సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జిల్లెల్ల మూడి అమ్మ -ఆరాధనోత్సవం -మరియు అసూయకు పతనమే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లోక కల్యాణానికి వెలసిన కొప్పెశ్వర స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీరీ పండిట్ ల అజ్ఞానం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రెండు స్తాయిల్లో దేవుడు -అరవింద రావు ,- ధర్మం రెండు రకాలు -పరిపూర్నానంద ,పతంజలి యోగం -రవి శంకర్



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ -ముస్లిములు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆపరేషన్ బర్మా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

kp9 001 kp76 001 kp77 001 kp78 001 kp80 001 kp81 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక – 10

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -10kp68 001 kp69 001 kp70 001 kp71 001 kp72 001 kp73 001 kp74 001 kp75 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9kp66 001 kp67 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8kp56 001 kp57 001 kp58 001 kp59 001 kp60 001 kp61 001 kp62 001 kp63 001 kp64 001 kp65 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ స్టెల్లా కాలేజి రోడ్డు లో శ్రీ సాయబాబా గుడి వద్ద ఉన్న  ”సంయుక్త వేదిక ”లో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి మనవ రాళ్ళు (కుమారుడు కృష్ణ కుమార్తెలు  )ఛి.  సెరీనా,  ఛి . శ్రేయ లకు ”చీరెల సంబరం ”దృశ్యమాలిక -మరియు -స్టేట్ బాంక్ కాలనీలో మా తోడల్లుడి గారింట్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సద్గురు శివానంద మూర్తి శివైక్యం –

 
 
 

 

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7kp46 001 kp47 001 kp48 001 kp49 001 kp50 001 kp51 001 kp52 001 kp53 001 kp54 001 kp55 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -5(చివరిభాగం )

జోలాను కుట్ర తో చంపారు

ఎమిలీ జోలా మరణం పై అనేక అనుమానాలున్నాయి ఆయన ప్రత్యర్ధుల  కుట్రవల్లనే కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి౦దని అంతకు ముందు రెండు మూడు సార్లు వారు హత్యాప్రయత్నం చేశారని అన్నారు .కాని ఇది రుజువుకాలేదు ఒట్టి అపోహ మాత్రమె నని తేలింది .కొన్ని దశాబ్దాల తర్వాత పారిసాన్ రూఫర్ మరణ శయ్యపై ఉండి తానె రాజకీయ కారణాలవలన జోలా ఉన్న ఇంటి చిమ్నీ మూసేశానని చెప్పాడు .జోలాను మొదట పారిస్ లోని క్లేమేటోరి డీ మాంట్ మెట్రి శ్మశాన వాటికలో ఖనం చేశారు .నాలుగేళ్ల తర్వాతా అలేక్సాండర్ డ్యూమాస్ విక్టర్ హ్యూగో ల ను ఖననం చేసిన పా౦ధియన్ లో అవశేషాలను భద్ర పరచారు .1953 లో ఒక విచారణ సంఘం పూర్తీ విచారణ చేసి ఎమిలీ జోలా ది హత్య మాత్రమె నని   ,ప్రమాద వశాత్తు జరిగిన మరణం కాదని  తేల్చింది .చిమ్నీ స్వీపర్ హెన్రి బూరోన్ ఫెస్స్ తానె రాజకీయ వాదుల కోరిక పై చిమ్నీ ని మూసేశానని ఒప్పుకొన్నాడు .కనుక ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది .

రెండు కుటుంబాల కద

జోలా రాసిన 20 భాగాల రోగాన్ మాక్వార్ట్  నవల సెకండ్ ఫ్రెంచ్ ఎంపైర్ కు చెందిన విషయ౦  అని ముందే చెప్పుకొన్నాం .1851-71 మధ్య ఉన్న ఇరవై ఏళ్ళలో జరిగిన ఒక కుటుంబ గాధ అది .ఇందులో మూడొందల అధ్యాయాలున్నాయి .ఇది రోగాన్  మరియు మాక్వార్ట్ అనే రెండు కుటుంబాల కద .దీనికి జోలా పెట్టిన ఫ్రెంచ్ పేరుకు ఇంగ్లీష్   పేరు ‘’the natural and social history of a family   ,under the second empire ‘’దీన్ని ఫ్రెంచ్ మూడవ రిపబ్లిక్ కాలం లో రాశాడు .మూడవ నెపోలియన్ కాలం లో ఫ్రెంచ్ సైన్యం దారుణంగా ఓడిపోవటమే ఇందులోని విషయం .నానా నవలలో కూడా దీని గురించి రాశాడు .

శాస్త్రీయ పరిశోధనా నవల కు ఆద్యుడు జోలా

‘’లి రోమన్ ఎక్స్ పెరిమెంటల్ ‘’నవలలో నేచరలిస్ట్ నవల ధోరణి ప్రారంభమై ,సైంటిఫిక్ పరిశోధనానవలగా పేరు తెచ్చుకొన్నది .క్లినికల్ ఫిజియాలజికి దారి తీసింది .జోలా దృష్టిలో ‘’no character should appear larger than life ‘’ Although Zola would not accept that it was either scientifically or artistically justifiable to create larger-than-life characters, his work does present a number of larger-than-life symbols which, like the mine Le Voreux in Germinal, take on the nature of a surrogate human life. The mine, the still in L’Assommoir and the locomotive La Lison in La Bête humaine impress the reader with the vivid reality of human beings. The great natural processes of seedtime and harvest

జోలా ఒక రచయిత ,కవి సైంటిస్ట్ మాత్రమె కాక ఆశావాది .’’పాజిటివిజం ‘’అంటే మక్కువ .మానవాభ్యున్నతిపై అచంచల విశ్వాసం ఉన్నవాడు జోలా .ఆయన జీవితం పై సినిమా కూడా తీశారు . “I wish to explain how a family, a small group of human beings, conducts itself in a given social system after blossoming forth and giving birth to ten or twenty members, who, though they may appear, at the first glance, profoundly dissimilar one from the other, are, as analysis demonstrates, most closely linked together from the point of view of affinity. Heredity, like gravity, has its laws’’

 అని తన సీరియల్స్ కు ముందుమాట రాశాడు జోలా .సంఘం లో ఉన్న పరిసరాల పరిస్థితులు ,హింస ,తాగుడు వ్యభిచారం ఏవిదం గా ప్రజలను  ‘’సెకండ్ వేవ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ‘’కాలం లో ప్రభావితం చేశాయో వివరించాడు .బ్రెజిల్ ఫ్రాన్స్ దేశాల రచయితలపై జోలా ప్రభావం అధిక౦ .అయిదుగురు నేచరలిస్ట్ రచయితలకు జోలా ఆదర్శనీయుడు .

      Inline image 1     Inline image 2 Inline image 3Inline image 4

          సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొ

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్

బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం

unnamedఅమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ రాలు .బెంజమిన్ ఫ్రాన్క్లిన్ కు కూడా చుట్టరికం ఉన్నది .డచేస్ కౌంటిలో ఉన్న ‘’నైన్ పార్ట్నర్స్ స్కూల్ ‘’లో13 వ ఏట చేరి చదివింది .ఇది న్యూయార్క్ లోని సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ నిర్వహించే స్కూల్ .గ్రాడ్యుయేట్ అయి అక్కడే టీచర్ గా చేరిపని చేసింది .ఆ స్కూల్ లో అప్పుడు మగ మేస్టర్లకు ఆడ టీచర్లకంటే మూడు రెట్ల జీతం ఇస్తూ ఉండేవారు .ఇది గమనించి కాఫిన్ మహిళలకు సమాన హక్కులు కావాలనే అభిప్రాయం లోకి వచ్చింది .తండ్రి కుటుంబాన్ని ఫిలడేల్ఫియాకు మార్చటం తో పీటర్ మొట్ అనే టీచర్ తో సహా అక్కడికి వెళ్ళింది .మొట్ ను పెళ్ళాడింది .సంతానం కలిగారు .ఆమెపిల్లలు ఆమెలాగే బానిసత్వ నిర్మూలన ఉద్యమం లో క్రియాశీలంగా పని చేశారు .

బానిసత్వ నిర్మూలనోద్యమం

ఇతర క్వేకర్ ల లాగానే కాఫిన్ కు బానిసత్వం అంటే నచ్చేదికాదు .బానిసత్వం సాంఘిక దురాచారం అని భావించింది .ఇతర బానిసలు నేసిన నూలు దుస్తులు వారు తయారు చేసిన పంచదార ,మొదలైనవి ఉపయోగించేదికాదు . మొట్ క్వేకర్ మినిస్టర్ అయింది ఆత్మజ్ఞానం పొందిన కాఫిన్ ప్రతివారిలోను భగవంతుని దర్శించింది .భర్తకు చేదోడుగా సహకరించి ప్రజలలో బానిసత్వం యెడల విముఖతకలిగేట్లు ప్రచారం చేసింది .భర్త ‘’అమెరికన్ యాంటి స్లేవరి సొసైటీ ‘’స్థాపించటానికి ఎంతగానో సహకరించింది .ఫిలడెల్ఫియాలో బహిరంగ వేదికలపై మాట్లాడే నేర్పు అలవడింది .అందరిని ఒప్పించే గుణం ఆమెలో ఉండేది .అప్పటికి ఆమె ఒక్కతే బహిరంగ సభలలో ఉపన్యాసం ఇచ్చేది. ఇంకెవరూ అంతటి సాహసం చేయ లేక పోయేవారు .కనుక ఏకైక మహిళా వక్త అయింది .ప్రజాబలం కూడగట్టుకొని కొద్దికాలం లోనే ‘’ఫిలడెల్ఫియా యాంటి స్లేవరి సొసైటీ ‘’ని స్థాపించింది .అక్కడి నల్ల జాతివారి సహాయ సహకారాలు ఆమెకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. జాతి వివక్షతపై పోరు బాట సాగించింది .నల్లజాతివారి మత ఉత్సవాలలో పాల్గొని వారి అభిమానాన్ని పొందింది .బంధు మిత్రులతోకలిసి ‘’రోచెస్టర్ యాంటి స్లేవరి సొసైటీ ‘’నికూడా ఏర్పాటు చేసింది .
కుటుంబ ఆదాయాన్ని బట్టి ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బును ఉద్యమ విస్తరణకు విని యోగించేది. ఇంటికి వచ్చిన అతిధులకు సేవల౦ద జేసేది .కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూనే సాంఘిక న్యాయం కోరే మహిళగా గుర్తింపు పొందింది .అందరిని కూడగట్టి ఉత్సవాలు ఊరేగింపులు చేస్తూ వచ్చిన రాబడిని బానిస విమోచనానికి ఖర్చు చేసేది 1837, 38,39 లలో జరిగిన ;;యాంటి స్లేవరి కన్వెన్షన్ ఆఫ్ అమెరికన్ వుమెన్ ‘’సభలు మూడింటికి హాజరై ప్రాతినిధ్యం వహించింది మొట్ .1838లో ఫిలడెల్ఫియాలో సమ్మేళనం జరిపే హాల్ ను దుండగులు తగల బెట్టారు .ఆరుబయటనే మీటింగ్ నిర్వహించి బానిసవిమోచనశంఖా రావం పూరించింది .అగ్గి మీద గుగ్గిలమైనవ్యతిరేకులు మొట్ ఇంటినీ నల్లజాతివారి ఇళ్ళను దోచుకొన్నారు .భీభత్సం సృష్టించారు

ప్రపంచ సభలో పాల్గొనటం

1840 జూన్ నెలలో లండన్ లో జరిగిన ‘’ప్రపంచ బానిస వ్యతిరేక సభ ‘’లో మొట్ పాల్గొన్నది .అప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఆరుగురు అమెరికన్ ప్రతినిదు లతో హాజరైన ఆమెను అక్కడి’’ మగ పురుషులు ‘’తమతో అమెరికన్ మహిళలు కూర్చోటానికి వీలు లేదని వ్యతిరేకించి పాల్గొన కుండా చేశారు . పాపం మహిళలు వేరేగా కూర్చోవాల్సి వచ్చింది .ఈ సభలో ఆడవారి హక్కుల విషయం ప్రస్తావి౦చ రాదని నిషేధం విధింఛి బానిస విమోచనాన్ని నీళ్ళు గార్చే ప్రయత్నం చేశారు .అప్పడు లండన్ లో ఉన్న న్యాయ చట్టాల ననుసరించి స్త్రీలు బహిరంగం గా రాజకీయ సభలలో పాల్గొన రాదు అనే నియమం కూడా ఉంది . మగవారికి వారికి అది కలిసొచ్చింది .కాని అమెరికా నుండి వచ్చిన పురుష ప్రతినిధులైన గారిసన్ ,నేతానియాల్ పి.రోజేర్స్ ,విలియం ఆడమ్స్ ,ఆఫ్రికన్ –అమెరికన్ యాక్టివిస్ట్ చార్లెస్ లేనాక్స్ రిమాండ్ మొదలైనవారు స్త్రీలకోసం కేటాయించిన స్థలం లోనే స్త్రీ ప్రతినిధులతో బాటు కూర్చుని నిరసన తెలియ జేశారు . ఐరిష్ పత్రిక మొట్ ను ‘’మహిళా సింహం ‘’అని కీర్తించింది .ఇంగ్లాండ్ స్కాట్ లాండ్ సభలలో పాల్గొని అమెరికాకు తిరిగి వచ్చింది .

బానిస రాష్ట్రాల పర్యటన

న్యూయార్క్ లోను బోస్టన్ లోను బహిరంగ సభలలో మొట్ ఉపన్యసించింది .బానిసలున్న రాష్ట్రాలలో పర్యటన చేసి బాల్టిమోర్ వర్జీనియా మేరీలాండ్ లలో ప్రసంగించి చైతన్యం తెచ్చింది .బానిస యజమానులతో సమావేశమై వారి మనసు మార్చటానికి ప్రయత్నించింది .40 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశం లో ప్రసంగించి వారికి విమోచన పై అవగాహన కలిగించింది .ఆసభకు వచ్చిన’’ ప్రెసిడెంట్ జాన్ టేలర్’’ మొట్ వ్యక్తిత్వానికి ,ఉపన్యాసానికి ముగ్ధుడైపోయాడు .అక్కడే ఉన్న బానిస విమోచనాన్ని వ్యతిరేకించే సెనేటర్ ‘’కల్హాన్ ‘’ ఆమెకు అప్పగిస్తానని ప్రకటించాడు .
న్యూయార్క్ లోని సేనేకా ఫాల్స్ లో మొట్ మరియు మరోనాయకురాలుసాంటన్ తో కలిసి మహిళాహక్కుల సభ 1848లో జరిపారు .స్త్రీ వోటు హక్కు కోసం నినదించారు .విమోచన ఎంతముఖ్యమో స్త్రీ వోటుహక్కూ అంతే ముఖ్యం అన్నారు .మానవ హక్కుల నాయకుడు ఫ్రెడరిక్ డగ్లాస్ ఇందులో కీలక పాత్ర పోషించాడు .మొట్ ప్రభావం యునిటేరియన్లు అయిన ధియోడర్ పార్కర్ ,విలియం ఎల్లరి చానింగ్ , విలియం పెన్ ల పై అధికం .యూని వరసల్ రైట్స్ కోసం పోరాడాలని నిర్ణయించారు .మొట్ క్రమంగా దూరమైంది అనారోగ్య రీత్యా .
‘’the kingdom of God is within man ‘’అని అభిప్రాయపడింది మొట్ .తర్వాత రెలిజియస్ లిబరల్స్ ఏర్పరచిన ‘’ఫ్రీ రేలజి యన్ అసోసియేషన్ ‘’లో చేరింది .దీనిలో మహా వేదాంతి ఎమర్సన్ ,మొదలైన గొప్పవారు కూడా సభ్యులయ్యారు మొట్ ‘’సేర్మాన్ టు మెడికల్ స్టూడెంట్స్ ‘’రాసి 1849లో ప్రచురించింది ‘’డిస్కోర్స్ ఆన్ వుమెన్ ‘’అనే కరపత్రం వెలువరించింది .క్వేకర్ ఉద్యమనాయకురాలుగా ఉండి మహిళా హక్కులకోసం, బానిస విమోచనం కోసం అహరహం శ్రమించిన మహిళా మాణిక్యం లుక్రేషియా కాఫిన్ మొట్ ..87 ఏళ్ళు జీవించి 11-11-1880 న మరణించింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

IMG_4253గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” .

ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . ప్రసిద్ధ కవులు వ్యాస , వాల్మీక , శ్రీ హర్షుడు , విశాఖ దత్తుడు , భారవి , శూద్రక , దండి , హర్షవర్ధనుడు , మాఘుడు , బాణుడు ,భోజుడు ,కవిరాజు , కల్హణుడు , గౌడ డిండిమ భట్టు మొదలైన కవులు లతో పాటుగా అలంకార శాస్త్ర రచయితులైన దండి , ఉద్భుటుడు , వామనుడు , ఆనందవర్ధనుడు , రాజశేఖరుడు ,రుద్రుటుడు , అభినవ గుప్తుడు , విశ్వనాధుడు , వామనభట్టు , బాణుడు , మధుసూదన సరస్వతి , జగన్నాధ పండితరాయులు గురించి వివరణ కూడా పొందుపరిచారు .

అదే విధంగా కవియిత్రులు గంగాదేవి , ప్రణయ కవియిత్రి మోరిక , స్వభావోక్తి కవియిత్రి మురళ , నంజన గూడు తిరుమలాంబ , రామ భద్రాంబ , పద్మా వతి , గౌరీ వారి విశేషాలతో పాటు నాట్యం , సంగీతం కళలకు తమ రచనల ద్వారా వన్నె తెచ్చిన కవులు , పండితులు భరతముని , జయదేవుడు , జాయపసేనాని, సింగభూపాలుడు . కొమారగిరి రెడ్డి,నారాయణతీర్ధులు మొదలైన వారి జీవిత విశేషాలు , రచనల వివరాలు పొందుపరిచారు .

అపర శంకరులు . శంకర భాగాత్వాదులు మొదలుకొని శతావధాని గణేష్ వరకు ఎందరో సంస్కృత పండితుల సమాచారం పొందుపరిచారు రచయిత . కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు . అద్వైత మత స్థాపనాచార్యులు , త్రిమతాచార్యులలో ప్రధములు , శంకరాచార్యుల బాల్యం గురించి , గురుదర్శనం , స్తోత్రరత్నాలు , అద్వైతం మొదలైన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి . అర్ధ శాస్త్ర రచయిత కౌటిల్యుడు విశేషాలు , భరత నాట్య సృష్టి కర్త భరతముని వివరాలు , భరతముని రచించిన నాట్య శాస్త్రాన్ని పి.యస్ .అప్పారావు తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .

క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందిన ఘటకర్పకుడు గురించి వివరణ ఉంది . భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారం ఉంది అని , అది నిజం కాదు అనే వివరణ కూడా రచయిత ఆ పుస్తకంలో ఇచ్చారు . ఘటకర్పకుడికి యమక చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది . బౌద్ద వేదాంత కవి అశ్వ ఘోషుడు గురించి సమాచారం విపులంగా తెలియజేశారు . తెలుగు సాహిత్యంలో శ్రీనాధుడి పేరు సుపరిచితమే . శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన నైషధీయ చరిత్రను శ్రీనాధుడు తెలుగులోకి అనువదించాడు . అలాగే సంస్కృతం నైషదీయంలో శ్రీహర్షుడు మంత్ర శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప వ్యాఖ్యానం రాశారు .

మహా కవి శూద్రకుదు , ఈయన నాటక నవలాకారుడు ,3 వ శతాబ్దానికి చెందినవాడు . శూద్రక అనేది కలం పేరు . అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహ . ప్రకరణ రచనకు ఆద్యుడు శూద్రకుడు . అలాగే మృచ్చకటికం గురించి , నామ ఔచిత్యం గూర్చిన వివరణ కూడా తెలియజేశారు రచయిత . విశాఖ దత్తుడు అనగానే ముద్రారాక్షసం నాటకం గుర్తుకు రాక మానదు . ఆయన దేవీ చంద్ర గుప్తా నాటకం అభిసారికా వంచితం మొదలైన నాటకాలను కూడా రాశాడు . అలాగే విశాఖ దత్తుడు అర్ధ , నాట్య , న్యాయ , రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడు .

పాల్కురికి సోమన గురించి తెలియని తెలుగు వారు అరుదు . కాని ఆయన సంస్కృతి పాండిత్యం అంతగా తెలియక పోవచ్చు . సోమనాధుని “వీర శైవాగ్రేసరుగు” అంటారు . బసవేశ్వరుని చరిత్రను పురాణంగా రాసి కొత్త దారి తీశాడు . చరిత్రకు పురాణ వైశిష్ట్యతను కలిగించిన మొదటి కవి పురాణ కర్త సోమన . ఎవరైనా ఏ పుస్తకం మీదనైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లినాధ సూరి వ్యాఖ్యానంలా ఉంది అంతం పరిపాటి . ఈయన 1350- 1450 కాలంలోని వాడు . కాళిదాసు కుమారా సంభవం , భారవి కిరాతార్జునీయం , మాఘడు , హర్షుడు వారి కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసాడు సూరి .

రేడియోలో సంస్కృత పాఠాలు బోధించిన సర్వోదయ ప్రచారకులు కేశిరాజు వెంకట అప్పారావు 1913 మార్చి 14 న తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జన్మించారు . తెనాలి నుండి వెలువడే సామ్య యోగం ‘సర్వోదయ పక్ష పత్రికకి గౌరవ సంపాదకులుగా సేవ చేశారు . వీరి కావ్యాలు పంచవటి , గంగాలహరి . వీటిని తెలుగులోకి అనువాదం చేసారు . బృందావనం అనే కావ్యాన్ని హిందీ , తెలుగు , సంస్కృతి భాషలలో రచించి తమ ప్రతిభను చాటుకున్నారు . చివరి వ్యాసంగా శతావధాని గణేష్ పరిచయం వివరాలతో ముగుస్తుంది . సంస్కృత , కన్నడ , ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశు కవిత్వంలో దిట్ట . అవధానాలతో పాటు శతావధాన శారద , శతావధాన శ్రీవిద్య , శతావధాన శాశ్వత గ్రంధాలను రాశారు . షేక్ స్పియర్ రాసిన నాటకం హామ్లెట్ కు కన్నడ అనువాదంగా హొరాషియో రాసి , తానే ముఖ్య పాత్ర పోషించారు .

విరూపాక్ష కవి , సంబందు , మయూరుడు , అమరుక కవి , భట్టి మురారి , వాక్పతి రాజు , దిజ్నాగుడు , పరిమళ పద్మ గుప్తుడు , రుమ్యకుడు , జినరత్న , వామన భట్ట బాణుడు , నంజన గూడు , తిరుమలాంబ , నుదురుపాటి వెంకన్న , రాజవర్మ , శొంటి భద్రాద్రి రామ శాస్త్రి మొదలైన కవులు సమాచారం కూడా పొందుపరిచారు . అలాగే కాళిదాసు కుమారా సంభవం కావ్యాన్ని కన్నడంలోకి అనువాదం చేసిన కవి ఎవరు ?, జైన తీర్ధం కురులలో చివరి వాడైన మహా వీరుని జీవితం పై వచ్చిన మొదటి గ్రంధం ఏది ?, అభినవ కాళిదాసు అని ఎవరిని పిలుస్తారు ?, షేక్ స్పియర్ నాటకాలను సంస్కృతంలోకి అనువదించిన రచయిత ఎవరు ?, సంస్కృతంలో ఉత్తరాలు రాసిన రచయిత పేరేమిటి ? ఇత్యాది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే .

ఇది వరకు వచ్చిన “పూర్వ ఆంగ్ల కవుల చరిత్ర పుస్తకం ఆంగ్ల సాహిత్యానికి ఒక కర దీపికగా లభించిందో ,ఈ పుస్తకం పేర్కొన్న కవులు, రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వారే . సంస్కృత సాహిత్యాన్ని అభిమానించే వారికి ఈ గ్రంధం అపురూప కానుక . సంస్కృత సాహిత్యాన్ని చదవాలి అనుకునే వారికి ఈ గ్రంధం ఒక కరదీపిక అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .

– అరసి

ప్రతులకు :

గబ్బిట దుర్గా ప్రసాద్  

శివాలయం వీధి  ,ఉయ్యూరు  

కృష్ణా జిల్లా

సంచార వాణి:9989066375

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నమస్తే హేమలత గారు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ” గ్రంధం పై శ్రీ /శ్రీమతి” అరసి ”గారు ”లోనారసి ”విపులమైన అర్ధ వంతమైన సమీక్ష చేసి  గ్రంధం ఔచిత్యాన్ని ,ప్రస్తుత సమాజానికి దాని అవసరాన్ని ,అందులోని వివిధ విశేషాలను ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారు వారికి నా తరఫున సరసభారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ..సమీక్ష రాయించి విహంగ లో ప్రచురించిన మీకు ధన్యవాదాలు . -దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -4

నిరుపేద సంపన్నుడయ్యాడు  –

ఈ సిరీస్ లో వచ్చిన నవలలు జోలాకు గౌరవాన్నికాని ఆర్ధిక లాభాలను   కాని తెచ్చి పెట్టలేదు .కాని ఏడవ భాగమైన ‘’ది ద్రాం షాప్ అండ్ ది బరూం ‘’చాలా సంచలం తెచ్చి అభియోగం మోపెంత దాకా తెచ్చింది . విమర్శల జడివనే కురిసింది .’’literary street cleaner ‘’,poet of the disgusting ‘’,purveyor of muck ‘’అంటూ విశేషణాలు తగిలించారు .కాని పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్మకం కొనసాగించి జోలా ఫ్రాన్స్ దేశం లో అందరి కి సుపరిచతమైన రచయిత అయి పోయాడు .పిచ్చికల్ని కాల్చుకు తిన్న దరిద్రం పోయి అధిక సంపన్నుడయ్యాడు .విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు .అతని ఆకలిమాత్రం అదే స్థాయిలో పెరిగిపోయి౦ది .చాలాఖరీడైన ఆహారం తింటున్నాడు అరుదుగా లభించే వైన్ సంపాదించి తాగుతున్నాడు .పిట్టాలా ఉండే వాడి  పొట్టపెరిగి బలిసి చాలాలవుగా ,వైభవోపేతంగా దర్జాగా కనిపిస్తున్నాడు .డబ్బు తెచ్చిన మార్పులివి .సంభాషణలు  దైవ వాక్యాలుగా ,ప్రామాణికాలుగా  భారీగా ఉంటున్నాయి .రచన జిలేబీ చుట్టల్లా ఉండి,ముతక గా మారింది .

సాంఘిక సంస్కర్త జోలా

అయితేనేం విజయ పరంపరసిరీస్ లో  13వ డైన ‘’జేర్మినల్ ‘’వరకు  కోన సాగి జోలా సాంఘిక సంస్కర్త అవతారం ఎత్తాడు .బొగ్గు గని కార్మికుల జీవన స్థితి వారి సమ్మెలు హక్కుల పోరాటాలు ప్రోలిటరేనియన్  సంస్కృతీ అన్నీ అందులో ప్రతిఫలింప జేశాడు దీనితో రచయితల దృక్పధమే మారిపోయింది .ఇదే తర్వాతా ప్రోలిట రేనియన్ నవలకు నాంది పలికింది .రావి శాస్త్రి గారి నవలలకూ విషయమైంది .జేర్మినల్ నవల లో మార్క్స్ సిద్ధాంతాన్నీ జోడించాడు . దీన్ని గూర్చి సోషల్ సైన్సెస్ కు చెందిన విజ్ఞాన సర్వస్వం ‘’zola  implanted in its readers a faith in the revolution as an investable catastrophe which must precede the happier era when rival classes will be supplanted by a society of free individuals bound only by ties of cooperative labor  and love ‘’అని విశ్లేషించి రాసింది .

జోలా’’ నానా’’ నవల

ఈ సిరీస్ లో వచ్చిన నవల ‘’నానా ‘’ఉత్క్రుస్టం అని పించుకోలేదుకాని సెన్సేషనల్ నవలగా పేరొంది ఇప్పటికీ బాగా ప్రాచుర్యం లోనే ఉంది ..జోలా అంటే ‘’నానా ‘’నవలే గుర్తొస్తుంది .దీనితర్వత ‘’ రైతు జీవితం పై రాసిన’’లాటెర్రె’’కూడా ఆదరం పొందింది .దీని ఇంగ్లీష్ అనువాదం లో కార్మికుల పోరాటం వారందరూ భూమిలోకి చేరిపోవటం విషయం లో చాలా బలమైన మాటలు౦డటం తో ఇంగ్లీష్ వారికి నచ్చక దీన్ని నిషేధించారు .అనువాదకుడిని జైల్లో పెట్టారు .ఆ పుస్తకం ఆంగ్లానువాదం దాదాపు యాభై ఏళ్ళు ఇంగ్లీష్ చదివే వారికి అందుబాటులో లేకుండా చేశారు .ఒకప్పుడు రైతులంటే ఇష్టపడని జోల వారిపై సంచలనాత్మక నవల రాసి వారికీ చేరువైనాడు .’’లా డిబాకిల్ ‘’నవలలో సెకండ్ ఎంపైర్ అని పిలువబడే నిరాశ నిస్పృహలతో ఓడిపోయినా సైన్యానికి సంబంధించిన విషయాలు రాశాడు   .జోలా ధోరణీ మారింది .’’An artist must learn to be lavish and live at top pitch ‘’అన్నాడు .నీతి జాడ్యానికి చికిత్స చేసే వాడుగా జోలా కనిపిస్తున్నాడన్నారు .దీనికి సమాధానం గా తన రాతలు విద్య నేర్పించాటానికే కనుక నీతి తో ఉండటం సహజం అన్నాడు .’’సంఘ రాజకీయ శరీరానికి’’ తాను  డాక్టర్ ను అని చెప్పుకొన్నాడు ఆయన వెలువరించిన తీవ్ర విషయాలను ‘’కల్చరల్ అటాప్సీలు’’ ( సాంస్కృతిక స్వీయ వీక్షణలు )అన్నారు

నడి వయసులో ఘాటు ప్రేమ

.1888లో తన సీరియళ్ళ సీరియస్ ప్రచురణలో ఉండి అమాంతం’’ జినీ రోజెరాట్ ‘’అనే తన ఎస్టేట్ సర్వెంట్ తో ప్రేమలో  పడ్డాడు మనోడికి నలభై యదు ఆమెకు ఇరవై లోపు వయసు .’’జోలా అండ్ హిస్ టైం ‘’లో మాథ్యూ జోసేప్ఫ్సన్ రాస్తూ ఆమె చాలా అరుదైన సౌనదర్యం కలిగి ఉండేదని రాశాడు. పల్లెటూరి ప్రాంతం నుంచి వచ్చిన పిల్ల .ఇప్పుడిప్పుడే ఇంటి పనులు చేయటం నేర్చుకొన్నది .మన రచయితలో ఇప్పటిదాకా ఆనకట్ట వేయబడిన శృంగారం గేట్లు తెంచుకొని ఉరక లెత్తి అడ్డూ ఆపూ లేకుండా .పారింది . ఈ శృంగారం ఫలించి జోలాకు ఇద్దరు పిల్లని కన్నది .ఈ వ్యవహారాన్నిజోలా భార్య అలేక్సాండ్రిన్  మొదటవ్యతిరేకించినా చివరికి రాజీ పడి ఆమోదించింది. జోలా చనిపోయిన తర్వాత అతని భార్య చేత అనుమతి పొంది ఈ పిల్లలకు జోలా పేరు పెట్టుకొన్నది కొత్త పెళ్ళాం .వారే జోలా వారసులయ్యారు .

డ్రేఫస్ అఫైర్ –దోషి అని ముద్రపడిన కెప్టెన్  డ్రేఫస్ ను  నిర్దోషిగా నిరూపించిన జోలా

జోలాకు యాభై వ ఏడు వచ్చేసరికి ఫ్రాన్స్ దేశం లో కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రీ ఫేస్ దేశానికి ద్రోహం చేశాడని నేరం ఆరోపి౦ప బడి , శిక్ష అనుభవించటానికి ‘’డెవిల్స్  ఐలాండ్ ‘’ కు పంపారు .ఈ కేసునే ‘’డ్రీఫాస్ అఫైర్ ‘’అంటారు ఫ్రాన్స్ దేశపు అవినీతి ,రాజకీయ కుళ్ళు దీనితో అందరికి తెలిసింది .తర్వాత ఈ కేసును అందరూ మర్చే పోయారు .చివరికి రెండేళ్ళ తర్వాతా ఎమిలీ జోలా తన వద్ద ఉన్న పూర్తీ ఆధారాలతో డ్రీఫాస్ నిరపరాధి అని నిరూపించాడు .సైన్యం లోని కొందరు పెద్దలు జర్మనీకి రహస్య విషయాలను చేరవేశారని వారే అసలైన నిందితులని చెప్పాడు .అప్పటి వరకూ జనసామాన్యానికి ద్డ్రీఫాస్ పై సాను భూతి లేదు . ఏది ఏమైనా తన పట్టు విడువకుండా స్తైర్యం గా డ్రీప్ఫెస్ వైపు నిలబడ్డాడు జోలా . ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫెలిక్స్ ఫారె కు జోలా ఒక బహిరంగ లేఖ రాయటం తో కద క్లైమాక్స్ కు చేరింది .తన దగ్గర ఉన్న డాక్యు మెంట్ల ద్వారా ఒక్కో అధికారి గుట్టు బయట పెట్టి ముచ్చెమటలు పట్టించాడు .తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియ బర్చాడు .మానవత్ర్వం కోసం మానవ హక్కుల పరి రక్షణ కోసమే నని చెప్పాడు .దీనిపై క్రోధం పూనిన సైన్యం అధికారులు సైన్యాన్ని అవమాన పరచాడనే అభియోగం మోపి జలులో పెట్టారు .నేరం రుజువైందని చెప్పి మూడు వేల ఫ్రాన్కుల జరిమానా  ఒక ఏడాది జైలు శిక్ష విధించారు .ప్రజా బలం జోలా వైపే ఉంది అయినా సైన్యానికున్న సర్వాధికారాలు ఉపయోగించి ,పత్రికల నోళ్ళు మూయించారు .ప్రజల దృష్టిలో జోలా అమర వీరుడయ్యాడు .సైన్యానికి వ్యతిరేకం గా ప్రజలు ఆగ్రహ జ్వాలలు కురిపించారు. కాని ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది

కేసును పునర్విచారించారు .జోలాకు దేశ బహిష్కార శిక్ష విధించారు 1898జులై లో రహస్యం గా లండన్ చేరి ఒక ఏడాది మారు పేరుతొ ప్రవాస జీవితం గడిపాడు .జోలా నిరంతర పోరాట ప్రయత్నం వలన మళ్ళీ కేసు విచారణకు వచ్చి కెప్టెన్ ద్రేఫాస్ పై నేరాన్ని ఉపసంహరించి అతనికి క్షమా భిక్ష పెట్టింది ప్రభుత్వం .అప్పుడు జోలా పారిస్ కు తిరిగి వచ్చాడు .ఆయన హీరో గానూ లేక గాయపడిన వాడుగానూ ఉండలేదు .పగ ద్వేషం అనే అగ్ని నుండి బయటపడ్డాడు. శుద్ధ మనస్కుడు అని నిపించాడు   .ఈ సందర్భం గా ‘’truth having been vanquished ,justice reigning at last I am re born and take my place again upon French soil ‘’అన్నాడు .ఇలా ఏ విషయమైనా అంత లోతుగా అధ్యయనం చేసే సామర్ధ్యం ఉన్నవాడు ఎమిలీ జోలా .జోలా అంటే చాంపియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ .

అసంపూర్తి నవల –విషాదంగా సంపూర్ణమైన జీవితం

ఇంగ్లాండ్ లో ఉండగా జోలా’’ ది ఫోర్ గాస్పెల్స్ ‘’అనే కొత్త సీరియల్ రాయటం ప్రారంభించాడు .ఈ నవల గురించి చెబుతూ ‘’about a humanity enlarged for the needs of tomorrow –‘’దీన్ని a Utopia of social harmony a dramatization of the Dreyfus case ,and justice ,’’అన్నారు .విమర్శకులు . కాని దీన్ని పూర్తీ చేయలేక పోయాడు .ఒక ఆటం రోజు రాత్రి జోలా చలికి తట్టుకోవటం కోసం  సేవకులు అసాధారణమైన మంట వేశారు నెగడులో .కాని ఫైర్  లో గాలి వెళ్ళే మార్గం లో ఏదో లోపం ఉంది ఎవరూ గమనించలేదు .అందుకని రాత్రి వేళ చిమ్నీ లోంచి గాలి అసలు బయటికి పోలేదు లోపలే ఉండిపోయింది. కనుక జోలా ఆ రాత్రి అంతా గదిలో ఉండిపోయిన  కోల్ గాస్ తో నిండిన విషపు  గాలినే అంటే కార్బన్ మోనాక్సైడ్ నే  పీల్చాడు పాపం . తెల్లారి  సేవకులు వచ్చి తలుపులు పగల కొట్టి చూసేసరికి జోలా  చని పోయి ఉన్నాడు .అప్పటికి ఆయన వయస్సు 62.మరణించిన తేది 19-9-1902.

అంతిమ యాత్ర

ఎమిలీ జోలా అంత్య క్రియలకు రికార్డ్ స్థాయిలో ముప్ఫై వేలమంది జనం హాజరయ్యారు.’’మినిస్టరూ , ప్రెసిడెంట్ ఆఫ్ ది సోఅసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్’’  జోలాపై గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు మిగిలిన పెద్దలూ ఉపన్యసించారు .జోలా సహచర ప్రముఖ రచయిత అనటోల్ ఫ్రాంక్ చివరగా నివాళులర్పిస్తూ ‘’Zola was a fighter for justice as well as an author .He has honored his country and the world with an immense work a magnificent action .Envy him his destiny and his heart ,which made his lot that of the greatest .He was a moment’s embodiment of humanity ‘s conscience ‘’అని ప్రశంసించాడు .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శివైక్యం పొందిన ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి

శివైక్యం పొందిన ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి

వరంగల్, జున్ 10:  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది సద్గురు శివానందమూర్తి(87) శివైక్యం పొందారు. ఎండవేడిమిని తట్టుకోలేక నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున వరంగల్‌ జిల్లాలో ములుగురోడ్డులోని గురుధామంలో తుదిశ్వాస విడిచారు. డిసెంబర్‌ 21, 1928న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శివానందమూర్తి జన్మించారు.
సంస్కృతీ, సంప్రదాయాలపై శివానందమూర్తి పలు పుస్తకాలను రచించారు. హిందూవివాహ వ్యవస్థ, మహర్షుల చరిత్ర, గౌతమబుద్ధ ఆయన ప్రముఖ రచనలు. శివానంద కల్చరల్‌ ట్రస్ట్‌, ఆంధ్రా మ్యూజిక్‌ అకాడమీ స్థాపించి కళాకారులకు ఎనలేని సేవలను అందించారు.
ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. విశాఖ జిల్లా భీమిలిలో ఆనందవనం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. శివానందమూర్తి రచించిన కఠయోగా అనే పుస్తకం కంచిపీఠం పరమాచార్య, శృంగేరి శంకరాచార్యల మన్ననలను పొందింది. సన్యాసులు సహా అందరూ ప్రజా సంక్షేమానికి సంరక్షకులుగా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలని శివానందమూర్తి తన ప్రసంగాల్లో తరచూ చెబుతుండేవారు.
 శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శివానంద మూర్తికి దేశవిదేశాల్లో లక్షలాది మంది అభిమానులు, శిష్యులు ఉన్నారు. శివానందమూర్తి మృతిపట్ల పలువురు పీఠాధిపతులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం గురుధామంలో శివానందమూర్తి అంత్యక్రియలు జరుగనున్నాయి. శివానందమూర్తి మృతి పట్ల ఆయన అభిమానులు, శిష్యులు విచారం వ్యక్తం చేశారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -6

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -6kp36 001 kp37 001 kp38 001 kp39 001 kp40- 001 kp41 001 kp42 001 kp43 001 kp44 001 kp45 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -5

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -5kp30 001 kp31 001 kp32 001 kp33 001 kp34 001 kp35 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -4

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -4kp28 001 kp29 001 kp22 001 kp23 001 kp24 001 kp25 001 kp26 001 kp27 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -2

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -2kp7 001 kp8 001 kp9 001 kp10 001 kp11 001 kp12 001 kp13 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -3

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -3

kp14 001 kp15 001 kp16 001 kp17 001 kp18 001 kp19 001 kp20 001 kp21 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రత్యెక ఆంద్ర రాష్ట్రానికి ”నూరేళ్ళు ”నిండాయి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

రాలిన 86 వసంతాల మోదుగపూ(లు)వు -దాశరధి రంగా చార్య అస్తమయం – ”అభినవ వ్యాసుడు ”రంగా చార్య


 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారి స్మృతి సంచిక -మూసీ -జూన్

సాహితీ బంధువులకు శుభకామనలు -ఆశు కవితా సమ్రాట్ ద్విశతావధాని కీ శే రాళ్ళబండి
కవితా ప్రసాద్ గారిపై స్మృతి సంచికగా మూసీ మాసపత్రిక జూన్ సంచికను
ప్రచురించింది  ఆంద్ర  ,తెలంగాణా లలో ఇన్ని సాహిత్య సంస్థలు ,సాహితీ పత్రికలూ
ఉన్నా ఎవరూ చేయని సాహసం చేసి ఆ కవితా ప్రసాదాన్ని అందరికి అంద  జేస్తున్నందుకు
మూసీ సంపాదకులు శ్రీ డా సాగి కమలాకర శర్మ గారిని అభినందిస్తున్నాను . కవితా
ప్రసాద్ గారిపై మూసీ లో వచ్చిన వ్యాసాలూ కవితలను ధారా వాహికం గా సరసభారతి
అందజేస్తూ తన వంతు సాహితీ సేవ చేస్తోంది . దీనితో ఆరు విషయాలు జత చేశాను చదివి
ఆనందించండి మిగిలినవి సరసభారతి వరుసగా అంద  జేస్తుంది  -మీ దుర్గా ప్రసాద్ –k.p3 001 kavita prasad -1 001 kavita prasad-2 001 kp-4 001 kp5 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెళ్లి పాట తో చిత్రప్రవేశం చేసిన వడ్డే పల్లి కృష్ణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జూన్ 14 బుచ్చిబాబు శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షరాగ్ని వర్షం -చిరంజీవి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ సుగంధం -దేవరాజు మహారాజు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు కవితలు – కర్షక కవి రాసిన పొలం కావ్యం


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేచి చూడటం కోసం – నరేంద్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”-పై చలపాక ప్రకాష్ సమీక్ష -ఆంద్ర భూమి -ఆదివారం 31-5-15

”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”-పై చలపాక ప్రకాష్ సమీక్ష -ఆంద్ర భూమి -ఆదివారం 31-5-15

31cenall copy

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -3

ప్రేమ వ్యామోహం

దీనికి రెండేళ్ళ ముందే జోలా గాఢం గా ప్రేమలో పడ్డాడు 1864లో ఎడమ గట్టు మీద కొత్త లాడ్జింగ్ వెతుక్కొని వెళ్ళిపోయాడు . అప్పటి నుంచి అలేక్సాండ్రిన్ మేస్లీ తో పిచ్చి మొహం లో పడ్డాడు .ఆమె తలిదంద్రులు అద్దెకిచ్చిన గదిలోనే ఉన్నాడు .ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ కు కొత్తభార్య ఆమెను వేసవికి ఇంటిదగ్గర వదిలి భర్త వెళ్లి పోయి మళ్ళీ తిరిగి రాలేదు .ఆమె జోలాను ముగ్గులో దించినా ఓపిక పట్టి ఆమె భర్త తిరిగి వస్తే జరిగే  పరిణామాలను గురించి ఆలోచించాడు .ఒక వేళ ఆమె ప్రియుడు తిరిగి వస్తే అలేక్సాండ్రిన్ పై అతనికే మొదటి హక్కు ఉంటుంది కదా అనుకొన్నాడు .ఈ స్థితిలో సుఖం గా గడపాల్సిన రాత్రులన్నీ ఈ సంక్షోభం తో కరిగిపోయాయి జోలాకు  అతనే తిరిగి వస్తే తనకు ఆమె మొదటి ప్రేమికుడికి మధ్య ద్వంద్వయుద్ధం  జరుగుతుందేమో ననుకొన్నాడు .అనుకోన్నట్లే కొన్ని నెలల తర్వాతా ఆ మెడికల్ స్టూడెంట్ తిరిగి రానే వచ్చాడు . వీరిద్దరి ప్రేమ గ్రహించిన ఆ మెడికో జోలాకు అలేక్సాండ్రిన్ ను స్వయం గా అప్పగించేశాడు .కొత్త దంపతులు విశాలమైన ఇంటికి కాపురం మార్చారు .అప్పుడు జోలా తల్లి వచ్చి కొడుకు కోడలుతో ఉంది. హాయిగా ఆనందంగా జీవితం గడిపారు ముగ్గురూ ..ఆరేళ్ళ తర్వాత ఆమెను చట్ట బద్ధం గా జోలా పెళ్లి చేసుకొన్నాడు .

ఇంప్రెష నిస్ట్

రెండేళ్ళ తర్వాతా తన సాహిత్య క్షేత్రాన్ని జోలా విస్తరించాడు .సెన్సేషనల్ గా వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక గొప్ప నవల రాయటానికి తీవ్రం గా ప్లాన్ తయారు చేసుకొన్నాడు .అప్పటికే ‘’మై హేట్స్’’(-my hates ) అనే వ్యాస సంపుటిని ప్రచురించాడు చివరి సారిగా తాను రోమా౦టి జం ను త్యజిస్తున్నానని ప్రకటించాడు .యువ చిత్రకారుల భుజం తట్టి వారి  ఇంప్రెష నిజానికి  మద్దతు పలికాడు సిజానే తో కలిసి .సెలూన్ జూరీ దీనికి అనుమతించలేదు .’’పిక్నిక్ ఆన్ ది గ్రాస్ ‘’అనే చిత్రాన్ని గీసిన మానేట్ ను అభినందించాడు . దాన్ని ‘’పోకిరి ‘’చిత్రం అని విమర్శకులు దాడి చేస్తే జోలా ‘’A work of art is a corner of creation ,seen through a temperament ‘’అని జవాబు చెప్పాడు. ‘’తెరేసి రాక్విన్ ‘’ప్రచురించేటప్పటికి జోలా వయసు 27.ఈ నవలలో తాను సెక్స్  ,హత్య , పశ్చాత్తాపం మొదలైన వాటిని చర్చించానని జోలా చెప్పాడు. అశ్లీలం గా జంతు ప్రేమకు పరాకాష్టగా  ఉందని విమర్శకులు అన్నా, రెండవ ముద్రణ పొందింది .

25 ఏళ్ళ పరిశోధనా కృషి ఫలితమే రోగాన్ –మాక్వార్ట్

నిశ్చయత్వం లో పూర్తిగా మునిగి  పరిసరాలు ,హీరేడిటిల ప్రభావాలను చర్చించాడు . వాటి ప్రభావాన్ని గణితం  చెప్పినంత కరెక్ట్ గా చెప్పగలిగాడు .ఫిక్షన్ రచనలలోని వ్యక్తుల ప్రవర్తనను వారి జీవిత నేపధ్యం దృష్టిలో రాశాడు .ఇందులో పెంపకం, రక్తం ,ఏయే  ప్రభావాలు కలగ జేస్తాయో క్లినికల్ లేబరేటరీ లో పరీక్ష చస్తే వచ్చే ఫలితాలు ఎంత స్పష్టంగా ఉంటాయో అంత స్పష్టంగా చెప్పగలిగాడు బాల్జాక్ రాసిన ‘’కామెడీ హ్యూమనే ‘’ఆధారం గా మరో గొప్ప నవల కు ప్లాన్ తయారు చేసుకొన్నాడు .లైబ్రరీలలో కూర్చుని మోనోగ్రాఫులు ,కేస్ హిస్టరీలు ,మానసిక అధ్యయనం ,వ్యవహార పత్రాల పరిశీలన ను అతి జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిని తనకున్న మనోభావాలతో  విశ్లేషించి వివరించాడు .సమాజం పై తనకున్న భావాలు వ్యక్తుల ప్రవర్తన ,వారి మానసిక శారీరక స్తితి లపై చేసిన ఈ పరిశోధన 25  భాగాల ‘’రోగాన్ –మాక్వార్ట్ ‘’నవలలకు  సరిపడ సామగ్రి గా లభించింది . ఈ బృహత్తర గ్రంధ రచనకు 25 ఏళ్ళు పట్టింది ఇవన్నీ 90 రాత ప్రతులలో భద్రం చేశాడు .రోగాన్ –మక్వార్ట్ కుటుంబాలకు చెందిన 32 మంది  వ్యక్తుల  సమగ్ర రిపోర్ట్ ఇది దీనికోసం ఎందరో వ్యక్తుల మహళ్లకు ,మురికి కూపాలకు అడ్డాలకు అనేక సార్లు వెళ్లి వచ్చేవాడు .పోలీసు రికార్డ్ లు పరిశీలించాడు   తన రచన చాలా నిర్దుష్టంగా సంపూర్ణం గా దోష రహితంగా ఉండాలన్న తపనే ఇదంతా .

ప్రతి పుస్తకాన్ని వేరుగా ఒక యూనిట్ గా ఉంచాడు .ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణానికి రాళ్ళు ఎలా అవసరమో ఇవి ఆయన బృహత్తర నవలకు మూలాదారాలయ్యాయి .దీనిపై హెన్రి బార్బాస్ స్పందిస్తూ ‘’  in the entire history of intellectual creation there is scarcely another example of a man seeing so far in advance with such precision the concrete contours of a multi form work ‘’అని గొప్పగా విశ్లేషించి చెప్పాడు ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శాసనాల కళాఖండం

శాసనాల కళాఖండం kalakhandam -1 001 kalakhandam 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విదేశాల ఎన్నికలలో లో మన తెలుగు కార్టూన్ లతో ప్రచారం

విదేశాల ఎన్నికలలో లో మన తెలుగు కార్టూన్ లతో ప్రచారంcartoon 1 001 cartoon 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -2

ఇరుకు గదిలో ఇద్దరు

ఉద్యోగం కోసం ఎదురుచూపులు మానేసి అప్పుచేసి దాంతో పోట్టకింత తింటూ  ఒక మేడమీద పై భాగం లో చిన్నగది బాడుగకు తీసుకొని ,ఎత్తు  మెట్లు ఎకుతూ దిగుతూ అక్కడ  ప్రోఫెషనల్ బోహీమియన్ లా ఉన్నాడు . బద్ధకం గురించి చెబుతూ ‘’బద్ధకం మహా గొప్పది. దానివలన ఎవరూ చచ్చిపోరు .’’అంటాడు  తన పూర్వ స్నేహితులిద్దర్నీ తనతోకలిసి వచ్చి లాటిన్ క్వార్టర్ లో ఉండమని ఆహ్వానించాడు .కాని సిజానే మాత్రం మూడేళ్ళు తండ్రితో తీవ్ర యుద్ధం చేసి వచ్చి చేరాడు . ఆ చిన్న ఇరుకు గదిలోనే ఇద్దరూ సర్దుకున్నారు .సిజనే కొచ్చే అలవెన్స్ తోనే ఇద్దరూ గడిపారు .ఇద్దరికీ విసుగనిపించి వేర్వేరుగా గదులు తీసుకొని వేరైపోయి ఉన్నారు. ఐక్స్ లో సిజానే ఇబ్బంది పడుతూ ఇంటికి వెళ్లి పోయాడు .జోలా ఒంటరిగా పేదరికం లో మగ్గుతూ గడిపాల్సి వచ్చింది .రోమా౦టిసిజం ను ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు అవి ఏమీ ప్రతి ఫలాన్ని పిండటం లేదు .’’ఈ నగరం లో విశ్రు౦ఖల వేశ్యా విహారం తప్ప ఏమీలేదు .పోనీ పల్లెటూళ్ళల్లో ఏదైనా ఉందనుకొంటే అక్కడ అంతా మూర్ఖత్వమే ‘’అన్నాడు జోలా .కని  పించిన ప్రతి చోట ప్రేమ కోసం అన్వేషించాడు .కాని అదీ ఆకాశ కుసుమమే అయింది .’’everywhere sex but nowhere woman ‘’అనుకొన్నాడు .ఉద్యోగం వెన్నులో వణుకు పుట్టిస్తోంది .అవి తనను పూడ్చి పెట్టనిమ్మనుకొన్నాడు .

పిచికల్ని కాల్చుకు తిన్న అతి దరిద్రం

కొంతకాలం దరఖాస్తు పెట్టకుండా ఉద్యోగం వేట చేశాడు .అతని ఆకారం, దుస్తులు ,చూపులు చూసిన వారెవ్వరూ ఇంటర్వ్యు చేయట౦ , ఉద్యోగం ఇస్తానన్న సాహసం చేయ లేకపోయారు .తనకు తాను అంచనా వేసుకొన్నాడు తాను  వేసుకొన్న మార్కులు కూడా చాలా పూర్ .కవి ,స్వేచ్చా ప్రేమ తో ఉన్న బోహీమియన్ అను కొనేవాడు .ఇరవై ఒక ఏడాది వరకు అస్కలిత ఘోటక బ్రహ్మ చారి గా ఉన్నాడు .ఒక వేశ్య దొరికితీ ఆమె తో కొన్ని నెలలు గడిపాడు .ఈ కలయిక సుఖాన్ని ఏమీ అందించలేదు .బీదరికాన్ని ,బీద జనాన్ని చీదరించుకొనే జోలా ,సంఘాన్ని తిట్టిపోశాడు ,కాని దాన్ని సహించాడు .చాలీ చాలని దుస్తులు ,ఎప్పుడూ కడుపులో ఆకలి మంటలు .కళ్ళల్లో క్రోధం అదీ జోలా పరిస్థితి .రాయటానికి అసలు ఇష్టపడే వాడు కాదు . గైడీ మొపాసా అనే ప్రముఖ రచయిత రాసిన దాన్ని బట్టి  జోలా గదిలో పిచ్చుకలు  గూళ్ళు కట్టుకొని ఉండేవి  వాటిని  కర్టెన్ రాడ్ మీద ఉదికి౦చు కొని ఆత్మా రాముడికి శాంతి కలిగించేవాడు . అంతటి దుర్భర దారిద్ర్యం అనుభవించాడు జోలా .లేక పోతే అవి తెచ్చుకొని వదిలేసిన రొట్టేముక్కల్నిదక్షిణ ప్రాంతం  నుండి పంపిన  ఆలివ్ ఆయిల్ లో ముంచు కొని  తినేవాడు . మరీ దారుణంగా పతనమై పోయాడు ఆర్ధికం గా .అప్పుడు తెలిసింది ఒక స్నేహితుని ద్వారా తన తండ్రి ఒక  పబ్లిషింగ్ కంపెనీ లో ఒక ఉద్యోగాన్ని కుదిర్చాడని తెలిసింది .

ఉద్యోగం –మొదటి కదా పుస్తకం –మొదటి నవల

ఆ మాట విని ‘’విశ్వాసం మళ్ళీ వచ్చింది .నిజమే అని నమ్మాను .ఇప్పుడు నాకు నవ్వు వస్తోంది ‘’ ఆకంపెనీ అధికారి మన్సూర్ హేచాటీ  జోలా రచయిత అని తెలుసుకొని  ప్రొమోషన్ ఇచ్చి అడ్వర్ టైజ్ డిపార్ట్ మెంట్  లో ఎక్కువ జీతం ఇచ్చి ప్రోత్సహించాడు .ఈ విషయాన్ని సిజానే కు రాస్తూ తన పాత రచనలపై అభిప్రాయాలకు మెరుగులు దిద్దాలనుకోన్నానని చెప్పాడు .బాగా వినిపించాలని బాగా చూడాలని అనిపిస్తోందన్నాడు ఇదివరకు లేని కొత్తభావాలు  తనలో వికసిస్తున్నాయన్నాడు  ప్రకృతి లో చాలా కవిత్వం ఉంది అలా కనిపిస్తుంది కూడా అన్నాడు .ఇది వరకు రాసిన రొమాంటిక్ కధలను అన్నిటినే సేకరించి మేగజైన్స్ లో ప్రచురించేట్లు చేశాడు . మిగిలినవీ రాశాడు.  వీటినన్నిటిని కలిపి ‘’’’స్టోరీస్ ఫర్ నినాన్ ‘’పేరుతొ ప్రచురించాడు . ఇదే జోలా మొదటి పుస్తకం .అప్పటికి ఆయన వయసు 25.తర్వాత వేశ్యతో తాను గడిపిన అశాంత జీవితాన్ని ఒక నవలగా ‘’కన్ఫెషన్స్ ఏ క్లాడ్ ‘’.రాశాడు .దీన్ని తన ప్రియ మిత్రులైన సిజనే ,బైలీ లకు అంకితమిచ్చాడు ఈ నవల సిగ్గుమాలిన నవల అని అందరూ ముందు అన్నా తర్వాత విపరీతమైన విజయాన్ని సాధించి ఉత్సాహాన్నిచ్చింది .ఈ సందర్భం గా సిజనే –జోలా చిత్రాన్ని గీసి బహూక రించాడు అందులో జోలా లోని కల ,నిశ్చయం రెండూ సమతూకం లో కనిపిస్తాయి .

ఫ్లాబర్ట్ చెప్పే నేచురలిజం చూసి దాని ప్రచారం విని తెలుసుకొని తన రచన చాలా పేలవం గా ,జీవం లేనిదానిలా ఉందని జోలా గ్రహించాడు .’’మాడంబోవరీ’’రాసినందుకు ఫ్లాబర్ట్ ను అందులో అనైతికత ఉందని కోర్టుకు లాగారు  అందులో అన్నీ చాలా వివరంగా ఫ్లాబర్ట్ రాశాడు .’’మంచి అభిరుచి ‘’ చదువరులకు అందించాలనే ఆలోచన వచ్చింది .ఇదే నేచరిలిజం కు దారి తీసింది  “”zola  envisioned a kind of writing which would shock the world by its power and range ,a series of books from which nothing could be excluded .’’అనే ఒక ఆలోచనలోకి వచ్చాడు .ఈ సందర్భం లో జోలా ‘’When I attack a subject ,I want to force the whole universe into it ‘’అని చెప్పుకొన్నాడు .జోలా పని చేస్తున్న కంపెనీ దాని అధికారి హచాటీ లవి భిన్న ఆలొచనలుగ ఉండేవి .తన జీవిత చరిత్రగానే రాసిన ‘’కన్ఫెషన్స్ ‘’నవల అతని కంపెనీలో ద్వేషాలు పెంచింది .మూడేళ్ళు అలాగే లాక్కొచ్చి రాజీనామా చేసేశాడు .వెంటనే చారిత్రాత్మకం గా గొప్ప నవల ‘’ది ఇస్స్యు ‘’ను ధారావాహికం గా పారిస్ వార్తాపత్రికకు రాశాడు .దీన్ని మెచ్చిన సంపాదకుడు ఆ పత్రికలో రెగ్యులర్ కాలం రాయమని కోరాడు .’’A young man versed in all the arts whose books ,few but excellent ,have already produced a sensation ‘’అని మెచ్చుకొన్నాడు కూడా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

7-6-15 ఆదివారం మా ఇంట్లో -మా కజిన్ సూరి రాధాకృష్ణ మూర్తి -కుమారుడు శ్రీరామ మూర్తి కుటుంబం 

7-6-15 ఆదివారం మా ఇంట్లో -మా కజిన్ సూరి రాధాకృష్ణ మూర్తి -కుమారుడు శ్రీరామ మూర్తి కుటుంబం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గతి తప్పిన రుతురాగం

గతి తప్పిన రుతురాగం

  • 07/06/2015
  • -సుధామ, కృష్ణతేజ

వాన రాకడ… ప్రాణం పోకడ… -అని మనవాళ్లు ఊరికే అనలేదు. ఈ రెండూ ముందుగా గుర్తించడం అసంభవం. ఎంత శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరిగినా, అంచనాలు వేయడమంటూ జరిగినా, అనుకున్నట్టుగానే జరుగుతుందని అస్సలు చెప్పలేం! అయితే ‘అతివృష్టి’ – లేకుంటే ‘అనావృష్టి’ అన్నట్లు పరిస్థితులుంటూంటాయి. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా – ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా’ అని వర్షం పాటలు ఎన్ని పాడుకున్నా, అది రాదలచుకుంటే వస్తుంది. లేదంటే లేదు. వచ్చినా ఎంత శాతంగా తన ‘పాతం’ నమోదు చేసుకుంటుందో, జరిగాక కానీ చెప్పలేం! వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో – ఆ వ్యవసాయం కూడా ప్రధానంగా వర్షాధారితం కనుకనే, ‘వాన రాకడ’ పట్ల మనకంత నిరీక్షణలూ, మమకారాలూ! కానీ, రోజులు మారిపోతున్నాయి. మేధోమథనాలు, మేఘ మథనాలు వచ్చాక ‘దృక్పథాలూ’ మారిపోతున్నాయి. ఒకప్పుడు వానతో ముడివడిన అనుభూతులు క్రమంగా అంతరించి పోతున్నాయేమోనన్న బెంగా కలుగుతోంది. ‘వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా’ ‘వానావానా వల్లప్పా’ అని పాడుకునే పిల్లలు ఇప్పుడు – ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అని పాడుతున్నారు. వరుణుడికి కోపం వస్తే రావచ్చు మరి. ‘ఎల్.కె.జి. రైమ్‌కీ, ‘ఎల్‌నినో’కు సంబంధం ఉంటుందా? అంటే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అయిపోవచ్చు. మెయిల్ కాదు గానీ, ‘మొయిలు’ అంటే మేఘం అనే. ‘బ్లాక్‌మెయిల్’ అనగా నల్లని మేఘం అంటే వర్షవాహికగా భావిస్తాం మరి! ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటామా’ – అలా చేస్తే ఇప్పటికే తాగునీరు సమస్య పెరిగిపోతోంది. అది మరీ గుక్కెడు నీరు అందని విపత్కర పరిస్థితి తెచ్చేయవచ్చు. గుంపులు గుంపులుగా కనపడ్డ మబ్బులు గుప్పెడు నీళ్లయినా చల్లకుండా తేలిపోవచ్చు. ‘కుంభవృష్టి’ అనగా కుండపోత నీరు పడడం పోయి వాన వాటర్‌బాటిల్ ఒంపినట్లుగా పడి ముగిసిపోనూ వచ్చు. అసలు ‘వానాకాలం’ అనే దానికి గొప్ప ప్రాధాన్యం. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. వర్షం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అంటూ బిందు వ్యవసాయంలోకి దిగితే ‘డిప్రెషన్’ రావచ్చు. రైతు ఆత్మహత్యలకు వర్షాభావ పరిస్థితులూ హేతువులవుతున్నాయనే మాట ఉంది. పర్యావరణ సమతుల్యతను చేజేతులా మనమే దెబ్బతీసి అడవులు, చెట్లు నరికివేస్తుంటే ఇక సహజ వర్షాలను చేజేతులా అడ్డుకున్నట్లే అని శాస్తవ్రేత్తలు ఘోషిస్తూన్నారు. ‘వానలో తడవనివాడు’ మనిషే కాడు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సహజసిద్ధంగా జీవనం గడపవలసిన మనిషి ఆ సహజాతాలకు దూరంగా ఆ కాలానికి తగినట్లుగా కాక ప్రతికూలతలను సౌకర్యాలుగా సంభావించి అనుభవించడం నేర్చుకుంటున్నాడు. వానలో తడిస్తే మొక్క మొలిచి పోతానన్నట్లు భయపడుతున్నాడు. వివేకం బదులు విలువలు నశించి బుర్రలో మట్టి పెరుగుతున్నప్పుడు సదరు భయాలు సహజమే అనిపిస్తోంది కూడాను. మునుపు ‘వానాకాలం చదువులు’ అనేవారు. వర్షపురోజుల్లో బడులు, బోధనలు సెలవులెక్కువ పుచ్చుకునేవి అప్పుడు. కానీ, వానాకాలం చదువు అంటే నిజమైన వ్యవసాయ విద్య అనే భావనా వుండేది. చెట్లు చేమలతో, పొలాలతో ప్రకృతితో ప్రతి మనిషికీ అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలు కొందరు బియ్యం చెట్లకు కాస్తాయనుకుంటున్నారంటేనూ, ఏది ఏ పొలమో, ఏది ఏ చెట్టో మొక్కో చాలామంది గుర్తించలేని స్థితిలోనే వున్నారంటేనూ వానతో, ప్రకృతితో వారికి అనుబంధం ఎడమై పోవడమే. సన్నగా వర్షం పడుతూంటే రేడియోలో వివిధభారతిలో ఏ హిందీ పాటనో వింటూ, వేడివేడి పకోడీలో, మిరపకాయ బజ్జీలో తినడంలోని అనుభూతి- ఆ మజా అనుభవిస్తే గానీ తెలియదు కదా! ఇప్పుడు రేడియో ఔట్ ఆఫ్ డేటెడ్ కదా పాపం! ‘బర్సాత్ కీ ఏక్ రాత్’, ‘వర్షం కురిసిన రాత్రి’ లాంటి కథలు సాహిత్యంలో హృదయదఘ్నంగా చేరువైన రోజులూ వెళ్లిపోతున్నాయి. ‘కొమ్మచాటు పువ్వు తడిసె – ఆకుచాటు పిందె తడిసె’ అని వర్షపు గీతాలు, సినిమాల్లో వర్షపు సన్నివేశాలు ఎంతగా ఎందరి అనుభూతి ప్రపంచాన్ని చుట్టుకున్నాయో మాటల్లో చెప్పడం కష్టమే! వర్షంతో ముడిపడిన కథలెన్నో! కావ్యాలెన్నో! ‘నగరంలో వాన’ అని కుందుర్తి సుదీర్ఘ వచన కవిత రాశారు. అలాగే, వర్షం గురించి వంగపల్లి విశ్వనాథం అనుభూతి వీచికలు కవితాత్మకం చేశారు. సినిమాల్లో వాన పాటలు, వాన దృశ్యాలకు కొదవే లేదు. మబ్బు మరణించి వానగా మారిపోవు విత్తు మరణించి మొక్కగా మారిపోవు అంటూ మృత్యుకేదారముననె జీవి సుమించుట చూస్తాం- అని తాత్త్విక కవిత నల్లిన వారున్నారు. వానలు ముంచెత్తితే వరదలే! గాలివాన ఒక బీభత్స దృశ్యమే. పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పుడు తుపానులు కూడా కొత్తకొత్త పేర్లు పెట్టుకుని వస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘హుద్‌హుద్’ తుఫాను అందాల విశాఖను ఊడ్చిపారేసింది. ఇప్పుడిప్పుడే విశాఖ మళ్లీ ప్రకృతి అందాల చిగుళ్లు తొడుక్కుంటోంది. వరద బీభత్సాలు పంటలను, గ్రామాలను పాడుచేస్తే వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు తెస్తాయి. వానలు పడక పోవడమంత దురదృష్టం మరొకటి లేదు! వర్షాల గురించి అధ్యయనాలు ఇవాళ ప్రపంచమంతటా సాగుతున్నాయి. వాతావరణ శాఖ వాన రాకడ అంచనాలకు అహర్నిశలూ కృషి చేస్తూ ఉంది. డైనమిక్ థియరీ, జెట్ స్టీమ్ థియరీ వంటి కొత్తకొత్త పరిశోధనలు వచ్చాయి. ఎల్‌నినో ఏర్పడితే వర్షాభావ పరిస్థితులెదురై కరువు కాటకాలకు దారి తీస్తుందంటున్నారు శాస్తజ్ఞ్రులు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో వచ్చే ఉష్ణోగ్రతల్లోని పెనుమార్పులే ఎల్‌నినోకు కారణం సాధారణ ఉష్ణోగ్రతలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మధ్య తూర్పు పసిఫిక్ జలాల్లో సంభవించి మిగిలిన సముద్ర ప్రాంతాలకు విస్తరించడమూ జరుగుతోందిట! వేడి నీటి ప్రవాహాలు సముద్రంపైన గాలిలో నీరు చేరేందుకు అడ్డుపడి వర్షాభావంతో కరువులకు నెలవులు అవుతూంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వేగం తగ్గడం కూడా ఎల్‌నినో ఏర్పడడానికి సంకేతం అంటున్నారు శాస్తజ్ఞ్రులు. నీటి ఉష్ణోగ్రత సామాన్య స్థితికన్నా బాగా తగ్గిపోవడంవల్ల ‘లానినా’ సంభవిస్తుంది. ‘ఎల్‌నినో’ అయినా, ‘లానినా’ అయినా ఉష్ణోగ్రతల్లో తారతమ్యాల వల్ల ప్రమాద సూచికలయ్యే వీలుంది మరి! భూగర్భ జలాలు కూడా క్రమేపీ తగ్గిపోతున్నాయి. చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురై, కాంక్రీటు భవనాలు లేచిపోతుంటే పర్యావరణం దెబ్బతినక ఏమవుతుంది? దారికి ఇరుపక్కలా మొక్కలు నాటించిన, బావులు తవ్వించిన అశోకుడు వంటివారు ఇవాళ చరిత్ర పుటలకే పరిమితమై పోయారు. వ్యక్తి స్వార్థంతో ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొక్కలు నాటడం కన్నా నరకడం పరిశుభ్రత అనుకునే దుస్థితి వచ్చింది. ‘వన మహోత్సవం చేద్దాం మొక్క నాటడానికి చోటు చూడండి’ అని అధికారులు ఆదేశిస్తే, ‘గత సంవత్సరం నాటిన చోటు బానే వుందండీ! అక్కడే నాటేద్దురుగాని’ అని సమాధానమిచ్చే సహాయకులు, స్వచ్ఛ భారత్ చేయాలంటే చీపుర్లు పట్టడం కోసం ఆ నేతలకు సమీపంలోనే చెత్త చేర్చేవారు రూపొందుతున్నారు. ‘వాన నీటిని వృథా కాకుండా కాపాడాలి’ అన్నది నినాదంగా మిగిలిపోకూడదు. వానలు అరుదై పోతే వాననీరు మరీ అరుదై పోతుంది. కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షాలే అవుతాయ గానీ రుతుపవనాలతో సహజసిద్ధంగా వర్షించినవి కాజాలవు కదా! నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుండి జూన్ మొదటి వారంలో ప్రవేశించడం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి కారణంగా సెప్టెంబర్ వరకు వానలు పడే వీలుంటుంది. అయితే, వర్షపాతం ఎక్కువ, తక్కువలు అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. మబ్బులు ఏర్పడటంతో సరిపోదు. అవి సరియైన దిశగా పయనించి కొండలను తాకి తాము ధరించిన నీటిని వర్షించడం ముఖ్యం. ఈ పరిణామం సహజంగా ఎంత చక్కగా జరిగితే వర్షపు పరిమాణం అంత హర్షదాయకం అవుతుంది. నీరే ప్రాణాధారం అన్నారు. భూమినైనా మూర్ఛ నుంచి తేర్చేది వర్షపు నీరే. వర్షం రైతు నేస్తం మాత్రమే కాదు. సర్వ జీవరాశి జీవన నేస్తం కూడాను. వానల కోసం భారత విరాట పర్వ పారాయణాలు చేయడం, కప్పలకు పెండ్లి చేయడం ఈ భరత భూమిలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. వానాకాలం అంటే ప్రాణకోటి జీవనకాలం ప్రకృతితో మమేకమై విలువల జీవధార నింపువడం ఎప్పటికీ అవిస్మరణీయ అంశం. * కాలం మారింది! సంగీతంలో శ్రుతి బాగుంటేనే శ్రావ్యంగా ఉంటుంది. అది మనసుకు హాయినిస్తుంది. రుతురాగం బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. శ్రుతి, లయ తప్పితే విలయమే. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా భారతీయుల జీవితానికి రుతురాగమే చుక్కాని. తొలకరితో మొదలయ్యే వారి జీవనరాగం, మధురిమలొలకాలంటే ఏ కాలానికి ఆ కాలం తన పని తాను చేసుకుపోవాలి. ఆ పనికి మనిషి ఆటంకాలు కల్పిస్తే వచ్చే విలయానికి బలయ్యేది అతడే. అది ఇప్పటికే అనుభవంలోకి వచ్చేసింది. రోహిణి కార్తెలో రోళ్లు పగలడం మామూలే అయినా ఇప్పటిలా పిట్టల్లా మనుషులు రాలిపోవడం ఇటీవలి కాలంలో ఎదురైన విషాదకర పరిణామం. నీడను, తిండిని, చక్కటి గాలిని ఇచ్చే చెట్టూచేమను తెగనరికిన ఫలితం ఇది. సముద్రాలు వేడెక్కి ఏర్పడిన మేఘాలు చల్లబడటానికి కావలసిన చల్లని గాలిని ఇచ్చే చెట్లు లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పటికే మానవాళికి అనుభవంలోకి వచ్చింది. పచ్చనిచెట్టు నరకొద్దని పూర్వం ఎందుకు చెప్పేవారో ఇప్పటి తరానికి అర్థం కాదు. వసంతం వచ్చినా కోకిల గొంతుల్లో అప్పటి మాధుర్యం విన్పిస్తోందా? మేమున్నామంటూ అక్కడో, ఇక్కడో ఓ కోకిలగొంతు సవరించుకుంటున్నదే తప్ప అప్పటిలా కుహుకుహుల వింజామర ఏదీ! ఎండమావి ఎలా ఉంటుందో వేసవి చెబుతుంది. తీరని కోర్కెలు, లేదా అలవికాని హామీలను ఎండమావితో పోల్చేవారు. ఇప్పటి తరానికి ఈ రెండు అనుభవమే. అలాగే బతికేస్తున్నాం. వేసవికాలం పెరిగిపోయి, వర్ష రుతువు చిన్నబోతోంది. తొలకరి కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తుంది. ఎందుకు. మిగతా ఏడంతా పనీపాట, పాడిపంటా, డబ్బూదస్కం దండిగా రావాలంటే తొలకరితోనే సాధ్యం. అందుకే ఆశగా ఆకాశం వైపు, కరిమేఘాల కోసం, వానచినుకు కోసం పరితపిస్తాడు రైతు. మన చేతినిండా పంట, పశువు కడుపు నిండా గ్రాసం కావాలంటే తొలకరి సకాలంలో పలకరించాల్సిందే. తొలి చినుకులతో తడిసిముద్దవ్వడం ఓ తరహా ఆనందం. తొలకరి వానలో చిన్నాపెద్దా తడిసిముద్దవ్వడం అలనాటి మురిపెం. చూరుకింద బొట్లు, బొట్లుగా జారే ముసురువాన నీటిచుక్కలతో వచ్చే బుడగలు అలా లేచి టప్పున పేలిపోవడం ఓ ముచ్చట. జీవితం కూడా అలాంటిదేనని, ఎప్పుడు ఎలా ముగుస్తుందో చెప్పలేమనడానికి ఆ బుద్బుధం ఓ సంకేతం. అలా మరీ ప్రవాహం కాని చూరునీటిలో కాగితపు పడవులు వేయడం ఓ ఆనందక్రీడ. పనికిరాని కాగితాలతో పడవలు చేయడం పెద్దవారికి, వాటిని నీటిలో విడవడం, ఆడటం చిన్నవారికి వానాకాలం వినోదం. ఇప్పుడు వానలు తగ్గిపోయాయి కనుక ఆ ఆటలు దూరమయ్యాయి. పడవ చేసే ఓపిక, ఆసక్తి ఇప్పటి జనంలో పూర్తిగా కనుమరుగవ్వలేదుకానీ, తగ్గిందనే చెప్పాలి. జీవనశైలిలో వచ్చిన మార్పులకు, వాతావరణంలో వచ్చిన మార్పు జోడెద్దుల్లా తయారై జీవనగమనాన్ని మార్చేస్తున్నాయి. రొంప చేస్తుందని తెలిసినా అప్పటి జనం వానల్లో తడిసిముద్దయ్యేవారు. రైతులకైతే వానలోనే పొలాల్లోకి చేరి నారుకట్టడం, నాట్లువేయడం తప్పనిసరి చర్య. ఎండలు తగ్గి, వానలు పెరిగితే ఆ ప్రభావం ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపేమాట నిజమే అయినా అందుకుతగ్గ జాగ్రత్తలు తీసుకోవడం పూర్వీకులు ఎప్పుడో నేర్చారు. అయితే, కాలచక్రంలో అనూహ్య మార్పులు రావడంవల్ల, అజాగ్రత్తవల్ల పైప్రాణాలు పైనే పోతున్నాయి. వర్షాలొస్తే తడవకుండా ఉండటానికి పడే తాపత్రయం ఓ సరదా సన్నివేశమే. ఇళ్ల పైకప్పులు సరిగా లేకపోతే వాననీరు గదుల్లో ఉరవడం, అవి ఇల్లంతా పాకిపోకుండా చూసేందుకు గినె్నలు ఆ నీటిధార పడేచోట పెట్టడం ఓ జాగ్రత్త. రోజుల తరబడి ఉండే ముసురు- ఇప్పుడు మురిపానికి కూడా ఎదురవడం లేదు. వస్తే కుండపోత లేదా ఒకటీ అరా చినుకే దక్కుతోంది. ఇక ఆ తరువాత శిశిరం. వేసవికాలం పెరిగిపోవడం, వర్షాకాలం చిక్కిపోవడంతో పెద్దగా ఎవరినీ వణికించడం లేదు. చల్లని చిరుగాలుల్లో తిరుగుతూ మొక్కజొన్న కండె, పక్కన చెలికత్తె ఉంటే ఆ చలి బలాదూర్. కానీ, ఈ ఆనందం అనుభవించేలోగా శీతాకాలం శీతకన్ను వేస్తోంది. వేసవిలో మల్లెపూల పరిమళం, సంపెంగల సువాసనలు ఆస్వాదించడంలో ఆనందం ఉంది గానీ, కోస్తా తీరంలో వేడిగాలులు, స్వేదధారలు దానిని కడిగేస్తాయి. వర్షాకాలంలో పుష్పవిలాసం తక్కువేగానీ శిశిరంలో బంతీచామంతులు కాంతలకు ఇష్టమే. అద్భుతమైన పరిమళం మాటకాదు గానీ, ఇంటికి, ఇంతికి అవి తెచ్చే అందం అంతాఇంతాకాదు. వర్షం పడుతున్నప్పుడు ఒకే గొడుగు కింద దూరి, వాటి చూరులోంచి ఓ మాదిరి ధారలు పడీపడకుండా, తడిసీతడవకుండా తప్పించుకుంటూ ఒకరినొకరు రాసుకుంటూ,పూసుకుంటూ సిగ్గులొలికే జంట ఆనందం ఆ గొడుగుమాటున మనకు కన్పించదు కానీ అదంతా వర్షం పుణ్యమే కదా. ఇప్పుడొచ్చే వర్షాలు ఆ గొడుగులను ఎగరేసుకుపోయే స్థాయిలో లేదా గొడుగులు అవసరమే రాని స్థాయిలో పడుతున్నాయే తప్ప అప్పటిలా సాధారణ స్థాయిలో ఉండటం లేదు. సప్త సముద్రాల మాటేమోగానీ మనదేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలపై గాలులు, ఆ పక్కనే ఉండే పసిఫిక్ సముద్రగాలులు, మేఘాలకు హిమాలయాల అడ్డంకులు కలసి కురిసే వర్షమే భారతావనికి ప్రాణం. రైతుకు ఆయువు. పంటకు ఆధారం. ప్రపంచంలో కేవలం ఋతుపవనాలపైనే ఆధారపడి, వ్యవసాయానికి అవసరమైన నీటిలో దాదాపు 80శాతం ఇస్తున్న ఆ గాలుల దిశ, దశ ఇప్పుడు పూర్వంలా స్థిరంగా లేదు. దీంతో భారతీయుల జీవనమార్గం లయ తప్పుతోంది. దాంతో ఆనందం ఆవిరైపోతోంది. భారత ఆర్థికరంగంలో 80శాతం వ్యవసాయం ద్వారానే వస్తోంది. ప్రజల్లో 70శాతం మంది దీనిపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20శాతం దీనిద్వారానే సమకూరుతోంది. ఒక్క ఏడాది రుతుపవనాల గమనం లయ తప్పితే అది దేశ ఆర్థిక, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే అటు రైతైనా, ఇటు ప్రభుత్వమైనా తొలకరి కోసం పరితపిస్తాయి. ఆ పవనాలు తమకు అనుకూలంగా వీయాలని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన వరుణుడు విని కరుణిస్తే చాలు. అదే పదివేలు. * నైరుతి, ఈశాన్య రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ అవసరాలను తీరుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణభారత దేశం యావత్తూ ఈ రుతుపవనాల వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఉత్తర భారతదేశానికి లాభం ఉన్నా ఇబ్బందులూ వీటివల్ల ఎక్కువే. ప్రపంచంలో అత్యంత నాటకీయంగా, క్రమం తప్పకుండా వచ్చే ఈ తరహా రుతుపవనాలు భూగోళంపై మరెక్కడా కానరావు. ఈ మధ్య ఎదురౌతున్న ‘ఎల్‌నినో’ ప్రమాదం వల్ల రుతుపవనాల గమనంలో మార్పు కన్పిస్తోంది. భారతదేశంలో కేవలం రుతుపవనాలపై ఆధారపడి 60 కోట్లమంది జనాభా బతుకుతున్నారు. వీటి గమనంలో తేడాలొస్తే వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. పంటలు పండకపోతే ధరలు పెరిగి, పనులు లేక వారు ఇబ్బందులు పాలవుతారు. అందుకే అందరి దృష్టి రుతుపవనాల రాకపైనే ఉంటుంది. మనదేశంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు రెండుగా చీలిపోయి అడుగుపెడతాయి. ఒకభాగం మలబారు తీరంలోని కేరళను తాకి దేశంలోకి వస్తాయి. మరోభాగం అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రాంతాలను తాకి మరోవైపునుండి చుట్టబెడతాయి. ఇక ఆ పవనాలు నెమ్మదిగా దేశమంతటా వ్యాపించి నెమ్మదిగా బలహీనపడతాయి. ఇక ఈశాన్య రుతుపవనాలు ఉత్తరాదికి కొంత లాభకరంగా ఉంటాయి. దక్షిణాదికి నైరుతి రుతుపవనాలతో పోలిస్తే వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు. * అక్కడ వర్షపాతం అధికం.. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మనదేశంలోనే ఉందంటారు. అస్సోంలోని చిరపుంజి మనదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా చాలామంది భావిస్తారు. అందులో కొంత నిజం ఉంది. అయితే గత పది పదిహేను సంవత్సరాల వర్షపాత నమోదు వివరాలు పరిశీలిస్తే చిరపుంజి కాస్త వెనకబడిందనే చెప్పాలి. మేఘాలయలోని హిమాలయాల పర్వత సానువుల్లో ఉండే ‘మాసిన్‌రామ్’ గ్రామంలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇది షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలాకాలంగా చిరపుంజి కన్నా ఇక్కడ ఎక్కువే వర్షం పడుతోంది. ప్రపంచంలో అత్యంత చిత్తడి ప్రదేశంగా దీనికి గుర్తింపువస్తోంది. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 11,872 మిల్లీమీటర్లు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లిపోయారు. వేసవిలో ఉత్తర వాయవ్య దిశల నుంచి వేడి గాలులు కొనసాగడం సాధారణమే. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వేడిగాలులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి అధిక ప్రభావం చూపాయి. సాధారణ ఉష్ణోగ్రత (సగటున 40 డిగ్రీలు) కంటే 5 నుంచి 6 డిగ్రీల అధికంగా ఉష్ణోత్రలు నమోదైతే ‘హీట్‌వేవ్ కండిషన్స్’గా పేర్కొంటాము. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైతే ‘సివియర్ హీట్‌వేవ్ కండిషన్స్’గా పరిగణిస్తాము. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో మే 20 నుంచి 27 వరకూ సివియర్ హీట్‌వేవ్ కండిషన్స్ నెలకొన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ‘మోడరేట్ హీట్‌వేవ్ కండిషన్స్’ నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న- దాదాపు 68 ఏళ్లతర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ అసాధారణ పరిస్థితులకు మరికొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ వేసవిలో కొనసాగే అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా వేడిగాలుల తీవ్రతకు కారణమయ్యాయి. అల్పపీడన ద్రోణికి భూ ఉపరితలం మీదుగా ఎడమ వైపు ఉన్న ప్రాంతాల్లో ఈ సారి వేడిగాలుల తీవ్రత అధికంగా కన్పించింది. సముద్ర తీరం వెంబడి కుడి ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అంతగా ప్రభావం చూపలేదు. రుతుపవనాలు మన దేశాన్ని తాకే వరకూ పగటి ఉష్ణోగ్రతల్లో ఈ తీవ్రత కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలోనే ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రొఫెసర్ పివి రామారావు, విశ్రాంత డైరెక్టర్, వాతావరణ శాఖ, విశాఖ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-6-15 శనివారం కాకినాడలో మా శిష్యుడు చిలుకూరి కుమారుని ఉపనయనం లో మేము 

6-6-15 శనివారం కాకినాడలో మా శిష్యుడు చిలుకూరి కుమారుని ఉపనయనం లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బంగ్లాదేశ్ రాత ప్రతులు సామాజికత ,-సురవరం లేఖల్లో సామాజికత

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగునపడిన కవి రత్నం

Posted in వార్తా పత్రికలో | Leave a comment

దళితుల జీవనం సంస్కృతీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుణ్య నదులే నవ దేవతలు -చరితార్ధుడు అగస్త్యుడు ఉన్నతంగా జీవిద్దాం


 
 


 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | 4 Comments