బాహుబలి గురించి దర్శకుడు రాజ మౌళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సి.వి అనే చిత్తజల్లు నరసింహా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగా యుగం



Gabbita Durga Prasad

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -3

S సుగుణా దేవి రచనలు -2

S.Suguna Devi Rachanalu-3a S.Suguna Devi rachanalu-3b S.Suguna Devi rachanalu-3c S.Suguna Devi Rachanalu-3d S.Suguna Devi rachanalu-3e S.Suguna Devi Rachanalu-3f S.Suguna Devi Rachanalu-3g S.Suguna Devi Rachanalu-3h

Posted in సేకరణలు | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -2

S సుగుణా దేవి రచనలు -2S.Suguna devi Rachanalu-2a S.Suguna Devi rachanalu-2b S.Suguna Devi rachanalu-2c S.Suguna Devi Rachanalu-2d S.Suguna Devi Rachanalu-2e S.Suguna Devi Rachanalu-2f S.Suguna Devi rachanalu-2g S.Suguna Devi rachanalu-2h

Posted in సేకరణలు | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -1

S సుగుణా దేవి రచనలు -1

S.Suguna Devi Rachanalu-1a S.Suguna Devi Rachanalu-1b S.Suguna Devi Rachanalu-1c S.Suguna Devi Rachanalu-1d S.Suguna Devi Rachanalu-1e S.Suguna Devi Rachanalu-1f S.Suguna Devi Rachanalu-1g S.Suguna Devi rachanalu-1h S.Suguna Devi rachanalu-1i S.Suguna Devi rachanalu-1j

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పతంజలి చేసిన మహోప ”యోగం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాసు శ్రీరామ కవి -,13 వ శతాబ్దపు కురాన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా శాస్త్ర వైద్యుడు అగ్గలయ్య చూడాల్సిన రాణక్ పూర్ ,రంగులు మార్చే జలపాత్తం -ఆంధ్ర ప్రభ

మహా శాస్త్ర వైద్యుడు అగ్గలయ్య చూడాల్సిన రాణక్ పూర్ ,రంగులు మార్చే జలపాత్తం -ఆంధ్ర ప్రభaggalayya 001 jalpath 001 ranakpur1 001 ranakpur2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఫన్నింగ్ ”కామెంటరి

1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ”

  ”వామ ”చూపు తో అవుతోంది ”ఫన్నింగ్ కామెంటరి ”
2- ”తెలక పల్లి” రవి కి కనిపిస్తుంది ”యోగ” 
     ”యెర్ర ”దనాన్నిపూర్తిగా  మింగే ”డేగ ”. 
3-”మోడీ ”తెచ్చాడు యోగాకి అంతర్జాతీయ” మహా యోగం” 
    చాపకింద నీరు అవుతోంది లలిత్ మోడీ ”అభియోగం ”
4- అధికారం రాక ముందు అంతా ”నీతి మంతులే ”
    వచ్చాక  అవుతారు  బీరకాయిలో ”నేతి మంతులు”  
5-”చంద్రు”లిద్దరి మధ్య రాచకీయ ”పోరు”
     మీడియా కధనాలతో చెవులు ”హోరు ”
6- ఎవరి డబ్బు ఎవరు ఎందు ”కిస్తున్నారో ”
  బెమ్మకైనా తెలీని ”కిమిన్నాస్తిరో”. 
7- తెలుగు నాట వర్షాలే” వర్షాలు ”
   బాబు అడుక్కి జనం హర్షాలే” హర్షాలు ”
8- చానెళ్ళ పై ఏడాది పైగా ”నిషేధం”
   ప్రజాస్వామ్యానికి మరో” మానిషాదం ”
9- ఆద్వానికి మళ్ళీ గుర్తొచ్చింది ”ఎమర్జెన్సీ” 
    భయ పెడుతోందేమో  ”మోడీ యమఅర్జెంసీ  ”
10-వోటుకుఇస్తుంటే ” కోట్ల నోటు ”
     ఇక ఎన్నిక లెందుకు”దండగ  చేటు ” 
11-నేడు తండ్రుల దినం – ”ఫాదర్స్ డే ”
    పేర్ల తో అవుతోంది” ఫూలర్స్  డే ”
 మీ– గబ్బిట  దుర్గా ప్రసాద్ -21-6-15 -ఉయ్యూరు 
    

—

 
Posted in కవితలు | Tagged | Leave a comment

ఉదయ గిరి గుహలు ,బటే శ్వర్ ,దయ్యం కట్టిన వంతెన ,సింగపూర్ లో లిటిల్ ఇండియా -ఆంధ్ర భూమి

ఉదయగిరి గుహలు

  • 14/06/2015
  • |

  • -బి.మాన్‌సింగ్ నాయక్

జైన తీర్థంకరుల స్ఫూర్తితో ఒరిస్సాలోని ఉదయగిరిలో రూపుదిద్దుకున్న రాతి కట్టడాలు కాలక్రమంలో 20 హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. గుప్తుల కాలంలో మహావిష్ణు దశావతారాలను ఉదయగిరి గుహల్లో చెక్కారు. దశావతారాలతోపాటు విఘ్నేశ్వరుడు, శివుడు, దుర్గామాత పది చేతులున్న విగ్రహాలు ఒకే భారీ రాతిపై మలిచారు.
అతిలోతైన చెరువు
అమెరికాలోని అతి లోతైన సరస్సు క్రేటర్ సరస్సు. ఓరెగాన్ రాష్ట్రంలోని ఈ సరస్సు లోతు 1,932 అడుగులు (589 మీటర్లు) అంటే ఈఫిల్ టవర్ లాంటి ఎతె్తైన నిర్మాణాలను రెండింటిని ఈ సరస్సులో నిలువునా ముంచవచ్చునన్నమాట.
ఎస్కిమోలు, ఇన్యూట్‌లు
రష్యా ఈశాన్యపు కొసన అలాస్కాలో ఎస్కిమోలు జీవిస్తున్నారు. ఇన్యూట్ తెగ ప్రజలు ఉత్తర కెనడా ప్రాంతమైన నునావుట్, గ్రీన్‌లాండ్‌లలో ఉంటారు. నునావుట్ అంటే వారి భాషలో ‘మా భూమి’ అని అర్థం.

  • బటేశ్వర్

    • 07/06/2015
    • |

    • -పి.వి.

    ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు 70 కి.మీ. దూరంలో యమునానదీ తీరానగల బటేశ్వర్‌లో దాదాపు 40 దేవాలయాలున్నాయి. ఇక్కడ ఏటా శీతాకాలంలో జరిగే క్యాటిల్ ఫెయిర్‌కు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఇవన్నీ శివాలయాలే. ఈ దేవాలయాల సముదాయం 1300 సంవత్సరాల కాలం నాటిది కావడం విశేషం.
    నలంద
    ఆనాడు ప్రపంచానికి విద్య, విజ్ఞానం అంటే ఏమిటో సరిగా తెలీని రోజుల్లోనే ఒక మహా విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద. వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రదేశాల నుండి వచ్చి అధ్యయనం చేసేవారు. ఇది పూర్తిగా గురుకుల తరహాగా ఉండేది. వేల సంవత్సరాల క్రితమే దాదాపు వంద రకాల విభిన్న శాస్త్రాలను అక్కడ బోధించేవారు. గౌతమ బుద్ధుడు పలు పర్యాయాలు నలందను సందర్శించాడు.
    వైశాలి
    గంగాతీరంలో ఉన్న బీహార్ సారవంతమైన భూమి. ఎటు చూసినా పచ్చని చెట్లు, తోటలు. ఇక్కడే గౌతముడు రత్నసూత్రాన్ని బోధించాడు. మహిళలకు సన్యాస దీక్షను తొలిసారిగా బుద్ధుడు ప్రసాదించింది ఇక్కడే. తన పెంపుడు తల్లి గౌతమిని తొలి సన్యాసినిగా, శిష్యురాలిగా స్వీకరించడం విశేషం.
    కపిలవస్తు
    ఇది నేటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. బుద్ధుడు తన జీవితంలోని మొదటి 30 సంవత్సరాలు గడిపింది ఇక్కడే. నాటి సిద్దార్థుని సౌధం, శిథిలాలు నేటికీ కనిపిస్తుంటాయి. ఆ శిథిల సౌందర్యాలనుబట్టి ఆనాడు ఆ రాజసౌధాలు ఎంతటి అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
    కందిరీగ
    పెప్సిన్ అనే ఆడ కందిరీగ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టే ముందు అది ఒక సాలెపురుగును వెదుకుతూ వెళుతుంది. బాగా లావైన టరాంటురా సాలె పురుగు కనిపించగానే దాని మీద వాలి కాటేస్తుంది. ఆ విష కాటుకు సాలె పురుగు చనిపోగానే దానిని గొయ్యి తవ్వి పాతి పెడుతుంది. పాతిపెట్టిన చోట గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి పెరిగి వచ్చే లార్వా సాలెపురుగు అవశేషాలను భుజించి కందిరీగగా పరిణామం చెందుతుంది.
    టొబాగో ద్వీపం
    వెస్టిండీస్ ద్వీపాల్లో ఒకటైన టొబాగో ద్వీపం, బ్రిటీష్, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ పరిపాలనలలో ఒకరి నుండి మరొకరికి 31సార్లు మారి రికార్డు సృష్టించింది. కరేబియన్ సముద్రంలో నౌకాదళానికి టొబాగో ద్వీపం ఒక కీలక స్థావరం కావడం మూలాన ఈ దేశాలు ఆ ద్వీపం మీద ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. 1819లో బ్రిటన్ ఈ ద్వీపాన్ని ట్రినిడాడ్ ద్వీపంతోపాటు మత సామ్రాజ్యంలోకి చేర్చుకుంది. 1962 దాకా ఈ ద్వీపానికి స్వాతంత్య్రం లభించలేదు.

  • దెయ్యం కట్టిన వంతెన!

    • 17/05/2015
    • |

    • -దుర్గాప్రసాద్

    ఎంతో అందమైన స్విట్జర్లాండ్‌లోని మరింత అందమైన రియాస్ నది ప్రకృతి సంపదకు నిలయం. అంతేకాదు! ఇక్కడ గల ఒక విచిత్రమైన వంతెన గురించి వినిపించే కథలు భయాన్నీ, ఆసక్తినీ కలిగిస్తాయి.
    ఎందుకంటే ఈ ప్రాంతంలోని షాలొనెన్ జార్జ్ అనే చోట గల టిఫెల్స్‌బ్రక్ అనే వంతెన చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి అక్కడి రియాస్ నది ఉన్న ప్రాంతాన్నీ, దగ్గరలోని సెయింట్ గోట్జర్డ్‌ను కలుపుతూ ఊళ్లోకి వెళుతుంది.
    రియాస్ నది దగ్గర నుండి ఊర్లోకి వెళ్లాలంటే ఈ బ్రిడ్జే ఆధారం. అక్కడ వంతెన నిర్మించాలని 1230లో అప్పటి అధికారులు భావించారు. నిర్మాణ పని వారిని పిలిచారు. వారు వచ్చి ఎంతో దిగువగా ఉన్న ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించడం అసాధ్యం అని తేల్చేశారు.
    ఎందుకంటే రియాస్ నదిని ఆనుకుని ఉన్న కొండని తొలిచి రహదారి వేశారు. ఆ రహదారి కొనసాగింపుగా బ్రిడ్జి నిర్మించి, ఊర్లోకి వెళ్లేలా వంతెన ఉండాలని ప్లాన్. అయితే నిట్టనిలువునా ఉండే కొండని కలుపుతూ, నది మీదుగా బ్రిడ్జి నిర్మించడం అసాధ్యమని పెద్దగా సాంకేతిక సౌకర్యాలు లేని అప్పటి నిర్మాణరంగ పనివారు చెప్పారు.
    అక్కడ బ్రిడ్జి నిర్మించడం కేవలం దెయ్యాలకే సాధ్యమని వారు పెదవి విరిచారు. అది విని అధికారులకు ఏం చేయాలో బోధపడలేదు.
    సరిగ్గా అప్పుడే అక్కడొక దెయ్యం ప్రత్యక్షమయిందట. ‘మీకు కావలసిన వంతెనని నేను నిర్మించి ఇస్తాను. కానీ ఒక్క షరతు’ అని చెప్పిందట.
    జరిగిన సంఘటనతో అప్పటికే బిత్తరపోయిన అధికారులు కొంతసేపటికి తేరుకుని ‘ఏమిటా షరతు?’ అని ప్రశ్నించారు.
    దానికా దెయ్యం ‘నేను వంతెన నిర్మించిన తర్వాత దీనిపై నడిచే మొదటి జీవిని నేను ఆహారంగా స్వీకరిస్తాను’ అని చెప్పింది.
    దానికి సరేనన్నారు అధికారులు.
    అప్పుడు ఆ దెయ్యం అతి ప్రమాదకరమైన రియాస్ నదిపై అతి చాకచక్యంగా మూడు రోజుల్లో వంతెన నిర్మించి ఇచ్చిందట.
    ‘నేను వంతెన నిర్మించి ఇచ్చి ఇచ్చాను. మాటకు కట్టుబడి ఈ వంతెనపై నడిచే మొదటి జీవిని నాకు ఆహారంగా ఇవ్వండి’ అని చెప్పి బ్రిడ్జికి అటు చివరికి వెళ్లి కూర్చుందట.
    అప్పుడు బాగా ఆలోచించిన అధికారులు, అక్కడి పెద్దలు దెయ్యం అనుకున్నట్లు మనిషిని కాకుండా ఒక మేకపిల్లని ఆ వంతెన మీదికి వదిలారట.
    దానికి ఆగ్రహించిన దెయ్యం తాను కట్టిన వంతెనని తునాతునకలు చేయడానికి అక్కడున్న అతిపెద్ద బండరాయిని పైకెత్తి ఉగ్రంగా ముందుకొచ్చిందట.
    అధికారులు, గ్రామస్థులు భయంతో అక్కడి నుండి పరుగులు పెట్టారు. అయితే ఎంతసేపైనా అక్కడెలాంటి బీభత్సం జరుగుతున్న అలికిడి వినిపించకపోవడంతో వెనుదిరిగి చూశారట. అప్పుడు వారికొక విచిత్రమైన దృశ్యం కనిపించింది. అప్పుడే కట్టిన వంతెనని నాశనం చేయడానికి దెయ్యం బండరాయితో వస్తుండగా, ఒక వృద్ధురాలు చేతిలో శిలువ తీసుకుని ఆ దెయ్యానికి ఎదురుగా వెళుతూ కనిపించిందట.
    వృద్ధురాలి చేతిలోని శిలువని చూసిన దెయ్యం భయంతో అరుస్తూ వంతెనని నాశనం చేయడానికి పైకెత్తిన బండరాయిని పడేసి అక్కడ నుండి పారిపోయిందట.
    దెయ్యం వదిలేసి పోయిన బండరాయి ఆ తర్వాత చాలా సంవత్సరాలు టిఫెల్స్‌బ్రక్ వంతెన వద్ద కనిపించేది. ఆధునిక కాలంలో ఆ బండరాయిని పరీక్షించి చూస్తే దాని బరువు 220 టన్నులని తేలింది. ఆ బండరాయిని 1977లో అక్కడికి దగ్గరలో మోటారు వాహనాలు వెళ్లే దారి నిర్మాణం కోసం తరలించారు. 1230లో దెయ్యం కట్టినట్లు చెప్పబడుతున్న ఆ వంతెనను ఆధునీకరించారు. ఈ బ్రిడ్జి మీద నడిస్తే అవతలికి చేరుకోవడానికి అరగంట పడుతుంది. దీని మీదుగా నడుస్తూ కిందనున్న రియాస్ నదిని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. దెయ్యం కట్టిన వంతెన గురించి తెలుసుకున్న ఎంతోమంది టూరిస్టులు ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

  • సింగపూర్‌లో లిటిల్ ఇండియా

    • 10/05/2015
    • |

    • -పుట్టా సోమన్న చౌదరి

    సింగపూర్ రోడ్లపై అంతవరకు ప్రశాంతంగా పర్యటిస్తూంటే.. ఒక్కసారిగా హైదరాబాద్‌లోని కోఠి లేదా చెన్నైలోని పాండీబజార్‌కి వెళ్లినట్లు అనిపిస్తే కచ్చితంగా అది సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతమని చెప్పవచ్చు. ఢిల్లీ వాసులైతే ఇది చాందినీ చౌకా అనీ, ముంబై వారు ఝవేరీ బజారుకొచ్చామా? అని ఆశ్చర్యపోతారు.
    సింగపూర్ వెళ్లిన ఏ భారతీయుడైనా మెర్‌లైన్ (సగం సింహం సగం చేప బొమ్మ) పర్యాటక ప్రదేశాన్ని చూడటం ఎంత సహజమో ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాన్ని చూడటం అంతే సహజం.
    ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ ఇండియా ప్రాంతాన్ని ‘మోడల్ ఇండియా’ అని పిలిస్తే బాగుంటుందేమో. లిటిల్ ఇండియా బజార్‌కి వెళ్లగానే హిందీ, తమిళం, తెలుగు భాషలు గుప్పుమంటాయి. మన దేశంలోలాగే ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్లటం కనిపిస్తుంది. కార్ల హారన్లతోపాటు సైకిల్ గంటల శబ్దాలు వినిపిస్తాయి. ప్లాట్‌ఫారాలు రకరకాల వస్తువులతో నిండిపోయి ఉంటాయి. ఇంకా కొనుగోళ్ల కోసం రాతపూర్వక ఆహ్వాన బోర్డులే కాదు రండి – ఆవోబాయ్ అంటూ ప్రార్థనాపూర్వకమైన గొంతులు వినిపిస్తాయి.
    సింగపూర్‌లోని సెరంగూన్ ప్రాంతంలో లిటిల్ ఇండియా ఉంది. ఇది సింగపూర్‌లోని ఇతర ప్రాంతాలకంటే సందడిగా ఉండటమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉట్టి పడుతుంది. షార్టులు, జీన్సులే కాదు లుంగీలు, ధోవతీలు, చీరలు ధరించిన వారు కనిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడి వంటశాలల ఘుమఘుమలు ఆఘ్రాణించి తీరాల్సిందే. మల్లెలు, సంపెంగలు, అరటి ఆకులు, వేరుశెనగ గంపలు, కిళ్లీలు, అటుకుల మిక్చర్ తోపుడు బండ్లు, దినపత్రికలు అమ్మే కుర్రాళ్లు, రోడ్డు పక్కన చౌకరకం రెడీమేడ్ వస్త్రాలు అమ్మేవాళ్లు, చివరకు తాయత్తులు కట్టేవారు, వాచీలు, తాళాలు రిపేరు చేసేవారు కనిపిస్తారు. కూరగాయల్లో ములక్కాడలే కాదు ములగ ఆకు, కరివేపాకు, చింత చిగురు కూడా కనిపిస్తాయి. వెండి, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, మసాలా దినుసులు అమ్మకం గురించి చెప్పనే అక్కర్లేదు. అగరబత్తులు, సెంట్లు సువాసనలు ముక్కులను తాకుతూ ఉంటాయి. ఖర్జూరం బళ్లు కూడా కనిపిస్తాయి. ఈ లిటిల్ ఇండియాలో అన్ని రకాల భారతీయ వస్తువులు దొరుకుతాయి. చౌక భోజనాలు, టిఫినే్ల కాదు కాస్త ఖరీదైన భారతీయ వంటకాలు లభించే ఇండియన్ రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి. వాటి ముందు డిస్‌ప్లే బోర్డులు దర్శనమిస్తాయి. ఇక టేకా మార్కెట్ ఫుడ్ సెంటర్‌లోని తోపుడుబండ్లపై భారతీయ భోజనం, ముఖ్యంగా మటన్, చికెన్, రొయ్యల బిర్యానీలు దొరుకుతాయి. సింగపూర్‌లో పెద్ద సంఖ్యలో ఉండే అల్పాదాయ కార్మికులకు చౌక భోజనాలు దొరికేది ఇక్కడే. కాస్త ధర ఎక్కువైనా జోజీఆవో ఫుడ్ సెంటర్‌కి తప్పక వెళ్లాలి. అచ్చమైన భారతీయ సంప్రదాయ భోజనం కావాలంటే కోమలా విలాస్ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. లోయర్ సెరెంగూన్ రోడ్డు నుండి కిచనేర్ రోడ్డు వరకు ఎన్నో ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బఫైల్లో రోడ్, కెరంబూరోడ్, బలీలియా రోడ్, కరైకొడి సెంటర్, డన్‌లప్ స్ట్రీట్, క్యాంప్ బెల్ లైన్, హెండ్సన్ రోడ్, చందర్‌రోడ్, కాంసోగ్‌కాపూర్ రోడ్‌లలో షాపింగ్ చేయవచ్చు. 1950లో నెహ్రూ శంకుస్థాపన చేసిన గాంధీ మెమోరియల్ హాల్ కూడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని శ్రీలక్ష్మి మందిరం, కలియమ్మన్ మందిరం, శ్రీనివాస్ పెరుమాళ్ అనే వేంకటేశ్వర స్వామి ఆలయాల వల్ల కూడా లిటిల్ ఇండియా రద్దీ ప్రాంతంగా మారిందని చెప్పవచ్చు. లిటిల్ ఇండియా ప్రాంతానికి అండర్‌గ్రౌండ్ రైలు మార్గం ఉంది. స్టేషన్ నుండి బయటికి రాగానే సెంటర్ కనిపిస్తుంది. ఇది చాలా రద్దీ ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక లిటిల్ ఇండియాకి అతి సమీపంలోని ముస్త్ఫా సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది 24 గంటలూ తెరిచి ఉండే అతి పెద్ద షాపింగ్ మాల్. సింగపూర్ టూర్‌లో గైడ్లు ఈ షాపింగ్ కోసమే పది పనె్నండు గంటలు కేటాయిస్తారు. ఇక్కడ గుండుసూది మొదలుకొని దొరకని వస్తువంటూ ఉండదు.
    సింగపూర్‌లో సుందరమైన భవనంగా కీర్తించే లినోంగ్‌సేన్ బౌద్ధ మందిరం లిటిల్ ఇండియా ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది. సింగపూర్ వెళితే మెరలైన్ సింహాన్ని, కేబుల్ కార్లనే కాదు ‘లిటిల్ ఇండియా’ను కూడా తప్పక చూడాలి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగా’కి రాజయోగం

యోగా’కి రాజయోగం

  • 21/06/2015
  •  -బి.వెంకటప్రసాద్

వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన యోగా వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. గతంలో యోగాను విశ్వసించేవారు, సాధన చేసే వారు, ఆచరించేవారు ఎంతో మంది ఉన్నా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా గుర్తించడంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా సంబరాలు మొదలయ్యాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే యోగాను ఇపుడు ప్రపంచం యావత్తూ అక్కున చేర్చుకుంటోంది. యోగా ఐదువేల ఏళ్లుగా భారత్‌లో ప్రాచుర్యంలో ఉంది. గెలుపు స్థిరం కాదు, ఓటమితో అంతా అయిపోదు. కానీ- ప్రతి మలుపులో గెలుపును చూడాలి. ఎందుకంటే విజేతల జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిలకడ లేని పరిణామాల మీద హృదయాన్ని నిలబెట్టి విజయానికి అదే దారి అనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అలా మనసుకు అలవాటు చేసుకోవాలి. మనసును నియంత్రించి, అది మనం చెప్పినట్టు వినాలంటే దానికి ఏకైక మార్గం యోగాభ్యాసం. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్యం విషయంలో మాత్రం తీవ్రమైన అలసత్వాన్ని పాటిస్తుంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం మానేసి, తీరా రోగాలు వచ్చిన తర్వాత వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటాం. అసలు రోగమే రాకుండా నిరోధించే దివ్య ఔషధం అరచేతిలోనే ఉన్నా మనం పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధమే- యోగా. భారతీయ సనాతన ధర్మం నుండి ఆవిర్భవించి నేటికీ కొనసాగుతున్న ఆరోగ్య సూత్రమే యోగా. సనాతన ధర్మానికి ఆనవాలుగా నిలుస్తూ, సత్కర్మలు భోధించి సన్మార్గంలో నడిపించే వేదభూమిగా భారతదేశానికి మంచి పేరుంది. ఉపనిషత్తుల్లోని ఎన్నో అద్భుత మార్గాలతో జీవన విధానాన్ని అందించిన నేల మనది. ఈ జీవన విధానానే్న నేడు ప్రపంచం మార్గదర్శకంగా తీసుకుంటోంది. ఆ మార్గదర్శకమే యోగా రూపం. ప్రకృతిపరమైన సౌందర్యం, కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి కూడా యోగా యోగదాయకమైంది. యోగా కారణంగా శరీరంలో కాంతి పెరుగుతుంది. ముఖవర్ఛస్సుతో కళ పెరుగుతుంది. శరీరంలో అవసరంలేని కొవ్వు కరిగిపోతుంది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా భావిస్తున్నా, వేల ఏళ్ల సంవత్సరాల నుండి యోగా పలురూపాల్లో ఆచరణలో ఉంది. అన్ని మతాల వారు, కులాల వారూ యోగాను సాధన చేస్తున్నారు. దాన్ని తెలుసుకుని సరైన రీతిలో సాధన చేస్తే ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. యోగా సాధనకు, ఆంతరంగిక శిక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంతోమంది యోగులు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిర్వచించారు. వేల ఏళ్ల చరిత్ర… క్రీస్తుపూర్వం వంద శకం నుండి 500 శకం మధ్య కాలంలో పతంజలి యోగా శాస్త్రాన్ని రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగా సూత్రాలుగా క్రోడీకరించాడు. సూత్రం అంటే దారం. దారంలో మణులను చేర్చినట్టు యోగాశాస్త్రాన్ని పతంజలి ఒక చోట కూర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివసంహిత అందులో ప్రధాన భాగాలు, వీటిలో కర్మయోగ, జ్ఞాన యోగ, రాజయోగ, భక్తియోగ అంతర్భాగాలు. వ్యాసుడు రచించిన భగవద్గీతలో కూడా యోగాసనాలపై 18 భాగాలుగా వివరణ ఉంది. అసలు యోగా అంటే ఏమిటి? యోగం అంటే సాధన, యోగం అంటే అదృష్టం, భగవద్గీతలో అధ్యాయాలకు యోగాలు అని పేరు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగా దర్శనం కూడా ఒకటి. యోగాదర్శనానికి ప్రామాణికం పతంజలి యోగాశాస్త్రం. యుజ్ అంటే కలయిక అని అర్థం. ఇది సంస్కృతం నుండి వచ్చింది. యోగ లేదా యోగం అనే పదం యుజ్ నుండే ఉత్పన్నమైంది. యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకుని, చిత్తాన్ని ఈశ్వరునిపై లగ్నం చేసుకుని మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి సామాన్య స్థితికి చేరడం లేదా పరమార్థతత్వం అర్థం చేసుకుని ఏకాగ్రతను సాధించడమే యోగా. యోగా అంటే చిత్తవృద్ధి విరోధం. స్థిరంగా ఉండి సుఖాన్ని అనుభవించడమే యోగా. యోగాభ్యాసంతో వైరాగ్యం పోతుంది, చిత్తవృత్తులు నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా మనసును మన ఆధీనంలోకి తెచ్చుకునే యోగా సాధననే పతంజలి అష్టాంగ యోగా అన్నారు. దీనినే రాజయోగం అని అలవాటుగా చెప్పుకుంటున్నాం. పతంజలి యోగా సూత్రాలు నాలుగు అధ్యాయాలు. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అని అంటారు. మానసిక శుద్ధికి కావల్సిన యోగాలు అవి. శారీరక దారుఢ్యానికీ, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగ కూడా వివరిస్తుంది. సమాధి పద అంటే ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించడం, సాధన పద అంటే రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో తెలుసుకోవడం, విభూతి యోగ అంటే యోగ సాధనలో నైపుణ్యాన్ని సాధించడం, మోక్ష సాధన ఎలా పొందాలో తెలుసుకోవడమే కైవల్యపద. వీటన్నింటికీ ఉదాత్తమమైన మరో మార్గం అష్టాంగపద యోగం. దీనిని సాధన చేయాలంటే అనేక కఠినమైన నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఈ యోగంలో భాగంగా ఉంటాయి. అసత్యం పలకరాదు, హింసకు పాల్పడరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం తాకరాదు వంటి పలు కఠినమైన నిబంధనలు ఉంటాయి. శుభ్రత పాటించడం, సంతోషంగా, ఆనందంగా ఉండటం కూడా ఈ యోగా చేయాలంటే అనివార్యం. మనిషికి జ్ఞానం, విజ్ఞానం, అర్థం తెలియజెప్పే మహత్తర సూత్రం యోగం. ప్రతి మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీ మండలాలు 6 ప్రధానంగా ఉంటాయి. మానవుడిలో ఉండే ప్రాణశక్తి కారణంగా అతడు సజీవంగా ఉండగలుగుతాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించడం వల్ల శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. వెలువడే ఆ శక్తి పేరే కుండలినీ శక్తి. ఆ శక్తిని ప్రేరేపించడం వల్ల మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే గాక, ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడు. ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాలుగా యోగాభ్యాస ప్రక్రియలను, యోగాసనాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధునిక సమాజం దీని వల్ల ఎంతో ప్రశాంతత పొందుతోందని పరిశోధనల్లో, స్వానుభవాలతో తేటతెల్లమైంది. ఇతర వ్యాయామాలు శారీరక దారుఢ్యాన్ని మాత్రమే మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. యోగాభ్యాసం మాత్రం ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మానసిక ప్రశాంతతకు, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక వత్తిడులు తగ్గించడం, హృద్రోగం, రక్తపోటును అదుపు చేయడం, వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది. మనం దేవుళ్లను గమనించినపుడు వారు ఏదో ఒక యోగాసనంలోనే మనకు దర్శనం ఇస్తారు. యోగాపై పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రస్తావన ఉంది. దేవదేవుడైన ఈశ్వరుడు తపస్సు చేస్తున్నపుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్టు పురాణాల్లో వర్ణించారు. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే, మహావిష్ణువు నిద్రను యోగనిద్ర అంటారు. బౌద్ధ సంప్రదాయంలోనూ, జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధానపాద్ర పోషిస్తోంది. ఆశ్చర్యకరం ఏమంటే సింధు నాగరికతలో కూడా యోగా చిత్రాలను మనం గమనిస్తాం. ఇతర వ్యాయామాల కంటే భిన్నమైనది, నిబిడీకృతంగా ఆధ్యాత్మిక భావం ఉన్నది యోగాభ్యాసం. ఇదే కారణంతో దేశవిదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యం లభించింది. తేలికగా ఆచరించదగింది కావడంతో పాశ్చాత్యదేశాల్లో కూడా యోగాకు మక్కువ పెరిగింది. దీంతో భారతీయ సంప్రదాయక యోగా నిపుణులు ఇతర దేశాల్లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యోగా హిందువుల ధ్యానమార్గంగా భావించడం కూడా ఇటీవల వివాదాలకు దారితీస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యనమస్కారాలకు ఇటు క్రైస్తవుల నుండి అటు ముస్లింల నుండి అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. యోగా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఐక్యతను చాటుకునేలా ముస్లింలు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వివాదం లేకుండా చూడటానికి అధికారికంగా యోగా కార్యక్రమం నుండి సూర్య నమస్కారాలను తొలగించామని, నిజానికి వాటికి మతంతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం కార్యక్రమం సజావుగా జరగాలన్నదే తమ సంకల్పమని పేర్కొంది. శ్లోకాలు తప్పనిసరేమీ కాదని, వాటికి బదులు అల్లా అని ముస్లిం మతస్థులు వల్లించుకోవచ్చని కూడా సూచించింది. యోగా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడంపై కూడా కొన్ని మైనార్టీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింలు ఆచరించే నమాజ్- యోగా కాకున్నా, అందులోనూ యోగా ఉందని, నిజానికి యోగాను వ్యతిరేకించేవారు మానవాళికే శత్రువులని, యోగాకు మతానికి అస్సలు సంబంధమే లేదని మజ్లిస్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు వౌలానా సయ్యద్ కౌకబ్ మఖ్తాబా అంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలిపిన 177 దేశాల్లో 47 దేశాలు ఇస్లామిక్ దేశాలేనని గుర్తుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాల విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మతాలకు, వివాదాలకు అతీతంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావించింది. ఈ సందర్భంగా నిర్వహించే రెండు కార్యక్రమాలు ప్రపంచ రికార్డును నమోదు చేయబోతున్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థకు కూడా ప్రభుత్వం ఈ విషయమై సమాచారాన్ని పంపించింది. ఆయుష్ సంస్థ ఈ మేరకు రెండు రికార్డులను నమోదుచేయాల్సిందిగా గిన్నీస్ రికార్డ్సు సంస్థను కోరింది. 651 జిల్లాల్లో… అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ నెల 21న దేశ రాజధానిలో యోగా ప్రదర్శనలు భారీ ఎత్తున జరుగుతాయి. రాజ్‌పథ్‌లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో 45 వేల మంది పాల్గొంటారు. మొత్తం 15 ఆసనాలను 35 నిమిషాల పాటు వేస్తారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరై యోగా విశిష్టతను వివరిస్తారు. దేశ వ్యాప్తంగా 651 జిల్లాలతో పాటు దిల్లీ నగరంలోనూ పెద్ద సంఖ్యలో యోగా శిబిరాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్యనమస్కారాలు అభ్యంతరమైతే హిందూయేతర మతస్థులు వారి మతాలకు చెందిన బోధనలను చదువుకోవచ్చు. రాజ్‌పథ్‌లో యోగా దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. టైమ్ స్క్వేర్‌లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ మన్‌హట్టన్‌లోని టైమ్‌స్క్వేర్‌లో యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ప్రధాన కార్యక్రమం ఇది. సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అధ్యక్షత వహిస్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్యాంకుటిసా కూడా దీనికి హాజరవుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారు. టైమ్ స్క్వేర్ నుండి అనేక కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న ఐరాసలో ఆయన చేసిన ప్రతిపాదనను 177 దేశాలు బలపరిచాయి. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే, సమితిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం. గత అక్టోబర్ 22న తీర్మానం ఆమోదించారు. మొదటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికాలోని వంద నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుకొచ్చిన కార్పొరేట్లు.. యోగా పట్ల అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మొబైల్ అప్లికేషన్లు రూపొందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు బ్లాగ్‌లు, పోర్టళ్లు ప్రారంభించాయి. సమయ పరిమితి మినహాయింపు.. రోజా ఇఫ్తార్ తర్వాత కూడా యోగా చేయాలని భారత్‌లోని ముస్లిం వర్గాలు భావిస్తే అలాగే చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాము నిర్దేశించిన సమయం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర సంస్థలకు మాత్రమేనని మిగిలిన వారు తమకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చని పేర్కొంది. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు తమ మతానికి చెందిన ప్రవచనాలను మననం చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ముస్లిం మతస్థులు నమాజ్ చేయడం అంటే యోగా చేయడం వంటిదేనని యోగా, ఏ ఒక్క మతానికో పరిమితం అయింది మాత్రం కాదని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంది. 10 రూపాయలు, వంద రూపాయలు విలువ చేసే నాణాలను కూడా ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ యోగా కార్యక్రమం ఉదయం 7.00 నుండి 7.35 గంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆసనం ప్రధానం.. యోగాలో ఆసనం అనేది ఒక కీలక ఘట్టం. ఆసనం అంటే ఒక భంగిమ. మానవ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలుగుతుంది. అందుకు తగ్గట్టు శరీర నిర్మాణం ఉంటుంది. క్రమపద్ధతిలో హృదయానికి, శరీరానికి ఉపయోగపడే భంగిమలను ఆసనాలుగా గుర్తించారు. జీవితాన్ని ఒక ఉన్నతమైన పార్శ్వానికి తీసుకువెళ్లేది లేదా ఉన్నతమైన అవగాహనను అందించేది యోగా. అందువల్ల ఎలాంటి భంగిమ అయితే మనల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళ్తుందో దానినే మనం యోగాసనం అంటున్నాం. మనకు తెలిసి, అలవాటుగా చేసుకుంటున్న యోగాసనాలు చాలా తక్కువ. తెలియనివి చాలా ఉన్నాయి. శరీర వ్యాయామ విధానాలే యోగాసనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి కావడానికి ఇవి దోహదపడతాయి. ముక్తికి మార్గం.. దైనందిన జీవితంలో శరీరం సహజంగానే ఒక భంగిమను ఎంచుకుంటుంది. అపుడే మనం ఆనందంగా ఒక విధంగా కూర్చోగలుగుతాం. ప్రశాంతంగా లేనప్పుడో, కోపంగా ఉన్నపుడో మనం మరో విధంగా కూర్చుంటాం. ఎవరైనా ఎలా కూర్చున్నారన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని వారి మనసు లోపల ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు. అయతే, యోగాసన శాస్త్రం ఇందుకు భిన్నమైన సూచన చేస్తుంది. చేతనంగా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం ద్వారా ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవచ్చు. యోగాసనాల్లో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. అవి 84 శరీర భంగిమలని మాత్రం కాదు. ఇవి ముక్తి సాధించడానికి తగిన వ్యవస్థలు లేదా సరైన మార్గాలు. యోగాసనంలో ప్రావీణ్యం ఉంటే చాలు ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు. యోగాసనాలు కేవలం వ్యాయామ ప్రక్రియలు మాత్రమే కాదు. ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుకతో చేయాల్సి ఉంటుంది. యోగా సూత్రాల్లో పతంజలి ‘సుఖం స్థిరం ఆసనం’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యవంతమైనదో, అత్యంత స్థిరమైనదో అదే మీ ఆసనం. మానవ శరీరం పూర్తి ఉత్తేజంతో, సమతుల్యతతో ఉంటే అప్పుడు ఎవరైనా ఊరికే కూర్చున్నా ధ్యానంలోనే ఉంటారు. ఆసనం అనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందుకే ఆసనాలు చురుకైన ధ్యానమార్గాలు. యోగా సాధనతో శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేడు మనిషి జీవనకాలం పెరిగినా, బతికినన్ని రోజులూ అనేక రోగాలతో బాధపడుతూ ఎంతోమంది రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం యోగా సాధనే. రోగం వచ్చిన తర్వాత పరుగులు తీసేకంటే రాకుండానే శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా తోడ్పడుతుంది. ఎక్కువ మంది ప్రాణాయామం, శవాసనం చేస్తుంటారు. వీటివల్ల చాలా లాభాలు ఉన్నా, ఆచరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యోగులు చెబుతున్నారు. యోగా ఇపుడు భారతీయులకో పెద్ద పండగ. సగటు భారతీయుడి ఆరోగ్యమే భారతదేశ ఆరోగ్యం. అదే దేశ సమర్థతకు, సామర్థ్యానికి చుక్కాని అవుతుంది. *** ప్రచారకర్తలు యోగాపై ప్రచారం కోసం ఇప్పటికే సినిమా, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీల సేవలను ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయంచింది. యోగా దినం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు ఇప్పటికే మీడియాలో ప్రచారం ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, నటి శిల్పాశెట్టి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ లాంటి వారిని యోగాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. మోదీ ప్రత్యేకత ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని ఈ నెల 21న భారీ కార్యక్రమం జరుగుతున్నా, తొలి నుండి ప్రధాని నరేంద్రమోదీకి యోగాసనాలపై మక్కువ ఎక్కువ. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున విధిగా యోగాసనాలు వేసేవారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తప్పకుండా యోగాసనాలు వేయాలని, తద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ఆయన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మనుషులంతా ఒక్కటే అనే భావన కూడా యోగా కారణంగా కలుగుతుందని మోదీ విశ్వసిస్తారు. యోగా శారీరక, మానసిక వికాసానికి, సమాజ శాంతికి దోహదం చేస్తుందని, ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ఆయన నమ్ముతారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాల్పుల విరమణతో కథ కంచికి!?

కాల్పుల విరమణతో కథ కంచికి!?
రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ వర్షాలతో వాతావరణం చల్లబడింది. విచిత్రంగా గత కొద్ది రోజులుగా సెగలు పుట్టించిన రాజకీయ వాతావరణం కూడా రెండు రోజులుగా కొంత చల్లబడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని కాలు దువ్వుకున్న ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత చానల్‌కు ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసు వ్యవహారంతో విషయం మళ్లీ మొదటికి వచ్చిందనే అభిప్రాయం కలిగినప్పటికీ… అందులో నిజం లేదనే చెప్పవచ్చు. గడచిన మూడు వారాలుగా తెలుగు రాష్ర్టాలను సలుపుతూ వచ్చిన టేపులు, ట్యాపింగ్‌ వ్యవహారం హఠాత్తుగా ప్రాధాన్యం కోల్పోవడానికి కారణం ఏమిటి? అసలు ఏమి జరిగింది? అన్న కుతూహలం ప్రజల్లో నెలకొంది. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారనీ, ఇక ఆయన పదవీ త్యాగం చేయక తప్పదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భలే దెబ్బకొట్టారనీ చంద్రబాబు వ్యతిరేకులు సంబరపడిపోయారు. రాజకీయ పార్టీల అధీనంలో ఉన్న మీడియాల్లో చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఒక్కటే మిగిలిందని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకు తెచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఏపీ మంత్రులు జబ్బలు చరచుకున్నారు. ఇద్దరు చంద్రుల మద్దతుదారులు సోషల్‌ మీడియాలో హైరానా పడిపోయారు. సొంత సమస్యల గురించి ఆలోచించకుండా తమ సృజనాత్మకతను ప్రయోగించి ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలలో పోస్టింగులు పెడుతూ అలౌకిక ఆనందం పొందారు. మొత్తంమీద మద్దతుదారుల ఉన్మత్త ప్రేలాపనలు కొనసాగుతూ ఉండగానే ఇరువురు ముఖ్యమంత్రులు తెల్ల జెండా ఎగురవేయబోతున్నారన్న సమాచారం అందుతోంది. అంతవరకు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ రెచ్చిపోయిన కేసీఆర్‌ మీడియా కూడా గురువారం నుంచి కొంత వెనక్కు తగ్గింది. ఆయన సొంత పత్రికలో మొదటి పేజీలో ఓటుకు నోటు అంశంపై ఒక్క వార్త కూడా కనిపించలేదు. అంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యం అన్న అనుమానాలు సహజంగానే పొడచూపుతాయి. దీంతో చంద్రబాబు సేఫ్‌ కదా అని ఆయన మద్దతుదారులు అనునయించుకోవడం మొదలుపెట్టారు. ఓటుకు నోటుతో మొదలై ఎన్నో మలుపులు, సుడులు తిరిగి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ దగ్గరకు చేరి… రెండు రాష్ర్టాల ప్రజల మధ్య అంతరం సృష్టించిన ఈ వ్యవహారంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత తాత్కాలికమా? శాశ్వతమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, రాజకీయ నాయకుల ఎత్తుగడలు తెలియని వారికి మాత్రమే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నేను క్రితం వారం పేర్కొన్నట్టుగానే రాజకీయ నాయకులు ఒక హద్దు దాటి ముందుకు వెళ్లరు. వెళితే ఏమవుతుందో వారికి తెలుసుగానీ, వారిని గుడ్డిగా సమర్థించేవారికి తెలియదు. మొత్తం ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ పైచేయికాగా, వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నవాళ్లు, ఏదో జరుగుతుందని భ్రమించినవాళ్లు మాత్రం చిత్తు అయ్యారు.
 ఎత్తుకు పైఎత్తు
ఇంతకీ ఇద్దరు చంద్రుల మధ్య కాల్పుల విరమణ ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమయంలో ఈ వ్యవహారంతో లాభపడింది ఎవరు? భంగపడింది ఎవరు? కూడా తెలుసుకుందాం. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి చిక్కుకున్ననాటి నుంచి రెండు రోజుల క్రితం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలోనే ఉన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల వల్ల తెలుగు ప్రజల మధ్య మరింత అంతరం ఏర్పడి అది ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడినా, ఈ వ్యవహారం మాత్రం జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ఠను మసకబారేట్టు చేసింది. దీంతో రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోని చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టడంతో పాటు, తన పలుకుబడిని అంతా ఉపయోగించి టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించారు. అంతే, అందుబాటులో ఉన్న మంత్రులను, ఇతర పార్టీ ముఖ్యులను పిలిపించుకుని జరిగినదంతా వివరించి టేపుల వ్యవహారం వల్ల తాను రాజీనామా చేసే పరిస్థితి ఉండదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రయోగించడానికి తనకు బ్రహ్మాస్త్రం లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందీ లేనిదీ 24 గంటలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రులు అల్టిమేటం జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి ఇంటికి రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులను కేసీఆర్‌ పంపారు. పనిలో పనిగా మరో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటికి కూడా పంపి నోటీసులు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించలేదని నమ్మడం వల్లనే కేసీఆర్‌ ఈ చర్యకు పూనుకుని ఉండవచ్చు. అయితే, గురువారం సాయంత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రికి తత్త్వం బోధపడింది. ఈ దశలో మనం ఒక అడుగు ముందుకు వేస్తే చంద్రబాబు రెండు అడుగులు ముందుకు వేస్తారు. అందరం మునిగిపోతామని అధికారులు కూడా ఆయనను హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో అదే రోజు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కూడా కలిశారు. అప్పటికే ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించాయని తెలుసుకున్న గవర్నర్‌ కూడా ఓటుకు నోటు వ్యవహారంలో ఇక తగ్గండి అని కేసీఆర్‌కు గట్టిగా సూచించారని వార్తలు వచ్చాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటూ ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహారం ఇంతటితో ఆగకపోతే కొంపలు మునుగుతాయని గుర్తించి గవర్నర్‌ను హెచ్చరించింది. అంతే, వాతావరణం చల్లబడటం మొదలైంది. టేపుల వ్యవహారంలో ఒకరు, ట్యాపింగ్‌ వ్యవహారంలో మరొకరు ఇరుక్కుపోయినట్టు గుర్తించిన ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణకు మానసికంగా సిద్ధమయ్యారు. ఫలితంగానే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గురు, శుక్ర, శనివారాల్లో ఎటువంటి హడావుడి చేయలేదు. ఏపీ మంత్రులు కూడా తాము ఇచ్చిన గడువు దాటిపోయినా ట్యాపింగ్‌ వ్యవహారం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదు. ఇదంతా చూసి నిన్నటి వరకు కొట్టుకున్నవాళ్ల మధ్య ఇంత సామరస్యం, అవగాహన ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం వస్తే అది వారి అమాయకత్వమే అవుతుంది. రాజ్యం పదిలంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నంత వరకు మాత్రమే రాజులుగానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగానీ ఎంత దూరమైనా వెళతారు. ఎన్ని ప్రకటనలైనా చేస్తారు. ఈ క్రమంలో సైనికులు లేదా అభిమానులు కొట్టుకు చచ్చినా పట్టించుకోరు. తమ సీటుకు ఎసరు వస్తుందనుకున్నప్పుడే జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రాంత ప్రయోజనాలు, ఆత్మగౌరవం వంటివి ఏమి గుర్తుకురావు. ఇంతకీ చంద్రబాబు సేకరించిన ఆధారాలు ఏమిటి? ఈ ఎపిసోడ్‌లో ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బకరాలు అయ్యారో ఇప్పుడు చర్చించుకుందాం.
ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడానికి పది రోజుల ముందునుంచే తెలంగాణ ప్రభుత్వం తన వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారనీ, అందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తాము విజయం సాధిస్తామనీ, ఫలితంగా ఏపీ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందనీ, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవలసిందిగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డికి కూడా సూచించినట్టు తెలిసింది. ఈ అంశంపై వివరంగా మాట్లాడుకోవడానికి మంత్రి హరీశ్‌ రావు, జగన్మోహన్‌ రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ గత నెల 21వ తేదీన సమావేశమైనట్టుగా తెలుగుదేశం పార్టీ వారికి ఆధారాలు లభించాయి. ఆ రోజు నుంచి తెలంగాణ అధికార పక్ష నేతలు వ్యవహారాన్ని గుట్టుగా మొదలు పెట్టారు. అత్యుత్సాహవంతులైన కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు ఈ వ్యూహం అమలులో సహకరించడానికి ముందుకొచ్చారు. ఆ వెంటనే ఫలానా ఫలానా వారి ఫోన్‌ నంబర్లు ట్యాపింగ్‌ చేయాలని సర్వీసు ప్రొవైడర్లకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు పంపారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, సెబాస్టియన్‌ నంబర్లతోపాటు కొంతమంది ఉగ్రవాదులు, నక్సలైట్‌ల నంబర్లు చేర్చారు. అధికారికంగా రిక్విజేషన్‌ రావడంతో సెల్‌ఫోన్‌ సర్వీసు ప్రొవైడర్లు గత నెల 23వ తేదీ నుంచి ట్యాపింగ్‌ మొదలు పెట్టారు. అధికారికంగా నిర్వహించిన ఈ ట్యాపింగ్‌తోపాటు ప్రయివేటు సంస్థల ద్వారా కూడా మరికొంత మంది ఫోన్‌లు ట్యాప్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఏపీ సీఎం చంద్రబాబు సేకరించి పెట్టుకున్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోన్‌ నంబర్లు ట్యాప్‌ చేయడానికి పోలీసు అధికారులు అధికారికంగా రాసిన లేఖ ప్రతిని కూడా సంపాదించారు. ఈ లేఖపై తెలంగాణ ఎస్‌ఐబీ చీఫ్‌ సజ్జనార్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌ శర్మ, హోం సెక్రటరీ బి.వెంకటేశం సంతకాలు చేసినట్టు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ లేఖతోపాటు ఇతర ఆధారాలను చంద్రబాబు అండ్‌ కో బయటపెడితే సర్వీసు ప్రొవైడర్లకు రాసిన లేఖపై సంతకాలు చేసిన అధికారుల ఉద్యోగాలు పోవడమే కాకుండా, జైలుకు కూడా వెళ్లవలసి వస్తుంది. అప్పుడు వ్యవహారం అక్కడితో ఆగదు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్‌ మెడకు కూడా చుట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఆ పని చేశామని పోలీసు అధికారులు విచారణలో చెబితే కేసీఆర్‌ చిక్కుల్లో పడతారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఉదంతం కేసీఆర్‌కు గుర్తుకు రాకుండా ఉంటుందా? నెపాన్ని అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నించే పక్షంలో పోలీసు శాఖలో తీవ్ర అలజడి ఏర్పడుతుంది. ఇకపై, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులెవ్వరూ అమలు చేయబోరు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణను ఎదుర్కోవలసి వస్తుంది.
 
ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లను నేరుగా ట్యాపింగ్‌ చేయకపోయినా, తమ ట్యాపింగ్‌లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి చంద్రబాబుకు వెళ్లిన కాల్స్‌ సంభాషణలను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీకి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు మధ్య జరిగిన సంభాషణను కూడా పోలీసు అధికారులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద టెలిఫోన్‌ సంభాషణల టేపులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. జరిగింది ఇది! ఓటుకు నోటు వ్యవహారంలో న్యాయస్థానంలో రేవంత్‌ రెడ్డికి శిక్ష పడుతుందో లేదో తెలియదుగానీ చంద్రబాబు మాత్రం తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయన స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినప్పుడు డబ్బు గురించిగానీ, తమ అభ్యర్థికి ఓటు వేయమనిగానీ కోరలేదు. పైగా సంభాషణ చివరిలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని సూచించారు. ఈ కారణంగా చంద్రబాబును దోషిగా నిరూపితం చేయలేరని న్యాయవాది కూడా అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటివాళ్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో ఏసీబీని మరింత ఎగదోస్తే, చంద్రబాబుకు జరిగే నష్టం కన్నా కేసీఆర్‌కు జరిగే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబుకు జరగాల్సిన నష్టం ఇదివరకే జరిగింది. కేసీఆర్‌కు మాత్రం కొత్త కష్టాలు ప్రారంభమవుతాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడం మొదలైంది. కేసీఆర్‌ మీడియా స్వరాన్ని తగ్గించుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటుకు నోటు కేసు కథ కంచికి చేరినా ఆశ్చర్యపోవలసింది లేదు. అదే విధంగా ట్యాపింగ్‌కు సంబంధించి చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలు కూడా వెలుగు చూడకపోవచ్చు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రుల జుట్టు మాత్రం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఇద్దరు ముఖ్యమంత్రుల హితులు రంగంలోకి దిగారు. ‘చేసింది చాలు. ఇక సరిపెట్టండి’ అని హితవు చెబుతున్నారు. అయినా ముందుకు వెళితే ఏం జరుగుతుందో తెలియనంత అమాయకులుకారు మన చంద్రులు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇంతకీ… ఎవరు చిత్తు?
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఆటలో అరటిపండు అయిందెవరో చూద్దాం. ఈ జాబితాలో ముందుగా గవర్నర్‌ నరసింహన్‌ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటను నమ్మిన ఆయన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంతటితో ఆగకుండా తనను కలిసిన ఏపీ మంత్రుల వద్ద కూడా ట్యాపింగ్‌ ఎవరు చేశారంటూ దబాయించారు. ట్యాపింగ్‌ జరిగిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు చంద్రబాబుకు లభించడంతో, ఇప్పుడు గవర్నర్‌ కేంద్రం వద్ద తలదించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంతిమంగా ఆయన పదవికే ఎసరు తేవచ్చు. వాస్తవానికి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టగానే ఉమ్మడి గవర్నర్‌గా ఎవరిని నియమించ మంటారంటూ చంద్రబాబును అడిగారు. అప్పట్లో ఆయన ఏ కారణం వల్లనోగానీ నరసింహన్‌నే కొనసాగించవలసిందిగా సూచించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబుకు, నరసింహన్‌కు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు అన్నట్టుగా నడుస్తోంది. ఏపీ మంత్రులు నేరుగా గవర్నర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెడితే తెలుగు ప్రజల ముందు తాను తలదించుకోవలసి వస్తుంది కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్‌ను నిలువరించడం ఒక్కటే మార్గమన్న ఉద్దేశంతో బుధవారం నాడు తనను కలిసిన కేసీఆర్‌కు గవర్నర్‌ ఉపదేశం చేసినట్టు చెబుతున్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి రెండవ బకరాగా మిగిలారు. ఇద్దరు చంద్రుల మధ్య సాగుతున్న రాజకీయ క్రీడలో చివరకు జగన్‌ ఆటలో అరటిపండుగా మిగులుతారని నేను గతవారమే పేర్కొన్నాను. ఇప్పుడు అదే జరిగింది. కేసీఆర్‌ అండ్‌ కో మాటలు నమ్మి చంద్రబాబు నిజంగానే జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారనీ, ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనతో చేతులు కలిపే అవకాశం ఉందనీ, తాను ముఖ్యమంత్రి కావచ్చుననీ జగన్మోహన్‌ రెడ్డి కలలు కని ఉండవచ్చు. లేదా కేసీఆర్‌ అండ్‌ కో అలా భ్రమింపచేసి ఉండవచ్చు. ఈ కారణంగానే కాబోలు గడచిన మూడు వారాలుగా చంద్రబాబుకు శిక్ష తప్పదంటూ పుంఖానుపుంఖాలుగా తన పత్రికలో వార్తలు అచ్చేశారు. చంద్రబాబు స్థానంలో ఫలానా వారు ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలను ప్రజల్లోకి వదిలారు. ఊహల్లో విహరించిన జగన్‌కు బుధవారంనాటి పరిణామాలతో తత్త్వం బోధపడింది.

కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనకు భుజం కాయడం వల్ల ఏపీలో తనపై వ్యతిరేకత ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో పార్టీ ముఖ్యులను సమావేశపరచి ఓటుకు నోటు వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుని, కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లిపోయారు. దీన్ని బట్టి రాజకీయాలలో జగన్మోహన్‌ రెడ్డి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అనిపిస్తోంది కదా! ఇక మూడవ బకరాగా మీడియాను పేర్కొనవచ్చు. కేసీఆర్‌కు భయపడిగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ అటు పత్రికలు, ఇటు చానెళ్లు గాలి వార్తలను పోగేసి ప్రచురించి, ప్రసారం చేశాయి. అవినీతి నిరోధక శాఖ సోర్స్‌ పేరిట ఇదిగో పులి, అదిగో తోక అంటూ కథనాలను ప్రజల్లోకి వదిలాయి. చంద్రబాబును అరెస్ట్‌ చేయడమే మిగిలి ఉందంటూ ప్రచారం చేశాయి. టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు లభించి ఉండకపోతే ఏమి జరిగేదో తెలియదుగానీ… ఇప్పుడు మాత్రం ఏమీ జరగకపోవచ్చునని చెప్పవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా! అని అనుకుంటే అలా నమ్మిన వారిదే అమాయకత్వమే అవుతుంది. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడం గతంలో కూడా జరిగింది. ఇకపై కూడా జరుగుతుంది. అయితే, ఈ కేసులో వలె మీడియా ఇంత బాధ్యతారహితంగా గతంలో ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. తాము ప్రచారం చేస్తున్న గాలి వార్తలను ప్రచురించి, ప్రసారం చేయకపోతే ‘ఆంధ్రా మీడియా’ అని కేసీఆర్‌ సొంత మీడియా ఎక్కడ నిందిస్తుందోనన్న భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇక నాలుగవ బకరాగా సోషల్‌ మీడియాలో చెలరేగిపోయిన వారిని పేర్కొనవచ్చు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్‌ మీడియాలో రెచ్చిపోయిన వారు తమలోని సృజనాత్మకతను సొంతానికి ఉపయోగించుకుంటే వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆట ముగింపు దశకు చేరుకుంది. కేంద్రం నుంచి కూడా ఆ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులకు సూచనతో కూడిన హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేసీఆర్‌, చంద్రబాబు పదవులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే… ఒక రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్‌లను ట్యాప్‌ చేయడం, అది బయటకు వెల్లడవడం తెలంగాణ క్షేమం దృష్ట్యా కూడా మంచిది కాదు. గుట్టుగా ఉండవలసిన చోట అత్యుత్సాహం ప్రదర్శిస్తే అంతిమంగా ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వాధినేతల ప్రోత్సాహంతోనే విచ్చలవిడిగా ట్యాపింగ్‌ చేయడం, ఆ టేపులను బయటపెట్టడం వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కూడా భయపడే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నందుకు సోకాల్డ్‌ తెలంగాణవాదులు నన్ను విమర్శించవచ్చుగానీ రోజులు గడిచేకొద్దీ వారికి వాస్తవం తెలిసివస్తుంది. నిజానికి, దేశంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తకాదు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిత్యం ఆ పని చేస్తూనే ఉంటాయి. గుట్టుగా అది సాగిపోతుంటుంది. ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్న వివరాలను తదుపరి వ్యూహాల రచనకో, లేక విరుగుడు చర్యలకో వాడుకుంటాయి. అంతే తప్ప నేరుగా బయటపెట్టవు. కానీ, తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకుని ‘ట్యాపింగ్‌ టేపులను’ బయటపెట్టడం కొత్త అనుభవం. మొుత్తంమీద కథ కంచికి చేరుకునే దశకు చేరుకున్నట్లే అని భావించవచ్చు. కనుక ఏదో జరుగుతుందని ఆశించి భంగపడిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎటొచ్చీ చట్టాల పట్ల నమ్మకం పెట్టుకున్నవాళ్లు మాత్రం ఇదంతా చూసి ‘నీ యవ్వ. అంతా తొండి’ అని ఉడుక్కోవచ్చు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు లో 21-6-15 అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఉదయం 7 గం లకు శాంతి నేకేతన్ హైస్కూల్ లో ,ఉదయం 11 గం లకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో

ఉయ్యూరు లో 21-6-15 అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఉదయం 7 గం లకు శాంతి నేకేతన్ హైస్కూల్ లో ,ఉదయం 11 గం లకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో

 

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6162708660116406785?cfem=1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వర్షం తెచ్చిన హర్షం – బందా

img135

Posted in కవితలు | Tagged | Leave a comment

యోగ ముద్ర లో ఉయ్యూరు

yoga1 001 yoga2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

3 ధార్మిక విషయాలు –


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శశి బి టెక్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదివారం అద్భుతం – జీవన యోగం – అంతర్జాతీయ యోగం

అంతర్జాతీయ యోగం (19-Jun-2015)

యోగం అంటే శరీరానికి, మనసుకు ఉన్న సంబంధాన్ని చెప్పే శాస్త్రమనీ
ఇదివరలో తెలుసుకున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపు
కుంటున్న సందర్భంగా యోగ చరిత్ర గురించి తెలుసుకుందాం.

భగవద్గీతతో సహా సమానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పుస్తకం పతంజలి యోగసూత్రలు. ఇది ఏ దేవుడి సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది కాదు. అందువల్ల అన్ని సంస్కృతుల వారూ దీన్ని గ్రహించారు. ప్రస్తుతం మనదేశంలో కన్నా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో దీనిపై శాసీ్త్రయమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ బ్రైయాంట్‌ పతంజలి యోగసూత్రాలపై ఉన్న వ్యాఖ్యలన్నిటినీ పరిశీలించి ప్రామాణికమైన వ్యాఖ్యను రాశారు. వందలాది మానసిక శాస్త్రవేత్తలు యోగాపై అధ్యయనం చేశారు.
మంత్రయోగం..
వేదాల మొదటి భాగాల్లో యోగ ప్రస్తావన కనిపించదు. ఉపనిషత్తుల్లో యోగం ప్రస్తావన వివరంగా ఉంది. సింధునది నాగరికత నాటి ముద్రల్లో ధ్యానం, యోగ ముద్రలు కనిపిస్తాయి. వైదిక సంప్రదాయం, సింధు నది నాగరికత రెండూ ఒకటా..? వేర్వేరా..? అనే విషయంపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మొదట్లో ఇది వైదిక సంస్కృతిలో లేదు అని కొందరి అభిప్రాయం. అయితే వైదిక సంస్కృతితో పాటు సమాంతరంగా వచ్చిన సంప్రదాయం ఇదని మరికొందరి అభిప్రాయం. వేదాల మొదటి భాగాల్లో యజ్ఞాలు మొదలైనవి చెప్పారు. ఇవన్నీ మానవ స్వభావమైన కోరికలకు సంబంధించినవి. దీని నుంచి క్రమక్రమంగా ఎదిగి తత్వచింతన చేయడానికై మనసుకు నిలకడ, శిక్షణ అవసరం. అందుకే మనసును అదుపులో పెట్టే సాధనంగా యోగా పద్ధతులను ఉపనిషత్తుల్లో అంగీకరించారు. భారతంలో, ముఖ్యంగా మోక్షధర్మ పర్వంలో భీష్ముడు యోగా పద్ధతులను చాలా వివరంగా చెబుతాడు. పురాణ కాలానికి పతంజలిని పూర్తిగా హిందూ సంప్రదాయంలోని వ్యక్తిగా చూడగలం. ఆయన ఆదిశేషుడి అవతారమని మన సంప్రదాయం. ఆదిశేషుడు గానీ, శివుడి కంఠంలో ఉన్న నాగరాజు గానీ, అనేక దేవతలకు గొడుగు పడుతున్న సర్పాలు గానీ, ఆయా దేవతల యోగశక్తులను సూచిస్తాయని పండితుల అభిప్రాయం. సర్పాలకు వాయుభక్షకులు, గాలిని పీల్చి బతికే జీవులు అని కూడా పేరు. ప్రాణాయామంలో.. ముఖ్యమైంది ప్రాణవాయువే. ప్రాణాయామం యోగంలో ఒక ముఖ్యమైన మెట్టు. తర్వాతి కాలంలో అనేక పూజా విధానాల్లో భాగంగా కొంత యోగా పద్ధతులను ప్రవేశపెట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు సూర్య నమస్కారాలు. వీటిలో ఉన్న ఆసనాలను కొన్ని మంత్రాలు మననం చేస్తూ చేయాలి. అలాగే సంధ్యావందనంలోని అనేక ముద్రలు యోగ నుంచి గ్రహించినవే.
ముద్రయోగం
తూర్పు ఆసియా దేశాలన్నింటిలో యోగ సంప్రదాయం ఉంది. ఇది బౌద్ధమతం ద్వారా వ్యాపించిందని పండితుల అభిప్రాయం. ఆ దేశాల్లోని కొన్ని యుద్ధపద్ధతులు కూడా బౌద్ధబిక్షువులు వ్యాపింపజేసినవే అని ఒక వాదన. కొన్నేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘blood sport’ లో హీరో కొన్ని విన్యాసాలు చేస్తాడు. వాటిలో చేతులకు, వేళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వేళ్లకు సంబంధించిన ముద్రలు కొన్ని మన పూజా విధానాల్లో ఉన్నవే. కుంగ్‌ ఫూ చిత్రాల్లో కూడా ఇలాంటి ముద్రలు చూస్తాం. ఇవన్నీ హఠయోగానికి సంబంధించినవే. గాలిని పీల్చుకుని శరీరాన్ని బిగించే పద్ధతులు హఠయోగంలో కనిపిస్తాయి.
పాశ్యాత్య దేశాల్లో యోగా బోధించేటప్పుడు మన సంప్రదాయంలో చెప్పే మంత్రాలను తీసివేసి వారి సంస్కృతికి అనుగుణంగా బోధిస్తారు. దీనిపై ఆందోళన అనవసరం. మన మంత్రాలకు బదులుగా వారి దేవుడి పేరు చెప్పుకోవడం సహజమే. అర్థచంద్రాసనాన్ని ‘half moon posture’ అని, భుజంగాసనాన్ని ‘cobra posture’ అని ఈ విధంగా పేర్లు మార్చి చెప్పినా వారు కూడా మనం సాధించిన ఫలితాలనే సాధిస్తారు. ఇటీవల కేరళలో క్రైస్తవులు ఈ యోగా పద్ధతులను జీసస్‌ నమస్కారాలు అంటూ బోధిస్తున్నారు. దీనికి మనమేం ఆందోళన చెందాల్సిన పని లేదు.
విద్యాయోగం..

యోగాభ్యాసాన్ని స్కూల్‌ సిలబ్‌సలో భాగంగా పెట్టడం తమ సంస్కృతికి విరుద్ధమని ఇతర మతాల వారు భావించవచ్చు. విషయం ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా.. స్వచ్ఛందంగా అందరికీ ఆమోదకరంగా ఉన్నప్పుడే దాన్ని ప్రవేశపెట్టడం సరైన విధానం. పదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ప్రఖ్యాత అరబ్‌ యాత్రికుడు అల్‌ బెరూనీ పతంజలి యోగ సూత్రాలను అరబిక్‌ భాషలో ‘కితాబ్‌ బతంజల్‌ అల్‌ హిందీ’ పేరిట గురుశిష్యుల సంభాషణ రూపంలో తర్జుమా చేశాడు. దీని అంగ్ల అనువాదం వివరాలను ఇంటర్నెట్‌లో చూడగలం. ‘ఈ పుస్తకం ప్రతి అక్షరం విని అర్థం చేసుకున్న తర్వాత నా ప్రజలకు దీన్ని ఇవ్వకుండా ఉండటానికి నా అంతరాత్మ అంగీకరించలేదు’ అని అల్‌ బెరూనీ రాసుకున్నాడు. ఇలాంటి పుస్తకాలను భారతీయ భాషల్లోకి తేవడం కూడా అవసరమేమో..!
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు,
రిటైర్డు డీజీపీ
రెండు స్థాయిల్లో దేవుడు (12-Jun-2015)

ప్రపంచంలోని అనేక మతాలకూ, భారతీయ మతాలకూ ఒక ముఖ్య భేదం ఉంది. దీన్ని వివరిస్తూ మ్యాక్స్‌ ముల్లర్‌ ఇలా అన్నాడు. what distinguises the vedanta philosophy from all other philosophies is that it is at the same time a religion and a philosophy. ఇతర మతాల్లో ముఖ్యంగా ఒకే మతగ్రంథం ఉంటుంది. దాని ఆధారంగా మిగతా గ్రంథాలు వస్తాయి. ముఖ్యమైన మతగ్రంథం ఒకానొక వ్యక్తి, ఒకానొక చారిత్రకసమయంలో దేవుడి సాక్షాత్కారాన్ని పొంది దేవుడి ఆజ్ఞగా తన ప్రజలకు చెప్పిన విషయాలకు సంబంధించినది. ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు. శాస్త్రీయంగా సమర్థించలేనివి. ఒక మతం వారు మా విశ్వాసం సరైనది అంటే మరొక మతం మా విశ్వాసం సరైనది అనవచ్చు. భారతీయ (హిందూ, బౌద్ధ, జైన) మతాల్లో తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, మత సంబంధమైన పుస్తకాలు సమన్వయం చేయబడి ఉంటాయి. ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు తత్త్వశాస్త్రంలోనూ భాగమే, మతగ్రంథాల్లోనూ భాగమే. అందుకే హింద మతగ్రంథాలు రెండు స్థాయిల్లో విషయాన్ని బోధిస్తాయని మునుపటి ఒక వ్యాసంలో ప్రస్తావించాను. తత్త్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాడికి ఆ స్థాయిలోనూ, ఆ శక్తి లేనివాడికి పురాణాలు మొదలైన స్థాయిలోనే విషయాన్ని చెబుతాయి.

పరమాత్మ అంటే విశ్వమంతా వ్యాపించిన శుద్ధచైతన్యం అనీ, సృష్టి అనేది ఆ చైతన్యం నుండి వచ్చిందే అనీ, ఆ చైతన్యంలోని క్రియాశక్తి వల్ల ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, చెట్లు చేమలు, చిట్ట చివరిగా ప్రాణులు వచ్చాయనీ, పంచభూతాల మరో రూపంగానే ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి అని విశ్లేషించి చెప్పడం శాసీ్త్రయమైన విచారం. ఇది తత్త్వశాస్త్రం అనే కోవకు వస్తుంది. ఉపనిషత్తులు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు పై విషయాల్ని అనేక కోణాల్లో వివరించి చెబుతాయి. వీటిని తెలుసుకోవడానికి కొంత శ్రద్ధ, కొంత విషయజ్ఞానం ఉండాలి. పురాణాలలో త్రిమూర్తులు, సృష్టి, స్వర్గం, నరకం మొదలైన విషయాలు, విశ్వాసానికి చెందినవి, ఎవరూ నిరూపించలేనివి ఉంటాయి. వీటిని కూడా మన సంప్రదాయం అంగీకరించింది.
పై రెంటిలో ఏది నిజం? ఆకాశంలో చేతిలో కర్రపట్టుకుని ఒకానొక దేవుడు ఉన్నాడు అనేది ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోడు. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించేవాడికి మొదట చెప్పింది నిజం. కానీ మన చుట్టూ సమాజంలో అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని తోసివేయాలంటే బలాత్కారంతో, రక్తపాతంతో ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అలా జరిగింది కానీ మనదేశంలో అలా జరగలేదు. ఒక బాలుడు బొమ్మ ట్రైన్‌ను నడుపుతూ తాను నిజంగా ట్రైన్‌ నడుపుతున్నానని భావిస్తాడు. తండ్రి దాన్ని నవ్వుతూ అంగీకరిస్తాడు. పెద్దవాడయ్యాక ఎట్లూ ఆ బొమ్మతో ఆడుకోడని అతనికి తెలుసు. అలాగే ఆలోచనాశక్తి పెరగనంత వరకూ ఏదో ఒక స్థాయిలో మనిషి క్రమశిక్షణతో ఉండడం మంచిది కనుక ఆ సంప్రదాయాల్ని కూడా సరే నిజమే అన్నారు. పై స్థాయిలో చెప్పినదాన్ని పారమార్థిక సత్యం అన్నారు. కేవలం విశ్వాసంపై ఆధారపడి వ్యవహారాల్లో ఉన్నదాన్ని వ్యావహారిక సత్యం అన్నారు.
అలాగే రెండింటినీ ఒప్పుకోవడం వల్ల ఒకానొక కాలంలో లాభంపడి ఉండవచ్చు కాని మతాల మధ్య ప్రస్తుత పోటీ వాతావరణంలో కొత్త సమస్యలొస్తున్నాయి. ఒకప్పుడు శాస్త్రీయ చర్చలు చేస్తూ పండితులు ఒకవైపు, రామాయణం, భాగవతం కథలు వింటూ నిరక్ష్యరాస్యులు మరొకవైపు ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో తెలుసుకుంటూ వచ్చారు. ఒకవైపు సత్యం ఏమిటి అంటూ నిష్పక్షపాతంగా, శాసీ్త్రయంగా కొనసాగించే ఆలోచన. మరొకవైపు సమాజంలో ఇదివరకే ఉన్న సంప్రదాయాల్ని(విష్ణువు, శివుడు మొదలైనవి) అంగీకరించడం మొదటి స్థాయిలో విశ్లేషణ శాస్త్రీయమైనది కావున ఎలాంటి వివాదం ఉండదు. రెండవ స్థాయిలోని విషయాలు విశ్వాసానికి సంబంధించినవి. ఒకవైపు వైష్ణవ సంప్రదాయం, మరోవైపు శైవం, ఇంకొకచోట శక్తిపూజ మొదలైనవి. వీటి మధ్య పరస్పర వాదాలు తలెత్తకుండా శ్రీ శంకరాచార్యులు వీటన్నింటినీ ఉపనిషత్తులు అనే గొడుగు కిందకు తెచ్చారని ఇది వరలో గమనించాం. ఇలాంటి సంప్రదాయాలు అనేకం కావున అనేక దేవుళ్ళను అంగీకరించారు. ఏ సంప్రదాయం ప్రకారం పూజించినా ఒకే పరమాత్మను పూజిస్తున్నారని ఈయన సమన్వయం చేశారు. వేదాంత స్థాయిలో చెప్పిన బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు. దానికి ప్రపంచ సృష్టి, దుష్టశిక్షణ, శిష్టరక్షణలాంటి డ్యూటీలు లేవు. సంప్రదాయం, లేదా మతంలో చెప్పిన దేవుడికి ఇలాంటి డ్యూటీలున్నాయి. డ్యూటీని ఉపాధి అంటారని మనకు తెలుసు. ఈ ఉపాధి అన్న దేవుణ్ణి సోపాధిక బ్రహ్మ అన్నారు. ఇది కింది స్థాయికి చెందింది. ఉపాధిలేని సత్యము, చైతన్యం అనే దాన్ని నిరుపాధికం అన్నారు. అందువల్లే మొదటి స్థాయిలో మాట్లాడేవారు ఎప్పటికప్పుడు కింది తరగతి వారిని హెచ్చరిస్తూ మీరు సత్యం అనుకుంటున్నది పాక్షిక సత్యం మాత్రమే, ఆ స్థాయి నుంచి మీరు పైకి ఎదగాలి అంటూ చెబుతూ వచ్చారు. ఇలాంటి హెచ్చరికలు ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు కేనోపనిషత్తులో ‘‘నేదం యదిదముపాసతే’’-‘‘ప్రజలు ఇది దేవుడు అని పూజిస్తున్నది సంపూర్ణసత్యం కాదు’’ అంటూ నాలుగు మంత్రాలున్నాయి. ఇదం అంటే ఇది అని నిర్ధారించి చెప్పిన విషయం. కొందరు మతపెద్దలు కూడి ఇది దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఇతన్నే పూజించాలి అని చెబితే అది ‘ఇదం’ అనే దాని పరిధిలోకి వస్తుంది. సృష్టి మొదలైన డ్యూటీలు ఉన్న దేవుణ్ణి ఏ మతం చెప్పినా అది ‘ఇదం’ అనే స్థాయికే వస్తుంది. దీనివల్ల ప్రయోజనాలుండవచ్చు. ఇది పూజాపునస్కారాలకు పనికివస్తుంది. మనిషిని సన్మార్గంలో పెట్టడానికి దానం, ధర్మం, అహింస మొదలైన గుణాల్ని ఇవ్వడానికి పనికివస్తుంది. అయితే ఇది వ్యవహార దశలో సత్యమే కానీ పరమార్థ దశలో కాదు. అందువల్లే వేదాంతం మాటిమాటికీ మనిషిని హెచ్చరిస్తూ నీవు మతం స్థాయిలో దేన్ని ఆరాధించినా తప్పులేదు కానీ అదే పరమసత్యం కాదు అని చెప్పింది. అసలైన శుద్ధ చైతన్యాన్ని ఇది అంటూ నిర్దేశించలేం. ఒక టార్చిలైటు వెలుగులో చీకటి గదిలోని వస్తువుల్ని చూడవచ్చు కానీ సూర్యుడువైపు టార్చిలైటు వేసి ఎవరూ చూపరు. చైతన్యం కారణంగా మనం వస్తువుల్ని చూడగలుగుతున్నామే కానీ ఆ చైతన్యాన్నే మనం చూడలేం. Consciousness cannot be objectified అని ఇవాళ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్నే చెబుతున్నారు. కావున నీవు పూజిస్తున్నది పరమసత్యంకాదు అని ఉపనిషత్తులు చెబితే ఒక నమ్మకాన్ని వదిలి మరొక నమ్మకాన్ని అంగీకరించమనీ, ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని తీసుకోమని కాదు. ఏ నమ్మకమైనా ఒకే స్థాయిలోనిదే, ఉపాధి ఉన్న దేవుడే. ఇది దాటి అసలైన సత్యాన్ని, తెలుసుకోమని వాటి ఉద్దేశం.
దీన్ని వక్రీకరించి కొందరు మీ ఉపనిషత్తుల్లోనే మీరు పూజిస్తున్నది దేవుడు కాదని చెప్పారు కదా, మా మతంలోకి రండి అనడం, ఆధునిక సాధనాలైన వాట్సప్ లాంటి ద్వారా ప్రచారం చేయడం అజ్ఞానంతో కూడిన పని. దీనివల్ల అమాయకుల్ని మతమార్పిడి చేయవచ్చు. కానీ సత్యానికి మరింత దూరంగా వెళ్లడమే అవుతుంది. మరికొందరు మీ ఉపనిషత్తుల్లో మా దేవుడి గురించే చెప్పారు అనడం మరొక మానసిక బలహీనత. సంస్కృత పండితులు నోరు మెదపకున్నంత కాలం ఇలాంటి వాదనలు ఇంకా అనేకం వస్తాయి.
‘ఇదం’ అని చెప్పబడింది పూర్తిగా వ్యర్థంకాదు. డిగ్రీకి వెళ్ళడానికి హైస్కూలు ఎలా అవసరమో ఇదీ అలా అవసరం. అసలైన దాన్ని తెలుసుకోవడానికి అదొక గొప్ప సాధనం.
మన సంప్రదాయంలో చెప్పిన ఉసాసనలన్నీ ఇలాంటివే. అంతేగాని ‘ఇదం’లో ఉన్న ఒకటి సరైనది, మరొకటి తప్పు అనడం దురుద్దేశంతో కూడిన వాదం.
(రచయిత ప్రసంగాల్ని www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

జీవన యోగం

  • 20/06/2015
TAGS:

ఆదివారం-జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతున్న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ మానవాళి చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం…సమన్వయసాధన పథంలో మరో ప్రగతి పదం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దాదాపు అన్ని దేశాలూ మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘యోగ దినోత్సవ నిర్వహణ’ ప్రతిపాదనను ఆమోదించడం మన దేశానికి లభించిన సాంస్కృతిక విజయం. శరీరం, మనస్సు, బుద్ధి కలసి మెలసి ఎకోన్ముఖ స్థితి ఏర్పడడం యోగం. ఈ ఏకోన్ముఖ స్థితి మంచి నడవడి. మంచి నడవడిని మానవాళికి నేర్పిం చే సంస్కారాల సమన్వయతత్త్వం యోగం. యోగ విద్య మనదేశంలో అంకురించింది, పల్లవించింది, వికసించింది, పరిమళించింది. ఈ పరిమళం ప్రపంచ మానవాళికి మాధుర్యాన్ని పంచిపెట్టడం చరిత్ర. ఆ మాధుర్యం మానవులను నిజమైన మానవులుగా దిద్దడానికి దోహదం చేసిన చరిత్ర. జంతు ప్రవృత్తి నుంచి పైశాచికమైన వికృతులనుంచి తప్పించి మానవుడిని సంస్కృతి నిబద్ధుడిని చేసిన మాధ్యమం యోగం. యోగవిద్య మనదేశలో పుట్టినప్పటికీ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడడం తరాల చరిత్ర. ఈ సంస్కారబద్ధులైన సమయంలో మానవులు ఇతర మానవులను పీడించలేదు. ఈ సంస్కారానికి దూరమైన సమయంలో మానవులు దురాక్రమణ దారులుగా మారారు. కలయిక-యోగం-ఆయా జాతుల మనస్సులలో వికసించకపోవడమే ఇందుకు కారణం… యోగం వికసించడమంటే శరీరం, మనస్సు, బుద్ధి ఒకే లక్ష్యం వైపు ఏకోన్ముఖంగా కేంద్రీకృతం కావ డం. ఈ ఏకోన్ముఖ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. ఒకే ఆత్మ అద్వితీయమైన ఆత్మ. అనంతకోటి బ్ర హ్మాండాలుగా, అసంఖ్యాక జీవాత్మలుగా ప్రస్ఫుటిస్తుండడం విశ్వవ్యవస్థలోని వ్యవహార వాస్తవం. ఈ జీవన వాస్తవం, యోగం ద్వారా యోగ విన్యాసాల ద్వారా ధ్రువపడడం సమన్వయం. అసంఖ్యాక రూపాల, వైవిధ్యాల స్వభావం ఒక్కటే…వైవిధ్యాలన్నీ అద్వితీయమైన సత్యంలో ఆత్మతో సమన్వయమై ఉండడం యోగం-కలయిక! ఈ జీవన వాస్తవాన్ని ‘ప్రపంచం’ ఆచరించగలిగినప్పుడు వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. మతాల మధ్య, భాషల మధ్య, వర్గాల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, జీవజాలం మధ్య, చరాచర విశ్వ స్వరూపాల మధ్య విరోధం లేదు. ఈ సంస్కార మాధ్యమం భారతీయ జీవన యోగం! కలిసి ఉండడమే విలీనమై ఉండడమే యోగ స్వభావం. శరీరం బుద్ధి మనస్సు ఆత్మతో కలసి ఉండాలి. మానవాళి కలసిమెలసి ఉండాలి. ఇదే వసుధైక కుటుంబం…ప్రపంచ మంతా ఒకే కుటుంబం, ఒకే ఇల్లు! అలాగే మన పుడమి విశ్వవ్యవస్థలోని అసంఖ్యాక గ్రహాలతో నక్షత్రాలతో బ్రహ్మాండాలతో కలసి ఉండడం సహజమైన యోగం. మహా మేళనం యోగం. అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ సహజ సమన్వయ తత్వానికి చిహ్నం..
యోగవిద్య, యోగాభ్యాసం, యోగాచరణ, యోగ ప్రబోధం అందువల్ల అనాదిగా ఉన్న సహజ జీవన విన్యాసాలు, సహజత్వానికి తప్పిపోకపోవడం, కృత్రిమత్వానికి గురికాకపోవడం యోగం. అనాది యోగశాస్త్రాన్ని దాదాపు మూడువేల మూడువందల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి మరోసారి వివరించాడు. యోగశాస్త్రం ఆరు వేద దర్శన శాస్త్రాలలో ఒకటి. మానవాళికి మార్గదర్శనం చేసేది దర్శనాలు. పతంజలి హఠయోగం అని రాజయోగం అని యోగాభ్యాస పద్ధతులను వర్గీకరించాడు. హఠయోగం ప్రధానంగా శరీరానికి పుష్టిని కలిగించే వ్యాయామం. రాజయోగం శరీరానికి మనస్సునకు బుద్ధికీ కూడ సౌష్టవం కలిగించే ప్రక్రియ మాత్రమే కాదు. నైతికనిష్ఠను పెంపొందించే జీవనరీతి కూడ. అందువల్లనే యోగం కేవలం ఆసనాలకు, ప్రాణాయామానికి ధ్యానానికి పరిమితమైనది కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ యోగంలోని ఎనిమిది విభాగాలు. ఇవన్నీ మానవులు ఇరవైనాలుగు గంటల దినంలో సహజంగా పాటించదగిన జీవన సూత్రాలు. హింస చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. అత్యాశతో యాచించరాదు, దోచుకోరాదు, శుభ్రతను పెంపొందించుకోవాలి వంటి నైతిక సూత్రాలు యోగంలో భాగం. ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ్భారత కార్యక్రమం యోగం నిర్దేశించే స్వచ్ఛతలో భాగం. ఈ స్వచ్ఛత మానసిక పరిశుభ్రత, శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, పరిసరాల పరిరక్షణ కూడ.
యోగసూత్రాలకు దూరమైన జాతులు ఇతర జాతులను దోపిడీ చేయడం చరిత్ర. శక్తిని గాయాలను మాన్పడానికి-క్షతత్రాణ కార్యక్రమానికి-వినియోగించకుండా గాయాలను కలిగించడాన్ని ‘క్షతికారులు’ ఉపయోగించడం వల్ల ప్రపంచ సమాజం అల్లకల్లోలమైంది. సంతృప్తి చెందని జాతులు ఇతర దేశాలను దురాక్రమించడం ఇతర దేశాల ప్రజలను అణచివేతకు ఆర్థిక శోషణకు గురి చేయడం శతాబ్దుల చరిత్ర. కలసి జీవించడమన్న యోగం నష్టమై కలహించడమే ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజల సమష్టి స్వభావంగా మారింది. ఈ కలహించే ప్రవృత్తి మానసిక వికృతి. ఈ వికృతులు అంతర్గత సమాజంలో, అంతర్జాతీయ సమాజంలోను, వైరుధ్యాలను వ్యవస్థీకరించడం కొనసాగుతున్న వైపరీత్యం. మానసిక సంతులనం, మానసిక ప్రశాంతిని కోల్పోయిన వారు రకరకాల ఒత్తడికి గురి అవుతున్నారన్నది దాదాపు అన్ని దేశాలలోను ప్రచారమవుతున్న మనోవైజ్ఞానిక వాస్తవం. అందువల్లనే ప్రశాంతిని వెతుక్కుంటూ వివిధ దేశాలవారు యోగభూమి అయిన మనదేశానికి తరలిరావడం ఆధునిక పరిణామం. అలాగే ఈ దేశంనుండి తమ దేశానకి వచ్చిన వివేకానందస్వామి వారి నుండి మానసిక ప్రశాంతిని, నైతిక జీవనాన్ని నేర్చుకొనడానికి అనేక దేశాల ప్రజలు తపించడం కూడ ఆధునిక పరిణామం. యోగం, నేర్పడానికి నేర్చుకొనడానకి భారతీయ ధర్మాచార్యుల నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు, సంస్థలు, మందిరాలు, విశ్వవిద్యాలయాలు నెలకొంటుండడం కూడ ఆధునిక పరిణామం. ఈ ఆధునిక పరిణామం అతి ప్రాచీన పరిణామ క్రమానికి పునరావృత్తి. ఈ దేశానికి వచ్చి, ఈ దేశం నుండి పృథివీ తలంలోని సర్వమానవులూ జీవన సంస్కారాలను నేర్చుకొని వెళ్లడం అతిప్రాచీన చరిత్ర. ఈ జీవన యోగం మధ్యకాలంలో మరుగున పడింది. వివేకానందుని వంటివారి కృషి ఫలించి చరిత్ర మళ్లీ పునరావృత్తవౌతోంది. నైతిక నిష్ఠను జీవన సంస్కారాలను నేర్చుకొనడానికై ప్రపంచ ప్రజలు మళ్లీ భారతదేశం వైపు చూస్తున్నారు. భారత్ విశ్వ విజేత కావాలని ఆహంకరించడం లేదు. ఇదీ వౌలికమైన యోగం…ఈ యోగం వల్లనే భారతదేశం విశ్వగురువైంది.
యోగం పెరగడం వల్ల రోగం నశిస్తుంది. సృష్టి, ప్రకృతి, సమాజం, మానవుడు, పరస్పరం విభేదించే విరుద్ధ అంశాలు కాదు. పరస్పరం పరిపోషకమైన సహజ స్వభావ రూపాలు. ప్రకృతి తానేనని మానవుడు భావించినప్పుడు యోగం వికసిస్తుంది. ప్రకృతి తనకంటె భిన్నమని భావించిన మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. భౌతికమైన, మానసికమైన రోగాలకు ఇదీ కారణం. సమాజం తనకంటె భిన్నమని భావించడం వల్లనే మానవుడు ఆర్థిక రోగాన్ని విస్తరింపచేశాడు. ఈ రోగం దోచుకొనడం. ప్రకృతిని సామాజాన్ని పరిరక్షించడం వల్ల మాత్రమే తనకు సర్వాంగీణ వికాసం కలుగుతుందన్న సృష్టిగత సత్యాన్ని వ్యక్తి వ్యక్తిలో చిగురింపచేసే జీవన మాధ్యమం యోగం… యోగం సృష్టిక్రమం..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -48

19-     పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ-2

మరణం దాకా కవే

మళ్ళీ కవిత్వ ప్రవేశం చేసిన హార్డీ కొత్త శక్తీ ఉత్సాహ ప్రోత్సాహాలతో జీవిత చరమకం వరకూ రాస్తూనే ఉన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాక ఆయన అతి విలువైనకవితా సంపుటులు విడుదలయ్యాయి .కవిత్వ రచన కొనసాగిస్తూనే ఉన్నాడు .చాలా అర్ధవంతమైన వివాద రహితమైన అద్భుతమైన కవితలు రాశాడు దాదాపు తొంభై ఏళ్ళు వచ్చేదాకా .88 వ సంవత్సరం లో గొంతు బాగా బొంగురు పోయింది .శీతలం కమ్మింది .11-1-1928న88 వ ఏట థామస్ హార్డీ చనిపోయాడు .ఆయన చితా భస్మాన్ని వెస్ట్ మినిస్టర్ ఆబే లో భద్ర పరచారు ..కాని ఆయన రాసుకొన్న విల్లు ప్రకారం ఆయన గుండెను మాత్రం స్వగ్రామం డార్ చెస్టర్ లో ఖననం చేశారు .

హార్డీ మనసులోని భావనలు

తను చూస్తున్న సత్యాన్ని ,తన చుట్టూ ఉన్న హీన పరిస్తితులను అర్ధం చేసుకొన్నాడు హార్డీ .విక్టోరియన్ కాలానికి చెందిన విలువలు ,మాధుర్య ప్రకాశ వంతమైన జీవితం ఉన్నది అన్నదాని ఒప్పుకోలేదు .ఆ కాలపు కవిత్వాన్నీ పెద్దగా మెచ్చ లేదు. మరణ శయ్య పై ఉండి కూడా భార్యను తనకు అత్యంత ఇష్టమైన రుబాయత్ ను చదవమని కోరాడు .డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించిన హార్డీ మానవుడు ఈ విశ్వానికి ఆధారం అన్నమాటను తిరస్కరించి సైన్స్ ను కవిత్వం లో పోదిగాడు .పంచభూతాలు మనిషికి శత్రువులూ కారు ,మిత్రులూ కారు అన్నాడు .వ్యత్యాసం అనేది సృష్టిలో ఉన్న లక్షణం అన్నాడు .వర్డ్స్ వర్త్ మహా కవి చెప్పిన ప్రక్రుతి ప్రేమకు బ్రౌనింగ్ ఆశావాదానికి ,స్విన్ బరన్ విశ్వం దైవం తో ముడిపడిలేదు అన్నదానికి  జవాబుగా ఫాటలిజం ను చెప్పాడు హార్డీ . కర్షకుని కష్టాలకు మనిషిని జంతువుగా చూసే విధానాన్ని తప్పు పట్టాడు . విశ్వాన్ని ఎవరో పాలిస్తున్నారు అన్నదానికి బదులు దాన్ని అనుకోని సంఘటనలే పాలిస్తున్నాయన్నాడు .దేవుడికి మానవుల మీద ఉన్న మమకారాన్ని మర్చి పోయాడన్నాడు .దైవం యొక్క అపజయాలలో ఇదొకటి అంటాడు .క్రూరత్వామో కారుణ్యమో ప్రపంచాన్ని పాలించటం లేదు .చాన్స్ అంటే అవకాశాలే పాలిస్తున్నాయి .’’grass casualty obstructs the sun and rain ‘’ అని భావించాడు హార్డీ .’’Hardy accepted the stern realities without joy .’’

కుంచించుకు పోతున్న ప్రపంచాన్ని గురించే హార్డీ రాశాడు .మానవ నాటకం మీద పెద్దగా ఆసక్తి చూపలేదు .సాను భూతిలేని ప్రపంచాన్ని అసహ్యించాడు .గౌరవం గా జీవించాల్సిన మానవుడు బతుకు పోరాటం లో ఒక నేరస్తుడి విషాదం పాలౌతున్నాడని అంటాడు . Hardy realized that the true satisfaction of life lies in imaginative conflict .What ever their ultimate purpose ,men are alive only while they struggle .. When they grow aware of the futility of their effort ,and yet strive to fashion some thing from it ,they become noble ‘’అని సీగ్ ఫ్రీడ్ ససూన్ అన్నాడు .డబ్ల్యు ఆడెన్ ‘’his hawk’s vision ,his way of looking at life from a great height ‘’అని విశ్లేషించాడు

హార్డీ రాసిన ‘’ the dark eyed gentleman ‘’  కవిత జానపద సాహిత్యాన్ని పోలి ధారా పాతంగా ఉంటుంది .కవిత్వం లో వాడి వేడి సంభాషణాత్మక జాతీయాలు వాడి ఆధునిక కవిత్వానికి దారి చూపాడు హార్డీ .కవిత్వాన్ని కొత్త రక్త మాంసాలు ఇచ్చాడు .జార్జి ఇలియట్ కు చెందిన విక్టోరియన్ రియలిస్ట్ హార్డీ .నవలలో  కవిత్వం లోవర్డ్స్ వర్త్   రోమాంటిజం ప్రభావం ఉంది .హార్డీ పై చార్లెస్ డికెన్స్ ప్రభావమూ ఎక్కువే .డికెన్స్ లాగే విక్టోరియ సమాజపు  అవశేషాలను ఏవ గించాడు .

డి.హెచ్ లారెన్స్ ను  అత్యంత ప్రభావితం చేసిన వాడు హార్డీ .హార్డీ భావనలనే పెంచి లారెన్స్ తన పాత్రలను సృష్టించాడు .అమెరికా నాటక కర్త క్రిస్టఫర్ దురాంగ్ నాటక పాత్రలపై హార్డీ ప్రభావం అధికం .సుమారు 18 నవలలు ,రాశాడు .14 కవితా సంపుటులు తెచ్చాడు .మూడుభాగాల ది డైనాస్టి అనే బృహన్నాటకం రాశాడు .30 కి పైగా కధలూ రాశాడు .

 

The irony and struggles of life and a curious mind led him to question the traditional Christian view of God:

The Christian god – the external personality – has been replaced by the intelligence of the First Cause…the replacement of the old concept of God as all-powerful by a new concept of universal consciousness. The ‘tribal god, man-shaped, fiery-faced and tyrannous’ is replaced by the ‘unconscious will of the Universe’ which progressively grows aware of itself and ‘ultimately, it is to be hoped, sympathetic’.[41]

Signature

 ture

సశేషం

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -47

19-     పందొమ్మిది ఇరవై శతాబ్దాల వారధి -థామస్ హార్డీ

నెల తక్కువ పిల్లాడు

19 20 శతాబ్దాలకు వారధి వంటి కవి థామస్ హార్డీ –అతనికవిత్వం లో సగం రొమాంటిక్ గా మిగిలిన సగం రియలిస్టిక్ గా ఉండటానికి ఇదే కారణం .ఇదే విక్టోరియా యుగపు  ఆఖరి  లక్షణం.  హార్డీ రాసిన చురుకైన ,చిక్కని కవిత్వమే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసింది .2-6-1840లో ఇంగ్లాండ్ లోని   డార్ చెస్టర్ లో పుట్టిన హార్డీ గ్రామం గొప్ప లాండ్ స్కేప్ లకు నిలయం .దీనికే తర్వాత వేస్సేక్స్ అనే పేరొచ్చింది .అతని కవిత్వానికి నేపధ్యం ఈ ప్రదేశమే .అతని కుటుంబ వృక్షపు వ్రేళ్ళు ఇక్కడే బలం గా పాతుకు పోయి ఉన్నాయి .తల్లి తరఫు వారిది వ్యవసాయ వ్రుత్తి .తండ్రిది రాతి పని చేసే తాపీ వ్రుత్తి .హార్డీకి తలి దండ్రుల నుండి మొరటు తనం అబ్బలేదు . నెలలల కంటే ముందే పుట్టటం తో  ఒక నర్సు అతడిని బతికించింది. రోగిష్టి అవటం తో స్కూల్ కు పంపలేదు .ఇంటిదగ్గరే తల్లి రక్షణలో ఉండి ఆమె చెప్పిందే నేర్చాడు .ఈ ‘’నెల తక్కువ వాడు ‘’ఆరేళ్ళ కంటే బతకడు అని అందరూ ‘’దీవిస్తే ‘’ సుబ్భరం గా 88 ఏళ్ళు జీవించి అందరినీ ఆశ్చర్య పరచాడు . భూమ్మీద పడిన నాటి  నుండి సంచలనమే సృష్టించాడు హార్డీ .

భవన నిర్మాణం-పెళ్లి

ఎనిమిదో ఏడు రాగానే అయిష్టంగానే బడికి పంపారు .ఏది నేర్చినా తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకొన్నాడు హార్డీ  .16 ఏళ్ళకు మామూలు విద్య పూర్తీ చేశాడు .కొడుకును ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తండ్రి పనిలో కుదిర్చాడు . ఆతర్వాత ఆర్కిటెక్చర్ లో నిపుణుడైన మరో వ్యక్తీ వద్ద చేర్చాడు .20 వ ఏట రాయల్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ నుంచి ఒక అవార్డ్ వచ్చింది .ఇది అతని విద్య ను చూసి ఇచ్చిన్దేకాని ఆర్కిటెక్చర్ పనికి మెచ్చి ఇచ్చి౦ది కాదు . బిల్డింగ్ లు నిర్మించటం కన్నా బుక్స్ మీద ఆసక్తి ఉండేది కాని 27 వ ఏట ఆర్కిటెక్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు .30 వ ఏట కారన్ వాలిస్ వెళ్లి ఒక చర్చి ని పునర్నిర్మించాడు .అక్కడ వికార్ వదిన   ఏమ్మా గిల్ ఫోర్డ్ తో ప్రేమలో పడి పెళ్ళాడాడు .

కవిత్వం నుంచి నవలకు జంప్

అప్పటికే హార్డీ కవిత్వం రాస్తున్నాడు .కాని పత్రికలూ మాత్రం ప్రచురించలేదు .రాళ్ళల్లో సూక్తుల సరస్వతీ కటాక్షం ఉన్నా కడుపుకు తిండి పెట్టె లక్ష్మీ కటాక్షం లేదని గ్రహించి. ఆర్కి టేక్చర్ కు గుడ్ బై చెప్పేశాడు .రచనలతోనే సంపాదన పొందాలని భావించాడు .కవిత్వం డబ్బేమీ చేపటం లేదని గ్రహించి ఫిక్షను కు ఫిక్స్ అయ్యాడు .’’ది పూర్ మాన్ అండ్ ది లేడి ‘’అనే మొదటి నవల రాశాడు .కాని ఇందులో ప్లాట్ ఏమీ లేదని పబ్లిషర్ ప్రచురించ లేదు .కోపం వచ్చి రాసిన దాన్ని తగల బెట్టి మరోనవల ‘’డేస్పెరేట్ రేమిడీస్ ‘’రాశాడు .ఇందులో వస్తువు పాత్రల్ని డామినేట్ చేసింది .స్వంత చిలుం వదిలించుకొని అచ్చేసి వదిలాడు .కాని వ్యతిరేకమైన సమీక్షలు మరీ నీరు గార్చాయి .లెక్కచేయకుండా ‘’అండర్ ది గ్రీన్ వుడ్ ట్రీ ‘’,’’ఏ పైర్ ఆఫ్ బ్లూ ఐస్ ‘’అనే రెండు నవలలలు రాసి వదిలాడు .దీనితో తాను ఒక రచయితను అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఒక మేగజైన్ నవల రాయమని హార్దీని కోరింది .ఇప్పటికి తానేమిటో లోకం అర్ధం చేసుకోన్నదనుకొన్నాడు .దీని ఫలితమే ‘’ఫార్ ఫ్రం ది మాడేనింగ్ క్రౌడ్ ‘’నవల .ఈ నవల ఆర్ధికం గా విజయాన్నిచ్చి సాహిత్యం లోనూ పేరును నిల బెట్టింది .జార్జి ఇలియట్ కు ఘోస్ట్ రచయిత హార్డీ అని ఒకడు బాంబు పేల్చాడు .హార్డీ నవలలో వేస్సేక్స్ గ్రామీణ వాతావరణాన్ని మనుష్యుల తీరు తెన్నులను చాలా శక్తి వంతం గా ప్రదర్శించాడు .కాని సబ్జెక్ట్ మీదపూర్తీ  అధారిటీ రాలేదు .

ముప్ఫై ఏళ్ళ వయసులో చూడటానికి పెద్దగా ఆకర్షణీయం గా  ఉండేవాడు కాదు .సాధారణ పొడవుతో ,నీలి కళ్ళతో ,పల్లెటూరి రై(బై )తు లాగా కనిపించేవాడు . భార్య తో కొంతకాలం లండన్ లో కాపురమున్నాడు .నలభై లలో వరుసగా గుండె పోట్లు రావటం ప్రారంభించి బతుకే ప్రమాదం అనే స్థితికి వచ్చింది .అయినా మరో నవల చాలా తీవ్రంగా రాస్తూనే ఉన్నాడు .

బాక్ టు పెవిలియన్

. ఈ నవల తో ఆపేసి తాను మొదటి నుంచి మక్కువ పెంచుకొన్న కవిత్వం తోనే కాలం గడపాలని నిర్ణయానికి వచ్చాడు .రెండేళ్ళ తర్వాత లండన్ వదిలి తన స్వగ్రామం డార్చేస్టర్ చేరి మళ్ళీ ఆర్కిటెక్ట్ అవతారం ఎత్తి స్వంత ఇల్లు’’మాక్స్ గేట్’’ నిర్మించుకొన్నాడు . దీన్ని చూడటానికి ఎందరో సందర్శకులు వస్తూంటారు .కొంచెం సిగ్గూ ,ఒంటరితనం ఇష్టపడే హార్డీ లండన్ లోని  పబ్లిక్  జీవితం కంటే ప్రైవేట్ జీవితం లోనే ఆనందం ఉందని భావించి డార్చేస్టార్ కు వచ్చానని చెప్పుకున్నాడు

బెడిసి కొట్టిన నవలలు  .

1874-1890 మధ్య పదహారేళ్ళకాలం లో ఎనిమిది నవలలు  30 చిన్నకధలు రాశాడు .అన్నీ డబ్బును వర్షించాయి .యాభై వ ఏట ‘’టేస్స్ ఆఫ్ దిడి అర్బేర్ విల్లీస్ ‘’నవల రాసి ప్రచురించాడు .దీనిపై విమర్శకులు విరుచుకు పడ్డారు .మేగజైన్ లో ప్రచురణార్హం కాదన్నారు .దీనికి సమాధానం గా ‘’జూడే ది అబ్ స్క్యూర్ ‘’రాశాడు .ప్రకృతి ధర్మాలకు విరుద్ధం గా రాశాడని  అనైతికతను ప్రోత్సహించాడని ఈస డించారు .మనిషి అంతర్ స౦ఘర్షణకు ,బాహ్య క్రూరత్వానికి బలై  చనిపోవటం ఇందులోకద .దీన్నే  అమెరికాలో’’ జూడే ది అబ్ సీన్ ‘’గా ప్రచురించినా విమర్శల జడివాన తప్పలేదు .దాన్ని నిరసించారు అవహేళన చేశారు .’’ఫిల్ది నావెల్ ‘’అన్నారు  ఒకాయన ఆ నవలను తగల బెట్టి దాని బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపి కోపం తీర్చుకొన్నాడు .దీనితో ఇక నవలల జోలికి వెళ్ళ కూడదనే నిర్ణయానికొచ్చాడు .ఈ విషయాన్నే హార్డీ ‘’I have to give up verse for prose in order to make a living –in later life  referred to my novels as’’ pot boilers ‘’ and ‘’wretched stuff ‘’and I  returned with joy as well as relief to poetry ‘’అని చెప్పుకొన్నాడు .

బాక్ టు పెవిలియన్ –మహత్తర బృహన్నాటకం

సుమారు అరవైవ వసంతం లో హార్డీ మొదటి కవితా సంపుటి ‘’వేస్సేక్స్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఇందులో 30 ఏళ్ళుగా రాసిన లిరిక్కులు బాలడ్లూ కలిసి ఉన్నాయి .జనానికెవరికీ పట్టనే లేదు .నాలుగేళ్ల తర్వాత’’పోయెమ్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’సంపుటి వెలువరిస్తే కొంత మెరుగైన ప్రోత్సాహం లభించింది .ఇక ఈ ముసలాడి పని అయి అయిపొయింది ఇక రాసే దమ్ము లేదు అని అందరూ అను కొంటూ ఉండగా ఆశ్చర్య పరుస్తూ ‘’ది డైనాస్త్స్ ‘’అనే నాటకం మొదటి భాగాన్ని వదిలి , నాలుగేళ్ళ తర్వాతా దాన్నిమూడు భాగాలతో  పూర్తీ చేశాడు .ఇందులో  నెపోలియన్  యుద్ధాలకు సంబంధించిన విష యాలు పరమనాటకీయం గా ఉన్నాయి 19 అ౦కాలతో  ,130 సీన్లతో బృహత్తరంగా ఉన్న నాటకం ఇది ..విమర్శకుల నోళ్ళు మూసుకు పోయాయి .అప్పటిదాకా హార్డీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొన్నారు .లండన్ టైమ్స్‘’the dynasts combines ,as only a work of genius could combine ,a poetic philosophy with minute historical knowledge and a shrewd eye for the  tragical and comical ways of men and women ‘’అని అభి వర్ణించింది  .లాసేల్లెస్ ఆబెర్ క్రోమ్బీ అనే ప్రముఖ విమర్శకుడు ‘’the biggest and most consistent exhibition of fatalism in literature ‘’అని కీర్తించాడు  ‘’ఫాటలిజం’’  అంటే జీవితం లో జరిగే సంఘటనలు ముందే దైవ  నిర్ణయాలై ఉంటాయి వాటిని మనం మార్చలేము అని అర్ధం .ఫేట్ కు సంబంధించింది ఫాటలిజం  మన భాషలో ‘’విధి లిఖితం ‘’.

దూషణలకు బదులు భూషణలు-పురస్కారాలు

ఇప్పటిదాకా అంటీ ముట్టనట్టు ఉన్న సమాజం ఒక్కసారి హార్డీ ని గుర్తించింది. కేర్తి కిరీటం పెట్టింది .విమర్శల జడివాన పోయి పొగడ్తల పూల వాన కురిపించారు. అభినందనల వెల్లువ సాగింది .సన్మాన పరంపర ,సత్కార హోరూ పెరిగాయి .లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారి స్వర్ణ తకం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్  అందుకొన్నాడు హార్డీ .ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జ్ ,బ్రిస్టల్ యూని వర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించి సత్కరించాయి .రాయల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్స్ వారు హార్డీకి ఫెలో షిప్ అందజేశారు .తన డార్ చెస్టర్ స్వగ్రామం ఇంతటి ఘన విజయాలను సాధించి ఇచ్చింది అనుకొన్నాడు .72 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది .ఎంతోకాలం గా తన దగ్గర సేక్రటరిగా పని చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు హార్డీ .ప్రఖ్యాత రచయిత సోమర్ సెట్  మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఏల్ ‘’నవల హార్డీ కుటుంబ జీవితమే అని విశ్లేషకుల భావన .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

జననం –విద్య

శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళవరదాచార్యుల వారు అంటే ఎవరికీ తెలియదుకాని ఎస్. టి .జి .వరదాచార్యులు అంటే యిట్టె అందరికి తెలిసి పోతుంది .ఆ పేరుతో అంత ప్రాచుర్యం పొందారు .కృష్ణా జిల్లా బందరు దగ్గరున్న చిట్టి గూడూరు లో విద్యా వైదుష్యాలకు నెలవైన సంపన్న వైష్ణవ కుటుంబం లో వరదా చార్యుల వారు 4-8-1892జన్మించారు .మచిలీ పట్నం హిందూ హై స్కూల్ లోను ,  అక్కడి నోబుల్ కళాశాలలో  ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజి  లోను  విద్య నభ్యసించి సంస్కృతం లో ఏం. ఏ .ఆనర్స్ డిగ్రీ పొందారు .

గీర్వాణ సేవ

డిగ్రీ పొందిన తర్వాత విజయనగరం మహా రాజా వారి సంస్కృత కళాశాలలో కొంతకాలం ,ప్రదానాధ్యాపకులుగా పని చేశారు .తర్వాత ప్రాచ్య పాఠశాలల (ఓరియెంటల్ స్కూల్స్ )పాలనా వ్యవహారాలను పర్య  పర్య వేక్షించే అధికారిగా వ్యవహరించారు .

స్వంత గ్రామం లో ప్రాచ్య కళాశాల స్థాపన

ఆ తర్వాత స్వగ్రామం చిట్టి గూడూరు చేరి తమ తండ్రి గారి పేరిట ప్రాచ్య కళాశాలను ప్రారంభించారు .నిర్వాహక సమితికి అధ్యక్షులుగా ఉన్నారు .ఉవ్వెత్తున ఎగసిన భారత జాతీయోద్యమ కాలం లో  జాతీయ విద్యను బోధించాలనే సంకల్పం తో జాతీయ విద్యా పరిషత్తును ఏర్పరచి కార్య దర్శిగా ఉండి జాతీయ కళాశాల ను మచిలీ పట్నం లో ఏర్పాటు చేశారు .దీన్ని తీర్చి దిద్దటం లో  ఆచార్యులవారు తీసుకొన్న శ్రద్ధా చొరవ మాటల తో వర్ణించ లేనంత గొప్పది .

భద్రాచల రామాలయ  జీర్ణోద్ధరణ

వరదాచార్యుల వారు ఆగమ శాస్త్రం లోను నిష్ణాతులు .భద్రాచలం లోని శ్రీ సీతా రామ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కమిటీ ఉపాధ్యక్షులై అహరహం శ్రమించి నిర్మించారు .

ఆచార్యుల వారి గీర్వాణ రచన

వరదాచార్యుల వారు తెలుగు శతకాలను ఏడింటిని సంస్కృతం లోకి అనువదించారు .వీటిని ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి ముద్రించిం వెలువరించింది .’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’అనే తులనాత్మక భాషా శాస్త్ర గ్రంధాన్ని ఆచార్యుల వారు సంస్కృతం లో రచించి అనన్య కీర్తి సాధించారు .అది పరమ ప్రామాణిక గ్రంధం గా పేరు పొందింది .

గౌరవ పురస్కారాలు

రాష్ట్ర, రాష్ట్రేతర విశ్వ విద్యాలయాలలో ‘’పాఠ్య గ్రంధ నిర్ణయ పరిషత్తు’’ లో సభ్యులుగా అధ్యక్షులుగా వరదాచార్యుల వారు పని చేశారు .వీరి సమర్ధతకు తగిన పదవి .ఇది ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమి వరదా చార్యుల వారికి  1969 విశిష్ట సభ్యత్వం అందజేసి గౌరవించింది . ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది 90 ఏళ్ళు సార్ధక జీవనం గడిపిన  విద్యా వరదు లైన శ్రీ వరదాచార్యుల వారు 2-11-1982న శ్రీ వైకుంఠ౦   చేరుకొన్నారు. ..

సశేషం

150- కామ ప్రబంధం రాసిన రాజయోగి –దక్షణా మూర్తి పరమ హంసస్వామి

ఒక అనామక మంగయ్య  పరమ హంసగా మారాడు అంటే ఆశ్చర్యం వేస్తు౦ది కాని ఇది పక్కా నిజం .అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చరిత్ర .

బాల్యం

విజయనగరం దగ్గర మెట్ట లో న్యాయ వాది సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 మంగయ్య గారు జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు కనిపించి  ఏమికావాలని ఆయన కోరితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని మంగయ్య కోరితే బలవంతం గా సిద్ధుడు హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దాన్ని అనుస్టించటం వల్ల  మంగయ్యకు వాక్సుద్ధి కలిగింది .ఊరవతల గుట్టలలపై ఏకాంతం గా ఎప్పుడూ కూర్చునే వాడు .ఒక రోజున ఎవరిదో బంగారు నగ పోతే మంగయ్యను అడిగితే నగ ఇక్కడికే వస్తుందని చెప్పాడు .ఇంతలో ఒక కాకి ఆ నగను ముక్కుతో కరచుకొని తీసుకొచ్చి ఆయన ఉన్న చెట్టుపై చేరి కిందికి జార విడిచింది .ఈ విషయం తెలుసుకొన్న ఊరి జనం మంగయ్య కారణ జన్ముడు మహాత్ముడు అని భావించారు .

ఉపనయనం –విద్య

మంగయ్యకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు .పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ,తెలుగు ,ఆంగ్లం నేర్చుకొన్నాడు .ఒక సారి ఇంటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన మీద పడింది .అందులో ఉన్న పదార్ధాన్ని ఒళ్లంతా రాసుకొన్నాడు .ఆ కాయను బొడ్డులో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం వెళ్లి హైస్కూల్ లో చేరి సెకండరీ విద్య పూర్తీ చేసి ,ఇంటికి వచ్చి తండ్రి దగ్గర శైవ మంత్రాలను ఉప దేశం పొందాడు .

పెళ్లి –రాజయోగ ,హఠయోగ విద్య

పదహారవ ఏట మంగయ్యకు పెళ్లి అయింది .రైల్వే లో పని చేసే ఒకాయన రాజ యోగం క్షున్నం గా నేర్పాడు .యోగ ప్రభావాన్ని చూపించమని స్నేహితులు బలవంతం చేశారు ..అదే సమయం లో ఒక బండీవస్తుంటే దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమని సవాలు చేశారు .మంగయ్య యోగ శక్తితో ఆ బండీని అనేక సార్లు ముందు, వెనకలకు నడిపించి ఆశ్చర్య పరచాడు .కొంతకాలం తర్వాత బాలానంద పరమ హంస అనేసిద్దేశ్వర బ్రహ్మ చారి అనే  ఉత్తర దేశీయుని వద్ద రాజ ,హఠయోగ రహస్యాలు ఆకళింపు చేసుకొన్నాడు .

గణితం నుంచి వేదాంతం లోకి

మద్రాస్ వెళ్లి క్రిస్టియన్ కాలేజి లో చేరి గణితం లో బి .ఏ. చదివాడు .ఒక సారి కాలేజి లో జరిగిన డిబేటింగ్ పోటీలో గణిత ఉపన్యాసకుడు ‘’సైకాలజీ లో  ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్ ‘’ అని వాదిస్తే  ,కోపం తో లెక్కల సబ్జెక్ట్ ను వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొని చదివాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ‘’ఘట్టాన్ని పేరులో  ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .ముఖ్య శిష్యుడయ్యాడు .గురు శిష్యులిద్దరూ తరచుగా కావ్య గోష్టితో కాల క్షేపం చేసేవారు .ఒకసారి ప్రయోగం కోసం ఈ గురు శిష్యులు గంజాయి దమ్ము కొట్టారు .గురువు శాస్త్రి గారు దిమ్మ తిరిగి పడిపోయారు .శిష్యుడు  నిమ్మకాయ నీళ్ళు తాగించి పైత్యం వదిలించాడు .ఇద్ద్దరూ ఒక సారి శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి అందులో దుష్యంతుడు శకుంతలకు చేసిన అన్యాయాన్ని సహించలేక  పూర్తిగా చూడ కుండా  లేచోచ్చారు .బి ఏ .పూర్తి అయ్యే సరికి మంగయ్య లోని తర్క శక్తి పట్ట పగ్గాలు లేకుండా శిఖరారోహణం చేసింది .

లౌకిక ఉద్యోగాలు –అలౌకిక సాధన

నాడీ శుద్ధి,  కుంభక ప్రాణాయామం సాధిస్తూ మంగయ్య ఒంటి పూట భోజనం మాత్రమె చేస్తుంటే క్షయ రోగం పట్టుకుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని కొడుకు రోగం తగ్గించాడు .మంగయ్యకు తండ్రి మేధా దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేశాడు .మంగయ్య పర్లాకిమిడిలో పోలీస్ హెడ్ క్లార్క్ గా కొద్దికాలం  పని చేశాడు .ఉద్యోగం వదిలేసి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శిగా పని చేశాడు .ఒక సిద్ధుడు మంగయ్యకు శ్రీ స్వప్నాన్జనేయ ,శ్రీ వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియ జేశాడు .

స్కూల్ మేష్టారు మంగయ్య

భార్య ,పిల్లల్ని మామ గారింట్లో వదిలేసి మంగయ్య మద్రాస్ వెళ్లి ఎల్. టి . ట్రెయినింగ్ (ఉపాధ్యాయ శిక్షణ ) లో చేరాడు  .మంగయ్య రాసిన ఇంగ్లీష్ రచనలు చూసి అతని ప్రతిభకు సంమోహితుడై ‘’ఈరాక్ ద్రు’’అనే ఆంగ్ల దొర గుండెలు బాదుకొన్నాడు .తర్వాత నిజాం రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరి పని చేశాడు .ప్రభుత్వం మంగయ్య ప్రతిభను గుర్తించి బి .ఎడ్. జిల్లా కేంద్ర ఉన్నత విద్యాలయానికి హెడ్ మాస్టర్ గా నియమించింది .

శ్రీ కృష్ణ సాక్షాత్కారం –మహిమా ప్రదర్శన

మంగయ్య నిజామాబాదు లో ఉన్నప్పుడు గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ఈయన వద్ద  ‘’సమాధి భేదాలు ‘’నేర్చుకొన్నారు .మంగయ్య ఋగ్వేద ,యజుర్వేదాలను గురుముఖతా అభ్యసించారు .రామస్వామి అయ్యర్ ‘’వాసు దేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దీని వలన మంగయ్య గారికి శ్రీ కృష్ణ సాక్షాత్కారం కలిగింది  .హైదరాబాద్ గౌలి గూడా లో కాపురమున్నారు .ఇద్దరు స్నేహితులకు వేర్వేరు చోట్ల ఒకే సారి కనిపించి ఆశ్చర్య పరచారు .హరిహత్  దంపతులు శివ జపం చేస్స్తుంటే అనుకోకుండా ప్రత్యక్షమై మంగయ్యగారు రుద్రాభి షేకం చేసి మై మరపించారు  .శిష్యుడు ఒకడికి మంగయ్య గారు అగ్ని జ్వాలల మధ్య కనిపించారు. భయ పడి వాడు పారి పోతుంటే మళ్ళీ యధాస్థితికి వచ్చారు .పశు సంవర్ధక శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివ లింగం ఇచ్చి ఆ తర్వాత వరుసగా పదకొండు లింగాలు ఇచ్చారు. గృహస్తాశ్రమ జీవనం గడుపుతున్నా మంగయ్యగారు శ్రీ రామ శ్రీ  కృష్ణులు లాగా బ్రహ్మ చారులే. విదేశీ డాక్టర్లు ఈ విషయం పై పరి శోధన చేసి నిర్ధారించారు .

వశ్య వాక్కు మంగయ్య

మంగయ్య గారి పెద్ద కుమారుడి వివాహముహూర్తాన్ని తానె నిర్ణయించి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు ,పండితులు ఈ ముహూర్తానికి కేతు ,కుజ వేధలు ఉన్నాయని  ఆ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు ..ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని మంగయ్య గారు వాదించారు .పెళ్ళికొడుకుని రామాలయానికి తీసుకు వెడుతుంటే పాము అడ్డమొచ్చినది .కదలటానికి వీల్లేదన్నారు స్థానిక పండితులు .’’ఇదే నయ్యా కేతు వేద అంటే ‘’ అని మంగయ్య గారు చెప్పారు .పాము మాయ మై పోయింది  .పెళ్లి కొడుకును కళ్యాణ వేదిక వద్దకు  తీసుకొని వెళ్ళారు . పీటల మీద వధూ వరులను కూర్చో బెట్టారు .ముహూర్తం కోసం పండితులు జుట్టు పీక్కుంటూ గడియారాలను తదేకం గా చూస్తూ ఉండిపోయారు.ఒకళ్ళ టైం నాలుగు ,అని, ఒకళ్ళ గడియారం ఏడు అని ,మరొకరిది ఆగి పోయిందనీ చెప్పారు .మంగయ్య గారు ‘’ఇదేరా బాబూ కుజ వేద అంటే ‘’అని చెప్పి అక్షింతలు తాను  తీసుకొని ,అందరికీ  ఇప్పించి  అందరి చేత అక్షింతలు వేయించి తాను పెట్టిన శుభ లగ్నానికే కుమారుని వివాహం జరిపించారు ‘’ఇప్పుడు మీ గడియారాలు చోసుకోండి ‘’అన్నారు మంగయ్య .అందరి గడియారాలు మంగయ్య గారు పెట్టిన ముహూర్త సమయాన్నే చూపించాయి . అందరూ ముక్కు మీద వేలేసుకొన్నారు దట్ ఈజ్ మంగయ్య .వశ్య వాక్కు  మంగయ్య అయ్యారు .మంగయ్య గారి మహా శక్తికి అఘటన ఘటనా సామర్ధ్యానికి నివ్వెర పోయారందరూ .

మరిన్ని మంగయ్యగారి మహిమలు

దేవీ దాసు అనే వాడికి ఏ .బి. సి. డి. లు కూడా రావు .వాడితో కొన్ని గంటల సేపు ఇంగ్లీష్ లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్యగారు .తనకు’’ షోడశీ’’ మంత్రాన్ని ‘’దేవుజీ మహా రాజు ‘’గారే వచ్చి ఇస్తారని మంగయ్య గారు ముందే చెప్పారు .అందరూ  గణం జయ మహారాజు తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .సమయానికి  గణం జయుడు రాలేదు .దేవూజీయే వచ్చి మంత్రం దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత అమోఘమైనది .

మంగయ్య గారి విద్యా వైదుష్యం –గీర్వాణ రచన

మంగయ్యగారి విద్యా వైదుష్యం నిరుపమానమైనది .ఆంగ్లం లో అయిదు పద్యకావ్యాలు రాశారు .పదహారు ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు .సంస్కృతం లో ‘’కామ ప్రబంధం ‘’,’’దక్షిణ గీత ‘’’’సౌభాగ్య రత్నాకరం ‘’’’అద్వైత పారిజాతం ‘’,’’వ్యావహారిక దర్పణం ‘’వంటి అలౌకిక గ్రందాలనేన్నిటినో రాశారు .సంస్కృతం లో స్తుతి స్తోత్ర రచనా చేశారు .’’ధర్మాస్టకం ‘’వంటి అస్టకాలూ రాశారు .

కాలచక్ర గమనాన్ని ప్రత్యక్షం గా  దర్శింప జేసిన మహాత్ముడు మంగయ్యగారు

ఒక శిష్యుడు కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూడాలని ఉందని మంగయ్యగారిని వేడుకొంటే అతనికి కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లు వైఖరీ వాక్కు తో జపించే మంత్రాన్ని  మంగయ్యగారు పశ్యన్తీ వాక్కు తో  ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో తన మేడ మెట్లు దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్యగారు వైఖరీ వాక్కులో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు.అంటే మంగయ్య గారికి సమస్త జీవ రాశుల జన్మ వృత్తాంతాలు పూర్తిగా తెలుసు అని అర్ధమౌతుంది మనకు .

మంగయ్య గారి ప్రముఖ శిష్యులు

మంగయ్య గారికి జాతి మత భేదాలు లేకుండా ఎందరో శిష్యులైనారు .అలాంటి వారిలో జర్మన్ విద్వాంసుడు ‘’స్పర్జ్ ‘’, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ‘’బర్నెట్ ‘’,విద్యా మంత్రి ‘’నవాబ్ ఆజం యార్ జంగ్ ‘’,ఇంజనీరింగ్ మంత్రి ‘’మొహిదీ నవాబ్ జంగ్ ‘’,గణితా చార్యుడు ‘’సయ్యద్ సిరజుల్ హసన్ ‘’మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు .

మంగయ్య గారి స్పెషాలిటీ

మంగయ్య గారికి ఒక విచిత్రమైన అలవాటు ఒకటి ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షింతలు ఉంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంటూ ఉండేవారు .నడుస్తున్న ,కూర్చున్నా తమలో తాము మాట్లాడుకొంటూ ఉండేవారు ఇవి పరమహంస లక్షణాలు .మంగయ్యగారురాసిన ఒక ఇంగ్లీష్ పుస్తకానికి పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంవారు ‘’ఈ గ్రంధం లోని  అభిప్రాయాలను గ్రహించటానికి ౩౦౦ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు .అంత క్లిష్టమైన లోతైన రచన అన్నమాట .

మంగయ్యే దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

బాల బ్రహ్మ చారి అని పేరు పొందిన ‘’చిన్మయా నంద స్వామి ‘’మంగయ్య గారికి సన్యాస దీక్షనిచ్చి ‘’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమనామాన్ని ఇచ్చారు .స్వామి ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .ఎందుకోకాని అక్కడ మంచి ఫలితం రాలేదు .విశాఖ పట్నం వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసుకొని శ్రీ లలితా దేవి ని ప్రతిష్టించారు .ఆ ప్రాంతం లలితానగర్ గా పేరు పొందింది .

పరమ హంస సిద్ధి

దక్షిణామూర్తి పరమ హంస స్వామి 1954లో 92 వ ఏట సిద్ధిపొందారు .స్వామి ముఖ్య శిష్యులు ‘’వాల్వేకర్ ‘’ఆశ్రమాదికారి అయి అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేసి 1995లో సిద్ధి పొందారు .వీరిని గురువుగారి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు ఈ లలితాశ్రమాన్ని కుర్తాళం పీఠాదిపతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )28-6-1998 లో దత్తత తీసుకొని శ్రీ రామానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలు అప్ప గించారు .

(ఆధారం –నేను రాసిన ‘’సిద్ధ యోగి పుంగవులు’’పుస్తకం  )

Inline image 1

 

 

మనవి-   ఆధునిక   సంస్కృత రచయితలైన సర్వశ్రీ కోగంటి సీతా రామాచార్యులు ,కొలచల యజ్న నారాయణ దీక్షితులు అనే క్షేమేంద్ర , ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి , ల గురించి నాకు వివరాలు ఏవీ దొరక లేదు .ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటె ,నాకు తెలియ జేస్తే వారి గురించి కూడా రాస్తాను .నేను మరచి పోయిన ఇంకా ఎవరైనా ఆధునిక సంస్కృత రచయితలు ఉంటె కూడా నాకు తెలియ జేస్తూ వారి వివరాలూ మీకు అందుబాటులోఉంటే నాకు తెలిపి నా గీర్వాణ సేవకు చేయూత నివ్వమని అర్ధిస్తున్నాను .దుర్గాప్రసాద్ -18-6-15-

మరో మనవి – నా గీర్వాణ కవుల కవితా గీర్వాణం గ్రంధం చదివి ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు (హైదరాబాద్ ) నేను మరింత సమాచారం తెలుసుకోవటానికి వీలుగా శ్రీ ఏం.కృష్ణ మాచారియార్ గారుఆంగ్లం లో  రచించి 1937లో ప్రచురించ బడిన ‘’History of classical Sanskrit Liiterature ‘’ గ్రంధాన్ని చదవమని సలహా ఇచ్చారు .ఈ విషయం తెలుసుకొని వెయ్యి పేజీల  ఈ మహా గ్రంధాన్ని నాకు, సరసభారాతికి అత్యంత ఆప్తులైన శ్రీ మైనేని గోపాల కృష్ణగారు దాన్ని కొని ,దానితోపాటు మరికొన్ని సంస్కృత గ్రంధాలను కూడా నాకు మే నెలలోనే అందేట్లు పంపారు. వారి సుహ్రుదయతకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .

పై గ్రంధం ఆధారం గా మిగిలిన  పూర్వ గీర్వాణ కవుల కవితా గీర్వాణ వైభవాన్ని ‘ఈ రెండవ భాగం లో 150 వ కవిగా ‘’వత్స భట్టి ‘’తో  ప్రారంభించి వీలు కుదిరినప్పుడల్లా రాస్తానని   మనవి చేసుకొంటూ ,శ్రీ గోపాల కృష్ణగారికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను  .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్  –19-6-15 –ఉయ్యూరు

151—      ‘’ ప్రశస్తి ‘’రచించిన వత్స భట్టి

మందసార్ సూర్య దేవాలయం లో శిలా ఫలకాలపై ఉన్న ‘’ప్రశస్తి ‘’శ్లోకాలను వత్స భట్టికవి  మాళవ సంవత్సరం లో అంటే 529లో రాశాడని భావిస్తున్నారు . బూలర్ లెక్క ప్రకారం ఇది క్రీ .శ.473-74 అవుతుంది .ప్రశస్తి లో 44 పద్యాలున్నాయి .మొదలు చివర మంగళా శాసనంలు వచనం లో  ఉన్నాయి  .చక్ర వర్తి కుమార గుప్తుని గురించి రాజులు విశ్వ వర్మ ,బంధు  వర్మల గురించి  సూర్య దేవాలయ నిర్మాణాన్ని గురించి  శీతాకాల వర్ణన అందులో కవి రాశాడు .అనేక ఛందస్సులను ప్రయోగించాడు .ఈ రకమైన రచనలు తూర్పు దేశ కవులే చేస్తారని దండి వివరించాడు .మొత్తం కవిత్వం చాలా ధారా శుద్ధితో ఉంటుంది .

నాలుగో శతాబ్దం రెండవ భాగం లో దశ పురా –మందసోర్ లోని సూర్య దేవాలయ ప్రశస్తి గౌడీయ విధానం లో ఉన్నట్లు కనిపిస్తుంది .ఈగౌడకవులు తూర్పు భారతానికి చెందిన వారుగా భావిస్తారు .వత్సభట్టి రాసిన ప్రశస్తి లో కవిత్వాన్ని అధ్యయనం చేస్తే కవి మహా కావ్య పరిచయం బాగా ఉన్నవాడని తెలుస్తుంది .ఛందస్సులో గొప్ప పాండిత్యం ఉన్నవాడుగా తోస్తుంది .అతనిలో గొప్ప కవిత్వం ఉందని  మహా కావ్య నిర్మాణం చేసే సమర్ధత ఉందని అనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు .కాని నిరర్ధక పాదపూరక ప్రయోగాలు ,అసందర్భ పదాలు కొన్ని వాడాడు .ఒక్కో చోట వ్యాకరణ మూల విషయాలనే వదిలేశాడు .సంప్రదాయ కవులు పాటించిన నియమాలను కాదని స్వేచ్చ తో కూడా రాశాడు .కొత్త పోలికలనూ చెప్పాడు .మేఘాలకు ఇళ్ళకూ పోలిక చూపాడుకాని అది ఆకర్షించ లేదు .ఇవన్నీ చూస్తె వత్స భట్టి  ,ఆనాటి సమాజం లో ఉన్న యదార్ద స్థితికే అద్దం పట్టాడని పిస్తుంది .

దీన్ని బట్టి చూస్తె 472 నాటికే గొప్ప ప్రశస్తమైన కావ్య సాహిత్యం ఉందని తెలుస్తోంది .ప్రశస్తిలోని పదవ పద్యం పునరావృత్తమైంది .కాళిదాసు మేఘ దూతం లోని 65 వ శ్లోకం ను భట్టి కవి వాడుకున్నాడని ,కాళిదాసులాగానే ఈతనికీ ‘’శుభగ ‘’పదం ఇస్టమని తెలుస్తుంది 11 వ పద్యం కూడా కూడా కాలిదాసుకు కాపీ యేననిపిస్తుంది .కాళిదాసు రఘు మహా రాజును  వర్ణించి నట్లే  వత్స భట్టి  రఘు వర్మను వర్ణించాడు .కనుక వత్సభట్టికి కాళిదాసమహాకవి కావ్య రచనలన్నీ పరిచయమే నని అనిపిస్తుంది .ప్రశస్తిలో కాళిదాస ఋతు సంహారం లోని అయిదవ సర్గ లోని రెండు మూడు శ్లోకాలను శబ్ద ప్రయోగం భావం లలో పూర్తిగా పోలి ఉన్నాయని ప్రొఫెసర్ కీల్హాన్ అన్నాడు కాని అది అసంబద్ధం అని ఈ గ్రంధ రచయిత క్రిష్ణమాచారియార్ అభిప్రాయ పడ్డారు .ఇవన్నీ గమనిస్తే కాళిదాసు క్రీ శ 472కు పూర్వం వాడే అని నిర్ధారణగా చెప్పవచ్చునంటారు ఆచార్య .

వత్స భట్టి రాసిన గ్రంధాలేవీ లభ్యం కాలేదు .మందశౌర  ప్రశస్తి అనేది మాత్రమె శిలాఫలక రూపం లో దొరికింది .ఇందులో అక్కడి సూర్య దేవాలయాన్ని  చేనేత పనివారు క్రీ.శ 437 లో నిర్మించిన వైనాన్ని వర్ణించాడు .మొదట శివుని గూర్చి ప్రార్ధన ఉంటుంది .తర్వాత మంద సౌర ప్రశస్తిని చెప్పాడు .సమకాలీన రాజు అయిదవ శతాబ్దానికి చెందిన  నరపతి వర్మ ను వర్ణించాడు .వత్సభట్టి కవిత్వం పై కాళిదాసమహాకవి ప్రభావం బాగా కనిపిస్తుంది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆడవాళ్ళకు మాత్రమె ప్రవేశం ఉన్న దేవాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడవడి యే అసలైన అలంకారం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ గే ట్ ”మరియు చెత్త రాజకీయం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్ట జీవులే కలకాలం బతుకుతారు -84 ఏళ్ళ శ్రీమతి మల్లు స్వరాజ్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు బెల్లం కొండ రామరాయ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు  బెల్లం కొండ రామరాయ కవి

వైష్ణవ సంప్రదాయం లో జన్మించి అద్వైతాన్ని ఆలింగనం చేసుకొని దాని లోతులను తరచిన మహా కవి ,విమర్శకులు శ్రీ బెల్లం కొండ రామ రాయకవి .గుంటూరు జిల్లా నరసరావు పేట దగ్గర పమిడి పాడు లో నియోగికులం లో సంపన్న గృహస్తుఇంట  రామరాయకవి 1876లో జన్మించారు .భారద్వాజ గోత్రీకులు .ఆశ్వలాయ సూత్రులు ,రుక్ శాఖకు చెందిన వారు .చిన్నతనం లో నే పితృ వియోగం కలిగింది .

స్వయం కృషితో విద్య –పిన్న వయసులోనే రచనా వ్యాసంగం

స్కూలు లో చేరి మొదట కొంతకాలం ఇంగ్లీష్ విద్య నేర్చుకొన్నారు .అది మానేసి సంస్కృతం అభ్యసించారు .హయగ్రీవ ఉపాసకులై విశిస్టాద్వైత మతానికి మారారు .చిన్నతనం నుండి సంస్కృతం లో కవిత్వం రాయటం అలవడింది .సంస్కృత పాండిత్యమూ అప్పటికి గోప్పదేమీకాదు .  కాళిదాసు రాసిన రఘువంశం , కుమార సంభవం లలో రెండేసి సర్గలు మాత్రమె నేర్చుకొన్నారు .మేఘ దూతం చదవటం మొదలు పెట్టి పూర్తిగా చదవకుండా అంతా విన్నారు .సంస్కృత జ్ఞానం బాగా ఏర్పడింది .తర్వాత అన్నిటిని స్వయం గా అభ్యసించారు .14 వయేత ‘’రుక్మిణీ పరిణయం ‘’,రమా పరిణయం ‘’ అనే చంపూ కావ్యాలు రాశారు .నెల్లూరుకు చెందిన సింగరాజు వెంకట రమణయ్య ,గారి రెండవ కుమార్తె ఆడి లక్ష్మమ్మ గారిని రామ రాయకవి వివాహం చేసుకొన్నారు .

అంతర్ముఖత్వం –హయగ్రీవ ఉపాసన

కంఠం లోతు నీటిలో నిలబడి హయగ్రీవ మంత్రాన్ని అనుష్టానం చేసేవారు . చింత తోటలోకి చేరి అరుగుమీద కూర్చుని ఉపాసన చేసేవారు .ఇంటి లో హయగ్రీవార్చన నిత్య కృత్యం గా చేసేవారు .చదువుమీద శ్రద్ధ ఉన్న విద్యార్ధులకు తన ఇంట్లోనే ఆహార వసతులను కలిపించి సాహిత్యాలంకార శాస్త్రాలను బోధించేవారు .పురిఘళ్ళ రామ శాస్త్రి  సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుల వద్ద తర్కాన్ని వ్యాకరణాన్ని నేర్చారు .వ్యాఖ్యా వ్యాకరణాలను స్వయం గా నేర్చారు .

ద్వైతి- శంకరాద్వైతిగా మారటం    రామరాయ కవితా యశోభూషణం

‘సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్యానం రాశారు .అనునిత్యం వేదాంత గ్రంధ పఠనం చేసి అద్విత వేదాంతాన్ని మొత్తం గా స్వయం గా ఆకళించుకొని నిష్ణాతులయ్యారు .అప్పటిదాకా ఉన్న విశిష్టాద్వైత మతాభిమానం తొలగించుకొని పూర్తిగా  అద్వైతి అయ్యారు రామరాయకవి .వంశ పారంపర్యంగా వచ్చిన ద్వైతాన్ని విసర్జించి ఆ గురువులకు దూరమై పోయి అద్వైతానికి అంకితమయ్యారు .శంకర వేదాంత గ్రంధాలను బోధించారు .జీవితకాలం లో రామ రాయ కవి 143 గ్రంధాలు రచించిన బహు గ్రంధ కర్త .తానె స్వయం గా కొన్ని గ్రంధాలను ముద్రించారు ఇంత చిన్న వయసులో ఇన్నిఉద్గ్రంధాలు   రాసిన వారెవ్వరూ లేరు .వీరికి వీరే సాటి గా నిలిచారు

.                    రామరాయ కవితా యశోభూషణం

రామరాయ కవి రాసిన వాటిలో స్తోత్ర గ్రంధాలు, శతకాలు అనేకం ఉన్నాయి .అందులో  అష్టకాలు ,స్తోత్రాలు కలిసి 68 ఉన్నాయి .వీటన్నిటిలో శాంకరాద్వైతాన్నే ప్రతిపాదించారు కవిగారు ఇందులో ‘’హకారాది హయగ్రీవ సహస్ర నామావళి ‘’చాలా ప్రాచుర్యం పొందింది ..శంకర భగవత్పాదులు రాసిన ‘’గీతా భాష్యం ‘’కు వ్యాఖ్య రాశారు .శంకర భాష్య టీకా గా ‘’గీతా భాష్యార్ధ ప్రకాశిక ‘’,దశోపనిషత్తులకు ‘’వేదాంత ముక్తావళి ‘’,అద్వైతం పై ‘’శంకరా శంకర భాష్య విమర్శ ‘’ స్వామి మధుసూదన సరస్వతి రాసిన గ్రంధానికి ‘’సిద్ధాంత సింధువు ‘’వ్యాఖ్య , అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ‘’వేదాంత కౌస్తుభము ‘’,రాశారు .’’అద్వైతాన్య మత ఖండనం ,,’’కౌముదికి వ్యాఖ్యగా ‘’శరద్రాత్రి ‘’,చంపూ భాగవత వ్యాఖ్య  మురారి రాసిన అనర్ఘ రాఘవ నాటకానికి వ్యాఖ్య ,సముద్ర మధన చంపూ కావ్యం ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి కావ్యం రాశారు .రామరాయ కవి గ్రంధ రచనను ఒక మహా తపస్సుగా చేశారు .అద్భుత ధారా శుద్ధి  శబ్ద శుద్ధి రామరాయ కవి గారి ప్రత్యేకత .

అంతర్ముఖుడైన సమావిస్టూడైన యోగిగా రామ రాయ కవిని లోకం గుర్తించి కీర్తించింది .హయగ్రీవ ఉపాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన సిద్ధ యోగి పుంగవులు శ్రీ బెల్లం కొండ రామ రాయ కవి కేవలం 39 సంవత్సరాలు మాత్రమె జీవించి శతాధిక గ్రంధ రచన చేసి 1914 లో ముక్తిని పొందారు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్గనిస్తాన్ లో బమియాన్ బుద్ధ ధగ దగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంజని -నందివాడ కధల పోటీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య మర్మమెరిగిన కారా మాస్టారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగాచార్య – కవిత -”కొలిమంటు కొంది ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మిలిటంట్లకు శివంగి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో సవాల్ అంటే శారీరక బాల ప్రదర్శనమా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

kashi 1 001 kashi2 001కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విరాట రాజు గద్దె కాదు -బౌద్ధ స్థూపం

viratraj gadde 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతిలో బౌద్ధమత ప్రాభవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సూర్యుడు బ్రౌన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిదంబర దేవాలయం లో ”సభలు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ స్థాయి బుచ్చిబాబు -దా.వేదగిరి రా0 బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందిరా ఎమర్జెన్సీ పెట్టి 40 ఏళ్ళయింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనీ‘షి’ -అడుసుమల్లి మల్లికార్జున-కద

మనీ‘షి’

  • 14/06/2015
  • |

  • -అడుసుమల్లి మల్లికార్జున

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
***
ఓం
భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యమ్
భర్గో దేవశ్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్!’
ధ్యానం ముగించుకుని గాయత్రి మంత్రం స్మరిస్తూ – తలుపు తీశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ రాముడు.
‘ఒరే రాముడూ!’ ఆనందంతో బిగ్గరగా కేక వేశాను.
‘అంత బిగ్గరగా అరవకు. ఎక్కడో సీతమ్మ దగ్గరున్న రాముడు కంగారుపడి పరుగెత్తుకొచ్చేను’ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు రాముడు అని నేను పిలిచే రామచంద్రయ్య. చిన్ననాటి నుంచి వదలకుండా ఇంకా మిగిలి వున్న ఏకైక నేస్తం.
‘పద్మ ఎప్పుడు వస్తుందిరా?’
‘నిన్ననే కదరా వెళ్లింది. వాళ్ల తమ్ముడు కూతురు సంబంధం విషయమై వెళ్లింది. రెండు మూడు రోజులు పడుతుంది’ అన్నాను.
‘ఈ మూడ్రోజులు బతుకు పో’ అందా?’
‘మరి? ఆడాళ్లు అప్పుడప్పుడు అలా వెళ్లకపోతే మగాళ్లు చచ్చిపోరట్రా’
మా ఆఫీసులో ఈ మధ్య ఓ జోకు –
సుబ్బారావని అటెండరు. ఈ మధ్య ‘హార్ట్ స్ట్రోక్’ వచ్చింది. ఏమయ్యా! నీకు షుగర్ లేదు. బి.పి. లేదు. ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా అని డాక్టర్ అడిగారట. ‘్భర్య వుందిగా’ అన్నాడట మెత్తగా. డాక్టర్ తేరిపార చూసి ‘నిజమేనయ్యా! ఆ విషయం మర్చిపోయా’ అన్నాడట అంతకంటె మెల్లిగా.
ఇద్దరం భలే నవ్వుకున్నాం. వాడుంటేనే ‘్భలే’ అనే పదానికి అర్థం.
‘నేను స్నానం, ధ్యానం ముగించుకుని వస్తాను. అంతవరకు వీటి జోలికెళ్లకు’ అంటూ నాలుగు పొట్లాలు టేబుల్ మీద పెట్టాడు.
‘ఏమిటివి?’
‘వస్తూ వస్తూ
కనుక్కున్నాను. శీనయ్య హోటల్‌లో ఇడ్లీ, పెసరట్టు ఉప్మా బావుంటాయని తెలిసింది. అవే ఇవి’ అంటూ టవల్ అందుకున్నాడు.
నేను నోరు తెరుచుకుని చూస్తూండిపోయాను.
నేను బాపట్ల వచ్చి నాలుగైదు నెలలు. ఆ శీనయ్య హోటలు సంగతి నాకింతవరకు తెలీదు. వీడు అడుగుపెట్టింది ఈ రోజే. ఇప్పుడే కాదు వాడు ఎప్పుడూ అంతే. ఏదైనా టూర్ వెళ్లినపుడు – మేమంతా పట్టించుకోని విషయాలు, అతి చిన్న విషయాలు వాడికి తెలిసిపోయేవి. ఏదైనా ఊరు వెళ్లి వస్తే ఆ ఊరు ఆహార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఈనాటికి వాడికి ఆ ‘ఉత్సుకత’ తగ్గలేదు. అడిగితే ఏమనుకుంటారో అనే ‘్భతి’ నాకూ తగ్గలేదు.
రాముడు వాళ్ల నాన్నగారు మిలట్రీ ఆఫీసర్. కాళ్లకు చెప్పుల్లేకుండా మేము హైస్కూలు వెళ్తున్నపుడు – వీడు టై, టక్, బూట్లతో ప్రత్యక్షమయ్యేడు. అందరూ ‘సిటీ బాయ్’ అన్నారు. వాడి చదువు కూడా అట్లాంటి చోటే సాగింది. వాడి దగ్గరకు వెళ్లాలంటే అందరికీ బెరుకు. తను మాత్రం అందరితో ఫ్రీగా వుండేవాడు. నాతో మరింత దగ్గరగా వచ్చేవాడు. అలా ఆనాటి నుంచి మంచి స్నేహం.
చాలా సున్నితమైన విషయాలు కూడా నాకు చెప్పేవాడు.
పైట చూసి ఆమడ దూరం పరుగెత్తే వయసులో తను మాత్రం మగ పిల్లలతో మాట్లాడినంత మామూలుగా వాళ్లతో మాట్లాడేవాడు. వాళ్లూ హాయిగా మాట్లాడేవాళ్లు.
చిత్రం చూడండి.
చూట్టానికి అలా వుంటారుగాని
ఆడాళ్లు – భలే వాళ్లు.
రాముడంటే చాలామంది అమ్మాయిలు ఇష్టపడేవాళ్లు. జీవితమంతా అలాగే ఆడుతూ పాడుతూ గడిపేశాడు. అందుకే నేను ‘ఒరే రాముడు – కాదు కృష్ణుడు’ అనేవాణ్ని.
ఉదయానే్న ధ్యానం చేస్తాడు. గాయత్రి మంత్రం జపిస్తాడు. సాయంకాలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్తాడు. రాత్రి ‘బోట్స్ క్లబ్’కెళ్లి సరదాగా గడిపేస్తాడు. ‘దేనికదే’ అంటాడు. అందరూ అలా జీవించలేరు. ఏదో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని చూసి విధి కుళ్లుకుంది. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసులో భార్య చనిపోయింది.
ఒక కొడుకు, కూతురు – ముచ్చటైన సంసారం. కొడుకు ఏరోస్పేస్ ఇంజనీర్‌గా బ్రిస్టల్‌లో వుంటున్నాడు. వాడికి పెళ్లి చేశాడు. కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్న యాక్సిడెంట్‌లో భార్య చనిపోయింది. నేనూ, పద్మా వెళ్లి వారం రోజులు అక్కడే వుండి వచ్చాం. ఎన్ని వున్నా ఇల్లాలు లేని లోటు ఎవరు తీర్చగలరు.
రాముడు ప్రాక్టికల్ మనిషి. రాత్రులు చందమామను చూసి కలలు కనవచ్చు. పగలు అది తల్చుకుని పని పాడు చేసుకోకూడదు – అనే మనస్తత్వం. త్వరలోనే కోలుకున్నాడు. ఉద్యోగరీత్యా నేను ఎన్ని ఊళ్లు తిరుగుతున్నా ‘కావలి కబుర్లు’ వాడి ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేవి. నిజంగా తెలిసీ తెలియని యవ్వనం ఎంత మధురం. ఎప్పుడు తలుచుకున్నా పెదవులు సుతారంగా విచ్చుకుంటాయి.
ఇంతలో రాముడు వచ్చాడు.
‘్ధ్యనం ఎంత మంచి అలవాటు. మనసు ప్రశాంతంగా ఉంటుందిరా’
‘నిజమే రాముడు. దాని ప్రభావం తప్పక కనిపిస్తుంది’
‘నిన్ను చూసేరా.. ఈ ధ్యానం, గాయత్రి మంత్రం అలవాటైతే.. మంచి అలవాటైనా – వదలటం కష్టం’ అంటూ నవ్వాడు.
‘అవున్రా! నాకే తెలీదు. ఈ ఉప్మా పెసరట్టు సంగతి’
‘నీ తలకాయ్.. నువ్వు బైట తింటే కదా తెలిసేది. బాపట్ల ఎట్లా ఉంది? ఈ ఊరు స్పెషల్ ఏమిటి?’
టిఫిన్ తింటూ కబుర్లలో పడ్డాం.
‘మన కావలి, బాపట్ల ఒకలా ఉంటాయిరా. సముద్ర తీరానికి పది కిలోమీటర్లలోపు. మనకు రాతి నేల. ఇక్కడ ఇసుక నేల. మల్లెపువ్వులు, ఆకు కూరలు కావాలంటే మాత్రం బాపట్లేరా’
‘ఆహా! మల్లెపూలు ఉంటే ఆడాళ్లెందుకురా!’ అన్నాడు కొంటెగా నవ్వుతూ.
‘పువ్వులు పెట్టుకోటానికి’ అన్నాను నవ్వుతూ.
‘ఓహో! మర్చిపోయాను’
* * *
రాముడు తీరిగ్గా అసలు విషయం బైటపెట్టేడు.
‘చందన సంబంధం విషయం వచ్చాన్రా. బాపట్లలో ప్రసాదరావుగారని. వాళ్లబ్బాయి ఐ.బి.ఎం.లో వున్నాడట. పాప కూడా హైదరాబాదే కాబట్టి – ఒకే ప్రొఫెషన్. అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటే బావుందనిపించింది. నువ్వూ ఇక్కడకే చేరావు. అదీ సంగతి’
‘చాలా ఆనందంగా ఉందిరా’
‘వచ్చిన పని పూర్తయితే కదా’
‘దానికేంరా. కుందనపు బొమ్మ. తప్పకుండా ఈ సంబంధం కుదురుతుంది. పద్మ వుంటే సంబరపడిపోయేది తెలుసా. చందన పెళ్లి తర్వాత నువ్వూ ఇక్కడకు వచ్చేయ్‌రా. ఒక్కడివి ఏం చేస్తావ్? అందరం కలిసే ఉందాం’
ఆ మాటతో రాముడి కళ్లు చెమ్మగిల్లాయి.
కాసేపు మాట్లాడలేదు.
‘నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా. మాకు ఎవరున్నారు? ఎవరి దారి వారిది. నేను పద్మ. మేము నీ గురించి అదే అనుకుంటూ ఉంటాం’
‘ఎప్పుడైనా పొరపాటున రాత్రి తొలి గంటలో మన ‘సెషన్’ చూసిందంటే – తర్వాత మంచి నీళ్లు కూడా పుట్టవు తెలుసా’ అంటూ నవ్వేశాడు.
‘సరే. ఎప్పుడు వెళ్దాం ప్రసాదరావుగారింటికి’ అడిగాను.
‘సాయంత్రం వెళ్దాం’
* * *
చల్లని సాయంకాలం
ఇద్దరం పటేల్‌నగర్‌లోని ప్రసాదరావు ఇంటికి వెళ్లాం. ఇంటి వాతావరణం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ముందు వైపు పూల మొక్కలు, జామ, ఉసిరి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మేము వెళ్లేసరికి ప్రసాదరావు గారు బైట మొక్కల మధ్య పడక కుర్చీలో కూచొని సంజీవదేవ్ ‘తెగని జ్ఞాపకాలు’ చదువుతున్నారు.
నన్ను పరిచయం చేసుకుని, రాముణ్ని పరిచయం చేశాను. కావలి నుంచి వచ్చాడని చెప్పగానే – ఆయనకు అర్థమైంది.
‘రండి రండి… చాలా సంతోషం. కృష్ణమూర్తిగారు చెప్పారు’ అని ఆప్యాయంగా పలకరించారు.
ఈ అపార్ట్‌మెంటు బతుకుల్లో ఏం కోల్పోతున్నామో, ప్రసాదరావు గారిల్లు చూస్తే తెలిసిపోతుంది.
ఆ మాటే అన్నాను.
‘ఈ క్రెడిట్ అంతా మా ఆవిడదే. పని చేసేది ఆవిడ. ఆస్వాదించేది నేను’ అన్నారు.
ఆయన కూడా సరదా మనిషే.
కుర్చీలు తెప్పించి ఆ మొక్కల మధ్య, చెట్ల నీడలో వేయించారు. తను లోనికెళ్లి వాళ్ల బాబు ఫొటోలు తెచ్చారు. చాలా బావున్నాడు. రాముడు కూడా వాళ్ల పాప ఫొటోలు చూపించాడు.
ఈడూ జోడూ ముచ్చటగా ఉంటుంది.
రాముడు అక్కడి వాతావరణం, ఆ ఇల్లు చూశాక కాస్త ఆలోచనలో పడ్డాడు. కొడుకు ‘బ్రిస్టల్’లో వున్నా, కూతురు ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా పెద్ద పొజిషన్ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందాన ఉంది. వాళ్లు కాస్త ఎక్కువలోనే ఉంటారు. అయినా వెళ్లిరా. దేవుడి దయ ఉంటే, రాసి పెట్టి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని కృష్ణమూర్తిగారు చెప్పబట్టి వచ్చాడట.
నిజం చెప్పాలంటే అబ్బాయే అందంగా ఉన్నాడు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా చూసినా అన్ని విధాలా కాస్త ఎత్తులోనే ఉన్నారు ప్రసాదరావుగారు. ఇలాంటి విషయాలు వాళ్లు మాట్లాడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. నేనే మొదలుపెట్టాను.
కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు – అన్నీ విడమరిచి చెప్పాను. నేను మాట్లాడినంతసేపు ప్రసాదరావు గారు చిరునవ్వుతో విన్నారు. చివరగా ఆయన అన్నారు.
‘కృష్ణమూర్తిగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండు. రామచంద్రయ్య గారి గురించి పూర్తిగా చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. మా బాబు పెళ్లి విషయంలో వాళ్లమ్మ ఇష్టమే వాడిష్టం. నా మీద అంత నమ్మకం మరి’
మేము నవ్వాం.
తనూ నవ్వి-
‘నిజమండీ. నాకు మాత్రం అన్ని విధాలా నచ్చింది. ముఖ్యంగా రామచంద్రయ్యగారు, మీరు. మీ మాటలు, పాప, కుటుంబం – రాసిపెట్టి ఉంటే అంతే మరి’ అన్నారు.
నాకు తృప్తి కలిగింది.
రాముడి ముఖంలో కూడా కాంతి.
ఆడపిల్లకు పుట్టిల్లు కంటె అత్తారిల్లు ప్రాముఖ్యత ఎంతో ఉంది. జీవితాంతం వీడని అనుబంధం కదా.
ప్రసాదరావుగారిని చూసినా, వారి మాటలు విన్నా ఆడపిల్లల తండ్రులకు భయం తీరిపోతుంది.
మమ్మల్ని తీసుకెళ్లి తన మినీ లైబ్రరీ చూపించారు.

కృష్ణశాస్ర్తీ, చలం, బుచ్చిబాబులతోపాటు ఆధునిక రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. పోతన భాగవత మాధుర్యం గురించి ముచ్చటించారు. సాహిత్యంలో పడి కాలం ఇట్టే గడిచిపోయింది.
‘మరి మేము సెలవు తీసుకుంటాం’ అన్నాం.
‘వుండండి. మా ఆవిడ వస్తుంది. శ్రావణమాసం కదండీ. పూజలూ అవీ ఉంటాయి’ అంటూ ‘శారదా’ అని పిలిచారు.
కాఫీ తీసుకుని వచ్చిందావిడ.
‘నమస్కారమండి’ అంది.
మేము ప్రతి నమస్కారం చేశాం.
ఆవిడను చూసి రాముడు మ్రాన్పడిపోయాడు. ఆవిడ స్థితి కూడా అలాగే ఉంది.
కలా! నిజమా! అన్నట్లు చూస్తూండిపోయారు.
నేను రాముణ్ని పరిచయం చేశాను. ఈలోపు ప్రసాదరావుగారు విషయం పూర్తిగా చెప్పారు.
ఆవిడ శాంతంగా విన్నారు.
పాప ఫొటో తీసుకున్నారు.
ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడారు.
బాబుతో మాట్లాడి తప్పకుండా త్వరలో అభిప్రాయం చెప్తామన్నారు.
నోట మాట రాకుండా గుడ్లప్పగించి అట్లాగే ఉండిపోయాడు రాముడు.
నమస్కారం చేసి బైటకొచ్చాం.
ఇంటికి వచ్చేవరకు రాముడు మాట్లాడలేదు.
మనిషి కలత చెందినట్లు కనిపించాడు. దిగులుగా వున్నాడు.
‘ఆలోచించకు. నేను మాట్లాడతాను. ఈ సంబంధం కుదురుతుంది’ అన్నాను.
‘నాకు ఆశ లేదు. ఈ సంబంధం కుదరదు’ దృఢంగా అన్నాడు రాముడు.
నాకు అర్థం కాలేదు.
నిదానంగా అన్నాడు.
‘ఆ రోజుల్లో కట్నం నచ్చక ఒక మంచి అమ్మాయిని చేసుకోలేక పోయానని నీకు చెప్పాను గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు మనం చూసిన ఆవిడ’
విషయం చిన్నగా అర్థమైంది.
కారణం ఎవరైనా కానీ ఆ రోజుల్లో వాళ్లు చాలా ప్రాధేయపడ్డారు. డబ్బులు పెద్దగా ఇవ్వలేమని తర్వాత వీలైతే అడిగినంత ఇవ్వగలమని రాముడు వాళ్లను బ్రతిమాలారు. అందరూ మంచివాళ్లే. కాని పెళ్లి జరగలేదు. ఆడపిల్ల గలవాళ్లు చాలా బాధ పడ్డారు. రాముడు కూడా ఆటలో బొమ్మలా అలా ఉండిపోయాడు.
విధి విచిత్రమంటే అదే కాబోలు.
ఈ రోజు తన కూతురు భవిష్యత్తును నిర్ణయించే అధికారం, అవకాశం ఆవిడకే వచ్చింది.
రాముడు చెప్పాక – విషయం పూర్తిగా అర్థమైన తర్వాత, నాకు కూడా సంశయం కలిగింది.
‘చూద్దాంరా. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందిలే’ ధైర్యం చెప్పాను.
వౌనంగా ఉండిపోయాడు రాముడు.
జీవితాన్ని ఆడుతూ పాడుతూ ‘సిటీ బాయ్’గా – రాముడు కాదు కృష్ణుడుగా, గడిపిన రాముడు ఒక్కసారిగా డీలా పడిపోయాడు. కూతురు విషయమై ఏ తండ్రి అయినా ఆలోచన చేయటం సహజం. కానీ చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాకపోయేసరికి – నిజంగా ఆడపిల్ల తండ్రి అయిపోయాడు.
మరుసటి రోజు వాణ్ని ట్రైన్ ఎక్కించి-
‘నువ్వేమీ ఆలోచన పెట్టుకోకు. చందనకు మంచి సంబంధం నేను చూస్తాను’ అని ధైర్యం చెప్పాను.
సరిగ్గా వారం రోజుల తర్వాత-
ప్రసాదరావుగారు మా బ్యాంక్‌కి వచ్చారు. నన్ను చూసి చిరునవ్వుతో నా దగ్గరకు వచ్చి-
‘నమస్కారం’ అన్నారు.
నేను నమస్కారం పెట్టి-
బాయ్ చేత ‘కాఫీ’ తెప్పించాను.
‘బ్యాంకులో పని ఉందా?’ అని అడిగాను.
‘లేదండి. మీ దగ్గరకే వచ్చాను. మీ రామచంద్రయ్యగారి సంబంధం మాకు బాగా నచ్చింది. కట్నం విషయం ఆలోచన వద్దు. మీ ఫ్రెండ్‌కు చెప్పండి. ముందుగా మీకు చెప్పాలని వచ్చాను’ అని చెప్పారు.
సంతోషానికి అర్థమేమిటో తెలిసింది.
ఆ సాయంత్రం-
పళ్లు, స్వీటు తీసుకుని ప్రసాదరావు గారింటికి వెళ్లాను.
ఎదురుగా ఆవిడ.
ఆవిడకు ఇచ్చి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాను.
మానవత్వానికి, మంచితనానికి ప్రతీకగా ఆమె అలాగే నిలబడి ఉంది.
నేను వడివడిగా బైటకొచ్చాను – ఈ విషయం రాముడికి చెప్పాలి కదా! ఈలోపు మీకు కనిపించినా వాడి చెవిలో ఈ శుభవార్త వేయండి.

అడుసుమల్లి మల్లికార్జున
15-5-56, వేదాంతంవారి వీధి, బాపట్ల – 522 101
గుంటూరు జిల్లా.. 99895 99175
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

రెండు నిమిషాల్లో వేడివేడిగా, ఘుమఘుమలాడుతూ నోరూరించే ఆ నూడిల్స్.. నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎందరికి తెలుసు? తెలిసినా పట్టించుకునేవాడేడి? ప్రపంచవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ అప్పటికప్పుడు, చిటికెలో తయారయ్యే రుచికరమైన ‘ఇన్‌స్టెంట్ నూడిల్స్’ అంటే చచ్చేంత ఇష్టం. అయతే ప్రమాదకరమైనవని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. నిజానికి నూడిల్స్ మంచి ఆహారమే. కానీ, రుచిని పెంచడానికి వాటి తయారీలో వాడే రసాయనాల పరిమాణం పెరిగితే అది మనిషి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలా ప్రమాదకర రసాయనాలతో తయారైన మ్యాగీ నూడిల్స్‌పై ఇపుడు దేశవ్యాప్తంగా వివాదం రేగింది. ‘ఆకలి రుచి ఎరుగదు…నిద్ర సుఖమెరుగదు’ అన్నది అలనాటి సామెత. కానీ, ‘ఆకలి రుచిని కోరుతోంది.. ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న’ది నేటి సామెత. ఇపుడు సర్వత్రా చెలరేగిన మ్యాగీ నూడిల్స్ వివాదం ఇదే చెబుతోంది. ఒక్క నూడిల్స్ గురించే ఎందుకు చెప్పుకోవాలి. ‘జంక్ ఫుడ్’గా భావించే ఆహార పదార్థాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ బాటిల్స్‌లో పురుగుమందులు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పాలపొడి ఒకటేమిటి? నాగరికపు ఆహార పదార్థాలైన బర్గర్లు, పిజ్జాలలో రుచి పెరిగేందుకు వాడే ఎంఎస్‌జి (మోనో సోడియం గ్లుటామేట్) వంటివి దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రాసెస్‌డ్ ఫుడ్’లో పరిమితికి మించి వాటిని వాడుతూనే ఉన్నారు. *** నూడిల్స్…ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోటా విన్పిస్తున్నమాట. నిన్నమొన్నటివరకు దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ నూడిల్స్‌పై ఇప్పుడు ధుమధుమలాడేవారు ఎక్కువయ్యారు. మానవుడి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నాయంటూ అత్యంత జనాదరణ పొందిన మ్యాగీ నూడిల్స్ దేశంలో సంచలన వార్తాకథనాలు వెల్లువెత్తాయి. చాలా ప్రాంతాల్లో వీటిపై నిషేధం విధించారు. వేల ఏళ్ల క్రితమే నూడిల్స్ తయారీ ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఇన్‌స్టెంట్ ఫుడ్‌లో నూడిల్స్‌దే సింహభాగం. వీటిని కనిపెట్టింది చైనా. ఇప్పటికీ వాటి తయారీలోను, వాడకంలోనూ ఆ దేశానిదే అగ్రస్థానం. చైనాలోని ఎల్లో రివర్ ప్రాంతంలో పురాతత్వ శాస్తవ్రేత్తలు 2002లో జరిపిన తవ్వకాల్లో నూడిల్స్‌తో ఉన్న ఓ బౌల్ దొరికింది. అందులో నిండుగా నూడిల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతన నూడిల్స్‌గా రికార్డు సాధించాయి. శాస్తవ్రేత్తల అంచనా ప్రకారం 206 బిసిఇ- 220 సిఇలో నూడిల్స్ వాడుకలోకి వచ్చాయి. టాంగ్ రాజవంశం పరిపాలించినప్పుడు ఇవి బహుళ వ్యాప్తిలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. నూడిల్స్‌లో ఏముంటుంది? నిజానికి పురాతన పద్ధతి ప్రకారం తయారు చేసిన నూడిల్స్‌లో అన్నీ పోషక పదార్థాలే వాడేవారు. ముఖ్యంగా మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండి, పామ్ ఆయిల్, కాస్తంత ఉప్పు కలిపి వీటిని తయారు చేసేవారు. వందలాది సంవత్సరాల పాటు ఇవే పదార్థాలు వాడేవారు. తీగలుతీగలుగా వీటిని పేని, ముక్కలుగా, రకరకాల ఆకారాల్లో విరిచి వండేవారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకు అదే పరిస్థితి. సేమియా, పాస్తావంటివి ఆ తరువాత నూడిల్స్‌కు మరోరూపంగా తయారయ్యాయి. ఇక నూడిల్స్‌లో సన్నగా తరిగిన కాయగూరలు, ఇతర ఆహార పదార్థాలను కలిపి వండుకోవడం ఆ తరువాత మొదలైంది. ‘ఇన్‌స్టంట్’ ప్రభంజనం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమిపాలైన తరువాత సైనికులు, సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోయారు. ధరల పెరుగుదల, క్షామం, ఉపాధి లేమి వంటి పరిస్థితుల్లో వారు ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోలేక ఆకలితో అలమటించారు. తప్పనిసరి పరిస్థితిలో అమెరికా నుండి బ్రెడ్‌ను జపాన్ దిగుమతి చేసుకుంది. కానీ, జనం ఆకలి తీర్చలేకపోయింది. అ బాధలు చూసిన తైవాన్-జపనీస్ వ్యాపారవేత్త మొమొఫుకు ఆండో నిమిషాల్లో తయారయ్యే ఆహార పదార్థం, చౌకగా అందించేలా తయారు చేయాలని భావించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఇన్‌స్టెంట్ నూడిల్స్. నీటి ఆవిరితో సగం ఉడికించి లేదా పామాయిల్‌తో సగం వేయించి ప్యాక్ చేయించి మార్కెట్‌లోకి వదిలాడు. 1958లో ఇది జరిగింది. తొలిసారిగా వచ్చిన చికెన్ రామెన్ నూడిల్స్ మొదట్లో ఖరీదు ఎక్కువగాను, అది ఓ హోదాకు చిహ్నంగా ఉన్నా అనతికాలంలో అతిచౌకగా, పేదలకు అందుబాటులోకి వచ్చి ఆదరణకు నోచుకుంది. ఇక నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ అంటే లోకం పడి చచ్చిపోతోందన్న పరిస్థితి నెలకొంది. ఇక 1971లో కప్ నూడిల్స్‌నూ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత వాటికి రకరకాల ప్లేవర్స్, నాన్‌వెజిటబుల్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ మొదలయ్యాయి. అతడు జపాన్‌లో ప్రవేశపెట్టిన తొలి ఇన్‌స్టెంట్ నూడిల్స్ పేరు ‘రామెన్ నూడిల్స్’. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ అమ్ముడయ్యే నూడిల్స్ ఇవే. ఆ తరువాత అమెరికాలో వినియోగదారుల ఇష్టాయిష్టాలను గమనించి మరికొన్ని మార్పులతో రకరకాల నూడిల్స్ తీసుకొచ్చాడు. 2007లో అతడు మరణించినా నూడిల్స్ ప్రస్తావన వస్తే మొమొ పేరు స్ఫురణకు రాక తప్పదు. జపాన్‌లో అతడి పేరుమీద, రామెన్ నూడిల్స్ పేరుతోను రెండు మ్యూజియంలు నెలకొల్పారు. ఇప్పుడెందుకు సమస్య ఇన్‌స్టెంట్ నూడిల్స్ రుచికరంగా ఉండటానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ముఖ్యంగా మోనో సోడియం గ్లుటామేట్, సీసం (లెడ్) ఉపయోగిస్తారు. మోనో పొటాషియం గ్లుటామేట్, ఆటోలైజ్డ్ ఈస్ట్, అజినోమోటో, సోడియం కేసినైట్ అని పిలిచే ఎంఎస్‌జి సాంద్రత నిజానికి 0.01 పిపిఎం ఉండాలి. మనదేశంలో ఈ మధ్య మార్కెట్లో లభ్యమైన మ్యాగీ నూడిల్స్‌లో ఈ పరిమితి ఆరురెట్లు అధికంగా ఉందన్నది అధికారిక ఆరోపణ. అది నిజం కాదని, తమ పరిశోధనల్లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్న మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తిదారు నెస్ట్లే యాజమాన్యం వినియోగదారుడి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఆ స్టాక్‌ను వెనక్కి రప్పించుకుంది. ఎంఎస్‌జి అంటే… మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణం. దానిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. ఎంఎస్‌జిని తయారు చేసిన అజినోమోటో కంపెనీ పేరుకు ‘ఎసెన్స్ ఆఫ్ టేస్ట్’ అని అర్థం. భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఒక్కోచోట ఒక్కో పేరు భారతదేశంలో నూడిల్స్ అంటే నెస్ట్లే ఉత్పత్తి చేసే మ్యాగీయే గుర్తొస్తుంది. కానీ వివిధ సంస్థలు ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మనదేశం సహా బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, సింగపూర్, మలేసియా, బ్రూనే, కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ మ్యాగీదే పైచేయి. జపాన్‌లో రామెన్ నూడిల్స్‌కే జనం పట్టం గట్టారు. హాంకాంగ్‌లో సాన్‌టావో, దక్షిణకొరియాలో షిన్‌రామెన్, ఇండోనేషియాలో ఇండోమీ, థాయ్‌లాండ్‌లో మామ, నేపాల్‌లో గండకి నూడిల్స్ అంటే జనానికి పిచ్చి. మారిషస్‌లో అపోలో నూడిల్స్‌కు ఆదరణ ఎక్కువ. ఇవన్నీ జనాదరణ పొందిన బ్రాండ్లు. ఆయా దేశాల్లో మరికొన్ని ఇతర బ్రాండ్లు ఉన్నా వాటికి ఆదరణ అంతంతమాత్రమే. భారత్‌లో మ్యాగీది అగ్రస్థానం కాగా ఐటిసి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ‘యప్పీ’ ఈ మధ్య కాలంలో గణనీయంగా మార్కెట్‌ను పెంచుకుంది. విషతుల్యం అదొక్కటే కాదు… ప్రజలు ఆరగిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో కేవలం నూడిల్స్‌లో మాత్రమే పరిమితికి మించి ఎంఎస్‌జి ఉందని చెప్పలేం. చాలా పదార్థాల్లో అనేక నిషేధిత పదార్థాలు కన్పించాయి. వివాదాలూ రేగాయి. మనదేశంలో లభ్యమయ్యే కోకోకోలా సహా 12 రకాల కూల్‌డ్రింక్స్‌లో క్రిమిసంహారక మందులు ఉన్నట్లు చాలాకాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. ఉండవలసిన పరిమాణం కన్నా 17 రెట్లు ఎక్కువగా డిడిటి కోకోకోలాలో ఉందని పరీక్షల్లో తేలింది. ఆహార పదార్థాల్లో ఆయా రసాయనాల వాడకాన్ని నిషేధించే లేదా ఉత్పత్తిదారులపై చర్య తీసుకునే ఫుడ్‌సేఫ్టీ వ్యవస్థ ఈ ఏడాది ఏర్పడింది. అలాగే వివిధ కంపెనీలు విక్రయిస్తున్న పనె్నండు రకాల తేనెలో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ ఉన్నట్లు తేలింది. క్లోరోంఫెనికోల్, సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్స్ అందులో ఉన్నట్లు రూఢీ అయింది. కోళ్ల ఎదుగుదల కోసం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నట్లు వాటి మాంసాన్ని పరీక్షించినప్పుడు స్పష్టమైంది. మనదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాల్లో చికెన్, బీఫ్ నూడిల్స్‌లో గుర్రం మాంసం దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. మన దేశంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ భారత ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల సాధికార సంస్థ నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మ్యాగీ వివాదంలోకి వచ్చిందికానీ మున్ముందు ప్రాసెస్డ్ ఫుడ్ విక్రయించే ఏ సంస్థ అయినా దోషిగా నిలబడవచ్చు. ప్యాక్‌డ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇంతకాలం వీటిని పరిశీలించి, పరీక్షించి, నియంత్రించే వ్యవస్థ లేకపోయింది. బహుళజాతి సంస్థల ఉత్పత్తులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కాగా దేశీయ సంస్థల ఉత్పత్తులు, స్ట్రీట్‌ఫుడ్, ప్రభుత్వ సంస్థలు విక్రయించే పదార్థాలు ప్రమాణాలకు దీటుగా ఉన్నాయా? అంటే లేదనే చెప్పాలి. రుచికన్నా ఆరోగ్యం ముఖ్యమన్న స్పృహ తినేవారిలో ఉంటే జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మెరుగైన ఆహారమే మేలు. ‘ప్రచారకర్త’లకు బాధ్యత లేదా? చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు మొదలు భారీ సైజు టీవీలు అమ్ముడుపోవాలన్నా వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలు ‘ప్రచారకర్తలు’గా అవతారం ఎత్తాల్సిందే. ప్రకటనల్లో నటించినందుకు భారీగా పారితోషికాలు అందుకునే సెలబ్రిటీలకు మాత్రం సంబంధిత ఉత్పత్తుల నాణ్యతాప్రమాణాలపై ఎలాంటి సంబంధం ఉండదు. ప్రచారం చేయడం వరకే తమ పాత్ర అని, ఉత్పత్తుల విషయమై ఎలాంటి ఫిర్యాదులొచ్చినా తాము బాధ్యులం కామంటూ వారు తెగేసి చెబుతుంటారు. ప్రస్తుతం ‘మ్యాగీ’ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న సందర్భంలోనూ సెలబ్రిటీలు తమ పాత పాటే వినిపిస్తున్నారు. ప్రజారోగ్యంతో సంబంధం ఉన్న ఆహార ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నపుడు సెలబ్రిటీలు అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోరా? వారికి సామాజిక బాధ్యత లేదా? అన్న విమర్శలు వస్తూనే ఉంటాయి. శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాల వివాదం నుంచి తాజాగా ‘మ్యాగీ’లో హనికర రసాయనాల వరకూ ‘ప్రచారకర్త’లైన మన సెలబ్రిటీలు ఏమీ తెలియని అమాయకులే! ‘మ్యాగీ’కి ఇంతటి ప్రాచుర్యం కల్పించి వాటి విక్రయాలు కోట్లలో పెరగడానికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపైనా కేసులు నమోదు చేయాలన్న వాదనలు విన్పించాయి. ‘మ్యాగీ’ వివాదం తీవ్రంగా రాజుకోవడంతో ఆ ముగ్గురిపైనా కొన్ని చోట్ల కేసులు పెట్టడం, నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. ‘మ్యాగీ’ ప్రకటనల్లో నటించి చాలాకాలమైందని, ప్రస్తుత వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని ఆ సెలబ్రిటీలు సెలవిచ్చారు. అయితే, ఆహారోత్పత్తులకు సంబంధించి ఇకపై ‘ప్రచారకర్త’లుగా బాధ్యతలు నిర్వహిస్తే అన్ని విషయాలూ ఆలోచిస్తామని వారు ప్రకటించారు. ‘ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలతో ప్రచారకర్తలకు సంబంధం లేదా’ అన్న చర్చ అప్పుడప్పుడూ మొదలు కావడం మళ్లీ పాతబడిపోవడం షరామామూలుగానే మారింది. ప్రకటనల్లో నటించినపుడు ఉత్పత్తుల నాణ్యత గురించి ఏ సెలబ్రిటీ కూడా ఆరా తీయడం జరగదు. ఉత్పత్తిదారులు కూడా ఆ విషయాలను ‘ప్రచారకర్త’లకు చెప్పడమూ ఉండదు. తమకు ముట్టజెప్పే పారితోషికం తప్ప మిగతా విషయాలు వారికి అనవసరం. వివాదాలు మరింతగా ముదిరితే, ఆ ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తప్ప సెలబ్రిటీలు చేసేది ఏమీ ఉండదు. బాలీవుడ్‌కు సంబంధించి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అక్షయ్‌కుమార్, బిపాసా బసు, కంగనా రనౌత్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు నటించిన ప్రకటనలు గతంలో వివాదాస్పదంగా మారాయి. కోకోకోలాలో పురుగుమందుల అవశేషాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇక ఆ శీతల పానీయం కోసం ప్రచారకర్తగా తాను వ్యవహరించేది లేదని ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ గతంలోనే స్పష్టం చేశారు. వరకట్నం ప్రస్తావన ఉన్నందున ఓ కంపెనీ టీవీల ప్రచారానికి కూడా ఆయన దూరమయ్యారు. ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్‌పై ఆరోపణలున్నందున- ఉత్పత్తిదారులిచ్చే రెండు కోట్ల రూపాయల పారితోషికం కోసం తాను నటించలేనని యువనటి కంగనా రనౌత్ తెగేసి చెప్పింది. పొగాకు, మద్యం విక్రయాలకు సంబంధించి తాను ప్రచారకర్తగా వ్యవహరించనని నటుడు జాన్ అబ్రహాం ప్రకటించారు. సామాజిక ప్రయోజనం లేనందున ఓ విలాసవంతమైన కార్లకు ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలతో కొందరు నటీనటులు జనం నుంచి జేజేలు అందుకున్నా, మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువులయ్యారు. ‘మాజీ విశ్వసుందరి’, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఆ మధ్య ఓ నగల కంపెనీ కోసం నటించిన ప్రకటన వివాదం రేపింది. నలుపురంగులో ఉన్న ఓ పేద బాలిక ఐశ్వర్యకు గొడుగు పడుతున్నట్లు చిత్రీకరించిన ఆ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఆ ప్రకటన ఉందన్న ఆరోపణలు రావడంతో దాన్ని ప్రచారం నుంచి ఉపసంహరించారు. నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారండంటూ ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి షారుఖ్ ఖాన్ ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. కొందరి మనసులను గాయపరిచే ఇలాంటి ప్రకటనల్లో నటించనని అమీర్ ఖాన్ చెప్పగా, షారుఖ్ మాత్రం ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. నటుడు అక్షయ్‌కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా డెనిమ్ బ్రాండ్ జీన్ ప్యాంట్ల ప్రకటన మరీ అశ్లీలంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. 1998లో ఓ బ్రాండ్ లోదుస్తుల ప్రకటనలో నటి బిపాసా, అప్పటి ఆమె ప్రియుడు డినో మోరియా నటనపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 1991లో పూజా బేడీ, మార్క్ రాబిన్సన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా విమర్శలను మూటగట్టుకుంది. మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన 1993లో వివాదం సృష్టించింది. నటి కంగనా రనౌత్ ‘లెవిస్’ జీన్స్ ప్రకటనలో మరీ సిగ్గు విడిచి నటించిందన్న విమర్శలు గతంలో వచ్చాయి. లైంగిక విజ్ఞానం గురించి చెప్పడానికి బదులు ‘డూరెక్స్’ కండోమ్ ప్రకటనలో నటుడు రణ్‌వీర్ సింగ్ నటన మరీ శ్రుతి మించిందన్న వ్యాఖ్యానాలున్నాయి. గుట్కా ప్రకటనలో సంజయ్ దత్ నటించడంతో ఎంతోమంది యువకులు ఆయన బాటను అనుసరిస్తున్నారని గతంలో కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీతారలు యువతకు ఆరాధ్యదైవాలుగా కనిపిస్తున్న నేటికాలంలో వారు నటించే ప్రకటనల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ప్రకటనలకు, ప్రచారకర్తలకు సంబంధించి వివాదాలు చెలరేగడం కొత్తేమీ కాకపోయినా- తాము చెప్పే మాటలను జనం సులువుగా నమ్ముతారన్న విషయాన్ని సెలబ్రిటీలు గుర్తుంచుకుంటే వారు విమర్శలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రచారకర్తలుగా బాధ్యతలు స్వీకరించేముందు సంబంధిత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం, నైతిక విలువలు వంటి విషయాలను వారు తెలుసుకుంటే మరీ మంచిది. *** అందమైన చిహ్నం…ఆవిరైన నమ్మకం అందమైన పక్షిగూడు….అమ్మ తెచ్చే ఆహారంకోసం నోళ్లు తెరిచి ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న పిల్లలు, వాటికి ఆప్యాయంగా ఆహారాన్ని ఇచ్చేందుకు వచ్చిన పక్షి…వెరసి ప్రఖ్యాత ఆహార పదార్థాల తయారీ సంస్థ నెస్ట్లే వ్యాపారసంస్థ చిహ్నం. దశాబ్దాలుగా భారతీయుల ప్రేమను పొందిన ఆ సంస్థపై విశ్వాసం ఇప్పుడు పరీక్షకు నిలిచింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన ఈ సంస్థ ఎన్నో ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ మ్యాగీ పేరుతో ప్రారంభించిన నూడిల్స్ అంతర్జాతీయ ఖ్యాతిని పొంది భారీ మార్కెట్‌ను అందించాయి. ఒక్క భారత్‌లోనే నూడిల్స్ విభాగంలో ఆ సంస్థ 70శాతం మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఏటా 8వేలకోట్ల పైబడి రాబడి సాధిస్తున్న మ్యాగీ కేవలం లాభాలపైనే దృష్టిపెట్టి, వినియోగదారుడి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. వివిధ రాష్ట్రాల్లో మ్యాగీ నూడిల్స్‌తో నిషేధం విధించడం, ఆ నూడిల్స్‌ను నిషేధించాలని కేంద్రం ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో నెస్ట్లె తమ నూడిల్స్‌ను మార్కెట్‌నుండి వెనక్కు రప్పించింది. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఎంఎస్‌జి, సీసం ఉన్నాయన్నది అభియోగం. ఈ వివాదంవల్ల దాదాపు 4వేల కోట్ల రూపాయల మేరకు ఆ సంస్థకు దెబ్బతగిలింది. అయితే భారతీయ వినియోగదారుడి మనసు చూరగొనేలా, విశ్వాసాన్ని పొందేలా మళ్లీ మార్కెట్‌లోకి వస్తామని ఆ సంస్థ గట్టిగా చెబుతోంది. నెస్ట్లె చిహ్నం చూసి ఎంతో నమ్మకంతో ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతీయులు ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నారు. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికి మించి ఎంఎస్‌జి, లెడ్ ఉండటంవల్ల ఎన్నో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని తేలడం నెస్ట్లె వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం ఆ సంస్థ ఉత్పత్తి చేసే పదార్థాలే కాదు. ఇప్పుడు ఇతర సంస్థలు తయారు చేస్తున్న ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ పరీక్షించాలని భారత కేంద్ర ఆహార పదార్థాల నాణ్యత, ప్రమాణాల సంరక్షణ సాధికార సంస్థ నిర్ణయించింది. అయితే ఆయా ఉత్పత్తుల తయారీకి, చాలాకాలంగా వస్తున్న ఆరోపణలకు స్పందించకుండా ఉండటానికి రాజకీయ నేతలు, అధికారులే కారణమని భావించాలి. అసలు ఆహార పదార్థాలా నాణ్యత, ప్రమాణాలను పరీక్షించే సంస్థ ఇన్నాళ్లూ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో చెబుతోంది. ఇదీ నూడిల్స్ సామ్రాజ్యం మన దేశంలో ఇప్పుడు అందరినోటా విన్పిస్తున్న మాట మ్యాగీ నూడిల్స్. నిజానికి ‘యెప్పీ’ అనే రకం నూడిల్స్ కూడా ఈ మధ్య జనాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా నూడిల్స్ అంటే ఇష్టపడేవారి సంఖ్య తక్కువేమీకాదు. భారతదేశంలో ఇన్‌స్టెంట్ నూడిల్స్ మార్కెట్‌లో మ్యాగీ వాటాయే ఎక్కువ. దాని వార్షిక అమ్మకాల విలువ 8,900 కోట్ల రూపాయల పైమాటే. మనదేశంలో సైనికులు బాగా ఇష్టపడే ఆహారం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 102.7 బిలియన్ ప్యాకెట్ల నూడిల్స్‌ను జనం తిన్నారు. భూగోళంమీద ఉన్న ప్రతి ఒక్కరికి వీటిని పంచితే ఏడాదికి ఒక్కొక్కరు 14 ప్యాకెట్లు తిన్నట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ‘గ్లోబల్ ఫుడ్’ గా కీర్తిస్తే, భారతదేశంలో ‘కంఫర్ట్ ఫుడ్’ గా భావిస్తారు. వీటిని ఇష్టపడి బాగా తినే దేశాల్లో చైనా, హాంకాంగ్ మొదటి స్థానంలో ఉన్నాయ. ఇక్కడ ఏటా 44,400 మిలియన్ల ప్యాకెట్లు తినేస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్ తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ నాల్గో స్థానంలో ఉంది. *** మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండ్లతో నూడిల్స్ తయారైన తరువాత వాటికి ఇతర రుచులు మేళవించాక, సగం ఉడకబెట్టడమో, లేక పొడిబారేట్లు చేయడమో అయ్యాక, 320 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో అందులో ఉండే నీరు ఆవిరై, క్రిస్పీగా తయారైన ఇన్‌స్టెంట్ నూడిల్ సిద్ధమవుతుంది. దీనిని మనం తినాలనుకున్నప్పుడు మరుగుతున్న నీళ్లలో వేసినప్పుడు అత్యంత వేగంగా నీటిని అవి పీల్చుకుని త్వరితగతిన ఉడికి తినడానికి వీలుగా సిద్ధమవుతాయి. ఈ మధ్య కాలంలో ‘బ్లోడ్రై’ పద్ధతిలో ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. 176 డిగ్రీల ఫారన్‌హీట్ వేడితో ఉండే హాట్‌ఎయిర్‌తో 30నుండి 60 నిమిషాలపాటు మగ్గబెట్టి గట్టిపడిన తరువాత ప్యాకింగ్ చేస్తున్నారు. నిషేధంపై భిన్న వైఖరులు..! హానికర రసాయనాలున్నాయన్న వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా కుతకుతలాడిన ‘మ్యాగీ’ నూడుల్స్‌పై వివిధ రాష్ట్రాల్లో విభిన్న నివేదికలు రావడం విశేషం. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావడంతో- ‘మ్యాగీ’పై రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఆగమేఘాలపై నిషేధాజ్ఞలు విధించాయి. ప్రజారోగ్యానికి చేటుతెచ్చే ఆహారోత్పత్తులను తాము అనుమతించేది లేదంటూ కేంద్రం సైతం జూలు విదిల్చింది. వివాదం ముదురుపాకాన పడడంతో ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలు ‘మ్యాగీ’ నమూనాలను నిపుణుల పరీక్షల నిమిత్తం పంపాయి. ఈ నూడుల్స్‌లో సీసం (లెడ్) వేర్వేరు రాష్ట్రాల్లో ప్రామాణిక స్థాయి (2.5 పిపిఎం)ని మించి అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు రావడం ఆశ్చర్యకరం. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఇంకో విడ్డూరం. ఓ ప్రముఖ బహుళజాతి సంస్థ నిర్ణీత ప్రమాణాలతో ఒక ఉత్పత్తిని ఒకే పద్ధతిలో తయారుచేస్తే నాణ్యతకు సంబంధించి ఇంతటి తేడాలు రావడం ఏమిటన్నది శేషప్రశే్న! వివిధ రాష్ట్రాల్లో ఒకే ఉత్పత్తిపై పరీక్షలు జరిపితే ఇలాంటి వ్యత్యాసాలు ఎలా ఉంటాయన్నది అర్థం కాని విషయమే. ఈ నేపథ్యంలో ‘మ్యాగీ’పై కేంద్రం వైఖరి ఒకలా ఉండగా, వివిధ రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ‘మ్యాగీ’కి ‘క్లీన్‌చిట్’ ఇవ్వగా, ఇంకొన్ని చోట్ల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణుల పరీక్షలకు నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు లేకపోలేదు. తొమ్మిది రకాల నూడుల్స్‌ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం ‘నెస్లే’ సంస్థకు సూచించింది. కాగా, ‘మ్యాగీ’లో అభ్యంతరకర అంశాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తొమ్మిది రకాల ఉత్పత్తుల్లో సీసం మోతాదు మించినట్లు కనిపించలేదని మహారాష్ట్ర ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రుచి కోసం వాడే ఎంఎస్‌జి కూడా పరిమితికి లోబడే ఉందని ఆ సంస్థ అధికారులు తేల్చారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే ‘మ్యాగీ’పై తాము తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు ‘మ్యాగీ’లో కనిపించాయని భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవ్వించి నవ్వించి కరగించిన సినిమా -నిర్మాత లగడపాటి శ్రీధర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ భాగ్యం నాకు మిగిలింది ”అన్న బుచ్చిబాబు భార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ యుద్ధానికి ఇం”ధనం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment