జైట్లీ ,అటార్నీ అబద్ధం ఆడారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాస్వామ్యం లో నియంతలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమలం వ్యూహం -ఆంధ్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు

ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు
‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్‌ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో కూడా నటించారు. తెలుగులో 115కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. పరిశ్రమ ఆయన్ని ఎప్పుడో మరిచిపోయినా శాటిలైట్‌ ఛానల్స్‌లో హరనాథ్‌ చిత్రాలను చూసే ప్రేక్షకులకు ఆయన చిరస్మరణీయుడే. . నేడు హరనాథ్‌ 25వ వర్థంతి. ఈ సందర్భంగా హరనాథ్‌ జ్ఞాపకాలను గురించి ఆయన తనయుడు శ్రీనివాసరాజుతో ముచ్చటించింది ‘చిత్రజ్యోతి’. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.
మా చిన్నతనంలో నాన్న షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా మాకోసం కొంత సమయాన్ని కేటాయించేవారు. ఆయనది చాలా ఫ్రెండ్లీ నేచర్‌. సున్నిత మనస్కుడు. మాకు ఊహ తెలిసే సరికి ఆయనకు సినిమా మార్కెట్‌ తగ్గింది. నాన్నకు స్నేహితులంటే ప్రాణం. వారికి ఆపద అని తెలిస్తే చాలు ఈయన దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేసేవారు. వెనుకాముందుఆలోచించకుండా పరిధిని దాటి దానం చేసేవారు. ఆయనది చాలా పెద్ద సర్కిల్‌. దానికి తగ్గట్టే మెయింటెనెన్స్‌ ఉండేది. ఆయన జీవితానికి ఫ్రెండ్‌షిప్పే ప్లస్‌, మైనస్‌ అయింది. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొలేదు. సంపాదించాలనే తపన ఆయనకు ఉండేదికాదు. రియలైజ్‌ అయ్యే సరికి జరగాల్సింది జరిగిపోయింది.
పైలట్‌ ట్రైనింగ్‌కి వెళ్ళి
మా తాతగారు చాలాకాలం చెన్నైలో ఉన్నారు. ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేదట. కొన్ని సినిమాలకు దర్శకత్వపు శాఖలో కూడా పనిచేశారు. అదే సమయంలో నాన్న పైలట్‌ ట్రైనింగ్‌ కోసం మద్రాస్‌ వెళ్ళారు. బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న నాన్నను చూసి గుత్తా రామినీడుగారు సినిమా హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇండస్ర్టీలో అడుగుపెట్టడానికి మా నాన్నగారు ఎటువంటి కష్టం పడలేదు. నాన్న సినిమాలు చూస్తుంటే ఆయన యాక్ట్‌ చేసినట్లు అనిపించదు. ఇంట్లో ఎలా ఉండేవారో తెరపైన కూడా అలాగే కనిపించేవారు. ఎవరితోనైనా ఈజీగా కలిపిసోయే తత్వం ఆయనది.
ఆ సంఘటన గుర్తొస్తే బాధగా ఉంటుంది
నాన్నకు క్యాన్సర్‌ అని తెలిసి కూడా నేను లండన్‌ వెళ్ళాను. అప్పటికే రెండేళ్ళు చికిత్స పొందడంతో చాలావరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. లండన్‌ వెళ్ళడం గురించి ఆయనను అడగగా వెళ్ళమనీ చెప్పలేదు. వెళ్ళొద్దని చెప్పలేదు. 1989 ఆగస్ట్‌లో లండన్‌ వెళ్ళాను. వెళ్లిన మూడు నెలల్లో (నవంబర్‌, 1న) ఆయన మరణించారు. చివరి క్షణాల్లో దగ్గరలేనని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే ఆ రోజు లండన్‌ వెళ్లి పొరపాటు చేశానని బాధపడుతుంటాను. నాన్నతో ఎన్ని మధుర జ్ఞాపకాలున్నా ఇది మాత్రం మరచిపోలేని సంఘటన.
నిర్మాతగా కొనసాగాలనుంది

నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమా తీశాను. ఇప్పుడు కూడా సినిమాలు తియ్యాలనుంది. కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి తొందరపడను. ప్రస్తుతం మిత్రులతో కలిసి ప్రొడక్షన్‌ హౌస్‌ నడుపుతున్నాను. బడ్జెట్‌ కంట్రోల్‌లో తియ్యాలనుకుంటున్నాను. పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌తో సినిమాలు చెయ్యాలనేది నాకున్న మరో కోరిక. ఎప్పటికి కుదురుతుందో చూడాలి.
పవన్‌కళ్యాణ్‌కి నాన్నకి పోలికలు
సహాయం చేసే విషయంలో నాన్నకి, పవన్‌కళ్యాణ్‌గారికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆయన కూడా దానం చేసే విషయంలో ఎంత ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించేవారు కాదు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ని చూస్తుంటే నాన్న మనస్తత్వానికి, ఆలోచనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాకపోతే పవన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాన్నకు ఆ ఆలోచన ఉండేది కాదు. నాన్న పుట్టినరోజు, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు ఒకే రోజు కావడం కూడా ఒక పోలికగా భావిస్తాను.
సినిమా పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా
కుటుంబ సభ్యులు మరణిస్తే వారి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చూసుకుంటూ ఆయా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. కొన్ని సందర్భాలో బాధ కూడా కలుగుతుంది. ప్రతి నాలుగైదు రోజులకి నాన్న తాలూకు జ్ఞాపకాలను సినిమాల రూపంలో చూస్తూ చాలా ఆనందపడుతుంటాం. చాలామంది ‘‘ఈరోజు మీ నాన్న సినిమా టీవీలో చూస్తున్నాం’’ అంటూ ఫోన్‌ చేసి చెబుతుంటే సినిమా మనిషిని అయినందుకు గర్వపడుతుంటా. కేవలం నటులకు మాత్రమే దక్కిన అవకాశమిది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?

మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?
చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ పుస్తకం ఆంగ్లంలో ‘ఎ హిజ్రా లైఫ్‌ స్టోరీ’గా విడుదలైంది. తెలుగులో ‘ఓ హిజ్రా ఆత్మకథ’గా ఈ పుస్తకాన్ని అనువదించారు. నేడు పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమెని ‘నవ్య’ పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…

‘నాలో సీ్త్ర లక్షణాలు ఉన్నాయని గుర్తించాక బయట తిరగడానికి సిగ్గుపడ్డా. అప్పటి వరకు అబ్బాయిలా అందరితో కలివిడిగా ఉన్న నాకు ఒక్కసారిగా అమ్మాయిల దుస్తులు వేసుకోవాలనిపించేది. అమ్మాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. మాది ఒక పల్లెటూరు. పరువుగల కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ లక్షణాలేంటని కన్నీరు పెట్టుకోని రోజు లేదు. మా అమ్మ, నాన్నలు తలెత్తుకుని తిరగ్గలరా..? అని మధనపడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి ఆత్మన్యూనత నుంచి నేను హిజ్రానని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగడం వెనుక ఒళ్లు జలదరించే సంఘటనలనేకం ఉన్నాయి. ఓ మగాడు హిజ్రాగా మారిన తరువాత సమాజంలో ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో. నా హృదయాంతరాలను ఆవిష్కరించి, మా హిజ్రాల బాధలు సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాను’ అంటూ రేవతి తన జీవితానుభవం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

క్రికెట్‌బ్యాట్‌తో కొట్టాడు..
‘‘మాది తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాకు చేరువలో ఉన్న ఓ కుగ్రామం. మేం నలుగురం. అందరికన్నా నేనే చిన్న. నా పేరు దొరైస్వామి. మా ముగ్గురు అన్నయ్యల్లాగే నేను కూడా అబ్బాయిలతో స్నేహంగా ఉండేవాడిని. ఏమైందో ఏమో తెలియదు కొంచెం ఊహ వచ్చాక నాలో మార్పులు చోటు చేసుకోవడం గమనించా. అప్పటివరకు అబ్బాయిలతో కలివిడిగా తిరుగుతున్న నాకెందుకో చెప్పలేనంత సిగ్గుగా ఉండేది. అబ్బాయిలతో కంటే అమ్మాయిలతో స్నేహం చేయాలనిపించేది. అమ్మాయిల దుస్తులు ధరించాలి అనిపించేది. నాలో మార్పులను మా అన్నయ్యలు గుర్తించి మా నాన్నకు చెప్పేవారు. మొదట్లో నాన్న తేలిగ్గా తీసుకున్నా, ఆ తరువాత నా ప్రవర్తన ఆయనకూ నచ్చేది కాదు. ఎందుకిలా చేస్తున్నావంటూ కోప్పడేవారు. నేనేందుకు ఇలా మారానో నాకు తెలిస్తే కదా…? నాన్న కోప్పడినప్పుడల్లా బాధగా ఉండేది. ఏడుపు తన్నుకొచ్చేది. నాలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదనిపించేది. పదో తరగతి వరకు ఎలాగోలా బండి లాగుతూ వచ్చా. ఒక రోజు మా అన్నయ్య నా ప్రవర్తనతో విసిగిపోయి క్రికెట్‌ బ్యాట్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. ఇక ఇక్కడ నేనుండడం కష్టమని.
ఢిల్లీ ప్రయాణం..
మా అమ్మ చెవిపోగులు దొంగతనం చేసి, సేలం నుంచి ఢిల్లీ రైలెక్కాను. రెండు రోజుల ప్రయాణం అనంతరం ఢిల్లీలో దిగి, అక్కడ నాలాంటి వారిని చూశాక కాని మనసు కుదుటపడలేదు. హిజ్రాలు అధికంగా నివసించే ప్రాంతానికి ఒక వ్యక్తి సహాయంతో చేరుకున్నా. నా గురించి ఓ హిజ్రాకు పూర్తిగా చెప్పాను. ఆమే నాకు అమ్మైంది, గురువైంది. అలా ఢిల్లీలో దొరైస్వామిని కాస్తా రేవతిగా మారిపోయాను. అప్పటి నుంచి సమాజంలో నేను అనుభవించని ఛీత్కారాలు లేవు. ఢిల్లీ పోలీసులు నానా చిత్రహింసలకు గురిచేసేవారు. యాచకం చేసి తెచ్చుకున్న డబ్బులను కూడా తీసేసుకునేవారు. ఆ బాధలు పడడం కన్నా, చచ్చిపోతే బాగుండు అనిపించేది. ఆ రోజుల్ని తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నేను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. అయినప్పటికీ చిన్నప్పుడు నాకు అబ్బిన నాట్యం, నటన, కొద్దో గొప్పో రాయగల సామర్థ్యం ఉన్నాయి. వాటిని ఆయుధంగా చేసుకుని హిజ్రాల ఈతిబాధలను సమాజానికి చెప్పాలని తీవ్రంగా ఆలోచించేదాన్ని. రేవతిగా మారిపోయిన తరువాత ఓ రౌడీమూక నాపై అత్యాచారానికి తెగబడింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు నన్ను నగ్నంగా నిల్చోబెట్టి మరీ అవమానించారు. అవన్నీ భరించాను. నాలా ఇలాంటి బాధలు ఎవరూ పడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఢిల్లీ వదిలి ఎక్కడికైనా వెళ్లి సమాజంలో గౌరవంగా బతకాలనుకున్నాను.
సాహిత్యమే నా ఆయుధం..
మా అమ్మ (ఢిల్లీలో రేవతికి ఆశ్రయమిచ్చిన హిజ్రా) సహాయంతో బెంగళూరుకు చేరుకుని ఢిల్లీ పరిచయాలతోనే ‘సంగమ’ అనే ఎన్జీవో సంస్థలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా చేరాను. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సంస్థ అది. లైంగిక వేధింపుల బాధితులకు సంబంధించిన వివరాలు సేకరించే పని నాది. అలా సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందేందుకు బెంగళూరు మొత్తం తిరగడంతో పాటు, తమిళనాడులోని హిజ్రాల గురించి ఆరా తీయాలని సంకల్పించాను. ఆ విధంగా తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి, హిజ్రాలపై పరిశోధన చేసి 2004 సంవత్సరంలో నా తొలి పుస్తకం ‘ఉనర్వుం – ఉరువవుమ్‌’ (దేహం- భావం) రాశాను. 50 మంది హిజ్రాలను కలుసుకుని వారి జీవితానుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని రాసిన పుస్తకమది. ఆ పుస్తకాన్ని హిందీలో ఢిల్లీకి చెందిన యోధప్రెస్‌ ప్రచురించింది. అలాగే కన్నడంలోకి తర్జుమా అయ్యింది. అయితే ఆ పుస్తకంలో ఇంకా ఏదో వెలితి అనిపించింది. అందుకే నా జీవిత చరిత్రను రాయాలని నిర్ణయించుకున్నాను. కళ ద్వారానే సమాజంలోకి భావాలను సులువుగా తీసుకెళ్లగలమని బలంగా నమ్మే నేను సాహిత్యాన్నే ఆయుధంగా మార్చుకోవాలనుకున్నాను. 2005-06 సంవత్సరం మధ్య నా ఆత్మకథను రాశాను. తెహెల్కా పత్రిక ప్రతినిధుల ద్వారా పెంగ్విన్‌ సంస్థను సంప్రదించి నా ఆత్మకథ గురించి చెప్పాను. వారు ముందుకు రావడంతో ‘వెల్లైమొళి’ (తెల్లని భాష)గా తమిళంలో నా ఆత్మకథ పుస్తకం ప్రచురితమైంది. ఓ హిజ్రా ఆత్మకథకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దేశంలోనే ఏ హిజ్రా పంచుకోలేని వ్యక్తిగత అనుభవాలకు కూడా ఈ పుస్తకంలో అక్షర రూపమిచ్చాను. మొదట్లో నా చిన్ననాటి స్నేహితులు ఇలా ఎందుకు రాయటం అని నిరుత్సాహపరిచారు. అయితే సమాజంలో హిజ్రాల పట్ల ఉన్న దురభిప్రాయం తొలగాలన్న సంకల్పంతోనే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఈ పుస్తకం రాశాను.
అన్ని భాషల్లోకి అనువాదం..
నా ఆత్మకథ ఆంగ్లంలో ‘ద ట్రూ స్టోరి: ఏ హిజ్రా లైఫ్‌’గా అనువాదం కాగా, మలయాళం, కన్నడం భాషలలో కూడా అనువదించారు. తాజాగా తెలుగులోనూ ‘ఓ హిజ్రా కథ’ పేరుతో అనువాదానికి నోచుకుంది. ఓ హిజ్రా ఆత్మకథ ఇన్ని భాషలలో రావడం నిజంగా రికార్డే. నా కథతో ఇప్పటికే పలు నాటక సంఘాలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నాయి. నాటకంపై నాకూ కొంచెం అవగాహన ఉండడంతో నేను కూడా నా ఇతివృత్తాన్ని వీథి నాటకంలా వేయిస్తున్నాను. కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చేలా చేస్తున్నాను. అమెరికాలోని ఓ కళాశాలలో నా ఆత్మకథ పాఠ్యాంశంగా కూడా చేర్చారంటే నా జీవితం ఎంతమందిని ప్రభావితం చేసిందో కదా.
మేమంటే ఎందుకీ చిన్నచూపు..
హిజ్రాలంటే సమాజంలో చిన్నచూపు ఉంది. చేతులు చరుస్తూ యాచిస్తుంటారని, లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారన్న హీనమైన అభిప్రాయం ఉంది. మాకు ఎక్కడా ఉపాధి అవకాశాలు ఇవ్వరు. కనీసం ఇల్లు కూడా అద్దెకివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలనే నేను పోరాడుతున్నాను. నాకు తెలిసిన మార్గం ద్వారానే సమాజంలో మాపై ఉన్న అభిప్రాయాన్ని తుడిచిపెట్టాలనేదే నా లక్ష్యం. అందుకే నా పుస్తకాన్నే ఆయుధంగా మలచుకున్నాను. ప్రస్తుతం నేను స్వప్నించిన మార్పులు కన్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా హిజ్రాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. కేంద్రప్రభుత్వం మమ్మల్ని మూడో విభాగం కింద పరిగణించడాన్ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. నా వరకు నేను మహిళగానే భావిస్తాను. ప్రస్తుతం నా వయస్సు 47 యేళ్లు. ఇన్నేళ్ల నా ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… మా పట్ల సమాజంలో చిన్నపాటి మార్పులు వచ్చాయనిపిస్తోంది.

నా వరకు అయితే నేను అనుకున్నది సాధించాననే సంతృప్తి ఉంది. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో పత్రికల సహకారం కూడా చాలానే ఉంది. ప్రస్తుతం నేను నామక్కల్‌లో నా తండ్రి వద్దే ఉంటున్నాను. మా అమ్మ చనిపోయింది. బెంగళూరులో ఉద్యోగానికి రెండున్నర సంవత్సరాల క్రితమే రాజీనామా చేశాను. సామాజిక కార్యకర్తగా మా హిజ్రాలకు చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజలందిరిలోను మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అని చెప్పారు రేవతి.
గొల్లపల్లి ప్రభాకర్‌రావ్‌, చెన్నై
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -61

88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు

రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో రాశాడు .దీనికి వృత్తి కూడా ఉంది..ఇతని శిష్యుడే మంఖకుడు .శ్రీకంఠం కావ్యాన్ని రాశాడు .సూత్రాలను రుయ్యకుడు రాస్తే వ్రుత్తి మంఖకుడు రాశాడని ప్రచారం లో ఉంది .అలంకార సర్వస్వానికి జయ రధుడు టీక రాశాడు .

రుయ్యక పాండితీ గరిమ

అలంకార లక్షణాలను సూత్రాలలో చెప్పి వృత్తిలో ఉదాహరణలతో వివరించాడు విశ్లేషణపద్దతి శాస్త్రీయ విధానం లో ఉంటుంది .ఇతర కావ్యాల విషయం ఎత్తుకోలేదు .కొత్త అలంకారాలను చేర్చాడు .ధ్వనివాదిగా రుజువు చేసుకొన్నాడు .ధ్వని సిద్ధాంతాన్ని ఖండించినవారిని ఖండించాడు .కావ్య ప్రకాశం కు ‘’సంకేతం ‘’అనే టీకా రాశాడు .మహిమ భట్టు రాసిన ‘’వ్యక్తీ వివేకం ;;కు విచార విమర్శ చేశాడు సాహిత్య మీమాంస ,నాటక మీమాంస ,అలంకారారల సరణి ,సహృదయ లీల అనే గ్రంధాలను కూడా రుయ్యకుడు రచించాడు .రుద్రటుడు రుయ్యకునిపై విపులమైన చర్చ చేశాడు .

89-రస తరంగిణి కర్త మాయా రస ప్రతిపాదకుడు  –భానుదత్తుడు

పదమూడవ శతాబ్ది వాడైన భాను దత్తుడు రసతతంగిణి ,రసమంజరి అనే అలంకార శాస్త్రాలు రాశాడు .మిధిలా గణనాదునికొడుకు .

దత్తుని కవితా భానుప్రతాపం

రసమంజరిలో శ్లోకాల తోబాటు టీకా కూడా ఉండటం విశేషం .నాయికా నాయకుల భేదాలను వివరించాడు .రసమంజరితర్వాత రస తరంగిణి రాశాడు .ఇది భరతుని నాట్య శాస్త్రం లోని ఆరు ఏడు అధ్యాయాలకు వ్యాఖ్యానం గా భావిస్తారు గద్య రూప రచన.రాముడికి కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు రాసి ఉదాహరణలుగా ఇచ్చాడు .ఎనిమిది తరంగాల కావ్యం .శృంగార రసం ప్రాధాన్యతను తెలియ బరచాడు .’’మాయా రసం ‘’అనే దాన్నిప్రతిపాదించి దాన్ని పదవ రసం గా చెప్పాడు చిత్త వ్రుత్తి అనేది ప్రవ్రుత్తి ,నివృత్తి అనే రెండు రూపాలలో ఉంటుందని ,నివృత్తిలో శాంతరసం ,ప్రవృత్తిలో మాయారసం ఉంటాయన్నాడు . రతి ,హాస,శోక ,క్రోధ ,ఉత్సాహ ,భయ ,జుగుప్స విస్మయాలు ప్రవృత్తిలో పుట్టి అక్కడే అణగిపోతాయన్నాడు . ఇవన్నీ స్థాయీ భావాలని ,ఇవి మాయా రసానికి వ్యభిచారీ భావాలు అవుతాయని చెప్పాడు .మాయారసానికి స్థాయీ భావం గా మిధ్యజ్ఞానం ,ధర్మాధర్మాలు ,సంతానం విజయాలు అనుభవాలు అన్నాడు .మాయ అనాది అని ఏదోఒక దాని వల్లమాయ పుట్టదని అది రసమే కాడుపోమ్మన్నాడు చిరంజీవి భట్టాచార్యుడు .జ్రుమ్భ అనే తొమ్మిదవ సాత్విక భావాన్ని భాను దత్తుడు చెప్పాడు ‘’.ఛలం’’ అనే ముప్ఫై నాలుగవ సంచారీ భావాన్నికూడా చెప్పాడు

90-.సాహిత్య దర్పణ రచయిత –విశ్వనాధుడు

ఒరిస్సా కు చెందిన విశ్వనాధ మహా పాత్రుడు పద్నాలుగవ శతాబ్దికి చెందిన వాడు ..ఒరిస్సా రాజాస్థానకవి తండ్రిచంద్ర శేఖరుడు కూడా అదే ఆస్థానం లో మహా కవీశ్వరుడు .

కవితా విశ్వనాధం

‘’సంధి –విగ్రహ మహా పాత్రుడు ‘’అనే బిరుదున్న వాడు విశ్వనాధుడు ,ముమ్మటుడి కావ్య  ప్రశంస  కు ‘’కావ్య ప్రకాశ దర్పణం ‘’అనే టీకా రాశాడు ..విశ్వనాధుని ‘’సాహిత్య దర్పణం ‘’బాగా ప్రచారమైన అలంకార శాస్త్రం .ఇందులో పది పరిచ్చేదాలున్నాయి .దృశ్య ,శ్రవ్య కావ్య చర్చ చేశాడు ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’అని సిద్దాన్తీకరించినవాడు విశ్వనాధుడు .ధ్వని వాదికాడు రసవాది .రసమే కావ్యానికి ఆత్మ అని భరతుడిని సమర్ధించాడు .రూపక భేదాలను వివరంగా వివరించాడు .దశ రూపకం తర్వాత ఇదే ప్రామాణికం .అలంకార రీతులనూ విశదీకరించాడు .తానూ స్వయంగా కవికనక తన గ్రందాలనుంచే ఉదాహరణలిచ్చాడు .రఘు విలాస మహా కావ్యం ,కువలయాశ్వ చరిత్ర ,అనే ప్రాకృత కావ్యం ప్రభావతి ,చంద్రకళ అనే నాటకాలు కూడా రాశాడు విశ్వనాధుడు .విశ్వనాధుని సాహిత్య దర్పణం నిజం గానే సాహిత్యాని దర్పణం లాంటిదే. అందరి ప్రశంసలను అందుకొన్నది .ముమ్మటుని గ్రంధం తర్వాత దీనికే ప్రాచుర్యం ఎక్కువ .దర్పణానికి అనేకమంది టీక లు రాశారు .విశ్వనాదుడికొడుకు అనంత దాసుకూడా ఒక టీకా రాసి తండ్రి ఋణం తీర్చుకొన్నాడు .

91-వసంత రాజీయం రచించిన –కుమారగిరి రెడ్డి

కొండవీటి సామ్రాజ్య ప్రభువు కుమారగిరి రెడ్డి ‘’వసంత రాజీవం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కాలం 1386-1402.ఇందులో ముఖ్యం గా రూపకాల భేదాలను విపులంగా వివరించాడు .కుమార గిరి రెడ్డి బావమరది కాటయ వేమా రెడ్డి కాళిదాసు రాసిన మూడు నాటకాలకు బావ గారి పేర ‘’కుమారా గిరి రాజీయం ‘’వ్యాఖ్యానం రాశాడు ఇవి చాలా ప్రఖ్యాతమైన వ్యాఖ్యానులుగా  గుర్తింపు పొందాయి .వసంత రాజీయం లోని వ్యాఖ్యానాలకు అనుగుణం గా కాటయ వేముడు ఈ వ్యాఖ్యానాలు రాశాడు .మల్లినాధుడు ,కుమారస్వామి  నాదెండ్ల గోపయ్య మంత్రి తమ వ్యాఖ్యానాలలో వసంత రాజీవాన్ని బాగా ఉదాహరించారు .కుమారగిరిని వసంత రాయలు అంటారు వసంతోత్సవాలను గొప్పగా నిర్వహించేవాడు .

92-సాహిత్య చింతామణి కర్త –పెదకోమటి వేమ భూపాలుడు

కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి కుమారా గిరి రెడ్డి తర్వాత రాజయ్యాడు సాహిత్యప్రియుడు అనేక వ్యాఖ్యానాలతో బాటు సాహిత్య చింతామణి అనే అలంకార గ్రంధాన్ని కూడా రాశాడు .కాలం 1403-1420.ముమ్మటుడి కావ్య ప్రకాశ ధోరణిలో వేమారెడ్డి ‘’సాహిత్య  చింతామణి ‘’కూర్చాడు. పదమూడు పరిచ్చేదాలున్న కావ్యం .కావ్యం  ఉత్పత్తి లక్షణాలు గుణ దోషాలు అలంకారాలు రీతులు కావ్య వస్తువు దృశ్యకావ్య లక్షణాలు మొదలనవన్నీ వివరించాడు .ధ్వనికి లోబడే రసాన్ని ఒప్పుకొన్నాడు .తన రచనల నుంచే ఉదాహరణలిచ్చాడు .వేముడికి సంగీతం లోను గొప్ప ప్రతిభ ఉంది ‘’సంగీత చింతామణి ‘’రాశాడు .’’సర్వజ్ఞ చక్ర వర్తి’’ బిరుదున్నవాడు .

93- చమత్కార సిద్ధాంత కర్త -విశ్వేశ్వరుడు

రెండవ సింగ  భూపాలుడి ఆస్థానకవి విశ్వేశ్వరుడు ‘’చమత్కార చంద్రిక ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు ఉదాహరణ శ్లోకాలు రాజు ప్రశంసలతోనే ఉంటాయి .ఎనిమిది విలాసాల కావ్యమిది .వర్ణ వివేక ,వాక్య గుణ దోష విచార ,అర్ధ దోష ప్రబంధ విశేషక ,గుణ రీతి వ్రుత్తి పాక శయ్య వివేక ,రస వివేక ,శబ్దాలంకార ,అర్దాలంకార ,ఉభాయాలంకార అని ఆ విలాసాలకు పేర్లుపెట్టాడు. ఇతనిది చమత్కార సిద్ధాంతం .చమత్కారం కావ్యం యొక్క మూల తత్త్వం గా చెప్పాడు ‘’నహి చమత్కార విహితస్య కవేఃకవిత్వం కావ్యస్యవా కావ్యత్వం ‘’అని గంట కొట్టి క్షేమేంద్రుడు చెప్పాడు విశ్వేశ్వరుడి తర్వాత హరిప్రసాదుడు కూడా చమత్కారాన్ని మెచ్చాడు .ఆహ్లాదం ,జ్ఞానం లోకోత్తరత్వం హ్లాదం చమత్కారం ఉన్నది రమణీయం అన్నాడు జగన్నాదుడుకూడా .ఇంకో అడుగు ముందుకు వెళ్లి విశ్వేశ్వరుడు చమత్కారాన్ని తరగతులుగా విభజించాడు చమత్కారి శబ్ద చిత్రం ,చమత్కార తరం ,అర్ధ చిత్రం గుణీభూత వ్యంగ్యం ,చమత్కారి తమం ,వ్యంగ్యం కలిగిఉన్నదే కవిత్వం అన్నాడు .చమత్కారాన్ని ధ్వని సరసన నిల బెట్టాడు  .అనేక అలంకారాలు ప్రసిద్ధ అలంకారాల నుండే ఉద్భవిస్తాయి అన్నాడు .అలంకార మీమాంస విషయం లో జగన్నాదుడిని సమర్ధించాడు .అలంకార కౌస్తుభానికి తానె స్వయం గా టీకరాశాడు .రస చంద్రిక ,అలంకార ప్రదీపం ,అలంకార ముక్తావళి ,’’కవీంద్ర కంఠా భరణం ‘’లో చిత్రకావ్యాలప్రామాణికత ను పరిశీలించాడు .ఇతని అన్న ఉమాపతి కూడా  ఆలంకాకారికుడే  ఆతను చెప్పిన పరికరాలంకారాన్ని విశ్వేశ్వరుడు సమర్ధించాడు .తండ్రి లక్ష్మీ పతికూడా కవేకాక పండితుడుకూడా .ప్రౌఢ ఆచార్యులలోకొందరి దృష్టిలో ఇతనే చివరివాడు .ఎక్కువ మంది సృష్టిలో జగన్నాదుడినే  చివరివాడిగా గుర్తించారు .యితడు పద్దెనిమిదవ శతాబ్దం పూర్వార్ధం లో ఉన్న వాడు .

94- తానీషా రాజ గురువు -అక్బర్ షా

గోల్కొండ రాజు అబుల్ హసన్ తానీషా కు రాజ గురువు అక్బర్ షా తండ్రి అంటారు .షాకు తపశ్శక్తి కూడా బాగా ఉండేదని నమ్ముతారు .తండ్రితర్వాత తానీషా  కొలువులో రాజ గురువు అయ్యాడు .అక్బర్ షా సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన పండితకవి .’’శ్రుంగార మంజరి ‘’అనే అలంకార గ్రంధాన్ని షా రాశాడు .దీన్ని ముందు తెలుగులో రాసి తర్వాత సంస్కృతం లోకి అనువాదం చేశాడట .ఆయన మాటల్లోనే –

‘’తేనాంద్ర భాషాయాం రచితః శృంగార మంజరీ గ్రంధః –స్వయమా కబరేణ భూ భ్రున్ముకుట మణి రంజితాంఘ్రి కమలేన

తద్విరచితాంధ్ర భాషా కలితాం శృంగార మంజరీచ్చాయాం –సేవద్వం సురవాణీ రచితాం రస తోషితా రసిక భ్రుమ్గాః’’

శ్రుంగార మంజరి లో నాయికా నాయక చర్చ ,రసంపై చర్చ చేశాడు షా .ఇందులో నాయికా విభాగం నాయక విభాగం ,దూతీ విభాగం ,రస విభాగం అనే నాలుగు భాగాలున్నాయి  ఈ గ్రంధానికి ఆధారం భాను దత్తుడి రసమంజరిగా భావిస్తారు .షా ఒక గొప్ప తమాషా చేశాడు తన పేరుతొ .అక్బర్ ను అ ,క ,వ ,ర అని విడగొట్టి అ అంటే బ్రహ్మ ,క విష్ణువులను వర అంటే మించిన వాడు అని అర్ధం చెప్పుకొన్నాడు .షా కు ‘’బడే సాహెబ్ ‘’అనే పేరుకూడా ఉందట .దీనికికూడా తన సొంత అర్ధం చెప్పుకొన్నాడు దానికి అర్ధం –మహేశ్వరుడు అన్నాడు .మహామ్మదీయుల్లో సంస్కృతం నేర్చినవారు తక్కువే .అందులోను సంస్కృత గ్రంధాలను రాసిన వారు మరీ తక్కువ .అలాంటి వారిలో ప్ర ప్రధముడు అక్బర్ షా కవి .

95-రూప గోస్వామి శిష్యుడు –గోస్వామి కర్ణ పూరుడు

చైతన్య శిష్యపరంపరలో ఇంకొక ఆలంకారికుడు కర్ణ పూరుడు .రూప గోస్వామికి సమకాలికుడేకాక శిష్యుడుకూడా ‘’.అలంకార కౌస్తుభం ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు .ఇతని  అసలుపేరు ‘’పరమానంద సేనుడు ‘’కర్ణ పూరుడు వాడుక పేరు .బెంగాల్ లో 1524లో పుట్టాడు .చైతన్యుని ప్రభావం తో కృష్ణ భక్తుడై   చైతన్యుడి భక్తీ సిద్ధాంతాలను ప్రచారం చేయటానికి ‘’చైతన్య చంద్రోదయం ‘’  అనే గ్రంధం రాశాడు .కావ్య తత్వాలన్నీ కూలం కషం గా చర్చించాడు .తానూ శ్రీ కృష్ణునిపై భక్తితో రాసిన శ్లోకాలను ఉదాహరణలుగా పేర్కొన్నాడు గ్రంధం లో .రసం ఒక్కటే అని సిద్దాన్తీకరించాడు .శుద్ధమైన మనస్సుకు ఆనందం అనే దర్మం ఉందని అదే స్థాయి అని చెప్పాడు .స్పటికం లో అనేక రంగులు కనిపించినట్లు ఒక్కటే అయిన స్థాయి అనేక విభావాదుల కలయిక తో వీరం, అద్భుతం మొదలైన రూపాలను ధరిస్తుంది అన్నాడు .సూర్య ప్రతిబింబాలు యెన్నిఉన్నా అసలు సూర్యుడు ఒక్కడే అన్నట్లు ఉపాదులలో భేదమే కాని ఆనందం లో భేదం లేదు .రాసాలన్నిటికి’స్వాద్వాత్మ’’ ఒక్కటే అని కర్ణ పూరుడి సిద్ధాంతానికి శాస్త్రీయత ఉందని అందరూ అంగీకరించారు .

కర్ణ పూరుడు ‘’ఆనంద బృందావనం ‘’అనే చంపువును ‘’గౌర గణోద్దీపిక ‘’లను రచించాడు ఈయన కొడుకు కవి చంద్రుడుకూడా లబ్ధ ప్రతిస్టూడైన కవే .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం కు తాత్కాలిక విరామం

మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం అనే శీర్షిక తో ఇప్పటికి 61ఎపిసోడ్ లలో 95 మంది ప్రసిద్ధ  సంస్కృత కవుల గురించి, వారి సాహిత్య సేవలను గురించి ,వారు చూపిన నవ్య మార్గాల గురించీ ,సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన ,నేను సేకరించిన సమాచారాన్ని అంద జేశాను.ఇదే సంపూర్ణం కాదు .ఒక సారి ఆ మహా కవులను  సంస్మరించే ప్రయత్నమే నేను చేశాను .ఇంకా లోతులు తరచాలనుకొనే వారికి ఒక చిన్న ఆధారం మాత్రమె .

శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి  మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను  .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .మధ్యలో కొంత గందర గోళం అయింది కాలం విషయం లో .అయినా అలానే రాశాను   .నేను రాసిన వారుకాక పూర్వ కవులలో ఇంకా ఎందరో మహాను భావులున్నారు. వారి గురించి రాయక పోయినా వారి ప్రతిభకు జోహార్లు అర్పిస్తున్నాను .

ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు .వారిపేర్లూ సేకరించి రెడీగా ఉంచుకోన్నాను .వారిని గురించి కూడా రాయాలనుకొంటున్నాను .కనుక ఇంతటితో ఈ శీర్షికకు ఫుల్ స్టాప్ కాకుండా కామా మాత్రమె పెడుతున్నానని మనవి చేస్తున్నాను .వాటినీ త్వరలోనే రాస్తాను . ఎందరో మహాను భావులు. అందరికి వందనములు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలంగాణాను పెనం నున్దిపోయ్యి లోకి తోసింది కె సి ఆర్ అంటున్న ప్రో కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హుదుద్ విశాఖ లో సృష్టించిన నీరు -నిప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60

83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి

ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా  చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం లోనే కన్నడ భారతం రాసిన పంపకవి కూడా ఉండేవాడు .ఈ చాళుక్య రాజులు జైన అభిమానులు .సూరి మాత్రం ఉత్తర దేశం వాడు ఇక్కడికొచ్చి ఈ కావ్యం రాశాడు .ఇతనికాలం 995 అయి ఉండాలి .

సోమప్రభ యశస్ తిలకం

సూరి రాసిన పై కావ్యం లో యశోధర ,మారి దత్తుడు అనే రాజుల కద ఉంది .మారిదత్తుడు యజ్ఞం చేయాలనుకొని బలికోసం పశువులతో బాటు ఒక బాలుడు బాలిక లను కూడా   సిద్ధం చేసుకొంటాడు .సుదత్తుడనే ముని వచ్చి ఇలాంటి యజ్ఞం కూడదు అంటాడు .ఆ ముని బోధ వలన మారిదత్తుడు జైన మతం స్వీకరిస్తాడు .సమకాలిక జీవిత ప్రతి బింబం గా చిత్రణ బాగా చేశాడు .రాజ్య వ్యవహారాలూ ,దురాచారాలు వాస్తవం గా రాశాడు .కాదంబరి లాగానే నడిపించాడుకావ్యాన్ని .

సూరికి ఆదర్శం బాణుడే.అదే దారిలో నడిచాడు .పాండిత్యం తో శ్లేషలతో కవిత్వాన్ని రక్తి కట్టించాడు .సూక్తులను సందర్భోచితం గా ప్రయోగించి సార్ధకత తెచ్చాడు ..సోమ ప్రభును ఆనంతర కవులు చాలామంది అనుకరించారు .

84-అభినవ కాళిదాసు

అసలు పేరు వెల్లాల ఉమా మహేశ్వరుడు .అభినవ కాళిదాస బిరుదాంకితుడు .’’భాగవత చంపువు ‘’రాశాడు .కాలం పదిహేనవ శతాబ్ది .

కొత్త దాసు గారి కవిత్వం

భాగవతం లోని దశమస్కంధం ఆధారం గా ఇతను ఈ చంపువు రాశాడు .రాదా కృష్ణుల ప్రేమ  వృత్తాంతం హై లైట్ చేశాడు .రాధను నాయకిని చేసి కృష్ణుడితో పెళ్లి జరిపించి ఒక అడుగు ముందుకే వేశాడు .ఈ దంపతుల ప్రణయాన్ని మధురం గా వర్ణించాడు .భక్తికంటే రక్తికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .శ్లేషకు ప్రాధాన్యం ఇచ్చాడు .గద్య లో సమాస బంధం ముచ్చటగా ఉంటుంది .దీనికి అక్కయ సూరి వ్యాఖ్య రాశాడు .కొత్త కాళిదాసు ‘’భారత చంపువు ‘’కూడా రాశాడు .ముద్రితం కాలేదు .

85-చంపూ భారత కర్త –అనంత భట్టు

క్రీశ పదిహేను  వందల వాడైన అనంత భట్టు చంపూ భారతం రాశాడు .అభినవ కాళిదాసుతో విభేదం ఉండేదట .1041శ్లోకాలు ,200గద్యాలున్నాయి .విభాగాలకు ‘’స్తబకాలు ‘’అని పేరుపెట్టాడు పన్నెండు స్తబకాల కావ్యం ఇది .

భట్టు కవితా అనంతత్వం

ఉపాఖ్యానాలు తప్ప తక్కిన భారత ఘట్టాలన్నిటిని ఇందులో చేర్చి రాశాడు .పాండురాజు పుట్టుకతో కావ్యాన్ని ప్రారంభింఛి అతని వేట కు ప్రాధాన్యమిచ్చి ‘’కిందమ ముని ‘’శాప వృత్తాంతం హైలైట్ చేశాడు .వర్ణనలను బాగా చేశాడు .ప్రతి పదాన్ని సమర్ధం గా ప్రయోగించి ‘’పదలాలిత్య పారీణుడు ‘’అనిపించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం –

‘’కిం శుకస్య వాదనే రుచిరత్వం కిం శుకస్య  హృదయే పి వశిత్వం –కిం శుకస్య కుసుమేషు నదంతీ శంసతిస్మ మధు పాలి రితీవ’’

అనుప్రాసతో పాటు యమక ఉత్ప్రేక్షాలంకారాలనూ సమర్ధం గా ప్రయోగించాడు .వీర రస కావ్యమైన దీనిలో యుద్ధ వర్ణనలూ బాగా ఉన్నాయి నర్తన శాలలో భీముడు కీచకుడు రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణం లో చేసే చాటు యుద్దాన్న్ మనోహరం గా వర్ణించాడు ,-

‘’అక్ష్వేలితా రావమ వీర వాదం అవీక్షక ఖ్లాఘన చాటు గం ఫనం-అనుచ్చ నిహ్ శ్వాస ముహుం క్రియాకం అభూత పూర్వం తభూన్నియుద్ధం

శిలీ ముఖైస్చిత్తజ చాపాజు స్తైర్దత్తానిరంధ్రాణిదధన్నిజాంగే –సమీర జాతేన విదూని తోసి సకీచాకోనైవ చుకూజ కించిత్ ‘’

కురుక్షేత్ర యుద్ధాన్ని అదే స్తాయిలో వర్ణించి దృశ్యమానం చేశాడు .’’అలాంటి వాడికడుపులో ఎలా పుట్టావు ?’’అనే తెలుగు పలుకు బడికి సంస్కృతం చేసి భట్టు ప్రయోగించాడు .అర్జునుడు ఉత్తరకుమారుడితో అన్న సందర్భం లో –

‘’ఉదితోసి విరాట భూపతేః ఉదరాత్ భద్ర కధంత్వమీద్రుశః ‘’అదీ ప్రయోగం .అలాగే మంగళ సూత్రా విధానమైన  తెలుగు సంప్రదాయాన్నిసంస్కృతం లోకి లాక్కేల్లాడు . ఈ చంపువుకు కురవి రామ చంద్ర ,మల్లాది లక్ష్మణ స్వామి ,నారాయణ స్వామి ,కుమారా తాతాచార్య ,నరసింహా చార్య వగైరా వ్యాఖ్యానాలు రాశారు .

86-వసుచరిత్ర చంపువు కర్త-కాళహస్తికవి

అప్పయ్య దీక్షితుల వారి శిష్యుడైన కాళహస్తికవి 1575కాలం వాడు .వసుచరిత్ర చంపువు రాశాడు .కంచి కామాక్షీ దేవి భక్తుడు .కావ్యం చివర అనుప్రాసలతో అమ్మవారిని నుతించాడు .రచన పదిహేడవ శతాబ్దిలో చేసిఉంటాడని ఊహిస్తున్నారు .

‘’ కాళహస్తి’’ మహాత్మ్యం  .

తెలుగులో రామ రాజ భూషణుడు(భట్టు మూర్తి) రచించిన ‘’వసు చరిత్ర’’ను సంస్కృతం లో ఈ కవి రాయటం ప్రత్యెక మైన అపూర్వమైన  విషయం .వసు చరిత్రకారునిది మౌలిక రచన శైలి  సంగీత మాధుర్యంతో  నాన్యతో దర్శనీయం .భావాలకు చమత్కారాలకు పుట్టినిల్లు .అలాంటి’’ వసువు’’ ను సంస్కృత కవులకు పరిచయం చేసి అందులోనూ వసువును అంటే బంగారాన్ని పండించాడు .అతని ఆలోచనకు హాట్స్ ఆఫ్ అన బుద్దేస్తుంది .వసుకారుని గురించి ఎక్కడా పేర్కొనక పోవటం కూడా విశేషమే .రామ రాజ భూషణుడు పీఠికలోని తెలుగు పద్యాలను సంస్కృతీకరించాడు .తెలుగు .శ్లేష చమత్కారాన్ని సంస్కృత సాహిత్యం లోకి దించాడు .కృతికర్త వంశ వర్ణన వదిలేశాడు .

ఆరు ఆశ్వాసాలుగా తెలుగు లో ఉన్నట్లే రాశాడు .శ్లేష,ధ్వని గుణీ భూత వ్యంగ్యం మచ్చుకు మచ్చు గీర్వాణం లోకి మార్చి తన కవితా గీర్వాణాన్నేకాక వసుకారుని తెలుగు సోయగ గీర్వాణాన్ని కనులకు కట్టించాడు .తెలుగులో ఉండే యతిప్రాసలనే వాడి సంస్కృతానికి మాధుర్యం లయా ,ఊపు తెచ్చాడు .ఎక్కడా కవిత్వం కుంటు పడదు .తెలుగు పద్యం లోని భావాన్ని ఒకే శ్లోకం లోపొదివి పట్టాడు .మూలం లోని గద్యాన్ని గద్యం గానే గీర్వాణీక రించాడు.అవసర మైన చోట్ల సీసపద్యాన్ని మూడు శ్లోకాలో చెప్పాడు .ప్రాస సౌందర్యాన్ని రామ రాజ భూషణుడికి తగినట్లు సంస్కృతం లోకి తెచ్చి వారేవా అనిపించాడు కాలహస్తికవి .ఒక ఉదాహరణ చూద్దాం –

‘’వేణి చలింప గంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణ –శ్రేణి నటింప లోన శఫారీ నిబరీ సకటాక్ష కాంతి .వి

న్నాణముచూప హంసక గణ క్వనంబులు మీర సైకత –శ్రోణి వివర్తితాబ్జ ముఖ శోభితమై కడు సంభ్ర మించినన్ ‘’

ఇది తెలుగు వాసు చరిత్రలో రామ రాజ భూషనుదిపద్యం ‘దీన్ని సంస్కృతం లో కాళహస్తికవి –

‘’వేణీ చచాల బిసవద్భుజ కంకణానాం-శ్రేణీ ననార్త విబభుశ్శఫరీ కటాక్షాః

నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ-శ్రోణీలసత్పులిన సాచిత మబ్జ వక్త్రం ‘’

87-ద్వ్యర్దికవి రాజు -కవిరాజు

మాధవ  భట్టు  అసలు పేరున్న కవిరాజు 1182-1197కాలపు జయన్తిపురాదీశ్వరుడు కదంబ వంశ రాజు కామ దేవుడి ఆస్థానకవి .’’రాఘవ పాండవీయం ‘అనే ద్వార్దికావ్యాన్ని సంస్కృతం లో రాశాడు .పదమూడు సర్గలతో ఆరు వందల అరవై ఎనిమిది శ్లోకాలతో వర్ధిల్లిన రామాయణ ,మహా భారత కధలు జమిలిగా ఉన్న కావ్యం ఇది .ప్రతి సర్గ చివర రాజు పేరు చేర్చటం విశేషం .కనుక దీనికి ‘’కామ దేవాంకం’’అనే పేరుకూడా ఉంది .

కవిరాజీయం

తనకంటే ముందు ధనుంజయుడు రాసిన రాఘవ పాండవీయకర్త ధనుంజయుడికి కు ఆశ్రయమిచ్చిన  ‘’ముంజ రాజు ‘’కంటే తనకు ఆశ్రయ మిచ్చిన కామదేవుడు గొప్పవాడని చమత్కరించాడు –‘’

‘’శ్రీ విద్యా శోభినో యస్య శ్రీ ముంజా దియతీభిదా –దారాపతి రసావాదీయం తావ ద్ధ్రరా పతిః’’భావం –శ్రీవిద్యఅనే  తాంత్రిక సిద్ధిగల ముంజ రాజు ,కు లక్ష్మీ సరస్వతుల చేత శోభిల్లే కామ దేవుడికి భేదం ఏమిటి అంటే –అతడు దారాపతి అంటే దారానగర రాజు ,యితడు ధరాపతి అంటే భూమిపాలకుడు .ధనుమ్జయుని కావ్యం కంటే తనకావ్యం గొప్పదని భావించాడు .వక్రోక్తికి మహా వైభవాన్ని తెచ్చాడు .రామాయణ భారత కధలను జోడించిన తీరు ముచ్చటగా ఉంది .ద్వర్దికావ్య రచన అసిధారా వ్రతం .దాన్ని అనాయాసం గా నిర్వహించి ద్వ్యర్దికావ్యానికి మహా కావ్య గౌరవాన్ని చేకూర్చాడు .ఒకే సర్గలోవివిధ వృత్తాలను ఉపయోగించాడు .వీర రసప్రధానమైన అన్నిరసాలను పోషించాడు ..భావ ప్రకటనలో అద్వితీయుదనిపిస్తాడు –

‘’వికీర్ణ సంక్రందన చాప లేశాచ్చవీనికీర్ణాని వనస్తలీషు –సలీల మాదాయ మయూర బర్హాన్యుత్తంస యంతిస్మకిరాతనార్య ‘’భావం –విరిగిపడిన ఇంద్ర ధనుస్సుముక్కలాగా ఉన్న అడవిలో చెల్లా చెదురుగా పడిఉన్న నెమలి పించాలను ఏరుకొని కిరాత స్త్రీలు విలాసంగా తమ చెవులలో అలమ్కరించుకొంటున్నారు .నెమలి ఈకలను ఇంద్రధనుస్సు ముక్కలుగా పోల్చటం రమణీయ భావన .

రామాయణం పవిత్ర  మైన గంగానది .భారతం విశాల సముద్రం లాంటిది .ఈ రెండిటిని కలిపిన కవిరాజు భగీరధుడి వంటివాడు అని చమత్కరించాడు

‘’శ్రీమద్రామాయణం గంగా ,భారతం సాగరోపమన్ –తత్సంయోజన కార్యజ్ఞః కవిరాజో భగీరదః ‘’

మరోకవిని కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎక్సరే సాహిత్య సంస్థ 15వ వార్షికోత్సవ ఆహ్వానం 1-11-14- ఘంటసాల మ్యూజిక్ కాలేజి –

xray1 001 xray2 001 xray3 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహానాయకుడు –సర్దార్ పటేల్

మహానాయకుడు
‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్‌ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్‌. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో బలప్రయోగం చేపట్టి విజయం సాధించారు పటేల్‌. అందుకే పటేల్‌ను ఉక్కుమనిషిగా అభివర్ణించటం ఎంతో సముచితం.

గుజరాత్‌ రాష్ట్రంలోని నాడియర్‌లో 1875, అక్టోబర్‌ 31న జవేరి భాయ్‌, లోద్‌భాయి దంపతులకు వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా ఇంగ్లండు లో బారిస్టర్‌ పట్టా పొంది స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ మంచి బారిస్టర్‌గా పేరును, ధనాన్ని సంపాదించారు. ఆనాడు దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణాన 1917లో ఖౌడా జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులను భూమి శిస్తు కట్టాల్సిందేనని ప్రభుత్వం వేధిస్తుండటంతో గాంధీజీ నేతృత్వంలో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ రైతులకు మద్దతుగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ప్రభుత్వమే రైతులకు సాయమందించేలా చేశారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిస్థాయిలో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక 1928లో బార్టోలీలో ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్‌ ఉద్యమాన్ని చేపట్టి గ్రామగ్రామాన పర్యటించి ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించి వారిలో నైతిక బలాన్ని పెంపొందించటంలో వారందరూ కలిసి కట్టుగా క్రమశిక్షణతో అహింసాయుతంగా వ్యవహరించి చేసిన న్యాయమైన పోరాటం దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి సంసిద్ధత తెలుపడంతో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ యావత్‌ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. జాతి యావత్తూ ఒక మహానేతగా గుర్తించి ‘సర్దార్‌’ అనే బిరుదుతో శ్లాఘించింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టయిన తొలి నేత సర్దార్‌ పటేల్‌. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించారు. ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి అనేకమార్లు జైలు శిక్ష అనుభవించారు. 1946 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ఏర్పడిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో సర్దార్‌ హోం, సమాచార ప్రసార శాఖల మంత్రి అయ్యారు. 1947, ఆగస్టు 15న భారత సంపూర్ణ స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉప ప్రధానిగా 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించే వరకు ఆ పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు. నెహ్రూ మంత్రి మండలిలో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించారు. దేశవిభజన అనంతరం చిన్న చిన్న సంస్థానాలు వాటిని పాలిస్తున్న రాజులు, నవాబ్‌లు స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తుండటంతో అనేక మర్గాల ద్వారా 550 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. బలవంతపు విలీనం ప్రధాని నెహ్రూకు ఇష్టం లేకపోయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా నెహ్రూ యూరప్‌ పర్యటనలో ఉండగా తనకున్న అధికారంతో లక్షద్వీప్‌ దీవులను, గుజరాత్‌లోని జునాగఢ్‌ ప్రాంతాన్ని, హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత భూభాగంలో కలిపిన మహనీయుడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌. నిజానికి 16 రాష్ర్టాల ప్రతినిధుల్లో 13 రాష్ర్టాల ప్రతినిధులు ప్రధాని పదవికి పటేల్‌ పేరును ప్రతిపాదించినప్పటికీ ప్రధాని కావాలన్న నెహ్రూ ఆలోచనను గాంధీ ద్వారా అర్థం చేసుకుని పోటీ నుంచి తప్పుకున్న గొప్ప వ్యక్తి సర్దార్‌. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
– కడియాల సాంబశివరావు
(నేడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్వేతను మళ్లీ బతకనివ్వండి.

శ్వేతను మళ్లీ బతకనివ్వండి.
ఒకప్పుడు నేషనల్‌ అవార్డు విన్నర్‌, తెలుగులో ప్రముఖ హీరోయిన్‌ అయిన శ్వేతబసు ప్రసాద్‌.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు శ్వేత ఎలా ఉంది? ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, ఉద్వేగాలు ఎలా ఉన్నాయి? కెరీర్‌ను మళ్లీ మొదలు పెడుతుందా? వంటివన్నీ ఆ హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌కు తెలుసు. ఆ విశేషాలే ఇవి..

‘‘శ్వేతను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. ఒక మహిళ తప్పు చేసినప్పుడు ప్రపంచం ఎన్నో మాటలు మాట్లాడుతుంది. అలాగే శ్వేతను గురించీ మాట్లాడింది. కాని నేను చూసిన శ్వేత వేరు. ఆ అమ్మాయిది ఊహించనంత మంచి వ్యక్తిత్వం. తను నా వద్దకు వచ్చిన తర్వాత
ఒక్క అబద్దమైనా చెప్పలేదు. అన్నీ నిజాలే చెప్పింది. చాలా కాన్ఫిడెంట్‌గాను కనిపించింది. నా దగ్గరకు ప్రతినెల వ్యభిచారం కేసుల్లో పట్టుబడిన వాళ్లు దాదాపు 65 మంది దాకా వస్తారు.
వారిలో ఎక్కువ మంది రకరకాల ఫిర్యాదులు చేస్తారు. గొడవలు పెట్టుకుంటారు. అందర్నీ బూతులు తిడతారు. ఈ హోం నుంచి ఎప్పుడెప్పుడు బయట పడతామని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు, అయితే శ్వేత అలాంటివేమీ చేయలేదు. వచ్చిన వెంటనే అన్నీ చాలా సహజంగా చెప్పింది. ‘‘మేడమ్‌ నాకు నాటక ప్రదర్శన మీద పట్టుంది. సితార్‌ వాయించడం బాగా వచ్చు. మంచి ఇంగ్లీషు నేర్పించగలను. ఫోటోగ్రఫీ స్కిల్స్‌కూడా నాకున్నాయి. నా నైపుణ్యాలతో నేను ఎలాంటి సర్వీసు చేయగలనో మీరే చెప్పండి’’ అంది. నేను ఆశ్చర్యపోయాను. శ్వేత ఒక హీరోయిన్‌గానే మనకు తెలుసు. ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలున్నాయన్నాయంటే ఆశ్చర్యకలిగింది. తెలిసో తెలియకో తప్పు చేశాను. దానిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే తాపత్రయం ఆమెలో కనిపించింది..
ఇంగ్లీషు పాఠాలు చెప్పింది..
ప్రజ్వలహోంలో ఉన్నంత కాలం – ఇక్కడ ఆశ్రయం పొందుతున్న పిల్లలందరికీ ఆంగ్ల పాఠాలు నేర్పించింది . నాటకాలలో తర్ఫీదును ఇచ్చింది. పిల్లల చేత నాటక ప్రదర్శనలు కూడా చేయించింది . ఽథియేటర్‌ఆర్ట్స్‌లో శ్వేతకు మంచి పట్టుంది. ఇవన్నీ చూశాక – ఆమెను బయటి ప్రపంచం అసభ్యంగా మాట్లాడుతుంటే విని బాధపడ్డాను. శ్వేత ఒక మంచి హ్యూమన్‌బీయింగ్‌. ఆమె తరఫు నుంచి నేను చేసే విజ్ఞప్తి ఒకటే..
శ్వేతను పదే పదే ఆ కోణం నుంచే చూస్తూ.. బాధపెట్టకండి. ఆమె తిరిగి కొత్త జీవితం మొదలు పెట్టేందుకు తోడ్పాటు నివ్వండి. మీ నైతిక మద్దతు ఆమెకు అవసరం.
ఏ దారీ కనిపించనప్పుడు..
నా దృష్టిలో శ్వేత ఒక బాధితురాలు. వ్యభిచారం చేయడానికి పేదరికం ఒక్కటే కారణం కాదు. జీవితంలో ఊహించని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఏ దారీ కనిపించకుండా ఉన్నప్పుడు.. ఈ దారికి వెళతారు. ఎవరో ప్రేరేపిస్తారు. ఆ సమయంలో సంఘర్షణలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. మానసికమైన అనివార్యత ఏర్పడినప్పుడు తప్పులు జరగడం సహజం. ఒక సంఘటన వెనక ఇటువంటి కారణాలను సమాజం అర్థం చేసుకోదు. ఇదిగో ఇలా బయట పడినప్పుడు మాత్రం నిందించడం మొదలుపెడతారు. ఇవన్నీ పక్కన పెడితే – మా హోమ్‌కు వచ్చినప్పుడు తను ఎలా ట్రాప్‌ అయ్యిందో తెలుసుకుంది శ్వేత. ఆమెను మా హోంలో పెట్టుకున్నందుకు నేను ఎక్కడికిపోయినా మీడియా నా వెంట కూడా పడింది. ఇది బాధాకరవిషయం.
ఆమె ఒక్కరే కనిపించారా..
ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ కేసులో శ్వేత ఒక్కరే బాధితురాలు ఎందుకయింది ? ఆమెతో ఉన్న మగవాళ్ల పేర్లు ఎందుకు బయటకు రాలేదు ఇది కుట్ర అనిపిస్తుంది. వ్యభిచారం చేయాలంటే.. అక్కడ ఒక ఆడది మాత్రమే ఉండదు. అక్కడొక మగవాడు కూడా ఉంటాడు అని మరిచిపోకూడదు. శ్వేత వెనకున్న ఆ మగవాళ్ల మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్‌ చేయడం లేదు. ఆ వార్తల్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఆ బ్రోకర్ల మీద ఎందుకు దర్యాప్తు చేయరు? ఇలాంటి ప్రశ్నలను అందరు ఆలోచించాలి.
సానుభూతి అక్కర్లేదు…
భవిష్యత్తులో కెరీర్‌లో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆమె అద్భుతమైన నటి. హీరోయిన్‌గానే కాకుండా బోలెడన్ని డాక్యుమెంటరీలు తీసిన ఫిల్మ్‌మేకర్‌. ఆ నైపుణ్యాలు చాలు.. మరొకసారి జీవితంలో నిలబడటానికి. ఆమెకు మరొక ఛాన్స్‌ ఇవ్వాలి. అది మనందరి బాధ్యత. అయితే ఈ కేసులో ఇరుక్కున్న శ్వేతకు సానుభూతితో అవకాశాలు ఇవ్వడం కాదు. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి.. వాటికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ కోణంలో ఆమె పట్ల ప్రత్యేకశ్రద్ధ అక్కర్లేదు. ఒక్కడొక సంగతి చెప్పాలి – ఒక రోజున ఒక పెద్ద వ్యక్తి నాకు ఫోన్‌ చేసి.. ‘‘శ్వేత మీ దగ్గర ఉందని తెలిసింది. ఆమెకు సహాయం చేయాలనుంది? కలవొచ్చా’’ అని అడిగాడు. అప్పుడు ఆయనతో నేను అన్నాను.. ‘‘సార్‌ మీరు శ్వేతకు మాత్రమే హెల్ప్‌ చేయడం కాదు. మా దగ్గర అలాంటి అమ్మాయిలే మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లకు కూడా హెల్ప్‌ చేయండి’’ అన్నాను. ఆప్పుడు ఆయన నుంచి సమాధానం లేదు. ఇటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి.
కెరీర్‌ మొదలుపెడుతుంది..
శ్వేత ఇక్కడి నుంచి వెళ్లే ముందు – ఎమోషనల్‌గా ఉంది. ఈ రెండు మాసాలలో ఎంతోమందితో తనకు స్నేహం ఏర్పడింది. పిల్లలతో బంధం అల్లుకుంది. ఆమె వెళ్లేప్పుడు పిల్లలందరు ఎంతో ఆప్యాయతతో ఒక పెద్ద గ్రీటింగ్‌ కార్డును బహుమతిగా ఇచ్చారు. వెళుతూ వెళుతూ శ్వేత ‘‘ఈ సంస్థకు నా వంతు ఎంత వరకు అయితే అంత వరకు సహాయం చేస్తాను’’ అంది. గతంలో మోహన్‌బాబు కొడుకు విష్ణు మంచు నా వద్దకు వచ్చి ‘‘మేడమ్‌, మీరు ఎప్పుడైనా చెప్పండి. నేను ఆ అమ్మాయికి కెరీర్‌ ఇస్తాను. మంచి రోల్‌తో మళ్లీ ఇండసీ్ట్రలోకి తీసుకొద్దాం’’ అని హామీ ఇచ్చాడు. అన్నీ ఆలోచిస్తున్నాను. శ్వేత కెరీర్‌ కోసం నా వంతు కృషి చేస్తున్నాను..’’                                                                                         -చందు తులసి, ఏబీఎన్‌ ప్రతినిధి, హైదరాబాద్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నదికి వందనం -చాగంటి

నదికి వందనం

కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను. నేను గంగా స్నానానికి వెళ్లాలనుకున్నాననుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకు వెళ్లాలి. గోదావరి స్నానం చేయకుండా నేను కాశీ పట్టణానికి వెళ్లకూడదు. నేను మొన్న కాశీ పట్టణం వెళ్లినపుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్లాను. ఎందుకని? 
మీ పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మీకన్నం పెడుతోంది. ఆ నది వల్ల నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అంశం.
మీరెప్పుడైనా నది ఒడ్డులో వెళుతుంటే ఆ నదీ ప్రవాహంలో ఉండే విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైన శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెళుతుంది. ఆ వెడుతున్నపుడు అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే నది చంద్రుని యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికా లక్షణం ఉంది. చంద్ర కిరణాలు పడతాయి. అవి అమృతతుల్యం. ఆ అమృతధార వల్ల నీరు శక్తిని పొంది ఉంటుంది. ఆ నీటిలో అభిముఖంగా నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లే వాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణాల వల్ల. కలిగి మీకు శారీరకమైన ఆనారోగ్యం కలగకుండా, ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇంకనూ చంద్రస్పర్శ కలిగింది కాబట్టి, సోముడు, మనస్సుచ మనస్సు సాత్త్వికమై, పరమేశ్వరారాధనయందు సాత్త్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ రెండు సాఽధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తిక మాసంలో తప్పకుండా నదీస్నానం చేయండి అని శాస్త్రం విధించడానికి కారణమిది.
ఎలా చేయాలి?
కార్తిక మాసంలో నదీస్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించరు. నదీస్నానం చేసేటపుడు ఒంటిమీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటపుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. నేను స్నానం చేసేటపుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం తప్పకుండా ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి, పూజ చేస్తున్నాను, ఈశ్వరునికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటపుడు ఏ పేరెత్తితే నీ పాపనాశనం అవుతుందో అది నీతో పలికిస్తాడు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైలం పేరు పలికిస్తారు. శీశైలస్య, ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నందుల మధ్యలో ఉన్నానో చెప్పిస్తాడు. గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్యదేశస్థే అని చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నీవు నిలబడి ( నదికి కాలం, దేశం గొప్పవని మీకు మొదటే మనవి చేశాను) దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తిక మాసంలో సంకల్పంతో నదీస్నానం చేస్తే, అది నిన్ను రక్షిస్తుంది. ఆ నదియందు స్నానం చేసి వెళ్లిపోవడం కాదు. నదీ స్నానం చేసేవాడు తప్పకుండా బయట నుంచి పుణ్యకర్మాచరణ చేయాలి. అంటే ఓ దానమో, ధర్మమో ఏదో ఒకటి చేయాలి.
తీర్థస్నానం అంటే అర్థమేమిటి? 
తీర్థయాత్ర అన్నమాటకు అర్థమేమిటంటే, స్నానం వల్ల పుణ్యమును మూటకట్టుకోవటం, ఈశ్వర దర్శనం చేత కాదు. యథార్థమునకు స్నానం చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానది ఉందనుకోండి. అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తూ ఉన్నా, మణికర్ణిక మహా అద్భుతమైన తీర్థం. వేంకటాచల పర్వతం నందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్నమాట ఎందుకొచ్చిందంటే, అంగీరస అన్న మహర్షులు, ఆయా తీర్థములందు ప్రత్యేకమైన యజ్ఞయాగాదులు క్రతువులు చేసి వాళ్లు ఊర్థ్వలోకాలకు వెళ్లిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం. ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వారికి ఈ యజ్ఞం చేసిన ఫలితం కలుగుగాక! అందుకని వెళ్లి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ల ఖాతాలో వీళ్లు యజ్ఞం చేశారు అని వేస్తాడు. అంటే సోమయాజి అవుతాడు. తేలికమార్గం ఏది అంటే తీర్థయాత్ర స్నానమే! అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండీ అంటారు. కానీ కళ్లతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగిన మహాపురుషులను తీర్థ స్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్లండి అని ఎందుకంటారంటే, నదీ స్నానానికి వెళ్లిన తర్వాత నువ్వు తీర్థ స్నానం కూడా చేస్తావు తప్పకుండా! కాబట్టి ఆ తీర్థ స్నానం చేత అందునా ఆ దక్షిణాయనంలో అప్పుడు చేయవలిసిన పని కాబట్టి. విశేషంగా ఇటువంటివి చేయగలుగుతావు. అందులోనూ కలియుగంలో ఉండే లక్షణమేమిటండీ అంటే 
అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సకర్మము లెవ్వియుఁజేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.

(భాగవతం 1- 44) అంటారు భాగవతంలో.
 – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం ఉపనిషత్‌ సిద్ధాంతంలో చెప్పినది.
మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటనే ప్రశ్నకు మన పరంపరలో నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా నడవడానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు ( ఇవి కూడా ధర్మానికి లోబడి ఉండాలి). మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి, మనిషి తన స్వరూపమే బ్రహ్మస్వరూపమని తెలుసుకోవడం. కులం, మతం, వర్ణం, ఆశ్రమం మొదలైన అన్ని రకాల సమాజ నిబంధనలకీ అతీతుడై భగవంతుడెలా అన్నింటికీ అతీతుడో అలా వ్యవహరించడం.
మొదటి మూడూ సమాజవ్యవహారం సరిగా నడవడానికి కావల్సిన విషయాలు. వ్యవహారదశ (empirical level)అని అంటారు. నాల్గవదైన మోక్షం ఈ వ్యవహారదశను దాటి వెళ్లేది. వేదవిచారం వల్ల కలిగిన జ్ఞానం, దానివల్ల వ్యక్తి ప్రవర్తనలో దృష్టికోణంలో వచ్చిన మార్పు, మనిషే భగవంతుడుగా వ్యవహరించడం. దీన్ని పరమార్థదశ (absolute level) అంటారు. ఉపనిషత్తులు ఒకవైపు శాసీ్త్రయంగా విచారం (ఞఠజీటడ) చేస్తూ మరొక వైపు సమాజానికి అవసరమైన విశ్వాసాల్ని కొన్నింటిని సమర్థిస్తూ ముందుకు సాగుతుందని ఇదివరలో చూశాం. స్వర్గం అనేది ఇలాంటి విశ్వాసమే. ఇది అన్ని మతాల్లో చెప్పబడిందే. కొన్ని మంచి పనులు చేసి ఈ లోకంలో ఎలా సుఖశాంతులు సంపాదిస్తామో అలాగే మరొక విధమైన మంచిపనులు (కర్మలు) చేసి స్వర్గాన్ని సంపాదించవచ్చని అన్నిమతాలూ చెబుతాయి.
భారతంలో (వనపర్వంలో) ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కథ ఉంది. ఆ రాజు కొన్ని లక్షలకొలదీ యాగాలు చేసి వాటి ఫలితంగా చాలా ఏండ్లు స్వర్గంలో గడిపిన తర్వాత దేవతలు ఒకనాడు ఆయన పుణ్యంఫలం ముగిసిందని లెక్కవేసి, అతడిని భూలోకానికి పంపడానికి ప్రయత్నించారు. తన పుణ్యం బ్యాలెన్స్‌ ఇంకా ఉందని ఆయన వాదం. భూలోకంలో ఎంతకాలం ఒక మనిషి కీర్తి ఉంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చని ఒక నియమం. అందువల్ల భూమిపై ఇంకా ఆ రాజు కీర్తి ఉందా లేదా అని పరీక్షించాల్సి వచ్చింది. ఆ రాజుతో పాటు ఇద్దరు దేవతలు కూడా భూలోకానికి వచ్చారు. లోకంలో ఉన్న చిరంజీవుల్ని అందరినీ విచారించారు. అందరికంటే చిరంజీవి అయిన ఒక తాబేలు ఒకానొక కొలనులో ఉందని తెలిసింది. ఆ తాబేలును విచారించగా అది రాజును గుర్తించి ఎంతో గద్గద స్వరంతో చెప్పింది. ‘ ఈ మహానుభావుడు ఎన్నో యాగాలు చేసి లక్షల గోవుల్ని దానం చేశాడు. ఆ గోవుల తొక్కిళ్లతోనూ, దానజలంతోనూ ఈ సరస్సు ఏర్పడింది. ఇది నాకు నివాసమయ్యింది.’ అని చెప్పింది. వెంటనే దివ్యరథం రావడం, రాజు మళ్లీ స్వర్గానికి వెళ్లడం అనేది కథ.
దీనర్థం ఏమిటంటే, స్వర్గం కొన్ని మంచిపనులు చేయడం వల్ల సాధింపబడేది. ఆ మంచి పనులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం స్వర్గసుఖాలు ఉంటాయి. వీటిలో గొప్పదనం ఏమీ లేదు. ఇక్కడికన్నా ఎక్కువ సుఖాలు, మంచి భోజనం, డ్యాన్సులు వగైరా సమాజంలో తన కర్తవ్యాన్ని (ధర్మాన్ని) తాను చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తాయని మతం స్థాయిలో ఉన్న విశ్వాసం. ఏది ఏమైనా, పుణ్యం కాస్తా అయిపోయాక వీసా అయిపోయిన వాడిలాగే స్వర్గం నుండి వెనక్కి రావాలి. అందువల్ల స్వర్గం కూడా కామం అనే హెడ్డింగ్‌ క్రిందకు వస్తుంది.
మోక్షం దీనికి పూర్తిగా బిన్నమైనది. ఇది కామం (కోరిక) కాదు. దీనిలో ఎక్కడా దేన్నీ పొందడం అనేది లేదు. వెళ్లడం అనేది లేదు. ఎక్కడో పెళ్లి సుఖాలు పొందేది లేదు. ఉన్నచోటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని అన్ని రకాల కట్టుబాట్లనుండి, బంధాలనుండి, మనస్సులో నిర్మించుకున్న అడ్డుగోడల నుండి బయటకు వచ్చి ఉండడం. కట్టుబాట్లు లేవంటే ఎలాంటి నియమాలూ లేకుండా ఇష్టం వచ్చి వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడని అర్థం కాదు. భగవంతునికి ఎలాగైతే రాగద్వేషాలూ, ఈర్ష్య, అసూయలు, కోరికలు మొదలైనవి లేవో తనూ అలాంటి దశకు రావడానికై చాలా కాలంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేసి మనస్సును ఎంతో పవిత్రం చేసుకున్నట్టి స్థితి అది. ఇలాంటి పవిత్రమైన మనస్సు ఉన్న వ్యక్తి అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అందరిలోనూ దేవుణ్ని దర్శిస్తూ ఉంటాడు. అందరినీ ప్రేమిస్తూంటాడు. సమాజ నియమాల్ని పాటిస్తూంటాడు.
ఈనాటి మాటల్లో దీన్నిenlightenment అంటాం. అంటే మనిషి తను ఫలానా జాతి, కులానికి చెందినవాడ్ని, ఇంత గొప్పవాడ్ని, ఇంత మేధావిని అనే బరువులన్నీ వదిలేసి లైట్‌గా, అంటే బరువులు తగ్గించుకుని ఉండడం.
మోక్షం కేవలం పుస్తకజ్ఞానం వల్ల కలిగేది కాదు. వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం వల్లనే మనస్సులో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. దీన్ని వేదాంత భాషలో చిత్తశుద్ధి అంటారు. ఆ స్థితిలో మనిషి తన స్వరూపాన్ని గూర్చి, భగవంతుడి గూర్చి ఉపనిషత్తులు చెప్పిన విషయాల్ని గురువు దగ్గర తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని మననం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోవడం ముఖ్యమైనవి. తనతో పాటు ప్రపంచాన్నంతా కేవలం బ్రహ్మస్వరూపంగా చూడడం, తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అందరినీ అలాగే చూడడం సహజంగా వస్తుంది. దీన్ని గీత ఆరవ అధ్యాయంలో ‘ఆత్మౌపమ్యం’ అనే మాటతో శ్రీకృష్ణుడు చెబుతాడు.
మనిషి ఏదో స్వార్థంతో పొందేది కాదు మోక్షం. స్వార్థం నుండి బయటపడడం, చివరకు తన ఐడెంటిటీని కూడా కోల్పోవడం మోక్షం లక్షణం.
స్వర్గం అనే మాటను రిలిజియన్‌ స్థాయిలో (అనగా తాత్కాలిక స్థాయిలో) వేదాంతం అంగీకరిస్తుంది. చిన్నపిల్లల్ని బడికి పండానికి తల్లి ఎలా లాలిపాప్‌ ఇచ్చి పంపుతుందో, అలాగే సమాజంలో మనిషిని మంచి మార్గంలో పెట్డడానికి స్వర్గమనే లాలిపాప్‌ ఉందని భాగవతం చెబుతుంది. స్కూలుకు వెళ్లి చదువుపై శ్రద్ధ మొదలైన తర్వాత లాలిపాప్‌పై శ్రద్ధ ఎలా తొలగిపోతుందో అలాగే జ్ఞానమార్గంలో వచ్చినవాడికి స్వర్గంపై కోరిక తొలగిపోతుంది. దీనివల్ల ముఖ్యంగా మనం గమనించేదేమంటే స్వర్గమనేది కొన్ని కర్మ (మంచిపనుల)ల వల్ల పొందబడేది. కానీ, మనిషి స్వార్థం సమసిపోలేదు. స్వార్థం పూర్తిగా సమసిపోయి సమాజానికి హితమైన పనుల్ని చేస్తూ జ్ఞానమార్గంలోన ఉన్నవాడు పై చెప్పిన మోక్షమనే స్థాయికి వస్తాడు.

స్వర్గం, మోక్షం అనే ఈ రెండు పదాలకూ తేడా తెలుసుకున్న తర్వాత మనం మరికొంతగా కర్మయోగం గూర్చి తెలుసుకోగలం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

79- ప్రాకృత కావ్య కవి రాజు  -వాక్పతి రాజు

వాక్పతి రాజు  భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు ఇందులో 1209 గాధలున్నాయి .ఇందులో యశో వర్మ జీవిత వృత్తాంతం కూడా ఉంది .అసంపూర్ణ కావ్యం .యశోవర్మ కాశ్మీర రాజు లలితా దిత్యుని చేతిలో733లో  ఓడిపోయాడు .కనుక వాక్పతి రాజు కావ్యం740లో రాసి ఉంటాడని భావన.

వాక్పతి కవితా రాజం

ఈ కావ్యం లో యశోవర్మ గౌడ రాజును జయించే కదఉంది అందుకే ‘’గౌడ వధ .’’(గౌడ వహో)అని సముచితమైన పేరు పెట్టాడు .చరిత్రకంటే కావ్య లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి .గౌడ వధ తో బాటు రాజు దిగ్విజయాలూ ఉన్నాయి .శ్లేష చమత్కారాలు తక్కువగా సుందరమైన శైలిలో రాశాడు . .

80-నవ సాహసాంక చరిత్ర కర్త-పరిమళ పద్మ గుప్తుడు

కాళిదాసమహా కవి మీద గౌరవం తో ‘’పరిమళ కాళిదాసు ‘’అనే బిరుదుపొండాడు పరిమళ గుప్తుడు .దారానగర రాజు సాహసాంక అనే బిరుదు పొందిన సింధురాజు ఆస్థానకవిగా ఉన్నాడు పద్మ గుప్తుడు .,కవిపండితపోషకుడురెండవ వాక్పరి రాజు   తమ్ముడే సింధురాజు .భోజ రాజు తండ్రి  .సింధు కూడా కవిపండిత పోషకుడు .వాక్పతి కర్నాటక రాజు   తైల పుడి చేతిలో మరణించాడు ,సింధురాజు  రాజయ్యాడు  .పద్మ గుప్తుడి తండ్రి మృగాంక గుప్తుడు .సింధురాజు ప్రోత్సాహం తో ఈకావ్యం రాశాడు .ఇతని తర్వాత  ముంజ రాజు ఆ తర్వాత భోజుడు రాజులయ్యారు .ఈ ఇద్దరి ఆస్థానాల్లోనుపద్మ గుప్తుడు  కవి .భోజుడు ఎక్కడా ఇతని విషయం ప్రస్తావించ లేదు .కనుక పద్మ గుప్తుడు పదవ శతాబ్దం చివరినుండి పదకొండవ శతాబ్దం లోపు వాడు .గుప్తుడు కాశ్మీర దేశపు శైవుడు .

గుప్తుని కవితా పద్మ పరిమళం

‘’నవ సాహసాంకచరిత్ర’’  పద్దెనిమిది సర్గల కావ్యం .క్షేమేంద్రుడు ఇతని శ్లోకాలను ఉదాహరించాడు. ఇందులో సింధురాజు నాగ రాజు కూతురు శశిప్రభను పెళ్లి చేసుకోవటం ఇతి వృత్తం .వజ్రాం కుడు అనే నాగుల శత్రువును చంపి ,వాడి సరస్సులో ఉన్న బంగారు కమలం తెచ్చి నాగ రాజుకిచ్చి  అతని కూతురు శశిప్రభను పెల్లాడతాడు  .రమ్యమైన శైలిలో కావ్యం నడిపాడు .అనుప్రాసలతో కవిత్వం పారించాడు  ఓజోగుణశైలి ఎక్కువ .సహజ వర్ణనలు చేశాడు. అలంకార పుష్టిని కావ్యానికి చేకూర్చాడు .తన అభిమాన కవి మహా కవి కాళిదాసు ను అన్నిటా అనుకరించాడు అనుసరించాడు .

సింధురాజు పరమార వంశానికి చెందిన వాడు .క్షత్రియులని ,బ్రహ్మ క్షాత్ర కులం వారమని చెప్పుకొన్నారు. పదకొండవ సర్గ లో పర మార వంశ చరిత్ర చెప్పాడు .విశ్వా మిత్రుడు వసిస్టూడి కామ ధేనువును ఎత్తుకు పోగా అరుంధతి దేవి మొదలైన రుషిపత్నులు తీవ్రం గా విచారించారు ,వసిస్టమహర్షి యజ్ఞం చేస్తాడు అందులో నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భ వించి విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామ ధేనువు తెచ్చి ఇస్తాడు .ఆ పురుషుడికి ‘’పరమారుడు ‘’అనే పేరుపెట్టాడు వసిస్స్టూడు .అతని నుంచి పరమార వంశం ఏర్పడింది .శాసనాలలో దీన్నే రాసుకొన్నారు .

పదవ సర్గ లో సింధు రాజు వాగడ ,మురళ,లాబా ,హూణదేశాలను జయించి నట్లు రాశాడు ఇవన్నీ చారిత్రిక సత్యాలే .విద్యాధరుల సాయం తో సింధురాజు వజ్రామ్కశ రాజును జయించి నాగరాజు కూతురు శశి ప్రభను వివాహం చేసుకోవటం చారిత్రిక సత్యమే అన్నారు .వజ్రాంకుడి రాజ దాని  రాత్నావతి నర్మదానది కి దక్షిణాన ఉంది .వీరు జీమూత వాహనుడినితమ వంశ మూల పురుషుడిగా చెప్పుకొంటారు .బహుశా వీరి రాజ్యం కొంకనణ ప్రాంతం అయి ఉండాలి .

81-‘’శివాజీ చరిత్ర రాసిన -అంబికా దత్త వ్యాసుడు

1850-1900వాడిన అంబికాదత్తుడు ‘’శివ రాజ విజయం ‘’కావ్యం రాశాడు .కాశీ వాసి ఇందులో శివాజీ మహా రాజు చరిత ఉంది .శివాజీ జీవితం లోని ముఖ్య ఘటనలన్నీ ఉన్నాయి కల్పననలూ బాగానే చేశాడు

అంబికా దత్తీయం

స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే మహోత్క్రుస్ట ఉద్దేశ్యం తో ఛత్రపతి శివాజీ మహారాజు సమర్ధ రామ దాస స్వామి ఆశీర్వాద ప్రోత్సాహాలతో నిర్ణయించుకొని మహమ్మదీయ అత్యాచారాలను నిర్మూలనం చేసి సాధిస్తాడు కొద్దిమంది ససైనిక పరివారం తో జైత్ర యాత్ర ప్రారంభిస్తాడు . బీజ పూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ అనే సైన్యాదికారిని శివాజీ మీదకు పంపిస్తాడు .బుద్ధి బలం తో అతడిని శివాజీ మట్టుపెడతాడు .తర్వాత సయిస్తఖాన్ ను జయించి చంపి సూరత్ జయించి మహా రాష్ట్ర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు ,కొన్ని కల్పిత పాత్రలూ ఇందులో ఉన్నాయి .ఎక్కడా అసహజత్వం లేకుండా రాశాడు .దండి  బాణులను అనుకరించాడు. అవసరమైన అలంకారాలు వాడాడు .పాత్రోచిత భాష తో అలరించాడు .ప్రతి పాత్రా సజీవం గా కన్పిస్తుంది .శివాజీ శీల ఉత్క్రుస్టతను మనోహరం గా చిత్రించాడు .

శివాజీ మహారాజులో ఉన్న దేశ భక్తీ శౌర్య పరాక్రమాలు ,దానం ధర్మ మార్గా నుసరణం  నిర్భయం స్వాభిమానం ఆత్మ గౌరవం స్త్రీలయెడ ఉన్న గౌరవ సమ్మానం చరిత్ర లో ఎక్కడా చూడం .అన్నిటినీ సహజ సుందరం గా వర్ణించాడు .సాంఘిక రాజకీయ విషయాలను ఉత్క్రుస్టంగా చిత్రించాడు .అన్ని రకాల వర్ణనలు చేశాడు .శివాజీని ఆదర్శ మూర్తిగా వీరునిగా మహా దీరునిగా దేశ భక్తీ ప్రబోధకునిగా మహత్తరం గా చిత్రీకరించి మెప్పుపొందాడు అంబికా దత్తుడు .చారిత్రక ఇతి వృత్తానికి గొప్ప కావ్య గౌరవం కలిగించాడు .ఆధునిక కాలం లో కూడా ఇంతటి ఉత్కృష్ట సంస్కృత కావ్య రచనలు చేసేవారున్నారని అంబికా దత్తుడు నిరూపించి మార్గ దర్శనం చేశాడు

82-నల చంపువు రాసిన –త్రివిక్రమ భట్టు

నల చంపువు రాసిన త్రివిక్రమ భట్టు పదవ  శతాబ్ది కవి .తండ్రి దేవా(నేమా)దిత్యుడు తాత శ్రీధరుడు భోజుడు త్రిక్రముడిని ఉదాహరించాడు .మాన్య  ఖేటాధిపతి  అయిన మూడవ ఇంద్రుడు అనే రాష్ట్రకూట రాజు ఆస్థాన కవిగా ఉన్నాడు .

భట్టు కవితా త్రివిక్రమం

భట్టు తండ్రి నేమాదిత్యుడు రాజాస్థాన పండితుడు .భట్టు చదువు వదిలేసి తిరుగు బోతుగా ఉండేవాడు .తండ్రి ప్రక్క ఊరు వెళ్ళినప్పుడు రాజాస్థానానికి శాస్త్ర వాదం చేయటానికి ఒక పండితుడు వచ్చాడట .రాజు ఇంటికి కబురు చేశాడు ఏమి చేయాలో తోచని త్రివిక్రముడు సరస్వతీదేవిని  ప్రార్దిం చాడట ..అతని తండ్రి తిరిగి వచ్చేదాకా తానూ భట్టు నాలుక మీద ఉంటానని వాణివాగ్దానం చేసి అలానే చేసింది .అమ్మ బలం తో శాస్త్రవాదానికి వచ్చిన పండితుడిని తానె ఓడించి రాజ సత్కారం పొందాడు .సరాసరి ఇంటికి వచ్చి ‘’నల చంపువు ‘’రాయటం ప్రారంభించాడు .ఏడవ ఉచ్చ్వాసం పూర్తీ అయ్యేసరికి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు .సరస్వతి ఇచ్చిన మాటప్రకారం నాలుకమీద నుంచి వై దోలగింది .తర్వాత కావ్యాన్ని పూర్తీ చేయలేక పోయాడట .అని కద ప్రచారం లో ఉంది  ,

,  భారతం లోని అరణ్య పర్వ కద.అందరికీ తెలిసిందే .నలుడు హంసను చూసి పట్టుకోవటం దానితో సంభాషించటం  ,అది దమయంతికి నలునిపై ప్రేమ ఉందని చెప్పటం .దమయంతి  వృత్తాంతం అంతా వివరంగా రాశాడు .హంస దమయంతిని చేరి నలుని ప్రేమ విషయం తెలియ జేయటం ,దమయంతీ స్వయం వరం దిక్పాలకుల తరఫు రాయబారం దమయంతీ విరహం తో నలుడు పడే బాధ .త్రివిక్రముడు చంపు వును ఆధారం గా చేసుకొనే శ్రీ హర్షుడు నైషద కావ్యం రాశాడంటారు .ఇందులోని భాగాలను ఉచ్చ్వాసాలు అని పేరుపెట్టాడు ప్రతి ఉచ్చ్వాసం చివర్లో ‘’హర చరణ సరోజ ‘’అనే పదాన్ని వాడాడు .ఈ చంపూకావ్యానికి చాలా టీకలున్నాయి .కనుక అందరిని అలరించిన కావ్యం అనుకోవచ్చు .త్రివిక్రముని బాటలో హర్షుడు లక్ష్మీధరుడు శ్రీనివాస దీక్షితులు నల దమ యంతుల కావ్యాలు రాశారు ఇందరికి ప్రేరణ నిచ్చినవాడు త్రివిక్రముడు .

త్రివిక్రముడు మదాలస చంపువు కూడా రాశాడు .మార్కండేయ పురాణం లోని ‘’కువలయాశ్వుడు –మదాలస ‘’ల చరిత్ర .కువలయాశ్వుడు పాతాళ కేతువును చంపి మదాలసను పెళ్ళాడటమే ఇతి వృత్తం .బహుశా దీన్నే ముందుగా రాసి ఉంటాడు .అంత పరిపక్వమైణ రచన అనిపించదు .కదా విషయం లో ఉత్క్రుస్టకావ్యం అనిపించుకొన్నది .దీని ఆధారం గా కృష్ణ దేవరాయలు తో సహా చాలామంది మదాలస చరిత్ర కావ్యాలు రాశారు .ఇందరికి స్పూర్తికల్గించాడు .చంపువు అంటే పద్యం తో బాటు గద్యమూ ఉన్న రచన అని మనకు తెలిసిన విషయమే. త్రివిక్రముడు సవ్య సాచిగా రెండిటిని పండించాడు .మధురమైన శైలి ఆకర్షిస్తుంది .సభంగ శ్లేషను బాగా ప్రయోగించాడు .

‘’ఉదయగ్రి గతాయాం ప్రాక్ప్రభా పాండుతాయా –మనుసరతి నిశీదే శ్రుంగా మస్తాచలస్య

జయతి కిమపి తేజః సాంప్రతం వ్యోమ మధ్యే –సలిలమివ విభిన్నం జాహ్నావం యామునం చ ‘’ అంటే –ఉదయ కాంతి ఉదయ గిరి కొండమీద ప్రకాశిస్తోంది .రాత్రి హస్తగిరి శిఖరాల మీద నుంచి జారుతోంది ,.అప్పుడు గంగా యమునా జలాలు కలిసి పోయినట్లు ఒక అలౌకిక తేజస్సు అంతటా ప్రకాశిస్తోంది ‘’అన్నాడు త్రివిక్రముడు .

కవి పద ప్రయోగం లో నిపు ణుడుగా ఉండాలి .కాకపొతే తప్పటడుగులు వేసి అర్ధం కాని బాలుడి మాటల వాడు అంటారు అన్నాడు త్రివిక్రముడు .’’కిం కవేస్తేన కిం కాండేన ధనుష్మతః –పరస్య హృదయే లగ్నం ణ ఘూర్ణ యతి యచ్చిరః ‘’అని మరొక చోట అంటాడు దీని అర్ధం –ప్రయోగించిన పదం ధనుర్ధారి ప్రయోగించిన బాణం హృదయాన్ని తాకి వ్యామోహితుడిని చేయక పొతే లాభం లేదు .ఇదీ త్రివిక్రమ భట్టు కవితా ప్రాభవం .

మరోకవితో మళ్ళీ

సశేషం

మీ-గబ్బిట డుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మధురగాయిని ఏం ఎస్ సుబ్బలక్ష్మి మంచిమనసు – భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు – రామకృష్ణ ప్రభ -నవంబర్

 

bhamidi 001భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు –ms 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి స్వర్గీయ గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు ఆహ్వానం

ramaratnam 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీక పున్నమి

kartika punnami 001 kp2 001 sivavishnu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!!హెబ్బార్ నాగేశ్వరరావు

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!

అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం పది గంటలకు పటేల్ తుది శ్వాస వదిలాడు! సర్దార్ జీవించి ఉండగా చివరి పుట్టినరోజు పండుగ 1950 అక్టోబర్ ముప్పయవ తేదీన జరిగినట్టు ఆయన కుమార్తె మణిబెహిన్ పటేల్ తన డైరీలో వ్రాసుకున్నారు! మణిబెహిన్ దినచర్య పుస్తకంలోని వివరాల మేరకు 1946, 1947, 1948, 1949 సంవత్సరాలలో ముప్పయి ఒకటవ తేదీన జరిగిన ఈ పుట్టిన పండుగ 1950లో ఒక రోజు ముందుగా ఎందుకు జరిగిందో తెలీదు! పటేల్ ప్రధానంగా గుజరాతీ పంచాంగం- విక్రమ శకం- ప్రకారం పుట్టిన పండుగ జరుపుకునేవాడు. ఈ సంగతి మణిబెహిన్ మరోచోట వెల్లడించి ఉన్నారు! అందువల్ల 1950లో ఒక రోజు ముందుగానే ‘జన్మదినం’ వచ్చిందేమో?? కానీ పటేల్ దేశానికి అవసరమైనంతకాలం జీవించలేదు, ముందుగానే మరణించాడు! ఎనబయి ఏళ్లు జీవించడం ‘అద్భు తం’కాదు… పటేల్ డెబ్బయి ఐదు ఏళ్లకే మరణించడం దేశ ప్రజల దురదృష్టం! పటేల్ కనీ సం మరో ఐదు ఏళ్లు జీవించి ఉండి ఉంటే చైనా టిబెట్‌ను దురాక్రమించకుండా భారత ప్రభు త్వం చర్యలు తీసుకొని ఉండేదన్న వాదం ప్రచారంలో ఉంది! టిబెట్ 1949-1959 సంవత్సరాల మధ్య చైనా దురాక్రమించడాన్ని మన దేశం అడ్డుకొని ఉండి ఉంటే……??
1962 సెప్టెంబర్ 8వ తేదీ నుండి చైనా మన దేశంలోకి చొరబడి ఉండేది కాదు, అక్టోబర్ 20నుండి దురాక్రమణను ఆరంభించి ఉండేది కాదు! టిబెట్ స్వతంత్ర దేశంగా మనకూ చైనాకుమధ్య నెలకొని ఉన్నప్పుడు చైనా దళాలు మన సరిహద్దునకు వచ్చే ప్రశే్న లేదు, భారత్ చైనా సరిహద్దు లేదు… భారత్-టిబెట్ సరిహ ద్దు, టిబెట్-చైనా సరిహద్దు మాత్రమే ఉండేది!! కానీ పటేల్ మరో ఐదేళ్లు జీవించి ఉంటే చైనాను నిరోధించడం- టిబెట్‌ను దిగమింగకుండా – సాధ్యమయి ఉండేదా??
తాను మరణించడానికి నెల రోజుల ముందు 1950 నవంబర్‌లో ఉప ప్రధానమంత్రి వల్లభభాయి కమ్యూనిస్టు చైనానుండి మన దేశానికి రానున్న ప్రమాదం గురించి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను అప్రమత్తం చేయయత్నించాడు! ‘‘మన దేశాన్ని నమ్ముకున్న టిబెట్ దేశా న్ని తమ ప్రభుత్వం చైనా దురాక్రమణ బారినుండి కాపాడలేకపోతోందని’’ పటేల్ తన ఉత్తరంలో నెహ్రూకు తెలియజేశాడు. కానీ అప్పటికే జవహర్‌లాల్ టిబెట్‌ను చైనాలో విలీనం చేయడానికి నిర్ధారించి ఉన్నాడు! 1949లో భారత ప్రభుత్వం తరఫున ఆయన చైనాకు వ్రాసిన ఉత్తరం ఇందుకు సాక్ష్యం!! ‘‘టిబెట్‌లో చైనాకు ఎలాంటి ప్రతిఘటన కూడ ఉండబోదు…’’అని ఆ ఉత్తరంలో భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ ‘మైత్రీ లేఖ’కు సమాధానంగా అత్యంత పరుష పదజాలంతో చైనా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని నిందించింది. ‘‘చైనా వాడిన పదజాలం మైత్రిని కోరేవారు ఉపయోగించేది కాదు… ప్రబల శత్రువు వాడే పదజాలమిది…’’అని ఆ సమాధానం గురించి పటేల్ నెహ్రూను హెచ్చరించాడు! పటేల్ ఉత్తరాలకు నెహ్రూ ఇచ్చిన చివరి సమాధానం ‘‘టిబెట్ స్వాతం త్య్రం మరణించింది…’’అని మాత్రమే!! బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ముగిసిన తొలి రోజులలో మన దేశపు అంతర్గత వ్యవహారాలను వల్లభభాయిపటేల్ నిర్వహించాడు. ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడని రీతిలో ఖండిత భారత సమైక్యతను సాధించాడు! జమ్మూకాశ్మీర్ బ్రిటిష్ దురాక్రమణ సమయంలో అర్థ స్వతంత్ర సంస్థానం. ఈ సంస్థానం కూడ 1947 అక్టోబర్ 26న దేశం లో విలీనమైంది! కానీ ఈ అంతర్గత వ్యవహారాన్ని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా నిర్వహించడంవల్ల జమ్మూకాశ్మీర్‌లోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూమి పాకిస్తాన్ అక్రమ అధీనంలో అలమటిస్తోంది! నెహ్రూ నిర్వాకంవల్లనే టిబెట్‌ను చైనా కాజేయగలిగింది… ఈ కాజేసిన ఫలితమే మన లడక్‌లోని చైనా చొరబడి పోవడం! లడక్‌లోని ముప్పయి ఎనిమిది వేల చదరపుకిలోమీటర్ల ప్రాంతం చైనా దురాక్రమణకు గురి అయి ఉంది!! ఇదంతా అక్టోబర్ నెలతో ముడిపడిన వ్యవహారం!!
చైనావల్ల తమ దేశానికి దురాక్రమణ ప్రమాదం ఏర్పడిందని నిరోధించాలని 1949లో టిబెట్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి మొరపెట్టుకుంది! ‘‘జవహర్‌లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదుల వీపుమీద ఎక్కాడు. అతగాడు వారి తొత్తు…’’అని 1949 సెప్టెంబర్ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ అధికార పత్రికలు అభివర్ణించాయి! అతి పెద్ద సోషలిస్టు దేశమైన చైనాకు తన పట్ల కలిగిన ఈ దురభిప్రాయం బహుశా జవహర్‌లాల్ నెహ్రూకు ఆవేదన కలిగించి ఉండవచ్చు… అందువల్లనే ఈ దురభిప్రాయాన్ని దూరంచేసి చైనా మెప్పును పొందడానికి ఆయన ఆ జీవన కృషి సాగించాడు. 1949 నవంబర్ 24న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ‘టిబెట్’ చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా మన ప్రతినిధి చైనా ప్రతినిధివలె ప్రవర్తించడం చరిత్ర… టిబెట్ చైనా లో భాగమన్న వాదాన్ని వినిపించడం ద్వారా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయ చకితనుచేయడం కూడ చరిత్ర!! ఇదం తా చైనా మైత్రికోసం నెహ్రూ చేసిన ‘కృషి’లో భాగం!! ఐక్యరాజ్య సమితిలో మాత్రమే కాదు మన పార్లమెంటులో సైతం నెహ్రూ వినిపించిన వాదం టిబెట్ స్వాతంత్య్ర హనన చరిత్రలో భాగం… 1954 మే నెల 18వ తేదీన నెహ్రూ పార్లమెంటు ఉభయ సభలలో మూడు సుదీర్ఘ ప్రసంగాలు చేశాడు! ఈ ప్రసంగాల సారం టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పే ‘బ్రిటిష్ పాలన’నాటి విధానాన్ని దుయ్యబట్టడం, తప్పు పట్టడం! బ్రిటిష్‌వారు మన దేశాన్ని పాలించిన సమయంలోను, అంతకుముందు దాదాపు రెండువేల ఏళ్లకు పైగా టిబెట్ స్వతంత్ర దేశమన్న చరిత్రను నెహ్రూ గుర్తించలేదు! 1914నాటి సిమ్లా ఒప్పందం ద్వారా చైనా దురాక్రమణనుండి టిబెట్‌ను రక్షించే అధికారం మన దేశానికి సంక్రమించింది! ఈ ఒప్పందంలో భాగంగానే టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పారు, మన తంతి తపాలా కార్యాలయాలను నెలకొల్పారు. ఈ సంస్థలను నెహ్రూ ప్రభుత్వం రద్దుచేసింది! ఇలా రద్దుచేయడం మన భద్రతకు చైనావల్ల ప్రమాదం ఏర్పడుతుందన్న వాదాన్ని నెహ్రూ తన మూడు ప్రసంగాల ద్వారా ‘‘తిప్పికొట్టాడు’’…
‘‘టిబెట్ చైనాలో భాగం, మరో స్వతంత్ర దేశంలో భారతీయ సైనికులు కొనసాగడం ఊహించరాని వ్యవహారం… టిబెట్‌లోని భారతీయ సైనికుల సంఖ్య మూడువందలు మాత్రమే కావచ్చు. కానీ ఈ ‘పటాలాన్ని’ టిబెట్‌లో ఎందుకని మోహరించారు? టిబెట్ స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనా అంతర్భాగం కావచ్చు! కానీ తన సైన్యంలోని ఒక విభాగాన్ని చైనాలో నెలకొల్పే అధికారం భారత్‌కు ఉందా? గతంలో… టిబెట్‌లో భారత సైనిక దళాలను నెలకొల్పిన సంప్రదాయం బ్రిటిష్ సామ్రాజ్యవాద చిహ్నం. ఈ ‘వ్యవస్థ’ను కొనసాగించడం ప్రస్తుతం అసాధ్యం! ‘యాతంగ్’లో కాని ‘జ్ఞాన్‌క్షా’లో కాని భారత సైనికదళాలను నెలకొల్పాలనడం వాస్తవాలకు, విచక్షణకు విరుద్ధమైన అంశం…’’అని 1954 మే 18న నెహ్రూ నిగ్గుతేల్చాడు! ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది’’అని పటేల్‌కు చెప్పడం ద్వారా ఒకప్పుడు టిబెట్ స్వతంత్ర దేశమని నెహ్రూ 1950లో అంగీకరించి ఉన్నాడు! కానీ 1954 నాటి టిబెట్ గతంలో స్వాతంత్య్ర దేశం కావచ్చు లేదా చైనాలో అంతర్భాగం కావచ్చు… అని అంటూ నెహ్రూ చరిత్రను వక్రీకరించాడు! ‘నెహ్రూ విధాన’వాదులు రచించిన చరిత్ర పుస్తకాలను తగులబెట్టాలని భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి అక్టోబర్ ఐదవ తేదీన ఢిల్లీలో జరిగిన ‘ఇతిహాస సంకలన యోజన’ సమితివారి సదస్సులో పిలుపునిచ్చాడు! ఈ పిలుపు చరిత్రలో ‘హేమచంద్ర విక్రమాదిత్యుడు’అన్న స్వదేశీయ సామ్రాట్టు క్రీస్తు శకం 1556నకు పూర్వం నిర్మించిన సామ్రాజ్యాన్ని ‘నెహ్రూవాద’ చరిత్రకారుడు పట్టించుకొనక పోవడంపట్ల నిరసన….కానీ టిబెట్టు స్వాతంత్య్ర చరిత్రను నెహ్రూ స్వయంగా పట్టించుకోలేదు!! 1950లో టిబెట్ స్వాతంత్య్ర పరిరక్షణకు భారత ప్రభుత్వం పూనుకోవాలని కోరిన పటేల్ ఆ తరువాత ఐదేళ్లు అయినా జీవించి ఉండి ఉంటే ఏమయి ఉండేదో…??
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య టిబెట్ స్వతంత్ర దేశం! అందువల్లనే టిబెట్ చైనా తరఫున పోరాడలేదు, బ్రిటిష్‌వారి తరఫున పోరాడలేదు! రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో చైనా, బ్రిటన్‌లు ఒకే జట్టు! జవహర్‌లాల్ నెహ్రూ బృందంవారు ఆ తరువాత భ్రమించినట్టు టిబెట్ చైనాలో భాగమయి ఉండినట్టయితే చైనా ‘బ్రిటన్ అమెరికా రష్యాల కూటమి’లో ఉన్నప్పుడు టిబెట్ తాటస్థ్యం వహించడం కుదరదు!! అతి ప్రాచీన చరిత్రను మరచిపోయినప్పటికీ కనీసం క్రీస్తుశకం ఇరవైయవ శతాబ్ది చరిత్రనైనా మన ప్రధాని 1949 తరువాత గుర్తించుకోవలసి ఉండింది!! అతి ప్రాచీన కాలంలో టిబెట్ భారతదేశంలో సాంస్కృతికంగా మాత్రమేకాక, ఆర్థికంగాను, భౌగోళికంగాను రాజ్యాంగ వ్యవస్థాగతంగానూ కూడ భాగమన్నది చారిత్రక సత్యం.
ఐదువేల నూట నలబయి మూడు ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో యదువంశ బలరాముడు ఎవరి పక్షంలోనూ చేరలేదు. ఇలా కౌరవులకూ, పాండవులకూ కూడ దూరంగా ఉండిపోయిన ‘మరో రాజకుమారుడు’ ‘రూపతి’…. రూపతి యుద్ధవిముఖుడై ఉత్తరంగా వెళ్లాడు, హిమాలయాలలో త్రివిషృప సీమలకు చేరుకున్నాడు. ఆ సమయంలో త్రివిష్టపమ్- టిబెట్టు- అనేక వనవాసీ నాయకుల మధ్య విభక్తమై అనేక రాజ్యాలుగా ఉండేది. ఈ ‘పాలకులు’ పరస్పరం కలహించుకునేవారు! ఈ వనవాసీలు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి ఆరాధన వేదధర్మంలోని ఒక సంప్రదాయం! రూపతి పరస్పరం కీచులాడుతున్న ‘వనమతం’వారిని సమైక్యపరచి విశాల త్రివిష్టప రాజ్యాన్ని నిర్మించాడు. అలా ‘కలియు గం’లో తొలి టిబెట్ పాలకుడు రూపతి… భారతీయుడు! రూపతికి పూర్వం కూడ త్రివిష్టప ప్రాంతాలన్నీ భరత ఖండంలో భాగం, అందువల్లనే వనజనుడు రూపతిని రాజుగా అంగీకరించాడు!
క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకుల దండయాత్రలు మొదలైన తరువాత రెండు సహస్రాబ్దులపాటు భారత రక్షకుల దృష్టి పశ్చిమంవైపు తిరిగింది! ఈ సమయంలో టిబెట్, బర్మా వంటి తూర్పు సరిహద్దు ప్రాంతా లు ప్రధాన భారత భూభాగంనుండి విడిపోయి రాజకీయంగా స్వతంత్రమయ్యాయి! రాజకీయంగా ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటికీ టిబెట్ సంస్కృతి భారతీయ సంస్కృతిలో భాగం కావడం చరిత్ర!! టిబెట్ మళ్లీ స్వాతంత్ర దేశంగా ఏర్పడడంవల్ల మాత్రమే మనకు చైనా బెడద తప్పుతుందన్నది చరిత్ర చెబుతున్న పాఠం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు,
ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) సమచారం ప్రకారం మన దేశంలో భర్తల లైంగిక హింస కారణంగా నరకం చవి చూస్తున్న గృహిణుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే, కుటుంబం పరువు ప్రతిష్టలు, సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎంతోమంది బాధిత మహిళలు లైంగిక హింసను వౌనంగా భరిస్తున్నారే తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

భార్య ఆమోదం లేకుండా లైంగిక చర్యకు భర్త పాల్పడితే అది ‘అత్యాచారం’ అవుతుందని గతంలో ఉన్నత న్యాయస్థానాలు సైతం వ్యాఖ్యానించాయి. దాంపత్య బంధంలో లైంగిక హింసను ఎదుర్కొంటున్న గృహిణుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, భర్తలపై ఒక్క శాతం మేరకే కేసులు నమోదైనట్లు, ఇతరులపై ఆరు శాతం కేసులు నమోదైనట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. 2005 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను, జాతీయ నేర గణాంకాల సంస్థ 2013లో ప్రకటించిన సమాచారాన్ని సామాజిక నిపుణులు విశే్లషించగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్తల వల్ల లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సందర్భంగా 6,590 ఫిర్యాదులు వచ్చాయి. ఇతరుల లైంగిక హింసకు సంబంధించి 157 ఫిర్యాదులు అందాయి. భర్తలే అత్యాచారాలకు పాల్పడినట్లు 372 కేసులు, ఇతరులకు సంబంధించి 91 కేసులు గత ఏడాది నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ చెబుతోంది. భర్త వల్ల లైంగిక హింసకు సంబంధించి 0.6 శాతం, ఇతరులకు సంబంధించి 5.8 శాతం కేసులు నమోదైనట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనం సందర్భంగా నిపుణులు ప్రశ్నించిన ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఇద్దరు లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మంది మహిళల్లో కనీసం 157 మంది లైంగిక హింసను భర్త నుంచి లేదా ఇతరుల నుంచి ఎదుర్కొంటున్నారు. లైంగిక జీవితంలో గృహిణులు హింసను ఎదుర్కోవడం గత 12 ఏళ్ల కాలంలో అధికమైనట్లు అధ్యయనంలో విశే్లషించారు. భార్య మనోభావాలను ఖాతరు చేయకుండా బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య నానాటికీ పెరగడంతో దాంపత్య బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. పురుషాధిక్య భావజాలమే ఇందుకు కారణమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పరిచయస్తులు, బంధువుల నుంచి కూడా మహిళలకు లైంగిక హింస ఎదురవుతోంది. ఆర్థిక స్వేచ్ఛ, ఉన్నత చదువులు చదివిన మహిళలు సైతం భర్తల నుంచి లైంగిక దాడులను భరిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్ తదితర అంశాల కారణంగా బాధిత మహిళలు నోరు విప్పేందుకు జంకుతున్నారు.
వివాహానికి ముందు, పెళ్లి తర్వాత మహిళలపై అత్యాచారాల సంఖ్య పెచ్చుమీరడం ఆందోళనకర పరిణామమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ‘లైంగిక హింస’ అని చెప్పేందుకు జంకుతున్న కొందరు మహిళలు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని భరించలేక ‘్భర్త క్రూరత్వం’ అని ఫిర్యాదు చేస్తున్నారు. నేరాల నమోదుకు దేశంలో ఇప్పటికీ అధునాతన వ్యవస్థ, శాస్ర్తియ పద్ధతులు లేనందున లైంగిక హింసకు సంబంధించి వాస్తవ సమాచారం పూర్తి స్థాయిలో వెలుగు చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలు, పోలీసులు రాజీ చేస్తున్నందున లైంగిక హింసపై నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా హక్కుల సంస్థ ‘జాగోరి’ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్త లేదా ఇతరుల కారణంగా లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళల్లో 0.8 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారని ఆ సర్వేలో తేలింది.
జాతీయ నేర గణాంకాల సంస్థ, పోలీసు శాఖ వద్ద నమోదైన కేసుల వివరాలే తప్ప ఇతర సమాచారం ఉండదు. లైంగిక హింసపై వాస్తవ సమాచారాన్ని రాబట్టాలంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మరింత విస్తృతంగా జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. కేసులు పెట్టేందుకు ముందుకురాని బాధిత మహిళల నుంచి వాస్తవ సమాచారం రాబట్టాలంటే అది ఆరోగ్య సర్వే సిబ్బంది వల్లే సాధ్యపడుతుంది. గృహహింస, లైంగిక హింస, మానసిక హింస, భౌతిక దాడులకు ఉన్న తేడాను అన్ని వర్గాల మహిళలకు వివరించ గలిగి, వారిలో మనోధైర్యాన్ని నింపగలిగితే వాస్తవ సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ‘ప్రశ్నావళి’ని సమూలంగా మార్చాలని మహిళా హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దాడికి, లైంగిక హింసకు తేడా ఉన్న సంగతి తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకురావడం లేదు. దాంపత్యంలో లైంగిక హింస గురించి సన్నిహితులతో చెప్పుకునేందుకు సైతం గృహిణులు సహజంగా ఇష్టపడరు. ఈ కారణంగానే వారు భర్తపైన లేదా ఇతర పురుషులపైన కేసులు పెట్టేందుకు సుముఖత చూపడం లేదు. లైంగిక విషయాల్లో ఘర్షణ పడే దంపతులకు ‘కౌనె్సలింగ్ కేంద్రాల’ను ఏర్పాటు చేస్తే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉందని సామాజిక శాస్తవ్రేత్తలు సూచిస్తున్నాయి. లింగ నిష్పత్తి, అక్షరాస్యత ఆశాజనకంగా ఉన్న కేరళ, తమిళనాడు, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భర్తల లైంగిక హింసపై ఫిర్యాదు చేసే మహిళల సంఖ్య తక్కువగానే ఉంటోంది. లైంగిక విషయాల్లో కౌనె్సలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ స్పందించడం లేదు. విడాకులకు దరఖాస్తు చేసుకునే దంపతులకు న్యాయశాఖ పరిధిలో ‘కౌనె్సలింగ్’ ఇచ్చినట్లే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘లైంగిక విజ్ఞాన కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్న

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి

ఆకాశదీప మహాత్మ్యం

కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః 

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేఇ కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా మరణానికి ముగింపులేదు -రెహనా ఉరి తర్వాత విడుదల చేసిన ఉత్తరం

నా మరణానికి ముగింపులేదు

రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ సంఘటనపై అంతర్జాతీయంగా పెనుతుపాను చెలరేగింది. ఈ నేపథ్యంలో- తనకు మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత రెహనా తన తల్లికి ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపింది. గత శనివారం ఆమెను ఉరితీసిన తర్వాత అధికారులు దీనిని విడుదల చేశారు. భగవంతుడి న్యాయస్థానంలో మనం ముద్దాయిలం కాదు అని తన తల్లికి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించిన రెహనా తన శరీర అవయవాలను దానం చేయమని కూడా కోరింది. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే ఆమె పంపిన సందేశానికి తెలుగు అనువాదమిది.. 
డియర్‌ షోలి,
నేను క్విసాస్‌ (ఇరాన్‌ న్యాయవ్యవస్థలో ఒక అంశం)ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందనే విషయం ఈ రోజే నాకు తెలిసింది. ఈ విషయాన్ని నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది. నా జీవితంలో ఆఖరి అధ్యాయానికి చేరుకున్నానని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం బాధ కలిగించింది. నాకు ఈ విషయం తెలుస్తుందని నువ్వు అనుకోలేదా? నువ్వు విషాదంగా ఉన్నావనే ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతోంది.. నీ చేతిని, నాన్న చేతిని ముద్దాడే అవకాశాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు.? ఈ ప్రపంచం నన్ను 19 ఏళ్లు బతకనిచ్చింది. నన్ను చంపేసి నా శరీరాన్ని నగరంలో ఏ మూలో విసిరేసి.. కొద్ది రోజుల తర్వాత మార్చురీలో నా శవాన్ని గుర్తించమని నిన్ను తీసుకువెళ్లేవారు. నన్ను రేప్‌ చేశారనే విషయం కూడా నీకు అప్పుడే తెలిసేది. నన్ను చంపిన వ్యక్తి ఎవరో కూడా ఎవ్వరికి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే- వాళ్ల దగ్గర ఉన్నంత సంపద, శక్తి మన దగ్గర లేదు. ఆ తర్వాత నువ్వు సిగ్గుతో తలదించుకొని జీవితాన్ని గడపాల్సి వచ్చేది.. అలా గడిపి.. గడిపి.. బాధతో కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా మరణించి ఉండేదానివి. కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది.
అయితే ఒక్క దెబ్బతో మొత్తం కథంతా మారిపోయింది. నా శరీరాన్ని నగరంలో ఏ మూలో పడేయలేదు. మొదట ఈవిన్‌ జైలులోను, ఇప్పుడు శ్మశానంలాంటి షరార్‌ ఈ రే జైలులోను ఉంచారు. అయితే ఈ విషయాలు వేటికీ నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను సంపాదించుకోవటానికి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి, కొన్ని బాధ్యతలు నెరవేర్చటానికి వస్తాడని నువ్వు నాకు చెప్పేదానివి. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం పోరాడాల్సి వస్తుందనే విషయాన్ని నేను నేర్చుకున్నా. నన్ను ఒక వ్యక్తి కొరడాతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తి ప్రతిఘటించాడు. అతనిని కూడా కొరడాతో కొడితే ఆ దెబ్బలకు అతను మరణించాడని నువ్వు నాకు చెప్పావు. ఒక వ్యక్తి చనిపోయినా పర్వాలేదు.. కానీ ఈ మరణం వెనకున్న కారణం, దానికున్న విలువ గురించి అందరికీ తెలియాలి.
స్కూలుకు వెళ్లినప్పుడు, దెబ్బలాటలు వస్తాయని.. ఫిర్యాదులు చేస్తూ ఉంటారని- వాటిని మనం ఎదుర్కోవాలని నువ్వు చెబుతూ ఉండేదానివి. మా ప్రవర్తనకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదానివో గుర్తుందా? అయితే నీ అనుభవం తప్పు. నన్ను ఒక వ్యక్తి రేప్‌ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ పాఠాలేమి పనిచేయలేదు. కోర్టులో హంతకురాలిగా చిత్రీకరించినప్పుడు అవి నన్ను కాపాడలేదు. కోర్టులో నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు. నేను కోర్టులో ఏడ్వలేదు. నన్ను క్షమించమని ప్రాధేయపడలేదు. నేను న్యాయాన్ని నమ్మాను. అందుకే ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చలేదు. నేను ఎప్పుడూ దోమలను కూడా చంపలేదని నీకు తెలుసు. బొద్దింకలను కూడా వాటి మీసాలు పట్టుకొని బయటపడేసేదాన్ని. అంతే తప్ప చంపేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక కరుడుకట్టిన హంతకురాలిని అయిపోయాను. నాపై రకరకాల ఆరోపణలు మోపారు. న్యాయమూర్తుల దగ్గర నుంచి న్యాయం ఆశించటం కూడా ఆశావాద థృక్పథమేమో అనిపిస్తుంది. న్యాయమూర్తి నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నన్ను ఇంటరాగేషన్‌ సమయంలో కొడుతున్నప్పుడు.. అత్యంత హీనంగా దుర్భాషలాడుతున్నప్పుడు ఎవ్వరూ నా వైపు మాట్లాడలేదు. నా అందానికి చిహ్నంగా నేను భావించే జుట్టును తీసేసి గుండు చేయించినప్పుడు నాకు దక్కిన బహుమానం ఏమిటో తెలుసా- జైలులో 11 రోజుల ఏకాంత నిర్భందం.
ఇదంతా వింటూ నువ్వు ఏడవకు. మొదటి రోజు పోలీసు ఆఫీసులో ఒక పెళ్లికాని ముసలి పోలీసు నా గోళ్లను విరిచేశాడు. అప్పుడు అందాన్ని ఇక్కడ హర్షించరనే విషయం అర్థమయింది. ఒక అందమైన ఆకృతి, అందమైన ఆలోచన, అందమైన భావన, అందమైన రాత, అందమైన చూపు, అందమైన గొంతు- వీటి వేటికి ఇక్కడ విలువ లేదు. అమ్మా, నా ఆలోచనా విధానం మారిపోయిందేమిటా అనుకోకు. దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నా మనసులోంచి అనేక మాటలు ప్రవాహంలా వస్తున్నాయి. నువ్వు లేకుండా, నీకు తెలియకుండా నన్ను ఉరితీసినప్పుడు- నా జ్ఞాపకాలుగా నీకు మిగిలేవి ఈ మాటలే. నేను మరణించే ముందు నాదో కోరిక.. నీ శక్తిమేరకు దాని కోసం ప్రయత్నించు. నేను నిన్ను, ఈ దేశాన్ని కోరేది ఇదొక్కటే. దీనిని సాధించాలంటే కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. అమ్మా.. ఏడవకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక విల్లు రాయాలనుకుంటున్నా. జైలులో ఉత్తరం రాయాలన్నా అధికారి అనుమతి కావాలి. అందువల్ల నువ్వు కోర్టుకు వెళ్లి నా తరపున అభ్యర్థనను వారి ముందు ఉంచు. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావనే భావనే నన్ను ఇబ్బంది పెడుతోంది. అమ్మా.. నేను నిన్ను అభ్యర్థించేది ఇది ఒక్కటే. కోర్టులో నాకు శిక్ష వేయవద్దని న్యాయమూర్తులను అభ్యర్థించమని చాలా సార్లు చెప్పావు. కానీ నేను అంగీకరించలేదు. కానీ నా ఈ చివరి అభ్యర్థనను మాత్రం నువ్వు మన్నించాలి. అమ్మా.. నువ్వు నాకు నా జీవితం కన్నా ఎక్కువ. అందుకే నువ్వు నాకీ పని చేసిపెట్టాలి. మరణించిన తర్వాత నా శరీరం మట్టిలో కలిసిపోకూడదు. నా అందమైన కళ్లు, చలాకీగా పనిచేసే నా గుండె ఎందుకూ పనికిరాకుండా పోకూడదు. అందువల్ల- నన్ను ఉరితీసిన వెంటనే నా గుండె, కాలేయం, కళ్లు- ఇలా- అవయవ మార్పిడికి పనికొచ్చే అవయవాలన్నింటినీ ఈ ప్రపంచానికి నా బహుమతిగా ఇచ్చేయండి. అవి అమర్చిన వారికి నా పేరు తెలియనివ్వకండి. అంతే కాదు. నాకు నువ్వు సమాధి కట్టద్దు. దాని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు నల్లబట్టలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను కష్టపడిన రోజులన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు.
ఈ ప్రపంచం మనల్ని ప్రేమించలేదు. అందుకే నేను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నాను. భగవంతుడి న్యాయస్థానంలో- నన్ను కొట్టినందుకు ఇన్‌స్పెక్టర్‌ షామోలపైన, అతనిని నివారించలేకపోయినందుకు సుప్రీం కోర్టు జడ్జీలపైన కేసు పెడతాను. అదే కోర్టులో నా హక్కులను హరించినందుకు డాక్టర్‌ ఫార్వాడిపైన, ఖాసీం షబానీపైన కేసులు పెడతాను. కొన్ని సార్లు మనం నిజమనుకున్నదంతా నిజం కాదు. అమ్మా.. ఆ సృష్టికర్త ప్రపంచంలో నువ్వు నేను ఒకటి. మనం ముద్దాయిలం కాదు. మనపై ఫిర్యాదులు చేసిన వారందరూ ముద్దాయిలు. భగవంతుడు ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం.. నేను మరణించేదాకా నిన్ను కౌగిలించుకోవాలని ఉంది. ఐ లవ్‌ యూ..
ఇట్లు…
నీ రెహనా
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు

నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని తీర్ధుల వారు రాశారు .శ్రీకృష్ణుని చరిత్రకావ్యం ఇది .రుక్మిణీ కల్యాణం వరకు ఇందులో ఉంది .పన్నెండు తరంగాలున్నాయి .శ్లోకాలు సంగీతాత్మకం గా నాద వినోదాన్ని చేకూరుస్తాయి .సంగీత నాట్య శాస్త్రాలలో నిధి .చిన్నతనం లోనే సన్యాసి అయి భక్తీ సామ్రాజ్యాన్ని పాలించాడు .ముప్ఫై నాలుగు ప్రసిద్ధ రాగాలను ఉపయోగించాడు .త్రిపుట ,అది జంప ,ఏకఅట తాళాలను ఉపయోగించారు .హ్గాద్యం పద్యం మహా హృదయం గా రాశారు తీర్ధులు .అనుష్టుప్ భుజంగ ప్రయాతం ఆర్యా వసంత తిలక పృథ్వి వృత్తాలు విరివిగా వాడారు .పదాల లాగా పాడుతుంటారు .నాట్యం చేస్తూ అభినయించే వీలు ఉన్న తరంగాలు .ఆంద్ర దేశం లో బాగా ప్రచారం లో నారాయణ తీర్ధుల తరంగాలు ఉన్నాయి .లీలా తరంగిణి లో పన్నెండునూట యాభై పాటలు ,మూడు వందల రెండు శ్లోకాలు ,ముప్ఫై ఒక్క చూర్నికలు ఉన్నాయి . తరంగాలు ,తీర్ధుల వారు ‘’హరి భక్తీ సుదార్నవం ‘’అనే మరో రచనా చేశారు భాగవత దశమ స్కంద ఇతి వృత్తం .మొత్తం పదిహేను రచనలు చేశారు బెనారస్ హిందూ యూని వర్సిటిలో అవి లభ్యమవుతాయి .

72   ‘’నాయన ‘-’-కావ్య కంఠ వాసిష్ట గణపతి

రమణ మహర్షి చేత’’ నాయన ‘’అని పించుకొన్న మహా భక్తుడు, దేశ భక్తుడు అయిన అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి .విద్వత్తు వలన పొందిన బిరుదే వాశిష్ట గణపతి .ఉత్తరాంధ్ర దేశం లో బొబ్బిలి దగ్గర కలువ రాయి లో 1878లో జన్మించారు ,పండిత కుటుంబం .పడవ ఏటనే ‘’పాండవ దార్త రాష్ట్ర సంభవ ‘’అనే ఖండకావ్యం రాసిన ప్రతిభా శాలి .వ్యాకరణం జ్యోతిషం ,ఆయుర్వేద దర్శన  విద్యల్లో మహా పండితుడు .మహా మంత్రం శాస్త్ర వేత్త .ఇంద్రాణీ సప్త స్తుతి ,చండీత్రిశతి ,వివిధ చందస్సులతో రాసిన ‘’ఉమా సహస్రం ‘’మొదలైన సంస్కృత కావ్యాలు రాశారు. మహా ఉపాసకులు .విశ్వ మీమాంస ,సదా చార బోధిని ,గాయత్రి వ్యాఖ్యానం రాశారు ‘’పూర్ణ ‘’నవలను సంస్కృతం లో రాశారు .మొత్తం మీద డెబ్భై అయిదుకు పైగా రచనలు చేశారు .గణపతి మునిగా ప్రసిద్ధులు .ఆత్మా విచారం లో అద్వితీయంగా ముందడుగు వేశారు భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు .

73కావ్య శాస్త్ర కర్త–హేమ చంద్రా చార్యుడు

పదకొండవ శతాబ్దికి చెందిన వాడు హేమ చంద్రుడు .కవి ,వ్యాకరణ వేత్త ,అలంకారికుడు గుజరాతు రాజు ‘’అన్హిల వాడ చాళుక్య రాజు కుమార పాలుడి చరిత్రను ‘’కుమార పాల చరిత్ర’కావ్యం ’గా రాశాడు .సంస్కృత ,ప్రాకృత వ్యాకరణాలను రచించాడు .కుమార చరిత్ర ఇరవై ఎనిమిది సర్గల కావ్యం .మొదటి ఇరవై స్సంస్క్రుతం లో మిగిలిన ఎనిమిది సర్గలు ప్రాకృతం లో రాసిన సవ్య సాచి .ఇందులోతన వ్యాకరణ పాండిత్యాన్ని అంతా గుప్పించాడు .అందుకే ఇది కావ్య శాస్త్రం అయింది ..ద్వాశ్రయం  ‘’అన్నారు .ఈ కావ్యం లో సంస్కృత భాగానికి ‘’అభయ తిలక గణి’’వ్యాఖ్యానం రాస్తే ప్రాకృత భాగానికి ‘’పూర్ణ కలశ గణి’’వ్యాఖ్యానం చేశాడు కావ్యం వీర రస ప్రధానం .ఒక సర్గ అంతా రాత్రినే వర్ణించటం విశేషం .సోమనాధజ్యోతిర్లింగ మహా భక్తుడు కవి .జైన హిందూమత సామరస్యాన్ని గుజరాత్ లో సాధించిన ఘనత హేమ చంద్రుడిది .

హేమ చంద్రుని విజ్ఞానం అపారమైనది .అతని శబ్ద భాండారం అంతులేనిది .కొత్త కొత్త శబ్దాలను సృష్టించి ప్రయోగించి గౌడీ రీతిలో కావ్యాన్ని రాశాడు .వ్యాకరణాన్ని కావ్య లక్షణాలపై జోడు గుర్రాల సవారీని సమర్ధ వంతం గా చేసి సుభాష్ అని పించుకొన్నాడు .అన్ని రకాల అలంకారాలు వాడాడు .చాళుక్యులు మూడు వందల ఏళ్ళు గుజరాతు లోని కదియ వాడును పాలించారు .చాళుక్య మూల పురుషుడడి తో ప్రారంభించి కుమార పాలుని చరిత్ర తో ముగించాడు .కుమారుడు  ముసలి సలితనం లో హేమ చంద్రుని ప్రోద్బలం తో జైన మతాన్ని స్వీకరించటం తో ముగింపు పలికాడు  .రాజు  జీవించి ఉండగానే  హేమ చంద్రా చార్యుడు 1172 లో మరణించాడు . .

74-పృధ్వీ రాజ చరిత్ర కర్త-జయాంకుడు

అజ్మీరు ధిల్లీ రాజ్యాలను పరిపాలించిన పృధ్వీ రాజ్ చోహన్ చరిత్రను కావ్యం  రాసిన వాడు జయాంకుడు .కాశ్మీర దేశం లో శిధిలావస్థ లో ఉన్న ఈ కావ్యాన్ని ‘’బ్యూలర్’’కనుగోన్నాడు . అసం పూర్తీ కావ్యమే .పన్నెండు సర్గలున్నాయి .పృధ్వీ రాజు మహమ్మదీయ రాజులను జయించే వృత్తాంతం తో బాటు ఆయన పట్టాభిషేకం ఉంటుంది .జయాంకుడు  పృధ్వీ రాజు ఆస్థాన కవి .కనుక కాశ్మీరీ అని అనుకో వచ్చు .బిల్హనుడి శైలితో రాసిన కావ్యం ఇది జాన రాజు అనే కాశ్మీర కవి దీనికి  వ్యాఖ్యానం రాశాడు .1193కు పూర్వమే కావ్యాన్ని రాశాడు .కారణం 1191లో పృధ్వీ రాజు షహబుద్దీన్ ఘోరిని ఓడిస్తే 1193లో గోరీ ఇతన్ని ఓడించి చంపాడు .

కవితా జయాంకం

జయాంకుడి కి వేద,పురాణ ,మహా కావ్య ,న్యాయ ,వ్యాకరణ జ్యోతిస్శాస్త్రాలలో నిష్ణాతుడు .కావ్యం లో రామాయణ మహా భారత గాధలను ఉటం కించాడు  .పూర్వ కవుల ప్రభావం బాగా ఉన్న వాడు .పాంచాలీ గౌడీ రీతుల్లో అలంకార యుక్తం గా కావ్యం రాశాడు .చౌహాన్ రాజ వంశ చరిత్ర గురించి తెలియ జెప్పే చారిత్రిక కావ్యం ఇది ఈ వంశం లో పృధ్వీ రాజు మూడవ రాజు .అవి ఇతన్ని విష్ణువు అంశం గా భావించాడు .చివరీ ఘోరీతో జరిగిన యుద్ధ ప్రస్తావన ఇందులో లేక పోవటం ఆశ్చర్యమే .

75- హోయసల రాజ చరిత్ర రాసిన -సకల విద్యాచక్ర వర్తి

కర్నాటక  హోసల రాజు రెండవ నరసింహ సోమేశ్వరుని ఆస్థాన కవి ‘’సకల విద్యా చక్ర వర్తి ‘’.ఇది అతని పాండిత్యానికి పొందిన బిరుదు .ఇతడిని రెండవ విద్యా చక్ర వర్తి గా గుర్తించారు .మూడవ చక్ర వర్తి రుయ్యకుడి అలంకార సర్వస్వ గ్రంధానికి సంజీవిని టీక రాశాడు .మనకవి గద్యం లో ‘’గద్య కర్ణామృతం ‘’రాశాడు .హోయసల వంశ రాజుల చరిత్రను ఆవిష్కరించే గ్రంధం ఇది .చారిత్రిక సత్య సమన్వితం .హోయసల రాజులకు చాళుక్య రాజులకు మధ్య జరిగిన యుద్ధాల వివరాలున్నాయి .సోమేశ్వర రాజు  చాళుక్య రాకుమారి దేవిక ను పెళ్లి చేసుకోవటం ముఖ్య వృత్తాంతం .బాణుడు రాసిన హర్ష చరిత్రను  స్పూర్తిగా దీన్ని రాశాడు .ఇందులో శైలి అర్ధ పౌరాణికం అర్ధ ఐతిహాసిం . వాల్మీకి కాళిదాసాదుల ధోరణిలోకావ్యం రాశాడు  .

76- హమ్మీర చరిత్ర కర్త-నయ చంద్ర సూరి

చౌహాన్ రాజు ‘’హమ్మీరు’’ని చరిత్రను ‘’హమ్మీర కావ్యం ‘’రాశాడు సూరి .జయ సింహ సూరి మనవడు .ఇది 1456లో రాసిన కావ్యం .తండ్రి జయ సింహ సూరి ‘’హమ్మీరమద మర్దనం ‘’అనే నాటకాన్ని రాశాడు .దీనిలో వస్తుపాల ,తేజ పాల చరిత్రలున్నాయి .పద్నాలుగు సర్గల కావ్యం ..అవి మహా పండితుడు. శాస్త్రాలన్నీ నేర్చి పండిపోయి సూరి అయ్యాడు రాజనీతి యుద్ధ రీతి తెలిసిన వాడు .వైదర్భీరీతిలో ప్రసన్న మాధుర్యం గా రాశాడు జలక్రీడలు యుద్ధాలు ఋతువులు వర్ణించాడు అపహ్నుతి ,యమా అలంకారాలను సందర్భాన్ని బట్టి వాడాడు .వీర రస ప్రధాన కావ్యం .అల్లాఉద్దీన్ తన సైన్యాలను హంమీరుడి సోదరుడి మీదకు పంపితే వారు అతన్ని ఓడిస్తే రాజు స్వయంగా యుద్ధానీకి దిగాడు . అతని సైనికులే నమ్మక ద్రోహం చేశారు .తెలిసిన హమ్మీరుడు రాణి వాస స్త్రీలను అగ్ని ప్రవేశం చేయమని కబురు చేసి ఘోర యుద్ధం లో పాల్గొని ప్రాణాలు వదిలి వీర మరణం పొందాడు .ఇది పదమూడవ సర్గలో వర్ణించాడు .పద్నాలుగవ సర్గలో హంమీర పరాక్రమాన్ని వంశ చరిత్రను రాసి కావ్యాన్ని ముగించాడు .

77-రాణికవయిత్రి -గంగా దేవి

విజయ నగర రాజు రెండవ బుక్క రాయల రెండవ కొడుకు కంపరాయల భార్య గంగా దేవి .1361-1374లో యువరాజుగా ఉన్నాడు .మధురమీద దాడి చేసి తురుష్కులను ఓడించి1371లో  విజయం సాధించాడు .ఈ ఇతి వృత్తాన్ని తీసుకుని గంగా దేవి ‘’మధురా విజయం ‘’కావ్యం సంస్కృతం లో రాసింది .దీనికి  ‘’వీరకంప రాయ చరిత్ర ‘’అనే పేరూ ఉంది .ఏడవ సర్గలో తానూ కంపరాయల భార్యనని చెప్పుకొన్నది .

కవితా గంగాలహరి

విదుషీమణి అయిన గంగాదేవి కావ్యాల అధ్యాయాన్ని క్షుణ్ణం గా  చేసింది .ఆ ప్రభావం కావ్యం మీద ప్రసరించింది .తెలుగు సాహిత్యం తో పరిచయం కూడా బాగా ఉన్నట్లు గోచరిస్తుంది .ఇది కూడా వీరరస కావ్యం .పుర ఋతు ,జలక్రీడ ,సూర్యాస్తమయ ,చంద్రోదయాలను కావ్య రీతిలో వర్ణించింది .అయిదవ సర్గ వర్ణనా మయం .గణేశ ప్రార్ధన చేసి కావ్యం ప్రారంభించి మిగిలిన దేవతలనూ స్తుతించింది .ముఖ్యం గా ‘’క్రియా శక్తిని ‘’ ని వర్ణించటం విశేషం .ప్రతి సర్గ లో రాబోయే సర్గలోని విషయాలను చెప్పింది .

మొదటి సర్గలో విజయ నగర వర్ణనను సహజ సుందరం గా చేసింది .కావ్యం లో వైదర్భీరీతి కనిపిస్తుంది .భాష పరిపక్వం గా ఉంటుంది ,

‘’హిమ భర విహతః కమలా కరో మృదిత కాంతి రభూన్మ్రుగ లామ్చనః-వాదన మేవ నరేంద్ర నాథ భ్రువాను భజత శ్రియమ ప్రతి శాసనః ‘’అని వసంత రుతువును గంగా దేవి వర్ణించింది –భావం –కమలాలు మంచుతో కప్పు బడ్డాయి చంద్రుడుకాంతి  పోగొట్టు కొన్నాడు .రాజు గారి ప్రియురాలు ముహం ఒక్కటే కాంతి తో ఉంది ‘’అలాగే సూర్యస్తమయాన్నీ మనోహరం గా వర్ణిస్తుంది –

‘’ప్రతి బింబ పరం పరామ్బుదే పవనోద్భూత తరంగా సంగినః –నభాసో వాతారిష్య తో  రవేర్మణిసోపాన ధియం వ్యభావయత్ ‘’-అంటే ఆఆశం నుంచి దిగుతూ ఉన్న సూర్యుడి నిశ్చలమైన బింబం కదిలే అలల్లో ప్రతి బిమ్బిమ్చి రత్నాల మెట్లు లాగా ఉంది ‘’.క్లిష్టం అనేది లేని కవిత్వం రాసింది .

కంపరాయలు ఉదయగిరికి రాజుగా ఉండేవాడు .తండ్రి బుక్క రాయల కంటే ముందే కంపరాయలు చని పోవటం తో విజయ నగర ప్రభువు కాలేక  పోయాడు  బుక్క కు చాలా మంది రాణులుఉన్నా గంగా దేవి  కంపరాయల తల్లిని మాత్రమె పేర్కొంది .కంపరాయలు రెండవ కంపరాయలుగా పేరొందాడు .మహా మండలేశ్వరుడు అనే బిరుదు ఉంది యుద్ధ కళల లోనే కాదు లలిత కళల్లోనూ మంచి ప్రవేశం ఉన్న వాడు .తండ్రి బుక్క రాయల అనుమతితో మధుర , తుండీర రాజ్యాలను జయించి వాటిని తురుష్కులఅధీనం నుండి విముక్తి చేసిన శౌర్య శాలి .ఇక్కడే కొంతకాలం ‘’మరకత నగరం ‘’రాజ దానిగా చేసుకుని మూడేళ్ళు పరిపాలన చేస్తూ పరిస్తితుల్ని చక్క బరచాడు .1374లో అతడొక్కడే పాలన చేసి నట్లు శాసన  ఆధారాలాలున్నాయి .హిందూమత పునద్ధరణకు కంప రాయలు చేసిన సేవలు చరిత్ర ప్రసిద్ధాలు 1371లో కంపరాయలు మధుర ,శ్రీరంగా పట్నాలను లొబరచుకుని తురుష్కులను పార ద్రోలాడు .ఈ చారిత్రక సంఘటనలను గంగా దేవి తన మధురా విజయం కావ్యం లో కమనీయం గా ఆవిష్కరిం చింది .కనుక ఈ  కావ్య కాలం 1371-1374అని భావింప వచ్చు .

78-కంచు ఢక్కల-గౌడ డిండిమ భట్ట కవి సార్వ భౌముడు

విజయ నగర రాజు రెండవ ప్రౌఢ దేవా రాయల ఆస్థానం లో డిండిమ భట్టు ఆస్థానకవి .అరుణ గిరి కుమారుడు .ఈ డిండిమపండితుడినే శ్రీనాధుడు వాదం లో ఓడించి అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు .దీనితో కవి సార్వ భౌముడు అనే తనకున్న బిరుదాన్నికోల్పోయి శ్రీనాధుడికి అప్పగించాడు .డిండిమ వంశం లో వారందరికీ కవి సార్వ భౌమ,డిండిమ  బిరుదు ఉండేది .సాల్వ నరసింహ రాయలు చరిత్రను రాజనాధుడు అనేకవి ‘’సాళువాభ్యుదయం ‘’అనే కావ్యం గా రాశాడు .సాల్వ నరసింహ రాయలు 1486లో విజయనగర రాజు కాని సాల్వాభ్యుదయం లో ఎక్కడా ఈమాట చెప్పబడలేదు. చంద్రగిరి రాజు అనే  ఉంది .కనుక ఈ కావ్యం అతడు మహా మండలేశ్వరుడుగా ఉన్నప్పుడే 1486లో రాయబడింది. ఈ కావ్యం ప్రచురితం కాలేదు .ఇందులో పదమూడు సర్గ లున్నాయి .

ఈ కావ్యం లో నరసింహ దేవరాయల యుద్ధాలు ధర్మ కార్యాలూ ఉదాత్తం గా వర్ణించ బడ్డాయి .సుందర కావ్య శైలి ఉంది .నరసింహ రాయలు సంస్కృతాంధ్రాల ను పోషించాడు .మూడు నుంచి ఏడు సర్గల దాకా అతని విజయాలు ,ఎనిమిదిలో వేట ,పదిలో ఋతు వర్ణనలు ,పదకొండులో  శివరాత్రి ఉత్సవాలు పన్నెండులో రాజ దానికి రావటం ,పదమూడవ సర్గలో దాన ధర్మాలు ,సాహిత్య పోషణ ఉన్నాయి .

మరోకవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-14-g

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేవతి రాసిన ”ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకంపై చర్చ-హైదరాబాద్ బుక్ ట్రస్ట్

http://hyderabadbooktrust.blogspot.in/Pamphlet

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నంపెట్టే చేతులు..

అన్నంపెట్టే చేతులు..

రోజూ బడికి వెళ్లే పిల్లలకు ఒక పూట వండి పెట్టడానికే ఎన్నో అవస్థలు పడతాం. అదే ప్రతి రోజు మధ్యాహ్నం బడి గంట కొట్టగానే – ప్రతి పిల్లాడి ముందు వేడి వేడి భోజనం సిద్ధం చేయడమంటే మాటలు కాదు. ఒక రోజు వండిన వంటను మరుసటి రోజు వండకుండా పద్దెనిమిది రకాల మెనూలతో పన్నెండువేల మందికి తిండి పెడుతోంది బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్‌.. 
తలు గ్రామానికో, మండలానికో మహా అయితే జిల్లా వ్యాప్తంగానో సేవలందించడం మనం చూస్తూ ఉంటాం. కాని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులోని శ్రీ బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ తమ సేవలకు ఎల్లలు హద్దుకావని నిరూపించింది. పశ్చిమ ఆఫ్రికాలో సేవలను విస్తృతం చేసింది. ఈ స్థాయికి ఎదిగిన ట్రస్టుకు ప్రాణం పోసిన వ్యక్తి బుధ్ధవరపు వెంకట్రావు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు శ్రీనివాస నాగేశ్వర కుమార్‌ ట్రస్ట్‌ సేవలను ముమ్మరం చేశారు. మొదట్లో వైద్యశిబిరాలు పెట్టేదీ ట్రస్టు. ఆ తర్వాత – ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి సారించింది. పాఠశాల ఆవరణలోనే వండి వడ్డించే క్రమంలో కట్టెల పొయ్యలతో విద్యార్థులు పడుతున్న అవస్ధలను గుర్తించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని ఇచ్చేందుకు సంకల్పించింది. దీనితో పొలమూరులోనే అత్యాధునిక పరికరాలతో ఒక వంటశాలను నిర్మించారు. దీంతో పరిశుభ్రమైన వాతావరణంలో తిండిని వండేందుకు వీలవుతోంది. ప్రస్తుతం అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాలలోని 145 పాఠశాలల్లో సుమారు 12,500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మండలాన్ని మూడు గ్రూపులుగా విభజించి పది ఆటోల ద్వారా సమయానికి ఆహారం సరఫరా చేయడం ట్రస్ట్‌ ప్రత్యేకత. ’’ ప్రభుత్వం ఒకో విద్యార్థికి సగటున ఐదు రూపాయల దాకా ఇస్తుంది. ఐదు రూపాయలతో భోజనం పెట్టడం దాదాపు అసాధ్యం. మిగిలిన వ్యయాన్ని మేమే భరిస్తున్నాం. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే ఇంకా ఎక్కువ మందికి ఆహారం అందించవచ్చు.’’ అని ట్రస్ట్‌ ఛైర్మన్‌ బుద్ధవరపు వెంకట్రావు వెల్లడించారు. అయితే మధ్యాహ్న భోజన సరఫరాకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటికీ ట్రస్టుకు ఇవ్వడం లేదు. అయినా సరే విద్యార్థుల కడుపులు మాడకూడదన్న ఉద్దేశ్యంతో పొయ్యి వెలిగిస్తూనే ఉన్నారు ట్రస్టు నిర్వాహకులు. మధ్యాహ్న భోజనానికి తమిళనాడులో అయితే మన దగ్గర కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. వంటగది, పాత్రలను సైతం ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా పిల్లల భోజనాలకు నిధులు చెల్లిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అంత చొరవ చూపకపోవటం వల్ల చాలా ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలుకావటం లేదు.
పర్యావరణ పరిరక్షణకు..
ప్రతి నెల పౌర్ణమి రోజున రాజమండ్రిలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ట్రస్ట్‌ నిర్వహిస్తుంది. హారతికి మన సంప్రదాయంలో ఒక విశిష్టత ఉంది. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ఒక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కూడా. ఇప్పటి దాకా నాలుగేళ్లుగా ఈ హారతిని నిర్వహిస్తున్నాం. రెండు అధికమాసాలతో కలిపి వచ్చే నెల ఆరవ తేదీ వచ్చే కార్తిక పౌర్ణమికి 50 హారతులు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం..’’ అని ట్రస్టీ కుమార్‌ వెల్లడించారు. స్వచ్ఛ గోదావరి అనే నినాదంతో గోదావరి ప్రక్షాళన తమ ప్రధానోద్దేశమని వివరించారు. ’’ఒకప్పుడు గోదావరికి ఏడు పాయలు ఉండేవని చెబుతారు. వాటిలో ఇప్పటికే రెండు కనుమరుగైపోయాయి. మిగిలిన వాటిలో కొన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకొని మురుగు కాలవలుగా మారిపోయాయి. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్‌ తరాల వారికి ఇవి కూడా మిగలవు..’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫ్రికాలోను సేవలు..
దేశంలోనే కాకుండా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కూడా బుద్దవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలను విస్తరించింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ట్రస్ట్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం అక్కడ పేదలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తుంది. గినియాలో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించి అక్కడి ప్రజలకు స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తున్నారు. మన దేశం మాదిరిగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం ఏర్పాటు చేసి చిన్నారుల ఆకలి తీరుస్తోంది సంస్థ. అక్కడి ప్రజలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణనిస్తూ వారి జీవనోపాధికి బంగారు బాటలు వేస్తోంది.
(ట్రస్ట్‌ ఫోన్‌ నెంబర్‌- 9391984999) కర్రి శ్రీనివాసరెడ్డి, అనపర్తి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

kareem nagar gandhi -vishva bandhu -boyinapalli ramrao

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ

గీర్వాణ కవితా గీర్వాణం -57

63-  స్వభావోక్తికవయిత్రి మురళ

మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను బట్టి ఆమె ప్రసిద్ధ కవయిత్రి అనే అభిప్రాయం కలుగుతుంది .ప్రసిద్ధ కవయిత్రుల పేర్లలో మురళ పేరును ధనాద దేవుడు పేర్కొనటం గమనార్ధం .కాలం సుమారు పదిహేను వందలు .

‘’శీలా విజ్ఞామారుళా మొరికాద్యాః –కావ్యం కర్తుం శాంతి విజ్ఞాః ప్రియ్యోసి

విడ్యాం వేట్టుం వాదినో నిర్వి జేతుం –దాతుం వక్తుం యః ప్రవీణః నవంద్య’’

64-ప్రణయ కవయిత్రి -మోరిక

ధన దేవుడు మెచ్చిన మరోకవయిత్రి మోరిక . ఈమె శ్లోకాలలో ప్రణయం ముఖ్య ఇతి వృత్తం .పైన తెలుసుకొన్న కవయిత్రి మురళ తో సమానమైన పాండిత్యం కవిత్వం ఉన్న మహిళ. పదిహేను వందలు కాలానికే చెందింది .

65-  లీలాశుకుడనే -బిల్వ మంగళుడు

పదకొండవ శతాబ్దానికి చెందినా బిల్వ మంగళుడు శ్రీ కృష్ణ కర్ణామృతం రాశాడు .శ్రీకృష్ణ గానం చేసిన చిలుక కనుక లీలా శుకుడు అయ్యాడు .ఇందులో మూడు వందల పది శ్లోకాలున్నాయి .భక్తీ రసం పొంగిపోరలేట్లు రాసినకవ్యం ఇది శ్రీకృష్ణ భక్తీ పరాకాష్టగా చెప్పాడు లీలాశుకుడు .మూడు ఆశ్వాసాలున్నాయి .ఒక్కోదానిలో నూటపది శ్లోకాలున్నాయి .మొదటిదానిలో శ్రీ కృష్ణ  సాక్షాత్కారం ,రెండవ దానిలో కృష్ణ లీలలు ,మూడు కృష్ణుని జీవితం లో అనేక మధుర ఘట్టాలున్నాయి .నిత్య పారాయణ గ్రంధం గా గొప్ప వ్యాప్తి ఉన్నది .భక్తీ తప్ప శృంగారానికి చోటు కల్పించలేదు .జయదేవుడే లీలాశుకుడు అయ్యాడనే ప్రచారం ఉంది .చింతామణి అనే వేశ్య తో బిల్వమంగళుడు ఉండేవాడు .ఒకసారి పెద్ద గాలి వానలో ఆమెను కలుసుకోవటానికి పెరటి గోడ ఎక్కుతూ తాడు అనుకోని పామును పట్టుకొన్నాడు .జ్ఞానోదయమై లీలాశుకుడుగా మారాడు .’’కస్తూరీ తిలకం లలాట ఫాలకే ‘’శ్లోకం రాణి వారుండరు .అది లీలాశుకుని శ్లోకమే .కర్నామ్రుతాన్ని రాగామాలికలలో సభల్లో గానం చేస్తారు .ఈయన కృష్ణా జిల్లాకు చెందినవాడే అంటారు .శ్లోకాలన్నీ ముక్తక రూపం లో ఉండటం ప్రత్యేకత దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది .కృష్ణుడు గోప బాలకుడుగా ,గోపా బాలకుల స్నేహితుడుగా ,లోకోత్తరశృంగార పురుశోత్తముడుగా ఇందులో దర్శన మిస్తాడు .

‘’చింతా మణిర్జయతి సోమ గురుర్మే-శిక్షా గురుశ్చభగవాన్ శిఖి  పించమౌళిః

యత్పాదకల్ప తరు పల్లవ శేఖ రేషు –లీలాస్వయం వర రసం లభతే జయశ్రీ ‘’

అనంత పద్మనాభ స్వామి ని మొదట దర్శించిన వాడు బిల్వ మంగళ రుషియే.కర్ణామృతం కాక శ్రీ చిహ్నం ,పురుష కారం ,అభినవ కౌస్తుభ మాల ,దక్షిణా మూర్తి స్తవం ,కాలవధ కావ్యం ,దుర్గా స్తుతి , బాల కృష్ణ స్తోత్రం ,బాల గోపాల స్తుతి ,శ్రీకృష్ణ వరదాస్టకం ,బృందావన స్తోత్రం ,భావన్నాముకురం ,రామ చంద్రాస్టకం ,గణపతి స్తోత్రం అనుభావాస్స్టకం ,మహా కాలాస్టకం,మహా లక్ష్మి సోత్రం ,కర్కోటక స్తోత్రం ,కృష్ణ లీలా వినోదం ,సాకార హృదయంగమంసుబంధ సామ్రాజ్యం ,తిన్ గంధ సామ్రాజ్యం ,క్రమ దీపిక మొదలైన ఇరవై రెండు గ్రంధాలు రచించాడు .కర్ణామృతం వింటూ శ్రీకృష్ణుడు టా ఊపే వాడని అంటారు .

66-  ఆర్యా సప్త శతి కర్త -గోవర్ధనా చార్యుడు

క్రీ శ.1116వాడిన గోవర్ధనా చార్యుడు లక్ష్మణ సేన మహా రాజు ఆస్థాన కవి .ప్రాకృత గాదా సప్త శాతిని అనుకరిస్తూ ‘’ఆర్యా సప్త శతి ‘’ని సంస్కృతం లో రాశాడు .ఇందులోనూ ఏడు వందల శ్లోకాలున్నాయి .ఇదికూడా ముక్తక కావ్యం .ప్రతి శ్లోకానికి ఒక కదా ఉంటుంది .ముక్తకాలలో గొప్ప పెరుపొందినడిది .జయదేవుడి ప్రస్తుతి పొందిన కవి గోవర్ధనుడు –‘’శృంగారోత్తర సత్ప్రమేయ రచనానైరాచార్య గోవర్ధన –స్పర్దీకో పి న విశ్రుతః శృతి దారో ధోయీ కవిక్ష్మా పతిః’’అంటూ జయదేవుడు ధోయీ ని గోవర్ధనుడిని పొగిడాడు .దోయి ఏక సంతాగ్రాహి గోవర్ధన్ శృంగారస పట్లు తెలిసిన వాడు ఇద్దరూ లక్ష్మణ సేనుని ఆస్థాన కవులే .

కవితా గోవర్ధనం

అప్పటిదాకా ప్రాకృతం లోనే ఉన్న ముక్తక సాహిత్యాన్ని సంస్కృతం లోకి ప్రవేశ పెట్టిన మొదటి వాడను తానె నని గోవర్ధనుడు చెప్పుకొన్నాడు –‘’వాణీ ప్రాకృత సముచిత రాసా బలేనైవ సంస్కృతం నీతా-నిమ్నాను రూప నీరా కాళింద కన్యేవ గగన తలం ‘’.దీని భావం –లోతులో ప్రవహిస్తున్న యమునా నదిని బలరాముడు గగన తలానికి చేర్చి నట్లు ప్రారుత పాతాళం లో ఉన్న రసమయ వానిని సంస్కృతం లో ప్రవేశ పెట్టాను అని కావ్యం మొదట్లో చెప్పాడు ..ఈ కావ్యం రాసి తాన సోదరు లిద్దరికీ నేర్పాడు వారు దీన్ని గొప్పగా ప్రచారం చేశారు ఆమాల పద విన్యాసం తో ఈ ముక్తకాలు ముత్యాల సొగసును వెదజల్లుతాయి .మనసుకు బాగా పట్టుకొనే సులభ సుందర ఆర్యా వృత్తాలలో వీటిని రాసి విపరీతమైన క్రేజ్ తెచ్చాడు .సజ్జన హృదయాలను అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి .మదన రూప బ్రహ్మ జ్ఞానానికి ఉపనిష్టుల లాంటివి అన్నారు వీటిని .

ఇందులో వివిధ రకాల నాయికల వర్ణన ఉంది ప్రేమ సంయోగం వియోగం ,ఈర్ష్య అసూయ ,శృంగారం అనునయం యదా ప్రకారం ఉన్నాయి రసవాది అనిపిస్తాడు –‘’రాతిరేవ వీత వాసనా ప్రిఎవ శుద్ధాపి వాజ్ముదే సరసా –అరసా సాలంక్రుతి రాపి ణ రోచతే శాల భంజీవ ‘’భావం రాతిలో వస్రాలను వదిలేసిననాయిక , ,నాయకుని అనన్య రతి భావం కల ప్రియురాలు లాగా అలంకారం లేని సరస వాని ఆనంద ప్రదం గా ఉంటుంది అలంకారాలతో ఉన్నా రస శూన్యం గా ఉన్న వాని అలంకారాలతో నిండిన సాల భంజిక లాగా రుచికరం గా ఉండదు ‘’.అనుప్రాసద్యలంకారం అంటే గోవార్ధనుడికి మహా ఇష్టం .దీనితో కావ్యాన్ని రస మాగ్నం చేసి మానసికానందాన్ని కల్గిస్తాడు .అలంకారం అంటే చాలు పులకిమ్చిపోతాడు .అన్యోక్తి అలమ్కారమూ చాలా   ఇస్టమైనదే .వ్యంగ్యార్ధం తోకావ్యాన్ని రస శోభా భరితం చేశాడు .

గోవర్ధనుడి లోక పరిశీలనాశక్తి గొప్పది మంచి లోక జ్ఞానం ఉన్నవాడు అతని శాస్త్ర పరిచయ జ్ఞానం దొడ్డది .రెండే పాదాలు ఉండే ఆర్యా ఛందస్సులో ఒక్కొక్కటి ఒక్కో కావ్య ఖండం గా తీర్చి దిద్దిన గొప్ప కవితా ప్రతిభ గోవర్ధనుడిది .రామనీయమియా వ్యంగ్యార్ధాలతో ప్రతి ముక్తకాన్ని ఒక మహా ముత్యం ళా మెరుగులు దిద్ది ప్రకాశమానం చేశాడు .ప్రాకృతం మీద మంచి గౌరవం కలిగిన వాడు .అందుకే గునాధ్యుడిని వ్యాస వాల్మీకి  అంతటి వాడు అని కీర్తించాడు .

ఒక సఖి ని చెలులు యెంత నచ్చ చెప్పినా ప్రియుడిని చేరలేదు విసుగెత్తి వాళ్ళు వెళ్ళిపోగా ప్రియుడు ఆమె చెంత చేరగా ఆమె అతనితో ‘’నా సఖులు  ‘చెప్పింది నేను వినలేదు .వాళ్ళు నన్నోడలి వెళ్ళిపోయారు .ఇప్పుడు నేను ఒంటరిని .నువ్వు నన్ను బలాత్కారించాలి అనుకొంటే ణా సర్వస్వం సమర్పించటానికి సిద్ధం గా ఉన్నాను ‘’అంటుంది =ఇడదేశ్లోకం లో ‘’అగ్రుహీతానునయాం మా ముపేక్ష్య సఖ్యోగతా బతైకాహం  -ప్రసభం కరోపిమఇ చేత్వదుపరి వపురద్య మొక్షామి ‘’ఇదొక సాంపిల్ మాత్రమె .కావ్యం లో అడుగడుగునా ఇలాంటివి కోకొల్లలు .జుర్రుకొనే ఓపిక ఉండాలికాని కావ్యం ఆపాతమధురమే .

67- భక్తికి శాస్త్రీయత కల్పించిన -మధు సూదన సరస్వతి

క్రీ శ పదహారవ శతాబ్దం వాడిన మధు సూడన సరస్వతి శ్రీ మహా విష్ణువు కు మహా భక్తుడు .విష్ణు మూర్తిని కేశాల దగ్గరనుండి పాదాల వరకు వర్ణిస్తూ ‘’ఆనంద మందాకినీ ‘’అనే కావ్యం రాశాడు దీన్ని స్తుతికావ్యం అంటారు .కోమలమైన భక్తీ  గొప్ప హ్రుదయాను భూతి ఇందులో ప్రత్రి శ్లోకం లో దర్శనం ఇస్తుంది మధుసూదనుడు’’ భక్తీ రసాయనం’’ అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో శాస్త్రీయ పద్ధతిలో భక్తిని అన్నికోనాలలోను చర్చించాడు .రూప గోస్వామి భక్తిని రసం గా చెప్పినా ,దానికి శాస్త్రీయతను కల్పించిన వాడు మధు సూడాన సరస్వతి మాత్రమె .ద్వైతం నుండి అద్వైతానికి ప్రయాణం చేశాడు .బెంగాలుకు చెందినా మధు సూదనుడి అసలు పేరు కమల నయనుడు .నవ్య న్యాయ సిద్ధాంతాన్ని చదివి ప్రచారం చేశాడు .వారణాసి చేరి సన్యాసిగా మారి అద్వైతాన్ని జేఎవితాన్తమ్ ప్రచారం చేశాడు .ఇరవైకి పైగా రచనలు చేశాడు అందులో కృష్ణ –కుతూహలం అనే నాటకం కూడా ఉంది .ఈశ్వర ప్రతిపత్తి ప్రకాశం ,భాగవత రసాయనం బాగా ప్రసిద్ధి చెందాయి .అక్బర్ చక్ర వర్తితో గొప్ప దోస్తీ ఉండేది .తులసీదాసు కు మంచి మిత్రుడు .

68- మౌలికత ఉన్న కవయిత్రి -గౌరీ

పది హేడవ శతాబ్దికి చెందినా గౌరీ రాసిన ఇరవై ఎనిమిది శ్లోకాలే దొరికాయి ఇందులో రాజనీతి ,యుద్ధం ,శత్రురాజుఅల్ విషయాలు దొర్లాయి .మౌలికత ఉన్న రచయిత్రి అనిపిస్తుంది .సహజ ధోరణిలో లలితమదురకవిత్వం రాసింది .

69- ప్రకృతి కవయిత్రి -పద్మావతి

పద్మావతి కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినకవయిత్రి .దొరికినవి పందొమ్మిది శ్లోకాలు మాత్రమె .ఘూర్జర స్త్రీలతో సహా అనేక విషయాలపై రాసింది గుజరాత్ వాసి అవచ్చు సుందరమైన ప్రక్రుతి వర్ణాలు చేసింది కవిత్వం సహజ సుందరం

70- సంస్కృత ద్వ్యర్ధి కావ్య కవి-వేంకటాధ్వరి

క్రీ శ .1650కాలం వాడిన వేంకటాధ్వరి ‘’విశ్వ గుణాదర్శం’’అనే చంపూ కావ్యం రాశాడు ‘’లక్ష్మీ సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల స్తుతి కావ్యం రాశాడు ,దీనిలో లక్ష్మీ దేవి విష్ణు స్తుతి ఉంది .రసవత్తరమైన స్తోత్ర కావ్యం గా గుర్తింపు పొందింది .’’సుభాషిత కౌస్తుభం ‘’అనే కృతికూడా చేశాడు .రాఘవ యదవీయం అనే ద్వార్దికావ్యం సంస్కృతం లో రాశాడు ,మొదటినుంచి చదివితే రామాయణ కదా కుడివైపు నుంచి చదివితే భాగవత కదా వస్తుంది ,అంటే ఒక రకం గా ద్వార్దికావ్యం అన్నమాట .ఇది ముప్ఫై శ్లోకాల కావ్యం మాత్రమె .

మరోకవిని కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూర్యకాంతం – దత్తపుత్రుడు దిట్టకవి అనంత పద్మనాభ మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ బి యెన్ పై ఎందుకు నిషేధం ?రాజీవ్ నాగ్ కమిటి -కె సిఆర్ కు ఛివాట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

61- ప్రతాప రుద్ర రాజ కవి

ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ దేవి తర్వాత రాజైన వాడు .గొప్ప సాహిత్య ప్రియుడు .స్వయానా రచయితా .సాహిత్య పోషకుడు .విద్యానాధుడు ఈయన ఆస్థాన కవి .ప్రతాప రుద్రా యశో భూషణం లేక ప్రతాప రుద్రీయం అనే అలంకార శాస్త్రం రాసి రాజుకు అంకితమిచ్చాడు .

రుద్ర రాజ కవి ప్రతాపం

స్వయం గా కవి అయిన ప్రతాప రుద్రుడు ‘’యయాతి చరిత్ర’’అనే సంసృత నాటకం రాశాడు . రాజు  రాజు కావతానీ ముందే ‘’కుమారు రుద్రుడు ‘’అనే పేరుతొ ‘’అమరుక రాజు రాసిన ‘’శృంగార శతకానికి ‘’వ్యాఖ్యానం రాశాడు తెలుగులో భాస్కర రామాయణం కూడా కొంత భాగం రాశాడు అసలుకవి భాస్కరుడికి రుద్రా దేవుడు శిష్యుడు .దీన్ని బట్టి రెండవ ప్రతాప రుద్రా చక్ర వర్తి సంస్కృతం లోను తెలుగులోనూ కవిత్వం రాశాడని అర్ధమవుతోంది .

యయాతి చరిత్ర నాటకం లో ఏడు అమ్కాలున్నాయి .ఇది భారత కదా .యయాతి రాజు తన భార్య దేవా యాని దగ్గర దాసిగా ఉన్న వృష పర్వ రాజు కూతురైన శర్మిష్ట ను ప్రేమించి పెళ్లి చేసుకొనే కధ.ఏరకమైన మార్పులూ లేకుండా ప్రతాప రుద్రరాజు నాటకం రాశాడు .చకని సంవిధానం తో నాటకం రాశాడు నాటకం పై హర్ష దేవా ,కాళిదాసుల ప్రభావం ఉంది .సరళమైన కవిత్వం లో నాటకాన్ని తీర్చి దిద్దాడు .అప్పయ్య దీక్షితులు ఇందులోని శ్లోకాలను ఉదాహరించాడు .పొన్నగంటి తెలగానార్యుడు ఆంధ్రీకరించాడు .

62-సంగీత సాహిత్యాలలో కూడా రాజు –సింగ భూపాలుడు

సింగ భూపాలరాజు  రాచకొండ ప్రభువు అనపోతనాయకుని కుమారుడు .రెండవ సింగ భూపాలుడు అంటారు .1386-1412కాలం లో రాజ్య పాలన చేశాడు .’

సింగ రాజీయం

సింగ భూపాలుడు ‘’ రసార్నవ సుధాకరం ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధాన్ని రాశాడు .సంగీత రత్నాకరం అనే సంగీత శాస్త్ర గ్రంధానికి ‘’సుధాకరం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాశాడు .రాజు గొప్ప సంగీత ,సాహిత్య ప్రియుడు .ఈయన ఆస్థానం లో చమత్కార చంద్రిక రాసిన విశ్వేశ్వర కవి ఉండేవాడు .కవి,పండిత పోశషకుడే కాక స్వయానా కవి సింగ భూపాలుడు .నాటక రచయితా కూడా .కువలయావలి  అనే నాలుగు అంకాల నాటకం రాశాడు దీనికే రత్న పాంచాలిక అనే పేరు కూడా ఉంది .శ్రీ కృష్ణుడు కువలయా వలి అనే లలనా మణిని వివాహమాడటం ఇతి వృత్తం .రాచకొండ ప్రసన్న గోపాల స్వామి ఆలయ వసంతోత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కాలం 1386-1412

 

బ్రహ్మ దేవుని ఆదేశానుసారం కువలయావాలి అనే అమ్మాయి భూమి మీద పుడుతుంది .ఆమె పెంపుడు తండ్రి నారదుడు .తగిన వరుడికోసం వెతుకుతూ ఉన్నట్లు నటిస్తూ ద్వారక లో రుక్మిణీ దేవి సంరక్షణ లో ఉంచుతాడు .ఆమెకు నారదుడు ఒక ఉంగరాన్నిస్తాడు .దాన్ని ధరిస్తే మగవారికి ‘’రత్న పాంచాలిక ‘’గా కనిపిస్తుంది .ఒక సారి ఆమె ఉద్యాన వనం లో క్రీదిస్తుంటే నారదుడు ఇచ్చిన ఉంగరం జారి ఎక్కడో పడిపోతుంది .శ్రీకృష్ణుడు ఆ సమయం లో వచ్చి ఆమెను చూసి ఉంగరం వెతికి అందజేస్తాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .విషయం సత్య భామకు తెలిసి పోతుంది .ఆమె రుక్మిణికి చెబితే కువలయావలిని రుక్మిణి దాచేస్తుంది .ఒక రాక్షసుడు ఆమెను ఎత్తుకు పోతాడు .ఆమెను రక్షించమని కృష్ణుని రుక్మిణి కోరుతుంది .ఇంతలో నారదుడు వచ్చి బ్రహం ఆదేశం తెలియ జేస్తాడు .కువలయావలిని శ్రీకృష్ణుడికి ఇచ్చి రుక్మిణి పెళ్లి చేస్తుంది .ఈ నాటకం పై స్వప్న వాసవ దత్త మాలవికాగ్ని మిత్ర నాటకాల  ప్రభావం కనిపిస్తుంది .

రసార్నవ సుధాకరం కు ఆంగ్లం లో అమెరికాలోని టొరంటో యూని వర్సిటి సంస్కృత పోఫేసర్ శ్రీ టి వేంకటాచార్య మంచి వ్యాఖ్యానం రాశారు .ఇది తిరువనతపురం సంస్కృత లైబ్రరీలో లభ్యం .

63-సాహితీ సమరాంగణ సార్వ భౌముడు –శ్రీ కృష్ణ దేవ రాయలు

విజయనగర రాజులలో ప్రసిద్ధుడు శ్రీకృష్ణ దేవరాయలు స్వయానకవి కాక కవిపోషకుడు .భువన విజయం లో కవి పండిత గోష్టి నిర్వహించేవాడు 1509-1529కాలం .విక్రమాదిత్య  హర్ష వర్ధన భోజ రాజులతో సమానుడై ఆంద్ర భోజ బిరుదు పొందాడు .ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని ఆంద్ర నాయకుడి దెవాలయమైన శ్రీకాకుళం లో శ్రీకారం చుట్టాడు .

ఆంద్ర భోజ రాజీయం

కృష్ణ దేవరాయలు సంస్కృతం లోను గొప్ప పండితుదేకాక మహా కవి అనిపించుకొన్నాడు .మదాలస చరిత్ర ,సత్య వధూ ప్రీణనం ,సకల కదా సార సంగ్రహం ,పురాణ కదా సంగ్రహం రాశాడు .జాంబవతీ కల్యాణం అనే సంస్కృత నాటకాన్ని రాయలు రాశాడు .దీనికి ప్రేరణ గురువైన వ్యాస తీర్ధుల వారు .ఇది అయిదు అంకాల నాటకం .ఇది శ్యమంతక మని కద.శ్రీ కృష్ణుడు జాంబవతి దగ్గరనుండి శ్యమంతక మణిని ఆమె తండ్రి జాంబవంతుని నుండి జాంబవతిని పొందటమే కద.శాకుంతల నాటక పోలికలు ఎక్కువ .హంపీ లోని విరూపాక్ష దేవాలయం లో వసంతోత్సవాలలో చాలా సార్లు ప్రదర్శింప బడిన నాటకం ఇది .

64-   అన్యాప దేశ కవితా  నిష్ణాతుడు – భల్లట కవి

కాశ్మీర దేశీయుడైన ఈ కవి  883-902కాలం లోరాజు శంకర వర్మ ఆస్థానం లో  ఉన్నాడు .’’భల్లట శతకం ‘’రాశాడు నీటి ధర్మ బోధనా ఇందులో ఉన్నాయి .అనేక వృత్తాలను ప్రయోగించాడు .భల్లాట శతకం బాగా ప్రాచుర్యం పొందింది .దీన్ని ముమ్మటుడు ఆనంద వర్ధనుడు ఉదాహరించారు .750ప్రాంతం వాడి ఉండాలి

.                                కవిత్వ భల్లటీయం

ధ్వని ప్రధాన కవిత్వం చెప్పాడు .ప్రసాద మాధుర్యం తో వైదర్భీ రీతిలో ఉంటుంది .కాలిదాస ,భారవి మాఘ చొర ,భావ భూతి మురారి మొదలైన గొప్ప కవుల స్థాయి కి చెందినవాడు భాల్లతుడు .

‘’శ్రీ దండీ దిమ్దిమాఖ్యః శృతి ముకుట గురుర్భాల్ల టో భట్ట బాణః-ఖ్యాతాశ్చాన్యే సుబంద్ధ్వాదయ ఇహ కృతి భిర్విశ్వ మాహ్లాదయంతి ‘’

ఏ విషయాన్నైనా సూటిగా మనొ హరం గా చెప్పాడు అందుకే లోక ప్రియ కావ్యం గా గుర్తింపు పొందింది .మచ్చుకి ఒకటి

‘’పరార్దేయః పీడామను భవతి  భంగే పి మధురో –యదీయో సర్వేషా మిహ ఖాలు వికారో ప్యాభిమతః

న సంప్రాప్తో వ్రుదిం యదిస భ్రుశమ క్షేత్ర పతితః –కిమిక్షోర్దోషో యం న పునర గుణాయామ మరు భువః ‘’ఇది అప్రస్తుత ప్రశంస .విరహం తో ఉన్న నాయిక బాధ –

‘’వాతా వాంతు కదంబ రేణు వాహలా నృత్యంతుసర్పద్విషః-సోత్సాహ నవ తోయ దాన గురవో ముంచంతు నాదం ఘనాః

మగ్నాం  కాంత వియోగ దుఃఖ దహనే మాం వీక్ష్య దీనానాం –విద్యుత్ భో స్పురపి త్వమస్య  కరుణే స్త్రీ త్ప్రేపి తుల్యే సతిః’’దీని భావం –వాయువు ,మయూరుడు మేఘాలు ,పుంలింగాలు కా బట్టి నిర్దయ తో నన్ను బాధ పెడుతున్నాయి .ఎంతయినా మగాళ్ళు మగాళ్ళే కదా .ఓ దామినీ నీవు స్త్రీ అయి ఉండికూడా ఎందుకు ఇంత నిర్దయ చూపిస్తున్నావో అర్ధం కావటం లేదు .

అన్యాపదేశ శైలిలో భాల్లటుడు శతకం  రాశాడు .ఇందులో నూట ఎనిమిది శ్లోకాలున్నాయి .వ్యంగ్యవైభవం ఇందులో పూర్తిగా ఉంటుంది .రాజు శంకర వర్మ క్రూరుడై నియంతగా మారుతాడు .అధిక పన్నులు వేసి ప్రజల్ని పీడిస్తాడు .దీన్ని చూడలేక బాధ పడుతాడు భల్లటుడు. అతని జీవనాదారమూ పోయింది .బీదరికం ఆవరించింది .లావట్టుడుఅనే కూలివాడి జీతం రెండు వందల దీనార్లు .తన దీన స్థితిని గురించి గాలిని అన్యాపదేశం గా నిందిస్తూ శ్లోకం చెప్పాడు .’’ఒ గాలీ !ఎందుకు ఈ రకమైన ప్రవర్తన ?కాలికింద ధూళిని ఎగరేసి ఆకాశానికి తీసుకొని వెడతావు .ఎన్ని అడ్డంకులున్నా అధిగమిస్తావు .కాని ఆ దుమ్ము తో నీఒళ్ళు దుమ్ముకొట్టుకు పోయిందని తెలుసుకోలేక పోతున్నావు ‘’అంటాడు .

రాజు క్రూరత్వాన్ని అడవి వేటకాడు లతో అన్యోక్తిగా పోల్చి చెప్పాడు ‘’ఈ ధనుస్సు చావు నోరు తెరచి నట్లు ఉంది .బాణాలు విషం తో ఉన్నాయి .అర్జున పరాక్రమం  కంటే ఎక్కువగా ఉంది .ఈ పువ్వు లోపల విషం చిమ్ముతూ బయటికి వెకిలి నవ్వు తూపాడుతోంది .అడవిజంతువులన్నీ పారిపోతాయేమో?’’.

మరోకవితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
వాక్యం సరిగా లేదు
‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
ఈ వాక్యమూ సరిగా లేదు
‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
వాక్యమిపుడు సరిగ్గా వుంది
వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు
వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు
ఎవరి సందర్భాలు వారివి!
కానీ వాక్యం సరిగ్గానే వుంది
‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’
ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ఆత్మహత్య చేసుకున్న
రైతు మట్టి దేహమ్మీది నుంచి నేల మీదికి
రాలిపడ్డ వాక్యమది! సరిగ్గానే వుంది!
——-
బతుకు పండగనాడు తీరుతీరు పూలను పేర్చి
తలకెత్తుకుంటున్నాం- ట్యాంక్‌బండ్‌ సాక్షిగా సంబరమే!
కానీ యుగాలుగా రైతు పొలాల్ని
తలకెత్తుకునే వున్నాడని మనకు తెలుసా
అతన్ని మనం తలకెత్తుకోవడం లేదు సరికదా
తన పొలమ్మీద తననే బతకనివ్వడం లేదు
మనం సంబరాల్లో మునిగిపోయి అతని సాగును
మరిచాం, ఉనికిని మరిచాం
నీరందివ్వక వెల్తురునివ్వక నేల బతుకు నుంచి
అతన్ని వెలేసాం – నేల మిగలక గాల్లోకి లేచి
అతను ట్రాన్స్‌ఫార్మర్‌ మీద ప్రాణం తీసుకున్నాడు
చావు నిరసనలోనూ అతను అన్వయాన్నే
పాటించాడని మన తలకెక్కుతున్నదా
సంతాపం ప్రకటిస్తున్న ఈ నేలమీద
వేలాడుతున్న మట్టిమనిషి శవం ముందు
ఇపుడు ఏ తలల్తో నిలబడతాం మనం?
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూనిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. 
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి.

పెంటమ్మ గుడిసె బయట తూర్పుముఖంగా నిలుచుండి ఎర్రని రూపు దాలుస్తున్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తున్నది. దస్తగీర్‌ రెండు చేతుల్లో రెండు గ్లాసులు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి, పెంటమ్మ వైపు మళ్లే వరకు సూర్యుని కాంతితో ఆమె ముఖం ఇంద్రధనుస్సు రంగులతో మిళితమైనట్టు కనిపించింది. ముగ్ధుడై చూస్తూ టీ గ్లాసును ‘‘ఇగో చాయ్‌, చాయ్‌’’ అని అందించాడు…

పెంటమ్మ తెప్పరిల్లినట్టు దస్తగీర్‌ వైపు మళ్లింది. బిడియంతో నేలకు వంగి గ్లాసును అందుకుంది. తలను వంచే టీ గుటక వేసింది. ఆమెను తీక్షణంగా చూస్తూ దస్తగీర్‌ కూడా ఆమె గుటకలకు తన గుటకలు మేళవించి టీ తాగాడు.
….

ఒక ప్రేమకథను మలుపుతిప్పిన సన్నివేశం అది.
యవ్వనం, భద్రజీవితం, కాల్పనిక ఆవేశం, మోహాతురత – వీటి నడుమ పుట్టిన నడిమితరగతి ప్రణయగాథ కాదది.
చరిత్ర ధ్వంసరచనలో ఆశోపహతులైన ఇద్దరు నిరుపేద నడివయస్కుల బతికిన క్షణాలు అవి.
ఆరుదశాబ్దాల కిందట ప్రచురితమైన ‘రాజకీయ బాధితులు’ కథలోని ఒక సందర్భం అది.
రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి.
తెలంగాణ సంక్షుభిత కాలాన్ని అక్షరాలలోకి అనువదించిన అసామాన్య కథానవలా రచయిత.
ప్రజల మనిషి.
నేటి తరం పాఠకులకు అందు బాటులో లేని ఈ రచన గురించి వ్యాఖ్యానించే ముందు ఇందులోని కథను రేఖామాత్రంగా అయినా పరిచయం చేయడం న్యాయం.
పెంటమ్మ, దస్తగీర్‌- ఈ ఇద్దరూ ఈ కథలో నాయికా నాయకులు.
ఇద్దరూ దళితులు. దస్తగీర్‌ దళిత ముస్లిమ్‌.
ఆమెకు ముప్పయ్యైదేళ్లు, అతనికి నలభై అయిదు.
పెంటమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు. దస్తగీర్‌ ఒక మోటారుషెడ్‌లో పనివాడు, కాపలాదారు.
వారిద్దరికి హైదరాబాదు వీధుల్లో తెల్లవారుజామున ముసి ముసి చీకట్లలో పరిచయం అయింది. ‘పొగమాదిరి కమ్మిన’ మంచులో వెచ్చదనం కోసం చుట్టవెలిగించుకోవాలనుకున్న పెంటమ్మకు దస్తగీర్‌ గుడిసె కంతలో దీపం వెలుతురు కనిపించింది.
నిప్పు కోసం వెడితె ఆమెకు దస్తగీర్‌ చాయ్‌ ఇచ్చాడు.
‘నీ పని అయిపోయినాక బువ్వకిక్కడికే రారాదు!..’ అని దస్త గీర్‌ ఆహ్వానించాడు. కుదరదని ఖండితంగా చెప్పింది పెంటమ్మ.
ఆ సాయంత్రం దస్తగీర్‌ కాపుకాసి ఆమెను మళ్లీ వీధిలో ఊడుస్తున్నప్పుడే కలిశాడు.
రెండు వేరుశెనగ పొట్లాలు కొని అతనికి ఒకటి ఇచ్చింది పెంటమ్మ.
రెండు పొట్లాలు కలిపేశాడు దస్తగీర్‌.
చాయ్‌వాడు వస్తే రెండు టీలు తీసుకున్నారు.
పైసలుపెంటమ్మే ఇచ్చింది.
వాళ్లిద్దరినీ చూస్తే టీ కుర్రాడికి ఏదో అర్థమయింది.
……..
ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయ త్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామాలలో భాగమైనవాళ్లు, తెలంగాణ నేల స్రవించిన నెత్తుటి ఆనవాళ్లు వాళ్లు. వాళ్లలో ఒకరు కమ్యూ నిస్టు యోధుని సహచరి. మరొకరు మతమార్పిడి చేసుకుని రజాకార్లలో తిరిగినవాడు. భర్త సజీవుడో కాదో ఆమెకు తెలియదు. భార్యాపిల్లలను చంపేశారని అతనికి తెలుసు.
ఈ కథా కాలం 1955 ప్రాంతం. అప్పటికి హైదరాబాద్‌ పై సైనిక చర్య జరిగి ఏడేళ్లు. తెలంగాణ సాయుధ పోరాటం అధికారికంగా విరమించి నాలుగేళ్లు. రచయిత కథాకాలాన్ని, నేపథ్యకాలాల్ని ఎంతో ఖచ్చితంగా పాటించారు. పెంటమ్మ ఫ్లాష్‌ బ్యాక్‌ ప్రకారం ఆమె భర్త కోటయ్యరాఘవాపురంలో దొర తోట మాలిగా పనిచేసినవాడు. మాటకారీ, దళితవాడలో పెద్దమనిషీ కావడం వల్ల కమ్యూనిస్టుపార్టీ స్పర్శ ఆ ఊరికి సోకగానే ప్రథమ కార్యకర్తగా మారినవాడు. దొరదగ్గరి పనికిరాని తుపాకీని మర మ్మత్తు చేయించుకుని సాయుధుడయ్యాడు. దొరమీదకే దాన్ని గురిపెట్టాడు. కమ్యూనిస్టుగా మొదట రజాకార్లను, తరువాత కాంగ్రెస్‌ వాండ్లను, మిలటరీని, పోలీసులను కూడా వేటాడాడు. కమ్యూనిస్టు పార్టీ పోరాటం మానుకున్నా కోటయ్య మాత్రం మానుకోలేదట. అందుకని పార్టీ వాండ్లు అతన్ని వెలివేశారు. అప్పుడు పార్టీ వాండ్లపైనా అతను కన్నెర్ర చేశాడట. ఏకాకిగా ఎన్నో అవస్థలు పడ్డాడట. బహుకష్టంగా ప్రభుత్వానికి చిక్కాడు. ఆ తరువాత అతని ఆచూకీ లేదు. అతను బతికిందీ చచ్చిందీ గట్టిగా చెప్పగలవారెవరూ లేరు. పెంటమ్మ కోటయ్యకు అన్ని విధాల చేదోడు వాదోడుగా పనిచేసింది. కానీ, ఆమెకు కోటయ్య పార్టీని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయింది. కోటయ్య పట్టుబడ్డాక ఎవరినుంచి సానుభూతీ సహకారం దొరకక, ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిలో కుది రింది. కానీ యూనియన్‌ వాండ్లకు కూడా తన వివరాలు చెప్ప లేదు. మహానగరంలో తనను తాను కాపాడుకుంటూ ఎట్లాగో నెట్టుకువస్తున్నది. ఇదంతా జరిగి మూడేండ్లపైన అయింది.
రామయ్య అనే దళితుడు పదిహేడేండ్ల కిందట మతం మారి దస్తగీర్‌ అయ్యాడు. దళితులను మతమార్పిడి చేసే కార్యక్రమం 1937-40 ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. ‘ప్రజల మనిషి’ నవలలో దాని విశేషాలను గమనించవచ్చు. అట్లా మారినవారు, అనేకమంది తిరిగి ఆర్యసమాజం శుద్ధి స్వీకరించి వెనుకకు వచ్చారు కానీ, కొందరు కొనసాగారు కూడా. అట్లా కొనసాగిన వాడు దస్తగీర్‌. అంతే కాదు, రజాకార్‌గా మారి, వారి కార్యకలా పాల్లో పాలుపంచుకున్నాడు. పెంటమ్మతో పరిచయం అయిన రోజున అతనికి తనగతం గుర్తుకు వచ్చింది. పెంటమ్మ ముఖం కడుక్కుంటుంటే, రెండు మూడు సార్లు గుడిసెలోంచి తొంగి చూచి, తన్మయత్వంలో మునిగితేలాడు. ‘‘….ఒకసారి శిలాప్రతిమ వలె నిలుచుండి తన్ను తానే మరచి ఆలోచించసాగాడు. అకస్మా త్తుగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లలో పోలీసు ఏక్షన్‌ రోజుల్లో పల్లెటూరిలో అతని ఇంటిపై దాడి జరిగి తన భార్య, పిల్లలు హత్య చేయబడడం గురించి, విన్న వివరాల ప్రకారం దృశ్యాలు తాండవించాయి. ఆనాడే ఆ సంఘటన జరిగినంత తల్లడిల్లాడు. పచ్చిగాయం మీద బలమైన ఇంకొక గాయం తగిలినంత వణికి పోయాడు. తాను రజాకారుగా చేసిన హత్యలు, గృహదహనాలు, మానభంగాలు పాపాన్ని కన్నీటిబొట్లతో కడిగి వేస్తున్నాడు…’’

వీళ్లిద్దరిని కథకుడు హైదరాబాద్‌లో ఎందుకు కలిపాడు? ఇద్దరి మధ్య ఏ సారూప్యం ఉన్నది? ఇద్దరూ రాజకీయ బాధితులు కావడమే కారణమా? అసలు వీరిని రాజకీయ బాధి తులు అనడం సరిఅయినదేనా?- ఈ ప్రశ్నలకు పూర్తి సమా ధానాలు కథలో దొరకవు. రెండు దళిత పాత్రలనుంచే ఎందుకు తీసుకున్నాడు? – ముస్లిమును ముస్లిముగానే తీసుకుని ఉండ వచ్చును గదా? గోపీచంద్‌ ‘గతించని గతం’లో బతుకమ్మ ఆడుతున్న సీ్త్ర మీద అత్యాచారంచేసిన ముస్లిం, పోలీసు యాక్షన్‌ వేళ పాకిస్థాన్‌కు పారిపోయి, ఏడేళ్ల తరువాత తిరిగివచ్చి పశ్చాత్తాప పడడం కథ. అది కేవలం రజాకార్‌ అత్యాచారాన్ని, బాధితురాలు బేలగా తనమీద దాడిచేసినవాడి కోసం ఎదురు చూడడాన్ని, ఆమె దయనీయస్థితి చూసి దుండగుడే పశ్చాత్తాప పడడాన్ని కథకుడు మూసవిలువల నేపథ్యంలోనే చిత్రించాడు. ఇక్కడ ఆళ్వారుస్వామి, రజాకార్‌గా మారిన దళితుడిని పాత్రగా తీసుకున్నాడు. దస్తగీర్‌ అయినా, పెంటమ్మ భర్త కోటయ్య అయినా – భూస్వామ్యపీడన నుంచి విముక్తి కావడానికే ఆయా రాజకీయ పాత్రలను స్వీకరించారు. తెలంగాణ గ్రామాల్లో మత మార్పిడి కోసం ముస్లిమ్‌ మతతత్వ సంస్థ ఉద్యమం చేపట్టి నప్పుడు- వారు దళితులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూస్వా ముల నుంచి పడుతున్న కష్టాలను మతమార్పిడి తొలగి స్తుందన్న భ్రమ కల్పించారు. దస్తగీర్‌ ఏ మార్గాన్ని ఎంచు కున్నప్పటికీ, అతని ఉద్దేశ్యం మాత్రం దోపిడి నుంచి బయట పడడమే. మతమార్పిడి చెందిన దస్తగీర్‌ యథాలాపంగా ఉండి పోలేదు.
నిష్ఠ కలిగిన ముస్లిమ్‌గా మారాడు. ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ చేసిన రాజకీయ ప్రబోధాలను విశ్వసించి రజాకార్‌గా మారాడు. తెలంగాణలో రజాకార్లు చేసిన పనులన్నిటిలోను భాగస్వామి అయ్యాడు. ఫలితంగా, పోలీసుచర్య సందర్భంగా జరిగిన పౌరదాడుల్లో తన భార్యాపిల్లలను పోగొట్టుకున్నాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యం కానీ, ఉదార లౌకికవాదులైన కాంగ్రెస్‌ ప్రాబల్యం కానీ ఉన్నచోట్ల ముస్లిములపై ప్రతీకార దాడులు జరగకుండా నిరోధించగలిగారు కానీ, ఇతర ప్రాంతాల్లో హింసా త్మకమైన చర్యలు జరిగాయి. అందుకు దస్తగీర్‌ కుటుంబంలోని అమాయకులైన సీ్త్రలు, పిల్లలు మరణించడమే రచయిత చూపిన నిదర్శనం. తనకు కలిగిన నష్టం నుంచి, తాను చేసిన పనులను దస్తగీర్‌ బేరీజువేసుకుని దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని కలగలిపి బాధపడ్డాడు. గ్రామంలో ఏమి జరిగిందో వినడమే తప్ప, అతను గ్రామానికి వెళ్లలేదని, హైదరాబాద్‌లో బతుకు ఈడుస్తున్నాడని కథాక్రమంలో మనకు అర్థమవుతుంది. ఈ ఏడేళ్ల కాలం అతను కష్టజీవిగానే గడిపాడు. పెంటమ్మతో అతను వ్యవహరించిన తీరులో ఎంతో సంస్కారం, పరిణతి కనిపిస్తాయి. అతనికి సంక్రమించిన జీవితం- అతన్ని ఒక మౌన పశ్చాత్తప్తునిగా మార్చివేశాయి. పెంటమ్మ కలిసిన రోజు శుక్రవారం. ఆరోజు అతను కొంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అట్లా అనుకోవడంలో ఒక వెలితి, దైన్యం కనిపిస్తాయి.

పెంటమ్మ కోటయ్య వంటి సాయుధయోధుడికి, ప్రజా నాయకుడి భార్యగా ఉండడంలోనే అనేక కొత్త సంస్కారాలు అలవరచుకుంటుంది. ఒకరికి తోడుగా ఉండగలిగిన గుణమూ, ఒంటరిగా నిభాయించుకోగలిగిన నిబ్బరమూ రెండూ ఆమెకు ఉంటాయి. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఒంటరి మహిళగా తనకు ఎదురైన అనుభవాలనన్నిటినీ ఒక విద్యార్థిగా ఆమె విశ్లేషించుకుంటుంది. తనకు దగ్గర కావడానికి ప్రయత్నించే పురుషులలోని స్వార్థాన్ని ఆమె గుర్తించగలదు. దస్తగీర్‌ విషయంలో కూడా ఆమె ఆ స్వార్థాన్ని పసిగట్టింది కానీ, అతని ప్రయత్నంలోని హుందాతనాన్ని గౌరవించింది. భర్త ఉన్నాడో లేదో తెలియనితనం నుంచి, పోయాడులే అని నిర్ధారణకు వస్తున్న క్రమంలో ఉన్నదామె. (జైలులో లేకుండా, బయట లేకుండా అదాలతులో మొఖద్దుమా లేక ఏమై ఉంటాడు? హృదయంలో ఒక ప్రశ్న బయలుదేరింది. ఆ విధంగా నామ రూపాలు లేకుండా మాయమైన వారు ఎందరు లేరు? వారిలో కోటయ్య కూడా ఎందుకు చేరగూడదు? ప్రజల బలం గాని, పార్టీ సానుభూతి గాని లేని కోటయ్యను ఎవరు ఏమి చేసినా అడిగేవారెవరు? ఎవరూ లేరు. కాబట్టి తప్పకుండా చచ్చి ఉండాలి..) అప్పుడు దస్తగీర్‌ పరిచయం ఆమెలో కదలిక కలిగించింది.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తమ గత జీవితాలను చెప్పుకున్నారా? రచయిత అట్లా ఎక్కడా చెప్పలేదు. కానీ, దస్తగీర్‌ రూపురేఖలను తలచుకుంటూ పెంటమ్మ అనుకున్న మాటలు ఆమె గ్రహింపు శక్తిని సూచిస్తున్నాయి. ‘‘.. అతడు అందగానిలో లెక్క కాదు. పిల్లి గడ్డం, స్ఫోటకపు మచ్చలతో చెదలు పట్టినట్లున్న ముఖం, పట్టుదలతో నమాజు చేస్తున్నందుకు గుర్తుగా నుదుటి మీది రూపాయి కంటె పెద్ద నల్లని మచ్చా, పోలీస్‌యాక్షన్‌ రోజుల్లో మిలటరీ తుపాకీ దెబ్బకు ఎగిరిపోగా మిగిలిన చెవ్వు, మిలటరీ క్యాంపులో తిన్న దెబ్బలకు వంకరలు తిరిగిన వేళ్లు…’’ అదీ దస్తగీర్‌ రూపం. బహుశా, తెలంగాణలో అణగారిన ప్రజలు ప్రతి ఒక్కరి ఒంటి మీదా, జీవితం మీదా నాటి కాలం కొన్ని గుర్తులు వేసింది. బాధితుల మధ్య కలిగే సహజమైన మమత్వం ఏదోవారిద్దరినీ దగ్గర చేసి ఉండాలి. యుద్ధరంగం ఎన్ని మరణాలను వెదజల్లినా, ఎప్పుడో ఒకప్పుడు జీవితం తిరిగి మొలకెత్తవలసిందే.
తెలంగాణ సాయుధపోరాటం, పోలీసు యాక్షన్‌- భారతదేశ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు. దేశవిభజన కాలం నాటి పరిణామాలతో పరోక్షంగా సంబంధం ఉన్న పరిణామాలు. అంతర్జాతీయంగా, రెండో ప్రపంచయుద్ధపు ముగింపు, చైనాలో విజయానికి చేరువగా ఉండిన విప్లవం, నూతన స్వతంత్ర భారత పాలకవర్గాల జాతీయోన్మాదం-అన్నీ కలిసి నాటి సంఘటనలను రచించాయి. తాము అడుగులో అడుగు వేసి నడిచిన విశ్వాసాలు తమను వెలిగా పెడితే, లేదా తాము ఎడం జరిగితే కలిగే ఏకాకితనం పెంటమ్మ, దస్తగీర్‌లకు అదనపు కష్టం. బహుశా, ఆళ్వారుస్వామి కూడా ఈ కథారచన కాలంలో అటువంటి మనస్థ్సితిలో ఉండి ఉంటారు. అందుకే ఆయన ఈ కథకు ‘రాజకీయ బాధితులు’ అని పేరుపెట్టారు. తరువాత కొద్దిరోజులకే తన ఒంటరి సంక్షోభానికి పరిష్కారంగా తిరిగి కమ్యూనిస్టుపార్టీలో ఆయన ప్రవేశించి ఉంటారు.
తెలుగుసమాజం అనుభవించిన అత్యంత హింసాత్మక పరిణామాలకు అద్దం పట్టిన ఈ ప్రేమ కథ, తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమకథానికల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దళితపాత్రలను తీసుకుని రచయిత కథనం చేసిన తీరు, పాత్రల పట్ల ఆయన చూపించిన అపారమైన గౌరవం, సున్నితమైన సీ్త్రపురుష ఆకర్షణను వాస్తవికంగాను, గంభీరంగాను వర్ణించిన పద్ధతి, అంతర్లీనంగా కథలో ఆయన చిత్రించిన బీభత్సం- అసాధారణమైనవి. అలభ్యంగా ఉండిపోయిన ఆళ్వారు స్వామి కథల్లో ఇది ఒకానొకటి మాత్రమే. తక్కిన కథలన్నీ ఇంతటి విస్తృతినీ, ఇంతటి జీవితాన్నీ, చరిత్రనూ చిత్రించాయని కాదు కానీ, ప్రతి ఒక కథా ఒక ఆణిముత్యమే. లభ్యం కాని కథలే కాదు, దొరుకుతున్న కథలు కూడా తెలుగు పాఠకులకు తగినంతగా తెలియదు. కనీసం ఆళ్వారుస్వామి పేరైనా తరచు ప్రస్తావనకు వస్తున్న తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఆ ప్రయత్నం జరగకపోవడం ఆశ్చర్యకరం.
పుస్తకరూపం తీసుకోకుండా ‘స్రవంతి’ పత్రిక సంపుటాల్లోనే మిగిలిపోయిన ‘రాజకీయ బాధితులు’ కథతోపాటు సుమారు మరో ఇరవైకథలు ఇంకా తెలుగు పాఠకులకు కొత్తగా పరిచయం కావలసి ఉన్నాయి. ప్రగతిశీల ప్రచురణకర్తల దారుణమైన విస్మరణకు, వివక్షకు గురై ‘జైలు లోపల’కథలు కూడా ఇటీవలి దాకా పునర్ముద్రణే జరగలేదు. అముద్రిత కథలు పుస్తకరూపమే తీసుకోలేదు. కథారచయితగా ఆళ్వారుస్వామి అజ్ఞాతవాసానికి త్వరలో ముగింపు లభిస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి పరిశోధనల ద్వారా అసామాన్యమైన కృషి చేసిన సంగిశెట్టి శ్రీనివాస్‌ సేకరించిన అముద్రిత కథలతో పాటు, ఆళ్వారుస్వామి కథలన్నీ శతజయంతి సంవత్సరంలో 2015 ఫిబ్రవరి 5న ఆళ్వారుస్వామి వర్ధంతి రోజున ఆవిష్కృతం కానున్నాయి.
– కె. శ్రీనివాస్‌
(నవంబర్‌ 1న ఆళ్వారుస్వామి 99వ జయంతి, శతజయంతి ఉత్సవాల ప్రారంభం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాగంటి -కార్తీక మాస విశేషాలు

26_10_2014_002_010

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య

  • -ముదిగొండ శివప్రసాద్

శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి-
రచన: పరశురామ పంతుల లింగమూర్తి
వెల: 350/-
ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్
21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి,
మురుగేశం కాంపౌండ్- కడప

నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వీరివి దాదాపు పదకొండు ఇతర కృతులు లభ్యమవుతున్నా విషయ ప్రాధాన్యాన్నిబట్టి ఈ గ్రంథానికి విశేషప్రాచుర్యం లభించింది. దీనికి వెనె్నలకంటి సుందరరామశర్మగారు తాత్పర్యము వ్రాయగా వేదాం తం లక్ష్మయ్య సద్గురువులు విశేషార్థ వివరణ ఇచ్చారు. దీనిని ఇప్పుడు బ్రహ్మస్పర్శిని సంస్థ -(కడప)వారు ముముక్షువులకు అందించారు. ఈ కృతి సంకలనం చంద్రగిరి ఎస్.సుబ్రహ్మణ్యంగారు చేశారు. పరశురామ పంతులవారి పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఎప్పుడో వచ్చి ఓరుగల్లులో స్థిరపడ్డారు. శివుడు పార్వతికి శ్రీరామతత్వము బోధించినట్లు గ్రంథ ఉపక్రమణికలో ఉంది. సాంఖ్యము తారకము అమనస్కయోగము వేరువేరు కావని ఇందులో ప్రతిపాదించారు. నిజమునకు ఇదొక ఆధ్యాత్మిక సంగ్రహ విజ్ఞాన సర్వస్వమువలె కన్పడుతున్నది. రామపరబ్రహ్మ తత్వము అనే మిషతో అసంఖ్యాక విషయములు ఇందులో చెప్పబడ్డాయి. రాములవారు రచయితను స్వప్నసాక్షాత్కారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. శ్రీరామ పట్ట్భాషేకానంతరము ఈ సంవాదము జరిగినట్లు కవిగారు చిత్రీకరించారు. ఇందులో షట్‌చక్రములు- సత్వ అస్తేయశౌచములు స్వాధ్యాయము చతుర్విధ శుశ్రూషా వివరణమూ వంటివేగాక భిన్నభిన్న యోగాసనములు ప్రాణాయామ పద్ధతులు కూడా చేర్చబడ్డాయి. అంటే ఇందులో తత్వశాస్త్రంతోబాటు తదనుభవ సామాగ్రి ఉపాసనా విధానము అందించారని తెలుస్తున్నది.
‘‘ఘటముంవీక్షించు వాడే గతిని తాగాక వేఱైన భంగిన్
పటుదేహద్రష్టనై పరమ సుఖమయ బ్రహ్మమై నట్టినేనె
నన్నటికిన్ దృశ్యంబు మాయానగర సమమసన్నామ రూపాత్మకంబున్
కుటిలా విద్యాకృతంబాకుల దమగుతనూ కోశముంగానువయ్యా!’’
(74వ పద్యము మహాస్రగ్ధర- పుట 317.)
ఈ విధంగా రచనాశైలి సాగింది. అపరిగ్రహము అంటే అసలు తీసుకోకపోవటం అని అర్థం చెప్పుకోకూడదు. శిష్యులిస్తే తీసుకోవచ్చు. అలాగే శౌచము బ్రహ్మచర్యము వంటి పదాలకు ఇందులో కొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇదొక శాస్త్రగ్రంథము. పైగా పద్యములలో ఉంది. అందువలన కేవల మోక్ష పురుషార్థకామములకు నిర్దేశింపబడింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం

హాస్యానందాన్నిచ్చే కథలు

  • -కూర చిదంబరం

నాకొక శ్రీమతి కావాలి
హాస్య కథలు
రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు
పేజీలు: 135, వెల: రూ.120/-
కాపీలకు: రచయిత,
విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు

‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. బరువెక్కిన ‘‘మూడ్’’ తేలికవుతుంది. ‘ఈసురోమంటూ ఇరవయ్యేళ్ళకంటే, నవ్వుతూ నాలుగేళ్ళు బ్రతుకుతే చాలు’ అనుకునే రోజులివి. వైద్యరీత్యా కూడా, నవ్వు ఆరోగ్యాన్ని చేకూర్చి రోగాల్ని దూరంగా ఉంచుతుందట! అందుకే మనం ‘అంతర్జాతీయ నవ్వుల దినం’ అని లాఫింగ్ క్లబ్బులు అని పెట్టుకుని, నవ్వు కరువవుతున్న ఈ రోజుల్లో, పనిగట్టుకుని మరీ నవ్వుతున్నాము.
ఈ సంకలనంలో 24 హాస్య కథలున్నాయి. ఇవన్నీ లోగడ వేర్వేరు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఏకధాటిగా, మనం నవ్వుకునేందుకు ఇప్పుడు వీటినన్నింటినీ సంకలనంగా మన ముందుంచారు డా.రాజుగారు. బోధన వీరి వృత్తి. కనుక చెప్పదల్చుకున్న విషయాన్ని అందంగా, పఠనీయత పెంచి మన ముందుంచటం వీరికి వృత్తితో పెట్టిన విద్య.
ఆనాటి రోజుల్లో మాత్రమే కనబడే వారాలబ్బాయి గురించి (్భక్త కుంకలు) వ్రాసినా, ఈనాటి దాలిబాబు కార్ఖానాలో పనిచేస్తూ, ఆయన కూతుర్ని లేపుకువచ్చి రైలు ప్రయాణం చేస్తున్న నర్సింహులు (బంగాళాఖాతంలో వాయుగుండం) గురించి వ్రాసినా, రంభా ఊర్వశిల్లాంటి అందగత్తెలతో సరసాలు సాగిస్తున్నానని చెబుతూ జోళ్ళషాపులో ఊడ్చి కళ్ళాపి చల్లే అప్పలమ్మతో గ్రంథం నడిపించబోయే బుచ్చిబాబు (రంభతో రాం. రాం) గురించి వ్రాసినా, మనం నవ్వుకోవాల్సిందే!
ఇక చొక్కావేసుకోని, నక్కిన చొక్కారావు (శ్రీమతి వౌనవ్రతం) అడ్వకేటు, వౌనవ్రతం పట్టే ఆయన శ్రీమతి ప్రతిభాదేవి గురించి వ్రాసినా, సర్వమంగళ మెడలో తాళికట్టి ‘్భర్త వత్సలం’ అయిన భక్తవత్సలం గురించి వ్రాసినా, అద్దె భార్య ప్రమీలను కుదుర్చుకుని అవస్థలు పడే పెంటారావు అనబడే గంటారావు (అద్దె భార్య అలిగితే) గురించి వ్రాసినా మనం హాయిగా నవ్వుకోవలసిందే! ఇప్పుడు కనబడటం లేదు కాని ఆ రోజుల్లో ‘నశ్యం’ పీల్చటం ఉండేది. ముక్కుపొడుం (నశ్యం) పీల్చే లంబోదరం లాంటి వేలువిడిచిన బంధువులు, (బేలు బిడిచిన బందుబు) అధ్యాపక వృత్తిలో తరుచూ తారసపడేవారు, వీళ్ళంతా మన నిత్య జీవితంలోని పాత్రలే! వీరితో నవ్వులపువ్వులు పూయించారు రాజుగారు.
వీరి కథల్లో ‘‘పన్’’ (-ఖశ) ఉంది. ‘‘పంచ్’’ ఉంది. అయితే సంకలనంలోని అన్ని కథల్లోనూ ఇవి ‘యూనివర్సల్’గా కానరావు. ఒక్కో కథలో ‘స్మైల్ ప్లీజ్. నవ్వండి’అని అంటున్నట్లవుపిస్తుంది. ‘కంటిన్యుటీ’ కనిపించక, ఘఇఖఔఆ గా కథ ముగించినట్లనుపిస్తుంది.
‘బ్నిం’ (బి.నరసింహమూర్తి) గారి ముఖ చిత్రంలో మనం బోలెడంత మంది నిన్నా, నేటి సినిమా తారలను చూసుకోవచ్చు. గృహస్తు అవాలని, శ్రీమతి కావాలని కలలుగనే లంబోదరమూర్తికి శ్రీమతి దొరకటం ‘అందని ద్రాక్ష’ కాగూడదని, త్వరలోనే పెళ్ళవుతుందని ఆ పెళ్ళి విశేషాలు, ఆ తర్వాతి కబుర్లు, ముందుముందు డా.మంతెన సూర్యనారాయణరాజు మనకందిస్తారని ఆశిద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా మారాయి. అరచేతిలో ఉండే మొబైల్‌లోనే అతిపెద్ద దుకాణ సముదాయాలను కలియజూసిన అనుభూతి పొందుతూ నేడు చాలామంది ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. పలురకాల వస్తువులు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉండడం, భారీ రాయితీలు, నగదు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, మనం కోరుకున్న వస్తువులు అదే రోజు ఇంటికి చేరడం.. ఇలా ఎనె్నన్నో అనుకూల అంశాలు వినియోగదారుల్లో ‘ఆన్‌లైన్ షాపింగ్’ పట్ల మక్కువను పెంచుతున్నాయి. ఇదో ప్రభంజనం… ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లు భారత ఆన్‌లైన్ రంగంలో తాజాగా సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. ఇంటర్నెట్‌తో ‘టచ్’ ఉన్నవారిలో అధిక సంఖ్యాకులు ఈ నెల 6న ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్‌ను ఏదో ఒక వస్తువు కోసం ‘క్లిక్’ చేశారంటే అందులో అతిశయోక్తి లేదు. ‘ఆన్‌లైన్ బూమ్’ను పండగల సీజన్‌లో క్యాష్ చేసుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు నిమగ్నమై పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఊహించని డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, కచ్చిత బహుమతులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు వెల్లువెత్తడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాస్తవానికి మన దేశంలో ఈ ఏడాది దసరాకు ముందునుంచే ఇ-కామర్స్ సంస్థల జోరు మొదలైంది. ఇదే నెలలో దీపావళి తోడవడంతో ఆ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లకు యథాశక్తిన వల వేశాయి. పదునెక్కిన ప్రచార వ్యూహాలు, పోటాపోటీ ఆఫర్ల నేపథ్యంలో వినియోగదారులు ఈ వెబ్‌సైట్లను ‘క్లిక్’మనిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరికొత్త డిజైన్లు, విదేశీ ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. పది గంటల్లో రూ. 610 కోట్ల విక్రయాలు..! ‘గతంలో ఎన్నడూ చూడని భారీ రాయితీలు.. ఇరవై నాలుగు గంటల పాటు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అరుదైన అద్భుత అవకాశం..’- అంటూ భారీ ప్రచారంతో కస్టమర్లను తెగ ఊరించిన ‘్ఫ్లప్‌కార్ట్’ ఈ నెల 6న ‘ది బిగ్ బిలియన్ డే’ పేరిట ఆన్‌లైన్ వ్యాపారంలో పెను సంచలనం సృష్టించింది. అన్ని రకాల ఉత్పత్తులపై ఎనభై శాతం వరకూ తగ్గింపు ధరలంటూ రెండు వారాల ముందు నుంచీ వివిధ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా కస్టమర్ల నుంచి స్పందన వెల్లువెత్తింది. కొద్ది గంటల్లోనే తమ వెబ్‌సైట్‌కు వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సగం వ్యవధిలోనే ‘్ఫ్లప్‌కార్ట్’ సంస్థ భారీ సేల్‌కు తెరదించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రత్యేక ఆఫర్లతో ఆర్డర్లు స్వీకరించగా కేవలం పది గంటల వ్యవధిలోనే వంద మిలియన్ డాలర్ల ( 610 కోట్ల రూపాయలు) మేరకు విక్రయాలను సాధించినట్లు ఆ సంస్థ గొప్పగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో నాణ్యమైన ఉత్పత్తులను భారీ రాయితీలపై విక్రయించడంతో స్పందన అనూహ్యంగా ఉందని స్పష్టమైనట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రతినిధులు చెప్పుకున్నారు. ఇ-కామర్స్ చరిత్రలోనే ‘బిగ్ బిలియన్ డే’ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు అభివర్ణించారు. విమర్శలూ అధికమే… ‘బిగ్ బిలియన్ డే’ పేరిట ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహించిన సేల్స్ స్కీమ్‌లో కొనుగోళ్లకు కస్టమర్లు ఎంత భారీగా స్పందించారో అదే స్థాయిలో విమర్శలూ చోటు చేసుకున్నాయి. మొబైల్ ఫోన్లు, పలురకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు నాణేలు, ఇతరత్రా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో కస్టమర్లు ఆర్డర్లు చేసేందుకు ఎగబడ్డారు. అసలు ధరలో పదోవంతుకే కొన్ని వస్తువులు ఇస్తామంటూ ఊదరగొట్టడంతో ఈ ఆన్‌లైన్ సైట్ ఎంతోమందికి లభించని పరిస్థితి ఏర్పడింది. తాము కోరుకున్న ఉత్పత్తులకు ఆర్డర్లు ఇస్తే తీసుకోలేదని, కొన్ని సందర్భాల్లో ‘క్లిక్’లు తప్పుడు పేజీలకు వెళ్లాయని సామాజిక మాధ్యమంలో కస్టమర్లు ఆరోపించారు. సర్వర్ ‘క్రాష్’ అయిందని చెప్పడమే గాక, తప్పుదోవ పట్టించే ధరలతో మోసగించారని కూడా విమర్శలు చెలరేగాయి. తమ వెబ్‌సైట్‌కు ‘ట్రాఫిక్’ అనూహ్యంగా ఉన్నా, సర్వర్ ‘క్రాష్’ కాలేదంటూ ‘్ఫ్లప్‌కార్ట్’ ఇచ్చిన వివరణ వినియోగదారులకు ఊరట కలిగించలేదు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో పలు రకాల ఉత్పత్తులను సాధారణ షాపింగ్ మాల్స్‌లో కంటే తక్కువ ధరలకు విక్రయిస్తారన్న నమ్మకం జనంలో ప్రగాఢంగా ఉంది. ఈ నమ్మకంతోనే ‘బిగ్ బిలియన్ డే’ పట్ల కస్టమర్లు వేలం వెర్రిగా మొగ్గు చూపారు. ‘్ఫ్లప్‌కార్ట్’లో ప్రదర్శించిన ఉత్పత్తుల ధరలు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఇతర సంస్థల్లో కంటే అధికంగా ఉన్నాయని, అందువల్ల భారీ రాయితీలపై నిజమైన నమ్మకం కుదరలేదని కొందరు కస్టమర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ రాయితీలు చూపించేందుకు గతంలో విక్రయించిన ధర కంటే ఎక్కువగా చూపారన్న ఫిర్యాదులూ వచ్చాయి. ‘24 గంటల సేల్’ అంటూ ఘనంగా ప్రచారం చేసినా కొద్ది గంటల వ్యవధిలోనే ‘నో స్టాక్’ అని ప్రకటించడం ‘మరో దగా’ అన్నవారు కూడా లేకపోలేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ‘్ఫ్లప్‌కార్ట్’ ద్వారా విక్రయించే సరఫరాదార్లు ఆర్డర్లు నిలిపి వేయడమే ఇందుకు కారణమని కొందరు వ్యాఖ్యానించారు. అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో సాధ్యమైనంత త్వరగా సరకులను డెలివరీ ఇచ్చేందుకే కొత్త ఆర్డర్లు నిలిపివేశారన్న ఫిర్యాదులూ వినిపించాయి. ‘్ఫ్లప్‌కార్ట్’ వెబ్‌సైట్ అందుబాటులో లేనందున కొందరు కస్టమర్లు ఇతర వెబ్‌సైట్లను ఆశ్రయించక తప్పలేదు. కొద్దిమందికి డిస్టౌంట్ ధరల్లో వస్తువులు దక్కినా చాలామందికి నిరాశే మిగిలింది. ఒకే ఉత్పత్తి వివిధ సమయాల్లో వివిధ రకాల రేట్లలో దర్శనమివ్వడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ‘సారీ’.. మరోసారి ఇలా జరగదు.. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా వినియోగదారులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయామని, ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచలేక పోయామని ఇ-కామర్స్‌లో దిగ్గజమైన ‘్ఫ్లప్‌కార్ట్’ కస్టమర్లకు క్షమాపణలు చెప్పుకుంది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినపుడు పూర్తి స్థాయి సన్నాహాలతో, సమర్ధతతో ముందుకు వస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ స్పష్టం చేశారు. వంద కోట్లకు పైగా ‘హిట్స్’ రావడంతో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు సమర్ధించుకున్నారు. ‘బిగ్ బిలియన్ డే’ సందర్భంగా 20 రెట్లు అధిక ట్రాఫిక్‌ను ముందుగానే తాము అంచనా వేసి 5 వేల సర్వర్లను ఉపయోగించామని, అయినప్పటికీ కస్టమర్ల నుంచి విమర్శలు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. ఇంతటి భారీ స్పందనను ఊహించనందునే కస్టమర్లందరినీ సంతృప్తి పరచలేక పోయామని, ఇకముందు ఇలాంటి ఈవెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని ‘్ఫ్లప్‌కార్ట్’ వ్యవస్థాపకులు భరోసా ఇచ్చారు. తాము సాధ్యమైనంత వరకూ పలు రకాల ఉత్పత్తులను వేలు, లక్షల సంఖ్యలో సిద్ధం చేసినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోలేదన్నారు. సంప్రదాయ రిటైల్ వ్యాపారం వెలవెల.. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో అమ్మకాల జోరు పెరగడంతో మన దేశంలో సంప్రదాయ రిటైల్ వ్యాపారం ఇప్పటికే పలు ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు తోడు స్నాప్‌డీల్, అమెజాన్.. ఇంకా అనేకానేక ఇ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా అమ్మకాలు జరపుతున్నందున దేశీయ సంప్రదాయ రిటైల్ వ్యాపారం మనుగడపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ సంస్థల అమ్మకాల దూకుడు ఇలాగే కొనసాగితే సాధారణ దుకాణాలు, షాపింగ్ మాల్స్ పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గత అయిదారేళ్లుగా ఇ-కామర్స్ కంపెనీలు దేశీయ మార్కెట్లో పాతుకుపోయేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయడంతో ఇటీవల పరిస్థితిలో అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ దేశీయ వ్యవస్థాగత రిటైల్ వ్యాపారంతో పోలిస్తే ఆన్‌లైన్ వ్యాపార పరిమాణం చాలా తక్కువే. సంప్రదాయ రిటైల్ వ్యాపారం పరిమాణం 50 వేల కోట్ల డాలర్లు ఉంటుందని ఓ అంచనా. 2013 నాటికి ఇ-కామర్స్ వ్యాపారం విలువ 1,300 కోట్ల డాలర్లు మాత్రమే. ఇటీవలి కాలంలో ఇ-కామర్స్ వ్యాపారం అనూహ్యంగా విస్తరించడంతో రిటైల్ సంస్థలు దిగాలు పడుతున్నాయి. విదేశీ పెట్టుబడులతో… దేశ, విదేశీ పెట్టుబడి సంస్థల నుంచి ఆన్‌లైన్ సంస్థలు భారీ ఎత్తున ప్రైవేటు ఈక్విటీని సమీకరిస్తున్నాయి. దేశీయ ఇ-కామర్స్ సంస్థల్లోకి గత ఆరేళ్లలో దాదాపు 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఆన్‌లైన్ సంస్థలు అంచనాలకు అందని రీతిలో ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఈక్విటీల పేరిట సమీకరించిన డబ్బునే ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు, టర్నోవర్‌ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. నిజానికి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నా కొన్ని ఆన్‌లైన్ సంస్థలు సైతం ఆఫర్ల మాయాజాలం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఇనె్వస్టర్లు సైతం ఈ సంస్థల్లోనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఆధిపత్య పోరాటం.. దాదాపు 25 కోట్లకు పైగా ఇంటర్నెట్ కస్టమర్లు ఉన్న మన దేశంలో ఆన్‌లైన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి. అందుకే ఆఫర్లు, రాయితీల పేరుతో లక్షలాది ఉత్పత్తులను విక్రయించేందుకు ఇ-కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కస్టమర్ల ఆసక్తే ఈ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరిగే రిటైల్ అమ్మకాల్లో దసరా, దీపావళి వాటా ఎంత కాదన్నా 40 శాతం దాకా ఉంటుంది. పండగల వేళ కొనుగోళ్లకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందునే ఆన్‌లైన్ సంస్థల మధ్య ఆధిపత్య పోరాటం ఆరంభమైంది. కొన్ని రకాల ఉత్పత్తులు తమ సైట్‌లకే పరిమితమయ్యేలా ఉత్పత్తిదారులతో ఇవి ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కేవలం ప్రచారానికే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే వాటి మధ్య ఎంతటి పోటీ ఉందో అవగతమవుతుంది. ప్రస్తుతం భారత రిటైల్ మార్కెట్ 31 లక్షల కోట్లని ఓ అంచనా. ఆన్‌లైన్ మార్కెట్ వ్యాపారం ప్రస్తుతం 24 వేల కోట్లకు మించిందని, ఇది అంతకంతకూ పెరిగి 2016 నాటికి 50 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ చెబుతోంది. ‘అమెజాన్’ చూపు భారత్ పైనే… ప్రపంచ ఈ-మార్కెట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ‘అమెజాన్’ కళ్లు ఇప్పుడు భారతీయ మార్కెట్‌పై పడ్డాయి. వేలాదికోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఇక్కడి మార్కెట్‌లో కుమ్మరిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈమధ్య ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో చేసిన తమాషా ‘ఔరా’ అన్పించింది. ఆ సంస్థ ప్రకటించిన తాయిలాలు చూస్తే నిజమేనా అన్పిస్తుంది. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? అమెజాన్ 1994లో పురుడు పోసుకుంటే- ఢిల్లీ ఐఐటీలో మార్కెట్ పాఠాలు నేర్చుకున్న సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ అందులో చేరారు. వారు అమెజాన్‌లో ఉద్యోగం చేసి వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు. తరువాత 2007లో సొంతంగా ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థను 2007లో ఏర్పాటు చేశారు. సింగపూర్‌లో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వీరి వెబ్‌సైట్ భారత్‌లో అత్యధికులు సందర్శించే టాప్ టెన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఒకటి. 2008 వరకు పుస్తకాలు, చిన్నచిన్న ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలకే పరిమితమైన ఆ సంస్థ ఇటీవల తన ఆలోచనలను మార్చుకుంది. 125 కోట్ల భారతీయుల్లో 20శాతం మంది ఈ-కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారని అంచనావేసింది. ఈలోగా భారత్‌లో వేలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్ కూడా ‘సై’ అంది. ఇదిగో అప్పటి నుంచి మార్కెట్‌లో ఆయా సంస్థల ఆఫర్ల మాయాజాలం మొదలైంది. 1994లో ఈ-మార్కెట్‌లో అడుగులు వేసిన అమెజాన్ ఒక్కో దేశానికి ఒక్కో వైబ్‌సైట్ నడుపుతోంది. భవిష్యత్‌లో శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లోనూ అడుగుపెట్టబోతోంది. భారత్‌లో మింత్ర డాట్ కామ్ వంటి సంస్థలతో చేతులు కలిపిన అమెజాన్ ధాటిని తట్టుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు అంత సులువేం కాదు. ఈకామర్స్ కన్సల్టింగ్ సంస్థ గార్ట్నర్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఈ-కామర్స్ రంగంలో 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల అమ్ముడుపోతాయి. ఇప్పటి వ్యాపారం కన్నా అది 70 శాతం అధికమని చెబుతోంది. పైగా ఈ వ్యాపారం అంతా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్ వినియోగదారులతో ఎక్కువగా నడుస్తోంది. టాబ్లెట్ల ద్వారా విజిట్ చేసే వినియోగదారులది రెండోస్థానం. భారత్‌లో భవిష్యత్‌లో ఈ సాంకేతిక విప్లవం వర్థిల్లే సూచనలు ఎక్కువగా ఉండటం వల్ల మునుముందు భారీస్థాయిలోనే విక్రయాలు సాగుతాయని అంచనా. అందుకే ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, మింత్ర, అలిబాబా వంటి సంస్థలు భారతీయ మార్కెట్‌లో కాసులు గుమ్మరిస్తున్నాయి. కొత్తకొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక ఈ-మార్కెట్‌లో గెలుపెవరిదో..? * ………………………………… నియంత్రణ ఉండాల్సిందే! ఆన్‌లైన్ రిటైల్ కంపెనీల దూకుడుకు పగ్గం వేయాలంటూ దేశీయ రిటైలర్లు గళమెత్తుతున్నారు. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ‘కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అసోసియేషన్’ (సిఎఐటి) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆన్‌లైన్ వ్యాపార సంస్థల ధోరణి సంప్రదాయ మార్కెట్‌ను దెబ్బ తీస్తోందని సిఎఐటి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇష్టారాజ్యంగా డిస్కౌంట్లను ఇస్తున్నాయని, అనుచిత వ్యాపార విధానాలతో సంప్రదాయ రిటైల్ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ సంస్థల దూకుడుతో భవిష్యత్తులో వ్యాపార రంగంలో గుత్త్ధాపత్యానికి దారి తీసే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల వ్యాపార విధానాలపై, వాటి పన్ను చెల్లింపులపైనా సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని రిటైల్ వ్యాపారుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తాజాగా నిర్వహించిన ‘బిగ్ బిలియన్ డే’పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన డిస్కౌంట్‌పై రిటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడంతో అవసరమైతే కొత్త విధానాలను రూపొందిస్తామని, ఈ-కామర్స్ వ్యాపారంపై మరింత స్పష్టత తీసుకొస్తామని ఆమె చెబుతున్నారు. భారీ ఆఫర్ల కారణంగా సంప్రదాయ మార్కెట్లలోని వ్యాపారులు దెబ్బతింటారని ఆమె అంగీకరించారు. కాగా, ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈ-కామర్స్ బిజినెస్‌కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనను ఉల్లంఘన జరిగిందా? అన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) అధికారులు కూడా ప్రకటించారు. ……………… ఈ-కామర్స్‌లోకి అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తుండడంతో ఈ-కామర్స్ వైపు నేడు పలు భారతీయ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. 2020 నాటికి ఈ-కామర్స్ వ్యాపారం మనదేశంలో 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉండడంతో రేమండ్స్, అరవింద్, టాటా గ్రూపు వంటి ప్రముఖ సంస్థలు ఆన్‌లైన్ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. సంప్రదాయ రిటైలింగ్, మార్కెటింగ్, పంపిణీ విధానాలకు పూర్తి భిన్నంగా ఈ-కామర్స్ విస్తరిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భవిష్యత్తులో ఈ-కామర్స్ ప్రధాన మాధ్యమం అవుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తుండగా, మరి కొన్ని మాత్రం ప్రత్యేక విభాగాలకే పరిమితమవుతున్నాయి. ఫ్యాషన్ దుస్తులు, జ్యూయలరీ తదితర ఉత్పత్తుల్లో ప్రజాదరణ పొందిన సంస్థలు భారీగా లాభాలను చవి చూస్తున్నాయి. దీంతో కొన్ని అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు కూడా ఈ-కామర్స్‌వైపు దృష్టి సారిస్తున్నాయి. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో ఆశాజనక పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ దేశీయ వ్యాపార సంస్థలు కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు సొంతంగా వెబ్‌సైట్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులను ఇతర ఆన్‌లైన్ సైట్ల ద్వారా విక్రయాలకు పెడుతున్నాయి. ఫ్ల్లిప్‌కార్ట్ వంటి సంస్థలపై ఆధారపడడం కన్నా సొంతంగా ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లను ప్రారంభించేందుకు వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దుస్తుల రంగంలో ప్రఖ్యాతి పొందిన రేమండ్స్ లిమిటెడ్ ఇప్పటికే సొంతంగా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇదే తీరులో ప్రముఖ దుస్తుల కంపెనీ అరవింద్ కూడా ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. టైటాన్ కంపెనీ కూడా తన సొంత పోర్టల్‌ను ప్రారంభించింది. చేతి గడియారాలు, ఆభరణాలు, కళ్లద్దాలు, బ్యాగులు వంటి పలు రకాల వస్తువులను విశ్వవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు టైటాన్ కో-ఇన్ అనే పోర్టల్‌కు రూపకల్పన జరిగింది. ఇతర కంపెనీలకు చెందిన వస్తువులను కూడా ఈ సైట్‌లో టైటాన్ విక్రయిస్తుంది. అలాగే, పారిశ్రామిక దిగ్గజం అయిన టాటా గ్రూపు కూడా తాము ఉత్పత్తి చేసే అన్నిరకాల వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించే పనిలో పడింది. ……………… ఉద్యోగాల వెల్లువ… రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలో ఈ-కామర్స్ రంగం 20 నుంచి 25 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ. కనీసం లక్షన్నర మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంటున్నారు. 2016 నాటికి దేశంలో ఈ-కామర్స్ వ్యాపార పరిమాణం 50 వేల కోట్లరూపాయలకు చేరుకునే అవకాశం ఉన్నందున అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ-కామర్స్ రంగం ఆశాజనకంగా ఉన్నందున ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయని ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఇండియా సంస్థ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, మింత్రా వంటి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నందున క్యాంపస్ నియామకాలు కూడా జోరుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ సంస్థలు భారీగా వేతనాలు ఇస్తున్నందున యువత కూడా వాటిపై మొగ్గుచూపుతోంది. ఈ సంస్థల్లో జూనియర్ స్థాయి సిబ్బందికి వార్షికంగా 1.45 నుంచి 2 లక్షలు, మధ్యస్థాయి ఉద్యోగులకు ఏటా 12నుంచి 30 లక్షల వరకు వేతన ప్యాకేజీ లభించే అవకాశం ఉన్నట్టు మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తికమాస వైశిష్ట్యం -పి.వి.సీతారామమూర్తి

ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది.
పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం స్నానమునకు- దీపమునకు- దానాలకు ప్రసిద్ధియైనది. ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టి కలిగి తన చల్లని కిరణముల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని అందిస్తాడు. ఈ మాసంలో శివుని మారేడు దళాలతో- జిల్లేడు పూలతోనూ, శ్రీ మహావిష్ణువును తులసీ జాజి పూవులతోను పూజించాలని శాస్త్రం చెబుతున్నది.
పరమేశ్వరుడైన శివునికి సోమవారం చాలా యిష్టం గనుక ఆ రోజున ఉపవసించడం ఎంతో మేలు. కార్తికంలో వనభోజనాలకు ప్రశస్తం గావున పలు రకాల వృక్షములున్న ప్రాంతంలో ఉసిరికచెట్టును పూజించి దాని క్రింద కూర్చుని పనస ఆకుల విస్తర్లలో భోజనం చేయాలని పురాణాలు తెలిపాయి. కార్త్తిక శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలి. ఈ మాసంలో ఏ సత్కార్యం చేసినా ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించాలి.
ఋతుప్రభావంవలన- పరివర్తనాల వలన వాతావరణంలోని మార్పులను దృష్టిలో వుంచుకొని శారీరక- మానసిక – ఆధ్యాత్మిక ఆరోగ్యాలకూ వాటికీ వున్న సంబంధమును వైజ్ఞానిక దృష్టితో అర్థం చేసుకోవాలి. ఈ నెలలో నదులూ చెరువులు- బావుల నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారంవలన తేజస్సునూ, బలాన్ని సంతరించుకొని వుంటుంది. కావున ఇండ్లలో స్నానాలు చేయవద్దన్నారు. దేవుని ఆరాధనకు కావలసిన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ మాసం సాధనకు అనుకూలమైనది.
శరదృతువులోని పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. ఈ జలస్నానం మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పైత్య ప్రకోపాలను తగ్గించే స్నానం యిది. అమృతతుల్యం. మానవాళికి ఉపయుక్తమైనది. నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుందని కృష్ణయజుర్వేదంలో ఒక మంత్రం తెలుపుతుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడంవలన ఈ హంసోదకం స్నానపానాదులకు అమృత తుల్యమని మహర్షి చరకుడు తెలిపినాడు. నదులు ప్రవహించే వేళ ఆ నీటిలో తెలియకుండా విద్యుత్ శక్తి ఉంది. శరీరానికి శక్తినిస్తుంది. మూడు దోసిళ్ల నీరు తీసికొని తీరానికి చల్లి, తరవాత బట్టల పిండుకోవాలి. దీనినే ‘యక్షతర్పణం’ అంటారు. పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జల ప్రదేశంలో అనంత శయనుడైన విష్ణువు నివసించి ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతుంది. కార్తీక శుద్ధ విదియను యమద్వీతీయ అంటారు. లేదా భగినీ హస్త భోజనం అనగా ఈ రోజున సోదరి చేతి వంట తినాలి. యముడు విదియనాడు తన సోదరి యమున ఇంటిలో ఆమె వండి వడ్డించగా భోజనం చేశాడుగాన దీనికి ‘యమ ద్వితీయ’ అని పేరు. భోజనం పిదప సోదరికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. నాల్గవ రోజు శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఈ రోజున స్ర్తిలు పుట్టలలో పాలు పోసి చలిమిడి- వడపప్పు- నువ్వులతో చేసిన తీపి వుండలు- నైవేద్యాలుగా సమర్పిస్తారు. శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కృతయుగంలో దేవదానవులు క్షీర సాగర మథనం చేసిన రోజు. మరొకటి కార్తీక పౌర్ణమి. ఈ వేళ ఉసిరికాయలమీద వత్తులుంచి దీపాలు పెడతారు. నదుల్లో వదులుతారు. పండితులకు దీపదానం చేస్తారు.
ఈ మాస నియమాలు:ఈ నెల రోజులు ఇంగువ-ఉల్లి-వెల్లుల్లి- ముల్లంగి- గుమ్మడి- శెనగ- పెసర- అల్చందలు- నువ్వులు నిషిద్ధం. మాంసాహారం నిషిద్ధం. కంచు పాత్రలో భోజనం చేయరాదు. ఆదివారం కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు.

 

 

నాగుల చవితి

సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందపంచమి, కుమారషష్ఠి లానే కార్తిక చతుర్ది కూడా నాగులకు విశేషమైందే. శ్రావణ పంచమి నాడు నాగుల పుట్టలో పాలు పోసి పూజించినట్లే కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయటం, నాగులను పూజించటం చేస్తారు. ఈ నాగుల చవితినాడు పొద్దునే్న చన్నీటిస్నానం ఆచరించి ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి పుట్టకు సమర్పిస్తారు. పుట్టకు దారం చుట్టటం కూడా కొందరు చేస్తుంటారు. పుట్టకు కొంతమంది కోడిగుడ్లు కూడా సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని వారి నమ్మకం. నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూ ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కతే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులకు వేడుకొంటారు. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయ.
నాగులను పూజించటం వల్ల వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. అసలు పిల్లలు పుట్టలేదని బాధడపడేవారు సైతం నాగ పూజ చేస్తేవారికి సంతానం కలుగుతుంది. శివపార్వతులు లోక కల్యాణంకోసం పుత్రార్థులై ఉన్నసమయంలో దేవతలు ఆటకం కలిగించినందుకు పార్వతి ఎంతో కోపగించుకొంది. ఆ సమయంలో బయల్వెడలిన శివతేజస్సును దేవతల కోరికపై అగ్ని ధరించాడు. అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలివ్వగా ఆరు ముఖాలనుంచి పాలు గ్రోలాడాబాలుడు. అందుకే కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనికే సుబ్రహ్మణ్యుడన్న పేరు వచ్చింది. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు కోరగా దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. ఈ సుబ్రహ్మణుడి ప్రీత యర్థమే నాగుల చవితి పూజలు చేస్తుంటారు.
మనకు కనిపించే నాగులు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యపప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. తన సవతి అయన వినతతో కద్రువ ఓ సారి తాను చూచిన గుర్రపు తోక నల్లగా ఉందని పందెం కాసింది. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారురెండవ వారికి దాసిగా ఉండాలని పందెం వేసుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని వెళ్లి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని ఉండి తనను గెలిపించమని కోరింది. తన కొడుకు వలన గెలిచిన కద్రువకు వినత దాసి అయంది. ఆ దాస్యత్వం పోగొట్టడానికి ఏం చేయాలని వినత కుమారుడైన గరుత్మంతుడు నాగులను కోరగా వారు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమనికోరారు. వారు చెప్పిన విధంగా – దేవతలతో యుద్ధం చేసి గెలిచి అమృత భాండాన్ని తీసుకొని రాబోతుండగా ఇంద్రుడు గరుత్మంతుని పట్టుదలా, నిజాయతీల మెచ్చుకుని నీవు ఈ అమృతభాండాన్ని నాగులకిచ్చి స్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పమని చెప్పాడు. ఇంద్రుడు చెప్పినట్లుగానే గరుత్మంతుడు నాగులకు చెప్పి దర్భపైన అమృతభాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు. నాగులు శుచులై వచ్చేలోపు ఇంద్రుడు అమృతభాండాన్ని తీసుకొని వెళ్లగా ఆ దర్భలను నాగులను నాకారట. దానితో దర్భలవల్ల నాలుక రెండుగా చీలినా అమృతభాండస్పర్శఉన్న దర్భల వల్ల వారికి అమృతత్వం వచ్చిందంటారు.
అనార్యుల నుంచి ఈ నాగారాధన ఉన్నట్లు చారిత్రికంగా తెలుస్తోంది. నాగ పత్రిమలు మొహంజదారో తవ్వకాల్లో బయల్పడ్డాయ. బౌద్ధ, జైనులు కూడా నాగులను ఆరాధిస్తారు. ఈజిప్టు, గ్రీక్, పర్షియా లాంటి దేశాల్లో అయితే సర్పాలను సస్యదేవతగా పూజించటం కనబడుత

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు పి ్‌ఎచ్ .డి . పొందిన -శ్రీ చిలుకూరి నారాయణ రావు

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు

ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా అప్పుడే అక్కడ ఉన్నాడు .కనుక కాలం1294-1325గా భావిస్తారు .కాకతి రాజులకాలం లో నాటకాలు అలంకార శాస్త్రాలు నాట్య శాస్త్రాలు ,చారిత్రిక కావ్యాలు ఎన్నో సంస్కృతభాషలో వెలువడ్డాయి .అగస్త్యకవి ఒక వ్యక్తీ కాదు ఒక సాహిత్య సంస్థ అని పించాడు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసన పట్టినట్లు ఈ అగస్త్యకవి సాహిత్య సముద్రాన్ని ఆపోసన పట్టి అపర అగస్త్యుదనిపించుకొన్నాడు అతని సమర్ధతకు నిదర్షం గా ఆయన రాసిన 74గ్రంధాలే సాక్ష్యం .

సాహితీ అగస్త్యం

అగస్త్యుడు సంస్కృతం లో సంక్షిప్తం గా భారతం రాసి బాల భారతం అని పేరుపెట్టాడు .ఇరావై సర్గ లున్న ఈకావ్యం వైదర్భీ రీతిలో రాయ బడింది .చక్కని ఆవ్య వర్ణనలు చేశాడు ఋతు వర్ణన అమోఘం గా చేశాడు .వసంత ఋతు వర్ణనలో ‘’పుష్ప పరాగం వసంత లక్ష్మి చల్లిన రంగుల్లాగా ఉన్నదట .క్లిష్టత లేక స్పష్ట సుందరం గా చెప్పటం అతని ప్రత్యేకత .కాళిదాసు ను జ్ఞప్తికి తెస్తాడు .భారత యుధం లో చంద్రుడు తన వంశం అంతరించిపోతోందని తెలిసి చూడలేక త్వరగా అస్తమించాడని వర్ణించాడు .-

‘’శీతాంశుర్నిజ ఉల జన్మనాం నృపాణాం సంగ్రామే నిధాన మపెక్షితుం –శృంగాణి క్షణ మవలంబ్య రశ్మి హస్తై రస్తాద్రేఃపయసాంనిధిం ప్రపేదే ‘’.ఈ ఆవ్యానికి విజయ నగర సామ్రాజ్య చక్ర వర్తి శ్రీకృష్ణ దేవరాయల ముఖ్యమంత్రి అప్పాజీ అనే తిమ్మరుసు ‘’మనోహర ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .దీని ఆధారం గా తమిళం లో ‘’విల్లి భారతం ‘’రాయబడిందట .

నల ఈర్తి కౌముది అనే రెండవ కావ్యాన్ని అగస్త్యుడు రాశాడు .ఇందులో రెండు ,నాలుగు సర్గలు మాత్రమె దొరికాయి శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దీని లిఖితప్రతి ని సంపాదించి తలుగు అకాడెమి జర్నలో లో ప్రచురించారని తెలుస్తోంది .రెండు సర్గల సరళిని చూస్తె ఇది మహా కావ్యం అనిపిస్తుంది .రెండవ సర్గలో నలుడు విదర్భలో దేవతలా దూతగా ప్రవేశించటం ఉంది నాలుగవ సర్గ లో నల దమయంతుల వివాహం తర్వాత నలుడు మామ గారింట్లో ఒక నెల గడిపి తన నిషాద నగరానికి వచ్చినట్లుంది .నలుడు దామయన్తితో నిషాద నగరానికి వస్తూఉంటె పురజనులు వేడుక తో చూసే వర్ణన ను రఘువంశం లో కాళిదాసు వర్ణించిన తీరుగా ఉంటుంది .తెలుగుకవులుకూడా ఈ విషయాన్ని అందం గా తమకావ్యాలలో వర్ణించారు అంతటి ప్రేరణ కల్గించి అగస్త్యుని రచన .ఈ సర్గాలోనే వసంత ,వర్శర్టు వర్ణన ,జలక్రీడలు వర్ణింప బడ్డాయి .ప్రతి సర్గ చివర ‘’శ్రీ ‘’శబ్దాన్ని భారవిలాగా ప్రయోగించాడు రెండవ సర్గలో డెబ్భై నాలుగవ శ్లోకాన్ని వాసు చరిత్రకారుడు రామ రాజ భూషణుడు అనువాదం చేసి పొందుపరచాడు ఆ పద్యమే ‘’నానా సూన వితాన వాసనలు –‘’.పన్నెండవ శతాబ్దం తర్వాత వచ్చిన కవుల్లో అగస్త్యుడే ప్రతిభా శాలి అంటారు .

58-వేదాంత దేశికులు

1268-1369కాలానికి సస్మ్బంధించిన వేదాంత దేశికుల వారు అపర రామానుజవతారం అంటారు .నూటపాతిక దాకా సంస్కృతం లో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన అపర సరస్వతీ స్వరూపులు .వైష్ణవ మాట వ్యాప్తికి ఇతోధికం గా తోడ్పడ్డారు .అసలు పేరు వెంకట నాధుడు .తమిళం లోను గొప్ప పండితులు .గొప్ప దార్శనిక్లుగా సుప్రసిద్ధులు .వేదాన్తాచార్య ,కవితార్కిక సింహ ,సర్వ తంత్ర స్వతంత్ర బిరుదాంకితులు దేశికులు .ఇరవై ఏడేళ్ళ వయసులోనే దేశిక ,ఆచార్య సర్వ తంత్ర స్వతంత్ర బిరుడులన్డుకొన్నారు .శ్రీరంగ స్వామి రంగనాధుడు దేవి రంగనాయకి స్వయం గా దేశికుల భక్తికి కవితా శక్తికి ,పాండిత్యానికి మెచ్చి వేదాన్తాచార్య బిరుదు ప్రదానం చేశారని అంటారు .తమిళనాడు లోని తిరువహిందిపురం లో గురువు ఆజ్ఞతో గడిపి గరుడాళ్వార్ ను సేవించి అనుగ్రహం పొంది హయగ్రీవ మంత్రాన్ను ఉపాసించి అనుగ్రహానికి పాత్రుడైనారు .అప్పటి నుంచి లక్ష్మీహయగ్రీవ భక్తులై జీవితాన్ని చరితార్ధం చేసుకొన్నారు .ఆసేతు హిమాచల పర్యంతం తీర్ధ యాత్రలు చేసి విశిష్టాద్వైత మత ప్రచారం చేశారు .యెంత ఎదిగినా ఒదిగి ఉన్నారు దేశికులు .’’వేదాంత దేశిక పధేవిని వేశ్య బాలాం’’’ అని అతి వినయం గా చెప్పుకొన్నారు .’’భగవానుడు ఒక బాలకుడికి ఆచార్య స్థాయిని కల్పించాడు .యెంత దయామయుడో’’అన్నారు .శ్రీరంగాన్ని మదురై సుల్తాన్ ఆక్రమించగా విజయనగర రాజ్య స్థాపకులు  దేశికుల సహా విద్యార్ధి అయిన విద్యారణ్య స్వామి శ్రీరంగం వచ్చి ఇక్కడి పరిస్తితులను అధ్యయనం చేసి గోపనార్యుడు అనే బ్రాహ్మణ సైన్యాధ్యక్షునికి దక్షిణ భారత దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తి కలిగించమని ఆదేశించారు .ముందుగా జెంజిని జయించి స్వాధీనపరచుకొని ,తిరుపతి లోఉన్న శ్రీరంగాని విగ్రహాన్ని అక్కడికి తాత్కాలికం గా తెప్పించాడు .వెంటనే శ్రీరంగం లోని సుల్తాన్ సైన్యం పై విజ్రుమ్భించి ఓడించి ,శ్రీరంగానాదుడిని మరల శ్రీరంగం లో ప్రతిస్టించాడు గోపనార్యుడిని సాక్షాత్తు విష్ణు అవతారం అని భావిస్తారు .

దేశికీయ కవిత్వం

వేదాంత దేశికులు సర్వార్ధ సిద్ధి ,న్యాయ పరిశుద్ధి ,న్యాయ సిదాన్జన,మీమాంసా పాదుక ,అధికరణ సారావళి ,శాత దూషిణి,సచ్చరిత్ర రక్ష ,నిషేపరాక్ష ,పంచ రాత్ర రక్ష మొదలైన సంస్కృత గ్రంధాలను దార్శనిక సంబంధమైనవిగా లెక్కిస్తారు .రామానుజుల ‘’శ్రీ భాష్యం ‘’కు తత్వ టీకను ,తాత్పర్య చంద్రికలను ,యామునా చార్యుల గీతార్సరధ సంగ్రహ రక్షను ,రామానుజుల గద్య త్రయానికి రహస్య రక్షను ,ఈశావాస్యోపనిషత్ భాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు .ద్రావిడ ప్రబంధ మైన  ‘’తిరువాయి మొలి’’ని  సంస్కృతీకరించారు .

యాదవాభ్యుదయం అనే మహా కావ్యాన్ని ,సంకల్ప సూర్యోదయం అనే నాటకాన్ని ,హంస సందేశం అనే లఘు కావ్యాన్ని ,పాదుకా సహస్రం ,వరద రాజ పంచాశతి ,గరుడ దండకం అనే ముక్తక కావ్యాలను రాశారు దేశికులు రామాయణ కదా సారాన్ని ‘’రఘువీర గద్య ‘’గా సంస్కృతం లో రాశారు అచ్యుత శతకాన్ని ప్రాకృతం లో రాశారు వేదాంత దేశికులు దార్శనికులుగానేకాక మహా పండిత ప్రకాన్డులుగా ,మహా వ్యాఖ్యాతగా ,మహోన్నత కవిగా రాణ కెక్కారు .

దేశికుల యాదవాభ్యుదయం లో ఇరవై నాలుగు సర్గాలున్నాయి .శ్రీకృష్ణ చరిత్రకావ్యం ఇది .కృష్ణుని జీవితం లోని ప్రతి సంఘటన వెనుక ఉన్న దార్శనికార్ధాన్ని కమ్మని శైలిలో వర్ణించారు .ఈ కావ్యానికి అప్పయ్య దీక్షితులు వ్యాఖ్యానం రాయటం మరో విశేషం వర్ణనలలో వేదాన్తపర మైన ఉపమానాలను వాడటం దేశికుల ప్రత్యేకత .-

‘’వివిధ ముని గణోప జీవయా తీరదా విగామిత సర్ప గణా పరేణ పుంసా –అభిజిత యమునా విశుద్ధ ముగ్ర్యాం శమిత మహిర్మాట సంప్లవా త్రయీవ ‘’-అర్ధం –మూడు వేదాలని చదువుకొన్న వాడి చేత ఇతర మతాలూ ఏ విధం గా శమింప చేయ బడతాయో అదే విధం గా యమునా నది సర్పాల నన్నిటిని పార ద్రోలిన తర్వాత పరి శుద్ధమై విశుద్ధం గా ప్రకాశిస్తోంది .

 

దేశికులు సంకల్ప సూర్యోదయం అనే నాటకం రాశారు ఇందులో మోహ పరాజయం ,వివేకోదయం లను చెప్పారు .శాంతరసం వలన మనో వికారాలు శమించి ఆనందానుభూతి కలిగిస్తుందని వివరించారు .ఇది దార్శనికతకు ప్రతీకాత్మక నాటకం .

దేశికులు రహస్య గ్రంధాలైన ‘’తత్వ పదవి ,రహస్య పదవి తత్వ నవనీతం ,రహస్య నవనీతం ,తత్వ మాతృక ,రహస్య మాతృక ,తత్వ సందేశం ,రహస్య సందేశవివరణం ,తత్వ రత్నావళి ,తత్వ రత్నావళి ప్రతిపాద్య సంగ్రహం ,రహస్య రత్నావళి,రహస్య రత్నావళి హృదయం ,తత్వ త్రయ చూలకం ,రహస్య త్రయ చూలకం ,అభయ ప్రదాన సారం ,రహస్య శిఖామణి ,అంజలి వైభవం ,ప్రదాన శతకం ,ఉపహార సంగ్రహం ,సార సంగ్రహం ,మునివాహన భోగం ,మధుర కవి హృదయం ,పరమ పద సోపానం ,పరమత భంగం ,హస్తిగిరి మహాత్మ్యం ,శ్రీమత్ రహస్య త్రయ సారం ,సారసారం ,పరిహారం . ,

దేశికులు హంస సందేశం అనే కావ్యం రాశారు .రాముడు హంస ద్వారా సీతా దేవికి సందేశం పంపటం ఇందులోని వృత్తాంతం .దక్షిణ దేశం గుండా హంస పర్యటించి ,సముద్రం మీద రామ బాణం లాగా దూసుకు వెళ్లి యెగిరి లంక చేరి రామ సందేశాన్ని సీత కు సందేశం అందజేస్తుంది .దేశికుల ‘’పాదుకా సహస్రం ‘’ను ‘’మాగ్నం ఓపస్’’ గా భావిస్తారు .ఇది1008 శ్లోకాల భక్తిమాల .ఇందులో ముప్ఫై రెండు పదాదిలు ఉన్నాయి .రోజుకు ఒకటి చొప్పున ముప్ఫై రెండు రోజులలో దీన్ని భక్తితో పఠిస్తే కోరికలు తీరి మోక్షం లభిస్తుంది అని నమ్మం .చిత్ర పదాలతో లలిత సుందరం గా రాసిన భక్తీ కుసుమమాల ఇది .ముఖ్యం గా శ్రీరామ శ్రీకృష్ణ ,శ్రీ రంగనాధ స్వామి పాదపద్మా లపై రాసిన శ్లోక సముదాయం .ఇది చదివితే ఆత్మ జ్ఞానం లభించటం ఖాయం .వేదాంత దేశికులు ఎక్కని సోపానాలు లేవు .అందని పురస్కారాలు లేవు .కదిలించని రచనలు లేవు .అన్నిటా దేశికులు మహా మార్గ దర్శులే .

మరోకవితో కలుద్దాం

Swamy Desikan.jpg

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు- నది పత్రికలో

10358125_463739887097237_933547058037116647_n 10688000_463740267097199_4785532005841422699_o 68961_463740390430520_3492032012266459891_n 10501888_463740477097178_6556041745055068840_n 10447538_463740557097170_958199359059903359_n 10402765_463740650430494_2261025788983526428_n 1554364_463740743763818_96905378363693578_n 10689599_463740867097139_6258573982857227235_n 10712861_463741010430458_8518551558265989551_n 10366046_463768143761078_5512087312742271172_n

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

56-సిద్ధ యోగి పుంగవుడు   –అప్పయ్య దీక్షితులు

పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు )ఆరణి దగ్గర ఆడయ పాలెం లో గణపతి సుబ్రహ్మణ్యశర్మ  గా ప్రమాదీచ సంవత్సరం కన్యా మాసం కృష్ణపక్షం లో ఉత్తరా నక్షత్రం లో జన్మించాడు .తండ్రి రంగ రాజాధ్వరి .భరద్వాజ గోత్రీకుడు .గణపతికి అప్ప అనే పెరున్దికనుక నామకరణ మహోత్సవం లో అప్పయ్య దీక్షితులు అనిపేరు పెట్టారు .తమ్ముడు అచ్చన్ దీక్షితులు .రామకవి అనే గురువువద్ద అప్పయ్య వేదం వేదాంగాలు అభ్యసించాడు .చాలా చిన్నతనం లోనే పద్నాలుగు విద్యలలో అపార పాండిత్యాన్ని సంపాదించాడు .కృష్ణ దేవా రాయల గురువు తాతా చార్యులు వైష్ణవాన్ని బాగా ప్రచారం చేస్తున్న సమయం లో కాశీ లో ఉన్న అప్పయ్య దీక్షితులకు తెలిసి విజయ నగరం చేరి ఆచార్యులను తనతో వాదానికి రమ్మన్నాడు .అప్పయ్య ప్రతిభ తెలిసిన రాయలు ఆచార్యులను వాదానికి దిగవద్దన్నాడు.కానీ రెచ్చిపోయిన తాతాచార్యులు వాదానికి దిగి ఓడిపోయి చేసుకొన్నా ఒప్పందం  ప్రకారం శైవాన్ని స్వీకరించేందుకు సిద్ధపడ్డాడట .అప్పయ్య లేక పొతే అందరూ నిలువు బొట్టు వాళ్ళే అయ్యేవారన్నమాట .ఆ ప్రమాదాన్ని తప్పించిన వాడు అప్పయ్య దీక్షితులు .

దేశాటన చేస్తూ వేద విరోధులను వాదం లో ఓడిస్తూ వైదిక మత ప్రచారం చేశాడు .వెల్లూరు ,తంజావూరు ,విజయ నగర ,వెంకట గిరి రాజుల ఆస్థానాలలో పండిత స్థానాన్ని అలంకా రించి  గౌరవ సన్మానాలు అందుకొన్న విదుషి అప్పయ్య దీక్షితులు .వాదనలో అపర రుద్రుడిలా విజ్రుమ్భించి ప్రతిపక్షులను గడగడ  లాడించే వాడు .దీనితో అతనిని ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రలు కూడా తెర వెనుక జరిగినా మొక్క వోని ఆత్మా విశ్వాసం తో అప్రతిహతం గా ముందుకు సాగాడు దీక్షితార్ .రాజులు మహారాజులు ఎందరో అప్పయ్య అప్రతిహత విద్యా నైపుణ్యానికి దాసోహం అన్నారు .వారికి ధర్మ ప్రబోధం చేసి ఆత్మ మార్గాన్ని తెలియ జేశాడు .ఆశువుగా శ్లోకాలు గంగా ప్రవాహం గా చెప్పి అప్రతిభులను చేసే నేర్పు అప్పయ్యా దీక్షితుల సొమ్ము .తన వాక్ చాతుర్యం తో యుక్తితో ,సంయమనం తో ,విశాల హృదయం తో ,అల్ప మనస్కుల ను ఎదిరించి పరివర్తన తెచ్చిన ఘనత అప్పయ్య దీక్షితులది .

అప్పయ్య కవితా దీ(ద)క్షితీయం

కవిత్వం ,శైవాద్వైత ప్రచారం ,యజ్న యాగాదులతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతూ ఒక ‘సిద్ధ యోగి పుంగవుడు ‘’గా గడిపాడు .సాధించిన ఎన్నో మంత్ర విద్యలను ప్రదర్శించాడు .చివరికి వాటివల్ల ఆరోగ్యానికి భంగం కూడా కలిగింది .కొందరు ఆయనపై ప్రయోగాలు చేసి దుస్టశక్తులను ఆయనపైకి పంపేవారు ..ధ్యానం లో మునిగి ఉన్నప్పుడు సమాధి స్తితిలోకి చేరేటప్పుడు తనముందు కొన్ని తువ్వాళ్ళను ఉంచేవాడు .ఆ యోగ శక్తితో ఆయన లోని దుస్టశక్తులు ,వ్యాధులు  ,తువ్వాలళ్ళలో చేరేవి .అప్పుడు అవి పిచ్చెక్కి నట్లు నాట్యం చేయటం  శిష్యులు గమినించే వారు .సమాధినుండి బయటికి రాగానే ఆ తువ్వాళ్ళను మళ్ళీ మీద వేసుకొనేవాడు .

‘ఆత్మార్పణ స్తుతి ‘’కావ్యం రాశాడు . దీనికి ఒక  కధ ప్రచారం లో ఉంది .ఇది యాభై శ్లోకాల కావ్యం .ఒక్కొక్క శ్లోకం తో లోపలి ఆత్మను కర గించి వేశాడు .మరి ఈకావ్యం ఎలా రాశాడు ?తన ఆత్మ శక్తిని భగవంతునిపై తనకున్న వీర భక్తిని  పరీక్షించుకోవాలనే కోరిక కలిగిందట .అందుకని ‘’దాతుర ఫల రసం ‘’(ఉమ్మెత్త కాయల రసం )తాగాడు .అది తీవ్రమైన మత్తు పిచ్చి ఎక్కిస్తుంది  .పిచ్చి ఎక్కి మత్తులో తన నోట వచ్చిన ప్రతి వాక్యమూ రాయమని శిష్యులకు ముందే చెప్పాడు .ఇలాంటి స్తితిలో లోపల అణచ బడిన భావాలన్నీ ఒక్క ఉదుటున దూసుకు బయటికి వస్తాయి .ఈ స్తితిలో అప్పయ్య దీక్షితుల నోటి నుండి ఆశువుగా వెడలిన కావ్యమే ‘’ఆత్మార్పణ స్తుతి ‘’.దీనికి అప్పటి నుంచి ‘’ఉన్మత్త పంచ దశి ‘’అనే పేరొచ్చింది .అదీ ఆ మహా సిద్ధుని ప్రతిభ .

అప్పయ్య దీక్షితులు సంసృతం లో చిన్నా పెద్దా  నూట నాలుగు రచనలు చేసినా అందులో ముఖ్యమైనవి 60 రచనలు . .ఇందులో వేదాంత ,శివాద్వైత ,వ్యాకరణ ,మీమాంస  కావ్య వ్యాఖ్యాన , అలంకార ,భక్తీ స్తోత్రాలున్నాయి .శివాద్వైతులు అప్పయ్యను తమ వారిగా భావిస్తారు .యెంత శివ భక్తుడో అంతటి వైష్ణవ  పారమ్యం ఎరిగిన వాడు .బ్రహ్మ సూత్రాలలో చెప్పబడిన విషయాలను ‘’చతుర్మత సారం ‘’గా రాశాడు .నయ మంజరి లో అద్వైతాన్ని ,నయ మణిమాల లో శ్రీకాంత మతం గురించి చెప్పాడు .నయ మయూఖ మాలిక లో రామానుజుని విశిష్టాద్వైతం గురించి ,నయ ముక్తావళి లో మధ్వాచార్యుల వైష్ణవ మతాన్ని గూర్చి చెప్పాడు .ఇలా బ్రహ్మ సూత్ర రహస్యాలను అన్ని మతాలకు అన్వయిన్చేట్లు చెప్పిన మహా విద్వాంసుడు అప్పయ్య దీక్షితులు .ఇవన్నీ ఆయ మతాలకూ ఆధార గ్రంధాలుగా రిఫరెన్స్ పుస్తకాలుగా పూజనీయ స్థానం లో ఉన్నాయి .

దీక్షితులు రాసిన వేదాంత గ్రంధాలలో ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’ప్రముఖ స్థానాన్ని పొందింది .వివిధ ఆలోచనా ధోరణులను ఏకం చేసి అద్వైత ముఖ్య ప్రవాహం లో కలిపిన అతని వైదుష్యం హర్షణీయం .ఏక జీవ వాదం నానా జీవ వాదం ,బింబ ప్రతి బింబ వాదం ,సాక్షిత్వ వాదం మొదలైన వాటిని ప్రశ్నించి ఉన్నది. ఒకటే బ్రహ్మం అయితే ఇన్ని వాదాలేమిటన్నాడు .అందరూ మూల సూత్రాన్ని ఒప్పుకుంటూ భిన్న మార్గాలలో నడిచి దూరమైపోయారన్నాడు .అమలానంద రాసిన ‘’కల్ప తరు వు ‘’కు ‘’పరిమళ ‘’అనే అద్భుత వ్యాఖ్యానాన్ని రచించాడు .వాచస్పతి మిశ్ర రాసిన ‘’భామతి ‘’కి కల్పతరువు ఒక వ్యాఖ్యానమే .ఇది ఆది శంకరాచార్యుల సూత్ర భాష్యానికి వివరణం .

బ్రహ్మ సూత్రాలకు ‘’శివార్క మణి దీపిక ‘’అనే అమోఘమైన భాష్యాన్ని అప్పయ్య దీక్షితులు రాయటం మన అదృష్టం .ఇందులో శివ వైష్ణవాద్వైతాన్ని స్తాపించాడు .ఈ గ్రంధమూ ,పరిమళ గ్రంధము అప్పయ్య దీక్షితుల మేధో సర్వస్వం గా (మేగ్నం ఓపస్ )గా భావిస్తారు .ఇవి విషయం లో, గ్రంధ రూపం లో అతి విశిష్టమైన  ఉద్గ్రంధాలు .వెల్లూరు రాజు చిన్న బొమ్మ దేవర అప్పయ్య దీక్షితులతో శివార్క దీపిక ను  బోధింప జేయటానికి   500మంది విద్యార్ధులతో ఒక కళాశాల  నెలకొల్పాడు .వీరందరికీ నేర్పి అద్వైత భావాలలో నిష్ణాతులను చేసి భావ వ్యాప్తి చేయించాడు .

దీక్షితుల దృష్టిలో ద్వైతం కింది మెట్టు .విశిష్టాద్వైతం మధ్య మెట్టు ,శివాద్వైతం అద్వైతం ఒకటే అయిన ఆఖరి మెట్టు .శ్రీ కాంత శివాచార్యుని శివాద్వైతాన్ని అప్పయ్య అనుసరించి బ్రహ్మ సూత్రాలకు ఈ ధోరణిలో వ్యాఖ్యానం రాశాడు .దీక్షితులు వేదాంత దేశికుల మెప్పు పొందాడు .కువలయానందం లో ముకుందుని కీర్తించాడు .హరిహర అభేదాన్ని అప్పయ్యదీక్షితులు చెప్పినంత గాఢం గా అంతకు ముందెవరూ చెప్పలేదు .మీమాంస శాస్త్ర వ్యాప్తికి అప్పయ్య చేసిన కృషి అద్వితీయం .కౌస్తుభం అనే వ్యాఖ్య రాశాడు .విది రసాయనం  ,కువలయానందం లను విజయ నగర ప్రభువు పెనుగొండ రాజు వెంకట పతి రాయలు గుర్తించి ఆస్తానాన్నికి సగౌరవగా ఆహ్వానించి సన్మానించాడుఅంకితం పొందాడు  .సిద్ధాంత కౌముది రాసిన భట్టోజి దీక్షితులు అప్పయ్యను రాజుకు పరిచయం చేశాడు .అప్పయ్య రాసిన కువలయానందం చిత్ర మీమాంస ఎందరో విద్యార్ధులకు పఠనీయ గ్రందాలయ్యాయి .ఆయన రాసిన దుర్గా స్తుతి ,ఆదిత్య స్తవ రత్నం భక్తికి పరాకాష్టగా నిలిచాయి .వరద రాజ స్తవం లో అలంకారాలన్నీ వాడి శోభకల్పించాడు .

అరుణాచలం లోని అమ్మవారు ‘’ఆపీత కుచాంబ’’ పై చెప్పిన ‘’ఆపీత కుచాంబ స్తవం ‘’రచించాగానే అప్పయ్య కున్న జ్వరం తగ్గిపోయిందట .దానికి అంత ప్రభావం ఉంది .మానసోల్లాసం మానసిక ఆందోళన ఉన్న వారికి వర ప్రసాదమే .సౌభాగ్య క్షేమాలకు ,ప్రయాణం లో మంచి జరగటానికి ‘’మార్గ బంధు సూత్రం , ఆరోగ్యం కోసం ‘’ఆదిత్య స్తవ రత్నం రాశాడు .

చిదంబరం లో ఉండి నిత్యం నటరాజ స్వామి దర్శనం తో పులకిన్చేవాడు .అక్కడేఅప్పయ్య జీవిత పరిసమాప్తి డెబ్భై మూడవ ఏట  ‘జరిగింది ’.చనిపోయే రోజున రోజూ వెళ్ళే మార్గం గుండాకాక ‘’పంచాక్షర మెట్లు ‘’మీదుగా నటరాజ స్వామిని దర్శించడం అందరూ చూసి ఆశ్చర్య పోయారట .దర్శనం పూర్తీ చేసుకొని ఇంటికి వెళ్ళగానే అప్పయ్య దీక్షితులు తుది శ్వాస వదిలాడు .నటరాజ స్వామి అనుగ్రహం తో జన్మించిన అప్పయ్య ఆయన చెంతనే మరణించటం విశేషం .అప్పయ్య ఒక శ్లోకం లో ‘’నేనుపవిత్రమైన  చిదంబరం లో చనిపోవటానికి సంతోషిస్తున్నాను. నా కుమారులు బాగా చదువుకొని  గ్రంధ రచన చేసిన సంస్కారులు .నాకోరికలు  ఏవీలేవు .ఒక్కటే కోరిక .చిదంబరం లో నటరాజ సన్నిధిలో  మరణించ టమే నా కోరిక ‘’అన్నాడు .అలా కోరికను తీర్చుకొన్న ధన్య జీవి అప్పయ్య దీక్షితులు .

బహుముఖ ప్రజ్ఞా శాలి దార్శనికుడు అప్పయ్య దీక్షితులు రాసిన మూడు అలంకార గ్రంధాలు –వ్రుత్తి వార్తిక ,చిత్ర మీమాంస ,కువలయానందం .మొదటి దానిలో రెండు పరిచ్చేదాలున్నాయి అభిదా ,లక్షణా వృత్తుల భేదాలగురించి చెప్పాడు .వ్యంజనా వృత్తిని ఖండించాడు. ఇది అసంపూర్ణ గ్రంధం .చిత్ర మీమాంస అపూర్వ గ్రంధం అర్ధ చిత్ర కావ్యాలను గురించి చర్చించాడు ఇదీ  అసంపూర్ణమే .కువలయానందం లో అలంకారాలను గురించి వివరణ చేశాడు  అలంకారాలమీద వచ్చిన చివరిగ్రంధం గా దీన్ని భావిస్తారు .ఇతని సిద్ధాంతాలను జగన్నాధ పండితరాయలు ఖండించాడు .కువాలయనందానికి పది టీకలున్నాయి .ఇన్ని టీకా లుండటం దీని ప్రసిద్ధికి నిదర్శనం .పెనుగొండ రాజు వెంకట రాయలకు  అంకితమిచ్చాడు .విదేశీ  భాషల్లోకీ అనువాదం పొందిన గ్రంధం ఇది .అలంకార వివరణ తర్క బద్ధం గా శాస్త్రీయం గా చేశాడు .అలంకారాలు  విశ్వనాధుడి వరకు  ఎనభై తొమ్మిదికి పెరిగాయి .అప్పయ్య వీటి సంఖ్యను నూట పద్దెనిమిది పెంచాడు . అలంకారాల  గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జయదేవుడు రాసిన చంద్రాలోకం అప్పయ్య రాసిన కువలయానందం చదవాల్సిందే .ఇవే గతి .ధ్వనిలేక పోయినా అలంకా రాలతో ఉన్న కావ్యాలు సుందరం గా ఉంటాయన్నాడు .ధ్వనిలేకపోయినా కావ్యాన్ని ఆదరించాలన్నాడు .చిత్ర మీమాంసలో చిత్రకావ్యాల భేదాలను వివరించాడు .చిత్రకావ్యం కూడా ధ్వనికావ్యం లాగే మహత్వం ఉన్నదన్నాడు .కొద్దిగా కూడా ధ్వని లేని చిత్రకావ్యాల కొమ్ముకాసి ఉత్తమ స్తాయి కల్పించాడు ..దీన్ని ఖండించాడు పండిత రాయలు .అప్పయ్య దీక్షితుల సోదరుడి పౌత్రుడు నీల కంఠ దీక్షితుల సోదరుడైన మూడవ అప్పయ్య దీక్షితులు ‘’చిత్రమీమాంస దోష ధిక్కారం’’అనే గ్రంధం లో జగన్నాద పండిత రాయల అభ్యంతరాలన్నిటికి దీటైన సమాధానాలిచ్చి రాశాడు .

‘’ఆంధ్రత్వం ఆంధ్రభాష ,మధు మధురమైనవి .ఆంద్ర దేశం లో జన్మించటం పూర్వజన్మ  సుకృతం ‘’అని తెలుగును తెలుగు దేశాన్ని మనసారా మెచ్చుకొన్న అప్పయ్య దీక్షితుడు మనవాడే .మందరి వాడే .

మరోకవితో కలుద్దాం

Inline image 1  Inline image 2

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు

తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు .రఘునాధుడు తండ్రి అచ్యుత రాయలపై సంస్కృతం లో ‘’అచ్యుతేయాన్ద్రాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .యక్షగానాలు రాశాడు .వీణా వాదనలో మహా విద్వాంసుడు .క్షేత్రయ్య తంజావూర్ వచ్చి ఈ రాజును దర్శించి తన మువ్వ గోపాల పదాలతో మెప్పించాడు .తంజావూర్ సరస్వతిమహల్  గ్రంధాలయాన్ని, కుంభకోణం లో రామస్వామి దేవాలయాన్ని ,ఆది కుమ్భేశ్వరాలయానికి గోపురం నిర్మించాడు .తంజావూరు లోను పశుపతి దేవాలయం లోను స్వామి వారల రదోత్సవాలను మహా వైభవం గా నిర్వహింప జేసేవాడు .వీణ విధానం లో గణనీయమైన మార్పులు తెచ్చాడు రఘునాధుడు .జయంత సేన రాగాన్ని సృష్టించాడు .రామానంద తాళం కనిపెట్టాడు .చేమకూర వేంకటకవి ,కృష్ణాధ్వరి మధురవాణి, రామ భద్రాంబ ఈ ఆస్థాన కవులు .అనేక కావ్య రచన ఇక్కడ జరిగింది .శృంగారం వరదగా రఘునాదుడికాలం లో పారింది .అందుకని క్షీణ యుగం అన్నారుకూడా .బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు దానం చేశాడు .బీద బ్రాహ్మణులకు ఖరీదైన బహుమతు లంద జేశాడు .గుర్రపు సవారిలో ,ఖడ్గ యుద్ధం లో సాటిలేని వాడు .కవి ,పండిత సంగీతజ్ఞుల పోషణ చేశాడు .ఇంగ్లాండ్ డెన్ పోర్చుగీసు దేశాలతో మంచిమైత్రి నెలకోల్పాడు .

గోవింద ,యజ్న నారాయణ దీక్షితుల ప్రాభవం

ఈయన మంత్రి గోవింద దీక్షితులు ‘’సంగీత సుధ’’అనే కృతి చేశాడు .దీక్షితులకుమారుడు యజ్న నారాయణ దీక్షితులు రఘునాధుని విద్యా గురువేకాక ‘’రఘునాదాభ్యుదయం ‘’అనే సంస్కృత కావ్యం ను రాజు జీవిత చరిత్రగా రాశాడు .’’రఘునాధ విలాసం ‘’అనే సంస్కృత నాటకం రాసి రాజు ధర్మకార్య విశేషాలను తెలియ జేశాడు .’’అలంకార రత్నాకరం ‘’అనే అలంకార శాస్త్రాన్ని ప్రతాప రుద్రీయం నమూనాలో రఘునాధ రాయలను వర్ణిస్తూ లక్ష శ్లోకాలలో రాశాడు ‘.

53-ఆస్థానకవయిత్రి –రామ భద్రాంబ

తంజావూరు రాజు రఘునాధ రాయల ఆస్థాన నకవయిత్రి,ప్రియురాలురామ భద్రాంబ .రాజు జీవిత చరిత్రను ‘’రఘునాదాభ్యుదయం ‘’సంస్క్రుతకావ్యం రాసింది. శ్రీరామావతారం గా రఘునాధుని భావించి వర్ణించిన కావ్యం ఇది .పన్నెండు సర్గల మనోహర కావ్యం .ఇందులో రఘునాధుని దిగ్విజయాలు ,సుపరిపాలన వర్ణించింది .రామ భద్రాంబ తెలుగు కవిత్వం లోనూ ఆరి తేరింది .తెలుగు పద్యాలకు ప్రత్యెక మైన యతి ప్రాసలను సంస్కృత శ్లోకాలో ప్రయోగించటం ఒక గొప్ప ప్రయోగం .సంస్కృత ,ప్రాకృత భాషల్లో అనేక సమస్యలను పూరించిందని తెలుస్తోంది .ఈమె చెంగల్వ రాయకవి శిష్యురాలు .త్రిభాషా కవయిత్రిగా ప్రసిద్ధి చెందింది .అస్టావదానాలలో నిష్ణాతురాలు .

రఘునాదాభ్యుదయం లో రామ భద్రాంబ మొదటి సర్గలో చోళ రాజ్య వైభవాన్ని వర్ణించింది .తామ్రపర్ణి, కావేరి నదుల సోయగాలను వర్ణించింది .తరులు ,,లతలు ,పక్షులు, జంతువులూ అన్నీ ఆమె రచనలో చోటు చేసుకొన్నాయి .బ్రాహ్మణులు వేదం వేదాంగాలలో నిష్ణాతులుగా ,వారు నిర్వహించే యజ్న యాగాదులను తనివి తీరా వర్ణించింది .రెండవ అధ్యాయం లో చోళ రాజధాని తంజావూర్ పురాన్ని విశేషం గా వర్ణన చేసింది .అందులోని వీధులను ,దగ్గరున్న సముద్రాన్ని నాట్యకత్తెలను ,ఎత్తైన భవనాలను ,ఏనుగులు గుర్రాలను వర్ణించి రాజు ధార్మిక పరిపాలనను వివరించింది ..మూడవ అధ్యాయం లో రాజు శౌర్య ప్రతాప వితరణలను చెప్పింది .స్త్రీవిద్యకు రఘునాధుడు చేసిన కృషిని తెల్పింది .నాలుగవ సర్గలో రాజు దిన కృత్యాలను పూస గుచ్చినట్లు వర్ణించింది .అయిదులో కూడా రాజు గురించే రాసినా రాజాస్స్థానాన్ని సందర్శించిన కేరళ ,అంగ మగధ ,కలింగ గౌడ ,ఆరాట్ట దేశాలనుండి విచ్చేసిన సందర్శ్శకులను ముఖ్యంగా వేదాంతులను ,వ్యాకరణ పారీణులను ,కవులను ,కళాకారులను విపులంగా వివరించింది .రాజు విద్వాంసులను ఆదరించిన తీరు ,కళాకారులను ప్రోత్సహించి ,వారికి శిక్షణ నిచ్చిన విధానాలనూ తెలియ జేసింది రామ భద్రాంబ .

54-చోళ రాజ్య చరిత్ర రాసిన –విరూపాక్షకవి

చోళ రాజుల చరిత్రను విరూపాక్షకవి ‘’చోళ చంపువు ‘’గా సంస్కృతం లో రాశాడు .కావేరి పట్టణాన్ని రాజ దానిగా చేసుకొని తమిళ దేశాన్ని పాలించిన చోళ రాజుల చరిత్ర అంతా ఇందులో చూపాడు. ఈ రాజ్యం క్రీ శ మూడు నాలుగు శతాబ్దాలలో పల్లవ రాజుల చేత అంతమైంది .మళ్ళీ తొమ్మిదవ శతాబ్దం లో చోళ వంశం పునరుద్దరింప బడింది .అప్పుడు వీరు తంజావూర్ ను రాజ దానిగా చేసుకొని పరిపాలన సాగించారు .ఇదిమాత్త్రమే లభ్యం అవుతోంది. పూర్వ చోళ చరిత్ర దొరకలేదు కాని తమిళ సంగమ సాహిత్యం లో లభిస్తోంది .చోళ చంపువు ను మొదట కనుగొన్న వాడు ‘’హల్చ్ ‘’ఇది పౌరాణిక కల్పన ఆన్నాడు .స్థల పురాణం అయిన ‘’బృహదీశ్వరమాహత్మ్యం ‘’ఆధారంగా విరూపాక్షుడు ఈ చంపువు రాశాడు .చోళ చంపువు పదిహేడవ శతాబ్దపు రచన .భట్ట బాణుడి శైలిలో విరూపాక్షుడి శైలి ఉంటుంది .సరళ సుందర కవిత్వం తో ఈ చంపువు చంపక పరిమళాన్ని వెదజల్లింది .

55- పట్టపు  రాణి కవయిత్రి- నంజన గూడు తిరుమలాంబ

 

 

విజయ నగర రాజు అచ్యుత రాయల భార్య తిరుమలాంబ .కాలం 1529-1542 .’’వరదాంబికా పరిణయం ‘’అనే చంపూ కావ్యాన్ని సంస్కృతం లో రాసిన కవయిత్రి తిరుమలాంబ .ఆమె ప్రతిభకు ఇది నిదర్శనం .తాను  ఏక సంతాగ్రాహిని అని చెప్పుకొన్న విదుషీమణి .మనుష్య రూపం లో ఉన్న సరస్వతీ దేవి అని పేరుపొందింది .కవయిత్రిమాత్రమేకాదు కవులను పోషించిన ఔదార్యం అమెది .శకలం వారి ఆడపడుచు అయిన వరదాంబిక ,అచ్యుత దేవరాయల వివాహ వర్ణనయే ఈకావ్య ఇతివృత్తం ..మొదటగా అచ్యుత రాయల వంశాన్ని వర్ణించింది .అతని తండ్రి విజయ యాత్రలు ఓబలాంబ తో అతడి వివాహం అచ్యుతుని జననం ,రాజ్యాభిషేకం వివరం గా చెప్పింది ఒక రోజు రాయలు కాత్యాయని ఆలయం లో పూజ చేస్తున్న వరదాంబికను చూసి ప్రేమిస్తాడు .ఇద్దరి మధ్యా ప్రేమ  అంకురించటం ,ఇంతలో విదూషకుడు వచ్చి రాచకార్యం పై తీసుకొని వెళ్ళటం ,అయిష్టంగా అతను కదిలి వెళ్ళటం వరదాంబిక విరహ వేదన ఉంటుంది చెలికత్తెలు వచ్చి ఆమెను అచ్యుత రాయలకిచ్చ్చి ఆమె వివాహం జరిపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పటం ,ఇద్దరి పరిణయం .శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తో దంపతులకు వెంకటాద్రి జన్మించటం పట్టాభి షేకం జరగటం తో సమాప్తం .

తిరుమలాంబ కద కన్నా వర్ణాలకే ప్రాధాన్య మిచ్చి కావ్యం రాసింది .అచ్యుతరాయల కంటే తండ్రినే అధికం గా వర్ణించింది .సంస్కృతం పై చక్కని అధికారం తో కావ్యం రాసింది సందర్భాను సారం గా అన్ని రసాలను వర్ణించి కావ్య గౌరవం పెంచింది .శృంగారాన్ని  అంగి రసం గా చేసుకొన్నది .శ్లేష ,యమకాలనూ సమయాన్ని బట్టి వాడింది సైన్యం , ,యుద్ధాలను ,నదులను ,ఋతు  జలక్రీడ వర్ణనలను అద్భుతం గా చేసింది .అచ్యుత రాయలను నఖ శిఖ పర్యంతం శోభాయమానం గా వర్ణించింది .స్త్రీ ఇలా పురుష వర్ణన చేయటం అప్పటికి కొత్తా,  వింత కూడా . ఈమె గద్యం బాణుని బాటలో సమర్ధం గా నడిచింది .పరి సంఖ్యాలంకారాన్ని చమత్కారం తో ప్రయోగించింది .గద్యం ఓజో గుణ భరితం .అనుప్రాసలతో దీర్ఘ సమాస బంధురం గా రాసింది .ఉదాహరణకు –

‘’నిరంతరాంద కారిత దిగంతర కందళ మంద సుధారస బంధు సాన్ద్రతర ఘనాఘన వృందా సందేహ కరస్యన్దమాన మకరంద బిందు బంధుర మాకంద తరుకుల తల్ప కల్ప మృదల సికతాజాల జాతిల మూలతల మరువక మిలిద లఘు లయ కలిత రమణీయ పానీయ శాలికా బాలికా కరార వింద గలంతికా గల దేల లవంగ పాటల ఘన సార కస్తూరి కాతి సౌరభ మేదుర లఘుతర మధుర శీతలతర సలిల ధారా నిరాకరిష్ణు తదీయ విమల విలోచన మయూఖ రేఖా పసారిత పిపాసా యాస పాదిక లోకాన్ –‘’అని రస రమ్యం గా సాగుతుంది .ఆమె గద్యం కన్నా పద్యం హృద్యం.

‘’సరసి విరహసి త్వం శాత్రవా వారధి మధ్యే –త్యము పవన సరన్యాం తేలి ఘోరే వానంతే

కృతక గిరి తటే త్వం కిన్చాటే వింధ్య శైలే –కదా మరిషు విగానం కధ్యతా మచ్యుతేంద్ర ‘’

తిరుమలాంబ ‘’ఆర్య మహిళే’’ అని రాసిన దానిలో మహిళలే ఆర్య ధర్మాన్ని నిలబెట్టాలని సూచించింది .కన్నడ దేశాన్ని గురించి ,కన్నడ భాషను గురించి తిరుమలాంబ  చెప్పిన విషయాలు .ఆమె కన్నడ అభిమానానికి కన్నడ దేశ భక్తికి నిదర్శనాలని కన్నడ భాషా విమర్శకుడు సి యెన్ మంగళ చెప్పారు .ఇలా కన్నడం గురించి దేశాన్ని గురించి ప్రస్తుతించిన మొదటి కవి తిరుమలాంబ యేననీ ఆయన చెప్పటం తిరుమలాంబ వ్యక్తిత్వానికి మరింత శోభ కూర్చింది .

నంజన గూడు తిరుమలాంబ పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ఏర్పరచి ప్రముఖులకు అందిస్తున్నారు .ఆ పురస్కారాన్నిపొండిన వారిలో విజయ లక్ష్మి పండిట్ కుమార్తె నాయన తారా సెహగల్ ఉన్నారు .ఏఎ అవార్డ్ గ్రహిస్తూ నాయన తార ఆనాడే పురుషుల తో బాటు స్త్రీకూడా అన్ని రంగాలలోనూ ముందు ఉండాలని ప్రబోధించి ఆచరించి చూపింది తిరుమలాంబ అని కొనియాడింది .

మరో కవితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి ,దీపావళి పండుగ

This gallery contains 29 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి

గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే చైతన్యప్రభువు అని వీరందరి నమ్మకం .రూపగోస్వామి పూర్వీకులు కన్నడ దేశానికి చెందినసారస్వత బ్రాహ్మణులు . లఘు తొషిని రాసిన జీవ గోస్వామి మాటలను బట్టి రూప గోస్వామి యజుర్వేద శాఖకు చెందినవారు .భారద్వాజ గోత్రీకులు .ఈ  వంశం లోని పూర్వీకుడే సర్వజ్ఞ రాజు విద్యా వేత్త .జగద్గురు బిరుతాంకితుడు .  ఈయన కుమారుడు అనిరుద్ధుడు .ఈయనకు హరిహార ,రూపేశ్వరులు కుమారులు .రూపేశ్వరుడు వేదం వేదాంగాలలో నిష్ణాతుడు .హరి హరుడు ధనుర్విద్యలో ,రాజకీయాలలో ఆరి తేరిన వాడు .తండ్రిమరణం తర్వాత రాజ్యం వీరిద్దరికీ విభజింప బడింది .కాని దుర్మార్గుడైన హరిహరుడు రూపేశ్వరుడు రాజ్యాన్ని లాక్కొని అతన్ని దేశ బహిష్కారం చేస్తే దేశాటనం చేస్తూ గంగా తీరం చేరాడు .పద్మనాభుడు ఈయనను ఆదరించాడు .పద్మనాభుడికి పద్దేనిమిదిమంది కుమార్తెలు ,అయిడుగురు  కుమారులు చివరికొడుకు ముకుందుడు .

ఆ ప్రాంతం లో మత సంఘర్షణలు చోటు చేసుకొంటే ముకుందుని కుమారుడు కుమార దేవుడు జేస్సూర్ చేరాడు .కుమార దేవుని కుమారులే రూప ,అమర,(సనాతన ) శ్రీవల్లభ ,(అనుపమ).కుమార దేవుని మరణం తర్వాత అన్నదమ్ములు ముగ్గురు గౌడ దేశం అని పిలువ బడే బెంగాల్ చేరి విద్యాభ్యాసం చేశారు .న్యాయ శాస్త్రాన్ని సార్వ భౌమ భట్టా చార్య వద్ద నేర్చారు .సంస్కృతం తో బాటు ఆరేబిక్ పర్షియన్ భాషలనూ నేర్చుకొన్నారు .వీరి తెలివి తేటలకు ,విద్యా గరిమకు మెచ్చి అప్పటి బెంగాల్ పాలకుడు అల్ల్లాఉద్దీన్  హుసేన్ షా వీరిని బలవంతం గా ప్రభుత్వాధికారులను చేశాడు .రూపను ముఖ్య కార్య దర్శిగా ,సనాతనుడిని రెవిన్యు మంత్రిగా చేశాడు సుల్తాన్ .

సుల్తాన్ రాజ దాని రామ కేళి లో వీరు ఉన్నారు .అప్పుడు చైతన్య మహా ప్రభువు 1514లో అక్కడికి వచ్చినప్పుడు మొదటి సారిగా దర్శించారు .చైతన్య ప్రభావం తో సన్య సించి రాజీనామా చేసి స్వంత గ్రామం జేస్సూర్ లోని ఫతియా బాద్ చేరుకొన్నారు .రూప ,అనుపమ లు చైతన్యునికోసం పూరీ కి పంపగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసి బృందావనం చేరటానికి ప్రయత్నించి తమ వద్ద ఉన్న పదివేల బంగారు నాణాలు సనాతనునికోసం అక్కడ ఉంచామని తెలియ జేసి బృందావనం చేరుకొన్నారు .

సోదరులు బృందావనం లో చైతన్యుడు కనిపించకపోయేసరికి ప్రయాగలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లి దర్శించారు .చైతన్యుడు వీరిద్దరికీ గౌడీయ వైష్ణవ ధర్మాలన్నీ బోధించాడు .బృందావనం లోని సనాతన ప్రదేశాలను గుర్తించి ,వైష్ణవ మత వ్యాప్తి చేసే బాధ్యతను చైతన్యుడు రూప గోస్వామిపై పెట్టాడు .బృందావనం లోనే జీవితాలను గడిపారు సోదరులు .శ్రీ క్రిష్ణుని ముని మనవడు వజ్రనాభ మహారాజు స్తాపించి అర్చించిన భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని శోధించి కనుగొని బృందావనం లో రూప గోస్వామి ప్రతిస్టించాడు .వీరికి శిష్య పరంపర పెరిగింది అందులో లోక నాద ,భూ గర్భ ,గోపాల భట్ట ,రఘునాధ భట్ట ,రఘునాధ దాస గోస్వాములు .రూప గోస్వామి కూడా ఇక్కడికి చేరి వైష్ణవాన్ని పొందాడు .లలితాదేవి ఆధ్వర్యం లో రాదా క్రిష్ణులను భక్తితో సేవించిన చిన్న గోపిక ‘’రూప మంజరి ‘’యేరూప గోస్వామిగా మరల అవతరించారని వారి నమ్మకం .నిత్యం శ్రీ కృష్ణ భజనలతో బృందావనం మారు మోగింది అప్పటినుండి .ఇప్పటికీ అలానే జరుగుతోంది ,

రూప గోస్వామీయం

రూప గోస్వామి   సంస్కృతం  లో అనేక గ్రంధాలు రచించాడు అందులో వేదాంతం అలంకార శాస్త్రం ,నాటక శాస్త్రాలున్నాయి .రూప గోస్వామి రాసిన భక్తీ రసామృత సింధు గ్రంధం గౌడీయ వైష్ణవానికి ప్రామాణికం .ఉజ్వల నీలమణి అనేది మాధుర్య రసాన్ని గూర్చి తెలిపేది .లఘు భావామృత అనేది సనాతన గోస్వామి రాసిన బృహత్ భాగమృతం కు సంక్షిప్తం .విదగ్ధ మాధవ అనేది రెండు కృష్ణ నాటకాల సంపుటి .రెండు గా చేయమని సత్యభామ కలలో కన్పించి చెప్పిందట .ఇవే లలితా మాధవ ,విదగ్ధ మాధవ నాటకాలు .స్తవమాల లో అనేక స్తోత్రాలున్నాయి .దాన కేళి కౌముది లో  ఏకాంకిక ఉన్న భాణం .శ్రీ రాదా కృష్ణ గనోద్దీపిక  -లో రాధ కృష్ణుల పాత్ర స్వరూప స్వభావాలను వర్ణించాడు .మధుర మహాత్మ్యం లో మధురా నగర విశేషాలున్నాయి .ఉద్దవ సందేశం భాగవతం ఆధారం గా రాసింది ఇందులో కృష్ణుని ఆదేశం పై ఉద్ధవుడు బృందావనానికి రావటం తెలియ జేయ బడింది .హంస దూతం అనేది రాధ కృష్ణునికి హంస ద్వారా సందేశాన్ని పంపటం వృత్తాంతం .శ్రీ కృష్ణ జన్మ తిది విధి లో శ్రీకృష్ణ జన్మాష్టమి వివరణ చేయాల్సిన విధి విదానాలన్నీ వివరించాడు .నాటక చంద్రిక లో గౌడీయ వైష్ణవ నాటక విధానాలను వివరించాడు .ఉపదేశామృతం లో శ్రీకృష్ణుని చేరుకోవటానికి తేలికైన పదకొండు పద్ధతులను పదకొండు శ్లోకాలలో చెప్పాడు .

భక్తీ రస  స్థాపకుడుగా రూప గోస్వామి నిలిచాడు .ఉజ్వల నీల మణి, భక్తీ రసామృత సింధు అనే అలంకార శాస్త్రాలలో రస చర్చ చేశాడు .శృంగార రసాన్ని విపులంగా వివరించాడు .భక్తిలో ఉండే విభావ ,అనుభవాలను వివరిస్తూ వాటినీ రసం గానే చెప్పాడు .భగ వంతునిపై ప్రీతిని ప్రేయో రసంగా చెప్పాడు .దీన్ని మధుసూదన సరస్వతి సమర్ధించాడు .భక్తీ మధురం ఉజ్వలం అని రెండు రకాలన్నాడు .శ్రీ కృష్ణ గోపీకల మధ్య ఉన్నది శృంగార రసమన్నాడు .దీనికి చిత్త ద్రవం స్తాయీ భావంగా చెప్పాడు .కృష్ణ గోపీ విషయకమైన రతి ఉపాదేయం అని అదే భక్తీ రసమని వివరించాడు .శృంగారం మొదలైన రసాలు క్షుద్రమైనవని ,భక్తీ రసం ఒక్కటే సర్వ శ్రేష్టమైనదని స్తాపించాడు .భగవద్భక్తి రసాయనం అనే గ్రంధం లో భక్తీ కి సంపూర్ణం గా రసత్వాన్నిచ్చి ఉదాత్తత కల్పించాడు .భగ వంతుడు ఆలబన విధానం ,ఆయన చరిత్రలు విభావాలు ,భగవద్రతి స్తాయీ భావం ,నేత్ర వికారం మొదలైనవి అనుభవాలు ,నిర్వేదం ,శంక ,హర్షం మొదలైనవి వ్తభిచారీ భావాలు అని రూప గోస్వామి వివరించాడు .భక్తీ రసం అందరి ఆమోదాన్ని పొందింది .

నాటక చంద్రిక లో నాటక లక్షణాలు వివరణ లిచ్చాడు .

 

మరో కవితో కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తుస్సు టపాసులు

తుస్సు టపాసులు

వాలిపోయే అవ్వాయి చువ్వలాగా దూసుకొచ్చాడు మా బామ్మర్ది బ్రాహ్మి ‘’.బావా ఏటపాసులూ పేలటం లేదని అంటున్నారేమిటి  బావా’’అన్నాడు బోల్డు ఆశ్చర పోతూ .’’అదేంటిరా  .తుఫాను వచ్చింది విశాఖ ఇజీనగరం సికాకోలు జిల్లాలకేగా ?మనకేమీ వర్షం లేదు తడిసే పనీ లేదు ఎందుకు పేలవు ?’’అన్నా  అమాయకం గా .’’లేదు బా.ఎప్పుడూ కొనే వాడికోట్లోనే కొట్టుకొచ్చా .కాలిస్తే ఒక్కటీ కాలలేదు పేలలేదు ‘’అన్నాడు ఏడుపు మొహం తో .’’ఎందుకిలా?’’అని పోజు పెట్టా సుబ్బరాయ శర్మలాగా .’’నువ్వు బ్రాండ్ లేబిల్ చూశావా?’’అని అడిగా ..’’చూసిన గుర్తు లేదు బా .అయినా మీ చెల్లికి ఫోన్ చేసి తెలుసు కొంటానుండు ‘’అని ఫోన్ చేసి సమాధానం రాగానే తెల్ల మొహం వేశాడు .’’ఇంతకీ  ఏం చెప్పింది  మీ ఆవిడ?’’నా కుతూహలం ఆగక అడిగా .’’చిచ్చుబుడ్లు సోనియా బ్రాండ్ వి ,నేలటపకాయలు రాహుల్ బ్రాండ్ వి ట బా ‘’అన్నాడు బారుమంటూ .’’హర్యానా మహారాష్ట్ర లలో ఇద్దరి ఇజ్జత్తు తుస్సుమందిగా మొన్న ఎన్నికల్లో .అందుకే ఆబ్రాండ్ వి కూడా తుస్సుమని ఉంటాయి ‘’అన్నాను ఊరడిస్తూ .’’సరేకానీ బాంబులూ ఔట్లూ బాగా పేలాయా?’’మళ్ళీ  నాప్రశ్న.వాడు మళ్ళీ ఫోన్ లో ఎంక్వైరీ ,మరలా దిగాలు మొహమూ చూడలేక ‘’ఏమైందిరా?’’అన్నా ‘’మోసం బా .’’మళ్ళీ బావురు .’’పవార్ ఆటంబాంబులు ,చవాన్ ఔట్లూటబా ‘’అన్నాడు .నీళ్ళు రాకపోయినా అశ్రుపూర్ణు డనిపించినట్లున్నాడు.’’ఆహా !అదీ విషయం .ఇద్దరి  గాలి మహారాష్ట్రలో తుస్సుమంది రా. దానిప్రభావమే’’ అన్నా .సరే బావా నరకచాతుర్దసి ఎట్లాగో అయిన్దనిపించాం .దీపావళికి ఏమి కొనాలో ఎక్కడ ఏ బ్రాండ్ వికోనాలో తోచటం లేదు బా ‘’అన్నాడు .’’మతాబాలు ,సీమ టపాకాయల సంగతేమిటి ?’’మళ్ళీ ప్రశ్నించా .పాపం మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకొని మళ్ళీ బావురుమన్నాడు .’’ఏమిటి సంగతి ?’’అడిగా .’’అవీ మోసమే బా .హుడా ,చౌతాలా బ్రాండ్ లట .అవీ వెలగలేదు ,పువ్వులు రాలలేదు .టపటప మనాల్సిన సీమ టపాకాయలు నీళ్ళు కాచే పొయ్యిలో వేసినా ఉలకా  లేదు పగల లేదు శబ్దం ఒస్తే ఒట్టు ‘’అన్నాడు ఏడుపోక్కటే తక్కువ   .’’అలా చెప్పు .హర్యానాలో ఇద్దరూ మట్టికరిచారుకదా .ఇంకేం పేల్తాయిరా .పదవులలో ఉండగా దర్జాగా వాళ్ళు వెలిగారు .జనం గోడు పట్టించుకోలేదు .అవినీతి మురుగులో కూరుకు పోయిన ఫలితం .అల్లుడుగారి మేహర్బానీకోసం హర్యానాను తాకట్టు పెట్టిన ఫలితమే ఇది .ఇక  ఆబ్రాండ్ లకు కాలం చేల్లిపోయిన్దిరా .కొత్త  బ్రాండ్ లు వచ్చాయని అందరూ అంటున్నారు .అవి ట్రై చెయ్యి  ‘’అన్నా .

‘’బావా అందరూ మోడీ బ్రాండ్ వే కొంటున్నారట .నాబుద్ధి గడ్డి తిని నూరేళ్ళ పాత బ్రాండ్ కదా అని ఆశ పడి మోసపోయాను .అప్పటికీ మీ చెల్లెలు చెబుతూనే ఉంది ఈ బ్రాండ్ అంతా కల్తీ ,దగా మోసం అవినీతి తో కూరినవే .అందుకే తుస్సు బస్సు లే తప్ప ప్రతాపం చూపి పేలలేక పోయాయి ,కాల లేక పోయాయి వేలుగులివ్వలేక పోయాయి ,తిరగ లేక పోయాయి ఎగర లేక చతికిల పడ్డాయి .’’అన్నాడు జ్ఞాన నేత్రం తెరుచుకున్నఅజ్ఞాని లా .’’బావా !ఇక ఇప్పుడు చెలామణి లో ఉన్నది ఒకే  ఒక్క బ్రాండ్ మోడీ బ్రాండ్ .కావలసిన టపాకాయలన్నీ ఆ బ్రాండ్ వే కొంటా .మోతమోగిస్తా .వెలుగులు నింపేస్తా .దూసుకేల్తా ఇక తిరుగే లేదు .’’అంటూ ‘’మోడీ-అమిత్ షా  అవ్వయిచువ్వాయి’’లాగా రెట్టించిన వేగం తో, కాంతితో, మోతలతో, ఇంటికి దూసుకు వెళ్ళాడు బ్రహ్మి బామ్మర్ది,

Inline image 1  

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment