నిజం పత్రికలో చలపాక ”జీవితం”రచన పై సమీక్ష ,పురస్కారం -దర్శనీయ దైవ క్షేత్రాల

29-1-15 నేటి నిజం పత్రికలో చలపాక ”జీవితం”రచన పై సమీక్ష ,పురస్కారం -దర్శనీయ దైవ క్షేత్రాలnetinijam 1 001 netinijam 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్యనాటకం బండర్లోనే పుట్టింది

Untitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీరమ్మ తల్లి ఊరేగింపు వైభోగం

Untitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్రాండ్‌ సలామ్‌ :@19

గ్రాండ్‌ సలామ్‌ :@19

ప్రైజ్‌ మనీ రూ.14 .9 కోట్లు
సెరెనాదే ఆసే్ట్రలియన్‌ ఓపెన్‌
పోరాడి ఓడిన షరపోవా

అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ విశ్వ వేదికపై మరోసారి జూలువిదిల్చింది. వయసు పెరుగుతున్నా..! యువ రాకెట్లు దూసుకొస్తున్నా…! తన ముందు వారంతా బలాదూర్‌ అని చాటి చెప్పింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో వరుసగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో 19వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. స్టెఫీ గ్రాఫ్‌ (22) రికార్డుకు మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది.
మెల్‌బోర్న్‌: ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌, టాప్‌ సీడ్‌ సెరెనా విలియమ్స్‌ విజేతగా నిలిచింది. శనివారమిక్కడ జరిగిన ఫైనల్లో సెరెనా 6-3, 7-6(7/5)తో రెండో ర్యాంకర్‌, రెండో సీడ్‌ షరపోవాపై చెమటోడ్చి నెగ్గింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన ఆరుసార్లూ టైటిల్‌ ఆమెనే వరించడం మరో విశేషం. అదే విధంగా షరపోవాను వరుసగా 16వ సారి ఓడించి ఆధిక్యాన్ని చాటుకుంది. ఓపెన్‌ ఎరాలో అత్యధిక వయసులో ఈ టైటిల్‌ నెగ్గిన మహిళగా 33 ఏళ్ల సెరెనా రికార్డులెక్కింది. సెరెనా కెరీర్‌లో ఇది 23వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. దాదాపు దశాబ్దం తర్వాత ఇద్దరు టాప్‌ సీడ్‌ క్రీడాకారిణులు తలపడ్డ తుదిపోరులో సెరెనా తొలిసెట్‌ను సులభంగా నెగ్గింది. అయితే రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకున్న షరపోవా.. అమెరికా స్టార్‌కు గట్టి పోటీనిచ్చింది. కానీ, టై బ్రేకర్‌లో తన అనుభవంతో పాటు బలాన్ని రంగరించి మరియాను మరోసారి మట్టికరిపించింది. 203 కి.మీ. వేగంతో సర్వీస్‌ చేసిన ఆమె 18 ఏస్‌లు సంధించి రష్యా సుందరికి చెక్‌ పెట్టింది.
జలుబు బాధిస్తున్నా…: వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సెరెనా జలుబుతో బాధ పడుతున్నప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలిసెట్‌లో సెరెనా 3-2తో ఉన్న దశలో వర్షం రావడంతో 13 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపివేశారు. కొద్ది అలసటతో కోర్టును వీడిన సెరెనా బ్రేక్‌ సమయంలో వాంతి చేసుకుంది. వెంటనే వైద్యం చేయించుకుంది. ఇక విరామం తర్వాత సెరెనా అద్భుత ఏస్‌తో మ్యాచ్‌ను కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. అయితే సెట్‌ పాయింట్‌ వద్ద నిలిచిన సమయంలో ఆమె సర్వీస్‌ కోల్పోయింది. కానీ, మూడో అవకాశంలో ఆమె సెట్‌ గెలుచుకుని శుభారంభం చేసింది. రెండో సెట్‌లో షరపోవా పోరాడినప్పటికీ లాభం లేక పోయింది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు 

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు

 

http://tnilive.com/?p=3192

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కృష్ణా జిల్లా కార్య  లో ఫిబ్రవరి 21,22 శని,ఆదివారాలలో  జరిగేమూడవ  ప్రపంచ  తెలుగు రచయితల మహాసభల వేదికను క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉన్న ”కృష్ణ వేణి టేలెంట్ స్కూల్ ”కు మార్చబడిందని తెలియ జేశారు మీగిలిన కార్యక్రమాలన్నీ  ఇది వరకు తెలియ బరచినట్లుగానే  జరుగుతాయి .

కార్య వర్గ సమావేశ ఫోటోలు గూగుల్ ప్లస్ లో పెట్టాను చూడండి -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

కెసిఅర్ సార్ స్టైలే వేరు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

 

 


థౌజండ్‌వాలా 30 ఇయర్స్‌ ఇండసీ్ట్ర

నేడు బ్రహ్మానందం పుట్టినరోజు
సినిమాల ద్వారా మీరు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు? మరి, మిమ్మల్ని ఎక్కువగా ఎవరు నవ్విస్తుంటారు?
మా ఊళ్లో నాకు బాల్య స్నేహితులు ముగ్గురున్నారు. గంగారపు వెంకట్రావు, జింకా రామారావు, ఎం.పుల్లారెడ్డి అని. వీళ్లు ముగ్గురు హాస్యప్రియులు. మాటలతో, చేష్టలతో నవ్విస్తుంటారు. ఫోన్‌లలోనే సెటైర్లు వేస్తూ నాలో జోష్‌ నింపుతుంటారు. ఇక, నటుల్లో అయితే – రాజేంద్రప్రసాద్‌, కృష్ణభగవాన్‌, ఎంఎస్‌ నారాయణ, అలీ, వేణుమాధవ్‌, గుండు హనుమంతరావు వేసే జోకులకు నవ్వొస్తుంటుంది. వీళ్లలో ఏ ఒక్కరు షూటింగ్‌లో కలిసినా నవ్వులు పేలుతుంటాయి.
బ్రహ్మానందం వాడుకున్నోళ్లకు వాడుకున్నంత! ఆయనలో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో అన్నీ వాడుకునే ప్రయత్నం చేశారు తెలుగు సినీ దర్శకులు. వాటిలో పేలిన సినిమాలే ఎక్కువ! ఒక దశ వచ్చేసరికి – హీరో పక్కన బ్రహ్మానందం కాదు, బ్రహ్మానందం పక్కన హీరోలు అనే స్థాయికి వెళ్లాడీ కమెడియన్‌. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటికి సరిగ్గా సినిమాల్లో కొచ్చి 30 ఏళ్లు అయ్యింది. 1000 సినిమాల మైలు రాయినీ దాటారాయన. ఈ సందర్భంగా.. ఇంతవరకు బ్రహ్మానందం గురించి తెలియని వేరియేషన్లను పట్టుకునే ప్రయత్నం చేసింది ‘నవ్య’. అప్పుడు థర్టీ ఇయర్స్‌ ఇండసీ్ట్రలో థౌజండ్‌వాలా పేల్చిన కబుర్లే ఇవి..
రోటీన్‌ అవ్వకూడదు. లేకపోతే అన్నేళ్లు సినీజీవితం ఉండదు? మీరు ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
అక్షరసత్యం ఏంటంటే – అలాంటి పాత్రల్ని సృష్టించడం బ్రహ్మానందం గొప్పదనం కాదు, రచయితల గొప్పదనం. అన్నిటికంటే ముఖ్యంగా – కెమెరా ముందుకు వస్తూనే.. నీకు ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి? బయట ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? వంటివన్నీ మరిచిపోయి నటించగలగాలి. పాత్రలో లీనమవ్వాలి. వీటన్నిటికీ భగవంతుడి దయ ఉండాలి. సిన్సియర్లీ ఐ బిలీవ్‌ దట్‌. మనం చేయలేని చాలా విషయాలు మన చేత చేయిస్తాడు భగవంతుడు. సహజంగా సినిమాల్లో ఒక కమెడియన్‌ జీవితకాలం ఎంత ఉంటుంది? అయిదేళ్లు, మహా అయితే పదేళ్లు? 30 ఏళ్లు దాటి వెయ్యి సినిమాలకు పైగా చేశానంటే ఏమనుకోవాలి? మొదట్లో నేను కూడా అనుకునేవాణ్ణి. ‘నేను చాలా టాలెంటెడ్‌. లేకపోతే ఇన్ని అవకాశాలు రావు కదా’ని! కాని ఒక దశకు వచ్చిన తరువాత.. మనకు తెలిసేది ఏంటంటే ‘మనది కాదు ఇది. మనకు తెలియనిది ఏదో ఉంది. అదే మన చేత ఇవన్నీ చేయిస్తోంది’ అని అర్థం అవుతుంది. అది ఆధ్యాత్మికభావన అనండి మరొకటి అనండి. తెలుగు సినీ పరిశ్రమకు కూడా నేనిక్కడ ధన్యావాదాలు చెప్పుకోవడం ధర్మం. లీజర్‌ టైమ్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తుంటారు..?
పుస్తకాలు చదువుతుంటాను. టీవీ చూస్తాను. ఒకప్పుడు కొమ్మూరి, ముప్పాళ్ల రంగనాయకమ్మ నవలలు ఎక్కువగా చదివేవాణ్ణి. ఈమధ్య రజనీష్‌, రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, జిడ్డుకృష్ణమూర్తి పుస్తకాలు చదువుతుంటాను. అన్ని చదివిన తరువాత తెలిసింది ఏంటంటే – పుస్తకంలో ఏమీ లేదు. ఉన్నదంతా మస్తకంలోనే అని.
వాళ్లు పేల్చే ఆ జోకులేవో మాక్కూడా చెప్పొచ్చు కదా?
ఉన్నఫలంగా జోక్‌ చేయడంలో కృష్ణభగవాన్‌ దిట్ట. మాట తడుముకోకుండా టకీమని అలా ఒక బిట్‌ విసురుతాడు. దాన్ని అర్థం చేసుకునేలోపే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది. షూటింగ్‌లో ఒక రోజు కృష్ణభగవాన్‌ చాలా డల్‌గా కనిపిస్తే ‘‘ఏంటీ చాలా డల్‌గా ఉన్నావ్‌?’’ అడిగాను. ‘‘రాత్రి డబ్బు పోయిందండీ’’ అన్నాడు. ‘‘ఎందులో పోయింది’’ అన్నాను. ‘‘ఎందులో పోయినా పోయినట్లే కదండీ’’ అన్నాడు మళ్లీ. ‘‘అన్ని చోట్ల వెతికారా’’ అన్నాను. ‘‘మా భార్యను కూడా అడిగాను. షర్టు జేబు కూడా చూసుకున్నాను. కనబడలేదు’’ అంటూ చెప్పడం ఆపాడు. ‘‘మరి, ప్యాంటు జేబులో చూసుకున్నారా?’’ అన్నాను నేను. ‘‘చూల్లేదండీ’’ అన్నాడు. ‘‘మరి అక్కడ కూడా చూసుకోకపోయారా?’’అని గుర్తు చేశాను. ‘‘అక్కడ కూడా లేకపోతే టెన్షన్‌ ఎక్కువై మరీ బాధపడాల్సి వస్తుందని.. చూసుకోలేదు సార్‌..’’ అన్నాడు. అలా అతని మాటలు స్పాంటేనియ్‌సగా లాఫ్టర్‌ను క్రియేట్‌ చేస్తుంటాయి.
ఎంఎస్‌ నారాయణ, వేణుమాధవ్‌లు కలిసినప్పుడు కూడా ఇలాంటి నవ్వులే పూస్తుంటాయట కదా?
ఎంఎస్‌ మాట్లాడుతుంటే మ్యాజిక్‌ డాల్‌ మిమిక్రీ చేస్తున్నట్లే అనిపించేది. అతను విద్యాధికుడు కాబట్టి.. ఆ జోకుల్లో హాస్యంతో పాటు ఆలోచింపజేసే బిట్టు మిళితమై ఉండేది. అది ‘డబ్బు భలే జబ్బు’లో షూటింగ్‌ సమయం. ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు ఎంఎస్‌ ‘‘సార్‌, చాలా ధైర్యం చేసి చెప్పాల్సొస్తోంది. మీరు ఏమీ అనుకోరు కదా?’’ అన్నాడు. ‘‘అనుకునేదేముంది? చెప్పవయ్యా?’’ అన్నాను నేను. అతనేదో పెద్ద మ్యాటరేదో చెబుతాడనుకుని తెగ ఫీలయ్యాను. ఆ వెంటనే ‘‘నా కాలు పొరపాటున మీ కాలికింద పడింది. తీసుకోవచ్చా సార్‌’’ అన్నాడు. ఆ మాట విన్న వెంటనే భళ్లున నవ్వొచ్చింది. ఇక, వేణుమాధవ్‌ చెప్పే జోకులు ఎలా ఉంటాయంటే.. అతని టేకాఫే ఏదో బద్దలైపోయేలా అనిపిస్తుంది. ‘భజంత్రీలు’ షూటింగ్‌ జరుగుతోందప్పుడు. వేణుమాధవ్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడేమో సమయం మించిపోయింది. షూటింగ్‌కు రాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఎం.ఎస్‌. నారాయణకు కోపమొచ్చి ‘‘ఫోన్‌ చేయండి. వాడికి ఇష్టమొచ్చినప్పుడు షూటింగ్‌కు రావడం అలవాటైపోయింది. అసలు ఈ రోజు వస్తాడో రాడో కనుక్కోండి’’ అని అరుస్తున్నాడు. అతని కోపం చూసి ‘‘ఉండండి నేనే వేణుకు ఫోన్‌ చేస్తాను’’ అని ఫోన్‌ కొట్టాను. ఫోన్‌ ఎత్తిన వేణు ‘‘మీకేమయ్యా మీరు ఇష్టమొచ్చినప్పుడు రమ్మంటారు. ఆ మాత్రం వెయిట్‌ చెయ్యలేరా..? నా ప్రియమైన దర్శకుడు ఎంఎస్‌ నారాయణ నాటుకోడి మాంసం కావాలని అడిగాడు. పొద్దున్నే కోడిని పట్టుకుందామనుకుంటే.. అది నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వరకు పరుగో పరుగు. ఆడికెళ్లి దాన్ని పట్టుకుని కూర వండుకుని తెస్తుంటే లేటు కాదామరి?’’ అంటూ అరిచినంత పనిచేశాడు. అంటే వాడప్పుడు నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వద్ద ఉన్నాడన్నమాట. ఆ మాట చెబితే ఎంఎ్‌సకు ఇంకెంత కోపం వస్తుందో తల్చుకుని నవ్వొచ్చింది నాకు.
వార్తల్లోని ప్రముఖుల ఫోటోలతో మీ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి.. ఫేస్‌బుక్‌, వాట్స్‌పలలో పెడుతుంటారు. వాటిని చూసి నవ్వుకుంటుంటారా?
నాకు ఇంటర్‌నెట్‌ చూసే అలవాటు లేదు. నా ఫోను కూడా స్మార్ట్‌ఫోను కాదు. ఇదిగో మీరే చూడండి. పాత శ్యామ్‌సంగ్‌ ఫోను. మాట్లాడేందుకు, వినేందుకు తప్ప దేనికీ పనికిరాదు ఇది. నెట్‌లో నా మార్ఫింగ్‌ ఫోటోలను అప్పుడప్పుడు మా పిల్లలు నాకు చూపిస్తుంటారు. ఒబామా, గఢాఫీ, మోడీల ముఖాల్లో నా ముఖం పెట్టి చక్కగా గ్రాఫిక్స్‌ చేసిన ఆ ఫోటోలను చూస్తే నాకే నవ్వొస్తుంది. ఫేస్‌బుక్‌లో వాటికి లైక్స్‌ కూడా ఎక్కువేనట! మా వాళ్లు చెబితే తెలుస్తుంది.
సినిమాల్లో బ్రహ్మానందం అందరికీ తెలుసు. మరి, ఇంట్లో బ్రహ్మానందం ఎలా ఉంటారు?
ఇంట్లో ప్రత్యేకంగా జోకులు వేసుకునే సందర్భాలు తక్కువ. అదృష్టవశాత్తూ ఇంట్లో వాళ్లందరికీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువే! సరదాగా మాట్లాడుకునే మాటలను వాళ్లందరు పాజిటివ్‌గానే తీసుకుంటారు. నవ్వుతుంటారు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నేనేమో షూటింగ్‌ ముచ్చట్లు చెబుతుంటాను. బయట జరిగే విశేషాల్ని వాళ్లు చెబుతుంటారు. నా నటన మీద పాజిటివ్‌ కామెంట్లే చేస్తుంటారు కాని.. నెగిటివ్‌ కామెంట్స్‌ చేయరు. దేన్నయినా సానుకూల దృక్ఫథంతో చూసే వాతావరణమే ఇంట్లో ఉంటుంది. కొన్ని సినిమాల్లో నేను ఓవర్‌ యాక్షన్‌ చేస్తే – అది నేను చేశానా..? సినిమా వాళ్లు చేయించారా అన్న సంగతి వాళ్లకు బాగా తెలుసు. సినిమాల్లో నవ్వులు పండించడం అనేది కేవలం కమెడియన్‌ ఒక్కడి మీదే ఆధారపడి ఉండదు.
అక్కినేని నాగేశ్వరరావు మొదలు మొన్నటి ఎంఎస్‌ నారాయణ వరకు ఎంతోమంది పాతతరం నటులు వరుసగా చనిపోతున్నారు. వీళ్లందరితో సాన్నిహిత్యమున్న మీకు ఏమనిపిస్తోంది? జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒక రోజు మరణం దగ్గర ఆగిపోవాల్సిందేనన్న కఠోర సత్యాన్ని మీరెట్లా జీర్ణించుకుంటారు?
అందరూ చెప్పినట్లు చెప్పాలంటే ‘‘వాళ్లందరు పోవడం చాలా బాధగా ఉంది. నిజంగా ఏమిటో ఈ చలనచిత్ర పరిశ్రమకు ఏదో పట్టింది. భవిష్యత్తు ఏమైపోతుందో ఏమో’’ అంటూ దీర్ఘం తీసి చెప్పాల్సొస్తుంది. ఎవరికైనా మరణం అనేది చాలా సహజమైనది. పోవడం ఉండటం అనేది మన చేతుల్లో లేనిది. అయితే ఈవాళ మనందరి మధ్య మెలిగిన మనిషి రేపు శాశ్వతంగా కనిపించకపోవడం నిజంగా బాధాకరమే! అయితే మనుషులకు మరణం అనేది శాపం అనుకుంటారు. నేను మాత్రం వరం అనే అంటాను. ఎందుకంటే ఏదో ఒక టైమ్‌లో అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోకపోతే ఈ లోకం ఏమవుతుందో ఒకసారి ఊహించండి? ఎప్పుడో ఒకసారి జీవితం బోర్‌కొట్టి వెళ్లిపోవడానికి ఛాన్స్‌ లేకపోతే?! గాడ్‌ హ్యాజ్‌ గివెన్‌ దట్‌ ఛాన్స్‌! ప్రపంచంలో విచిత్రమైన విషయం – మానవుడు అన్నిట్లో ముందుండాలని కోరుకుంటాడు ఒక్క మరణానికి తప్ప! మరణానికి మాత్రం తరువాత వస్తాను. తరువాత వస్తాను అంటుంటాడు. జీవించింది చాలు మరణానికి నేనిక సిద్ధం అని ఏ ఒక్కరు అనరు. ఇదేమీ ఫిలాసపీ కాదు. జీవనసత్యం. ఈ రెండు మూడు నెలల్లో అక్కినేని, శ్రీహరి, ధర్మవరపు, ఏవీఎస్‌, ఆహుతిప్రసాద్‌, ఎంఎస్‌ వంటి వారు మనకు దూరమవ్వడం.. పరిశ్రమకు నిజంగానే తీరని లోటు. దాన్నెవరూ కాదనలేము.
తరతరానికి వేషభాషలు, జీవనశైలి, ఆలోచనలు, అభిరుచులు మారడం సహజం. ఆ మార్పుకు తగ్గట్టు ఆయా పాత్రల్లో మీరు సులభంగా ఒదిగిపోతారు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హావభావాలను కూడా అచ్చుగుద్దినట్లు పండించగలరు. ఎలా సాధ్యం అవుతోంది?
నిత్య జీవనగమనంలో మార్పును పసిగట్టే మనస్తత్వం నటుడికి చాలా అవసరం. అది ఏ శిక్షణ సంస్థలోనో శిక్షణను ఇచ్చే అంశం కాదు. కొత్త కొత్త సమూహాలను పరిశీలించడానికని చెప్పి ప్రత్యేకించి సమయం కేటాయించను. బయటికి వెళుతున్నప్పుడే మనుషుల్ని, వారి మనస్తత్వాల్ని, భావోద్వేగాల్ని పరిశీలిస్తుంటాను అంతే! నాకు తాగుడు అలవాటు లేదు. కాని తాగుడు యాక్టింగ్‌ చేస్తాను. దీనికి ఓ ఆ ఇంగ్లీషు పుస్తకాలు చదివాను.. ఈ పుస్తకాలు చదివాను. బార్‌లకు, పబ్బులకు వెళ్లి తెగ పరిశీలించాను అని చెప్పడం హాస్యాస్పదం. ఎవరో ఒక నటుడు అన్నాడట ‘‘భారతంలో శకుని పాత్రను చేయడానికి నేను చాలా పుస్తకాలు చదివాను’’ అని. ఆ మాటలు విన్న పక్క వ్యక్తి ‘‘అన్ని పుస్తకాలు చదవడం ఎందుకు? భారతం ఒక్కటే చదివితే సరిపోతుంది కదా’’ అన్నాడట.
మీరు ఇప్పటికే రకరకాల పాత్రలను చేశారు. మీరింకా వేయాల్సిన డ్రీమ్‌రోల్స్‌ ఏవైనా ఉన్నాయా?
చాలానే ఉన్నాయి. అందులో ఒకటి – రోడ్ల మీద తిరిగే పిచ్చోని పాత్ర ఒకటి. ఆ సంగతి అలా ఉంచితే – అసలు డ్రీమ్‌రోల్స్‌ అనే ముందు నేనెన్ని పాత్రలను చేశానని చెప్పుకోవాలి..? నేను చేసింది చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. నేను చేసింది ఆఫా్ట్రల్‌ థౌజండ్‌ ఫిల్మ్స్‌. అందులోను రిపిటీషన్‌ ఉన్న పాత్రల్ని తీసేస్తే మిగిలేవి కొన్నే! మన దేశంలో నూటా ఇరవై కోట్లకు పైగానే జనాభా ఉంది. ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండడు. నా దృష్టిలో ప్రతి మనిషీ ఒక క్యారెక్టరే. ఈ లెక్కన నేను ఇంకా చేయాల్సిన క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయో మీరే లెక్క వేసుకోండి. అందుకని నేను చేసింది కొంతే! అభిమానాలు, పొగడ్తలను చూసి మంచుదుప్పటి కప్పుకోలేను. బ్రహ్మానందం లేకపోతే సినిమానే లేదు అనే టాక్‌ను కూడా నేను ఒప్పుకోను. సర్క్‌సలో ఫోకస్‌ లైటు లాంటిది నటుడి జీవితం. సర్క్‌సకు వచ్చిన వీక్షకుల మీదికి అలా ఆ లైటును తిప్పుతుంటారు. ఒకరి మీద కాసేపు, మరొకరి మీద మరికొంతసేపు పడుతుంది. నా మీద పదినిమిషాలు పడింది. అంతే!
సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, స్వర్గధామాలు ఎక్కువ. మీకు ఇష్టమైన డెస్టినేషన్స్‌ ఏమైనా ఉన్నాయా?
నాకు అలాంటివేవీ లేవు. నా ఆలోచనల తీరు ఎలా ఉంటుందంటే – మా నాన్న నిరుపేద. మా బతుకులంతా దిగువ మధ్యతరగతివి. పండగలు మా ఊళ్లోకి వస్తాయి కాని మా ఇంటికి రావు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాణ్ణి కనక.. నాకే ఆశలు లేవు. ఇప్పుడు ఆర్థికంగా అన్నీ సమకూరి ఉండవచ్చు కాని.. ఒక జీవనశైలికి అలవాటు పడిపోయిన తరువాత.. మళ్లీ ఖరీదైన ఆలోచనలు రావు. నాకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు, బతుకు భయం తెలుసు. ఈ పరిధి దాటి లగ్జరీ వైపు వెళ్లలేను. విలాసవంతమైన జీవితంలో ఉన్న మజాను తెలుసుకోవడానికి ఒక బేస్‌మెంట్‌ అంటూ ఉండాలి. అది నాకు లేదు. మొన్నామధ్య ఒక డాక్టర్‌ వద్దకు వెళితే ‘‘చిన్నప్పటి నుంచి మీకుగాని, మీ నాన్నగారికిగాని స్వీట్లు తినే అలవాటుందా?’’ అని అడిగారు. ‘‘స్వీట్లు కాదు కదా. మంచి భోజనం అడిగితేనే చితక్కొట్టేవాళ్లు. చిన్నప్పుడు అవేవీ తెలియవు నాకు’ అన్నాను. అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాణ్ణి కనక ఇలాగే ఉండిపోయాను. అయితే ఆర్టిస్ట్‌ కావడం వల్ల ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తిరిగే అవకాశం ఆయాచితంగా వచ్చింది నాకు. అది నా అదృష్టం.
పూజ ఎక్కువగా చేస్తుంటారట?
నేను ఎంతో మంది దేవుళ్లను నమ్మను. ఒకే ఒక్క దేవున్ని కొలుస్తాను. ఆ దేవునికి రూపం లేదు. ఇదివరకు మన పెద్దలు చెప్పినట్లు ‘దేవుడంటే ఒకరే – అతను నిర్వికారుడు, నిరంజనుడు’ ఈ మధ్య చాలామంది బుధవారం ఒక దేవుడని, శుక్రవారం ఇంకో దేవుడని.. గురువారం అది తినను. మంగళవారం ఇది తాగనని.. భక్తిని చాటుకుంటుంటారు. వాళ్లను చూస్తే నవ్వొస్తుంది. పాపం! ఆఖరికి దేవుణ్ణి కూడా కిచెన్‌ వరకు తీసుకొచ్చారు.
ఇంకా ఎంత కాలం నటిస్తారు? ప్రేక్షకులకు బోర్‌ కొట్టలేదు కాని.. మీకు మీరు ఎప్పుడైనా బోర్‌ కొట్టారా?
బ్రహ్మానందం కావాలి అనే డిమాండ్‌ ఉన్నంత వరకు నటిస్తుంటాను. ఇక నాకు నటన మీద ఎప్పుడూ బోర్‌ కొట్టదు. అదే నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆనందాన్ని.. బ్రహ్మానందాన్ని ఇచ్చింది.
ఇంటర్వ్యూ : నవ్య డెస్క్‌
సహకారం : చిత్రజ్యోతి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్టాలు -కన్నీళ్లు

కస్టాలు -కన్నీళ్లు

బాధలు -వ్యధలు 
ఆప్యాయతలు  -అనురాగాలు 
స్నేహాలు -చుట్టరికాలు 
జీతం- నాతం 
కధలు -కవిత్వాలు 
బాధ్యతలు -బరువులు 
ఆకలీ -దప్పులు 
గుండె చప్పుళ్ళు-గుండె కోతలు
గోదారీ జలాలు -మూసీ తీరాలు 
నచ్చటా లు -మెచ్చటాలు  
ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు  
ఆపేక్షలు – ఆత్మీయతలు 
చిత్రాలు -జీవిత విచిత్రాలు 
ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు  
ప్రైజులు -పారితోషికాలు 
కుందుర్తి ,శ్రీవాత్సవలు -శివారెడ్డి  గోపాల చక్రవర్తులు    
మేనమామలు -పెద నాన్నలు 
ఊపిరి తిత్తులు తొలిచే పురుగులు -ఊరడించే సింగులు 
క్రిష్ణాపత్రికలు -సమాచార శాఖలూ 
అహంభావం తో కొట్టిన దెబ్బలు -మర్యాదగా తిరస్కరించిన తీరులూ 
ఉత్తరాలు -పరిచయాలు 
ఉత్తర పరిచయం తో -చేరువైన ఇల్లాలు 
ఇవన్నీ పడుగూ -పేకల్లా  
అల్లిన మీ జీవితం -ఒక చిక్కని గీతం 
వచన సంగీతం -కవిత్వ వచనం 
ప్రతి పదం లోపలి పొరలు చీల్చుకోచ్చినదే 
ప్రతిభావం నవ పరిమళ భరితమే 
చిత్రానికి సంగీతం అద్ది -కవిత్వానికి చిత్ర సొగసులు కూర్చి 
మీ జీవితాన్ని -జీవన గమనాన్ని 
ఆవిష్కరించిన తీరు -అమోఘం అత్యద్భుతం 
వీర్రాజు గారూ -అక్ష రాలను శోభావిలసిత శిల్పాలుగా 
చెక్కిన మీ ఓర్పూ -నేర్పూ నాన్యతో దర్శనం అనిపించింది 
అదొక ప్రవాహం -సుడిగుండం 
శక్తి జలపాతం -సంగమ క్షేత్రం 
భేషజం లేని -నిరాడంబర ఉత్కృష్ట  గమనం 
నిసర్గ రమణీ యానికి  నిలువెత్తు  దర్పణ మే  
శ్రీ వీర్రాజుదంపతులకు  నమస్కారాలు  మూడు నెలల క్రితం పరిచయమైనా మీరు ఆప్యాయం గా నాకు అందజేసిన ”పడుగు పెకల మధ్య జీవితం ” పుస్తకం నిన్నా ఇవాళ చదివే అవకాశం కలిగింది దాదాపుగా నాన్ స్టాప్ గా చదివా  ముగ్దుడిని  చేసింది . ఉండ బట్ట  లేక చేతకాని కవిత్వం షో కులకు  పోయి పైన ఏదో గిలికాను . నిజం చెప్పాలంటే మాటలు చాలవు చదివి అనుభవించాల్సిందే
ఇద్దరి ఆరోగ్యాలు బాగా ఉన్నాయని తలుస్తూ -దుర్గాప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

శాత పత్ర సుందరుడు రజనికి శత వర్శోత్సవం (100 ఏళ్ళు )

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

vuyyuru veeramma tirunaallu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్‌ సిస్టర్స్‌-, prajvala ,prayusha ,pravallika

మ్యూజిక్‌ సిస్టర్స్‌

‘‘సుస్వరాల సంగీత సాధనే మాకు ప్రభుత్వోద్యోగాన్ని లేదా జీవనభృతిని తప్పక కల్పిస్తుందని ఎంతో
నమ్మకంగా’’ చెప్తారు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ సోదరీమణులకి
సంగీతమే ప్రాణం. వీరిలో ఒకరు వీణ, కీబోర్డుల్లో నిష్ణాతురాలు కాగా మిగతా ఇద్దరు వయొలిన్‌, హార్మోనియంల్లో నైపుణ్యం సాధించారు. ప్రజ్వల, ప్రత్యూష, ప్రవళ్లిక అనే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు గాత్ర సాధన కూడా చేస్తారు. సంగీతంలో రాణిస్తున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గురించి…
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కపాటిపాళెంకు చెందిన కమతం ప్రకాష్‌కు ముగ్గురు కూతుర్లు. ప్రజ్వల ఆఖరి అమ్మాయి. బాల్యం నుంచీ ఈ అమ్మాయికి సంగీతమంటే ప్రాణం. దాంతో టీవీ, రేడియోల్లో వచ్చే సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించేది. వాళ్ల ఇంటి పక్కన ఉండే జాన్‌ అనే కీబోర్డు ప్లేయర్‌ దగ్గర కీబోర్డులో మెళకువలు నేర్చుకుంది. ‘‘ఆయన వద్ద రెండేళ్లలోనే కీబోర్డు ప్లే చేయడం బాగా నేర్చుకోగలిగాను. ఆ తరువాత వీణ వాయించడంలో మాదేష్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందాను. ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెతోనే సాధన చేసేదాన్ని. మా ఇంట్లో ఉన్న హార్మోనియంకు సుమారు వందేళ్లు ఉంటాయి. మా కుటుంబంలో తరతరాలుగా ఈ హార్మోనియం పెట్టెమీదే సంగీత సాధన చేసేవారట.
నెల్లూరులోని ప్రభుత్వ సంగీత పాఠశాలలో వీణావాయిద్యంలో, గాత్రంలో సర్టిఫికెట్‌ కోర్సు చేశాను. చక్కని గాత్రం కూడా ఉండడంతో పాఠశాల స్థాయి నుంచే పలు కార్యక్రమాల్లో పాడేదాన్ని. వీణ, హార్మోనియం వాయించేదాన్ని. నేను సంగీతంలో రాణించడం చూసిన ఇద్దరు అక్కలు ప్రత్యూష, ప్రవళ్లికలు కూడా నా బాటలోకి వచ్చారు. ప్రత్యూష బీటెక్‌ పూర్తి చేసింది. ప్రవళ్లిక బిబిఎ చదువుతూనే సంగీతంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ కోర్సు చేసింది.
గిన్నిస్‌బుక్‌ ఎక్కాం
హైదరాబాద్‌లో సిలికాన్‌ ఆంధ్రా వారు 2009లో నిర్వహించిన త్యాగరాయ లక్ష గళార్చన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి మేం ముగ్గురం ఎంపికయ్యాం. లక్షా అరవై వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే గిన్నిస్‌ రికార్డు అందుకున్నాం. అదే సంవత్సరం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి ‘బహురూప’ అనే కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకున్నాం. అప్పటి నుండి మా జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కచేరీలు చేయడం మొదలుపెట్టాం. 2009లోనే నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి యువజన పోటీల్లో పాల్గొని వీణా వాయిద్యంలో మొదటి స్థానం సాధించాం. కర్ణాటక మైసూరు రాజావారి ఇంట్లో ఉన్న పురాతన వీణను మంచి విద్వాంసులకు అందజేస్తామని వారు ప్రకటించినప్పుడు అక్కడికి వెళ్లి ఆ వీణ వాయించాను. నా ప్రతిభను మెచ్చి ఆ వీణనే నాకు బహుమతిగా ఇచ్చారు. 150 సంవత్సరాల క్రితానిదా వీణ’’ అని వివరించింది ప్రజ్వల.
ఫ కె.గయాజుద్దీన్‌, నెల్లూరు.
ఫోటోలు: అశోకుడు
సంగీతానికి ‘కమతం’
వీణ, హార్మోనియం, వయొలిన్‌ వంటి వాయిద్యాలను వాయించడం యువతీ యువకులకు నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ల ఇంటిపేరు కమతం పేరుతో ఇంట్లోనే సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇదేకాకుండా కోవూరులో కూడా సంగీత పాఠశాలను స్థాపించారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. నారాయణ వైద్య కళాశాలకు చెందిన ప్రముఖ వైద్యులు కూడా ప్రజల్వ దగ్గర వీణ, హార్మోనియం నేర్చుకుంటుండడం విశేషం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జయంతి నటరాజన్ జంప్ -జయప్రద కూడా –


 
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -3

వాగ్నర్ ‘’ఆర్ట్ వర్క్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’,’’ఆర్ట్ అండ్ రివల్యూషన్ ‘’ఓపెరా అండ్ డ్రామా ‘’లను ‘’జూడాయిజం ఇన్ మూజిక్ ‘’తో పాటు రాశాడు .మొదటి దానిలో తన గొప్పతనాన్ని డబ్బా కొట్టుకొంటే రెండో దానిలో తన జీవిత దుఖాన్ని ఆరబోసుకొన్నాడు .క్రమంగా ధోరణిమార్చి ఎక్కువమంది ఇస్టపడేదాన్ని చేతిలో రూపాయి పడేదాన్ని ఎంచుకొని రాయసాగాడు .1848-53మధ్య కాలం అతని వదిలేసిన కాలం వృధాగా నే గడిచిపోయిందని విమర్శకులు భావించారు .కాని ఆకాలం లో ఖాళీ గా ఏమీలేడు. లవ్ అఫైర్స్ లో మునిగి తేలాడు .35ఏళ్ళ వయసులో 22 ఏళ్ళ అమ్మాయిని ముగ్గులోకి దించితే  ఆమె  ధనిక భర్త ,తల్లీ వ్యతిరేకిస్తే ఆమెతో లేచిపోదామని ప్లాన్ వేసి ఆమె భర్త వాగ్నర్ ను కాల్చిపారేస్తానని భయపడితే ఆచిన్నది సాహసం చేయలేకపోతే  తనను ఆదుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నం ఒక  చిన్నపిల్ల మనస్తత్వం అనుకోని సర్దుకు పోయాడు .మనవాడిని వలచిందీ మనవాడు వలచిండదీపెళ్లి అయిన భార్యలే . భర్త ఉన్న ఇంకో ధనవంతురాలితో ప్రేమాయణం సాగించి ఆ భార్యా భర్తల వలన తన సంగీతానికి ప్రచారం తెచ్చుకొన్నాడు .

‘’మై లైఫ్ ‘’అనే పుస్తకం వాగ్నర్ రాసి తన జీవిత విశేషాలను పొందుపరచాడు .ఈ సమయం లోనే ‘’రింగ్ ‘’అనే దానికి సంగీతం కూరుస్తూ ఆ కుటుంబం తో సాన్నిహిత్యం పెరిగి ఆమెను ప్రేమించి దగ్గరయ్యాడు .దీనితో ‘’రింగ్ ‘’ను పక్కన పెట్టాడు .భార్యా పిల్లా తిరిగి వచ్చి ఇతన్ని చేరాక ఈ తాత్కాలిక ప్రేమకు తెర పడింది .వెనిస్ వెళ్లి ‘’ట్రిస్టాన్ ‘’పూర్తీ చేశాడు .భార్య డ్రెస్ డేయిన్ వెళ్లి అ భర్త కు క్షమాభిక్ష కోసం ప్రయత్నించింది .ఆరేళ్ళు కస్టపడి ట్రిస్టాన్ ను పూర్తీ చేశాడు .భార్య ప్రయత్నం ఫలించి వాగ్నర్ కు క్షమా భిక్ష లభించి జర్మనీలో ఉండే అవకాశం ఏర్పడింది

జెర్మనీ స్పిరిట్ తో ఇంకా బాగా సంగీతం లో దూసుకుపోవాలన్న కోరిక బలీయమైంది .అంకిత భావం తో పనిచేసి ‘డస్క్ ఆఫ్ దిగాడ్స్ ‘’,డై వాకీర్ ‘’ ది రైన్గోల్డ్ ‘’చేసి హిట్లు కొట్టాడు .ఇలాంటి సంగీతం అంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎక్కడా విని ఉండలేదని గొప్పగా కీర్తించారు .అందులో వేగం ధృతి ,పెద్ద ధ్వని తో ఉన్నా అద్భుతమైన శ్రావ్యత ఉండటం వాగ్నర్ సంగీతం లో ప్రత్యేకత .ఛందస్సు బంధాలు తెంచేశాడు .సంప్రదాయాన్ని దూరం చేశాడు .ఉదాత్త అనుదాతాత్తలతో తీవ్ర సంచలనమే సృష్టించాడు .చెవులకు ఇంపైన సంగీతాన్ని ఆర్కెస్ట్రా లో మాధ్యమంగా చేసుకొని సృష్టించిన ఈ సంగీతం కొత్త రికార్డు సృష్టించింది .ఏక వాద్య సంగీతం కాక సామూహికం గా ఇంతటి మాధుర్యాన్ని సృష్టించటం అనితర సాధ్యం అని అందరూ మెచ్చుకొన్నారు

‘’ది లీడింగ్ మోటివ్ ‘’లో ఆర్కెస్ట్రా తో సర్కసే చేయించాడు ‘’లీట్ మోటివ్ ‘’అనే సంగీత రూపకం ‘’is the embodiment of a person or an idea .It identifies with figure ,comment upon  action ,and explains the fluctuating emotions and state of mind.’’అని పేరుపొందింది .శ్రోత చెవులకు ఇబ్బంది కలుగ కుండా దృశ్యాలు కనుల ముందు కదిలిపో యేట్లు తీర్చాడని అదొక స౦గీత చిత్రం musical portraitఅనీ తెగ మెచ్చారు. ట్రిస్టాన్ ను పారిస్ లో ప్రదర్శిద్దామనుకొంటే ‘’తన్నాహీసర్ ‘’ను వాళ్ళు సెలెక్ట్ చేయటం ఆశ్చర్య పరచింది వాగ్నర్ని .ఇంకో ఆశ్చర్యకరమైన వార్త విన్నాడు .గ్రాండ్ ఒపేరా హౌస్ లో బాలెట్ లేకుండా ఒపేరా ప్రదర్శన ఉండదు .తానూ రాసిన దానిలో బాలద్ద్ లేదు. అందుకని దానికోసం సంగీతం తయారు చేశాడు .ఏంతో కస్టపడి కూర్చాడు .కాని పారిస్ వనితలు పెదవివిరిచారు .గోల, అల్లరి ,ఆగం తో ప్రదర్శన సాగలేదు .మూడోసారి చేసిన ప్రయత్నమూ ముందుకు వెళ్ళక నిరాశ చెందాడు .పారిస్ అంటే రోత పుట్టింది. రైన్ నదీ తీరం లో బీబ్రిచ్ లో ఉన్నాడు .

యాభై ఏళ్ళ వయసులో అపజయాలు బాధించి కలవరపెట్టాయి .స్వదేశం లో మళ్ళీ తన ప్రతిభ నిరూపించుకోవాలనుకొన్నాడు .ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్ళాడాడు ప్రబుద్ధుడు .ఇద్దరిపెళ్ళాల ముద్దుల మొగుడు .ఎవరి మీద ద్రుస్ష్టిపెట్టాలో తెలియక తబ్బిబ్బయ్యాడు .ఇంటిలోని పోరుకు దూరం అవటానికి బెర్లిన్ ,ప్రేగ్ ,మాస్కో వగైరా ప్రదేశాలలో కచేరీలతో కాలక్షేపం చేశాడు .వలచి వలపించటం ఎక్కడికెళ్ళిన మానలేదు .మళ్ళీ రుణ బాధల్లో పీకల్లోతు కూరుకుపోయాడు .దీనిలోంచి బయటపడే గొప్ప సదవకాశం వెతుక్కొంటూ వచ్చింది .మ్యూనిచ్ లో బ్రవేరియా రాజు దర్బార్ లో పందొమ్మిదేళ్ళ లుడ్విగ్ తో సమానం గా హోదా లభించింది .అక్కడొక అమ్మాయి తో ఎఫైర్ సాగించి  గుప్పుమన్నది .డబ్బు వస్తోంది గదిలో అతి విలాసమైన రగ్గులకు  కర్టెన్ లకు  .మాంచి ఖరీదైన సిల్క్ డ్రెస్ లకు   డబ్బు బోలెడు ఖర్చు చేశాడు .ఇలాంటి సిల్క్ డ్రెస్సులు  ఇరవై నాలుగు ఉండేవి .అంత ఆడంబరం ఒలక పోశాడు సంగీత గురుడు .వాగ్నర్ విలాస జేవితం సామాన్యులు ఈస డించారు .దానికి మనవాడి సమాధానం ‘’నేను అరవై వేల ఫ్రాన్కులను దుబారా గా ఖర్చు చేయటం లో గొప్ప చాకచక్యం కలవాడిని. కాని ఆ డబ్బు సంపాదించటం లో కాదు ‘’అని గొప్పలు పోయేవాడు .ఇవన్నీ చూసి కుర్ర రాజు అసహ్యిన్చుకొన్నాడు .చర్చి అధికారులూ అయిష్టత చూపారు .అతనిలోని విప్లవ భావాలకు కలత చెంది అందరూ క్రమంగా దూరమైపోయారు .అధికారులు వాగ్నర్ జీవితం ప్రమాదం లో ఉందని రాజుకు  చెప్పగావిని  లుడ్విగ్ కన్నీరు పెట్టుకొని గురువును మ్యూనిచ్  వదిలి వెళ్ళిపొమ్మని బ్రతిమిలాడాడు .అక్కడి నుండి స్విట్జెర్లాండ్ వెళ్లి రాజు ఇచ్చిన పెన్షన్ తో స్వంత ఇల్లు ఏర్పరచుకొని ఆయన ఉదారత వలన బతికి పోయాడు. ‘

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-15 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

“శ్రీ పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్ లో సాహస యాత్ర” – గబ్బిట కృష్ణ మోహన్

silk route

Silk Route lo Saahasa Yaatra00010002 0003 0004

Posted in రచనలు | Tagged | Leave a comment

30-1-15 శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో మా పూర్వ శిష్యుడు చిలుకూరి నరసింహం దంపతులు 

This gallery contains 10 photos.

More Galleries | Tagged | Leave a comment

సావిత్రి ఓ నిండుగోదారి -నాగేశ్వర రావు బుద్ధి మంతుడు అన్న శ్రీ సత్య ప్రకాష్

savitri 002anr 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలపాక ‘’జీవితం ‘’

చలపాక ‘’జీవితం ‘’

మిత్రుడు ,ఆత్మీయుడు ,నిత్య సాహిత్యోపజీవి ,కవి ,కధకుడు, విమర్శక విశ్లేషకుడు సంపాదకుడు అనేక  సత్కారా పురస్కారాలు అందుకొన్న వారు ,  నాకు ,సరసభారతికి అత్యంత సన్నిహితుడు  తలిదండ్రుల మధ్య జీవిస్తూ ఆదరాభిమానాలు పొందుతూ ఆ జననీ జనకులకు తన జీవితమాదుర్యాన్నిపంచుతున్న  శ్రీ చలపాక ప్రకాష్ ఇటీ వలే వెలువరించి ఆవిష్కరించిన  కదా సంపుటి ‘’జీవితం ‘’ను వారికి కృతజ్ఞతగా అంకితమిచ్చారు .జీవితం లోని బహుపార్శ్వాలను అందులో స్పృశించి రాసిన కధలవి .కొన్నివెయ్యి రూపాయల పారితోషికాన్ని కూడా పొంది పేరు తెచ్చుకోన్నాయి .దీనికి ముందుమాట రాసి మెచ్చి ఆశీర్వదించారు ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాంబాబు.ఈ సంపుటిని నాకు అందజేశారు ప్రకాష్ ఇప్పుడే చదివే తీరిక దొరికి చదివి నా అభిప్రాయం రాస్తున్నాను .

జీవితం ఒక నాణెం .దానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే జీవితానికి రెండు పార్శ్వాలున్నాయి. ఆ రెండు పార్శ్వాలను తరచి రాసిన 16 కధలివి .సమకాలీనతకు సన్నిహితమైనవీ కూడా .ఈ రోజు చానెళ్ళ భీభత్స ప్రసారానికి నిదర్శనం గా ‘’ప్రళయం ‘’కద రాశారు ప్రకాష్ .ఉన్నదానికంటే వెయ్యి రెట్లు భయం సృష్టించి క్షణ క్షణ నరకం చూపించి ఇక ప్రళయం ముంచుకొచ్చి ఈ ప్రపంచం ఉండదేమో అని భయం కలిగించి సొమ్ములు దన్నుకొనే చానెల్ సృష్టించిన విలయం తో ఓముసలి గుండె తనవారినందర్నీ ముంచుకొచ్చే తుఫాను కు దూరంగా పంపేసి భార్య తో ఇంట్లో ఉండి చివరి ఫ్లాష్  బ్రేకింగ్ న్యూస్ విని గుండె ఆగి చనిపోయిన ముసలాయన కధే .అద్భుతం గా ఉంది .ప్రసార మాధ్యమాల వికృత చేష్టలకు ఇది దర్పణం .రెందోకద ఇలాంటి బలిదానమే. ప్రభుత్వోద్యోగి సమైక్య ఉద్యమం లో పాల్గొని తిండీ తిప్పలూ లేకుండా తిరిగి అరిచి అలసిపోయి గుండె ఆగి ప్రాణాలుకోల్పోతే ‘’సమైక్యత కోసం అసువులు బాసిన అమరజీవి ‘’అని ముద్ర వేసి ఉద్యమా గ్నికి సమిధగా వాడుకోవటం .  మూడోకద’’ 3 జి మహిమ ‘’ సారాంశం  ప్రకాష్ మాటల్లోనే ఆధునిక టెక్నాలజీని మనిషి తన అవసరాలకు అనుగుణం గా ఎలా మలుచుకొంతటున్నాడో ,అంతకంటే వేగం గా అనవసర విశ్రు౦ఖలతల కు బానిస అవుతున్నాడు ‘’.సెల్, వీడియో ఫోన్ ఇంటర్ నెట్ లు ప్రదర్శించే అశ్లీలతపై అవి చూపే వ్యామోహం పై చాచికోట్టిన దెబ్బ .అలాగే ‘’బుల్లితెర ‘’భూతానికి  అతుక్కొనిపోయి  జీవిత మాధుర్యాన్ని మరచి జీవితాన్ని నరకం చేసుకొనే వారి కద’బుల్లితెర ‘’.

స్వతహాగా స్వర్నకారుడైన చలపాక కే .డి .య౦ .కిటుకును బయటపెట్టాడు .అది బంగారు వస్తువుల జాయింట్లకు వాడే ‘’అతుకు ‘’మాత్రమె ‘’నని నిజం చెప్పాడు   .కార్పోరేట్ జ్యూయలరీ మాయా జాలాన్ని గురించి తెలుసుకోక మైకం లో పడిపోయే వారి గురించి చెప్పిన కద’’గుర్తింపు .‘’స్వర్నకారుడి పని తనాన్ని గుర్తించాలని వారిలో డిజైన్ చేసి అద్భుతాలు సృష్టించే డిజైనర్  నైపుణ్యాన్ని మెచ్చుకొని వారికి ప్రోత్సాహకాలివ్వాలని సూచించారు . బంగారు పని చేస్తున్నానని  తాను  చెబితే తానేదో అంటరానివాడిని అన్నట్లు చూసే లోక జనాలే అంటరాని వారన్న ఫీలింగ్ కలిగిస్తాడు .కష్టాల్లో ఉన్న వారిని చూసి చేతనైనంత సహాయం చేయాలని అది ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రివార్డులకోసం కాదని కనీస మానవ ధర్మమమని   తెలియ జెబుతూ రాసిన కద ‘’అభినందన ‘’.బలవంతపు బందులు నాయకుల దండాలు ,పీడించే  వసూళ్లు ఒక  బక్క స్వర్ణకార ప్రాణి ఆచారి జీవితాన్ని ఎలా బలి తీసుకోన్నదో చెప్పిన కద ‘’శిక్ష ‘’ వ్యవస్తలో ఎదురుతిరిగే అవకాశం లేని వారికి పడే శిక్ష మరణమే .అదిప్రమద వశాత్తో అయినా సరే కావాలనుకోన్నదో .ఈ శిక్ష ఎవరికి తనకా ?తనపై ఆధార పడ్డ  కుటుంబానికా?ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న  గా మిగిలే పోయింది ,పోతూనే ఉంటుంది .ఈ ఏడు కధలు ‘’జీవితానికి ఒక వైపు’’లోవి .అదీ విషాదం వైపువి .

‘’జీవితానికి మరోవైపు ‘’లోసరదా గా రాసిన  తొమ్మిది కధలున్నాయి .ఇందులోనూ మొదటికద ‘’టి వి రిపోర్టర్ ల అతి కి ప్రతిబింబం ‘’గోరంత –కొండంత ‘’.ఒకమ్మాయి ఆయాసపడుతూ టాంక్  బండ్ పై  పరుగెత్తుతూ ఉంటె వెనకో కుర్రోడు సీసా లో ఏదో ద్రవం పట్టుకొని ఆమె వెంట బడతాడు .ఇంకేముంది చానేల్ వాళ్ళు కెమెరా పెట్టేసి స్టూడియో నుంచి రిపోర్టర్ ను  ప్రశ్నలమీద ప్రశ్న సంధించటం వాడు సుళ్ళు తిరుగుతూ చొంగ కార్చుకొంటూ అదేదో రేప్ సీన్ గా ,లేక యాసిడ్ దాడిగా తన వాక్ ప్రవాహం తో కధలూ గాధలూ చెబుతూ ప్రేక్షకుల్ని టివిలకు కట్టి పడేయ్యటం –చివరికి ఆ కుర్రాడు మార్కెట్లో కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్ ప్రేయసికోసం తెచ్చాడని ఆమెకొత్తడాన్ని టేస్టు చేయ్యటం ఇష్టం లేక పరిగెత్తుతోన్దని బలవంటంగా పట్టుకొని ఆమె నోట్లో దాన్ని పోసి ఆమె ఇష్టం గా తాగుతుంటే ఆనందం అనుభవించారని తెలిసి రిపోర్టర్ తో సహా అందరూ నోరెళ్ళ బెట్టాడమే ఇందులో తమాషా .కధ ,కధనం బాగా సాగాయి  .ఆద్యంతం రక్తికట్టి హుషారిచ్చింది  మరొకద ‘’భలే వ్యాపారం ‘’లో మినరల్ వాటర్ ఫాన్సీ పై చమక్కు .ఇపుడు అందరూ దాని వ్యామోహం లో పడిపోయారని వీధి కొళాయిల దగ్గర ‘’పానీ పట్టు ‘’యుద్ధాలు లేవని హాయిగా బిందెల నిండా నీళ్ళు దొరుకుతున్నాయని సరదాగా చెప్పిన కద.

దేవుడినే బోల్తా కొట్టించిన ఆనంద రావు కద.తర్వాతిది .డిష్ యాన్తీనా కింద కూర్చుని గడ్డాలు మీసాలు పెరిగి నేలకు తాకే దాకా తపస్సు చేసి దేవుడిని ప్రత్యక్షం చేసుకొని ‘’ధనకనక వస్తువాహనాలు తప్ప ఏదైనా కోరుకో ‘’అంటే ఏమీ అక్కర్లేదు ‘’నేను కాలం వెనక్కి వెళ్ళేట్లు చేయి స్వామీ ‘’అనికోరి వరం పొంది 1983  కంటే వెనక్కి వెళ్లి భార్య సంతృప్తికోసం బస్తాడు బంగారం అతి తక్కువ ధరలో కొని వీపు మీద మోసుకొచ్చాడు అతి తెలివి ఆనంద రావు. మనిషి పన్నిన ఉచ్చులో దేవుడు పడి గిలగిల లాడి  ఆనండుడితో నవ్వుతూ ‘’ఏ షరతు విధించినా దేవుడినైన నన్నే బోల్తా బురిడీ కొట్టించి మీ కోర్కెలు తీర్చుకొనే అపూర్వమైన మీ మానవ తెలివి తేటలకు జోహార్లు ‘’అన్నాడు .మంచి ఆలోచనా భలే కదా కధనం .’’డిష్ యా౦టేన్నా  తో ప్రసారాలపై ఒక చమక్కు చళుక్కు ‘’ఫామిలీ పాక్ ‘’కధ .ఇంట్లో అందరికి తలో  చానల్ కావాలి .యజమాని ముసలాయనకి మాత్రం రాత్రి 11-30 తర్వాత వచ్చే ‘’మిడ్ నైట్ మసాలా’’ కావాలి .ఇదీ రోజంతా రావాలని ఆయన ఆశ .అలాంటిది ఇంకారాలేదని వస్తే ఫస్ట్ చాన్స్ ఆయనకే ఇస్తానని డిష్ పెట్టించుకోమని ఏజెంట్ చెప్పగా ఇంతమందికి ఇన్ని చానెళ్ళు చూడటానికి అన్ని టి వి లు తానూ కొనలేనని ఆ అమాయక చక్ర వర్తి అనటం  తో నవ్వుల పువ్వులే పూస్తాయి

భార్య కొత్తకారు మీద మోజు  ‘’నానో కారు ‘’తో తీర్చిన భర్త  వచ్చిన కొత్తలోనే హెడ్ లైట్లు క్రికెట్ బంతికి కృష్ణార్పణం .కొడుకు కోపానికి అద్దాలు ధ్వంసం .రిపైర్లకు చాలని డబ్బు .పక్కింటి వారి పెళ్ళికొడుకు ఊరేగింపుకు కారు  ఇచ్చి అది కరెంట్ స్తంభాన్ని ముద్దేట్టుకొని ముక్కలవటం  .మనకు నవ్వుతో కడుపు చేక్కలవటం ‘’సంతోషానికి తాళం ‘’కదలో విషయం .సినీ హీరో సినిమా రిలీజ్ అయినా పుట్టిన రోజు జరిగినా అభిషేకాలే కాక ఇప్పుడు ‘పాలాభి షెకాలు ‘’చేసి ఆయన పాపాలు కడిగేస్తున్నారు .దీనితో ఎంతడబ్బు వృధానో ఎన్నిపాలు నేలపాలో అనే సామాజిక స్పృహ లోపించటం గురించి రాసి ‘’మంచి దొంగ ‘’కధలో ‘’అన్న ‘’అభిషేకానికి తెచ్చిన పాల కాన్ లను తెలీకుండా వ్రుదాతత్వాన్ని చూడలేక దొంగలించి అనాధ శరణాలయానికి తీసుకు వెళ్లి ‘’ఆ అన్న’’పేరిట ఉచితంగా పంచిన  వాడి కద.

దేవుడిని వరం అడిగితె ఏమిస్తాడు ఎవోపాతకాలపు సరుకు తప్ప అని భావించి ఒక ఆధునికుడు’’ బుడ్డా రావు  ‘’సైంటిస్ట్ కోసం తపస్సు చేసి మెప్పించి ముందు గ్రామఫోన్ తర్వాత  రేడియో టి వి ,కలర్ టివి ప్లాస్మా ఎల్సిడి  కంప్యూటర్ లాప్టాప్ వగైరాలు సృష్టింప జేసుకొని అవేవీ చాలక చివరికి సెల్ ఫోన్ అందులోనే ఇంటర్నెట్ తో సహా చేయించుకొని వీటన్నిటిని ఉపయోగించుకొనే సమయం చాలక వాటి ఆపరేషన్ కోసం  మరమనిషి రోబోను  కూడా సృష్టించి ఇచ్చాడు సైంటిస్ట్ .చివరకు  రచయిత ‘’అప్పటి వరకు ఉన్న ‘’మనిషి ‘’మాయమై రోబోలు మిగిలాయి .ఈ విశాల ప్రపంచం లో ‘’అని ‘’మాయం ‘’కదముగిస్తాడు .విలువలన్నీ మాయం అయి కృత్రిమత మాత్రమె ప్రపంచం లో రాజ్య మేలుతోందని అంతర్ ధ్వని  .దేవుడి సృష్టికంటే మానవ సృష్టి ‘’పాలిదిలీన్ ‘’తో విజ్రుమ్భించి అవి మట్టిలో కలిసిపోక పర్యావరణ కాలుష్యాన్ని పెంచి జంతు జీవావరణానికి హాని కలిగిస్తున్నాయని హెచ్చరించే కధే ‘’తరగని ముద్ద’’.

ఒక వేసవి లో దేవేంద్రుడు మానవుడికి ప్రత్యక్షమైతే వాడు  .అయన దాహార్తి తీర్చటానికి ద్రాక్షా పైనాపిల్  మాంగో జ్యూసులిప్పించి ఐస్ చేశాడు .వాటి బహురక రుచులకు ఇంద్రుడు సంప్రీతుడై దేవలోకం లో ఉన్న అమృతం ఎప్పుడూ ఒకటే రుచి కలిగిఉంటుందని ఈరుచుల జాడ దానికి లేదని వీటిని దేవలోకం పంపి అక్కడి అమృతం అందుకోమని భక్తుడిని దేవేంద్రుడు కోరటం భక్తుడు పారిపోవటం  కొసమెరుపు .బ్రహ్మకైన కలుగు రిమ్మ తెలుగు .కాదు ఇంద్ర కైనా  దిమ్మ తిరుగు అని పించేట్లు రాసిన చివరి కద ‘’అమృతాన్ని మించిన రుచి ‘’

ఇవన్నీ చివరికద లానే అమృతాన్ని మించిన రుచిగా ఉండటం ఈ సంపుటి ప్రత్యేకత .వీటిలో కొన్ని పత్రికలలో ముద్రితాలు .మొదటి ఏడు కధల్లో జీవితం లోని విషాద పార్శ్వాన్ని  చూపిస్తే,రెండు కధలు ఎక్కువగా రాసి  చివరి తొమ్మిదిలో ఆనందపు అంచుల్ని  చుంబింప  జేశారు . అంటే జీవితం లో నీరస నిరాశల కంటే ఆనందం తృప్తీ సంతోషం ఉన్నాయని రెండుకధలు ఎక్కువగా రాశారని పించింది నాకు. శ్రీ  ప్రకాష్ ఏ రకమైన కద నైనా తన విచక్షణా దృష్టితో లోక పరిశీలనతో గోప్పగా మలచగలిగిన ‘’కదా స్వర్ణకారుడు చలపాక’’  .ఆ ప్రకా(షం )శం మురిపించి ,మై మరపిస్తుంది ..జీవితానికి ఉన్న అన్నిరకాల అర్ధాలను ఇందులో మణులుగా పొదిగారు  .అందరూ కొనిచదివి ఆనందించాల్సిన కదా సంపుటి శ్రీ చలపాక ‘’జీవితం ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -2

అప్పుల వాళ్ళను తప్పించుకోవటానికి రష్యా నుండి కుటుంబం తో పారిపోయిన వాగ్నర్ సముద్రం అల్ల కల్లోలం గా ఉండటం వలన వారం రోజుల్లో చేరాల్సిన ఓడ మూడు వారాలు పట్టింది ఇంగ్లాండ్ చేరటానికి .సముద్ర భీభత్సం ప్రక్రుతి అతనిలో అలజడి రేపి మూడ వ ఒపెరా ‘’ఫ్లైయింగ్ డచ్ మాన్ ‘’కు నేపధ్యం దొరికింది .అంతకు ముందే హీన్స్ రాసిన ‘’మేమాయిర్స్ ఆఫ్ శ్నాబెలోస్కి ‘’చదివి ఉన్నాడు. కనుక ఈ నల్లని మబ్బులతో నిండిన ఆకాశం, గర్జించే సముద్రం ఒక నేపధ్యం గా దానికి చేకూర్చాలని భావన కలిగింది .ఈ కొత్త సంఘటనల ముద్ర మనసులో గాఢమై అలజడి రేపింది .లండన్ నుంచి మధ్య ప్రాచ్యం లోని బోలోన్ చేరి అక్కడ తన రీన్జీ ని మెచ్చిన  మేయర్ బీర్ ను కలిశాడు .ఒక నెల గడిపి పారిస్ చేరాడు .చేరిన  ఊరుకోకుండా తనకు ఎక్కువ అప్పిచిన  వాడికి ‘’మీకు రుణపడి ఉండటం నాకు ఏంతో సంతోషం గా ఉంది ‘’అని ఉత్తరం గిలికి అయిదేళ్ళ తర్వాత తాను  కూర్చిన ‘’జూడాయిజం ఇన్  మూజిక్ ‘’లో అతనిని అతనితో పాటు అప్పులిచ్చిన మిగిలిన యూదుల్ని  తీవ్రం  గా దూషించాడు .

పారిస్ వచ్చాడే కాని వాగ్నర్ బతుకు పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది .నరకం అనుభవించాడు .కటిక దరిద్రాన్ని అనుభవించారు .ఈ పరిస్తితులన్నీ అతని మనో ఫలకం పై తీవ్ర మైన చెరగని ముద్రనే వేశాయి..ఒక గదిలో ఉంటె లాడ్జి వాడొచ్చి ఆక్రమించుకొని  ఇబ్బంది పెట్టటమే కాదు వాగ్నర్ భార్య మిన్నా తో  బూట్లు కూడా తుడిపించుకొని అవమానించాడు .అప్పటికే భార్య దగ్గర ఉన్నది అంతా ఊడ్చిపారేసిన వాగ్నర్ ఇంకా అడుగూ బొడుగూ ఉన్నాయేమో నని  డబ్బు కోసం పీడించి చివరికి ఆమె కట్టుబట్టలు తప్ప ఏమీ  లేకుండా చేశాడు ఈ  మహానుభావుడు  .రొట్టె కొనుక్కోవటానికీ  చేతిలో చిల్లి గవ్వ లేని నికృష్ట పరిస్తితి .పోట్టగడవాలి కనుక ఫ్రెంచ్ కవితలకు పియానో ట్యూన్లు కట్టాడు,ప్రూఫ్ రీడింగ్ లు చేశాడు  .లిబ్రేట్తో లను అనువాదం చేశాడు .చిన్న నవలలు స్కెచ్ లు వ్యాసాలూ పుస్తక సమీక్షలూ చేశాడు. చివరికి మురికి కూపం గా ఉన్న ఒక చిన్న దియేటర్ లో కోరస్ గ్రూప్ లో స్థానం పొంది పాడాడు కాని ఆర్కెస్ట్ర యజమాని వాగ్నర్ పాట సరిగ్గా పాడలేదని ,పాడటం రాదని గ్రహించి తీసేశాడని వాగ్నారే చెప్పుకొన్నాడు .ఇలా పారిస్ బులపాటం తీరింది .

తిండిలేక మాడుతూ దుర్భర ఒంటరి జీవితం గడుపుతూఉన్నా ‘’రీంజి ‘’కి సంగీతం కూరుస్తూనే ఉన్నాడు .దీని ని ప్రదర్శించటానికి డ్రెస్ దేయిన్ లోని ఒపేరా హౌస్ అంగీకరించింది .బెర్లిన్ లో హిట్ అయిన ‘’దిఫ్లైయింగ్ డచేస్ ‘’ను కూడా ప్రదర్శించే ఏర్పాటు జరిగింది .ఈ డచేస్ ప్రతి ఒపేరా హౌస్ లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .తన జీవితపు చీకటిని ప్రతిఫలింప జేశాడు .భర్తకోసం సర్వస్వాన్ని త్యాగం చేయటానికి హక్కు కోరిన స్త్రీ కద అది .ఒక విధం గా ఇది వాగ్నర్ జీవిత చరిత్రే జర్మనీ లో ఉండటానికి నోచుకోలేక పారిస్ లో కనీసం ఉండటానికి ఇల్లుకూడా లేని జీవిత పరిస్తితి .మూడేళ్ళ ఈ దీన హీన నికృష్ట దుర్భర జీవితానికి తెరపడి ఆశా సూర్యోదయం అయింది .జీవితం లోచీకటి పోయి  వెలుగు రేఖలు ప్రసరించటం ప్రారంభ మైంది .

అప్పు చేసి ప్రయాణం టికెట్లు కొనుక్కొని రీంజి ప్రదర్శన కోసం డ్రెస్ డేయిన్ వెళ్ళాడు .ప్రదర్శన విపరీతమైన విజయాన్ని సాధించి బీద వాడిని భాగ్య వంతుడిని చేసింది .డచేస్ కూడా ప్రదర్శింపబడి ఆదాయాన్ని పెంచింది .ముప్ఫై రెండేళ్ళు నిరాశలో లో మగ్గిన వాడికి ముప్ఫై మూడవ ఏట అదృష్టం తలుపు తట్టింది .’’రాయల్ కండక్టర్ ‘’ఉద్యోగం వరించింది .హాయిగా కాలు కదల్చకుండా  కూర్చునే ఉద్యోగం గౌరవం. కాని మనవాడికి సంతృప్తి తక్కువ .ఆరేళ్ళు ఇక్కడే గడిపాడు . రొటీన్ గా రోజూ రిహార్సేల్స్ ,ప్రదర్శనలతో బోర్ కొట్టింది గురుడికి .సమకాలీన సంగీత కర్తలు మెండేల్సాన్,షూమన్ లతో పెద్దగా పరిచయం పెట్టుకోలేదు కారణం వారిని తనకు పోటీదార్లుగా భావిం చటమే .జీతం బాగానే ముడుతోంది కాని విలాసాలకు మరిగి వచ్చింది చాలటం లేదు .మళ్ళీ అప్పుల ఊబిలో నిలువునా కూరుకు పోయాడు .’’జేసేస్ ఆఫ్ నజారేత్ ‘’,ఫ్రెడరిక్ బార్బరోసా ‘’అనే రెందు సంగీతనాటకాలకు సంగీతం చేయాలనుకొన్నాడు కాని రెండిటినీ  వదిలేశాడు  ,చివరికి డ్రెస్ డేయిన్ లో ‘’ట్రాన్స్ హేజర్ ‘’కు  తర్వాత ‘’లోహేన్గ్రిన్ ‘’ లకు మాత్రం సంగీతం చేశాడు.ఇటాలియన్ శైలి ఒపెరాను ‘’దుస్తుల్లో  కచేరి  ‘’-concert in costume ‘’అని గేలి చేసేవాడు .

వాగ్నర్  కూర్చే సంగీతం లో సంగీతం సాహిత్యం ,నటన పూర్తిగా కలిసి పోయి ఉండేవి .అతనిలోని నాటకకవి పురి విప్పి నాట్యం చేసేవాడు .అతని ఊహ అత్యద్భుతం .అతని పాత్రలు రక్తమాంసాలతో సజీవం గా ఉంటాయి .ఆ కాలం లో వాగ్నర్ తన’’ లోహెన్ గ్రిన్ ‘’లో శక్తి యుక్తులన్నీ విజ్రుమ్భి౦భి౦ప జేసి  ఉన్నత శిఖరం చేరాడు ని విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు .అది వాగ్నర్ యుగం అన్నారు .ప్రశాంత మైన కాలం అని కితాబిచ్చారు . యెంత గొప్ప పేరు వచ్చిందో అంతే గొప్పగాడ్రెస్ డేయిన్ లో ‘’అప్పుల డ్రెయిన్’’ లో  దిగిపోయాడు .డ్రెస్ డేయిన్ ఆర్కెస్ట్రాలో తీవ్రమైన మార్పులు చేయాలని సూచించేవాడు కాని .ఎవరూ పట్టించుకో లేదు .సంస్కరణ చేద్దామంటే ఒప్పుకోక పోయే సరికి తిరుగుబాటు దారుడిగా అవతారం ఎత్తాడు వాగ్నర్ .రష్యా అరాజక వాది అంటే అనార్కిస్ట్ అయిన బకూనిన్ తో కలిసి ‘’సీగ్ ఫ్రీడ్స్ డెత్ ‘’అనే మహాకావ్య కధను తీసుకొని సంగీతం కూర్చాడు .అరిస్టాక్రసి కి వ్యతిరేకం గా సాగే కధగా తీర్చాడు .1849లో దేశం లో అశాంతి నెలకొని ప్రజలు తిరుగుబాటు చేశారు .వీదులన్నితికి బారికేడ్స్ పెట్టి  సైన్యం పహరాకాసింది.తిరుగుబాటు దారులపై సైన్యం తుపాకీ గుళ్ళ వర్షం కురిపించింది .వాగ్నర్ విప్లవవాదుల పక్షం లో చేరి పాల్గొన్నాడు ..తిరుగుబాటును సైన్యం అణచేసి నాయకులను అరెస్ట్ చేసింది .వాగ్నర్ ఒక’’ కోచ్ వాలా’’ వేషం లో వీమర్ కు పారిపోయాడు .అక్కడ ఫ్రాంజ్ లిజ్ అనే తన’’ట్రాన్స్ హేజర్ ‘’ను ప్రదర్శంచిన  అతని దగ్గర శరణార్ధిగా ఉందామనుకొన్నాడు .ఆయన ఒప్పుకోలేదు .జర్మనీలో ఎక్కడా ఉండటానికి నీడ దొరక లేదు .అతన్ని అరెస్ట్ చేయటానికి పోలీస్ వారంట్ సిద్ధం గా ఉంది .లీజ్  చూపిన ఔదార్యం తో ఎవరికీ తెలియకుండా జూరిచ్ చేరి  భార్య మిన్నాను కలుసుకొన్నాడు .ఇక్కడే పదేళ్ళు ప్రవాస జీవితం గడిపాడు ఆ సంగీత కర్త వాగ్నర్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమాధి లోంచి ఘోషిస్తున్న గాంధి -లవణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్ణం – కులం శ్రీ అరవింద రావు

వర్ణం – కులం

శ్రీకృష్ణుడు,
కుచేలుడు స్నేహితులనీ, వారిద్దరూ సాందీపని అనే గురువు వద్ద వేదాల్ని చదువుకున్నారనీ మనకు తెలుసు. కృష్ణుడు యాదవుడు కదా! మరి ఈనాటి యాదవులు వేదమెందుకు చదవడం లేదు? తమకు తామే శూద్రులని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మన మెదడుకు రాకపోవచ్చు. దీనికి సమాధానం ద్విజుడు అనే పదానికి అర్థం గమనిస్తే తెలుస్తుంది.

ద్విజుడంటే ఎవరు?
బ్రాహ్మణుడని మనం అనుకుంటాం. కాని అది సరికాదు. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే మూడు వర్ణాలు కూడా. ఈ మూడు వర్ణాలవారూ వేదాల్ని చదివేవారు. ‘జన్మనా జాయతే శూద్రః’ అన్నట్లు పుట్టుకతో అందరూ శూద్రులే. ఉపనయనం అనే కర్మ వల్ల ‘కర్మణా జాయతే ద్విజః’ అన్నట్టు ద్విజులుగా మారేవారు. వేదంలో చెప్పిన అన్ని విషయాలపై వీరికి అధికారం ఉంది. ఇక్కడ మళ్ళీ వైశ్యుడు అనే పదానికి ఉన్న అర్థం చాలా ముఖ్యం. ‘కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం(గీత 18-44)’ అని దీని నిర్వచనం. అంటే సేద్యం చేయడం. పశువుల్ని కాయడం. అన్ని విధాల వ్యాపారాలు వైశ్యుడు అనే పదంలోకి వస్తాయి. అందువల్లే నిన్న మొన్నటివరకూ పల్లెల్లో పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు మొదలైన వాళ్లందరూ జందాలు వేసుకుని నియమ నిష్ఠలతో ఉండేవారు. ఇటీవలి కాలం వరకూ చాలామంది భారతం, భాగవతం మొదలైనవి బాగా చదువుకునేవారు. అలాగే క్షత్రియులు కాకుండా రాజ్యాలు పాలించిన మిగతా కులాలవారు బ్రాహ్మణులతో సమానంగా అన్ని శాసా్త్రలూ చదివారు. పుస్తకాలు రాశారు. ఈ వర్గాలవారు తమని తాము శూద్రులని అనుకుంటున్నారు కానీ వీరందరూ ద్విజులు అనే వర్ణంలో భాగమే.

నాలుగు వర్ణాలను తాను సృష్టించానని గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం మనకు తెలుసు. గుణాన్ని బట్టి, అంటే వ్యక్తి యొక్క స్వభావసిద్ధమైన ప్రవర్తనను బట్టి ఈ విభజన అని ఆయన చెప్పాడు. కేవలం గీతలోనే కాక భారతంలో పలుచోట్ల వర్ణం ప్రస్తావన ఉంది. ఇప్పుడు సైకాలజీలో ఎలాగ పర్సనాలిటీ టైప్స్‌ అంటూ విశ్లేషిస్తున్నారో అలాగే పూర్వీకులు మనిషి స్వభావాన్ని నాలుగు విధాలుగా గమనించారు. క్షమాగుణం, అహింస, సత్యము, సంతుష్టి విద్య పట్ల ఆసక్తి, తపస్సు మొదలైన గుణాల్ని సత్త్వ గుణమన్నారు. శౌర్యము, ఇతరుల్ని శాసించే స్వభావం, అధికారం పట్ల, ధనం పట్ల కోరిక మొదలైన వాటిని రజో గుణమన్నారు. సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేకపోవడం, సోమరితనం, పట్టుదల, స్ఫూర్తి లేకపోవడం మొదలైన వాటిని తామస గుణమన్నారు. ప్రకృతిలో అన్ని జంతువుల్లోనూ, పదార్థాల్లోనూ, మనుషుల్లోనూ ఈ గుణాలున్నాయని గమనించారు. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలూ వివిధ నిష్పత్తులలో కలవడం వల్ల నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయని చెప్పారు. సత్త్వగుణం ముఖ్యంగా ఉంటే బ్రాహ్మణ వర్ణమనీ, రజో గుణంలోని శౌర్యము, శాసించే స్వభావం అధిక పాళ్లలో ఉంటే క్షత్రియ వర్ణమనీ, రజోగుణంలోనే ధనం పట్ల కోరిక ఎక్కువగా ఉంటే వైశ్యస్వభావమనీ, స్వయం స్ఫూర్తి తక్కువగా ఉంటే శూద్రస్వభావమనీ విభాగం చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది. పుట్టిన ప్రతి మనిషి వర్ణాన్ని ఎలా నిర్ణయించాలి? ఏదో ఒక లేబొరేటరీలో పరీక్షించి అతని స్వభావాన్ని కొంతకాలం గమనించి ఫలానా వర్ణమనీ నిర్ణయించే ప్రక్రియ ఉంటే తప్ప పేచీ వస్తుంది. తండ్రి సత్త్వగుణం కలవాడు కావచ్చు. కానీ అతని పిల్లలకు ఆ స్వభావం లేకపోవచ్చు. ఈ ప్రశ్న ఈనాడు మనమెంత తీవ్రంగా వేస్తున్నామో మహాభారతంలో కూడా అంతే ఉద్వేగంగా చర్చించారు. మనందరికీ తెలిసిన యక్షప్రశ్నలు, నహుష ప్రశ్నలు, ధర్మవ్యాధుని కథలలో ఎవరు బ్రాహ్మణుడు అన్నది ఒక ముఖ్య ప్రశ్న. వేదవ్యాసుడు నిర్మొహమాటంగా ఫలానా గుణాలున్న వాడే బ్రాహ్మణుడు, అవి లేనివాడు కాడు అని అనేకచోట్ల చెప్పాడు. భారతం మొత్తానికి సంస్కృతంలో వ్యాఖ్య వ్రాసిన నీలకంఠ పండితుడు మొదలైనవాళ్లు కూడా గుణాలకే ప్రాధాన్యమిస్తూ ఆయా గుణాలున్న వాణ్ణే బ్రాహ్మణుడనాలి, అవి లేనివాడు శూద్రుడే అని చెప్పారు. ఒక వర్ణాన్ని నిర్వచిస్తూ ఏ గుణాలు చెప్పారో అవి ఎవరిలో ఉన్నా, ఏ జాతిలో పుట్టినా అతన్ని ఆ వర్ణం వాడిగా గుర్తించాలి అని సూటిగా చెప్పారు. భాగవతంలోని 11వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని వ్యాసుడు మళ్ళీ చెప్పాడు. బ్రాహ్మణుల్లోని తపోబలం సన్నగిల్లినవాళ్లు, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవాళ్ళు, క్షత్రియులుగా మారారనీ, మరికొందరు సేవాస్వభావం కలవారు శూద్రులుగా మారారనీ శాంతిపర్వం 188వ అధ్యాయం చెబుతుంది.
వేదాల్ని గమనించినా ఇలాంటి స్పష్ట అభిప్రాయమే కనిపిస్తుంది. శుక్లయజుర్వేదానికి చెందిన బృహదారణ్యక ఉపనిషత్తు (1411) లో ఇలా చెప్పారు- సృష్టిలో మొదట అందరూ బ్రాహ్మణులే. అది సమాజం అవసరాల్ని తీర్చలేకపోవడం వల్ల క్షత్రియవర్ణం అనేది ఏర్పడింది. అంటే ఇతరుల దాడుల్ని ఎదుర్కోవడం అవసరమైంది. పై రెండు కూడా సమాజాన్ని పూర్తిగా నిర్మించలేకపోయాయి. కాబట్టి వైశ్య అనే వర్ణం ఏర్పడింది. అంటే సంపదను సృష్టించే విభాగం ఒకటి ఉండాలి. పై మూడూ ఉన్నా వ్యవస్థ పూర్తి కాకపోవడం వల్ల శూద్ర అనే వర్ణం వచ్చింది. దీన్ని ఉపనిషత్తులో ‘పూష’ అన్నారు. అంటే అన్ని ప్రాణాలను పోషించేది అని దీని అర్థం. మనం ఈనాడు రైతును అన్నదాత అన్నట్లు.
పై చెప్పిన విధంగా వ్యక్తిని పరీక్షించడానికి ఎలాంటి లేబొరేటరీ వ్యవస్థ చేయలేం కాబట్టి ఆయా వర్ణాలవారు క్రమక్రమంగా తమ తండ్రి తాతలకు సంబంధించిన పనుల్నే కొనసాగించడ వల్ల వర్ణవ్యవస్థ కాస్తా కులవ్యవస్థగా మారింది. ప్రాచీన సమాజమంతా గ్రామీణ సమాజం. ప్రతి గ్రామం ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి గలదిగా ఉండేది. గుడ్డలు నేయడానికొకరు, వ్యవసాయ పనిముట్లు చేసేవారొకరు, బంగారు పనిచేసే వారొకరు ఇలా ఆయా వృత్తులు చేసే వాళ్లు తమ పిల్లలకు ఆ వృత్తుల్లోని మెళకువల్ని నేర్పడం వల్ల అలాంటి వాళ్లందరూ ఒక కులంగానే ఏర్పడ్డారు. పక్క గ్రామంలోని వ్యక్తికి అమ్మాయిని ఇవ్వాలన్నా ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తికే ఇచ్చారు. ఇలాగ కులవ్యవస్థ ఏర్పడింది. ఇలా ఉన్నప్పటికీ వారు ఆయా కులాలకే పరిమితం కాలేదు. క్షత్రియులే కాకుండా యుద్ధాలు చేసి రాజ్యాలని స్థాపించిన అనేక కులాల్ని మనం చరిత్రలో చూడగలం. అందుకే కులాలెన్ని ఉన్నా సమాజంలో సమస్యలు రాలేదు. పండుగల్లో, ఉత్సవాల్లో అందరూ అవసరమే, అందరూ భాగస్వాములే.
బ్రిటీష్‌ కాలం వరకూ పై వ్యవస్థ సమాజ భద్రతకు సమస్య కాలేదు. విభజించి పాలించే సిద్ధాంతం, మతమార్పిడి అనే లక్ష్యంతో బ్రిటీష్‌ వారు మన సమాజాన్ని ఎన్ని విభాగాలుగా చేయవచ్చు అని పరిశీలించి మొదటిసారిగా కులాలన్నింటినీ లెక్కించి ఐదారు వేలల్లో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కొన్ని వర్గాలలో తాము అణగదొక్కబడిన వారమనే భావన(ఠిజీఛ్టిజీఝ ఝ్ఛుఽ్ట్చజూజ్టీడ)ని తీవ్రంగా సృష్టించారు. మన చరిత్రలో ఉన్న మంచిని దాచడం, చెడును మాత్రం పెద్దగా చేసి చూపడం వల్ల మన సంస్కృతిపై ద్వేషం కలిగించడమే వీరి ఉద్దేశం.
సమాజంలో మార్పును గుర్తించి మన మత గురువులు చాలామంది సమాజంలోని మార్పుకనుగుణంగా స్మృతుల్ని సవరించి వ్రాయాలని సూచించారు. ఇటీవలే సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆలోచన ప్రకారం మహామహోపాధ్యాయ, పద్మశ్రీ బిరుదు పొందిన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వ్రాసిన ‘కౌండిన్యస్మృతి’ అనే పుస్తకం ఇందుకు ఉదాహరణ. ఈ పుస్తకం మన రాజ్యాంగ విలువలకు అద్దం పట్టడం చూడగలం. అస్పృశ్యత, కులం, వర్ణం మొదలైన విషయాలపై ఉపనిషత్తుల సిద్ధాంతం. మన రాజ్యాంగ సిద్ధాంతం రెండూ ఒకటే. మార్పు అంటే బ్రాహ్మణుడు తన విధుల్ని, ధర్మాన్ని మానేయాలని అర్థం కాదు. సమాజంలో అందరినీ అందులో భాగస్వామ్యులుగా చేయాలని అర్థం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తూ సమాజాన్ని కలిపే శక్తులు తక్కువగా ఉండటం వల్లా, విభజించే శక్తులే ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత ఓటుబ్యాంకు రాజకీయం వల్లా కులాలు మరింత పటిష్టంగా తయారయ్యాయి. అందరూ కులవ్యవస్థను తీవ్రంగా విమర్శించేవారే కానీ కులపు గోడలు మాత్రం మరింత గట్టిగా కట్టుకున్నారు. ఇది మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మిగతా సంస్కృతుల వాళ్ళు విమర్శించడానికున్న ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్క కులాన్ని ఆకర్షించడానికి ఒక్కో ఊ్యహంతో మతమార్పిడులు చేయబూనడం దేశభద్రతకు మరొక సమస్య.
భారతీయ సంస్కృతి గూర్చి పని చేస్తున్న వ్యవస్థలు అస్పృశ్యతపై ఎలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందో అలాగే కుల నిర్మాణంపై కూడా స్పష్టత, విధాన పరమైన నిర్ణయం ఇవ్వడం ఈనాడు చాలా ముఖ్యం. అస్పృశ్యత ఎలాగ మన భారతీయ మత గ్రంథాల్లో లేదో కులాలు కూడా మత గ్రంథాల్లో లేవు. మనిషి స్వభావం ఆధారంగా చెప్పబడిన వర్ణం వేరు, మనమిప్పుడు చూస్తున్న కులం వేరు. ఈ అంశంపై విధానపరమైన ఒక నిర్ణయాన్ని ధర్మ సంసద్‌, సాధుపరిషత్‌ మొదలైన వ్యవస్థల ద్వారా అందించటం చాలా అవసరం.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply, Reply to all, or Forward
10.55 GB (70%) of 15 GB used
©2015 GoogleTermsPrivacy
Last account activity: 11 hours ago

Details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

సాహితీ బంధువులకు శుభకామనలు -ఉయ్యూరు వీరమ్మ తల్లి పేరంటాళ్ళు తిరునాళ్ళు ఈరోజు మాఘ శుద్ధ ఏకాదశి 30 1-15 శుక్రవారం నుండి 13-2-15 శుక్రవారం  వరకు 15 రోజులు వైభవం గా జరుగుతాయి .ఈ రోజు రాత్రి అమ్మవారు   ఊరేగింపు గా అత్త వారింటి నుంచి బయల్దేరి శనివారం రాత్రికి ఆలయ ప్రవేశం చేస్తుంది .11  వ రోజు  సిడి బండీ  ఉంటుంది   -దుర్గాప్రసాద్

Inline image 1Inline image 2

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -86 గండ్రాయి స్పెషల్

నా దారి తీరు -86

గండ్రాయి స్పెషల్

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు గండ్రాయి హైస్కూల్ లోను , ట్యూషన్ లో చేసి అందరికి అభిమానుడినయ్యాను .డ్రాయింగ్ మేస్టారు ప్రసాద్ బెజవాడ వాడే .అక్కలు అక్కడ ఉద్యోగం .వారానికి ఒకసారి బెజవాడ వెళ్లి వచ్చేవాడు . కుర్రాడు మంచివాడే   కొంచెం ఈగో ఉండేది  .ఎర్రగా వెడల్పు ముఖం తో ఉండేవాడు .చిటికలో కోపం వచ్చేది .నేను మాట్లాడి శాంతపరచేవాడిని. డ్రాయింగ్ లో  మంచి  నైపుణ్యం ఉన్నవాడు .బాగా నేర్పించేవాడు .చక్కగా బొమ్మలు వేస్తాడు నాకు బాగా దగ్గరయ్యాడు .అతనితో నేచురల్ సైన్స్ బొమ్మలు రంగుల చాక్ పీసులతో బోర్డు మీద వేయించే వాడిని .అది నాకు పాఠాలు చెప్పటానికి బాగా తోడ్పడేది .ఏది అడిగినా చాలా ఇష్టం గా అద్భుతం గా వేసేవాడు .సుధాకర రావు అనే తెలుగు మేష్టారు బందరు దగ్గర వడ్లమన్నాడు  వాడు .తలిదండ్రులు అక్కడే ఉండేవారు భార్య ,పిల్లాడితో ఇక్కడికి వచ్చాడు .మేమున్న బజారులోనే ఒక కమ్మవారి ఇంట్లో పై అంతస్తులో ఉండి ఆరు ఏడు క్లాసులకు ప్రైవేట్ చెప్పేవాడు .సాహిత్య జ్ఞానం బాగానే ఉంది చాకు లాంటికుర్రాడు .పద్యం బాగా పాడేవాడు .నవ్వుముఖం సరదాగా మాట్లాడేవాడు పిల్లలతో మంచి అనుబంధం పెంచుకొన్నాడు .నా ట్యూషన్ పిల్లలకు అప్పుడప్పుడు పిలిపించి తెలుగు చెప్పించేవాడిని. నేను ఎలాగూ అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాడిని .  అతని భార్య కూడా చాలా కలుపుగోలు తనం గా ఉండి మాట్లాడేది .సాయంత్రాలు సుధాకర్ నేను  డ్రాయింగు ఆయనా కలిసి సరదాగా షికారు వెళ్లి తోటల్లో తిరిగి ప్రక్రుతి అందాలు చూసి వస్తూ౦డేవాళ్ళం .సుధాకర్ ఇంటికి వెడితే టిఫిన్ కాఫీ తప్పక ఉండేది .ప్రసాద్ ఒక కమ్మారి కుటుంబం ఉన్న ఒక గదిలో ఉండేవాడు .వాళ్ళు అతన్ని బాగా చూసుకొనే వారు .స్కూల్ కు దగ్గరా రోడ్డుమీదే అతని నివాసం .

ముందుగా నేను నా సైన్స్ క్లాస్ లకు వచ్చే పిల్లలను మోటివేట్ చేయించి వారితో తలా అయిదు రూపాయలు చందాగా వేయించి మొత్తం వసూలు చేసి హెడ్ మాస్టారికిచ్చి సైన్స్ రూమ్ లో రెండు ట్యూబ్ లైట్లు ఒక ఫాన్ తెప్పించి ఏర్పాటు చేయించాను .అది అందరిమీద ప్రభావం చూపింది నేను నా ఎనిమిదవ తరగతి విద్యార్ధుల చేత వాళ్ళ క్లాస్ రూమ్ లో ట్యూబ్ లైట్ ఏర్పాటు చేయించాను .తర్వాత అందరూ దీన్ని స్పూర్తిగా తీసుకొని మిగిలిన క్లాస్ లలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయించి స్కూల్ కు వెలుగు లు తెచ్చారు  .ఒక ఐడియా స్కూల్ వాతావరణాన్నే మార్చేసింది .

డ్రాయింగ్ మేస్టర్ ప్రసాద్ తో సైన్స్ రూమ్ బోర్డ్ పై ఉన్న భాగం లో ‘’మధన పడే మేధావుల చివురాశలు చివురించే రస రాజ్యం లేబరేటరి’’ అనే నాకిష్టమైన దాశరధి కొటేషన్ రాయించాను పెద్ద అక్షరాలతో. నేను పని చేసిన ప్రతిస్కూల్ లోనూ ఈ పని చేశాను .ఇది ఇక్కడ అందరికి నచ్చింది .పదవ తరగతి లో బాగా చలాకీ అయిన అమ్మాయి కొండపల్లి లక్ష్మి ఉండేది .తారకేశ్వరి తో పోటీ పడి చదివేది .సైన్స్ లో బాగా అభిరుచి ఉన్న ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులను సెలెక్ట్ చేసి ‘’సైన్స్ క్లబ్ ‘’అనేదాన్ని ఏర్పాటు చేసి దానికి కార్య దర్శిగా లక్ష్మిని నియమించి ప్రతిబుధవారం సాయంత్రం చివరి పీరియడ్ లో సైన్స్ క్లబ్ సమావేశాలు జరిపించి విద్యార్ధులతో సైన్స్ సంబంధిన ఆ వారం పేపర్ల లో వచ్చిన వార్తలు సేకరించి చదివించటం ఒక సైంటిస్ట్ గురించి విషయాలు సేకరించి మాట్లాడించటం చేసేవాడిని .పిల్లలకు ఇది కొత్త .చాలా బాగా పాల్గొని ప్రతిభను రుజువు చేసుకొనే వారు .

స్కూల్ కు ముందున్న కాంపౌండ్ వాల్ తప్ప అట స్థలానికి ఫెన్సింగ్ లేదు .అన్నీ ముల్ల పొదలే .కాలు పెట్ట టానికి వీలున్దేదికాడు .డ్రిల్ మేష్టారు జనార్దన రావు  అని జ్ఞాపకం .నందిగామ దగ్గర ఏటూరు నుంచి రోజూ వచ్చేవాడు .బుగ్గన ఎప్పుడూ జారదా కిళ్ళీ ఉండేది .మంచి ఆటగాడు .డ్రిల్ బాగా చేయించేవాడు .పిల్లలకు బాగా దగ్గరయ్యాడు .ఆయన నేను,డ్రాయింగ్ ప్రసాద్ కలిసి హెడ్ మాస్టారు తో చెప్పి కంచే వేయటానికి సీమ తుమ్మ విత్తనాలు తెప్పించి పిల్లలతో సాయంత్రం డ్రిల్ పీరియడ్ లలో గ్రౌండ్  చుట్టూ పలుగుతో కన్నాలు వేయించి విత్తనాలు వేయించి నీరు పోయించా౦ .అవి నెమ్మదిగా మొలకెత్తి అల్లుకొని కంచే లాగా ఆరు నేలలయ్యేసరికి పెరిగిపోయి అందరికి ఆశ్చర్యం వేసింది ఇక్కడెవరూ ఊహించని విషయం అందరి ప్రశంసలు  అందుకోన్నాం టీం లీడర్ నేనే .మొలవని విత్తనాల స్థానాలు గుర్తించి అక్కడ మళ్ళీ విత్తనాలు నాటించి దట్టం చేశాం .కనుక స్కూల్ కు కొంత వరకు రక్షణ కల్పించామన్న మాట గొడ్లు లోపలి రావటానికి ఇక కుదరకుండా చేశాం .ఇదీ ఒక ముందడుగే  .

ఇంత వరకు స్కూల్ విద్యార్ధులు ,ఉపాధ్యాయులు ప్రతి ఏడాది జరిగే గ్రిగ్ ఆటల పోటీలలో పాల్గొనే వారు కాదు కారణం స్కూలుకు స్పెషల్ ఫీజు ల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇక్కడంతా బి .సి. లు ఎసి., ఎస్. టి. విద్యార్ధులే అవటం వలన  ఫీజు కు ఎక్సేం ప్షన్ ఉండటం తో ఆదాయం రాదు .అదే ప్రతిస్కూలు పరిస్తితి .కాని ఆలోచన వస్తే అదేదో వచ్చినట్లు ఆటలూ  ఆడించ వచ్చు .మేమంతా కలిసి బాగా ఆడే  పిల్లలను ఎంపిక చేసి ఆటలు ఆడించి తర్ఫీదు చేశాం  బాడ్మింటన్ వాలీ బాల్ లో బాగా నైపుణ్యం చూపారు .పిల్లలనే  డబ్బులు కట్టుకోమని ఆడటానికి వెళ్ళటానికి ఖర్చులు కూడా వాళ్ళనే పెట్టుకోమని చెప్పి మొదటిసారిగా గ్రిగ్ పోటీలలో స్కూలు పాల్గోనేట్లు చేసి విద్యార్ధులలో క్రీడల పట్ల ఆసక్తి పెంచటానికి తోడ్పడ్దాం.అదో ‘’తుత్తి’’(తృప్తి ).మేస్తర్లం కూడా డబ్బులు వేసుకొని ఎంట్రీ ఫీజు కట్టి రోజూ బాడ్మింటన్ , వాలీబాల్ స్కూలు కాంపౌండ్ –రోడ్డు మధ్య ఉన్న ఖాళీ స్థలం లో నెట్ కట్టి ప్రాక్టీస్ చేసి నందిగామ సబ్ జోన్ కు వెళ్లి ఆడాం .ఇదొక రికార్డే ఇక్కడ .

ట్యూషన్ పిల్లలకు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఉయ్యూరు లో చేసినట్లు  వీలైన వాళ్ళ తో పాలుతెప్పించి  పంచదార ఏలకులు వగైరా కొనిపించి భారతమ్మగారితో పాలు కాయించి పరవాన్నం వండించి అందరికి పంచాము .ఇది ఇక్కడ అపూర్వమైన విషయమే అయింది. ఏంతో సంతోషం గా పిల్లలు పాల్గొని ఆనందించారు  .సుహృద్భావం ఐకమత్యంకలగటానికి ఆర్. ఎస్ .ఎస్. వారు దీన్ని ‘’కోజాగరీ ‘’అనే పేరుతొ ఉయ్యూరు కాలేజి గ్రౌండ్ లో చేస్తే మేమంతా పాల్గొనే వాళ్ళం. అలానే ఇక్కడ చేయించాను .దీన్ని గురించి ఊరంతా బాగా చెప్పుకొన్నారు .

గండ్రాయిలో ఎస్. సి .పిల్లలకు హాస్టల్ వుంది .వాళ్లకు హాస్టల్లో చదువు చెప్పేవారు లేరు .ఆ విద్యార్ధులు కూడా ట్యూషన్ కు వస్తామంటే చేర్చుకొని వాళ్లకు స్పెషల్ గా తర్ఫీదు ఇచ్చాను .దగ్గర ఊరు నుంచి అక్కడ హైస్కూల్  లో చదివే ఆడామగా విద్యార్ధులు కూడా నాదగ్గర చదవటానికి సైకిళ్ళమీద వచ్చేవారు .ఆడపిల్లలు రాత్రి ఇంటికి వెళ్ళిపోయేవారు .మగ పిల్లలు ఇక్కడే పడుకొనేవారు .అంత క్రేజ్ వచ్చింది ట్యూషన్ మీద  బాగా కస్టపడి బోధిస్తే ఆరాధన ఉంటుంది అన్నదానికిది నిదర్శనం .డబ్బు ఇవ్వలేము అన్నవారికి ఉచితం గా నే చెప్పేవాడిని .కాకాని గోపయ్య అనేముసలి  జవాను ఉండేవాడు .హాయిగా స్కూల్ కు వచ్చి నిద్రపోయేవాడు .లేక పొతే పేపరు చదువుకొంటూ కూచునే వాడు .పీరియడ్ అవగానే బెల్లు కొట్టేవాడుకాడు .అతనికి చెప్పలేక హెడ్ మాస్టారే  గంట కొట్టే వారు .ఇది చూసి నాకు మంటగా ఉండేది .అయిదారు సార్లు చూసి హెడ్ మాస్టారి దగ్గరకు వెళ్లి ‘’మీరు ఇలా గంట కొట్టడం బాగా లేదండీ . అతనితో కొట్టించాలి .లేకపోతె యాక్షన్ తీసుకోవాలి ‘’అన్నాను అయన దాన్ని తేలిగ్గా తీసేసుకొని అతనికి చెప్పేవారుకాదు .పరిస్తితి యదా తదం .అలాగే హెడ్ గారు టెన్త్ ఇంగ్లీష్ చెబుతుంటే విన్నారో లేదో చూసేవారు కాదు. సగం పిల్లలు నిద్రలో జోగుతూ ఉండేవారు .ఇదీ పట్టించుకొనే వారుకాదాయన .అలసత్వం యెంత దాకా  ఈడుస్తుందో  రెండూ ఉదాహరణలే .కాని ఏమైనా మార్పు తేవాలి అని నిశ్చయించుకొన్నాను .అటెండర్ గోపయ్య తో ఒంటరిగా మాట్లాడి ఆతను చేస్తున్నపని బాగా లేదని డ్యూటీ సక్రమం గా చేయకపోతే ఎవరైనా కంప్లైంట్ చేస్తే చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుందని నెమ్మదిగా చెప్పా. మొదట్లో ససేమిరా అన్నా తర్వాత మెత్త బడ్డాడు .ఇక నుంచి సక్రమంగా డ్యూటీ చేస్తానని మాట ఇచ్చి నిల బెట్టుకొన్నాడు .దానికి బదులుగా అతని కూతురు టెన్త్ చదివే ఉమకు ట్యూషన్ ఫ్రీ గా చెప్పా .అతని కళ్ళలో కృతజ్ఞత మెరుపులా మెరవటం చూసి సంతృప్తి చెందాను .అప్పటి నుంచి నేనంటే ఆరాధన గౌరవం అతనికి ఎక్కువైనాయి .డ్యూటీ లో మరెప్పుడూ అలసత్వం చూపలేదు .బెల్లు ఖచ్చితంగా టైం కు కొట్టేవాడు .

టెన్త్ క్లాస్ పిల్లలకు నేను క్లాస్ కు వెళ్ళినప్పుడు హెడ్ మాస్టారి క్లాసులో నిద్ర పోవద్దని మళ్ళీ నిద్ర పోతుండగా చూస్తె క్షమించనని హెచ్చరించా .అప్పటి నుండి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు .ఈ రెండు మార్పులూ గ్రామస్తులు ఊహించనిమార్పులు .మంచి జరిగినందుకు అందరికీ ఆనందం గా ఉంది ఇది చాలు .ప్రైవేట్ చదివే టెన్త్ క్లాస్ నైంత్ క్లాస్ పిల్లలను ఒక ఆదివారం గండ్రాయి లో మా ఉయ్యూరుకు చెందిన వారణాసి సదాశివరావు గారి పెద్ద భార్య గారి కుమారుడు ఆర్ ఏం పి గా ఇక్కడ చాలా ఏళ్ళుగా స్థిర   నివాసం గా ఉంటున్న డాక్టర్ మూర్తి గారి మామిడి తోటలోకి పిక్నిక్ తీసుకొని వెళ్లాను .పిల్లలు ఇంటి దగ్గర చేయిన్చుకోచ్చిన పదార్ధాలను అందరం కలిసి తిన్నాం. గొప్ప అనుభవం కలిగించా .అప్పుడే ఇండియా ఆస్ట్రేలియా లు మద్రాస్ చేపాక్ గ్రౌండ్ లో క్రికెట్  టెస్ట్ లో టై చేసి చరిత్ర సృష్టించారు దానిపై ‘’చేపాక్ టై ‘’పేర కవిత రాసి వాళ్లకు అక్కడ వినిపించా .అందరూ సంతోషం పొందారు .

స్కూల్ నైట్ వాచ్మన్ పేరు జ్ఞాపకం లేదుకాని చాలా మంచివాడు చాకలి కులం అనిజ్ఞాపకం. అతని కొడుకు తొమ్మిది చదువుతున్నాడు .వాడు రోజూ నా దగ్గరకొచ్చి  అంట్లు  తోమి బట్టలుతికే వాడు గది ఊడ్చేవాడు .అతనికి ట్యూషన్ ఫ్రీ గా చెప్పాను .ఇన్ని అనుభవాలు గంద్రాయితో పెన వేసుకొని ఉన్నాయి ఇవన్నీ నాకు మధురానుభావాలే అనుభూతులే .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1-15- ఉయ్యూరు .

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-3

ఆధునిక సంగీత నిర్మాత  –రిచార్డ్ వాగ్నర్ -1

తండ్రికి ఉన్న తొమ్మిది మంది సంతానం లో చివరివాడుగా లీప్ లిజ్ లో పుట్టి  ,పుట్టిన కొన్ని నెలలకే  తండ్రిని కోల్పోయి ,ఇరవై ఏళ్ళకే ప్రపంచ ద్రుష్టి అలవడి తన  పేరు విల్ హెమ్ రిచార్డ్ వాగ్నర్ లో మొదటి భాగాన్ని తీసేసుకొన్నాడు ..కుటుంబానికి సన్నిహితుడు  చిత్రకారుడు ,నటుడు నాటక రచయిత ,జ్యూ అయిన లుడ్విగ్ గేయర్ ను తల్లి మళ్ళీ పెళ్ళాడింది .కొత్త మొగుడు వలన ఒక కూతురును కన్నది .వాగ్నర్ మారుటి తండ్రి కుటుంబాన్ని  చాలా ఆప్యాయం గాబాధ్యతా గా  పెంచాడు .ఇతనిపై ప్రత్యెక శ్రద్ధ వహించాడుకూడా .ఇదొక విశేషమే .కుటుంబం డ్రెస్ డేయిన్ కు మారింది .గేయర్ వాగ్నర్ ను స్కూల్ లో చేర్చి రిచార్డ్ గేయర్ అని పేరు నమోదు చేశాడు .పద్నాలుగో ఏట పుకార్లు షికార్లు చేసి చెవిన పడి రిచార్డ్ వాగ్నర్ గా పేరు మార్చుకొన్న స్వతంత్ర జీవి .పది హేనేళ్ళ వయసులో షేక్స్ పియర్ రచనలు చదివి హేమ్లెట్ నాటకం  ప్రభావం తో’’లీ బాల్డ్ అండ్ అడిలైడ్’’   నాటకం రాశాడు  .అందులో వచ్చే పాత్రలనన్నిటిని మొదటి  అంకాలోనే చంపేశాడు .నాటకం ట్రాజెడీ కావటానికని వాళ్ళని మళ్ళీ చివర్లో బతికించి ప్రయోగం చేశాడు .గ్రీకు ట్రాజేడీలపై ఆరాధన ఏర్పడింది . హోమర్ సాహిత్యాన్ని పన్నెండు భాగాలు అనువాదం చేశాడు .అప్పటిదాకా సంగీతం అంటే పెద్దదా గా ఇష్టం ఉండేదికాదు .

వెబర్ రాసిన ‘’ఫ్రీస్చిట్జీ ‘’గురించి విన్నతరవాత సంగీతం పై విపరీతమైన మోజు ఏర్పడింది .వాటిని తన పియానో మీద వాయించి తృప్తి చెందాడు .సోనాటాలు సిమ్ఫనీలపై ద్రుష్టి పడింది .షేక్స్పియర్ ను బీతొవెన్  మొజార్ట్ ను కలలలో కలుసుకొని మాట్లాడానని వాగ్నర్ చెప్పుకొన్నాడు .అంటే మనసంతా వాళ్ళే  నిండి పోయారన్నమాట .పదహారో ఏట సంగీతం లో మెళకువలు గ్రహించి సంగీత కర్త అయ్యాడు .మనసులోని భావాన్ని హాహార్మని తో పలికించటం ,బీతోవన్ నుంచి కౌంటర్ పాయింట్ ను పొందటం జరిగింది  కుటుంబం వారెవ్వరూ వాగ్నర్ సంగీత కర్త అవటానికి అభ్యంతరం చెప్పలేదు .అతని పెద్దక్క అప్పటికే ఒపేరా గాయనిగా ప్రసిద్ధి పొందింది .కంపోసర్ గా కంటే గాయకుడిగా స్తిర జీవితం అతనికి లభిస్తే బాగుంటుందని మాత్రం వాళ్ళు ఆశించారు .

తల్లి పియానో  వయోలిన్ విద్యలో కొడుకు ఆరితేరాలని కోరుకొన్నది . గురువుల వద్ద నేర్పించింది .కాని నేర్పిన గురువు ‘’వాగ్నర్ ను ‘’వరస్ట్ ఫెలో –తెలివిగాలాడే కాని బద్ధకిస్టు’’అన్నాడు .ఈ రెండిటినీ సంపూర్తిగా నేర్వనే లేదు .పద్దెనిమిదో ఏట లీప్ జిగ్ యూని వర్సిటిలో చేరి సంగీతకర్త బాష్  వారసుడైన థియోడర్ వీన్లిగ్ దగ్గర సంగీతం నేర్చాడు గురువు శిష్యుడుచేసిన పియానో సొనాటా ,పోలోనైజ్ అనే రెండు కంపోజిషన్ లను ముద్రించే ఏర్పాటు చేసి  ప్రోత్సహించాడు .యూని వర్సిటీకి రెగ్యులర్ గా వెళ్ళేవాడుకాడు .తాగి త౦దనాలాడేవాడు .జూదం ఆడేవాడు .తల్లి కొచ్చే పెన్షన్ డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు చేసి ఎప్పుడూ అప్పుల అప్పారావు అవతారం లోనే ఉండేవాడు .కాని సంగీతం లో ప్రయోగాలు చేస్తూనే ఉండేవాడు .

సి మేజర్ లో చేసిన స్వర సమ్మేళనం అంటే కంపోజిషన్ ప్రేగ్ లో ప్రదర్శించాడు .మొదటి ఒపేరా ‘’ది వెడ్డింగ్ ‘’స్వరాలు కూర్చి నచ్చక మంటల్లో తగల పెట్టేశాడు .ఇరవై రెండవ ఏట రెండవది’’ది ఫెయిరీస్’’ ప్రారంభించాడు .ఇది జర్మన్ కవి గోతే రాసిన ‘ఫాస్ట్ ‘’కూర్పు లా ఉంటుంది .ఇదీ ప్రదర్శనకు నోచుకోలేదు .అప్పటికే సంగీతం లో పండిపోయాడు .ప్రొఫెషనల్ అని పించుకొన్నాడు .వాగ్నర్ సోదరుడు స్టేజి మేనేజర్ గా ఉన్నాడు .ఇతనికి కోరస్ మాస్టర్ గా అవకాశం ఇచ్చి ఒక గుర్తింపు తెచ్చాడు .తిండికి ఇబ్బంది లేని ఉద్యోగం దొరికింది .ఇప్పుడు మూడవ ఒపేరా’’దిలవ్ బాన్ ‘’ కోసం ప్రయత్నం చేశాడు .ఇందులో షేక్పియర్ రాసిన ‘’మెజర్ ఫర్ మెజర్ ‘’ఇతివృత్తాన్ని వాడుకొన్నాడు .దీనితో కీర్తి వచ్చిమాగ్దేబర్గ్ లోని  చిన్న దియేటర్ డ్రామా కంపెనీ కి సంగీత దర్శకుడయ్యాడు ..ఆ ప్రదేశం కాని ,అక్కడి జనం కాని నచ్చక మళ్ళీ లీప్ జిగ్ కు వెళ్ళిపోయాడు .

ఇక్కడ మన వాడి కద మలుపుతిరిగింది .ఆరేళ్ళ కూతురున్న మిన్నా ప్లానర్ అనే పెద్దగా సంస్కారం లేని ఆమె తో పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వచ్చింది .ఆమె నాటకరంగం పై అభినివేశం నిర్వహణా సామర్ధ్యం ఉన్నావిడ .పెళ్లి అయిందికాని వాగ్నర్ తిక్క కుదర్లేదు .బాధ్యతారాహిత్యం గా ,ప్రవర్తిస్తూ ఆడంబరాలకు పోయి  భార్య డబ్బంతా తిరుక్షవరం చేసి అప్పులపాలై మునిగి ఆమె తో పోట్లాడుతూ  జీవితం నరకం చేసుకొని, చేశాడు .వీడిని భరించలేక ఆరు నెలలకాపురానికే విసిగిపోయి వదిలేసి ఆమె మానాన ఆమె వెళ్లి పోయింది .మనవాడు ‘’అత్తారింటికిదారేది ? అని వెతుక్కోని చేరి సయోధ్య చేసుకొన్నా అది తాత్కాలికమే అయింది .మళ్ళీ గొడవ ,విడిపోవటం .చివరికి వాగ్నర్ రీగాలో సంగీత దర్శకుడైన తర్వాత ఆమె వచ్చి చేరింది .సంగీతం కూరుస్తూనే ఉన్నాడు .ప్రదర్శిస్తూనే ఉన్నాడు వచ్చిన రూపాయి నిలవటం లేదు .మళ్ళీ అప్పులే అప్పులు  .తిప్పలే తిప్పలు .ఈ బాధ భరించలేక స్నేహితుడికి ఉత్తరం రాస్తూతనకు డబ్బు కావాలని లేక పొతే పిచ్చివాడినై పోతానని చెప్పుకొన్నాడు .డబ్బు మంచి నీళ్ళ ప్రాయం గా ఖర్చు చేసేవాడిని ఎవరు ఎంతవరకు ఎన్నిసార్లు ఆదుకొంటారు ?.అధిక వడ్డీలకు డబ్బు తేవటం తీర్చలేక మళ్ళీ అప్పులు చేయటం అదీ అతని పరిస్తితి .నిండా మునిగిపోయాడు .ఉద్యోగం ఊడింది .పరువు గంగ పాలైంది .నెత్తిన గుడ్డ వేసుకొని రీగా నుండి రష్యాకు కుటుంబం తో వెళ్ళిపోయాడు .సరస్వతి ఉన్నా లక్ష్మీ ప్రసన్నం అయినా ఖర్చు శని వాగ్నర్ ను పట్టుకొనిపీడించి పిప్పి చేసింది .

 

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి

‘లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి

Sakshi | Updated: January 29, 2015 02:04 (IST)
‘లక్ష్మణ్ రేఖ’ చిరంజీవి

‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలంటే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి. ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్కరలేదు.’’

మనం తరచు చూసే దృశ్యం లో చూడని కోణాన్ని చూపిం చేది – కళ. మనం తరచు చేసే ఆలోచనలో ఆలోచించని కోణాన్ని ఆవిష్కరించేది కార్టూన్. అదీ కళే. ఈ రెంటినీ కేవలం 90 సంవత్సరాలు ఉపాసించిన కళాకారుడు ఆర్కే లక్ష్మణ్. మొదటి దృశ్యం – కాకి. లక్ష్మణ్ చిత్రాల్ని చూసినప్పుడు మనం రోజూ చూసే కాకిలో ఇంత కళాత్మకమైన వైవిధ్యం ఉన్నదా అని పిస్తుంది. మనం రోజూ వినే వార్తల పట్ల ఆయన కార్టూ న్ మన మనసుని గిలిగింతలు పెడుతూనే ఒక హెచ్చరిక చేస్తుంది.

మన నాయకులు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు – ప్రజాసంక్షేమం పేరిట. డ్యామ్‌లు నిర్మిస్తున్నారు- ప్రజాభ్యుదయం పేరిట. ప్రణాళికలు చేస్తున్నారు – ప్రజల్ని ఉద్ధరించే లక్ష్యంతో. ఆస్పత్రులను, విద్యాసంస్థలను, పునరావాస కేంద్రాలను నిర్మిస్తున్నారు- ప్రజల వికాసానికి. కాని, ఇంకా ఇంకా సగటు మనిషి అలాగే అడుక్కుతింటున్నాడు – అన్న సత్యాన్ని స్థూలంగా ఆర్కే లక్ష్మణ్ తన జీవిత కాలమంతా తన కార్టూన్ ద్వారా ఆవి ష్కరించారు. ఆయన కార్టూన్లలో గొప్ప శిల్పం ఏమిటంటే ఈ సగటు మనిషి ఏనాడూ నోరు విప్పి మాట్లా డలేదు. కళ గొప్ప సూచన. గొప్ప విశ్లేషణ. గొప్ప కను విప్పు.

నేటితరం రాజకీయ నాయకుల గురించి ఆయన సమీక్ష వినదగ్గది. ‘‘ఆనాటి నాయకులు – నెహ్రూ, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటివారు తమదైన వ్యక్తిత్వాలతో కనిపించేవారు. వారి మీద కార్టూన్ వేయడం ఒక అవకాశంలాగ ఉండేది. ఈ తరం నాయకులు- లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వినా- అందరూ ఒకే మూస. తమదైన వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా ఏమీ కని పించవు.’’

నోరెత్తి మాట్లాడని బడుగు మనిషి సమకాలీన సమాజపు సమీక్ష కోసం కోట్లాది మంది పాఠ కులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ‘యూ సెడ్ ఇట్’అనే రెండంగు ళాల కార్టూన్ కోసం 50 సంవత్స రాల పాటు పత్రికను చదివారు. రోడ్ల మీద గుంటలు, ట్రాఫిక్ దిగ్బం ధాలు, నీటి ఎద్దడి, బిచ్చగాళ్లు, నాయ కుల వెర్రితలలు- ఏవీ ఆయన దృష్టినీ, కార్టూన్లనీ దాటి పోలేదు. డెరిల్ డి‘మాంటే అనే చిత్రకారుడు ఆయనతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఒకసారి వ్యవసాయ భూముల మీద గరిష్ట పరిమితిని ప్రభుత్వం ఎత్తి వేసింది. కుంచించుకుపోతున్న రైతు నెత్తి మీద పెద్ద గుది బండని వేసి లక్ష్మణ్ కార్టూన్ పంపారు. ఇది బొత్తిగా ‘కథ చెప్పినట్టుంది’ అన్నారట డి‘మాంటే. వెంటనే ఆ కార్టూన్‌ని తెప్పించి- ఆ బండ మీద రాజకీయ నాయకుడు జల్సాగా కూర్చున్న చిత్రాన్ని వేశారట.

మరో కితకితలు పెట్టే కార్టూన్. ఒక రాజకీయ నాయకుడి కారు ముందు బడుగు మనిషి నిలబడి ఉన్నా డు. నాయకుడు పక్కవాడితో అంటున్నాడు, ‘‘ఇంకా నయం. స్వచ్ఛమైన తాగునీరు, స్కూళ్లు కావాలని అడు గుతారేమోనని భయపడుతున్నాను. అదృష్టవశాత్తూ వాళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని అడుగుతున్నారు.’’  ఓ పాత్రికేయుడు, ‘‘అయ్యా! మీ కార్టూన్లలో మేధావి చెణుకులు కనిపించవేం?’’ అని అడిగారట. ఆయన సమాధానం- ‘‘బడ్జెట్ మీద కార్టూన్ వేయాలం టే మీ సమీక్ష నేలబారు మనిషికి చేరాలి, ఆర్థికమంత్రికి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి. వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్క రలేదు.’’

ఆయన తరం కార్టూనిస్టు, ఆయన అభిమాని- సుధీర్ ధర్ ఆ రోజుల్లో ‘హిందుస్తాన్ టైమ్స్’లో పనిచేసేవారు. ఓసారి హిందు స్తాన్ టైమ్స్ ఆఫీసులో ఆయన బొమ్మ వేసుకుంటూండగా ఎవరో టేబుల్ దగ్గరకి వచ్చి నిలబడ్డారు. చూస్తే లక్ష్మణ్. ఆనందంతో ఉబ్బితబ్బి బ్బయ్యి తన సమక్షంలో బడుగు మనిషిని వేయమని అడిగారట. అతి సులువుగా వేసి, దాని మీద ‘హిందూస్తాన్ టైమ్స్’ అని రాసి పక్కనే ఒక శీర్షిక పెట్టారట: ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పక చదవండి!’అని. ధర్ ఆత్రుతగా ‘మీ ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్’ అని అన్నారట.

లక్ష్మణ్ పెన్ను తీసు కుని ఆటోగ్రాఫ్ రెండుసార్లు పెట్టారట. ఆయనకి ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్నీ, దరిమి లాను పద్మవిభూషణ్ పురస్కా రాన్నీ ఇచ్చింది. వ్యవస్థని దుయ్యబట్టే కళకి వ్యవస్థ అర్పించిన గౌరవప్రదమైన నివాళి ఇది. సామాజిక అరా చకం పట్ల కళాకారుడి విమర్శ- ఆరోగ్యకరమైన చికిత్స అని తన జీవిత కాలంలోనే వ్యవస్థను ఒప్పించిన కళాకా రుడు, నేలబారు మనిషిని ప్రజల మనసుల్లో చిరంజీవిని చేసిన అపూర్వ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్. మారని ఈ లోకం లో మార్పు అవసరమన్న స్పృహని ఒక పక్క చిన్న నవ్వు తో, వెనువెంటనే చిన్న కవ్వింపుతో ఒక జీవితకాలం కలి గించిన గొప్ప వైద్యుడు లక్ష్మణ్.
 – గొల్లపూడి మారుతీరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లలిత సంగీతానికి సిగ్నిచర్ ట్యూన్

లలిత సంగీతానికి సిగ్నిచర్ ట్యూన్
బాలాంత్రపు రజనీకాంతరావు లేని లలిత సంగీతాన్ని ఊహించలేము. ఆయన గురించి మాట్లాడకుండా ఆలిండియా రేడియో తెలుగు ప్రసారాలను ప్రస్తుతించలేము. తెలతెలవారుతూనే అన్నమయ్య కీర్తనలతో తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత నింపి, తెలుగువారి ‘ధర్మ సందేహాలు’ ఉషశ్రీ ద్వారా నివృత్తి చేయించింది ఈయనే. కార్మికుల కార్యక్రమం, వనితా వాణి… ఏ కార్యక్రమమైనా దాని సిగ్నేచర్‌ ట్యూన్‌ ‘బాలాంత్రపు’ బాణీనే. కృష్ణశాసి్త్ర పాటలోని మాధుర్యమైనా, శ్రీశ్రీ రాసిన నాటికల రేడియో ప్రసారాలైనా, చలం ఇంటర్వ్యూ అయినా ఆయనకు మాత్రమే సాధ్యమనిపిస్తాయి. అందరికీ సుపరిచితమైన ఆయనే శత వసంతాల బాలాంత్రపు రజనీకాంతరావు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం…
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వేంకట పార్వతీశ్వర కవుల్లో ఒకరైన బాలాంత్రపు వెంకటరావు, వేంకటరమణమ్మలకు 1920 జనవరి 29వ తేదీన జన్మించిన రెండో సంతానం రజనీకాంతరావు. ఆ ప్రకారం 29న ఆయన 96వ పుట్టిన రోజు. అయితే తెలుగు తిథుల ప్రకారం (అధికమాసాలతో కూడా కలుపుకుంటే) ఈ నెల 31వ తేదీన ఆయన శతవసంతంలోకి అడుగు పెడుతున్నారు.
జ్ఞాపకం మునుపటి వలె కెరటంలా ఆయనను చుట్టుముట్టడం లేదు. సున్నితమైన ఓ అల.. అలా వచ్చి ఆయనను మెల్లగా స్పృశించి వెనుదిరుగుతోంది. అయితే పాట ఆయనను కమ్మేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేనత్త కూతురు సుభద్ర భద్రంగా ఆయన గుండెల్లోనే కొలువై ఉంది. ఈ శతవసంతాల బాలుడిని ఇప్పటికీ ఉత్సాహంగా నిలుపుతోంది ఆయన ప్రాణంలో ప్రాణమైన పాట, తన ప్రియమైన సుభద్రే. రజనీకాంతరావును పలకరించిన వెంటనే పక్కనే గోడపైన ఉన్న చిత్తరువులో తనతో ఉన్న తన ప్రియసఖి సుభద్రను చూపిస్తారు. ఆమె తన 70వ ఏట తనను పాటకు వదిలేసి వెళ్లిపోయిందని పితూరి చెబుతారు. తన తల్లి తన రెండో ఏటనే కన్నుమూసిందని, అప్పుడు తన తండ్రి వయసు 40 ఏళ్లని గుర్తుచేసుకుంటారాయన. తన భార్య క్రీగంటి చూపును వర్ణిస్తూ ‘‘కాకిలా ఇలా నన్ను చూసేది’’ అని చూపిస్తారు. ఆ వెనువెంటనే ‘..ఓసి నామేనత్త కూతురా.. ఓసోసీ నా బావ చెల్లెలా.. రా దగ్గరకు రా..’ అంటూ ‘ఆశా.. నా ప్రాణసఖీ..’ అని ఆమె కోసం రాసిన పాట పాడి వినిపిస్తారు. ఇక అక్కడి నుంచి మనం ఏ పాట కావాలని అడిగితే ఆ పాట ఆయన గొంతు నుంచి ఉరికొస్తుంది.
కృష్ణశాసి్త్ర అల్లుడు..
రజనీకాంతరావు చదువు గురించి వివరిస్తూ ‘ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణుడినయ్యాను. పింగళి లక్షీకాంతం నాసాహిత్య గురువు’ అన్నారు. కృష్ణశాసి్త్రతో తనకున్న గొప్ప అనుబంధాన్ని నెమరువేసుకుంటూ, ‘ఆయనతో నాకు మామయ్యా అని పిలిచేంత దగ్గరి అనుబంధముంది.. ఆయన కూడా నన్ను ‘అల్లుడూ.. మేనల్లుడూ’ అంటూ పలకరించే వార’ని చెబుతారు.
ఇక – రజనీకాంతరావు పుట్టిన రెండేళ్లకే అమ్మ వెంకటరమణమ్మ కన్నుమూయడంతో పిఠాపురంలో చిన్నమ్మమ్మ ఆయనను తన వెంట తీసుకెళ్లింది. ఆ పసిప్రాయంలోనే రజనీకి శ్రీమహాలక్ష్మి ఇష్ట దేవత అయింది. అదెలాగంటే.. పిఠాపురం కుమారస్వామి కోవెలలోని కోనేటి ఒడ్డున రాత్రిపూట అమ్మమ్మ ఒళ్లో కూర్చుని చెంచులక్ష్మి వీధినాటకం చూడడం వల్లనట. నీలపురంగు పూసిన చెంచులక్ష్మి ముఖాన్ని ఇష్టపడేవారు కాదట. ఆదిలక్ష్మి ముఖానికి రాసిన పసుపు రంగు ఆయనకు సంతోషాన్ని కలిగించేది.
బెంచీ ఎక్కి పద్యాలు పాడేవారు..
పిఠాపురంలో చదువుతున్న రజనీకాంతరావును సిక్స్త్‌ ఫారం (ఎస్‌ఎ్‌సఎల్సీ) చదివేందుకు గుంటూరు పంపించారు. అక్కడి టౌన్‌ స్కూల్లో చదువు. తరగతి గదిలో గొడవ వినిపిస్తే ప్రధానోపాధ్యాయులు వెదురు బెత్తంతో వచ్చి అందరినీ వరసపెట్టి కొట్టేవారట. అదే పిఠాపురం స్కూల్లో అయితే పంతుళ్లు గదిలోకి వచ్చే వరకూ గొడవ చేసినా కొట్టేవాళ్లు కాదట. పైగా అక్కడ ఉపాధ్యాయులకు ఈయన పద్యాలు బాగా పాడతాడని తెలిసి అడిగి మరీ పాడించుకునేవారు. గుంటూరులో ఈ విషయం ఎవరికీ తెలియదట. అక్కడ సంగీతం టీచర్లు సంగీతం నేర్పరట. అందుకే అక్కడ చదవడం ఇష్టం లేక, తండ్రికి లేఖ రాసి ఆయన అనుమతితో పిఠాపురం తిరిగి వచ్చేశారు. ‘బెంచీ ఎక్కించి నా చేత పద్యాలు పాడించిన బడి అది. నాకెంతో ఇష్టమైనది’ అంటారాయన. తమలోని ఆసక్తిని, నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించని బడిని పిల్లలు ఇష్టడరనేదే రజనీకాంతరావుగారి అనుభవం కూడా.
ఐదేళ్లకే కల్యాణిరాగం 
వయసుతోపాటే ఆయనలోని విద్వాంసుడూ ఎదిగాడు. ఐదేళ్లకే కల్యాణిరాగాన్ని ఆలపించారు. పాఠశాల చదువు పూర్తయ్యే నాటికే ఎన్నో రాగాలనూ అలవోకగా ఆలపించిన ఆయన 18వ ఏట తొలి పాట రాసి, బాణీకట్టి పాడారు. అదే తెలుగు తల్లిపై రాసిన ‘పసిడి మెరుంగుల తళతళలు…’ అనే పాట. అప్పుడు ఆయన ఆంధ్రాయూనివర్సిటీలో బీఏ (ఆనర్స్‌) చదువుతున్నారు. ఆనందభైరవి రాగంలో ఆ పాట పాడుతుండగా, నాటి వీసీ సి.ఆర్‌.రెడ్డి కూడా వచ్చి గళం కలపడం ఆయన మరచిపోలేని మధుర స్మృతి.
స్వర రచనలో వైవిధ్యం..
రేడియోలోకి రాక పూర్వమే (యుక్తవయసులోనే) తన సంగీత రచన రెండు ప్రవాహాల్లో సాగిందంటారాయన. ‘‘వాటిలో ఒకటి సంప్రదాయ పరిధిలో ప్రసిద్ధ కర్ణాటక రాగం కాగా, మరొకటి సమకాలీన ఆంధ్రేతర, భారతీయ, ప్రపంచ సంగీత ధోరణులను మన పాటకు నప్పేలా చేయడం’’ అని చెబుతారు. మధ్య ప్రాచ్య సంగీతపు ఆలాపనా పద్ధతులను అవలీలగా పలికించిన నైపుణ్యమే ఆయనను బి.ఎన్‌.రెడ్డి వంటి దర్శకులకు దగ్గర చేసింది. ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహో పావురమా..’ మొదలు రాజమకుటంలో ‘ఊరేది పేరేది..’ వరకు అలా వచ్చిన పాటలే.
రేడియోలో కృష్ణ‘రజని’
రజనీ మోహన రాగం లేకుండా కృష్ణశాసి్త్ర పాట లేదు. ఆయన యక్షగానమూ లేదు. అందుకే వారిద్దరినీ కృష్ణ-రజనీ అని పిలిచేవారు. రజనీకాంతరావు సంగీతంలో ప్రసారమైన దేవులపల్లి తొలి సంగీత నాటకం ‘శర్మిష్ట’. 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. ‘ఉమర్‌ ఖయ్యాం జీవిత ఘట్టాలను చిత్రిస్తూ దేవులపల్లి రచించిన నాటకానికి సంగీతం, ప్రధానపాత్ర నావే. అందులో పారశీక సంగీత ధోరణులను ప్రదర్శించాను’ అని గుర్తు చేసుకున్నారు రజనీకాంతరావు. దేవులపల్లి చేత మూడు యక్షగానాలు రచింపజేసి హైదరాబాద్‌ నుంచి ప్రసారం చేశారు. వాటిలో ఒకటి ‘క్షీరసాగర మథనం’. రెండవది ‘విప్రనారాయణ’, మూడవది ‘మాళవిక’. క్షీరసాగరం రచనలో మూడొంతుల రచన రజనీదే. ఈ మూడు యక్షగానాలకు ఆరంభ ప్రదర్శనలో చరణం చిట్టచివర ‘శ్రీకృష్ణ దాన చకోర పూర్ణిమా, రజనీకాంతోదయా దయారాశీ హెచ్చరిక‘… అని జంట కవుల్లా వారిద్దరి పేర్లూ వచ్చే విధంగా రాసుకోవడం విశేషం. ఇలా.. అందమైన రాగ భావాల కాంతుల హరివిల్లు కింద పుట్టిన రోజును జరుపుకుంటున్న ఈ శతవసంతాల ‘బాల’ రజనీకరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 పద్మావతి వడ్లమూడి, విజయవాడ
స్వరకర్తే కాదు.. పరిశోధకుడు కూడా..
తాను చదివిన, చూసిన ఏ అంశాన్నైనా విశ్లేషించడం, దాని మూలాల్లోకి వెళ్లి శోధించడం రజనీ తత్వం. కాళిదాసు మహాకవి వర్ణించిన మేఘదూత తొలకరి మేఘమేనని విశ్లేషణాత్మకంగా వివరించిన పరిశోధకుడు. పక్షుల కిలకిలరావాల్లో అర్థాలను అన్వేషించిన తాత్వికుడు. బాల్యంలో తాము పెంచిన రామచిలుక, మైనా గోరా తమ వద్ద నేర్చుకున్న మాటలను, వాటంతటవే నేర్చుకున్న మాటలను, బాలమురళీకృష్ణ ఇంట మైనా తనంతట తానే నేర్చుకుని స్వరయుక్తంగా పలికే రాగస్వరగుచ్ఛాలను జాగ్రత్తగా గమనించారాయన. తెల్లవారు జామున కొక్కోరోకో అనే కోడి కూతలో దాంపత్య సంబంధమైన స్వర సామాన్య నిగూఢార్థం ఏదో ఉంటుందంటూ, నేడు ఫౌలీ్ట్ర ఫారాల్లో కోళ్ల దాంపత్య పద్ధతుల్లో మార్పు వల్లనేమో వాటి స్వర విన్యాసాలు మారిపోయాయంటారు. దోమల సంగీతంలోని రిథమ్‌ను గుర్తించిన గొప్పవాడు. పిచ్చుకల కిచకిచలను జాగ్రత్తగా గమనించి వ్యాకరణం రాయవచ్చేమోనని ఆలోచించిన వాడు.
వాల్మీకి కవితకు..
సహజమైన ధ్వనులను సంగీత వాయిద్యాలపై పలికించడంలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. విజయవాడలో ఓ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక వాద్య గోష్ఠికి రిహార్సల్స్‌ చేస్తూ వాల్మీకి కవితకు కారణమైన క్రౌంచ పక్షుల ప్రణయ కలాపాల ధ్వనులను వాయిద్యంపై పలికించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మామిడిచెట్టు గుబుర్లలో విశ్రమిస్తున్న పక్షుల గుంపు చటాలున లేచి కిలకిలరావాలు చేశాయట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘గాయక విద్వాంసులంతా ఆనందంతో ఒళ్లు పులకరించగా నన్ను అభినందిస్తూ చేతులు జోడించారు. నేను ఆ నాదబ్రహ్మకు చేతులు జోడించి నమోవాక్యాలు అర్పించానప్పుడు.’…అని చెబుతారు బాలాంత్రపు వారు. ఇందుకు భిన్నంగా ‘మూసీపై వలపు వంతెన’ నృత్య రూకంలో గుర్రపు డెక్కల శబ్దాన్ని కొబ్బరిచిప్పలపై పలికించిన ఘనత ఆయనదే!
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐ టి ఉద్యోగాలకు కత్తెర

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వభావ సరళి వల్లనే సమస్యలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దిల్లీలో కేజ్రీవాల్ ముందంజ సర్వేలు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ కళ్ళే పల్లి శివరామయ్య – శ్రీమతి కళ్ళే పల్లి వేంకట రమణమాంబ ‘ఆంధ్రలక్ష్మి’ మాస పత్రిక 1921

శ్రీ కళ్ళే పల్లి  శివరామయ్య – శ్రీమతి కళ్ళే పల్లి వేంకట రమణమాంబ 
‘ఆంధ్రలక్ష్మి’ మాస పత్రిక 1921 
 
‘ఆంధ్ర’ పేరు కలిగిన స్త్రీల పత్రిక. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్ర అనే 
పదం అనేక సంస్థలకు, వ్యాపారాలకు ఆంధ్ర మహాసభల ప్రభావం వల్ల  విరివిగా 
వాడటం జరిగింది.  అనేక పత్రికలపేరులో   ఆంధ్ర అనే పదము  ఉపయోగించడము జరిగింది. 
అటువంటి పత్రికలలో ఇది ఒకటి. డిసంబర్ 1921 ప్రథమ సంచిక  గంజాం జిల్లా , 
బరంపురం పట్టణం నుంచి ప్రచురించబడింది
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -85 గండ్రాయిలో ఒకే గదిలో కాపురం

నా దారి తీరు -85

గండ్రాయిలో ఒకే గదిలో కాపురం

స్కూల్ తెరిచే రోజుకు జగ్గయ్య పేటకు వంట సామాను మడతమంచం మా తమ్ముడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చినఅలారం కం  రేడియో వగైరా సరంజామాతో శోభనాద్రి వాళ్ళింటికి చేరాను .వాళ్ళు నాకోసం భోజనం రెడీ చేసి ఉంచారు తిని బస్ ఎక్కి స్కూల్ సమయానికి గండ్రాయి చేరాను .రోజూ అసెంబ్లీ ఉండేది .హెడ్ మాస్టారు సమయానికే వచ్చేవారు .అంతాఅయిన తర్వాత పిల్లలు క్లాసులకు వెళ్ళేవారు .నేను లాబ్ ను సుబ్బారావు గారనే సెకండరీ గ్రేడ్ మాస్టారి నుంచి హా౦ డోవర్ చేసుకొన్నాను  సైన్స్ క్లాసులు అక్కడే నిర్వహించేవాడిని .చిన్న బల్బు తప్ప ఏ సౌకర్యమూ లేదు .ఏ క్లాస్ వాళ్ళకూ లైట్లు లేవు .వర్షం వచ్చినా చీకటిపడినా కళ్ళు కనిపించేవికవు. అలానే గడుపుకోస్తున్నారు .ఇదంతా చూడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది .వర్క్ అలాట్ మెంట్ చేసి టైం టేబుల్ వేసి ఇచ్చారు .నేను  ఎనిమిదో క్లాస్ కు ఇంగ్లీషు ,ఎనిమిది నున్చిపదో క్లాస్ వరకు ఫిజికల్ నేచురల్ సైన్సూ చెప్పాలి .క్రమంగా అలవాటుపడ్డాను ఈ వాతావరణానికి .

వారం రోజులు జగ్గయ్య పేట నుంచే వచ్చేవాడిని .ఉదయం కాఫీ వేళకు భోజనం ఏర్పాటు చేసింది సత్యవతిపిన్ని నన్ను చాలా ఆప్యాయం గా చూసేది అలానే కోడళ్ళూ కొడుకులూ మనవలూ మనవరాళ్ళు కూడా .ఎక్కడో దూరంగా ఇంటికి దూరంగా ఉన్నాననే భావం నాలో నుంచి పోగోట్టారందరూ .సాయంత్రం రాగానే టీ తాత్రి భోజనం అన్నీ యదా ప్రకారం గా ఉండేవి వీళ్ళకు శోభనాద్రి గూడెం నుండి రోజూ బస్ లో బస్ స్టాండ్ కు స్వంత గేదెల పాల కాన్ వచ్చేది .దాన్ని ఎవరొ ఒకరు  వెళ్లి ఇంటికి తెచ్చుకొనే వారు . ఇంట్లో ఫ్రిజ్ కూడా లేదు .

రోజూ స్కూల్ కు వెళ్ళగానే పిల్లలు ట్యూషన్ చెప్పండి అని వెంటపడేవారు .రెండుమూడురోజుల తర్వాత అలాగే అన్నాను .ఉండటానికి రూమ్ కావాలన్నాను  .ఎవరికి వాళ్ళు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అనే వాళ్ళు .ట్యూషన్ చెప్పాలంటే  షరతులు  పెట్టాను .నేను ప్రతి శనివారం సాయంత్రం ఉయ్యూరు వెడతానని దసరా ,సంక్రాంతి సెలవల్లో ఉండనని చెప్పాల్సినదంతా ఉన్న రోజుల్లోనే చెప్పుతానని ,అవసరం అయితే తెల్ల వారుజ్హామునే రావాల్సి వస్తుందని రాత్రి తొమ్మిది దాకా ఉండాల్సి ఉంటుందని చెప్పాను. అందరూ చాలా ఆనందం గా ఇష్టపడ్డారు .

కనపర్తి పిచ్చయ్య గారు భారతమ్మ గారి ఆదరణ ఆప్యాయత

కనపర్తి ప్రసాద్ అనే కుర్రాడు తొమ్మిది చదువుతున్నాడు .వాడు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉందని అది ఇస్తారని పూర్వం ప్రసాద్ అనే సైన్స్ మేష్టారు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పేవారని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు .అక్కడ అతని తండ్రిగారు పిచ్చయ్య గారు అమ్మగారు భారతమ్మ గారు నన్ను ఏంతో ఆప్యాయం గా పలకరించి ఆహ్వానించారు కాఫీ ఇచ్చారు .టిఫిన్ పెట్టారు .వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఏ విధమైన అభ్యంతరం లేదని హాయిగా ప్రైవేట్ చెప్పుకోవచ్చని అన్నారు .ఏ సహాయం కావాలన్నా తాము చేయటానికి సిద్ధం అన్నారు .నేను ఒకడినే ఉంటానని ఫామిలీని తీసుకొని రానని వంట చేసుకొంటానని ప్రతివారం ఉయ్యూరు వెడతానని నా రికార్డు పెట్టాను .నవ్వి అలాగే అన్నారు .వాళ్ళ అబ్బాయి ప్రసాద్ చదువులో బాగా వెనక పడిఉన్నాడని ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని కోరారు అలాగేనన్నాను .వాళ్ళు ఉంటున్న డాబా లో వాకిలి వైపున్న కుడివైపు గది చూపించారు .బాగానే ఉంది నాకు సరిపోతుంది. లోపలా బయటా వరండాలో ట్యూషన్ చెప్పచ్చు .నచ్చిందని చెప్పాను .అద్దె యాభై అనిజ్ఞాపకం .

సుమారు వారం తర్వాత పిచ్చయ్య గారింట్లో చేరాను .వంట చేసుకొనే వాడిని .ముందుగా మాజీ గారి అమ్మాయి  తారకేశ్వరి అనే తార అనే అమ్మాయి ఆ అమ్మాయితో పాటు కొందరమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు చేరారు .క్రమంగా బాయిస్ కూడా వచ్చారు .దాదాపు ఇరవై మంది చేరారు. ప్రసాద్ తొమ్మిది చదువుతున్నాడుకనుక అతనికోసం తొమ్మిది వాళ్ళనూ చేర్చుకోవాల్సి వచ్చింది .స్కూల్ లో టీచింగ్ చూసి ఎనిమిది వాళ్ళూ  వచ్చారు .సందడే సందడి .దీనికి కారణం ఆ మార్చిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు దారుణం గా ఉన్నాయి అంతా కలిపి పదహారుశాతం మాత్రమె పాస్ అయ్యారు .అందుకని తలిదండ్రులు పిల్లల్లో బాగా చదవాలని చదివించాలని కోరిక కలిగింది .ట్యూషన్ చెప్పే వారు ఇన్నాళ్ళకు దొరికి నందుకు వారి సంతృప్తి కి హద్దు లేకుండా పోయింది .అందుకని చాలామంది చేరుతున్నారు .అదీ అసలు విషయం .టెన్త్ వాళ్లకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఫీజు పెట్టాను .రెండు వాయిదాలలో ఇవ్వాలి .చేరిన నెల లోపు మొదటి వాయిదా చెల్లించాలి .తోమ్మిదివారికి రెండు వందలు ఎనిమిదివారికి నూటయాభై తీసుకొన్న జ్ఞాపకం .పిల్లలు పెరిగే సరికి పిచ్చయ్యగారికి కొంత ఇబ్బంది గా ఉండేది .అయన బాగా తెలుగు దేశం రాజకీయం మనిషి .ఎప్పుడూ ఇల్లు పెద్ద సత్రం లా జనం తో కిట కిటలాడేది .అందుకని నారూమ్ ను డాబా పైన ఉన్న ఉన్న గదిలోకి మార్చారు  గది కూడా విశాలమైనదే  బయట ఖాళీ చాలా ఉంది గాలి వెలుతురూ కు ఢోకాలేదు .పిచ్చయ్య గారి ఇంటి వెనకే వల్లభి వెళ్ళే బస్ స్టాప్ ఉంది చాలా దగ్గర .ఇక్కడే దిగి ఇంట్లోకి రావచ్చు .

పిచ్చయ్య గారి దంపతుల ఆతిధ్యం

పిచ్చయ్య గారికి వ్యవసాయం ఉంది .ఎడ్లు బండీ పాలేర్లు ఆవులు  గేదెలు ఉన్నాయి వీటితోపాటు మేకలూ గొర్రెలూ ఉండేవి .నారాయణ అనే పాలేరు నల్లగా ఉండేవాడు. లుంగీతో ఉండేవాడు స్లాక్ వేసేవాడు. వారింట్లో అన్నిపనులు చేసేవాడు .తెల్లవారగానే భారతమ్మగారు అతనితో కప్పూ సాసరు తోకాఫీ పంపేవారు. వారింట్లో ఇడ్లీలు చేస్తే టిఫిన్ పంపేవారు ఇంట్లో ఎవరైనా బంధువులు కాని పార్టీ వాళ్ళు కాని వస్తే వారి తో బాటు నాకూ మళ్ళీ కాఫీ వచ్చేది .మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వస్తే టీ పంపేవారు .ఉదయం తోమ్మిదిన్తికోసారి కాఫీ వచ్చేది .సాయంత్రం మళ్ళీ ఇటికి రాగానే టీ పంపేవారు .నేను పాలు కొనేవాడిని కాదు అంటే కొన నివ్వలేదు నాకుకావలసిన పాలు అరలీటరు వారే పంపేవారు నేను కూడా కాఫీ పెట్టుకొని కావా ల్సినప్పుడు తాగేవాడిని . పొద్దునా రాత్రి గడ్డ పెరుగు పంపేవారు .నాకు ఏ లోటు లేకుండా స్వంత పిల్లాడిలాగా చూసుకొన్నారు .ఆ దంపతులు వారిద్దరి మాటలూ కొంత పడమటి యాస తో ఉండేది .మాస్టరు గారూ అని ఆప్యాయం గా ఇద్దరూ పిలిచేవారు .ఇంటికొచ్చిన వారందరికీ నన్ను పరిచయం చేసేవారు వారి స్వంత మనిషిగా చూసుకొన్నారు .ఇంతటి ఆప్యాయత నాకు మహాశ్చర్యం గా ఉండేది .మేస్టారు అంటే వారికున్న గౌరవం అది .

కమ్మ వారే అయినా పిచ్చయ్య దంపతులు ఏంతో అభిమానం కనపరచారు .నాకు ఎప్పటికప్పుడు ఏం కావాలో పాలేరు నారాయణ్ తో అడిగించి ఏ లోటూ రాకుండా చూశారు  .వాళ్లకు ఇద్దరబ్బాయిలు ఒక అమ్మాయి .అమ్మాయిని మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేశారు. పెద్దబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగం ప్రసాద్ రెండవ వాడు .వీడు చాలా సాత్వికుడు .నోటిలో నాలుకలా ఉండేవాడు .నెమ్మది పిల్లాడు ఎర్రగా పొడుగ్గా సన్నగా ఉండేవాడు మాట కూడా నేమ్మదే .చదువులో బాగా వెనక పడి ఉన్నాడు .వీడికి ప్రత్యేకం గా చెప్పి తీర్చి దిద్దాల్సి వచ్చేది .అలానే చేసేవాడిని భారతమ్మ గారి పుట్టిల్లు దగ్గరలోనే ఉన్న భీమవరం .తలిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు .పెనుగంచిప్రోలుకు భీమవరం మీదుగా వెళ్ళచ్చు . .

కనపర్తి శేషగిరిరావు గారనే ఆయన కాంగ్రెస్ పార్టీ వారు .ఆయన మండలాధ్యక్షునిగా పని చేశారు .పిచ్చయ్యగారికి కజిన్ .పార్టీలు వేరైనా మంచి సంబంధ  బాంధవ్యాలు ఉండేవి  .రెండుకుటుంబాల మధ్య .ఏదో ఒక ఫంక్షన్ కు శేషగిరిరావు గారింటికి వెళ్ళిన జ్ఞాపకం .ఇంటిముందే ఇంకో రాజకీయ నాయకుడు ఉండేవాడు .పేచీకోరు మనిషిగా ఉండేవాడు కుక్కను పెంచేవాడు. పిచ్చయ్యగారికే పెంపుడుకుక్క ఉండేది .ఇంట్లో బోర్ వేసి నీటిగొట్టాల ద్వారా  సరఫరా పెట్టుకొన్నారు  ఇలా ఉన్న ఇళ్ళు  ఒకటో రెండో ఉన్నాయి గండ్రాయిలో .సెప్టిక్ లెట్రిన్ కూడా ఉం. అదీ పిచ్చయ్యగారిప్రత్యేకత . తెల్ల పాలిస్టర్ పంచెను లుంగీ గా కట్టి పైన స్లాక్ తొడిగి ఉండే వారేప్పుడు. ఎర్రగా కుదిమట్టం గా నవ్వు ముఖం తో కనిపించేవారు .భారతమ్మ గారు కొంచెం పొడగరి .నేతచీరే తో పెద్ద బొట్టు తో మహా లక్ష్మిగా కనిపించేవారు .మేడలో మంగళ సూత్రం తప్ప ఏ ఆభరణాలు పెట్టుకోగా నేను చూడలేదు .వాకిట్లో పిచ్చయ్య గారి స్వర్గీయ తలిదండ్రుల పెద్ద ఫోటోలున్నాయి .వాటికి వాడని పూల దండలు ఉండేవి బొట్టు పెట్టిఉ౦డేవి  .కోళ్ళు  ఎప్పుడూ మేస్తూ తిరుగుతూ ఉండేవి .బంధువులు వచ్చినప్పుడు వాటిపని గోవిందా .గంపల కింద కోళ్ళు ఉండేవి తెల్లవారుజ్హామునే కోడికూతలతో హడావిడి మొదలయ్యేది.

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-15 –ఉయ్యూరు

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మా ఊరి రామయలమే నాకు సంగీతం నేర్పింది -స్వర వీణా పాణి

మా ఊరి రామయలమే నాకు సంగీతం నేర్పింది

‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగానరసం ఫణి’.
పసిబిడ్డలను, పశుపక్ష్యాదులను సైతం రంజింపజేసేది సంగీతం అన్నది దానర్థం. 12 స్వరాల పునాదులపై 72 మేళకర్తరాగాల సమాహారమే సంగీతం. కానీ ఎంతోమంది గొప్ప విద్వాంసులు సైతం మేళకర్తరాగాలను సులభశైలిలోకి తీసుకురాలేకపోయారు. ఆ పని చేయడంలో సఫలీకృతుడయ్యారు ‘స్వర వీణాపాణి’. చిన్నారులు కూడా తేలిగ్గా సంగీతస్వరాలను నేర్చుకోవాలంటున్న ఆయన
పదహారేళ్లపాటు కఠోర సాధన చేసి 72 మేళకర్త రాగాల సమ్మేళన ప్రయోగం చేశారు. ఆ ప్రయాణంలో తన అనుభవాలను ‘నవ్య’తో ముచ్చటించారాయన..
‘‘మాది గుంటూరు జిల్లా రావెల. అమ్మా నాన్నలు ఓగేటి అన్నపూర్ణమ్మ, లక్ష్మీనరసింహశాసి్త్ర. నాన్న ఎలిమెంటరీ స్కూల్లో హెడ్‌మాస్టర్‌. ఆయనకు సంగీతమంటే మహాపిచ్చి. అందుకే సిరిపురం నుంచి నాజర్‌ అనే సన్నాయి వాయిద్యకారుణ్ని పిలిపించుకుని సంగీత సాధన చేసేవారు. ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్న ఆయన కొన్ని వందలమందికి సంగీతపాఠాలు నేర్పారు. మేం ఐదుగురం సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరికీ నాన్న సంగీతం నేర్పారు. అయితే అందరికన్నా నేనే ఆసక్తిగా సంగీతం నేర్చుకున్నాను.
‘‘అరవయ్యేళ్ల క్రితం మంగళంపల్లి వారు ఒక్కో రాగంలో ఒక్కో కీర్తన పాడి రికార్డు చేశారు. అన్ని రాగాల్లో కీర్తనలు పాడింది మంగళంపల్లివారొక్కరే. ఇంతవరకూ మళ్లీ ఆ సాహసానికి ఎవ్వరూ పూనుకోలేదు. అలాంటిది ఆరు నిమిషాల్లో 72 మేళకర్తరాగాలంటే ఆయనెలా అంగీకరిస్తారు? అయినా ఈ ప్రయోగం వినేందుకు మంగళంపల్లి గారు ఒప్పుకున్నారు. భయంతోనే ఆయన వద్దకు వెళ్లాను. నోట్సు ఆయన చేతిలో పెట్టి ఆలపించాను’’
మా ఊరే గుర్తించింది..
మా ఊరి రామాలయం మైకులో ప్రతిరోజూ భజనపాటలు పాడుతుండేవారు. నేను, మా నాన్న కూడా పాటలు పాడుతూ హార్మోనియం వాయించేవాళ్లం. మా చుట్టుపక్కల గ్రామాల్లో భజన బృందాల పోటీలు జరుగుతుండేవి. మా వూరి బృందం కూడా పోటీలకు వెళ్లేది. ఒక్కోసారి మా బృందం ఓడిపోయేదశలో వున్నప్పుడు నేను ఆశువుగా పాటలు పాడేవాణ్ని. దాంతో మేం గెలిచేవాళ్లం. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతంతో పాటు సాహిత్యమూ కొంత అబ్బింది. చిన్నప్పుడే నేను 108 పాటలు రాశాను. అన్నీ అంజనీపుత్రునిపైనే. ఆ పాటలు విని చాలామంది మెచ్చుకుంటుండేవారు. అయితే గుంటూరులోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదివేందుకు చేరినప్పుడు ఉత్సాహం కొద్దీ ఆ పాటల్ని నాటి ప్రిన్సిపల్‌ పొన్నెకంటి హనుమంతరావుగారికి ఎలా వున్నాయో చూడమని ఇచ్చాను.. ఆయన అవి చదివి నన్ను అభినందించారు. ఇంటర్‌లో వున్నప్పుడే నేను గణేశునిపై ఒక పాట రాశాను. ఆ పాట ఇప్పటికీ మావూరి ఆలయంలో పాడుతున్నారు. ‘గుడి- బడికి వెళ్లేటప్పుడు నా పాటలు పనికొస్తాయా?ఎవరైనా పాడతారా?’ అని అనుకునేవాణ్ని. కానీ ఆ తరువాతి కాలంలో నా ఆలోచన కార్యరూపం దాల్చింది. ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల వంటివారు నేను రాసిన పాటల్ని, నేను స్వరపరచిన పాటల్ని ఆలపించారు. అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను. మావూరి ఆలయంలో ‘ఏకాహం’ జరిగేది. అంటే ఒక రాగం తీసుకుని ‘హరే రామ.. హరే కృష్ణ…’ అంటూ పాడేవారు. దానిని నాన్నగారు 4 గంటల పాటు నిరంతరాయంగా పాడేవారు. అందరూ అచ్చెరువొందేవారు. అదే నాకు స్ఫూర్తి. ‘సప్తస్వరాల్ని 4 గంటల పాటు ఎలా చెబుతున్నారు’ అన్న ఆలోచనే నా ఈ ఆరు నిమిషాల్లో 72 మేళకర్తల ప్రయోగానికి స్ఫూర్తి.
హార్మొనీతోనే కాలం..
కాలేజీలో చేరినా హార్మొనీ సాధనను మాత్రం వీడలేదు. విద్యార్థులకు నాటకాలు వేయడం నేర్పుతూనే వాటికి హార్మోనియం వాయించేవాణ్ని. దాంతో వచ్చే డబ్బుతో నేను చదువుకునేవాణ్ని. అనంతరం బీకాం తరువాత వేలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో ‘లా’ చేశాను. అక్కడ నైట్‌ కాలేజీలో సీటు వచ్చింది. అయితే రాత్రిళ్లు నాటకాలకు హార్మొనియం వాయించేందుకు వెళ్లే నాకు నైట్‌ కాలేజీ అంటే కుదిరేపనేనా? అందుకే ప్రిన్సిపల్‌ వద్దకెళ్లి డే కాలేజీలో సీటివ్వాలని అడిగాను. నా విన్నపాన్ని విన్నతరువాత ఆయన డే కాలేజీకి మార్చారు. దాంతో పగలు కాలేజీ, రాత్రి నాటకాలతో కాలం గడిచిపోయింది. అలా కొన్నాళ్లకు ‘లా’ పూర్తి చేశాను. గుంటూరు జిల్లా కోర్టులో, మున్సిబుకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలెట్టాను. అయితే ఏదో అసంతృప్తి. అది మనకు సరైన మార్గం కాదన్న భావన నిత్యం నాలో అలజడి రేపుతుండేది. అప్పుడు కూడా నాటకాలకు హార్మొనీ వాయించడం మానలేదు. అప్పుడు భక్తి సంగీతం నుంచి లలిత సంగీతం వైపు మనసు మళ్లింది. నేనే పాటలు రాసి నేనే కంపోజ్‌ చేయడం మొదలుపెట్టాను. కొన్ని ఆల్బమ్స్‌ కూడా చేశాను.
హైదరాబాద్‌కి మకాం
ఆ తరువాత మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చాను. ఇక్కడ కనిపించిన వారికి నా ఆల్బమ్‌ క్యాసెట్లు ఇస్తుండేవాణ్ని. ఓసారి తనికెళ్ల భరణిగారు పరిచయం అయ్యారు. నా సంగీతం, పని తీరు నచ్చి ఓరోజు తనకు సంగీతం నేర్పమని అడిగారాయన. నాకు పెద్దగా సంగీతం రాదంటే ‘నీకు సంగీతం వచ్చో, రాదో నాకు తెలుసు. నువ్వు నేర్పు’ అన్నారు. నేను కూడా మా నాన్న తరహాలోనే (కోపమొస్తే కొట్టడం) నేర్పుతానన్నాను. దాంతో ఆయన వారి పిల్లలతో సహా సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు (నవ్వుతూ). సంగీతదర్శకత్వం వహించాలన్న నా కోరిక విని ఓ రోజు దర్శకుడు శివనాగేశ్వరరావ్‌ని పిలిచి అవకాశం ఇవ్వాలని చెప్పారు భరణిగారు. శివనాగేశ్వరరావ్‌కు నా పాట వినిపించాను. అప్పటికి ఆయన ఏ సినిమా అనుకోలేదు. కానీ పాట వినగానే ఆయనే నాకు డబ్బు ఇచ్చేశారు. ఆ తరువాత ‘పట్టుకోండి చూద్దాం’ సినిమాకు అవకాశం ఇచ్చారు. దాంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.
స్వరవీణాపాణిగా నేను..
ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నా అసలు పేరు ఓగేటి నాగవెంకట రమణమూర్తి. కానీ మొదటి సినిమా సమయంలో పేరు బాగా లేదని మంచి పేరు పెట్టాలని శివనాగేశ్వరరావ్‌గారు భరణిగారిని అడిగారు. ఓ రోజు నేను భరణిగారి పిల్లలకు సంగీత పాఠాలు చెబుతుండగా.. పూజమందిరం నుంచి ‘వరవీణా మృదుపాణి…’ అంటూ పాటపాడుకుంటూ వచ్చిన ఆయన ‘నీ పేరు వీణాపాణి’ అన్నారు. అప్పటి నుంచి అదే నా పేరుగా మారిపోయింది. ఆ తరువాత ‘దేవస్థానం’ సినిమా సమయంలో దర్శకుడు జనార్ధనమహర్షి నాకు ‘స్వరవీణాపాణి’ అని పేరు పెట్టారు. అదే నాకు స్థిరమైపోయింది. నేను ‘పట్టుకోండి చూద్దాం’, ‘దేవస్థానం’, ‘ఆల్‌రౌండర్‌’, ‘టైంపాస్‌’, ‘సిరా’ సినిమాలకు దర్శకత్వం వహించాను. అయినా ఏదో అసంతృప్తి. భరణిగారు అప్పుడప్పుడూ ‘సంగీతంలో ఏదైనా మీరు కొత్తగా చేయాలండీ’ అంటుండేవారు.
72 మేళకర్త రాగాలు..
ఏ పనిలో నిమగ్నమైనా ఏదో అసంతృప్తిగా వుండేది. ప్రపంచ సంగీతానికి 12 స్వరచక్రాలే పునాదులు. సంగీతంలోని మొత్తం 72 మేళకర్తల్ని 12 చక్రాలుగా కుదించారు. ఒక్కో చక్రానికి ఆరేసి మేళకర్తలుంటాయి. ఆ మేళకర్త రాగాలను ఒక్కోదాన్ని ఒక్కో గంటపాటు అంటే 72 గంటల పాటు వుండేలా కంపోజ్‌ చేశా. అలా దానిపై సాధన చేస్తూనే వున్నా. నా ప్రయోగానికి తనికెళ్ల భరణిగారే తొలిశ్రోత. ‘చాలా బాగా చేశావ్‌. కానీ ఎవరైనా పెద్దవారు వింటే బావుంటుంది’ అని సూచించారు. ఆయన సలహాతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు మోహనకృష్ణ వద్దకెళ్లి నా ప్రయోగాన్ని వినిపించాను. వెంటనే మంగళంపల్లివారికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు. ఆ మాట విని ఆయన కొట్టిపారేశారు. అది అసాధ్యమని తేల్చేశారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. అరవయ్యేళ్ల క్రితం మంగళంపల్లి వారు ఒక్కో రాగంలో ఒక్కో కీర్తన పాడి రికార్డు చేశారు. అన్ని రాగాల్లో కీర్తనలు పాడింది మంగళంపల్లివారొక్కరే. ఇంతవరకూ మళ్లీ ఆ సాహసానికి ఎవ్వరూ పూనుకోలేదు. అలాంటిది ఆరు నిమిషాల్లో 72 మేళకర్తరాగాలంటే ఆయనెలా అంగీకరిస్తారు? అయినా ఈ ప్రయోగం వినేందుకు మంగళంపల్లి గారు ఒప్పుకున్నారు. భయంతోనే ఆయన వద్దకు వెళ్లాను. నోట్సు ఆయన చేతిలో పెట్టి ఆలపించాను. ‘ఛీ, పో. ఇది సంగీతమే కాదు!’ అని ఆయన అంటారని నిర్ణయించేసుకున్నాను. క్షణాలు గడిచేకొద్దీ ఆయన ఏమంటారోనని గుండె కొట్టుకుంటున్న తరుణంలో ‘భారతీయ సంగీతానికి ఇది గేట్‌ వే’ అన్నారాయన. ఇక నా ఆనందం చెప్పనలవి కాలేదు. ఆ తరువాత నన్ను దగ్గరకు తీసుకున్నారు. ‘‘నేనూ చేశాను. ఈ రాగాల్ని ఆలపించాను. కానీ నువ్వు చేసింది అసామాన్యం. సమాజం నేర్చుకోవడానికి సులువుగా వుంది. దీనిని నేనూ పాడతా’’ అన్నారు. ఆ తరువాత దేశంలోని మహాసంగీత మేధావులందరి వద్దకెళ్లీ నా సాధనను వినిపించాను.
ఇది జనాల్లో ప్రాచుర్యం పొందేందుకు 72 మంది సంగీత విద్వాంసులు, గాయనీగాయకుల చేత ఈ 72 రాగాల్ని పాడించాలన్నది నా కోరిక. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడే ఇది ప్రపంచవ్యాప్తమవుతుంది. ‘స్వరనిధి సంగీత విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేసి ఔత్సాహికులందరికీ సంగీతం ఉచితంగా అందించాలన్నది కూడా నా లక్ష్యం. నా ఈ ప్రయోగం గురించి తెలిసి నార్త్‌ టెక్సాస్‌ యూనివర్శిటీ వారు పరిశోధన కోసం పిలిచారు. త్వరలోనే అక్కడకు వెళ్లబోతున్నాను. ఆ యూనివర్శిటీ నుంచి పరిశోధనకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుణ్ని నేనే.
స్వరవీణాపాణి మొబైల్‌ నెంబర్‌: 09848498344
ఈమెయిల్‌:swaraveenapani@gmail.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్వుల ముని పుంగవుడు “ఏం ఎస్ ” -ప్రసాద మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షేత్రాలు పై డా ఇప్పలూరి సాయిబాబా గారి స్పందన

isaibaba 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-2

అస్తిత్వ వాద పిత   -సోరేన్ కీర్క్ గార్డ్

పందొమ్మిదవ శతాబ్దపు డేనిష్ వేదాంతి కీర్క్ గార్డ్ .జీవితకాలం లో బాగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు .అసలుపేరు సోరెన్ ఆబె కీర్క్ గార్డ్ .దాదాపు మూడు వందల సంవత్సరాలు అతన్ని అందరూ మర్చేపోయారు .ఆ తర్వాత అతని గొప్ప తనాన్ని తెలుసుకొని ఆరాధించటం ప్రారంభించారు .క్రైస్తవ మిస్టిక్ గా భావించారు. ఆయన చెప్పిన కొత్త వేదాంతం చాలా వ్యతిరేకతను పొందింది .అస్తిత్వవాదాన్ని తెరపైకి తెచ్చాడు .5-5-1813లో కోపెన్ హాగెన్ లో జన్మించిన నూట ఇరవై నాలుగు ఏళ్ళ వరకు ఆయన రాసిన దానికి దేనికీ ఇంగ్లీష్ అనువాదం రాలేదు .ఆయన గురించిన కనీస సమాచారమూ తెలియనే లేదు .అదృష్టం బాగుండి 1940 లో ఆయన ప్రతిభను గుర్తించి సెయింట్ ఆగస్టేన్ తర్వాత కీర్క్ గార్డ్ వంటి మాట ప్రవక్త ,మనస్తత్వ శాస్త్ర వేత్త జన్మించలేదని ప్రశంసించారు  .చర్చి ధోరణిలోని నిరంకుశత్వాన్ని ఎదిరించాడాయన . కఠిన నియమ నిబంధనలను కాదన్నాడు .

తండ్రి గొప్ప పవిత్ర వ్యాపార వేత్తయే కాని ప్రైవేట్ జీవితం లో పెద్ద పాపి .కొడుకును మతం లోకి లాగే ప్రయత్నం చేశాడు .నరక లోకం అగ్ని గురించి చెప్పి భయ పెట్టేవాడు తండ్రి ..ఆ వాతావరణం అతనికి సరిపడలేదు .’’నేను పుట్టినప్పుడే ముసలివాడిని .’’అని చెప్పుకున్నాడు .తనకు పసితనం బాల్యం యవ్వనం దూరమైనాయని వ్యధ చెందేవాడు .తండ్రి అంటే భయం కోపం పగ ద్వేషం అతనిలో నరనరాన వ్యాపించాయి దీనితో ఏ ఆనందాన్ని అనుభవించలేక పోయాడు .ప్రేమించటం అంటే ఏమిటో తెలియనే తెలియదు .అమ్మాయిలూ ఐ లవ్ యు  చెప్పినా  ,ఆ మధురానుభూతి కలిగేదికాదు .ప్రేమించిన అమ్మాయి ఈయన దగ్గర్నుంచి లవ్ సిగ్నల్స్ రాకపోతే వేరోకడిని పెళ్లి చేసేసుకోన్నది .ఈ భావాలను ఒక గొప్ప రచనగా ‘’యైదర్ ఆర్’’పేరిట రాశాడు .

మత వేదాంతం పై  ద్రుష్టి పెంచుకొని మారుపేర్లతో  వరుసగా అనేక గ్రంధాలు రాశాడు .అందులో ‘’ది కాన్సెప్ట్ ఆఫ్ ఐరనీ ‘’,ఫియర్ అండ్  ట్రెం బ్లింగ్ ‘’,వగైరాలున్నాయి .అతని దృష్టిలో ప్రతి నిర్ణయం రిస్క్ తో కూడినదే .అనంతత్వం చేతిలో నడిచే మనిషి తన నిర్ణయాన్ని సర్వం –శూన్యం ల మధ్య ఏదో దాన్ని ఎన్నుకోవాలి అన్నాడు .ఈ భావాన్నే  ఇబ్సన్ ‘’బ్రాండ్ ‘’మొదలైన నాటకాలలో ప్రతిఫలింప జేశాడు .ముప్ఫై వ ఏట మత తత్వ శాస్త్రాన్ని గురించి తీవ్రం గా ఆలోచించి రాశాడు. ఈ భావాలు పాశ్చాత్య బుర్రల్ని వేడెక్కించింది కలవరపరచింది .వ్యంగ్యం, సందేశం కలగా పులగం చేసి విజ్రుమ్భించి రాశాడు .వ్యవస్తీక్రుతమైన ప్రతి వ్యవస్థ మీద తిరగబడ్డాడు .అధిక్షేపణ, అవహేళన లతో వారి మన స్తిమి తాన్ని దెబ్బ తీశాడు .యాంత్రిక యుగం లో మనిషి నిస్సహాయుడే కాకుండా నిరాశా వాదిగా మారిపోతున్నాడని బాధ పడ్డాడు .’’man became helpless and hopeless ‘’అన్నాడు .మనిషికి ఉన్న ఒకే ఒక ఆశ ఏమిటంటే తన ఉనికిని అర్ధం చేసుకోవటం మాత్రమె అని చెప్పాడు .మత బోధనలు ఆచారాలు మనిషిని దేవుడి దగ్గరకు చేర్చలేవని మనిషి స్వయం గా సూటిగా భగవంతునితో సంబంధం పెట్టుకోన్నప్పుడే అది సాధ్యం అన్నాడు .మనిషికి ఉన్న జ్ఞానం తెలివి తేటలు అతని అణకువ కు నిదర్శనం గా ఉండాలన్నాడు . వాటిని త్యాగం చేసుకొని దేవుని సమీపాన్ని పొందాలి అని చెప్పాడు .’’the existent individual is not a Being but a Becoming ‘’అనే సత్యాన్ని విశదీకరించాడు .క్రైస్తవ మతం కూడా ‘’is a Becoming –an endless progress through anxiety ,in security ,and suffering .It ceases to be Christianity when it sinks complacently into peace of mind ‘’అని రావాల్సిన మార్పును ఖచ్చితం గా సూచించాడు కీర్క్ గార్డ్ .

క్రైస్తవ ఫాదరీల దౌష్ట్యాన్ని ,అవివేకాన్ని ,పెత్తనాన్ని ,డబ్బు మనస్తత్వాన్ని ఎండగట్టాడు .యేసు క్రీస్తు చెప్పిన పరమ సత్యాలను వీరందరూ నీరు గార్చి స్వంత వ్యాఖ్యానాలతో ప్రజలకు మతాన్ని దూరం చేస్తున్నారన్నాడు ‘’.చర్చి క్రిష్టియానిటీని పూర్తిగా బహిష్కరించింది –‘’Church has practically abolished Christianity in the name of Christ ‘ అని నిర్మోహ మాతం గా చెప్పాడు  కీర్క్ గార్డ్ .క్రీస్తును అడ్డం పెట్టుకొని ఆడే దొంగాటల వల్ల క్రైస్తవం పరువు గంగలో కలుస్తోందని వాపోయాడు .మత పెత్తనం పై విమర్శగా ‘’అటాక్ అపాన్ క్రిసేండం ‘’రాశాడు .మతాధికారుల పద్ద్ధతి ఎలా ఉందంటే ‘’for them Christianity does not exist –and yet they live on it ‘’అని కడిగిపారేశాడు .

సమకాలీన జీవితం లో అసంబద్ధతను వ్యతిరేకించి తిరస్కరించి ప్రక్షాళన కోసం పాటుబడ్డ మత వేదాంతిగా కీర్క్ గార్డ్ చరిత్ర పుటల్లో నిలిచాడు .ఈ విధం గా ఇ౦త నిర్మోహ మాటం గా మాట్లాడితే మతపెద్దలు సాహిస్తారా? ఎదిరించారు అణగ దొక్కే ప్రయత్నాలు చేశారు .పత్రికల వాళ్ళూ ఎదురు దాడి చేశారు .కార్టూనిస్ట్ లకు చేతినిండా పని దొరికింది .ఆయన బాహ్య ఆక్రుతిపై వ్యంగ్యాత్మక కధనాలు కార్టూన్లు గుప్పించారు కీర్క్ గార్డ్  సిం ప్లిసిటి ని ,హుమిలిటిని కోరాడు .’’man is a social paradox ,he is his own reason for being and yet he is nothing without the transcendent power of God .’’అని మనిషి శక్తిని చెప్పాడు. మనిషి కాలం లో జీవిస్తాడని ,కాని అతను తప్పకుండా కాలాతీతమైన భావన కలిగిఉండాలని ,ఉత్క్రుస్టత వైపు పయనం సాగించాలని మానవ మేధకు పరిమితికి మించిన జ్ఞానాన్ని పొందే ప్రయత్నం నిర౦ తరం చేయాలని కోరాడు .

తాను ఏమి కోరుకొంటున్నాడో చెబుతూ ‘’what I require is a voice as piercing as a lynx;s eye ,as terrible as the sigh of a giant ,as persistent as a cry of nature in order to deliver my self of what is in my mind ,to shake the bowels of anger ,sympathy ,and understanding .అన్నాడు .పరిస్తితులు చాలా తెలికైపోయాయని వాటిని కస్ట తరం చేసే ప్రయత్నాలు కావాలని కోరుకొన్నాడు కర్క్ గార్డ్ .ఇంతగొప్ప వేదాంతి నలభై మూడవ ఏట రోడ్డుమీద నడుస్తూ మూర్చ వచ్చిపడి పోయాడు .చూసిన వారు ఆస్పత్రిలో చేర్చారు అప్పటికే నడుమునుంచి క కింది భాగ మంతా పక్షవాతం వచ్చింది కదలలేని పరిస్తితి .మళ్ళీ గుండెపోటు వచ్చి 11-11-1855లో కర్క్  గార్డ్ నలభై మూడవ ఏట మరణించాడు .

సందట్లో సడేమియా లా మత పెద్దలు తమను కీర్క్  గార్డ్ వ్యతిరేకించ బట్టే పక్షవాతం పాలైనడని తమ పక్షపాత బుద్ధి పొని చ్చుకోకుండా కూశారు .తగిన శాస్తి జరిగిందని సంబరాలు చేసుకొన్నారు .సమకాలీనుల మెప్పు పొందక పోయినా ఈ కాలం లో కర్క్ గార్డ్ తిరుగులేని మత వేదాంతిగా ఆరాధింప బడుతున్నాడు .’’వాస్తవం ‘’పై ప్రశ్నలు సంధించాడు .అతని భావనలు ఆధారం గ ఫ్రాంక్ కాఫ్కా , ధామస్ మాన్ లు అనేక రచనలు చేసి గుర్తింపు పొందారు .నకిలీ  క్రైస్తవాన్ని ఎదిరించాడు .’’mans affirming existence is greater than all the concepts of his intellect ‘అన్నది కీర్క్  గార్డ్ నిశ్చితాభిప్రాయం .దీన్ని ఆధారం చేసుకొని నోబెల్ ప్రైజ్ విన్నర్ జీన్ పాల్ సాత్రే అస్తిత్వవాదాన్ని అభి వృద్ధి చేశాడు . ఆధునిక మానవుడు ప్రకృతికి దూరమైపోతున్నాడని ,శాస్త్ర సాంకేతికలతో భగవంతుని నుండి తొలగిపోయాడని కీర్క్  గార్డ్ బాధ పడ్డాడు .’’ఇవాళ మానవుడు ఒక స్థాన భ్రంశం చెందిన మనిషి –displaced person ‘’అని సానుభూతి చెందాడు .

A head-and-shoulders portrait sketch of a young man in his twenties that emphasizes his face, full hair, open and forward-looking eyes and a hint of a smile. His attire is a formal necktie and lapel.

A signature, in a foward-slanting cursive script, which reads "S. Kierkegaard."

కీర్క్ గార్డ్ ప్రభావం మనవ మనస్తత్వ శాస్త్రం మీద చాలా ఉంది .క్రిస్టియన్ సైకాలజీ .ఎక్సిస్టేన్షియల్ సైకాలజీ, థెరపీలకు ఆద్యుడు .అస్తిత్వవాదమే మానవ వాదం అన్నాడు ‘ఫాదర్ ఆఫ్ ఎక్సిం స్టేలిజం ‘’అంటారు గార్డ్ ను .అస్తిత్వ వాదం తో మతాన్ని కొత్తమలుపు తిప్పిని ,దేవునికి మనిషికి మధ్య చర్చి చర్చిపెద్దలు అడ్డుగోడాలని భావించి ఆ గోడల్ని కూల ద్రోసె ప్రయత్నం చేసి చరిత్ర ప్రసిద్ధుడైనాడు కీర్క్ గార్డ్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమేపల్లి కదా పురస్కార సభ 1-2-15 ఆదివారం ఉదయం ప 10 గం విజయవాడ ప్రెస్ క్లబ్ లో

some1 001 some2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం

బ్రహ్మాండం-తరంగాల క్షేత్రం

aprabha –   Tue, 27 Jan 2015, IST

సృష్టికి ఉత్పత్తికి మూలకారణం చైతన్యశక్తి. ఈ చైతన్య శక్తి మనిషిలో బుద్ధి రూపంలో ఉంటుంది. దీని కారణంగానే ప్రపంచంలో మనిషి రకరకాలుగా అభివృద్ధి సాధిస్తున్నాడు. వివేకం, విచక్షన కూడా ఉన్నందువల్లే అతడు ఉచి తాను చితాలను, సరియైన నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ, అనుభవం తోడయ్యే, వివేకం, ఆలోచనాశక్తి పెరుగుతాయి. ఇతర ప్రాణుల్లో ఈ శక్తి లేని కారణంగా, అవి మనుష్యుల్లాగా చింతన, మన నం చేయలేవు.

పైన తెలిపిన చేతనాశక్తి బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది ఉంది. బుద్ధి నుండి ఉత్పన్నమయ్యే తరంవగాల్ని ఈ చైతన్యమే తనలో నిలుపుకుంటుంది. ప్రతి బుద్ధి నుండి వెలువడే తరంగాలు వేరువేరు ఫ్రీకెన్సీల్లో వెలువడతాయి. సృష్టిలో ఎన్ని మస్తిష్కాలు (బుద్ధులు) ఉన్నాయో అన్నివేర్వేరు ఫ్రీకెన్సీలు ఉంటాయి. బ్రహ్మాండంలో అంతా, వేర్వేరు ఫ్రీకెన్సీల్లో, బుద్ధి నుండి వెలువడే తరంగాలు అన్ని వేళలా వ్యాపిస్తూ ఉంటాయి.

బుద్ధి నుండి తరంగాలు ఉత్పన్నం అవుతాయి, అలాగే అదే బుద్ధి తరంగాల్ని గ్రహిస్తుంది కూడా. బుద్ధి ద్వారా మనం చేసే ఆలోచనలు, కలిగే భావాలు, ఊహించే కల్పనలు, తీసుకునే సంకల్పాలు, అన్నీ తరంగా లుగా మారి బ్రహ్మాండమంతా వ్యాపిస్తాయి. వీటినే ఏదో ఒక బుద్ధి గ్రహిస్తుంది. గ్రహించి ఆ తరంగాల్లో వుండే ఆలోచనల ప్రకారం బుద్ధిలో ఆలోచనలు రేకెత్తుతూ ఉంటాయి. విశేషమైన పనుల ప్రభావంలో ఒకేరకమైన తరంగాలు కొన్ని విశేష స్థానాల్లో గుమిగూడుతాయి. ఈ కారణంగా ఆయా స్థానాల్లో వాటి ప్రభావం బాగా పడుతుంది. ఎలాంటే మనం కనుక గుడికి వెళ్తేనో లేదా ఎవరైనా సాధువు- మహాత్ముల దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడో మన ఆలోచనలు పరిశుద్ధంగా, సాత్వికంగా అవుతాయి. అదే మనం కనుక బాగా జనసమర్థం ఉన్న చోటికి వెళ్లినప్పుడు, అంటే హోటల్‌ లేక పిక్చర్‌ హౌస్‌కి వెళ్లినపుడు మన ఆలోచనలు, భావాలు భౌతిక విషయాలవైపు ఎక్కువగా ఆకర్షించబడ తాయి. పైన తెలిపిన రహస్యం తెలియని కారణంగా మనిషి, తరంగాల ద్వారా గ్రహించిన ఆలోచనల్ని తన స్వంత ఆలోచనలుగా భావిస్తారు. ఈ శాస్త్రంలో భాగంగానే భావతరంగాలు కూడా బ్రహ్మాండంలో ఎల్లప్పుడూ వ్యాపించి ఉండడం వల్ల, ప్రతి మనిషీ ఎవరో ఒకరిని భావతరంగాల్ని గ్రహించి, అలా గ్రహించిన భావనల ప్రకారంగా స్వయంగా భావించుకుని, ఆ భావన తనదనే అనుకుంటాడు. బుద్ధి నుండి స్వీయభావనే కాక ఇతరుల భావనలు కూడా బ్రహ్మాండం నుండి గ్రహించబడతాయి. సాధారణంగా మానవునికి తన భావన ఏదో, మరి స్వీకరించిన పరుల భావం ఏదో అతనికి తెలియదు.

ధ్యానాదుల్లో నిమగ్నమైన వ్యక్తుల బుద్ధి, బ్రహ్మాండ తరంగాల చేత తక్కువగా ప్రభావితమై ఉన్నందున వారికి భావనలు ఎలా ఉత్పన్నమౌతాయో, ఉత్పన్నమైనవి వారివో కావో లేక బుద్ధి ద్వారా బయటనుండి గ్రహించబడినవో లేవో కూడా వారికి తెలుస్తుంది. అలాగే వారికి తమ మస్తిష్కం నుండి ఉత్పన్నమైన ఆలోచనలు వారి స్వంతమూ లేక బయటనుండి గ్రహించబడినవా అనే విషయం కూడా వారిక తెలుస్తుంది.

బుద్ధిలో, ఆలోచనలు, భావాలు, చింతనలు, చైతన్య శక్తి కారణంగా ఉత్పన్నమై, తిరిగి ఆ చైతన్యవ్యక్తిలోనే తరంగ రూపంలో ఉంటాయి. ఇవే తరంగాలు తిరిగి మరో మస్తిష్కం లోకి ప్రవేశిస్తాయి. ఆ బుద్ధి తన స్వభావ, సంస్కారాల్ని బట్టి, ఆ విషయంలో కలతబడడమో లేక బాగా చింతన-మననం చేయడమో చేస్తుంది. ఇదే క్రమం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎంతగా విస్తరిస్తుంది అంటే ఎవరూ దీని గురించి ఇంత అని అంచనావేయలేరు.

బ్రహ్మాండంలో సదా-సర్వదా ఈ తరంగాలు వ్యాపించి ఉండడం కారణంగా దాన్ని ‘తరంగాల క్షేత్రం’ అని కూడా అనవచ్చును. ఇవన్నీ కూడా చైతన్యశక్తి కారణంగా జరగడం వల్ల దాన్ని చైతన్యక్షేత్రం అని కూడా అనవచ్చును. ఈ క్షేత్రంలో అన్ని రకాల మంచి చెడు ఆలోచనల- భావాల తరంగాలుంటాయి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా సత్‌-రజ, తమో గుణాలుగా విభజించవచ్చు. దీనినే ‘త్రిగుణాత్మక ప్రకృతి’ అని కూడా అంటారు. ఈ ప్రపంచం లోని ప్రతి ప్రాణీ కూడా ఈ మూడుగుణాల్లోని ఏదో ఒకగుణంతో ప్రతి క్షణం ప్రభావితం అయ్యి, దాని ప్రకారంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అజ్ఞానవ శాత్తూ, మోహించిన ఆ భావాన్ని తన భావంగా భావించుకుని హర్షమో, శోకమో ఏదో ఒకటి వ్యక్త పరుస్తారు. ఆ భావం బ్రహ్మాండంలోంచి తన బుద్ధి స్వీకరించిందని గాని, తదనుసారంగా తాను కర్మలను ఆచరిస్తున్నానని గాని అతనికి బోధపడదు.

ఈ సత్‌-అసత్‌(మంచి-చెడు) భావాల కారణంగా ఉత్పన్నమయ్యే హర్షశోకాలనుండి తప్పించుకోడానికై కొన్నిమార్గాలున్నాయి. ఒకటి ధ్యానం, రెండోది, ఆ భావనలను తనవికావు అని భావించడం. ఆలోచనలు భావాలు తరంగరూపంలో బ్రహ్మాండంలో ఉన్నట్లుగా గ్రహించి వాటిని బుద్ధిద్వారా గ్రహించి దర్శించడం, చైతన్యశక్తి చేసే పనుల్ని గమనించడం చేయాలి. చైతన్యశక్తి ఏ విధంగా బుద్ధి ద్వారా ఆలోచనల్ని భావాల్ని ఉత్పన్నం చేస్తుందో, వాటినెలా మార్చి తరంగాల రూపంలో తనలో ఉంచుకుంటుందో, ఎలా వేరేబుద్ధిలో ప్రవేశపెడుతుందో కూడా గమనించాలి. ఈ విధంగా బ్రహ్మాండంలో ఉన్న చైతన్యశక్తికి సంబంధించిన ఈ లీలామయ కార్యాన్ని (లీలను) చూడాలి.

గీతలో చైతన్యశక్తి యొక్క విధానాన్ని ఇలా వర్ణించడం జరిగింది:

బుద్ధిర్‌ జ్ఞానం అసంమోహ: క్షమా సత్యం దయా శమ:

సుఖం దు:ఖం భవో భావో భయం చాభయమేవ చ

అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశ:

భవన్తి భావం భూతానాం మత్తేవ పృథిగ్విధా:

నిర్ణయాత్మకశక్తి, యథార్థజ్ఞానం, అసమూఢత్వం, క్షమ, సత్యం, ఇంద్రియాల్ని వశపరచుకోవడం, మనోనిగ్రహం, సుఖదు:ఖాలు, ఉత్పత్తి-ప్రళయాలు, భయాభయాలు, అహింస, సమత్వం, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి – ఇలా ఈ ప్రాణుల రకరకాల భావాలు నా ద్వారానే చైతన్య శక్తిద్వారానే ఉత్పన్నమౌతాయి.

– సద్గురు రమేష్‌ జైన్‌

9908075971

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడు కవితలు

గేటు దగ్గర

  • – పి.శ్రీనివాస్ గౌడ్ 9949429449
  • 26/01/2015
TAGS:

గేటు దగ్గర-
పొగ మంచులా
బతుకు భారం

గేటు పడాలని..
గేటు పడకూడదని
ఎవరి తొక్కిడి వారిది

ఒకడికి గేటు తీస్తే-
నోట్లో ముద్ద
నేల రాలినట్టు

ఒకడికి గేటు వేస్తే-
అందే ద్రాక్ష
పుల్లనవుతున్నట్టు

ఒకేపు చిరువ్యాపారులు-
మరోవైపు వాహనదారులు
జీవన ఘర్షణ
రైలెళ్లిపోతోంది-
తాపత్రయాలు
చప్పబడుతాయి

గమనం సాగుతుంది-
పిట్టలన్నీ
తలో దిక్కు

ఒక్కోసారి
గేటు పడుతుండాలి-
జీవితం కళ్ళబడుతుంది
ఒక్కోసారి
గేటు తీసుండాలి
జీవితం తుళ్లిపడుతుంది

గేటు ఒక ప్రతీక
హెచ్చరిక..
ఆగి, మెల్లిగా, సాగడానికి…

నిశ్శబ్ద రాత్రిలోకి..

  • – బి.కళాగోపాల్, 9441631029
  • 26/01/2015
TAGS:

అన్ని శబ్దాలు నిశ్శబ్దంలోకి ఆవాహన అయ్యాక..
దిగులు తరకలా ఒంటిమీదినుండి
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన కొత్త బొమ్మ నాదేమోనని
ఆయాస ప్రయాసలలో కాలం నన్ను
కొండ చిలువై మింగేస్తోంది!
మిగిలిన క్షణాలను బతికిన క్షణాల్లోకి ఒంపుకుంటూ,
ది థింకర్‌లా ఎనే్నళ్లని? ఎన్నాళ్లని
అట్టానే నిరీక్షించనూ?
చూశావా సోక్రటీసు నిర్భీతి ఆత్మపరాగం
మృత్యుకళికలోకి..
వివర్ణ వర్ణమేదో కన్నులముందు
అగరొత్తుల పొగను వెలిగించింది
ఇల్లు వాకిలి, ఆలుబిడ్డలను వదలి
బుద్ధుని జ్ఞాన సమాధిలోకి..
అత్తరు పరిమళాల్లో నిద్రిస్తున్న
మరో మెహంజదారో
కుటీర వాటికలోకి పయనమవుతున్నా!
ఏం జరుగుతుంది పిమ్మట?
రోములస్ శకమేదైనా
ప్రారంభమవుతుందనుకున్నావా?
వెర్రివాని నవ్వులా జనం లోలోన
విరగబడి నవ్వుతూ…
పైకి మాత్రం ఉదాసీన ముఖాల ముసుగేసుకొని,
నాలుక చివరన వ్రేలాడే మాటల్లో
చివరి కన్నీటి చుక్కను జారుస్తారు
అయినా.. నేను మాత్రం అక్షర నక్షత్రమై
విశ్వమహాదర్పణంలో వెలిగిపోతాను!!
పునః పునః అంకురార్పణకై..
ఏ ఊదా

4అలల వాకిట్లో

  • – కొమురవెల్లి అంజయ్య 9985411090
  • 26/01/2015
TAGS:

సముద్రం వాకిట్లోకి వెళ్లా
సోపతి కలుపుకుందామని
కాళ్లకు పాలనురుగు నీళ్లు
కడుక్కోమన్న అలల హృదయం
నాలుగడుగులు ముందుకేశానా
ధైర్యం చాలని వెనకడుగు
అలల ప్రేమ వడి అందని దరి
నన్ను నేను పరిచయం చేసుకోకముందే
పరిచయ పత్రాలతో అందరి నిరీక్షణ
సముద్రుని ఆతిథ్యం గుండెల్లో ఉద్వేగం
***
కాళ్ల దగ్గర అంబాడుతున్న
చిన్నారులు అలలు
ఉయ్యాలలూగుతున్న బాల్యం కలలు
పొరలు పొరలుగా స్మృతులు, కథనాలు
విచ్చుకున్న తీపి చేదుల ప్రయాణం
తెప్పరిల్లితే కాళ్లకు ఉప్పద్దిన అలలు
కళ్లల్లోంచి జారే నీటి బొట్లు
నలుగురికి పంచడానికి ఉప్పస
దుమారం రేపితే ఉప్పెన
ఆనందాశృవుల ఉప్పందించడానికి
కళ్ల భాషల కదలికలు
కడుపులో కదలని సల్ల
కాయకష్టం తీపి తెల్వని వల
శ్రమ సంగీతం అలజడి రేపకముందే
చెమట జలల్ని ఒడ్డున పడేస్తున్న శరీరం
***
ఆందోళనల సుడిగుండాల్లో
కడుపు కల్లోల సముద్రం
నిద్రపట్టని రాత్రి ‘పగ’లు
ఊహలకందని ఉద్యమాల ధ్వనులు
కాళ్లు చేతులాడనివ్వని అలల జోరు
***
నలువైపులా సముద్రమే
నీటి నడుమ ఉప్పు ద్వీపంలా నేను
సాగర జలాల సమ్మోహన శక్తి
అందని సముద్రం లోతులు
మనిషి చేష్టలు

Related Article

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదర్శ ఎక్సిబిషన్ సొసైటీ -హైదరాబాద్ ”నుమాయిష్ ”

నుమాయిష్…తగ్గని జోష్

  • 25/01/2015
  • -బి.శ్రీధర్

ఓ పది రూపాయలతో అక్కడ మీకు నచ్చిన ఓ వస్తువు కొనుక్కోవచ్చు. జేబు నిండుగా ఉండి, మీ హోదాకు తగ్గట్టు ఖరీదైన వస్తువులనే తీసుకోవాలంటే వేయి రూపాయలకూ మీకు నచ్చిన ఐటెం అక్కడ దొరుకుతుంది. వాటితోపాటు కావలసినంత ఆనందమూ మీకు లభ్యమవుతుంది. మీతోపాటు వచ్చినవారికీ బోలెడంత వినోదం దక్కుతుంది. ఇవన్నీ ఒక్కచోటే దొరుకుతాయంటే మీరు నమ్మాలి. నమ్మకం లేకపోతే హైదరాబాద్‌లోని నుమాయిష్‌కు వెళ్లి రావాలి. ఇంటిల్లిపాదీ కలసి వెళ్లి ఆనందాన్ని ఆస్వాదించి హాయిగా ఇంటికి వెళ్లగలిగేలా వినోదాన్ని అందించే ప్రాంతం అది. హైదరాబాద్ నుమాయిష్ కు మరోపేరు నాంపల్లి ఎగ్జిబిషన్. పాత, కొత్తతరాల్ని ఆకర్షిస్తున్న అద్భుత వేదిక. కార్పొరేట్ కల్చర్ ఆక్రమణలను తట్టుకుని, షాపింగ్ మాల్ సంస్కృతిని ఢీకొట్టి ఏటేటా పెద్దసంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న నుమాయిష్ వనె్న తరగని వ్యాపారకూడలి. ఆనందాల కడలి. అక్కడ అడుగుపెట్టిన మీరు కాశ్మీర్ శాలువలు, కుంకుమపువ్వు, అరబ్బులు నేసిన రగ్గులు, ఇరానీ ఖర్జూరాలు, పాక్ కళాఖండాలు… ఒకటేమిటి మీకు కావలసిన గుండుసూదినుంచి అత్యాధునిక గృహోపకరణాలు… ఏమైనా అక్కడ లభిస్తాయి. ఓ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వారివారి వయసును బట్టి, వారి అవసరాలకు తగ్గ వస్తువులన్నీ చౌకగా అక్కడ కొనుక్కోవచ్చు. అబ్బబ్బ…ఎంతసేపూ ఈ కొనడం, అమ్మడమేనా…మరీ రోజులు వ్యాపారమయమైపోయాయన్పిస్తే…అలా మరో పది అడుగులు ముందుకు వేయండి…తన్మయత్వంతో సాగే ముషాయిరాలో కవితల ఆలాపన వీనులవిందు చేస్తాయి. వహ్వా..వహ్వా అంటూ సాగే అభినందనలూ హుషారెత్తిస్తాయి. నాటకాలు, నాటికలూ అలరిస్తాయి. ఆ రంగం మీకు ఇష్టం లేదా… మరోవైపు అడుగులు వేయండి…అజయ్ జైస్వాల్ రేడియో స్టేషన్ మిమ్మల్ని పలకరిస్తుంది. హైదరాబాద్‌తో మమేకమైన హిందీ పాటలు,…అదీ మీకు అందుబాటులో లేనివి, పాతవి వినాలనుకుంటే ఆయన మీకు విన్పిస్తారు. కిషోర్‌కుమార్, మహమ్మద్ రఫీ, మన్నాడే గీతాలను ఆస్వాదిస్తూ మిమ్మల్ని మీరు మరచిపోతే మీతోపాటు వచ్చిన ఇల్లాలు, పిల్లలు ఊరుకోరు కనుక మరో నాలుగైదు అడుగులు వేయాల్సిందే. అప్పుడక్కడ టాయ్ ట్రెయిన్, జెయింట్‌వీల్ కన్పిస్తాయి. మీరు వాటిని చూసేలోగానే మీ పిల్లాజెల్లా అవి ఎక్కడమో, ఎక్కాలని గోల చేయడమో ఖాయం. అక్కడున్న జనం, ఉత్సాహం, మీవాళ్ల ఉత్సుకత చూశాక మీరు మాత్రం వెనక్కు తగ్గుతారేంటి. చలోచలో అంటూ మీరూ చిన్నపిల్లలైపోతారు. కొంచెం డబ్బు…కాస్తంత తీరిక…కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఉబలాటం మీకుంటే ఓ సారి నుమాయిష్‌కు వెళ్లిరావొచ్చు. ఆ తరువాత వద్దన్నా వెళ్లాలని మీరు తపించకపోతే అది హైదరాబాద్ ఎగ్జిబిషనే కాదు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పాతిక ఎకరాల స్థలంలో 2575 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశవిదేశాలనుంచి వివిధ సంస్థలు, వ్యక్తులు తమ ఉత్పత్తులను విక్రయిస్తారు.ఇక్కడ దొరికే అరుదైన, అబ్బురమైన, చౌకైన వస్తువులను కొనేందుకు, చూసేందుకు హైదరాబాదీలు తరలివస్తారు. దీనినే నుమాయిష్‌గా పిలుస్తున్నారు. హైదరాబాద్ పేరు చెబితే భోజన ప్రియులకు బిర్యానీ గుర్తొస్తుంది… సాహితీ ప్రియులకు ముషాయిరాలు, సంగీతసాహిత్య చర్చాగోష్టులు గుర్తుకువస్తాయి…ఇలా వారి ఇష్టాయిష్టాలను బట్టి నగరంతో ఏదో ఒక అనుబంధం హృదయాన్ని మీటుతూనే ఉంటాయి. కానీ ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని అందించే ఓ వేదిక హైదరాబాద్‌లో ఉందంటే..అదే నుమాయిష్. ప్రతి ఆంగ్ల సంవత్సరాదితో ప్రారంభమయ్యే ఈ వేడుక నలభై ఐదు రోజులు సాగుతుంది. రోజులు గడుస్తున్నకొద్దీ కొత్త సొగసుతో, ప్రజల కిటకిటతో కళకళలాడుతుంది. అరె అప్పుడే అయిపోయిందా అని ఏటా జనం అనుకునేట్లు అలరించే ఈ వేడుకే నుమాయిష్. 1938లో… సరిగ్గా డెబ్భై అయిదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సంస్థానం పరిథిలో ఆర్థికసర్వే చేయాలని భావించారు. కానీ అది చేయడానికి నిధులు లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొందరు ఇక్కడ తయారు చేసిన వస్తువులను అమ్మేందుకు ఓ ఎగ్జిబిషన్ నిర్వహించాలని, తద్వారా నిధులు సేకరించాలని ముందుకొచ్చారు. అలావచ్చిన నిధులతో సర్వే చేసి, మిగతా సొమ్ముతో మహిళలకు చదువు చెప్పించాలని నిర్ణయించారు. అప్పటికే పబ్లిక్‌గార్డెన్‌లో నిజాం నిర్వహించిన సిల్వర్‌జూబ్లీ నుమాయిష్‌కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పడగొట్టవద్దని, అందులో తాము మరో ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటామని కోరారు. అలా తొలిసారిగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ల ఆధ్వర్యంలో తొలి నుమాయిష్ నిర్వహించారు. ఇది అక్టోబర్, 1938నాటి మాట. కేవలం రూ. 2.50లతో, ఆరు స్టాల్స్‌తో, పదిరోజులపాటు తొలి ప్రదర్శన జరిగింది. వరుసగా మూడేళ్లు, ఏటా అక్టోబర్‌లో ఈ ఎగ్జిబిషన్ కొనసాగాక, క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ రాష్ట్ర ఏడవ నిజాం తొలి ప్రదర్శనను ప్రారంభించారు. 1946లో హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్ సర్ మీర్జాఇస్మాయిల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 32 ఎకరాల స్థలాన్ని ఎగ్జిబిషన్‌కోసం కేటాయించారు. తరువాతికాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ సంస్థానం విలీనం వివాదాలతో 1947,48లలో నుమాయిష్ నిర్వహించలేదు. 1949తరువాత ఇప్పటివరకు ఎగ్జిబిషన్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. 1949లో భారత తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నుమాయిష్‌ను ప్రారంభించారు. ఆ ఏడాదినుంచి దీనిని ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పిలుస్తున్నప్పటికీ 2009లో నుమాయిష్ అన్న పేరును పునరుద్ధరించారు. రికార్డుల్లో ఏ పేరున్నా జనం నోట్లో మాత్రం నుమాయిష్ లేదా నాంపల్లి ఎగ్జిబిషన్ అన్న పదాలే పలుకుతాయి. ఎన్నో మార్పులు కాలానుగుణంగా నుమాయిష్ నిర్వహణలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపారకోణంలోనే కాకుండా సేవాదృక్పథంతో పనిచేస్తోంది. ఏటేటా కనీసం వంద స్టాల్స్ పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా సందర్శకుల సంఖ్య కనీసం లక్ష పెరుగుతోంది. లాభాలూ బాగా వస్తున్నాయి. 1960లో ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పది పైసలుంటే ఇప్పుడు ఇరవై రూపాయలుంది. మహిళలకు, చిన్నారులకోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయిస్తున్నారు. కేవలం క్రయవిక్రయాలే కాకుండా సందర్శకులకు వినోదాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తి,శ్రద్ధ ఉన్నా అందుకు తగిన ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఎగ్జిబిషన్ సొసైటీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 20 కళాశాలలను నిర్వహిస్తూ మధ్య తరగతి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇస్తోంది. సరికొత్త జోష్! ఏడాదికోసారి జరిగే నుమాయిష్‌లో పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్, బంగ్లాదేశ్‌సహా పది పదిహేను దేశాలకు చెందిన సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈసారి ఏర్పాటు చేసిన 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు పాకిస్తాన్ దూరంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ నుమాయిష్‌కు సందర్శకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకే ఎగ్జిబిషన్ ప్రారంభమైనా ఐదయ్యేసరికి ఊపందుకుంటుంది. రాత్రి పది గంటల వరకు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వచ్చే నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనకు ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి నాలుగున్నర లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రదర్శన ప్రారంభమైన కొత్తలో అంతంతమాత్రంగా ఉన్న సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి సెలవు కావటంతో ఆ ఒక్కరోజే 70వేల మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు సొసైటీ గౌరవ కార్యదర్శి పి.నరోత్తమ్ రెడ్డి చెప్పారు. చిన్నారులకోసం అమ్యూజ్‌మెంట్ జోన్ పారిశ్రామిక ప్రదర్శన ముఖ్యంగా చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తొంది. ఇక్కడి అమ్యూజ్‌మెంట్ జోన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న జెయింట్ వీల్స్, కొలంబస్, వెల్ ఆఫ్ డెత్, కప్ సాసర్, క్యామిల్, బౌన్సర్, రేంజర్, రంగులరాట్నం వంటివి చిన్నారులను ఆకట్టుకుంటాయి. కేవలం ఈ జోన్ 150 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్గుతోంది. సాహస విన్యాసాలతో సందర్శకులను అబ్బురపరుస్తున్న డేర్ డ్రైవర్లు, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న చుక్ చుక్ రైలుతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన చారిత్రక కట్టడాల నమూనాలు, హస్తకళాఖండాలు సందర్శకుల ఆదరణను పొందుతున్నాయి. ఐటి కార్పొరేట్, విద్యా, వైద్య సంస్థలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కూడా సందర్శకులు కిటకిటలాడుతున్నారు. ఎగ్జిబిషన్‌లో హిందీపాటలను ఇష్టపడేవారికోసం జైశ్వాల్ రేడియోస్టేషన్ విన్పించే పాతపాటలు రోజునుబట్టి, జనంరద్దీని బట్టి, సమయాన్ని బట్టి మారిపోతూంటాయి. జనం మూడ్‌నుబట్టి పాటలను విన్పిస్తారు. కానీ ఎగ్జిబిషన్ ముగుస్తున్న సమయంలో పాకిజాలోని చల్తేచల్తే కోయి మిల్‌గయా పాటను ప్రసారం చేస్తారు. ఆ తరువాత చిరాగ్ భుజ్హ్రేహైన్…కామెంట్ తో స్టాల్స్ నిర్వాహకులను హెచ్చరిస్తారు. ఇక స్టాల్స్‌ను మూసేయాలని సూచించడం ఓ ఆనవాయితీ. నుమాయిష్ సందర్శన ముగిసిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సందర్శకులు చేరేందుకు వీలుగా ఆర్టీసి అర్థరాత్రి వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. భద్రత ఎంత? 45 రోజుల ప్రదర్శనకు సుమారు 23 నుంచి 24లక్షల మంది హాజరవుతారని అంచనా. ప్రతిరోజు కనిష్ఠంగా 20వేలమంది, గరిష్ఠంగా లక్ష మంది హాజరయ్యే నుమాయష్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రౌండ్ లోపల ముప్పై చెక్ పోస్టులు, అడుగడుగున నిఘా, ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేసినా ఎప్పటికపుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. నుమాయిష్ ప్రారంభమైనప్పటినుంచి రెండంచెల్లో భద్రతను కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో భద్రతలోని డొల్లతనాన్ని పోలీసులు వెల్లడిచేయడంతో సొసైటీ అప్రమత్తమైంది. మెయిన్ గేట్ల వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రయివేటు మార్షల్స్‌ను నియమించింది. ఆటాపాటా..పోటీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించటంతోపాటు సందర్శకుల్లోని విభిన్న కళ, క్రీడాంశాలకు సంబంధించిన ప్రతిభను ప్రోత్సహించటంలో కూడా ఎగ్జిబిషన్ సొసైటీ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. చిన్నారులు, మహిళలకు రంగోలీ, యువతీయువలకు క్రీడాపోటీలు నిర్వహిస్తోంది. వెల్‌బేబీ షో, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేగాక, ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న కాలేజీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నుమాయిష్ జరిగే రోజుల్లోనే పతకాలను బహుకరిస్తూ ప్రోత్సహిస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం కేవలం విద్యాలయాల నిర్వహణకే పరిమితం కాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులకు ఆపన్న హస్తం అందజేస్తోంది. ఇటీవల జమ్ముకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ. 20 లక్షలను ఆర్థిక సహాయంగా అందజేసింది. అంతేగాక, పోలీసుల సంక్షేమానికి ఏటా రూ. 10 లక్షలు, ఫైర్ విభాగానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సొసైటీ తన ఉదారతను చాటుకుంటోంది. తాజాగా ఈ సారి హైదరాబాద్ పాతబస్తీలోని గౌలీపురా, మొఘల్‌పురాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకుంది. తొలి దిశగా వీటిలో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ. 10 లక్షలను వెచ్చిస్తోంది. అంతేగాక, భాస్కర మెడికల్ కాలేజీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పేద విద్యార్థినికి వార్షిక ఫీజు చెల్లించింది. * గిరాకీ ఇంకా పెరగాలి! మేము 30 ఏళ్ల నుంచి ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం తొలి పది నుంచి పదిహేను రోజుల్లో అమ్మకాలు ఊపందుకునేవి. ఈ సారి స్టాల్‌ను సందర్శించే వారి సంఖ్య అశాజనకంగానే ఉన్నా, కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వ్యాపారపరంగా కాకుండా ఏ ఉత్పత్తికైనా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశమున్నందునే ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం! -ఇంతియాజ్ (కాశ్మీర్ గీటు నగల వ్యాపారి) ఎగ్జిబిషన్ అదుర్స్‌నుమాయిష్ చాలా బాగుంది. హైటెక్ సిటీ సమీపంలోని మైండ్ స్పేస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేం, స్నేహితులు శశికాంత్, పావెల్, రమణలతో కలిసి వచ్చాం. అన్ని ప్రాంతాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే లోపలికి రావటం, బయటకు వెళ్లటమే కొంత ఇబ్బందిగా మారింది. ఇక్కడున్న అన్ని స్టాళ్లను చూస్తాం. చైతన్య, దివ్య ఐటి ఉద్యోగులు కాశ్మీర్ నగలకు డిమాండ్ మేం ఆర్లేళ నుంచి పారిశ్రామిక ప్రదర్శనలో స్టాల్‌ను పెడుతున్నాం. ప్రతిసారికూడా తొలి పదిహేను రోజులు పెద్దగా అమ్మకాలుండవు. ఈ సారి కూడా సరిగ్గా ఇదే జరిగింది. సంక్రాంతి నుంచి అమ్మకాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. కాశ్మీర్ సంప్రదాయ నగలకు ఆదరణ దక్కుతోంది. కొనుగోలుదారులే కాకుండా మిగతావారూ ఈ నగల గురించి వివరాలు తెలుసుకోవడం ఆనందంగా ఉంది. మీర్ తాసిర్ రషీద్ ఎస్‌కెవై కాశ్మీర్ జ్యుయెలరీ యజమాని ఇది చాలదు…ఇంకా పుంజుకోవాలి పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా, ఇంత వరకు కనీసం రూ. 10వేల సరుకు అమ్మలేకపోయాం. మునుపటితో పోలిస్తే కొనుగోలుదారుల సంఖ్య తగ్గింది. వ్యాపారం బాగా సాగుతుందన్న నమ్మకంతో రాజస్థాన్‌నుంచి ఇక్కడికొచ్చాం. మావెంట వచ్చిన నిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. అహ్మద్ రాజస్థాన్ చెప్పుల వ్యాపారి విభజన ప్రభావం కన్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన నేను ప్రతి సంవత్సరం హ్యాండ్లూమ్ స్టాల్‌ను ఏర్పాటు చేస్తుంటాను. కానీ ఎపుడూ లేని విధంగా ఈ సారి అమ్మకాలు బాగా తగ్గాయి. ఇందుకు రాష్ట్ర విభజనే కారణం. హ్యాండ్లూమ్ కొనుగోలుపై నగరవాసులు ఎంతో మక్కువ చూపుతారని, వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండ్లూమ్స్ అందుబాటులోకి తెచ్చాం. కానీ తాము ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగటం లేదు. -మూల్‌చంద్ కేశ్వాని హ్యాండ్లూమ్ వ్యాపారి ప్రతి సారి వస్తాం! అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను తిలకించేందుకు నేను, మా కుటుంబ సభ్యులు ప్రతి సారి వస్తాం! గతంతో పోల్చితే ఈ సారి స్టాళ్ల సంఖ్యను పెరిగింది. సందర్శకుల సౌకర్యాలపై సొసైటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తం నుమాయిష్ చూడాలంటే ఒక రోజు సమయం సరిపోదు. తీరిగ్గా ఉన్నపుడు మళ్లీ వస్తాం. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే నగరవాసులు కుటుంబ సమేతంగా సేదదీరే వేదిక నుమాయిష్. నర్సింగ్‌రావు, మాధవి దంపతులు లెక్చరల్, విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఘట్‌కేసర్ సందర్శకుల సంఖ్య 5 లక్షలు దాటింది! అఖిల భారత 75వ పారిశ్రామిక ప్రదర్శనకు ఆశించిన స్థాయిలోనే ఆదరణ కన్పిస్తోంది. జనవరి 16 మధ్యాహ్నం నాటికి సందర్శకుల సంఖ్య 5లక్షలకు దాటింది. గతంలో పరిస్థితులను పోల్చితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎక్కడా కూడా అంగుళం స్థలం వృథా కాకుండా స్టాళ్లను ఏర్పాటు చేసినా, వ్యాపారస్తుల డిమాండ్ మేరకు స్టాళ్లను అందుబాటులో తేలేకపోయాం. బహుళజాతి సంస్థలు, షాపింగ్ మాల్స్, చిన్నాచితకా ఎగ్జిబిషన్లు వచ్చినా నాంపల్లి నుమాయిష్‌కు ఆదరణ తగ్గలేదు. పైగా ఏటేటా ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరం మొత్తం ప్రదర్శన జరిగిన 45 రోజుల్లో 23లక్షల మంది సందర్శకులు హాజరుకాగా, ప్రస్తుతం వస్తున్న ఆదరణను బట్టి ఈ సారి కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి పి. నరోత్తమ్‌రెడ్డి అప్పుడు…ఇప్పుడు 1938లో తొలి ప్రదర్శన ఆరు స్టాల్సుతో, మూడు రోజులు నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తులను విక్రయించాలని అప్పుడు భావించారు. ఇప్పుడు 75వ ఏట 2575 స్టాళ్లతో, దేశవిదేశాల వస్తువులను విక్రయిస్తున్నారు. అప్పుడు వారానికోసారి మహిళలకోసం ఎగ్జిబిషన్ ప్రత్యేకిస్తే ఇప్పుడు మొత్తంమీద ఒక్కరోజు వారికోసమే కేటాయించారు. పిల్లలకు ఓ రోజు కేటాయించారు. రోజులు మారినా, కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగినా, షాపింగ్ మాల్స్ వెల్లువెత్తినా సంప్రదాయ వస్తువులు దొరికే నుమాయిష్‌కు నానాటికీ ఆదరణ పెరుగుతూనే ఉంది. గత ఏడాది ఎగ్జిబిషన్‌ను 21 లక్షలమంది సందర్శించారు. గతేడాదికన్నా ఈ సారి 100 స్టాల్సు ఎక్కువ పెట్టారు. ఈ ఏడాది సందర్శకుల సంఖ్య 23-24 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఎగ్జిబిషన్ సొసైటీకి 11 కోట్ల లాభం వచ్చింది. ఈసారి మరో కోటి రూపాయలు లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి బస్సులు పారిశ్రామిక ప్రదర్శన జరిగినన్నీ రోజులు ప్రయాణికులకు అనుకూలంగా ఆర్టీసి బస్సులను నడుతోంది. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు సందర్శన సమయం కావటంతో చాలామంది తమ వృత్తి, ఉద్యోగాలను ముగించుకుని కుటుంబ సమేతంగా ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో సందర్శనానంతరం వారు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు వీలుగా అర్థరాత్రి వరకు ఆర్టీసి బస్సులను నడుపుతున్నాం. మామూలు రోజుల్లో రద్దీని బట్టి దాదాపు 120, ఇక సెలవురోజుల్లో అదనంగా 60 అంటే మొత్తం 180 బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతున్నాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతాం. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ జి.జయరావ్ టిఎస్ ఆర్టీసీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మశ్రీ ”హాస్యం కోట”కు సెట్ పై ఘన సత్కారం

కోటకు ఘనసత్కారం.. (26-Jan-2015)

నటనకు అర్ధం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన నటనను ఎంత వాడైనా పొగాడాల్సిందే. నటనకు నిలువెత్తు నిదర్శనం కోట శ్రీనివాసరావు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కేంద్రం కోటకు పద్మశ్రీ ప్రకటించడంతో….‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్ర బృందమంతా కోటకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రంలో కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో యూనిట్‌ సభ్యులందరూ ఆయనకు విషెస్‌ తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్న కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు నటి స్నేహలతో పాటు నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ కోటకు శాలువా కప్పి ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం ఎస్ పై తోటపల్లి మధు మరియు -అరసవెల్లి సూర్య నారాయణ దర్శనం



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply or Forward
10.54 GB (70%) of 15 GB used
©2015 GoogleTermsPrivacy
Last account activity: 15 hours ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

Family

https://plus.google.com/u/0/_/streamwidgets/canvas

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్స్ర్టూ నిస్ట్ రచయితా ఆర్ కె లక్ష్మణ్ మరణం


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -84 గండ్రాయి హైస్కూల్ లో చేరిక

నా దారి తీరు -84

గండ్రాయి హైస్కూల్ లో చేరిక

ఆత్కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి వేసవి సెలవలలో 24 -4-86నుండి 30-4-86 వరకు ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి హైస్కూల్ లో చేరటానికి ఏప్రిల్ ముప్ఫై వ తేదీన ఉయ్యూరు నుండి బయల్దేరి గండ్రాయి కి విజయవాడ వెళ్లి అక్కడినుండి జగ్గయ్య పేట బస్ ఎక్కి ,అక్కడినుండి వల్లభి బస్ ఎక్కి షేర్ మహమ్మద్ పేట మీదుగా గండ్రాయి హైస్కూల్ దగ్గర స్టాప్ లో దిగా. ఎండ అదిరిపోతోంది .అప్పటి దాకా గండ్రాయి ఎక్కడ ఉందొ తెలీదు తెలుసుకొని వెళ్లాను .లాస్ట్ వర్కింగ్ డే కనుక జీతాలు చెక్కు మార్చి ఇచ్చేరోజు .నేను వెళ్లేసరికి హెడ్ మాస్టారు లేరు .జీతాల చెక్ మార్చటానికి జగ్గయ్య పేట వెళ్ళారని నైట్ వాచర్  చెప్పాడు .అక్కడే బల్లమీదో కుర్చీలోనో కూర్చున్నా.సాయంత్రం నాలుగింటికి హెడ్ మాస్టారు శ్రీ పి.వి సుబ్రహ్మణ్యం గారు ,గుమాస్తా  అటెండర్ వచ్చారు .జీతాలు తీసుకోవటానికి కొద్దిమంది మేస్టార్లు కూడా వచ్చారు .నా ట్రాన్స్ ఫర్ వలన  అప్పటిదాకా గంద్రాయిలో పని చేసిన సైన్స్ టీచర్ హూస్ట్ అయిందని ముందే రాశాను .ఆమె కూడాస్వగ్రామం బందరు నుంచి  జీతాలకోసం వచ్చింది .పరిచయం అయింది .సారీ చెప్పాను .హెడ్ మాస్టారి గార్ని పరిచయం చేసుకొని  విషయం చెప్పి నా జాయింగ్ రిపోర్ట్ అందించాను .వారు వెంటనే  హాజరు పట్టీ లో   రాసి నా సంతకం పెట్టించారు .నేను ఏప్రిల్ ముప్ఫైవ తేదీ సాయంత్రం గంద్రాయిలో డ్యూటీలో చేరినట్లు అయిందన్నమాట .

హెడ్ గారు చాలా మర్యాదస్తులు బ్రాహ్మణులు .జగ్గయ్య పేటలో స్వంత ఇంట్లోనే ఉండి రోజూ గండ్రాయికి అప్ అండ్ డౌన్ బస్ లో చేస్తారు .ముఖం కొంచెం స్పోటకం పోసినట్లుంటుంది నవ్వుముఖం .బ్లూ కలర్ లేక ఖాకీ కలర్ పాంటు ఖద్దరు ఫుల్ చేతుల షర్ట్ ధరిస్తారు .అక్కడ వారు చెప్పిన దాన్నిబట్టి జగ్గయ్య పేటలో వారికి లెక్కల టీచర్ గా మంచి పేరుంది .ఆయన శిష్యులు ఆయనమీద ఉన్న గౌరవం భక్తికి నిదర్శనం గా ఒక డాబా ఇల్లు కట్టించి కానుకగా ఇచ్చారు .చుట్టుప్రక్కల హెడ్ మాస్టర్లలో తలలో నాలుకగా ఉంటారు. రూల్స్ అన్నీ ధరో.ఇక్కడ టెన్త్ క్లాస్ కు ఇంగ్లీష్ బోధిస్తున్నారు  ఈ స్కూల్ లో అన్నీ సింగిల్ సేక్షన్లే .స్త్రెంగ్థ్ మూడు వందల లోపే .ఒక లెక్కల మేస్టారు ఒక సైన్సు ఒక సోషల్ ,హిందీపండిట్ తెలుగుపండిట్ ,డ్రాయింగు డ్రిల్లు క్రాఫ్ట్ మేష్టారు  ఇద్దరు సేకండరీగ్రేడ్ మాస్టర్లు ఉన్నారు .ఒక గుమాస్తా .ఇదీ స్టాఫ్ .క్రాఫ్ట్ మేస్టారు వెంకటేశ్వర రావు స్టాఫ్ సెక్రెటరి లైబ్రరీ ఇంచార్జి కూడా .ఒక చిన్న లాబరేటరి ఉంది .దాన్ని వాడిన పాపాన పోయినట్లు అనిపించలేదు .స్కూలు రోడ్డు మీదే ఉంది .కాంపౌండ్ వాల్ లేదు .మంచిప్లె గ్రౌండ్ ఉంది కాని ముళ్ళమయం .రూములన్నీ రేకుల షెడ్ లే అని గుర్తు .సరే ఇక చేరాముకనుక ఉండటానికి ఎలా అనే ఆలోచన .ఇంతలో ఆ వూరి మాజీ ప్రెసిడెంట్ కనుపర్తి ఆయన  ,స్కూలుకు చాలాకావలసిన వాడు అయిన ఒకాయన వచ్చాడు .మల్లు పంచే లుంగీతో  పరిచయం చేసుకొన్నాడు .ఇక్కడ అంతా బాగా ఉంటుందని పిల్లలకు ట్యూషన్ చెప్పే వారు లేరని ఇక్కడే ఉంటె పిల్లలకు బాగా ఉపయోగం గా ఉంటుందని అన్నారు  ఆయన్ను అందరూ ‘’మాజీ గారు ‘’అంటారు ఆలోచనలో పడ్డాను సోషల్ లెక్కల మేష్టర్లూ హెడ్ మాస్టారు జగ్గయ్యపేట నుంచి వస్తారు .కనుక పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారు లేరు .నాకు ఇక్కడి వాతావరణం అంతా కొత్తగా ఉంది .మంచినీరు దొరకదు .వేడిప్రదేశం కాకిరాయికి గండ్రాయి బాగా ప్రసిద్ధి అని విన్నాను చదివాను .ఫామిలీ పెట్టె ఆలోచన ఎలానో లేదు .ఏం చేయాలి ? రిఒపెనింగ్ రోజున వస్తానని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని ఉయ్యూరు బయల్దేరా .

జగ్గయ్య పేటలో మా బుల్లిమామ్మ మనుమడు వెలమకన్ని శోభనాద్రీశ్వర రావు అనే శోభనాద్రి వాళ్ళు సీతారాం పురం లో ఉంటారు .కనుక వాళ్లకు ఒక సారి కనిపించి వెడదామని అనుకోని జగ్గయ్య పేట దిగి బస్ స్టాండ్ కు దగ్గరలోనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లాను .సత్యవతి పిన్ని శోభనాద్రి భార్య రాముడు భార్య అందరూ కలిసే ఉంటున్నారు పెద్ద ఇల్లే .గంద్డ్రాయిలో చేరానని స్కూల్ తెరిచే నాటికి మళ్ళీ వస్తానని చెప్పాను ఎక్కడా ఉండద్దు వాళ్ళింట్లోనే ఉండి రోజూ గండ్రాయి వెళ్లి రావచ్చునని భోజనం వసతి అంతా వాళ్ళ ఇంట్లోనే అని వాళ్ళంతా చాలా ఆప్యాయం గా చెప్పారు .కాదనటం ఎందుకని సరేనన్నాను  .ఇక్కడ ఉండి కొన్ని రోజులు వెడుతూ గండ్రాయిలో ఒక రూమ్ తీసుకొని ఉండవచ్చు అని నా ఆలోచన .కనుక ఆవాసానికి వెళ్లి రావటానికి ఇబ్బంది లేదు .’’ఏ బ్లెస్ ఐ  దిస్గైజ్ ‘’ వాళ్ళనుంచి బస్ స్టాండ్ కు వెళ్లి బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు రాత్రికి చేరుకొన్నాను .

ఇప్పటికే నేను హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ ఒక్క పేపర్ మినహా అన్నీ పాసై ఉన్నాను అదీ రాశాను రిజల్ట్ రావటం దాదాపుగా సంవత్సర ఆలస్యం .అయింది మధ్యలో సమ్మెలు హడావిడి తో అంతా అనుకోని డిలే .ఏ నెలలోనైనా రిజల్ట్ రావచ్చు .వస్తే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వస్తుంది .కనుక గండ్రాయి నుంచి మళ్ళీ ఉయ్యూరు వైపుకు ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాను. లేకపోతె ప్రతిసారీ లాగా జిల్లా పరిషత్ వాళ్ళు ట్రాన్స్ ఫర్ చేయటం నేను మళ్ళీ ప్రయత్నంచటం అక్కడి నుండి బయట పడటం ఇంతదాకా జరుగుతోంది .సరే ఇదీ ఒకందుకు మంచిదే .ఫలితాల కోసం ఎదురు చూస్తూ జిల్లా పరిషత్తు వారు పానెల్ తీసే లోపు రిజల్ట్ వస్తే వారికి తెలియ జేస్తే పానెల్ లో చేర్చి ప్రమోషన్ ఇస్తారు .లేక పొతే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సి ఉంటుంది .రోట్లో తలపెట్టాం ఎదురు చూడక తప్పదు.ఇప్పటిదాకా హెడ్ మాస్టర్ ప్రమోషన్ మనకెందుకులే అనుకోని అశ్రద్ధ చేసి పరీక్ష రాయలేదు .ఇన్నాళ్ళకు కుచ్చెళ్లు సవరించి రాస్తే రిజల్ట్ ఆలస్యం .సర్వం కాలాదీనం అన్నారు అందుకే అనిపిస్తుంది .

ఇంటికి చేరి గండ్రాయి విశేషాలన్నీ చెప్పాను .జగ్గయ్యపేట నుంచి అరగంటకు ఒక బస్ వల్లభికి ఉంటుంది. అది ఖమ్మం కు దగ్గరఖమ్మం జిల్లాలోని ఊరు  .గండ్రాయి మీదగా వెడుతుంది ఖమ్మం ప్రయాణీకులు వల్లభి దిగి అక్కడినుంచి వెడతారు. కనుక ఈ బస్ కు గిరాకీ ఎక్కువే .జన రద్దీ బాగా ఉంటుంది .షేర్ మహమ్మద్ పేట బెజవాడ హైదరాబాద్ రూట్ లో చిల్లకల్లుకు సుమారు ఎనిమిది కిలోమీటర్లలో జగ్గయ్యపేటకు ఆరు కిలో మీటార్ లలో  మయిన్ రోడ్ మీదనే ఉంది .అక్కడి నుంచి కుడి వైపు రోడ్డు గండ్రాయికి వెడుతుంది .కనుక షేర్ మొహమ్మద్ పేటలో దిగి అక్కడినుండి వల్లభి బస్ పట్టుకొని గండ్రాయి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి అంటే ఇన్ని తిప్పలు పడాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-15 –ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీమతి వారణాసి సూర్యకుమారిగారు రాసిన ”శ్రీ ఆంజనేయం కావ్యాన్ని మచిలీపట్నంలో 25-1-15 ఆదివారంఉదయం మహతి ఆడిటోరియం లో ఆవిష్కరించిన నేను ,మిగిలిన దృశ్యాలు 

శ్రీమతి వారణాసి సూర్యకుమారిగారు రాసిన ”శ్రీ ఆంజనేయం కావ్యాన్ని మచిలీపట్నంలో  25-1-15 ఆదివారంఉదయం  మహతి ఆడిటోరియం లో ఆవిష్కరించిన నేను ,మిగిలిన దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నేతాజీ —తెలుగు పద్మశ్రీలు

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వాతి తిరుణాల్ మహా రాజు ఒక కల్పిత పాత్ర అని అపహ పడ్డ దర్శకుడు బాల చందర్ -నందూరిపార్ధ సారధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment