ఆత్మ కధకు ఆద్యుడు స్వర్గీయ వెన్నెల కంటి సుబ్బా రావు -అక్కిరాజు రమాపతి రావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొంతెమ్మ కోరికలు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూలిన 220 ప్రాణాలు,అమరావతిలోపటేల్ విగ్రహం

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మద్రాస్ మెరీనా బీచ్ లో 25 గంటల కవి సమ్మేళన సమీక్ష

m b k sammelanam 3 001 marina beach kavi sammelanam 1 001 marina beach kavisammelanam 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-3(చివరి భాగం )

కొత్త భావాలను మనసులో ఉంచుకొని వుడ్ డెమన్ ను ,అంకుల్ వాన్యా లను మార్చి రాశాడు చెకోవ్ .వాన్యా బాగా ఆదరణ పొందింది .నిజాలను స్పష్టంగా చూడగలిగాడు .అప్పటి నుండి దియేటర్ తో ఎక్కువ సంబంధాలను కొన సాగించాడు .మాస్కో ఆర్ట్ దియేటర్ లో సభ్యురాలైన ఒల్గానిప్పర్ ను ప్రేమించాడు ఆమె కూడా వలచింది .కాని పెళ్లి విషయం చెప్పటానికి సందేహించాడు .అనారోగ్యం వలన ప్రదేశాలు తిరుగుతూ ఉత్తరాల ద్వారానే ప్రేయసికి వలపు వార్తలు తెలియ జేసేవాడు .ఒక ఇంటిలో ఆతిధ్యం పొందుతూ తీవ్ర జబ్బు తో బాధ పడ్డాడు ఇక తన రోజులు దగ్గర పడ్డాయని తెలుసుకొన్నాడు .అయితే ఓల్గా అతనిని ఒంటరిగా బాధ పడకుండా కానీ పెట్టి ఉంది .అతాన్ని ఒప్పించటానికి రెండేళ్ళు తీవ్రంగా ప్రయత్నించింది .చివరికి 25-5-1901 న అతన్ని ప్రపోజ్ చేసింది ఇద్ద్దరూ పెళ్లి చేసుకున్నారు .పిరికితనం వదలక పెళ్లి విషయం రహస్యం గానే ఉంచాడు .టాల్ స్టాయ్ను ఇష్టపడే  వారందరికీ చెకోవ్కూడా ఇష్టమే  .కాని తనకు బయటి ప్రపంచానికి ఊహాత్మక అడ్డ గోడ ఒకటి నిర్మించుకొని లోపలే ఉండిపోయాడని చెకోవ్ మరణం తర్వాత భార్య చెప్పింది .

జీవిత చరమాంకానికి ఇక మూడు ఏళ్ళు మాత్రమె మిగిలాయి .రష్యన్ అకాడేమిలో సభ్యుడయాడు రెండేళ్ళ తర్వాత తన స్నేహితుడు మాక్సి గోర్కీ ని అకాడెమి కి ఎన్నిక చేశాడు . గోర్కీ రాజకీయ సిద్ధాంతాలకు  అకాడెమి అభ్యంతరం చెప్పి అతని ఎన్నిక ను రద్దు చేసింది .దీనికి తీవ్రంగా స్పందించి గోర్కీ పక్షాన నిలిచి అకాడెమి సభ్యత్నానికి రాజీనామా చేశాడు.చెకోవ్ .మరో రెండు నాటకాలు దిత్రీసిస్టర్స్ ,ది చేర్రిఆర్చార్డ్  రాసి మహా పాప్యులర్ నాటక  కర్త అనిపించాడు .శారీరక బాధ అంతకంతకు ఎక్కువైంది .రోజుకు కొన్ని పంక్తులు మాత్రమె రాయ గలిగే వాడు .వ్యంగ్యాత్మక హాస్యాన్ని కొత్త విలువలతో పాత పద్ధతిలో రాశాడు

చెర్రి  ఆర్చర్డ్ తర్వాత చెకోవ్ పరిస్తితి విషమించింది .శారీరకం గా బలహీనుడైనా మానసికంగా మరింత ధృఢ౦ గా ఉన్నాడు .దేవుడు తనలో జీవాణువుపెట్టాడని అనేవాడు దిగజారిన ఆరోగ్యం వలన బెదేన్ వీలర్ శానిటోరియం లో చేర్చారు .డాక్టర్లు ఆయనకేమీ ఫర్వాలేదని ధైర్యం చెప్పేవారు .చెకోవ్ కూడా డాక్టరు కదా ఆయన్ను ఎవరూ మోసగించ లేరు .’’నేను చనిపోతున్నాను ‘’అని చెప్పి,2-7-1904 న 44ఏళ్ళకే ఇంకో ఆరు నెలలకు 45ఏళ్ళు వస్తాయనగా  చెకోవ్ చనిపోయాడు .   చెకోవ్ ఏక వ్యక్తీ సైన్యం లాగా క్రుత్రిమతపై తిరుగు బాటు చేశాడు .శైలీ నిర్మాణం తో నాటకాలను ,అందమైన కదానికలను రాసి అజరామరమైన కీర్తి సాధించాడు .అతని మొదటి ఆంగ్ల శిష్యురాలు కేధరీన్ మానస్ ఫీల్డ్ చిన్నకధకు వన్నె తెచ్చాడని అంది .అటు అమెరికాలోను చెకోవ్ కధలకు బ్రహ్మ రధం పట్టారు .ఎన్నో కధానికా పోటీలలో ఆయన కధలు బహుమతులు పొందాయి .ఏది రాసినా దాన్ని మధ్యలోనే చెప్పటం వదిలేస్తాడు .పాఠకుడి ఊహకే  కద సమాప్తాన్ని వదిలేయటం చెకోవ్ ప్రత్యేకత  .నటన ,క్రుత్రిమత్వాలను ఏవ గించాడు .కధలను ‘’it does not matter ‘’అని ,’’if we could know ‘’అని కాని చెప్పి ముగిస్తాడు .’’His was the genius of a style ,the biography of the mood ,the slice of life which gave rise to a new and enlarging literature of sensibility ‘’అని విశ్లేషకుల భావన .

చనిపోవటానికి కొన్ని నెలలముందు  తన రచనలను జనం మరో ఏడేళ్ళు చదువుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.అ తర్వాత ఆరున్నర ఏళ్ళు జీవించాడు . ఆయన అంచనాలు తారుమారయ్యాయి .మరణానంతరం పాప్యులారిటీ బాగా పెరిగింది .ఆయన చెర్రీ ఆర్చర్డ్ నాటకం తో టాల్ స్టాయ్ కి తరువాతివాడిగా ప్రజలు భావిన్చేట్లు చేసింది .చెకోవ్ కధలను ఫస్ట్ ,సెకండ్ థర్డ్ గ్రేడ్ లుగా విభజించారు .ఇంగ్లీష్ లోకి అనువాదం పొందాక ఆంగ్ల పాఠకులు చెకోవ్ పై వీరాభిమానం చూపారు .జేమ్స్ జాయిస్ వర్జీనియా ఉల్ఫ్ కేధరీన్ మానస్ ఫీల్డ్ వంటి ప్రముఖులు ఆయన్ను మెచ్చుకొన్నారు .ముఖ్యంగా బెర్నార్డ్ షా ప్రశంసలు పొందాడు చెకోవ్ .అయన చిన్నకధలు నాటకాలను డామినేట్ చేశాయి వాటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది .చెకోవ్ ప్రభావం అమెరికా రచయిత హెమింగ్ వే మీద బాగా ఉంది .చెకోవ్ కద ’’ది లేడీ విత్ ది డాగ్ ‘’చాలా గొప్పకద అని హెమింగ్వే అభిప్రాయ పడ్డాడు .వర్జీనియా ఉల్ఫ్ కు ‘’ది కామన్ రీడర్ ‘’కద బాగా నచ్చింది .

‘’Chekhov is comic in avery special paradoxical way .His plays depend as comedy does on the vitality of the actors to make pleasurable what would other wise be painfully awkward –inappropriyate speeches ,missed connections ,faux pas stumbles childishnesss –but as part of deeper pathos ,the stumbles are not pratfalls but an energized graceful dissolution of purpose ‘’అని విశ్లేషించాడు ఒక ప్రొఫెసర్ .భూ ప్రపంచం మీద రెండవ గొప్ప రచయిత చెకోవ్ అన్నది యదార్ధం .జపాన్ నాటక రచయిలు షిమూజి కునో ,యోజి సకాటే ,ఐ నాగాయ్ లపై చెకోవ్ ప్రభావం ఎక్కువ .చిన్న కధకు వన్నె చిన్నెలు దిద్ది కళాకృతి గ మార్చిన మహా కదా కధన శిల్పి చెకోవ్

 

Inline image 1    Inline image 2    Inline image 3Inline image 4   s

Inline image 6

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-2

ఆ రోజుల్లో రచయితలంతా  లియో టాల్ స్టాయ్  ప్రభావం పడిన వారే .చెకోవ్ కూ ఆయనంటే అభిమనమేకాని ఆయన మార్మిక భావాలు నచ్చేవి కావు .చెకోవ్ ను రాడికల్ అని అజ్ఞాత వాదిఅనీ అనేవారు .30ఏళ్ళు వచ్చేసరికి సాహిత్యం లో చెకోవ్ లబ్ధ ప్రతిష్టుడైనాడు. మిత్రుడు సవోరిన్ మెడికల్ ప్రాక్టీస్ కు రాం రాం చెప్పమన్నాడు .అప్పటికే ఆరోగ్యం క్షీణించటం మొదవటం తో రెండు వాహికలూ ఉండాలనే అన్నాడు చెకోవ్ .తల్లీ ,తమ్ముల సంరక్షణ తో అతని శక్తి నీరుగారి పోయింది .అదే సమయం లో లిడియా అవేలోవా తో పరిచయం కొంత ఆశా జనకం గా ఉన్నా ఆమెకు అప్పటికే పెళ్లి అయి గర్భ వతిగా ఉండటం తో నిస్పృహకు లోనయ్యాడు .వీటి నుండి కొంత విశ్రాంతి పొందటానికి దూరం గా ఉన్న సఖాలిన్ ఐలాండ్ కు వెళ్ళాడు .మూడు నెలలు ఉండి ఖైదీలతో తన అనుభవాలను రాశాడు .’’భగవంతుని భూమి అందమైనది .అయితే అందులో అందంగా లేనినిది మనం మాత్రమే ‘’అని ముగించాడు .

ఒత్తిడి, వేదనలతో రాయాలన్న ఉత్సాహం జావ గారి పోతోంది .అతని ‘’సి గల్’’కధలోని త్రిగారిన్ మదనే చెకోవ్ మధనం .’’పగలూ రాత్రి రాయటమే రాయటం అయి పోయింది నా జీవితం .రాయి రాయి రాయి అనే ఒత్తిడే ఎక్కువైంది .ఒక పుస్తకం పూర్తీ చేశానని తెలియగానే మరోటి రాయమని పుమాయింపు .ఇలా నిరంతరం రచనా వ్యాసంగం లోనే ఉండిపోయాను .ఓపిక నశి౦ చేదాకా రాస్తూనే ఉన్నా .దీని నుంచి తప్పించుకో లేనిస్థితి నాది .నన్ను రెచ్చ గొట్టి రాయిస్తున్నారు తప్పులు రాస్తున్నాని తెలుసు. కాని గత్యంతరం లేదు .దీనితో అసంతృప్తి .అధైర్యం .చదివిన ప్రతిదాన్నీ అబ్బో అదర గొట్టాడు చి౦ పేశాడు నరికేశాడు దున్నేశాడు విజ్రు౦ భించాడని  రాం డోళ్ళ మోత .ఇలా అంటూనే టాల్ స్టాయ్రాసినంత  బాగాలేవు అని సన్నాయి నొక్కులు .నేనూ మనిషినే. బాధ్యత గల పౌరరుడినే . వాళ్ళ కస్టాలు కన్నీళ్లు చూసి ఓదార్చార్చాల్సినవాడినే .వారి ప్రతినిధి గా ఉండాల్సిన వాడినే .వారి భవిష్యత్తు ,శాస్త్రీయ అవగాహన ద్రుక్పదాలకు ఆసరాగా ఉండాలి .అందుకే అన్ని విషయాలపై రాశాను అన్ని వైపుల్నించి విమర్శలను ఎదుర్కొన్నాను .’’అని రాసుకొన్నాడు .

అప్పుడప్పుడు చిన్న చిన్న స్ట్రోక్స్ వస్తున్నా రచనలనేమీ ఆపలేదు రాస్తూనే ఉన్నాడు .నిర్లఖ్యం చేశాడు .సన్నిహితులతో తప్ప మిగిలిన వారెవ్వరి తోనూ కలిసే వాడుకాదు .’’తెలియని వారి సమక్షం లోకంటే ఆత్మీయుల దగ్గర చావటం మేలు ‘’అనేవాడు .మొదటినాటకం విజయం పొందిన తర్వాత రెండవది ‘’ది వుడ్ డెమన్’’రాశాడు .ఇది తన్నింది .నిరాశపడకుండా మూడోది ‘’ది సీ గల్’’రాశాడు .మిత్రులకు దీన్ని చదివి వినిపిస్తే పెదవి విరిచారు .నాటకం ఆడితే హాల్లో పిల్లి ,నక్క కూతలు అరుపులు ఆగం .మిత్రుల సలహాతో  సి గల్ ను  అయిష్టం గానే   కొంతమార్చి’’మాస్కో ఆర్ట్ దియేటర్ ‘’లో స్టానిస్ లేవిస్కి నిర్వహణలో ప్రదర్శిస్తే సూపర్ డూపర్ విజయం సాధించింది .ఇది అనూహ్య విజయం ,అత్యంత విశేష విజయం .

నిరాశా ,నిస్పృహలతో  ,బతికే ధైర్యం లేని బడుగు జీవులకు చెకోవ్ నాటకాలు మానసికానందాన్నిచ్చేవి .విధానాన్ని మరల్చాడు చెకోవ్ .జీవిత సత్యాలను ,అంతర్భాగమైన హాస్యాన్ని మేళ వించి విజయం సాధించాడు .బడుగు ప్రజలు సామాన్యులతో దూరంగా ఉండటాన్ని ఎద్దేవా చేసి చైతన్య వంతుల్ని చేశాడు .’’the artist should be not the judge of his characters  ,but only an un biased witness ‘’అంటాడు.  ఇవాళ ఆంధ్ర జ్యోతి ,వాళ్ళ చానల్ ’’ఉయ్ రిపోర్ట్  యు డిసైడ్ ‘’ అని చెప్పినట్లు  ఆనాడే చేకోవ్ ‘’నా పని సంఘటనలు సన్ని వేశాలని రిపోర్ట్ చేయటమే .అందులో పాత్రల స్వభావాలను కాంతి వంతం చేయటానికి అవసరమైనవీ అనవరమైనవీ ఉంటాయి .వీటిని నిగ్గు తేల్చి నిర్ణయింఛి తీర్పు చెప్పాల్సిన  వారు పాఠకులు మాత్రమె’’అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81

36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్

హాస్యం అంటే మొదటినుంచి అమితాసక్తికలిగి ,లెక్కలేనన్ని  హాస్య కధలు రాసిన రష్యన్ రచయిత అంటోన్ పాల్వోవిచ్ చెకోవ్ ను ఇవాళ ప్రపంచం అంతా ఆయన కొత్త సాహిత్య సృష్టికర్త గా ,మనిషి సంతోషరహిత ఏకాంతాన్ని ఆవిష్కరించిన వాడిగా ,సమ కాలీనులను అర్ధం చేసుకోలేక పోయిన వాడిగాభావిస్తున్నారు .

16-1-1860లో రష్యాలో సి ఆఫ్ అజోవ్ పై ఉన్న టాగన్ రాగ్ పట్నం  లో చెకోవ్ జన్మించాడు .వీళ్ళ పూర్వీకులు ప్లేబియన్ లకంటే తక్కువ స్థాయి వారు .తాత ఒక బానిస .అయినా డబ్బు సంపాదించి తెలివి తేటలతో స్వేచ్చ కొనుక్కొని బానిసత్వం నుండి విముక్తి చెందాడు .తండ్రి పావెల్ డబ్బు లేని దుకాణాదారుడు  .గర్వం ,సంకుచిత స్వభావంగల  ,క్రూరుడైన తండ్రి .తల్లి వస్త్ర వ్యాపారి కూతురు .ఆరుగురు సంతానం లో చెకోవ్ మూడో కొడుకు  .గృహ జీవితం సంతోషకరం గా లేదు .చిన్నతనం అంతా అణచివేత దౌష్ట్యం కింద నలిగిపోయిందని జ్వరం లాగా అవి పీల్చి పిప్పి చేశాయని  చెకోవ్ వాపోయాడు .మత వ్యవహారలలోపిల్లలు ఏమాత్రం అతిక్రమించినా తండ్రి సహి౦చేవాడుకాడు .కఠిన దండన కు గురి చేసేవాడు . ఇరవై తొమ్మిదవ ఏట చెకోవ్ తన బాల్యం గురించి రాస్తూ ‘’దయ అనేది నాకు చాలా దూరమైన విషయంగా ఉండేది .ఎవరైనా దయ చూపిస్తే ఏంతో కొత్తగా  పరమ సంతోషంగా ఉండేది .అందుకే ఇతరులపై దయ చూపాలనే సంకల్పం నాకు స్థిరంగా కలిగింది .కాని ఎలా దాన్ని చూపాలో తెలియటం లేదు ‘’అన్నాడు .

యవ్వనం లోకి రాకుండానే అన్నలు అలేక్సాండర్ ,నికొలాస్ ఇద్దరూ పూటుగా తాగి ,గాంబ్లింగ్ లో మునిగి ఇల్లు వదిలి బాధ్యతలు మరచి పారిపోయారు .కుటుంబ బాధ్యత అంటోన్ పైన పడింది .8ఏళ్ళకే ఫామిలీ స్టోర్స్ లో పని చేయాల్సి వచ్చింది .కాని అతనిది తేలికగా తీసుకొనే స్వభావం ,సంతోషం తో ఉండేరకం .అందంగా ఉండటం తో అందర్నీ ఆకర్షించేవాడు ముఖ్యంగా మహిళలను .దీనితో 13వ ఏటికే ‘’ప్రేమ రహస్యాలు ‘’అన్నీ తెలిసిపోయాయి .పదహారవ ఏట ,తండ్రి వ్యాపారం దివాలాతీసి ,అప్పుల వాళ్లకు అందకుండా ఇంటి నుంచి పరారైపోయాడు .తండ్రితో బాటు కుటుంబం వెళ్లి పోయింది. చెకోవ్ ఒక్కడే అక్కడే ఉందడి కుటుంబ స్నేహితుడి ఇంట్లో ఉంటూ,తింటూ  వాళ్ళబ్బాయికి ట్యూషన్ చెబుతూ  కృతజ్ఞతగా బదులు తీర్చుకొంటూ స్కూల్ చదువు పూర్తీ చేశాడు .చదువులో పెద్దగా అభి వృద్ధి ఉండేదికాదు. తప్పాడు .అందుకని ట్రేడ్ స్కూల్ లో చేరి టైలరింగ్ నేర్చాడు .కస్టపడి ఇంకా ఎక్కువ ట్యూషన్లు చెబుతూ కొంత డబ్బు వెనకేసుకొన్నాడు .ఈ డబ్బును దాదాపు పస్తులతో బతుకుతున్న తన కుటుంబానికి పంపేవాడు .17వ ఏట తీవ్రంగా జబ్బుపడ్డాడు .అప్పటినుంచి మెడిసిన్ చదివి  డాక్టర్ కావాలనుకొన్నాడు .చెణుకులు ,హాస్య గుళికలు ,జోకులు రాసి మాస్కో లో కామిక్ ప్రెస్ లో పని చేస్తున్నన్న  అన్న అలేక్సాండర్ కు  పంపేవాడు.అందులో కొన్ని ప్రచురితమై మరిన్ని రూబుళ్ళు చేతిలో పడేవి .

19వ ఏట పరీక్ష పాసై మెడికల్ స్కూల్ లో చేరటానికి స్కాలర్ షిప్ పొందాడు .పుట్టిన ఊరి నుంచి మరో ఇద్దరు విద్యార్ధుల్ని తన వారితో ఉండమని చెప్పి మాస్కో వెళ్ళాడు .అందరూ చేరటం తో ఇల్లు ఇరుకై మురికివాడలో ఒక ఫ్లాట్ లోకి మారాల్సి వచ్చింది .బతకటానికి పోరాటమే చెయ్యాల్సి వచ్చేది .చిన్న తమ్ముడు మైకేల్ చాలా డామినేంట్ గా ఉండేవాడని చెకోవ్ అన్నాడు .అతనికి డబ్బు సంపాదించటం జాగ్రత్తగా ఖర్చు చేయటం తెలుసు .కుటుంబానికి నైతిక బలం అతనే .మెడిసిన్ లో చేరి చదువుతూ ,తేలికపాటి హాస్య రచనలు చేస్తూ ఉండేవాడు  .21వ ఏట మొదటిసారిగా అమ్మి ,తర్వాత వాటికేమీ సాహిత్య విలువలు లేవని  గ్రహించి వాటిపై ‘’ఆంతోష్ చేకాంటే ‘’’అనే కలం పేరు తో సంతకం పెట్టాడు .

క్రమంగా రచనలో పుష్టి ,పక్వత చోటు చేసుకొన్నాయి .ప్లాట్ కంటే ప్రొటెస్ట్ డామినేట్ చేసేవి .కాని నాన్ స్టాప్ గా రాస్తూనే ఉండేవాడు .27 ఏళ్ళకే 600 చిన్న కధలు రాసిన చేయి తిరిగిన కధకుదయ్యాడు .అప్పటికి ఆరడుగుల అందగాడు .కాని ఇరవై వ ఏట క్షయ వ్యాధి సోకింది.లక్షణాలను బట్టి గ్రహించాడుకాని కుటుంబం వారికి చెప్పకుండా రహస్యం గా ఉంచాడు .దీని నివారణకు చాలా ఖరీదైన మందులు చాలాకాలం వాడాలి .కనుక అది తన మేడిసన్ చదువుకు ,రచనకు అడ్డంకి అవుతుందని దాచుకొన్నాడు .

మెడిసిన్ పాసై 24వ ఏట ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు .పరిస్తితులకు అనుకూలం గా ఉంటూ,సైన్స్ ఆర్ట్   లకు ప్రాధ్యాన్యతనిస్తూ ,జీవితం లో హాస్యానికి సముచిత ప్రాధాన్యమిస్తూ గడిపాడు సాహిత్యాన్ని ,డాక్టరీ ని సమంగా ఆదరించాడు ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే వైద్య పరిభాషలోనే చమత్కారంగా ‘’వైద్యం నా లీగల్ వైఫ్ అని ,సాహిత్యం నా మిస్ట్రెస్-ఒకామేతో విసుగొస్తే రాత్రి అంతా రెండవ ఆమెతో హాయిగా గడిపేస్తా ‘’అనేవాడు .   ఇది మర్యాదకాడుకదా అని ఒక పబ్లిషర్ అంటే ‘’తప్పదు .అది బోర్డం నుంచి తప్పిస్తుంది .నేను ఒకసారి ఒకరితో ఉండటం వల్ల,ఆ ఇద్దరిలో ఏ  ఒక్కరికి అసౌకర్యం ,నష్టం లేదు  నేను వారికి అవిశ్వాసం గా ఉన్నాను అనటానికి అవకాశమే లేదు ‘’అనేవాడు .

చెకోవ్ కంటే పాతికేళ్ళ సీనియర్ సవోరిన్ చెకోవ్ కు మిత్రుడు ఫిలాసఫర్ ,మార్గ దర్శి అయ్యాడు .అతని ప్రభావం తో చెకోవ్ రచనా శైలి మారింది .26ఏళ్ళకే చెకోవ్ తన మొదటి కదా సంపుటిని ప్రచురించాడు. ప్రేక్షకులంటే ఏమిటో అర్ధమైంది .ఒక ఆర్టిస్ట్ గా చెకోవ్ బాధ్యత ఏమిటో ఎరుక పరచాడు సవోరిన్ .రష్యన్ సంప్రదాయం లో ఒక నవల పాఠకులను ,జనన వంతుల్ని  చేయటం కంటే వినోద పరచటం   కోసం  రాద్దామనుకొన్నాడు .కాని అందులో చరిత్ర ,ఫిలాసఫీ ,సోషియాలజీ కలపాల్సి వస్తుందని అది అంతగా ఆకర్షణీయం కాదని భావించి వెనక్కి తగ్గాడు .దీనికి బదులు ‘’ఇవానోవ్ ‘’అనే నాటకం రాశాడు .ఇది బాగా క్లిక్ అయి ‘’పుష్కిన్ ప్రైజ్ ‘’కొట్టేశాడు ఇరవైలలోనే .ఇది అతి చిన్న వయసులో ఆ యువ రచయితకు దక్కిన అరుదైన గౌరవం అయింది .దీనితో ఆత్మ స్తైర్యం ఏర్పడి రాబోయే కాలం లో తానొక ప్రముఖ రచయితను అవుతానని సాహిత్యం లో తనకొక ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని  గొప్ప ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఈ విషయం లో ఆయన ‘’చేకాంటే చాలా రాశాడు కాని చెకోవ్ దాన్ని అంగీకరించతానికి ఇబ్బంది పడుతున్నాడు ‘’అన్నాడు నిస్పృహగా

.Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కదివేడుపాలలో రెండు ఉప్పు రాళ్ళు,ఆనందం ఎక్కడో లేదు రవి శంకర్

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండుటాకుల ఘోష ,మానవతా వాది మల్లయ్య శాస్త్రి

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మీరు మేధావులా వెర్రి గొర్రెలా ?ఏం వి ఆర్ శాస్త్రి ప్రశ్న,జనం ఆమోదమే పాలకుల కొలమానం

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిక్కనవుతున్న నిరసన ,మహాత్ముడు ,మండేలా క్రికెట్ –

Inline image 1


Inline image 2
.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“విశ్వనాదామృతం” ధారావాహిక

ఈటీవీలో 
 
“విశ్వనాదామృతం” ధారావాహిక 
 
“కళా తపస్వి” సినీ జీవిత ఆవిష్కరణ –
 
కె. విశ్వనాథ్ గారి సినిమాల తెర వెనుక వింతలూ, విశేషాలు 
 
(ఆయన మాటలలోనే)
 

 నవంబర్ 1, 2015 నుంచి ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30 PM ఇండియా లోనూ, అమెరికాలోనూ (USA EST)

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టుగానే మా హ్యూస్టన్ లోనూ అనేక మంది “విశ్వనాథాభిమానులు” ఉన్నారు. అసమానమైన గొప్ప కళాత్మక దృష్టి తో అనేక విజయవంతమైన చిత్రాల దిగ్దర్శకులు విశ్వనాథ్ గారి ఆయా సినిమాల నేపధ్యం గురించి మా అందరికీ ఉన్న కుతూహలాన్ని ఒక ఆత్మీయమైన చారిత్రక దృక్పథంతో పదిలపరిచే ప్రయత్నం చెయ్యాలని “విశ్వనాధ వీరాభిమాని” చెరువు రామ్మోహన్ కి సుమారు ఏడాది క్రితం వచ్చిన ఒక మంచి ఆలోచన రాగానే మా అందరితోటీ పంచుకున్నాడు. ఆ సమాలోచనలన్నీ కార్యరూపం దాల్చి రూపొందించబడినదే ఈ నవంబర్ నుంచి 1, 2015 నుంచి 13 వారాల పాటు మీరు చూడబోయే “విశ్వనాదామృతం” టెలివిజన్ సీరియల్ —ఈటీవీ లో.

ఈ అపురూప ప్రసారం అటు ఇండియా లోనూ, ఇటు అమెరికా లోనూ (EST) మధ్యాహ్నం 1:30 PM కి జరుగుతుంది.

ఉత్తమ అభిరుచులతో టెలివిజన్ కార్యక్రమాలు, చిన్న సినిమాల నిర్మాణానికి మా మిత్ర బృందం చేత హ్యూస్టన్ లో నెలకొల్పబడ్డ “శృతిలయలు” అనే లాభా పేక్ష లేని సంస్థ తొలి ప్రయత్నమే ఈ “విశ్వనాదామృతం”. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో వీక్షించి, ఆనందించి మా సంస్థ విజయానికి తోడ్పడమని మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం.

ఒక అసాధారణ దర్శకుడి చలన చిత్ర జీవిత సందర్శనం……ఆయా చిత్రాల నిర్మాణంలో ఆయన సృజనాత్మక శక్తి కి అక్షర దానం, గాత్ర దానం, నటనా కౌశలం, సాంకేతిక పరిజ్జానం, ఆయన చిత్ర నిర్మాతలుగా ఆర్ధిక పరిపుష్టినీ అందించిన హేమా హేమీలు ఆత్మీయంగా వెలువరించిన అభిప్రాయాలతో….అందరికన్నా ముఖ్యంగా విశ్వనాథ్ గారే స్వయంగా ఇప్పటి దాకా ఎవరికీ తెలియని విశేషాలని మనతో పంచుకున్న ఒక అపురూపమైన ప్రయత్నం..ఒక ధారావాహికలా బుల్లి తెర మీద చలన చిత్ర చరిత్రని పదిలపరిచే ఈ ధారావాహికకి ఏంకర్ సుప్రసిద్ధ గాయకుడు నేమాని పార్థు. విశ్వనాథ్ గారితో సినీ ప్రస్థానం సాగించిన “సిరివెన్నెల సీతారామ శాస్త్రి”, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కమల్ హసన్, జయ ప్రద, వెంకటేష్, చిరంజీవి, మొదలైన నిష్ణాతులు ప్రధాన వ్యాఖ్యాతలు కాగా అక్కినేని, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు విశ్వనాథ గారి ప్రతిభా విశేషాలని విశ్లేశిస్తారు.

తెలుగు సినిమా కి దేవుడిచ్చిన వరంగా అందరూ భావించే “కళా తపస్వి” శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారి “రీల్” లైఫ్ ….అనగా ఆయన తీసిన ప్రతీ సినిమా తాలూకు, నేపధ్యం, ఆ కథ రూపుదిద్దుకున్న తీరుతెన్నులు, పాత్రల ఎంపికలో, సాహిత్యం విలువలు ఉన్న పాటల రచనలలో, అత్యున్నతమైన సంగీతం సమకూర్చడం లో, ఆసక్తికరమైన చిత్రీకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు మొదలైన విశేషాలతో ఆయన చలన చిత్ర జీవితాన్ని చరిత్రలో శాశ్వతంగా తెర మీద నిక్షేపించిన ఈ “విశ్వనాదామృతం” కార్యక్రమాన్ని కనుల పండుగ గా, వీనుల విందుగా ఆస్వాదించండి. ఈ ధారావాహికలో “ఓ సీత కథ, సిరివెన్నెల, సాగర సంగమం, శంకరా భరణం, శుభలేఖ, స్వాతి కిరణం, స్వరాభిషేకం, స్వర్ణ కమలం, శృతిలయలు మొదలైన విశ్వనాథ్ సినిమాలన్నింటి తెర వెనుక కథలు, పాటలు ఆసక్తికరంగా ఆవిష్కరించబడ్డాయి.

లాభా పేక్ష లేని ఈ “విశ్వనాదామృతం” టెలివిజన్ దారావాహికకి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ధారావాహిక సంక్షిప్త విశేషాలు ఇందుతో జత పరిచిన ఆంగ్ల ప్రకటన లో చూడండి.

ధన్యవాదాలతో

వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ఫోన్: 832 594 9054

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అట్లతద్ది కి కృత్తి వెన్నుఒల్లంగి దిబ్బలో లో కొత్తరకం ఉయ్యాల

uyyala 001అట్లతద్ది కి కృత్తి వెన్నుఒల్లంగి దిబ్బలో లో కొత్తరకం ఉయ్యాల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56

గూరూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

గూరూరు మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే కాని దాని లోని లోతులుపాతులు తెలిసి వ్యాపారం చేస్తే కలిసొస్తుంది .లేక పొతే నష్టాల్లో ఆ గని లోతుల్లోకి కూరుకు పోతారు .దీనికెంతో లౌక్యం చాకచక్యం ,ధీమా, వ్యవహార దక్షత,అవతలి వాడిని ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం ఉండాలి ,.దీనికి తోడూ అదృష్టమూ కలిసి రావాలి  .మైకా పైకి కనిపించే తళతళలతో ఊరించి బుట్టలో వేసు కొంటుంది. దిగితెనేకాని లోతు తెలియదుకదా .తెలీకుండా దిగితే ,అంచులు పట్టుకొనే తెలివి తేటలు లేకపోతె పెట్టిన సొమ్మంతా గనిపాలే .మిగిలేది అప్పులూ, తిప్పలే    .ఈ రెండవ రకానికి చెందినా వాళ్ళే మా ఉయ్యూరు లోని వేగారాజు వారు .పూర్తిగా మునిగిపోయారు .ఇప్పటిదాకా  ఉయ్యూరు వారు మైకా వ్యాపారం చేశారని నాకు తెలీదు  మా ఉయ్యూరు వాడు ,హైస్కూల్ లో నాశిష్యుడు ,కే సి పిలో పని చేసి రిటైరై  బెంగుళూర్ లో స్థిర డ్డవాడు  ,ఏ దేశం లో ఉన్నా సరసభారతి ని చదివి స్పంది౦ చేవాడూ ,వేగరాజు రాజేంద్ర ప్రసాద్ ,ఏదో పని మీద ఉయ్యూరు వచ్చి నాలుగు రోజుల క్రితం మా ఇంటికొచ్చి మాటల సందర్భంగా తమ తాతగారు స్వర్గీయ వేగ రాజు వెంకట సుబ్బయ్య గారు గూడూరు మైకా గనుల వ్యాపారం చేశారని ,అందులో నష్టపోయారని సవివరంగా తెలిపాడు .నేను రాసేదంతా ఆతను నాకు చెప్పిన విషయాలే .

          శ్రీ వేగరాజు వెంకట సుబ్బయ్య గారిల్లు ఉయ్యూరు లో విష్ణాలయం వెనక బజారులో ఉంది .ఆయన్ను నా చిన్నప్పుడు చూశాను .అప్పటికే బాగా ముసలివారు .వాకిట్లోదిగాలుగా  కూర్చుని ఉండేవారు.ఆయన భార్య సుందరమ్మగారినీ చూశానని గుర్తు . మేము విష్ణాలయానికి మా ఇంటి నుంచి ఈ వెనక దారిలోనే వెళ్ళేవాళ్ళం .ఇప్పటికీ అలానే వెడతాం.అప్పటికి ఆయన గురించి నాకేమీ పెద్దగా తెలియదు .కాని అయన తమ్ముడు వేగ రాజు సీతారామయ్య గారు ఇంకా వయసులోనే ఉన్నారు .బాగా స్థితిపరులని పేరు పొందారు .ఈయన ఇల్లు గుండు పద్మావతమ్మ గారింటికి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్క ఎత్తైన స్థలం లో ఉండేది .సంతానం లేదు .అన్నగారి పిల్లలే వారింట్లో పిల్లలు .సీతారామయ్యగారు వేగ రాజు వారికే దత్తత వెళ్లారట .అందుకే ఆస్తి బాగా కలిసివచ్చిందట .వీరి ద్దరి మధ్య వెంకటేశ్వర రావు గారు౦౦ డేవారట .ఈయన్ను నేను చూసిన గుర్తు లేదు .ముగ్గురికి పిత్రార్జితమైన ఇల్లు ,పొలాలు ,స్థలాలు బాగానే ఉండేవట .వీరి పొలాలు తోటల వల్లూరు రోడ్డుకు ,పుల్లేరుకాలువకు ఎదుటి వైపు రోడ్డును ఆనుకొని ఉండేవట .ఉయ్యూరులో వేగరాజు వారి కటు౦ బానికి మంచి పలుకు బడి ఉండేదట .ఇక్కడి ఆస్తి అజమాయిషీ వెంకటేశ్వరరావు గారు చేసేవారట .

            ఈ అన్నదమ్ములలో పెద్ద వారైన వెంకట సుబ్బయ్యగారు గూడూరు వెళ్లి  మైకా గనులకొనుబడి , అమ్మకం  సుమారుగా 1940నుండే చేసేవారట .కొంతకాలం బాగా కలిసోచ్చిందట .విధి వైపరీత్యం వలన వీరి  గనులు కొన్ని కూలిపోయాయి .వ్యాపారం మొత్తం దివాలా తీసిందట .పది వేల రూపాయల అప్పులలో కూరుకు పోయారట .దిగాలుపడి గూడూరు నుంచి ఉయ్యూరు వచ్చేశారు .ఆ అప్పులు తీరిస్తేకాని ఆయన తల ఎత్తుకొలేని స్తితి .అప్పుడు తమ్ముడు వెంకటేశ్వర రావు గారు అన్నగారి పేర ఉన్న స్థలాలు ,పొలాలు   అయినకాడికి అమ్మేసి ,ఆ పది వేలు తీర్చేసి ,తానూ బొక్కాల్సింది బొక్కేసి రాజమండ్రి వెళ్లిపోయారట .ఊళ్ళో కరణం సీతం రాజు సాంబశివ రావు గారు ఈ వెంకటేశ్వర రావు గారికి బాగా వత్తాసు పలికి వెయ్యి రూపాయలు కిమ్మతు ఉన్నదాన్ని వందరూపాయలే వాల్యూ గాచూపించి సుబ్బయ్య గారిని ఈ ఇద్దరూ నిలువునా ముంచారని రాజేంద్ర ప్రసాద్ మొన్న ;లబో దిబో మన్నాడు. ఆతను చెప్పేదాకా నాకు అసలే విషయమూ తెలియనే తెలియదు .ఇలా ఉయ్యూరు వేగ రాజు వారి గూడూరు మైకా గనుల వ్యాపారం ముగిసిన అధ్యాయమే అయింది .కాని అదృష్టం బాగుండి ఆయన అల్లుడు మైకాలో పిచ్చ పిచ్చగా  సంపాదించాడట .ఆ కద తెలుసుకొందాం .ఎవరి అదృష్టం ఎలాంటిదో ?

        సుబ్బయ్యగారు సుందరమ్మగార్లకు శ్రీ వెంకట నాగేశ్వర రావు ,శ్రీ సాంబ శివరావు ,శ్రీ గోపాలకృష్ణ మూర్తి ,శ్రీ విశ్వేశ్వర రావు ,శ్రీ సూర్య నారాయణ ,శ్రీ విజయ రామారావు  అనే 6గురు కుమారులు .ఒక్కతే శ్రీమతి దుర్గాంబ ఆడపిల్ల .ఇందులో విస్సు ,సూరి మాకు సీనియర్లు .విజయ రామారావు నాకు హైస్కూల్   లో క్లాస్ మేట్.

   దుర్గాంబ గారిని కడప జిల్లా రాజం పేట కు చెందిన శ్రీ గోటేటి వెంకటేశ్వర రావు గారికిచ్చి వివాహం చేశారు .అప్పటికే ఆయన మైకా గనుల యజమాని. దుర్గాంబ గారి పాణి గ్రహణం తో ఆయనకు అంతా బాగా కలిసొచ్చింది. మైకా సామ్రాజ్యాధిపతి అయి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి వ్యాపారం ఎలా చేయాలో నిరూపించి మామగారికి ఊరట కలిపించాడు మామగారిది ‘’బాపన వ్యవసాయం ‘’లా వ్యాపారం ఉంటె అల్లుడుగారు ‘’వైశ్య దృక్పధం ‘’తో గొప్ప సంపాదనా పరులయ్యారు .ఎదురులేని వ్యాపారి అనిపించారు రాజేంద్ర చెప్పిన దాన్ని బట్టి ఇప్పటకీ గోటేటి వారికి 14లారీలు ,జీపులు కార్లూ ఎన్నో ఉన్నాయి .

            సుబ్బయ్య గారి సంతానం లో శ్రీ సాంబశివరావు గారు ఉయ్యూరు కెసీపి లో ఉద్యోగం చేశారు .మంచి పలుకుబడి సంపాదించారు .అందరికి తలలో నాలుకగా ఉండేవారు .ఏడాది క్రితమే సుమారు 90ఏళ్ళు జీవించి చనిపోయారు .ఆయన భార్య చనిపోయి సుమారు 40ఏళ్ళు అవుతుంది .వీరికుమారులు –శ్రీ సురేష్ బాబు  ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ ,,బాబ్జీ అనే శ్రీ శంకర్ .ఇతను అకస్మాత్తుగా తండ్రి మరణానంతరం పదినెలల క్రితం చనిపోయాడు .బాబ్జీ ఐ టి ఐ ఇంస్ట్రక్తర్ గా పని చేసి రిటైర్ అయి ఉయ్యూరు చేరి ‘’వేగ రాజు మాన్షన్ ‘’అనే అపార్ట్ మెంట్ సముదాయం నిర్మించి తాతగారి పేరు నిలబెట్టాడు .సురేష్ ,రాజేంద్ర ,బాబ్జీ లు హైస్కూల్ లో నా శిష్యులే .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం లో క్రియా శీలక పాత్ర వహించిన వారే .క్రిందటి కార్తీకమాసం లో కొత్తగా  ఏర్పడిన బ్రాహ్మణ సంఘం లో బాబ్జీ కీలల పాత్ర పోషించాడు .పేదబ్రాహ్మణ విద్యార్ధులకు తండ్రి సాంబశివరావు గారి పేర పది వేల రూపాయల స్కాలర్ షిప్ లను అందజేసిన వదాన్యుడు .సా౦బశివరావుగారి కి ఇద్దరమ్మాయిలు శ్రీమతి బేబి జ్యోతి ,శ్రీమతి రాణీ సుజాత .ఇందులో జ్యోతి హైస్కూల్ లో నా శిష్యురాలే .

   ఉయ్యూరు వీరమ్మ తల్లికి ,వేగ రాజు వారి కుటుంబానికి సాన్నిహితం ఉంది. మాఘ మాసం లో శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరేటప్పుడు ముందుగా వేగ రాజు వారింటికి వచ్చిచీ, సారే, హారతి తీసుకొన్న తరువాతనే బయాల్దేరుతుంది అని ,వీరమ్మ తిరునాళ్ళు  11వ రోజు జరిగే  సిడి బండీ ఉత్సవం  రోజున  తాటి మాను సిడిబండీకి మొదట వేగరాజువారే గుమ్మడికాయ కట్టి  కొబ్బరికాయ కొట్టి ,హారతిస్తారని ఆ తర్వాతే మిగిలిన వారు చేస్తారని అప్పుడే సిదిబండీ బయాల్దేరుతుందని ,ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తోందని  రాజేంద్ర చెప్పాడు .

             మరో విషయం తో కలుద్దాం

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-15-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికా తెలుగు వారికి అండగా శైలజ -జ్యోతి గౌరీ మహాత్మ్యం కంచె ,రాజు గారిగది సినీ సమీక్ష –

Inline image 1
 
Inline image 2
Inline image 3

 
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాలూ దశ తిరిగేనా ?సర్దేశాయ్ దీపశిఖ కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలూ

 

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అయి పోయిన సచిన్ ఆటతో ఇప్పుడు ఆడుకుంటున్న కపిల్

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒక్క సంతకం తో సహారా పరివారాన్ని సహారా ఎడారిలో పడేసిన కె సి ఆర్.

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముషారఫ్ నోట నిజాలు మరియు కొత్తా దేవుడండీ

Inline image 1
Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేపుఅట్ల తద్ది -వరాలిచ్చే వాయన పండుగ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోణార్క అందాలు -ఆంధ్ర జ్యోతిమరియు ముదిరిపోతున్న సెక్యులర్ పిచ్చిభూమి

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80

 

  1. వ్యావహారిక సత్తా వాద వేదాంతాన్ని ప్రచారం చేసిన అమెరికన్  సంస్కర్త – జాన్ డ్యూయి

అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రైతు, నిర్భయ ఉదారవాది, ప్రాగ్మాటిజం ప్రచారకుడు విద్యా సాంఘిక సంస్కర్త ,ఫిలాసఫర్ జాన్ డ్యూయి అమెరికా రాజకీయాలను, సంస్కృతిని ఆధునిక విద్యనూ ప్రభావితం చేసిన ఆలోచనాపరుడు. అమెరికా ప్రజలు ఆయనను ప్రగతిశీల విద్య విధాన స్థాపకుడు అంటారు. డార్విన్ కు విలియం జేమ్స్ కు అనుచరుడు. విధానాలను స్పష్టపరచడమే కాక   వ్యాప్తికి ధర్మయుద్ద్ధం చేసినవాడు. డార్విన్ లాగానే జ్ఞానం ముందే ఏర్పడిన భావాల పై ఆధారపడి ఉండదని, జీవాత్మక యదార్దాలపై ఆధారపడి ఉంటుందని అన్నాడు. విలియం జేమ్స్ వలెనే  నిరంకుశాధికారం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వ్యావహారిక సత్తా వాదం (ప్రాగ్మాటిజం ) ను బలపరచాడు. వ్యవహారంలో ఉన్నవాటిని ప్రశ్నించలేదు. ఆలోచన, పదార్ధం రెండూ కూడా ఒక చలనశీల విధానం అని, తర్కం అనేది వృద్ధి చెందుతున్న ఒక విధానమని తత్వ శాస్త్రం ,వాస్తవ విషయ జనిత సంగ్రహాల సమాహారం కాదని, దానికి ఒక సాంఘిక పునాది ఉంటుందని కనుక అది సాంఘిక శక్తిగా భావించాలని అన్నాడు.

 

జాన్ డ్యూయి    అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో బర్లింగటన్ పట్టణంలో 20-10-1859లో జన్మించాడు. అదే సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ‘’ ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్’ ప్రచురించటం ఒక  యాదృచ్చిక సంఘటన. నాలుగు రోజుల తర్వాత జాన్ బ్రౌన్ హార్పర్స్ ఫెర్రీ పై దాడి చేసాడు. క్రీ.శ. 16౦౦ నుండి ఇతని కుటుంబం అమెరికాలోనే ఉంది. తండ్రి ఒక కిరాణా షాపు నిర్వహించేవాడు. తల్లి ఒక వేర్మార్మర్ కుమార్తె. ఆమె పూర్వీకులు కేప్ గాడ్ రైతులు. చిన్నతనం నుంచి పుస్తకాలలో కూరుకుపోఎవాడు. పుస్తకాలతోనే  అతని ఆట. 20 ఏళ్ళు రాక ముందే వెర్మాంట్ యూనివర్సిటీ నుండి పట్ట భద్రుడయ్యాడు. వెంటనే పాఠాలు బోధించాడు. పెన్సిల్వేనియాలోని ఆయిల్ సిటీ లో మొదట ఉద్యోగంలో చేరి తర్వాత తన సొంత రాష్ట్రంలో అక్కడి గ్రామీణ స్కూళ్ళలో బోధన చేసాడు. కొన్నేళ్ళ తర్వాత తత్వ శాస్త్రాన్ని ముఖ్య విషయంగా ఎంచుకుని జాన్స్ హాప్కిన్స్ లో చేరి 25 ఏళ్లకే డాక్టరేట్ పొందాడు. తన విద్యార్థిని అయిన యాలిస్ చిప్మన్ ను పెళ్లి చేసుకున్నాడు. మిచిగాన్ యూనివర్సిటీ లో  ఇన్ స్టక్ట ర్ గా చేరి 1888 లో మిన్నెసోటా యూనివర్సిటీలో తత్వ శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు. 35 వ ఏట చికాగో యూనివర్సిటీలో  తత్వ శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు.  రెండేళ్ళ తర్వాత దాని’’ లాబరేటరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు. అది  ప్రయోగాత్మక విద్యా విధానం కోసం ఏర్పడిన స్కూల్. నిజాలు, గణాంకాలు ఆలోచనలు పిల్లలపై వారికి ఆసక్తి కలిగేవరకు బలవంతంగా రుద్దరాదని అనే ఆశయంతో ఈ స్కూల్ నడుస్తోంది. జాన్డ్యూయి   పిల్లవాడి వర్తమాన అనుభవాన్ని సుసంపన్నం చేయాలని  స్పష్టంగా తెలియని భవిష్యత్తు కోసం వారిని ఇబ్బంది పెట్టరాదని భావించాడు. అతని ఆశయం’’ పని చేస్తూ నేర్వడం’’ (లెర్నింగ్ బై డూయింగ్). భవిష్యత్తుకోసం విద్య బోధించడం కాక ఇప్పటి జీవితాన్ని అర్థవంతం చేసేట్లుగా విద్య ఉండాలని చెప్పేవాడు. దీనిపై అప్పుడు వాదోపవాదాలు ఉండేవి.  “The new spirit in education forms the habit of requiring that every act be an outlet of the whole self” అనేది అతని వాదం. సనాతన భావాలకు విరుద్ధంగా ఆయన చెప్పేవాడు. తన భావాలను ఆయన మొదటి గ్రంథం’’ ది స్కూల్ అండ్ సొసైటీ’’లో విస్పష్టంగా వివరించాడు. ఆయన 40 వ ఏట ఇది ప్రచురించబడింది.

 

45 వ ఏట చికాగో యూనివర్సిటీకి రాజీనామా చేసి కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేరి అక్కడే జీవితమతా చిరస్మరణీయమైన సేవలు అందించాడు. ఆయన శిష్యుడు, సహాయకుడు మాక్స్ ఈస్ట్మన్’’ సాటర్ డే రివ్యూ ఆఫ్ లిటరేచర్ ‘’లో ఆయన రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ లాగా ఉండేవాడని వర్ణించాడు. సమతలమైన జుట్టు, నల్ల మీసాలు కాంతివంతమైన కళ్ళతో తరగతి గదికి వచ్చేవాడు. ఆయన స్ఫూర్తినిచ్చే ఉపన్యాసకుడు కాదు. పాఠాలు మార్పు లేకుండా మూస విధానాలు ఉండేవి. ప్రేరణ కలిగించేవి కావు. కొలంబియా యూనివర్సిటీ తత్వ శాస్త్ర అధిపతి ఇర్విన్ ఎడ్మండ్ ఈయన బోధన మొదటిసారి విని చాలా నిరాశ చెందాడు. కానీ అయన విషయ పరిజ్ఞానం చాలా లోతైనదని ఆయన మేధా పరిణతికి ఆశ్చర్య పడ్డాడు. ఆయన చెప్పేదంతా సృజనాత్మక తత్వ శాస్త్రమే.

50 వ ఏట “How we think” పుస్తకం రాసాడు. కూతురు ఈవ్లిన్ తో కలసి ‘’స్కూల్స్ ఆఫ్ టుమారో’’రాసాడు. ‘’డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్’’ అనే ఈయన రాసిన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. 61 వ ఏట’’ రి కన్స్ట్రక్షన్ ఇన్ఫిలాసఫీ ‘’ రాసాడు. తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వారికి వెలుగు మార్గం చూపే కరదీపికగా దీనిని భావిస్తారు. పిల్లలకు వారి భావాలను బయటకు చెప్పే స్వాతంత్ర్యం ఇవ్వాలని వారి స్వేచ్చకు భంగం కలిగించరాదని చెప్పేవాడు. ఒకసారి ఈయన నర్సరీ స్కూలుకు పర్యవేక్షణకు వెళ్ళగా అక్కడ ఆయన కొడుకు ఒక పెద్ద కుర్రాడి చేత తన్నులు తింటూ నేల మీద అసహాయంగా పడివుండటం చూసాడు. అక్కడే ఉన్న ఒక ఉపాధ్యాయుడు “ఇది మా అభివృద్ధి విద్యా విధానం” అని నవ్వుతూ అన్నాడు. వెంటనే డ్యూయి ‘’ప్రపంచంలో దుర్మార్గం చాలా ఉందని దానికి తన కుమారుడు ఎదిరించటానికి   సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. ఇంకొకసారి ఆయన ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళగా క్లాసు గోలగోలగా ఉండగా ఒక కుర్రాడు పుస్తకాన్ని తదేక దీక్షగా చదువుతుండటం చూసాడు. అక్కడ ఉన్న టీచర్ ‘’అతన్ని మీరు క్షమించాలని,అతను స్కూల్ లో చేరి ఒక వారమే అయ్యింది.’’అన్నాడు అంటే   ఇతను కూడా ,వారిలాగానే  అల్లరి చేసేవాడుఅనే అర్ధం వచ్చేట్లు అన్నాడు ‘’మీ విద్యా సంస్కరణలు ఇలా ఏడ్చాయి ‘’అని దెప్పి పొడవటం అన్నమాట .. ఇలాంటి సంఘటనలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. వయస్సు పెరిగిన కొద్దీ ఆయన శక్తిసంపన్నుడు అయ్యాడు. 50-60- ఏళ్ల మధ్యలో చాలా చురుకుగ్గా ఉన్నాడు. న్యూయార్క్ నగరంలో ‘’టీచర్స్ యూనియన్ ‘’ఏర్పడడానికి కృషి చేసాడు. రాజకీయంలో ప్రవేశించాడు. ఉదారవాదులలో ప్రముఖుడయ్యాడు. “పార్టీ కంటే వ్యక్తికీ ఓటు వేయండి” అనే నినాదాన్ని ప్రచారం చేసాడు. జపాన్ పర్యటించి టోక్యోలోని ‘’ఇంపీరియల్ యూనివర్సిటీ’’లో  ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన శిష్యులైన చైనా విద్యార్థులు ఆయనను పట్టుబట్టి చైనాకు తీసుకెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు పెకింగ్ లో, నాంకింగ్ లో ఉపన్యాసాలిస్తూ ఉన్నాడు. 65-70 ఏళ్ల మధ్య టర్కీ, మెక్సికో, రష్యా సందర్శించి అక్కడి విద్య ప్రయోగాలను నిర్దేశించాడు. 78 వ ఏట ఒక తీవ్రమైన వివాదాస్పద సంఘటనలో ఇరుక్కున్నాడు.

సోవియట్ ప్రభుత్వం లియాన్ ట్రాటస్కీ అనే ప్రవాసంలో ఉన్న అతనిపై చేసిన ఆరోపణలను పరిశోది౦చటానికి ఏర్పడిన కమిషన్ కు నాయకత్వం వహించాడు. స్టాలిన్ అనుచరులందరినీ అక్కడి ప్రభుత్వం చంపేస్తోంది.   ట్రాటస్కీ చాకచక్యంగా తప్పించుకుని మెక్సికో వెళ్ళిపోయాడు. కానీ అక్కడ దారుణంగా హత్య చేయబడ్డాడు. ద్యూయి తటస్థంగా ఉన్నాడు. తాను ట్రాటస్కయిట్ కానీ స్టాలినిస్టూకాదని  మాస్కో వారి సాక్ష్యాన్ని , అవతలి వారి సాక్ష్యం విన్నతర్వాత మాత్రమే అ౦గీకరిస్తామని చెప్పాడు. కమిషన్ ట్రాటస్కీ కి తీవ్రవాదం, ఫాసిజం తో అమబంధం లేని అమాయకుడుఅని ,, నిర్దోషి అని తీర్పిచ్చింది. కనుక అతనిపై ఆందోళనలు తగవని అది ఒక కుట్ర అని చెప్పింది. కమ్యూనిష్టులు అతనిని తీవ్రంగా రెచ్చ గొట్టినా ఆయన కలవరపడలేదు. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా రక్షించాలని ఆయన ధ్యేయం. జీవితం చరమాంకంలో ఆయన భయాలకు ఎర అయ్యాడు. ఎనభైలలో కూడా తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి జంకలేదు. ఎనభై ఐదు లో కూడా ప్రజాస్వామ్య విలువలకోసం తీవ్రపోరాటం చేస్తూనే ఉన్నాడు. 1946లో చికాగో, డెట్రాయిట్ లో కార్మిక నాయకులతో కలిసి పీపుల్స్ పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘’పీపుల్స్ లాబీ’’కి అధ్యక్షుడయ్యాడు. అమెరికాలోని’’ రెండు పార్టీలు’’ పెద్ద వ్యాపార సంస్థలు అన్నాడు. ప్రభుత్వాదికారం ధనస్వామ్యం చేతిలో కాక ప్రజలకు దక్కాలి అని ప్రచారం చేసాడు. 1946లో రాసిన’’ ప్రాబ్లంస్ ఆఫ్ మెన్’’ లో తన అభిప్రాయాలను పొందుపరచాడు. దీనిని సమీక్ష చేసిన ఆల్విన్ జాన్సన్ అనే న్యూ స్కూల్ ఫర్ సోషల్ రిసర్చ్ అధ్యక్షుడు  ‘’ తత్వశాస్త్రంలోనూ రాజకీయంలోనూ గొప్ప ప్రతిక్రియకు తోడ్పద్దాడని అన్నారు. తత్వ శాస్త్రాన్ని సమూలంగా మార్చాలని భావించాడు. ప్రస్తుత ప్రపంచం ప్రజాస్వామ్యానికి చెందినదని భావించాడు. ప్రజాస్వామ్యం కాలం కోసం ఆగకూడదని ఊహాగానాలపై ఆధారపడకూడదని అన్నాడు. 87లో ఆయన చూపు, ఆలోచనలకు ఏమాత్రం పదును తగ్గ లేదు. మరింత ద్రుఢపడ్డాడు. భార్య చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత, 88ఏట తన వయస్సులో సగం వయస్సును రోబర్తా గ్రాంట్ అనే విధవ స్త్రీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య వలన ఆరుగురు పుడితే అందులో ఇద్దరు బాల్యంలోనే చనిపోయారు.ఏడవ వాడిని పెంచుకున్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరినీ యుద్ధ శరణార్ధులను దత్తత తీసుకున్నాడు. తొంభై వ  పుట్టినరోజున అనేక సన్మానాలు, గౌరవాలు, డిన్నర్లు, ప్రపంచవ్యాప్త ప్రశంశలు అందుకున్నాడు. ఆయన అభిమానులు తొంభై వేల డాలర్లను కానుకగా అందించారు. ఆ ధనాన్ని తన అభిమాన విద్యా ప్రణాళికల అమలుకు ఖర్చు చేశాడు ..

తొంభై ఒకటవ ఏట కిందపడగా మోకాలు విరిగింది. త్వరగా కోలుకుని ‘’ఏల్స్’’ అందచేసిన గౌరవ పట్టాను స్వయంగా తీసుకున్నాడు. 1952  వసంత కాలంలో న్యుమోనియా వచ్చి తీవ్రమై 93 వ ఏట 2-6-1952 న జాన్ డ్యూయీ మరణించాడు.

ఆయన రచనలు స్టయిల్ కంటే విషయానికి ప్రాధాన్యం ఉండేది. ఆయన ప్రకటనలు సంక్లిష్టంగా పునరుక్తితో ఆకర్షణీయంగా ఉండేవి కావు. ఆయన రాసిన ముప్పై ఎనిమిది పుస్తకాలు, ఎనిమిది వందలపైగా రాసిన వ్యాసాలలో కొట్టవచ్చేటట్లు ఒక వాక్యమూ కనిపించదని ,’’కోటబుల్ కోట్స్ ‘’ఉండవని విమర్శకులు అంటారు. కానీ అంతర్గర్భంగా తీవ్రమైన,  ఆలోచనా సంపన్నమై ఉంటాయని తెలుస్తుంది. “Dewey calls for intellectual pioneering toward wider horizons”. ఆయన తత్వ శాస్త్రాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కానీ ప్రతివారూ దానిని అనుసరిస్తారు. “His philosophy grows out of common experience and can be tested by it. It is applicable not only to college professors but to travelling salesmen, plumbers, farmers, clerks. His pulse beat quickens to the drums of humanity’s blundering march toward freedom.” ఆయన –స్థిరం గా  మంచితనానికి అవకాశమున్న చెడ్డతనానికి మధ్య విభజనరేఖ గీయటానికి ఇష్టపదేవాడు కాదు. ఆయన దృష్టిలో చెడ్డవాడు అంటే  “The bad man is the man who, no matter how good he has been, is beginning to deteriorate to grow less good.  అలాగే మంచివాడు అంటే “The good man is the man who, no matter how morally unworthy he has been, is moving to become better”. జీవితాన్ని నిర్వచి౦చ లేమని అది ఎప్పటికి చివరిది కాదని అది ఎప్పుడూపురోగామిస్తూనే ఉంటుందని   అన్నాడు. అలాగే “Not perfection has a final goal, but the ever enduring process of perfecting maturing refining is the aim of living”అని చెప్పాడు. మనం ఉన్న ప్రపంచం అన్నిటికంటే ఉత్కృష్టమైనది అనుకోవటం నిరాశావాద౦  యొక్క విరక్తత అని అన్నాడు. ప్రజాస్వామ్యం, సమాజం జాన్ డ్యూయి కి అతి ముఖ్యమైన విషయాలు. నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాడటానికి అమెరికాలోని ‘’యా౦కీలను’’ సన్నద్ధం  చేయటమే ఆయన ధ్యేయంగా జీవించాడు. అతని దృష్టిలో తత్వ శాస్త్రం అంటే “is a catholic and far sighted theory of the adjustment of the conflicting factors of life.”

డ్యూయీ రె౦డిటికి ప్రాదాన్యమిచ్చాడు .ఒకటి స్కూల్స్ ,రెండవది పౌర సమాజం .విద్య చెప్పే వారు ఎప్పటికప్పుడు స్వయం సమర్ధం అవ్వాలన్నాడు లేక పొతే కాలం కంటే వెనక బడతారని చెప్పాడు .టీచర్ నిరంతర విద్యార్ధి గా ఉండాలని సూచించాడు .ఇదే విద్యా నాణ్యతను పెంచుతు౦దన్నాడు .అందుకే కొఠారి ‘’విద్యార్ధి వ్యక్తిత్వ వికాసం  క్లాస్ రూమ్ లోనే తీర్చి దిద్దబడు తుంది ‘’అన్నాడు .టీచర్ ఎడ్యు కేషన్ కు ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .జర్నలిజం సంఘాన్ని తీర్చి దిద్దటం లో ప్రముఖ పాత్ర పోషించాలన్నాడు.పబ్లిక్ ను ఎలివేట్ చేసే పని వారిదే నంటాడు .మానవత్వమంటే మహా మక్కువ ఉన్న డ్యూయీ ఆ సంబంధ కార్యక్రమాలనేన్నిటిలోనో చురుకుగా పాల్గొన్నాడు .  ‘’humanism means not a contraction of human life ,an expansion in which nature and the  science of nature are made the willing servants of human good.’’అని మానవత్వాన్ని నిర్వచించిన మేధావి..విద్యా స్వేచ్చ కోసం అయిన్ స్టీన్ తో కలిసి ‘’ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ ఎకాడేమిక్ ఫ్రీడం ‘’ లో అమెరికా తరఫున సభ్యుడైనాడు .1940లో హోరేస్ కేల్లెన్ తో కలిసి బెర్ట్రాండ్ రసెల్ కేసు కోసం అనేక వ్యాసాలూ రాశాడు .టీచర్ల వ్యక్తిత్వ రక్షణకోసం ,కమ్యూనిస్ట్ ల నీడ పడకుండా స్వేచ్చాయుత ఉపాధ్యాయ ఉద్యమ నిర్వహణ చేశాడు  ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్  ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’ఏర్పరచాడు .1939లో ‘’’లీగ్ ఫర్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ ‘’కి అధ్యక్షుడయ్యాడు .’’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం ఫ్రంట్ ‘’కు డ్యూయీ ,బెర్ట్రాండ్ రసెల్ కార్ల్ జాస్పర్స్ మొదలైన వారు ‘’ఆనరరీచైర్మన్ ‘’హోదా పొందారు .

 

యూని వర్సిటి ఆఫ్ ఒశియో , పెన్సిల్వేనియా ,ఏల్,రోమ్ లు  గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. బ్రూక్లిన్ ,న్యూ యార్క్ లలో ఆయన పేర హైస్కూల్స్ ఏర్పడ్డాయి .గ్రీన్ బే , బార్రింగ్ టన్ లలో డ్యూయీ  పేరిట ‘’ఎకాడేమి ఆఫ్ లెర్నింగ్’’సంస్థలేర్పడ్డాయి .

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-15-ఉయ్యూరు ,

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79

34-‘’ఫ్రీ విల్ ‘’ను ప్రవచించిన ప్రముఖ ఆధునిక  ఫ్రెంచ్ తత్వ వేత్త –హెన్రి  బెర్గ్ సన్

హెన్రి బెర్గ్ సన్ తండ్రి  పోలాండ్ దేశీయుడు తల్లి ఇంగ్లాండ్ దేశీయురాలు ,పూర్వీకులెవరూ గాలిక్ రక్తం లేనివాళ్ళే .వీరంతా  జ్యూయిష్ వ్యాపారస్తులు . హెన్రి తండ్రి కళలవైపు మొగ్గు చూపాడు .గొప్ప సంగీత విద్వాంసుడు అవటం తో స్వంత ఊరు వార్సా వదిలిపెట్టి  బ్రిటన్ చేరి ఐరిష్ వంశానికి చెందిన ఇంగ్లీష్ జ్యూయిష్ యువతి కేధరీన్ లేవిన్సన్ ని పెళ్లి చేసుకొన్నాడు .కొడుకు హెన్రి 18-10-1859లో పారిస్ లో పుట్ట్టినప్పటికీ ఇరవై ఒకటవ ఏడు వరకు సామాన్య ఫ్రెంచ్ దేశీయుడిగానే ఉన్నాడు .ఇతని ఇంగ్లీష్ ఉచ్చారణ చూసి తోటి విద్యార్ధులు టిపికల్ ఇంగ్లీష్మన్ అనుకొనేవారు .ఈకోల్ నార్మేల్ సుపీరియర్ లో  బయాలజీ ,సైకాలజీ  చదివాడు . జాన్ స్టువర్ట్ మిల్ బోధించే ఫ్రీ థాట్ కు ,ఇండక్షన్ విధానానికి ఆకర్షితుడై హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పిన ‘’ఫస్ట్ ప్రిన్సిపుల్ ‘’ను మెచ్చుకున్నాడు.‘’.శాస్త్రీయ పరిణామ భాషలో వాస్తవాన్ని వివరించలేము అని అనుమాన పడ్డాడు .

18వ ఏట ఒక గణిత సమస్య ‘’అన్నేల్ డీ మేధమేటిక్ ‘’పత్రిక లో పడింది .అది ప్రభావితం చేసింది  గణిత శాస్త్రజ్ఞుడు అవుదామనుకొన్నాడు .గణితం లోని కఠిన నియమాలు ,ఖచ్చితమైన సైన్స్ ,ఊహాత్మక  సాహిత్యం లలో దేన్నీ ఎంచుకోవాలో యువ హేన్రికి అర్ధం కాక రెండిటిని కలపాలని నిర్ణయానికి వచ్చాడు .ఫిలాసఫీ రచయిత ఆవాలను కొన్నాడు .పూర్వపు గ్రీకు ఫిలాసఫర్ల పై ఆసక్తి పెరిగింది .జీనో చెప్పిన ‘’బీయింగ్ ,బికమింగ్ ‘’,హెరాక్లిటస్ బోధించిన ఫ్లూయిడ్ యూని వర్స్స్  మనసుకు బాగా పట్టాయి .వీటిని తరువాత కాలం లో సుసంపన్నం చేశాడు .మనిషి వేదాంతం వలననే జీవించలేడుఅని గుర్తించి ,ఫిలాసఫీ బోధన,తిండి పెడుతుంది అని తెలుసుకున్నాడు .గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ‘’లైస్ ఆఫ్ క్లేర్మాంట్ ఫెర్రాండ్ ‘’లో టీచర్ గా చేరి విద్యార్ధులను బాగా ఆకర్హించాడు .ప్రతి విషయం పైనా  నిగ్గు తేల్చే విధానాన్ని అనుసరించాడు .

30 వ ఏట బెర్గ్సన్ రెండు పరిశోధనా గ్రంధాలను రాసి ప్రచురించాడు. అందులో చాలా ముఖ్యమైన మొదటి గ్రంధం “Time and Free will”. ఎనిమిది ఏళ్ల తర్వాత ఆయన చదివిన పాత స్కూలులో ఉద్యోగం పొందాడు. అప్పుడు తీవ్రమైన ఆలోచనా విధానం కల “మేటర్ అండ్ మెమరీ” గ్రంధాన్ని ప్రచురించాడు. 1900లో కాలేజి డి ఫ్రాన్స్ లో ప్రొఫెసర్ అయ్యాడు. ఇందులో ముప్పై ఏళ్ళు పని చేసాడు. ఆయన ఉపన్యాసాలు అందరినీ ఆకర్షించేవి. ఒక ఫిలాసఫర్ అంతగా ప్రాచుర్యం పొందటం ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ప్రఖ్యాతి విపరీతంగా వ్యాపించింది. అన్ని చోట్లా ఆయనను అభినందించారు, అనుకరించారు, ఆహ్వానించి సన్మానించారు. తరచుగా ఇండ్లు మారుస్తుండేవారు. అందుకని “వా౦డరింగ్ జ్యూ” అనేవారు. స్త్రీలు ఆయన ఉపన్యాసాలంటే క్రేజీగా హాజరయ్యేవారు. ఆయన చెప్పే “క్రియేటివ్ ఇవల్యూషన్”,” చైతన్య స్రవంతి (ఎలాన్ వైటల్)” బాగా ఆకర్షణగా ఉండేవి. వేదాంతమంటే తనలో తాను తొంగి చూసుకోవడమని చెప్పేవాడు. ఈ మాటలను అందరూ అన్ని చోట్లా చెప్పుకుని ప్రాముఖ్యతను తెచ్చారు. 50 వ ఏట టెయిన్ అండ్ రెనాన్ అనే చోట ఉండి ఫ్రాన్స్ దేశంలో సృజనాత్మక ఆలోచనా పరుడుగా కీర్తిపొందాడు. కొత్త భావాల వ్యాప్తికి ప్రపంచంలో గొప్ప ప్రేరణ కల్గించిన  మేధావిగా గుర్తింపు పొందాడు. 52వ ఏట ఆయన రాసిన time అండ్ freewill, matter అండ్ memory, క్రియేటివ్ ఇవల్యూషన్ ఒకే సారి ఇంగ్లీషులో అనువాదం పొంది విడుదల అయ్యాయి. అమెరికా, ఇంగ్లాండ్ లలో ఆయనకు కొత్త శిష్యులు ఏర్పడ్డారు. పురుషులు ఆయన భావ తీవ్రతకు ఉత్తేజపడితే, స్త్రీలకు  ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన దాంపత్యం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగింది.

50 లలో బెర్గ్సన్ సంచార ఉపన్యాసకుడుగా మారాడు. ఆక్స్ఫర్డ్, లండన్, బర్మింగ్హాం, బొలోనా, న్యూ యార్క్ లలో చిరస్మరణీయ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. దానితో శ్రోతలకు ఆయన ప్రవచనాలు పరమ ఆసక్తిగా ఉండేవి. 55 వ ఏట ఫ్రెంచ్  అకాడమీకి ఎన్నిక అయ్యాడు. 62 లో కాలేజి డి ఫ్రాన్స్ కు  రాజీనామా చేసాడు కానీ ‘’ఆనరరీ  ప్రొఫెసర్’’ గా ఉండిపోయాడు. 68లో బెర్గ్సన్ కు “in recognition of his rich and life giving ideas and resplendent art with which they are presented” కు గాను’’ నోబెల్ బహుమతి’’ లభించింది. వయస్సు పై బడుతున్న కొద్దీ మత భావాలకు మరీ దగ్గర అయ్యాడు. 70 వ ఏట కాథలిక్ గా మారి దానిని “The complete fulfillment of Judaism” అని ప్రకటించాడు. కానీ యాంటీ సేమిటిక్ ఉద్యమాలప్రభావం వలన , జర్మనీ ఫ్రాన్స్ లలో మతంపై ఒక కొత్త ఆలోచన రావాలి అని భావించాడు. దౌష్ట్యం ఆయన్ను కలచి వేసింది .రాబోయే  రోజుల్లో బాధితులలో తానూ ఒకడిగా ఉండాలని అనుకున్నాడు. ఈ దౌష్ట్యం ఫ్రాన్స్ లో 1940 ఫ్రాన్స్ పతన౦  తర్వాత జరిగింది. ‘’విచీ’’ ప్రభుత్వం యూదులందరినీ వారి ఉద్యోగాల నుండి తప్పించింది. బెర్గ్సన్ జోలికి పోలేదు. దీన్ని ఆయన స్వప్రయోజనం గా  భావించలేదు. 80 ఏళ్లకు మరీ బలహీనుడై ఏమాత్రం రాజీ  పడకుండా  విశ్రాంత జీవితాన్ని గడిపాడు. ఫ్రాన్స్ లోని యూదులందరినీ పేర్లను నమోదు చేసుకోవాలని బలవంత పెట్టినా ఈయన జోలికి రాలేదు. దాన్ని ఆయన అవకాశంగా భావించకుండా రిజిస్ట్రేషన్  ఆఫీసువెళ్లి ,  క్యూలోగంటల తరబడి  నిలబడి తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. దీనితో విపరీతమైన నీరసం వచ్చి తట్టుకోలేక పోయాడు. అననుకూలమైన ఆ వాతావరణంలో ఆయన గంటలు తరబడి నిలబడి ఉండటం వలన ఆరోగ్యం దెబ్బ తిన్నది. కానీ మానవత్వ గౌరవాన్ని ఆయన ప్రపంచానికి చాటాడు. అదే ఆయన చావుకు దగ్గరకు తెచ్చింది. ఊపిరి తిత్తులు దెబ్బ తిని, రక్త నాళాలు కుంచించుకునిపోయి  4 – 1-19 41 న ఆ జ్ఞాన వయో వృద్ధ ఫిలాసఫర్ హెన్రీ బెర్గ్సన్ తుది శ్వాస వదిలాడు.

బెర్గ్సన్ భావాలు విప్లవాత్మకమైనవికావు. కానీ ఆయన వివరించే విధానం ఆశ్చర్యంగా దిగ్భ్రమ కలిగించేవిగా ఉంటాయి. వేదాంతం అంటే  పారిపోయే జనాలకు ఆయన మాటలు రస గుళిక లయ్యాయి ..  సంభ్రమాశ్చర్యాలలో ముంచేవి. సామాన్య జీవికి గుణాత్మక మార్గాన్ని చూపెట్టిన మహానీయుడాయన. నేతి- నేతి వాదాల జోలికి పోకుండా సూటిగా వేదాంతాన్ని బోధించిన అద్వితీయుడు. ప్రతి వ్యక్తీ ఒక కొత్త జీవి అని సృజన శీలి అని నమ్మాడు. ఆయన జీవితంలో ప్రతి క్షణం ఒక కొత్త అవకాశానికి వేదికగా ఉండేది. స్వేచ్చా ఆలోచనలకు ఆయన పెద్ద పీట  వేశాడు. డార్విన్ సిద్ధాంతాన్ని కొత్త ఆలోచనలతో పరిణామ క్రమంగా బోధించాడు. అందుకే బెర్నార్డ్ షా ఆయన చెప్పిన ఎలాన్ వైటల్ ను ప్రాణ శక్తి (లైఫ్ ఫోర్స్ ) అన్నాడు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ, వ్యాపిస్తూ కొత్త రూపాలను పొందుతూ నిస్తేజంగా చలన రహితంగా ఉత్సాహ రహితంగా ఉండే వాటిని వ్యతిరేకించింది.    జడత్వాన్ని వదిలించింది. జీవితం అంటే అడ్డు లేని నిరంతర చర్య అన్నాడు. అనుమాన రహితమైన పోరాట పటిమ కల విధానం అంటాడు. దేవుడు కూడా ఒక చోట స్థిరపడి ఉండే శక్తి కాదన్ననాడు. తను చేసిన సృష్టితో పాటు దేవుడు కూడా పెరుగుతాడు అంటాడు. ‘’దేవుడు రెడీ మేడ్ ‘’వస్తువు కాదన్నాడు. “God is unceasing life action freedom. Creation so conceived is not a mystery – we experience it in ourselves when we act freely” అని చెప్పాడు.

ఈ ఆరకమైన ఆలోచన వల్ల బెర్గ్సన్ పదార్థానికి ఒక కొత్త తేజాన్ని ఇస్తూ ఆధ్యాత్మికతకు దగ్గర చేసాడు. కనిపించే  వస్తువులను, అణువులను దాటి ఆయన ఆలోచనలు ఉండేవి. “He compared the potential energy held in the atom to the release of nuclear thought within the mind. He made a distinction between the brain, which is the calculating and measuring machine and the mind which remembers every thing and manifests itself in intuition, the source of all knowledge”అని సిద్దాంతరీకిస్తాడు బెర్గ్సన్. మానవ మెదడు ఆలోచనా యంత్రమని, అది లెక్కించి మదింపు చేసి విశ్లేషణ చేస్తుందని కానీ అది అనుభ వించ లేదని చెప్పాడు. భావాలకు స్పందించే శక్తి బాధ పడటం, ఓర్చుకోనటం అనేవి ఒక ఆత్మగత విధానం అన్నాడు. బాధ పడటం, ఒర్చుకోనటం అని మిగిలిన వేదాంతులు చెబితే బెర్గ్సన్ “intuition is the legitimate and noble province of the mind – indeed it is the only means for perceiving the heart of things” అని స్పష్టంగా చెప్పాడు. మనిషి లోని గతం వర్తమానంపై అధిక ప్రభావం చూపిస్స్తుంది అని అది అతని అంతరాత్మను ఎప్పుడూ వదలిపెట్టదని ఆయన రాసిన మేటర్ అండ్ మెమరీ లో చెప్పాడు. ఇదే ఒక ‘’సజీవ చైతన్య స్రవంతి’’ లాగా     ఉంటుందని అతని అభిప్రాయం.

 

కాలానికి ,అవధికి (duration )ఉన్న తేడాను కూడా బెర్గ్సన్ వివరించాడు. గడియారం చూపే కాలం వాస్తవ కాలం కాదంటాడు. వాస్తవ కాలం లోలక ఆవర్తనంతో ఏకీభవిస్తూ ఉన్నా గడియారం టైం తో సంభంద ఉండదు. దానికి హద్దులు లేవు. దానిని సంక్షిప్తీకరించలేము. అవధి (ద్యూరేషన్) గురించి చెబుతూ “Duration is the continuous progress of the past which gnaws (bite) into the future and which swells as it advances, “for the past in its entirety is prolonged into the present and abides there actual and acting. Duration is the essential pulse of our being”. “అంతర్ జ్ఞానం అంటే వ్యక్తీ అసలు రూపం, అతని  ఆత్మ, అతని  అనంతమైన సృజనాత్మక మేధ” అన్నాడు బెర్గ్సన్.   అతని వ్యాసాలలో భాగాలు కేలిడియో స్కోప్ లో చూస్తున్న అనుభూతి నిస్తాయి. గందరగోళపరిచే కాల్పనికత ఉండదు. వాక్యాలన్నీ మాటల ప్రవాహాలే, పారదర్శకాలే. సునిశిత హాస్య స్ఫోరకాలే. కంటిని గురించి చెబుతూ బెర్గ్సన్ అందులో అనేక భాగాలున్నాయని, కార్నియా, రెటినా, కటకం మొదలైన భాగాలు ఉన్నాయని అందులో ప్రతి భాగం పని అనంతంగా ఉంటుందని రెటీనా లో నాడులతో కూడిన మూడు పొరలు అనేక ధ్రువాల కణాలు ద్విద్రువ కణాలు చూపు కణాలు ఉంటాయని ఇందులో ప్రతి దానికి స్వయం వ్యక్తిత్వం ఉంటుందనీ కనుక దీనిని నిర్వచించటం కష్టం అని అంటాడు. “The mechanism of the eye is in short composed of an infinity of mechanisms. All of extreme complexity, yet vision is one simple fact. As soon as the eye opens the visual act is effected, this contrasts between the infinite complexity of the organ and the extreme simplicity of the function is what should open our eyes” అని మనిషి తెలుసుకోవలసిన అసలు విషయాన్ని ఎరుక పరచాడు.

బెర్గ్స్సన్ రచయత లందరికంటే గొప్ప సత్తా ఉన్నవాడు. ఏడిపిస్తాడు, కదిలిస్తాడు, ఊహను ప్రేరేపిస్తాడు. అతను ఫిలాసఫర్లలో కవి. అంతర్ జ్ఞానం -కారణాన్ని అధిగమిస్తుందని అంటాడు. బెర్గ్సన్ ప్రభావం సాహిత్యంలో మార్మికతను వేగవంతం చేసింది. “Bergson re-established the innate sense of wonder in a world where even the machine takes on mystical powers” అని అతని మార్మికతపై వ్యాఖ్యానిస్తారు. దీనిపై ఆయన స్పందన “Machinery will find its true vocation again, it will render services in proportion to its power of mankind which it has bowed still lower to the earth can succeed through it in standing erect looking heavenly wards.” మొత్తం మీద బెర్గ్సన్ సిద్దాంత సారాంశం “intuition and creation, life and memory, perception and religion are one, the immediate moment contains the entire past every thing- the accumulation of all ages  is now.”

1908లో బెర్గ్ సన్ లండన్ లో హార్వర్డ్ ఫిలాసఫర్ విలియం జేమ్స్ ను కలుసుకొన్నాడు .అయన ఇంగ్లీష్ అమెరికన్ మిత్రులందరికీ ఈ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ను పరిచయం చేశాడు .ఈ ఇద్దరూ అప్పటినుండి మంచి మిత్రులయ్యారు .బెర్గ్ సన్ను అభినదిస్తూ విలియం జేమ్స్ ‘’so modest and unpretending a man such a genius intellectually .I have the strongest suspicions the tendency which he has brought to a focus will end by ,prevailing ,and the present epoch will be a short of turning point in the history of philosophy ‘’అని రాశాడు .హెన్రి రాసిన తొలి రచనలపై జేమ్స్ ప్రభావం బాగానే ఉంది .తర్వాత బెర్గ్ సన్ ప్రభావం  జేమ్స్ పై పడి తనకున్న లాజిక్ ను క్రమంగా తగ్గించుకొన్నాడు .ఇటలీలోని బోలోనాలో జరిగిన నాలుగవ అంతర్జాతీయ వేదాంత సభలలో బెర్గ్ సన్’’ఫిలసాఫికల్ ఇంట్యూ షన్’’పై అద్భుత ప్రసంగం చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో ‘’ది పెర్సేప్షన్ఆఫ్ చేంజ్ ‘’పై గంభీరోపన్యాసమిచ్చాడు .ఫ్రెంచ్  పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలూ రాసి ఉత్తేజ పరచాడు .1920లో కేంబ్రిడ్జి యూని వర్సిటి ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’బహూక రించి సత్కరించింది .

‘’ బెర్గ్ సన్అండ్ ఐన్ స్టీన్  యూని వర్స్’’అనే పుస్తకం రాశాడుకాని ఆయన భౌతిక శాస్త్ర పరిజ్ఞానం చాలలేదనే విమర్శను ఎదుర్కొన్నాడు .’’కార్టీషియన్ దీరీ’’ కి వ్యతిరేకంగా ‘’లాఫ్టర్ –(laughter ) పుస్తకం రాశాడు .హెన్రి పై ఇమాన్యుల్ కాంట్ ,బారుక్ ,స్పినోజా మొదలైన వారి ప్రభావం ఉంది .బెర్గ్ సన్’’ఎమిలీ బ్రీహీర్ ,మార్సెల్ ప్రాస్ట్ ,నికోస్ కజంట్ జకి మొదలైన వారిపై విశేషమైన ప్రభావం కలిగించాడు .

బెర్గ్ సన్ కోటబుల్ కోట్స్ కొన్ని -1-to exist is to change ,to change is to mature ,to mature is to go on creating oneself endlessly .

2-think like a man of action ,act like a man of thought’.

3-the present contains nothing more than the past ,and what is found in the  effect  was already in the cause .

Inline image 1   Inline image 2  Inline image 3  Inline image 4

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-15-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

బాలసాహిత్యానికి పూర్వ వైభవం మళ్ళీ తెద్దాం – వేదగిరి బాబు ,అట్ల తద్ది

Inline image 1
Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆది కవి వాల్మీకి(వాల్మీకి జయంతి ),,సిరులు కురిపించే సిరిమానోత్సవం


Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాయన తార నిజాయితీ యెంత ?ముదిగొండ శివ ప్రసాద్ బీహార్ విజయం పై అమిత్ షా ఆత్మ విశ్వాసం

 

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

బ్లెయిర్ వచో విలాసం ,గోవు తోనే పాడి పంటలు

Inline image 1


Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కుదిపేసిన భూ కంపం ,గీత పాక్ గీత దాటొచ్చింది -హార్దిక స్వాగతం

Inline image 1


Inline image 2
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ఏర్పడింది

ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ఏర్పడింది

 

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు నవలా సాహిత్యం లో జగజ్జాణ ,నాయకురాలు నాగమ్మ -ప్రభ

 

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరీరమే ఒక శ్రీ చక్రం -పసుమర్తి కామేశ్వర శర్మ ,పావన మూర్తి పాండురంగడు

శరీరమే ఒక శ్రీ చక్రం -పసుమర్తి కామేశ్వర శర్మ ,పావన మూర్తి పాండురంగడు

 

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ నిజం గా అన్యాయం చేశారా ?టంకశాల అశోక్ కుమార్ ,అమెరికా సమదర్శనం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆళ్వారు స్వామి కధల్లో నేరము శిక్ష ,చలసాని ప్రసాద్ తో ఇంటర్వ్యు

ఆళ్వారు స్వామి కధల్లో నేరము శిక్ష ,చలసాని ప్రసాద్ తో ఇంటర్వ్యు

 

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోబంధం కవిత -ఎండ్లూరి సుధాకర్

Inline image 1

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాహుల్ సరైన వాడు కాదు -ఫోతే దార్ ,తోకచుక్క నుండి సెకనుకు 500 బాటిళ్ళ వైన్క్రికెట్ లో ఓటమి

Inline image 1

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడు రాళ్ళపల్లి తో ఆర్ కె ఇంటర్వ్యు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దృష్టిని బట్టే సృష్టి -గణపతి స్వామీజీ,మాత్రు భాషకు పట్టం కట్టిన చోళ ధనుంజయుడు

దృష్టిని బట్టే సృష్టి -గణపతి స్వామీజీ,మాత్రు భాషకు పట్టం కట్టిన చోళ ధనుంజయుడు

 

Inline image 1


 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరీ ఉద్దండ రాయుడు

Inline image 1
Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడు రామ్ జగన్ షూటింగ్ ముచ్చట్లు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుక్కమీద వ్యాసం,సాహిత్య అకాడెమి తీర్మానం

Inline image 1


 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంరంభం ముగిసింది ఆరంభం మిగిలింది

Inline image 1

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ).

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ).

169-‘’మాత స్మేరే విస్మరా స్మత్స్మి తాంకం-వ్యాస స్వామీ నోచి వానత్ర దోషం

మాతుర్వత్స స్యాపి మధ్యే క్వ దోషః –దోషా దోషా ప్రార్ధయామి ప్రసీద ‘’

తా-ముసి ముసి నవ్వులు నవ్వే తల్లీ !నేను ఇదివరకు నవ్విన నవ్వు అనే కళంకాన్ని వాత్సల్యం తో తొలగించు .మర్చి పో.వ్యాసస్వామి కూడా నా నవ్వు విషయాన్ని పెద్దగా పట్టించు కోలేదు .దోషమనీ అనలేదు .

17౦-‘’నిశ్వాసోచ్హ్వా సస్థ సో హంత యా వా –హంసత్వేనా ప్యాంత రస్థేన హార్దాత్

బాహ్యే హాంసే మండలేవా హ మస్మి –త్యాలంబ్యా బత్వా ముపాసేన యస్వ ‘’

తా-ఉచ్వాస  నిశ్వాసాల కు ఆధారమైన’’ హంస’’ భావం తో కాని ,హృదయం మధ్యలో ఉన్న’’ హంస మండలం నేను’’ అనే ‘’ హార్దో పాసన’’ అనుసరించి కాని ,బయట అందరికి ప్రత్యక్షం గా కనిపించే సూర్య మండలం లోని ‘’సోహం ‘’భావం తో కాని ,శ్రుతిని అనుసరించికాని ,ఏదో ఒక మతాన్ని అనుసరించికాని నిన్ను ఉపాసిస్తాను .దేనికి నేను అర్హుడినో ఆ స్థితి ని నాకు కలిగించు

171-‘’హస్తే కృత్వా త్వం చి౦తితం  భ్రామ యస్యే-తల్లోకానీక౦ చితంచా చితంచ

త్వం చిద్వా చిద్వేతి జానాతి కోవా –యోజానీయా త్సో పితా దృక్త్వ మేతి’’

తా-అమ్మా !చిద్రూపాన్ని చేతిలో పెట్టుకొని ,జడం ,అజడం అయిన లోక జాలాన్ని అంతా ఆడిస్తున్నావు .ఈ ఆటలో నువ్వు ఏ రూపం లో ఉంటావో తెలుసుకోవటం కష్టం .

172-.’’జాగ్రన్మానేన ప్రమాణ ప్రమేయ-ప్రఖ్యాతే ధ్వన్యాస్థితా దుర్ల భాసి

స్వప్నే దృష్టాం కో వనిర్ణే తు మీశో –యద్వా తద్వా కుర్వనీశం త్వమీశా ‘’

తా-లోక దృష్టిలో మెలకువ స్థితిలో ప్రమాణ ,ప్రమేయ రూపం గా ప్రసిద్ధమార్గం లో ప్రత్యక్షంగా కనిపిస్తూ కూడా  ,చేరటానికి శక్యం కాని దానివై ఉంటావు .కలలో కన్పించిన నిన్ను ,నీ స్వరూపాన్ని వర్ణించటం ఎవరి సాధ్యం ?అసమర్ధుడైన నన్ను ,సమర్దురాలవైన నువ్వు అటో ఇటో ఏదో ఒక గమ్య స్థానానికి చేర్చు జగన్మాతా !

173-‘’వేదే శాస్త్రే సత్పురాణేతిహాసే –ప్రఖ్యాతేధ్వన్యార్య జుస్టే వసామి

కాంచీ పీఠ స్వామిభి శ్చంద్రశీర్షై –రాదిస్టే ప్రాప్తే సమాధౌ క్షణేన’’

తా-వేద,శాస్త్ర ,ఇతిహాస ,పురాణాలలో ప్రసిద్ధమైన మార్గం లో ఆర్యజనుల చేత సేవింప బడే ప్రముఖ కాంచీ పీఠంలో నెలకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిచే ఆదేశింప బడి ,పుణ్య వశం తో క్షణిక సమాధిలో’’ నేను నేనై’’ ఉంటాను .

174-‘’యస్యాం కస్యాం వా సృతౌ సంప్రవర్తే-మా మీక్షస్వ స్వాను కంపా ద్రుశాంబ

పాపం పుణ్యం మేస్తు ,వామాస్తువాహం –యావత్సత్యే బ్ధౌ నిమజ్జామి తావత్ ‘’

తా-నీ బిడ్డనైన నన్ను చూసుకొనే భారం నీదే .పుణ్య పాపాల చింత నాకు లేదు .నీ అండ ఉంటె సత్య  సముద్రం లో మునిగే సత్య వస్తువుకు పాపపుణ్యాలుండవు  .మాయికానికి ఉంటె ఉండనీ నాకేం ?

175-మాతర్దేవి వ్యాస మౌనిన్ క్షమద్వం –ఏతా వంతం కాల మస్మన్నిబంధం

వాచాలత్వం సన్నిధౌ వామ పీదం-వాత్సల్యా ద్వాం స్వ ప్రతిస్టో హ్యసాని ‘’

తా-తల్లీ దేవ దేవీ !  ఓ మహామౌనీ వ్యాసర్షీ ! అల్పుడనైన నేను ఇంత సేపు మిమ్మల్ని నిలబెట్టటం ,మీ సాన్నిద్యం లో నానోటికొచ్చి౦దల్లా వాగటం చెసిన౦దుకు ఇద్దరూ నన్నుముందుగా   క్షమించండి .మీకు నేనేం సమర్పించుకో గలను ?మీ వాత్సల్యం తో నాకు’’ స్వస్వరూపావస్తితబాధిత కాలం’’ సంప్రాప్తమైంది .

176-‘’ఇత్ధం యద్వా నిత్య సాన్నిధ్య యోగాత్ –సత్యం ధర్మం వాచయ౦ తౌ శ్రుతీద్యం

వాచం దేవీ౦ వాచిమే సన్నిదాప్య –సంతుస్టౌ స్తస్సోయమర్దో మమార్ధ్యః ‘’

తా-నిత్యం మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించి వాగ్దేవిని నా నాలుకపై ఉంచి ,శ్రుతులచేత కొనియాడ బడే సత్య ,ధర్మాలను నాచేత పలికిస్తూ ఇలాంటి వినోదాన్ని చూస్తూ సంతోషిస్తారా ?అది నాకు నిర్బీజ సమాదికంటే ముఖ్యమైనదిగా నేను భావిస్తాను .

177-‘’యద్విద్యా జన్యోర్య ఆసీత్ప్ర మూలం –నౌమి స్తౌమి స్వం గురుం తం మహాంతం

తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రీ-త్యాఖ్యాతం శ్రీరామ గాదా మ్రుతోక్త్యా ‘’

తా-నా విద్యకి ,పుట్టువుకు మూల భూతుడైన శ్రీ రామ కదామృత గ్రంధ కర్త శ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి అని లోక ప్రఖ్యాతుడైన మహా గురువైన నా తండ్రిని మాటి మాటికి నమస్కరిస్తూ స్మరిస్తూ కొనియాడుతాను .

178-‘’మాతా విఖ్యాతా  హనుమాంబికేతి-సాధ్వీ తాతో వే౦కటప్పః కవీశః

శ్రీ దేవీ సత్యంబికా రాధ కోహం –ఆత్రేయో నారాయణో రాఘ వాద్యః ‘’

తా-హనుమాయమ్మ అని విఖ్యాతి చెందిన మహా సాధ్వి నా తల్లి .తండ్రి తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి .నా పత్ని శ్రీదేవి .మాది ఆత్రేయస గోత్రం .శ్రీమాత ఆరాధకులం మేము .రాఘవ నారాయణ అని నా తండ్రి నాకు పేరు పెట్టారు .నాకు మా తండ్రి ఈ పేరు పెట్టినందుకుమా తండ్రి అంతర్ముఖులని ,మహాత్ముడనీ  బెజవాడ సభలో పూరీ స్వాముల వారు కీర్తించారు అందులో భావమేమిటో నాకేం తెలుసు ?

179-‘’దత్త భాగవత నామ కృతిం లిం –గోద్భావాయ విభవే నగరే దాం

చెన్న కేశవ పద ప్రభ వేయా –మా వికాంత దుభకౌ  మామ బందూ ‘’

తా-దత్త భాగవతం అనే గ్రంధాన్ని రచించి చందోలు నగరం లో’’ లింగోద్భవ స్వామి’’కి అ౦కితమిచ్చాను .మాయావిక అనే గ్రంధాన్ని రాసి శ్రీ చెన్నకేశవ స్వామికిచ్చాను ‘ఈ రకంగా శివ కేశవులు నాకు అల్లుళ్ళు అయ్యారు .

180-‘’ధర్మ కాండ పిన మిత్ర సుపుత్ర –స్వాగతా వతి భయే  జననీహ

ద్వైత వాద సరణీ నభయం మే –ద్వైత పధ్ధతి మిత స్స్వ్యమేకః ‘’

తా-   ఆ యమ ధర్మ రాజు మిత్రుని పుత్రుడు కనుక నా వాడే. ప్రవృత్తిలో   ఏ భయం వచ్చినా జగజ్జనని నన్ను రక్షిస్తుంది .కనుక ద్వైత వాద మార్గం లో నాకేమీ భయమే లేదు .అద్వైతమార్గాన్ని అనుసరించేవాడిని నేనొక్కడినే కదా .రెండో వాడు ఉంటేనే కదా భయం .కనుక నేను అభయుడను ,ఆనంద స్వరూపుడను .

181-‘’వృద్ధ క్ష్మౌ భ్రున్నాగ లింగః ప్రసిద్దో –విద్వానాసీ న్మే గురుః  పాణినీయే

శిష్య ప్రీత్యా బ్రహ్మ సూత్రం చతుర్భి- ర్భాష్యైర్మారర్గైః  ప్రాపు యద్యో విమృశ్య ‘’

తా-ముదిగొండ నాగ లింగ శాస్త్రి అనే ప్రసిద్ధ విద్వాంసుడు నాకు వ్యాకరణ గురువు .ఆయన ద్వైత విశిష్టాద్వైత భాష్యాలను విమర్శిస్తూ ప్రతి సూత్రానికి నాలుగుదారుల  భేదాలను శిష్య వాత్సల్యం తో బోధించాడు .

182-‘’విద్వాన్ మద్దుల్పల్లి మాణిక్య శాస్త్రీ –మాన్యోయం మే తర్క వేదాంత సమ్రాట్

దాక్షి ణ్యా ద్యోన్మద్గ్రుహం ప్రాప్య భవ్యే-విజ్ఞానే స౦  మర్శ  యామాన మానం ‘

తా-మహా తర్క వేదాంత సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ,అనుకో కుండా ఒక సారి మా ఇంటికిశిష్యులతో  వచ్చినెల రోజులుండి నేను చదివింది చదవనిది నాకున్న జ్ఞాన లేశాన్ని మెరుగు పరచి నన్ను తీర్చి దిద్దారు .

183-‘’తద్వద్యో యోమే లమేకం దదౌతం –చిత్తేనాహం గౌర వేణార్చ యామి

దైవేభ్యో మిత్రేభ్య ఉచ్చైర్గురుభ్యః –పా౦డిత్యౌన్న  త్యర్ది వద్భ్యో నమా౦ స్యోం ‘’

తా-ఇలా ఏయే మహాత్ములు నాకు ఒక్కక్షరమైనా ఇచ్చ్చారో వారందరినీ గౌరవ ప్రపత్తులతో పూజిస్తాను .దేవతలకు మిత్రులకు ,సహ పాఠకులకు ,పెద్దలకు గురు వరేణ్యు లకు ,సర్వ సమత్వ భావమున్న ప్రబుద్ధులకు అందరికి నమస్కరిస్తాను .ఇంతకంటే నేను చెప్పేది, చేసేది ఏమీ లేదు .పర బ్రహ్మ రూపమైన ‘’ప్రణవం ‘’ను ఉచ్చరిస్తూ’’ తురీయా తీత దశ’’ను కోరుతున్నాను .

మత్స్వప్నః (నా కల )సమాప్తం .అమ్మవారూ అయ్యవారూ ,కైలసానికి ,వ్యాసులవారు విష్ణు పదానికి చేరుకున్నారు .మనం ఈ కలలోంచి బయటపడి సదసద్వివేకులమవుదాం –స్వస్తి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 25-10-15

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

156-’’తన్మాయా మాయి ప్రతీక ప్రకారం –విశ్వం విశ్వం తావభివ్యాప్య సుస్థౌ

ఏతత్సర్వంస్థూల దేహేస్తిసౌక్ష్మాత్ –ప్రత్యక్షం తద్యోగిన స్సంవదంతి’’

తా-ఆ మాయ ,మాయి అవయవాల ప్రకృతే ఈ విశ్వం .ఆ ఇద్దరూ విశ్వమంతా నిండి ఉన్నారు .ఈ ప్రపంచంతా స్థూల దేహం లో సూక్ష్మం గా వ్యాపించి ఉంది .యోగ శాస్త్రానుభావం కలవారికి ఇది అనుభవైక వేద్యమే .అంటే ఈ శరీరం లో చూసి వారు సర్వ లోక వృత్తాంతాన్ని చెప్పగలరన్న మాట .

157-‘’ఆవిర్భూతా సైవ మాయా హ మత్రే-త్వం తర్జ్నానా ల్లోక మాతా శివావా

లక్ష్మీర్వాణీవాఫై యాకా చిదన్యా-సీతా దీనాంమాతృ తేత్ధం హి సిద్ధా’’

తా-ఆ మాయా దేవియే నేను .ఇప్పుడిక్కడ ఆవిర్భ వించాను అనే ఆనతరంగిక జ్ఞానం వలన పార్వతి అయినా ,లోక మాట కావచ్చు ,లక్ష్మీ దేవీ కావచ్చు నారోక రెవరైనా జగజ్జనని కావచ్చు .ఇలా సమన్వయము చేసుకొంటే సీతా ,రుక్మిణీ మొదలైన అవతార వ్యక్తులకు ,లోపాముద్రాది సిద్ధ స్త్రీ వ్యక్తులకు జగన్మాతృత్వం సిద్ధిస్తుంది .

158-‘’వైరాజీయా సృష్టి రేషాత్ర దృశ్యా –యుగ్మం వామస్తంబ పూర్వం స్వయం తత్

ఇచ్చా మాత్రా ఏష సృష్టిః పురాణీ-సూక్ష్మా సృష్టి ర్మాచ హైరణ్య  గర్భీ ‘’

తా-ఈ ప్రకరణం లో విరాట్ పురుషుని చేత చేయ బడిన సృష్టినే చూస్తున్నాం .మీ దాంపత్యం స్వయం సిద్ధమై ఆ రూపంగా పూర్వమే ఉంది .తలఛి నంతనే సంభ వించే పురాతన ఈశ్వర సృష్టి ,హిరణ్య గర్భుడు చేసిన సూక్ష్మ సృష్టి –రెండిటిలోనూ మీ దాంపత్యమే భాసిస్తోంది .

159-అస్మిన్పక్షే నిర్వివాదః ప్రసంగః –కాళీదాసో ప్యాహ పూర్వ ప్రసిద్ధం

మాతుర్భర్తా సౌ పితా భూత్పితుస్సా-పత్నీత్వా న్మాతా భవద్బ్రహ్మ శక్తిః’’

తా-ఇలా చేసిన ప్రసంగం అంటా వివాద రహితమైనది .కాళిదాస మహా కవి కూడా పూర్వ సృష్టి ప్రసిద్ధిని చెబుతూ తండ్రి భార్య తల్లి అనే చెప్పాడు .తల్లికి భర్త తండ్రి అవుతాడు .తండ్రిభార్య తల్లి అవుతుంది .అదే ఇక్కడ బ్రహ్మా, శక్తి.

160-‘’ఏకా మూర్తిస్సా త్రిదా భేద మాపే –త్యాహ స్మాసౌ కాళిదాస స్త్రి మూర్తీన్

తన్యాయే నైవాప సాపి త్రిదాత్వం –నానాత్వం వా నాత్ర చోద్యా వకాశః ‘’

తా-ఈ కాళిదాసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గూర్చి చెబుతూ అదొక్కటే స్వరూపం మూడు విధాల వ్యక్తీ భేదాన్ని పొందింది .ఈ ముగ్గురిలో వారు చేసే పనులలో హెచ్చు తగ్గులు ఉండచ్చు కాని స్వయం గా భేదం లేనివారే అని చెప్పాడు .ఈ పద్ధతిలోనే శక్తి కూడా కార్య వశాత్తు మూడు రూపాలు లేక నానా రూపాలు పొందింది .ఇందులో ఎవరూ ప్రశ్నించటానికి ఏమీ లేదు .

161-‘’అస్మన్యాతా పూర్వ మూద్వా చితంసా –హ్యస్మాన్సూతా నిర్వివాదో యమర్ధః

పూర్వం ద్రస్ట్రూణా మభా వాదవిత్తః-తత్సద్భావా దద్యవేద్యో వివాహః

తా-ప్రస్తుతానికి వద్దాం –మా అమ్మ జగన్మాత చిద్రూపాన్ని ముందే వివాహమాడి ,తర్వాతే మమ్మల్ని అందర్నీ కన్నది .ఇది వివాద రహితం .అప్పటి వివాహానికి సాక్షులు లేరు .ఇప్పుడు చూసే సాక్షులున్నారు .కనుక పార్వతీ పరమేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,మొదలైన వారందరి పెళ్ళిళ్ళు ఇప్పుడు తెలుస్తున్నాయి .

162-‘’భక్తోత్సాహా ద్వత్సరే వత్స రేవా –మాసే మాసే వాసరే వాసరేవా

మాతా పిత్రోర్నిత్య కల్యాణ మాసీత్ –అఘ్న్యే కస్మిం స్తచ్చతం వా సహస్రం ‘’

తా- ఆ దంపతులకు ఒక సారి పెళ్లి కాని ఇన్ని సార్లు పెళ్లిళ్ళా అనే అనుమానం వద్దు .భక్తుల ఉత్సాహం తో ప్రతి ఏడాది ,ప్రతి నెలా ,ప్రతి రోజూ ఆ పురాణ పుణ్య దంపతుల కు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భక్తితో చేస్తున్నారు .ఒక్కో సారి వందా, వెయ్యి కల్యాణాలను కూడా చేస్తున్నారు .

163-‘’ఇత్ధం గాదాయాః పురాణ ప్రసిద్ధా –యోగాత్సా౦ఖ్యా ద్వా ద శారీర కార్దే

తాన్సర్వా న్సమ్యక్సమర్దా భవంతి –తద్ద్రుస్ట్యా ర్యై ర్ముక్త మన్వేతు మర్హాః’’

తా-ఇలా పురాణ ప్రసిద్ధ కధలు ఎన్నో ఉన్నాయి .ఇవన్నీ యోగ మతం ,సాంఖ్య మతం లను అనుసరించి ,జీవుల మోక్ష ప్రయోజనానికి సర్వవిధాలా చక్కగా సమర్ధనీయం అవుతున్నాయి .పూజ్యులైన పెద్దలచేత పురాణాలను అన్వయింప జేసుకోవాలి .ఇదే ఉత్తమ మార్గం .

164-‘’ఏవం మూలాధార సంస్థం గణేశం –సర్వజ్ఞో సా వర్చ యామాస శర్వః

స్వస్యోద్యా ద్వాహే కాల యోగా త్కుమారం –పశ్చాదా విర్భా వ యామాస గౌరీ ‘’

తా-ఈ విధంగా సృష్టికి మొదట్లో ప్రతి జీవి మూలాధార చక్రం లో గణపతిని సర్వజ్ఞుడైన పర మేశ్వరుడు తన వివాహ సమయం లో పూజించాడు .లోకాలకు అవసరమైనప్పుడు పార్వతీ దేవి అతడిని తన కుమారుడిగా స్థూల దృష్టిలో కనిపింప జేసింది .

165-‘’శ్రీ కృష్ణ ద్వైపాయనర్షే నమాంసి-పాణిభ్యాం పాదావు పాదాయ కుర్వే

యద్వాత్వద్వా త్పాదాంత భూమౌ నిపత్య –సాస్టాంగ స్పర్శం నమామి ప్రసీద ‘’

తా-కృష్ణ ద్వైపాయన ముని శ్రేస్టా !నా రెండు చేతులతో నీ రెండు పాదాలనంటి నమస్కరిస్తున్నాను .ఒక విధంగా నీ పాదాలకు దగ్గర భూమిపై పడుకొని కరచరణాది అవయవాలు ఎనిమిది భూమికి తాకేట్లు నమస్కరిస్తున్నాను .అనుగ్రహించు మహాను భావా !

166-‘’త్వద్వా గంబోదేః పరం పారమేతు౦ –కోప్యేకో ప్యాలోక్యతే నో సమర్దః

మాతా స్వప్నవ్యాజతో వాచ యన్మాం-బాలోక్తీసశ్శ్రో  తు౦ హి కౌతూహలేన’’

తా-ఓ గుగ్గురూ !పరమమునీ !నీ పురాణ వాగ్దోరణి అనే సముద్రం యొక్క అవతలి ఒడ్డును చేరటానికి ఈ లోకం లో ఒక్కడు కూడా సమర్ధుడు లేడు.నేను నీ పురాణాలమీద సిద్ధాంతం చెప్ప గలిగే సమర్దుడినా !పిల్లల వచ్చీ రాని  మాటలు వినాలనే వేడుక గల తల్లి ఐన పరాశక్తి ‘’కల ‘’అనే వంక తో నన్ను ఇట్లా వాగించావు కదూ !

167-‘’మౌనిన్ తే త్రాకారణం త్వే తదర్ధం –దోషం త్యక్త్వా భాషితం మే శ్రుణుష్వ

శ్రుత్వా స్యాయా శ్ష్రావయా సాదు సాధూ –భీతో మాతుస్త్వాం శరణ్యం భజామి ‘’

తా-మునిముఖ్యా వ్యాసా !ఈ చిన్న విషయానికే నన్ను వీడు నన్ను పిలిచాడా అని తప్పు పట్టకుండా నే చెప్పేది విను .మంచి చెడు తేల్చు .తల్లి వలన భయం తో చనువుగా నిన్ను రక్షకుడిగా భావించి వేడు కొంటున్నాను .

168-‘’వేదే వాదే త్వ త్పరీ వాద బాదే –బోధ ప్రాయాం శేముషీం మే ప్రదేహి

స్వర్గే మోక్షేవాన్యన్య జన్మ ప్రసంగే –సాధ్వధ్వానంప్రాపయాస్తు ప్రణామః ‘’

తా-వేదం విషయం లో వాదం వచ్చినా ,నీ పురాణాల విషయం లో ఆక్షేపించే వాళ్ళ మాటలు వినాల్సి బాధ పడేటప్పుడు గాని సత్యమైన అర్ధాన్ని తెలుసుకొనే సద్బుద్ధిని నాకు ఇవ్వు .స్వర్గ మోక్షాల విషయం లో ,ఉత్తరజన్మ విషయ ప్రసంగాలలో  మంచి మార్గం లో నన్ను నడిపించు .నేను నీకేమి ఇవ్వగలను ?ఒక్క నమస్కారం సమర్పించటం తప్ప ?

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-15-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మోడీ తెచ్చిన”మనీ పాకేజ్ మ(మట్టి )నీ (నీరు )పాకేజ్ పై మంగు రాజ గోపాల్ హాస్య పేకెట్

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

136-‘’బాలా లాపాన్వత్స లత్వాన్నిశమ్య –భక్త్యా స్తిక్యా చ్చోచ్య మానాన్ మదీయాన్

పాపం భంక్త్వా యత్ప్రదేయం ప్రదేహి –మాతర్వ్యానం చాపి ప్రుచ్చా మితేగ్రే ‘’

తా-భక్తీ ,ఆస్తిక బుద్ధి లతో నేను పలికిన వెర్రి మొర్రి మాటలను బిడ్డమీద ప్రేమ ఉన్న తల్లిలాగా విని నా పాపాలు పోగొట్టి నాకేది ఈయాలని పిస్తే దాన్ని ఇవ్వు .నీ సముఖం లోనే వ్యాస భట్టారకునితో రెండు మాటలు మాట్లాడతాను .దాన్నీ విను తల్లీ !.

137-‘’స్వామిన్ వేదవ్యాస భట్టార కర్షె –సాక్షాద్విష్ణో  దేహిమే సంప్ర బోధం

శిష్యస్యాజ్ఞ స్యాత్మ వాణ్యాం పురాణ్యాం-మద్విజ్ఞానే నోచ్యమానం శ్రుణుష్వ’’

తా-వేదం విభజన చేసి ,సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన వ్యాస మహర్షీ !అజ్నుడైన ఈ శిష్యుడికి ప్రబోధం చేయి .నువ్వు చెప్పిన పురాణాలలో ,నా బుద్ధికి తోచిన వాటిని ప్రశ్నోత్తర రూపం లో విను .

138-‘’గౌరీ కళ్యానేర్చితో విఘ్న రాజ –ఇత్యాస్తే తేతత్పురాణ ప్రప౦చే

ఐతత్కాలం నో సజాతః కధం వా-కుర్వా తేస్మా మూ అజాతస్య పూజాం ‘’

తా-గౌరీకళ్యాణ  సమయం లో ఆ దంపతులు గణపతి పూజ చేశారని పురాణం లో ఉంది .అప్పటికి పార్వతికి గణపతి పుట్ట లేదు కదా .పుట్టని వాడికి పూజేమిటి మహాత్మా ?

139-‘’ఇత్యాదీ న్ప్రశ్నా న్సముత్దా పయంతి –లోకా స్తేషా ముత్తరం కిం వదామః

తూష్ణీం స్థాతుం శక్ను వంతో న కిం వా –వచ్మో యుక్తా యుక్తతే కః ప్రవేద ‘’

తా-ఇలాంటి ప్రశ్నలు లోకం లో కో కొల్లలున్నాయి .వాళ్లకు ఏం  సమాధానం చెప్పాలో తెలియటం లేదు .వాళ్ళ నోరు మూయించటానికి నాకు తెలిసిన సమాధానమేదో చెబుతున్నాను  .అందులో సత్యా సత్యాలు యుక్తా యుక్తాలు  నాకు తెలియదు .సత్యాన్ని తెలుసుకోవటం ఎవరి తరం ?

140-‘’శ్రుణ్వే తన్మే త్రోచ్య మానం సమాధిం –విష్ణ్వీశాది స్థూల సర్గో యదా భూత్

సర్వే దేవా స్సర్వ లోకా న్సమస్త౦ –భూత ప్రాయం భూత మే వేతి మన్యే ‘’

తా-నేను చెప్పే సమాధానం విను స్వామీ !శివ ,విష్ణు ,బ్రహ్మా దుల స్థూల దేహ సృష్టి ఎప్పుడు జరిగిందో ,అప్పుడే సర్వ లోకాలు ,సర్వ దేవతలు ,సమస్తభూత జాలం ఏర్పడింది ఒకదానినొకటి పోలి ఉన్నాయి .

141-‘’తుల్యే దేహే వ్యావహారం విహారం –లోకా యోగాః పారమార్ధం గృణంతి

యోగీంద్రాణాం సాను భూతిర్నవేద్యా –తే మన్యంతేస్మత్ప్ర వృత్తిం హి తుచ్చాం’’

తా-అందరి దేహాలూ ఒకటిగానే ఉన్నా ,లౌకికులు వ్యావహారిక విషయాలనే గ్రాహి౦చారు .యోగులు మాత్రం ఇందులో పారమార్ధిక మార్గాన్ని అనుసరించారు .యోగుల అనుభావమేమిటో మనకు తెలియదు కదా. మనం వాడుకొనే పధ్ధతి తుచ్చం అని వారి అభిప్రాయం .

142-బ్రహ్మాండం పిండాండ  కేత్రా స్తి గూఢం-షట్సప్తా స్టౌవాత్ర చక్రాణి సంతి

ఆదిక్షాంతా స్తద్దల స్థాహి దేవ్యః –మధ్యే సూక్ష్మా కుండలినాఖ్య శక్తిః’’

తా-ఈ స్వల్ప మానవ శరీరం లో బ్రహ్మాండం అంతా గూఢం గా ఉంది ఇందులోనే ఆరు ,లేక ఏడు లేక ఎనిమిది చక్రాలున్నాయి .ఆ చక్రాల దళాలలో అ నుండి క్ష వరకు అక్షరాలు అమ్రుతాది శక్తి రూపం లో ఉన్నాయి .ఈ చక్రాల మధ్య కుండలిని అనే శక్తిగల నాడి వ్యాపించి ఉంది .

143-‘’ఊర్ధ్వం వాలం శీర్ష మానీయ చాద –శ్శేతే స్మాకం పృష్ట వంశేషు సోహిః

యోగీడాయాం పింగలాయాం చ  వాయు –మా పూర్యాత్రో త్దాపయంత్య౦త రాతాం’’

తా- ఆ కుండలినీ శక్తి తకకి౦దు గా తోక పైకి ఉంచి మన వెన్నెముకలో నిద్రిస్తోంది .దాన్ని వెన్నుపాము అంటాము .యోగాభ్యాసం చేసేవాడు దానికి అటూ ఇటూ ఉండే ఇడ,పింగళఅనే నాడులలో గాలి గట్టిగా పూరించి ,మధ్యలోని కుండలినీ శక్తిని కదిలిస్తాడు .

144-‘’ఊర్ధ్వం శీర్షం వాల  మూలం తధాధః-క్రుత్వోత్తిస్ట త్యజ్జ్వలాత్మా సుసుమ్నా

వాయుర్వహ్నీ భూయ సాకం తయోద్యన్ –మూర్ధానం సన్నాద భీమం ప్రయాతి ‘’

తా-ఈ రెండు నాడులలో నిండిన గాలి ప్రేరేపి౦పగా తలపైకి తోక కిందికి ఉండేట్లుగా మహా ప్రకాశం తో ఆ కు౦డలిని జ్వాలలను ఎగిసేట్లు చేస్తుంది .ఆ గాలి అగ్ని రూపాన్ని పొంది ,సుషుమ్న తో ఎగసి నానా విధ నాదాలతో భయంకరంగా సాధకుని మూర్ధ స్థానానికి చేరుతుంది .

145-‘’’’తన్మార్గే చక్రాణి పశ్యేత్క్రమేణ –యోగీ భాగ్యా ద్రాజ మార్గే   నిశాయాం

గచ్చన్ దీపే నాట్ట కుడ్యే పతంతీం-చాయాం తత్రత్య  ద్రుమా దేర్య దా చ్ఛే’’

తా-ఇలా నాదమయం అయిన యా కుండలిని తో సహస్రానికి వెళ్ళే మార్గం లో రాత్రి వేళ దీపం తీసుకు పోతున్నప్పుడు దారిలో ఉన్న మేడల గోడల,పై చెట్ల నీడలు చూసినట్లు సాధకుడు అదృష్ట వశాన ఆ చక్రాలను దర్శిస్తాడు .

146-‘’మూలాధారం చక్ర మాదౌ తదీశో-విఘ్నేశాన స్తస్య పుష్టి ర్హి శక్తిః

చత్వార్యే తత్ప్ర కాణ్యే షు దేవ్యో –వశ్ష స్సస్తా వశిన్యాది సంజ్ఞా ‘’

తా-మొదట్లో మూలాధార చక్రం కని పిస్తుంది .దీనికి గణపతి అధికారి .గణపతి శక్తి’’ పుష్టి దేవి ‘’అనే పేరు కలది .ఇందులోని  నాలుగు దళాలలో  అవే’’ వ ,శ ష ,స ‘’అనే అక్షరాలు’’ వశిన్యాది ‘’శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటాయి .

147-‘’వాణీ బ్రహ్మాదిష్టితం యత్త దూర్ధ్వ్యం –స్వాధి స్టానం చక్ర మాస్తే షడశ్రం

బాలా ద్యంతా వర్ణకా స్త ద్దలేషు-బందిన్యాద్యా శ్శక్తయ స్సన్ని విస్టాః

తా-దానిపై సరస్వతీ శక్తి తో కలిసి బ్రహ్మ చేత అధిస్టిం ప బడిన ‘’స్వాదిస్టానం’’ అనే ఆరు దళాల చక్రం ఉంటుంది .ఆ దళాలలో ‘’బ ,భ ,అ ,య ,ర,ల ‘’అనే వర్ణాలు ‘’బందిన్యాది శక్తులు ‘’గా నిత్యం నిలిచి ఉంటాయి .

148-‘’తస్మా దూర్ధ్వం స్యా న్మణీపూరకాఖ్యం—లక్ష్మీ శ్శక్తిర్విష్ణు రత్రా ధి దేవః

డాద్యాః ఫాంతా అక్షరా అత్ర దేవ్యో –డాకిన్యా ద్యాస్స్యు ర్దశ స్వశ్ర కేషు ‘’

తా-దీనిపైన(నాభి దగ్గర ) మణిపూరకమనే చక్రం ,దాని అధిదేవత విష్ణువు ఉంటారు .ఇక్కడ లక్ష్మీ దేవియే శక్తి .ఈ కమల దళాలలో’’ డ,ఢ,ణ,త,ధ.ద,ధ,న,ప,ఫ’’అనే అక్షరాలూ 15దళాలలో’’ డాకిన్యాది శక్తులుగా’’ ఉంటాయి .

149-‘’తస్యాప్యగ్రే నాహతం ద్వాదశారం –శక్తిః పార్వత్యత్ర దేవా శ్శివ శ్చ

తస్యా రేషు స్యుః కఠాద్యంతవర్ణా-స్సర్వా దేవ్యః కాలరా త్ర్యాదయ స్తాః’’

తా-మణిపూరకం పైన హృదయ స్థానం లో ‘’అనాహతం ‘’అనే పేరుతొ 12అంచుల చక్రం ఉంది ..దీనిలో శక్తి పార్వతి శివుడు దేవుడు..దాని అంచులలో ‘’క ఖ ,గ ఘ ,జ్ఞ,చ, ఛ జ ,ఝ ,జ,ట,ఠ ‘’అనే ఆగమ ప్రసిద్దాలైన 12అక్షరాలుంటాయి .ఇవే’’ కాలరాత్రి’’ మొదలైన ఆగమ ప్రసిద్ధ  శక్తులు .

150-‘’కంఠ స్థానే షోడ శారం త దూర్ధ్వం –జీవో దేవః ప్రాణ శక్త్యా సమేతః

అశ్రేష్వస్య స్యు స్స్వరా స్షోడశర్ణా—స్తాఏ వైషాం శక్త యశ్చా మృతాద్యాః’’

తా-అనాహతం పైన క౦ఠ స్థానం లో (గడ్డం కింద )16అంచుల చక్రం ఉంది .దీని అధిదేవత జీవుడు ప్రాణశక్తితో ఉంటాడు .అంచులలో ‘’అ ,ఆ,ఇ,ఈ, ఉ, ఋ,ఋాఆలు ,ఆలూ ,ఎ,,ఏ ఐ, ఒ,ఓ,ఔ,అం,అః’’అనే 16అక్షరాలూ (అచ్చులు )’’అమృతం ‘’మొదలైన శక్తులుగా ఉంటాయి .

151-‘’ఆజ్ఞా చక్రం ద్వ్యశ్ర మంతర్భ్రువో ర్య-త్తస్మిన్నిచ్చా శక్తి రీశః పరమాత్మా

పత్ర ద్వంద్వే హ క్ష వర్ణౌక్షమావ –త్యేకాచాన్యా హంస వత్యేవ శక్తీ ‘’

తా-రెండు కను బొమల మధ్య రెండంచుల ‘’ఆజ్ఞా చక్రం ‘’ఉంటుంది .ఇందులో ఇచ్చయే శక్తి రూపంగా ఉంటుంది .దీనికి అధికారి పరమాత్మ .రెండు దళాలలో’’ హ ,క్ష’’అనే రెండక్షరాలుండి’’ క్షమావతి ,హంసవతి ‘’అనే శక్తులను కలిగి ఉంటాయి .

152-‘’మూర్ధ న్యాస్తేయం సహస్రార సంజ్న-శ్చక్ర శ్శ్శ్రేస్టో  మోక్ష శక్త్యా గురుశ్చ

సర్వే వర్ణాస్సర్వ దేవాస్స్వశక్తి- ప్రోతా స్స్ఫీతా అత్ర యోగా వసంతి .’

తా-‘’మాడు’’ లో ‘’సహస్రారం’’ అనే ఉత్తమమైన చక్రం ఉంది .ఇక్కడ’’ గురుమూర్తి’’ అధిస్టించి ఉంటాడు .అక్షరాలన్నీ తమ శక్తులతో కలిసి ,ఆయా దేవత లంతా ఈ చక్రం లో ఉంటారు .యోగాభ్యాసకులు ఇక్కడే నిద్రిస్తారు .

153-‘’దృశ్యాదృశ్యం చా స్టమం చక్ర మూర్ధ్వే –మూర్ద్నః పీఠే స్వాంగుళీ నాం చతుష్కే

ద్రష్టుం దూరాద్యోగినా మప్య శక్యం –శక్తి శ్శక్తో వా పరం బ్రహ్మ మూలం ‘’

తా-సహస్రారం పైన ఎవరి చేతి వ్రేళ్ళ తో నాలుగు అంగుళాల లెక్కలో బెత్తెడు దూరం లో ‘’పీఠం’అనే చక్రం ఉంది .సహస్రారం లో ఉన్న యోగులకు కూడా చూడశక్యం కానిది .ఇక్కడ సర్వ కారణమైన పర బ్రహ్మ స్వరూపం ఉంటుంది .అది శక్తియో ,శక్తి మంతుడో ఎవరూ చెప్పలేరు .

154-‘’తస్మిన్ దేశే శక్తి మచ్చక్త్య భేదాత్ –బ్రహ్మై వేదం శక్తి రేవే య మిత్ధం

ద్రష్ట్రూణాం ద్రుష్టి ప్రభే ధాన్మతాని –శాక్తే యాదీ న్యానిరాసన్ హితాని ‘’

తా-ఇక్కడ శక్తికి ,శక్తి మంతుడికి అభేదమే .దీనినే ‘’బ్రహ్మం ‘’అనీ ,’’శక్తి ‘’అనీ పిలుస్తారు .చూసే యోగుల దృష్టి భేదాన్ని బట్టి శాక్తేయం ,వైష్ణవం శైవం మొదలైన మతాలూ ఏర్పడ్డాయి .

155-‘’శక్త్యంశో మాతాత్ర తాతః పుమంశః –చిచిచ్చక్తీ అగ్ని శక్తీ వ రూఢే

సా మాయా మాయీ స కామేశ్వ రోయం –కామేశీ  సా పార్వతీ సా స ఈశః ‘’

తా-ఈ చక్రం లో శక్తి రూపంగా కని  పించే భాగం తల్లి .పురుష రూపంగా కనిపించే భాగం తండ్రి  .అగ్నీ దాని శక్తి ఐన వేడి లాగా చిద్రూపం, శక్తి రూపం గూఢ మైనవి .శక్తి రూపం’’ మాయ’’ .పురుష రూపం ‘’మాయి ‘’.మాయియే కామేశ్వరుడు .మాయ కామేశ్వరీ దేవి .కామేశ్వరే పార్వతీదేవి .కామేశ్వరుడే పరమేశ్వరుడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment