వీక్షకులు
- 1,202,651 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అలంకార శాస్త్ర వేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.4 వ భాగం.14.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.57 వ భాగం.14.10.26
- పంచ సూక్తాలు.3 వ భాగం.14.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం.డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.29 వ భాగం.14.10.26.
- పంచసూక్తాలు.2 వ భాగం.13.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.28 వ భాగం.13.10.26.
- పంచ సూక్తాలు.1 వ భాగం.12.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.27 వ భాగం.12.10.26.
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త , , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -9( చివరిభాగం )
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.26 వ భాగం.11.10.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,572)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3
-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3
సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి వివాదం
ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు .వాళ్ళు నాటకం రాస్తే నాటకం తోనూ వ్యాసం రాస్తే వ్యాసం తోనూ జవాబు చెప్పటం శాస్త్రి గారి ప్రత్యేకత .సంస్కరణ పిపాసి వీరేశలింగం గారు ఎప్పుడూ శాస్త్రిగారికి ప్రధాన వ్యతిరేక పక్షమే .లింగం గారు విమర్శించారన్నమాత్రాన హిందూమతం లో ఏ స్వల్ప మార్పులు జరగటానికైనా శాస్త్రి గారు ఒప్పుకోనేవారుకాదు. అంతటి నియమ పరులు .కందుకూరి వారు కాలాన్ని బట్టి యుక్తిని బట్టి మతం లో మార్పులు రావాలని కోరేవారు .కాని ఆయనే ఆ నియమాన్ని పాటించలేదు అనే విమర్శ ఉండేది .ఆత్మకు పుట్టుక ఉందికాని చావు లేదనేవారు లింగం గారు .కానిలోకం లో పుట్టుట గిట్టుటకోసమే అనే మాట మర్చిపోయారని నింద మోశారు. శంకరాద్వైతం యుక్తి యుక్తమే అయినా ఒప్పుకోనన్నారు వీరేశలింగం .డార్విన్ పరిణామ వాదం శాస్త్రీయమే అయినా తాను అంగీకరించనన్నారు కందుకూరి .సృష్టివాదం అంటే క్రియేషన్ ధీరీ అశాస్త్రీయం అయినా అంగీకరిస్తున్నానన్నారు వీరేశలింగం .పులి ,పాము ,ఉప్పెన భూకంపం ,మహామారి మొదలైన విపత్తులను దేవుడే సృష్టించి ప్రజలకు భయం కలిగేట్లు చేసి తనను సేవి౦చేట్లు దేవుడు చేసినవే నంటారు కందుకూరి .ఇది మూఢ విశ్వాసంకాదా అని ఆనాడు శాస్త్రి గారు లాంటి సనాతనులు లింగం గారిని అవహేళన చేశారు ..ఇలా వీరేశలింగం గారు చాలా విషయాలలో పరస్పర విరుద్ధం గా ప్రవర్తించారనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది .అందుకే బ్రహ్మయ్య శాస్త్రి గారు వీరేశ లింగం గారి అన్నివాదాలను సమూలంగా చేది౦చాల్సి వచ్చింది .ఇవన్నీ గమనిస్తే శాస్త్రిగారు మహా వక్త మహా రచయిత మహా విమర్శకులేకాక మహా నిర్మాణ కౌశలం కలిగినవారు అని స్పష్టమౌతుంది .హిందూమతాభిమానం ,ప్రచార ఉత్సాహం తాటాకు మంటలాగా కాసేపు ఉండి ఆరిపోయేవికావు ఆయనలో .అవి నిత్య జ్వాలలే .యాభై ఏళ్ళు వీటికోసమే పోరాడిన మహితాన్వితులు .
స్పర్ధయా వర్ధతే విద్యా
శాస్త్రిగారిని ఇంత పని చేయించింది ప్రతిపక్షాలవారే. వారి ప్రేరేపణే.ఒక సారి ధిల్లీ దర్బారు సందర్భం గా ఒక సభలో బ్రహ్మ సమాజ ప్రవర్తకులు బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ బ్రిటిష్ వారు మనదేశానికి వచ్చిన తర్వాతనే శూద్రులు బాగు పడ్డారని అంతకు ముందు బ్రాహ్మణ సమాజం చేత అణగ ద్రోక్క బడినారని చెప్పారు .దీనికి శాస్త్రిగారు బదులిస్తూ ‘’బ్రాహ్మలు శూద్రులకు అన్యాయం చేసిరా?’’అనే చిన్న పుస్తకం రాసి ప్రచురించారు .ఇందులో శ్రుతి స్మ్రుతులనుండి ,మహాభారత నుండి శుక్రనీతి మొదలైన మహా గ్రంధాలనుండి అనేక ప్రమాణ వాక్యాలు ఉదాహరణగా ఇచ్చి శూద్రులు ఎప్పుడుకూడా నీచంగా చూడబడలేదని సప్రమాణంగా రుజువు చేశారు .ఇంకో సారి శ్రీ త్రిపురనేని రామ స్వామి చౌదరి ‘’శబుక వధ ‘’నాటకం రాసి బ్రాహ్మణులను అనవసరంగా నిందించటం గమనించిన శాస్త్రిగారు ‘’శ౦బుక వధా విమర్శన గ్రంధం ‘’రాసి తమ పాండిత్యాన్ని ,ప్రతిభను వాద పటిమను ,లోకజ్ఞానాన్ని ,యుక్తిని నిరూపించుకొన్నారు .మరోసారి కాకినాడలో బ్రహ్మ సమాజం వారు శివలింగం అశ్లీలాన్ని బోధిస్తోందని ఒక పెద్ద సభలో అన్నారు .వెంటనే స్పందించిన బ్రహ్మయ్య శాస్త్రిగారు సమాధానంగా ‘’శివలింగం యోగి రూపం లో భావింపబడిన శివుని శిరస్సు’’ అనే సిద్ధాంతాన్ని చెప్పి దానికి ప్రమాణాలను పేర్కొని అనేక శాస్త్రాలను పరిశోధించి సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చి వ్యాస పరంపరను పత్రికలో ప్రచురించారు .
వీరేశలింగం గారు వితంతువుల కేశ ఖండననం ,పరలోకం లో దంపతులు కలుస్తారు అనే హిందూ మతం లో ఉన్న నమ్మకాన్ని పరిహసిస్తూ ‘’నారద సందర్శనం ‘’అనే ప్రహసనం రాశారు .దీనికి దీటుగా సమాధానం రాస్తూ శాస్త్రిగారు ‘’పర్వత సందర్శనం ‘’అనే ప్రహసనాన్ని రాసి వదిలారు .మరోసారి బ్రహ్మ సమాజీకులుతమ మందిరం లో విగ్రహారాధన తుచ్చం, నీచం, హేయం అని నిందించారు .దీనికి శాస్త్రిగారు ‘’ఇలాంటివి ఏదో ప్రైవేటు మందిరం లో కూర్చుని చెబితే తేలేవికావు ప్రజా సమక్షం లో వాదోపవాదాలు చేసి నిగ్గు తేల్చేవి. అప్పుడే అసలు సత్యం ఏమిటో సామాన్య ప్రజలు గ్రహిస్తారు .మేము బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం దానికి మీరు రండి మీ వాదాలు వినిపించండి మా వాదాలు మేమూ వినిపిస్తాం ‘’అని జవాబిచ్చి నిజంగానే బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో తన వాదంగా శాస్త్రిగారు విగ్రహారాధనను సమర్ధిస్తూ చేసిన ఉపన్యాసం మహా విశిష్టంగా ఉంది .చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖి౦పబడదగినదినది అయింది .అదీ శాస్త్రి గారి వాదనా సామరధ్యం .వాక్ పటిమ .సర్వ గ్రంధ పరిశీలనం .
శాస్త్రిగారు పరిష్కరించిన సమస్యలు
బ్రహ్మయ్య శాస్త్రి గారు తమ అమూల్యమైన ఉపన్యాసాలలో ఎన్నో విషయాలను చర్చించి విషయ వివరణం చేశారు .ఎన్నో సమస్యలకు తగిన సమాధానాలు పరిష్కరించి చెప్పారు .వారు పరిష్కరించిన వాటిలో కొన్ని సమస్యలు -1 శ్రీ కృష్ణుడు జారుడా ?2- గణపతి 3-జీవన్మత మేది ?4-హిందూమతం ఆవశ్యకత 5-త్రిమతములు మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ ప్రతి హిందువు చదివి అర్ధం చేసుకొని అనుసారించాల్సినవే .అలాగే రజస్వలానంతర వివాహం వితంతు వివాహం లను యుక్తి యుక్తంగా ఖండించి శాస్త్రాదారాలు చూపి నిరూపించారు. దీనిలో వారిని మించిన వారెవ్వరూ లేరని చెప్పటం అతిశయోక్తి కాదు
హిందూ విజ్ఞానం
బ్రహ్మయ్య శాస్త్రిగారు హిందూ విజ్ఞానం పైన అనేక అమూల్య వ్యాసాలూ రాశారు .ఆధునికులు చెప్పే ప్రక్రుతి శాస్త్రము మన ప్రాచీనులు చెప్పిన ప్రాచీన గ్రంధాలనుండి గ్రహించి వ్రాయబడినదే అని ఘంటాపధం గా రాసి నిరూపించారు . హిందూ విజ్ఞానంపై శాస్త్రిగారు ‘’జగము సృజింప బడినదా?భూమి తిరుగు చున్దా?భూమి వర్తులత్వం యెంత ,?భూమి తిరుగుటకు ఆధారమేమి ?భూమి యొక్క యాకర్షణ శక్తి ,రాశి చక్రము ,పంచ భూతములు గ్రహణ కదా చర్చ రామయణమందలి వానరు లెవరు ?మొదలైన వ్యాసాలూ విజ్ఞాన సోపానాలే. శాస్త్రిగారి అసమాన ప్రాక్ ప్రచీతీ విజ్ఞాన సమ్మేళనానికి గొప్ప ఉదాహరణలే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు
భారత్ భద్రమేనా?
భారత్ భద్రమేనా?
- 24/05/2015
- -ఎస్.కె.రామానుజం/ బి.శ్రీధర్
‘్భవిష్యత్‌లో భారత్‌కు పెనుభూకంపం ప్రమాదం పొంచి ఉందా?’-అంటే ‘ఔన’నే అంటున్నారు శాస్తవ్రేత్తలు. వారు భయపడుతున్నట్లు అదే జరిగితే తట్టుకోగలిగే శక్తి మన దేశానికి ఉందా? కనీసం ఆ స్పృహ ప్రజలకు, నాయకులు, అధికార యంత్రాంగానికి ఉందా? దేశ రాజధానిలో భూకంపం వస్తే నష్టం, కష్టం ఏ స్థాయిలో ఉంటాయో ఊహించారా? అంటే ఇప్పటివరకూ అలాంటి తీవ్రమైన అంశంపై ఎవరూ దృష్టి సారించడం లేదనే చెప్పాలి. నేపాల్ అనుభవాల నుంచి మనం వెంటనే పాఠాలు నేర్వకపోతే, ప్రకృతే గుణపాఠం చెబుతుందని హెచ్చరిస్తున్న నిపుణుల మాటల్లోని నిజం ఏమిటో తెలిస్తే సగటు భారతీయుడి మనసు బరువెక్కడం ఖాయం. ఇప్పుడేంటి సమస్య? అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లే ఎప్పుడూ ఉండే సమస్యలు మినహా దివ్యంగా ఉన్న ఈ దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమిటి? భారత్ భద్రతకు వచ్చిన సమస్య ఏమిటి? అనుకుంటే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని అర్థం. మన పొరుగున ఉన్న నేపాల్‌లో తాజా భూకంపాలు, అదే సమయంలో మనదేశంలో సంభవిస్తున్న ప్రకంపనలు భారత్‌కు ఓ హెచ్చరిక అని శాస్తవ్రేత్తలు నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా వినేవారు, నమ్మేవారు తక్కువే. మనసుదోచే తెల్లని మంచుతెరలతో, ప్రకృతి సోయగంతో మెరిసిపోయే హిమాలయ పర్వత ప్రాంతం నిజానికి అంత చల్లగా ఏమీ లేదు. ఉన్నట్టుండి ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణంలో భూకంపం, అదీ తీవ్రస్థాయిలో అంటే- ఇప్పుడు నేపాల్‌లో వచ్చినదానికంటే ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం చాలా ఉందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. భూకంపాలను కచ్చితంగా పసికట్టడం, కట్టడి చేయడం మానవుడికి ఇంకా సాధ్యం కాని విషయమే. కానీ గత అనుభవాలు, భూకంపాల చరిత్ర, భూగర్భంలో జరుగుతున్న మార్పులను బట్టి వారు ఈ పరిణామాలను ఊహిస్తున్నారు. ఇప్పుడు నేపాల్‌లో వచ్చిన భూకంపాల గురించి వివిధ దేశాలకు చెందిన సెస్మాలజిస్టులు ముందుగానే హెచ్చరించారు. అయితే ఎప్పుడు, ఏ స్థాయిలో వస్తుందన్నది వారు చెప్పలేకపోతున్నా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని దేశాలకు ఈ ముప్పు పొంచి ఉందని చెప్పారు. నేపాల్‌లో భూకంపాల ఫలితంగా భారీ కట్టడాలు పేకమేడల్లా కూలిపోయి, అంచనాలకు అందని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. మున్ముందు అంతకంటే ఎక్కువ స్థాయిలో భూకంపాలు వస్తే భారత్ తట్టుకోగలదా? నష్టాన్ని నివారించుకోగలదా? అంటే పెదవి విరుపే తప్ప సరైన సమాధానం లేదు. భూకంపాల గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, నష్టనివారణపై ప్రచారం, ఏర్పాట్లు లేకపోవడంవల్ల మనం పెద్దనష్టానే్న ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇతర ప్రమాదాల మాదిరిగా భూకంపాలు ఎవరి ప్రాణాలు తీయవు. కాకపోతే భూకంపాల తాకిడికి కొండ చరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం, హిమనీనదాలు జారిపడటం, అగ్నిపర్వతాలు పేలడం వంటి పరిణామాలతో నష్టం సంభవిస్తూంటుంది. భూకంప ప్రభావాన్ని తట్టుకోగలగడం, నష్టాన్ని తగ్గించగలగడం మన చేతుల్లోని పనే. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అంటే లేదనే చెప్పాలి. భూకంపం అంటే.. ప్రపంచం అంతా కొన్ని భూ ఫలకాల సమాహారం. సముద్రాల కింద ఉన్న కొన్ని ఫలకాలు, భూమి ఉపరితలంగా ఉన్న ఫలకాలు కొన్ని నిరంతరం భూమి అంతర్భాగంలో నెమ్మదిగా కదులుతూంటాయి. ఈ ఫలకాల మధ్య రాపిడి, ఒకదానిని మరొకటి ఢీకొట్టడం, ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవడం వల్ల అనంతమైన ఒత్తిడి కలిగి పెను శక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి పైకి ఎగతన్నుకురావడమే భూకంపం. ఆ ఫలకాల సర్దుబాటు పూర్తయ్యేవరకు ఈ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. పూర్తిస్థాయిలో భూకంపం వస్తే- అంటే శక్తి పైకి వస్తే దాని ప్రభావం వల్ల ఆస్తి,ప్రాణనష్టం సంభవిస్తుంది. ప్రపంచంలో హిందూకుష్ పర్వత శ్రేణుల్లోను (హిమాలయాలు సహా), ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ ప్రమాదం ఎక్కువ. భూమి అంతర్భాగంలో ఉన్న ఈ ఫలకాల కదలికల్లో భారత ఉపఖండం ఉన్న ఫలకం మిగతావాటికన్నా వేగంగా కదులుతూ పక్కనే ఉన్న యురేషియా ఫలకంతో తరచూ ఢీకొట్టడం, లేదా రాసుకుపోవడం జరుగుతోంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇనే్నళ్లుగా ఉద్భవిస్తున్న శక్తి బయటకు రాకుండా భూమిలోనే ఉండిపోయి లోపలి భాగంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ రెండు ఫలకాలు ఢీకొట్టడం వల్లే వేలాది మైళ్ల పొడవున హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి. ఇప్పుడు కూడా అవి ఉన్న ప్రాంతంలోనే భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకం వైపు కదులుతూ ఢీ కొడుతూండటంతో ప్రమాదం పొంచి ఉందని సెస్మాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఏమి జరగొచ్చు..? మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. ఏడాదికి 1నుంచి 6 సెంటీమీటర్ల చొప్పున భారత ఉపఖండ ఫలకం యురేషియా ఫలకం వైపు(అంటే ఉత్తర దిశగా) దూసుకువెళుతోంది. కొన్నివేల సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామం ఇది. ఈ ఫలకాల మధ్య ఒత్తిడి వల్ల ఇప్పటివరకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. అయినా భూమిలోపల దాగి ఉండిపోయిన అనంతమైన ఒత్తిడి (శక్తి) బయటకు ఇంకా విస్ఫోటనం కాలేదు. ఎప్పటికైనా అది బయటపడే అవకాశం ఉంది. 1255-1934 సంవత్సరాల మధ్య హిమాలయాల చరిత్ర, హై రిజల్యూషన్ ఉన్న ఛాయాచిత్రాలు, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా లెక్కగట్టిన శాస్తవ్రేత్తలు భారత్, నేపాల్ దేశాలకు ముప్పు చాలా దగ్గరలో, తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సగటున ప్రతి 30 లేదా 75 సంవత్సరాలకు ఒకసారి పెనుభూకంపాలు వచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్శిటీ 2012లో ప్రచురించిన జర్నల్ నేచర్ జియోసైన్స్‌లో భారత్‌కు పొంచి ఉన్న ముప్పును సూచించింది. నేపాల్‌లో తాజా భూకంపాల గురించి ప్రపంచ దేశాలకు చెందిన 50మంది శాస్తవ్రేత్తలు రెండు నెలల ముందే హెచ్చరించారు. అయితే వారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వస్తుందని చెప్పారే తప్ప ఏ దేశం అన్నది స్పష్టం చేయలేదు. అది అంచనాకు సాధ్యం కాదు. ఇప్పుడు నేపాల్ ప్రాంతంలో భూకంపాలు వచ్చాయి కనుక, దిగువ ఫలకం కదలికవల్ల భూమి పొరల్లో కొంత సర్దుబాటు కలిగింది. ఇక మిగిలిన ప్రాంతాలపై దాని ప్రభావం ఉంటుందన్నమాట. మిగిలిన ప్రాంతమంటే భారత్‌లోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, దిల్లీతోపాటు మరికొన్ని ప్రాంతాలు. గడచిన 150 సంవత్సరాలలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చిన అతిపెద్ద భూకంపాలు, వాటి మధ్య ఉన్న కాల పరిమితిని పరిశీలిస్తే ఇక ఎప్పుడైనా మరో తీవ్ర భూకంపం అంటే రిక్టర్ స్కేలుపై 8 పాయింట్లకన్నా ఎక్కువ స్థాయిలో రావచ్చన్నమాట. హిమాలయ ప్రాంతంలో (్భరత్ వైపు) 1897లో షిల్లాంగ్‌లోను, 1905 హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా, 1934లో నేపాల్-బీహార్ సరిహద్దుల్లోను, 1950లో ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్‌లోను పెనుభూకంపాలు నమోదయ్యాయి. ఆయా సంఘటనల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించాయి. ఆ తరువాత ఇప్పటివరకు అంటే మొన్న నేపాల్‌లో వచ్చిన స్థాయిలో అక్కడ భూకంపాలు రాలేదు. అదే ఇప్పటి భయానికి కారణం. భూమిలోపల దాగిఉన్న శక్తి బయటకు వచ్చి ఒత్తిడి తగ్గితే తప్ప ప్రమాదం లేనట్టు భావించలేం. ముఖ్యంగా భారత ఉపఖండ ఫలకం, యురేషియా ఫలకాల రాపిడికి గురవుతున్న 240 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రాంతాల్లో భూకంపాల ముప్పు ఉందన్నమాట. ఆ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో మన దేశానికి చెందిన చమోలి, ఉత్తరకాశి, మున్సియారి, ఉత్తరాఖండ్, జోషిమఠ్ వంటివి ఉన్నాయి. అంటే తొలి ప్రమాదం ఆ ప్రాంతాలకేనన్నమాట. సన్నద్ధత ముఖ్యం..కానీ… ప్రపంచంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ప్రాంతాల్లో రెండవది భారత ఉపఖండం. మనదేశంలో 54 శాతం ప్రాంతంలో భూకంపాలు రావొచ్చు. అయినా ఆ ప్రమాదం వస్తే తట్టుకోగలిగే సామర్థ్యం మన వద్ద ఇంకా పూర్తిగా లేదు. ఎదుర్కొనే శక్తి ఉన్నా ఆసక్తి లేకపోవడమే పెద్దసమస్య. భూకంపాల పుట్టగా చెప్పుకునే కాలిఫోర్నియాలో కూడా ఇదే సమస్య. చిన్నదేశమైనా పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో అవగాహనతో జపాన్ భూకంపాలను తట్టుకోగలిగేలా, నష్టాన్ని కనిష్ఠం చేసేలా అడుగులువేసి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. మొన్నటికి మొన్న నేపాల్‌లో వచ్చిన మాదిరి లేదా అంతకంటే పెద్దస్థాయిలో భూకంపం వస్తే దిల్లీ రూపురేఖలు ఏ మాత్రం మిగలవని నిపుణులు చెబుతున్నారు. పద్ధతీపాడు లేకుండా నిర్మించిన అసంఖ్యాక భవనాలు, నిర్మాణ శైలి, ఒకదానిని ఒకటి ఆనుకుని కట్టడం, యుమునా తీరంపై నిర్మాణాలు పెరిగి, జనాభా పెరిగి ఒత్తిడి ఎక్కువ కావడంతో నష్టాన్ని ఊహించడానికే భయం వేస్తోందని అంటున్నారు. మొన్న వచ్చిన చిన్నపాటి భూప్రకంపనలకే దిల్లీ సచివాలయం ఊగిసలాడింది. ఇక భారీ ప్రకంపనలు వస్తే అది నిలబడుతుందంటే నమ్మేదెవరు? రిక్టర్ స్కేలుపై 8 కన్నా ఎక్కువ ప్రభావంతో భూకంపం వస్తే చారిత్రాత్మక కుతుబ్‌మినార్ తట్టుకోవడం కష్టమేనని వారి వాదన. అంటే హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లోని కొండలు, లోయల్లో ప్రకృతిప్రకోపాన్ని పెంచేలా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు, అపార్టుమెంట్లు, హోటళ్లు పెను భూకంపానికి పేకమేడల్లా కూలిపోతాయని, పెనునష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే గంగానదీ పరీవాహక ప్రాంతంలో పెరిగిన నిర్మాణాలు, అధిక జనాభా ఫలితంగా భూకంపాలు వస్తే అపారనష్టం అనివార్యం కావొచ్చు. ఆమధ్య గుజరాత్‌లోని భుజ్ భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో మేల్కొన్న కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. నైనిటాల్లో ‘అడ్వాన్స్డ్ స్టడీ ఆన్ జియాలజీ’, గాంధీనగర్‌లోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెస్మాలాజికల్ రీసెర్చ్’ సంస్థలను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నివారణ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనే సంపూర్ణ, సాధికార సంస్థ ఇంకా రూపుదిద్దుకోవలసి ఉంది. జపాన్ ఏం చేస్తోంది. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూప్రకంపనలు వస్తూనే ఉంటాయి. రోజుకు కనీసం 57 సార్లు భూమి కంపిస్తుంది. కాకపోతే రిక్టర్ స్కేలుపై 3కన్నా ఎక్కువ స్థాయిలో ఉండేవే నమోదవుతాయి. మిగతావి ప్రమాదకరమైనవిగా గుర్తించరు. 4 కన్నా ఎక్కువ స్థాయిలో వస్తే కొందిరికి ప్రకంపనల ప్రభావం అనుభవంలోకి వస్తుంది. భూకంపాలతో తరచూ నష్టపోయిన జపాన్ ప్రకృతిని జయించే దిశగా అడుగులు వేసింది. 2004లో వచ్చిన తీవ్ర భూకంపంతో కకావికలమైన జపాన్ అప్పటికే భూకంపాలను తట్టుకునే సాంకేతిక ప్రగతిని సాధించి అన్ని విధాలా తట్టుకోగలిగింది. అక్కడ ప్రతి వీధిలో, రైల్వేలైన్ పైన భూకంపాలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేశారు. కనీసం కొన్ని క్షణాలముందు లేదా ప్రకంపనలు వచ్చిన వెంటనే హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఉంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపం వస్తే సురక్షితంగా ఆ రైళ్లు ఆగేలా ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు సురక్షిత మార్గాలు చూపిస్తూ ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకునే ఏర్పాట్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన వెంటనే టీవీల్లో మిగతా ఛానళ్ల ప్రసారాలు ఆగి, కేవలం జాగ్రత్త చర్యలు చెప్పే వార్తలే ప్రసారమయ్యే ఏర్పాట్లు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఏ భవనమైనా, ఆకాశహర్య్మాలైనా భూకంపాలను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టాల్సిందే. భూమిలోపల ఉండే పునాదులు, ఉపరితలం పైన ఉండే నిర్మాణానికి మధ్య ఎక్కడో ఒకచోట ‘షాక్ అబ్జర్వర్’లు, డక్టెల్‌లాంటివి నిర్మిస్తారు. వాటివల్ల భూప్రకంపనలు వచ్చినపుడు కట్టడం అంతా ఊగిపోకుండా ఆ డక్టెల్ లేదా అలాంటి మరో ఏర్పాటు ‘మేనేజ్’ చేస్తుందన్నమాట. మంచినీటి పైపులైన్లు భూకంపాలకు పగిలిపోకుండా కొత్త టెక్నాలజీని సైతం జపాన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్‌లోనూ ఈ టెక్నాలజీతో కొత్తగా పైప్లైన్లు వేయాలని ప్రయత్నిస్తోంది అమెరికా. కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు భూకంపాలు వస్తే అవి తలకిందులైనప్పుడు అందులో ఉన్నవారికి ప్రమాదం జరగకుండా ఎయిర్‌బ్యాగ్‌ల మాదిరిగా ఉండే సంచులను అమరుస్తారు. వాటిలో ఒకరకమైన లిక్విడ్ ఉంటుంది. దానివల్ల వారికి దెబ్బలు తగలకుండా ఉంటుంది. ఇక స్కూళ్లలో పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భూకంపాలు వచ్చినపుడు ఏం చేయాలో చిన్నప్పటినుంచి, స్కూళ్ల ప్రేయర్ టైమ్‌లోనే నేర్పిస్తారు. అంటే ఏరోజైనా, ఏ క్షణమైనా భూకంపంవస్తే ఎదుర్కొనేలా, క్షేమంగా బయటపడేలా చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పిస్తారు. మొన్నటికిమొన్న అక్కడ భూకంపం వచ్చినపుడు విద్యార్థులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం తగ్గిన తరువాత ఎటువంటి జంకూగొంకూ లేకుండా బయటకు రావడాన్ని సీసీటీవీ ఫుటేజిల్లో చూసి ప్రపంచం అవాక్కయింది. ప్రకంపనలు వచ్చినపుడు ఆరుబయటకు రావడం, భవనాల మధ్య ఉండకుండా గోడల వారకు చేరడం, బల్లలకిందకు చేరడం, కంగారుపడటం, భయపడటం, ఏడ్వటం వంటివి చేయకుండా బయటపడటం, ఎవరో ఒకరు వచ్చేవరకు ఎదురుచూడటం, మానసికంగా బలంగా ఉండటం నేర్పిస్తారు. రోజువారీ కార్యక్రమాల్లో భూకంపాల గురించి, జాగ్రత్తల గురించి చెప్పడం అక్కడ పరిపాటి. జపాన్‌తో పోలిస్తే మనదేశంలో భూకంపాలు తక్కువే అయినా, వస్తేగిస్తే తట్టుకునే శక్తి, సాంకేతిక సన్నద్ధత, ప్రజల్లో అవగాహన ఇంకా ముమ్మరం అవ్వాల్సి ఉంది. రిక్టర్ స్కేల్ – ఎం.ఎం.ఎస్ భూకంపాలను కొలిచే సాధనం ‘రిక్టర్ స్కేల్’. 1930లో దీనిని అభివృద్ధి చేశారు. అంతకుముందు భూకంపాల తీవ్రత లెక్కగట్టే సాధానాలు (వుడ్-అండర్సన్ టోర్సన్ సెస్మోగ్రాఫ్) ఉన్నా దీనికి కచ్చితత్వం ఎక్కువ కావడంతో అదే ప్రామాణికంగా మారింది. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సెస్మాలజిస్ట్ ఛార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్, బెనో గిటెన్‌బర్గ్‌లు రూపొందించిన స్కేల్‌కు ‘రిక్టర్’ పేరు పెట్టారు. ఇది 1930 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇది భూకంప తీవ్రతను చెబుతుంది. ఇది ఒకటికన్నా తక్కువ భూప్రకంపనలను నమోదు చేయదు. ఆధునికయుగంలో అంటే 1970 తరువాత రిక్టర్ స్కేలును ఆధునీకరించి, ఎంఎంఎస్ (మూమెంట్ మాగ్నిట్యూట్ స్కేల్)ను వినియోగిస్తున్నారు. రిక్టర్ స్కేల్ కన్నా దీన్ని మేలైన సాధనంగా చెబుతారు. దీనినే ‘మెరికల్లి ఇంటెన్సిటీ స్కేల్’అని, ‘మెద్వదెవ్-స్పాన్‌హడర్-కార్మిక్ స్కేల్’ అని కూడా అంటారు. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రతను చెబితే, ఎంఎంఎస్ భూకంప తీవ్రతతోపాటు, అది చూపే ప్రభావాన్నికూడా చెబుతుంది. అంటే నష్ట తీవ్రతను చెబుతుందన్నమాట. నిజానికి చాలా దేశాలు ఇప్పటికీ రిక్టర్ స్కేలునే వినియోగిస్తున్నప్పటికీ అమెరికా జియలాజికల్ విభాగం మాత్రం ఎంఎంఎస్‌నే వినియోగిస్తోంది. సెస్మిక్ జోన్స్ నాలుగు మనదేశంలో భూకంపాల ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో రావచ్చో ఊహించి 2,3,4, 5 సెస్మిక్ జోన్లు ప్రకటించారు. జోన్ 5: ఇక్కడ అతి తీవ్ర భూకంపాలు రావొచ్చన్నమాట. అంటే అత్యధిక ‘రిస్క్’ ఉన్న ప్రాంతం అన్నమాట. హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఈ జోన్లో చేర్చారు. కాశ్మీర్, మధ్య, పశ్చిమ హిమాలయాలు, ఉత్తర బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాణ్ ఆఫ్ కచ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ జోన్లోకి వస్తాయి. జోన్ 4: ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలున్న జోన్ ఇది. ముఖ్యంగా గంగ, యమున నదులు ప్రవహించే ప్రాంతాలన్నమాట. దిల్లీ, జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, నేపాల్-బీహార్ సరిహద్దులు, మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జోన్ 3: మోడరేట్ డామేజ్ రిస్క్ ఉన్న ప్రాంతాలు. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాలు, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 2: సాధారణ నష్టం కలిగే ప్రాంతాలు. పై మూడు జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాలన్నమాట. నిజానికి గతంలో ఆరుజోన్లు ఉండేవి. తాజాగా కేంద్రప్రభుత్వం దీనిని నాలుగు జోన్లుగా మార్చింది. భాగ్యనగరం సురక్షితమే- కానీ.. భూ ప్రకంపనలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ రెండో జోన్లో ఉంది. భూకంపం వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేని జోన్లో ఉంది. ప్రకంపనల వల్ల ఏ ముప్పు ఉండదని చెప్పుకునే ‘ఒకటో నెంబర్ జోన్’ను తొలగించారు. తెలంగాణ రాజధాని రెండో జోన్లో ఉందంటే విపత్కర పరిస్థితి పొంచి ఉందని అర్థం. అలాగని భారీ నష్టం జరుగుతుందన్న ఆందోళన అవసరం లేదు. దిల్లీ, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాలతో పోల్చితే భూ ప్రకంపనలకు సంబంధించి హైదరాబాద్ సురక్షిత ప్రాంతమే. భూమిలోపల మొత్తం పనె్నండు రకాల ఫలకాలుంటాయి. భూమిలోపల వేడి తీవ్రత కారణంగా కొన్ని ఫలకాలు కరిగి ద్రవ రూపంగా మారినపుడు, వాటిపై
బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ
|
||||||
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2
గ్రంధాలయ స్థాపన
1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను ఇరవై సంవత్సరాల వయసు లోనే స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు .కృత్తివెంటి పేర్రాజు ,నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్య దీక్షకు మెచ్చి చేయూత నిచ్చారు .ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండా గారం ‘’అనే గ్రందాలయన్నీ స్థాపించారు . మొదట్లో జగన్నాధ పురం లో ఉన్న ఈ లైబ్రరి తర్వాత పెద్ద వీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’లోకి మ్కార్చారు .కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు .సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు .ఇక్కడే శాస్త్రి గారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు .ప్రసిద్ధులను కూడా ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు .హరికధా కాలక్షేపాలు కూడా ఏర్పాటు చేశారు .ఆర్య మత బోధిని సభ ద్వారా శాస్త్రి గారు చేసిన హిందూమత సేవ అపారమై నిలిచింది .
వీదిప్రచారం
క్రైస్తవ మత ప్రచారకులు బ్రహ్మ సమాజికులు ఆనాడు వీధుల్లో బృందాలుగా వచ్చి మత బోధ చేయటమేకాక హిందూమతాన్ని తీవ్రంగా దూషించేవారు .సనాతన ధర్మంపై వ్యతిరేక ప్రచారం ఎక్కువ చేసేవారు .వారి ప్రచారం లో పస లేదని రుజువు చేయాలని శాస్త్రి గారు భావించి తానుకూడా వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసి నిర్వీర్యులను చేయాలని నిశ్చయించుకొన్నారు .1884లో ఈ వీధి ప్రచారం మొదలు పెట్టి శాస్త్రిగారు ఎన్నో వీధి ప్రచార సభలు నిర్వహించి ,కరపత్రాలను అచ్చు వేసి పంచి పెట్టారు .ప్రజలలో భక్తిని ప్రబోది౦చటానికి భక్తీ గీతాలను పాడుకొంటూ వీధుల వెంట తిరిగేవారు .దీనికోసం ఒక సమాజాన్ని 1885 లో స్థాపించారు .అవసరమైన పాటలను,కీర్తనలను శాస్త్రిగారే రచించి పాడటం నేర్పించి సమాజాన్ని వీధి ప్రచారానికి పంపేవారు .దీని వలన గొప్ప ప్రచారం జరిగీ క్రైస్తవ బ్రహ్మ సమాజాలు సమాజాలు బయటికి రావటానికి భయపడ్డాయి .
మహా పురుషుల జయంతి వర్ధంతులు
భారత దేశం లో జన్మించి తమ అమూల్య జీవితాలను ఆదర్శ వంతంగా తీర్చి దిద్దుకొన్న మహా పురుషులైన శ్రీ రామ కృష్ణ పరమ హంస ,శ్రీ శంకరాచార్య ,శ్రీ రామానుజాదుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి వారి జీవితాలలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రేరణ కలిగించేవారు .శాస్త్రిగారు ఆనాడేప్పుడో మొదలు పెట్టిన శంకర జయంతి కాకినాడలో ఈ నాటికీ నిర్వహిస్తూనే ఉన్నారు .తర్వాత ఈ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఉద్యోగులు నిర్వహి౦చారు .
మాస పత్రిక నిర్వహణ
శాస్త్రి గారు హిందూ మత విజ్ఞానాన్ని జన సామాన్యానికి అందించాలన్న తలంపుతో ‘’ఆర్య మత బోధిని ‘’అనే మాస పత్రిక ను స్థాపించి నిర్వహించారు .దీన్ని 1905 జనవరి ఒకటవ తేదీ ప్రారంభించారు .అప్పటికే శాస్త్రిగారు హిందూ మత సంబంధమైనవి ,సాహిత్య పరమైనవి అయిన వ్యాసాలూ వందల కొద్దీ రాసి ఉన్నారు .అవి వివిధ పత్రికలలో ప్రచురితాలుకూడా. కనుక శాస్త్రి గారి పేరు ఆంద్ర దేశం లో తెలియని వారు ఆ రోజుల్లో ఎవరూ ఉండేవారు కాదు. అంత గా పాప్యులర్ అయ్యారు శాస్త్రిగారు ‘’ఆర్య మత బోధిని కి దేశ మంతటా విశేషం గా పాఠకులు౦డేవారు శాస్త్రి గారి ప్రభావం వలన క్రమంగా బ్రహ్మ సామాజికుల ప్రభావం బాగా తగ్గి పోయింది అని వీరేశ లింగం పంతులుగారే అంగీకరించారు శాస్త్రి గారి ప్రభావం అంత గొప్పది .వీరేశ లింగం గారి మాటల్లోనే ‘’వెయ్యగా వెయ్యగా వెర్రి వాడే గెలిచి నట్లు శాస్త్రి గారి రాతలు ,చేతలు జనులను భ్రమల్లో ముంచాయని గ్రహించి నేను తలపెట్టిన మహా కార్యానికి విఘాతం కలుగుతుందని భావించి ‘’సత్య వాదిని ‘’అనే పత్రిక ప్రారంభించాను ‘’అని వీరేశ లింగం గారే రాసుకొన్నారు .ఆనాడు సంఘ సంస్కార పత్రికలన్నీ శాస్త్రి గారి మీద కత్తి కట్టాయి .అయినా జంకూ గొంకూ లేని శాస్త్రిగారు సరైన సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి వారి నోరు మూయి౦చ గలిగారు .అదే వారి ఘన విజయం .పరుషంగా వారు మాట్లాడినా శాస్త్రిగారు మృదువుగా యుక్తి యుక్తం గా సమాధానాలిచ్చేవారు .కలహానికి కందుకూరి ఎప్పుడూ కాలుడువ్వేవారు .చివరికి లింగం గారే పశ్చాత్తాపం ప్రకటించాల్సి వచ్చింది .సత్యమేవ జయతే అని శాస్త్రి గారు రుజువు చేశారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-15 –ఉయ్యూరు
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు
ఎవరిపేరు చెబితే విద్వాంసులు చేతులు జోడిస్తారో ,ఎవారు అజ్ఞాన తిమిరాలను చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించారో ,ఎవరు వందలాది శిష్యగణానికి ఆరాధనీయులో ఎవరు నడిచే విద్యా సరస్వతిగా భాసిల్లారో ,ఎవరు విమర్శనా వాజ్మయ జలధిని మదించి అనర్ఘ రత్నాలనీ వెలికి తీశారో ,ఎవరు సర్వ శాస్త్ర పారంగతులో, ఎవరు సమాజ దేవ పూజ చేశారో ,ఎవరు మూఢాచారాలను ఖండించి ప్రగతిమార్గ ప్రవర్తకులయ్యారో,ఎవరు సంస్కరణలను చెప్పటమేకాక పాటించి ఆదర్శంగా నిలిచారో వారే బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు .
శాస్త్రిగారి కుటుంబం
బ్రహ్మయ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా పలివెల గ్రామం లో మాతామహులైన మైలవరపు నరసన్న గారింట క్రీ శ.2-4-1863 న జన్మించారు .అది రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి గురువారం .శాస్త్రి గారి పూర్వీకులు రాజోలు దగ్గర కడలి గ్రామం లో ఉండేవారు .తెలగాణ్యులు .గౌతమస గోత్రులు .ఆపస్థంభ సూత్రులు .ముత్తాత గారు కడలి గ్రామం వదిలి కాకినాడ లో జగన్నాధ పురానికి చేరుకొని స్వగృహమేర్పరచుకొని నివాసమున్నారు .తండ్రిగారు బ్రహ్మావదానిగారు వేద శాస్త్రాలలో నిష్ణాతులు .తల్లిగారు సుబ్బమ్మ గారు .బ్రహ్మయ్య శాస్త్రిగారి తమ్ములు కూడా తక్కువ వారేమీకాడు .తమ్ముడు సుబ్బయ్య శాస్త్రి’’ శ్రీరామ విజయ గ్రంధ కర్త ‘’.బ్రహ్మయ్య శాస్త్రి గారి పెద్దకుమారుడి పేరుకూడా బ్రహ్మయ్య శాస్త్రి యే..ఈయన ‘’శ్రీరామ శతకం’’ రాసి తండ్రిగారికి అంకితమిచ్చాడు .శాస్త్రిగారి రెండవ కుమారుడు నరసింహ మూర్తి సుబ్బయ్య శాస్త్రి గారికి దత్త పుత్రుడయ్యాడు .ప్రసిద్ధ సారస్వత సేవకుడు దేశభక్తుడు కోటమర్తి చిన రఘుపతి రావు గారు బ్రహ్మయ్య శాస్త్రిగారి అల్లుడే .శాస్త్రి గారు మొదటిభార్య సుబ్బమ్మగారు మరణించిన తర్వాత వెదురుపాక నివాసి దంతుర్తి బ్రహ్మయ్య శాస్త్రులుగారి పెద్ద కూతురు సూరమ్మగారిని శాస్త్రిగారు ద్వితీయం చేసుకొన్నారు .
విద్యాభ్యాసం –సకల కళా ప్రపూర్ణులు
బ్రహ్మయ్య శాస్త్రి గారు కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో ఆంగ్ల విద్య నేర్చి మెట్రిక్ పాసైనారు .ఎఫ్ ఏ .పరీక్షకు చదువుతుండగా కుటుంబ పరి స్థితులవలన చదువు సాగక మానేశారు .కాలేజీ లో చదివేటప్పుడే శాస్త్రిగారు ఆంద్ర ప్రబంధ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .ఇంగ్లీష్ నేర్వక ముందే సంస్కృత పంచకావ్యాలు చదివేశారు .కాలేజి వదిలేసిన తర్వాత ‘’సిద్ధాంత కౌముది ‘’ని ఆపోసన పట్టారు .దానిపై వ్యాఖ్యానాలను చదవక పోయినా అందులోని సారాన్ని ఆస్వాదించారు .సంస్కృత ,ఆంద్ర ఆంగ్ల భాషల త్రివేణీ సంగమ స్నానం చేసి’’ సాదృశ భాషా శాస్త్రం’’ (ఫైలాలజి )లో క్రుషికూడా చేశారు .త్రిభాషా పాండిత్యం అబ్బటం వలన ప్రతి విషయాన్ని తులనాత్మకం గా పరిశీలించేవారు .దేశం లోని సాంఘిక విషయాలనూ అవగాహన పరచుకొన్నారు .హిందూ మతం పై వీరాభిమానమేర్పడింది .హిందూమతం లాంటి మతం, హిందూ సంఘం లాంటి సంఘం ప్రపంచం లో ఇంకెక్కడా లేవు అనే దృఢమైన అభిప్రాయమేర్పడింది .హిందూమతం యొక్క బాహ్య స్వరూపం తెలుసుకొంటే చాలదని భావించి అందులోని మత విజ్ఞానం పై ద్రుష్టి సారించారు .వివిధ శాఖలలో ఉన్న అతి సూక్ష్మ విషయాలను కూడా ఆకళింపు చేసుకొన్నారు .ప్రాయశ్చిత్త పశు నిర్ణయం ,పురాణాలలో ఉన్న గ్రహణాల విషయం అధ్యయనం చేశారు .వీటిపై అనేక వ్యాసాలూ రాశారు .అవి చదివితే శాస్త్రిగారికి ఉన్న శ్రౌత పాండిత్యం ,జ్యోతిష అవగాహన మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి .గానకళ లో నాట్యకళ లో ప్రావీణ్యం సాధించారు .ఎప్పుడూ ఏదో ఒక కొత్త విద్య నేర్వటం దాని లోతుపాతుల్ని తరచటం శాస్త్రిగారి హాబీ .అందుబాటులో ఉన్న గ్రంధాలయాలకు వెళ్లి తనకు కావలసిన విషయాలను చదువుకొంటూ లోకాన్నే మర్చి పోయేవారు .ఇతర గ్రంధాలను అనేకం చదవటం వలన ఆయనకు 60 వ ఏట నేత్ర ద్రుష్టి క్షీణించింది .మద్రాస్ వెళ్లి నేత్ర వైద్యులు డాక్టర్ కోమన్ నాయర్ కు చూపించగా వారు మరల దృష్టిని ప్రసాదించారు .రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ గ్రంధ పఠనం కొనసాగించారు .విద్య నేర్పటంకంటే విద్యార్ధిగా ఉండటమే శాస్త్రి గారికి మహా ఇష్టం .
నిత్య కర్మ వీరులు
బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత నిఘంటువు లో విశ్రాంతి అనే మాట కు చోటే లేదు .అనునిత్య కర్మవీరులు శాస్త్రిగారు .ప్రజా విషయాలపై అత్యంత శ్రద్ధ చూపటం మొదటి నుండి అలవాటు .కాకినాడ ట్రెజరీ డిప్యూటీ కచేరిలో గుమాస్తాగా శాస్త్రి గారు ఉద్యోగించారు .అక్కడ పని చేస్తున్నా వీరి ఇతరపనులకు ఏ ఆటంకమూ ఉండేదికాదు .కాలేజీ చదువు మానేసి ఇందులో కొలువులో చేరి నిరాఘంటంగా తమకు 56 వ ఏడు వచ్చేదాకా పని చేశారు .తరువాత దీనికి గాను నెలకు ఇరవై రూపాయలు పెన్షన్ పొందేవారు .విధి నిర్వహణలో ఏమరుపాటు లేకుండా పై అధికారుల మెప్పును పొందేవారు .ఆఫీసులో బండ చాకిరి చేసి ఇంటికి వచ్చినా శాస్త్రిగారు విశ్రాంతి తీసుకొనే వారుకాదు .ఎక్కడో ఒక చోట ఉపన్యాసం ఉండేది .వ్యాసాలూ రాసేవారు .అంతేకాక ప్రజాహిత సంస్థలను ఏర్పాటు చేసి వాటిద్వారా ప్రజా సేవ చేసేవారు .అందుకే వారికి విశ్రాంతి అనేది గగన కుసుమమే అయింది .
నాటక సమాజ స్థాపన
శాస్త్రిగారు విద్యార్ధిగా ఉండగా మహా రాష్ట్ర నుండి ధార్వాడ నాటక సమాజాలు వచ్చి ప్రదర్శనలు ఇచ్చేవి . .వారి రంగాలంకరణ ,ప్రక్రియా వైవిధ్యం ఆంధ్రులను ముగ్ధులను చేసేవి .ఆ కొత్త పద్ధతులు ఆంద్ర దేశం లో కూడా అభి వృద్ధి చెందాలని శాస్త్రిగారు భావించారు .’’ఆంద్ర బృందానంద సంధాయి ‘’అనే పేరుతొ ఒక నాటక సమాజాన్ని స్థాపించారు .ఈ సమాజం వీరేశ లింగం గారు రాసిన శాకుంతలం ‘’నాటకాన్ని బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసిన ‘’త్రిపురాసుర విజయ వ్యాయోగం ‘’నాటకాన్ని ఆడేవారు .ప్రసిద్ధ కవులు రాసిన నాటకాలనూ ప్రదర్శించి ప్రజారంజనం చేసేవారు .తర్వాత ఈ సమాజం మరో సమాజం లో కలిసి పోయింది .
భక్త సమాజ స్థాపన
విద్యార్ధి దశనుండి హిందూ మతానికి నవ నాగరికత వలన వస్తున్న ముప్పును బ్రహ్మయ్య శాస్త్రి గారు గ్రహించారు .దానిని నివారించటానికి ప్రజలలో భగవద్ భక్తీ పెంచటానికి అనువుగా 1880లో ‘’భక్త సమాజం ‘’అనే సమాజాన్ని స్థాపించారు .శాస్త్రి గారి నిర్మల నిశ్చయ భక్తీ వలన సమాజం దిన దిన ప్రవర్ధమానమైంది .సమాజం తరఫున అనేక గ్రామాలలో పర్యటించి భక్తిపై స్పూర్తిపూర్వకప్రసంగాలు చేసేవారు .కొంతకాలం తర్వాత ఈ సమాజం ‘’హిందూమత బాల సమాజం ‘’లో కలిసి పోయింది .
ఆధారం – మా తండ్రిగారు కీ .శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారు భద్రం గా తమ గ్రంధాలయం లో2-4-1940అని తమ సంతకం కింద తేదీ వేసి సంతరించి దాచుకొన్న ‘’విమర్శకాగ్రేసర కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత చరిత్రము ‘’ అనే గ్రంధం .సుమారుగా 75 ఏళ్ళక్రిందటిపుస్తకం అన్నమాట .అనుకోకుండా నా కంట బడితే సార్ధకం చేసుకొంటున్నాను . కవర్ పేజి చినిగిపోయింది .కనుక గ్రంధ కర్త ఎవరో నాకు తెలియలేదు .ఇది 40 పేజీలున్న చిన్ని పొత్తం .రచయితకు కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-15-ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -10-
ఆనంద రామాయణ విశేషాలు -10-
సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం
సీత తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె సంప్రీతి చెంది ఒక పాయస పాత్రను ఆయనకు ఇచ్చి’’మునీశ్వరా ! ఈ పాత్రలో అనేక పక్వాన్నాలు సమస్త భోజ్య పదార్ధాలు ఉన్నాయి .నీభార్య లోపాముద్రకు ఈ పాత్రనిచ్చి అందరికి వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అదృశ్యమయింది. అలాగే అగస్త్య పత్ని రామ పరివారానికి వడ్డించింది .అందరికి ఎవరికి ఏది ఇష్టమో ఆ పదార్ధాలన్నీ పాయస పాత్త్రనుండి వస్తుండగా సంతోషంగా వడ్డించి వారదరికీ తృప్తి కలిగించింది .భోజనాల తర్వాత సీతా రాములకు బంగారు ఆభరణాలను నూతన వస్త్రాలను ముని దంపతులు సమర్పించి ఆశీర్వ దించారు .
రాముడు అగస్త్యునితో పంచాప్సర సరోవరానికి వెళ్ళటం
మళ్ళీ పుష్పకమెక్కి పరివారం తో దండకాటవి సోయగాలను తిలకిస్తూ పంచాప్సర సరోవర తీరం చేరి ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని సంకల్పించారు .సీతారాములు అప్సర నాట్య గానాలు తిలకించి సంతోషించారు .కాని అప్సరసలు మాత్రం ఎవరి కంటికీ కనిపించలేదు .అందులోని రహస్యాన్ని రాముడు అగస్త్య మునినిని తెలియ జేయమని కోరాడు .’’రామా ! సర్వజ్నుడివి నీకు తెలియని విషయమే లేదు. నాద్వారా వినాలనే నువ్వు అడిగావు .చెప్తున్నాను విను ‘’పూర్వం గంధర్వ రాజు పుత్రికలు అయిదుగురు మనోహరా౦గులై రజస్వలలు కాకపూర్వం ఈ సరోవరం లో క్రీడించారు .ఇంతలో సరోవరం నుండి ఏడుగురు నాగకన్యలు కూడా బయటికి వచ్చి జలక్రీడలాడుతున్నారు .ఇలా నాగ గంధర్వకన్యలకు బాగా పరిచయాలు పెరిగిపోయాయి .సరస్సు ఒడ్డున తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరునికి వీరి జలక్రీడల వలన తపో భంగం కలిగింది .ఆయన వారందరినీ సరస్సు వద్దకు రావద్దని గట్టిగా చెప్పాడు .చపల చిత్తం కల అకన్యలు ముని మాట లక్ష్యపెట్ట లేదు. దేవేంద్రుడు కూడా వారిని ప్రోత్సహించి మరికొంతమంది అప్సరసలను అక్కడికి పంపి ముని సహనాన్ని పరీక్షించాడు .ఏంతో కోపం వచ్చిన వీళ్ళకు శాపం ఇస్తే తన తపస్సు వృధా అవుతుందని ముని ఆగుతున్నాడు .ముని జలదేవతలను ప్రార్ధించాడు. వారు వచ్చి అయిదుగురు అప్సరసలను నాగ కన్యలను బలాత్కారం గా అక్కడినుంచి తీసుకొని వెళ్లి ఎవరికీ వినపడని కనపడనిని నీటి ఇంటిలోదాచేశారు .హాయిగా తపస్సు చేసుకొని కొంతకాలానికి ఆ ముని స్వర్గం చేరుకొన్నాడు ..వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు నృత్య గీతాలాపన కొనసాగిస్తున్నారు .అదే నువ్వు వింటున్నది .నువ్వు వారిపై దయతో వారిని సంతుస్టూలను చేయి ‘’అన్నాడు .
ముని ఆజ్ఞను ఔదల దాల్చి శ్రీ రాముడు లక్ష్మణ స్వామిని తన ధనుర్బాణాలను వెంటనే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు తాను వెళ్లి జలదేవతను శిక్షించి నాగకన్యల చేర విడిపిస్తానని అన్నాడు .అన్న చెప్పినట్లు తమ్ముడు చేశాడు. చాపం చేత బూని ధనుస్టంకారం చేసి బాణాన్ని సంధించ టానికి సిద్ధ పడ్డాడు రాముడు .అప్పుడు భూమి కంపించింది చండమారుతం వీచింది ,దిక్కులన్నీ దుమ్ము కమ్మి చీకటి పడినట్లయింది .చుక్కలు రాలిపడి పోతున్నాయి .ప్రళయ భీకర రామ ధనుస్టంకారానికి భయపడిన జలదేవాతలు భయపడి తాము దాచి ఉంచిన కన్యలనందరిని వెంట బెట్టుకొని రామ దర్శనానికి వచ్చారు .రామపాదార విన్దాలపై పడి ప్రణమిల్లారు .సర్వాలంకార శోభితులైన పన్నెండుమంది నాగ కన్యలను శ్రీరామునికి సమర్పించారు .రాముని పాదాలపై వ్రాలిన జల దేవతలు రామునితో ‘’శ్రీ రామా !మా అపరాధం క్షమించు .బాణాన్ని ప్రయోగించవద్దు .సూర్య వంశాజులెవ్వరూ స్త్రీలపై బాణ ప్రయోగం చేయలేదు .నువ్వు కూడా గంగా తీరం లోసీతాదేవి ప్రతిజ్ఞ చేసినప్పుడు బాణం ప్రయోగించకుండా భూదేవిని రక్షించిన కరుణా సముద్రుడివి .తాటకిని చంపానుకదాఅని నువ్వు ప్రశ్నించ వద్దు .పాపులను సంహరించటం తో బ్రహ్మ హత్యా పాతకం రాదనీ నీకు తెలుసు ‘’అని భయ భక్తులతో ప్రార్ధించారు .సంతోషించిన రాముడు వారి మాటల విశేషానికి నవ్వి బాణాన్ని తూణీరం లో నుంచి బయటికి తీయలేదు .జలదేవతలు రాముని పూజించారు .వారిని స్వస్థానాలకు వెళ్ళిపొమ్మని రామాజ్న .అప్పటికే అక్కడికి చేరిన నాగ ,గంధర్వులు సీతారామ అగస్తులను అభినందించి రామునికి కానుకలు అందించి మనోహర వాక్యాలతో ప్రశంసిస్తూ .
నాగ గంధర్వులు శ్రీరాముని ప్రార్ధించటం
‘’రాజీవాక్షా !ఈ కన్యలు రజస్వల కాని కన్నెలు .వీరందరూ నీ పుత్రికలుగా భావించు .వీల్లనందర్నీ నీ పుత్రులకు ఇచ్చి వివాహం చేసి కన్నెచెర విడిపించు .నీవలన మాకులాలు పవిత్రమయ్యాయి .’’రాముడు వారికి అలానే చేస్తానని వాగ్దానం చేసి వారినిపంపేశాడు .అగస్త్యుదు రామునితో ‘’రామా !నువ్వు వైకుం ఠానికి వెళ్ళేటప్పుడు కుముదుని చెల్లెలైన కుముద్వతిని కుశుని ధర్మ పత్నిగా ఏర్పాటు చేయి .ఈ చంపిక కు మగ పిల్లలు పుట్టరు .కుముద్వితి వలన కుశునికి అతిధి అనే కొడుకు జన్మిస్తాడు అతడే రాజ్యానికి ఉత్తరాదికారి అవుతాడు .వంశ వర్ధనుడౌతాడు .ఇప్పుడు కుశుడు తప్ప మిగిలిన లవుడు మొదలైన వారికి నాగ కన్యలను ఏడుగురిని విధి విధానంగా వివాహం చేయించే ఏర్పాటు చేయి .నీ కొడుకు యూప కేతువు ఇంకొక అమ్మాయిని రాక్షస వివాహం చేసుకొంటాడు .అతని సమర్ధత వలన వచ్చే భార్యకూడా మంగళాంగి అవుతుంది .వారికి కొడుకులు మనుమలు కలుగుతారు .నీకొడుకులు కోడళ్ళు అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు .మనుమలు మునిమనుమలను కళ్ళారా చూసి వారి సౌభాగ్యాన్ని గమనించి సంతృప్తి చెంది అప్పుడు మాత్రమె నువ్వు వైకుంఠానికి సపరివారంగా వెళ్ళాలి ‘’అని ఆదేశించాడు రాముడు చిరునవ్వుతో ముని ఆజ్ఞను శిరసా వహిస్తానన్నాడు .కన్యల పేర్లను అడిగి తెలుసుకొన్నాడు రాముడు .వారే చంద్రిక ,చంద్ర వదన ,చంచల ,చపల ,అచల ‘’అని తెలియజేశారు గంధర్వులు .ఆ తర్వాత నాగుల నడిగి ఆ కన్యల పేర్లు ‘’కంజానన,కంజ నేత్ర , కంజాంఘ్రి ,కలావతి ,కళిక ,కమల ,మాలతి ‘’అని తెలుసుకొన్నాడు .వారందరి మనోభావాలను తెలుసుకొని వారికి తనకుమారులతో వివాహం మనస్పూర్తిగా ఇష్టమే నని గ్రహించాడు .అందరిని పుష్పకం ఎక్కించి సుఖ నిద్రపోయారు .మర్నాడు ఉదయం స్నానాదికాలు నిర్వహించి అగ్ని హోత్రాన్ని అర్చించి గాంధర్వ నాగ జనాన్ని చూసి రాముడు ‘’ఈ జనం తో నేను నాగ గాంధర్వ స్వర్గ లోకాలకు మనుష్యలోక వాసినైన నేను రావటానికి యోగ్యుడినికాను .కనుక నామాట విని మీరు మీ స్వస్థానాలకు వెళ్లి పోయి ,ఈ కన్యల వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా మళ్ళీ అయోధ్యాపురికి విచ్చేసి కళ్యాణాలనులను తిలకించి పులకించి మా ఆతిధ్యాన్ని స్వీకరించి మమ్ములనందరిని ఆనందింప జేయండి ‘’అని చెప్పి అయోధ్యకు చేరాడు .
వీరందరి వివాహం ఎలా జరిగిందో కిందటి ఎపిసోడ్ లో తెలుసుకొన్నాం కదా .ఇక స్వస్తి
ఆనంద రామాయణం ప్రధమ సంపుటం లోని విశేషాలు ఇంతటితో సమాప్తం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -9
ఆనంద రామాయణ విశేషాలు -9
పన్నెండు పెళ్ళిళ్ళు
ఒక రోజు రామ రాజు సింహాసనం పై ఆసీనుడై జ్యోతిశాస్త్ర పండితులను పిలిపించి ,కులగురువు వశిస్టమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి కూర్చో బెట్టి ,నాగ గాంధర్వ పురోహితులనూ ఆహ్వానించి తన 7 గురు కుమారులకు దివ్యమైన వివాహ ముహూర్తాన్ని నిర్ణయించమని అర్ధించాడు .అందరు పండితులు తమలో తాము సంప్రదించుకొని ఏకగ్రీవం గా ‘’వైశాఖ మాసం లో శుక్ల పక్షం లో ఒక ముహూర్తాన్ని దానికి పదిహేను రోజుల్లో కృష్ణ పక్షం లో మరో ముహూర్తాన్ని సూచించారు .అలాగే జ్యేష్టమాసం లోకూడా శుక్ల పక్షం లో ఒకటి కృష్ణ పక్షం లో మరొకటి దివ్యమైన ముహూర్తాలని సెలవిచ్చారు ,మార్గశిరమాసం లోనూ రెండు ,మాఘ మాసం లో మూడు ముహూర్తాలున్నాయని చెప్పారు .ఇలాగ పన్నెండు ముహూర్తాలు పన్నెండుమందికన్యలకు తగి ఉన్నాయని సెలవిచ్చారు .మళ్ళీ అందరూ కలిసి వసిస్టూలవారి తో సంప్రదించి శ్రీరామునికి నివేదించారు .లవునికి ,అంగదునికి వైశాఖ మాస ముహూర్తాన్ని ,చిత్రకేతు ,పుష్కరులకు జ్యేష్టమాస ముహూర్తాన్ని ,వేర్వేరు పక్షాలలో బాగున్నాయని నిర్ణయించారు .తక్షుడికి సుబహువుకు మార్గ శిరమాస ముహూర్తాలు భేషుగ్గా ఉన్నాయన్నారు .యూపకేతువుకు ,అంగదునికి ,చిత్రకేతువుకు మాఘ మాస ముహూర్తాలు కుదిరాయన్నారు పుష్కర ,తక్షక ,సుబాహువులకు ఫాల్గుణ మాస మూడు ముహూర్తాలు తగినవిగా ఎంచారు .ఇలా రాజకుమారులు 12 మందికి 12 శుభ ముహూర్తాలు నిర్ణయించారు జ్యోతిశ్శాస్త్ర పండితులు .వారిని రాముడు ఘనంగా సన్మానించాడు .
జ్య్తోతి ష్ శాస్త్ర పండితులు మహర్షి వసిస్టూడు ,గాంధర్వ నాగ పురోహితులు అందరూకలిసి శ్రీరాముని సన్నిధానానికి చేరి గాంధర్వ ,నాగ కన్యలను పెళ్లి కుమారులకు చక్కగా పంచారు . కన్జానన ను లవునికి ,కంజాక్షి ని అంగదునికి కన్జాంఘ్రిని చిత్ర కేతువునికి ,కలావతిని పుష్కరునికి ,కాలిక ను తక్షునికి ,కమలను సుబాహునికి ,మాలతిని యూప కేతువునకు ,ఇచ్చి వివాహం చేస్తే చక్కని పొంతన ఉంటుందని తెలియ జేశారు .ఈ విధం గా ఏడుగురు నాగ కన్యలకు తగిన వరులను నిర్ణయించి చెప్పారు .తర్వాత చంద్రికను అంగదునికి ,చంద్రాస్యను చిత్ర కేతువుకు ,చంచలను పుష్కరుడికి ,ఆచలను సుబాహువుకు ఇచ్చి వివాహం చేస్తే దాంపత్యం అన్యోన్యంగా వర్ధిల్లుతుందని చెప్పారు .సంతోషించిన రాముడు అందరిని సముచితంగా సత్కరించిపంపి సీతా దేవికి ఈ విషయ౦ వర్తమానం పంపాడు .
ఏడుగురు కొడుకులకు పన్నెండు మంది కన్యలతో వివాహం చేసిన తండ్రి శ్రీరాముడు
రాజకుమారుల వివాహవార్త దేశమంతటా చాటించగా అశేష జన సందోహం అయోధ్యకు వచ్చి చేరుకొన్నది. ఎక్కడ చూసినా జయ జయ ద్వానాలే .రాజవీదులన్నీ క్రిక్కిరిసిపోయాయి .అందరికి తగిన వసతి సౌకర్యాలు కల్పించారు .రాక్ష సేనతో విభీషణుడు ,వానర సేనతో సుగ్రీవుడు ,ఇద్దరు కొడుకులతో భూరి కీర్తి ,సపరివారంగా జనక మహారాజు తమ్ముడు ,యుదాజిత్తు తో సహా విచ్చేశారు .ఎవరికీ ఏ లోపం లేకుండా మంత్రులు ఏర్పాట్లు అద్భుతంగా చేశారు .
శ్రీరాముడు వైశాఖ శుక్లపక్షం లో పురోహిత ,బంధు మిత్రులతో మంగళ స్నానాలు చేశాడు .లవకుమారునికి మంగళ స్నానాలు చేయించి పెండ్లికోడుకును చేయించాడు వ.ధువు చే సువాసినీ పూజ జరిపించాడు .సీతాదేవి మిగిలిన రాణులు అభ్యంగన స్నానాలు చేశారు .దివ్యాభరణాలతో శోభాయమానంగా అల౦కా రాలు చేసుకొన్నారు .మంగళ వాద్య ధ్వనులు మిన్నులు ముట్టు తున్నాయి .శ్రీరాముడు పురోహితుల సహాయం తో శ్రీ మహా గణపతి పూజ చేశాడు .తర్వాత పున్యాహవాచనం నవ గ్రహ పూజ చేశాడు .మునులన్దరిని ఉచిత రీతిలో సత్కరించాడు .ముహూర్త సమయానికి ముందే నాగ రాజులున్న విడిది ఇంటికి చేరుకొన్నాడు ..లవకుమారుని నాగకన్య కన్జనయనకు శాస్త్రోక్తంగా ముహూర్త సమయానికి వివాహం చేశాడు .నాలుగవ రోజున లవుడు మంగళ మంటపం లో శోభాయమానం గా విరాజిల్లాడు .రాముడు స్వగృహం లో లవుని చేత శ్రీమహా లక్ష్మీపూజ చేయించాడు .అనేక దానాలు ఇప్పించాడు .వివాహానికి తరలి వచ్చిన నాగ యక్ష గాధర్వ పౌరజనం అంతా రామునికి నూతన వస్త్రాభరణాలు చదివించి పూజించి ధన్యులయ్యారు .లక్ష్మణుడిని కుశుడిని సన్మానించారు .రాజ పత్నులు ,మిత్రపత్నులు గంధర్వ పత్నులు వేర్వేరుగా సీతాదేవి మొదలైన రాజ పత్నులను సత్కరించారు .వారందరికీ సీతా దేవి యధోచిత సత్కారాలు చేసింది .ఇలా వైశాఖ మాస శుక్లపక్షం లో రాముడు లవుని వివాహం చేసి అందరికి ఆనందం కలిగించాడు .
వైశాఖ కృష్ణ పక్షం లో రాముడు అంగద వివాహం మహా వైభవం గా నిర్వహించాడు .జ్యేష్టమాసం లో శుక్ల ,కృష్ణ పక్షాలలో చిత్ర కేతు ,పుష్కరులకు పెళ్ళిళ్ళు ఘనం గా చేశాడు .సమస్త రాజులను సత్కరించి మర్యాద చేసి పంపాడు .మళ్ళీ మార్గ శిరమాసం వివాహాలకు రావాలని కోరాడు .మళ్ళీ అందరి సమక్షం లో మార్గశిరమాసం లో తక్షకునికి సుబాహువుకు వైభవోపేతం గా కళ్యాణాలు జరిపించాడు .మాఘ మాస వివాహాలకు ఆహ్వానించి యూప కేతువు అంగదుడు ,చిత్రకేతువు లకు ఘనంగా వివాహాలు నిర్వహించి వచ్చినవారందరినీ వెనక్కి వెళ్ళకుండా అయోధ్యలోనే ఉంచుకొని ఫాల్గుణ మాసం లో పుష్కర,తక్షక ,సుబాహువుల పెండ్లిండ్లు మహా వైభవోపేతంగా జరిపించాడు .ఈ విధంగా తన ఏడుగురు కుమారులకు పన్నెండుమందికన్యలతో వివాహం జరిపించి రికార్డ్ సృష్టించాడు రాముడు .ఈ కళ్యాణాలు జగదానంద కారకాలుగా ,బ్రహ్మానందం గా జరిగినందుకు దేవ యక్ష గాంధర్వ నాగ ,రాక్షస వానర సమూహాలన్నీ పరమానంద భారితులయ్యాయి .అందరినీ శ్రీరామ పరివారం సగౌరవం గా సత్కరించి మర్యాదలతో వీడ్కోలు పలికి రాముని గొప్పతనానికి వన్నె తెచ్చారు .వారందరూ అయోధ్యను ,రాముని వదలలేక వదలలేక వెళ్ళారు . సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు .
ఆనంద రామాయణ విశేషాలు -7 శివుడు చేసిన రామ స్తవం -2
ఆనంద రామాయణ విశేషాలు -7
శివుడు చేసిన రామ స్తవం -2
భవోద్భవం వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం తం భక్తి ప్రియం భాను కుల ప్రదీపం –భూతాది నాదం భజామి రామం భవ రోగ వైర్యం –సర్వాది పత్యం రణరంగ ధీరం సత్యం చిదానంద సుఖ స్వరూపం –సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానంద మహం భజామి –కార్యం క్రియా కారణ మప్రమేయం కవిం పురాణం కమలాయ తాక్షం –కుమార వేషం కరుణామయం తం కల్ప ద్రుమం రామమహం భజామి –త్రైలోక్య నాధం సరసీ రుహాక్షం దయానిదిం ద్వంద్వ వినాశ హేతుం –మహాబలం వేద నిధిం సురేశం సనాతనం రామమహం భజామి –వేదాంత వేద్యం కవిమీశితారం అనాది మధ్యంత మచింత్య మాద్యం –అగోచరం నిర్మల మేక రూపం పరాత్పరం రామమహం భజామి –
అశేష వేదాత్మక మాది దేవ మజం హరిం రామ మనంత మూర్తిం –అపార సంవిత్సుఖమేక రూపం నమామి రామం మనసః పరస్తాత్ –తత్వ స్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత మేకమేవ –రాజాదిరాజం రవి మండలస్తం విశ్వేశ్వరం రామ మహం భజామి –యోగీంద్ర సంఘై రపి సేవ్యమానం నారాయణం నిర్మల మాదిదేవం –నతోస్మి నిత్యం జగదేక నాధం హరిం చిదానంద మయం ముకుందం –అశేష విద్యాదిపతిం నమామి రామం పురాణం తమసః పరస్తాత్ –విభూతిదం విశ్వ సృజం విరాజం రాజేంద్ర మీశం రఘునాధ నాధం –అచింత్య మవ్యక్త మనంత రూపం జ్యోతిర్మయం రామమాహం భజామి సమస్త సాక్షిం తమసః పరస్తాత్ –మునీంద్ర గుహ్యం పరిపూర్ణ మేకం కలానిదిం కల్మష నాశ హేతుం –పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహాతోమహాంతం –బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చదేవేంద్రో దేవతాస్తధా –ఆదిత్యాది గ్రహిస్చైవ త్వమేవ రఘు నందనః –తపస రుషయస్సిద్దా స్సాధ్యాస్చ మునయస్తదా –విప్రా వేదాశ్చ యజ్ఞాశ్చ పురాణం ధర్మ సంహితాః – వర్ణాశ్రమా స్తదా ధర్మా వర్ణ ధర్మ స్తధైవచ –నాగ యక్ష్మాస్చ గంధర్వా దిక్పాలాది గజాదిశః –వసవోస్తౌత్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః –తరకా ద్వాద శాదిత్యా స్త్వమేవ రఘునాయకః –సప్త ద్వీపా స్సముద్రాశ్చ నదానద్య స్తదా ద్రుమాః –స్థావరా జ౦గ మాస్చైవ త్వమేవ రఘునందనః –దేవా తిర్యజ్మనుష్యా ణాం దానవానాం దివౌకసాం –మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందనః –శాంతం సర్వ గతం సూక్ష్మం పరబ్రహ్మ సనాతనం –రాజీవ లోచనం రామం ప్రణమామి జగత్పతిం –తతః ప్రసస్సా శ్రీరామః ప్రోవాచ వృషభధ్వజం ‘’
అని శివుడు రాముడిని స్తుతించాడు .విన్న శ్రీరాముడు పరమానందం తో పరమేశుని అభినందించి ప్రసంనుదనైనానని ఏదైనా వరం కోరుకోమన్నాడు ..రాం స్మరణ తో తానూ ధన్యుదనయ్యానని తెలిపి తనకు ‘’అద్వైత జ్ఞానం ‘’బోధించమని రామపాదార విందా సేవలో ధాన్యం యెట్లు చేయమని వేడాడు .కాని రాముడు శివుడికి వేరే వరం ఇచ్చి అనుగ్రహించాడు .శివుడు చేసిన ఈ రామస్తుతి విన్నా చదివినా పారాయణ చేసినా ఉత్తమ లోకప్రాప్తికలుగుతుందని ఫల శృతి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15-ఉయ్యూరు
రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం
రెండుముక్కలాట
తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’
సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు నేను బెజవాడలో మండిపోతున్నాను .నీది బలిసిన రాష్ట్రం నాది బక్క రాష్ట్రం .అందరూ తలాచేయి విదిలిస్తే బతికి బట్టకడతాం .ఏడాది అయిందికాని హామీలేతప్ప ఆచరణే లేదు .నెలకి మూడు సార్లు బాబు మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ‘’చేపిందేమీ’’ లేదు బాబు ఉట్టికెగరలేకపోయినా స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నాడు .ఇదీ మా పరిస్తితి .అందుకని’’ తెలంగాణా అమ్మను’’ నువ్వు తీసుకొని హైదరాబాద్ లో జాగ్రత్తగా చూసుకో .అమ్మకి అన్నీ కావాలి .అన్నిటిమీదా కోరికలున్నాయి .మీరు బలిసిఉన్నారు . మా సొమ్మంతా నొక్కేసి కుక్కేసుకొన్నారు .కనుక అమ్మ నీది .నాన్న నోట్లో నాలుక లేనివాడు .ఉన్నా లేకున్నా సర్దుకు పోతాడు .నాన్న బరువు నాకేమీ కష్టం కాదు .ఎలాగోఅలా బాబు లాగా బండీ ఈడుస్తాను . మనుషులం వేరైపోతున్నా మనస్సులో ఒకటిగా బతుకుదామని ముక్కలయ్యేటప్పుడు ముక్కలు చేసేటప్పుడు పెద్దలు చెప్పిన మాటల్ని పాటిద్దాం .బై అమ్మా –వెళ్లి హాయిగా అన్నయ్య దగ్గర బతుకు .ఇక్కడేముంది శివాలయం ?ఫోన్లూ గట్రా చేసుకొంటూ ఉందాం లే ‘’అన్నాడు తమ్ముడు .సరేనని అన్న అమ్మను తమ్ముడు నాన్నను పంచుకొని భరిస్తున్నారు .
సీన్ 2- ‘’ఒరే ! ఒద్దంటే ఆ తెలంగాణా పోరి వెంటబడి ప్రేమించి మా కొ౦పలమీదికి తెచ్చావ్ .ఎగేస్తే బ్రహ్మ హత్యా దిగేస్తే గోహత్యా లాగా ఉంది మా పని ‘’ అన్నాడొక ఆంధ్రా పుత్ర రత్నం తండ్రి .’’నాన్నా !మనసులు కలవటానికి ఆంధ్రా తెలంగాణా ఏమిటి ?ఇద్దరం ప్రేమించుకోన్నాం .పెళ్లి చేసుకోవాలనుకోన్నాం వాళ్ళ నాన్నకు అమ్మకూ ఇష్టమే మీ అభిప్రాయం కోసమే ఆగాం .లేకపోతె ఏ కోటప్పకొండమీదో లోనో పెళ్లి చేసేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం .మీ మీద గౌరవం తో ఆ పని చేయలేదు .రేపు ఆ ఆమ్మాయి అమ్మానాన్నా వస్తారు. ఇద్దరూ కూర్చుని ఎలా చేయాలో ఆలోచించి మా పెళ్లి చేయండి ‘’అన్నాడు పుత్ర రత్నం .
మర్నాడు ఇరువైపులా వియ్యాలవారూ కూర్చుని మాట్లాడుకొంటున్నారు ఆ వివారాలు –
పెళ్లి కూతురు తండ్రి –బావ గారు ! పెళ్లి ఎక్కడ ఎలా చేయమంటారు ?
పెళ్ళికొడుకు తండ్రి –మీ ఇష్టం బావాజీ ! ఏ సంప్రదాయం లో చేద్దాం ?
పెళ్లి కూతురి తల్లి –ఎలాగో రెండుముక్కలయ్యాం కదా అటూ ఇటూ రెండుద్ధతులూ పాటిద్దాం
పెళ్ళికొడుకు తల్లి –వొదిన గారు మా భేషుగ్గా చెప్పారు .తాంబూలాలు తెలంగాణలో పద్ధతిలో తీసుకొందాం
పె కూ త –అయిడియా బాగుంది వొదినా ! పెళ్లి ఆంధ్రా పద్ధతిలో లాగిద్దాం
పె కొ త –ఒకే వొదినా
పపె కూ త-అయితే కార్యం మాత్రం మా తెలంగాణా విధానం లో ధూమ్ ధాం గా జరగాలి వొదినా
పె కొ త –వెరీ గుడ్ –ఇక హనీమూన్ సంగతి ?
పె కొ తండ్రి –మీది బలిసిన రాష్ట్రం .మావన్నీ లాక్కుని మరీ బలిసిపోయారు .కనుక ఖర్చు అంతా మీరే పెట్టుకొని ఏ సింగపూర్ కో పంపండి .
పె కూ తండ్రి –దాందేముంది బావాజీ ! మొన్నటిదాకా మీరు మేశారు ఇప్పుడు మేము మేస్తున్నాం .తినేవాళ్ళం మారారుకాని తినటం మారలేదు .అయినా పెళ్లి విషయాలలో ఈ దెప్పుల్లెందుకు లెండి .
పె కొ తం –బాగా చెప్పారు బావగారు .మా రాయల సీమ సరుకు దిమ్పుతాం పెళ్లి రోజున .కంగారు పడకండి .హాయి గా జాయ్ అండ్ ఎంజాయ్ .ఇదే సమన్యాయం అంటే .
సీన్ 3- కుర్రది -ఏరా! ఆన్ద్రోన్నని గీర్వనం సేయమాకు .పాపం ఎంటబడ్డావని ఒకే అనేస్తి .జర- జాగర్త మీ అమ్మఆంధ్రోల్లంట నా మీదికి వస్తే తెలంగాణా శకుంతల మాదిరి లొల్లి సేస్తా .
కుర్రాడు -ఎందే నీ మిడిసిపాటు .మా నాన్న తెలంగాణా బిడ్డ తోలు వోలుస్తాడు బిడ్డా ఒళ్ళు జాగ్రత్త .
కుర్రది –అరె అసలు మనకింకా పెళ్ళే కాలేదు అప్పుడే ఈ సోది ఏందిబే
కుర్రాడు –అందుకే నిదానించు .పెద్దోళ్ళు ఏం నిర్వాకం చేశారో మనకొద్దు .మనం మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం .మనకు భేదాలు ఒద్దు .నువ్వూ నేనూ మనం .అంతే .వాళ్లకు మన నడకతో బుద్ధి సెప్పాల .ఆల్లు తప్పు సేశామని సెంపలేసుకోవాల .అదీ మనిద్దరి పధ్ధతి
కుర్రది –ఒకే రా .అంతే మనం ఒక్కటే .ఒక్కటిగా మనం .మనం మనకోసమేకాడు అందరికోసం
కు ,కుర్రాడు –ఒకే బాబా ఒకే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-15- ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -8
ఆనంద రామాయణ విశేషాలు -8
శ్రీరాముడు గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళటం
ఒకసారి శ్రీరాముడు సీతా లక్ష్మణ భారత శత్రుఘ్న సమేతుడై పుష్పక విమానం ఎక్కి సూర్య గ్రహణ స్నానానికి కురుక్షేత్రానికి వెళ్ళాడు .అప్పటికే దేవ గాంధర్వ కి౦పు రుషలాదులందరూ అక్కడికి చేరుకొన్నారు .అన్ని ఆశ్రమాలనుండి మునులూ విచ్చేశారు .నానాదేశ రాజులూ వచ్చారు .శ్రీరాముడు సీతా సమేతంగా గ్రహణ స్నానం చేశాడు .గజ ,తురగ ఉస్ట్ర మొదలైనవానిని దానం గా సమర్పించాడు .రాజులు విలువైన కానుకలు రామునికి సమర్పించారు .సీతా రామ దర్శనానికికై అందరూ ఉవ్విళ్లూరుతున్నారు .జానకీదేవి రాజపత్నులను ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలతో వారిని సంతృప్తి పరచింది .మునిపత్నులకు నమస్కరించి ఉచితాసనాలపై వారిని కూర్చుండ బెట్టింది .
సీతా లోపాముద్ర సంవాదం
సీతాదేవి ముని పత్నులఎడ చూపుతున్న గౌరవ మర్యాదలకు పొంగిపోయిన అగస్త్యమహర్షి భార్య లోపాముద్ర సీతను ఆమె పెండ్లి నాటినుండి ఇప్పటివరకు జరిగిన కధను వివరించమని కోరింది .సీత అన్ని విషయాలు ఆసక్తికరంగా వివరించింది .అంతా విన్న లోపాముద్ర ‘’జానకీ !అంతా బాగానే ఉంది .కాని ఒక విషయ౦ లో మీ ఆయన అనవసరంగా కష్టపడ్డాడేమోనని పించింది .సముద్రంపై సేతువును కట్టటానికి అంత కష్టపడాలా ? మావారు కు౦భసంభవులు అగస్త్యమహర్షికి చెప్పి ఉంటె ,ఆ సముద్ర జలాన్ని మూడు గుక్కల్లో తాగేసి లంకకు దారి ఏర్పరచేవారుకదా?కోతిమూకకు సేతువుకట్టే శ్రమ ఉండేదికాదు కదా ?’’అని సన్నాయి నొక్కులు నొక్కింది .లోపాముద్రా దేవి చాలా గర్వంతో తనభర్త అగస్త్యమహర్షి గొప్పతనాన్ని గురించి చెప్పిందని గ్రహించిన సీతా దేవి నవ్వి ఆమెతో ‘’తల్లీ అగస్త్య అర్ధాంగి లోపాముద్రా దేవీ !నా భర్త శ్రీరాముడు సేతువును చాలా తేలికగానే సక్రమంగానే కట్టారు .మీరు కూడా వినండి రాజపత్నులారా ! సవివరంగా ఆ విషయం మీ అందరికి వివరిస్తాను .శ్రీరాముడు మీరు అనుకొన్నట్లు చేతకాని వాడేమీకాదు.రామ బాణం ఎక్కు పెట్టి సముద్రుడిని శోషింప జేయగల మహా సమర్ధుడు నా రాముడు .కాని అలా చేస్తే సాగరం లోని అనేక జీవ రాశులకు అపాయంకలిగి హత్యా దోషం కలుగుతుందని సందేహించాడు .ఒక వేళ రాముడు ఆకాశ గమనం తో సముద్రాన్ని దాటితే అప్పుడు రావణుడు శ్రీరాముని మనుష్యమాత్రునిగా ఎలా భావిస్తాడు ?ఇదీకాక భక్తుడైన హనుమ వీపుమీద ఎక్కి సాగర ఉల్లంఘనం చేసి లంకకు వెళ్ళగల సమర్దుడే కదాఅంటారేమో ! అప్పుడు రామ పౌరుషాన్ని లోకం ఏ విధంగా భావిస్తుంది ?పోనీ ఈదుకుంటూ సముద్రం దాట వచ్చు కదా అని అనుకొంటే ‘’బ్రాహ్మణ మూత్రం అయిన సముద్రాన్ని మనం దాట రాదు’’ అని శంకించాడు .-‘’పీతోయం జలధిః పూర్వం శ్రుతం క్రోదా దగస్తినా –మూత్ర ద్వారా ర్బహిస్త్యస్త సమాత్ క్షారత్వ మాగతః –సర్వదా మూత్రవత్ క్షారస్స కదం పాతు మర్హతి –స రుషి ర్మమ వాక్యేన చులకం తు కరిష్యతి ‘’.
‘’అయినా మీ ఆయన మా ఆయన చేత ప్రార్ధనీయుడే .కాదన లేను .నీ భర్త అగస్త్యముని కోపంతో ఈ సాగరాన్ని పానం చేశాడని విన్నాను.లోకాలు తల్లడిల్లి మహర్షిని ప్రార్ధిస్తే తన మూత్రం ద్వారా సాగరాన్ని బయటికి వదిలాడని లోకానికి తెలిసిన విషయమేకదా.అందుకే తీయగా ఉండే సముద్రజలం అగస్త్య మూత్రం తో ఉప్పగా మారి క్షార జలధి అనే పేరు వచ్చింది .ఈ సంగతి నీకు తెలియనిదికాదు .’’మూత్రపానం బ్రాహ్మణేన స్వకార్యార్ధం నిజొక్తిభిః ‘’ అలాంటి మూత్ర రూప సాగరాన్ని నా భర్త ఇక్ష్వాకు ప్రభువు రాఘవ స్వామి మళ్ళీ ఎలా పానం చేస్తాడమ్మా!ఒక వేల నువ్వు హితం చెప్పినట్లే నేను నా రాముని నీ భర్త అగస్త్యమునిని వేడుకొని సముద్రజలాన్ని ‘’చులికీక్రుత సర్వ పాదోది జలం’’గా చేయమని కోరినా ,అయన అంటే నీ భర్త అగస్త్యుడు మళ్ళీ ఎల్లా తన మూత్రాన్నే పానం చేయగలడు?’’ఇది లోక ధర్మ విరుద్ధంకదా మాతా ! లోకం ఏమను కొంటుంది? ‘’రాముడు సొంత కార్యం కోసం పాపం నిష్టా గరిస్టూడైనబ్రాహ్మణుడి చేత స్వమూత్ర పానం చేయించాడు ‘’అనే లోక నింద పడమంటావా .అపకీర్తి మూట గట్టుకోమంటావా ? ! ఇది న్యాయమా ?అందుకే రాముడు ధర్మ స్వరూపుడు కనుక నీ భర్త అగస్త్యుని ప్రార్ధించలేదు . ఇన్ని రకాలుగా అలోచించి వానర మూకల చేత సేతు బంధాన్ని చేయిన్చాడుధర్మ మూర్తి రామ మూర్తి .ఇంతవరకు ఎవరూ చేయని సాహసం చేసి సేతు నిర్మాణం గావించి చిరకీర్తి పొందాడు రాముడు .ఏ రామునిచేత సముద్రం లో రాళ్ళు సంతరి౦ప బడ్డాయో అలాంటి వాడు కదా’’ దాశరధి’’ అని నా భర్త శ్లాఘింప బడ్డాడు కీర్తింప బడ్డాడు !‘’అని సీతా సాధ్వి సవినయంగా మనవి చేసింది .లోపాముద్ర ఈ సమాధానికి ఓడిపోయి తలవంచుకొని నిలబడింది .మునిపత్ని ఖిన్నురాలుకకుండా ఆమెపై తన కున్న అపూర్వ గౌరవాన్ని ప్రకటిస్తూ లోపాముద్రాదేవిని యధోచితంగా సత్కరించి మిగిలిన మునిపత్నులనూ పూజించి అందరి ఆశీస్సులు అందుకొన్నది .ఇంకా మునిపత్ని మనసులో ఏమైనా కోపం ఉందేమోనని సీతాదేవి ఆమె చెంతకు చేరి ‘’అమ్మా లోపాముద్రా దేవీ ! పరమ పవిత్రురాలివి నువ్వు .నేను చాలా అపరాధం చేశాను .అంత పరుషంగా నేను మాట్లాడి ఉండి ఉండాల్సినదికాదేమో . ప్రసంగ వశం లో, పరవశం లో శ్రీరామ గుణగానాన్ని చేశాను .ఆయన పౌరుషాన్ని ప్రకటించాను. అంతే నీ మీద నాకు ఏ విధమైన ద్వేష భావమూ లేదు .మహర్షి అగస్త్యులవారివలననే నా భర్త శ్రీరామునికి అంతటి పరాక్రమ పౌరుషాలు లభించాయని నాకు తెలుసు .నన్ను మన్నించమ్మా మనసులో ఏమీ భేదభావం నాపై ఉంచుకోకు తల్లీ ‘’అని పాదాలపై పడి ప్రార్ధించి స్వస్త చిత్తను చేసి యధోచిత సత్కారాలు అందించి లోపాముద్రాది మునిపత్నులకు వీడ్కోలు పలికింది సీతా సాధ్వి .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15- ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -7
ఆనంద రామాయణ విశేషాలు -7
శివుడు చేసిన రామ స్తవం -2
భవోద్భవం వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం తం భక్తి ప్రియం భాను కుల ప్రదీపం –భూతాది నాదం భజామి రామం భవ రోగ వైర్యం –సర్వాది పత్యం రణరంగ ధీరం సత్యం చిదానంద సుఖ స్వరూపం –సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానంద మహం భజామి –కార్యం క్రియా కారణ మప్రమేయం కవిం పురాణం కమలాయ తాక్షం –కుమార వేషం కరుణామయం తం కల్ప ద్రుమం రామమహం భజామి –త్రైలోక్య నాధం సరసీ రుహాక్షం దయానిదిం ద్వంద్వ వినాశ హేతుం –మహాబలం వేద నిధిం సురేశం సనాతనం రామమహం భజామి –వేదాంత వేద్యం కవిమీశితారం అనాది మధ్యంత మచింత్య మాద్యం –అగోచరం నిర్మల మేక రూపం పరాత్పరం రామమహం భజామి –
అశేష వేదాత్మక మాది దేవ మజం హరిం రామ మనంత మూర్తిం –అపార సంవిత్సుఖమేక రూపం నమామి రామం మనసః పరస్తాత్ –తత్వ స్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత మేకమేవ –రాజాదిరాజం రవి మండలస్తం విశ్వేశ్వరం రామ మహం భజామి –యోగీంద్ర సంఘై రపి సేవ్యమానం నారాయణం నిర్మల మాదిదేవం –నతోస్మి నిత్యం జగదేక నాధం హరిం చిదానంద మయం ముకుందం –అశేష విద్యాదిపతిం నమామి రామం పురాణం తమసః పరస్తాత్ –విభూతిదం విశ్వ సృజం విరాజం రాజేంద్ర మీశం రఘునాధ నాధం –అచింత్య మవ్యక్త మనంత రూపం జ్యోతిర్మయం రామమాహం భజామి సమస్త సాక్షిం తమసః పరస్తాత్ –మునీంద్ర గుహ్యం పరిపూర్ణ మేకం కలానిదిం కల్మష నాశ హేతుం –పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహాతోమహాంతం –బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చదేవేంద్రో దేవతాస్తధా –ఆదిత్యాది గ్రహిస్చైవ త్వమేవ రఘు నందనః –తపస రుషయస్సిద్దా స్సాధ్యాస్చ మునయస్తదా –విప్రా వేదాశ్చ యజ్ఞాశ్చ పురాణం ధర్మ సంహితాః – వర్ణాశ్రమా స్తదా ధర్మా వర్ణ ధర్మ స్తధైవచ –నాగ యక్ష్మాస్చ గంధర్వా దిక్పాలాది గజాదిశః –వసవోస్తౌత్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః –తరకా ద్వాద శాదిత్యా స్త్వమేవ రఘునాయకః –సప్త ద్వీపా స్సముద్రాశ్చ నదానద్య స్తదా ద్రుమాః –స్థావరా జ౦గ మాస్చైవ త్వమేవ రఘునందనః –దేవా తిర్యజ్మనుష్యా ణాం దానవానాం దివౌకసాం –మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందనః –శాంతం సర్వ గతం సూక్ష్మం పరబ్రహ్మ సనాతనం –రాజీవ లోచనం రామం ప్రణమామి జగత్పతిం –తతః ప్రసస్సా శ్రీరామః ప్రోవాచ వృషభధ్వజం ‘’
అని శివుడు రాముడిని స్తుతించాడు .విన్న శ్రీరాముడు పరమానందం తో పరమేశుని అభినందించి ప్రసంనుదనైనానని ఏదైనా వరం కోరుకోమన్నాడు ..రాం స్మరణ తో తానూ ధన్యుదనయ్యానని తెలిపి తనకు ‘’అద్వైత జ్ఞానం ‘’బోధించమని రామపాదార విందా సేవలో ధాన్యం యెట్లు చేయమని వేడాడు .కాని రాముడు శివుడికి వేరే వరం ఇచ్చి అనుగ్రహించాడు .శివుడు చేసిన ఈ రామస్తుతి విన్నా చదివినా పారాయణ చేసినా ఉత్తమ లోకప్రాప్తికలుగుతుందని ఫల శృతి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15-ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -6
ఆనంద రామాయణ విశేషాలు -6
శివుడు చేసిన రామ స్తవం -1
ఆనంద రామాయణం లో విలాస కాండ లో శ్రీరాముడు ఆశ్వమేద యాగం చేసిన తర్వాత రాజమందిరం లో కొలువై ఉండగా పార్వతీ పతి శివమహా దేవుడు విచ్చేసి అర్ఘ్య పాద్యాదులు అందుకొని ఉచితాసనాసీనుడై శ్రీరామ తత్వాన్ని స్తవంగా గానం చేశాడు.
‘’యదేకం యత్పరం నిత్యం యదనంతం చిదాత్మకం –యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యాహం –సర్వ త్రైలోక్య సౌఖ్యర్ధం రామ భక్త్యభి వ్రుద్ధయే –విజ్ఞాన హేతుం విమలా యథాక్షం ప్రజ్ఞాన సందివ్య సుఖైక రూపం –శ్రీ రామ చంద్రం హరిమాది దేవం విశ్వేశ్వరం రామమహం భజామి –కవిం పురాణం పురుషం పరేశం సనాతనం యోగినమీ –అణో రణీయాం సమనంత వీర్యం ప్రాణేశ్వరం రామ మహం భజామి –నారాయణం జగన్నాధం అభిరామం జగత్పతిం –కవిం పురాణం వాగీశం రామం దశరదాత్మజం –రాజ రాజం రఘువరం కౌసల్యానంద వర్ధనం –భార్గం వరేణ్యం విశ్వేశం రఘునాధం జగద్గురుం –సత్యం సత్య ప్రియం శ్రేష్టం జానకీ వల్లభం ప్రభుం –సౌమిత్రి పూర్వజం శాంతం కామదం కమలేక్షణం –ఆదిత్యం రవిం ఈశానం ఘ్రుణి౦ సూర్యం అనామయం –ఆనంద రూపిణం సౌమ్యం రాఘవం కరుణాకరం –జ్ఞాన గమ్యం తపోమూర్తి౦ రామం పరశుదారిణం-వాక్పతిం వరదం వాచ్యం శ్రీపతిం పక్షి వాహనం –శ్రీ శార్జ్న్య ధారిణం రామం చిన్మయా నంద విగ్రహం –హలదారిణ మీశానం బలరామం కృపానిదిం –శ్రీ వల్లభం కమలానాధం జగన్మోహన మచ్యుతం –మత్స్య కూర్మ వరాహాది రూపదారిణ మవ్యయం –వాసుదేవం జగద్యోని మనాది నిధనం హరిం –గోవిందం గోవ్పతిం విష్ణుం గోపీ జన మనోహరం –గోపాలం గో పరీవారం గోపికన్యా సమావ్రుతం –విద్యుత్పుంజ ప్రతీకాశం రామం కృష్ణం జగన్మయం –గో గోపికా సమాకీర్ణం వేణు వాదన తత్పరం –కామ రూపం కలావంతం కామినాం కామదం ప్రభుం మన్మధం మధురానాధం మాధవం మకరధ్వజం –శ్రీధరం శ్రీకరం శ్రీశాం శ్రీనివాసం పరాత్పరం –భూతేశం భూపతిం భద్రం భూతిదాం భూరి భూషణం –సర్వ దుఃఖ హరం వీరం దుస్ట దానవ మర్దనం –శ్రీ నృసింహ౦ మహా విష్ణుం –మహాంతం దీప్తి తేజసం –చిదానందమయం నిత్యం ప్రణవం జ్యోతి రూపకం –ఆదిత్య మండల గతం నిశ్చితార్ధ స్వరూపిణం –భక్తీ ప్రియం పద్మ నేత్రం భక్తానా మీప్సిదం ప్రియం – కౌసల్యేయం కలామూర్తిం కాకుస్త౦ కమలాప్రియం – సింహాసనే సమాసీనం నిత్య వ్రత మకల్మషం –విశ్వామిత్ర ప్రియం దాంతం –స్వదార నియత వ్రతం –యజ్నేశం యజ్న పురుషం యజ్న పాలన తత్పరం –సత్య సందం జిత క్రోధం శరణాగత వత్సలం –సర్వ క్లేశాపహరణం విభీషణ వర ప్రదం –దశగ్రీవ హరం రుద్రం కేశవం కేశి మర్దనం –వాజీ ప్రమధానం వీరం సుగ్రీవేప్సిత రాజ్యదం-నర వానర దైవేశ్చ సేవితం హనుమత్ప్రియం –శుద్ధం సూక్ష్మం పరం శాంతం తారక బ్రహ్మ రూపిణం –సర్వ భూతాత్మ దూతస్తం సర్వాధారం సనాతనం –సర్వ కారణ కర్తారం నిదానం ప్రకృతేః పరం .—నిరామయం నిరాభాసం నిరవద్యం నిరంజనం –నిత్యానందం నిరాకారం అద్వైతం తమసః పరం –పరాత్పరతరం నిత్యం సత్యానంద చిదాత్మకం –మనసా శిరసా నిత్యం ప్రణమామి రఘూత్తమం .’’-(ఇంకా ఉంది –అది రేపు -)
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-15 –ఉయ్యూరు
ప్రేక్షక రంజకం ‘పాండవ విజయం’
ప్రేక్షక రంజకం ‘పాండవ విజయం’
- 20/05/2015
TAGS:
రాజమండ్రి, మే 19: కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అంపశయ్యపై చేరడంతో ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించటంతో మొదలైన పాండ విజయం పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షక రంజకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మంగళవారం నాలుగో రోజు నాటకోత్సవాల్లో పాండ విజయం పద్య నాటక ప్రదర్శన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన కళారాధన సాంస్కృతిక చైతన్య మండలి కళకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే తిరుపతి వేంకటకవులు రచించిన ఈ పద్యనాటకానికి మల్లాది గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. సైంధవుడ్ని సంహరించడానికి ముందు సూర్యుడికి సుదర్శన చక్రం అడ్డువేయటం, సైంధవుడి తలను బాణంతో నరికి, ఆ తల ముని చేతిలో పడటం, కర్ణుడి రథ చక్రం భూమిలో దిగటం, మడుగులో ధుర్యోధనుడి జలస్థంభన వంటి సన్నివేశాలు రక్తికట్టించాయి. ఈ సన్నివేశాలు జరుగుతున్నపుడు ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది. ద్రోణాచార్యుడు పన్నిన పద్యవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు మరణించటం, ఆ తరువాత పుత్రశోకంలో మునిగిన అర్జునుడు, ధర్మరాజు తదితరులను కృష్ణుడు ఓదారుస్తాడు. కర్ణుడిని హతమార్చాలన్న విషయంలో అర్జునుడు, ధర్మరాజు మధ్య జరిగిన సంవాదం అందర్నీ ఆకట్టుకుంది. ధర్మరాజు, అర్జునుడు మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలను తొలగించిన కృష్ణుడు ఇద్దర్నీ యుద్ధానికి కార్యోన్ముఖులను చేస్తాడు. అభిమన్యుడు మరణానికి కారకుడైన సైంధవుడ్ని, కర్ణుడ్ని కూడా అర్జునుడు యుద్ధంలో చంపుతాడు. ఈ నేపథ్యంలో ఆప్తులందర్నీ పోగొట్టుకుని మడుగులో జలస్తంభన విద్యతో దాక్కున్న ధుర్యోధనుడ్ని పాండవులు, కృష్ణుడు సూటిపోటి మాటలతో బయటకు రప్పించిన సన్నివేశంలో నటులంతా అదరగొట్టారు. గదా యుద్ధం సన్నివేశంలో భీముడు, సుయోధనుడు పాత్రదారులు అద్భుతమైన నటనతో మన్ననలను పొందారు. ధర్మరాజుగా క్రమధాటి వెంకటేశ్వరశర్మ, భీముడుగా పి సూర్యప్రకాష్, అర్జునుడిగా కొమరవోలు శ్రీనివాసరావు, నకులుడిగా టి ధనుంజయ, సహదేవుడిగా బుగ్గోజి, కృష్ణుడిగా వల్లూరి శ్రీనివాసరావు, దుర్యోధనుడిగా సుబ్బారావు, కర్ణుడిగా పి శ్రీనివాసరావు, శల్యుడిగా గోవిందరాజుల నాగేశ్వరరావు, ద్రోణుడిగా బి నాగిరెడ్డి, అభిమన్యుడుగా టి శ్రీనాథ తదితర పాత్రల్లో చక్కని నటనను ప్రదర్శించారు.
పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో కడప జిల్లా రాజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘మనో వైకల్యం’ తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని ఇచ్చింది. మేనరికం కారణంగా మానసిక వైకల్యంతో పుట్టిన వారికన్నా, అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నప్పటికీ సరయిన మనస్తత్వం లేని మనో వైకల్యం ఉన్న వారు ఎలా ఉంటారో చక్కగా ప్రదర్శించారు.
ఆనంద రామాయణ విశేషాలు -5
ఆనంద రామాయణ విశేషాలు -5
దేవపత్నులు గోపికలుగా జన్మించే వరం
శ్రీరాముడు సరయూ నదీ తీరం లో చైత్రమాసం లో పట గృహం(డేరా) లో ఉన్నాడు .సీతాదేవి అక్కడలేదు ఈ సంగతి తెలిసిన అయోధ్య వాసులు నానా దేశ వాసులు ,రామతీర్దానికి చైత్ర స్నానానికి వచ్చారు దేవ యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు గంధర్వులూ నాగులు మునులు రాజులు ,అప్సరసలు ,కామరూపం లో ఉన్న దేవతలు అందరూ వచ్చారు .శ్రీరాముని దివ్య సుందర రూపాన్ని చూసి వారందరూ పులకించిపోయారు .వారిలో వారు మాట్లాడుకొని అర్ధ రాత్రి దేవ పత్నులు రామ దర్శనానికి వచ్చారు .భటులు అనుమతినివ్వలేదు .అప్పుడు వారంతా ‘’మాకు ఇప్పటికిప్పుడు శ్రీరామ దర్శనం లభించకపోతే సరయు నదిలో పడి ప్రాణ త్యాగం చేసుకొంటాం ‘’అని బెదిరించారు వాళ్ళు కంగారుపడి రాముడికి నివేదించారు .రాముడు వెంటనే అక్కడికి చేరుకొన్నాడు .రామ దర్శనం తో ధన్యత చెందారు .ఇంతమంది ఇక్కడికి ఒక్కసారిగా రావటానికి కారణమేమిటి అని వారిని అడిగాడు రాముడు .
వారందరూ సిగ్గులమొగ్గలై తలలు వంచుకొని కామ ప్రేరితులమై తాము అక్కడికి వచ్చామని శ్రీరామునితో క్రీడించాలని మనసునిండా కోరికతో ఉన్నామని దాచుకోకుండా చెప్పారు .దానికి శ్రీరాముడు నవ్వి ‘’ఈ జన్మ లో నేను ఏక పత్నీ వ్రతుడిని .నియమ భంగం చేయను .మీరు వెళ్ళిపొండి ‘’అని చెప్పాడు .వారందరి మనసు గాయపడింది తట్టుకోలేక పోయారు .అందరూకలిసి సరయూనదీ ఇసుక తిన్నెలమీద మూర్చ పోయారు .అలామూర్చ నొందిన ఆ దేవపత్నులపై జాలికలిగి ధర్మాత్ముడైన రాముడు వారితో ‘’’కామినులారా !నేను ద్వాపర యుగం లో నంద గోపుడు పాలించే గోకులం లో శ్రీకృష్ణుడిగా పెరుగుతాను .ఇంద్రుడే నందుడుగా జన్మిస్తాడు .అప్పుడు దేవతలందరూ నా వరప్రసాదం చేత గోపాలకులుగా పుడతారు .మీరందరూ గోపికలుగా జన్మిస్తారు . మీరు ఇప్పుడుకోరిన మీ కోరికను నేను నెరవేర్చి మీకందరికీ ఆనందాన్ని చేకూరుస్తాను .మీతో కాలిందీ నదీ తీరంలో అర్ధ రాత్రి వేళల్లో ఇసుక తిన్నెలమీద పుష్పవనాలలో రాసక్రీడలు సలుపుతాను .మిమ్మల్ని తనియింపజేసి, తరింప జేస్తాను నామాట నమ్మండి ‘’అని నచ్చ చెప్పాడు .రామ వాక్యం పై ఉన్న నమ్మకం తో వారందరూ విశ్వసించి నమస్కరించి ఆశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు .’’తా మూర్చాం విహ్వాలా దృష్ట్వా రామో విహ్వల మానసః –నారీ స్సంతోషయన్ ప్రాహ హే నారయ స్శ్రూయతాం మమ –వాక్యం ఖేదావహం చోద్య ద్వాపరే కృష్ణ రూప దృక్ –అహం వ్రజే భవిష్యామి నంద గోపేశ పాలితే –తదా దేవాస్తూ గోపాలా భావి మద్వర దానతః –భవిష్యన్తి సురేశశ్చనంద స్తత్ర భవిష్యతి –భవిష్యద తదా యూయం గోపికా స్సకలాఃవ్రజే –యుష్మాకం పూర యిష్యామి యదేచ్చం వాంచితం తదా –రాసక్రీడాం హి యుష్మాభిః కరిష్యామి న సంశయః – వృందావనేతు కాలింద్యాం సైకతే నిశివై చిరం –భావద్వో స్వస్త చిత్తాశ్చ గచ్చ ద్వం స్వస్థలం ముదా ‘’
గుణవతి సత్యభామగా జన్మించటం
కృతయుగాంతం లో మాయ పురిలో వేద వేదంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .అతిధి సత్కారాలలో నిత్యాగ్ని హోత్రం లో శ్రేష్టుడు .సూర్యోపాసి .సూర్య తేజస్సు చేత ప్రకాశించేవాడు .ముసలివాడైన దేవశర్మకు అందాల రాసి అయిన గుణవతి అనే కుమార్తె ఉంది .ఆమెను శిష్యుడైన చంద్ర శర్మ కిచ్చి వివాహం చేశాడు .కూతురూ అల్లుడూ చాలా అన్యోన్యంగా జీవిస్తూ దేవశర్మకు సేవ చేస్తున్నారు .ఒక రోజు మామా అల్లుడు సమిధలు వగైరా సేకరించి తీసుకొని రావటానికిహిమవత్పర్వత సానువులలో ఉన్న అడవికి వెళ్ళారు .అప్పుడు అనుకోకుండా ఒక రాక్షసుడు వారికి కనిపించాడు భయపడి పారిపోవాలని ప్రయత్నం చేసి పరిగెత్త లేక ఆగిపొయారుఇద్దరూ .దయలేని రాక్షసుడు వారిద్దరిని చంపి తినేశాడు .ఆ క్షేత్ర మహాత్మ్యం వలన వారిని విష్ణు దూతలు దేవలోకానికి తీసుకొని పోయారు .సూర్య పూజ నిత్యం చేసేవారుకనుక విష్ణు మూర్తి వారిపై ప్రసన్నంగా ఉన్నాడు .వారికి విష్ణులోక ప్రాప్తికల్గించాడు .
తండ్రిని, భర్తను రాక్షసుడు చంపడాన్న వార్త గుణవతికి తెలిసింది .ఆమె కన్నీరు మున్నీరుగా విలపించి ఉన్న వస్తువులనన్నిటిని అమ్మివేసి వారిద్దరికీ ఉత్తర క్రియలు నిర్వర్తించింది .మనసులో ఏ కోరికా లేకుండా జితెన్ద్రియురాలై విష్ణు భక్తీ పరాయణురాలై ఏకాదశీ వ్రతం ,కార్తీక విష్ణుసేవా ,మాఘ స్నానం వైశాఖ స్నానాలు పూజలు ,విష్ణ్వాలయం లో సేవ ,స్వస్తికాదుల నివేదన నిత్య విష్ణు పూజ అనే ఎనిమిది రకాల ‘’విష్ణు వ్రతాన్ని ‘’శ్రద్ధగా చిత్త శుద్ధితో భక్తితో ఆచరిస్తోంది .సరయూ నదీ మహాత్మ్యాన్ని వినిఅక్కడి రామ తీర్దానికి చేరి చైత్రమాస వ్రతం ఆచరిస్తోంది .సరయూనదీ సైకత పట గృహం లో శ్రీరాముడున్నాడని తెలిసి అర్ఘ్యపాద్యాదులతో అర్చించాలని వెళ్ళింది .భటులకు మనసులోని మాట తెలియజేసి వారి అనుమతితో గుడారం లోకి చేరుకొన్నది .అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు .ఆ దివ్య మోహన రూపాన్ని చూసి గుణవతి పులకించి పోయి సాష్టాంగ నమస్కారం చేసింది .రామునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి భక్తితో పూజించింది .ఆమె సేవలకు పరమ ప్రీతుడైన రాముడు మనసులోని కోరిక ను గురించి ఆమెను అడిగాడు .
గుణవతి ‘’శ్రీ రామా!వేలకొలదిగా నీకు దాసీజనం ఉన్నారు .నీ సేవలో వారందరూ ధన్యులవుతున్నారు.నన్ను కూడా వారిలో ఒకరిగా స్వీకరించి నీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించు ‘’అని ప్రార్ధించింది .రాముడు ఆమెతో ‘’బ్రాహ్మణ స్త్రీవైన నువ్వ్వు ఇలా కోరడం ఆశ్చర్యంగా ఉందినాకు .నా సేవలో తరించాలని నీకు నిశ్చయంగా మనసులో ఉంటె వేరొక జన్మలో దాన్ని తీరుస్తాను .ఈజన్మలో సాధ్యం కాదు .నేను ద్వాపరయుగం లో ద్వారకా పట్టణం లో శ్రీ కృష్ణావతారం లో ఉంటాను. మీ తండ్రి దేవ శర్మ సత్రాజిత్తుగా జన్మిస్తాడు .నువ్వు ఆయన పుత్రిక సత్యభామగా జన్మిస్తావు .అప్పుడు నిత్యం నా సేవ చేస్తూ పూజిస్తూ ధన్యత నొందుతావు .తన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తావు .నేను నిన్ను వివాహం చేసుకొంటాను నీ భర్త నాకు సఖుడైన అక్రూరుడుగా జన్మిస్తాడు .సత్యభామా విధేయుడు అని అందరూ నన్ను అనుకోనేంత గా మన దాంపత్యం వర్ధిల్లుతుంది .ఇక ఇంటికి వెళ్ళు ‘’అని వరమిస్తాడు .
ఎంతో సంతోషించిన గుణవతి ఇంటికి చేరి చైత్రవ్రతాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఒక సారి తోటి జనం తో కలిసి హరిద్వారానికి యాత్రగా వెళ్ళింది .అక్కడే ఉంటూ విష్ణు చిత్తం తో ధర్మాచరణ చేస్తూ ఒక రోజు జ్వరపడి గంగా స్నానం చేస్తూ అందులో శరీరాన్ని వదిలేసింది .స్వర్గం చేరి చాలాకాలం సుఖాలను అనుభ వించింది .ద్వాపరం రాగానే సత్రాజిత్తు కుమార్తె సత్యభామగా జన్మించి శ్రీ కృష్ణ సేవలో తరించి ఆయననే వివాహమాడి ‘’మీరజాలగలడా నాయానతి వ్రత విదానమహిమన్ ‘’అని కృష్ణుడిని కొంగుకు కట్టేసుకొని’’ సత్యాపతి ‘’అనే బిరుదాన్ని నల్లనయ్యకు వచ్చేట్లు చేసిన ఘటికురాలైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-15-ఉయ్యూరు
ఆనంద రామాయణ విశేషాలు -4
ఆనంద రామాయణ విశేషాలు -4
సీతారాముల జలక్రీడ
రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు .ఒకరు విసనకర్రతో వీచితే ,మరొకరు వింజామర విసిరారు.ఒకామె ఆసనం తెస్తే ఇంకొకామె తాంబూలం ,మరో ఆవిడ వస్త్రం ,ధనుస్సుఒకావిద ఖడ్గం ఇంకొకతే తీసుకొని చుట్టూ నిలబడ్డారు .అందర్నీ పలకరిస్తూ అంతర్ గృహం చేరాడు రాముడు .సీతా దేవి ఇచ్చిన జలం తో ఆచమనం చేశాడు. ఆసనం పై కూర్చున్నాడు .అందించిన దివ్య ఉదకాన్ని త్రాగాడు .లక్ష్మణుదిని పిలిచి భోజన శాలకు వెళ్లి బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించి ఊర్మిళాదులతో అన్నిటిని సిద్ధం చేయించమని చెప్పాడు .
దాసీజనులు సంతోషించేట్లు రాముడు సీతను బాహు బంధం లో బిగించి అక్కడే ఉన్న జలయంత్రం లోకి(స్విమ్మింగ్ పూల్ ) ఎత్తి తోశాడు .వెంటనే తానూ ఎత్తు మీదనుండి అందులోకి దూకేసి సీతతో జలక్రీడలాడటం ప్రారంభించాడు రాముడు . సీతను బాహుబంధం లో బంధించి నీళ్ళలోకి తోసేస్తూ ,నీటిని విపరీతమైన వేగంతో ఆమె పై చల్లుతూ ,పరిమళ భరిత దివ్య తైలాలనూ వెదజల్లుతూ హడావిడి చేశాడు. దీనికి మురిసిపోయిన దాసీలు అనేక రకాల సుగంధ చూర్నాలు ,మంగళ ద్రవ్యాలు తెచ్చి ఇద్దరికీ అందించారు .రెచ్చిపోయిన ఆ జంట యెడ తెరిపి లేకుండా వాటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ అందరికీ వినోదాన్ని పంచారు .పిచికారీలతో ఒకరిపైఒకరు వసంతాన్ని జల్లుకొన్నారు .రాముడు కనుచూపు తో దాసీలను పరదాల వెనక్కి వెళ్ళమని ఆజ్న ఇవ్వగా వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు .తమ చుటూ ఎవ్వరూ లేరని అనుకొన్న సీతారాములు హాయిగా ఆనందం గా ఇష్టాపూర్తిగా వినోదంగా యధేచ్చగా జలక్రీడా సరససల్లాపాలు బహు భంగులు గా చేశారు .
కుసుమ సుకుమారమైన ముష్టి లతో ఒకరినొకరు కొట్టుకొన్నారు .పరమాత్మ అయిన శ్రీరాముడు మహా మాయఅయిన సీతాదేవి అధరోస్టాన్నిలోక రీతిలో సహజంగా విలాసంగా చు౦బి౦చాడు .కుచమర్దనమూ చేశాడు .కంచుకాన్ని స్వయంగా చేతులతో తీసేసి అర్ధాంగిని గాఢంగా ఆలింగనం చేసుకొని సౌఖ్యం అనుభవించాడు .కామకేళీ విలాసాలనన్నిటినీ స్వేచ్చగా చేసి సీత మనసుకు సంతోషం సంతృప్తి కల్గింఛి ,ఆనంద కేళి లో ముంచి తేల్చాడు రాముడు . ‘’జల యంత్రేషు క్రీడాం చక్రతు స్సుచిరం ముదాః –ముస్టిభ్యాం జానకీరామం తాడయామాస కౌతుకాత్ –సోపితాం తాడయామాస ముష్ట్యా పుష్ప సమానయా –చుంబిత స్యా బింబోస్టం చూర్ణ యామాస తత్కుచౌ –ముక్త్వా తత్కంచుకీ బంధం ఆలింగ్య హృదయే నతాం –ముమొచ కచ్చం శ్రీరామః సీతాయా స్వరేణసః –‘’ఇలా హాయిగా స్వేచ్చగా సీతారాములు జలక్రీడ సలిపారు .
ఇంతలో భోజన సమయమైందనిదని లక్ష్మణుడు చెప్పటానికి వస్తే దాసీలు అడ్డగించి సీతారాములు రహస్త్యం గా జలక్రీడలలో ఉన్నారని చెప్పారు .సరే అని భోజన సమయం అయిన్దికనుక వేగిరమే రావలసినదని వారిద్దరికీ చెప్పమని మర్యాదాపురుషుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు .సిగ్గుల మొగ్గయైన ఒక దాసీ పరదాల వెనక నుండే ఆ వార్తను వారిద్దరికీ నివేదించింది .రాముడు వెంటనే గట్టుపైకి వచ్చి వేడినీటితో నలుగుపిండితో సుగంధ ద్రవ్యాలతో తలంటి పోసుకొని సిద్ధమయ్యాడు .సీతాదేవికి కూడా పరిజనం ఇలానే చేసి సిద్ధ పరచారు .ఇద్దరిచేత దివ్య పీతాంబరాలు ధరియింప జేశారు .దారిలో పూలు చల్లుతూ వారిద్దరిని వంట శాలకు తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడ వేచిఉన్న ఊర్మిలా మొదలైన వారు అందరికి వడ్డన చేశారు .రాముడు బంధు మిత్ర మునిగణ పరివారం తో సహా షడ్రసోపేత భోజనాలుఆరగించారు .సీతాదేవి వీవన తో వీస్తూ పరియాచికంగా మాట్లాడి నవ్విస్తూ ఉంది .తర్వాత సీత అందించిన తాంబూలాన్ని రాముడు తీసుకొని ఆస్వాదించాడు .అందరిభోజనాలు ముగిసిన తర్వాత రాముడు నిద్రాశాలకు చేరాడు .అప్పటికే అక్కడికి చేరుకొన్న సీతా సాధ్వి రాముని రాకకై ఎదురు చూస్తూ నిలిచి ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్ళింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-15 –ఉయ్యూరు
సీతారాముల జలక్రీడ
రాజకార్యం నిర్వర్తించి రాముడు తమ్ముళ్ళతో నిజమందిరానికి వెళ్ళాడు .దుందుభులు మోగాయి .వందిమాగధులు కీర్తించారు .ఈ హడావిడి విని సీతాదేవి మంచం దిగి ఎడమ చేతిలో అర్ఘ్యపాత్ర ,కుడి చేతిలో ఉపపాత్ర తీసుకొని రాముడికి ఎదురొచ్చింది .ముత్యలపల్లకి దిగిన రాముడు తమ్ముళ్ళతో లోపలి ప్రవేశించాడు .దాస దాసీ జనం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు .ఒకరు విసనకర్రతో వీచితే ,మరొకరు వింజామర విసిరారు.ఒకామె ఆసనం తెస్తే ఇంకొకామె తాంబూలం ,మరో ఆవిడ వస్త్రం ,ధనుస్సుఒకావిద ఖడ్గం ఇంకొకతే తీసుకొని చుట్టూ నిలబడ్డారు .అందర్నీ పలకరిస్తూ అంతర్ గృహం చేరాడు రాముడు .సీతా దేవి ఇచ్చిన జలం తో ఆచమనం చేశాడు. ఆసనం పై కూర్చున్నాడు .అందించిన దివ్య ఉదకాన్ని త్రాగాడు .లక్ష్మణుదిని పిలిచి భోజన శాలకు వెళ్లి బ్రాహ్మణుల నందరిని ఆహ్వానించి ఊర్మిళాదులతో అన్నిటిని సిద్ధం చేయించమని చెప్పాడు .
దాసీజనులు సంతోషించేట్లు రాముడు సీతను బాహు బంధం లో బిగించి అక్కడే ఉన్న జలయంత్రం లోకి(స్విమ్మింగ్ పూల్ ) ఎత్తి తోశాడు .వెంటనే తానూ ఎత్తు మీదనుండి అందులోకి దూకేసి సీతతో జలక్రీడలాడటం ప్రారంభించాడు రాముడు . సీతను బాహుబంధం లో బంధించి నీళ్ళలోకి తోసేస్తూ ,నీటిని విపరీతమైన వేగంతో ఆమె పై చల్లుతూ ,పరిమళ భరిత దివ్య తైలాలనూ వెదజల్లుతూ హడావిడి చేశాడు. దీనికి మురిసిపోయిన దాసీలు అనేక రకాల సుగంధ చూర్నాలు ,మంగళ ద్రవ్యాలు తెచ్చి ఇద్దరికీ అందించారు .రెచ్చిపోయిన ఆ జంట యెడ తెరిపి లేకుండా వాటిని ఒకరిపై ఒకరు చల్లుకొంటూ అందరికీ వినోదాన్ని పంచారు .పిచికారీలతో ఒకరిపైఒకరు వసంతాన్ని జల్లుకొన్నారు .రాముడు కనుచూపు తో దాసీలను పరదాల వెనక్కి వెళ్ళమని ఆజ్న ఇవ్వగా వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు .తమ చుటూ ఎవ్వరూ లేరని అనుకొన్న సీతారాములు హాయిగా ఆనందం గా ఇష్టాపూర్తిగా వినోదంగా యధేచ్చగా జలక్రీడా సరససల్లాపాలు బహు భంగులు గా చేశారు .
కుసుమ సుకుమారమైన ముష్టి లతో ఒకరినొకరు కొట్టుకొన్నారు .పరమాత్మ అయిన శ్రీరాముడు మహా మాయఅయిన సీతాదేవి అధరోస్టాన్నిలోక రీతిలో సహజంగా విలాసంగా చు౦బి౦చాడు .కుచమర్దనమూ చేశాడు .కంచుకాన్ని స్వయంగా చేతులతో తీసేసి అర్ధాంగిని గాఢంగా ఆలింగనం చేసుకొని సౌఖ్యం అనుభవించాడు .కామకేళీ విలాసాలనన్నిటినీ స్వేచ్చగా చేసి సీత మనసుకు సంతోషం సంతృప్తి కల్గింఛి ,ఆనంద కేళి లో ముంచి తేల్చాడు రాముడు . ‘’జల యంత్రేషు క్రీడాం చక్రతు స్సుచిరం ముదాః –ముస్టిభ్యాం జానకీరామం తాడయామాస కౌతుకాత్ –సోపితాం తాడయామాస ముష్ట్యా పుష్ప సమానయా –చుంబిత స్యా బింబోస్టం చూర్ణ యామాస తత్కుచౌ –ముక్త్వా తత్కంచుకీ బంధం ఆలింగ్య హృదయే నతాం –ముమొచ కచ్చం శ్రీరామః సీతాయా స్వరేణసః –‘’ఇలా హాయిగా స్వేచ్చగా సీతారాములు జలక్రీడ సలిపారు .
ఇంతలో భోజన సమయమైందనిదని లక్ష్మణుడు చెప్పటానికి వస్తే దాసీలు అడ్డగించి సీతారాములు రహస్త్యం గా జలక్రీడలలో ఉన్నారని చెప్పారు .సరే అని భోజన సమయం అయిన్దికనుక వేగిరమే రావలసినదని వారిద్దరికీ చెప్పమని మర్యాదాపురుషుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు .సిగ్గుల మొగ్గయైన ఒక దాసీ పరదాల వెనక నుండే ఆ వార్తను వారిద్దరికీ నివేదించింది .రాముడు వెంటనే గట్టుపైకి వచ్చి వేడినీటితో నలుగుపిండితో సుగంధ ద్రవ్యాలతో తలంటి పోసుకొని సిద్ధమయ్యాడు .సీతాదేవికి కూడా పరిజనం ఇలానే చేసి సిద్ధ పరచారు .ఇద్దరిచేత దివ్య పీతాంబరాలు ధరియింప జేశారు .దారిలో పూలు చల్లుతూ వారిద్దరిని వంట శాలకు తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడ వేచిఉన్న ఊర్మిలా మొదలైన వారు అందరికి వడ్డన చేశారు .రాముడు బంధు మిత్ర మునిగణ పరివారం తో సహా షడ్రసోపేత భోజనాలుఆరగించారు .సీతాదేవి వీవన తో వీస్తూ పరియాచికంగా మాట్లాడి నవ్విస్తూ ఉంది .తర్వాత సీత అందించిన తాంబూలాన్ని రాముడు తీసుకొని ఆస్వాదించాడు .అందరిభోజనాలు ముగిసిన తర్వాత రాముడు నిద్రాశాలకు చేరాడు .అప్పటికే అక్కడికి చేరుకొన్న సీతా సాధ్వి రాముని రాకకై ఎదురు చూస్తూ నిలిచి ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్ళింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-15 –ఉయ్యూరు
దాగుడుమూత దండాకోర్ (09-May-2015)
|
|
||||||
తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్… ‘మదరాసి పట్టణం’ నుండి తీసిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అయితే… అతని తాజా చిత్రం ‘శైవం’ మాత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి ఆర్.కె. మలినేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ‘శైవం’ సినిమాను ‘దాగుడుమూత దండాకోర్’ పేరుతో క్రిష్ పునర్ నిర్మించారు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓ పచ్చని పల్లెటూరిలో అతి పెద్ద కుటుంబం రాజు (రాజేంద్ర ప్రసాద్) గారిది. నలుగురు సంతానంలో ఒక్క కొడుకు మాత్రమే రాజుగారితో పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. మిగిలిన వారిలో ఓ అబ్బాయి ఢిల్లీలోనూ, మరొకడు చెన్నయ్ లోనూ ఉంటారు. కూతురి కుటుంబం దుబాయ్ లో ఉంటుంది. పల్లెటూరిలో జరిగే పోలేరమ్మ జాతర సందర్భంగా అక్కడక్కడా ఉన్న రాజు గారి కుటుంబ సభ్యులంతా ఊరుకు చేరతారు. ఎవరికి వారికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా… పెద్దంతగా బయటపడరు. అయితే ఊరిలోకి వచ్చిన దగ్గర నుండి ఎదురైన అశుభాలతో తమ కుటుంబానికి ఏదో చెడు జరుగుతోందనే భావన వారికి కలుగుతుంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే… అప్పుడెప్పుడో పోలేరమ్మకు కోడిని బలి ఇస్తానని మొక్కుకుని దానిని తీర్చలేదని రాజు గారి భార్య (సంధ్యా జనక్) గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆ బలి కోసమే వాళ్ళు ఇంట్లో నాని అనే కోడిపుంజును పెంచుతూ ఉంటారు. ఆ నాని అంటే… రాజుగారి ముద్దుల మనవరాలు బంగారం (సైరా అర్జున్) కు ఎంతో ప్రేమ. పోలేరమ్మకు నానిని బలి ఇస్తారని తెలియగానే బంగారం తల్లడిల్లిపోతుంది. విచిత్రంగా పోలేరమ్మ జాతరలో బలికి సర్వం సిద్ధమౌతున్న వేళ నాని కనిపించకుండా పోతుంది. అది ఎక్కడకు వెళ్ళిపోయింది? నాని కనిపించకుండా పోవడం వెనక ఎవరి హస్తం ఉంది? పోలేరమ్మకు నాని ని బలి ఇచ్చారా లేదా అన్నది మిగతా కథ.
మూగజీవులను హింసించడం తగదని ప్రతి ఒక్కరూ ఉపన్యాసాలు చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం చూపరు. ముఖ్యంగా అమ్మవార్లకు ఇచ్చే జంతుబలిని నిషేధించాలని ఎంతోమంది ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. అయినా… భక్తుల మూఢనమ్మకాల ముందు ఈ పోరాటలు నీరు కారి పోతున్నాయి. ఈ సున్నిత అంశాన్ని ఓ చిన్నారి హృదయస్పందనగా తెలియచేసే ప్రయత్నం చేశాడు కథకుడు ఎ.ఎల్. విజయ్. తమిళంలో నాజర్ పోషించిన పాత్రను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ చేశారు. ఆ పాత్ర పోషణలోని సహజత్వం తెలుగులో కొరవడింది. లేని గాంభీర్యాన్ని తీసుకురావడం కోసం తెల్లటి కనుబొమ్మలు, మీసాలు, జుత్తుతో హడావుడీ చేశారు. దాంతో సహజత్వం కొట్టుకుపోయింది. ఇక రాజుగారి మనవరాలు బంగారంగా తమిళంలో చేసిన సైరా అర్జున్ ఇక్కడా నటించింది. చక్కని అభినయ పటిమ ఉన్న ఈ బాలనటి మరోసారి తన నటనతో మెప్పించింది. నిజానికి ఈ సినిమాలో పెద్దవాళ్ళ కంటే పిల్లలే చక్కగా నటించారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ సినిమాలో బాలనటిగా మెప్పించిన నిత్యాశెట్టి… ఇప్పుడు కుమారిగా ఎదిగి, రాజుగారి పెద్ద మనవరాలుగా ఓ కీలక పాత్రను పోషించింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఇ.ఎస్. మూర్తి సంగీతం, పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రధానమైన లోటు… కథా విస్తరణే. చిన్న పాయింట్ ను తీసుకుని సాగతీయడం వల్ల… బిగువు లేకుండా పోయింది. ప్రథమార్ధంలో చక్కని వినోదాన్ని అందించిన దర్శకుడు ద్వితీయార్థంకు వచ్చే సరికీ చేతులెత్తేశాడు. సహజంగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేసేప్పుడు ఆత్మను పట్టుకుని, దానిని మన వాతావరణానికి తగ్గట్టుగా మార్చితే బాగుంటుంది. కానీ ఇక్కడ అది జరగలేదు. సెంటిమెంట్ సీన్స్ పెద్దంత పండలేదు. భారీ భవంతిలో నివాసం ఉంటే రాజుగారి కుటుంబ సభ్యులంతా కట్టకట్టుకుని ఒకే హాలులో పడకలేయడం విచిత్రంగా అనిపిస్తుంది. కోడిపుంజును వెతికే క్రమంలో ఊరి జనంతో జరిపే కొట్లాట కూడా అతిగా ఉంది. సహజత్వానికి దగ్గరగా సినిమా తీయాలని తపించిన దర్శకుడు పతాక సన్నివేశానికి వచ్చేసరికీ… సినిమాటిక్ ముగింపునే ఇచ్చాడు. అమ్మవారికి కోడిపుంజును బలి ఇవ్వకపోయినా… అందరికీ మంచే జరిగిందని చెప్పడం నాటకీయంగా ఉంది. ఈ సంఘటనలను ఇంకాస్త విపులంగా చూపి ఉంటే బాగుండేది. ఏదేమైనా… సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరకెక్కించి, ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించడానికి క్రిష్ బృందం చేసిన ప్రయత్నం ఫలించలేదు!
|
సరస్వతీ నదీమతల్లి సాక్షాత్కారం!
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ / నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు…” అంటో, మనం పంచోపచార షోడశోపచార పూజావిధానాలలో, యజ్ఞ యాగాదులలో, వివాహాది, కల్యాణ ప్రకరణం ప్రతిపాదించే సంరంభాలలో, కలశ పూజ చేస్తాం..కాని ఈనాడా సరస్వతి కానరాదే?! ఎందుకు కనుమరుగైపోయింది?
పౌరాణికంగా. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కూడా సాక్షీభూతమైన ‘సరస్వతీ నది ఏ కారణంతో అంతర్ధానమైంది? ఎప్పుడు అంతర్హితమైంది? ఎలా అంతరించింది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకడానికి జరిగే అన్వేషణే, సరస్వతీ నది పునరుధ్ధరణ ప్రణాళిక! ఇదిప్పుడు కార్యరూపం దాల్చడం ముదావహం.
ఇందులో భాగంగా, 4,000 సంవత్సరాల తరువాత, హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం సరస్వతీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల, ప్రయాసల ఫలితంగా, 2015, మే నెల 12 వ తేదీన పౌరాణిక సరస్వతీ నదీ జలాలు , ఒక నూతిలోంచి ఉవ్వెత్తున ఎగసి పడడంతో, భారతీయుల హృదయాలలో ఆనంద వాహిని వెల్లి విరిసింది.
యమునానగర్ జిల్లాలో, ముగల్వాలీ గ్రామంలో, 80 మంది గ్రామీణులు సరస్వతీనదీ పరీవాహక ప్రాంతాన్ని తవ్వుతున్న సమయంలో, అకస్మాత్తుగా ఆ నూతిలో తడిని గమనించారు. అలా తవ్వగా, తవ్వగా. ఆ తడి చిత్తడిగా మారిపోయి, 8 అడుగుల లోతులోంచి, నీరు పొంగి ప్రవహించింది.
“ఆరోజు మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో, ఖలీల్ అహమ్మద్, సల్మా, ప్రదీప్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఒక నూతిని తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు, 8 అడుగుల లోతు తవ్వగా, నీటి మట్టం పెరగడం మొదలయ్యింది.” అన్నారు స్థానిక పంచాయతీ కార్యదర్శి, బల్కర్ సింగ్. అలాగే, ఆ దగ్గరలో వరుసగా తవ్విన మరో 4 నూతులలోకూడా నీరు అగుపించింది. ఆ వార్త క్షణాలలో కార్చిచ్చు లా వూరంతా పాకి, క్రమంగా వూరి జనం అంతా అక్కడికి చేరి పోయారు.
సరస్వతీ నది బృహత్ప్రణాళికను 2015 ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభించారు. ఆ తవ్వకాల పనులు ప్రారంభించిన యమునానగర్ డిప్యూటీ కమిషనర్ ఎస్.ఎస్. ఫూలియా, హర్యానా అసెంబ్లీ స్పీకర్ కన్వార్ పాల్ గుజ్రార్తో సహా, వెనువెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆయన నీటిని పరీక్షించి, దాదాపు 15 రోజులుగా ఆ తవ్వకాలు జరుపుతున్న వారితో సమావేశమయ్యారు.
అసలు, యమునానగర్ జిల్లాలో, ఆది బద్రీ ప్రాతంలో పుట్టి, సరస్వతీ నది 21 గ్రామాల గుండా ప్రవహిస్తుందని హర్యానా ప్రభుత్వం నమ్ముతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్,యీ పధకంకోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు.
సో౦బ్ నది కోసం, 400 ఎకరాలలో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక పెద్ద ‘చెక్ డామ్’ను ఇప్పుడు సరస్వతీ నది కోసం మళ్ళిస్తున్నారు. ఈ పౌరాణిక సరస్వతీ నది 4,000 సంవత్సరాల క్రితం ఎండిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనవాలు పట్టి, అప్పట్లో సరస్వతీ నది వాయవ్య భారతదేశంలో ప్రవహించేదని నిర్ణయించాయి. ఒక శక్తిమతమైన భూకంపం తాకిడికి సరస్వతీ నది ప్రవాహం అదృశ్యమైపోయిందని ‘రిమోట్ సెన్సింగ్’ నిపుణులు చెబుతున్నారు.
సరస్వతీ నది ఛాయలు, పరమ పవిత్రమైన కురుక్షేత్ర నగరంలో కూడా కానవచ్చాయి. కురుక్షేత్ర సమీపంలోని అలనాటి, హర్షవర్ధన సామ్రాజ్య రాజధాని థానేసర్ ద్వారా సరస్వతి ప్రవహించిందట! పాండవులు స్నానం చేసిన ‘కపాలమోచన్’, ‘రణ్మోచన్’ అనే రెండు నూతులలో సరస్వతీ నది నీరు నింపేదని ప్రతీతి.
సరస్వతీ నదిని పునరుధ్ధరిస్తే, హర్యానాలో మతపరమైన పర్యాటకం ఇనుమడించడమేకాక, ఈ నదీ తీరంలోని గ్రామాల దాహం కూడా తీరుస్తుందని ఆశ! మళ్ళీ గంగా, యమునా, సరస్వతుల త్రివేణీ సంగమంలో అనతికాలంలోనే భక్తులు అఘమర్షణ స్నానాలు ఆచరిస్తారని భారతీయ సంస్కృతీ పునరుద్ధరణ దీక్షాదక్షుల ఆకాంక్ష!
నేతాజీ నిధి ఎక్కడ?
|
||||||
ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు
ఇటలీ శాంతికాముక ఉద్యమ మహిళలిద్దరు
సంక్షుభిత ఇటలీ దేశం లో నిత్యం యుద్ధ మేఘాలు కమ్ముకొని జన జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తే శాంతికోసం పరితపించి ఉద్యమాలు నడిపిన ఇద్దరు మహిళా వజ్రాలను గురించి తెలుసుకొందాం .
1-ఇటలి శాంతి పోరాట యోధురాలు సాంఘిక నవలా రచయిత్రి –గ్విస్ అడామి రొసాలియా
శాంతికే ప్రాధాన్యత :
ఇటలీ లో ఇరవై వ శతాబ్దం లోని మహిళలు అనేక రంగాలలో అగ్రభాగాన ఉన్నారు .అందులో గ్విస్ అడామి రొసాలియచాలా ప్రాముఖ్యం పొందింది .శాంతి ని సాధించటం లో అవిశ్రాంతం గా కృషి చేసిన సాంఘిక నవలా రచయిత్రి రొసాలియా .దేశం లోని స్త్రీలను శాంతి సాధనా ఉద్యమం లో లో సమాయత్తం చేసిన మహితాత్మురాలు .సాంఘిక ,మానవ హక్కులు ,మహిళా వోటు హక్కుల కంటే శాంతికే ప్రాముఖ్యతనిచ్చింది .
జీవితం –నవలా రచన –శాంతి ఉద్యమం :
గ్విస్ అడామి ‘’రిసేర్జి మెంటో పేట్రియట్స్’’కుటుంబం లో 30-7-1880 నఇటలీలోని ఎడోలో లో జన్మించింది . .ఈ సంస్థ ఆమెకు ప్రముఖ ఇటలీ నాయకులు జిసేప్పీ మాజ్జిని ,జిసేప్పీ గరిబాల్డి ల ప్రజాస్వామ్య జాతీయ భావాలను రంగ రించి పోసి తీర్చి దిద్దింది .సాంఘిక ఇతి వృత్తాలతో మొదటి సారిగా రచనలు చేయటం ప్రారంభించింది .1905 లో మొట్ట మొదటి సాంఘిక నవల ‘’కాన్షన్స్ ‘’రాసి ప్రచురించింది .ఇటాలియన్ శాంతి ఉద్యమంలో చేరింది .అకుంఠిత దీక్ష తో పని చేసి అందరి దృష్టినీ ఆకర్షించి ఇటలీ శాంతి పత్రిక ‘’ఇన్టర్నేషనల్ లైఫ్ ‘’లో అనేక వ్యాసాలూ రాసి శాంతి ఆవశ్యకతను చాటి చెప్పేది .తర్వాత ‘’అవుట్ సైడ్ ది నెస్ట్-ది గోల్డెన్ వర్జిన్ ‘’నవల రాసి ముద్రించింది .ఇందులో 1914లో ఉన్న సాంఘిక సమస్యలను చర్చించింది .
యువ మహిళా సంస్థ –మహిళా విద్యా వ్యాప్తి :
1909 లో ఇటలీ లోని మిలన్ లో ‘’ఇటాలియన్ యంగ్ వవుమెన్ సొసైటీ ఫర్ పీస్ ‘’ని రొసాలియా స్థాపించింది .ఈ సొసైటీ ద్వారా బాలికా హైస్కూలు విద్యార్ధినులు ,టీచర్లు స్వచ్చందం గా యువతులకు ఇతర దేశాన్ని విధ్వంస వినాశం చేయకుండా ధనాత్మక దేశ భక్తీ బోధించే ఏర్పాటు చేసింది .యువతలో అంతర్జాతీయ సహకారం సాధించటం ,వినాశకర యుద్ధ ఆయుధాల ను యూరప్ లో తగ్గంచే ప్రయత్నానికి కృషి చేసింది .సొసైటీ కి విరాళాలు సేకరించి టీచర్ స్టూడెంట్ బృందాలు ఇతర దేశాలలో పర్యటించటం ఆ దేశాల వారు ఇటలీ లో పర్యటి౦చ టానికి తోడ్పడింది . దీనివలన ఇటాలియన్ మహిళలు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవటానికి గొప్ప అవకాశాలు కలిగాయి .ఈ సందర్భం గా గ్విస్ అడామి ప్రముఖ ఇటాలియన్ శాంతి ఉద్యమ నాయకుడు ఎర్నేస్టో దియడరో మొనాటో తో కలిసి పని చేసింది .ఇద్దరూకలిసి మిలన్ లోను ,బెర్న్ లోని అంతర్జాతీయ శాంతి సంస్థ లో సేవలు అంద జేశారు .
ఇటలీ స్వేచ్చకు ప్రాముఖ్యం 1911లో శాంతి మంత్రాన్ని వదిలేసి ఇటలీ దేశం లిబియా సిరనైకా లపై దాడిని రొసాలియా సమర్ధించింది -ఇటలీకి జాతీయ స్వాతంత్ర్యం అన్నిటికంటే ముఖ్యమైనదని భావించింది .అప్పుడే ఇటలీ అసలైన అంతర్జాతీయ నేతృత్వం వహించే సావకాశం ఏర్పడుతుందని గట్టిగా నమ్మి కృషి చేసింది . ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ల కాలనీ రాజ్య కబంధ హస్తాల నుండి ఇటలీ విముక్తి పొందాలని స్వతంత్ర దేశమై స్వయం సమృద్ధి సాధించాలని వా౦చి౦చింది .కాని ఆల్మా డోలేన్ వంటి శాంతికాముకులు ఇటలీ చేసే యుద్ధాన్ని సమర్ధించకుండా రోసాలియా ను వ్యతి రేకి౦చారు .
యూరప్ ఐకమత్యం
1912 లో గ్విస్ అడామి జెనీవాలో జరిగిన అంతర్జాతీయ పీస్ కాంగ్రెస్ లో ఇటలీ దేశానికి ప్రాతి నిధ్యం వహించి హాజరైంది .ఐరోపా ఐకమత్యాన్ని నొక్కి చెప్పింది అక్కడ .1914 జూలై లో బ్రసెల్స్ లో జరిగిన శాంతి స్థాపక సమావేశానికి వెళ్ళింది .కాని మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన నేపధ్యం లో తన దేశం ఇటలి తటస్థ దేశం గా ఉండగలుగుతుందా అని సందేహించింది .యుద్ధ కాలం లో గ్విస్ మహిళలను యుద్ధానికి సానుకూలం గా మార్చ టానికి పత్రికలలో చాలా వ్యాసాలూ కరపత్రాలురాసి ప్రచురించి ఉద్బోధించింది .అందులో ‘’ఇన్ ది ఫ్రై’’వంటి పాంఫ్లెట్ చాలా ప్రభావం చూపించాయి .స్త్రీ ల తోడ్పాటు వలన యుద్ధం అయిన తర్వాత అనేక రాజకీయ హక్కుల సాధనకు తోడ్పడుతుందని అనుకొన్నది .చనిపోయే దాకా’’ లీగ్ ఆఫ్ నేషన్స్ ‘(నానా జాతి సమితి )ను గ్విస్ అడామి రొసాలియా ను సమర్ధిచింది .’’there are not two moralities –one for nations and one for individuals ‘’అనేది రొసాలియా నిశ్చితాభిప్రాయం .యాభై ఏళ్ళు మాత్రమే సార్ధక జీవితం గడిపిన గ్విస్ అడామి రొసాలియా 1930 లో మరణించింది .
2- స్త్రీ వాద రిపబ్లికన్ ,నవలా కారిణి – అలైడ్ గుల్బర్టా బెకారి

అగ్రగామి ఫెమినిస్ట్ :
1842 లో ఇటలీ లోని పాడువా లో జన్మించి 64 సంవత్సరాలు మాత్రమె జీవించి 1906 లో చనిపోయిన ఇటలీ ఫెమినిస్ట్ రిపబ్లికన్ రచయిత్రి అలైడ్ గుల్బర్టా బెకారి .తలిదండ్రులకున్న 12 మంది సంతానం లో బతికి బట్టకట్టిన ఒక్కగానొక్క బిడ్డ బెకారి .తండ్రి పాడువా లో సివిల్ ఉద్యోగి .అది అప్పుడు ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం లో ఉండేది .తండ్రి ఇటలీ ఐక్యతను కోరే ఉద్యమం లో ఉండేవాడు .1848 రిసార్జి మెంటా తిరుగు బాటుదళం లో పని చేశాడు .దీన్ని అణచి వేయగా టూరిన్ కు పారిపోయాడు .తండ్రికి సేక్రేటరిగా పని చేసింది బెకారి .పాడువాను లా౦బార్డి వేనేషియా ఆక్రమించుకొన్న తర్వాత తల్లీ కూతుళ్ళు పాడువాకు తిరిగి చేరుకొన్నారు .
ఉమన్ పక్ష పత్రిక :
16 వ ఏట బెకారి వెనిస్ చేరి అక్కడ’’ఉమన్ ‘’పక్ష పత్రికను స్థాపించి నడిపింది .అందులో స్త్రీ సమస్యలమీద ఎన్నో ఆర్టికల్స్ రాసింది .ఇటలీ ఐక్యత కోరుతూ నిరంతర రచన చేసింది. ఇవన్నీ ఫలించి 1861లో ఎట్టకేలకు ఇటలీ ఐక్యత సాధించింది .బెకారికి సాంఘిక సంస్కరణలపై ఆసక్తి ఎక్కువ .ఇంగ్లాండ్ ఫ్రాన్స్,అమెరికా దేశాలలో వచ్చిన సంస్కరణలు గమనించి ఇటలీలో సంస్కరణల కోసం పెద్ద ఉద్యమమే నడిపింది .1870-1880దశాబ్దం లో ఇటలీలో మహిళల హక్కులకోసం ,భాష కోసం నిలిచి పోరాడింది ఉమన్ పత్రికఒక్కటి మాత్రమే .దీనిలో ప్రముఖ ఫెమినిస్ట్ అన్నా మేరియా మోజోన్నీ వ్యాసాలూ చాలా ప్రభావితంగా ఉండేవి .వ్యభిచారాన్ని చట్ట సమ్మతం చేయరాదని ఈ పత్రిక పోరాడింది .
స్త్రీ విముక్తి ఉద్యమం –మహిళా వోటు హక్కు :
’’స్త్రీ విముక్తి ‘’జరగాలని సర్వ శక్తులు ఒడ్డి పోరాడింది బెకారి .ఇటలీ ఐక్యత వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలను సమాయత్త పరచింది .అన్నా మేరియా మోజాని ఇటలీ చట్టాలలో సంస్కరణల కోసం ఉద్యమిస్తే ఉమన్ పత్రిక పూర్తిగా సమర్ధించింది .మోజానితోకలిసి బెకారి ‘’సిటిజన్ ఉమన్ ‘’ ‘’పేట్రి యట్ మదర్ ‘’ అనే వాటిని అందరికి అర్ధమయ్యేట్లురాసి ముద్రించి అవగాహన కల్గించారు . .గొప్ప చైతన్యమే తెచ్చారిద్దరూ .జోసఫైన్ బట్లర్ భావాలకు ప్రాచుర్యం కల్పించింది ఉమన్ పత్రిక .ఈ పత్రికలో పడిన ఆర్టికల్స్ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచమంతా ప్రచారమయ్యాయి .ఉమన్ పత్రిక ౩౦౦౦ మంది మహిళలతో ఇటలీలో మహిళా వోటు హక్కు కోసం సంతకాలు పెట్టించి పిటీషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించింది .
మగవారు యుద్ధాలలో పోరాటాలు చేస్తుంటే స్త్రీలు సంతానాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవాలని బెకారి హితవు చెప్పేది .శాంతి ఉద్యమాలెక్కడ జరిగినా విధిగా హాజరై శాంతి తోనే ఇటలీ సౌఖ్యం సాధించగలదని ప్రచారం చేసేది .అంతర్జాతీయ మహిళా సమాఖ్య ఏర్పడటానికి సహాయ సహకారాలను ఉమన్ పత్రిక ద్వారా అందించింది .
నాటక రచన-ప్రదర్శన : బెకారి మంచి రచయిత్రి .సామాజిక నాటకాలు రాసింది ..అందులో ‘’ఏ కేస్ ఆఫ్ డైవోర్స్ ‘’నాటకం రాసి 1881 లో ప్రదర్శించింది .అదొక సెంటిమెంటల్ స్టఫ్ అన్నారందరూ .డ్రామాలో రెండోపెళ్ళి లేదు .ఆ కాలం లో ఇటలీ లో స్త్రీ రచయితలూ అరుదు గా ఉండేవారు .రాసినా వాటిని ప్రచురించటం జరిగేది కాదు .బెకారి నాటకం రాయటమేకాక ప్రచురించి ప్రదర్శన కూడా ఇచ్చి రికార్డు సృష్టించింది .ఇది ఆనాటి సమాజం లో అరుదైన అద్భుతం .1945లో ఫాసిస్ట్ ప్రభుత్వ పతనం తర్వాతనే ఇటలీలో స్త్రీలకు వోటు హక్కు లభించింది .బెకారి లాంటి ఎందరో మహిళల పోరాట ఫలితం ఇది .అలాగే 1970లో మాత్రమే విడాకుల హక్కు చట్టమైంది .
పిల్లల పత్రిక మామ్మ: అనారోగ్యం పాలైన బెకారి 1887 లో ఉమన్ పత్రిక సంపాదకత్వాన్ని వదులుకొని ఎమిలీ మారియానా కు అప్పగించింది .ఆఖరు వరకు బెకారి రాస్తూనే ఉంది .పిల్లలకోసం ‘’మామ్మ ‘’పత్రిక పెట్టి నడిపింది .స్త్రీలు తమ కార్య రంగాన్ని ఎంచుకోవటానికి బెకారే తోడ్పడి ఆదుకొనేది .ఇటలీలో మహిళా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రజల తోడ్పాటు చాలా నిరాశా జనకం గా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయింది .
సోషలిజం కు సమర్ధన సోషలిజం ను వాచాఅంటే మాటలతో సమర్ధించింది .ఇది సామాన్య ఫెమినిస్ట్ లకు మింగుడు పడలేదు .బెకారికి వీరు మద్దతు ఇవ్వలేదు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
– See more at: http://vihanga.com/?p=14722#sthash.ld0XCEYH.dpuf



























