్లలో నన్ను తలవంచు కోనేట్లు చేశావ్ .ఇదేం తెంపరి తనమయ్యా .అన్నీ ఇస్తే కట్టుకొని ,పెట్టుకొని కులుకుదామనే ! అన్నీ నీ కిచ్చేసి నేను దిగంబరంగా దిసి మొలతో ఊరేగాలనా నీ భావం ?ఎంత ఆశయ్యా రామదాసయ్యా నీకు ? పోనీ అప్పుడెప్పుడో తానీషా కాలం లో ప్రభుత్వ ఖజానా నీ జమానా అనుకోని గుట్టు చప్పుడుకాకుండా ఖర్చు చేసి నాకు గుడికట్టించి ,ఆభరణాలు చేయించి ,జామా ఖర్చులు చెప్పనందుకు బందిదిఖానాలో ఉండి  చువ్వలు లెక్క పెట్టలేక నన్ను కీర్తిస్తూ తిడుతూ ,నీలో నువ్వు పాడుకోన్నావు బాగానే ఉంది.ఏదోలే భక్తుని ఆర్తి అని సరిపెట్టుకున్నాను .కాని ఇన్ని వందల ఏళ్ళు అయినా దాన్ని మర్చిపోకుండా మీ వాళ్ళు సినిమాలు తీసి ,నిన్ను నాయకుడిని చేసి నన్ను విలన్ చేసి ,కీరవాణి తో స్వరాలు కట్టించి కమ్మగా పాడించి ,దేశ విదేశాలలో కూడా నన్ను నీ పాటల ద్వారా ఆడి పోసుకొంటున్నారు కదయ్యా .పైగా బాలమురళి ప్రతికచేరీలో నీ పాటలే పాడి మరీ రక్తికట్టిస్తున్నాడు .నీకు కీర్తి ,నాకు అపకీర్తి .ఇదేం బాగా లేదు రాం దాసూ ‘’అన్నాడు గుక్క తిప్పుకోకుండా రామ స్వామి .

ఇంకా రామస్వామి ప్రసన్నం కానందుకు నొచ్చుకొని భక్త స్వామి ‘’రాముడే గలడు నా పాలి శ్రీ రాముడే గలడు-రాముడార్త విరాముడా భావ భీముడానంద  ధాముడు ‘’అని కీర్తన పాడాడు .చలనం లేదు .’’భజరే మానస రామం –భజరే జగదభిరామం –అవనత జలజ భావేంద్రం ,అగణిత గుణ సాంద్రం –మానసరుచికరదేహం –రూప మదన శత కోటిం-శ్యామ సజలధర శ్యామం –సాంబ శివానుగత రామం –భద్రాచల నివాసం –పరిపాలిత శ్రీ రామ దాసం ‘’అని రామదాసూ గుక్క తిప్పుకోకుండా కీర్తించాడు .ఊహు –మార్పు లేదు స్వామి ముఖం లో .ఇంకా గంభీర ముద్రలోనే ఉన్నాడు .

‘’ఏమయ్యా దాసూ !నేను నీ కంటికి ఆనటం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా  .ఆడవాళ్ళ తో చెప్పిస్తే వింటానని భ్రమలో ఉన్నట్లున్నావు .అలా అయితే సీతా పరిత్యాగం ఎందుకు చేస్తాను ?అగ్ని ప్రవేశం చేయమని ఎందుకు కోరుతాను ?.అంత మరీ కొంగు చాటు కృష్ణుడి నను కొన్నావా ?  నాదగ్గర సిఫార్సులు చెల్లవని తీలీదా నీకు? .నంగ నాచి కబుర్లు చెబుతున్నావు.’’నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి –నారీశిరోమణి ,జనకుని కూతురా జనని జానకమ్మా ‘’అని అటు నుంచి నరుక్కొద్దామనుకొన్నావా?’’పోనీ మగాళ్ళకంటే   ఆడవాళ్ళు జాలి గుండె కలవాళ్ళు అనుకొందాం ,కాని ‘’ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు –చక్కగ మరు కేళి సొక్కు చుండెడి వేళ-ఏకాంతం లో ఏక శయ్య నుండేడి వేళ’’ సీత నీ గురించి నాకు చెప్పాలా ?’’–ఆ పని తప్పఇంకో పనీ ,ఆలోచన ‘’లేని వేళ మరీగుర్తుంచుకొని నీ గొడవ చెప్పాలా ? ఎంత స్వార్ధం రామదాసూ నీది ?మా ఏకాంతం ,దా౦పత్య సౌఖ్యం వదిలి ,పానకం లో పుడక లాగా నీ బాధ మాకు అడ్డు కావాలా ?ఎంత పక్షపాతం నీకు ?  .ఇంత మంది భక్తుల్ని చూశానుకాని’’  నీదంతా– అదో మాదిరి ‘’.’’అన్నాడు కొంచెం కనికరంగా .

‘’నా తప్పులన్నీ క్షమి యించుమీ  -జగన్నాధ నీవాడ రక్షించుమీ –పాతకుడని ఎంచక పోషించు దాత వనుచు నీ పదములే నమ్మితి –నా యెడ నేరమెంచక హితమున ద్వేషములెంచకు –మ్రొక్కెద ‘’అని పాడాడు . స్వామి మోము నెమ్మదిగా జీరో కాండిల్ నుంచి థౌసంద్ కాండిల్ వెలుగు సంతరించుకొన్నది .అమ్మయ్యా అనుకొన్నాడు భక్త రామదాసు .

‘’ బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా’’ అంటూ

‘’ మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా
అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా
సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా
బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా ..మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా
న్యాయములేక నే నటునిటు దిరుగను నారదుండ గాను రామా
ఆయము చెడి హరి నిను గని కొలువను నర్జునుండ గాను రామా
దాయాదుండని మదిలో మురియను దశరథుడను గాను రామా బి..

గరిమతోడ మాసీతను గాచిన గొప్పలు నే వింటి రామా
పరగ భద్రగిరి శిఖరనివాసా పర బల సంహార రామా
నరహరి నను రక్షింపుమయా శ్రీనారాయణరూపా రామా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు విడువ రామా ‘’

అని పూర్తీ చేసిఆపసోపాలు పడుతూ  ఆపాడు .అప్పుడు రామసామి ‘’రామదాసూ !అందుకే నయ్యా త్యాగయ్య గారు నీ  కీర్తనలంటే పరవశించి పోయేవారు .ఆయనకు స్పూర్తి నీవే నని చెప్పుకొనేవారు .’’అన్నాడు .భక్తుడు పరవశి౦చాడు మ్ ‘వెంటనే

వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం
త్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యం
హేయాహేయా ద్వంద్వ హీనంపర
మేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం..

నానాశాస్త్రైర్వేదకంబైః ప్రతిపాద్యం
నిత్యానందం నిర్విషయాజ్ఞ మనాదిం
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం
వందే రామం మరకతవర్ణం మధురేశం వం..

అని గీర్వాణ గానాన్ని చేశాడు .మందస్మిత వదనార వి౦దుడైన రామయ్య రామ దాసుకు సుమనోజ్నంగా సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చాడు .

హరిహరిరామ నన్నరమర చూడకు
నిరతము నీ నామస్మరణ ఏమరను ..
దశరథనందన దశముఖమర్దన
పశుపతిరంజన పాపవిమోచన ..
మణిమయభూషణ మంజులభాషణ
రణజయభీషణ రఘుకులపోషణ
పతితపావననామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసునేలుమా రామ

 

అంటూ మరో కీర్తనతో రామదాసు రామస్వామిని కీర్తించాడు .మానసానందం పొందిన రామయ్య ‘’రామ దాసూ !నీ మంగళ గీతం నాకు మహా నచ్చుతు౦దయ్యా  .ఒక్క సారి పాడవా నా కోసం .?అడిగాడు .’’స్వామీ ! నీ అజ్ఞ అని –

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం రా..

:కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాదివినుత సద్వరాయ మంగళం రా..చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం రా..లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలదసదృశ దేహాయ చారు మంగళం రా..దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్యమంగళం రా..పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజవాహనాయ అతులమంగళం రా..విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ
సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా..రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా..

Inline image 1 Inline image 2

‘’ఏమండీ !ఆరై పోయింది  భక్తి రంజని వస్తోంది లేవండి .’’అని నిద్ర లేపింది మ శ్రీమతి .అప్పడే బాలమురళి రేడియోలో ‘’సీతా రామస్వామీ !నే చేసిన నేరమదేమి ‘’అంటూ పాడుతున్న రామ దాసు కీర్తన వినిపిస్తోంది .

మహర్నవమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15

31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్

జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట   ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ ప్రొఫెసర్ .అయ్యాడు .యూని వర్సిటియే ఎం ఏ డిగ్రీ ఇచ్చి 1879 లో లండన్ కింగ్స్ కాలేజి లో సంస్కృత ,పర్షియన్ భాషల ప్రొఫెసర్ ను చేసింది .1880 నుంచి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో ఓరియెంటల్ భాషల లెక్చరర్ అయ్యాడు. 1888 లో బలియల్  కాలేజి ఫెలో అయి ,అనారోగ్యం వలన 24-6-1909 న రిజైన్ చేశాడు బెంగాల్ ,అస్సామీ సమారిటన్ భాషలకు వ్యాకరణవిషయాలు  రాశాడు .రిటైర్ మెంట్ తర్వాత ఫీలిక్స్ టో లో నివసించాడు The Times, he was described as “a celebrated scholar and teacher of the Indian languages, classical and vernacular, and the author of several educational works”, who had worked for many years to help teach probationers members of the Indian Civil Service studying at Oxford.[5]

 

32 –సన్యాసాశ్రమ ధర్మ రచన చేసిన   –పాట్రిక్ ఆల్విల్లి

శ్రీ లంకలో పుట్టి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి 1972 లో  బి ఏ ఆనర్స్ పాసై ,సంస్కృత పాళీ,ఇతర భారతీయ భాషాధ్యయనం  ధామస్ బర్రో ,ఆర్ సి జేనర్ లవద్ద  చేసి ,పెన్సిల్వేనియా యూని వర్సిటి నుండి1974 లో  పి హెచ్ డి పొంది , యాదవ ప్రకాశుని ‘’యతి ధర్మ ప్రకాశిక ‘’పై దిసీస్ సమర్పించాడు .1974 నుండి 1991 వరకు బ్లూమింగ్టన్ లోని  ఇండియన్ యూని వర్సిటిలో రిలిజియస్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో బోధించాడు .ఆయన అనువదించిన రచనలు –సన్యాస ఉపనిషత్ ,ఎర్లి ఉపనిషడ్స్ ,ధర్మ సూత్రాస్ ,పంచ తంత్ర ,బిట్వీన్ ది ఎంపైర్ సొసైటీ అండ్ ఇండియా ,ది లా కోడ్ ఆఫ్ విష్ణు ,ధర్మ స్టడీస్ ఇన్ ఇట్స్ సమాటిక్ ,లాంగ్వేజ్ టెక్ష్ట్స్ అండ్ సొసైటీ ఎక్ష్ప్లొ రేషన్ ఇన్ అన్శేంట్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియన్ , Ascetics అండ్ బ్రాహ్మిన్స్ స్టడీస్ ఇన్  ఐడియాలజీస్ అండ్ ఇన్ స్టి ట్యూషన్స్’మొదలైనవి

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-10-16 –ఉయ్యూరు .

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్


శుభ దేవ దూత
26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో ప్రసిద్ధ పామీ కుటుంబానికి చెందింది .తండ్రి ఆ గ్రామ పెద్ద కాకపోయినా చిన్నారి రాణి అందరికీ అల్లారు ముద్దు బిడ్డ గా ఎదిగింది .గైదిన్లూ అంటే శుభ వార్త తెచ్చే దూత అని అర్ధం .చిన్నతనం నుంచే అసాధారణ తెలివి తేటలను ,నైపుణ్యాన్ని ప్రదర్శించేది .ఎవరికి భయపడని స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెది .బాల్యం నుండి ఆధ్యాత్మికత అలవడి మహాత్మ్యాలు చూపటం ప్రారంభించింది .ఏపనైనా ధైర్య సాహసాలతో స్వంత ఆలోచనతో చేసేది .అక్కయ్యలకంటే అన్నిటా ముందుకు దూసుకు పోయి ,ఆగ్రామ బాలికలకు నాయకురాలైంది .
మలుపు
ఆమె జీవితం ఒక ముఖ్య సంఘటన తో మలుపు తిరిగింది .అ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో తన పోలికలే ఉన్న దేవత కనిపించింది .ఆ దేవత జీలియంగ్రా౦గ్ దేవతా సమూహం లో బిష్ణు దేవుని కుమార్తె అని గ్రహించింది .దేవతకు ,గైదిన్లూ కు మంచి స్నేహమేర్పడింది .గైదిన్లూ తలిదండ్రులు తమకుమార్తె షమాన్ పూజారిణిగా మారిపోతుందని భావించారు .తర్వాత మణిపూర్ రాజకీయ ఏజెంట్ జే సి హిగ్గిన్స్ ఆమె ను’’మైబి ‘’.అంటే మందుల అమ్మాయి గా ప్రచారం చేశాడు. కాని మందుల వ్యక్తీ మైబా కంటే జడోనాంగ్ఎంత గొప్పవాడో, అలాగే మైబి కంటే గైదిన్లూ అంత గొప్పది . ,

.ఒక రోజు కలలో జడోనాంగ్ కనిపిస్తే ఆయనే తన భవిష్యత్ గురువు అని తెలుసుకొని,ఆయనను కలుసుకోవటానికి ,వెతుక్కుంటూ కంబిరాన్ కు వెళ్ళింది .1926 నుండి -27వరకు ఈ గురు శిష్య సంబంధం జడోనాంగ్ ,గైదిన్లూ మధ్య నడిచింది .గైదిన్లూ లో దైవిక లక్షణాలున్నాయని ఆయన గ్రహించాడు . జడోనాంగ్ సాగిస్తున్న ఉద్యమం లో స్వచ్చందంగా గైదిన్లూ చేరి పని చేయటం ప్రారంభించింది .

కొద్దికాలం లోనే ఆమె జడోనాంగ్ కు అతినమ్మకమైన అనుచరురాలైంది .తన స్వగ్రామం నుంగ్ కావు లో తారాంగ్ కాయ్ దేవాలయ ఉత్సవాలు బహు శ్రద్ధగా నిర్వహిస్తూ ,ప్రజలందరూ పాల్గొని పూజించటానికి ఒక ప్రార్ధనా మందిరాన్ని నిర్మించి సమర్పించింది .వారికి టింగ్ కవ్ రగ్వాంగ్ అనబడే టింగ్ వాంగ్ సర్వోత్తమ దైవం .జెలియన్ గ్రాంగ్ మతం లో సంస్కరణలను చేయటం ప్రారంభించింది .మతం లో ఉన్న నిషేధాలను తొలగించేట్లు చేసింది .

అందరుకలిసి సామూహికంగా దైవ ప్రార్ధన చేసుకోవటం పాటలు పాడటం నృత్యాలు చేయటం వంటి వాటికి మంచి అవకాశాలు కల్పించింది.వీటిని గురువైన హైపో జడోనాంగ్ పూర్తిగా సమర్ధించి ఆమె పక్షాన నిలిచాడు .అసలే పేదరికం లో అలమటిస్తున్న ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం చూపిస్తున్న అణచివేత దమనకాండను ఆమె తిరస్కరించింది .గురువు ఆశీర్వాద బలం తో ప్రజలందర్నీ సమీకరించి వారికి ధైర్య సాహసాలు చొరవ అన్యాయాన్ని ఎదిరించటంలో సాహసాలను నేర్పింది .మత పరమైన సంస్కరణల వలన వారందరూ బాగా దగ్గరయ్యారు .

బిష్ణు దేవుని గుహ సందర్శనకు చివరి సామూహిక యాత్రలో ఉండగా ఆమెకు తన భవిష్యత్ పోరాటం అర్ధమైంది .గురువు జడో నాంగ్ కు సంస్కరణలతో కూడిన కొత్త మతం పై ఆలోచన వచ్చి శిష్యురాలు గైదిన్లూ కు తెలియ జేయగానే ఆమె దానిని వెంటనే అనుసరించింది .అస్సాం పోలీసులు లఖిపూర్ లో జడో గాంగ్ గురువును అరెస్ట్ చేయగానే ఆయనకు మరణం సమీపిస్తోందని గ్రహించింది .తెలివిగా పోలీసుల కళ్ళు కప్పి కొండలపైకి వెళ్లి దాక్కుంది .
అస్సాం లోని కచార్ జిల్లా డిప్యూటీ కమీషనర్ సి గిమ్సన్ జడో నాంగ్ గురువును అరెస్ట్ చేసి ,మణిపూర్ లో పొలిటికల్ ఏజెంట్ అయిన హిగ్గిన్స్ కు అప్పగించాడు .అస్సాం రైఫిల్స్ కాలమ్స్ బృందం తో జిరిఘాట్ ,నుండి నుంగ్ కావ్,తామేలాంగ్ మీదుగా ఇంఫాల్ దాకా పెద్ద ఊరేగింపు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది .13-3-1931 న జరిగిన ఈ మార్చ్ సందర్భంగా హిగ్గిన్స్ కు ఎస్ డి వో .ఎస్ జే .డంకన్ కు,నాలుగవ అస్సాం రైఫిల్స్ మేజర్ బుల్ ఫీల్డ్ 17 ఏళ్ళ గైదిన్లూను గుర్తించారు .ఆమె గ్రహించి జీలాండ్ లేక్ ఫారెస్ట్ ఏరియాకు పారిపోయి దాక్కుంది ..ఆమె వెంట కొందరు బాలికలతోసహా 40 మంది అనుచరులున్నారు .

అడవులలో ,కొండలమీదా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత వాసం చేస్తూ జడో నాంగ్ గురువు పై ఇంఫాల్ కోర్ట్ లో జరుగుతున్ననేర విచారణ విషయమై ఆరా తీస్తూనే ఉంది.జడోనాంగ్ గురువు నిరపరాధి అని, ఆయనకు ఏ హత్య తోనూ సంబంధం లేదని పూర్తిగా నమ్మింది .29-9-1931 న విచారణ పూర్తి అయి జదోనాంగ్ ను ఉరితీశారు .గురువు మరణ వార్త విన్నగైదిన్లూ వెంటనే ప్రజా సమీకరణ చేసి నాయకత్వ బాధ్యతలను తీసుకొన్నది .అసలైన నాగా విప్లవం జడోనాంగ్ మరణం తర్వాతనే ప్రారంభమైందని నాయకత్వం వహించిన గైదిన్లూ పోరాటపటిమ త్యాగం , బ్రిటిష్ వారి ఉక్కు పాదం కింద నలిగి అణగారి పోయిన నాగా జాతి జరుపుతున్న పోరాటం పరాకాష్టకు చేరిందని చరిత్రకారులు రాశారు .అంతకాలం తమ హక్కులకై పోరాటం చేసిన నాగా ప్రజలు జడోనాంగ్ అరెస్ట్ ,ఉరితీతలకు భయపడి పోయి ,బ్రిటిష్ దౌర్జన్యాలకు తలఒగ్గి అసలు జడోనాంగ్ తమ నాయకుడే కాదన్నారు ఆవూరి ప్రజలు .ఇప్పుడు పోరాట భారమంతా గైదిన్లూ మీదనే పడింది .
సాంఘిక మతోద్యమం
రాజకీయాలతోపాటు సాంఘిక మత సంస్కరణల పైనా రాణి గైదిన్లూ దృష్టిపెట్టింది .జేమీ ,లింగమై రాంగ్, మీ అనే మూడు తెగల నాగాలను సమైక్య పరచటమే ఆమె ధ్యేయంగా ముందుకు సాగింది .పరంపరగా వస్తున్న నాగ జాతి సంస్కృతీ వారసత్వాలను పరిరక్షించుకోవాలనే దృఢమైన సంకల్పంతో ,ఏ మత౦తోనూ సంబంధం పెట్టుకోకుండా ఉద్యమించింది .చివరికి హెరాకా అనే కొత్త మతాన్ని ఏర్పాటు చేసింది .
రాజకీయ ఉద్యమం
గురువు జాడో నాంగ్ ఫిలాసఫీ అయిన ‘’నాగా జాతి వారే పాలకులు ‘’అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసింది. జోడా నాంగ్ కు మహాత్మా గాంధి సహాయ నిరాకరణ ఉద్యమం ,భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం బాగా తెలుసు ..కాని రాణి గైదిన్లూ మాత్రమే గాంధీ విధానాలను తన రాజకీయ ప్రచారానికి బాగా ఉపయోగించుకొన్నది .తన అనుచరులకు ఆమె ‘’ భారత దేశానికి ’గాంధీ అనే కొత్త రాజువచ్చి పరిపాలిస్తాడు ‘’అని ఉద్బోధించింది .జడో నాంగ్ గాంధీ రాజు అవుతాడు అని రాసిన పాటనుబాగా ప్రచారం చేసింది .
జెలియన్ గ్రాంగ్ విప్లవం
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గైదిన్లూ విప్లవ శంఖం పూరించి విప్లవ నాయకురాలై ,అస్సాం ,మణిపూర్ లలోని జెలియన్ గ్రాంగ్ ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించమని పిలుపునిచ్చింది .ఉద్యమాన్నిమణిపూర్ వాయవ్య భాగం లోని తామేన్ గ్లాంగ్ లోను , నాగా కొండల జిల్లాలో ,అస్సాం లోని ఉత్తర కచార్ కొండ జిల్లాలలోను తీవ్రతరం చేసింది .పరిస్థితి చేయి జారిపోతోందని భావించిన అస్సాం కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్ అస్సాం రైఫిల్స్ దళంను ఆమెకు వ్యతిరేకంగా సైనిక చర్యకు ఆజ్ఞలను జారీచేశాడు .నాగా హిల్స్ డిప్యూటీ కమీషనర్ జే .పి .మిల్స్ కు సైనిక చర్య బాధ్యతను అప్పగించాడు .ఆయనకు సహాయం గా 3,4 దళాల అస్సాం రైఫిల్స్ వారిని , నార్త్ కచార్ హిల్స్ ఎస్ .డి .వో .,మణిపూర్ రాష్ట్ర అధికారుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పాడు .గైదిన్లను అరెస్ట్ చేసినవారికి రెండు వందల రూపాయల పారితోషికం మణిపూర్ స్టేట్ దర్బార్ ప్రకటించింది .దీన్ని తర్వాత అయిదు వందలకు పెంచింది .
హాన్ గ్రు౦ పోరాటం
విప్లవ కారిణి గైదిన్లకు సహాయపడిన వారికి తీవ్రమైన శిక్ష విధిస్తామని మణిపూర్ ప్రభుత్వం హెచ్చరించింది ఎన్నో గ్రామాలను ప్రభుత్వం తగలబెట్టించింది .1932 ఫిబ్రవరి 16న నార్త్ కచార్ హిల్స్ వద్ద అస్సాం రైఫిల్స్ సిపాయిలు ,విప్లవకారులపై పెద్ద ఎన్ కౌంటర్ జరిపి యువ విప్లవ కారి గైదిన్లను అరెస్ట్ చేశారు ,1932 మార్చి లో పట్టపగలే నాగా ప్రజలు పెద్ద ఎత్తున హాన్ గ్రుం లోని అస్సాం రైఫిల్స్అవుట్ పోస్ట్ పై తీవ్రమైన దాడి చేశారు .పాపం నాగ ప్రజల ఆయుధాలు డాలు బల్లాలే అవటం తో రైఫిల్స్ ముందు నిలువలేకపోయారు .అవుట్ పోస్ట్ వారు నాగాలపై కాల్పులు జరుపగ గాయపడ్డారు .తర్వాత వెనక్కి వెళ్లి పోయారు .ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లు జీమె యుద్ధవీరులు ఎనిమిది మంది చనిపోయారు , ఈ దాడిలో నాగా హిల్స్ లోని బోపంగ్ వామి గ్రామం భస్మీపటలమైంది .
పూల్వాలో అరెస్ట్
1932 అక్టోబర్ లో రాణి గైదిన్లూ ,పూల్వా(పోలోమి)గ్రామానికి చేరి ,అక్కడ కొయ్యతో కోట కట్టించటంమొదలుపెట్టింది .రాబోయే రెండు నెలలు చాలా క్లిష్టమైనవి అని తానో, బ్రిటిష్ వాళ్ళో ఎవరో ఒకరు విజేతలు అవుతామని అనుచరులకు చెప్పింది.తన సైన్యానికి అస్సాం రైఫిల్స్ కు తుది పోరుకు సన్నద్ధమైంది .ఈ లోగా డిప్యూటీ కమిషనర్ జే .పి మిల్స్ ,కెప్టెన్ మాక్డోనాల్డ్   ఆధ్వర్యం లో బలమైన అస్సాం రైఫిల్స్ దళాన్ని ,హర్ బాలా ను తోడిచ్చి దానికి సాయంగా పూల్వా పంపాడు . రాణీ కోట ఇంకా పూర్తికాలేదు ,విప్లవ వీరులు పూర్తిగా అప్రమత్తంగానూ లేరు .1932 అక్టోబర్ 17 తెల్లవారుజామున పూల్వా గ్రామం పై కెప్టెన్ మాక్డోనాల్డ్ సైన్యం తో హఠాత్తుగా విరుచుకుపడ్డాడు .అవాక్కైన విప్లవ దళం ఎదిరించే స్థోమతలేక  డీలాపడి లొంగిపోయింది యువ రాణిని ఒక ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి కొహిమాకు తీసుకువెళ్లి ఇంఫాల్ లో విచారణ జరిపారు .
బ్రిటిష్ జైళ్లలో నిర్బంధం
పొలిటికల్ ఏజెంట్ హిగ్గిన్స్ ఆమెకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు . గైదిన్లూ ఒక ఏడాది గౌహతి ,ఆరేళ్ళు షిల్లాంగ్ ,మూడేళ్ళు ఐజ్వాల్ ,నాలుగేళ్ళు గారోహిల్స్ లోని తురాలో మొత్తం 14 ఏళ్ళు బ్రిటిష్ జైళ్లలోశిక్ష అనుభవించింది.గైదిన్లూ శిక్ష గైదిన్లూకంటే విపరీతంగా ప్రజల్లో వ్యాప్తిచెంది ప్రసిద్ధి పొందింది .ఆమె సాగించిన పోరాటాన్ని ఆపకుండా అనుచరులు చాలా ఏళ్ళు కొన సాగించారు .
నెహ్రూ –రాణి గైదిన్లూ
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జవహర్ లాల్ నెహ్రు 1937లో అస్సాం వచ్చినప్పుడు షిల్లాంగ్ జైలులో ఉన్న యువనాగ కన్య గైదిన్లూ విప్లవ పోరాటపటిమ తెలుసుకొని బ్రిటిష్ వారి దౌష్ట్యానికి బలైపోతున్న ఈయువ నారీ కిశోరం పై విపరీతమైన సానుభూతి ప్రదర్శించాడు .ఆమె పోరాటం పై ఆయన హిందూస్తాన్ టైమ్స్ లో వ్యాసం రాస్తూ ఆమెను ‘’రాణి ‘’అని కీర్తించాడు అప్పటి నుంచి ఆమెను’’ రాణి గైదిన్లూ’’ అంటున్నారు .1937 లో దేశం లో చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలోకి వచ్చాయి .ఆమెను విడిపించటానికి నెహ్రు విశ్వ ప్రయత్నం చేశాడు .కాని మణిపూర్ బ్రిటిష్ ప్రావిన్స్ లో లేకపోవటం తో ఏమీ చేయలేకపోయాడు .

బ్రిటిష్ లేడీ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ అయిన ఆస్టర్ దృష్టికి ఈమె విషయం తెచ్చాడు .ఆమె సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు ఈ విషయం తెలియ జేస్తే ఆయన గైదిన్లూ ఆమె ఇప్పటికీ మణిపూర్ లో బలమైన నాయకురాలని ,ఆమెను విడుదల చేస్తే మణిపూర్ అస్సాంలలో శాంతికి భగ్నం కలుగుతుందని విడుదలకు తిరస్కరించాడు .దీనిపై నెహ్రు స్పందిస్తూ ఆమె యవ్వనం అంతా బ్రిటిష్ జైళ్లలో మగ్గి మసిబారి పోయిందని ,ఇంత చిన్నవయసులో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించిన ఆమె సాహసాన్నిబ్రిటిష్ ప్రభుత్వం ఓర్వలేక హింసిస్తోందని అన్నాడు .
స్వాతంత్ర్యానంతరం విముక్తి
1947 లో నెహ్రు భారత దేశ తాత్కాలిక ప్రధానిగా ఉన్నప్పుడు మిసెస్ జోన్స్ అనే బ్రిటిష్ వనిత ఒత్తిడి చేయటం వలన రాణి గైదిన్లూ ను తురా జైలు నుంచి విడుదల చేశారు .ఆమెను మణిపూర్ వెళ్ళటానికి వీలు లేదని ఆంక్ష పెట్టగా ఆమె పూర్వపు నాగా హిల్స్ జిల్లా లోని మొక్కాచుంగ్ దగ్గరున్న ఇమ్రాప్ గ్రామలో ఉన్నది .అయిదేళ్ళ తర్వాత 1952 లో ఆమెను మణిపూర్ రాష్ట్రం లోకి అనుమతించారు .అక్కడ తామేన్ గ్లాంగ్ హెడ్ క్వార్టర్స్ లో స్థిరపడి ప్రశాంత జీవనం సాగించింది .నెహ్రూ ను ఆయన కుమార్తె ఇందిరా గాంధీని 1958 లో స్వయంగా వెళ్లి కలిసింది .మణిపూర్ నాగాలాండ్ నార్త్ కచార్ లలోని తన ప్రజల ఆర్ధిక సాంఘిక అభి వృద్ధికి కృషి చేసింది .
నాగా తిరుగు బాటు దార్ల తో విభేదం
1956 లో ఏ జడ్.ఫిజో నాయకత్వాన నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడి తిరుగుబాటు చేశారు .రాణి గైదిన్లూ ,ఆమె మత మైన హెరాకా జనం పై దాడి జరిపి ఆమెను అగౌరవపరచి ,ఆమెపై పుకార్లు వ్యాపింప జేశారు .1960 లో ఆమె అనుయాయులు ఆమెతో సహా అడవులలోకి వెళ్లి వెయ్యి మంది జనంతో నాలుగు వందల రైఫిల్స్ తో ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పరచి తమ మత విశ్వాసాలను రక్షించుకొందామని ఆమెకు నచ్చచెప్పారు .సరేనని మళ్ళీ నాయకత్వం చేబట్టింది. ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తిరుగుబాటుదారుకాదని , భారత జాతీయతపై ఆమెకు విశ్వాసం ఉందని దేశ ద్రోహికాదని ,నాగా నాయకురాలని అర్ధం చేసుకొన్నది .మణిపూర్ ,నాగాలాండ్ ప్రభుత్వాలు ఆమెను బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపొమ్మని పిలుపు నిచ్చాయి .
మళ్ళీ జనజీవన స్రవంతిలోకి
ప్రభుత్వాల పిలుపును గౌరవించి రాణి తన సైన్యం తో సహా బయటికి వచ్చి 1966 జనవరి లో కోహిమాలో స్థిరపడింది .ఆమె సైన్యం నాగాలాండ్ ప్రభుత్వానికి లొంగిపోయి ,తర్వాత’’ బటాలియన్ ఆఫ్ నాగాలాండ్ ఆర్మేడ్ పోలీస్’’ అని పిలువబడింది .ఆమె ఎప్పటినుంచో జీలియాన్ గ్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నుఅస్సాం నాగాలాండ్ మణిపూర్ లలోని జీం ,లింగ మాయ్,రా౦గ్ మేప్రాంతాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూనే ఉంది .ప్రధాని ఇందిరను కలిసి ఈ ప్రతిపాదన అందజేసింది. ఆవిడ ఆమె కోరిన ప్రాంత ,ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అన్నిరకాల సహకరిస్తానని హామీ ఇచ్చింది. కాని ఆమె తనగురువు హైపూ జడోనాంగ్ చిరకాల వాంఛఅయిన జీలాంగ్ ప్రజలకు ప్రత్యేక భాగం కావాలన్న అసలైన కోరికను మర్చి పోలేదు . జీన్ గ్రాంగ్ ప్రజల ఆరాధ్యదైవంగా మన్ననలు అ౦దుకొంటున్నది .కొహిమా లో ఉండగానే ఆమెను నాగా ఇంటి గ్రేటేడ్ఉద్యమ నాయకులు ఆమెను తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వమని కోరారు .ఆమె జీనియాన్ గ్రాంగ్ ప్రాంత ఏర్పాటుకే కట్టు బడి ఉంది .
ప్రభుత్వ పురస్కారం
రాణి గైదిన్లూ నాగాలాండ్ లో ఉండగా అన్ని జాతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యేది .ఆలిండియా ఫ్రీడం ఫైటర్స్ అసోసియేషన్ వారు నాగలాండ్ స్టేట్ చాప్టర్ కు ఆమెను ప్రెసిడెంట్ ను చేశారు .బ్రిటిష్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాడిన ఆమె చరిత్ర లోకవిఖ్యాతమైంది .దీనికి కేంద్ర ప్రభుత్వం 1972 లో తామ్రపత్రం అందించింది .పడమటి మణిపూర్ లో తామేన్ గ్లాంగ్ జిల్లా ఏర్పాటు చేయటం లో ,నాగా లాండ్ లో పేరెన్ జిల్లా ఏర్పాటులో ,నార్త్ కచార్ హిల్స్ లోని జీలియన్ గ్రాంగ్ ప్రజల సంరక్షణకు ,కచార్ లో రాంగ్ మీలకు నివాస భూమి సాధించటంలో ఆమె చూపిన చొరవ, ధైర్యం, ముందు, చూపు ఒప్పించే నైజం బాగా కలిసివచ్చాయి .1981 లో ఆమెను ‘’పద్మ భూషణ్’’ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది .ఆమె అనేక సాంస్కృతిక మత సంస్థలకు సన్నిహితు రాలయ్యింది .

జీనియాగ్రాంగ్  కమ్యూనిటి పునర్వ్యస్తీకరణ లో హెరాకా మత విశ్వాసం ఆమెను మరింత ఉన్నతురాలిని చేసి ,ఆ విశ్వాసులకు ఫిలాసఫర్ ,మార్గదర్శి అయింది .మాజీ శాసన సభ్యుడు యెన్. సి .జీలంగ్ అధ్యక్షుడుగా ‘’జీలియంగ్రాంగ్ హెరాకా అసోసియేషన్  ఏర్పాటు చేసింది .జాతీయ సంస్థలైన కళ్యాణ్ఆశ్రం ,విశ్వ హిందూ పరిషత్ ,విద్యా భారతి లతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి .దేశ ప్రజల మత ,సాంస్కృతిక పునర్ వైభవ ఉద్యమానికి ఊపిరుల౦దించింది భారత ప్రభుత్వం. ఆమెగౌరవార్ధం 1996 లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఇండియా ప్రభుత్వ మానవ వనరుల శాఖలోని మాతా శిశు సంరక్షణ విభాగం ప్రతి ఏడాది మహిళా సంక్షేమానికి అత్యుత్తమ సేవలందించే వారికి శక్తి పురస్కార్ పేరిట అయిదుగురు మహిళలకు అందిస్తోంది . పద్మభూషణ్ రాణి గైదిన్లూ కూ అందజేసి గౌరవించింది .ఇండియన్ ఆన్త్రో పాలజికల్ సర్వే సంస్థ ఆమెకు 1996 లో భగవాన్ బిశ్రాముండా పురస్కారం తోపాటు లక్షరూపాయల నగదు బహుమతిని అందజేసింది .దురదురదృష్టవశాత్తూ దీన్ని ఆమె మరణానంతరం ఇవ్వబడింది
జీలియన్ గ్రాంగ్ ప్రజా సంస్థ నాయకత్వం
రాణి గైదిన్లూ అధ్యక్షతన జీలియంగ్రాంగ్ ప్రజాసంస్థ ఏర్పడింది .దీని ముఖ్య ఉద్దేశ్యం భారత ప్రభుత్వం ఆప్రజలకు ప్రత్యేకజిల్లా లేక యూనిట్ లేక యూనియన్ టేర్రిటరి ఏర్పాటు చేయటం .ప్రధాని ఇందిర దీనికి సానుకూలంగా స్పందించింది .కాని 1984 లో ఇందిరాగాంధీ ఆకస్మిక మరణం రాణీకి ఆశనిపాతమే అయింది .కాని ఆమె పోరాటం ఆపలేదు .తర్వాత ప్రధాని రాజీవ్ గాంధి ఆ ప్రాంతాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అధారిటి కిందకు తెస్తానన్నాడు .స్తబ్ధత ఏర్పడి 1992 లో ,కూకి –నాగా సంఘర్షణలతో రాజకీయ కార్యక్రమాలు ముందుకు సాగలేదు .ఈలోగా రాణీకి జబ్బు చేసి కొహిమా వదలి స్వగ్రామం నుంగ్ కావూక్ కు చేరి, ఏడాది తర్వాత నుంగ్ కావో గ్రామం చేరింది .కొద్ది అస్వస్థత ఏర్పడి రాణి గైదిన్లూ 17-2-1993 న చనిపోయింది.

నాటి ప్రధాని పి. వి .నరసింహా రావు సంతాపసందేశం పంపిస్తూ ఆమెను ఈశాన్య రాష్ట్రాల అగ్రశ్రేణి స్వాతంత్ర్య సమరయోధురాలని ప్రశంసించారు .ఆమె అంత్యక్రియలకు గవర్నర్ శ్రీ చింతామణి పాణిగ్రాహి హాజరయ్యారు .దేశ వ్యాప్తంగా ఆమె మరణానికి వేలాదిప్రజలు సానుభూతి ప్రకటించారు .26-1-2015 న రాణి గైదిన్లూ శత జయంతిని భారత ప్రభుత్వం ఘనం గా నిర్వహించింది .ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జడోనాంగ్ ను  అమర వీరునిగా ,రాణి గైదిన్లూను భారత స్వాతంత్ర్యసమర యోధురాలిగా అభి వర్ణించారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————–

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14

30-  ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్  ముల్లర్

6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన  లిరిక్ పోయేట్ సంగీతా కారుడు  వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ .  మేనమామ ఫ్రీడ్రిక్ ఒక ఒపెరానాటకం లో ముఖ్య పాత్ర మాక్స్ వేషం వేసేవాడు .ఆ పేరే ముల్లర్ కు పెట్టారు .ఈ మేనమామ మేనల్లుడిని పెంపుడు కొడుకుగా తీసుకొన్నాడు .చాలా అధికారిక పత్రాలలో,  మారేజ్ సర్టిఫికే, యూని వర్సిటి రిజిస్టర్ ,,గౌరవ పత్రాలలో ,ముద్రించిన కొన్ని పుస్తకాలలో ఆయన పేరు’’ మాక్సి మిలియన్’’ అనే ఉంది.డేస్సూ లో జిమ్నేసియం లో చదివి ,తర్వాత లీప్జిగ్ నికోలాయి స్కూల్ లో చేరి మ్యూజిక్ ,క్లాసిక్స్ చదివాడు .అప్పుడే ఫెలిక్స్ మెండేల్సన్ ను తరచూ కలుసుకోనేవాడు.

లీప్జిగ్ యూని వర్సిటిలో చేరి చదవటానికి స్కాలర్ షిప్  కోసం పరీక్షలు రాసే ప్రయత్నం లో తాను అప్పటి దాకా చదివిన చదువు చాలదని గ్రహించి అతి వేగం గా లెక్కలు ,ఆధునిక భాషలు సైన్స్ లను నేర్చుకొన్నాడు. పరీక్షలు పాసై లీప్ జిగ్ యూని వర్సిటిలో 1841 లో పూర్వంచదివిన మ్యూజిక్ ,కవిత్వాలకు ఉద్వాసన చెప్పి ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకొన్నాడు .1843 లో డిగ్రీ పొంది ,స్పినోజాస్ ఎథిక్స్ పై  డేసెర్టేషన్ రాశాడు .గ్రీక్ లాటిన్ పర్షియన్ సంస్కృతం అరబిక్ భాషాధ్యయనం పై ఆసక్తి చూపాడు .

1850 లో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో మోడరన్ యూరోపియన్ లాంగ్వేజెస్ కు టేలరియన్ ప్రొఫెసర్ గా నియమింప బడ్డాడు .ధామస్ గై ఫోర్డ్ సలహాపై ఆయనకు గౌరవ ఎం. ఏ .డిగ్రీ నిచ్చి  ,ఆక్స్ ఫర్డ్ లోని క్రిస్టియన్ చర్చి కాలేజి  మెంబర్ గా కూడా తీసుకొన్నారు .1854 లో ప్రొఫెసర్ అయి ఇప్పుడు సాధికారికంగా ఎం .ఏ .ను కాన్వోకేషన్లో పొందాడు .1858 లో ఆల్ సూయిస్ కాలేజి కి లైఫ్ ఫెలో అయ్యాడు .

1860 లో సంస్కృత  బోడేన్ ప్రొఫెసర్ ఎన్నికలో పోటీ చేసి మాక్స్ ముల్లర్  మోనియర్ మోనియర్ విలియమ్స్ చేతిలో ఓడిపోయాడు .విలియమ్స్ కన్నా ఎంతో ప్రతిభా సంపన్నుడే కాని ముల్లర్ కు ఓటమి తప్పలేదు .ఇండియాపైన సరైన అవగాహన లేక పోవటం ,మత విషయం లో ఉదారంగా ఉండటం ,జర్మనీ వాడుకావటం ముల్లర్ ఓటమికి కారణాలయ్యాయి .ఈ విషయం పై తల్లికి జాబు రాస్తూ ‘’ all the best people voted for me, the Professors almost unanimously, but the vulgus profanum made the majority”.[7]’’

అని మనసులో బాధను  వెళ్ళ గక్కాడు .1868 లో ఆయన కోసమే ఏర్పాటు చేసిన కంపారటివ్ ఫైలాలజి కి మొదటి ప్రొఫెసర్ అయ్యాడు ముల్లర్ ..1875 లో రిటైర్ అయినా 28-10-1900 న చని పోయేదాకా అందులోనే పని చేశాడు .

1844 లోనే జర్మనీలో ఫ్రీడ్రిక్ స్కీలింగ్ తో కలిసి ముల్లర్ సంస్కృతం చదివాడు .స్కీలింగ్ కోసం ఉపనిషత్ లను అనువాదం చేశాడు .ఇండో యూరోపియన్ భాషాధ్యయనం చేసిన మొదటివాడైన ఫ్రాంజ్ బొప్ప వద్ద సంస్కృత౦ పై పరిశోధన చేశాడు.భాషా చరిత్రను మత చరిత్రతో ముడిపెట్టినవాడు స్కీలింగ్.అప్పుడే ముల్లర్ హితోపదేశం ను జర్మని భాషలోకి అనువదించి ప్రచురించాడు .1845 లో పారిస్ వెళ్లి యూజీన్ బర్నాఫ్ వద్ద సంస్కృతం మెరుగు పరచుకొన్నాడు  .యూజీన్ బర్నాఫ్ ముల్లర్ ను ఋగ్వేదాన్ని ఇంగ్లాండ్ లో లభ్యమైన వ్రాత ప్రతులు ఆధారం గా సంస్కృతం లో ప్రచురించమని కోరాడు  .1846 లో లండన్ వెళ్లి ఈస్ట్ ఇండియా కంపెని సేకరించిన సంస్కృత గ్రంధాలను అధ్యయనం చేశాడు .దీనితో బాటు సృజనాత్మకం గా ‘’జర్మన్ లవ్ ‘’అనే నవల రాశాడు అది బాగా ప్రసిద్ధి చెందింది .

ఈస్ట్ ఇండియా కంపెనీ ,ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి సంస్కృత విద్వాంసుల పరిచయం తో భారతీయ సంస్కృతీ పై బ్రిటన్ లో సాధికారికంగా మాట్లాడే వారిలో మాక్స్ ముల్లర్ ముఖ్యుడయ్యాడు .ఇదేసమయం లో ఇంగ్లాండ్ భారత దేశం పై సార్వ భౌమాదికారం పొందింది. దీనితోభారత ఇంగ్లాండ్ విద్వాంసుల మధ్య  అనేక క్లిష్ట సమస్యలేర్పడ్డాయి .మాక్స్ ముల్లర్ బ్రహ్మ సమాజం వారితో సన్నిహితంగా ఉండటం సమస్యను మరింత జటిలం చేసింది .ముల్లర్  సంస్కృతాధ్యయన కాలం లో సాంస్కృతిక అభివృద్ధి పైననే భాషాభి వృద్ధి జరుగుతుంది అనే అభిప్రాయం బలపడిన సమయం లో సాగింది .వేద సంస్కృతీ యూరోపియన్ క్లాసికల్ సంస్కృతి కంటే అతి ప్రాచీనమైనదిఅని ఇండో యూరోపియన్ భాషలలో సంస్కృతమే అతి ప్రాచీనమైనది అనే   అభిప్రాయం బలపడింది .

ముల్లర్ ఈ కోణం లో సంస్కృతాన్ని  ఆనాటి మేటి సంస్కృత విద్వాంసు లందరి కంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు .పాగాన్ యూరోపియన్ మతాల గురించి తెలియాలి అంటే వేద సంస్కృతిని అధ్యయనం చేయాల్సిందే అని చెప్పాడు .అందుకే ఋగ్వేదం పై అభిమానం ఎక్కువైంది. రామ కృష్ణ పరమహంస గారి వేదాంత ధోరణి పై ఆసక్తీ ఎక్కువైంది ఆయనకు .తర్వాత ఉపనిషత్ లపై అధ్యయనం చేశాడు .ఉపనిషత్ వేదాంత౦ వేదిక్ బ్రాహ్మనిజం కు ముందున్న ‘’హీనో ధిజం ‘’ నుండి ఏర్పడింది  అన్నాడు.లండన్ వెళ్లి బ్రిటిష్ ఇండియా కంపెని వద్ద ఉన్న  రుగ్వేద వ్రాత ప్రతులను 1849 నుండి 1874 వరకు  25 ఏళ్ళు పరిశోధించి ప్రచురించాడు .స్వంత గొంతుకతో ఋగ్వేదాన్ని గ్రామ ఫోన్ పై రికార్డ్ చేశాడు .దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ముల్లర్ కు డబ్బు బాగానే ముట్ట జెప్పింది ..కాని ఋగ్వేద ప్రచురణ  ముల్లర్ గొప్పతనం కాదని అంతకు ముందే జర్మన్ విద్వా౦సుడొకడు ఆపని చేశాడని ,కాని పేరు మాక్స్ ముల్లర్ కు వచ్చిందని సైంటిఫిక్ అమెరికన్ పేపర్ లో 8-12-1900 లో ప్రచురితమైనది. “Rig Veda,” was in reality not his at all. A German scholar did the work, and Muller appropriated the credit for it.” [12].

రోమా౦టిజం లో చాలా భావాలకు ముల్లర్ మద్దతు పలికాడు .ఋగ్వేద దేవతలు ప్రకృతి శక్తులే అన్నాడు .1888 లో  ముల్లర్ గ్లాస్కో యూని వర్సిటి  జిఫ్ఫోర్డ్ లెక్చరర్ అయ్యాడు .అనేక స్కాటిష్ యూనివర్సిటీలలో నాలుగేళ్ళు  ప్రసంగాలు చేశాడు .ఆయన ప్రసంగ విషయాలు –నేచురల్ రిలీజియన్ ,ఫిజికల్ రిలీజియన్ ,ఆన్త్రోపోలాజికల్ రిలీజియన్ ,దియాసఫీ ఆఫ్ సైకలాజికల్ రిలీజియన్ .1881 లో ఇమాన్యుయాల్ కాంట్స్ క్రిటిక్  ఆఫ్ ప్యూర్ రీజన్ ను అనువదించాడు .కాంట్ చెప్పిన  ట్రాన్సెండలిజం ను ఆరాధించాడు .డార్విన్ సిద్ధాంత అభివృద్ధిని వ్యతిరేకించాడు .language forms an impassable barrier between man and beast.”[17]అనేది ముల్లర్ అభిప్రాయం .

.28-5-1896 న స్వామి వివేకానంద మాక్స్ ముల్లర్ దంపతులను కలుసుకొన్నాడు The visit was really a revelation to me. That little white house, its setting in a beautiful garden, the silver-haired sage, with a face calm and benign, and forehead smooth as a child’s in spite of seventy winters, and every line in that face speaking of a deep-seated mine of spirituality somewhere behind; that noble wife, the helpmate of his life through his long and arduous task of exciting interest, overriding opposition and contempt, and at last creating a respect for the thoughts of the sages of ancient India — the trees, the flowers, the calmness, and the clear sky — all these sent me back in imagination to the glorious days of ancient India, the days of our brahmarshis and rajarshis, the days of the great vanaprasthas, the days of Arundhatis and Vasishthas. It was neither the philologist nor the scholar that I saw, but a soul that is every day realizing its oneness with the universe.

అని వివేకానంద స్వామి ఆ సంఘటనపై రాశాడు .

నేనెప్పుడో సుమారు 30 ఏళ్ళ  మన వార్తాపత్రికలోనో వీక్లీ లోనో మాక్స్ ముల్లర్ గురించి న వ్యాసం చదివా .అందులో ఆయన భారత దేశాన్ని సందర్శించ లేక పోయినందుకుగంగా స్నానం చేయ లేకపోయినందుకు  పడిన మనో వేదన చదివాను. తాను ఇక పై జన్మించే ప్రతిజన్మలోను భారత దేశం లోనే పుట్టాలని అనుకొంటున్నానని చెప్పాడని చదివాను .అంతేకాదు  తన ప్రవర ను ‘’గోతీర్ధ  నివాసినం (ఆక్స్ఫర్డ్ ) మోక్ష మూలరు భట్టారం(మాక్స్ ముల్లర్ )అని చెప్పుకొనే వాడనీ చదివాను . ’.దీన్నే పైన వివేకానంద స్వామి రాసిన మాటలు ధృవీకరిస్తున్నాయి .ముల్లర్ దంపతులు ఆయనకు వసిష్ట మహర్షి అరుంధతీ దంపతులుగా దర్శనమిచ్చారంటే ఆయన ఎంత ఉన్నతం గా భారతీయ భావ లహరి లో జీవిం చాడో తెలుస్తుంది .ఆయనలో స్వామికి ఒక బ్రహర్షి ,ఒక రాజర్షి కనిపించాడు. ఆ దంపతుల అతి నిరాడంబర జీవితం ఆయనకు వానప్రస్థాశ్రమం లో ఉన్నట్లు అనిపించింది .ఇంత కంటే మాక్స్ ముల్లర్ ను ఆవిష్కరించిన వారు లేరని పించి౦ది నాకు మాత్రం .

ముల్లర్ ను క్రిస్టియన్లు క్రైస్తవ మత  వ్యతిరేకి అన్నారు .డార్విన్ ను కాదన్నందుకు దెప్పారు .’’టురేనిజం ‘’అనే కొత్త భాషా కుటుంబాన్ని ముల్లర్ ప్రతిపాదించాడు

Turanism[edit]

Müller put forward and promoted the theory of a “Turanian” family of languages or speech, comprising the FinnicSamoyedic, “Tataric” (Turkic), Mongolic, and Tungusiclanguages.[33][34] According to Müller these five languages were those “spoken in Asia or Europe not included under the Arian (sic) and Semitic families, with the exception perhaps of the Chinese and its dialects”. In addition, they were “nomadic languages,” in contrast to the other two families (Aryan and Semitic), which he called State or political languages.[35]

1869 ఫ్రెంచ్ అకాడెమి పురస్కారం ,1874 లో సివిల్ క్లాస్ అవార్డ్ ,1875 లో బవేరియన్ మాక్సిమిలన్ ఆర్డర్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ పురస్కారం అందుకొన్న ముల్లర్ 1896 లో ప్రీవీ కౌన్సిల్ మెంబర్ అయి విశేష గౌరవం పొందాడు .185 5 లో 32 వ ఏట బ్రిటిష్ పౌరసత్వం లభించింది .జార్జియానా అడిలైడ్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానాన్ని పొంది ఆదర్శ దాంపత్య జీవితం గడిపాడు . .1898 నుంచి ముల్లర్ ఆరోగ్యం క్షీణించటం మొదలు పెట్టింది 28-10-1900 న ఆక్స్ ఫర్డ్ లో మహా విద్వాంసుడు మాక్స్ ముల్లర్ 78 వ ఏట మరణించాడు .ఇండియా లోని గోదే సంస్థలను మాక్స్ ముల్లర్ భవనం గా మార్చారు .దాదాపు 25 ఉద్గ్రంధాలు రచించాడు .అందులో ‘’ఇంట్ర డక్షన్ టు సైన్స్ ఆఫ్ రెలిజియన్ ,హిస్టరీ ఆఫ్ ఎన్శేంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ,ఇండియా వాట్ కన్ ఇట్ ,తీచ్ అజ్ ,ఉపనిషడ్స్ ,బయాగ్రఫికల్ ఎస్సేస్ ,జర్మన్ క్లాసిక్స్ ఫ్రం ఫోర్త్ టు  నైన్ టీంత్ సెంచరి,,ది సైన్స్ ఆఫ్ థాట్ ,స్టడీస్ ఇన్ బుద్ధిజం ,సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ,మై ఆటోబయాగ్రఫీ ,మొదలైనవి ఉన్నాయి .

ఇంత చేసినా  భారత దేశం లో ముల్లర్ భావాలపై కొంత  వ్యతిరేకత ఉంది  .వేదం లోని పైకి కనిపించే అర్ధాలనే తీసుకొన్నాడుకాని లోతులకు  వెళ్ళ లేదన్నారు .క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించటానికి హిందూ మతం పై బురద చల్లాడని దానికోసం అక్కడి చర్చి పెద్దలతో చేతులు కలిపాడని అభియోగం ఉంది .దీనికి మద్దతుగా ఈ క్రింది జాబు చూపిస్తారు .అలాగే భార్యకు రాసిన ఉత్తరాన్నీ ఉటంకిస్తారు .

TO HIS WIFE, OXFORD, December 9, 1867.

“…I feel convinced, though I shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what that root is, I feel sure, the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.”

 

ముల్లర్ ఆర్య సంస్కృతీ వికసనం పై దృష్టి పెట్టి ,ఇండో యూరోపియన్ సంప్రదాయం(ఆర్య సంప్రదాయం ) ను సెమెటిక్ మతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించాడు . కొంతకాలానికి ఇవే రేసిస్ట్ పదాలుగా మారిపోవటం చూసి బాగా కలత చెందాడు .తన భావాలకు అవి చాలా దూరం అన్నాడు .ఆయన దృష్టిలో సామాన్య భారతీయ సామాన్య  యూరోపియన్ ప్రాచీనత హిట్లర్ చెప్పిన రేసిస్ట్ భావానికి పూర్తీ వ్యతిరేకం అన్నాడు   “an ethnologist who speaks of Aryan race, Aryan blood, Aryan eyes and hair, is as great a sinner as a linguist who speaks of a dolichocephalic dictionary or a brachycephalic grammar” and that “the blackest Hindus represent an earlier stage of Aryan speech and thought than the fairest Scandinavians”.[32]

అని తన దృక్పధాన్ని స్పష్టంగా తెలియ జేశాడు . “He who knows one, knows none.”అన్నదాన్ని ఎక్కువగా ముల్లర్ వాడేవాడు .

Like many of his contemporaries, Müller believed that genuine .

“The Science of Religion,” he wrote, “may be the last of the sciences which man is destined to elaborate; but when it is elaborated, it will change the aspect of the world” (Chips, xix). This enthusiasm helped to stimulate the scholarship that made Müller’s own ideas obsolete.అని  ఎన్ సైక్లో పీడియా బ్రిటానిక ‘’మాక్స్ ముల్లర్ ను ఎస్టిమేట్ చేసింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13

28-లలిత విస్తారసూత్రం  అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్

Inline image 1

జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో,  పారిస్ లలో చదివి బెర్లిన్ యూని వర్సిటి నుండి 1864   లో  పి హెచ్ .డి .పొందాడు .1866 లో  హీల్డ్ బెర్గ్ కు ప్రైవేట్ డోసేంట్ ఆఫ్ సాంస్క్రిట్ అయ్యాడు .1870 లో అసోసియేట్ ప్రొఫెసర్ అయి ,1901 లో ఆనరరి ప్రొఫెసర్ అయ్యాడు .1803 లో గౌతమ బుద్ధజీవిత చరిత్ర అయిన  లలిత విస్తారాన్ని అనువాదం చేసి తన సంపాదకత్వం లో ముద్రించాడు .ఫ్రాంజ్ బాప్ పైన పుస్తకం రాశాడు .1898 లో హిస్టరీ ఆఫ్ ఎన్సేంట్ ఇండియా రచించాడు .జర్మన్ భాష ఒకే రకమైన ఉచ్చారణ తో ఉండాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించాడు .యూని వర్సిటిలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామం వెస్ట్ ఫెలియా లో అనేక చిన్న చిన్న వర్గాలవారికి ప్రైవేట్ ట్యూటర్ గా ,స్కూల్ మాస్టర్ గా పని చేసి ఆభాషాభి వృద్ధికి గొప్ప కృషి చేశాడు .పేద ప్రజల సహాయార్ధం జేడేకా వేరీన్ సొసైటీ ఏర్పరచి అధ్యక్షుడయ్యాడు .14-1-1912 న హీల్దేన్ బెర్గ్ లో లెఫ్ మాన్ 81 వ ఏట  చనిపోయాడు

.Inline image 2

29-సంస్కృత శబ్దోత్పత్తి నిఘంటు రచన చేసిన –ఆస్ట్రియా సంస్కృత విద్వాంసుడు –మాన్ఫ్రేడ్ మేఫేర్

26-9-1926 న జన్మించి 31-10-2011 న మరణించిన మాన్ఫ్రేడ్ మే ఫేర్ ఆస్ట్రియాన్ ఇండో యూరోపియన్  విద్వాంసుడు .ఇండో ఇరానియన్ భాషలపై స్పెషలైజ్ చేశాడు .వియన్నా వర్సిటిలో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా ఉన్నాడు .సంస్కృత ఎటిమలాజికల్ డిక్షనరీ నిర్మాణ ఘటికుడు .లింజ్ లో పుట్టి , గ్రాజ్ యూని వర్సిటి లో ఇండో యూరోపియన్ మరియు సెమెటిక్ లింగ్విస్టిక్స్ చ చేశాడు .19 63 నుంచి 66 వరకు సార్లాండ్ యూని వర్సిటి  ప్రొఫెసర్ గా ఉన్నాడు .1966 లో ఆస్ట్రియాకు తిరిగి వెళ్లి వియన్నా యూని వర్సిటి ప్రొఫెసర్ అయి 1990లో 8 5 ఏళ్ళ వయసులో  చనిపోయేదాకా పనిచేశాడు .దాదాపు 13 ఉద్గ్రంధాలు రాశాడు .1982 లో అప్పర్ ఆస్ట్రియా నుంచి కల్చరల్ ప్రైజ్ ను ,8 6 లో ‘’ఆస్ట్రియన్ డెకరేషన్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ అవార్డ్ ,88 లో వీల్మన్ హార్టల్ ప్రైజ్ ,2004 లో కార్డినల్ ఇన్నిత్జర్ ప్రైజ్ లను మాన్ఫ్రేడ్ మేఫెర్ అందుకొన్నాడు.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12

27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని  అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్

చార్లెస్ లాక్ వెల్ లాన్మన్  అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ అబిగెల్ పోషణ బాధ్యత తీసుకొన్నది .ఆమె గొప్ప ఆర్టిస్ట్ .అమెరికన్ రివల్యూషనరి  ఆర్టిస్ట్  జాన్  ట్రంబుల్ కు చెందిన ఆస్తితోపాటు ,ఆయన చిత్రించిన విలువైన పెయింటింగ్ లు స్కెచ్ లు ఆమెకు సంక్రమించాయి .పదేళ్ళ వయసులో చార్లెస్ అమెరికన్ ఓరిఎంటల్ సోఅసైటీ వారి జర్నల్ ఒకటి చదివాడు .అందులో భారతీయ ఖగోళ  శాస్త్రానికి నికి చెందిన విలువైన వ్యాసం చదివి సంస్కృతం పై విపరీతమైన ఆసక్తి పెంచుకొన్నాడు .

1871 లో ఏల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా గ్రీక్ ను జేమ్స్ హాడ్లి వద్ద ,సంస్కృతాన్ని డబ్ల్యు .డి.విట్ని వద్ద అభ్యసించి  1875 లో డాక్టరేట్ పట్టా పొందాడు . ,జర్మనీలో వెబర్  రోత్ ల వద్ద సంస్కృతాన్ని మెరుగు పరచుకొని ,జార్జి  కర్టియస్ ,ఆగస్ట్ లస్కియన్ ల దగ్గర ఫైలాలజి1873  -76 మధ్య  నేర్చాడు .ప్లిమత్ కాలనీకి చివరి గవర్నర్ అయిన ధామస్  హింక్లి వారసురాలు మేరి బిల్లింగ్స్ హింక్లి ని పెళ్లి చేసుకొన్నాడు .కొత్త భార్యతో ఇండియాకు హనీమూన్ కు  వచ్చి  ఇండియా అంతా  పర్యటించి 500విలువైన సంస్కృత  ప్రాకృత గ్రంధాలు  వ్రాత ప్రతులు కొని హార్వర్డ్ యూని వర్సిటికి అందజేశాడు .అవి ఫిట్జ రాల్డ్ హాల్ లో భద్రపరచారు .వీటిని తన సంపాదకత్వం లో ప్రొఫెసర్ లాన్మన్ హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ గా ముద్రించాడు .1890 లో  ఇండియా నుంచి తిరిగి   వెళ్ళాక కేంబ్రిడ్జి లోని 9 ఫర్రార్ స్ట్రీట్ లో స్వంత గృహాన్ని నిర్మించుకొన్నాడు .

1876 లో జాన్ హాప్కిన్ యూని వర్సిటి ప్రారంభమైనపుడు వారి ఆహ్వానం తో 1876 నుంచి నాలుగేళ్ళు సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .1880లో హార్వర్డ్ యూని వర్సిటి కి వెళ్లి ఇండో –ఇరానియన్ భాషల కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .అదే 1902 లో ఫైలాలజి డిపార్ట్ మెంట్ అయింది .తర్వాత సంస్కృత ,ఇండియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ గా 1951 లో మారింది .1911 -1912 మధ్య ప్రఖ్యాత కవి టి ఎస్ ఇలియట్ ఇక్కడే విద్యార్ధిగా చదివి ఫిలాసఫీలో డాక్టరేట్ పొందాడు  .

1879—1884 మధ్య అయిదేళ్ళు  లాన్మన్ ట్రాన్సాక్షన్స్ కు సెక్రెటరి ,ఎడిటర్ గా ,18 90-9 1 లో అమెరికన్ ఫైలలాజికల్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా చేశాడు .1884 నుండి పదేళ్ళు 1894 వరకు అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ కి కరస్పాండెంట్ సేక్రటరిగా ఉన్నాడు .1897 నుంచి 1907 వరకు పదేళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా ,1907 నుండి -1908 వరకు ప్రెసిడెంట్ గా పనిచేశాడు .

బెంగాల్  ,ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ఏసి యాటిక్ సొసైటీలకు  గౌరవ ఫెలో అయ్యాడు .గాటిన్జన్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ,రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్ లకు కరస్పా౦డింగ్ మెంబర్ పదవీ గౌరవం పొందాడు .అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు ఫెలో ను చేసి అమెరికా ప్రభుత్వం గౌరవించింది. 1902 లో ఏల్ నుండి ఎల్ ఎల్ డి,అబెర్డీన్ యూని వర్సిటి 400 వార్షికోత్సవ సందర్భంగా లాన్మన్ కు ఎల్ ఎల్ డి నిచ్చి సన్మానించారు

హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ లో లాన్మన్ రాజ శేఖరుని ‘’కర్పూర మంజరి’’ అనే ప్రాకృత నాటకాన్ని  ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి 1900 లో ప్రచురించాడు . ,విట్నీ ఆంగ్లీకరించిన  అధర్వ వేద సంహిత లోని లోపాలను పరిశీలించి పునర్మూల్యాంకనం చేసి తన సంపాదకత్వం లో రెండుభాగాలుగా 2005లో ప్రచురించాడు .సాంస్క్రిట్ రీడర్ విత్ వకాబ్యులరి అండ్ నోట్స్ రాసి ప్రచురించాడు .ఇదే ఇప్పటికీ నాణ్యమైన ఆదర్శమైన ఉపోద్ఘాత గ్రంధంగా మన్ననలు  పొందుతోంది .

1926 లో హార్వర్డ్ లో లాన్మన్ రిటైరై ,గౌరవ స్థానం లో (ఎమెరిటస్) లో ఉన్నాడు .అమెరికాలో ఉన్న ప్రస్తుత సంస్కృత విద్వాంసులు ,సహకారులు లాన్మన్ శిష్య బృందం లోని వారే .88 వ ఏడు వచ్చేదాకా లాన్మన్ చార్లెస్ నదిలోరోజూ పడవ పై తిరిగేవాడు .అందుకే ఆయనను’’చార్లెస్ రివర్ లాన్మన్ ‘’అని సరదాగా పిలుస్తారు .చార్లెస్ నది పై 12 వేల మైళ్ళు ప్రయాణించిన ఘనత చార్లెస్ లాన్మన్ ది .20- 2-1941 న   సంస్కృత సాహిత్య సాగరాన్ని , ,చార్లెస్ నదిని ఈది రికార్డ్ సృష్టించిన చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ 90 వ ఏట పరమ పదించాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్

 

 

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్

13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్  ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన చేశాడు .1897 లో  హితోపదేశం పై పరిశోధన చేసి  సిద్ధాంత వ్యాసం రాసి లీప్జిగ్ యూని వర్సిటి నుండి పి .హెచ్ డి.పొందాడు .1919 నుండి 1937 వరకు 18 ఏళ్ళు లీప్జిగ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అండ్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ గా ఉన్నాడు .అక్కడ ఆసియా ,ఇండో యూరోపియన్ భాషలు ,సంస్కృతం వేదం ,జెంద్ అవెస్తా లను బోధించాడు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను జర్మన్ భాషలోకి అనువాదం చేశాడు .వేదం పైనా అవెస్తా పైనా రాసిన ‘’ఇండో ఇరానియన్ సోర్సెస్ అండ్ రిసెర్చ్ ‘’పేరిట ధారావాహికంగా ప్రచురింప బడినాయి .వీటిని ఆయనే ఎడిట్ చేశాడు కూడా .

1933 లో హీర్టేల్ జర్మన్ సోషలిస్ట్ పార్టీకి, హిట్లర్ కు విధేయుడిగా ఉంటానని శపథం చేశాడు .సాక్సోనియాన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,రాయల్ ఏషియాటిక్ సొసైటీ లండన్ కు సభ్యుడుగా ఉన్నాడు .ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీప్జిగ్ యూని వర్సిటి లైబ్రరీలో భద్ర పరిచారు .అతని రచనలు –ది సదరన్ పంచతంత్ర ,పంచాఖ్యాన కధలు ,పూర్ణ భద్రాస్ పంచతంత్ర .

Inline image 2

25-రామాయణ ,భారతాలపై పరిశోధించిన –ఆల్ఫ్ హిల్టే బీటెల్

కొలంబియాకు చెందిన ఆల్ఫ్ హిల్టే బీటెల్  అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూని వర్సిటి లో రిలీజియన్ ,హిస్టరీ ,హ్యూమన్ సైన్సెస్ కు ప్రొఫెసర్ .పురాతన భారతీయ కావ్యాలైన రామాయణ ,మహా భారతాలపై మత సంప్రదాయం ,జానపదం లపై పరిశోధన చేశాడు .

బీటెల్ హార్వర్డ్ కాలేజి నుంచి బి ఏ డిగ్రీ పొంది ,మతం ముఖ్య విషయంగా ,ఇంగ్లీష్ ను సెకండరీ గా తీసుకొని 1959- నుండి 1963 వరకు చదివాడు .1964 నుండి నాలుగేళ్ళుయూని వర్సిటి ఆఫ్  చికాగో  డివినిటి స్కూల్ లో చదివి హిస్టరీ ఆఫ్ రెలిజియన్ లో ఎం .ఏ డిగ్రీ తీసుకొని 1973 లో పి .హెచ్ .డి.అందుకొన్నాడు .పరిశోధన వ్యాసంగా ‘’గాడ్స్ హీరోస్ అండ్ కృష్ణ – ఎ స్టేడి ఆఫ్ దిమహాభారత ఇన్ రిలేషన్ టు ఇండియన్ అండ్ ఇండో యూరోపియన్ సింబాలిజం ‘’రాశాడు .

న్యు యార్క్ సిటి లోని సీ బరీ ప్రెస్ కు 1963 నుండి 6 4 వరకు ఎడిటోరియల్ అసిస్టంట్ గా ఉన్నాడు .ఇదే స్థాయిలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ జర్నల్ కూ పని చేశాడు .తర్వాత వాషింగ్టన్ యూని వర్సిటి అసిస్టంట్ ప్రొఫెసర్ గా ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,1981 లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందాడు .సారబాన్ ,విస్కాసిన్ యూని వర్సిటీలలో నూ ,దక్షిణ భారత దేశం లోను ఆహ్వానం పై ఉపన్యాసాలిచ్చాడు .2009 నుండి ‘’ఆక్స్ ఫర్డ్ బిబ్లియోగ్రఫిక్ ఆన్ లైన్ కు హిందూ ఇజం పై ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు .మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్ లకు ‘’ఇండియాస్ సాస్క్రిట్ ఎపిక్స్ –టెక్స్ట్ అండ్  ట్రడిషన్ సిరీస్ కు కూడా ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్నాడు .

గుగ్గెన్ హీం ఫెలో షిప్ ,వుడ్రో విల్సన్ ఫెలో షిప్ లతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు బీటెల్ .’’లేడీ ఆఫ్ జింజి –సౌత్ ఇండియన్ ద్రౌపది ఫెస్టివల్స్ ‘’కు 1988 లో డైరెక్టర్ .రచనలు –ది రిట్యువల్స్ ఆఫ్ బాటిల్ –కృష్ణ ఇన్ ది మహా భారత ,ది కల్ట్ ఆఫ్ ద్రౌపది ,రీ థింకింగ్ ఆఫ్ ఇండియాస్ ఓరల్ అండ్ క్లాసికల్ ఎపిక్స్ ,రి థింకింగ్ ది మహా భారత ,ధర్మాస్ ఇన్ ఎర్లి హిస్టరీ  లా, రెలిజియన్ అండ్ నారేటివ్ ,రీడింగ్ ది ఫిఫ్త్ వేద (భారత ),వెన్ ది గాడెస్ వాస్ ఏ వుమన్ –వగైరా .

సంపాదకుడుగా –క్రిమినల్ గాడ్స్ అండ్ డెమన్ డివోటిస్ ,హెయిర్ ఇట్స్ మీనింగ్ అండ్ పవర్ ఇన్ ఏసియన్ కల్చర్స్ ,ఈజ్ ది గాడెస్ ఏ ఫెమినిస్ట్ ? ది పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ గాడేసేస్ ‘’ గ్రంధాలు వెలువరించాడు .

26-హిందూ ,బౌద్ధ గ్రంధాలను చైనీ భాషలోకి అనువదించిన –పద్మశ్రీ హువాన్ బావో షెంగ్

1942 జులై లో జన్మించిన హువాన్ బావో షెంగ్ సంస్కృత ,పాళీ భాషలను అధ్యయనం చేసిన భాషా వేత్త .సంస్కృత ,పాళీ గ్రంధాలను చైనా భాషలోకి అనువదిం చిన  ఘనుడు .ముఖ్యంగా భారతం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు ,లలిత విస్తారసూత్రం ,వజ్ర చ్చేదికా వంటిఅపురూప గ్రంధాను చైనా భాషలోకి తర్జుమా చేసిన వాడు .

1942  జులై లో షాంఘై లో జన్మించి ,పెకింగ్ యూని వర్సిటిలో ప్రాచ్య భాషలలో డిగ్రీ పొంది ,సంస్కృత ,పాళీ భాషలపై ప్రత్యేక కృషి చేసి పెకింగ్ యూని వర్సిటిలో రిటైర్ అయ్యాడు .గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ చైనీస్ అకాడెమి ఆఫ్ సోషల్ సైన్సెస్ లో విదేశీ భాషల పరిశోధకుడుగా ఇంకా పని చేస్తున్నాడు .చైనా ఫారిన్ లిటరేచర్ సొసైటీకి ,ఇండియన్ లిటరేచర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లకు  అధ్యక్షుడు .  చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు కూడా .

మహా భారతాన్ని చైనా భాష లోకి అనువదించే కార్యక్రమం 1989 లో జాలో గుహోవా ,జి బిజువాంగ్ లసంపాదకత్వం లో ప్రారంభమై ఆది పర్వం పూర్తీ చేశారు .తర్వాత హువాన్ బావో షెంగ్ నాయకత్వం లో  లోఅయిదుగురు సభ్యుల కమిటి   1993 లో దీని బాధ్యతా చేబట్టి ,2003కు మొత్తం 18 పర్వాల భారతాన్నీ చైనీస్ భాషలోకి మార్చేశారు.దీనిని మళ్ళీ సమీక్ష చేసి హువాన్ సంపాదకత్వం లో 2005కు మొత్తం 6 భాగాలుగా ముద్రించారు .

క్లాసికల్ పోఎటిక్స్ ఆఫ్ ఇండియా గ్రంధాన్ని హువాన్ రాశాడు. హువాంగ్ కు అనేక పురస్కారాలు లభించాయి అందులో కొన్ని –య౦గ్ అండ్  మిడ్ఎజేడ్ ఎక్స్ పెర్ట్ ,ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్,చైనా ఇవ్వగా , 2015 లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది  .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10

21-ఆంగ్లో ఇండియన్ పద  నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్

11-7-1840  న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’  గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ షైర్ లోని సెయింట్ బ్రియావేల్స్ లో జన్మించాడు .లండన్ లోని కింగ్స్ కాలేజి లో చదువుతుండగా కోపెంహాం కు చెందిన   ప్రొఫెసర్ విగ్గో ఫాస్బోల్ ను కలుసుకొని ఆయన ప్రభావం తో భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .తండ్రి బ్రిటిష్ ఈస్టిండియా కంపెని ఉద్యోగి అవటం వలన 1860 లో ఇండియన్ సివిల్ సర్విస్ ఉద్యోగిగా మద్రాస్ వచ్చాడు .మద్రాస్ లో సంస్కృత వ్రాత ప్రతులను కాపీ చేశాడు .1870 లో తాను సేకరించిన 350  వ్రాతప్రతులను  ఇండియా ఆఫీస్  లైబ్రరీకి అంద జేశాడు  .

మద్రాస్ వాతావరణం పడక పోవటం వలన  అధిక శ్రమ వలనా తరచూ అనారోగ్యం పాలయ్యేవాడు .ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లోని వెస్ట్ స్ట్రాషన్ లో 12-10-1882 న చనిపోయాడు .బర్నేల్ 1874  లో ‘’హాండ్ బుక్ ఆఫ్ సౌత్ ఇండియన్ పాలోలోగ్రఫీ ‘’ప్రచురించాడు దీనినే మాక్స్ ముల్లర్ ‘’ప్రతి భారతీయ సాహిత్య విద్యార్ధి  చేతిలో ఉండదగిన పుస్తకం ‘’అని ప్రశంసించాడు 1880 లో మద్రాస్ ప్రభుత్వానికి తన కృషి సర్వస్వం అయిన ‘’ది క్లాసిఫైడ్ ఇండెక్స్ టు ది సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ఇన్ ది పాలస్ ఆఫ్ టాంజోర్ ‘’ సమర్పించాడు .భారతీయ శిక్షాస్మృతి కి చెందిన అనేక సంస్కృత గ్రంధాలను అనువాదం చేశాడు .భారతీయ భాషలపైనేకాక బర్నేల్ కు టిబెటన్ ,అరబిక్ ,కావి ,జావనీస్ ,కాప్తిక్ భాషలలో కూడా పాండిత్యం ఉండి .సర్ హెన్రి యూల్ తో కలిసి ఆంగ్లో –ఇండియన్ పదాలు .పద సమూహాలకు చెందిన నిఘంటువు ను కూర్చి దానికి ‘’హాబ్సన్ –జాబ్సన్ ‘’అని పేరు పెట్టాడు .

Inline image 1

22 – సంస్కృత చరిత్ర రాసిన -ఆర్ధర్  బెర్రిడేల్ కీత్

ప్రొఫెసర్ ఆర్ధర్ బెర్రిడేల్ కీత్ డి.సి .ఎల్. ,డి.లిట్. ,ఎల్. ఎల్ .డి.5-4-1879 న జన్మించాడు .స్కాటిష్  కాన్ స్టిట్యూషనల్ లాయర్ ,సంస్కృత విద్వాంసుడు, ఇండాలజిస్ట్ .ఎడిన్ బర్గ్ యూని వర్సిటిలో సంస్కృతం లో రీజియాస్ ప్రొఫెసర్ ,కాన్ స్టి ట్యూషనల్ హిస్టరీ లెక్చరర్ కూడా .ఈ పదవులలో 1914 నుండి 30 ఏళ్ళు 1944 వరకు పని చేశాడు .అబర్దీన్ లో 6-10-1944 న చనిపోయాడు .ఆయన గ్రంధాలు –ఇండియన్ మైతాలజి ,ది రెలిజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది వేదాస్ అండ్ ఉపనిషడ్స్ ,ది హిస్టరీ ఆఫ్ ది సాంఖ్య ఫిలాసఫీ ,బుద్ధిష్ట్ ఫిలాసఫీ ఇన్ ఇండియా ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ .ఆత్రేయ సంహిత ,.అనువాద రచనలు -ది వేద ఆఫ్ ది బ్లాక్ యజుస్ స్కూల్ (కృష్ణ యజుర్వేదం ),రిగ్వేద బ్రాహ్మనాస్ ది ఆత్రేయ అండ్ ది కౌసితకిబ్రాహ్మనాస్ ఆఫ్ ది రిగ్వేద  ‘’.ఇవికాక’’ కాన్ స్టి ట్యూషనల్ లా అండ్ హిస్టరీ ‘’పై 20 దాకా ఉద్గ్రంధాలు రాశాడు .

Inline image 2

23-ప్రబోధ చంద్రోదయం ను జర్మన్ భాషలోకి అనువదించిన –దియోదర్ గోల్డ్ స్టక్కర్

దియోదర్ గోల్డ్ స్తక్కర్ 18-1-1821 న జన్మించి 6-3-1872 న మరణించిన జర్మన్ సంస్కృత విద్వాంసుడు .జర్మనీలోని కొనిగ్స్ బర్గ్ లో యూదు దంపతులకు జన్మించి ,పారిస్ వెళ్లి 1842 లో కృష్ణ మిశ్ర యతి రచించిన ప్రబోధ చంద్రోదయం ను జర్మనీ భాషలోని అనువదించి ప్రచురించాడు .1847 నుండి మూడేళ్ళు బెర్లిన్ లో ఉండి ,అలేక్సాండర్ వాన్ హంబోల్ద్ చేత గుర్తింపబడ్డాడు .కాని అతని రాజకీయ భావాలు అతనిని అధికారుల కు అనుమానం కలిగింఛి  ,1848 జర్మన్ విప్లవ సమయం లో బెర్లిన్ వదిలి వెళ్లమని  ఆజ్ఞాపించారు .హెచ్ .హెచ్ .విల్సన్ ఆహ్వానం పై లండన్ వెళ్ళాడు .1852 లో లండన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .విల్సన్ తయారు చేసిన సంస్కృత నిఘంటువు కు సహాయమ౦ దించాడు .ఇందులో మొదటిభాగం  1856 లో ప్రచురణ పొందింది .సుదీర్ఘంగా చాలా వివవరణాత్మకం గా  ఉన్నందున మిగిలిన భాగాల ప్రచురణ ఆగి పోయింది .1861 లోఆయన గొప్ప రచన ‘’పాణిని –హిజ్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’రాసి విడుదల చేశాడు .సాంస్క్రిట్  టెక్స్ట్ సొసైటీకి వ్యస్థాపక అధ్యక్షుడు .ఫైలలాజికల్ సొసైటీ లో చురుకుగా పాల్గొనే వాడు .చనిపోయే నాటికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .ఇవికాక ‘’లిటరరీ రిమైన్స్ ‘’రాశాడు .

Inline image 3  Inline image 4

సశేషం

మీ గబ్బిట దుర్గ ప్రసాద్ -3-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9

18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్

30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ భాషలు-అరబిక్ ,పెర్శియన్ సంస్కృతం లను సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో  అధ్యయనం చేసి తర్వాత జర్మని వెళ్లి బెర్లిన్, బాన్ యూని వర్సిటీలలో 1839నుండి మూడేళ్ళలో  పూర్తీ చేశాడు .,1842 లో మళ్ళీ పీటర్స్ బర్గ్ చేరి రాయల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు సభ్యుడుగా ఎన్నికై ,1860 లో రష్యన్ స్టేట్ కౌన్సిలర్ అయ్యాడు .తర్వాత ప్రీవీ కౌన్సిలర్ అయ్యాడు .1868 లో జర్మని లోని జేనా చేరి తర్వాత లీప్జిగ్ లో స్థిర వాసమేర్పరచుకొని 1-4-1904న చని పోయే దాకా  అక్కడే ఉండి పోయాడు  .

19 వ శతాబ్దపు ఓరిఎంటలిస్ట్ లలో పేరెన్నిక గన్నవాడు ఆటోవాన్ .భారతీయ భాషలపైనా ,తులనాత్మక భాషాధ్యయనం పైనా గొప్ప నిష్ణాతుడు .మొదటి గొప్ప రచన పాణిని అస్టాధ్యాయిని ఇంగ్లీష్ లోకి అనువదింఛి జర్మన్ వ్యాఖ్యానం రాయటం .ఇది ఒక రకంగా ఫ్రాంజ్ బొప్పా  ఫైలలాజికల్ విధానాలపై  కామెంటరి  .ఇదికాక బోపదేవుని వ్యాకరణాన్ని ,ఛాందోగ్య ఉపనిషత్ ,బృహదారణ్యక ఉపనిషత్ లను తర్జుమా చేసి వ్యాఖ్యానం కూడా రాశాడు .సంస్కృత –జర్మని నిఘంటువుణు 7 భాగాలలో  తయారు చేశాడు .సంస్కృత ఉచ్చారణ పై రాశాడు .దండి కావ్యాదర్శాన్ని అనువదించాడు

 

19-ప్రాకృత నిఘంటువును అనువదించిన –జోహాన్ గార్గ్ బూలర్

జోహాన్ గార్గ్ బూలర్ 19 -7-1837 న రెవరెండ్ జోహాన్ జి .బూలర్ కు హానోవర్ లోని బోర్స్తల్ లో జన్మించాడు .హానోవర్ గ్రామర్ స్కూల్ లో  లో చదివి ,గ్రీక్ ,లాటిన్ లలో మహా పండితుడయ్యాడు .గోటేన్జన్ యూని వర్సిటిలో చేరి దియాలజి, ఫిలాసఫీ   ,క్లాసికల్  ఫైలాలజి ,సంస్కృతం జెంద్,పెర్షియన్ ,అరెబిక్ , ఆర్మీనియన్  భాషలు అధ్యయనం చేశాడు .1858 లో తూర్పు భాషలలోను ,ఆర్కియాలజీ లోను డాక్టరేట్ పొందాడు .గ్రీక్ భాషలోని ‘’టేస్ ‘’అనే ప్రత్యయం పై దిసీస్ రాసి ప్రచురించాడు .అదే ఏడాది సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలనకోసం పారిస్ వెళ్ళాడు .తర్వాత లండన్ వెళ్లి 1862 వరకు ఉన్నాడు .ఈ కాలం అంతాఇండియన్ ఆఫీస్ లో  ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీ లోని బోడ్లియన్ లైబ్రరి  వేద వ్రాత ప్రతుల అధ్యయనం లోనే గడిపాడు .మొదట్లో ప్రైవేట్ టీచర్ గా పని చేసి తర్వాత విండ్సర్ కాజిల్ లోని క్వీన్స్ లైబ్రరి కి అసిస్టంట్ గా ఉన్నాడు .

1862 లో గోటేన్జన్ లైబ్రరీకి అసిస్టంట్ గా వెళ్లి ,మాక్స్ ముల్లర్ ద్వారాఆహ్వానం అందుకొని  బనారస్ సాంస్క్రిట్ కాలేజి లో చేరటానికి వెళ్ళాడు .  ఈలోగాప్రోఫేసర్ మూలర్ ద్వారా బాంబే ఎలి ఫెంటైన్ కాలేజి లో ప్రాచ్యభాషల  ప్రొఫెసర్ గా ఆహ్వానమూ అందుకొని వెంటనే బొంబాయి వెళ్లి1863 ఫిబ్రవరి 10 న  చేరాడు .అప్పుడు అక్కడ ప్రముఖ న్యాయ శాస్త్ర విద్యా వేత్త కాశీనాద్ త్రయంబక్ తెలంగ్ విద్యార్ధిగా ఉన్నాడు .మరుసటి ఏడాది బూలర్ ఫెలో ఆఫ్ బాంబే యూని వర్సిటి అయ్యాడు .రాయల్ ఏషియాటిక్ సొసైటీ లో సభ్యుడయ్యాడు .188౦ వరకు ఇక్కడే పని చేశాడు .ఇక్కడున్న కాలం లో బెర్లిన్ కేంబ్రిడ్జ్ ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలకు అరుదైన విలువైన పుస్తకాలను సేకరించి పంపాడు .

1878 లో అతి ప్రాచీనమైన ప్రాకృత వ్యాకరణం ‘’పైయాలచ్చి ‘’నిఘంటువును అనువదించాడు .వివరణ కూడా  రాశాడు .ఆపస్తంభ ధర్మ సూత్రాల అనువాదానికీ సహయం చేశాడు .8-4-1898 న లేక్ కాన్స్తాన్స్ లో మునిగి చనిపోయాడు .బూలర్ ఇతర రచనలు –ది రూట్స్ ఆఫ్ దాతుపాఠ.ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఖరోస్తి ,డైజెస్ట్ ఆఫ్  హిందూ లా కేసెస్ ,పంచతంత్ర ,కేటగిరి ఆఫ్ సాస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ,దశ కుమార చరిత్ర ,విక్రమార్క చరిత్ర ,ఇన్స్క్రిప్షన్స్ ఫ్రం ది కేవ్స్ ఇన్ బాంబే ప్రెసిడెన్సి ,ది లాస్ ఆఫ్ మను ,మొదలైన సుమారు 20 రచనలు .

Inline image 2

20- మైత్రాయణీయ ఉపనిషత్ అనువదించిన –వాన్ బుటెనాన్

జోహాన్నెస్ ఆద్రినాస్ బెర్మార్దాస్  వాన్ బుటెనాన్ 21-8-1928 న ది హేగ్ లో జన్మించిన డచ్ ఇండాలజిస్ట్ .చికాగో యూని వర్సిటిలోఫిలాసఫీ ఫైలాలజి  చదివి  .కెరీర్ చివరలో మహా భారతం పై మక్కువ ఎక్కువ చూపాడు .1953  లో డాక్టరేట్ పొందాడు .వెంటనే ఇండియా వెళ్లి మూడేళ్ళున్నాడు .1959 నుంచి 61 వరకు యుట్రేక్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .నెదర్ లాండ్స్ పై మోజు పోయి ,చికాగో యూని  వర్సిటి నుండి  ఆహ్వానం రాగా చేరి 21-9-1979 న చనిపోయే దాకా అక్కడే పని చేశాడు .అమెరికాలోని అనేక మంది విద్యావేత్తలకు గురుత్వం వహించిన ఖ్యాతి  వాన్ బుటెనాన్ ది .ఆయన ప్రముఖ శిష్యులలో జేమ్స్ ఎల్ ఫిట్జెరాల్డ్ ,వాల్టర్ ఓ కేల్బార్ ,మైకేల్ డివిల్స్  బ్రూస్ సల్లినాన్, బ్రూస్ లింకన్ వంటి వారున్నారు .1963 లో రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్  అండ్ సైన్స్ కు కరస్పాండెంట్ అయ్యాడు .

బుటేవాన్ రచనలు –టేల్స్  ఆఫ్ ఎన్శేంట్  ఇండియా ,ది మైత్రాయణీయ ఉపనిషత్ ,ది ప్లేస్ ఆఫ్  ఎన్శేంట్  ఇండియా ,రామానుజ ఆన్ భగవద్గీత ,యామునాస్ ఆగమ ప్రామాణ్య ,ది మహాభారత -3 భాగాలు ,భగవద్గీత ఇన్ ది మహా భారత .సాంఖ్యం మీద మూడు పెద్ద వ్యాసాలు ,పంచ రాత్ర నామ విశిస్టత మీద ఆంగ్ల వ్యాసం రాశాడు

Inline image 1

.

సశేషం

గాంధీ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-16 –ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది .ఒక సారి అమ్మ ఎలా ఉందొ చూద్దాం –  అమ్మంటే అంగడిలో దొరికే బొమ్మకాదని ,గోడకి తగిలించే పటం కాదని చెప్పి ప్రమిదలో దీపంలా చూసుకోమన్నారు .’’అమ్మ ఉంటే అంతులేని సొమ్ముగా ‘’అని సుద్ది చెప్పారు .కన్నవారిని అనాదాశ్రమాలు పాలు చేసే వారికి ఇది కొరడా దెబ్బ .’’తరతరాల పెన్నిధి –తలచుకొంటే సన్నిధి ‘’అంటూ ‘’బతికి నంతకాలం యెద తలుపులు మూశావు  -బతుకు బండి ఆగిపోతే –‘’ఇప్పుడు తహతహ లాడే వారిని ఎండ గట్టారు .’’అమ్మ సారధి వారధి ‘’అన్నారు .’’అమ్మ మనసు విరిచి అమ్మ భాష మరిచిన వాడు ‘’లోకం లో చులకన అవుతాడు .’’అమ్మా నాన్న అక్షరాలు చెరగని సత్యాలు ‘’’’చల్లని సంసారం ,చక్కని సంతానం ఉంటె –మెచ్చును ఆ జంట –నడిచోచ్చును సిరి ఆ వెంట ‘’అని చాలా అనుభవం తో చెప్పారు .ఏ భాషలో నైనా అమ్మా నాన్నలకు అర్ధం ,పరమార్ధం ఒకటే .’’తనువున్నంతకాలం తన వారిని కాస్తూ –తరాలు మారినా తరగని మమకారం గుండెల్లో ని౦పేది అమ్మ ‘’’

‘’మూడు ముళ్ళు వేసి ,ఏడడుగులు నడిస్తేచాలదు –ఒకరి నొకరు తెలుసుకొని,ఒకటిగా మసలుతూ ముందుకు అడుగేయాలి ‘’అని కొత్త జంటకు ఆదర్శం బోధించారు .ఒద్దికగా బుద్ధిగా ఉంటె జంట ‘’జే గంట ‘’కొడుతుందని ,అ జంటను చూసిన లోకానికి కన్ను కుడుతుందని లోక రీతి చెప్పారు .’’ఎవరి కేది బంధమో –ఎవరికెంత రుణమో –ఎవరికేది సొంతమో ,-ఎవరు యెటుల అంతమో !’’అని తత్త్వం బోధించారు .అర్ధ రాత్రి స్త్రీ ఒంటరిగా తిరగటానికిస్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్ళు అయినా కుదరనందుకు బాధ పడ్డారు .’’స్త్రీ కి ఇచ్చే గౌరవం ఇదేనా ?అని ప్రశ్నించారు .కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతూ ,ఆనందాన్ని అభివర్ణిస్తూ ‘’అరుగుల చావడి ,అంకెల గారడీ –మాటల ఉరవడి ,మనసున పై బడి –అందేల సవ్వడి ,అడుగుల అలికిడి –ఆడి పాడి ప్రతి రోజూ చేయాలి సందడి ‘’అని ఘనంగా చెప్పారు .చివరగా నవ్యాంధ్ర నిర్మాణానికి చేయీ చేయీ కలపమంటూ ‘’తర తరాల అంత రాలలో తరగని సంతోషం నింపుదాం –అమ్మా జనని నీ కిదే వందనం –పాదాభి వందనం ‘’మాత్రు వందనం తో  ముగించారు .హాయిగా చదువుకోవటానికి బాగా ఉన్న అమ్మ మీది ఆత్మీయ గౌరవాల కవితా గీతికలు రాసి ,అమూల్యమైన అమ్మ ను అందరికి ”అమూల్యం ”గానే అందిస్తున్న  శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి అభినందనలు .

దసరా శుభా కాంక్షలతో

గబ్బిట దుర్గా ప్రసాద్-30-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment