మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-11

– మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-11

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -6

6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి -2

సమయాధార అధ్యయనం స్థానికంగా తయారు చేసిన నైట్రోజెన్ లేజర్ ,క్షీణ వక్రతల ఫోటోగ్రాఫింగ్ లను స్టోరేజ్ ఆసిలో  స్కోప్  తో చేయగలిగారు .ఈ టెక్నిక్ చాలా మొరటు విధానమే అయినా ,ఉత్తేజిత౦ ,ఫ్లారసేన్స్ మార్గాలను ఖచ్చితమైన  లైఫ్ టైం గుర్తించటానికి సరిపోయింది.

  దీనితర్వాత ఉత్తేజిత మూలాల తో వాణిజ్య పరమైన ట్యూ నబుల్  పల్స్ డై లేజర్ వైపు అడుగులేయటం తో మరో దశ ప్రారంభమైంది .నైట్రోజెన్ లేజర్ తో చేసిన బ్రూట్ ఫోర్స్ ఎక్సై టేషన్ కంటే ఇది నిర్దుష్టంగా ఉన్నది .పిమ్మట బాక్స్ కార్ యావరేజర్ కూడా కాన్పూర్ సంస్థలో అందుబాటులోకి వచ్చింది .అద్భుతమైన ఈ యావరేజర్ తో డీకే ప్రోఫైల్స్ ను అత్యంత నిర్దుష్టంగా రికార్డ్ చేయగలిగారు .CROతో చేసిన దానికంటే దీనితో వచ్చిన ఫలితాలు చాలా ఖచ్చితంగా, అత్యంత సంతృప్తిగా ఉన్నాయి .అందువలన రేడియేషన్ ట్రాన్సిషన్ రేట్స్ డేటా ,అయాన్ పైర్ రిలాక్సేషన్ ప్రాసేసేస్ ,అన్ కన్వర్షన్ ఫినామినా మొదలైన వాటిపై  , చాలా ఎక్కువగా సమాచారం దొరికింది . ఈ ఫలితాలు సైట్ సెలెక్టివ్ స్పెక్ట్రో స్కోపి అన్వేషణకు చక్కని రాజమార్గాన్ని ఏర్పరచాయి .

   మొత్తం మీద కాన్పూర్ ఐ ఐ టిలో ఆప్టి కల్ స్పెక్ట్రో స్కోపి  పరిశీలనలు రేర్ ఎర్త్ అయాన్ డోపేడ్ ఫ్లొరసైడ్ క్రిస్టల్స్ ల దీప్తి అధ్యనానికి మార్గం సుగమమం చేశాయి .ఇందులో అబ్సార్ప్షన్,లేజర్ ఇండ్యూసేడ్ ఫ్లారసేన్స్ ,లైఫ్ టైం మెజర్ మెంట్స్ కూడా ఉన్నాయి .వెంకటేశ్వర్లుగారికి  అత్యంత సునిసిత దూర దృష్టి ఉంది.కాన్పూర్ ఐ . ఐ .టి.లో చేసిన అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి ఆ కాలానికి సమయానికి తగిన అభిరుచి .ఇక్కడ చేసిన ఎనర్జి అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి పని ఆధారం గా ఐబి ఎం సైంటిస్ట్ లు La F3,Nd +3లను ఉపయోగించి వయొలెట్ అప్ కన్వేర్షన్ లేజర్ ను అభి వృద్ధి చేశారు .తర్వాత 15 ఏళ్ళవరకు అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి /లేజర్ వర్క్   లకు ఇదే అందరికీ సిద్దాన్తమైంది .

  అందుకనే అలబామాలో అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన కొనసాగించారు .ఆప్టికల్ ఫిజిక్స్ లో ప్రయోగాత్మక పరిశోధనకు వెంకటేశ్వర్లు గారే శ్రీకారం చుట్టారు .ఆయనద్వారానే అనేక ప్రభుత్వ సంస్థలనుంచి విరాళాలు వెల్లువగా ప్రవహించాయి .ఆప్టో గాల్వనిక్ స్పెక్త్రో  స్కోపి ,ఇంటర్ ఫేరో మెట్రి ,ఆర్గానిక్ మీడియా నాన్ లీనియర్ స్పెక్ట్రో స్కోపి ,నాన్ లీనియర్ ఆప్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ ,ఫైబర్ ఆప్టిక్స్ ,ఆప్టికల్ స్పెక్ట్రా ఆఫ్ క్రిస్టల్స్ పై ప్రయోగాలు చేశారు .అలబామాలో  Er3+,HO 3+,N d 3+మొదలైనవి ,డోపేడ్ ఫ్లూరైడ్స్ గార్నేట్స్ ,గ్లాసెస్ ల పై  ముఖ్యంగా దృష్టి పెట్టారు .చాలాకాలం ఆప్టికల్ గ్లాసులు అప్ కన్వర్షన్ లో అంతగా ప్రాచుర్యం పొందలేదు .కారణం వాటికి ఉన్నఫోనన్ ఫ్రీక్వెన్సీ యే.హయ్యర్ రేడియేషన్ లెవెల్స్ ను అణచటానికి మల్టి ఫోనాన్ రిలాక్సేషన్స్ ఉపయోగించారు .టేల్ల్యురియం ఆక్సైడ్ కలిగి ఉన్న Er3+ మల్టి ఎలిమెంటల్  ఆక్సైడ్ గ్లాస్ ను అలబామా సంస్థలో  ఇన్ఫ్రా రెడ్ రేడియేషన్ కు  సమీపం లో  తయారు చేస్తే కాంతివంతమైన అప్ కన్వర్షన్ ఏర్పరచింది .అదే సమయం లో చాలా ప్రయోగశాలల్లో ఇలాంటి పనే జరిగింది .ఈ కాలం లోజపాన్ లో తయారయ్యే  రేర్ ఎర్త్ ఆయాన్ డోపేడ్ టేల్యు రైడ్ ఫైబర్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి .దీనిని బట్టి వెంకటేశ్వర్లు గారి బృందం అలబామా సంస్థలో చేసిన కృషి ఎంతటి  విశిస్ట మైనదో అర్ధమవుతోంది .ఇవన్నీ జర్నల్స్ లో చోటు చేసుకొని చారిత్రాత్మక విజయాలుగా పరిగణింప బడ్డాయి .ఈ సంస్థ లో  విజిబుల్ కన్వర్షన్ ఫినామినా లో నియర్ ఇన్ఫ్రా రెడ్ పై కేంద్రీకరణ జరిగింది .HO 3+,డోపేడ్ Ca F2  ల సైట్ సెలెక్టివ్ అప్ కన్వర్షన్ స్పెక్ట్రో స్కోపి లు అనూహ్య ఆసక్తికర ఫలితాలనిచ్చాయి .హాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర్లు గారు .

   సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-17 – ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధనుర్మాసం మొదటి రోజు 17-12-17 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రభాత పూజ

ధనుర్మాసం మొదటి రోజు 17-12-17 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రభాత పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-10

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-10

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -5

6-సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి లో కృషి

నలుగురు నడిచే నలిగిన దారిలో నడిచే అలవాటు లేని వెంకటేశ్వర్లుగారు చేసినపనే చేస్తూ కూర్చోవటం లో సంతృప్తి పడేవారు కాదు .1964 లో కాన్పూర్ ఐ ఐ టిలో ప్రయోగాత్మక పరిశోధన చేస్తున్నప్పుడు ,చాలాకాలం గా పని చేస్తున్న మాలిక్యులర్ స్పెక్ట్రో గ్రఫి  కి మాత్రమె పరిమితం అవకుండా ,సాలిడ్ స్టేట్ స్పెక్ట్రో స్కోపి పై కూడా దృష్టి సారించి దానికవసరమైన వేరియర్ EPR మెషీన్ ,కెరీ 14ఆప్టికల్ స్పెక్ట్రో మీటర్లను కూడా డిపార్ట్ మెంట్ లో  నిర్మించే లాబరేటరీ తోపాటు నెలకొల్పారు .సింగిల్ క్రిస్టల్స్ లోయిపిఆర్ పరివర్తన లోహ అయాన్ లపై గొప్ప కృషి చేశారు .ఈ అయాన్ ల ఆప్టికల్ స్పెక్ట్రో స్కోపి తాను పూర్వం చేసినదానికి కొనసాగింపు మాత్రమె .

  Rb Mn F3 ఎలక్ట్రాన్  అబ్సార్ప్షన్ కృషి ఫలితంగా ఉత్తేజిత  Mn 2+ లో స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ను మొట్టమొదటిసారిగా నిర్ణయించ గలిగారు .క్రిస్టల్ ఫీల్డ్ ,రికా పారామీటర్స్ దృష్టిలో  స్పెక్ట్రం యొక్క సంపూర్ణ  విశ్లేషణ సాధ్యమైంది .ఈ ఫలితాలన్నీ ఫిజికల్ రివ్యు లెటర్స్ లో ప్రచురించారు  .వెంకటేశ్వర్లు శిష్య బృందం కలిసి  అమోనియం క్లోరైడ్ సింగిల్ క్రిస్టల్స్ లోడైవలేంట్  కాపర్ ,నికెల్ ఎలెక్ట్రానిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రా ను ఆర్దర్డ్ ,డిసార్దర్డ్ స్థాయిలలో డోపైన్ అయాన్స్  ఎలక్ట్రా నిక్ సైట్స్ , లామ్డా ట్రాన్సిషన్ ల ప్రభావాలపై అన్వేషణ చేశారు .

  1973  లో ఆయన దృష్టి, అభిరుచి రేర్ ఎర్త్ మెటల్ అయాన్స్  పై కేంద్రీకరించి లాంథనం ఫ్లోరైడ్ ,కాల్షియం ఫ్లోరైడ్ మొదలైన క్రిస్టల్స్ పై  అన్వేషణ చేశారు .12 ఏళ్ళలోఈ రంగం లో గణనీయమైన అభి వృద్ధి సాధించారు .Nd 3+,Dy 3+,Eu3+,Pr 3+లపై కూడా పరిశోధించారు . ఆకాలం అంతా గొప్ప ఉత్తేజం అభిరుచి లతో చాలామంది విద్యార్ధులు ఇలాంటి వాటిపైనే కృషి చేసి వాటి స్పెక్ట్రా  లపై అసక్తికరమైన విషయాలు కనుగొన్నారు .ఈ అయాన్స్ ల అబ్సార్ప్షన్ స్పెక్ట్రా లను ఫోటోలు తీసి ,స్థానికంగా తయారు చేసిన నైట్రోజెన్ లేజర్ ద్వారా ఫ్లారసేన్స్ ను గుర్తించారు .స్పెక్ట్రో గ్రాఫ్ ను తర్వాత లాబ్ లో రికార్డింగ్ స్పెక్ట్రో ఫోటోమీటర్ గా పరి వర్తన చెందించారు .వాణిజ్య పరమైన ఉత్తేజిత CW ఆర్గాన్ అయాన్ లేజర్ ద్వారా వెలువడిన ఫ్లారసేన్స్ ను రికార్డ్ చేశారు .క్రిస్టల్స్ ను  పోలరైజేడ్ లైట్ ద్వారా అనేక కోణాలో ఉత్తేజిత పరచి 77 K  ఉష్ణోగ్రత ,ఆ పై  ఉష్ణోగ్రత ల వద్ద ఫ్లారసేన్స్ లను రికార్డ్ చేశారు .

  శక్తి స్థాయిలను  సైట్ సిమ్మెట్రి  గుర్తింపు కోసం  స్టేడీ స్టేట్ స్పెక్ట్రా ను వాడారు .కాల్షియం ఫ్లోరైడ్ లో అనేక క్రియాశీలక క్షేత్రాలను గమనించారు .గమనించిన మరి కొన్ని ఆసక్తికర విషయాలలో సెల్ఫ్ అబ్సార్ప్షన్ ,యాంటి స్టోక్స్ ఫ్లారసేన్స్ తర్వాత వరుసగా జరిగే రెండు ఫోటాన్ ల శోషణ,అయాన్ జంటల మార్పు లను ఈ పదార్ధాల స్పెక్ట్రా ఆధారం గా కనిపెట్ట  గలిగారు .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-9

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -4

                          ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్

3-నూతన విధానాలు

అయాన్స్ యొక్క EPR విశ్లేషణ లో భాగం గా స్పిన్ విలువ ఒకటి లేక ఒకటి కంటే ఎక్కువ ఉంటె ,సున్నా క్షేత్రం వద్ద క్రిస్టల్ ఫీల్డ్ పారామీటర్ విషయాలు తెలిసే వీలున్నది.సూటిగా ఈ సమాచారం రాబట్టటానికి వెంకటేశ్వర్లు గారి బృందం జీరో ఫీల్డ్ EPR స్పెక్ట్రా మీటర్  ను మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ గా   నిర్మించి GHz పరిధిలో సాలిడ్ సాంపిల్స్ యొక్క శోషణ (అబ్సార్ప్సన్ )గణించారు .ఇలాంటి స్పెక్ట్రా  మీటర్ ఇండియాలో ఇదే మొట్టమొదటిది .ఇది X,K బాండ్ లలో పని చేసే సామర్ధ్యం కలిగి ఉన్నది .ఈ స్పెక్త్రా మీటర్ ఉపయోగించి ఆయన బృందం అమ్మోనియం క్లోరైడ్ యొక్క డై వలేంట్ Mn ,ట్రైవలేంట్ Fe ల జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ల సమాచారం తెలుసుకున్నారు .EPR వలన ఎక్కువ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ సమాచారం గ్రహించటం చాలా కష్టతరం అయినందున వీరు రాబట్టిన సమాచారం చాలా ప్రాముఖ్యమైంది .

4-NLO పదార్ధాల EPR

ప్రేరణ ,అంతర్ దృష్టి ఆధారం గా వెంకటేశ్వర్లు గారు  ఘన పదార్ధాలలో  పాయింట్ డిఫెక్ట్ ల నిర్మాణ ధర్మాలను  ,తాను నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,హోలోగ్రఫీ లపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నా కనిపెట్టగలిగారు .ఫోటో EPRఅధ్యయనానికి అలబామా A and M యూని వర్సిటిలో ఒక లేబరేటరి నెలకొల్పి ,Ba Ti O3,Li Nb O3,బిస్మత్ సిలికాన్ ఆక్సైడ్ ల  ,ఫోటో రిఫ్రాక్టివ్ ల మెకానికల్ అన్వేషణ హాలోగ్రఫీ సంయుక్త పరిశోధనలకు తగినట్లు దీని నిర్మాణం చేశారు .ఆయన బృందం సూటిగా Fe3+మలినాలు ఫోటో ఇండ్యూసేడ్ చార్జి  మార్పు తెస్తాయని   ప్రయోగాత్మక పరిశోధనా సాక్ష్యాలుగా నిరూపించి ,ఇది B a T I O 3స్పటికాల నిర్మాణ గ్రేటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తుందని చూపారు .దీని ఆధారం గా  ఫోటో రిఫ్రాక్టివ్ B a T I O 3స్పటికాలు ,మిగిలిన పీజో ఎలక్ట్రిక్  సిస్టం ల గ్రేటింగ్ లమోడల్స్ నిర్మాణాలకు  కొత్త  సూచనలు చేయగలిగారు .

5-న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజోనెన్స్

ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీలో ఉండగానే వెంకటేశ్వర్లుగారు NMRలో రిసెర్చ్ సౌకర్యాలు కల్పించారు .భారతీయ యూని వర్సిటీలలో ఇలాంటిది ఇక్కడే ప్రారంభమై దిశా నిర్దేశం చేసింది .తర్వాత కాన్పూర్ ఐ. ఐ.టి. లోనూ ఇలాంటి సౌకర్యం యేర్పరచారాయన .ఆయనా ఆయన విద్యార్ధులు H1,F19 ,Cl35,C13లలో న్యూక్లియర్ మాగ్నెటిక్ రిజోనేన్స్ పరిశోధనా ఫలితాలను అనేక రిసెర్చ్ పేపర్లుగా రాసి ప్రచురించారు .అతి ముఖ్యంగా NMR స్పెక్ట్రా యొక్క నాలుగు స్పిన్ విధానాలను అత్యంత స్పష్టంగా అధ్యయనం చేయగలిగారు .1- ఫ్లోరో 2-డై నైట్రో బెంజీన్ ,3-పారా డిస్ట్రిబ్యునల్  బ్యూటేడ్ బెంజీన్స్,ఆల్ఫా బీటా, గామా పైకోలైన్స్ లH1 ,F1ల రెజోనేన్స్ స్పెక్ట్రా  అధ్యయానాలు చాలా ముఖ్యమైనవి .ఫ్లోరో బెంజీన్స్ .పారా సబ్స్టి ట్యూ టెడ్ ఫ్లోరియో బెంజీన్స్ లో H1,F19 NMRస్పెక్ట్రా అధ్యయనాలు  చాలా ప్రశస్తమైనవి .ఆల్కలి క్లోరైడ్ లలో Cl 35 రెజోనేన్స్ అబ్జర్వేషన్స్  కూడా చేశారు .

  సి .యెన్ ఆర్ .రావు గ్రూప్ తో కలిసి థయో బెంజాయడ్ ఆసిడ్ ,ఫినాల్ ,అనిలిన్ ధయో ఫినాల్ ,ఇథనాల్ ,2,2,2 ట్రై ఫ్లోరో ఇథనాల్ మొదలైన మాలిక్యూల్స్ లలోని హైడ్రోజెన్ బాండింగ్ ను ఆసక్తికరంగా అధ్యయనం చేసి ఎన్నో కొత్త  ఆసక్తికర అవసరంమైన విషయాలు లోకానికి తెలియజేశారు .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-17 –ఉయ్యూరు

 

 

        

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-8

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-8

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -3

           అయస్కాంత అనునాదం (మాగ్నెటిక్ రేజో నెన్స్)లో అద్వితీయ కృషి

1-       ఎలక్ట్రానిక్ పారమాగ్నేటిక్ రిజోనెన్స్

1960 ప్రధమార్ధం లో ఘనీకృత పదార్ధాలపై న్యూక్లియర్ మరియు స్పెక్ట్రో స్కోపిక్ టెక్నిక్ ల అను వర్తనం  (అప్లికేషన్ ) విషయం లో  పరిశోధన కొంత అభి వృద్ధి సాధించింది .ఘన పదార్ధాలలో స్థానిక ఆకృతి ,బాండింగ్ ప్రోబ్ అయాన్ ఖచ్చితమైన సమాచారం ఎలక్ట్రానిక్ లెవెల్స్ పై  హైపర్ ఫైన్ ఇంటరాక్షన్స్ , ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రేడి ఎంట్స్ ప్రభావం కోసం ఈ టెక్నిక్ లనుచక్కగా ఉపయోగించారు .ఈ పరిశోధనా ఫలితాలు 3d,4f అయాన్ ల అయానిక్ స్పెక్ట్రాలపై నూతన సమాచారం అందించింది. అంతేకాదు ఘనీ కృతాలలో లాపోర్డ్ నిషేధాలను అధిగమించటానికి అవకాశాలు మెరుగైనాయి .1962 లోనే వెంకటేశ్వర్లుగారు అత్యంత వేగంగా దీని ప్రాముఖ్యాన్ని గుర్తించారు .ఆలస్యం చేయకుండా,ఘన  3d,4f అయాన్ ల క్రిస్టల్ స్పెక్ట్రా ,పారా మాగ్నెటిక్ రేజో నెన్స్(EPR)లను క్రయోజెనిక్  ఉష్ణోగ్రత ల వద్ద అధ్యాయనానికి నిర్దుష్ట ప్రణాళికలను  సిద్ధం చేసుకున్నారు .అంతటి వేగ వంతమైనది ఆయన ఆలోచనా సరణి .

           అన్వేషణ రంగాలు

వెంకటేశ్వర్లు గారి బృందం అనేక   పారా మాగ్నెటిక్ ఘన పదార్ధాల సింగిల్ క్రిస్టల్స్ నిర్మాణం ,బాండింగ్ లపై ఎన్నో ఆసక్తికర విషయాలను ఆవిష్కరించింది .ముఖ్యంగా పూర్తిగా అయానిక్ క్రిస్టల్స్ అయిన సోడియం క్లోరైడ్ ,పొటాషియం క్లోరైడ్ ,హైడ్రోజెన్ బాండ్ ఉన్నKDPవంటి ఫెర్రో ఎలక్ట్రిక్స్,హైడ్రోజెన్ బాండింగ్ ఉన్నవి ,లేనివీ అయిన  అనేక  సల్ఫేట్స్,సాలినేట్స్.మాలిక్యులర్ ఘనాలైన ఆలమ్స్ ,అమ్మోనియం సల్ఫేట్స్,,హాలైడ్స్ ,అనేక పరి వర్తక లోహాలు ,అల్కలిన్ ఎర్త్ పెర్క్లో రేట్స్ పై నూతన విషయాలను కనిపెట్టారు .పారామాగ్నేటిక్ సంక్లిస్టాల నిర్మాణం పై కొత్త సమాచారం  రాబట్టటమే కాకుండా ,ఈ బృందం మొట్టమొదటి సారిగా EPR టెక్నిక్ ను ఘనాల సంక్లిష్ట ధర్మాలను అర్ధం చేసుకోవటానికి,పారామాగ్నేటిక్ అయాన్స్ లను గుర్తించటానికి  ప్రయోగించారు . హైడ్రోజెన్ బాండ్ ఉన్న KDP లో నిర్మాణ దశా  పరివర్తనం,అమోనియం హాలైడ్స్ లోలామ్డా పరివర్తనకు దగ్గరలో ఉన్న మాలిక్యులర్ డైనమిక్స్ లపై అద్భుత అన్వేషణ చేశారు . ఆల్కలైన్ నైట్రేట్స్, ట్రాన్సిషన్ లోహాలు ,ఆల్కలైన్ యెర్త్ లోహాల ఆల్కలైన్ నైట్రేట్స్,పెర్ క్లోరేట్స్ పై  పరిశోధన చేసి ,విలువైన సమాచారం అందించారు .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 13-12-17- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు 

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు 

బెంబేలెత్తి పోతున్న దేశ ప్రధాని 
గుజరాత్ ఎన్నికలలకు 
పన్నిన  సరి కొత్త వ్యూహం 
మచ్చ  లేని వారిపై బురద చల్లటం 
 తనను చ0పేందుకు పధకం సిద్ధం 
అంటూ కన్నీటి బొట్లు రాల్చి 
అవి ప్రవాహ వేగంతో కదిలిపోవటం 
ఆక్రోశం ,ఆవేశం తో స్థాయి మరచి 
నిందారోపణ చేయటం 
”నీచే ” అన్న”అయ్యర్ని
 ఉతికి పారేయటం 
ఆవేశ కావేశా హావ  భావాలతో 
కారు మబ్బుల్ని సృష్టించటం 
ఇవి ఓట్ల వర్షం కురిపిస్తాయని ఆశించటం 
కన్నీటి బొట్ల ప్రవాహం లో ప్రతి పక్షం 
దరీ దాపు లేకుండా కొట్టుకు పోయి 
ఆమాద్మీ లంతా ఓట్ల జడివాన కురిపిస్తారని
 అత్యాశ పడటం  
అభివృద్ధి మాట మరచి 
ఉచ్చ నీచాలు పక్కన బెట్టి 
పక్క దేశం పాక్ నూ 
ఇరికించటం 
ఓటమి భయం తోనా 
ఓట్ల సునామీ  కోసమా?
ఇది ఈయనకే కాదు 
మాజీ మహిళా ప్రధానికూడా  
ప్రతి ఎన్నికకూ తన్ను  చంపబోతున్నారని 
ప్రచారం చేయటం చూసాం విన్నాం చదివా0 
ఓట్లు దండుకోండి  చేసిన మంచి చెప్పి- తప్పేమీ లేదు 
అసత్యపు ఆరోపణ ,కల్ల  బొల్లి ఏడుపు 
ఎప్పుడూ ఫలితమివ్వదు 
”చేసిన పుణ్యము  చెడని  పదార్ధము ”
అన్న కవి సూక్తి గుర్తించి ప్రవర్తించండి . 
ప్రజలు బాగా తెలివైన వాళ్ళని గుర్తించండి 
ఎవర్ని ఎప్పుడు ఎక్కించాలో ఎప్పుడు దింపాలో 
నాడి  తెలిసిన వాళ్ళు –
తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత . 
   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-17- ఉయ్యూరు ,

—


Posted in రచనలు | Tagged | 1 Comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-7

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర -2

2-మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లో

డ్యూక్ యూని వర్సిటీలో ఉండగా వెంకటేశ్వర్లుగారు మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన ప్రారంభించారు .1953-54 కాలం లో రెండేళ్ళు ఆ పనిలోనే ఉన్నారు .ఆ సమయం లో వాయువుల మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి  ప్రారంభ దశ లోనే ఉన్నది ఆ యూని వర్సిటి లో గార్డీ,ఆయన అనుచరులు మార్గ గాములుగా ఉన్నారు .వెంకటేశ్వర్లుగారు సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేశారు .మిధైల్ ఆల్కహాల్ కొద్దిగా అసౌస్టవ మాలిక్యూల్ గుప్తంగా అంతరిక భ్రమణాలు (హిండర్డ్ ఇంటర్నల్ రొటే షన్స్) కలిగి ఉంటుంది .అందులోని ప్రాధమిక కంపనాలు ( ఫండ మెంటల్ వైబ్రేషన్స్  హైడ్రాక్సిల్ గ్రూప్ )పురి(టార్సనల్ )తో మిధైల్ గ్రూప్ కు అనుబంధంగా ఉంటాయి .ఈ కదలిక నే హిండర్డ్ అంటే గుప్త భ్రమణాలు అంటారు .ఇవి మాలిక్యూల్ స్పెక్ట్రం యొక్క భ్రమణాలను క్లిష్ట తరం చేస్తాయి .వీటిపై ప్రాధమిక పరిశోధన ,విచారణలను డేన్నిసన్ ,అతని అనుచరులు చేశారు .1953 లో దీనిపై పరిశోధనా పత్రం రాసి ప్రచురించగానే వెంకటేశ్వర్లుగారు ఆయన సహచరులు మిధైల్ ఆల్కహాల్ మైక్రో వేవ్ స్పెక్ట్రం ను పరిశోధించారు .దీనిపై మొదట గా  ఈ మాలిక్యూల్ యొక్క రోటేషనల్ స్పెక్ట్రం మొదటి  ప్రాధమిక  అధ్యయన విషయాలను రెండు పేపర్లుగా ప్రచురించారు .ఈ మాలిక్యూల్ యొక్క మైక్రోవేవ్ ,మిల్లి మీటర్ వేవ్ స్పెక్ట్రం లను మైక్రో వేవ్ ఆస్ట్రనాట్స్ దట్టమైన మాలిక్యులర్ క్లౌడ్స్ లో మైక్రో వేవ్ ఉద్గారం (ఎమిషన్ ) వలన గుర్తుపట్ట గలరు .అప్పటి నుంచి ఓరియన్ మాలిక్యులర్ క్లౌడ్స్ లో అనేక చోట్ల అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు .మైక్రో వేవ్ ఆస్ట్ర నామర్స్ కు ఈ మాలిక్యూల్ ను గుర్తించటానికి ఈ ఊహలు పరిశోధనాలయం లో గమనించిన విషయాలు బాగా తోడ్పడ్డాయి .అంతరిక్ష భౌతిక శాస్త్రం లో అత్యధిక ప్రాముఖ్యం కల ఈ మాలిక్యూల్ యొక్క మైక్రో వేవ్ స్పెక్ట్రం ను అధ్యయనం చేసిన మొట్ట మొదటి శాస్త్ర వేత్తలుగా శ్రీ వెంకటేశ్వర్లు గారి బృందం  చరిత్ర ప్రసిద్ధులయ్యారు .

  డ్యూక్ యూని వర్సిటి లో మిజు షీమా,  వెంకటేశ్వర్లు గారు కలిసి గ్రూప్Vd,Td మాలిక్యూల్స్ లో మైక్రో వేవ్ శోషణ (అబ్సార్ప్షన్)పై అన్వేషణ చేశారు .వీటికి శాశ్వత డైపోల్ గమనం ఆధార స్థితి లో లేదని ,కనుక ఆ స్థితిలో మైక్రోవేవ్ శోషణ లేదని కనిపెట్టారు .ఈ శాస్త్ర ద్వయం ఈ మాలిక్యూల్స్ యొక్క ఉత్తేజిత  క్షీణ కంపన స్థితిలో పూర్తిగా రోటేషనల్ అబ్సార్ప్షన్ కనపరుస్తాయని చెప్పారు ..ఇలాగే మిదేన్ మాలిక్యూల్ విషయం లో ఒజీర్ ,అయన అనుచరులు1973 లో  పరిశోధించి చెప్పారు . ఇవన్నీ వెంకటేశ్వర్లుగారి అంతర్ దృష్టి (ఇంట్యూషన్ ),శాస్త్రీయ అవగాహనలకు ప్రతిబింబాలు .

  1954 లో ఇండియా కు  తిరిగి వచ్చిన .వెంకటేశ్వర్లు గారు వెంటనే  ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి ఫాకల్టీ లో  చేరారు .చేరిన ఏడాదికే యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్ మైక్రో వేవ్  స్పెక్ట్రో  స్కోపి లాబరేటరి నిర్మించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .అప్పటికి భారత దేశం సాంకేతిక ,పారిశ్రామిక అభి వృద్ధిలో కాలు మోపి నెమ్మదిగా అడుగులు కదుల్చుతోంది .మైక్రో వేవ్ స్పెక్ట్రా మీటర్ నిర్మాణానికి కావలసిన విడిభాగాలన్నీ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలి .ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ పరికరాలు  లాగా మైక్రో వేవ్ స్పెక్ట్రా  మీటర్లు మనకు కావలసినన్ని  దొరకవు .విడిభాగాలు తెప్పించి సమకూర్చుకుని లాబరేటరి లో నిర్మించు కోవాల్సిందే  .వీరు ఎక్కువ భాగం డ్యూక్ యూని వర్సిటీ నుంచి తెప్పించుకున్నారు .వేవ్ గైడ్ కంపో నెంట్స్ వంటికి ఇండియాలోనే సమకూర్చుకున్నారు .ఒక్క ఏడాదిలోనే భారత దేశం లో మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి లాబ రేటరి సిద్ధం చేసే శారు .ఇండియాలో ఇది అపూర్వ కార్య సిద్ధి ,సాఫల్య విజయం గా చరిత్ర పుటల్లో నిలిచింది .వెంకటేశ్వర్లు గారి ముందు చూపు ,దీక్ష ,తపన ,పట్టుదలతోనే ఈ అపూర్వ సృష్టి జరిగింది .ఆలీగర్ ముస్లిం యూని వర్సిటి లో వెంకటేశ్వర్లు బృందం మిధైల్ ఆల్కహాల్ ,మిధైల్ ఎమైన్ వంటి ముఖ్య మైన మాలిక్యూల్స్ ల మైక్రో వేవ్ స్పెక్ట్రా లను   అన్వేషింఛి ,విజయ వంతంగా ఆవిష్కరించారు .ఇది’’ వన్ మోర్ ఫెదర్ ఇన్ హిజ్  కాప్’’  .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-6

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-6

            పరిశోధనలలో వెంకటేశ్వర్లు గారి కృషి ,పాత్ర

సాటి లేని డిపార్ట్ మెంట్ ను అలబామాలో ఏర్పరచి ,దాని నిర్వహణ కోసం 4 మిలియన్ డాలర్ల నిధి ని చేకూర్చిన దార్శనికులు శ్రీ వెంకటేశ్వర్లు .అలబామా రాష్ట్రం లో మొట్టమొదటి ఆఫ్రికన్ –అమెరికన్ మహిళతో  పి హెచ్ డిచేయించిన విశాలహృదయుడు .ఆమె ఇప్పుడు అలబామాలోని హాంట్స్ విల్ లో ఉన్న మార్షల్ స్పేస్ సెంటర్  ఏయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ (నాసా )లో పని చేస్తోంది .ఆమె కు ఇంతటి ఉజ్వల భవిష్యత్తు కల్పించినవారు ఆయన .

1-మొదటగా  ఎలెక్ట్రానిక్ స్పెక్ట్రో స్కోపి లో కృషి, సహకారం

1930 కాలం లో ఆర్.ఎస్.మల్లికాన్ ‘’మాలిక్యులర్ ఆర్బిటల్ థీరీ’’ని ప్రతిపాదించాడు .ఇదే ఆయనకు నోబెల్ పురస్కారం అందజేయించింది  .ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి మాలిక్యూల్స్ ల ఎలక్ట్రానిక్ స్థితి ని తెలుసుకోవచ్చు .మల్లికేన్ తన సిద్ధాంతాన్ని విస్తృత పరచి  ద్వి అణు మాలిక్యూల్స్ ల ఆధార (గ్రౌండ్ ),ఉత్తేజిత ,ప్రేరేపిత (ఎక్సైటేడ్)స్థితులను ఊహించి చెప్పాడు .40-50 దశాబ్దాల కాలం లో మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి లో విస్తృతమైన అభి వృద్ధి జరిగింది .ఈ కాలం లో తన సత్తా చూపిన వారు యువ వెంకటేశ్వర్లు గారు . బెనారస్ హిందూ  యూని వర్సిటి లో  మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి లో బహు ప్రసిద్ధి పొందిన  ఆర్ .కె అసుంది వద్ద తన పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ని  చేశారు.

  అసుంది పర్య వేక్షణలో వెంకటేశ్వర్లుగారు హాలోజెన్ మాలిక్యూల్స్ యొక్క కాంప్లెక్స్ స్పెక్ట్రా పై పరిశోధన ప్రారంభించారు.30 దశకం లోనే మల్లికాన్ –హాలోజెన్ డయాటమిక్ మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రానిక్  స్థితులను ఊహించి చెప్పాడు .ఇక మిగిలింది గమనించిన హాలోజెన్ స్పెక్ట్రా ను ఎలక్ట్రానిక్ పరివర్తన (ట్రాన్సిషన్ )దృష్టితో  వ్యాఖ్యానించటమే .దీనినొక సవాలుగా తీసుకొని వెంకటేశ్వర్లుగారు తన గ్రాడ్యుయేట్ రిసెర్చ్ కాలం లో మాలిక్యులర్ ఆర్బిటల్ సిద్ధాంతాన్ని అనుసరించి తాను గమనించిన  హెచ్చు తగ్గులు (ఫ్లక్యు యేషన్స్ ),ఉత్తేజిత  కిందిపాక్షిక  ఆధారిత హాలోజెన్ ఎలక్ట్రానిక్  స్థితుల  నిరంతర హాలోజెన్ బాండ్ ల గురించి విపులమైన వ్యాఖ్యానాలు విశ్లేషణలతో అనేక రిసెర్చ్ పేపర్లు రాశారు .మాలిక్యులర్ ఆర్బిటల్ సిద్ధాంతం పై క్లిష్టమైన పరిశీలన జరుగుతున్న ఆ కాలం లో ఆయన చేసిన కృషి  గొప్ప ఉత్తేజాన్ని ,ఉత్సాహాన్ని ఇచ్చి మార్గం సుగమం అయింది .

   ఆయన చేసిన రిసెర్చ్ కృషికాలం లో హాలోజెన్ స్పెక్ట్రా పై అభి రుచి, ఆసక్తి అలాగే కొన సాగింది .అనేక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్   విద్యార్ధులను హాలోజెన్ ఎలెక్ట్రానిక్ స్పెక్ట్రా పై మరింత పరిశోధనలకుప్రోత్సహించారు .తగినట్లుగా వాళ్ళు స్పందించి డయాటమిక్  హాలోజెన్ మాలిక్యూల్స్ I2,Br2 ,C l 2,I B r ,IClమొదలైన హాలోజెన్  ఆటం  కలిగిన అనేక  డయాటమిక్  మాలిక్యూల్స్ పై విస్తృత పరిశోధనలు చేసి అప్పటి వరకు ఉన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృత పరచారు .వెంకటేశ్వర్లు గారు స్వయంగా అయోడిన్ ,బ్రోమిన్ డయాటమిక్ మాలిక్యూల్స్ ల ఎలక్ట్రానిక్ స్పెక్త్రా పై  G.H ertz Berg  లాబరేటరిలో పరిశోధనలు చేశారు .మొదటి సారిగా హై రిజల్యూషన్ తో ఏర్పరచిన ఈ రెండు మాలిక్యూల్స్ ల మొదటి  అబ్సార్ప్షన్ బాండ్ ల విశ్లేషణ కు మల్లికేన్ ఊహించిన ఎలక్ట్రానిక్ స్థితి ఆధారంగా వివరించటానికి చాలా కస్ట పడాల్సి వచ్చింది .ఈ బాండ్ లన్నీ అయోడిన్ బ్రోమిన్ దయాటమిక్ ఆధార స్థితి  ఉత్తేజ స్థితి  కి చెందిన బాండ్ లని వర్గీకరించి మాలిక్యులర్ ఆర్బిటల్ దీరీ ననుసరించి చెప్పటం లో కృత క్రుత్యుడయ్యారు .

 అతి ముఖ్యమైన  హాలోజెన్ డయాటామిక్ మాలిక్యూల్స్   విశ్లేషణ  తో పాటు  ట్రయాటమిక్  మాలిక్యూల్ అయిన CF 2 యొక్క ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా కూడా కనుగొనటం లో విశేష కీర్తి  పొందారు .తర్వాత ఒక విద్యార్ధి Si F 2 ట్రయాటమిక్ స్పెక్ట్రా కనిపెట్టటానికి మార్గ దర్శనం చేశారు .కనుక ‘’డయటామిక్  ట్రయటామిక్ స్పెక్ట్రా  మార్గ దర్శి ‘’ గా వెంకటేశ్వర్లుగారిని భావించవచ్చు .

   సశేషం

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-17- ఉయ్యూరు

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5

అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో అందించిన సేవలు -2

1992లో ప్రొఫెసర్ పుచ్చా వెంకటేశ్వర్లు అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు .దురదృష్ట వశాత్తు 76 ఏళ్ళ వయసులో 1997 ఆగస్ట్ 8 న చేరిన అయదేళ్ళకే అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోయారు .ఎప్పటిలాగానే అంకిత భావం తో తుది శ్వాస వరకు  కృషి చేస్తూ సేవలందించారు .ఆ రోజు కూడా సాయంత్రం 6 గంటలవరకు పని చేసి ,ఇంటికి వెళ్లి  ఆ రాత్రే చనిపోయారు .

  ప్రయోగాత్మక ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనలు చేస్తూ దీనికోసం యు ఎస్ .ఆర్మీ మిసైల్ కమాండ్ సంస్థ నుంచి మొదటి సారిగా రిసెర్చ్ గ్రాంట్ పొందారు .ఇదే ఈసంస్థలో ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనకు నాంది అయింది .ఇది కాక నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,ఆప్టికల్ మెటీరియల్స్ రిసెర్చ్ కోసం   మరొక 10 మిలియన్ డాలర్ల గ్రాంట్ ను పదేళ్లకు గాను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుంచి అందుకున్నారు .ఇలా 12 రిసెర్చ్ గ్రాంట్ లను NSF,DOE,NASA AIR FORCE ARMY RESEARCH OFFICE వంటి  , అనేక ఫెడరల్ ఏజేన్సీలనుండి సాధించిన ఘనత  ఆయనది .చారిత్రాత్మక బ్లాక్ కాలేజీలు యూని వర్సిటీలలో AAMU అగ్రశ్రేణి ప్రగతి పధ గామి విద్యా సంస్థగా పేరెన్నిక గన్నది .అమెరికాలో ఆప్టిక్స్ /లేజర్ కోర్సు లో పి .హెచ్. డి.. చేసే అవకాశమున్న అతి కొద్ది సంస్థలలో ఒకటిగా నిలిచింది .ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో ఇప్పుడున్న ఫాకల్టి సభ్యులు ఆయన రిసెర్చ్ గ్రాంట్ లవలన పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్స్ లనుండి నియామకం పొందినవారే .

  అలబామా సంస్థ మొదటి పిహెచ్ డి విద్యార్ధి హోసేన్ అబ్దిల్ డయెం వెంకటేశ్వర్లుగారి పర్య వేక్షణలో 1991 లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు .ఇప్పుడు అతను నాసా /మేరీ లాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో పని చేస్తున్నాడు .తరువాత సంవత్సరాలలో చాలామంది పిహెచ్ డి ,,ఎం .ఎస్ .విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు .1991 -97 కాలం లో 10 మందికి రిసెర్చ్ గైడ్ గా ఉన్నారు .ఆయన నిరంతర కృషి ఫలితంగా  ఆ నాటికి 47 మంది డాక్టరేట్ లు అయ్యారు .ఇది ఆసంస్థ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు అత్యంత గర్వకారణమైంది .వెంకటేశ్వర్లుగారి అమెరికా అసోసియేట్ లందరూ కలిసి  ఆయన సాధించిన విజయాలపై ఒక  సింపోజియం 1997అక్టోబర్ లో నిర్వహించి ఘన సన్మానం    చేయాలని సంకల్పించారు . కాని ఆగస్ట్ లోనే ఆయన మృతి చెందటం వలన ఆ సమావేశం స్మ్రుతి నివాళిగా నిర్వహించాల్సి వచ్చింది .

  వెంకటేశ్వర్ల గారి సేవానిరతి కి గుర్తుగా ఈ అలబామా సంస్థ ప్రెసిడెంట్ జాన్ గిబ్సన్ నాయకత్వం లో వార్షిక స్మారక  ప్రసంగాలను నిర్వ హించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .మొదటి మెమోరియల్ లెక్చర్ అక్టోబర్ 1998 లో రైస్ యూని వర్సిటి కిచెండిన నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కర్ల్ చేశాడు .మరుసటి ఏడాది  నేషనల్ ఇన్ స్టి ట్యూట్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన  మరొక నోబెల్ లారియేట్ విలియం ఫిలిప్స్ , 2000లో కొలంబియాకు చెందిన నోబెల్ గ్రహీత హార్స్ట్ స్టార్మర్,20 01 లో నోబెల్ లారియేట్ నికొలాస్ బ్లోమేర్జెన్ ,2002 లో నోబెల్ గ్రహీత డగ్లాస్ ఒషేరాఫ్ ,2003లో నోబెల్ గ్రహీత ఎరిక్ కార్నెల్ ,2004 లో నోబెల్ లారియేట్ అలాన్ ఈగర్ లు స్మారక ప్రసంగాలు చేసి వెంకటేశ్వర్లుగారికి ఘనం గా నీరాజనాలు అందజేశారు .ప్రతి సంవత్సరం వెంకటేశ్వర్లుగారి స్మారక ప్రసంగాలను  నోబెల్ బహుమతి పొందిన వారితోనే చేయించాలని నిర్ణయింఛి చేస్తున్నారు  .అలబామా మరియు A and M యూని వర్సిటీల సభ్యులు శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారిని ‘’ఫాదర్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్  ఆప్టిక్స్ రిసెర్చ్ యట్ అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి’’గా మనసులలో భద్రం గా పదిల పరచుకున్నారు . .ఇలా శ్రీ పుచ్చావెంకటేశ్వర్లు  గారు ‘’అలబామా ప్రయోగాత్మక  కాంతి శాస్త్ర పరిశోధన పిత ‘’ అయ్యారు .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-17 –ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్

1889 ఫిబ్రవరి 2 ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో రాజకుమారి అమృత కౌర్ జన్మించింది .పంజాబ్ ప్రాంత కపుర్తలా రాష్ట్ర రాజు హర్మమ్ సింగ్ , రాణి హర్నాం సింగ్ దంపతుల ఎనిమిది మంది సంతానం లో ఒకరు .రాణి తల్లి బెంగాలీ ప్రేస్బెటేరియన్ ,ఆంగ్లేయ దంపతుల కుమార్తె .ఆమె ప్రాధమిక విద్య ఇంగ్లాండ్ లో డోర్సేట్ లోని షేర్ బార్న్ బాలికా పాఠ శాలలో , కాలేజి ఉన్నత విద్య ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో నేర్చి ఇండియా కు తిరిగి వచ్చింది .
తండ్రి రాజా హర్నాంసింగ్ కు కాంగ్రెస్ మిత్రులు చాలా మంది ఉండేవారు .ఆయనపై గోపాల కృష్ణ గోఖలే తోపాటు అందరకి గొప్ప విశ్వాసం ఉండేది . ఇండియాకు తిరిగి వచ్చాక తమ ఇంటికి వచ్చే కాంగ్రెస్ ప్రముఖుల తో పరిచయమేర్పడి వారి ప్రభావం తో అమృత కౌర్ భారత స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొనాలని ఉత్సాహ పడింది .1919 లో బొంబాయిలో మహాత్మా గాంధీ ని మొదటి సారి దర్శించినప్పుడు ,ఆమె మనసు పూర్తిగా స్వతంత్ర ఉద్యమం కు అంకితమైంది .జలియన్ వాలాబాగ్ లో సిక్కుల ఊచకోతకు హృదయం తల్లడిల్లి భారత దేశం బ్రిటిష్ కబంధ హస్తాలనుండి విడుదల కానిదే గత్యంతరం లేదని నిర్ణ యించుకొన్నది .కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని పూర్తిగా ఉద్యమం లో పాల్గొని సాంఘిక సంస్కరణలకూ మద్దతు నిచ్చింది .

1927 లో అఖిల భారత మహిళా సంఘం ఏర్పాటు చేయటం లో సహకరించి ,1930 లో కార్యదర్శి అయి ,19 33 లో అధ్యక్షురాలైన చురుకైన పాత్ర పోషించింది. 1930 లో గాంధీ గారితో 240మైళ్ళ దండీ మార్చ్ లో పాల్గొని ,రాజ్య వ్యతిరేక నేరం పై అరెస్ట్ అయింది అమృత కౌర్ .విడుదలైన తర్వాత గాంధీ గారి ఆశ్రమం లో తన రాజ వంశ వారసత్వాన్ని కుసుమ కోమల శరీరాన్ని కఠిన నియమాలతో ఒక సాధారణ మహిళగా పవిత్ర జీవితం గడిపింది .16 సంవత్సరాలు గాంధీగారి కార్య దర్శులలో ఒకరుగా పని చేసింది .

1937 లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కైబర్ ఫక్తూన్ స్క్వ లో ఉన్న బన్ను కు సౌహార్ద్ర యాత్ర లో పాల్గొనగా ,బ్రిటిష్ పాలకులు ఆమె పై దేహద్రోహ నేరం మోపి అరెస్ట్ చేశారు . 1942 క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని మళ్ళీ అరెస్ట్ అయింది .ఇండియాలో అందరికి సమానంగా ఓటుహక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని తీవ్ర ప్రచారం చేసి లోధియన్ కమీషన్ ముందు తనవాదన వినిపించింది .బ్రిటిష్ పార్లమెంట్ జాయింట్ సెలెక్షన్ కమిటీ కి సంస్కరణ విధానాల అవసరాన్ని గట్టిగా సమర్ధించి తెలియ జెప్పింది .

కౌర్ కున్న దూరాలోచన ,అభి వృద్ధిపై ఆకాంక్ష ,మహిళా సాధికారత పై ఉన్న మక్కువ గ్రహించి ఆమెను ‘’ఆలిండియా వుమెన్స్ ఎడ్యుకేష ఫండ్ అసోసియేషన్’’ కు చైర్ పర్సన్ గా ఎన్నుకొన్నారు .న్యు ఢిల్లీ లేడీ ఇర్విన్ కాలేజ్ ఎక్సిక్యూటివ్ కమిటీ మెంబర్ అయింది .బ్రిటిష్ ప్రభుత్వం ఆమె ను అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెంబర్ ను చేసింది .క్విట్ ఇండియా ఉద్యమం లో ఈ పదవికి రాజీనామా చేసింది .1945 ,1946 లలో లండన్ ,పారిస్ ల లో జరిగిన యునెస్కో సమావేశాలకు భారత ప్రతినిధిగా ప్రభుత్వం పంపింది .అఖిల భారత స్పిన్నర్స్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ గా సేవలు అందజేసింది . అక్షరాస్యత కోసం ,బాల్య వివాహాల నిషేధం కోసం ,పర్దా వ్యవస్థ రద్దుకోసం తీవ్రంగా కృషి చేసింది .

భారత స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మంత్రి వర్గం లో ఆరోగ్య శాఖ కేబినేట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేబట్టి భారతీయ ప్రధమ కేంద్ర మహిళా మంత్రి గా రికార్డ్ సృష్టించింది రాజకుమారీ అమృత కౌర్ .జాన్ మత్తయ్ ,కౌర్ ఇద్దరే ఆనాటి ఇండియన్ క్రిస్టియన్ మంత్రులు .1950 లో ‘’వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ‘’ప్రెసిడెంట్ అయింది .ఆ సంస్థ ఏరడిన 25 ఏళ్ళలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ,మొదటి ఆసియా మహిళాధ్యక్షురాలు అయి మరో రికార్డ్ నెలకొల్పింది . ఇద్దరు మహిళలకే ఈ గౌరవం దక్కింది .

ఢిల్లీ లో ఆలిండియాఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పడటం లో కీలక పాత్ర పోషించింది అమృతకౌర్ .దీని ప్రధమ ప్రెసిడెంట్ అయి సమర్ధత రుజువు చేసుకొన్నది .దీని నిర్మాణానికి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ,పశ్చిమ జర్మని ,స్వీడన్ ,అమెరికాల నుండి ఆర్ధిక, సాంకేతిక సాయం పొందే కృషి చేసింది .కౌర్ ,ఆమె సోదరులలో ఒకరు సిమ్లా లో ఉన్న తమ స్వంత భవనాలను ,వారసత్వ ఆస్తినీ ఈ ఇన్ స్టి ట్యూట్ లో పని చేసే స్టాఫ్ కు, నర్స్ లకు వేసవి విడిదిగా ఏర్పాటు చేసి తమ త్యాగాన్ని ప్రదర్శించారు .

అమృత కౌర్ 14 ఏళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ కు అధ్యక్షురాలుగా సేవలు చేసింది .భారతదేశం లో రెడ్ క్రాస్ వ్యవస్థ విస్తృతంగా అభి వృద్ధిచెందటానికి ఎంతో కృషి చేసింది.టి.బి . అసోసియేషన్ ,మద్రాస్ లో సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ,అమృత్ కౌర్ కాలేజి ఆఫ్ నర్సింగ్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పడటం ఆమె కృషి ఫలితమే. వీటి సేవలు వర్ణనాతీతం .

1957 నుండి ఏడేళ్ళు 1964 వరకు కౌర్ రాజ్య సభ సభ్యురాలుగా ఉన్నది .ప్రజాసమస్యలపై తీవ్రంగా స్పందించేది .1958 నుంచి 1963 వరకు ఢిల్లీ లోని ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ .చనిపోయే వరకు ఆలిండియా ఇన్ స్టి ట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ,టిబి అసోసియేషన్ ,సెయింట్ జాన్స్ ఆమ్బులన్స్ కార్ప్స్ కు అధ్యక్షురాలుగా సేవ చేసింది .బహువిధ సేవలకు కౌర్ ‘’రీనె సాండ్ మెమోరియల్ అవార్డ్ ‘’పొందింది . భారత విముక్తి ఉద్యమం, మహిళా సాధికార ఉద్యమం ,కేంద్ర మంత్రిపదవిలో ఆక్షరాస్య సాధన ,మహిళా శిశు సంక్షేమం వంటి బహువిధ సేవలు అందించి,సార్ధక జీవితం గడపిన రాజకుమారీ అమృత కౌర్ 6-2-1964న 75 వ ఏట మరణించింది .

Inline image 1-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3

కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సేవ

ఐ. ఐ. టి.కాన్పూర్ గా పిలువబడే ఈ విద్యాకేంద్రం స్వర్గీయ పీ.కే .కేల్కర్ అనేక సంప్రదాయేతర నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయటం తో విభిన్న ,వినూత్న విద్యాకేంద్రంగా భారత దేశం లో శోభించింది .ఈ అదృష్టానికి కారకుడు కేల్కర్ .దీనికి నిర్దుష్టమైన ,సరైన బోధనా సిబ్బంది ని నియమించటం లో కేల్కర్ బహు జాగ్రత్త వహించి దీనిస్థాయి పెంఛి ఆకర్షణీయం చేశాడు . ఆయన నియమించిన మొదటి నలుగురు ఫాకల్టి సభ్యులలో శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారు౦డటం విశేషం .కేల్కర్ కు కుడి భుజంగా ఉంటూ, చొరవ తీసుకొని అత్యున్నత అత్యుత్తమ ఫాకల్టి నియామకానికి వెంకటేశ్వర్లు గారి కృషి చిరస్థాయి గా నిలిచింది .దేశం అంతా అత్యున్నత ప్రమాణ సాంకేతిక విద్య కోసం కాన్పూర్ ఐ. ఐ. టి . వైపు చూసేట్లు చేశారు .

  1960 నాటికే అత్యంత ప్రతిభావంత శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగాఇండియాలోనూ విదేశాలలోనూ  గుర్తింపబడి,మరింత ఉత్తమ భవిష్యత్తు ఉన్న  శ్రీ వెంకటేశ్వర్లు లోని వినూత్న ఆలోచనా సరళి ఈ నూతన విద్యాసంస్థ ఏర్పడటం ,దాని అభి వృద్ధికి అహరహం కృషి చేయటం కేల్కర్ గమనించాడు .ఆయనలోని అకు౦ఠిత దీక్ష ,తపన ,అంకితభావం ఈయనకు ఎంతో నచ్చాయి.తన పరిశోధనకే పరిమితం కాకుండా మొత్తం ఆ విద్య సంస్థ కోసం ఆయన చేస్తున్న ,అమలు బరుస్తున్న ప్రణాళికలు  కేల్కర్ ను ముగ్దుడిని చేశాయి . కేల్కర్ చాలా మందితో పని చేస్తున్నా ,వెంకటేశ్వర్లు వంటి మార్గ దర్శి ,స్పూర్తి నిచ్చే వ్యక్తి వేరొకరు లేరనుకొన్నాడు .మేధస్సు ,సునిసిత జ్ఞానం ,చొరవ ,నాయకత్వ లక్షణం ఉన్నప్పటికీ అనుచరుడుగా సంస్థ అభ్యున్నతికి ఆయన అరమరికలు లేకుండా పని చేసే అపూర్వ వ్యక్తిగా గుర్తించాడు కేల్కర్ .

  విద్యా వేత్తగా అనేక రంగాలలో పని చేస్తున్నా వెంకటేశ్వర్లు గారికి పరిశోధనే ప్రాణం .ఇక్కడ చేరిన కొద్దికాలం లోనే తన బృందానికి కావలసిన పరిశోధనా సామగ్రి కోసం ఆర్డర్ వేసి ,తనతోపని చేస్తున్న యువ పరిశోధకులను ఉత్సాహ పరుస్తూ ,ఉన్న స్థలంలోనే  ,అందుబాటులోఉన్న పరికరాలతోనే పని చేయించారు .ఫిజిక్స్ లోనే కాక కెమిస్ట్రి లో కూడా ప్రతిభ ఉన్నవారిని ఆకట్టుకొన్నారు ఇండియాలో జరిగే ముఖ్య శాస్త్రీయ సమావేశాలకు  హాజరవుతూ,అక్కడున్న వారిలో తన డ్రీం ప్రాజెక్ట్ ఐ .ఐ .టి.కాన్పూర్ తత్వానికి  తగిన ప్రతిభావంతులను ఎంపిక చేసేవారు.    

కేల్కర్ సారధ్యం లో వెంకటేశ్వర్లు మనదేశం లోని సమర్ధులైన సైంటిస్ట్ లతో తరచూ సంభాషణలు జరుపుతూ ,వారి వద్ద  ‘’మేధో నవనీతం ‘’(క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్) ఉన్నవారిని ,తన విద్యా సంస్థ నాణ్యత పెంచే వారిని వెతికి ఆహ్వానించి మరింత ఉన్నత స్థాయి కలిపించారు .సాధారణంగా ఐఐ టి లో ఇంటర్వ్యు కమిటీల ద్వారా ఎంపిక చేయటం సంప్రదాయం .కానీ వెంకటేశ్వర్లు అంత దాకా ఆగే స్వభావం కలవారుకాదు .ఆయనకు పనులన్నీ వేగంగా జరిగిపోవాలి .

వెంకటేశ్వర్లు గారి కార్య క్షేత్రం అంటే కర్మ భూమి ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ . 1961 నుండి 1967 వరకు పని చేసిన 6 సంవత్సరాలలొ ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ..ఈ కాలం లో ఆయన చేసిన అనేక పనులతో పాటు లేజర్ శక్తి సామర్ధ్యాలను గుర్తించటం ముఖ్య విషయమై పోయింది.లేజర్ ను ఉపయోగించి స్పెక్ట్రో స్కోపి పరిశోధింఛటమేకాదు ఫిజిక్స్ ,కెమికల్ ఇంజినీరింగ్ ,ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని తన  సహచరులకు  కూడా లేజర్ టెక్నాలజీ పై అభిరుచి , అభిలాష కలిగేట్లు చేశారు . దీనికి ఉదాహరణ తన సహచరుడు ఆర్ .ఆర్. దాసరి ని రెండేళ్ళు ఎం. ఐ .టి . లాబ్ లో పనిచేయించటం  . ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని మరొక సహచరుడు కె .ఆర్. శర్మ ఒక ఏడాది ఎం. ఐ .టిలో గడిపి ,ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో బోధనకు ,పరిశోధనకు సమర్ధుడ   య్యాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-17 –ఉయ్యూరు

    

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ -రేపల్లెలో -24-12-17 ఆదివారం -మధ్యాహ్నం 3 గం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక  వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2

 మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక  వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-2

                                 బోధన పరిశోధన

శాస్త్రీయ రంగం లో శ్రీ వెంకటేశ్వర్లు గారి అమూల్య సేవ1954 -1997 కాలం లో  మూడు గొప్ప విద్యాకేంద్రాలు1- ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి 2-,కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , 3-అమెరికాలో  హ౦ట్స్ విల్ లోఉన్న అలబామా  అగ్రికల్చర్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ ల ఏర్పాటు తో   విస్త్రుతమై ,విశ్వవ్యాప్తమై ,చిరస్మరణీయమైంది .ఈ మూడిటిలో 50 మందికి పైగా  పి .హెచ్ .డి.లకు అత్యున్నత శిక్షణ నిచ్చారు .జీవితమంతా ఏదో ఒక వినూత్న ప్రయోగ ,పరిశోధన లతో గడిపిన ఆలోచనాపర మైన మేధస్సు ఆయనది .ఇదివరకు చేసిన ఆప్టికల్ ,ఇన్ఫ్రా రెడ్ ,మైక్రో వేవ్  స్పెక్ట్రో స్కోపి పై పరిశోధనలతో పాటు పూర్తిగా  నూతన రంగాలైన  న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ,సాలిడ్ స్టేట్  స్పెక్ట్రో స్కోపి ,లేజర్స్ ,లేజర్ ఇంఫ్యూజ్డ్ ఫ్లోరొసెన్స్ స్పెక్ట్రో స్కోపి ,అన్ కన్వర్షన్ స్టడీస్ ,ఇంటర్ ఫెరోమెట్రి ,ఆప్టికల్ ఫేజ్ కా౦జుగేషన్,హోలోగ్రాఫిక్ గ్రేటింగ్స్,నాన్ లీనియర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ ,మైక్రో స్పెరికల్ లేజర్స్ ,పౌడర్ లేజర్స్ మరియు ప్లానార్ వేవ్ గైడ్స్ లోను విస్తృత పరిశోధనలు జరిపిన నిత్యాన్వేషి శ్రీ వెంకటేశ్వర్లు .అన్ని సైంటిఫిక్ జర్నల్స్ లో ఆయన రాసిన 200 కు పైగా వ్యాసాలు  ప్రచురితమై ,ఆయన కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది .పైన పేర్కొనబడిన మూడు విద్యాకేంద్రాలలో ఆయన మార్గదర్శక మహత్తర సేవ ,తోడ్పాటు లను సంక్షిప్తంగా తెలుసుకొందాం .ఆయన ప్రతిభకు గుర్తుగా ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీలకు   ఫెలో గా ఎన్నుకోబడ్డారు .రామన్  సెంటినరి అవార్డ్ అందుకున్నారు.అమెరికన్ ఫిజికల్ సొసైటీ ,ఆప్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా లలో ఆయన కు సభ్యత్వ మిచ్చి గౌరవించారు .

1-      ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ లో సేవ

విద్యారంగం లోమొట్ట మొదటి సారిగా  శ్రీ వెంకటేశ్వర్లు గారు  ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటీ రీడర్ గా 1954 లో నియామకం పొందారు .ఒకప్పుడు ఇది ప్రొఫెసర్స్ ఆర్.శామ్యూల్ ,ఆర్. కె.అసుంది ఆధ్వర్యం లో స్పెక్ట్రో స్కోపిక్ రిసెర్చ్ కు ముఖ్య కేంద్రంగా విలసిల్లింది.రెండవ ప్రపంచ యుద్ధకాలం లో శామ్యూల్ జర్మనీకి ,అసుంది బెనారస్ కు వెళ్లి పోవటం తో లాబరేటరి దాదాపు మూత పడి,20 ఏళ్ళు పరికరాలన్నీ తాళాలు పడి నిరుపయోగ౦గా ఉండి పోయాయి .వెంకటేశ్వర్లు గారు ఇక్కడ చేరిన మరుక్షణం నుంచి కార్య రంగం లోకి దూకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ డైయటామిక్ మాలిక్యూల్స్  పరిశోధన క్షేత్రం లో మహత్తర చైతన్యం తెచ్చారు .ప్రొఫెసర్లు శామ్యూల్ ,అసుంది లు 1930 కాలం లో ఉపయోగించిన లో రిజల్యూషన్ స్పెక్ట్రో గ్రాఫ్ లనే వాడుతూ ,విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్ పై మార్గ దర్శనం చేశారు .వెంకటేశ్వర్లుగారి బెనారస్  డిగ్రీ చదువు నుండి అత్యంత  అభిమానమైన విషయం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఆఫ్ హాలోజెన్స్అని మనకు తెలుసు . దీనినే ఆయన కొనసాగించి జీవితం తుది ఘట్టం వరకు వదిలి పెట్టకపోవటం విశేషం .స్పెక్ట్రో స్కోపి లోపరిశోధనకోసం  పరికరాన్ని కొనటానికి కావలసిన భారీ మొత్తం లో చాలాభాగం వెంకటేశ్వర్లు గారికి మొదటి సారిగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సంస్థ కానుకగా అందజేసింది. తాను ఇదివరకెన్నడూ పరిశోధించని కొత్త విభాగం లో ఆయన కొన్న మొట్టమొదటి పరికరం యెన్.ఎం. ఆర్. స్పెక్ట్రో మీటర్ .ఇండియాలో నే మొట్టమొదటి మైక్రో వేవ్ స్పెక్ట్రో మీటర్ ను  విడి భాగాలన్నీ కూర్చి తయారు చేసి,ముగ్గురు పిహెచ్ డి విద్యార్ధులకు శిక్షణ నిచ్చారు పుచ్చావారు .ఇదేకాక వాక్యూం అల్ట్రా వయొలెట్ స్పెక్ట్రోస్కోపిని కూడా మొదటిసారిగా ప్రారంభించిన ఘనత   శ్రీ వెంకటేశ్వర్లు గారిదే అని తెలిస్తే అవాక్కై పోతాం .ఆలిఘర్ యూని వర్సిటి లో 9 మంది విద్యార్దులకు ఇందులో శిక్షణ నివ్వగా ,అందులో ఏడుగురు ఇండియా ,అమెరికా ,కెనడా లలో ప్రొఫెసర్ లుగా రాణిస్తున్నారు .

    సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు         

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు -1

                    కుటుంబ నేపధ్యం

శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు 25-10-1921న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీ పుచ్చా చంద్ర మౌళి శాస్త్రి ,శ్రీమతి బాలా త్రిపుర సుందరి .అయిదుగురు సంతానం లో కడగొట్టు ఏకైక మగ పిల్లాడు .ఆయన వంశ పూర్వీకులందరూ వేద శాస్త్ర పారంగతులైన విద్యా వేత్తలైనందుకు శ్రీ వెంకటేశ్వర్లు గారు గర్వపడే వారు  .పదేళ్ళ బాల్యం లోనే తల్లిని పోగొట్టుకున్నఅభాగ్యుడు . బి ఎస్ సి డిగ్రీ వరకు గుంటూరు లోనే చదివి,తరువాత బెనారస్ హిందూ విశ్వ  విద్యాలయం లో చేరి 1944లో ఎం. ఎస్. సి.డిగ్రీ   ,1947  లో డి .ఎస్. సి .సాధింఛి ప్రొఫెసర్ అయ్యారు . . శ్రీమతి ఈమని సరస్వతి గారిని వివాహమాడి ఒక కుమార్తెకు  నలుగురు కుమారులకు  జన్మ నిచ్చారు .ఇద్దరు కుమారులు అమెరికాలో ప్రొఫెసర్లు.మిగిలిన ముగ్గురు అక్కడే కన్సల్టింగ్ ఫర్మ్ లకు అధినేతలు .  

           విద్య శాస్త్ర  సేవలు

ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు బెనారస్ హిందూ యూని వర్సిటి లో స్వర్గీయ ఆర్. కె. అసుంది తో కలిసి రిసెర్చ్ చేసి 1947లో డి.ఎస్. సి .డిగ్రీ పొంది , రిఫెర్రేడ్ పేపర్లను డిగ్రీ లో నేచర్ పై రాసినది  ,హాలోజెన్స్ ల ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాపై రాసినది కాక  ,మరొక 9 తను ప్రత్యేకంగా వ్రాసిన వాటిని కలిపి మొత్తం 11 రిఫెర్రేడ్ పేపర్లు రాసి ప్రచురించారు .వీటిలో దాదాపు సగం ఆయన వ్యక్తిగతమైనవి గానే ఉన్నట్లు ,తరువాత జీవితం లో యూరప్ ,అమెరికా ,కెనడా లలో ప్రముఖ లాబరేటరీలలో పోస్ట్ –గ్రాడ్యుయేట్ అసోసియేట్ గా ఉన్నప్పుడు కూడా   ఇలాగే కొనసాగించారు  .యవ్వనం నుంచే ధైర్య సాహసాలతో తాను వినూత్న ,విశిష్ట ,సాహసోపేత కార్యాలను చేయగలననే ఆత్మస్థైర్యం ఉన్నవారు .దీనికి గొప్ప ఉదాహరణే ఆయన బెనారస్ లో డిగ్రీ పొందిన వెంటనే  నీల్స్ బోర్ లాబరేటరి న్యూక్లియర్ ఫిజిక్స్ లో పనిచేయటానికి తీసుకొన్న సాహసోపేత నిర్ణయం .ఇక్కడ’’ లో రిజల్యూషన్ ప్రిజం  స్పెక్ట్రోగ్రాఫ్’’ లను మాత్రమే ఉపయోగించి మాలిక్యులర్ స్పెక్ట్రో స్కోపి పరిశోధన చేశారు .నిజంగా ఈ రెండిటికి సంబంధమేలేదు ,పోలికాలేదు ,ప్రయోగ సా౦కేతికతలో ,సైద్ధాంతిక పరంగా కూడాఇవి పూర్తిగా భిన్న స్వభావం కలవి కూడా .తర్వాత తన బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి మైక్రో వేవ్ స్పెక్ట్రో స్కోపి  పోస్ట్ గ్రాడ్యుయేషన్  కు సర్వ సర్ధమైన అత్యంత నాణ్యమైన కెనడాలోని  యెన్ .ఆర్ .సి .లో ఉన్న గెర్హార్డ్ హెర్జ్ బెర్గ్,చికాగో యూని వర్సిటి లోని రాబర్ట్ మల్లికేన్ ,డ్యూక్ యూని వర్సిటి లోని వాల్టర్ గార్డి  కేంద్రాలను,ఇన్ఫ్రా రెడ్  స్పెక్ట్రో స్కోపి కి ఎం. ఐ. టి.లోని రిచార్డ్ లార్డ్ విద్యా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు . నోబెల్ బహుమతి గ్రహీతలైన ముగ్గురి పేరిట ఉన్న ఈ విద్యాలయాలలో విద్య కొనసాగించటం వలన వెంకటేశ్వర్లు గారికి ,వారిలోని పట్టుదల ,కృషి ,ముందుచూపు ,నిరంతర శ్రమ ప్రేరణగా నిలిచి జీవితాంతం ముందుకు నడిపించాయి .

   సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-17 –ఉయ్యూరు  

 పుచ్చావారి ఫోటో జత చేశాను చూడ0డి  dr.puccha venkateshvarlu (1)

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1-12-17 శుక్రవారం శ్రీ హనుమద్వ్రతం

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

1-12-17 శుక్రవారం శ్రీ హనుమద్వ్రతం సాయంత్రం భజన ,చాలీసా పారాయణ

This gallery contains 33 photos.

More Galleries | Tagged | Leave a comment

“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ -2

“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ -2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ ”

“29-11-17బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో శ్రీ హనుంద్వ్రతం సందర్భంగా మొదటి రోజు చేమంతి పూజ ”

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో 23-11-17 గురువారం శ్రీ విష్ణుభొట్ల అవధాని గారి దంపతులు ,24-11-17 శుక్రవారం ఆత్మీయులు శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు గారు

మా ఇంట్లో 23-11-17 గురువారం శ్రీ విష్ణుభొట్ల అవధాని గారి దంపతులు ,24-11-17 శుక్రవారం ఆత్మీయులు శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ 

అక్షరం లోక రక్షకం

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

సరసభారతి ఆధ్వర్యం లో  రేపల్లె వాస్తవ్యులు  డా .శ్రీ యల్లాప్రగడ రామ మోహనరావు ,శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్ల సౌజన్య సహకారాలతో సంయుక్తంగా గుంటూరు జిల్లా రేపల్లె లో నిర్వహిస్తున్న

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ
సాహితీ బంధువులకు శుభకామనలు – సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంథాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె(పరుచూరి ,ఎల్లా ప్రగఢ వారి స్వగ్రామం )  లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు

గుంటూరు ,కృష్ణా జిల్లాల లో ప్రసిద్ధ  కవులచే

‘’సాహితీ బంధం ‘’అంశం పై  కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది .

పాల్గొన నున్న ప్రముఖ అతిథులు

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్- పులిచింతల మరియు ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు)   డా .శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి (ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ,పారిస్ ),శ్రీమాన్ వేదాల వెంకట సీతారామాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు ) ,అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా సవరం వెంకటేశ్వరరావు(చరిత్ర శాఖాధిపతి హిందూ కాలేజి ,మచిలీపట్నం ) ,డా. శ్రీతూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాల ,పొన్నూరు )డా శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి(రిటైర్డ్ సంస్కృత అధ్యాపకులు ,శ్రీ పరశు రామాయణాది గీర్వాణగ్రంథకర్త )  డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ ,(ప్రముఖ కవి) డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు బెనారస్ హిందూ  విశ్వ విద్యాలయం  –వారణాసి ) , డా శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి(న్యాయ శాఖాధ్యక్షులు  శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం –పూరీ ) – డా శ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి ( ప్రాచ్య సాఖ్యాన వివరణ కర్త –వారణాసి ) — డా రేమెళ్ళఅవధానులు(వేద గణిత నిధి,శ్రీ వేద భారతి నిర్వాహకులు ) )   శ్రీపరాశరం భావనారాయణా చార్యులు(వనౌషధి నిఘంటు కర్త )  –డా శ్రీమతి అయ్యగారి ప్రభావతీదేవి(విశ్వనాథ ‘’వేయి పడగలు’’ నవల కు సంస్కృతానువాదకర్త )  -డా శ్రీ ఇనగంటి ఉమారావు(తత్వ చింతామణి సిద్దా౦జన కర్త ) – శ్రీ చలపాక ప్రకాష్ (రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి )  మొదలగు విశిష్ట అతిథులతో పాటు-

రేపల్లె పుర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా  పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య ,సంగీత ప్రియులందరికీ ఆహ్వానం . పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .

ఆవిష్కరింపబడే గ్రంథాలు

1-ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు

తమ సృజనాత్మక ప్రతిభతో ప్రపంచ ప్రగతిని మార్చి  మలుపు త్రిప్పి ,ఆధునిక ప్రపంచానికి దారులు వేసిన  వేదాంతం,  తత్వశాస్త్రం ,కవిత్వం ,నాటకం నవల  సంగీతం,నాట్యం, సినిమా ,శిల్పం, చిత్రకళ మొదలైన  రంగాలలో  లబ్ధ ప్రతిష్టు లైన 91 మంది మహానుభావుల జీవిత చిత్రణ .

అంకితం – రేపల్లె లో జన్మించి స్టాటిస్టిక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతులైన గణిత శాస్త్ర వేత్త కీ శే . డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య (అమెరికా )గారికి

ప్రాయోజకులు -సరసభారతి ఆప్తులు  శ్రీ మైనేని గోపాలకృష్ణ(రేపల్లె అల్లుడుగారు )  శ్రీమతి సత్యవతి(రేపల్లె ఆడపడుచు ) దంపతులు -అమెరికా  (పరుచూరి వారికి బావగారు ,సోదరి

—

ముందు మాటలు -డా .శ్రీ సవరం వెంకటేశ్వర రావు –  చరిత్ర శాఖాధిపతి  -హిందూకాలేజి -మచిలీ పట్నం

2- గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 -మూడవ భాగం

భారత దేశం లోని అన్ని రాష్ట్రాలకు,అన్నికాలాలకు  చెందిన 462 మంది సంస్కృత కవుల జీవితాలు, ,దర్శనం ,కావ్యం ,నాటకం ,కధ నవల ,చరిత్ర ,సాహిత్యం ,వ్యాఖ్యానం మొదలైన ప్రక్రియలలో వారి రచనా  విశేషాలపై    వెలువడిన ముచ్చటైన మూడవ గ్రంథం .

అంకితం – దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి(రేపల్లె అల్లుడుగారు )  ,శ్రీమతి డా  సులోచన –రేపల్లె ఆడపడుచు- (అమెరికా ) దంపతులకు

ప్రాయోజకులు –రేపల్లె లో జన్మించిన  విద్యాసంపన్నులు , వితరణ శీలి ,దేశభక్తి పరాయణులు,

ప్రొఫెసర్ యల్లాప్రగడ రామమోహన రావు గారు(అమెరికా )

(మూర్తిగారి   బావమరిది ,సులోచనగారి అన్నగారు )

ముందుమాటలు -అవధాన సరస్వతి డా శ్రీ పాపపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు

 

— వేదిక తో సహా అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం డిసెంబర్ మొదటి వారం లో అంద జేస్తాం

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –

 

డా .ఎల్లాప్రగడ రామమోహనరావు-రేపల్లె

 

పరుచూరి శ్రీనాథ్(కీ శే .డా పరుచూరి రామ కృష్ణయ్య గారి సోదరుడు )-రేపల్లె

23-11-17

—

 

 

 

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

20-11-17 సోమవారం మా ఇంట్లో అమెరికా నుంచి వచ్చినపెద్దమనవడు సంకల్ప్ తో మేము

20-11-17 సోమవారం మా ఇంట్లో అమెరికా నుంచి వచ్చినపెద్దమనవడు సంకల్ప్ తో మేము 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

462-21 వ శతాబ్దం లో గీర్వాణ భాషాభ్యసనం లో నవీన విధానాలు – బి .యెన్ .శశికిరణ్ ,హరి రవికుమార్ (జూన్ 2017 )  (చివరి ఆర్టికల్ )

చిన్మయ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యం లో ‘’సంస్కృతం లో నూతన ఎల్లలు ,భారతీయ విజ్ఞానం ‘’పై 2017 జూన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ బి .యెన్ .శశికిరణ్ ,శ్రీ హరి రవికుమార్ లు సంయుక్తంగా ఒక పరి శోధనా పత్రాన్ని సమర్పించారు .అందులోని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను ..

‘’ ప్రపంచం లో భారత దేశానికి సంస్కృతభాష దైవమిచ్చిన విశేష వరం . అనేక విధాలుగా దాని ప్రత్యేకత ఉంది . వ్యాకరణం లో పాణిని పధ్ధతి  ఉత్కృష్ట మైనది  . భాషకు అది గొప్ప శక్తి సామర్ధ్యాలను చేకూర్చింది . శబ్దోత్పత్తికి దాని తోడ్పాటు చిరస్మరణీయ౦ .  . ఇతర భాషా బోధనా  విధానాలు సంస్కృతానికి నప్పవని ,శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి ,శ్రీ ఆర్ జి భండార్కర్ ,ఎ.ఎ.మాగ్డోనెల్ ,డి .యెన్. షాన్ బాగ్ మొదలైన ప్రముఖులు ,సంస్కృత భారతి ,బెనారస్ హిందూ యూనివర్సిటి ,రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ ,సుర సరస్వతి సభ ,కర్నాటక స్టేట్ ఓపెన్ యూని వర్సిటి ప్రసిద్ధ సంస్థలు ఆధునిక కాలం లో వారి వారి విధానాలలో సంస్కృతం నేర్పుతున్నారు .ఇందులో కొన్ని సత్ఫలితాలనిస్తే ,మరికొన్ని  అంతగా ప్రయోజనం చేకూర్చలేదు .కనుక ప్రాక్ ,పశ్చిమ దేశాలలో సంస్కృత బోధనకు ‘’కావ్య ఆధార విధానం ‘’(కావ్య సెంట్రిక్ అప్రోచ్ )చాలాబాగా ప్రయోజనాన్ని కలిగిస్తుందిఅని అధ్యయనం లో తేలింది .ఇది  సంప్రదాయ విధానం ఆధారంగా ఉన్నప్పటికీ ,ఆధునిక సాంకేతికను సమకూర్చటం తో విశేష ఫలితాలు వస్తున్నాయి .వ్యక్తి  విధానానికి అనుకూలంగా ఉంటూ , నేర్చేవారిని 1-సంస్కృతం తో ఏమాత్రం పరిచయం లేనివారు 2-భారతీయ సంస్కృతి పై అవగాహన ఉన్నా ,ప్రాంతీయ భాషపై అవగాహన లేనివారు 3-భారతీయ భాషా సంస్కృతి ,పరంపరాగత భాష లో  అవగాహనఉండి ఏదోఒక భాష బాగా తెలిసినవారు  4- ఒకప్పుడు సంప్రదాయ పద్ధతిలోనో వేరొక విధానం లోనో నేర్చి ,మరలా దానిపై అభిమానం తో నేర్వాలనుకోనేవారు గా విభజన చేశారు . పైన చెప్పిన  ద్వయం  వీరందరికోసం ఎనిమిదిరకాల భాషాభ్యసన పరికరాలను(లెర్నింగ్ టూల్స్ ) తయారు చేశారు .ఇవి రెడీ మేడ్ దుస్తులు లాగా ఎవరికి ఏది కావాలంటే వారికి అది సరిపోయేటట్లుగా  ఉంటాయన్నమాట .అవేమిటో ఇప్పుడు చూద్దాం –

1-సంప్రదాయ భారతీయ కళా సంస్కృతులపై అవగాహన 2-వివిధ రకాల సంస్కృత శ్లోకాలు వినటం ధారణ చేయటం 3-దేవనాగరి లిపి వర్ణక్రమం తెలుసుకొని రాయటం 4-సంస్కృత కవిత్వం కథలు,నాటికలు వినటం ,తెలుసుకొని అభిరుచి పొందటం  5-వ్యాకరణం ,నిఘంటువుల ను ఉపయోగించి భాషాభివృద్ధి సాధించటం 6-సాంప్రదాయ శిక్షణను ఈ క్రింది 8 విధానాలలోపొందటం –

1-    వాదనం –గురువు చెప్పిన ఒక శ్లోక ధారణ  2-అనువాదనం –అదే శ్లోకాన్నిరెండు సార్లు ధారణ చేయటం .3-పదచ్చేదం –పదాలను విడదీయటం 4-ఆకాంక్ష –శ్లోక భావం అర్ధం చేసుకోవటం 5-అన్వయం –పదాలను వరుసక్రమం లో పేర్చటం 6-వ్యాకరణ విశేషః –శ్లోకం లోని వ్యాకరణ సూత్రాలను గ్రహించి అర్ధం చేసుకోవటం 7-అన్య విశేషః –అలంకారాలు ,ఛందస్సు వగైరా విషయాలు తెలుసుకోవటం 8-భావార్ధం –శ్లోక సారాన్ని గ్రహించి అనుభవింఛి ఆనందించటం . ఇలా 8 పద్ధతులలో  6 వ దైన ‘’సాంప్రదాయ శిక్షణ’’ పొందాలన్నమాట .

 

7-భాషాభ్యసన పరి పుష్టి కోసం పదాలతో సరదాగా ఆటలాడుకోవటం 8-భాషలో అదనపు బలసామర్ధ్యాలు పొందటానికి శ్రేణీయ సాధనాలు (గ్రేడెడ్ ఎక్సర్ సైజెస్ )  చేయటం.

విద్య ర్చేటప్పుడు అన్ని స్థాయిలలోనూ సంస్కృతం మాత్రమే ఉపయోగించాలి .

సంస్కృతం అంటే బాగా పరిశుద్ధం చేయబడిన భాష అని ,చక్కగా కలిపి ఉంచేది అని అర్ధం .అనేక వేల సంవత్సరాలుగా అభి వృద్ధి చెందిన భాష సంస్కృతం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-17 -ఉయ్యూరు

సమాప్తం -17-11-17 –ఉయ్యూరు

— 

విన్నపం -గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవభాగం పై తాజా ఆర్టికల్ తో 462 మంది కవులతో వెలువడుతోంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం చిత్ర మాల

16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం చిత్ర మాల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో

15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం లో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి – మధుర్యపాత్ర మన్మధ చాపం చెరకు గడ -మాకు ఏడుగడ కవి కర్షక కార్మిక హృదయ మాధుర్యం మాకు శిరోధార్యం విద్యా వైద్య ఆధ్యాత్మిక కేంద్రస్థానం మా ఊరు ఆటు పోటులేని జీవన మాధుర్యం మాది మా చేలల్లో తీపి చెరకే కాదు వరిలోనూ మాధుర్య రస ఝరులున్నాయి మా పుల్లేరు నీరు రష్యా వోల్గాను చేరింది నూనెలో నూతనావిష్కరణ కు దారి చూపింది మా కేమోటాలజిపిత” కొలాచల సీతారామయ్య” మా వూరి విద్యామాణిక్యం మాకు గర్వకారణం ఇండో- సోవియెట్ శాస్త్ర సాంకేతిక స్నేహ వారధి మా కెసీపి దృఢానికే కాదు మధుర చక్కెరకూ కాణాచి జిల్లాలో మా రాజకీయ౦ బలవత్తరం ,దిశా నిర్దేశం కూడా మాది ఆదర్శప్రాయ అనుసరణీయ జీవన విధానం మా క్షేత్రాలు పాడిపంటలకే కాదు మాదుర్య సాహిత్య సస్య కేదారాలు కూడా సిరి సంపదలకు ,వితరణ శీలతకు సంస్కృతీ సంప్రదాయాలకు మార్గ దర్శి మా వూరు ఆధ్యాత్మికత వెల్లి విరిసిన మాధుర్య సీమమాది అందుకే ”కృష్ణాజిల్లా వైభవం ”లో మా ఉయ్యూరు ది ”మాధుర్య పాత్ర ”. గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-17 -ఉయ్యూరు —

Nov 14
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ  ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం లో  నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –

               మధుర్యపాత్ర
మన్మధ చాపం చెరకు గడ -మాకు ఏడుగడ
కవి కర్షక కార్మిక హృదయ మాధుర్యం మాకు శిరోధార్యం
విద్యా వైద్య ఆధ్యాత్మిక కేంద్రస్థానం మా ఊరు
 ఆటు పోటులేని జీవన మాధుర్యం మాది
మా చేలల్లో తీపి చెరకే కాదు
వరిలోనూ మాధుర్య రస ఝరులున్నాయి
మా పుల్లేరు నీరు రష్యా వోల్గాను చేరింది
నూనెలో నూతనావిష్కరణ కు దారి చూపింది
మా కేమోటాలజిపిత” కొలాచల సీతారామయ్య”
మా వూరి విద్యామాణిక్యం మాకు గర్వకారణం
ఇండో- సోవియెట్ శాస్త్ర సాంకేతిక స్నేహ వారధి
మా కెసీపి దృఢానికే కాదు మధుర చక్కెరకూ కాణాచి
జిల్లాలో మా రాజకీయ౦ బలవత్తరం ,దిశా నిర్దేశం కూడా
మాది ఆదర్శప్రాయ అనుసరణీయ జీవన విధానం
మా క్షేత్రాలు పాడిపంటలకే కాదు
మాదుర్య సాహిత్య సస్య కేదారాలు కూడా
సిరి సంపదలకు ,వితరణ శీలతకు
సంస్కృతీ సంప్రదాయాలకు మార్గ దర్శి మా వూరు
ఆధ్యాత్మికత వెల్లి విరిసిన మాధుర్య సీమమాది
అందుకే ”కృష్ణాజిల్లా వైభవం ”లో
మా ఉయ్యూరు ది ”మాధుర్య పాత్ర ”.
    గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-17 -ఉయ్యూరు 

—

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )

తెలంగాణా రాష్ట్రం సిద్దిపేటలో శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ జన్మించారు .వీరిది పండిత వంశ౦ .పితృ ,పితామహులందరూ సంగీత సాహిత్యాలలో దిగ్దంతులే .తండ్రి నారాయణ శాస్త్రి పండితులేకాక ప్రతిభా వ్యుత్పన్నులు ,సంగీత కళా మర్మజ్ఞులు .   మేనమామ ,విద్యా గురువు శ్రీకొరిడే సీతారామ శర్మగారి ఆదేశం తో   దేవీ మానస పూజ ను ఒక సంవత్సర కాలం దీక్షగా పారాయణ చేసి ఆత్మ గతం చేసుకొన్నారు .దీనితో వారిలో మధుర కవితా ధార పెల్లుబికింది .’’బ్రహ్మోమాపతి పద్మనాభ నుత !శు౦భత్పద్మసింహాసనా ‘’మకుటం తో అమ్మవారిని  స్తుతించిన నపద్యాలలో త్రిమూర్త్యాత్మక రూపినణియైన అమ్మవారే కాకుండా కవి గారూ దర్శన మిస్తారు . తొలితరం తెలంగాణా కధకులలో శర్మగారు అగ్రేసరులు .1960 కాలం లో వారి కధలు ,వ్యాసాలూ ,విమర్శలు ,గేయాలు భారతి ,సాధన ,కృష్ణాపత్రిక లలో ప్రచురితాలు .’’చతురంగం ‘’,’’నవ కథా విపంచి ‘’వీరి కథా సంపుటాలు .’’చివరి ఘడియలు ‘’అముద్రితం .

శర్మగారు వేణువు ,వయోలిన్ ,హార్మోనియం వాయిద్యాలవాదనలో అసమాన ప్రజ్ఞావంతులు .వీరి గాత్రం సుస్వర బద్ధమై వీనుల విందు చేసేది .భువనవిజయ౦ లో రామరాజ భూషణుడుగా జీవించేవారు .వీరి పద్య కవితా గానం మై మరపించేది .కాళిదాస కవిత్వాన్ని ఎంతగా ఆరాదధించేవారో ఓ హెన్రీ కథలనూ అంతగా ఆస్వాదించేవారు .తెలంగాణా ప్రాంతీయ దేశ్య పదాలు ,ప్రాచీనకవుల ప్రయోగాలపై శర్మగారి వ్యాసాలు ఆణిముత్యాలు ..ప్రముఖ పరిశోధకులు నిడదవోలు వెంకటరావు మల్లంపల్లి సోమ శేఖర శర్మగార్ల ప్రశంసలు పొందాయి .దివాకర్ల వెంకటావధాని ,పుల్లెల రామ చంద్రుడు ,దోర్బల విశ్వనాధ శర్మ వంటి సాహితీ ప్రముఖులు శర్మగారి పాండితీ గరిమకు నీరాజనాలు పలికారు .’’అజో-విభో ‘’పురస్కారం సద్గురు శివానంద మూర్తి గారి అమృత హస్తాలనుండి అందుకొన్న పుణ్య మూర్తి .భావకవిత్వోద్యమ ప్రభావం తో ‘’మధురకవి ‘’గా గుర్తింపు పొందారు .ఆయన అధ్యయన శీలత అచ్చెరువు గొల్పుతుంది .ఉద్యోగం చేస్తూ సాహిత్య కృషి కొనసాగిస్తూ ,వేదాంత వాజ్మయ మధనమూ చేశారు .దీనిఫలితంగా  పదకొండు వ్యాసాల ‘’హంసనాదం ‘వెలువడింది .అద్వైత,శివాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను సహేతుకంగా తర్కించి ‘’శివా ద్వైత దర్శనం ‘’రచించి  దిగ్భ్రాంతి కలిగించారు  .శ్రీ శంకర భగవత్పాదుల ‘’శ్రీ దేవీ మానసిక పూజ ‘’ను శంకరుల అంతర్ దృష్టికి తగినట్లు ఆంధ్రానువాదం చేశారు .

అవసరమైతేనే మాట్లాడే నియమమున్న శర్మగారి మౌన అంతరంగం నుండి 108  శ్లోకాల ‘’అద్వైత గీత ‘’జాలువారి యోగ సాధకులకు దిశా నిర్దేశం గా భాసించింది .తామే దీనికి సులభ వ్యాఖ్య రాయగా ‘’దర్శనం ‘’మాసపత్రిక లో ప్రచురింపబడింది .సహాధ్యాయులైన శ్రీ అప్పాల వాసు దేవ శర్మ గారితో కలిసి ‘’దేవీ సప్త శతి ‘’శ్లోకాలను తెలుగులో లోతైన తాత్విక భావన తో రాశారు .’’తొగుట –రాంపురం ‘లోని శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాధిపుల ఆజ్ఞమేరకు సంస్కృత భాగవత శ్రీధరీయ వ్యాఖ్యను ద్వితీయ ,దశమ స్కంధాలకు తెలుగు సేత చేశారు .జ్యోతిశ్శాస్త్రం లోనూ శర్మగారు అఖండులే.శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వాములు తెలంగాణా గజవల్లి లో పర్యటించినపుడు సన్మానపత్రం రచించి శర్మగారు శ్రీవారి అభినందన పొందారు .మనసులాగానే స్వచ్చ శ్వేత వస్త్ర ధారణతో ,ఆలోచనా ముద్రతో శర్మగారు కనిపించేవారు .

శర్మగారి మరణానికి సరిగ్గా నెల రోజులక్రితం తెలంగాణా ప్రభుత్వ తృతీయ ఆవిష్కరణ మహోత్సవం నాడు ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు గారి చేతుల మీదుగా పండిత పురస్కారం అందుకొన్నారు .ప్రచారార్భాటం ఇష్టపడని శర్మగారు ఈ కాలపు కవి యోగి పుంగవులు .

పుంభావ సరస్వతులైన శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మగారు 2017 జులై 4 న ఉమాపతి సాన్నిధ్యం చేరారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-17 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడని వ్రేలి ముద్రలు

1-సెల్ ఫోన్ లకు ఆధార్ కార్డు తో లింక్ చేయమని మెసేజి లపై మెసేజ్ లు వస్తున్నాయి . సీనియర్లు లింక్ చేయటానికి సెల్ డీలర్స్ దగ్గరకు వెడితే వాళ్ళ దగ్గరున్న వ్రేలి ముద్రల మెషీన్  10 వ్రేళ్ళతో ఏ వ్రేలి ముద్రనూ యాక్సెప్ట్ చేయటం లేదు .అందుకని సుమారు 70 ఏళ్ళు దాటిన వారికి లింక్ చేయించుకొననే  అవకాశం లేకుండా పోతోంది .దీనిపై ప్రభుత్వాలు స్పందించి మరేదైనా మార్గం త్వరలో ఆలోచించి అమలు చేయాలని కోరిక .

2-పెన్షనర్ అసోసియేషన్ లో ఇటీవల బయట పడిన అవకతవకలకు ఝడిసి ప్రభుత్వం పెన్షనర్లు నవంబర్ లో ఇవ్వాల్సిన లైఫ్ సర్టిఫికెట్ఇచ్చేటప్పుడుతప్పని సరిగా  వ్రేలి ముద్ర నమోదు చేయటం ఈ సంవత్సరం ఖచ్చితంగా అమలు చేస్తోంది   లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేయటానికి ట్రెజరీ ఆఫీస్ కు వెడితే ఇక్కడకూడా వ్రేలి ముద్ర మెషీన్లుసుమారు  70 ఏళ్ళు దాటిన పెన్షనర్ల వ్రేలి ముద్రలు తీసుకోవటానికి మొరాయిస్తున్నాయి అంటే అంగీకరించటం లేదన్నమాట .కనుక ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ మార్గం అమలు చేయాలి  ట్రెజరీ ఆఫీస్ వారు ఏమీ చేయలేక మళ్ళీ డిసెంబర్ లోనో జనవరి లోనో కొత్తవిధానం అంటే కంటి గుడ్డు ఫోటో ఐరిస్ ఫోటో వస్తుంది అప్పుడు మరల రమ్మని బ్రతిమాలి చెబుతున్నారు
  కనుక పై రెండు విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను . అతి త్వరలో ప్రత్యామ్నాయ మార్గం ప్రవేశ పెట్టి పెన్షనర్ లకు ,సెల్ వినియోగ దారులకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాను
                                              గబ్బిట దుర్గాప్రసాద్
                                        సెల్ వినియోగ దారుడు మరియు రాష్ట్ర పెన్షన్ దారుడు
                                         ఉయ్యూరు -కృష్ణా జిల్లా -సెల్ 9989066375

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

13-11-17 సోమవారం రాత్రి మా ఇంట్లో మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు, కోడలు జయ, కొడుకు కళ్యాణ్, కోడలు , వియ్యంకుడు, వియ్యపురాలు, కళ్యాణ్ బావమరది ,భార్య

13-11-17 సోమవారం రాత్రి మా ఇంట్లో మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు, కోడలు జయ, కొడుకు కళ్యాణ్, కోడలు , వియ్యంకుడు, వియ్యపురాలు, కళ్యాణ్ బావమరది ,భార్య

 

https://photos.google.com/share/AF1QipPQdDmWkLA1WSZrPdRH_U-pRoP4rkAvumNw0YWsPENsQ-fKRnAis7mFEgGx4txR2w?key=ZjE2bjhoQy10T2NTaF8tTXU4MzdpTnlIaUdYWTJ3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5-11-17 ఆదివారం ఉదయం కర్నాటక ప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురంలో మేమిద్దరం మాకోదాలు వియ్యపురాలు ఫోటోలు-పార్ట్-2

5-11-17 ఆదివారం ఉదయం కర్నాటక ప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురంలో మేమిద్దరం మాకోదాలు వియ్యపురాలు ఫోటోలు-పార్ట్-2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రుద్రాభిషేకం -శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటోలు

4-11-17 శనివారంకార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ -మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో తెల్లవారుఝామున3-30 నుండిఉదయం 6 వరకు రుద్రాభిషేకం తరువాత ఉదయం 6 నుండి 8 వరకు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –

463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)

భరత చంద్ర రే గుణకార్ 18 వ శతాబ్ది ప్రముఖ సంస్కృత బెంగాలీకవి .రాజాస్థానకవి కూడా .అన్నపూర్ణ మంగళ కావ్యం తో సుప్రసిద్ధుడయ్యాడు .భరత చంద్ర గా సుపరిచితుడు .నాడియా మహా రాజు కృష్ణ చంద్ర ‘’గుణకార్’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .అప్పటి నుంచి ‘’రే గుణకార్ భరత చంద్ర’’ అని అందరూ పిలువ సాగారు .

నరేంద్ర నారాయణ రే,భవానీ దంపతులకు 1712 లోబెంగాల్ లోని ‘’పెన్రో భూర్షట్ ‘’గ్రామం లో జన్మించాడు . ఈ గ్రామం ఇప్పుడు హౌరా జిల్లాలో  ఆమ్టా కు దగ్గరలో ఉంది. నలుగురు సంతానం లో చివరివాడు .తండ్రి –వర్ధమాన రాజు కీర్తి చంద్ర రే తో ఆస్తి తగాదా పడి రాజమాత బిష్ణు కుమారి ని అవమానించాడు .దీనితో రాజు కినిసి వీళ్ళ భూములన్నీ స్వాధీనం చేసుకొన్నాడు .చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తండ్రి నారాయణ రే ఊరు వదిలి పారిపోయాడు .కొడుకు భరత చంద్ర ను మాతా మహుల ఇంట్లో నయాపారాలో ఉంచారు .అక్కడే ఉంటూ దగ్గర గ్రామం తాజ్ పూర్ లో సంస్కృతం అభ్యసించాడు .14 ఏళ్ళకే సంస్కృతం లో అద్వితీయ పాండిత్యాన్ని సాధించి తలమానికమై భాసించాడు .ప్రక్కనే ఉన్న  శారద గ్రామానికి చెందిన నరోత్తమ ఆచార్య కుమార్తెను వివాహం చేసుకొన్నాడు .

తిరిగి స్వగ్రామానికి చేరిన తమ్ముడు భరత చంద్ర సంస్కృత పండితుడైనందున ఆ భాష కూడు గుడ్డ పెట్టదని  ఈసడించి అన్నలు అవహేళన చేశారు .అవమానం పొందిన భరతచంద్ర స్వగ్రామం వదిలేసి హుగ్లీ జిల్లాలోని బాష్ బెరియా లోని దేబానంద పుర కు వెళ్ళాడు .అక్కడ రామ చంద్ర మున్షి ఇంట్లో ఉంటూ పర్షియన్ భాష నేర్చి పట్టు సాధించి మాస్టర్ అనిపించుకొన్నాడు .పిత్రార్జిత సంపదను కాపాడుకోవటానికి మోఖ్తార్  అయ్యాడు .అన్నలతో ఆస్తితగాదాలు, వారిని సంప్రదించకుండా వివాహమాడటం తో మళ్ళీ ఇల్లు వదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది .ఎక్కడా నిలువ నీడ లేక దేశాటనం చేస్తూ కొంతకాలం మహారాష్ట్ర పాలనలో ఉన్న ఒరిస్సాలోని కటక్ లో ఉన్నాడు .మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోయాడు .

చందర్ మగూర్ లోని  ఇంద్ర నారాయణ చౌదరి అనే ఫ్రెంచ్ ప్రభుత్వ దివాన్ ఇంట్లో అద్దె కున్నాడు భరతచంద్ర .  చంద్ర లోని విద్యా పటిమను గుర్తించి,న దివాన్  కృష్ణ నగర్ మహారాజు కృష్ణ చంద్ర ఆస్థాన కవిగా నియమించే ఏర్పాటు చేశాడు . మహారాజు కవిగారి విద్వత్తు కు తగిన ‘’రే గుణకార్ ‘’బిరుదునిచ్చి గౌరవించి సన్మానించటమే కాక మూలజోర్ లో అనేక వందల ఎకరాల భూమిని ప్రదానం చేశాడు .బెంగాలీ భాష లో ‘’ప్రధమ ప్రజాకవి’’ గా భరత చంద్ర గుర్తింపు పొందాడు .బెంగాలీ భాషను తన కవిత్వం, రచనలతో భరత చంద్ర సుసంపన్నం చేసి శాశ్వత కీర్తి తనకూ భాషకూ సాధించి చిర కీర్తి పొందాడు .

భరతచంద్ర రచనలలో ముఖ్యమైనది 1752 లోరచించిన ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణ మంగళ్ .ఇది మూడుభాగాలు .మొదటి భాగం లో ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణా దేవి స్తోత్రం ఉంది.రెండవ భాగం ‘’కాళికా మంగళ్’’ .ఇందులో విద్యా , సుందరుల కథ ఉంది. మూడవది అయిన చివరి భాగం లో మొదటి మాన్సింగ్ ,అన్నపూర్ణ మంగళ్ అనే భవానంద మజుందార్ ల చరిత్ర ఉన్నది . భానుదత్తుడు మైధిలీ భాషలో రచించిన ‘’రసమంజరి ‘’ని బెంగాలీ భాషలోకి భరతచంద్ర అనువదించాడు . భరతచంద్ర సంస్కృత బెంగాలీ  భాషా పటిమకు నిదర్శనంగా నిలిచిన రచన ‘’నాగాస్టకం ‘’. సంస్కృత ఛందస్సు పై తన సాధికారతను రుజువు చేసిన రచన ఇది .ఇదికాక సంస్కృతం లో గంగాస్టకం రాశాడు . చండీ నాటకం ,తో పాటు మరొక అసంపూర్ణరచన ‘’సత్యనారాయణ పాంచాలీ కూడా రాశాడు .

మధ్యయుగ బెంగాలీ గీతాల నుంచి ఆధునిక బెంగాలీ గీతాలవరకు అనేక వందల పాటలు రాసి భాషా సౌందర్యం తో తీర్చి దిద్దిన ప్రజాకవి భరత చంద్ర . కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితమైన ‘’మంగళ గానం ‘’ను ప్రజా పరం కూడా చేసి భాషకు, సంగీతానికి సొగసులు దిద్దాడు . స్వేచ్ఛగా మంగళగానం చేసే వీలుకల్పించాడు .రాధాకృష్ణుల శృంగారాన్ని,ప్రణయాన్నీ ‘’పదావళి కీర్తనలు ‘’గా రచించాడు . దీనిద్వారా రాం ప్రసాద్ సేన్ ,నిధుబాబు అనబడే రాం నిధి గుప్తాలకు మార్గ  దర్శి అయ్యాడు .

భరతచంద్ర రచన ‘’అన్నదా మంగళ్’’ను’’ గేరాసీ లెబ్ దేవ్’’ రష్యన్ భాషలోకి అనువాదం చేశాడు .భరతచంద్ర సంగీతం సమకూర్చిన వాటినీ కలకత్తా లో నాటకాలకు వాడుకొన్నాడు .48 ఏళ్ళు మాత్రమే జీవించినా, శాశ్వత యశస్సు సాధించిన గుణకార్ భరతచంద్ర ఈ నాటి 24 పరగణాలలో ఉన్న ములజోర్ లో 1760లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

Bharatchandra Ray Gunakor

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )

నేపాల్ లో ఫుల్గమ ప్రాంతం లో రాంజీ ఠాకూర్ జన్మించాడు .వైష్ణవ కవి గోవింద ఠాకూర్ ,ప్రసిద్ధాకవి ,సవతి సోదరుడు రుచికర్ ఈ కవి పూర్వీకులు .లక్ష్మీ కాంత్ ఝా ,వి ఆర్ శర్మ ,పండిత్ శోభాకాంత్ జయదేవ్ ఝా వంటి సుప్రసిద్ధ సంస్కృత విద్వాంస గురువులవద్ద విద్య నేర్చాడు . రాం ప్రతాప్ సంస్కృత కాలేజి ,మహారాజ్ లక్ష్మీ సింగ్ కాలేజీ లలో సంస్కృత లెక్చరర్ గా  చేశాడు .పాట్నాలోని బీహార్ సంస్కృత సమితి  నుండి1956 లో ఆచార్య డిగ్రీ,  1960 లో ఎం ఏ లో గోల్డ్ మెడల్ ,1981 లో దర్భంగా లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి నుండి ‘’బాణ భట్టస్య రచనస్య ప్రేక్షా విలాసః ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి. అందుకొన్నాడు . దర్భంగా లోని లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి సంస్కృత ఆచార్యుడుగా రిటైర్ అయ్యాడు.

రాంజీ ఠాకూర్ సంస్కృతం లో కావ్యం, ఖండకావ్యాలు,ముక్తకావ్యాలు రచించాడు .అతని ప్రసిద్ధ కావ్యం-గీతామాధురి.ఖండకావ్యాలు –వైదేహీ పాదాంకం ,రాధా విరహం ,ప్రేం రహస్యం ,బాణేశ్వరి చరితం ,గోవింద చరితామృతం ,మాతృ స్తన్యం .ముక్తకావ్యాలు-ఆర్య విలాసః ,లఘుపద్య ప్రబంధ త్రయికావ్య కోశః . ఇటీవల ప్రచురించినవి -పర్యాయ చరితం కావ్యం ,అమృత మ౦ధనమ్

1912 లోరాంజీ ఠాకూర్  లఘు పద్య మంజరి కి కేంద్ర సాహిత్యఅకాడేమీ పురస్కారం అందుకొన్నాడు .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ – 3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

461-పిప్పలాద సంహిత పరిశోధకుడు –ప్రొ .దుర్గామోహన్ భట్టాచార్య (1899-1965 )

13-10-18 99 న ఢాకా లో  దుర్గామోహన భట్టాచార్య జన్మించాడు .1900 లో కుటుంబం ముర్షీదాబాద్ జిల్లా సహనగర్ లాల్ బాఘ్ కు తరలి వెళ్ళింది .నిరుపేద  కుటుంబం అయిన౦దున పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలకుపంపించలేక పోయారు .వీధిబడిలో బెంగాలీ సంస్కృతాలు బెంగాలీ భాషా మాధ్యమం లో  మాత్రమే నేర్చాడు .దుర్గామోహన్ బుద్ధి తీక్ష్ణత చాలా ఎక్కువకనుక 1915 నాటికే అంటే 16 వ ఏటనే అనేక సంస్కృత ఉపాధి పరీక్షలురాసి అగ్రభాగాన నిలిచాడు .కావ్య ,సాంఖ్య ,పురాణాలలో అత్యుత్తమ డిగ్రీ పొంది ‘’భాగవత రత్న ‘’బిరుదు అందుకొన్నాడు .

విధవరాలైన తల్లి ,తమ్ముడితో కలకత్తా లో ఉన్న మాతామహుల  ఇంటికి చేరాడు.  మేనల్లుడి ఆంగ్ల భాషాధ్యయనం కోరిక తీర్చటానికి పెద్ద మేనమామ అతనిని ప్రసిద్ధ కలకత్తా టౌన్ హైస్కూల్ హెడ్మాస్టర్ సురేష్ చంద్ర కుందు వద్దకు తీసుకు వెళ్ళాడు  .అప్పటికే 16 ఏళ్ళు రావటం వలన 10 ఏళ్ళ కోర్సును కేవలం ఒక్క ఏడాది లో చదవాల్సి వచ్చింది .శ్రమకోర్చి ఇష్టంగా కస్టపడి చదివి 1917 లో యూని వర్సిటి ఎంట్రన్స్ పరీక్ష రాసి ప్రధమతరగతిలో ఉత్తీర్ణుడై అందరికీ ఆశ్చర్యం కలిగింఛి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు .  .పట్టుదల ఓర్పు ఉంటె సాధించలేనిది లేదని నిరూపించాడు .1919 లో విద్యాసాగర్ కాలేజి నుంచి ఇంటర్ పాసై ,1921 లో స్కాటిష్ చర్చ్ కాలేజి నుండి సంస్కృతం లో బి ఏ ఆనర్స్ డిగ్రీని పొందాడు .1923 లో కలకత్తా యూని వర్సిటీ నుంచి సంస్కృత ఎం.  ఏ . డిగ్రీ తీసుకొన్నాడు .

దుర్గా మోహన్ తన దృష్టిని విద్యారంగం పై నిలిపాడు .హౌరా లో నరసింహ దత్ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ గా చేరి ,తర్వాత స్కాటిష్ చర్చ్ సంస్కృత ప్రొఫెసర్ అయి 30 వ ఏటనే హెడ్ అయ్యాడు .1952లో వెస్ట్ బెంగాల్ సీనియర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లో సంస్కృత కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ ఆఫ్ వేదిక్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ గా నియమింపబడ్డాడు .అర్హతను బట్టి ఉద్యోగాలు వెతుక్కొంటూ వచ్చి నిలిచాయి .చనిపోయేదాకా ఈ పదవిలోనే ఉన్నాడు .భట్టాచార్య  సమర్ధత ను  గుర్తించి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ,ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ వంటి అగ్ర శ్రేణి సంస్థలు ఆహ్వానించి వేదం మొదలైన విషయాలపై ప్రసంగాలను ఏర్పాటు చేసి గౌరవించాయి .సంస్కృతం ,వేద వాగ్మయం లో ఆయన కృషికి ఈ సంస్థలు స్వర్ణ పతకాలను అందజేసి సత్కరించాయి.

అందరూ అనుకొంటున్నట్లుభారత దేశం లో  అధర్వ వేదం కనుమరుగు కాలేదని అనేక పరిశోధనలవలన  విషయ సేకరణ వలన నిర్ధారించాడు .దీనికి తగిన సాక్షాధారాల సేకరణ కోసం దేశం లోని అనేక ప్రాంతాలను సందర్శించాడు . చనిపోవటానికి కొన్నేళ్ళ కిందటనే ఒరిస్సాలోని’’ గుహిపాల్’’ గ్రామం లో అధర్వ వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగుతోందని ప్రత్యక్షంగా చూసి సంతృప్తి చెందాడు . గుహిపాల్ లోనే అధర్వ వేదం లోని తొమ్మిది సంహితలలోముఖ్యమైన ‘’పిప్పలాద సంహిత ‘’ఒరియా భాష లోఅనేక  వ్రాత ప్రతులలో  కనిపించింది .దుర్గామోహన  భట్టాచార్య  ఆనందానికి అవధులు లేకపోయింది  . అన్వేషణ ఫలించి అధర్వ వేదం అంతరించి పోలేదని లోకానికి సాక్షాధారాలతో నిరూపించి ఒక రకంగా అధర్వ వేద పునః ప్రతిష్ట చేసి దాని ప్రతిష్టను కాపాడి ఉనికిని చాటాడు .ఈ పరిశోధన విశ్వ వ్యాప్తం గా అందరి దృష్టినీ ఆకర్షించి భట్టా చార్యను ‘’అధర్వ వేదోద్ధారకుడు ‘’గా సన్మానించారు .

పిప్పలాద సంహితపై అనేక సంవత్సరాలు పరిశోధించి ,దాని ప్రచురణకు పూనుకొని ప్రపంచ వ్యాప్త గీర్వాణ విద్యా వేత్తల ప్రశంసలు పొందాడు .దురదృష్ట వశాత్తు కేన్సర్ వ్యాధి సోకి దుర్గా మోహన భట్టాచార్య 12-11-1965 న 66 వ ఏట పరమపదించాడు .మధ్యలో ఆగిపోయిన ఈ పనిని కుమారుడు దీపక్ భట్టాచార్య పూర్తిచేసి మొదటి 18 కాండల గ్రంధాన్నితయారు చేయగా కలకత్తా ఏషియాటిక్ సొసైటీ  మూడు భాగాలుగా1997 ,2008 ,2011 లో   ప్రచురించి లోకానికి అందజేసింది . భట్టాచార్య భార్య భవానీదేవి 1992 లో మరణించింది  .ఆ దంపతులకు అయిదుగురు కుమారులు నలుగురు కుమార్తెలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-17- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 19-3-1872 లో జన్మించింది .తండ్రి జనరల్ మైఖేల్ అలెక్సీ డోమంటో విచ్ 13 వ శతాబ్ది యుక్రెయిన్ కొస్సాక్ సంతతి వాడు .రష్యాటర్కీయుద్ధం లో రష్యాకు బల్గేరియా లో రష్యన్ అడ్మిని స్ట్రేషన్ కు సలహాదారుడు .ఉదార భావాలున్న వ్యక్తిగా ప్రసిద్ధుడు .కాని కడు పేద . మసాలినా మ్రావిన్స్కయా అనే ధనికురాలిని పెళ్లి చేసుకొన్నాడు . వీరిద్దరి కుమార్తెయే మైఖలోవానా .ఈమెను చిన్నప్పుడు అందరూ ‘’షుర ‘’అని పిలిచేవారు . తండ్రిదగ్గర చనువు ఎక్కువ .తండ్రి అభిప్రాయాలకు విలువ నిచ్చి హిస్టరీ తోపాటు అనేక భాషలు నేర్చింది. తల్లితో ఫ్రెంచ్ ,స్నేహితులతో ఇంగ్లిష్ ,రైతులతో ఫిన్నిష్ భాషలో మాట్లాడేది .యూని వర్సిటి లో చేరి చదువు కోవాలను కొన్నదికాని తల్లికి ఆడపిల్లలు ఉన్నత విద్య చదవటం ఇష్టం లేదు . యూని వర్సిటీ లో రాడికల్ భావాలు తీవ్రంగా విద్యార్ధులను ప్రభావితం చేస్తాయనే భయమూ ఉండేది .కనుక తల్లి ఇష్ట ప్రకారమే స్కూల్ టీచర్ గా ఉద్యోగానికి కావలసిన సర్టిఫికేట్ సాధించింది .

1889 -90 కాలం లో 19 వ ఏట ఇంజినీరింగ్ చదువుతూ మిలిటరీ ఇన్ స్టి ట్యూట్ లో పేరు నమోదు చేసుకొన్నపేద వ్లాడిమిర్ లుద్విగోవిచ్ కొల్లాంటి తో పరిచయమై పెళ్లి చేసుకోవాలను కొన్నది . ఆ నిరుపేద తో పెళ్ళికి తల్లి ఒప్పుకోకపోతే ,టీచర్ ఉద్యోగం తో సంసారం గడుపుతామని సమాధానం చెప్పి౦ది .కాని ఆమెను పశ్చిమ యూరప్ లో టూర్ చేయమని మిషతో పంపారు.ఆమె ప్రేమ బలమై ,ప్రేమించిన వాడినే1893 లో పెళ్లి చేసుకొని పంతం నెగ్గించుకొన్నది .కొద్దికాలానికే గర్భవతి అయి కొడుకు మైఖేల్ ను కన్నది.తీవ్ర వామ భావాల రాజకీయ సాహిత్యం అధ్యయనం చేస్తూ ఫిక్షన్ రాసింది .

భర్త వ్లాడిమిర్ రైతు ఆధార సంఘాన్ని పునర్నిర్మించాలనే పూనికతో ఉన్నాడు .యాంత్రికత తో విప్లవభావాలతో నవీన రష్యా ను నిర్మించాలన్న ఆలోచన కార్మిక కర్షకులలోవ్యాపించి పోయింది .పిరికిగా భయం భయంగా లైబ్రరీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడుపుతున్నాడు .ఇంతలో ఎలీనా స్టాసోవాఅనే మార్క్సిస్ట్ ఉద్యమకారునితో పరిచయమై ,అతను ఇస్తున్న చట్ట వ్యతిరేక రచనల పార్సిళ్ళను కొరియర్ గా అజ్ఞాత వ్యక్తులకు చేర వేస్తున్నాడు .తాను కుట్రకు గురయ్యానని గ్రహించి ప్రేమ వివాహం విచ్చిన్నమై కొడుకు మైఖేల్ ను తలిదండ్రులకు అప్పగించి ఆమె ఎకనామిక్స్ చదవటానికి స్విట్జర్ లాండ్ లోని జూరిచ్ కు 1898 లో వెళ్ళిపోయింది .అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్లి లేబర్ పార్టీ నాయకులతో పరిచయం పొందింది . మళ్ళీ1899లో రష్యా వచ్చివ్లాడిమిర్ లెనిన్ తో గాఢ పరిచయం పెంపొందిం చుకొన్నది .ఇదే ఆమె జీవితాన్ని కొత్త మలుపు త్రిప్పింది . 27 వ ఏట ‘’రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ‘’సభ్యత్వం పొంది 1905 లో సెయింట్ పీటర్స్ బర్గ్ లో వింటర్ పాలెస్ ముందు జరిగిన ‘’బ్లడీ సండే ‘’కు ప్రత్యక్ష సాక్షి అయింది .

1905 లో జర్మనీ కి ప్రవాసం వెళ్ళింది .’’ఫిన్లాండ్ అండ్ సోషలిజం ‘’పుస్తకం రాసి ఫిన్లాండ్ ప్రజలను రష్యా జార్ నియంతల సామ్రాజ్య వాదానికి ఎదురు తిరిగి పోరాటం చేయమని ప్రోత్సహించింది .ఇంగ్లాండ్ జర్మని ఫ్రాన్స్ లలో పర్యటించి రోసా రుక్సే౦ బర్గ్ ,కార్ల్ లీబ్నేట్ లను పరిచయం చేసుకొన్నది .1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధ వ్యతిరేకి కనుక జర్మనీ వదిలి డెన్మార్క్ చేరి ,అక్కడ ఆ దేశం కూడా యుద్ధాన్ని సమర్దిస్తోందని గ్రహించి నిరాశ చెంది , స్వీడెన్ వెళ్లి అక్కడ తన ఉపన్యాసాలతో, రచనలతో వారిని యుద్ధ వ్యతిరేకులుగా మార్చాలను కొన్నది .కాని ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది .విడుదలకాగానే నార్వే వెళ్లి అక్కడి సోషలిస్ట్ కమ్యూనిటి తన భావాలకు గౌరవమివ్వటం వలన 1917 వరకు అక్కడే ఉండి పోయింది .1917 లో రష్యాలో కాలు పెట్టగానే జార్ నియంతల సామ్రాజ్యం పతనమై రష్యా రివల్యూషన్ ఊపులో ఉందని గ్రహించింది .

తాను సభ్యత్వం తీసుకొన్న పార్టీ జూలియస్ మార్టోవ్ నాయకత్వం లో మెన్షెవిక్ పార్టీ గా ,లెనిన్ నాయకత్వం లో బోల్షెవిక్ పార్టీ గా చీలి పోయింది .మొదట్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా 1904 లో లెనిన్ పార్టీ బోల్షెవిక్ లకు మద్దతు నిచ్చింది .1917 అక్టోబర్ విప్లవం తర్వాత కొల్లాంటి రాజకీయ జీవితం ప్రారంభమైంది .సోషల్ వెల్ఫేర్ కు పీపుల్స్ కమ్మిస్సార్ అయింది. 1919 లో’’ మహిళా డిపార్ట్ మెంట్ ‘’ ఏర్పరచి దేశం లో పరిపాలన యంత్రాంగం లో బాగా ప్రాముఖ్యాన్ని పొందింది . ఈ సంస్థ స్త్రీ సంక్షేమానికి, విద్య కు ,ఉపాధికి ,వివాహాలకు కృషి చేసింది .విప్లవ సమయం లో మహిళలకు చేసిన వాగ్దానాలన్నీ నెర వేరేట్లు చేసింది . మిగిలిన మహిళా నాయకుల భావాలకు వ్యతిరేకంగా ‘’లిబరల్ ఫెమినిజం ‘’ను వ్యతిరేకించింది .ఆ భావాన్ని బూర్జువా భావం అన్నది .1930 లో డిపార్ట్ మెంట్ మూసేశారు .1917 లో పావెల్ డేబెంకో ను పెళ్లి చేసుకొన్నది .

ప్రభుత్వం లో ఉంటూనే కమ్యూనిస్ట్ పార్టీ చేసే తప్పులను తెలియ బరుస్తూ ,అలేక్సాండర్ షిప్లికోవ్ తో కలిసి ‘’వర్కర్స్ అపోజిషన్ ‘’ఏర్పాటు చేసింది .లెనిన్ దీన్ని రద్దు చేసి ,ఆమె కు ప్రాముఖ్యం తగ్గించేశాడు .1920 నుంచి అనేక డిప్లమాటిక్ స్థాయిలలో పని చేసి ,రష్యాలో మహిళా సాధికారత కోసం తీవ్ర కృషి చేసింది .1923 లో నార్వే రాయబారిగా పని చేసింది .ప్రపంచం లో రెండవ మహిళా రాయబారి గా రికార్డ్ నెలకొల్పింది .మొదటి ఆమె డయానా అబ్గర్ జపాన్ లో అమెరికా రాయబారి గా చరిత్ర సృష్టించింది . తర్వాత మెక్సికో, స్వీడెన్ దేశ రాయబారిగా1926 నుంచి 1945 వరకు సుదీర్ఘకాలం పని చేసి సమర్ధతను నిరూపించుకొన్నది ..ఆమె స్టాక్ హోం లో ఉండగానే

‘’వింటర్ వార్ ‘’ రష్యా ,ఫిన్లాండ్ మధ్య జరిగింది . ఆమె ప్రభావంతో స్వీడెన్ తటస్థంగా ఉండి పోయింది .యుద్ధానంతరం ఆమె ‘’వ్యాచస్లావ్ మోలోటోవ్ ‘’పురస్కారం పొందింది .అనేక శాంతి సంభాషణలలో చురుకైన పాత్ర పోషించింది .లీగ్ ఆఫ్ నేషన్స్ కు రష్యా డెలిగేషన్ లో మెంబర్ గా ఉన్నది .కార్మిక మాతకు తన ,పర భేదం ఉండరాదని హితవు చెప్పేది .మాతృత్వానికి విలువనివ్వాలని కోరేది.

అలేక్సాండ్రా కొల్లాంటి 80 వ ఏట మాస్కో లో 9-3-1952 న మరణించింది .ఆమె పై ‘’వేవ్ ఆఫ్ పాషన్ ‘’సినిమా తీశారు . బ్రిటన్ ,అమెరికాలలో 1960 లో రాడికలిజం ,1970 లో ఫెమినిస్ట్ ఉద్యమం రావటానికి ముఖ్య కారణం ఆమె రచనలే .అంతటి ప్రభావ శీలి ఆమె .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

వసంత విలాసి కృష్ణ శాస్త్రి మహా దేశ భక్తుడు -టిప్పు సుల్తాన్ -జ్యోతి -1-11-17

Inline image 1Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -12(చివరి భాగం )

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -12(చివరి భాగం )

శివానందలహరి లో అద్వైత స్థితి

‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో –‘’శ్లోకం లో శివుని అద్వైత స్థితి ని వర్ణించారు శంకరాచార్య .మహా ప్రళయం లో కూడా పరమేశ్వరుడు ఆనంద లహరిలో తేలియాడుతూ,నిశ్చలంగా  ఉంటాడు .ఇదే అద్వైత స్థితి .ఇ౦దులో ఆన౦ద లహరి ఒక గొప్ప అనుభవ స్థితి .

‘’కిం బ్రూమః తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో ,భవ –ద్ధైర్యం చేద్రుశ మాత్మన స్థితిరియం చాన్యైః కథం లభ్యతే

భ్రశ్య ద్దేవ గణం త్రసన్ముని గణం నశ్య త్ప్రపంచం లయం –పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భావాన్ ‘’

శంభో పశుపతీ !నీ ధైర్యానికి జోహార్లు .నీ సాహసానికి జోహార్లు .నీ అచంచల ఆత్మ స్థితి బహు ప్రశంశ  నీయం. ప్రళయ కాలం లో దేవతలు కూడా స్థాన భ్రంశం చెందుతున్నారు .భయం తో వణికి పోతుంటారు .నీ కళ్ళ యెదుటనే ప్రపంచం నశించి పోతోంది .ఇదంతా చూస్తూ నువ్వు మాత్రం నిశ్చలంగా  ఆనంద సముద్ర లహరి లో హాయిగా తేలియాడుతూ ఉంటావు .అని అద్వైతానందాను భూతిని ఆచార్య శంకరులు అద్భుతంగా ఆవిష్కరించారు .

అలాగే ‘’అంకోలం నిజ బీజ సంతతి –‘’శ్లోకం లోనూ అద్వైత సిద్ధాంత ప్రదర్శన చేసిన సంగతి తెలుసుకొన్నాం .నదులు  సముద్రం లో కలిసి తమ నామ రూపాలు అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రమే నన్న భావం గా కలిసిపోతాయి  .ఇదే అద్వైత స్థితి లో ఆంతర్యం .

ఈశ్వరుడు మనలోనే ఉంటె  ఈశ్వర ప్రార్ధన నిరంతరం చేస్తుంటే జ్ఞాన ప్రాప్తి జరిగి ,అరిషడ్వర్గాలు నశించి అద్వైత సిద్ధి లభిస్తుంది అని ఇదివరకటి శ్లోకాలలో తెలుసుకొన్నాం .  ఇలాంటి శ్లోకాలు ఎన్ని చెప్పుకొన్నా సంతృప్తి ఉండదు . నిత్య సాధనతో పరమేశ్వర చిత్త లగ్నమానసులమైతే ఆచార్య శంకరులు ప్రవచించిన శివానంద లహరి అనే అద్వైత సిద్ధి లభిస్తుందని గ్రహించాలని మనవి చేస్తూ ‘’శంకరుల శివానందలహరి ఆంతర్యం ‘’ధారావాహిక కు  ఇంతటితో సమాప్తి పలుకు తున్నాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్  .

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీసత్య నారాయణ స్వామి వ్రతం

శ్రీసత్య నారాయణ స్వామి వ్రతం

— 4- 11- 17 శనివారం ఉదయం 7 గంటలకు మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రుద్రాభిషేకం ,అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొంటున్నాము . మీరందరూ తప్పక వచ్చి రెండు కార్యక్రమాలలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాము

5-11-17 ఆదివారం ఉదయం 6 గంటలకు మల్లాపూర్ లో కారులో బయల్దేరి  5 గంటల ప్రయాణ దూరం లో కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ప్రముఖ దత్తాత్రేయ క్షేత్రం   గానుగా పురం లో వేంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం లో స్వామి వారిని  దర్శించి s , సాయం కాలానికి మల్లాపూర్ చేరుతాము . ఈ దైవ దర్శనకార్యక్రమం లో కూడా పాల్గొనమని కోరిక -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వినయం తో విన్నపం

వినయం తో విన్నపం

— రిసెర్చ్ కృషి లాంటి ఈ బృహద్గ్రంథం  ‘’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”ప్రచురణలోనాకు,సరసభారతికి,,ప్రాయోజకులకు ,అంకితంపొందుతున్నవారికీ ఎవరికీ ప్రతిఫలాపేక్ష ,వ్యాపార దృష్టి లేదని ప్రపంచ పురోగతికి మార్గ దర్శకులైన మహనీయుల జీవిత విశేషాలు సాధించిన ఘనవిజయాలను  ,తెలియని వారికీ ,ముఖ్యంగా నేటి యువతకు ,అభిరుచి ఉన్న ఆసక్తిగల పాఠకుల దృష్టికి తెచ్చి,ఇంతటి సమాచారాన్ని  అందుబాటులో ఉంచటమే మా  ప్రధాన లక్ష్యమని   మనస్పూర్తిగా తెలియ బరుస్తున్నాను .

 

గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17

 

ఎందరో మహానుభావులు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు అనే ఈ గ్రంధానికి  ఆధరాభిమానాలతో ముందుమాటలు రచించిన డా సవరం వెంకటేశ్వరరావు గారికి  -హిస్టరీ హెడ్ -హిందూ కాలేజీ -మచిలీపట్నం ,అభిలషణీయమైన ఆకర్షణీయ అర్ధవంతమైన ముఖ చిత్రాలను డిజైన్ చేసిన శ్రీ కళాసాగర్ గారికి ,డిటిపి చేసి సరసభారతి తరఫున అందంగా  ముద్రి0పజేసి ,అందజేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం  కార్యదర్శి ,రమ్య భారతి సంపాదకులు ,సరసభారతి ఆత్మీయులు శ్రీ చలపాక ప్రకాష్ గారికీ ,  కీ శే డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితమిప్పించి  సార్ధకత కల్పించి ,ప్రాయోజకులుగా సరసభారతి తరఫున గ్రంథ ముద్రణకు తోడ్పడిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులకు , నాతోపాటు అడుగులేస్తూ సహకరిస్తున్న సరసభారతి కార్యవర్గానికి కృతజ్ఞతలు . నా రచనలకు ప్రోత్సాహమిస్తున్న నా అర్ధాంగి శ్రీమతి ప్రభావతికి ,నా కుటుంబ సభ్యులకు అభినందనలు.                                                                                   గబ్బిట దుర్గాప్రసాద్ –

 

వదాన్యులకు వందనాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలకు భక్తితోను , ,సరసభారతి కార్యక్రమాలకు ,గ్రంథ ముద్రణలకు ఆదరాభిమానాలతోనూ  విరాళాలు అంద  జేసిన వదాన్యులైన దాతలకు కృతజ్ఞతలు -గబ్బిట దుర్గాప్రసాద్

1-శ్రీ వేలూరి పవన్ ,శ్రీమతి రాధ దంపతులు -అమెరికా     రూ 15,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ ,శ్రీమతి దుర్గ దంపతులు -హైదరాబాద్ -13,116

3-శ్రీ కోమలి సాంబావదాని శ్రీమతి విజయలక్ష్మి దంపతులు -అమెరికా –10,000

4-శ్రీ అడుసుమిల్లి రాంకీ ,శ్రీమతి ఉష దంపతులు -అమెరికా                  9,000

5-చి గబ్బిట సంకల్ప్ –అమెరికా                                                     7,500

6-శ్రీ గౌడ రఘు శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా                            7,000

7 -శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు -అమెరికా              7,000

8-శ్రీ వీటూరి రామ కృష్ణ ,శ్రీమతి పద్మజ దంపతులు -అమెరికా                   6,600

9-శ్రీ జగ్గా లోకానాధ్ ,శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా                         6,000

10-డా శ్రీ బండారు రాధాకృష్ణమూర్తి డాశ్రీమతి  సులోచన దంపతులు -అమెరికా 6,000

11-శ్రీ వాసుకి ,శ్రీమతి మాలిని దంపతులు -అమెరికా                                  5,000

12-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు -హైదరాబాద్          5,000

13-శ్రీ రావి శరత్ శ్రీమతి ఉష దంపతులు -అమెరికా                                    5,000

14-శ్రీ గోసుకోండ నరేంద్ర శ్రీమతి అరుణ దంపతులు  -అమెరికా                       4,000

15-శ్రీ గ్రంధి హరి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు -అమెరికా                           3,500

16-శ్రీ వేలూరి హరికిషన్ శ్రీమతి శారిక దంపతులు -అమెరికా                            3,000

17-శ్రీమతి వేణి దంపతులు అమెరికా                                                          2,500

18-శ్రీ అడుసుమిల్లి పవన్ సాయి శ్రీమతి పద్మశ్రీ దంపతులు -అమెరికా                2,500

19-శ్రీమతి పసుమర్తి లక్ష్మి -అమెరికా                                                           2,000

-20-శ్రీ గార్లపాటి ప్రసాదావధాని శ్రీమతి అనసూయ దంపతులు -అమెరికా              1,500

– 21-శ్రీ నాగరాజు శ్రీమతి రంజని దంపతులు -అమెరికా                                      1,250

22-శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తి  శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులు-ఖమ్మం     5,00

23-శ్రీమతి చతుర్వేదుల జానకి -విజయవాడ                                                   5,00

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-

స్థూల సూక్ష్మ కారణ శరీరాల లయం

1-      స్థూల శరీరం -పంచ భూతాలూ ,అయిదు కర్మేంద్రియాలు ,అయిదు జ్ఞానేంద్రియాలు ,పంచ ప్రాణాలు ,,నాలుగు అంతః కారణాలు –కలిసిన మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం –ఈ 24 తత్వాలు లయం అయితేనే మోక్షం .అందుకే శంకారాచార్య 24 సార్లు మహేశ్వర పాద పద్మాల స్మరణ చేశారు .ఇలా స్మరణ చేస్తే స్థూల శరీరం పర బ్రహ్మలో లయం అవుతుందని ఆచార్యుల వారి ఆంతర్యం అని గ్రహించాలి .

2-      సూక్ష్మ శరీరం –పంచ ప్రాణాలు ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనసు  ,బుద్ధి కలిస్తే సూక్ష్మ శరీరం .ఇవి 17 తత్వాలు .ఇవీ లయం కావాలని 17 సార్లు పశుపతిని స్మరించారు .మనసును 18 వస్తువులతో పోల్చటం ఆ 17 తత్వాల సూక్ష్మదేహం  లయం అవటానికే నని ఆంతర్యం .

3-      కారణ శరీరం –ఇది ఆకారం లేనిదేకాక పుట్టుక ,చావులకు కారణమైనదికూడా.

దీనికోసం ‘’ఆశాపాశ క్లేశ దుర్వాసనాది —‘’శ్లోకం చెప్పి మనస్సు అనే పెట్టెలో ఈశ్వర పాద పద్మాలుంటే వాసనా క్షయమై కారణ శరీరం లయమౌతుందని  అప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుందని ఇది వరకే గ్రహించాం . పాదాలు మనం నిలకడ గా ఉండటానికిఆధారం గా  తోడ్పడతాయి .అంఘ్రి అన్నా పాదాలే ఉత్తమ గతి పొందించేవి అని అర్ధం .సన్మార్గం లో సంచరి౦చటానికి సహకరించేవి చరణాలు .దేవతల శక్తులన్నీ భగవంతుని పాదాలలోనే ఉంటాయట .

పాద పద్మాలు అనే మాటకు ఆంతర్యం ఆత్మ,పరమాత్మల జ్ఞానాలే భగవంతుని పాదపద్మాలు .భగవంతుని లీలలు ఒక పాదం అయితే ఆ౦తరిక అర్ధం మరో పాదం అన్నారు విజ్ఞులు .శివుడు ఒక పాదం అయితే శక్తి మరోపాదం  అన్నారు.

శంకరాచార్య పాదాలను భక్తి పూర్వకంగా పాదపద్మాలన్నారు .జీవులను సంసార లంపటం నుంచి తరి౦పజేసేవి భగత్పాదపద్మాలు .

ఈ విధంగా శివానంద లహరి లో శంకర భాగవత్పాదులవారు సదాశివ పాద పద్మార్చనం ,స్మరణం ,కీర్తనం,పాద సంసేవనం అందరూ చేసి తరి౦చాలని భావించారు . ఇది శిరోధార్యం మార్గ దర్శకం కైవల్య సాధనం ,సంసార తరుణోపాయం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-17 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -10

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం –10

అన్తఃకరణాలలో రెండవదైన బుద్ధి గురించి శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకాలను తెలుసుకొందాం .

విషయాన్ని నిశ్చయించే మానసిక స్థితి ని బుద్ధి అంటారు .జడ బుద్ధి ఉన్నవాడు పరమేశ్వర చి౦తనానికి దూరం గా ఉంటాడు అనే భావంగా చెప్పిన శ్లోకం –

‘’అసారే సంసారే నిజభజన దూరే ‘’శ్లోకం లో దీని వివరణ ఇదివరకే తెలుసుకొన్నాం .మరో శ్లోకం –

‘’యథా బుద్ధి శ్శుక్తౌ రజత మితి కాచాశ్మని మణి-ర్జలే పైస్టేక్షీరం భవతి మృగ త్రుష్ణాసు సలిలం

తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యో జడజనో –మహా దేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ‘’

దేవతలే ఆరాధించే పరమ శివా పశుపతీ !మూఢుడు సత్యం కాని దాన్ని సత్యం అని భ్రమ పడుతున్నాడు .తాను వేరు బ్రహ్మం వేరు అనుకొంటున్నాడు .అది నిజం కాదని ఆ వెర్రి మాలోకానికి తెలీదు పాపం .నువ్వు నిత్య సత్య సచ్చిదానంద స్వరూపుడివి .కాని వాడు నిన్ను వదిలేసి చిన్న దేవతలనే నమ్ముతున్నాడు .ఇది ఎలా ఉందీ అంటే ముత్యపు చిప్పను చూసి వెండి అని,  గాజు ముక్కను చూసి మణి అని, ఎండమావి ని చూసి నీరు అని భ్రమించటం లాగా ఉంది .కనుక నిన్నే సేవిస్తే ఈ భ్రమ ప్రమాదం వాడికి ఉండదు .ఇతర దేవతలను సేవిస్తే లౌకిక తాత్కాలిక ప్రయోజనాలే నేర వేరుతాయి . నిన్ను సేవిస్తే శాశ్వత ముక్తి లభిస్తుంది .నువ్వుఅవిద్యా నిర్మూలనం చేసి మోక్షం ప్రసాదిస్తావు .జీవుడు మాయావృతుడు .నీవు మాయాతీతుడవు .

అలాగే ‘’గభీరే కాసారే విశతి విజనే –‘’శ్లోకం లోనూ ఇదే భావాన్ని వివరించారని తెలుసుకొన్నాం

జడ బుద్ధిని జ్ఞానం లో నిలపాలి అప్పుడే తరుణోపాయం అని చెప్పెశ్లోక౦

‘’మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ –కరశ్చాభ్యర్చాయాం శ్రుతి రపి కథాకర్ణన విధౌ

తవ ధ్యానే బుద్ధిః నయన యుగళం మూర్తి విభవే -పరగ్రంథాన్ కైర్వాపరమశివ జానే పరమతః ‘’

నా మనసు నీ పాద పద్మాల మీద లగ్నమవ్వాలి .తామర పువ్వుకు ఏమీ అంటనట్లు  నామనసుకు ఏ మాలిన్యమూ అంటరాదు.శివ జ్ఞానం అనే మకరందాన్ని మాత్రమే ఆస్వాదించాలి .నిన్ను స్తుతించే వేద,ఇతిహాస ,పురాణ స్తుతినే వింటూ ఉండాలి .కావ్యాలు, గేయాలు, పద్యాలలో నీ స్తుతే వినిపించాలి చేతులు నిన్నే అర్చించాలి .చెవులు నీ గాథలే వింటూ ఉండాలి . నాబుద్ధి నీధ్యాన లగ్నమవ్వాలి .నాకళ్ళు నీ రూప సౌందర్య దర్శనం తో ధన్యమవాలి .నువ్వే ప్రపంచం,ప్రపంచమే నువ్వు అనే భావన మనసు ,బుద్ధి లో నిండిపోవాలి .నా సర్వేంద్రియాలు నీ చుట్టూనే పరి భ్రమించాలి .ఇలా బుద్ధిని నీకై సర్వ సమర్పణ చేస్తే ,సాయుజ్యమే కదా కలిగేది .

1-      చిత్తం –‘’చింతన కతృత్వం చిత్తం –‘’జ్ఞాపకాల పొరలు ఉన్నది చిత్తం.చిత్తం లో పరమేశ్వర పరిమళాలు నింపుకోవాలి అని –

‘’పాపోత్పాత విమోచనాయ రుచి రైశ్వర్యాయ మృత్యుంజయ –స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనా కర్ణనే

జిహ్వా చిత్త శిరో౦ఘ్రి హస్త నయన శ్త్రోత్రై రహం ప్రార్ధితో –మా మా జ్ఞాపయ  ముహుర్మామేవ మా  మే వచః ‘’

మృత్యుంజయ మూర్తీ శివా !నాఇంద్రియాలన్నీ నిన్నే ప్రార్దిస్తున్నాయి .ఎందుకంటె తమవలన నేరాలు ఏవైనా జరిగితే అవి పాపాలకు కారణం అవుతాయని .పాపాలు మనోహరమైన ఈశ్వర సంబంధమైన జ్ఞాన సంపదను అనుభవించ కుండా అడ్డుపడతాయి .కనుక పాపాలవల్ల జరిగే ఉత్పాతాలు కలగకుండా ఇంద్రియాలన్నీ నిన్నే సేవిస్తున్నాయి .నాలుక నిన్ను స్తోత్రం చేయటానికి , చిత్తం నీ సంబంధమైన ధ్యానం చేయటానికి  చేతులు నిన్ను పూజించటానికి ,కళ్ళు నిన్నే దర్శించటానికి ,శిరస్సు నీకే నమస్కరించటానికి ,పాదాలు నీ చుట్టూ ప్రదక్షిణం చేయటానికి  ,చెవులు నీకథలే వినటానికి అనుకూలంగా ఉంచమని వేడుకొంటున్నాయి.అందుకని ఓ ప్రభూ నన్ను ఆ ఇంద్రియాలు కోరినట్లు ఆజ్ఞాపించు .నాకు మూగతనం చెవుడు ,గుడ్డితనం కుంటితనం రాకుండా చూడు .ఈ ఆవ లక్షణాలు లేకపోతె  హాయిగా నాఇంద్రియాలు నీ సేవలో ధన్యమౌతాయి

4-ఆహ౦కార౦  -.’’అహం కర్తా అహంకారః ‘’అని శకరాచార్య నిర్వచనం .నేను చేస్తున్నాను అనే భావమే అహంకారం .ఇది అనర్ధ హేతువు దాన్ని వదిలించుకోవాలి .దీనికోసం

‘’త్వత్పాదాంబుజ మర్చయామి –‘’శ్లోకం లో ఈ విషయాన్నే  చెప్పారు.  దీన్ని మనం తెలుసుకొన్నాం .అలాగే 

‘’మనస్తే పాదాబ్జే –‘’శ్లోకం లోని భావాలూ గ్రహించాం –

‘’సా రసనే తే నయనే –తావేవ కరౌ స ఏవ కృతకృత్యః

యా యే యౌయో భర్గం-వద తీక్షతే సదార్చత స్స్మరతి’’

శివ నామం ఉచ్చ రించే నాలుకే నాలుక .శివుని దర్శించే నేత్రాలే నేత్రాలు .మహా దేవుని పూజించే చేతులే చేతులు .నిరంతరం సదాశివుని స్మరించేవాడే కృతకృత్యుడు .పోతనగారుకూడా ‘’కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ —‘’అన్నారు .చివరగా –

‘’క్రీడార్ధం సృజసి ప్రపంచ మఖిలం క్రీడా మృగా స్తే జనాః –యత్కర్మా చరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్

శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేస్టితం నిశ్చితం –తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్య మేవ త్వయా ‘’

ప్రపంచాన్ని ఆటగా సృస్టిస్తావు.ఆ ఆటలో మేమందరం క్రీడా మృగాలమే .నువ్వు సృష్టించిన అడవి జంతువును నేను . నీ పెంపుడు జంతువును కూడా .కనుక నేను చేసే పనులన్నీ నీకు ఇష్టంగానే ఉంటాయి .పెంపుడు జంతువంటే  యజమానికి వల్లమాలిన అభిమానం కదా .కనుక నన్ను రక్షించటం నీ బాధ్యత ,కర్తవ్యమ్ కూడా .కారణం నువ్వు పశుపతివి .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-17 –ఉయ్యూరు

  

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9

మనసు ను చాతకం ,చక్రవాకం,చకోరం హంస లతో కూడా పోల్చి శంకరాచార్య శ్లోకాలు చెప్పారు –

‘’హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః –కోకః కోకనది ప్రియం ,ప్రతిదినం చంద్రం చకోర స్తదా

చేతో వా౦ఛతి మామకం ,పశుపతే ,చిన్మార్గ మృగ్యం విభో-గౌరీనాథ,భవత్పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్య ప్రదం ‘’

హంస నిండుగా పద్మాలున్న కొలను లో విహరించాలని కోరుకొంటుంది .చక్రవాకం సూర్యుడిరాక కోసం ఎదురు చూస్తుంది .చక్రవాకం చంద్రుని  వెన్నెల కోసం నిరీక్షిస్తుంది .చాతక పక్షి నీల మేఘం ఎప్పుడు వర్షిస్తుందా అని అర్రులు చాస్తూ ఎదురు చూస్తుంది .అలాగే నేను జ్ఞానమార్గం చూపించే  గౌరీ నాధుని పాద పద్మాలద్వారా మోక్షం కోసం ఎదురు చూస్తున్నాను .

  పై నాలుగు పక్షులు కంటికి కనిపించవు .మనసు కూడా అంతే .ఆ పక్షులకున్న విశిష్ట గుణాలవంటివి మన మనసుకు కూడా ఉన్నాయి .ఈ సుగుణాలతో సాధన సాగించమని ఆంతర్యం .

1-హంస పాలు నీళ్ళను వేరు చేస్తుంది .అంటే పాలను వేరు చేస్తుంది .అంటే గుణాన్ని గ్రహించటం హంస లక్షణం .అలాగే హంస తన జీవితకాలం లో ఒక హంస తోనే జత కడుతుంది .మరో హంస వైపు చూడదు .అలాగే భక్తుడు తన చూపును ఈశ్వరుని వైపే చూడాలని ఆంతర్యం .2- చాతక పక్షి శరత్కాల నీల మేఘాన్ని తప్ప మరొక దాన్ని యాచించదు .అన్నికాలాలలోవర్షం పడినా చాతకానికి ఆ నీరు అక్కర్లేదు .అలాగే మనం కూడా మోక్షాన్ని ఇచ్చే ఈశ్వరునే యాచించాలని భావం .3-చకోర పక్షి వెన్నెలలోని అమృతాన్ని ఆస్వాదిస్తుంది .అమృతం చంద్రునిలో మాత్రమే ఉంటుందని దానికి తెలుసు .దీనికోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది .మనం కూడా నిరంతర ప్రయత్నం తో అద్వైతామృతాన్నిపొందాలని సందేశం .-  4- చక్రవాకం పత్నీ వియోగాన్ని పోగొట్టుకోవటానికి సూర్యుని కోసం ఎదురు చూస్తుంది .జీవుడు కూడా పరమాత్మ వైపే దృష్టి సారించాలని సూచన .ఈ నాలుగు పక్షులు తమ గుణాలవలన మానవుని కి గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్నిస్తున్నాయని ఆంతర్యం  .

  మరొక శ్లోకం లో మనసును చాతకం తో పోల్చారు –

‘’కారుణ్యామృత వర్షిణం ,ఘన విపద్గ్రీష్మ చ్ఛిదాకర్మఠం-విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సం సేవ్య మిచ్ఛాకృతిం

నృత్యద్భక్త మయూర మద్రినిలయం  సంసజ్జటామండలం –శంభో ,వాంఛతి నీలకంధర,సదా త్వాం మే మనశ్చాతకః ‘’

ఈ శ్లోకం లో నీలకంఠుడైన శివుడికి, మేఘానికి భేదం లేనట్లుగా చమత్కరించారు శంకరాచార్య

ఆ నీల మేఘం కారుణ్యం అనే అమృతాన్ని వర్షిస్తుంది .గ్రీష్మ తాపాన్ని పోగొడుతుంది .పంటలు బాగా పండుతాయి కనుక రైతులు పూజిస్తారు .వాళ్ళు కోరిన కోరికలను మేఘం తీరుస్తుంది .మేఘాలను చూసి నెమళ్ళు  ఆనంద పరవశంతో నాట్యం చేస్తాయి. మేఘం ఎత్తైన కొండల మీద ఉంటుంది . కం అంటే నీరు ధర అంటే ధరించినది అంటే నీటిని కలిగిఉన్న మేఘం అని అర్ధం .ఆ నీటితో తన దాహార్తిని తీర్చమని చాతక పక్షి నీల మేఘాన్ని కోరుతోంది

  గరళాన్ని మింగటం చేత శివుడి కంఠం నల్లబడింది కనుక నీల కంఠుడు.కంధరం అంటే మెడ కనుక నీల క౦ధరుడు  .ఈయన కరుణ అనే అమృతాన్ని వర్షిస్తాడు .ఆపదలను తొలగించి ,జ్ఞానం అనే పంటలు పండిస్తాడు .దేవతలు ఆయనను సేవిస్తారు ,ఆనంద పరవశంతో నాట్యం చేస్తారు .కైలాస పర్వత వాసి ,జటా జూట ధారి శివుడు .అలాంటి కరుణానిధి అయిన శివుడిని నా మనస్సు అనే చాతకపక్షికోసం  కారుణ్యం అనే అమృతాన్ని వర్షించమని ప్రార్ధిస్తోంది అని ఆంతర్యం .

 మనసును ఒక పెట్టె గా అభి వర్ణించి మరోశ్లోకం రచించారు –

‘’ఆశా పాశ క్లేశ దుర్వాసనాది-భేదో ద్యుక్తైర్దివ్య గంధై రమందై

ఆశా శాటీకస్య పాదారవిందం –చేతః పేటీం వాసితాంమే తనోతు ‘’

నా మనసు ఒక పెట్టె.దాని నిండా అవిద్య ,అస్మితం ,రాగం ,ద్వేషం  అభినివేశం అనే అయిదు క్లేశాలు అనే దుర్వాసనతో ఉంది . ఇవి దుఃఖ హేతువులు .దిక్కులే వస్త్రాలుకల దిగంబరుడైన శివుడిపాద పద్మాలు నా మనస్సు అనే పెట్టెలో ఉంటే ఆ క్లేశ దుర్వాసనలు అన్నీ తొలగి పోతాయి .

అవిద్య అంటే అజ్ఞానం .అస్మితం అంటే సుఖ దుఖాలు నేను అనుభవిస్తున్నాను అనే భావం వలన కలిగే దుఖం .రాగం అంటే ఇష్టమైన దానిపై కోరిక అవి దూరమైతే దుఖం .ద్వేషం అంటే ఇష్టం లేని వస్తువులు దగ్గరైతే కలిగేది .అభినివేశం అంటే తనను తాను ప్రేమించటం  మరణాదుల వలన కలిగే దుఖం .ఈ క్లేశాలు నశించాలంటే శివజ్ఞానం ఒక్కటే మార్గం అని ఆంతర్యం .

 మనసు ఒక గుర్రం అని ఇంకో శ్లోకం –

‘’కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం –సర్వేంగితజ్నమనఘం ధ్రువ లక్షణాఢ్య౦

 చేత స్తురంగ మధిరుహ్య చరస్మరారే –నేత స్సమస్త జగతాం వ్రుషభాధి రూఢః’’

ఈశ్వరా !నామనసు ఒక గుర్రం .దాని నడక చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది . దాని పరుగు వేగం చాలా ఎక్కువ .మనో భావాలను ఇట్టే పసిగట్టే నేర్పు దానికి ఉంది.దోషాలు లేని మాంచి జాతికి చెందిన సాముద్రికలక్షణాలన్నీ కలిగి ఉన్న కల్యాణి జాతి గుర్రం .నువ్వు సర్వ లోకాధినేతవు .వృషభారూఢుడవు.నువ్వే నా మనసనే పంచకల్యాణి గుర్రాన్ని అధిరోహించి తిరగమని  వేడు కొంటున్నాను .

  గుర్రానికి ఉండే సరస చిత్ర గతి 5 రకాలు -1-అతి వేగం అతి నెమ్మది కాకుండా మధ్యరకం గా పరిగెత్తటం 2- .వేగంగా చాతుర్యంగా పరిగెత్తటం 3-వంకర టికర కాకుండా తిన్ననైన మార్గం లో గమనం 4-పైకి కాళ్ళు కదిలిస్తూ పరిగెత్తటం 5-ఒకే రకమైన వేగం తో ఎంతదూరమైనా పరిగెత్తటం.

  ఈ అయిదు రకాల గమనం మన మనసును నడిపే పంచేంద్రియాలకు సంకేతం .రౌతు అంటే గుర్రాన్ని నడిపే వాడు సమర్దుడైతే పొగరుబోతు గుర్రమైనా చెప్పినట్లు దారికొచ్చి మాట వింటుంది .కనుక సర్వ సమర్ధుడైన ఈశ్వరుడే మన మనసనే గుర్రాన్ని ఎక్కితే అది దారికి తప్పకుండా వస్తుందని ఆంతర్యం .

 ఇదికాక మనసును చెరువుతో ,ఇంటితో కూడా పోల్చారు . ఆశ్లోక వైభవాలను ముందే తెలుసుకొన్నాం .

  మనసు అనే మొదటి అంతః కరణ పూర్తయింది .  రెండవదైన బుద్ధి గురించి  తర్వాత తెలుసుకొందాం .

    సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -8

శ్రీ శంకరుల శివానంద లహరి  ఆంతర్యం -8

మనసు కోతి వంటిది .నిలకడ ఉండదు అన్నీ కావాలను కొంటుంది ఎంగిలి చేసి వదిలేస్తుంది .మోహంఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –

‘’సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ –నటత్యాశా శాఖా స్పటతిఝడితి స్వైర మభితః

కపాలిన్ భిక్షో  మే హృదయ కపి మత్యంత చపలం –దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో ‘’

మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది .చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది .దాన్ని అదుపు చేసి బంధించటం కష్టం .దానికి మోహం ఎక్కువ .పరుగులు పెడుతూ ఉంటుంది .నా వశం లో లేని నా మనసును నువ్వే భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో .నువ్వు భక్తి  అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆది భిక్షుడవు .

  మనసు ఒక ఇల్లు అంటూ –‘’శివ ,తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా –భవ మమ గుణ ధుర్యాం  బుద్ధికన్యాం ప్రదాస్యే

సకల భువన బంధో సచ్చిదానంద సింధో-సదయ హృదయ గేహే సర్వదా సంవస త్వం ‘’

సకల భువన బంధువైన శివా !నా మనసు ఒక ఇల్లు .నాబుద్ధి ఒక కన్య .ఆకన్య గుణ గరిస్టురాలు.దాన్ని నీకు అర్పించాలని సంకల్పిస్తున్నా .నా కోరిక మన్నించి నామనసు అనే ఇంట్లో పార్వతీ దేవి తో వచ్చి ఉండిపో .నాబుద్ధికన్యను గ్రహించి ఇల్లరికపు అల్లుడిలాగా ఇక్కడే ఉంటే నిన్ను సదా సేవిస్తూ ధన్యుడనవుతాను .

 మనసు ఒక మదపు టేనుగు అని –‘’ధైర్యా౦కుశేన నిభ్రుతిం –‘’అనే శ్లోకంలో వర్ణించారు .దీన్ని ఇదివరకే తెలుసుకొన్నాం . మనసు ఒక గుడారం అంటూ మరోశ్లోకం –

‘’ధృతి స్తంభాధారం దృఢగుణ నిబద్ధాంసగమనాం –విచిత్రాంపద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం

స్మరారే మచ్చేత స్పుట పట కుటీం ప్రాప్య విశదాం – జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః సేవిత విభో ‘’

నా మనసు ఒక గుడారం .దానికి స్తంభాలు ధైర్యం మొదలైనవి.  త్రాళ్ళు సత్వ రజస్ తమోగుణాలు .మనస్సనే ఈ గుడారాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని వెళ్ళచ్చు .ఈ గుడారం లో మూలాధారం మొదలైన ఆరు చక్రాలు పద్మాలుగా ఉన్నాయి.  కుండలినీ శక్తి ఉంది.దీన్ని సాధించి ,భేదించి ముందుకు వెళ్ళచ్చు .ఆత్మజ్ఞానం తో ఇందులో హాయిగా జీవించ వచ్చు .నువ్వు కామారివి అంటే మన్మధుడికి శత్రువుకదా .

 మనసు ఒక దొంగ అని చెప్పే శ్లోకం –

‘’ప్రలోభాద్యై రర్ధాహరణ పరతంత్రో దని గృహే –ప్రవేశోద్యుక్త స్సంభ్రమతి బహుధా తస్కర పతే

ఇమాం చేతశ్చోరంకథ మిహ సహేశంకర విభో –తవాధీన౦ కృత్వా మయి నిరపరాధే కురు కృపాం ‘’

నా మనసు ఒక దొంగ .డబ్బు సంపాదించాలనే ఆశ దానికి ఎక్కువ .డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రవేశిస్తుంది .నేను వేరు చిత్తం వేరు ..ఇలా నామనసు శరీర సుఖాలకోసం లోభ గుణానికి బానిస అయింది .ఈ దుర్గుణాన్నిఇక నేను భరించ లేను . నువ్వే స్వాధీనం చేసుకోవాలి.  నన్ను నిరపరాధిని చేసి దయ చూపించు మహ ప్రభో.  

  మనసు ఒక తెల్లకలువ అని చెప్పిన శ్లోకం –

‘’ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం –కామ క్రోధ మదాదయో విగళితాః కాలాస్సుఖా విష్క్రుతః

జ్ఞానానంత్య మహౌషధి స్సుఫలితా కైవల్య నాథే సదా –మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే

ఉత్తమ రాజు పాలనలో ధర్మం నాలుగు పాదాలా వర్ధిల్లు తుంది .కామ క్రోధాది అరిషడ్వర్గాలు నశిస్తాయి రోజులు పక్షాలు నెలలు సంవత్సరాలతో కూడిన కాలం అంతా చక్కగా చల్లగా ప్రకాశిస్తుంది .అనంతమైన జ్ఞానం అనే ఔషధం రాజ్యం లో ఫలిస్తుంది. దాని వలన ప్రజలు విజ్ఞులై సుఖాలనుభవిస్తారు .

  అలాగేమనసు ఒక పుండరీకం అంటే తెల్లకలువ .దానిలో తలపై చల్లని చంద్రుని ధరించిన పరమశివుడున్నాడు .అ౦దువల్ల కామక్రోధాదులు నశించి పోయాయి .రాజు అంటే ప్రభువు చంద్రుడు అనే రెండు అర్ధాలున్నాయి .చంద్రుడు మృదుల స్వభావి రాజు కఠినుడు .ఇలాంటి తెల్లకలువ అనే నామనసులో హాయిగా రాజులాగా విహరించు పరమశివా అని అర్ధం .

  మనసు ఒక దుర్గం గా భావించి చెప్పిన శ్లోకం –

‘’గాంభీర్యం పరిఖా పదం ఘన ధ్రుతిః ప్రాకార ఉద్యద్గుణ-స్తోమ శ్చాప్త బలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్తితః

విద్యా వస్తుసమృద్ధి రిత్యఖిల సామగ్రీ సామేతే సదా –దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు ‘’

నామనసు ఒక దుర్గం .అంటే కోట .అందులో ప్రవేశించటం కష్టం .దుర్గమమైనది దుర్గం –ప్రవేశించటానికి కష్టమైనది అని అర్ధం .దుర్గానికి రక్షణగా చాలా ఉంటాయి .దాని కందకం గాంభీర్యం .ప్రాకారం ధైర్యం .సద్గుణాలే నమ్మదగిన ఆప్తులు .శరీరం లోని నవరంద్రాలే ఇంద్రియాలు . అందులోని సంపద అంతా విద్య  జ్ఞానం మొదలైనవి .కనుక శివుడు ప్రవేశించటానికి కావలసిన సామగ్రి అంతా ఉంది .శివుడు దుర్గా ప్రియుడు .మనసు పరమ  శివునికి ఇష్టమైన దుర్గం అని ఆంతర్యం . శివజ్ఞానం ఉంటేనే ప్రవేశానికి అర్హత ఉంటుంది అని అర్ధం .

  మనసు ఒక అడవి అని వర్ణించే శ్లోకం –

‘’మా గచ్ఛమితస్తతోగిరిశ భో మయ్యేవ వాసం కురు –స్వామిన్ ఆది కిరాత మామక మనః కాంతార సీమాంతరే

వర్తంతే బహుశో మృగా మద జుషో మాత్సర్య మోహాదయః –తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం ఛ సంప్రాప్యసి’’

శివా .నువ్వు ఎక్కడికీ పోవద్దు .నాలోనే ఉండిపో.నామనసు ఒక అరణ్యం అని ముందే చెప్పాను .నువ్వేమో ఆది కిరాతకుడవు .నీకు వేటాడటం చాలా ఇష్టం సరదా కదా .నీకు కావలసినన్ని మృగాలు నాలోనే ఉన్నాయి . హాయిగా వేటాడి అనుభవించు .రా .ఆలస్యం చేయకు .ఇవిగో కామ క్రోధ మద మాత్సర్యాలు అనే మృగాలు .వీటిని వేటాడి నీ వేట తీట తీర్చుకో అనుభవించు ,ఆస్వాదించు ,వినోదించు ,ప్రయోజనం పొందు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-17- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

అంతఃకరణ చతుస్టయ సమర్పణ విషయమైన శ్లోకాలు –మనస్సు, బుద్ధి,చిత్తం , అహంకారం అనే నాల్గింటిని అంతఃకరణ చతుస్టయ౦  అంటారు.ఇవి మనలోపల ఉన్నా వాటి చూపు మాత్రం బయటే ఉంటుంది .తాను పరమాత్మకంటే వేరు అనే భావం వలన ఇవి ప్రకోపిస్తాయి . వాటిని అణచి సమర్పణ చేయాలని అంతర్యం .

సంకల్ప ,వికల్పాలు చేసేది మనసు .దీని అధిదేవత చంద్రుడు .నిష్కర్షగా తేల్చేది బుద్ధి .దీనిదేవత బ్రహ్మ .నేను అనే భావమే అహంకారం .దేవత రుద్రుడు .జరిగి పోయినవాటిని చి౦తి౦చేది చిత్తం . వాసుదేవుడు దేవత .భ్రూ మద్యం లో మనసు,కంఠం లో బుద్ధి ,హృదయం లో చిత్తం ,నాభిలోఅహంకార౦ ఉంటాయి  .వీటిని ఈశ్వరార్పణం చేస్తే జీవి పరమయోగి ,సుఖి అవుతాడని శంకర భగవత్పాదులవారి ఆంతర్యం .వీటికి శ్లోకాలు రాశారు శివానంద లహరి లో .

1-మనసు

‘’గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే –విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః

సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే –సుఖేనావస్థానం జన ఇహ న జానాతి కిమహో ‘’

ఉమానాథా!అదొక అగాధమైన సరస్సు .ఒకవైపు నిర్జర కీకారణ్యం .మరో వైపు ఎత్తైన పర్వతం ..ఇటు నుయ్యి అటు గొయ్యి గా ఉంది పరిస్థితి . వాటిలోకి వెళ్లి పూలు కోసి నీకు అర్చన చేయాలని ఉంది .అటూ ఇటూ తెగతిరుగుతున్నాడు ఆరాట పడుతున్నాడు వెర్రివాడు మూర్ఖుడు .జడుడు.తనలోపలే ఒక పుష్పం ఉందని  కదలక్కర లేకుండా వెతకక్కర లేకుండా లోపలే హృదయ పుష్పం ఉందని గ్రహించలేక పోతున్నాడు . అది బురదలో పుట్టినా దానికి బురద అంటదు .మనసు కూడా అంతే.సూర్యుని చూసి పద్మం వికశించినట్లు  నిన్ను చూస్తె హృదయ పద్మం వికశిస్తుంది . ఆన౦దానుభవం పొందుతుంది .ఈ హృదయ పద్మాన్ని ఉమానాధునికి కైంకర్యం చేసి ఆనందాన్ని హాయిగా అతి సులభంగా పొందవచ్చు .ఇదంతా చూస్తూఉంటె  కస్తూరి మృగం తన నాభి దగ్గరున్న కస్తూరి వాసన గ్రహించకుండా పర్వతాలపై గాలించి అలసి పోయినట్లు గా కనిపిస్తోంది .

  అలాగే ‘’పటుర్వా గేహీవా ,యతి రపి జటీవా తదితరో –నరోవా యః కశ్చిన్ భవతు భవ కిం తేన భవతి

యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే –తదీయస్త్వం శంభో భవసి భావ భారం  చ వహసి ‘’

బ్రహ్మ చారి గృహస్తు ,వానప్రస్తుడు ,సన్యాసి  ఇంకెవరైనా కావచ్చు .వారు శాస్త్రాలు ఆశ్రమ ధర్మాలు నియమాలు పాటించవచ్చు .పాటించి ఉత్తమ బ్రహ్మ చారి ,ఉత్తమ గృహస్తు ,ఉత్తమ వానప్రస్తు,ఉత్తమ సన్యాసి అవవచ్చు .దీని వలన వారికి కొంచెం కూడా ప్రయోజనం ఉండదు.  వాళ్ళ మనస్సు నీ అధీనమై ఉండాలి .అప్పుడే వాళ్ళు ధన్యులవుతారు .కనుక ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మనసు భగవదర్పితమైతేనే జీవికి సాఫల్యత అని ఆంతర్యం  .

మరో శ్లోకం లో –‘’భ్రుంగీ చ్ఛానతనోత్కటః కరి మదగ్రాహీ స్పురన్మాధవా-హ్లాదోనాద యుతో మహాసిత వపుః పంచేషుణా చాదృతః

సత్పక్షః సుమనో వనేషు స పున సాక్షాన్మదీయేమనో –రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః

పరమ భక్తుడైన భ్రుంగి కోరగా శ్రీశైలమల్లేశ్వరా నువ్వు ఇష్టంగా తాండవం చేస్తావు .విష్ణువు మోహినీ రూపం ధరించినపుడు ,ఆయనపై మోహంపొందావు .ఓంకార నాదాలు  ధ్వనించేవాడవు.తెల్లని శరీరం కలిగి మన్మధుని చే ఆరాధింపబడేవాడవు .గజాసుర సంహారివి .దేవతలనేకాక వాసనాత్రయం లేని,సజ్జనులను  కూడా  రక్షించేవాడవు .అలాంటి శ్రీశైల వాసుడవైన నువ్వు నామనస్సు అనే కమలం లో భ్రమరాంబా దేవితో కలసి ఎప్పుడూ విహరించాలి .

  జ్ఞానకమలాన్ని వికసింప జేయాలని ఆంతర్యం .

  ఈశ్లోకాన్ని తుమ్మెద పరంగా కూడా అన్వయించవచ్చు .మగతుమ్మెద ఆడ తుమ్మెద నాట్యానికి ఆకర్షితురాలవుతుంది . అది ఏనుగు మదజలాన్ని ఆస్వాదిస్తుంది .మనోహర వైశాఖమాసం లో పుష్పాలు వికసించి ఉంటాయి .ఆతుమ్మెద జంట  మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనంద ఝంకారం  చేస్తూ ఎగురుతాయి . తుమ్మెద నల్లగా ఉంటుంది . మన్మధుడు పంచబాణుడు . ఆయన బాణాలు అరవిందం అశోకం ,మామిడి పువ్వు ,నవమల్లికాపుష్పం ,కలువ పూవు  .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-17- ఉయ్యూరు 

—

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని,  లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? అసలే తొడ తొక్కిడి  ముందూ వెనకా ఒకటే తోపుడు, జనరద్దీ అక్కడి బెత్తంగాళ్ళు (వేత్ర హస్తులు )శీఘ్రం శీఘ్రం అంటూ అరవం లో ,పోండా,పోండా అంటూ తెలుగులో  మువ్, మువ్ క్విక్లీ, అంటూ ఆంగ్లం లో మమ్మల్ని తోసేస్తుంటే  క్షణకాలమైనా దర్శనం చేసుకోనివ్వకుండా ఉంటే, ఘంట ఉందొ ,మోగించారో లేదో ఎవడు చూశాడు?  ఎప్పుడు బయట పడదామా అనే ఆరాటమే తప్ప అని కొందరు ,ఆహా! ఆహా !ఏమి దివ్య దర్శనం !ఆ దివ్య సుందర మంగళ స్వరూపుని కనులారా గాంచి ఆ పంగనామాలయ్యను చూస్తూ పరవశిస్తుంటే ఘంటో ,పంటో మీద దృష్టి ఉంటుందా అని కొందరూ అనవచ్చు .కాని దుర్భిణీ పెట్టి వెతికినా ,చెవులకు స్పీకర్లు పెట్టుకొని విన్నా గర్భాలయం లో ఘంట కనిపించదు ఘంటా నాదం విని పించదు. ఇదేం   విడ్డూరం అయ్యా బాబూ   అసలు ఘంట లేకుండా గుడి ఉంటుందా ,ఘంటానాదం లేకుండా అర్చన ఉంటుందా ?అంటారా ? .అసలు ఘంట ఉంటే కదా కనపడటానికి , మోగిస్తే కదా వినిపించటానికి ?నువ్వేదో మోకాలి చిప్పకూ బట్టతలకు ముడి పెట్టే వాడివిగా కనిపిస్తున్నావు అని నన్ను అంటారు కదూ – నిజమండి  బాబూ –ఆ బాలాజీ మీద ఒట్టు . ఈ ఒట్లూ, పట్లూమాకెందుకుగాని అసలు విషయమేమిటో నాన్చకుండా చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెబుతాను జాగ్రత్తగా వినండి . శ్రీ వారి ఘంట ను ఒకావిడ  మింగేసిందయ్యా బాబూ.  ’ఎన్నాపైత్యకారీ!ఘంటమింగటం ఏమిటయ్యా  అదీ ఆడకూతురు అంటున్నావ్ . నమ్మ మంటావా ?లేక నిమ్మకాయ నెత్తిన మర్దన చేయమంటావా ? అదేమీ అక్కర్లేదు కానీ ‘’నిఝ౦ గా నిజమయ్యా ‘’బాపు రమణల భాషలో . టెన్షన్ తట్టుకోలేకున్నాం అసలు విషయం చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెప్పేస్తున్నా చెప్పేస్తున్నాఆ కథ  చెప్పేస్తున్నా –

   శ్రీ వైష్ణవ లేక విశిష్టాద్వైత సంప్రదాయం లో శ్రీ వేదాంత దేశికులు అని గొప్ప కవి వందకు పైగా గ్రంధాలు సంస్కృత  తమిళభాషలో రచించిన మహా వేదాంతి ఉన్నారు .ఆయన క్రీ. శ. 1268 -1369 కాలం లో ఉన్నారు .  101 సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి  విశిష్టాద్వైత మత వ్యాప్తికి కృషి చేసినవారు ,నిజమైన దేశికోత్తములు .అసలు పేరు వెంకట నాధుడు .కంచి దగ్గర అన్మించి  కంచి ,శ్రీరంగ౦ లలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి ,భగవద్రామానుజులు నియమించిన   74 శ్రీ భాష్య సి౦హాసనాధిపతులలో ఒకరైన వ్రాత్యవరదుల వారి శిష్యులు .

  దేశికులవారి తండ్రి అనంతసూరి .తల్లి తోతాద్ర్యమ్మ లేక తోతాద్ర్య౦బ . శ్రీ వారి ఘంటను మింగిన మహా తల్లి ఈవిడే-అంటే దేశికులవారి తల్లిగారే . మళ్ళీ మధ్యలో సస్పెంసేమిటి ?అనకండి .ఈ దంపతులకు పెళ్లి అయిన 12 ఏళ్ళ దాకా సంతానం కలగలేదు .ఒక రోజు స్వప్నం లో దంపతులకు ఇద్దరికీ విడివిడిగా శ్రీనివాస ,పద్మావతీ దంపతులు ప్రత్యక్షమై ,తిరుమలకు  వచ్చి  తమ దర్శనం చేసుకొంటే పుత్రుడు జన్మిస్తాడు అని ఆనతిచ్చారు . అంతకంటే కావాల్సిందేముంది? దానికోసమే కదా ఇన్నేళ్ళ ఎదురు చూపు .తిరుమల యాత్ర చేసి పద్మావతీ శ్రీనివాస దర్శం చేసి  ,మానసిక ఆనందాన్ని పొందుతారు అనంత సూరి తోతాత్ర్యంబ దంపతులు . ఆరాత్రి తిరుమల శ్రీనివాసుడు చిన్నరి వైష్ణవ బాలుడి రూపం లో తోతాత్ర్యంబ కు కలలో కనిపించి ,శ్రీ వారి ఆరాధనలో వినియోగించే’’ ఘంట’’ను ఆమె చేతిలో పెట్టి మింగమని ఆదేశించాడు .తన ఆజ్నను  పాటించ గానే పుత్ర సంతానం కలుగుతుందని అభయమి చ్చి ,ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు .ఆమె భక్తి  తో దాన్ని మహా ప్రసాదంగా పటిక బెల్లం ముక్క లా  భావించి గుటుక్కున మింగేసింది .

  శ్రీ వారి ఆలయ అర్చకులు ప్రభాత వేళ ఆలయం తెరచి చూస్తే ఘంట కనిపించలేదు .ధర్మకర్తలు అర్చకులను అనుమానిస్తారు .అప్పుడు శ్రీనివాసుడు ప్రధాన అర్చకుని లో ‘’ఆవేశించి’’ ఎవ్వరినీ అనుమాని౦చవద్దనీ,తానే ఒక ఒక పుణ్య స్త్రీకి ఆశీర్వాదం గా ఆ ఘంట ను ప్రసాది౦చానని చెప్పాడు .అందరూ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు .

   శ్రీ వారి ఘంట ను కలలో మింగినామె అంటే తోతాత్ర్యంబ క్రీ .శ .1268 లో ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది .శ్రీనివాస వర ప్రసాది కనుక అ బాలుడికి  ‘’వేంకట నాథుడు’’ అని నామకరణం చేశారు .ఆయనే వేదాంత దేశికులై విరాజిల్లారు .కనుక వేదాంత దేశికులను శ్రీ వేంకటేశ్వరుని ‘’ఘంటావతారం’’గా భావిస్తారు .ఘంటానాదం అసుర శక్తులను తరిమేస్తుంది .’’సంకల్ప సూర్యోదయం’’ అనే తమ గ్రంథం లో దేశికులు ఈ విషయాన్ని నిక్షిప్తం చేశారు –‘’ఉత్ప్రేక్ష్యతే బుధ జనై రుపపత్తి భూమ్నా –ఘంటా హరేః సమజ నిష్ట యదాత్మనేతి ‘’

  అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం లో గంట లేదు, అర్చనలో ఘంటా నాదం ఉండదు .గర్భాలయం బయట  వ్రేలాడే పెద్ద ఘంట ను మాత్రమే వినియోగిస్తారు .ఇదండీ బాబూ అసలు విషయం . 

అలాగే ”ముకుందమాల ”రచించిన కులశేఖర ఆళ్వార్ తాను భక్తుల పాద ధూళితో పవిత్రమై  శ్రీవారి గర్భ గుడి వాకిట ”గడప”గా ఉండాలని కోరుకుని అలాగే అయ్యారు .దాన్ని కులశేఖర గడప అంటారు . 

ఆధారం –  ‘’సరసభారతి బ్లాగ్ ‘’చదువుతూ  నా చిరునామా తెలుసుకొని నేను అమెరికా లో ఉన్నప్పుడు  శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ తాను అత్యంత భక్తి  శ్రద్ధలతో  ఎంతో వివరణాత్మకంగా,సమగ్రంగా  రిసెర్చ్ గ్రంథంలాగా రచించి ఆదరంగా పంపిన   ‘’వేదాంత దేశికులు ‘’ గ్రంథం .    

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-17 – ఉయ్యూరు    

Inline image 1              Inline image 2

—


Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

నాలుగు రకాల భక్తులకు ఉమా మహేశ్వరుడే శరణు అంటూ వారి  విషయమై శంకరాచార్య వివరిస్తున్నారు .’’ఆర్తో ,జిజ్ఞాసు ,రర్ధార్ధీ,జ్ఞానీ చ భరతర్షభ ‘’అని గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ నలుగురు భక్తులను పేర్కొన్నాడు .

1-ఆర్తుడు – ఆర్తుడు అంటే దుఖం తో బాధ పడేవాడు .

‘’అసారే సంసారే నిజ భజన దూరే జడధియా-భ్రమంతం మాం మంథం పరమ కృపయా పాతుముచితం

మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః-త్వదన్యః కో వా మే త్రిజగతిశరణ్యః పశుపతే ‘’

‘’స్వామీ శివా !స్వస్వరూప జ్ఞానం లేని మూఢుడను నేను .అంథుడను .దయతో ఈ దీనుడిని రక్షించు .ఈ ప్రపంచం చావు ,పుట్టుకలతో కూడి బాధామయంగా ఉంది.ఇందులో సారం అంటే రుచి లేనే లేదు .నేనెవరినో ,ఎక్కడి నుంచి వచ్చానో ,మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలో తెలుసుకో లేక పోతున్నాను .దేహమే నేను అనే భ్రాంతి లో పడి కొట్టుకొంటున్నాను .కించిత్తు కూడా ఆత్మ జ్ఞానం లేని వాడిని .ఆత్మ చింతన లేకపోవటం తో ఈ ప్రపంచం నిత్యం, సత్యం అనే మాయలో ఉన్నాను .వయసు మీద పడి ముసలి వాడినై ,కంటి చూపు కూడా లేని వాడినయ్యాను .ఏది సత్యమో ఏది నిత్యమో తెలియ లేకున్నాను .సంసార లంపటం లో కూరుకు పోయి తపిస్తున్న దీనుడిని .నాలాంటి దీనులను రక్షించటం లో నువ్వు మహా నేర్పరివి .నువ్వు రక్షించటానికి నా కంటే దీనుడు ఎవరున్నారయ్యా .త్రిలోకాలలో నువ్వే నాకు దిక్కు .’’అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’’

  ఇక కాపాడే వారెవ్వరూ లేరని ,భగవంతునిపై భారం వేస్తే ,ఆయన రక్షగా నిలుస్తాడు అని ఆంతర్యం .

తర్వాత శ్లోకమూ ఆర్తుని రోదనమే –

‘’ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే –ప్రముఖ్యోహం తేషా మపి కిముత బంధుత్వ మనయోః

త్వయైవ క్ష౦తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః – ప్రయత్నాత్కర్తవ్యం మద వనమియం బంధు శరణిః’’

పశుపతీ !నువ్వు సర్వ సమర్ధుడవు .దీనులకు అత్యంత ఆప్తుడవైన బంధువుడవు .బంధు ,దీన జన రక్షకుడవు  నువ్వు .దీనులలో ముఖ్యుడను నీకు బంధువుడను సన్నిహితుడను అని నీకు వేరే చెప్పాలా!నాతప్పులన్నీ క్షమించు .దీనికి ప్రయత్నించటం నీ తక్షణ కర్తవ్యమ్ .బంధు రక్షణ సంప్రదాయంగా వస్తోందికదా  .

పరమేశ్వరుడే ఆర్త త్రాణ పరాయణుడు అని ఆంతర్యం  సంసార తాప పరితప్తుని గూర్చిన శ్లోకాలివి .

2-జిజ్ఞాసువు –జ్ఞానం కావాలని ప్రార్ధించే వాడు జిజ్ఞాసువు

‘’ఛందశ్శాఖి శిఖాన్వితైః ద్విజ వరై స్సంసేవితే శాశ్వతే –సౌఖ్యాపాదిని ఖేద భేదినిసుధా సారైః ఫలైర్దీపితే

చేతః పక్షి శిఖా మణే,త్యజ వృధాసంచార మన్యైరలం-నిత్యం శంకర పాద పద్మ యుగళీ నీడే విహారం కురు ‘’

ఓ మనసా !పక్షీ౦ద్రా!ఎందుకు అటూ ఇటూ వృధాగా తిరుగుతావు ?అదుగో శంకరుని పాదపద్మాలు అనే గూడు అక్కడ ఉంది చూడు .దాంట్లో హాయిగా విహరించు .వేదాలు అనే కొమ్మల చివర ఆ గూడు ఉన్నది .దాన్ని బ్రహ్మ విద్యలో శ్రేష్టు లైన యోగీశ్వరులు సేవిస్తూ ఉంటారు .ఈ గూడు ఆషామాషీ ది కాదు శాశ్వత నివాసం .పరమ సుఖమైన మొక్షాన్నిచ్చేది .సంసార దుఖాన్ని పోగొట్టేది .అది అమృతం నిండిన పండ్లతో శోభిస్తుంది .ఇంకెందుకు ఆలస్యం ? శాశ్వతంగా ఆ శంకరుని పాద పద్మాలలో స్వేచ్ఛగా  విహరించి పరమానంద విభూతి పొందు .

  మనసు పక్షిలాగా ఒక చోట కుదురుగా ఉండదు .దానికి శాశ్వతమైన గూడు అవసరం.  జిజ్ఞాసువుకూడా అలాగే శాశ్వతమైన నివాసం కావాలి . అదే శంకర పాద సన్నిధి అని ఆంతర్యం .

తర్వాత రెండు శ్లోకాలు కూడా జిజ్ఞాసువు నుద్దేశించి చెప్పినవే –

‘’ఆకీర్ణే  నఖ రాజి కాంతి విభవైరుద్యత్సుధావైభవైః-రాధౌతేపి చ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే

నిత్యం భక్తివధూగణై శ్చరహసి స్వేచ్ఛావిహారం కురు –స్థిత్వా మానస రాజ హంస ,గిరిజా నాధాంఘ్రి సౌధాంతరే ‘’

ఈ శ్లోకం గూర్చి ఇదివరకేచేప్పుకున్నాం .తర్వాత శ్లోకం –

‘’శంభు ధ్యాన వసంత సంగిని హృదారా మేఘ జీర్ణ చ్ఛదాః-స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితా పుణ్య ప్రవాళశ్రితాః

దీప్యంతే గుణ కోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః-జ్ఞానానంద సుధా మరంద లహరీ సంవిత్ఫలాభ్యునతిః’’

శివుని ధ్యానించటం అనేది వసంత ఋతువు .నా హృదయం ఒక పూల తోట. దానిలో శివధ్యానం అనే వసంత ఋతువు ప్రవేశించింది .వెంటనే నాలో ఉన్న పాపాలు అనే ఎండుటాకులన్నీ రాలిపోయాయి .వెనువెంటనే పుణ్యాలు అనే పగడాల లాంటి యెర్రని చిగురుటాకులనే సద్గుణాలు  మొలకెత్తాయి .దానితో భక్తి  అనే లతలు ఏర్పడి  శివుని పైకి ఎగబ్రాకాయి  .అవి నవ నవో న్మేమేషంగా గా ఉన్నాయి .అలా అల్లుకు పోయిన లతలకు శివ ధ్యానమే జపం అయింది .ఆ లతలకు జప వాక్కులు అంటే  సోహం ,పంచాక్షరి మంత్రం పుష్పాలుగా పూశాయి. ఒక్క సారి శివా అంటే చాలు స్వస్వరూప జ్ఞానం ఏర్పడి  వాటి పరిమళాలు అంతటా వ్యాపిస్తాయి .అవే బ్రహ్మానంద పరమైన సంస్కార పరిమళాలు .ఆ పుష్పాలనుండిజ్ఞానానందం అనే అమృతం మకరందంగా  ధారా పాతంగా ప్రవహి౦చి౦ది  .భక్తిలతకు బ్రహ్మ జ్ఞానం అనే పంట పండింది. ఇదే జ్ఞానానందం అనే సుధా తరంగం  .ఇదే కైవల్యం .

3-అర్ధార్ధి-ధనంమొదలైన కోరికలు కోరేవాడు అర్ధార్ధి.సాధకుడికి ఇవి అక్కరలేదు కావలసింది శాశ్వతమైన ముక్తి  బ్రహ్మానందం .దీనికోసం మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తారు .పొందే దాకా  వదిలి పెట్టరు వీరు అర్ధార్ధులు.

‘’కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో-విధిత్వం ,విష్ణుత్వం  దిశసి ఖలుతస్యాఃఫలమితి

పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతా – మదృస్ట్వా తద్ఖేదం కథ మిహ సహేశంకర విభో ‘’

శంకర ప్రభూ !నీ పూజ చేస్తున్నా .దానికి ప్రతిఫలంగా బ్రహ్మ పదవో విష్ణు పదవోఇస్తానంటావేమో .అవి నాకు వద్దే వద్దు .నిన్ను పూజించే విష్ణువు సృష్టి కార్యం చేస్తున్నాడు .బ్రహ్మకు నువ్వే వేదాలు ఇచ్చావు.   విష్ణువు  నీ మూల స్వరూపం తెలుసుకోవటానికి భూమిని త్రవ్వి త్రవ్వి అలసి సోలసి వెనక్కి వచ్చేశాడు పాపం  .బ్రహ్మ సృష్టి కార్యం లో మునిగి పోయి ,నీ అంతం ఎక్కడుందో తెలుసుకోవటానికి హంసగా మారి యెగిరి యెగిరి తిరిగి తిరిగి ఆయాసం తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాకై అబద్ధం చెప్పి శాపానికి గురై పూజకు అనర్హుడయ్యాడు .కనుక నాస్వామీ !బ్రహ్మత్వం విష్ణుత్వం నాకు వద్దు మహాప్రభో .నీ ఆది ,అంతాలు చూడలేని ,తెలుసుకోలేని ఆపనికి మాలిన  పదవులు నా కెందుకయ్యా-ఏం చేసుకోను నేను ? ఆ దుఖం ఎందుకు ఆ వ్యధ ఎందుకు వృధా  ఆయాసం ఎందుకు నాకు ? నీ పూజా ఫలంగా మోక్షం ప్రసాదించు తండ్రీ .చాలు .  

  శివుని  అశాశ్వతమైన కోరికలు కోరరాదు .శాశ్వతమూ నిత్యమూ అయిన మోక్షాన్నే కోరుకోవాలని ఆంతర్యం .

1-      జ్ఞాని –బ్రహ్మజ్ఞాని నిశ్చలంగా నిశ్చింతగా ,పరమార్ధం లో మునిగి తేలుతూ ఉంటాడు .శివుడు నాలో కొలువై ఉన్నాడు నాకు భయమెందుకు అనుకొంటాడు –ఈ విషయాన్నే –‘’దీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోప కుల్యాక్రమై –‘’శ్లోకం లో విపులంగా చెప్పుకొన్నాం .మరో శ్లోకం –

‘’కరలగ్న మృగః కరీంద్ర భంగో –ఘన శార్దూల విఖండనోస్త జంతుః

గిరిశో విశదాకృతిశ్చ చేతః –కుహరే పంచ ముఖోస్తి మే కుతో భీః’’

 చేతిలో జింక  గజాసుర వ్యాఘ్రాసుర సంహారి  ప్రాణులను తనలో విలీనం చేసుకొనేవాడు  భస్మలేపనం తో తెల్లగా ఉన్నవాడు ,పర్వత శయనం కలవాడు ,అయిదు ముఖాలున్న శివుడు నా మనస్సు అనే గుహలో ఉండగా నాకు భయం ఎందుకు ?

 సింహాన్ని కూడా పంచముఖఃలేక పంచాస్య  అంటారు .అదీ గుహలోనే ఉంటుంది.దాని చేతిలో వేటాడిన జింక ఉంటుంది .ఏనుగు, పెద్దపులినిఅది చంపుతుంది  .సింహం ఉన్న గుహలో ఇక ఏ జంతువూ ధైర్యంగా ప్రవేశించలేదు .పంచముఖుడైన శివుడిని ,పంచాస్య అయిన సింహాన్ని కలిపి పోల్చి చెప్పారిక్కడ .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-17 –ఉయ్యూరు        

‘   

Posted in రచనలు | Tagged | Leave a comment