ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21

39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్

స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ గా పని చేశాడు .నాలుగు దశాబ్దాలు ఇండియా లో ఉన్నాడు .భారత దేశానికి చెందినకానూన్ బీబీ ని పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలను కన్నాడు. వారిద్దరూ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులను వివాహం చేసుకొన్నారు .1786 లో బిహార్ లో పర్య టించి మిలిటరీ రూట్ సర్వే మాప్ తయారు చేశాడు .అక్కడి నుంచి బెనారస్ కు మారాడు .మొఘల్ బేగ్ అనే ముస్లిం స్నేహితుడి తోపరిచయం పెరిగి అతన్ని పండిట్ సర్వేయర్ గా భావించాడు .బేగ్ తో కలిసి వాయవ్యభారత్  ,దక్షిణ పంజాబ్,మరియు బావల్ పూర్ లకు మిలిటరీ రూట్ మాప్ లను తయారు చేశాడు .

సంస్కృత విద్వాంసుల ,ఓరియంటలిస్టు లతో ముఖ్యంగా విలియం జోన్స్ ,చార్లెస్ విల్కిన్స్ ,హెచ్ హెచ్ విల్సన్ ,హెచ్ టి కోలేరూక్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొన్నాడు .1794 లో ఆర్మీ నుండి రిటైరై బెనారస్ లో స్థిర పడ్డాడు .బ్రిటిష్ రెసిడెంట్ జోనాధన్ డంకన్ స్థాపించగా ఈస్ట్ ఇండియా కంపెనిసంస్కృత పండితులకు శిక్షణ ఇవ్వటానికి ఈస్ట్ ఇండియాకంపెని ఏర్పాటు చేసిన  వారణాసి సంస్కృత కళాశాలకు సెక్రెటరిగా చేశాడు .ఈ కాలేజి పై ఫ్రాన్సిస్ ప్రభావం విశేషంగా ఉండేది .చనిపోయే ముందు తనకు ఇష్టుడైన వాడిని ముఖ్య పండితుని స్థానం కట్ట బెట్టాడు .  విల్ ఫోర్డ్ చాలామందిపండితులను  కాపీయిస్ట్ లుగా ,అనువాదకులుగా ,సర్వేయర్లు గా నియమించాడు  .1790  సంవత్సరం అంతా పురాణాలు ఇతర సంస్కృత గ్రంధాలలో ఉన్న జాగ్రఫీ విషయాలను సేకరించాడు .చారిత్రిక కావ్యాలు ఐతిహాసాక కదల నుండి జాగ్రఫీ కి చెందిన వాటిని పొందు పరచాడు .భారతీయ సంస్కృత పండితుల మధ్య కూర్చుని వారితో పాటు స్వరం కలుపుతూ హిందూ పురాణాలు పాశ్చాత్య గాధలు బిగ్గరగా చదివే వాడని బైయిలీ రాశాడు.సాదృస్యాలను వెంటనే రికార్డ్ చేయించేవాడు .పురాణాలలో ఉన్న మిశ్ర అనే పదం ప్రాచీన ఈజిప్ట్ పేరైన అల –మిస్ర్ అని గమనించాడు .  Leask points that:

Sanskrit Cosmography had been metamorphosed into geography by ‘follow[ing] the track, real or imaginary, of [Hindu] deities and heroes; comparing all their legends with such accounts of holy places in the regions of the west…preserved by Greek mythologists; and endeavouring to provide the identity of the places by the similarity of the names and remarkable circumstances’.[3]

నోవా అతని ముగ్గురు కొడుకులు జాఫెత్ ,హాం, షేం  పేర్లు సంస్కృతం లో సత్య వ్రత కుమారులైన జపేటి చర్మ ,శర్మ అని ఇది పద్మ పురాణం లో ఉందని చెప్పాడు .శర్మ కొడుకులు నైల్ లేక కాళి నదీ తీరాలకు వలస పోయారని .చర్మ నీగ్రో కొడుకులు నోవా ను హేళన చేసినందుకు శాపం పొంది ఇండియాకు వలస వచ్చారని ,అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్ళారని వీటికి తాను ఆధారాలు సేకరించానని విల్ ఫోర్డ్ చెప్పుకొన్నాడు .ఈజిప్ట్ లోని ఆధునిక డేనిజేన్లు శర్మ కొడుకులు సేమటన్లు అన్నాడు .వీరు పూర్తిగా స్థిరపడి చర్మ కొడుకులు హాస్యాసిలన్లను  ఎడారి ప్రాంతాలకు వెళ్లి పొమ్మని బహిష్కరించారు .వాళ్ళు అక్కడ నుంచి ఆఫ్రికా వెళ్లి అక్కడే  వ్యాపించి ఉండి పోయారు .ఈ కధను నేగెల్ లీస్క్  colonial construction of racial hierarchy to subordinate Egypt to India :అన్నాడు . This subordination of Egypt to India in terms of chronological priority is accompanied by a distinctly colonial construction of racial hierarchy in which the inhabitants of contemporary Africa are equated with the aboriginal inhabitants of India, both descended from the proscribed family of Ham, Charma, or Hasyasilas(‘the laughter’).[3]

1788 లో విల్ ఫోర్డ్ ప్రాచీన ఈజిప్ట్ గురించి రాజుల గురించి  భారతీయ పురాణాల గురించి అనేక గ్రంధాలు రాశాడు .భారతీయులు నైలు ,ఈజిప్ట్ ప్రాంతాలలో స్థిర పడ్డారని గ్రీకులకు కూడా మూల పురుషులు హిందువులే అన్నాడు .17 9 లో విల్ ఫోర్డ్ ‘’ఈజిప్టు ,కాళి నదికి సమీప దేశాలు ‘’అనే వ్యాసం రాశాడు .కాళి అంటే నైలు నది ,సంస్కృత కుశద్వీపమే ఆధునిక ఇతి యోపియ లేక అబిసీనియా .మానిచేరియాన్ జాతిలో ఒక భాగం ఉత్తర పడమర భారతం లో వ్యాపించారు అన్నాడు .ప్రాచీన క్రిస్టియన్ క్రాస్ లు కేరళ త్రవ్వకాలలో బయట పడ్డాయని అందుకని క్రైస్తవానికి మూలం హిందూ దేశమే నని చెప్పాడు .దీనితో హిందూ ముస్లిం క్రైస్తవులు అభ్యంతం చెప్పారు శ్వేత ద్వీపం అంటే బ్రిటిష్ ఐల్స్ అన్నాడు . Wilford, in fact, attributed lotus-like division of Old Continent to his puranic source as:

lotus-like division of the old continent into seven ‘dwipas’ or climates centred on Mount Meru, from whence four rivers flowed to the cardinal points of the earth. Moving in a north-westerly direction from Jambu (India), the six dwipas were as follows: Cusa (the country between the Persian Gulf, the Caspian Sea, and the Western boundary of India); Placsha (Asia Minor, Armenia, etc,.); Salmali (Eastern Europe, bounded on the west by the Baltic and Adriatic Seas); Crauncha (Germany, France, and the northern parts of Italy); Sacam – alternatively Swetam, the White Islands (The British Isles, surrounded by the ‘sea of milk’); Pushcara (Iceland)[3][9]

Wilford narrated the story of Salivahana that the child had born to a virgin and a carpenter, later became a mystic, and finally crucified in a Y-shaped plough. In 1805, Wilford had confessed publicly that some of the manuscripts he had been working were, in fact, forged, though, he didn’t specifically refer to the Salivahana story; later, when he had published in 1807 – 2 years after his confession -, he preceded it with a disclaimer as: The Salivahana story ‘is a most crude and undigested mass of heterogeneous legends taken from the apocryphal gospel of the infancy of Christ, the tales of the Rabbis and Talmudists concerning Solomon, with some particulars about Muhammed…jumbled together with…the history of the Persian kings of the Sassanian dynas

తాను అన్నీ విషయాలూ ఫోర్జేరి చేశానని చివరలో ఒప్పుకొన్నాడు విల్ ఫోర్డ్ .విల్ ఫోర్డ్ ను సమకాలీన చరిత్ర కారులు విపరీతంగా ద్వేషించారు విమర్శించారు Friedrich Schlegel, an author and poet, in his essay On the Language and Wisdom of India(Über die Sprache und Weisheit der Indier, in German language) applauded Wilford’s putative discovery of the Indian origin of Egyptian civilisation, establishing India as the Ursprung, to settle the long-standing controversy about the relative antiquity of the two civilisations – India and Egypt. Although Schlegel supported the extreme views of Wilford as “Everything, absolutely everything, is of Indian origin,”[3][11] yet he denounced Wilford; later, for his fanciful temerity as:

the fanciful temerity of a Wilford was bringing discredit on the Indian researches—a temerity which would necessarily provoke a re-action, and lead, as in some recent instances, to a prosaic narrow-mindedness, that would seek to bring down the whole system of Indian civilization to the dull level of its own vulgar conceptions.[12]

విశ్వ నాద వారు తన నవల’’ ఆరునదులు ‘’.ఈ విషయాలన్నీ చెప్పారని నా జ్ఞాపకం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20

38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని

9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి 1845 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు .చాలా ఏళ్ళు నార్త్ యా౦ప్టన్ లోనే బాంక్ లో పని చేసి ,పెద్దన్న జోషియా విట్నీ కి లేక్ సుపీరియర్ ప్రాంత జియలాజికల్ సర్వే కు సహకరించాడు .ఈ సమయం లోనే ఖాళీగా ఉన్నప్పుడు సంస్కృతం చదివాడు .1850 లో జర్మనీ వెళ్లి మూడేళ్ళు సంస్కృతం అధ్యయనం చేశాడు .చలికాలాలలో బెర్లిన్ లో  ఆల్బర్ట్ వేబెర్ ,ఫ్రాంజ్ బాప్ లవద్దా వేసవులలో టూబెంగిన్లో రుడాల్ఫ్ వాన్ రోత్  వద్ద సంస్కృతం లో మెళకువలు నేర్చాడు .ఈ క్షేత్రం లో గొప్ప విజ్ఞానిగా గుర్తింపు పొందాడు .

  1854 లో ఏల్ లో సంస్కృత ప్రొఫెసర్ అయి,1869 కంపారటివ్ ఫైలాలజి కి ప్రొఫెసర్ కూడా అయ్యాడు .షెఫీల్డ్ సైంటిఫిక్ స్కూల్ లో ఆధునిక భాషలు బోధించి ,అమెరికన్ ఓరియెంటల్  సొసైటీ కి 1857 నుండి సేక్రేటరిగా చేసి,1884 లో ప్రెసిడెంట్ అయ్యాడు  .1856 లో ఎలిజబెత్ వూస్టర్ బాల్డ్విన్ ను పెళ్లి చేసుకొని 6 గురు సంతానాన్ని పొందాడు అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు ఫెలో గౌరవాన్ని ,అమెరికన్  యాంటి క్వేరియన్ సొసైటీ సభ్యత్వ గౌరావాన్ని పొందాడు . విట్ని అవేన్యు లో  7-6-1894 న 67 వ ఏట మరణించాడు .

విట్ని 1864 లో అమెరికన్ వెబ్ స్టర్ నిఘంటువులో నిర్వచనాలను మార్పు చేసి రాశాడు .1869 లో అమెరికన్ ఫైలలాజికల్ అసోసియేషన్ కు సంస్థాపక అధ్యక్షుడైనాడు .వేద ఛందస్సులను అనువదించాడు .వేదాలు భాషా శాస్త్రం లపై చాలా వ్యాసాలూ రాశాడు ఇవన్నీ ‘’ఓరియెంటల్ అండ్ లింగ్విస్టిక్ స్టడీస్ సిరీస్ లో 1872-74 లో ప్రచురితాలు .ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ సంస్క్రుతాలకు వ్యాకరణ గ్రంధాలు రచించాడు .1879 లో అష్టాధ్యాయి పై రాసిన వ్యాఖ్యానం ‘’సాంస్క్రిట్ గ్రామర్ ‘’చాలా పేరు పొందింది .పాణిని రాసిన అష్టా ధ్యాయి ‘’ఉన్నతమైన కళాత్మకమైన 4 వేల ఆల్జీబ్రా లాంటి సూత్రాలతో రాయ బడింది అని సంక్షిప్తతతో సందిగ్ధానికి తావు లేకుండా ఉందని ప్రశంసించాడు విట్ని .ఐరోపా భాషా శాస్త్ర వేత్తలపై విట్నీ ప్రభావం అత్యదికమని  In his Course in General Linguistics in the chapter on the ‘Immutability and Mutability of the Sign’, Ferdinand de Saussure credits Whitney with insisting on the arbitrary nature of the linguistic sign

పై విధంగా సాసురే విట్ని ప్రతిభకు నీరాజనం పట్టాడు ..జీవిత చరమాంకం లో గుండె జబ్బుతో బాధ పడుతున్నా ‘’సెంచరి డిక్షనరీ ‘’మొదటి భాగానికి  ఎడిటర్ ఇన్ చీఫ్ గా పని చేశాడు .ఇది 1889-91కాలం లోఇది  విడుదలయింది . Although little in modern American linguistics can be traced or attributed uniquely to Whitney’s work, his writings on general linguistics have continued to be regularly praised for their “sanity,” a term reflecting his clarity of style, the care he took to provide examples drawn from actual language usage in support of thoughtful, empirically based statements, and his avoidance of the “metaphysical” mysticism of some of his contemporaries. The writing table at which he stood to prepare so many of his 360 books and articles was eventually obtained by the Linguistic Society of America, founded in 1924, and is passed on to each successive editor of that society’s journal, Language, as an honor of the office.

Inline image 1  Inline image 3   Inline image 4  Inline image 5Inline image 2

          సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-21-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్

11-12-1853 న జన్మించి 22-5-1938  న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను  గాటిం జెన్  ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి బెసేల్ యూని  వర్సిటి  లో గ్రీక్ ఫ్రొఫెసర్ గా ఫ్రెడరిక్ నీషే కు వారసు డయ్యాడు .1902 లో గాటింజెన్  యూని వర్సిటి పిలుపు నందుకొని మొదటి ప్రపంచ యుద్ధ౦ కారణం గా 1905లో తిరిగి బెసేల్ చేరాడు .1936 లో రిటైర్ అయి ,22-5-1938 న 85 వ ఏట బెసేల్ లో మరణించాడు .

 జాకబ్ ముఖ్య సాహితీ సేవ ‘’సంస్కృతానికి ‘’సమగ్ర వ్యాకరణం ‘’తయారు చేయటం .ఆధునిక భాషా శాస్త్ర వేత్తలలో ఆయన ‘’వాకర్నగల్ లా ‘’సృష్టి కర్త గా గుర్తింపు పొందాడు .ఇండో –యూరోపియన్ క్లాజేస్ లలో  (ఉప వాక్యాలు )ఒత్తిపలకని పదాల స్థానం పై పరిశోధించి ఈ సూత్రాన్ని కనిపెట్టాడు.ఆయన మరణానంతరం 1889 లో ఆయన గౌరవార్ధం ఆయన పేరుమీద ‘’వాకర్నగల్స్ లా ఇన్ కాంపోజిషన్ ‘’  ను గ్రీకు భాషలోని సమ్మేళన(కాంపౌండ్ )పదాల లో మొదటి ఇంగ్రీడిఎంట్ అచ్చుగా అంతమయి   ,రెండవ ఇంగ్రీడిఎంట్ అచ్చుగా మొదలై ఈ రెండూ కూడా  పై స్థాయిలో లేనప్పుడు మొదటి అచ్చు ఏ మార్పునూ పొందక రెండవ అచ్చు మొదటి దాని స్థానం లో దీర్ఘం గా పలకబడటం ఇందులోని విషయం .ఆయన రాసిన ‘’సింటాక్స్ లెక్చర్స్ ‘’కు మంచి పేరుంది .

Inline image 1

37 –సంస్కృతం లో వేల్స్ ప్రొఫెసర్ లు  

అమెరికాలో హార్వర్డ్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి ‘’హెన్రి వేర్ వేల్స్ ‘’(1818 -1856 ) 24-4-1849 న సంస్కృతం లో ప్రొఫెసర్ షిప్ కోసం ఎండోమెంట్ ఏర్పాటు చేసి ఒక వీలునామా రాశాడు.కాని సంస్కృత పీఠం మొదటి సారిగా 26-1–1903లో మాత్రమే ఏర్పాటై చార్లెస్ రాక్వెల్ లాన్మాన్ వ్యవస్థాపక పీఠాది పతి అయ్యాడు .ఈయన 1876 లో జాన్ హాప్కిన్స్ యూని వర్సిటి లో వృత్తి ప్రారంభించి ,అక్కడ తన అధీనం లో సంస్కృత శాఖనేర్పాటు చేసి , ,హార్వర్డ్ ప్రెసిడెంట్ చార్లెస్ విలియం ఇలియట్ ఆహ్వానం పై  హార్వర్డ్ లో 1880 లో సంస్కృత ప్రొఫెసర్ పదవిని చేబట్టాడు  ..రెండవ ప్రొఫెసర్ వాల్టర్ యూజీన్ క్లార్క్, మూడవ ఆయన డేనియల్ హెచ్ హెచ్ ఇగ్నల్స్ సీనియర్ .1987 నుండి మైకేల్ విట్జేల్ నాలుగవ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

Inline image 2  Inline image 3

ware whales                                

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19

—       35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం )

దేవ భాష

చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ కృషి అయిన  ఆధ్యాత్మిక కావ్యం అయిన ‘’సావిత్రి ‘’పై స్పూర్తి దాయకమైన ,ప్రకాశ వంతమైన సారాంశం .ఇది 1960లోహరిదాస్ చౌదరి ఫ్రెడరిక్ ఫ్రీజేల్ బెర్గ్ ల సంపాదకత్వం లో వెలువడిన  ‘’ది ఇంటెగ్రల్ ఫిలాసఫీ ఆఫ్  శ్రీ అరబిందో – ఎ కమ్మేమోరేటివ్ సింపోజియం ‘’లో  ఒక అధ్యాయం గా చోటు చేసుకొన్నది .19 70  ఆమె ‘’ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్ ‘’ను తనకున్న అద్భుత సంస్కృత జ్ఞాన భండారాన్నుంచి వెలికి తీసి రాసిన మహోత్క్రుస్ట రచన గా వెలువరించింది .ఇవి కాక సంస్కృత ఉచ్చారణ టేప్ లను తనకున్న 45 ఏళ్ళ సంస్కృత బోధనా,వైదుష్యం ల అనుభవ సారంగా తెచ్చింది .వీటిని శ్రీ అరవిందుల స్మ్రుతి కి నివాళిగా సమర్పించింది .దీనికి ఆమె ముందు మాటలుగా రాసిన ఉపోద్ఘాతం’ చాలా స్పూర్తి దాయకం గా ఉంది –‘’ “In this age when men are responding to a spiritual need for unity and brotherhood among all the nations of the world, we find a spiritual vocabulary being drawn from the rich treasury of Sanskrit terminology because these words are already ripe with truths divine.”[44] .

దీని పై వివరణనిస్తూ ఆమె అన్న మాటలు –‘’ “a stress has been given to the verb-roots of the words, for they are the essential carriers of the meaning of the words as originating in the spiritual element of the Universe”  అంటూ స్పష్టం చేసింది .దీని వలన విద్యార్ధి అసలైన అర్ధాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది అని చెప్పింది .ఈ పుస్తకానికి బి ఎల్ ఆత్రేయ ,వి కె గోకక్ లిద్దరూ నాణ్యమైన ఉపోద్ఘాతాలు పరమ ప్రయోజన కరం గా రాశారు .సంస్కృతాన్ని ,హిందూ ఇజాన్ని కలిపి  తెచ్చిన ఏకైక ప్రత్యేక విషయానికి బాగా మెచ్చుకొన్నాడుఆత్రేయ . .గోకక్ సత్యం కోసం ఆమె చేస్తున్న నిరంతర అన్వేషణను ,తనకున్న అపార జ్ఞాన సంపత్తిని తోటి వారికి అంద జేయాలనుకొనే తపనను కీర్తించాడు . మంత్రం శాస్స్త్రం లో ఆమెకున్న అభినివేశం వలన అతీంద్రియ మానవుని అవగాహనకు దారి చూపుతుంది అన్నాడు .దీనిపై ఇండియాలో నూ గొప్ప పేరు వచ్చింది పత్రికలూ వేనోళ్ళ పోగిడాయి .ఆమె కృషి అద్వితీయం అన్నది ‘’ఇండియన్ లిబరేషన్ ‘’పత్రిక The Indian Libertarian wrote: “Dr. Tyberg has woven for us a magnificent fabric of primary source materials of the highest authority”, and The Indian Review hailed the “novel approach and sincerity of scholarship” ending with the words “Dr. Tyberg has laid all lovers of Sanskrit under a debt of gratitude.”[48] In Mother India, Sanat K. Banerji admired Tyberg’s “.boldness and originality” and particularly commended three major innovations: “within a reasonable compass, practically all the important terms that a students of (India’s) most valuable works is likely to come across”, the relating of “technical terms to the verbal roots from which they are derived” and the “signal service” which he felt must be emphasized: “Vedic interpretation has long suffered at the hands of scholars wholly ignorant of the spiritual endeavours the Vedas were meant to enshrine. The author has a valuable chapter on the Vedas and their spiritual meaning … compiled from Sri Aurobindo’s monumental work on the subject”. The review finished with the words: “Dr. Tyberg has justified the name Jyotipriya given her by Sri Aurobindo.”[49]

19 7 2 లో శ్రీ అరవిందుల శత జయంతి ఉత్సవాలకు కి ఇండియా వచ్చి పాండి చేరి వెళ్లి మదర్ ను సందర్శించి ఆశీస్సులు అందుకొన్నది .జూడిత్  ఉచితం గా చేస్తున్న సంస్కృత సేవ ,ఆధ్యాత్మిక బోధన ,కౌన్సెలింగ్ లకు  మదర్ బహుదా ప్రశంసించింది  .1973 లోకొత్తగా ఏర్పడిన  కాలేజ్ ఆఫ్ ఓరియెంటల్ స్టడీస్ కు బుద్ధ ధర్మ యూని వర్సిటి లో  బౌద్ధ అధ్యయన ఎమిరిటస్ స్టాఫ్ ప్రొఫెసర్ గా ఉండటానికి అంగీకరించింది .గొడ్దార్డ్ కాలేజి  గ్రాడ్యుయేట్ ఫీల్డ్ ఫాకల్టి లో సంస్కృత ,హిందూ ఇజం ప్రొఫెసర్ గాకూడా సేవలు అందించింది One academic reference attested “Tyberg’s lectures were distinguished by wide reading and research; and even more than this, she imparted to her students and hearers the spiritual aroma and inspiration of the great philosophical schools of the East.”[29] Tyberg often said that it was in the joy of teaching that she transcended all pain.[39]

19 7 8 లో  ఈస్ట్ –వెస్ట్  సంస్థ బిల్డింగ్ తనఖా బాకీ పూర్తిగా తీర్చేసి కొత్త బోర్డాఫ్ డైరెక్టర్ లకు  కొత్త యుగపు మార్గ దర్శక సూత్రాలను అందజేస్తూ ‘’ This Center is not a business or a sect or a popular or social activity. It is a service to the Divine to share and unite the best aspects of the spiritual and religious, philosophical and cultural and healing arts of the East and West for uplifting and leading to a Divine Life on Earth…. May it continue to grow thus spontaneously with Divine backing with no catering to lower standards for attracting money.”[29]

అని ప్రబోధించింది

సుదీర్ఘ కాలం నిరంత బోధనా కార్యక్రమాలలో ,సత్య, సుందర ,ఆనందాన్వేషణలో  అలసి పోయిన జూడిత్ టై బెర్గ్ అంతిమ శ్వాసను 3-10-19 8 ౦78 వ ఏట   తీసుకొని తాను ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న పరమాత్మలో తన ఆత్మను అనుసంధానం చేయటానికి ఇహ లోకం వీడింది .జ్యోతి ఆత్మా జ్యోతి లో లీనమైంది . After a life where she sought “long service … in search of truth, beauty and joy to share with all”, her final aspiration was “the speedy return of my soul to the Divine … so I may return again to serve the Light”

జూడిత్ రాసిన సంస్కృత పుస్తకాలు సంస్కృత తరగతి బోధనకు భూమికగా ఉప యోగిస్తూనే ఉన్నారు .ఆమె ఊపిరి ,శ్వాస అయిన ఈస్ట్ వెస్ట్ కల్చరల్ సెంటర్ నిర్విరామంగా కృషి చేస్తూ,ఆమె జ్ఞాపక చిహ్నంగా ఉన్నది .

Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

 ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18

35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2

అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు

1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి  ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం చార్లెస్ మూర్ ను కలిసి 1949 లోజరిగిన  ‘’తూర్పు –పడమర తత్వ వేత్తల సమావేశం ‘’ఫలితాల గురించి చర్చించింది .అందులోని భావ పరంపర సమాహారం శ్రీ అరవిందులను చేరుకోవటానికి పాశ్చాత్య మేధావి వర్గానికి నివేదించటానికి అనువుగా ఉంటు౦ద ని భావించింది .ఆమె లాస్ ఏంజిల్స్ కు రావటం అనుచర వర్గానికి గొప్ప ప్రోత్సాహమై ,రెండు వారాలలో ఆమె వెయ్యిమందికి పైగా పాల్గొన్న పది సమావేశాలలో ప్రసంగించేట్లు చేసింది .సాన్ ఫ్రాన్సిస్కో లోనూ ఇదే ఉత్సాహం వెల్లి విరిసి,స్టాన్ ఫోర్డ్ యూని వర్సిటిలో ఘన సన్మానం ఏర్పాటు చేశారు .’’ఇండియా పై నిషేధం లేని సత్యాన్నితెలుసుకోవటానికి  అమెరికా ఆతుర పడుతోందని దీనికి నాంది గా కాలి ఫోర్నియా అరవిందుని భావ జాలాన్ని అందుకునే ప్రయత్నం లో ముందు ఉందని చెప్పింది .19 5 1 లో సాన్ ఫ్రాన్సిస్కో లో కొత్తగా స్థాపించబడిన ‘’అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ‘’ ఫాకల్టి లో చేరటానికి  జూడిత్ టై బెర్గ్ ను సాదరంగా ఆహ్వానించారు .ఇది ఆసియా సంస్కృతికి పూర్తిగా అంకితమైన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ యూని వర్సిటి ‘’.1961 లో ‘’శాన్ఫ్రాన్సిస్కో పునరుజ్జీవన ‘’కు వేళ్ళు పాదుకొనే సిద్ధాంతాలకు వేదికయింది .టై బెర్గ్ ఇందులో సంస్కృతం లో ప్రొఫెసర్ గా పని చేస్తూ అలాన్ వాట్స్ ,హరిదాస్ చౌదరి ,దిలీప్ కుమార్ రాయ్ వంటి అంతర్జాతీయ మిత్ర బృందం తో కలిసి పని చేసింది .రాయ్ ,చౌదరి ఇద్దరు ఆమె తో పాటు అరవింద అనుచరులే .డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ గా ఉన్న ఫ్రెడరిక్ స్పీగెల్ బెర్గ్ కు శ్రీ అరవిందులు ఈ యుగ మార్గ దర్శి అనే అభిప్రాయం బలంగా ఉన్నవాడు .టై బెర్గ్ సంస్కృత బోధనా విధానం ప్రాచీన ,అర్వాచీన భారతీయ భావ అనుసంధానం తో ఉండటం ఆయనకు ఎంత గానో నచ్చి అభినంది౦చేవాడు .ఆమె బోధనా పటిమ అత్యుత్తమమని శ్లాఘించాడు .ప్రతిక్లాసు ను ఆమె ఎంతో వైవిధ్య భరితంగా ఉత్సాహం గా ప్రేరణగా బోధించటం అపూర్వం  గా ఉండేది ..’’ఆధునిక భారత దేశం ‘’పై 1952 వేసవిలోసాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కాలేజి లో  జరిగిన సెమినార్ లో ఆమె ఇంస్ట్రక్టర్  గా ఉంది.ఆమె టీచింగ్ ను అనూహ్యప్రతిభా  ప్రభావ సంపన్నం  గా ఉందని కీర్తించారు .ఆమెకు ఈ సబ్జెక్ట్ పై ప్రత్యక్షంగా స్వీయ అనుభవం  ఉండటం ,లోతైన అధ్యయనం చేసి ఉండటం ఆమె విజ్ఞానం అగణితంగా ఉండటం దీనికి ముఖ్య కారణమైనాయి. స్ట్రాఫోర్డ్ యూని వర్సిటీ లోనూ ఆమె లెక్చరర్ గా పని చేసింది .

ప్రాచ్య –పాశ్చాత్య సంస్కృతీ కేంద్రం

అకాడేమిలో రెండేళ్ళు పని చేశాక బెర్గ్ లాస్ ఏంజెల్స్ పై దృష్టి పెట్టి అక్కడ 1953 మే 1 న ‘’ఈస్ట్ వెస్ట్ కల్చరల్ సెంటర్ ‘’స్థాపించింది .’’అందరినీ ఏకం చేసేదే అసలైన జ్ఞానం ‘’అన్న అరవిందుల లోకోక్తిని ఆమె పాటించింది .ఈ సంస్థ విశాల దృక్పధం తో ప్రాచ్య పాశ్చాత్య సాంస్కృతిక అన్యోన్యతను నిర్మించటం ,ఆధ్యాత్మిక జీవనానికి వైవిధ్య అంశాలను ప్రతిపాదించటం కోసం పాటు పడింది .ఆమె ఒక్కతే సంస్కృతం, హిందీ, పాళీ, గ్రీక్  భాషలను ,తులనాత్మక మతం ,భారతీయ ఉత్తమ సాహిత్య గ్రంధాలను ,,సంగీత, నృత్య , యోగ ,అరవింద ,మదర్ లపై తరగతులను అద్వితీయంగా బోధించి ‘’ మానవ కంప్యూటర్’’ అనే భావన కలిగించింది . భారతీయ కళా సంస్కృతులు ,నాటక విధానం మొదలైన వాటిపై  గెస్ట్ లెక్చర్ లను ఏర్పాటు చేసింది .’’ఓరియెంటల్ లైబ్రరి ‘’ని ,బుక్ షాప్ ను ఏర్పాటు చేసి అనేక యోగ విధానాలకు చెందిన ఎన్నో పుస్తకాలను సేకరించి అందు బాటులో ఉంచింది .కొరియా యుద్ధ సమయం లో ఒంటరి భావం లో ఉన్న మైనారిటీలకు ఇది గొప్ప ఊరట కలిగించింది .1953 నుంచి 73 వరకు ఆమె ‘’ది ఈస్ట్ –వెస్ట్ కల్చరల్ స్కూల్ ఫర్ క్రిఏటివ్లి గిఫ్టేడ్ చిల్ద్రెన్ ‘’ స్థాపించగా లాస్ ఏంజెల్స్ ,కాలి ఫోర్నియా స్కూల్ బోర్డ్ వారు పూర్తీ అంగీకారం గుర్తింపు నిచ్చాయి .’’కళా సౌందర్య (ఈస్తెటిక్స్ )విద్యా సక్తి ‘’కలిగించటమే ఈ స్కూళ్ళ లక్ష్యం .రాజ యోగా స్కూల్ ట్రైనింగ్ కు ప్రతిధ్వనిగా టై బెర్గ్ ఈ స్కూళ్ళలో విద్యార్ధులలో ‘’దైవీ భావ ‘’వ్యాప్తిని కలిగించింది .అన్ని సబ్జెక్ట్ లతోపాటు సంగీతం ,పియానో తానే బోధించింది .ఈ స్కూల్స్ లో చదివి గ్రాడ్యుయేట్ అయిన వారిని ప్రముఖ కాలేజీలలో కళ్ళకు అద్దుకొని సీట్ ఇచ్చి చేర్చుకొన్నారు .అంతటి క్వాలిటీ బెసేడ్ ఎడ్యుకేషన్ ఆమె అందించింది .ఈ విద్యార్ధులను పబ్లిక్ స్కూల్స్ లో  రెండేళ్ళ  అడ్వాన్స్డ్ క్లాస్ లలో చేర్చుకోనేవారు .అందుకే  టై బెర్గ్ స్కూల్ లో  చదివిన వారికి అదొక అద్భుత, ప్రత్యేక ,అరుదైన అవకాశం గా గుర్తుండి పోయింది .

యాభైలలోని ప్రచ్చన్న యుద్ధం (కోల్డ్ వార్ )అరవై లలో కొత్త యుగానికి (న్యు ఏజ్ )కు దారి తీసి అనేక ఏళ్ళుగా  చేస్తున్న బెర్గ్ విధానాలు సంపూర్ణంగా వికసనం చెంది పూర్తీ ఫలితాలనిచ్చాయి .’’యూని వర్సిటి కోసం నాఅన్వేషణ ‘’అనే ఆమె ప్రసంగాలు ఆమెను సొత్ లాండ్ ప్రముఖ వ్యక్తిగా నిరూపించాయి .దక్షిణ కాలిఫోర్నియా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ సంస్థ ప్రముఖ స్థానం పొందింది .అది వారం మధ్యాహ్నకాలాలో ఆడిటోరియం యోగా కేంద్రంగా ఆధునిక యోగాన్ని ప్రభావితం చేసేదిగా నడుస్తోంది .స్వామి ముక్తానంద ,సచ్చిదానంద ,చిదానంద ,రామ దాస్ ,మదర్ మీరా బాయ్, సిఖ్ ,సూఫీ ,బౌద్ధ యోగా గురువులు శ్రీలంక ,జపాన్ ,కాంబోడియాలనుండి ,ఇండియా లోని సాంస్కృతిక రాజకీయ నాయకులు వచ్చిసందర్శించి సంతృప్తి చెందేవారు .పాశ్చాత్య  మిస్టిక్ లను ,మంత్రం వేత్తలను ,జ్యోతిశ్శాస్త్ర వేత్తలను బెర్గ్ ఆహ్వానించేది . ప్రముఖ నృత్య కళాకారిణులైన రూత్ సెయింట్ డెనిస్ ,ఇందిరా దేవి లు ఇక్కడ నృత్య ప్రదర్శన చేశారు .ఈ వేదిక అమెరికా ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా భాసించింది .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-16 –ఉయ్యూరు   ,,

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17

— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17

35- అమెరికా యోగిని  జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1

జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన  లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ కి ప్రపంచాధ్యక్షురాలు  కేధరిన్  టి౦గ్లి లోమా లాండ్ ను 1898 లో స్థాపించింది  .దీనికి జూడిత్ తలిదంద్రులైన  డేనిష్ ఫిలసాఫికల్ దంపతులు మార్జోరి ,ఓలఫ్ టై బెర్గ్ లు సహాయ సహకారాలు అందించారు .1900 లో  టింగ్లి ‘’రాజ యోగ స్కూల్ ‘’నుస్థాపించింది .ఆస్కూల్ లో  సర్వోన్నత భావనలైన సత్యం న్యాయం విజ్ఞానం విద్యార్ధులకు గొప్పగా బోధించి ఆదర్శ వంతులుగా తీర్చి దిద్దేవారు .బాల్యం నుండి టై బెర్గ్ కు ఆధ్యాత్మిక భావ జాలం ఎక్కువగా ఉండి శ్రద్ధగా నేర్చుకోనేది .మేడం టింగ్లి ఈమెను తన అసలైన రాజయోగినులలో ఒకరు అని మెచ్చుకోనేది .1942 వరకు ఆమె అక్కడే చదివి నేర్చి జీవించింది .అప్పుడే ఆమెకు ప్రముఖ ఓరియెంటలిస్ట్ లు వాల్టర్ ఇవాన్స్ వెంజ్ ,పాల్  బ్రంటన్ లతో పరిచయ మేర్పడింది .

ఫిలసాఫికల్ యూని వర్సిటీలో చదివి జూడిత్  హయ్యర్ మాధమటిక్స్,లాటిన్ గ్రీక్ హీబ్రు జర్మన్ డచ్ ,ఫ్రెంచ్ ,డానిష్ స్వీడిష్ భాషలలో బి ఏ  డిగ్రీని ,ఓరియెంటల్ ధాట్ ,ముఖ్య విషయంగా మతం ఫిలాసఫీ లలో ఎం ఏ డిగ్రీ సాధించింది . సేక్రేడ్ స్క్రిప్చర్స్ .,అండ్ యేన్షేంట్ సివిలిజేషన్ లలో బి .ధే,ఎం .ధే.లను బైబిల్ ,కబ్బాల కోణం లో చదివి అందుకొన్నది .1930 లో సంస్కృతాన్ని గోటిఫ్రైడ్ డి పరూకర్  శిష్యరికం లో చదివి సంస్కృతం లో పి .హెచ్. డి.పొందింది .అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ మెంబర్ అయింది . టీన్ ఏజ్ లోనే రాజ యోగ స్కూల్ లో విద్యాబోధన చేసింది .1932 నుండి 35 వరకు అసిస్టంట్ ప్రిన్సిపాల్ గా పని చేసి 1940  లో సంస్కృత  ,ఓరియెంటల్ శాఖ కు ముఖ్యాదిపతి అయింది .1935 నుండి 45దియసాఫికల్ యూని వర్సిటి   డీన్ఆఫ్ స్టడీస్  గా ,ట్రస్టీ గా సేవలందించింది .దియసాఫికల్ ఫోరం మేగ జైన్ కు 1930 నుంచే అనేక విలువైన వ్యాసాలను రాసి నిర్వహించింది .అందులో ఆమె రాసిన ‘’సేక్రేడ్ టెక్స్ట్ ఆఫ్ ది గుప్త విద్య ‘’అనే వ్యాసం బాగా ఆకర్షించింది .అలాగే ‘’పాసిబిలిటీస్ ఆఫ్ కలియుగ ,హిందూయిజం అండ్ బుద్ధిజం  వేర్ ఆర్ యువర్ హాంట్ ఆఫ్ కాన్షస్ నెస్  కూడా   ప్రసిద్ధి చెందాయి .డీ పరూకర్ సారధ్యం లో గ్రీకు చైనీఎస్ కబ్బాలిస్టు జోరాస్ట్రియన్ ,హిందూ ,బుద్ధిష్ట్ గ్రంధాలలో  దియాసఫీ ,డ్రాయింగ్  ఆధ్యాత్మిక శబ్ద జాలం పై  నిఘంటు నిర్మాణానికి జూడిత్ సహకరించింది .అందులో టైబెర్గ్ 2 వేల పదాలను  సమకూర్చింది.

మొదటి సంస్కృత రచనలు

టై బెర్గ్ ఋగ్వేదం నుండి ‘’హైమ్స్ టు ది ఆరిజిన్ ఆఫ్ దివరల్డ్ ‘’ ముందుగా రాసింది .1946 లో చార్లెస్ జాన్స్టన్ అనువాద రచన  ‘’Crest jewel of Wisdom ‘’ ‘’(వివేక చూడామణి )ను వరుస క్రమం లో అమర్చి ముందుమాట రాసి తన సంపాదకత్వం లో వెలువరించింది .’’విస్డం రెలిజియన్ ‘’కు సంస్కృత కీ రాసింది .ఇందులో మత ,దియసఫికల్ తంత్ర శాస్త్రాలలోని 50 0 సంస్కృత పదాలను సేకరించి కూర్చింది .ఇదే ఆమె సంస్కృత సాహిత్య మందిర నిర్మాణానికి శంకు స్థాపన గా నిలిచింది .అంతవరకూ ఇండియా తో సహా ప్రపంచం లోని మరే దేశం లోనూ ఎవ్వరూ కూడా జూడిత్ లాగా సంస్కృతాన్ని లీనో టైప్ చేసిన వారు లేరు .దియసాఫికల్ యూని వర్సిటి ప్రెస్ లో చీఫ్ లీనో టైప్ ఆపరేటర్ జాఫ్రి బాబోర్కా తో కలిసి ప్రాచీన దేవనాగర లిపి కి మొదటి సారిగా కీ బోర్డ్ తయారు చేసింది .దీనికోసం కొన్ని డజన్ల మాత్రికలు (మాట్రిక్స్ ) ఉపయోగించింది .సంస్కృత పదాలలో ఆధ్యాత్మిక అర్ధం గోచరిస్తుంది.మానవ మనస్తత్వ పరిణామంగా ప్రపంచ స్థితిని వ్యక్త పరచేవిగా ఉంటె   వీటి ఇంగ్లీష్ పదాలు   తప్పుడు అర్ధం లో మూఢత్వాన్ని సూచి౦ చేవిగా అసలైన అర్ధాన్ని తెలియ జేసేవిగా ఉండవు .1941 లో టై బెర్గ్ తన లీనో టైప్ తో ‘’ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ‘’మొదటి ముద్రణ చేసింది .ఇది 1851 లో జేమ్స్ బాల౦టైన్ తయారుచేసిన గ్రామర్ కు ఇది రివిజన్ .దీన్నిలోవా స్టేట్ యూని వర్సిటి కి చెందిన లారెన్స్ ఏ వేర్ తో కలిసి రూపొందించింది .జీవితకాలం దీన్ని మూడు సార్లు మార్పులు చేర్పులూ చేసి 1950 ,1961 ,1977 లలో ప్రచురించింది .

శ్రీ అరవి౦దులతో సమావేశం

19 4 6 లో కాలిఫోర్నియా దియసాఫికల్ సొసైటీలో అభిప్రాయ భేదాలు రావటం తో జూడిత్ డీన్ ,ట్రస్టీ పదవులకు  రాజీనామా  చేసింది . దక్షిణ కాలిఫోర్నియా యూని వర్సిటిలో కొంతకాలం బోధన చేసి  కాలిఫోర్నియా లోని గ్లెండేల్ లో సంస్కృత కేంద్రాన్నీ ,బుక్ షాప్ ను ప్రారంభించింది .దీనిలో భారతీయ ఫిలాసఫీ ,మతం భాషలు ,సంస్కృతులను బోధించింది .యూని వర్సిటీలలో ,వివిధ సంస్థలలో ఉపన్యాసాలిస్తూ తన గౌరవాన్ని ,వివిధ భాషా వేత్తలతో పరిచయాలను బాగా పెంచుకొన్నది .1946 లో ఇండియాలోని బెనారస్ యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా ఉన్న  డా సర్వేపల్లి రాధాకృష్ణన్ అమృత గంగా ప్రవాహ ఉపన్యాసాన్ని సదరన్ కాలి ఫోర్నియా లో విని ,ప్రభావితురాలై బెనారస్ హిందూ యూని వర్సిటి లో సంస్కృత రిసెర్చ్ స్కాలర్ గా చేరటానికి దరఖాస్తుపంపుతూ ‘’సంస్కృత భాషలోని మహోన్నతః వేదాంత మత  విషయాలను వ్యాప్తి చేయటానికి ,ఈ భావనలతో పాశ్చాత్యుల  ఫిలాసఫీ పై అసలైన,సంపూర్ణమైన   దివ్య కాంతి ప్రసరింప జేయటానికి జీవిత మంతా త్యాగం చేస్తాను ‘’అని తెలియ బరచింది  .తన కొద్ది జీతం ,లెక్చర్ల వలన సంపాదించిన కొంచెం సొమ్ము తో అతి సాధారణ జీవన విధానం తో  ‘’  నిస్వార్ధంగా పనిలోనే అభి వృద్ధి ఉందని నమ్మి ముందుకు సాగే వారికి  సహాయం తప్పక  లభిస్తుంది ‘’అని నమ్మి ముందడుగు వేసింది .బెనారస్ యూని వర్సిటిలోని  ‘’ఓరియెంటల్ విభాగం ‘’లో మూడేళ్ళ స్కాలర్షిప్ తో పాటు ‘’ఆలిండియా ఆర్య ధర్మసేవా సంఘం ‘’లో గౌరవ సభ్యత్వం కూడా లభించింది .

1947 జూన్ లో బెనారస్ యూని వర్సిటి లో చేరి ,ఎం ఏ .కు ‘’ వేద మత మంత్రాల ‘’ను ధిసీస్ విషయంగా ఎంచుకోన్నది .మానవాళి అత్యున్నత పవిత్ర గ్రంధాలపై 25 ఏళ్ళ అధ్యయనం ,17 ఏళ్ళ సంస్క్రుతాధ్యయనం చేసిన టై బెర్గ్ కు వేద ప్రాచీనత ,ప్రామాన్యతపై ఇంకా తెలియాల్సిన లోతైనమహత్తర  విషయాలెన్నో ఉండి పోయాయని ,వేదాలపై పాశ్చాత్యుల అభి ప్రాయాలన్నీ ‘’నాన్సెన్స్ ‘’అనీ అన్నది .కాని ఆమె తీసుకొన్న విషయానికి మార్గ దర్శకం చేసే వారెవరూ ఆసమయం లో లభించకపోవటం వలన పాపం ఆమె పరిశోధన అంశాన్నే మార్చుకోమని సలహా ఇచ్చింది బెనారస్ హిందూ యూని వర్సిటి .

ఈ విషయం తెలిసినప్రొఫెసర్ అరవింద బసు ఆమెను కారిడార్ లోకి తీసుకొని వెళ్లి ఆమెతో ఆమెకు మార్గ దర్శకత్వం చేయగల మహితాత్ముడున్నాడని ,అప్పటికి ఇంకా ప్రచురింపబడని ,వ్రాత ప్రతిగానే ఉన్నఅప్పటికే  విప్లవ రాజకీయాలనుండి విరమించుకొని ,అనేక మార్మిక భావాల ప్రభావితుడై పాండి చేరిలో ఆశ్రమం స్థాపించి ఉంటున్న  శ్రీ అరవిందుల రచన ‘’ది సీక్రెట్స్  ఆఫ్ వేద ‘’ను ఆమె కిచ్చాడు .ఆ రాత్రి అంతా దాన్ని తదేక దీక్షతో చదివి జూడిత్ టై బెర్గ్ మర్నాడు ఉదయం బసు ను కలిసి ‘’సత్యాన్వేషణ లో నాకు సరైన మార్గమే లభించి,నా జీవిత ధ్యేయం నెరవేర బోతోంది ‘’అన్నది. ఆయన సలహాపై అరవిందుల దర్శనానికి అనుమతి కోరుతూ జాబు రాసింది .

పాండిచేరి అరవిందాశ్రమం నుండి ఆమెను రెండు నెలలు ఆశ్రమం లో గడపటానికి అనుమతి రాగా 1947 శరదృతువు కాలం లో వెళ్లి నవంబర్ 24 న అరవిందుల నాలుగు రోజుల ఏకాంత వాస దీక్షా విరమణ రోజులలో ఆయన దర్శనం చేసి అక్కడే అందరి చేత’’ మదర్ ‘’ అని పిలువడే ఫ్రెంచ్ దేశీయురాలు మిర్రా ఆల్ఫస్సా తో పరిచయం పొంది,ఆధ్యాత్మిక అనుభూతికి లోనై తనలో ఏదో విద్యుత్ శక్తి ప్రవహించి ‘దైవత్వ భావన ‘’కలిగింది .అప్పుడే ‘’నా ఆత్మ స్వరూపం ఏమిటో తెలిసింది ‘’అని చెప్పింది .రహస్యంగా మదర్ ను కలిసి తనకు ఆధ్యాత్మిక నామం ప్రసాదించమని కోరగా అరవిందులు అనుగ్రహించి ‘’జ్యోతి ప్రియ ‘’(కాంతి ప్రేమికురాలు )నామం ప్రసాదించారు

బెనారస్ తిరిగి వచ్చి తన చదువు కోన సాగిస్తూ సంస్కృత హిందీ పాళీ ,గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు వేదం లోని వేదాంత విషయాలు ఆధునిక భారతీయ ఆలోచనలు పై ఎం ఏ కోర్సు చదివి,1949 మార్చి లో ‘’భారతీయ మతం ,తత్వ శాస్త్రం ‘’లో ఫస్ట్ క్లాస్ ఎం ఏ డిగ్రీ పొందింది  .ఈ విషయం మాతారవి౦దులకు కృతజ్ఞతా పూర్వక లేఖ రాసి తెలియ జేసింది .

ఎందరో భారతీయ తత్వ వేత్తలు ,యోగ మాస్టర్లు టైబెర్గ్ కున్న భారతీయ భావాలకు అవగాహనకు ,భారతీయ సంస్కృతిపై ఉన్న మక్కువకు ముక్కున వేలేసుకొని ఆశ్చర్య పోయి హృదయ పూర్వకం గా అభినందించారు .మహాత్మా గాంధి ,మౌలానా ఆజాద్ ,జి గోకక్ ,బి ఎల్ ఆత్రేయ ,ఆనందమయి మా ,రమణ మహర్షి శ్రీ రామ దాస్ ,కృష్ణ ప్రేమ ,అరవిందాశ్రమం లో కపాలి స్వామి ఇంద్ర సేన్, శిసిర్ మిత్ర ,పృథ్వి సింగ్ ,స్వాతంత్ర సమార యోధులు నళినీ కాంత గుప్త ,ఏ బి పురాని వంటి ప్రముఖులు ఎందరో జూడిత్ నుమనస్పూర్తిగా ప్రశంసించి ఆశీర్వదించారు .ఆమె అరుణాశ్రమం వెళ్లి రమణ మహర్షిని దర్శించి ఒక వార౦ అక్కడ ఉన్నది .మహర్షి ఆమెతో ‘’నీకు ఇది వరకే అంతా తెలుసు అని నీకు తెలియదు ‘’అన్నారు .స్వామి శివానంద తో ఆమె కు ఆధ్యాత్మిక సత్సంబంధ ఉంది .ఆయన ప్రేరణతో 1948 లో జరిగిన ‘’వరల్డ్ యూని వర్సిటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ‘’కు భారత దేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .రాధాకృష్ణన్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టడీస్ యూనియన్ ‘’కుమొదతిఅధ్యక్షు రాలై ఆయన చేత ‘’అంతర్జాతీయ అవగాహనకు జూడిత్ అసలైన శక్తి ‘’అని ప్రశంస పొందింది .ప్రొఫెసర్ టి ఆర్ వి మూర్తి ‘’నువ్వే ఇప్పుడు ప్రాచ్య పాశ్చాత్య .ఆధ్యాత్మిక భావ సమైక్యాన్ని సాధించగల సర్వ సమర్దు రాలవు అనే నమ్మకం కలిగింది ‘’అన్నాడు .

1949 శిశిరం లోమళ్ళీ పాండిచేరి వెళ్లి ఆరునెలలు అరవిందుని అంతే వాసినిగా ఉన్నది .ఇండియాలో ఉన్న  రెండేళ్ళ కాలం లో అమెరికాలోఉన్న  ఆధ్యాత్మిక అన్వేషకులతో  ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉంది .కొందరు దీన్ని యోగాకు విరుద్ధం అని విమర్శించగా మదర్ ను సలహా అడిగింది .’’నీ లాంటి వారు ప్రజలతో కలిసి పని చేయక పోతే  భగవానుని దైవీ భావనలు ఎలా వ్యాప్తి చెందుతాయి ?’అయినా నువ్వు చాలాకాలం క్రితమే నీ మార్గాన్ని ఎంచుకొన్నావు ‘’అని సమాదానమిచ్చింది మదర్  .1950  ఫిబ్రవరి 21 న చివరి సారిగా శ్రీ అరవి౦దులను దర్శించి తన అనుభవాన్నిఈ విధంగా రికార్డ్ చేసింది  ‘’ Vast deep calm with a mighty wisdom … his consciousness seemed infinite … such currents!”[27]  

     ‘Inline image 1          సశేషం

    

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18-10-16 –ఉయ్యూరు   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైత లక్ష్మణ కన్నుమూత

Inline image 2


దైత లక్ష్మణ  కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా సుపరిచితులైన లక్ష్మణ శాస్ర్తీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు శాస్త్రంలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందారు. అనంతరం డిఎస్సీ పట్టా కూడా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు. భౌతికశాస్త్ర పరిశోధనలపై దేశ విదేశీ విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చారు. లెక్కలేనన్ని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎన్నో పుస్తకాలు రచించారు. స్వామి వివేకానంద ప్రవచనాలకు ప్రభావితులైన లక్ష్మణశాస్ర్తీ హిందూ కళాశాల ప్రాంగణంలో వివేకానందుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈడేపల్లిలో ‘మధువిహార్’ సంస్థను స్థాపించి యువతకు ఉచితంగా సంగీతం, కూచిపూడి నాట్యం, కుట్టు, అల్లికలు, కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇప్పించేవారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షులు ధన్వంతరి ఆచార్య తదితరులు లక్ష్మణశాస్ర్తీ భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం

సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం

సరసభారతి ,రోటరీ క్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో నేను రచించిన 14 వ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న 22 వ పుస్తకం ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(4 82  మందిసంస్కృత కవుల జీవిత, సాహిత్య పరామర్శ )డిసెంబర్ 4 వ తేదీ (4-12-16 )ఆదివారం మధ్యాహ్నం 3 -30 గంటలకు ఉయ్యూరు రోటరీ క్లబ్  ఆడిటోరియం నందు జరుగును . ఈ గ్రంధాన్ని మా తలి దండ్రులు కీ శే  విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి, కీ శే .శ్రీమతి భవానమ్మ దంపతులకు అంకిత మిస్తున్నాం .గ్రంథ ప్రాయోజకులు శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ). .దీనికి ముందుమాటలు డాశ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి -రిటైర్డ్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్-పొన్నూరు రాశారు .
  ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని గ్రంధా విష్కరణ చేస్తారు .
,విజయవాడమేరీ స్టెల్లా కాలేజీ సంస్కృత ఆచార్యులు డా. శ్రీ ధూళిపాళ రామ కృష్ణ, గౌరవ అతిధిగా ,,కాశీ విశ్వ విద్యాలయం సంస్కృత ప్రొఫెసర్ డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి విశిష్ట అతిధిగా విచ్చేస్తారు
మాననీయ అతిధులుగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గార్లు ,
,ఆత్మీయఅతిధులుగా ఉత్కళ యూని వర్సి తర్క శాస్త్ర ప్రొఫెసర్ డాశ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డా శ్రీ జి వి .పూర్ణ చంద్  ,రమ్య భారతి సంపాదకులు శ్రీచలపాక ప్రకాష్   మొదలైన పెద్దలు  పాల్గొంటారు . . .
  ఆవిష్కరణకు ముందు ”గీర్వాణ వైభవం ”(సంస్కృత సంస్కృతీ )శీర్షిక పై జిల్లా లోని ప్రముఖ కవుల చేత కవి సమ్మేళనం నిర్వ హింప బడుతుంది .
 సాహిత్యాభి లాషులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం నవంబర్ రెండవ వారం లో అందజేయ బడుతుంది .
జోశ్యుల శ్యామలాదేవి , మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు మరియు             కార్య దర్శి               కోశాధికారి        అధ్యక్షులు -సరస భారతి
 రోటరీ క్లబ్ అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంస్కరణ శీలి వితరణ శీలిస్వర్గీయ శ్రీ కోలాచలం వెంకట రావు (బళ్ళారి )పై నా రేడియో టాక్ 15-10-16

k-venktrao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16

33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి

6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత  విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు అమెరికాలో సంస్కృత పీఠం పై ఆచార్యుడుగా ఉన్న ఏకైక విద్వాంసుడు సాలిస్బరి .తరువాత అది ప్రొఫెసర్ షిప్ ఫర్ సాంస్క్రిట్ అండ్ కిన్ద్రేడ్  లాంగ్వేజెస్ ‘’ ,అనే ప్రత్యెక డిపార్ట్ మెంట్ గా ఏర్పడి విలియం ద్వైట్ విట్నీమొదటి అధిపతి అయ్యాడు.1863  నుండి  66 వరకు మళ్ళీ ,1873 నుంచి 1880 వరకు  అమెరికన్ ఓరిఎంటల్  సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .

పారిస్ ఏషియాటిక్ సొసైటీ కి, కనెక్టికట్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కూ మెంబర్ గా ఉన్నాడు .జర్మన్ ఓరిఎంటల్ సొసైటీకి , అమెరికన్  యాంటి క్వేరియన్ సొసైటీ కి మెంబర్ గా 1861 లో ఎన్నికయ్యాడు .ఆయనకు ఏల్ యూని వర్సిటి 1869 లోను ,హార్వర్డ్ యూని వర్సిటి 1886 లోను గౌరవ  ఎల్ ఎల్ డి నిచ్చి సత్కరించాయి .

Inline image 1

34-డచ్ –కెనెడియన్ స్కాలర్ –రాబర్ట్ జే .జిడెన్ బాస్

1957 లో కెనడాలోని టోరేంటోలో జన్మించిన రాబర్ట్ జే జిడేన్ బాస్ డచ్ కెనెడియన్ స్కాలర్ ఇండియన్ ఫిలాసఫీ ,ద్రవిడియన్ స్టడీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొంది ,నెదర్ లాండ్స్ లోని యూట్రెక్ట్    యూవర్సిటి నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించి ,సౌత్ ఆసియా ఇన్ స్టి ట్యూట్ లో ,జర్మనీలోని హీడెల్ బెర్గ్ యూని వర్సిటి లలో ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ రెలిజియన్స్ చదివాడు .హీల్డల్ బెర్గ్ వర్సిటిలో సంస్కృతం బోధించి ,తర్వాత ఇండియాలో మద్రాస్ యూని వర్సిటిలో జైనం బోధించాడు .తరువాత కెనడాలోని టోరేంటో యూని వర్సిటిలో సంస్కృతం, బౌద్ధం, దక్షిణాసియా భాషలు బోధనా చేశాడు .సమకాలీన కన్నడ ఫిక్షన్ పై డాక్టోరల్ దిసీస్ రాసిన మొట్ట మొదటి వెస్ట్రన్ స్కాలర్ రాబర్ట్ జిడేన్ బాస్.

కోఎన్రాడ్ ఎలిస్ట్ ,,యెన్ ఎస్ రాజా రాం లు ప్రచారం చేసిన’’ ఆర్యన్ ఇన్వేజన్ దీరీ ;’’ని పూర్తిగా వ్యతిరేకించాడు .అమెరికన్ ఓరి ఎంటల్ సొసైటీ జర్నల్ కు చాలా విలువైన వ్యాసాలు రాశాడు .కన్నడ సాహిత్యం పై సంపూర్ణ పాశ్చాత్య చరిత్ర ను రాశాడు. కన్నడ సాహిత్యాన్ని జర్మన్ ,ఇంగ్లీష్ భాషలలోకి అనువదించాడు .సంస్కృతం లో ఉన్న ద్వైత వీరశివ, జైన రచనలను ఆంగ్లం లోకి తర్జుమా చేశాడు .దాదాపు 20 ఏళ్ళ నుండి కర్ణాటకలోని మైసూర్ లో ఉంటున్నాడు ‘

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-16 –ఉయ్యూరు

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్జికల్ దసరా సరదా

సర్జికల్ దసరా సరదా

Inline image 1

ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా !మోడీ నవాబ్ షరీఫ్ మీద సేక్సికల్ ఆపరేషన్ చేశాడని అందరూ కోడై కూస్తుంటే ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు ‘’?అన్నాడు  .తెల్లబోయా .సేక్సికల్  ఆపరేషన్  ఏమిటో అని గాబరా పడ్డాను .కాసేపు వితర్కిన్చుకొని ‘’ఒరే ఫూలా !అది సర్జికల్ ఆపరేషన్ .దానికీ సెక్స్ కూ ఏమీ సంబంధం లేదు .సగం సగం విని వచ్చి నోటికొచ్చింది కూసి చివాట్లు తింటావు ‘’అన్నాను .’’ఏదో అదే అయి ఉంటుంది .ఎందుకు చేశాడు బావా ?అడిగాడు .’’మన సరిహద్దు దాటి పాక్ ఉగ్ర వాదులు అర్ధ రాత్రి మనమీద బాంబు లేసి మన జవాన్లను చంపి పారిపోయారు .ఊరు కొంటె ఇంతే అవుతుందని సైన్యం మనమేమిటో ,మనసత్తా ఏమిటో చూపించ టానికి అకస్మాత్తుగా వాళ్ళున్న ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రముఠాను చంపి పబ్లిగ్గా  మన వాళ్ళు  చేసిన సాంపిల్ ఆపరేషన్ నే సర్జికల్ ఆపరేషన్ అన్నారు .అంటే శస్త్ర చికిత్స . దుస్టాంగాన్ని ఖండించి ,శేషాంగాన్ని కాపాడటం అన్నమాట .’’అబ్బే వాళ్ళు మా మీదికి రానూ లేదు ,సరిహద్దు దాటనూ లేదు  మా వాళ్ళు అసలు ఎవరూ చావనూ లేదు ‘’అని బుకాయి౦ఛా డటగా నవాబ్ షరీఫ్ ‘’బామ్మర్ది ప్రశ్న .’’అరె నీకూ విషయాలు తెలుసు  నన్ను ఎందుకు మళ్ళీ వాయించటం ‘’అన్నాన్నేను .’’తెలుసనుకో బా .నీ నోటి నుంచి వింటే క్లియర్ కట్ గా ఉంటుందని నా ఏడుపు ‘’అన్నాడు .’’నిజమే .కాని వాళ్ళ సైనికాధికారి  నాలుగు రోజులక్రితం మన సర్జికల్ ఆపరేషన్ నూటికి రెండువందల శాతం నిజంగా జరిగిందని చెప్పేశాడు .పాక్ మీడియా  అంతకు ముందే చానళ్ళలో అన్నీ స్పష్టంగా చూపింది .మన దేశం లోనూ లెఫ్ట్ పార్టీలు ,వాళ్ళ తోక రాహుల్ కూడా పాక్ కే వంత పాడినా సోనియా నిక్కచ్చిగా మోడీని అభి నంది౦చి౦ది .’’అన్నాను .

‘’మన రాజకీయ నాయకులూ ఇలాంటి ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు కదా బావా ‘’?బ్రహ్మం మళ్ళీ ప్రశ్న .’’అవున్రా .కె సి ఆర్ జిల్లాలు పెంచటానికి సర్జికల్ ఆపరేషన్ చేస్తున్నాడు .అది అతి రహస్యం .ఏ జిల్లా పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలీని పరిస్థితి .అక్కడ మామా అల్లుడు కొడుకు కూతుళ్ళకు తప్ప బ్రహ్మ దేవుడికి కూడా ఆఆపరేషన్  రహస్యం తెలియదు ‘’అన్నా .’’మరి బాబు ఏమీ ఆపరేషన్ చేయటం లేదా “మరో లకోటా ప్రశ్న .’నెలకు మూడు సార్లు ధిల్లీ చుట్టూ తిరిగి శాలువాలు బొకేలతో ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసినా బిగుసుకు కూర్చున్న కేంద్రాన్ని ‘’మీతో కటీఫ్ ‘’అని సర్జికల్ ఆపరేషన్ చేశాడుకనుకనే ప్రతి పత్తి పక్కకు పెట్టి ‘’పాకేజీ అంటూ ఏదో ప్రకటించారు కదా .దీనికీ రఘువీర జగన్ లు వీరంగం వేశారు కాని ప్రస్తుత పరిస్తితులలో అంత కంటే ఊరట ఉండదుఅని బాబూ సర్దుకోవాల్సి వచ్చింది .’’చెప్పాను .’’సరే బావా ! చంద్ర బాబు ఎప్పుడూ టెలి కాన్ఫరెన్స్ లంటూ హడా విడి చేస్తాడు .వాళ్లకు విసుగు అని పించదా’’మళ్ళీ ప్రశ్న దాడి .’’కనకనే  ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు ,ఆఫీసర్లు హాయిగా సైలెంట్ గా నిద్ర అనే సర్జికల్  ఆపరేషన్ లో ఉంటున్నారని వీడియో క్లిప్పింగ్ లు ,పేపర్లు చూపిస్తున్నాయి .రుద్దుడు ఎక్కువైతే బోర్ కొట్టదా .కొంతకాలమైనా వాళ్ళు ఆలోచించుకొని పని చేయాలి కదా .ఎప్పుడూ కొరడా ఝపిస్తే తిరుగుబాటు సర్జికల్ ఆపరేషనో,సైలెంట్ నిద్ర ఆపరేష నే  ఫలితం అవుతుంది  .’’అన్నాను .’’ఎన్ని విషయాలు నీకడుపులో ఉన్నాయి బావా ‘’అన్నాడు అరగుండు బ్రహ్మానందం లాంటి మా బామ్మర్ది బ్రహ్మం .

‘’జగన్ సంగతేమిటి “”?మరో ప్రశ్న సంధించాడు .’’ఇమడలేక పోతున్నాడు .అయిన దానికీ కాని దానికి నిరశన ,వాకౌట్ ,బూతుల సర్జికల్ ఆపరేషన్ నిరంతరం చేస్తూనే ఉన్నాడు కదా .కావలి౦తల ముద్దుల ఆపరేషన్ లో దిట్ట ,పలకరింపుల ,ఓదార్పులసర్జికల్ ఆపరేషన్  సెంచరి పూర్తీ చేశాడు .కాని ఆపరేషన్  సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి అతనిది ‘’అన్నాను .’’బావా క్రికెట్ —‘’అన్నాడు నెమ్మదిగా .’’దానిదేమున్దిరా .కోహ్లీ వచ్చాక సెంచరీల సర్జికలపరేషణ్ తో క్లీన్ స్వీప్ విజయాలిస్తున్నాడు కదరా ‘’అన్నా.’’అడగచ్చో లేదో తెలీదుకాని తమిళ నాడు సంగతేంది బావా ?’’’’ఏముంది రా .ఆవిడకు ఆరోగ్యం బాగా లేకపోతే ,హాస్పిటల్ లో చేరి చికిత్స చేయి౦చు కొంటుంటే కళ్ళ జోడు ముసలాయన విమర్శల సర్జికల్ ఆపరేషన్ మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్థితి కుదుట బడింది .’’చెప్పా . ‘’బావా !అమరావతి నిర్మాణం ఆపరేషన్ సంగతేమిటి ?’’మరో బాణం .’’ప్లాన్ల మీద ప్లాన్లు మారుస్తున్నారు .అయినా పట్టు వదలని విక్రమాదిత్యుడు బాబు ‘’అల్టిమేటం అనే సర్జికల్ ఆపరేషన్ చేయగానే అందరూ బిలబిల మంటూ వచ్చి చేరి పని చేసుకొంటున్నారు .పిల్లి మెత్తనిదైతే ఎలుక ఏదో చేసిందని సామెత తెలుసుగా నీకు “.అన్నాను .’’చివరగా దసరా విషయం చెప్పు బావా ?’’అడిగాడు ఫైనల్ గా .’’ఒక రకం గా దసరా మామూలు అనే సర్జికల్ ఆప రేషన్ చేసే జేబుకు చిల్లి పడేసే జనం తగ్గి పోయారు ఈ సేవా మీ సేవా లవలన.అడిగే వాడూ లేడూ ఇచ్చే వాడూ లేక దసరా దేవాలయాలలో భక్తుల దర్శన సర్జికల్ ,అమ్మవారి అలంకార ఆపరేషన్ లతో మూడు పూలు ఆరు కాయలలాగా వర్ధిల్లు తోంది .’’అన్నాను .వెళ్ళొస్తా బావా ‘’అంటూ తుర్రుమన్నాడు బామ్మర్ది బ్రహ్మ౦.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

రామదాసుతో రామయ్య సొద

రామదాసుతో రామయ్య సొద

భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు అర్ధం కావటం లేదు . ఆయన కాళ్ళ నుండి బాష్పధార కారి పోతోంది .పరవశం అనుకోన్నారందరూ .కాని ఆయన కనులు ,మనసు శూన్యంగా ఉన్నాయి .ఏభావమూ కదలాడ లేదు .భగవంతుడికి భక్తుడి కి మధ్య ఏదో పెద్ద అగాధం  ఏర్పడింది .ఒక గంట నిశ్శబ్దమే తాండవం చేసి౦ది ఇద్దరి మధ్యా  .తర్వాత స్వామి కనులలో ఏదో ఆజ్న కనిపించి,తనను రామదాస మందిరానికి రమ్మన్న సూచన అర్ధమై ,వడి వడి అడుగులతో నిమిషం లో అక్కడికి చేరి నిలిచాడు .భక్తుడు తన భావన గ్రహించి వచ్చాడని సంతోష పడ్డాడు భగవంతుడు .ప్రసన్నం చేసుకొందామని’’పలుకే బంగార మాయేనా –కోదండ పాణి –పిలిచినా పలుకవేమి –కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి ‘’అన్న కీర్తన పాడి, వెంటనే    ‘’అంతా రామమయం ఈ జగమంతా రామమయం ‘’పాడాడు .పులకించి పలకరిస్తాడనుకొన్నస్వామి అప్రసన్నంగా ‘’ఈ పొగడ్తలకేమి దాసూ ! ఇస్టం వచ్చినట్లు కీర్తనల పేరుతో  నన్ను నీ ఇష్టం వచ్చినట్లు దులిపేశావు .కస్టాలు నీకేనా ?లోకం లో ఇంకెవరికీ లేవా ?ఆ మాత్ర౦ అర్ధం చేసుకోలేవా ?నీకస్టాల చిట్టా విప్పి,వాటికి నేనే కారణం అన్నట్లు చేతిలో కలం ఉందికదా రాసి పారేశావు .అదేమిటీ ! ‘’అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము –నెయ్యెడగానగనయ్యా ‘’ అంటావా ?అంత అన్యాయం నేనేం చేశానయ్యా నీకు ? అంతా స్వయ౦కృతాపరాధమే నీది .పైగా నన్ను దానికి దుయ్యబడతావు .భలే జాణ తనం నేర్చావయ్యా దాసూ !’’అనగానే అవాక్కయ్యాడు రాం దాసు .’’అది కాదు రామయ్యా ! పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇతడు ‘’అని కీర్తించాను కదయ్యా !నా మీద సొడ్డు వేస్తున్నావేం రామా ! ‘’అన్నాడు కొంచెం నత్తురు నత్తురు మంటూ . .’’చాలు చాలుకాని –‘’ఉన్నాడో లేడో భద్రాద్రి యందు –ఆకొని  నేనుచేకొని వేడితే రాకున్నాడయ్యయ్యో ‘’ ‘’అని లోకం లో నా మీద అనుమానం కలిగిస్తావా ?గుడికట్టి ప్రతిష్టించింది నువ్వు. ఉత్సవాలు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహి౦ఛి  వేలాది భక్తులను రప్పించింది నువ్వు .నీకే అనుమానం వస్తే నాపరువేం కాను ‘’?దబాయించాడు రామయ్య. ‘’స్వామీ !నన్ను పూర్తిగా అపార్ధం చేసుకొన్నారు .నేరం మోపుతున్నది మీరే .’’’’ఎంతో మహానుభావుడవు –ఎంతో చక్కని దేవుడవు ‘’అని పోగిడాను కదా రామ చంద్రా !’’’—’ఏదో గిల్లి జోలపాడినట్లుంది నీవైఖరి .కప్పి పుచ్చటం బాగా అలవాటైంది నీకు భక్త రామదాసూ !’’కొంచెం కోపం తో అంటించాడు స్వామి .అల్లల్లాడి పోయాడు రామ చరణ దాసు .’’అన్నిటికి అన్నీ చెబుతున్నావు దాసూ !’’ఇక్ష్వాకు కుల తిలకా !ఇకనైనా బలుకవా ‘’అని బాగానే ఎత్తుకొని ‘’ఆ ప్రాకారమునకు బట్టే పది వేల వరహాలు ,భరతునకు జేయిస్తి పచ్చల పతకము అంటూ శత్రుఘ్నుని మొలత్రాడుకు  పది వేల వరహాలు ,లక్ష్మణుని ముత్యాలపతకానికి మరో పది వేలు  ,సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి ఇంకో పది వేలు ఖర్చు చేశానని గొప్పలు చెప్పుకోన్నావు.అసలు నిన్ను ఎవడు చేయించమన్నాడు వీటిని ?.ప్రభుత్వ సొమ్ము అంటే అంత చులకనా ?మంచినీళ్ళు లాగా ఖర్చు చేసి మా మీద నింద వేస్తావా ?పైగా ‘’సర్కారు సొమ్ము తృణంగా భావించ వద్దు ‘’అని నాకే శ్రీరంగ నీతులు –అదే లేవయ్యా భద్రాద్రి నీతులు చెబుతావా ?గడుసు పిండానివయ్యా దాసూ ! పోనీ అంతటితో ఆగావా ? నేను కలికితురాయి పెట్టుకొని కులుకుతున్నానని ,పైగా నీ బాబు చేయించాడా నీ మామ చేయించాడా ?.’’అని వీరంగం వేస్తావా ? ఇది చాలక ‘’అబ్బా తిట్టితి నని ఆయాస పడవద్దు ‘’అని జాలిం లోషన్ రాస్తావా ?‘’ అని  కొంచెం ఘాటుగానే అన్నాడు భద్రాద్రి రాముడు .కాని భద్రాద్రి రామ దాసు మొహం మాడిపోయింది .స్వామి ఎదుట దోషిగానిలబడి పోయాడు .అయినా ధైర్యం కొంచెం తెచ్చుకొని’’అయ్యా !దెబ్బలకోర్వక తిట్టితి నయ్యా ‘’అని చెంప లేసుకొన్నా గా రామ ప్రభూ.నిన్ను పూజించినట్టి చేతుల నిదిగోకట్ట బెట్టి రెటు తాళుదు నయ్యా’’   అని బతిమి లాడుకొన్నాను గదా స్వామీ ‘’అన్నాడు వేడుకొంటూ .

ఏది చెప్పినా రామస్వామి అపార్ధం చేసుకొంటున్నాడను కొని ‘’సీతా రామ స్వామీ నే జేసిన నేరంబేమి ?ఖ్యాతిగా నీ పద పంకజములు నే ప్రీతిగ దలపక భేద మెంచితినా “’అని లంకించుకొన్నాడు .’’చాల్చాల్చాల్లేవయ్యా దాసయ్యా!ఎత్తు కోవటం బాగానే ఎత్తు కున్నావ్ తర్వాత ఏమన్నావ్ ? ‘’రంగుగా నాపది వేళ్ళకు రత్నపు టు౦గరములు నిన్నడిగితినా ‘’అంటూ మొదలెట్టి  నీబంగారు  శాలువాలు ,పాగాలు అంగీలు నడికట్లు ముత్యాల సరాలు ,నవ రత్నాల హేమ కిరీటం  ,మురుగులు గొలుసులు,సరి గజ్జెలు ,గజ తురగాలు,   అడిగానా  ,ప్రభుత్వం ఇమ్మన్నానా ?దాన కంకణం ,మేలిమి మొలనూలు అడిగానా ?అని మరీ చింతకాయ దులుపుడు దులిపెశావు  .కలలో నన్నా నిన్ను వీటిని అడిగానా ఎప్పుడైనా భక్త స్వామీ !ఏదో నర్మ గర్భం గానో ,నిందా స్తుతో,వ్యాజ స్తుతో అను కోవటానికి వీల్లేకుండా సూటిగా మాటల ఈటెలతో నా గుండె గాయం చేశావు .నా కీర్తి ప్రతిష్టలు ‘’గోదాట్లో ‘’కలిపేసి ,సాటి దేవుళ్లలో నన్ను తలవంచు కోనేట్లు చేశావ్ .ఇదేం తెంపరి తనమయ్యా .అన్నీ ఇస్తే కట్టుకొని ,పెట్టుకొని కులుకుదామనే ! అన్నీ నీ కిచ్చేసి నేను దిగంబరంగా దిసి మొలతో ఊరేగాలనా నీ భావం ?ఎంత ఆశయ్యా రామదాసయ్యా నీకు ? పోనీ అప్పుడెప్పుడో తానీషా కాలం లో ప్రభుత్వ ఖజానా నీ జమానా అనుకోని గుట్టు చప్పుడుకాకుండా ఖర్చు చేసి నాకు గుడికట్టించి ,ఆభరణాలు చేయించి ,జామా ఖర్చులు చెప్పనందుకు బందిదిఖానాలో ఉండి  చువ్వలు లెక్క పెట్టలేక నన్ను కీర్తిస్తూ తిడుతూ ,నీలో నువ్వు పాడుకోన్నావు బాగానే ఉంది.ఏదోలే భక్తుని ఆర్తి అని సరిపెట్టుకున్నాను .కాని ఇన్ని వందల ఏళ్ళు అయినా దాన్ని మర్చిపోకుండా మీ వాళ్ళు సినిమాలు తీసి ,నిన్ను నాయకుడిని చేసి నన్ను విలన్ చేసి ,కీరవాణి తో స్వరాలు కట్టించి కమ్మగా పాడించి ,దేశ విదేశాలలో కూడా నన్ను నీ పాటల ద్వారా ఆడి పోసుకొంటున్నారు కదయ్యా .పైగా బాలమురళి ప్రతికచేరీలో నీ పాటలే పాడి మరీ రక్తికట్టిస్తున్నాడు .నీకు కీర్తి ,నాకు అపకీర్తి .ఇదేం బాగా లేదు రాం దాసూ ‘’అన్నాడు గుక్క తిప్పుకోకుండా రామ స్వామి .

ఇంకా రామస్వామి ప్రసన్నం కానందుకు నొచ్చుకొని భక్త స్వామి ‘’రాముడే గలడు నా పాలి శ్రీ రాముడే గలడు-రాముడార్త విరాముడా భావ భీముడానంద  ధాముడు ‘’అని కీర్తన పాడాడు .చలనం లేదు .’’భజరే మానస రామం –భజరే జగదభిరామం –అవనత జలజ భావేంద్రం ,అగణిత గుణ సాంద్రం –మానసరుచికరదేహం –రూప మదన శత కోటిం-శ్యామ సజలధర శ్యామం –సాంబ శివానుగత రామం –భద్రాచల నివాసం –పరిపాలిత శ్రీ రామ దాసం ‘’అని రామదాసూ గుక్క తిప్పుకోకుండా కీర్తించాడు .ఊహు –మార్పు లేదు స్వామి ముఖం లో .ఇంకా గంభీర ముద్రలోనే ఉన్నాడు .

‘’ఏమయ్యా దాసూ !నేను నీ కంటికి ఆనటం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా  .ఆడవాళ్ళ తో చెప్పిస్తే వింటానని భ్రమలో ఉన్నట్లున్నావు .అలా అయితే సీతా పరిత్యాగం ఎందుకు చేస్తాను ?అగ్ని ప్రవేశం చేయమని ఎందుకు కోరుతాను ?.అంత మరీ కొంగు చాటు కృష్ణుడి నను కొన్నావా ?  నాదగ్గర సిఫార్సులు చెల్లవని తీలీదా నీకు? .నంగ నాచి కబుర్లు చెబుతున్నావు.’’నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి –నారీశిరోమణి ,జనకుని కూతురా జనని జానకమ్మా ‘’అని అటు నుంచి నరుక్కొద్దామనుకొన్నావా?’’పోనీ మగాళ్ళకంటే   ఆడవాళ్ళు జాలి గుండె కలవాళ్ళు అనుకొందాం ,కాని ‘’ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు –చక్కగ మరు కేళి సొక్కు చుండెడి వేళ-ఏకాంతం లో ఏక శయ్య నుండేడి వేళ’’ సీత నీ గురించి నాకు చెప్పాలా ?’’–ఆ పని తప్పఇంకో పనీ ,ఆలోచన ‘’లేని వేళ మరీగుర్తుంచుకొని నీ గొడవ చెప్పాలా ? ఎంత స్వార్ధం రామదాసూ నీది ?మా ఏకాంతం ,దా౦పత్య సౌఖ్యం వదిలి ,పానకం లో పుడక లాగా నీ బాధ మాకు అడ్డు కావాలా ?ఎంత పక్షపాతం నీకు ?  .ఇంత మంది భక్తుల్ని చూశానుకాని’’  నీదంతా– అదో మాదిరి ‘’.’’అన్నాడు కొంచెం కనికరంగా .

‘’నా తప్పులన్నీ క్షమి యించుమీ  -జగన్నాధ నీవాడ రక్షించుమీ –పాతకుడని ఎంచక పోషించు దాత వనుచు నీ పదములే నమ్మితి –నా యెడ నేరమెంచక హితమున ద్వేషములెంచకు –మ్రొక్కెద ‘’అని పాడాడు . స్వామి మోము నెమ్మదిగా జీరో కాండిల్ నుంచి థౌసంద్ కాండిల్ వెలుగు సంతరించుకొన్నది .అమ్మయ్యా అనుకొన్నాడు భక్త రామదాసు .

‘’ బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా’’ అంటూ

‘’ మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా
అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా
సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా
బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా ..మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా
న్యాయములేక నే నటునిటు దిరుగను నారదుండ గాను రామా
ఆయము చెడి హరి నిను గని కొలువను నర్జునుండ గాను రామా
దాయాదుండని మదిలో మురియను దశరథుడను గాను రామా బి..

గరిమతోడ మాసీతను గాచిన గొప్పలు నే వింటి రామా
పరగ భద్రగిరి శిఖరనివాసా పర బల సంహార రామా
నరహరి నను రక్షింపుమయా శ్రీనారాయణరూపా రామా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు విడువ రామా ‘’

అని పూర్తీ చేసిఆపసోపాలు పడుతూ  ఆపాడు .అప్పుడు రామసామి ‘’రామదాసూ !అందుకే నయ్యా త్యాగయ్య గారు నీ  కీర్తనలంటే పరవశించి పోయేవారు .ఆయనకు స్పూర్తి నీవే నని చెప్పుకొనేవారు .’’అన్నాడు .భక్తుడు పరవశి౦చాడు మ్ ‘వెంటనే

వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం
త్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యం
హేయాహేయా ద్వంద్వ హీనంపర
మేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం..

నానాశాస్త్రైర్వేదకంబైః ప్రతిపాద్యం
నిత్యానందం నిర్విషయాజ్ఞ మనాదిం
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం
వందే రామం మరకతవర్ణం మధురేశం వం..

అని గీర్వాణ గానాన్ని చేశాడు .మందస్మిత వదనార వి౦దుడైన రామయ్య రామ దాసుకు సుమనోజ్నంగా సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చాడు .

హరిహరిరామ నన్నరమర చూడకు
నిరతము నీ నామస్మరణ ఏమరను ..
దశరథనందన దశముఖమర్దన
పశుపతిరంజన పాపవిమోచన ..
మణిమయభూషణ మంజులభాషణ
రణజయభీషణ రఘుకులపోషణ
పతితపావననామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసునేలుమా రామ

 

అంటూ మరో కీర్తనతో రామదాసు రామస్వామిని కీర్తించాడు .మానసానందం పొందిన రామయ్య ‘’రామ దాసూ !నీ మంగళ గీతం నాకు మహా నచ్చుతు౦దయ్యా  .ఒక్క సారి పాడవా నా కోసం .?అడిగాడు .’’స్వామీ ! నీ అజ్ఞ అని –

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం రా..

:కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాదివినుత సద్వరాయ మంగళం రా..చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం రా..లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలదసదృశ దేహాయ చారు మంగళం రా..దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్యమంగళం రా..పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజవాహనాయ అతులమంగళం రా..విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ
సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా..రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా..

Inline image 1 Inline image 2

‘’ఏమండీ !ఆరై పోయింది  భక్తి రంజని వస్తోంది లేవండి .’’అని నిద్ర లేపింది మ శ్రీమతి .అప్పడే బాలమురళి రేడియోలో ‘’సీతా రామస్వామీ !నే చేసిన నేరమదేమి ‘’అంటూ పాడుతున్న రామ దాసు కీర్తన వినిపిస్తోంది .

మహర్నవమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15

31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్

జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట   ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ ప్రొఫెసర్ .అయ్యాడు .యూని వర్సిటియే ఎం ఏ డిగ్రీ ఇచ్చి 1879 లో లండన్ కింగ్స్ కాలేజి లో సంస్కృత ,పర్షియన్ భాషల ప్రొఫెసర్ ను చేసింది .1880 నుంచి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో ఓరియెంటల్ భాషల లెక్చరర్ అయ్యాడు. 1888 లో బలియల్  కాలేజి ఫెలో అయి ,అనారోగ్యం వలన 24-6-1909 న రిజైన్ చేశాడు బెంగాల్ ,అస్సామీ సమారిటన్ భాషలకు వ్యాకరణవిషయాలు  రాశాడు .రిటైర్ మెంట్ తర్వాత ఫీలిక్స్ టో లో నివసించాడు The Times, he was described as “a celebrated scholar and teacher of the Indian languages, classical and vernacular, and the author of several educational works”, who had worked for many years to help teach probationers members of the Indian Civil Service studying at Oxford.[5]

 

32 –సన్యాసాశ్రమ ధర్మ రచన చేసిన   –పాట్రిక్ ఆల్విల్లి

శ్రీ లంకలో పుట్టి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి 1972 లో  బి ఏ ఆనర్స్ పాసై ,సంస్కృత పాళీ,ఇతర భారతీయ భాషాధ్యయనం  ధామస్ బర్రో ,ఆర్ సి జేనర్ లవద్ద  చేసి ,పెన్సిల్వేనియా యూని వర్సిటి నుండి1974 లో  పి హెచ్ డి పొంది , యాదవ ప్రకాశుని ‘’యతి ధర్మ ప్రకాశిక ‘’పై దిసీస్ సమర్పించాడు .1974 నుండి 1991 వరకు బ్లూమింగ్టన్ లోని  ఇండియన్ యూని వర్సిటిలో రిలిజియస్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో బోధించాడు .ఆయన అనువదించిన రచనలు –సన్యాస ఉపనిషత్ ,ఎర్లి ఉపనిషడ్స్ ,ధర్మ సూత్రాస్ ,పంచ తంత్ర ,బిట్వీన్ ది ఎంపైర్ సొసైటీ అండ్ ఇండియా ,ది లా కోడ్ ఆఫ్ విష్ణు ,ధర్మ స్టడీస్ ఇన్ ఇట్స్ సమాటిక్ ,లాంగ్వేజ్ టెక్ష్ట్స్ అండ్ సొసైటీ ఎక్ష్ప్లొ రేషన్ ఇన్ అన్శేంట్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియన్ , Ascetics అండ్ బ్రాహ్మిన్స్ స్టడీస్ ఇన్  ఐడియాలజీస్ అండ్ ఇన్ స్టి ట్యూషన్స్’మొదలైనవి

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-10-16 –ఉయ్యూరు .

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్


శుభ దేవ దూత
26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో ప్రసిద్ధ పామీ కుటుంబానికి చెందింది .తండ్రి ఆ గ్రామ పెద్ద కాకపోయినా చిన్నారి రాణి అందరికీ అల్లారు ముద్దు బిడ్డ గా ఎదిగింది .గైదిన్లూ అంటే శుభ వార్త తెచ్చే దూత అని అర్ధం .చిన్నతనం నుంచే అసాధారణ తెలివి తేటలను ,నైపుణ్యాన్ని ప్రదర్శించేది .ఎవరికి భయపడని స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెది .బాల్యం నుండి ఆధ్యాత్మికత అలవడి మహాత్మ్యాలు చూపటం ప్రారంభించింది .ఏపనైనా ధైర్య సాహసాలతో స్వంత ఆలోచనతో చేసేది .అక్కయ్యలకంటే అన్నిటా ముందుకు దూసుకు పోయి ,ఆగ్రామ బాలికలకు నాయకురాలైంది .
మలుపు
ఆమె జీవితం ఒక ముఖ్య సంఘటన తో మలుపు తిరిగింది .అ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో తన పోలికలే ఉన్న దేవత కనిపించింది .ఆ దేవత జీలియంగ్రా౦గ్ దేవతా సమూహం లో బిష్ణు దేవుని కుమార్తె అని గ్రహించింది .దేవతకు ,గైదిన్లూ కు మంచి స్నేహమేర్పడింది .గైదిన్లూ తలిదండ్రులు తమకుమార్తె షమాన్ పూజారిణిగా మారిపోతుందని భావించారు .తర్వాత మణిపూర్ రాజకీయ ఏజెంట్ జే సి హిగ్గిన్స్ ఆమె ను’’మైబి ‘’.అంటే మందుల అమ్మాయి గా ప్రచారం చేశాడు. కాని మందుల వ్యక్తీ మైబా కంటే జడోనాంగ్ఎంత గొప్పవాడో, అలాగే మైబి కంటే గైదిన్లూ అంత గొప్పది . ,

.ఒక రోజు కలలో జడోనాంగ్ కనిపిస్తే ఆయనే తన భవిష్యత్ గురువు అని తెలుసుకొని,ఆయనను కలుసుకోవటానికి ,వెతుక్కుంటూ కంబిరాన్ కు వెళ్ళింది .1926 నుండి -27వరకు ఈ గురు శిష్య సంబంధం జడోనాంగ్ ,గైదిన్లూ మధ్య నడిచింది .గైదిన్లూ లో దైవిక లక్షణాలున్నాయని ఆయన గ్రహించాడు . జడోనాంగ్ సాగిస్తున్న ఉద్యమం లో స్వచ్చందంగా గైదిన్లూ చేరి పని చేయటం ప్రారంభించింది .

కొద్దికాలం లోనే ఆమె జడోనాంగ్ కు అతినమ్మకమైన అనుచరురాలైంది .తన స్వగ్రామం నుంగ్ కావు లో తారాంగ్ కాయ్ దేవాలయ ఉత్సవాలు బహు శ్రద్ధగా నిర్వహిస్తూ ,ప్రజలందరూ పాల్గొని పూజించటానికి ఒక ప్రార్ధనా మందిరాన్ని నిర్మించి సమర్పించింది .వారికి టింగ్ కవ్ రగ్వాంగ్ అనబడే టింగ్ వాంగ్ సర్వోత్తమ దైవం .జెలియన్ గ్రాంగ్ మతం లో సంస్కరణలను చేయటం ప్రారంభించింది .మతం లో ఉన్న నిషేధాలను తొలగించేట్లు చేసింది .

అందరుకలిసి సామూహికంగా దైవ ప్రార్ధన చేసుకోవటం పాటలు పాడటం నృత్యాలు చేయటం వంటి వాటికి మంచి అవకాశాలు కల్పించింది.వీటిని గురువైన హైపో జడోనాంగ్ పూర్తిగా సమర్ధించి ఆమె పక్షాన నిలిచాడు .అసలే పేదరికం లో అలమటిస్తున్న ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం చూపిస్తున్న అణచివేత దమనకాండను ఆమె తిరస్కరించింది .గురువు ఆశీర్వాద బలం తో ప్రజలందర్నీ సమీకరించి వారికి ధైర్య సాహసాలు చొరవ అన్యాయాన్ని ఎదిరించటంలో సాహసాలను నేర్పింది .మత పరమైన సంస్కరణల వలన వారందరూ బాగా దగ్గరయ్యారు .

బిష్ణు దేవుని గుహ సందర్శనకు చివరి సామూహిక యాత్రలో ఉండగా ఆమెకు తన భవిష్యత్ పోరాటం అర్ధమైంది .గురువు జడో నాంగ్ కు సంస్కరణలతో కూడిన కొత్త మతం పై ఆలోచన వచ్చి శిష్యురాలు గైదిన్లూ కు తెలియ జేయగానే ఆమె దానిని వెంటనే అనుసరించింది .అస్సాం పోలీసులు లఖిపూర్ లో జడో గాంగ్ గురువును అరెస్ట్ చేయగానే ఆయనకు మరణం సమీపిస్తోందని గ్రహించింది .తెలివిగా పోలీసుల కళ్ళు కప్పి కొండలపైకి వెళ్లి దాక్కుంది .
అస్సాం లోని కచార్ జిల్లా డిప్యూటీ కమీషనర్ సి గిమ్సన్ జడో నాంగ్ గురువును అరెస్ట్ చేసి ,మణిపూర్ లో పొలిటికల్ ఏజెంట్ అయిన హిగ్గిన్స్ కు అప్పగించాడు .అస్సాం రైఫిల్స్ కాలమ్స్ బృందం తో జిరిఘాట్ ,నుండి నుంగ్ కావ్,తామేలాంగ్ మీదుగా ఇంఫాల్ దాకా పెద్ద ఊరేగింపు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది .13-3-1931 న జరిగిన ఈ మార్చ్ సందర్భంగా హిగ్గిన్స్ కు ఎస్ డి వో .ఎస్ జే .డంకన్ కు,నాలుగవ అస్సాం రైఫిల్స్ మేజర్ బుల్ ఫీల్డ్ 17 ఏళ్ళ గైదిన్లూను గుర్తించారు .ఆమె గ్రహించి జీలాండ్ లేక్ ఫారెస్ట్ ఏరియాకు పారిపోయి దాక్కుంది ..ఆమె వెంట కొందరు బాలికలతోసహా 40 మంది అనుచరులున్నారు .

అడవులలో ,కొండలమీదా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత వాసం చేస్తూ జడో నాంగ్ గురువు పై ఇంఫాల్ కోర్ట్ లో జరుగుతున్ననేర విచారణ విషయమై ఆరా తీస్తూనే ఉంది.జడోనాంగ్ గురువు నిరపరాధి అని, ఆయనకు ఏ హత్య తోనూ సంబంధం లేదని పూర్తిగా నమ్మింది .29-9-1931 న విచారణ పూర్తి అయి జదోనాంగ్ ను ఉరితీశారు .గురువు మరణ వార్త విన్నగైదిన్లూ వెంటనే ప్రజా సమీకరణ చేసి నాయకత్వ బాధ్యతలను తీసుకొన్నది .అసలైన నాగా విప్లవం జడోనాంగ్ మరణం తర్వాతనే ప్రారంభమైందని నాయకత్వం వహించిన గైదిన్లూ పోరాటపటిమ త్యాగం , బ్రిటిష్ వారి ఉక్కు పాదం కింద నలిగి అణగారి పోయిన నాగా జాతి జరుపుతున్న పోరాటం పరాకాష్టకు చేరిందని చరిత్రకారులు రాశారు .అంతకాలం తమ హక్కులకై పోరాటం చేసిన నాగా ప్రజలు జడోనాంగ్ అరెస్ట్ ,ఉరితీతలకు భయపడి పోయి ,బ్రిటిష్ దౌర్జన్యాలకు తలఒగ్గి అసలు జడోనాంగ్ తమ నాయకుడే కాదన్నారు ఆవూరి ప్రజలు .ఇప్పుడు పోరాట భారమంతా గైదిన్లూ మీదనే పడింది .
సాంఘిక మతోద్యమం
రాజకీయాలతోపాటు సాంఘిక మత సంస్కరణల పైనా రాణి గైదిన్లూ దృష్టిపెట్టింది .జేమీ ,లింగమై రాంగ్, మీ అనే మూడు తెగల నాగాలను సమైక్య పరచటమే ఆమె ధ్యేయంగా ముందుకు సాగింది .పరంపరగా వస్తున్న నాగ జాతి సంస్కృతీ వారసత్వాలను పరిరక్షించుకోవాలనే దృఢమైన సంకల్పంతో ,ఏ మత౦తోనూ సంబంధం పెట్టుకోకుండా ఉద్యమించింది .చివరికి హెరాకా అనే కొత్త మతాన్ని ఏర్పాటు చేసింది .
రాజకీయ ఉద్యమం
గురువు జాడో నాంగ్ ఫిలాసఫీ అయిన ‘’నాగా జాతి వారే పాలకులు ‘’అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసింది. జోడా నాంగ్ కు మహాత్మా గాంధి సహాయ నిరాకరణ ఉద్యమం ,భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం బాగా తెలుసు ..కాని రాణి గైదిన్లూ మాత్రమే గాంధీ విధానాలను తన రాజకీయ ప్రచారానికి బాగా ఉపయోగించుకొన్నది .తన అనుచరులకు ఆమె ‘’ భారత దేశానికి ’గాంధీ అనే కొత్త రాజువచ్చి పరిపాలిస్తాడు ‘’అని ఉద్బోధించింది .జడో నాంగ్ గాంధీ రాజు అవుతాడు అని రాసిన పాటనుబాగా ప్రచారం చేసింది .
జెలియన్ గ్రాంగ్ విప్లవం
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గైదిన్లూ విప్లవ శంఖం పూరించి విప్లవ నాయకురాలై ,అస్సాం ,మణిపూర్ లలోని జెలియన్ గ్రాంగ్ ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించమని పిలుపునిచ్చింది .ఉద్యమాన్నిమణిపూర్ వాయవ్య భాగం లోని తామేన్ గ్లాంగ్ లోను , నాగా కొండల జిల్లాలో ,అస్సాం లోని ఉత్తర కచార్ కొండ జిల్లాలలోను తీవ్రతరం చేసింది .పరిస్థితి చేయి జారిపోతోందని భావించిన అస్సాం కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్ అస్సాం రైఫిల్స్ దళంను ఆమెకు వ్యతిరేకంగా సైనిక చర్యకు ఆజ్ఞలను జారీచేశాడు .నాగా హిల్స్ డిప్యూటీ కమీషనర్ జే .పి .మిల్స్ కు సైనిక చర్య బాధ్యతను అప్పగించాడు .ఆయనకు సహాయం గా 3,4 దళాల అస్సాం రైఫిల్స్ వారిని , నార్త్ కచార్ హిల్స్ ఎస్ .డి .వో .,మణిపూర్ రాష్ట్ర అధికారుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పాడు .గైదిన్లను అరెస్ట్ చేసినవారికి రెండు వందల రూపాయల పారితోషికం మణిపూర్ స్టేట్ దర్బార్ ప్రకటించింది .దీన్ని తర్వాత అయిదు వందలకు పెంచింది .
హాన్ గ్రు౦ పోరాటం
విప్లవ కారిణి గైదిన్లకు సహాయపడిన వారికి తీవ్రమైన శిక్ష విధిస్తామని మణిపూర్ ప్రభుత్వం హెచ్చరించింది ఎన్నో గ్రామాలను ప్రభుత్వం తగలబెట్టించింది .1932 ఫిబ్రవరి 16న నార్త్ కచార్ హిల్స్ వద్ద అస్సాం రైఫిల్స్ సిపాయిలు ,విప్లవకారులపై పెద్ద ఎన్ కౌంటర్ జరిపి యువ విప్లవ కారి గైదిన్లను అరెస్ట్ చేశారు ,1932 మార్చి లో పట్టపగలే నాగా ప్రజలు పెద్ద ఎత్తున హాన్ గ్రుం లోని అస్సాం రైఫిల్స్అవుట్ పోస్ట్ పై తీవ్రమైన దాడి చేశారు .పాపం నాగ ప్రజల ఆయుధాలు డాలు బల్లాలే అవటం తో రైఫిల్స్ ముందు నిలువలేకపోయారు .అవుట్ పోస్ట్ వారు నాగాలపై కాల్పులు జరుపగ గాయపడ్డారు .తర్వాత వెనక్కి వెళ్లి పోయారు .ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లు జీమె యుద్ధవీరులు ఎనిమిది మంది చనిపోయారు , ఈ దాడిలో నాగా హిల్స్ లోని బోపంగ్ వామి గ్రామం భస్మీపటలమైంది .
పూల్వాలో అరెస్ట్
1932 అక్టోబర్ లో రాణి గైదిన్లూ ,పూల్వా(పోలోమి)గ్రామానికి చేరి ,అక్కడ కొయ్యతో కోట కట్టించటంమొదలుపెట్టింది .రాబోయే రెండు నెలలు చాలా క్లిష్టమైనవి అని తానో, బ్రిటిష్ వాళ్ళో ఎవరో ఒకరు విజేతలు అవుతామని అనుచరులకు చెప్పింది.తన సైన్యానికి అస్సాం రైఫిల్స్ కు తుది పోరుకు సన్నద్ధమైంది .ఈ లోగా డిప్యూటీ కమిషనర్ జే .పి మిల్స్ ,కెప్టెన్ మాక్డోనాల్డ్   ఆధ్వర్యం లో బలమైన అస్సాం రైఫిల్స్ దళాన్ని ,హర్ బాలా ను తోడిచ్చి దానికి సాయంగా పూల్వా పంపాడు . రాణీ కోట ఇంకా పూర్తికాలేదు ,విప్లవ వీరులు పూర్తిగా అప్రమత్తంగానూ లేరు .1932 అక్టోబర్ 17 తెల్లవారుజామున పూల్వా గ్రామం పై కెప్టెన్ మాక్డోనాల్డ్ సైన్యం తో హఠాత్తుగా విరుచుకుపడ్డాడు .అవాక్కైన విప్లవ దళం ఎదిరించే స్థోమతలేక  డీలాపడి లొంగిపోయింది యువ రాణిని ఒక ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి కొహిమాకు తీసుకువెళ్లి ఇంఫాల్ లో విచారణ జరిపారు .
బ్రిటిష్ జైళ్లలో నిర్బంధం
పొలిటికల్ ఏజెంట్ హిగ్గిన్స్ ఆమెకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు . గైదిన్లూ ఒక ఏడాది గౌహతి ,ఆరేళ్ళు షిల్లాంగ్ ,మూడేళ్ళు ఐజ్వాల్ ,నాలుగేళ్ళు గారోహిల్స్ లోని తురాలో మొత్తం 14 ఏళ్ళు బ్రిటిష్ జైళ్లలోశిక్ష అనుభవించింది.గైదిన్లూ శిక్ష గైదిన్లూకంటే విపరీతంగా ప్రజల్లో వ్యాప్తిచెంది ప్రసిద్ధి పొందింది .ఆమె సాగించిన పోరాటాన్ని ఆపకుండా అనుచరులు చాలా ఏళ్ళు కొన సాగించారు .
నెహ్రూ –రాణి గైదిన్లూ
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జవహర్ లాల్ నెహ్రు 1937లో అస్సాం వచ్చినప్పుడు షిల్లాంగ్ జైలులో ఉన్న యువనాగ కన్య గైదిన్లూ విప్లవ పోరాటపటిమ తెలుసుకొని బ్రిటిష్ వారి దౌష్ట్యానికి బలైపోతున్న ఈయువ నారీ కిశోరం పై విపరీతమైన సానుభూతి ప్రదర్శించాడు .ఆమె పోరాటం పై ఆయన హిందూస్తాన్ టైమ్స్ లో వ్యాసం రాస్తూ ఆమెను ‘’రాణి ‘’అని కీర్తించాడు అప్పటి నుంచి ఆమెను’’ రాణి గైదిన్లూ’’ అంటున్నారు .1937 లో దేశం లో చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలోకి వచ్చాయి .ఆమెను విడిపించటానికి నెహ్రు విశ్వ ప్రయత్నం చేశాడు .కాని మణిపూర్ బ్రిటిష్ ప్రావిన్స్ లో లేకపోవటం తో ఏమీ చేయలేకపోయాడు .

బ్రిటిష్ లేడీ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ అయిన ఆస్టర్ దృష్టికి ఈమె విషయం తెచ్చాడు .ఆమె సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు ఈ విషయం తెలియ జేస్తే ఆయన గైదిన్లూ ఆమె ఇప్పటికీ మణిపూర్ లో బలమైన నాయకురాలని ,ఆమెను విడుదల చేస్తే మణిపూర్ అస్సాంలలో శాంతికి భగ్నం కలుగుతుందని విడుదలకు తిరస్కరించాడు .దీనిపై నెహ్రు స్పందిస్తూ ఆమె యవ్వనం అంతా బ్రిటిష్ జైళ్లలో మగ్గి మసిబారి పోయిందని ,ఇంత చిన్నవయసులో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించిన ఆమె సాహసాన్నిబ్రిటిష్ ప్రభుత్వం ఓర్వలేక హింసిస్తోందని అన్నాడు .
స్వాతంత్ర్యానంతరం విముక్తి
1947 లో నెహ్రు భారత దేశ తాత్కాలిక ప్రధానిగా ఉన్నప్పుడు మిసెస్ జోన్స్ అనే బ్రిటిష్ వనిత ఒత్తిడి చేయటం వలన రాణి గైదిన్లూ ను తురా జైలు నుంచి విడుదల చేశారు .ఆమెను మణిపూర్ వెళ్ళటానికి వీలు లేదని ఆంక్ష పెట్టగా ఆమె పూర్వపు నాగా హిల్స్ జిల్లా లోని మొక్కాచుంగ్ దగ్గరున్న ఇమ్రాప్ గ్రామలో ఉన్నది .అయిదేళ్ళ తర్వాత 1952 లో ఆమెను మణిపూర్ రాష్ట్రం లోకి అనుమతించారు .అక్కడ తామేన్ గ్లాంగ్ హెడ్ క్వార్టర్స్ లో స్థిరపడి ప్రశాంత జీవనం సాగించింది .నెహ్రూ ను ఆయన కుమార్తె ఇందిరా గాంధీని 1958 లో స్వయంగా వెళ్లి కలిసింది .మణిపూర్ నాగాలాండ్ నార్త్ కచార్ లలోని తన ప్రజల ఆర్ధిక సాంఘిక అభి వృద్ధికి కృషి చేసింది .
నాగా తిరుగు బాటు దార్ల తో విభేదం
1956 లో ఏ జడ్.ఫిజో నాయకత్వాన నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడి తిరుగుబాటు చేశారు .రాణి గైదిన్లూ ,ఆమె మత మైన హెరాకా జనం పై దాడి జరిపి ఆమెను అగౌరవపరచి ,ఆమెపై పుకార్లు వ్యాపింప జేశారు .1960 లో ఆమె అనుయాయులు ఆమెతో సహా అడవులలోకి వెళ్లి వెయ్యి మంది జనంతో నాలుగు వందల రైఫిల్స్ తో ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పరచి తమ మత విశ్వాసాలను రక్షించుకొందామని ఆమెకు నచ్చచెప్పారు .సరేనని మళ్ళీ నాయకత్వం చేబట్టింది. ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తిరుగుబాటుదారుకాదని , భారత జాతీయతపై ఆమెకు విశ్వాసం ఉందని దేశ ద్రోహికాదని ,నాగా నాయకురాలని అర్ధం చేసుకొన్నది .మణిపూర్ ,నాగాలాండ్ ప్రభుత్వాలు ఆమెను బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపొమ్మని పిలుపు నిచ్చాయి .
మళ్ళీ జనజీవన స్రవంతిలోకి
ప్రభుత్వాల పిలుపును గౌరవించి రాణి తన సైన్యం తో సహా బయటికి వచ్చి 1966 జనవరి లో కోహిమాలో స్థిరపడింది .ఆమె సైన్యం నాగాలాండ్ ప్రభుత్వానికి లొంగిపోయి ,తర్వాత’’ బటాలియన్ ఆఫ్ నాగాలాండ్ ఆర్మేడ్ పోలీస్’’ అని పిలువబడింది .ఆమె ఎప్పటినుంచో జీలియాన్ గ్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నుఅస్సాం నాగాలాండ్ మణిపూర్ లలోని జీం ,లింగ మాయ్,రా౦గ్ మేప్రాంతాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూనే ఉంది .ప్రధాని ఇందిరను కలిసి ఈ ప్రతిపాదన అందజేసింది. ఆవిడ ఆమె కోరిన ప్రాంత ,ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అన్నిరకాల సహకరిస్తానని హామీ ఇచ్చింది. కాని ఆమె తనగురువు హైపూ జడోనాంగ్ చిరకాల వాంఛఅయిన జీలాంగ్ ప్రజలకు ప్రత్యేక భాగం కావాలన్న అసలైన కోరికను మర్చి పోలేదు . జీన్ గ్రాంగ్ ప్రజల ఆరాధ్యదైవంగా మన్ననలు అ౦దుకొంటున్నది .కొహిమా లో ఉండగానే ఆమెను నాగా ఇంటి గ్రేటేడ్ఉద్యమ నాయకులు ఆమెను తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వమని కోరారు .ఆమె జీనియాన్ గ్రాంగ్ ప్రాంత ఏర్పాటుకే కట్టు బడి ఉంది .
ప్రభుత్వ పురస్కారం
రాణి గైదిన్లూ నాగాలాండ్ లో ఉండగా అన్ని జాతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యేది .ఆలిండియా ఫ్రీడం ఫైటర్స్ అసోసియేషన్ వారు నాగలాండ్ స్టేట్ చాప్టర్ కు ఆమెను ప్రెసిడెంట్ ను చేశారు .బ్రిటిష్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాడిన ఆమె చరిత్ర లోకవిఖ్యాతమైంది .దీనికి కేంద్ర ప్రభుత్వం 1972 లో తామ్రపత్రం అందించింది .పడమటి మణిపూర్ లో తామేన్ గ్లాంగ్ జిల్లా ఏర్పాటు చేయటం లో ,నాగా లాండ్ లో పేరెన్ జిల్లా ఏర్పాటులో ,నార్త్ కచార్ హిల్స్ లోని జీలియన్ గ్రాంగ్ ప్రజల సంరక్షణకు ,కచార్ లో రాంగ్ మీలకు నివాస భూమి సాధించటంలో ఆమె చూపిన చొరవ, ధైర్యం, ముందు, చూపు ఒప్పించే నైజం బాగా కలిసివచ్చాయి .1981 లో ఆమెను ‘’పద్మ భూషణ్’’ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది .ఆమె అనేక సాంస్కృతిక మత సంస్థలకు సన్నిహితు రాలయ్యింది .

జీనియాగ్రాంగ్  కమ్యూనిటి పునర్వ్యస్తీకరణ లో హెరాకా మత విశ్వాసం ఆమెను మరింత ఉన్నతురాలిని చేసి ,ఆ విశ్వాసులకు ఫిలాసఫర్ ,మార్గదర్శి అయింది .మాజీ శాసన సభ్యుడు యెన్. సి .జీలంగ్ అధ్యక్షుడుగా ‘’జీలియంగ్రాంగ్ హెరాకా అసోసియేషన్  ఏర్పాటు చేసింది .జాతీయ సంస్థలైన కళ్యాణ్ఆశ్రం ,విశ్వ హిందూ పరిషత్ ,విద్యా భారతి లతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి .దేశ ప్రజల మత ,సాంస్కృతిక పునర్ వైభవ ఉద్యమానికి ఊపిరుల౦దించింది భారత ప్రభుత్వం. ఆమెగౌరవార్ధం 1996 లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఇండియా ప్రభుత్వ మానవ వనరుల శాఖలోని మాతా శిశు సంరక్షణ విభాగం ప్రతి ఏడాది మహిళా సంక్షేమానికి అత్యుత్తమ సేవలందించే వారికి శక్తి పురస్కార్ పేరిట అయిదుగురు మహిళలకు అందిస్తోంది . పద్మభూషణ్ రాణి గైదిన్లూ కూ అందజేసి గౌరవించింది .ఇండియన్ ఆన్త్రో పాలజికల్ సర్వే సంస్థ ఆమెకు 1996 లో భగవాన్ బిశ్రాముండా పురస్కారం తోపాటు లక్షరూపాయల నగదు బహుమతిని అందజేసింది .దురదురదృష్టవశాత్తూ దీన్ని ఆమె మరణానంతరం ఇవ్వబడింది
జీలియన్ గ్రాంగ్ ప్రజా సంస్థ నాయకత్వం
రాణి గైదిన్లూ అధ్యక్షతన జీలియంగ్రాంగ్ ప్రజాసంస్థ ఏర్పడింది .దీని ముఖ్య ఉద్దేశ్యం భారత ప్రభుత్వం ఆప్రజలకు ప్రత్యేకజిల్లా లేక యూనిట్ లేక యూనియన్ టేర్రిటరి ఏర్పాటు చేయటం .ప్రధాని ఇందిర దీనికి సానుకూలంగా స్పందించింది .కాని 1984 లో ఇందిరాగాంధీ ఆకస్మిక మరణం రాణీకి ఆశనిపాతమే అయింది .కాని ఆమె పోరాటం ఆపలేదు .తర్వాత ప్రధాని రాజీవ్ గాంధి ఆ ప్రాంతాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అధారిటి కిందకు తెస్తానన్నాడు .స్తబ్ధత ఏర్పడి 1992 లో ,కూకి –నాగా సంఘర్షణలతో రాజకీయ కార్యక్రమాలు ముందుకు సాగలేదు .ఈలోగా రాణీకి జబ్బు చేసి కొహిమా వదలి స్వగ్రామం నుంగ్ కావూక్ కు చేరి, ఏడాది తర్వాత నుంగ్ కావో గ్రామం చేరింది .కొద్ది అస్వస్థత ఏర్పడి రాణి గైదిన్లూ 17-2-1993 న చనిపోయింది.

నాటి ప్రధాని పి. వి .నరసింహా రావు సంతాపసందేశం పంపిస్తూ ఆమెను ఈశాన్య రాష్ట్రాల అగ్రశ్రేణి స్వాతంత్ర్య సమరయోధురాలని ప్రశంసించారు .ఆమె అంత్యక్రియలకు గవర్నర్ శ్రీ చింతామణి పాణిగ్రాహి హాజరయ్యారు .దేశ వ్యాప్తంగా ఆమె మరణానికి వేలాదిప్రజలు సానుభూతి ప్రకటించారు .26-1-2015 న రాణి గైదిన్లూ శత జయంతిని భారత ప్రభుత్వం ఘనం గా నిర్వహించింది .ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జడోనాంగ్ ను  అమర వీరునిగా ,రాణి గైదిన్లూను భారత స్వాతంత్ర్యసమర యోధురాలిగా అభి వర్ణించారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————–

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14

30-  ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్  ముల్లర్

6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన  లిరిక్ పోయేట్ సంగీతా కారుడు  వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ .  మేనమామ ఫ్రీడ్రిక్ ఒక ఒపెరానాటకం లో ముఖ్య పాత్ర మాక్స్ వేషం వేసేవాడు .ఆ పేరే ముల్లర్ కు పెట్టారు .ఈ మేనమామ మేనల్లుడిని పెంపుడు కొడుకుగా తీసుకొన్నాడు .చాలా అధికారిక పత్రాలలో,  మారేజ్ సర్టిఫికే, యూని వర్సిటి రిజిస్టర్ ,,గౌరవ పత్రాలలో ,ముద్రించిన కొన్ని పుస్తకాలలో ఆయన పేరు’’ మాక్సి మిలియన్’’ అనే ఉంది.డేస్సూ లో జిమ్నేసియం లో చదివి ,తర్వాత లీప్జిగ్ నికోలాయి స్కూల్ లో చేరి మ్యూజిక్ ,క్లాసిక్స్ చదివాడు .అప్పుడే ఫెలిక్స్ మెండేల్సన్ ను తరచూ కలుసుకోనేవాడు.

లీప్జిగ్ యూని వర్సిటిలో చేరి చదవటానికి స్కాలర్ షిప్  కోసం పరీక్షలు రాసే ప్రయత్నం లో తాను అప్పటి దాకా చదివిన చదువు చాలదని గ్రహించి అతి వేగం గా లెక్కలు ,ఆధునిక భాషలు సైన్స్ లను నేర్చుకొన్నాడు. పరీక్షలు పాసై లీప్ జిగ్ యూని వర్సిటిలో 1841 లో పూర్వంచదివిన మ్యూజిక్ ,కవిత్వాలకు ఉద్వాసన చెప్పి ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకొన్నాడు .1843 లో డిగ్రీ పొంది ,స్పినోజాస్ ఎథిక్స్ పై  డేసెర్టేషన్ రాశాడు .గ్రీక్ లాటిన్ పర్షియన్ సంస్కృతం అరబిక్ భాషాధ్యయనం పై ఆసక్తి చూపాడు .

1850 లో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో మోడరన్ యూరోపియన్ లాంగ్వేజెస్ కు టేలరియన్ ప్రొఫెసర్ గా నియమింప బడ్డాడు .ధామస్ గై ఫోర్డ్ సలహాపై ఆయనకు గౌరవ ఎం. ఏ .డిగ్రీ నిచ్చి  ,ఆక్స్ ఫర్డ్ లోని క్రిస్టియన్ చర్చి కాలేజి  మెంబర్ గా కూడా తీసుకొన్నారు .1854 లో ప్రొఫెసర్ అయి ఇప్పుడు సాధికారికంగా ఎం .ఏ .ను కాన్వోకేషన్లో పొందాడు .1858 లో ఆల్ సూయిస్ కాలేజి కి లైఫ్ ఫెలో అయ్యాడు .

1860 లో సంస్కృత  బోడేన్ ప్రొఫెసర్ ఎన్నికలో పోటీ చేసి మాక్స్ ముల్లర్  మోనియర్ మోనియర్ విలియమ్స్ చేతిలో ఓడిపోయాడు .విలియమ్స్ కన్నా ఎంతో ప్రతిభా సంపన్నుడే కాని ముల్లర్ కు ఓటమి తప్పలేదు .ఇండియాపైన సరైన అవగాహన లేక పోవటం ,మత విషయం లో ఉదారంగా ఉండటం ,జర్మనీ వాడుకావటం ముల్లర్ ఓటమికి కారణాలయ్యాయి .ఈ విషయం పై తల్లికి జాబు రాస్తూ ‘’ all the best people voted for me, the Professors almost unanimously, but the vulgus profanum made the majority”.[7]’’

అని మనసులో బాధను  వెళ్ళ గక్కాడు .1868 లో ఆయన కోసమే ఏర్పాటు చేసిన కంపారటివ్ ఫైలాలజి కి మొదటి ప్రొఫెసర్ అయ్యాడు ముల్లర్ ..1875 లో రిటైర్ అయినా 28-10-1900 న చని పోయేదాకా అందులోనే పని చేశాడు .

1844 లోనే జర్మనీలో ఫ్రీడ్రిక్ స్కీలింగ్ తో కలిసి ముల్లర్ సంస్కృతం చదివాడు .స్కీలింగ్ కోసం ఉపనిషత్ లను అనువాదం చేశాడు .ఇండో యూరోపియన్ భాషాధ్యయనం చేసిన మొదటివాడైన ఫ్రాంజ్ బొప్ప వద్ద సంస్కృత౦ పై పరిశోధన చేశాడు.భాషా చరిత్రను మత చరిత్రతో ముడిపెట్టినవాడు స్కీలింగ్.అప్పుడే ముల్లర్ హితోపదేశం ను జర్మని భాషలోకి అనువదించి ప్రచురించాడు .1845 లో పారిస్ వెళ్లి యూజీన్ బర్నాఫ్ వద్ద సంస్కృతం మెరుగు పరచుకొన్నాడు  .యూజీన్ బర్నాఫ్ ముల్లర్ ను ఋగ్వేదాన్ని ఇంగ్లాండ్ లో లభ్యమైన వ్రాత ప్రతులు ఆధారం గా సంస్కృతం లో ప్రచురించమని కోరాడు  .1846 లో లండన్ వెళ్లి ఈస్ట్ ఇండియా కంపెని సేకరించిన సంస్కృత గ్రంధాలను అధ్యయనం చేశాడు .దీనితో బాటు సృజనాత్మకం గా ‘’జర్మన్ లవ్ ‘’అనే నవల రాశాడు అది బాగా ప్రసిద్ధి చెందింది .

ఈస్ట్ ఇండియా కంపెనీ ,ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి సంస్కృత విద్వాంసుల పరిచయం తో భారతీయ సంస్కృతీ పై బ్రిటన్ లో సాధికారికంగా మాట్లాడే వారిలో మాక్స్ ముల్లర్ ముఖ్యుడయ్యాడు .ఇదేసమయం లో ఇంగ్లాండ్ భారత దేశం పై సార్వ భౌమాదికారం పొందింది. దీనితోభారత ఇంగ్లాండ్ విద్వాంసుల మధ్య  అనేక క్లిష్ట సమస్యలేర్పడ్డాయి .మాక్స్ ముల్లర్ బ్రహ్మ సమాజం వారితో సన్నిహితంగా ఉండటం సమస్యను మరింత జటిలం చేసింది .ముల్లర్  సంస్కృతాధ్యయన కాలం లో సాంస్కృతిక అభివృద్ధి పైననే భాషాభి వృద్ధి జరుగుతుంది అనే అభిప్రాయం బలపడిన సమయం లో సాగింది .వేద సంస్కృతీ యూరోపియన్ క్లాసికల్ సంస్కృతి కంటే అతి ప్రాచీనమైనదిఅని ఇండో యూరోపియన్ భాషలలో సంస్కృతమే అతి ప్రాచీనమైనది అనే   అభిప్రాయం బలపడింది .

ముల్లర్ ఈ కోణం లో సంస్కృతాన్ని  ఆనాటి మేటి సంస్కృత విద్వాంసు లందరి కంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు .పాగాన్ యూరోపియన్ మతాల గురించి తెలియాలి అంటే వేద సంస్కృతిని అధ్యయనం చేయాల్సిందే అని చెప్పాడు .అందుకే ఋగ్వేదం పై అభిమానం ఎక్కువైంది. రామ కృష్ణ పరమహంస గారి వేదాంత ధోరణి పై ఆసక్తీ ఎక్కువైంది ఆయనకు .తర్వాత ఉపనిషత్ లపై అధ్యయనం చేశాడు .ఉపనిషత్ వేదాంత౦ వేదిక్ బ్రాహ్మనిజం కు ముందున్న ‘’హీనో ధిజం ‘’ నుండి ఏర్పడింది  అన్నాడు.లండన్ వెళ్లి బ్రిటిష్ ఇండియా కంపెని వద్ద ఉన్న  రుగ్వేద వ్రాత ప్రతులను 1849 నుండి 1874 వరకు  25 ఏళ్ళు పరిశోధించి ప్రచురించాడు .స్వంత గొంతుకతో ఋగ్వేదాన్ని గ్రామ ఫోన్ పై రికార్డ్ చేశాడు .దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ముల్లర్ కు డబ్బు బాగానే ముట్ట జెప్పింది ..కాని ఋగ్వేద ప్రచురణ  ముల్లర్ గొప్పతనం కాదని అంతకు ముందే జర్మన్ విద్వా౦సుడొకడు ఆపని చేశాడని ,కాని పేరు మాక్స్ ముల్లర్ కు వచ్చిందని సైంటిఫిక్ అమెరికన్ పేపర్ లో 8-12-1900 లో ప్రచురితమైనది. “Rig Veda,” was in reality not his at all. A German scholar did the work, and Muller appropriated the credit for it.” [12].

రోమా౦టిజం లో చాలా భావాలకు ముల్లర్ మద్దతు పలికాడు .ఋగ్వేద దేవతలు ప్రకృతి శక్తులే అన్నాడు .1888 లో  ముల్లర్ గ్లాస్కో యూని వర్సిటి  జిఫ్ఫోర్డ్ లెక్చరర్ అయ్యాడు .అనేక స్కాటిష్ యూనివర్సిటీలలో నాలుగేళ్ళు  ప్రసంగాలు చేశాడు .ఆయన ప్రసంగ విషయాలు –నేచురల్ రిలీజియన్ ,ఫిజికల్ రిలీజియన్ ,ఆన్త్రోపోలాజికల్ రిలీజియన్ ,దియాసఫీ ఆఫ్ సైకలాజికల్ రిలీజియన్ .1881 లో ఇమాన్యుయాల్ కాంట్స్ క్రిటిక్  ఆఫ్ ప్యూర్ రీజన్ ను అనువదించాడు .కాంట్ చెప్పిన  ట్రాన్సెండలిజం ను ఆరాధించాడు .డార్విన్ సిద్ధాంత అభివృద్ధిని వ్యతిరేకించాడు .language forms an impassable barrier between man and beast.”[17]అనేది ముల్లర్ అభిప్రాయం .

.28-5-1896 న స్వామి వివేకానంద మాక్స్ ముల్లర్ దంపతులను కలుసుకొన్నాడు The visit was really a revelation to me. That little white house, its setting in a beautiful garden, the silver-haired sage, with a face calm and benign, and forehead smooth as a child’s in spite of seventy winters, and every line in that face speaking of a deep-seated mine of spirituality somewhere behind; that noble wife, the helpmate of his life through his long and arduous task of exciting interest, overriding opposition and contempt, and at last creating a respect for the thoughts of the sages of ancient India — the trees, the flowers, the calmness, and the clear sky — all these sent me back in imagination to the glorious days of ancient India, the days of our brahmarshis and rajarshis, the days of the great vanaprasthas, the days of Arundhatis and Vasishthas. It was neither the philologist nor the scholar that I saw, but a soul that is every day realizing its oneness with the universe.

అని వివేకానంద స్వామి ఆ సంఘటనపై రాశాడు .

నేనెప్పుడో సుమారు 30 ఏళ్ళ  మన వార్తాపత్రికలోనో వీక్లీ లోనో మాక్స్ ముల్లర్ గురించి న వ్యాసం చదివా .అందులో ఆయన భారత దేశాన్ని సందర్శించ లేక పోయినందుకుగంగా స్నానం చేయ లేకపోయినందుకు  పడిన మనో వేదన చదివాను. తాను ఇక పై జన్మించే ప్రతిజన్మలోను భారత దేశం లోనే పుట్టాలని అనుకొంటున్నానని చెప్పాడని చదివాను .అంతేకాదు  తన ప్రవర ను ‘’గోతీర్ధ  నివాసినం (ఆక్స్ఫర్డ్ ) మోక్ష మూలరు భట్టారం(మాక్స్ ముల్లర్ )అని చెప్పుకొనే వాడనీ చదివాను . ’.దీన్నే పైన వివేకానంద స్వామి రాసిన మాటలు ధృవీకరిస్తున్నాయి .ముల్లర్ దంపతులు ఆయనకు వసిష్ట మహర్షి అరుంధతీ దంపతులుగా దర్శనమిచ్చారంటే ఆయన ఎంత ఉన్నతం గా భారతీయ భావ లహరి లో జీవిం చాడో తెలుస్తుంది .ఆయనలో స్వామికి ఒక బ్రహర్షి ,ఒక రాజర్షి కనిపించాడు. ఆ దంపతుల అతి నిరాడంబర జీవితం ఆయనకు వానప్రస్థాశ్రమం లో ఉన్నట్లు అనిపించింది .ఇంత కంటే మాక్స్ ముల్లర్ ను ఆవిష్కరించిన వారు లేరని పించి౦ది నాకు మాత్రం .

ముల్లర్ ను క్రిస్టియన్లు క్రైస్తవ మత  వ్యతిరేకి అన్నారు .డార్విన్ ను కాదన్నందుకు దెప్పారు .’’టురేనిజం ‘’అనే కొత్త భాషా కుటుంబాన్ని ముల్లర్ ప్రతిపాదించాడు

Turanism[edit]

Müller put forward and promoted the theory of a “Turanian” family of languages or speech, comprising the Finnic, Samoyedic, “Tataric” (Turkic), Mongolic, and Tungusiclanguages.[33][34] According to Müller these five languages were those “spoken in Asia or Europe not included under the Arian (sic) and Semitic families, with the exception perhaps of the Chinese and its dialects”. In addition, they were “nomadic languages,” in contrast to the other two families (Aryan and Semitic), which he called State or political languages.[35]

1869 ఫ్రెంచ్ అకాడెమి పురస్కారం ,1874 లో సివిల్ క్లాస్ అవార్డ్ ,1875 లో బవేరియన్ మాక్సిమిలన్ ఆర్డర్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ పురస్కారం అందుకొన్న ముల్లర్ 1896 లో ప్రీవీ కౌన్సిల్ మెంబర్ అయి విశేష గౌరవం పొందాడు .185 5 లో 32 వ ఏట బ్రిటిష్ పౌరసత్వం లభించింది .జార్జియానా అడిలైడ్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానాన్ని పొంది ఆదర్శ దాంపత్య జీవితం గడిపాడు . .1898 నుంచి ముల్లర్ ఆరోగ్యం క్షీణించటం మొదలు పెట్టింది 28-10-1900 న ఆక్స్ ఫర్డ్ లో మహా విద్వాంసుడు మాక్స్ ముల్లర్ 78 వ ఏట మరణించాడు .ఇండియా లోని గోదే సంస్థలను మాక్స్ ముల్లర్ భవనం గా మార్చారు .దాదాపు 25 ఉద్గ్రంధాలు రచించాడు .అందులో ‘’ఇంట్ర డక్షన్ టు సైన్స్ ఆఫ్ రెలిజియన్ ,హిస్టరీ ఆఫ్ ఎన్శేంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ,ఇండియా వాట్ కన్ ఇట్ ,తీచ్ అజ్ ,ఉపనిషడ్స్ ,బయాగ్రఫికల్ ఎస్సేస్ ,జర్మన్ క్లాసిక్స్ ఫ్రం ఫోర్త్ టు  నైన్ టీంత్ సెంచరి,,ది సైన్స్ ఆఫ్ థాట్ ,స్టడీస్ ఇన్ బుద్ధిజం ,సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ,మై ఆటోబయాగ్రఫీ ,మొదలైనవి ఉన్నాయి .

ఇంత చేసినా  భారత దేశం లో ముల్లర్ భావాలపై కొంత  వ్యతిరేకత ఉంది  .వేదం లోని పైకి కనిపించే అర్ధాలనే తీసుకొన్నాడుకాని లోతులకు  వెళ్ళ లేదన్నారు .క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించటానికి హిందూ మతం పై బురద చల్లాడని దానికోసం అక్కడి చర్చి పెద్దలతో చేతులు కలిపాడని అభియోగం ఉంది .దీనికి మద్దతుగా ఈ క్రింది జాబు చూపిస్తారు .అలాగే భార్యకు రాసిన ఉత్తరాన్నీ ఉటంకిస్తారు .

TO HIS WIFE, OXFORD, December 9, 1867.

“…I feel convinced, though I shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what that root is, I feel sure, the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.”

 

ముల్లర్ ఆర్య సంస్కృతీ వికసనం పై దృష్టి పెట్టి ,ఇండో యూరోపియన్ సంప్రదాయం(ఆర్య సంప్రదాయం ) ను సెమెటిక్ మతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించాడు . కొంతకాలానికి ఇవే రేసిస్ట్ పదాలుగా మారిపోవటం చూసి బాగా కలత చెందాడు .తన భావాలకు అవి చాలా దూరం అన్నాడు .ఆయన దృష్టిలో సామాన్య భారతీయ సామాన్య  యూరోపియన్ ప్రాచీనత హిట్లర్ చెప్పిన రేసిస్ట్ భావానికి పూర్తీ వ్యతిరేకం అన్నాడు   “an ethnologist who speaks of Aryan race, Aryan blood, Aryan eyes and hair, is as great a sinner as a linguist who speaks of a dolichocephalic dictionary or a brachycephalic grammar” and that “the blackest Hindus represent an earlier stage of Aryan speech and thought than the fairest Scandinavians”.[32]

అని తన దృక్పధాన్ని స్పష్టంగా తెలియ జేశాడు . “He who knows one, knows none.”అన్నదాన్ని ఎక్కువగా ముల్లర్ వాడేవాడు .

Like many of his contemporaries, Müller believed that genuine .

“The Science of Religion,” he wrote, “may be the last of the sciences which man is destined to elaborate; but when it is elaborated, it will change the aspect of the world” (Chips, xix). This enthusiasm helped to stimulate the scholarship that made Müller’s own ideas obsolete.అని  ఎన్ సైక్లో పీడియా బ్రిటానిక ‘’మాక్స్ ముల్లర్ ను ఎస్టిమేట్ చేసింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13

28-లలిత విస్తారసూత్రం  అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్

Inline image 1

జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో,  పారిస్ లలో చదివి బెర్లిన్ యూని వర్సిటి నుండి 1864   లో  పి హెచ్ .డి .పొందాడు .1866 లో  హీల్డ్ బెర్గ్ కు ప్రైవేట్ డోసేంట్ ఆఫ్ సాంస్క్రిట్ అయ్యాడు .1870 లో అసోసియేట్ ప్రొఫెసర్ అయి ,1901 లో ఆనరరి ప్రొఫెసర్ అయ్యాడు .1803 లో గౌతమ బుద్ధజీవిత చరిత్ర అయిన  లలిత విస్తారాన్ని అనువాదం చేసి తన సంపాదకత్వం లో ముద్రించాడు .ఫ్రాంజ్ బాప్ పైన పుస్తకం రాశాడు .1898 లో హిస్టరీ ఆఫ్ ఎన్సేంట్ ఇండియా రచించాడు .జర్మన్ భాష ఒకే రకమైన ఉచ్చారణ తో ఉండాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించాడు .యూని వర్సిటిలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామం వెస్ట్ ఫెలియా లో అనేక చిన్న చిన్న వర్గాలవారికి ప్రైవేట్ ట్యూటర్ గా ,స్కూల్ మాస్టర్ గా పని చేసి ఆభాషాభి వృద్ధికి గొప్ప కృషి చేశాడు .పేద ప్రజల సహాయార్ధం జేడేకా వేరీన్ సొసైటీ ఏర్పరచి అధ్యక్షుడయ్యాడు .14-1-1912 న హీల్దేన్ బెర్గ్ లో లెఫ్ మాన్ 81 వ ఏట  చనిపోయాడు

.Inline image 2

29-సంస్కృత శబ్దోత్పత్తి నిఘంటు రచన చేసిన –ఆస్ట్రియా సంస్కృత విద్వాంసుడు –మాన్ఫ్రేడ్ మేఫేర్

26-9-1926 న జన్మించి 31-10-2011 న మరణించిన మాన్ఫ్రేడ్ మే ఫేర్ ఆస్ట్రియాన్ ఇండో యూరోపియన్  విద్వాంసుడు .ఇండో ఇరానియన్ భాషలపై స్పెషలైజ్ చేశాడు .వియన్నా వర్సిటిలో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా ఉన్నాడు .సంస్కృత ఎటిమలాజికల్ డిక్షనరీ నిర్మాణ ఘటికుడు .లింజ్ లో పుట్టి , గ్రాజ్ యూని వర్సిటి లో ఇండో యూరోపియన్ మరియు సెమెటిక్ లింగ్విస్టిక్స్ చ చేశాడు .19 63 నుంచి 66 వరకు సార్లాండ్ యూని వర్సిటి  ప్రొఫెసర్ గా ఉన్నాడు .1966 లో ఆస్ట్రియాకు తిరిగి వెళ్లి వియన్నా యూని వర్సిటి ప్రొఫెసర్ అయి 1990లో 8 5 ఏళ్ళ వయసులో  చనిపోయేదాకా పనిచేశాడు .దాదాపు 13 ఉద్గ్రంధాలు రాశాడు .1982 లో అప్పర్ ఆస్ట్రియా నుంచి కల్చరల్ ప్రైజ్ ను ,8 6 లో ‘’ఆస్ట్రియన్ డెకరేషన్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ అవార్డ్ ,88 లో వీల్మన్ హార్టల్ ప్రైజ్ ,2004 లో కార్డినల్ ఇన్నిత్జర్ ప్రైజ్ లను మాన్ఫ్రేడ్ మేఫెర్ అందుకొన్నాడు.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12

27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని  అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్

చార్లెస్ లాక్ వెల్ లాన్మన్  అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ అబిగెల్ పోషణ బాధ్యత తీసుకొన్నది .ఆమె గొప్ప ఆర్టిస్ట్ .అమెరికన్ రివల్యూషనరి  ఆర్టిస్ట్  జాన్  ట్రంబుల్ కు చెందిన ఆస్తితోపాటు ,ఆయన చిత్రించిన విలువైన పెయింటింగ్ లు స్కెచ్ లు ఆమెకు సంక్రమించాయి .పదేళ్ళ వయసులో చార్లెస్ అమెరికన్ ఓరిఎంటల్ సోఅసైటీ వారి జర్నల్ ఒకటి చదివాడు .అందులో భారతీయ ఖగోళ  శాస్త్రానికి నికి చెందిన విలువైన వ్యాసం చదివి సంస్కృతం పై విపరీతమైన ఆసక్తి పెంచుకొన్నాడు .

1871 లో ఏల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా గ్రీక్ ను జేమ్స్ హాడ్లి వద్ద ,సంస్కృతాన్ని డబ్ల్యు .డి.విట్ని వద్ద అభ్యసించి  1875 లో డాక్టరేట్ పట్టా పొందాడు . ,జర్మనీలో వెబర్  రోత్ ల వద్ద సంస్కృతాన్ని మెరుగు పరచుకొని ,జార్జి  కర్టియస్ ,ఆగస్ట్ లస్కియన్ ల దగ్గర ఫైలాలజి1873  -76 మధ్య  నేర్చాడు .ప్లిమత్ కాలనీకి చివరి గవర్నర్ అయిన ధామస్  హింక్లి వారసురాలు మేరి బిల్లింగ్స్ హింక్లి ని పెళ్లి చేసుకొన్నాడు .కొత్త భార్యతో ఇండియాకు హనీమూన్ కు  వచ్చి  ఇండియా అంతా  పర్యటించి 500విలువైన సంస్కృత  ప్రాకృత గ్రంధాలు  వ్రాత ప్రతులు కొని హార్వర్డ్ యూని వర్సిటికి అందజేశాడు .అవి ఫిట్జ రాల్డ్ హాల్ లో భద్రపరచారు .వీటిని తన సంపాదకత్వం లో ప్రొఫెసర్ లాన్మన్ హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ గా ముద్రించాడు .1890 లో  ఇండియా నుంచి తిరిగి   వెళ్ళాక కేంబ్రిడ్జి లోని 9 ఫర్రార్ స్ట్రీట్ లో స్వంత గృహాన్ని నిర్మించుకొన్నాడు .

1876 లో జాన్ హాప్కిన్ యూని వర్సిటి ప్రారంభమైనపుడు వారి ఆహ్వానం తో 1876 నుంచి నాలుగేళ్ళు సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .1880లో హార్వర్డ్ యూని వర్సిటి కి వెళ్లి ఇండో –ఇరానియన్ భాషల కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .అదే 1902 లో ఫైలాలజి డిపార్ట్ మెంట్ అయింది .తర్వాత సంస్కృత ,ఇండియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ గా 1951 లో మారింది .1911 -1912 మధ్య ప్రఖ్యాత కవి టి ఎస్ ఇలియట్ ఇక్కడే విద్యార్ధిగా చదివి ఫిలాసఫీలో డాక్టరేట్ పొందాడు  .

1879—1884 మధ్య అయిదేళ్ళు  లాన్మన్ ట్రాన్సాక్షన్స్ కు సెక్రెటరి ,ఎడిటర్ గా ,18 90-9 1 లో అమెరికన్ ఫైలలాజికల్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా చేశాడు .1884 నుండి పదేళ్ళు 1894 వరకు అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ కి కరస్పాండెంట్ సేక్రటరిగా ఉన్నాడు .1897 నుంచి 1907 వరకు పదేళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా ,1907 నుండి -1908 వరకు ప్రెసిడెంట్ గా పనిచేశాడు .

బెంగాల్  ,ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ఏసి యాటిక్ సొసైటీలకు  గౌరవ ఫెలో అయ్యాడు .గాటిన్జన్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ,రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్ లకు కరస్పా౦డింగ్ మెంబర్ పదవీ గౌరవం పొందాడు .అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు ఫెలో ను చేసి అమెరికా ప్రభుత్వం గౌరవించింది. 1902 లో ఏల్ నుండి ఎల్ ఎల్ డి,అబెర్డీన్ యూని వర్సిటి 400 వార్షికోత్సవ సందర్భంగా లాన్మన్ కు ఎల్ ఎల్ డి నిచ్చి సన్మానించారు

హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ లో లాన్మన్ రాజ శేఖరుని ‘’కర్పూర మంజరి’’ అనే ప్రాకృత నాటకాన్ని  ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి 1900 లో ప్రచురించాడు . ,విట్నీ ఆంగ్లీకరించిన  అధర్వ వేద సంహిత లోని లోపాలను పరిశీలించి పునర్మూల్యాంకనం చేసి తన సంపాదకత్వం లో రెండుభాగాలుగా 2005లో ప్రచురించాడు .సాంస్క్రిట్ రీడర్ విత్ వకాబ్యులరి అండ్ నోట్స్ రాసి ప్రచురించాడు .ఇదే ఇప్పటికీ నాణ్యమైన ఆదర్శమైన ఉపోద్ఘాత గ్రంధంగా మన్ననలు  పొందుతోంది .

1926 లో హార్వర్డ్ లో లాన్మన్ రిటైరై ,గౌరవ స్థానం లో (ఎమెరిటస్) లో ఉన్నాడు .అమెరికాలో ఉన్న ప్రస్తుత సంస్కృత విద్వాంసులు ,సహకారులు లాన్మన్ శిష్య బృందం లోని వారే .88 వ ఏడు వచ్చేదాకా లాన్మన్ చార్లెస్ నదిలోరోజూ పడవ పై తిరిగేవాడు .అందుకే ఆయనను’’చార్లెస్ రివర్ లాన్మన్ ‘’అని సరదాగా పిలుస్తారు .చార్లెస్ నది పై 12 వేల మైళ్ళు ప్రయాణించిన ఘనత చార్లెస్ లాన్మన్ ది .20- 2-1941 న   సంస్కృత సాహిత్య సాగరాన్ని , ,చార్లెస్ నదిని ఈది రికార్డ్ సృష్టించిన చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ 90 వ ఏట పరమ పదించాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్

 

 

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్

13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్  ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన చేశాడు .1897 లో  హితోపదేశం పై పరిశోధన చేసి  సిద్ధాంత వ్యాసం రాసి లీప్జిగ్ యూని వర్సిటి నుండి పి .హెచ్ డి.పొందాడు .1919 నుండి 1937 వరకు 18 ఏళ్ళు లీప్జిగ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అండ్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ గా ఉన్నాడు .అక్కడ ఆసియా ,ఇండో యూరోపియన్ భాషలు ,సంస్కృతం వేదం ,జెంద్ అవెస్తా లను బోధించాడు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను జర్మన్ భాషలోకి అనువాదం చేశాడు .వేదం పైనా అవెస్తా పైనా రాసిన ‘’ఇండో ఇరానియన్ సోర్సెస్ అండ్ రిసెర్చ్ ‘’పేరిట ధారావాహికంగా ప్రచురింప బడినాయి .వీటిని ఆయనే ఎడిట్ చేశాడు కూడా .

1933 లో హీర్టేల్ జర్మన్ సోషలిస్ట్ పార్టీకి, హిట్లర్ కు విధేయుడిగా ఉంటానని శపథం చేశాడు .సాక్సోనియాన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,రాయల్ ఏషియాటిక్ సొసైటీ లండన్ కు సభ్యుడుగా ఉన్నాడు .ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీప్జిగ్ యూని వర్సిటి లైబ్రరీలో భద్ర పరిచారు .అతని రచనలు –ది సదరన్ పంచతంత్ర ,పంచాఖ్యాన కధలు ,పూర్ణ భద్రాస్ పంచతంత్ర .

Inline image 2

25-రామాయణ ,భారతాలపై పరిశోధించిన –ఆల్ఫ్ హిల్టే బీటెల్

కొలంబియాకు చెందిన ఆల్ఫ్ హిల్టే బీటెల్  అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూని వర్సిటి లో రిలీజియన్ ,హిస్టరీ ,హ్యూమన్ సైన్సెస్ కు ప్రొఫెసర్ .పురాతన భారతీయ కావ్యాలైన రామాయణ ,మహా భారతాలపై మత సంప్రదాయం ,జానపదం లపై పరిశోధన చేశాడు .

బీటెల్ హార్వర్డ్ కాలేజి నుంచి బి ఏ డిగ్రీ పొంది ,మతం ముఖ్య విషయంగా ,ఇంగ్లీష్ ను సెకండరీ గా తీసుకొని 1959- నుండి 1963 వరకు చదివాడు .1964 నుండి నాలుగేళ్ళుయూని వర్సిటి ఆఫ్  చికాగో  డివినిటి స్కూల్ లో చదివి హిస్టరీ ఆఫ్ రెలిజియన్ లో ఎం .ఏ డిగ్రీ తీసుకొని 1973 లో పి .హెచ్ .డి.అందుకొన్నాడు .పరిశోధన వ్యాసంగా ‘’గాడ్స్ హీరోస్ అండ్ కృష్ణ – ఎ స్టేడి ఆఫ్ దిమహాభారత ఇన్ రిలేషన్ టు ఇండియన్ అండ్ ఇండో యూరోపియన్ సింబాలిజం ‘’రాశాడు .

న్యు యార్క్ సిటి లోని సీ బరీ ప్రెస్ కు 1963 నుండి 6 4 వరకు ఎడిటోరియల్ అసిస్టంట్ గా ఉన్నాడు .ఇదే స్థాయిలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ జర్నల్ కూ పని చేశాడు .తర్వాత వాషింగ్టన్ యూని వర్సిటి అసిస్టంట్ ప్రొఫెసర్ గా ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,1981 లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందాడు .సారబాన్ ,విస్కాసిన్ యూని వర్సిటీలలో నూ ,దక్షిణ భారత దేశం లోను ఆహ్వానం పై ఉపన్యాసాలిచ్చాడు .2009 నుండి ‘’ఆక్స్ ఫర్డ్ బిబ్లియోగ్రఫిక్ ఆన్ లైన్ కు హిందూ ఇజం పై ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు .మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్ లకు ‘’ఇండియాస్ సాస్క్రిట్ ఎపిక్స్ –టెక్స్ట్ అండ్  ట్రడిషన్ సిరీస్ కు కూడా ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్నాడు .

గుగ్గెన్ హీం ఫెలో షిప్ ,వుడ్రో విల్సన్ ఫెలో షిప్ లతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు బీటెల్ .’’లేడీ ఆఫ్ జింజి –సౌత్ ఇండియన్ ద్రౌపది ఫెస్టివల్స్ ‘’కు 1988 లో డైరెక్టర్ .రచనలు –ది రిట్యువల్స్ ఆఫ్ బాటిల్ –కృష్ణ ఇన్ ది మహా భారత ,ది కల్ట్ ఆఫ్ ద్రౌపది ,రీ థింకింగ్ ఆఫ్ ఇండియాస్ ఓరల్ అండ్ క్లాసికల్ ఎపిక్స్ ,రి థింకింగ్ ది మహా భారత ,ధర్మాస్ ఇన్ ఎర్లి హిస్టరీ  లా, రెలిజియన్ అండ్ నారేటివ్ ,రీడింగ్ ది ఫిఫ్త్ వేద (భారత ),వెన్ ది గాడెస్ వాస్ ఏ వుమన్ –వగైరా .

సంపాదకుడుగా –క్రిమినల్ గాడ్స్ అండ్ డెమన్ డివోటిస్ ,హెయిర్ ఇట్స్ మీనింగ్ అండ్ పవర్ ఇన్ ఏసియన్ కల్చర్స్ ,ఈజ్ ది గాడెస్ ఏ ఫెమినిస్ట్ ? ది పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ గాడేసేస్ ‘’ గ్రంధాలు వెలువరించాడు .

26-హిందూ ,బౌద్ధ గ్రంధాలను చైనీ భాషలోకి అనువదించిన –పద్మశ్రీ హువాన్ బావో షెంగ్

1942 జులై లో జన్మించిన హువాన్ బావో షెంగ్ సంస్కృత ,పాళీ భాషలను అధ్యయనం చేసిన భాషా వేత్త .సంస్కృత ,పాళీ గ్రంధాలను చైనా భాషలోకి అనువదిం చిన  ఘనుడు .ముఖ్యంగా భారతం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు ,లలిత విస్తారసూత్రం ,వజ్ర చ్చేదికా వంటిఅపురూప గ్రంధాను చైనా భాషలోకి తర్జుమా చేసిన వాడు .

1942  జులై లో షాంఘై లో జన్మించి ,పెకింగ్ యూని వర్సిటిలో ప్రాచ్య భాషలలో డిగ్రీ పొంది ,సంస్కృత ,పాళీ భాషలపై ప్రత్యేక కృషి చేసి పెకింగ్ యూని వర్సిటిలో రిటైర్ అయ్యాడు .గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ చైనీస్ అకాడెమి ఆఫ్ సోషల్ సైన్సెస్ లో విదేశీ భాషల పరిశోధకుడుగా ఇంకా పని చేస్తున్నాడు .చైనా ఫారిన్ లిటరేచర్ సొసైటీకి ,ఇండియన్ లిటరేచర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లకు  అధ్యక్షుడు .  చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు కూడా .

మహా భారతాన్ని చైనా భాష లోకి అనువదించే కార్యక్రమం 1989 లో జాలో గుహోవా ,జి బిజువాంగ్ లసంపాదకత్వం లో ప్రారంభమై ఆది పర్వం పూర్తీ చేశారు .తర్వాత హువాన్ బావో షెంగ్ నాయకత్వం లో  లోఅయిదుగురు సభ్యుల కమిటి   1993 లో దీని బాధ్యతా చేబట్టి ,2003కు మొత్తం 18 పర్వాల భారతాన్నీ చైనీస్ భాషలోకి మార్చేశారు.దీనిని మళ్ళీ సమీక్ష చేసి హువాన్ సంపాదకత్వం లో 2005కు మొత్తం 6 భాగాలుగా ముద్రించారు .

క్లాసికల్ పోఎటిక్స్ ఆఫ్ ఇండియా గ్రంధాన్ని హువాన్ రాశాడు. హువాంగ్ కు అనేక పురస్కారాలు లభించాయి అందులో కొన్ని –య౦గ్ అండ్  మిడ్ఎజేడ్ ఎక్స్ పెర్ట్ ,ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్,చైనా ఇవ్వగా , 2015 లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది  .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10

21-ఆంగ్లో ఇండియన్ పద  నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్

11-7-1840  న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’  గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ షైర్ లోని సెయింట్ బ్రియావేల్స్ లో జన్మించాడు .లండన్ లోని కింగ్స్ కాలేజి లో చదువుతుండగా కోపెంహాం కు చెందిన   ప్రొఫెసర్ విగ్గో ఫాస్బోల్ ను కలుసుకొని ఆయన ప్రభావం తో భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .తండ్రి బ్రిటిష్ ఈస్టిండియా కంపెని ఉద్యోగి అవటం వలన 1860 లో ఇండియన్ సివిల్ సర్విస్ ఉద్యోగిగా మద్రాస్ వచ్చాడు .మద్రాస్ లో సంస్కృత వ్రాత ప్రతులను కాపీ చేశాడు .1870 లో తాను సేకరించిన 350  వ్రాతప్రతులను  ఇండియా ఆఫీస్  లైబ్రరీకి అంద జేశాడు  .

మద్రాస్ వాతావరణం పడక పోవటం వలన  అధిక శ్రమ వలనా తరచూ అనారోగ్యం పాలయ్యేవాడు .ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లోని వెస్ట్ స్ట్రాషన్ లో 12-10-1882 న చనిపోయాడు .బర్నేల్ 1874  లో ‘’హాండ్ బుక్ ఆఫ్ సౌత్ ఇండియన్ పాలోలోగ్రఫీ ‘’ప్రచురించాడు దీనినే మాక్స్ ముల్లర్ ‘’ప్రతి భారతీయ సాహిత్య విద్యార్ధి  చేతిలో ఉండదగిన పుస్తకం ‘’అని ప్రశంసించాడు 1880 లో మద్రాస్ ప్రభుత్వానికి తన కృషి సర్వస్వం అయిన ‘’ది క్లాసిఫైడ్ ఇండెక్స్ టు ది సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ఇన్ ది పాలస్ ఆఫ్ టాంజోర్ ‘’ సమర్పించాడు .భారతీయ శిక్షాస్మృతి కి చెందిన అనేక సంస్కృత గ్రంధాలను అనువాదం చేశాడు .భారతీయ భాషలపైనేకాక బర్నేల్ కు టిబెటన్ ,అరబిక్ ,కావి ,జావనీస్ ,కాప్తిక్ భాషలలో కూడా పాండిత్యం ఉండి .సర్ హెన్రి యూల్ తో కలిసి ఆంగ్లో –ఇండియన్ పదాలు .పద సమూహాలకు చెందిన నిఘంటువు ను కూర్చి దానికి ‘’హాబ్సన్ –జాబ్సన్ ‘’అని పేరు పెట్టాడు .

Inline image 1

22 – సంస్కృత చరిత్ర రాసిన -ఆర్ధర్  బెర్రిడేల్ కీత్

ప్రొఫెసర్ ఆర్ధర్ బెర్రిడేల్ కీత్ డి.సి .ఎల్. ,డి.లిట్. ,ఎల్. ఎల్ .డి.5-4-1879 న జన్మించాడు .స్కాటిష్  కాన్ స్టిట్యూషనల్ లాయర్ ,సంస్కృత విద్వాంసుడు, ఇండాలజిస్ట్ .ఎడిన్ బర్గ్ యూని వర్సిటిలో సంస్కృతం లో రీజియాస్ ప్రొఫెసర్ ,కాన్ స్టి ట్యూషనల్ హిస్టరీ లెక్చరర్ కూడా .ఈ పదవులలో 1914 నుండి 30 ఏళ్ళు 1944 వరకు పని చేశాడు .అబర్దీన్ లో 6-10-1944 న చనిపోయాడు .ఆయన గ్రంధాలు –ఇండియన్ మైతాలజి ,ది రెలిజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది వేదాస్ అండ్ ఉపనిషడ్స్ ,ది హిస్టరీ ఆఫ్ ది సాంఖ్య ఫిలాసఫీ ,బుద్ధిష్ట్ ఫిలాసఫీ ఇన్ ఇండియా ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ .ఆత్రేయ సంహిత ,.అనువాద రచనలు -ది వేద ఆఫ్ ది బ్లాక్ యజుస్ స్కూల్ (కృష్ణ యజుర్వేదం ),రిగ్వేద బ్రాహ్మనాస్ ది ఆత్రేయ అండ్ ది కౌసితకిబ్రాహ్మనాస్ ఆఫ్ ది రిగ్వేద  ‘’.ఇవికాక’’ కాన్ స్టి ట్యూషనల్ లా అండ్ హిస్టరీ ‘’పై 20 దాకా ఉద్గ్రంధాలు రాశాడు .

Inline image 2

23-ప్రబోధ చంద్రోదయం ను జర్మన్ భాషలోకి అనువదించిన –దియోదర్ గోల్డ్ స్టక్కర్

దియోదర్ గోల్డ్ స్తక్కర్ 18-1-1821 న జన్మించి 6-3-1872 న మరణించిన జర్మన్ సంస్కృత విద్వాంసుడు .జర్మనీలోని కొనిగ్స్ బర్గ్ లో యూదు దంపతులకు జన్మించి ,పారిస్ వెళ్లి 1842 లో కృష్ణ మిశ్ర యతి రచించిన ప్రబోధ చంద్రోదయం ను జర్మనీ భాషలోని అనువదించి ప్రచురించాడు .1847 నుండి మూడేళ్ళు బెర్లిన్ లో ఉండి ,అలేక్సాండర్ వాన్ హంబోల్ద్ చేత గుర్తింపబడ్డాడు .కాని అతని రాజకీయ భావాలు అతనిని అధికారుల కు అనుమానం కలిగింఛి  ,1848 జర్మన్ విప్లవ సమయం లో బెర్లిన్ వదిలి వెళ్లమని  ఆజ్ఞాపించారు .హెచ్ .హెచ్ .విల్సన్ ఆహ్వానం పై లండన్ వెళ్ళాడు .1852 లో లండన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .విల్సన్ తయారు చేసిన సంస్కృత నిఘంటువు కు సహాయమ౦ దించాడు .ఇందులో మొదటిభాగం  1856 లో ప్రచురణ పొందింది .సుదీర్ఘంగా చాలా వివవరణాత్మకం గా  ఉన్నందున మిగిలిన భాగాల ప్రచురణ ఆగి పోయింది .1861 లోఆయన గొప్ప రచన ‘’పాణిని –హిజ్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’రాసి విడుదల చేశాడు .సాంస్క్రిట్  టెక్స్ట్ సొసైటీకి వ్యస్థాపక అధ్యక్షుడు .ఫైలలాజికల్ సొసైటీ లో చురుకుగా పాల్గొనే వాడు .చనిపోయే నాటికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .ఇవికాక ‘’లిటరరీ రిమైన్స్ ‘’రాశాడు .

Inline image 3  Inline image 4

సశేషం

మీ గబ్బిట దుర్గ ప్రసాద్ -3-10-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9

18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్

30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ భాషలు-అరబిక్ ,పెర్శియన్ సంస్కృతం లను సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో  అధ్యయనం చేసి తర్వాత జర్మని వెళ్లి బెర్లిన్, బాన్ యూని వర్సిటీలలో 1839నుండి మూడేళ్ళలో  పూర్తీ చేశాడు .,1842 లో మళ్ళీ పీటర్స్ బర్గ్ చేరి రాయల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు సభ్యుడుగా ఎన్నికై ,1860 లో రష్యన్ స్టేట్ కౌన్సిలర్ అయ్యాడు .తర్వాత ప్రీవీ కౌన్సిలర్ అయ్యాడు .1868 లో జర్మని లోని జేనా చేరి తర్వాత లీప్జిగ్ లో స్థిర వాసమేర్పరచుకొని 1-4-1904న చని పోయే దాకా  అక్కడే ఉండి పోయాడు  .

19 వ శతాబ్దపు ఓరిఎంటలిస్ట్ లలో పేరెన్నిక గన్నవాడు ఆటోవాన్ .భారతీయ భాషలపైనా ,తులనాత్మక భాషాధ్యయనం పైనా గొప్ప నిష్ణాతుడు .మొదటి గొప్ప రచన పాణిని అస్టాధ్యాయిని ఇంగ్లీష్ లోకి అనువదింఛి జర్మన్ వ్యాఖ్యానం రాయటం .ఇది ఒక రకంగా ఫ్రాంజ్ బొప్పా  ఫైలలాజికల్ విధానాలపై  కామెంటరి  .ఇదికాక బోపదేవుని వ్యాకరణాన్ని ,ఛాందోగ్య ఉపనిషత్ ,బృహదారణ్యక ఉపనిషత్ లను తర్జుమా చేసి వ్యాఖ్యానం కూడా రాశాడు .సంస్కృత –జర్మని నిఘంటువుణు 7 భాగాలలో  తయారు చేశాడు .సంస్కృత ఉచ్చారణ పై రాశాడు .దండి కావ్యాదర్శాన్ని అనువదించాడు

 

19-ప్రాకృత నిఘంటువును అనువదించిన –జోహాన్ గార్గ్ బూలర్

జోహాన్ గార్గ్ బూలర్ 19 -7-1837 న రెవరెండ్ జోహాన్ జి .బూలర్ కు హానోవర్ లోని బోర్స్తల్ లో జన్మించాడు .హానోవర్ గ్రామర్ స్కూల్ లో  లో చదివి ,గ్రీక్ ,లాటిన్ లలో మహా పండితుడయ్యాడు .గోటేన్జన్ యూని వర్సిటిలో చేరి దియాలజి, ఫిలాసఫీ   ,క్లాసికల్  ఫైలాలజి ,సంస్కృతం జెంద్,పెర్షియన్ ,అరెబిక్ , ఆర్మీనియన్  భాషలు అధ్యయనం చేశాడు .1858 లో తూర్పు భాషలలోను ,ఆర్కియాలజీ లోను డాక్టరేట్ పొందాడు .గ్రీక్ భాషలోని ‘’టేస్ ‘’అనే ప్రత్యయం పై దిసీస్ రాసి ప్రచురించాడు .అదే ఏడాది సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలనకోసం పారిస్ వెళ్ళాడు .తర్వాత లండన్ వెళ్లి 1862 వరకు ఉన్నాడు .ఈ కాలం అంతాఇండియన్ ఆఫీస్ లో  ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీ లోని బోడ్లియన్ లైబ్రరి  వేద వ్రాత ప్రతుల అధ్యయనం లోనే గడిపాడు .మొదట్లో ప్రైవేట్ టీచర్ గా పని చేసి తర్వాత విండ్సర్ కాజిల్ లోని క్వీన్స్ లైబ్రరి కి అసిస్టంట్ గా ఉన్నాడు .

1862 లో గోటేన్జన్ లైబ్రరీకి అసిస్టంట్ గా వెళ్లి ,మాక్స్ ముల్లర్ ద్వారాఆహ్వానం అందుకొని  బనారస్ సాంస్క్రిట్ కాలేజి లో చేరటానికి వెళ్ళాడు .  ఈలోగాప్రోఫేసర్ మూలర్ ద్వారా బాంబే ఎలి ఫెంటైన్ కాలేజి లో ప్రాచ్యభాషల  ప్రొఫెసర్ గా ఆహ్వానమూ అందుకొని వెంటనే బొంబాయి వెళ్లి1863 ఫిబ్రవరి 10 న  చేరాడు .అప్పుడు అక్కడ ప్రముఖ న్యాయ శాస్త్ర విద్యా వేత్త కాశీనాద్ త్రయంబక్ తెలంగ్ విద్యార్ధిగా ఉన్నాడు .మరుసటి ఏడాది బూలర్ ఫెలో ఆఫ్ బాంబే యూని వర్సిటి అయ్యాడు .రాయల్ ఏషియాటిక్ సొసైటీ లో సభ్యుడయ్యాడు .188౦ వరకు ఇక్కడే పని చేశాడు .ఇక్కడున్న కాలం లో బెర్లిన్ కేంబ్రిడ్జ్ ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలకు అరుదైన విలువైన పుస్తకాలను సేకరించి పంపాడు .

1878 లో అతి ప్రాచీనమైన ప్రాకృత వ్యాకరణం ‘’పైయాలచ్చి ‘’నిఘంటువును అనువదించాడు .వివరణ కూడా  రాశాడు .ఆపస్తంభ ధర్మ సూత్రాల అనువాదానికీ సహయం చేశాడు .8-4-1898 న లేక్ కాన్స్తాన్స్ లో మునిగి చనిపోయాడు .బూలర్ ఇతర రచనలు –ది రూట్స్ ఆఫ్ దాతుపాఠ.ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఖరోస్తి ,డైజెస్ట్ ఆఫ్  హిందూ లా కేసెస్ ,పంచతంత్ర ,కేటగిరి ఆఫ్ సాస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ,దశ కుమార చరిత్ర ,విక్రమార్క చరిత్ర ,ఇన్స్క్రిప్షన్స్ ఫ్రం ది కేవ్స్ ఇన్ బాంబే ప్రెసిడెన్సి ,ది లాస్ ఆఫ్ మను ,మొదలైన సుమారు 20 రచనలు .

Inline image 2

20- మైత్రాయణీయ ఉపనిషత్ అనువదించిన –వాన్ బుటెనాన్

జోహాన్నెస్ ఆద్రినాస్ బెర్మార్దాస్  వాన్ బుటెనాన్ 21-8-1928 న ది హేగ్ లో జన్మించిన డచ్ ఇండాలజిస్ట్ .చికాగో యూని వర్సిటిలోఫిలాసఫీ ఫైలాలజి  చదివి  .కెరీర్ చివరలో మహా భారతం పై మక్కువ ఎక్కువ చూపాడు .1953  లో డాక్టరేట్ పొందాడు .వెంటనే ఇండియా వెళ్లి మూడేళ్ళున్నాడు .1959 నుంచి 61 వరకు యుట్రేక్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .నెదర్ లాండ్స్ పై మోజు పోయి ,చికాగో యూని  వర్సిటి నుండి  ఆహ్వానం రాగా చేరి 21-9-1979 న చనిపోయే దాకా అక్కడే పని చేశాడు .అమెరికాలోని అనేక మంది విద్యావేత్తలకు గురుత్వం వహించిన ఖ్యాతి  వాన్ బుటెనాన్ ది .ఆయన ప్రముఖ శిష్యులలో జేమ్స్ ఎల్ ఫిట్జెరాల్డ్ ,వాల్టర్ ఓ కేల్బార్ ,మైకేల్ డివిల్స్  బ్రూస్ సల్లినాన్, బ్రూస్ లింకన్ వంటి వారున్నారు .1963 లో రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్  అండ్ సైన్స్ కు కరస్పాండెంట్ అయ్యాడు .

బుటేవాన్ రచనలు –టేల్స్  ఆఫ్ ఎన్శేంట్  ఇండియా ,ది మైత్రాయణీయ ఉపనిషత్ ,ది ప్లేస్ ఆఫ్  ఎన్శేంట్  ఇండియా ,రామానుజ ఆన్ భగవద్గీత ,యామునాస్ ఆగమ ప్రామాణ్య ,ది మహాభారత -3 భాగాలు ,భగవద్గీత ఇన్ ది మహా భారత .సాంఖ్యం మీద మూడు పెద్ద వ్యాసాలు ,పంచ రాత్ర నామ విశిస్టత మీద ఆంగ్ల వ్యాసం రాశాడు

Inline image 1

.

సశేషం

గాంధీ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-16 –ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు

ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది .ఒక సారి అమ్మ ఎలా ఉందొ చూద్దాం –  అమ్మంటే అంగడిలో దొరికే బొమ్మకాదని ,గోడకి తగిలించే పటం కాదని చెప్పి ప్రమిదలో దీపంలా చూసుకోమన్నారు .’’అమ్మ ఉంటే అంతులేని సొమ్ముగా ‘’అని సుద్ది చెప్పారు .కన్నవారిని అనాదాశ్రమాలు పాలు చేసే వారికి ఇది కొరడా దెబ్బ .’’తరతరాల పెన్నిధి –తలచుకొంటే సన్నిధి ‘’అంటూ ‘’బతికి నంతకాలం యెద తలుపులు మూశావు  -బతుకు బండి ఆగిపోతే –‘’ఇప్పుడు తహతహ లాడే వారిని ఎండ గట్టారు .’’అమ్మ సారధి వారధి ‘’అన్నారు .’’అమ్మ మనసు విరిచి అమ్మ భాష మరిచిన వాడు ‘’లోకం లో చులకన అవుతాడు .’’అమ్మా నాన్న అక్షరాలు చెరగని సత్యాలు ‘’’’చల్లని సంసారం ,చక్కని సంతానం ఉంటె –మెచ్చును ఆ జంట –నడిచోచ్చును సిరి ఆ వెంట ‘’అని చాలా అనుభవం తో చెప్పారు .ఏ భాషలో నైనా అమ్మా నాన్నలకు అర్ధం ,పరమార్ధం ఒకటే .’’తనువున్నంతకాలం తన వారిని కాస్తూ –తరాలు మారినా తరగని మమకారం గుండెల్లో ని౦పేది అమ్మ ‘’’

‘’మూడు ముళ్ళు వేసి ,ఏడడుగులు నడిస్తేచాలదు –ఒకరి నొకరు తెలుసుకొని,ఒకటిగా మసలుతూ ముందుకు అడుగేయాలి ‘’అని కొత్త జంటకు ఆదర్శం బోధించారు .ఒద్దికగా బుద్ధిగా ఉంటె జంట ‘’జే గంట ‘’కొడుతుందని ,అ జంటను చూసిన లోకానికి కన్ను కుడుతుందని లోక రీతి చెప్పారు .’’ఎవరి కేది బంధమో –ఎవరికెంత రుణమో –ఎవరికేది సొంతమో ,-ఎవరు యెటుల అంతమో !’’అని తత్త్వం బోధించారు .అర్ధ రాత్రి స్త్రీ ఒంటరిగా తిరగటానికిస్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్ళు అయినా కుదరనందుకు బాధ పడ్డారు .’’స్త్రీ కి ఇచ్చే గౌరవం ఇదేనా ?అని ప్రశ్నించారు .కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతూ ,ఆనందాన్ని అభివర్ణిస్తూ ‘’అరుగుల చావడి ,అంకెల గారడీ –మాటల ఉరవడి ,మనసున పై బడి –అందేల సవ్వడి ,అడుగుల అలికిడి –ఆడి పాడి ప్రతి రోజూ చేయాలి సందడి ‘’అని ఘనంగా చెప్పారు .చివరగా నవ్యాంధ్ర నిర్మాణానికి చేయీ చేయీ కలపమంటూ ‘’తర తరాల అంత రాలలో తరగని సంతోషం నింపుదాం –అమ్మా జనని నీ కిదే వందనం –పాదాభి వందనం ‘’మాత్రు వందనం తో  ముగించారు .హాయిగా చదువుకోవటానికి బాగా ఉన్న అమ్మ మీది ఆత్మీయ గౌరవాల కవితా గీతికలు రాసి ,అమూల్యమైన అమ్మ ను అందరికి ”అమూల్యం ”గానే అందిస్తున్న  శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి అభినందనలు .

దసరా శుభా కాంక్షలతో

గబ్బిట దుర్గా ప్రసాద్-30-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల పరదాలు కప్పుకొని ముందుకొస్తాయి, గిలి గింతలు పెడతాయి. కాని సుభద్రా దేవి రాసిన కదచదివితే  కన్నీళ్ళ వాన కురుస్తుంది .అదీ మిగతా వారి కంటే కధకురాలిగా ఆమె చూపు లోని వైశిష్ట్యం .ఒక రకం గా ప్రత్యక్షర శిల్పమే ఈ కద అని పించింది నాకు .అందుకే మీ అందరికీ తెలియాలని దీన్ని గురించి రాస్తున్నాను .కొంచెం ఫ్లాష్ బాక్ లోకి వెడతా .’’ఉత్తరాంధ్ర కధలు ‘’అనే బృహత్ గ్రంధాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 20 14  జులై లో కీ శే విరియాల లక్ష్మీ పతి ,డా చాగంటి తులసి గార్ల సంపాదకత్వం లో డా ఎస్వీ సత్యనారాయణ గారు గౌరవ సంపాదకులుగా వెలువరించారు .దీన్ని నాకు ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )కొని, కానుకగా 20-1-15 న పంపారు .దీన్ని 12-7-15 న ప్రారంభించి ,సమయం ఉన్నప్పుడు చదువుతూ ‘’లాగు’’తున్నాను .ఇవాళ శ్రీమతి శీలాసుభద్ర గారి ‘’వానా వానా కన్నీళ్లు ‘’కద చదివి దాన్ని గురించి రాయకుండా ఉండలేక పోయాను .ఇదీ నేపధ్యం .

పార్టీ వాళ్ళుఇచ్చిన ఎలెక్షన్  జెండా ను అయ్య చొక్కా కుట్టిస్తే ఆ కొత్త చొక్కా తొడుక్కున్నాడు బజార్లో కాగితాలేరుకొనే సూరిగాడు .అంత కంటే దరిద్రం తో బాధ పడుతున్న అదే పనిని  వాడితో పాటు చేస్తున్న అప్పిగాడు బోల్డంత ఆశ్చర్య పోయి చూసి నేస్తాన్ని ఎవరు కుట్టి౦చారని అడిగితె వాడు ‘’అయ్య కుత్తిం చేడు .పారటీ వొల్లు ఇచ్చినారట ‘’అన్నాడు ముడుకుల కింత వరకు వేలాడుతున్న చొక్కాని మురిపెంగా చూసుకొంటూ సూరిగాడు .పార్టీ వాళ్ళు ,ఎలచ్చన్ల గొడవలు తెలీని అప్పి గాడికి వివరంగా బోధిస్తూ ‘’పెచారానికి ఈ రంగు చొక్కానే తొడగాలి .ఆ పార్టీ వొల్లుమా అయ్యా రిచ్చాను బేరమాడుకున్నారు .రిచ్చా చుట్టూ అచ్చరాలు రాసిన గుడ్డ కూడా నాకు గోసీకని ఇత్తాడట మా అయ్య’’  కాగితాల గోని సంచీ మరో బుజానికి మార్చుకుంటూ గర్వం గా చెప్పాడు సూరిగాడు . అప్పిగాడు మాసి పోయిన తన గోచీ గుడ్డను ఓ సారి తడుముకున్నాడు .తనకీ కొత్త గోచీ ఉంటె బాగుండును అనుకొన్నాడు .వాడి అయ్య మిల్లు లో పని చేస్తాడు .’’మేనేజరు బాబుపంచ ఏదైనా ఇత్తే,అప్పుడు అయ్యా ఆడి పంచ చింపి ,తనకి తమ్ముల్లిద్దరికి గోసీ కిత్తాడు .అంత దాకా ఈ పాత గోసీయే ‘’అను కున్నాడు కూడా .

ఇద్దరూ పోటీ పడుతూ కాగితాలేరు కొంటున్నారు .ఎన్నికల హడావిడి కనుక బోల్డు కాగితాలు దొరుకుతున్నాయి .వీధులు తిరుగుతూ ఎలక్షన్ పందిరి దగ్గరికోచ్చారు .అదేటోఅప్పిగాడికి తెలవక పాయె .సూరిగాడు అనుభవజ్నుడిలా ‘’ఈడ కూడా ఎలచ్చన్ల పెచారం చేత్తార్రా ‘’అన్నాడు .ఇన్ని విషయాలు వాడికెలా తెలిశాయో ఆశ్చర్య పోయి అడిగితే ‘’నాను రెండో కళాసు సదివినాను కాదేటి .ఆడ అతికించిన కాగితాలు సదువుతే నాకు తెలిసిపోనాది ‘’గొప్పగా చెప్పాడుఅమృతం సీరియల్ లో హోటల్ సర్వర్ లా సూరిగాడు తనకైనా వయసులోనే కాదు అన్నిట్లోనూ చిన్న వాడైన అప్పిగాడితో .ప్రచారం కాగితాలను మొహమాటానికి జనం తీసుకొని చదివినట్లు నటించి పార్టీ వాళ్ళు కనుమరుగు కాగానే చింపి పారేస్తుంటే వీళ్ళిద్దరికీ కడుపు నిండా అన్నం మాటేమో కాని సంచీ నిండా కాగితాలే కాగితాలు ఏరుకొన్నవాడికి యేరు కొన్నంత .  .బస్టాండ్ దగ్గర ఎలక్షన్ టెంట్ దగ్గరికి చేరే లోపే మరో తడికల టెంట్ కనిపించింది  అక్కడికి సూరి  గాడి నాన్ననారాయణ పరిగెత్తుకొంటూ వచ్చి ‘’ఒర్ సూరిగా ! ఆ చొక్కా బేగిప్పేసి ఇయ్యరా ,పెచారినికి తోడుక్కేల్లాలి.నీ ఒంటి మీదసూసినారా కొంప మునుగుద్ది .నా బనీను నువ్వేసుకో ‘’అని చొక్కా బనీను తండ్రీ కొడుకులు మార్చుకొన్నారు ఆఘ మేఘాల మీద .కొత్త చొక్కా ఒంటి మీద లేనందుకు దిగులు పడ్డా ,తండ్రి రిచ్చ జెండాలతో కళకళ లాడి పోవటం చూసి చొక్కా విరహం మర్చి పోయాడు .అప్పి గాడికి ఇదంతా వింత గా ఉంది చోద్యం చూస్తున్నాడు నోరెళ్ళ బెట్టి .’’సూసావురా అప్పిగా !అయ్య రిచ్చా చుట్టూతా పెట్టినారే ,ఆ గుడ్డే ఎలచ్చను అయ్యాక ఇత్తారట’’అన్నాడు అల్ప సంతోషి సూరి .ఇంతలో టెలిఫోన్ స్థంభాలకు రోడ్డుపైన పెద్ద బానర్ కట్టటం చూశారిద్దరూ .గుడ్లు తేలేసి గుడ్డ వంక చూస్తూ ‘’అది మనకైతే అయిదు చొక్కాలు అవుతాయి కదరా !’’అన్నాడు అప్పి  .’’కాదురా .రెండు మన ఆదివి అయి రెండు మీ బుడ్డోడికి అవుతాయి  ‘’అన్నాడు ఆరిందా సూరి .అప్పుడే ఆ బానర్ గుడ్డ తమకిచ్చేసినట్లు దాన్ని చొక్కాలు కుట్టి౦ చేసినట్లు ఫీలై , కబుర్లతో సంతృప్తి పడ్డారు ఆ అమాయక గర్భ దరిద్ర బుడత జీవులు .  ఇక ఆపూటకి ఏరుడు ఆపేసి  ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి పోయారు సూరి ,అప్పి గాళ్ళు .

ఇంటికి వచ్చాడే కాని అప్పిగాడు పరధ్యానం లోనే ఉన్నాడు  ఏదో ఇంత అంబలి కతికి ఆరు బయట బొంత మీద రాత్రి పడుకొని నక్షత్రాలు చూస్తున్నాడు ..పైడి తల్లి మిల్లు నుంచి వచ్చి చెంబెడు నీళ్ళు దిమ్మరించుకొని అంబలి తాగి వచ్చి కొడుకు అప్పిగాడి పక్కన కూర్చున్నాడు .నెమ్మదిగా అయ్యను పలకరించి ‘’అయ్యా !నువ్వు కూడా రిచ్చా తోక్కవే ‘’అన్నాడు ప్రాదేయంగా .కొడుక్కు వచ్చిన వింత ఆలోచన అర్ధం కాలేదు తండ్రికి ‘’మా అయ్య ఇంతప్పటి నుంచి మిల్లు కాడే సేసినాడు .ఆడు సేసిన అప్పులు తీర్చటానికి నాను కూడా మిల్లు కాడే కుదురుకున్నాను అప్పు తీరుతుందో లేదో ఎరిక నేదు .ఇంకా రిచ్చా ఏటిరా ?’’అన్నాడు .ఇంతలో  తల్లి వచ్చి ‘’బాగానే ఉంది అయ్యా కొడుకుల సంబడం .అందరం సేసే సాక్రి కూడుకే సాలటం నేడు .ఇంకా రిచ్చాలేంటి కలలు కంటున్నావా ?అని గదిరింది  .

మళ్ళీ రెండు రోజులు అప్పి సూరి పేపర్ల వేటలో బిజీ బిజీ .అయినా అప్పిగాడి మనసులో ఆ బానర్ దోబూచు లాడుతూనే ఉంది. కనీసం టెంట్ కు కట్టిన గుడ్డ అయినా చాలు అని కలలు కంటున్నాడు .ఒకరోజు సూరిగాడికి చెప్పకుండా టెంట్ దగ్గరకొచ్చి ఎవరూ చూడటం లేదనుకొని టెంట్ తడికకు కట్టిన గుడ్డను బ్లేడ్ తో కోయటం మొదలు పెట్టాడు .దరిద్రం ఎంతకైనా తెగిస్తుంది .ఇంతలో పార్టీ వాడొకడు గమనించి కేకలు లంకించుకొన్నాడు .అందరూ పోగై అప్పిగాడిని పట్టు కొన్నారు,కొట్టారు  .వాడు వేరే పార్టీ వాడేమోనని ,అందుకే  చింపేస్తున్నాడని పొరబడి అప్పిగాడి వీపు చించేశారు . వీడు ‘’ఓర్నాయనో 1 నానే పారిటీ వోన్నీగాను .కొత్త గోసీ గుడ్డ కోసం సి౦పుకున్తున్నాను బావో ‘’అని ఏడ్చాడు .ఇంతలో అప్పి గాడు తనని పిలవ కుండా వచ్చేసాడేమో అనుకొంటూ అక్కడికి తండ్రితో చేరిన సూరిగాడికి సీను అర్ధమై  ,నెమ్మదిగా వాడిని ఆ గుంపు నించి తప్పించి బయటపడేసి వాడి మానాన్ని కాపాడాడు .’ఒర ప్పిగా ! మా అయ్యా ఇత్తే ఆ గుడ్డ  నీక్కూడా కసింత ఇత్తానులేరా ‘’అని అభయమిచ్చాడు స్నేహ ధర్మంగా .’’ఉరే !ఎలచ్చన్లు  అయ్యే దాకా ఆటి జోలికి మనం ఎల్తే సంపెత్తారు .సమయానికి మేం రాబట్టి సరి పోయింది .నేక పొతే ఏటయ్యేదో ‘’అని పార్టీ ఎలక్షన్ కోడ్ చెప్పి ,అనునయించి తీసుకు వెళ్ళాడు .అప్పిగాడికి తగిలిన దెబ్బలకు సూరీ తండ్రీ బాధ పడ్డారు .అయితే ‘’వాళ్ళ బాధ లోకానికేం బాధ లేదు కనుక యాంత్రికంగా మరో రెండు రోజులు గడిచి పోయాయి ‘’అంటారు లోకానుభవం తో రచయిత్రి .

ఎన్నికల మూన్నాళ్ళ భోగం పూర్తీ అయి మళ్ళీ రిక్షా బేరాలకి వెళ్ళాల్సి వచ్చిందే అని సూరి తండ్రి ‘’సూనాయన ‘’తెగ బాధ పడిపోయాడు  . తండ్రి నడిగి రిక్షా చుట్టూ కప్పిన గుడ్డను విప్పేసుకొచ్చి కప్పేసు కొన్నాడు సూరి .’’అప్పుడే దాన్ని సిమ్పీ సేయ్యమాకు. నాల్రోజుల తర్వాత సూడచ్చు ‘’అని హెచ్చరించాడు తండ్రి .సూరి గాడి ముఖం చిన్న బోయింది .కానీ తర్వాతన్నా అది తనదే అవుతుంది కదా అనే ఆశ, ధైర్యం వాడిది .అందుకే మడతేట్టి గూట్లో జాగ్రత్త చేశాడు .కాని ఏమనుకోన్నాడో ఏమో తండ్రి నారాయణ  మర్నాడే బానర్ గుడ్డా ,జెండాలు తీసికెళ్ళి పార్టీ ఆఫీసులో ఇచ్చోచ్చాడు .తెలిసిన సూరి ఏడుపుకు అంతం లేదు .అప్పిగాడి తో చెప్పుకొని తెగ ఇదయ్యాడు .’’పోన్లేరా మన అదుట్టం అంతే ‘’అని ఓదార్చాడు అప్పి గాడు .బానర్ ఎ౦డా వానలకు రంగు వెలిసి పోయినట్లు వాళ్ళ ముఖాలు పాలిపోయాయి అన్నారు సుభద్రా దేవి .గాలికి పడిన చినుగు కనిపించేసరికి మరింత విల విల్లాడారు .

ఒక రోజు రాత్రి విపరీతంగా కొండ పోత గా వాన కురిసింది .గుడిసె వాసులు నిద్ర లేకుండా ఏమై  పోతామో అని జాగరణ చేస్తున్నారు .అప్పిగాడికి ఒక ‘’అవుడియా’’ వచ్చి ఇంట్లోంచి బయటికొచ్చి ఇంట్లో వాళ్ళు అరుస్తున్నా లెక్క చేయకుండా  బయట ఉన్న సూరిగాడితో కలిసి బస్టాండ్ దగ్గర కట్టిన బానర్ వైపు పరిగెత్తారు .అక్కడికి చేరి పైకి చూస్తే  తాము ఇన్నాళ్ళుగా కలలు కంటూ కోరుకున్న బానర్ అడ్రస్ లేదు .తాళ్ళ చివరల గుడ్డ పేలికలు మాత్రమే వేలాడుతూ కనిపించాయి .ఇద్దరి నవ నాడులూ కలిసి 18 నాడులూ కుంగి పోయాయి .రోడ్డంతా కలయ చూశాయి .నాలుగు కళ్ళు ఒకటై .బురదలో కూరుకు పోయిన బానర్ కంట బడింది .అది ఎండా వానలకు, బురదకు చీలికలు పేలికలై కనిపించింది .’’ఇద్దరి గుండె పగిలింది .ఆ చప్పుడు వాళ్ళిద్దరికే వినిపిస్తోంది .రాత్రి  వర్షానికి మించిన తీవ్రత తో కురుస్తున్న వాళ్ళ కన్నీరు ,వాళ్ళిద్దరూ వర్షం లో పూర్తిగా తడిసి పోవటం చేత బయటి వాళ్ళకైతే వినిపిచటం లేదుకాని ,వాళ్ళిద్దరికీ ఒకరి కన్నీరు ఒకరికి కని  పిస్తూనే ఉంది ‘’అని కధను పూర్తి చేశారు శ్రీ మతి సుభద్రా దేవి .

ఉత్తరాంధ్ర అంటే ఘనీభవించిన దరిద్రం అని భావిస్తాం. దాన్ని కళ్ళకు కట్టించారు సుభద్రా దేవి .గోచీ కోసం పడే కుర్రాళ్ళ తపన పరా కాస్ట గా చిత్రించారు . ‘’ఉత్తరాంధ్ర కధలు ‘’కదా సంకలం మొత్తం మీద దరిద్రం పై ఇంత గొప్ప కద ఇంకొకటి మాత్రమె కనిపించింది నాకు. అది శ్రీ  ఏ వి రెడ్డి శాస్త్రి గారి ‘’మునిగిపోతున్న బల్లకట్టు’’.దీన్ని నా వాయిస్ తో చదివి రికార్డ్ చేసి ఇది వరకే మీ అందరికీ అందించాను. ఇవాళ ఈ కద నన్ను బాగా ఆకర్షించింది .ఇంకా సుమారు ముప్ఫై  కధలున్నాయి .చదవాలి  . పుస్తకం పంపిన శ్రీ మైనేనిగారికి ధన్యవాదాలు  ,ఈ కద రాసిన శ్రీ మతి సుభద్ర గారికి మనః పూర్వక అభినందనలు .న్యాయంగా ఈ కధ అక్షర లక్షలు చేసే కధ.

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

దేవీ నవరాత్రుల సందర్భంగా సరసభారతి 98 వ సమావేశం –దేవీ ప్రాశస్త్యం -ధార్మిక ప్రసంగం

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

  దేవీ  నవరాత్రుల సందర్భం గా సరసభారతి 98 వ సమావేశంగా శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి దంపతులచే ”దేవీ ప్రాశస్త్యం ”ధార్మిక ప్రసంగం 4-10-16 మంగళవారం సాయంత్రం 6- 30గం లకు స్థానిక శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటు చేయబడినది .సాహిత్యాభిమానులు భక్తులూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
 జోశ్యుల శ్యామలాదేవి    మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్ 

                                                                                       సరసభారతి  అధ్యక్షులు

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7

15-లూడో రోచెర్

సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు .అదే వర్సిటిలో 61 నుండి 67 వరకు ‘’సెంటర్ ఫర్ స్టేడి ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా ‘’కు డైరెక్టర్ గా ఉన్నాడు .

ప్రొఫెసర్ నార్మన్ బ్రౌన్ ఆహ్వానం పై రోచెర్ అమెరికాలోని ఫిలడేల్ఫియాకు వెళ్లి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా నియమింప బడి 1966 నుండి 36 ఏళ్ళు నిరాటంకంగా 2002 వరకు పని చేశాడు .1991 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ పీఠానికి అధిపతి అయ్యాడు .అమెరికన్ ఓరిఎంటల్ స్టడీస్ కు చైర్మన్ అయి ,అమెరికన్ ఫిలసైకల్ సొసైటీ కి ,రాయల్ అకాడెమి ఆఫ్ ఓవర్సీస్ సైన్సెస్  (బెల్జియం )కు మెంబర్ గా  ఫెలో ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ  గా ఉన్నాడు .భార్య రోసేన్  రాచెర్ తో కలిసి ఫిలడేల్ఫియా లో ఉంటున్నాడు.

సంస్కృతం లో 25 పుస్తకాలు రాశాడు .లెక్కలేనన్ని పత్రాలను సంస్కృత న్యాయ శాస్త్రం పై రచించాడు .భార్యతో కలిసి రాసిన ‘’దిమేకింగ్ ఆఫ్ వేస్త్రెన్ ఇండాలజీ ‘’గ్రంధానికి ‘’ఫాండేషన్ కొలిఎట్ కాలిఎట్ ‘’బహుమానం పొందాడు .’’ఫౌండర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండాలజీ ‘’,స్టడీస్ ఇన్ హిందూ లా అండ్ ధర్మ శాస్త్ర ,జీమూత వాహనాస్ దాయ భాగ ,ది పురాణాస్ ,స్మ్రుతి చింతామణి ఆఫ్ గంగాదిత్య, ది దీరీ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఎంసేంట్ ఇండియా ,వాచస్పతి మిశ్రా –వ్యావహార చింతామణి మొదలైన గ్రంధాలు బాగా ప్రసిద్ధమైనవి .రాచెర్ కు లబ్ధ ప్రతిస్తులైన రాబర్ట్ పి గోల్డ్మన్ ,ప్రొఫెసర్ సిగ్మే ఎం కొమేన్ వంటి శిష్యులు చాలా మంది ఉన్నారు .రాచెర్ దంపతులకు అనేక సంస్థలు బిరుదులిచ్చి సత్కారం చేశాయి

.Inline image 1  Inline image 2

 

16-రోసేన్ రోచెర్

రోసేన్ రోచెర్ 10-8-1937న   లో బెల్జియం లో మౌస్ కార్న్ లో  జన్మించింది .క్లాసిక్స్ లోను ,ఇండో ఇండియన్ స్టడీస్ లోను ఎం ఏ డిగ్రీలు పొందింది .బ్రసెల్స్ యూని వర్సిటి నుండి సాంస్క్రిట్ లింగ్విస్టిక్స్ లో పి హెచ్ డి సాధించింబెల్జియం నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్లో ప్రి డాక్టరల్ ,పోస్ట్ డాక్ట్రల్ ఫెలోఅయింది   .లూడో రోచెర్ ను పెళ్లి చేసుకొని ఫిలడెల్ఫియా వెళ్లి అక్కడ అమెరికన్ పౌరసత్వం పొందింది .1970 నుంచి పెన్సెల్వేనియా యూని వర్సిటి లో బోధిస్తూ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సౌత్ ఏసియా స్టడీస్ చైర్ అధిస్టించి ,సౌత్ ఏసియా నేషనల్ రిసోర్స్ సెంటర్ కు డైరెక్టర్ అయి ,ఏసియన్ అమెరికన్ స్టడీస్ ప్రోగ్రాం కు వ్యవస్థాపక డైరెక్టర్ అయింది .

 

ఆక్స్ ఫర్డ్  డిక్షనరీ ఆఫ్ నేషనల్బయాగ్రఫీ ,యెన్ సైక్లో పీడియా ఆఫ్ ఏసియన్ హిస్టరీ ,హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఇంటర్నేషనల్ యెన్ సైక్లో పీడియా ఆఫ్ లింగ్విస్టిక్స్ ,ఎన్సైక్లో పీడియా ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్ మొదలైన ఉద్గ్రందాలకు సహకరించింది .సంస్కృత సాహిత్యం పై పుస్తకాలు రాసింది .ది మేకింగ్ ఆఫ్ వెస్స్టర్న్ ఇండాలజీ ‘’గ్రంధానికి భర్త లూడో రోచెర్ తో కలిసి ఫా౦డేషన్  కోలేటీ కేలియాట్ అవార్డ్ అందుకొన్నది

ప్రైవేట్ ఫార్త్యూన్స్ అండ్ కంపెని ప్రాఫిట్స్ ఇన్ ఇండియన్ ట్రేడ్ ఇన్  యైటీ౦త్ సెంచరి ,ఇండియా అండ్ ఇండాలజీ ,అలేక్సాండర్ హామిల్టన్ మొదలైన గ్రంధాలు రాసింది .

Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5

11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ

26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో  ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ లో చేరాడు .తర్వాత పూర్తిగా సంస్కృత అధ్యాయనానికే అంకితమయ్యాడు .ఈకోల్ డేస్ హాట్స్ ఎత్యూడ్స్ లో జూల్స్ బ్రాచ్ ఇచ్చే ఉపన్యాసాలను శ్రద్ధగా విని ,అదే సమయం లో ‘’లెస్ మైత్రేస్ డీ లా ఫైలాలజి వేదిక్ ‘’పుస్తకం1928  లో  రాశాడు .1925 లో డాక్ట టోరియల్ దీసేస్ ‘’లా వేలూర్ డుపార్ఫేట్ డాన్స్ లెస్ హిమ్స్ వేదిక్స్ ‘’ప్రచురించాడు .తరువాత మరి రెండు చోట్ల పని చేసి సార్బోన్నే చేరి ,.ఆల్ఫ్రెడ్ ఏ ఫౌచేర్ కు వారసుడుగా పదివి అధిష్టించాడు .1946 లో అకాడెమి డేస్ ఇన్స్క్రిప్షన్స్’’కు ఎన్నికయ్యాడు .

Inline image 1

1948  -49 లాయిండియా ,1953 లో ఏల్స్ యూని వర్సిటి ,1954 నుంచి రెండేళ్ళు టోక్యో లలో పర్యటించి ‘’మాసన్ ఫ్రాంకో జపానీస్ ‘’కు డైరెక్టర్ అయ్యాడు .ఇండియా భాషలు తప్ప మరే దానిమీదా రాయనే లేదు చాలా కాలం .ఆర్కియాలజీ ,రాజకీయశాస్త్రం ,బౌద్ధం పై ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా వదిలేసి ఋగ్వేదం పైన పూర్తిగా దృష్టి పెట్టాడు .40 ఏళ్ళు తన సృజనాత్మక పరిశోధనలను పెద్ద పెద్ద గ్రంధాలుగాఅత్యున్నత ప్రమాణాలతో  రాస్తూనే ఉన్నాడు .ఆయన మనసులో సంస్కృత వ్యాకరణం పూర్తిగా నిండి పోయింది .అందుకే ‘’ఎత్యూడ్స్ వేదిక్ ఎట్ పాణినేస్’’రాసి 1955 -56  మధ్య ప్రచురించాడు  .ఇది రెండు వేల పేజీలతో వేద మంత్రాలకు అనువాదం వ్యాఖ్య లతో ఉంది . ఋగ్వేదం లో రెండు వంతుల భాగం చనిపోయే లోపు పూర్తీ చేయ గలిగాడు .ఇన్ స్టి ట్యూట్డీ సివిలిజేషన్ఇండి యెన్నెకు డైరెక్టర్ అయి ,సొసైటీ ఏషియాటిక్ ,అకాడెమి ల మీటింగ్ లకు హాజరయ్యేవాడు .1 66 లో మహా విద్వాంసుడు లూయీ రెనౌ 70 వ ఏట చనిపోయాడు .

ఇంగ్లీష్ లో లూయీ రాసిన గ్రంధాలు –రెలిజియన్స్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,హిస్టరీ ఆఫ్ వేదిక్ ఇండియా ,హిందూయిజం ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఫ్రెంచ్ భాషలో 13 పుస్తకాలు రాశాడు .

 

12-కాదంబరిని అనువదించిన –సి .ఎం .రిడ్డింగ్

కరోలిన్ మేరీ రిడ్డింగ్ 30-8-1832 న వెస్ట్ మిడ్లాండ్స్ లోని మెరిడన్ లో జన్మించి సంస్కృత ,పాళీ భాషలలో విద్వాంసురాలై  భట్టబాణుని కాదంబరిని ఇంగ్లీష్ లోకి అనువదించింది ,తండ్రి విలియం రిడ్డింగ్  మెరిడన్ కు వికార్ ,క్రికెట్ ఆటగాడు .తల్లి కెరొలిన్ సేలిన కాల్డే కాట్ జార్జి రిడ్డింగ్ కు సమీప బంధువు .రిడ్డింగ్ సంస్కృతం నేర్చిన మొట్ట మొదటిమహిళా  స్కాలర్ .ఇ .బి .కౌవేల్ శిష్యురాలు .ఆయన 1903చనిపోయాక ఆయన వద్ద ఉన్న 260గ్రంధాలు ఆమె అధీనం లోకి వచ్చాయి .ఈ పుస్తకాలను కేటలాగింగ్ చేసింది .కేంబ్రిడ్జి యూని వర్సిటి లైబ్రరీకి మొదటి మహిళా అధికారి ..ఎన్నో వేల గ్రందాల పట్టిక తయారు చేసిన ఘనత ఆమెది .

1923 లో కేంబ్రిడ్జి యూని వర్సిటి స్త్రీలకూ మొదటి సారిగా డిగ్రీ ని ప్రదానం చేసినప్పుడు ఆమె ఎం .ఏ డిగ్రీ పొందింది .సంస్కృత ,పాళీ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదిన్చాటమేకాక  బెంగాలి హిందీ లనూ నేర్చింది .టిబెట్ భాష నేర్చి అ భాషా గ్రంధాలపై  జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ స్టడీస్ లో విమర్శలు రాసింది . షార్లెట్ మేరీ యాంగ్ పై ఆమెకు వల్లమాలిన అభిమానం .యాంగ్ రాసిన గ్రంధాలను గిరర్టన్ కాలేజి కి ప్రదానం చేసింది .రిడ్డింగ్ 9-11-1941 న మరణించింది. ఆమె గౌరవార్ధం ‘’రిడ్డింగ్ రీడింగ్ ప్రైజ్ ‘’ను ఏర్పాటు చేశారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-16 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4

11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్

28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా .తండ్రి వేల్స్ లో గణిత శాస్త్ర వేత్త .గణితం లో ‘’పై ‘’గుర్తు ను కనిపెట్టిన వాడు కూడా . కొడుకు జోన్స్ బాల్యం లోనే ఇంగ్లీష్ వెల్ష్ గ్రీక్ ,లాటిన్ పెర్షియన్ ,అరెబిక్ ,హీబ్రూ ,చైనా భాషలను నేర్చి న బాల భాషా మేధావి  .చనిపోయే నాటికి 13 భాషల్లో మహా పాండిత్యం మరో 28 భాషల్లో పాండిత్యం సాధించిన వాడు .అందుకే ఆయన్ను మహోన్నత బహుభాషా వేత్త అన్నారు .

తండ్రి చిన్నప్పుడే చనిపోతే తళ్లి మేరీ నిక్స్ అతి జాగ్రత్తగా పెంచి పోషించింది 1753 లో హారో లో చేరి తర్వాత ఆక్సఫర్డ్ లో చదివాడు .68 లో డిగ్రీ 1773 లో ఎం ఏ చేశాడు . ఫీజులు కూడా కట్ట లేనంత దరిద్రం తో బాధ పడి ఎర్ల్ స్పెన్సర్ కొడుకు ఏడేళ్ళ లార్డ్ ఆన్త్రాప్ కు ట్యూషన్ చెప్పాడు .ఆరేళ్ళు ట్యూటర్ గా అనువాదకుడుగా ఉంటూనే పర్షియన్ భాషలో మీర్జా మేహిది ఖాన్ అష్టార్ బాడి రాసిన ‘’హిస్టరీ ఆఫ్ నాదర్ ఛా ‘’ను ఫ్రెంచ్ భాషలోకి అనువదించాడు .దీన్ని డెన్మార్క్ రాజు ఏడవ క్రిస్టియన్ కోరికపై రాసి 24 ఏళ్ళకే ఓరిఎంటలిస్టు అనిపించుకొన్నాడు  .ఇదే ఆయన మొదటి రచన

1770 లో ‘మిడిల్ టెంపుల్ లో చేరి మూడేళ్ళు’’లా’’ చదివటం తో ఇండియా వెళ్ళే అవకాశం వచ్చింది .30-4-1772 న రాయల్ సొసైటీకి ఫెలో గా ఎంపికై ,వేల్స్ లో సర్క్యూట్ జడ్జి గా పని చేసి , పారిస్ లో బెంజమిన్  ఫ్రాంక్లిన్ పరిచయం తో అమెరికన్ విప్లవం  విషయం లో రాజీ కుదర్చ లేక ,సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ గా కలకత్తా లోని  ఫోర్ట్ విలియమ్స్ లో   పూస్నే జడ్జిగా1783 లో  నియమింపబడి ,ఏప్రిల్ లో నైట్ హుడ్ పొందాడు .అన్నా మేరియా శిప్లీ ను పెళ్ళాడి ముగ్గురుపిల్లల్ని పొంది భార్య సాయం తో ఇండియా చరిత్రను డాక్యుమెంట్ చేశాడు

తీవ్ర భావాలున్న రాజకీయ ఆలోచనా పరుడైన విలియం జోన్స్ అమెరికా స్వాత్నత్ర్య పోరాటాన్ని  సమర్ధించాడు . ‘’ప్రిన్సిపుల్స్ ఆఫ్ గవర్న్ మెంట్ ఇన్ ఎ డయలాగ్ బిట్వీన్ ఎ స్కాలర్ అండ్ ఏ పెజంట్ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .ముద్రణ తర్వాత రాజ ద్రోహం కింది నేర విచారణ ఎదుర్కొన్నాడు .దక్షిణ ఆసియా సంస్కృతులపై మోజు ఎక్కువై 15-1-1784 న కలకత్తాలో ‘’ఏషియాటిక్ సొసైటీ ‘’స్థాపించాడు .నాడీయ హిందూ యూని వర్సిటి కి చెందినా సంస్కృత పండితుడు  రామ లోచన  వద్ద వేదాలను అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .జ్యోతిషం పై సామ్యుయాల్ డేవిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఇదంతా తర్వాత ఆయన రచనా స్రవంతికి  గొప్పగా దోహదం చేశాయి .ఇండియాలోని స్థానిక న్యాయం సంగీతం సాహిత్యం వృక్ష ,భూగోళ శాస్త్రాలపై విస్తృత౦ గా రచనలు చేశాడు .భారతీయ సాహిత్యాన్ని మొదటి సారిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .47 ఏళ్ళు మాత్రమె జీవించిన భారత భాషాభిమాని పండితుడు విద్యావేత్త విలియం జోన్స్ 27-4-1794 న కలకత్తా లో మరణించి సాహితీ లోకం లో తీవ్ర వెలితిని సృష్టించాడు .సౌత్ పార్క్ స్ట్రీట్ సేమేటరిలో ఖననం చేశారు .

విలియం జోన్స్ చేసిన అతి ముఖ్యమైన పని –ఇండో యూరోపియన్ భాషల మధ్య ఉన్న వారసత్వ బాంధవ్యాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయటం.ఏషియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవం లో మాట్లాడుతూ సంస్కృత ,గ్రీకు,లాటిన్ భాషలకు ఒకే మూలం ఉందని ,అదే గోతిక్ ,సెల్టిక్ పెర్షియన్ భాషలనూకలుపుతోందనీ చెప్పాడు .ఈవిషయం విలియం జోన్స్ కంటే ముందే 16 వ శతాబ్దపు ఐరోపా యాత్రికులు గుర్తించి భారత ఐరోపా భాషలమధ్య సన్నిహిత సంబంధం ఉందని రాశారు .1653 లో ‘’వాన్ బాక్స్ హారన్ అనే భాషా వేత్త  జర్మన్ ,‘గ్రీక్ బాల్టిక్ ,స్లావిక్ సెల్టిక్ ,ఇరానియన్ భాషలకు ’ప్రోటో లాంగ్వేజ్ ‘’అనే అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ  పుస్తకం రాశాడు .ఫ్రెంచ్ అకాడెమి సైన్సెస్ కు 1767 లో’’జీవితం అంతా ఇండియాలో గడిపిన  ఫ్రెంచ్ జెసూట్ గాస్టన్ లారెనన్స్ కోర్ డాక్స్  ‘’సంస్కృతానికి యూరోపియన్ భాషలకు మధ్య ఉన్న సారూప్యతను నిర్ధారించి రాసిపంపాడు .1786 లో విలియం జోన్స్ –సంస్కృత ,ఇరానియన్ గ్రీక్ ,లాటిన్ జర్మన్ సెల్టిక్ భాషలకు ఒకే మూలం ఉందని ప్రతిపాదించాడు .అయితే జోన్స్ కృషి అతని ముందు వారి  కృషి కంటే తక్కువే .హిందీ ని వదిలేసి ఇండో యూరోపియన్ భాషలలో ఈజిప్షియన్ జపనీస్ చైనా భాషల్ని జోన్స్ చేర్చాడు .ఈ సామాన్య ఆధార విషయం ‘’ప్రోటో –ఇండో –యూరోపియన్ ‘’గా పిలువ బడింది .

ఉపఖండం లో ఆర్యుల దండ యాత్ర విషయం ప్రతిపాదించి జాతుల మధ్య విభజన తెచ్చిన మొదటి వాడు విలియం జోన్స్ .కాని అతని దగ్గరున్న ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయి .1763 లో 17 వ ఏట జోన్స్ లాటిన్ భాషలో ఆరు లైన్లు ఉండే ఛందస్సులో ‘’కిస్సా ‘’అనే కవిత రాశాడు .దీనికి మాతృక చదరంగం పై 1527 లో ప్రచురింపబడిన ‘’స్కాచ్చియా లూడస్’’అనే 658 లైన్ల కావ్యం .దీనిభావం –వనదేవత కాస్యా మార్స్ పురోగమనాన్ని తిప్పి కొడుతుంది .మార్స్ అంటే కుజుడు క్రీడా దేవత సాయం కోరుతాడు .ఆయన చదరంగాన్ని సృస్టింఛి మార్స్ కు సాయం చేసి కాస్యా అభిమానం పొందేట్లు చేస్తాడు .ఈ చెస్ గేం లో మార్స్ కాస్యాను ఓడిస్తాడు అప్పటినుంచి చెస్ కు కాస్యా దేవతః అయింది .ఇదీ కద

తత్వ వేత్త కోపెన్ హార్ విలియం జోన్స్ రాసిన ‘’వరల్డ్ ఆజ్ విల్ అండ్ రిప్రేసేన్తెషణ్ ‘’నుఉదహరిస్తే, అమెరికన్ కవి ఎడ్గార్ అల్లెన్ పో  తన బెర్నిస్ కదానికలో జోన్స్ కవితను పొందుపరచాడు .విలియం జోన్స్ దాదాపు 30 గ్రంధాలు రాశాడు

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-9-16 –ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3

8-  జర్మన్ ఇండాలజిస్ట్  -దియోడర్ ఆఫ్రేట్

జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో   జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ ‘’గ్రంధం క్రిస్చాఫ్ తో కలిసి రాసి వెలువరించాడు .1852 లో ఆక్స్ ఫర్డ్ కు మారి బోడియాన్ లైబ్రరీలో చదివాడు .1862 నుండి ,1875 వరకు 13 ఏళ్ళు స్కాట్ లాండ్ లోని ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ గా పని చేసి ,మొదటి సారిగా ఏర్పడిన ‘’సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ‘’పీఠాన్ని అధిష్టించాడు .1875 లో ఎల్.ఎల్.డి.డిగ్రీ పొందాడు .

1875 లో ఆఫ్రేట్ బాన్ యూని వర్సిటి ఇండాలజీ చైర్ పై కొలువయ్యాడు .14 ఏళ్ళు అందులో ఉన్నాడు .1891 నుంచి 1903 లోపు ‘’ఆల్ఫబెటికల్ కేటలాగ్ ఆఫ్ ఆల్ సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్ కలెక్షన్ ‘’చేశాడు .దీనికే ‘’కేటలాగ్ కేట లాగోరం ‘’అని పేరు పెట్టాడు .1935 నుండి అన్ని భారతీయ వ్రాత ప్రతులను అపూర్వం గా సేకరించిన ఘనత ఆయనది .మద్రాస్ యూని వర్సిటి ఆ నాటి వరకు ఉన్న వాటినన్నిటిని సేకరించి కేటలాగ్ తయారు చేసింది .ఉజ్వల దత్త వ్యాఖ్యానం ,డీ హైమేన్ డేస్ రిగ్వేద,ఆత్రేయ బ్రాహ్మణ ,కేతలాగో కేటలాగోరియం మూడు  భాగాలు అఫ్రేట్ అద్భుత కృషి

.Inline image 1

9-స్కాటిష్ ఓరియెంటలిస్ట్ -జేమ్స్ రాబర్ట్  బాలంటైన్

స్కాటిష్ ఓరి యెంటలిస్టు జేమ్స్ రాబర్ట్ బాలంటైన్ 1813 లో జన్మించి 1864 లో మరణించాడు .1845 నుంచి వారణాసి సంస్కృత కళాశాలలో సూపరిం టే౦డెంట్ గా ఉన్నాడు .1861 లో లండన్ వెళ్లి ఇండియా ఆఫెస్ లైబ్రరీకి లైబ్రేరియన్ గా ఎన్నికయ్యాడు .

బాలం టైన్ సంస్కృత ,హిందే  మరాటీ భాషలకు వ్యాకరణం రాశాడు.’’లఘు కౌముది ఆఫ్ వజ్ర దత్త ‘’ను1849 నుండి 52 లోపు కృషి చేసి ప్రచురించాడు .పతంజలి మహా భాష్యం  మొదటి భాగాన్ని 1856 లో ప్రచురించాడు   .ఈవిదం గా నేటివ్ ఇండియన్ వ్యాకరణ పద్ధతిని  ను మొదటి సారిగా యూరోపియన్ విద్యా  వేత్తల దృష్టికి తెచ్చాడు  .ఇతర రచనలు –ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ అండ్ వ్రజ్ భాషా గ్రామర్ ,హిందూ స్తాని సెలెక్షన్స్ ,పాకెట్ గైడ్ టు హిందూ స్తాని కన్వర్సే షన్ ,పర్షియన్ కాలి గ్రాఫి ,ప్రాక్టికల్ ఓరిఎంటల్ ఎంటర్ ప్రిటర్ ,కాటే చిజం ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ ,క్రిస్టియానిటి  కాం ట్రాస్తేడ్ విత్ ఇండియన్ ఫిలాసఫీ ,ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ .

Inline image 2

10-బహు భాషా వేత్త మిత్రలాభ ప్రచురణ కర్త  –ఫ్రాన్సిస్ జాన్సన్

179 5 లో పుట్టి 1876లో చనిపోయిన ఫ్రాన్సిస్ జాన్సన్ సంస్కృత ,తెలుగు ,బెంగాలి భాషలను ఈస్ట్  ఇండియా కాలేజి లో 1824 నుంచి 1855 వరకు 34 ఏళ్ళు బోధించాడు .పర్షియన్ ఆరబిక్ ,ఇంగ్లిష్ భాషలకు సమగ్ర నిఘంటువులు తయారు చేసి 1852 లో ప్రచురించాడు .యవ్వనం లో చార్లెస్ లాక్ ఈస్ట్ లేక తో కలిసి రోమ్,ఎదేన్స్ లను సందర్శించి 1824 లో మళ్ళీ లండన్ చేరుకొన్నాడు .హెర్ట్ ఫోర్ట్ హీత్ లో కాంగ్రి గేషనల్ చాపెల్ నిర్మాణం చేశాడు .హితోపదేశ ,మొదటి సంస్కృత పుస్తకం పేర మిత్రలాభం  ప్రచురించాడు .

Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

23-9-16 

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2

6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్

1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి ,క్లాసిక్స్ లోను ,ఇండియన్ లాంగ్వేజెస్ లోను ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందాడు .రెండిటిలోనూ బ్రౌన్ మెడల్ సాధించాడు .కేంబ్రిడ్జి లో ఎద్వార్డ్ బిల్స్ కోవెల్ వద్ద సంస్కృతం అభ్యసించాడు

Inline image 2

1898 నుండి 1927 వరకు ఇండియా ఆఫీస్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా ఉన్నాడు .అదే సమయం లో లండన్ యూని వర్సిటి కాలేజి లో  కంపారటివ్ ఫైలాలజి  లెక్చరర్ గా.19 08 నుంచి 19 35 వరకు పని చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి బోడేన్ సాంస్క్రిట్ ప్రొఫెసర్ గా 19 27 నుంచి 37 వరకు పని చేస్తూ బాలియాల్ కాలేజి ఫెలో అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో ఆయ శిష్యులైన వారిలో ప్రముఖుడు హోరాల్ద్ వాల్టర్ బైలీ ఉన్నాడు .19 27 లో ఫెలో ఆఫ్ బ్రిటిష్ అకాడెమి గౌరవం పొందాడు .6-5-1956 న 8 8 వ ఏట మరణించాడు .

జాక్వెస్ బకాట్ టో కలిసి ‘’ఓల్డ్ టిబెటన్ హిస్టారికల్ టేక్స్త్స్ సేకరించి ప్రచురించాడు .మధ్య ఆసియా నుండి టిబెటన్ వ్రాతప్రతులను సేకరించి ఇండియా ఆఫీస్ లైబ్రరీలో భద్ర పరచాడు .బాణుని హర్ష చరిత్ర ,సైనో  టిబెటన్ సరిహద్దు ప్రాంత౦ పు ‘’నాం’’భాష పై  పరిశోధన చేసి రాశాడు .ఎన్శేంట్ ఫోక్ లిటరేచర్ఆఫ్  ఈస్ట్రన్ టిబెట్ పుస్తకం రాశాడు .

7-ఇంగ్లీష్ ఓరి ఎంటలిస్ట్-డాక్టర్ హోరేస్  హేమన్ విల్సన్

ఇంగ్లిష్ ఓరి ఎంటలిస్ట్అయిన హోరేస్ హేమన్ విల్సన్  26-9-1786 న జన్మించి ,సెయింట్ ధామస్ హాస్పిటల్ లో మెడిసిన్ చదివి 1808 లో ఇండియా వచ్చి బెంగాల్ లో అసిస్టంట్ సర్జన్ గా ఈస్ట్ ఇండియా కంపెని లో పని చేశాడు  .మెటలర్జీ మీద ఆయనకున్న అపార జ్ఞానం కలకత్తా లోని మింట్ కు దగ్గర చేసి,జాన్ లేడెన్ తో కలిసి పని చేశాడు .భారతీయ పురాతన సాహిత్యం పై అభిలాష ఏర్పడి నందున హెన్రి ధామస్ కోల్ బ్రూక్ ఇతన్ని బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ సెక్రెటరి చేశాడు .కాళిదాస మేఘ దూతం ను అందమైన ఆంగ్లభాషలోకి అనువాదం చేశాడు .1819 లో మొట్ట మొదటి సంస్కృత –ఇంగ్లీష్ నిఘంటువును సంస్కృత విద్యావేత్తల సయం తో తన స్వంత పరిశోధనతో కూర్చాడు .దీన్ని రుడాల్ఫ్ రోత్ ,ఆతోవాన్ బోత్లింక్ లు1853  – 1876 మధ్య తయారు చేసిన ‘’సాంస్క్రిట్ ఓర్టర్ బర్చ్ ‘’ వెనక్కి నెట్టేసింది .

విల్సన్ కు ఆయుర్వేదం పై అభిరుచి కలిగి అధ్యయనం చేసి కలరా ,కుష్టు వ్యాధుల నివారణకు మందులపై మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీ ఆఫ్ కలకత్తా లో వ్యాసాలు రాశాడు .1827 లో ‘’సెలెక్ట్ స్పెసిమేన్స్ ఆఫ్ ది దియేటర్ ఆఫ్ ది హిందూస్ ‘’పుస్తకం ,భారత దేశ నాటకాలను ,నాటక శాలలను క్షుణ్ణంగా పరిశోధించి రాశాడు .’’మెకంజీ కలెక్షన్స్ ‘’అనేది మరొక గొప్ప కృషి .’’హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ ది ఫస్ట్ బర్మీస్ వార్ విత్ డాక్యుమెంట్స్ పొలిటికల్ అండ్ జాగ్రాఫికల్ ‘’మరో గొప్ప పుస్తకం .పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ సేక్రేటరిగా ,కలకత్తా సంస్క్రుతకాలేజి సూపరింటే౦డ గా పని చేశాడు .విష్ణు పురాణాన్ని ఇంగ్లీష్ లోకి  అనువదించాడు .హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రాశాడు .ఇంగ్లీష్ ను భారతీయుల నెత్తిన రుద్ద కూడదని ఎలుగెత్తి చాటిన భారతీయ భాషాభిమాని హోరేస్ విల్సన్ దీనివలన కొంత వ్యతిరేకతను బ్రిటిష్ వారి నుంచి ఎదుర్కొన వలసి వచ్చింది .1832 లో బ్రిటిష్ ప్రభుత్వండా హోరేస్ విల్సన్ ను ఆక్స్ ఫర్డ్  లో ఏర్పాటు చేసిన బోడెం సంస్కృత పీఠం కు మొదటి అధికారిగా ఎంపిక చేసి నియమించింది .దీనిపై 1832 మార్చి 6 న ‘’ది టైమ్స్ ‘’పత్రికు ఒకకాలం నిడివిఉన్న ప్రకటన ఇచ్చాడు .1836 లో ఈస్ట్ ఇండియా కంపెనీ లైబ్రేరియన్ అయ్యాడు .ఈస్ట్ ఇండియా కంపెనికాలేజిలో బోధనా చేశాడు కలకత్తా మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీలో సభ్యత్వ మిచ్చి గౌరవించారు .రాయల్ ఏషియాటిక్ కంపెనీకి ప్రాధమిక సభ్యుడు .1837  నుండి చనిపోయేదాకా దానికి డైరెక్టర్ గా ఉన్నాడు .8-5-1860లో చనిపోయిన విల్సన్ ను కేంసాల్ గ్రీన్ సేమిటేరి లో ఖననం చేశారు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2

3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్

ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందాడు .బోడేన్ సాంస్క్రిట్ స్కాలర్షిప్ పొంది ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి 1909నుండి ఇండియాలో వివిధ హోదాలలో15 ఏళ్ళు పని చేసి రిటైరై ఇంగ్లాండ్ వెళ్లి పోయాడు . అప్పటినుంచి సంస్క్రుతాధ్యయనం సాగించాడు .చైనా టిబెట్ భాషాధ్యయనమూ చేశాడు  .

మధ్యయుగపు శిల్పాలపై ఒక వ్యాసం రాశాడు .తర్వాత సంస్కృత సాహిత్యం లో వ్యవసాయం మొదలైన విషయాలపై 1928నుండి 36 వరకు రాశాడు .రెండవ శతాబ్దానికి చెందిన బుద్ధ ఘోషుని ‘’బుద్ధ చరిత్రను’’ అనువాదం చేసి ప్రచురించాడు.ఇదే తన మహత్తర రచన అని ‘’ది టైమ్స్ ‘’పత్రికలో తెలియ జేశాడు .1937లోఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో  బోడేన్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్  అయి ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ కీపర్ గా ,,ప్రోఫెస్సోరియాల్ ఫెలో ఆఫ్ బాలియాల్ కాలేజ్ గా పని చేశాడు .బోడేలేన్ లైబ్రరీకి సంస్కృత వ్రాతప్రతుల కేటలాగింగ్  చేశాడు .ఇండియన్ ఇన్స్టిట్యూట్ మ్యూజియం అభి వృద్ధి కి కృషి చేశాడు .ఇండియా ఆఫీస్ లైబ్రరి వ్రాతప్రతులపైనా సహాయం చేశాడు .వివిధ వైవిధ్య అంశాలపై చాలా వ్యాసాలూ రాసి ప్రచురించాడు .సర్ హెన్రి మే కుమార్తె ఐరిస్ మే ను పెళ్ళాడి ,చనిపోయిన తన సోదరుని పిల్లలను చేరదీసి పెంచాడు .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో కుటుంబాన్ని అమెరికాకు మార్చి ,తాను ఆక్స్ ఫర్డ్ లోనే ఉన్నాడు .ఎయిర్ రైడ్ వార్డెన్ గా ,హోమ గార్డ్ గా సేవ చేశాడు .1942 అక్టోబర్ 24న57 వ ఏట  మరణించాడు .

4-సంస్కృత వ్యాకరణ రచయిత ఆర్ధర్ ఆంటోని మాక్డోనాల్డ్

11-5-1854 నజన్మించి 28-12-1930 న మరణించిన ఆర్ధర్ ఆంటోని మాక్ డోనాల్డ్ ఇండియాలోని ముజఫర్ పూర్ లో ఇండియన్ ఆర్మీ కి చెందిన చార్లెస్ అలేక్సాండర్ మాక్ డోనాల్డ్ కుమారుడు .గాట్టిన్జన్ యూని వర్సిటి లో చదివి ,కార్పస్ క్రిస్టి కాలేజ్ – ఆక్స్ ఫర్డ్  నుంచి 1876 లో మెట్రిక్ పాసై బర్మన్ ,చైనీస్ సంస్కృతం లో  బోడేన్ స్కాలర్షిప్ పొంది  క్లాసికల్ ఆనర్స్ లో 1880 లో గ్రాడ్యుయేట్ అయి ,ఆక్స్ ఫర్డ్ లో ‘’టైరియాల్ టీచర్ ఆఫ్ జర్మన్ ‘’గా ఉద్యోగం పొంది ,83 లోలీప్జిగ్ యూని వర్సిటి నుంచి  పి .హెచ్ .డిఅందుకొని,88 లో ఆక్స్ఫర్డ్ లో సంస్కృతం లో డిప్యూటీ ప్రొఫెసర్ గా చేరి 8 9 లో బోడేన్ ప్రొఫెసర్ అయి , బాలియాల్ కాలేజ్ ఆక్స్ ఫర్డ్ కు ఫెలో షిప్ పొందాడు .అనేకసంస్కృత గ్రంధాలను ఎడిట్ చేశాడు .సంస్కృత వ్యాకరణం రాశాడు .సంస్కృత నిఘంటువు ను కూర్చాడు .వేదిక్ గ్రామర్ ,వేదిక్ రీడర్ వేదిక్ మైదాలజి లతోబాటు సంస్కృత చరిత్ర రాశాడు .ఇవికాక,అనే ఋగ్వేదం లోని దేవీ దేవతలపై  ‘’బృహద్దేవత’’పుస్తకం రాశాడు .

 

5- క్లాసిక్స్ ప్రొఫెసర్-క్రిస్టఫర్ మిన్కోవ్ స్కి

క్రిస్టఫర్ జాన్ మిన్కోవ్ స్కి అమెరికా దేశ విద్యా వేత్త .ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటిలో సంస్కృత బోదేన్ ప్రొఫెసర్ .గిల్మన్ స్కూల్ లో చదివి హార్వర్డ్ కాలేజి లో ఇంగ్లీష్ అధ్యయనం చేసి ,ఢిల్లీ యూని వర్సిటి నుంచి 1976 లో హిందీలో డిప్లమా పొంది ,హార్వర్డ్ కు తిరిగొచ్చి ,మాస్టర్ డిగ్రీ అందుకొన్నాడు ,సంస్కృతం ,ఇండియన్ స్టడీస్ లో 1986 లో పి హెచ్ డి తీసుకొని  ఆక్స్ ఫర్డ్ వుల్ఫ్సన్ కాలేజిలో రిసెర్చ్ చేయటానికి ముందు అయోవా ,బ్రౌన్ యూని వర్సిటీలలో విద్యా బోధన చేశాడు.

1989 నుంచి 2006మధ్య కార్నెల్ యూని వర్సిటీలో బోధన గరపి ,ఏషియన్ స్టడీస్ అండ్ క్లాసిక్స్ కు ప్రొఫెసర్ అయ్యాడు .2005 లో ఆక్స్ ఫర్డ్ లో బోడేన్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ అయ్యాడు .దీనితో బాటు ఆక్స్ ఫర్డ్ లోని బాలియాల్ కాలేజి ప్రోఫెస్సోరియాల్ ఫెలో కూడా అయ్యాడు .

‘’ప్రీస్ట్ హుడ్ ఇన్ ఎన్శేంట్ ఇండియా ‘’అనే గ్రంధాన్ని 1991 లో రాసి ప్రచురించాడు .వేదమతం ,సాహిత్యం ,మోడరన్ ఇంటలేక్త్యువల్ హిస్టరీ ఆఫ్ సదరన్ ఏసియా లపై చాలా వ్యాసాలూ రాశాడు .

 

6- హిందూ యిజం గ్రంధ కర్త ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ స్థాపకుడు  -సర్ మోనియర్ మాక్స్ ముల్లర్ తో పోటీ పడిన -మోనియర్ విలియమ్స్

12-11-1819 నఇండియాలోని బొంబాయి లో  జన్మించిన మోలియర్ మోలియర్ విలియమ్స్ బాంబే ప్రెసిడెన్సిలో సర్వేయర్ జనరల్ మోనియర్ విలియమ్స్ కుమారుడు .1887 వరకు ఇంటిపేరు విలియమ్స్ గా ఉండి తర్వాత మొనియర్ విలియ మ్స్ మార్చాడు .1822 లో ఇంగ్లాండ్ లోని హావ్,చెల్సియా ,ఫించ్లి  స్కూల్స్  లో చదవటానికి వెళ్ళాడు .కింగ్స్ కాలేజి స్కూల్ బాలియాల్ కాలేజి లలో  ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చదివాడు .1848 లో జూలియా గ్రంధం నుపెళ్ళాడి ఆరుగురు మగ ,ఒక ఆడ పిల్లలకు తండ్రి అయ్యాడు .71  వ ఏట ఫ్రాన్స్ లోని కేన్స్ లో 11-4-1899 న మరణించాడు .

18 4 4 నుండి -5 8 వరకు ఈస్ట్ ఇండియా కంపెని కాలేజి లో ఏషియన్ లాంగ్వేజెస్ బోధించాడు ,1887 ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామం లో ఆ కంపెని రద్దయింది .186౦ లో బోడేన్ చైర్ ఆఫ్ సాంస్క్రిట్ ఎన్నికల ప్రచారం లో మాక్స్ ముల్లర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి బాగా గుర్తింపు పొందాడు .1831 లో సంస్కృత పీఠం అధిస్టించి సంస్కృత వ్రాత ప్రాతులను సేకరించి భద్ర పరచిన హోరాక్ హేమాన్ విల్సన్ 186౦ లో మరణించగా ఖాళీ ఏర్పడింది .తన స్థానాన్ని విలియమ్స్ కు ఇవ్వాలని ఆయన కోరాడు .జగజ్జెట్టి అయిన మాక్స్ ముల్లర్ కు పోటీ గా నిలిచాడు .మాక్స్ ముల్లర్ మత విషయం లో ఉదార వాది . విలియమ్స్ కు ఇండియాపైనా సంస్క్రుతంపైనా అనుభవం బాగా ఉంది. క్రిస్టియన్ మతం పై పూర్తీ విశ్వాసమున్నవాడు .ముల్లర్ జీవితం లో ఇండియాను చూడనే లేదు .ఇది విలియమ్స్ కు బాగా కలిసి వచ్చింది.ప్రొఫెసర్ గా ఎంపికైన విలియమ్స్ ఓరిఎంటల్ స్కాలర్షిప్ కు క్రిస్టియన్ మత స్వీకరణ ముఖ్యం అన్నాడు  .188 7 లో ‘’హిందూ యిజం ‘’అనే పుస్తకం రాశాడు .హిందూ ఇజం అనేపేరు అప్పుడే నిఘంటువులో చోటు చేసుకొన్నది

18 8 3 లో విలియమ్స్ యూని వర్సిటికి చెందిన ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ను ఏర్పాటు చేసి విద్య తోబాటు సివిల్ సర్విస్ కు శిక్షణ కూడా ఇప్పించాడు .భారతీయ సంస్కృతిపై పరిశోధన జరగాలని కోరాడు .18 7 5 నుండి ఏడాదిపాటు ,18 8 3 లోను ఇండియాలో పర్యటించి తన భావనలో ఉన్న ప్రాజెక్ట్ కోసం ధన సమీకరణ చేశాడు .భారత దేశ రాజులకు ప్రేరణ కలిగించాడు .1883 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ శంకు స్థాపన చేయగా 1886 లో లార్డ్ జార్జి హామిల్టన్ ప్రారంభోత్సవం చేశాడు .ఈ సంస్థ 1947 లో భారతదేశం  స్వాతంత్ర్యం పొందగానే మూత పడింది .

మొనియర్ విలియమ్స్ అనేక వ్యాసాలు  రాసి అద్వైత వేదాంతం ఒక్కటే వేదాలను సరిగ్గా అర్ధం చేసు కొనే పద్ధతిలో ఉందని అదే ముక్తికి మార్గమని తెలియ జేశాడు .బాగా ప్రచారం లో ఉన్న కర్మ ,భక్తీ సిద్ధాంతాలు తక్కువ స్థాయివి అని అభిప్రాయ పడ్డాడు .సంక్లిష్ట విధానాలతో అల్లకల్లోలమైన భావాలను సంస్కృతసాహిత్యం  ఐక్య పరచింది అన్నాడు .మొనియర్ సంస్కృత –ఇంగ్లిష్ నిఘంటువు 1899 లో తయారు చేశాడు .ఇది1872 లో వచ్చిన  పూర్వపు పీటర్స్ బర్గ్ నిఘంటువును ఆధారం గా చేసిందే. కాళిదాస మహాకవి విక్రమోర్వశీయం  ,శాకుంతలం లను  అనువాదం చేశాడు .ఎలిమెంటరిగ్రామర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ,శిక్షా పత్రీ కి అనువాదం ,బ్రాహ్మినిజం అండ్ హిందూఇజం ,బుద్ధిజం ,కూడా రాశాడు

1876 లో నైట్ హుడ్ పొందాడు .ఆక్స్ ఫర్డ్ నుంచి ఆనరరి డి.సి ఎల్ ,కలకత్తా నుండి ఎల్. ఎల్. డి,గూటిన్జేన్ నుండి గౌరవ పి .హెచ్ .డిఅందుకొన్నాడు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు

 

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్-22-9-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు

1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో

1909జూన్ 29 న  మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో  కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జ్ క్రైస్ట్ కాలేజి లో చేరటానికి స్కాలర్షిప్ సాధించాడు .సంస్క్రుతంపై అభిమానమేర్పడి కంపారటేటివ్ ఫైలాలజిలో స్పెషలైజ్ చేశాడు .ఇండియాలోని అన్నామలై యూని వర్సిటి లో పి ఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద ‘’సంస్కృతం లోని ద్రావిడ భాషా పదాలను గుర్తించటం లో సమస్యలు ‘’పై పరిశోధన చేసి ‘’ది కలేక్టేడ్ పేపర్స్ ఆన్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ‘’గా 1968 లో ప్రచురించాడు . ఇండాలజిస్ట్ మాత్రమే కాక బారో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బోడెన్ సంస్కృత ప్రొఫెసర్ కూడా .19 44నుంచి 76 వరకు 32 ఏళ్ళు అక్కడ పనిచేశాడు .అదే సమయం లో ఆక్స్ ఫర్డ్ బలియాల్ కాలేజి ఫెలో గా కూడా ఉన్నాడు . ఆయన రచనలు 1-ఏ ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ ,2-ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ష్వా ఇన్ సాంస్క్రిట్, 3-ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఇతర రచనలు –ట్రాన్స్ లేషన్ ఆఫ్ ది ఖరోషి ఫ్రం చైనీస్  అండ్ టర్కిస్తాన్  ,ఏ కంపారటివ్ వొకాబ్యులరి ఆఫ్ ది గోండి లాంగ్వేజ్ ,కలేక్క్టేడ్ పేపర్స్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ .సంస్కృత భాషా సేవకుడైన బారో 19 86 జూన్ 8 న మరణించాడు .

2- బౌద్ధం పై సాధికారత ఉన్న రిచర్డ్  గా౦ బ్రిచ్

పియానిస్ట్ అయిన ఐల్ గామ్బ్రిచ్ కు ఆస్ట్రియన్ –బ్రిటిష్ ఆర్ట్ హిస్టోరియన్ ఎర్నెస్ట్ గాం బ్రిచ్ దంపతుల ఏకైక కుమారుడు రిచర్డ్ గాం బ్రిచ్ .17-7-1937న జన్మించాడు .లండన్ లోని సెయింట్ పాల్ స్కూల్ లో చదివి ,ఆక్స్ ఫర్డ్ లోని మాగ్డలిన్ కాలేజి లో చేరాడు .1961 లో బి ఏ పాసై ,63 లో హార్వర్డ్ నుంచి ఎం .ఏ .పొంది ,70 లోఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి  డి.ఫిల్ .సాధించాడు .ఇండాలజిస్ట్ గా ఉండి సంస్కృత ,పాళీ ,బౌద్ధాలపై విద్వా౦సుడయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో బోడెం ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా 1976 నుంచి 2004వరకు 28 ఏళ్ళు పనిచేశాడు .

బౌద్ధమత అధ్యయనం లో కాకలు తీరిన పండితుడు రిచర్డ్ .సమకాలీన సింహళ బౌద్ధం పై పరిశోధన చేసి ‘’ప్రిసేప్ట్ అండ్ ప్రాక్టిస్ –ట్రడిషనల్ బుద్ధిజం ఇన్ ది రూరల్ హైలా౦డ్స్ ఆఫ్ సిలన్ ‘’గ్రంధాన్ని 1971 లో ప్రచురించాడు  .20 వ శతాబ్దపు ‘’తెర వాదబౌద్ధ’’మహా పండితులలో వ్రేళ్ళ మీద లెక్కించదగిన వారిలో రిచార్డ్ ఉన్నాడు .ఇప్పుడు బౌద్ధ అధ్యయనం లో రిచర్డ్ పేరు మీద ‘’గా౦బ్రిచియన్ ‘’పదం చోటు చేసుకొన్నది అంటే అతని  ప్రమేయం ఎంత ఉందొ అర్ధమై పోతుంది .

40 ఏళ్ళకు పైగా ఆక్స్ ఫర్డ్ లో పని చేసి రిటైర్ అయ్యాక కూడా ఇంకా బోధిస్తూనే ఉన్నాడు .ఆయన 50 కి పైగా పరిశోధన పత్రాలు రాశాడు .అందులో సింహ భాగం బౌద్ధం మీదనే ఉన్నాయి .బౌద్ధ సంఘ లోని పెద్దలపైనా పరిశోధన చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బౌద్ధ అధ్యయనం కోసం ‘’నుమత ఫౌండేషన్ ‘తో ఒక పీఠం’ఏర్పరచాడు. ఉన్నత విద్యాభి వృద్ధిపై మక్కువ ఉన్న రిచర్డ్ 2000సంవత్సరం లో టోక్యో యూని వర్సిటి లోని గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ స్టడీస్ ఆహ్వానం పై వెళ్లి ‘’బ్రిటిష్ హయ్యర్ ఎడ్యుకేషన్ పాలిసి ఇన్ ది లాస్ట్ 20 యియర్స్ ‘’అనే అంశం పై ఉన్నత విద్య పై తనకున్న అభిప్రాయాలను వెల్లడించాడు .విజిటింగ్ ప్రొఫెసర్ గా ప్రిన్స్ టన్,కింగ్స్ కాలేజ్ –లండన్ ,హాంగ్కాంగ్ సియోల్ మొదలైన యూని వర్సిటీలను సందర్శించి బోధించాడు .ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ బుద్ధిష్ట్ స్టడీస్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1994 నుండి 2002వరకు పాళీ టెక్స్ట్ సొసైటీ ప్రెసిడెంట్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరీ కి జనరల్ ఎడిటర్ ఎమిరిటస్ హోదా ఉంది .

1993 లో కలకత్తా లోని ఏషియాటిక్ సొసైటీ ఆహ్వానించి సన్మానించింది .94 లో శ్రీలంక ప్రెసిడెంట్ ‘’శ్రీలంక రాణజ్న’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు

..

సశేషం

మీ-గబ్బిట డుర్గాప్రసాద్ -22-9-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం )ఆవిష్కరణ

సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ప్రచురిస్తున్న 22 వ పుస్తకం గా ,నేను రచించిన 14 వ గ్రంధంగా సరసభారతి కి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ప్రాయోజకులుగా సహాయి సహకారాలతో ముద్రిస్తున్న 7 వ పుస్తకం గా ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 482 మంది సంస్కృత కవుల జీవిత,సాహిత్య పరామర్శ గా బృహద్గ్రంథం గా అక్టోబర్ మాసం చివరలో ఆవిష్కరణ జరుపు కో బోతోందని సవినయం గా  తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రం అక్టోబర్  రెండవ వారం లో అందజేస్తాము   .-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-16

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ లేక ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణ కోసం 1958 ఆర్మేడ్ యెన్ఫోర్సేడ్ యాక్ట్ ను ఈ ఏడు రాష్ట్రాలలో అమలు చేసి౦ది .దీనిప్రకారం సైన్యం ప్రజా రక్షణ కోసం వారంట్ లేకుండా ఆస్తులు ఇల్లు వ్యక్తులను సోదా చేయటానికి ,జమ్మూ కాశ్మీర్ లో లాగా రాజ్యాంగ ధిక్కారం పై యే మాత్రం అనుమాన మొచ్చినా తీవ్రమైన ఆయుధాలను ప్రయోగించటానికి అనుమతి నిచ్చింది ఒక్కోసారి సైన్యం కూడా దురుసుగా ,దుడుకుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి పెద్ద ఉద్యమాలకు దారి తీశాయి . .ఇదీ ఈశాన్య భారత స్థితి .ఈ కల్లోల భారతం లో మణిపూర్ లో జన్మించిన మహిళా జాతి రత్నమే ఐరాం షర్మిల .

షర్మిల పోరాట పటిమ :

‘’మణిపూర్ ఉక్కు మహిళ’’ అని పిలువబడే ఐరాం షర్మిల.14-3- 1972లో జన్మించి హైస్కూల్ చదువులో 12 వ క్లాస్ పూర్తీ చేయకుండానే తన రాష్ట్రం లో ప్రజా ప్రతిఘటన నాయకురాలిగా నిలిచింది .పౌరహక్కుల రాజకీయ పోరాట యోధురాలు .కవ యిత్రి .ఐరాం పై తండ్రి ప్రభావం చాలా ఉంది. మానవ హక్కులను కాల రాస్తున్నందుకు నిరసనగా ప్రజా హక్కుల పోరాటం చేసింది .

నరమేధానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష : 
ఇంఫాల్ లోయ లోని 2-11-2000 న ‘’మాలూం నర మేధ౦ ‘’లో అస్సాం రైఫిల్స్అనే పారా మిలిటరీ దళం చేతిలో 10 మంది అమాయక ప్రజలు బస్ స్టాప్ లో నిలబడి ఉండగా కాల్పులలో చని పోవటానికి సైన్యం చేసిన దమన కాండకు నిరసనగా ఆమె మాలూం లో 28 వ ఏట నవంబర్ 5 న నిరాహార దీక్ష చేబట్టింది .చనిపోయిన వారిలో’’ లీసేంగ్ భం ఐసే టో౦బి’’,అనే 62 ఏళ్ళ మహిళ ,’’నేషనల్ బ్రేవరి అవార్డ్ ‘’పొందిన 18 ఏళ్ళ’’ సీనం చంద్ర మణి’’ ఉన్నారు . ఈ సంఘటన ఆమె పై గొప్ప ప్రభావం చూపింది . ‘’ఆఫ్సాచట్టాన్ని ‘’ప్రభుత్వం ఉప సంహరించేవరకు తాను అన్నంతిననని , మంచి నీళ్ళుకూడా తాగనని తల దువ్వుకోనని అద్దం లో ముఖం చూసుకోనని కఠోర నియమాలు ఏర్పరచుకొని నిరాహార దీక్ష కొన సాగించింది .మూడవ రోజున ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తోంది అని చట్టప్రకారం అది నేరం అని అరెస్ట్ చేసి,తర్వాత జుడీషియల్ కస్టడీలో ఉంచారు .ఆమె ఆరోగ్యం క్షీణించి పోతూ ఉండటం తో ఆమెకు బలవంతంగా ద్రవాహారం ఇచ్చారు .ప్రతి సంవత్సరం ఆమె నిరాహార దీక్ష చేబట్టటం అరెస్ట్ అవటం విడుదలవటం మళ్ళీ దీక్ష చేబట్టటం జరిగింది .

2006లో అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు షర్మిల ఢిల్లీ లోని రాజ్ ఘాట్ ను సందర్శించి తనకు ఆదర్శమైన మహాత్మునికి పుష్ప గుచ్చం సమర్పించి ,ఆ సాయంత్రమే విద్యార్ధి బృందాలు మానవ హక్కులకోసం చేస్తున్న పోరాటం లో జంతర్ మంతర్ వద్ద కలిసి నాయకత్వం వహించి౦ది .అస్సాం రైఫిల్స్ హెడ్ క్వార్టర్ ముందు షర్మిలకు మద్దతుగా 30 మంది మహిళలు నగ్న ప్రదర్శన చేశారు .వాళ్ళ చేతులలో ‘’భారత సైన్యం మమ్మల్ని రేప్ చేస్తుంది ‘’ అన్న బానర్లు ఉన్నాయి .వాళ్ళందర్నీ నిర్బంధించి మూడు నెలలు జైలులో ఉంచారు .

షర్మిలకు మద్దతు : 
2011 లో షర్మిల మానవ హక్కుల నాయకుడు అన్నా హజారే ను మణిపూర్ సందర్శించ వలసిందిగా కోరింది ఆయన తన తరఫున ఇద్దరినీ పంపాడు .అదే ఏడాది అక్టోబర్ లో ‘’మణి పూర్ ప్రదేశ్ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ‘’శషర్మిలకు మద్దతు ప్రకటించి ,పార్టీ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ ని’’ఆఫ్సా చట్టాన్ని ‘’ఉపసంహరించటానికి సాయం చేయమని కోరింది .దీనికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సానుకూలంగా స్పందించాయి .11 వ నిరాహార దీక్ష సమయం లో నవంబర్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ ను షర్మిల కలిసి అస్సాం లో అమలులో ఉన్న చట్టాన్ని ఉపసంహరించమని కోరింది .నవంబర్ 3 న 100 మంది మహిళలు అంబారి లో మానవ హారంగా చేరి 24 గంటల నిరాహార దీక్షతో షర్మిలకు మద్దతు తెలిపారు .అదే ఏడాది ‘’సేవ్ షర్మిలా సాలిడారిటి కాంపైన్ ‘’ఏర్పడి ఆమె ఉద్యమానికి మరింత బలం చేకూర్చారు .డిసెంబర్ లో పూనే యూని వర్సిటి మణిపూర్ మహిళలు 30 మందికి డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్ లను ‘’షర్మిలాచాను’’ 39 వ జన్మదినోత్సవ పురస్కారంగా మంజూరు చేసింది .దీక్ష ప్రారంభించాక ఒకే ఒక్క సారి తల్లిని చూడటానికి వెళ్ళింది .’’ఆఫ్సా చట్టం’’ ఉపసంహరించాక మాత్రమే మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె పెట్టిన అన్నం తింటాను ‘’అని ప్రకటించింది .
దీక్ష విరమణ

28-3-2016 న 16 ఏళ్ళ నిరాహార దీక్షను షర్మిల విరమించింది .చేసిన శపథం ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళలేదు తల్లిని చూడలేదు చట్టం ఉపసంహరించాల్సిందే అని పట్టు బట్టి అదే రోజు సాయంత్రం ఇంఫాల్ లో షాహిద్ మీనార్ లో మళ్ళీ నిరాహారదీక్షమొదలు పెట్టింది .ఆమరణ నిహారాహార దీక్ష నేరం అంటూ మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు .26-7-16 న షర్మిల తాను ఆగస్ట్ 9 న దీక్ష విరమిస్తానని ,మణిపూర్ ఎన్నికలలో పాల్గొంటానని ప్రకటించింది .ఆమె ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది .ఆమె చేసిన శపదాలను పట్టించుకోనందుకు జనం కలతచెందారు ‘’నేను రాజకీయాలలో ఉండి ఆఫ్సా చట్ట ఉప సంహరణకు తీవ్రంగా కృషి చేస్తాను ‘’అని శాంత పరచింది ..

ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక నిరాహార దీక్ష : 
ఏకంగా 500వారాలు కఠిన కఠోర నిరాహార దీక్ష చేసింది .ప్రపంచ నిరాహార దీక్ష సమ్మెలో ఇది చారిత్రాత్మకంగా నిలిచి రికార్డ్ సృష్టించింది .ఇంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసినవారెవ్వరూ ప్రపంచం మొత్తం మీద లేనే లేరు ..ఆహారం నీరు లను ఆమె తీసుకోకుండా నే ఇంతకాలం నిరాహార దీక్ష చేసింది . 2014 ఎన్నికలలో ఆమెను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికలో పోటీచేయమని కోరాయి .ఆమె తిరస్కరించింది .జైలులో ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు అయినట్లు చట్ట ప్రకారం ఆమెకు ఓటు చేసే హక్కును రద్దు చేసింది ప్రభుత్వం .19-8-20 14 న కోర్టు ఆమెను నిర్బంది౦చ టానికి తగిన కారణాలేవీ లేవని విడుదల చేసింది .కాని 22-8-2014న మళ్ళీ అరెస్ట్ చేశారు .విడుదల చేసి, కోర్టు ఆమె ను జుడీషియల్ కస్టడీ లో 15 రోజులు ఉంచారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .

గౌరవ పురస్కారాలు : 

2004 లో షర్మిల ను ‘’ప్రజా ప్రతిఘటన చిహ్నం ‘’గా గుర్తించి ఆరాధించారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .అహింసా పూరిత సత్యాగ్రహ పోరాటానికి షర్మిలకు 2009 లో ‘’మయిల్లమ్మా ఫౌండేషన్ ‘’వారు ‘’మయిల్లమ్మా అవార్డ్ ‘’ను ప్రదానం చేశారు .2010 లో ‘’ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్’’షర్మిలకు ‘’జీవన సాఫల్య పురస్కారం ‘’అందించింది .రవీంద్ర నాద టాగూర్ శాంతి బహుమతి తో పాటు 5 లక్షల నగదు పురస్కారాన్ని ‘’ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ‘’పురస్కారం అందుకొన్నది .’’శాంతి సామరస్య ‘’సాధన కోసం చేసిన కృషికి ‘’సర్వ గుణ సంపన్న’’పురస్కారం పొందింది . .2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఐరాం షర్మిల ఏం. ఎస్ .ఎన్ .వాళ్ళు నిర్వహించిన ఓటింగ్ లో అగ్రభాగాన నిలిచింది .

షర్మిల జీవితం పోరాటాలపై ‘’దీప్తి ప్రియా మేర్హోత్ర ‘’బర్నింగ్ బ్రైట్ –ఐరాం షర్మిల –అండ్ హర స్ట్రగుల్ ఫర్ పీస్ ఇన్ మణిపూర్ ‘’పుస్తకాన్ని రాశారు ..’’ఓజాస్ యే సి ‘’అనే పూణే నాటకనటుడుఆమె జీవితం ఆధారంగా ‘’టేక్ ది టార్చ్ ‘’అనే మొనో ప్లే ప్రదర్శించాడు .దీన్ని దేశం లో చాలా చోట్ల ప్రదర్శించి షర్మిల స్పూర్తిని తెలియ జేశాడు . మణిపూర్ ఉక్కు మహిళ ఐరాం షర్మిల అందరికీ ఆదర్శంగా నిలిచి స్పూర్తి ,ప్రేరణలనిచ్చింది .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

లాభాపేక్ష లేని  స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి

రాజమండ్రి లోని గౌతమి కంటి ఆస్పత్రి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచిత నేత్ర వైద్యం చేస్తున్న గొప్ప సంస్థ .ఉభయ గోదావరి జిల్లాలు ఖమ్మం కృష్ణా జిల్లాలో వారు ఐ కాంప్ లు నిర్వహిస్తూ ,రాజమండ్రి నుండి సకల వైద్య పరికరాలతో వచ్చి ఉచితం గా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలిచ్చి ,మరీ అవసరమైతే వారి కున్న ఏ సి వాన్ లో రాజమండ్రి తీసుకు వెళ్లి అక్కడి గౌతమి హాస్పిటల్ లో చేర్చి ఉండటానికి ఏ సి రూమ్ ఇచ్చిఉచితం గా  అపరేషన్ చేసి అవసరమైన మందులు ఇచ్చి మర్నాడు వారి ఏ సి కారు లోనే ఇంటికి అంటే స్వగ్రామానికి చేరుస్తున్నారు .ఒక వారం తర్వాత వారే కారు లో ఇంటికి వచ్చి ఫాలో అప్ యాక్షన్ చేసి నేత్ర రోగులపాలిటి అశ్వినీ దేవతలుగా సేవ లందిస్తున్నారు .ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్ కాని ఆధార కార్డ్ కాని ,ఉంటె చాలు రోగులు ఎలాంటి ఫీజులు ఆపరేషన్ ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిర్వహిస్తూ ,అందరి అభిమానం పొందుతున్నారు .ముఖ్యంగా రిటైర్ అయిన వారికి గొప్ప ఊరట కల్పిస్తున్నారు .

సుమారు వారం క్రితం నా తోటి ప్రధానోపాధ్యాయుడు ,హిడ్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరి ,మాతో పాటే రిటైర్ అయిన పెదముత్తేవి ఓరిఎంటల్ హై స్కూల్ మాజీ హెడ్ మాస్టర్ శ్రీ కోసూరు ఆదినారాయణ రావు నాకు ఫోన్ చేసి కృష్ణా జిల్లా మొవ్వ ,కూచిపూడి మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం లో రాజమండ్రి గౌతమీ నేత్రాలయ వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించామని వారి సేవలు చిరస్మరణీయమని  మా ఇద్దరికీ తెలిసిన ఎందరో చికిత్స చేయించు కొన్నారని ,11 వ తేది న మొవ్వ హై స్కూల్ లోపెన్షనర్స్ సర్వ సభ్య సమావేశం జరుగుతోందని అందులో గౌతమి  నేత్రాలయ సీనియర్ డాక్టర్ ఎం డి శ్రీ రాజు గారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని ,నన్ను కూడా ఆత్మీయ అతిధిగా రావలసిందిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు ఆ రోజు నాకు వేరే పని ఉండటం వలన రాలేక పోతున్నానని తెలియ జేశాను .సరే అన్నారు .తర్వాత రెండు రోజులకు ఫోన్ చేసి 18 వ తేది కూచిపూడి లో గౌతమి వారి ఐ కాంప్ నిర్వహిస్తున్నామని తప్పక రావలసిందిగా కోరారు సరే అన్నాను .

ఇవాళ కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్రం లో జరిగిన ఐ కాంప్ కు నేను వెళ్లాను .ఇద్దరు యువ డాక్టర్లు చాలా శ్రద్ధగా అందరినీ చాలా ఓపికగా అన్ని పరీక్షలు చేసి సలహాలు ఇస్తున్నారు .నాతొ పాటు రిటైర్డ్ హెడ్ మాస్టర్లు శ్రీ యెన్ అంజయ్య ,శ్రీ రామస్వామి శ్రీ ఆంజనేయులు మొదలైన వారూ వచ్చారు పరీక్ష కోసం .శ్రీ జి .ఉమామహేశ్వర రావు గారు ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుని హోదాలో కనిపించారు .నేనూ పరీక్షలు చేయించుకొన్నాను .నాకు సుమారు 8 ఏళ్ళక్రితం ఎడమ కంటి రెటీనాకు లేజర్ ఆపరేషన్ చేయిన్చుకోన్నానని ఆ రిపోర్ట్ చూపి ,జూన్ లో ఉయ్యూరు రోటరీ కంటి ఆస్పత్రిలో చెక్ చేయించుకొని కొత్త జోడు వాడుతున్నానై చెప్పాను అన్నీ ఓపికగా విని కంటిలో రెండు సార్లు డ్రాప్స్ వేసి మళ్ళీ పరీక్ష చేసి అంతా బాగానే ఉందని కుడి కంటికి కొద్దిగా శుక్లం ఉందని ఇపుడిప్పుడేమీ కంగారు పడాల్సింది లేదని అంటే ఒక ఏడాది ఆగచ్చా అని నేను అడిగితే ఆరునెలల తర్వాత మళ్ళీ పరీక్ష చేసి చూపు తగ్గితే అప్పుడు చూద్దాం ప్రస్తుతం మండులుకాని ఐ డ్రాప్స్ కాని అక్కర లేదు అని చెప్పారు .ఈ యువ డాక్టర్ గారి సరసభారతి ప్రచురణ గ్రంధాలు 9 ,శ్రీ ఉమా మహేశ్వర రావు తోడుగా అందజేశాను ఆయన వాటిని ‘’మీ పెద్దాయనకు ఇవ్వండి ‘’అని చెప్పారు సరే అన్నారు కుర్ర డాక్టర్ .ఉమా గారికీ మన పుస్తకాలు ఇచ్చాను .దాదాపు 100మంది దాకా ఇవాళ పరీక్ష చేయించుకొన్న వారున్నారు .అందరు చాలా సంతృప్తిగా ఉన్నట్లు అర్ధమైంది .ఇలాంటి కాంప్ లు నిర్వహిస్తున్న శ్రీ ఆదినారాయణ అండ్ కొ వారికి ,గౌతమి నేత్రాలయ వారికి వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు .రాష్ట్రం లో అంధత్వం ఉండరాదు అన్న రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం తో చేతులు కలిపి గౌతమి  సేవ చేస్తోంది .వారిని అడిగి వారి బ్రోచర్ తీసుకొన్నాను .అందులోని ముఖ్య విషయాలు మీకు తెలియ జేస్తున్నాను .

ఉద్యోగుల ఆరోగ్య పధకాలను హెల్త్ కార్డ్ ద్వారారుసుము లేకుండా  సేవలు అందించటం .ప్రాధమిక పరీక్షలు ,నిర్ధారిత పరీక్షలు అవసర శాస్త్ర  చికిత్సలు  ఉచితంగా పొందవచ్చు .ప్రభుత్వంనిర్దేశించిన ప్రమాణాలతో సేవలు అందించటం సమాజం లో విజ్ఞులైన వర్గాలకు కంటి సేవలు అందించటం వీరి ముఖ్య ధ్యేయం.ఉద్యోగ సంఘాలున్న చోట కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు .ఉన్న కళ్ళ జోడు నుపరీక్షించి మార్పులు ఉంటె సూచించటం మధు మేహ వ్యాధి ఉన్నవారికి రెటీనా ఫోటో తీసి గ్లకోమా ,రేటినో పతి నిర్ధారణ చేస్తారు .న్యాయమైన ధరలకు కళ్ళజోళ్ళు అందజేస్తారు .శస్త్ర చికిత్సలు చేయించుకొనే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు .వీరికి రాజమండ్రి గౌతమి హాస్పిటల్ లో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పిస్తారు శస్త్ర చికిత్స చేయి౦చు కోనేవారికి అవసరమైన రక్త పరీక్షలు ,కంటి పరీక్షలు ఉచితం గా చేస్తారు.అమెరికా పద్ధతిలో శుక్ల శస్త్రచికిత్సలు చేస్తారు .శస్త్ర చికిత్సానంతరం కూడా వైద్య సేవలు అందజేస్తారు .గౌతమి నేత్రాలయం లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నదాన్ని ఆచరణ లో చూపిస్తూ సేవ చేస్తున్న ఉన్నత ఆదర్శాలతో నడుస్తున్న సంస్థ . అవసరమైన వారందరూ వీరి సేవలను వినియోగించుకొని కంటి స్వస్థత పొందాలని కోరుతున్నాను .

కళా క్షేత్రానికి వెడుతున్న దారిలోమెయిన్ రోడ్డుకు దగ్గరలో  ఎడమవైపు సిలికానాంధ్రా వారుఅన్ని వైద్య సేవలు అందించే  చాలా పెద్ద  .సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కడుతున్నారు .భూమిని సుమారు నాలుగు గజాల లోతు కు తవ్వి ఉంచారు .పనులు ప్రారంభించాలి ఇది శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి ఆధ్వర్యం లో సర్వాంగ సుందరంగా అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న విద్యాలయం .కూచిపూడి కి వరం అందరికీ గొప్ప సదుపాయం .

గౌతమి నేత్రాలయ కంటి శిబిరం ఫోటోలు తీశాను. జత పరుస్తున్నాను చూడండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- -18-9-16 –ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత రత్న ఏం ఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి

Inline image 1

సరస భారతి ఆధ్వర్యం లో ఈ రోజు 17-9-16 శనివారం సాయంత్రం 6- 30 గం లకుసరసభారతి 97వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో గానకోకిల ,భారత రత్న శ్రీ మతి ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గారి శత జయంతి సభ నిర్వహిస్తున్నాం .తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ బృందం సంగీత కచేరి నిర్వహిస్తారు . సంగీత రసజ్ఞులందరూ విచ్చేసి సభను జయప్రదం చేయవలసినదిగా ఆహ్వానిస్తున్నాం .

జోశ్యుల శ్యామలా దేవి   మాది రాజు శివ లక్ష్మి ,గబ్బిట వెంకట రమణ   గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు             కార్య దర్శి               కోశాధికారి                అధ్యక్షులు -సరసభారతి

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక అధికారం కావాలి .తెలుగు సాహిత్యం లో ఆయన తాకకుండా విడిచిన మార్గం లేదు .ఆయన పద రచనలలో బాగా పండినవి కిన్నెరసాని పాటలు .దీని కదా వస్తువు ఆయన తయారు చేసుకోన్నదే .దీనికి ఆధారం రెండే రెండు .ఒకటి భద్రాద్రి దగ్గర కొండ ,రెండవది దాన్ని చుట్టుకొని ప్రవహించే యేరు .ఆ ఏరే ‘’తెలుగు సాని ‘’అయింది .పెనుగొండ లోని ‘’బృందావనం ‘’చూసి ,శుక్తిమతి ,కోలాహలపర్వత౦, గిరిక పాత్రలను   సృష్టించిన భట్టు మూర్తి జ్ఞాపకం వస్తాడు. ఒకటే దృశ్యం రెండు హృదయాలలో భిన్న రీతులలో భిన్న లక్ష్యాలకు ఆధార మైంది .భట్టు పాండిత్యాన్ని గుమ్మరించి ,మెదడును వంచి భళీ అని పించుకొంటే ,విశ్వనాధ తాను వాపోయి ,మనల్ని ఏడిపించాడు .రసనాళాలను తాకి ,రసము యొక్క మేరలు తడిమాడు .కిన్నెర సాని రసాకృతి .అందుచే ‘’ధునీ వైఖరి బూనింది .మగడు శిలా సదృశుడైన మగవాడు –రాయి అయ్యాడు .ఇద్దరికీ కలిగింది ఒకటే దుఖం .కాని సంభవించింది భిన్న పరిణామం .దీనికి కారణం స్త్రీ పురుషుల జన్మల మూలతత్వం లో ఉన్న భేదమే .ప్రకృతి రూపం లో ఉన్న స్త్రీ రసాకృతి .,ముగ్ధ లలితా స్వరూపిణి .పురుషుడు స్త్రీకంటే గంభీరుడు ,ఉదాత్తుడు .వాని హృదయం దుఖం చేత పగులు తు౦ది కాని ప్రవహించదు .ఈ దృశ్యాన్ని చదువుతుంటే ఉత్తర రామ చరితలో భవభూతి వర్ణించిన ‘’అనిర్భిన్న గభీరత్వా దంత ర్గూఢ ఘనవ్యదః –పుట పాక ప్రతీకాశో రామస్య కరుణో రసః ‘’జ్ఞాపకం వస్తుంది .కిన్నెర సాని దుఖాన ఒక వనమే కాదు ,తెలుగు వారి బ్రతుకులన్నీ పాట అయి పోతాయి .ఇదొక విలక్షణ కావ్యం .ఒక ప్రత్యేక రచనా పద్ధతికి దారి తీసింది .విశ్వనాధ –కిన్నెర సాని అనుస్యూతాలై ఆంద్ర సారస్వతం లో నిక్కచ్చిగా నిలిచి పోతాయి .సాంకేతిక కావ్య దృష్టిలో చూస్తే   కిన్నెర సానిలో ‘’పులుముడు ‘’ఎక్కువ .అందుకే దాన్ని చదవ కూడదు .పాడాలి .’’ఓ నాధ ఓ నాద ‘’అని నాలుగు సార్లు వస్తుంది .ఈ నాలుగు సార్లను వేర్వేరు స్వరాలలో మేళవిస్తే ,అనేక భావ ,రాగాలకంటే స్పష్టంగా కనిపిస్తుంది .దీనితో ‘’లీనత ‘’ధర్మం ఎక్కువై మనసుకు పడుతుంది .(దీన్ని విశ్వనాధ స్వరం లో  వింటే మధురాతి మధురం గా ఉంటుంది ఆ ఒయ్యారాలు పోకడలు అన్నీ కళ్ళకు కట్టిస్తాడు )కావ్యం అంతా ‘’రోకంటి పాట’’లాగా కాకుండా విషయ భేదాన్ని బట్టి గేయాల మట్టులు మారాయి .నిష్కల్మష ప్రేమకు భగవంతుడు దగ్గరలోనే ఉంటాడు .కిన్నెర ,దాని మగడు బతికి పవిత్రులు ,చచ్చి కూడా పవిత్రులైనారు .కనుక ఈ కావ్యం మోదాంతమే .

‘’విశ్వనాధ నవలలో మూడు నేను చూశాను .అవి నవలలు కాదు కావ్యాలే .విశ్వనాధ నవలలు రాయటం అంటే భవభూతి నాటకాలు రాయటం లాంటిదే .నాటక కారుడు సహస్రాక్షుడు అవ్వాలి .భవభూతి నాటకాలలో ‘’సెన్స్ ఆఫ్ ప్రోపోర్షన్ ‘’-పరిమాణం లో మితి తక్కువ .మాలతీ మాధవ నాటకమే దీనికి ముఖ్య సాక్ష్యం .విశ్వనాధ ‘’మహావేశి.చెలియలి కట్ట నవల లో ఆత్మ వేదన మొదటి నుంచి చివరిదాకా ఛాయా రూపంగా పారింది .ఆయన వచనం వచనం కాదు –కవిత .అంటే గద్యానికి కావలసిన గుణాలకంటే ,పద్యానికి కావలసిన భావన ,ఆవేశం ముందు నడుస్తాయి .వేయి పడగలు చదువు తూ ఉంటె ఒక మహా కావ్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన వచనం లోనూ అనేక శయ్యలున్నాయి .నన్నయ లాగా దీర్ఘ కోమల సమాసాలు ,తిక్కన లాగా విరుపులు ,శ్రీనాధుని బిగువైన పటాటోపం ,పోతన లాగా గలగలమనే అనుప్రాస లతో మధుర లాస్యం చేస్తాయి .పెద్దన లాగా శిరీశ కుసుమ పేశల వైదగ్ధ్యాన్ని ,రాయలలాగా మారు మూల పదాల పోహలింపు ,తెన్నాలి వానివలె ఉద్దండ శైలి చిమ్మగలడు. చేమకూర వాని లాగ తెలుగులోని అచ్చు కత్తులు చూపిస్తాడు .చివరికి చూర్నికలనూ వదలలేదు .చిత్ర విచిత్ర శయ్యల్ని కొత్తగా సృష్టించాడు .వచన రచనలో అతనికి అతడే సాటి .నిజంగా గద్యానికి శైలి అంటూ ఉండదు. కాని ఈయన ఎన్నో పద్ధతులను ప్రవేశ పెట్టి అప్రతిభులను చేశాడు .వేయి పడగలు అపూర్వ సృష్టి ..సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగలు .కాని ఈ కవి ప్రతిభాషణం అసంఖ్యాకాలై తెలుగు నేలను ఆవరించాయి .దానిలో ఒక ‘’విరాట్ స్వరూపం ‘’ఉంది.ప్రాచీన ,నవీన సమాజాలకు వేయి పడగలు ఒక లంకె .దాన్ని చదవకూడదు .వల్లించాలి .ప్రేమించ దగినదే కాదు పూజించాలి ఆంధ్రులకు అది గర్వ కారణం పసరిక పాత్ర భావనా కల్పితం .గిరిక దేవ దాసీత్వం గూడు కట్టిన మూర్తి .అరుంధతి సాక్షాత్తు అరుంధతీ దేవియే .ధర్మారావు  విశ్వనాధ యే..అదొక అమృత ప్రవాహం .గ౦ధర్వ లోకం .

వేన రాజు నాటకం పండితులలో ఒక ‘’తుఫాను నే లెవ దీసింది .దాన్ని పరా మర్షించే  విమర్శ గ్రందాలెన్నో వచ్చాయి .నర్తన శాల చిన్నతనం లో రాసినట్లు అనిపిస్తుంది .ఆయన ప్రాచీన మహా కవుల కెవ్వరికీ తీసిపోని సాహితీ సార్వ భౌములు ,మహా పండితుడు ,విశంకటుడు ‘’అయన మరో రూపం లో వచ్చిన నన్నయ .గుడివాడలో జరిగిన సన్మానం చంద్రునికో నూలు పోగే .న్యాయం గా ఆయనను ‘’ధర్మ సింహాసనం పై ఎక్కించి ,రాజులు మోయాలి .ఆయన గౌరవం ఆంధ్ర దేశ గౌరవం .ఇప్పటికే అ మహా కవి ‘’కాలమందు అరుగని వాడు ‘’అయ్యాడు .ప్రతి పద్య రాసాస్పదమైన  రామాయణ కల్ప వృక్షాన్ని పాడి రుషియే కాగలడు.’’అంతా వ్యర్ధం .వట్టి ఆశ పెను మాయా వల్లి ‘’అంటూ మూల కూర్చు౦టాడేమోనని భయం నాకు ఉంది  .తెలుగు వారి నోముల  చేత ,ఆంద్ర సాహితీ పుణ్యం చేత అలాంటి దుష్కాలం మాత్రం రాకుండు గాక ‘’అనిసరస్వతీ పుత్రులు కోరుకొన్నారు .   ఇదీ శ్రీ పుట్ట పర్తి నారాయణ చార్య గారి దృష్టి కోణం లో విశ్వనాధుని  సాహితీ విశ్వ రూపం ..

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16 –ఉయ్యూరు

Inline image 1 Inline image 2

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2

‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార శ్రుతిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తుల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్తరంగాలలో –ముయ్యేరై ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ  అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని కనిపిస్తుంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని  -పోయేటి వేళలో భూమి తనంతగా –తోరమై విరియుచూ త్రోవ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన రామాయణ వృత్తాంతం వ్యంగ్యం గా ధ్వని0చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తుంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి .భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .

‘’  ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తుంది .ఆయన ఉపాస్య దైవం నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది ?దీనికి రసావేశమే కారణం .మహా స్వతంత్రుడు .ఏ పోకడలనైనా పోతాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తుంది .నిలిచి స్వతంత్రంగా చెబితే మాత్రం నన్నయ భట్టారకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం రాస్తాడు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద గతి కనిపిస్తుంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు విస్తరిస్తాయి  .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే అలంకారాలన్నీ కొత్తవే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొత్తు .చాలని దానికి  సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రాక్షీ భవద్బాడబా ‘’అని సంబోధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్తభావం చూపిస్తాడు .ప్రౌఢోక్తి అతని సొమ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రుడు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా కన్పించాడు .సముద్రుడు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గుతున్న దున్న ‘’గా కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .

‘’  పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది వోలె కదలింది –వడలు తెల్లని త్రాచు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త పదబందాలే .  స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్తగా అలవాటు పడని భావ నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రాచు లాగా చుట్టలు చుట్టలు గా చుట్టుకొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి,  మనల్ని నిట్టూర్పులతో వెనక్కి పంపిస్తాడు .మహా రసావేశి కనుక  పదాలు ,భావాలు అవశాలై దొర్లుతాయి .వెనకా ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ ,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న  ఈ కవికి  తలచుటకు ముందే తమంత తామే పై బడి దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్దరము కలసి పోదామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తామురా’’అని వాపోయినప్పుడు ఆ ముగ్ధతకు మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తుంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను  తానే మరిచి పోతాడు .’’నీ నిస్టాగతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ భావానికి పరాకాష్ట ..ఏ వస్తువును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పోతాడు ‘’.

‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టాలని కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్తం ఉడు కెత్తుతుంది .అక్కడి తెలుగు మట్టి గడ్డలలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రాణిస్తాడు .ఇంత అభిమానం ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తుల్లాంటి  ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపోతే గంభీర భావాలు సుకుమారమైన భాష లో ఇమడక హిందీ రచయిత  ‘’ద్విజేంద్రు’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది .ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తుంది ?నిష్టుర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి  నవ్వు ‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .

ఎంత  ఖచ్చితం గా బంగారాన్నితూచి విలువ కడతారో అంతఖచ్చితంగా విశ్వనాధ సాహిత్యాన్ని తూకం వేసి నిగ్గు తేలుస్తున్నారు సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్య .అందుకే నాకీ వ్యాసం బాగా నచ్చింది అన్నాను .మిగిలిన విశేషాలు మరో సారి .,

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16- ఉయ్యూరు

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య గారి వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది .అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .

‘’  విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొక విచిత్ర మానవుడు .విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞానం లో ఉన్న అజ్ఞానం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తాడు .తెలుగు నేలపై విశ్వనాధ వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని కుండం .కుంగి కుంగి దుఖం పట్టలేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క సారి తన రచనలను బయటికి వెదజల్లుతాడు .జీవచ్చవమై పోతున్న సమాజాన్ని చూసి కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిద్రం .దానితో వైదుష్యం .స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపోయాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో ప్రారంభమై ,భవభూతిలో పండిన మార్గమే పట్టింది .ఇదే ఆయన మూల తత్త్వం .తాను మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపోని ప్రపంచాన్ని విడువ లేడు,సరి పోనీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్తం మాటేమో కాని వైదిక రక్తం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిద్రం ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పోషించారు .నన్నయ కంటే తెలుగు తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పోకడలు తప్ప విశ్వనాధ లో తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థాన త్రయ పాఠం చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రాన్ని ఔపోసనే పట్టాడు .నన్నయ ను ఉపాసి౦చాడు .తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పోతనకు మొక్కి ,రాయల వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .

ఆంగ్ల భాషలో ప్రాచ్య హృదయం లోని శాంతి-రుషిత్వం విశ్వనాధ కు కనిపించలేదు .ఆయన పరీక్ష మహా నిశితమైనది .వస్తువునుకాని ద్రుశ్యాన్నికాని నిశితంగాపరీక్ష గా  చూస్తాడు .ఆ పరీక్ష లో సౌందర్య సీమను దాటుతాడు .సౌందర్యం గౌణం అయి కర్కశత్వం ఏర్పడుతుంది .ఏదైనా చెబితే పాఠకుడు మరువనట్లు మరచి పోలేనట్లు చెప్పాలని ఆకాంక్ష .అమిత వేధ అనుభవిస్తాడు .లెక్కలేనన్ని కొత్త పదాలు సృష్టిస్తాడు .భాషను సుడులు తిప్పుతాడు .కొత్త ఉక్తుల్ని కల్పిస్తాడు .ఇదే వేదన భవభూతి పొందాడు .భవ భూతికి సీత లాగా విశ్వనాధకు దేవదాసి ,గిరి కన్నేలలలో భగవంతుడు ఆడాడు .వీరిద్దరికీ స్త్రీ జగన్మాత .

ప్రయోగాలలో విశ్వనాధ సర్వ స్వతంత్రుడు .సంస్కృత వైకల్పికాలన్నీ రచనలో గుప్పించాడు .ఆయన ఆచ్చిక ప్రయోగాలకు వ్యాకరణం ఇంకా సాధించాలి .గ్రామ్య పదాలేన్నిటికో గ్రా౦ధికత కల్పించాడు .ఆవేశం లో ఆయనకు శరీరమే తెలియదు .సంస్క్రుతాభిమానం తో జాను తెలుగు సొగసుల్ని  అభిమాని౦చ లేదేమో .రసలబ్దులగు రచయితలకు అనవసరం కూడా .నాకు మాత్రం పాత్రోచిత భాషా వాది అని పిస్తాడు .ఆయన భాష గీర్వాణ సార్వ భౌమత్వాన్ని అంగీకరించింది .ఆయన అనుభవం ‘’రావి ఆకుల చుట్టలు కాల్చుకొనే పాలేరు బుడ్డ వాళ్ళు మొదలు కొని ,జమీందారుల వరకు విరిసి కొన్నది’’ .ప్రౌఢత్వం ఆయన స్వభావం అయి పోయింది .చిన్న భావాన్ని కూడా గొప్ప భాషలో చెబుతాడు .భాషా సంధిలో భావ బంధాన్ని ఇరికించి నపుడు భావం మనకు అందుబాటులోకి రాదు ‘’.

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

అమెరికా

నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

విధవా పునర్వివాహ ఉద్యమ౦

1884 లో మద్రాస్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు బళ్లారిలో మొదటి విధవా వివాహాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విందు కూడా ఏర్పాటు చేశాడు .సాంప్రదాయ స్మార్తులు వెంకట రావు కు వ్యతిరేకమై ఆయనను ఆయన శూద్ర సేవకులను వెలివేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు .దీన్ని ధిక్కరించి ఆయన తనకు తన వారికి స్నేహితులకు అందరూ చూస్తూ ఉండగానే మంచి నీరు ,విలువైన ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేవాడు .విరూపాక్ష మతానికి చెందిన శ్రీ శంకరా చార్యులు  వెంకట రావు కు బంధువులు అవటం వలన ఆయన తటస్థంగా ఉండిపోయారు .విధవ పునర్వివాహాలపై విస్తృతంగా శాస్త్ర  చర్చ జరగాలని శంకరాచార్య అభిప్రాయ పడ్డారు .వెంకట రావు చొరవ ,ధైర్యాలకు ఆకర్షింపబడిన ఆయన కులస్తులు సంకోచం లేకుండా ఆయనతో సన్నిహితంగానే మెలిగి స్మార్తుల ఆంక్షలను తూ నా బొడ్డుఅన్నారు .దీని తర్వాత మళ్ళీ రెండు విధవా పునర్వివాహాలను వెంకట రావు నిర్వహించాడు .అందులో ఒకదాన్ని తన స్వంత ఇంట్లోను ,రెండవది తన స్నేహితుడైన సభాపతి మొదలియార్ ఇంట్లో చేశాడు .పరిస్థితి  అర్ధం చేసుకొన్న అతని బంధుగణం ఆయన ఇంట్లో జరిగిన ఏ శుభ ,అశుభ కార్యాలకూ ఆటంకం కలిగించకుండా ప్రవర్తించారు .

సముద్రం పై విదేశీ యానం

1887 లోమద్రాస్ లో  జరిగిన సోషల్ కాన్ఫ రెన్స్ కు హాజరై ,సముద్రాంతర ప్రయాణం పై ఆనాడున్న ఆంక్షల విషయం పరిష్కరించాలనుకొన్నాడు .’’కాలాపానీ ‘’ని రెండు సార్లు దాటి శ్రీలంకకు ,రెండు సార్లు బర్మాకు ఓడపై ప్రయాణించి వెళ్ళాడు .ప్రతిసారీ సముద్రం పై నాలుగు నుంచి ఆరు రోజులు ప్రయాణం చేశాడు .వెంకట రావు దృఢ సంకల్పానికి ఆయన బంధువులు మిత్రులు అందరూ అబ్బురపడి ఎవరూ అభ్యంతరం తెలుప లేదు. ఈ విధం గా జన హృదయాలను గెలుచుకొన్నాడు .ఆయన శీలం మీద మచ్చ పడకుండా ప్రవర్తించారు అందరూ .దీనిపై మరింత అవగాహన కలిగించాలని ఆయన 1902మేలో ఇంగ్లాండ్ దేశానికి వెంట వంటవాడు కాని పనివాడుకాని లేకుండానే ఒక్కడే వెళ్ళాడు .ఆరునెలలుండిఇంగ్లాండ్ లోని  గ్రామీణ ప్రాంతాలను పట్నాలను కలియ తిరిగి ,తర్వాత స్కాట్లాండ్ ,ఐర్లాండ్ తో పాటు ఐరోపాలోని చాలా దేశాలు పర్యటించాడు .స్కాండినేవియన్ పెనిన్సుల ,రష్యా ,టర్కీ లు తప్ప అన్నీ చూశాడు .ఆ యా దేశాలలో తాను చూసిన వాటి గురించి బంధు మిత్రులకు వెంట వెంటనే వివరంగా ఉత్తరాలు రాసేవాడు .వాటిని ముద్రించి ఉంటే అమూల్యమైన యాత్రా , లేఖా సాహిత్యం మనకు లభించి ఉండేది  .9-8-1902 న లండన్ లో జరిగిన ఏడవ ఎడ్వర్డ్ రాజు పట్టాభిషేకానికి హాజరై నాడు .

అపూర్వ స్వాగతం

సీమ దేశ పర్యటన దిగ్విజయం గా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట రావు కు గుంతకల్ రైల్వే స్టేషన్ లో బ్రాహ్మణ ,అబ్రాహ్మణ ,వైదిక ,గృహస్త జనాలందరూ అపూర్వ స్వాగతమిచ్చి బళ్ళారి దాకా ఊరేగింపుగా తోడ్కొని వచ్చి ఇంటి వద్ద కు చేర్చారు .బళ్లారిలో అంతటి సంరంభం అంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు .ఎవరికీ జరుగ లేదు కూడా .వెంకట రావు ఎక్కిన బండీని  .ప్రజలు భక్తిగా తామే లాగుతూ పురవీధుల్లో ఊరేగింపు చేశారు .తర్వాత అన్ని కులాలవారు వెంకట రావు ను విందు భోజనాలకు ఆహ్వానించి అపూర్వా సఖ్యతను చాటారు .ప్రెసిడెన్సి కి అవతల ఉన్న ఆయన కులస్తులు కూడా అరమరికలు మరచి ఆయనను ఆహ్వానించి ఆయనతో కలిసి మెలిసి నడిచారు .

అపూర్వ వ్యక్తిత్వం

అజేయమైన నడవడి .మచ్చ లేని శీల సంపత్తి ,ప్రగతి పై అకు0ఠిత విశ్వాసం ,ధ్యేయ సాధనకు మనో నిబ్బరం ఆత్మ స్థైర్యం ,సాహసం అందరిని ఒప్పించే నేర్పు ఉన్నవాడు కనుకనే వెంకట రావు అన్నిటా  విజయం సాధించాడు అని గ్రహించాలి .ఆయన ప్రవర్తనలో  అణుమాత్రం కూడా దోషం ఎవరూ గుర్తించలేదు. అంతటి విశుద్ధ మనస్కుడు వెంకట రావు .ఆ రోజుల్లో అందరూ తాగే  సోడా నీరుకాని ,మత్తు పానీయాలు కాని రుచి చూడని అపూర్వ వ్యక్తి వెంకట రావు .1889 లో భార్య మరణించింది .అప్పటి నుండి భారత దేశం లో విధవలు పాటించే అత్యంత పరిశుద్ధ జీవితాన్ని వెంకట రావు గడిపాడు .భార్య చనిపోతే ఏ విధురుడూ అంతటి కఠోర నియమాలతో జీవించటం మనం ఎవరూ చూడనది .సాంఘిక నియమాలను ఉల్లంఘించిన వారిని వెంకట రావు చాలా సున్నితంగా మందలించి తప్పు తెలుసుకోనేట్లు చేసేవాడు ఆయన నడవడి ఆచరణ  ఆలోచన అంతా విశ్వ జనీనమైనదిగా అంటే కాస్మోపాలిటన్ గా ఉండేది .ఆయనకు కులమతాల పట్టింపు ,పక్షపాతాలు లేనేలేవు.హిందూ ,మహమ్మదీయ ,క్రైస్తవులను సోదరులుగా ఆత్మీయులుగా భావించి ,వారికి ఏ కష్టం ,నష్టం వచ్చినా మనస్పూర్తిగా వారిపక్షాన నిలబడి సాయం ,న్యాయం చేసేవాడు .వారి సాంఘిక రాజకీయ ఉన్నతికి పాటు పడేవాడు .అందరితో కలిసి సంచరిస్తూ దురభ్యాసాలనుంచి వారిని దూరం చేస్తూ పరిశుభ్రత పారిశుధ్యాలపై అవగాహన కలిగింఛి ఆచరణ సాధ్యం చేసేవాడు .

ఆ రోజుల్లో బళ్ళారి లోని బ్రాహ్మణకుటుంబాలలో ఎవరైనా మరణిస్తే ,వారి శవాలను  ఇళ్ళనుండి చాలా దూరం లో ఉన్న శ్మశానానికి తీసుకొని వెళ్ళటానికి శవ వాహకులు లభించేవారు కాదు .ముఖ్యంగా బీద బ్రాహ్మణులు శవవాహక బ్రాహ్మణులు కోరే అధిక ధనాన్ని చెల్లించలేని పరిస్థితి ఉండేది .ఈ అనివార్య పరిస్థితులలో వెంకట రావు వారికి అండగా ఉండి ధన రూపం లోనూ ,శవ వాహన విషయ౦  లోనూ  సహాయ కారిగా నిలిచేవాడు .

మునిసిపల్ చైర్మన్ వెంకట రావు

వెంకట రావు సేవా దృక్పధాన్ని ,చొరవను ,సంస్కరణాభిలాషను గుర్తించిన బళ్ళారి ప్రజలు 1902 లో ఆయనను మునిసిపల్ చైర్మన్ గా ఎన్నుకొని అపూర్వ గౌరవం చూపించారు .దురదృష్ట వశాత్తు అదే సమయం లో బళ్ళారి ని ప్లేగు మహమ్మారి చుట్టు ముట్టి భీభత్సం సృష్టించింది .మొక్కవోని ధైర్యం తో చైర్మన్ వెంకట రావు మూడు నెలలు అహోరాత్రాలు శ్రమించి వేలాది రూపాయల తన ధనాన్ని ,శారీరక శ్రమను ఖర్చు చేసి దీనజన బా౦ధ వుడిలా ఆదుకొని ప్రభుత్వ సాయం తో ప్లేగు వ్యాధిని అరికట్టగలిగాడు .

వితరణ శీలి వెంకట రావు

అతి పేదవాడుగా జీవితం ప్రారంభించి నెలకు కేవలం 40 నుండి 70రూపాయల జీతం తోనే  ప్లీడర్ అయ్యేదాకా గడిపాడు .న్యాయవాదిగా పుష్కరం పాటు పనిచేసినా మొదత్లొఆయన సంపాదన బొటా బొటీ గా ఉండేది .ఇలా చాలీచాలని జీతంతో గడుపుతున్నా దాన ధర్మాలు మానలేదు .1896 నుంచి తన సంపాదనలో ఆరవ వంతు ,కొన్ని సార్లు నాలుగవ వంతు దాన ధర్మాలకు వినియోగించిన త్యాగ శీలి ,ఆదర్శ మూర్తి వెంకట రావు .తన తర౦ భౌతిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఔన్నత్యం సాధించాలని తపన పడేవాడు .బళ్ళారి బాలుర క్రికెట్ ఆటస్థలం కోసం ప్రభుత్వం 3 వేల రూపాయలు ఖర్చు చేస్తే ,దానికి రక్షణ కంచే కోసం ,నిర్వహణ కోసం  వెంకట రావు ఒక వెయ్యి రూపాయలు స్వంత ధనాన్ని వెచ్చించాడు .ఇప్పుడు అది జింఖానా గ్రౌండ్ అయింది .ప్రముఖ సంఘ సంస్కర్త ,విధవా వివాహాల చాంపియన్ రావు బహదూర్ వీరేశ లింగం పంతులు  గారుచేబట్టిన  ‘’విధవా గృహం ‘’నిర్మాణానికి వెంకట రావు 3 వేల రూపాయలు విరాళం గా అందజేసి ,మరుసటి ఏడాది మరొక 2 వేల రూపాయలను అంది౦చిన వదాన్యుడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి భూరి విరాళ మందించిన వితరణ శీలి .లండన్ లోని జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ కమిటీ డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  ఖర్చులకు ఏటా 500  రూపాయలను 3 ఏళ్ళు అందజేశాడు .బళ్లారిలో బాలికా ఉన్నత పాత శాల నిర్మాణం కోసం 7 వేల అయిదు వందలు ఇచ్చాడు .బళ్ళారిర లోని హిందూ ముస్లిం క్రైస్తవ సేవా సంస్థలకు ప్రతినెలా విరాళాలు అందించేవాడు .బళ్లారిలో సభలు సమావేశాల కోసం టౌన్ హాల్ ను అర లక్ష రూపాయలతో నిర్మించి ,మరో యాభై వేల రూపాయలతో దానికి అనుబంధంగా ఒక గ్రంధాలయాన్ని 10 వేల విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేశాడు .తన మాతృ మూర్తి పేర క్షయ రోగులకోసం ఒక విద్యాలయాన్ని కట్టించాడు .తన తమ్ముడు ప్రముఖ నటుడు నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు  రచించి ,ప్రదర్శించటానికి ,వీలుగా  ఒక నాటక శాలను 10వేల రూపాయలతో నిర్మించాడు .అనాధ బాలలకోసం అనాధాశ్రమ నిర్మాణానికి 20 వేల రూపాయలు ఖర్చు చేసిన మహానుభావుడు

శాసన మండలి సభ్యుడు వెంకట రావు

నార్దర్న్ గ్రూప్ ఆఫ్ మునిసిపాలిటీస్ వెంకట రావు ను 1903నవంబర్ లో మద్రాస్ శాసన మండలికి సభ్యునిగా ఎన్నిక చేసింది .అన్ని ప్రాంతాల ప్రజలు తర తమ భేదాలు పాటించకుండా వెంకట రావు నుఆహ్వానించి సన్మానించి ఆయన ప్రసంగాలతో తన్మయులయ్యారు .సాంఘిక సంస్కరణ ల అమలులో ఆచరణాత్మకంగా కృషి చేసిన వెంకట రావు ను మించిన వారెవ్వరూ లేరు .1903లో గ్రూప్ వారి వార్షిక సాంఘిక సభలకు వారి అభ్యర్ధనపై అధ్యక్ష స్థానం అలంకరించి సమర్ధం గా నిర్వహించాడు ‘ ప్రపంచ పర్యాటకుడు వెంకట రావు 1904 ఫిబ్రవరి లో కుమారుడు రామ చందర్ తోకలిసి ప్రపంచ యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసి అక్టోబర్ 30కి తిరిగి వచ్చాడు .కుమారుడు బార్ కోసం  చదివి బారిస్టర్ అయి బళ్లారిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు .

బిజినెస్ మాగ్నెట్

వెంకట రావు కు సభాపతి ప్రెస్ , నాలుగు జిన్నింగ్ మరియు హైడ్రాలిక్ ప్రెస్సింగ్ ఫాక్టరీలు ఉండేవి .రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్ లో అరలక్ష పెయిడ్ అప్ కాపిటల్ ఉంది .డెక్కన్ ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కాయస్ కు సెక్రటరిలలో ఒకడు గా ఉండేవాడు .వజ్ర కరూర్ డైమ౦డ్ప్ ప్రాస్పెక్టింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ .దీనిలో ఇంగ్లీష్ రష్యన్ ,ఆఫ్రికన్ భాగ స్వాములు ఉండేవారు .ఆయనకుఆయిల్ ఇంజన్ తో నడిచే  ఒక ప్రత్యేక ఎక్స్ పెరిమెంటల్ ఫారం ఆధునిక హంగులతో  ఉండేది .స్పిన్నింగ్, వీవింగ్ ,షుగర్ ఫాక్టరీలలో  షేర్లు చాలా ఉండేవి .ఇవికాక భూవసతి ,పొలాలు ,భవనాలు లెక్కలేనన్ని ఉన్న బడా బిజినెస్ మాగ్నెట్ వెంకట రావు .సేవా భావం లోనూ సాటి లేనివాడు కోటీశ్వరుడైన కోటి కొక్కఁడైన వాడు శ్రీ కోలాచలం వెంకట రావు . .

ఆధారం –కోలాచలం వంశానికి చెందినవారు ,వెంకట రావుగారి తమ్ముడు బళ్ళారి నివాసి  అయిన లాయర్ శ్రీకోలాచలం  అనంత ప్రకాష్ గారు నాకు 8-7-16 న పంపిన ఆంగ్ల రచన ‘’Life of Mr .K.Vencata Rao .

మనవి -కానీ వెంకట రావు గారు ఎక్కడ ,ఎప్పుడు చనిపోయినదీ పై ఆంగ్ల వ్యాసం లో లేదు .నెట్ లో వెతికినా దొరకలేదు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-16 -ఉయ్యూరు

 

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో  శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం. ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణాటకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బోదకాలు గా ఉండటం వలన ఇప్పటికి జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి .ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని ఆనే గొందే సంస్థానం లో దివాన్ .ఇది విజయనగర సామ్రాజ్యం లో భాగం .ఆ వంశానికి చెందిన వాడే శ్రీ కోలాచలం వెంకట రావు .ఆయన నిజంగా కోటికోక్కడై కీర్తి పొందాడు .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

జనన విద్యాభ్యాసాలు –లాయర్ వెంకట రావు

శ్రీ కోలాచలం వెంకట రావు 28-2-18 50 న కర్ణాటక లోని హంపి దగ్గరున్న కమలాపురం లో జన్మించాడు .ఇది పూర్వపు విజయనగర సామ్రాజ్యం లో భాగం .వార్డ్లా ఇన్ష్టి ట్యూట్ లోను ,,తర్వాత గవర్నమెంట్ ప్రొవిన్సియల్ స్కూల్ లోను చదివాడు .1867 డిసెంబర్ లో ఎఫ్ .ఏ .పాసయ్యాడు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజ్ లో మిస్టర్ ధాంసన్ వద్ద బి ఏ .కొంతకాలం చదివి ,మద్రాస్ వాతావరణం ఆరోగ్యానికి సరిపడక చదువు మానేశాడు .మద్రాస్ ప్రావిన్స్ లో అదొక్కటే కాలేజ్ కనుక ఇంకెక్కడా చదవలేక పోయాడు .పొట్ట పోషించుకోవటానికి స్కూల్ మేస్టరీఉద్యోగం లో చేరి 1874 వరకు పని చేశాడు .తర్వాత జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో హెడ్ క్లార్క్  గా ఉద్యోగం పొంది నాలుగేళ్ళు పని చేశాడు .డిప్యూటీ తాసిల్దార్ గా ,సబ్ మేజిస్ట్రేట్ గా పదోన్నతి పొంది రెండేళ్ళు సేవ చేశాడు .తన మనసులోని భావనలకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదని భావించి  న్యాయ శాస్త్రం  చదివి1880  లో పాసై బళ్ళారి న్యాయ స్థానాలలో సివిల్,క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచి లాయర్ గా ప్రసిద్ధి చెందాడు లాయర్ వెంకట రావు .1883 లో దియోసఫిస్ట్ అయి ,క్రమంగా మత ,రాజకీయ సాంఘిక వేదాంతాల పట్ల ఆసక్తి వృద్ధి చేసుకొని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జీవించాడు . .

సకల మతాసక్తి –సంఘ సంస్కరణాభిలాష

హి0దూ వేదాంతం కొరాన్ బైబిల్ లను ఆసక్తిగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొన్నాడు వెంకట రావు .హిందూ ధర్మం పై అమితాసక్తి కలిగి హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధ స్వాముల వద్ద విశేషాలు గ్రహించాడు .రెండు సార్లు బర్మా శ్రీలంకలను సందర్శించి బౌద్ధ ధర్మ పారమ్య౦ ఎరిగాడు .శారీరక ,మానసిక స్వచ్చత ను1884 లో పొందాడు .దేవాలయాలలో ,స్నేహితుల ఇళ్ళలో జరిగే  దేవా దాసీ నృత్యాలను చూడటానికి వెళ్ళటం మానేశాడు .స్వర్గీయ రావు బహదూర్ ఎ.సభాపతి మొదలియార్ తో కలిసి వేశ్యా నృత్యనిషేధం పై పోరాటం చేశాడు .పిలిచినా ,పిలవక పోయినా దేవాలయాలలో ఉత్సవాల సందర్భం గా ఏర్పాటు చేసే వేశ్యా నృత్యాలకు వెళ్లి ,సంఘం లో పతితలైన వారిని ఈ రొంపిలోకి దించటం అన్యాయం అని ఉపన్యాసాలిచ్చి దాన్ని మాన్పించే ప్రయత్నం చేశాడు .ఇది ప్రజలలో గొప్ప ప్రభావం  కలిగించి క్రమంగా దేవ దాసీ నృత్యాలుబళ్ళారి లో కనుమరుగై పోయాయి .

రాజకీయ ప్రవేశం

లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలను విస్తృత పరచే చట్టాన్ని తెచ్చాడు .సభాపతి మొదలియార్ తన వైశ్య బంధువులను వీటిలో ఎన్నికలలో పాల్గొని బాధ్యతలు స్వీకరించమని హితవు చెప్పాడు .ఆయన మాట మన్నించి ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులు చేబట్టి రాణించారు .1884 లో బళ్ళారి లో  వెంకట రావు గెలిచి బొంబాయి కి వెళ్లి రిప్పన్ పదవీ విరమణ సందర్భం గా జరిగిన పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నాడు .అక్కడ అనేక సభలలో పాల్గొని అక్కడ రెండు సంస్థలను ఏర్పాటు చేయటానికి అందరూ అంగీకరించారు అందులో ఒకటి ‘’భారత జాతీయ కాంగ్రెస్ ‘’అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయటం ,రెండవది ‘’సోషల్ కాన్ఫరెన్స్ ‘’అనే సాంఘిక సంస్థ ఏర్పాటు . 1, 2, 3, 4 ,5, 7 కాంగ్రెస్ సభలకు ఆ తర్వాత 7 కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు .1884 నుంచి సంవత్సరం లో రెండు ,మూడు నెలలు భారత దేశమంతా ,సిలన్, బర్మా మొదలైన దేశాలు పర్యటించిఅక్కడి జన జీవన పరిస్తితులు ,దేవాలయాలు మసీదులు చర్చి లు  ,ప్రాచీన సంస్కృతులను ,ఆర్కి టేక్చర్ ను సందర్శించి ,ప్రజలతో కలసి మెలసి అన్నీ అర్ధం చేసు కొన్నాడు .

ఆధారం -8-7-16 న బళ్ళారి నుంచి శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు శ్రీ వెంకట రావు గారిపై ఆంగ్లం లో రాసిఉన్న జిరాక్స్ కాగితాలు కొరియర్ లో పంపారు .వారెవరో నాకు అసలు తెలియదు .పంపిన కాగితాలపై వారి ఫోన్ నంబర్ ఉంటె ఫోన్ చేశాను .చక్కని తెలుగులో మాట్లాడారు .మల్లి నాదసూరి  వంశ0 కోలాచలం వంశపు వాడినని ,తాను బళ్లారిలో లాయర్ నని చెప్పారు  మహా మహోపాధ్యాయుడైన సూరి అపార పాండిత్యాన్ని గూర్చి ,సంస్కృత పంచ కావ్యాలపై మల్లినాద సూరిరాసిన వ్యాఖ్యానాన్ని గురించి ముచ్చటించుకోన్నాం .మల్లినాద సూరి సమగ్ర జీవిత చరిత్ర తయారు చేస్తున్నామని నాలుగైదు నెలలలో వెలువరిస్తామని చెప్పారు .మన సరసభారతి పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పిమర్నాడే 9-7-16 న రెండు వందలు ఖర్చు చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాను .కాని పుస్తకాలు అందాయో లేదో తెలీదు .జులై చివర్లో ఆగస్ట్ లో రెండు సార్లు ,ఇవాళ ఈ వ్యాసం రాయ బోయే ముందు వారిచ్చిన సెల్ నంబర్ కు ఫోన్ చేశాను .కాని ఎవరో లిఫ్ట్ చేసి కన్నడం లో మాట్లాడుతూ రాంగ్ నంబర్ అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది .వారిచ్చిన అడ్రస్

కోలాచలం అనంత ప్రకాష్ ,లాయర్ ,80,Gooty Kalappa Compound ,అనంత పూర్ రోడ్ ,బళ్ళారి -583101  -కర్నాటక

సెల్ నంబర్ -0 94,94,23,60,84

సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-9-16 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

మా ఇంట్లో 4-9-16 ఆదివారం సాయంత్రం -శ్రీ సూరి ఆంగీరసశర్మ గారు ,కుమారుడు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం

IMG-20160902-WA0026విశ్వ విఖ్యాత నైరుప్య చి

త్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు ఘన సత్కారం

నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.
సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి య

వత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
రియో ఒలింపిక్స్లో రజిత,కాస్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలంటి క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

by gdurgaprasad

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్ర్రకళా యశస్వి పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి ఆత్మీయ సత్కారం

సరసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు 95 వ సమావేశంగా స్థానిక శ్రీనివాస విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారం తో శ్రీనివాసకళాశాల సెమినార్ హాల్ నందు

విశ్వ విఖ్యాత నైరూప్య చిత్రకారులు కవి ,రచయిత విశ్లేషకులు  పద్మశ్రీ ఎస్ వి రామారావు గారికి

1-9-2016గురువారం  మధ్యాహ్నం 2- 30 గం లకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నాము

ముఖ్య అతిధిగా శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ (శాసనమండలి సభ్యులు )గౌరవ అతిధిగా డా.శ్యాం కుమార్ లు పాల్గొనే ఈ ఆత్మీయ సత్కార సభకు సాహిత్యాభిమానులు కళా హృదయాలు విచ్చేసి జయ ప్రదం చేయ ప్రార్ధన

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

పరుచూరి శ్రీనివాస రావు –ప్రిన్సిపాల్ ,శ్రీనివాస విద్యా సంస్థలు –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment