అలనాటి కవిత్వం కవితా కదంబం

అలనాటి కవిత్వం కవితా కదంబం

ANDHRAPRABHA –   Mon, 19 Jan 2015, IST

”మా అక్కగారగు శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ 1920 -49 సంవత్సరముల మధ్య వ్రాసిన రచనలను ఈనాటికి ఒక ”కవితా కదంబము”గా ఆంధ్ర సాహితీపరుల కర్పించగల్గినందులకు ఆమె సోదరులగు మేము ధన్యులము” అంటూ 1973లో ఈ కవితా సంపుటిని ప్రచురించిన మల్లవరపు కృష్ణరావు విశ్వేశ్వరరావులు ముందుమాట రాశారు.

విశ్వసుందరమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో 1899లో జన్మించారు. తల్లా వర్ఝ&ుల శివశంకర శాస్త్రి వంటి గొప్ప పండితులు దీనికి పీఠిక రాస్తూ ”ఈమెకు చిన్నతనము నుండియు దేశభక్తి మెండు. బ్రాహ్మ సమాజికులగుటచేతనూ ఆమెకు సంఘ సంస్కరణాభిలాష మెండు. ఈమెది తనివిదీర్చు కవిత్వము” అనటం విశేషం. స్వాతంత్య్ర సమరంలో పాల్గొని చెరసాలకు వెళ్ళిన దేశ సేవాభిమానురాలు సుందరమ్మ.

”కవితా కదంబం”లో హృదయవీణ, కథా కవిత, సుజన స్తుతి, జాతీయ సాంఘిక గీతావళి, భగవత్కీర్తనము, అనే విభాగాలున్నాయి. కథా కవిత అప్పట్లో రాయడం గమనార్హం! దేశభక్తి ఎంత ఉందో భావకవితా వైభవం అంతే ఉంది -భావకవితా వైభవం ఎంత ఉందో సామాజిక తపన అంతే ఉంది.

”ఎతట దు:ఖ భయంబుల కిరవు లేదొ

స్వర్గ సౌఖ్యంబులెచ్చోట జరుగుచుండు

నాయెడకు నాదు నావను నడుపుమయ్య

చేరి యనుకూల వాయువులే దారిజూప”

అనటం భావకవిత్వ పోకడ! భావకవిత్వంలో గల స్వేచ్ఛా ప్రియత్వలక్షణం ఈమె కవితలో కనిపిస్తుంది. కోకిల పాట ఎంత ప్రశస్తమూ, ఆనందకరమో విశ్వసుందరమ్మ ఇలా ప్రకటిస్తారు.

”కోకిలమ్మా లేని కోనలు తనకు

కా కిమూకలతోడి కానలేనంట

తావిలేనట్టి యాంపూవులేనంట”

”అర్జును తీర్థయాత్ర” అనేది కథాకవిత. రాజా రామమోహనరాయలు, వీరేశలింగం, సరోజినీ నాయుడు వంటి వారిని స్తుతిస్తూ రాశారు. జాతీయోద్యమంలో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ ఎందర్నో ప్రభావితం చేశారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ-

”ఖద్దరెంతో ప్రీతిగట్టు మా

మొద్దు దనుచు మూతిముడువక”

అంటూ కవిత రాశారు. విశ్వసుందరమ్మ స్త్రీల సమస్యలపై కూడా కలమెత్తారు-

”ఇట్టి వెతలకు గురియైం ఇంతులెల్ల

తలచి కొన్నంత దు:ఖము తరగలౌను”

అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు -మానసిక స్వభావాల్ని వివరిస్తూ తాత్త్వికంగా చెప్పిన కవితలూ ఉన్నాయి-

”దూషణ మానుము మనసా!

పరదూషణ మానుము మనసా

ఆత్మదోషముల నమ్రతతో గని

ఆత్మస్తుతినీ వేళనుమాని”

– – -ద్వా.నా. శాస్త్రి

9849293376

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర సృష్టించిన చరితార్ధులు

చరిత్ర సృష్టించిన చరితార్ధులు

ANDHRAPRABHA –   Mon, 19 Jan 2015, IST

చరిత్ర స్‌సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఒక చరిత్రకారుడు, బహుగ్రంథకర్త ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు’, ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు, భారతి స్వాతంత్య్రోద్యమము -ముస్లిం ప్రజాపోరాటాలు, చిరస్మరణీయులు, 1857 -ముస్లింలు, అక్షర శిల్పులు, అష్పాబుల్లాఖాన్‌, టిపూసుల్తాన్‌ వంటి గ్రంథాలను సమాజానికందించారు. ఈ గ్రంథాలు అందించే క్రమంలో ఆయన చేసిన పరిశోధన, పడిన శ్రమ అనితర సాధ్యం. కొన్ని వేల కిలోమీటర్లు తిరగడం వందలాది మందిని కలుసుకోవడం, ఆ ప్రాంతపు ముస్లిం యోధుల గురించి తెలుసుకోవడం చరిత్ర మరుగునపడిపోయిన ఆ యోధుల చరిత్రని వెలికి తీయడం నశీర్‌ అహమ్మద్‌కి నిత్యవ్యాపకం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదేపనిలో నిమగ్నమై ఉన్నారాయన. జర్నలిస్ట్‌గా, అడ్వకేట్‌గా, ఇలా అనేక వ్యాపకాలను నెరిపినా ప్రస్తుతం పరిశోధనకే జీవితాన్ని అంకితం చేసి ముందుకు సాగుతున్నారు నశీర్‌. బహుశా మరుగున పడిన ముస్లిం ప్రముఖుల చరిత్రలను వెలికితీసి నిక్షిప్తం చేస్తున్నవారు అరుదే నేమో! అయితే ముస్లింల చరిత్రను నిక్షిప్తంచేసే క్రమంలో ఆయన పరమతాలకు చెందిన ఎవరిని ఏ సందర్భంలోనూ కించపరిచిన దాఖలాలు లేవు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే 1757 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని ముస్లిం యోధుల చిత్రాలు, అలాగే వారి సంక్షిప్త వివరాలతో ‘చరితార్థులు’ పేరుతో ఒక మంచి పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం తీసుకురావడంలో ఆయన ఎంతగానో శ్రమించారు. ఇది ఒక అరుదైన పుస్తకం. కొందరి త్యాగాలకు చరిత్రలో స్థానం లేకుండా పోవడం శోచనీయమైన అంశం. అయితే దాన్ని ఈనాడు భర్తీ చేయాలంటే చరిత్ర మూలాల్ని పరిశోధించాల్సి ఉంటుంది. దానికి పూనుకొని నిరంతరం శ్రమిస్తున్న పరిశోధకుడు నశీర్‌ అహమ్మద్‌. చరితార్థులు పుస్తకానికి ఆయన మాటగా రాసుకున్న దానిలో ఇలా అంటారు.

చరితార్థులు (తెలుగు) ‘ది ఇమ్మోర్టల్స్‌’ (ఆంగ్లం) ఆల్బమ్‌ గత పదిహేనేండ్ల నా అన్వేషణ, శ్రమఫలితం. 1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్‌ వ్యతిరేకపోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని అసంఖ్యాక ముస్లిం యోధులలో నేను సమకూర్చుకోగలిగిన 155 మంది చిత్రాలు, ఫొటోలు, సమాచారం ఆధారంగా రూపొందించిన ప్రతి రూపాలు, సంక్షిప్త వివరాలు ఇందులో పొందుపర్చాను. ఈ గ్రంథంలో భారత పునర్వికాసోద్యమ నిర్మాతలలో ఒకరుగా ఖ్యాతి గాంచిన ముల్లా అబ్దుల్‌ ఖయ్యూంఖాన్‌ (హైదరాబాద్‌) బ్రిటిష్‌ ప్లాంటర్లు ప్రయోగించిన విషాహారం నుండి మహాత్ముణ్ణి కాపాడిన బతఖ్‌మియా అన్సారి (మోతిహరి, బీహార్‌) చిత్రపటాలు మాత్రం నా దృష్టికి వచ్చిన గ్రంథాలలో పేర్కొన్న వర్ణనలను బట్టి చిత్రకారుడి ద్వారా రూపకల్పన జరిగింది. అముత్సలాం (రాజస్థాన్‌) ఫొటో మాత్రం ఆమె చేత మహాత్మాగాంధీ స్వయంగా నిరాహారదీక్ష విరమింపజేస్తున్న దృశ్యం లభ్యం కావడంతో, ఆ అంశం ప్రాధాన్యత దృష్ట్యా, ఆ ఫొటోను యధాతథంగా వాడానని వివరిస్తారు నశీర్‌ అహమ్మద్‌. ఇక చక్రవర్తులు, రాజులు, రాజప్రముఖులు, సైనిక ప్రముఖులు సైన్యాధికారులు, సైనికులు, సాహసికులైన సామాన్య ప్రజల చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీషు భాషలతో వెలువడటం వల్ల ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలవారు చదువుకోవడానికి అవకాశమేర్పడింది.

ఈ పుస్తకంలో బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలా మొదలుకొని షేర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ వరకు మొత్తం నూటయాభై మంది చిత్రాలు అలాగే క్లుప్తంగా వారి చరిత్రలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో కూర్చారు.

ఎంతో ఆసక్తికరంగా వీరి చరిత్రలు అందించడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారని చెప్పవచ్చు. కొన్ని అరుదైన చిత్రాలు సేకరించి అందించారు నశీర్‌ అహమ్మద్‌. హైదర్‌ అలీ, టీపూసుల్తాన్‌, బేగం హజరత్‌ మహల్‌, బహదూర్‌ షాహ్‌జఫర్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌, బేగం నిషాతున్నిషా మోహాని, డాక్టర్‌ ఉమర్‌ అలీషా, మొహమ్మద్‌ అలీఖన్నా, షోయాబుల్లా ఖాన్‌, బతఖ్‌మియా అన్సారి, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ మఖ్దూం మొహియుద్దీన్‌, షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌, మొహమ్మద్‌ ఇస్మాయిల్‌, డాక్టర్‌ ఫక్రుద్దీన్‌ అలీఅహ్మద్‌, బేబి అమతుస్సలాం, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ వంటివారు ఇందులో చోటు చేసుకున్నారు.

చరిత్రకారులు కొందరిని కావాలని పక్కన బెట్టడం, అలాగే కొందరి చరిత్రను వక్రీకరించడం వంటివి ఎన్నో జరిగాయి. ఇందులో దళితులు, ముస్లింలను ఎక్కువగా విస్మరించడం జరిగాయి. ఇటువంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి ముస్లిం ప్రముఖుల చరిత్రను సేకరించడంలో నశీర్‌ చేస్తున్న కృషిని ఏమాత్రం తక్కువ చేయకూడదు. ఒకరి చరిత్రను అధ్యయనం చేయడమంటే నాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక అంశాలను అధ్యయనం చేసినట్లేకదా! ఇలా భారతదేశంలోని ఈ చరితార్థుల చరిత్రను రికార్డు చేయడం ప్రశంసనీయం.

బ్రిటిష్‌ వలస పాలకులనుండి ఈ దేశ విముక్తికోసం అలుపెరుగక పోరుసలిపిన ముస్లిం త్యాగధనులకు సరి అయిన గుర్తింపు లభించలేదనేది వాస్తవం. చారిత్రక ఆధారాలతో వచ్చిన ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావలసిన అవసరం వుంది.

అలాగే ఇందులోని చరితార్థుల గురించి సమగ్రమైన చరిత్రలను నిక్షిప్తం చేయాల్సిన అవసరమూ వుంది. ఇది ఒక్క ముస్లింలేకాక అందరూ చదివి భద్రపరుచుకోవాల్సిన పుస్తకమిది.

”ఈ ఆల్బమ్‌ రూపకర్త శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఎంతో శ్రమకోర్చి సేకరించిన 155 ముస్లిం యోధుల చిత్రపటాలు, ఆయా యోధుల వివరాలు ఇందులో పొందుపర్చారు. 1757 నుండి 1947 వరకూ దేశం కోసం త్యాగాలు చేసిన, ప్రాణాలర్పించిన ముస్లిం వీరులు, దేశభక్తులు సమర యోధులు ‘చరితార్థులు’లో వున్నారు. ఇవి దృశ్యమాలికలు. క్రితం కఈఊి, కఇి లాంటి సంస్థలు ఈ దిశలో కొన్ని గ్రంథాలు వెలువరించాయి. వీటిని సరసన చేర్చగల ప్రామాణిక గ్రంథాన్ని మిత్రులు నశీర్‌ అహమ్మద్‌ తయారు చేసి వెలువరించడం హర్షణీయం అంటారు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ. ఇది అక్షర సత్యం. ప్రతులకు -9440241727.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రధ సప్తమి సందర్భం గా మా ఇంట్లో  26-1-15 సోమవారం

26-1-15 సోమవారం రధ సప్తమి సందర్భం గా మా ఇంట్లో కార్యక్రమం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1

సాహితీ బంధువులకు రధసప్తమి ,అరవై వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు –

నాకు ,సరస భారతికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అత్యంత ఆత్మీయులు అన్న సంగతి మీకు తెలిసిన విషయమే .ఎప్పుడూ ఆయన తనకు నచ్చి చదివిన పుస్తకం నేను కూడా చదవాలన్న ఉద్దేశ్యం తో కొని ,నాకు పంపటం దాదాపు పదేళ్లుగా జరుగుతున్న విషయం   ఎప్పటికప్పుడు నాకేదైనా పుస్తకం కావాలంటే నిస్సంకోచం గా తనకు తెలియ జేయమని చెబుతూనే ఉంటారు .కాని నేను ఏనాడూ ఆ అవకాశం ఉపయోగించుకోలేదు . నిరుడు ప్రముఖ అమెరికన్ రచయిత ‘’లూయీ అంటర్ మేయర్ ‘’ రాసిన ‘’లైవ్స్ ఆఫ్ ది పోయెట్స్’’పంపటం వెంటనే నేను చదివి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గ నెట్ లో రాయటం దాన్ని వారు స్పాన్సర్ చేసి పుస్తకరూపం లో సరసభారతి తీసుకురావటం తెలిసిందే .ఆ తర్వాత ఎప్పుడో నెట్ లో వెతుకుతుంటే లూయీ రాసిన ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’అనే పుస్తకం చూశా .మైనేని గారికి రాసి ఆయన చదివారేమో అడిగా .చదవలేదని చెప్పటం ,వెంటనే కొని నాకు పంపటం అది కిందటి అక్టోబర ఇరవైన నాకు చేరటం చక చకా జరిగిపోయాయి .ఆరోజే చదవటం ప్రారంభిచాను అందులో ‘’గుజ్జు ‘’ఉందనిపించింది .దాన్ని సమయం ఉన్నప్పుడు చదువుతూ నెమ్మదిగా మూడు నెలలు చదివి ఈ ఇరవై తేదీకి పూర్తీ చేశానని పించాను .

1909లో జన్మించిన చార్లెస్ డార్విన్ తో ప్రారంభించి 1914లో పుట్టిన డిలాన్ ధామస్ తో పూర్తీ చేసి వందేళ్ళ కాలం లో  మధ్యలో ఎందేరెందరో రాజకీయ వేదాంత ధార్మిక ఆర్ధిక శాస్త్ర సాంకేతిక చిత్రలేఖన,సాహిత్య  నాటక సినిమా ,సంగీతాది  రంగాలలో చరిత్రను మలుపు తిప్పిన92 ప్రముఖుల జీవితాలను వారు సాధించిన విజయాలను ,పొందిన కీర్తిని అపకీర్తిని,పడిన కష్టాలను అన్నిటినీ కళ్ళకు కట్టేట్లు లూయీ అంటర్ మేయర్ తన ప్రతిభా సర్వస్వం తో మహా గొప్పగా చిత్రించాడు .వీరిని ఆయన ‘’movers and shakers ‘’అన్నాడు అంటే కదిలించి చైతన్యం తెచ్చిన వారన్నమాట . ఇందులో ఎందరో నాకు తెలియని వారే ఉన్నారు .వారిని ఈ పుస్తకం ద్వారానే తొలిసారి తెలుసుకొన్నాను .కనుక మీకూ వారి విశేషాలను అందించాలనే ఆలోచన కలిగి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’అనే శీర్షిక తట్టి మైనేనిగారికి మెయిల్ రాస్తే శుభస్య శీఘ్రం అని ఆశేర్వదించారు .ఇవాళ రధ సప్తమి ,భారత రిపబ్లిక్ దినోత్సవం కలిసి వచ్చిన శుభ సందర్భం గా ఈ ధారా వాహిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులోని వారి జీవితాలలో సాధించిన జయాపజయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాను .వారెక్కడ ఎప్పుడు పుట్టి ఎక్కడెక్కడ ఏమేం చదివారో వగైరా ల జోలికి పెద్దగా పో దలచుకోలేదు .  సంక్షిప్తం గా ,సూటిగా మాత్రమే రాస్తున్నాను .ఆదరిస్తారని భావిస్తున్నాను –మీ –దుర్గా ప్రసాద్

1 –చార్లెస్ డార్విన్

చార్లెస్ డార్విన్ రాసిన ‘’పరిణామ సిద్ధాంతం ‘-‘’ది ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ‘’’పై సాప్రదాయ వాదులు తిరగ బడితే ,నవీనులు సమాదరించారు .ఆరేళ్ళప్పుడే తల్లిని కోల్పోయాడు .జంతువులంటే అమితమైన ప్రేమ ఉండేది పసితనం నుంచే .రక్తాన్ని చూస్తె బెదిరిపోయేవాడు .ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన తో సైన్స్ మీద ద్రుష్టిపెంచుకొన్నాడు  .దక్షిణ అమెరికా కు పరిశోధన కోసం వెడుతున్న బీగిల్ అనే ప్రభుత్వ నౌకలో నేచరిస్ట్ అయిన డార్విన్ కు అవకాశం ఇచ్చి ఆహ్వానిస్తే వెళ్ళాడు .దొరికిన లక్షణాలను బట్టి ఆ జీవి రూపు రేఖలు ,ప్రవర్తన నిర్నయిఇంచ వచ్చుననే వాడు .దీన్ని నౌక కెప్టెన్ ,మరియు ‘’ఫ్రేనాలజిస్ట్ ‘’అయిన ఫైజ్ రాయ్ ఈసడిస్తూ ‘’ఈకల్ని బట్టి పక్షి సంగతి చెప్పే నీ ముక్కు మాత్రం నాకు నచ్చ లేడు’’అన్నాడు . రెండేళ్ళు అనుకొన్న ఈ పరిశోధన అయిదేళ్ళు పట్టింది .

ఈ సుదీర్ఘ ప్రయాణం లో సరైనా తిండి లేదు పడక లేదు చాలా దారుణ పరిస్తితుల్లో గడిపాడు .సముద్ర జ్వరం తో బాధ పడ్డాడు .ఆరోగ్యం బాగా దెబ్బతిని జీవితాంతం బాధ పడ్డాడు .కాని ఈ ప్రయాణం తన జీవితం లో గొప్ప విద్యనూ అందించిందని సంబరాపడ్డాడు .డార్విన్ ఇప్పుడు’’ సెర్చింగ్ బయాలజిస్ట్ ‘’అవతారం ఎత్తాడు .ఎప్పుడూ అనారోగ్యం ,జ్వరం ,కడుపు నొప్పి ,వాంతులు మొదలైన వాటితో బాధలు పడుతూ సంసారం చేస్తూ అయిదుగురు కొడుకుల్ని ఇద్దరు అమ్మాయిల్ని కన్నాడు .యాభై వ ఏట ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ప్రచురించాడు దీని ప్రభావం సోషల్ సైన్స్ ,వేదాంతం ,మతం మొదలైన వాటిపై పడి గణనీయమైన మార్పులు చెందాయి అవి .దీనితో డార్విన్ ప్రాభవం పెరిగిపోయి ‘’న్యూటన్ ఆఫ్ బయాలజీ ‘’అని డార్విన్ ను అందరు కీర్తించారు .ధామస్ హక్స్లీ కూడా డార్విన్ ఫాన్ గా మారిపోయాడు

ఆరిజి న్ ఆఫ్ స్పెసీస్ ను అధిక్షేపించటమేకకుండా నిషేధానికి గురి చేశారు .అలాంటి పాఠాలు స్కూళ్ళలో బోధించ రాదన్నారు .డార్విన్ చెప్పినవి బోధిస్తున్న జాన్ ధామస్ స్కోప్ అనే ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు దీనిపై ప్రజా సంఘాలు మండిపడి ఎడురుతిరిగినాయి .కోర్టు కేసులు నడిచి ఆ ఉపాధ్యాయుడిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి౦ది  వేసవిలో కోర్టుకు హాజరై న ఆ మేస్టారి ప్రాణాలు హరీ మన్నాయి పాపం నిజం చెప్పిందుకు ఇంతటి శిక్ష అనుభ వి౦ చాడు ఆ పూర్ క్రీచర్ టీచర్ .

దేనికీ వెరవని డార్విన్ తన పుస్తకాన్ని పెంచి రాస్తూనే ఉన్నాడు మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు .డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని గురించి రాసిన పాల్ సియర్స్ అనే ఆయన ‘’the  immediate effect of Darwin on science was one of magnificent  release .It was not ,properly speaking ,a stimulus –the vast unexplored world of the unknown was stimulus enough ,and curiousity was straining to under stand it .Darwin cut the leash ,and the human mind leaped a head .He wrought mightily ,and others with him ,for a newer  and greater faith –in universal order ,whose secrets open themselves to men truly free to question ‘’ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు .

Inline image 1

నూట ఇరవై జాతులకు ,తొమ్మిది ఉపజాతులకు డార్విన్ పేరుపెట్టి గౌరవించారు .ఆయన కనిపెట్టిన గాలాపగాస్ దీవులకు ‘’డార్విన్ ఫించేస్ ‘’అనే గౌరవనామం పెట్టి గుర్తించారు .ఇతరులు కనిపెట్టిన పరిణామాత్మక విషయాలకు డార్వినిజం ‘’అని పేరుపెట్టారు .రాయల్ సొసైటీ రాయల్ మెడల్ ఇచ్చి సన్మానించింది .

డార్విన్ 2-12-1809 లో ఇంగ్లాండ్ లో జన్మించి ,డెబ్భై మూడవ ఏట 19-4-1882న చనిపోయాడు .మతాన్ని మాట నమ్మకాలను  ఒక మలుపు తిప్పిన జీవ శాస్త్ర వేత్త చార్లెస్ డార్విన్ .జీవ పరిణామ సిద్ధాంతం నవ శాస్త్ర సూర్యోదయానికి నాంది పలికింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశాఖ చరిత్రపై విలక్షణ రచన

విశాఖ చరిత్రపై విలక్షణ రచన

  • -జిఆర్కె
  • 24/01/2015
TAGS:

సమగ్ర విశాఖ నగర చరిత్ర
రెండవ భాగం
రచన: అంగర సూర్యారావు
పుటలు: 224;
వెల: రూ.200/-
ప్రతులకు: రచయిత,
22-67-6, చోపుదారుగల్లీ
టౌన్‌హాల్ రోడ్,
విశాఖపట్నం- 530001.

సుందర పరిసరాలు, అనుకూల సాగర తీరం వరాలుగా లభించిన విశాఖపట్నాన్ని ప్రపంచం విస్మయం చెందే రీతిలో మహానగరంగా తీర్చిదిద్దుతున్న కీలక సమయాన హుద్‌హుద్ అనే పెనుతుఫాను కకావికలు చేసింది. 2014 ద్వితీయార్ధంలో ప్రకృతి సృష్టించిన విలయాన్ని విశాఖ వాసులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం విశాఖను విశ్వనగరంగా రూపొందించేందుకు స్థిర సంకల్పంతో తిరిగి సమాయత్తమైన విశేష సందర్భంలో ‘సమగ్ర విశాఖనగర చరిత్ర’ గ్రంథం వెలువడడం అత్యంత సముచితంగా వుంది.
గ్రంథకర్త అంగర సూర్యారావు ప్రముఖ రచయిత. 87 సం.ల పరిణత వయస్సులో ఈ బృహద్రచనను చేపట్టడం ప్రశంసనీయం. ప్రస్తుత గ్రంథం రెండవ భాగం. మొదటి భాగం క్రీ.పూ.4వ శతాబ్దినుంచి క్రీ.శ.1942 వరకు విశాఖ చరిత్రను వివరిస్తోంది. అంటే అశోకుడు కళింగరాజ్యంపై దండెత్తిన కాలంనుంచి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం వరకు సంఘటలు ఇందులో చోటుచేసుకున్నాయి. స్వరాజ్యోద్యమ కాలం నాటి సంగతులతో మూడవ భాగం రచన పూర్తిఅయిందని, అది త్వరలో విడుదల అవుతుందని రచయిత తెలియజేస్తున్నారు. నిస్సందేహంగా ఇదొక బృహత్ప్రయత్నం మహావిశాఖ నిర్మాణం యజ్ఞంలో భాగస్వాములైన వారందరికి ఇది ఉత్తమ స్ఫూర్తినిస్తుంది. విషయ బాహుళ్యం, పరిశోధనాత్మక విశే్లషణ, సమాచార సమగ్రత, అభివ్యక్తి స్పష్టత- ఈ రచనలోని ప్రత్యేకతలు. సూర్యారావు సుదీర్ఘానుభవం వున్న రచయిత కావడం, 1947నుంచి సవివర దినచర్యరాస్తూ వుండడం ఆయన కృషికి దోహదకారులయ్యాయి. ఇవి రచనను పఠనీయంగా, ప్రామాణికంగా చేశాయి.
సమీక్షిస్తున్న రెండవ భాగంలో కాంగ్రెసు పార్టీ అవతరణ నుంచి స్వాతంత్య్రావిర్భావం వరకు గల చరిత్రను పొందుపరిచారు. గ్రంథనామం విశాఖ నగర చరిత్ర అని వున్నా వాస్తవానికి దీని పరిధి అతి విశాలం. విశాఖకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. దీనిలో ఆంధ్రుల చరిత్ర, భారతదేశ చరిత్ర, స్వరాజ్యోద్యమ ఘట్టాలు, నాయకులు ఉద్యమకారుల జీవితాలు, ఆనాటి సాంఘిక సంస్కరణలు- ఇంకా ఎనె్నన్నో అంశాలు వివరంగానే తెలియజేశారు. గ్రంథం చివరి భాగంలో విశాఖ భౌగోళిక స్వరూపాన్ని వివరించారు. రచనాప్రణాళికను రచయిత విలక్షణంగా రూపొందించారు. విశాఖ ప్రస్తావన వున్న అంశం నేపథ్యాన్ని సుదీర్ఘంగా చూపుతూ అనేక విషయాలు పాఠకులకు అందించారు. సాధారణ పాఠకులకేకాక పండితులకు, పరిశోధకులకు, చరిత్రకారులకు ఉపకరించే వాస్తవాలను తేదీల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరణ్యం కాదు… నందనవనమే!

అరణ్యం కాదు… నందనవనమే!

  • -పిఎస్‌ఎన్.
  • 24/01/2015
TAGS:

అరణ్యం
-సిహెచ్.వి.బృందావనరావు
పుటలు: 114,
వెల: రు.100/-
ప్రచురణ: మల్లెతీగ,
విజయవాడ.

ఈ సంపుటిలో పదునెనిమిది కథలున్నయి. అందులో చాలావరకు ఇంతకుముందే వివిధ పత్రికలలో ప్రచురింపబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే.
జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలనే సిహెచ్.వి. బృందావనరావుగారు కథలుగా మలచి పాఠకులకు అందించారు. సహజత్వంతో నిండి పాఠకుడిని ఎంతో ఆసక్తిగా చదివిస్తయి.
‘స్పర్శ’ అన్న కథ చదవటం పూర్తిచేసిన పాఠకుడు కొద్దినిముషాలపాటు ఆ స్పర్శలో బందీఅయి ‘అసలు నిజాన్ని’ రచయిత తన గుప్పిటలో ఎంతో జాగ్రత్తగా భద్రపరచి చివరికి పాఠకుడి గుండెల్లోకి ఎలా బాణంలా వదిలిందీ గ్రహించి విస్మయం చెందుతాడు. ఎనిమిది మంది పిల్లల్ని కని, ‘హెచ్చుదిగుబడి వరివంగడం’ అని పేరుబొందిన ఆ దంపతులు ఓ రాత్రి, తెలిసిన పొరుగూరి వ్యక్తి నిండు గర్భిణీ అయిన భార్యతో ఆ ఇంట గడపవలసిన పరిస్థితి ఏర్పడగా, ఆ అమ్మాయి పురిటినొప్పులు మొదలయినప్పుడు ఆ ఇంటి ఇల్లాలే మంత్రసాని అవుతుంది. ఆ అమ్మాయి వెళుతూ కృతజ్ఞతలు చెబితే, ‘నువ్వుకాదు చెప్పవలసింది, నేనే… నాలుగు సంవత్సరాలుగా మాటలులేని మా దంపతులకు నీ మూలకంగా రాత్రే మాటలు కలిసినయి’ అంటుంది తృప్తిగా. చాలా మంచి కథ.
సుబ్రహ్మణ్యశాస్ర్తీ పురోహితుడు. కొడుకును పౌరోహిత్యంలోకి దింపితే తిండికి ఇబ్బందిలేకుండా రోజులు గడుస్తయిలే అనుకుంటాడు. కానీ భార్య పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనే ఆశతో ఉంటుంది. ‘జంఝాలు, దీపాల ఒత్తులూ కూడా ఓ రిలయన్స్ వాళ్ళ షాపుల్లో అమ్ముతారట’లాంటి చురకలు, పౌరోహిత్యంలో కూడా బ్రోకర్ల దోపిడీ మీద విసుర్లు కథకు జీవంపోస్తయి. మనిషికి చదువైనా ఉండాలి, లేకపోతే శ్రమపడే శక్తయినా ఉండాలనే సత్యాన్ని వివరిస్తారు. ఆనందానే్న కాదు వేదననూ సృష్టించిన కథ ‘విస్సిగాడి చదువు.’ ‘దేవుడూ సెడిపోయినాడే’ అనేది ఒక విలక్షణమైన కథ. ‘పోలియో వచ్చి ఎడంకాలు కాస్త వంకర తిరిగినందున- కొంచెం కుంటుతుంది గాని చుక్కకేం తక్కువ. ఎడంకంట్లో పువ్వేసి కొంచెం ఎబ్బెట్టుగా కన్పిస్తుంది గాని అది చుక్కకు పెద్ద అవకరమా. పద్దెనిమిదేండ్ల పండు పరువం చుక్క వొంట్లో అణువణువునా తిష్ఠవేసుకుకూర్చున్న’ ఆ అమ్మాయిని సురేష్ మోసం చేస్తే, బుర్రినాయుడు మనువాడతానంటాడు. సుక్కమ్మ చెడిపోయినానంటే, ‘మనసుంటోల్ల మొగాన ఇట్టా సెడిపోయే బతకండిరా సెత్త నాకొడకల్లారా అని రాసిపెట్టినోడుండాడే- ఆ దేవుడు వాడు అందరికంటే సెడిపోయినాడు’ అని ఆమెను ఓదారుస్తాడు అతడు. మనిషి మానిసి అయినవేళ కలిగే భావనను రచయిత చక్కగా చిత్రీకరించారు.
కొడుకులు విదేశాల్లో స్థిరపడిపోయి, వృద్ధులయిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, పెద్దవాళ్ళకు ఆసరాగా వుంటూ ఆ ఊరి వ్యక్తిని తప్ప మరొకరిని వివాహం చేసుకోనంటుంది కూతురు. మగపిల్లలకంటే ఆడపిల్లలకే తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఎక్కువ అని చెప్పే కథ ఇది.
‘అరణ్యం’ క్రూరమృగాలతో నిండిన ప్రదేశమే కాదు, వృక్ష సంపదకూ స్థావరమే. అంతేకాదు మనుష్యులకన్నా జంతువులే నయం అనే నీతిని చెప్పే ఈ కథ ఈ సంపుటికే ప్రధాన కథ.
పెళ్ళి కావాల్సిన కూతురు, మొగుడొదిలేసిన తల్లి- ఒకరికోసం ఒకరు పడే వేదనే ‘తోడు’ అయితే, కులాంతర వివాహంవలన తల్లీకూతుళ్ళకు కలిగిన వేదనను చూపించిన కథ ‘మనోవేదన.’
అప్పు తీర్చలేక, కొనుక్కున్న గేదె మీద ఆత్మీయతతో, అరెకరం పొలాన్ని వదులుకోవటానికి, కొడుకును బానిసగా మార్చటానికి కూడా వెనుకాడని ఓ స్ర్తికథే ‘రాములమ్మా-తిరుపతి కొండా!…’ మనస్సును తడిచేస్తుంది.
చిన్నప్పుడు తప్పిపోయి, విదేశాల్లో సుఖజీవనానికి అలవాటుపడ్డ ఓ యువకుడు, తనను కన్నవారిని చూడాలనే తపనతో ఇండియాకు వచ్చి వాళ్ళను గుర్తించి, వాళ్ళ దైన్యస్థితికి జాలిచెంది ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు ‘నిర్ణయం’ కథలో. మంచి సందేశాన్ని ఇచ్చిన కథ.
ఇందులోని ‘సందు’, ‘ఆఖరి పేజీ’, ‘తీర్పు’, ‘క్షాళనం’, ‘స్వీపరు కొడుకు’, ‘స‘మ్మతం’ మొదలయిన అన్ని కథలూ చదువరిని ఆలోచింపజేసేవే. చెప్పటంలో క్లుప్తత కథల్ని ఆసక్తిగా చదివించేలా చేసింది. చక్కటి తెలుగు, గ్రామీణ వాతావరణంలో రాసిన కథలకు మాండలికంలో వ్రాసిన సంభాషణలు, మానవ సంబంధాల మీద నడిపిన తీరు వాటికి ఎంతో వనె్నతెచ్చినయి. ఈ సంపుటికి తొలిపలుకు వ్రాసిన ప్రముఖ రచయిత మునిపల్లెరాజుగారు ‘ఈ పాదముద్రల్లో ఎంతో నిజాయితీ వుంది- ఎంతో సహజ సౌందర్యం వుంది’అంటారు. అది అక్షరాలా నిజం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆసక్తి రేపే ‘దేవ రహస్యం’

ఆసక్తి రేపే ‘దేవ రహస్యం’

  • -ముదిగొండ శివప్రసాద్
  • 24/01/2015
TAGS:

దేవ రహస్యం
భారతీయ పౌరాణిక కథల వర్ణన
వివరణ వ్యాఖ్యానం
-కోవెల సంతోష్‌కుమార్
వెల:రూ.150/-
ప్రతులకు:kovelas@gmail.com

ఫ్రతీక – సంకేతం- సింబాలిజం- అనేవి సమానార్థకాలు. భారతీయులు పురాణాల్లో ఎక్కువగా సంకేతాలను ప్రయోగించారు. అంటే, వారు చెప్పిన కథలు, గాథలు పుక్కిటి పురాణాలు అని అపహాస్యం చేసేవారు. అందలి సంకేతాలను గ్రహిస్తే అర్థం పరమార్థం రెండూ లభిస్తాయి. ఇటీవల కోవెల సంతోష్‌కుమార్ ‘దేవ రహస్యం’ అనే గ్రంథం ప్రచురించారు. ఇందులో దశావతారములవంటి అనేక పౌరాణిక కథలలోని సంకేతాలు చాలా సరళంగా వివరించారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస పంచమ వేదాదులలో సంకేతాలున్నాయి. వాటిని డీకోడ్ చేసే మేధావులు కరువు కావడంతో విషయం అగమ్యగోచరంగా మారింది. సంతోష్ రచించిన ఈ గ్రంథంలో దాదాపు 50 పౌరాణిక, దేవీ దేవతల సంకేతార్థాలు చర్చింపబడ్డాయి. మనం ఏ మంచిపని సంకల్పించినా ముందు గణపతిని స్తుతిస్తాం. ఈ గ్రంథ రచయిత కూడా గణేశునిమీది వ్యాసంతో గ్రంథం ప్రారంభించారు. గణేశుని స్థూలరూపం పదార్థానికి (మేటర్) సంకేతం. ఆయన బొజ్జ, తొండము కుండలినీయోగమేనని సంతోష్‌కుమార్ వివరించారు. ఆ తరువాత సరస్వతీ స్వరూపము పరిశోధించి ఈమె వాగ్దేవత అని సూచించారు. ‘‘ప్రణోదేవతి దేవీ సరస్వతి వాజౌంధిరీ వాజినీవతీ’’ అని రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది. సరస్వతి వాగ్దేవత. స – రస శబ్దంలోనే ఈ భావం గోచరిస్తుంది. మన దశావతారములో సృష్టి పరిణామం కన్పడుతున్నది. వీటికి ఇంకా చాలా వ్యాఖ్యానాలున్నాయి. ‘‘రా’’ అంటే సూర్యుడు. సీత భూమి. హనుమంతుడు వాయుపుత్రుడు- ఇవన్నీ సంకేతాలే కదా. అలాగే, భారత పాత్రలన్నీ బాహిర కథా సంవిధానంతోపాటు అంతర్లీనంగా ఎన్నో పరమార్థాలు ప్రతీకాత్మకంగానూ చెప్పబడ్డాయి. కైలాసంలో శివుడు ఉన్నాడా? దేవకాలమానం మానవ కాలమానాల్లో తే డాలు ఎలా వచ్చాయి? మహాభారతం రామాయణంలోని యుద్ధాలు అణుధార్మిక శక్తిని, విస్ఫోటనం వెలువరించా యా? భూతాలకూ లిపి ఉంటుందా? 60 వేలమంది కృష్ణులు ఎక్కడ ఉన్నారు? విశ్వంలో తొలి సర్జన్ ఎవరు? ఇలా ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు రచయిత వేసుకొని వాటికి ఈ గ్రంథంలో సమాధానం చెప్పారు. ఆంజనేయుని పెళ్లి ఏమిటి? అమ్మోరు ఎవరు? బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం ఎలా అయినాడు? ఇవన్నీ నేడు మనకు ధర్మసందేహాలే. వీటికి ఈ గ్రంథంలో సమాధానాలున్నాయి. అంటే, ఇదొక కథా కావ్యం కాదు. శాస్ర్తియ విశే్లషణ. సంతోష్‌కుమార్ జర్నలిస్టు కావడంవలన పాఠకుల నాడిని గుర్తించి తదనుగుణమైన పదజాలం, భాష వాడి పుస్తకానికి రీడబులిటీ కల్పించారు. అవసరమైన చోట ఆంగ్ల పదాలు వాడారు. ఆనాటి గాంథారం నేడు ఎక్కడ ఉంది? ఇంద్రప్రస్థం ఏది? పురాణాలు భారతదేశ ప్రాచీన చరిత్ర గ్రంథాలని కోట వెంకటాచలం వంటివారు ఎందరో అంగీకరించారు. అయితే, వాటిని విడమరచి చెప్పేవారే కరవైనారు.
కోవెల సంతోష్‌కుమార్ చేసిన ఈ ప్రయత్నానికి సద్గురు శివానందమూర్తిగారు ముందుపుటలో ఆశీస్సులందించారు. చాలాకాలం తరువాత ఒక ప్రయోజనాత్మక గ్రంథం అందుబాటులోకి వచ్చింది. అన్యమతస్థులకు, నాస్తికులకు ఇది అవశ్య పఠనీయం. కోవెల అంటే గుడి. ఈ గ్రంథం భారతీయ సంకేతార్థాల కోవెల.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హృద్యమైన కథలకు వనె్నలద్దిన వర్ణనలు

హృద్యమైన కథలకు వనె్నలద్దిన వర్ణనలు

  • -కె.బి.గోపాలం
  • 24/01/2015
TAGS:

శిలప్పదికారం
ఇలంగో ఆదిగళ్
మణిమేఖల రచన: శీతలై శాత్తనార్
అనువాదం: లంకా శివరామప్రసాద్
వెల: ఒక్కొక్కటి రూ.200/-
ప్రతులు: విశాలాంధ్ర, నవోదయ,
ఇంకా అన్ని పుస్తకాల
అంగళ్లలో దొరుకును.
పేజీలు: 200, 180

డాక్టర్ శివరామప్రసాద్, వృత్తిపరంగా వైద్యులు. ప్రపంచ సాహిత్యంలోని ప్రసిద్ధ గ్రంథాలను తెలుగులో అందించడానికి పూనుకున్నారు. ప్రస్తుతం రెండు తమిళ ప్రాచీన కావ్యాలను ప్రచురించారు. తమిళ సాహిత్యంలోని సంగం కాలంనాటి ఈ రెండు కావ్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. నిజంగా ప్రాచీన కావ్యాలు అవి.
చేర రాజ కుటుంబీకుడయిన ఇలంగో – ఆదిగళ్ రచన శిలప్పదికారం. కన్నగి అనే మహిళ యొక్క కాలి కడియం గురించిన కథ యిది. ఈ రచయిత జైన సాంప్రదాయంలోని వాడు. రెండవ కావ్యం మణిమేఖలైలో కథ కొనసాగుతుంది. దీన్ని శీతలై శాత్తనార్ అనే వ్యాపారి రచించాడు. ఈయన బౌద్ధుడు. ఈ రెండు కావ్యాలు, కవితారూపంలో నడుస్తాయి. అనువాదాలు మొదటిదాంట్లో కొంత దూరం వరకు కవితారూపంలో నడిచింది. తరువాత గద్యరూపంలో సాగింది. రెండవ కావ్యం పూర్తిగా గద్య రూపంలోనే నడిచింది.
కన్నగి (కణ్ణగి), కోవలన్ దంపతులు పూంపుహార్ నగరంలో సుఖంగా బతుకుతుంటారు. కోవలన్ ఒక సందర్భం కారణంగా మాధవి అనే వేశ్య ప్రేమలో పడతాడు. ఆమె గొప్ప నర్తకి. కొంత కాలానికి తప్పు తెలుసుకుని అతను తిరిగి భార్యను చేరుకుంటాడు. అప్పటికి అతని ఆస్తి హరించుకుపోయి ఉంటుంది. గౌరవంగా బతికే ప్రయత్నంలో వారు మదురై చేరుకుంటారు. అక్కడ కోవలన్ భార్య పాదమంజీరాలను అమ్మి వ్యాపారం చేయాలనుకుంటాడు. ఆ కడియం మహారాణిదని, కోవలన్ దొంగ అని నిర్ణయించి రాజు అతనికి మరణదండన విధిస్తాడు. కన్నగి రాజుకు ఫిర్యాదుచేసి తనవద్దనున్న రెండవ కడియాన్ని పగలగొట్టి చూపుతుంది. తప్పు తెలుసుకున్న రాజ దంపతులిద్దరూ మరణిస్తారు. కన్నగి మదురై నగరాన్ని శపిస్తుంది. నగరం నాశనమవుతుంది. తరువాత ఆమె స్వర్గం చేరుకుంటుంది. స్థూలంగా ఇది కథ.
కావ్యం చదువుతుంటే, అడుగడుగున రచనలోని ప్రత్యేకత ఎదురవుతుంది. అలనాటి రాజులు, ప్రజల బతుకుతీరు, సంగీతం, నాట్యాలు మరెన్నో వివరాలు వర్ణించినతీరు ఆసక్తిని పెంచుతుంది. శిలప్పదికారంలో మూడు కాండములున్నాయి. వాటిలో కథ నడిచిన తీరు, వర్ణనలు రచనయొక్క ప్రత్యేకతను చాటిచెపుతుంటాయి. పుస్తకం నిజమయిన క్లాసిక్ అన్న భావన కలుగుతుంది. మాధవి, కన్నగిల పాత్రలు ఎంతో ప్రత్యేకమయినవి. ప్రస్తుతం చెన్నయ్ నగరం సముద్రపుతీరాన కణ్ణగి విగ్రహం స్థాపింపబడి ఉందంటే, కావ్యానికిగల గౌరవం, ప్రజాదరణ అర్థమవుతాయి. ఈ కావ్యంలో ఒకచోట ప్రేమగీతాలున్నాయి. వాటితీరు మనసులను తాకుతుంది. రెండు కావ్యాలలోనూ ప్రకృతి వర్ణనం అద్భుతంగా సాగుతుంది.
శిలప్పదికారం నాయకుడు కోవలన్, వేశ్య మాధవిలకు పుట్టిన కూతురు మణిమేఖల. ఈమె వృత్తాంతాన్ని శీతలై శాత్తనార్ మరొక కావ్యంగా రాశాడు. ఈ కావ్యంలో బౌద్ధం గురించిన విశేషాలు వివరంగా ఎదురవుతాయి. అంటే ప్రస్తుతపు రెండవ పుస్తకం మణిమేఖల ఒక కొనసాగింపు కావ్యం. ప్రియుడు కోవలన్, అతని భార్యల సంగతి తెలిసిన మాధవి బౌద్ధసన్యాసినిగా మారుతుంది. కూతురు మేఖలను కూడా అదే దారిలో పెడుతుంది. మణిమేఖల చాలా అందమయినది. ఆమెను రాజకుమారుడు ఉదయుడు ప్రేమిస్తాడు. కానీ, మణిమేఖల మార్గం మారదు. ఆమె ప్రజాసేవలో కాలం గడుపుతుంది. నిజానికి స్థూలంగా కథ యింతే. కానీ, మణిమేఖల, ఇతర పాత్రల పూర్మజన్మ వృత్తాంతాలు, అర్వణ ఆదిగళ్ వంటి జ్ఞానుల బోధనలు, కథలోని అనుకోని మలుపులు ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తాయి. ఈ కావ్యాలు గొప్పవి అని ఇవాళ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే తెలుగు పాఠకులకు ఈ కథలతో పరిచయంలేకపోవడం ఆశ్చర్యం. వెనకట ఎప్పుడో వీటిని పద్యకావ్యాలుగా పూతలపట్టు శ్రీరాములురెడ్డి రాశారు. అయినా అంతగా ప్రచారం జరిగినట్టులేదు. కనుకనే ఈ రెండు కావ్యాలు అవశ్యంగా చదవదగినవి.
ఈ పుస్తకాలు అనువాదాలని ఎక్కడా చెప్పలేదు. కానీ, రచన మాత్రం అనువాద ధోరణిలోనే సాగింది. ‘కాళ్లకు బరువయిన కడియాలున్న మహారాజా!’ వంటి మాటలు ఈ విషయాన్ని రుజువుచేస్తాయి. కావ్యాలను కేవలం కథచెప్పిన ధోరణిలో చెప్పడం కుదరదు. రెంటిలోనూ గొప్ప వర్ణనలు, వివరాలు ఆసక్తికరమయినవిగా ఉన్నాయి. రాత్రి, ఉదయాల వర్ణన, చివరకు నగరంలో గస్తీ వివరాలు కూడా ఉన్నాయంటే వాటి లోతు తెలుస్తుంది. బౌద్ధ, జైనముల తీరు గురించి కూడా ఎన్నో విశేషాలు ఈ రచనల్లో ఎదురవుతాయి.
ఈ రెండు కావ్యాలలోనూ స్ర్తిపాత్రలు ఎంతో ప్రత్యేకత గలవి. వాటి గురించి ఎంతో చర్చ జరిగింది. జరుగుతున్నది. ఇప్పుడు చర్చలో పాల్గొనే అవకాశం తెలుగు పాఠకులకు కూడా కలిగింది. అసలు మొత్తం కథను చదివే అవకాశం కలగడమే బాగుంది.
వందల సంవత్సరాలనాటి ఈ కావ్యాలలోనిది ప్రాచీన తమిళ భాష. మరోభాష ఆధారంగా ఈ రచనలు(అనువాదాలు) సాగినయి. కథనం బాగానే నడిచింది. కానీ అక్కడక్కడ దుష్టసమాసాల ప్రయోగం కనబడుతుంది, మృత్యుకొట్టము, ఏకైక దిక్కు, నృత్యగాన సంబరాలు వంటి మాటలు లేకుంటే బాగుండేదేమో? అట్లాగే నడయాడ్తున్నాయి, చేతుల్నిండా, విసుర్రాయి లాంటి మాటలుకూడా బాగుండలేదు. ప్రాచీన గ్రంథాలలోని భాష తీరును అనువాదంలో కొంతవరకయినా నిలపగలిగితే, మరింత బాగుంటుంది.
తమిళంనుంచి నేరుగా అనువాదాలు చేసేవారు కనిపించడం లేదు. మరో భాష ద్వారా అనువాదాలు జరగడంలో కొన్ని కష్టాలున్నాయి. పక్కనే ఉన్న తమిళ ప్రాంతపు సాహిత్య సంపద పాతదయినా, కొత్తదయినా మన భాషలోకి రాకపోవడం అన్యాయం. అనువాదాలు (ఏ రకంగానయినా) రావాలి. ఈ కావ్యాలను రెంటినీ పాఠకులు ఆదరిస్తారు. సందేహం అవసరం లేదు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ చంద్ర శేఖర ఆజాద్ కద -నీళ్ళు -రక్తం – చంద్ర వెల్లి గుళ్ళు

chandra 001neellu1 001 neellu2 001 neellu-3 001 neellu4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు – గీతాంజలి మూర్తి గారు వ్రాసిన లేఖ

0001Temples

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పెద్దది భొట్ల రామ లక్ష్మమ్మ మనుమరాలు కోడలు సౌభాగ్య లక్ష్మి కుమార్తె ఛి సౌ స్రవంతి వివాహ వేడుక -ఉయ్యూరు 24-1-15శనివారం ఆర్య వైశ్య కళ్యాణ మండపం

పెద్దది భొట్ల రామ లక్ష్మమ్మ మనుమరాలు కోడలు సౌభాగ్య లక్ష్మి కుమార్తె ఛి సౌ స్రవంతి వివాహ వేడుక -ఉయ్యూరు 24-1-15శనివారం ఆర్య వైశ్య కళ్యాణ మండపం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

చిత్తూరు లో ప్రధమ ”వేధ సభ ”28-1-15 బుధవారం ఉదయం 9 గం లకు టి టి డి కళ్యాణ మండపం లో

vedha 2 001 vedha1 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రిపోర్టింగ్‌లోనూ.. కమిట్‌మెంట్ – ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్‌

డితెరపై భిన్న రూపాల్లో విరబూసి.. దిగంతాలకు చేరిన ఆ నవ్వులో అందరికీ ఓ సాల్మన్‌రాజ్.. ఓ రెనా (రెడ్డినాయుడు).. మరో బొక్కా వెంకట్రావ్.. కనిపిస్తారు. కామన్‌మ్యాన్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీకింగ్ ను స్టార్ రిపోర్టర్‌గా మార్చి ఆయనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది సిటీప్లస్. రీల్‌లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించిన ఎమ్మెస్.. రియల్‌లైఫ్‌లో రిపోర్టర్‌గా అవతారం ఎత్తి తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ముచ్చట్లు మీకోసం..
– భువనేశ్వరి

ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్‌గా తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేయడం యాధృచ్చికంగా జరగలేదు. ఎమ్మెస్ ఇంటర్వ్యూ చేయడానికి నాలుగు వృత్తులను సూచిస్తే.. ఆయన మాత్రం కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేస్తానన్నారు. ‘ఎందుకు సార్.. అంత ఇంట్రెస్ట్?’ అని అడిగితే.. ‘రిపోర్టర్‌గా నేను నా మనసును కదిలించిన వారిని పలకరిస్తే వృత్తి తృప్తి కలుగుతుంది. పైగా నాకున్న సందేహాలు తీరడంతో పాటు పాఠకులకూ ఆ వృత్తిని నమ్ముకున్న వారి బాధలు తెలుస్తాయని చెప్పారు. ఇంకా నాడు ఏమన్నారంటే..

చెవిలోన చేరేలా..
తెల్లవారుజామున మంచి నిద్రలో ఉండగా ‘ఆక్కూరలు.. బెండకాయ.. దొండకాయ…. కొత్తిమీర.. కరేపాకో..’ అంటూ ఓ అరుపు వినిపిస్తుంది. తలుపులన్నీ బిడాయించి..  ముసుగు తన్ని పడుకున్నా.. ఆ పిలుపు చక్కగా చెవిలోకి చేరిపోతుంది. వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఆ క్షణంలో కాస్త చికాకు పుట్టినా.. వాళ్లు గుమ్మాల దగ్గరికి రాకపోతే.. మనం కాళ్లీడ్చుకుంటూ మార్కెట్ దాకా వెళ్లాల్సి వస్తుంది.  నవనవలాడే కూరగాయలు గుమ్మం ముందుకు వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వారంటే నాకు అభిమానం.

లైవ్ రిపోర్టర్లు..
వారు ప్రతి ఇంటికీ కావాల్సిన వారే. ఒక వీధిలో పది ఇళ్లుంటే అందరికీ అతను ఆప్తుడే. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కూరగాయలబ్బిపై మక్కువ కాస్త ఎక్కువే. తాజా కూరగాయలు ఇస్తాడనో.. కసురుకోకుండా కొసరు వేస్తాడనో కాదు.. పక్కవీధి నుంచి తాజా తాజా కబుర్లు మోసుకొస్తాడని.ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ.. ఈ ఇంతి ముచ్చట్లు అక్కడ చెప్పే పుల్లారావులు కూడా వీరిలో ఉంటారు. ‘మీలా బేరం ఆడకుండా.. డబ్బులిచ్చే వారు ఎక్కడుంటారు చెప్పండి’ అంటూ కాకాపెట్టే కాకారాయుళ్లూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తోపుడుబళ్ల వాళ్లు మనలో ఒకరన్నమాట’ అని వారిని తను చూసిన యాంగిల్‌లో వివరించారు ఎమ్మెస్.

బహుదూరపు వ్యాపారి..
నాలుగు రకాల కూరగాయలు అమ్ముకుని బతికే వారు.. ఈ డబ్బుతో అంతస్తులు కట్టుకోలేడు. కేవలం పొట్టనింపుకోగలడంతే. బండెడు కూరగాయలు అమ్ముకోవడానికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడో తెలియదు. నేను వాళ్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. పాఠకులకు కొన్ని విషయాలు చెబుదామనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. దండిగా డబ్బున్న వాళ్లు కూడా ఆకుకూరలు కొనే దగ్గర గీచి గీచి బేరాలాడుతుంటారు.

ఓ గంట బేరమాడి ఓ కట్ట ఎక్కువ సాధించనంత మాత్రాన మీరు మరింత ధనవంతులు కాలేరు! బేరమాడకుండా మీరు డబ్బులిచ్చినంత మాత్రాన వాటితో అతనేమీ మేడలు కట్టుకోలేడు !! బేరమాడకుండా తీసుకుంటే ‘చల్లంగా ఉండమ్మా’ అని దీవించి ఆ రోజు హ్యాపీగా ఉంటాడు. రిపోర్టర్‌గా వారిని పలకరిస్తే మానవీయ కథనంగానే కాకుండా వారి ఇబ్బందులను కూడా బయటకు తెచ్చిన వాడిని అవుతాను కదా !’ అంటూ వివరించారు ఎమ్మెస్.

ఇంటర్వ్యూ ముగిసాక..
రెహ్మత్‌నగర్ బస్తీలో ఓ పదిమంది బండ్లవారిని ఇంటర్వ్యూ చేసే ముందు వారితో.. ‘మిమ్మల్ని స్టార్‌గా పలకరించడం లేదు. సాక్షి తరఫున స్టార్ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీకున్న ఇబ్బందులన్నీ మన సువిప్పి చెప్పుకోవచ్చు. వాటిని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా చేస్తాను’ అన్నారు. రిపోర్టింగ్ ముగిశాక ‘తోపుడు బండ్లకు లెసైన్స్‌ల కోసం ప్రయత్నిస్తానని’ లోకల్ కార్పొరేటర్ కబురు పంపడంతో వారింటికి వెళ్లారు ఎమ్మెస్.

మీడియా ముఖంగా ఆ హామీ నెరవేరుస్తానని చెప్పాల్సిందిగా ఆమెను అడిగి.. ఓ బాధ్యతగల రిపోర్టర్‌గా వ్యవహరించారు. కొన్ని రోజుల తర్వాత సాక్షి స్టార్ రిపోర్టర్ సక్సెస్ మీట్ సందర్భంగా మళ్లీ ఎమ్మెస్‌ను కలిసినపుడు.. ఆ తోపుడుబండ్ల వారి లెసైన్స్‌ల పని ఎంత వరకు వచ్చిందని ఆత్రుతతో అడిగి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాంటి మంచి వ్యక్తికి.. మా స్టార్ రిపోర్టర్‌కు తుది వీడ్కోలు.

2014 సెప్టెంబర్ 14న సిటీప్లస్ లో ప్రచురితమైన రిప్టోరర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం .యెస్.

ప్రేక్షకులకు మహా స్మైల్ పంచి 
చివరికి మహా శోకం మిగిల్చి 
”అసలేం జరిగిందో తెలుసుకోకుండా” 
 నారాయణ వెళ్ళిపోయాడు 
 నెమ్మదిగా  నవ్వుల మలయ సమీరం గా ప్రవేశించి
 ”గాలి”లా చెలరేగి నవ్వుల సునామీ సృష్టించాడు 
 తాగినా తాగించినా వాగినా వాగించినా 
 వెరైటీ ని కల్పించి వినోదం పంచాడు 
”రామనాధం గారూ !మీరు ప్రతి దాన్లో వేలు పెట్టి కెలక్కండి ”
 ”ప్రసాదూ !ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా ” డైలాగులు 
 వేణు, శ్రీరాంలు  ఆవు వేషం లో ఉంటె పాలు పితికినశీను 
ఏదీ మర్చిపోలేని మరువరాని సీన్లే పండించాడు 
నవ్వుకు తానొక కొత్త అర్ధాన్ని సృష్టించి 
నవ్వుల డిక్షనరీలో నింపాడు 
అందుకే మహా  సంతోషం కలిగించి 
మహా శోకం మిగిల్చి దేవలోకం లో
 నవ్వులు పంచటానికి వెళ్ళిపోయాడు 
అక్కడ  ఇంద్రుడినీ  చిత్ర గుప్తుడి నీ 
ముగ్గు లోకి దించి పెగ్గు లాక్కుంటాడు అనుమానం లేదు 
ఆత ను ఇచ్చిన నవ్వుల నజరానాకు .
బాష్పాంజలి తప్ప మనమేం ఇవ్వగలం? 
          మీ -గబ్బిటదుర్గా  ప్రసాద్ –
   

 

Posted in కవితలు | Tagged | Leave a comment

నవ్వుల నారాయణ

నేలకొరిగిన నవ్వుల శిఖరం
మరో ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ‘ఆహుతి’ ప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు చిత్రపరిశ్రమకు హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ మరణం నిజంగా పెద్ద దెబ్బే. ఆయన హాస్యరస పోషణలో ఆయనదొక ప్రత్యేకమైన ఒరవడి. స్వతహాగా రచయిత కావడంతో తనకు ఇచ్చిన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్ది తన నటనతో దానికి జీవం పోసేవారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు ఆయన పెట్టింది పేరు. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకొన్న ఎమ్మెస్‌ మరణం నిజంగా తీరని లోటే.
సినిమాల్లోకి రాకముందు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే, పలు నాటకాల్లో వేషాలు వేశారాయన. పరుచూరి గోపాలకృష్ణ రచించిన సోషలిజం’ ఆయన నటించిన తొలి నాటకం. మొదటి నాటకంలోనే ఉత్తమ నటుడిగా అవార్డ్‌ను అందుకున్నారు. తెలుగు మాస్టార్‌గా ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణలో క్రియాశీలక పాత్ర పోషించారాయన. దివిసీమ ఉప్పెన వచ్చిన సందర్భంలో బాధితులకు ఏదోలా సాయం చేయాలని ‘జీవచ్ఛవం’ నాటికను రాసి స్కూల్‌ విద్యార్ధులతో ఆడించి సేకరించిన మొత్తాన్ని ఉప్పెన బాధితులకు అందించిన ఘనత ఆయనది. 1978లో భీమవరంలో ఉద్యోగం చేస్తూనే ఎమ్‌.ఏ కట్టి పాసయ్యారు. తర్వాత భీమవరంలోనే లెక్చరర్‌ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన జీతం రూ. 250. ఎమ్మెస్‌ గతం తెలుసుకున్న భీమవరం కాలేజ్‌ యాజమాన్యం సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలన్నీ ఎమ్మెస్‌కే అప్పగించారు. ఆయన రాసిన ‘ప్లస్‌ అండ్‌ ఇంటూ ఆర్‌ ఈక్వల్‌’ నాటిక విద్యార్ధులతో వేయించారు. దానికి ఎనిమిది ఫ్రైజ్‌లొచ్చాయి. అంతే అక్కడి వాళ్ళంతా ఎమ్మెస్సా మజాకా! అన్నారు.
కళాప్రపూర్ణ ప్రోత్సాహంతోనే…
జనరల్‌గా సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబంలో ఏ ఒక్కరూ ఒప్పుకోరు. కానీ ఎమ్మెస్‌ భార్య అలాకాదు వెన్నుతట్టి ఆయనను ప్రోత్సాహించింది. ‘ఏదయినా సాధించే వరకూ ఇంటిముఖం చూడొద్దని’ ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మళ్లీ చెన్నై ప్రయాణమాయ్యరు. ఓ చిన్న గది అద్దెకు తీసుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంత దూరమైన కాలినడకే శరణ్యం. కానీ అవకాశాలు ఈయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా ఎమ్మెస్‌ నిరూత్సాహపడలేదు. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే’ అని డైరీలో అప్రయత్నంగా రాసుకున్న ఓ డైలాగ్‌ పదేపదే చదువుకుంటూ ఉత్సాహాన్ని నింపుకున్నారు.
‘సవ్యసాచి’తో రచయితగా తొలి అవకాశం
కొన్నాళ్ళకు రవిరాజా పినిశెట్టి ఆయన దగ్గర ‘సవ్యసాచి’ కథను కొన్నారు. అక్కడి నుండి ఆయనతో మంచి సాన్నిహిత్యం పెరిగింది. రవిరాజా సినిమాలకు కలం సాయం కూడా చేశారాయన. తర్వాత ‘ప్రయత్నం’ కథను పరుచూరి గోపాలకృష్ణ కొన్నారు. ‘అలెగ్జాండర్‌’, ‘పేకాట పాపారావు’, ‘ప్రతిష్ట’, ‘అదిరింది గురూ’ అనే సినిమా కథఽలతో సినిమా రచయితగా ఎమ్మెస్‌ స్థిరపడ్డారు.
మెల్లగా కామెడీలోకి
సాఫీగా సాగుతున్న ఆయన రచన జీవితానికి ఓ బ్రేకి చ్చారు రవిరాజా పినిశెట్టి. ‘నీలో మంచి నటుడు ఉన్నాడు. నువ్వు ఉండాల్సింది తెర వెనుక కాదు తెర ముందు’ అని తను తీస్తున్న ‘ఎమ్‌.ధర్మరాజు ఎమ్‌ఏ’ సినిమాలో చెవిటి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర బాగా పండడంతో ఎమ్మెస్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘రుక్మిణి’, ‘పెదరాయుడు’ వంటి ఏడు సినిమాల్లో వరుసగా అవకాశాలిచ్చారు రవిరాజా పినిశెట్టి. ‘రుక్మిణి’లో తాగుబోతు పాత్ర పోషించి ఎమ్మెస్‌ ప్రేక్షకులను మెప్పించారు. ఆ క్యారెక్టర్‌ను చూసిన ఈవీవీ సత్యనారాయణ ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో అవకాశమిచ్చారు. ఆయన నట జీవితానికి రవిరాజా పినిశెట్టి పునాది వేస్తే, దానిపై ఈవీవీ ఇల్లు కట్టుకునే అవకాశమిచ్చారని ఎమ్మెస్‌ తరచూ చెబుతుండేవారు. అలా అవకాశాలు పెరిగాక 1998లో లెక్చరర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికి 700కుపైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో గొప్ప హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. ఇందులో 200కు పైగా తాగుబోతు పాత్రలే. ఎమ్మెస్‌ మాంచి తాగుబోతు నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నేను గ్లాస్‌ పట్టుకుని ఎన్నిసార్లు జనాలముందుకెళ్ళినా వారు మాత్రం బోర్‌ ఫీల్‌ కాలేదని’ ఆయన పలు సందర్భాల్లో చెప్పేవారు. ప్రిన్సిపాల్‌ పాత్రలు కూడా ఎమ్మెస్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘మా నాన్నకు పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘రామసక్కనోడు’, ‘శివమణి’, ‘దూకుడు’ సినిమాలకు ఐదు నందులు అందుకున్నారు. ఉత్తమ హాస్యనటుడిగా దూకుడు సినిమాకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకున్నారు. రెండు సినీగోయర్స్‌ అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
‘కొడుకు’ సినిమాతో దర్శకుడిగా
ఎమ్మెస్‌ తనయుడు విక్రమ్‌ని హీరోగా పరిచయం చేసి ‘కొడుకు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘భజంత్రీలు’ సినిమాకు కూడా ఆయనే దర్శకుడు. తమిళంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ‘క్రేజీవాలా’, ‘నవాబ్‌ బాషా’, ‘శుభోదయం’ త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతోపాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన నటించగా విడుదలైన చివరి చిత్రం ‘పటాస్‌’లో సునామీస్టార్‌గా ఆకట్టుకున్నారు. ‘శంకర’, ‘రేయ్‌’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘నిద్రపోయేటప్పుడు విశ్రాంతి తీసుకో.. మెలకువగా ఉండి పడుకోవద్దు’ అని ఎమ్మెస్‌ తండ్రి చెప్పిన మాటల్ని చివరి వరకు పాటించారు ఎమ్మెస్‌.
‘తాగుబోతు’గా
చరిత్ర సృష్టించారు నారాయణా!

మా మానాన మేం సినిమాల్లో మీ కామెడీ సీన్లు ఎంజాయ్‌ చేస్తుంటే, రెండ్రోజులుగా ఉన్నట్లా, లేనట్లా అంటూ, ఏడిపించీ ఏడిపించకుండా ఏడిపించారేమిటి ఎమ్మెస్‌? ‘అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి ఎమ్మెస్‌!’ అని మేం అడగాలనుకునేంతలోనే ‘ఇక నవ్వించింది చాలు’ అంటూ మమ్మల్నందరినీ నిజంగానే ఏడిపిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారా నారాయణా! ‘అతడు’లో మీరు చేసింది సింగిల్‌ సీనే అయినా, ‘మీ మానాన మీరు మాడిపోయిన మసాలా దోశ’ తినే ఆ ఒక్క సీనుతో ఎంతగా గుర్తుండిపోయారు? ‘దుబాయ్‌ శీను’లో ‘పైర్‌స్టార్‌ సాల్మన్‌రాజు’గా స్టార్‌ హీరోలపై చెణుకులు విసురుతూ మీరు చేసిన విన్యాసాలకు పొట్టచెక్కలయ్యేలా ఎంతగా నవ్వుకున్నాం! ‘దూకుడు’లో వెంకట్రావు పాత్రలో ‘యమదొంగ’, ‘మగధీర’, ‘సింహా’, ‘రోబో’ కేరక్టర్ల స్ఫూఫింగ్‌తో అలరించిన మిమ్మల్ని బ్రహ్మానందం ‘కళ్లకింద అంతంత క్యారీ బ్యాగులు పెట్టుకొని ఎలా హీరో అవుదామనుకున్నావ్‌రా’ అంటే, చాలా అమాయకంగా ‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారనుకున్నా’ అన్న మీ డైలాగ్‌తో నవ్వి నవ్వి నవ్వలేక అలసిపోయాం కదా ఎమ్మెస్‌!
వెండితెరపై తాగుబోతు పాత్ర అంటే ఏ హాస్యనటుడూ మీకు సాటిరాడు కదా. ఎన్ని తాగుబోతు పాత్రలు! మీరు చేసిన ఏడొందల యాభై పై చిలుకు పాత్రల్లో రెండొందల యాభై పైగా తాగుబోతు పాత్రలే. అయినా మాకు విసుగనేది కలగలేదంటే, మేం మొనాటనీ ఫీలవ్వలేదంటే, అదంతా మీ నటనా చాతుర్యమే కదా. తాగుబోతు పాత్రల్లో మీది చెరిగిపోని చరిత్ర. మీరు తాగుతారని మాకు తెలుసు. అందుకే మాలో చాలామంది మీరు తాగే ఆ పాత్రల్లో చెలరేగిపోతారని అనుకుంటూ వచ్చారు. కానీ, మొహం మీద మేకప్‌ ఉండగా ఎప్పుడూ మీరు తాగలేదనే సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది తాగుబోతు పాత్రల్లో ఒక తరహాలో డైలాగ్స్‌ చెప్పడమే మాకు తెలుసు. కానీ మీరు ఆ పాత్రల్లో ముక్కుతోటి విలక్షణంగా డైలాగ్స్‌ చెబుతూ మీదైన శైలిని సృష్టించారు. నిజంగా హాస్యనటుల్లో ‘తాగుబోతు’గా మీరు ట్రెండ్‌సెట్టర్‌ ఎమ్మెస్‌.
కేవలం ‘తాగుబోతు’ అంటే మిమ్మల్ని మేం కించపరిచినట్లే. తాగుబోతు కాని పాత్రల్లోనూ ఎంతగా మమ్మల్ని నవ్వించారు నారాయణా. విలన్ల అసిస్టెంట్‌గా, లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, యాక్టర్‌గా, పల్లెటూరి రైతుగా, అమాయక భర్తగా, కొడుకులతో తిప్పలు పడే తండ్రిగా – ఎన్నెన్ని పాత్రల్లో ఎంతగా కడుపుబ్బించారు! ఎప్పుడైనా దర్శకులు మీచేత ఎబ్బెట్టు మాటలు పలికించారేమో కానీ, మీ హాస్యం ఎప్పుడూ ఎబ్బెట్టనిపించలేదు. తెరపై మీరు కనిపిస్తే చాలు, మా మొహాల మీద నవ్వు దానంతట అదే ప్రత్యక్ష్యం. ఇప్పుడు బుల్లితెరపై అచేతనంగా ఉన్న మీ దేహాన్ని చూస్తుంటే, అంత ఆపుకుందామన్నా ఆగకుండా దూకుతోంది దుఃఖం. మీరు చనిపోయారంటే నమ్మడం కష్టంగా ఉంది ఎమ్మెస్‌. మీరు లేకున్నా, మీరు చేసిన పాత్రల్లో జీవించే ఉంటారు. ఎప్పటికీ మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు.
– ఒక ప్రేక్షకుడు
ప్రముఖుల
సంతాపాలు

ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎమ్మెస్‌ నారాయణ మృతికి సినీ ప్రముఖులు పలువురు సంతాపాలను వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
అపహాస్యం చేయలేదు
‘‘ఎమ్మెస్‌ నారాయణ పరిశ్రమలో రచయితగా ప్రవేశించి, నటుడిగా టర్న్‌ అయ్యాడు. అతి తక్కువ సమయంలో 700లకి పై చిలుకు సినిమాల్లో నటించడం గొప్ప విషయం. ఆయన ఎప్పుడూ హాస్యాన్ని అపహాస్యం చేయలేదు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్న వ్యక్తి అతను. హాస్యం పండించడంలో అందెవేసిన చేయి. ఆరోగ్యంగా ఉన్న ఎమ్మెస్‌ హఠాత్తుగా పోవడం బాధాకరం.’’
– దాసరి నారాయణరావు
మనసున్న వ్యక్తి 
‘‘ఎమ్మెస్‌ నారాయణ మనసున్న వ్యక్తి. మా సినిమా ‘ఎం.ధర్మరాజు.ఎం.ఎ’తో నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యాడు. ‘పెదరాయుడు’లో తన నటన చూసి గొప్ప నటుడవుతాడని అనుకున్నా. నాతోనూ, నా బిడ్డలతోనూ నటించడానికి ఎంతో ఆసక్తి చూపించేవాడు. ఏ రోజూ నాకింత పారితోషికం కావాలని నోరు తెరిచి అడగలేదు. వ్యక్తిగత విషయాలను కూడా చెప్పి సలహాలడిగేవాడు. అతను మంచి నటుడు, కవి, దర్శకుడు ఎమ్మెస్‌.’’
– డా.ఎం.మోహన్‌బాబు
అద్భుతమైన నటుడు
‘‘ఎమ్మెస్‌ నారాయణ అద్భుతమైన నటుడు. నాకు మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేశాం. ఆయన లేరన్న వార్త మనసును కలచివేసింది. ఇటీవల ‘లయన్‌’లో కూడా కలిసి నటించాం. ఆయన మరణంతో పరిశ్రమ గొప్పనటుడిని కోల్పోయింది.’’
– నందమూరి బాలకృష్ణ
వెర్సటైల్‌ నటుడు
‘‘ఎమ్మెస్‌ నారాయణగారు వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌. ప్రతిభావంతుడు. ఆయన మరణవార్త విని బాధపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’
– పవన్‌కల్యాణ్‌
గుండె ఝల్లుమంది
‘‘నాకు ఎమ్మెస్‌ నారాయణ అత్యంత ఆప్తుడు. మంచి నటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నా పట్ల చాలా అభిమానంగా ఉండేవాడు. ఎమ్మెస్‌ ఇకలేడన్న వార్త వినగానే గుండె ఒక్కసారి ఝల్లుమంది. విద్యాధికుడైన కమెడియన్‌ అతను. తన మాటల్లో డెప్త్‌ ఉండేది. ఈవీవీ ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా చేస్తున్నప్పుడు ఎమ్మెస్‌ గురించి చెప్పి పరిచయం చేశాను. ఆ తర్వాత కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. నాకిష్టమైన హాస్యనటుల్లో, వ్యక్తుల్లో ముఖ్యుడు ఎమ్మెస్‌.’’

– బ్రహ్మానందం
జీర్ణించుకోలేకపోతున్నా..
‘‘మీకు ఒకతను కథ చెబుతానని అడుగుతున్నాడండీ అని జాస్తి మాధవరావు చెబితే రమ్మన్నాను. వచ్చిన వ్యక్తి పేరు ఎమ్మెస్‌ నారాయణ. చెప్పిన కథ పేరు ‘సవ్యసాచి’. కథ వినగానే లేచి నేను ఇంట్లోకివెళ్లాను. ‘కథ నచ్చలేదేమో’ అని అనుకున్నారట ఎమ్మెస్‌. నేను పెద్దమొత్తంలో డబ్బు తెచ్చి ఆయన చేతిలో పెట్టేసరికి నమ్మలేకపోయారు. కారణాంతరాల వల్ల ఆ కథను నేను తెరమీదకు తీసుకురాలేకపోయాను. కానీ ఆ తర్వాత ఎమ్మెస్‌తో పరిచయం పెరిగింది. కథాచర్చలు జరుగుతున్నప్పుడు అతని హావభావాలు చూసి నటించమన్నా. మొహమాటపడ్డాడు. ఒకరోజు ‘ఎం.ధర్మరాజు.ఎం.ఎ’ షూటింగ్‌కు పిలిపించా. మేకప్‌ వేసేసరికి తికమకపడ్డాడు. కానీ సీన్‌ను చాలా బాగా చేశాడు. దాంతో అతనిపై అతనికి నమ్మకం పెరిగింది. ‘రుక్మిణి’ సినిమాలో తాగుబోతు పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన ఈవీవీ సత్యనారాయణ ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రంలో అవకాశమిచ్చాడు. వయసును పక్కనపెడితే, అంచలంచెలుగా ఎదిగిన ఎమ్మెస్‌ని చూసి ఓ తండ్రిలాగా గర్వపడ్డాను. అతను కూడా నా పట్ల అంతే గౌరవంగా మెలిగేవాడు. నిత్యం బిజీగా ఉండే అతను లేడన్న వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.’’ – రవిరాజా పినిశెట్టి
మంచి అనుబంధం ఉంది
‘‘నా సినిమాలు అన్నిటిలోనూ ఎమ్మెస్‌గారున్నారు. నేను అసిస్టెంట్‌గా, ఆయన రైటర్‌గా ఉన్నప్పటి నుంచి మా మధ్య మంచి అనుబంధం ఉంది. సంక్రాంతికి పది రోజుల ముందు కూడా మా ఇంటికి వచ్చి వెళ్లారు. మా అమ్మగారు కనుమూస్తే వచ్చి పరామర్శించారు. ఎమ్మెస్‌ లేరన్న వార్త వినగానే మనసులో ఒకరకమైన నిర్లిప్తత నెలకొంది.’’
– వినాయక్‌
యూనిక్‌ ఆర్టిస్ట్‌
‘‘ఎమ్మెస్‌గారు లేరన్న వార్త విని షాక్‌తిన్నా. చాలా బాధనిపించింది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలోనూ మంచి పాత్ర చేశారు. నేను రాసుకున్న పాత్రకు 100శాతం న్యాయం చేసేవారు. మా ఇద్దరి మధ్య ‘దర్శకుడు-నటుడు’ అనే బంధాన్ని మించి మంచి స్నేహం ఉండేది. అలాంటి గొప్ప నటుడికి రీప్లేస్‌మెంట్‌ కష్టం. యూనిక్‌ ఆర్టిస్‌.్ట ఆయన లేకపోవడం పరిశ్రమకు పెద్దలోటు.’’
– శ్రీనువైట్ల

నవ్వుల తోటమాలి

‘‘ఎమ్మెస్‌ నారాయణగారిని తెరపై రియల్‌హీరోగా శ్రీనువైట్ల, నేను, తాజాగా అనిల్‌ రావిపూడి చూపించాం. ‘ప్రేమలో పావని కల్యాణ్‌’కు తొలిసారి ఎమ్మెస్‌గారితో కలిసి పనిచేశా. ‘సవాల్‌’ మేం కలిసి పనిచేసిన రెండో సినిమా. అందులో తన ట్రాక్‌ చూసి చాలా ఆనందించారు. ‘ఇక అందరూ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తారేమో అమ్మాయ్‌’ అని అనేవారు. మా మధ్య దర్శకురాలు, నటుడు అనే బంధాన్ని మించిన ఆత్మీయత ఉండేది. ఒకే చోట పక్కపక్క ఫ్లోర్‌లలో షూటింగ్‌ చేస్తుంటే ‘అమ్మాయి.. భోజనానికి వస్తున్నాను’ అని కబురుపెట్టి మరీ వచ్చేవారు. అలాంటి గొప్ప బంధం మాది. తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వుల తోటమాలి అయిన ఎమ్మెస్‌గారు లేని లోటు భర్తీచేయలేనిది.’’
– జయ.బి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మీ పుస్తకం ‘దర్శనీయ స్థలాలు ‘ Satyanarayana Moorthy Jonnalagadda

మాన్య శ్రీ    దుర్గా   ప్ర      సాద్  గారూ   నమస్తే   .

ఒక ప్ర   యోజనాత్మకమై   న  , పరిసోధనాత్మకమై   న  గొప్ప
పుస్త   కాన్ని రచించి వెలువరించినారు.  అభినన్దనలు.
ఎన్నెన్నో  దర్శనీయ  ప్ర  దేశాలని చూపించారు .  మీ విషయ
సేకరణా వివరణ  బహుధా ప్ర  శం స నీయంగా ఉన్నాయి.
ప్ర  త్యేకించి 33 వ విభాగంలో  అన్నిఅన్ని దేవాలయాల ప్ర థ్యేకతల్ని
 చెప్పటం  మీ కృ షి కి  శ్ర  మకి దర్పణం పడుతున్నది .
హార్ది  క   శుభాకాంక్షలు  !!……… మీ    విహారి
Satyanarayana Moorthy Jonnalagadda <vihaari912@gmail.com>
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రమ్య భారతి జనవరి-15 – మధుర మధుమాస కవి -కృష్ణ శాస్త్రి – ప్రకాష్ సంపాదకీయం మరియు సోమేపల్లి ప్రధమ బహుమతికద

dvk1 001dvk2 001dvk3 001dvk4 001

రమ్య భారతి జనవరి-15

chalapaka 001 first-1 001 first2 001 first-3 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆమెకు అండగా పద్మిని పప్పెట్రీ

ఆమెకు అండగా పద్మిని పప్పెట్రీ

‘‘పలు సున్నితమైన అంశాలను బొమ్మలాట(పప్పెట్రీ) ద్వారా మనసులకు హత్తుకు పోయేలా చెప్పొచ్చు. మేము ఇప్పటివరకు ఎన్నో సామాజికాంశాలను బొమ్మలాట ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చి చర్చించాం.ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపులు, అసభ్యకర మాటలు, సంజ్ఞలు, స్పర్శ వంటి విషయాలను చేపట్టాం. అందులో భాగంగా కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం. ఈ ప్రయాణంలో అర్థమైంది ఏమిటంటే ఆడవాళ్లపై జరిగే వేధింపులు, అత్యాచారాల వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ‘కాలనీ పోలీసింగ్‌’ అనేది బ్రహ్మాస్త్రం’’ అంటారు స్టెపార్క్‌ (స్ఫూర్తి థియేటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ పప్పెట్రీ, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌) ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు పద్మిని రంగరాజన్‌.
రెండూ ఒకటి కాదు
బొమ్మలాట, తోలుబొమ్మలాట ఒకటే అనుకుంటారు. కాని తెర వెనుక ఆడేది తోలు బొమ్మలాట. తెర ముందు ఆడేది బొమ్మలాట. నా బొమ్మల్ని మట్టి, వేస్ట్‌ కాగితాలు, థర్మకోల్‌ షీట్స్‌ వాడి తయారుచేస్తాను.
‘‘పప్పెట్రీ అనేది పిల్లలకే కాదు పెద్ద వాళ్లకీ వినోదాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చదువుకునే రోజుల నుంచీ పరిశోధన, బోధన – ఈ రెండు అంశాలంటే నాకు చాలా ఆసక్తి. కాని అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చాను. 2003లో మా బాబు కోసమని కోతి బొమ్మ ఒకటి తయారుచేశాను. ఆ బొమ్మ గురించి స్కూల్లో టీచర్లకు చెప్పాడు. వాళ్లు నన్ను స్కూల్‌ పిల్లలకోసం మరిన్ని బొమ్మలు చేసిమ్మని అడిగారు. అలా అనుకోకుండా బొమ్మల ప్రపంచంలోకి వచ్చాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఉన్న రామకృష్ణమఠంలో ఇంగ్లీషు బోధించాను. అప్పుడు ఇంగ్లీషు గ్రామర్‌ని బొమ్మలు ఉపయోగించి నేర్పించేదాన్ని. ఇలా చెప్పడం వల్ల విద్యార్థులకి భాష పట్ల ఆసక్తి కలగడమే కాకుండా నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకుండా ఉండేవారు. ఒక్క ఇంగ్లీషు భాషకే కాకుండా ఇతర భాషలు వేటినైనా బొమ్మలతో బోధించొచ్చు. అలాగే లెక్కలు, సైన్సులను సులువుగా అర్థమయ్యేలా చెప్పొచ్చు.
విద్యాపరమైన అంశాలనే కాకుండా పలు సామాజింకాశాల పట్ల పిల్లలకు, పెద్దలకు అవగాహన కలిగించడంలో బొమ్మలు కీలక పాత్ర పోషిస్తాయి. సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అరికట్టేందకు బొమ్మల్ని టూల్‌గా చేసుకుని ముందుకెళ్తున్నాం. 2013 నిర్భయ ఘటన జరిగినప్పటి నుంచీ లైంగిక వేధింపుల గురించి కారక్రమాలు చేస్తున్నాం. వీటిలో బొమ్మల ద్వారానే ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తాం. బొమ్మలే ప్రేక్షకుల్ని ప్రశ్నలు అడుగుతాయి. మేము చేసే కార్యక్రమాలు తీర్పునిచ్చినట్టుగా కాకుండా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందో ప్రేక్షకులే ఆలోచించేలా రూపొందిస్తాం.
ప్నశ్నల ద్వారా ఆలోచింపచేస్తాం…
మా కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఓ నలుగురు స్నేహితురాళ్లు కలిసి రవీంద్రభారతిలో మహాభారతం పప్పెట్రీషోకి వెళ్దామనుకుంటారు. అందరూ కలిసి ఆ షోకి వెళ్తారు. ఆ బొమ్మలాట ఆసక్తికరంగా సాగుతుంది. ద్రౌపది వస్ర్తాపహరణ ఘట్టం వరకు చూశాక నలుగురూ కలిసి ఇంటికి బయల్దేరతారు. బస్టాపులో బస్‌లకోసం ఎదురుచూస్తుంటారు. వెళ్లిన నలుగురిలో ముగ్గురికి వాళ్లు ఎక్కాల్సిన బస్సులు రావడంతో వెళ్లిపోతారు. తాను ఎక్కాల్సిన బస్‌ రాకపోవడంతో ఒక్క అమ్మాయే మిగిలిపోతుంది. వంటరిగా బస్టా్‌పలో ఉన్న ఆ అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసుల కఠినమైన ప్రవర్తన ఆ అమ్మాయికి మరింత బాధకలిగిస్తుంది. సమాజం ఆ కుటుంబాన్ని వెలివేసినట్టు చూడడంతో కుటుంబమంతా కలిసి చచ్చిపోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితుల్ని చక్కదిద్దే పని మొదలుపెడుతుంది. – ఇదీ కథ. పౌరాణిక అంశంలో నుంచి నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులకి తగ్గట్టుగా కథనాన్ని రూపొందించి బొమ్మలాట ద్వారా చూపిస్తాం.
కాలనీ పోలీసింగ్‌తో క్రాస్‌ చెక్‌
వేధింపులు, అసభ్యకర చేష్టలు, మాటలు వంటి తదితర అంశాల గురించి పరిశోధిస్తున్నప్పుడు బోలెడు అంశాలు నా దృష్టికి వచ్చాయి. అయితే వాటిలో ఒక విషయం మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. అదే ‘కాలనీ పోలీసింగ్‌’. ఊర్లో లేదా కాలనీల్లో కొత్త వ్యక్తులు వస్తే గుర్తుపట్టడం అక్కడే నివాసముండే వాళ్లకి కష్టమైన విషయం కాదు. అంతేకాక ఆ ప్రాంతంలో జులాయి చేష్టలు చేసే వాళ్లని కూడా గుర్తించొచ్చు. అందుకని కాలనీల్లో ఉండే వాళ్లే ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడు ఇటువంటి విషయాలను నివారించగలగడం ఏమంత కష్టమైన పని కాదనేది నా అభిప్రాయం. ‘నా వరకు వస్తే అప్పుడు చూద్దాంలే’ అనే ధోరణి మంచిదికాదు. ఎందుకంటే తీరా మీ వరకూ వచ్చాక మీరేం చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కాలనీ పోలీసింగ్‌ అనేది ఎంత బాగా పనిచేస్తుందో చెప్పేందుకు మీకో ఉదాహరణ చెప్తాను… మా పప్పెట్రీ టీంలో ఉండే ఇద్దరమ్మాయిలు వాళ్ల కాలనీకి రోజూ ఒకే బస్సులో వెళ్ళేవారు. ఒకరోజు పోకిరీలు ఆ అమ్మాయిల్ని బస్సులోనే వేధించడం మొదలుపెట్టారు. అది గమనించిన బస్సు డ్రైవరు, కండక్టరు, తోటి ప్రయాణికులు ఆ పోకిరీలకు బుద్ధి చెప్పారు. రోజూ చూసే ముఖాలు కావడం వల్ల ఇది సాధ్యమైంది. అందుకే కాలనీ పోలీసింగ్‌ మంచిదంటాను నేను.
మనమూ మారాలి
ప్రస్తుతం సమాజంలో నెలకొన్న ధోరణులు చూస్తుంటే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. అఫ్‌కోర్సు కొందరు మగపిల్లలకీ కొన్ని ఇబ్బందులు తప్పడంలేదనుకోండి. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పిల్లల మైండ్‌సెట్‌ను సరిచేసే ప్రయత్నం ఇంటినుంచే ప్రారంభం కావాలి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఎన్నో అంశాలు పిల్లల్ని ఆకర్షిస్తుంటాయి. దానివల్లే తెలిసీ తెలియని వయసులో వాళ్లు పక్కదారులు పడుతుంటారు. మన సమాజంలో ముఖ్యంగా పిల్లల ముందు లైంగిక విషయాల గురించిన ప్రస్తావన తేవడానికి ఇష్టపడరు. కాని మారుతున్న సమాజంతో పాటు మనమూ మారాలి. తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు లేదా కూతురు ‘ఐ యామ్‌ ఎట్రాక్టెడ్‌ టు హర్‌/హిమ్‌…’ అని చెప్పడమో, ప్రవర్తించడమో చేస్తే వాళ్లని కోపగించుకున్నా, తిట్టినా ఫలితం ఉండదు. ఆ వయసులో అనేక ఆకర్షణలు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. ‘ఆకర్షణ అనేది సహజం. ఇది చదువుకునే వయసు. బాగా చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడితే ఆ తరువాత మిగతా విషయాల గురించి ఆలోచించొచ్చు’ అని సున్నితంగా చెప్పాలి. పిల్లలతో స్నేహంగా ఉంటూ వాళ్ల మనసుల్ని చదవగలిగితే ఆరోగ్యకరమైన సమాజాన్ని తప్పక నిర్మించొచ్చు. ఆ దిశగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. జెండర్‌ సెన్సిటివిటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు మహిళా సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఇప్పటికే కొందర్ని సంప్రదించాం. మహిళలకు సంబంధించిన అంశాలతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణం, బాల్యవివాహాలు, భ్రూణహత్యలు, బాలకార్మికులు వంటి తదితర అంశాలను కూడా చేపడుతున్నాం.’’
స్ఫూర్తి సంస్థ ఫోను: 8985759361
నవ్యడెస్క్‌
ఫోటోలు: విజయ్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంన్యాసం – గురువులు డాక్టర్‌ కె. అరవిందరావు

సంన్యాసం – గురువులు

సరిగ్గా ఈ రోజు, అంటే జనవరి 23 న కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఒక మహత్తర సంఘటన జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలలో ఒకసారి జరిగే సంఘటన ఇది. ఆదిశంకరులు ఎనిమిదివ శతాబ్దంలో స్థాపించిన శృంగేరీ పీఠానికి కాబోయే పీఠాధిపతిగా ఒక యువకుణ్ణి ఎంచుకొని సంన్యాస దీక్ష ఇచ్చే ప్రక్రియ ఇది. శ్రీ శంకరులు ఈ పీఠాన్ని దక్షిణ దేశానికంతా ధర్మప్రచార బాధ్యతల్ని అప్పజెప్పుతూ ఏర్పాటు చేశారు. నాలుగు రాషా్ట్రల ప్రజలూ ఈ పీఠానికి వెళుతూంటారు.
సంన్యాసం అంటే ఇంటిని, భార్యాపిల్లల్ని వదిలేయడమని సాధారణంగా అనుకుంటాం. కానీ అలాకాదు. ఇది ఆధ్యాత్మిక చింతనలో, జ్ఞానమార్గంలో ఒక ముఖ్యదశ. సమాజం ఒక నిర్దిష్ట మార్గంలో నడవడానికి వేదాలు ప్రతి వ్యక్తీ కొన్ని కర్మల్ని తప్పకుండా చేయాలని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు అతిథుల్ని ఆదరించడం(అతిథి యజ్ఞం). దేవతల్ని పూజించడం(దేవయజ్ఞం), సమాజానికి హితమయ్యే పనులు చేయటం మొదలైనవి. ఈ కర్మల వల్ల పుణ్యము, పుణ్యం వల్ల స్వర్గం మొదలైన సుఖాలు లభిస్తాయి అనేది మతం అనే స్థాయిలో చెప్పుకునే వ్యవస్థ. దీనికి అతీతంగా ఎదిగి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యంతో ఉన్నవాడు కర్మల్ని వదిలేయాలి. కర్మను వదిలేయడమే సంన్యాసంలో ముఖ్య విషయం. భార్యాపిల్లలు, ఇల్లు , వేళకు భోజనం మొదలైన సుఖాలని వదిలేయడం దీనిలో భాగం మాత్రమే.
సంన్యాసి జీవితం ఎంత కఠినంగా, కత్తిమీద సాములా ఉంటుందో ‘నారద పరివ్రాజక ఉపనిషత్తు’ చూస్తే ఆశ్చర్యమవుతుంది. కేవలం కర్మల్ని వదిలేయడం సులభంగానే చేయవచ్చు. కానీ మనస్సులోని రాగద్వేషాలూ, కోరికలూ మొదలైనవి వదులుకోవడం చాలా కష్టం. మనందరికీ సమాజంలో ఒక వ్యక్తిత్వం, ఐడెంటిటీ ఉంటుంది. పలానా వంశం వాడు, ఫలానా ఉద్యోగం చేసేవాడు, ఎంతో గొప్పవాడు అంటూ ఒక చిరునామా నిర్మించబడి ఉంటుంది. దీన్ని పూర్తిగా వదిలి తాను ఏ వర్ణానికీ, సంప్రదాయానికీ, కులానికీ చెందినవాడు కాదని తెలుపుతూ కులాన్ని తెలిపే శిఖ, జందెం మొదలైనవాటిని వదిలేయాలి. నదిలో నిల్చుని ఇదివరకూ ఉన్న వసా్త్రలను వదిలేసి, గురువు ఇచ్చిన కౌపీనాన్ని పెట్టుకుని శరీరం పట్ల ప్రేమభావాన్ని వదిలి నది నుండి బయటకు రావాలి. గుడ్డల్ని వదిలేయటం అనాగరికత చిహ్నం కాదు. దేహంపై అభిమానం లేకపోవడం, భగవంతునిపై ధ్యానం ఉండటం అనే దానికి నిదర్శనం. లోకజ్ఞానం కలగకముందు ఆడం, ఈవ్‌లు కూడా ఈ దశలో తిరగడానికి ఇదే అర్థం.
సంన్యాసి కాబోయే వ్యక్తి ఎనిమిది రకాల శ్రాద్ధాలు చేయాలి. అంతవరకూ తాను పూజిస్తున్న దేవతలు, పితృదేవతలు మొదలైన వారికి శ్రాద్ధాలు చేయాలి. ఒక విధంగా చూస్తే వారితో వీడ్కోలు తీసుకున్నట్లు. అలాగే తనకు తానే శ్రాద్ధం పెట్టుకోవాలి. దీన్ని ఆత్మశ్రాద్ధం అంటారు. అంటే ఇన్నాళ్ళూ తనకున్న వ్యక్తిత్వాన్ని పూర్తిగా నశింపజేసుకున్నట్లు భావన. తాను కేవలం పరమాత్మతత్వమే అనే భావనతో అందరిపట్ల సమభావనతో మెలగడానికి మొదటిమెట్టు. ఇరవై ఐదేళ్ళ యువకుడు తల్లిదండ్రుల ఎదురుగా తనకు తానే శ్రాద్ధం పెట్టుకుంటుంటే దాన్ని చూసే తల్లిదండ్రుల మనస్సులోని భావోద్వేగం ఊహాతీతం. ఇదొక గొప్ప త్యాగానికి చిహ్నం.
హిందూసమాజం త్యాగం పట్ల ఎక్కువ ఆదరం చూపింది. మనదేశ చరిత్రను చూస్తే రాజులు, చక్రవర్తుల కంటే ఎక్కువగా పరివ్రాజకులు, గురువులే సమాజంపై ప్రభావాన్ని చూపారు. అందువల్లే సంన్యాసులు, గురువులు అనేక క్లిష్ట సమయాల్లో ధర్మాన్ని కాపాడగలిగారు. ఉపనిషత్తుల కాలంలో సంన్యాసమంటే పూర్తిగా కర్మల్ని వదిలేసి జడుడిగా, భిక్షుకుడిగా తిరిగే ఆచారముండేది. రాను రాను హిందూ ధర్మంలో పీఠాలు, ఆశ్రమాలు అనే వ్యవస్థ ఏర్పడింది. మన మతానికి ఒక గట్టి సంస్థాగత నిర్మాణం లేకపోయినా ఈ పీఠాలు, గురువులు ధర్మప్రచారం చేస్తూ వచ్చారు. బహుశా బౌద్ధుల ఆరామాలు, వారికున్న పటిష్టమైన ప్రచారవ్యవస్థ చూసిన తర్వాత వాటికి సమాంతరంగా శంకరులు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేశారని కొందరి అభిప్రాయం. శ్రీ శంకరుల తర్వాత శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు కూడా ఇదే మార్గాన్ని పాటించి పీఠాలు ఏర్పాటు చేశారు.
ఆధునిక కాలంలో ఈ వ్యవస్థను కొత్తరూపంలో నిర్మించిన వ్యక్తి శ్రీ వివేకానందులు. వీరు స్థాపించిన రామకృష్ణ మిషన్‌ ఆధునిక అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా చాలామంది సాధువుల్ని తీర్చిదిద్దింది. ఎంతోమంది ఆధునిక విద్యావంతులు, సంస్కృతానికి దూరమైనవారు, సంస్కృతంతో సంబంధం లేకుండా మన మూల సిద్ధాంతాల్ని తెలుసుకోగలిగారు. ప్రపంచంలో అనేక దేశాల్లో వేదాంతం పట్ల ఆదరం, అభిమానం కలగడానికి శ్రీ వివేకానందుల కృషి ముఖ్యమైనది. ఇదే ఆదర్శంతో చిన్మయామిషన్‌ మొదలైనవి ప్రారంభమయ్యాయి. తెలుగు రాషా్ట్రలలో సుమారు తొంభై సంవత్సరాల క్రితం మళయాళ స్వామివారు యేర్పేడులో స్థాపించిన ఆశ్రమం వందలాది సాధువుల్ని తయారు చేసింది. వీరు కులమతభేదం లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన మూల గ్రంథాల్లో ఉన్న ఉదాత్తమైన భావాల్ని తీసుకెళ్ళడం వల్లనే సమాజంలోని అనేక వర్గాలు పైగ్రంథాల బోధనల్ని గ్రహించగలిగాయి. ఈ ఆధునిక సంప్రదాయాలకు చెందిన సాధువుల్ని కూడా ప్రాచీన పీఠాలతో సమానంగా ఆదరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే సంన్యాసదీక్ష తీసుకున్న వారందరూ కులమత భేదాలకు అతీతంగా ఎదిగినవారే.
సంన్యాస దీక్ష తీసుకున్న వ్యక్తిని అతి వర్ణాశ్రమి అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. అతి వర్ణాశ్రమి అంటే బ్రాహ్మణ, క్షత్రియ మొదలైన వర్ణభేదాలకు అతీతంగా ఎదిగినవాడు అని అర్థం. సమాజంలో అందరినీ సమానంగా చూడగలిగి ఉండాలి. అలాగే జగద్గురువు అనే మాట కూడా అర్థవంతమైనది. ఈ పదానికి జగత్తుకు గురువు అని అర్థం. జగత్తు అంటే – గచ్ఛతి ఇతి జగత్‌ – ఎప్పుడూ మారే స్వభావం కలది అని అర్థం. మార్పు అన్నది సహజం. సమాజంలోని మార్పును గమనించి సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి జగద్గురువు. ప్రాచీన కాలంలోని గురువులు వారి సమకాలీన సిద్థాంతాల్ని బాగా తెలిసినవారు. ఆ సిద్థాంతాల ప్రభావాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నవారు. ప్రస్తుత గురువులకు కూడా మన ధర్మానికి సవాలుగా నిలిచిన ఈనాటి సిద్థాంతాల పట్ల, సమాజ సమస్యల పట్ల అవగాహన అవసరం . అలాంటి అవగాహనతో గురువులు ముందుకు నడిస్తే సమాజం వారికి బ్రహ్మరథం పడుతుంది.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను
navya@andhrajyothy.com 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మైలవరపు సత్యనారాయణ అనే ఏం ఎస్ -మరణం

 

హైదరాబాద్‌, జనవరి 23 : ప్రముఖ హాస్యనటుడు ఎమ్‌ఎస్‌ నారాయణ(63) కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్‌ఎస్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కొండపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఎమ్‌ఎస్‌ బాధపడుతున్నారు.
ఎమ్‌ఎస్‌ 1951 ఏప్రిల్‌ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఎమ్‌ఎస్‌ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. 1995లో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన హాస్యనటుడిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. తాగుబోతు పాత్రలను పోషించడంలో ఎమ్‌ఎస్‌ ప్రసిద్ధిగాంచారు. దాదాపు 500 చిత్రాలకుపైగా నటించి నవ్వించారు. రచయిత కావాలని వచ్చి హాస్యనటుడిగా స్థిరపడిన ఎమ్‌ఎస్‌ 2011లో విడుదలైన దూకుడులో తన నటవిశ్వరూపం ప్రదర్శించారు.
ఈ చిత్రానికి ఎమ్‌ఎస్‌కు హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. కెరీర్‌లో ఐదు నంది అవార్డులను నారాయణ అందుకున్నారు. ఎమ్‌ఎస్‌ నారాయణ తొలి చిత్రం ఎం. ధర్మరాజు ఎంఏ. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు ఎమ్‌ఎస్‌ దర్శకత్వం వహించారు.
నువ్వునాకు నచ్చావ్‌, శివమణి, ఇడియట్‌, యమదొంగ, దూకుడు, ఆగడు, బాద్‌షా, అతడు, అత్తారింటికి దారేది, సొంతం, ఆది, దిల్‌, ఆనందం, జులాయి, సుడిగాడు, రెడీ, కింగ్‌, రెబల్‌, రచ్చ, డార్లింగ్‌, గోలీమార్‌, స్వయంవరం, సమరసింహారెడ్డి, మానాన్నకు పెళ్లి చిత్రాలో ఎమ్‌ఎస్‌ నారాయణ నటించి మెప్పించారు. ఎమ్‌ఎస్‌కు భార్య కళాప్రపూర్ణ, కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు విక్రమ్‌ కొడుకు సినిమాతో ఇండస్ర్టీలో అడుగు పెట్టగా, కుమార్తె శశికిరణ్‌ ఈ మధ్యే దర్శకురాలిగా అడుగుకు ముందుకేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌లో ఎమ్మెస్‌ భౌతికకాయం
హైదరాబాద్‌, జనవరి 23 : హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ భౌతికకాయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెస్‌ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు(శనివారం) వికారాబాద్‌లో ఎమ్మెస్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఎమ్మెస్‌ మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం
హైదరాబాద్‌, జనవరి 23 : అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెస్‌ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షేత్రాలు ఆవిష్కరణ మరియు చలపాక కు సన్మానం -రమ్య భారతి -జనవరి 15

kshetralu 001 prakash 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీ మిత్రులు మచిలీపట్నం 33 వ వార్షికోత్సవ సభ ఆహ్వానం 25.01.2015

ఆహ్వానం1 (1)0001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆయనొక నిత్య చైతన్య దీప్తి – జ్ఞాని అక్కినేని

ఆయనొక నిత్య చైతన్య దీప్తి

సాధారణంగా సినిమాల్లో హీరోలు మరణించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అయినా ‘దేవదాసు’, ‘మేఘసందేశం’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేసిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఒక్క ‘దేవదాసు’లో తప్ప మిగిలిన ఆ రెండింటిలోనూ సహజనటి జయసుధ అక్కినేనితో కలిసి కథానాయికగా నటించింది. ప్రాతల గురించిన చర్చ సరే, అంత కు మించిన జీవితసత్యాల మీద నాగేశ్వరరావు చేసే అమూల్యమైన వ్యాఖ్యానాల్ని ఆమె తనివితీరా వింది. తన జీవన గమనానికీ, స్పూర్తికీ అవి ఎంతో ఉపయోగపడ్డాయని మనసు విప్పి చెబుతోంది. ఒక్క జయసుధకే కాదు కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకులకు మనోల్లాసాన్ని, చైతన్య దీప్తిని అందించి వెళ్లిపోయిన అక్కినేని తొలివర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్న విశేషాలే ఇవి..
‘‘అప్పటికే ‘నోము’, ‘పండంటి కాపురం’ సినిమాల్లో నటించిన నాకు నాగేశ్వరరావు గారు హీరోగా ‘మహాకవి క్షేత్రయ్య’లో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి కాకపోయినా అందులో ఉన్న చాలా మంది హీరోయిన్లలో నే నొకరినయ్యాను. అందులో నాది ఒక నర్తకి పాత్ర. నాకు నాట్యం పెద్దగా రాకపోయినా ఏఎన్నార్‌తో కలిసే మహదావకాశం కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాను. ఆ తర్వాత రామానాయుడి గారి ‘సెక్రెటరీ’లో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలా దాదాపు పాతిక సినిమాల దాకా ఆయనతో కలిసి నటించాను.
సాధారణంగా మాతరం వాళ్లు షాట్‌లో తమ పాత్ర లేకపోతే దూరంగా వెళ్లి కూర్చోవడం చేస్తుంటారు. అక్కినేని గారు మాత్రం అలా వెళ్లే వారు కాదు. లోపల కూర్చుని స్ర్కీన్‌ మీద మా నటనను గమనిస్తుండే వారు. ఎప్పడైనా వీలు చిక్కినప్పుడు బాగుంటే అభినందించడం, ఏదైనా తేడా కనిపిస్తే ఆ విషయాన్ని సూటిగా చెప్పేవారు. దాంతో ఎక్కడ తప్పు చేస్తున్నామనేది కొత్తవాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. సినిమా అంటే అదొక సమష్టి కృషి.. అనే మాట అనుక్షణం మనసులో ఉంచుకోవడమే అందుకు కారణం. ‘‘ఈ అమ్మాయికి తెలుగు రాకపోయినా ఒకసారి డైలాగ్‌ వినిపించగానే వెంటనే గుర్తు చేసుకుని ఇంత బాగా ఎలా చెబుతోంది?’’ అంటూ పలుమార్లు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ వ్యక్తం చేసేవారాయన. మీడియా ముందు కూడా నన్ను మెచ్చుకుంటూ ఓపెన్‌గానే మాట్లాడే వారు. వాస్తవానికి ఆ మహానటునికి అప్పుడప్పుడే వచ్చిన నటి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరమేముంది? ఆయన పెద్ద మనసు కాకపోతే!.
సరదా మనిషి..
తానున్న వాతావరణాన్ని ఎప్పుడూ తేలిగ్గా, హాయిగా ఉంచడం అక్కినేని నైజం. సభావేదికల్లో ఉన్నంత సహజంగానే షూటింగ్‌ సమయాల్లో కూడా ఉండేవారు. కాకపోతే సరదాగా ముందు మాట్లాడినా ఆ తర్వాత ఆయన ఆలోచనలు మెల్లమెల్లగా విషయాల లోతుల్లోకి వెళ్లేవి. ప్రతి తాత్విక విషయాన్నీ ఒక హాస్యోక్తితో మొదలుపెట్టే వారు. ఎక్కడా కాసింత నిరాశకూ, నిర్లిప్తతకూ చోటిచ్చే వారే కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? వాస్తవానికి ఎలా ఉండాలి? అనే విషయమే ఆయన మాటల్లో ఎక్కువగా ధ్వనించేది. ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారు. అయితే పరోక్షంగానే తప్ప ఏ రోజూ వ్యక్తిగత విషయాల్ని ఉటంకించేవారు కాదు. అలా మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఒక పరంపరగా ఆయన నోట వచ్చే మాటలు మనం ఊహించని దూరాలకు తీసుకువెళ్లేవి. చాలా మంది నటీనటులకు ఆరోగ్యపరమైన విషయాలు జీవన శైలికి సంబంధించిన విషయాలే ఆసక్తిగా ఉంటాయి. పరిధి దాటితే ఆ మాటల్ని వినడానికి ఆసక్తి చూపరు. ఆయన ప్రపంచంలోని పలు విషయాలు మాట్లాడేవారు. నాకైతే ఈ విషయాలపైనే ఆసక్తి ఎక్కువ. అందుకే ఎంత సేపు మాట్లాడినా అంతే ఆసక్తిగా వినేదాన్ని. ఆయన నడిచే గ్రంథాలయం అనే మాట నేనే కాదు ఒక గంట పాటు ఆయన సంభాషణలు విన్న ఎవరికైనా అదే భావన కలుగుతుంది.
గొప్ప మార్గదర్శి..
మానవ సంబంధాల్ని ఎలా మెయింటెన్‌ చేయాలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్‌ చేయాలో బాగా చెప్పేవారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి రంగం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఒక పండితుడాయన. అయినా పరిశ్రమలో అన్ని దశాబ్దాలుగా ఉన్నా ఒక్క నిర్మాతగా తప్ప మరే రంగంలోనూ అడుగు మోపలేదు. రెండు పడవల మీద కాలు మోపడం ప్రమాదమని ఆయన నమ్మడమే అందుకు కారణం. ఎక్కువ రంగాల్లోకి వెళితే ఉన్న రంగం మీద ఏకాగ్రత లోపిస్తుంది. ఇది అసలుకే ముప్ప తెస్తుంది అనేవారారు ఏఎన్నార్‌గారు. మాలాంటి వారు ఎదుర్కొనే ఏ సమస్య విషయంలో సలహా అడిగినా ఒక సమగ్రమైన సలహా ఇచ్చేంత సమర్ధులాయన. అలా సలహా అడగకపోవడం వల్లే మాలాంటి వారు అప్పుడప్పుడు మొట్టికాయలు తినడానికి కారణమయ్యింది. నేను రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలుసుకుని ‘‘అక్కడ నీకు ఓకేనా?’’ ఇంతే అన్నారాయన. నేను సలహా ఏదీ అడగలేదు కాబట్టి. రాజకీయ రంగం మనకంత సరియైుంది కాదనే విషయం నాకు ఎప్పటి కో గానీ తెలిసి రాలేదు.
ఆయనొక వైద్యుడు..
ఆరోగ్య విషయాల్లో ఆయనకున్న అవగాహన చాలా అరుదైనది. మానసికంగా స్థిరంగా ఉండడానికి ఆయన అనుసరించే విధానం కూడా అనుసరణీయమైనది. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు, మనం చేయగలిగేది ఏమీ లేనప్పుడు ఆ విషయాల్లోకి వెళ్లకపోవడమే ఉత్తమమని అక్కినేనిగారు నమ్మేవారు. అందుకే వెళ్లకూడదని భావించిన చోటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లే వారు కాదు. ఘంటసాల గారు మరణించినప్పుడు తాను వెళ్లకపోవడం పట్ల ఎన్ని విమర్శలు ఉన్నాయో మనకు తెలుసు. విమర్శలు వస్తాయన్నది ఆయనకు తెలియని విషయమేమీ కాదు. ఆయన వెళ్లనంత మాత్రాన ఆ తాలూకు బాధ, దుఃఖం అవేవీ అతనిలో లేవని కాదు కదా! ఏమైనా ఆ నియమాలు అంత కఠోరంగా ఉండేవి మరి. అవన్నీ ఆయన ఆరోగ్య రహస్యాలే. ‘‘మీ ఆయుష్షు ఇక్కడికే పరిమితం’’ అని డాక్టర్లు చెప్పినా ఆయన వారందరినీ ఆశ్చర్యపరుస్తూ 90 ఏళ్లు జీవించారు. ఆయన అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడానికి ఒక సుఽధీర్ఘమైన జీవితాన్ని కోరుకున్నారు. దాన్ని సాధించారు.
ఆయన నాస్తికుడు. నిజమే. అయితే నా మటుకు నేను ఆయన ఆత్మే ఆయన దేవుడు అని అర్థం చేసుకున్నాను. ఆ దైవం లాంటి ఆత్మతో ఆయన నిత్యం సంభాషించేవారు. దాని ఫలితమే ఆయన నోట అమృతం లాంటి ఆ వాక్యాలు వస్తాయని నా నమ్మకం.
మనసులో దేన్నీ దాచిపెట్టుకునే వారు కాదాయన. తనకు క్యాన్సర్‌ ఉందని బహిరంగంగా చెప్పడానికి ఎవరికైనా ఎంత ధైర్యం కావాలి? అలా చెప్పడం వల్ల ఏమైనా నష్టం కలిగితే కలగవ చ్చు. కానీ అలా చెప్పడం ద్వారా ఇతరులకేమైనా లాభం కలిగే అవకాశం ఉంటే ఎందుకు ఊరుకోవాలి? అనేది ఆయన తత్వం. ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్‌ కణాలు ఉంటాయి. ఒక్కోసారి అవి కాస్త పెరుగుతాయి. సరైన వైద్యం అందితే అవి మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేస్తాయి అంటూ.. క్యాన్సర్‌ ఒక సాధారణ జబ్బేనంటూ ఎంతో మందిలో ధైర్యం నింపారాయన. అందుకే ఆయన ఎప్పటికీ చైతన్యదీప్తి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా మద్రాస్ మేనకోడలు ఛి సౌ కళ, ఉయ్యూరులో మా ఇంట్లో

మా మద్రాస్ మేనకోడలు ఛి సౌ కళ, ఉయ్యూరులో మా ఇంట్లో -మరియు 30 ఏళ్ళ క్రిందటి గండ్రాయి హైస్కూల్ శిష్యుడు జానకి రామయ్య మా ఇంటికొచ్చిన సందర్భం -21-1-15  DSCN0117 DSCN0118 DSCN0119 DSCN0120 DSCN0121 DSCN0122 DSCN9977 DSCN9978 DSCN9979 DSCN9980 DSCN9981

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహదేవన్ అందరికి మామే -విశ్వనాధ్

ఆయన అందరికి మామే

‘‘పరిపూర్ణమైన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌గారు. అన్ని రకాల పాటలకూ సమర్థవంతంగా స్వరాలు సమకూర్చగలిగే సత్తా ఆయన సొంతం. బాణీలు కట్టడమే కాదు నేపథ్య సంగీతాన్ని అందించడంలోనూ దిట్ట’’ అని అంటున్నారు కె.విశ్వనాథ్‌. ‘ప్రైవేటు మాస్టార్‌’ నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ‘స్వాతికిరణం’ వరకు ఆ బంధం సాగింది. నేడు కె.వి.మహదేవన్‌ జయంతి. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నారు కె.విశ్వనాథ్‌.
‘‘నన్ను విశ్వం అని పిలిచేవారు. నేను ‘మామా’ అనేవాడిని. నాకే కాదు ఆయన అందరికీ మామ. యూనివర్శల్‌ మామ. ‘మూగమనసులు’ సినిమాకు ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర నేను సెకండ్‌ యూనిట్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పటి నుంచి మహదేవన్‌ గారితో పరిచయం ఉంది. ఆ చిత్ర సంగీత చర్చలు హైదరాబాద్‌లోని తాజ్‌మహల్‌ హోటల్లో జరిగాయి. నేను దర్శకుడిని అయ్యాక మామతో కలిసి చేసిన తొలి సినిమా ‘ప్రైవేటు మాస్టార్‌’. అంతకు ముందే పరిచయం ఉండటంతో ‘కొత్త’ అనే భావన ఇద్దరిలోనూ లేదు. మేమిద్దరం కలిసి పనిచేసిన సినిమాల సంగీత చర్చలన్నీ సినిమా ఆఫీసుల్లోనే జరిగేవి. పాటల కోసం బయటికెళ్లి చర్చించే అలవాటు లేదు.’’
పవిత్రమైన దేవాలయం
‘‘మహదేవన్‌గారితో సంగీత చర్చలు చాలా పవిత్రంగా సాగేవి. చీకులు, బ్రాంది, సిగరెట్‌ పొగ, బయటి మాటలు… ఇలాంటి వాటికి దూరంగా ఉండేది వాతావరణం. అరచేయి వెడల్పు జరీ సేలం పంచె, సిల్కులాల్చీ (చొక్కా చేతులు రెండూ మడిచేవారు) నుదుటి నిండా చందనంతో చాలా పవిత్రంగా వచ్చేవారాయన. పుహళేంది, లిరిక్‌ రైటర్‌, డైరక్టర్‌, అప్పటికి అందుబాటులో ఉంటే నిర్మాత, తబలా వాయించే మైఖేల్‌ అక్కడ తప్పక ఉండేవాళ్లం. ఉదయం 10 గంటలకు మొదలుపెడితే మధ్యాహ్నం ఒంటిగంటదాకా, సాయంత్రం నాలుగు నుంచి ఏడుదాకా సాగేవి చర్చలు. రాత్రుళ్లు పనిచేయడమనే మాటకు తావే లేదు.’’
మహానుభావుడు
‘‘రచయితకు స్వతంత్రతనిచ్చి ముందు సందర్భానికి తగ్గట్టు పాట రాయమనేవారు. తెలుగు కాస్త అర్థమయ్యేది. అయినా నేను పక్కనుంచి ఓ సారి ఆ పాటకు అర్థం చెప్పేవాడిని. దానికి తగ్గట్టు ట్యూన్‌ కట్టేవారు. ‘పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్‌ని ఇచ్చినా మామ ట్యూన్‌ కట్టగలరు’ అని అందరూ గొప్పగా, ఒకింత ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. రచయిత రాసిన పాటకి ట్యూన్‌ చేయడమనే ప్రక్రియకు ఒకరంగా ఆద్యుడు ఆయనే. నాకన్నా వయసులో చాలా పెద్దవారు. అందుకే ట్యూను కట్టాక ఏదైనా అభ్యంతరం చెప్పాల్సి వస్తే ‘బాణీ ఏదోలా ఉంది. మీ స్టాంపు లేదు మామా’ అనేవాడిని. ‘ఏం దీనికేమైంద’ని అడిగేవారు కాదు. ‘ఫర్లేదు. రేపు మరలా కూర్చుని చేద్దాం’ అనే చెప్పేవారు. ఎదుటివారికి నచ్చకపోతే వారికి సర్దిచెప్పి ‘మమ’ అనిపించాలనే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. నిరంకుశత్వం అనే మాటకు అక్కడ తావు ఉండేది కాదు. ఎవరికీ ఈగో ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘వెన్‌ హి ఈజ్‌ ఆన్‌ జాబ్‌, హి ఈజ్‌ రియల్లీ ఆన్‌ జాబ్‌’. అంతటి మహానుభావుడు.’’
గురువాయూరప్ప..
‘‘ఎన్‌ అప్ప గురువాయూరప్ప అనడం ఆయనకి అలవాటు. ఆనందం వచ్చినా, ఆశ్చర్యం అనిపించినా అనేమాట అదొక్కటే. మేం కలిసి చేసిన సినిమాల్లో ‘శంకరాభరణం’ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. నా విజయాన్ని బాగా ఆస్వాదించేవారు. స్వతహాగా మలయాళీ అయినా ‘శంకరాభరణం’ మలయాళంలో విడుదలైనప్పుడు తెలుగు పాటలనే అక్కడా వినిపించారు. తెలుగు పాటల్లో ఉన్న సంస్కృతం వల్ల మలయాళీయులకు కూడా అర్థమవుతుందని ఆయన భావన. అందుకే కేవలం డైలాగులను మాత్రం అనువదించుకున్నారు. ఇటీవల తమిళంలో ఆ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదలైంది. బాణీలు పాతవే. అయితే తమిళ పదాలతో పాటలు రాసుకున్నారు.’’
ఆత్మీయంగా..
‘‘నేను, మామ కలిసి పనిచేసినప్పుడు ఎలాంటి భేషజాలకు తావుండేది కాదు. నేనేదో పెద్ద దర్శకుడినని, ఆయనేదో పెద్ద సంగీత దర్శకుడనే భావన కనిపించేది కాదు. ఇవాళ పెద్ద హిట్లుగా అనిపించే ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘స్వాతికిరణం’లాంటి పాటలను కూడా మేము కర్తవ్యనిర్వహణలో భాగంగా త్రికరణశుద్ధిగా చేశామంతే. అదేదో రికార్డులకోసం తపించి చేసిన పని కాదు. మా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి పాటా మాకు ఆత్మసంతృప్తి కలిగిన తర్వాతే సినిమాల్లోకి వచ్చిందనేది వాస్తవం.’’
వాళ్లు ఆశ్చర్యపోయేవారు
‘‘మహదేవన్‌గారి మరో ప్రత్యేకత ఏంటంటే రీ-రికార్డింగ్‌. ఏకసమయంలో ఒక రీలుకు రీ-రికార్డింగ్‌ చేసేవారు. ముందుగా ఏ బిట్‌ ఎన్ని సెకన్లుందో నోట్‌ చేసుకునేవారు. దేనికి ఏ వాయిద్యం అయితే బావుంటుందో నోట్‌ చేసుకునేవారు. ఒకటీరెండు సార్లు రిహార్సల్‌ చేసి నేపథ్యాన్ని అందించేసేవారంతే. అదే బాలీవుడ్‌లో అయితే ప్రతి బిట్‌కూ ప్రత్యేకంగా రీ-రికార్డింగ్‌ చేసేవారు. మామ రీ-రికార్డింగ్‌ చేసే విధానం చూసి బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి రీల్‌ను చూస్తే దర్శకుడి కన్నా గొప్పగా గుర్తుపెట్టుకోవడంలో ఆయన దిట్ట.’’
నాలుగు రోజులు
‘‘ఢిల్లీలో అవార్డు అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నేను, మహదేవన్‌గారు, ఆయన భార్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు, వాణిజయరాం కలిసే ఢిల్లీ వెళ్లాం. అప్పడు ఓ నాలుగు రోజులు ఆయనతో గడిపే అవకాశం వచ్చింది. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. ఆయన తెలుగువాడు కాదంటే నమ్మడం కష్టమే. ‘మూగమనసులు’లో పాటలు వింటుంటే అచ్చమైన తెలుగు వ్యక్తి స్వరాలు సమకూర్చినట్టు అనిపిస్తుంది. అంతటి ప్రతిభామూర్తి.’’
మహదేవన్‌గారిలాంటి వ్యక్తి ఒకసారి పరిచయమైతే ఆయన్ని వదులుకోవడం చాలా కష్టం. కె.వి.మహదేవన్‌, పుహళేంది కాంబినేషన్‌లో అద్భుతమైన సంగీతం వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చేతివేళ్ల మీద సరస్వతి పలికి తీరేదంతే. అంతటి పరిపూర్ణులు వాళ్లు. ‘స్వాతికిరణం’ సంగీత చర్చల్లోనే ఆయన్ని ఆఖరి సారి కలిశాను. ఆ తర్వాత ఆయన పోయారన్న చెడువార్త వినాల్సి వచ్చింది.’’
చల్లా భాగ్యలక్ష్మి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుమార్చని రాకకీయ యోద్ధ పాలడుగు -పి వి కి వీరాభిమాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ హవా తాగ్గిందా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐక్యతపై అనైక్యత -కమ్మీల తీరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సoఘo -3 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

Telugu maha0001 0002 0003 0004 0005

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

Letter to interested Teachers

mdevineni@icloud.com17-1-14
0001
0002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భజన చేసే విధము తెలియండీ…

భజన చేసే విధము తెలియండీ…

  • – భాస్కర్. యు.
  • 19/01/2015
TAGS:

ఇటీవలికాలంలో- జంటనగరాల్లో జరుగుతున్న పుస్తకావిష్కరణల జాతర చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. రోజురోజుకు వీటి జోరు పెరుగుతోంది. ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరుకొంటోంది. కవుల దగ్గర ఇంత డబ్బుందా? అనే ఆలోచన కలవరపెడుతోంది.
ఇవాళ పుస్తక ముద్రణతోపాటు ఆవిష్కరణ సభ, ఆ తర్వాత జరిగే సభానంతర కార్యక్రమం ఖర్చు దాదాపు యాభై వేల రూపాయలకు చేరిపోయిందనడం సత్యదూరం కాదు. కవిగాని, రచయితగాని ఈ మాత్రం ఖర్చును భరించడం సామాన్యంగానే మారింది. నగరంలోని అధిక శాతం రచయితలు బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారే కావటాన వారికిది లెక్కకాదు.
ఆవిష్కరణ సభ జరిగి పుస్తకం బయటికొస్తుంది. ఇక అది మహాగ్రంథంగా, రచయిత మహాకవిగా గుర్తింపు పొందాలి. నిస్సందేహంగా ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. సమీక్షకులు అస్మదీయులే కదా! ఇదంతా సజావుగా జరిపించడానికి, జరగడానికి సాయంత్రాలున్నాయి. కూర్చోవడాలు, లేవడాలున్నాయి. అనుకూలమైన అడ్డాలున్నాయి.
రకరకాల కవిత్వాలు. అనేక గ్రూపులుగా సాహితీమిత్రులు. సంప్రదాయ అభ్యుదయ, విప్లవ, మైనారిటీ, స్ర్తివాద, దళితవాద ధోరణులు. వీటికితోడు స్థిరపడిన ‘రెక్కలు’ ‘నానీ’ ప్రక్రియలు. అంతరంగాల్లో ఎవరూ ఎవరినీ ఖాతరుచేయరు. ఎవరికివారే గొప్ప. వీరంతా గొప్ప నటులు కూడా. అందరూ అన్ని సభలకు హాజరవుతారు. రచయితను వాటేసుకుంటారు. శుభాకాంక్షలు తెలియజేస్తారు. సుహృద్భావం ప్రకటిస్తారు. ఎలాగో వక్తల రెండు గంటలపాటు ఊకదంపుడు ఉపన్యాసాలను భరిస్తారు. సభానంతర కార్యక్రమం ముగిశాక మళ్లీ ఆ కవిని గాని, అతని పుస్తకాన్ని గాని తలచుకుంటే ఒట్టు. ఇది వారికి తెలిసిన మర్యాద.
ఇక వక్తల గురించి- అన్ని సభలనూ వీరే అలంకరిస్తుంటారు. వీరు వివిధ రంగాలవారై ఉంటారు. నిజానికి వీరికీ, మాట్లాడవలసిన అంశానికి సంబంధమే వుండదు. ఎవరికి తెలిసింది వారు వాగేస్తారు. తాత బోడినెత్తికీ, నానమ్మ మోకాలి చిప్పకూ ముడివేస్తుంటారు. కవిగారిని ఏ మేరకు మునగ చెట్టెక్కించాలో అంతవరకూ ఎక్కిస్తారు. మహాకవి లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయంటారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వేదికను ఎక్కుతూనే వుంటారు. కానీ మర్నాడు నిన్నటి కవినిగాని, అతని కవిత్వాన్నిగాని మాటమాత్రంగానైనా ఎక్కడా ప్రస్తావించరు. అది వారి హోదాకు చిన్నతనం అనుకుంటారు.
ఇక సమీక్షకుల వంతు వస్తుంది. వ్యాసకర్తలు నడుము బిగిస్తారు. వీళ్లు పుస్తకాన్ని చేలోపడ్డ ఆబోతు అక్కడక్కడా గడ్డిపరకలను కొరికినట్టు కొన్ని పేజీలు తిప్పుతారు. అలాగే ముందుమాటల్లోని కొన్ని వాక్యాలను, వెనుక మాటల్లోని మరికొన్ని వాక్యాలను తెలివిగా వాడుకుంటూ అక్కడక్కడ ప్రాచీన కవుల ప్రస్తావనలు, లేక ఆధునిక కవుల కొటేషన్స్‌ని ఉటంకిస్తుంటారు. నిజానికి తాము ఏమి చెప్పదలచుకున్నారో, వారికి ఏమి అర్థమైందోగానీ చెప్పరు. ముక్కును చూపడానికి చేతితో తలను చుట్టి హైరానా పడతారు. ఏదీ సూటిగా ఉండదు. మరికొందరైతే తాము ఫలానా పత్రికలో రాసిన సమీక్షవల్లే ఫలానా కవికి అవార్డు వరించిందని గొప్పలు చెప్పుకుంటూ వుంటారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూలు. ఇటీవలి కాలంలో ఇంటర్‌వ్యూల జోరు బాగా పెరిగింది. వ్యక్తి ఎవరు? ఏ కోణంలో ప్రసిద్ధుడు అనేది ముఖ్యం కాదు. ఇంటర్వ్యూలు జరుపుతుంటారు. సొల్లు రాతలతో పేజీలు నింపిపడేస్తారు. పత్రిక కొన్న పాపానికి పాఠకులు దాన్ని ఒక శాపంగా భరిస్తుంటారు. అంతటితో ఇది ఆగదు. ఇలాంటి ఇంటర్వ్యూలనీ కలిపి ఒక పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ఇంటర్వ్యూలు చేసేవారికి ఇదొక ఆటవిడుపు. పబ్బం గడిచిపోతూ వుంటుంది.
ఫైనల్‌గా పీఠికాధిపతుల గురించి- వీరిది చాలా పెద్ద లెక్క. ఒకవైపు కవిని పిండేస్తూ మరోవైపు తమ పాపులారిటీని పెంచుకుంటారు. ఒకే ఒక్క పుస్తకంతో దేశానే్నలేయాలని భావించే అమాయకులను వీరు చేరదీస్తుంటారు. విషయానికి అందని పీఠికలు రాస్తారు. పుస్తకాలు బయటికి వస్తాయి. కవుల స్వస్థలాల్లో ఆవిష్కరణోత్సవాలు. పీఠికాధిపతికి ప్రముఖ స్థానం. ఆయన రాజధాని నుండి రావాలి. రాను పోను ప్రయాణ ఖర్చులు. హోటల్ ఖర్చులు. ఇవన్నీ కవి భరిస్తాడు లేదా అతని మిత్ర బృందం భరిస్తుంది. సభలో కవిగారి కవిత్వం సంగతేమోగాని పీఠాధిపతిని మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు. రాత్రికి తీర్థప్రసాదాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది.
ఇక అవార్డులు- ఇదంతా ఓ మాయ. సెలక్షన్ కట్టుదిట్టంగా జరుగుతుందన్న భ్రమ కలిగిస్తారు. చివరకు ఏ ఆశ్రీతుడికో కట్టబెడతారు. ఏ మాత్రం నిజాయితీ లేని ఏడుపు. మళ్లీ అవార్డు ప్రదానోత్సవ సభ. మళ్లీ హడావుడి, హంగామా. పూర్వకవులకు, ఇవాల్టి కవులకు ఉన్న తేడా ఏమిటంటే, పూర్వకవులు ఎంత వెంపర్లాడినా పాపులారిటీ దొరికేది కాదు. వారిని వారి కవిత్వమే నిలబెట్టాలి. ఇవాళ కవులను త్రిశంకుస్వర్గంలో నిలపడానికి అనేక మార్గాలేర్పడ్డాయి. సాహిత్యం, సాహిత్య సభలు, సాయంత్రాలు కాలక్షేపం చేయడానికి వేదికలయ్యాయి.
సామర్థ్యం లేని కవి పొగను పోగేస్తాడు. ఆ పొగను బొమ్మగా విగ్రహంగా, చివరకు స్వర్ణశిల్పంగా భ్రమింపజేయడానికి అనేకమంది మాయగాళ్లున్నారు. కాని చివరకు అది పొగలాగే జారిపోతుంది. కవీ వుండడు, వాడిచుట్టూ చేరిన భజన బృందం మిగలదు. నిజమైన సాహిత్య ప్రేమికులకు మాత్రం చేదు అనుభవాలు కలుగుతాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లంకలో తెలుగు వాళ్ళు

1lanka 001 2lanka 001 3lanka 001 4lanka 001 5lanka 001 6lanka 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం

ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం

  • -కె.బి.గోపాలం
  • 17/01/2015
TAGS:

సౌందర్య లహరి
(శంకర భగవత్పాదుల
రచనకు ఆంగ్లంలో
అనువాదం, వ్యాఖ్యానం)
డా.లంక శివరామప్రసాద్,
పేజీలు: 140,
వెల: రూ.250/-
ప్రతులు అన్ని పుస్తకాల అంగళ్లలో

ఆదిశంకరుల రచనలు, వ్యాఖ్యానాలు, భక్తులకు, అనురక్తులకు మార్గదర్శకాలు. ఒక్క సౌందర్య లహరికే సంస్కృతంలోనే 35కు పైబడి విస్తృత వ్యాఖ్యానాలున్నాయి. కొన్ని రచనలను గురించి ఎంత చర్చించినా కొత్త అర్థాలు పుడుతూనే ఉంటాయి.
శంకరులు వారణాసిలో ఉండగా, సకాయముగ కైలాసానికి, శివసేవార్థము వెళ్లిరట. అక్కడ గోడ మీద ఈ రచన ఉందట. శంకరులు 41 శ్లోకాలు చదివేలోగా గణపతి మిగతావాటిని తుడిపివేసినాడట. ఇది మానవ మాత్రులకు అందగూడని రచనయని భావమట. కథ సంగతి ఎట్లున్నా సౌందర్య లహరిలో 100 శ్లోకాలున్నాయి. 41 శ్లోకాలు, గహనమయిన మంత్ర, యంత్ర విషయాలను చెపుతాయి. కడమలి అమ్మవారి సౌందర్యమును రకరకాలుగ వర్ణించి చెప్పినవి. అన్నింటిలోనూ ఆదిశంకరుల శైలి కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ప్రాచీన పండితులు కూడ ఇదే మాట అన్నట్లు తెలియవస్తుంది.
సౌందర్య లహరి శ్లోకాలను అంత సులభంగా అర్థంచేసుకోవడం కుదరదేమో! ఇందులోని 17వ శ్లోకాన్ని పారాయణం చేస్తే, జ్ఞానం కలుగుతుందట. 33వ శ్లోకంతో లక్ష్మి అనుగ్రహిస్తుందట. ఫలితాల సంగతి పక్కనబెట్టి కేవలం రచన, అలంకారం, పదగుంఫనం లాంటి లక్షణాలను ఆస్వాదించేందుకు కూడ ఈ రచనను చదవవచ్చును. శంకరుల సంస్కృతము సాటి లేనిది!
వృత్తిపరంగా అనుభవ వైద్యులు శివరామప్రసాద్‌గారు, సౌందర్యలహరీ శ్లోకాలకు ప్రతిపదార్థము, అనువాదములతోబాటు కొంతపాటి వ్యాఖ్యానాన్ని కూడా జతచేసి, ఇంగ్లీషులో అందించారు. నాగరి లిపిలో శ్లోకం, తరువాత తెలుగు అక్షరాలలో అదే శ్లోకం, ఇంగ్లీషు అక్షరాలలో శ్లోకం, ఆ తరువాత ఇంగ్లీషు కవితా రూపం, ప్రతిపదార్థాలు ఇచ్చారు. బాగుంది. అక్కడే శ్లోకం యొక్క భావార్థాన్నికూడా నాలుగు పంక్తులలో యిచ్చిఉంటే మరింత బాగుండేది. పేజీకి ఒకటిగా శ్లోకాలను ఏర్పాటుచేశారు. ఇచ్చిన వ్యాఖ్యానం అదనపు సంగతులను చెప్పింది.
పుస్తకం ముందు, వెనుక మరెన్నో ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. అక్కడే పాఠకులకు సంస్కృతంతో పరిచయం చేయించే ప్రయత్నం చేశారు. నవరత్నాలను గురించి, ఆదిశంకరుల గురించి, మరెన్నో అంశాల గురించి ఇచ్చిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
కవర్ పేజీల మీద/ లోపల ప్రఖ్యాత కార్టూనిస్ట్ జయదేవ్‌గారి రేఖాచిత్రాలు ఈ బుక్‌లోని స్పెషల్ అట్రాక్షన్స్. జయదేవ్‌గారు ఇటువంటి చిత్రాలు యింతకుముందు ఎక్కడా వేసినట్టులేదు. ఇది ఇంగ్లీషు పుస్తకం! గుర్తుంచుకోవాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

  • -ముదిగొండ శివప్రసాద్
  • 17/01/2015
TAGS:

తెలంగాణ చరిత్ర
జి.వెంకటరామారావు
వెల:రూ.300/-
ప్రతులకు: అన్ని ప్రధాన
పుస్తక విక్రయ కేంద్రాలు.

తెలంగాణలో ప్రతి రాయికి, ప్రతి రప్పకూ చరిత్ర ఉంది. ప్రతి చెట్టుకూ, ప్రతి గట్టుకూ చరిత్ర ఉంది. ఎందరో మరుగున పడిన మాణిక్యాలున్నారు. వారిని వెలికితీసే పరిశోధకుల సంఖ్య అగణితంగా ఉండాలి. జి.వెంకటరామారావుగారి పేరు చెప్పగానే నిరాడంబరుడు, కర్తవ్యశీలి అయిన ఒక పండిత రచయిత, విమర్శకుడు మన కన్నులముందు సాక్షాత్కరిస్తారు. పరిశీలనాత్మక వ్యాసాలను పత్రికలకు అందించడంలో జివిఆర్ దిట్ట. ఇటీవల 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్ఫూర్తితో చరిత్రకందని కాలంనుండి నేటివరకూ తెలంగాణ చరిత్రను సాధికారికంగా అందించేందుకు ఒక బృహత్ ప్రయత్నం చేశారు. తెలంగాణ అనే పదం త్రిలింగ శబ్ద్భావం. త్రిలింగనుండి తెలుగు, తెలింగాణా, తెలంగాణా పదములు పుట్టాయి. శాతవాహనుల మూడు రాజధానులలో ఒకటి ప్రతిష్ఠానపురం. నేడు పఠాన్ పేరుతో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఓ మోస్తరు పట్టణం. ఇదికాక ధాన్యకటకం, శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) వారి మరి రెండు రాజధానులు కాణ్వాయన సుశర్మను ఓడించి శ్రీముఖ శాతవాహనుడు (సిముఖ) క్రీ.శ.187లో శాతవాహన రాజ్యం ప్రారంభించటంతో తెలంగాణా – ఆంధ్ర ప్రాంతాల చరిత్ర మొదలవుతుంది. వీరు క్షత్రియ వృత్తిని స్వీకరించిన బ్రాహ్మణులు. దాదాపు 300 సంవత్సరాలు పాలించిన తొలి తెలుగు రాజులు. ఆ తరువాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, చోళులు, చాళుక్యులు, ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో పాలించారు. గరుడచేత, బొట్టుచేత రాజులతో కాకతీయ వంశం ప్రారంభమైంది. వీరి పాలన క్రీ.శ.1000 నుండి 1323 వరకూ సాగింది. తెలంగాణ చరిత్రలో ఇదొక స్వర్ణయుగం. అందరూ అనుకుంటున్నట్లు కాకతీయ రాజ్యం కాంచీపురం వరకే పరిమితం కాలేదు. అది రామేశ్వరం వరకూ వ్యాపించింది. 1310 నుండి వరుసగా ఖల్జీ తుగ్లక్ రాజవంశాలు ఢిల్లీనుండి చేసిన దాడులతో తెలంగాణా బలహీనమైపోయింది. ఆ తరువాత కాపయనాయకుడు, ప్రోలయ నాయకుడు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనప్పటికీ ఎక్కువకాలం వారి రాజ్యం నిలువలేదు. బహమనీ సుల్తానులు, మొగలులు, అసఫ్ జాహీలువంటి ఎన్నో రాజవంశాలు తెలంగాణాను పాలించాయి. అంటే, 1948 సెప్టెంబర్ వరకూ తెలంగాణ తురుష్క పాలనలోనే ఉంది. 1947 ఆగస్టు 15 మొత్తం దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణా ప్రాంతంలో మాత్రం జాతీయ పతాకం ఎగురలేదు. 1952లో బూర్గుల రామకృష్ణారావుగారి నేతృత్వంలో స్వతంత్ర తెలంగాణ మంత్రివర్గం ఏర్పడింది. 1956లో ఆంధ్ర తెలంగాణలు ఆంధ్రప్రదేశ్ అనే భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఈ పొత్తు ఎక్కువ దశాబ్దాలు నిలువలేదు. 2014 జూన్‌లో మళ్లీ సీమాంధ్రనుండి తెలంగాణ విడివడిపోయింది. ఇందుకుగల నేపథ్యం ఉద్యమ కారణాలు, పరిణామాలు అన్నీ రామారావుగారు ఈ గ్రంథంలో విశే్లషించారు. రచయిత ప్రధానంగా పత్రికా పాఠకుల నాడి తెలిసినవాడు కావటంతో గహనమైన చారిత్రక విషయాలను సరళమైన భాషలో సామాన్యులకు అందించటానికి కృషిచేశారు.
ఈ గ్రంథంలో మొదటి 60 పుటలలోనే దాదాపు 16వ శతాబ్దంవరకుగల చరిత్రను ముగించారు. ఈ కారణంచేత ఈ భాగంలో ఇంకా చాలా అంశాలు చేర్చే అవకాశం లేకుండాపోయింది. తరువాతి భాగాన్ని విస్తరించారు. ఉదాహరణకు కాకతీయ చరిత్ర 15 పుటల్లో ముగించారు. పద్మనాయకుల చరిత్రకు ఐదు పుటలే కేటాయించారు. హళిబీడుద్వార సముద్ర ప్రాంతం. ఇక్కడి శిల్పానికి పాలంపేట రామప్ప శిల్పానికి సాన్నిహిత్యం ఉంది. రామప్ప హొయసాల రాజ్యంనుండి వచ్చాడా? ‘అప్ప’ శబ్దం రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లోనే వాడతారు. పాలంపేట చెరువువద్ద పెద్ద శిల్ప కళాక్షేత్రం ఉండేది. రామప్ప త్రికూట నిర్మాణం కందుకూరు రాజుల సోమేశ్వర త్రికూట నిర్మాణం వంటి వివరాలు కాకతీయుల అధ్యాయంలో విస్తరించటం అవసరం.
30వ పుటలో ఘీయాజుద్దీన్ ఉలుఫ్ దండయాత్రల సుదీర్ఘ చరిత్రను పది పంక్తులలో సంగ్రహీకరించారు. కోహినూరు వజ్రాన్ని కాకతమ్మ జ్ఞాననేత్రంగా అలంకరించేవారు. దానిని ప్రతాపరుద్రుడు మాలిక్ నరుూబ్ కాఫర్‌కు ధారాదత్తం చేశాడు. ఈ వివరాలన్నీ పాఠకులకు అవసరం. అంటే ఈ అధ్యాయం పది పంక్తులనుండి పాతిక పుటలు విస్తరించి ఉండవలసింది. కాకతీయుల పతనానికి అనేక కారణాలున్నాయి. రామారావు పేర్కొన్నట్లు హిందువుల అనైకమత్యం ఒక ప్రధాన కారణం. పద్మానాయకులు, రెడ్డిరాజులు పరస్పరం కలహించుకున్నారు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయింది. ఈ గ్రంథంలో పదవ అధ్యాయం నిజాం రాజుల పాలననుండి ఎక్కువ వివరాలు ఉన్నాయి.
సర్దార్‌పటేల్ పోలీసు చర్యకు దారితీసిన పరిస్థితులేమిటో ఈ తరం ప్రజలకు తెలియవు. వాటిని ఈ గ్రంథంలో చూడవచ్చు. ‘‘హైదరాబాద్ భారతదేశం నడిబొడ్డున ఉంది. హైదరాబాద్ పోతే మొత్తం భారతదేశం పోయినట్లేనని అప్పటి బొంబాయి ప్రావిన్స్ గవర్నర్స్ హైదరాబాద్ రెసిడెంట్‌ను హెచ్చరించాడు’’ (191వ పుట).
‘‘అప్పటివరకూ నిజాం దుశ్చర్యలను ప్రతిఘటించటానికి స్టేట్ కాంగ్రెస్‌లో కలిసి పనిచేసిన కమ్యూనిస్టులకు నెహ్రూ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా కనిపించింది’’ (అదేపుట).
పోలీసు చర్య తరువాత పటేల్ కమ్యూనిస్టులపై గాలింపు ముమ్మరం చేశారు. ‘‘పగలంతా మిలటరీవారు రాత్రిళ్ళు కమ్యూనిస్టులు గ్రామాలలో బీభత్సం సృష్టించారు’’ (191వ పుట).
ఇదంతా భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం జరిగిన పోరాటమేనా? రష్యాకు మార్షల్ స్టాలిన్ డాంగే, అజయ్‌ఘోష్, రాజేశ్వరరావు, బసవపున్నయ్యలను పిలిచి తెలంగాణ పటం ముందుపెట్టుకుని సుదీర్ఘ చర్చలుచేశారు (అదే పుట).
స్వామి రామానంద తీర్థ ఉద్యమం, వినోబాభావే భూదాన ఉద్యమం, జె.పి ఉద్యమం, అణచివేతలు, ఆంధ్ర మహాసభ స్థాపన, రాజరాజనరేంద్ర కృష్ణదేవరాయ గ్రంథాలయాల ఆవిర్భావం- అవి భాషాపరంగా సాధించిన వివరాలు, అణచివేతలు ఈ గ్రంథంలో రామారావుగారు సప్రమాణంగా, సరళభాషలో వివరించారు. 2014 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అవతరణతో గ్రంథం పరిసమాప్తమైంది. ఇది మంచి ప్రయత్నమే అయినా గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసి ప్రథమ భాగం మరింత పెంచవలసిన అవసరం ఉంది. శాతవాహనులనుండి కాకతీయులవరకు గల తెలంగాణ చరిత్ర, కోటిలింగాల వివరాలు పాఠకులకు అందించాలి. బృహత్క్థ రాసిన గుణాఢ్యుడు, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీమాత తెలంగాణావారే. ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యుల వివరాలు ఈ పరివర్థిత గ్రంథంలో ఇవ్వవచ్చు. ఇలాంటి పుస్తకాలు రాయడానికి చిత్తశుద్ధి, ఓపిక, పట్టుదల, వివేకం తప్పనిసరిగా కావాలి. అవి జి.వెంకటరావుగారిలో సమృద్ధిగా ఉన్నాయి. తెలంగాణ 400 సంవత్సరాలు ముస్లిం పాలనలో మగ్గినప్పటికీ అక్కడక్కడా ఎడారిలో ఒయాసిస్సులవలె దోమకొండ, వనపర్తి, గద్వాల వంటి సంస్థానాలు చేసిన సాహిత్య సేవ తక్కువేమీ కాదు. ఆ వివరాలు ఈ తరంవారికి తెలియజెప్పడం అవసరం.



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎమెస్కో సంపాదకుడితో ఇంటర్వ్యు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందమైన పాండవ ‘వనవాసం’

pandava 1 001 pandava2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

‘’దర్శనేయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ విశేషాలు

10-1-15 శనివారం

సరసభారతి ప్రచురించిన 14వ పుస్తకం ,నేను రాసిన తొమ్మిదవ పుస్తకం  నెట్ లో రాసిన ఆరవ పుస్తకం ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ఆవిష్కరణ సభ సరసభారతి 74 వ సమావేశం గా 11-1-15 ఆదివారం సాయంత్రం అయిదుగంటలకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో ఘనం గా జరిగింది .ఒక రకం గా ఈ కార్యక్రమం రెండు రోజులు జరిగినట్లు లెక్క

దర్సనియ దైవ క్షేత్రాలు పుస్తక ఆవిష్కరణ సభ

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవం .

జనవరి 10 వ తేదీ శనివారం సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం ,సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారల ఆరాధనోత్సవం కూడా .అందుకని పదవ తేదీ ఉదయం ధనుర్మాస ప్రత్యెక పూజలో శ్రీ త్యాగ రాజ స్వామి వారల చిత్రపటానికి పూల మాల వేసి ‘’నేను రాసినఅస్తోత్తరం’’ తో పూజ చేశాం . శనివారం సాయంత్రం  శ్రీ మైనేని వారి పుట్టిన రోజు పండుగను శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఘనం గా జరిపాం .శ్రీ మైనేని దంపతుల పేరిటస్వామి వారలకు ప్రత్త్యేక పూజ చేయించి ,ప్రత్యేకం గారెండుకిలోల పిండితో  అరిసెలు ప్రసాదం గా చేయించి ,వాటితోస్వామివారలకు  పూజ కూడా చేసి వచ్చిన భక్తులకు  ప్రసాదం గా అందజేశాం .శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకుమిగిలినవి ఆదివారం తెనాలి నుండి వచ్చే శ్రీ కోగంటి సుబ్బారావు గారి కుటుంబానికి బందుగణానికి ,మిత్ర బృందానికి అంద జేయాలని భావించాం .పిల్లలు మైనేని వారికి ‘’హేపీ బర్త్ డే ‘పాటపాడగా చప్పట్లతో ఇక్కడినుండే అమెరికా వినిపించేట్లు శుభా కాంక్షలు తెలియ జేశాం .మైనేని వారు కోరిన ప్రకారం శ్రీ సువర్చలాదేవికి ,శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి ,శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టు కు  పట్టు చీర జాకెట్ ,పట్టుపంచలు కొని గోపాల కృష్ణ  దంపతులు అందజేసినట్లు గా స్వాములకు అంద జేశాం . పూజారి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ కు, శ్రీ బలరాం గారికి మైనేని వారు కొనిపించిన పట్టు బట్టలు కట్ట బెట్టి శాలువాలు కప్పాం.స్వామి వారల పాదాల చెంత ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’ఒక పుస్తకం ఉంచి ,పూజారి గారితో స్వామి సన్నిధిలో ఆవిష్కరింప జేశాం .అంటే మొదటి నుంచీ మైనేని వారి పుట్టిన రోజున పుస్తకావిష్కరణ జరగాలన్న కోరిక ఈ విధం గా నేర వేరింది .శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవ సందర్భం గా ‘’పంచ రత్న కీర్తనలు ‘’కాసేట్ పెట్టి వినిపించాం .ఉదయం స్వామి వారి సన్నిధిలో సంగీత గురువు శ్రీమతి సూరి రాజ్య లక్ష్మి గారు ఒక గంట సేపు త్యాగ రాజ కీర్తనలు గానం చేసి ఆ సంగీత పెన్నిదికి ఘన నివాళులు అర్పించారు .అనుకోకుండా ఈ రోజు కార్యక్రమం వైభవం గా ,సంతృప్తికరం గా జరిగింది .

11-1-15- ఆదివారం

ఈ రోజు కార్యక్రమాన్ని అమెరికాలో ఉన్న మైనేని గోపాల కృష్ణ గారి కుటుంబం ,చూడటానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశాం .ఉయ్యూరులో ఒక సాహిత్య కార్యక్రమం ఇలా ‘’లైవ్ ‘’లో తిలకించటం ఇదే మొదలు. ఆ కీర్తి సరస భారతికి దక్కింది .కళ్యాణ మండపం చాల సువిశాలం గా అన్ని హంగులతో కన్నుల పండువుగా ఉంది. వేదిక పై కార్యక్రమం చాలా రక్తి కట్టింది .దూరం గా ఉన్న వారందరూ చూసి చాలా అభినందించారు .కళ్యాణ మండపం అద్దె పదివేల రూపాయలకు పైనేఉంటుంది . కాని మా రమణ మిత్రుడు శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులు చొరవతో ఉచితం గా రూపాయి ఖర్చు లేకుండా లభించింది .దీనికి  ఆంజ నేయుల్ని అభినందించాలి .కార్యక్రమ ఏర్పాట్లు అన్నీ దగ్గర ఉండి పర్య వేక్షిస్తూ ఆతను చేసిన సేవ మరువ రానిది .

సంగీత కచేరి

ఈ రోజు కూడా శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం నిర్వహించాం .సాయంత్రం అయిదుగంటలకు విజయ వాడకు చెందిన రేడియో ఆర్టిస్ట్ శ్రీ పి. ఇంద్ర కీలాద్రి శర్మగారు తన బృందం తో కచేరీ చేశారు .వయోలిన్ పై కుమారి వి లక్ష్మి ,మృదంగం పై ఛి ఆదిత్య ఆయనకు సహకరించారు .సుమారు నలభై అయిదు నిమిషాలపాటు కచేరీ వివిధ గీతాల తో జరిగింది .కచేరీ బృందానికి శ్రీ గోపాల కృష్ణ గారు మాతో కొనిపించిన నూత్న వస్త్రాలు ,అందజేసి శాలువాలు కప్పి పుష్పమాలలతో సత్కరించి సరసభారతి ముద్రించిన పుస్తకాల సెట్ ను అందరికి అందించి ప్రత్యేకం గా ఈ కార్య క్రమం కోసం తయారు చేయించిన  సంక్రాంతి ,తెనాలి రామాలయం లతో కూడిన ముచ్చటైన జ్ఞాపికలను అంద జేశాం .బృందానికి మైనేని వారు ఏర్పాటు చేసిన 2,౦౦౦ రూపాయల పారితోషికాన్ని సరసభారతి తరఫున అంద జేసి వారందరికీ గొప్ప సంతృప్తిని కల్గించాం .

శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలో శ్రీ కోగంటి బంధుగణం

క్షేత్రాలు అంకితం పొందే ఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్ధులు శ్రీ కోగంటి సుబ్బారావు గారు ,కుమారులు కోడళ్ళు కుమార్తె అల్లుడు మనుమలు ,మనుమరాళ్ళు మిత్ర బృందం తో కార్లలోతెనాలి నుండి బయల్దేరి  సాయంత్రం అయిదింటికి ఉయ్యూరు కు చేరి, సభలో పాల్గొన్నారు .వారిని ముందుగా దగ్గరలోనే ఉన్న మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయానికి తీసుకొని వెళ్లి అష్టోత్తర పూజను  వారి గోత్రనామాలతో  పూజారి గారితో చేయించి  పులిహోర ప్రసాధం గా చేయించాం .హారతి ఇప్పించి ,మంత్రం పుష్పం యదా విధిగా చెప్పించి ,తీర్ధ ప్రసాదాలను ఇప్పించాం .వారిని అడగ కుండా గోత్రనామాలు పూజారిగారు చెప్పటం వారికి అమితాశ్చర్యం వేసినట్లు కనిపించింది .ముందుగానే నేను గోపాల కృష్ణ గారి నుండి కోగంటి వారి గోత్రం భాస్కరేంద్ర గారి గోత్రం అడిగి తెప్పించి పేర్లు ,పూజారికి రాసి ఇచ్చి ఉదయం సహస్రనామ పూజ సాయంత్రం అస్తోత్తరం చేయించాను .సుబ్బారావు గారికి,  వారికుమారులు శ్రీ శివ ప్రసాద్ గారికి  అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు గారికిమొదలైన వారికి పూజారి గారితో స్వామి వారి శేష వస్త్రాలు కప్పించాను .ఆడవారికి అమ్మవారి జాకెట్ ముక్కలను అంద జేశాం .వారెవరూ ఇలా జరుగుతుందని ఊహించలేదు .అందరి ముఖాల్లో ఏంతో  వెలుగు, ఆనందం సంతృప్తి జ్యోతకం అయింది .సుబ్బారావు గారు పరవశించి పోయినట్లు కనిపించింది .సుబ్బారావు గారిని చూడటం ఇదే మొదటి సారి .గోపాల  కృష్ణ  గారికి వారిపై అంత అభిమానం ,ఆరాధనా ఎందుకు ఉన్నదో చూడగానే అర్ధమైంది .ఆ ముఖం లో గొప్ప ప్రశాంతత ,కళ్ళల్లో పెద్ద వెలుగు ,ఆ పంచె కట్టు దానిపై చక్కని షర్టు మహా హుందాగా ఉన్నారు .ఇలాంటి ఉన్నత మూర్తికి ఈ గ్రంధం అంకితమిచ్చి నేనూ సరసభారతి ధన్యమౌతోందని అనిపించింది. మైనేని గారి కోరిక ఈ విధం గా తీరుతున్నందుకు మహదానందం గా ఉంది .ఆ పర్సనాలిటీ కళ్ళల్లో ,మనస్సులో నిండిపోయింది .గొప్ప వ్యక్తీ ని చూశాననే ఆనందం తో మనసు పరవళ్ళు తొక్కింది .దేవాలయం అంతా కోగంటి వారి బంధుగణం తో అభిమానులతో కిక్కిరిసి పోయింది .స్వామి సేవలో అందరూ ధన్యులయ్యారు .

ఆవిష్కరణ సభ

దేవాలయం నుంచి అందరం వచ్చి కళ్యాణ మదిరం చేరాం .అప్పటికే ముఖ్య అతిధి నది సంపాదకులు ఈ నాటి పుస్తకావిష్కరణ కర్త శ్రీ జలదంకి ప్రభాకర్ గారు ,ఆత్మీయ అతిధి శ్రీ చలపాక ప్రకాష్ గారు వచ్చి కూర్చున్నారు .దాదాపు నూట పాతిక మంది తో మందిరం కళకళ లాడింది .మైనేనిగారి బావగారు శ్రీ అన్నే హనుమంతరాగారు చెల్లెలు శ్రీమతి  హేమలత గారు వచ్చారు . గౌరవ అతిధిగా రావాల్సిన ‘’అఖిల భారత వాసవీ ట్రస్ట్ –పెనుగొండ –ఉపాధ్యక్షులు శ్రీ బొండాడ రామ మోహన రావు గారు క్రితం రోజు అనుకోకుండా కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినందున రాలేక పోయారు .ఒకటవ తేదీకూడా వారి తో మాట్లాడాను .వస్తానని ఖచ్చితం గా చెప్పారు .సభకు హాజరైన వారందరికి స్వీటు హాటు ఉన్న పాకెట్ అందించారు. టీ ఏర్పాటు చేశాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ రెండో సారి తేనీరు అందజేశాం

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి అతిధులను పేరు పేరునా వేదికపైకి ఆహ్వానించింది .అందరికి కమలా ఫల ద్వయం తో సరసభారతి సభ్యులు ,మా మనవాళ్ళు మనవ రాళ్ళు కోడళ్ళు స్వాగతం పలికారు . నేను శ్రీ కోగంటి సుబ్బారావు గారిని పరిచయం చేసి వేదికమీడకు ఆహ్వానించాను శ్రీ జలదంకి ప్రభాకర్ గారిని  ఛి బాలాజీ  ,చలపాక ప్రకాష్ గారిని శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అన్నే హనుమంతరావుదంపతులను   మా పెద్దకోడలు శ్రీమతి సమత ,శ్రీ రామి నేని భాస్కరేంద్ర రాగారిని శ్రీ శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులనుమా మనుమరాలు ఛి రమ్య చక్కగా స్పష్టమైన ఉచ్చారణ తో స్క్రిప్ట్ చదివి పరిచయం చేసి అందరి ప్రశంసలు పొందారు.అందరికి  జంట కమలాలతో స్వాగతం చెప్పారు .

సభాధ్యక్షునిగా నేను ప్రసంగిస్తూ సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు తెనాలి వారిని ఉయ్యూరు వారిని ఈ విధం గా ఇక్కడ కలిపారని ఈ కార్యక్రమం ఖర్చు ,పుస్తక ముద్రణ ఖర్చు ఈ బందుగణానికి యధోచిత నూత్న వస్త్రాల సమర్పణ అంతా ఆయనదే నని ఇందులో ఏ మంచి పని అయినా, ఘనత అయినా మైనేని వారికే చెందుతుందని ఏ చిన్న లోపం ఉన్నా అది నాకు మాత్రమే చెందుతుందని అన్నాను .ఇప్పటికి నాలుగు పుస్తకాలు స్పాన్సర్ చేసి సరసభారతికి కొండంత అండగా గోపాల కృష్ణ గారున్నారని ,వారికి ఉయ్యూరు మీద ఉన్న అభిమానం మరువరానిదని. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు విరాళాలు అందజేసి తోడ్పడ్డారని చెప్పాను  నాలుగు సార్లు పుస్తకాన్ని అంకితం తీసుకోమని గోపాల కృష్ణ గారిని అడిగినా సున్నితం గా తిరస్కరించి ఒకటి ‘’సిద్ధ యోగిపున్గవులు ‘’వారి తల్లిగారు శ్రీమైనేని సౌభాగ్యమ్మ గారికి ,రెండవది ‘’మహిళా మాణిక్యాలు ‘’తమ ధర్మ పత్ని శ్రీమతి సత్య వతి గారికి మూడవది ‘’పూర్వాంగ్ల. కవుల ముచ్చట్లు ‘’తమ బావ గారు డాక్టర్ శ్రీ రాచ కొండ నరసింహ శర్మ,ఏం డి . గారికి నాలుగవది అయిన ‘’దర్శ నీయ దైవ క్షేత్రాలు ‘’తనకు మార్గ దర్శి అత్యంత ఆప్తులు  గొప్ప మిత్రులు ,తన జీవితాన్ని తీర్చి దిద్దిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –‘’శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితమివ్వమని చెప్పి ఇప్పించిన విశాల హృదయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అని చెప్పాను .ఇటీవలే అంతర్జాలం లో 145 మంది సంస్కృత కవులపై రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను మైనేని వారికీ చెప్పకుండానే నెట్ ద్వారా ఎవరికీ రూపాయ ఖర్చు లేకుండా  అంకితమిచ్చానని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశాను .ఇప్పుడు దాని సి డి ని శ్రీ సుబ్బారావు గారు ఆవిష్కరిస్తారని అది గోపాలకృష్ణ గారికి మహా ఆనందం కలిగిస్తుందని చెప్పాను .దీనికి గురుభాక్తిగా ఆయన నాకు ఏదో చేయాలని భావించారని ఆయన సహృదయత నాకు గురు దక్షిణ అనిఇంకేమీ అక్కర్లేదని మెయిల్ రాసి తెలియ జేశానన్నాను .కాని ఆయన ఊరుకొనే రకం కాదు .వెంటనే సరస భారతి, శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల కార్యక్రమాలను చిత్రీకరించటానికి వీలుగా ఒక’’ సోని వీడియో కెమెరా ‘’కొనిచ్చి గురు దక్షిణ చెల్లించారని ఇక నేనేను ఏమీ మాట్లాడలేక పోయానని వివరించాను .అయితే రెండురోజుల క్రితంశుక్రవారం  రాత్రిఆయన ఫోన్ చేసి ‘’గీర్వాణం ‘’పుస్తకాన్ని తన మేనకోడలు , డాక్టర్ శర్మ గారి కుమార్తె ,అమెరికాలో డాక్టర్ గా ఉంటున్న శ్రీమతి జ్యోతి గారుస్వంత ఖర్చులతోసరసభారతి ద్వారా  ముద్రించి  అ౦ద జేయటానికి సంసిద్ధత వ్యక్త పరచారని తెలిపారు చాలా ఆనందం వేసిందని వారికి కృతజ్ఞతలు తెలియ జేయమని చెప్పానని అన్నాను .దీనిలో భాగాస్వాములవ్వటానికి జ్యోతిగారి సోదరీమణులు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలియ జేశాను. సరసభారతి కి ఇప్పటికి అయిదు పుస్తకాలు ముద్రించి ఇచ్చిన ప్రకాష్ గారి ఆత్మీయత మర్చిపోలేనిదని ,ఈ పుస్తకాన్ని కూడా వారే తీసుకు రావటానికి ముందుకొచ్చారని ,అలాగే శ్రీ టి వి సత్యనారాయణ గారు రాసిన ‘’పేరడీలు ‘’కూడా సరస భారతి ముద్రిస్తోందని దాన్ని స్వర్గీయ బాపు –రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేశాను .13 -51-15 బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా మా మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (అమెరికా)  స్పాన్సర్ చేస్తూ అతని తలిదండ్రులు ,మా అ అక్కా బావలు అయిన శ్రీ వేలూరి వివేకానంద శ్రీ మతి దుర్గ గార్లకు అంకితం ఇస్తూ160 దేవాలయ చరిత్రలున్న   ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’ఆవిష్కరణ స్వామి సన్నిధిలో చేస్తామని తెలియ జేశాను . ఇందరు బంధు గణం తో అభిమానులతో ఈ వేదిక, హాలు మెరిసిపోవటం ఏంతో గొప్పగా ఉందని చెప్పి గ్రంధావిష్కరణ చేయ వలసిందిగా ప్రభాకర్ గారిని కోరాను

పుస్తకావిష్కరణ

దర్శనీయ దైవ క్షేత్రాలుగ్రంధా విష్కరణ ను శ్రీ జలదంకి ప్రభాక ర్ గారు చేసి మొదటికాపీ ని సుబ్బారావు గారికి అంద జేశారు.తర్వాత వేదిక పై ఉన్న అతిదులందరికి అంద జేశారు . తరువాత సభకు హాజరైన వారందరికీ పుస్తకాలను సరస భారతి కార్య కర్తలు అందజేశారు .ప్రభాకర్ గారు గ్రంధం లోని కొన్ని ముఖ్య విషయాలపై ప్రసంగించారు ప్రకాష్ గారు ఈ పుస్తకాన్ని ‘’అమూల్యం ‘’అని ప్రచురించటం ఏంతో  హర్షణీయ మైన విషయ౦  అన్నారు .శ్రీ భాస్కరేంద్ర క్లుప్తంగా ఒక పండుగ వాతావరణం గా ఈ కార్య క్రమం జరిపినందుకు అభినందించారు .శ్రీ అన్నే హనుమంతరావు గారు ఉయ్యూరుతో తమకున్న అనుబంధాన్ని మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రి గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ వారి సరస్వతీ ట్యుటోరియల్ కాలేజీ లో పని చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు .కోగంటి వారి పెద్దకోడలు శ్రీమతి పుష్పలత చక్కగా ఇంత గొప్ప వేడుక ఇక్కడ జరగటం తమల్ని అందరిని ఆహ్వానించి గౌరవించటం జీవితం లో మరపు రాని సంఘటన అని ఇది గోపాల కృష్ణ గారి పెద్ద హృదయానికి నిదర్శనమని అన్నారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –సి డి ఆవిష్కరణ .

నేను అంతర్జాలం లో రాసి నెట్ ద్వారా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితం ఇచ్చిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’సి డి ని శ్రీ కోగంటి సుబ్బారావు గారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి నన్నూ శ్రీ గోపాల కృష్ణ గారిని అభి నందించారు .ఈ సి డి ని మైనేనిగారికి వారికోసంవారి డబ్బుతో  కొన్న పట్టుపంచె ,ఉత్తరీయం శాలువావారి శ్రీమతి శ్రీమతి సత్యవతిగారికి కొన్న పట్టు చీర జాకెట్ ,పసుపు కుంకుమ ,మొదలైన వాటితో బాటు పాక్ చేసిన పాకెట్  ను  శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు అందజేసి శ్రీ గోపాల కృష్ణ గారికి అందజేయ మని కోరాను .

సన్మాన సంరంభం

ముందుగా ఈ నాటి కృతి భర్త శ్రీ కోగంటి సుబ్బారావు గారి ని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి చందనం పూసి పన్నీరు చల్లి గులాబీ పుష్పహారం వేసి .సెంట్ రాసి ,తాంబూలం అందించి బొట్టుపెట్టి  మైనేని వారు ,కోగంటి వారి కోసం మాతో కొనిపించిన పట్టు బట్టలు కప్పి వారి శ్రీమతికి పట్టు చీర జాకెట్ పసుపు కుంకుమ అందించి ,శాలువా వేసి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అంద జేశాం .గోపాల కృష్ణ గారు అమెరికా నుండి శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ఆర్డర్ ఇప్పించి చేయించిన ‘’శ్రీ లక్ష్మీ నరసింహ బంగారు కాయిన్ ‘’ను శ్రీ సుబ్బారాగారికి సభా మఖం గా అంద జేశాము. సుబ్బారావు గారు సంక్షిప్తం గా ప్రసంగించి తనకు జరిగిన ఈ సత్కారానికి గోపాల కృష్ణ గారి ఔదార్యానికి వితరణకు బంధు ప్రేమకు ,పెద్దల యెడ ఉన్న గౌరవాభిమానాలకు మురిసిపోతున్నానని సరసభారతిద్వారా ఉయ్యూరు వచ్చే గొప్ప అవకాశం కల్పించి నందుకు కృతజ్ఞతలు తెలియ జేశారు

తరువాత కృతి కర్త అయిన నాకు మా శ్రీమతి ప్రభావతికి జలదంకి వారు కోగంటి వారు పై విధం గానే సన్మానం చేశారు .ఉయ్యూరు హైస్కూల్ లో నాకు డ్రిల్ మాస్టారు ,ఆ తర్వాత సహా ఉపాధ్యాయులు అయిన పెద్దలు శ్రీ సూరపనేని వెంకట సుబ్బారావు గారు ఈ కార్యక్రమాని విచ్చేసి నా మీద ఉన్న అభిమానాన్ని చాటి నాకు నూతన వస్త్రాలతో సత్కారం చేసి నా గురించి అభినందన వాక్యాలు పల్కి ఆశీర్వ దించటం నేను చేసుకొన్న పూర్వ  జన్మ సుకృతం .

ఆ తర్వాత శ్రీ అన్నే హనుమంతరావు దంపతులకు ,శ్రీ భాస్కరేంద్ర దంపతులకు శ్రీ కోగంటి శివ ప్రసాద్ దంపతులకు శ్రీ ప్రభాకర్ గారికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి అదే తీరులో ఘనం గా నూతన వస్త్రాలు శాలువా దండలు జ్ఞాపికలు చందన సత్కరాలు చేశాం .అందరూ ఏంతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .సభకు రాలేక పోయిన కోగంటి వారి రెండవ కుమారులు శ్రీ శ్రీనివాసరావు శ్రీమతి అరుణ  దంపతులకుకూడా కొన్నవాతిని సుబ్బారాగారికి అందజేశాం . మనుమలు ,శ్రీ అవినాష్ శ్రీ మతి భారతి ,శ్రీ ఆశ్వాంత్ శ్రీమతి హారిక  సుబ్బారావు గారి మనుమ రాళ్ళు కుమారి మయూరి ,కుమారి హరిణి  ,హనుమంతరావు గారి మనుమరాలు కుమారి తన్వి లకు  కోగంటి వారి ఆజన్మ  మిత్రులుశ్రీ అన్నే వెంకటేశ్వర్లు గారికి ,వారి శ్రీమతి గారికి  మైనేని వారు అభిమానం తో మాతో కొనిపించిన నూతన వస్త్రాలు ,జ్ఞాపికలు మొదలైనవి అందజేసి మైనేని వారి కి అత్యంత ఆనందాన్ని కల్గిన్చాం . అమెరికా లో ఉండి ప్రత్యక్ష ప్రసారం లో  ఆ దంపతులు వీక్షించి ఏంతో కనుల పండువుగా జరిగిన ఈ కార్యక్రమానికి సంతోషించి ఉంటారు .మా అబ్బాయి రమణ ,కోడలు శ్రీమతి మహేశ్వరి లకు మైనేని వారుకోనిపించిన నూతన వస్త్రాలు ,శాలువా ,జ్ఞాపిక పుష్పహారం చందనాది సత్కారాలతో సత్కరించారు .ఇదంతా ఒక పెళ్లి వేడుకలాగా  జరిగింది .ఒక సాహిత్య కార్యక్రమం ఇంత వైభవం గా జరగటం నేనెప్పుడూ చూడలేదు .వస్త్రాల నాణ్యతలో ,శాలువాల విలువలో ఎక్కడా మైనేని గారు రాజీపడలేదు అన్నీ నంబర్ వన్ గా ఉండాలని కోరారు అలానే చేశాం .జ్ఞాపిక విషయం లోనూ ఏంతో జాగ్రత్త తీసుకొన్నాం

ఈ కార్యక్రమాని విజయ వాడ నుండి వచ్చిన ప్రసాద్ గారికి ,శాలువా జ్ఞాపికలతో సత్కరించాం. సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మికి ,ప్రచార కార్య దర్శి శ్రీ వీరమాచనేని బాల గంగాధర రాగారికి పుష్పహారం శాలువా చందనాది సత్కారం జ్ఞాపిక లతో సన్మానం చేశాం ,కళ్యాణ మండపాన్ని ఉచితం గా ఇప్పించి ఈ కార్యక్రమం బాగా జరగటానికి సహకరించిన శ్రీ వెంట్ర ప్రగడ  ఆంజ నేయులను కూడా పై విధం గా సన్మానించి కృతజ్ఞతలు తెలియ జేశాం .

కోగంటి వారికి తెనాలి లో పంచి పెట్టటానికి 250 పుస్తకాలను ,భాస్కరేంద్ర గారికి మదన పల్లిలో పంచటానికి సుమారు 150 పుస్తకాలను ఇచ్చాం  ఏంతో సంతోషం గా వారు వాటిని తీసుకు వెళ్ళారు .ఈ విధంగా ఆవిష్కరణ రోజునే సుమారు 500 పుస్తకాలను ఉచితం గా అందరికి అందజేసి ఏంతో సంతృప్తి చెందాం

తరువాత ఘన మైన విందు ఏర్పాటు చేశాం .అన్ని పదార్ధాలు చాలా రుచికరం గా శుచిగా ఉన్నాయని మెచ్చుకొంటూ భోజనం చేశారు వచ్చిన వారందరూ .కిళ్ళీ కూడా చాలా బాగుందని మెచ్చారు .అన్నే వెంకటేశ్వర్లుగారు మరీ మరీ మెచ్చుకొన్నారు .శ్రీ ఆంజనేయ స్వామి వారికి చేయించిన అరిసెలు ప్రసాదం గా కోగంటి వారి బందుగణానికి అంద జేసింది మా శ్రీమతి ప్రభావతి  అరిసెల  ఐడియా ఆవిడదే .బాగా క్లిక్ అయింది .అందరికి ఉపయోగపడింది  జనవరి ఒకటి వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారలకు చేసిన లడ్డూ పూజ ప్రసాదం లడ్డూ లను కూడా తెనాలి వారందరికీ అందించింది  వారి ఆనందానికి అవధి లేదనిపించింది వారి ముఖాలలో కనిపించిన సంతృప్తిని చూస్తే.

ఆవిష్కరణ కార్యక్రమం లో నేను ఆలోచన చేసినదాన్ని మా అబ్బాయి రమణ చక్కగా అమలు అయ్యేట్లు పూర్తీ బాధ్యతలు తీసుకొన్నాడు .ఆహ్వానాలు ,బానర్లు జ్ఞాపికలు ,స్టేజి ఏర్పాటు మైకు ,ప్రత్యక్ష ప్రసారం ,పుస్తకం డి టి పి అందులో దేవుళ్ళ దేవాలయాల ఫోటోల డి తీపి చేసిన శుశీల్ తో పెట్టించటం దగ్గరుండి సంతృప్తిగా చేశాడు .మైనేని వారి మన్ననలు అందుకొన్నాడు .సభను ఆసాంతం అద్భుతం గా నిర్వహించిన శ్రీమతి శివలక్ష్మి కి ప్రత్యెక అభినందనలు కెమెరా వాయిస్ రికార్డర్ లతో కార్యక్రమాన్ని కవర్ చేసిన మా సాంకేతిక సలహా దారు శ్రీ గంగాధర రావు గారిని యెంత పొగడినా తక్కువే .ఇందరి సహకారం తో ఈ కార్యక్రమం రూపు దిద్దుకొని ,అద్భుతం గా నిర్వ   హింప బడి అందరి ఆనందానికి హేతువైనది . జ్ఞాపిక రూప శిల్పి జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ కు   సరసభారతి కృతజ్ఞతలు .ఈ గ్రంధాన్ని ఇంత అందంగా ముద్రించి మాకు అందజేసిన శ్రీ రామా ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారికి ,కవర్ పేజీ డిజైనర్ శ్రీ కళాసాగర్ గారికి ,దగ్గరుండి ముద్రణ విషయం లో జాగ్రత్తలు తీసుకొని అందజేసిన ఆత్మీయులు చలపాక ప్రకాష్ గారికి అభినందనలతో కృతజ్ఞతలు .

సభ లో పదనిసలు

1-కచేరీ వారు నాలుగున్నరకు వస్తానని అయిదుంబావుకు రావటం చిరాకు అనిపించింది

2-త్యాగరాజ అరధనోత్సవం లో త్యాగరాజ స్వామి కీర్తనలుపాడక పోవటం అన్నమయ్య పాటలు పాడి లాగుడు సంగీతం తో విసుగు తెప్పించటం అసహనాన్ని కలిగించింది .

3-ప్రత్యక్షప్రసారం మొదటి అరగంట లో నెట్ అందక ఇబ్బంది పెట్టింది తరువాత వీయిన అన్ని సోర్సులను ఉపయోగించి ప్రసారం  అంతరాయం కాకుండా జాగ్రత్త పడటం తో కొంత టెన్షన్ తగ్గింది

4- నది సంపాదకులు గ్రంధాన్ని గురించి చక్కగా క్లుప్తం గా ప్రసంగించ కుండా శాఖా చంక్రమణం చేయటం, అసలు అందులో సరుకు ఏముందో తెలియ జేయక పోవటం  మరీ ఇబ్బంది పెట్టింది

5-గౌరవ అతిధి రాకపోవటం –చాలామంది కి నిరాశ కల్గించింది

6-కోగంటి వారి కుటుబ సభ్యులు తాముకూడా సుబ్బారావు గారికి  తలొక   శాలువా కప్పటం దండ వేయటం చేయక పోవటం పద్ద వెలితి .చక్కని అవకాశాన్ని సద్వినియోగం చెసుకకో లేకపొయారేమో అనుకొన్నాను .ఆ ఎనభై అయిదేళ్ళ వృద్ధ జ్ఞానమూర్తిన ఉయ్యూరులో సత్కరించే మహద్భాగ్యం వారుకోల్పోయి నందుకు బాధగా ఉంది .

7- కుటుంబ సభ్యులలో భాస్కర్ ,పుష్పలత్ గార్లు తప్ప మిగిలిన వారు సుబ్బారావు గారి గురించి రెండుమాటలు చెప్పక పోవటం భావ్యం అనిపించలేదు .

సరిగమలు

1-మా కుటుంబ సభ్యులు దాదాపు హాజరై తలొక పనిలో భాగ స్వాములవ్వటం సంతోష కరమైన విషయ౦

2- చిన్నపిల్లలు కూడా హుషారుగా పాల్గొని తమ వంతు బాధ్యత నేర వేర్చటం

3-మా గుడి దగ్గరున్న  బడ్డీ బుడ్డి సోదరులు నిలబడి సేవలందించటం

4- మా గుడి అర్చకులు తమ ధర్మాన్ని సక్రమం గా నిర్వర్తించటం

5- వెయ్యి ఆహ్వానాలు పంచితే 125 మంది అంటే పదికి ఒకరు వంతున రికార్డ్ గా హాజరవటం

6- కార్యక్రమం ఒక గొప్ప వేడుకగా జరగటం .

7-ఇదొక తీపి గుర్తుగా మిగిలిపోవటం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-15 –ఉయ్యూరు

 

 

.

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్‌ ఘనత (13-Jan-2015)

శిలాశాసనంగా నిలిచిన ఎన్టీఆర్‌ ఘనత (13-Jan-2015)
‘పాండవ వనవాసం’
చరిత్ర
ఎన్టీఆర్‌ నటించిన పౌరాణికాలు పలు భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా విజయఢంకా మోగించాయి. ‘పాండవ వనవాసం’ సినిమా బెంగాల్‌లో అనువాదమై అక్కడ శతదినోత్సవ వేడుకను జరుపుకోవడం విశేషం. 1965లో తెరకెక్కిన ఈ సినిమాకి రూ.పది లక్షల ఖర్చయింది. విడుదలైన 40 ఏళ్ళకు జీ టీవీ రూ. 50 లక్షలకు శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకుంది. అంటే పెట్టుబడిని మించి ఐదింతలు లాభం తెచ్చిపెట్టింది. ఈ రికార్డు ఇండియాలోనే మరెవ్వరికీ లేకపోవడం విశేషం.
మహానటుడు నందమూరి తారక రామారావు నటజీవితంలో ఎన్నో తరగని, చెరిగిపోని రికార్డులున్నాయి. వాటిలో కొన్నింటిని ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపిన ‘పాతాళభైరవి’(1951) నుండి ఆయన నటించిన పలు చిత్రాల ద్వారా చిత్ర సీమలో రికార్డులను నమోదు చేశారు. సరిగ్గా యాబై ఏళ్ళ క్రితం ఎన్టీఆర్‌ నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ను ఈ ఐదు పదుల కాలంలో ఎవరూ అధిగమించలేకపోవడం గమనార్హం. ఇది కేవలం తెలుగునాడుకే సంబంధించిన విషయం కాదు. యావత్‌ భారతదేశంలోనూ ఎవరికీ సాధ్యపడని రికార్డ్‌ను ఆయన 50 ఏళ్ళ క్రితమే సునాయాసంగా సాధించారు. ఒక్క సినిమా చెయ్యడానికే మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇప్పటి మన స్టార్‌ హీరోలు. అలాంటిది నంబర్‌వన్‌ హీరోగా ఉంటూ 1965లో 12 సినిమాల్లో నటించారు ఎన్టీఆర్‌. వాటిలో కొన్ని పౌరాణికాలు, కొన్ని జానపదాలు ఉండడం విశేషం. ఈ పన్నెండు సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకోగా, ఎనిమిది సినిమాలు (నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం, మంగమ్మ శపథం, తోడూ నీడ, దేవత, వీరాభిమన్యు, సి.ఐ.డి, ఆడబ్రతుకు) డైరెక్ట్‌గా శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. ఆ ఏడాదే విడుదలైన ‘దొరికితే దొంగలు’ తెలుగువారికి తొలి సైంటిఫిక్‌ ఫిక్షన్‌ సినిమా. 92 రోజులు ఆడిందా సినిమా. ‘సత్యహరిశ్చంద్ర, ‘ప్రమీలార్జునీయం’, ‘విశాల హృదయాలు’ కూడా అర్ధశత దినోత్సవాలు జరుపుకోగా వీటికి ఒక్కవారం గ్యాప్‌లో విడుదలైన ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవ వనవాసం’ ‘ఆడబ్రతుకు’ చిత్రాలు 25 వారాలు ప్రదర్శితం కాగా ‘వీరాభిమన్యు’ చిత్రం 156 రోజులు ఆడింది. ఏడాది కాలంలో ఆయన నటించిన డజను సినిమాలు ఈ విధంగా రికార్డు సృషించాయి. ఎన్టీఆర్‌ తర్వాత ఆయనకంటే మిన్నగా డజనుకు పైగా సినిమాల్లో నటించిన హీరోలున్నారు. కానీ ఏ ఒక్కరూ ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకోవడం అన్న రికార్డ్‌ను అధిగమించలేకపోయారు. యాబై ఏళ్ళుగా ఎన్టీఆర్‌ పేరిట ఈ రికార్డ్‌ నిలిచి ఉండడం తరిగిపోని, చెరిగిపోని ఎన్టీఆర్‌ రికార్డ్‌లకు ఓ నిదర్శనం. భవిష్యత్తులోనూ ఈ ఘనత చెక్కు చెదరక చరిత్ర పుటల్లో నిలిచే ఉంటుందని చెప్పొచ్చు.
చెక్కు చెదరని ఇమేజ్‌
ఎన్టీఆర్‌ రికార్డ్‌లానే ఇమేజ్‌ కూడా చెక్కు చెదరనిది. అందుకు మరో నిదర్శనం ఉంది. షమ్మీ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ‘చైనా టౌన్‌’ సినిమాను 1969లో ‘భలే తమ్ముడు’గా రీమేక్‌ చేశారు. దాదాపు అదే తరహా కథాంశంతో 1978లో అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా రూపొందిన ‘డాన్‌’ చిత్రాన్ని మరుసటి ఏడాది ఎన్టీఆర్‌తో తెలుగులో ‘యుగంధర్‌’గా నిర్మించారు, ఈ రెండు సినిమాలను తమిళంలో రీమేక్‌ చెయ్యగా ‘చైనా టౌన్‌’లో ఎమ్జీఆర్‌, డాన్‌ రీమేక్‌లో రజనీకాంత్‌ అభినయించడం గమనార్హం. అమితాబ్‌ని స్టార్‌గా నిలిపిన ‘జంజీర్‌’(1973) సినిమాను ఎన్టీఆర్‌ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ నిర్మిస్తే తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ వయసు 52 కాగా, అమితాబ్‌ వయసు 35 సంవత్సరాలే. అదే 52 ఏళ్ళకు అమితాబ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్స్‌కి దిగిపోయారు. ఎన్టీఆర్‌ చివరిదాకా నంబర్‌వన్‌ హీరోగా కొనసాగడం విశేషం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెంది ఈ రోజుల్లో ఓ సినిమా ఖండాంతరాలు వెళ్ళడం విశేషం కాదు. సరైన ప్రచార సౌకర్యం లేని ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ సినిమాలు పరభాషల వారినీ ఆకర్షిస్తూ మెప్పించడం అసలైన ఘనత.
– కొమ్మినేని వెంకటేశ్వరరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేతాజే మృతి వీడని మిస్టరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామన్న స్పూర్తి -ఆదివాసుల దైవం నాగోబా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్తపలుకు ఆర్ కె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం పేరడీలు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -3 పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు  అంతర్జాలం లో నేను 145 మంది సంస్క్రుతకవుల  పై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”నుసరసభారతి నిర్వహించే  శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకల రోజున అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం జరిగే సభలో ఆవిష్కరింప జేస్తామని ,దీనిని సరసభారతికి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిస్తున్నామని ఈ పుస్తకానికి ముద్రణ ఖర్చు అంతా శ్రీమైనేనిగారి మేనకోడలు ,అమెరికాలో ఉంటున్న డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు భరించి పుస్తకం తెస్తూ తన ”కృష్ణ మామ”పై ఉన్న గౌరవాభిమానాలను ప్రకటిస్తున్నారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .
 ఉయ్యూరు కె సి పి లో కెమిస్ట్ గా పని చేసి రిటైర్ అయిన సరసభారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ టి .వి.  .సత్యనారాయణ గారు రాసిన ”పేరడీలు ”కూడా సరసభారతి ముద్రించి మన్మధ ఉగాదినాడు ఆవిష్కరిస్తోందని ఈ పుస్తకాన్ని ప్రముఖ హాస్య జంట స్వర్గీయ బాపు -రమణ లకు అంకితమిస్తున్నామని తెలియ జేస్తున్నాం
 మా అమెరికా మేనల్లుడు జె .వేలూరి .స్పాన్సర్ చేస్తున్ననేను నెట్ లో రాసిన  ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శ్రీహనుమజ్జయంతి నాడు 13-5-15 బుధవారం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో స్వామి వారల శాంతి కళ్యాణ మహోత్సవం లో ఆవిష్కరిస్తామని దీనిని మా అక్క బావలు శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ దంపతులకు అంకితమిస్తున్నామని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది మీ  -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మకర సంక్రాంతి వీధులలో సంక్రాంతి రంగవల్లులు

15-1-15గురువారం మకర సంక్రాంతి వీధులలో సంక్రాంతి రంగవల్లులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-1-15గురువారం మకర సంక్రాంతి పర్వదినాన మా బ్రహ్మణోత్తమునికి కూష్మాండ దానం 

వై బి రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు ఇంటి వద్ద భోగిమంటలు మామనవడు ఛి భువన్ హాజరుyvrp 001

15-1-15గురువారం మకర సంక్రాంతి పర్వదినాన శ్రీ సువర్చలాన్జనేయస్వామి పూజ ,మరియు ఉయ్యూరు వీధులలో సంక్రాంతి రంగవల్లులు ,మా  బ్రహ్మణోత్తమునికి కూష్మాండ దానం

DSCN0116 DSCN0115 DSCN0114 DSCN0113 DSCN0112 DSCN0111 DSCN0110 DSCN0109 DSCN0108 DSCN0106 DSCN0105 DSCN0104 DSCN0103 DSCN0102 DSCN0101 DSCN0100 DSCN0099 DSCN0098 DSCN0096 DSCN0095 DSCN0094 DSCN0093 DSCN0092 DSCN0091 DSCN0090

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మారణాయుధాల మధ్య తూనీగలు

మారణాయుధాల మధ్య తూనీగలు

  • – వి.బి.ఎన్. శ్రీనివాస్ 8522846585
  • 12/01/2015
TAGS:

మబ్బు చిచ్చుబుడ్డి చిమ్మే పువ్వుల్ని
భూమికన్నా ముందే అందుకునే
కొన్ని చేతులు

ముత్యపు చిప్పలకన్న ముందే
గుప్పిట పట్టే కొన్ని నోళ్ళు –

మొక్కల మొదళ్ళకన్న ముందే
మట్టి సాక్సులు తొడుక్కునే కొన్ని కాళ్ళు –

కాల్వ పక్కనే ఎదురుచూస్తున్న
కాగితపు పడవల్ని సుతారంగా లేపి
నీటి మీద బతుకునిచ్చే కొన్ని ప్రాణాలు –

ఏం చెప్పాలి
నవ్వుల వెనె్నల్ని కాసే
వేల చందమామలు!
ఇల్లు పూలవనమయ్యే
పుప్పొడి అడుగులు!!
అమ్మ నాన్నల్ని ఆరోగ్యపరిచే
అద్భుత ముద్దుల గుళికలు!

అక్షరాలమీద వాలిన తూనీగల్ని
ముక్కలు చేసి
ఆయుధానికి దండేశారు
కూలిన కలల నెత్తుట్లో
పసివాసన నవ్వులు!
రాలిన కలల నెత్తుట్లో
మరణించిన బాల్య పరిమణాలు!
వాలిన కలల నెత్తుట్లో
మినుకు మినుకు కళల
నిర్జీవ నక్షత్రాలు!
వాలి కూలి రాలిన నెత్తుట్లో తేలిన
బాల్యపుస్తకాల శవాలు!

చిగురాకుల్ని కాల్చి
ఖండఖండాలు చేసి
తల్లివేరు కడుపుమీద
ఆరని చితి పేర్చారు
రాజ్యం కనుగప్పిన ఆయుధమా!
నీకో పాలబువ్వల బాల్యాన్నిస్తున్న
నీకో సుతిమెత్తని తరగతి పుస్తకాన్నిస్తున్న
నీకో సతత వసంతబడి వాతావరణాన్నిస్తున్న
నీకో ప్రేమల అమ్మ ఒడినిస్తున్న
నీకో హృదయపు తడినిస్తున్న
ఇక బతుకు!

వెర్రితలల తుపాకుల్లారా!
కత్తుల్లారా! బాంబుల్లారా!
బాల్యాన్ని మింగడమంటే-
రేపటి ప్రపంచాన్ని చంపడమే!
బాల్యం పాలస్తీనా అయినా
బాల్యం పాకిస్తాన్ అయినా
బాల్యం భారత్ అయినా…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment