| రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య | |
‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’
వాక్యం సరిగా లేదు ‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ ఈ వాక్యమూ సరిగా లేదు ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’ వాక్యమిపుడు సరిగ్గా వుంది వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు ఎవరి సందర్భాలు వారివి! కానీ వాక్యం సరిగ్గానే వుంది ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’ ట్రాన్స్ఫార్మర్ మీద ఆత్మహత్య చేసుకున్న రైతు మట్టి దేహమ్మీది నుంచి నేల మీదికి రాలిపడ్డ వాక్యమది! సరిగ్గానే వుంది! ——- బతుకు పండగనాడు తీరుతీరు పూలను పేర్చి తలకెత్తుకుంటున్నాం- ట్యాంక్‌బండ్ సాక్షిగా సంబరమే! కానీ యుగాలుగా రైతు పొలాల్ని తలకెత్తుకునే వున్నాడని మనకు తెలుసా అతన్ని మనం తలకెత్తుకోవడం లేదు సరికదా తన పొలమ్మీద తననే బతకనివ్వడం లేదు మనం సంబరాల్లో మునిగిపోయి అతని సాగును మరిచాం, ఉనికిని మరిచాం నీరందివ్వక వెల్తురునివ్వక నేల బతుకు నుంచి అతన్ని వెలేసాం – నేల మిగలక గాల్లోకి లేచి అతను ట్రాన్స్ఫార్మర్ మీద ప్రాణం తీసుకున్నాడు చావు నిరసనలోనూ అతను అన్వయాన్నే పాటించాడని మన తలకెక్కుతున్నదా సంతాపం ప్రకటిస్తున్న ఈ నేలమీద వేలాడుతున్న మట్టిమనిషి శవం ముందు ఇపుడు ఏ తలల్తో నిలబడతాం మనం? |
వీక్షకులు
- 1,194,571 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర -5
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర -5(చివరిభాగం )
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-4
- అమెరికా జాతీయకవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర-4
- శ్రీ జోల ద రాశి కె. దొ డ్డ న్న గౌడ అనుభవాలు- జ్ఞాపకాలు.1 వ భాగం.20.9.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం. విశ్వనాథ వేయిపడగలు.34 వ భాగం.20.9.26।
- నోబెల్ లారియట్ హెమింగ్వే జీవిత చరిత్ర-3
- అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ జీవిత చరిత్ర-3
- శ్రీ నాయని సుబ్బారావు గారి జీవిత చరిత్ర.10 వ చివరి భాగం.19.9.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.33 వ భాగం.19.9.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,467)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

