మధ్యప్రదేశ్ గొడవల్లో పదో నిందితుడు గవర్నరే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి నీళ్ళల్లోనే ఉంది ”ఎటకారం ”కృష్ణ భగవాన్ ఉవాచ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సకలజన ”సన్నాసులారా ”ఏకం కండి గులాబి నాయన పిలుపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య  ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు

మాధవ అనే పేరుగల విద్యారన్యులు శ్రింగేరి పీఠాది పతులు.విజయనగర సామ్రాజ్య సంస్థాపకులుగా కీర్తి గడించారు .హరి హర బ్బుక్క రాయలను ప్రేరేపించి  విజయనగర రాజ్య స్థాపన చేసి రాజులను చేశారు .రాజ్య పాలనలో సాలహా లిస్తూ రాజ గురువు అనిపించుకొన్నారు .అందుకే వారికి ‘’కర్నాటక సింహాసన స్థాపనా చార్య ‘’అని పేరు వచ్చింది .ఆయన సాయన శ్రీమతుల కుమారుడు  భారద్వాజ గోత్రీకులు .న్యాయ ,వేదాన్తాలపై అద్భుత రచనలు చేసి మార్గ దర్శకం చేశారు .అనంత మహా విజ్ఞాని .వేదాలపై విద్యారణ్య భాష్యం పరమ ప్రామాణికం .విద్యారణ్య విరచిత ‘’దేవ్యపరాద స్తోత్రం ‘’అనన్య సదృశం .అందులో వారి కవితా ప్రభ మహాద్భుతంగా ఆవిష్కరింప బడింది .వారు రాసిన’’ శ్రీ శంకర విజయం ‘’అన్తాకు ముందు వచ్చిన శంకర భగవత్పాదుల చరిత్రలన్నిటినీ పరాస్తం చేసి అనన్య సదృశంగా పరమోత్క్రుస్తంగా ఉంది నేటికీ అందరికీ ప్రమాణ గ్రంధం గా ఉంది .83ఏళ్ళ సార్ధక జీవితం గడిపిన విద్యా రన్య స్వామి 1387లో శంకర సాన్నిధ్యం చేరారు .

విద్యారన్యులు ‘’పరాశర మాదవీయం ..,’’సర్వ దర్శన సంగ్రహం ‘’భారతీయ దేదాంత కరదీపికలు .సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు వీటిని పరామర్శిస్తూ అందులో పదారు రకాలైన సిద్ధాంతాలను  క్రమ ఆరోహణ క్రమం లో వివరించారని అవి అద్వైత మత భావ వ్యాప్తికి తోడ్పడ్డాయని తెలియ జేశారు .అవే చార్వాక మతం, బౌద్ధమతం ,జైనమతం ,పూర్ణ ప్రజ్న,నకులీశ పాశుపతం ,శైవం ,ప్రత్యభిజ్న(కాశ్మీరశైవం ),రసేశ్వరం ,వైశేషికం ,అక్షపాదలేక న్యాయం ,జైమినీయం ,పాణినీయం ,సాంఖ్య ,పతంజల యోగం ,ఆది శంకరుల వేదాంతం .సర్వ దర్శన సంగ్రహం లో ఈ పదహారు లేవుకాని వాటి మొత్తం సారం అంతా శంకరాద్వైతం లో నే ఉందని తెలియ జేశారు .ఒక్కొక్కమతాన్ని విడివిడిగా సమీక్షించి వాటి లోని డొల్లతనాన్ని బయట పెట్టాడు .లోకాయత లేక భౌతిక వాదం గురించి ఇంకెక్కడా లేని సమాచారం సర్వ దర్శన సారం లో ఉంది .

విద్యారన్యుల మరోగ్రంధం ‘’పంచ దశి ‘’.అద్వైత వేదాంత సారం అంతా ఇందులో నిక్షిప్తం చేశారు .పది హీను అధ్యాయాల గ్రంధం .వివేక ,దీప ,ఆనంద అనే మూడు భాగాలుగా ఉంటుంది ,’’మాధవీయ శంకర విజయం’’ అనేది సంక్షిప్తశంకర విజయం .ఇది ఆది శంకరాచార్యులైన శంకర భగవత్పాదుల జీవిత చరిత్ర .మీమాంస సూత్రాలకు భాష్యం కూడా రాశారు .పదహారు ఏళ్ళు శృంగేరి పీఠాదిపత్యం నిర్వహించి విద్యారణ్య స్వామి సిద్ధి చెందారు .ఆయనది ఒక శకం .అద్వైతానికి ఆయన ఎత్తిన పతాక .

విద్యారన్యుల వారి తమ్ముడు  సాయనుడు మొదటి బుక్క ,రెండవ హరిహరుల మంత్రి .ఆయనకొడుకులు కంపన సంగీత గాయకుడు .మయనుడు కవి .సింగన వేద పండితుడు .సాయన 1378లోచనిపోయాడు . వేదాలపై భాష్యం రాశాడు .’’సుభాషిత సుధా నిధి ‘’లో చక్కని నీతులు చెప్పాడు .పది అధ్యాయాల ‘’అల౦కారసుదానిది’’ రాశాడు .

స్వామి మరో తమ్ముడు భోగనాధుడు రెండవ సంగమ రాజు సమకాలీనుడు .మహా గొప్పకవి .రామోల్లాసం ,త్రిపుర విజయం ,శృంగార మంజరి ,ఉదాహరణ మాల ,మహా గణపతి స్తోత్రం, గౌరీనాధ స్తోత్రం రాశాడు .

Image result for vidyaranya of vijayanagara  Inline image 1Image result for vidyaranya of vijayanagara

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

-తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు

వెంకట నాధుడే పూర్ణ ప్రజ్ఞ సంపాదించి  వేదాంత దేశికులైనారు .ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంట అవతారం గా భావిస్తారు .1268కాలం .నూటపాతిక దాకా గ్రంధాలు రాశారు .శ్రీ వైష్ణవం లో వడిగల శాఖ సంస్థాపకులు వేదాంత దేశికులు .దక్షిణ భారత వైష్ణవాలయాలలో దేశికుల విగ్రహం తప్పని సరిగా ఉంటుంది .వీరిని గూర్చి మనం మొదటి భాగం లో విపులంగా  తెలుసుకొన్నాం .

186-సాకల్య మల్ల కవి

మల్లయార్య ,కవిమల్ల అని పిలువ బడే సాకల్య మల్లకవి మాధవుని కుమారుడు .అద్వైతమతానికి చెందిన వాడు. సంగ భూపాలుని ఆస్థానం లో వేదాన్తదేశికుని శిష్యుడు నాయనా చార్య చేతిలో వాదం లో ఓడిపోయాడు .సింగభూపాలుడు 1330లోరాచ కొండ రాజు .సాకల్యుడు వైష్ణ ఆచార్యుని పై భేతాలుడు అనే పిశాచిని బ్రాహ్మణ శిష్యుని వేషం లో పంపాడని అయన పల్లకిలో గ్రామాంతరం వెడుతూ శిష్యుడిని పల్లకి మోయ మన్నాడని ,వాడు పల్లకి కిందపడేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశాడని ఈ విషయం గ్రహించి వైష్ణవ స్వామి దానికి విరుగుడుగా మంత్రం వేశాడని దానికి లొంగిపోయి అతి భక్తిగా భేతాళ శిష్యుడితో చచ్చినట్లు పల్లకి మోయిచెట్లు చేశాడని ఒక కద ప్రచారం లో ఉంది . ఈ కవికి శ్రీరాముడు కలలో కనిపించి కావ్యం రాయమని కోరితే ‘’ఉదార రాఘవం ‘’రాశాడు .ఇది పద్దెనిమిది కాండలకావ్యం .కాని మనకు మిగిలింది ఏడు కాండలే .రామాయణ కధను రఘు వంశం ఆధారం గా రాశాడు .సరళమైన కవిత్వం .మాయి సూరి కొడుకు చావుండి దీఇకి వ్యాఖ్య రాశాడుకాని అసంపూర్తిగా దొరకినది .రాంపల్లి గోపీ నాధుడు కూడా వ్యాఖ్య రాశాడు .

ఇప్పటివరకు మనకు తెలిసింది ఏమిటంటే అనేకార్ధ కావ్యాలు బాగా విజ్రుమ్భించి సాహిత్యాన్ని సర్కస్  ఫీట్ల కింద మార్చాయని జైన కవులూ ఈ ప్రభావం లో పడి పోయారని వారూ దాని అంతు చూశారని తర్వాత నెమ్మదిగా ధోరణి మారి వంశ  చరిత్రలు  బాగా వ్యాప్తి లోకి వచ్చాయని అందులో చాలా భాగం చరిత్ర ఉన్నదని అలంకార గ్రంధాలు  నిఘంటువులు కూడా కవులు రాసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని తెలిసింది .ఈ కవులు ఎక్కువ భాగం గుజరాత్  ,కాశ్మీర  రాజుల ఆస్థానకవులు .ఎక్కువ మంది సూరి బిరుదున్నవారు. అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .జైన మతాచార్యులుగా లబ్ధ ప్రతిస్టూలు .రాజులను ఆ మతం లోకి మార్చిన వారు .విభవ ప్రాభవాలు అందుకొన్నవారు .వీరి తర్వాతకవులు దక్షిణా పదానికే ఎక్కువగా చెందిన వారు వచ్చారు .విజయ నగర సామ్రాజ్యం ఏర్పడటం తో వచ్చిన మార్పు ఇది .ఆ సామ్రాజ్య నిర్మాత శ్రీ విద్యారన్యులవారు. వారినే మాధవ విద్యా రన్యులు అంటారు .ఇక నుంచి కద విజయ నగరానికి చేరుతుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక

rachana1 001 rachana2 001 rachana3 001బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నిన్నటి తరం కథ -దాట్ల దేవదానం రాజు 0

నిన్నటి తరం కథ

  • -దాట్ల దేవదానం రాజు
  • 04/07/2015
TAGS:

…….
కథల పోటీలో ఎంపికైన రచన
……….

కొందరంతే.. సర్దుకుపోరు, విలువల పట్ల రాజీపడరు. అలాగే, తరాల మధ్య తేడాను కొలవలేం. ఇదంతా కాలం తెచ్చిన మార్పేనా? అవును… అంతే అయి వుండాలి. కొన్ని తగవులు ఎన్నటికీ తెగవు. ఇందుకు ఉదాహరణగా రంగారావుని తీసుకుంటే…
***
రంగారావుకి ఎనభై రెండేళ్ళు. పొద్దుట రాఘవకు, తనకూ జరిగిన సంభాషణ చుట్టూనే ఆలోచనలు సాగుతున్నాయి. చిన్నతనంలో తను వంద రూపాయల నోటును కనులారా చూసిందీ లేదు, చేత్తో పట్టుకుందీ లేదు. అత్తారింటికి పెళ్లాం దగ్గరకెళ్లాలంటే.. రేవు దాటడానికి పావలా, బస్సుకు అర్ధ రూపాయి.. రాను పోను సరిపడే డబ్బులు లెక్క కట్టి ఇచ్చేవాడు నాన్న. ఉమ్మడి కుటుంబంలో నాన్న మాట జవదాటే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఆయన చూపులు భయపెట్టేవి. గదమాయించి మాట్లాడితే వణుకు వచ్చేది. మరి ఇప్పుడో..? పెద్దలంటే లెక్కలేదు, మర్యాద లేదు. అక్రమ సంపాదన నిలబడదని అంటే రాఘవకు చుర్రుమని కోపం వచ్చేసింది.
‘‘నీతి,నిజాయితీలతో బతకడం వల్ల ఒరిగేదేమీ లేదు. మడి కట్టుకుని కూర్చుంటే మన పని అంతే. నీకు తెలియదు తాతయ్యా..! డబ్బు చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం. ఎలా సంపాదించావన్నది కాదు ప్రశ్న. సంపాదించడమే ముఖ్యం. మీ రోజులు వేరు. ఉన్నదాన్ని తినడం తెలియని తరం మీది. మేం అలా కాదు. ముందు మేం అనుభవించాలి. ఆ తర్వాతే మిగిలిన వారికి..’’ అని రంగారావు మంచానికి చేరువుగా కుర్చీ జరుపుకుంటూ అన్నాడు రాఘవ. రంగారావు మాట్లాడలేదు. ఒకసారి మనమడి కేసి చూసి ఊరుకున్నాడు.
రాఘవకు క్షణం తీరిక ఉండదు. ప్రత్యేకంగా అతను చేసేదేమిటో తెలియదు. ఎవరెవరో పనుల కోసం వస్తుంటారు. అస్తమానం హైదరాబాదు తిరుగుతుంటాడు. మంత్రులంటాడు.. అధికారులంటాడు.. డబ్బుకు ఇబ్బంది ఉన్నట్లుగా ఎప్పుడూ కనిపించడు. హాయిగా ఖర్చుపెడతాడు.
రాఘవ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే ప్రమాదంలో చనిపోయారు. రంగారావు దగ్గరే పెరిగాడు. నెల క్రితం రంగారావుకు సుస్తీ చేయడంతో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అప్పట్నుంచీ కాసేపు తాత దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు.
‘‘ఎన్నైనా చెప్పు రాఘవా.. న్యాయంగా కూడబెట్టిందే నిలుస్తుంది. అలా కానిదైతే మట్టికొట్టుకుపోవడం ఖాయం’’ మరలా రంగారావు అన్నాడు.
చిరాగ్గా చూశాడు రాఘవ.
‘‘అంటే… నన్ను శపిస్తున్నావా..?’’
‘‘అయ్యో… అంతమాట ఎందుకురా? పైవాడి పిలుపు కోసం ఎదురుచూస్తున్నవాడిని. అయినా నినె్నందుకు అంటాను? నీవేమైనా దోపిడీలు చేస్తున్నావా? కాని పనులు చేస్తున్నావా?’’
‘‘అలాంటివాళ్ళే లోకంలో ముప్పాతిక మంది ఉన్నారు. వాళ్ళంతా దర్జాగా హాయిగా బతుకుతున్నారు. ఒక్కసారి డబ్బు పోగుపడాలే గానీ అక్కడ్నుంచి అదే పెంచుతుంది. ఈ వాదనలు నీకూ, నాకూ మధ్య ఎప్పుడూ ఉండేవే. ఆసుపత్రిలో నీవు చస్తావో, బతుకుకతావో అని మేం ఏడుస్తుంటే- నాకో కోరిక ఉంది. అది తీర్చు- అన్నావు. అదేమిటో చెప్పు తప్పక చేస్తాను’’ అన్నాడు రాఘవ లేచి నిలబడుతూ.
మంచం మీద పడుకుని కబుర్లు చెబుతున్న రంగారావు నెమ్మదిగా లేచి స్టూలుమీంచి మంచినీళ్ళ గ్లాసు అందుకుని తాగాడు.
‘‘నా బాధంతా దాని గురించే. ఈ వారంలో జరిగిపోతే మంచిది. ఆ తర్వాత నేనేమైనా ఫర్వాలేదు. అడ్డు చెప్పకుండా నేను చెప్పినచోటుకి తీసుకెళ్ళు’’ అని కాసేపు ఆగి- ‘‘అన్నట్టు రెండొదల రూపాయలు కావాలి నాకు. మొత్తం కావాల్సింది వెయ్యి.. అయతే- రెండొందలు తక్కువైంది.. ఇవ్వు’’-
వెంటనే రాఘవ పర్సులోంచి అయిదు వందల నోటు తీసి ఇచ్చాడు.
‘‘ఉహూ.. వద్దు.. రెండొందలే కావాలి’’ అన్నాడు రంగారావు.
రంగారావు తాను తీసుకున్న నోట్లను రెండు మడతలు చేసి తలగడ కింద దాచుకున్నాడు.
‘‘నీకెప్పుడు వీలవుతుంది?’’
‘‘వర్షాలు పడుతున్నాయి కదా తగ్గనీ.. వెళదాం.. ఇంతకీ ఏ ఊరు వెళ్లాలి?’’ అడిగాడు రంగారావు.
‘‘అబ్బో.. చాలా దూరమే… పని చెప్పు… నేను వెళ్లి పూర్తిచేసి వస్తాను’’.
‘‘నేనే వెళ్లాలి, ఆ మహానుభావుడి దగ్గరకు. ఇలా దగ్గరకు రా. నా చేతిలో ఒట్టేయి రెండు రోజుల్లో తీసుకెళ్తానని’’.
చేయి అందుకుని ఒట్టువేసాడు రాఘవ.
రంగారావు కళ్ళముందు వెంకన్నబాబు కనిపించారు. ‘ఏనాటి వెంకన్నబాబు… ఎంత మంచి మనిషి’ అనుకున్నాడు.
***
రెండు రోజులు గడిచాయి. ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే వుంది. రంగారావు ఉదయానే్న లేచాడు. పనివాడి సాయంతో స్నానాదికాలు పూర్తిచేశాడు. పంచె కట్టుకున్నాడు. చొక్కా తొడుక్కున్నాడు. తీరా చూస్తే చొక్కా ముందుభాగంలో డాగులున్నాయి. ఒక బొత్తాం సగం విరిగిపోయి ఉంది. విప్పేసి మరొక మంచి చొక్కా తీసుకుని వేసుకున్నాడు. రాఘవ కోసం ఎదురుచూస్తున్నాడు, అతను రాలేదు. ఉరుములు.. మెరుపులు.. వర్షం మళ్లీ ప్రారంభమైంది.
‘‘ఈవేళ అంత పెందరాళే లేచారెందుకు?’’ రాఘవ భార్య రమ అడిగింది.
రంగారావు చెప్పలేదు. రమ రెట్టించలేదు. క్షణాలు గడుస్తున్నాయి. రాఘవ రాలేదు. వర్షం కొద్దిగా తెరిపిచ్చింది. రంగారావు అసహనంగా ఏదో గొణుక్కుంటున్నాడు. ఇంట్లో పనిచేసే సూరీడుని లోపలికెళ్లి రాఘవను పిలుచుకు రమ్మన్నాడు. మళ్లీ వర్షం మొదలైంది. కాసేపటికి రాఘవ వచ్చి తాతయ్యని చూసి ఆశ్చర్యపోయాడు, అంత పొద్దునే్న బట్టలు వేసుకున్నందుకు.
‘‘ఏరా.. ఇంకా అలాగే ఉన్నావేంటీ? మాట మరిచావా?’’ అడిగాడు రంగారావు.
ఏమిటన్నట్లు చూశాడు రాఘవ.
‘‘బడాయికి మొన్న ఒట్టు పెట్టావ్.. గుర్తులేదా?’’
‘‘ఇప్పుడా?.. చూడు.. వాతావరణం ఎలా వుందో? వర్షం బాగా పడుతోంది. తుపానుగా మారే అవకాశం ఉందంటున్నారు. వర్షాలు తగ్గాక వెళదాం లే’’ తేలిగ్గా అన్నాడు.
రంగారావు కోపంగా చూసి నెమ్మదిగా లేచాడు. భుజంమీద తువ్వాలు మంచం మీదకు, చొక్కా తీసి రాఘవ మీదకు విసిరేశాడు. జుట్టు చెరిపేసుకున్నాడు. పంచె కూడా విప్పబోతూండగా రాఘవ దగ్గరకొచ్చి పట్టుకున్నాడు. గోడ వార బల్ల దగ్గరకు పోయి అటువైపు చూస్తుండిపోయాడు. ఆయన ఉపయోగించే ఆయుధం ఒకటే.. వౌనవ్రతం..! పమిట కొంగు తుడుచుకుంటూ వచ్చి నడుం మీద చేయి వేసుకుని నిలబడిన రమ్య పకపకా నవ్వింది.
‘‘బుజ్జిగాడి కోపతాపాలు కూడా ఇలాగే ఉంటాయి. వాడికన్నీ ముత్తాతగారి బుద్ధులే’’ అంది.
తాత గెడ్డం పట్టుకుని బతిమాలాడు రాఘవ. ఆయన అలక మానలేదు. ఇక తాత మాట వినక తప్పలేదు రాఘవకి. ఆఖరికి తాతే నెగ్గాడు. రాఘవ కారు తీశాడు. ఇంటి నుంచి రోడ్డుకి చేరే క్రమంలో ఎదర చక్రం మురికి గుంటలోకి దిగబడింది. కారు దిగి ఇద్దరి మనుషుల సాయంతో బయటకు లాగాడు. మరలా చిరు జల్లులు. రంగారావు దర్జాగా డ్రైవింగు సీటు పక్కన కూర్చున్నాడు. కారు ఊరు దాటింది.
‘‘ఇప్పటికైనా.. చెప్పు తాతయ్యా.. ఫ్రెంచి యానాం అవతల ఆ ఊరు… పేరేమిటన్నారు? ఇంతకీ అక్కడికెళ్లి మనం ఏం చేయాలి?’’ కారు అద్దాల్లోంచి రోడ్డును చూస్తూ అన్నాడు రాఘవ.
‘‘మనం వెళ్లాల్సిన ఊరు ఉప్పంగల. ఇక పని ఏమిటంటావా? అక్కడికి వెళ్లాక నీకే తెలుస్తుంది. కారు జాగ్రత్తగా పోనీయ్’’
‘‘మీ ముసిలాళ్లకు అంతా చాదస్తం. ఒక పట్టాన వినరు. వయసొచ్చేకొలదీ మరీ చంటిపిల్లలైపోతారు. అనుకున్నది అయిపోవాలి అంతే. చూస్తున్నారా..? వర్షం.. ఇంకో రోజు తెరిపిగా ఉన్నప్పుడైతే.. ఏమైంది?’’ చిన్న గొంతుతో విసుగ్గా తాత వంక చూస్తూ అన్నాడు రాఘవ.
‘‘రోజులన్నీ చూస్తూండగా జారిపోతున్నాయి రా.. ఈసారికి కష్టపడు. ఇంకెప్పుడూ బాధపెట్టనులే. అయినా నాదే తప్పు.. ఇనే్నళ్ళపాటు దాటెయ్యవలసింది కాదు’’
అమలాపురం చేరారు. మూడు గంటలు పట్టింది. యానాం వెళ్లాలంటే మరో గంట పడుతుంది. యానాం నుంచి ఆ ఊరు ఎంత దూరమో..? అదే అడిగాడు రాఘవ. రంగారావు చెప్పబోయాడు. అకస్మాత్తుగా కారు ఆగింది. ఇంజన్‌లో ఏదో సమస్య. దారంటా వెళ్ళేవారిని తోయమని కారును రోడ్డు పక్కకు చేర్చాడు రాఘవ. మెకానిక్ సరిచేసేటప్పటికి మరో అరగంట గడిచింది. మళ్లీ ప్రయాణం. రాముడ్ని స్తుతించే పాటేదో కూనిరాగం తీస్తూ అందుకున్నాడు రంగారావు. రాఘవ భరించలేకపోతున్నాడు. ఇలా ఇరుక్కున్నందుకు మనసులో తిట్టుకున్నాడు. క్షణాలు గడిచేకొలదీ ఇక ఆగలేకపోయాడు.
‘‘చెవుల్లో ఊరికే రొద పెట్టకు తాతయ్యా.. కాసేపు వౌనంగా ఉండు.. అసలు విషయం చెప్పవు. నీకు తెలుసో లేదో ఎంతో కొంత లాభం లేకుండా ఏ పనీ చేయను. సొమ్ము ఒడిలో పడాలే గానీ అది అక్రమమో, సక్రమమో అని చూడను. ఎదుటివాడి నుంచి సొమ్ము ఎలా రాబట్టుకోవాలో, మనం ఇవ్వాల్సింది ఎట్లా ఎగ్గొట్టాలో తెలుసు. అలాంటివాడిని ఈవేళ నీ పాలబడ్డాను’’ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా పైకి అనేశాడు రాఘవ.
కళ్లింత చేసుకుని కొత్తగా వింటున్నట్లుగా రాఘవ కేసి చూస్తుండిపోయాడు రంగారావు. రాఘవ ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఎదుర్లంక చేరుకున్నారు. యానాం- ఎదుర్లంక వంతెన పనులు పూర్తయనా ప్రారంభోత్సవం జరగలేదు. అటు దరికి చేరాలంటే ఇక పడవే గతి. కారును కూడా దాటించాలంటే ఫంట్ అవసరం. రావులపాలెం మీదుగా వెళితే చుట్టూ తిరిగినట్టవుతుందని ఇలా వచ్చారు. మహోధృతంగా.. గోదావరి. చెదురుమదురుగా పడవలు.. ద్విచక్ర వాహనాలకు ఇబ్బంది లేదు. ఇద్దరు మనుషులు మోసుకెళ్లి పడవలోకి దింపేస్తారు. ఫంట్ రెండు రోజులుగా రావడం లేదట. మరమ్మతుల కోసం వెళ్లిందట.
‘‘కారు దాటే మార్గం లేదు.. ఏం చేద్దాం తాతయ్యా.. వెనక్కెళ్లి మరో రోజు వద్దామా..?’’
రంగారావు తీక్షణంగా గోదావరి కేసి, ఆకాశం వైపు దృష్టి సారించాడు. ఆ సరికి మేఘాలు చెదిరిపోయాయి.
‘‘ఇంతా చేసి ఇప్పుడు వెనక్కెళితే.. మరలా రావడం ఎప్పుడు కుదురుతుందో? ఊళ్ళో ఎవరింటి దగ్గరైనా కారును ఉంచేసి, మనం ఏ ఆటోనో మాట్లాడుకుని వెళదాం’’
ఎదుర్లంక గ్రామం ఏటి ఒడ్డునే వుంది. కారుని ఊళ్ళోకి పోనిచ్చాడు. దారిలో పరిచయస్తుడొకడు తగిలాడు. అతను చూపించిన చోట కారు ఉంచేసి, మరలా రేవు దగ్గరకు వచ్చారు. యానాం చేరేటప్పటికి మరో గంట గడిచింది. ఆటో మాట్లాడుకున్నారు. గతుకుల రోడ్డు, ఆరు కిలోమీటర్ల దూరం. ప్రయాసపడి ఉప్పంగల చేరారు. తీరా అక్కడికి వెళ్లాక రంగారావుకు కావాల్సిన వెంకన్నబాబు యానాంలో ఉంటున్నట్లుగా తెలిసింది. వెంకన్నబాబు యానాంలో ఎక్కడుంటున్నాడో తెలుసుకోగానే రంగారావు ఆశ్చర్యపోయాడు. బాధగా ఉంది. స్థిమితంగా లేదు. విన్న విషయం అర్థం కావడానికి సమయం పట్టింది.
ఒక్కోసారి కాలం కొట్టే దెబ్బల్ని ఊహించుకోలేం. వెంకన్నబాబు లాంటి పరోపకారి యానాం వృద్ధాశ్రమంలో ఉంటున్నాడంటే వింతకాక మరేమిటి? వెంకన్నబాబుకు అందులో చేరే అగత్యం ఎందుకు కలిగింది? నమ్మినవాడు చేసిన మోసానికి సర్వం కోల్పోయాడని తెలిసి విచారం కలిగింది.
‘‘ఏమిటి తాతయ్యా.. ఊళ్ళో వాళ్ళు చెప్పింది విన్న దగ్గర్నుంచీ.. అలా ముడుచుకునిపోయావేమిటి? మనుషుల్ని గుడ్డిగా నమ్మితే అంతే మరి..’’
***
యానాం ఓల్డేజ్ హోం పరిశుభ్రంగా ఉంది. ఆడవాళ్ళు ఒక పక్క, మగవాళ్ళు మరోపక్క గదుల్లో ఉన్నారు. వెంకన్నబాబు చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. జ్ఞాపకశక్తి మందగించింది. రంగారావును చాలాసేపటివరకు గుర్తుపట్టలేదు. ఆయన్ని అలా చూడగానే రంగారావుకు దుఃఖం ముంచుకొచ్చింది. బావ వరుసతో ముచ్చట్లు మొదలెట్టారు. శారీరక అవస్థల గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఆఖరి సారి కలిసి ముప్ఫై అయిదేళ్లు అవుతుందని లెక్కలు కట్టుకున్నారు.
రాఘవ మాత్రం అక్కడ ప్రేక్షకుడయ్యాడు.
‘‘ఒక అపరాధ భావం నన్నీమధ్య పీడిస్తున్నది. మిమ్మల్ని కలవకుండా చచ్చిపోతాననే భయం ఈవేళ నన్ను ఇక్కడకు రప్పించింది. మిమ్మల్ని చూశాను, చాలు. మీరు ఆ చుట్టుపక్కల ఊళ్ళకు మకుటం లేని మహారాజులా ఎలా మెలిగారో ప్రత్యక్షంగా చూసినవాడిని. ఒక్క చేతిమీదుగా కాగితం, కలం లేకుండా మీరు చక్కబెట్టిన వ్యవహారాలు మరొకళ్లకి సాధ్యమయ్యే పనికాదు’’ నెమ్మదిగా ఒక్కో మాట చెబుతూ కంటతడి పెట్టాడు రంగారావు.
వెంకన్నబాబు కళ్ళు మిలమిలా మెరిశాయి. ఇద్దరు ముసిలాళ్ళ సొదకు ఇంక అంతులేదని గ్రహించి రాఘవ పొడిగా దగ్గాడు. వాళ్ళను వదిలి దూరంగా పోబోయాడు. రంగారావు గమనించి రాఘవ చేయి పట్టి ఆపాడు.
‘‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం నేను మీ దగ్గర మూడొందలు తీసుకున్నాను. ఆ బాకీ అలాగే ఉండిపోయింది. ఆ సొమ్ము మీకివ్వాలని మా మనవడ్ని తోడు చేసుకుని వచ్చాను. నన్ను రుణవిముక్తిడ్ని చేయండి’’ అని చెప్పి వెంకన్నబాబు చేతిలో డబ్బు పెట్టాడు.
‘‘ఇదేమిటి? ఇప్పుడెందుకూ…?’’ ఆ నోట్లను తిరిగి ఇచ్చేయబోయాడు. ఉంచమని దణ్ణం పెట్టి జేబులో కుక్కాడు రంగారావు.
వెంకన్నబాబు తన జేబులోనుంచి నోట్లు తీసి లెక్కపెట్టాడు.
‘‘మీ దగ్గర నేను తీసుకున్నది మూడొందలు… ఎప్పటిమాట… ధర్మప్రభువులు, ఈ మొత్తం మీరు తీసుకుంటేనే నాకు తృప్తి’’ అన్నాడు రంగారావు.
‘‘నేనేమైనా.. వడ్డీ వ్యాపారినా?’’ అని మూడొందలు తన దగ్గర ఉంచుకుని మిగిలిన ఏడొందలు తిరిగి ఇచ్చేసాడు వెంకన్నబాబు.
ఎవరి పంతం వారిదే. ఆయన వద్దంటాడు.. ఈయన కుదరంటాడు.. ఈయన బతిమాలతాడు. ఆయన కాదు పొమ్మంటాడు. ఇది ఇంతలో తెమిలేలా లేదు. ఎవరికివారు తమ మాటే నెగ్గాలనుకుంటున్నారు. రాఘవ చేతులు కట్టుకుని చూస్తూ నిలబడ్డాడు. ఆ ఇద్దరూ ఒక పురాతన క్రీడ ఏదో ఆడుతున్నట్లుగా ఉంది. ఆ ఆటకు ముగింపు లేదు. *

రచయత సెల్ నెం: 94401 05987

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి

వస్తుపాల ,తేజపాలకు గురువు ఆచార్యుడు ఉదయ ప్రభ సూరి .కవి సిద్ధాంతకర్త ,ఖగోళ శాస్త్రజ్ఞుడు .అతని ‘’ఆరంభ సిద్ధి ‘’ఖగోళ విషయం పై రాసిందే .’’ఉపదేశ మాలా కార్మిక ‘’ఉపదేశామాలకు రాసిన వ్యాఖ్యానం. ధర్మాభ్యుదయం లేక ‘’సంఘాదిపతి చరిత్ర ‘’అనే మహాకావ్యం వస్తుపాల రాజు పశ్చిమ దేశ జైన మందిర సందర్శనం పై రాసింది ,నరేంద్ర ప్రభ కూడా దీనిలో భాగ స్వామి .అతని ‘’సుకృత కృతి కల్లోలిని ‘’వస్తుపాల ,తేజపాలుల  శత్రున్జయ  యాత్ర పై రాసినది .దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యం ఉందికూడా .వస్తుపాల వంశ చరిత్రతో బాటు చాపోత్కల ,చాళుక్య రాజుల గురించి వివరాలూ ఉన్నాయి .

180- చాళుక్య వాంశ చరిత్ర రాసిన -జయ సింహ సూరి

బోచ్ లో ముని సువ్రత కు ఆచార్యుడైన జయ సింహ సూరి వీరసూరి శిష్యుడు .శ్వేతాంబర జైనుడు .ఒకప్పుడు వస్తుపాలుని సోదరుడు తేజపాల ఈ జైన మందిరాన్ని సందర్శించ టానికి వచ్చినపుడు ఇరవై అయిదు బంగారు నాణాలు అంబదలో ఉన్న సకుమిక విహార కు దానం చేయమని శ్లోకం లో అడిగాడు .వెంటనే రాజు ఇచ్చేశాడు .వస్తుపాల ప్రశస్తి లో ఈ సోదరుల దాత్రుత్వాన్ని శ్లాఘించాడు .దానానికి  క్రుతజ్ఞాతగా ‘’హమ్మీర మద మర్దనం ‘’నాటకాన్ని  వస్తుపాల కొడుకు జయంతి సింహు ని కోరికపై రాశాడు .కాంబే లో భీమేశ ఉత్సవం నాడు దీన్ని ప్రదర్శించారు .ఇందులో వస్తుపాల, స్నేహితుడు వీర ధవళ  కలిసి గుజరాత్ ను మహమ్మదీయ దండ యాత్రనుంచి రక్షించిన చరిత్ర వర్ణించాడు .ఉపమలతో ఉల్లాసంగా కవిత్వం ఉంటుంది .విరాధ వల్ల కొలువులో వస్తుపాల మంత్రిగా ఉండేవాడు .కనుక ఈ నాటకం 1220-30మధ్య రచించి ఉండాలి .జయసింహుని ’’వస్తుపాల ప్రశస్తి ‘’చాళుక్య వంశ చరిత్ర .మొదటి మూల రాజు నుండి అందరిని చేర్చి రాశాడు .

181- కదా రత్న సాగరం రాసిన -నరచంద్ర సూరి

1288 వాడైన నరచంద్ర సూరి అనేక ‘’ప్రశస్తులు ‘’రాశాడు .వస్తుపాలపై రాసిన ప్రశస్తి గిర్నార్ శాసనం లో లభిస్తుంది .హరత పురి యాగచ్చ కు చెందిన మలదారి దేవప్రభ సూరి శిష్యుడు .అనర్ఘ రాఘవం పై వ్యాఖ్యానం రాశాడు .వస్తుపాలుని కోరిక మేరకు ‘’కదా రత్న సాగరం ‘’రాశాడు .శిష్యుడు నరేంద్రప్రభ ‘’అలంకార మహోదధి ‘’రచించాడు .దేవ ప్రభ రాసిన ‘’పా౦ డవ చరిత్ర ‘’,ఉదయ ప్రభ రచన ‘’ధర్మాభ్యుదయం ‘’లను సవరించి మెరుగులు దిద్దాడు

182-సరస్వతీ పుత్రుడు -బాల చంద్ర సూరి

చంద్రా గచ్చ కు చెందిన హరి భద్ర సూరి శిష్యుడే బాల చంద్ర సూరి .ధోల్కా రాజు విరాధ వాలుని మంత్రి వస్తుపాలుడిని తెగ ప్రశంసించాడు .రాజు మరణం తర్వాత వస్తుపాలుని అభ్యర్ధనకేరకు ‘’వసంత విలాసం ‘’అనే పద్నాలుగు కాండాల కావ్యాన్ని వస్తుపాల మంత్రిత్వ గరిమను గురించి రాశాడు .వస్తుపాలుడు మరణించాడు .పద్దెనిమిది కాండలలో మొదటికాండం లో తన చిన్ననాటి జీవితం రాసుకొన్నాడు .గాయక్వాడు రాజాల అదీనం లో ఉన్న కాడి జిల్లాలో మోదేరక నగరం  లో  ధర్మ వేదుడు అనే ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడని ,బాధలలో ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు చేసేవాడని దీనితో జైనమతం పట్ల ఆకర్షితుడయాడని రాశాడు .అతని ఇంటికి వచ్చిన అతిధులకు చేతి నిండా ధనం ఇచ్చి పంపేవాడు .భార్య పేరు విద్యుత్ .కొడుకు ముంజల .ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచే ప్రపంచం మాయ అని తెలుసుకొన్నాడు .హరి భద్ర సూరి గురుత్వం తో విషయ పరిజ్ఞానం పెరిగి జైనం లోకి మారటానికి తలిదండ్రుల అనుమతి కోరాడు .అనుమతిపొంది జైనమందిరం లో గురువు శిక్షణలో అన్నీ నేర్చాడు .బాల చంద్ర అనే ఆశ్రమనామం పెట్టాడు గురువు .చనిపోయిన తర్వాత శిష్యుడినే అధికారి  అయెట్లు చేశాడు .పద్మాదిత్యుడి  పాదపద్మాల పై చాళుక్య చక్ర వర్తి కిరీట మణి కాంతులు పడేవని అంతటి మహిమాన్వితుడైన పద్మాదిత్యుడి శిష్యుడనని చెప్పుకొన్నాడు .

వాడిదేవసూరి  లోని గచ్చ కు చెందినఉదయసూరి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాడని ,దాన్ని సాధన చేసేవాడినని ఒక సారి యోగ  నిద్రలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై తన  భక్తికీ ఆరాధనకు మెచ్చి  కాళిదాసులాగా తన కుమారుడిగా భావిస్తానని చెప్పింది ‘’అని రాసుకొన్నాడు .బాలచంద్ర రాసిన కవిత్వానికి వస్తుపాలుడు ఏంతో సంతోషించి వెయ్యి ‘’ద్రమ్మల’’(drammaas)తో బాల చంద్ర సూరిని ఆచార్యునిగా చేసినట్లు ‘’ప్రబంధ చింతామణి ‘’తెలియ జేస్తోంది .

183  కీర్తి కౌముది  ,కావ్యాదర్శ కర్త -సోమేశ్వర దేవుడు

సోమశర్మ లేకసోమేశ్వర దేవుడు ఆశుకవి .కుమార,లక్ష్మి ల కుమారుడు .అతని పైన ఎనిమిదవ  తరం వాడైన సోలుడు అన్హిల్ విద్లో చాళుక్య సామ్రాజ్యాన్ని మొదట స్థాపించిన మూల రాజు ఆస్థాన పురోహితుడు .సోలుని తర్వాత ఆకుటుంబం వారందరూ ఆస్థాన పురోహితులే అయ్యారు .సోమేశ్వరుడు వస్తుపాల రాజు స్నేహితుడు .విరాధ పాల ,విశాల దేవ రాజుల దర్బారులో సోమేశ్వరుని ప్రశస్తి  ని రాజశేఖరుడు’’ ప్రబంధ కోశం ‘’లో తెలియ జేశాడు .హరిహర ,సుభటులు సోమేశ్వరుని స్నేహితులు .వీరిద్దరుసోమకవి కవిత్వాన్ని మెచ్చారు .సోమేశ్వరుడు తన ‘’కీర్తి కౌముది ‘’లోను ,’’సురతోత్సవం ‘’లోను తన పోషకరాజులను  కీర్తించాడు .ఇందులోని రెండవ కావ్యం లో పదిహేను కాండాలలో సురత రాజును ,అతని చైత్ర వంశాన్ని ,వర్ణించాడు ఇందులోని హిమాలయ వర్ణన అసదృశం..’’ఉల్లాఘ రాఘవం ‘’లో శ్రీరామచరిత్రను నాటకీకరించాడు .పార్ధ పరాక్రమ కావ్యానికి యువ రాజు ప్రహ్లాదనుడు కవి అని సురతోత్సవం లో చెప్పాడు .రామ శతకం కూడా రాశాడు సోమ .కావ్యాదర్శ రాశాడు .కావ్య ప్రకాశ కు వ్యాఖ్య కూడా రాశాడు సోమేశ్వరుడు .

184- అమరచంద్రునిజంట కవి-  అరిసి౦హుడు

లావణ్య  సింహుని కొడుకైన అరి సింహుడు వస్తుపాల మంత్రి ఆశ్రితుడు .తక్కూరకు అధికారి .అమరచంద్రుడు సహ సాహిత్య జీవి .అమరచంద్రునికి సిద్ధ సరస్వతి మత్రాన్ని ఉపదేశించింది అరి సింహుడే .ఈ జంట కవులు ‘’కవి కల్ప లత’’సూత్రాలు కలిసి రాశారు .అరి సింహుడు ‘’కవితార హాసం ‘’రాశాడు .పదకొండు కాండాల’’సుకృత సంకీర్తన ‘’లో అరి వస్తుపాలుని మహోజ్వల చరిత్ర రాశాడు .మొదటి కాండం లో అనహిల్ల పట్టణం నిర్మించిన వన రాజును ,అతని చాపోత్కర వంశ రాజులను వర్ణించాడు .ఇది ఉదయ ప్రభ రాసిన సుకృత కల్లోలిని లాగానే ఉంటుంది .రెండవ కాండలో చాళుక్య రాజ్య మూల పురుషుడు మూల రాజు తో ప్రారంభించి రెండవ భీమ దేవుదు వస్తుపాల, తేజపాలల   దాకా రాశాడు .మిగిలిన కాండలలో వస్తుపాలుని యాత్రలు దాన ధర్మాలు వివరించాడు .ప్రతికాండం చివర అమరసింహుడు తాను రాసిన నాలుగు శ్లోకాలను చేర్చాడు .మల్లినాధుడు నిర్మించిన గోడ లోని గూడు ను కూడా వర్ణించాడు .వీటికి ఆధారాలుగా మౌంట్ ఆబూలో శిలాశాసనాలున్నాయి .

185- ప్రబంధ చింతామణి కర్త -మేరుతంగ

మేరుతంగ రాసిన ‘’ప్రబంధ చింతామణి ‘’మహా గొప్పచారిత్రిక  కావ్యం .1306లో దీన్ని వాద్వాన్ లో వైశాఖ శుద్ద్ధ పౌర్ణమినాడు పూర్తీ చేశాడు .ఇందులో అయిదు ప్రకాశ లున్నాయి .ప్రతి ప్రకాశకు ప్రబందాలుంటాయి .ప్రతి ప్రబంధం లో ఒక కద ఉంటుంది .అదీ దీని నిర్మాణం .విక్రమశకానికి ఆద్యుడైన విక్రమాదిత్యుని కధతో కావ్యం ఆరంభమవుతుంది .తర్వాత శాతవాహనుని పూర్వజన్మ వృత్తాంతం ఉంది .ఆ తారవాత సుదీర్ఘంగాఅన్హిల్ విద్  చాళుక్య రాజుల చరిత్ర  భోజరాజు ముంజ రాజులతో వారి సంబంధం ఉంటాయి .పిమ్మట వాఘేల రాజు లావణ్య ప్రసాదు ,విరాధ వాల రాజు ల గురించి సుదీర్ఘ చరిత్ర రాశాడు కవి .ఇందులో వారిమంత్రులు వస్తుపాల తేజ పాల వ్రుత్తా౦తమూ చేర్చాడు .చివరి కాండ లో లక్ష్మణ సేన ,ఉమాపతి ,భర్తృహరి గురించి ఆసక్తికర విషయాలున్నాయి .మేరుతంగ రాసిన ‘’మహా పురుష చరిత్ర ‘’జైన మునుల చరిత్ర యే.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జైన గోదారి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్తమానమే జీవిత సౌభాగ్యం -92 ఏళ్ళశ్రీ కాళ్ళకూరి ఫణి పద్మనాభం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వర్సిటిపై ఉదాసీనత –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాపం పాపం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ మౌన చాణ క్యం -ఇండియాగేట్ కృష్ణారావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే

panchangam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎన్టిఆర్ కృష్ణ విగ్రహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యూరోస్ కు గ్రీస్ ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం

సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంgodavari pushkara parichayam 1 001 gp2 001 gp3 001 gp4 001 gp5 001 gp6 001 gp7 001 gp8 001 gp9 001 gp10 001 gp11 001 gp12 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోదావరి పుష్కర శోభా యాత్ర –

గోదావరి పుష్కర శోభా యాత్ర –pushkara yatra 4 001 pushkara yatra1 001 pushkarayatra2 001 pushkarayatra3 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-177- వేణీ కృపాల -అమరచంద్ర కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

177- వేణీ కృపాల  -అమరచంద్ర కవి

అమరకవి లేక అమరచంద్ర కవి అన్హిల్ వద్ లోని వాగట నగరానికి చెందిన వాడు .జైన గురు సంప్రదాయానికి చెందిన వాడు .జినదత్త సూరి శిష్యుడు .సిద్ధ సరస్వతి మంత్రాన్ని ఉపాసించి ,సరస్వతీ దేవి కటాక్షం తో అశేష కవితా సామర్ధ్యం పొందాడు .గుజరాత్ రాజు విశాల దేవుడికి ఈ కవి సామర్ధ్యం తెలిసి తన రాజధాని ధవలక్కక కు ఆహ్వానించాడు .అక్కడ  సోమేశ్వర ,నానక మొదలైన  పండిత కవుల చేత కవిని పరీక్షింప జేశాడు .అమరుని కవితా ప్రాగాల్భ్యానికి వారందరూ ఆశ్చర్య పోయి గొప్పకవి అని ప్రకటించారు .రాజు ఘన సన్మానం చేశాడు .విరాధ వాల రాజు కొడుకు విశాల దేవుడు 1243-1262మధ్య లో పాలన చేశాడు .కనుక అమర చంద్రకవి పదమూడవ శతాబ్ది మధ్యలో ఉండి  ఉంటాడు .అమర కవి బాలభారతం లో  సూర్యోదయ వర్ణన పరమాద్భుతం గా చేశాడు .ఈ వర్ణన వలననే కవికి ‘’వేణీ కృపాల ‘’బిరుదు లభించింది .

అమర చంద్రుని ఇతర కృతులలో బాల భారతం ప్రసిద్ధి చెందింది .మహా భారత పర్వాలను అనుసరిస్తూ రాశాడు .ఉదాత్త కవిత్వం రాయటం వలన కావ్యాన్నికాళిదాసు  రఘు వంశం సరసన చేర్చారు .అలంకార శాస్త్ర గ్రంధం ‘’కావ్య కల్ప లత’’ను ఛందస్సుపై ‘’ఛందో రత్న వల్లి ‘’ముక్తావళి ‘’రాశాడు .సాకేతిక విషయ పరంగా ‘’కలాకలాపం ‘’పద్మానంద కావ్యం ‘’,లేక జినేంద్ర చరిత్ర కూడా చేశాడు .ఇందులో జినుని పుట్టుక నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .అమర చంద్రుడు తన స్నేహితుడి రచన ‘’కావ్య కల్ప లత’’ను పూర్తీ చేసి దానికి కి వ్యాఖ్యానంగా ‘’కవి శిక్షా వ్రుత్తి ‘’రచించాడు .

178-సరస్వతీ పుత్ర- వస్తుపాల రాజ కవి

ఆచరాజు ,కుమార దేవి ల కుమారుడే వస్తుపాలుడు .వీరు ప్రసిద్ధ పఠాన్ల వంశం వారు .ముత్తాత చందపుడు రాజ ప్రముఖులలో సూర్యుడు అని గుర్తింపు పొందాడు .ఆయనకు నలుగురు కొడుకులు .చండప్రసాద్ ,సూరా ,సోమ ,అశ్వ రాజు .పెద్ద వాడు రాజ ముద్రికకు అధికారి .రాజ్యం లో మిగిలిన ముగ్గురూ అత్యున్నత ప్రభుత్వాదికారులే .భార్య అభూ అనే సైన్యాధికారి కూతురు .అతను ధోకా రాజు వరద వాల కు  ముఖ్య మంత్రి .. అతని శక్తి సామర్ధ్యాలు అపూర్వం ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి దక్కన్ ,లతా గోద్రా రాజుల దండయాత్రలను సమర్ధంగా ఎదుర్కొని రాజ్యాన్ని రక్షించాడు .1221చిరస్మరణీయ మౌంట్ ఆబూ యాత్ర చేశాడు .అక్కడ దేవాలయాలకు భూరి దానాలు చేశాడు అవి శిలాఫలకాలపై కనిపిస్తాయి .అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది .1242లో చనిపోయాడు .సోమేశ్వర కవి తన ‘’కీర్తి కౌముది ‘’లో వస్తుపాల గుణగణాలను దాతృత్వాన్ని భక్తిని  శీల సంపదను విశేషంగా వర్ణించాడు ..

వస్తుపాలుడు స్వయంగా కవి .ఇతరకవుల ప్రతిభను మెచ్చాడు .సోమేశ్వరునిపై అసూయ ఉన్నా హరిహర కవిని ఆదరించాడు .మూడు గొప్ప గ్రంధాలయాలను స్థాపించాడు .విలువైన వ్రాత ప్రతులను సేకరించి వాటిలో భద్ర పరచాడు .నరచంద్ర సూరి రాసిన ‘’కదా రత్న సాగరం ‘’ను ప్రోత్సహించాడు .నరేంద్ర ప్రభుని ‘’అలంకార మహోదధి ‘’ని కూడా సమాదరించాడు .దీని వలన విలువైన సాహిత్యం వచ్చింది .వస్తుపాలుని జ్ఞానం అసాధారణ మైనది ‘’సరస్వతీ పుత్రుడు ‘’అనే బిరుదు పొందాడు .’’కవి కున్జర’’’’ కవి చక్రవర్తి’’ ఇతర బిరుదులు .కవి జనాశ్రయం తో దర్బారు సరస్వతీ సామ్రాజ్యం అని పించేది .అందుకే వస్తుపాలుని ‘’లఘు భోజుడు ‘’అని కీర్తించారు .అతని ఆస్థానం లో ఉద్దండకవులు సోమేశ్వర ,అరిసింహ ,నానక మొదలైన వారుండేవారు .

వస్తుపాలుడు రాసిన ‘’నర నారాయణా నంద ‘’కావ్యం పదహారు కాండలు కలది.నర నారాయణ స్వరూపులైన అర్జున శ్రీ కృష్ణుల దివ్య చరిత్ర ఇందులో రాశాడు .గిర్నార్  అడవులలో వారిద్దరి సంచారం ,సుభద్రను అర్జునుడు ఎత్తుకు వెళ్లి వివాహం చేసుకోవటం మొదలైన కధలున్నాయి .ఉత్ప్రేక్షకు వైభవంతెచ్చి ఆ వర్ణనలతో కావ్య పరిపుష్టి కలిగించాడు .శిశుపాల వధ ను అనుసరించి రాశాడు .కదా కధనం లో అనేక సూక్తులు చెప్పాడు వస్తుపాలుడు .వాటినన్నిటిని సేకరించి ఒక పుస్తకం గా ప్రచురించారు .జల్హణుని ‘’సూక్తి ముక్తావళి’’ లో ఇందులోనివి చాలా భాగం చోటు చేసుకొన్నాయి .అతని ‘’ఈశ్వర మనోరధ మయ  స్తోత్రం ‘’భక్తికి, ఆధ్యాత్మికతకు విశిస్ట మైనదిగా గుర్తింపు పొందింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-15 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

168-కవి చక్ర వర్తి- శ్రీపాలుడు

గుజరాత్ పాలకుడు సిద్ధ రాజ జయ సింహ చేత  కవి రాజు ,కవి చక్ర వర్తి బిరుదులు పొందిన  శ్రీపాల కవి ప్రాగ్వత కుటుంబానికి చెందిన లక్ష్మణుని కుమారుడు .అన్హిల్ విద్ లో1095-1154 లో జీవించాడు . కవి గుడ్డివాడు అంటే ఆశ్చర్య పోతాం .కవికి ముప్ఫై ఏళ్ళ వయసులో శ్వేతాంబర ,దిగంబర జైనుల మధ్య పెద్ద తగాదా వచ్చింది .విస్తృత జైన సమ్మేళనం నిర్వహించారు .కర్నాటక రాజు కుముదచంద్ర దిగంబర జైన పాక్షం వహించాడు .గుజరాత్ కు చెందిన దేవాచార్యుడు శ్వేతాంబర జైన పక్షం వహించి చర్చలు వాదోపవాదాలు జరిపారు .ఈచర్చోప చర్చలలో శ్రీపాల కవి ప్రముఖ పాత్ర పోషించాడు .యశశ్చంద్రుడు దీనిని ‘ముదిత కుముద చంద్ర ‘’గ్రంధం లో పేర్కొన్నాడు ..అతడు ‘’వై రోచన పరాజయం ‘’కూడా రాశాడు .అతడు రాసిన అనేక ప్రశస్తి లు జైన ప్రాచీన లేఖ మాలలో కనిపిస్తాయి .

శ్రీ పాలుని కొడుకు సిద్ధ పాలుడు కూడా గోప్పకవే .1199వాడు .ఇతనికొడుకు విజయపాలుడు ప్రసిద్ధ కవి అని సోమప్రభ సూరి తెలియ జేశాడు .రాజా కుమారపాల ఇతని ముఖ్య స్నేహితుడు .అతని పోషక రాజు సిద్ధ రాజ భీమ సేనుడు చాళుక్య రాజు 1109-1241కాలం వాడు .రాజు గారి కోరిక పై ‘’ద్రౌపదీ స్వయం వరం ‘’అనే రెండు అంకాల నాటకం రాశాడు .విజయ పాల కవి 1244వరకు జీవించాడు .

169-సూరి వంశ చరిత్ర రాసిన -ముని రత్న సూరి

చంద్రా గచ్చకు చెందిన సముద్ర ఘోషుని శిష్యుడు ముని రత్న సూరి .ఇతని శిష్యుడు జయ సింహుడు  గురువు గారిపై ప్రశస్తి రాశాడు ..’’అమమాస్వామి చరిత్ర ‘’ను చాళుక్య  వంశానికి చెందిన వారాహి రాజు శ్రీమాల కుల రాజస్తాన కోశాధికారి  యశోద వాల కుమారుడు జగద్దేవుడు రాయమని కోరితే రాశాడు .అప్పటికే గొప్ప కవి అని పించుకొన్నాడు దారానగరరాజు నరవర్మ ఆస్థానం లో ముప్ఫై కాండాలలో’’ అమామ స్వామి’’ జీవిత చరిత్రను మధుర మనోహరం గ రాశాడు పాట్నాలో ఈ రచన చేశాడు .1252శాంతి నాద ఆలయం లో చదివి వినిపించాడు ఇందులో పురాణ పాల ,యశపాల ,మన పాల ,మహానాద లను కీర్తించాడు .మరో గ్రంధం ‘మునీశ వర చరిత్ర ‘’ను ఇరవై మూడు కాండాలలో రాసి అందులో తన సూరి వంశానికి చెంది నప్రసిద్దుల జీవితాలను వర్ణించాడు .

170-వాది సింహ బిరుదాంకితుడు –అభయ దేవుడు

జైన సన్యాసి అభయ దేవుడు విజయ చంద్రుని శిష్యుడు .దేవా భద్రుని కొడుకు .జిన శేఖర సూరికి నాలుగ వ తరం వాడు . అభయ దేవుడు సర్వ శాస్త్రాలను అధ్యయనం చేశాడు .వాదోప వాదాలలో మహా నిష్ణాతుడు .అందుకే ‘’వాదిసింహ ‘’బిరుదంను కాశీ రాజు నుండి  పొందాడు .అభయుని వలననే’’ రుద్ర పతిజ గచ్చ’’మహా ప్రాభవం పొందింది .ఈ కవి రాసిన ‘’జయంత  విజయం ‘’, పందొమ్మిది కాండాల కావ్యం .1222లో దీన్ని  రాశాడు .జయంతు ని జీవిత చరిత్ర ఇది .ఇందులో సూర్యోదయ సూర్యాస్తామయాలను ఋతువులను ,క్రీడలు , ,జైత్ర యాత్రలు విస్తారంగా వర్ణించాడు .

171- చంద్ర ప్రభ చరిత్ర కర్త -వీరనంది కవి

ఈ కవి గురించి పెద్దగా వివరాలు తెలియ లేదు. కాని ఈ కవి రాసిన ‘’చంద్ర ప్రభ  చరిత్ర’’  పద్దెనిమిది కాండాలలోరాజు కనక ప్రభ ను ,జైన తీర్ధంకరుడైన  చంద్రప్రభను వర్ణించాడు .చివరి కాండలో జైన సిద్ధాంతాలను ఆచరణ విధానాలను చెప్పాడు. చివర్లో  ఇంద్రుని అవతారమే జినుడు అని తెలిపాడు .వీరనందికవి పదమూడవ శతాబ్ది ఉత్తరార్ధం లో ఉండి ఉంటాడు .

172-‘’ సంకేత’’ వ్యాఖ్య కారుడు[[ మాణిక్య చంద్ర

సాగారెంద్రుని శిష్యుడైన మాణిక్య చంద్ర లేక మాణిక్య సూరి రాజాగచ్చ కు చెందిన వాడు .కావ్య ప్రకాశ కు రాసిన వ్యాఖ్య ‘’సంకేత ‘’లో తన వంశ చర్తిత్ర చెప్పుకొన్నాడు .పార్శ్వనాధ చరిత్ర ,శాంతినాద చరిత్ర కూడా రాశాడు 1220కాలం వాడు .

173-దసశ్రావక చరిత్ర కర్త-పూర్ణ భద్రుడు

జినపతి శిష్యుడైన పూర్ణ భద్రుడు ప్రహ్లాదన పురం వాడు .రాసిన గ్రందాలు  ‘’దసశ్రావక చరిత్ర ‘’.ధన్య శాలి భద్ర చరిత్ర ‘’’’కృత పుణ్య చరిత్ర ‘’ ‘,అతి ముక్తా చరిత్ర ‘’

174-ముని సువ్రత చరిత్ర కారుడు –పద్మ ప్రభ

విబుధ ప్రభ శిష్యుడైన పద్మ ప్రభుడు ‘’ముని సువ్రత చరిత్ర ‘’,’’కుంతు నాద చరితా చరిత్ర ‘’రాశాడు పదమూడవ శతాబ్ది తొలి కాలం వాడు .

175-ప్రత్యక బుద్ధ చరిత్ర రాసిన – లక్ష్మీ  తిలక

జిన రత్న శిష్యుడు లక్ష్మీ తిలక ‘’ప్రత్యక బుద్ధ చరిత్ర ‘’ను పది హేడు కాండాలలో రాశాడు .ఇందులో నలుగురు జైన స్వామిలైన కరకందు,ద్విముఖ , నమి ,నగ్గాతి లను వర్ణించాడు .1255రచన ఇది .

176-పృథ్వి చంద్ర చరిత్ర కారుడు –ముని దేవ సూరి ,సత్య రాజ

పృథ్వి చంద్ర చరిత్ర ,శాంతినాద చరిత్రలు రాసిన ముని దేవ సూరి సత్య రాజు లు  1383ప్రాంతం వారు . 1200లో ప్రాకృత భాషలో దేవ చంద్ర ,శాంతి శ్రీలు రాసిన వాటినే వీళ్ళు సంస్కృతం లో అదే పేర్లతో రాశారు .

సశేషం

మీ-గబ్బిటడుర్గా ప్రసాద్ -7-7-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి (శ్రీ పీఠం) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర గోదావరీ పుష్కరాల లో (జూలై 14 నుంచి 26, 2015) వరకూ ఐదు లక్షల మంది యాత్రీకులకి అన్నదాన కార్యక్రమం

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి (శ్రీ పీఠం) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో

పవిత్ర గోదావరీ పుష్కరాల లో (జూలై 14 నుంచి 26, 2015) వరకూ

ఐదు లక్షల మంది యాత్రీకులకి అన్నదాన కార్యక్రమం

అమెరికా, భారత దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తుల విరాళాలకి విన్నపం

(Last Date to receive tax-deductible donations in USA: July 20, 2015)

2003 నాటి అనుభవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుండి జరుగుతున్న పవిత్ర గోదావరి పుష్కరాలలో కూడా 5 లక్షల మంది భక్తులకి (రోజుకి 45 వేల చొప్పున పన్నెండు రోజులు పాటు) ఉచిత అన్నదానం కార్యక్రమానికి పూజ్య పరిపూర్ణానంద స్వామి సంకల్పించారు. అత్యంత పరిశుభ్రమైన, పవిత్ర వాతావరణలో పౌష్టిక పదార్థాలతో త్వరిత పంపిణీ కోసం భోజనం పొట్లాలు తయారు చేసే సమగ్ర పథకం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాజమండ్రి (ఆంధ్ర ప్రదేశ్), ధర్మపురి (తెలంగాణా) లలో జరిగే ఈ అత్యవసర అన్నదాన కార్యక్రమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తున్నాయి.

కేవలం 12 సంవత్సరాలకి ఒక సారి మాత్రమే లభించే ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమానికి అమెరికా దాతల ఆర్ధిక సహకారాన్ని అర్థిస్తున్నాం. ఇటు అమెరికాలోనూ, అటు భారత దేశం లోనూ విరాళాలకి పూర్తి పన్ను రాయితీ లభిస్తుంది.

Suggested Donation Categories

Donors contributing from Rs. 10,000 (About US$150) to Rs. One Lakh (About US$1500) receive specific services during Pushkaraalu as suggested by Pujyasri Paripunranada Swami garu. Please see complete details in the attached documents.

How to Donate in USA

(All currencies worldwide including India are accepetd. All donations in USA are tax deductible. Tax ID 76-0444238)

  1. On-Line with any credit card.

 

Click or cut & paste the following link in the URL and follow prompts.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=A7538EZX97EH8

or    log onto:

 

 www.vangurifoundation.blogspot.com

click on DONATE button on right and follow prompts.
Enter the purpose of Donation as “GODAVARI PUSHKARALU ANNADANAM”:

 

  1. By Check payable to Vanguri Foundation of America, Inc., 

     write in Memo section:  Godavari Pushkaralu -2015

    Mail to:

Vanguri Foundation of America, Inc.

P.O. Box 1948

Stafford, TX 77497

How to Donate in India

Please see attached detailed Appeal with account details.

Last Date to receive tax-deductible donations in USA: July 20, 2015

For more information

Shankar Planjery

Phone: 630 297 4610, E-mail: planjerys@gmail.com

or

Vanguri Chitten Raju

Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 -167- ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

167-   ‘’శతాదికార్ధ ‘’కావ్య కర్త- సోమప్రభాచార్య

ఇప్పటి వరకు  ఏడర్దాలకావ్యం వరకే పరిమితమైన సంస్కృత సాహిత్యం లో శతపత్రం లాగా శాతాదికార్ధ కావ్యం ప్రభ వించింది. కర్త సోమప్రభా చార్య కీర్తి దశ దిశలా దాని పరిమళం లా వ్యాపించింది .ఒకే శ్లోకానికి వంద అర్ధాలు  వచ్చేట్లు రాసిన కవిత్వం ఇది .న భూతో అని పించింది .ఈ  కావ్యం తో ఆయనకు ‘’శాతార్ధిక ‘’బిరుదు లభించింది .సుమారుగా 1177లో దీనిని రాశాడు .ఉపోద్ఘాతం లో అయిదు శ్లోకాలు రాశాడు .అందులో సూచికలో తాను భావించిన వంద అర్ధాలను వివరించాడు .మొదట ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల ను ,తర్వాత  వైదిక  దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వర నారద మొదలైన వారి  విషయాలను ,చివరలో తన సమకాలీన కవులైన వాది దేవ సూరి ,హేమచంద్రాచార్య ,లను వారితో బాటు జైనమత  పోషక రాజులైన   జయ సింహ దేవా ,కుమారపాల ,అజయ దేవ ,మూల రాజ , గుజరాత్ ను పాలించిన చాళుక్య రాజులను  సిద్ధిపాల అనే  గౌరవ నీయ కవి ,పౌరుడిని ,ధర్మాచార్యులైన అనిత దేవ ,విజయ సింహులను గురించి చెప్పాడు .కావ్యం చివరలో అయిదు శ్లోకాలలో ప్రశస్తి రాసి అందులో తన గురించి శిష్యులు కీర్తించిన విషయాలను చేర్చాడు .సోమ ప్రభాచార్యుడు ‘’శృంగార వైరాగ్య తరంగిణి ‘ అనే నీతి కావ్యం ’రాశాడు  .

ఇలా అనేకార్ధ కావ్యం ఆవిర్భవించింది సోమప్రభా చార్య కవితా ప్రభ వలన .ఒక అజ్ఞాత కవి ‘’నల హరిశ్చంద్ర ‘’కావ్యం రాశాడు .శ్లోకం మొదటి నుంచి చదివితే నల చరిత్ర ,చివరి నంచి చదివితే హరిశ్చంద్ర చరిత్ర వస్తుంది .దీనికి కామెంటరీ కూడా జోడించాడు .హరదత్త కవి ‘’రాఘవ –నైషదీయం ;;రాశాడు .ఇది రామ, నల  కద.ఈ కవి గార్గ్య  గోత్రీకుడు .తండ్రి జయ శంకరుడు  .దీని వ్యాఖ్యానం లో భట్టోజి దీక్షితులను ,భట్తమల్ల ,కేశవ ,రామ కృష్ణ ,రభస యాదవ మొదలైన  నిఘంటు కారులను పేర్కొన్నాడు .  ఇది పద్దెనిమిదవ శతాబ్ది తొలి కాలపు రచన .

అనంతసూరి   రచన ‘’హరిశ్చంద్రోదయం ‘’ఇరవవై కా౦డాల ద్వ్యర్దికావ్యం  .ఇందులో ఒక హరిశ్చంద్రుడు పురాణ పురుషుడైతే రెండవ హరిశ్చంద్రుడు కవి గారి పోషక రాజు .

సూర్యకవి లేక సూర్య దాస లేక దైవ జ్ఞాన పండితుడు ‘’రామ –కృష్ణ విలోమ కావ్యం ‘’అనే ముప్ఫై ఎనిమిది కాండాలు గా రాశాడు .మొదటి నుంచి శ్లోకాన్ని చదివితే రామ పరామైన అర్ధం ,రెండవ చివర నుండి చదివితే కృష్ణ పరమైన అర్ధం వస్తుంది .కవి భరద్వాజ గోత్రీకుడు తండ్రి జ్ఞానాది రాజు .పార్ధ పురం లో ఉండేవాడు .దేవగిరి రాజు రామ ఆస్థానం లో రామ కవి ఉండేవాడు .ఈ కవి ఖగోళ విజ్ఞాని .1539లో ‘’సూర్య ప్రకాశ ‘’రాశాడు .లీలావతి గ్రంధం  పై1542లో  విమర్శ రాశాడు .అతడు అయిదు కాండాలలోరాసిన ‘’నృసింహ చంపువు ;’’’బాల బోధిక ‘’వ్యాఖ్య ,దేవేశ్వరుని ‘’కవికల్పలత ‘’లభిస్తున్నాయి .

కృష్ణ మూర్తి అనే మేధావి ,కవి ‘’కంకణబంధ రామాయణం ‘’అనే ముప్ఫై రెండు అక్షరాల ఏకశ్లోకం రాశాడు .ఇది చేతిగాజు లాగా గుండ్రం గా ఉంటుంది కనుక కంకణం అనే పేరొచ్చింది .ఎడమ వైపు నుంచి మొదలు పెట్టి చదివినా కుడి నుంచి ఎడమకు చదివినా ,లేక ఏ అక్షరంనుంచి మొదలు పెట్టి చదివినా అరవై రెండు శ్లోకాలు వచ్చేట్లు రాసిన ఏక శ్లోక కావ్యం .కవి తల్లి గౌరీ తండ్రి సర్వజ్ఞుడు.వసిస్టగోత్రం .సర్కారు జిల్లాల వాడై ఉంటాడని ,పందొమ్మిదవ శతాబ్ది కవి అని తెలుస్తోంది .

ఇదే రకమైన కంకణ బంధ ఏక శ్లోక కావ్యాన్ని మరింత వృద్ధి  చేసి శ్రీ చర్ల భాష్యకార శాస్త్రి రాశారు .ఈయన కృష్ణా జిల్లా కాకర పర్తి గ్రామ వాసి .కంకణ  బంధ రామాయణం లో వచ్చే ప్రతిశ్లోకానికి వచ్చే అర్ధ భావాలనుతెలియ జేస్తూ, సంయుక్తాక్షరాలను విడదీసి అందులోనుంచి 128 శ్లోకాలను విడమర్చి చూపించాడు .

ఈ విధంగా అనేకార్ధ కావ్యాలు వాటిలో చమక్కులు జిమ్మిక్కులు విపరీతం గా పెరిగి పోయి సాహిత్యం ఒక సర్కస్ కింద మారింది .బుద్ధికి పదును పెట్టి౦ది కాని మనసుకు హృదయానికి స్థానం లేకుండా పోయింది .దీనికి తగిన సాహిత్య వైద్యం చేసే కవి ఆవిర్భ వించాల్సిన  అవసరం కలిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాంస్కృతిక యుద్ధ స్వరం విమలక్క -మరియు సినారేకవిత



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషను నిరంతర సాధన చేయండి -తానా లో జస్టిస్ రమణ ,మంత్రి వెంకయ్యనాయుడు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విభజనలో ఎ.పి కి కష్టం -తానాసభలో ఆర్కే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

163-పార్వతీ రుక్మిణీయ కవి-విద్యా మాధవుడు

శివ పార్వతి కల్యాణాన్ని ,శ్రీ  కృష్ణ రుక్మిణీ కల్యాణాన్ని కలిపి ‘’పార్వతీ –రుక్మిణీయం ‘’అనే ద్వ్యర్ధి  కావ్యం గా  రాశాడు విద్యా మాధవుడు .చాళుక్య రాజు సోమదేవుని ఆస్థాన కవిగా ఈ కవి ఉండేవాడు .1126-1138 కాలం కళ్యాణ రాజు నాల్గవ సోమేశ్వరుడే ఈ సోమదేవుడు .మనకవిగారు గుణవతి దగ్గర నీలాలయం లో జన్మించాడు .వేదం,శాస్త్రాలన్నీ నేర్చాడు .కిరాతార్జునీయం మొదలైన వాటిపై పై వ్యాఖ్య రాశాడు .కవిరాజు తన తోకలిపి మహా కవులు ముగ్గురే అన్నాడు .మిగిలిన ఇద్దరు బాణుడు ,సుబందు .విద్యా మాధవుడు.ఇంకో అడుగు ముందుకు వెళ్లి బాణ ,సుబందు ,కవిరాజుల తర్వాతా నాలుగో వాడిని నేనే అని చెప్పుకొన్నాడు .కవిరాజుకన్నా చిన్నవాడేకాని సమకాలికుడు .

అంతకు ముందే  రామాయణ  భాగవత కధలను ‘’యాదవ రాఘవీయం ‘’గా రాశాడు వేంకటాధ్వరి .అతనిపదిహేడవ శతాబ్ది రచన  ‘’విశ్వ గుణాదర్శం  ‘’విశిష్టమైన రచనగా పేరొందింది .కఠిన పదాలతో యమకాను ప్రాసలతో సాగిన రచన అది .ఐతే కవిరాజు కావ్యానికి ఇది తీసికట్టు .దీనిపైనా వ్యాఖ్యానం వచ్చింది .బహుశా కవి రాసిన వ్యాఖ్యానమే అది అయి ఉండచ్చు .

164- రాఘవ యాదవీయ కవి-సోమేశ్వరుడు

వింజమూరి కుటుంబానికి చెందిన కృష్ణ సూరి కుమారుడే సోమేశ్వరుడు .గౌతమ గోత్రీకుడు .పది హీను కా౦ డాలున్న ‘’రాఘవ యాదవీయ౦  ‘’రాశాడు .ఇందులో శ్రీ రామ,శ్రీ కృష్ణ చరిత్రలను వర్ణించాడు .ఇది ద్వ్యర్దికావ్యం .కాళిదాస ,భారవి ల శబ్దాలానే ప్రయోగించి అమరకవి లాగా ఏకాక్షర పదాలనూ వాడాడు .ఇది కావ్యమే కాదు అలంకార గ్రంధం కూడా .విపులమైన వ్యాఖ్యానమూ ఉంది ..ఇదే పేరుతో రఘునాదా చార్యుడు ,శ్రీనివాసాచార్యుడు ,వాసుదేవుడు కూడా రాశారు .రామ చంద్రుని ‘’రసిక రంజనం ‘’అనేది శృంగార ,వైరాగ్య అర్ధ భావాలను తెలియ జేసే కవితల సంపుటి .1524 లో రాసిన  రామ చంద్రుడు లక్ష్మణ భట్టు కుమారుడు .

165-త్ర్యర్దికావ్య రచనకు  నాంది పలికిన ‘’చిదంబర కవి ‘’

ఇలా ద్వ్యర్దికావ్యాలు మూడు పూలు ఆరుకాయలులాగా వర్ధిల్లిన కాలం అది .మరో అడుగు ముందుకు వేసి త్ర్యర్ది కావ్య రచన చేశారు కవులు .మూడు రకాలైన కధలను ఒకే కావ్యం లో చెప్పటమే త్ర్యర్దికావ్యం .రాఘవ యాదవ పాండవీయం లో రామాయణ మహా భారత భాగవత కధలను ఒకే చోటమూడు కాండలలో  చెప్పాడు’’చిదంబర కవి ‘’.ఇతడు అనంత నారాయణ వెంకటా లకుమారుడు .కౌశిక గోత్రానికి చెందిన సూర్య నారాయణ కు మనవడు .శ్రీనివాసుడు ఇతని తమ్ముడు .శివ సూర్య ఇతని మేనమామ .ఇతని ‘’భాగవత చంపు ‘’కృష్ణ కదామృతమే .డిండిమ కు చెందిన ముల్లనద్రం నివాసి .1586-1614ప్రాంతపు విజయ నగర రాజైన మొదటి వెంకట ఆస్థానం లో ఉండేవాడు .ఈ గ్రంధం పై వ్యాఖ్యానం ఉన్నది .తండ్రి అనంత నారాయణుడే రాశాడు .కావ్యం లోని మూడు అర్ధాలను చక్కగా విడమరచి విపులంగా అర్ధ మయెట్లు రాశాడు .ఈ కవి ఇంకాస్తముందుకు వెళ్లి ‘’పంచ  కళ్యాణ చంపువు ‘’రాశాడు అందులో రామ ,కృష్ణ ,విష్ణు, శివ ,సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణాలను ఐదింటిని ఒకే సారి  వర్ణించాడు .తానే విపుల వ్యాఖ్యానమూ రాసుకొన్నాడు .

మైసూరుసంస్థానం లో   ఉదయేంద్ర పురానికి చెందిన అనంతా చార్యుడు ‘’యాదవ –రాఘవ –పాండవీయం ‘’రాశాడు .రాజాస్థాన కవ యిత్రి ‘’త్రివేణి ‘’కి ఈయన తండ్రి .కృష్ణ ,నల ,హరిశ్చంద్ర ,కధలను చతురర్ధ కావ్యం ‘’ఆబోదాకర ‘’గా ఘనశ్యామ కవి రాశాడు  .ఇలా అనంతార్ధ కావ్య విజ్రు౦భణ జరిగింది .సాహిత్యం పరిపుష్టి చెందింది .కాని దాన్ని పగల కొట్టి విడమర్చి చెప్పాల్సిన వింత పరిస్తితి ఏర్పడింది .

166-మేఘ విజయ గని –

జైన సన్యాసి అయిన మేఘ విజయ గని క్రిపావిజయుని శిష్యుడు .హీరవిజయకు అయిదవ తరం వాడు .వ్యాకరణ,ఖగోళ ,మీమాంస ,శాస్త్రాలలో ఉద్దండుడు .వీటిపై విపులంగా గ్రంధాలు రాశాడు .అతడు రాసిన ‘’సప్త సంధాన కావ్యం ‘’లో తన కవితా  ప్రతిభ ఏమిటో నిరూపించుకొన్నాడు .ఈ కావ్యం లో ఒకే సారి ఏడు రకాల కధలను అల్లాడు .మధుర భాషా సంపద దీనిలో కనిపిస్తుంది .’’దేవానందాభ్యుదయం ‘’కావ్యం లో ఏడు కాండాలలో ‘’విజయ దేవ సూరి ‘’జీవితాన్ని చిత్రించాడు .ఇది 1671లో రాసిన పుస్తకం .’’శాంతి నాద చరిత్ర ‘’లో శాంతినాధుని జీవితాన్ని వర్ణించాడు ఈరెండు కావ్యాలలో విజయగని శిశుపాల వధ ,నైషద కావ్యాలలోని పంక్తులను సమస్య కోసం  గ్రహింఛి తన స్వంత కవిత్వం తో వాటి ఉత్ర్కుస్టతను  చాటి చెప్పాడు.

మేఘ విజయ గని కవి తన ‘’సప్త సంధాన మహా కావ్యం ‘’లో ప్రతి శ్లోకం లోను ‘’వృషభ నాద ,శాంతి నాద ,పార్శ్వ నాద ,నేమినాద ,మహావీర ,కృష్ణ ,బలదేవ లను వర్ణించాడు .ఇందులో మొదటి అయిదుగురు ఇరవైనలుగురు జైన తీర్ధ౦కరులలో ఉన్నారు  .తొమ్మిది కాండాలలో వీరిపై అనేక కధలు రాశాడు .అతి సరళంగా సుందరం గా కవిత్వాన్ని అలవోకగా జాలువారించాడు .అతని సంస్కృత పరిజ్ఞానానికి ముగ్దులయేట్లు చేస్తాడు .

హేమ చంద్ర సూరి కూడా’ సప్త సంధాన కావ్యం ‘’రాసినట్లు ఉందికాని కావ్యం అలభ్యం .ఆ లోపాన్ని మేఘ విజయ సూరి పూరించి గొప్ప మేలు చేశాడు .కాళిదాసమహాకవి మేఘ సందేశ కావ్యం లాగా గని ‘’మేఘ దూత సమస్య లేఖ ‘’రాశాడు ఇందులో కవి తన ప్రభువు గచ్చ విజయ ప్రభ సూరి ‘’కి రాసిన లేఖ ఉంది .విజయప్రభ సూరి జీవితం పై పదమూడు కాండల ‘’దిగ్విజయ మహాకావ్యం ‘’రాశాడు విజయ గని . ‘’ సమకాలీన వేదాంతుల సిద్ధాంతాలను ఖండిస్తూ  దృష్టాంతం గా మేఘ విజయ గని రాసిన నాటకమే ‘’యుక్తి ప్రబోధం ‘’..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుణ్య గోదావరి – పుష్కరాలు

punya godavari6 001 punyagodari1 001 punyagodari2 001 punyagodari3 001 punyagodari4 001 punyagodari5 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అర్ధనారి -వేణుగోపాల్ విగ్రహ0 – విలన్ బెనర్జీ సినీ అరంగేట్రం –

అర్ధనారి -వేణుగోపాల్ విగ్రహ0 – విలన్ బెనర్జీ సినీ అరంగేట్రం -ఆంధ్ర జ్యోతి ఆదివారం స్పెషల్ 5-7-15

ardhanari venugopal1 001 ardhanarivenugopal2 001 benarji1 001 benarji2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ముసలి మనసుల మానసికోల్లాసం –F.M.రేడియో

ఏ చానల్ చూసినా ఏదో ఒక  రాద్ధాంతం , సిద్ధాంతంపై అనవసర చర్చలు .లేకపోతే ఒకే హీరో గారి మూస సినిమాల దాడి .ఏ సీరియలోను రియల్ గా ఉండేది ఏమీలేదు .అన్నీ కుతంత్రాలు ,ఆరళ్ళు ,భీభత్సాలు ,పగలూ ప్రతీకారాలు మాయలు మంత్రాలు .ఇవన్నీ చూస్తూ బంగారం లాంటి సమయాన్ని ఖర్చు చేసి మనం పొందే మానసిక ఆనందం కాని ,త్రుప్తికాని లేదు .ఇక భక్తీ చానళ్ళ విషయానికొస్తే ఒకాయన భారతం దగ్గర్నుంచి’’ పల్లీలు బటానీలు’’దాకా నాన్ స్టాప్ గా వాయిస్తాడు .మరో ఆయన ఏది మొదలు పెట్టినా శాఖా  చంక్రమణం చేసి కద అంగుళం కదలకుండా ఎపిసోడ్ లకు ఎపి సోడులు నవిలి మింగేస్తాడు .మరో ఆయన ఆయన ఏం చెబుతాడో ఆయనకే అర్ధం కాని అగమ్య గోచరం .సూటిగా సరళంగా చెప్పే వ్యక్తీ దుర్భిణీ వేసినా దొరకటం లేదు .ఏదైనా నేర్చుకొనే విజ్ఞానం ఉందా అంటే అదీ గగన కుసుమమే .అందుకే అలసిన ముసలి మనసులకు ఆరోగ్యా తెరపి ఎఫ్ ఏం రేడియో అంటాను నేను .నేను అదే అనుసరిస్తూ. టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నాను .ఆ వివరాలే మీకు చెబుతున్నాను .

రెయిన్ బౌ  కృష్ణ వేణి

విజయ వాడ నుండి ప్రసారమయ్యే ఆకాశవాణి వారి ‘’రెయిన్ బౌ ‘కృష్ణ వేణి ’ఎఫ్ ఏం .చాలా హాయిగా ఉంటుంది .ఉదయం అయిదింటికి చక్కగా భక్తీ సినిమాల పాటలు వస్తాయి .ఏదైనా పని చేసుకొంటూ వినచ్చు .లేక పోతే నా బోటి బద్ధకిస్టూ  వింటూ అరమూత కనులలో నిద్రా మెలకువ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పాటల మాధుర్యాన్ని అనుభవించవచ్చు .ఉదయం ఆరు గంటలకు సంప్రదాయ భక్తీ సంగీత ప్రసారం జరుగుతుంది .ఏడు గంటలవరకు ఇది ప్రసారమౌతుంది .ఈరెండు గంటలు మనం అలౌకిక ఆనందం లో మునిగి పోతాం .ప్రతి గంటకు రెండు నిమిషాల ముఖ్య వార్తాప్రసారం ఉంటుంది .ఉదయం ఏడు తర్వాత నేనెప్పుడూ దీన్ని వినలేదు .కుర్రకారుకు కావాల్సిన మిర్చి మసాలా అంతా రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది .కావాలనుకొనే వాళ్ళు వినచ్చు. నాకు అంత సీను లేదు .నేను వినను .రాత్రి పదిగంటలకు నిజం గా అమృత సమయం .’’ఆపాత మధురాలు’’ పేరిట ఎన్నో పాత సినిమా పాటలు వినిపిస్తారు పదకొండు గంటల దాకా .ఆ గంటా మళ్ళీ ఏదో లోకం లో విహరిస్తున్నట్లే ఉంటుంది శ్రావ్యతకు ప్రాముఖ్యమిస్తారు .ఘంట సాల మేస్టారి పాటలు వింటూంటే పానకం తాగినట్లు భానుమతి పాటలు  వింటూ ఉంటే స్వర్గ సీమలో విహరిస్తున్నట్లు మనసున మల్లెల మాల లూగుతున్నట్లు ఉంటుంది .ఏం ఎస్ రామారావు ,ఏ ఏం రాజా లీల గీతాలు ఉల్లాసం ఉత్తేజం కల్గిగిస్తాయి . ఎవరికి వారు విని అనుభవించాల్సిందే . రాత్రి పదకొండుగంటలకు దక్షిణాది భాషా సినీ సంగీతం వస్తుంది .ఆసక్తి ఉన్నవారు విని ఆనందించవచ్చు .నాకు మాత్రం ఉదయం అయిదు నుండి ఏడు వరకు ,రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండు వరకు అదే కాల క్షేపం .మంచం మీద పడుకొని దొర్లుతూ విని ఆనందిస్తా .బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఆకాశ వాణి నాటకం ,ఆ తర్వాతవచ్చే సంగీత కచేరి వింటా .ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చే గంట నాటకం రాత్రి వచ్చే సంగీతం  వినటం ఎన్నో ఏళ్ళుగా వస్తున్న అలవాటు .

అయితే ఈ రెయిన్ బౌ లో ఒకరిద్దరు జాకీ కుర్రాళ్ళు ‘’ఫ్రెండ్స్, ‘ఫ్రెండ్స్ ’అంటూ నిమిషానికి పది సార్లు అంటూ రాత్రి పూట  ఆ హాయైన అందమైన సమయాన్ని వృధా చేస్తున్నారు .అది లేక పొతే మరీ రక్తి కట్టిస్తుంది .మధురమైన పాటలకు వారేమీ ఇంట్ర డక్షన్ చెప్పక్కర్లేదు .వాళ్ళు చెప్పినా దాని మాధుర్యాన్ని పాడు చేయటమే చేస్తున్నారు .దీన్ని అధికారులు గుర్తిస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు .అలాగే ఒక రోజు వేసిన పాటలను మర్నాడే రిపీట్ చేస్తే వైవిధ్యం ఉండక బోరు కూడా కొడుతుంది .కనుక గాప్ ఇవ్వాలి .అప్పుడే చిక్కగా చక్కగా కార్యక్రమం నడుస్తుంది .మరో విషయం వారి ‘’ యాడ్’’ గా-‘’రేడియో కృష్ణవేణి –విజయవాడ విజయవాడ’’ అని చెప్పేది ఆకర్షణీయం గా లేదు .లాగుడుగా ఉంది .మార్చే  వీలుంటే మార్చాలి . ఇలా రైన్ బౌ కృష్ణ వేణి అలసిన ముసలి మనసులకు అందమైన దివ్యమైన అనుభవాన్నిస్తోంది .దీన్ని నిర్వహిస్తున్న ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి అభి నందన శతం .ఈ మధ్య 103 మీటర్ల మీద ఆకాశ వాణి వారిదే  మరో ఎఫ్ ఏం వస్తోందని తెలిసింది .నేను ఇంకా వినలేదు . ఆహ్వానిద్దాం .

రెడ్ ఎఫ్ ఏం

రెడ్ ఎఫ్ ఏం ఎవరిదో నాకు తెలియదుకాని ఇదీ  చాలా బాగుంది .ఉదయం అయిదు నుంచిఏడు గంటలదాకా  ఇందులోనూ మంచి భక్తీ సంగీతం వస్తుంది .అనేక వైవిధ్యభరితమైన భక్తిపాటలు కీర్తనలు ,వినిపిస్తారు .ఈ సమయం లో ఉండే జాకీ ఒకామ్మాయి చాలా విషయాలను సేకరించి మనకు తెలియ జేసి సంతోష పరుస్తుంది . చాగంటి వారి ప్రవచనమూ సాగుతుంది ఎడ్లరామదాసు కీర్తనలు బాలమురళి తత్వాలు హైలైట్ . చాలా బాగా ఉంటాయి .ఎందరో కొత్త గాయినీ గాయకులూ తమ స్వర మాధుర్యంతో దీన్ని సుసంపన్నం చేస్తున్నారు అభినందనలు ..వీలున్నప్పుడు దీన్నీ వింటూ ఉంటాను .ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిదిదాకా యువతను ఉర్రూత లూగించే పాటలు మాటలతో వారిని బాగా ఆకర్షిస్తోంది .వీటి జోలికి నేనెప్పుడూ వెళ్ళలేదు .

రెడ్ ఎఫ్ ఏం లో రాత్రి తొమ్మిది నుంచి పద కొండువరకు మధుర మైన పాటలు వినిపిస్తారు .’’రెడ్ క్లాసిక్స్ ‘’పేరిట కృష్ణం రాజ్ చెప్పే విషయాలు ఆసక్తిదాయకం గా ఉంటాయి .సినిమా  రంగం లో పేరుపొందిన నటులు నటీమణులు ,దర్శకులు నిర్మాతలు పాటల, సంభాషణ రచయితలూ ,ఛాయాగ్రాహకులు సంగీత దర్శకులు మొదలైన వారినందరినీ కృష్ణం రాజ్ పరి చయం చేసే తీరు అత్యద్భుతం .మూలాలోకి చొచ్చుకొని వెళ్లి విషయ సేకరణ చేసి అందంగా హాయిగా అందించే ‘’రాజ్ ‘’రెడ్ ఎఫ్ .ఎం. కు నిజంగానే ’’ రాజే ‘’నని పిస్తాడు .మధ్య మధ్యలో వచ్చ్చే క్లాసికల్ సాంగ్స్ వింటూ మనం మైమరచి పోతాం .ఆ మధుర సుందర స్వర్గ సీమ లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది ‘’హాట్స్ ఆఫ్ టు కృష్ణం రాజ్’’ .

మిర్చి –చాలా హాట్ గురూ

ఏ సెంటర్ లో విన్నా ,ఏ బస్ లో ,ఏ కారులో విన్నా రేడియో మిర్చి వినిపిస్తూనే ఉంటుంది .కుర్రకారుకు కిక్కెక్కించే ఎన్నో విషయాలు రేడియో మిర్చి హాట్ హాట్ గా అందిస్తుంది .దాన్ని వినని విని ఆనందించని కుర్ర్రాడు ఉండడు .క్రికెట్ స్కోర్ నుంచి ట్రాఫిక్ దాకా అది స్పృశించని అంశం ఉండడు .అందులో మరీ ఆకర్షణీయమైనది ‘’రాంబాబు కబుర్లు ‘’ ‘’బాబు బాగా బిజీ’’అని టెలిఫోన్ మోగినప్పుడు వినిపించే అమ్మాయి’’ హస్కీ వాయిస్’’ గమ్మత్తుగా ఉంటే రాంబాబు మిత్రుడితో సంభాషిస్తూ చెప్పే సినీ సిత్రాలు మరింత హాట్ కేక్ లే అనిపిస్తాయి .రోజుకు నాలుగైదు సార్లు వస్తుంది .వెరైటీ ఉంటుంది .సినీ,రాజకీయాలపై సంధించే వ్యంగ్యాస్త్రమే  ఇది . కడుపుబ్బా నవ్విస్తూ అవతలివారిని నవ్వుల చేన్నాకోల్ తో బాదేస్తున్నట్లని పిస్తుంది . దీన్నిమాత్రం నేనెప్పుడైనా హైదరాబాద్ లో మా అబ్బాయిల కార్ లో వెడుతున్నప్పుడు వాళ్ళు పెట్టె మిర్చి లో విని ఎంజాయ్ చేస్తాను .మిగిలినవేవీ కావాలని వినను .

మిర్చి కూడా ఉదయం అయిదింటి నుంచి ఏడు వరకు’’ దేవరాగం ‘’వస్తుంది దీన్ని భారతి అనే అమ్మాయి మహా గొప్పగా నిర్వ హిస్తుంది ‘’’దేవరాగం విత్ భారతి ‘’అందరూ విని తీరాల్సింది .ప్రతి రోజు తిదినక్షత్రాలు వర్జ్యం దుర్ముహూర్తం తో బాటు ఆ రోజు ప్రత్యేకత ఏమిటో భారతి చెప్పే విషయాలు మనకు అంతకు ముందు ఎప్పుడూ వినని విషయాలే .ఎక్కడి నుంచి సేకరించి ఆ మహా తల్లి అందిస్తుందో మహాశ్చర్యం .పురాణాలు చారిత్రికవిషయాలు పండగలు పబ్బాలు మన రాష్ట్రం లో మాత్రమె కాదు దేశం లో ఏ రాష్ట్రం లోనైనా ఏ ప్రాంతం లోవైనా భారతి తెలియ జెప్పే తీరు ముచ్చటగా ఉంటుంది .మధ్య మధ్యలో  ఇంగ్లీష్  మాటలు దోర్లుతున్నా  అవీ ఇంపుగానే ఉంటాయి భారతి గొంతులో. అదే ఈ కార్య క్రమం ప్రత్యేకత .దిన ప్రాధాన్యాన్ని మహా వివరంగా తెలియ జేస్తుంది భారతి .దైవరాగం విత్ భారతి వింటూ ఉంటే దైవ లోక సందర్శనం చేసినట్లే ఉంటుంది .దీనికి కారణమైన భారతిని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది .

ఈ రెండు గంటలలో క్లాసికల్ మ్యూజిక్ తప్పక ఉంటుంది .బాలమురళి ని వినచ్చు .పట్టమ్మాళ్ ,సుబ్బులక్ష్మి మొదలైన సంగీతజ్ఞులస్వరాభి షేకం లో నిండా మునిగి పోవచ్చు .భక్తీ జ్ఞాన వైరాగ్యాల పై పాటలు మహా ఇంపుగా ఉంటాయి .ప్రతి  రోజు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది .రేడియో మిర్చి ని ఉదయంఅయిదు నుంచి వినటం నాకిష్టం .   .మిగిలిన వాటిపై నాకు అవగాహన లేదు .

ఈ విధంగా విజయవాడ నుంచి ప్రసారమయే మూడు రకాల ఎఫ్ ఏం రేడియో లు ఉదయం రాత్రి మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి .అందులో ముసలిమనసులకు మరీ ఆనందం అనుభూతి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 162- కొంకణ రాయబారి -మంఖ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

162-   కొంకణ రాయబారి -మంఖ కవి

మంఖ కవికి మంఖక ,మంఖూక అనే పేర్లు కూడా ఉన్నాయి .కాశ్మీర్ దేశం లో పుట్టాడు తండ్రి  విశ్వా  వర్తుడు .సోదరుడు అలంకారుడు కూడా కవే కాక కాశ్మీర్ రాజులు  సుసాల ,జయ సింహ రాజుల  ఆస్థానం లో మంత్రికూడా .రాజా జయసింహ 1127-1150కాలం లో కాశ్మీర్ ను పాలించాడు .మంఖ కవి కొంకణ దేశానికి రాయబారిగా వెళ్ళాడు మంఖ మరో సోదరుడు శృంగారుడు ‘’బృహత్త౦త్రాధిపతి ‘’పదవిలో ఉన్నాడు .మంఖుని గురువు రుయ్యకుడు .మంఖ కవి’’ శ్రీ కంఠ చరిత్ర ‘’కావ్యాన్ని 1140లో రాశాడు .ఇరవై అయిడుకాండల మహాకావ్యం ఇది .ఇందులో శివుడు త్రిపురాసుర సంహార విషయం రాశాడు .

చివరి కాండ చాలా ఆకర్షణీయంగా ఉంది .అందులో అనేక మంది సమకాలీన ,పూర్వ కవులను పేర్కొన్నాడు .వాళ్ళ పేర్లు చెప్పటమేకాదు ఒక్కొక్కకవి ఏ విషయం లో నిష్ణాతుడో కూడా వివరించటం మంఖకవి ప్రత్యేకత .ఆనందుడు న్యాయ మీమాంసలో ,శంభూరిని కొడుకు ఆనందుడు  వైద్యం లో ,అలక దత్తుని శిష్యుడు కళ్యాణుడు సాహిత్య శాస్త్రం లో ,గర్గుడు,గోవిందుడు  జల్హనుడు  సాహిత్యం లో,జిన్దూకుడు త్రైలోక్యుడు  మీమాంస లో ,జనక రాజు వేదాలలో , నందనుడు వేదాంతం లో నిష్ణాతులు అని చెప్పాడు ., మొదటి కాండ లో ఇష్ట దేవతాస్తుతి .అందరు దేవుళ్ళనూ ప్రార్ధించాడు .చాలా భాగం కవితలో రెండు అర్ధాలు వచ్చేట్లు నేర్పుగా కూర్చాడు మంఖ కవి .భాషమీద మాంచి పట్టు ఉంది .అందుకనే నెమో మనవాళ్ళు ఎవరైనా మారాం చేసి పట్టు బడుతుంటే ‘’మంకు పట్టు ‘’పట్టాడు అంటారు .అది ‘’మంఖ కవి పట్టు’’ ఏమో .చదివే వారికి కష్టంగా ఉంటుంది మంఖ కవిత్వం .ప్రవాహ వేగం తక్కువ .జన రాజు దీనికి రాసిన వ్యాఖ్యానం వలన ఆ పాషాణ పాక కవిత్వాన్ని కొంత వరకు అర్ధం చేసుకో వచ్చు .మంఖ కవి ప్రయోగించిన శబ్దాల అర్ధాలను వివరించే నిఘంటువు ‘’మంఖ కోశం ‘’వచ్చింది . ఇది ఇప్పటికీ కాశ్మీర దేశం లో ఉన్నది .   రుయ్యకుని అలంకార శాస్త్రం పై మంఖ కవి ‘’అలంకార సర్వస్వం ‘’రాశాడు .రుయ్యకుని కారికలకు వ్యాఖ్యానం రాస్తూనే మంఖ కవి అలంకార సూత్రాలు కూడా రాసినట్లు అని పిస్తుంది .’’మంఖు కసుత్రోద్ధారణ ‘’లో సూత్రాలకు మంఖ కవి శిష్యుడు సముద్ర బంధుడు ఉదాహరణలు రాశాడు .ఇతనే అలంకార సర్వస్వానికి వ్యాఖ్య కూడా రాశాడు .అందులో రాజా రవి వర్మను  కీర్తించాడు .మంఖ కవికాలం లో కాశ్మీర రాజాస్థానం లో నిరంతరం సాహిత్య చర్చలు జరిగేవి .ఎంతో విలువైన సమాచారం అందేది .కాశ్మీర రాజులు ఇతర దేశాల రాజులతో మంచి సంబంధాలు నెలకొల్పారు రాయబారులను పంపేవారు .మంఖ కవిని  కాశ్మీర దేశపు  రాయబారిగా కొంకణ దేశానికి పంపారని ముందే చెప్పుకొన్నాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దృశ్యం – 2 – సర్దాగా చదవండి – బందా

దృశ్యం – 2 – సర్దాగా చదవండి – బందా

img148

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

హరినామమే హరిదాస్ శ్వాస

హరినామమే హరిదాస్ శ్వాసharidas1 001 haridas2 002 jnanam -vijnanam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరువు తీసిన పాలకుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో బుష్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 161- కలికాల సర్వజ్ఞుడు – ఆచార్య హేమ చంద్రసూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

161-  కలికాల  సర్వజ్ఞుడు – ఆచార్య  హేమ చంద్రసూరి

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి

జైన సంస్కృత ప్రాకృత  కవి ,పండితుడు ,వ్యాకరణ వేత్త ,సర్వ శాస్త్ర విశారదుడు  ,ఆలంకారికుడు ,గణిత మేధావి  ,జీవశాస్త్ర విజ్ఞాని మహా కావ్యాలతోబాటు అనేక నిఘంటువుల నిర్మాత అయిన హేమచంద్రకవి   1088లో ధందూక లో జన్మించాడు . చాచిగ శ్రేష్టి ,పాహిని దంపతుల పుత్రుడు .ఒకరోజు తండ్రి దూర దేశాలకు వెళ్ళినప్పుడు వజ్ర శాఖకు చెందిన దేవేంద్ర సూరి అనే  ముని వచ్చి అతని తల్లిని అయిదేళ్ళ ఆమె కొడుకును తనకిమ్మని అడిగాడు .ఆమె ఇచ్చేసింది .ఆయన తనతో తీసుకొని వెళ్లి సన్యాసాశ్రమ  వాతావరణం లో పెంచాడు .తల్లి తో సంబంధం లేని ఆ కుర్రాడికి ‘’చాంగ దేవుడు ‘’అనే పేరు పెట్టాడు .

హేమచంద్ర నామం

ఊరినుంచి తిరిగి వచ్చిన తండ్రికి కొడుకు విషయం తెలిసి వెదకటం మొదలు పెట్టాడు .అప్పటికే ఆలస్యమై  పోయింది .కొడుకు సన్యాసాశ్రమం లో అనేక సిద్ధులు సాధించాడు .ఒక సారి తన మహిమ చూపించటానికి మండే అగ్నిలో తన చెయ్యి పెట్టి కాల్చుకొన్నాడు. అది బంగారం అయి పోయింది .అప్పటి నుంచి అతని పేరు ‘’హేమచంద్ర ‘’అయింది .

ఆచార్య హేమ చంద్ర సూరి

హేమ చంద్రుడు  పురాణ తల్లి యాగచ్చ కు చెందిన దేవ చంద్ర చంద్ర సూరి శిష్యుడై శాస్త్రాలు నేర్చాడు .1154లో పండితుడై సూరి బిరుదాన్ని పొందాడు .గుజరాత్ లోని అన్హిల్విద్ పఠాన్  వంశ రాజాస్థానం లో జయసింహ సిద్ధ రాజ ,ఆ తర్వాత వచ్చిన కుమారపాల ల ఆస్థానకవిగా ఉన్నాడు .నిజానికి హేమ చంద్రుడు రాజ దర్బారులో మంత్రి .అతని జైన మత అభిమానం వలన రాజ్యం లో జైన ధర్మానికి గొప్ప ఆదరణ లభించి,రాజ్య  మతం కూడా అయింది .1400 జైన విహారాలు స్థాపించ బడ్డాయి .అహింసను అమలు చసి జంతువధ  మాన్పించి  మాంసాహారాన్ని నిషేధించారు .21ఏళ్ళ వయసులో హేమ చంద్ర సూరి శ్వేతాంబర జైన మతాన్ని రాజస్థాన్ లోని నాగూర్ లో స్వీకరించి’’ఆచార్య హేమ చంద్ర సూరి ‘’అయ్యాడు .

సోలంకీ    సిద్ద రాజు ఆస్థానం లో

హేమ చంద్రుడు జైన మతావలంబి అయినా పూర్వాశ్రమ బ్రాహ్మణ ధర్మాలను  వదిలి పెట్టలేదు  .జైన మతానికి చెందినవే కాక ఇతర మత గ్రంధాలనూ విపరీతంగా అధ్యయనం చేశాడు .మహా మేధావిగా గుర్తింపు పొందాడు .అతని వివేకం ,పాండిత్యం బహు గొప్పవి .సాహిత్యం లో ఆణిముత్యమని పించాడు .ఎన్నో వైవిధ్య రచనలు ప్రాకృత ,సంస్కృత భాషల్లో  చేశాడు .వ్యాకరణం లో కొత్త దారి తొక్కాడు .  ఆ సమయం లో అన్హిల్వద్ పఠాన్ ను  సోలంకీ వంశ రాజులు గుజరాత్ ను స్వాధీనం చేసుకొని పాలించారు . చాతుర్మాస్య దీక్షతో నాల్గు నెలలు  ఇక్కడే గడిపాడు . అతని రచనలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉండి  రాశాడు .1125 లో సోలంకి ప్రభువు సిద్ధ రాజ సింహకు పరిచయమై 1135లో రాజదర్బారులో విశిష్ట వ్యక్తీ అయ్యాడు .

పాణినికి దీటుగా వ్యాకరణం

సిద్ధరాజు మాల్వాను జయించాడు . అన్నిటితో బాటు భోజ రాజ రచనలను ధారా నగరం నుండి తనతోబాటు తీసుకొని వెళ్ళాడు .ఒక రోజు సంస్కృత  వ్యాకరణం  అయిన ‘’లక్షణ ప్రకాశ ‘’అనే ,’’సరస్వతీ కంఠా భరణం  ‘’ను సిద్ధ రాజు చూశాడు. అది ఎంతో ప్రభావం కలిగించి రాజాస్థాన పండితులకు అలాంటి దే సులభ ,పటిష్ట వ్యాకరణం  తయారు చేమని కోరాడు .హేమ చంద్రుడు రాజును  కాశ్మీర దేశం లోని ఎనిమిది గొప్ప వ్యాకరణాలను తెప్పించమన్నాడు వాటిని చదివి అధ్యయనం చేసి పాణిని రాసిన ‘’ఆస్టాధ్యాయి ‘’తో సరి తూగగల వ్యాకరణాన్ని రాశాడు .దీనికి ‘’సిద్ధ హేమ శబ్డాను శాసనం ‘’అని రాజు పేరు, తన పేరుకలిసి  వచ్చేట్లు గా పేరుపెట్టాడు .రాజు కవిగారి కృషికి ఎంతో సంతోషించి ఆ వ్యాకరణ గ్రంధాన్ని ఏనుగు పై అన్హిల్వద్ పఠాన్  పురవీధుల్లో ఊరేగించాడు .హేమ చంద్రుడు సోలంకి రాజ వంశ చరిత్ర ‘’ద్వాశ్రయ కావ్యం ‘’రాసి అందులోనుంచి తన వ్యాకరణానికి  ఉదాహరణలు ఇచ్చాడు .

కుమార పాలుని ఆస్థానం లో

సిద్ధరాజు తన మేనల్లుడు కుమార పాలను చంపే ప్రయత్నం చేస్తే హేమ చంద్రుడు  అతన్ని అనేక పుస్తకాల కుప్పలో  కనపడకుండా దాచేసి ప్రాణం కాపాడాడని ఒక కధనం ఉంది .కుమారపాలుని వలన తనకు ,తన రాజ్యానికి ప్రమాదం సంభవించి ,రాజ్యం పతనం చెందుతుందని భావించి ఈ హత్యా ప్రయత్నం చేశాడు సిద్ధ రాజు .సిద్ధరాజు ఆస్థానం లో నుంచి కుమార పాలుని ఆస్థానానికి చేరాడు హేమ చంద్రుడు .

కుమార పాలుని కాలం లో అంటే 1143-1173 లో హేమచంద్రుడు కుమారపాలునికి ముఖ్య సలహాదారుడుగా వ్యవహరించాడు .అప్పుడు గుజరాత్ రాజ్యం సాంస్కృతిక కేంద్రం గా వర్ధిల్లింది .జైన మతం లోని ‘’అనేకాంత వాదం’’ను బాగా నేర్చినవాడుకనుక హేమచంద్రుడు చాలా విశాల దృక్పధం అలవరచుకొని ,రాజు అభిమానాన్ని పొంది మరీ సన్నిహితుడయ్యాడు శైవుడైన కుమారపాలుడు పాఠాన్ లోని సోమనాధ  దేవాలయాన్ని పునర్నిర్మించాలని  భావించాడు   .హేమచంద్రుని ప్రాపకం ప్రాభవం చూసి అసూయ చెందిన కొందరు అతడు సోమనాధ శివునికి నమస్కారం కూడా చేయడని, పొగరు బోతు,గర్విష్టి  అని చాడీలు చెప్పారు .సోమనాధ  ఆలయ  ప్రారంభోత్సవం రోజున రాజు ఆహ్వానం పై హేమ చంద్రుడు రాజు వెంట ఆలయానికి వెళ్లి సోమనాధ లింగానికి సాగిల పడిమ్రొక్కి ‘’మనిషి జీవితం లో మనిషిలోని సహజాతాలైన అసూయ ,అనుబంధాలను నాశనం చేసే బ్రహ్మ అయిన,  విష్ణువైన, జినుడైన వాడికి నమస్కరిస్తున్నాను ‘’అని ప్రార్ధించాడు .

కుమారపాలుడు  జైనమతం లోకి

ఆ తర్వాత కుమార పాలుడు హేమ చంద్రునికి మరీ సన్నిహితుడై జైన మతావలంబి అయ్యాడు .

1121లో’’తరంగ ‘’లో ప్రారంభమైన జైన దేవాలయ నిర్మాణం లో హేమ చంద్రుడు పూర్తి బాధ్యత తీసుకొన్నాడు . .హేమ చంద్రుని ప్రభావం వలన రాజ్యం లో జైనమత వ్యాప్తి జరిగింది .అహింస కు ప్రజలు అలవాటు పడ్డారు . జంతువధ నిషేధింప బడింది .  గుజరాత్ లో .యజ్న యాగాలలో పశువద జరగ కుండా  కుమారపాల ,హేమ చంద్రులు కట్టడి  చేశారు    .హేమ చంద్రుడు చనిపోయి 900 ఏళ్ళు దాటినా ఇప్పటికీ గుజరాత్ అహింసా వ్రతాన్ని అవలంబిస్తోంది .

హేమ చంద్రునిమహా నిర్వాణం

.తన మరణాన్ని ఆరు నెలలు ముందే ప్రకటించి , ‘’సల్లేఖన ‘’అనే మత దీక్ష పూని నిరాహార దీక్షతో ఆచార్య  హేమ చంద్ర సూరి 1173 లోఅన్హిల్వద్  పఠాన్ లోమహా నిర్వాణం పొందాడు ..

కలికాల సర్వజ్ఞుడు

హేమచంద్రుని  రచనల మొత్తం 35,000,000 పంక్తులు ఉంటుంది .అందుకే హేమ చంద్రుని ‘’కలికాల  సర్వజ్ఞుడు ‘’(omniscient) అన్నారు .మహాత్ముడు అన్నారు . ఇరవై ఎనిమిది కాండల  ‘’కుమార పాల చరిత ‘’ను హేమచంద్ర సూరి రచించాడు .ఇది  అనిహిల్వద్ రాజ  వంశ  చరిత్ర .ముఖ్యం గాకుమారపాల రాజ చరిత్ర .మొదటి ఇరవై కాండాలు సంస్కృతం లోను , చివరి ఎనిమిది ప్రాకృత భాషలో రాశాడు .అందుకే దీనికి ‘’ద్వాశ్రయ కావ్యం ‘’అనే పేరొచ్చింది .చివరిభాగాలు ప్రాకృతం లో రాయటానికి కారణం తన కున్న ప్రాకృత భాషాభిమానమే కాకుండా అందులోని వ్యాకరణం లో  తన కున్న ప్రతిభను తెలియ జెప్పటం ,దానితో బాటు ప్రాకృతం లో ఉన్న మహారాష్ట్ర ప్రాకృతి ,సౌరసేని మాగధి ,పైశాచిలేక చూలికా పైశాచి  అపభ్రంశ ,మొదలైన ఆరు రకాల మాండలీకాలను పరిచయం చేయటం .గుజరాతీ మాండలికాన్ని సుసంపన్నం చేశాడు ..ఆప భ్రంశ భాషలకు ఇదొక్కటే చింతామణి లాంటి వ్యాకరణ ఔషధం .ఈ కావ్యాన్ని 1160లో ప్రారంభించి చనిపోయే వరకు రాశాడు .అసంపూర్తి కావ్యాన్ని అభయ తిలక గణి 1255లో పూర్తీ చేశాడని అంటారు .కాని తన పాత్ర అతి స్వల్పం అన్నాడు మణి కవి .

‘’  త్రిశష్టి శలాక పురుష  చరిత్ర ‘’ అనే దీర్ఘ కావ్యం లో హేమచంద్రుడు ఇరవై నలుగురు జైన తీర్ధంకరుల తో బాటు ,63 జైన మహా మునుల జీవిత చరిత్ర రాశాడు .వారి పుట్టుక ,పునర్జన్మ మొదలైన వివరాలను ,జైనమత నిర్మాణానికి, వ్యాప్తికి వారి సేవలను వివరించాడు . దీనికి అనుబంధం గా ‘’స్థవిర వాలి చరిత్ర ‘లేక ‘’పరిశిష్ట పర్వం ‘’రాసి   జైన సన్యాసుల జీవితాలను వర్ణించాడు  .ఇది ఆంగ్లం లో ‘’ది లైవ్స్ ఆఫ్ ది జైన్ ఎల్దెర్స్ ‘’గా అనువాదంపొందింది .  కాశ్మీర ఆలంకారికుడు మమ్మటుడు రాసిన పద్ధతినే అనుసరించి హేమ చంద్రుడు ‘’కావ్యాను ప్రకాశ ‘’రాశాడు .ఇందులో అభినవ గుప్త ,ఆనంద వర్ధనుల రచనలను పేర్కొన్నాడు . . .’’చందాను శాసనం ‘’అనే ఛందో గ్రందాన్నీ హేమ చంద్రుడు రాశాడు .’’కావ్యానుశాసనం’’తో బాటు  ,దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు .అదే ‘’అలంకార చూడామణి ‘’.ఎనిమిది  అధ్యాయాల  ఈ గ్రంధం సాహిత్య చరిత్రలోనే చాలావిలువైనది అపూర్వమైనది .భరత ,లొల్లట దండి , .శంఖ మమ్మట , భట్టనాయక రచనలను ఇందులో సమీక్షించాడు .ఇవికాక మరెన్నిటినో  స్పృశించాడు .ఇదొక విస్తృత రచన .

నిఘంటు రచన –స్తోత్ర రచన

హేమ చంద్రుడు కూర్చిన  నిఘంటువులలో ‘’దేశి నామ మాల ‘,లేక’’ దేశి శబ్ద సంగ్రహం’’,  ‘’అభిదాన చింతామణి’’ ,’’అనేకార్ధ కోశం ‘’ముఖ్యంగా పేర్కొన దగినవి . ., ,’’నిఘంటు శేషం’’అనేది జీవ శాస్త్ర నిఘంటువు . . ‘’శ్యాద వాద మంజరి’’ ,’’జినేంద్ర స్తోత్రం ‘’మొదలైనవి వర్ధమాన మహా వీరునిపై స్తోత్రాలు .’’వీత రాగ స్తోత్రం ‘’అనే ఆధ్యాత్మిక స్తోత్రం కూర్చాడు .’’యోగ శాస్త్రం తో బాటు ‘’,ప్రమాణ మీమాంస ‘’గ్రంధమూ రాశాడు. సంస్కృత ‘’ వ్యాకరణం గా ‘’శబ్డాను శాసనం ‘’రాశాడు .ఇందులో ఎనిమిదవ  అధ్యాయం లో ప్రాకృత వ్యాకరణమూ చేర్చాడు ;జైన మత కరదీపికగా ‘’యోగ శాస్త్రాన్ని’’ ,లింగనిర్దారణకు  ‘’లింగాను శాసనా’’న్ని హేమ చంద్రుడు రాశాడు .

గణిత మేధావి

గణితం లో కూడా హేమ చంద్రుడు తన ప్రతిభను చూపాడు .అంతకు పూర్వం గోపాలుడు రాసిన ఆధారంగా  హేమ చంద్రుడు ఆధునికకాలం లో పిలువ బడిన ‘’ఫైబోనాసి సీక్వెన్స్ ‘’ను తయారు చేసి చెప్పాడు .’’ఫైబో నాసి ‘’అనే గణిత శాస్త్రజ్ఞుడు 1202లో చెప్పిన ఈ సూత్రాన్ని యాభై ఏళ్ళకు ముందేఅంటే  1150 లోనే హేమచంద్రుడు తయారు చేసి చూపించిన మేధావి .దీన్ని F(n)=F(n-1)+F(n-2)నిర్వచనంద్వారా చెప్పాడు ఫైబోనాసి .

సోమ ప్రభాచార్యుడు ప్రాకృతభాషలో ‘’కుమార పాల ప్రతిబోద మహాకావ్యం ‘’రాసి కుమార పాల చరిత్రను బోధ పరచాడు .సోమప్రభుడు విజయ  సింహుని శిష్యుడు .ముని చంద్రునికి అయిదవ తరం  వాడు .అతని తండ్రి సిద్ధ పాలుని సహచరుడు ,కవిహేమచంద్రుని  స్నేహితుడుఅయిన శ్రీపాలుడు .అనిల్హివిద్ రాజాస్థానం లో ఉన్నాడు .ఈచరిత్రలో కుమారపాలుడు జైనం లోకి పరి వర్తన చెందినవిధానం వర్ణించ బడింది .హేమచంద్రుని ప్రబోధం వలననే కుమారపాలుడు జైనం స్వీకరించాడని తెలియ జేశాడు. అందులో కావ్యం చివర సంస్కృత భాషలో ‘’ ప్రశస్తి ‘’రాశాడు .హేమ చంద్రుని  ఇతర గ్రంధాలు  ‘’హేమ కుమార చరిత్ర ‘’,సోమతినాద చరిత్ర,సాలాంత కావ్యం మొదలైనవి .

మహా మేధావి ,సర్వ శాస్త్ర పారంగతుడు ,సంస్కృత ప్రాకృత కవి ,కలికాల సర్వజ్ఞ బిరుదాంకితుడు జైనాచార్యుడు హేమచంద్ర సూరి ని మనవాళ్ళు అంతగా గుర్తించినట్లు కనిపించదు .అందుకే ఈతరానికి హేమ చంద్రుని పరిచయం చేశాను .

Inline image 1

–గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నవభారత ఆధ్యాత్మిక ఆత్మా స్వామి వివేకానంద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్యూబా తో అమెరికా సయోధ్య –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాటి తొర్రలో కొండ చిలువ ,,అమరేశ్వర మంచు లింగం ,రామచిలుకలు


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దృశ్యం – సీ – రియల్ – 1 – సర్దాగా చదవండి – బందా

దృశ్యం – సీ – రియల్ – 1 – సర్దాగా చదవండి – బందా

img147

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పావన లహరి -పుష్కరగోదావరి

pushkara godavari3 001 pushkara godavari4 001 pushkaragodavari1 001 pushkaragodavari2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

159-ద్విసందాన (ద్వర్ది)కావ్య నిర్మాత –ధనుంజయుడు

వాసుదేవ ,శ్రీదేవి ల పుత్రుడైన ధనుంజయుడు జైనకవి .అప్పటికే సాహిత్యం లో ద్వార్దికావ్యాలు విజ్రుమ్భించాయి .ఒకే పద్యం లో రెండు వేర్వేరు కదార్ధాలు వచ్చే దాన్ని ద్విసందాన కావ్యం అన్నారు .దండి కవి సంస్కృతం లో దీనికి నాన్దిపలికితే భోజుడు శృంగార ప్రకాశ లో దాన్ని పేర్కొన్నాడు .సుబందు దీన్ని వచనం లో చేశాడు .సుబందు వాసవ దత్తలో ద్వ్యర్దికావ్య నిర్మాణాన్ని శిఖరారోహణం చేయించాడు .ధనుంజయుడు అదే బాటలో నడిచి రామాయణ ,మహా భారత కధలను ద్విసందాన కావ్యంగా సుమధుర ,సాంద్ర ప్రవాహ కవిత్వం లో రాశాడు .తన శక్తి ఎరిగిన వాడు కనుక ధనుంజయుడు తనను వాల్మీకి వ్యాసులతో పోల్చుకొని వారితర్వాత మూడో వాడిని తానే నని చెప్పుకొన్నాడు. దండిని దృష్టిలో పెట్టుకొనే ఈ మాట అన్నాడు .తన కావ్య్యం మూడు వజ్రాలలో ఒకటి అన్నాడు .ఆకలంకుని న్యాయ సారం ,పూజ్య పాదుని వ్యాకరణం మిగిలిన రెండు వజ్రాలుట .ధనుంజయుడు ఆనంద వర్ధన ,రాత్నాకరులను బాగా మెచ్చు కొన్నాడు .సోమదేవ,జల్హనులు ధనుంజయ కవిత్వాన్ని మెచ్చారు ఇతనిగురించి వర్ధమానుడూ చెప్పాడు .కనుక ధనున్జయునికాలం తొమ్మిది పది హతాబ్దుల మధ్యగా నిర్ణయించారు .

160-మూషిక వంశ చరిత్ర రాసిన –అతుల కవి

పదిహేను కాండాలలో అతులకవి మూషిక వంశ రాజ చరిత్రను రాశాడు .అంతకు మించి అతుల గురించి మనకు ఏమీ తెలియ లేదు .దక్షిణ తిరువాన్కూరు పాలకులైన మూషిక వంశ రాజుల సుదీర్ఘ చరిత్ర ఇది .పరశురాముడు రాజ  క్షత్రియ రాజ వంశ  నిర్మూలన చేస్తుండగా ఒక క్షత్రియ వంశ రాజు చనిపోగా అతని భార్య పారిపోయి ఒక పర్వత గుహ లో దాక్కున్నది .ఒక రోజు ఏనుగంత ఉన్న ఎలుక ఆ గుహలో దూరి ఆమెను బలాత్కారం చేయబోతే ఆమె కంటి చూపుకే అది  కాలి  బూడిద అయ్యింది .ఎలుక ఆత్మా పర్వత రాజు రూపంగా ప్రత్యక్షమైంది. తన రూపం మారిపోవటం గ్రహించిన ఎలుక కౌశిక ముని శాపం వల్ల తనకు ఆ ఎలుక రూపం వచ్చిందని చెప్పాడు .రాణి ఆ గుహలోనే ఉండిపోయి ఒక మగ పిల్లాడిని కన్నది .రాణి తో పాటు ఇక్కడే ఉన్న రాజ పురోహితుడు ఆ పిల్లవాడికి విద్య నేర్పాడు .పరశురామ యజ్ఞానికి బలి పశువుగా ఈ బాలుడు వెళ్లి ఆయన్ను మెప్పించి చావు తప్పించుకొని ఆయన అనుగ్రహం తో ‘’మూషిక రామ ఘట ‘’పేరుతో మూషిక రాజ్యానికి రాజు అయ్యాడు . ఒక కుండ నీటితో పవిత్రీకరింప బడ్డాడుకనుక రామ ఘట (కుండ)అనే పేరొచ్చింది .ఇతను మగధ రాజు మాధవ వర్మనుయుద్ధం లో  చంపి కూతురు భద్రసేనను పెళ్ళాడాడు .మగధ కు మాధవ వర్మ కుమారుడిని రాజును చేశాడు .

రామ ఘటకు ఇద్ద్దరు కొడుకులు .పెద్దవాడు వటు ను హైహయ రాజ్యం  ఇచ్చి రాజును చేశాడు .చిన్నకొడుకు నందన ను చోళ రాజుగా అభిషిక్తుని చేశాడు. అరణ్యాలకు వెళ్లి వాన ప్రస్తాశ్రమం లో చివరి రోజులు గడిపాడు .మనకవి గారు ఇక్కడి నుండి ఆ తర్వాతా రాజులందర్నీ వరుసగా పేర్కొని చివరిరాజు నీల కంఠవల్లభా అతని కొడుకు  దాకా  వారి చరిత్ర అంతా పూస గుచ్చి వర్ణించాడు . .. శ్రీకంఠరాజు ఆస్థానం లో ఉండి ఈ మూషిక వంశ చరిత్ర రాశాడుఅతులకవి . .పద్నాలుగవ కాండం లో రాజా వల్లభ  కేరళపై దండయాత్రకు వస్తున్నచోలరాజును నిలువ రించటానికి  కేరళ రాజుతో కలిసి చోళ రాజుల దండయాత్రను ఎదుర్కొన్నాడు .ఈ చోళ రాజు 1014-1046వాడైనమొదటి రాజేంద్ర చోళుడు అయి ఉండ వచ్చు .పన్నెండు ,పద్నాలుగు అధ్యాయాల్లో శ్రీ మూల వాసం లో ఉన్న బుద్ధ దేవాలయాన్ని వర్ణించాడు .ఈ ఆలయం సముద్రం చొచ్చుకు రావటం వలన శిధిలమై పతన దశకు చేరుకొన్నదని    ఆవేదన వ్యక్తం చేశాడు .868లో రాజ పోషణం లో ఈ బుద్ధ దేవాలయం పరమ వైభవంగా ఉండేది .కనుక అతుల  మూషిక వంశ చరిత్ర పదకొండవ శతాబ్దం లో రాసి  ఉంటాడని భావిస్తారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -54

22—ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ –విలియం జేమ్స్

అమెరికా వేదాంతి ,సైకాలజిస్ట్, డాక్టర్  అయిన విలియం జేమ్స్ అమెరికాలో మొట్టట మొదటి సారిగా సైకాలజీ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనుడు .19వశతాబ్దపు మేధావులలో ఒకరుగా గుర్తింపు పొందాడు .అమెరికాలో ప్రసిద్ధ వేదా౦తు లలోఅప్పటి వరకు  అంతటి గొప్ప వేదాంతి జన్మించలేదని అంటారు  ..ఆ నాటి ప్రముఖ వేదా౦తు లైన విలియం సాండర్స్ పియర్స్,జాన్ డ్యూయీ సరసన నిలిచిన మహా వేదాంతి .వీరి సిద్ధాంతం ‘’ప్రాగ్మాటిజం ‘’అంటే పరిస్తితులను బట్టి సమస్యలను గురించి ఆలోచించి పరిష్కారం కలిగించే విధానం .దీనితో ‘’ ఫంక్షనల్ సైకాలజీ ‘’నిర్మాతలలో ప్రసిద్ధుడైనాడు .ఇరవై వ శతాబ్దపు సైకాలజిస్ట్ లలో పద్నాలుగవ శ్రేణిలో నిలిచాడు .అందుకే విలియం  జేమ్స్ ను ’’’ఫాదర్ ఆఫ్ అమెరికన్  సైకాలజీ ‘’అని పిలుచుకొన్నారు .

మేధావుల కుటుంబం

జేమ్స్ కుటుంబం అంతా మేధావి వర్గమే .దియాలజి ,ఫిలాసఫీ ,సాహిత్యాలలో హెన్రి జేమ్స్,సీనియర్ విలియం జేమ్స్ హెన్రి జేమ్స్ జూనియర్   అగ్ర శ్రేణి లో ఉన్నారు .అందరూ బహు స౦పన్నులే .వీరి తాత వ్యాపార్ ఫైనాన్షియర్ కూడా .మూడు వేల మిలియన్ డాలర్ల ఎస్టేట్ ను అప్పగించాడు .వీరిలో సీనియర్ హెన్రి ఆకుటుంబం లో చాలా తమాషా మనిషి స్వీడెన్ బర్గ్ అనుచరుడు ,జీవితాంతం మత గ్రందాలు చదువుతూ ,మతపరమైన సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ,ముఖ్యం గా సృష్టికి సంబంధించిన మెటా ఫిజిక్స్ పై ద్రుష్టి పెట్టి జీవించాడు అన్నాడు బెర్నార్డ్ షా .తన తండ్రి నిజం గా దియలాజికల్ కాలం లో పుట్టి ఉంటే ,ఆయన దేవునికి మానవునికి ఉన్న సంబంధం ,దైవ సృష్టి ,అందులోని మిస్టరి లను వెలికి తీసి ,ఉంటే ప్రపంచానికి మార్గ  దర్శనం చేసిన మహానుభావులలో ఒకడై తీర్చి దిద్దే వాడై ఉండేవాడు ‘’అన్నాడు విలియం జేమ్స్ .తండ్రి ఒక మత ప్రవక్త అని ,మహా మేధావి అని అన్నాడు .

సాగని చదవు

సీనియర్  హెన్రి జేమ్స్ ,భార్య మేరీ రాబర్ట్ సన్లకు నలుగురు కుమారులు ,ఒక కూతురు .విలియం జేమ్స్ న్యూ యార్క్ సిటీలో 11-1-1842 జన్మించి న పెద్ద కొడుకు .అక్కడే ప్రైవేట్ స్కూల్ లో చదివి ఇక్కడి స్కూలు చదువులు నచ్చక తండ్రి కుటుంబాన్ని యూరప్ కు మార్చేశాడు .లండన్ ,పారిస్ ,బోలాన్ స్విట్జర్లాండ్ ,జెర్మని లలో ప్రైవేట్ మాస్టర్లు ,గవర్నసేస్ లు చదువు చెప్పారు మధ్య మధ్యలో మార్పులు కనుక పిల్లల చదువు వరుస క్ర్రమం లో సాగలేదు .విలియమ్స్ కు జర్మన్ ,లాటిన్  ఇటాలియన్ భాషలలో గొప్ప పాండిత్యం అలవడింది .

అస్థిర నిర్ణయాలు

పద్ద్దేనిమిదేళ్ళ వయసులో విలియం జేమ్స్ అమెరికా కు వచ్చాడు .యూరప్ అతడిని మృదు స్వభావిని చేయ లేక పోయింది .అక్కడ తిట్లు శాపనార్ధాలే నేర్చుకోన్నానని తండ్రితో చెప్పాడు .17వయసులో పెయింటర్ అవుదామనుకొన్నాడు .ఒక కొడుకు ఆర్టిస్ట్ మరొకడు నావలిస్ట్ అవాలని తండ్రి భావించాడు .అయిన కొడుకులకు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చాడు .విలియమ్స్ పారిస్ చేరి న్యు పోర్ట్ ఐలాండ్ లో ఒక ఇంట్లో ఉండి అభిమాన చిత్రకారుడు విలియం హంట్ బృందం తో ఉన్నాడు .

మళ్ళీ మెడిసిన్

ఒక ఏడాదికే చిత్ర లేఖనం మొహం మొత్తింది.ఆర్ట్ వదిలేసిహార్వర్డ్ లో  లారెన్స్ సైంటిఫిక్ స్కూల్ లో చేరాడు .మూడేళ్ళ తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో చేరాడు ..ఏడాదికే తాను సిద్ధాంత కర్తనే కాని ప్రాక్టికల్ మనిషిని కాదని గ్రహించాడు .లూయీ అగస్సి అతని గురువయ్యాడు ఆ స్కూల్ లో .అగస్సి బ్రెజిల్ కు ఒక అన్వేషణ లో బయల్దేరితే ,విలియం అనుసరించాడు .అక్కడ మొక్కలు వగైరా సేకరించటంవర్గీకరించటం  బోరు కొట్టి మళ్ళీ మెడిసిన్ చదవటం మొదలు పెట్టాడు .ఈ మార్పు మానసిక సంఘర్షణ కలిగించింది .అప్పుడప్పుడు నరాల జబ్బు వచ్చి బాధ పడేవాడు .ఈ నరాల వ్యాధి నుంచి తానను తానూ కాపాడుకోవాలని నిర్ణ యించుకొన్నాడు .ఆరోగ్యం కోసం జర్మని వెళ్ళాడు .మెడిసిన్ పాసై మంచి ఉద్యోగం వస్తేచేరాలనుకొన్నాడు .

A black and white photograph of James

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పరిశోధనాత్మక రచన – మహర్షి భరద్వాజ చరిత్ర – బందా

పరిశోధనాత్మక రచన – మహర్షి భరద్వాజ చరిత్ర – బందాimg145

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2

158-యుదిష్టిర విజయం రాసిన వాసుదేవకవి

వాసుదేవకవి ‘’రవి’’ కుమారుడు .మహా భట్ట భట్టాత్రి అనే భారత్ గురువు కు శిష్యుడు .తిరువాన్కూర్ లో విపర సత్తామ లో ఉండేవాడు .మలబారు తీరం కధనం ప్రకారం తన గురువు గారి శిష్యులు చదివే పురాణాలను శాస్త్రాలను వినటం అంటే వాసు దేవుడికి ఇష్టం గా ఉండేది .కాని చదువుకోవాలని ఉన్నా శబ్దాలను సరిగ్గా పలికే వాడు కాదట .’వాసు ‘’అనటానికి బదులు ‘’వాతు ‘’అని పలికే వాడు .ఒక రోజు తిరువలక్కావు దేవాలయం నుండి వాసు దేవ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే విపరీతంగా వర్షం కురిసింది .ఒక బోటు ఎక్కి సుళ్ళు తిరుగుతున్నవరద  నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేశాడు .కాని అసాధ్యం అని భావించి మళ్ళీ దేవాయానికే చేరుకొన్నాడు .అక్కడే ఆ రాత్రి గడిపాడు .బయట వర్షం తీవ్రం గా కురుస్తూనే ఉంది .ఒంటిమీద తడిసిన పంచె తప్ప ఏమీలేదు .ఆకలి విపరీతంగా ఉంది .తన ఇలవేలుపైన ఆ దేవిని ప్రార్ధించాడు .దయతో చలికాచుకోవటానికి కట్టెల మంట ఏర్పరచింది దేవి. తినటానికి కొన్ని అరటి పళ్ళు కూడా ప్రసాదించింది .ఆ పళ్ళు తినగానే వాసుదేవునికి మహా గొప్ప కవిత్వం ఆశుదారగా వచ్చేసింది .మహా కవి అయిపోయాడు .ఉదయమే వచ్చిన దేవాలయ పని మనిషి అది గమనించి అతనిని   అరటి తొక్కలను ఎక్కడ పారేశాడో తెలుసుకొని వెళ్లి తెచ్చుకొని తినేసింది .  ఆశ్చర్యం గా ఆమె నోటి వెంబడి అమోఘమైన కవిత్వం జాలు వారింది .కవయిత్రి అయిపొయింది .ఆ తర్వాత రాజా కులశేఖర ,రాజా రాము ల ఆస్థానం లో వాసుదేవకవి తొమ్మిదవ శతాబ్దం లో ఉన్నాడు .

దేవి కృపతో మహాకవిఅయిన  వాసుదేవ ‘’యుదిష్టిర చరితం ‘’ అనే ఎనిమిది కాండలలో ఆర్యా వృత్త శ్లోకాలలో కావ్యం రాశాడు .అందులో తన రాజు కులశేఖరుడు అని తెలియ జేశాడు .పాండురాజు వేట తో ప్రారంభించి ధర్మరాజు పట్టాభి షేకం తో కావ్యం ముగించాడు . అక్షింబ శిష్యుడైన చొక్కనాధుడు దీనికి వ్యాఖ్యానం రాశాడు .శ్రీరంగానికి దగ్గరలో ఉన్న శాత నూర్ కు చెందిన సుదర్శన కూడా ఈ కావ్యం పై వ్యాఖ్య రాశాడు .

శౌరికాధోదయ ,త్రిపురదహనం కావ్యాలలో రాజు రామ అని పేర్కొన బడింది .మొదటికావ్యం శ్రీకృష్ణుని జననం నుండి బాణాసుర వధ వరకు ఉన్న శ్రీ కృష్ణ కద.  దీనికి హరివంశం మూలం .నీల కంఠుడుదీనికి వ్యాఖ్య రాశాడు .ఇతడు ముక్తిస్తలానికి చెందిన ఈశానుని కుమారుడు ..రెండవ కావ్యం త్రిపురాలను దహించిన శివ గాధ.దీనికి  నిత్య ప్రియుడు అని చెప్పుకొన్న కవి వ్యాఖ్యానం రాశాడు .వాసుదేవుడు రాసిన ఈ మూడు కావ్యాలు యమకం లో ఉండిబాగా  రాణిం చాయి .ఇటీవలి పరిశోధనలలో కాళిదాసు రాసినట్లు భావిస్తున్న ‘’నలోదయ ‘’కావ్యాన్ని కూడా వాసుదేవ రచించి ఉంటాడని భావిస్తున్నారు .

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment