ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది .అప్పటి వరకు ఉన్న మూస పదబంధాలను త్రోసి రాజని కొత్త ఉదాత్త భావ జాలాన్ని చొప్పించాడు .నిత్య జీవిత విషయాలు కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పాటకజన పాటలు ,జానపద గీతాలు ,లయతో ఊగిపోయేట్లు రాశాడు .సైన్స్ ఆవిష్కరణలను కొత్త నాటక శైలిలో రచించాడు .డిగ్నిటి తోపాటు రౌడి యిజం కూడా ఏకకాలం లో కన్పించటం ప్రత్యేకత .ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రక్క కనిపిస్తూనే ప్రజాకవిగా వెలు గొందాడు .ఈ ద్విముఖ కవితా మార్గం ఆశ్చర్య పరచింది .’’The poet was essentially a wit after the caustic mockery of ‘’Law ‘’అనిపిస్తాడు అంటాడు గార్దేనేర్స్ .ఉదాహరణకు ఒక కవిత –

‘’Law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law is as you know I suppose –law is but let me explain it once more –law is the law ‘

సామాన్య లిరికల్ కవి మాత్రమే రాయగలిగిన ఒక లవ్ పోయెం రాసి మరీ ఆశ్చర్య పరుస్తాడు ఆడెన్ –

‘’Lay your sleeping head ,my love-human on my faithless arm –time and fevers burn away –individual beauty from –thoughtful children ,and the grave –proves the child ‘s ephemeral –but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty but to me –the entirely beautiful ‘’

ఆధునికకవులయిన  ఆడెన్ ఒక్కడే పాత ఫాషన్  బాల్లడ్ లో లేక విలానేల్లె లో భావ వ్యక్తీకరణ చేసే సామర్ధ్యమున్నవాడు .ఫ్రెంచ్ సంప్రదాయాలైన సేస్టినా మొదలైన ఫారంస్ లో కూడా ఆడెన్ ఒక్కడే ఇలాచేయగాలిగాడు .ఆడెన్ ఇంగ్లాండ్ లో అందరితో కలిసి పోయాడు .ఒక్కొసారీ ‘’మరీ ఎక్కువ భారం వేశాడు ‘’అనిపిస్తాడు .ఆడెన్ కవిత్వం లో ‘’A vitality ,an explosive violence ,that leaves his contemporaries dazed ‘’అన్నాడు స్పెండర్ .ముప్ఫై లలో ‘’ది డబుల్ మాన్ ‘’,’’ఫర్ ది టైం బీయింగ్ ‘’లలో ఆయన ఎంత విరుద్ధ భావ ప్రేరణ కవియో ,తన తరాన్ని ఎంత గొప్పగా ప్రబావితం చేశాడో తెలుస్తుంది .’’ది డబుల్ గేమ్’’  700 లైన్లు ఉన్న సుదీర్ఘ కవిత . ఇందులో ఆడెన్ మల్టిపుల్ మాన్ గా కనిపిస్తాడు అంటే-బ్రావేరాపెర్ఫార్మార్ గా ,ఫినికల్ క్రాఫ్ట్స్ మన్ గా జాంటి ఐకనో క్లాస్ట్ గా ,రిజర్వేడ్ క్లాసిసిస్ట్ గా కనిపిస్తాడన్నమాట .దీన్ని చూసి ఆయన మళ్ళీ లైన్ లో పడ్డాడని సమకాలీన కవులలో ప్రయోగ శీలి అని ,పోప్ మార్గ గామి అనిపిస్తాడు .కాని ‘’ది టెంపుల్స్ ‘’లో క్లాసిక్ కలోక్వియల్ లను కలిపి చాలా అందంగా  పారడాక్స్ గా రాశాడు.ఇదీ ,దీనితరువాత రాసిన వాటిల్లో ఒక అపూర్వతను సాధించాడు –అదే లైట్ వర్స్ కు ఆరేటరికి ,ఉన్నత భావాలకు ,ఉన్నత తీవ్రతకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి పారేశాడు .

ఇలియట్ కవిలాగా ఆడెన్ నిరాశా నిస్పృహ సంక్షోభాలను లతో కవిత్వం తో ప్రారంభించి,పరిపక్వత పొందాక తన స్వీయ భావ జాలం తో క్రూరత్వానికి నిరసనగా రాశాడు .మంచితనం లేని సౌందర్యాన్ని మెచ్చలేదు .గాయ పడిన మానవ హృదయ ఘోష వినిపించాడు .ఆధునిక మానసిక శాస్త్రాన్ని ,సాంఘిక శాస్త్రం తో జోడించాడు .ఇలియట్ పాత సంప్రదాయం లో పాతుకు పోతే ఆడెన్ భవిష్యత్తుపై దృష్టి నిలిపాడు .కొన్ని సార్లు సలహాలిచ్చాడు .మరికొన్ని సార్లు కర్క్ గార్డ్ ,ఫ్రాయిడ్ ,హెన్రి జేమ్స్ ,మాధ్యూ ఆర్నాల్డ్ ,యేట్స్ ,రిల్కే ,ఐన్ స్టీన్ ఎడ్వర్డ్ లియర్ ల  అవసర మూల విషయాలు అభి వర్ణించాడు .కాని వాటిల్లో పూర్తిగా మునిగి పోలేదు .ఇలియట్ రాసిన మాస్టర్ పీస్ ‘’వేస్ట్ లాండ్ ‘’లాంటిది ఆడెన్ రాయక పోయినా ఇలియట్ తర్వాత అంత ప్రభావం చూపిన కవిగా చరిత్రలో నిలిచి పోయాడు .దీనికి భౌగోళిక ,కవితాత్మక న్యాయం. ఉంది ఆడెన్ ఇంగ్లాండ్ లో పుట్టినా అమెరికాలో స్థిరపడ్డాడు .ఇలియట్ అమెరికాలోని మిస్సోరిలో పుట్టి ,బ్రిటన్ చేరి బ్రిటిష్ పౌరుడయ్యాడు .ఇలియట్ లాగానే ఆడెన్ సినిసిజం నుంచి మిస్టిజం కు ,నాగరకతా వ్యామోహాన్ని త్యజించి మత విశ్వాసానికి చేరువయ్యాడు .తన తరానికి ‘’ఏజ్ ఆఫ్ యాన్ క్సైటీ’’అని పేరుపెట్టి రాసిన దానికి పులిట్జర్ బహుమతి 1948లో  పొందాడు  .1940 నాటి భాషను వాడుతూ అందులోని వింతైన యాసకు ప్రాణం పోశాడు .ఇది పూర్వపు ఆంగ్లో సాక్సన్ రోజుల్లోకి తీసుకు వెడుతూ కొత్త అందాన్ని కల్పించింది

40 లలో ఆడెన్ రచయిత సంపాదకుడు కొల్లాబరేటర్ ,అనేక కవితా సంపుటుల నాటకాల ,వ్యాసాల కర్త అయ్యాడు .తన తర కవుల కు తన సామర్ధ్యం వలన శత్రువూ అయ్యాడు .అతని అభిమాన బృందాన్ని ‘’A circle of merchandising ,cooperative than a literary school ‘’అన్నారు ఈర్ష్యతో .మార్క్సిజం పట్ల ఆరాధన ఆయనలో ఎప్పుడూ పూర్తిగా పాదుకొని లేదు .మర్చేపోయాడు తర్వాత .పబ్లిక్ స్కూల్ బాయ్ గా ,గార్డెన్ పార్టీలతో జేరాల్ద్ హెర్డ్ తో కాలక్షేపం తో బి బి సి కి సైన్స్ పాప్యులరైజర్ గా ‘’అమెరికన్ హాలి ఉడ్ వీరీ రేలిజియాసిటికి ‘’వ్యాఖ్యానకర్తగా బిజీ బిజీ గా గడిపాడు .బారుగా ,స్ట్రా ఎల్లో రంగు జుట్టు తో ,తేలిక మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఒక’’ పక్ ‘’ అనిపించేవాడు ఈ పక్కిజమే అతని అభిమానుల్ని కలవర పరచింది .కవిత్వ టెక్నిక్ లో అనితర సాధ్యుడు ఆడెన్. చివరి రోజుల కవిత్వం ‘’నోన్స్ ‘’లో ‘’అనదర్ టైం ‘’లలో మానవత్వం పై మమకారం ,వినయం కనిపిస్తాయి .కోపం స్థానం లో జాలి చోటు చేసుకొన్నది .ప్రపంచ వికృత స్థితిపై రాసిన కవిత –

‘’Intellectual disgrace –stares from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’వేదనామయ కాలం నుండి ,చావు ఆలోచనలనుండి ఐక్యతా అనుభవం లోకి ప్రవేశించాడు .అతని ప్రస్తానం ‘’from doom is dark and deeper than any sea dingle ‘’నుంచి ‘’we must love one another and die ‘’లోకి ప్రవేశించింది .తన కాలపు కవుల్లో పూసల్లో మణి లాగా వెలిగాడు ఆడెన్ .యేట్స్ కవి మరణాన్ని భావ గర్భితంగా గొప్పగా వర్ణించాడు –

‘’in the deserts of the heart –let the healing fountain start –in the prison of the days –teach the free man how to praise ‘’

గడచిన రెండు శతాబ్దాలలో అమెరికా బ్రిటన్ దేశాల లో కవులు రెండు వందలకు పైగా ఉన్నారు .ఇందులో విస్మ్రుతులేవరో సంస్మ్రుతులేవరో కాలమే నిర్ణయించాలి .అందులో 16 గురుకవులు మాత్రం తమ కాలసమస్యల్ని ఒత్తిడులను తట్టుకొని నిలిచారు 20 వశతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాల తాకిడికి తట్టుకొని నిలిచింది .వీటివలన శాంతి యేర్పడ లేదుకాని ఘర్షణ వాతావరణం ఏర్పడింది .మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే భయం దేశాలమధ్య కొంత సయోధ్యతను చే కూర్చింది .సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ దోరో నమ్మినట్లు ‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every  one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలు ,లోపలి టెన్షన్ లకు గురైన వాళ్ళు .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు అలవికాక విసిరి వేయబడ్డారు .మరికొంత మంది పలాయనం చిత్తగించారు .నిలిచి వెలిగిన  ఆందోళన కాలపు  కవే ఆడెన్ .ఆధునిక మానవుని భయాందోళనలు ,కలవరం అసూయ నిరాశాలకు ఆడెన్ ప్రతి రూపమే అయ్యాడు .తనకాలాన్ని అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .

వ్యక్తిగా కవిగా తనకొక స్థానం కల్పించింది అమెరికాయే నన్నాడు ఆడెన్ ..అమెరికా తనను రాయటానికి ఆకర్షించిన దేశం అని మురిసిపోయాడు .అమెరికన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’పురస్కారం పొందాడు .అందులో సభ్యుడై గౌరవం పొందాడు కూడా .చాలా కాలేజీలు ,యూని వర్సిటీలలో బోధించాడు .1956 లో లండన్ వెళ్లి ఎమ్డెన్ గా లెక్చర్లిచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ‘’,’’ఎ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’గ్రంధాలు రాశాడు .’’ది ఎంచేఫ్ద్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు .కాల్రిడ్జి ,లూయీస్ మాన్లి ,హాప్కిన్ మేల్విల్లీ ,బాడర్లేర్ ,జూల్స్ వేర్న్స్ మొదలైన ప్రముఖులపై సాధికారిక ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,కర్క్ గార్డ్ ,పాస్కల్ ఓల్టేర్,మాంటేగ్ ఐన్ స్టీన్ లపై కమ్మని కవితలల్లాడు .’’కాదేదీ కవితను అనర్హం ‘’అని చాలా సార్లు రుజువు చేసి మన శ్రీ శ్రీకి దారి చూపాడు .న్యూయార్క్ లోని ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .ప్రేమ రాజకీయం ,మత౦  నీతి ,పౌరసత్వం ,సైకాలజీ లపై గొప్ప శైలీ టెక్నిక్ తో కవిత్వం రాశాడు .ఆయన భావాలపై ఎన్నో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీశారు .’’ఫునెరల్ బ్లూస్ ‘,అన్ నోన్ సిటిజెన్ ‘’,సెప్టెంబర్ ఫస్ట్ ‘’,రెఫ్యూజీ  బ్లూస్’’కవితలను ఇప్పటికీ జనం చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లోకి దూసుకు వెళ్లి ,ఆధునిక కవులలో శ్రేష్టుడు గా ఉన్నాడు ఆడెన్ .నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడు కాని అందలేదు .29-9-1973న 66 వ ఏట ఆస్ట్రియా లోని వియన్నా లో ఆడెన్ మరణించాడు .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు .20 వ శతాబ్దపు గొప్ప రచయిత అనిపించుకొన్న ఆడెన్ ‘’ఒపేరా లిబర్టోస్ ‘’రాసి బలంగా భావ ప్రదర్శన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్

     ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్

35 ఏళ్ళ లోపు విస్టన్ హఘ్ ఆడెన్ కలవరపరచే విషయమైనాడు .అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులా ఆయన అత్యంత ప్రభావం కలిగించాడు .ఆయన కవిత్వం ఒక మైలు రాయిగా ఉండటమే కాక ,ఒక అత్యంత గొప్ప మలుపు కూడా తిప్పింది .ఆధునిక కవులపై  రాసిన ఉద్గ్రంధం ‘’ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’గొప్ప విశ్లేషణాత్మకమైన గ్రంధం .దీని ఉప శీర్షిక ‘’కవిత్వ విముక్తి 1930-43 ‘’కూడా అంతటి ప్రాముఖ్యం పొందింది .దీన్ని బట్టి ఆయన ఒక యుగ కర్త అనిపిస్తాడు .

21-2-1907న ఇంగ్లాండ్ లోని యార్క్ లో ఆడెన్ జన్మించాడు తండ్రి రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ .హాల్ట్ లోని గ్రేషమ్స్ స్కూల్ లో చదివి,ఆక్స్ ఫర్డ్ లో క్రైస్ట్ చర్చ్ కాలేజిలో చేరి ,23 వ ఏటనుండి అయిదేళ్ళు మాల్వేర్న్ లోని స్కూల్ లో బోధించాడు ‘అతని ‘’ఓడ్  -టు మై ప్యూపిల్స్ ‘’లండన్ అంతా ప్రతిధ్వనించింది .మరుసటి ఏడాది ఒక ఫిలిం ఫర్మ్ లో పని చేశాడు .30 లో కింగ్స్ పోయెట్రి మెడల్ అందుకొన్నాడు . .స్పెయిన్ వెళ్లిస్పానిష్ విప్లవ సమయం లో  లాయలిస్ట్ లకోసం ఒక అంబులెన్స్ నడిపాడు .రెండేళ్ళ తర్వాత ఎరికా మాన్ అనే ధామస్ మాన్ కుమార్తెను పెళ్లి చేసుకొని అమెరికాకు తాను  రాసిందంతా తీసుకొని  వెళ్ళాడు .1946 లో అమెరికా పౌరుడయి ,అప్పటికే నాలుగు కవితాసంపుటులు ,మూడు నాటకాలు ,3 వచన సంపుటులు ,యాత్రపై రెండు, 3 ఆ౦ ధాలజీలు   రాసి  రచయితగా పేరొందాడు .

   ఆడెన్ మొదటి కవితా సంపుటి లోనే ఆయన కవితా చాతుర్యం మనసులోని ఫిలాసఫీ వ్యక్తమయ్యాయి .’’పాత ముఠా’’’ను నిర్దాక్షిణ్యంగా ఖండించాడు .వారికవిత్వం ఏడుపు గొట్టు ,విషాదభరితమన్నాడు.కాని తానూ కొత్త దారి తొక్క లేక పోయాడు .యుద్ధపు కరుకుదనం లో శాంతిలో అలక్ష్యం చేయబడిన వారి పక్షాన చేరాడు .వాళ్ళలో ఒకడు కాక పోయినా మనసారా సానుభూతి చూపాడు  .ఆయన పూర్తిగా పాల్గొనక పోవటానికి కారణం కవిత్వం లో బిగుసుకు పోవటం అడ్డంకి అయింది .తనకోసం తన చుట్టూ ఉండే కొద్ది మంది కోసమే ఆడెన్ రాశాడు అని ఆయనపై అభియోగం ఉంది .తన పరిధి దాటి ఇతరులతో కలవటానికి చేసే ప్రయత్నం ,అంతశ్శోధన ,అనిశ్చిత ముగింపు లు కనిపిస్తాయి .

Inline image 1

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2-చివరిభాగం

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241

89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2(చివరిభాగం 0

ఐక్యత ,ఒంటరితనం రెండూ ముఖ్యమైనవే అని కాని ప్రతిగంటకు అత్యవసరమైనవే అని సాత్రే అంటాడు ..’’అండర్ గ్రౌండ్  కార్యకలాపాలలో ఉన్నవారి పరి పోరాట స్థితులు కొత్త తరహా అనుభావాలనిచ్చాయి . .వాళ్ళు సామాన్య సైనికులు లాగా బయట పోట్లాడరు .అన్ని పరిస్థితులలోనూ వారు ఒంటరివారే .ఆ ఏకాంతం లోనే వేటాడబడి ,ఏకాంతంలోనే అరెస్ట్ అయినవాళ్ళు .పూర్తీ నిరాధార ,స్నేహరహిత౦గా హింస ,దౌర్జన్యాలలో నగ్నంగా ఏకాంతంగా అనుభవిస్తూ ,నున్నగా గొరగబడి ,బాగా తిండి పెట్టబడి ,మంచి వస్త్ర ధారణ తో ,బలిసిన ఒళ్ళు చూసుకొని మురుస్తూ కనిపించే ప్రతిదీ సరైనదిగా భావిస్తారు .ఒంటరిగా స్నేహ రహితంగా ,ప్రోత్సాహం కలిగించే  ఒక్కమాటా లేకుండా ,ఒంటరితనపు అగాదాల్లో ఇతరులను ఆ ఇతరులనే తమ కామ్రేడ్ లనే నిలవరించటానికి ఎదిరిస్తూ బతికారు .సంపూర్ణ బాధ్యతా సంపూర్ణ ఒంటరితనంలోనే .ఇదికాడా మన విముక్తి కి  నిర్వచనం ?వ్యక్తిగతంగా ,కమాండర్ ఇన్ చీఫ్ పరంగా రిస్క్ తోకూడిన సమానత్వాన్ని పొందుతున్న ఇలాంటి సైన్యం ప్రపంచం లో ఎక్కడా ఉండదు .క్రమశిక్షణలో అదే ప్రమాదం అదే పూర్తీ బాధ్యతా అదే త్యాగం ,అదే సంపూర్ణ స్వేచ్చ .ఈ విధంగా చీకట్లో ,రక్తం లో ఒక రిపబ్లిక్  సర్వశక్తి వంతమైన రిపబ్లిక్ ఏర్పడింది .స్వేచ్చలో తనకుతాను ఎంచుకొంటూ ,అందరి స్వేచ్చనూ ఎంచుకొన్నాడు ‘’అని రాశాడు సాత్రే .

   ఫ్రాన్స్ విముక్తమయ్యాక టీచర్ ,పోరాట యోధుడు అయిన సాత్రే మరింత శక్తి వంతమైన రచయిత అయ్యాడు. పోరాటం లో తానూ అనుభవించిన కస్టాలు బాధలు అన్నీ ఆయనకు బాగా గుర్తు ఉండిశారీరక మానసిక వేదనలను గ్రహించి మానవ సమాజ ప్రవర్తన ,వారి దయనీయ స్థితిగతుల పై రాశాడు .సానుభూతిలేని స్వచ్చతతతో మనిషి ఈ వేదనామయ ప్రపంచం లో తన ఉనికికి ఏదీ సహకరించని పరిస్థితులను అన్వేషించి రాశాడు .మనిషి స్వేచ్చాయుత మనసే అతని జీవితానికి దారి అన్నాడు .మనిషి నిరాశా నిస్పృహలను వేదనను ‘’ది ఏజ్ ఆఫ్ రీజన్ ‘’,ది రిప్రీవ్ ‘’,ది లాస్ట్ చాన్స్ ,నాసియా ‘’మొదలైన వాటిలో రాశాడు .నాటకాలుగా ‘’ది ఫ్లైస్ ‘’,నో ఎక్సిట్ ,లను నరకం భూమికగా రాసి ,ది రేస్పెక్ట బుల్ ప్రాస్టి ట్యూట్ ‘’మెలోడ్రామా రాశాడు ఇవన్నీ అభిమానుల్ని అలరిస్తే దియేటర్ వాళ్ళు అధిక్షేపించారు .38 వ ఏట సాత్రే తన ప్రముఖ ఫిలసాఫికల్ రచన ‘’బీయింగ్ అండ్ నాన్ బీయింగ్ ‘’రాశాడు .

 కరక్ గార్డ్ దృష్టిలో ఆదర్శ జీవితం అంటే నిరంతర అన్వేషణ ,దైవ సాక్షాత్కారానికి అనంత తపన .ఇద్దరికీ బహుదూరం కనుక జీవితమంతా కడగండ్ల అనుభవమై చివరికి దక్కుతుంది .దీన్ని సాత్రే పూర్తిగా వ్యతిరేకించాడు .అందుకే ‘’The self  that existentialism seeks is each person’s individual self ,which he must forge for himself out of such senseless circumstances ,such meaningless limitations as are given him .This self creation –the making of ones  essence from mere existence –is demanded by each of us because according to existentialism,there is no single essence of humanity to which we may logically turn as standard or model for making ourselves thus or so .And there is no single concept of humanity because there is no God ‘’అని వివరించాడు .

మనిషి  తను చేస్తున్నదానికి తానున్నదానికీ పూర్తీ  బాధ్యుడు .మనిషికి మించిన విలువలు లేవు .కనుక సమయ సందర్భాలను బట్టి తనకు కావలసింది ఎన్నుకొని తన మార్గం లో ప్రవర్తించాలి .హ్యూమనిజానికి మరోపేరు అస్తిత్వ వాదం .మనిషిమాత్రమే మూలమూ సృష్టికర్త అన్ని విలువలకు .మానసికంగా పరి పక్వం చెంది ముందుకు మానవుడు నడవాలి అని సాత్రే వేదాంత సారాంశం .ఎవరికి వారే స్వతంత్రులుకనుక వేరోకరిపై బలవంతంగా దేనినీ రుద్దరాదు .అయితే తన స్వేచ్చను ఆషామాషీగా భావించ కూడదు .స్వాతంత్ర్యం అంటే వరం కాదు అదొక భరించరాని బాధ్యత.ప్రపంచం లో మనిషి విరుద్ధ ద్వంద్వాలలో ఇరుక్కుని ఉన్నాడు .విముక్తికోసం నిరంతరం పోరాటం చేస్తాడు .అలారం గడియారాలు ,సైన్ బోర్డ్ లు ,పోలీసులు వంటివి భయపెట్టే ఎన్నో అడ్డంకులు .నాకు నేను తెలియబడితే వీటి అర్ధం తెలుస్తుంది ‘’అంటాడు సాత్రే .అస్తిత్వవాదం విరుద్ధత ఏమిటి అంటే జంకని పెసిమిస్ట్ మోరలిస్ట్ అవటం ,అన్నిటినీ కాదనే నిరీశ్వరవాది మాంచి ఆధ్యాత్మిక గురువు అవటం .అయితే సాత్రే మాత్రం ప్రపంచాన్ని ప్రశ్నించే ఎదిరించే వారి ప్రతినిధి .యంత్ర ఉత్పత్తికి ,మెటాఫిజిక్స్ కు వ్యతిరేకి .అందుకే ఆయనను ‘’ది ఎమోషనల్లి అన్ ఎంప్లా ఎడ్’’అన్నారు

 ఇంకా అసలైన అస్తిత్వ వాద సిద్ధాంతం ఏర్పడలేదు .ఎమిలీ జోల ,ఇబ్సెన్ ల కాలం నాటి నేచురలిజం ను మించినది అస్తిత్వవాదం .అస్తిత్వ వాదానికి కొన్ని మంచి లక్షణాలే ఉన్నాయి .కాని దాని అచేతనత్వమే అందర్నీ భయ పెడుతోంది .అది అచేతనత్వానికి విరుగుడు మాత్రం కాలేక పోయింది .విశ్వ వ్యాప్త రుగ్మత పై అది కొత్త మతాన్నికాని స్పష్టమైన మానవ జాతి ని కాని  నిర్మించ లేక పోయింది  .కాని ప్రపంచ వ్యాప్త వేదనను అస్తిత్వ వాదులు అర్ధం చేసుకొన్నారు .

సాత్రేకు సైమన్ డీ బోవియర్ తో సన్నిహిత సంబంధాలుండేవి .ఇద్దరూకలిసి సాంఘిక  సాంస్కృతిక భావాలను ఎదిరించారు .19 64 లో సాత్రేకు సాహిత్యం లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తే తీసుకోవటానికి తిరస్కరిస్తూ ‘’A writer should not allow himself to be turned into an institution ‘’అన్నాడు .తనకు అధికారిక మర్యాదలు ఇష్టం లేదన్నాడు .పారిస్ లో 15 -4-1980 న 74  వ ఏట జీన్ పాల్ సాత్రే జీవన యాత్ర ముగించాడు .

In 1975, when asked how he would like to be remembered, Sartre replied:

I would like [people] to remember Nausea, [my plays] No Exit and The Devil and the Good Lord, and then my two philosophical works, more particularly the second one, Critique of Dialectical Reason. Then my essay on Genet, Saint Genet…. If these are remembered, that would be quite an achievement, and I don’t ask for more. As a man, if a certain Jean-Paul Sartre is remembered, I would like people to remember the milieu or historical situation in which I lived,… how I lived in it, in terms of all the aspirations which I tried to gather up within myself.[52]

గుస్తేవ్ ఫ్లాబర్ట్ జీవిత చరిత్ర రాశాడు సాత్రే .సాత్రేను  పబ్లిక్ ఇంట లేక్త్యువల్ అంటారు వామభావ పక్షపాతి .దాదాపు ఇరవైకి పైగా కల్పనా సాహిత్య పుస్తకాలు ,,10 ఫిలసాఫికల్ వ్యాసాలూ ,4 జీవిత చరిత్రలు ,15 విమర్శన వ్యాసాలూ రాశాడు

The war opened Sartre’s eyes to a political reality he had not yet understood until forced into continual engagement with it: “the world itself destroyed Sartre’s illusions about isolated self-determining individuals and made clear his own personal stake in the events of the time.”[70]Returning to Paris in 1941 he formed the “Socialisme et Liberté” resistance group. In 1943, after the group disbanded, Sartre joined a writers’ Resistance group,[71] in which he remained an active participant until the end of the war. He continued to write ferociously, and it was due to this “crucial experience of war and captivity that Sartre began to try to build up a positive moral system and to express it through literature”.[7

Inline image 1  Inline image 2

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్—2-8-16-ఉయ్యూరు

స

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240

89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే

ఫ్రెంచ్ నాటక నవలా  కర్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ,జీవిత చరిత్రకారుడు ,అస్తిత్వ వాద ద్రుగ్విషయ వాదసిద్ధాంత మూల పురుషులలో ఒకడు ,20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఫిలాసఫీ మార్క్సిజం లో నిష్ణాతుడు జీన్ పాల్ సాత్రే .ఆయన రచనా ప్రభావం సోషియాలజి,,క్రిటికల్ దీరీ ,పోస్ట్ కలోనియల్ దీరీ ,లిటరరీ స్టడీస్ ల పై గొప్ప ప్రభావం చూపాయి .

సోరెన్ కర్క్ గార్డ్ ఫిలాసఫీ అనేక విరుద్ధ విషయాలను ప్రతిపాదించింది .ముఖ్యంగా మానవుడు దేవుని సమీపిస్తున్నకొద్దీ శూన్యం దగ్గరకు చేరతాడు ,ఈ శూన్యం అతని అస్తిత్వ వాదసాఫల్యమే .కర్క్ గార్డ్ మరణించిన వందేళ్ళకు మానవ అస్తిత్వ సమస్య ఆధునిక యుగం లో రెండు విభిన్న సిద్ధాంతాలకు దారి తీసింది .అందులో మొదటిది –మానవునికి ప్రాధమికంగా విశ్వాసం ఉండాలని మత సాంప్రదాయాలను పాటించాలన్నది ,దాని సారాంశం గ్రహి౦చాలన్నది . రెండవది –అసలు దేవుడూ గీవుడూ’’ జంతా నై ‘’అంటూ  అన్ని సువార్తలను ,మెటా ఫిజికల్ జ్ఞానాలను పూర్తిగా తిరస్కరించి అస్తిత్వ వాదననే నమ్మటం అనేది .రెండవ సిద్ధాంతానికి మళ్ళీ రెండు భిన్నమార్గాలు ఏర్పడి విమర్శకులు కూడా రెండు గుడారాలలో చేరారు .ఫిలాసఫీలో కొత్త నిష్క్రమణ అని ,అసలు ఫిలాసఫీ  తిరస్కరించటమేనని ,అన్నారు .కొత్త విభేదం వచ్చినప్పుడల్లా అస్తిత్వ వాదం మహా వేగంగా పెరిగింది .దాని మూల ద్వేషం నిరాశ మూలాలపై ఆధార పడింది .1940 లోరెండవ ప్రపంచ యుద్ధం తో ఏర్పడిన  ఆశారాహిత్యం తో  ఇది వెంటనే ప్రాభవం పొంది౦ది .దీనికి ప్రేరణ జీన్ పాల్ సాత్రే వల్లనే జరిగింది .

 5-6-1905న పారిస్ లో జన్మించిన సాత్రే బాల్యం నుంచి ఫిలాసఫీ ని ఇష్టపడటం విశేషం .ఈకోల్ నార్మేల్ లో చదివి 25 ఏళ్ళకే డిగ్రీ పొంది ,పారిస్ లోని లీ హార్వే ,లయాన్ లలో ఫిలాసఫీ బోధించాడు .30 లలో జర్మని ,ఇటలి స్పెయిన్ ,గ్రీస్ ,ఇంగ్లాండ్ లలో పర్యటన చేసి,రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఆర్మీలో చేరాడు .1939 లో ఆల్సేస్ లోఆర్టిలరి అబ్సర్వర్ గా  ఉన్నాడు .ఏడాది తర్వాత బందీ అయి జర్మన్ జైలు లో 9 నెలలు గడిపాడు  .ఎలాగోలాతప్పించుకోనిఫ్రాన్స్ అధీనంకాని జోన్ కు చేరి ,35 వ ఏట టీచింగ్ చేశాడు .నాజీ ప్రభుత్వం ఫ్రాన్స్ దేశాన్ని కబళించినప్పుడు సాత్రే పారిస్ లోనే ఉండిపోయి అండర్ గ్రౌండ్ లో రెసిస్టన్స్ మూవ్మెంట్ ‘వాళ్లకు రిస్క్ తీసుకొని సహాయం చేశాడు .

ఈ పరిస్థితులోనే  సాత్రే తన స్వంత’’ పారడాక్స్ ఫిలాసఫీ ‘’పై ఆలోచించి రూపు దిద్దాడు.ఇందులో ముఖ్య విషయం ‘’బయటి అణగార్చే తనం వలననే విముక్తి  శక్తి ఏర్పడుతుంది .అది మానవులోని లోపలి మనిషిని తనకు రోజూ ఏదికావాలంటే అది చేసుకోనేట్లు చేసి తెగించే నిర్ణయాలను చేయిస్తుంది .సాత్రే ‘’రిపబ్లిక్ ఆఫ్ సైలెన్స్’’గ్రంధం రాశాడు .ఇందులో ‘’జర్మన్లు ఆక్రమించినప్పుడు మేము పొందిన స్వేచ్చ అంతకు ముందు ఎప్పుడూ పొందలేదు మా హక్కులన్నీ హరి౦చేశారు .మాట్లాడే హక్కుతో సహా .ప్రతి రోజు మమ్మల్ని మా ముఖమీదే అవమానిస్తున్నారు .వాటిని మేము మౌనంగా భరించాం ఏదో ఒక నెపంతో వర్కర్లుగా జ్యూలుగా రాజకీయ ఖైదీలుగా మమ్మల్ని సామూహికంగా దేశంనుంచి బహిష్కరించారు .నోటీస్ బోర్డు లపైనా , వార్తాపత్రికలలో ,సినిమాహాళ్ళలో మమ్మల్ని అతి నీచంగా అవమానకరంగా చిత్రింఛి మేము ఆ అణగార్చే ముఠాకు లొంగి పోయేట్లు,వాళ్ళ మాట వినేట్లు  చేసే ప్రయత్నాలన్నీ చేశారు .అందుకే వీటన్నిటి వలన మేము ఫ్రీగా ఉన్నాం .నాజి విషం మా ఆలోచనల్లోకి ఎక్కిపోయింది .ప్రతి సరైన ఆలోచనా ఒక విజయమే అయింది .అన్నిరకాల అంతమంది పోలీసులు మా నోళ్ళు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేసినా ,మా లోంచి వచ్చిన ప్రతిమాట ఒక సిద్ధాంత విలువగా ప్రకటిత మైంది .మమ్మల్ని వేటాడి పడ గొట్టటం వలన ,మాలోని ప్రతి కవళికఒక గట్టి  నిబద్ధతకు బలాన్నిచ్చింది .’’అంటాడు తీవ్ర స్టాయిసిజం తో .’’వాళ్ళ హింసలు ,దౌర్జన్యదురాగతాలు కూడా మాకు హాయిగా జీవించే స్థితి కల్పించాయి .భ్రమ ,అబద్ధపు అవమానం ,భయంకర బతకలేనితనం అన్నీ మాకు మానవ అదృష్టంగా కలిసి వచ్చాయి ‘’అన్నాడు సాత్రే .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-8-16-ఉయ్యూరు  

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )

మూడవ ఇంటర్నేషనల్ నుండి 1927 లో  చాంగ్ కై షేక్ విడిపోయి కమ్యూనిస్ట్ లతో కలిసిపోయినప్పుడు మాల్రక్స్ యూరప్ తిరిగి వెళ్లి పోయాడు .అక్కడ చేతులు ముడుచుకొని కూర్చో లేదు .యాంటి ఫాసిస్ట్ ఉద్యమ నాయకుడై ,యూరప్ లోని అండర్ గ్రౌండ్ వర్కర్లకు ,అన్ని ప్రదేశాలలోని ‘’సామాన్య జన సమూహానికి సేవ చేయటానికి అంకితమయ్యాడు.’’డే ఆఫ్ రాత్’’లో ఫాసిజం సమస్యను నాటకీయం గా రాశాడు .ఇది మాన్స్  ఫేట్ కంటే విపరీతంగా కిక్ అయింది .ఇందులో కేంసేన్ పాత్ర అండర్ గ్రౌండ్ జర్మన్ మనిషి .కమ్యూనిస్ట్ ల జాబితాను ఇవ్వమని ఆయన్ను అడిగినప్పుడు తిరస్కరిస్తేతొమ్మిది రోజులు కటిక చీకటి  జైలులో పెట్టారు ఎవరో ఒక బకరా కమ్యూనిస్ట్ తానె కాస్నేర్ అని ఒప్పుకున్నందున అసలు వాడిని విడుదల చేశారు .. మాల్రక్స్ సాంఘిక సేవ పేపర్లకే పరిమితం కాలేదు .పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఆవేశంగా నాజియిజం నిజాన్ని గురించి ,ముసోలిని బ్లాక్ షర్ట్  సాహసాల గురించి మాట్లాడే వాడు .అబిసీనియా పై క్రూర దాడిని నిరసించాడు .’’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైటర్స్ ’’సంస్థను సంస్కృతీ పరిరక్షణకోసం ఏర్పరచాడు .

1936 లో మాల్రక్స్ మళ్ళీ విప్లవోద్యమ౦లో చురుకుగా పాల్గొన్నాడు .స్పెయిన్ కు ఫ్రాంకో డిక్టేటర్ అయినప్పుడు మాల్రక్స్ లాయలిస్ట్ లతో కలిశాడు .ఒక విమానం తీసుకొని మాడ్రిడ్ వెళ్లి విమానం నడిపే అనుభవం ఎక్కువ గా లేకపోయినా ధైర్యంగా ఫాసిస్ట్ సామ్రాజ్యం పై 65 దాడులు చేశాడు .ఆ దాడిలో రెండు సార్లు గాయ పడ్డాడు .స్పెయిన్ ముందుకు దూసుకు రాకుండా ఆపగలిగాడు .ఫ్రాన్స్ ,అమెరికాలలో ప్రయాణించి లాయలిస్ట్ లకు అండగా నిలవాలని ఆదేశాలను ఒప్పించి వారికి ధనసహాయం కోసం విరాళాలు సేకరించాడు .స్పానిక్ సివిల్ వార్  మొదటి దశ విషయాలన్నిటిని ‘’మానస్ హోప్స్ ‘’లో రాశాడు .వీదియుద్దాల భీభత్సం ,సాయుధ శ్రేణుల వీరోచిత పోరాటం అసలైన హీరో అయిన రిపబ్లిక్ ఆర్మీ విషయాలను చాలా ఖచ్చితంగా వర్ణించాడు .అనేక మంది ఇతర రచయితలలాగా రెండు పడవలలో కాళ్ళు పెట్టాడు అన్నారు .

మాల్రక్స్ కు ఈ మారటాలు మామూలే .స్టాలిన్ ను కొన్ని రోజులు ట్రాట్ స్కి ని కొన్ని రోజులు సమర్ధించాడు .మార్క్సిస్ట్ ల విజయోత్సవాలను ,వాళ్ళ పరాజయపరంపరాలను చూశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో టాంక్ దళం లో పేరు నమోదు చేయించుకొని ,అరెస్ట్ అయి ,తప్పించుకొని ,అండర్ గ్రౌండ్ మార్క్విజ్ ల తో చేరి పనిచేశాడు .యుద్ధం పూర్తీ అవగానే మాల్రక్స్ పూర్తీ రైటిస్ట్ ప్రభుత్వాన్ని సమర్ధించి తన అభిమానుల్ని అనుచరుల్ని విపరీతంగా ఆశ్చర్యం లో పడేశాడు .నియంత చార్లెస్ డిగాల్లీ ని సమర్ధించటం మరీ విడ్డూరం అని పించింది .విప్లవవాది డీగల్లీకి వ్యతిరేకి అయి యుద్ధాన్ని ద్వేషించాడని ఆయన యుద్ధ ప్రేమికుడని నింద మోపినప్పుడు మాల్రక్స్ ‘’నేను మారలేదు ప్రపంచం మారింది ‘’అని సమాధానమిచ్చాడు .బాహ్యంగా ఆయనలో పెద్ద మార్పేమీ లేదు .50 ఏళ్ళ వయసులో ఆయన నీలి కళ్ళు ఇంకా జ్వలిస్తూనే ఉన్నాయి .జుట్టు నల్లగా నిగ నిగ లాడుతూ ,మూతి మాత్రం ఇదివరకటి కంటే బిగుసుకు పోయి కనిపించాడు .

భార్య క్లారాతో వివాహ జీవితం సమాప్తమై విడాకులు తీసుకొన్నారు .రచయిత్రి జోసేట్టి  క్లోటిస్ ను పెళ్ళాడాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .ఆమెరైలు ప్రమాదం లో చనిపోయింది .మూడో పెళ్లి హాఫ్ బ్రదర్ రోలాండ్ భార్య మేరీ మెడలీన్ ను చేసుకొన్నాడు .రోలాండ్ గెస్టపోలో ,మరో హాఫ్ బ్రదర్ క్లాడ్  రెసిస్టన్స్ మూవ్ మెంట్ లో చనిపోయారు .1953 లో అ౦తగా ఉత్తేజం ఇవ్వని ‘’ది వాయిసెస్ ఆఫ్ సైలెన్స్ ‘’ప్రచురించాడు .మనిషి ,అతని ఆర్టిస్టిక్ కళా చిత్రాన్ని నియో లిథిక్ కాలం నుంచి ఆధునికకాలం వరకు రాసి ‘’ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ‘’పేరుతొ ప్రచురించాడు .’’All art Malraux implies is a revolt ,a protest against extinction ,a rebellious act against death and man’s tragic mortality .మాల్రక్స్ద్రుస్తిలో కళ కదా అంటే మనిషి కద కూడా .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో మాల్రక్స్ చివరి నవల ‘’ది స్ట్రగుల్ విత్ ది ఏంజెల్ ‘’రాశాడు .యుద్ధం తర్వాత ప్రెసిడెంట్ డీగల్లి 1945 లో మాల్రక్స్ ను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ను చేశాడు .సైకాలజీ ఆఫ్ ఆర్ట్ పై మూడు పుస్తకాలు రాశాక మూడిటిని కలిపి కొంత మార్చి ఒకే పుస్తకంగా తెచ్చాడు .1958 లో దీగాల్లి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక మాల్రక్స్ ను మొట్టమొదటిసారిగా కల్చరల్ ఎఫైర్స్ మినిస్టర్ ను చేశాడు .నల్లకప్పేసిన పురాతన ఫ్రెంచ్ బిల్డింగ్ లను శుభ్రపరచి రంగులతో శోభాయమానం చేశాడు .ఫ్రాన్స్ దేశ జాతీయ వారసత్వాన్ని కాపాడే అనేక చర్యలు తీసుకొన్నాడు .1957  లో ‘’మెటా మార్ఫసిస్ ఆఫ్ ది గాడ్స్ ‘’మూడు భాగాలలో మొదటిది  ప్రచురితమైంది .మిగిలిన రెండు భాగాలు ఆయన మరణానంతరం వెలువడ్డాయి .బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని మాల్రక్స్ సమర్ధించాడు .1971 లో భారత ప్రధాని ఇందిరా గాంధి పారిస్ సందర్శించినప్పుడు మాల్రక్స్ ఆమెతో బంగ్లా దేశ సమస్యను చర్చించాడు .యుద్ధానంతరం పాక్షిక జీవిత చరిత్రభాగాలు రాసి ప్రచురించాడు .పారిస్ దగ్గర క్రిటేల్ లో 23-11-1976 న మాల్రక్స్ 75 వ ఏట మరణించాడు .

మాల్రక్స్ అనేక అవార్డ్ లు పొందాడు అందులో ముఖ్యమైనవి –ప్రిక్స్ కాన్కర్ట్ అవార్డ్ ,మేదేల్లె డీ లా రెసిస్టన్స్ ,టాక్స్ డీ గేర్రే .అంతర్జాతీయ మాల్రక్స్ సొసైటీ అమెరికాలో ఏర్పడి౦ది .పారిస్ లోనూ ఇలాంటి సంస్థ ఏర్పడింది .మాల్రక్స్ కొటేషన్ లు కొన్ని చూద్దాం –

1-      man is dead ,after God .

2-      the artist is not the transcriber of the world ,he is its rival

3-      what is man ? a miserable little pile of  secrets .

4-      Art is an object lesson for the gods

5-      The art museum is one of the places that give us the highest idea of man .

మాల్రక్స్ దాదాపు 20 గ్రంధాలు రాశాడు .

Inline image 1
Inline image 2

సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-16 –ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238

88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్

యాభై రెండేళ్ళ వయసులో నవలాకారుడు రాజకీయ వేత్త ,వామ భావాలనుండి,రియాక్షనరి కుడి భావాలకు మారి ,అమెరికా వెళ్లి రాజకీయాలు మానవ మనుగడను భయపెట్టిబెదిరిస్తున్నాయని ,కళ ఒక్కటే అందర్నీ కలిపి ఉంచే ఏకైక సాధనాం అని చెప్పిన వాడు ఫ్రెంచ్ నవలా కారుడు  ఆండ్రే మాల్రక్స్ .ఈ విషయాన్ని తన ‘’ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ‘’మ్యూజియం వితౌట్ వాల్స్ ‘’లో చెబుతూసంపూర్ణ కళ తప్ప  అన్ని సంపూర్ణ విషయాలు అదృశ్యమైపోతాయి అన్నాడు.నూతన మానవత్వం ,ఆధ్యాత్మిక వాస్తవం ,కళ  ‘’నూతన మతంలో ఒక భాగం .ప్రతి ఉద్గ్రంధమూ  సూటిగానో ,బహిర్గాతంగానో గుడ్డి విధి పై మానవ విజయాలను తెలియ జెప్పేవే .కళాకారుడు తన శక్తితో తెలుసుకొని ఆవిష్కరిస్తాడు .దానికి మానవత్వ పలుకుబడిని కలిగిస్తాడు .కాల గర్భం లో కలిసి పోకుండా నిలిచినా అవన్నీగడచి పోయిన  మానవ నాగరకత యొక్క లోపలి స్వరాలే (ఇన్నర్ వాయిస్ ).ఈ సజీవ ,ఇంకా అమరం కాని  దేవతలను చేరే స్వరం దాని సాఫల్యత కోసం అవిశ్రాంత మరణ వాద్య బృందమే అవుతుంది .అన్ని నాగరకతల కళ లో ఇది సర్వ సాధారణం .అది దైవ ఘటన కు వ్యతిరేకమైన రక్షణనె వ్యక్త పరుస్తుంది ‘’అన్నాడు మాల్రక్స్ .

  మాల్రక్స్ చెప్పే ‘’డిఫెన్స్ ఎగైనెస్ట్ ఫెటాలిటి’’అతనిలో భిన్న రూపాలద్వారావ్యక్తమైంది .అనేక జీవుల ఉద్ధరణకు దారి తీసింది .3-11-1901 న మాల్రక్స్ పారిస్ లో పుట్టాడు .తండ్రి సమర్ధుడైన సంపన్నుడైన సివిల్ ఉద్యోగి .కొడుకు ఉన్నత విద్య లో  రాణించాలనుకొన్నాడు .లైసె కాండో ర్సేట్ లో క్లాసిక్స్ చదివి పారిస్ స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరి సంస్కృత ,చైనా భాషలతో పాటు ఆర్కియాలజీ కూడా క్షుణ్ణం గా నేర్చాడు .ఇరవై వ ఏట మొదటి వచన పద్యాన్ని రాసి ప్రచురించాడు .జర్మన్ జ్యూయిష్ ఫైనాన్సేర్ కూతురు క్లారా గోల్డ్ ష్క్మిత్ ను పెళ్లి చేసుకొన్నాడు .23 వ ఏట ఇండో చైనాకు తండ్రితో వెళ్లి ఆర్కియాలజికల్ పరిశోధనలో గడిపాడు .పురాతన స్థలాలను త్రవ్వించి శిధిల దేవాలయాలను ,భూ గర్భం లోని బౌద్ధ శిల్పాలను వెలికి తీయించాడు .ఏడాది కాలం ఈ పనిలో గడిపి గతం పై బోర్ కొత్త వర్తమానం పై అభిరుచితో కాలనీ ప్రజల స్థితి గతుల అన్వేషణలో పడ్డాడు .’’అన్నమైట్ తిరుగు బాటు ‘’కు ఆకర్షితుడై ‘’అన్నాం లీగ్ ‘’లో చేరి దాని స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి అయ్యాడు .చైనా సరిహద్దు దాటి లోపలి ప్రవేశించి మాల్రక్స్ రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయాడు .1925 నేషనల్ లిబరేషన్  ఉద్యమం లో పాల్గొని సన్యట్ సేన్ స్థాపించిన కోమిటాంగ్ లో చేరి అసోసియేట్ సెక్రెటరి జనరల్ అయ్యాడు .చాంగ్ కై షేక్ సహ సభ్యుడుగా ఉన్న కమిటీ ఆఫ్ ట్వెల్వ్ లో పని చేస్తూ కాంటన్ తిరుగు బాటులో పాల్గొని కోమిటాంగ్ కు కమ్యూనిస్ట్ పార్టీ ల సయోధ్య కుదిర్చాడు .అతని వాగ్ధాటి ,ఉత్సాహం గుర్తింప బడి క్వా౦ టంగ్ క్వాన్ గ్సి ప్రాంతాల ప్రాపగాండా కమీషనర్ గా నియమింప బడ్డాడు .26 వ ఏట పూర్తీ తిరుగు బాటు దారుడని పించుకొన్నాడు .

   ఇండో చైనా ,షాంఘై ,హాంగ్ కాంగ్ లలో చూసిన దారుణ పరిస్థితులన్నీ మొదటి మూడు నవలలో చేరాయి అధికారానికి డిమాండ్ లు దానికోసం కార్యా చరణ వీటిలో కనిపిస్తాయి .’’ది కాన్కరర్స్ ‘’లో హీరో చైనాలో సోవియెట్  ప్రతినిధి .19 25 లో హాంగ్ కాంగ్ సమ్మె కు ప్రాపగాండా చేస్తాడు .దీన్ని ట్రాట్స్కి ‘’romanticized chronicle of revolution ‘’అన్నాడు .కాని మాల్రక్స్ అది వ్యక్తికీ సామూహిక చర్యకు ఉన్న సంబంధమేకాని సామూహిక చర్య మాత్రమే కాదు అన్నాడు .ఏడాది తర్వాత వచ్చిన ‘’ది రాయల్ వే’’లో కంబోడియాలోని పురాతత్వ విషయాలు న్నా అందులో మాల్రక్స్ ఏకాకి జీవితం ,మావుడు చావును జయి౦చలేని  స్థితి ,దానిపై తన అజాగ్రత్త వినాశకర శక్తి తో పోరాటం ఉన్నాయి .

మూడవ నవల ‘’మానస్ ఫేట్ ‘’మాల్రక్స్ ను అంతర్జాతీయ వ్యక్తిని చేసింది .మాస్టర్ పీస్ అనే పేరొచ్చింది .కాన్కోర్ట్ ప్రైజ్ సాధించింది .అన్ని జీవద్భాషలలోకి తర్జుమా అయింది .హెమింగ్వే లాగానే మాల్రక్స్ కూడా చావు ,హింస లానే ఎంచుకొన్నాడు .హెమింగ్వే లా కాక ప్రతి చర్యను సమర్ధించాడు దానికి కారణాలు అన్వేషించి చెప్పాడు .జనరల్ చాంగ్ కై షేక్ కు ,కోమిటాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ కి మధ్య జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని నేపధ్యంగా రాసిన నవల ఇది ‘.షాంఘైలోని19 27 నాటి రెండు రోజుల  సంక్షోభాన్ని చాలా అన్వేషణాత్మకంగా ,నాన్యతో దర్శనీయంగా రాశాడు .’’డాస్టోవి స్కి ,గోర్కీ ల తర్వాత ఇంత వివరంగా ప్రజా సంక్షోభాన్ని వర్ణించిన పుస్తకం ఇదే ‘’అన్నాడు ఫిలిప్ హే౦ డేర్సన్..’’Malraux  ‘s people  are however not merely the products of their environment ,bitterly fighting their way to opposite goals but shares a philosophy –an acceptance of cruelty and its barriers against communication ,a determination to force the moment to its utmost ,and desperate affirmation of terror ,loneliness and sacrifice for some un definable but greater future .’’’ఇందులో జరుగుతున్నకాలం నిర్ణయాత్మకమైన కాలం అని ,ఒక జాతి భవిష్యత్తు మొత్తం కొద్ది మంది యుద్ధానికి సన్నద్ధ మౌతున్న ప్రచారకుల (ప్రాపగాన్డిస్ట్)లచేతుల్లోనే ఉంది అని పిస్తుంది .

Inline image 1   Inline image 2

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-8-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

31-7-16 ఆదివారం మా ఇంట్లో మా శిష్యుడు చిలుకూరి దంపతులు

This gallery contains 23 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237 87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237

87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

ఉల్ఫ్ మరణానంతరం ప్రచురింప బడిన ‘’వెబ్ అండ్ ది రాక్ ‘’,యు కం నాట్ గొ హోం అగైన్ ‘’లోను గాంట్-వెబర్ పాత్రను కాలం తో బాటు మారి ముసలితనం తో ఉన్నట్లు చిత్రించాడు .ఆపాత్ర దయనీయంగా ,వాస్తవ విరుద్ధంగా ,ఒక్కోసారి పారనయిక్ గా కనిపిస్తుంది .అతడు అతనికంటే ఎక్కువ వాడనిపిస్తాడు .తన బలహీనలతలు తెలిసిన వాడు .ఆత్మసానుభూతి ని అవహేళనతో జోడించాడు .ఆతను అమెరికా ఆర్టిస్ట్ గా కాక అమెరికా చిహ్నంగా దర్శనమిస్తాడు .పాతను నిరాకరిస్తూ ,తమదికాని సంప్రదాయాన్ని కాదంటూ ఎమర్సన్ విట్మన్ లలాగా దుఃఖిస్తూ ఆ దేశం లోనే ఆ మట్టి తోనే తమ జీవితాలను తామే వెలిగించుకొంటూ ,శక్తి సామర్ధ్యాలు సమకూర్చుకొంటూ ,తమ భాషా సంస్కృతులను కాపాడు కొంటూ ,తమ కళా సారాన్ని అనుభవిస్తూ జీవించాలి అనే సందేశం కనిపిస్తుంది .

  ఈ విషయాన్ని రూపు చెందించే సమయం ఆయనకు లేక పోయింది .తన ఆకలి హృదయాన్ని సంతృప్తి పరచలేక పోయాడు .’’Billion forms of America ,the savage violence ,and the dense complexity of all its swarming life ‘’ను రూపొందించ లేక పోయాడు .1938 జులై లో జబ్బుపడి మందుకు అలవాటుపడ్డాడు .న్యుమోనియా వచ్చి కోలుకొంటూ కాంప్లికేషన్స్ పెరిగి సెరిబ్రల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి  ఆపరేషన్ చేయాల్సి వచ్చి  .బాల్టిమోర్ లో జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ లో 15-9-1938 న 38 వ పుట్టిన రోజు 15 రోజుల్లో వస్తుందనగా ధామస్ ఉల్ఫ్ చనిపోయాడు .ఆయన తప్పులు చాలా ఉన్నాయి వాటి నిగ్గు తేల్చాల్సింది విమర్శకులే .’’one can only respect Wolfe for his determination to realize himself on the higher level and to be satisfied with nothing short of greatness ‘’అన్నాడు బెర్నార్డ్ డీ వోటో.అతని రచనా సర్వస్వం ఆవేశాత్మక ప్రక్రియ (ఫోర్సింగ్ ప్రాసెస్ ).అతను చెప్పిన ప్రతి మాటలో ఇంతకూ ముందు యే మానవుడూ భూమి మనిషి గూర్చి చెప్పని అద్భుత ఆశ్చర్య కర విషయాలున్నాయి  .ప్రపంచం మొత్తం మీద వీటిని ఇంత గొప్పగా అర్ధం చేసుకొని ఇంత అద్భుతంగా చెప్పిన వారు లేరు అనిపిస్తాడు .అతనిది హింసాత్మక ప్రయత్నచరిత్ర  అంటారు (వయలెన్స్ ఎండేవర్ ).అతని వెబ్ అండ్ ది రాక్ అతని రచనల్లో గొప్పది అన్నాడు జేబీ .ప్రీస్త్లి .

తప్పులెన్నిఉన్నా రచనలో శిఖరారోహణ చేశాడు ‘’I believe that we are lost in America ‘’అని అరిపిస్తాడు నిజమైన అమెరికాను ఆవిష్కరించే పని మనది అన్నాడు .The true discovery of America is before us .I think the true fulfillment of our spirit ,of our people ,of our mighty and immortal land ,is yet to come ‘’అని కలవరి౦చిన వాడు ధామస్ ఉల్ఫ్ .ఎంతో కస్టపడి ఎంతో దూరం ప్రయాణించి సంపూర్ణత్వం సాధించాడు .ఆయన కాల దేశాలకు అతీతమైన భావన ఉన్నవాడు .శైలిని తృణీకరించి ,అనుభవ సారాన్ని మానవ హృదయ భారాన్ని ఒక గుండు సూది మొనమీదనిలబెట్టిన వాడు .’’నేను కవిగా నే ఉంటాను తప్ప ఇంకా ఏదీ కాను ‘’అన్నాడు .ఉల్ఫ్ మరణానంతరం విడుదలైన రెండు పుస్తకాలు ‘’ది ఫేస్ ఆఫ్ ఎ నేషన్ ‘’,అనేది కవితా సంపుటి .’’ఎ స్టోన్ ,ఎ లీఫ్ ,ఎ డోర్ ‘’అనే వచనాలను కవిత్వీకరించిన సంపుటి .సహజ కవి అయినా వచన మాధ్యమాన్ని ఎంచుకొన్నాడు .తాను  కవి అని ఆయనే గుర్తించలేక పోయాడు .’’లుక్ హోం వర్డ్ ఏంజెల్ ‘’లో నగ్న సౌందర్య కవిత్వాన్ని ఒలక బోశాడు .ఆ కవితా వైభవాన్ని చూద్దాం –

‘’Which of us has known his brother ?which of us has – -looked into his father’s heart ?which of us has not –remained forever prison pent ?which of us is not-forever  a stranger and alone ‘

’అతని కవితా శైలి పై లూయీ అంటర్ మేయర్ ‘’Wolfe ‘s diffuse style ,such a passage is so perfectly shaped ,so classic in design ,that its clear and almost formal rhythms reveal ,the spirit free of the heavy flesh .They speak for the clairvoyant poet ,beyond life out living death ,completed and fulfilled ‘’అని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేశాడు .తన తరానికి మహా గొప్ప ప్రతిభ ఉన్నవాడు ఉల్ఫ్ అన్నాడు విలియం ఫాక్నర్ .బీట్ జెనరేషన్ కు చెందినజాక్ కరౌక్ ,రే బ్రాడ్ బరి ,ఫిలిప్ రాత్ బెట్టి స్మిత్  లపై ఉల్ఫ్ ప్రభావం చాలా ఎక్కువ .స్వీయ చరిత్ర రాసిన  వారిలో  సర్వ ప్రధముడు ఉల్ఫ్ .నార్త్ కరోలీనాకు చెందిన మహా రచయిత .అతని ప్రసిద్ధ పద బంధం ‘’ఫియర్ అండ్ లోదింగ్ ‘’భయం ,ద్వేషం ‘’.

ధామస్ ఉల్ఫ్ సొసైటీ ఏర్పడి ఆయన సాహిత్యాధ్యయనానికి కృషి చేస్తోంది .నార్త్ కరోలిన లోని ఆయన ఇల్లు ఎస్టేట్ జాతీయ సంపదగా రక్షింప బడుతోంది .యెన్ సైక్లో పీడియా   బ్రిటాన్నికా లో ‘’Wolfe was gifted with the faculty of almost total recall, and his fiction is characterized by an intense consciousness of scene and place, together with what is often an extraordinary lyric power. In Look Homeward, Angel and Of Time and the River, Wolfe was able to imbue his life story and the figures of his parents with a lofty romantic quality that has epic and mythopoeic overtones. Powerful emotional evocation and literal reporting are combined in his fiction, and he often alternates between dramatically effective episodes of recollection and highly charged passages of rhetoric. Though The Web and the Rock and You Can’t Go Home Again contain episodes of great vividness, they are too often uncontrolled in their form and fail to sustain the epic tone of Look Homeward, Angel, which has become an American classic.’’అని రాశారు .అయన కోటబుల్ కోట్స్ కొన్ని చూద్దాం –

Culture is the arts elevated to a set of beliefs.

One belongs to New York instantly. One belongs to it as much in five minutes as in five years.

The reason a writer writes a book is to forget a book and the reason a reader reads one is to remember it.

Inline image 1  Inline image 3
Inline image 2                   ఉల్ఫ్ ఎస్టేట్

Inline image 4Inline image 5Inline image 6Inline image 7

     సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236 87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236

87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్

అమెరికా విస్తృత జీవన శక్తి కి ప్రతీక ధామస్ ఉల్ఫ్ .అమెరిక దేశపు హీరో .నిర్మించినది ప్రతిదీ అతి విస్త్రుతమైఉండేది  ,నిప్పులు రాల్చే కళ్ళతో నల్ల జుట్టుతో ,కాల గమన హింసతో ,ఏకాకి జీవిత వ్యధతో ,కోల్పోయిన దిగులుతో ఉండేవాడు .వాల్ట్ విట్మన్ లాగా అమెరికాను అన్నికోణాల్లో దర్శించినవాడు  ,ఆ జీవితాన్ని ప్రతి స్థాయి లోను అనుభవించి,అమెరికా ప్రేమికుడై ఆరాధన తో నాలుగు నవలలతో సాహిత్య చిరంజీవియై 38 ఏళ్ళు రాకుండానే  మరణించిన వాడు . అమెరికా లో నార్త్ కారోలీనా ఆష్విల్ లో 3-10-1900 న జన్మించి ధామస్ క్లేటన్ ఉల్ఫ్ గా నామకరణం చేయబడ్డాడు .తండ్రి రాళ్ళు చెక్కేవాడే అయినా సాహిత్యం అంటే మోజున్నవాడు .కవిత్వాన్ని గట్టిగా ఆనందంగా పఠించేవాడు .ఉల్ఫ్ చిన్నతనం షేక్స్ పియర్ సాలి లోక్వి ల   రిథం బట్టీ పట్టటం గ్రే కవి ‘’ఎలిజీ ‘’అప్పగించటం తో గడిచింది .ఈ రెండూ కూడా వేదనా భరితమైనవే .తల్లి ఒక బోర్డింగ్ హౌస్ కీపర్ .టాం ఏడుగురు పిల్లలలో చివరివాడు .కుటుంబ బాధ్యతకూడా మీద పడింది .బాల్యం లోనే ఇంటింటికీ పేపర్లు వేసి ,ఎవరైనా పని చెబితే చేసి ,కొన్ని పెన్నీలు సంపాదిస్తూ నీగ్రో క్వార్టర్ లకు వెళ్లి ఒక నీగ్రో వాడిని బోర్డింగ్ కు కుదిర్చే వాడు ..15 వ ఏట టాం ను నార్త్ కరోలినా యూని  వర్సిటికి పంపే స్తోమత వచ్చింది..అక్కడ కాలేజ్ మేగజైన్ కు  న్యూస్ పేపర్ కు  ఎడిటర్ అయాడు . జర్నలిస్ట్ కాని లాయర్ కాని కావాలనుకోనేవాడు .కాలేజీ లో చివర రెండేళ్లలో చాలా ఏకాంకిక నాటికలు  రాశాడు .కాని తానూ ప్రోఫెషనల్ రచయిత అవుతానని కలలో కూడా అనుకోలేదు  .ఆతను రాసిన నాటిక ఒకటి కాలేజి స్టేజ్ పై ప్రదర్శింప బడింది .18 వ ఏట వర్జీనియాలో న్యు పోర్ట్ న్యూస్ లో ఉద్యోగం లో చేరాడు .కవితలు నాటక కధలు మనసులో సుళ్లు తిరిగేవి .1920 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హార్వర్డ్ వెళ్లి అక్కడ  ప్రొఫెసర్ జార్జ్ పియర్స్ కు చెందిన ప్రసిద్ధ ‘’47 వర్క్ షాప్ ‘’లో చేరాడు దీనిలోనే ఆ తర్వాత ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ కూడా చేరాడు .

   టాం కు రాయటం అవలీలగా వచ్చేసింది .పదాలు నదీ ప్రవాహం లాగా దొర్లుకొంటూ వచ్చేసేవి .అవి తమంతటికి తామే వచ్చి ఎక్కడ ఉండాలో అక్కడ చేరినట్లు ఉండేవి .టాం కోసమే తాము సిద్ధంగా ఉన్నట్లు అనిపించేది .ఆ ప్రవాహం అడ్డూ ఆపూ లేకుండా మహా ప్రవాహంగా చేరి కుదిరి సార్ధకంయ్యేవి .20 వ ఏట రోజూ తనను  మోసుకు పోయే ఈశబ్ద ప్రవాహం అకస్మాత్తుగా పొంగి ప్రవహించింది .కొత్త నాటికలు రాస్తున్నాడు బాగున్నాయని అంటున్నారుకాని తిరస్కరింప బడేవి .అందరూ మెచ్చుకోనేవాళ్ళే కాని ప్రదర్శించటానికి ఎవరూ ము౦దు కోచ్చేవారు కాదు .ఇదంతా అతని సహనానికి పరీక్షగా ఉండేది  .ఈ సందర్భంగా అతనిలో ఒక రకమైన తాత్విక చింతన ప్రారంభమై ఇలా రాసుకొన్నాడు –‘’I am acquiring patience .i am quite willing to wait for the unveiling   exercises .All that really matters right now is the knowledge that  I am twenty –three and a  golden May is here .The feeling of immortality in youth is upon me .I am young and I can never die .Don’t tell me that I can .Wait until I am thirty .Then I believe you ‘’

      కాని అంతగా ఓపిక పట్టలేక హార్వర్డ్ లో ఏం యే .చేసి ,న్యు యార్క్ వర్సిటి   వాషింగ్టన్ స్క్వేర్ కాలేజి ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగం పొందాడు .చాలా నిబద్ధత తో  చదువు చెప్పాడు  .తనది ఉద్యోగంగా భావించి నాటక కర్త కావాలనుకొన్నాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ చైర్మన్ హోమర్ వాట్ కు ‘’నా ద్రుష్టి అంతా నాటకాల మీద ఉంది .కొద్ది రోజుల్లో నేను దియేటర్ నాటకాలు రాయగలను అనే దైర్యం ఉన్నవాడిని.అది తప్ప నాకి౦కేదీ చెయ్యాలని లేదు ‘’అని ఉత్తరం రాశాడు .వాళ్లకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు .తన పరిసరాలను ,చుట్టూ ఉన్నవాళ్ళను పెద్దగా పట్టించుకొనే వాడుకాదు .వీళ్ళను ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’లో ‘’స్కూల్ ఫర్ యుటిలిటి కల్చర్స్ ‘’శీర్షిక తో వ్యంగ్యంగా ఏకేవాడు .ఆరేళ్ళు న్యుయార్లో టీచింగ్ లో ఉన్నా క్లాస్ రూమ్ లనుండి విశ్రాంతి గానే గడిపాడు .విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక నవల ఇతి వృత్తం మనసులో మెదిలింది .మళ్ళీ టీచింగ్ లో చేరాల్సివచ్చి ,చేరి మళ్ళీ పారిపోయి 19 26 లో లండన్ లో కనిపించాడు .విదేశం లో ఒంటరిగా ఉంటూ రాయటం మొదలు పెట్టాడు .రెండున్నర ఏళ్ళ తర్వాత న్యు యార్క్ వచ్చి ,పగలు చదువు బోధించటం లో రాత్రుళ్ళు రచనలో గడిపి పుస్తకం పూర్తీ చేశాడు .’’పుస్తకం నన్ను కట్టి పడేసింది నన్ను స్వంతం చేసుకొంది’’అని రాశాడు .ఈ నవలపేరు ‘’ది స్టోరీ ఆఫ్ ఎ నావెల్ ‘’. దీన్ని గురించి ‘’నవల దానికదే రూపు దిద్దుకోన్నది .నాకు ప్రతి యువకుడూ ఇష్టమే .నేను ఆరాధించే రచయితల ప్రభావం నాపై ఉంది .అప్పుడు జేమ్స్ జాయిస్’’యులిసెస్ ‘’తో  చాలా ప్రసిద్దుడు .ఈ పుస్తక ప్రభావం నా నవలపై పడింది .అయినా నాదైన  యువ శక్తి ,అగ్ని దానిపై బాగా పని చేశాయి .జాయిస్ లాగానే నేనూ నాకు తెలిసిన వస్తువుల గురించి ,ఇప్పటి జీవిత౦ అనుభవం గూర్చి చిన్ననాటి విషయాల గురించి రాశాను .జాయిస్ కున్న సాహిత్య అనుభవం నాకు లేదు .ఇంతకూ ముందు యే పుస్తకామూ నేను ప్రచురించలేదు .నాకు రచయితలూ ,పబ్లిషర్లు ,పుస్తకాలు ,దూరపు ప్రపంచం ఏవీ తెలియవు .చిన్నతనం లో ఎలా రొమాంటిక్ గా లేవో ఇప్పుడూ అలాగే అంది .కాని ఈ నవలలో నేను సృష్టించి చిత్రించిన మనుషులు ,రంగులు విశ్వ వాతావరణం అన్నీ నన్ను తమవాడిని గా చేసుకోన్నాయి .అందుకే నేను ఆ దీప శిఖ తో  ఒక యువకుడు ఇంతకూ పూర్వం ఏదీ ప్రచురించనివాడు రాసినట్లు  ఇక ముందు అంతా మంచి జరగాలని జరుగుతుందని ఆశ తో రాశాను.’’అని చెప్పాడు .

  ఈ నవల నమ్మశక్యం కానంత బృహత్ నవల. .మూడులక్షల యాభై వేల పదాల నవల .దీన్ని ‘’ఓ లాస్ట్ ‘’అనిపిలవాలనుకొన్నాడు .దీని ప్రచురణకు ఇద్దరు మిత్రుల సాయం అందుకొన్నాడు .చివరికి ఈ పుస్తకానికి ‘’లుక్ హోమ్వర్డ్ ఏంజెల్ ‘’అని పేరుపెట్టాడు .29 వ పుట్టిన రోజు విడుదల చేశాడు దీన్ని .తనను తాను  మరీ నగ్నంగా ప్రదర్శించుకోన్నానేమో అనుకొన్నాడు .కాని విమర్శకులు చాలా గొప్పగా  పెద్ద పెద్ద విశేషణాలతో మెచ్చుకొనే సరికి మహా దానంద౦  పొందాడు  .కొందరు దీన్ని వీధి మూలల్లో తిట్టటం ,అతని అభిమాని ఒకామె ఫిర్యాదు చేయటం మనసు ను కల్లోల పరచింది .’’బాబోయ్! ఇది ఫిక్షనే కాని ఎవరి జీవిత చిత్రణా కాదు మొర్రోయ్ ‘’అని చెప్పుకొన్నాడు .అయినా అది ఆయన జీవిత చరిత్రే అనటం లో సందేహం లేదు .దీనిపై ఉల్ఫ్ ‘’మన జీవితాలలో అన్ని క్షణాల మొత్తమే మనం .మనలో ఉన్నదే వాళ్ళలోనూ ఉంది మనం తప్పించుకోవటంకాని ,దాచటానికి కాని ఏదీ ఉండదు .జీవితం మట్టి లోనుంచే  ప్రావిర్భావం చెందుతుంది  .అందరూ దీన్ని ఉపయోగించాల్సిందే .తప్పించుకోలేరేవ్వరూ . ఒక లైబ్రరీలో సగం చదివి కానిఒక మనిషి  ఒక పుస్తకం రాయలేడు అన్నాడు డాక్టర్ జాన్సన్ .అదే విధంగా నవలాకారుడు నగరం లో సగం మంది జనాన్ని పరామర్శిస్తే కాని ఒక పాత్రను మలచ లేడు.’’అని చెప్పుకొన్నాడు .

పుస్తక విజయం ఆనందం కన్నా ఆందోళన కలిగించింది ఉల్ఫ్ కు .మరోటి రాస్తే యే రకంగా విమర్శకులు స్పందిస్తారో అనే ఆందోళన ఎక్కువైంది .నవల అమ్మకాలు మహా జోరుగా ఉండటం తో న్యు యార్క్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు .గుగ్గెన్ హీం ఫెలోషిప్ అవార్డ్ పొందాడు .మళ్ళీ విదేశాలకు వెళ్లి పారిస్ లో ‘’హోం సిక్’’అయి బుర్రనిండా రాయబోయే రచనల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరై తుఫానుకు కదిలిపోయినట్లు కదిలిపోయాడు .రెండవది అదే వేగం తో రాసేశాడు .’’నేను రాయలేదు .నవలే నన్ను రాసింది ‘’అన్నాడు పోతనలాగా .దీన్ని ‘’అక్టోబర్ ఫైర్’’అందామనుకొన్నాడు .కాని తట్టుకోలేని ఒడ్లను కూలుస్తూ సాగే ఆ భావాల వరద ,ఉరవడి అతడిని వివశుడిని చేసి పేరు ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’గా మార్చాడు .మొదట్లో దానికి రూపం నిర్మాణం ఏవీ  లేవు .ఆతను అన్నది నిజమే .అది ఉద్ధరి౦ప బడని అనంత ఉత్సాహ పూరిత మహా ప్రవాహమే .’’అమెరికాలోని చీకటి వెలుగుల గురించే రాశాను .పది వేల చిన్న పట్టణాల జనాల గురించి రాశాను .నిద్ర మోతు మొహాలగురించి చెప్పాను .నదులు చీకటిలో ఎలా ప్రవహి౦చా యో రాశాను .పది  వేల మైళ్ళ తీరం ,దానిపై వరద ఉద్ధృతి ,ఘోరారణ్యాలపై చంద్ర కాంతి మిలమిల ,పిల్లి కళ్ళలోని  పసుపు రంగు మెరపు ,చావు,నిద్ర ,మనం సిటి అని ముద్దుగా పిలుచుకొనే శిలా సదృశ మానవ జీవితం ,అక్టోబర్ నెల సోయగం ,పెద్దపెద్ద రాళ్ళూ రాక్షస అరుపులతో రాత్రిళ్ళు పరిగెత్తే రైళ్ళు విధం ,ఉదయం లో స్టేషన్లు ,షిప్స్ గురించి ,హార్బర్ లో జనం ,షిప్ ల వద్ద ట్రాఫిక్ ‘’అన్నీ రాశాను’’ అని చెప్పాడు ఉల్ఫ్ .

  అమెరికాకు1931 లో  తిరిగొచ్చాక మళ్ళీ మనసంతా నువ్వే అన్నట్లు మనుషులు ,కేకలు ,దీప ప్రభలు ,అదృశ్య ముఖాలు సూర్యరశ్మి రావటంపోవటం పొదలపై ఆకుల రెపరెపలు ,రాయి రప్పా ,ఆకు అలము ,తలుపు చెక్కా –ఒకటేమిటి సమస్త జీవం అతని కళ్ళముందు మనసులో నిండి పరవళ్ళు తోక్కుతూపరవశం కలిగిస్తున్నాయి .సౌత్ బ్రూక్లిన్ లో అసీరియన్ క్వార్టర్ లోని బేస్ మెంట్ లో ఉంటూ తన హీరో యూజీన్ గాంట్ జీవితం పై  పేజీల పై పేజీలు  గుట్టలు గుట్టలుగా రాసి పారేస్తున్నాడు .అవి లెడ్జేర్ మీద లెడ్జేర్ గా అనేకపెద్ద పెద్ద  పాకింగ్ కేసుల  నిండా నింపేశాడు .పుస్తకానికిముగింపు పలక లేక పోయాడు .పెర్కిన్సన్ ఏదో సలహా ఇవ్వటం దాన్ని అంగీకరించి మరో ఎపిసోడ్ రాయటం ,బ్రూక్లిన్ వచ్చి రాసింది నెమరేసుకొని ‘’అరె ! ఇదేమీ చాలినట్లు లేదే ‘’అనుకోని మళ్ళీ దాన్ని పెంచి రాయటం తో అంత విస్తృత మైన నవలగా రూపొందింది .పెర్కిన్సన్ సహాయం తో మళ్ళీ తగ్గించుకొంటూ వచ్చాడు .అయినా ఒక మిలియన్ పదాలతో మహా నవల అయింది సాధారణ నవలకు రెట్టింపు అన్నమాట .టాల్స్టాయ్ తాత ‘’వార్ అండ్ పీస్ ‘’కు ద్విగుణీకృతం .వర్జీనియా రాత్రి రైల్ ప్రయాణం తో నవల మొదలు పెదదామనుకొన్నాడు .కానీ ఉపోద్ఘాత అధ్యాయమే లక్ష పదాలయింది .అంటే చిన్న సైజు పుస్తకం .దాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది చివరికి .’’ఈ రక్తపాత హత్య నేను భరించలేక పోయాను ‘’అన్నాడు దాన్ని తీసేస్తూ .యాభై వేలపదాలున్నచాప్టర్ లను కుది౦చాడు ‘పుస్తకం పూర్తీ అయింది ఇక ప్రెస్ కు పంపటమే తరువాయి అనుకొన్న సమయం లో ‘’అబ్బే ! ఇదేమీ సంపూర్ణంగా లేదే అసమగ్రంగా ఉందే’’’అనిపించి మళ్ళీ నరికేసినవి మళ్ళీ కుట్టాడు . ఇంకా ఎన్నో చెప్పలేక రాయలేక పోయానే అనే దుగ్ధ ఎప్పుడూ ఉండేది . ఉల్ఫ్  చికాగో వెళ్ళిన సందర్భం లో పార్కిన్సన్ నవలను  సంక్షిప్తంగా ఎడిట్ చేసి  ప్రింటర్ చేతిలో పెట్టి ఉండకపోతే ఆ నవల ఎన్నటికీ వెలుగు చూసేదికాదు .ఉల్ఫ్ తిరిగొచ్చి నెత్తీ నోరూ మొత్తుకొని తనకింకా ఆరు నెలల సమయం కావాలన్నాడు ‘’నువ్వేమైనా ఫ్లాబర్ట్ లాగా పెర్ఫెక్షన్ కోసం నగిషీలకోసం  రాస్తున్నానను కొంటున్నావా?’’అనిచివాట్లు పెట్టి నా ,ప్రూఫ్ పేజీలమీదేతాను రాయాలనుకోన్నది అంతా రాసి ఉల్ఫ్ కోరిక తీర్చుకొన్నాడు  .ఇలా రాస్తో తిరిగి రాస్తూ ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’నవలను పూర్తీ చేయటానికి ఆరేళ్ళుతీసుకొన్నాడు .1935 మార్చ్ లో ఇది వెలుగు చూసింది .

ఈ నవల స్పందన ఎలా వస్తుందో అనే లోపల భయం ఉంది ఉల్ఫ్ కు ‘’నేను నా జీవితాన్ని వినాశకరంగా ఆవిష్కా రించు కోన్నాను .దయనీయమైన తెలివి తక్కువ వాడిగా ప్రవర్తించాను .ఏదో ప్రలోభం బుద్ధి చాంచల్యం తో రాశానేమో ‘’అన్నాడు .పబ్లిష్ అయినరోజు  దేశం వదిలి  పారిస్ లోఉన్నాడు .మొదటిభాగం లాగానే రెందవదీ విజయం సాధించింది అని వినగానే నమ్మ లేక పోయాడు .తరువాత రాసిన పుస్తకాలలోస్వీయ జీవిత చరిత్రను రాయటం తగ్గించేశాడు .తన హీరో యూజీన్ గాంట్ ను అతని ఆకృతులను మార్చేశాడు ఉల్ఫ్ .తరువాత రెండు నవలలు మొదటి రెండిటి గొలుసు నవలలే అయినా నాలుగూ కలిసి ఒకటే పుస్తకం .ఒక శిఖరాయమాన స్వీయ జీవిత చరిత్ర అయింది .ఇప్పడు హీరో కు  జార్జ్ వెబర్  పేరు పెట్టాడు . గాంట్ ను  మానసిక వికలాంగ ముఖం ‘’అని అంటే ఇప్పుడు వెబర్ ను ‘’చతికిల పడ్డ మనిషి ‘’అన్నాడు .వెబర్ ను స్నేహితులు ‘’మాంక్ ‘’రుషి అని పిలిచేవారు . వెబర్ అంటే రూపం మార్చుకొన్న కఠినంగా మారిన  గాంట్.అని పిస్తాడు.

Inline image 1

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

పారిస్ లోఉంటూ , టైరోల్ లో స్కైయింగ్  స్పెయిన్ వెళ్లి బుల్ ఫైట్ లతో కాలక్షేపం చేసేవాడు హెమింగ్వే .ఈకాలం లో ఆయన అత్యుత్తమ కధలను రాశాడు .1927 లో మొదటి పెళ్లి విడాకులతో పూర్తీ అవగానే పాలీన్ పీఫెర్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు మగ పిల్లలని  కన్నాడు .అమెరిక వెళ్లి మరో చిన్న కదా సంపుటి ‘’మెన్ వితోట్ వుమెన్ ‘’ప్రచురించాడు .కి వెస్ట్ కు వెళ్లి నైపుణ్యం గల చేపల వేటకాడయ్యాడు .అధిక శ్రమవలన ఆయన పాత గాయాలు మళ్ళీ ఇబ్బంది పెట్టాయి .1928 లో ‘’ఫేర్ వెల్ టు ఆర్మ్స్ ‘’నవల పూర్తీ చేశాడు .చిన్నకదను పుస్తక ప్రమాణంగా ద్వైవీ భావం తో ప్రేమ ,యుద్ధ పతనాలను జోడించి రాశాడు .చిన్న కధలోని సమాప్తం నవలలో దుఃఖ విచారాలయ్యాయి ‘’.మరణ మృదంగం ‘’అని ఆయన విమర్శకులు అన్నట్లు ఆయన రచనల్లో అది పూర్తిగా ఆక్రమించింది .దీనినే ‘’డెత్ ఇన్ ది  ఆఫ్టర్ నూన్ లో బుల్ ఫైటింగ్ ను ఒక కళ గా ,అదొక ప్రత్యేక ఉన్నత శైలి వధ గా వర్ణించాడు .ఏదో రకమైన ప్రమాదం ఉన్న ప్రేమ ను వదిలి బుల్ ఫైటింగ్ లో పడ్డాడు .కాని అనుభవ రాహిత్యం ఇబ్బందిపాలు చేసింది ..బొక్కలు (బొమికలు )విరిగి ఒళ్ళు పుళ్లు అయి అసలే నిప్పుల బాధలో ఉన్నవాడికి మరింత ఇబ్బంది కలిగింది .ఈ బాధల్లోంచే ఒక్కోసారి వినోదం ,మరోసారి ప్రకాశ వంతం కలిగిస్తూ రచనలు చేశాడు .’’విన్నర్ టేక్ నధింగ్ ‘’ ‘’గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా ‘’లలో బుల్ ఫైటింగ్ బదులు వేటకు ప్రాదాన్యమిచ్చాడు .’’టు హావ్ అండ్ జావ్ నాట్ ‘’లో చావు ,కరిగిపోవటం లను కలిపి రాశాడు .ఈ కద కీ వెస్ట్ లో జరిగింది .ఇక్కడ చావు మరో తరహాగా ఉంటుంది .39 లో ప్రవేశించిన హెమింగ్వే స్పానిష్ రిపబ్లిక్ కూలి పోవటం తో  ఆదవాని ప్రపంచమంతా ప్రతిధ్వనించినట్లు అనిపించింది .హెమింగ్వే ఫాసిస్ట్  వ్యతిరేకి .’’ప్రపంచ రక్షకులు ‘’అని పించుకొంటున్నవారిని ఇంకా పూర్తిగా  సమర్ధించ లేదాయన .అతని హారీ మార్గాన్ ఒక మోసకారి స్మగ్లర్ పేద్దహీరో గా కుళ్ళిపోతున్న సమాజానికి ఉద్దారకుడిగా ,ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడయ్యాడు .ఇందులో లక్ష్య నినాదం ‘’ఇప్పుడెవరూ ఒంటరికాదు ‘’.వేధించే సాంఘిక సమస్య హెమింగ్వే కు కొత్త .కనుక పుస్తకం రెండు భాగాలుగా రాసి ప్రచురించాడు .

  చావు కోరిక ,పునరుత్పత్తి  సిద్ధాంతం లను కలిపి ‘’ది ఫిఫ్త్ కాలం ‘’నాటకం గా రాశాడు .దీన్ని నవల చదివినంత హాయిగా చదువుకో వచ్చు .యుద్ధ పరిణామాలలో విఫల ప్రేమ ఉంది .హీరోకు చంపటం లో అర్ధం ఉందనిపిస్తుంది .19 38 లో ఈనాటకం తో కలిపి కొన్ని ఆయన ప్రసిద్ధకధలతో చేర్చి ‘’ది ఫిఫ్త్ కాలం అండ్ ది ఫస్ట్ ఫార్తీనైన్ స్టోరీస్ ‘’గా తెచ్చాడు .ఇవి హాలీవుడ్ సినిమాలకు గొప్ప వరమైనాయి .వీటిలోనూ చావువాసనే వుంది .45 వ ఏట హెమింగ్వే అతని అతిపెద్ద ,అతి ప్రాముఖ్యమైన నవల ‘’ఫర్ హూం ది బెల్ టాల్స్ ‘’రాశాడు .పూర్వపు ఆలోచనే అయిన చావు ,జీవితం దీనిలోనూ ప్రాధాన్యం పొందింది .స్పెయిన్ లో ఫాసిస్ట్ లపై లాయలిస్ట్ ల పోరాటం గుర్తించాడు .మానవ స్వేచ్చకు  బాధ్యతకు భంగం కలిగించే వాటిపై నిరసన గళమే ఆయన .పూర్వం ఆయన కు కీట్స్ కవి చెప్పిన ‘’many a time I have been half in love with easeful death ‘’భావనకు వ్యతిరేకి .జీవితాన్ని ప్రమాద పరచే ప్రేమ అంటే ఆయనకు చాలా ఇష్టం .చావు నిరాశామయమని ,చావు కు అర్ధం లేదని అనుకొనేవాడు .ఇప్పుడు ఆయనకు జీవిచటం లో మరణించటం లో ప్రయోజనం ఉందని తెలిసింది .దానికి కారణం కూడా ఉంటుందని అన్నాడు .స్పానిష్ యుద్ధం పై ఆయన రిపోర్ట్ లో స్పానిష్ ప్రజల పై అధ్యయనం పెద్దగా లేదని కాని అది ఎపిక్ ధైర్యాన్ని ,అనుకంపను కలిగిస్తుందని అంటారు .గెరిల్లాలపై సానుభూతి చూపాడు .మానవత్వం పై పెద్ద ఆశ కనిపిస్తుంది .అంటే కాదు మొదటి సారిగా సోదరత్వం గోచరిస్తుంది .

   కాని లాయలిస్ట్ ల ఓటమి త్యాగం ,సంతోషం ,సహవాసాలు ఆయన్ను  సిగ్గుపడేట్లు చేశాయి .చివరికి ఇవి ఆయనలో పూర్తిగా మృగ్యమైపోయాయి .ఎనిమిదేళ్ళ తర్వాత ‘’అక్రాస్ ది రివర్ అండ్ ఇంటూ ది ట్రీస్  ‘’రాశాడు .ఎంతో ఆశగా ఎదురు చూసిన జనానికి చుక్కలు చూపించి నిరాశ కలిగించింది .రచనా విధానం పేలవమై విసుగు పుట్టించింది .కాని చావు మళ్ళీ ప్రత్యక్షమైంది ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లో .54 వయసు .చిన్ననవలె కాని మనిషి అదృష్టం తో డీకోనటం కద.జీవించటానికి ,మరణింప చెయ్యటానికి ప్రబలమైన ప్రకృతి శక్తులతో మనిషి పోరాటాన్ని గొప్ప గా చిత్రించాడు .ట్రాజిక్ డిగ్నిటి కి పట్టం కట్టాడు .ఇలాంటి కధను ఇంతకూ ముందు హెమింగ్వే కాని ఆయన సమకాలికులు కాని రాయనే లేదు .క్లాసిక్ అయింది .నవల లో ఓల్డ్ మాన్ తో చెప్పించిన మాటలు గొప్ప జీవిత సత్యాలు అన్వేషణా ఫలితాలూను –‘’Now we  are  joined together And  no one to help either one of us .Fish I love you and respect you very much .You are my brother –you are killing me ,fish .but you have a right to .Never have I seen a greater ,or more beautiful or calmer or more noble thing than you .,brother .Come on and kill me .I do not care who kills who ‘’.ఆ మహా మీనాన్ని చంపెదాకా టెన్షన్ బాగా పోషింప బడింది .గొప్ప భావోద్రేకాన్ని ,మహా ప్రతీకాత్మకంగా తెలియ జేశాడు .1953 లో దీనికి పులిట్జర్  బహుమతి లభించినందుకు అతని అభిమానులు యెగిరి గంతేసి పాతికేళ్ళు ఆలస్యంగా వచ్చిందని అంటే  వ్యతిరేకులు ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకొన్నారు .మరుసటి ఏడాదే నోబెల్ పురస్కారం అయన  ‘’style making mastership ‘’శైలీ విన్యాసం లో అద్వితీయతకు ‘’ లభించింది .ఆయన తనను తానూ కాల్చుకొని చనిపోకముందే నోబెల్ సంస్థ ఆయన్ను సత్కరిమ్చాలను కొన్నది .1954జనవరిలో రేడియో లో అకస్మాత్తుగా హెమింగ్వే మరణ వార్త ప్రసార మైంది .భార్యతో ఆఫ్రికాకు సఫారి కోసం వెళ్ళాడు .వీళ్ళు ప్రయాణం చేసే విమానం ముక్కలై ఎగువ నైలు నదీ ప్రాంతం లో  కూలిప్రేలి పోయింది ..ఇంకేముంది ప్రసార మాధ్యమాలు ‘’మహా గొప్ప నవలా కారుడు హెమింగ్వే మరణించాడని ‘’మరణాన్ని ఆనందంగా అనుభవించాడు అని శీర్షికలు పెట్టి ప్రసారం చేశాయి .అప్పటిదాకా హెమింగ్వే రచనలను చదవని వేలాది మంది చావు ఆయన సాధారణ కదా విషయం అని ఎప్పటికప్పుడు చావు సమీపానికి వచ్చి తప్పించుకొంటాడని  తెలుసు కొన్నారు .మర్నాడు ఉదయం పత్రికలూ ఆయన చావ లేదని రెండు సార్లు మృత్యువు కోరలలోంచి బ్రతికి బయట పడ్డ రచయిత అని పతాక శీర్షికలతో రాశాయి .కూలిన విమానం లో నుంచి నెమ్మదిగా ఇద్దరూ పాకు కొంటూ బయట పడ్డారు   ఒక మోటార్ లాంచ్ రక్షించి౦ది ..రక్షణ విమానం వచ్చి తీసుకొని వెడుతుండగా అది అగ్నిప్రమాదానికి గురై మళ్ళీ భార్యా భర్తలిద్దరూ బ్రతికి బయట పడ్డారు .అప్పుడు ఆయన ‘’My luck –she is still running good ‘’అన్నాడు .

 హెమింగ్వే ఏదిరాసినా సంచలం సృష్టించింది .విమర్శకులు తమపని తాము చేసుకుపోతున్నారు .ఆయన క్యూబా లో  పూర్వపు యుద్ధ విలేకరి నాలుగవ భార్య మేరీ వెల్ష్ ని 1946 లో పెళ్లి చేసుకొని తో హేపీ హేపీ గా ఉన్నాడు. అతని శైలి గొప్పతనం గురించి చెప్పలేక పోతున్నారు.ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్ ‘’ Hemingway ‘s words strike you ,each one as if they  were pebbles fetched fresh from a brook ..They live and shine each in its place .’’అని గొప్ప విశ్లేషణ చేశాడు .జీవద్భాష తో ఆయన మాటలు ఒక దానితో ఒకటి పోటీ పడతాయి .’’His style is distinctly the man hard ,clean ,close clipped persistently masculine –his very adjectives  are appropriately ,even aggressively athletic and accurate .’’ఇంతటి గొప్ప రచయిత అయినా ఆయన చదువురాని బాస్కెట్ బాల్ ఆటగాడిలా మాట్లాడే వాడు .ఇది ఆయనలో పెద్ద లోపం .తాను  చావును చావుకోసం చూడనని చంపటం అనేది తిరుగు బాటుకు ,దాని అమలుకు పోరాటభావన  అన్నాడు .

1950 చివరిదాకా రచన చేస్తూనే ఉన్నాడు .1959  లో స్పెయిన్ వెళ్లి లైఫ్ మేగజైన్ కు బుల్ ఫైటింగ్ పై పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు .1960 లో క్యూబా వెళ్లి ‘’లైఫ్ ‘’కోసం పది వేలమాటల రచన ప్రారంభిస్తేఅది విపరీతంగా పెరిగి పోయింది .హాచ్నర్ సాయం తో దాన్ని నలభై వేలమాటలకు కుది౦చాడు .కాని ముద్రాపకులు  పూర్తీ స్క్రిప్ట్ ఇవ్వమని అడిగితే లక్షా ముప్పై వేల మాటలతో రాసిచ్చాడు .హెమింగ్వే దారి తప్పుతూ కంగారుగా ఉన్నట్లు అనిపించేవాడు .1960 జులై లో భార్యతోకలిసి క్యూబా వదిలాడు మళ్ళీ రాలేక పోయాడు .లైఫ్ మేగజైన్ ఫ్రంట్ కవర్ పేజి కోసం స్పెయిన్ వెళ్ళాడు .కొద్దిరోజుల్లో తీవ్రమైన జబ్బు చేసిందని చావు బతుకులలో ఉన్నాడని వార్తా ప్రసారమైంది .కాని భార్యకు ఆయనకులాసాగానే ఉన్నాడని కేబుల్ వచ్చింది .అక్కడ ఒక్కడే పక్కకే అంకితమై ఉన్నాడు .తాను  బ్రేక్ డౌన్ లో ఉన్నానని గ్రహించాడు .లైఫ్ మేగజైన్ లో ‘ డేంజరస్ సమ్మర్ ‘’1960 సెప్టెంబర్ లో మంచి రివ్యూలతో వచ్చింది .అక్టోబర్ లో స్పెయిన్ వదిలి న్యూయార్క్ చేరాడు .భార్య మేరి అపార్ట్ మెంట్ వదిలి వెళ్ళనన్నాడు తనమీద ఎవరో నిఘా ఉన్నారని అనుమాన పడ్డాడు .వెంటనే ఆమె ఇడాహోకు తీసుకువెళ్ళి డాక్టర్ కు చూపించింది .డబ్బు కోసం రక్షణ కోసం ఇబ్బందిపడ్డాడు .అమెరికా ఎఫ్ బి ఐ అనపై నిఘా పెట్టి౦ద నుకొన్నాడు .మేయో హాస్పిటల్ లో ఉన్నాడు .ఆరోగ్యం తగ్గగా జూన్ లో డిశ్చార్జ్ అయ్యాడు .1961 ఏప్రిల్ లో కేట్చెం చేరారు .మే లో ఆతనివద్ద పెద్ద షాట్ గన్ ఉన్నట్లు భార్య గ్రహించింది .భయపడి సన్  వాలీ హాస్పిటల్ లో చేర్పించింది .మళ్ళీ మేయో లో చేరి షాక్ ట్రీట్మెంట్ తీసుకొన్నాడు .జూన్ లో డిశ్చార్జ్ అయి 30 కి ఇంటికి వెళ్ళాడు .19 61 జులై 2 న తన డబుల్ బారెల్ షాట్ గన్ తో కాల్చుకొని చనిపోయాడు .

చనిపోయేముందు హెమింగ్వే పరిస్థితి తండ్రి ఆత్మ హత్య చేసుకొన్నా దాని లాగానే ఉంది .హీమో క్రోమాటిస్  అనే మానసిక వ్యాధి తండ్రినుంచి ఆయనకు సంక్రమించింది .హీమో క్రోమోటాసిస్ కూడా ఉందని ఆయన అమితంగా తాగేవాడని  ఆ తర్వాత రిపోర్ట్ లలో తేలింది .ఆయన సోదరి సోదరుడు కూడా ఆత్మహత్య తోనే చనిపోయారు .

Hemingway’s style was fundamentally shaped “in reaction to [his] experience of world war”. After World War I, he and other modernists “lost faith in the central institutions of Western civilization” by reacting against the elaborate style of 19th-century writers and by creating a style “in which meaning is established through dialogue, through action, and silences—a fiction in which nothing crucial—or at least very little—is stated explicitly.”[18]

Hemingway learned to “get the most from the least, how to prune language, how to multiply intensities and how to tell nothing but the truth in a way that allowed for telling more than the truth.”[168] Hemingway called his style the Iceberg Theory: the facts float above water; the supporting structure and symbolism operate out of sight.[168] The concept of the iceberg theory is sometimes referred to as the “theory of omission”. Hemingway believed the writer could describe one thing (such as Nick Adams fishing in “The Big Two-Hearted River”) though an entirely different thing occurs below the surface (Nick Adams concentrating on fishing to the extent that he does not have to think about anything Hemingway habitually used the word “and” in place of commas

Fiedler believes Hemingway inverts the American literary theme of the evil “Dark Woman” versus the good “Light Woman”. The dark woman—Brett Ashley of The Sun Also Rises—is a goddess; the light woman—Margot Macomber of “The Short Happy Life of Francis Macomber“—is a murderess.[181] Robert Scholes admits that early Hemingway stories, such as “A Very Short Story“, present “a male character favorably and a female unfavorably”.[184] According to Rena Sanderson, early Hemingway critics lauded his male-centric world of masculine pursuits, and the fiction divided women into “castrators or love-slaves”.

Inline image 1

Inline image 2Inline image 3

  సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

హెమింగ్వే  ఒక కొత్త దృగ్విషయం గా ఉండేవాడు .ఈస్తేటేస్ లో అతను అథ్లెట్ .ఆరడుగుల పొడవు సింహం తల ,పురుషాహంకార చాతీ తో ఒక ప్రైజ్ రింగ్ లోకి ప్రేవేశించినట్లు రూమ్ లో కి ప్రవేశించేవాడు .ఆయన గొప్ప బాక్సర్ మాత్రమే కాదు దానిలో శిక్షణ కూడా ఇచ్చే గురూజీ కూడా .దవడ కింద చలాకీగా కొట్టటం ఆయన నేర్చిన గొప్ప పాఠం.25 లో జర్నలిస్ట్ కంటే రచయిత కావాలనుకొని మొదటిచిన్న పుస్తకం వదిలాడు .ఏదో ఒక అనామక ప్రెస్ లో అంతగా ఆకర్షణ లేని విధంగా అది ప్రింట్ అయింది .దానికి ‘’త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయెమ్స్ ‘’అని పేరుపెట్టాడు .కొద్దికాలానికే రెండవది ‘’ఇన్ అవర్ టైం ‘’అచ్చు వేశాడు . ఎక్కువగా సంప్రదాయాన్ని పట్టుకు పాకులాడినట్లని పించింది .యుద్ధానంతర పరిస్తితి ,ఎపిగ్రాఫ్ లతో ఉంది .దీన్నే కొంత మార్చి 1924 లో న్యు యార్క్ నుండి ‘’ఇన్ అవర్ టైం ‘’గా ప్రచురించాడు .ఇందులో ఆయన శక్తి వంతుడైనసృజనాత్మక  రచయిత అనిపిస్తాడు .కాని ఇంకా పరిపక్వానికి రాని ,జీవితం ,కళ అంటే ఏమిటో తెలీని వాడుగా కనిపించాడు .ఇదొక నవల గా ఉంటుంది .ప్రతి అధ్యాయానికి శీర్షిక ,పాత్రల మధ్య సమన్వయం ఉంటుంది .నిజంగా ఇది చిన్నకదల సమాహారమే కాని ఒకదానికొకటి సంబంధం కలిగి పాత దానికి శబ్ద చిత్రం అనిపిస్తుంది .ఏక సూత్రత ఉండటం విశేషం .చూడగా ఈ రెండూ వేరు వేరుగా అనిపిస్తాయి .ఇందులో యుద్ధం ,హింస అకస్మాత్తు చావులు ఉంటాయి .మరోరకం గా అతని బాల్య స్వీయ చరిత్ర తండ్రితో చేపలు పట్టే విశేషాలున్నాయి..యుద్ధానికి ముందుకూడా లోకం లో శాంతి లేదని బాధ పడటం చూస్తాం .25 లో ఉగ్రవాద ౦ ,పెద్ద పెద్ద విషాద సంఘటనలలో ఏర్పడిన క్రౌర్యం అంటే ఆయనకు మోజుగా ఉండేది .ప్రతి రోజు జీవితం లో విషాదం ,క్రూరత్వం ,హృదయం లేని భావం అతన్ని బాగా పీడించేవి .వీటినన్నిటిని ‘’టోరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో రాశాడు .ఇది షేర్ వుడ్ ఆండర్సన్ కు నివాళి గానే కనిపించినా పరిహాసమూ ధ్వనిస్తుంది .ఆండర్సన్ చెప్పే సెక్సువల్ మిస్టి సిజం ‘’లాస్ట్ జెనరేషన్ ‘’కు పూజనీయమైంది .శాంతికోసం ఆరాటం అందులో కనిపించకపోవటం ఆ సిద్ధాంతం లో హెమింగ్వే కు కనిపించింది .

      హెమింగ్వే ఆకస్మాత్ ప్రాభవానికి ఆయన దృక్పధం, శైలి ముఖ్యకారణాలు .ఈ రెండు కూడా ఆగ్రహం లోంచి వచ్చినవే .వేలాది యువకుల నిరాశా నిస్పృహలు ,స్థితి త్రుణీకరణం ,ఆశల వైఫల్యం పై ఆయనకు కోపం ఎక్కువ .ఈ కోపం స్టాయిజం ముసుగులో కాని ఆ తరం సాంఘికంగా విలువలపరంగా తగినంత స్థాయిలో లేకపోవటం ఆయనకు బాధ కలిగించింది .కూలి పోయిన ప్రపంచం లో స్త్రీ పురుషులు ఏదో రకంగా సర్దుకు పోతూ ,చిద్రమైన బోహిమియన్ లలాగా జీవించటం చూసి ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’రాసి పెద్ద సంచలనమే సృస్టించాడు .మంత్రముగ్ధంగా బిగపట్టిన నరాలతో హింసాత్మకంగా ,పిచ్చి సంగీతం కోసం ,మరింత కిక్కిచ్చే మద్యం కోసం అరవటం కనిపిస్తుంది .ప్రేమ లేని సెక్స్ ,సెక్స్ లేని ప్రేమ ఇందులో పుష్కలం .

ఇందులోని హీరోలు బుల్ ఫైటర్లు  ,హంటర్లు ,క్రీడాకారులు ,ఆదిమానవులు .వీరంతా 20 వ శతాబ్ది బలహీన సంస్కృతికి ప్రతినిధులు .హెమింగ్వే వారి ప్రవక్త .వారి కస్టాలు బాధలు వేదనల కన్నీరు నిరాశా నిస్పృహ లపై సానుభూతి చూపాడు .వీళ్ళను తాను అధిగామించినవాడు .ఆయన రచయితమాత్రమేకాక ,,ఫైటర్ ,ప్రిమిటివ్   ,భౌతిక కార్యాన్ని ఘనంగా చెప్పినవాడు .చాలా ముక్కు సూటిగా అత్యంత సరళంగా ,యే అల౦కారం లేని విధంగా రాయటం ఆయన ప్రత్యేకత .’’his tone was dry and flat but the implications were exciting .-the dialogues were as as artlessly plastic as conversation  but they were un cannily precise and almost unbearably intense ‘. .ఈ దివాలా ప్రపంచాన్ని సమాజాన్నీ  ఆయన తిరస్కరించాడు .తన స్వంత శబ్ద ప్రపంచాన్ని సృష్టించుకొని శబ్ద బ్రహ్మ అనిపించాడు .ఆయనది ఒక భాషా విద్యాలయమే అయింది .సాహిత్య విప్లవం కోరుకొన్నాడు ..ఆయన విధానాన్ని రచయితలూ అనుకరించటానికి ఉబలాట పడ్డారు .కొందరు మాత్రం ఆయన రచనలు చదవ లేదని  ప్రగల్భాలు పలికారు .ఆయన అండర్ స్టేట్ మెంట్ లు  ఉడికే రక్తానికి ప్రతినిదులయ్యాయి .ఫాషన్ కూడా అయింది .’’sick brutality and twisted sentimentality లను వింతగా జోడించి రాయటం ఆయన ప్రత్యేకత .At twenty –seven Hemingway had set the keynote for a new kind of literature .it was felt half the young writers tried to imitate him and the other half tried not ‘’

Inline image 1

Inline image 2Inline image 3
   సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూర్య సిద్ధాంతం ప్రకారం కన్యా రాశిలో గురుడు 26 వ తేదీమంగళ వారమే ప్రవేశించాడని తెలిసి

మేము 29-7-16 శుక్రవారం ముక్త్యాల ఉత్తర వాహిని కృష్ణా నదిలో పవిత్ర పుష్కరస్నానం చేసి శ్రీ ముక్త్యేశ్వర స్వామిని సందర్శించి కోటిలింగాలలో శ్రీ పశుపతి నాద లింగానికి అభిషేకం చేయించి ,తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఫెర్రీలో గోదావరి -కృష్ణా సంగమాన్ని దర్శించి జలాలను శిరసుపై చల్లుకొని ఉయ్యూరు తిరిగి వచ్చిన ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232

85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )

 లిబ్రటిస్ట్ లయిన జార్జెస్ ఎస్.కాఫ్మన్ ,మోరీ రిస్కిండ్ ల ప్రోత్సాహం తో జేష్క్విన్ మరో కొత్త ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని అమెరికా సంస్కృతీ –మ్యూజికల్ సెటైర్ పై తన ముద్ర వేశాడు .యుద్ధం ,రాజకీయం ,బడా బిజినెస్ ,,ఉన్నత విషయాలలో డోల్లతనాలను సరదాగా నవ్విస్తూ’’స్ట్రైక్ అప్ ది బాండ్ ఆఫ్ దీఐ సింగ్ ‘’ద్వారా  బయట పెట్టాడు .దీనికి ‘’పులిట్జర్ ప్రైజ్ ‘’వచ్చింది .మొదటి సారిగా ఒక మ్యూజికల్ కామెడీకి ఈ బహుమతి రావటం చారిత్రాత్మకమైనది .అలాగే ‘’లెట్ దెంఈట్ కేక్ ‘’అనేది మరొకటి .వీటికి అన్న ఇరా లిరిక్స్ రాశాడు .ఈ రెండు 1930 -33 మధ్య వచ్చాయి .ఈ త్రయం కొత్త కోణాలలో భావాలతో పూర్వం కేవలం వినోదం అన్న దానికి భిన్నం గా గొప్ప సృజనాత్మకంగా దియేటర్ సంగీతానికి సొగసులద్దారు .

   1933 లో జేర్శ్విన్ ‘’పోర్జీ అండ్ బెస్స్ ‘అనే మొదటి అసలైన అమెరికన్ మ్యూజిక్ డ్రామాకు స్కెచెస్ తయారు చేశాడు .’’డు బోస్ హేవార్డ్’’ నవల ఫోక్ ఒపేరా ఆధారంగా దీన్ని రెండు ఏళ్ళ లో తయారు చేశాడు .ఇందులో ఆర్కేస్ట్రై జేషన్ కే తొమ్మిది నెలలు పట్టింది .కోరికలు భయాలు ,సంతోషాలు కలిసి గొప్ప వైవిధ్యం తో రూపు దిద్దాడు .అలాగే జోలపాట ‘’సమ్మర్ టైం ‘’బాగా పాప్యులర్ అయింది .అరడజను దాకా రాసినా పూర్తీ శాస్త్రీయ బద్ధ సంగీతం లో రాయలేదు అన్నాడు ఆస్కార్ లెవంట్ .’’he could never accustom to such restraints as sonatas ,rondos ,or any of the classic molds .the thematic fluency ,the easy going rhythmic freedom of the rhapsody or un restricted fantasy was his natural genre ‘’అన్నాడు ఆస్కార్ .వయసు 30 కి రాకముందు 30 మ్యూజికల్ కామెడీలు స్టేజ్ కి  సినిమాలకు రాశాడు  .1936 లో సోదరు లిద్దరూ మళ్ళీ కాలి ఫోర్నియా చేరారు .అప్పటికే నాలుగవ సినిమా ‘’ది గోల్ద్విన్ ఫాలీస్ ‘’కు సంతోషంగా సంగీతం కూరుస్తున్నాడు .అకస్మాత్తుగా తలనెప్పి వచ్చి బాధ పడ్డాడు .మొదట్లో స్నేహితులు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు .ఇవి హాలీ వుడ్ కు వ్యతిరేక మైన డిఫెన్స్ మేకానిజానికి చెందిన  సైకో సోమాటిక్ న్యూరోటిక్ ప్రొటెస్ట్ లనుకొన్నారు .ఒక్కసారిగా అతని పియానో టెక్నిక్ విఫలమవటం తో  స్టూడియో లోనే కుప్ప కూలాడు .డాక్టర్ దగ్గరకు వెంటనే తీసుకు వెళ్ళారు .అక్కడ కూడా ఆయన దీన్ని సీరియస్ గా భావించలేదు .అతన్ని పరీక్షించి నెర్వస్ బ్రేక్ డౌన్ అని చెప్పారు .రెండవ సారి వచ్చింది .ఎక్స్ రే రిపోర్ట్  అత్యవసరమైంది .మెదడులో కణితి పెరిగిందని గుర్తించారు .ఎమర్జెన్సి ఆపరేషన్ చేశారు .కాని కోలుకోలేదు లాస్ ఏంజెల్స్ లో 11 -7-19 37 న 39 వ ఏట సంగీత శిఖరారోహణ చేసిన జార్జ్ జేష్విన్ అకస్మాత్తుగా అమరుడైనాడు .మరిన్ని సృజనలతో మెరిపించి మురిపించాల్సిన సంగీత కర్త బ్రెయిన్  ట్యూమర్ తో మరణించాడు .

  ఆయన చనిపోయిన సుమారు 20 ఏళ్ళకు కూడా ఆయన సంగీతం తరచుగా వినటం మెచ్చుకోవటం జరుగుతోంది .అతని పెద్ద రచనలు అంతగొప్పవి కావని విమర్శకాభి ప్రాయం .కాని ఆయన జీనియస్ ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదు .రికార్డ్ కంపెనీలు ఆయన పాత పాటలను దుమ్ము దులిపి బయటికి తీసి కొత్త తరానికి అందిస్తూ ఆన౦దించేట్లు చేస్తున్నాయి .ఎన్నో సంగీత స్వరాలను కూర్చి పరవశింప చేయటమేకాక పూర్వం ఎప్పుడూలేనిసరికొత్త విధానం ప్రవేశ పెట్టాడు .పాప్యులర్ ,క్లాసిక్ సంగీతానికి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి లేక ఫార్మల్ నాన్ ఫార్మల్ సంగీత హద్దుల్ని చెరిపేసి విలువైన అమర సంగీతాన్ని అందించాడు .1955 లో ‘’పోర్జి అండ్ బీస్ ‘’ని ప్రదర్శిస్తూ యూరప్ అంతా   చుట్టిన కంపెనీకి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు .అంటే ఇప్పటికీ సంగీత ప్రపంచం లో రష్యాతోపాటు అనేక దేశాలలో అతని కీర్తి స్థిరంగా సురక్షణలోనే ఉంది అని తేలింది .””He had pronounced the tone and the tempo of his age –he had given music a new racy speech  and for the first time in history an American accent ‘’.

ఆతని ఎస్టేట్ అన్నకు ,తల్లికి సంక్రమించింది .అతని సంగీతం పై వచ్చే రాయల్టీ, కాపీరైట్ హక్కులు ఆ కుటుంబానికే దక్కాయి .ఆతను సంపాదించిన డబ్బును లెక్కేసి గార్డియన్ పత్రిక అన్నికాలాలోని సంగీత కారుల కంటే అత్యంత సంపన్నుడు అని తేల్చింది .మిచిగన్ యూనివర్సిటి లో అతనిపేర ఒక సంగీత కళాశాల ఏర్పరచారు .ఆయనకు వచ్చిన అవార్డులు చాలా విలువైనవి –కంగ్రేషనల్ గోల్డ్ మెడల్ ,స్పెషల్ పులిట్జర్ ప్రైజ్ ,ఇరా జార్జ్ సోదరులకు జీవన సాఫల్య పురస్కారం  ,లాంగ్ ఐలాండ్ మ్యూజిక్ హాల్ లో పేరు చేర్చారు .ఆర్కెస్ట్రా తో చేసినవి 10 ,సోలో పియానో లు 2 ,ఒపెరాలు 2 ,లండన్ మ్యూజికల్స్1 , ,బ్రాడ్వే మ్యూజికల్స్ 18 ,సినిమాలకు 5 జేర్శ్విన్ సంగీతం సమకూర్చాడు 

Inline image 1  Inline image 2Inline image 3

.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231

85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్

‘’తనకు తగిన తేజస్సు తో జీవించాడు ‘’ అని మెచ్చుకొనే అమెరికా ప్రజారంజక సాంప్రదాయ స్వరమాదుర్య సంగీత కర్త జార్జ్ జెష్విన్.38 ఏళ్ళకే అకస్మాత్తు సంఘటనలో మరణించే దాకా అమెరికాలోని ప్రజాదరణ సంగీతాన్ని గొప్ప మలుపు తిప్పట మేకాక  పశ్చిమ దేశాల లో సంగీత నాడిని వేగం చేసిన వాడు .అమెరికాలో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో 26-9-1898 న జన్మించాడు .తల్లి మార్రిస్. తండ్రి రోజ బ్రస్కిన్  జెర్ష్విన్ .చిన్నతనం అంతా మాన్ హాటన్ లోని లోయర్ ఈస్ట్ సైడ్ లో గడిచింది .తండ్రి అనేక పనులలో అంటే రెస్టారెంటులు ,రష్యన్ ,టర్కిష్ బాత్ లు ,బేకరీలు సిగార్ స్టోర్స్ ,ప్పోల్ పార్లర్ లలో ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అని పిలిచే బ్రిటన్ బీచ్ రేస్ ట్రాక్ దగ్గర పనులు చేసేవాడు .ఎక్కడా స్తిరంగా ఉండక ఎప్పుడూ ఏదో చోటికి మారు తూ ఉండేవారు .ఒక వ్యాపారాన్ని అమ్మేసి ఇంకో దాన్ని ప్రారంభించినప్పుడు ఆయనతో పాటే  కుటుంబమూ ‘’జెండాపై కపిరాజు ‘’అంటూ అక్కడికి  వెళ్ళేదన్నమాట  .అన్న ఇరా తమ్ముడు జార్జ్ తాము దాదాపు 25 చోటుల్లో ,అపార్ట్ మెంట్ లలో మారుతూ బతికామని చెప్పుకొన్నారు .సెకండ్ ఎవెన్యు లోకి మారినప్పుడు తల్లి ఒక పియానో కొన్నది .అప్పటికి జార్జ్ వయసు 12 .

       ఈ పియాని అన్న ఇరా కోసమే కొన్నా ,తమ్ముడు జార్జ్ దాని దగ్గర కూర్చుని ఎడమ చేత్తో చక్కగా వాయించేవాడు .తర్వాత చార్లెస్ హామ్బ్రిద్జర్ వద్ద చోపిన్ ,డేబూసీ ల సంగీతాన్ని నేర్చాడు  .ఈ చార్లెస్ జార్జ్ కి సంగీతంలోని ప్రాధమిక విషయాలు టెక్నిక్ లు క్షుణ్ణం గా నేర్పాడు  .దీనితో హై స్కూల్ ఆఫ్ కామర్స్  లో ఉదయం అసెంబ్లీకి సౌసా మార్చ్ సాంగ్ లు వాయించే నైపుణ్యం వచ్చింది  .15 వ ఏట నే ప్రొఫెషనల్ అయి పోయి ,ఒక మ్యూజిక్ పబ్లిషింగ్ సంస్థలో వారానికి 15 డాలర్ల జీతం తో చేరాడు .సాంగ్ స్లాగ్గర్ లతోకలిసి వాడే విల్లీ హౌసెస్ ,లకు వెళ్లి అక్కడ జరిగే వాటిని రిపోర్ట్ చేస్తూ ,ఆచరణ యోగ్య మైన స్వరాలు కట్టేవాడు .మూడేళ్ళ తర్వాత స్వంత ఒక పాట పబ్లిష్ అయింది .21 వ ఏట ‘’లాలా లూసేల్లి ‘’అనే కామెడి కి 1919 లో మొత్తం సంగీతాన్ని కూర్చాడు .అదే ఏడాది టిన్ పాల్ అల్లే లో పాటగాడు ఆల్జాల్సన్ స్వీనీ తో రాక్ పాటలు పాడటం తో జార్జ్ పేరు దేశమంతా మారు మోగింది .

 స్వీనీ  ఒక నమూనా (ప్రోటో టైప్ )పాటఆనాటి మూస సెంటిమెంటల్ మ్యూజిక్ కామేడీలకు అతి భిన్నంగా ఉండి విప్లవాత్మకమైంది .ఇది అప్పటిదాకా ఉన్న పాత వియన్నీస్ ఒపెరెట్టాఫాషన్  లకు కాపీగా కాకుండా ,పూర్తీ గా మార్పు చేసి వేగవంతమైన ,విపరీత ఆశ్చర్యాన్ని  కలిగించేట్లు ,ఉత్తేజం ,వినోదాల సంగీత విందు ఇచ్చింది .ఇందులో అన్నీ పరమ ఆశ్చర్య కరాలే .అందులోని స్వదేశ భావన ఆరాధన హాస్యపు గుబాళింపు తో మేళవించి ,పదాలు ,సంగీతం చాలా సరదాగా కలిసిపోయి ,విపరీతమైన శ్లేష తో ఆది నుంచి అంతం దాకా నమ్మకాన్ని విశ్వాసాన్ని అందించింది .ముఖ్యం గా ఇందులో స్వదేశీయ అమెరికా హృదయ ధ్వని భాసించి ఇదీ మా అసలైన  సంగీతం అని రుజువు చేసింది .

        దీని తర్వాత వచ్చిన పాటలన్నీ చాలా హాయిగా తేలిగ్గా లాబ దాయకంగా ప్రవ హి౦చాయి .ఇలాంటి స్వరాలు మాధుర్యం ఇంతకూ ముందు ఎన్నడూ అమెరికన్ దియేటర్ లో వినిపించనే లేదు ఇదొక విప్లవం .అమెరికన్ మూలాల లో పాదాలు ఉంచి నరాల ఉత్తుంగ ఉత్తేజం తో బ్రాడ్వే మ్యూజికల్స్ కు అనేక ప్రైవేట్ పాటలకు స్వరాలు కూర్చి స్వదేశీ భావసుమాలకు  పరిమళాలు అద్ది  రస  భరితం చేశాడు .అలాంటి వాటిలో ‘’ఐ గాట్ రిధం ‘’,సమ్ బడి లవ్స్ మి ‘’మే బి ‘’,’’లిజా ‘’,అవర్ లవ్ ఈజ్ హియర్ టు స్టే’’చాలా ప్రసిద్ధమైనవి .శారీరకంగానూ ఆయన చాలెంజింగ్ గానే ఉన్నాడు .ఎత్తుగా సన్నగా ఉన్న పర్సనాలిటి .ముఖం నలుపు సన్నం .నుదురుఎత్తు గా ఉండేది .మొత్తం మీదచూస్తే అసీరియన్ శిల్పం లాగా ఉండేవాడు .వేగవంతంగా నవ్వేవాడు. తనకు తగిన తేజం తో గోచరి౦ చేవాడు .ప్రజలను నమ్మక పోవటం లేదుకాని వాళ్ళను అర్ధం చేసుకొనే అవసరం ఉండేదికాదు .జీవితాంతం పెళ్లి చేసుకొనే లేదు .పియానో నే ఆయన పెళ్ళాం ఆంతరంగిక సహచరి .పియానో ఉంటె అన్నీ మర్చిపోయి అందులోనే ఆనందం తృప్తీ పొందేవాడు .ఇతర పియానిస్ట్ లు గదిలో ఉన్నా ఆయన ద్రుష్టి అంతా తన పియానో మీదే ఉండేది అంతటి తాదాత్మ్యం ఆయనది .’’చూడండి –నేను వాయిస్తుంటే అందరూ హాపీ ,కాని ఇతరు లెవరైనా వాయిస్తుంటే నేను దయనీయం గా ఉంటాను ‘’అని చెప్పాడు .సంప్రదాయ సంగీతకారుల సంగీతంపై బాగా ఇష్టం ఉన్నా ,సమకాలికుల స్వరాలు కొన్ని నచ్చినా ,మెచ్చుకొన్నా ,పియానో దగ్గర ఉంటె మాత్రం వాళ్ళను ఎవర్నీ మెచ్చిన దాఖలాలు లేవు .’’ఆయనతో సాయంత్రం గడపటం అంటే అది జేష్విన్ సాయంత్రమే ‘’అన్నాడు ఆయన స్నేహితుడు ,సాటి పియానిస్ట్ ఆస్కార్ లేవెంట్ . మరోసారి తన పాటకు మెరుగు పెట్టు కొంటూ ’’నా సంగీతం ఇంకో వందేళ్ళ తర్వాత ఎవరైనా వాయిస్తారా ?’’అని ఆస్కార్ ను అడిగితే ‘’తప్పకుండా నువ్వు వాళ్ళ మధ్య ఉంటే ‘’అని  నీరసంగా జవాబు చెప్పాడు ఆస్కార్ .

  వయసు ఇరవై లలో ఉండగా ఆయనకు నాటకీయంగా కొత్త జీవితం ప్రారంభమైంది .బాండ్ లీడర్ పాల్ వైట్ మన్ డాన్స్ మ్యూజిక్ ను ఉద్ధరించాలనుకొన్నాడు .ఆధునిక సంగీత ప్రయోగం పేరుతొ ఒక సంగీత కచేరి ని లింకన్ పుట్టిన రోజు 1924 లో ఆలోలియన్ హాల్ లో నిర్వహించాడు .అంతకు ముందేజనవరిలో  వైట్ మాన్  ప్రెస్ వాళ్లకు జేర్శ్విన్ తన స్వంతపాట పాడుతారని  ప్రకటించాడు .అందరి కంటే జేర్శ్విన్  ఎక్కువ ఆశ్చర్య పోయాడు ‘’నువ్వు ఏదో ఒక రోజు నా కు ఒక కాన్సేర్ట్ పీస్ రాయాలి ‘’అని అడిగాడు .’’ఏదో ఒకరోజు రాస్తాలే ‘’అన్నాడు యదా లాపంగా .పేపర్లో ప్రకటన చూశాక ఆ సంఘటన జ్ఞాపకమొచ్చి ,వెంటనే పనికి ఉపక్రమించాడు .ఒక సరదా విషయం తీసుకొని నోట్ బుక్ లో రాసుకొని దాన్నే ప్రార౦భ గీతంగా పాడాలనుకొన్నాడు .అది క్లారినెట్ పై సుదీర్ఘంగా ఉదాత్త అనుదాత్తాలతో సాగింది .అలా౦టి పాట ఆకాల౦  లో ఎవరూ వాయించటానికి సాహసిమ్చేవారుకాడు . అతి కష్టమైనదికూడా . .జేష్విన్ దాన్ని గొప్ప పద బంధం తో ,పై స్థాయిలో ‘’రాప్సోడి ఇన్ బ్లూ’’తో మొదలయ్యేటట్లు రాశాడు ..ఈ రాఫ్సోడి ని మూడు వారాల్లో పూర్తీ చేశాడు .దీన్ని అప్పుడు అక్కడ ప్రదర్శిస్తే దాని ప్రభావం చెప్ప తరంకాక విపరీతంగా విజయ వంతమైంది .సాగతీత ,పాత వాసనలతో విసుగెత్తిన జనాలకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది .సీరియస్ సంగీతం పై పిచ్చ అభిమానమేర్పడింది .దాని వేగం ,తీక్ష్ణత  అందులోని పరోక్ష ఇతి వృత్తానికి అన్నితరగతుల వారు మురిసి పోయారు  అందరూ కొంతకాలం దాకా దీన్ని గురించే మాట్లాడుకొనేవాళ్ళు .రాఫ్సోడి అమెరికన్ ట్రేడ్ మార్క్ అయి పోయింది .అమెరికా చరిత్రలో ఇంత అద్భుతమైనది అంతకు ము౦దుకాని ఆ తర్వాత కాని రాలేదు ,అంత తరచుగా వినబడలేదు అంత ప్రపంచ ప్రసిద్ధం కాలేదు .’’సన్  ఆఫ్ ది సాయిల్ ఇన్ మ్యూజిక్’’ అని పించుకొన్నాడు జేర్శ్విన్ .

ఇంకా విస్తరించాలి అని అభిమానులు కోరుకున్నారు .అందుకే చిన్న కమ్మర్షియల్ బిట్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద వాటిదాకా పనిచేసి అందరికి సంతృప్తి కల్గించాడు .వైట్ మాన్ అరెంజర్ అయిన ఫెర్డే గ్రోఫే రాఫ్సోల్ది ‘’కి ఆర్కెస్ట్రా సమకూర్చాడు .ఇక స్వంత ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాడు జార్జ్ ..కాలక్షేపానికి ఎప్పుడైనా టెన్నిస్ ఆడేవాడు స్పోర్ట్స్ కు దూరం .దీనికి బదులు స్టుడియోలలో రాబిన్ గోల్డ్ ఆర్క్ ,జోసెఫ్ శిలింజర్ వంటి ముఖ్య సంగీత కారులతో కూర్చుని కాలం గడిపేవాడు .జార్జ్ కూర్చిన ‘’టిన్ పాన్ అల్లే ‘’శిల్లిన్జర్ కు బాగా నచ్చి అందులోవింత ట్రయేడ్,టేట్రాడ్స్ వలన కలిగిన గణిత కీలక భావనలు అంతకు పూర్వం తెలియని హై పిచ్ స్కేల్స్ ,అవి తీగల నిర్మాణం తో సంబంధం కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగించి ‘’rhythmic  groups resulting from the interference of several synchronized periodicities ‘’  ,’’groups with the fractioning around the axis of symmetry ‘’అని రాశాడు .

  రాఫ్సోడి ప్రదర్శన తర్వాత ‘’కంసేర్టో f’’ లో సోలోయిస్ట్ అవతారమెత్తాడు .దీన్ని వాల్టర్ డాం రాష్ న్యు యార్క్ సి౦ ఫనికి చేశాడు ‘’యాన్ అమెరికన్ ఇన్ పారిస్ ‘’,సెకండ్ రాఫ్సోడి’’’’రాఫ్సోడి ఇన్ రివర్స్ ‘’వంటివి ఎన్నో చేశాడు .The rhapsody in blue was amounting adventure in excitement full of the flamboyant youth and pulsing energy of the nation .The jazz  driven ‘’concerto ‘’widened Gershwin ;s gamut ‘’దీనిలో ఏముంది అంటే –‘’the nerves ,repressions and complexities of the modern world ‘’అమెరికన్ జాతీయాలను యాన్  అమెరికన్ ఇన్ పారిస్ ,సెకండ్ రాఫ్సోడి’’లు మరింత విస్తృతం చేశాయి .ఈ పాటలతో నగరాలు పల్లెలు వీది వీధినా మారు మోగాయి .

Inline image 1

  సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )

  స్టాక్ హోమ్స్ లో పురస్కార ప్రదానోత్సవం నాడు ఫాక్నర్ మాట్లాడిన తీరు అందరూ మాట్లాడే రీతికి భిన్నంగా చాలా హుందాగా ,వినయపూర్వకంగా ,చాంపియన్ షిప్ గా ఉండి అందర్నీ ఆశ్చర్య పరచింది .అందులో కొన్ని బంగారు పలుకులు ఆయన మాటల్లోనే –‘’The old universal truths ,lacking which any story is ephemeral and doomed ..Until the writer re learns these things ,he will write as though he stood among and watched the end of man .I believe that man will not merely endure –he will prevail ..He is immoral ,not because he alone among creatures has an inexhaustible voice but because he has a soul ,a spirit capable of compassion and sacrifice and endurance The poet’s ,the writer’s ,duty is to write about these things .It is his  privilege to help man endure by lifting his heart ,by reminding him of the courage and honor and hope and pride and compassion and pity and sacrifice which have been the glory of his past ‘’.ఈ స్టాక్ హోమ్స్ ఉపన్యాసం అందరూ మెచ్చుకొన్నారు .విషాద ,నిరుత్సాహ వాతావరణం లో ఎప్పుడూ మాట్లాడే ఫాక్నర్ ఇంత గొప్పగా మాట్లాడుటాడని ఇంతటి ఆశ ను చిగురింప జేస్తాడని ఎవరూ ఊహించలేదు .వాళ్ళకిప్పుడు గొప్ప ఊరట కలిగింది .మనుషులను ఓదార్చి వాళ్ళ కడగండ్ల నుండి ఉద్ధరించటం రచయిత బాధ్యత.వాళ్లకు బలమైన పునాదులతో ఆశా సౌధం నిర్మించాలి అనే ఆయన సిద్ధాంతానికి బలం చేకూరింది .యెంత నీచ అల్ప విషయమైనా దానికి జీవం చేకూర్చే పని ఫాక్నేర్ చేయగలడు అని నమ్మారు .ఫాక్నేర్ నేచురలిజం ను ఫ్రెంచ్ రచయిత బాడర్లేర్ ‘’డయ బాలిజం ‘’తోనూ రష్యా రచయిత డాస్టోవ్ స్కి ‘’గిల్ట్ సఫరింగ్ డ్రైవ్ ‘’తోనూ పోల్చారు .

   నోబెల్ ప్రైజ్ పొందిన నాలుగేళ్ళకు ‘’యే ఫేబుల్ ‘’రచన ప్రచురించాడు .పాత గొలుసు నవలలకు భిన్నంగా తన జీవిత ఆకాంక్షను తెలియ జేస్తూ రాశాడు .ఇందులో జాలి దయ ,ఆశ నింపాడు .ఇది ఒక నవలలాకాక ప్రతీకల సమూహంగా ఉంది .’’ది బేర్ ‘’లో ఒకే వాక్యం లో రెండు వందలకు పైగా పంక్తులు రాశాడు .మరో గొప్ప విషయం ఏమిటంటే ఆయన జీవనకాలం లో ఆయన్ను మించి రాసిన వారెవరూ లేక పోవటం ‘’he combines the novel of direct action with the novel of analysis ..ఏది రాసినా దానికొక పరమార్ధం ఉండేట్లు రాశాడు .మొత్తం మీద ‘’threatened with disaster and at times dementia ,Faulkner ‘s world is scarcely alluring ,but it is unmistakably a world ,and it is unquestionably his own ‘’

The manuscripts of most of Faulkner’s works, correspondence, personal papers, and over 300 books from his working library reside at the Albert and Shirley Small Special Collections Library at the University of Virginia, where he spent much of his time in his final years. The library also houses some of the writer’s personal effects and the papers of major Faulkner associates and scholars such as his biographer Joseph Blotner, bibliographer Linton Massey, and Random House editor Albert Erskine.

Southeast Missouri State University, where the Center for Faulkner Studies is located, also owns a generous collection of Faulkner materials including first editions, manuscripts, letters, photographs, artwork, and many materials pertaining to Faulkner’s time in Hollywood. The university possesses many personal files and letters kept by Joseph Blotner, along with books and letters that once belonged to Malcolm Cowley, another famous editor for William Faulkner. The university achieved the collection thanks to a generous donation by Louis Daniel Brodsky, a collector of Faulkner materials, in 1989.

Further significant Faulkner materials reside at the University of Mississippi, the Harry Ransom Center, and the New York Public Library.

·         radine (“Spotted Horses”) and Arliss Howard (“That Evening Sun”, “Wash”). Winner of AudioFile Earphones Award.

·         William Faulkner Reads: The Nobel Prize Acceptance Speech, Selections from As I Lay Dying, A Fable, The Old Man. Caedmon/Harper Audio, 1992. Cassette. ISBN 1-55994-572-9

·         William Faulkner Reads from His Work. Arcady Series, MGM E3617 ARC, 1957. Faulkner reads from The Sound and The Fury (side one) and Light in August (side two). Produced by Jean Stein, who also did the liner notes with Edward Cole. Cover photograph by Robert Capa (Magnum).

·         From 1957 to 1958, William Faulkner was the University of Virginia’s Writer in Residence (the first). There are audio recordings of his time at the University of Virginia, and they have now been made available online at Faulkner at Virginia

                       64 ఏళ్ళ వయసులో ఫాక్నేర్ 6-6-1962 న మిసిసిపి లోని బైహాలియా లో చనిపోయాడు .నోబెల్ ప్రైజ్ తోపాటు పులిట్జర్ ప్రైజ్ నేషనల్ బుక్ అవార్డ్ లు కూడా పొందాడు Faulkner was known for his experimental style with meticulous attention to diction and cadence. In contrast to the minimalist understatement of his contemporary Ernest Hemingway, Faulkner made frequent use of “stream of consciousness” in his writing, and wrote often highly emotional, subtle, cerebral, complex, and sometimes Gothic orgrotesque stories of a wide variety of characters including former slaves or descendants of slaves, poor white, agrarian, or working-class Southerners, and Southern aristocrats.

In an interview with The Paris Review in 1956, Faulkner remarked:

Let the writer take up surgery or bricklaying if he is interested in technique. There is no mechanical way to get the writing done, no shortcut. The young writer would be a fool to follow a theory. Teach yourself by your own mistakes; people learn only by error. The good artist believes that nobody is good enough to give him advice. He has supreme vanity. No matter how much he admires the old writer, he wants to beat him..

   ‘’యే మార్బుల్ ఫాన్ ‘’ది గ్రీన్ బో ‘’అనే రెండు కవితా సంపుటులను కూడా ఫాక్నర్ రాశాడు న్యు క్ర్తిటిక్స్ కు ఆయన ఆరాధనీయుడు .. He donated part of his Nobel money “to establish a fund to support and encourage new fiction writers”, eventually resulting in the PEN/Faulkner Award for Fiction, and donated another part to a local Oxford bank, establishing a scholarship fund to help educate African-American teachers at Rust College in nearby Holly Springs, Mississippi. The government of France made Faulkner a Chevalier de la Legion d’Honneur in 1951.

   పోస్త్మాస్తర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పై అధికారులకు ఆయన రాసిన ఉత్తరం ఎలా ఉందొ చూద్దాం – As long as I live under the capitalistic system, I expect to have my life influenced by the demands of moneyed people. But I will be damned if I propose to be at the beck and call of every itinerant scoundrel who has two cents to invest in a postage stamp.

This, sir, is my resignation.

Inline image 1   Inline image 2Inline image 3Inline image 4

Inline image 5

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఫాక్నర్ అంతగా ప్రసిద్ధి చెందక పోయినా ఆయన గురించి జనం బాగా చెప్పుకొనేవారు .ఆయన డార్క్ మేజిక్ ,దెయ్యాలు రిరిగే తీర భూముల  భీకర అందాల గురించి చర్చించుకొనేవారు .ఆ ప్రదేశం ఎందుకు దెయ్యాల ఆవాసభూమి అయిందో పాల్క్నర్ ఎప్పుడూ విడమరచి చెప్పలేదు కాని చావు ,పతనం ఆయన రాసిన వాటిలో ఉన్నాయి .అందుకే ఆయన రచనలు ‘’dark grandeur of destruction ‘’అని పించాయి .ఆ భూములు వాటి యజమానులు బానిసత్వం వలన బలసి పోయారని అన్నాడు .అరిస్టాక్రసి ,ధనదాహం తో వాళ్ళు ధైర్యం  గౌరవాలను పోగొట్టుకొన్నారు .దీనిని వ్యతిరేకించే ఆయన, వాళ్ళ ఓటములను కధలుగా చెప్పాడు .వాళ్ళందరూ శాపోపహతులు అంటూ ఫాక్నర్ ‘’this whole land the whole of South is cursed ‘’అన్నాడు అందులోని పాత్ర మెక్ కాల్సిం ‘’అక్కడి నుంచి వచ్చిన మేమంతా నల్లవాళ్ళు తెల్ల వాళ్ళు పోషింపబడి ఆ శాపం లోనే ఉండిపోయాం ‘’అని అరుస్తాడు .

32 వ ఏట ఇద్దరుపిల్లల తల్లి ఎస్టెల్లా ఓల్డ్ హాం ఫ్రాంక్లిన్ ను పెళ్ళిచేసుకొన్నాడు .ఈ పెళ్లి వలన ఒక శిశువు పుట్టి చనిపోయింది .తర్వాత కూతురు జిల్ పుట్టి ఆయనకు గర్వ కారణమైంది .తరువాతి నవల ‘’ఆస్ ఐ లేడైయింగ్ ‘’ను బొగ్గు ప్లాంట్ లో పని చేస్తుండగా వీల్బారో వెనక కూర్చుని రాశానని చెప్పుకున్నాడు .ఇందులో బంద్రెంస్ అనే పేద తెల్ల వాడి గురించి ఆడీ బ్రన్దేన్ అనే కొండ జాతి అమ్మాయి గురించి ,ఆమె కుటుంబ బాధలగురించి ,ఆమె శరీర మాంసం శిధిలమై పోతుండా గా ఆమెను జెఫర్సన్ సేమిటరికి చేర్చటం , ఆమె శరీరాన్ని పీక్కు తినటానికి ఆకాశం లో గద్దలు రాబందులు తిరుగుతూ భయోత్పాతాన్ని కల్పించటాన్ని ఆమె కొడుకు పిచ్చివాడిగా మారటం భర్త పెట్టుడు పళ్ళ తో తనకు  భార్య శవాన్ని పూడ్చటానికి పలుగూ పారా అప్పుగా  ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం  పరమ హృదయ విదారకంగా రాశాడు ఫాక్నర్ .విషయం నిరాసక్తమైనదే అయినా ఆయన నిర్వహించిన తీరుతో అది ,గుండెలోకి సూటిగా దూసుకుపోయే శబ్దజాలం తో ,ముడి కవిత్వంతో ‘’బాక్ వుడ్స్ ఎపిక్ ‘’అయింది .సమాప్తానికి ముందు అందులోని ఒక పాత్ర మానవుని నిష్ప్రయోజకత ను వ్యక్తీకరిస్తుంది ఇది ఫాక్నర్ గొంతు అని భావం అని మనం గ్రహించాలి-అతడే మన్నాడో ఆ పాత్ర మాటల్లో ఇంకా గొప్పగా ఉంటుంది చూడండి –‘’ How do our lives ravel into the no wind ,no sound ,the weary gestures wearily recapi tulant  echoes of ld compulsions with no hand on no strings –in sun set we fall into furious attitudes ,dead gestures of dolls ‘’ఇలాంటి స్టేట్మెంట్ కౌంటర్ పాయింట్ గా ‘’ఇలియట్ రాసిన ‘’హాలో మెన్ ‘’కు దీటుగా అనిపిస్తుంది –ఒక్కసారి ఇలియట్ కవిత్వం లోకి దీనికోసం తొంగి చూద్దాం –

‘’shape without form ,shade without color –paralyzed force ,gesture without motion –remember us –if at all –not as lost –violent souls  but only –as the hollow men –the stuffed men ‘’

వయసు 30 మధ్యలో ఉండగా సీరియస్ నవలల తో విజయం సాధించాలనుకొన్నాడు .’’సాన్ క్ట్యుయరి ‘’రాసి అబ్బే చాలా చీప్ గా కాసులకోసం కక్కూర్తి గా రాసినట్లుంది   అనుకొన్నాడు .నమ్మ శక్యం కాని దృశ్యాలు హింసాత్మకంగా ,వేశ్యా గృహం లో పూర్తిగా జరిగే కధగా దారుణ వాస్తవికంగా రాశాడు .ఇది కూడా అతని సౌత్ లాండ్ లో జరిగే నిత్య కృత్య రేపులు ,దిగాజారుడులే .సెన్సార్ వాళ్ళు కత్తెర వేశారు కాని కనక వర్షం కురిపించింది .దీన్ని అదనుగా తీసుకొని హాలీ వుడ్ స్క్రీన్ ట్రీట్ మెంట్ రాయటానికి ఆహ్వానించింది .అక్కడ కద అంతా మారి పల్చనై ‘’ది స్టోరీ ఆఫ్ టెంపుల్ డ్రీకర్ ‘’గా విడుదలైంది .మిగిలిన కొన్ని కధలను సినిమాలు తియ్యటం కోసం ఆయన్ను పెట్టుకొన్నారు .డబ్బు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చలో హాలీ వుడ్ .కనుక బతకటానికి వేరే ఉద్యోగం అక్కర్లేకుండా పోయింది .పోస్ట్ మాస్టర్ గా ఎలా నిర్వాకం చేశాడో ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ గా అలానే చేశాడు .ఒక దానికి స్టూడియో లో కాకుండా ఇంటి దగ్గరే రాయటానికి అనుమతి తీసుకొన్నాడు .ఈయన అద్దెకున్న ఇల్లు వెదికి  డైరెక్టర్  వెడితే మనవాడు మిసిసిపి కి జంప్ జిలానీ అయ్యాడని తెలిసి పర్మిషన్ అడగటం ఒక సాకు మాత్రమే అని అర్ధమైంది .

   పూర్తిగా ఊహా ప్రపంచాన్ని సృష్టించాలన్న కోరికతో ‘’యాక్న పటా వాఫా ‘’సాగా సీరియల్ గా రాయ దలచి అతి భీకర ,మహా విపత్ భరిత ,అత్యంత వేదనా భరిత నవల ఇది వరకెన్నడూఅమెరికాలో  రాయని విధంగా రాశాడు .అందులో ‘’లైట్ ఇన్ ఆగస్ట్ ‘’లో కుళ్ళి శిధిలమై పోతున్న నాగరకతను కళ్ళకు కట్టించాడు .ఇందులో రెండుకధలున్నాయి ఒకటి గర్భిణి అయిన ఒక పర్వత ప్రాంత అమ్మాయి కడుపులోని బిడ్డకు తండ్రి అయిన వాడిని వెదకటం ,సెక్స్ కోరికలతో సతమతమవుతూ నీగ్రోలకు సాయం చేసే తన ప్రేమ గూడులో చిక్కిన ఒక కుర్ర వాడిని చెడగొట్టి తానూ నాశనం అయ్యే  ఒక ముసలి మెయిడ్ కద..’’అబ్సలాం అబ్సలాం ‘’అనేది ఒక మేలో డ్రామా ఇందులో కోరిక ,సమ్మోహన బుద్ధి ,వావి వరసలు లేని శృంగారం లతో పతనమైన ఒక  వంశ చరిత్ర ఉంది .కధను అనేక పాత్రలద్వారా అసందర్భంగా చెప్పించినా నిర్మాణం వెనుకా ముందూ ప్రస్తావన లతో ఫాక్నర్ లోని ద్వైవీ భావాన్ని బయట పెడుతుంది .మానవత్వ  హుందాతనంతో పాటు నీగ్రో ,అన్నా ఆమె అన్నా అయిష్టత గోచరిస్తుంది ‘’ది అన్ వాన్క్విషెడ్’’లో మరో కుటుంబ కద ఉంది  ,రాసిన  ప్రచురితమైన అనేక కధలలో తన తాత గారి వ్యక్తిత్వ ఆరాధనా ఆయన ‘’సార్టోరిస్ ‘’వంశానికిచెందిన వాడుగా నిలబెట్టాడు .’’వైల్డ్ పామ్స్ ‘’ది హామ్లెట్ ‘’,ఇంట్రూడర్ఇన్ ది డస్ట్ ‘’మొదలైనవి ఈ  శ్రుమ్ఖలానికి చెందినవే .మాల్కం కౌలీ ‘’ది పోర్టబుల్ ఫాక్నర్ ‘’లో ‘’part of the same living pattern .In this pattern and not the printed volumes in which part of it is recorded that Faulkner ‘s real achievement ..he has little need to construct .,he needs only to call upon what is already waaiting for him ‘’అంటూ చక్కగా చెప్పాడు .

  50 వ ఏట ఫాక్నర్ జాతీయ వ్యక్తి అయ్యాడు .ప్రముఖ రచయితగా గుర్తింపు పొంది రచయితల సంఘాలకు ,సాహిత్య సమావేశాలకు దూరమైనాడు .విమర్శను దూషించేవాడు కాదు .న్యు క్ర్తిటిక్ ల పై యే అభిప్రాయం ఆయనకు లేదు .కళా ఈస్తెటిక్స్ మొదలైన వాటికి దూరంగా ఉండేవాడు ‘’నేనొక సామాన్య రైతును.ఏదో అప్పుడప్పుడు కధలు రాస్తాను  ‘’అని చెప్పుకునేవాడు .ఈ రైతు రచయిత కే ఎంతో విశిష్టమైన నోబెల్ సాహిత్య బహుమతిని నవంబర్ 1949 లో అందజేసి గౌరవించింది నోబెల్ పురస్కార సంస్థ .ఈ వార్తను  భార్య ఆయనకు చెప్పేదాకా తెలియనే తెలియదు .

Inline image 1  Inline image 2Inline image 3

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్

టి ఎస్ .ఇలియట్ లాగా విలియం ఫాక్నర్ ‘’అతి ‘’వలన  పరాజయం పొందిన ,దాని అపరాధానికి అంతమైన ,దాని గర్వానికి,మాయ నటనకు  నాశనమైన,శిధిలమవుతున్న ప్రపంచం లో ఎదురు చూపులు చూస్తూ ,చావును కోరుకొంటూ బతికిన వాడు . ఇలియట్ లాగానే రాసిన శక్తివంతమైన కొన్ని ,ఆకాలపు పెసిమిస్టిక్ సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందాడు .ఇలియట్ లాగా కాకుండా తను పుట్టిన  తనకు అన్నం పెట్టిన మట్టినే నమ్మి తాను  ఎంచుకొన్న తన ‘’ఊసర క్షేత్రం ‘ సౌత్ లాండ్ ను ’ పండించే ప్రయత్నం చేస్తూ ,జన్మ భూమిని ,సంస్కృతిని ,పౌరసత్వాన్ని ఎప్పుడూ నిందించని వాడు ఫాక్నర్ .

     25-9-1897 న నలుగురు సోదరులలో పెద్దవాడుగా అమెరికా లో న్యు ఆల్బనిలోని మిసిసిపి లో పుట్టాడు .బాల్యం లోనే తండ్రి’’ గౌరవ మర్యాదల ‘’ కోసం హత్య చేయ బడ్డాడు .తాతగారు చేయించిన ఈ ఘాతుకం లో ఎవరూ చావ లేదు.తల్లి కుటుంబాన్ని యూని వర్సిటి టౌన్ ఆక్స్ ఫర్డ్ కు మార్చింది .కుటుంబం లో ఈ హత్యలు మామూలే .ఫాక్నర్ తాత విలియం కూబర్ట్ ఫాక్నర్ చాలా ఊహా ప్రపంచ జీవితం గడిపాడు .14 వ ఏటనే ఇంట్లోంచి పారిపోయి ,మెక్సికన్ యుద్ధం లో చేరి ,కెప్టెన్ గా తిరిగొచ్చి ,లా చదివి ,చిన్ననాటి స్వీట్ హార్ట్ ను పెళ్ళాడి ,సివిల్ యుద్ధకాలం లో ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పరచి ,యుద్ధం తర్వాత గొప్ప లీగల్ ప్రాక్టిస్ చేసి 40 లో  ప్రసిద్ధుడయ్యాడు  .50 నాటికి లెజేండరివ్యక్తీ అయి ,ఒక బ్యాంకర్ తో భాగస్వామి అయి ,రైల్ రోడ్ నిర్మించి ,రచయితగా పేరు పొంది ‘’వైట్ రోజ్ ఆఫ్ మెంఫిస్ ‘’’’లిటిల్ బ్రిక్  చర్చ్’’,లను ‘’అంకుల్  టామ్స్ కేబిన్ ‘’కు దీటుగా రాసి స్టేట్ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు .ఈ బహువిధ జీవన వ్యాపారం తన భాగస్వామితో జరిగిన పోట్లాటలో ద్వేషంగా మారి కాల్చిఆయన్ను  చంపి పారేసేదాకా వచ్చింది .అందరూ తాతను కల్నల్ అని పిలిచేవారు ఆయనే ఫాక్నర్ కు ఆదర్శం .తాను  రాసిన నవలలో కధల్లో ఆ పాత్రను అద్భుతంగా పండించాడుకూడా .

  తాతకాలం నుండి కుటుంబాని గౌరవ ప్రఖ్యాతులు పుష్కలంగా ఉండేవి  .ఫాక్నర్ తండ్రి  స్వంత   ఫామిలి రైల్ రోడ్ కు కండక్టర్  . ఫాక్నర్ గతకాలపు స్మృతులలో తేలుతూ వర్తమానాన్ని పట్టించుకొనే వాడు కాదు .స్కూల్ లో చదవటం ఇష్టం ఉండేదికాదు .హైస్కూల్ చదువు కూడా పూర్తీ చేయలేదు .చదువులో దిశా నిర్దేశం లేక ,తప్పుల్ని సరిదిద్దేవారు లేక చాలా అతిశయం తో కీట్స్ కవి స్వచ్చ రోమాన్టిజం నుంచి ఫ్లాబర్ట్ రియలిజం  దాకా దేకాడు.యవ్వనం లో ఉన్నప్పుడే కవిత్వం రాశాడు .మొ .ప్ర .యుద్ధం ప్రారంభమవగానే విమాన దళం లో చేరాడు .అమెరికా వాయుసేన విమానాలు నడపటానికి తిరస్కరించాడు .’’యాంకీల ‘’బాసిజాన్ని నిరసించే భేషజం ఉన్నవాడు .21 వ ఏట బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో చేరి ,ఫ్రాన్స్ యుద్ధం లో గాయపడి ,యుద్ధం పూర్తీ అయినా ఫ్లైట్ ట్రెయింగ్ లోనే ఉండి ,తాను  గొప్పలు చెప్పుకొనే గాయం యుద్ధం లో కాక ఆర్మిస్టిక్ డే ఉత్సవాలలో తగిలిన గాయమే అది అని తెలిస్తే ఎవరైనా  నవ్వి పోతారు .’’నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ‘’రకం .

   ఆక్స్ ఫర్డ్ లో చేరి చిన్నఇంటికి పెయింటింగ్ ,కప్పు బాగు చేత ,కార్పెంటరి ఉద్యోగాలు చేస్తూ బతికాడు .అప్పుడే రైతులు ,కౌలు దార్లు నీగ్రోలు చెప్పిన అనేక కధలను విన్నాడు వాటిని సేకరించాడు .అనేక పుకార్లు నమ్మాడు .మళ్ళీ ఒకసారి బడి చదువు ప్రయత్నం చేశాడు ఆక్స్ ఫర్డ్ లో మిసిసిపి యూని వర్సిటి లో చేరి లెక్కలు ఇంగ్లీష్ లలో తప్పి ,రెండో ఏడాది చదవకుండానే బయటికొచ్చాడు .యూని వర్సిటి లో ఉన్న మిసిసిపి రచయిత స్టార్క్ యంగ్ ఫాక్నర్ ఆశించేది న్యు యార్క్ లో దొరుకుతుంది అని సలహా ఇవ్వగా  ఉత్తరానికి వెళ్ళాడు .అక్కడ ఏమీదోరకలేదు .యాంగ్ తో కలిసి ఉండి గ్రీక్ హోటల్ లో బొచ్చెలు కడిగి ఏవో  కొన్ని రాళ్ళు సంపాదిస్తూ ,డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పుస్తకాలు అమ్ముతూ గడిపాడు .ఆరు నెలల  పస్తుల బతుకు తర్వాత తన స్వగ్రామం ఆక్స్ ఫర్డ్ లో పోస్ట్ మాస్టర్ గా పని చేద్దామని తిరిగొచ్చాడు .ఏ పని సమయానికి చేసేవాడుకాడు .ఉత్తరాలు సార్ట్ చేయాలంటే బద్ధకం .అకౌంట్ పుస్తకాలు జాగ్రత్తగా నింపటం ,,రికార్డ్ లను భద్ర పరచటం లో అలసత్వం చూపుతూ తన ఇష్టం వచ్చినప్పుడు పోస్టాఫీస్ ను తెరుస్తూ మూస్తూ పబ్లిక్ సంగతి పట్టించుకోకుండా చెత్త పోస్ట్ మాస్టర్ అనిపించుకొన్నాడు .కస్టమర్లు పైకి ఫిర్యాదు చేయగా రాజీనామా ఇచ్చేశాడు ‘దీనిపై రాస్తూ ‘’I am glad I will no longer have to be at the beck and call of any  one who happens to have two cents ‘’అన్నాడు .

   రెండేళ్ళు వ్యవసాయం ,చేపలుపట్టటం , వేట  చేసి 27 వ ఏట విసుగెత్తి యూరప్  వెళ్ళాలనుకొని న్యు ఆర్లియన్స్ చేరాడు .తనకిష్టమైన చిన్నకదా రచయితా షేర్ వుడ్ యా౦డర్సన్ ను కలిసి ,మొదటిసారిగా రచయితలతో కలిసే అవకాశం పొందాడు .’’పార్శియన్ బోహేమియన్స్ ఆఫ్ ది లెఫ్ట్ బ్యాంక్ ‘’ కు బదులుగా  ‘’న్యు ఆర్లియాన్స్ ఫ్రెంచ్ క్వార్టర్ ‘’ఏర్పాటు చేశారు .వీళ్ళ ‘’ది డబుల్ డీలర్ ‘’పత్రికకు ,సిటీలో పేరున్న మరో పత్రిక కు ‘’మస్క్విటోస్’’అనే సెటైర్ ను ‘’సోల్జర్స్ పే’’అనే అనే ఉడుకు రక్తపు రిపోర్ట్ రాశాడు ,హీరో హీరోయిన్ లు లేకుండా రాశాడు .పెద్దగా క్లిక్ కాలేదు కొన్ని చిన్న కధలు రాసి అమ్మాడు .రచనతో పొట్ట గడుపులేను అనుకొన్నాడు .’’సార్టారిస్’’,’’ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ ‘’లలో తన సొంత సాహిత్య సీమను సృష్టించుకొన్నాడు.ఒక ఊహా దేశం ‘’యోక్న పటా వఫా’’ సృష్టించు కొన్నాడు  ..ఇదే అసలైన అమెరికన్ ఆదిమానవుల యోకనా రివర్ పేరు .ఒకప్పుడీ ప్రాంతం బంగారు పంట పండిన ప్రదేశం ,ఇప్పుడు భవంతులతో పాట సంస్కృతీ వినాశనం తో వెల వెల పోతోందని భావించాడు  .ఎస్టేట్లు ,నాశనమై తెల్లబంగారం అనబడే పత్తి క్షేత్రాలు కనుమరుగై ,రైతుల నడుములు విరిగి ,అవినీతి నిలయమైన పట్టణాలతో ,చిత్తడినేలలు ,అడవులతో అమెరికన్ యూనియన్ లో  అత్యంత పేదరిక ప్రదేశమైనందుకు బాధ పడ్డాడు ఫాక్నర్ .అచ్చంగా ‘’వేయి పడగలు’’ నవల లో విశ్వనాధ పడిన ఆవేదనే పడ్డాడు ఫాక్నర్ .

     ఈ సౌండ్ అండ్ ఫ్యూరీనవల ఫాక్నర్ రచనలలో ఉత్కృష్ట మైనదిగా ,చెదిరిన సంస్కృతీ విలసిననానికి దర్పణంగా  బావిస్తారు అతని రచనా పాటవానికి అబ్బుర పడతారు ‘’లైఫ్ బీయింగ్ యే టేల్.టోల్డ్ బై యాన్ ఇడియట్  సిగ్ని ఫైయింగ్ నధింగ్ ‘’అన్న షేక్స్ పియర్ సూక్తికి ఇది సజీవ నిదర్శనం .ఫాక్నర్ శీర్షికతో నే కాకవిధానం తో కూడా చదువర్లు దారి తప్పారు .సామాన్య వివరణ కు భిన్నంగా దీన్ని రాయటం అతని ప్రత్యేకత.’’Faulkner  disrupted the usual sequence of events ,he juggled the sections to show the violent disintegration of a family sharpened characterization by the use of interior monologs in the Joycean ‘’stream of consciousness ‘’and made time seem as way ward as the mind of the idiot Benjy Compson  the symbol of ultimate ruin .’చాలా మంది ఈ విధానం అస్పష్టం అని వెనక నుంచి చదువుకోవాలని మళ్ళీ మళ్ళీచదివితే కాని బుర్రకు ఎక్కదు అన్నారు .దీనికి భిన్నంగా పెద్ద పెద్ద సిటీల జనం అతని  శైలీపరిణతికి  నిశ్చేస్టు లయ్యారు .  రాత లోని దూకుడు ,దాని ప్రభావం అనిర్వచనీయం .అంతకు ముందు కాని ఆ తర్వాత కాని ఈ పుస్తకం ప్రజల మనసులలో దూరినంత గా, యే పుస్తకం చేరలేదు .’’It presented a marvelous and unprecedented amalgam of innocence and depravity of sick delusions maturity ‘s yearning for the security of early family affection ,and child hood ‘s memories lost in hopeless longings or as in the case of Benjy twisted into madness ‘’

Inline image 1 Inline image 3

Inline image 2
         సశేషం

             మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-3(చివరి భాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్–3(చివరి భాగం)

  అమెరికాకు తిరిగొచ్చాక తాను  ఏదో ప్రశాంతమైన స్థలం లో ఉండి తనమనసులో ఉన్న విషయాలపై రచన సాగిస్తానని ప్రకటించాడు ఫిట్జెరాల్డ్ .మళ్ళీ నిలకడ లేనితనం ,బాధ్యతారాహిత్యం తో ఉండి పోయి పదేళ్లకు కాని ఏదీ రాయలేక పోయాడు .హాలీఉడ్ కు ఆఫర్ వచ్చి’’ బంగారు లప్ప ‘’ఏదో దొరుకు తుందని తిరస్కరించకుండా వెళ్ళాడు .అక్కడా పార్టీల హోరు  ప్రాక్టికల్ జోకుల తో యే పనీ చేయలేదు .ముడ్డి మీదకు ముప్ఫై ఏళ్ళు వచ్చినా పాత పధ్ధతి మారక ‘’ఆడాల సెంట్ స్థాయి’’ నుంచి ఎదగ లేదు .’’తాగు బోతు  నాయాల’’గానే ప్రవర్తించాడు .కాన్స్తాంట్ టల్మాడ్గే అని జాజ్ యుగపు విఫల వ్యక్తిపై కద రాస్తే  తిరస్కరిస్తే భార్యతోకలిసి తూర్పుకు వెళ్లి డేలావార్ విల్లింగ్టన్ దగ్గర  ఒక పాత ఇంటిని కొని ఇంటినీ వ్యవహారాన్ని బాగు చేసుకొని బాగున్నారు  .విదేశాలలో ప్రారంభించిన కొత్తనవల దాదాపు ఇక్కడ పూర్తీ చేశాడు .కొంప చాలా పెద్దదవటం నిర్వహణ కస్టమవటం తో రోజూ జల్దా తో పోట్లాడే వాడు  .ఇరుగుపొరుగు తో నిత్యం తగూ పడేవాడు .పనిలో కూరుకు పోయేవాడు .ఏడాది లోపేదీన్ని వదిలేసి మళ్ళీ పారిస్ చేరారు .వయసు పెరిగి ఇక డాన్స్ చేయలేక జేల్డా తన వ్యాపకం ఏదో చూసుకోవాలని అనుభవం లేక పోయినా 28 ఏళ్ళకు ప్రొఫెషనల్ బాలెట్ డాన్సర్ అయింది .అంతకు ముందు ఏడాది ఫిట్జెరాల్డ్ రాబడి సుమారు ముప్ఫై వేల డాలర్లు .అయినా గురుడు అప్పుల అప్పారావే అయ్యాడు .తరువాత రెండేళ్ళు యూరప్ ,అమెరికాల మధ్య ఆసులో గొట్టం లాగా తిరిగాడు .జేల్డా ఉత్సాహం తెచ్చుకొని వ్రుత్తి లో నిలబడితే అయ్యగారు మొరోజ్ గా తన పాత కదల రిపేర్ లో పడ్డాడు .భార్యపైనా తనపైనా ఇర్రిటేషన్ఆపుకోలేక తరచుగా డిప్రెషన్ లో పడి కయ్యానికి కాలు దువ్వుతూ మానసిక క్షోభ పడుతూ ఆమెకూ కలిగించి ,ఇక తగ్గడు అన్నట్లుగా ప్రవర్తించాడు. జేల్డా డాన్సర్ గా ఫెయిల్ అయి,బాగా దెబ్బ తింది.1930 లో ఆమె బాగా కుంగి పోయింది .స్విట్జెర్లాండ్ లో మానసిక చికిత్స కోసం ఆమెను తీసుకు వెళ్ళాడు .ఆమె ‘’స్కిజియో ఫ్రేనేక్ ‘’తో బాధ పడుతున్నట్లు నిర్ధారణ అయింది .ఇక జీవితాంతం  మానసిక దెబ్బతిన్న ఆమెను కని పెట్టుకొని ఉండాల్సిన స్థితి కలిగింది .శానిటోరియంలలో కొంత నయమని పించినా మళ్ళీ తిరగ బెట్టేది .పూర్తిగా ఎప్పుడూ కోలుకొనే లేదు .అయనా ఆమె ఇంటలిజేంస్ లెవెల్ ఏమాత్రం తగ్గలేదు .1932 లో బాల్టిమోర్ హాస్పిటల్ లో చేర్చాడు .ఈ హాస్పిటల్ లో ఉండగానే అక్కడ జరిగిన అగ్నిప్రమాదం లో జేల్డా మరణించింది .

          1932  లో ఆల్కహాల్ బానిసత్వంనుండి బయట పదాలనుకొన్నాడు .కాని మందు ఎందుకు తాగాడో కారణాలు బాగా చెప్పటం ప్రారంభించాడు .ఒక స్నేహితుడి తో పోట్లాడి ,డిప్రెషన్ లో తనంతకు తానే   స్నేహితులు లేనిలోకం లో  జీవించసాగాడు .హెమింగ్ వే గురించి చెబుతూ ‘’ఆతను ఎప్పుడూ విజయాల గురించే గట్టిగా చెబుతాడు  .నేను సాధికారికంగా ఓటముల గురించి చెబుతాను ‘’అన్నాడు .ఏదో విధంగా తంటాలు పడి తొమ్మిది చిన్న కధలు గిలికాడు .ఎక్కువ ధర కావాలని డిమాండ్ చేయలేదు .ఇప్పటిదాకా రాసిన పుస్తకాలపై  రాయల్టీ లు ఇప్పటికి సున్నకు సున్నా  హళ్లికి హళ్ళి.’’టెండర్ ఇన్ ది నైట్ ‘’1934 లో కొన్ని వేలకాపీలు మాత్రమె అమ్ముడయ్యాయి .విమర్శకులు సానుభూతి చూపకుండా దారుణంగా విరుచుకు పడ్డారు .చదువరులు మాత్రం దెబ్బతిన్న సమాజాన్ని బాగా చూపించాడని భవిష్యత్తుపై ఆశ కల్పించాడని అనుకొన్నారు .’’All gods dead ,all faith in man shaken ‘’అని రాస్తూ సి హార్ట్లి గ్రాటేన్ ‘’the feverish beauty of a class  in decay ,the polished charm of a decadence that is not yet self conscious ‘’అన్నాడు . ‘’the story of a psychiatric husband and a psychoneurotic wife who ruin each other ‘’అనిపిస్తుంది ఇలియట్ తన వేస్ట్ లాండ్ తో పోల్చాడు .టెండర్ ఈజ్ ది నైట్ లో గుండెపగిలే  బుర్ర తిరిగే సంఘటనలు ఉన్నా ,ఆదుర్దా అలసట లు ఉన్నాయి వీటినే ఫిట్జెరాల్డ్ ‘’ఎమోషనల్  దివాలాతనం ‘’అన్నాడు .ఇదే ప్రతి చోటా కనిపిస్తుంది .

  38 వ ఏట పాత ట్రాక్ నుంచి దారిమార్చుకొని ఇదివరకెప్పుడూ ప్రయత్నించని విధానం లో 19 వ శతాబ్దపు హిస్టారికల్ రోమాన్స్ ‘’ది కౌంట్ ఆఫ్ డార్క్ నెస్ ‘’రాశాడు .9 లో ఇదివరకు అచ్చుకాని కధలను పోగేసి ‘’టాప్స్ ఎట్ రివెల్లి ‘’పేరుతొ ప్రచురించాడు .పసలేని పుస్తకం అయింది .విమర్శకులు విపరీతంగా విరుచుకుపడి ‘’దారుణం అలా ఉండ కూడదు ‘’అన్నారు .నలభై వ పడి లో ఫిట్జెరాల్డ్ తన పని అయిపోయి౦దనుకొన్నాడు .ఇప్పుడు రాసిన కధలు ఇది వరకేప్పుడూ లేనట్లు గా తిరిగొచ్చాయి .నిరాశా నిస్పృహలతో జీవిత చరిత్ర శకలాలు రాస్తున్నాడు .తాత్కాలిక ఉపశమనానికి రక్షణకు మళ్ళీ హాలీ వుడ్ వెళ్ళాడు .41 ఏడు సమీపిస్తుండగా నలభై వేల డాలర్లు బాకీ పడ్డాడు .అసలే ‘’లాస్ ‘’అయి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి ‘’లాస్ ఏంజెల్స్ ‘’వెళ్ళాడు .కొత్త ఆశ కొత్త జీవితం కొత్త మాధ్యమం కోసం ఎదురు చూశాడు .కాని ‘’వెనకటి గుణ మేల మాను వినరా సుమతీ ‘’అన్నట్లు పాత కద మళ్ళీ మొదలెట్టి తాగి తందనాలాడాడు .సృజన పోయి అవతలి వాడి రచనలకు మార్పులూ చేర్పులూ చేస్తూ గడిపాడు .కాని అయ్యగారి ట్రీట్ మెంట్ స్పందన కలిగించ లేక పోయింది .తను ఎంతో గొప్ప రచన అనిగర్వంగా  చెప్పుకొనే ఒక నవలను హాలీ వుడ్ జనం పూర్తిగా మార్చేసి ఫిట్జెరాల్డ్ సంభాషణలలో కిక్  ,వినోదాలు లేవని ’’ డై’’లాగులు’’ ‘’కుట్టారు .అతని గౌరవం ఒక్క సారిగా కూలి పోయింది .పబ్లిక్ అతన్ని అసలు పట్టించుకోవటం మానేశారు .అతనితోపాటు స్క్రిప్ట్ రైటర్ గా ఉన్న బడ్ శుల్ బెర్గ్ ‘’స్కాట్ ఫిట్జేరాల్డా 1 అతడు చనిపోయాడను కొన్నాను ‘’అన్నాడు అదీ హాలీవుడ్ లో ప్రముఖ రచయిత ఫిట్జెరాల్డ్ పరిస్తితి .అతని ఏజెంట్ లు  ఫిట్జెరాల్డ్  ఏదీ రాయ లేదని ,స్వయం గాఇక  ఏదీ రాయలేడని కధలకు అడ్వాన్స్ లు ఇవ్వటం మానేశారు.హాలీ వుడ్  లో ఉద్యోగం ఏది రాదు .హాలీవుడ్ లో ఏదీ రాకపోయినా ‘’ఆల్కహాల్ ‘’లో అన్నీ ఉన్నాయని తెగ తాగి అందరి చేత ఛీ కొట్టి౦చు కొంటూ ,మనిషి కనిపిస్తే పురుగును చూసినట్లు దూరం పారి పోతూ వెగటు పుట్టించే స్థితి కొని’’ సారీ ’’ ‘’తాగి’’ తెచ్చుకొన్నాడు .’’నేను ముసలివాడినై జబ్బు తో ఉన్నాను ‘’అని ఫిర్యాదు చేశాడు .నలభై మూడు కే ముసలి తనం ! విడ్డూరం .ఈ హాలీవుడ్ భాగోతాన్ని బయట పెడుతూ ఒక నవల రాయాలని ప్రయత్నం లో ఉండివందలాది విషయాలను నోట్ చేశాడు .

  1940 లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది .భయ పెట్టింది కాని ధైర్యం తెచ్చుకొని ఆ హాలీవుడ్ నవల పై మళ్ళీ ద్రుష్టి పెట్టాడు .దీనికి ‘’ది లాస్ట్ టైకూన్ ‘’పేరుపెట్టాడు కాని పూర్తీ చేయలేక పోయాడు .దీన్ని అత్యంత విస్తృతంగా మనసు పొరల్లోకి దూసుకు పోయేట్లు రాయాలనుకొన్నాడు .’’I want to write scenes that are frightening and inimitable ‘’అని చెప్పుకొన్నాడు .మరో నెలకు మరో సారి విపరీతమైన గుండె జబ్బు వచ్చి21-12-1940  న 44 దాటిన మూడు నెలలకే స్కాట్ ఫిట్జెరాల్డ్ చనిపోయాడు .

ఫిట్జెరాల్డ్ లాగా యే రచయితరచనా ,జీవితం ఒకటై భాసి౦చలేదు .ఎక్కడ తనకద ముగిస్తాడో ఎక్కడ లేజేండరి పాత్ర ప్రారంభిస్తాడో తెలీకుండా రాసే నేర్పు అతనిది .వేది౦పబడిన రచనా సృష్టికర్తను ,సంతోషం లేని పాత్రలనుండి వేరు చేయలేము .ఆతను అతని ఫిక్షన్ ఫిగర్లు పరిణతి చెందని కలల బేహారులు  విజయం పొందినప్పుడు పొందిన ఆదుర్దా ,అపజయం లో వేదన లను ఒకే తీరున పంచుకొంటారు .హాలీ వుడ్ కు వెళ్ళక ముందు ‘’ఎందుకు నేను వ్యధను కోరుకు న్నానో  వేదన పొందానో ఆలోచించటానికే  ,విచార భావం విచార ప్రవర్తన ,ట్రాజెడీ పై ట్రాజిక్ ప్రవర్తన ,ఎందుకు నేను నా భయానక పరిస్థితి ,జాలి,దయల తో ఏకీభవించి పోయానో ఆలోచించటానికే నేను  పూర్తీ ప్రశాంతతను కోరాను’’అని చెప్పాడు  .ఫిట్జెరాల్డ్ చనిపోయే నాటికే అతని రచనలన్నీ ప్రచురితమైనాయి ‘

అయిదేళ్ళ తర్వాత ఫిట్జెరాల్డ్ ను మళ్ళీ కనుగొని ఆవిష్కరించారు .ఫిట్జెరాల్డ్ తిరిగి రాక ఎడ్మండ్ విల్సన్ ఎడిట్ చేసిన ‘’ది క్రాక్ అప్ ‘’ప్రచురణ తో జరిగింది .ఇందులో అత్యంత స్వీయ ఒప్పుకోళ్ళు,వ్యాసాలూ ,నోట్స్ ,ప్రక్షిప్తాలు ,కూతుళ్ళకు ప్రేమ ఆప్యాయతా ఉట్టిపడేలా రాసిన ఉత్తరాలు ఉన్నాయి .దీని తర్వాత డోరోతి పార్కర్ ఎడిట్ చేసిన ‘’ఎఫ్ .స్కాట్ .ఫిట్జెరాల్డ్ –ది మాన్ అండ్ హిస్ వర్క్ ‘’1950 లో వచ్చింది .అతని గ్రేట్ గాట్స్ బి నవల వ్యక్తీ సంక్షోభానికి అదే విశ్వవ్యాప్త సూత్రతకు డాక్యుమెంట్ గా నిలుస్తుంది

 ఫిట్జెరాల్డ్ ప్రభావం ఆయన మొదటి రచన ప్రచురణ అయిన నాటి నుంచే ఉంది .గాట్స్ బి నవల చదివి ఇలియట్ ఆయనకు ఉత్తరం రాస్తూ హెన్రి జేమ్స్ తర్వాత అమెరికన్ ఫిక్షన్ ను పండించిన వాడు అతనే అన్నాడు   Don Birnam, the protagonist of Charles Jackson‘s The Lost Weekend, says to himself, referring to The Great Gatsby, “There’s no such thing … as a flawless novel. But if there is, this is it.”[53] In letters written in the 1940s, J. D. Salinger expressed admiration of Fitzgerald’s work, and his biographer Ian Hamilton wrote that Salinger even saw himself for some time as “Fitzgerald’s successor”.[54] Richard Yates, a writer often compared to Fitzgerald, called The Great Gatsby “the most nourishing novel [he] read … a miracle of talent … a triumph of technique”.[55] It was written in a New York Times editorial after his death that Fitzgerald “was better than he knew, for in fact and in the literary sense he invented a generation … He might have interpreted them and even guided them, as in their middle years they saw a different and nobler freedom threatened with destruction.”

21 వ శతాబ్దం లో గాట్స్ బి మొదలైన ఫిట్జెరాల్డ్  రచనలు  మిలియన్ ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి .గాట్స్ బి ఎప్పుడూ బెస్ట్ సెల్లర్ గానే ఉంది’ స్కూళ్ళు కాలేజీలలో దాన్ని బోధిస్తున్నారు ఆయన 5 నవలలు , 3 నావేల్లాలు ,10 చిన్నకదా సంపుటాలు రాశాడు .ఆయన నవలలు సినిమాలుగా వచ్చాయి .ఎన్నో సంస్థలు ఆయన పేరు పెట్టి గౌరవించాయి .ఆయన రాత ప్రతులు బహు భద్రంగా భద్ర పరచ బడ్డాయి .

Inline image 1

Inline image 2Inline image 3

సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-7-16- ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్-2

  ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’అనే పాక్షిక జీవిత చరిత్ర-అంటే కాలేజి జీవితం ,ఖుషీపార్టీలుఅడ్వర్ర్టైజ్ ఏజెన్సీ ,,విఫలప్రేమ ,మూడు వారాల తాగుబోతు దేవదాసు జీవితం అన్నీ కలగలిపి రాసిన రచన  ,అంచనాలకు మించి  విజయవంతం అయింది .విమర్శ మిశ్రమంగా వచ్చింది .అరువు తెచ్చుకొని ,క్షమించరాని తప్పులతో ఉందని  కొందరు అన్నా ,అందులోని ఉత్తేజాన్ని ఎవరూ కాదన లేక పోయారు .’’ ఈనవల లో రచయిత చేయాల్సిన పాపాలన్నీ చేశాడు కాని క్షమించరాని తప్పు ఒకటి ఉంది –అదే బతకటానికి విఫలం కాకూడదని .కాలేజి జీవితానికి చెందిన అత్యంత రొమాంటిక్ ,నిరాశాలను కాచి వడపోసిన అమెరికన్ నవల అని పించుకోన్నది .కొన్ని నెలలలోపే ఈ పుస్తకం అండర్ గ్రాడ్యుయేట్ల ‘’బైబిల్ ‘’అయింది ఆరాధ్యమై కూర్చుంది .నవలా కారుడు ఫిట్జెరాల్డ్ జాజ్ యుగపు ఉడుకు లెత్తే యువ రక్త నాయకుడు అయ్యాడు .స్టాక్ మార్కెట్ స్పెక్యు లేషన్ కు ,రాజకీయ అవినీతికి అది బంగారు కాలం .నిష్ఫలమైన మద్యపాన నిషేధాలు,  బలిసి దొంగ లిక్కర్ తయారు చేసే బడా వ్యాపారులకు అది అంది వచ్చిన కాలం .ఈ యుగానికి ఫిట్జెరాల్డ్ ప్రతినిధి అయ్యాడు –‘అద్భుత భవిష్యత్త్ ఉన్న ’గోల్డెన్ బాయ్ ‘’అని పించుకొన్నాడు .

   చాలా ఏళ్ళ తర్వాత భయంకరమైన బీదరికపు  హద్దులు ,మరీ భయపెట్టే ధన ప్రభావాల గురించి స్వగతాలు రాశాడు .డబ్బు యావ మాత్రం అతన్ని వదలలేదు .అది జేల్డా చుట్టూ తిరుగుతూనే ఉంది .జేబులో గలగలమంటూ డబ్బు ఉంటె ఆమెను ఒక ఏడాది తర్వాత పెళ్లి చేసుకొని  అపనమ్మకం ,వైరాను   దూరం చేసుకొని ,ఒక విప్లవ కారుడిగా కాకుండా రగిలిపోయే రైతుగా ఉండాలనుకొన్నాడు .తనతో బాటే ఉంటున్న తన స్నేహితులకు అంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి వస్తోందో  అర్ధం కాలేదు .అంత డబ్బున్న తన స్నేహితులలో  ఎవరికో ఒకరికి  ఆ అమ్మాయిని ఇచ్చి కట్ట బెడితే ?ఇలాంటి ఆలోచనలన్నీ బుర్ర నిండాసుళ్లు తిరుగుతున్నాయి .

         మొత్తం మీద కల నెరవేరి యువ దంపతులై ఒక కూతురు ఫ్రాన్సెస్ ను  కన్నారు. ఆ నిరాశా జనక కాలం లో కూతురు తండ్రి బొమ్మలను ఆరాధిస్తూ గడిపింది .అవి హీరో హీరో యిన్ ల గురించి అతిశయోక్తులకే అతిశయోక్తులు గా ఉన్నాయి .రగిలే యువతకు ప్రతి రూపాలు .బొమ్మల కొలువులో వాళ్ళు రాజు ,రాణి గా ఉండి ఫిక్షనల్ పాత్రలై అలరించాయి .టాక్సీ లపై వీటిని పెట్టుకొని తిప్పుతుంటే న్యు యార్క్ నగర వాసులకు చీమ కుట్టినట్లుగా కూడా లేక పోయింది .ఎవరినీ ఆకర్షి౦ప లేక పోయాయి .అవి కనబడిన ఫౌంటెన్ లలోకి దూకటం ,బట్టలు దాదాపు విప్పుకు తిరగటం డిన్నర్ టేబుల్స్ దగ్గర డాన్సులు చేయటం ,ఫైర్ అలారాలను మోగించటం ,దాని రక్షకులు ఎక్కడ మంటఎక్కడ మంట అంటూ పరిగెత్తుకు రావటం జేల్డా తన రొమ్ముల్ని చూపించి ఇక్కడేఅనటం-ఇదంతా ఒక కౌమారఆటగా అసంబద్ధ ఉల్లాస భరిత కలగా ఫిట్జెరాల్డ్ ప్రతిధ్వనింప జేశాడు ప్రపంచాన్ని జయించిన తర్వాత అలేక్సాండర్, అనుభవించిన దుఖం ,ఒక రోజు ఫిఫ్త్ ఎవేన్యు పై స్వారి చేస్తుంటే విజయం,నష్టాల అసంబద్ధత (పారడాక్స్ )అనుభవించటం ‘’నేను గట్టిగా అరిచాను –కారణం నాకునేను కోరింది  అంతా దొరికింది  ఇంతఆనందం నేను మళ్ళీ పొందలేను అని ‘’రాశాడు .

   పార్టీలకు డబ్బు కట్టాలి చిన్న కధలు బాగానే ఆదాయాన్నిస్తున్నాయి కాని అప్పుల్లో కూరుకు పోయి రాయబోయే ,రాబోయే10 పుస్తకాలను తాకట్టు పెట్టి  పదహారు వందల డాలర్లు ప్రింటర్స్ దగ్గర అప్పు తీసుకొన్నాడు.జేల్డా విపరీత దుబారా ఖర్చు రాబడిని తెలుసుకోకుండా చేస్తున్న అనవసర ఖర్చు భరించలేక  మళ్ళీ తాగుడుకు బానిసై ఇంటికి దూరమై బతుకు తున్నాడు .ఫిట్జెరాల్డ్ దంపతులు స్థిరం గా ఒక చోట ఉండలేక ఊళ్లు ఇల్లు మారుతున్నారు .ఈ కాలపు మొదటివివరాలన్నీ ‘’ఫ్లాపెర్స్ అండ్ ఫిలాసఫర్స్ ‘’అనే చిన్న కదల సంపుటిలో చూపాడు .25 ఏళ్ళ రచయిత కు రావాల్సిన కీర్తి రాలేదు .కాని రెండవ నవల ‘’ది బ్యూటిఫుల్ అండ్ డామ్మేడ్ ‘’డబ్బు పెద్దగా రాల్చక పోయినా గొప్ప అన్వేషణ ఉంది .జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకొని సమాధానం వెతికాడు .విషాదాంతమే అయినా నూటికి నూరు శాతం అర్ధరహితం అన్నాడు విల్సన్..హీరో హీరోయిన్ ఇద్దరూ పరమ డిబాచరర్ లుగా ఉండి,మొదటి నుంచి చివరదాకా యేసీరియస్  పనీ చేయక , ఆ పిచ్చిమాలోకాలు హేతువాడులుగా అనిపిస్తారు .వాళ్ళు సామాన్య జీవితాన్ని స్పర్శించినప్పుడల్లా మానవ వ్యవస్థలు ఏవగి౦పుకలిగే ఫార్స్ గా ,పనికిమాలిన అసంబద్ధమైనవిగా చూపిస్తారు .చివరగా సైన్యం డబ్బు పిచ్చి లోకం ,వ్యాపార ద్రుష్టి లను బహిర్గతం చేస్తారు గౌరవమర్యాదలూ విషయమూ ఏమీ లేకుండానే అని రాశాడు విల్సన్ .

   డిగ్నిటి  మీదవ్యామొహం తో ఫిట్జెరాల్డ్ లాంగ్ ఐలాండ్ లో డబ్బు మంచినీళ్ళ ప్రవాహం లా ఖర్చుచేశాడు .ఒక్క ఏడాది  లోనే 36 వేల డాలర్లు తగలేశాడు.ఇంకో అయిదు వేల డాలర్ల అప్పులో మునిగాడు. అప్పు చేసి పప్పు కూడు అంటే ఏమిటో  రుజూ చేశాడు.’’స్కాట్ గురువు’’ స్కాచ్ తాగి .వెజిటబుల్స్ ‘’అనే నాటకం రాశాడు .అందులో కొంచెం రాజకీయవ్యంగ్య  వాసన ఉండటం తో ఫెయిలయింది .చిన్న కదల రెండవ సంపుటి’’టేల్స్ ఆఫ్ ది జాజ్ ఏజ్ ‘’ విడుదల చేశాడు .ఇందులో ‘’లీస్ ఆఫ్ హాపినేస్స్ ,మే డే ‘’,ది డయమండ్ యాజ్ బిగ్ యాజ్ రిట్జ్ ‘’అనే మూడు కట్టుకధలు -ఫేబుల్స్ ఉన్నాయి .అప్పటికి వయసు 27మాత్రమే .కొన్ని నెలల తర్వాత ఫిట్జెరాల్డ్ లు అన్ని విలాసాలకు దూబరా ఖర్చులకు దూరమవ్వాలని  యూరప్ కు మకాం మార్చారు .ఫ్రాన్స్ లో జేల్డా ఒక యువ ఫ్లయర్ తో ప్రేమాయణం సాగించింది .ఫిట్జెరాల్డ్ అహం దెబ్బతిన్నా ,అతని ప్యూరిటన్ భావాలకు విఘాతం కలిగినా నోరు మెదపలేక పోయాడు దీనివలన తాను పరిణతి చెందానని అనుకొని పబ్లిషర్ కు జాబు రాస్తూ ‘’నేను చాలా అసంతృప్తి తో ఉన్నాను .కాని నా పనికి ఆటంకం లేదు .నేను ఎదిగాను ‘’అని రాశాడు .రోమ్ కు చేరారు .అసహనం పెరిగిఅందరితో పోట్లాడుతూ  ఫిట్జెరాల్డ్ఒక  టాక్సీ డ్రైవర్ తో తగాదా పడి వాడిని కొట్టి దెబ్బలు తిని  అరెస్టయి జైలు కు వెళ్ళాడు .కాప్రి స్వర్గం  అనుకొన్నాడు .పెద్ద ప్రేగు వాచీ ఇన్ఫ్లుఎంజా బారిన పడి ఇద్దరూ మళ్ళీ ఫ్రాన్స్ చేరారు ‘’వెయ్యి పార్టీలు – పని నిల్  ‘’అని రాసుకొన్నాడు .

   తాగుడుకు ఏదీ అడ్డం కాలేదు .నాన్ స్టాప్ గా పెగ్గు మీద పెగ్గు లాగిస్తూనే ఉన్నాడు .తాగి ఎక్కడికి వెడుతున్నాడో తెలీక వెళ్లి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో తిరిగి వచ్చేవాడు ఇదీ అయ్యగారి ‘’పాన కత’’.అయిదేళ్ళలో లక్షా పదిహీను వేల డాలర్లు సంపాదించి అంటే ఏడాదికి ఇరవై మూడు వేల డాలర్లు పోగేసుకొంటూ కూడా సాధారణ రచయితలు  కలలు కనే సుఖమయ జీవితాన్ని అనుభవించ లేక పోయాడు .పబ్లిషర్ కు రాస్తూ ‘’మా జీవిత స్థాయిని తగ్గించుకోలేం.ఈ ఆర్ధిక అరక్షణ ను ఎదుర్కొలేను ‘’ అని తెలియ జేశాడు .ఇంకా తాను  హాండ్ సమ్ గా అండర్ గ్రాడ్యుయేట్ గా అడాలసెంట్ గా ఉన్నాననే భ్రమ పడుతూ ,అవతల వారిని ఆకర్షించలేక ,చిలిపి పరిహాసం ,జోకులతో ,ఒక్కో సారి అవి వెనక్కి పేలగా  ఇబ్బంది పడుతూ చివరికి పరిస్థితిని యెంత దాకా తెచ్చుకొన్నాడు అంటే స్నేహితులందరూ ‘’సారీ ‘’తోనూ హోటళ్లుఅన్నీ ‘’నో ఎంట్రీ ‘’బోర్డుల తోనూ వెనక్కి పంపించేదాకా .ఇందులోంచి బయట పడేయ్యటానికి జేల్డా  కొత్త ఉత్సాహ ప్రేరకంగా అనేక చిట్కాలు ప్రయోగించి చివరికి ఆత్మహత్య  దాకా వెళ్ళింది .స్కాట్ మరింత బరి తెగించి డిప్రేస్ అయ్యాడు .’’నాకు ఇంకా 22 ఏళ్ళే .నారచనే నన్ను సంతోష పెడుతుంది .నేను మెంటల్ గా ఫిజికల్ గా  హాంగోవర్ లో ఉన్నాను ‘’అని రాశాడు .

   పరిస్థితులు ఇలా ఉన్నాకూడా ఫిట్జెరాల్డ్  మరో రెండు పుస్తకాలు ‘’ది గ్రేట్  గాట్స్ బి ‘’,ఆల్ ది సాద్ యాంగ్ మెన్ ‘’ విడుదల చేశాడు  .రెండవది 1926 లో వచ్చింది .ఇందులో అతని పాత కధలు రెండు –రిచ్ బాయ్, వింటర్ డ్రీమ్స్ ‘’ఉన్నాయి .గాట్స్ బి మాత్రం ఫిట్జెరాల్డ్ రచనలలో మాస్టర్ పీస్ .ఇంకా తప్పించుకొనే వారి గురించి సహజ ముద్దులు గురించే రాస్తున్నాడు .బైరానిక్ లవ్ ఆఫ్ రోమాన్స్ ను రొమాంటిక్ లపై రియలిస్ట్ ల వెక్కిరింతల్ని ,పేదవాడు ధనికులను ఆరాది౦చటాన్ని  ఆర్టిస్ట్ లు డబ్బు ను ఏవ గి౦చుకోవటాన్నిరాస్తూ ఒక వైపును సమర్ది౦చటమూచేశాడు .విశ్లేషకులు ఫిట్జెరాల్డ్ ప్రోగ్రెస్ ను వివిధ కారణాల తో సమర్ధించారు .హెచ్ ఐ మెంకాన్ ‘’The Great Gatsby is an exposure of  the florid show of  American life –the high carnival of those who have too much money to spend and too much time for the spending of it ‘’అంటే టి ఎస్ ఇలియట్ ‘’the first step that American fiction has taken since Henri James ‘’అని మెచ్చుకొన్నాడు .

Inline image 1  Inline image 2

            సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-16 –ఉయ్యూరు  

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్

   సాహిత్య చరిత్ర కారులు ప్రతి యుగానికి ఒక లక్షణాన్ని  ఆపాదిస్తారు. కాని ,ప్రస్తుత యుగ లక్షణాన్ని ‘’ఏజ్ ఆఫ్ యా౦ గ్జైటీ’’ అన్నవాడు ఎఫ్ .స్కాట్ ఫిట్జెరాల్డ్.4-9-1890 న అమెరికా మిన్నెసోటా రాష్ట్రం సెయింట్ పాల్ లో ఫిట్జెరాల్డ్ పుట్టాడు .తల్లి తరపు దూరపు చుట్టం పై గౌరవం తో ఫ్రాన్సిస్ స్కాట్ కీ ఫిట్జెరాల్డ్ గా చర్చిలో పేరు నమోదయింది .మంచి కుటుంబమేకాని దరిద్రం తో అల్లల్లాడి౦ది .తండ్రి చేతకాని దద్దమ్మ .కొడుకు కు పదేళ్ళు రాకుండానే ఉద్యోగం పోగొట్టుకొన్నాడు .30 ఏళ్ళ తర్వాత  ఫిట్జెరాల్డ్ తన ఓటమిని గ్రహించి  ఈ విషయాన్ని తండ్రి ముందే గ్రహించాడని తెలుసుకొన్నాడు .ఈ విషయాలన్నీ రాసుకొన్నాడు .ఓటమి ,దురదృష్టం అనే రెండు అంశాలమీద ఫిట్జెరాల్డ్ సాహిత్యమంతా నడుస్తుంది .జాన్ ఓ హరా అనే రచయితకు ‘’సగం బ్లాక్ ఐరిష్ ,సగం పాత అమెరికన్ రక్తం తో గతకాలపు గొప్పల్ని నెమరేసుకొంటూ  , ఏదో సాధించామని ప్రగల్భాలు పలకటం అలవాటైంది ‘’అని చెబుతూ ‘’being born in an atmosphere of crack ,wise crack and counter crack ,I developed a two cylinder inferiority complex .I I spent my youth in alternately crawling in front of kitchen maids and insulting the great ‘’అని చెప్పుకొన్నాడు .

  కుటుంబం బీదరికం లో మగ్గుతున్నా తల్లికి ఫిట్జెరాల్డ్ అంటే ప్రాణం .ఒక ఆంట్ ఆతను న్యు జెర్సీ లోని న్యూమాన్ లో ఉన్న కేధలిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించటానికి సాయం చేసింది .అక్కడ రాణించ లేక పోయాడు .చాలా అందంగా ఆకర్హణీయంగా,మంచి రంగుతో ,నీలి కళ్ళతో అందమైన ముద్దు గుమ్మలాగా కనిపించేవాడు . ఫుట్ బాల్ ఆడేవాడుకాడు .పుట్టుకతో వచ్చిన వక్తృత్వం తో ప్రతి వాడితోనూ వాదించేవాడు .’’ బీద వాడు- ధనవంతుల స్కూల్ ‘’అనేది మనసుపొరల్లో ఎప్పుడూ మసిలేది .17 వ ఏట ప్రిన్స్ టన్ లో చేరి ,అండర్ గ్రాడ్యుయేట్ సాహిత్య కారులతో ముఖ్యంగా జాన్ పీల్ బిషప్ తో బాగా దోస్తీ గా ఉన్నాడు .ఈ స్నేహం జీవితాంతం ఉంది .ఎడ్మండ్ విల్సన్ జూనియర్ ఇతనికి సాహిత్య చేతనగా  నిర్వహణ కారుడుగా ఉండేవాడు .న్యూమాన్ చేసే తప్పులు చేయక ,ఫుట్బాల్ ఆటలో చేరి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు,135 పౌండ్ల బరువుతో కొత్త స్క్వాడ్ ఏర్పరచాడు .తర్వాత తనలోని సృజనకు పదును పెడుతూ నాటకాలపై ద్రుష్టి పెట్టాడు .ట్రెయినింగ్ క్లబ్ కోసం ఒక ‘’ఒపరెట్టా’’రాశాడు .ప్రదర్శనలో లేకపోయినా గ్రేడులు మాత్రం దారుణంగా రావటం తో కట్టిపెట్టాడు . కాస్ట్యూమ్ తో ఉన్న అతని ఫోటో ను పబ్లిసిటి డిపార్ట్మెంట్ అందరికి చూపించి ‘ ప్రిన్స్ టన్  కొత్త మ్యూజిక్ నాటకం లో ’బహు సొగసైన షో గర్ల్ ‘’అని ప్రచారం చేసింది .

     సెలవులలో ఇంటికి తిరిగి వచ్చి 19 వ ఏట మొదటి సారి జినేర్వా కింగ్ అనే ఒకమ్మాయిని ప్రేమించాడు .ఆమె అందమైన ధనికుల పిల్ల .ఆమెకు అయస్కాంత ఆకర్షణ ఉందని ,అన్నిరకాలాఫిట్జెరాల్డ్ కు జోడీ అని ,అతని పేదరికం ,అనిశ్చితత్వం ,ఊహ లకు తగినదని ఆయన చరిత్రకారుడు ఆర్ధర్ మిజేనర్ రాశాడు .ఆమె అన్నిటా విజయాలను సాధించినా అనాఘ్రాత పుష్పం అన్నాడు .ఫిట్జెరాల్డ్ చివరి రోజులలో  ఆమెను వదిలిన 20 ఏళ్ళకు కూడా జినేర్వా గురించిన ఆలోచన వస్తే కళ్ళ వెంట కన్నీరు కారేది .తర్వాతెప్పుడో ఆమెను హాలీ వుడ్ లో చూసి మళ్ళీ అదే ప్రేమ మైకం లో పడ్డాడు .వారిద్దరిమధ్య రోమాన్స్ చోటు చేసుకోలేదు .ఆమె దక్కక పోయినా గ్రేడ్లు కూడా దక్కక ఒక ఏదాది చదువు ఆగటమేకాక గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు యూని వర్సిటీ అభిమానమూ పొందలేక పోయాడు .ట్రయాంగిల్ క్లబ్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికకాలేక పోయాడు .జేనేర్వా ఇక జన్మ లో తనను పెళ్లి చేసుకోదు అనే నిర్ణయానికి వచ్చాడు ఫిట్జెరాల్డ్ .ఇది చాలా బాధాకరమైంది .తన నోట్ పుస్తకాలలో ‘’that is the stamp that goes into my books so that people can read it blind like Braile’’అని రాసుకొన్నాడు .

   మొదటి ప్రపంచ యుద్ధం ఫిట్జెరాల్డ్ లో దేశభక్తి కాని ఉత్సుకతను కానీ కల్పించలేదు .’’ఈ అనివార్య యుద్ధం నన్ను ఇరిటేట్ చేస్తోంది ‘’అన్నాడు .ప్రజల  సెంటి మెంటాలిటి తనకు  పక్కలో బల్లెంగా ఉందన్నాడు .సైన్యం లో చేరటాని అప్ప్లై చేశాడు .21 వయసు దాటిన నెలకు అది వచ్చింది .యుద్ధానికి వెళ్ళాడు .తల్లికి జాబు రాస్తూ ‘’cold bloodedly and purely for social reasons ‘’మిషతో యుద్ధానికి వెడుతున్నానని తెలియ జేశాడు .ఆతన్ని తీరాలు దాటి పంపలేదు .దానిబదులు చాలా కాంప్ లలో పని చేశాడు .ఫోర్ట్ లీవెన్ వర్త్ లో ‘’the world’s worst second lieutenant ‘’అని చెప్పుకొన్నాడు .’’ది రొమాంటిక్ ఈగోయిస్ట్ ‘’అనే నవల ఇప్పుడే రాశాడు .దీని రాత ప్రతి తిరస్కరింప బడిన తర్వాత తన ప్రేమికురాలు జినేర్వా పెళ్లి చేసుకో బోతోందని తెలిసింది .అదే సమయం లో ఒక కాంప్ డాన్స్ లో జేల్డా సేయ్రీ అనేఅందం ఆకర్షణ ,చొరవ వ్యక్తిత్వం ఉన్న బాల్ డాన్స్ బెల్లీ అయిన 18  ఏళ్ళ  అమ్మాయితో పరిచయమై ఇద్దరూ ప్రేమ రొంపిలో దిగి భవిష్యత్తు పై కలలు కన్నారు .  1919 ఫిబ్రవరిలో ఫిట్జెరాల్డ్ ను ఘనంగా ఆర్మీ నుంచి విడుదల చేశారు .

మళ్ళీ సాధారణ పౌరుడై జర్నలిస్ట్ ఉద్యోగం వెతుక్కొని జేల్డా ను పెళ్లి చేసుకొందామనుకొన్నాడు ..న్యు యార్క్ చేరి ఏడు పత్రికల చేత తిరస్కరింప బడి ‘’నేను ఆఫీస్ బాయ్స్ ను ఇంప్రెస్ చేయటం లో  విఫలమయ్యాను ‘’అనుకోని ఒక అడ్వేర్ టైజింగ్ కంపెనీలో కాపీలు రాసే పనికి నెలకు 90 డాలర్లకు  చేరాడు .రాత్రిళ్ళు తన కధలకు కేటా యించుకొన్నాడు ..అవన్నీ తిరుగుటపాలో క్షేమంగా తిరిగోచ్చేవి ..’’బేబ్స్ ఇన్ ది వుడ్స్ ‘’ను హెచ్ ఎల్ మెంకేన్ ,జార్జి జీన్ నాధన్ లు చిన్న సెట్ గా 30 డాలర్లకు  ప్రింట్ చేసే సరికి ,122  ప్రింటెడ్ రిజేక్షన్ స్లిప్పులు అందుకొన్నాడు .జేల్దాకు జాబులు రాస్తూనే ఉన్నాడు ఈ పరిస్తితుల్లో ఆమె దక్కదేమో అనుమానం పీడించింది .ఆ భయం తో అలబామాలోని మాంట్ గోమరి లో ఉన్న జేల్డా ను చూడటానికి ఉన్న కొద్ది డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాడు .ఆమె త్వరగా పెళ్లి చేసుకోవటానికి కాని ,అసలు పెళ్లి చేసుకోవటానికి కాని ఇష్ట పడలేదు ‘’షేక్స్ పియర్ మొహం’’ వేసుకొని మళ్ళీ న్యు యార్క్ చేరాడు .చెదిరిన మనసుతో దేవదాస్లాగా  పూటుగా తాగి రోజులు గడిపాడు .మళ్ళీ స్వంత ఊరు సెయింట్ పాల్ చేరాడు .అప్పటికే రాయటం మొదలెట్టి ఆపేసిన నవలను పూర్తీ చేసే ప్రయత్నం చేశాడు .రొమాంటిక్ ఈగో యిస్ట్ లోని మంచి పేరాలనన్నిటిని తీసుకొని మళ్ళీ ఆ ఎపిసోడ్ లనుతిరగ రాశాడు .కాని సంతృప్తి కలగక విసిరి పారేస్తే ఒక స్నేహితుడు దాన్ని ‘’ది కలేక్తేడ్ వర్క్స్ ఆఫ్ ఫిత్జరాల్ద్ ‘’అనే పేరు సూచించాడు .23 వ ఏట ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’పేరు పెట్టి పంపాడు .ఎడిటర్ మాక్స్ వెల్ పెర్కింగ్ వెంటనే దాన్ని అంగీకరించి అందులో ఉన్న జీవ శక్తికి అభినందించాడు .దశ మారుతుంది అనుకొన్నాడు కాని జేల్డా ఇంకా పచ్చ జెండా ఊపలేదు .పబ్లిషర్ త్వరలోనే అచ్చు పూర్తీ చేసి అమ్మకాలకు పెడతానన్నాడు ఈలోపు పాతకధలు కొన్నిటిని రిపేర్ చేసి కొత్త రూపు తెచ్చాడు .1919 చివరి మూడు నెలలలో తొమ్మిది రాశాడు .అన్నీ బాగా అమ్ముడుపోయాయి .రేట్లు పెంచి అమ్మారు .’’ది సాటర్ డే ఈవెనింగ్ ‘’పత్రికరెండు కధలకు వెయ్యి డాలర్లు ఇచ్చింది .వీటినే రెండేళ్ళ క్రితం డజన్ పత్రికలు    నిర్దాక్షిణ్యంగా తిరస్కరి౦ చాయి .

Inline image 1

    Inline image 2

సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-7-16 –ఉయ్యూరు

    

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -4(చివరిభాగం

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ –4(చివరిభాగం)

  తన విరోధులను మాయ మాటలు ,తెచ్చిపెట్టుకొన్న గాంభీర్యం ,నియంతృత్వపు తీవ్రతలతో భయపెట్టాడు .ఇష్టం లేనిశాంతి ఒడంబడికను పూర్తిగా 1938 లో కాల రాచి పారేశాడు .విముక్తి మంత్రం తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తనను ‘’నీట్జేస్చేన్ సూపర్ మాన్’’ గా ‘’క్రిస్టియానిటి ముసుగులో ఉన్న క్రూర నియంత ‘’ గా ప్రత్యక్షమై ,తాను జర్మనీ  దేశ భవిష్యత్తు ను నిర్ణయించే విధాతగా ప్రకటించుకొని ‘’దేవుడు నన్ను ప్రపంచ ప్రజల విముక్తి కోసం పంపాడు .ప్రజల మానసిక దౌర్భాగ్యం నుంచి విడుదల చేస్తాను .ప్రతి వ్యక్తి కి స్వాతంత్ర్యాన్నిచ్చి కాపాడుతాను ‘’అని నమ్మించాడు .ముందుగా ఆయన విముక్తి చేసింది జర్మనీనే .తర్వాత ఆస్ట్రియా .బవేరియా సరిహద్దులలోకి దండును పంపుతూ ,భయ పడేట్లు చేసి ఆస్ట్రియన్ చాన్సెలర్ కర్ట్ వాన్ స్కూస్నిజ్ ను రాజీనామా చేసేట్లు చేశాడు .మార్చి 12 న వియన్నా లో ప్రవేశించి ,అక్కడ ముందే రిహార్సల్ చేయించిన జనం చేత జయజయ ధ్వానాలు పలికి౦చుకొన్నాడు .కొన్ని నెలలాగి మళ్ళీ కొత్త డిమాండ్ లు చేశాడు .జేకోస్లో వేకియాలోని జర్మన్లకు ఆపద్బాఓ ధవుడని పించుకొన్నాడు .ఇంతలో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ లు జెక్ లను సూడేటేన్లాండ్ ను అప్పగించామనికోరాయి .సెప్టెంబర్ 13 న హిట్లర్ మరో ట్ర౦ప్ కార్డ్ ప్రయోగించాడు .మ్యూనిచ్ లో దీనితో ఇప్పటిదాకా తాము రక్షకులమనుకొంటున్న జక్ ను బ్రిటన్ ఫ్రాన్స్ లు వదులుకోవాల్సి వచ్చింది . బ్రిటిష్ ప్రధాని చామ్బర్లేన్ లండన్ కు పీచే మూడ్ అయ్యాడు .వెళ్లి లండన్ లో ‘’మ్యూనిచ్ లోమనకాలం లో  శాంతి ఒప్పందం కుదిర్చాను ‘’అని ప్రకటించు కొన్నాడు .

             50 వ ఏట హిట్లర్ ‘’కొరక రాని కొయ్య’’ అయ్యాడు .అతని ముఖం లో హిప్న టైజ్ చేసే కళ్ళు ,వాటిలో తీక్ష్ణ ద్రుష్టి తప్ప ఇంకేమీ ప్రత్యేకతలు లేవు .ముఖం కుదించుకొని గట్టిపడినట్టు,చెత్త గా నటించే విదూషకుడిగా ,సాధారణ నుదురు గడ్డం మూతి  కనుబొమలు చార్లీ చాప్లిన్ మీస౦  తో వికృతంగా ఉండేవాడు  .చాప్లిన్ విషాద నవ్వు పుట్టించే ముఖం బదులు ద్వేషం ప్రతిధ్వని౦చేది  .చెడు అలవాట్లు లేని రాక్షసుడు హిట్లర్ .పొగ తాగేవాడు కాదు .తాగుడు అలవాటు లేదు .మాంసం తినేవాడుకాదు .మగువ పై మొహం లేదు .అంటే మకార త్రయానికిదూరం . జెలి అనే యువ నీస్ కు మాత్రమే స్వంతమైన వాడు .ఆమెను తన అపార్ట్ మెంట్ లో ఆమె వయసు ఇరవై లోపు ఉండాగానే  కాల్చి చంపేశాడు .దీనికి కారణం ఏమిటో తెలియదుకాని ఆమె ది ఆత్మ హత్య అని ప్రచారం చేయించాడు .తర్వాత ఈవా బ్రాన్ తో సంసార జీవితం సాగించాడు .హిట్లర్ కు చర్చ కాని వ్యతిరేక అభిప్రాయం కాని నచ్చదు .’’ఈ సీతయ్య ఎవరిమాటా వినడు ‘’అన్న నందమూరి హరికృష్ణ డైలాగ్ లాగా హిట్లర్ ఎవరిమాటా వినేవాడుకాడు .ఆయనకు ఇష్టమైనది మిలిటరీ బాండ్  దానితో పాటు  జర్మనీ సంగీత కారుడు వాగ్నర్ కూర్చిన ‘’నార్డిక్ మ్యూజిక్ ‘’మాత్రమే ఇష్టం .

  50  వయసులో హిట్లర్ కు విజయాలు ఒక దాని వెంట ఒకటి వచ్చి మీద పడ్డాయి .19 39 లో తన కిష్టమైన ‘’బలమే మొదటి చట్టం  బలమే హక్కును సృష్టిస్తుంది ‘’అనే సింహ నాదం చేశాడు .స్లోవాకియాను మాతృదేశం  నుండి విడిపోమ్మని కోరాడు .మేమెల్ కు చేరి లొంగ దీసుకొని రీచ్ కి కట్ట బెట్టాడు .ఏప్రిల్ లో’పోలాండ్ తో కుదుర్చుకొన్న ’యుద్ధ వివరణ  ఒప్పందాన్ని’’,ఇంగ్లాండ్ తో చేసుకొన్న సముద్ర సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు .  రూజ్ వెల్ట్ ను కాదని దాన్జింగ్ ను ఇవ్వమని కోరాడు .మే లో జర్మని ఇటలీలు మిలిటరీ ఒప్పందం చేసుకొన్నాయి .ఆగస్ట్ లో రష్యాతో దురాక్రమణ రహిత ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు .ఈ రకంగా జర్మనీని రెండు వైపులా  యుద్దాన్నుంచి తప్పించు తప్పించాడు .తనకు అందరూ భయ పడ్డారని భావించి తూర్పు నుంచి ప్రమాదం లేదని తలచి పోలాండ్ ను సెప్టెంబర్ 1 న జయిఛి డాన్జింగ్ ను స్వాధీన పరచుకొని ,కావాలనే వార్సా మొదలైన సిటీలపై బాంబుల వర్షం కురిపించాడు .రెండు రోజుల తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ లు ఈ వివాదం లో చేరాయి .దీనితో భయంకర రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది .

 1940 లో హిట్లర్ స్టార్ తిరిగి ,ఎగ బాకింది .అతని సైన్యాలు పోలాండ్ ను తుడిచి పెట్టేశాయి .కొద్దికాలం ఓపిక పట్టి పశ్చిమ రాజ్యాలతో శాంతి ఒప్పందం కుడుర్చునేట్లు అభినయి౦చాడు .కాని జర్మనీ భాషలో ‘’సిట్జ్ క్రీగ్ ‘’అనే ’’ సిట్ డౌన్ వార్ ‘’ఒక్కసారిగా అకస్మాత్తుగా ‘’బ్లిట్జ్ క్రీగ్ ‘’అంటే ‘’మెరుపుదాడి’’ గా పరిణమించింది .నాజీలు నెదర్లాండ్,బెల్జియం ,లక్సేన్ బెర్గ్ ల పని పట్టారు  .హాలండ్ బెల్జియం లు మే లో  తామే లొంగిపోయాయి .బ్రిటిష్ సైన్యం బందీ అయింది .డన్కర్ బీచ్  నుండి చాలా భాగం బ్రిటిష్ సైన్యాన్ని తప్పించేశారు .చాలా టాంక్ లు ,ఆయుధ సామగ్రి నస్టమైంది  .జూన్ 13 న నాజీలు పారిస్ నగరం లోకి దూసుకు పోయారు .మూడు రోజుల తర్వాత మార్షల్ పీటైన్ఫ్రాన్స్ ప్రధాని అయి హిట్లర్ తో శాంతి చర్చలు జరిపాడు .జులై లో జర్మని ఇంగ్లాండ్ పై భారీ విమాన దాడి చేసి పౌర నగరాలపైనా కేధడ్రిల్లపైనా అకారణం గా బాంబుల వర్షం కురిపించింది .పనిలోపనిగా ఇటలీ దెబ్బతిన్న ఫ్రాన్స్ పై యుద్ధానికి దిగింది .దీన్నే ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ‘’వెన్ను పోటు ‘’అన్నాడు.రుమేనియా హ౦గెరీలు జర్మనీతో చేతులు కలిపాయి .సంవత్సరాంతానికి’’ స్వస్తిక పతాకం ‘’యూరప్ లోనార్వే ,డెన్మార్క్ లతో సహా  చాలా దేశాలలో రెప రెప లాడింది .

   1941 మరొక గణనీయ మైన విజయ పరంపరను హిట్లర్ కు అందజేసింది .హిట్లర్ గ్రీస్ ,ఇంగ్లాండ్ లపైకి ఉరికాడు ఇంగ్లాండ్ దాడి నుండి తప్పించుకొని రక్షించు కోవటానికి  చాలా తక్కువ ప్రయత్నం చాలా ఆలస్యం గా  చేసింది .యుగోస్లావియా సయోధ్య కుదుర్చుకొన్నది .ఇక పడమటి లో తనను నిలవరించేవారేవ్వరూ లేరని ,రెండు వైపులా యుద్ధం ఎందుకని తూర్పు దేశాలపైఒక్కసారిగా  విరుచుకు పడ్డాడు  .ముందుగా రష్యాపై దాడి చేసి స్టాలిన్ శ్రేణిని నాశనం చేసి ,తర్వాత కీవ్, మాస్కో ,లెనిన్ గ్రాడ్ పై పడ్డాడు .యుద్ధ నిపుణులు రష్యా సైన్యాన్ని మూడు వారాల్లో మట్టు పెట్టగలరని మొత్తం రష్యా ను ఆరువారాల్లో ఊదేయగలరని  జోస్యం చెప్పారు  .కనుక హిట్లర్ నాజీ సైన్యం రష్యా లోపలి భాగాల్లోకి దూసుకు వెళ్ళి కీవ్ ,ఒరెల్ లు పట్టుకొని లెనిన్ గ్రాడ్   నుచుట్టుముట్టాయి . .ఇంకేముంది రష్యా పని అయి పోయింది జర్మనీ చేతిలో రష్యా ఓడిపోయింది ఇక కోలుకోలేదు లేవలేదు పూర్తిగా నాశనమై పోయింది  అని హిట్లర్ ప్రగాల్భాలతో ప్రకటించాడు .

        జపాన్ పెరల్ హార్బర్ పై దాడి చేసినపుడు అమెరికా కూడా యుద్ధానికి దిగాల్సి వచ్చింది .’’పుచ్చిపోయిన ప్రజాస్వామ్యం ‘’అంటే ఏవగింపు ద్వేషం ఉన్న హిట్లర్ అమెరికా పై యుద్ధం ప్రకటించాడు .దీనితో అల్ప జాతులనూ ,పనికి రాని ప్రజాస్వామ్యాలను ఒక్క దెబ్బతోతన నాజీ కాన్సేంట్రేషన్ కాంప్ లతో ,అత్యంత పాశవిక చర్యలతో తుడిచి పెట్టి  నాశనం చేయచ్చు అనుకొన్నాడు . జబ్బులు ,ఆహార లేమి , భయోత్పాతం చేయలేని పనిని ఇంజెక్షన్లు ,తగల బెట్టడాలు , గాస్ చే౦బర్ల తో పాశవిక మారణ హోమాన్ని సాధించాడు .న్యూరేం బెర్గ్ విచారణలలో ,యుద్ధ ప్రారంభ సమయం లో తొమ్మిదిన్నర మిలియన్ల యూరోపియన్ జ్యూస్ ఉండేవారని ,యుద్ధం తర్వాత మూడు మిలియన్ల మంది మాత్రమే  మిగిలి ఉన్నారని తేలింది .ఇవన్నీ హిట్లర్ ను సాడిస్ట్,  అమానుష స్ట్రాట జిస్ట్  అనటానికి దోహదం చేశాయి .’Brutality is respected .’The plain man in the street respects nothing but brute strength and ruthlessness .The people need fear .They want  some one to frighten them and make them shudderingly  submissive >They need something that give them a thrill of horror .terror is the most effective political instrument . I shall not permit my self to be robbed of it simply because  a lot of stupid mollycoddles  choose to be offended by it ‘’ఇవీ  హిట్లర్ ధర్మ పన్నాలు  .’’ ది వాయిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ‘’లో హీర్మాన్ రాస్చేనింగ్ ‘’లో హిట్లర్ తన అధికారుల్ని బండ బూతులు తిట్టేవాడని ,కాళ్ళతో తన్నేవాడని ,పిడికిళ్ళు టేబుల్ పైన కొట్టేవాడని ,దెబ్బతిన్న పిల్లాడో పిచ్చిపట్టిన స్త్రీ యో చేసినట్లు రాక్షసంగా ప్రవర్తి౦ చే వాడని రాశాడు వాళ్ళందరూ ఏడుస్తూ రోదిస్తూ అన్నీ  భరించేవారట .’’The most  horrible warfare is the kindest .The important thing is the sudden shock of an overwhelming fear of death .These so called atrocities spare me a hundred thousand individual  actions against disobedience and discontent. People will think twice before opposing us when they hear what to expect in the camps ‘’ఇదీ హిట్లరీయం ,హిట్లర్ మార్క్ పాలన .రావణా పాలన .

 విపరీతంగా అన్నిరకాల నష్టం పొందుతున్నా ,నెపోలియన్ వాటర్లూ పరాభవ గాధ తెలిసినా ,ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా మొండిగా తన నాజీ సైన్యాన్ని మరింతగా రష్యా లోపలి భాగాలలోకి చొప్పించాడు .మిలియన్ కంటే ఎక్కువ సైన్యం తో స్టాలిన్గ్రాడ్ వద్ద మోహరించాడు .ఇటలి లో పొందిన నష్టాన్ని పూడ్చుకోవటానికి డేరింగ్ డాషింగ్ వీరుడు రామ్మేల్ ను ఆఫ్రికా కు పంపాడు .మొదట్లో కొంచెం విజయం సాధించినా అతనునిలువరింప బడ్డాడు .నాజీ ఆక్రమణ నుంచి రక్షించు కోవటానికి  ఫ్రాన్స్ తన నావికా దళాన్ని ఉపసంహరించింది .చరిత్రలో అంతవరకూ ఎన్నడూ జరగని విధంగా అమెరికా ఇంగ్లాండ్ లు ఉత్తర ఆఫ్రికాలో అతి పెద్ద సైన్యాన్ని ది౦పేసి యుద్ధం చేశాయి .సిసిలీనుంచి బేస్ గా తీసుకొనిదక్షిణ ఇటలీ పై  అమెరికా యుద్ధం చేసింది .’’ఫ్యూహ్రేర్ ‘’హిట్లర్ జాతకం తిరగ బడింది .1943 లో అమెరికా యూరప్ కోటలను ధ్వంసం చేస్తే ,రెడ్ ఆర్మీ హిట్లర్ సైన్యాన్ని చావు దెబ్బ తీసి వెనక్కి తరిమేశాయి .ముస్సోలినీ పతనం చెందగానే ఇటలి యే హామీలు లేకుండానే లొంగి పోయింది .నాజీలు రోమ్ ను ఆక్రమి౦చగానే ఇటలీ జర్మనీకి ఎదురు తిరిగింది .అమెరికా యుద్ధ విమానాలు పగలూరాత్రి నాన్ స్టాప్ గా జర్మనీ పారిశ్రామిక వాడలపై బాంబు వర్షం కురిపించాయి .ఒకే ఒక రాత్రి అమెరికా అయిదు వందల యుద్ధ విమానాలతో  బ్రేమిన్  ఆయువు పట్ల పై దాడి చేసి కోలుకోకుండా చేసింది .బెర్లిన్ పై వందకు పైగా దాడులు చేసింది .హాంబర్గ్ పీనుగుల పెంట అయింది .

194 4  లో హిట్లర్ సైనికాధికారులు తాముచావు  దెబ్బతిన్నట్లు తెలుసు కొన్నారు .కాని హిట్లర్ అహం ఇంకా చావలేదు .ప్రజల బతుకు కంటే తన ప్రిస్టేజ్ ప్రధానమని భావించాడు .శాంతి అసాధ్యమని ప్రతి సైనికుడు వెనక్కి తిరగ కుండా పోరాడి చావాల్సిందేనని హుకుం జారీ చేశాడు .రష్యా అన్ని చోట్లా ఎదురు తిరిగే స్థాయిలో ఉంది .ఒడేస్సాను సేవెస్ట పోల్ ,మిన్స్క్ రుమేనియా లను తిరిగిపొంది హ౦గరీని  యుద్ధాన్ని ఆపు చేయమని ఒత్తిడి తెచ్చింది.అమెరికా బ్రిటన్ కెనడాల బలగాలు ఫ్రెంచ్ తీరాలపై మొహరించాయి .రెండు నెలల తర్వాత ఫ్రాన్స్ దాక్షిణ భాగాలను స్వాధీనం చేసుకొన్నాయి .సెప్టెంబర్ లో అమెరికా సైన్యం జర్మనీలో ప్రవేశించింది .1945 ఫిబ్రవరిలో బెర్లిన్ సైన్యాన్ని తూర్పుకు తరుముతుంటే రష్యా  తూర్పునుంచి దాడి చేసింది.హిట్లర్ పైనా ,ఆయన జేనరల్స్ పైనా దాడిచేశారు .గాయపడిన హిట్లర్ చావు నుండి తప్పించుకొన్నాడు .ఇంత జరిగినా అపజయాన్ని అంగీకరించ లేక పోయాడు హిట్లర్.మానవత్వం,హృదయమూ లేని ఆజ్ఞలను జారీచేసి వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకొని ,చివరికి గత్యంతరంలేక అన్ని కార్యక్రమాలకు దూరమయ్యాడు .బాంబులతో ధ్వంసమైన నగరాలనైనా కనీసం వెళ్లి చూడ లేదు .శాంతి కోసం ప్రయత్నం చేయలేదు .మిగిలిపోయిన సైన్యానికి నాయకత్వం వహించి చావో రేవో అంటూ పోరాడనూ లేదు   .బాంబ్ ప్రూఫ్ షెల్టర్ లో తలదాచుకొన్నాడు. భార్య, కొద్ది మంది వీరాభిమానుల తో ఉన్నాడు .1945 ఏప్రిల్ తర్వాత రష్యా జెండా రీచ్ స్టాగ్ పై  ఎగిరింది .హిట్లర్ దాక్కున్న సురక్షిత బంకర్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కరిపించింది .తనకు చావు దగ్గర పడిందని గ్రహించి హిట్లర్ ఆయన దర్పానికి గర్వానికీ,ఆత్మ ద్రోహానికి  మాస్టర్ పీస్ అనిపించే ఒక వీలునామా తయారు చేయించాడు .జరిగిన తీవ్ర నష్టానికి ప్రాణాలకు సానుభూతికూడా చెప్పకుండా ,ఇంకా తానూ జర్మనీ సంరక్షకుడిని విముక్తి దారుడిని అనే అనే భ్రాంతిలో పడి  ‘’actuated solely by love and loyalty ‘’అంటూ ‘’ఆరేళ్ళ యుద్ధం వలన అనేక రకాలుగా ఇబ్బందిపడినా దెబ్బ తిన్న జర్మనీ దేశ గౌరవాన్ని పెంచే దాని ఆకాంక్షను తీర్చే   గొప్ప ఘన కార్యంగా చరిత్రలో నిలిచి పోతుంది అని రాశాడు .తరుమబడిన సైనికులు కొందరు ఇంకా ఆయనకోసం,ఆశయ౦ కోసం  పోరాడుతూనే ఉన్నారు .కాని ప్రపంచాన్నిభయం తో  దొర్జన్యం తో   ,విచక్షణా రాహిత్యం తో  అమానుషంగా వణికించిన జర్మనీ నియంత హిట్లర్ పిరికి వాడుగా తనను కాల్చుకొని19 45 ఏప్రిల్ 30 న 56 వ ఏట  చచ్చిపోయాడు .కొన్ని గంటల క్రితమే ఆయన్ను పెళ్లి చేసుకొన్నా మిస్త్రేస్ విషం తీసుకొని చనిపోయింది . గాసోలీన్ మంటల్లో హిట్లర్ కాలి మసి అయ్యాడు .అవే పాపం ఆయనకు జరిగిన అంత్యక్రియలు .‘

హిట్లర్ చేసినట్లుగా చెప్పబడే అకృత్యాలు ఈనాడు నమ్మ శక్యం గా ఉండవు .దేశాన్ని ప్రేమించి జాతిని ఉద్ధరిస్తానని మాట ఇచ్చి జర్మనీ ఐక్యత సాధించి ప్రపంచం ఆర్యజాతి సర్వోత్క్రుస్టత కు మురిసి దేశోద్దారకుడిని అని ప్రకటించుకొన్న హిట్లర్ అంత క్రూరుడా అనిపిస్తాడు .కాని ఆయనలో ఉన్న ద్వేషం ,పగ ప్రతీకారం ,దౌష్ట్యం ,అధికార దాహం  అమానుషత్వం చరిత్రలో మచ్చలుగా మిగిలిపోయాయి .

హిట్లర్ చావును చాలామంది ఆహ్వానించారు చావుతో ఆయన పేరుకూడా ఖననం అయ్యింది .కొద్దిమందిమాత్రమే ఆయన కోసం ఏడ్చారు .చాలామందిని ఆయన ఎద్పించాడుకనుక వాళ్ళకళ్ళల్లో ఆనందం విరిసింది . Hitler’s actions and Nazi ideology are almost universally regarded as gravely immoral;[355] according to Kershaw, “Never in history has such ruination—physical and moral—been associated with the name of one man”.[356] Hitler’s political programme brought about a world war, leaving behind a devastated and impoverished Eastern and Central Europe. Germany itself suffered wholesale destruction, characterised as Stunde Null (Zero Hour).[357] Hitler’s policies inflicted human suffering on an unprecedented scale;[358] according to R.J. Rummel, the Nazi regime was responsible for the democidal killing of an estimated 19.3 million civilians and prisoners of war.[325] In addition, 29 million soldiers and civilians died as a result of military action in the European Theatre of World War II.[325] The number of civilians killed during the Second World War was unprecedented in the history of warfare.[359] Historians, philosophers, and politicians often use the word “evil” to describe the Nazi regime.[360] Many European countries have criminalised both the promotion of Nazism andHolocaust denial

 Historian Friedrich Meinecke described Hitler as “one of the great examples of the singular and incalculable power of personality in historical life

English historian Hugh Trevor-Roper saw him as “among the ‘terrible simplifiers’ of history, the most systematic, the most historical, the most philosophical, and yet the coarsest, cruelest, least magnanimous conqueror the world has ever known”.[363] For the historian John M. Roberts, Hitler’s defeat marked the end of a phase of European history dominated by Germany.[364] In its place emerged the Cold War, a global confrontation between the Western Bloc, dominated by the United States and other NATO nations, and the Eastern Bloc, dominated by the Soviet Union.[365] Historian Sebastian Haffner avers that without Hitler and the displacement of the Jews, the modern nation state of Israel would not exist. He contends that without Hitler, the de-colonisation of former European spheres of influence would have been postponed.[366] Further, Haffner claims that other than Alexander the Great, Hitler had a more significant impact than any other comparable historical figure, in that he too caused a wide range of worldwide changes in a relatively short time span.[367]

According to a U.S. Office of Strategic Services report, “The Nazi Master Plan”, Hitler planned to destroy the influence of Christian churches within the Reich.[380][381] His eventual goal was the total elimination of Christianity.[382] This goal informed Hitler’s movement early on, but he saw it as inexpedient to express this extreme position publicly.[383]According to Bullock, Hitler wanted to wait until after the war before executing this plan.[384]

Speer wrote that Hitler had a negative view of Himmler’s and Alfred Rosenberg‘s mystical notions and Himmler’s attempt to mythologise the SS. Hitler was more pragmatic, and his ambitions centred on more practical concerns.[385][386]

Researchers have variously suggested that Hitler suffered from irritable bowel syndrome, skin lesions, irregular heartbeat, coronary sclerosis,[387] Parkinson’s disease,[273][388]syphilis,[388] giant cell arteritis with temporal arteritis,[389] and tinnitus.[390] In a report prepared for the Office of Strategic Services in 1943, Walter C. Langer of Harvard Universitydescribed Hitler as a “neurotic psychopath“.[391] In his 1977 book The Psychopathic God: Adolf Hitler, historian Robert G. L. Waite proposes that Hitler suffered from borderline personality disorder.[392] Historians Henrik Eberle and Hans-Joachim Neumann consider that while Hitler suffered from a number of illnesses including Parkinson’s disease, he did not experience pathological delusions and was always fully aware of, and therefore responsible for, the decisions he was making.[393][261] Theories about Hitler’s medical condition are difficult to prove, and placing too much weight on them may have the effect of attributing many of the events and consequences of Nazi Germany to the possibly impaired physical health of one individual.[394] Kershaw feels that it is better to take a broader view of German history by examining what social forces led to the Nazi dictatorship and its policies rather than to pursue narrow explanations for the Holocaust and World War II based on only one person.[395]

Hitler followed a vegetarian diet.[396] At social events he sometimes gave graphic accounts of the slaughter of animals in an effort to make his dinner guests shun meat.[397]Bormann had a greenhouse constructed near the Berghof (near Berchtesgaden) to ensure a steady supply of fresh fruit and vegetables for Hitler throughout the war.[398] Hitler publicly avoided alcohol. He occasionally drank beer and wine in private, but gave up drinking because of weight gain in 1943.[399] He was a non-smoker for most of his life, but smoked heavily in his youth (25 to 40 cigarettes a day). He eventually quit, calling the habit “a waste of money”.[400] He encouraged his close associates to quit by offering a gold watch to any who were able to break the habit.[401] Hitler began using amphetamine occasionally after 1937 and became addicted to it in late 1942.[402] Speer linked this use of amphetamine to Hitler’s increasingly inflexible decision making (for example, rarely allowing military retreats).[403]

Prescribed 90 medications during the war years, Hitler took many pills each day for chronic stomach problems and other ailments.[404] He regularly consumed methamphetamine,barbiturates, opiates, and cocaine.[405][406] He suffered ruptured eardrums as a result of the 20 July plot bomb blast in 1944, and 200 wood splinters had to be removed from his legs.[407] Newsreel footage of Hitler shows tremors of his hand and a shuffling walk, which began before the war and worsened towards the end of his life.[404] Ernst-Günther Schenck and several other doctors who met Hitler in the last weeks of his life also formed a diagnosis of Parkinson’s disease.[408]

 Inline image 1    Inline image 2
Inline image 4
Inline image 5Inline image 6

   సశేషం                                      

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ –3

  తీవ్ర వాదుల పార్టీల కార్యక్రమాలు బాగా వేగంగా ఊపు నందుకోన్నాయి .డిప్రెషన్ ,ఇన్ ఫ్లేషన్ పరిస్థితులను మరీ దిగ జార్చాయి .19 18 లో జర్మని కరెన్సీ లో డాలరు కు 4 మార్క్ లు వస్తే, 1922 లో డాలర్ కొనాలంటే 75 మార్కు లు  1922 లో 100 మార్క్ లు చెల్లించాల్సి వచ్చింది  .ఆ తర్వాత కూడా ప్రతి నెలా మార్క్ పతనం కొనసాగింది .1923జులై  కు పరిస్థితి  మరీ దిగ జారిపోయి 1 50 000అయి,ఆగస్ట్ నాటికి మిలియన్ మార్క్ లకు దేకింది. కరెన్సీ పతనం నాజీలకు బాగా కలిసి వచ్చింది . ఆహార కొరత ,నిరుద్యోగం ,సాధారణ దివాలా ,కూడా వాళ్లకు పంట పండించింది .ఈ గండాలనుంచి దరి చేర్చటానికి ప్రజల్ని ఆదుకోవటానికి నాజీ పార్టీ ఒక్కటే సరైనది అనే అభిప్రాయం బాగా కలిగించారు దేశాన్ని దివాలా స్థానం నుంచి ఉద్ధరించటానికి ,ప్రాంతీయ అలజడులు అంతర్జాతీయ దాడుల నుండి కాపాడ గలిగే పార్టీ నాజీ పార్టీ ఒక్కటే అనే గట్టి నమ్మకాన్ని హోరెత్తే ప్రచారం తో కలిగించారు .వేర్సేల్లీస్ ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ను బాగా ప్రచారం చేసి శక్తి వంతమైన జర్మనీ నిర్మాణం చేయాలన్న ఆలోచనకు మద్దతు సంపాదించారు .ప్రజల్ని ఎలా మాటలమాయతో మభ్యపెట్ట వచ్చో హిట్లర్ కు బాగా తెలుసు .ముఖ్యంగా ప్రజల ఫ్రస్ట్రేషన్ తో ఎలా ఆడుకోవచ్చో తెలుసు ..వాళ్ళకోరికలు తీరుస్తానని , జర్మనీ కీర్తి విశ్వ వ్యాప్తమవుతుందని పూర్తీ నమ్మకం కలిగించాడు .రహస్య క్రూర పోలీసు దళాలతో ,దారి తప్పిన ప్రజల్ని దారిలోకి తెచ్చుకొన్నాడు .విప్లవానికి పరిస్థితి తిబాగా పక్వమై౦దని గ్రహించి పార్టీని సివిల్ వార్ కు పురిగొల్పాడు .1923 నవంబర్ లో బ్రవేరియాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం లాక్కోవాలని ప్రయత్నించాడు .సరైన ప్రయత్నం ,ముందు జాగ్రత్తలు తీసుకోక పోవటం వలన అది ఫలించలేదు .సైనిక తిరుగుబాటు జరుగుతుందని ఊహించాడుకాని జరగలేదు పైగా హిట్లర్ అరెస్ట్ అయ్యాడు  . .ఇదొక పెద్ద అపజయం .

ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చాయి హిట్లర్ దొర గారికి .జర్మనీ లో ప్రతి వారి నోటినుంచి హిట్లర్ హిట్లర్ అనే నామం మంత్రోచ్చారణగా వినిపించి మహా ప్రసిద్దుడైపోయాడు .ఆయన పై జరిగిన 9 నెలల విచారణ ,జైలు జీవితం హిట్లర్ ను త్యాగ వీరుని చేశాయి .జైలు లో ఉండగానే ‘’మీన్ కాంఫ్ ‘’లో చాలా భాగం రాశాడు .అదే నాజీలకు పవిత్ర బైబిల్ అయింది..జైల్లో ఉంటూ పార్టీ నాయకులతో సంప్రదిస్తూ పార్టీని మరింత పదును పెట్టాడు .హిట్లర్ కు క్షమా భిక్ష ఇచ్చి విడుదల చేశాక తన స్థానాన్ని పదిల పరచుకొనే ప్రయత్నం గట్టిగా చేశాడు .అయిదేళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి తనకు అడ్డు వస్తారను కొనే వాళ్ళనందర్నీపురుగుల్ని నలిపినట్లు నలిపి పారేశాడు .తనకున్న లేబర్ వ్యతిరేక విధానాలతో ముఖ్య పారిశ్రామిక వేత్తల మద్దతు సంపాదించాడు .సైనికాధికారులూ అతన్ని సమర్ధించి మరింత శక్తి వంతుడిని చేశారు .దేశం లోని అసంతృప్తిని బాగా కాష్ చేసుకొని తన అధికారానికి  అవకాశ వాదం తో అధికార పీఠం పై కూర్చోవటానికి రాచ బాట వేసుకొన్నాడు.

 45 వ ఏట అధికారం చేతిలో ఉంటే దేనినైనా సాధించవచ్చు ననుకొన్నాడు .ముందుగా రాజ్యాధికారం పొందాలి కనుక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశాడు .మాటల గారడీ ,ట్రిక్కులు ,ఆశలు కల్పించి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు ఇల్లు లేనివాళ్ళకు ఇల్లు ,నిరుద్యోగికి ఉద్యోగం ,అతి ముఖ్యంగా అదో జగత్ సహోదరులు తనలాగే పైకి వచ్చే అన్ని రకాల అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టాడు .అన్నీ కలిసి వచ్చాయి .అతనికి వ్యతిరేకంగా ఉన్న లెఫ్ట్, రైట్ నాయకులు ఒక్కటికాలేక పోయారు .చట్టప్రకారం రాజ్య భోజ్యానికి చేసిన కుట్ర ఫలించింది .45 వ ఏట ఎందుకూ పనికి రాని ఒక పోస్ట్ కార్డ్ పెయింటర్  ,వియన్నా వీధుల్లో తిండికి ,నిద్రకు అలమటించి తిరిగినవాడు అయిన హిట్లర్ –రిపబ్లిక్ ప్రెసిడెంట్ ముసలి యుద్ధ వీరుడు మార్షల్ హీన్దేన్ బర్గ్ పై ఒత్తిడి తెచ్చి తనను చాన్సలర్ నియమంచమని కోరాడు .1933 జనవరి 30 అయిన ఆ దుర్దినం నుంచి అతనిమాట ,చర్య పరమ భీకరంగా మారి జర్మనీకి అన్నివిధాల తానేప్రభువును అనే స్థితిలోకి వచ్చి ,యూరప్ అంతా తానే పరిపాలిస్తానని భయపెట్టాడు .’’To day Europe tomorrow the whole world ‘’అనే స్లోగన్ తో అందర్ని కంగు తినిపించాడు .

   చాన్సలర్ నుండి డైరెక్టర్ కు వెంటనే ఎదిగిపోయాడు .తన సహచరులు గోరింగ్ ,గోబెల్ల్స్ కు సర్వాధికారాలు ఇచ్చి విపక్ష వర్గాన్ని ఏవిధంగా నైనా అణచి  నాశనం చేసి పారేయ్యమన్నాడు  .హిట్లర్ వాణి అయిన గోరింగ్ పార్టీ అధినేత,డైరెక్టర్ కూడా  అయి నరకాసుర పాలన చేబట్టారు .గోబెల్స్ పబ్లిక్ యెన్ లైటేన్ మెంట్  మంత్రిగా ముఖ్య ప్రాప గాండ చేశాడు .రీచ్ స్టాగ్ బిల్డింగ్ ను తగల బెట్టించిన ఈ ఇద్దరు ప్రభుద్దులు కమ్యూనిస్ట్ లే ఆ పని చేశారని   ప్రచారం చేశారు .అందుకే అప్పటినుంచి అసత్య ప్రచారాలను ‘’గోబెల్స్ ప్రచారం ‘’అనటం ఆనవాయితీ అయింది ప్రపంచం లో .దీనితో అన్ని ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికినాంది అయింది . స్వీయస్వేచ్చా  ,వాక్ స్వాతంత్ర్యం  ,పత్రికా స్వాతంత్ర్యం  ,పోస్టల్ కమ్యూని కేషన్ లో ఉన్న రహస్య౦ అన్నిటికి భంగం కలిగించి స్వేచ్చకు సంకెళ్ళు వేశారు .     .తన నిర్వాకాన్ని తెలియ జేస్తూ గోరింగ్ బోరింగ్ గా ‘’నా చర్యలు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండవు .న్యాయం పై నాకు చింత లేదు .నా సంకల్పం సర్వ నాశనం ,దు౦పనాశనం, నిర్మూలనమే ‘’అని నిర్లజ్జగా ప్రకటించాడు .రీచ్ వ్యవస్థ చేసే దురాగత ప్రజా వ్యతిరేక చర్యల నుంచి రక్షి౦చటానికే  అనే బూటకం తో హిట్లర్ రాజ్యాంగాన్ని కూడా ప్రక్కకు పెట్టేశాడు .విశ్లేషకుడు అలాన్ బులాక్స్ వివరించినట్లు ‘’కొత్త రాజ్యం లోని సంపత్తిని అంతటినీ వీధి రౌడీ గాంగ్ లు స్వాధీన పరచుకొని పెత్తనం చేశారు .మురికి నాయాళ్ళు అందలమెక్కారు ‘’.1933 జులై 14 న జర్మనీలో నాజీ పార్టీ ఒక్కటే రాజ్యాంగ బద్ధమైన పార్టీ అనే చట్టాన్ని తెచ్చాడు .దీనితో పెట్రేగిపోయిన నాజీ మూకలు భీభత్సం ,హత్యాకాండ, దమన కాండ ,లతో రక్తపు టేరులు పారించారు .హిట్లర్ ఇప్పుడు ‘’ఫ్యూహ్రేర్ ‘’ అంటే సర్వాధికార నియంత అయ్యాడు .రాజ్య పాలకుడిగా సైన్యం పైనా అధికారం పొందాడు .సైనికు లందరి చేత ఎలాంటి భేషజం లేకుండా ‘’హిట్లరే మా నాయకుడు ,ఆయనకే లొంగి ఉంటాము’’అనే పవిత్ర శపథం చేయింఛి జర్మనీ సామ్రాజ్యానికి అరివీర భయంకరుడయ్యాడు  .తన దేశాన్ని లోబరుచుకొన్న గట్టర్ హీరో హిట్లర్ ఇప్పుడు ఉపఖండాన్ని జయి౦చాలనే ఉబలాటం లో ఉన్నాడు .

మొదటి ప్రయత్నంగా లీగ్ ఆఫ్ నేషన్స్ కు గొళ్ళెం పెట్టాడు .మొదట్లో బ్రిటన్ గొణిగినా తర్వాత జర్మనీకి  కొత్తాయుధ వితరణ ఇచ్చింది .అంతర్జాతీయ పరిస్థితి ని హిట్లర్ బాగా అవగాహన చేసుకొని దాన్ని ప్రయోజనం గా చేసుకొనే ప్రయత్నం చేశాడు .శత్రువుల బలహీనత లను పసిగట్టే మేధావి హిట్లర్ .వారి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకొనే మహా తెలివి తేటలున్న వాడు .తన దేశం జర్మనీ లోని విభేదాలను తుంగలోతొక్కి అధికారానికి వచ్చినవాడుకనుక సామ దాన భేద దందోపాయాలన్నీ తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ప్రయోగించాలో తెలిసిన కౌటిల్యుడు .ఇంగ్లాండ్ ను ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా చేశాడు .ఫ్రాన్స్ ను  పోలాండ్ కు వ్యతిరేకం చేశాడు .రష్యాను పశ్చిమ దేశాలకు వ్యతిరేకిని చేశాడు .జెనీవాలో జరిగిన ఆయుధ విసర్జన సమావేశం ఫలప్రదం కాకుండా అడ్డుపుల్ల వేశాడు .జర్మనీలో నిర్బంధ సైనిక విధానం అమలు పరచి అందర్నీ సైన్యం లో చేర్చే ప్రయత్నం చేశాడు .విద్య ,వ్యాపారం వాణిజ్యం ,జర్నలిజం దియేటర్ లలో బాగా స్థిర పడి ఉన్న జ్యూలన్దర్నీ దేశ బహిష్కారం చేసి  వారి స్థానాలలో తన ‘’చెంచా గాళ్ళ’’ను కూర్చోబెట్టాడు .ఏది ప్రసారం చేయాలో ఏది కూడదో నిర్ణయిస్తూ సమాచార వ్యవస్థను స్వాధీనం చేసుకొన్నాడు .దీనితో  విధ్వంసానికి కోట గోడ కట్టాడు. దేశ ద్రోహ గ్రంధాలు అనే ముద్ర వేసి విలువైన  సాహిత్యాన్ని అంతా తగుల బెట్టించాడు . ముందుగ  కమ్యూనిస్ట్ సానుభూతి రచనలను, తర్వాత జ్యూ ల ఫ్రాయిడ్ యొక్క ,హీన్ యొక్క రచనలన్నీ తగలబెట్టించి భోగి మంటలు వేయించి ఆనందంగా చలి కాచుకొన్నాడు .ఆర్య వ్యతిరేకమైనవన్నీ భస్మీపటల మైపోయాయి .ఇంతటితో ఆగక సోషల్ డెమొక్రాట్ ల ,యుద్ధ వీరుల ,అసమ్మతి సైంటిస్ట్ ల ,అధిక అధికారం చెలాయించే వారిపై రాసిన విమర్శల నన్నిటినీ తగలబెట్టి వినోదం పంచుకొన్నారు ఆ కిరాయి మూకాసురులు .

     1936 లో యూరప్ సమస్యలతో సతమత మైంది .ఫాసిస్ట్ ఇటలి సంధిని ఉల్లంఘించి ఇతోపియాను బాంబుల దాడితో నామ రూపాలు లేకుండా చేసింది .లీగ్ చేతగాక ముసోలినే సమర్ధించి దెబ్బతిన్న  దేశాన్ని వదిలేసింది ..స్పెయిన్ లో అంతర్యుద్ధం  చెల రేగింది .తిరుగు బాటు దారులను  జర్మని ఇటలీలు వెనకేసుకొస్తే లాయలిస్ట్ లకు జనరల్ ఫ్రాంకో ,రష్యాలు మద్దతు నిచ్చారు .బ్రిటన్ అమెరికాలు దూరంగా ఉండి పోయాయి .పరిస్థితులన్నిటిని జాగ్రత్తగా గమనించిన హిట్లర్ ఇప్పుడు అంతర్జాతీయరాజకీయ  గాంబ్లింగ్ ఆడాడు .తన జర్మన్ సైన్యాన్ని రీన్ లాండ్ పైకి ఉరికించాడు .దీనితో జర్మని పూర్వపు ఒప్పందాలన్నిటినీ ఉల్లంఘిస్తుంది అని చాటి చెప్పాడన్నమాట .మిగిలిన దేశాలు లీగ్ కు ఫిర్యాదు చేశాయి .కానిఇదివరకటిలాగానే  ఏమీ చేయలేక పోయింది లీగ్ .1937 జనవరిలో ఫ్రాన్స్ ,గ్రేట్ బ్రిటన్ లు స్పెయిన్ లో పోరాడుతున్న విదేశీ వాలంటీర్లు అందరిని వెనక్కి రావాలని కోరాయి .ఇటలీ జర్మనీలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి .స్పానిష్ ఫాసిస్ట్ లకు హిట్లర్ ఇంకా ఎక్కువ సాయం చేయాలని నిర్ణయించాడు .ఇంకాస్త ముందుకెళ్ళి వేర్సైల్లిస్ ఒప్పందాన్ని తప్పు పట్టి జర్మనీకి జరిగిన అన్యాయాన్ని చాటుతూ కోల్పోయిన కాలనీలన్నిటిని తిరిగి ఇచ్చేయాలని కోరాడు

 .

Inline image 1

            సశేషం

       మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-24-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2

  ఈ జాతీయ భావం ,నాయకత్వ లక్షణం హిట్లర్ కు 24 ఏళ్ళు రాక ముందే మనసులో బలపడ్డాయి .వియన్నీస్ వర్కర్లు పెద్ద ప్రజా ప్రదర్శన చేసినప్పుడే ఈ మూక జనం బలమైన  శక్తి సంపన్నమైన దేనికీ లొంగని పాలకుడికి విధేయంగా  ఉంటారని అనుకొన్నాడు  .పడగొట్టే వాడికంటే పరిపాలకుడికే జై కొడతారని ఊహించాడు .ఈ జనం భయపెట్టినకొద్దీ లొంగి ఉంటారని ,వాళ్ళస్వాతంత్రేచ్చ కాల రాచినా వాళ్ళు ఏమీ అనుకోరని తలచాడు .ప్రజల దృష్టిని ఏదో ఒక దానిపై ఏకీ కృతం చేస్తే వాళ్ళ ద్రుష్టి మరో దాని పైకి పోదని అనుకొన్నాడు .అప్పుడు వాళ్ళను విడదీయ టం కష్టమే అని అర్ధం చేసుకొన్నాడు ..మేధావి నాయకుడు వివిధ వ్యతిరేకుల్ని ఒకే కేటగిరీ లోకి తెచ్చి పిడికిలి లో బిగిస్తాడని అభిప్రాయ పడ్డాడు .అబద్ధాలు బాగా చెప్పాలి .యెంత తప్పు చేస్సినా ఒప్పుకోకుండా దబాయించాలి .రిజర్వేషన్ లను ఆపెయ్యటానికి సందేహించ రాదు .మూకల్ని బాగా అవినీతి పరులను చేయటం తేలిక .,వాళ్ళు సహజం గా చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు అలాంటి వాళ్ళతో పెద్దవి బొంకి౦ చటానికి మరింత పెద్ద తప్పుల్ని చేయించటానికి  శ్రమ పడక్కర లేదు ..బల ప్రయోగం తో మూకను ఒప్పించ వచ్చు .ఎంత గట్టిగా నొక్కి చెబితే అ౦త  బాగా నమ్ముతారు .నెత్తిన మొట్టిన కొద్దీ వంగి వంగి సలాం చేస్తారు .’’అని ‘’హిట్లరోపనిషత్’’ విప్పి చెప్పాడు .’’the driving force which has brought about revolutions has never been  a body of scientific teaching  ,but always a devotion to which  has inspired them and a kind of hysteria which urged them into action –who ever wishes to win over the masses must know this key ,It is not objectivity  but a determined will backed up by power where necessary ‘’అన్నాడు .దీనిపై విశ్లేషకులు స్పందిస్తూ ‘’the greatest damage in history Hitler fused the cool cynicism of Machiaivelli  with the agitating oratory of a mob spell binder ,plus a compulsive ruthlessness that was all his own ‘’అని చెప్పారు .

 24 వ ఏట అధికార దాహం తో ఉన్న హిట్లర్ వియన్నాను వదిలాడు .24 ఏళ్ళతర్వాత మళ్ళీ అక్కడ విజేతగా  కాలు పెట్టాడు. 1913 లో మ్యూనిచ్ కి స్ప్రింగ్ లో వెళ్ళాడు .ఇంతకాలం ఎలా పొట్ట పోషించు కున్నాడో ఎవరికీ తెలియదు .కొన్ని పెయింటింగ్ లు వేసి అమ్మి జీవించి ఉండవచ్చు .పిచ్చి పట్టిన  వాడుగా రోడ్లమ్మట పగలూ రాత్రి తన సమ్మోహన స్వరం తో జనాలను చైతన్యం చేస్తూ తిరిగి ఉండవచ్చు .పాత చరిత్ర తవ్వి తీసి నార్డిక్ సుప్రీమసి ని జాగృతం చేస్తూ ట్యుటానిక్ మైదాలజిని గొప్ప చేస్సి చెప్పుతూ జర్మనీ ని కొత్త సైన్యం తో సమాయత్త పరిచి ఉండ వచ్చు .1914 ఆగస్ట్ 14 న  అతని కల మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం తో నెర వేరే అవకాశాలు లభింఛి బవేరియన్ సైన్యం లో పేరు నమోదు చేసు కొన్నాడు .

   సైనికుడిగా హిట్లర్ పాత్ర ఏమిటో తెలియదుకాని తన స్థానాన్ని పదిలం చేసుకొన్నాడు . యుద్ధం పూర్తీ  అయేసరికి హిట్లర్ ఒక కార్పోరల్ గానే ఉన్నాడు .అతని ముఖ్యమైన పని ఉత్తరాల బట్వాడా మాత్రమే . దీనికే’’ ఐరన్ క్రాస్ ‘’బహుమతి పొందాడు .జర్మని ఓడిపోవటం అతనికి పాలకుల నిర్వాకం పై మరింత ద్వేషం పుట్టించింది .సంధి పత్రం పై సంతకం చేసిన వాళ్ళను విద్రోహులు అన్నాడు .జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటే ఆతనికి ఎలర్జీ .మూక జనం పై ద్వేషం తోనే యుద్ధానికి దిగాడు .దీనిపై ‘’డేర్ ఫ్యూహ్రేర్ ‘’పుస్తకం లో  కాన్రాడ్ హీడేన్ ‘’నాయకుల పై ఏహ్యం తోనే వదిలాడు .తాను  నీచ జనం అన్నవాళ్ళకు భయపడి ఒణికి లొంగిపోయారు ‘’అని ఎద్దేవా చేశాడు అని రాశాడు .ఉన్నత వర్గాలపై ద్వేషం పెంచుకొన్నాడు .పది పన్నెండు వేల సోషలిస్ట్ ఉద్యమకారుల్ని గాస్ తోనో  విషం తోనో అధినాయకులు చంప లేక ఊచ కోత కోయలేక  పోయిన వాజమ్మలు దద్దమ్మలు అని ఆక్రోశించాడు .అదే వాళ్ళు చేసి అతిపెద్ద ద్రోహం తప్పు బ్లండర్ అన్నాడు .

   అప్పటికే ప్రజాస్వామ్య వ్యతిరేక వాదుల ఉద్యమాలలో ప్రదర్శనలలో బాగా పాల్గొన్న హిట్లర్ ఇక తన స్వప్రయోజనం కోసం ప్రాపగాండా ప్రారంభించాడు .జర్మన్ నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ అంటే ‘’నాజీ పార్టీ ‘’లో చేరాడు. దాని గుర్తు స్వస్తికం .రౌడీల, ధగ్గుల ముఠాలను ఇందులో చేర్చుకొని  ఊరేగింపులు , ఉద్యమాలను చెదర గొట్టటం, బెదిరించటం చేయించాడు .వ్యతిరేకుల్ని భయ  భ్రాంతుల్ని చేయించాడు   .ఒక మీటింగ్ లో తాను అన్ని రకాల సమావేశాలను ,ఉపన్యాసాలను అడ్డుకొంటానని  శ్రోతలను దీనిద్వారా భయ భ్రాంతులకు   గురి చేస్తానని ప్రేక్షకులకు తెలియ జేశాడు .నాజీ మూక తో ప్రతిపక్షానికి దడ పుట్టించాడు .’’మా దండు రాజకీయ పోరాటానికి కే తప్ప డిబేటింగ్ సొసైటీలకు కాదు ‘అని తేల్చి చెప్పాడు .రోమన్ ఇంపీరియ లిజానికి గుర్తుగా ముసోలిని ప్రవేశ పెట్టిన ఫాసిస్ట్ సాల్యూట్ ను హిట్లర్ కూడా ప్రవేశ పెట్టి ,ముసోలిని ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ప్రజల్లో వెర్రి ఆవేశాన్ని రగిలించాడు .’’మేము పోరాటాన్ని బోధిస్తాం .పార్లమెంటరీ పద్ధతికి తీవ్ర వ్యతిరేకం గా పోరాటం సాగిస్తాం .దీనితో జర్మనీ పూర్తిగా కూలి పోవచ్చు లేక ఒక కొత్త హీరో ఆవిర్భవించి దాని భవితను నిర్ణయించ వచ్చు .ఆనాయకుని బూట్లు మురికిగా ఉండచ్చు కాని అతనికి ఉక్కు పిడికిలి ,సంకల్పం ఉంటాయి .అతను ఊక దంపుడు ఉపన్యాసాలకు స్వస్తి చెప్పి స్వస్తిక మార్కు గుర్తు తో జాతిని కార్యోన్ముఖం చేస్తాడు ‘’అని ఉద్రేక పూర్వకంగా ప్రసంగించాడు .రెచ్చగొట్టాడు .తన దారికి తెచ్చుకొన్నాడు .

      సశేషం

                  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్

  స్కూల్ లో చదవని ఆస్ట్రియన్ అడాల్ఫ్ హిట్లర్ వియన్నా మురికి వాడలవాడు, చెదిరి పోయిన జర్మనీని క్రూర ప్రపంచ శక్తిగా ఉద్ధరించి అసలే జబ్బుతో ఉన్న యూరప్ ను కోలుకోలేని సంక్షోభం లోకి నెట్టినవాడు .20-4-1889 న ఆస్ట్రియా బవేరియా దేశ సరిహద్దు లో ఉన్న  బ్రానువా అనే చిన్న పట్నం లో పుట్టాడు .తండ్రి ఆలోయిస్ అనే ఒక రైతు కన్నెపిల్ల మేరియా శికిల్ గ్రుబర్ కు అక్రమ సంతానంగా పుట్టినవాడు.తల్లిపేరును 30 వ ఏడాదివరకు కొనసాగించి తర్వాత హిట్లర్ గా మార్చుకొన్నాడు .హిట్లర్ లేక హీడ్లర్ లేక హీట్లర్ కుటుంబం  తరతరాలుగా సంచారులే .కాని హిట్లర్ తల్లి వైపు వాళ్ళు పోల్జులు తరతరాలుగా పొలం కూలీలు .హిట్లర్ తండ్రి చిన్న ఆఫీసర్ .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నాడు .మొదటి పెళ్ళాం అతనికంటే 14 ఏళ్ళు పెద్దది .పిల్లలు లేరు. 16 ఏళ్ళ తర్వాత పెళ్లి రద్దు చేసుకొని  ఒక హోటల్ లో వంట చేసే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కొడుకు కు తండ్రి అయ్యాడు .ఏడాది తర్వాత ఆమె టి బి వచ్చి చనిపోయింది .ఆమె చనిపోయిన ఆరు నెలల తర్వాత  సెకండ్ కజిన్ నుతనకంటే 23 ఏళ్ళ చిన్నదైన అమ్మాయిని  ముచ్చట గా మూడో పెళ్లి చేసుకొని 5 గురు పిల్లలను కన్నాడు .ఇందులో ముగ్గురు బాల్యం లోనే చనిపోయారు .మూడో పెళ్లి కి మూడో కొడుకే అడాల్ఫ్ హిట్లర్ .తండ్రి రెండవ పెళ్ళాం హాఫ్ సిస్టర్ ఏంజెలా రాబాల్ తో మాత్రమే హిట్లర్ కు అనుబంధం ఉండేది .ఆమె కూతురు జీలి తో విచిత్రంగా విషాదంగా ప్రేమలో పడ్డాడు హిట్లర్ .

   ఆరవ ఏట స్కూల్ లో చేరి ఇతర ఆస్ట్రియన్ పల్లెటూరి పిల్లలలాగానే అరవై వ ఏడు లోకి ప్రవేశిస్తున్న తండ్రిని తండ్రిగా కాక తాత అనే భావం తో చూశాడు .సాధారణ చదువే చదివి ,తాను సివిల్ సర్విస్ ఉద్యోగం కోసం చదవనని   పెయింటర్ అవుతానని చాలెంజ్ చేశాడు .మొదట్లో కొడుకు ఇంటికి సున్నాలు రంగులు వేసే వాడు అవుతాడేమోనని అసంతృప్తి చూపి విపరీతంగా కోప్పడ్డాడు. కాని ఫలితం లేక పోయింది .ఆయన కోపం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది .ఇదే హిట్లర్ మొదటి విజయం .దీన్ని ప్రయోజనం గా భావించి లింజ్ లో సెకండరి స్కూల్ లో చేరి ,చదవనని భీష్మిస్తే సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు .’’నాకు ఏది సంతోషంగా ఉందేదో  దాన్నే చదివాను .ఇష్టం లేని దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు ‘’అని హిట్లర్ తన జీవిత చరిత్ర ‘’మీన్ కాంఫ్ అంటే ‘’నా పోరాటం’’ లో రాశాడు .1903 లో తండ్రి చనిపోగా ,రెండేళ్ళ తర్వాత స్కూల్ మానేశాడు .అతని ప్రోగ్రెస్ కార్డ్ లో అన్నీ ‘’అత్తిసెరు ‘’మార్కులే కనిపిస్తాయి .ఫ్రీ హాండ్ డ్రాయింగ్ మాత్రం బాగా ఉంది. రాత దరిద్రపు గొట్టు .జర్మనీ గురించి ఆయనకు తెలిసింది సంతృప్తికరంగా లేదని ఆ రిపోర్ట్ సారాంశం .

    స్కూల్ లో నూ తలిదండ్రుల పరంగానూ క్రమ శిక్షణ లేని హిట్లర్ లింజ్ కు దగ్గర లో ఉన్న ఉర్ఫార్ లో జులాయిలా తిరుగుతూ యే పనీ చేయని సోంబేరి అయ్యాడు .తానేం కావాలో తెలియక  ఇతరుల పై అనుమానం పెంచుకొని ,ఎవరితోనూ స్నేహం చేయక , యే సంస్థలోనూ చేరక  ఎవరి తీర్పుకూ ఇష్టపడకుండా కాలక్షేపం చేశాడు .కొన్ని నెలలు మ్యూనిచ్ ఆర్ట్ కాలేజిలో చేరి  చదివాడు  .18 వ ఏట తల్లి ఆసరాతో వియన్నా ఫైన్ ఆర్ట్స్ లో చేరుదామను కొన్నాడు  .ఎందరో  ఆర్టిస్ట్ నిష్ణాతులను కలిసినా ఎవరూ చేర్చుకోలేదు .మరుసటి ఏడాదీ ప్రయత్నించి దారుణంగా విఫలుడయ్యాడు .పరీక్ష రాయటానికి కూడా ఎవరూ ఒప్పుకోలేదు  .జీనియస్ ఆర్టిస్ట్ లందరూ తనలాగా తిరస్కరింప బడిన వారే అని తనను  తాను   ఓదార్చు కొన్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేలోపే  తల్లీ చనిపోయింది .ఏం చేయాలో,ఎక్కడికి వెళ్ళాలో  పాలుపోలేదు .’’’’నార సంచీలో ఉన్న బట్టలు సర్దుకొని ,మొక్కవోని దైర్యం తో వియన్నాకు బయల్దేరాను .నేను’ఏదో కావాలి ‘’అనే నిశ్చయం నా మనసంతా నిండి పోయింది .కాని సివిల్ ఉద్యోగిని మాత్రం కాకూడదు అని గట్టిగా నిర్ణయించుకొన్నాను ‘’అని రాసుకొన్నాడు హిట్లర్ .

  వియన్నా లో  అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .తర్వాత తిండి తినటానికి సరి పడడబ్బును పెయింటింగ్ ద్వారా సంపాదించానని గర్వంగా చెప్పుకొన్నాడు .కాని ‘’గురుడికి ‘’మనిషి బొమ్మ వేయటమే రాదు .ఒక చిన్న సృజనాత్మకమైన బొమ్మా వేయే లేక పోయాడు .ల్యాండ్ స్కేపులు బిల్డింగ్ లను కాపీచేశాడు .వియన్నా పై పోస్ట్ కార్డ్ భావాలు గిలికాడు .ఈ తిరుగులాటలో బోహిమియన్ దేశ ద్రిమ్మరి తో అనుకోకుండా పరిచయమైంది .కొద్ది రోజుల్లోనే వాడితో పోట్లాడి వదిలించుకొన్నాడు.మంచు ఆటలలో పెన్నీలు సంపాదిస్తూ ,రైల్వే స్టేషన్ లో సామాన్లు మోస్తూ ,కార్పెట్ల దుమ్ము దులుపుతూ ,తాగు బోతుల దగ్గర అడుక్కొంటూ ఏదో కొంత సంపాదిస్తూ బతికేస్తున్నాడు .పార్క్ బెంచీలమీద పడుకొంటూ ,చేతిలో ‘’గవ్వలు’’ఆడుతుంటే చిన్న మురికి గదిలో ఉంటూ వచ్చాడు .ఉచితంగా ఇచ్చే సూప్ కప్ కోసం బారులు తీరిన క్యూలో  గంటల  తరబడి నిలబడే వాడు .ఒక్కో సారి అదృష్టం కలిసొస్తే బ్రెడ్ తో హార్స్ సాసేజ్ దొరికేది .

   హిట్లర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు .ముఖం మృదువుగా గుండ్రంగా ఉండేది.రంగు పాస్టేగా ఉండేది .జుట్టు దువ్వ కుండా ,నుదుటిమీద పడుతూ ఉండేది .పొడుగాటి జుట్టు .21 కే గడ్డం మీసం మొలిచి క్రిస్టియన్ లలో ఒక విపరీతమైన వాడుగా కనిపించేవాడని స్నేహితులు చెప్పారు .అతనిపరిస్థితి  చూసి స్నేహితులు హిట్లర్ ను బాధిత పీడిత జన బాంధవుడు అనుకొన్నారు .కాని వారిని ద్వేషిం ఛి అసహ్యించుకొనే వాడని  పాపం వాళ్లకు తెలియదు .  ‘’వర్కర్లు మురికి తో రోతపుట్టిస్తారు .ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు .పొట్టకు కూడు   తాగుడు ,అమ్మాయిలూ తప్ప  వాళ్లకు ఇంకేమీ అక్కర్లేదు  .ఏ విషయం పైనా ఈ మూక  జనాలకు అవగాహన ,నిర్ణయాలు ఉండవు ‘’అని’’హిట్లర్ గురూజీ’’సూక్తులు పలికాడు  .కార్మిక సంస్థలలో హిట్లర్ సభ్యత్వం తీసుకోలేదు ,ఉద్యమాలలో చేరలేదు .’’పేదజనం నిరంతరంగా పెరిగే ప్రజల్ని భయపెట్టే బెదిరించే సైన్యం’’అన్నాడు .’’ఏ వ్యక్తీ అయినా తన గమ్యం చేరాడు అంటే దానికి అతని ఒరిజినాలిటి బ్రూటాలిటీ యే కారణం ‘’ అని గర్వంగా ప్రకటించాడు .

  హిట్లర్ కు ఒరిజినాలిటీ కంటే బ్రూటాలిటి పై మోజేక్కువ దాన్నే ఆయుధంగా చేసుకొని గద్దె నెక్కాడు. అధికారం చెలాయించాడు ,ప్రపంచాన్ని భయపెట్టాడు .సాధారణ అసంతృప్తి అంతా కలిసి లేబర్ ను ,లిబరల్స్ సాంఘిక ప్రజాస్వామ్య వాదులు  ముఖ్యంగా యూదులు  అంటే ద్వేషాన్ని ఆయనలో రెచ్చగొట్టి పాశవికంగా ప్రవర్తి౦ చేన్చేట్లు చేసింది .హిట్లర్ కున్న’’ యాంటి సెమిటిజం’’ ఆయనకు పగటి కల ఫాంటసి అయి ఆయన రక్తమా౦సాలలో జీర్ణమై ,అంతరాత్మకు చోదక శక్తియై కోప ద్వేష కారణమై నడిపించింది .సామాన్య జ్యూ ను ,నల్లజుట్టుతో ,పతనం చెందించే యువకుడిగా చిత్రించాడు .తన చరిత్ర మీన్ కాంఫ్ లో ‘’యూదులే నీగ్రోలను రీన్ లాండ్ కు తెల్లజాతిని జారత్వం లోకి దించటానికి తెచ్చినవారు.’’అని రాశాడు .ఇలాంటి యూదు జాతితో కలిసి ఉండలేక పోయాననుకొన్నాడు ..తానూ అత్యంత ఉన్నత జాతి వాడినని కాలరెగరేసి చెప్పుకొన్నాడు .అందుకే సమానత్వాన్ని బోధించే వాళ్ళందర్నీ ద్వేషించాడు హిట్లర్ .మార్క్స్ ను కొంత చదివాడుకనుక జ్యూలు అందరూ కమ్యూనిస్ట్ లే అనే పొరబాటు అభిప్రాయానికి వచ్చాడు .కనుక హిట్లర్ కున్న యాంటి సేమిటిజానికి మానవత్వ వాదులు అంతర్జాతీయ వాదులు ,సంస్కర్తలు ,మేధావులు  ,ప్రక్రుతి సిద్ధ తేడాలు సహజం అనే యాంటి సేమిటిజాన్నిప్రశ్నించేవారు అంటే ద్వేషం నర నరానా జీర్ణించుకు పోయింది .మేధావులు సమర్ధించే జ్యూలు కొన్ని జాతులు సర్వోత్క్రుస్త మైనవి అనే అభిప్రాయ౦ తో మానవ అస్తిత్వ మూలాలనే కూల్చేయాలనుకొనే వారి ని  అంగీకరించ లేదు.

అలాన్ బులాక్ రాసిన ‘’హిట్లర్ యే స్టడి ఇన్ టిరనీ ‘’పుస్తకం లో ‘’మీన్ కాంఫ్ అనే తన స్వీయ చరిత్రలో పేజీ లన్నిటి లోను పిచ్చివాడి ప్రపంచమే కనిపిస్తుంది .అందులో మనుషుల నీడలే కనిపిస్తాయి .జ్యూలు మనుషులే కాదు .తననొక పురాణ పురుషుడుగా అభి వర్ణించు కొన్నాడు .ఆయన  అవినీతికి మారు రూపం .ఈ కోణం నుంచే ప్రపంచాన్ని చూశాడు .కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపి౦చి నట్లు ఆయనకు ప్రపంచమంతా ద్వేషం కోపం అనుమానం భయంగ  మాత్రమే   కనిపించింది  . ప్రతి అన్యాయానికి  తనకు ఇష్టం లేని  ఆధునికతకు సంగీతానికి ఆర్ట్ కు  జ్యూలే కారణంగా కనిపించారు హిట్లర్ కు . పోర్నోగ్రఫీ కి వ్యభిచారానికి జాతి వ్యతిరేక ప్రెస్ విమర్శకు ,సోషలిజం పేరుతొ మాస్ జనాల పై ఒత్తిడికి ,చివరికి తన వైఫల్యాలకు యూదులే ముఖ్య కారణమనుకొన్నాడు .మూడవ నెపోలియన్ తనను ఆస్ట్రియా నుంచి సాగనంపి పాన్ జర్మన్ గా మార్చటానికీ వాళ్ళే కారణం అనేభ్రమ ఆయన్ను పీడించి ఆడించి ఓడించింది ‘’అని రాశాడు .బలహీన ప్రపంచ పౌరుడు ఒకఫెనటిక్ ,యాంటి సెమెటిక్ యోధుడిని చేసింది .

Inline image 1

   సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జులై 24 ఆంద్రభూమి మెరుపు పేజీ లో …..

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )

 తరువాతి సంవత్సరాలలో రాజకీయాలపై మాట్లాడి వివాదాలకు కేంద్రమయ్యాడు ఆయన సెక్సువల్ స్కాన్దల్స్ కు వచ్చిననత ప్రచారం దీనికీ వచ్చింది .ఫాసిజం ఓడిపోయి 1942లో రెండవ కూటమి ఏర్పడాలని చెప్పాడు .అప్పుడు హెన్రి వాలెస్ వామపక్షం లో ఉన్నాడు .రష్యాతో అవగాహనకు రావాలని సూచించాడు .చాప్లిన్ ను కమ్యూనిస్ట్ గానో లేక దాని సానుభూతి పరుడిగానో భావించారు .అసలే సుమారు ఇరవై ఏళ్ళనుంచి అమెరికాలో ఉంటూ డబ్బు మేటలు వేస్తూ ఉన్నా పౌరసత్వం తీసుకోకపోవటం ఈ అనుమానం మరీఎక్కువైంది .దీనికి ఆయన సమాధానం ‘’నేను అంతర్జాతీయ వాదిని,అన్ని దేశాలకూ చెందిన వాడిని .అందుకే నేను యే దేశం లోనూ పౌరసత్వం తీసుకోలేదు ‘’అన్నాడు .’’మాన్సూర్ వేర్దాక్స్ ‘’ప్రదర్శించినపుడు చిన్న ట్రాంప్ వేషం నుంచి బ్యాంక్ క్లెర్క్ వేషం లోకి మారి సుఖంగా బతకాలంటే తాను ధనం కూడబెట్టి ,దానితో కుటుంబాన్ని పోషించుకోవాలని భావించి సంపన్ను లైన ఆడవాళ్ళను పెళ్లి చేసుకొంటూ వాళ్ళను హత్య చేస్తూ జీవించే వాడి కధను చెప్పాడు .మొదట దీనికి ‘’లేడీ కిల్లర్ ‘’పేరు పెట్టాడు .ఈ సినిమాను బడా వ్యాపారస్తుల పై క్రూర పారబుల్ .ఇందులోని ముఖ్యపాత్ర ఆనాటి కాలం లోని భావాలను వెల్లడించిందని ,సంక్షోభం నుండి తనలాంటి వాళ్ళు పుట్టారని ,డిప్రెషన్ యొక్క మానసిక రుగ్మతకు అతడు ఒక ప్రత్యెక ఉదాహరణ అని చాప్లిన్ చెప్పాడు .విధానం, హత్య ,మార్బిడ్ గా ఉంది .దీని పరిష్కారం తర్క బద్ధ్యంగా కామిక్ గా ఉంది .’’ఈ సినిమా చాప్లిన్ సుదీర్ఘ వ్రుత్తి లో ఒక లాండ్ మార్క్ మాత్రమె కాక అమెరికన్ సినీ పరిశ్రమలో పెద్ద ముందడుగు అని జేమ్స్ ఆగీ అన్నాడు .దీనితో చాలామంది ఏకీభవించలేదు .సినిమా చాలా సింబాలిక్ గా ఉంది ,అర్ధం కావటం కస్ట౦  బాడ్ టేస్ట్ కు ఉదాహరణ అన్నారు .కేధలిక్ వార్ వెటరన్స్ పికెట్ చేశారు .చాలా సినిమాహాళ్ళు దీన్ని ప్రదర్శించటానికి నిరాకరించారు .కాని యూరప్ లో దీనికి అనేక అవార్డులు వచ్చాయి .ఆర్ధికంగా ఆయనకు పెద్ద బొక్క .ఇదే చాప్లిన్ జీవితం లో మొదటి ఫైల్యూర్ .ఇంకేముంది చాప్లిన్ పని ఖాళీ అన్నారు .

         ‘’ మోషన్ పిక్చర్ల వల్ల అభివృద్ధి చెందిన జీనియస్ ‘’అని బెర్నార్డ్ షా మెచ్చిన చాప్లిన్  నిరాశ పడకుండా మళ్ళీ శక్తిని ఉత్తేజాన్ని ని౦పుకొని కొత్త పాత్రలో ‘’లైం లైట్ ‘’లో 63 వ ఏట ప్రకాశించాడు.రచన నటన దర్శకత్వం తోపాటు బాలెట్ కూడా చేశాడు .’’ఈ పాత్ర ఒక రకంగా ఆయన జీవిత చరిత్ర .ఇందులో ఒక కమెడియన్ మూల జీవిత ఫిలాసఫీ  జీవితం ప్రేమ,ప్రేక్షకులు ,హాస్యం మొదలైన వాటిపై అభిప్రాయాలు, భావోద్విగ్న అనుభవాలు తో,ఐడియాలతో నిండిన సినిమా .’’అని’’ది సాటర్ డే రివ్యు ‘’రాసింది..’’ఇది మానవత్వం పై సినిమాటిక్ కవిత్వం ‘’అన్నాడు ఓటిస్ .ఎల్ గుర్నేసి –‘’న్యు యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ‘’లో .ఆయనే ‘’if it does not scan mathematically ,it touches the heart with dramatic images of longing’’అనీ చెప్పాడు .మిగిలినవారు అహంకారం తోచేసిన మాటల అల్లిక ,పాత పధ్ధతి ,పాత సెంటిమెంట్ లతో ముంచేశాడు అన్నారు .చాప్లిన్ అపజయాన్ని జయంగా మార్చి నిలబడ్డాడు పెద్ద హీరో లాగా

   అందరూ ప్రేమించే చాప్లిన్ కు ,ప్రజలుఅనుమానించిన చాప్లిన్ కు తేడా ఉంది  .నిర్బంధ సమాజం లో  వ్యక్తిత్వాన్ని బెదిరిస్తున్న శక్తులను ఇది వరకు బయట పెడితే, ఇప్పుడు సీరియస్ గా ఉన్న ఆలోచనా పరుడిగా కనిపించాడు .ఇప్పుడూ జనం ఆయన్ను అనుసరించారు ,మాట విన్నారు .’’my adversaries was suffering from delusion of intelligence ‘’అని చెప్పుకొన్నాడు .లైం లైట్  విడుదలయ్యాక కుటుంబం తో దూర దేశాల టూర్ కు వెళ్ళాడు .షిప్ యెక్క బోతుండగా అమెరికన్ అటార్నీ జనరల్ వచ్చి మళ్ళీ అమెరికాలో కాలుపెట్ట వద్దని ,ఆయన రాజకీయ నైతిక జీవితం పై నేర పరిశోధన జరుపుతున్నామని తెలియ జేశాడు .దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తింది .1953 ఏప్రిల్ 17 న స్విట్జర్లాండ్ నుంచి తానూ అయిష్టంగా నే తన నిజాయితీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న అమెరికా అధికారుల తీరుపై  ఏవ గింపు తో  అమెరికా నివాసాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు .రేడియో ద్వారా ప్రపంచమంతా ప్రసారమైన ఈ స్టేట్ మంట్ పై ఎల్మేర్ డేవిస్ వ్యాఖ్యానిస్తూ ‘’ ఇక్కడ నలభై ఏళ్ళకు పైగా నివసించిన నటుడు బాగా లబ్దిపొంది  ,ఈ దేశాన్ని వదిలేస్తానంటే మేము భయ పడాల్సిన అవసరం లేదు .అటార్నీ మెక్ గ్రానీ  చర్యను మరిచి పోవచ్చేమోకాని అమెరికాలో ఎదిగి ,ప్రఖ్యాతుడై అమెరికాకు పేరుప్రతిష్టలు నటనతో తెచ్చిన మహానటుడు చార్లీ చాప్లిన్ ను మాత్రం మర్చి పోలేము ‘’అన్నాడు .

తీర్పు ఎలా వచ్చినా చాప్లిన్ ఆ పేజీలలో ప్రత్యెక స్థానం పొందుతాడు .తన సృజన తో కొత్త మాధ్యమం లో ప్రజా సమస్యలను అందరి దృష్టికి తెచ్చిన గొప్పనటుడు దర్శకుడు చాప్లిన్ అన్నది నిర్వివాదం .రాజకీయ కారణం తోకూడా సేలిబ్రేటి అయ్యాడు చర్చిల్ ,రూజ్ వెల్ట్ ,హిట్లర్ లతో సమాన స్థాయి పొందాడు  .’’ది గ్రేట్ గాడ్ పాన్ ‘’లో రాబర్ట్ పెయిన్ ‘’ .Chaplin’s descent from the goat footed demi-god through Deburuau, Grimaldi and the great clowns of the past to his position as the greatest jester of his day –half God half man and always vagabond ,brother to St.Francis and the moon ‘’అని గొప్పగా విశ్లేషించి మెచ్చాడు .చాప్లిన్ చిరుతప్పుల్ని మర్చిపోతే ,సినీ తెర మీద ఆయన నీడ జీవం తో కదులుతూ ,మనకు విషయ ప్రచారం చేస్తూ ,మనకు తెలియని ఇంకా పుట్టని ఎన్నో ప్రేమ ,ఆశ  మానవత్వాల విషయాలను తవ్వి పోస్తూనే ఉంటాడు.

 చాప్లిన్ కోటబుల్ కోట్స్ చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి .కొన్ని చూద్దాం –life is a tragedy when seen in closeup  but a comedy in long shot ‘

2-A day without laughter is a day wasted ‘

3-we think too much and feel too little

In 1998, the film critic Andrew Sarris called Chaplin “arguably the single most important artist produced by the cinema, certainly its most extraordinary performer and probably still its most universal icon”.[414] He is described by the British Film Institute as “a towering figure in world culture”,[415] and was included in Time magazine’s list of the “100 Most Important People of the 20th Century” for the “laughter [he brought] to millions” and because he “more or less invented global recognizability and helped turn an industry into an art”.[416]

As a filmmaker, Chaplin is considered a pioneer and one of the most influential figures of the early twentieth century.[1] He is often credited as one of the medium’s first artists.[422] Film historian Mark Cousins has written that Chaplin “changed not only the imagery of cinema, but also its sociology and grammar” and claims that Chaplin was as important to the development of comedy as a genre as D.W. Griffith was to drama.[423]He was the first to popularise feature-length comedy and to slow down the pace of action, adding pathos and subtlety to it.[424][425] Although his work is mostly classified as slapstick, Chaplin’s drama A Woman of Paris (1923) was a major influence on Ernst Lubitsch‘s film The Marriage Circle (1924) and thus played a part in the development of “sophisticated comedy”.[426] According to David Robinson, Chaplin’s innovations were “rapidly assimilated to become part of the common practice of film craft.”[427] Filmmakers who cited Chaplin as an influence include Federico Fellini (who called Chaplin “a sort of Adam, from whom we are all descended”),[339] Jacques Tati (“Without him I would never have made a film”),[339] René Clair (“He inspired practically every filmmaker”),[338] Michael Powell,[428] Billy Wilder,[429] Vittorio De Sica,[430] and Richard Attenborough.[431] Russian filmmaker Andrei Tarkovsky praised Chaplin as “the only person to have gone down into cinematic history without any shadow of a doubt. The films he left behind can never grow old.”[432]

In the 21st century, several of Chaplin’s films are still regarded as classics and among the greatest ever made. The 2012 Sight & Sound poll, which compiles “top ten” ballots from film critics and directors to determine each group’s most acclaimed films, saw City Lights rank among the critics’ top 50, Modern Times inside the top 100, and The Great Dictatorand The Gold Rush placed in the top 250.[437] The top 100 films as voted on by directors included Modern Times at number 22, City Lights at number 30, and The Gold Rush at number 91.[438] Every one of Chaplin’s features received a vote.[439] In 2007, the American Film Institute named City Lights the 11th greatest American film of all time, while The Gold Rush and Modern Times again ranked in the top 100.[440] Books about Chaplin continue to be published regularly, and he is a popular subject for media scholars and film archivists.[441] Many of Chaplin’s film have had a DVD and Blu-Ray release.[44

చాప్లిన్ స్మృతి చిహ్నాలు ఎన్నో వెలిశాయి ఆయన పుట్టిన లండన్ లో ట్రాంప్ ఆకారపు విగ్రహాన్ని జాన్ డబుల్ డే శిల్పించాగా 1981 లో ఆవిష్కరించారు .ఒక వీధికి ‘’చార్లీ చాప్లిన్ వాక్ ‘’అని పెరేట్టారు .స్విట్జర్లాండ్ లోని ఆయన స్వగ్రుహాన్ని నేషనల్ మ్యూజియంగా మార్చారు .ప్లానెట్ 3623 కు చాప్లిన్ పేరుపెట్టారు .పారిస్ లో ఆయన పేర ఆఫీసుంది .జీవితం చివరి రోజుల్లో ఎన్నో అవార్డులు రివార్డ్ లు అందుకొన్నాడు .లండన్ లో న్యు యియర్ ఆనర్ నైట్ హుడ్ ఆనర్ ,ఆక్స్ ఫర్డ్ నుంచి డి.లిట్.,ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి లీజియన్ ఆనర్ ,వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ ఆనర్ ,జీవిత సాఫల్య పురస్కారం ,మూడు అకాడెమి అవార్డులు , బెస్ట్ స్కోర్ అవార్డ్  బెస్ట్ యాక్టర్ బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ పిక్చర్  బెస్ట్ డైరెక్షన్ లకు అవార్డులు ,కాక ఇంకా ఎన్నో పొందాడు ఆయన సినిమాలు ఆరింటిని –ది ఇమ్మిగ్రేషన్ ,ది కిడ్ ,సిటి  లైట్ ,గోల్డ్ రష్  మోడరన్ టైమ్స్ ,ది గ్రేట్ డిక్టేటర్ లను ,  , నేషనల్ ఫిలిం రిజిస్ట్రి ‘’లో భద్ర పరచారు .చాప్లిన్ డైరెక్ట్ చేసినవి 11 సినిమాలు .

Inline image 1  Inline image 3

Inline image 2
Inline image 4Inline image 5
Inline image 6  Inline image 7Inline image 8

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ .-23-7-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3

   మరొక విచిత్రమైన కేసులో ప్రతివాదిగా మారాడు చాప్లిన్ .జోన్ బెర్రీ అనే స్టేజి సహాయ నటి తన బిడ్డకు చాప్లిన్ తండ్రి అని కోర్టుకెక్కింది  .తర్వాత కొంతకాలాని చాప్లిన్ ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జర్మన్ డైరెక్టర్ మాక్స్ రీన్ హార్స్ట్ దగ్గరకు పంపాడని తెలిసింది .ఒక ఏడాదిలోనే ఆమె విపరీతమైన కోరికలకు విసిగి పోయాడు .ఆమె నెమ్మదిగా చాప్లిన్ ఇంట్లో ప్రవేశించి చంపేస్తానని  .ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరించింది .ఆమె దేశదిమ్మరితనానికి అరెస్ట్ అయింది .ఆమెకు పిల్లాడు పుట్టాక రక్త పరీక్షలలో ఆమె ఆరోపించినట్లు చాప్లిన్ కొడుకు కాదని రుజువైంది .కాని ఆమెతో ఆయనకున్న సాన్నిహిత్యం వలన కోర్టు ఆ పిల్లాడి పోషణ భారం చాప్లిన్ దేనని తీర్పు ఇచ్చింది .

  బారీ కేసు మధ్యలో ఉండగా చాప్లిన్ నాలుగో పెళ్లి అభిమానులను కలవర పరచింది  .నాలుగో పెళ్లి కూతురూ బాగా చిన్న పిల్లే.ఆమె ఎవరో కాదు ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ 18 ఏళ్ళ కూతురు .ఈ పెళ్లి ని తండ్రి ఒప్పుకోలేదు .పైగా తనకూ కూతురుకు సంబంధమే లేదు పొమ్మన్నాడు. అల్లుడు చాప్లిన్ మామ నీల్ వయసు వాడు .1943 లో జూన్ నాలుగున జరిగిన పెళ్లి నాటికి  చాప్లిన్ వయసు 54 ,కొత్త పెళ్లి కూతురు ఊనా వయసు కేవలం 18 ఏళ్ళు .ఆమెలో చాప్లిన్ మంచి జీవిత భాగస్వామిని చూడటమేకాక దాంపత్య సౌఖ్యాన్ని బాగా అనుభవించాడు .ఈ పెళ్లి తర్వత ఆయనపై స్కా౦డల్స్ ఆగిపోయాయి .ఇప్పటిదాకా పడిన అపనిందల సుడి గుండాల నుంచి బయట పడి సిటిజన్ షిప్ రాని లోటు దీనితో తీరి,సుఖమయ ఆనందమయ జీవితం గడుపుతున్నాడు .ఈ ఇద్దరికి ఒక కొడుకు యూరప్ లో ఉండగా పుట్టాడు .

   వివాదాలను శత్రువులను చాప్లిన్  సృష్టించు కొంటున్నాడు తన ప్రవర్తన, పనికి రాని ఎమోషన్ ,రాజకీయాలతో .పూర్వపు పనులన్నీ గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. లండన్ వీధుల్లో గూడు లేక కూడు లేక తిరిగిన రోజుల్ని మర్చిపోలేదు. 1922 తర్వాత ఈ అధోజగత్ సహోదరుల గురించి డాక్యు  మెంటరీలు తీశాడు .ఇందులో మొదటిది ‘’వుమెన్ ఆఫ్ పారిస్ ‘’ఇందులో తానుకనిపించడు కాని ఇతివృత్తం బలీయంగా దర్శనమిస్తుంది .’’ది గోల్డ్ రష్ ‘’ను స్వయంగా దర్శకత్వం వహించాడు .ఇది ఆయన మేగ్నం ఓపస్ అన్నారు .అందులో విషాదాన్ని హాస్యం తో జోడించాడు .ఈ కధను ఎందుకూ పనికిరాని ఒక క్లౌన్ తో అసంబధంగా  వ్యంగ్య భరితంగా సస్పెన్స్ తో చెప్పించాడు ..’’సిటి లైట్స్ ‘’అన్ని లెక్కల్నీ తారు మారు చేసింది  .మాట్లాడే సినిమాలు తీశాక మూడేళ్ళకు మళ్ళీ మూకీ లు తీసి అయిదుమిలియన్ డాలర్లు లాభం పొందాడు .మళ్ళీ సంప్రదాయాన్ని మార్చి హాస్యానికి ట్రాజేడి కలిపాడు .సిటీ లైట్స్ లో ఒక గుడ్డి పిల్ల ఒక తాగుబోతు ,డిప్రెషన్ తో ఉన్న మిలియనీర్ దగ్గరుండే ఒక సంచారిని ప్రేమిస్తుంది  .ఆమెకు చూపు తెప్పించటం కోసం అతడు ప్రయత్నించి సాధించి ఆమెకు చూపురాగానే ఆమెను కోల్పోతాడు .ముగింపు సందిగ్ధంగా ,తప్పనిసరిఅనిపిస్తుంది .తీవ్రమైన స్వీయ సానుభూతి ఎక్కడా తగ్గకుండా తర్వాత వచ్చే కామిక్ సీన్లు నిలబెట్టాయి .

      ఇప్పుడు చాప్లిన్ అనేక రకాల సృజన శీలి అయ్యాడు ..సీనరిస్ట్ ,డైరెక్టర్ ,నటుడూ గా ఉన్నాడు .సంగీత దర్శకుడూ అయ్యాడు .సిటి లైట్స్ తర్వాత వాటికి కదా సంగీతం ఆయనే కూర్చాడు .సీరియస్ విషయం డామినేట్ చేయకుండా ఆచార వ్యవహారాలపై వ్యంగ్య విమర్శలతో తీశాడు .మళ్ళీ ‘’మోడరన్ టైమ్స్ ‘’మూకీ తీశాడు ..ఇది పారిశ్రామిక వేత్తల మితి మీరిన వస్తు ఉత్పత్తి ,విపరీత చేస్టలపై గొప్ప సెటైర్ …ది గ్రేట్ డిక్టేటర్ ‘’లో హిట్లర్ వేషం ధరించి అతని ఆయుధ పిచ్చిని ,క్రౌర్యాన్ని ఎండగట్టాడు .జ్యూయిష్ బార్బర్ గా తానుతీసిన అన్నిసినిమాలకు భిన్నంగా మొదటి సారి నోరు విప్పి మాట్లాడాడు .కొందరు చాలా ఎక్కువగా వాగాడు అన్నారు .చివరికి వచ్చే మోనోలాగ్ ను తీవ్రంగా విమర్శించారు .క్లౌన్ క్లౌన్ గానే ఉండాలికాని ఈ హిత బోద ఏమిటి అన్నారు .దీనికి సమాధానం గాచాప్లిన్ ‘’I am a human being who wants to see this country a real democracy ,free from the infernal regimentation which is crawling over the rest of the world ‘’అని సమాధానం చెప్పి నోరు మూయించాడు .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు  .

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఎస్సానే లో ఉన్న ఏడాదే చాప్లిన్ ‘’the immortal and world famous –character of the tramp –the tragic ,comic vagabond so perfectly symbolizing the universal underdog –came into being –possibly the most significant artistic arch type of this century ‘’అనిపించాడు మ్యూచువల్ ఫిలిమ్స్ లో ఈ పాత్రను 12 సినిమాలలో పోషించి చిరంజీవి ని చేశాడు .కధను బట్టి తన పాత్రకు వివిధ కొణాలో న్యాయం చేసి మూకాభినయం తో అమరునిగా ఆ పాత్రను నిలిపాడు .1916 -17 యుద్ధం లో గాయపడ్డ లక్షలాది ప్రపంచ జనాలకు  ఈ పాత్ర ద్వారా ఆనందాన్ని పంచి తానూ విపరీతంగా అభిమానం పొందాడు .’ఫ్లోర్ వాకర్  ‘’,ది కౌంట్ ‘’,’’ది ఇమ్మిగ్రంట్ ‘’,ఈజీ స్ట్రీట్ ‘’సినిమాలు క్లాసిక్స్ ..ప్రింట్ లు బాగా లేక పోయినా ఇప్పటికీ చాప్లిన్ ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తూ నే ఉన్నారు .ఆయనంటే పడనీ వాళ్ళు మాత్రం ఆయన అమెరికాలో బాగా డబ్బు దండు కొన్నప్పటికీ ,అక్కడ పౌరుడుగా నమోదుకాలేదని  కనీసం పేరు రాయించుకొనే ప్రయత్నమూ చేయలేదని అంటారు .పని తప్పించుకొనే స్లాకర్ అని ఇంగ్లాండ్ వాళ్ళు అంటారు. ఆయన .ఇంకా బ్రిటిష్ పౌరసత్వాన్ని ఉంచుకొన్నాడు .అసలు విషయం ఆయన ఆర్మీ ఫిజికల్ రిక్వైర్ మెంట్ ను పాస్ కాలేక పోయాడు రెండు నెలల బాండ్ సెల్లింగ్ వినోదం ఆయన విమర్శకులను శాంత పరచ లేక పోయింది

   ఇదే సమయం లో ఫస్ట్ నేషనల్ తో మిలియన్ డాలర్లు  పది హేను వేల డాలర్ల బోనస్  కాంట్రాక్ట్ పై సంతకం  చేశాడు  చాప్లిన్  ఇప్పుడే తానే నిర్మాత ,తనదే స్వంత స్టూడియో లాభాలలో వాటా కూడా ..ఈ కాలం లో ‘’షోల్డర్ ఆర్మ్స్ ‘’ది కిడ్ ‘’వంటి అత్యంత ప్రముఖు సినిమాలతో సేలిబ్రేటి అయ్యాడు . ది కిడ్ లో’’ జాకీ కూగాన్’’ అనే కుర్రనటుడిని పరిచయం చేసి అతనితో అద్భుత నటన రాబట్టాడు .౩౦వ ఏడు వచ్చేదాకా చాప్లిన్ జీవితం ప్రశాంతంగా ,కుంభ కోణాలు లేనివాడుగా గడిచి పోయింది .దేనిపైనా సీరియస్ గా జోక్యం లేనివాడుగానే ఉన్నాడు .ఎడ్నాపర్వియన్స్ ను దేశస్థాయిలో నటిగా గుర్తింపు తెప్పించాడు .ఆమెను వివాహం చేసుకొంటాడని అందరూ అనుకొన్నారు .కాని మనవాడు  అందం ,డబ్బు ,కీర్తి  ఉన్నా బ్రహ్మ చారిగానే ఉండి పోయాడు .కానిపదహారేళ్ళ పడుచు ,నాటక సినీ నటి మిల్డ్రెడ్ హారిస్ పొగడ్తలకు ఆకర్షణకు లొంగిపోయాడు .అకస్మాత్తుగా 23-10-1918న ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .పిల్లపుట్టాక మూడు రోజులే కాపురం చేశారు .పడుచు పెళ్ళాంనుంచి దూరమై ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో ,డబ్బు వ్యవహారం లో పట్టుదలలు పోయి చివరికి విడాకులు పొందారు  .క్రమంగా ఎమోషనల్ గా అస్థిర చిత్తం తో ఉంటున్నాడు .అహంకారం పెరిగింది .తాను  సాధించిన దానికి ప్రత్యేక విలువలు కావాలని కోరుకోనేవాడు .ఆయన ప్రేక్షకులు ఎప్పుడూ ఆయన్ను నిరాశ పరచ లేదు .19 21 లో  పేపర్ వాళ్ళ ఊహాగానాలకుదూరంగానూ  తగ్గిన తన సృజనకు పదును పెట్టుకోవటానికి  యూరప్ వెళ్ళాడు .అక్కడ ఆయనకు ‘’తిరిగొచ్చిన హీరో ‘’గా అపూర్వ స్వాగతం పలికారు .

   చాప్లిన్ వింత స్వభావం చెదురుమదురు బాధ్యతా రాహిత్య పరంపరలు అన్నీ కలిసి ఆయన స్వీయ జీవితాన్ని కష్టాల పాలు చేశాయి . .యాభై లలో ఆయన శృంగారం వివాహ జీవితం అడ్డూ ఆపూ లేకుండా గడిచింది .1924 లో తరచుగా లీటా గ్రే అనే లోలితా మెక్ ముర్రే తో కనిపించేవాడు .ఈమెకూడా పాత పడుచు పెళ్ళాం లాగా 16 ఏళ్ళ కన్నె పిల్లే  .మళ్ళీ అకస్మాత్తు పెళ్లి 1924 లో ,అయి పొసగని సంసారమై చార్లెస్ స్పెన్సర్ జూనియర్ కు తండ్రి అయి మరుసటి ఏడాది రెండోకొడుకు సిడ్నీ ఎర్లె పుట్టాక పేపర్లు మళ్ళీ వీల్లిద్దరిమధ్య గొడవలున్నాయని గాసిప్పులు ప్రచారం చేశాయి .ఇదంతా అబద్ధం అని బుకాయించారు ఇద్దరూ .తర్వాత లీటాతనను భర్త లైంగికంగా వేధిస్తున్నాడని బజారున పడితే చాప్లిన్ అసలామె కుటుంబమే మంచిదికాదని తనను అమాయకంగా ముగ్గులో దింపారని తన నుంచి భారీగా డబ్బు రాబట్టుకోవ టానికి చేసిన కుట్రా ,ద్రోహమని  ఆరోపణ చేశాడు .42 పేజీల ఆరోపణ పత్రాన్ని ఆమె విడుదల చేస్తే వేలాది మంది డబ్బులిచ్చి కొనుక్కున్నారు .ఆర్టిస్ట్ ప్రైవేట్ జీవితాన్ని వీధిలోకి లాగ కూడదని ,దాన్ని నటన తో చ ముడి పెట్ట రాదనీ ఆక్రోశించాడు .ఆడవాళ్ళ క్లబ్బులు అన్నీ చాప్లిన్ కు వ్యతిరేకంగా మొహరించాయి .చివరికి అతని సినిమాలను కొన్నిటిని బాన్ చేశారు .ఈ ఒత్తిడిని చాప్లిన్ తట్టు కోలేక పోయాడు .భంగ పడిన చాప్లిన్ ఆమెతో ఆరు లక్షల డాలర్లకు ,ఇద్దరు పిల్లలపోషణకు  ట్రస్ట్ పేరిట రెండు లక్షల డాలర్లకు రాజీ కుదుర్చుకొన్నాడు .అటార్నీ ఫీజు కూడా కలుపుకొంటే ‘’ఈసున్నం’’  మొత్తం ఒక మిలియన్ డాలర్లకు దేకింది  …లీటాకు  మాంచి జాక్ పాట్ పాక్ట్ కుదిరి చాప్లిన్ జేబు కు పెద్ద బొక్క పడింది .ఈ పెళ్లి పెటాకులైన లీటా ఆ తర్వాత మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకొణి లాభ పడింది . .

ప్రపంచం తీరును ఇప్పుడిప్పుడే గమనిస్తున్నాడు చాప్లిన్ .బంగారు బాతు గా ఆయన్ను భావించి ఎవరో ఒక అమ్మాయితో సంబంధం ఉందని పుకారు పుట్టించటం ఆ రొంపి లోంచి బయట పడటానికి డబ్బుతో  పరిష్కరించు కోవటం పరి పాటై పోయి౦ది పాపం .పోలిష్ నటి పోలా నేగ్రి ,కలైర్ విండ్సర్ లతో జతకట్టాడని ఆరోపణ .క్లేర్ షెరిడాన్ అనే శిల్పిణి తో కలాపం సాగిస్తున్నాడనీ చాటింపు .పాలెట్టి గొడ్దార్డ్ తో అనుబంధం తో ఆయన కు ఊరట కలిగింది .ఎనిమిదేళ్ళు దీన్ని రహస్యంగా ఉంచాడు .ఇద్దరూ ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకొన్నారో అంతు చిక్కలేదు .తర్వాత ఇద్దరూ బహిరంగం గానే ఉన్నారు .1942 లో ఇద్దరూ విడిపోయాక ,విడాకులు పొందాక మాత్రమే వాళ్ళిద్దరి పెళ్లి  చైనాలోని కాంటన్ లో 1936 లో జరిగిందని వెల్లడించాడు .

Inline image 1Inline image 2Inline image 3

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్

  అనేక మంది నైతిక ప్రవర్తనను  అక్షేపించినవాడు , రాజకీయంగా వివాదాస్పదుడు ,ఉంటున్న దేశంనుండి బహిష్కరింప బడినవాడు ,చార్లీ చాప్లిన్ అని మనం పిలిచే చార్లెస్ చాప్లిన్ .విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టలు పొందిన ఏకైక నటుడు ముఖ్యంగా హాస్య నటుడు .నవ్వు, జాలి, కరుణ, అమాయకత్వం తో వెండి తెరను ఎకచ్చత్రాదిపత్యంగా యేలినవాడు .ఏది చేసినా ఏది చెప్పినా అత్యంత అతిశయోక్తిగా చెప్పాడు .చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమైన జనాలను నవ్వి౦ఛినట్లు యే ఇతర నటుడూ నవ్వించ లేదు అన్నది నిర్వివాదాంశం .అంతే కాదు ఆయన ఒక తరానికి చిహ్నమై భాసి౦చాడు .20 వ శతాబ్దిలో అందరివాడు గా అగ్రభాగాన ఉన్నాడు .మూకీచిత్రాల రాజాదిరాజు అయ్యాడు .ప్రేక్షక జనావళికి ఆరాధ్య దైవమయ్యాడు .ఆధునిక కాలం లో ఏకైక విశ్వ పౌరుడుగా గుర్తింపు పొందాడు మాక్స్ ఈస్ట్ మన్ అన్నట్లు ‘’In the history of Great Fame .,no chapter will be more astounding that in which this little modest actor of one role became in three short years known and loved by more men and more races ,and classes of men ,than an one ,even the great religious leaders ever had been before ‘’ అంతటి ప్రతిభా సంపన్నుడు ,ప్రభావ శీలి చాప్లిన్ .

16-4-1889 న లండన్ లో చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ పుట్టాడు .చాప్లిన్ అనేది పెట్టుకొన్న పేరు అంటారు తండ్రి సంగీత భవన గాయకుడు .తండ్రిపేరుకూడా చార్లెస్ చాప్లిన్ .ఫ్రెంచ్ జ్యూల కు చెందినవాడు తర్వాత ఆంగ్ల దేశీయుడైనాడు .తల్లి హన్నా కొంత ఐరిష్ కొంత స్పెయిన్ దేశాల రక్తం ఉన్నగాయకురాలు డాన్సర్ .పూర్వపు  భర్త వల్ల ముగ్గురు మగ పిల్లలను కన్నది .అందులో సిడ్నీ,చార్లీ కంటే నాలుగేళ్ళు  పెద్దవాడు .మారుటి తండ్రి పేరే పెట్టుకొన్నాడు  .చాప్లిన్ కుటుంబం ఎప్పుడూ ఆర్ధిక చిక్కుల్లో ఉండేది .తండ్రి పెద్ద తాగు బోతు.తల్లికి సంసారం ఏమై పోతుందో అనే దిగులు. ఈ ఇద్దరు పిల్లల్నిబజారులో పాడించి డబ్బు సంపాదించేవాడు తండ్రి  .అప్పటికి చార్లీకి మాట  ,ఆట ,నడక రాదు .అయినా తండ్రి చెప్పినట్లు చేసేవాడు .అయిదవ ఏట తల్లికి అకస్మాత్తుగా జబ్బు చేస్తే ఆమె  బదులు ప్రదర్శన ఇచ్చాడు  .ఆ లేత వయసులోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి ఆతను ఉంటే తప్ప చూడరు అన్న భావన కలిగించాడు .ఎడాది తర్వాత తలి దండ్రులు విడిపోయారు .తండ్రి తాగుడుతో చనిపోయాడు .బాధ దిగులు తల్లి స్టేజి వృత్తిని దెబ్బతీశాయి .ఏమాత్రం ఆర్ధిక స్తోమత లేక గత్యంతరం లేక ఆమె కొడుకు లిద్దర్ని చారిటి హోం లో చేర్చింది..ఆమె ఆరోగ్యం బాగయ్యాక పిల్లల్నిద్దర్ని తెచ్చుకొని కుట్టు పని చేస్తూ పోషించింది .7 వ ఏట చాప్లిన్ బాలల మ్యూజిక్ హాల్ లో నటిస్తూ కొంత సంపాదిస్తూ తల్లికి ఆసరా అయ్యాడు .తర్వాత హీర్న్ బాయ్స్ కాలేజ్ లో రెండేళ్ళు చదివించే ఒప్పందం కుదిరింది .ఇక్కడ చదివిన చదువే ఆయనకు మిగిలింది .మళ్ళీ యే స్కూలు గుమ్మమూ తొక్క లేక పోయాడు చాప్లిన్ .

 అన్న సిడ్నీసముద్రం పై ఉద్యోగం తమ్ముడు చాప్లిన్ స్కూల్ చదువులో ఉండగా తల్లికి మానసిక జబ్బు వచ్చింది .మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అయింది ఆకుటుంబ పరిస్తితి .తల్లిని మానసిక హాస్పిటల్ లో చేర్చారు .ఒంటరివాడైన చాప్లిన్ జీవితం వీధుల్లోనే గడిచింది .ఇతరులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ యేవో కొన్ని పెన్నీలు సంపాదించి బతుకుతున్నాడు .తర్వాత ఎప్పుడో ఈ అనాధ కోటికి పడగ లెత్తినా కూడా డబ్బుకోసం ఇబ్బంది పడ్డాడు .దరిద్రం అంటే భయ పడ్డాడు .హాలీ వుడ్ విలాసాలకు ఎప్పుడూ అర్రులు చాచలేదు .లండన్ లో వీధుల్లో పెన్నీ లేకుండా తిరిగిన రోజులు ఎప్పుడూ ఆయన మనసులోంచి పోలేదు గాఢ ముద్ర వేసి నిలిచే ఉన్నాయి .  

 సిడ్నీ కొంత డబ్బు సంపాదించి తిరిగి వచ్చాడు తమ్ముడు చాప్లిన్ ను వెదికి పట్టుకొని ఆ డబ్బుతో ఇద్దరూ కలిసి ఏదైనా చేసి తమ ప్రజ్న నిరూపించుకోవాలనుకొన్నాడు .ఒక ఏజెంట్ గా మారి పదేళ్ళ తమ్ముడు చాప్లిన్ కు లండన్ హిప్పోడ్రోంలో నటించే అవకాశం కల్పించాడు  కొన్నేళ్ళకే అందులో చాప్లిన్ గొప్ప నటుడుగా ఎదిగి పోయి ఇంగ్లాండ్ లో  బాలనటు లలో ప్రముఖుడనిపించుకొన్నాడు .తల్లిని హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి స్వస్థత హోం లో చేర్చారు కాని ఆమె పరిస్తితి ఏమీ మెరుగు పడలేదు .కొడుకుల్ని గుర్తించ లేని పరిస్తితిలో ఉంది .స్వరం మారి కౌమార దశకు చేరిన చాప్లిన్ ఇక తానూ బాల నటుడిగా కాక అనేక వినోద ప్రదర్శనలతో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని అనుకొన్నాడు ..మూకీ వినోద ప్రదర్శనగ్రూప్ ‘’ఫ్రెడ్ కార్నో కంపెని’’లో చేరి అన్నా తమ్ముళ్ళు  రాణించారు .

ఇంకా ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే చాప్లిన్ అత్యంత ప్రఖ్యాతిగల హాస్య నటుడుగా అమెరికా వెళ్ళాడు .తానో టూరింగ్ ట్రూప్ లో తాగుడు తో నవ్వించే వికట నటుడుగా అందర్నీ ఆకర్షించాడు .20 ఏళ్ళకే వారానికి 50 డాలర్లు సంపాదించేవాడు .ఇతని నటనా సామర్ధ్యానికి అబ్బుర పడి కీ స్టోన్ ఫిలిమ్స్  వాళ్ళు వారానికి 150డాలర్ల జీతం తో ఆహ్వానించారు  .కార్నో కంపెనీతో కాంట్రాక్ట్ పూర్తికాగానే చాప్లిన్ కాలి ఫోర్నియా చేరాడు .అతి వేగంగా అభి వృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమలో గొప్ప మార్పులు చోటు చేసుకొన్నాయి .మొదట్లో విజయాలు తర్వాతయూరో పియాన్ ల ఆధిపత్యం తో అమెరికన్ స్టుడియోలపై ప్రభావం చూపింది ..విడుదల తగ్గించేశారు .చిన్నసినిమాలు ఫీచర్ సినిమాలపై ద్రుష్టి పెట్టారు .సిసిల్ డిమిల్లీ ,సాన్  గోల్ద్విన్ జెస్సి లాస్కిమొదలైన వాళ్ళు ‘’స్క్వవుమన్ ‘’మొదలైన నాటకాలను సినిమాలుగా మార్చే ప్రయత్నం చేశారు .గ్రిఫ్ఫిత్ సెమి డాక్యుమెంటరి డ్రామా  ‘’ది బర్త్ ఆఫ్ యే నేషన్ ‘’ను తెరకెక్కించారు .కాని కామెడి పై ఇవేవీ ప్రభావం చూపలేక పోయాయి .ఒకటి రెండు రీళ్ళతో వారానికి ఒకటి తీయటం మొదలు పెట్టారు .మాక్ సేన్నేట్ అనే హాస్య నటుడు కీ స్టోన్ అధినేత గ్రిఫ్ఫిత్ నుండి మూవీ టెక్నిక్ ను నేర్చుకొన్నారు .పిచ్చపిచ్చగా ఇష్టం వచ్చి నట్లు అసంబద్ధంగా ,తలా తోకా లేకుండా తీసి పారేశాడు హాస్యం పేరుతొ అపహాస్యం సృష్టించాడు .సేన్నేట్ చాప్లిన్ లోని ఒరిజినాలిటి ని గుర్తించి ,అతనిలాగా నవ్వి౦చ గలవారేవ్వరూ లేరనే నిర్ణయానికి వచ్చాడు .

  చార్లీ చాప్లిన్ వేసుకొనే వికారపు డ్రెస్ కు ఒక ఫ్లాష్ బాక్ ఉంది .సాన్నేట్ చాప్లిన్ ను లొకేషన్ కు నవ్వు పుట్టించే డ్రెస్ వేసుకొని రమ్మన్నాడు .హడావిడిలో చేతికి ఏది అందుబాటులో ఉంటే దాన్నే ధరించి హడావిడిగా వెళ్ళాడు చాప్లిన్ .ఆ నాడు లావుగా ఉండే కమెడియన్ వేసుకొనే బాగీ పాంటు, మరో హాస్యగాడు వేసే కాళ్ళకు పెద్దసైజు ఉన్న బూట్లు ,   తలకంటే చిన్నదైన మాసిన డేర్బి, బక్కోడే అయినా బాగా బిగుతుగా ఉన్న కోటు ,,కొంకె లాంటి పేము కర్రా ,చిన్న టూత్ బ్రష్ మీసం తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .ఈ డ్రెస్ కోడ్  వేష ధారణ పై దియోదర్ హాఫ్ రాస్తూ ‘’personifies shabby gentility –the fallen aristocrat at grips with poverty .The cane is a symbol of attempted dignity ,the pert mustache  a sign of vanity ‘’అని విశ్లేషించాడు .ఆకర్షణీయ ,తరచుగా కనిపించే విషాద ఆకృతి ఇంకా రావాలి .మొదటి ఏడాదిలో నటించిన 35 సినిమాలలో ఆయన పాత్ర ఎందుకూ పనికి రాని అసమర్ధుడు ,జాలి లేని వాడు గా కనిపించినా గిలిగింతలు పెట్టె హాస్యం తో కడుపుబ్బా నవ్వించాడు .కేవలం 13 వారాల తర్వాత చాప్లి న్ నే స్వయంగా రచన చేసి ,దర్శకత్వం కూడా చేయమని కోరారు .కీ స్టోన్ కాంట్రాక్ట్ 12 నెలలు  హాయిగా గడిచి పోయింది .సంవత్సరం పూర్తికాగానే సేన్నేట్ వారానికి నాలుగు వందల డాలర్లు ఇస్తానని చెప్పాడు కాని పోటీ సంస్థ ఎస్సనే కంపెని వారానికి 1250డాలర్ల స్టైపెండ్ అంటే పది రెట్లు ఎక్కువ ఇస్తానని లాక్కు పోయింది .ఈ కంపెనీలో ఒక ఎదాదిపని చేయగానే చాప్లిన్ విలువ మళ్ళీ పది రెట్లు పెరిగింది .ఇప్పుడేమ్యూచువల్ కంపెని వారానికి పది వేల డాలర్లు ,సంవత్సరానికి లక్షా యాభై వేల డాలర్ల బోనస్ ఆఫర్ తో తీసుకొన్నది .అతికష్టం మీద చాప్లిన్ ను ఒప్పించి ఆయన లాస్ ఏంజెల్స్ లో మురికి కూపం ప్రదేశం లో మకామున్న  చిన్న హోటల్ నుంచి మంచి ప్రదేశానికి మార్పించింది .

Inline image 1  Inline image 2
Inline image 3

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్ర శేఖరయ్య గారి కవితా చంద్ర హారం

చంద్ర శేఖరయ్య గారి కవితా చంద్ర హారం

శ్రీ బి చంద్ర శేఖరయ్య గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నా చిరునామాకు తమ మినీ కవితా సంపుటి ‘’చంద్ర హారం ‘’పంపగా ఇవాళే చేరింది .వెంటనే చదివాను .అందులోని కొన్ని మచ్చు  తునకలను మీకు పరిచయం చేయాలనే ఈ ప్రయత్నం .

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనశ్రీ  చంద్ర శేఖరయ్య ప్రవృత్తి మాత్రం సాహితీ వ్యాసంగం .’’తెలుగు కళలకు వెలుగు సంతకం పలమనేరు రచయితల సంఘం ,తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి’’ లో ముఖ్య పాత్ర ధారి . గొప్ప కవి ,రచయితా లబ్ధ ప్రతిస్టులు .అయిన శ్రీ పలమనేరు బాలాజీ ఈ కవిని అభినందిస్తూ’’ సంఘం జీవితం ,వ్యక్తిత్వ వికాసం ,జనన మరణాలు సంస్కారం మానవ సంబంధాలు రైతు ,విద్యార్ధి, సాహిత్యం  మొదలైన సామాజిక అంశాలపై రాసిన ఈ కవితలతో కవితా లోకం లోకి తొలిఅడుగులు వేస్తున్నారని’’ ఆశీర్వ దించారు .’’అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా విధి నిర్వహిస్తున్న ఈకవి రచయితగా వెలుగు లోకి రావటం అభినందనీయం ‘’అన్నారు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు ,’’ఉపాధ్యాయ ‘’సంపాదకులు శ్రీ పి తులసీనాధం నాయుడు .ఈ కవితాసంపుటిని తమ తలిదండ్రులు స్వర్గీయ శ్రీమతి వీరమ్మ ,శ్రీ వి బసవయ్య గార్లకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు కవిగారు .ఒక రకంగా వారిద్దరికీ ఇది 163 రకాల స్వర్ణ పుష్ప ‘’కవితా చంద్ర హారమే ‘’.

‘’ ఆశించేది జీత౦  –అర్పించేది జీవితం ‘’అంటూ చక్కని తాత్వికతను ఒలకపోశారు .ఆఫీస్ ఉద్యోగాలపై కొరడా ఝలిపిస్తూ ‘’నిద్ర లేచి ఆఫీస్ కు వెడితే ఉదయం –మెలకువ వచ్చి ఇంటికి వెడితే సాయంత్రం ‘’అని వ్యంగ్య౦ గా అన్నారు .’’పుట్టినిల్లు జన్మ భూమి –మెట్టినిల్లు పుణ్య భూమి ‘’అంటూ అందరినీ ఉద్దేశించే చెప్పారు . దాంపత్యం  లో సరిగమలపై చెణుకుతూ’’’’పొద్దున్న పోరు రాత్రికి రాజీ – సమాంతర  రేఖలే జీవన సరళి ‘’అని ,’’వాటాలు కుదిరాయి –చర్చలు ఫలప్రదం ‘’అంటూ రాజకీయ బేర సారాలపై మరో చెణుకు విసిరారు .కరెంట్ కొత్త  కూడా హాయిని, ఉల్లాసాన్ని ఇస్తుందని చమత్కరిస్తూ ‘’పండు వెన్నెల పరిచయం –కరెంటు కోతకు ధాంక్స్ ‘’అంటారు .హీరో వర్షిప్ పై మరో వ్యంగ్యం –‘’ఇంటి నిండా నాయకుల ఫోటోలు –అమ్మా నాన్నలవి ?ఆల్బం లో వెతకాలి ‘’.మంచి పుస్తకం పై మంచి కవిత –‘’వెతకటానికి- గంటలు –చదవటానికి నిమిషాలు ‘’.సామాజిక బాధ్యతా గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికే –‘’సమాజం నీకు రుణపడితే ప్రమోదం –సమాజానికి నీవు రుణ పడితే ప్రమాదం ‘’.మనిషికి స్నానం ఉల్లాసాన్నిస్తే జ్ఞానం ఉత్త్తేజాన్నిస్తుందని మంచి బోధ .

ఎంత విజయం సాధించినా మూలాలు మరచి పోవద్దని చెబుతూ –‘’విజయం వెనుక కృషి –చెట్టుకింది వేరు ‘’అన్నారు .అన్యోన్య  దాంపత్యం  పై మరో చురక –‘’బయట కాంబినేషన్ –ఇంట్లో డామినేషన్ –అన్యోన్యత ‘’.సెల్ ఫోన్ సత్య హరిశ్చంద్రుని బద్ధ శత్రువు గా కనిపించింది కవి హృదయానికి .పెళ్లి మీద మరో వ్యంగ్యాస్త్రమే –‘’స్వేచ్చగా ఎగిరే రెండు పక్షుల్ని –ఒకటిగా కట్టి పడేసే –పెళ్లి ‘’.ఆక్సిజన్ లాంటి అవకాశాన్ని వెతుక్కొని అభాండం లాంటి కలుషితం నుండి తప్పుకోవాలని హితవు .’’క్రాంతికి బులెట్ –శాంతికి బ్యాలెట్ ‘’అని శాంతి కరువైతే బులెట్ వాడకం తప్పదనే భావన చేశారు .’’చిత్త శుద్ది లక్ష్య సిద్ధికి రాచబాట ‘’అంటూ ,నాడు క్విట్ ఇండియా ఉద్యమం నేడు వెల్కం ఇండియా స్వాగతం అంటారు .మాటలు పటిక  బెల్లం అని చేతలు పక్కలో బల్లెం అని నేటి కుహనా రాజకీయ వేత్తల ప్రవర్తనపై చీదరింపు .కళ పై వ్యాఖ్యానిస్తూ ‘’ఆవిర్భ విస్తే కళకళ –అనుకరిస్తే వెల వెల ‘’అని అనుకరణ అభ్యాసం వరకే కాని ఎప్పుడూ కాదని సృజనే  యే కళకైనా పరమార్ధమని కళా మర్మజ్నునిలా బోధించారు .పర్యావరణ స్పృహ బాగా ఉన్న ఈ కవి –‘’పెంపొందిస్తే రక్షిస్తుంది –నశింప జేస్తే శిక్షిస్తుంది ‘’అని పౌర ధర్నాన్ని తెలియ జేశారు .నిజాన్ని గురించి చెబుతూ –‘’గొడ్డలిలా వేరు చేయ వద్దు –సూదిలా దగ్గరకు చేర్చు ‘’అని కలిసి ఉంటె కలదు సుఖం అని హిత బోధ చేశారు .’’తరువును పరి రక్షిస్తే కరువు పారి పోతుంది ‘’అని సూక్ష్మ౦గా చెప్పారు. వన సంరక్షణ  అత్యంత  అవసరమని తెలియ జేస్తూ .నీటిని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అనేది మరో హెచ్చరిక .పుస్తకానికి విలువ ఇస్తే విజ్ఞానం విస్మరిస్తే అజ్ఞానం పెరుగుతుందని ధర్మ సూక్ష్మం చెప్పారు .

నేటి సంసారాలలో వికృతి ఎలా ఉందొ చెప్పే కవిత –‘’అయ్య గారింట్లో అగ్ని ప్రమాదం –అల్లుడు ,కోడలు మృతి –కొడుకు ,కూతురు క్షేమం ‘’ఇంటికి వచ్చిన కోడలు అల్లుడూ మసి అయ్యారని ,ఇంటివారైన కొడుకు కూతురు క్షుషీ అని  అర్ధం ‘’మోసానికి శ్వాస –దురాశ ‘’గొప్ప కవిత అల్పాక్షరాల్లో అనంతమైన వివరణ .వివక్షతపై స్పందిస్తూ –కుండ మైల పడితే విసిరి కొట్టటం  అదే బిందె అయితే కడిగి దాచుకోవటమే వివక్షత  అంటారు కవి .ఆడపిల్ల అవనికే చేటు అని భావించి భ్రూణ హత్యలు చేయిస్తున్న సమాజం పై –‘’గర్భస్థ శిశువు మగ  అయితే అండం –ఆడ అయితే పిండం ‘’అని బహు చక్కగా చెప్పారు .వ్యాపారికి అతి వృష్టి అనా వ్రుస్టీ అన్నీ సీజనే అంటారు .నేలా నీరు అగ్నీ అన్నీ కొంటున్నాం ఇక గాలి మాత్రమే మిగిలింది ‘అయినా ఫాన్లతో ,ఎ.సి.లతో దాన్నీ కొంటూనే ఉన్నామన్న సంగతి కవి మర్చి పోయి ఉంటారు .’’మృత్యువు మనిషిని స్ప్రుశిస్తే –అవయవ దానం తో మనసు మరణాన్ని జయించింది ‘’అని మరణానంతర జీవితాన్ని గొప్పగా చెప్పారు .నేటి మనిషి అల్పత్వాన్ని తెలియ జేస్తూ –‘’నాకు నేనే నచ్చను-నిన్నెలా మెచ్చుకొంటాను ?’’అన్నారు .కృతజ్ఞత చూపిస్తే ‘’మనిషి ‘’అవుతాడని కృతఘ్నత చూపితే ‘’మహిషి ‘’అవుతాడని సత్యం ఆవిష్కరించారు .ముష్టి వాడిని చీదరించుకొని అన్నదానానికి విరాళాలిచ్చే ప్రబుద్ధుల గురించిచెప్పారు .చదువు చెప్పి పరీక్షిస్తే ‘’గురువు ‘’అని  ,పరీక్ష పెట్టి గుణ పాఠం నేర్పితే ‘’ప్రభువు ‘’ అని గురు బోధ చేశారు .పుట్టిన బిడ్డ కూడా మనకు కర్తవ్య బోధ చేస్తుందట –‘’పుట్టిన బిడ్డ నేర్పుతోంది –పిడికిలి బిగించి కదలమని ‘’అని పిడికిలి బిగించి పుట్టిన శిశువు మనకు హిత బోధ చేస్తుందని చెప్పటం కవి నిశిత పరిశీలనకు దృష్టాంతం .మరో తాత్విక కవిత –‘’అమ్మ ఋణం తీర్చుకోవటమంటే –ఆకాశాన్ని మడిచి జేబులో పెట్టు కోవటమే ‘’చివరి కవిత మానవత్వ పరిమళ వ్యాప్తి కలిగించింది –‘’కొట్లలో వెదికినా –వేలల్లో కూడా మిగలటం లేదు –మానవత్వం ‘’అని వాపోయిన మానవతా హృదయం కవిగారిది .

శ్రీ చంద్ర శేఖరయ్య గారికి మంచి భావుకత ఉంది .మానసు లోని భావాలను తగిన మాటలతో చెప్పగల కవితా శక్తి ఉంది .చక్కని పదబంధం తో చెప్పగల నేర్పు ఉంది .ఈ చంద్ర హారం కవి గారి కవితా సామర్ధ్యానికి పుష్ప హారం .మరిన్ని కవితలు రాసి లబ్ధ ప్రతిస్టితులు కావాలని ఆకాంక్షిస్తున్నాను .వీరికి ఈ మధ్యనే మనం ఆవిష్కరించుకొన్న ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలాన్ని బుక్ పోస్ట్ లో పంపిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1 of 17,890 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216 80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216

80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

1936 లో ఓ నీల్ కు వచ్చిన నోబెల్ బహుమతి  ఫిలిస్టైన్ లకు చెంప పెట్టు,ఆధునిక అమెరికన్  నాటక రచయిత ఓ నీల్ కు కు గొప్ప ప్రశంస .ఆరేళ్ళక్రితం సింక్లైర్ లెవిస్ ఇచ్చిన వివరణ గుర్తుకొచ్చి నీల్ కూడా ‘’ఈ అత్యున్నత పురస్కారం నాకు మాత్రమె కాదు అమెరికాలోని నా సహచరుల౦దరిదీ .ఈ నోబెల్ బహుమతి రాబోయే అమెరికా దియేటర్ కు చిహ్నం .నా నాటకాలకు రావటం అదృష్టం కాలమూ కలిసి రావటం .మొదటి ప్రపంచ యుద్ధానంతరంనాటకాలురాసిన అమెరికన్ మిత్ర రచయితలందరి పాత్ర ఇందులో ఉంది ‘’అని చాలా నిగర్వంగా ప్రకటించాడు .నీల్ చాలా వినయంగా ఈమాటలు అన్నప్పటికీ అప్పటికి ప్రపంచం మొత్తం మీద షేక్స్ పియర్ బెర్నార్డ్ షా ల తర్వాత ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవాడు ఓనీల్ మాత్రమే ..వారిద్దరి నాటకాల తర్వాతఇంగ్లీష్ నాటకాలలో  జనం అమితంగా చదివింది నీల్ నాటకాలనే .

అకస్మాత్తుగా నీల్ అదృష్టకాలం  రచనా శక్తి దెబ్బతిన్నాయి .శారీరకంగా సృజనాత్మకం గా తగ్గిపోయాడు .ఆయన పని ‘’ఆకాశంబున నుండి పాతాళం ‘’లోకి పడిపోయింది  .’’డేస్ వితౌట్ ఎండ్ ‘’తో బాగా ఇబ్బంది పడ్డాడు  .12 ఏళ్ళ తర్వాత ‘’ది ఐస్ మాన్ కమేత్ ‘’కూడా ఫైల్యూర్ అయింది .1946 లోమళ్ళీదియేటర్ కు వచ్చాడు .’’యే మూన్ ఫర్ ది మిషె గాటన్’’కూడా దెబ్బ తిన్నది .అప్పటికే ఒక మిలియన్ డాలర్లు సంపాదించిన నాటక రచయితనీల్ 50 వ ఏట జబ్బు పడి సంతోషం కోల్పోయాడు . కుటుంబ జీవితం ముక్కలైంది .కూతురు ఊనా హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ను పెళ్లి చేసుకోవటం క్షమించ లేక పోయాడు. చిన్న కొడుకు షేన్ మత్తుమందుకు బానిసై ఆస్పత్రి పాలైనాడు .టీచర్ ,గ్రీక్ స్కాలర్ అయిన పెద్దకొడుకు1950 లో  ఆత్మ హత్య చేసుకొన్నాడు ..నీల్ వీటన్నిటి వలన మరింత ఆరోగ్యం కోల్పోయి చిక్కి శల్యావశిస్టమైనాడు .బతికి ఉన్న ఆస్థి పంజరమా అనిపించాడు .కళ్ళు నల్లబడి గుంతల్లా ఉన్నాయి .ఎముకల పోగుకు చర్మం  అంటింఛినట్లున్నాడు .56 వ ఏట కండరాల జబ్బు కూడా వచ్చి రాయటం అసాద్యమై పోయింది .తర్వాత చేతితో కలం పట్టుకోలేక పోయాడు .ఆస్పత్రి వైద్యం కూడా ఫలించలేదు .క్రమంగా శారీరక కార్యక్రమాలు బలహీన  పడ్డాయి .పార్కిన్సన్ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు .ఆయన వ్యాధిని ‘’ప్రి సేనైల్ ఆర్టీరియల్ స్క్లేరో టిక్ కండిషన్ ‘’గా నిర్ణయించారు .ఆయన రాత అతి చిన్నక్షరాలుగా ఉండేది .ఇప్పుడు చెప్పి రాయిద్దామని ప్రయత్నించాడు.కాని ఇక తనకు సృజన శక్తి కరువైపోయిందని గ్రహించాడు .ఇరవై  ఏళ్ళ క్రితం రాయటం ప్రారంభించిన  చక్రీయ నాటకాలనన్నిటిని  తగల బెట్టించాడు .స్వీయ చరిత్ర లాంటి ‘’లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్ ‘’మాత్రం ఉంచాడు .దీన్ని తానూ మరణించిన 25 ఏళ్ళ తర్వాత మాత్రమే ప్రచురించ బడాలి అని కోరుకొన్నాడు .పాపం ఆయన ,ఆయన వ్యాధికి బందీ అయిపోయి పదేళ్ళు అలాగే బతికాడు .పూర్తిగా శక్తి హీనుడైపోయాడు .దీనికి తోడు బ్రాంకియల్ న్యుమోనియా వచ్చి ఆధునిక అమెరికన్ నాటక మార్గ దర్శి యూజీన్ ఓ నీల్ 65  వ ఏట  27-11 -1953 న మరణించాడు .

‘’టైం మాగజైన్ ‘’నీల్ గురించి రాస్తూ ‘’ఓ నీల్ కు ముందు అమెరికాలో దియేటర్ మాత్రమే ఉంది .ఓ నీల్ వచ్చాక అందులో నాటకం వచ్చింది ‘’అన్నది .గ్రీక్ ట్రాజెడీ అంతా విధికి తలొగ్గిన ట్రాజేడి.అదృష్టం అంతా నక్షత్ర ప్రభావం .షేక్స్పియర్ ట్రాజేడి పాత్రల ట్రాజేడి .మానవుని అదృష్టం అతని మనసుని బట్టి ఉంటుంది .బాధా చావుల వలన గ్రీకుల షేక్స్ పియరన్ ట్రాజేడిలలో ట్రాజేడి హీరోలు దేవతలను సంతృప్తి పరచి ముక్తి పొందారు .కాని ఓ నీల్ ప్రేక్షకులు మాత్రం దేవుడు ,మనసు ,విదిలపై అనుమానం ఉన్నవారు .నీల్ రాసినదంతా పర్సనల్ సైకాలజీ .మనిషి అదృష్టం జీన్స్ లో హార్మోన్స్ లో ఉంటాయని చెప్పాడు .ఆయన నాటకం ‘ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో ట్రాజిక్ హీరో ‘’మనిషి ముక్కలు ముక్కలై  జన్మిస్తాడు .దాన్నిఅతికించి  బాగుచేస్తూ జీవిస్తాడు .దేవుని దయ ఒక జిగురు మాత్రమే ‘’అంటాడు .’’మార్నింగ్ బికం ఎలెక్ట్రా ‘’నాటకం లో గ్రీక్ లెజెండ్ క్లైమాక్స్ ను సంప్రదాయ కేదార్సిస్ ను  చుట్టేసి ముఖ్య పాత్ర చేత ‘’నన్ను శిక్షించటానికి ఎవరూ మిగల్లేదు  నన్ను నేనే శిక్షించు కొంటాను ‘’‘’అని అరిపిస్తాడు  .

ఓ నీల్ నాటకాలు అపజయం పొంద టానికి అధిక ప్రయోజనమే తప్ప ,ఆయన మేధో దారిద్ర్యం మాత్రం కాదు .ఉన్నత శిఖరం నుంచి అప్పుడప్పుడు ఆయన జారిపోవటానికి కారణం అవి జనానికి అందుబాటులో లేవు అనే అభియోగాన్ని ఆయన త్రోసి పుచ్చాడు .కాని కారణం ఆయన ఆ ఉన్నత శిఖరం మీదనే ఉండిచనిపోవాలను కొన్నాడేకాని అందరూ ఎప్పుడూ ఎంతకాల౦  నడిచిన రోడ్డుమీదకు వచ్చిమాత్రం కాదు .’’పాతా దేవుడి మరణం ‘’సైన్స్ ,భౌతికత  ల అపజయం ఆయన్ను కలత పెట్టాయి .నీల్ పాత్రలపై జాన్ మేసన్ ‘’Neil’s characters were not merely in conflict with one another .They were with war with the agents were not indifferent to them .This link between mortals and forces shaping their lives was the mighty concern which gave a kind of majesty to the feeblest of his plays ‘’అని రాశాడు .’’నాటక సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో ఇంకా తేలలేదు కాని ఆయన రెచ్చగొట్టే ఆవిష్కర్త, (ప్రోవోకేటివ్ ఇన్వెంటర్).పాత సంప్రదాయాలను విచ్చిన్నం చేసినవాడు ,నవీన సంప్రదాయ నిర్మాత .కాని నేటికాలం లోఆయన చిన్న నాటకాలను మాత్రమె ఎవరో కొందరు ఎక్కడో అక్కడ ఆడుతూనే ఉన్నారు .షేక్స్ పియర్ ,షాల నాటకాలులాగా నీల్ పెద్ద నాటక ప్రదర్శనలు ఎక్కడా లేవు .ఆయన నాటక నైపుణ్యం ,స్థాయి ,ప్లాట్ ల స్పూర్తి ,పాత్రల ప్రామాణ్యత, విశ్వసనీయత లపై ఇంకా చాలా చర్చ జరగాలి .కాని ఆయన ప్రభావ ప్రాధాన్యత మాత్రం ప్రశ్నింప రానిది  ‘’అంటాడు రచయితా లూయీ అంటర్ మేయర్ .

20 వ శతాబ్ది అమెరికన్ నాటకాలలో నీల్ రాసిన ‘’లాంగ్ డే స్ జర్నీ  ఇంటూ నైట్ ‘’అత్యంత విలువైన నాటకమని పేరు పొందింది .అమెరికా ప్రాంతీయ భాషను నాటకాలలో వాడిన మొదటి నాటక కర్తనీల్ .ఆయన పాత్రలు ఎదురు తిరుగుతాయి పోట్లాడుతాయి కాని చివరికి నిరాశ నిస్పృహలతో ప్రక్కు తప్పుకొంటాయి .ఆఫ్రికన్ అమెరికన్ నటులపై నీల్ ప్రభావం అత్యధికం .పాల్ రిలే రోబ్ సన్ బాగా ప్రేరణ పొందాడు .వారెన్ బీట్టీ తీసిన ‘’రెడ్ ‘’సినిమాలో నీల్ పాత్రను జాక్నికల్సన్ పోషించాడు .కనెక్టికట్ లో నీల్ దియేటర్ ఏర్పాటు చేశారు .ఆయన న్యు ఇంగ్లాండ్ లో నివసించిన ఇల్లు జాతీయ చారిత్రిక ప్రదేశంగా గుర్తింప బడింది .ఆయన పేరుమీద చాలాకాలేజీలు సంస్థలు ఏర్పడ్డాయి .నీల్ 32 పెద్దనాటకాలను ,21 ఎకా౦కికలను తో  పాటు కొన్ని ఇతర రచనలూ చేశాడు .

O’Neill’s tragic view of life was perpetuated in his relationships with the three women he married—two of whom he divorced—and with his three children. His elder son, Eugene O’Neill, Jr. (by his first wife, Kathleen Jenkins), committed suicide at 40, while his younger son, Shane (by his second wife, Agnes Boulton), drifted into a life of emotional instability. His daughter, Oona (also by Agnes Boulton), was cut out of his life when, at 18, she infuriated him by marrying Charlie Chaplin, who was O’Neill’s age.

 

నీల్ ను అమెరికన్లు బాగానే ఆరాధించారు అంతకంటే ఎక్కువగా స్వీడన్లు ఆరాధించారు .కారణం ఆయన్ను ప్రేరేపించినవాడు స్వీడన్ నాటక కర్త ఆగస్ట్ స్త్రిండ్ బెర్గ్ అవటం కూడా ఒక కారణం .ఆయన విషాద కధలు నీల్ నాకాలలో ప్రతిధ్వనిస్తాయి .అమెరికా రంగ స్థలాన్ని ఒక సాహిత్య క్షేత్రంగా గుర్తించి నాటక రచన చేసిన మొదటి అమెరికన్ నాటక కర్త ఓ నీల్ .సాహిత్యం లో నాటకానికి అమెరికా లో నోబెల్ పొందిన మొదటి వాడు కూడా నీల్ ఒక్కడే .1920 లో అమెరికన్ దియేటర్ సాంస్కృతికంగా ప్రాచుర్యం పొందటానికి నీల్ ఒక ముఖ్య కారకుడు

 

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -215 80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -215

80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -2

28 ఏళ్ళ వయసులో నీల్ చేతినిండా స్క్రిప్ట్ లే .ప్రావిన్స్ టౌన్ కు వెళ్లి తన మొదటినాటక ప్రదర్శన’’బౌండ్ ఈస్ట్ ఫర్ కార్డిఫ్ ‘’ చూసుకొన్నాడు .వేర్ఫ్ దియేటర్ దీన్ని ప్రదర్శించింది బ్రహ్మాండమైన విజయం లభించింది .ఈ దియేటర్ తర్వాత న్యూయార్క్ గ్రీన్ విచ్ విలేజ్ కి మారి ప్రావిన్స్ టౌన్ ప్లేయర్స్ గా ప్రసిద్ధ మైంది .1917 నుండి 20 దాకా మూడేళ్ళు నీల్ రాసిన పది  ఏకాంకికలను ప్రదర్శించింది .అవే ‘’ఐల్ ‘’,ది మూన్ ఆఫ్ ది కర్రబీస్ ‘’,’’ది లాంగ్ వాయెజ్ హోం ‘’.ఈ మూడిటిని ‘’ది స్మార్ట్ సెట్ ‘’గా ముద్రించాడు .తరువాత పూర్తీ నిడివిగల నాటకం ‘’బియాండ్ ది హోరైజన్స్ ‘’19 20 లో ప్రదర్శించారు .అధిక ప్రేక్షకాదరణతో ఇది వంద కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు .దీనికి మొదటిసారిగా పులిట్జర్ బహుమతి పొందాడు .దీనికి ముందటి నాటకాలు మోటుగా ఉన్నా అవి ‘’టైలర్ మేడ్ వినోదాలు అనిపించుకోలేదు .సామర్ధ్యంగా రాసినవే .అవి ఆకర్షణీయంగా లేకపోయినా ,సుఖాన్ని కలిగించక పోయినా చీకటిలో  ,హింసాత్మక ,వికార అందాన్ని ప్రదర్శించాయి .ఒక్కో సారి హీనంగా మరో సారి భయంకరంగా ఉన్నా అప్రధానంగా మాత్రం లేవు .ప్రపంచ బాధ ,అందులోని చెడు ను చూసి కుంగి పోలేదు .అతని హీరోలు ‘’నిస్సహాయులు ,విషాద వదనులు .’’అన్నా క్రిస్టీ ‘’కి రెండో సారి1922 లో  పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .’’స్ట్రెంజ్ఇంటర్ లూడ్ ‘’నాటకం బహుళ ప్రజాదరణ పొంది దేశవ్యాప్తంగా నీల్ కీర్తి వ్యాపించి మూడో పులిట్జర్ పొందింది .రెండేళ్ళ తర్వాత అమెరికన్ రచయిత సింక్లైర్ లెవిస్ నోబుల్ బహుమతిని స్వీకరిస్తూ హుందాగా’’ ఈ ప్రైజ్ యూజేన్ ఓ నీల్ కు ఇచ్చిఉంటే చాలా గొప్పగా ఉండేది ..సమాజం లోని వికృతిని భయంకరంగా నేల బద్దలయేట్లు అగ్ని వర్షం కురిపించినట్లు ,తన నాటకాలను దాదాపుగా పది ఏళ్ళ నుంచి రాస్తూ కొత్త లోకాలను చూపిస్తున్నాడు’’అని మెచ్చుకొన్నాడు .విధ్వంసకర అగ్ని అనిపించాడు నీల్ .

నాటక రంగ సంప్రదాయాలనన్నిటిని తుంగలో తొక్కాడు .’’ది ఎ౦పరర్ జోన్స్ ‘’సుదీర్ఘ స్పీచ్ లకు స్వస్తి పలికింది .మోనోలాగ్ లతో రక్తి కట్టించాడు .పాతకాలపు ఫాంటసి నుంచి ఆధునిక వాస్తవికత కు నాటకాన్ని మార్చాడు .’’ది హేయిరీ ఏప్ ‘’లో ఫాంటసిని భావ వ్యక్తీకరణ వాద సిమ్బాలిజంగా మార్చాడు .’’ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో మాస్క్ లను ప్రవేశ పెట్టాడు .ఒరాస్ పాటల శబ్దాలతో ‘’లాజరస్ లాఫ్ద్ ‘’ను తీర్చి దిద్దాడు .పూర్వ గ్రీకు ట్రాజెడిలను ఆధునిక విధానాలతో శోభ కూర్చాడు .ఆయన నాటకాల లాగానే ఆయన జీవితమూ మారింది .అనేక మూడ్స్ లో అనేక ప్రదేశాలలో ఉన్నాడు .ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేక పోయాడు.న్యు ఇంగ్లాండ్ ,బెర్మూడా ,ఫ్రాన్స్ ,సీ ఐలాండ్స్ ,టావో హౌస్ ,సాన్ ఫ్రాన్సిస్కో ,న్యూయార్క్, కేప్ కాడ్ లన్నీ తిరిగాడు మొదటి పెళ్లి  మూడేళ్లకే పెటాకులైతే 30 వ ఏట యాగ్నెస్  బోల్టన్ ను పెళ్ళాడి ఒక కొడుకు షేన్ ను కూతురు ఊనా కు తండ్రి అయ్యాడు .1929 లో విడాకు లిచ్చి 42 వ ఏట అందమైన నటి కార్లోటా  మాంటరి ని పెళ్లి చేసుకొని తోమ్మిదినాటకాల శ్రు౦ఖలానికి నాంది పలికాడు .1775 నుంచి 1932 వరకు అమెరికా కుటుంబం పొందిన ఉద్దాన పతనాలను వీటిలో గొప్పగా చూపించాడు .ఆరోగ్యం పూర్తిగా లభించి జుట్టుకొంచెం తెల్లబడి చలన పూర్వక పెదవులతో ,తీవ్ర ఆలోచన ఉన్న కనులతో ,ఎముకలు పొడుచుకు వచ్చే  దవడలతో అనేక ప్రశ్నల సమాహారంగా కనిపించేవాడు .

45 లో అభిమానులను ఆశ్చర్య పోయేట్లు ‘’ఆ వైల్డర్ నెస్ ‘’అనే సెంటిమెంటల్ కామెడి తో చేశాడు .భౌతిక సంపద మొహాన్ని తిరస్కరించాడు .’’ఆల్ గాడ్స్ చిల్లన్ గాట్ వింగ్స్ ‘’నాటకం జాతి అల్లర్లు సృస్తిస్తు౦దేమోనని భయ పడ్డారు .’’ది ఫైర్ ఉండరర్ ది  ఎల్మ్స్ ‘’కి బుజాలు తడుముకొన్న అవినీతి పరులు న్యు యార్క్ దియేటర్ లో ఆడనీకుండా అడ్డు పడి మూసేయించారు .బోస్టన్ లో కూడా జరగ నివ్వ లేదు .లాస్ ఏంజిల్స్ లో కొన్ని ప్రదర్శనలతర్వాత అందులో పాల్గొన్న నటుల౦దర్నీ  అరెస్ట్ చేశారు .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -213 79- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్—3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -213

79-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్—3(చివరిభాగం )

ఊసర క్షేత్ర రచనపై వచ్చిన విమర్శలకు సమాధానం గా ఇలియట్ ‘’one of the surest tests of a poet’s sensibility is the way in which a poet borrows ,.Immature poets imitate ,mature poets steal ,bad poets deface what they take ,and good poets make it into something better or at least something different ‘’అన్నాడు .నర్సరీ  రైమ్స్ లాగా పూర్తీ చేస్తూ పూర్తీ నిరాశతో వ్యంగ్య ప్రార్ధనగా ఉందనిపిస్తుంది . .ఆయన అనుచరులు సగం వర్ణనాత్మక సగం లిరికల్ శైలికి ముగ్ధులయ్యారు .అందరికి పరిచయం లేని సాహిత్యం ,ఎప్పటిదో అయిన ఫిలాసఫీ ,అరడజనుభాషలలోని కొటేషన్లు తో గందర గోళం కలిగించాడని కొందరు ,కాదు కాదు ఆయన కవిత్వం ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించి ఊహలను గిలక్కోట్టాయిఅని కొందరు  అన్నారు .

తరువాత ఆయన చాలా మార్పుల తో రచన చేశాడు .నాటక రచన చేశాడు .రెచ్చగొట్టే వ్యాసాలూ రాశాడు .పుస్తక సమీక్షలు చేశాడు .’’పిల్లి ప్రేమికుల ‘’కోసం ‘’ఓల్డ్ పాస్యూమ్స్ బుక్ ఆఫ్ ప్రాక్టికల్ కాట్స్ ‘’రాశాడు .పెజియంట్ నాటకం గా ‘’ది రాక్ ‘’రాశాడు .సెయింట్ ధామస్ ఆత్మ బలిదానం పై ‘’మర్డర్ ఇన్ ది కేదేడ్రీల్’’రాశాడు . ఇలియట్ ను చూస్తె సంప్రదాయ బ్యాంకర్ అనిపిస్తాడుకాని కవి అనిపించడు..ఆరడుగుల అందగాడు .కాని సన్నగా అలసిపోయినట్లు ఉండేవాడు .డేగ చూపు .కొంచెం వంగి నడిచేవాడు .చక్కని గంభీర స్వరం తో తన కవితలలో చాలాభాగం చదివి రికార్డ్ చేశాడు .సిగ్గుపడుతూ సిగ్గుపడేవారి పక్షాన నిలిచాడు .కాని ఆయన సమక్షం ఎందుకో అందరికీ నచ్చేదికాదు దీనిపై ఎడ్వర్డ్ లియర్ కవి ఒక కవిత అల్లాడు –

‘’  How unpleasant to meet Mr.Eliot –with his features of clerical cut –and his brow so grim –and his mouth so prim –and his conversation so nicely –restricted to what precisely  -and if and perhaps and but –‘’

యాభై వచ్చేలోపు ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’రాశాడు .ఇందులో గోప్పఫిలాసఫీ కుమ్మరించాడు .20 వ శతాబ్ది అత్యుత్తమ రచన అనిపించింది .సింఫనీ మాంత్రికుడు బీతొవెన్ సంగీత పరిధి దాటి సంగీతం కూర్చినట్లు ఉంది అన్నారు .  50 ఏళ్ళు దాటాక తుళ్ళిపడే శైలి టో రాశాడు .ఆయన రాసిన ‘’కాక టైల్ పార్టీ ‘’ఇంగ్లాండ్ ,అమెరికాలలో మంచి పేరు తెచ్చాయి .పూర్వపు యోధుడు ఇప్పుడు దైవ అన్వేషకుడుగా మారాడు .’’ట్రడిషన్ అండ్ ఇండి విడ్యువల్ టేలెంట్ ‘’అనేగొప్ప సాహిత్య విమర్శ గ్రంధం రాశాడు 60 వ ఏట ‘’కన్జర్వేటివ్ ఎల్డర్ స్టేట్స్ మన్’’అని పించుకొన్నాడు .ఈ వయసులోనే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసినందుకు నోబెల్ పురస్కారం అందుకొన్నాడు .ఈ సందర్భం గా ‘’the process of advancement is interesting one seems to become a myth ,a fabulous creature that does not exist ,one does not feel any different though ,it is not you get bigger to fit the world ,the world gets smaller to fit you ‘’అని ఫైల్లసాఫికల్ గా స్పందించాడు . నాలుగవ జార్జి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశాడు 65వ ఏట అందరూ చెప్పుకొనే కవిగా ,విమర్శకుడుగా ఇలియట్ ఎదిగిపోయాడు .అప్పటికే ఆయనపై డజను పుస్తకాలు వివరణాత్మకంగా విశ్లేశానాత్మకం గా వెలువడ్డాయి .వివాదాలకు కేంద్ర బిందువూ అయ్యాడు .ఆయన వివేకాన్ని ఎవరూ ప్రశ్నించలేదు .కవిత్వాన్ని గురించి ‘’ poetry may make us see the world afresh ,or some new part of it .It may make us from time to time  a little more aware of the deeper un named feelings to which we  rarely penetrate ‘’భాష్యం చెప్పాడు ఇలియట్ .70 లో ఇలియట్ పై ఒక సింపోజియం నిర్వహించారు .కొత్త క్రిటిక్స్ ను ఆయన లెమన్ స్క్వీజేడ్ క్రిటిక్స్ అన్నాడు –‘’good poetry must exhibit several qualities in proportion of which one is good sense ‘’అని కవిత్వ పరమావధి గురించి చెప్పాడు .’’సేలేక్టేడ్ ఎస్సేస్’’ లో కవిత్వం గురించి చాలా రాశాడు ‘’కవిత్వం ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూపిస్తుంది .కొత్త భాగాలను తెలియజేస్తుంది .లోతుల ఆవిష్కరణ చేస్తుంది నిజంగా దూసుకుపోయే సమర్ధత కవిత్వానికి ఉన్నది .ఆనందం తోబాటు జాగృతి కలిగిస్తుంది ‘’ ‘’అన్నాడు .ప్రపంచం లో ఎక్కడ యే రచన వచ్చినా దానిపై ఇలియట్ యేమని కామెంట్ చేశాడని అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఆయన విమర్శకు అ౦త విలువ ఉండేది .

ఒక రకంగా చెప్పాలంటే ఇలియట్ ‘’ఊసర క్షేత్రం ‘’లో కవితా సస్య కేదారాలు పండించాడు .ప్రతి చోటా ఉన్న చావును ఆవిష్కరించాడు .కవితను ముక్కలు ముక్కలు చేసిరాశాడు .అందులో గుప్పించిన క్రియా సౌభాగ్యానికి మురిసిన వారున్నారు .శిధిల చిహ్నాలు చూపించాడు. బోలు మనుషుల నిజ రూపం కళ్ళ ముందు నిలిపాడు . కదలలేని కుళ్ళి కంపు కొడుతున్న  సమాజాన్ని చూపించాడు ‘’this is the way the world ends –this is the way the world ends –this is the way the world ends –not with a bang but a whimper ‘’అంటూ మూడు మాటలు గంట కొట్టినట్లు కొట్టి ప్రపంచ పరిసమాప్తి ని తెలియ జేశాడు .

చివరికాలం లో ‘’ఆల్కహాలిక్ ‘’ అయి ‘’రిం జిమ్ రిం జిమ్ ‘’అంటూ జిమ్ ను జాం మంటూ తెగ తాగేవాడు .4-1-1965 న ఇలియట్ మహా కవి మరణించాడు .ఆయన ద్విశాబ్ది కి లండన్ పోఎట్స్ కార్నర్ లో వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఒక పెద్ద శిలను ఉంచి గౌరవించారు .వర్జీనియా ఉల్ఫ్ ,జేమ్స్ జాయిస్ వంటి వారిని ప్రభావితం చేశాడు ఇలియట్ ‘’దం ,దాంతం,ధమత్వం ‘’మొదలైన భారతీయ పదాలను   వేస్ట్ లాండ్ లో చొప్పించి ఘనత చేకూర్చాడు .ఆధునిక ఆంగ్ల కవిత్వ మార్గదర్శి టి ఎస్ ఇలియట్ .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

 3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో కీ శే  శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యు ల గురు పూజోత్సవం ,పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్నాం  .ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో పాల్గొంటారు . ,శ్రీ కోట మాస్టారి చిత్రపటానికి పుష్పహార  సమర్పణ జరుగుతుంది  .

ఆనాటి కార్యక్రమం లో శ్రీమైనేని గోపాల కృష్ణ దంపతులు  ఏర్పాటు చేసిన కీ శే  శ్రీ కోట సూర్యనారాయణ శాస్స్త్రి మాస్టరు గారి ధర్మపత్ని స్వర్గీయ సీతమ్మ గారి   స్మారక నగదుబహుమతిని ప్రతిభ ,పేదరికం ఉన్న శాంతి నికేతన్ హైస్కూల్ బాలికకు  ,స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి మాస్టారు గారి స్మారక నగదు బహుమతి నిపబ్లిక్ స్కూల్ బాలునికి   చెరొక 10 ,000రూపాయలను సరసభారతి ద్వారా అందజేయబడుతుంది ,కోట సోదరులు తమ తలిదండ్రుల  జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 10 000రూపాయలను పేదరికం  ప్రతిభా ఉన్నఇంటర్  విద్యార్ధికి వారి చేతులు మీదుగా అందింప జేయటం జరుగుంది .

రెండు రోజుల తర్వాత వచ్చే  5 వ దేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 3 వ తేదీ నే శ్రీ కోట సోదరులకు ,శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మధుసూదన్ పిళ్లే దంపతులకు ,సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మిగారికి ,,ఇద్దరు పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు  సత్కారం జరుగుతుంది ..

   శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవ సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి సాహిత్యాభిమానులు ,విద్యాభిమానులు విశేషంగా పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

పూర్తీ వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ రెండవ వారం అందజేయ బడుతుంది    

                                          గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                     ఏం కె బాబు –ప్రిన్సిపాల్ –ఉయ్యూరు పబ్లిక్ స్కూల్    

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -212 789- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్—2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -212

789-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్—2

క్లాసిసిస్ట్ లలో ఇలియట్ అదో రకం .మొదటి రచనలలో రొమాంటిక్ కవిత్వమే కాక రొమాంటిక్ ప్రయోగాలు కూడా చేశాడు .19 వ ఏట లిరిక్స్ రాశాడు .హార్వర్డ్ నుంచి  గ్రాడ్యుయేట్ అవక ముందే ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల పరిచయం కలిగింది .22వ ఏట హార్వర్డ్ పేపర్ ‘’ఆడ్వోకేట్ ‘’లో హ్యూమర్స్క్యు కవిత అచ్చయింది .తర్వాత రాసిన ‘’స్ప్లీన్ ‘’కవితలో వేరాలైన్ ,బాడర్లె సంగీతం ఎక్కువైంది .’’ప్లు ఫోర్క్’’లో ప్రత్యెక లక్షణాలు కనిపించాయి .అందులోని కొన్ని లైన్లు –

‘’And life ,a little bald and gray –languid ,fastidious ,and bland –waits ,,hat and gloves in hand –punctilious of tie and suit –on the doorstep of the Absolute ‘’తర్వాత సింబాలిక్ ప్రభావాన్ని గ్రహించాడు .అందుకే ‘’సింబాలిస్ట్ మువ్ మెంట్ ఇన్ లిటరేచర్ ‘’పుస్తకం లో ఇలియట్ ‘’లాఫోర్జ్ ,లిమ్బాడ్ లను  వినలేదుకాని ,వేరలిన్ ను ఇంకా చదవ లేదు .ఆయన్ను చదివాక కోర్బరీని తెలుసుకోలేదు .కనుక సైమంస్ పుస్తకం నన్ను మార్చింది అని చెప్పక తప్పదు’’అని రాశాడు .అండర్ గ్రాడ్యుయేట్ కవిగా ఉన్నప్పుడే తనమోడల్స్  కవితలను కేవలం పునః రచన చేయలేదు ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల వస్తు భావ తీవ్రతలకు చెదిరిన స్థితులను  జాగృతం చేశాడు .మానసిక విశ్లేషణలను భావ వ్యక్తీకరణకు జోడించాడు  .ఇదంతా ఒక దీర్ఘ వలయాకారమైంది .ఆనాటి దిగజారుడు విధానాలను ఎలుగెత్తి చూపాడు .  శైలి విషయం లో ఇంకా నిర్దుస్టత రాలేదు .ఇంకా సగం పాండిత్యం ,సగం వ్యావహారికం గానే ఉంది .21 లో అతి ముఖ్యమైన కవిత ‘’ది లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ఫ్రూ ఫోర్క్ ‘’రాశాడు .””The symbolists had indicated a method ‘’of transmuting ideas into sensations ,of transforming an observation into a state of mind ‘’బాడర్లేర్ కొత్త  ప్రతీకల సముదాయాన్ని అందించాడు .సామాన్య జీవితం లోని ప్రతీకలనుకాకుండా వాటిని ఉద్ధరించి ,అసలు అర్ధానికి మరింత వివరణాత్మకం చేయాలి అన్నాడు ఇలియట్ .స్వాభావిక వ్యంగ్యాన్ని మరింత సాంద్రం చేశాడు .’’ఫ్రుటార్క్ అండ్ అదర్ అబ్సర్వేషన్స్’’కవితా సంపుటిలో వ్యంగ్యం తో టెక్నిక్ ను జటిలం చేసి రాశాడు .’’ది సేక్రేడ్ వుడ్ ‘’కవిత్వాన్ని వివరిస్తూ ‘’the use of poetry ‘’లో ‘’the essential advantage for a poet is not to have a beautiful world with which to deal –it is to be able to see beneath both beauty and ugliness –to see the boredom ,and the horror and the glory ‘’

ఇలియట్ అన్వేషణ34 వ ఏట వెలువడిన  ‘’వేస్ట్ లాండ్ ‘’లో ఫలవంతమైంది .17 వశతాబ్ది మెటాఫిజికల్ కవుల ,ప్రతీక కవుల వ్యంగ్యాన్ని కలబోసి రాశాడు దీన్ని .సెటైర్ ఉన్నా మూడ్ చాలా వాస్తవంగానే ఉంది .జ్ఞాపకాన్ని కోరికను కలిపి రాశాడు .ఇందులో ఆయనవాడిన జాతీయాలు ఆంగ్లకవిత్వం లో బహు నూతనమైనవి .కవిత వాడుక భాష ను ఆచూకీలతో మిశ్రమం చేసి రాశాడు .’’the verse was a curious amalgam ,colloquial speech joined to and jarred by recondite references ,blending with subtle emotions ,the horrifying and the ridiculous ‘’అని వివరించారు . అందుకే వేస్ట్ లాండ్ అనేక అర్దాల నిచ్చే కవిత అయింది .కొందరు దీన్ని అనేక కొటేషన్ ల అందమైన అల్లికగాఉండిచిన్న ఎపిక్ అయింది అన్నారు .మరొక వర్గ౦  సుదీర్ఘ మార్మిక పునః సృష్టి అన్నది  .మూడవ ముఠా దీన్ని క్రిస్టియానిటీ పై పునః విశ్వాస ప్రకటన అన్నది .నాల్గవ సమూహం ఈ కావ్యం ఊసర క్షత్ర మైన  సమకాలీన ప్రపంచ దిగ జారుడు, అవినీతి ,కి ఏకాంత నివాసానికి ,నైతిక విలువన దివాలా తనానికి   అద్దం పట్టింది అన్నది .హెమింగ్ వే వచనం లో ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’రాసిన దాన్ని ఇలియట్ వేస్ట్లాండ్ లో కవిత్వ పరంగా చెప్పాడు .ఇదే’’ కోల్పోయిన తరానికి ‘’మాని ఫెస్టో .మేధావి వర్గం, యువత దీన్ని తమ బైబిల్ అన్నారు .లూయీ మాక్ నీస్ అనే విశ్లేషకుడు ‘’వేస్ట్ లాండ్  కవిత్వం యొక్క కీలక భావనలను పూర్తిగా మార్చేసింది  నిజం చెప్పాలంటే జీవితాన్నే మార్చేసింది .18 ఏళ్ళ వయసువారు ఎన్నో ఊసర క్షేత్రాలను చూశారు .అవన్నీ ఇందులో చిత్రరూపాలను పొందాయి .కనుక వీరికి అదొక మహాద్భుత కావ్యమైంది .మనసులలోకి దూరింది .ఇలియట్ మహా కవి చేసిన అద్భుత సృష్టి ‘’అన్నాడు .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-18-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురుపూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీబంధువులకు 19-7-16 మంగళవారం గురుపూర్ణిమ అనే వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు

 గురుపూర్ణిమ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో ఈ రోజు ఉదయం 10 గం లకుప్రత్యేకంగా  శాకాంబరీ పూజ ఏర్పాటు చేశాము  -దుర్గా ప్రసాద్
Inline image 1
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య ఉన్న వేలుపు చర్ల లో మా బావమరిది స్వంత ఇంటికి వెళ్ళిన చిత్రాలు

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య ఉన్న వేలుపు చర్ల లో మా బావమరిది స్వంత ఇంటికి వెళ్ళిన చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

17-7-16 ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజ పురం సి ఆర్ లైబ్రరీలో శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారిచే ”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ మరియు స్పాన్సర్ శ్రీమతి మల్లికాంబ గారి పుట్టినింట్లో భోజనాల చిత్రమాలిక

17-7-16 ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజ పురం సి ఆర్ లైబ్రరీలో శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారిచే ”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ మరియు స్పాన్సర్ శ్రీమతి మల్లికాంబ గారి పుట్టినింట్లో భోజనాల చిత్రమాలిక

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్యలో -నా కవిత -”మా శర్మన్నయ్య చిరంజీవి ”

మా అన్నయ్యలో -నా కవిత -”మా శర్మన్నయ్య చిరంజీవి ”sharmannayya 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య ”లోశ్రీ మైనేని గోపాలకృష్ణగారి కవిత -మార్గ దర్శి అన్నయ్య

మా అన్నయ్య ”లోశ్రీ మైనేని గోపాలకృష్ణగారి కవిత -మార్గ దర్శి అన్నయ్యmargadarshi 001

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం సరసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది

మా అన్నయ్య

స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం సmallika3 001 page 001 chal1 001 chala2 001 mallika1 001 mallika2 001రసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకం -అంకితం పొందిన కీశే తాడికొండ భోగ మల్లికార్జునరావుదంపతుల విశేషాలు

మా అన్నయ్య పుస్తకం -అంకితం పొందిన కీశే తాడికొండ భోగ మల్లికార్జునరావుదంపతుల విశేషాలుankitam8 001 ankitam9 001 ankitam10 001 ankitam1 001 ankitam2 001 ankitam3 001 ankitam4 001 ankitam5 001 ankitam6 001 ankitam7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తక ముఖ చిత్రాలు

మా అన్నయ్య పుస్తక ముఖ చిత్రాలుmaannayya4 001 maannayya1 001 maannayya2 001 maannayya3 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -211 789- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -211

789-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్

అరవై వ ఏట  నోబుల్ బహుమతి గ్రహీత ,అనేక విలువైన గ్రంధ రచయిత ,అద్భుత వ్యాసకర్త ,చురుకైన కరపత్ర రచయిత ,రాజీ లేని ఆధునిక కాల సీరియస్ కవి ,మార్గ దర్శి- హాస్య రచనలు రాయటం మొదలు పెట్టాడు .ఇది చాలా ఆశ్చర్య జనకమైంది .అంతకంటే ప్రత్యేకత మరొక్కటి ఉంది –అదే అప్పటిదాకా రాసిన అస్పష్ట గూడార్ధ రచన లనుంచి ముఖ్యంగా కవిత్వం నుండి వైదొలగి ,అద్భుత విజయవంతమైన వినోదాత్మక  ప్రసిద్ధి చెందిన నాటకాలు రాసి అట్లాంటిక్ సముద్రానికి అటూ ఇటూ పేరు ప్రఖ్యాతులను పొందినవాడు అమెరికాలో జన్మించి బ్రిటిష్ పౌరుడైన ధామస్ స్టి యార్న్స్ ఇలియట్ అంటే టి ఎస్ ఇలియట్ .26-9-1888 న అమెరికా లోని సెయింట్ లూయీకి చెందిన మిస్సోరిలో జన్మించాడు .ఆరుగురు సంతానం లో చివరివాడు .తండ్రిది న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్ప్యూరిటన్ వంశం .తాత బోస్టన్ నుంచి వచ్చి వాషింగ్టన్ యూని వర్సిటిని, మొదటి యునిట రేనియన్ చర్చిని సెయింట్ లూయీ లో   స్థాపించాడు .సివిల్ వార్ ముందు పారిపోయే బానిసల కోసం అండర్ గ్రౌండ్ రైల్వే ను ఏర్పాటు చేసిన వారిలో ఒకడు .తల్లి పౌర సేవకనాయకు రాలు  సంస్కర్త ,కవయిత్రి సవోనారాల అనే నాటక కవిత్వం రాసింది .ఆమె ప్రతిభ కొడుకు కు వారసత్వంగా లభించింది .అందుకే న్యు ఇంగ్లాండ్ లో ఇలియట్ ను చేర్చి చదివించారు .మిల్టన్ అకాడెమి ,హార్వర్డ్ యూని వర్సిటీలలో చదివి బి యే తర్వాత ఏం యే పాసై ఇంగ్లాండ్ వెళ్లి  సార్బొన్నేలో  ,ఆక్స్ ఫర్డ్ లో మెర్టన్ కాలేజి లో చదివి స్కూల్ మాస్టర్ గా పని చేశాడు .అయిష్టంగానే మేస్టర్ గిరీ నాలుగేళ్ళు బ్యాంక్ గుమాస్తాగా ఎనిమిదేళ్ళు  లాగాడు . 27 వయేటబాలట్ పై మోజున్న  వివిన్నే హైఘ్ ను పెళ్ళాడి  లండన్ పబ్లిషింగ్ హౌస్ లో మంచి ఉద్యోగం లో చేరి ,తర్వాత భాగస్వామి అయి ,1927లో బ్రిటిష్ పౌరుడయ్యాడు .కారణం అడిగిన వారికి ‘’ఇక్కడ బతుకుతున్నాను ,ఇక్కడే స్నేహితులతో సరదాగా గడుపుతున్నాను .చట్ట విరుద్ధంగా ఉండటం నాకిష్టం లేదు .పూర్తీ బాధ్యతా తో ఇక్కడే ఉండాలనుకోన్నాను ‘’అని బదులు చెప్పాడు .తానూ మత రీత్యా ఆంగ్లో కేధలిక్ నని ,రాజకీయాలలో రాయలిస్ట్ నని సాహిత్యం లో క్లాసిసిస్ట్ నని చెప్పుకొన్నాడు ఇలియట్ .

Inline image 1

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-7-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment