స్వచ్చ బాబా

స్వచ్చ బాబాsvaccha baba-1 001 svaccha baba-2 001 svaccha baba-4 001 svacchabaaba-3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుండు హనుమన్త్క రావు బాత్ రూం స్తిక్కర్లే

gundu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -16

                     8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్-2

ఇరవై ఏడవ ఏట డిప్రెషన్ నుంచి బయట పడ్డాడు బాడలేర్ .తనలాగే జీవితం లో దుఃఖ శోకాలనుభావించిన అమెరికా కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ,రచయితా ‘’ఎడ్గార్ అలాన్ పో’’ ను రెండేళ్లక్రితమే చదివి ఆయన రచనలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేయాలనే మంచి కోరిక కలిగింది .’’నేనెందుకు పో ను అనువదిస్తున్నానో తెలుసా?అతని పోలికలు నాలో ఉన్నాయి ,  నామానసిక ఆధ్యాత్మిక బంధువు అనిపిస్తాడు .మొదటి సారి నేను ఆయన పుస్తకం తెరచి చదివి నప్పుడు  దిగ్భ్రాంతికి లోనైనాను .నేను ఏ విషయాల పై రాయాలని కలలు కన్నానో ,ఏ వాక్యాలు ఎలా రాయాలనుకోన్నానో ,అవన్నీ పో మహానుభావుడే రాసేశాడు .’’అని తన ఆరాధనా భావాన్ని తెలియ జేసుకొన్నాడు .కేధలిక్ మత వారసుడిగా బాడేలేర్ కు అసలైన పాపం అంటే ఏమిటో తెలుసు .చెడు మానవ ప్రకృతిలో అంతర్గతమై ఉందని పో గుర్తించినట్లే ఈయనా గుర్తించాడు .ఆరేళ్ళు తీవ్రం గా కస్టపడి  తన సృజనకు పదును పెట్టి పో కధలను  అయిదు  భాగాలుగా  ఫ్రెంచ్ భాషలో కి అనువదించాడు .కాని ఒక్క కవిత జోలికి కూడా పోలేదు .ఒకే ఒక అమెరికన్ కవిత లాంగ్ ఫెలో రాసిన’’హయవాత ‘’మాత్రం ఫ్రెంచ్ లోకి అనువాదం చేశాడు .ఇలా పో కవితో తాదాత్మ్యం చెంది రచనా సృష్టి చేసిన తర్వాత తాను రాయాలను కొన్న విషయాలపై ద్రుష్టి పెట్టాడు .

శైలి మార్చుకొన్నాడు .కామ భావనలు తగ్గి శోక భావాలు పెరిగాయి .ప్రేమ కవిత్వం లో అంతకు ముందు ఎవరూ రాయనంత గొప్ప కవిత ‘’అన్ వాయెజ్ ఏ సైటర్ ‘’ రాశాడు . అందులో పిచ్చి మోహం పెల్లుబికింది .భయంకర భీభత్స భయానక౦ గా దాన్ని సమాప్తి చేశాడు .’’in thine isle O Venus ,I found only upthrust-A calvary symbol whereupon my image hung –Give me Lord God ,to look upon that dung –my body and my heart ,without disgust ‘’దీనిపై మాన్సేల్ జోన్స్ స్పందిస్తూ ‘’సాహిత్య ప్రభావం కోసం కాకుండా పాపం అనేది మానవ అంతరాత్మ  స్వభావం ‘’అన్న విషయాన్ని బాడేలేర్ తెలియ జేశాడన్నాడు .కవితలో విశ్రుం ఖలత క్రమంగా తగ్గి  బాలెన్స్ స్తితిలో ఉంటున్నాడు మనకవి .ఆత్మవిమర్శ చేసుకొని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు .1857లో ‘’లెస్ ఫ్లుఎర్స్ డు మాల్ ‘’రాసి ప్రచురించాడు .దీన్ని అమ్మకానికి పెడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఖండించగా ,,కాపీలన్నీ పోలీ సులు స్వాధీనం చేసుకొన్నారు .ఈ విషయం తల్లికి ఉత్తరం ద్వారా తెలిపాడు .ఆ పుస్తకం పై తన స్పందన తెలియ జేస్తూ ‘’I have put all my tenderness ,my hate ,and my religion into the book .Iam proud of having written a book that inspired nothing but fear and horror of evil ‘’అన్నాడు .పుస్తకం లో ఏదో కొద్దిగా చదివి నిర్ణయానికి రాకూడదని మొత్తం చదివి అర్ధం చేసుకోవాలని కోరాడు .కోర్ట్ కు వెళ్ళాడు కోర్టు అతనిపక్షమే తీర్పు చెప్పినా  ఆ పుస్తకం లో దైవ దూషణ లేదని ,కాని బూతు అశ్లీలం ఉన్నాయని బహిరంగ అమ్మకానికి అనుమతించమని అందులోని  లెస్బియన్ పై ఉన్న ఆరు కవితలను తీసేసి ప్రచురిస్తే అనుమతిస్తామని తీర్పు చెప్పారు .దీనికి ఒప్పుకొని అలానే చేసి  మరో 35 కవితలు చేర్చి రెండవ ముద్రణ లో వాటిని తీసేసి ముద్రించాడు .కాని తానూ ఆశించిన పుస్తక శిల్ప నిర్మాణం(ఆర్కి టేక్చర్) దెబ్బ తిన్నాడని తెలుసుకొన్నాడు

బాడేలేర్ భావనలో కవిత్వ పరమార్ధం రెండు రకాలుగా ఉంటాయని ‘’the distinction between good and the beautiful ,the discerning of beauty in evil ‘’చెప్పాడు .’’no where in literature has there been found a more astonishing mixture of radiance and what Baudelaire called ‘’spleen ‘’of the macabre and the magnificent ‘’.కవిత్వం ,విమర్శ  విరుద్ధమైనవికావు అని చాలామంది అన్నదానిని ఒప్పుకోలేదు .కవి గొప్ప విమర్శకుడు అన్నాడు .విమర్శకుడు కాకపొతే సగం కవి మాత్రమె అవుతాడు అన్నాడు . కవి భావాలను ప్రసారం చేసే వాడుమాత్రమేకాదు,అన్ని కళలను సమన్వయము చేసి అతీత శబ్దాలను సృష్టించేవాడు . సాహిత్య ,కళ ,సంగీతం ,సౌందర్యం లపై బాడేలేర్ రాసినవిషయాలన్నీ అతని సృజన శక్తి ,అన్వేషణ ఫలితాలే .అవి   ఆనందాన్ని ఇస్తూనే  జ్ఞానాన్ని పెంచేవే .’’the material objects exist in this world only because they have their origin in the world of spirit .the artist should decipher the hidden writings of nature and to interpret the mysteries of the universe .’’అని హితవు చెప్పాడు .కళ అనేది పరమ ఉత్క్రుస్టమైనది మాత్రమె కాకుండా ప్రపంచం  లో అందాన్ని ప్రభావితం చేసేది .అందం అంటే మానసిక  వాస్తవికత –దీనినే ఆర్టిస్ట్ సృష్టించి దర్శింప జేస్తాడు .ఆర్టిస్ట్ దృష్టిలో అందం వస్తువులోఉండదు ,దానికి ఆర్టిస్ట్ తెచ్చే అందం లోనే ఉంటుంది .

ప్రచురించిన పుస్తకం ఆర్ధికం గా లాభించక పోవటమేకాక ఆరోగ్యం పైనా ప్రభావం చూపి ,రెండో ముద్రణలోనూ ప్రోత్సాహం రాక కున్గిపోయాడు .ప్రచురణ కార్ట్ దివాలా తీసి అప్పుల వాళ్ళ బాధ పడలేక బెల్జియం పారిపోవటం  మరీ బాధించింది .   లెక్చర్లు దంచి డబ్బులు వెనకేసుకొందామని ప్రయత్నిస్తే అదీ దారుణం గా విఫలమైంది .బెల్జియం లో ఉండగా ఆరోగ్యం మరింత క్షీణించి మొదటిసారి ఎటాక్ వచ్చింది .యవ్వనం లో విలాసంగా అన్నిరకాల సుఖాన్ని అనుభవించటం తో సంక్రమించిన సుఖ వ్యాధి పీల్చి పిప్పి చేస్తోంది .శారీరక బాధలను  మానసిక కుంగు బాటును మరిచిపోవటానికి నెమ్మదిగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు . భరించలేని పరిస్తితులలో ఆత్మహత్యకూ ప్రయత్నించాడు .దీనితో మానసిక స్థితి అదుపు తప్పి ‘’the wind of the wings of madness’’అనుభూతికి లోనయ్యాడు .43 ఏళ్ళ నది వయసులోనే ఈ సుఖాలు దుఖాలు బాధలూ అవమానాలు అన్నిటిని మరిచి పోయే శాశ్వత నిద్ర లోకి జారు కోవటానికి ముందు రెండేళ్ళు బెల్జియం లో దయనీయ స్తితిలో ఉండిపోయి ,నెమ్మదిగా పారిస్ చేరాడు  బాడేలేర్ .ఇక్కడ కొత్తగా కండరాల బలహీనత ,విస్మృతి ఏర్పడ్డాయి .మాట్లాడలేక పోయేవాడు .శరీరభాగాలేవీ పని చేయక పక్షవాత స్తితిలో ఉండిపోయాడు  .కాని మెదడు సురక్షితంగానే ఉంది .చివరికి మృత్యువే జయించి అతని బాధలన్నీ తీర్చి అక్కున చేర్చుకొని31-8-1867 నశాశ్వత విముక్తినిచ్చింది .

అతని అంత్య క్రియలు అత్యంత హీనంగా పదిమండి మాత్రమె హాజరవగా జరిగాయి .సాహిత్య సాంస్కృతిక సంఘాల వారెవరూ హాజరుకాలేదు .బాడేలేర్ పుస్తకాన్ని అంకితం పొందిన మహానుభావుడూ గైర్ హాజరయ్యాడు .సాహిత్య పత్రికలేవోకంటి తుడుపుగా నాలుగు ముక్కలు రాసి దులిపేసుకోన్నాయి .ఆతను జీవంచి ఉండగా వచ్చినమంచి  రివ్యూ మూడుభాగాలు పాల్ వేర్లేన్ అనే 22ఏళ్ళ యువ కవి రాసింది పెద్దగా ప్రాచుర్యం లేని “”L Art’’మేగజైన్ లో వచ్చింది .బతికి ఉండగా పట్టించుకోకుండా వదిలేశారు అతన్ని .కాని చనిపోయాక నాలుగేళ్ళకు బాడేలేర్ కవితలందరి చేతులలో  అలంకారా లైనాయి .ఇష్టపడి చదివి ఆరాధించటం మొదలు పెట్టారు .స్విన్ బరన్ కవి అతనిని ‘’ఫైర్ స్కార్ద్ స్పిరిట్ ‘’అన్నాడు .అతని కవితలు మన హృదయాలను మంటలతో తృప్తి పరుస్తాయన్నాడు .బాడేలేర్ కు స్మృతిగీతం రాస్తూ స్విన్ బరన్ ‘’thou sawest ,in thine own singing season ,brother –secrets and sorrows unbeheld of us –fierce loves ,and lovely leaf-buds poisonous –bare to thy subtler eye but for none other ‘’అంటూ నివాళులర్పించాడు .

సింబాలిక్  అనబడే ప్రతీక వాద కవులు బాడేలేర్ ను తమ మార్గ దర్శిగా భావించారు .కవిత్వాన్ని  సాంకేతి కతతోను ,సంగీతం తోనూ సంపన్నం చేశాడని పరవశిస్తారు . రూపకాలంకారాలు ,భావ చిత్రాలు తో సింబాలిక్ గా విషయాన్ని చెప్పాడని మెచ్చారు .ఆధునికులు అతనిలో సృజన ,విధ్వంసం అనే రెండుకళలున్నాయన్నారు .మతాధికారులు ‘’he transformed a seemingly insatiabe appetite for sin into a hunger for spiritual sustenance ‘’అని విశ్లేషించారు .దాదాపు ఇరవైకి పైగా పుస్తకాలు రాశాడు .

అయితే ఇవాళ బాడేలేర్ ను ఏ భావ జాలం వాళ్ళు తమవాడు ,ప్రేరకుడు  మార్గ దర్శి అని చెప్పటం లేదు .అతని ప్రభావం ,ప్రేరణ ఉత్తేజం అన్ని రకాల భావజాలాలోకి చొచ్చుకుపోయి  కలిసి కరిగి పోయాయి .శృంగార విరాగాలలో కలిసి పోయాయి .బాడేలేర్ చెప్పిన అసలు సూక్తి ఏమిటి అంటే ‘heaven or Hell what does it matter .Let us plunge into the depths .In the very pit of the unknown ,we will find the New ‘’.మార్సెల్ ప్రాస్ట్ ,ఆల్ఫ్రెడ్ డీ విన్జీ మొదలైన ఫ్రెంచ్ కవులు అతని ప్రభావానికి లోనయ్యారు .ఇంగ్లీష్ కవులలో ఎడ్మండ్ విల్సన్ ,ఇలియట్ మొదలైన వాళ్ళు  సింబాలిజాన్ని పోషించారు .సెక్స్ ను చావును గురించే ఎక్కువ చెప్పాడు .అవే ‘’ స్కాండలస్ సాహిత్యం’’ గా ముద్రపడ్డాయి .లెస్బియన్ శృంగారం చాలా పవిత్రమైనది ఆరోగ్యమైనది అని చెప్పాడు .ప్రేమ ఆరాధన గురించి ,రూప పరివర్తన ,శోకం ,నగరాలలో అవినీతి పైకవిత్వం రాశాడు .జీవించలేని దుర్భర పరిస్తితులను చూసి చాలించాడు . .If rape or arson, poison or the knife

Has wove no pleasing patterns in the stuff

Of this drab canvas we accept as life—

It is because we are not bold enough!

(Roy Campbell‘s translation)

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -15

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -15

                     8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్

ఆధునికత అనే పదానికి సృష్టికర్త ,సింబాలిజం కు ఆద్యుడు ,ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ నవల ద్వారా ప్రపంచ  ద్రుష్టి నాకర్షి౦చిన ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పియరీ బాడేలేర్.19 వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయితలు కొరడా దెబ్బలు కొట్టుకొని పాఠకులనూ అలానే కొట్టారు .వాళ్ళమనసులోని కోపం ,డిప్రెషన్ ,లను వ్యక్తిగత సెన్సేషనలిజం , ,బాహ్య ప్రదర్శనం గా మార్చుకొన్న విపరీత మనస్కులు .అందులో బార్లీ డీ ఆర్విల్ సముద్రపు ఎండ్రకాయ లాగా జీవిస్తూ అది సముద్రపు రహస్యాలు తెలుసుకోగలదని దాని హ్రుదయ౦  అతి పవిత్రమైనదని  అన్నాడు .బాడేలేర్ వీధుల్లోనే యెర్ర ఈకలతో చేసిన దాన్ని మెడ చుట్టూ కట్టుకొని తిరిగితే ,ఇంకో ఆయన రి౦బాడ్ దైవ దూషణ రాతలను పార్కు బెంచీల మీద పిచ్చ పిచ్చగా వంకర  టింకర గా ‘’షిట్ – గుడ్ బై ‘’( Merde a Dieu) అని రాసేవాడు .బాడేలేర్ చాలాబాధలు అనుభవించాడు .సమకాలీన రచయితల కంటే ఎక్కువగా స్వయంకృత డయాబాలిజంఅంటే  దెయ్యాల భయం తో   ,అపరాధ భావం తో క్షోభ చెందాడు .ఇవే మనసంతా నిండిపోయి ‘’ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ ‘’అనే ప్రఖ్యాత నవల రాశాడు .దీనిని సమీక్షిస్తూ ప్రముఖ విమర్శకుడు డీ ఆర్విల్ ‘’డాంటే స్వయం గా నరకం సందర్శిస్తే,  బాడేలేర్ ఆ నరకం నుండే వచ్చాడు ‘’అన్నాడు.

 పారిస్ లో 1821ఆగస్ట్ 9 న  బాడేలేర్ పుట్టేనాటికి తండ్రి వయసు 62,తల్లి వయసు 26.అంత వ్యత్యాసం ఉంది .ఒక్కడే పిల్లడుకనుక సంపన్నుడైన తండ్రి తన వెంట మ్యూజియం లకు తిప్పుతూ ఎన్నోకధలను చెబుతూ వాత్సల్యాన్ని కురిపిస్తూ  ,ఉత్సాహం కలిగించాడు .ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు .ఏడవ ఏటనే తండ్రి చనిపోగా తల్లి యువ కమాండర్ ను ప్రేమించి పెళ్ళాడింది .బాడేలేర్ కు ఈ కొత్త తండ్రిపై ద్వేషమే కలిగి హామ్లెట్ లాగా తల్లిమీదా అది ప్రతిఫలించి ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని నిశ్చయించుకొన్నాడు . మాతృప్రేమను కోల్పోయానని బాధపడ్డాడు .ముప్ఫై  ఏళ్ల తరువాత అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని ,ఆమె చూపించిన  శ్రద్ధ ,వాత్సల్యాలను అనుభూతిని  గుర్తుకు తెచ్చుకొని  రాసుకొన్నాడు .

  స్కూల్ లో చదువులో సాధారణం గా ఉండేవాడు .సాహిత్యం తప్ప మిగిలిన విషయాలేవీ అతన్ని ఆకర్షించలేదు .లాటిన్ పద్యాలకు బహుమతి వస్తే ,అవిదేయతకు శిక్ష పొందాడు .మళ్ళీ చేరి పరీక్ష పాసై తోచిందేదో రాస్తూ కాక్షేపం చేశాడు .కుర్రాడు చెడు సావాసాలుప ట్టిపాడి పోతాడేమో అని భావించి మారుటి తండ్రి సుదీర్ఘ ప్రయాణం తో కలకత్తా కు పంపించాడు .నౌక ఒకసారి ఘోర తుఫాను ప్రమాదానికి గురైతే ప్రయాణం విరమించి మారిషస్ లో .అక్కడి ట్రాపికల్ సీనరీ ,రెచ్చగొట్టే అమ్మాయిలూ బాగా నచ్చి , .లోపల దాగి ఉన్న కవిత్వానికి ప్రేరణ లభించ గా కొద్దికాలం ఉండిపోయాడు .మళ్ళీ పారిస్ చేరి కుర్రగాంగ్ తోకలిసి ‘’బోహీమియన్  అరిస్తో క్రసి ‘’అని పేరుపెట్టుకొని జీవించాడు . .నీటైన సోగ్గాడు బాడేలేర్ విలాసంగా వారిమధ్య కాలం గడిపాడు .బార్బీ డీ ఆర్విల్ అనే వాడుతన వింత చేష్టలతో   జతకలిసి ఉన్నాడు .క్రమంగా ఈ బాచీ సంఖ్య పెరిగింది .డబ్బు మదించిన వాళ్ళే వీళ్ళు .దియేటర్ లో చిన్న వేషాలు  వేసే ఒక పిల్లను చూసి  వ్యభిచారిణి కాదని చేరదీసి పెళ్ళాడాడు బాడేలేర్ .ఏ క్షణానికి తోచిన భావాన్ని అప్పటి అప్పుడే కవిత్వీకరించటం ప్రారంభించాడు .కలిగిన ప్రతిమానసిక భావాన్ని అక్షర బద్ధం చేశాడు .అప్పుడప్పుడు వచన రచనా చేశాడు .తటస్థపడిన ప్రతి స్త్రీపైనా కవితలు రాసినా ,జీన్ డవాల్ అనే ఆమె బాగా ప్రేరణ కలిగించింది .ఆమెనే ‘’డార్క్ వీనస్ ‘’అన్నాడు .ఆమె అంగాంగ  సౌందర్యాన్నీ కవిత్వ బద్ధం చేశాడు .యెంత త్వరగా ప్రేమించి దగ్గరికి చేర్చుకొనే వాడో అంతే స్పీడ్ గా వారితో పోట్లాడి దూరం చేసుకొనేవాడు .కాని జీన్ అతని జీన్స్ నే పట్టుకొన్నది . మనవాడి క్షణికోద్రేకాలకు విసిగి వేసారి ఒక సారి ఆమె అతన్నివదిలి  వెళ్లిపోతానన్నది .ఆమె వియోగాన్ని భరించ లేకపోయాడు .14 ఏళ్ళు కలిసి మెలసి ఉన్న ఆమె తనను వదిలి వెడితే జీవించలేనని తల్లికి ఉత్తరం రాశాడు .కానిఎడబాటు జరగ లేదు . ఇరవై ఏళ్ళు జెన్నీ బాడేలేర్ ‘జీవిత ’నాట్య  నాగిని ‘’గా ఉండిపోయింది .’’అందాల రాక్షసిగా’’’’ ,కాంతి దేవతగా ‘’అతనిమనసులో ఉండిపోయింది .ఆమె అందానికి ఆకర్షణ కి ఆరాధనకి కరిగిపోయాడు .అందం స్వర్గం నుండి భూమికి దిగివస్తుందో నరకంకూపం  నుండి వెడలి వస్తుందో  నిర్ణ యించలేకపోయాడు .దీనినే కవితాపరంగా ‘’viens du ciel profound ou sors-tu de l’abime’’అని రాసుకొన్నాడు .

 విపరీతంగా పిచ్చపిచ్చగా ఆడంబరం గా విచ్చల విడిగా డబ్బు ఖర్చుచేస్తున్నాడు బాడేలేర్ .సంక్రమించిన సంపదలో సగం ఖర్చై పోయింది .ఇలా అయితే చేతికి చిప్పెగతి అని మిగిలిన ఐశ్వర్యం ఇలా దుబారాకాకుండా అతనికి ఫైనాన్సియల్ గార్దియన్ గా ఒక నోటరీ ని ఏర్పాటు చేసింది తల్లి .అప్పటి నుంచి ప్రతి రూపాయి ఖర్చుకోసం నోటరీ దయా దాక్షిణ్యం పై ఆధార పడాల్సి వచ్చింది .ఖర్చు అలవాటైన ప్రాణం కదా విలవిల లాడుతోంది .అప్పులు చేస్తున్నాడు విపరీతంగా .అప్పిచ్చే వాళ్లకు ఎర గా మారిపోయాడు .డాబు దర్పం మాయమయ్యాయి .గుండ్రని అందమైన సున్నితమైన ముఖం  గట్టిపడిపోయింది .నవ్వుతూ హాళ్ళూ పెళ్ళూ గా ఉండేవాడు ముభావం గా ఉంటున్నాడు .చెక్కులు చిక్కిపోయాయి .అందమైన ఖరీదైన ధగధగలాడే బట్టలు వదిలేసి నల్ల బట్టలు కడుతున్నాడు .నల్ల బ్రాడ్ క్లాత్ మాత్రమె వేసుకొంటున్నాడు .దావీదు మహిమ కాదు ఇది ధనమహిమ .దనం చేతిలో ఆడక వచ్చిన పరిస్తితి కాదు కాదు సృష్టించుకొన్న స్థితి .దుస్తితి .బోహీమియన్ సంస్కృతీ వదిలి పెట్టేశాడు .బూర్జువా ముఠాకు దూరంగా ఉంటున్నాడు .1848జూన్ రివల్యూషన్ కు సాయం చేశాడు .బారికేడ్ లనిర్మాణం లో ,సాయపడ్డాడు .స్వయం గా ‘’we must shoot General Aupick ‘’అనే బానర్ ‘’నేశాడు ‘’.సాధారణ సైనికుడి స్థాయి నుండి జెనరల్ పదవికి ఆ తర్వాత రాయబారిపదవికి ఎదిగిన వాడిపై ద్వేషం మాత్రం పోలేదు .

     విప్లవ పత్రిక’’సాల్ట్ పబ్లిక్ ‘’ స్థాపించి నడపటం లో రాజీలేని వాస్తవ చిత్రకారుడైన గుస్తేవ్ కూర్బేట్  కు ,హెరాన్ దీమార్ అనే విమర్శకుడికి సహాయపడ్డాడు .విప్లవానికి ఇన్ని రాకాల ఊపిరులు ఊదినా అది విఫలమై చప్పగా చల్లారి పోవటం తో మానసిక క్షోభ చెందాడు బాడేలేర్ .’’సెకండ్ ఎంపైర్ ‘’అధికారానికి వచ్చింది .రాజకీయం అంటే రోతపుట్టింది .వీధుల్లోకొచ్చి విప్లవ నినాదాలిచ్చి ఉద్రేకం తో ఊగి ,ఊగించిన ‘’మాబ్ ‘వింత, విపరీత ప్రవర్తనకు  అసహ్యమేసింది .ఉదాసీనత మనసులో, శరీరం లో ప్రవేశించి నిష్క్రియా పరుడయ్యాడు బ్రాడేలేర్ .

    Étienne Carjat, Portrait of Charles Baudelaire, circa 1862.jpg సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు -రెండవ రోజు 22-2-15 ఆదివారం దృశ్యమాలిక 

This gallery contains 116 photos.

More Galleries | Tagged | Leave a comment

తెలుగు సభలు -రెండోరోజు ప్రముఖుల సందేశాలు



 
 
 


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిపి ,షుగర్ లకూ కేప్సిల్స్ నోరి దత్తాత్రేయ శర్మ -కేసర్ స్పెషలిస్ట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వలింగ సంపర్కం తోనూ పిల్లలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాళ్ళు వెళ్ళిపోయారు

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ వాడలోమూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల మొదటి రోజు 21-2-15 శనివారం దృశ్యమాలిక 

విజయ వాడలోమూడవ  ప్రపంచ తెలుగు రచయితల మహా సభల  మొదటి రోజు 21-2-15 శనివారం దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభ మొదటి రోజు -వెంకయ్య ప్రారంభం

 


 
 


 
 


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కైలాస యాత్రకు మరో మార్గం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గిదేంది మహాత్మా!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శుభాకాంక్షలు

అందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్

— Languages are the most powerful instruments of preserving and developing our tangible and intangible heritage. All moves to promote the dissemination of mother tongues will serve not only to encourage linguistic diversity and multilingual education but also to develop fuller awareness of linguistic and cultural traditions throughout the world and to inspire solidarity based on understanding, tolerance and dialogue.
—from the United Nations International Mother Language Day microsite[2]
సాహితీ బంధువులకు  -ఈ రోజు మా దంపతుల వివాహ 51 వ వార్షికోత్సవ సందర్భం గా అందరకు శుభ కామనలు ,శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

గిన్నీస్ బుక్ ఎక్కిన దర్శ కేంద్రుడు

గిన్నిస్బుక్‌ విజేత కావటం అద్భుతఘట్టం – కె. రాఘవేంద్రరావు

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల సినీ జీవితం గురించి సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ యు.వినాయకరావు రచించిన ‘గిన్నిస్బుక్‌ విజేత’ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి కాపీని ఆవిష్కరించారు. హీరో కృష్ణ స్వీకరించారు. మలి ప్రతిని బి.ఏ.రాజు కొనుగోలు చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘విజయనిర్మలగారు నాకు ఇష్టమైన నటి. ఓ మహిళా దర్శకురాలు గిన్నీ్‌సబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం సినిమా చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టం. ఆమెను స్పూర్తిగా తీసుకుని మరింత మంది మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి’’ అని అన్నారు. కృష్ణ మాట్లాడుతూ ‘‘విజయనిర్మలకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. ఆమె సినీ జీవితానికి సంబంధించి అన్ని అంశాలతో ఓ పుస్తకం రావడం ఆనందంగా ఉంది. వినాయకరావు చాలా విపులంగా రాశారు ఈ పుస్తకాన్ని. ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘‘నా సినిమాలన్నింటి గురించి విపులంగా ఓ పుస్తక రూపంలో సమకూర్చిన వినాయకరావుగారికి కృతజ్ఞతలు. ఆసక్తికరంగా ఉందీ పుస్తకం’’ అని అన్నారు. వినాయకరావు మాట్లాడుతూ ‘‘భారత చలన చిత్ర రంగంలో ఏ దర్శకురాలికి దక్కని గిన్నీ్‌సబుక్‌ రికార్డ్‌ గౌరవం విజయ నిర్మలగారికి దక్కింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విజయనిర్మలగారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నేను ఇస్తున్న చిరు కానుక ఇది. ఏ హీరోకి రానన్ని పేజీలతో త్వరలోనే కృష్ణగారి మీద మరో పుస్తకాన్ని తీసుకురానున్నాను ’’ అని తెలిపారు. ‘‘చక్కని నటి, దర్శకురాలు, అంతకుమించి గొప్ప రైతు, సంఘ సంస్కర్త అయిన మా అమ్మ గురించి పుస్తకం రాయడానికి వినాయకరావు అర్హుడు’’ అని నరేశ్‌ అన్నారు. ఇంకా బి.జయ, పద్మాలయ మల్లయ్య, నవీన్‌ విజయకృష్ణ, గుండు సుదర్శన్‌, ఖాదర్‌గోరి, దిడ్డి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయనిర్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటి మిట్టకు నవమి వైభవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాత్రు భాషోత్సవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -14

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -14

7-మహిళా నెపోలియన్ –సుసాన్ బ్రౌనేల్ ఆంథోని

అమెరికా లో  డెబ్భై అయిదేళ్ళ మహిళా పోరాటం వలననే స్త్రీలకూ స్వాతంత్ర్యం ,విద్య ,ఉద్యోగం స్వంత ఆస్తి ,పిల్లలపై అధికారం లభించాయి .వీటిని సాధించటానికి చేసిన ఉద్యమ పోరాటాలలో సింహ భాగం సుసాన్ బ్రౌనేల్ ఆంథోనీ కే దక్కుతుంది .ఆమె జీవితం మహిళా సాదికారతకే అన్కితమైంది  .ఆమె లేని ఉద్యమం లేదు .ఆమె పాల్గొనని సభ కనిపించదు ,చేయని పోరాటం లేదు .నిర్భయం గా మగ దీరులను ఎదిరించి వారు చెప్పే కుంటి సాకులకు దీటుగా సమాధానాలు చెప్పి చట్ట సభలలో తమ హక్కుల బిల్లు రూపొందించటానికి కృషి చేస్తూ త్యాగమయి గా జీవించి మహిళా శక్తిని సమీకరించి  గుండె ధైర్యం తో ముందుకు నడిఛి మహిళా నెపోలియన్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన మహిళా మాణిక్యం సుసాన్ .

  అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం లో 15-2-1820 నఆడమ్స్ లో జన్మించిన సుసాన్ ఆంథోని ఎనిమిది మంది సంతానం లో రెండవ ది.తండ్రి క్వేకర్ ఉద్యమ నాయకుడు అయినా బాప్టిస్ట్ స్త్రీని పెళ్లి చేసుకొన్నాడు .నవ వధువు భర్త క్వేకర్ ఉద్య మానికి పూర్తీ మద్దతు పలికి సహకరించింది .కూతురు సుసాన్ ను క్వేకర్ విధానం లో చదువు చెప్పించింది .పిల్లలు గృహకృత్యాలలో తర్ఫీదు ఇస్తూ ,చదువుకోనేట్లు చేసేది .ఇంటివద్దగవర్నేస్ లను ఏర్పాటు చేసి చదివించారు .సుసాన్ ఫిలడెల్ఫియాలో పెద్దగా డబ్బు ఖర్చు లేని స్కూల్ లో చదివింది .1938 ఆర్ధిక సంక్షోభం లో సుసాన్ తండ్రి దివాలా తీశాడు .కుటుంబాన్ని న్యూయార్క్ లోని బాటెన్ విల్ కు మార్చాడు .ఇక్కడే పదేళ్లున్నారు .తండ్రి న్యూ యార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేశాడు .డిప్రెషన్ ప్రభావం పడిన ఉన్నత కుటుంబాలలోని స్త్రీలు ఇంటి నుంచి బయటికి వచ్చి పురుషులతో సమానం గా గౌర వింప బడాలని  హక్కులు పొందాలని అభిప్రాయ పడ్డారు .వీరిని సక్రమమైన మార్గం లో నడిపించే ఆలోచన లో పడిసుసాన్  టీచర్ గా పని చేయాలను కొన్నది .న్యు రోషేల్లీ లోని బోర్డింగ్ స్కూల్ కు అసిస్టంట్ ప్రిన్సిపాల్ గా పని చేసింది .పది హీను వారాలకు ముప్ఫై డాలర్ల జీతం పొందింది .తర్వాత మగ టీచర్ కు వారానికి పది డాలర్లు ఇచ్చే పల్లెటూరి స్కూల్ లో వారానికి రెండున్నర డాలర్లు మాత్రమే జీతం పొందుతూ పని చేసింది .అదీ వివక్షత ఆడకూ మగకూ .

     ఇలా పని చేస్తూ క్రమంగా ఎదుగుతూ ,గనజాహోరి అకాడేమిలో  బాలికా విభాగం లో పనిచేసి గృహానికి దూరం గా ఒంటరిగా  స్వంత ఆదాయం పై జీవిస్తోంది సుసాన్ .ఇవి క్వేకర్ విధానాలకు వ్యతిరేకమే అయినా సాహసంగా ముందుకు వెళ్ళింది .పొడవుగా  ఉండి ,వెడల్పు బుజాలతో తీక్ష్ణ దృష్టితో యువకులకు అత్యంత ఆకర్షణీయం గా ఉన్నా ఆమె ఎవరి నీ వరించలేదు .’’కనజహారి  లో చురుకైన ధీశక్తి గల మహిళ’’గా గుర్తింపు పొందింది .మద్య పాన నిషేధ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నది .మహిళా ఉద్యోగ ఉద్యమం లోనూ తన వంతు పాత్ర నిర్వహించింది .సమాజం లో మహిళా సాధికారికత కోసం పెద్ద ఉద్యమం చేయాలనే కాంక్ష బలీయంగా మనసులో నాటుకొని అవకాశం కోసం ఎదురు చూస్తోంది .ఎలిజ బెత్ కాండీ స్టాన్టన్ మహిళల కోసం అప్పటికే ఉద్యమం లో ఉంది .సుసాన్ ‘’డాటర్స్ ఆఫ్  టెంపరెంస్ ‘’ఉద్యమం లో చేరింది .స్థానిక నాయకురాలి గా ఉండి క్రమంగా రాష్ట్ర నాయకు రాలైంది .ధారాళం గా మాట్లాడక పోయినా శక్తి వంతమైన పలుకులతో ఉర్రూత లూగించేది .వాదనా సామర్ధ్యం తో అవతలి వారిని ఒప్పించించేది .బ్రహ్మాండమైన రచయిత్రి కాకపోయినా రాసిన దానిలో స్పష్టత ,వాడి వేడి ఉండేవి .ఉద్యమం మందకొడిగా సాగటమే కాదు పురుషాదిక్యం వలనా వారి వ్యతిరేకతవలనా మందగించింది .మగవారు ఆడవారిని తమ తో సమానం గా పని చేయటానికి పూర్తిగా వ్యతిరేకించేవారు .మహిళల ను పబ్లిక్ మీటింగులలో చూడటమే కాని  వారిమాట   వినటానికి ఇష్టపడే వారు కాదు .ఆ నాడు .మహిళల హక్కు అంటే మండి పడేవారు  మగాళ్ళు. ఎలిజబెత్ తో యాభై ఏళ్ళ బంధం నుండి విడిపోయి స్వంతంగా స్త్రీ హక్కులకోసం పోరాడాలని నిర్ణయించింది .మొదటి సరిగా న్యూయార్క్ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ లో మాట్లాడి మహిళా టీచర్లకు అన్నిసదుపాయాలూ ,అన్ని విషయాలలో సంప్రదించే హక్కు కలిగేట్లు తీర్మానం చేయించ గలిగింది .దట్ ఈజ్ సుసాన్ .

          1853లో సుసాన్ పూర్తిగా మహిళాహక్కులకోసమే అంకితమై పని చేయటం ప్రారంభించింది .మొదట్లో స్టాన్టన్ కు సహాయకురాలిగా ఉన్నా తర్వాత ఆమెకే  గైడ్ గా మారి మార్గ దర్శనం చేసింది .ఆమెతో లాయరైన ఆమె భర్త తోకలిసి ఉద్యమాలు నిర్వహించింది .కలిసి ఉపన్యాసాలు రాసింది .అప్పటికే ఎలిజ బెత్ ఏడుగురు   పిల్లల తల్లి .స్త్రీల డ్రెస్ విధానం లోను మార్పు రావాలని భావించి జుట్టు కత్తిరించుకొన్నది .సంప్రదాయ డ్రెస్ వదిలి తక్కువ పొడవున్న డ్రెస్ ధరించింది .ఇది కొంత ఇబ్బందికలిగించి స్త్రీ సమస్యలపై కంటే వారి డ్రెస్ పైనే ద్రుష్టి కేంద్రీకృతం అవుతున్నట్లు గ్రహించి మళ్ళీ ‘’రోడ్లను ఊడ్చే పాదాల దాకా పాకే ‘’పాత డ్రెస్ లానే వేసుకోంది.

 ఉద్యమాల నిర్వహణకు డబ్బు అవసరం అది వీరి వద్ద లేదు .దీనికి ముఖ్య  కారణంఏమిటి అని ఆలోచిస్తే స్త్రీలకూ డబ్బు దాచుకొనే హక్కు కూడా లేదని గ్రహించింది .దీనికోసం సభలు సమావేశాలు నిర్వహించి న్యూ యార్క్ స్టేట్ లెజిస్లేచర్ లో మహిళా హోదా కల్పించటానికి ఎన్నో సార్లు ప్రయత్నించి చివరికి ఆ బిల్ పాస్ అయ్యేదాకా పోరాటం సాగించి హక్కు సాధించింది .ఇది పదేళ్ళ పోరాట ఫలితం .దీక్షగా ఆ పదేళ్ళు ఒకే డ్రెస్ ధరించి సుదూర ప్రాంతాలు అన్ని రకాల వాతావరణాలలో ,విపరీత విపత్కర పరిస్తితులలో పర్య టించి మహిలలో చైతన్య దీప్తి రగిలించి సమీకృతం చేసి ఉద్యమాలు నిర్వహించి సాధించిన ఫలితం ఇది .1860లో శాసన సభలో బిల్లు పాసై చట్టం వచ్చి మహిళలకు ఆస్తిహక్కు ,స్వంత సంపాదనహక్కు ,పిల్లలపై భర్తతో సహా హక్కు మొదలైనవన్నీ సుసాన్ కోరినట్లే లభించాయి ఇది చారిత్రాత్మక విజయం .

     ఈ విజయాలతో పాటు కొన్ని అపజయాలు చవి చూసింది సుసాన్ .ఒక మతాధికారి రాసిన ‘’వుమెన్స్ సఫ్రేజ్ –ది రిఫార్మ్ ఎగైనెస్ట్ నేచర్ ‘’అనే పుస్తకం రాసి పుండుమీద కారం చల్లాడు .అందులో సుసాన్ ను చాలా నీచం గా  వర్ణిం చాడు కూడా . అమెరికా సివిల్ యుద్ధం లో ఉడికి పోతోంది .అబ్రహాం లింకన్ ఎన్నిక అబాలిష నిస్ట్ లకు ఊతం ఇచ్చింది .మొదట్లో సుసాన్ లింకన్ కు వ్యతిరేకం గా ప్రచారం చేసినా తర్వాత ఆయన బానిసత్వ నిర్మూలనా సిద్ధాంతం నచ్చి ఆయనకే ప్రచారం చేసింది .సివిల్ యుద్ధ కాలం లో స్త్రీ హక్కు ఉద్యమాన్ని తాత్కాలికం గా నిలిపేశారు .తండ్రి కున్న ఫారం లో కాలక్షేపం చేసింది .బ్రౌనిగ్ రచనలు ,ఇలియట్ సాహిత్యాన్ని చదువుతూ గడిపింది ఆసమయం లో . బానిసత్వ నిర్మూలన ,స్త్రీ విముక్తి కోసం పధకాలు ,అవి అమలవ్వాల్సిన తీరు పై దేర్ఘం గా ఆలోచించింది .నీగ్రోలకు హక్కులు ఇచ్చే చట్టం వచ్చింది కాని అందులో మహిళల గురించి లేదు మళ్ళీ ఉద్యమించి ఎలిజబెత్ తో కలిసి స్త్రీ లను సంఘటిత పరచి పోరాడింది .అల్బనిలో మహిళా వోటుహక్కు కోసం పోరాడింది .న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ లో మహిళా వోటుహక్కు బిల్లు పాస్ కాకుండా మగవారందరూ అడ్డుపడ్డారు .దీనితో బాగా కలత చెందింది సుసాన్ .

   సుసాన్ -‘’రివల్యూషన్ ‘’అనే వార్తా పత్రికకు సంపాదకత్వం చేసింది .  ఆ పత్రిక ద్వారా ఉద్యమాన్ని ఉత్తేజపరచింది .సహించలేని మగ పురుషులు పత్రికను సస్పెండ్ చేయించారు .అధైర్య పడలేదు సుసాన్ .పత్రిక కు ఉన్న పది వేల డాలర్ల అప్పును తన స్వంత డబ్బుతో తీర్చేసింది .ఈ కాలం లో తండ్రి వదిలిపెట్టిన కొద్ది ఆస్తితో జీవిక సాగించింది .1872ప్రెసిడెంట్ ఎన్నికలో వోటు వేసింది .రాజ్యాంగానికి విరుద్ధం గా వ్యవహరించినందుకు సుసాన్ పై నేరం మోపి వంద డాలర్ల జరిమానా విధించారు .వీలున్నప్పుడల్లా తన ‘’హిస్టరీ ఆఫ్ వుమెన్ సఫ్రేజ్ ‘’పుస్తకం రాసి మహా గ్రంధాన్ని పూర్తీ చేసింది .సుసాన్ ఉద్యమం ‘’నేషనల్ అమెరికన్ వుమన్ సఫ్రేజ్ అసోసియేషన్ ‘’గా రూపు మారింది .ఒక రకం గా సుసాన్ ‘’అమెరికా దేశం మనసును మార్చిన మహిళ’’(the woman who changed the mind of the Nation ‘’అని రేటా చైల్డ్ డోర్ర్ రాశాడు .

      యూరప్ వెళ్లి అక్కడా ప్రసిద్ధి చెందింది .అక్కడ మహిళా ఉద్యమం ప్రారంభ దశలో ఉంటె దాన్ని చైతన్య పరచి ముమేంటంతెచ్చింది సుసాన్ .డెబ్భై ఏళ్ళు మీదపడ్డాయి .సోదరి బలవంతం మీద రోచెస్టర్ లో ఆమెతో కలిసి ఉంది .రోచేస్టర్లోని ‘’పొలిటికల్ ఈక్వాలిటి లీగ్ ‘’ సుసాన్ కు  గృహాన్ని సమకూర్చి  ,ఆమె మహిళా సేవకు సార్ధకత చేకూర్చి గౌరవించారు .కాని నిరంతర ప్రయాణాలు సభలూ చర్చలతో గడిపే ఆమె అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు .ఎనభై వ ఏట వుమెన్ సఫ్రేజ్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా రిటైర్ అయింది .ఆమె జీవిత చరిత్ర పూర్తీ అయి ప్రచురణ పొందింది .అమెరికా మహిళలకు ఫెడరల్ రాజ్యాంగ సవరణ చేసి మాత్రమె వోటు హక్కు కల్పించాలని ,రాష్ట్రాల లెజిస్లేచర్ లలో కాదని స్పష్టం గా చెప్పింది .1904 లో ‘’ఇంటర్నేషనల్ వుమన్ సఫ్రేజ్ అలయన్స్ ‘’అనే సంస్థ ఏర్పడింది .ప్రపంచ మహిళలందరూ సుసాన్ తమ నాయకురాలు అని ఏకగ్రీవం గా తీర్మానించారు .చివరి సమావేశం లో మాట్లాడుతూ ‘’మన పోరాటం ఆగదు..అది ఆగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిదీ .’’అని సందేశం ఇచ్చింది .86  వ  పుట్టిన రోజున వాషింగ్టన్ లో ఆమెకు సన్మానం చేశారు .పెద్ద డిన్నర్ ఇచ్చారు .అప్పుడు ‘’failure  is impossible ‘’అన్న మహా మంత్రాన్ని ఉపదేశించింది .అయినా విజయం రావటానికి ఇంకా చాలా కాలం నిరీక్షించాల్సి వచ్చింది దేశం .13-3-1906 న మహిళోద్యమ నాయకురాలు ,మహిళా సాధికార ఉద్యమ సారధి మరణించింది .అమెరికా పతాకం అవనత చేసి గౌరవించారు .’’the champion of a lost cause ‘’అని కీర్తించారు .ఆమె కోరిన మహిళా హక్కులన్నీ క్రమంగా తీరాయి .21-5-1919 అమెరికా ఫెడరల్ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మహిళలకు సర్వ తంత్ర పౌరసత్వహక్కు ,లభించింది .ఈ సవరణకు ‘’సుసాన్ బి ఆంథోని అమెండ్ మెంట్ అని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది ఆ పోరాట యోదురాలిని .

మరొక ప్రముఖునితో కలుద్దాం.

Inline image 1  Inline image 2

    సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిర్మాతలకు నిఘంటువు

నిర్మాతలకు నిఘంటువు

  • 20/02/2015
  •  – రాజేశ్వర ప్రసాద్

ఆయన చరిత్రను ఎటునుంచి ఎటు తిరగేసినా ఘనమైన అడుగులే కనిపిస్తాయి. మొక్కవోని దీక్షాదక్షతలు ప్రతి అడుగులోనూ కళ్లకు కడతాయి. నిర్మాత ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకోవాలంటే రామానాయుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోకుండా.. నిరంతరంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లారు కాబట్టే చీకటిని వెన్నంటే వెలుగుంటుందన్నట్టుగా రామానాయుడి జీవితం వెండి వెలుగులే విరజిమ్మింది. ఆరు దశాబ్దాల పాటు ఎడతెగని రీతిలో సాగినన సినీ సుదీర్ఘ ప్రయాణంలో రామానాయుడు ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. కథాపరంగా వైవిధ్యమంటే ఏమిటో ప్రేక్షకులకు రుచి చూపించారు. అందుకే.. ఆయన నిర్మాతలకు నిఘంటువు! తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ స్వర్ణయుగంగా పేర్కొనే అరవైయవ దశకంలోనే కారంచేడు కుర్రాడిలో సినీ కలలు మొదలయ్యాయి. అంతకుముందూ సినిమావాళ్లతో పరిచయాలున్నా.. మద్రాసు రావడం అన్నది అరవైయవ దశకం తొలి నాళ్లలోనే జరిగింది. జగ్గయ్య హీరోగా నిర్మితమైన అనురాగంతో నిర్మాతగా అడుగు పెట్టిన రామానాయుడికి ఎదో చేయాలన్న తపన బలంగా ఉండేది. తాను భిన్నంగా ఉండాలని, తను తీసే సినిమాలూ అదే స్థాయిలో ఉండాలన్న భావన మొదలైన ఆయన జీవితం అప్రతిహతంగానే సాగింది. అప్పట్లో పౌరాణికమైనా, జానపదమైనా ఎన్టీఆరే చిరునామాగా ఉన్న సమయంలో -షడ్రసోపేతమైన కథతో రాముడు-్భముడు నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో అక్కినేని నటించిన డాక్టర్ చవ్రర్తితో పాటు రాముడు-్భముడు సినిమాను విడుదల చేయాలని రామానాయుడు సంకల్పించినా ఎన్టీఆర్ వద్దనడంతో అనంతరమే విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. అక్కినేనితో సమానంగా ఎన్టీఆర్‌ను సాంఘిక సినిమా హీరోగా నిలబెట్టిన చిత్రం రాముడు-్భముడు. ఆ సినిమా ఘన విజయంతో రామానాయుడిలో నిర్మాతగా మరింత బాధ్యత పెరిగింది. ఎన్టీఆర్‌తోనే తొలి సినిమా విజయం సాధించడంతో ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్‌కు విజయ, జగపతి వంటి బలమైన బ్యానర్ల సరసన స్థానం లభించింది. ఓ పక్క ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాతగా ముద్రవేసుకున్న ఆయన తదుపరి తీసిన ప్రతి సినిమా విషయంలోనూ అంతే జాగ్రత్తపడ్డారు. నిర్మాత లేనిదే సినిమా లేదు. ఎంత పెద్ద హీరోకైనా తనను నమ్మే మంచి నిర్మాత దొరికితేనే రాణింపు ఉంటుంది. ఈ వాస్తవాన్ని ముందే గ్రహించిన రామానాయుడు తన సినిమాలకు కథలనే హీరోలుగా చేసుకున్నారు. హీరోలను అందులో పాత్ర దారులుగా మార్చారు. ఆయన ఇప్పటి వరకూ తీసిన 130 సినిమాలను లోతుగా గమనిస్తే నటీనటుల పాత్రోచిత ఎంపిక స్పష్టమవుతుంది. తెలుగైనా, హిందీ అయినా సరే మేలిమి బంగారం లాంటి కథలకే ఆయన ప్రాధాన్యతనిచ్చేవారు. ఇంటిల్లిపాదీ హాయిగా మూడు గంటల పాటు థియేటర్లలో కూర్చోగలిగే సినిమాలనే రామానాయుడు నిర్మించారు. 1960 నుంచి ప్రతి దశాబ్దంలోనూ విజయవంతమైన సినిమాలను బేరీజు వేసుకుంటే మొదటి పది సినిమాల్లో రామానాయుడి సురేష్ ప్రొడక్షన్స్ కనిపిస్తుంది. తాను పెద్ద నిర్మాతగా ఎదిగినా.. స్టార్లను ఉత్పత్తి చేసే స్టార్‌గా రాణించినా కూడా చిన్న హీరోలకు ఆయన నిత్యం బాసటగా ఉండేవారు. కొత్త వారితో సినిమాలు తీయాలన్నా, కొత్త తరహాలో ప్రయోగాలు చేయాలన్నా ఎంత మాత్రం వెనుదిరగని రామానాయుడు అనేక మందిని నిజంగా స్టార్లను చేశారు. కొత్త దర్శకులనూ పరిచయం చేశారు. వారందరూ కూడా అనంతర కాలంలో తమదైన ముద్రతో తెలుగు సినీ పరిశ్రమలో రాణించిన వారే కావడం తెలిసిందే. రామానాయుడి బ్యానర్‌లో పని చేయడం అంటే ప్రతి ఒక్కరికీ ఓ కలే కాదు సవాలు కూడా. ఎందుకంటే దర్శకులకు కథాపరంగా ఎంత స్వేచ్ఛనిస్తారో.. అనుకున్న విధంగా సన్నివేశాల చిత్రీకరణకు ఎంతటి వీలునిస్తారో.. వృధా వ్యయాన్ని అంతే సహించరు. నిర్మాత పదికాలాలపాటు ఉంటేనే పరిశ్రమలోని ప్రతి రంగం బతుకుతుందన్న భావనను తొలి నాళ్లలోనే వంటబట్టించుకున్నారు కాబట్టే డజన్ల సంఖ్యలో అన్ని భాషల్లోనూ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించగలిగారు. పెద్ద హీరోతో తీసినా, చిన్న హీరోతో నిర్మించినా రామానాయుడి సినిమాలన్నింటిలో రిచ్‌నెస్ కనిపిస్తుంది. సన్నివేశానికి అవసరమనుకుంటే ఎక్కడికైనా వెళ్లి అంత ఖర్చుతోనూ వాటిని రక్తికట్టించే మనస్తత్వం ఆయనది. ఇందుకు ఎన్నో ఉదంతాలున్నాయి. తన సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూడటమే కాదు, షూటింగ్ పూర్తయ్యే వరకూ వారి అవసరాలన్నీ తీర్చే పెద్ద మనసు ఆయనది. పనివాడిలో పనివాడిగా నిర్మాతా పని చేయడం ఎక్కడా మనం చూడ లేదు. డబ్బు పెట్టేది తానేనైనప్పుడు పారితోషికాలు లేదా జీతాలు తీసుకుంటున్న వారితో కలిసి పని చేయడమేమిటన్న ఆలోచన రామానాయుడికి ఏ కోశానా ఉండేది కాదు. అందుకే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమాయన. అందరికంటే ముందుగానే స్టూడియోకి వచ్చి షూటింగ్‌కు సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ మమేకం కావడం అన్నది తొలి సినిమా నుంచే రామానాయుడికి అబ్బింది. అదే అలవాటును చివరి వరకూ కొనసాగించి నిర్మాతలందరికీ ఓ పాఠంలా తన జీవితాన్ని మలచుకోగలిగారు. కష్టేఫలి అన్నట్టుగా ఆయన సినిమాలన్నీ కూడా దాదాపుగా ఘన విజయాన్ని సాధించినవే. హీరో ఎవరన్న మాటతో నిమిత్తం లేకుండా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు అంతగా జనంలో గుర్తింపు తీసుకురాగలిగారు. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, ఒరియా, పంజాబీ, బెంగాలీ వంటి ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించిన నిరుపమాన వ్యక్తి రామానాయుడు. భాష ఎదైనా మానవ నైజం ఒక్కటే. మంచి చెడుల సమ్మేళనమేనన్న వౌలిక అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టే అన్ని భాషల్లోనూ నాయుడి సినిమాలు విజయఢంకా మోగించాయి. పెద్ద హీరోలుంటేనే సినిమాలు ఆడతాయని, జనం ఆదరిస్తారన్న భావనను రామానాయుడు చరమగీతం పాడారు. కథను బట్టే సినిమా ఉండాలి తప్ప హీరోనుబట్టి కాదని నిరూపించారు. అంతే కాదు సినిమా టైటిల్ కూడా హీరోయిజానికి అద్దం పట్టేదిగా ఉండాలన్న వాదననూ ఆయన ఒప్పుకునే వారు కాదు. కథను బట్టే టైటిల్ ఉండి తీరాల్సిందేనని పట్టుబట్టిన రామానాయుడి సినిమా టైటిల్స్‌ను చూస్తే ఈ వాస్తవం స్పష్టమవుతుంది. డాక్టర్ చవ్రర్తితో నవలా నాయకుడిగా తిరుగులేని ముద్ర వేసుకున్న అక్కినేనితో రామానాయుడి నిర్మించినన్ని నవలా సినిమాలు ఎవరూ నిర్మించలేదు. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అక్కినేని- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు ప్రేక్షకులకు కన్నుల పండువగానే ఉండేవి. ముఖ్యంగా నవలలను సినిమాలుగా మలచడంతో ఆరితేరిన దర్శకులనే ఎంపిక చేసుకునే రామానాయుడు ఆ నవలకు పూర్తి న్యాయం జరిగేలా నటీనటుల్ని ఎంపిక చేసుకునేవారు. ఈ విషయంలో ఏవిధంగానూ రాజీపడకుండా తాను అనుకున్నట్టుగా సినిమా పూర్తయ్యే వరకూ నిద్ర పోయేవారు కాదు. అందుకే తొలి సినిమా విజయాన్ని ఎన్టీఆర్‌తోనే సాధించినా అనంతరం రెండు మూడు సినిమాలను మాత్రమే ఆయనతో రామానాయుడు నిర్మించారు. శ్రీకృష్ణతులాభారం పౌరాణిక సినిమాల నిర్మాణ తీరుతెన్నుల్నే మార్చేసింది. పౌరాణికం అన్న అద్భుత భావనకు అద్దం పట్టేలా ఆ సినిమాను నిర్మించిన తీరు అద్భుతమే. అప్పట్లో ఎన్టీఆర్‌తో సమానంగా జానపదాల్లో రాణిస్తున్న కాంతారావుతో ప్రతిజ్ఞాపాలన తీశారు. అది కూడా జానపద సినిమా నిర్మాణంలో కొత్త ప్రమాణాలను పాదుగొల్పింది. కృష్ణ, కాంతారావు హీరోలుగా బొమ్మలు చెప్పిన కథ అనే మరో వినూత్మ జానపద సినిమానూ తీశారు. వీటన్నింటికంటే కూడా నవలా కథానాయుడిగా తనకు తానే సాటి అనిపించుకున్న అక్కినేనితో ఎన్నో ఎనె్నన్నో విజయవంతమైన సినిమాలు తీయడం సురేష్ బ్యానర్ ఇమేజ్‌ను పెంచడంతోపాటు నిర్మాతగా రామానాయుడి స్థాయినీ అమాంతం పెంచేసింది. ఈ తరహా సినిమాల్లో ఆణిముత్యం ప్రేమ్‌నగర్.. ఈ సినిమా రిచ్‌నెస్‌కు కొలమానమైతే.. అక్కినేని నట వైభవానికి నిదర్శనం. వాణిశ్రీ నవలా కథానాయికగా సినీ చరిత్రలో నిలిచిపోవడానికి దోహదం చేసింది కూడా ఆ సినిమానే! అనంతర కాలంలో చక్రవాకం, సెక్రటరీ వంటి సినిమాలూ రామానాయుడికి ఎనలేని ఖ్యాతిని తెచ్చాయి. అక్కినేనితోపాటే అప్పటి వర్థమాన హీరో శోభన్‌బాబుకు కూడా స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన ఘనత రామానాయుడిదే. చక్రవాకం విజయంతో శోభన్ ఆగ్రనటుడైపోయారు. అనంతరం సురేష్ బ్యానర్‌పై ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించినవే. డబ్బు ఖర్చుపెట్టడమే కాదు, సార్థకమయ్యేలా చేయడంలోనే విజయం ఉంటుందని భావించిన నిర్మాత కాబట్టే రామానాయుడి సినీ జీవితం నిర్మాతకు నిత్య సోపానం. జయమైనా, అపజయమైనా కూడా నిలదొక్కుకోగలిగిన వాడే పదికాలాలపాటు రాణిస్తారని చెప్పడానికీ.. హీరోను కాకుండా కథను నమ్ముకున్నవాడే నిలబడతాడనడానికీ ఈ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత జీవితంలోని ప్రతి పేజీ అక్షర సత్యం. అందుకే ఆయన నిర్మాతలకు నిఘంటువు. ఆయన జీవితంలోని ప్రతి పేజీలోనూ క్రమశిక్షణకు నిర్వచనం కనిపిస్తుంది. నిబద్ధతకు అర్థం తెలుస్తుంది. అన్నింటి కంటేమించి చిన్ని చిన్ని అడుగులతో ఓ మహా ప్రయాణాన్ని ఆద్యంతం ఎలా ధీమాతో సాగించాలో కళ్లకు కడుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -91 కొత్త వొరవడి

నా దారి తీరు -91

కొత్త వొరవడి

సెకండరీ గ్రేడ్ మాస్టారు బ్రహ్మానందం ,హిందీ శంకరరావు గార్ల చొరవ తో కార్తీక వనభోజనం ఒక మామిడి తోటలో ఏర్పాటు చేయించాను .స్టాఫ్ అందరూ వచ్చారు .ఏర్పాట్లన్నీ బ్రహ్మానందం దగ్గరుండి స్వయం గా చూశాడు .ఆ స్కూల్ చరిత్రలో ఇది రికార్డ్ .

టెన్త్ పరీక్షలు

టెన్త్ క్లాస్ పరీక్షలకు వత్సవాయి హైస్కూల్ కేంద్రం గా ఉంది . ఆ సంవత్సరం లోనే క్వేస్చిన్ పేపర్లను పోలీసు స్టేషన్ లో ఇనప పెట్టెలో భద్రం చేసి ,ఏ రోజుకారోజు తెచ్చు స్కూల్ కు తెచ్చుకొని పరీక్ష నిర్వహించాలి .విపరీతం గా పేపర్లు ముందే లీక్ అవుతున్నాయని సెంటర్ హెడ్ మాస్టర్లె ‘’లీకు  వీరులు’’ అని   భావించి చేసిన పకడ్బందీ ఏర్పాటు ఇది .ఆ సంవత్సరమే పోలీస్ స్టేషన్ వత్సవాయికి వచ్చింది .అదీ స్కూలుకు ఎదురుగానే .కనుక ఇబ్బంది లేదు .అలాగే పేపర్లు తెచ్చి పరీక్షలు జరిపాం. చాలా పకడ్బందీ గా పరీక్షలు నిర్వహించాం కాపీలు కొట్టనివ్వలేదు .

ఇన్స్పెక్షన్

కాంగ్రెస్ మంత్రి జానారెడ్డి మేనల్లుడు శ్రీ వీరభద్రా రెడ్డి విజయవాడ డివిజన్ గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చారు .చాలా స్ట్రిక్ట్ అని వెళ్ళిన స్కూల్ లో అరుపులు కేకలతో భయపెడుతున్నారని నిర్మోహ మాటం గా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి .ఆయన పెనుగంచిప్రోలులో ఇన్స్పెక్షన్ కు వచ్చారని తెలిసి నేను సైన్స్ మాస్టర్ అప్పారావు కలిసి ఆయన స్కూటర్ మీద పెనుగంచి ప్రోలుకు వెళ్లి కలిసి మా స్కూల్ కు కూడా త్వరలో ఇన్స్పెక్షన్ కు రమ్మని ఆహ్వానించాను .ఆయన ఆశ్చర్య పడ్డారు నా చొరవకి  . పేనల్ ఇన్స్పెక్షన్ జరపటం అనేది అప్పటి అలవాటు. అంటే అన్ని సబ్జెక్టులు ఇన్స్పెక్టర్ చూడలేడు కనుక దగ్గర స్కూల్స్ నుంచి సబ్జెక్ట్ లో సీనియర్ టీచర్ లను పేనల్ ఇన్స్పెక్షన్ కు ఆహ్వానించి ఇన్స్పెక్టర్ తనకిష్టమైన ఏదో ఒక సబ్జెక్ట్ ను హెడ్ మాస్టారు చెప్పెక్లాసును ఇన్స్పెక్ట్ చేయటమే పీనల్ ఇన్స్పెక్షన్ .పెద్ద స్కూలు కనుక రెండు రోజుల పైనే పడుతుంది .ఆయన రెండు సార్లు డేట్ ఇచ్చి రాలేదు .మూడో సారి నేనే నేను పిలిచిన సబ్జెక్ట్ టీచర్స్ చేత పీనల్ ఇన్స్పెక్షన్ పూర్తీ చేయించి ,ఆయన కోసం ఎదురు చూశాను .ఆయన గుమాస్తాతో వచ్చి స్కూలువాతావరణం ,నిర్వహణ చాలా బాగా ఉందనిమెచ్చుకొన్నారు .మంచి భోజనం ఏర్పాటు చేశాం స్టాఫ్ తరఫున .ఆయన  గుమాస్తా  పీనల్ టీచర్లూ మా స్టాఫ్ అందరు కలిసి విందు చేశాం .రిమార్కులు కూడా చాలా ఫేవరబుల్ గా రాశారాయన .’’ఉగ్ర వీరభద్రం ‘’గా రంకె లేస్తాడేమో అనుకొంటే అదేదో సినిమాలో రేలంగి లా ‘’ఒట్టివీరబద్రం ‘’లా శాంతంగా తనిఖీ జరిపి అందరిని ఆశ్చర్య పరచారు .స్కూల్ పైనా నాపైనా గుడ్ ఇంప్రెషన్ కలిగి ఉండటం మొదటి సారిగా నేను హెడ్ మాస్టర్ అయి పొందిన ప్రశంస నాకు ప్రోత్సాహాన్నిచ్చింది .ఆయనా చాలా స్కూళ్ళకు చెప్పకుండా వెళ్లి అక్కడ పరిస్తితుల్ని చూసి వీరంగం వేసే వాడట .ఆ సీన్ కు అవకాశం లేకుండా చేశాం .ఇది స్టాఫ్ సమష్టి  సహకారమే  నా గొప్పకాదు .అందర్నీ కలుపుకు పోవటమే ఈ విజయానికి హేతువు .ఇన్స్పెక్షన్ జరిగినా స్కూల్ కు రాము అని భీష్మిన్చుకొన్న తెలుగు మేస్టర్ని, భార్య సోషల్ టీచర్ని స్టాఫ్ సెక్రటరీ తో ఇంటికి పంపించి నచ్చ చెప్పించి వారినీ హాజరయ్యేట్లు చేయగలిగాను .అప్పుడు అర్ధం చేసుకొన్నారు వాళ్ళిద్దరూ వారికి ఇది యెంత మేలు చేసిందో .వారి ఆరోగ్య విషయం ముందే ఇన్స్పెక్టర్ గారికి చెప్పి ,ఆయనకాకుండా పేనల్ టీచర్ల తో వారిద్దరికీ తనిఖీ చేయించి వాళ్ళను బయట పడేశాను .

ఏడవ తరగతి పరీక్షలు

ఏడవ తరగతి పరీక్షలు కూడా హెడ్ మాస్టారి ఆధ్వర్యం లో జరపాలి. అవి వార్షిక పరీక్షలకంటే ముందే జరుగుతాయి పేపర్లు జగ్గయ్య పేట హైస్కూల్ నుంచి తెచ్చుకోవాలి .లెక్కల మేష్టారు రమణయ్య తో పేపర్లు తెప్పించి ,నిర్వహించాను వీటినీ పకడ్బందీగా నే జరిపాను .మా స్కూల్ తో పాటు రెండు మూడు అప్పర్ ప్రిమరీస్కూల్ పిల్లలూ మా సెంటర్లో రాస్తారు .వారందరి నామినల్ రోల్స్ నాలుగుకాపీలు తయారు చేయించటం తెప్పించటం డి ఇ వొ ఆఫీస్ లో అందజేయటం జరగాలి అన్నీ యదా ప్రకారం చేశాను .

వార్షిక పరీక్షలు –వార్షికోత్సవం

వార్షిక పరీక్షలు కూడా పద్ధతిప్రకారమే జరిపాను .సబ్జెక్ట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారి పేర్లను తయారు చేయించి వారందరికీ బహుమతులు ఇప్పించాను .వ్యాసరచన వక్తృత్వం పోటీలు జరిపి బహుమతులిచ్చాం .స్కూల్ బెస్ట్ స్టూడెంట్ పై తరగతులలో ఒకరిని కింది తరగతులలో ఒకరిని ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులిచ్చాం .

సినిమాలు

వత్సవాయి మెయిన్ రోడ్డు మీద ఒక డాక్టర్  గారు ఉండే వారు .క్లినిక్ కూడా ఉండేది . అయన తండ్రికూడాడాక్టరు. ఈయనతో బాగా మంచి పరిచయం ఆచార్యుల గారి వలన కలిగింది .తరచుగా వారింటికి సాయంకాలం వెళ్లి కబుర్లు చెప్పుకొనే వాళ్ళం. చాలా సహ్రుదయులాయన పేరు మర్చిపోయాను .నేనూ క్రాఫ్ట్ మాస్టారు ఆచార్యులు బోనకాల్ వెళ్లి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. సైకిల్ మీద వెళ్లి వచ్చేవాళ్ళం .ఈప్రాంతం అంతా పెసర పంట బాగా పండేది .రోడ్డుమీదే వేసి నూర్చేవారు. ఆ వాసన బలే తమాషాగా ఉండేది .

ఆటలు

గ్రౌండ్ లో పల్లేరుకాయలు బాగా ఉండేవి .వాటినన్నిటిని పిల్లలతో తీయించి శుభ్రం చేసి బాడ్మి౦ టన్ వాలీ బాల కోర్టు లు వేయించి ఆదడిన్చేవాళ్ళం. స్టాఫ్ తో నేనూ ఆదేవాడిని .క్రాఫ్ట్ మాస్టారు ‘’పుర్ర చెయ్యి వాటం ‘’బాగా ఆడేవాడు కట్స్ బాగా కొట్టేవాడు .పంచ కట్టి మరీ ఆడేవాడు .కట్టు పైకి ఎగదీసి కట్టేవాడు .వాలీబాల్ లో ను మంచి నైపుణ్యం చూపేవాడు మంచి సర్వీస్ హాండ్ కూడా’ గిన్గర్లు తిరిగేట్లు బాల్ సర్వీస్ చేసేవాడు .ఆచార్యులు ,సైన్స్ అప్పారావు ,నేను ,లెక్కల రమణయ్య ,బ్రహ్మానందం బాగా అడే బాచ్ .చీకటి పడేదాకా ఆడి ఇంటికి వెళ్ళేవాళ్ళం .ఇదొక గొప్ప రిక్రియేషన్ .

గ్రామ పంచాయితీ ఎన్నికలు అప్పుడే వచ్చిన జ్ఞాపకం .నాకు కొండూరు డ్యూటీ వేశారు .అక్కడ కారణం కం ప్రెసిడెంట్ అయిన బ్రాహ్మణుల ఇంట్లోనే ఉన్నాను .ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అంతటి మంచిపేరున్న మనిషి ఆయన .ఆయన మనుషులే ఎన్నికైనట్లు గుర్తు .

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్టా కార్య క్రమం

పదేళ్ళ క్రితం మా ఆంజనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ట చేయాలని సంకల్పించి మీటింగులు వేసి చర్చించి విరాళాలు ఇచ్చిన వారికి రాసీదులిచ్చి వచ్చిన డబ్బు పదిహేను వందల రూపాయలను ఉయ్యూరు స్టేట్ బాంక్ లో నా పేరా మండా వీరభద్ర రావు పేరా జాయింట్ అకౌంట్ లో వేశాం.ఆ తర్వాత అడుగు కదలలేదు . గుడి దగ్గర పుల్లేరు కాలువపై వంతెన పడింది .జనం లో చురుకుదనం వచ్చింది. పదేళ్ళ తర్వాత మళ్ళీ   విష్ణ్వా లయం లో పెద్దల్ని పిలిచి మీటింగ్ వేస్తె ఈ సారి స్పందన బాగా వచ్చింది .పదేళ్ళ క్రితం పెద్ద విరాళం నూట పదహారు రూపాయలు అయితే  ఈసారి ఎవరికి వారు వెయ్యి నూట పదహార్లు ఇచ్చారు .నేనూవీరభాద్రరావు శ్రీ లంకా స౦జీవరావు గారు కలిసి తిరిగాము. వాగ్దానాలు వెల్లువలా రావటమేకాడు నేరవేర్చారుకూడా .దానితో వేడి బాగానే పుట్టి బందరు వెళ్లి శ్రీ వేదాంతం అనంత పద్మ నాభాచార్యుల వారి వద్ద ఆలయం పడగట్టటానికి ముహూర్తం పెట్టించి ఆ రోజే పని మొదలు పెట్టి ,విగ్రహాలను  విష్ణ్వాలయం లో ఉంచి ఆలయ నిర్మాణం మొదలు పెట్టాం . దీనికోసం అప్పుడప్పుడు ఎరండ్ లీవ్ కాని హాఫ్ ఏవరేజ్ లీవ్ కాని పెట్టాల్సి వచ్చేది .ఆదివారాలలో ఉయ్యూరు వెళ్లి పనులు చూసి  లూనాల మీద గ్రామాలు తిరిగి చందాలు వసూలు చేస్తూ వీరభద్ర రావు కు అందజేసి పనులు జరిపించేవాడిని .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-15- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

చీమలకూ అటా చేడ్ ”టాయి లెట్స్”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇస్లాం తోలి గురువు శివుడే -అన్న ముస్లిం మత పెద్ద –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వందేళ్ల ‘రజనీ’కాంతులు!

వందేళ్ల ‘రజనీ’కాంతులు!

  • 31/01/2015
TAGS:

అయిదేళ్ల చిరు ప్రాయంలోనే కల్యాణి రాగాన్ని అలవోకగా ఆలపించి అనతికాలంలోనే ఆయన స్వరలోకపు ‘సంగతుల’న్నీ ఔపోసన పట్టేశారు.. తన 18వ ఏట తొలి గీతాన్ని రాసి సొంతంగా బాణీ కట్టి ‘్భష్’ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో చలనచిత్ర సీమవైపు మమకారం పెంచుకుని స్వర వైవిధ్యంతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.. ఎన్నో చిత్రాలకు పాటలు రాసి, స్వరాలు సమకూర్చి సినీ సంగీతానికి దిశానిర్దేశనం చేశారు.. ఘంటసాల వంటి గాయకులను, సాలూరు రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహించారు.. ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా ఇతరుల కోసం సినీ గీతాలు రాశారు, లాలిత్యపు సుగంధాలను అద్ది పాటను కొత్త పుంతలు తొక్కించారు.. ‘నాగరాజు’, ‘తారానాథ్’, ‘నళినీకాంత్’ వంటి అనేక పేర్లతో పాటలు రాసినా, తన స్వరాలు ఎందరికో పేరు తెచ్చినా ఆయన ఏనాడూ కీర్తిప్రతిష్ఠలను కోరుకోలేదు. ఓ రేడియో నాటకంలో పాటలకు తొలిసారి స్వరాలందించిన ఈ సృజనకారుడు ముందుగా సినీ రంగంలో, ఆ తర్వాత ‘ఆకాశవాణి’లో అద్భుతాలను సాధించారు.. అనేక కారణాలతో చలనచిత్ర సీమకు దూరమయ్యాక రేడియోలో వినూత్న ప్రయోగాలు చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. రాగాలకు మాధుర్యాన్ని రంగరించి లలిత సంగీతానికి ‘ఆకాశవాణి’లో ప్రాణప్రతిష్ఠ చేశారు..
లలిత సంగీతానికి పర్యాయపదంగా నిలిచిన ‘శత వసంతాల’ బాలాంత్రపు రజనీకాంతరావు అక్షరాలా స్వర మాంత్రికుడే..! లలిత సంగీతంలో విభిన్న శైలితో వినూత్న ఆవిష్కరణలు చేసిన ఆయన ఓ వాగ్గేయకారుడిగానే కాదు, ‘ఆకాశవాణి’లో భక్తిరంజని, ధర్మసందేహాలు, వనితావాణి వంటి కార్యక్రమాల రూపశిల్పి కూడా.. సినిమా, రేడియో, ప్రైవేటు రికార్డులు.. ఇలా విభిన్న రంగాల్లో ఆయన స్వరాలు ఏ తరం వారినైనా ఉర్రూతలూగిస్తాయి. బిఎన్ రెడ్డి నిర్మించిన ‘స్వర్గసీమ’లో భానుమతి ఆలపించిన ‘ఓహో పావురమా..’ పాటను రాసి అద్భుత సంగీతాన్ని అందించారు. అదే సినిమాలో ‘గృహమే కదా స్వర్గసీమ’, ‘హాయి సఖీ’, ‘ఎవరి రాకకై’ వంటి పాటలు ఆయన సృజనే. గోపీచంద్ నిర్మించిన ‘గృహప్రవేశం’లో ‘మేలుకోవే భారతనారీ..’ పాటతో అప్పట్లోనే స్ర్తివాదాన్ని రజనీ వినిపించారు. తాను రచించి స్వరపరచిన పాటలు ఎవరి పేరుమీదో ప్రచారం పొందినా ఆయన ‘శైలి’ మాత్రం ప్రస్ఫుటంగా కనిపించేది. 1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించి, అధిక మాసాలతో కలిపి నేడు నూరవ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనాలు…

మా పింగళి మాస్టారు…
‘సాహిత్య చరితలో జంటకవుల పంట
ఆంధ్రికి ప్రత్యేకమయిన దంట
ఆధునికాంధ్రాన ఆదికవుల జంట
తిరుపతి వేంకటేశ్వరుల దంట
మలికైతరీతుల తొలి పంట వేంకట
పార్వతీశ్వర కవిద్వయముదంట,
తొలకరి కైతల మలిపంట పింగళి,
కాటూరి కవి యుగ్మకమ్ము దంట
ఒక్క కవుల జంట నొకరికి పుత్రుడు
నొక్కజంటలోనే యొకరి శిష్యు
డగుట రెండు జంటలందున మిగిలిన
తండ్రి, గురుని భక్తిదలతునెపుడు’
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షతలో రిటైరై, విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమ ప్రయోక్తగా ఉంటూండిన మా గురువుగారు పింగళి లక్ష్మీకాంతం గారికి 1967 జనవరిలో, నూజివీడులో ఆయన శిష్య బృందం చేసిన సన్మానంలో నేను రచించి చదివిన పద్యాలలో ఒకటి ఇది.

నెం.7 అరుళమ్మాళ్ వీధిలో..
నెంబర్ 7 అరుళమ్మాళ్ వీధిలో కొమ్మూరి వారి ఇంట్లో ఉండగా ఒక సంఘటన జ్ఞాపకం ఉంచుకోవలసినది జరిగింది. నా హోల్డాల్‌కి బెల్ట్ ఉంది కానీ ఆ బెల్ట్‌కి తాళం కప్ప ఏదీ ఉండేది కాదు. నా హోల్డాల్‌లో నా డైరీ.. నేను వ్రాసుకునే దినచర్య పుస్తకం ఉండేది. సాముద్రిక పుస్తకం ఒకటి చదివి, నా చేతిలో రేఖలకి నేనే ఒక రీడింగు ఆ డైరీలో వ్రాసుకున్నాను.
‘నా 20వ ఏడు పూర్తయేసరికి నా చదువు పూర్తయిపోతుంది. మా నాన్నకి ఇష్టం లేని- ఒక అమ్మాయితో నాకు ప్రణయం ఏర్పడి, ఆమెను పెండ్లి చేసుకోడానికి నిశ్చయించడం, మా నాన్నగారితో అభిప్రాయ భేదానికి దారి తీస్తుంది’ అని వ్రాసుకున్నాను నా డైరీలో.
హోల్డాల్ తాళం లేకుండా ఓపెన్‌గా తెరిచే ఉండడం చేత కృష్ణశాస్ర్తీ గారు నా డైరీ తీసి చదివారు. ‘ఇలా డైరీలో నీ ఇష్టం వచ్చినట్లు వ్రాసేసుకుని, ఇలా నలుగురాడపిల్లలూ వచ్చిపోతూ ఉండే హాలులో- నీ హోల్డాల్‌లో ఆ డైరీ పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చే పిల్లలలో ఎవరినో ఆ పంక్తులు ఆకర్షించాలనేనా? ’అని అడుగుతూ నన్ను దబాయించాడు.
నాకు కళ్లవెంబడి నీళ్లతో గొంతులో డగ్గుత్తికావచ్చి ఆయనతో ఇలా అన్నాను. ‘నేను నా డైరీ నా సొంతానికి వ్రాసుకున్నాను గాని, ఏ అమ్మాయిల మనస్సునీ ఆకర్షించడానికి కాదు. మా నాన్న గారికి గాని, ఇంట్లో ఎవరికి గాని చెప్పని నా హృదయ రహస్యం నీకు చెబుతున్నాను ఇప్పుడు. మా నాగరాజు బావ చెల్లాయమ్మా అని, మీరు పాపా అనీ పిల్చుకొనే సుభద్రని నేనూ, నన్ను సుభద్రా ఒకరికొకరం కోరుకున్నాం. ఈ సంగతి మీకే మొదటిసారి చెబుతున్నా. మా నాన్నగారికి ఆ విషయం ఇష్టం లేని సంగతి.. అని చేప్పే సరికి ఆయన కూడా కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘మా పాపని గురించా వ్రాసుకున్నావు డైరీలో..’ అన్నారు.
జపాన్ బాంబు..
1942లో మద్రాస్ మీద జపాన్ వాడి బాంబు పడటంతో ఆంధ్రతీర ప్రాం తాల వరకూ వచ్చిన అనేకమంది మద్రాస్‌లో ఉంటున్న తెలుగువాళ్లు తమ తమ ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లిపోయారు. (తాత్కాలికంగా) నే నూ పిఠాపురం చేరాను. రేడియోలో వ్యవసాయదారుల కు లేఖలు వ్రాసి చదువుతూంటే గోపీచంద్‌గారు నన్ను చూడ్డానికని పిఠాపురం వచ్చారు. కాంట్రాక్టు పద్ధతిపై వచ్చే డబ్బు పెంచితే బాగుండుననిపించి ఆ కాంట్రాక్టు అయ్యేట్టు, కాలవ్యవధి పెంచుతూ ఆదేశం వచ్చింది. 1943 నాటికి నా నెల జీతం వందరూపాయలయింది. ఐతే ఆ జీతం తీసికోకుండానే రేడియోలో ప్రభుత్వ అధికారి పదవి వచ్చింది. నల్లటి ‘ఆచ్‌ఖాన్’ కోటు (షేర్వానీ) సంపాదించి ఇంటర్వ్యూకి వెళ్లి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఆగస్టు 15న సెలెక్ట్ అయ్యాను. నాలాగే వైఎస్ రావు (శ్రీవాత్సవ), ఎస్‌వి సుబ్బారావు (బుచ్చిబాబు)లకూ ఇటువంటి అపాయింట్‌మెంటు లభించింది. మొత్తం 10 మందిమి ఉద్యోగులమయ్యాము. 1944 మే 8న ఉద్యోగంలో చేరాను. ఎటొచ్చీ ఆ ‘వంద’ తీసికోలేదనే బెంగ ఉండిపోయింది. అయితే 175 రూపాయల జీతం! రేడియోలో అధికారిగా సోమవారం, బుధవారం పదిహేను నిమిషాలు, నెలకో గంట నాటకం, ప్రత్యేక హాస్యవల్లరి, చిత్రమయ జగత్, రోజూ గ్రామీణ కార్యక్రమం సరేసరి. వీటిని తయారు చేయడం నా పని. ఒకసారి ‘పాఠశాల సమయం’ కూడా నిర్వహించవలసి వచ్చింది.
‘ఇంట నుండ నేల…ఇటువంటి సందె వేళ
విహరింపగ రావేల రావేల..’- అంటూ పాటలు, ఇంటర్య్యూలు సాగేవి.
కృష్ణశాస్ర్తీ రాస్తే నేను ఆయన పాట పాడటం లేక నేనే రాసి ట్యూన్ చేసుకోవడం జరిగేది. ‘మీ పాపకు ఓ పాట’ అని నేరాసిన పాట ట్యూన్‌లతో కార్యక్రమం కన్నమ్మ గారి ఆధ్వర్యంలో సాగేది. ఇది వారానికి రెండు సార్లు ప్రసారం అయ్యేది. ఆటవిడుపు అనే కార్యక్రమం కోసం ‘రారే చిన్న పిల్లలార’ అంటూ టెడ్డీబేర్స్ పిక్నిక్ ట్యూన్‌లో సాగించి పాడించాను. ఈ పిల్లల కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు బాపు, ముళ్లపూడి రమణలు! అలా వారానికో పిల్లల బృందం పాల్గొనేది. నెలకోసారి జానపద గీతాల కార్యక్రమం ఏర్పాటు చేసి అరుదైన పాటలు సేకరించి ప్రసారం చేశాను. నన్ను పెంచిన మా అమ్మమ్మ దగ్గర పాత మంగళ గీతాలు సేకరించాను. అవి ప్రసారం అయితే విని సంతోషించారు మా అమ్మమ్మ. చుట్టూ చేరే పిల్లల్ని మా మనవడు నా పాటలు వినిపిస్తున్నాడంటూ వాళ్లకి పిఠాపురం పార్కులో రేడియో వినేలా చేసేదావిడ. నేను కాకినాడ నుంచి కలకత్తా- మద్రాస్‌కి కలిపే రైలు ఎక్కాను. సామర్లకోటకు మా నాన్నగారు వచ్చి సాగనంపారు. అలా మద్రాస్ తిరిగి చేరాను. అక్కడ రాయపేటలో నా కోసం ఓ రెండుగదుల మేడ ఇల్లు కుదిర్చారు దుర్గాబాయి గారూ మా అన్నయ్యానూ.
*

చిత్రం.. రజనీ 2012లో ‘ఆత్మకథా విభావరి’ పేరిట తన జీవిత విశేషాలను భావితరాల కోసం అందించారు. ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు యథాతథంగా…

శతవర్ష సౌందర్యగీతం వాణీ పుత్రుడు

  • -కె.బి.గోపాలం
  • 31/01/2015
TAGS:

‘కవి రాజహంస’ బాలాంత్రపు వేంకటరావు, వేంకట రమణమ్మ దంపతులకు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించిన రజనీ కాంతరావు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. కాకినాడ పిఆర్ కళాశాలలో హైస్కూల్ విద్య ముగించి, 1940లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. 1941లో ‘ఆకాశవాణి’ మద్రాసు కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న తొలి స్వాతంత్య్ర దినం సందర్భంగా ‘మాదీ స్వతంత్ర దేశం’ గీతాన్ని ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారిచేత రేడియోలో పాడించిన ఘనత రజనీదే. విజయవాడ ఆకాశవాణిలో బాధ్యతలు చేపట్టాక ‘్భక్తిరంజని’ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అహ్మదాబాద్, విజయవాడల్లో స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేసి అదే హోదాలో బెంగళూరులో పదవీ విరమణ చేశారు. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలాన్ని రేడియోలో ఇంటర్వ్యూ చేసిన ఖ్యాతి రజనీకే దక్కింది. రేడియోలో అన్నమయ్య కీర్తనలను పరిచయం చేసిన గొప్పదనం ఆయనదే. సినీ రంగంలో కొన్నాళ్లు పనిచేశాక ఆకాశవాణి ద్వారా లలిత సంగీతానికి ఎనలేని కృషి చేశారు. భావకవి దేవులపల్లి చేత రేడియో కోసం మూడు యక్షగానాలను రాయించి ప్రసారం చేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం శాఖలో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర కళాపీఠంలో సేవలందించారు. స్వరకర్తగానే కాదు, ఎనె్నన్నో లలిత గీతాలు, నృత్య రూపకాలు రచించి సాహితీ రంగానికీ వనె్న తెచ్చారు. 1961లో కేంద్ర సాహిత్య అవార్డును, 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ను, 2000లో ‘అప్పాజోస్యుల విష్ణ్భుట్ల ఫౌండేషన్’ (అమెరికా) పురస్కారాన్ని అందుకున్నారు.

రజనీకి నూరేళ్లు వచ్చాయని పండగ చేస్తున్నారు. వందేళ్లకు సంబంధించి లెక్క మనకు అవసరం లేదు. పండగ చేస్తున్నారంటే మాత్రం చాలా బాగుంది. ఒక వ్యక్తి అంతకాలం జీవించారంటేనే పండగ చేయాలి. ఆ వ్యక్తి గొప్పగా బతికి ప్రపంచానికి సంతోషం పంచిన వారయితే పండగ మరింత ఘనంగా చేయాలి. అదే జరుగుతున్నది. నాకు తెలిసి రజని ఈ సంగతులేవీ పట్టించుకోరు. అమాయకంగా తన ప్రపంచంలో తాను ఉంటారు.
ఇంతకు, ఎవరీ రజని అనే అడిగేవాళ్లుంటారేమో? ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు! ఆయన వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన బాలాంత్రపు వెంకటరావుగారి కుమారుడు. తండ్రి గొప్పవాడని ఇవాళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకు ఆయనంత గొప్పవాడూనూ. రజని గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, సాహిత్యవేత్త, పరిశోధకుడు, ప్రయోక్త, ప్రయోగాలకు పెట్టింది పేరు. లలిత సంగీతం, లలిత శాస్ర్తియ సంగీతం విన్న, వినేవాళ్లకు ఆయన దేవుడే!
‘ఓహోహో.. పావురమా’ అని ఒక పాత పాట ఉంటుంది. అది ఈనాటికీ అందరూ ఇష్టంగా వింటూ ఉంటారు. అంటే అంత హిట్‌సాంగ్ అన్నమాట. చిత్రమేమంటే ఆ పాట రాసింది తానేనని రజని అని ఎక్కడా చెప్పరు. రికార్డుమీద నాటికీ, నేటికీ ఆయన పేరు లేదు. అదేమిటని అడిగితే అందంగా నవ్వుతాడు ముసలాయన! ఆయనను ముసలాయన అంటే పొరపాటు, పొరపాటున్నర! ఆమధ్యన ఒక కుటుంబ కార్యక్రమంలో చూస్తే రజని ముందువరుసలో ఉన్నాడు. అరవయి ఏళ్లు వస్తే ‘అస్తావిస్తు’ అని ఒక మాట ఉందని తెలుసు! వెళ్లి అనుమానంగా నమస్కారం చేసి, పేరు చెప్పుకుని, ‘గుర్తున్నానా?’ అని అడిగాను. ‘అదేమిటి గోపాల్! మనం ఎన్ని సంగతులు చర్చించుకున్నాం? ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం! ఆ ధృవుడు, 26 వేల సంవత్సరాల సంగతి నాకు ఇంకా గుర్తుంది!’ అంటూ సులభంగా కబుర్లలోకి దిగాడాయన. అక్కడ కనిపించకుండా జాగ్రత్తపడ్డాను కానీ, బిత్తరపోవడం నా వంతయింది! అదీ- రజని అంటే!
ప్రఖ్యాత నర్తకి శోభానాయుడు బృందం కొరకు ‘కళ్యాణ శ్రీనివాసం’ అని కొత్త ‘బాలే’ రాయించాలి. ననే్న రాయమన్నారు. నేను జంకాను. ‘రజని చేత రాయిద్దాం’ అన్నాను. నేను రాస్తానన్న నమ్మకంతోనో, మరో కారణంగానో, సంగీత దర్శకుడుగా కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారిని నిర్ణయించి, ఆయనకు చెప్పేశారు కూడా. రజని రెండు వేపులా వాడిగల కత్తి మరి! పాట రాస్తుంటే, రాగం, వరుస కూడా అక్కడే సెటిల్ చేసేస్తాడు. రచన చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకని టెంపొరరీగా కూచిపూడి అకాడమీలోనే ఉన్నాడు కూడా. నేనెంత అదృష్టవంతుడినో మరి. నిత్యం ఆయన దగ్గరకు పోవాలి. ఆనాడు రాసిన భాగం వినాలి. దాని గురించి చర్చించాలి. అవసరాలు వినిపించాలి. అది నా పని! రచన ఎంత గొప్పగా వచ్చిందో నేను చెప్పనవసరం లేదు. కానీ, పెద్దాయన ‘దక్షిణానిలాలు’ అంటూ ఫలానా రాగంలో పాట అంటూ ఏకంగా పాడడం ప్రారంభించాడు. ‘అయ్యా! అక్షరాలు మాత్రమే మన వంతు! రాగం సంగతి మరెవరికో అప్పగించారు’ అని మెత్తగా ప్రతినిత్యం గుర్తుచేయవలసి వచ్చేది. మహానుభావుడు గనుక, ఆయన ఏనాడూ నొచ్చుకోలేదు. ‘కదూ!’ అని ముందుకు సాగాడు. ఆ నృత్య నాటిక ఎంత బాగా వచ్చిందో, చూచినవాళ్ళు చెప్పుదురుగాక!
కొందరు కారణజన్ములుంటారు. రజని అలాంటివాడేనని గట్టి నమ్మకం. రజని పుట్టి రెండేళ్లు నిండకముందే అమ్మ చనిపోయింది. మహాకవి, పండితుడయిన తండ్రి ఈ బిడ్డను చంకనెత్తుకుని అన్నీ తానే అయ్యి పెంచాడు. గోరుముద్దలతోపాటు పద్యాలు తినిపించాడు. జోలపాటలతో బాటు సాహిత్యం తలకెక్కించాడు. అమ్మ ఏదీ? అని బిడ్డ అడిగితే, చుక్కల్లో ఉంది అని చెప్పేవారట ఆయన. అమ్మ పాడేది అని ‘నల్లనల్లని వాడే, నగుమోము వాడే’ అనే పాట వినిపించేవారట. రజనికి మేనత్తగారయిన నరసమ్మగారు అప్పట్లో ఒక మహిళా పత్రికకు సంపాదకురాలు. ఆమె బోధన కూడా జతకలిసి ‘నా మనసులో భక్తిరంజని ఆనాడే మొదలయింది’ అంటాడు రజని. ఆయన రాసిన పాట ‘శతపత్ర సుందరి’ ఇప్పటివాళ్ళు విన్నారో లేదో తెలియదు. నిండా సంస్కృతం. వింత నడక. పాట బాగుంది అనిపించింది గానీ, నిజం చెప్పాలంటే, కుర్రవాడయిన నాకు అర్థం కాలేదు. అది సరస్వతి అమ్మవారి గురించిన పాట అని తరువాత తెలిసింది. అంత జిగిపాకంగా పాటలు రాసి, వరుసలు కట్టిన రజని ‘బురదలోన పంది’ అంటూ సరదాగా నడిచే పిల్లల పాటలు కూడా రాశాడంటే ఆశ్చర్యం. ఆయనలోని వస్తు విస్తృతి గొప్పది!
రజనితో నాకు ఇంచుమించు స్నేహం కలిసిందంటే భుజాలు పొంగిపోతాయి. దేశాలం లేక దేవసాలగం అనే రాగం గురించి పరిశోధన చేస్తున్నాడాయన. ఫోన్‌లో నాకు ఆ రాగం, పాట వినిపించడం ఇంకా గుర్తుంది. ‘పొడిచెనదే శుక్రతార’ అంటూ గాంధీ గురించి రాసిన పాటను ఆ రాగంలోనే మలిచాడని గుర్తు! ధృవనక్షత్రం గురించి పరిశోధన చేసి ‘తూబన్’ అనే మధ్యప్రాచ్య పాత్ర ధృవుడేనని రజని చెప్పాడు. నాకు అర్థమయిన ఆస్ట్రానమీ సంగతులు, అతనికి అర్థమయే పద్ధతిలో చెప్పినట్టున్నాను. 26 వేల సంవత్సరాలు అని భాగవతంలో రెఫరెన్సు దొరికింది అంటూ ఆ విషయంగా తాను నాకు ఉత్తరం రాయడం గుర్తుంది. రజని చాలా గొప్ప పనులు, రచనలు చేశాడు. కానీ, అవి గొప్పవని ఆయన ఎన్నడూ అనుకోలేదు.
రజనీకాంతరావుగారు రేడియోలో స్టేషన్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేశాడు. పదవి నిర్వహించడమంటే ఆర్కెస్ట్రా, వాద్యగోష్ఠి నిర్వహించడం లాంటిదే. రకరకాల వారుంటారు. అందరినీ కలుపుతూ చక్కని రచన సృష్టించాలి, అన్నారాయన ఒకచోట. అక్కడా సంగీతమే తోచింది, ఆయనకు!
విజయవాడ రేడియోలో వీళ్లంతా ఉన్నకాలం.. అన్ని రకాలూ స్వర్ణయుగం. రజని ‘కొండనుంచి కడలిదాకా’ అని సంగీత రూపకం ప్రొడ్యూస్ చేశాడు. దానికి ఎనె్నన్నో బహుమతులు వచ్చాయి. అంతర్జాతీయంగా కూడా! గోదావరి పుష్కరాలొస్తున్నాయి. ఈ రూపకాన్ని తిరిగి పైకి తీస్తే బాగుంటుంది.
‘మనసవునే ఓ రాధా!’ అని ఒక పాట. ఆ కాలంలో శాస్ర్తియ గాయకులంతా లలిత సంగీతం కూడా పాడేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, యం.వి.రమణమూర్తి అందరూ ఈ పాట పాడారనుకుంటాను. ఘంటసాల కూడా పాడారేమో? రజని పాటలను గురించి వరుసగా చెపుతూ పోతే, ఎంతయినా, ఎంతకాలమయినా చెప్పవచ్చు. 1938లో తాను చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదో ప్రత్యేక సందర్భం వచ్చింది. జాతీయ గీతాలతో బాటు ఒక తెలుగు పాట ఉండాలని పెద్దలు నిర్ణయించారు. రజని చేత ‘పసిడి మెరుంగుల’ అనే పాట రాయించారు. తరువాత ఆ పాట రేడియోలో వచ్చేది. ఆడ, మగ జంట గొంతుకల్లో సాగుతుందది. అది తెలుగుదనం గురించిన పాట. బాగుంటుంది.
రజని కబుర్ల సందర్భంలో ఎన్నో సంగతులు చెప్పారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ తాను కలిసి ‘కృష్ణరజని’ అనే పేరుతో కొంతకాలం రచనలు చేశారు. అది చాలా మందికి తెలుసు. రేడియోలో (హైదరాబాద్) విప్రనారాయణ నాటకం షెడ్యూల్ చేశారు. అప్పట్లో అంతా నిజంగానే హాట్‌కేక్స్. కొన్ని అప్పటికప్పుడు వినిపించే కార్యక్రమాలయితే, కొన్ని, కేవలం కొన్ని గంటలు ముందు మాత్రమే రికార్డ్ అవుతాయి. కృష్ణశాస్ర్తీగారికి బద్ధకమని అందరికీ తెలుసు. ముంచుకుపోతున్నా రాయరు. చివరి క్షణాన రాసినదయినా రచన బ్రహ్మాండంగా వస్తుంది. విప్రనారాయణ అలాగే రాశారట. అయినా నిడివి తగ్గింది. రజని కూడా ఒక చేయి వేశారు. ‘కొలువయితివా రంగశాయి’ అన్న పాట ఇంచుమించు రజని రచన. నాటకంలోనూ, నేటికీ కృష్ణశాస్ర్తీ రచనగానే అందరికీ తెలుసది. సినిమాలో కూడా వాడుకున్నారు. (ఈ సంగతి చెప్పి నేను తప్పు చేస్తున్నానా? రజని చెప్పాలి!)
రవీంద్రుని రచనలను తెలుగువారికి పరియం చేసిన ఘనత రజనిదే. రవీంద్రుడు స్వయంగా చేసుకున్న వరుసల్లోనే తెలుగులో అనువాదగీతాలు రాసి తెలుగువారికి వినిపించాడాయన. ‘వని వికసించెనదే, పక్షీ ఏలా రాదు’ అని ఒక పాట. ఒకప్పుడు రేడియోవాళ్లు రవీంద్రభారతిలో కార్యక్రమం పెట్టారు. ఒక బెంగాలీ గాయకుడు అసలు పాట పాడిన తరువాత చిత్తరంజన్ తెలుగు వర్షన్ పాడారు. నాకు తెలుగే నచ్చింది. రవీంద్ర సంగీత్ గురించి రజని స్వయంగా పాడుతూ, వివరించిన రేడియో రూపకాన్ని ‘లోకాభిరామం’ అనే నా బ్లాగులో పదుగురితో పంచుకున్నాను. ‘ఎవరూ కేక విని రాకపోయినా, ఒకడినె పదవోయ్’ అని మరో పాట. ‘యాక్లచలో’ అనే బెంగాలీ మూలగీతాన్ని దేశంలోని పిల్లలందరికీ నేర్పించారు.
రజనికి మధ్యప్రాచ్య సంగీతమూ, సూఫీ తత్వము బాగా వంటబట్టాయి. మీరాబాయి, సూర్‌దాసులను మించిన సూఫీలు ఎవరూ లేరు అని తాను అనడం గుర్తుంది. ‘అతిథి శాల’ అనే రేడియో సంగీతరూపకం, ఆయనే సిద్ధం చేశారు. ‘మేలి జలతార్ బుటాలల్లిని నీలివలయం ఈ గుడారం!’ ఎంత బాగుంటుందో పాట!
రజనీ ‘్భవ తరంగాలు’ అనే వీక్లీ కాలం ద్వారా తమ అనుభవాలను, ఆలోచనలను పాఠకులతో పంచుకున్నారు. అది మన అదృష్టం. ఆ పుస్తకం చదివితే ఎవరికయినా ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగంలో చేరకుండా రజని, సినిమా రంగంలోనూ, కవి, గాయకుడు, సంగీతస్రష్ఠగా మిగిలి ఉంటే ఎట్లా ఉండేదో? ఆయన అనుభవాలు, ఆలోచనలు కొంతవరకయినా, అక్షర రూపంలో మనకు ఇచ్చాడు. ఇప్పుడా శత వర్ష సుందరుడు, యింకా ఏమయినా చెప్పగలడా? పాడగలడా? మొన్నమొన్నటిదాకా పాడినట్లే గుర్తు. రజని పాటలను, మాటలను సేకరించాలి మరి! వాళ్ల అబ్బాయి రామచంద్ర చక్కగా పాడతాడు. అచ్చంగా తండ్రిలాగే పాడతాడు. పాడి ఒక సీడీ చేశాడు కూడా. అతను చేతనయినన్ని పాటలు రికార్డ్ చేస్తాడని ఆశిస్తే ఆశ కాదు!
రజని వంటి గొప్ప మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యా.. రజనీ గారూ! మీరిలాగే మరింతకాలం హాయిగా పాడుతూ బతకండి! మాలాంటి వాళ్లను ఆశీర్వదించండి! మరిన్ని పండగలు, పాటలు అందించండి! శతశతం జీవేమ శరదస్సువీరాః!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సభల వైభోగం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికన్ వేదం వల్లించిన శ్రీ అరవింద రావు —– కోరిక — జిడ్డు కృష్ణ మూర్తి –

అమెరికన్ వేదం
ఈ శీర్షిక మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినా ఇటీవలే ఒక అమెరికన్‌ రచయిత రాసిన పుస్తకమిది. పేరు అమెరికన్‌ వేదం. ఈ పుస్తక రచయిత ఫిలిప్‌ గోల్డ్‌ బర్గ్‌ సుమారు సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో తన పుస్తకం గురించి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఉన్న నేను కూడా ఈ పుస్తకం గూర్చి మాట్లాడాను.
ఈ పుస్తకం 18వ శతాబ్దం మొదలుగా యూరోపియన్లు మన దేశ సంస్కృతిని ఎలా అధ్యయనం చేశారు, వారి భాషల్లోకి ఎలా అనువాదాలు చేశారు. వాటి ప్రభావం ఆ దేశాల మేధావులపై ఎలా పడింది అన్న విషయం చాలా వివరంగా చెబుతుంది. యూరప్‌ నుంచి అమెరికాకు వెళ్ళిన ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధగ్రంథాలు, పతంజలి యోగ సూత్రాలు ముఖ్యంగా అమెరికన్‌ మేధావుల్ని ఆకట్టుకున్నాయి. వివేకానందుడు అమెరికాకు వెళ్లకముందే అమెరికాలోని మహామహులు- ఎమర్సన్‌ లాంటి వేదాంతులు, థోరో, విట్‌మాన్‌ లాంటి రచయితలు, థామస్‌ జెఫర్సన్‌ లాంటి రాజనీతివేత్తలు వేదాంతాన్ని, భగవద్గీతను గూర్చి తెలుసుకున్నారని ఇందులో చూడగలం. ఎమర్సన్‌ను జ్ఞానయోగిగానూ, ఽథోరోను కర్మయోగిగానూ, విట్‌మాన్‌ను భక్తియోగిగానూ రచయిత ఈ పుస్తకంలో (పేజీ 42) వర్ణించాడు. విట్‌మాన్‌ రాసిన ‘‘””Leaves of Grass”’’ అనే పద్యసంకలనం భగవద్గీతను, భజనగీతాల్ని పోలి ఉందని చెప్పాడు రచయిత (పేజీలు 41-42). పై మహాకవి మరణించినపుడు భగవద్గీత ఆయన తలదిండు కింద కనిపించిందట. సత్యాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్ని మించిన పుస్తకాలు లేవనీ, అవి తనకు శాంతిని ఇచ్చిన గ్రంథాలనీ షోపెనార్‌ అనే జర్మన్‌ తత్త్వవేత్త చెప్పాడు. ఆయన రాసిన ‘‘ “”The World as Will And Idea”’’ అనే పుస్తకాన్ని మాండూక్య ఉపనిషత్తుతో పోల్చాడు అమెరికన్‌ వేదాంతి క్యాంప్‌బెల్‌(పేజీ 98).
వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు
చదివారు.
వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు చదివారు. ఆల్డస్‌ హక్స్‌ లీ అనే రచయిత జిడ్డు కృష్ణమూర్తి యొక్క గొప్ప స్నేహితుడు. ఆ ప్రభావంతో ‘‘The perennial Philosophy’’ అనే పుస్తకం రాశాడు. సనాతనధర్మం అనే మాటకు ఇంగ్లీషు అనువాదమే పై పేరు. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయమే ‘‘That Art Thou’’, అంటే తత్త్వమసి అనే వేదాంతవాక్యం. ఛాందోగ్య ఉపనిషత్తులోని సంభాషణల్ని యథాతథంగా రచయిత అందులో ఉటంకించారు. ఈ పుస్తకంలో వివేకచూడామణి, భగవద్గీతల్లోని అనేక శ్లోకాలు, బౌద్ధుల లంకావతార అనే పుస్తకం నుండి వాక్యాలు అనేకాలు కనిపిస్తాయి.
భారతీయులు సృష్టికాలాన్ని లెక్కించిన విధానంపై కార్ల్‌ సేగన్‌ అనే ఖగోళశాస్త్రవేత్త ఆశ్చర్యం ప్రకటించారు. శాస్త్రవేత్తలు చెప్పే కాలపరిమితికి సరిగ్గా సరితూగుతుందని అన్నాడు. ‘‘it is the only religion in which the time scales correspond to those of modern scientific cosmology… its cycles run 8.64 billion years long’’ అన్నాడు.
అమెరికాలో ప్రారంభమైన దివ్యజ్ఞాన సమాజం (Theosophical society) అక్కడి మేధావులపై చాలా ప్రభావం చూపింది. ఆజ్చూఠ్చ్టిటజుడ రాసిన ‘‘The Secret Doctrine’’ అనే పుస్తకం ఉపనిషత్తుల్లోనూ, బౌద్ధ సిద్ధాంతంలోనూ ఉన్న సాధనా పద్ధతుల్ని తెలిపింది. అదే సమయంలో పరమహంస యోగానంద అనే గురువు చాలామంది మేధావుల్ని ప్రభావితం చేశాడు. ఆయన రాసిన ‘‘Autobiogrphy of a Yog’’ అనే పుస్తకం బెస్ట్‌ సెల్లర్‌గా మారింది.
మహర్షి మహే్‌షయోగి అమెరికన్‌ సంస్కృతిలో ఒక చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఆయన శిష్యులు ప్రముఖ కళాకారులైన బీటిల్స్‌. యోగాన్ని, ధ్యానాన్నీ ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తి మహే్‌షయోగి.
మానసికశాస్త్రం కూడా భారతీయ సంప్రదాయం నుండి చాలా నేర్చుకుంది. అమెరికన్‌ మానసికశాసా్త్రనికి తండ్రి అనబడే విలియమ్‌ జేమ్స్‌ వివేకానందుడికి గొప్ప అభిమాని. ఆయన ‘‘The Varieties of Religious Experience’’ అనే పుస్తకాన్ని రాశాడు. ‘‘Vedanta is the paragon of all monastic systems’’ అంటాడు విలియమ్‌ జేమ్స్‌(పేజీ79). ప్రముఖ మేధావులు Vedanta Society of America అనే సంస్థను స్థాపించారు. ప్రముఖ చరిత్రకారులు టాయిన్‌ బీ, విల్‌డ్యురాంట్‌ మొదలైనవారు ఇందులో ముఖ్యులు.
అమెరికాకూ, పాశ్చాత్య దేశాలకూ మొదట్లో వెళ్లిన గురువుల లాగా ఇటీవలి కాలంలో వెళ్తున్న భారతీయ స్వామీజీలు, పండితులు అంత ప్రభావవంతంగా లేరనే సత్యాన్ని రచయిత రాశాడు. ఇటీవల నియోవేదాంత అనే పేరిట చాలామంది అమెరికన్‌ రచయితలు వేదాంతాన్ని ఆధునిక భాషలో వివరించడం గమనించదగింది. పాశ్చాత్యులే వేదాంత ప్రవచనాలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు రిచర్డ్‌ అనే అమెరికన్‌ రాందాస్‌ అనే గురువుగా మారాడు. డేవిడ్‌ ఫ్రాలీ అనే అతను వామదేవశాసి్త్రగా మారాడు. రమణమహర్షి బోధనలతో ప్రభావితులైన ఎక్‌హార్ట్‌ టోలే మొదలైనవారు స్వతంత్రంగా ఎన్నో గ్రంథాలు రాశారు. ఎక్‌హార్ట్‌ టోలే పుస్తకాలలో వేదాంతాన్నే ఆధునిక భాషలో చెప్పాడంటాడు రచయిత. పాశ్చాత్యులు తమ మతగ్రంథాలనే కొత్తకోణంలో ఎలా వ్యాఖ్యానించాలి అనే మెళకువలు కూడా నేర్చుకున్నట్టుగా గోల్డ్‌ బర్గ్‌ చెప్పారు.
కొందరు స్వామీజీల బలహీనతలను కూడా రచయిత ఒక అధ్యాయంలో యదార్థ ధోరణిలో వివరించారు. స్వామీజీలు ముఖ్యంగా అమెరికన్‌ శిషురాండ్రతో శృతిమించి ప్రవర్తించడం ఆ సీ్త్రల భర్తలు ఈ గురువులపై కోర్టుల్లో కేసులు వేయడం మొదలైనవి దురదృష్టకరమైన పరిణామాలు. ఇవి పరమహంస యోగానందతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు
చివరగా గోల్డ్‌ బర్గ్‌ ఇలా రాశారు- ‘‘Vedanta’s spirituality has never been more necessary. In an evershrinking world, pluralism and genuine respect for religious differences within a framework of underlying unity is a needed counterweight to the deadly forces of ethnocentrism’’ (పేజీ 345). అన్ని మతాల్నీ, సంస్కృతుల్నీ గౌరవించే సంస్కృతి భారతీయసంస్కృతి అంటూ ముగిస్తాడు రచయిత.
ఈ పుస్తకంపై రచయిత ప్రసంగాన్ని పాఠకులు యూట్యూబ్‌లో కూడా వినగలరు.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

కోరికలు అణిచిపెడితే ప్రమాదమే!

మన దేశం ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తత్వవేత్తల్లో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1939-1945) అమెరికాలో నివసించిన కృష్ణమూర్తి- బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా-తన దగ్గరకు వచ్చిన వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. ఆ సంభాషణలన్నింటినీ ఇటీవల కృష్ణమూర్తి ఫౌండేషన్‌- ‘ద వరల్డ్‌ వితిన్‌’ అనే పేరిట ప్రచురించింది. దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
బి నా దగ్గరకు వచ్చాడు. తాను సెక్స్‌ కోరికలకు బానిసనయిపోయానన్నాడు. ఈ కోరికలను తగ్గించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించానని అయినా లాభం లేకపోయిందని వాపోయాడు. అతను ఏం చేయాలి?
ఇంతకు ముందు మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ ఒక లైంగిక ఉత్ర్పేరకం కాదు. ఒక ఆలోచన కూడా కాదు. మన బుద్ధి (ఇంటలెక్ట్‌) నుంచి పుట్టింది కూడా కాదు. నేను అనే భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు కలిగే ఒక అనుభూతి. ఇది మనం ఒక పని చేసినందుకు వచ్చే ప్రతిఫలం కాదు. అది ఒక స్వయానుభూతి. జాలి, దయ, కరుణ, క్షమాగుణం మొదలైన భావాలు ఉన్నప్పుడే ఈ ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఒక గొప్ప సృజనాత్మక శక్తి. ఈ శక్తి విడుదల కాకుండా సెక్స్‌ అనుభూతులు విడుదల అయితే అది మోయలేని బరువుగా, పెద్ద సమస్యగా మారుతుంది. అంతే కాదు ఈ సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోకుండా సెక్స్‌ కోరికలను అణిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. చాలాసార్లు ఈ కోరికలు మరింత శక్తిమంతంగా మారతాయి. అవి తమ రూపాన్ని మార్చుకొంటాయి. రకరకాల హింసాపద్ధతులకు, క్రూరత్వానికి కారణమవుతాయి. ఎవరైనా అమితమైన సెక్స్‌ కోరికల నుంచి బయటపడాలంటే- ముందు వారు ఆ కోరికల మూలాన్ని అర్థం చేసుకోవాలి. సెక్స్‌ కోరిక తలెత్తినప్పుడు- దానిని విశ్లేషించి వదిలేస్తే చాలదు. దాని ఆనుపానులను, ప్రయాణిస్తున్న మార్గాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండాలి. అప్పుడు అతనికి కోరికల మూలం తెలుస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు- సరైన మార్గం కూడా దానంతట అదే ఆవిష్కృతమవుతుంది. ‘నేను మాత్రమే’ అనే ఆలోచన నుంచి విముక్తి పొందుతాడు.
ప్రచురణ: కృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా
ధర: రూ. 295 పేజీలు: 234
ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో లభ్యమవుతాయి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత

వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణి గురువారం మరణించారు. గతంలో
ఆమె నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు.. 
1965 జూలై 22 న నేను పుట్టాను. పుట్టిన యేడాదికే పోలియో బారన పడటం, ఆ తర్వాత రెండేళ్ళకు నాన్నగారి మరణం నా చిన్ననాట జరిగిన రెండు విషాదాలు. నాన్న నాకు పెట్టిన పేరు పండరీబాయి. ఇంట్లో అందరూ నన్ను ‘చిట్టి’ అని పిలుస్తారు.ఆరేళ్ళ వయసులో నా కాళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. ఆరునెలల్లో కాలీపర్స్‌ సాయంతో ఇంట్లోనే నడవడం, ట్యూషన్స్‌ ద్వారా చదవడం ప్రారంభించాను. తోబుట్టువులు బడికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మా నేనూ మిగిలేవాళ్ళం. వంటయ్యాక అమ్మ కథలు చదివి వినిపించేది. తీరిక వేళల్లో రెండో అక్క చదువు చెప్పేది. ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ తదితర పత్రికలు చూసే దాన్ని. వాటిల్లో ఎక్కువగా జయదేవ్‌ గారి కార్టూన్లు నన్ను ఆకర్షించేవి. అప్పుడే, నేనూ కార్టూన్లు వేసి పదిమందినీ నవ్వించాలన్న కోరిక పుట్టింది.
ఎనిమిదేళ్ళ వయసుకే తొలి కార్టూను
వచ్చీరాని ఊహలతో వంకర టింకర బొమ్మలతో చిత్తుకాగితాల మీద జయదేవ్‌ గారిని అనుకరిస్తూ బొమ్మలు వేసేదాన్ని. వాటిల్లో నాకు నచ్చిన వాటిని డ్రాయింగ్‌ పేపర్‌ ముక్కల మీద ఇండియన్‌ ఇంక్‌ తో వేసి పత్రికలకు పంపేదాన్ని. చాలా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అలా పంపగా, పంపగా ఆంధ్రజ్యోతి వీక్లీ లో నా తొలి కార్టూను అచ్చయింది. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్ళు.
నా కార్టూనుకు ఆంధ్రజ్యోతి వీక్లీ వారు పంపిన పారితోషికం నాలుగు రూపాయలు. అదే నా తొలి పారితోషికం. పోస్టుమేన్‌ రిసీవ్డ్‌ ఫోర్‌ రూపీస్‌ అని రాసి సంతకం పెట్టమన్నాడు. కార్టూను పడితే పత్రికల వాళ్ళు డబ్బులు పంపుతారని నాకు అప్పటికి తెలియదు. ఆ సంతోషంతో రిసీవ్డ్‌ ఫోర్‌ హండ్రెడ్‌ రూపీస్‌ అని రాశాను. పోస్ట్‌మేన్‌ కోపంతో అది కొట్టించేసి మళ్ళీ సరిగ్గా రాయించాడు. అదే నా మొదటి ధర్మార్జితం. ఆ సంఘటన ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు నవ్వు ఆగదు. ఒళ్ళు పులకరిస్తుంది.
ప్రతిభా సత్కారం
కళాకారులకు అవార్డులు అందుకునేటప్పుడు మధురానుభూతులు కలగడం సహజం. అలాంటి సందర్భం నాకు 1991 గణతంత్ర దినోత్సవం నాడు వచ్చింది. మైదానంలో పోలీసు విన్యాసాలు, పతాక ఆవిష్కరణ తర్వాత ప్రతిభా పురస్కారం అందుకునేందుకు క్రచర్స్‌ తో నడిచి వెళ్తుంటే అందరి చూపులూ నా మీదే. ‘ఈ అమ్మాయా రాగతి పండరి, పత్రికల్లో నవ్వించే ఈమె ఈ స్థితిలో ఉందా?’ అనే మాటలు ప్రేక్షకుల నుండి వినిపించాయి. ఆ సానుభూతి చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటిసారిగా తెలుగు కార్టూనిస్టులను మన ప్రభుత్వం గుర్తించింది. 2009 వ సంవత్సరంలో రాష్ట్ర సాంస్కృతిక మండలి కళారత్న (హంస) పురస్కారానికి తొట్టతొలిగా నన్నే ఎంపిక చేసింది. ఇది కార్టూనిస్టుల అందరి విజయం.
(అ)మృత దేహ దానం
నా మరణానంతరం నా పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్‌ బాడీ డోనర్స్‌ అసోసియేషన్‌కు చెందేలా దానం చేశాను. శ్రీమతి గూడూరు సీతామహాలక్షి ్మగారి ఆధ్యర్యంలో సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఈ అసోసియేషన్‌ను నిర్వహిస్తోంది. మాస్టారు అవసరాల రామకృష్ణారావుగారు ఇందుకు స్ఫూర్తి. కనిపించే దేవుళ్ళు వైద్యులు. వారి ద్వారా ఏ కొందరికైనా నా పార్థివ దేహం ఉపయోగపడితే నా జన్మ సార్థకం అవుతుంది. ఈ నిర్ణయానికి తమ అంగీకారాన్ని తెలియజేసి సంతకం చేసిన నా కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను? ఆనంద బాష్పాలు తప్ప…
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు అమలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ ఇంటూ కేజ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లిజెండ్ కు సెండాఫ్ –


 
 


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాంగ్రెస్ శూన్య హస్తం -కేసి అర్ కొత్త భాష్యం

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ సారి శ్రీరామ నవమి ఎక్కడ?

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీశైల, అమరావతి బెజవాదలలో స్వాముల రధ యాత్ర

 


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అకలంక దేశ భక్తుడు గోపాల కృష్ణ గోఖలే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –

146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

జననం –విద్య-

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ  దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- 1907 న జన్మించారు .తాతగారు రామయ్య గారి దగ్గరే వెలి బూడిద లో అక్షరాలు  దిద్దారు .తల్లిదగ్గర పన్నెండో ఏడు వచ్చేదాకా పాలు తాగారు .అదే తన కంఠ స్వర వరం అన్నారు .ఉపనయనం తర్వాత తాతగారి వద్దే సహస్ర గాయత్రి జపించి రామ హృదయం నేర్చారు .తండ్రి ‘’తాడి పర్రు శాస్త్రులుగా ,సాహితీ చక్రవర్తులు’’ గా పేరుపొందారు .వీరివద్ద సంస్కృతం అధ్యయనం చేసి పొలం పనులు చేయటం  అలవాటు చేసుకొన్నారు .ఇసుకలో చెడుగుడు ఆడుతుంటే ‘’స్పటిక వినాయకుడు ‘’దొరికితే బుద్ధి మార్చుకొని  చదువు పై  శ్రద్ధ వహించారు .దీన్ని తర్వాత పూజా మందిరం లో ప్రతిష్టించి నిత్యార్చన చేసేవారు .పాలేళ్ళకు పూరిపాకలో ఆముద దీపాల వెలుగులో చదువు నేర్పేవారు .

ఇంగ్లీష్ నేర్వడం –చదువు కు స్వస్తి –అధ్యయన అధ్యాపనం

మొదటి ప్రపంచ యుద్ధం అయిపోగానే తురుమెళ్ళ జార్జి కరోనేషన్ స్కూల్ లో మూడవ తరగతి చదివి ఇంగ్లీష్అక్షరాలూ నేర్చుకొన్నారు .స్కూలులో  నాటకంలో ‘’ఉపానందుడు’’ పాత్ర ధరించి మద్రాస్ మంత్రి పాత్రో చేతులమీదుగా సిరా బుడ్డి ,పుస్తకం బహుమానం గా పొందారు .లెక్కలలో పూజ్యం .తిలక్ మరణం తో విద్యార్ధుల సమ్మే జరిగి చదువుకు స్వస్తి చెప్పారు .తాతగారి దగ్గర ఒంటరిగా కావ్యాలు గ్రంధాలు నేర్చారు .అలంకార శాస్త్రాలన్నీ కరతలామలకలై నాయి .వాటిలోని పద్యాలూ శ్లోకాలు అన్నీ  కంఠతా వచ్చేశాయి .పుస్తకం అక్కరలేక పోయేది .తెనాలి సంస్కృత కళాశాల న్యాయ శాస్త్రాధ్యాపకులు శ్రీ కురుగంటి శ్రీ రామ మూర్తి గారు మాధవ రామ శర్మగారి వద్ద తర్క ప్రకరణ గ్రంధాలు చదివారు అంటే వీరి విద్వత్ యెంత గొప్పదో తెలుస్తోంది .కాశీ విద్యాకేంద్రం అని తెలిసి అక్కడ చదవాలని ఎవరికీ చెప్పకుండా వెళ్లి దశాశ్వ మేధ ఘాట్ లో సావిత్రీ జపం చేశారు .కాని తలిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు .ఇలా కాశీ చదువు సాగలేదు .

భావ వేగి

భావ వేగి అయిన శర్మగారు ఇంటి పట్టున ఉండక విద్యాకేంద్రం విజయ నగరం  తాతా సుబ్బారాయ శాస్త్రి గారనే రాయడు శాస్త్రి గారి వద్ద శాస్త్రాలు నేర్వాలని వెళ్లి రాజా గారి సంస్కృత కళాశాలలో చేరి ‘’సాహిత్య విద్యా ప్రవీణ ‘’చదివి ఉత్తీర్ణులై ,తర్కం నేర్వాలనుకోన్నరుకాని సాహిత్యం అభ్యసించారు. రాయడు శాస్త్రి గారి అంతేవాసులై సకల శాస్త్రాలు నేర్చేశారు .రామ శాస్త్రి గారి వద్ద తర్కం ,గంటి సూర్య నారాయణ శాస్త్రి గారి దగ్గర మీ మాంస ,రామానుజ చార్యుల వద్ద శాస్త్ర దీపిక  నౌడూరి వెంకట శాస్త్రి ,కంభం పాటి రామ శాస్త్రి గారి నుండి వ్యాకరణం నేర్చారు .అలంకార కౌస్తుభం ,వక్రోక్తి జీవితం ,అభినవ భారతి పై పట్టుసాధిం చారు .రాయడు శాస్త్రి గారి వద్ద ఉన్నప్పుడే మాధవ రామ శర్మ మాధవ ‘’రాయ’’ శర్మ అయ్యారు .

ఉద్యోగం

జీతం తీసుకోకుండా పన్నెండేళ్ళు తెనాలి సంస్కృత కళాశాలలో సాహిత్యాలంకార భాష శాస్త్ర అధ్యాపడుగా ,ఉపాధ్యక్షుడు ,ప్రిన్సిపాల్ గా సేవలందించిన మహోన్నత మూర్తి .ఈ బోధన వల్లనే తనకు గ్రంధాలు రాసే భావ వ్యూహం కలిగిందన్నారు .తర్వాత నెల్లూరు వేదం సంస్కృత కళాశాలలో ‘’సర్వాధ్యక్షులు ‘’గా పని చేశారు .పిమ్మట గుంటూరు  క్రైస్తవ కళాశాలలో సంస్కృతాంధ్ర  భాషాధ్యాపకుడుగా ఉన్నారు .అక్కడ రిటైరై కే .వి .కే .సంస్కృత కాలేజి లో అయిదేళ్ళు పని చేశారు ,నాగార్జున యూని వర్సిటిలో తెలుగు విభాగం లో ఉద్యోగించారు .

వివాహం –సంతానం

శర్మగారు వేదాంతం వారి ఆడబడుచుశ్రీమతి  కామాక్షీ హైమవతి ని  వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు .రెండవ కుమారునికి భావ భూతి శర్మ అని నామకరణం చేసి ఆ మహా కవిపై తనకున్న భక్తీ తాత్పర్యాలను చాటుకొన్నారు .అయిదవ కాన్పు సమయం లో శర్మ గారి భార్య చనిపోయారు .అప్పటినుండి పిల్లలకు తానే తల్లి అయ్యారు శర్మగారు .

గ్రంధ రచన

శర్మ గారు సంస్కృతాంధ్రాలలో 29గ్రంధాలు రచించారు .వారికి వాల్మీకి ,కాళిదాసు  భవభూతి ,అభినవ గుప్తుడు ,క్షేమేంద్రుడు అభిమాన రచయితలు .జగద్గురు శ్రీ కళ్యానంద భారతీ మహా స్వామి వారి చేత మంత్ర విద్యా దీక్ష స్వీకరించారు . ఆ సంస్కారమే  తన రచనా వ్యాసంగానికి దోహదం చేసిందని తెలియ జేశారు .  సంస్కృతం  లో శర్మగారు ఆనంద వర్ధనుని ధ్వన్యాలోక అలంకార శాస్త్రానికి సంగ్రహ సంస్కృత రచన ‘’ధ్వని సారం ‘’ రాశారు . దీక్షా గురువులైన శ్రీ కళ్యానంద భారతీ స్తుతిగా ‘’కళ్యాణ భారతి ‘’రాశారు .శర్మగారికి పుట్టపర్తి సత్య సాయి బాబా అంటే అమితాభిమానం సంస్కృతం లో ‘’సత్య సాయి పురాణం ‘’గా నలభై వేల శ్లోకాల తో సర్వ పురాణ సారం గా రచించారు . తెలుగులో మంత్రం శాస్త్ర గ్రంధం గా శ్రీ ,జగన్నాధ పండిత రాయని రసగంగాధరానికి వ్యాకహారికాంధ్ర భాషా వివరం గా ‘’నవ రస గంగాధరం ‘’,విద్యానాధుని ప్రతాప రుద్రీయానికి’’ఆంద్ర ప్రతాప రుద్రీయం ,ముమ్మటుని కావ్య ప్రకాశానికి ప్రామాణికాలైన పది వ్యాఖ్యానాల సారం గా ‘’కావ్య ప్రకాశం ‘’,రుయ్యకుని అలంకార సర్వస్వానికి ‘’అలంకార సూత్రం ‘’,భరతుని నాట్య శాస్త్రానికి వ్యాఖ్యానం గా ‘’నాట్య వేదం ‘’,క్షేమేంద్రుని రచనకు ‘’ఔచిత్య విచార చర్చ ‘’కుంతకుని గ్రంధానికి అనువాదం గా ‘’వక్రోక్తి జీవితం ‘’,భగవద్గీత ఆరు వేల శ్లోకాలకు వ్యాఖ్యానం ,మహా భారతాన్ని ధర్మ శాస్త్రం గా నిరూపిస్తూ ‘’శ్రీమన్మహా భారతం –ధర్మ శాస్త్రం ‘’మొదలైనవి రచించారు .ఇంకా కొన్ని గ్రంధాలు ముద్రించాల్సినవి ఉన్నాయి .’’సాహిత్యం అంటే సర్వ పురుషార్ధ సాధనం గా రసభావ స్పురణ ,తత్పర్యవసానమూ ఉండాలి ‘’అని శర్మ గారి అభిప్రాయం .

పుట్టపర్తి నారాయణాచార్యులు ,విశ్వనాధ సత్య నారాయణ గారల రచనలంటే శర్మ గారికి యెనలేని అభిమానం వారంటే ఆరాధనా భావమూ .

ఆధ్యాత్మిక జీవనం

నిత్య సంధ్యావందనం ,ధ్యానం ,మంత్రజపం చేసేవారు .ఇలవేల్పు అయిన శ్రీ లలితా పర భట్టారిక సహస్ర నామ రహస్యాలను బోధించేవారు .ఫాల భాగం లో భస్మం ,గంధం ,కుంకుమ ధరించేవారు .శర్మ గారి ప్రత్యేకత క్రాపుతో పాటు ‘’పిలక ‘’ఉండటం .ధోవతి ,దానికి అందమైన కుచ్చెళ్ల తో ప్రత్యేకంగా దర్శన మిచ్చేవారు .ఉత్తరీయ కప్పుకొంటే మహా రాజ ఠీవి జ్యోతక మయ్యేది .కంచి పరమాచార్య వారరి కటాక్షం పొందారు .శృంగేరీ స్వాముల వారి ఆశీస్సు లందుకొన్నారు సత్య సాయి కి ప్రీతి పాత్రులయ్యారు .తను సేకరించిన అయిదు వేల అపూర్వ గ్రంధాలను సత్య సాయి కాలేజి లైబ్రరీకి బహూక రించారు .భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు .’’నారాయణి నమోస్తుతే ‘’అనే మాట తరచుగా వాడేవారు .

భువన విజయ సృష్టికర్త

మాధవ రామ శర్మ గారే  శ్రీ కృష్ణ దేవరాయల భువన విజయం కు ద్రష్ట ,స్రష్ట .తిమ్మరుసు పాత్ర ధరించేవారు .దాని రూపకర్త శర్మ గారే .ఏ సి కాలేజిలో మొదటి సారి దాన్ని ప్రదర్శించారు .విశ్వనాధ ,గడియారం పుట్టపర్తి మధునా పంతుల వంటి సాహితీ దిగ్గజాలు పాల్గొన్న సభ అది .

సభలూ సమావేశాలు

‘’ శర్మ గారు మహా వక్త. అనర్గళం గా ఏ విషయం పైన నైనా మాట్లాడేవారు .ముందు సంస్కృతం లో  ధారాళం గా ప్రసంగించి తర్వాతే తెలుగులో మాట్లేడేవారు .అ౦తటి గీర్వాణ భాషాభిమానం వారిది .శర్మగారిది ‘’కంచు కంఠం’’.ఆ నాడు ‘’జకార త్రయం ‘’అని పిలువ బడే ఉద్దండ మహోపన్యాసకులు శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ జొన్నల గడ్డ సత్యనారాయణ మూర్తి గార్లు .ఆస్థానకవి శ్రీ కాశీ క్రిష్ణాచార్య వారి 90వ జన్మ దినోత్సవం నాడు శర్మగారి ఆధ్వర్యం లో గుంటూరులో ‘’సంస్కృత సామ్రాజ్యం’’అనే అపురూప సభ నిర్వహించారు. ప్రత్యెక సంచిక తెచ్చారు .

బిరుదులు –సత్కారాలు

మాధవ రామ శర్మ గారి మహా విద్వత్తు కు అంతే స్థాయిలో 18బిరుదులూ లభించాయి .అదేరీతిలో  సత్కార సన్మాన పురస్కారాలు పొందారు .వీరి బిరుదులలో మహోపాధ్యాయ ,దర్శనాచార్య ,లాక్షణిక సామ్రాట్ ,శాస్త్ర విశారద ,సాహిత్య సామ్రాట్ ,అభినవానంద వర్ధన ,రస జగన్నాధ ,నవ విద్యానాద ,సాహిత్య వాచస్పతి ,ధర్మ విద్యా ప్రవీణ ,సంస్కృత విద్యా భూషణ మచ్చుకు కొన్ని మాత్త్రమే .

నాగార్జున విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ,డి లిట్ ఇచ్చి గౌరవించింది .అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి దేవస్థానం వార్షికం ఇచ్చి  సమ్మానించేది .ఆలిండియా ఓరియంటల్ కాన్ఫ రెన్స్ లో ప్రతినిధి గ పాల్గొన్నారు .నవ ద్వీపం లో  గౌడీయ మఠం తరఫున పాల్గొని సంస్కృతం లో గంట సేపు ప్రసంగించి ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బాసు నే ఆశ్చర్య చకితుల్ని చేసి ‘’భారత దేశం లో ఇంత అనర్గళం గా సంస్కృతం లో ఇంత సేపు ప్రసంగించే వ్యక్తీ ఉన్నారా?’’అని  అప్రతిభులను చేశారు .వీరికి వచ్చిన శాలువాలు సన్మాన పత్రాలకు లెక్కే లేదు .అనేక చోట్ల పల్లకీలో ఊరేగించారు .ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు . సత్య సాయి పెన్ను ,రిస్ట్ వాచీ  బహూకరించారు .కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘’సాహితీ మాధవం ‘’అనే  ప్రశంసా  పద్యం రాసి చివరలో ‘’అభినవానంద భరత ‘’భావార్ద్ర ‘’మధుర రస పధ విహారి  మాధవ రామ సూరి ‘’అని కీర్తించారు .సాహిత్య వాచస్పతి పండిత పరమేశ్వర ,సాహిత్య విద్యాధర శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మగారు ఎనభై ఒక్క ఏడాది సార్ధక జీవితం గడిపి గీర్వాణ భాషా సేవలో పునీతులై  13-7-1988 న ‘’మాధవ సదనం ‘’చేరుకొన్నారు .

అధారం – శర్మ గారి శత జయంతికి(2007)కుమారుడు శ్రీ జమ్మల మడక భవ భూతి శర్మ రచించిప్రచురించిన  పుస్తకం . ‘’మా నాన్న –జమ్మల మడక మాధవ రామ శర్మ ‘’ .Inline image 1

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మూవీ మొఘల్‌ మరిలేరు

మూవీ మొఘల్‌ మరిలేరు

కేన్సర్‌తో రామానాయుడు కన్నుమూత
దాదాపు 5 దశాబ్దాల కెరీర్‌.. 13 భాషల్లో 140 చిత్రాల నిర్మాణం
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డ్‌
ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు
తెలుగు సినిమా పెద్దదిక్కుల్లో ఆయన ఒకరు… ఘన విజయాలకు ఆయన ఓ చిరునామా.. సినీ నిర్మాతలకు ఆయన ఓ పెద్ద బాల శిక్ష… అమ్మానాన్నలు పెట్టిన పేరు… రామానాయుడు! సినీ పరిశ్రమ ఆయనకు పెట్టిన పేరు ‘మూవీ మొఘల్‌’! ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో విజయాలు సొంతం చేసుకున్న ఆ స్టార్‌ ప్రొడ్యూసర్‌.. డి.రామానాయుడు (79) ఇక లేరు! నలుగురు సంగీత దర్శకులను… ఆరుగురు హీరోలను…. 14 మంది హీరోయిన్లను… 24 మంది దర్శకులను పరిచయం చేసిన… 13 భాషల్లో 140 చిత్రాల స్టార్‌ ప్రొడ్యూసర్‌!!
రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారాల్లో అడుగుపెట్టి చివరికి సినిమాల్లో స్థిరపడి.. ఆయన సాగించిన విజయ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న రామానాయుడు బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో… తెలుగు చిత్ర పరిశ్రమ మూగబోయినట్లయింది. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఖిన్నులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ‘మూవీ మొఘల్‌’కు నివాళులర్పించారు.
హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా 13 భారతీయ భాషల్లో 140 చిత్రాలు నిర్మించి.. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డు సాధించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. మూవీ మొఘల్‌.. దగ్గుబాటి రామానాయుడు(79) ఇక లేరు! కొంతకాలంగా ప్రొస్టేట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు సురేశ్‌, వెంకటేశ్‌, కుమార్తె లక్ష్మి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని రామానాయుడు స్టూడియోస్‌లో ఉంచి, మధాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని రామానాయుడు కుమారుడు వెంకటేశ్‌ తెలిపారు.
కారంచేడులో పుట్టి.. పెరిగి..
రామానాయుడు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కారంచేడు. 1936 జూన్‌ 6న దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. మూడేళ్ల పసి వయసులోనే మాతృమూర్తిని కోల్పోయారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన తొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో పెద్ద మనసు ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రామానాయుడు. భూదానోద్యమంలో భాగంగా 1945లో ఆచార్య వినోబా భావే కారంచేడుకు వెళ్లినప్పుడు.. ‘నా వంతుగా రెండున్నర ఎకరాలు ఇస్తాను’ అని ప్రకటించారు. కొడుకు మాటను మన్నిస్తూ ఆయన తండ్రి రెండున్నర ఎకరాల భూమిని ముగ్గురు వ్యవసాయ కూలీలకు పంచారు. ఆ తర్వాత.. ఒంగోలులోని బంధువుల ఇంట్లో ఉండి ఎ.బి.ఎం.హైస్కూల్‌లో చదువుకుని, ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పాసయ్యారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు విజయవాడలో లయోలా కాలేజ్‌ స్థాపన నిమిత్తం విరాళాల వసూలు కోసం కారంచేడు వచ్చిన నిర్వాహకులకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వడమే కాకుండా, ఊళ్లో రెండు లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఇచ్చారు. పర్యవసానంగా ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ లయోలా కాలేజీలో ఆయనకు ఇంటర్మీడియట్‌ సీటు వచ్చింది. కానీ అక్కడ ఏడాది కంటే ఎక్కువ ఉండలేకపోయారు. రెండో సంవత్సరం చీరాల వి.ఆర్‌.ఎస్‌. అండ్‌ వై.ఆర్‌.ఎన్‌. కాలేజీలో చేరారు. బాల్య స్నేహితుల సావాసంతో చదువు మీద సరిగా దృష్టిపెట్టక పరీక్షల్లో తప్పారు. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి వ్యవసాయంలో అడుగుపెట్టారు. 21వ ఏట.. తన మేనమామ యార్లగడ్డ నాయుడమ్మ కుమార్తె రాజేశ్వరిని 1957 నవంబర్‌ 2న వివాహమాడారు. మూడేళ్లు తిరిగేసరికి వారికి సురేశ్‌, వెంకటేశ్‌ జన్మించారు. కారంచేడులో ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్‌ జరగగా, ఓ ఎడ్లపందెం సీన్‌లో అక్కినేని నాగేశ్వరరావు డూప్‌గా నటించడమే కాక, అందులో కలెక్టర్‌ వేషం కూడా వేశారు. నటుడిగా ఆయన తెరమీద కనిపించిన మొదటి సినిమా అదే.
ఇటుకల వ్యాపారం చేద్దామని వెళ్లి..
ఇటుకల వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో మద్రాస్‌ వెళ్లారు రామానాయుడు. కానీ ఆ వ్యాపారంపై ఆసక్తి కలగలేదు. అప్పుడు సినీ రంగంపై దృష్టిపడింది. దర్శకుడు గుత్తా రామినీడు సలహాతో ఆయన దర్శకత్వం వహించిన ‘అనురాగం’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు. అయితే టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ‘అనురాగం’ ఆర్థికంగా నిరాశపరిచింది. దీనికితోడు.. సినీ రంగంలోకి వెళ్లడాన్ని ఆయన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆయనను ఒప్పించి భార్యా పిల్లలను తీసుకుని 1962 జూన్‌ 24న మద్రాస్‌లో కాపురం పెట్టారు. ‘అనురాగం’ తర్వాత భాగస్వాములు లేకుండా సొంతంగా సినిమాలు తియ్యాలని సంకల్పించి.. పెద్ద కుమారుడు సురేశ్‌ పేరు మీద 1963లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ను నెలకొల్పారు. డి.వి.నరసరాజు చెప్పిన కథ నచ్చడంతో తాపీ చాణక్య దర్శకత్వంలో సినిమా తియ్యాలని సంకల్పించారు. ఆ కథకు ఎన్టీఆర్‌ అయితే సరిగ్గా సరిపోతారని భావించి, ఆయననుసంప్రదించారు. తన వద్ద సరిపడేంత పెట్టుబడి లేకపోయినా, ఎన్టీఆర్‌కు రెగ్యులర్‌ డిసి్ట్రబ్యూటర్‌ అయిన విజయా పిక్చర్స్‌ ఇచ్చిన అడ్వాన్స్‌తో సినిమా ప్రారంభించారు. అదే.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ సినిమా. 1964 మే 21న విడుదలైన ఆ చిత్రం సూపర్‌ హిట్టవడంతో రామానాయుడు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు.
‘ప్రేమనగర్‌’ ఓ అధ్యాయం
1968లో తెలుగులో తను నిర్మించిన ‘పాప కోసం’ సినిమాను అదే ఏడాది తమిళంలో ‘కొళందై కాగ’ పేరుతో రీమేక్‌ చేసి, తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టారు రామానాయుడు. ఆ మరుసటి ఏడాది అక్కినేని నాగేశ్వరరావుతో తన తొలి సినిమా ‘సిపాయి చిన్నయ్య’ తీశారు. దాని తర్వాత కె.బాపయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘ద్రోహి’ సినిమా అట్టర్‌ఫ్లాపై ఆయన పెట్టుబడి రూ. 5 లక్షలను మింగేసింది. ఆర్థికంగా జీవన్మరణ సమస్య ఎదురైన సమయంలో.. ‘ప్రేమనగర్‌’ తీశారు. నవయుగ ఫిలిమ్స్‌ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని, తను రూ. 5 లక్షలు పెట్టి, మొత్తం రూ. 15 లక్షలతో ఆ సినిమాని నిర్మించారు. 1971లో అది చాలా పెద్ద బడ్జెట్‌. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా సెప్టెంబర్‌ 24న విడుదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో భయంకర తుఫాను. మూడు రోజుల పాటు కుండపోత వర్షం. రామానాయుడులోని ఆశలు ఆవిరవుతున్నాయి. ఆ సినిమా ఆడకపోతే, ఆర్థికంగా ఆయన కోలుకునే స్థితి లేదు. నాలుగో రోజు సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. వర్షాలకు మించి వసూళ్ల వర్షం కురిసింది. అలా ఆయన కెరీర్‌లో మేలిమలుపుగా, ఓ గొప్ప అధ్యాయంలా నిలిచింది ‘ప్రేమనగర్‌’. సినిమానా, వ్యవసాయమా? తేల్చుకోవాల్సిన స్థితిలో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఆ తర్వాత ఆ యనకెప్పు డూ రాలేదు. ఆ చిత్రాన్ని శివాజీ గణేశన్‌తో ‘వసంత మాళిగై’ పేరుతో రీమేక్‌ చేసి, అక్కడా ఘన విజయం సాధించారు. అదే సినిమాని రాజేశ్‌ ఖన్నా, హేమ మాలిని జంటగా ‘ప్రేమ్‌నగర్‌’గా రీమేక్‌ చేసి, హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, అక్కడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఒకే కథను మూడు భాషల్లో తీసి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ సినిమా నుంచి సురేశ్‌ ప్రొడక్షన్స్‌, అగ్ర సంస్థల జాబితాలో చోటు పొందింది. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తూ ‘మూవీ మొఘల్‌’గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకే కాదు.. భారతీయ సినిమాకు రామానాయుడు చేసిన సేవకు గుర్తుగా ఆయన్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. అందులో ముఖ్యమైనవి.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌ పురస్కారం. సినీ రంగానికి సంబంధించిన ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయన 2009లో అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. అలాగే.. రాజకీయనాయకుడిగా.. వ్యక్తిగా.. రామానాయుడు ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ప్రముఖుల సంతాపం
స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపసూచకంగా గురువారం షూటింగ్‌లు జరపకూడదని చిత్ర పరిశ్రమ.. థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు.
ప్రతిభకు పట్టం
ప్రతిభ ఎక్కడున్నా గ్రహించి, వెలుగులోకి తీసుకువచ్చిన మంచి మనిషి రామానాయుడు. ఇరవై నాలుగు మంది దర్శకులను, ఆరుగురు హీరోలను, పద్నాలుగు మంది హీరోయిన్లను, నలుగురు సంగీత దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన సంస్థలో వందమందికి పైగా హీరోలు, 130 మంది వరకు హీరోయిన్లు నటించారు. నిర్మాతగా ఆయన అన్ని వ్యవహారాలూ చూసుకున్న చివరి చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా’. వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి నటించగా, సురేశ్‌ నిర్మించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి ఆయన సమర్పకుడు.
ఈ భాషల్లో సినిమాలు..
తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, భోజ్‌పురి, అస్సామీ, పంజాబీ, ఇం గ్లిష్‌ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించారు.
ఆయనలో నటుడు
తాను నిర్మించిన దాదాపు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సీన్‌లో కనిపించడం రామానాయుడుకు అలవాటు. అత్యధిక సినిమాల్లో ఒకటి లేదా రెండు సన్నివేశాల్లో కనిపించే చిన్న పాత్రలు వేసిన ఆయన.. ‘హోప్‌’ అనే సినిమాలో ప్రధాన పాత్రనూ చేసి మెప్పించారు. బయటి నిర్మాతలు చాలా మంది ఆయనను తమ సినిమాల్లో నటించమని అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. బయటి బేనర్‌లో ఆయన నటించిన ఒకే ఒక్క చిత్రం ‘దాగుడు మూతలు’. అప్పట్లో సీనియర్‌ నటి శాంతకుమారి ‘‘ఒరేయ్‌.. నాయుడు, నా మాట వినరా. హీరోగా చెయ్యరా. నీది హీరో ముఖంరా’’ అని ఎన్నిసార్లో పోరుపెట్టినా, ఆయన నవ్వి ఊరుకున్నారు.
స్టూడియోల అధినేత..
చిత్రసీమలో నిర్మాతగా తను సంపాదించిన డబ్బును, అదే చిత్రసీమలో ఖర్చుపెడుతూ, పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషిచేశారు రామానాయుడు. 1984లో సురేశ్‌ మూవీస్‌ అనే డిసి్ట్రబ్యూషన్‌ సంస్థను ప్రారంభించి, పంపిణీదారునిగా మారారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లో ఐదెకరాల కొండ ప్రాంతాన్ని తొలిచి రామానాయుడు స్టూడియోస్‌ను కట్టారు. స్ర్కిప్ట్‌ పట్టుకుని ఈ స్టూడియోకు వచ్చే నిర్మాత చేతికి తొలి కాపీ వచ్చేవరకూ అన్ని సదుపాయాలనూ ఇందులో కల్పించారు. ఈ స్టూడియోకు ఐదు కిలోమీటర్ల దూరంలో నానక్‌రామ్‌గూడలో రామానాయుడు సినీ విలేజ్‌ పేరుతో మరో స్టూడియో ఏర్పాటుచేశారు. విశాఖపట్నంలోనూ ఓ పెద్ద స్టూడియోను నెలకొల్పారు.
రాజకీయాల్లోనూ..
చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమానికి ఆకర్షితులైన ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి, టీడీపీలో చేరి 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి చేతిలో ఓటమి పాలవడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
రేపు వస్తానో రానో..
రామానాయుడు స్టూడియోస్‌.. కొండలు పిండి కొట్టి కట్టిన ఆయన కర్మభూమి! సినీ రంగాన్ని నమ్ముకుని వచ్చే ఎంతో మంది కార్మికులకు ఉపాధినిచ్చిన బతుకు సీమ!! అందుకే ఆ స్టూడియో అంటే రామానాయుడు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మంగళవారం ఆయన స్టూడియోకు వెళ్లారు. ‘ఇక్కడికి రావడం ఇదే చివరిసారి’ అన్నంత ఇదిగా అణువణువూ కలియదిరిగారు. సిబ్బంది అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రేపు వస్తానో రానో.. ఇక్కడికి రావడం ఇదే చివరిసారేమో’నని ఆయన తమతో అన్నారంటూ స్టూడియో సిబ్బంది కంటతడి పెడుతున్నారు. అంతేకాదు.. నమ్మిన బంటులా ఇంతకాలం తన వెంట ఉన్న డ్రైవర్‌, ఇతర సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలని పెద్ద కుమారుడు సురేశ్‌బాబుకు రామానాయుడు చెప్పినట్లు తెలుస్తోంది!!
అదే మహమ్మారి..
కేన్సర్‌.. సినీ పరిశ్రమలో ప్రముఖులను వరుసగా కబళిస్తూ వస్తున్న ఈ మహమ్మారే మూవీ మొఘల్‌ మరణానికీ కారణమవడం గమనార్హం. పాతతరం నటుడు కాంతారావు మొదలు.. అక్కినేని నాగేశ్వరరావు, వడ్డే రమేశ్‌, ఈవీవీ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్‌, వీబీ రాజేంద్ర ప్రసాద్‌, గణేశ్‌ పాత్రో ఇలా ఎందరో సినీ ప్రముఖులు కేన్సర్‌కు బలైన సంగతి తెలిసిందే!!
సినీ దిగ్గజాన్ని కోల్పోయాం : ప్రముఖుల నివాళి
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీరంగాల దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. భారత చిత్రసీమకు వెలలేని సేవలందించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినిమాలు తీయడమేగాక ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అనేక భాషలలో శతాధిక చిత్రాల నిర్మాణంతో ప్రపంచ గుర్తింపు పొందిన రామానాయుడు మృతి యావత్‌ సినీ ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ప్రజాభిమానం ఆయనను అమరుడిగా నిలుపుతాయని పేర్కొన్నారు. తెలుగులోనే కాకుండా కన్నడ భాషలోనూ చిత్రాలు నిర్మించి, తమ రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కొనియాడారు. సినీ పరిశ్రమతోపాటు ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. సినీరంగంతోపాటు టీడీపీకి కూడా తీరని లోటని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు సినీరంగానికి పెద్దబాల శిక్షలాంటివారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. అలాగే ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని మరో ఇద్దరు మంత్రులు బండారు దత్తాత్రేయ సుజనా చౌదరి అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, మృణాళిని, పి.నారాయణ, తోపాటు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రామానాయుడు మృతిపై సంతాపం ప్రకటించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్రశాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎందరికో మార్గదర్శకుడిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తిగా ప్రతిపక్ష వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ కొనియాడారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును పోగొట్టుకున్నదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. ఐదు దశాబ్దాలు పరిశ్రమకు ఎనలేని సేవచేశారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రామానాయుడు మృతి పరిశ్రమలకు తీరని లోటని ఏపీ శాసనమండలి టీడీపీ విప్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు.
తెలుగు ప్రజల గౌరవం పెంచిన వ్యక్తిగా మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. చిత్రసీమ మూగబోయిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కళామతల్లికి ఎనలేని సేవలు చేశారని చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. సినీ ప్రపంచం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని పశ్చిమగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో ఉన్న హీరో శ్రీకాంత్‌, హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు, నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -90 వత్సావాయి స్కూల్ స్టాఫ్

నా దారి తీరు -90

ఇప్పటికి 15 ట్రాన్స్ ఫర్లు రుచి చూశాను. ఇది పదహారవ బదిలీ కం ప్రమోషన్ .వత్సవాయి చిల్లకల్లు –బోనకాల్ రోడ్డుమీద ఉంది. చిల్లకల్లు నుంచి తిరుమలగిరికొండ  దూరం గా కనిపిస్తుంది .అడిదాటితే కన్నెవీడు వస్తుంది తర్వాత మక్క పేట .ఇక్కడినుంచి తూర్పుకు వెడితే పెనుగంచిప్రోలు . మక్కపేటనుండి మునేరు దాటి తే వత్సవాయి వస్తుంది .వత్సవాయి నుండి బోనకల్ రైల్వే స్టేషన్ అయిదు కిలో మీటర్లు .అది హైదరాబాద్ –విజయ వాడ రైల్వే లైన్ లో ఉంది .శాతవాహన  గోల్కొండ లాంటి ఎక్స్ప్రెస్ ట్రెయిన్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి .అందుకని ఉద్యోగస్తులు ఈ ట్రెయిన్ లో అప్ అండ్ డౌన్ చేస్తారు . వత్సవాయి హైస్కూల్ గ్రౌండ్ లో పెద్ద వాటర్ టాంక్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తుంది .ఊరందరికీ నీటి సప్ల్లై ఇక్కడి నుంచే .

వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టార్ లింగం వెంకటేశ్వర రావు గారు లాంగ్ లీవ్ పెడితే నన్ను ప్రమోషన్ మీద ఇక్కడికి వేశారు .పెద్ద స్కూలే అన్నీ డబల్ సేక్షన్లే .అందరూ వెనకబడిన , ఎస్ టి  విద్యార్ధులే .కోమట్లూ ఎక్కువే .వత్సవాయి నుంచి ఎనిమిదికిలోమీటర్ల దూరం లో పొలం పల్లి ఉంది .ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది .ఇక్కడి హైస్కూల్ హెడ్మాస్టర్ విల్సన్ గారు ఉయ్యూరు హైస్కూల్ లో నా ఎస్ ఎస్ ఎల్ సి క్లామేట్ చంద్రా  నిర్మల భర్త గారే .ఆమె అక్కడే తెలుగు పండిట్ .కొండూరు అనే ఇంకొక ఊరు   కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉంది .ఇక్కడా కొత్తగా హైస్కూల్ పెట్టారు .బ్రాహ్మణ్యం ఎక్కువ. స్కూల్ కమిటీ వారి అధీనం లోనే ఉంది .ఆప్రేసిడెంట్ట్ మునసబుగారుకూడా అనిజ్ఞాపకం .

వత్సావాయి స్కూల్ స్టాఫ్

స్కూలు రమణయ్య అనే  లెక్కల మాష్టారు  ఇంచార్జిలో ఉంది .ఆయనకు ఇక్కడ ట్యూషన్లు కూడా ఉన్నాయి జగ్గయ్యపేట నుండి వచ్చేవాడు .రెండో లెక్కల మేస్టారేవరోగుర్తులేదు .సైన్స్ మేష్టారు అప్పారావు దగ్గరలో ఉన్న జొన్నలగడ్డ వాసి. మంచి కుర్రాడు .బాగా చెప్పేవాడు .సోషల్ కు విజయవాడ ప్రాంతం ఆవిడా .ఆమె భర్తసీనియర్  తెలుగుపండిట్ . ఇద్దరి ఆరోగ్యాలు అంతంత మాత్రమె .ఎప్పుడూ సెలవలె .తెలుగాయన మూడీ పర్సన్ .ఆస్తమా పేషెంట్ ఆవిడ కూడా .పిల్లలు లేరు .డ్యూటీ మైండెడ్ కాదు ఇద్దరూ..హిందీ పండిట్ శంకర రావు గారనే పెద్దాయన .యు టి ఎఫ్ కార్య కర్త .పంచె కట్టి చొక్కా తో వచ్చేవారు ఆయన అందరికి పెద్ద ఆయన మాట అందరికి ఇష్టమే .డ్రిల్ మాస్టారు ఆలీ గారు దాదాపు రిటైర్ మెంట్ స్టేజ్ లో ఉన్నాడు .దీనికి తోడూ పక్షవాతం వచ్చి కర్ర సాయం తో వచ్చేవాడు . హాజరు పట్టీ  లో సంతకం పెట్ట టానికే స్కూల్ కు వచ్చేవాడు .ఆ తర్వాత స్కూల్ వదిలి సెంటర్లో చేరి టీలు తాగుతూ గఫ్ఫాలు కొట్టేవాడు .‘’ఏదైనా అంటే ‘’సార్ !ఇప్పుడు ఇట్లా ఉన్నాకాని మంచి డ్రిల్ మాస్టర్ గా నాకు పేరుంది .అన్నీ ఆడేవాడిని బాగా నేర్పెవాడిని నందిగామ వాడిని డబ్బా కొట్టే వాడు .డ్రాయింగ్ మాస్టారు పెంటపాటి అప్పారావు గారని గుర్తు .ఆయన చాలా క్రమ పద్ధతిలో ఉండేవాడు .బ్రాహ్మణులు .ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు వెళ్లి తిన్నాను. చాలా మర్యాద గా చూశారు .సెకండరీ గ్రేడ్ టీచర్ గా  కోసూరు వాడు పరుచూరి బ్రహ్మానందం ఉండేవాడు .ట్యూషన్ లో చాలామంది పిల్లలు ఉండేవారు .శంకర రావు గారికి ముఖ్య శిష్యుడు .వారానికో సారి మమ్మల్ని ఇంటికి పిలిచి సాయంత్రం వేల కాఫీ టిఫిన్ ఇచ్చేవాడు భార్య బాగా అచేసేది . ఇంకొక సెకండరీ గ్రేడ్ టీచర్ ఆచార్యులుగారు కుర్రాడే .క్రికెట్ పిచ్చి ఎక్కువ .బందరు దగ్గర నుండి దుర్గాంబ అనే గ్రేడ్ టు తెలుగుపండిట్  వచ్చారు .క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వరరావు మానికొండలో నేను సైన్స్ మేస్టర్ గా పని చేసినపుడు లాబ్ అసిస్టంట్ గా ఉన్నవాడు .చికినాల నేటివ్ .పంచె చొక్కా తో ఉండేవాడు మాంచి మాటకారి .ఇక్కడ గార్డెనింగ్ మాత్రమె క్రాఫ్ట్ పని .స్కూల్ కు ఒకే ఒక రైటర్ లగడపాటి కృష్ణ మూర్తి ఉండేవాడు ఆన్నీ బాగా తెలిసిన వాడు .దాదాపు ఇరవై ఏళ్ళనుండి ఇక్కడే పని చేస్తున్నాడు .ఇక్కడే రిటైర్ అయ్యాడు .అన్ని పనులు చాలాశ్రద్దగా స్పీడ్గా చేసి నాకు ఏంతో సహకరించేవాడు  .టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నామినల్ రోల్స్ రాయటం దగ్గరనుండి పరీక్షలకు సీటింగ్ విషయం పేపర్లు పెట్టటం ఫైల్స్ మెయింటేన్ చేయటం ,కరేస్పాడేన్స్న్స్ అంతా పకడ్బందీ గా చేసేవాడు .ఏ అనుభవం లేకుండా హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్న నాకు ఇ౦ త అనుభవం ఉన్న క్క్లార్క్  ఉండటం నక్కను తొక్కినట్లు అయింది కమ్మవారే అయినా తలలో నాలుకలా ఉండేవాడు ఇలాంటి గుమస్తా నాకు దొరికి నందుకు అందరూ ణా అదృష్టాన్ని మెచ్చుకొనేవారు .ఒక సారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టించాడు సంస్కారి .విద్యార్ధులకు ఆయన అంటే గురి ఎక్కువ ఏ పనైనా చక చకా చేసేవాడు .టి సి లు వగైరాలకు ఎంతోకొంత పిల్లల దగ్గర తీసుకొనే వాడు అని విన్నాను .ఇది తప్పని సరే .దీనిపై నేనేమీ స్పందించలేదు .మధిర దగ్గర ఎర్రుబాలెం ఆయన స్వగ్రామం .కొన్ని పోస్ట్లు లేవు .లైబ్రేరియన్ లేడు ఇంతపెద్ద స్కూల్ కి .అటెండర్ మంగళా పురం దగ్గర లక్ష్మీ పురానికి చెందిన వెంకటేశ్వరరావు అనే కుర్రాడు .ఈ మధ్యనే వచ్చాడు నైట్ వాచర్ ముసలాయన రిటైర్ అయ్యాడు .అతనికొడుకు తో పని చేయించి అతనిని కొన్ని నెలల తర్వాత చైర్మన్ గారితో చెప్పి రెగ్యులరైజ్ చేయించాను .బలరాం అనే లైబ్రేరియన్ నాతో పామర్రులో చేశాడు .అతన్ని సస్పెండ్ చేస్తే చైర్మన్ గారి దృష్టికి తెచ్చి పోస్ట్ ఫిలప్ చేయమంటే అతన్నేవేశారు .పెద్ద దేశ ముదురు కబుర్ల పోగు . ఇలాంటి నేపధ్యం లో నేను హెడ్ మాస్టార్ బాధ్యతలను మొదటిసారిగా వత్సవాయి హైస్కూల్ లో చేపట్టాను .

మళ్ళీ ఒకే గదిలోపుల్లయ్య నాయుడు ఇంట్లో  కాపురం

కొత్తలో హైస్కూల్ లోనే ఒక వారం పడుకొన్నాను .క్రాఫ్ట్ మేస్టారు, ఆచార్యులు , అటెండర్కూడా అక్కడే పడుకొనేవారు బల్లల మీదే నిద్ర. నేను హెడ్ మాస్టారు రూమ్ లో ఉండేవాడిని స్టవ్ తెచ్చాను కనుక ఖాళీ రూమ్ లో వంట చేసుకొనే వాళ్ళం .అటెండర్ ,క్రాఫ్ట్ కూరలు అవీ తరిగిస్తే నేనే వండే వాడిని పప్పూ కూర సాంబారు చేసేవాడిని బాగా నే కుదిరి తెగ మెచ్చుకొంటూ అందరం తినే వాళ్ళం ..క్రాఫ్ట్ మేష్టారు ఖర్చు లెక్కలు రాసి పదిహేను రోజులకోసారి సమాన వాటాలు వేసి సర్డుకొనే వాళ్ళం తర్వాత హెడ్ గా స్కూల్ లో నేను పడుకోవటం చెడు సంప్రదాయం అనిపించి స్కూలు ప్రక్కనే ఒక సాలీల పుల్లయ్య నాయుడు ఇంట్లో వాకిలి వైపు గదిలోకి మారాను .మడత మంచం పట్టే ఖాళీ .వంటకు సరిపడా స్థలం ఉండేది. అన్నీ కిటికీలలోనే  నేనే వండేవాడిని ఆచార్యులు క్రాఫ్ట్  అటెండర్  నేనూ తినేవాళ్ళం ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కొనే వాళ్ళం అంట్ల గిన్నెలు అటెండర్ తోమేసే  సేవాడు. సరదాగా ఈ’’ మగ కాపురం ‘’ రెండు నెలలు చేశాం తర్వాత క్రాఫ్ట్ ఫామిలీ తెచ్చుకొన్నాడు .అటెండర్ స్కూల్ లోనే వండుకోనేవాడు. ఆచార్యులూ వేరే గది తీసుకొని ఉన్నాడు .పుల్లయ్య నాయుడు భార్య పిల్లలు సారూ గారు అంటూ ఏంతో అభిమానం గా ఉండేవారు .హెడ్మాస్టారు వాళ్ళ ఇంట్లో అద్దేకున్నందుకు గర్వ పడే వారు  నా రూమ్ స్కూల్ కు అతి సమీపం ‘.ఫెన్సింగ్ దాటి స్కూల్ లోకి వెళ్ళటమే .నాయుడు ఇంట్లో ఇడ్లీ చేస్తే నాకు పిల్లలతో పంపేవాడు  అతనిది  సైకిల్ మీద వెళ్లి చేసే వస్త్ర వ్యాపారం .కొత్తగా డాబా ఇల్లు కట్టుకొన్నాడు .కాఫీ కూడా ఇచ్చేది ఆ మహా ఇల్లాలు .మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే టీ చేసి పంపేది .ఒకే కుటుంబ సభ్యులం గా ఆత్మీయత తో ఉన్నాం .నాయుడు ఆ తరాత నేను అక్కడినుంచీ వచ్చేసినాక కూడా ఉయ్యూరు కు అడ్రస్ కనుక్కొని వచ్చి పలక రించి పోయేవాడు .ఈ మధ్య ఖమ్మం వెళ్లి నేను మా శ్రీమతి, మా పెద్ద కోడలు, మా అమ్మాయి విజ్జి వత్సవాయి మీదుగా తిరిగి వచ్చి పుల్లయ్య నాయుడి ఇంటికి వెళ్లి పలకరించాం .నేనున్న గది చూపించా .ఎలా అందులో ఉన్నానో నని వీళ్ళు ఆశ్చర్య పోయారు .వాళ్ళ మర్యాద మాటలతో చెప్పలేనిది .నాయుడు కొడుకు బి టెక్ పాసై ఉద్యోగ ప్రయత్నం చేస్తూమా  శర్మ ద్వారా ఏవైనా ఉద్యోగాలున్నాఎమో నని కనుక్కోమని ఫోన్ చేసేవాడు మా వాడు   లేవని చెప్పేవాడు .అతనికి ఏమీ సాయం చేయలేకపోయానే అనే బాధ మనసులో ఉంది రుణాను బంధం ఇది .

వంకాయ కూర బాగా చేసేవాడిని .బంగాళా దుంప వేపుడు రసం సాంబారు పప్పూ బాగా కుదిరేవి .కొంత మిగిల్చి నాయుడు కుటుంబానికి ఇచ్చేవాడిని తెగ మురిసిపోతూ తినేవారు .ఆ గదిలోనే హాస్టల్ ఆడపిల్లలకు ట్యూషన్ చెప్పాను  మద్దెల రా మొండి తోక  జ్యోతి అనే టెన్త్ కాస్ నైంత్ క్లాస్ పిల్లలు వచ్చేవాళ్ళు .రాణి అంట్లు తోమి పెట్టేది .చదువు పెద్దగా వచ్చేదికాదు .బాగా పాడేది జ్యోతి కొంతనయం .క్రాఫ్ట్ కూతురు టెన్త్ తప్పితే ట్యూషన్ చెప్పమంటే చెప్పాను లెక్కలు ఇంగ్లీష్ .పాసైంది పెద్దమ్మాయికి కూడా ట్యూషన్ చెప్పిన జ్ఞాపకం .ఉదయం తోమ్మిదికే భోజనం చేసి స్కూల్ లో టెన్త్ క్లాస్ హాస్టల్ పిల్లలకు సైన్స్ లెక్కలు ఇంగ్లీష్ చెప్పేవాడిని .కస్టపడి చదవటం ఎలాగో నేర్పాను. సాయంత్రం స్కూల్ అవగానే డాబా మీద టెన్త్ వాళ్ళను ‘’మల్లేసే వాడిని ‘’ స్టోరీలు పద్యాలు అప్పగించుకోవటం రాయించటం చేసేవాడిని వాళ్ళల్లో చురుకు దనం పెరిగింది .ప్రతి బుధవారం ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలకు చివరి పీరియడ్ లో కధలు చెప్పటం రాజకీయ నాయకుల గురించి వివరించటం సైన్స్ లో వచ్చిన కొత్త విషయాలు చెప్పించటం క్విజ్ నిర్వహించటం చేయటం తో వాళ్ళలో జనరల్ నాలెడ్జి కొంత పెరిగింది ఇన్ని యాక్టివిటీస్ ఇ౦త దూరం గా ఉన్న స్కూల్ లో ఏ హెడ్ మాస్టారు నిర్వహించి ఉండరు .ఇక్కడకి వచ్చిన మేస్టార్లు హెడ్ లు అందరూ కృష్ణా జిల్లా నడిగడ్డ నుండి ఏదో రకం గా ట్రాన్స్ ఫర్ అయి  చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ఎప్పుడు ఇక్కడి నుండీ బయట పడదామా అని ఎదురు చూసేవాల్లె .నేనూ అదే టైప్ అయినా డ్యూటీని ఏనాడూ అలక్ష్యం చేయలేదు .అందుకే ఒకరకం గా సక్సెస్ అయ్యాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15- ఉయ్యూరు

 

 

..

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -13

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -3

34 వ ఏట మేల్విల్లీ తన ప్రతిభా సర్వస్వం అయిన ‘’మోబీ డిక్ ‘’నవల రాయటం ప్రారంభించాడు .ప్రసిద్ధ రచయిత నథానియల్ హతారన్ తో గొప్ప స్నేహమేర్పడింది .ఆయన ను ఆదర్శం గా తీసుకొన్నాడు .ఇద్దరు బాగా సన్నిహితులయ్యారు .మేల్విల్లీకి పెద్దన్నగా సలహాలిస్తూ మార్గ దర్శిగా ఉండేవాడు హతారన్ .కస్టపడి రాసిన మోబీ డిక్ నవల 185 లో విడుదలైంది .ఇలాంటి పుస్తకం అమెరికన్ సాహిత్యం లో అంతకు ముందెన్నడూ రాలేదు .ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.బైబిల్ లోని  ‘’call me Ismaaelఅనే వాక్యాన్నిమొదటి వాక్యం గా  అర్ధ వంతం గాఉపయోగించాడు .ఇస్మాయిల్ అనే వాడు ప్రపంచం లోని అసంత్రుప్తి అశాంతి లనుండి పారిపోతూ అన్నమాట అది .ఆ ప్రయాణం లో ఆత్మ హననం కూడా ఉంది .ఆహాబ్ అనే పాత్ర తనకాలికి గాయం చేసిందనే పగా ప్రతీకారం తో తెల్ల వేల్ ను చంపటానికి సిద్ధ పడతాడు .కాని ఆ తిమింగిలమే ఆహాబ్ ను చంపేస్తుంది .వాడి నౌక కూడా నాశన మవుతుంది .నౌకలో మిగిలిన ఒకే ఒకడైన ఇస్మాయిల్ ఈ కదా అంతా చెప్పటానికి మిగిలి ఉంటాడు .

చరిత్ర చర్విత చర్వణం అవుతుందనే గొప్ప ఫిలాసఫీ ఈ నవలలో పోదిగాడు .నవలలో లొపాలి అనేకం ఉన్నా ఈ తరహా కదా,కధనం కొత్తది అవటం తో గొప్ప విజయాన్ని సాధించింది .Melvilllle  has great genius ,but little telent ‘’అన్నారు కొందరు .కాని మోబీ డిక్ లోని ఎపిక్ లక్షణాన్ని ఎవరూ కాదనలేదు .దానికి అదే సాటి అనిపించింది .మోబీ డిక్ పరమోత్క్రుస్ట ,మరమోన్నత నవల గా చరిత్రలో మిగిలిపోయింది .కొద్ది మంది విమర్శకులు కొందరు అభిమానులకు ఈ నవల నచ్చలేదు .వాళ్ళంతా ‘’టైపీ’’వంటినవలె మళ్ళీ రాస్తే బాగుండు ననిపించింది .న్యు మంత్లీ మేగజైన్ ‘’mad as a March hare  .gibbering ,screaming ‘’అని ఈసడించింది .

తన శక్తి సర్వస్వం ఖర్చు చేసి మేల్విల్లీ మోబీ డిక్ రాశాడు .ఇక ఆయనలో ఏమీ మిగలలేదు .శక్తి తో పాటూ ఆరోగ్యమూ తగ్గిపోయింది అప్పులూ వెంబ డి౦చాయి .ఇక తాను బతకటానికి ఆదాయం తెచ్చే ఏ రచనా చేయలేనేమోననే నిరుత్సాహం ఆవరించింది .విధి వెక్కిరిస్తోందని అనిపించి ‘’Dollars damn me and the malicious Devil is forever grinning in upon me ,holding the door ajar ‘’అని బాధ వెల్ల గక్కాడు .బుద్ధి పెట్టి రాస్తే ప్రభుత్వం బాన్ చేస్తోంది అన్నాడు .చేతిలో డబ్బు ఆడటం లేదు డబ్బు అవసరాలు ఎక్కువైనాయి. ఏడోనవల ‘’పియర్రీ ఆర్ ది యామ్బిగ్యుటీస్ ‘’మొదలు పెట్టాడు రెండోకొడుకు పుట్టాడు . ఈ నవలలో ఒక తల్లీ కొడుకు ఉంటారు వారిద్దరూ అక్కా తమ్ముడు లాగా ఉండటం ఇందులో ప్రత్యేకత .ఎవరికీ ఆనలేదు .అప్పు చేసి మామ గారు చెప్పిన చోట ఒక వ్యవసాయ క్షేత్రాన్నిపిట్స్ ఫీల్డ్ దగ్గరే  కొని అందులోనే  పదహారేళ్ళున్నాడు  .ఉన్నత హిమాయ శృంగం లాంటి మోబీ డిక్ నవల ముందు పియర్రీ ఒక పిగ్మాలియన్ అయిన్దిపాపం ఆర్ధికం గా ఏమీ లాభించనూలేదు .దీనితో మెల్వి ఉత్కృష్ట దశ పతనారంభమైంది  . తరువాతి నలభై ఏళ్ళూఅసౌకర్యం గా అసంతృప్తిగా అశాంతిగా బతికాడు .ఒంటరి తనం లో ఉండిపోయాడు .

దీనికి తోడూ సయాటిక్ రుమాటిజం వ్యాధి పీల్చేస్తోంది.నరాల బలహీనతా పట్టుకోంది..పెద్ద కొడుకు పద్దేనిమిదేల్లకే ఆత్మా హత్య చేసుకోవటం తో దిగాలు పడిపోయాడు .మేల్విల్లీ సృజన అంతా అతని 26-31 ఏళ్ళ వయసులోనే జరిగి వట్టిపోయింది .’’ది కాన్ఫిడెన్స్ –మాన్ ‘’అనే నవలా కొన్ని చిన్న కధలు రాశాడు .రాయాలనే కోరిక పూర్తిగా నశించింది .మానసికానందం కోసం మామగారిచ్చిన డబ్బుతో గ్రీస్ టర్కీ ఈజిప్ట్ ఇటలీ ఇంగ్లాండ్  లు సందర్శించాడు  .లెక్చర్లు ఇచ్చి ఏదైనా’’ఒడుక్కు౦దా’’మను కొని ప్రయతించి విఫలుడైనాడు .వచనం వదిలి అదృష్టాన్ని కవిత్వం లో వెతుక్కోన్నాడు .ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది .అసలైన అవగాహన లేకుండా రాసి అభాసు పాలయ్యాడు .రెండు వందల కవితలు రాశాడు .అందులో వేళ్ళమీద లెక్కించ దగినవి మాత్రం మీరు మిట్లు గొలిపాయి .తన సంత్రుప్తికోసమే కవిత్వం రాసుకొన్నాడు .

47 వయసులో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది .న్యూయార్క్ కు కుటుంబం మార్చాడు.బాగా కష్టమైన పనే .కానీ ఏమీ అనకుకోకుండా చేశాడు .దీనిలో 25 ఏళ్ళు అలాగే బండీ లాగాడు .వయసు అరవై ఏడు వచ్చింది .భార్య అతని పరిస్తితి అర్ధం చేసుకొని ఉద్యోగం మానేసి మళ్ళీ గ్రంధ పఠనం పై ద్రుష్టి పెట్టమని సలహా ఇచ్చింది .మనుమలు పుట్టారు .చరమాంకం లో బెర్మూడా కు యాత్రగా వెళ్ళాడు .’’జాన్ మేరీ అండ్ ఆదర్ పోయెమ్స్’’రాసి ప్రచురించాడు .ఇదే ఆఖరి రచన .గుండె వ్యాకోచం తో మేల్విల్లీ 28-9-1891 న72 వ ఏట మరణించాడు .పేపరు వాళ్ళు ఆయన చావు గురించి ‘’death of a once popular author’’అని మాత్రం రాసి ఇంకు దులుపుకొన్నారు .

మేల్విల్లీ చనిపోయిన పాతిక సంవత్సరాల వరకు ఆయన అభిమానులు తప్ప ఎవరూ ఆయన్ను గుర్తుపెట్టుకోలేదు .1921లో వీవర్ అనే రచయిత ఒక పబ్లిషర్ ను బ్రతిమిలాడి ‘’హీర్మాన్ మేల్విల్లీ –మారినర్ అండ్ మిస్టిక్ ‘’అనే గ్రంధాన్ని వెలువరించాడు .అప్పుడు జనాలకు చురుకు పుట్టింది .ఈ వేడి ఆయన పుట్టిన అమెరికాలో అనుకొంటే తప్పులో సారీ పప్పులో కాలేసినట్లే .అది ఇంగ్లాండ్ లోని లండన్ లో  సాగింది .మూడేళ్ళలో పదహారు గ్రంధాలు వెలువడ్డాయి .ఇదే మేల్విల్లీ పునరాగమనానికి అంటే రినైసేన్స్ కు దారి తీసింది .ఆ తర్వాత వరుసగా మూడు దశాబ్దాలు అందరూ మేల్విల్లీ పై అనేక కోణాలలో రచనలు చేసి ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని రచనా సామర్ధ్యాన్ని లోకానికి తెలియ జేశారు . ఎన్నో జీవిత చర్తిత్రలు వచ్చాయి .ఈచరిత్రలలో అనేక అసందర్భాలు  చోటు చేసుకోన్నాయి .అవగాహనలో తేడాలు వచ్చాయి .

మహా రచయితది హెచ్ లారెన్స్ ‘’the whale Moby Dick is the deepest blood being of the white race ,our deepest blood nature  and he is hunted hunted and hunted  by the maniacal fanatism of our white mental consciousness ‘’అని కుండ పగల కొట్టినట్లు చెప్పి ‘’we get dark races and pale to help us red yellow ,and black ‘’అన్న నిజాన్ని చెప్పాడు .మోబీ డిక్ లో ఆహాబ్ అంటే మనిషే అని ‘’man sentient ,speculative ,religious ,standing his full stature against the immense mystery of creation .’’అని ఎల్లరీసేడ్ విక్ అన్నారు .మోబీ డిక్ చెడుకు సంకేతం అని ఆహాబ్ మోబీ తో పోరాటం మంచికి చెడుకు పోరటమేనని చివరికి మంచి  తుడిచి పెట్టుకు పోతుందని ఇంకోఆయన వ్యాఖ్యానించాడు .భగవద్గీత పై ఎన్ని వ్యాఖ్యానాలోచ్చాయో అన్నీ మోబీ డిక్ మీద వచ్చాయి .ఎవరి దృక్పధం వారిది .అయినా ఇంకా మోబీ డిక్ ను చదువుతూనే ఉన్నారు మేల్విల్లీని ఆరాదిస్తూనే ఉన్నారు .

మేల్విల్లీ కి ఉన్న విలువలు ఆయన తరం నాటివికాదు .పేరుకు ,ఖ్యాతికి ఆయన ఇష్ట పడనే లేదు విషాదానికి పో లాంటి వాళ్ళు ఎలాగో మేల్విల్లీ కూడా అంతే .చాలెంజెర్ నంబర్ వన్ గా మిగిలాడు .ఎమర్సన్ ప్రశాంత ఇంద్ర ధనుస్సు కు వ్యతిరేకం గా మేల్విల్లీ పిడుగులు కురిపించాడు .వాల్ట్ విట్మన్ సూర్య దీప్తికి బదులు సాహసవీరోచిత  నల్లతనాన్ని ఆహ్వానించాడు .మేల్విల్లీ ప్రతిష్ట,వ్యక్తిత్వం  నానాటికీ పెరుగుతూనే ఉంది .Melville  not only measures up to the American giants but towers darkly above them ‘’ అన్న లూయీ అంటర్ మేయర్ మాట ముమ్మాటికీ నిజం .

మరో ప్రముఖునితో కలుద్దాం

Inline image 1  Image result for moby dick

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ )

       మినీ  ద్విపద్స్-4(శివరాత్రి  స్పెషల్ )

31-పర్వ దినం శివరాత్రి

 జన్మకో మహా రాత్రి .

32-అర్ధ రాత్రి లింగోద్భవం

    మహా ‘’ఎరికోద్భవం ‘’

33-జీవన్ముక్తి శివ రాత్రి

  తామస హరం  ఈ రాత్రి .

34-శివ శంకర నామం

   భవ హర గానం

35-అభిషేక ప్రియుడైన శివుడు

   తిమిర సంహారక రుద్రుడు

36-మహా శివ క్షేత్రం కోటప్పకొండ

  కోటీశ్వరస్వామి అందరి అండా దండా.

37-మల్లికార్జున క్షేత్రం శ్రీశైలం  

     నేడు కైలాస మహాశైలం

38-భీమేశుని దాక్షారామం

  ముక్తి రక్తుల విహారారామం

39-విశ్వేశ్వరుని వారణాసి  

   ముక్తి కెప్పుడూ వాసి

40-మనసు మాలిన్యం తొలగించే రాత్రి

  లింగోద్భవ మైన ఈ శివరాత్రి .

   సశేషం

          మహా శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలతో

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-15

 

Posted in కవితలు | Tagged | Leave a comment

కృష్ణుడు ఇచ్చిన రామ విగ్రహాలు -రామ తీర్ధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాలాజలం తో షుగర్ టెస్ట్ -రెండురూపాయలకే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పర్యావరణ మార్పు -రోగాల ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివరాత్రికి జాగరణం ఎందుకు?శ్రీ స్వరూపానంద-అక్షర’ లక్షల ఆది దేవుడు

శివరాత్రికి జాగరణం ఎందుకు?
అక్షర’ లక్షల ఆది దేవుడు

శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది. అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి. శివరాత్రి సందర్భంగా శివుని ఢమరుకం నుంచి జాలువారిన
వర్ణోత్పత్తి క్రమం…
శ్లో// నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌
ఏతద్విమర్శేత్‌ శివసూత్రజాలం
నటరాజైన శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని 14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్‌ 2) ఋ, ……(అచ్చు)క్‌ 3) ఏ, ఓ, ఙ్‌, 4) ఐ, ఔ, చ్‌ 5) హ, య, వ, ర, ట్‌ 6) ల, ణ్‌ 7) ఞ, మ, ఙ, ణ, న, మ్‌ 8) ఝ, భ, ఞ్‌ 9) ఘ, ఢ, ధ, శ్‌ 10) జ, బ, గ, డ, ద, శ్‌ 11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్‌ 12) క, ప, య్‌ 13) శ, ష, స, ర్‌ 14) హ, ల్‌.
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను… అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు ఏర్పడి ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ లిపి రూపంలో ఉన్న అక్షరాలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనయ్యాయి. చివరకు దేవనాగరి లిపిలో, వివిధ ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అక్షరాలకు ఈశ్వరానుగ్రహంవల్ల లభించిన ధ్వనులే మూలం. ‘‘తల్లి సమస్త భాషలకు దైవతభాషయ’’ అన్నట్లు అన్ని భాషలలోని అక్షరాల ఉచ్చారణకూ ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. అందుకే భారతీయ భాషలలో చాలా వరకు, కొన్ని సందర్భాలలో ఇతర భాషలలోకి సంస్కృతం చొచ్చుకుపోగలిగింది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి. అవే ‘అక్షరములు’ (నాశము లేనివి)గా నాటినుంచి నేటిదాకా ఉన్నవి. ‘క్‌+ష=క్ష త్‌+ర=త్ర జ్‌+ఞ=జ్ఞ’ ఇతర సంయుక్తాక్షరాల వంటివేగానీ, స్వతంత్రాక్షరాలు కావు. ఇలాంటి అక్షరాలను ఉచ్చరించడానికి అనువుగా ఉన్న ఈ శరీర భాగానికి ‘‘ఆస్యమ్‌’’ అని నామకరణము చేశారు. ‘‘ఆస్యంతి ఉచ్చారయంతి వర్ణాన్‌ అనేన ఇతి ఆస్యమ్‌’’- అంటే… ‘నోరు’ అని మన మాటల్లో చెప్పుకోవచ్చు. నోటిలో కూడా ఏయే భాగంతో ఏయే అక్షరాలు ఉచ్చరించటం సాధ్యమో కూడా వివరించారు.
మూడు భాగాలు
ఇందులో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్‌’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ……, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్‌’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో ఏయే ప్రదేశంలో ఏయే అక్షరాల పుట్టుక జరిగిందో దాన్ని కూడా సవివరంగా తెలిపారు.
1) అ, కు, హ విసర్జనీయానాం కంఠః
2) ఇ, చు, య, శానాంతాలు అని ఇలాంటి సూత్రరూపంలో తెలియజేశారు.
1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ (8) వసర్గలు – – – – – – – – వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ – – – – – వీటికి దవడలు (తాలు).
3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష – – – – – – – వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
4)…., త, థ, ద, ధ, న, ల, స- – – – – వీటికి దంతాలు.
5) ఉ, ప, ఫ, బ, భ, మ – – – – – – – – వీటికి పెదవులు (ఓష్ఠములు).
6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
7) ఏ, ఐ – – – – – – – – కంఠం, దవడలు.
8) ఓ, ఔ – – – – – – – కంఠం, పెదవులు.
9) వ, – – – – – – – – దంతాలు, పెదవులు.
10) ః ఖ – – – – – – – – జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
11) (0) సున్న
ఆ తర్వాత ‘హ్రస్వాలు, దీర్ఘాలు’ అనే మార్పుతో మరిన్ని అక్షర రూపాలు ఏర్పడ్డాయి. ముందు చెప్పినట్లుగా ఈ అక్షరాలతో పద, వాక్య నిర్మాణం జరిగి మనసులోని భావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నవారికి తెలిపే అవకాశం ఏర్పడింది.
 టి.సుధాకరశర్మ
70363 70381

 

 సాహితీ బంధువులకు17-2-15 మంగళవారం  శ్రీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

మనం ఏటా మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. దీనికి కారణం? పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఒకసారి బ్రహ్మ విష్ణువుతో ‘‘నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’’ అని అన్నారు. దానికి విష్ణువు ‘‘నీవు నా బొడ్డులో పుట్టావు కనక నేనే గొప్ప’’ అని తిరిగి సమాధానం చెప్పారట. ఇద్దరికి ఘోర యుద్ధం మొదలయ్యింది. వారిద్దరికి బుద్ధి చెప్పడానికి పరమేశ్వరుడు ఆకాశము, పాతాళము వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగమై ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మకు, విష్ణువుకు భయం కలిగింది. అప్పుడు ‘‘మీలో నా మొదలూ తుదీ ఎవరు తెలుసుకొని వస్తారో వారే గొప్ప’’ అని శివుడి యొక్క అదృశ్యవాణి వినిపించింది.
బ్రహ్మ హంస రూపం ధరించి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళ్లాడు. విష్ణువు వరాహరూపంతో ఆ జ్యోతిర్లింగం మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ బయలుదేరాడు. ఇలా వారిద్దరు ఎన్నో సంవత్సరాలు వెళ్లినా వారికి ఆ జ్యోతిర్లింగము ఆది అంతాలు కనబడలేదు. అయితే వారు పూర్తిగా అలసిపోయి శివుడిని ప్రార్థించగా శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘‘నేను గొప్ప నేనేగొప్ప అని మీరు అనవసరంగా తగువుపడుతున్నారు. మీకందరికీ నేనే మూలం. మీలోని శక్తికి నేనే కారణం. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణము, ఉపవాసము మొదలగు వాటి చేత నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తులు అవుతారు’’ అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడని శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో ఉంది.
ఈ జ్యోతిర్లింగ విషయమై ఆపాతాలనభస్థలాన్త భువన బ్రహ్మాండ మా విస్పుర జ్యోతి స్ఫాటిక లింగ.. అని మొదలుగు విధాల వర్ణన మహాన్యసంలో కూడా ఉంది. కనక భారతీయులు అనాదిగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటూ, రాత్రి జాగరణం చేసి శివునికి నాలుగు జామల్లో పూజాభిషేకాలు చేస్తూ, మరుసటి రోజు ఉదయం ప్రసాదం తీసుకుంటారు.
శివజాగరణ రహస్యం
‘‘ఇతిహాస పురాణాఖ్యానం వేదం సముప బృహయేత్‌ (భారతం)’’ అంటే ఇతిహాస పురాణాలు వేదార్థాన్ని తెలుపుతాయి అని ఉంది. అందుకే పురాణాల్లో ఈ శివరాత్రి కథకి వేదార్థాన్ని గ్రహించాలి.
తైత్తిరీయ నారాయణంలో మనోబ్రహ్మ అని ఉంది. కనక ఈ విశ్వాన్ని సృష్ట్టించే మనస్సే బ్రహ్మదేవుడు. ‘విష్ణుంకృత్వాథ సారథికు’ అను శృతి ప్రకారము, ‘బుద్ధింతు సారధిం విద్ధి’ ప్రకారం స్థూల శరీరాన్ని రషించే బుద్ధియే విష్ణువు. మనస్సు అనే బ్రహ్మ ఇంద్రియాల రూపంలో అంటే హంసరూపంతో ఎంత ప్రయత్నించినా, బుద్ధి అనే విష్ణువు తర్కరూపం అంటే వరాహరూపంలో ఎంత ప్రయత్నించినా వారిద్దరు ఆత్మ అయిన జ్యోతిర్లింగము యొక్క ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు.
‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ మనస్సు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు. అది అనుభవంతోనే తెలియబడుతుంది.. అని ఈ తైత్తిరీయ ఉపనిషత్‌ వివరణే ఈ కథ.
శివరాత్రి నాడు నిద్ర చేయకూడదు అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అంటే శ్రీ గౌడపాదులు నిద్రా తత్త్వ మజానతః (గౌ.కా) అన్నారు. అందరి స్వరూపమైన ఆత్మ యొక్క పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర.
‘అన్యథా గృహ్లాతః స్వప్నః’ అన్నారు గౌడపాదులు. అంటే ఉన్న ఆత్మను ఉన్నట్లు తెలుసుకోక దానిని దేహమని, మనస్సని, ఇంద్రియాలని తప్పుగా తెలుసుకోవడమే స్వప్నము. ఈ రెండు నిర్వచనాల వల్ల యధార్థ గ్రహణమే జాగ్రత్త (మెలకువ) అని గౌడపాదులు అన్నారు. అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణము. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. గౌడపాదులు అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అన్నారు. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయానిద్ర తొలగి, అజము, అనిద్రము, అస్వప్నము, అద్వైతము అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ. ఇలా తెలుసుకోకుండా ప్రజలు ఈ రోజు శివరాత్రి కనక జాగరణ చేయాలని రాత్రంతా సినిమాలు చూడటం, వేరే వేరే పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు అన్నం తినకూడదు అని రకరకాల తిండి తీర్థాలను జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేసామని భావించకూడదు. ఉప అంటే దగ్గర. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు.
ఇక యామ పూజ, యామం అంటే జాము. ఆ రోజు రాత్రి ప్రతి యామం శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలను అంతర్గతాలు. ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. ఈ నాలుగు యామాలు వాస్తవంగా మాండుంక్యంలోని (స్నోయమాత్మా చతుస్పాత్‌’) ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని తెలుపుతుంది. విశ్వపాదం తైజసపాదంలోను విశ్వతైజసపాదాలు ప్రాజ్ఞపాదంలోను ఈ మూడు పాదాలు తురీయపాదంలోను అంతర్గతాలు. ‘త్రయాణాం’ విశ్వాదీనాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తూరీయస్య ప్రతిపత్తిరితి’ అని శ్రీ శంకర భాగవతాదులు మాండూక్య భాష్యంలో చూపారు. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయములు అద్వితీయ ఆత్మలో వికల్పాలని గుర్తిస్తే ఆ నాల్గవ యామం చివరిలో తెల్లవారినట్లు అప్పుడు పరమార్థ జ్ఞానోదయం కలుగుతుంది. ఇదే శివ జాగరణ రహస్యం.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి,
విశాఖ శారదాపీఠాధిపతి,
ఫోన్‌ : 9966669658
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విభ్రాంతి విరిగి పోయింది -సినారే కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రా హెమింగ్ వె కేశవరెడ్డి అసామాన్య రచన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీయర్ గారి లక్ష దీపారాధన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment