ఉపనిషత్తులలో కుల ప్రసక్తి లేదు -డా అరవిందరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర మౌఖిక సాహిత్య జలధార -జయధీర్ తిరుమల రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతా నేతిబీర చంద్రం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిన్నప్పటి నుంచి పాటా నోటమాట – ధవళ వర్ణ దేవాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతి ప్రారంభోత్సవం

 


 
 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసురులెవరు ?అరవిందరావు ,మనిషికి మనసే వరం స్వరూపానంద ,జ్ఞాన దీపిక -రవి శంకర్


 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేవంత రెడ్డికేసు మాడభూషి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ దంతేవాడకు ఎందుకు ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు నిమిషాల్లో ఉడికే మాగీ ఇప్పుడు కుతకుత లాడుతోంది

రెండు నిమిషాల్లో ఉడికే మాగీ ఇప్పుడు కుతకుత లాడుతోంది

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా

సవ్యంగా సాగని బాల్య౦

తన రచనలన్నిటిని  వారసత్వాన్ని (హెరిడిటరి)ఆధారం గా చేసుకొని రాసి సాహిత్యం లో రియలిజానికి  పట్టం కట్టిన  ఎమిలీజోలాది మాత్రం మిశ్రమ వారసత్వం .తండ్రి ఫ్రాన్సిస్కో జోలా సగం ఇటాలియన్ సగం గ్రీకు వాడు. ఇంజనీర్ గా సాహసిగా పేరున్నవాడు తల్లి కోర్ఫు ఐలాండ్ కు చెందినది .ఆమె తండ్రి తాలూకు వారు వెనిస్ దేశస్తులు ఆమె పేరు ఫ్రాంకో ఎమిలే ఆబర్ట్ .పారిస్ దగ్గర డౌర్డాన్ గ్రామం లో   పుట్టింది  పారిస్ లో జోలా 2-4-1840న జన్మించాడు .అసలుపేరు’’ ఎమిలీ ఎడౌర్డ్ చార్లెస్ ఆంటోని ‘’.పుట్టగానే బ్రెయిన్ ఫీవర్ తో బాధ పడి రెండేళ్లకు కోలుకొన్నాడు .దీనికి తగ్గట్లు కళ్ళకు షార్ట్ సైట్ (హ్రస్వ ద్రుష్టి )ఉండేది .దీనితో ఎడమకన్ను కొంచెం పైకి లేచినట్లు కనిపించేది .ఈ పరిస్తితులలో ధనికుడైన తండ్రి కుటుంబాన్ని దక్షిణ ఫ్రాన్స్ కు తరలించాడు .పెళ్లి అయ్యే దాకా అక్కడే ఉన్నాడు .అక్కడ ఒక కాలువ తవ్వాలని ప్లాన్ లో ఉండేవాడు .అనుకోకుండా తీవ్రమైన చలి జ్వరం వచ్చి ప్లూరసి జబ్బు తో బాధ పడి చనిపోయాడు .కుటుంబానికి తండ్రి మిగిల్చింది ఐక్స్ సిటీ మీద వేసిన ఒక దావా మాత్రమె .ఈకేసులో తండ్రికున్న ఆస్తి చాలాభాగం అమ్మేయాల్సి వచ్చింది .చాలా తక్కువ ఆస్తి మాత్రమె  కుటుంబానికి మిగిలింది .ఎమిలీ యవ్వన జీవితం అంతా ఈ ఆర్ధిక లేమి వలన డిప్రెషన్ తోగాడిచి పోయింది .తక్కువ ఖరీదైన లాడ్జిలలో ఉంటూ తరచుగా ప్రదేశాలు మారుతూ గడిపాడు .చివరికి తల్లి అతన్ని ఐక్స్ లోని ఒక బోర్డింగ్ స్కూల్ లో చేర్పించింది .              ముగ్గురు మిత్రులు

మిగిలిన సహా విద్యార్దులకంటే వయసులో పెద్దవాడుగా ఉన్న జోలా స్కూల్ లో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు .తోటి విద్యార్ధులు అతని ఎగుడు దిగుడు కన్నులను చూసి వెక్కి రించేవారు అతని పారిస్ నగర ఉచ్చారణ విని హేళన చేసేవారు .దీనితో పిరికితనం వచ్చి ఆత్మ రక్షణ లో పడాల్సి వచ్చింది. కాని ఇద్దరు ఆత్మీయ మిత్రులను మాత్రం సంపాదించుకో గలిగాడు అందులో బాగా తెలివిగల ఐక్స్ లోపుట్టిన పాల్ సిజనే ,సిజనే స్నేహితుడైన బైలీలు  .పది హేనేళ్ళ ఈ ముగ్గురూ కలిసి పల్లె ప్రాంతపు అందాలను అనుభ వీస్తూ  పరిశోధన చేస్తూ  కాలవలలో ఈతలు కొడుతూ  నదిగట్ల మీద విక్టర్ హ్యూగో ,ఆల్ఫాన్సో డిలామర్టి న్ , ఆల్ఫ్రెడ్ డి మ్యూసేట్ ల రొమాంటిక్ రచనలు చదువుతూ .కాల క్షేపం చేశారు .వీటికన్నిటికి ప్రేరకుడు సిజనే .తర్వాత అయిదేళ్ళలో సిజనే రంగుల బొమ్మలు గీస్తూ గడిపాడు .ఎమిలీ జోలా కవిత్వం తో, బాలడ్స్ రాస్తూ మూడు అంకాల నాటకాలు రాస్తూ కాలక్షేపం చేశాడు  తోటి మిత్రులకు రాబోయే సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ కళ కున్న బాధ్యతను వివరిస్తూ చదువు పై శ్రద్ధ పట్టలేక పోయాడు జోలా .

ఆర్ధిక కు౦గు బాటు

ఇంటి దగ్గర తల్లి పరి స్తితులూ బాగాలేవు ..దరిద్రం పెరిగి పోయింది తినటానికి  తిండి కూడా  దొరకని పరిస్థితి వచ్చింది .ఆమె తలిదండ్రులే ఇప్పటిదాకా అండగా నిలిచారు .కాని వారూ ఇక ఏమీ చేయ లేని నిస్సహాయులైపోయారుకూతురికీ, మనవడికీ . చిల్లిగవ్వ కూడా చేత లేక జోలా తల్లి నిస్సహాయురాలైంది .ఎవరో పుణ్యాత్ముల దగ్గర అప్పు గా కొన్ని ఫ్రాన్కుల డబ్బు తీసుకొని భర్త తాలూకు బంధువులు ఏదైనా సాయం చేస్తారనే ఆశ తో  పారిస్ వెళ్ళింది.  కొడుకు జోలాను ఇంట్లో మిగిలిన కర్రా బుర్రా కూడా అమ్మేసి మూడవ తరగతి మెట్రో రైల్  టికెట్ కొనుక్కొని పారిస్ వచ్చి తనను కలవమని చెప్పింది .

కవిత్వం పై పిచ్చి

18 వ ఏటా జోలా పారిస్ చేరాడు .అది విలాసవంత మైన పై డాబుల నగరం మూడవ నెపోలియన్ దాన్ని పునర్నిర్మించాడు .లాభాల వేటగాళ్లకు ,పరాన్నభుక్కులకు నిలయం .అసాంఘిక చర్యలకు అడ్డా .తాను  వచ్చిన పల్లెటూరికి దీనికి ఆస్తి మశాకాంతరం ఉందనిపించింది జోలాకు .పారిస్ ను చూసి షాక్ అవటమేకాక ఆనందం కూడా పొందాడు .ఇక్కడ స్కాలర్ షిప్  వచ్చి లీసీ సెయింట్ లూయీ లో చేరాడు అక్కడ అతను ఇష్టం లేని వాడుగా ,అక్కడివాళ్లు అతన్ని ఒప్పుకోలేని వారుగా కనిపించారు .ఇక్కడ కూడా అతని పారిస్ ఉచ్చారణ కు  మొదట అవహేళన జరిగినా అతను స్థానికుడు కనుక సరిపోయింది .చదువు మీద ద్రుష్టి పెట్టలేదు. స్నేహితుల్ని పట్టించుకోలేదు .సాహిత్యం చదవటం ,రాయటం అనే రెండు విషయాల మీదే దృష్టిని కేంద్రీకరించాడు. అవే అతని శ్వాస, ఊపిరి అయ్యాయి .కవిత్వమే అతని ప్రేయసి అయి మురిపించింది లోకాన్ని మరిపించింది .ఆ తర్వాత నేచరిస్ట్ రచయితలలో అగ్రగామి అని పేరొచ్చినా అతనికి కవిత్వం మీద అభిమానం మాత్రం పోలేదు .ఇరవై ఏళ్ళ వయసులో కవిగా  గుర్తింపు మాత్రమేకాదు రొమాంటిక్ ఫిగర్ గానూ గుర్తింపు వచ్చింది ‘’మన ఆకలి  తీర్చుకోవటానికి  తిందాం తాగుదాం కాని మన ఆత్మలను పవిత్రం గా దూరం గా ఉంచుకొందాం ‘’అని చెప్పేవాడు .

మరణం  అంచు లోంచి బైటికి

19 వ ఏట జోలా మళ్ళీ చావు దగ్గరకు వెళ్ళాడు .తీవ్రంగా టైఫాయిడ్ జ్వరం వచ్చి రెండు నెలలు మంచం మీదనే ఉండిపోయాడు .కొంచెం కోలు కొనే సమయం లో నోరు అంతా అల్సర్ ల తో నిండిపోయి మాట్లాడ లేక పోయాడు.మానసికం గా బాగా కు౦గి పోయాడు .హైపో కా౦డ్రియాకు అది తర్వాత దారి తీసింది . ఈ వ్యాధి వలన వచ్చిన  రచనా విధానం లో మార్పు వచ్చింది . సిజనే కూడా కావితలు రాసేవాడప్పుడు .అతనికి జాబు రాస్తూ జోలా ‘’ఒరే ముసలి మూర్ఖా !నువ్వు నాకంటె గొప్పగా కవిత్వం రాయగలవు .నీ కవిత్వం కంటే నా దానిలో వాస్తవికత ఉండచ్చు కాని నీదానిలో కవితా స్పర్శ ఎక్కువ .నువ్వు హృదయం తో రాస్తావు .నేను మనసుతో అంటే బుద్ధి తో రాస్తాను .నీది హృదయవాదం నాది బౌద్ధికవాదం ‘’అన్నాడు

అనేక ఆలోచనలు

టైఫాయిడ్ నుంచి కోలుకొన్నాడు కాని స్కూల్ అంటే మరీ చిరాకేసింది .లాయర్ అవ్వాలనిపించింది పరీక్ష రాసి తప్పాడు డిప్లమా రాలేదు దీనిపై ‘’the open sesame to all the professions ‘’అను కొన్నాడు .దీనిపై దీర్ఘ కవిత రాశాడు .ఒక షాడో బిజినెస్ మాన్ అవతారం ఎత్తాలనుకొన్నాడు .ఈ విషయమై బైలీకి రాస్తూ ‘’ఏదో ఒక సంస్థలో గుమాస్తాగా చేరాలని ఉంది. ఇది నా నిరాశా దృక్పధం తో తీసుకొన్న నిర్ణయం .నా భవిష్యత్తు చిద్రమై పోతుంది .ఆఫీసులో పని చేసినా భవిష్యత్తు లేదు నైతిక పతనం తో చీకటి లోకి జారిపోవటమేనేమో ‘’అన్నాడు .అనుకోన్నట్లే నెపోలియన్ డాక్స్ లో బుక్ కీపర్ ఉద్యోగం వచ్చింది .రోజూ రెండుమైళ్ళు  నడిచి ఉద్యోగానికి వెళ్ళాలి. జీతం నెలకు ముప్ఫై ఫ్రాంకులు .చేరి ,జీతం చాలక, నడవ లేక రెండు నెలలకే మానేసి మళ్ళీ ఉద్యోగాన్వేషణలో పడ్డాడు

.Inline image 1

ignature

 

ignature

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –

17-పోస్ట్  -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్  పెయింటర్  – పాల్ సిజేన్ (Paul Cezanne)-3(చివరిభాగం )

తండ్రి మరణం తో ఆర్ధిక పుష్టి-అయినా దిన కూలీ  జీవితమే

1886 లో సేజనే తండ్రి మరణించటం తో ఆస్తిలో వాటాలభించి ఆర్ధిక పుష్టి కలిగింది .ఆర్ధిక భద్రత లభించి ధనవంతుడని పించుకొన్నా కూడా దిన కూలీ లాగా నే సాధారణ జీవితం జీవించాడు .గుర్రబ్బండీ కూడా కొనుక్కోలేదు .బయటికి తనను తీసుకొని వెళ్ళటానికి  ఒక కిరాయి బండిని  మాత్రం ఏర్పాటు చేసుకొన్నాడు .ఇది కూడా విలాసమే అనేవాడు .

ఆగిపోయిన బ్రష్

.కూలి విషయం లో ఒకసారి వాడితో గొడవ పడి,67  ఏడేళ్ళ వయసులో నడిచి పోతానని భీష్మించాడు .అనుకోకుండా తుఫాను వచ్చి గాలి వేగానికి రోడ్డుమీద కూలిపోయాడు .పూర్తిగా తడిసిపోయాడు .ఒక లాండ్రీ వాగన్ ఆయన్ను ఇంటికి చేర్చింది .మర్నాడు ఉదయం తానూ వేస్తున్న పోర్ట్రైట్ కు మెరుగులు  దిద్దాడు అప్పటికే డయాబెటిస్ ఉంది  .ఒకవారం తర్వాత 22-10-1906న 67 వ ఏట సిజనే పెయింటర్ చనిపోయాడు  .అతని   బ్రెత్ తో పాటుపెయింటింగ్ బ్రష్ కూడా  ఆగిపోయింది .చనిపోయే ముందు కొన్ని చిత్రాలపై ఫిర్యాదులు రాశాడు .ఆస్తిని భార్యను మినహాయించి కొడుక్కు దాఖలు పరచాడు విల్లు రాసి

సిజనే చిత్ర ప్రత్యేకత

సిజనే అంతర్ సంఘర్షణలు మాత్రం అతని చిత్రాల్లో ప్రతి ఫలించలేదు .ప్రశాంత మైన ప్రభావం కోసమే తపన పడ్డాడు .తనకు నచ్చని చిత్రాలను నేలమీదే బ్రష్ లతోబాటు పడేసేవాడు .లేకపోతే పాలెట్ కత్తితో వాటిని చించేసే వాడు .వాన్ గొఘ్ చిత్రాలలో కనిపించే మానసిక సంఘర్షణ సిజనా ఫినిషింగ్  కాన్వాస్ ల లో కనిపించదు . సిజనే  కోరింది ప్రశాంతత (సెరినిటి)మాత్రమె అదీ అతని ప్రత్యేకత .అతని రేంజ్ అంత గోప్పదేమీకాదు .అంటే వైవిధ్యం ఎక్కువ లేదని అర్ధం .ఎప్పుడు గీసినా అవే చెట్లు  కొండలు పూలు పళ్ళు  పేకాట ఆడేవాళ్ళు లనే చిత్రించేవాడు .అతని  రంగుల ప్రస్తారమూ హద్దులోనే ఉండేది .’’ఎప్పుడు గీసినా మూడే మూడు ప్రాధమిక రంగులతో ,వాటి నుండి వచ్చిన రంగులతోనే చిత్రించు ‘’అని చెప్పిన గురువు ‘’పిసార్రో ‘’మాటకు కట్టుబడి చిత్రించాడు .నలుపు ,కారునలుపు ,సియన్నా మొదలైన రంగుల జోలికి పోలేదు .తానూ సృష్టించుకొన్న రంగుల  సామరస్యానికే (హార్మని ) కట్టు బడ్డాడు .మూడే మూడు రంగులతో  తన కళా విశ్వరూపాన్ని చూపాడు అవేనీలం  ,ఆకుఅచ్చ ,ఊదా రంగులు .(blue green pink tan )అవే అతని రంగుల సర్వస్వం  . ‘’he used these colors not  mere accents in a design or as decorative units but as blocks of pure form ,basic elements of structure ‘’ అని అతని పై పరి శోధన విశ్లేషణా చేసిన వారు చెప్పారు .

ఇంప్రెష నిస్ట్ లు సంప్రదాయం గా వస్తున్న లైట్ అండ్ షేడ్ లను తిరస్కరించి ముందుకు సాగారు .కాని సిజనే ‘’’’modulated’’ his pigments and defined his objects not by outlines but by subtly contrasting planes and patches of color ,a continual change and ‘’de composition ‘’of light . అని అతను తొక్కిన కొత్తదారిని గురించి వివరించారు .లాండ్ స్కేప్ లలో సాధారణత ఉన్నా ,ఏదో ఒక నియమానికి  సూత్రానికి  బద్ధుడై చిత్రించలేదు . తాను  చిత్రించినవాటి లో ‘’క్యూబికల్ ,కొనికల్ ఆకారం లో ఉన్నవి తర్వాత కాలం లో  అందరికి ప్రేరణగా నిలిచి క్యూబిక్ ఆర్ట్ గా పేరు తెచ్చుకొంటు౦దని ‘’ప్రక్రుతి ప్రధానం గా రేఖాగణితం లాగా ఉంటుంది ‘’అనే నిర్వచనం వస్తుందని   సిజనేకు తెలిస్తే అమితాశ్చపోయేవాడు .

నిత్య జీవితం లోని విషయాలను విశ్వ సత్యాలకు అనుసంధానం చేశాడు చిత్రాలలో .అతిని నిశ్చల చిత్రాలలోనే కాదు  లాండ్ స్కేప్ లుకూడా  ప్రేమ మయం గా ఉండటం అతని ప్రత్యేకత  .యాపిల్ పళ్లను ఆరంజ్ లను చిత్రించటం లో  సాధారణ వస్తువులలో ఉన్న ఆశ్చర్యానుభూతిని ,వాటికున్న పరస్పర సంబంధాన్ని తెలియ జెప్పాడు .అతని దృష్టిలో ఒక జగ్ ఒక మగ్ ,రుమాల  పండుముక్క చిత్రం లో  తాత్కాలికంగా చోటు దక్కించుకొని   ఒక పర్వతానికున్న ప్రాధాన్యతను పొందుతుంది .అంటాడు . దీన్ని చూసే  శ్రీ శ్రీ ‘’కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం ‘’అన్నాడెమో !అతని దృష్టిలో ‘’literature express itself by abstractions ,where as painting ,by means of drawing and color ,gives concrete shape not only to perception but sensations ‘’  అని అభిప్రాయ పడ్డాడు . సాహిత్యం ఇవ్వలేని ఆకృతిని నిండుతనాన్ని చిత్రం ఇవ్వ గలుగుతుంది అని భావించాడు . ఈ సెన్సేషన్ అంటే ఇంద్రియానుభవమే చిత్రకారుడు సిజనే సాధించిన అద్భుత విజయం .దీనికి అతను ప్రక్రుతి ఉన్నతికి ,అర్ధంకాని విషయాలకు  వినమ్రుడౌతాడు.అతని చిత్రాలు  బ్రోకెన్  వర్ణాలకు   తనకు ఇష్టం లేని  తానూ లక్ష్య పెట్టని ఈ ప్రపంచానికి దూరంగా ఉండి  సంతోషించటానికి మార్గ దర్శకాలయ్యాయి .అవన్నీ శాంతికి  ప్రశాంతికి మహా చిహ్నాలుగా నిలిచిపోయి చరితార్ధతను సాధించాయి . ఎక్కడా ఆటవికత ఉండదు .అందులో ఒక క్రమ ద్రుష్టి ఉండి పవిత్రత తో శాశ్వతత్వాన్ని బోధిస్తాయి .ఈ ప్రశాంతత ఆతను పడిన మానసిక వేదన అంతర్ జ్వలన  నిరాశ వలన లభించినదే .అందుకే తనకు మొదటి డీలర్ గా ఉన్న వోలార్డ్ ను తనపై  నమ్మకం ఉంచుకోమని చెప్పాడు .కాని 115  స్టింగ్ ల తర్వాతా కూడా తాను గీసిన పోర్ట్రైట్ సంతృప్తినివ్వలేదు .’’he had failed to realize his sensations and could not coalesce his color planes into a solidly perfected form .’’Still ‘’ he conceded ‘’the shirt –front is not bad ‘’అన్న పెర్ ఫెక్షనిస్ట్ ప్- పెయింటర్ పాల్ సిజనే .

పతన ఉత్థానాలు –చీకటి కాలం

1861-1870  కాలం సిజనే చిత్రకళా జీవితానికి చీకటి రోజులు –మూడవ నెపోలియన్ సెలాన్ ల సంఖ్య తగ్గెట్లు  కొందరి  చిత్రాల్ని తిరస్కరించేట్లు చేశాడు .తిరస్కరింప బడినవారిలో ఇంప్రెష నిస్టులు కూడా ఉన్నారు .వారిని విప్లవకారులుగా భావించాడు .వారి శైలికి ప్రభావితుడయ్యాడు . కాని  వారితో స్నేహానికి దూరంగా ఉన్నాడు సిజనే .సిగ్గు, మొరటుతనం ,కోపం లు చుట్టుముట్టి డిప్రెషన్ లోకి వెళ్ళాడు .ఈ కాలం లో వేసినవన్నీ నల్ల రంగు చిత్రాలే .1867 లో కూర్బేట్ ప్రభావానికి లోనై ‘’పాలెట్ నైఫ్ ‘’తో చిత్రాలు గీశాడు .వీటినే తర్వాతి కాలం లో’’ un couilarde’’ అంటే ‘’విరిలిటి ‘’అంటే మగతనం ఉన్న చిత్రాలు అన్నాడు  పాలెట్ నైఫ్ తో సిజనే గీసిన చిత్రాలు ‘’ఆధునిక ఎక్స్ప్రేషనిజం’’కు నాంది పలికింది అని అతనే సృష్టికర్త అని రాస్తూ లారెన్స్ గోయింగ్ ‘’although it was incidentally that ,the idea of art as as an emotional ejaculation made first appearance in this moment ‘’అన్నాడు . ఇందులో అతని శైలి పరి పక్వమై నిలిచింది .ఇదే అతని చీకటికాలం ఈ కాలం లో గీసినవన్నీ ‘’ఈరోటిక్ ,వయోలేంట్  ‘’విషయా అంటే కామ ,హి౦సాత్మకాలే నన్నమాట .

ఇంప్రెషనిస్ట్ కాలం

1870-78  కాలం అతను ఇంప్రెష నిస్ట్ అనిపించాడు పారిస్ వదిలి మార్సేలీస్ కు చేరినతర్వాత లాండ్ స్కేప్ లేక్ ప్రాదాన్యమిచ్చాడు .యుద్ధం ముగిసిన తర్వాత పారిస్ చేరి పిసార్రో తోకలిసి లాండ్ స్కేప్ లు గీశాడు .తనను పిసార్రో శిష్యుడనని చెప్పుకొన్నాడు అతన్ని ‘’గాడ్ ది ఫాదర్ ‘’అని కీర్తించాడు పిసారో ప్రేరణ తో నల్ల రంగులు వదిలేసి మెరిసే రంగులు వాడాడు   పారిస్ ,ప్రావెంస్ ల మధ్య తిరిగాడు .మొదటి ఇంప్రెష నిస్ట్ ప్రదర్శన1877లో  ఇచ్చాడు .కొన్ని అమ్ముడుపోయి కొంత ధనలాభం కలిగింది .ఇందులో వ్యంగ్యం అధిక్షేపణ అధికం .వీటిని చూసిన గర్భిణీ స్త్రీ లకు ఎల్లో  ఫీవర్ తో పుట్టే బిడ్డను కనటం ఖాయం అన్నారు విమర్శకులు .

పరిపక్వ దశ

1878-90 కాలం సిజనే చిత్రకళా జీవితం లో పరిపక్వ దశగా భావిస్తారు .ప్రావెంస్ లోనే ఉండేవాడు 1885-88 కాలం అతని నిర్మాణ దశ .1886  గొప్ప మలుపు తెచ్చింది .ఎమిలీ జోలా తో స్నేహానికి దూరం గా ఉన్నాడు .జోలా నవలలో తనను ఒక పాత్రగా రాయటం తో చిన్ననాటి స్నేహానికి స్వస్తి చెప్పాడు .జోలా నమ్మక ద్రోహం చేశాడని భావించాడు –

అ౦తిమకాలం

1890-96కాలం లో  పెయింటింగ్  లకు దూరం గా ఉండిపోయాడు .కాని అతని పేయింటింగ్ లకు ప్రాచుర్యం బాగా వచ్చి నవ తరానికి చెందిన యువ చిత్రకారులు సిజనే ను తమ  ఆదర్శ చిత్రకారుడని భుజాలకెత్తుకొన్నారు . 1903 నుంచి తన  స్టూడియోలోనే చిత్రాలు గీశాడు .

సిజనే చనిపోయాక పెట్టిన ప్రదర్శనలో అతని చిత్రాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోయాయి. అతని శిష్యులుసిజనే క్యూబిజానికి ఆద్యుడు అని అంటూ అతని ప్రతిభను ‘’ “Cézanne is one of the greatest of those who changed the course of art history . . . From him we have learned that to alter the coloring of an object is to alter its structure. His work proves without doubt that painting is not—or not any longer—the art of imitating an object by lines and colors, but of giving plastic [solid] form to our nature.” (Albert Gleizes and Jean Metzinger in Du “Cubisme”, 1912)[37]

  అని ప్రశంసించారు .సిజనే ప్రభావం పికాసో ,బ్రేక్ ,మెట్జిన్జర్ ,గ్లీజేస్ ,గ్రీస్ మొదలైన ప్రముఖ చిత్రకారులమీద అదికం గా ఉంది .సిజనే ను జీనియస్ అన్నారు .అతనిపేర ఒక మెడల్ ఏర్పాటు చేశారు .

        మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

      సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక

ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం డైరెక్టర్ గారికి –

3-6-15 బుధవారం హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 9-30 గం లకు ప్రసారమైన ‘’ఇంటింటికో కద’’ అత్యద్భుతం .ఇల్లాలి  పాత్రలో శ్రీమతి ఇందిరాదేవి భావ ప్రకటన అనితర సాధ్యం అనిపించింది .స్వచ్చమైన వాచకం తో నిష్టూరాలు, దెప్పి పొడుపులు ,ఆప్యాయత ,అనురాగం, కుటుంబ బంధం ,బాధ్యత ,అలకా, అనునయం ,మాటకు మాట అంటించటం ,అత్తగారిని దెప్పటం, అమ్మను అనునయంగా బతిమాలటం ,భర్తపై యెనలేని ప్రేమ ,ఉద్యోగ ధర్మం ,పిల్ల చదువు భవిష్యత్తుపై ఆరాటం ,భర్త కు దూరమై బదిలీ అయితే ఆ అర్భకుడు పడే ఆగ చాట్లను తట్టుకోలేక పోవటం అన్నీ ,ఇందిరా దేవి గొంతుకలో సహస్రదళపద్మం లా విర బూశాయి  .నిజంగా చెప్పాలంటే మాటలు రావు .చాలవుకూడా  .రేడియో నాటికకు ఆమె ఒక వరం .ఆమెది సుస్వరం .ఆమె నట విశ్వరూప ప్రదర్శనమే ఈ నాటిక .

ఎన్నేళ్ళయిందోయిందో ఇంత కమ్మని తెలుగు నాటికను విని .మొదటినుంచి చివర వరకు సంభాషణలే నాటికకు జీవం పోశాయి .గాత్ర ధారులైన పాత్ర దారులు నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు .రచయిత బహుదా ప్రశంసనీయులు .అరగంట నాటిక అయిదు నిమిషాల్లో అయిపోయి నట్లు అనిపించింది .ఇంత అనుభూతిని మిగిల్చిన నాటిక కర్త ,ప్రయోక్త ,నటీనట బృందానికి ,ప్రసారం చేసిన హైదరాబాద్ కేంద్రం వారికి అభినందన శతం .అయితే ముగింపు   ట్రెడిషనల్ గా  ఉండటం అంత బాగాలేదని పించింది .మారుతున్నకాలానికి తగిన ముగింపు కాదు .చప్పట్లు కొట్టి౦చు కోవటానికి  చేసిన ముగి౦పే. ఏమైనా బుధవారం రాత్రి వీనులకు గొప్ప విందు అనుభవించాం .

ఆ తర్వాత విశాఖ నుండి ప్రసారమైన రాగం తానం పల్లవి లో శ్రీమతి మండ శ్రావ్యమైన స్వరం తో  అమ్మవారిపై కీర్తనను గానం చేసి దివ్యాను భూతిని కలిగించారు వాద్య సహకారమూ ముచ్చటగా మెచ్చదగినదిగా ఉంది .

గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-15-ఉయ్యూరు


 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-

17-పోస్ట్  -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్  పెయింటర్  – పాల్ సిజేన్ (Paul Cezanne)-2

పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి

1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న టౌన్ కు   పారిపోయాడు .అక్కడ తన అసమాన చిత్రకళా నైపుణ్యం తో ఆకళకు అమరత్వం సిద్ధింప జేశాడు .అక్కడే మోడల్ గా పని చేసిన హార్తెన్స్ ఫికేట్ తో సాన్నిహిత్యం పెరిగి వివాహం చేసుకొన్నాడు .ఆమె జూరా ప్రాంత రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి .ఆమెకు 19ఏళ్ళు .మన పైంటర్ కంటే 11 ఏళ్ళు చిన్నది .రెండేళ్లకు కొడుకు పుట్టాడు .వాడికి తనపేరు పాల్ అని పెట్టుకొన్నాడు .తన ప్రేమ వ్యవహారానికి తండ్రి ఉగ్ర నరసింహం అవుతాడేమో నని భయపడి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు .తండ్రివి డేగ కన్నులు .వ్యవహారం పసిగట్టాడు .అగ్గి మీద గుగ్గిలమై కొడుక్కు ఇచ్చే అలవెన్స్ డబ్బు కట్ చేసేశాడు . అమెతోకాపురం  చట్ట సమ్మతం చేయటానికి ,కుటుంబాన్ని ఒప్పించటానికి ఆమెను పది హేడేళ్ళపరిచయం తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అయినా ఆమె పై ప్రేమ క్రమంగా తగ్గిపోయింది .ఆమెతో అరుదుగా గడుపుతూ సిటీ జీవితానికి అలవాటు పడిపోయాడు . ఆమె నుంచి తప్పించుకోవటానికి తరచుగా ప్రయాణాలు చేసేవాడు .దీనికి సాకుగా ‘’మా ఆవిడ స్విట్జర్లాండ్ ను  ,నిమ్మకాయాలను మాత్రమె అతి జాగ్రత్తగా చూసుకొంటుంది ‘’అని చెప్పాడు .

క్రమబద్దత లేని జీవితం

పెళ్లి కాక పూర్వం నుంచీ కూడా సిజనే మామూలు జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకొన్నాడు .అతని అలవాట్లు లాగానే అతని స్టూడియో కూడా  అస్తవ్యస్తంగా ఉండేది .అంటువ్యాధుల కూడలిగా ఉండేది .30 వ ఏట చాలా పొడవుగా , బుజాలు కొద్దిగా ఒంగి, చిన్నగద్దముక్కు తో ,మోసం చేసేట్లుండే కళ్ళతో  కనిపించేవాడు .కొత్తగా వచ్చిన వారికి గట్టిగా మాట్లాడినట్లు ఆ మాటలు గుబురు నల్ల గడ్డం లోంచి వస్తున్నట్లు గా ఉండేది .40 ఏళ్ళు వచ్చేసరికి మనిషి చిరుబురులాడుతూ దుస్టుడేమో అని పించేవాడు .

విమర్శకుల దారుణ విమర్శ

ఇంప్రెషనిస్ట్ లంటే  అభిమానం పెరిగింది .కాని పత్రికలు  విమర్శల చేన్నాకోల్ తో ఝడిపించేవి .ఆతని చిత్రాలు పల్లెటూరి మూర్ఖుడి చిత్రాలని ,అతనొక మాంసం కొట్టే బుచర్ అనీ అతని పెయింటింగ్స్ చిన్నపిల్లలు ఆకతాయి తనం తో సీతాకోక చిలకలను పట్టుకొని జిగురుతో పుస్తకం లో అంటించి నట్లున్నాయని ఈసడించారు . అతనంటే ద్వేషం పెరిగిపోయింది .ప్రాచుర్యం పోయింది .మూడవ ఇంప్రెషనిస్ట్ ప్రదర్శన లో విమర్శకులు అరుపులు కేకలు నిరసనలతో హోరెత్తించారు .ఈ సంఘటనపై జోలా ‘’హాండ్ కర్చీఫులు అడ్డం పెట్టుకొన్నా నవ్వులు పెదిమలలోంచి పగిలి బయటికొచ్చాయి ,రెచ్చిపోయిన కుర్రకారు పై చొక్కాలు విప్పేసి అట్టహాసాలతో కోపాన్ని ప్రదర్శించారు .చర్మాన్ని మాంసం రంగు తో ఆకుపచ్చ ,,పసుపు షేడ్ లతో చిత్రించటం ఎవరూ హర్షించలేకపోయారు .సేజనే ఒక అపస్మారక స్థితిలో ఉ౦డి వీటిని పెయింట్ చేశాడేమో అని ఎద్దేవా చేయటమేకాక గర్భిణీ స్త్రీలను సేజనే చిత్రాలు చూడవద్దు అని కూడా చెప్పారు .చూస్తె వాళ్ళకుపుట్టే పిల్లలు ఒళ్లంతా మచ్చలతో పుడతారని ఝడిపించారు కూడా  అంత వ్యతిరేక ప్రచారం జరిగింది .

సిజనే వర్ణాలపై  చేస్తున్నప్రయోగాలను చూసి హర్షించిన మరో విమర్శకుడు ‘’విజ్లర్ ‘కూడా విమర్శిస్తూ ‘’ఒక ఆరేళ్ళ పిల్లాడు సేజనే లాగా వాళ్ళ చెల్లెల్ని చిత్రిస్తే ,అతని తల్లి  మంచి తల్లి అయితే అతడిని కొట్టిపారేసేది ‘’అన్నాడు .యాభై ఏళ్ళ తర్వాత ఒక లక్ష డాలర్లకు అమ్ముడుపోయిన సిజనే లాండ్ స్కేప్ చిత్రాలు ఆనాడు నలభై నుంచి ఎనభై ఫ్రాంకు లకు మించి ఎవరూ కొనలేదు .అదీ మన చిత్రకారుని సమకాలీన సమాజపు విపరీత వింత పోకడ .అసలు వీటి నెవరూ పట్టించుకోను కూడా పట్టించుకోలేదు ప్రదర్శనలో .’’ఒక లుక్ వేద్దాం ‘’అని కూడా ఎవరూ అనుకోకపోవటం దారుణం అంటారు .

ఇలాంటి తిరస్కారాలకేమీ స్పందించకుండా సిజనే తన పనేదో తానూ చేసుకు పోతున్నాడు . ఇంప్రెషనిజం  టెక్నిక్కులు వాడాడు .తర్వాత వారితో విభేదించినా వారి సిద్ధాంతాలను అంగీకరించాడు . ‘’ప్రకృతిలో గీతలు అనేవి లేనేలేవు .’’అని సిజనే నిశ్చితాభిప్రాయం .‘’.ప్రతిదీ లైట్ అండ్ షేడ్ ల ఏర్పాటే .రంగులమార్పిడి  భావ వ్యక్తీకరణాలే ‘’అంటాడు ‘’the main thing is the modeling –and a better word for modeling is modulation ‘’అని అతని నిర్వచనం .చారిత్రాత్మక ,పౌరాణిక  జానపద గాధల చిత్రాలను ‘’bad literature ‘’ అనేశాడు .ఎట్టకేలకు 1882లో అతని 43 వ ఏట సిజనే గీసిన ఒక చిత్రాన్ని ‘సెలూన్’’ అంగీకరించింది .ఇదికూడా ఒక కుట్రలో భాగమే ,వంచనా శిల్పమే .అంటోన్ గిలిమేట్ అనే స్నేహితుదు సెలూన్ లో జూరీ మెంబర్ .అతను ఒక విద్యార్ధి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ,ఆ ప్రదర్శనా చిత్రాల కేటలాగ్ లో ‘’Cezanne –a pupil of Guillimet ‘’అని పేర్కొన్నాడు .

అందరూ ఉన్నా ఏకాకి జీవితమే –చుక్కల్లో చంద్రుడు

వయసు పెరిగిన కొద్దీ అంతర్ సంఘర్షణలకు సిజనే ఎక్కువగా లోనయ్యాడు .ఈ విషయాలపై విన్ ట్రాప్ సార్జంట్ రాస్తూ ‘’ he painted women both as portraits and as nudes  ,yet he was so frightened by women that he often could not bear to remain in the same room with his female models ‘’అని చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న సెలూన్ పెయి౦టర్స్   అంటే సిజనే కు ఈర్ష్య ఎక్కువ .కాని వారి ఆమోదం కోసమే ఎదురు చూసేవాడు .అతను పూర్తిగా కేధలిక్ మతానికి చెందినవాడు .కాని ప్రీస్ట్ ల చెడుప్రవర్తనపై నిప్పులు కక్కేవాడు .సమాజం అంటే భయపడేవాడు తోటివారు ఏదో ప్రలోభపెట్టి తనను గేలాలతో బంధించి  వారితో లాక్కు పోతారనే భయం బాగా ఉండేది . ‘’humanity was horrible .Nature was reassuring  but it was loveliest when it was inanimate ‘’ఇదీ సిజనే మనస్తత్వం .కాని ఎమిలీ జోలా అంటే చాలా అభిమానం అతనికి విధేయుడుగా ఉండేవాడు .జోలా రాసిన నవల ‘’L’oeuvre’’లో హీరో గా తననే చిత్రి౦చాడేమోననే అనుమానం ఉండేది .అందులో హీరో అపజయాల పెయింటర్ ,పిరికి ,.తనను తాను విశ్వజనంతో కలుపుకోకుండా ఏకాకి గా ఉండేవాడు .కాని తనలాంటి వారు చాలా అరుదని చెబుతూ ‘’ప్రతి శాసన సభలో రెండు వేల మంది శాసన సభ్యులు ఉండవచ్చు .  కాని సిజానే లాంటి వాడు రెండు శతాబ్దాలకు ఒక్కడు మాత్రమె ఉంటాడు’’ అని ఘంటాపధం గా చెప్పగల ధీరుడు  సిజనే .

పీచే మూడ్

1895  తర్వాతా మాత్రమె 20ఏళ్ళ చిత్ర కళా     జీవితం లో నాలుగు మాత్రమె ప్రదర్శనలు ఏర్పాటు చేశాడుసిజనే .అప్పటికి వయసు 56 .వోలార్డ్ అనే డీలర్ చాలా చిత్రాలు పెట్టాడు కాని అప్పటికీ పబ్లిక్ అతన్ని తిరస్కారం తోనే చూశారు .సానుభూతి ఎక్కడా రాలేదు .సెలూన్ సామ్రాట్టులూ పెదవి విరిచారు .ఇక పారిస్ మీద విసుగు పుట్టి తన స్వగ్రామం చేరుకున్నాడు .అక్కడే తల్లితో కాలం గడిపాడు .స్నేహితులు అంటే అసహ్యమేసింది సిగ్గుపడి వారికి మొహం చూపించ లేక పోయాడు   .హింస ఫోబియాలో ఉండిపోయేవాడు ‘’ఈ ప్రపంచం నన్ను అర్ధం చేసుకోవటం లేదు .నేను కూడా ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .అందుకే దానికి దూరంగా ఉండిపోతున్నాను .మనుషుల చీచ స్వభావం చూసి సహించలేక పోతున్నా వారితో ఏకీభ వించ లేక పోతున్నా . జీవితం భయ పెడుతో౦ది నన్ను ‘’ అని కొడుకుకు ఉత్తరం రాశాడు .మానసిక భయం బాగా పట్టుకొని పీడించింది .డిప్రెషన్ నుండి బయట పదాలని విశ్వ ప్రయత్నం చేశాడు .’’సెరిబ్రల్ టెన్షన్ ‘’అతన్ని పీడిస్తోంది. ఏ పని అయినా భరించలేక పోయాడు .అయినా’’ఫారం ,కలర్’’లపై పోరాటం మానలేదు .I am old and ill –but I am determined to die painting ‘’అని కలవరించేవాడు .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దాదాపు 30 వేల మంది పైగా వున్న నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు – నా పరిచయం – బందా.

దాదాపు 30 వేల మంది పైగా వున్న నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు – నా పరిచయం – బందా.img123

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ప్రముఖ కదా రచయిత ,న్యాయవాది నాకు అత్యంత ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు కుటుంబం తో 2-6-15 మంగళవారం రాత్రి -మా ఇంట్లో 

ప్రముఖ కదా రచయిత ,న్యాయవాది నాకు అత్యంత ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు కుటుంబం తో 2-6-15 మంగళవారం రాత్రి -మా ఇంట్లో

DSCN1464 DSCN1465 DSCN1466 DSCN1467 DSCN1468 DSCN1469 DSCN1471 DSCN1472 DSCN1473 DSCN1474

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష (చివరి భాగం )

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష  (చివరి భాగం )

డా వెంకటేశ్వర –గారు కవితా సంపుటికి పెట్టిన పేరు ‘’పాఠం’’అని ముందే చెప్పుకొన్నాం .ఆ శీర్షిక తో ఉన్నకవిత ను చూద్దాం .చరిత్ర అంటే పిల్లలకు అసహ్యం. కారణాలు చాలా .హద్దుల్ని నిర్ణయిస్తూ ,ఆహవాలే (యుద్ధాలే )తప్ప ఆటలు లేక పోవటం ,తమ ప్రశ్నలకు చరిత్ర జవాబు చెప్పదనే  సంశయం  అన్ని పేజీలు  ఒకే మూసలో ఉంటాయన్న విసుగు అందుకే వాళ్లకు చరిత్ర అంటే గతకాలపు పాత వాసన .అందుకని కవిగారు ‘’పిల్లలు ఇస్టపడేలా చరిత్ర మొత్తం తిరగ రాయాలి ‘’అని తమ అభిప్రాయం తేట తెల్లం చేశారు .తాగు బోతు  సంసార జీవితం లో ‘’పాన సుఖ లాలసలో –కాలం మంచు ముక్క  కరుగుతుంది –రోజు రోజుకీ ఇల్లాలిగాజులు పెద్దదవుతాయి –పగిలిన సీసా పెంకులు పిల్లల గుండెల్లో దిగబడతాయి .’’అంతేకాక ‘’ఊరవతలి కొంపల్లో –కాలం బరువుగా కన్నీటి బొట్లుగా కారిపోతుంది –‘’ఒక్కో చుక్కా యెంత విలువైనదో తెలిసినా ‘’ఆ చుక్కను’’ మాత్రం వదలలేని బలహీనత కొంపల్ని కొల్లేరు చేస్తుందనే బాధ చూపారు ‘’దృశ్య దృశ్యం ‘’లో వర్షం ఎలా కురుస్తోందో తెలుసా ?’’మొయిలేనుగు (మేఘం అనే ఏనుగు )చదలేట్లోంచి (ఆకాశం అనే ఏటి లో నుంచి ) నీల్లేత్తి కుమ్మరిస్తున్నట్లు .’’ఇంతకురిసీ ఆగిపోయినా ‘’యెదలోపల కురుస్తూనే ఉంది అలజడి వాన ‘’ఎందుకు ?’’పొద్దుననంగా బయటికెళ్ళిన ‘’ఆరోప్రాణం’’ కోసం ఎదురు చూస్తూ ‘’ అన్నారు ‘’వర్షం కురిసిన రాత్రి ‘’కవితలో .సాహితీ సభ ఆహ్వానం లోని అక్షరాలూ ‘’సుతిమెత్తని ఎద లాంటి కాగితంపై ప్రేమాభిమానాలు అక్షరాలై దీపిస్తూ ‘’అని ‘’అక్షర స్మ్రుతి ‘’ వీణను మీటుతారు .అన్నీ చెప్పగలం సలహాలూ ఇవ్వగలం కాని ‘’మనల్ని మనం పసిగట్టటం –నిజంగా ఎంత కష్టమో ?’’అని ‘’అంతర్వాహిని ‘’ని వెలువరిస్తారు .ప్రతి నగరం లోను సాధారణంగా కనిపిస్తాడు  ‘’రోడ్డు చిత్రకారుడు ‘’’’మురికి చేతులతో తపో దీక్ష తో బొమ్మ గీసి కనక కిరీటాన్ని రూపొందిస్తాడు –కాలం మనుషులు కాసేపాగి మళ్ళీ పరుగో పరుగు .’’నాలుగు  రాళ్ళు ఏరుకొని  చీకట్లో కల్సిపోతాడు ‘’కాని అతడు వేసిన బొమ్మ మాత్రం సూదంటురాయిలా ఆకర్షిస్తూనే ఉంది’’ .ఇలాంటి రోడ్డు చిత్రకారుల గురించి ఇంకెవరైనా కవిత రాశారో లేదో నాకు తెలియదుకాని వెంకటేశ్వర మాత్రం అతనికి అక్షర శిల్పం చెక్కారు .నేను 1956-60 లో బెజవాడ లో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు ,ఒకప్పుడున్న  అలంకార్ టాకీస్ వద్ద ఒక గుడ్డి అతను ఇలానే రోడ్డు మీద బొమ్మలేసి ప్రాణ ప్రతిష్ట చేసి డబ్బా మొగి౦చు కొంటూ అడుక్కునేవాడు .అతను దాదాపు పదేళ్ళ క్రితం వరకూ అలానే గడిపాడు .అది నాకిప్పుడు గుర్తొచ్చింది .

ఎన్నో ఊహించుకొని తన ఊరి బస్సెక్కి వెడుతుంటే ‘’కనుచూపు మేరా ప్లాట్లు అవుతున్న పొలాలు ‘’చూసి దారి తప్పానను  కొన్నారు కవి .ఇన్నేళ్ళకు తిరిగొస్తే చిరు నగవు తో పలకరించే నేస్తమే కరువయ్యాడు .’’ముసలి పల్లె మూగగా రోదిస్తోంది –మూలాలనేవరో –కుదిపేస్తున్న భావన ‘’కలిగింది .తనకోసం విత్తనాలు చల్లే నేస్తాలను ‘’మీకోసం నేను –ఈ నేలమీద బీజాక్షరాలు రాస్తాను ‘’అని ఆహ్వానించారు .ఈ నాటి ప్రతి పల్లె సీమ దైన్య స్తితి ఇదేగా .’’నగరానికి ఎప్పుడోకానీ రెండు కాళ్ళూ ఒకే చోట నిలవవు –గడియారపు ముళ్ళల్లె’’-కుటుంబరావు గాఢ నిద్రలో మునిగినప్పుడు ఉన్నదికాస్తా దొంగలు ఊడ్చుకెళ్లితే ‘’తెల్లారని బతుకులు –తెల్లారి పతాక శీర్షికలు ‘’అవుతాయి పత్రికలలో  ‘’ఒక రోజు ‘’.

‘’ప్రపంచం కుగ్రామం అవుతుంటే ఇళ్ళన్నీ చిన్న బోతాయా ?’’అనే మౌలిక ప్రశ్న సంధించారు ‘’ప్రక్షాళన ‘’లో .అలాగే ప్రణయ రంజిత రాత్రి ‘’రాగ మయి ‘’అయి అనురాగమయి అయి ‘’జయ భేరి ‘’మోగిస్తుంది .’’ఎన్ని అస్తిత్వ ప్రత్యేకతలున్నా –మానవతకు లేవు సరిహద్దులు ‘’అని విశ్వ విపంచిని మీటారు కవి ‘’సారం ‘’లో అసలు కవితా సారం ఆదేనంటూ .చరాచారాన్ని ఉత్తేజ పరుస్తుంటే ,సుప్రభాత గీతం పాడుతుంటే ‘’రాత్రంతా బహుశా –వేకువనే కలగందేమో భూమి ?’’అనే అనుమానమొచ్చింది .అసూయ ఈర్ష్య ద్వేషం కమ్ముకొన్న మానవాళి ‘’తననీడనే భరించలేక పోవడం –మనిషి తనమేనా ‘’అని ‘’నీడ ‘’ను చూసి ఝాడుసుకొనే జనాన్ని చూసి సంధించిన ప్రశ్న .మానవత్వమే కనుమరుగైపోతోందన్న ఆందోళన .,ఆవేదన .మాటల్లో నిర్లక్షంగా మంటలు పుట్టిస్తుంటే స్నేహ గంధం వేడెక్కి పోతుంది .ఆ పొగ పెనుపాములా చుట్టేస్తుంది .ఇది పద్ధతికాదు అని చెప్పటానికి గొంతు సవరించుకొంటు౦ టే –గొంతు కేదో అడ్డు పడుతోంది ‘’అన్నారు ‘’స్నేహ ధూపం ‘’లో .రోడ్డు మీద ఇస్త్రీ చేసే వాడిని ‘’చలువరి ‘’అన్నారు సాభిప్రాయం గా .అతడికి తెలియని చిరునామా ఉండదు .కాని అతని చిరునామా మాత్రం ‘’రంగు వెలిసిన చెక్క బండే’’అనటం  మహాద్భుతం .’’మూటలు మూటలు బట్టలు చలువ చేస్తాడుకాని –అతడ్ని మాత్రం చలువ బట్టాల్లో –ఎవరైనా చూశారా ?’’లేదనే కదా సమాధానం .ఎప్పుడో తిలక్ ‘’పోస్ట్ బంట్రోతు ‘’గురించి కవిత రాసి మనః హృదయాలలో  అతన్ని నిలబెట్టాడు .ఇప్పుడు ఉప్పలధడియం వారు మళ్ళీ అలా అక్షర చలువ పందిరి వేశారు చలువరి కి.

సూర్యుడు కబేళాకు వెళుతున్న మేక పిల్లలా పడమరకు వెడుతున్నాడని ,మారాం చేసే కొడుకును ఆపలేక చితక్కోట్టిన తల్లి ‘’చిరుగు చీరతో  కళ్ళు ఒత్తుకుంటుంది  మళ్ళీ ‘’.సత్య సాయి బాబా ‘’మనుషుల్ని ప్రేమ స్వరూపులుగా సంభావించిన జ్ఞాన శిఖరం –ఆత్మ సౌరభ స్పృహ కలిగించే సత్యం –సమస్త లోకానికి శాంతిగీతం ‘’అని పించి ‘’అక్షరాంజలి ఘటించారు .కవిత్వానికి ఏ నిర్వచనమూ సరిపోలేదు కవిగారికి .కార్పోరేట్ ఆస్పత్రులలో ఎరగా అస్పష్ట చిత్రాలు ఆక్వేరియం లు ఉంటాయి .కాని అక్కడ ప్రాణం ఖరీదు ఎంత ఎక్కువో ఎవరికి తెలుసు ?’’(’’అ )మూల్యం’’ .అని వ్యంగ్యం .ఇల్లాలికికి ‘’నిద్ర మోయ లేని భారం ‘’ఆమె రెండు చేతులూ ‘’శత సహస్ర బాహువులై విస్తరిస్తాయి .రెండు కాళ్ళూ విరామం లేకుండా సంచరిస్తాయి .ఇదంతా ఎప్పుడు ?తెల్లారగట్ల .భర్తకు అన్నీ అందించాలన్న ఆరాటం తో .మరి ఆమెకు ఎమివ్వగ లడు ‘’నన్ను తప్ప ‘’అంటారు ‘’తెల్లార గట్ల ‘’కవితలో .చివరి మాట ఒక్కటి చాలు ఆమె చేసే సేవకు ప్రతిఫలంగా .

‘’మల్లెకు ఆశ ఆమె లా నవ్వాలని –గులాబీకి ఆశ –ఆమెలా మెరవాలని –శతపత్రానికి ఆశ –ఆమెలా వికసించాలని ‘’అంటూ ‘’ఈ పూలకు ఎంత దురాశో ! అని  ముక్తా యించారు .’’కలలకు ఆమె ఆసరా –అయినా –ఎంత నిష్టూరం గా మాట్లాడుతుందో !’’అదీ ‘’మూడు ముళ్ళ’’ బంధం లోని ప్రేమ ఆప్యాయత అనురాగం .’’ఆవిడకు ఓరోజంటే’’ఏమిటో తెలుసా ?’’నుదుటి బొట్టును తూర్పు గోడకు అంటించి దిగుతుంది ‘’బియ్యం లో వేళ్ళతో రాస్తుంటేనే పాకం కళే’’అని గ్రహించింది .ఇల్లు అంట్లు ధగ దగా మెరుస్తున్నాయంటే అది ఆమ్లాల శక్తికాదు ఆమె చెమట తో తడవటమే కారణం –అవసరాలు ఆకాంక్షలు కూర్చోనివ్వవు –ఇంటి పనికీ బయటిపనికీ –ద్విచక్రవాహనమై –తిరుగు తుంది ‘’’’ఆమె సిగ లో చేరలేని పూలన్నీ –ఆకాశం లో తారకలై –తృప్తి పడతాయి ‘’ఎంత గొప్ప భావాన్ని ఎంత కమ్మని  భాషలో గుండె లోతుల్లోంచి చూసి చెప్పారు వెంకటేశ్వర గారూ!

‘’విష సంస్కృతీ ని   విస్త రింప జేసే –వర్తమానాన్ని ప్రశ్నించ కుంటే –భవితవ్యమూ ప్రశ్నార్ధకమే –సహజీవన సౌరభం –గగన కుసుమమే ‘’అని హెచ్చరిస్తారు కర్తవ్య బోధ చేస్తూ .ఇదికవి  దార్శనికత  -చదరంగం ముందు కవిగారి అమ్మాయి కూచుని తండ్రిని ‘’రాయలు ‘’ను చేస్తుందట .నాన్న ను ఓడించేశానన్న సంతోషం తో ఆమె ఉంటె ‘’గెలుపును మించిన ఓటమి –మనసంతా చిత్తడి చిత్తడి ‘’పరమ వైభవ వర్ణన .పిల్లల చేతుల్లో ఓడిపోవటం లో ఉన్న మహాదానందానికి మచ్చు తునక ఈ కవిత. ‘’కవి’’ అంటే మనకవి గారు –‘’లోకం చుట్టూ తిరుగుతూంటా –అప్పుడప్పుడు –నాచుట్టూకూడా ‘’అని సహజ సుందర నిర్వచనం చేశారు .

ఇలా ఎన్నని ఉదహరించను ?ప్రతి కవితా ఆణి ముత్యమే –ప్రతి పంక్తి ‘’కోటబుల్ కోట్ ‘’ ఇవికాక ఇంకా ఎన్నో చెప్పాల్సినవి ఉన్నాయి .మచ్చుకు మాత్రమే నేను కొన్ని చెప్పాను .ఇష్టం ఉన్నవారికి ‘’హైకూ ‘’కూతలూ ఉన్నాయి .సుమారుగా 70 కవితలు .ప్రతిదీ చదివి ఆస్వాదించ దగినదే .చాలాకవితలు చెన్నై రేడియోలో  ప్రసిద్ధ పత్రికలలో వచ్చినవే .బహుమతులూ అందుకొన్నవే .కవిగారి కృషికి జేజేలు –పలుకుతూ సెలవ్ –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-6-15- ఉయ్యూరు

ప్రతులు కావాల్సిన వారికీ చిరునామా

Smt –V.Usha – No  1-A-4th street –V.V.colony –Adambakkam –chennai -88 –phone -044 -42028010 –price rs -60 .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’ సమీక్ష

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’

తమిళనాడు లో మద్రాస్ నగర జీవితానికి అలవాటుపడి హిందీ లో ఏం ఏ పి హెచ్ డి చేసి, పాలిటెక్నిక్ డిప్లోమో పొంది ,చెన్నై లో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా ఉంటూ శతకాలు కవితా సంపుటులు హిందీ వ్యాస సంపుటి ప్రచురించి ,’’జనని’’ పత్రికా సంపాదకత్వం వహించి కార్య దర్శియై ‘’నాగ భైరవ పురస్కారం’’ వంటి అపూర్వ పురస్కారాలు గ్రహించి ‘’షార్ట్ అండ్ స్మార్ట్ ‘’కవితా సంపుటి ‘’పాఠం’’వెలువరించిన డా . శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర  నా అడ్రస్ ఇంటర్నెట్ లో చూసి ,రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు కూడా చెప్పగా ఆపుస్తకాన్ని అత్యంత ఆదరం తో నాకు పంపటం నిన్ననే దాన్ని ఆసాంతం చదవటం రాత్రి వారి తో ఫోన్ లో సంభాషించటం జరిగింది .చిక్కని చక్కని కవిత్వం తో అలరించారు .ఉప్పలధడియం అనగానే మహానటులు చిత్తూరు వి. అంటే ఉప్పల దడియం నాగయ్య గారు జ్ఞప్తికి వచ్చారు .వారికీ వీరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీడు కాని నాగయ్యగారిదీ చిత్తూరు జిల్లాయే వీరి జననమూ ఆ జిల్లాలోనే . .

‘’పాఠం ‘’కవితలు నిజం గా అందరికీ పాఠాలునేర్పేవిగా నే ఉన్నాయి .ఇందులో మద్రాస్ నగరాన్ని ఎన్నో కోణాలలో ఆవిష్కరించారు డాక్టర్ గారు .పఠాభి అలానే రాశాడని జ్ఞాపకం .మళ్ళీ ఎవరైనా చెన్నై నగరాన్ని ఇలా రాశారో లేదో నాకు తెలియదు .కుందుర్తి నగరం లో వాన కూడా మదిలో మెదిలింది .ముందుగా కవి నగర వర్ణన గురించి తెలుసుకొందాం .’’నిర్నిద్ర నగర౦  ‘’కవితలో ‘’ఒంటరి నగరానికి –ఒంటి కంటి నిద్రే –ఆమాటకొస్తే మెలకువ కూడా ఒట్టి పర్రే’’అని నగర నిజాన్ని తెలిపారు .’’పాలపాకేట్టు ఒలికినట్లు తెల్లారి పోయిందట ‘’ గొప్ప ప్రయోగం .’’నగరం పై ప్రేమ గీతం ‘’వినిపిస్తూ ‘’ఒక స్వప్నం లోకి –ఒకానొక స్మ్రుతి లోకి –ఏక కాలం లో మేల్కొలిపే ఇంద్రజాలం ‘’గా నగరం కనిపించింది .నగరం లో వెలుగుకన్నా’’ చీకటి పొరలు ఎక్కువే ‘’ అయినా ‘’అదొక చైతన్య దీప్తి –ముందుకు నడిపించే మహా చోదక శక్తి ‘’అని పించింది .కవికి చెన్నై నగరం ‘’ఆ జన్మ సాహచర్యం ‘’అందుకే తనది అనుకొంటారు . నగరం అణువణువునా ఆయనలో అల్లుకొనే ఉంది .అన్నిపొరలు ఎలా ఎర్పడ్డాయోననే ఆశ్చర్యం ఉన్నా ‘’అనుభవం వేరు కదా !’’అన్నారు .చెన్నైలోని ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలతో కవికి అనుబంధం ఎక్కువ .’’అంశం ఏదైతేనేం వక్త ఎవరైతేనేం –అందరి హృదయాల్లో ప్రవహిస్తుంది –ఆర్ద్రంగా మన తెలుగు గంగ ,’’అని అదొక అమృత తరంగ అని ఫినిషింగ్ టచ్ ఇస్తారు .బహుశా తెలుగు సభలపై ఇంత భావుకతో  అనుభూతితో రాసిన కవిత లేదేమో ?బయట చీకట్లు అల్లు కొంటుంటే ‘’లోపల సాహితీ వెన్నెల కురుస్తుంది ‘’’అని సాయంత్రాలు కళా కాంతు లీనుతూ రాత్రిగా పరావర్తనం చెందడం అద్భుతమని పిస్తు౦ది కవిగారికే కాదు మనకూ .

‘’వేసవిలో నగరం’’ రోడ్లన్నీ తారుని స్రవిస్తాయి .ఆకాశ హర్మ్యాలు కడలిగాలిని కట్టడి చేయగా ఊపిరాడక ఇబ్బంది .నీడ అక్కడ ఎండమావే అనటం మంచిప్రయోగం మాత్రమేకాదు కాంక్రీట్ అరణ్యాల విస్తరణ ఫలితం కూడా .’’మిట్ట మధ్యాహ్నం వేళ’’సలసల కాగే నూనె నెత్తిన కుమ్మరిస్తున్నట్లు ఎండ కాస్తోంది .కాలికింద నేల బుసబుసా వేడి ఆవిర్లు చిమ్ముతోంది .గదిలో పంఖా సెగలు కక్కుతోంది –ఇంటా బయటా అగ్ని గుండమే ‘’ఈ బాధ భరించలేక ఎవరిని నిందించాలో తెలీక నిస్సహాయం గా స్వేద ధారగా కరిగి  పోవటమే జీవితం ‘’..ఎండ ఇ౦త మడిస్తుంటే మరి వర్షాకాలం ?’’వానకు నగరం అతలాకుతలమై ‘’బంగాళాఖాతం పాయలై పారుతున్నట్లు ‘’వీధులన్నీ నీళ్ళ మయం .దీనికి తోడు’’ విస్పోటన సంరంభం ‘’తో వీచేగాలి కి నగరం నిలువెల్లా గజగజ .మట్టినీ చెట్టునీ మింగేసిందిట మహా నగరం .యెంత ఎండ అయినా  భరిస్తారు కాని జనం నాలుగు వానచినుకులకే అల్లాడి పోవటం విడ్డూరం .మానవ ప్రక్రుతి అది .అంతే .

మద్రాస్ మెరీనా బీచ్ సాయంత్రాన్ని రాత్రిగా మారుస్తుందట. స్థలకాల స్పృహే లేని మహా సౌందర్యం లో లీనం చేస్తుందట .మహానగర సోకు పైపైన కనిపించే డాబు .కాలువలు పూడ్చి కట్టిన హర్మ్యాలు .మనో వేగంగా వాహనాలు .జడివానకు రోడ్లూ ఇళ్ళూ ఏకం .హోరుగాలికి చెట్లు  దుంగలే అవుతాయి భరోసా లేని జీవితం ఇది .నగరంపై ‘’ఎప్పుడూ ఎగురుతుంది పదో అంకె ప్రమాద సూచిక –కనిపించీ కనిపించ కుండా ‘’ఇవన్నీ వెంకటేశ్వర గారి స్వీయ అనుభూతులే అవి కవితామృతం మారి మనకు ,సాహిత్యానికి అమరత్వం కల్పిస్తున్నాయి .ఏ కవితలో చూసినా పదాలు వాటంతటికి అవి  వచ్చి చేరి కూర్చుని సార్ధక మయినట్లు ,భావానికి తగిన శబ్దం తన విలువను నిరూపించుకోన్నట్లు కనిపిస్తుంది .రస సిద్దుడైన కవి మనకు ప్రత్యక్ష మౌతాడు.

కవిగారు కొన్ని ప్రదేశాలను చూసి అక్కడిఅనుభూతులనూ కవితలలో అందంగా అమర్చారు .అవీ చాలా సార్ధకమై విలువను పొందాయి .అస్సాం లోని గౌహతికి వెళ్తే హోటల్ గది ‘’నిరుపహతి స్థలం ‘’గా పెద్దనగారికి లాగా అనిపించింది .’’ఎన్ని నక్షత్రాల హోటలైనా ఇల్లు అవదు అని  ఎరుక కలిగింది .ఇంటిమీది జ్ఞాపకాలతో రాత్రి దహించిపోయింది  . బ్రహ్మ పుత్ర నది మహా మాయలాడి –బతికించిన మనుష్యులనే బలి  గొంటుంది .అలాంటి నదిలో పడవ ప్రయాణంచేయాలి ప్రాణాలు అర చేత బట్టుకొని ‘’కామాఖ్యమ్మ ‘’పై భారం వేసి . ఇక్కడే ‘’చూస్తుండగానే ‘’కవితలోపడవలో చీకటి వేళ  ఇంటికి వెడుతున్న మిత్రుడు-‘’క్షితిజ రేఖ కేసి బ్రాహ్మ పుత్ర ప్రవహిస్తుంటే  చీకట్లో ఉవ్వెత్తున కెరటం ఎగిసి పడి కళ్ళల్లో గుచ్చుకొంది ‘’అని చెప్పారు .అంటే స్నేహితుడు జలసమాధి చెందాడని అంతరార్ధం . ‘’మదనపల్లి ‘’చుక్క రాల్చని నింగి –నెర్రవారిన నేలా ‘’కుమ్మక్కు అయినట్లుగా ఉందట .ఆశ ఆవిరై కళ్ళు శూన్యాన్ని వరిస్తే కాళ్ళు  సరిహద్దుల్ని పునర్లిఖిస్తున్నట్లుంది .’’హంపి ‘’లో రాగ ఝారి ప్రవహించింది .ఒకసారి పురావైభావం గుర్తొచ్చి ‘’గాలి వేళ్ళు అలల తీగల్ని మీటు తుంటే –ఏ వసంతోత్సవం లోనో ‘’అక్కడ పద్యం చదివిన గుర్తు .’’తల కోన ‘’అందాలనూ వొడిసి పట్టారుకవి .’’పచ్చని చీరలో –కొత్త పెళ్లి కూతురులా కొండ మెరిసి పోతోంది ‘’ట .జలపాతం వెండి తోరణం లా వేలాడుటూ రాతి తబలాల పై మూర్చనలు పోతోంది ‘’ట .మహా గొప్ప భావ చిత్రం .’’పాండిచ్చేరి ‘’లో జాలరి సాహసి .బుల్లిపోట్ట కోసం సాహసమే శస్త్రం గా ,నమ్మకమే కవచం గా ‘’సముద్ర యుద్ధం చేస్తాడు .అనుకోకుండా కడలి కాల సర్పమై బుస కొడితే క్షణమొక యుగమే అతనికి .ఎలాగోఅలా గట్టెక్కితే ‘’ గట్టవతల  తిమింగిలాలు ‘’గుటుక్కున మింగేస్తాయి ‘’అని దళారీ సామ్రాజ్యపు తిమింగిల కోరల్లో నలిగిపోతున్న జాలర్ల బతుకుని చక్కగా ఆవిష్కరించారు .’’మైసూరు ప్రయాణం లో పదనిసలు ‘’లో బట్టలకు బదులు  పుస్తకాలే సర్డుకొన్న అక్షర జీవిగా కవి కనిపిస్తాడు .పుస్తకం తెరిస్తే లోకమే కనిపించదు. భార్య ఫోన్ చేసి బట్టలు కొనుక్కోమనే దాకా .’’హార్స్లీ కొండలు ‘’అక్కడే  ఉండిపొమ్మంటాయిట.నీళ్ళూ చీకటి రాహు కేతువుల్లా సూర్యుడిని మింగుతుంటే కొండను మోసుకొని వెనుదిరుగుతాడటకవి ..బెంగళూరు నగరం లో స్నేహితులతో చెట్టాపట్టాలేసుకొని  తిరిగిన కవి పెళ్ళయ్యాక ‘’ఒక్క బంధం కోసం ఎన్నో బంధాలు కోల్పోయాను ‘’అని మధన పడతారు  .’’కొడైకెనాల్’’ లో తాను  ఒంటరిని కాదని చెట్లూ పూలు వాగులూ తన నేస్తాలేనని భావించారు .తిరునల్వేలి పై ‘’ఖాళీ ‘’కవితలో ‘’గదిలో గోడగడియారం ‘’అవే అంకెల చుట్టూ పదే పదే తిరుగుతున్నట్లని పించింది .గది ఖాళీ చేస్తే గణాంక పుస్తకం మినహా మరేమీ మిగలదు ‘’అన్నారు .’’అరకు ‘’లోనిగిరిజన తండాను చూసిన కవిగారి పిల్లలు అక్కడ వారు వాడే  చింకి చాప , మట్టికుండా , రుబ్బు రోలు ,పూరిపాక చూసి అవి ఎవరివి అని అడిగితె ‘’మనవేరా కన్నా ! మన పూర్వీకులవి ‘’అని మాయ మాట చెప్పి ఆ గిరిజన దీన స్తితిని మనకళ్ళ ముందుంచారు కవి .

మిగిలిన కవితల గురించి ఈ సారి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-15 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కీ శే.డా.వల్లభనేని రామ కృష్ణా రావు గారి పత్ని శ్రీమతి అరుణకుమారిగారు ఉయ్యూరు చూడాలని మా ఇంటికి 2-6-15 మంగళవారం వచ్చిన సందర్భం గా ఫోటోలు 

మాకు ఉయ్యూరు హైస్కూల్ లో మాస్టారు ,తర్వాత అదే స్కూల్ లో మా సహ ఉపాధ్యాయులు  మాకు మెంటార్ ,విశాఖ పట్నం ఆంధ్రా యూని వర్సిటిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయి అక్కడే స్తిరపడి అక్కడి యూనివర్సిటి తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య  శ్రీమతి అరుణ కుమారిగారిని  వివాహం చేసుకొని   అయిదారేళ్ళ క్రితం చనిపోయిన  గండి గు౦ట గ్రామవాసి మా గురువుగారు కీ శే.డా.వల్లభనేని రామ కృష్ణా రావు గారి పత్ని శ్రీమతి అరుణకుమారిగారు ఉయ్యూరు వచ్చి ప్రత్యేకం గా నన్ను చూడాలని మా ఇంటికి 2-6-15 మంగళవారం వచ్చిన సందర్భం గా ఫోటోలు DSCN1455 DSCN1456 DSCN1457 DSCN1458 DSCN1459 DSCN1460 DSCN1461 DSCN1462 DSCN1463

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా లోని షార్లెట్ నుంచి వచ్చిన మా పక్కింటి లేక్కల master ఉమామహేశ్వర రావు గారబ్బాయి ప్రసాద్

మా ఇంట్లో అమెరికా లోని షార్లెట్ నుంచి వచ్చిన ఉయ్యూరులో మా పక్కింటి లేక్కల master ఉమామహేశ్వర రావు గారబ్బాయి ప్రసాద్

 

DSCN1451 DSCN1452 DSCN1453 DSCN1454

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )

మానవత్వ ద్వేషి –మానవ హితైషి

 

ఈ రకమైన కుటుంబ విషాదాలు మార్క్ ట్వేన్ జీవితం లో మార్పులు తెచ్చాయి .మనుష్య ద్వేషిగా సర్వ ప్రపంచ ద్వేషి గా ఉన్న ఆయన  సమతుల్యత లో పడ్డాడు .జీవిత చరమాకం లోని 15ఏళ్ళు ,పూర్వ జీవితం లో ఎంత రాశాడో అంతే కాక ఎక్కువ కూడా  రాశాడు అదీ ట్వేన్ గొప్పతనం .అయితే ఇవి సగం సగం రాతలుగా మిగిలాయి .వీటిలో మానవ ప్రవ్రుత్తి ,విధి, ,గౌరవ౦ ,నీతి ఎక్కువ .అన్ని రకాల ఫీలింగ్ లకు స్థానం కల్పించాడు అమెరికా దేశపు రిపబ్లిక్ పాలన మిగిలిన దేశాల పూర్వపు రిపబ్లిక్ లలాగే అంత రించి పోతుంది అనుకొన్నాడు .దీనికి కారణాలు అవినీతి ,పిరికితనం మానవ స్వభావం గా భావించాడు .’’వాట్ ఈజ్ మాన్ ‘’అని ఒక పుస్తకం రాశాడు .శతాబ్దం మారిన తోలి రోజుల్లో రాసిన ఈ పుస్తకం 1906లో ముద్రణ పొందింది .కార్య కారణాల చర్చ చేశాడు ఇందులో  .’’He castigated humanity but he loved people ,especially the people of his time and place ‘’.’’ప్రిన్స్ అండ్ పాపర్ (రాజు –పేద )నవలలో ను’’ జోన్ ఆఫ్ ఆర్క్ ‘’లో ఫ్రెంచ్ చరిత్రను చేర్చాడు .ఈ రెండు తన అద్భుత నవలలు అన్నాడు మార్క్ ట్వేన్ .కాని ఫలితాలు ఆశావహం గా రాలేదు .అమెరికాలో ఉన్నంత హాయి, గుర్తింపు ఇతర దేశాలలో పొందలేక పోయాడు .

స్వచ్చతకు మారుపేరు తెల్లని వస్త్ర ధారణ

అరవైలలో నల్లని చిక్కని జూట్టు పల్చబడి తెల్లబడింది .మొదటి నుండి అలవాటైన తెల్లని వస్త్రాలే ధరించేవాడు కళ్ళల్లో చురుకుదనం తగ్గ లేదు మీసం ఆయన వ్యక్తిత్వానికి చిహ్నం గా మారింది .బతికి ఉన్న ఒకే ఒక కూతురు క్లారా పియానిస్ట్ ఆసిప్ గాబ్రిలోవిచ్ ను పెళ్లి చేసుకొన్నప్పుడు మాత్రం తెల్ల వస్త్రాల బదులు  ఆక్స్ ఫర్ యూని వర్సిటి డాక్టర్ ఆఫ్ లిట రేచర్ ప్రదానం చేసినప్పుడు ధరించిన  స్కార్లెట్ రంగు బట్టలు కట్టుకొన్నాడు . కనెక్టి కట్ లోరెడ్డింగ్ వద్ద  తనకు కావలసిన రీతిలో చక్కని ఇల్లు కట్టుకొన్నాడు .కాని ఇక్కడ ఎక్కువ కాలం ఉండకుండా నే చనిపోయాడు .తన జీవితం హెయిలీ తోక చుక్కతో ముడి పడి ఉంది అని భావించేవాడు .అది కనిపించినప్పుడు జన్మించి మళ్ళీ 75 ఏళ్ళకు కనిపించిన తర్వాతా 21-4-1910 న మరణించాడు .

అమెరికా కొత్త సాహిత్య ప్రపంచ సృజన

అమెరికన్ సాహిత్య సరిహద్దు అన్వేషకుడు మార్క్ ట్వేన్ .విషయ౦  లో, శైలిలో అద్వితీయుడే .కొత్త సాహిత్య ప్రపంచాన్నే సృష్టించాడు.తాను  చూసింది తెలుసుకొన్నది అంతా తన రచనలలో నిక్షిప్తం చేశాడు ప్రజల జీవన విధానం, భాష ,ప్రవర్తన అలవాట్లు, భయాలు ,విశ్వాసాలు ,కోరికలు,అంతరంగాలు అన్నీ అందులో పొదిగాడు .ఆ ప్రజల ప్రతినిధిగా రాశాడు .అమెరికా రాష్ట్రాల ప్రజల మనోభావాలకే ఆయన రచనలు  ప్రతినిదులైనాయి .నేటివిటి ప్రతి రచనలో ప్రతి ఫలించింది .ఇదే ఇతరులకు మార్గ దర్శకమైంది ‘’all modern American literature comes out of one book by Mark Twain called ‘’Huckleberry Finn .All American writing comes from that . There is nothing before .There has been nothing as good since ‘’. అని మరో అమెరికన్ ప్రసిద్ధ నవలా రచయితా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎర్నెస్ట్ హెమింగ్ వే చెప్పాడు ఇది అక్షర సత్యం .

భాష మీద అనితర సాధ్యమైన పట్టు సాధించి దానిలోనూ మార్గ దర్శి అయ్యాడు మార్క్ ట్వేన్ .తన మార్క్  ను సృష్టించు కొన్నాడు .మాట్లాడే భాషకు రాసే భాషకు ఉన్న అనేక అంతరాలకు  స్వస్తి పలికి మాట్లాడే భాషనే రాసేభాషగా తీర్చి దిద్ది కొత్త సాహిత్యభాషకు ఒరవడి పెట్టాడు .అంతకు ముందు ఏ రచయిత ఈ సాహసం చేసి ఉండలేదు .అదీ అతని క్రెడిట్ .నూతన సాహిత్య పరిభాష హాస్యం లో కొత్తపద సృష్టి వ్యంగ్యం లో వినూతనత్వం ఆయన తెచ్చినవే .చాల సులభం గా అతి సహజం గా భాషను వాడాడు .భాషలో జీవం నింపాడు .ప్రజలలోవ్యాపించి ఉన్న పదాలకు సాహితీ గౌరవం కలిగించాడు .ఈ పదాలు మనవే మనం మర్చిపోయాం అని గుర్తు చేశాడు .మన భాష ఇంత మహాత్తరమైనదా అని ఆశ్చర్య పోయేట్లు రాశాడు .అతని రచనలో వ్యంగ్యపు చురుకు పాలు అవహేళన చెన్నాకోలు దెబ్బలు ఉంటాయి .చురుక్కుమన్నా మహా సంతోషం గా ఉంటుంది .ఆయన పదాలు పదబంధాలు గొప్ప ఉదాహరణలుగా సాహిత్యం లో నిలిచిపోయాయి .ఆయన ఏది రాసినా ,ఏది చెప్పినా ఒక సాహిత్య క్రీడగానే భావించారు .అమెరికా జాతి మానవ మనసులను ,మనుష్యులను ఇంత గొప్పగా ఆవిష్కరించిన రచయిత అంతకు ము౦దు ఎవ్వరూ లేరు .ఆయనకున్న ఆలోచనా ఎవరికీ రాలేదు .అందుకే చరితార్ధుడు చిరస్మరణీయుడు అయ్యాడు మార్క్ ట్వేన్ .ఆయన సృజనకు జోహార్లు .

మార్క్ ట్వేన్ చేసిన చమత్కారాలు చూపిన చెమక్కులు ఎన్ని చెప్పినా తనివి తీరదు .కొన్ని ఆయన మాటల్లో చదివితేనే అందులోని సొగసు చూడగలం .అవి ఆ నాటి నుండి సాహిత్యం లో గొప్ప ఉదాహరణలుగా కోటబుల్ కోట్స్ గా చలామణి లో ఉన్నాయి –

1-To be good is noble ,but to show others how to be good is nobler and no trouble .

2-Good breeding consists in concealing how much we think of ourselves and how little we think of the other person .

3-Of all God’;s creatures there is only one that can not be made the slave of the lash .That one is the cat .If man could be crossed with the cat it would improve man  but it would deteriorate the cat .

4-If you pick up a starving dog and make him prosperous ,he will not bite you >this is the principal difference between a dog and a man .

5-man is the only  animal that blushes . or needs to

6- prosperity is the best protector of principle

7- In the first place God made idiots .This is for practice .

8-When in doubt tell the truth .

మార్క్ ట్వేన్ ప్రభావం

మార్క్ ట్వేన్ జీవించిన కాలం లో ఆయన ప్రభావం ఎంత ఉండేదో చెప్పటం కష్టం .ఈ నాడు మాత్రం ‘’ది అడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ ‘’మాత్రం బాల సాహిత్యం లో మహోత్క్రుస్ట మైనదిగా గుర్తింపు పొందింది .కాని దానినే 1877 లో రివ్యు చేసి ‘’అనవసర చెత్త ‘’అన్నారు .యాభై ఏళ్ళ వయసులో ట్వేన్ రాసిన హకల్ బెరిఫిన్ నవల పెద్దగా సంచలనం సృష్టించలేదు .ఇది  టాం సాయర్ వచ్చిన తొమ్మిదేళ్ళకు వచ్చింది .దీన్ని టాం కు సీక్వెల్ అనుకొన్నారు .సాంకేతిక దృష్ట్యా హకల్ బెరిఫిన్ భాషా శాస్త్ర పరంగా గొప్ప విజయమే సాధించింది .మాండలికం అమెరికన్ సాహిత్యం లో మొదటి సారిగా ప్రవేశించింది ఈ నవల ద్వారానే .అదొక ఘన విజయం .ఇందులో ఏడు రకాల మా౦డలీకాలున్నాయని పరిశోధనలో తెలిసింది .ఒక్కవాక్యం లో దీన్ని ‘’half comic ,half perilous saga ,a boy’s odyssey which has become a national myth ‘’అన్నారు .

మార్క్ ట్వేన్ కు కౌమార దశ అంటే అమితమైన అభిమానం .అది అప్పుడే జరిపోయిందే అనే బాధ కూడా ఉండేది .అదొక స్వర్గ సీమ అనుకొనేవాడు .ఆయన తాను వివాహ ద్వేషి (misogynist ) స్త్రీ ద్వేషి అని ధైర్యం గా చెప్పుకోలేని పిరికి వాడు  అన్నారు విమర్శకులు .కాని మగవారి గురించి ఎంత రాశాడో ఆడవారి గూర్చికూడా అలానే రాశాడు .అయితే చీము నెత్తురు రక్తం  మాంసం ఉన్న వ్యక్తిత్వం గల మహిళలు ఆయన రచనలో కనిపించరు అనే అభియోగం ఉంది .కాని మార్క్ ట్వేన్ తన భార్య దృష్టిలో ఎప్పుడూ ‘’యూత్ ‘’యే.

మార్క్ ట్వేన్  సాహిత్య పదాలలో  ‘’soil and soul ‘’ప్రతి చోటా దర్శనమిస్తాయి .లూయీ అంటర్ మేయర్ మార్క్ ట్వేన్ ను ‘’paradox is the very key to the conflicts which while they made  Mark Twain creatively mature ,kept him from growing up emotionally .A self confessed ,self divided spirit ,holding all the contra dictions together ,there remains the rude but loving skeptic ,the free and un flinching chronicler who was also the innocently swaggering ,endlessly resourceful ,,and eternally impressive boy ‘’ను అభి వర్ణించాడు .

శాస్త్ర సాంకేతిక జ్ఞానం

శాస్త్రీయ పరిశోధన అంటే మార్క్ ట్వేన్ కు అమితాసక్తి .స్నేహితుడు నికోలా టెస్లా తోకలిసి టెస్లా కున్న లేబరేటరిలో పరిశోధనలు జరుపుతూ గంటలకొద్దీ కాలం గడిపేవారు .మూడు పరిశోధనలకు పేటెంట్ హక్కు పొందాడు .ఆయన రాసిన ‘’కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్ధర్స్ కోర్ట్ ‘’నవలలో ‘’టైం ట్రావెల్ ‘’విషయాన్ని ప్రస్తావించాడు .ఇది అప్పటి సమకాలీన ఆవిష్కరణ .ఆర్ధర్ గారి ఇంగ్లాండ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాడు .ఇదే తర్వాతా సైన్స్ ఫిక్షన్ లో ‘’ఆల్టర్ నేట్ హిస్టరీ ‘’గా గుర్తింపు పొందింది .1909లో ప్రముఖ శాస్త్రీయ పరిశోధకుడు ఎడిసన్ మార్క్ ట్వేన్ నివసిస్తున్న కనెక్టికట్ లోని రెడ్డింగ్ కు వచ్చి అతని పరిశోధనపై రెండు రీళ్ల షార్ట్  ఫిలిం షూట్ చేశాడు .అదొక్కటే ట్వేన్ జీవితం పై చిత్రించబడిన ఒకే ఒక్క ఫిలిం .

లేబరేటరిలో మార్క్ ట్వేన్ -1894

మని కలెక్టింగ్ స్పీకర్

సునిసిత మైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి స్పాంటేనియస్ గా మాట్లాడటం మార్క్ ట్వేన్ గొప్పతనం .ఇదే తర్వాత కాలం లో ‘’ స్టాన్డప్ కామెడి ‘’గా గుర్తింపు పొందింది .ఎన్నో క్లబ్బులలో ‘’ పెయిడప్ టాక్స్ ‘’ఇచ్చాడు  .లండన్ సావేజ్ క్లబ్ లో కూడా మాట్లాడి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు .ఇంతటి అరుదైన గౌరవం పొందినవారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తో సహా ముగ్గురే ముగ్గురు .వియన్నా వెళ్లి అక్కడిక్లబ్ లో ‘’జర్మనీ భాషలో దారుణాలు ‘’(హారర్స్ ఆఫ్ జెర్మని లాంగ్వేజ్ ) అనే విషయం పై మాట్లాడి అందరిని మెప్పించాడు .ప్రిన్స్ టన్  యూని వర్సిటి లో ఉపన్య సించి దాని గౌరవ సభ్యుడయ్యాడు .

బాలికల క్లబ్

ఆడ పిల్లలను కోల్పోయిన మార్క్ ట్వేన్ 1906 లో ‘’’’ఏంజెల్ ఫిష్ అండ్ ఆక్వేరియం క్లబ్ ‘’స్థాపించి బాలికలను ఆహ్వానించి తన దియేటర్ లో  నాటికలు ఆడామని  సంగీతకచేరీలు చేయమనేవాడు .’’నా జీవిత ముఖ్య ఆనందం ఈ క్లబ్ ‘’అని రాశాడు .1908లో .ఏంజిల్ ఫిష్ బాలికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .

ఘన నివాళి

మార్క్ ట్వేన్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ విలియం హోవార్డ్ టాఫ్ట్’’మార్క్ ట్వేన్  బౌద్ధిక విజ్ఞానాన్ని  హాస్య వ్యంగ్య ఆనందాన్ని లక్షలాది ప్రజలకు అంద  జేశాడు   ఇంకా ఎందరినో ప్రభావితం చేశాడు. ఆయనది అమెరికా హాస్యం .ఆయన రచనలను ఇంగ్లాండ్ దేశం తో సహా అనేక దేశాలు చదివి అభినందించాయి. అమెరికా సాహిత్యానికి అరుదైన గుర్తింపు మార్క్ ట్వేన్ వలన లభించిందన్నది పరమ సత్యం ‘’అని ఘన నివాలులర్పించాడు .

అందరివాడు

ఇ౦పీరియలిజానికి మార్క్ ట్వేన్ వ్యతిరేకి .స్పష్టంగా దీన్ని తెలియ జేశాడు .జాతి వివక్షత ను కాదన్నాడు .మహిళాహక్కులు కావాలన్నాడు . స్త్రీలకు వోటుహక్కు ఉండాలని ‘’వోట్స్ ఫర్ వుమెన్ ‘’.అనే ఉపన్యాసం లో చెప్పాడు .అంధ రచయిత’’ హెలెన్ కెల్లర్’’విద్యా పురోభి వృద్ధికి సహకరించాడు .’’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’లో రాసిన బోటింగ్ ఇండస్త్రి లోని ‘’యూనియన్ ‘’ల గురించి రాసిన వాటిని ఇప్పటికీ యూనియన్ హాళ్ళలో చదువుతున్నారంటే ఆయన రచనా ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది .’’కార్మిక ఉద్యమం ‘’ను మార్క్ ట్వేన్ ప్రోత్సహించాడు .

 

మార్క్ ట్వేన్ పూర్తీ

డి లిట్  ట్వేన్

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట డుర్గా ప్రసాద్ -1-6-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండుకవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రప్రభ ”యాప్ భలే- భలే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రక్రియల్లో రసం ధ్వని ఏవి ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అతిశయోక్తులు అనుచితోక్తులు -ఆంధ్ర భూమి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తారుమారు కధలు చదివితే మారుతారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేవంత్రెడ్డి ని బుక్ చేశారు .నాకె పాపం తెలియదన్న రేవంత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చస్తూ ప్రతీకారం తీర్చుకున్న సొరచేప

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాజిక్ రియలిజం కు ఆద్యుడు -గుంటర్ గ్రాస్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శత జయంతి -కధల్లో లైంగిక శ్రమ విభజన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంత ”వడ” చరిత్రలో అయిదవ సారి-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బయ్య గారి మునిమనవడు ఉపనయన వేడుక

మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బయ్య గారి మునిమనవడు(కుమార్తె శ్రీమతి మనోహరి మనుమడు -రమేష్ కుమారుడు )ఛి శరశ్చంద్ర లోచన్ ఉపనయన వేడుకల ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భాషకి ప్రాణం వ్యాకరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడుకొండలపై ”బొయనాయుడు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు వేల ఏళ్ళ నాటి గాజు పరిశ్రమ -భువన గిరి వద్ద లభించిన ఆధారాలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపమహిమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందువులు అంటే ఎవరు ?డా అరవిందరావు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

2014 నంది నాటక అవార్డులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూట్ కేసు కన్నా సూటూ బూటూ మిన్న -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాట్ హాట్ ధిల్లీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలుష్యతాపం!

కాలుష్యతాపం!

  • 30/05/2015
TAGS:

ఆకుపచ్చదనానికీ ఎండవేడిమికీ మధ్యగల విలోమ సంబంధం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాలుష్యానికి వేసవి అగ్నికీలలకూ మధ్యగల అనులోమ అనుపాతం గురించి శాస్తవ్రేత్తలు చర్చిస్తున్నారు, సలహాలిస్తున్నారు. పచ్చని చెట్లు ఆకుపచ్చని పొలాలు పెరిగితే ఎండవేడిమి తగ్గిపోతుందన్నది విలోమ అనుపాతం- యాడ్వర్స్ రేషియో- పరిసరాలలో కాలుష్యం పెరిగినట్లయితే ఉష్ణోగ్రత కూడ పెరిగిపోవడం అనులోమ అనుబంధం-డైరెక్ట్ రేషియో- ఉభయ తెలుగు రాష్ట్రాలు పదిరోజులకు పైగా నిప్పుల కుంపట్లుగా మారడం ఈ చర్చలకు నేపథ్యం, గ్రీష్మతాప శరాఘాతాలకు ఉభయ రాష్ట్రాలలో తొమ్మిది వందలమంది ఆహుతైపోవడం అభూతపూర్వ విషాదం…ఉభయ రాష్ట్రాలలోను ఆకుపచ్చని స్థలాలు నానాటికీ సన్నగిల్లిపోతుండడం వల్ల రానున్న వేసవి ఋతువుల్లో ఉష్ణోగ్రత యాభయి డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరకు చేరే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. ప్రధాని నరేంద్రమోదీ నియమించిన వాతావరణ అధ్యయన మండలి సభ్యులు ‘పచ్చదనం పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని’ సూచించారట. ఈ ఏడాది సగటున రాష్ట్రంలో నలబయి నాలుగు డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇంతమంది ప్రాణాలు ఎండ మంటలలో మాడిపోయాయి. కొన్ని చోట్ల నలబయి ఆరు డిగ్రీలకు ప్రస్తుతం ఉష్ణోగ్రత పెరిగింది. అందువల్ల రానున్న సంవత్సరాలలో యాబయి డిగ్రీల సెంటీగ్రేట్-నూట ఇరవై రెండు ఫారెన్‌హీట్- డిగ్రీలకు వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినట్టయితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందన్నది ఊహించుకోవచ్చు. అటవీ విధ్వంసం వల్ల, రసాయన రసాయనేతర విష కాలుష్యం వల్ల ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏటా ఉష్ణోగ్రత పెరిగిపోతోందని దశాబ్దులుగా ఆందోళన వక్తం అవుతూనే ఉంది. అయితే మనదేశంలోను పరిసరాలలోను ప్రపంచస్థాయిని మించి ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇందుకు కారణం పచ్చదనం క్రమంగా అడుగంటి పోతుండడం. మూడువందల ఇరవై కోట్ల మొక్కలను పెంచడం ద్వారా ప్రకృతి ప్రాంగణంలో ఆకుపచ్చని అందాల సభలు తీర్చాలన్న తెలంగాణ ప్రభుత్వం వారి సంకల్పం అభినందనీయం…ఈ మొక్కలన్నీ పెరిగి పెద్దవై వృక్షాలుగా విలసిల్లినట్లయితే వేసవి అగ్నిని ప్రతిఘటించగల చల్లదనం విస్తరిస్తుంది. కానీ ఈ మొక్కలు నాటడానికే అనేక ఏళ్లు పడుతోంది. అవి అవినీతి మచ్చనిచ్చే చెట్లుగా మారడానికి ఎంతకాలం పడుతుందో? సమాంతరంగా పారిశ్రామిక వాణిజ్య వాటికలకోసం ఎంత విస్తీర్ణంలో అడవులు, పొలాలు అంతరించిపోతాయి? ప్రపంచీకరణ ప్రకృతి పచ్చని పటానికి కన్నాలు వేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం.
కాలుష్యం వల్ల వేడి పుట్టడం కాలుష్యం పెరిగిన కొద్దీ వేడి పెరగడం విశ్వ వ్యవస్థలోని సహజ పరిణామక్రమం. కాలుష్యాన్ని నిర్మూలించకపోయినట్టయితే కాలుష్యం క్రమంగా భూమిని కబళిస్తుంది. కృతయుగంలో క్షీరసాగర మథనంలో పుట్టిన కాలుష్యం-హాలాహలం- భయంకరమైన వేడిని వ్యాపింపజేయడం చరిత్ర…ఆ విషాన్ని పరమశివుడు మిం గడం వల్ల బయట వేడి తగ్గినప్పటికీ లోపలి వేడి పెరిగింది. ఆ వేడిని చల్లార్చడం కోసమే ఆకాశంలోని గంగ భువికి దిగింది. గంగ నీటికి ప్రతీక. నీరు కాలుష్యాన్ని కడిగివేస్తుంది. కడిగివేయాలన్నదే భారతీయుల తరతరాల ఆకాంక్ష. ‘ఆపఃపునస్తు పృథివీ, పృథివీ పూతాపునాతుమామ్’’- నీరు భూమిని శుభ్రం చేయుగాక, శుభ్ర పడిన భూమి మమ్ములను పరిశుభ్రం చేయుగాక- అన్నది మన జాతీయ సమష్టి జీవన సంప్రదాయం. నీరు పరిశుభ్రంగా విస్తరించిన కొద్దీ మొక్కలు తీగెలు చెట్లు వనాలు బతికి పచ్చదనాన్ని పంచుతాయి. మనదేశం అంతటా బావులు చెరువులు, గుడులు, మడుగులు, కోనేళ్లు, కొండవాగులు, బుగ్గలు, విస్తరించడం పచ్చదనపు చరిత్ర…బ్రిటిష్ వారు మనదేశంలోకి చొరబడిన తరువాతనే అటవీ సంపద హరించుకొని పోయింది. ప్రతి దేశంలోను మొత్తం భూమిలో కనీసం ముప్పయిమూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలన్నది ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం వారు 1950వ దశకం నుండి చెబుతున్న మాట. మొదట ప్రపంచ యుద్ధానికి పూర్వం మనదేశం యాబయిశాతానికి పైగా భూభాగంలో అడవులు ఉండేవి. ఆవులు, పశువులు, మేయడానికి వీలైన పచ్చిక బయళ్లు ఉండేవి. కాని ఇప్పుడు మన అటవీ ప్రాంతం పరిమాణం ఇరవై నాలుగు శాతం కంటె తక్కువ.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోను, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను బ్రిటిష్ వారు భారీగా మన అడవులను నరికి కలపను తమ దేశానికి, ఇతర దేశాలకు తరలించారు. చల్లని నీడను కొల్లగొట్టడానికి అది ఆరంభం. మొక్కలు, చెట్లు తగ్గిపోతున్న కొద్దీ వేసవి అగ్నిగుండంగా విస్తరించడం ఆరంభమైంది. ఈ వాస్తవ ధ్యాస ఉన్నప్పటికీ 1947నుండీ కూడ మన ప్రభుత్వాలు అటవీ విధ్వంసాన్ని ఆపకపోవడం మొదటి వైపరీత్యం. 1990వ దశకంలో ప్రపంచీకరణ వ్యవస్థీకృతం కావడంతో పచ్చదనపు వాటికలు పాడుబడి సిమెంటు రహదారులు విస్తరించడం మొదలైంది. ఇది రెండవ వైపరీత్యం. ప్రపంచీకరణలో భాగం గా బహుళజాతీయ వాణిజ్య సంస్థలు చొరబడిపోయాయి. దేశమంతటా వెలసిన ప్రత్యేక ఆర్థిక మండలాలు లక్షలాది ఎకరాల అటవీ వ్యవసాయ భూమిని దిగమింగుతుండడం గ్రీష్మతాపం భయంకరంగా పెరుగుతుండడానికి దోహదం చేసింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పారిశ్రామిక ప్రగతిలో భాగంగా కొండలను ఇసుక పర్రలను తవ్వేశాయి. ఫలితంగా కొండవాగులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. చెట్లు ఎలా పెరుగుతాయి? సతతహరిత ప్రాంతాలయిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మోడు వారడం ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం. అటవీ ప్రాంతం కనీసం ముప్పయిశాతానికి చేరేవరకు ఒక్క ఎకరం భూమిని కూడ పరిశ్రమలకు కేటాయించరాదన్న ధ్యాస ప్రభుత్వాలకు కలిగే వరకు ప్రతి ఏడాది మరింతగా ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. వేసవి మరణాల సంఖ్య మరింత పెరగకుండా నిరోధించడానికి ఈ ధ్యాస అనివార్యం…
కానీ పచ్చదనం పాలిట కరకు కసాయి గొడ్డలిలా తయారైన ప్రపంచీకరణ మరింత బలపడుతోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలన్న పట్టుదల వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుందన్నది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ఢిల్లీలో చేసిన చారిత్రక ప్రకటన. అంటే అడవులను పచ్చదనాన్ని కాపాడడం కంటె కృత్రిమమైన పారిశ్రామిక కాలుష్య వాటికలు ఏర్పడడం ప్రధానమన్నమాట. ఈ కాలుష్య వాటికలు ప్రత్యేక అర్థిక మండలులు..ఉష్ణోగ్రత పెరగకుండా ఎలా నిరోధించగలరు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పచ్చదనానికి విఘాతకరమైన పారిశ్రామిక విధానాన్ని కొనసాగిస్తోంది. భూమి సేకరణ సవరణ ఇందుకు సరికొత్త సాక్ష్యం…‘దీపం తేరా దిగనేతాము..’ అన్న చందంగా ఒకవైపున గంగ ప్రక్షాళన జరుగుతోంది..మరోవైపున ప్రపంచీకరణ విస్తరించిపోతోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కల్పవృక్షం కనుమరుగు? -వేంపల్లి గంగాధర్.

కల్పవృక్షం కనుమరుగు?

  • 31/05/2015
  • -వేంపల్లి గంగాధర్.. 9440074893

రక్తచందనం.. ఈ మాట ఇప్పుడు దశదిశలా విన్పిస్తోంది. కొందరు భయంతోను, కొందరు ఆశతోను, కొందరు ఆశ్చర్యంతోనూ ఈ మాటను వింటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర దొంగలపై కనె్నర్ర చేయడంతో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు ‘ఎర్రచందనం’ గురించి అన్నీ సంచలన వార్తలే వినిపిస్తున్నాయి. తిరుమల వెంకన్న సమక్షంలో నిశ్చింతగా, ఏపుగా ఎదుగుతున్న ఎర్రచందనం వృక్షాలను నిట్టనిలువునా నరికేసి అక్రమంగా తరలించి విదేశాల్లో తెగనమ్ముతున్నారు. వాయు, జల, భూ మార్గాల్లో దేనినీ వదలకుండా రక్తచందనం దుంగల్ని తరలించేస్తున్నారు. ఈ అక్రమాలలో అంతర్జాతీయ స్మగ్లర్లు, అధికారులు, రాజకీయ నేతలు, పోలీసులు, సినీనటులు, సాధారణ పౌరులు, కూలీలు మమేకమైపోయారు. ఏ ఎదురూ బెదురూ లేని మాఫియా కనుసన్నల్లో శేషాచలం అడవులు చిన్నబోవడం ఇప్పటి తంతుకాదు. అయితే ఇపుడు స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఉచ్చు బిగించడంతో నివ్వెరపరిచే నిజాలు బయటపడుతున్నాయి. ఎందుకంత విలువ? ఈ భూగోళంలో రక్తచందనం మొక్కలు పెరిగే వాతావరణం ఒక్క శేషాచలం అడవుల్లోనే ఉంది. చిత్తూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగాను, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో అక్కడక్కడ రక్తచందనం చెట్లు పెరుగుతాయి. తమిళనాడు, కర్నాటకల్లో ఒకటీ అరా ప్రాంతాల్లో పెరిగినా ఇక్కడ మొక్కల నాణ్యత అక్కడ లేదు. ఆయుర్వేద ఔషధాల తయారీలో, సంప్రదాయ వస్తువులు, పరికరాల తయారీకి దీనిని విస్తృతంగా వాడతారు. ఈ కలపతో చేసే వస్తువులు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని చాలామంది విశ్వాసం. చైనా, జపాన్ సహా ఆరు దేశాలకు మనదేశంలోని ఎర్రచందనం కావాల్సి వస్తోంది. చైనా, జపాన్‌లకైతే ఏటా 3వేల టన్నులకు పైగానే ఎర్రచందనం అవసరం ఉంది. 2000 సంవత్సరం నుండి మనదేశంలో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం ఉండటంతో అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో టన్నుకు సరాసరి 1.5 కోట్ల ధర పలకడంతో ఈ చెట్లు స్మగ్లర్లకు కల్పవృక్షాలుగా మారిపోయాయి. ఈ చెట్లకు ఉండే అరుదైన లక్షణం అణు ధార్మికతను తట్టుకోగలగడం. దీనివల్ల కూడా చైనా, జపాన్‌లు దీని కోసం తహతహలాడుతున్నాయి. ఇప్పటి పరిస్థితి శేషాచలం అడవుల్లో 5,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయని అంచనా. వీటిలో 40 శాతం వృక్షాలు ఇప్పటికే స్మగ్లర్ల చేతుల్లో నేలకూలి, విదేశాలకు తరలిపోయాయి. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. రాజకీయ, ఇతర కారణాలు పక్కనపెడితే రాష్ట్ర ఆర్థిక అవసరాలు కూడా ఎర్రచందనం వృక్షాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం కరకుగా వ్యవహరించడానికి కారణమవుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో చాలామందికి డబ్బే ప్రధానం. అన్నింటినీ వ్యాపార దృష్టితో చూసేవారికి మంచీ చెడుతో పనిలేదు. మనం బాగుంటే చాలనుకుని, మన తరువాతి తరాల భవిష్యత్ గురించి ఏమాత్రం బెంగలేదనుకునే తత్వం ఉన్నవాళ్లకు పచ్చని చెట్లను నరికేసి, నాలుగురాళ్లు వెనకేసుకోవడం పెద్దకష్టం కాదు. కష్టమైనా వదిలిపెట్టే రకం కాదు వాళ్లు. తమ పనిలో అడ్డొచ్చే చట్టమైనా, చెట్టైనా, అధికారులైనా వారికి ఒక్కటే. ఆ భావనే శేషాచలం అడవుల్లో రక్తచరిత్రకు కారణమవుతోంది. * * * శేషాచలం అడవుల్లో ఇటీవల ఎన్‌కౌంటర్ ఎర్రచందనం చెట్ల దుంగలను తరలిస్తున్నవారు పెద్దసంఖ్యలో మరణించడం దేశంలో సంచలనానికి కారణమైంది. నిజానికి అంతకుముందు చాలాసార్లు ఎదురుకాల్పులు, స్మగ్లర్ల ఎదురుదాడులు, అటవీశాఖ సిబ్బందిని హతమార్చడం వంటి సంఘటనలు జరిగినా ఏమాత్రం స్పందించని సమాజం ఈసారి ఎన్‌కౌంటర్‌తో అతిగానే స్పందించింది. అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్న అటవీశాఖ, శేషాచలం అడవుల్లో చాలాచోట్ల నిఘాకెమెరాలు అమర్చి స్మగ్లర్ల కదలికలపై నిఘాపెట్టింది. చాలాకాలంగా స్మగ్లర్లదే పైచేయిగా వస్తున్న వ్యవహారంలో ఇప్పుడు అటవీశాఖ అధికారుల కఠినవైఖరి కారణంగా కథ అడ్డం తిరిగింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్ని యాగీలు జరిగినా, ఈ సంఘటనతో ప్రపంచం దృష్టి ఎర్రచందనం, శేషాచలం అడవుల ప్రాశస్త్యంపై పడింది. అలాగే, ఈ ఎర్రచందనం మాఫియా ఎత్తులు, జిత్తులు, ఆ చెట్ల విలువ ప్రపంచానికి తెలిసొచ్చాయి. భయపడని మాఫియా ఈ ఎన్‌కౌంటర్ జరిగిన పనె్నండు రోజులకే కడప సబ్ డివిజన్ పరిధిలో వంద గొడ్డళ్లు, ఎర్రచందనం దుంగలు చిక్కాయి. రైల్వేకోడూరులోని వాగేటికోన రిజర్వాయర్ సమీపంలో ఎర్రచందనం దుంగలు, కూలీలు పట్టుబడ్డారు. ఎన్‌కౌంటర్ ‘చూసిన’ తర్వాత కూడా స్మగ్లర్లు, తమిళ కూలీలు వెనుకడుగు వేయడం లేదంటే, ప్రాణాలకు తెగించి వస్తున్నారంటే వారికి ప్రాణంకన్నా విలువైనదేదో లభిస్తోందని కదా అర్థం. నిజానికి వీరి ప్రాణాలను ఫణంగా పెట్టి దళారుల దండుకుంటున్నదే ఎక్కువ. ఇదీ అక్రమ మార్గం ఎర్రచందనం చెట్లను నరికి, ‘డ్రస్సింగ్’ చేసి, ఆ దుంగలను దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ చిన్నచిన్న ముక్కలుగా చేసి సుమారు ముప్పై కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో సర్ది వారికి విమాన టిక్కెట్లు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడం ఒక పద్ధతిగా వెలుగులోకి వచ్చింది. ఇదే కోణంలో నుంచే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎర్రచందనం కొయ్యలను పొడి రూపంలోకి మార్చి దుబాయ్ మీదుగా చైనాకు తరలిస్తున్న వైనమూ బయటపడింది. రెండు, మూడు నెలల వ్యవధిలోనే సుమారు వంద కిలోల ఎర్రచందనం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడమే దీనికి ఉదాహరణ. ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడు కీలక కేంద్రంగా ఉంటోంది. రోడ్డు మార్గాన చెన్నైకి చేర్చుకొని ఆపై సముద్ర మార్గాన చైనాకు యథేచ్ఛగా తరలిస్తున్న ‘బడా స్మగ్లర్లు’ కోట్లకు పడగలెత్తారు. వేరశనగ పప్పు, ఉప్పు, వంట సామాగ్రి పేరుతో ఎర్రచందనం దుంగలు నింపి సింగపూర్‌కు తరలించేందుకు సిద్ధమైన కంటైనర్‌ను గతంలో చెన్నై పోర్టు అధికారులు తనిఖీచేసి 18 టన్నుల ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అనుమానంతో సింగపూర్‌కు బయలుదేరిన మరొక కంటైనర్‌ను వెనక్కి రప్పించగా అందులో పద్దెనిమిది టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకోగలిగారు. తప్పుడు లేబుల్స్, సర్ట్ఫికెట్లు సృష్టించి ఎగుమతి చేస్తున్నారు. మయన్మార్ నెట్‌వర్క్… కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం చేరుతోంది. ఓడరేవులకు చేరిన తర్వాత అక్కడి కంటైనర్లలో సరకుల కింది భాగంలో దుంగలను చేర్చి తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చూసీ చూడనట్లు వదిలేయడానికి వీలుగా కస్టమ్స్ అధికారులకు ‘ఖరీదైన బహుమతులు’ ఇచ్చి స్మగ్లర్లు ప్రలోభపెడుతున్నారు. ముందుగా రోడ్డు మార్గాల ద్వారా పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరం, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలకు చేర్చుకొని అక్కడి నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, చైనాలకు తరలించేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో అక్కడి నిరుద్యోగ యువత, కూలీలతో కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అత్యంత రహస్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. తమ దేశానికి ఎర్రచందనం తరలించగలిగితే ప్రపంచంలో ఎక్కడికైనా స్మగ్లింగ్ చేయగలిగిన సత్తా తమకుందని ‘మయన్మార్ నెట్‌వర్క్’ నిరూపిస్తోంది. బర్మా నుంచి శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంటారు. మరో దారిలో గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి, అక్కడి నుంచి నౌకల్లో దుబాయ్‌కి ఎర్రచందనం దుంగలు తరలిపోతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి అగర్తలాకు తరలించి అక్కడి నుంచి చైనా, జపాన్‌లకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించగలిగారు. చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి ద్వారా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ మీదుగా దుంగలను అగర్తలాకు పంపుతున్నారు. తమిళనాడు నుంచి… తమిళనాడులోని వేలూరు, తిరువన్నామలై, చెంగల్‌పట్టు జిల్లాల నుంచి పెద్దఎత్తున కూలీలు ‘ఎర్రచందనం’ కొయ్యలను కొట్టడానికి ఆంధ్రా అడవుల్లోకి వస్తున్నారు. చిత్తూరు జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలోంచే సరిహద్దు మొదలవుతోంది. జవాది కొండల్లోని కావలూర్, పల్లంబట్టు, కోమటేరు, వీరప్పనూర్, కోయలూర్, దానమత్తూర్, జమునామరత్తూర్ ప్రాంతాల్లోని కూలీలను ఎంపిక చేసుకొని వృక్షాలను కొట్టడానికి ఏజెంట్లు పిలిపిస్తున్నారు. కూలీలను బృందాలుగా విడదీసి ఎవరు ఎక్కడికి వెళ్లి చెట్లు నరకాలో ముందే చెబుతారు. ఒక కూలీ సుమారు నెల నుండి రెండు నెలల వరకూ అడవిలోనే ఉండవలసి ఉంటుంది. దుంగలు నరకడం, వాటిని మోసుకొని ఒక చోటికి చేర్చడం, అక్కడ్నుంచి వాహనాల్లోకి ఎక్కించడం వంటి పనులన్నీ వారే చేయాల్సి ఉంటుంది. స్మగ్లర్లు కూలీలకు కన్పించకుండా ఏజెంట్ల ద్వారా అన్ని పనులూ చేయిస్తుంటారు. పది రోజుల పనికి ఒక్కొక్క కూలీకి 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కూలీల ప్రత్యేకత ఇదీ.. అడవుల్లో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు దుంగల్ని భుజాలపై మోసుకొని రాగల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం తిరువణ్ణామలై, సేలం, విల్లుపురం జిల్లాలకు చెందిన మలయాళీ గిరిజనుల ప్రత్యేకత. మిగతా చెట్లతో పోలిస్తే ధృడంగా, బరువుగా ఉండే ఈ చెట్లను నరకడమే చాలాకష్టం. వీటిని నరికి, తరలించే పని కష్టంతోను, ప్రమాదంతోనూ కూడుకున్నది కావడంతో వారికి భారీ ఎత్తున నగదు ఆశచూపి ఈ రొంపిలోకి ఈడుస్తున్నారు. ఏ పనుల్లేని పేదలు దీనికి ఒప్పుకుంటున్నారు. తమిళనాడు నుంచి దాదాపు ఐదు వేల మంది కూలీలు ఈ పనిపైనే ఆధారపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జైళ్లలో ఇప్పటికే రెండు వేల మందికిపైగా తమిళ కూలీలు శిక్ష అనుభవిస్తున్నారు. తిరుపతి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఇరవై మంది ఎర్ర కూలీల్లో ఎక్కువమంది జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూడా జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవాడే. వీరప్పన్ హతమయ్యాక అతడి అనుచరులు ఎర్ర చందనంపై దృష్టి పెట్టారు. గత పదేళ్లలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు. సరిహద్దులు దాటిపోయిన ఎర్రచందనం విలువ అక్షరాలా నలభై వేల కోట్లు! సోమశిల జలాల్లో.. సోమశిల వెనుక ఉన్న జలాల్లోనూ, జలాశయంలోనూ ఎర్రచందనం దుంగలు పలుసార్లు బయటపడుతూ వచ్చాయి. కడప-నెల్లూరు సరిహద్దుల్లోని సోమశిల జలాశయం సమీపాన వెలిగొండ అడవుల్లోంచి ఎర్రచందనం దుంగలను నీళ్లలో డంప్ చేసుకుంటూ తరలించుకుపోయారు. రాపూరు, రాజంపేట, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల మీదుగా వీటిని చెన్నైకి తరలించుకుపోతూ వచ్చారు. జలాశయం వద్ద మత్స్యకారుల్లా, తిరుమలకు భక్తుల రూపంలో వందల సంఖ్యలో తమిళ కూలీలు శేషాచలానికి చేరుకుంటున్నారు. ఏడాదికి పది నుంచి ఇరవై టన్నుల ఎర్రచందనం దుంగలు సోమశిల జలాశయంలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. సోమశిల ‘బ్యాక్ వాటర్’ ప్రాంతమైన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం బండారుపల్లి, అట్లూరు, కుడమలూరు, బద్వేలు, నందలూరు ప్రాంతాల్లోని కోనాపురం, కొమ్మూరు ప్రాంతాల్లో చేపల వేట ముసుగులో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అటవీశాఖ ‘ఎకో టూరిజం’ పథకాన్ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. దాడులు.. ప్రతిదాడులు మామూలే శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల సంచలనం, వివాదానికి కారణమైనా ఇక్కడ కాల్పులు, ఎదురుకాల్పులు, భయంకర దాడులు, హత్యలు సర్వసాధారణం. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా ఇప్పుడు జరిగింత ప్రచారం కాలేదు. 2011 నవంబర్‌లో శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను శ్రీనివాస మంగాపురం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద దాచిన కూలీలు, తమను వెంటపడిన అధికారులపై రాళ్లతో దాడిచేయడం, పోలీసులు కాల్పులు జరపడం తెలిసిందే. అదేఏడు నవంబర్‌లో చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె టేకువనం వద్ద అటవీ అధికారులకు, తమిళ కూలీల మధ్య రాళ్లదాడి, ప్రతిగా పోలీసుల కాల్పులు జరపగా స్మగర్లు పరారైనారు. ఆ తరువాతకూడా 2012 డిసెంబర్‌లో మరోసారి చిత్తూరు జిల్లా భాకరాపేటకు సమీపంలో రంగంపేట బేస్ క్యాంపు వద్ద రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లకు స్పెషల్ టాస్క్ఫోర్స్‌కు మధ్య కాల్పులు జరిగాయి. కరేపాకుకోన వద్ద స్మగ్లర్లు తిరగబడి రాళ్లు, గొడ్డళ్లతో అటవీ సిబ్బందిపై దాడి చేశారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుట్ట సమీపంలో రాత్రిపూట గస్తీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జి ఎఫ్‌బీవో జగ్జీవన్‌రావు, శ్రీనివాసరావులపై స్మగ్లర్లు రాళ్ల దాడి చేసి వారి ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌తో కాల్చి వేసిన సంఘటన 2013లో జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇక్కడ అతిసాధారణం. కర్కోటకులు.. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల ఘాతుకాలకు పరాకాష్ఠ – అటవీ శాఖ అధికారులు శ్రీ్ధర్, డేవిడ్ కరుణాకర్‌ల్ని బలి తీసుకున్న ఘటన. పెద్దబండ చేను వద్ద స్మగ్లర్లు దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీ్ధర్ మరో ఆరుగురు సిబ్బందిని వెంటపెట్టుకొని వాహనాల్లో బయలుదేరారు. అడవి మధ్యలో దుంగల్ని మోసుకెళ్తున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని పట్టుకోవాలనే వ్యూహంలో వుండగానే – అదుపులో వున్న స్మగ్లర్లు, దూరాన ఉన్న వారు కూడా రాళ్లదాడికి పూనుకున్నారు. దూరంగా నుంచి ముందుగా స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. స్మగ్లర్లు శ్రీ్ధర్ తలపై రాళ్లతో మోది ప్రాణాలు తీశారు. అతడి బట్టలు ఊడదీసి చిత్రహింసలు పెట్టి తమ కక్ష చల్లార్చుకున్నారు. గొడ్డలితో దేహంలోని భాగాలను విచక్షణా రహితంగా నరికివేశారు. ఇదే సంఘటనలో మరో అటవీ అధికారి డేవిడ్ కరుణాకర్ కూడా స్మగ్లర్ల చేతిలో క్రూరంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన 2013 డిసెంబర్ 15వ తేదీ జరిగింది. అక్కడితో ప్రభుత్వ వైఖరిలో మార్పు మొదలైంది. స్మగర్ల అంతుచూడాలన్న కసి పెరిగింది. కాల్పుల కలకలం శేషాచలం ప్రాంతంలోని వైకోట, గాదెల అడవుల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు 2014 జూన్ 8వ తేదీన గాలింపు చేస్తున్న సాయుధ బలగాలపై దాడులకు తెగబడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా కూలీలు వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా గురిపెట్టి కాల్పులు జరపడంతో ఒక కూలీ మరణించాడు. అయినా వారు బెదిరిపోలేదు. 2014 జూన్ 21వ తేదీన ఈ సంఘటన జరగగా, ఆగస్టులో కడప సరిహద్దుల్లో మళ్లీ వారు దాడులు చేశారు. అదేనెలలో మరోసారి యర్రావారిపాలెం మండలం చింతగుంట సమీపంలో గాదెలబీట్ నీసువంకలో పోలీసుల పైకి స్మగ్లర్లు రాళ్లతో దాడిచేస్తే పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు కలప కూలీలు మృతి చెందారు. మొన్నటికి మొన్న… ఏప్రిల్ 7, 2015న శేషాచలం కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఒక సంచలనం. ఆ రోజు తెల్లవారుజామున సచ్చినోడిబండ దగ్గర 11 మంది, చీకటీగలకోన వద్ద 9 మంది తమిళ కూలీలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. రాళ్లు, గొడ్డళ్లతో వాళ్లు దాడికి దిగడంతో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. వారిని సజీవంగా పట్టుకుని, ఆ తరువాత ఎన్‌కౌంటర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వివాదం రేగింది. ఈ వివాదం కోర్టుకెక్కింది. మానవహక్కులు సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్, సిట్ ఏర్పాటయ్యాయి. ఆ తరువాత తీగలాగితే డొంక కదిలిన చందాన ఎర్రచందనంలో అసలు సూత్రధారులు ఒక్కొక్కరూ బయటికొస్తున్నారు. ఓ నీతూఅగర్వాల్, ఓ మస్తాన్‌వలీ, ఓ బదానీ ఇలా. చివరకు చైనాకు చెందిన స్మగ్లర్లు, వారి మధ్యవర్తులు పట్టుబడ్డారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో రహస్యంగా ఉంచిన ఎర్రదుంగల ఆచూసీ లభిస్తోంది. మున్ముందు మరిన్ని సంచలన వివరాలు బయటపడొచ్చు. ఆర్టీసీ బస్సుల్లోనూ… ఎర్రచందనం తరలింపు పకడ్బందీగా, ఎవరికీ అనుమానం రాకుండా జరిగిపోయేది. అంబులెన్సులు, ఆర్టీసి బస్సులు, స్కూలు బస్సులు, పప్పుదినుసుల బస్తాలు, అవీఇవీ అని కావు ఎలా రహస్యంగా పంపేయాలో స్మగ్లర్లకు తెలిసిన మార్గాలు ఊహించడానికి కూడా అందవు. తెలిసిన అధికారులకు నోరువెళ్లబెట్టే స్థాయిలో డబ్బిచ్చి, లేదా వారికి కావలసిన కోరికలు తీర్చి నోరుమూయించడం వారికి వెన్నతోపెట్టిన విద్య. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఒకప్పుడు కీలకమైంది. తమిళ కూలీలను చెన్నై నుంచి రాజంపేటకు తరలిస్తున్న నలభై రెండు మంది ఆర్టీసీ డ్రైవర్లు 2014 డిసెంబర్ 2వ తేదీన అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండులో ప్రయాణీకులను ఎవ్వరినీ ఎక్కించుకోకుండా సీట్లు రిజర్వు అయ్యాయని కొద్ది దూరం వచ్చి మార్గమధ్యంలో తమిళ కూలీలను వీరు ఎక్కించుకునేవారు. మధ్యలో ఎక్కడా బస్సును ఆపేవారు కాదు. బైపాస్ రోడ్డు మార్గాన కుక్కలదొడ్డి, రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో కొంతమందిని దించుకుంటూ కడపకు చేరుకునేవారు. రాజంపేట – రోళ్లమడుగు రహదారి దగ్గర అడవిలోంచి ఎర్రచందనం దుంగలు తీసుకొస్తున్న తమిళ కూలీలను పట్టుకొని పోలీసులు విచారించినప్పుడు ఇది బయటపడింది. కొంతమంది డ్రైవర్లు దీనికోసం అదే పనిగా డ్యూటీలు వేయించుకొని, ఎక్కువ సార్లు చెన్నై రూట్లో వెళ్లేవారు. ఒక్కొక్క తమిళ కూలీ నుంచి రెండు వేలు నుంచి మూడు వేల వరకు తీసుకునేవారు. ప్రైవేటు బస్సుల్లో ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ తరహాలో దుంగలను ప్యాక్ చేసి తరలించేవారు. అధికారుల అక్రమాలు… చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం, యర్రవారిపల్లె మండలాల పరిధిలోని స్మగ్లర్ల గురించి స్థానికులు ఎప్పుడో బయటపెట్టారు. శేషాచలం కొండల్లోని తుమ్మలబీటు బంగళా, చాకిరేవు బండ, సానిపాయ రోడ్డు వంటి ప్రాంతాలు ఎర్రచందనం తరలింపులో కీలకంగా వుండేవి. ఇక్కడ పనిచేసే అధికారులు వారికి అండగా నిలిచేవారు. అయితే మామూళ్ల పంపకంలో విభేదాల వల్ల వారి రహస్యాలను వారే బయటపెట్టుకునేవారు. స్మగర్లకు సహకరిస్తున్న అధికారులు 2013 ప్రాంతంలో సుండుపల్లెలో పట్టుబడ్డారు. ఇక స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు పోలీసుస్టేషన్లలో భద్రపరిచినా మాయమవడం అతిసాధారణమైపోయింది. ఇలా మాయమైనప్పుడు అధికారుల సస్పెన్షన్ మామూలే. ప్రొద్దుటూరు అటవీ డివిజన్‌లోని పోరుమామిళ్ల రేంజ్‌లోని వివిధ బీట్ల పరిధిలోని నలుగురు గార్డులు, ముగ్గురు సెక్షన్ అధికారులను 2013 సెప్టెంబర్ మొదటి వారంలో సస్పెండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కానీ భాకరాపేట నుంచి వస్తున్న లారీలో 2014 డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తొంభై నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ రోజు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తించాల్సిన ఇద్దరు ఫారెస్ట్ బీటు అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేశారనే కారణంతో సస్పెండ్ చేశారు. 2015 మార్చిలో ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేయాలని భావించి గోడౌన్లలోని కొయ్యల వివరాలు సేకరించినప్పుడు అటవీ శాఖ అధికారిక గోడౌన్లలో వందల సంఖ్యలో కన్పించకుండా పోయిన వాస్తవాలు బట్టబయలైనాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి రాజేష్ మిత్తల్ ఎర్రచందనం ఎగుమతి, అనుమతులు పొందడంలో సక్రమంగా వ్యవహరించనందు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2008లో ఎర్రచందనం వేలంకు సంబంధించిన కీలక పత్రాలు, అటవీ శాఖ అధికారులు సాగించిన ప్రత్యుత్తరాలు వంటి పత్రాలు ఏవీ కనిపించక పోవడం మరో విశేషం. శేషాచలంలో అరుదుగా, అందంగా పెరిగే ఎర్రచందనం సురక్షితంగా ఉండాలంటే ముందు అందరిలో మార్పు రావాలి. వాటిని కాపాడుకోవాలన్న కోరిక కలగాలి. అధికారులు, సామాన్యులు, నాయకులు పరస్పర సహకారంతో, చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో పనిచేస్తే తప్ప అది సాధ్యంకాదు. శేషాచలం అడవులు ఎర్రచందనం అవశేషంగా మిగలకుండా, అశేషాచలంగా పరిఢవిల్లాలన్నదే సగటు తెలుగువాడి కోరిక. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకప్పటి మిస్ ఇండియా ఫైనల్ -ఇప్పుడు బౌద్ధ సన్యాసిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాన్న డ్రీం నేర వేరింది -నటుడు నారా రోహిత్

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

భూతాపం నిజమేనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు రాష్ట్రాలు -ఒక ఏడాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment