మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా (సంపాదకీయం) – జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ

మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా (సంపాదకీయం) – జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ

Published at: 10-08-2014 00:26 AM

భారత సమాజంలో అసహాయులైన ఆడవారి మీద మగవారి దురహంకార లైంగిక, హంతక దాడుల యుద్ధం కొనసాగుతోంది. ఆధిపత్య, జెండర్‌, మతం, కుల దురహంకార దాడుల సంస్కృతిలో ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు నలిగిపోతున్నాయి. ఆడవాళ్ళు, చిన్న పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేని లైంగిక, హంతక దాడులు పెరిగిపోయాయి. లైంగిక నేర ప్రవృత్తికి అగ్రకుల క్రూరత్వం తోడైన చోట దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల మహిళల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ మహిళలు, మహిళా సంఘాలు, తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు ప్రజాస్వామిక వాదులు సంఘటితమై గొంతెత్తుతున్నారు. సామాజిక, జెండర్‌ వక్రగతులను దిద్దుబాటు చేసుకోలేనంతగా మన సమాజం రోగగ్రస్తమయిందా? మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో సమాజమూ, చట్టాలూ, ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధిత మహిళలే తమని తాము రక్షించుకునే ఆత్మరక్షణా చర్యలకు సిద్ధపడక తప్పదా?   ‘నేను ఫూలన్‌ దేవిని’ అనే పుస్తకంలో వివరించిన ఫూలన్‌ దేవి కాలం నాటి అణచివేత పరిస్థితులు నేడు తప్పక కనిపిస్తాయి.

ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచింది. యమునా నదిలో ఈదింది. పడవలు నడిపింది. పాముల్నికొట్టింది. బరువులు మోసింది. పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూసింది. చమార్‌, జాతవ్‌, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్నీ, అశక్తతలనూ అర్థం చేసుకుంది. పదకొండేళ్ళ వయసులోనే బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసలనూ ఎదుర్కొంది. తండ్రి కున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్న నాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులు, దెబ్బలు, సామూహిక అత్యాచారాలను, బందిపోట్ల కిడ్నాపులకు, లైంగిక దాడులకు గురయింది. అడవుల్లో చంబల్‌ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారినా బాధిత స్ర్తీలు, పేదలకు ఆర్థిక సాయం చేసి, ధైర్యాన్నిచ్చి, కర్కోటకులైన అగ్రకుల ఠాకూర్లపై ప్రతీకారం నెరవేర్చుకునే తిరుగుబాటుదారుగా ఫూలన్‌దేవి మారింది.

మగ, కుల దురహంకార ఠాకూర్లకేగాక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికీ ఫూలన్‌ దేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, అర్జున్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమూ ఫూలన్‌దేవితో చర్చలకు పూనుకున్నాయి. ఫూలన్‌దేవి 1983లో షరతులు విధించి తన సహాచరులతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఎనిమిదేళ్ళకే విడుదల చేస్తామని ఇచ్చన మాట తప్పిన ప్రభుత్వాలు, ఫూలన్‌ దేవిని గ్వాలియర్‌, తీహార్‌ జైళ్ళలో పదకొండేళ్ళు ఖైదు చేశాయి. తర్వాత ఫూలన్‌ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికయ్యారు. తన 37వ ఏట 2001 జూలై 25న పార్లమెంటు మధ్యాహ్న భోజన విరామంలో ఫూలన్‌దేవి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లింది. అక్కడ ఇంటి బయట గుర్తు తెలియని ముసుగు మనుషుల తుపాకీ కాల్పుల్లో ఫూలన్‌దేవి హత్యకు గురయ్యారు. 1981లో బెహ్మాయ్‌ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకుగాను ఫూలన్‌ దేవి హత్య జరిగి ఉండవచ్చని చాలామంది భావించారు. అదే నిజం కావచ్చు. పాత శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండి ఉంటే, శత్రు కులం ఠా కూర్‌ని పెళ్ళి చేసుకోకపోతే ఆమె సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా, బాధితుల ప్రపంచ నాయకురాలిగా కొనసాగుతూ ఉండేవారేమో?

కొన్ని సందర్భాల్లో తన అనుభవాల నుంచి ఫూలన్‌ దేవి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుందాం.. ‘శారీరకంగా చితికిపోయి ఉన్నాను. నాకిపుడు పద్దెనిమిది సంవత్సరాలు. నా ఒంటి నిండా మగవాళ్ళు పెట్టిన గుర్తులున్నాయి. వాళ్ళు మగవాళ్ళు కాదు. పశువులు. కుక్కలు. పోలీసు లాకప్పులో నా ముంజేతులు విరిగిపోయాయి. ఇప్పటివరకూ కోలుకోలేదు. షాట్‌గన్‌ పట్టుకుని గురి చూడటమే కష్టంగా ఉంది. రెండు చేతులతో పట్టుకోవలసి వస్తోంది… పోలీసుల దృష్టిలోనేను బందిపోటు రాణిని. అంటరాని ఫూలన్‌ దేవిని. .. ఆ రాత్రి… శపథం చేసాను, ఇక నాకు పోయేదమీ లేదు. నేను శక్తిమంతురాలిని. మనుగడ, ప్రతీకారం నన్ను ముందుకు నడిపించాయి…

‘చిన్నప్పటినుంచి నేను మొండిదాన్నే.. జాతి, కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా మనందరికీ ఆత్మగౌరవం ఉంటుందని రుజువు చెయ్యాలనుకున్నాను. ‘ఫూలన్‌ దేవి ఒక మనిషి’ అని అందరూ నన్ను అనాలని నా కోరిక. అప్పుడే మిగతావాళ్ళ గురించి కూడా ఆ మాట అనగలుగుతారు… ఎన్నోసార్లు చేతులు చాచి సహాయం అర్థించాను. కానీ, ఎవ్వరూ ఆదుకోలేదు. హీనురాలిననీ, నేరస్థురాలిననీ అన్నారు. నేనేదో ఉత్తమురాలినని ఎన్నడూ అనుకోలేదు. కానీ, అలా అని నేరస్థురాలిని కూడా కాదు. నన్ను హింసించిన మగవాళ్ళని మాత్రం నేను హింసించాను అంతే.. లాఠీనే న్యాయంగా చెలామణీ అవుతున్న మా ప్రాంతంలో మల్లాలు, ఠాకూర్లకు బానిసలు అవుతున్న మా ప్రాంతంలో, నేను ప్రజలకు న్యాయం పంచాను. నేరం చేసిన వాళ్ళని నా న్యాయస్థానం ఎదుటికి తీసుకువచ్చే వారు. వాడు ఇతరులను ఎలా హింసించేవాడో వాణ్ని అదే పద్ధతిలో హింసించేదాన్ని… ఉన్నవాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని లేనివాళ్ళకి ఇచ్చాను. కట్నం డబ్బులిచ్చి అమ్మాయిలకు సహాయం చేశాను. అత్యాచారం చేసిన వాళ్ళనీ, భూమి లాక్కున్న వాళ్ళనీ, ఇన్ఫార్మర్లనీ శిక్షించాను తల పైకెత్తగలిగేది నేనే… నిలబడి యుద్ధం చేసింది… నేను.. పోలీసులను నేనే వేధించాను…. నా పేరు ఫూలన్‌ దేవి అనీ, మరచిపోవద్దు అనీ చెప్పేదాన్ని’.
అగ్రవర ్ణ రాజకీయ వ్యవస్థ, దాని మీడియా ప్రచారం చేసిన విధంగా ఫూలన్‌ దేవి కేవలం బందిపోటు కాదు. ఫూలన్‌ దేవి అంటే అమాయకురాళ్ళు, అశక్తులైన ఆడవారిపై, బాలికలపై లైంగిక, హంతక దాడులకు పాల్పడిన పురుషాంగాలను నిర్వీర్యం చేసే మహాశక్తి… పేదరికమూ, కులం తక్కువతనమూ తెచ్చే ఆకలి, అవమానాలు, అత్యాచారాలు, మగ, కుల హింసలపై తిరుగుబాటుదారు ఫూలన్‌ దేవి. ఆమె ఒక సైన్యంగా జెండర్‌, కుల అణచివేతలపై ఫూలన్‌దేవి యుద్ధం చేసింది. .. ఫూలన్‌ దేవి అంటే బాల్య వివాహాలను, లైంగిక అత్యాచారాలను, సాంఘిక దురాచారాలను ప్రశ్నించే తుపాకీ. ఫూలన్‌ దేవి అంటే మగ, కుల సర్పాలపై పడిన కత్తెర. మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా. ఆదర్శవంతమైన నాయకురాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మరో పేరు. ఫూలన్‌ అంటే జెండర్‌, కులం వివక్షా రూపాలన్నింటిపై తనను తాను రక్షించుకునే ఆత్మరక్షణా యుద్ధం.

వ్యవస్థీకృత సామాజిక రోగాలు, నేరాలు, దురాచారాలపై తిరుగుబాటు చేసిన పూలన్‌ దేవి జయంతి, వర్ధంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. ఫూలన్‌దేవి జీవితం, తిరుగుబాటు, సేవలు, సాధించిన విజయాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు హైస్కూలు విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పొందుపరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు, అవి చేపట్టే మహిళా సాధికార విధానాలకు ఫూలన్‌ దేవి పేరు పెట్టాలి. పార్లమెంట్‌లో ఫూలన్‌దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఉత్తరప్రదేశ్‌లో ఫూలన్‌దేవి పుట్టిన జిల్లాకు ఫూలన్‌ దేవి జిల్లాగా నామకరణం చేయాలి. పెప్పర్‌ స్ర్పేలు, కరాటే శిక్షణ, ఆత్మరక్షణా శిక్షణ, పరికరాలు, ఆయుధాలు అవసరమని భావించే నేటి ప్రతి యువతీ, మహిళా ఫూలన్‌ దేవి జీవిత కథనాన్ని ఒకసారి చదువుకొని, ఆమె ధైర్యం నుంచి కొంచెమైనా స్ఫూర్తిని తమలో నిలుపుకుంటే చాలు. లైంగిక, హంతక దాడులకు పాల్పడే మగ తోడేళ్ళను సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఫూలన్‌దేవికి మా ప్రేమపూర్వక నివాళులు.

– జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ
(నేడు ఫూలన్‌దేవి 51వ జయంతి)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1

ట్రావెన్ కూర్ ఝాన్సి రాణి –అక్కమ్మ చెరియన్

అక్కమ్మ చెరియన్ మంచి విద్యా వంతురాలు .మిడిల్ స్కూల్ టీచర్ గా పని చేసింది .ఆ కాలం లో ‘’బుడత కీచులు ‘’అనబడే పోర్చు గీసు వాళ్ళు ,బ్రిటిష్ వాళ్ళ భారతీయుల యెడ చాలా క్రూరం గా ప్రవర్తించేవారు .సరిహద్దులు దాటి చొరబడి భీభత్సం సృష్టించేవారు .దయా దాక్షిణ్యాలు వాళ్ళ డిక్షనరీలో కనిపించేవికావు ఇళ్ళల్లో చొరబడి నిప్పు పెట్టె నీచులు .వీటన్నిటిని చూసి సహించలేక చెరియన్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య యుద్ధం లో పాల్గొన్నది అన్ని  అందోళనలలో చురుగ్గా పని చేసింది .1938లో కేరళలో కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .దీనికి నిరసనగా అక్కమ్మ చెరియన్ అందరిని కలుపుకొని బ్రహ్మాండ మైన నిరసన ప్రదర్శనను తాంపనూర్ నుంచి కౌడియార్ పాలస్ వరకు నిర్వహించింది .దీనిపై స్పందించిన ప్రభుత్వం వారిపై  కాల్పులు జరుప బోతున్నట్లు ప్రకటించింది .ముందుగా తనను కాల్చి  తర్వాత తన అనుచరులను కాల్చమని చెరియన్ ముందుకొచ్చి ధైర్యం గా తుపాకులకు గుండెను ఎదురు పెట్టి నిలబడింది .కంగు తిన్న బ్రిటిష్ ప్రభుత్వం కాల్పుల ఆర్డర్ ను ఉపసంహరించుకోన్నది .ఆమె సాహసానికి   మహాత్మా గాంధి ‘’ట్రావెంకూర్ ఝాన్సి రాణి ‘’అని ఆమెను శ్లాఘించాడు .ఇది ఆమె జీవితం లో ఒక సాంపిల్ మాత్రమే .భారత ప్రజలకు వ్యతిరేకం గా బ్రిటిష్ ప్రభుత్వం చేబట్టిన అన్ని పనులను ఎదురొడ్డి నిల్చి నిరసన తెలుపుతూ ,ఆందోళన చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తూ జీవిత మంతా గడిపిన శ్రేస్టవీర వనితఆమె

 

.

కుట్టిమాలు అమ్మ

ఈమె మరొక పోరాట యోధురాలు .బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచినా స్త్రీ మూర్తి .మహిళలను ఐక్యపరచి పోర్చుగీస్ వారికి వ్యతిరేకం గా ఉద్యమించింది .విదేశీ వస్త్రాలు ధరించవద్దని కేరళ ప్రజలను  కోరింది .సహాయ నిరాకరణ ,క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది .

Inline image 1  Inline image 2

అమ్ము స్వామినాధన్

నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు అత్యంత విదేయుదు  అమ్ము స్వామినాధన్  భర్త నాయర్ .సుభాస్ బాబు లాగా ధైర్య వంతుడు అలానే ప్రవర్తించేవాడు .అన్ని ఉద్యమాలలో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించాడు .భర్త బోసు బాబు అడుగు జాడల్లో నడిస్తే భార్య అమ్ము స్వామినాధన్ గాంధీ మహాత్ముని అహింసా సిద్ధాంతాన్ని నమ్మి ,ఉద్యమాలు నిర్వహించింది .దీని వలన కేరళీయుల హృదయాలలో ఆమె అమ్మగా నిలిచిపోయింది .కేరళ అసెంబ్లీ శాసన సభ్యురాలుగా ,కేరళ నుండి రాజ్య సభకు ఎన్నికైన పార్ల మెంట్ సభ్యురాలుగా ఆమె సేవలు అందించింది .

Inline image 3Inline image 4

ఇంకా కొంతమంది స్త్రీ సమర యోధులు ఉన్నా వారి గురించి రికార్డుల్లో ఎక్కడా కనిపించక పోవటం దుర దృష్టం .

ఇప్పుడు కొందరు పురుష యోధుల గురించి తెలుసుకొందాం

మొహమ్మద్ అబ్దూర్ రేహిమాన్

కొచ్చిన్ రాష్ట్రం  కొడంగల్లూర్  జిల్లాలోని అజ్హికోడ్ లో రేహిమాన్ 1898లో జన్మించాడు .మద్రాస్ లో ఆలిగ్హాడ్ లలో విద్య నేర్చాడు .ఆలిగ్హాడ్ యూని వర్సిటిలో చదువుతూ మలబార్ లో సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలలో  లో పాల్గొని చదువుకు స్వస్తిపలికాడు .1921లో ‘’మోఫ్లా తిరుగు బాటు ‘’జరిగినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీవ్రం గా కృషి చేశాడు .మోఫ్లా తిరుగు బాటు దారుల తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నం చేసినప్పటికీ రేహిమాన్ ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .రెండేళ్ళు జ్జైలు శిక్ష అనుభవించాడు .

1930కాలికట్ బీచ్ లో ఉప్పు సత్యాగ్రహాన్ని చేస్తున్న రేహిమాన్ ను పోలీసులు చితకబాది  అరెస్ట్ చేసి కన్ననూర్ సెంట్రల్ జైలు లోతొమ్మిది నెలలు  నిర్బంధించారు’’.ఒ ఆల్ అమీన్ ఒ ‘’ అనే పత్రికను 1929నుండి పదేళ్ళు నడిపాడు .ప్రభుత్వ దమనకాండ వలన పత్రిక మూసి వేయాల్సి వచ్చింది .కాలికట్ మునిసిపల్ కౌన్సిలో 1931నుంచి మూడేళ్ళు మెంబర్ గా ఉన్నాడు .మలబార్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ గా కూడా పని చేసి తర్వాత మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి 1937లో ఎన్నికైనాడు .

1937కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ,1939జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాడు .నేతాజీ కి వీర విదేయుడైన రేహిమాన్ ఫార్వార్డ్ బ్లాక్ లో చేరి సేవలందించాడు .రెండవ ప్రపంచ యుద్ధం మొదలవగానే రేహిమాన్ ను అరెస్ట్ చేసి 1940నుండి 1945వరకు అయిదేళ్ళు జైలు లో ఉంచారు .విడుదల కాగానే కాలికట్ వెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లో క్రియాశీలకం గా పని చేశాడు .ఒక బహిరంగ సభలో ప్రసంగించి 22-11-1945నమహమ్మద్ అబ్దూర్ రేహిమాన్ మరణించాడు .ముస్లిం లీగ్ చెప్పే ద్విజాతి సిద్ధాంతాన్ని రేహిమాన్ పూర్తిగా వ్యతిరేకించేవాడు .మంచి వక్త రచయితా సమర్ధ నాయకుడు ,సాహస స్వాతంత్ర్య యోధుడు రేహిమాన్ లేని లోటు తీర్చలేనిదే .

Veeraputhran

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చందమామ జాబిలీ నెల వంకపాటల సమ్మేళనం10-8-14 విజయ వాడ కళా క్షేత్రం సా. 6-30

jabilli 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డా జి వి పూర్ణ చంద్ -”ఆరోగ్య వేదం ”పుస్తకావిష్కరణ 16-8-14 హోటల్ ఐలాపురం లో ఉదయం పది గం లకు

aharavedam 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అయో (య్యో )ధ్య

అయో (య్యో )ధ్య

పురాణకాలం నుండి అయోధ్య ప్రసిద్ధి చెందింది. సరయూ నదీ తీరాన ఉన్న ఆ పట్టణం ఈ నాటి ఫైజా బాద్ కు దగ్గరలో ఉంది .సరయూ నది అత్యున్నత హిమాలయాలలోని కింద కైలాస పర్వతం వద్ద ఉన్న మానస సరోవరం నుండి జన్మించిందని కధనం .ఒకప్పుడు జన సంద్రం గా ఉన్న అయోధ్య అనేక రాజకీయ కారణాల వల్ల జనసాంద్రత తగ్గినపట్టణం అయింది .మురికి రోడ్లు ,పారిశుధ్యం లేకపోవటం ,విద్యుత్ సమస్యల తో  కొట్టు మిట్టాడుతోంది .యత్రికులే ఎక్కువగా వస్తారు .పంచ  క్రోశయాత్ర శ్రీరామ నవమి రోజుల్లో ఇక్కడ ప్రసిద్ధి చెందింది .చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి సాదారణం గా మార్చ్ ఏప్రిల్ నెలల్లో వస్తుంది .

భగీరధుని తండ్రి సగర చక్ర వర్తి కాలం నుండి దీని ప్రాధాన్యత ఉంది .భగీరధుడు దివి నుండి భువికి గంగను తెచ్చిన పుణ్యాత్ముడు .ఇక్కడ హిందువులతో పాటు శైవ ,వైష్ణవ  బౌద్ధ ,జైనులూ కూడా ఉంటున్నారు .అయోధ్య చాల ప్రాచీనమైనదని మనకు తెలుసు .అయోధ్య లోని రామ కోట శిదిలాను పరీక్షించిన పురావస్తు శాస్త్రజ్ఞులు అది క్రీ పూ.ఏడవ శతాబ్దికి చెందినదని చెబుతున్నారు. కోసల దేశానికి అయోధ్య రాజధాని .బౌద్ధుల పుస్తకాలలో సాకేత నగరం అని ఉంది .బుధుడు ఈ నగరానికి వెంచేసినట్లు తెలుస్తోంది సాకేత నగరం జైనులకూ కేంద్రం గా ఉండేది .మొదటి జైన తీర్ధంకరుడు ‘’రిషభుడి’’ పుట్టుక స్థానం ఇదే .హిందువులకు రామ జన్మ భూమిగా సూర్య వంశ పాలనకు రాజధానిగా ఉన్నట్లు తెలుసు .అయోధ్య అంటే ‘’జయింప లేనిది ‘’అని అర్ధం .ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్రుడు దీనినే కేంద్రం గా చేసుకొని ధర్మ పరిపాలన చేశాడు .శ్రీ రాముని సంస్కృతీ  క్రీ శ.పదకొండవ శతాబ్దం నుండి ఇక్కడ జరుగుతున్నట్లు చారిత్రిక పరిశోధకులు అంటున్నారు .

భక్తీ ఉద్యమం బల పడినప్పుడు శ్రీ కృష్ణసంస్కృతీ   ప్రారంభమై పద్నాలుగో శతాబ్దం లో రామ ఆరాధన వచ్చిందని వారి అభిప్రాయం .కబీర్ ,తులసీదాస్ వంటి మహాను భావులైన రామ భక్తులు రామ కల్చర్ ను వ్యాప్తి చెందిన్చారని చారిత్రకాభిప్రాయం .హన్స్ రాజ్ బెకర్ అనే ఆయన అయోధ్య మహాత్మ్యాన్ని అనువదించి ఈ విషయాలు చెప్పాడు .అయోధ్యలో రామ పరిపాలనా పూజా ఎక్కువగా ఉన్నా ,శివారాధనా ఉండేది .రాముడి తో  ‘’స్వర్గ ద్వారం ‘’ముడి పడి ఉంది .ఇది సరయు నదిలో ఉంది .ఇక్కడి నుండే శ్రీ రాముడు అవతార సమాప్తి చేశాడుకనుక స్వర్గ ద్వారం అనే పేరొచ్చింది .రాముని అంతఃపురం సీతా దేవి ‘’కనక  భవనం ‘’,సీత వంట గది లను మహాత్మ్యంవివరించింది .

ఎన్నో శివసంబంధ ఘట్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి .అయోధ్య లో ముఖ్యమైన దేవుడు ‘’నాగేశ్వర నాదుడు  ‘’.అంటే నాగులకు రాజైన వాడు .సరయు నదిలోని స్వర్గ ద్వారా ఘట్టం లో స్నానం చేసిన భక్తులు స్నాన ఘట్టానికి కుడివైపున ఉన్న శివాలయానికి వెళ్లి ముందుగా పూజ చేస్తారు .నాగేశ్వర నాధ శివుని దర్శించకుండా అయోధ్య యాత్ర పరిసమాప్తం కాదని అక్కడి పూజారులు యాత్రికులకు తెలియ జేస్తారు .ఈ శివ లింగాన్ని శ్రీరాముని కుమారుడు కుశుడు ప్రతిస్టించాడు .నాగేశ్వర నాధుడే అయోధ్యకు  క్షేత్ర పాలకుడు .పురాతన ఉత్తర భారత దేశం లో నాగులు ,యక్షులు రక్షకులుగా ఉండేవారని తెలుస్తోంది . స్వర్గద్వార ఘాట్ లో యాత్రికులు సరయు నదిలో స్నానం చేసి క్షేత్రపాలకుడైన  శివుడిని దర్శించి అయోధ్య యాత్ర ప్రారంభిస్తారు .అయోధ్యను అధ్యయనం చేసిన పీటర్ వాన్ డీర్ వీర్ అభిప్రాయం ప్రకారం అయోధ్య రాముని జన్మ భూమి కర్మ భూమి అయినా శివుడి లింగాలే అన్ని ఘాట్ల లోను దర్శనమివ్వటం ఇక్కడి ప్రత్యేకత .

సరయు పవిత్రస్నానం ,శివ దర్శనం తర్వాత భక్తులు అయోధ్య వీధుల్లో సంచరిస్తారు. ఈ నాడు అక్కడ ప్రత్యేకత కలిగింది హనుమాన్ కోట అనే ఆహానుమాన్ గర్హి .ఎక్కడో కొండమీద మీద నెలకొన్న హనుమంతుడిని భక్తులు అనేక మెట్లు ఎక్కి రొప్పుతూ రోజుతూ చేరి అక్కడ రామ భక్త హనుమాన్ విగ్రహాన్ని దర్శించటం మరో విశేషం.ఈ కొండపై ముఖ్య దైవం హనుమాన్ మాత్రమె . ఇక్కడా శ్రీరామునికి ఏమీ ప్రత్యేకత లేకపోవటం గమనించ దగిన విషయం .స్వామి విగ్రహం బంతిపూల దండలతో తులసి పేరులతో సర్వాంగ సుందరం గా అలంకరింప బడి ఉంటుంది .విగ్రహం అంతాగంధ సిందూర విలేపనం తో శోభాయ మానం గా కనిపిస్తుంది .వెండి కళ్ళు ,,వెండి విష్ణు నామం తో భక్త సులభుడిగా దర్శనమిస్తాడు హనుమ .ఆలయం చుట్టూ శ్రీరామ , సీత, లక్ష్మణ విగ్రహాఉంటాయి .ఇవాళ హనుమాన్ గర్హి అయోధ్యలో అతిముఖ్య దర్శనీయ స్థలమైంది .దీనికి కారణం శ్రీరాముడు సరయూ నదిలో అవతార సమాప్తి చేస్తూ అయోధ్య రక్షణ బాధ్యతను హనుమంతునికి అప్పగించి వెళ్ళాడట .అప్పటి నుంచి అయోధ్యకు హనుమంతుడేప్రభువు. .       హనుమాన్ రామ శివులకు మంచి సంబంధం ఉంది .హనుమ శివకుమారుడని,సాక్షాత్తు శివ స్వరూపుడే నని పురాణాలు ఉద్ఘోషించాయి .శైవ భక్తులలో   సన్యాసులలో హనుమ ఆరాధన ,ఆయన రామ భక్తీ వలననే ఏర్పడింది .గర్హి మహాత్మ్యం లో శివుడు ‘’హనుమంతుడు పదకొండవ రుద్రుడు ,నా అవతారమే హనుమ ‘’అని చెప్పాడు .అందుకే అయోధ్యలోనూ ,పరిసరాలలోనూ హనుమాన్ గర్హి ,నాగేశ్వర నాద శివులకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది .

అయోధ్యలో రామ జన్మ భూమి ప్రదేశంఉంది  . ముసల్మాన్ చక్ర వర్తి  బాబర్ 1526లో దర్శించటం వలన బాబరీ మసీద్ ను చిహ్నం గా నిర్మించారు .దీన్ని మీర్ బకి కట్టించాడు . అక్కడికి దేవదూతలు అవతరిస్తారని వారి నమ్మకం .విశ్వ హిందూ పరిషత్ ,బిజెపి ఆర్ ఎస్ ఎస్  కరసేవకులతో 1996డిసెంబర్ ఆరున ముట్టడించిన సంగతి అందరికి తెలుసు .ఇవాళ అయోధ్యలో ప్రతి చోట పోలీస్ బారి కేడ్లున్నాయి .దానితో యాత్రికుల సంఖ్య తగ్గింది. వివాదాస్పద మసీదు అద్రుశ్య మైన్దక్కడ .రాముడు జన్మించిన స్థలం లో ఒక ప్లాస్టిక్ టెంట్ కని పిస్తుంది .మిగతా ప్రదేశం అంటా రక్షణ కవచం గా మార్చేశారు. శ్రీ రాముడి చిన్న విగ్రహం ‘’రాం లాలా ‘’మాత్రం చూసి బాల రాముడిని చూశామన్న సంతృప్తి పొందాలి .పూర్వం సీతా దేవి వంట శాల ఉండేది .ఇప్పుడదికని పించదు. ఏమైందని ఎవర్ని అడిగినా సమాధానం రాదు .అందుకే ఇవాళ అయోధ్య ను చూసిన వారందరూ ‘’అయ్యో?ధ్య ‘’అని మనసులో బాధ పడుతున్నారు .

ram lalla

Image result for ayodhya  Inline image 1 ram lalla

  

hanuman                                             sarayu river                       hanuman garhi

ఈ విషయాలన్నీ డయానా ఎల్ ఎక్  ‘’ఇండియాఎ సేక్రేడ్ జాగ్రఫి ‘’పుస్తకం లో రాసినవే .

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-14-ఉయ్యూరు

.

Posted in రచనలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ వరలక్ష్మీ వ్రతం 8-8-14-శుక్రవారం 

This gallery contains 37 photos.

More Galleries | Tagged | Leave a comment

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి

పశ్చిమ ఒరిస్సా కు చిన్నారి  మదర్ తెరిస్సా అని పించుకొన్న పార్వతి (పార్బతి)గిరి ప్రముఖ సాంఘిక సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధురాలు .ఒరిస్సా లోని సంబల్ పూర్ జిల్లా  బీజాపూర్ దగ్గరున్న సమలైపాదర్ అనేగ్రామం లో 1926లో జన్మించింది .ఈమె జననానికి ముందే స్వాతంత్ర్యోద్యమ విషయం ఒరిస్సా లోని అన్ని గ్రామాలకు పాకింది .పార్వతి జన్మించిన గ్రామం రాజకీయాలకు ముఖ్య కేంద్రం గా ఉండేది .లక్ష్మినారాయణ మిశ్ర ,దుర్గా ప్రసాద్ గురు మొదలైన ఉద్యమ నాయకులు అక్కడ నుంచే పని చేశారు .అక్కడే కాంగ్రెస్ సభల గురించి చర్చలు తీవ్రం గా జరిగేవి .స్కూల్ లో చదువుతున్నప్పుడే పార్వతికి రాజకీయాలపై ద్రుష్టిపడి ,తానూ వారిలా ఉద్యమాలలో పాల్గోవాలనే కోరిక ఏర్పడింది .అక్కడ జరిగే కాంగ్రెస్ సభలకు హాజరౌతూ ,ప్రేరణ పొందేది .మూడో క్లాస్ చదువుతున్న పార్వతి కాంగ్రెస్ సభ్యత్వం కోసం గ్రామాల వెంట తిరిగి చేర్పించేది .

1937లో సంబల్ పూర్ లో కాంగ్రెస్ సభ జరిగింది .కాంగ్రెస్ నాయకులు ఆమె చురుకుదనాన్ని గుర్తించి తండ్రిని ఆమె సేవలు కాంగ్రెస్ సంస్థకు అవసరమని ,తమకు ఆమె ను కార్య కర్తగా తీర్చి దిద్దే అవకాశం ఇవ్వమని అర్ధించారు .మరుసటి సంవత్సరం సంబల్ పూర్ లో పెద్ద కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం జరిగింది .మాలతి చౌదరి ,ప్రాణ కృష్ణచౌదరి  వంటి ప్రముఖులు పాల్గొని ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు .మళ్ళీ కాంగ్రెస్ నాయకులు పార్వతి తండ్రిని ఆమె సేవలు పార్టీకి అందించే సహాయం చేయమని విన్నవించారు .అనేక సార్లు ఆలోచించి తండ్రి ఒప్పుకొన్నాడు .రమాదేవి నడుపుతున్న బారి ఆశ్రమం లో పార్వతి చేరింది .

ఒక మైనర్ బాలిక ఇలా ఇల్లు వదిలి ఒక ఆశ్రమంలో చేరటం అ నాడు సంప్రదాయ ఉన్నత కుటుంబాలలో జరగని విషయం. ఆమెయే ఆద్యురాలై అందర్నీ ఆశ్చర్యం లో ముంచేసింది .కూతురుకున్న అకుంఠి దీక్ష ,సేవాభావం, మాతృదేశ భక్తీ కి ముగ్ధుడైన తండ్రి ఆమె సేవలు దేశానికి అవసరమని అది తమ కుటుంబానికి  వరమని భావించి సమ్మతించాడు .ఒక అజ్ఞాత కుగ్రామం లో పుట్టిన చిన్న  పిల్ల ప్రముఖ పట్నం జైపూర్ లోని బారి ఆశ్రమానికి వెళ్ళటం ,అక్కడ ఉండి పని చేయటం వింతగా అందరూ చెప్పుకొనే వారు .14-1-1938నఇల్లు వదిలి బారి ఆశ్రమం లో పార్వతి చేరింది .ప్రభావతి దేవి అనే బాల్య వితంతువు కూడా పార్వతి తో బాటే ఆశ్రమం లో చేరింది .పార్వతి కుటుంబం వారు ఎన్నో సార్లు ఆశ్రమం వదిలేసి ఇంటికి వచ్చేయమని ఇద్దరిపై ఒత్తిడి తెచ్చారు .కాని స్తిర చిత్తం తో అక్కడే ఉండిపోయారిద్దరూ .ఆశ్రమం లో రమాదేవి ,గోప బంధు చౌదరి ఏంతో సంతోషించారు .

ఈ నాటి ఆశ్రమాలు గా కాకుండా ఆశ్రమాన్ని ఏంతో  క్రమశిక్షంతో నైతిక విలువలతో రమాదేవి నడుపుతోంది .ఇలాంటి ఆశ్రమాలను ‘’సంగ్రామి శిబిర’’, ‘’అహింసా తీర్ధ ‘’అనే వారు .గోప బంధు డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తూ గాంధీగారి పిల్పు విని స్వరాజ్య ఉద్యమం లో చేరి పని చేస్తున్నాడు .రామా దేవి ,గోప బంధుల అమిత ప్రేమ ఆదరణలు ,వారిద్దరూ గాంధీగారి ప్రభావానికి లోనవటం పార్వతి పై కూడా ప్రాభావం కలిగించి దేశ సేవలో ధన్యత చెందాలనే నిశ్చయానికి వచ్చింది .ఆశ్రమంలో ఉన్న వారందరినీ కంటికి రెప్పలాగా చూసుకొంటూ ప్రేమ దయా సాను భూతులను వారిపై వర్షించింది .1940లో సత్యాగ్రహం ఉద్యమం సూటిగా ప్రారంభ మైంది .అన్ని ఆశ్రమాలు సంగ్రామ శిబిరాలుగా మారిపోయాయి .స్వరాజ్య పోరాట యోధులతో నిండిపోయాయి .

పార్వతి గిరి స్వగ్రామం బారాగర్ కు  తిరిగి వచ్చి,సంబల్ పూర్ ,పద్మాపూర్ ,పనిమార ,ఘెంస్ మొదలైన చోట్లకు వెళ్లి ప్రజలను ఉత్తేజ పరచి మీటింగులు నిర్వహిస్తూ స్వరాజ్య కాంక్ష కలిగించి బ్రిటిష్ పరపాలనాను వ్యతిరేకించేలా సంసిద్ధులను చేసింది .గ్రామాల్లో ,పట్టణాలలో నూలు వడకటం దారం తీయటం అందరికి నేర్పింది .సంబల్ పూర్ లో శ్రద్ధాకర్ సుపాకర్ అనే సమార యోధుడి తల్లి దగ్గర ఉండేది .  గాంధీగారి ‘’ఖాదీ  ఆందోళనోద్యమం ‘’లో చురుకు గా తానూ పాల్గొని అందరిని పాల్గోనేట్లు చేసింది .క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా వ్యాపించినట్లే ఒరిస్సాలోని గ్రామ గ్రామాన వెల్లి  విరిసింది .సామలై పాదార్ ,పనిమార ,ఘెంస్ వంటి ప్రముఖులు నాయకత్వం వహించగా ,రామ చంద్ర గిరి ఉజ్జల్ గిరి ,మంగళ గిరి ,ద్వితీయ గిరి ,కుబెర్ గిరి మంగళ గిరి ,ద్వాదదేసి రానా మొదలైన అనుచరులు పాల్గొని అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు .

యువకులను ఒక దళం గా ఏర్పరచి నాయకత్వం వహించి పార్వతి గిరి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ‘’క్విట్ ఇండియా ‘’అని అరుస్తూ ప్రదర్శన నిర్వహించింది .ఆమె ఇంకా మైనర్ బాలికే .కనుక పోలీసులు ఆమెను అరెస్ట్ చేయటానికి జంకారు .మరుసటి రోజు ముగ్గురు పిల్లలతో కలిసి పార్వతి గిరి బార్గా లోని s.D.O.ఆఫీస్ కు వచ్చింది .అక్కడ కుర్చీలో కూర్చుని తానే జడ్జిగా నటించింది .ఒక కుర్రాడు లాయర్ గా మరొకడు బంట్రోతు గా సీన్ సృష్టించారు .ఎస్ డి వొ .లోపలి ప్రవేశించగానే జడ్జి స్తానం లో ఉన్న పార్వతి ప్యూన్ గా నటిస్తున్న కుర్రాడిని అసలైన దోషిని బంధించి తాడుతో లాక్కుని  తన దగ్గరకు తీసుకొని రమ్మని ఆర్డర్ జారీ చేసింది .ఇది చూస్తున్న పోలీసులు ఆమె చుట్టూ చేరి కుర్చీ లోంచి లాగి పారెయ్యటానికి ప్రాయత్నిచారు .ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేసినందున ఆమెను బంధించి రెండేళ్ళు జైలు శిక్ష విధించారు .ఇందులో పార్వతి గిరి  భావం –బ్రిటిష్  వలస పాలన ,వారి పెత్తనం భారత దేశం లో ఉండరాదనే .

బారాగర్ కోర్టులో మరొక ఉదంతం జరిగింది .బారాగర్ కోర్టు కు వెళ్లి బార్ లో లాయర్ కూర్చునే సీట్ లో కూర్చుంది .అభం శుభం తెలియని ఆ పిల్ల లాయర్లన్దరిని కోర్టు విడిచి బయటికి వెళ్ళిపొమ్మని ఆర్డర్ వేసింది .బ్రిటిష్ ఆఫీసర్లకు ఇండియా లాయర్లు సహక రించ కూదడనే ఆమె ఉద్దేశ్యం .ఆమె మాట విని కొందరు లాయర్లు బయటికి వెళ్ళిపోయారు .మిగిలి వెళ్ళని వారి చేతులకు గాజులు తొడిగింది ఈ చిన్నారి పిడుగు .ఆ వయసులో   ఆమె చూపిన ధైర్య  సాహసాలకు ,చొరవకు దేశ ప్రజలంతా హర్షించి ఆశీర్వ దించారు .త్రికరణ శుద్ధిగా గాంధీజీ బోధించిన సూత్రాలనే నమ్మి పాటించింది పార్వతి గిరి .

అనాధలకు విధి వంచితలకు ఆమె ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహించింది .ఆమె చిరస్మరణీయ వ్యక్తీ మాత్రమె కాదు ,ఒక సేవా సంస్థ  సమగ్ర రూపమే పార్వతి ..

శ్రావణ శుక్రవారం –శ్రీవరలక్ష్మి వ్రతం సందర్భం గా శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య  యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం

16-3-1943 న మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలోని ఆఖ్రాని కోట దగ్గరున్న ఒక లోయ లో తల దాచుకొంటున్న వందలాది ఆదివాసీ స్త్రీలపైనా  మగవారి పైనా   బ్రిటిష్ సైన్యం , పోలీసులు  ఆకస్మికం గా దాడి చేసి ,చాలామందిని దారుణం గా  తుపాకులతో చంపేసి ,మిగిలిన వారిని లాక్కెళ్ళి జైలు పాలు చేశారు .అంతేకాదు వారినందర్నీ బందిపోట్లుగా చిత్రించారు . ఈ సంఘటన  జరగటానికి నేపధ్యం ఉంది .ఆ వివరాలు తెలుసుకొందాం .

తలోడా జిల్లా ,మార్వాద్ తాలూకా మార్వాడ కు చెందినా ఆప్ గులాం మహారాజ్ అనే యోగి తన శిష్యులను  సారా ,కల్లుతాగ వద్దని ,మరే విధమైన మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని బోధించేవాడు .శిష్యులు అత్యంత వినయం తో ఆయన మాటలు పాటిస్తూ వీటికి దూరం గా ఉంటూ జీవిస్తున్నారు .గులాం మహారాజ్ మరణం తర్వాత ఆయన చిన్న తమ్ముడు రామదాస్ మహారాజ్ సారా వ్యతిరేక ఉద్యమాన్ని స్వీకరించి నడిపి ఆది వాసుల జీవితాలలో వెలుగు రేఖలు నింపాడు .ఈ ఉద్యమమ వల్ల సారాషాపు యజమానులు తీవ్రం గా నష్టపోయారు .సారా తాగ్రేవాళ్ళకూ ఇబ్బందిగానే ఉంది .తాగుబోతులు ,సారా విక్రేతలు ఏకమై  సారా వ్యతిరేకతను తీవ్రం గా ఎదుర్కొన్నారు .తరచూ వీరిద్దరిమధ్య  ఘర్షణలు  జరుగుతూ ఉండేవి .

బ్రిటిష్ వాళ్ళు  బ్రిటిష్  వైన్ ను, వైన్ షాపుల వాళ్ళు  అమ్ముతున్నందున సహజం గా నే షాపు యజమానుల కొమ్ముకాసి ఉద్యమాన్ని బల పడకుండా చేస్తున్నారు .రామదాస్ మహారాజు ను ప్రభుత్వ వ్యతిరేక విప్లవ కారుడిగా ముద్ర వేశారు .అంతేకాక మహారాష్ట్ర నుండి ఆయన్ను,అనుచరులను  బహిష్కరించారు .అనేకమంది నమ్మకమైన అనుచరులతో ,అందులో ముసలి వారితో కలిసి నర్మదా నది వెంబడి ప్రయాణం చేస్తూ మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించాడు మహారాజ్ .

జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శంకర వినాయక్ ఠాకూర్ రామదాస్ మహారాజును బ్బహిష్కరణను వ్యతిరేకించి ప్రజల్లో కలిసి పొమ్మని కబురు చేశాడు .దానిని మన్నించి రామదాస్ మహారాజ్ అనుచరులతో వచ్చి ఆఖ్రానిరి కోట దగ్గరున్న లోయలో తల దాచుకొంటున్నారు .ఇదీ పై సంఘటనకు నేపధ్యం .నిరాయుధులు ,శాంతి యుతులు అయిన ఆదివాసీలపై  బ్రిటిష్ సైన్యం ,పోలీసులు ఆకస్మికం గా దాడి చేసి నిర్దాక్షిణ్యం గా వందలాది మందిని తుపాకి గుళ్ళకు బలి టుచేశారు .చనిపోయిన వారి శవాలను ఎడ్ల బండీ మీద కట్టెల మోపులు పేర్చినట్లు పేర్చి తలోడా పోలీస్ స్టేషన్ కు చేర్చారు .ఈ దారుణ మారణ కాండకు ఆనాడు ఆరవ తరగతి చదువుతూ ,ఇప్పుడు మాజీ శాసన సభ్యుడుగా ఉన్న  జనార్దన పోహార్య వాల్వి ప్రత్యక్ష సాక్షి  .ఈ దారుణ కిరాతక హత్యలు సరిగ్గా ఏ ప్రదేశం లో జరిగిందో ఆయన గుర్తు చేసుకొని చెప్పాడు .

దీని తర్వాత రామ దాస మహారాజును అయన స్వగృహం లో గృహ నిర్బంధం లో ఉంచారు పోలీసులు .మిగిలిన వారిని అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు .తరువాత శంకర్ వినాయక్ ఠాకూర్ వారిని జైలు నుండి విడిపించాడు .ఈ పోలీస్ కిరాత కృత్యం లో చని పోయిన ,అరెస్ట్ అయిన అమాయకులైన ఆది వాసీలను బంది పోటు దొంగలుగా పోలీసు రికార్డుల్లో నమోదు చేయటం మరీ దారుణం .మనకు స్వాతంత్ర్యం వచ్చి అరవై అయిదేళ్ళు దాటినా ఇంకా  ఆ సమర యోధుల్ని ‘’డకాయిట్లు ‘’గా రికార్డుల్లో ఉంచటం జాతికే సిగ్గు చేటు .మన అసమర్ధ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఉదాహరణ .

ఈ వివరాలన్నీ సంతోష్ మిరాఘే అనే టీచర్ ‘’ట్రైబల్ ట్రబుల్స్’’ ‘పుస్తకం లో రాశాడు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా

అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం .

అస్సాం లోని దరంగ్ జిల్లా బోరంగ బారిలో కనకలతా బారువా 22-12-1924న జన్మించింది .తండ్రి కృష్ణ కాంత్ .తల్లి కామేశ్వరి బారువా .తాతగారు ఘనా కాంత బారువా దరంగ్ జిల్లా  లో గొప్ప వేటకాడు .ఆమె పూర్వీకులు డోలా కారి బారువా రాజ్యానికి చెందిన వారు .దోలకారి ఇంటిపేరును వదిలేసి బారువా పేరునే ఉంచుకున్నారు .అయిదేళ్ళకే తల్లిని ,పదమూడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయినదురదృష్ట వంతురాలు కనక లత .మూడో క్లాస్ వరకు మాత్రమె చదివి ,కుటంబం లోని చిన్న పిల్లలను సంరక్షించే ఉద్దేశం తో చదువు మానేసింది .

క్విట్ ఇండియా ఉద్యమం లో అస్సాం లోని గొహ్ పూర్ సబ్ డివిజన్ లో యువత ‘’మృత్యు వాహిని “’దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని ఎదిరిస్తుంటే కనకలత కూడా అందులో చేరి పోరాడింది .20-9—1942నాడు మృత్యు వాహిని దళం స్తానిక  పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకను ఎగర వేయాలని నిశ్చయించింది .గ్రామస్తులందరూ నిరాయుధులుగా కనక లత నాయకత్వం లో ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు .అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఇంచార్జి పోలీస్ ఆఫీసర్ రేవతి మోహన్ సోమ్ .జనం ఉద్దేశ్యం గ్రహించి ,ముందుకు అడుగు వేస్తె తీవ్ర పరిస్తితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు .పోలీసుల హెచ్చరికలకు వీసమంతా కూడా భయపడకుండా జైజై  లు కొడుతూ  వాహిని దళం స్టేషన్ ను సమీపించింది .కనక లత చేతిలో జాతీయ పతాకం రెప రెప లాడుతోంది. దాన్ని పోలీస్ స్టేషన్ పై ఎగరేయాలనే ఉత్సాహం తో ఆమె ముందుకు నిర్భయం గా అడుగులు వేస్తూ దూసుకు పోతోంది .పోలీసులు ఆమె పై కాల్పులు జరిపారు .ఆమె చేతిలోని జెండాను ఆమె వెనకే ఉన్న ముకుంద కాకోటి తీసుకొని ముందుకు వెళ్ళగా  పోలీసులు తుపాకీ గుళ్ళ వర్షం కురిపించారు .ఈవిదం గా పోలీస్ ఆక్షన్ లో కనకలతటా బారువా ,ముకుంద కాకోటి ఇద్దరు ప్రాణాలు అర్పించి అమర జీవులైనారు .మాతృభూమి సంరక్షణ కోసం ధైర్యం గా జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం లో అమరజీవి అయిన కనకలత వయస్సు అప్పటికి పది హేడేళ్లు మాత్రమే నని తెలిస్తే ఆ యువతి సాహసానికి నివ్వెర పోతాం ..

భారతీయ తీర రక్షణ ఫాస్ట్ పెట్రోల్ నౌకకు 1977కనకలతా బారువాగా  నామకరణం చేసి ప్రభుత్వం గౌర వించింది .2011లో గౌరీ పూర్ లో కనకలత నిలు వెత్తు విగ్రహాన్ని ఏర్పరచి ప్రభుత్వం నివాళు లర్పించింది .

 

అస్సాం లో క్విట్ ఇండియా ఉద్యమం లో ఉరితీయ బడ్డ  – కుషాల్ కొన్వార్

అస్సాం లోనే మరో స్వాతంత్ర్య సమార యోధుడు క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులు బాసి అమరుడైనాడు .ఆయనే కుశాల్ కొన్వార్ .21-3-1905న అస్సాం లోని  ఈ నాటి గోలా ఘాట్ జిల్లా సరూపతార్ దగ్గర బలిజాన్ లో కుశాల్ కొన్వార్ జన్మించాడు .బెజ్ బారువా స్కూల్ లో చదివాడు .గాంధీ గారి సహాయ నిరాకరణ పిలుపుకు ఉత్తేజితుడై ఇష్టం గా పాల్గొన్నాడు .మహాత్ముడి మంత్రం’ సత్యం .అహింస స్వరాజ్యం ‘’కొన్వార్ పై గొప్ప ప్రభావాన్ని కల్గించింది .ఈ భావ వ్యాప్తికి ఒక ఎలిమెంటరి స్కూల్ పెట్టి అందులో గౌరవ ఉపాధ్యాయుడు గా పని చేసి విద్యార్దులలో జాతీయ స్పూర్తి రగిలించాడు .తరువాత బలిజాన్ టీ ఎస్టేట్ లో గుమాస్తాగా,సూపర్వైజర్ గా  చేరి పని చేశాడు. మనసంతా మహాత్ముని పిలుపే నిండిపోయి ,పూర్తిగా స్వాతంత్ర్య సమరం లో అంకితభావం తో పని చేయాలనే నిర్ణయానికి వచ్చాడు .సరూపతార్ ప్రాంతం లో కాంగ్రెస్ పార్టీని స్థాపించి ,బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకం గా సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమాలు నిర్వహించాడు .సరుపతార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .

কনকলতাৰ প্ৰতিমুৰ্তি.JPG  

1942ఆగస్ట్ 8న బొంబాయి లో కాంగ్రెస్ సమావేశం లో మహాత్ముడు ‘’క్విట్ ఇండియా ‘’పిలుపు నిస్తూ తీర్మానాన్ని ఆమోదింప జేశాడు .భారత దేశం నుండి పూర్తిగా బ్రిటీష్ వాళ్ళు వెళ్లి పోవాల్సిందే అన్నది ఆ తీర్మాన సారాంశం .గాంధి అక్కడి నుంచే ‘’విజయమో వీర స్వర్గమో ‘’అనే పిలుపు నిచ్చాడు ఇది దేశ జనాలకు మంత్రమే అయింది.దీనికి బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహం చెంది గాంధి తో సహాఅనేక మంది  జాతీయనాయకులను అరెస్ట్ చేసి జల లో పెట్టించింది  .కుల మతాలకు అతీతం గా ఆ సేతు హిమాచల పర్యంతం ప్రజలు వీధుల్లోకి వచ్చి బహిరంగం గా  ‘’క్విట్ ఇండియా ‘’నినాదాలు చేస్తూ ‘’వందే మాతరం ‘’అంటూ నినదిస్తూ ఉద్యమం  చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్ర పోయి కంటికి కునుకు లేకుండా చేశారు .గాంధి శాంతియుతం ఆ సత్యాగ్రహం చేయమని పదే పదే చెప్పినా కొన్ని చోట్ల హింసా దౌర్జన్యం చోటు చేసుకొని భీభత్సం సృష్టించింది .ప్రభుత్వ ఆఫీసులను  రైలు, బస్సులను తగల బెట్టి కమ్యూని కేషన్ లను విధ్వంసం చేశారు ప్రజలు ప్రజల ఆగ్రహానికిది పరా కాస్ట గా నిలిచింది .

అస్సాం లో కూడా క్విట్ ఇండియా ఉద్యమం ఊపు అందుకొన్నది .అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు గోపీనాద్ బర్దోలోయ్ ,సిద్ధినాద శర్మ లను బొంబాయి కాంగ్రెస్ సభల నుంచి తిరిగి వస్తుండగా  బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .అస్సాం మిగతా ప్రాంతాల నాయకులైన బిష్ణురాం మేది ,బిమలా ప్రసాద్ చాలిహా మొదలైన వారినీ జైలు లో పెట్టింది .మిగిలిన దేశం తో పాటు అస్సాం కూడా హింసా ప్రజ్వలనం తో అట్టుడికి పోయింది .10-10-1942 న మంచు దట్టం  గా కమ్ముకున్న సమయం లో గోలా ఘాట్ జిల్లా లోని సారూ పాటర్ వద్ద రైల్వేలైన్ కున్న  స్లీపర్లను కొందరు తొలగించారు .అదే దారిపై నడిచిన మిలిటరీ ట్రెయిన్  పట్టాలు తప్పటం వలన వందలాది బ్రిటిష్, అమెరికన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు .బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతం లో సైనికులను మొహరించి దోషులను పట్టుకొనే ప్రయత్నం తీవ్రం గా చేసింది .కని  పించిన ప్రతివాడిని విపరీతం గా కొట్టి హింసించి అరెస్ట్ చేసి .టెర్రర్ సృష్టించింది ఆ ప్రాంతం లో ..

ఈ రైలు కుట్రకు ముఖ్య పాత్రధారి కుశాల్ కొన్వార్ అని భావించి వెతికి పట్టుకొని అరెస్ట్ చేసింది .మహాత్ముని అడుగు జాడల్లో అహింస సత్య వ్రతం తో ఉద్యమాన్ని నడుపుతున్న కుశాల్ కు ఈ కుట్ర తో ఏమీ సంబంధం లేని అమాయకుడు .ఈ విషయాన్ని ప్రజలంతా ముక్త  కంఠం తో మొట్టుకొన్నారు .కాని ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఉండవనే సామెత రుజువు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .కుశాల్ మాత్రమె దీనికి ముఖ్య సూత్ర దారి అని నమ్మి ,అతన్ని గోలాఘాట్ నుంచి తీసుకొని వచ్చి 5-9-1942నఅరెస్ట్ చేసి జోర్హాట్ జైలు లో పెట్టింది .సి.ఏం హంఫ్రీ నాయకత్వం లోని కోర్టు  ఏ రకమైన ఆధారాలు లేక పోయినా ,చూప లేక పోయినా కుశాల్ దోషి అని నిర్ధారించింది,ఉరిశిక్ష వేసింది  .కుశాల్ భార్య ప్రభావతి  జోర్హాట్ జైలుకు వచ్చి నిర్దోషి ,అమాయకుడు అయిన తన భర్తకు ను దోషి అని అని తేల్చటం భరించ లేక వల వలా ఏడ్చేసింది .ఆమెను ఓదారుస్తూ కుశాల్ ‘’వేలాది మంది స్వాతన్నత్ర్య సమర సైనికులు ఉండగా   నామాతృదేశం కోసం ప్రాణాలను అర్పించే అరుదైన గౌరవం నాకు భగవంతుడు కల్పించాడు ఇది నాకు అదృష్టం ‘’అని ఆనందం గా సంతృప్తిగా చెప్పిన దేశ భక్తుడు కుశా ల్ .ఉరి శిక్ష అమలు అయ్యేదాకా జైలు లో భగవద్ గీత చదువుకొంటూ ,ప్రార్ధనలు చేసుకొంటూ కాలం గడిపిన స్తిత ప్రజ్ఞుడు కొన్వార్ .Image result for kushal konwar  Inline image 1

15-6-1943 తెల్ల వారుజామున 4-30 గం లకు కుశాల్ కొన్వార్ ను జోర్హాట్ జైలు లో  ఉరితీశారు .ఉరికంబం ఎక్కి ధైర్యం గా ‘’ఇంక్విలాబ్ జిందాబాద్ ‘’అంటూ నినాదాలు చేసి ,తనకిష్టమైన ప్రార్ధనగీతం ‘’పార్ కోరా రఘునాధ –సంసార సాగర ‘’ పాడు కొంటు అసువులు బాసి అమరజీవి అయ్యాడు .’మహాత్మా గాంధీ ‘’జీవించటం మరణించటం అనే కళా మర్మం తెలిసిన వాడే అసలైన సత్యాగ్రహి .అలాంటి అరుదైన సత్యాగ్రహి షహీద్ కుశాల్ కొన్వార్ ‘’అని  ప్రశంసించాడు ..

కుశాల్ కొన్వార్ నిర్భీతికి ఒక ఉదాహరణ –బలిజియన్ టీ ఎస్టేట్ లో సూపర్ వైజర్ గా కుశాల్ పని చేస్తున్నప్పుడు ,పక్కనే ఉన్న  ఇంగ్లీషు దొర విల్సన్ యజమానిదైన జముగురి టీ ఎస్టేట్ కి చెందిన అరవై డెబ్భై ఆవులు వీరి టీ తోటల్లోకి చొరబడి నాశనం చేస్తూంటే కుశాల్ వాటినన్నిటిని తాళ్ళతో బంధించాడు .అ ఆవుల్ని కాసేవాడు వచ్చి విడిచిపెట్టమని కోరితే ,వాళ్ళ యజమానినే వచ్చి అడగమని చెప్పాడు .వాడువెళ్లి చెబితే దొర వచ్చాడు .ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి దొర కర్రతో కొన్వార్ ను కొట్టబోతే కొన్వార్ వెంటనే చెప్పు తీసి పీత కొట్టుడు కొట్టేశాడు..కుశాల్ తీవ్రత ధైర్య సాహసాలకు భయపడి దొర పారిపోయాడు .ఈ సంఘటన తో అతని పేరు ఆ ప్రాంతమంతా మారు మోగి రైతు సంఘానికి నాయకుడిగా ఎన్నుకొన్నారు .కుశాల్ కొన్వార్ బలిదానం వృధా పోలేదు .భారత దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది

నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే (కాంబే జల సంధి )వద్ద సముద్రం లో కలుస్తుంది .నర్మదా పరిక్రమ పద్దెనిమిది వందల మైళ్ళు .తొమ్మిది వందల మైళ్ళు తూర్పుగా ప్రవహించి ,తరువాత పడమరకు మళ్ళు తుంది .నడిచి ఈ యాత్ర చేయటానికి పూర్వం మూడేళ్ళు పట్టేది .నర్మదకు ‘’నర్మదా వాలీ ప్రాజక్ట్ ‘’వలన అనేక సమస్యలు ఎదురైనాయి .స్వామి ఓంకారానంద ‘’నర్మదా ప్రదక్షిణ యాత్ర ‘’పుస్తకం లో అన్నీ వివరించారు .మధ్యలో సీతా వాటిక తీర్ధం ఉన్నది .ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని ప్రతీతి .కుశ లవులకు  సీతా దేవి ఇక్కడే వాల్మీకాశ్రమం లో జన్మ నిచ్చింది .వసిస్ట మహర్షి  భార్య అరుంధతి తో ఇక్కడికి వచ్చి తల్లీ బిడ్డలను చూసి వెళ్ళాడు .సీత కు ఏ అపకారం జరగ కుండా రక్షించటానికి అరవై నలుగురు యోగినులు ,యాభై ఇద్దరు భైరవులు అనుక్షణం కాపలా కాసే వారట .సీతను దర్శించటానికి నర్మదా మాత ప్రత్యక్షమైన్దిక్కడ.ఇక్కడి జలపాతాలు సొగసుగా ఉండి సీతా ,లక్ష్మణ, రామ నామాలతో విలసిల్లాయి .ఇక్కడ తపస్సు చేస్తే యెంత  మొండి వ్యాధి అయినా నివారింప బడుతుందనే నమ్మకం ఉంది .ప్రతి మూడు లేక నాలుగు మైళ్ళకు ఒక తీర్ధం ఉన్నట్లు ఆ పుస్తకం లో స్వామి ఓంకారానంద రాశారు. అమరకంటక కు నర్మదా నది చేరే లోపు 123,మొత్తం పరిక్రమ లో 481తీర్దాలున్నాయని స్వామి రాశాడు .

Inline image 1      

గంగ లాగే నర్మదా నది కూడా దివిజ గర్భయే.స్థానిక మహాత్య్మం లో నర్మద శివుని శిరస్సు నుండి భూమిపైకి దూకింది అని ఉంది .శివుడు తపస్సు చేశాడని ఆయన శరీర స్వేద జలమే నర్మదా ప్రవాహం అని కూడా కధలున్నాయి .గంగ శివుడి నెత్తి నెక్కి అర్ధాంగి పార్వతి సవతి  అయితే నర్మద పవిత్ర బ్రహ్మ చారిణి గా ఉండి పోయిందని చెప్పుకొంటారు .శివుని స్వేద ధార లోంచి అందమైన నర్మదా దేవి జనించిందని ,ఆమె శివుని భక్తీ తో ఆరాదిన్చిందని ఐతిహ్యం .మెచ్చిన శివుడు వరాన్ని ప్రసాదిస్తానంటే నర్మద ‘’శివా !నీవు సృష్టిని ప్రళయకాలం లో తాండవ నృత్యం తో నాశనం చేసినప్పటికీ ,జీవుల పాపాలను పోగొట్టే నా శక్తి మాత్రం నాకు ఉండేట్లు అనుగ్రహించు. గంగకు ఉత్తరభారతం లో ఉన్న గౌరవాన్ని ,పవిత్రతను దక్షిణ భారతం లో నాకు కలిగించు .నాకు ,గంగకు వైరుధ్యంలేకుండా చూడు .మకర సంక్రాంతి నాడు నా జలాల్లో స్నానం చేసే వారికి దేశం లోని అన్ని తీర్ధాలలో చేసిన స్నాన పుణ్య ఫలితం దక్కేట్లు చూడు .నిన్ను అర్చిస్తూ నా తీరాలపై మరణించే వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించు . ‘’అని వరం కోరితే తధాస్తు అన్నాడు తాండవ శివుడు .నర్మదా ప్రవాహానికి దారి చూపాడు .అక్కడినుండి నర్మద ,జబల్పూర్ ,ఓంకారేశ్వర్ ,భారుచ్ ల మీదుగా ప్రవహిస్తూ రేవా దగ్గర సాగర సంగమం చేసింది .

ఒక సారి పురూరవ మహా రాజు సభలో మానవుల పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది అని ప్రశ్నించాడు .ఎన్నో ఖర్చుతో కూడిన యజ్న యాగాదులు సూచించారట .సామాన్యులకు అందు బాటులో ఉండేది చెప్పమని మళ్ళీ అడిగాడు .అప్పుడు నర్మదా నదీ స్నానం సర్వ పాప హరణం మోక్ష దాయకం అని చెప్పారు .పురూరవుడు శివుని అర్చిస్తూ తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది ,ఆయన నర్మదను దివి నుండి భువికి దిగేట్లు చేయమన్నాడు . నర్మద అంగీకారం తీసుకొని తాను నర్మదను భరించగలనని  ఎనిమిది పర్వతాలతోకూడిన వింధ్య పర్వతం చెప్పగా  అక్కడికి నర్మదను దింపాడు అని మరో కధనం . .నర్మదా పరీవాహక   ప్రాంతమంతా పరమ పవిత్రమైపోయింది .

ఇంకో కధనం –దేవతలు జనుల పాప భారాన్ని మోయ లేక పోతున్నామని  విష్ణువుకు విన్న వించారు .ఆయన ‘’కేసు’’ని శివుడి దగ్గర పెట్టాడు .తన జట లో ఉన్న చంద్ర వంక ను తీసి ,అందులోని ఒక అమృత బిందువును నేల పై పడేట్లు చేశాడు  .అందులోనుంచే నర్మద అనే అందమైన స్త్రీ జన్మించింది. శివుడికి నమస్కరించి తాను ఏమి చేయాలో సెలవు ఇవ్వమని కోరింది .ప్రవాహ శీలత ఆమెకు కల్పించి ,జీవుల పాప హరం చేయమని ,ఆ నదిలో దొరికే శిలలు పవిత్ర శిలలై మానవుల వ్యాధి నివారకాలవుతాయని చెప్పాడు . అందుకే ఓంకార క్షేత్రం లో బాణ లింగం అంతటి ప్రసిద్ధి చెందింది .నర్మదాజలాలలో అరిగి పోయిన శిలలు పవిత్రమై శివ స్వరూపాలై పూజ లందుకొంటాయి. లోకం లో ‘’నర్మద కంకర శివ శంకరమే ‘’ అనే సామెత వచ్చింది .నర్మదా నదిలోనే లోక ప్రసిద్ధ మైన అనేక రంగుల బాణ లింగాలు లభిస్తాయి .

ఇవాళ మన్య ప్రాంతమైన మైకాల పర్వతాలలో ఉన్న  గోండు జాతుల నివాస భూమి అయిన అమర కంటక గొప్ప యాత్రా స్తలం అయింది .అక్కడి అరణ్యాన్ని  ‘’అమ్మ వనం ‘’అని పిలుస్తారు .అక్కడున్న చిన్న బావి నుండి నర్మదా జలం జాలువారుతుంది .అక్కడి నుండి భూగర్భం లో ప్రవేశించి ,అక్కడ నర్మద ఉద్గారమవుతుంది .ఐక్కడే శివాలయం ఉంది .దీనికే నర్మదా మందిరం అని పేరు .అక్కడి సరస్సును ‘’కోటి తీర్ధం ‘’అంటారు .మందిరం లో సుందరమైన  నల్ల రాయి నర్మదా దేవి విగ్రహం ఉంటుంది .శిరసుపై వెండికిరీటం ఉంటుంది. నీలి రంగు చీర ధరించి యెర్రని పుష్పమాలల తో ఆకర్షణీయం గా కని పిస్తుంది .ఇక్కడి శివుడిని ‘’అమరకంట మహా దేవ’’ అంటారు .చలువరాతి పార్వతి ,రామ ,సీత ,లక్ష్మణ విగ్రహాలు మందిరం లో ఉన్నాయి .నర్మదా జలధార వద్ద ‘’నర్మదేశ్వర్ ‘’అనే మరో శివ లింగం ఉంటుంది .ఇది సరస్సులో నీటిలో ఉంటుంది .ఇక్కడే గోముఖ కుండం ,త్ర్రివేణీ కుండం ఉన్నాయి .

నర్మద ఉద్భవించిన ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరం లో సోనే నది ప్రారంభమవుతుంది. దీన్ని  పురుష నదిగా భావిస్తారు .మరో పురుష నది బ్రహ్మ పుత్రానది అని చాలా మందికి తెలియదు .నర్మదా ,సోనే లు వ్యతిరేక దిశల్లో ప్రవహిస్తాయి .,వీటికి కొద్ది దూరం లో ‘’జ్వాల’’ అనే నదీ ప్రారంభమవుతుంది .ఇది కొంచెం దూరమే ప్రవహించి నర్మదలో కలిసి పోతుంది .ఈ రెండు నదుల ప్రారంభ స్థలాలు గొప్ప తీర్ధాలని మహా భారతం లో ,పురాణాలలోను ఉన్నది .ఇక్కడే నలభై ఏళ్ళు ఉన్న’’ జియోఫ్రి మా’’ అనే ఇంగ్లీష్ క్వేకర్ నాయకుడు ఒక ఆసక్తికర కధనాన్ని రాశాడు . నర్మదకు ‘’సోన్ ‘’అనే అతనితో తలిదండ్రులు వివాహం కుదిర్చారు .పెళ్లి కొడుకు ఎలా ఉంటాడోననే ఆదుర్దా తో నర్మద తన చెలికత్తె జ్వాలను చూసి రమ్మని పంపింది .ఆమె పెళ్ళికొడుకు దగ్గరకు రాగానే ఆమెయే పెళ్లి కూతురు అనుకోని పెళ్లి తతంగం ప్రారంభించమని ఆనతిచ్చాడుసోన్ .నర్మదా దేవికి విషయం తెలిసి తీవ్రం గా దుఖించింది .కోపంతో ,విపరీతమైన వేగం తో అక్కడినుండి కొండలు ,కోనలూ ,అడవులు దాటుకుంటూ మహా వేగం గా గంభీర ద్వనులతో తన అసమ్మతిని తెలియ జేస్తున్నట్లుగా ప్రవాహిస్తూ జలపాతాలను సృష్టించింది .ఇది తెలుసుకొన్న పెళ్ళికొడుకు సోన్ ఆగలేక పర్వత శిఖరం నుండి దూకి తూర్పుగా ప్రవహించి ,ఈశాన్యం వైపు తిరిగి చివరికి గంగా నదిలో కలిసి పోయి బంగాళా ఖాతం లో చేరిపోయాడు .

నర్మద జన్మ స్థానం నుంచి  ,గుజరాత్ లోని చందూడ్ చేరి సముద్రం వైపు ప్రవహిస్తూ విపరీతమైన వెడల్పు, లోతు గల గల బ్రహ్మాండమైన నదిగా మారింది .ఇక్కడ కూడా నర్మదా దేవి విగ్రహం మందిరం ఉన్నాయి . ఈవిషయాలన్ని ‘ఇండియా ఏ సేక్రేడ్ జాగ్రఫీ ‘’పుస్తకం లోడయాన .ఎల్ ఎక్ రాసింది . నర్మదానది మధ్య భారత జీవన వాహిని .రేవా అనీ పిలుస్తారు ..

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లగ్రంధావిష్కరణ సభ ( ఆహ్వాన పత్రం)

ఆహ్వాన పత్రం

సరసభారతి ,ఏ జి అండ్ ఎస్.జి.డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు ఐ.క్యు.ఏ.సి .మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సంయుక్తం గా నిర్వహిస్తున్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి, డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ,ఏం.డి. గారికి 90వ జన్మ దినోత్సవం నాడు అంకితమిస్తున్న ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’(వెయ్యేళ్ళ పూర్వ ఆంగ్ల కవిత్వం లో నూట పాతిక మంది కవుల పరామర్శ )గ్రంధా విష్కరణ సభకు ఆహ్వానం .

కార్య క్రమం

వేదిక –ఏ.జి అండ్ ఎస్.జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –సెమినార్ హాల్

తేది ,సమయం –28-8-2014గురువారం –ఉదయం -10గం లకు

సభాధ్యక్షులు –శ్రీ గుత్తికొండ సుబ్బా రావు –అధ్యక్షులు కృష్ణా జిల్లా రచయితల సంఘం

ముఖ్య అతిధి ,గ్రంధా విష్కర్త –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసన మండలి మాజీ సభ్యులు

ప్రధమ ప్రతి స్వీకరణ –శ్రీ రాచకొండ నరసింహ ప్రసాద్ (ప్రఖ్యాత రచయిత స్వర్గీయ రా.వి .శాస్త్రి గారి కుమారుడు )

గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్)-శ్రీ మైనేని గోపాల కృష్ణ –అమెరికా

ఆత్మీయ అతిధులు –శ్రీ తాతినేని  శ్రీహరి రావు –కన్వీనర్ ,ఏ.జి అండ్ ఎస్.జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజ్ –ఉయ్యూరు

శ్రీ కొడాలి సత్యనారాయణ –ప్రిన్సిపాల్ ‘’    ‘’           ‘’

డా.జి.వి.పూర్ణ చంద్ –ప్రధాన కార్య దర్శి ,కృష్ణా జిల్లా రచయితలసంఘం

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి, ద్విమాస పత్రిక సంపాదకులు

శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి

గ్రంధ సమీక్ష    —- కుమారి జి సోని ,ఇంగ్లీష్ లెక్చరర్

పూర్వాంగ్ల కవులపై కాలేజి విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన ,వక్తృత్వం ,కవితా ధారణా (రెసిటేషన్)పోటీలలోవిజేతలకు బహుమతి ప్రదానం

సభా నిర్వహణ ,పర్య వేక్షణ —-శ్రీమతి వి.అరుణ ,హెడ్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్

శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –కార్య దర్శి ,సరస భారతి

ఇట్లు

ఏ.జి అండ్ ఎస్ జి.సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –ఉయ్యూరు

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ- ఉయ్యూరు

గమనిక -పూర్తీ వివరాలతో కూడిన ఆహ్వాన పత్రాన్ని త్వరలోనే అంద జేస్తాము

-6-8-14-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

భారత స్వాతంత్ర్య సమరం లో బీహార్ కు ప్రత్యెక త ఉంది .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,జయప్రకాష్ నారాయణ వంటి ఎందరో త్యాగ మూర్తులు పుట్టిన గడ్డ అది .వీరితో బాటు సంతాలులు ,ఆదివాసీలు తమ అస్తిత్వ ,పోరాటం లో ,క్రైస్తవ వ్యాప్తిని ఎదుర్కొనటం లో ,,స్వాతంత్ర్య సాధనలో కృషి చేసి ధన్యులయారు .వారి ని మనం మార్చే పోయాం .అలాంటి వారిని జ్ఞప్తికి తేవటానికి చేసిన ప్రయత్నమే ఇది .

సంతాల్ నాయకుడు –  బాబా తిల్కా మంజి

బ్రిటిష్ వారిపై 1789లో బ్రిటిష్ వారిపై మొట్టమొదటి సరిగా దాడిచేసిన స్వాతంత్ర్య సమార యోధుడు సంథాల్ కులానికి చెందిన బాబా తిల్కా మంజీ .మంగళ పాండే తిరుగు బాటు చేయటానికి వందేళ్ళ ముందే బాబా తిరుగు బాటు బావుటా ఎగరేశాడు .సంతాల్ తెగ వారినందరినీ ఐక్యపరచి ‘’ముక్తి దళ్ ‘’గా ఏర్పరచి బ్రిటిష్ వారు కొల్ల గోడుతున్న సంపదను వారి దౌర్జన్యాలను ఎదిరించాడు .1784 మొదటి సారిగా’’ సంథాల్ హల్’’ అనే పేర ఈ తిరుగు బాటు ప్రారంభ మైనట్లు చరిత్ర చెబుతోంది .1770లో ఆ ప్రాంతం లో పెద్ద కరువు వచ్చి వేలాది మంది ఆకలితో మరణించారు .చిన్న విలియం పిట్ ఆజ్ఞలపై కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు జమీందారుల తో సర్దు బాటుకు పదేళ్ళ గడువు ఇచ్చారు .1880లో జమీన్దారికి సంథాల్ తెగకు మధ్య సంభాషణలు పెద్దగా జరగనే లేదు .

Inline image 1  

విసుగెత్తి పోయిన సంథాల్ గ్రామస్తులు బాబా తిల్కా మంజీ నాయకత్వం లో బ్రిటిష్ కమీషనర్ (లెఫ్టి నెంట్ )పై నా ,రాజ మహల్ పైనా ‘’గుయెల్’’’అనే ఒకే గుండు పేల్చగల తుపాకులతో(సింగిల్ షాట్ గన్  ) దాడి చేసి కాల్చి చంపేశారు  .బ్రిటిష్ సైనికులు వీరున్న ‘’తిలాపూర్ అరణ్యం ‘’ను దిగ్బంధం చేశారు  .అక్కడి నుండే చాలా వారాలు బ్రిటిష్ సైన్యం పై పోరాడాడు మంజీ .చివరికి బ్రిటిష్ సైన్యం 1784లో మంజీ ని పట్టుకొన్నది .అతన్ని గుర్రపు తోకకు కట్టి అక్కడి నుంచి కలెక్టర్ నివాసానికి భాగల్పూర్ దాకా ఈడ్చుకు వెళ్ళారు .అప్పటికి చితికి ,రక్తం ఓడుతున్న అతని శిధిల  శరీరాన్ని మర్రి చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు  .

భారత దేశ స్వాతంత్ర్య సిద్ధి తర్వాతబాబా ను ఉరి తీసిన ప్రదేశం లో ఒక శిలా విగ్రహాన్ని నిర్మించి గౌరవించారు .భాగల్పూర్ ఎస్ పి నివాసానికి  బాబా పేరుపెట్టారు.భాగల్పూర్ యూని వర్సిటి కి ‘’బాబా తిల్కా మంజీ భాగల్ పూర్ యూని వర్సిటి ‘’గా నామ కరణం చేశారు  .

ఆది వాసీ దేవుడు  బిశ్రా ముండా

1875-లో పుట్టి 1900లో ఇరవై అయిదేళ్ళాకేవీర మరణం పొందిన  ఆదివాసీ నాయకుడు,స్వాతంత్ర్య సమర యోధుడు ,హీరో – బిశ్రా ముండా.ఈ నాటి బీహార్ –జార్ఖండ్ ప్రాంతాలలో ‘’మిలినేరియన్ ఉద్యమం ‘’సాగించిన వీరుడు .ఇదే తర్వాత గొప్ప స్వాతంత్ర్య సమరం గా రూపు దాల్చింది .భారత పార్ల మెంట్ సెంట్రల్ హాల్ లో అతని చిత్రపటాన్ని ఉంచి గౌరవిస్తున్నారు .ఆ యువ హీరో సాధించిన విజయాలు అద్భుతం గా ఉంటాయి .

Birsa Munda, photograph in Roy (1912-72).JPG  

15-11-1875 న బీహార్ లోని రాంచి జిల్లాలో బిశ్రా ముండా గురువారం నాడు జన్మించాడు .ముండాతెగ ఆచారం ప్రకారం గురువారం పుట్టిన వారు ఏంటో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు  .తండ్రి సుగన ముండ .తలిదండ్రులు పిల్లల్ని తీసుకొని జీవిక కోసం బీర్బంకి దగ్గర కురుమ్డా చేరారు .ఇతని బాల్యం తలిదండ్రుల వద్దే ‘’చల్కాద్ ‘’లో గడిచింది .తోటిపిల్లలతోఇసుక లో, మట్టిలో ఆడి బాగా బల సంపన్నడయ్యాడని జానపద గీతాలు తెలియ జేస్తున్నాయి .బోహాండా అడవుల్లో గొర్రెలు మేపాడు .వయసు వచ్చాక ఫ్లూట్ వాయించటం బాగా వచ్చింది .గుమ్మడి కాయ బుర్రకు ఒక తీగె కట్టి(తుయిలా) అనే వాద్యం తయారు చేసి దానిపైనా బాగా వాయించేవాడు .అఖారా అనే నాట్యం చేసే ప్రదేశం లో హాయిగా గడిపే వాడు .అతనితో బాటున్న స్నేహితులు అతని నోటి నుండి విచిత్రమైన మాటలు వచ్చేవని చెప్పుకొనే వారు .

బీదతనం తో కుంగిపోతున్న తండ్రి బిశ్రా ను అయుభాటు లో ఉన్న మేన మామ ఇంటికి తీసికెళ్ళాడు .అన్న ముండా సాంప్రదాయం తో పెళ్లి చేసుకొని తండ్రిని చేరాడు .బిశ్రా మేనమామ ఇంట్లో  రెండేళ్ళు న్నాడు .సలగా లో జైపాల్ నాగ పెట్టిన బడిలో చేరి చదివాడు .తల్లి చిన్న చెల్లెలు’’జొని ‘’ తో చనువుగా తిరిగాడు ..ఆమెకు అతనంటే ఇష్టం .పెళ్లి అయి ఆమె అత్తారింటికి వెళ్ళిపోయింది .క్రిస్టియన్ మత ప్రచారకుడు వీరి గూడానికి వచ్చి ముండా సాంప్రదాయం వదిలి క్రైస్తవులుగా మారమని బోధిస్తుంటే బిశ్రా ఎదురు తిరిగాడు .చదువులో చురుకుగా ఉన్న బిశ్రాను గురువు జర్మన్ మిషన్ స్కూల్ లో చేరమన్నాడు. క్రిస్టియన్ అయితేనే అందులో ప్రవేశం ఉంటుంది .క్రిస్టియన్ గా మారి చేరి చదివాడు .కొద్దికాలం చదివి వదిలేసి వైష్ణవ భక్తుడు ‘’ఆనంద్ పాండే ‘’ను చేరి హిందూ ధర్మాన్ని బాగా అభ్యసించాడు .ఆయన ప్రేరణ తో రామాయణ ,మహా భారతాది గ్రంధాలన్నీ చదివాడు .

చైబాసాలో 1886 నుండి నాలుగేళ్ళు ఉన్నాడు .క్రైస్తవ మత ప్రచారాలు అతన్ని జాగ్రుతుడ్ని చేశాయి తన మతమేదో విస్పష్టం గా అర్ధమైంది .భావాలు బలీయం అయి క్రైస్తవానికి, మిషనరీకి వ్యతిరేకం గా మారిపోయాడు .జర్మన్ మిషనరినుండి కుటుంబం వేరైపోయి సర్దార్ల తోకలిసి వ్యతిరేకం గా పని చేశాడు .బలపడుతున్న సర్దార్ ఉద్యమం  లో చేరి ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ఎదిరించాడు .రక్షిత  అరణ్యాలలో   ప్రభుత్వం కల్పించిన  హక్కులను హరిస్తే వూరుకోనేది లేదని ముండా ఉద్యమం చేశాడు .సింగ్భం ,పాలమౌ ,మానభం అరణ్య ప్రాంతాలలో  వారి  హక్కులను తేల్చటానికి చర్యలు చేబట్టమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు .ప్రభుత్వం అడవుల్ని బ్లాకులుగా విడగొట్టి సేద్యపు భూమి ని ,పనికి రాని నేలను గుర్తించి సరిహద్దులు నిర్ణయించింది .యువ కిశోరం ముండా పాడు పడిన బావులను మరమ్మతు చేశాడు .గార్బెరాలో ఉన్న దొమ్బారి చెరువును బాగు చేశాడు .

దగ్గరే ఉన్న సింగభం లోని సంకర గ్రామంలో ఉన్న ఒకమ్మాయి తనకు ఇల్లాలుగా ఉండే అర్హతలున్నాయని గుర్తించి ఆమె తలిదండ్రులకు ధనం ,వజ్రాలు ఇచ్చి ఒప్పించాడు .కాని అతను జైలు కెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆమె క్రుతఘ్నురాలై ఉండటం గమనించి ఆమెను వదిలి పెట్టి వెళ్ళిపోయాడు .ఇద్దరు అమ్మాయిలూ పెళ్లి చేసుకోమని సిద్ధపడ్డారు .కొద్దికాలం తర్వాత బిశ్రా కుఎక పత్నీవ్రతం గురించి ఆలోచన వచ్చింది .చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలన్నీ బాగా పరిశీలించేవాడు .రైతులకు అన్యాయం జరుగుతోందని ,అడవిపుత్రులను తీవ్రం గా క్షోభ పెడుతున్నారని గ్రహించాడు .కొత్త మతాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించాడు .క్రిష్టియానిటి నుండి మారిన సర్దార్లు అందరూ అతని వైపే ఉన్నారు .చర్చి విధించే టాక్స్ అంటే కంపరం రేగిందిజనాలలో .ఒకే దేవుడు అనే భావన వ్యాప్తి చేశాడు వారిలో .అది వారికి బాగా నచ్చింది .బిశ్రా ఒక దేవ దూత అయ్యాడు వారికి .అతని సిద్ధాంతం లో డబ్బు ఖర్చులేదు .ముండాలు ,ఒరాన్లు ,ఖరియన్లు బిశ్రా అంటే దేవుడుగా భావించి అతన్ని చూడటానికి తండోప తండాలుగా వచ్చారు .తమపాపాలను పోగొట్టేవాడనే నమ్మకం కలిగింది .అందరూ బిస్రలైట్లు గా మారిపోయారు .’’ధర్తి ఆబా’’ అనే పేరు అందరి పెదవుల మీదా పలుకుతోంది .హిందువులు ముస్లిం లు కూడా విపరీతం గా వచ్చి ఈ కొత్తమతం లో చేరిపోయారు .హిందూ విధానాలను వ్యాపింప జేస్తూ మతం మారి క్రైస్తవులైన వారిని మళ్ళీ పాత పద్ధతిలోకి రమ్మని ప్రచారం చేశాడు .మన్య వీరుడై దేవదూతగా భాసించి సాక్షాత్తు వారికి దేవుడే అయ్యాడు బిశ్రా ముండా .గోపూజ  చేయమని ఆవును చంప వద్దని కూడా ప్రచారం చేశాడు .

బ్రిటిష్ కాలనీ వ్యవస్థ రైతులకు మేలు చేయకుండా జమీందారీ వ్యవస్థకు కొమ్ము కాసింది .ఆది వాసీలు తమ వద్ద ఉన్న పాత పని ముట్ల తో వ్యవసాయం చేస్తూ ,అధిక దిగుబడిని సాధించలేక పోయారు .అప్పుడు ప్రభుత్వం చోటా నాగ పూర్ లోని భూములను మన్య జనులకు కాక ఇతరులకిచ్చి వ్యవసాయం చేసుకోమన్నది .మన్య రైతుల్ని తరిమేసి భూములాక్రమించి వారందరూ దాష్టీకం చేశారు .దీనితో ‘’తికాదార్స్ ‘’అనే ఒక కొత్త వర్గం పుట్టింది .1856లో ఆరు వందమ మంది జాగీర్దార్లు ఉండే వారు .వారికి ఒకటి నుంచి  నూట యాభై  గ్రామాలపై ఆధిపత్యం ఉండేది .దీనితో అప్పటిదాకా ముండా,ఒరాన్ నాయకుల అధికారం  తగ్గిపోయింది .కొన్ని గ్రామాలలో ఈ ఆదివాసీలకు  భూమిపై హక్కులు లేకుండా నిలువ నీడ కూడా లేని పరిస్తితి ఏర్పడి వ్యవసాయ కూలీలుగా ఉండాల్సిన దుస్తితి వచ్చింది .

ఈ దారుణ పరిస్తితులకు కలత చెందిన బిశ్రా తదితర ముండా నాయకులు ఎదిరించి పోరాడారు .తమ అటవీ భూములపై తమకే హక్కు ఉండాలని పోరాటం సాగించారు .మధ్య వర్తులను బ్రిటిష్ వారిని తొలగించాలని డిమాండ్ చేసి ఉద్యమించారు .బ్రిటిష్ ప్రభుత్వం మాయోపాయాలు పన్ని బిశ్రా ముండా ను 3-2-1900న చక్రదార్ పూర్ లోని జామ్కోపాయ్ అడవిలో బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ  సహచర గెరిల్లా సైన్యం తో  కలిసి పడుకొని ఉండగా పట్టుకొని  జైల్లో పెట్టి హింసించింది .అతనితో బాటు 460మంది గెరిల్లా సైనికులను అరెస్ట్ చేసింది .కొంతమందికి యావజ్జీవకారాగారం ,ఇరవై ముగ్గురికి పద్నాలుగేళ్ళు జైలు విధించారు . బిశ్రా  యెడల పాశవికం గా ప్రవర్తించింది .బిశ్రా 9-6-1900 న రాంచీ జైలు లో దారుణ మరణానికి గురైనాడు .కలరా సోకి చనిపోయాడని జైలు అధికారులు చెప్పారు .ఆ లక్షణాలేవీ లేవని తర్వాత తెలిసింది .పాతిక ఏళ్ళు మాత్రమె జీవించిన బిశ్రా ముండా ఆదివాసీలకు ప్రత్యక్ష దైవం అయి బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహమై గడ గడ లాడించాడు .అతని మరణం తో ఉద్యమం నీరుకారిపోయింది .కాని రెండు విషయాలు స్పస్టమైనాయి .ఆదివాసీల భూములు ఇష్టం వచ్చినట్లు ‘’దికూస్ ‘’లు లాక్కొనే వీలు లేదని  ,బ్రిటిష్ కాలనీ వాసుల అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ఆదివాసీలు చూస్తూ ఊరుకోరని తిరగబడి బుద్ధి చెబుతారని వారిలో పోరాట పటిమ ఉందని తెలిసింది .ముండాతన తోటి వారికి ఇచ్చిన పిలుపు ‘’బ్రిటిష్ రాణి ప్రభుత్వం ఇక్కడ అంతమొందాలి .మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి ‘’అనేది ఒక మంత్రమై పని చేసి బీహార్ ,మధ్య ప్రదేశ్ ,ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ లలో ప్రతిధ్వనించి ఆదివాసీల ఐక్యతకు ,హక్కుల పరిరక్షణకు దారి చూపింది .

బిశ్రా జన్మించిన నవంబర్ పదిహేనును  కర్నాటక లోని కొడగు ,మైసూర్ జిల్లాలలో జయంతి వేడుకలను ఘనం గా నిర్వహిస్తున్నారు .జార్ఖండ్ రాజధాని రాంచిలో కోకార్ లో ఉన్న బిశ్రా సమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు . రాంచి లోని విమానాశ్రయానికి బిశ్రా ముండా విమానాశ్రయం అని పేరుపెట్టి గౌరవించారు .సింద్రీలో బిశ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ,కాన్పూర్ లో బిశ్రా ముండావనవాసీ చాత్ర వాస్ ను ,బిశ్రా ముండా క్రీడా మైదానం ,బిశ్రా ముండా సెంట్రల్ జైలు ,బిశ్రా సేవా దళ్ ,పురూలియాలో బిశ్రా ముండావ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పరచారు .బిశ్రా పై ఒక నవల రాసి దాన్ని సినిమాగా తీశారు .విప్లవం పేరుతొ అశోక్ శరణ్ 2004లో తీసిన హిందీ సినిమాలో అయిదు వందల మంది బిస్రలైట్లు నటించారు .రామన్ మాగ్ సేసే అవార్డ్ విన్నర్ మహా శ్వేతా దేవి బిశ్రా జీవితం ,ఆయన బ్రిటిష్ వారిపై చేసిన గెరిల్లా పోరాటాల నేపధ్యం గా ‘’అరణ్యే అధికార ‘’అనే బెంగాలి నవల రాసి సాహిత్య అకాడెమీ బహుమతిని పొందింది .యువకులకోసం ఆ నవలను తర్వాత సంక్షిప్తం గా రాసి ప్రేరణ కలిగించింది .

ఈ విధం గా ఇద్దరు బీహారీ ఆదివాసీ స్వాతంత్ర్య సమార యోధులను గురించి తెలియ జేసే మహద్భాగ్యం నాకు కలిగిందని సంతోషిస్తున్నాను .

మరికొంతమంది గురించి తరువాత తెలియ జేస్తా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం

కావ్య కంఠ ,వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’షస్ట శతకం’’ఏక వింశ స్తబకం  ‘’(21) లో ‘’అనుష్టుప్ ‘’వృత్తాలలో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని మహా వైభవం గా వర్ణించారు .ఆ సొగసు చూడ తరమా –చూద్దాం –

‘’ఇతం పీత్వాకుచం  స్కంధే ప్రసారితకరే తతః –జయతి స్మిత ముద్భూతం శివయో రేక దేహయోః’’అంటూ ప్రధమ శ్లోకం రాశారు .బాల సుబ్రహ్మణ్యం ఎడమవైపునున్న స్తనం నుండి పాలు తాగి ,కుడి వైపుకు చేతులు చాపగా ఒకే శరీరం కల పార్వతీ పరమేశ్వరులకు పరమ ఉత్కృష్టమైన నవ్వు కలిగిందట .

వామభాగం లో రత్నాలు పొదిగిన అందెల ధ్వనికి ఆకర్షితులైన హంసలు ,కుడి వైపు అందెగా ఉన్న నాగ రాజు బుసలతో వాటిని భయ పెడుతున్న నారీ ,పురుషాకారం కల ఒక దివ్య వస్తువు తన హృదయం లో ఉండుగాక అని కోరారు రెండవ శ్లోకం లో .ఎడమ వైపు దేవ సేనా నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జా గిస్తూ ,కుడి వైపు ఒడిలో గణపతి శిశువును ధరించిన అర్ధనారీశ్వరత్వం కాపాడు గాక అని మూడో శ్లోకం లో అంటారు .నాలుగులో

‘’విడంబిత బ్రహ్మ చారి కోకైకస్తన మేకతః –కవాతార్ధ నిభం బిభ్ర ద్వక్షః కేవల మన్యతః ‘’

ఎడమ వైపు తోడూ (జంట)లేకుండా జక్కవ పక్షి లాగా ఉన్న ఒంటి చన్ను కలిగి ,కుడి వైపున తలుపు చెక్క లాగా (బేస్ బాల్ కోర్ట్-లేక టెన్నిస్ కోర్ట్ )విశాలం గా ఉన్న స్తనంలేని వక్షం ఉన్న నారీ పురుషాకారం తనను రక్షించు గాక అన్నారు .తరువాత పార్వతీ భాగం లో శ్వాసిస్తూ కుమారస్వామి పాలుతాగుతుంటే ,పరమేశ్వర భాగం లో బుసకొట్టే  భయంకర సర్పం ఉన్న అర్ధనారీశ్వరులు కాపాడాలని కోరుకొన్నారు .ఎడమ వైపు తామర తూడు లాగా మెత్తగా మృదువుగా ఉన్న బాహు లతను ధరిస్తూ ,కుడివైపు ఐరావత గజ తొండం లాగ భీకర బాహుదండం ఉన్న స్త్రీపురుషత్వం కాపాడాలని కోరారు .ఏడవ శ్లోకం లో –

‘’కుత్రాప్య విద్య మానే పి వందనీయేతదా తదా-పరస్పర కర స్పర్శ లోభాతో విహితాంజలి’’

పార్వతీ పరమేశ్వరులిద్దరికి  ఎవరికీ నమస్కరించాల్సిన అవసరం లేని సర్వోత్రు క్రుస్టూలు . కాని అప్పుడప్పుడు ఒకరి చేయి మరొకరు తాకాలనే కోరికతో దోసిలి రూపం తో నమస్కరిస్తున్నట్లు కని పిస్తారని చమత్కరించారు కవి .మరో శ్లోకం –

‘’శక్ర నీల సవర్నత్వా ద్భాగయో రుభయోరపి –ఊర్ధ్వాధరాం గ సాపేక్ష సంధి జ్ఞాన గల స్థలం ‘’

కంఠ స్థలం లో కుడి ఎడమ భాగాలు రెండూ కూడా ఇంద్రనీల మణుల్లాఉన్నందున ,ఆ సంధి జ్ఞానం పై కింది అంగాల ఆపేక్ష కలది అయి అక్కడ ఉన్న అర్ధ నారీశ్వార వస్తువు నా హృదయం లో ఉండుగాక అని ప్రార్ధించారు .ఇక్కడ కొంత వివరణ అవసరం –దేవి కాళికా స్వరూపం కనుక ఆమె కంఠం ఎడమ భాగమంతా నీలం గా ఉంటుంది. తెల్లని శరీరం కల శివుడు విషాన్ని కంఠం లో దాచినందు వల్ల  కుడి భాగం నీలం గా ఉంటుంది .ఇలా  కంఠం అంతా నీలం కాగా ఏది పార్వతీదేవి కంఠం లో సగం, ఏది శివుని  కంఠం లో సగం అని తెలుసుకోవటం కష్టం గా ఉంది అని కవి భావం .కాని కుడి భాగం లోశివుడి  కంఠం మీదున్న తెలుపు కంఠం కింద ఉన్న తెలుపుల ను బట్టి పార్వతీ పరమేశ్వరుల కంఠసంధి భాగాన్ని గుర్తించి తెలుసుకోవాలి అని భావం .

Inline image 1   

ఎడమ వైపు కలువలను వికసింప జేసే చంద్రుడు నేత్రం గా ,,కుడివైపుపద్మాలను వికసింప జేసే సూర్యుడిని నేత్రం గా కలిగి ఉన్న అర్ధనారీశ్వరాన్ని స్తుతించారు .ఎడమ వైపు అందమైన నల్ల గ్రుడ్డున్న నేత్రం చేత ,కుడివైపున చేతుల్లో ఆడు కొనే  లేడి పిల్ల ఉన్నదట . అంటే పార్వతికన్ను శివుడి చేతిలో ఉన్న లేడి పిల్ల  దృష్టివిలాసాన్ని ,శివుడి చేతిలో ఉన్న లేడి పిల్ల  పార్వతి ద్రుష్టి విలాసాన్ని నేర్చుకోన్నాయని చమత్కారం .లలాటం లో ఎడమ వైపు కాశ్మీర సుగంధ ద్రవ్యం చేత ,కుడి వైపు మన్మధ దహన అగ్ని నేత్రం చేత అలంకరింప బడి ఉందట .ఒక వైపు మంచి వారికి క్షేమం కలిగించే చూపు ,రెండవ  వైపు దుస్టూలకు భయం కలిగించే మండే చూపు ఉన్నాయట ..ఎడమ వైపు నల్లని మెరసే కేశాలుంటే ,కుడివైపు అగ్ని జ్వాలల్లా పాటల వర్ణ జడలున్నాట.అర్ధ నారీశ్వర వక్షం లో ఎడమ వైపు కేశపాశం ,కుడి వైపు సర్పహారాలున్నాయి .ఎడమవైపు కొత్త పారిజాత పుష్ప మాల ఉంటె ,కుడివైపు పెద్ద కెరటాలతో ఉన్న ఆకాశ గంగ ఉందట .వెండికొండలో ,యోగుల మనస్సుల్లో విహరించే అర్ధ నారీశ్వరం .యెర్రని ఈశ్వర జటా జూటం యెర్రని సంధ్యాకాశం లా ఉంటె దేవి కురులు సంధ్యాకా మేఘం లాగా ఉన్నాయట .

‘’దమత్యో ర్యువాయో రేష లోపో యన్నాస్తి శైలజే –వామం పార్శ్వం విభో స్షేతుం దాతుం తే దక్షిణ కరః ‘’

‘’అమ్మా పార్వతీ !ణ పతి శివుడికి శయ నించటానికి ఎడమ వైపు లేదు .దానం ఇవ్వటానికి నీకు కుడి చెయ్యి లేదు దంపతులైన మీ ఇద్దరికీ ఇదే లోపం అని భలేగా చమత్కరించారు ముని

లోకం లో స్త్రీలు  రెండుస్తనాల తో ఒక్క బిడ్డను పోషించ గలరో లేదోకాని నువ్వు మాత్రం ఒకే స్తనం తో ముల్లోకాలనూ పోషిస్తున్నావు .స్త్రీలు కడుపులో ఒక బిడ్డను మోయటానికే ఆప సోపాలు పడతారు .నువ్వు మాత్రం సగం కడుపుతో మూడు లోకాలని అవలీలగా మోస్తున్నావు .

‘’అనురూపా శివస్య త్వమనురూపః శివస్తవ –ఆలం కారో  నురూపో వా మకలంకో ర్భకః శశీ ‘’ .

అమ్మా ! మీ ఇద్దరు ఒకరికి ఒకరు తగిన వారు .మీ ఇద్దరికీ తగిన ఆభరణం కళంకం లేని చంద్రుడు .

‘’తవైవ తవ దేహామ్శో హరస్యైవ హరస్య యః –ప్రాణాస్తూ జగతాం ధాత్రి హరస్య త్వం హర స్తవ ‘’

జగదీశ్వరీ !నీ దేహం నీదే –దానిపై శివుడికి అధికారం లేదు .శివుని దేహ భాగం ఆయనదే. దానిమీద నీకూ అధికారం లేదు .దేహ భాగాలు వేరైనా శివుడికి నువ్వు ప్రాణం ,శివుడు నీకు ప్రాణం గా ఉంటారు .కనుక మీ దాంపత్యం, ప్రేమ లోకోత్తరం అంటారు .ఇద్దరూ ఏకం గా ఉన్న దయామయమైన మీ మనస్సు మాకు శుభం చేకూర్చాలి అని ఇరవై నాలుగో శ్లోకం లో కోరారు .

చివరిదైన ఇరవై అయిదవ శ్లోకం లో మళ్ళీ ఒక చమత్కారం చేశారు –

‘’భవస్య భాగ ముత్సృజ్య భవానీ భాగ మాత్మనః –భజ త్వనుస్టూ భా మాసాం సృస్తానాం నార సింహినా ‘’

నరసింహుని పుత్రుడినైన ఈ గణపతి ముని కవి అనుష్టుప్ ఛందస్సులో భవ (శివ) వర్ణన పరమైన పద్య భాగాన్ని  నీ భర్త భవునికి వదిలేసి  భవానీ !నీకు సంబంధించిన పద్య భాగాన్ని నువ్వు స్వీకరించు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

Published at: 05-08-2014 02:41 AM

1953లో ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆ రాష్ట్రంలోనే స్థిరపడిన, పుట్టిన తెలుగువారిని స్థానికేతరులే అని జయలలిత అన్నారే అనుకుందాం. మరి, వారి మనవలకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇస్తుందా? 1956 తరువాత తెలంగాణలో స్థిరపడ్డ లక్షలాది తమిళులు, కన్నడిగులు, మరాఠీలు, గుజరాతీలు, ఉత్తర భారతీయుల సంగతేమిటి? వారి ఫీజులను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయా?

గత కొద్ది కాలంగా విద్యార్థులలోనే కాక నవ్యాంధ్ర, తెలంగాణలో ఆవేదన కలిగిస్తున్న స్థానికత -1956పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశ్య లోగుట్టు- 1. అక్రమాలు జరుగుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ని సంస్కరించి (అందుకనే ఎంసెట్‌ ఆలస్యం) అర్హులకి ఇవ్వడం. అయితే నష్టపోయేవారు గొడవ చేస్తారు, దానిని ప్రతిపక్షాలు ఎగదోస్తాయి కాబట్టి, దానికంటే పదునైన ఆంధ్ర విద్యార్థుల వ్యతిరేక ఉద్వేగ టాగ్‌ అందుకుని అర్హులకే అంటే కాదనలేరు. 2. తెలంగాణ ప్రజలలో రాష్ట్రం వచ్చిన తరువాత స్వర్గం దిగివస్తుందని, 5-10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయనే భ్రమ లు కొందరు కల్పించారు. అలాగే, హామీలన్నీ వెంటనే అమలు చేయడంలో ఇబ్బందులు సరిచేయటానికి ఆంధ్ర – తెలంగాణ భావోద్రేకాలు లేపటం. కొన్ని సర్వేల ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఈ భావోద్రేకాల వల్ల మనకు ఒక్కళ్ళకే న్యాయం చేయటానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారనుకుంటూ తెలంగాణలో వారి ఓటు బ్యాంక్‌ మరింత పెరిగినట్టు కనబడుతోంది. 3. తెలంగాణ తెదేపా (ముఖ్యంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు)ని ఇబ్బందుల్లో పెట్టడం, కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఆంధ్రా వారికి మద్దతు ఇస్తున్నాయంటూ వాటిని కూడా ఇరు కున పెట్టడం (శాంతి సందేశవాసిగా పేరొందిన జానారెడ్డి ఇది అన్యాయం అని మాట్లాడితే వారినీ డిఫెన్స్‌లోకి నెట్టే విధంగా ఆయనని దూషిస్తూ వ్యాఖ్యానించడం దీనిలో భాగమే. 4. అంతిమంగా ఒకవేళ కోర్టులు కొట్టివేసినా, మనకోసం ఎంతైనా ప్రయ త్నం చేసారుగా అనుకునే తెలంగాణ ఓటర్లతో అంతి మంగా లాభమే జరుగుతుందనే భావం. అంటే ఒక దెబ్బకు 5 పిట్టలు. మాస్టర్‌ స్ర్టేటజీ. ఇవన్నీ అలా ఉంచితే, ఒక్కటి మాత్రం సత్యం. ప్రజా పంపిణీ వ్యవస్థలో, ఫీజు స్కీంలో అక్రమాలు అరికట్టటానికి మాస్‌ సర్వే, తెలుగు భాషాభివృద్ధి, ప్రభుత్వ రంగంలోనే విద్యుదుత్పాదన ఇంకా అనేక విషయాలలో ఆయన అవగాహనతో మాట్లాడుతూ కార్యసాధనలో కనబడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలు కూడా అలాంటి వాటికి ప్రభుత్వానికి సహకారమందిస్తూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్థానికత సమస్యను వేరు వేరుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదే ళ్ళు ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలుండాలి. ఆ విధంగా నాన్‌ లోకల్‌ కోటాలో నవ్యాంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలో చదివే విద్యార్థులు ఈ సంవత్సరం 39,794 మంది అలాగే తెలంగాణ నుంచి నవ్యాంధ్రలో చదివేవారు 19,461 మంది ఉంటారని అంచనా. అందువల్ల పక్క రాష్ట్రంలో నాన్‌ లోకల్‌ కోటాలో చదివే విద్యార్థులకి ఆయా రాష్ర్టాలే నిధులివ్వాలనే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ని, నవ్యాంధ్రప్రదేశ్‌ కూడా ఒప్పుకున్నప్పుడు అది ఆంధ్రకి ఈ సంవత్సరం 126 కోట్లు, తెలంగాణకి రూ. 34 కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో వివాదం లేదు, ఆ విద్యార్థులకి ఇబ్బందీ లేదు. అయితే 1-11-1956 ముందు ఉన్నవారి సంతానమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (సంక్షేమ పథకం)కు స్థానికులని తీర్మానించి అది ఎలా అమలుచేయాలో కొత్తగా కమిటీ వేస్తూ జీవో తీసుకురావడమే అత్యంత అభ్యంతరకరం. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ కోరే అన్ని వర్గాలూ 371డి- రాష్ట్రపతి శాసనాన్ని కొనసాగించాలని తీవ్రంగా కోరారు. ఆమోదించబడిన బిల్లు ప్రకారం, 371డి స్థానికత ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో పదేళ్లు ఉమ్మడిగా భర్తీ జరుగుతుంది. దానికి ఒప్పుకుంటాం కానీ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించాలంటే ఈ స్థానికత సరిపోదనీ, వారి తాతలో ముత్తాతలో 1-11-1956 కంటే ముందే తెలంగాణకి వచ్చి తీరాల్సి ఉండాలంటే ఎలా? 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తరువాత రాష్ట్ర రాజధానిగా తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ అయి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన వ్యక్తి వారసులు ఫీజు లాంటి సంక్షేమ పథకాలకు అనర్హులనడం ఘోరం. దానికంటే ఇంకా ప్రమాదకరం సంక్షేమ పథకాల అమలుకు కట్‌ ఆఫ్‌ డేట్‌ పెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని అనటం. అంటే ఆ సంక్షేమ పథకాల్లోనే ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు, రైతుకు సబ్సిడీలు, విద్యుత్‌ సబ్సిడీ అన్నీ ఉంటాయి. అలా తెలంగాణలో స్థిరపడ్డవారు నవ్యాంధ్రలో కూడా రాష్ట్రపతి శాసన నిబంధనల ప్రకారం స్థానికులవ్వరు. వారు మరి త్రిశంకు స్వర్గంలో ఉండి ఏ దేశ పౌరులౌతారు?
ఇక, 1956 తరువాత తెలంగాణలో శాశ్వతంగా స్థిరపడినవారు, అక్కడే పుట్టినవారు, లేదా వారి మనమలు-ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజులు భరిస్తుందని నవ్యాంధ్ర మం త్రులు చెప్పడమంటే తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారిని ఆ ప్రాంతానికి దూరం చేయడమే. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకవేళ 1953లో ఆంధ్ర విడిపోయిన తరువాత అక్కడ స్థిరపడి, పుట్టి/అక్కడే చదువుకున్నవారు కూడా స్థానికేతరులే అని అన్నారే అనుకుందాం. మరి, వారి మనవలకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇస్తుందా? ఇదే అమలైతే 1956 తరువాత తెలంగాణలో స్థిరపడ్డ లక్షలాది తమిళులు, కన్నడిగులు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర భారతీయుల సంగతేమిటి? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి, రేషన్‌ కార్డులు ఇస్తాయా? పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దక్కేది ఎస్సీ, ఎస్టీలకు 2 లక్షల లోపు, బీసీ, ఇబీసీలలో 1 లక్షలోపు ఆదాయం వచ్చేవారి పిల్లలకు మాత్రమే. ఎవరు దెబ్బతింటున్నారు? ఉద్వేగాలు పెరిగి కేసీఆర్‌ గారికి ఓట్లు రాల్చవచ్చు. కానీ భారతీయత దెబ్బతినదా? తెలంగాణ తెలుగు ప్రజలు మహారాష్ట్ర, గుజరాత్‌లలో అరకోటికి పైగా జీవిస్తున్నారు. అక్కడ స్థానికులై వేలాది, లక్షలాది మంది ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, విద్యాసంస్థలలో స్థానికులుగా సీట్లు పొందుతున్నారు. అక్కడ ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీలే కాక మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు కూడా సంపాదించుకున్నారు. తెలంగాణ వారికి అక్కడి మరాఠీసేన వారు 1942 కట్‌ ఆఫ్‌ పెడితే పరిస్థితి ఏమిటి? భారతదేశంలో దీనికి అంతేమిటి? వీటన్నిటిపై దేశమంతటా, తెలంగాణలో కూడా పూర్తి చైతన్యం కల్పిస్తేనే, భారతదేశానికి ఎదురైన ఒక సమస్య పరిష్కారమౌతుంది. పరిష్కారం కాకపోతే మేమే దేశమంతటా తిరిగి చైతన్యానికి ప్రయత్నిస్తాము.
అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు దాటితే గ్రీన్‌కార్డ్‌కి అర్హులు. పుట్టితే-సహజంగా పౌరసత్వమే వస్తుంది. భారత రాజ్యాంగం – సమానత్వం (రైట్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ) అని ఆర్టికల్‌ 14, కుల, మత, ప్రాంత, జాతి, లింగ వివక్షత కుదరదు అని ఆర్టికల్‌ 15 చెబుతున్నాయి. అయితే ఆర్టికల్‌ 15లో (4), 29వ ఆర్టికల్‌ క్లాజ్‌ (2) ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకు, షెడ్యూల్‌ తెగలకు, వర్గాలకు ఇచ్చేదాంట్లో పై సమానత్వ క్లాజు మినహాయింపు చేయవచ్చును అని చెబుతుంది. ఆదివాసీల విషయమై ఆంధ్రప్రదేశ్‌ చేసిన 1950-చట్టం ఆదివాసీలది కాబట్టి చెల్లుతుంది. డి.పి. జోషి /స్టేట్‌ ఆఫ్‌ యంబిలో సర్వోన్నత న్యాయస్థానం దాన్ని సమర్థించింది. మోహిని జైన్‌ / స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక (1992) లోకల్స్‌ ఓన్లీ అనే కేసులో, అలాగే డాక్టర్‌ ప్రదీప్‌ జైన్‌ / యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐఆర్‌ 1984) రిజర్వేషన్‌ రూల్‌ని అప్‌హెల్డ్‌ చేసింది. అయితే రాజేంద్రన్‌ / స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1968)లో జిల్లాల వారిని కొట్టివేయగా స్టేట్‌ ఆఫ్‌ యూపీ/ ప్రదీప్‌ (1975)లో ఉత్తరాఖండ్‌ హిల్స్‌ ఏరియా విద్యార్థులకి రిజర్వేషన్‌ని ఆర్టికల్‌ 15(4) ప్రకారం విద్యాపరంగా వెనుకబడినవారికని మాత్రమే సమర్థించింది. నిడమర్తి మహేష్‌/ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (1986) యూనివర్సిటీలు ప్రాం తీయ రిజర్వేషన్లను ఒకే ప్రాంతం వెనుకబడిందంటే అది సరికాదని కొట్టవేసింది. రాధిక జైస్వాల్‌ కేసులో మెడికల్‌ విద్యలో కూడా ఆ విధమైన స్థానికత-డామిసైల్‌ రూల్‌ చెల్లదని, అదీ ముందస్తు ఇన్ఫర్మేషన్‌ లేకుండానని జస్టిస్‌ అనూప్‌ మెహతా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్‌ 2014 జూన్‌ 24న తీర్పు ఇచ్చింది. అయితే వారు ఇప్పుడు 12వ తరగతి అక్కడే చదివి ఉండాలనే నిబంధన ఒక అర్హతగా చేర్చారు. 1932 కటాఫ్‌ డేట్‌గా బాబూలాల్‌ మరాండీ ప్రభుత్వం 2002లో తీసుకొచ్చిన చట్టం హింసకు దారితీసింది. ఆఖరుకు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తమిళనాడులో తల్లిదండ్రులు, గార్డియన్‌ నివాస ధ్రువీకరణపై గత ఆరు సంవత్సరాలుగా అక్కడ నివాసముంటే స్థానికత్వం వస్తుంది. 1993 నుంచి మహారాష్ట్రలో అది పది సంవత్సరాల నివాసం. హర్యానాలో పదిహేనేళ్ళు, గుజరాత్‌లో పది సంవత్సరాలు. అనేక రాష్ట్రాల్లో స్థానికత అనేది కొన్ని ఉద్యోగాలకు, కొన్ని విద్యా ప్రవేశాలకు అదీ వేరు వేరుగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఆ రాష్ట్ర వాసిని వివాహం చేసుకున్న మహిళకు స్థానికత వస్తుంది. అనేక చోట్ల పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక భాష తప్పనిసరి చేసారు. పరీక్ష లున్నాయి. ఇక మన తెలంగాణ, ఆంధ్రలలో భాష, లిపి ఒక్కటే. పైగా ప్రత్యేక తెలంగాణ వాదులు కోరినట్లు 371-డి అధికరణం అమలులో ఉంది. దాని ప్రకారం ఆ సీటు లేదా ఉద్యోగానికి స్థానికత కావాలంటే అర్హత కలిగిన విద్యార్హత ముందు నాలుగు సం వత్సరాలు వరుసగా లేదా గత ఏడు సంవత్సరాల్లో ఎక్కడ చదివితే అక్కడ స్థానికులు అవుతారు.
వలసవచ్చిన జనాభాతో కలుపుకొని 42 శాతమనీ, హైదరాబాద్‌ జనాభా 75 లక్షలనీ చెప్పి ఆస్తులలో వాటా తీసుకుని, రాజధాని కాబట్టి ఏర్పడిన 400 ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉం చుకుని నేడు వారి పిల్లలకు, అదీ అల్పాదాయ వర్గాలకి ఫీజు కట్టనుపొమ్మంటే ఎలా? తెలంగాణలో తెలంగాణేతర భారతీయులు 70 లక్షల వరకు ఉండవచ్చు. తెలంగాణ పౌరసత్వ కార్డులు, కాశ్మీర్‌, హైదరాబాద్‌లపై టీఆర్‌ఎస్‌ అధినేతల వ్యాఖ్యలు చూస్తుంటే, ఇప్పటివరకు ఆంధ్ర-తెలంగాణ ఉద్వేగాలుగా సృష్టించినవి ఇకముందు భారతదేశ ఇతర పౌరులు వెర్సస్‌ తెలంగాణ వారుగా చేయబోతున్నారా అనే అనుమానం వస్తుంది. అందుకనే బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో సహా అన్ని ప్రాంతీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా ఉద్వేగాలను రగిలించి రాజకీయ అనుకూలతను తెచ్చిపెట్ట వచ్చు గానీ తెలంగాణ పౌర సమాజానికి అంతిమంగా లాభం చేయదు. దీనిపై స్పందించడానికి తెలంగాణలో ఒక్క మేధావి లేరా అని విద్యార్థులు, వారి తల్లితండ్రులు అడుగుతున్నారు. రాష్ట్రపతి, పార్లమెంటు, భారత ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా తమ పౌరులకి న్యాయం చేయాలి.. ఈ ఏడాది ఉమ్మ డిగా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి (పోస్ట్‌ మెట్రిక్‌) 4991 కోట్ల రూపాయలు అవసరం అని తేల్చారు. ఆ ప్రకారం కొత్త ఆంధ్రప్రదేశ్‌ 2477 కోట్లు, తెలంగాణ 2514 కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే తెలంగాణ 2096 కోట్లు (42శాతం) పెట్టుకుంటే చాలంటూ 300 కోట్లకు పైగా అధిక ఖర్చుకు చంద్రబాబు ముం దుకు వచ్చారు. ఎలాగూ సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడుగుముందుకు వేసి సమస్యని పరిష్కరించాలి. విద్యుత్తు, నీరు వంటి ముఖ్యమైన అంశాలను కూడా పరిష్కరించుకుని ఇరువురు ముఖ్యమంత్రులు రాజనీతిజ్ఞులుగా వ్యవహరిస్తూ రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్ళాలి.
-చలసాని శ్రీనివాస్‌
ఆంధ్ర మేధావుల వేదిక

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తానొవ్వక నొప్పించకగా ఉండే చక్ర పాణి గురించి – సింగీతం చెప్పిన జ్ఞాపకాలు

తానొవ్వక నొప్పించక – సింగీతం చెప్పిన చక్రపాణి జ్ఞాపకాలు…

Published at: 05-08-2014 00:55 AM

పాపాయికి గోరుముద్ద తినిపించాలంటే వెన్నెల్లో చందమామను పిలవాలి. అదే పాపాయిని జో కొట్టాలంటే అక్షరాల్లో చందమామను వినిపించాలి. ఆ చందమామ అందనిది… ఈ చందమామ అందరిదీ. అందని ఆ చందమామను తన సాహితీకలంతో నేలకి దించి తెలుగు లోగిళ్లలో సాహితీ వెన్నెలను ప్రసరింపచేసిన ఆ మహోన్నత వ్యక్తి.. తెలుగు సినిమా స్వర్ణయుగ చక్రవర్తి చక్రపాణి. ఆయన అడుగుజాడల్లో నడిచిన సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన చందమామ కథల్లాంటి సినీ సౌరభాలే.. ఈ చక్రపాణి జ్ఞాపకాలు…

‘‘ఇప్పుడు సందేశాలు ఇవ్వడం ఎక్కువైపోతోంది. సందేశం ఇవ్వదలచుకుంటే ఆయన ఒకటి చెబుతారు- ‘ఒక పోస్టుకార్డు మీద రాసి అందరికీ పంపించవచ్చు కదా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకూ’ అని. సినిమా అంటే మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచడమే ప్రధానమన్న ఆయన అభిప్రాయం’’

విజయా సంస్థలో అడుగుపెట్టక ముందే నాకు చక్రపాణిగారు తెలుసు. మొట్టమొదట చక్రపాణి పేరు విన్నది బెంగాలీ శరత్‌ సాహిత్యంలో. ఎన్నో రచనలను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. ఆయనలో గొప్ప సామాజిక స్పృహ ఉంది. ‘దేవదాసు’ అంటే ‘జగమే మాయ…’ పాటలు కాదు- జమీందారి వ్యవస్థ. అదే మెయిన్‌ సబ్జెక్ట్‌. ‘లైలామజ్ను’ అయినా, ‘రోమియో జూలియట్‌’ అయినా కేవలం ప్రేమకథలు కాదు, ఆనాటి వైషమ్యాల గురించి చెప్పే సినిమాలవి. చక్రపాణి రచనల్లో సామాజిక దృక్పథం కచ్చితంగా ఉంది. ఏమీ లేకపోతే ఆయన శరత్‌ సాహిత్యాన్ని ఎందుకు అనువదిస్తారు? కాకపోతే అది స్టేట్‌మెంట్‌గా, ఈ రకంగా ఉండాలి, అలా ఉండకూడదు అని ఏదో నీతులు చెప్పినట్టు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. రాముడు మంచి బాలుడు సామెత చెప్పి మీరూ అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం కన్నా ఒక ఇతివృత్తం ద్వారా అంతర్లీనంగా సందేశాన్ని చెప్పడంలో ఒక అందం ఉంది. అది చక్రపాణి రచనలో, సినిమాలో, ఆలోచనలో ఉంటుంది.
సందేశాలొద్దు..
ఇప్పుడు సందేశాలు ఇవ్వడం ఎక్కువైపోతోంది. సందేశం ఇవ్వదలచుకుంటే ఆయన ఒకటి చెబుతారు- ‘ఒక పోస్టుకార్డు మీద రాసి అందరికీ పంపించవచ్చు కదా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకూ’ అని. సినిమా అంటే మంచి ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచడమే ప్రధానమన్నది ఆయన అభిప్రాయం. ‘షావుకారు’, ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పు కూడు’, ‘గుండమ్మ కథ’… ఇవన్నీ జనరంజకమైన సినిమాలే. అన్నిట్లో కూడాను ఒక స్టేట్‌మెంట్‌ ఉంటుంది. అండర్‌లైన్‌ స్టేట్‌మెంట్‌. అవన్నీ షుగర్‌ కోటెడ్‌గానే ఉంటాయి. ఎక్కడా కూడా సందేశం చెబుతున్నట్టు తెలీదు. కానీ, ఇవన్నీ సామాజిక నేపథ్యమున్నవే. అదే చక్రపాణి సినిమాల గొప్పతనం.
పిల్లలకే కాదు..
‘చందమామ’లో ఇదే కనిపిస్తుంది, కథల్లో ప్రతిబింబిస్తుంది. అన్నీ మనోవికాసాన్ని కలిగించే ఆరోగ్యకరమైన కథలే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే… చిన్నపిల్లల కథలు రాశారు కదా అని ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవడానికి వీల్లేదు. ఆ ఆలోచన పొరబాటు. ఎందుకంటే ఆయన రాసింది చిన్నపిల్లల కథలు కాదు, చిన్నపిల్లలకు అర్థమయ్యే కథలు. చందమామ కథలు పిల్లల కంటే ఎక్కువ ఆసక్తిగా పెద్దల్ని కూడా చదివించాయి. ఈ కథల్లో ఎన్నో గొప్ప సందేశాలున్నాయి. ప్రతి కథలోనూ మంచి సందేశం ఉంటుంది. కానీ, ఎక్కడా ఇది నీతి, మీరు పాటించండి అని చెప్పలేదు. కథ, కథా వస్తువులు, పాత్రలు, చుట్టూ పరిసరాల ఇతివృత్తమే మనకు నీతిని ప్రబోధిస్తాయి. గమనిస్తే చక్రపాణి వ్యక్తిత్వం, చందమామ తత్త్వం ఒక్కటిగానే కనిపిస్తుంది. ఇదే ఆయన సినిమాల్లోను ప్రస్ఫుటిస్తుంది. తెలుగుజాతికి చక్రపాణి అందించిన గొప్ప కానుక ‘చందమామ’. ఇది కేవలం మ్యాగజైన్‌ కాదు, గొప్ప విలువలను చాటిన జీవితపాఠం. ప్రతి కటుంబంలోనూ ఒక భాగం.
చక్రపాణి ఏదైనా విషయాన్ని చెప్పాలంటే అందుకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తారు. కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యమిస్తారు. ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో ‘ఎవరో ఎవరో…’ అంటూ పింగళి నాగేంద్రరావు ఒక పాట రాశారు. అందులో ‘చదువుల సారం సంసారమునకే పదిలం చేసిందెవరో..’ అని ఉంటుంది. అది చాలా గొప్ప మాట. ఇది చక్రపాణి రాయలేదు. అయినా ఇక్కడ ఆయన గొప్పతనం ఏమిటంటే.. ఆ వాతావరణాన్ని సృష్టించడం. మన చుట్టూ వాతావరణాన్ని బట్టే ఆలోచనలు ఉంటాయంటారు. నిర్మాతగా చాలా కమాండింగ్‌, రచయితగా సృజనాత్మక శైలి ఆయనది.
అందరితో హాయిగా..
ఆనాటి సంగీత దిగ్గజాలు ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు ఇద్దరూ చక్రపాణి సినిమాలకు సంగీతం అందించినవారే. అయితే ఇద్దరి పనితీరులో తేడా ఉంది. ఘంటసాల చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సాలూరి రాజేశ్వరరావు అందుకు భిన్నంగా ఉంటారు. ఘంటసాల అనుకున్న సమయానికి వస్తారు, పని పూర్తి చేస్తారు. సాలూరి చెప్పిన సమయానికి రారు. ‘మాయాబజార్‌’లో మొదట నాలుగు పాటలు రాజేశ్వరరావు చేశారు. అయితే తరువాత ఘంటసాలతో కంపోజింగ్‌ చేయించారు కె.వి.రెడ్డి. నిజానికి సాలూరి పెద్ద జీనియస్‌ అని ఒప్పుకుంటారు కానీ, ఆయన ఇన్‌డిసిప్లేన్‌ కె.వి.రెడ్డికి నచ్చదు. చక్రపాణి అలా కాదు- ఘంటసాలతో ఎంత హాయిగా పని చేయించుకోగలరో, సాలూరితో కూడా అంతే హాయిగా పని చేయించుకునేవారు.
ఒకసారి మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరుగుతోంది. సినిమా సరిగ్గా గుర్తు లేదు. బహుశా ‘అప్పు చేసి పప్పు కూడు’ అనుకుంటాను. రాజేశ్వరరావుకి ట్యూన్‌ రాలేదు. కంపోజింగ్‌ గదిపైన ఉంటుంది. కింద గార్డెన్‌ ఉండేది. ఆయన ‘నేను గార్డెన్‌లో వున్న చెట్టు కిందకి వెళ్లి ఆలోచిస్తాను. అక్కడైతేనే నాకు ట్యూన్‌ వస్తుంది’ అన్నారు. ఈలోపు రచయిత పింగళి నాగేంద్రరావు ‘నేనూ తోటలోకి వెళ్తాను. ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది. ఆ రాయి మీద కూర్చుంటేనే నాకు పాట వస్తుంది’ అని ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. ప్రొడక్షన్‌ మేనేజన్‌ జగన్నాథరావు వారిద్దర్నీ చూసి ఒకరేమో చిటెకెలు వేసుకుంటూ చెట్టు కింద తిరుగుతున్నారు, మరొకరు రాయి మీద కూర్చుంటేగానీ మూడ్‌ రాదంటున్నారు. వీరి వరసేంటబ్బా అనుకుంటూ అలా చూస్తూ వున్నాడు. అప్పుడే వరండాలో నుండి చక్రపాణి వస్తున్నారు. కంపోజింగ్‌ గదిలో ఎవరూ లేరు, అసిస్టెంట్స్‌ తప్ప. జగన్నాథరావుతో ‘ఏమయ్యా రాజేశ్వరరరావు ఎక్కడ? నాగేంద్రరావు ఎక్కడ?’ అనడిగారు. జగన్నాథరావు విషయం చెప్పారు. అక్కడేమో వారిద్దరూ ‘నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వెందుకు వచ్చావ’ని వాదులాడుకుంటున్నారు. ‘నాకు చెట్టు కిందే ట్యూన్‌ వస్తుంద’ని సాలూరి అంటే, ‘రాయి మీద కూర్చుంటేనే ఈ రాయి నన్ను రాయి రాయి అంటుంది, అందుకే కూర్చున్నా’ అన్నారు పింగళి. అప్పుడు చక్రపాణిగారు ఒక మాట అన్నారు – ‘అవునులే. పులి కావాలంటే అడవికి వెళ్లాల్సిందేగానీ, స్పెన్సర్‌ స్టోర్‌లో దొరుకుతుందా!’ అని. ఇదంతా నాకు జగన్నాథరావు చెప్పారు. అంటే… సాలూరిగానీ, నాగేంద్రరావుగానీ కాస్త ఇన్‌డిసిప్లేన్‌గా వున్నా… వాళ్లలోంచి ఉద్భవించే ఆ క్రియేటివిటీ ఉందే అది చక్రపాణికి తెలుసు. క్రమశిక్షణ కోసం క్రియేటివిటీని బలిచేయకూడదని చక్రపాణి అభిప్రాయం. కె.వి.రెడ్డి మాత్రం డిసిప్లేన్‌ కావాల్సిందే అంటారు. ఇద్దరూ మహానుభావులే. నాగిరెడ్డికి వీరిద్దరూ అంటే అపరిమితమైన అభిమానం.
చక్రపాణి అంటే నాగిరెడ్డికి ప్రాణం అనే చెప్పొచ్చు. ఎల్వీ ప్రసాద్‌, ఎన్టీఆర్‌, కామేశ్వరరరావులను నాగిరెడ్డి చాలా గౌరవించేవారు. వాళ్లందరి కంటే చక్రపాణే ఎక్కువ అని నాగిరెడ్డి అనేక సందర్భాల్లో అనేవారు. చక్రపాణి, నాగిరెడ్డిల మఽఽధ్య బంధాన్ని తెలిపే గొప్ప సంఘటన ఒకటుంది. చక్రపాణిగారు మరణించిన తరువాత ఒకసారి నాగిరెడ్డి తమిళం నుండి తెలుగులోకి సినిమా రీమేక్‌ చేస్తున్నారు. విజయా గార్డెన్స్‌ థియేటర్‌లో పూజా కార్యక్రమం ఏర్పాటుచేశారు. దేవుడి చిత్రపటాలన్నీ పెట్టి పండితులు మంత్రాలు చదువుతున్నారు, యూనిట్‌ సభ్యులు, అతిథులుగా వచ్చిన వారందరూ అక్కడే వున్నారు. అంతా నాగిరెడ్డి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో నాగిరెడ్డి కారులో వచ్చారు. కారు దిగి పూజ ఏర్పాటుచేసిన చోటుకి వెళ్లారు. ఎవరితో మాట్లాడకుండా ఇప్పుడే వస్తానని వెంటనే వెనక్కి తిరిగి కారెక్కి వెళ్లిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు వెళ్లిపోయారా? అన్నది ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది సేపటి తరువాత మళ్లీ కారు వచ్చింది. నాగిరెడ్డి చేతుల్లో ఒక ఫోటోతో దిగారు. అది చక్రపాణి ఫోటో. తన మిత్రుడి ఫోటోని దేవుడి చిత్రపటాల పక్కన పెట్టిన తరువాత పూజ చేయమన్నారు. ఆ దృశ్యం చూసిన అక్కడున్నవారందరూ చలించిపోయారు.
గంభీరతే ఎక్కువ..
చక్రపాణి నవ్వుతూ కనిపించే సందర్భాలు చాలా తక్కువ. బాధగా కూడా కనిపించేవారు కాదు. ముఖంలోగానీ, మాటల్లోగానీ ఏ భావం తెలిసేది కాదు. చాలా గంభీరంగా, ఠీవిగా ఉండేవారు. ఇలాంటి వ్యక్తి తన సినిమాల ద్వారా, చందమామ కథల ద్వారా ఎంతో ఉల్లాసవంతమైన వినోదాన్ని ఎలా అందించారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి నవ్వు (మొదటి పేజీ తరువాయి)
ఆయన మనసులోనే ఉంది. అది కళ్లలో కనిపిస్తుంది. మనం ఏదైనా విషయాన్ని ఆస్వాదిస్తున్నామంటే నవ్వు ముఖంలోనే కనిపించాల్సిన అవసరం లేదు. అది వారి బాడీలాంగ్వేజ్‌ని బట్టి ఉంటుంది. ఆయన ఎంత ఆస్వాదించకపోతే ‘మిస్సమ్మ’; ‘గుండమ్మకథ’ వంటి సినిమాలు తీశారు, చందమామలో అంతటి గొప్ప కథలు రాశారంటారు!
సేవల కోసం కాదు..
విజయా గార్డెన్స్‌ కాంపౌండ్‌లో ఉంటాను గనుక ఆయన్ని ఎక్కువగా చూసే అవకాశం ఉండేది. కానీ, ఆయన చనువుగా ఉండే అదృష్టం దక్కలేదు. అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పేవాళ్లమంతే. ఎంత పెద్ద స్టార్‌లైనా, మాలాంటి అసిస్టెంట్లు అయినా చక్రపాణి సమంగానే చూసేవారు. ఆయన స్థాయికి ఆ రోజుల్లో అందరూ చిన్నవాళ్లే. నేను కె.వి.రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. నాకు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. అందులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని రాసుంది. ఆ లెటర్‌ని చక్రపాణికి చూపిస్తే ‘అసిస్టెంట్‌ టు డైరెక్టర్‌’ అని మార్చారు. అంటే నేను దర్శకుడు కేవీ రెడ్డికి మాత్రమే సహాయకుడ్ని అని. మిగతా వారికి సేవలు చేయక్కర్లేదు అని దానర్థం.
అదే ఆయన ట్రేడ్‌మార్క్‌..
ఆయనకి పలు భాషలు వచ్చినప్పటికీ తెలుగులోనే మాట్లాడేవారు. మాటలో ఒకరకమైన యాస ఉండేది. నిదానంగా నడుస్తారు. పంచెకట్టు, చేతిలో సిగరెట్టు ఆయన ట్రేడ్‌మార్క్‌. సిగరెట్‌ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఎందుకో ఆయన దాన్ని వదల్లేకపోయారు. ఈ విషయంలో ఆయన ఎవరికీ సలహాలు ఇవ్వలేదు, ఎవరూ ఆయనకి సలహా ఇచ్చే ధైర్యమూ చేయలేదు. సినిమాలకు సంబంధిస్తే మాత్రం తెలిసినవారికి, తెలియని వారికి కూడా పిలిచి మరీ సలహాలు ఇచ్చేవారు. ఏఎన్నార్‌ ‘బాటసారి’ సినిమా చూసి ‘ఇటువంటి సినిమాలు ఎందుకయ్యా చేస్తావు’ అన్నారు. విజయా గార్డెన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఒక మలయాళ సినిమా చూసి… ఆ దర్శకుడు ఎవరో తెలియకపోయినా పిలిచి మరీ ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆయన చెప్పే సలహాలకు తిరుగుండదు. ఎందుకంటే ఆయన చెప్పేదంతా సినిమా మంచి కోసమే. ఆయన ఏ సినిమా చూసినా మొదటి నుంచి చివరి వరకూ వరుసగా చూడరు. ముందు ఒకటో రీలు, తరువాత మూడో రీలు… రెండు రోజులు తరువాత పన్నెండో రీలు, తరువాత నాలుగో రీలు.. అలా ఉంటుంది ఆయన సినిమా చూసే విధానం. మొత్తం చూసిన తరువాత సినిమా అంతా పర్ఫెక్ట్‌గా చెబుతారు. తుదిగా సినిమా ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. ఆయన సినిమాల్లో ఎస్వీఆర్‌, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం కచ్చితంగా ఉండాలి. వీరు లేకుండా సినిమాలు తీయరు.
ఆ పాట అలా వచ్చింది..
చక్రపాణి సినిమా మేధావి. ఆయన ఆలోచన, అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఒక ఫ్రేమ్‌లో జనం ఏది చూస్తారు, ఏది చూడరన్నది నిక్కచ్చిగా అంచనా వేయగల సామర్థ్యం ఆయనకుంది. ఒకసారి ‘గుండమ్మ కథ’లో ‘ప్రేమ యాత్రలకు బృందావనము’ పాట కంపోజింగ్‌ జరుగుతోంది. దర్శకుడు కామేశ్వరరావు, ఘంటసాల, పింగళి నాగేంద్రరావు చర్చించుకుంటున్నారు. ఆ రోజుల్లో శ్రీధర్‌ వంటి యువ దర్శకులు పాటల్ని ఊటీలో తీయడం మొదలుపెట్టారు. అది చూసి కామేశ్వరరావు ప్రేమ యాత్రలకు బృందావనం పాటని కాశ్మీర్‌లో తీయాలనుకున్నారు. చిన్న చిన్న నిర్మాతలే ఊటీ, కొడైకెనాల్‌లో తీస్తున్నారు, విజయ వంటి పెద్ద సంస్థ సినిమా మనది, కాశ్మీర్‌లోనే పాట తీద్దాం అని కామేశ్వరరావు అన్నారు. పింగళి నాగేంద్రరావు, కెమెరామెన్‌ మార్కస్‌ బార్క్‌లే, ఘంటసాల కూడా సరే అన్నారు. అప్పుడే చక్రపాణి వచ్చారు. ఏమిటి విషయం అంటే… ఈ పాటని కాశ్మీర్‌లో తీయాలని అనుకుంటున్నామండి అని చెప్పారు. చక్రపాణి వెంటనే ‘‘సినిమా చూడ్డానికి వచ్చేవాళ్లు రామారావు, నాగేశ్వరరావు ముఖాలు చూడ్డానికి వస్తారు. వెనుక చెట్లు, పుట్టలు చూడ్డానికి కాదు. మన విజయా గార్డెన్స్‌ ఏమీ తక్కువైంది కాదు. అందుకని బ్రహ్మాండంగా విజయా గార్డెన్స్‌లోనే తీయచ్చు’’ అని వెళ్లిపోయారు. ఆయన ఆలోచననే పింగళి నాగేంద్రరావు మనసులో పెట్టుకుని ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏల నో… ప్రేమయాత్రలకు కాశ్మీరాలు, కొడైకెనాలు ఏలనో…’ అని రాశారు. సూపర్‌హిట్‌ అయ్యింది. అలా చక్రపాణి ఆలోచన నుండి పుట్టిన పాట ఇది. ఇందాక చెప్పినట్టు ఏదీ డైరెక్టుగా చెప్పరు. ఆయన మాటల్లోనే అంతర్లీనంగా ఎంతో విషయం ఉంటుంది.
దర్శకుడు కనిపించకూడదు..
ఎవరు మంచి డైరెక్టరు అన్న ప్రశ్న వస్తే… అబ్బ ఎంత మంచి షాట్‌ తీశాడురా అన్నారంటే అది మంచి సినిమా కాదన్నది నా అభిప్రాయం. టైటానిక్‌ చూస్తుంటే ఎవరు డైరెక్టరు అన్నది మర్చిపోతాం. సినిమా పూర్తయిన తరువాతే ఎవరబ్బా ఈ సినిమా తీసిన డైరెక్టరు అనుకుంటాం. గొప్ప సినిమాలన్నీ అంతే. సినిమాలో దర్శకుడిగా తాను కనిపించాలని, తన స్టాంపు చూపించాలని నిర్మాత అనుకుంటే అది మంచి సినిమా అవ్వదు.
చక్రపాణి ఆలోచన కూడా అదే. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి నటీనటులుగానీ, దర్శకుడుగానీ కనిపించకూడదు. ఆ పాత్రల్లో, వాతావరణంలో లీనమైపోవాలి. హీరోల కోసం పంచ్‌ డైలాగ్‌లు పెట్టడమంటే సినిమాకి విలు వ తగ్గినట్టే. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ కూడా పంచ్‌ డైలాగులు చెప్పినా హద్దులు దాటేవారు కాదు. ఎన్టీఆర్‌కి ప్రజల్లో ఉండే ప్రభావం తెలుసు. అందుకు తగ్గట్టుగానే రచయితలు రాసేవారు.

 

Category:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

పడమటి మహారాష్ట్రలో అరణ్య ప్రాంత ,మైన గంగా మాల్ లో పండిత రమాబాయి 23-4-1858 న జన్మించింది .తండ్రి అనంత శాస్త్రి గోప్పపండితుడే కాక సంఘ సంస్కర్త కూడా .తొమ్మిదేళ్ళ చిన్న పిల్లను పెళ్లి చేసుకొని ,ఆమె కు విద్య నేర్పాడు .ఊరి బ్రాహ్మణులు దీనికి ఒప్పుకోక సంఘ బహిష్కరణం చేస్తే అరణ్య ప్రాంతానికి వెళ్లి ఇల్లు కట్టుకొని ఉండిపోయాడు .భార్య లక్ష్మి బాయ్ కి ఇక్కడికి రావటం ఇష్టం లేదుకాని సరి పుచ్చుకొని ఉండిపోయింది .రమా బాయ్ పుట్టిన తర్వాతా అనేక అడవులు ,పట్నాలు తిరిగారు .ఎక్కడికి వెళ్ళినా శాస్త్రి గారు స్త్రీ విద్య నేర్వాలని ఉపన్యసించేవారు .1877కరువు కాలం లో రమాబాయి తలిదంద్రులిద్దరూ చనిపోయారు .వారిద్దరూ ,చెల్లెలు తను చూస్తుండగానే ఆకలితో మరణించటం ఆమె జీర్ణించుకోలేక పోయి ఆ దృశ్యం జీవితాంతం వెన్నాడుతూనే ఉంది .ఆమె తన అన్నగారితోకలిసి మళ్ళీ దేశ సంచారం ప్రారంభించింది .1878లో కలకత్తా చేరే వరకు ఎండల్లో వానల్లో చలిలో ఆకలిలో వారిద్దరూ అనుభవించిన వేదన వర్ణనాతీతం .కలకత్తా పండితులు ఆమె విద్యా వైదుష్యాన్ని గుర్తించి ,సంస్కృతం లో ఆమెకున్న పరిజ్ఞానానికి ఉపన్యాస ధోరణికి అబ్బుర పడ్డారు ..

 

Pandita Ramabai

తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని ఇద్దరూ నిలబెట్టాలనుకొన్నారు .అప్పటికే రమాబాయి మంచి ఉపన్యాసకురాలుగా పేరు పొందింది .కలకత్తా పండితులు ఆమె వైదుష్యాన్ని స్వయం గా పరీక్షించి సంతోషించి ఆమె కు ‘’పండిత ‘’’’,సరస్వతి’’ అనే బిరుదుల నిచ్చి సత్కరించారు .కొద్ది  కాలానికి అన్నగారు చనిపోయాడు .రమా బాయి  తనతో బాటు  ఆధునిక భావాలున్న  ఫిలాసఫర్ లాయర్  బాపు బిపిన్ బిహారీ దాస్ మాధవి అనే తక్కువ కులం అతన్ని వివాహం చేసుకొని అందరికి ఆశ్చర్యం కలిగించింది .అప్పటికే దేశం లో బ్రహ్మ సమాజ భావాలు బలం గా వ్యాపించాయి .అస్సాం లో ఉండగా భర్తకు బాప్టిస్ట్ మిషిన్ వాళ్ళు ఇచ్చిన బెంగాలీ భాషలో ఉన్న ‘’గాస్పెల్ ఆఫ్ లూకాస్ ‘’ను అధ్యయనం చేయటం ప్రారంభించింది .భర్త చనిపోగానే రమా బాయి  పూనా చేరింది .అక్కడ ‘’ఆర్య మహిళా సమాజ్  ‘’ను ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ప్రోత్సాహ మిచ్చింది .

1882ప్రభుత్వం విద్యా కమీషన్ వేసి అభిప్రాయ సేకరణ చేస్తుంటే రమా బాయ్ ఉపాధ్యాయులకు శిక్షణ నివ్వాలని ,మహిళా ఇన్స్పెక్తర్లను నియమించాలని ,మహిళలు వైద్య విద్యాభ్యాసం చేసి డాక్టర్లు అయితేనే మహిళల ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయని సూచించింది .రమాబాయ్ సూచించినవి  విక్టోరియా మహారాణి దృష్టికి వెళ్ళాయి .దీని ప్రభావం గా ‘’లేడి డఫ్రిన్ ‘’నాయకత్వం లో ‘’మహిళా వైద్య ఉద్యమం ‘’వచ్చింది .జెండర్ రిఫార్మ్ మీద ఆమె అద్భుతం గా మాట్లాడేది .ఆమె ఉపన్యాసాన్ని ప్రారంభించటానికి ముందు సభ గందర గోళం గా ఉంది .ఆమె మాట్లాడకుండా కాసేపు ఉండి పోయింది .పూర్తీ నిశ్శబ్దం ఏర్పడిన తర్వాతా రమా బాయ్ ‘’నా దేశ వాసులారా !నా గొంతు చాలా పీలగా ఉంటుంది .మీరెప్పుడు స్త్రీ గొంతు విప్పి బిగ్గరగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు ‘’ అని ప్రారంభించి ఏంతో భావోద్వేగం గా చాతుర్యం గా ,మెచ్చికోలుగా మాట్లాడి అందరి హృదయాలను ఆకర్షించి అందరి చేత కరతాళ ధ్వనులను అందుకొన్నది .కావలసిన తీర్మానాలు హర్ష ధ్వానాల మధ్య  అంగీకరింప జేసి అనుకొన్నది సాధించింది. ఆమె తెగువకు ధైర్యానికి ,ముందు చూపుకు అక్కడ చేరిన అశేష జనం గౌరవ సూచకం గా లేచి నిలబడి హర్ష ధ్వానాలతో కరతాళ ధ్వనులతో మారు మోగించి ధన్యవాదాలు తెలియ జేసి చిరస్మరణీయం చేశారు .

ఇరవై ఏళ్ళ నుంచి ప్రజా జీవితం లో ఉంటూ ,ప్రజా సమస్యలు తెలుసుకొంటూ మహిళలకు జరుగుతున్నా అన్యాయాలకు సాక్షీ భూతం గా ఉన్న రమా బాయ్ ,అనుభవసారాన్ని విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి అణగారిన వారి పేదవారి అభ్యున్నతికి కృషి చేస్తూ  ప్రజల మన్ననలు అందుకొన్నది . 1883ఆమె కజిన్ ఆనందీ బాయ్ జోషి భారత దేశ మొట్టమొదటి మహిళా డాక్టర్ గా జరిగే  గ్రాడ్యుయేషన్ ఉత్సవం లో పాల్గొన టానికి  అమెరికా లోని ఫిలా డేల్ఫియా వెళ్ళింది .అక్కడ కూడా సంచల్లనమే సృష్టించింది రమాబాయి .అమెరికా స్త్రీ ఉద్యమ నాయకురాలు ఫ్రాన్సెస్ విల్లార్డ్ ,ఫిలడేల్ఫియా మెడికల్ కాలేజ్ డీన్  అయిన రాచెల్ బాడ్లీ మొదలైన అనేక మంది తో గాఢమైన స్నేహ సంబంధాలను ఏర్పరచుకోంది.ఫ్రీద్రిక్ ఫ్రోబెల్ స్థాపించిన కిండర్ గార్టెన్ స్కూల్ లాంటిది ఇండియాలో అగ్రకుల మహిళలకు ముఖ్యం గా బాల్య వితంతువులకోసం ఒక రేసి డేన్షియల్  స్కూల్ ను స్తాపించాలన్న ఆలోచన వచ్చింది .

ఇండియా కు తిరిగి రాగానే  బొంబాయి  లో మొదటి సారిగా ‘’శారదా సదన్ ‘’అనే గురుకుల పాఠ శాలనేర్పరచింది .తర్వాత దాన్ని పూనా కు మార్చింది .దీనికి హిదువుల నుంచి క్రిస్టియన్ ల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది .అందుకని ఒక బహిరంగ ప్రదేశం లో స్కూల్ ను నడిపి హిందూ ,క్రిస్టియన్ పుస్తకాలను ఉచితం గా అంద జేసింది .అప్పటికే రామాబాయ్ పేరు ప్రఖ్యాతులు దేశమంతా మారు మోగి పోతున్నాయి .ఇదే సమయం లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ లో ముఖ్య విభాగం అయిన ‘’జాతీయ సాంఘిక సమావేశం’’లో ఉద్రేక పూరిత ప్రసంగం చేసింది .ఇది చాలా మందికి ఇబ్బంది కలిగింది .ఆమె పై విమర్శలు పెరిగాయి .ఆమె శిష్యులు చాలామంది క్రిస్తియన్లు గా మారిపోయి ఆమె కు స్థానిక బలం లేకుండా చేశారు .

బొంబాయి ,పూనా లలో ఉన్న శారదా సదన్ లు  బ్రాహ్మణ స్త్రీలకు మాత్రమె .ముక్తికోరుకొనే వారందరికీ ప్రవేశం కల్పిచింది .అనతికాలం లో ఆ ప్రదేశమంతా ఆకలి తో అలమటించే వారితో బాల్య వితంతువులతో మధ్య భారతం లో కరువు పాలైన శరనణార్దులతో కిక్కిరిసి పోయింది . వీరందరి సంఖ్యా రెండు వేలు దాటింది .ముక్తి సదన్ అందరికీ ఆవాసం కల్పించింది .బాలలకు కిన్దర్ గార్టెన్ స్కూళ్ళు , హాస్పిటల్ ,విధి వంచితలైన స్త్రీలకూ శరణాలయం ,అరవై నాలుగు చేనేత మగ్గాలు ,అయిదు ప్రింటింగ్ ప్రెస్సులు ,కుట్టుపని , చేతివృత్తులు ,పిండిమర ,ఆయిల్ ప్రెస్ ,లాండ్రీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది .వ్యవసాయ క్షేత్రం ,ఉద్యాన వనం ,ఫల వృక్షాలు ,మంచినీటి బావులు కూడా ఏర్పరచింది.వీటిని నిర్వహించటానికి పటిష్టమైన సంస్థనేర్పరచి క్రమ పద్ధతిలో సమర్ధ వంతం గా నిర్వహించింది .ఆమె కూతురు మనోరమ అమెరికా చదువు పూర్తీ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి  ఆమెకు సహాయం చేస్తోంది .

పూనా దగ్గర ఖేద్గాం లో ఒక సంస్థ నేర్పరచి వితంతువులకు బీద మహిళలకు కుట్టుపని అల్లిక , వడ్రంగి పని మొదలైన వృత్తులలో శిక్షణ నిచ్చే ఏర్పాటు చేసి ,వారు స్వంత కాళ్ళ పై నిలబడేట్లు చేసింది .స్త్రీ ధర్మ నీతి అనే పుస్తకం రాసి తన’’ముక్తి  ప్రెస్ ‘’లోనే ముద్రించింది మరాఠీ లో బైబిల్ ను అనువదించి  ముద్రించింది .బైబిల్ చదివే తాను ఇంత దానినైనానని  గర్వం గా చెప్పుకొనేది .అమెరికా లోని ‘’ఎపిస్కోపల్ చర్చి ‘’ఆమెను సత్కరించింది .ఆమె కుమార్తె మనోరమ చనిపోయింది .దీనితో తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తీ అయింది అనుకొన్నది .ముక్తి సంస్థ సమర్ధం గా నిర్వహించే ఏర్పాటు చేసింది .5-4-1922లో 66  ఏళ్ళ వయసులో రమాబాయి చనిపోయింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

ఎందరెందరో  త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి  దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం .

 

Ayyankali Statue.jpg

కేరళ లో  త్రివేండ్రం లోని వేంగ నూర్ లో 1863లో అయ్యం కాలి  చర్మకార దళిత వంశం లో ఏడవ సంతానం గా జన్మించాడు .విద్యా గంధం లేని కుటుంబం .ఆ రోజుల్లో దళితులూ వీధుల్లో నడవటానికి అగ్రకులాలు ఒప్పుకోనేవే కావు .ఆడవాళ్ళు  బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు వక్షస్తలాన్ని వస్త్రం తో కప్పుకోనిచ్చే వారు కాదు .అయ్యం కాలి  ఈ దురాచారాలను రూపు మాపాలని పిలుపునిచ్చి దళితులను సమైక్య పరచాడు .’’అయ్యావు స్వామి ‘’అనే ఒక సాధువు వీరికి అండగా నిల బడ్డాడు .ఈ స్వామి అంటే విపరీతమైన ఆరాధనా భావం ఉండేది . మనుస్మృతికి వ్యతిరేకం గా ప్రదర్శనలు నిర్వహించి ,కుల మతాలకూ తావు లేని సమాజం కోసం వీధులలో నిషిద్ధ మైన ప్రదేశాలలో ఎడ్ల బండి మీద ఊరేగుతూ ప్రచారం చేసి అందర్నీ నిరుత్తరుల్ని చేశాడు .దళిత బాలలు చదువుకోవాలని హితవు చెప్పాడు వారికోసం వెంగనూర్ లో ఒక స్కూల్ ప్రారంభించాడు .ఆ కాలం లో దళితులకు టీ షాపుల్లో టీ ని కొబ్బరి చిప్పలలో మాత్రమె పోసి ఇచ్చేవారు .దీన్ని వ్యతిరేకించి అందరితో సమానం గా తమకూ టీ తాగే హక్కు ఉందని డిమాండ్ చేసి సాధించాడు .దళిత పిల్లలను అందరితో పాటే స్కూల్ లలో చదివే ఏర్పాటుకు ,కూలీల పని గంటల ను తగ్గించటం ,జీతాలను ధాన్యం రూపం గా కాకుండా డబ్బు రూపం లో ఇప్పించటం లో సాధించి భారత దేశం లో మొట్ట మొదటి కార్మిక నాయకుడు అయ్యాడు అయ్యం కాలి .

దళితులకు సమానమైన మానవ హక్కుల సాధన కోసం కృషి చేశాడు.వీటినే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం లో పొందు పరచారు .కేరళలో కార్మిక సంఘాలు లేనికాలం లోనే ,వారి బాగోగులకోసం వేతనాల కోసం శ్రమించిన మకుటం లేని కార్మిక నాయకుడని పించాడు .నిరక్షర కుక్షి అయిన ఆతను ఇన్ని పనులకు ఆద్యుడుగా ఉన్నాడంటే ఆశ్చర్యమేస్తుంది .అంత ముందు చూపున్న నాయకుడు .మంచి చేయటానికి విద్య అవసరం కాదు అని నిరూపించాడు .1910అయ్యం కాలి ని ట్రావెంకూర్ అసెంబ్లీ స్థానానికి నామినేట్ చేసి ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ,గౌరవించి  ప్రతిస్పందించింది .కేరళ ఆధ్యాత్మిక గురువు ,  సంఘ సంస్కర్త  ‘’నారాయణ గురు ‘’ఆశీస్సులు ,అండా పుష్కలం గా లభించాయి .దీని ఫలితం గా 1900నాటికి కేరళ ప్రభుత్వం దళితులను బజారులలో నడిచే హక్కు ,దళిత విద్యార్ధులను స్కూళ్ళ లో చదువుకొనే హక్కు కలిపించింది .

అయ్యం కాలి ఉద్యమానికి అగ్రకులస్తులు ,ప్రజాసభ ‘’ లో సభ్యులైన సంపన్నులు కూడా మద్దతు పలికారు .కుట్టనాడులో’’ పల్లితానం లూకా మత్తయ్య ‘’ అనే ప్రజా సభ సభ్యుడు  దళితుల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు .ఆయన్ను ‘’కుట్టనాడు కాయ రాజా ‘’అనిఅప్పటినుంచి అందరూ గౌరవం గా పిలిచారు .’ఆయన కేరళ లోని ఛాందస సిరియన్ క్రిష్టియానిటి మతస్తుడైనప్పటికి ,అయ్యం కాలి చేబట్టిన ప్రతి సాంఘిక సంస్కరణకు మనస్పూర్తిగా మద్దతు పలికి సహక రించాడు .స్నేక్ బోట్లు  ఇతర నావలలో వందలాదిగా అయ్యం కాలి తో వచ్చిన దళితులకు  తన స్వంత ఊరు ‘’నలు కెట్టు ‘’లో స్వాగతం పలికి వారితో సహా పంక్తి భోజనం చేసిన సంస్కారి లూకా ముత్తయ్య .

పేద ప్రజలకు ఆసరాగా ‘’సాధుజన పరిపాలన సంఘం ‘’స్థాపించి ,వ్యవసాయ కార్మికులకు వారానికి ఆరు రోజుల పని ఏర్పాటు చేశాడు అయ్యం కాలి .1941  జూన్ పద్దేనిమిదిన ఈ కేరళ మహోద్యమ కారుడు 78వ ఏట అయ్యం కాలి కాల గర్భం లో కలిసిపోయాడు .కేరళ ప్రజలు ఆయన్ను ”మహాత్మా అయ్యం కాలి ”అని గౌరవం గా సంస్మరిస్తారు అతని సంస్కరణలు నారాయణ గురు సంస్కరణలంత ప్రాచుర్యం పొందాయని కేరళ ముఖ్య మంత్రి అన్నాడు .1907లో అయ్యం కాలి నిర్వహించిన చారిత్రాత్మక రైతుకూలీ ప్రదర్శన చిరస్మరణీయం అని నంబూద్రిపాద్ మెచ్చుకొన్నాడు .వేల్లయామ్బలం జంక్షన్ లో ఆయన శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు .పద్మ నాభ స్వామి దేవాలయానికి వెళ్ళే వారంతా ఈ విగ్రహాన్ని దర్శించే వెడతారు .’’విముక్తి –విప్లవ నాయకుడు –అయ్యం కాలి ‘’అన్నాడు కేరళ ఉఖ్య మంత్రి ఇ.కే నయనార్ .ఆ నాటి సంఘ సంస్కర్తలైన రాజా రామ మోహన రాయ్ ,రామ కృష్ణ పరమ హంస ,స్వామి వివేకానంద్ ,దయానంద సరస్వతి అయ్యం కాలి జీవించి ఉన్న కాలం వారే కావటం,సమకాలీనులవటం  విశేషం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ -విహంగ ఆగస్ట్ మ హిళా వెబ్ మేగజైన్ లో నా వ్యాసం

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ 

                  భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి అహల్యా బాయి హోల్కార్ జీవితం అందరికి ఆదర్శం ,ప్రేరణ ,స్పూర్తి .

    మహా రాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లా జామ్ఖేడ్ వద్ద చోండీ అనే గ్రామం లో అహల్యా బాయి 1725మే 31న జన్మించింది .తండ్రి మంకోజి షిండే గ్రామాధికారి .ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు .అయినా తండ్రి కూతురికి స్వయం గా రాయటం చదవటం నేర్పించాడు .ఒక చిన్న సంఘటన తో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది .ఆ నాటి పీష్వా బాజీ రావు సేనాధ్యక్షుడు  మాల్వా ప్రాంత  అధినేత మల్హర్ రావు హోల్కార్ పూనా వెడుతూ చోండీ గ్రామం లో ఒక దేవాలయం లో భక్తీ ప్రపత్తులతో పూజలు చేస్తున్న ఎనిమిదేళ్ళ అహల్యా బాయి ని చూసి ఆమె లోని సద్గుణాలకు  ముచ్చటపడి తన కుమారుడు ఖండే రావు కు తగిన ఇల్లాలు అని భావించి తల్లి దండ్రుల అనుమతి తో మాల్వాకు తీసుకొని వచ్చి కుమారుడికిచ్చి1733లో  వివాహం చేసి మంచి కోడలు లభించినందుకు ఏంతో సంతోషించాడు .ఆమె అందాల రాసి మాత్రమె కాకు సుగుణాల ప్రోవు ధైర్య సాహసాలకు నెలవు కూడా అహల్యా బాయి పదకొండేళ్ళు భర్త తో ఆనంద సుఖమయ జేవితాన్ని గడిపింది .కాని విధి వక్రించి ఆమె భర్త 1754లో కుమ్భేర్ స్వాధీనం చేసుకొనే పోరాటం లో వీర మరణం పొందాడు .మరో పన్నెండేళ్ళ తర్వాత మామ గారూ 1767లో మరణించాడు .మాల్వా రాజ్యానికి రాణి గా అహల్యా బాయి అప్పటి నుండి జీవితాంతం అంటే 1767నుండి 1795 వరకు ఇరవై ఎనిమిదేళ్ళు మాల్వా రాజ్యాన్ని అత్యంత సమర్ధ వంతం గా పరిపాలించింది .మామ గారు మల్హర్ రావు నుండి యుద్ధ తంత్రాన్ని ,పరిపాలనా దక్షతను నేర్చుకొన్నది .దురదృష్ట వశాత్తు ఉన్న ఒక్కగానొక్క కుమారుడూ చనిపోయాడు .ఇక దేశ పాలనా బాధ్యతలను పూర్తిగా స్వీకరరింపక తప్పని పరిస్థితు లేర్పడ్డాయి  .ఆడది రాజ్యానికి రావటం ఇష్టపడని కొందరు ఎదిరించారు .కాని సైన్యం ఆమె ధైర్య సాహసాలను గుర్తించి విధేయత ప్రకటించి విశ్వాసం చూపింది .పీష్వా కూడా ఆమె పాలనను అంగీకరించాడు .ఆమెకు అత్యంత ఇష్టమైన ఏనుగు నెక్కి విల్లు అంబులు సమకూర్చుకొని ఎదురు తిరిగిన వారి తో యుద్ధం చేసి ఓడించి తనకు ఎదురు లేకుండా చేసుకోంది.మల హర రావు దత్త కుమారుడు  సుబేదార్ అయిన తుక్కోజి రావు హోల్కార్ ను సైన్యాధ్యక్షుడిని చేసి రాజ్యాన్ని సర్వతో భద్రం గా పాలించింది .తనకు ఎదురు తిరిగిన ఒక బ్రాహ్మణుడికి సముచిత మైన పదవి నిచ్చి ఆరితేరిన ప్రజ్ఞ ను చూపి అందర్నీ ఆశ్చర్య పరచింది .అంతః పుర పరదాను వదిలేసి జనసామాన్యానికి దగ్గరై   వారి గోడు వింటూ కావాల్సిన సాయం అందిస్తూ అందరి మెప్పూ పొందింది .

          మాల్వా రాజ్యానికి రాజధాని అయిన ఇండోర్ పట్టణాన్ని అన్ని రకాలా అభి వృద్ధి చేసింది .ఇండోర్ కు అతి దగ్గరలో ఉన్న మహేశ్వరం లో నర్మదా నది ఒడ్డున ఒక బ్రహ్మాండమైన కోట నిర్మించింది .పరిపాలన ఇక్కడి నుంచే జరిపింది .ఇక్కడే మహేశ్వరాలయం ,రామాలయం  నిర్మించింది .మాల్వా పీఠభూమి లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాల నందించింది  .మాల్వా కు సుదూరం గా ఉన్న అనేక రాష్ట్రాలలో దేవాలయాల నిర్మాణం రోడ్ల వసతి సత్రాల నిర్మాణం ,నదులకు ఘాట్ లు ఏర్పాటు చేసింది .ఆ సేతు హిమాచల పర్యంతం యాత్రా స్థలాలలో అంటే కాశి ,ప్రయాగ ,గయా , సోమనాద్ ,అయోధ్యా ,మధుర ,కంచి ,ఉజ్జయిని బదరీ ,రామేశ్వరం మొదలైన చోట్ల  రాణి అహల్యా బాయి చే బట్టని మహత్కార్యం లేనే లేదు అంటే ఆశ్చర్య పడక్కర లేదు .ఆమె త్యాగాన్ని చూసి ఎందరో ధన వంతులు ఇలాంటి ధర్మ కార్యాలెన్నో చేశారు .ఆమె స్పూర్తి అలాంటిది .రాజ్యం లోని ధనం సంపద తనదికాదని తాను  ఒక సంరక్షకురాలిని మాత్రమే నని అదంతా ప్రజా సంక్షేమం కోసమే నని ఆమె ఎప్పుడూ వినయం గా చెప్పేది . తనకున్న స్వంత భూముల మీద వచ్చే ఆదాయం తోనే తన స్వంత ఖర్చులు పెట్టుకొనేది. అందులో నుంచే దానాలు ధర్మాలు చేసేది ప్రజోపకార్యాలకూ స్వంత ధనాన్నే ఎక్కువగా వాడేది అంతేతప్ప ప్రజలిచ్చిన పన్నులతో ఏ నాడూ జల్సాగా జీవించని  ఆదర్శ  రాణి అహల్యా బాయి .అందరూ ఆమెను కన్న తల్లి లా భావించేవారు .ప్రజలంటే ఆమెకు అంత మమకారం ఆత్మీయత ఆప్యాయతా ఉండేవి .దయ గల తల్లి అని పించుకొన్న మహా సాధ్వి అహల్యా బాయి .

       విధవలకు  భర్త ఆస్తి లో భాగం లభించేట్లు చేసింది .కుమారుడిని దత్తత తీసుకొనే అధికారం కల్పించింది ..ఒక సారి కింది అధికారి కి ‘’ఆమ్యామ్యా ‘’ముట్టలేదని దత్తత తిరస్కరిస్తే ఆ పిల్లవాడి పోషణ అంతా తానె చూసింది .రాణి సేవా సౌభాగ్యాన్ని దర్శించి మురిసిన ఇండోర్ ప్రజలు ఆమె పేర ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి గణనీయమైన ప్రజా సేవ చేసిన వారికి ప్రతి ఏడాది అందిస్తూ గొప్ప సంప్రదాయాన్ని నెల కోల్పారు .ఈ పురస్కారాన్ని మొదట పొందిన ప్రముఖ సామాజిక సేవకుడు ” అంత్యో దయ కార్య  క్రమ” నిర్వాహకుడు అయిన నానాజీ దేశ్ ముఖ్  తన రాజ్యం లో భిస్ లకు గోండు లకు అనాదిగా ఉన్న తగువులను పూర్తీ గా పరిష్కరించలేక పోయినప్పటికీ ,వారు సరిహద్దుల్లో అలజడి సృస్తిస్తునప్పటికి ఆమె ఉదారం గా వ్యవహరించి వారికి  కొండ  ప్రాంతాలలో ఉండేందుకు వసతి సౌకర్యాలు కల్పించి ఆవాస యోగ్యం చేసింది .వారిపద్ధతులకు సంస్కృతికి రక్షణ కల్పించింది .వారి సరుకుల రవాణాకు నామ మాత్రపు పన్ను విధించి ఆదుకోన్నది .

                మహేశ్వరం రాజ దానిలో విద్యా వైద్య సాహిత్య సాంస్కృతిక ,ఆధ్యాత్మిక ,పారిశ్రామిక అభి వృద్ధిని సాధించి ప్రజల ఉన్నతికి ఎంత గానో తోడ్పడింది .ప్రముఖ మహా రాష్ట్ర కవి మోరో పంత్ ను, సాహిర్ లో అద్వితీయుడైన అనంత  ఫండి లను ఆహ్వానించి ఘనం గా సత్కరించింది .కుశాలి రాం అనే సంస్కృత పండితుడిని పోషించింది .చేతి వ్రుత్తి పని వారికి ,శిల్పులకు ,కళా కారులకు జీవన భ్రుతిని ఏర్పాటు చేసిన దొడ్డ మనసున్న మా రాణి అహల్యా బాయి ..వారిప్రతిభా విశేషాలను గుర్తించి ఉత్సవాలలో  సంమానించేది . ఆర్ధిక పారితోషికాలను అందించే  సంస్కృతీ పరి రక్షకురాలు .మహేశ్వరం లో చేనేత పరిశ్రమను స్థాపించి ఎందరికో జీవనోపాధి కల్పించిన ఉత్తమురాలు .ఇన్ని ప్రజోపకార ,ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇంట పెద్ద ఎత్తున చేస్తున్నా అహల్యా బాయి ఒక రుషి జీవితమే గడిపింది అని ఆంగ్లేయ ,అమెరికన్ చరిత్రారులు పరిశోధించి చెప్పారు .మహారాష్ట్ర మాల్వా రాజ్యాలను అత్యంత సమర్ధ వంతం గా జన  రంజకం గా  ,సంక్షేమ సామ్రాజ్యం గా పరిపాలించిన ఉన్నత గుణ వరి స్టూరాలు,పాలనా దక్షురాలైన మహా రాణి రాణి అహల్యా బాయి.ఆమెను ‘’ఫిలాసఫర్ క్వీన్ ‘’అన్నారు .  బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశ ద్రోహం చేయ వద్దని,వారి కబంధ హస్తాలలో చిక్కుకో వద్దని హెచ్చరిస్తూ  పీష్వాకు ఉత్తరం రాసిన ధైర్య శాలి అహల్యా బాయి .మహేశ్వరం కోట దగ్గర రాణి అహల్యా బాయి చేతులలో శివలింగాన్ని పట్టుకున్న నిలువెత్తు పాల రాతి విగ్రహం ఆమె మూర్తి మత్వానికి నిలు వెత్తు ఉదాహరణ గా కని  పించి రెండు చేతులతో  నమస్కరించ  బుద్దేస్తుంది .

  రాజాస్థానానికి తగాదాల పరిష్కారం కోసం వచ్చేవారికి నచ్చ జెప్పి పరిష్కరించి నవ్వుమోహాలతతో ఇంటికి వెళ్ళే ట్లు చేయగల ధర్మ బుద్ధి ఆమెది .ప్రజలంతా సుఖ శాంతులతో అభివృద్ధి చెందుతూ జీవించాలి  లన్నదే ఆమె ధ్యేయం .ఇల్లు లేని వారికి అనాధలకు ఆమె అన్న పూర్ణ .అహల్యా బాయి వంటి రాజ నీతిజ్నురాలు వేరెవరూ లేరని చరిత్రకారులన్నారు .ఆమె రాజ్యం లో హిందువులు ముస్లిములు అత్యంత స్నేహం గా ఉండేవారు ఆమె 1795ఆగస్ట్ 13నమరణించినప్పుడు కన్నీరు పెట్టని వారే లేరు .అదే ఆమె సచ్చరితకు  సాక్ష్యం  .గ్రీకు వేదాంతి ప్లేటో ,భారతీయ వేదాంతి ,రాజనీతిజ్ఞుడు ,ధర్మ మర్మం తెలిసిన వాడు అయిన భీష్మ పితామహుడు అభి వర్ణించిన సద్గుణాలన్నీ రాశీ భూతమైన రాణి  అహల్యా బాయి .అందుకే ప్రజలు ఆమెను ‘’లోక మాన్య దేవి అహల్య ‘’అన్నారు .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

విహంగ ఆగష్టు 2014 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780

vihanga4

ముఖ చిత్రం: మమత రెడ్డి

సంపాదకీయం – హేమలత పుట్ల

కథలు

నిర్ణయం  –  కవిని

కంచె -సౌమ్య

కవితలు

లలిత గీతాలు – స్వాతి శ్రీపాద

వ్యాసాలు

రెండు దశాబ్దాల స్త్రీవాద కథ – గమనం
– డా . కె. శ్రీదేవి.

ఫిలాసఫర్ క్వీన్-అహల్యా బాయ్ హోల్కార్
– గబ్బిటదుర్గాప్రసాద్

మహిళా లోకానికే ఆరాధ్య ‘దమయంతి’ –

పి.వి.లక్ష్మణరావు

చేరా స్మృతి

‘చేరా’ జ్ఞాపకాల కొసలు – శివలక్ష్మి

చేరా – టి.వి.ఎస్.రామానుజ రావు

చేరాగాలు– ఎండ్లూరి సుధాకర్

 

ఆత్మకథలు

నాజీవనయానంలో.. ఎనిమిదవలో –కె.వరలక్ష్మి

గౌతమీగంగ – కాశీచయనులవెంకటమహాలక్ష్మి

సినిమాసమీక్షలు

 టు గార్డ్ ఎ మౌంటెన్– శివలక్ష్మి

పుస్తక సమీక్ష

కొండేపూడి నిర్మల కవిత్వం- తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

మూడు తరాల గణపతి
– మాలా కుమార్

శీర్షికలు

సమకాలీనం- మాసాయిపేట – విజయభానుకోటే

చారిత్రకవ్యాసాలు

భారతస్వాతంత్రోద్యమం : ముస్లింమహిళలు

– సయ్యద్ నశీర్ అహమ్మద్

ముఖాముఖి

నర్తనకేళి – 21 – అరసి

యాత్రాసాహిత్యం

నాకళ్లతోఅమెరికా- 34– డా.కె.గీత

ధారావాహికలు

ఎనిమిదోఅడుగు –17 అంగులూరిఅంజనీదేవి

ఓయినం – జాజులగౌరి

జోగిని – శాంతిప్రబోధ

అనువాద సాహిత్యం

‘ముకుతాడు ’-14 తమిళమూలం: శివశంకరి

తెలుగు :టి.వి.యస్ . రామానుజరావు

బెంగుళూరినాగరత్నమ్మ – వి.శ్రీరామ్

-తెలుగు:టి . పద్మిని

 

– See more at: http://vihanga.com/#sthash.2fD9Ck4p.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి అని పించేట్లు రాశారు కావ్య కంఠులు .ఆ కవితా సౌభాగ్యం అందుకుందాం .

మూడవ శ్లోకం –‘’అర్చన కాలే రూప గతా ,సంస్తుతికాలే శబ్ద గతా –చింతన కాలే ప్రాణ గతా ,తత్వ విచారే సర్వగతా’’

జగదంబ పూజా సమయం లో పూజించాల్సిన మూర్తిలో ,స్తుతించే టప్పుడు శబ్ద రూపం లో ,ధ్యానించే టప్పుడు ప్రాణం లో ఉంటుందట .అంటే అంతటా సర్వ రూపిణిగా ఉంటుంది. అర్చన ,కీర్తన ,ధ్యానం ,తత్వ విచారణ సమయాలలో భగవతి ఆయా స్థానాలలో భక్తులకు సన్నిహితం గా ఉండి అనుగ్రహిస్తుందని భావం .అయిదవ శ్లోకం లో –

‘’అంబర దేశే శబ్ద వతీ పావక తాతే స్పర్శ వతీ-కాంచన వీర్యేరూప వతీ సాగర కామ్చ్యాం గంధ వతీ ‘’

ఉమాదేవి ఆకాశం లో శబ్దం గా ,వాయువులో స్పర్శగా తేజస్సులో రూపం గా ,భూమిలో గంధం గా ,ఉంటుంది అంటే శబ్ద స్పర్శ రూప రస గందాదులు అన్నీ ఆమెయే అని అర్ధం ‘.ఆరవ శ్లోకం –

‘’అప్స్యమ లాసు స్పష్ట రసా చంద్ర విభాయాం గుప్త రసా –సంసృతి బోగే సర్వ రసా పూర్ణ సమాదా వేక రసా ‘’

అంటే ‘’నిర్మల మైన నీటి లో వ్యక్తమయ్యే రసం గా ,చంద్ర కాంతి లో గూఢ మైన రసం గా ,, ప్రపంచాను భవం లో శృంగారం మొదలైన రసాలుగా ,సంపూర్ణ సమాధిలో ఆనంద రసం గా శ్రీ దేవి ఉంటుంది .తరువాత శ్లోకం –

‘’చక్షుషు దృష్టి  శ్శాససతమా చేతసి దృష్టిశ్సిత్ర తమా—ఆత్మని దృష్టిసశుద్ధ తమా బ్రాహ్మణి దృష్టిః పూర్ణ తమా’ ‘’

దేవి మన నేత్రాలలో దృష్టిగా ,మనసులో విచిత్ర భావనా దృష్టిగా ,ఆత్మలో సహజ ద్రుష్టి గా ,బ్రహ్మ లో సమగ్ర ద్రుష్టి గ ఉంటుంది .తరువాత –

‘’స్థూల శరీరే కాంతి మతీ ,ప్రాణ శరీరే శక్తి మతీ –స్వాంత శరీరే భోగవతీ,బుద్ధి శరీరే యోగవతీ  ‘’ గా వ్యక్తమవుతుందట .అంటే ‘’పాంచ భౌతికం అయిన ఈ శరీరం లో దేవి కాంతి గా ,భౌతిక జీవనానికి ఆధారమైన ప్రాణ దేహం లో శక్తిగా ,సుఖ దుఖాను భవ సాధనం అయిన మనోమయ దేహం లో భోగ శక్తిగా ,బుద్ధి మయ దేహం లో ఆత్మ స్వరూప నిష్ట గా ఉంటుంది .

పదవ శ్లోకం లో –‘’సారస బందో రుజ్జ్వలభా ,కైరవ బందో స్సున్దరభా –వైద్యుత వహ్నే రద్భుత భా ,భౌమ క్రుశానో ర్దీపకభా ‘

శ్రీ దేవి సూర్యునిలో జ్వజ్వల్యమాన మైన దీప్తి గా ,చంద్రునిలో ఆహ్లాదమైన కాంతిగా ,విద్యుత్తూ లో విచిత్రమైన మెరుపుగా  భూమి అగ్నులలో ప్రకాశం గా జ్యోతకమవుతుంది .తరువాత శ్లోకం –‘

‘శస్త్రధరాణాం భీకరతా శాస్త్ర ధరాణాం బోధకతా –యంత్ర ధరణాం చాలకతా,మంత్రం ధరాణాం సాధకతా’’

ఆయుధాలలో భయాన్ని కలిగించే శక్తిగా ,శాస్త్ర వేత్తలలో బోధనా శక్తిగా ,యంత్ర వంతులలో యంత్రాన్ని నడిపే శక్తిగా ,రహస్యాలోచన పరుల్లో కార్య సిద్ధి కర శక్తిగా ఉమా దేవి ఉంటుంది .అంతేనా –

‘’గాన పటూనాం రంజకతా ధ్యాన పటూనాం మాపకతా –నీతి పటూనాం భేదకతా దూతి పటూనాం క్షేపకతా ‘’

లలితా పరమేశ్వరి గాన విశారదులలో శ్రోతలను రంజింప జేసే శక్తిగా ఏకాగ్రమనసుతో ఆలోచించేవారికి విషయ నిర్ణయ శక్తిగా ,నీతి నిపుణుల్లో భేదక శక్తి గా ఇతరులను ప్రేరణ చెందించే వారిలో ప్రేరక శక్తిగా ఉంటుంది .తరువాత –

‘’దీధితి ధారా లోక యతాం జీవిత ధారా వర్త యతాం-జ్ఞాపక ధారా చింత యతాం,మాదక ధారా ద్రావయతాం’’

పార్వతీ దేవి –చూసేవారిలో అవిచ్చిన్న దర్శన శక్తిగా , జీవించే వారిలో జీవన శక్తిగా ,ధ్యానించే వారిలో జ్ఞప్తి శక్తిగా ,సహస్రారం లో సోమ రసాన్ని స్రవింప జేసే యోగులలో ను ,బయట యాగాలలో సోమ రస పాణం చేసే యజమానుల్లో హర్ష జనక శక్తి గా ఉంటుంది .పదహారవ శ్లోకం –

‘’సూరి వరాణాం వాద బలం వీర వరాణాం బాహు బలం –మర్త్య వతీనాం సైన్య బలం రాగవతీనాం హాస బలం ‘’

భట్టారిక –పండితులలో ప్రవచన సామర్ధ్యం గా ,గొప్ప వీరులలో భుజ బలం గా ,రాజుల్లో సేనా బలం గా ,అనురాగ వతులైన స్త్రీలలో హాస బలం గా ఉంటుంది .మరోశ్లోకం –

‘’వైదిక మంత్రే భావ మతీ తాంత్రిక మంత్రే నాద వతీ –శాబర మంత్రే కల్ప వతీ సంతత మంత్రే సారవతీ ‘’

ఆది శక్తి –గాయత్రి మొదలైన మంత్రాలలో అర్ధా వతి గా ,శ్రీవిద్యాది మంత్రాలలో నాదం గా సామాన్య మాటలలోచెప్పే శాబర మంత్రాలలో ఉపకరణ వస్తు సామగ్రిగా ,ఉచ్చ్వాస ,నిస్శ్వాస రూపం లో ఉండే ‘’హంస మంత్రం’’ లో స్తిరత్వం గా ను ఉంటుంది . మరికాస్త తరచి చూస్తె –

‘’బ్రహ్మ ముఖాబ్జే వాగ్వనితా వక్షసి విష్ణోః శ్రీర్లలితా –శంభు శరీరే భాగమితా విశ్వ శరీరే వ్యోమ్ని తతా’’

బ్రహ్మ ముఖం లో సరస్వతిగా ,విష్ణు వక్షస్థలం లో శ్రీ లక్ష్మిగా ,శంకర శరీరం లో అర్ధ భాగం గా ,ఆకాశం అంతా వ్యాపించి విశ్వేశ్వరి గా ఉమాదేవి ఉంటుంది .

భూమి ,గ్రహాలు ,ఖగోళాలు లను బంతుల్లా ఆడుకొంటూ ,సర్వ లోకాలను ధరించి అనంతం గా ఆకాశమంతా వ్యాపించి ,తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటుంది ఉమా పార్వతి .సూర్యాది మండల రూపం లో జీవుల్లో కుండలినీ శక్తిగా ,అజ్ఞానుల అభిప్రాయాల్లో మంచి స్త్రీగా ,పండితాభిప్రాయం లో పరమానంద రూపిగా ఉంటుంది .తేజో మయి అయినా చిత్త రూపిణిగా ,ప్రాణం దేహం గా కలదైనప్పటికి ప్రాణం గా, దేహం గా ఉంటుంది .బ్రహ్మ దేహం ,ప్రకాశం, ఐశ్వర్యం కూడా ఆమెయే .

‘’దుర్జన మూలో చ్చేదకరీ దీన జనార్తి ధ్వంస కరీ  –ధీబల లక్ష్మీ నాశ క్రుశం పుణ్య కులం నః పాతు శివా ‘’’

దుస్టూల్ని సమూలం గా నాశనం చేస్తూ ,దీనుల దుఖాన్ని పోగొడుతూ ,మంగళ రూపిణి అయిన ఉమాదేవి మన బుద్ధి,బలం ,సంపద నశించటం మూలం గా కృశించిన మన పవిత్ర మానవ జాతిని కాపాడు గాక అని గణపతి ముని ఇరవైనాలుగోశ్లోకం లో వేడుకొన్నారు .చివరి శ్లోకం –

‘’చంద్ర కిరీటా మ్భోజ దృశః శాంతి సమృద్ధం  స్వాంత మిమే –సమ్మద యంతు శ్రోత్ర శుఖాః సన్మణి బంధాః సూరి పతే ‘’

పండిత శ్రేష్టుడైన గణపతి ముని చెవులకు ఇంపు గా చక్కని ‘’మణి బంధ వృత్తాలు ‘’తో రచించిన ఈ స్తోత్రాలు చంద్ర శేఖర పత్ని అయిన ఉమా దేవి ప్రశాంత మానసానికి ఆనందం  కల్గించు గాక అని ప్రార్ధించారు కావ్య కంఠు లైన వాసిష్ట గణపతి ముని .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-4-8-14-ఉయ్యూరు

 

‘’

Posted in రచనలు | Tagged | Leave a comment

94 ఏళ్ళ వయసులోనూ ”రజనీ ”గంధమైన గానం

rajani 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

-చేరా మాస్టార్ని మర్చి పోలేని కోడూరి విజయ కుమార్ -చాసో బాస సేబాసో- సినారె గేయం -సంచలన శీలం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )

జుబైదా దావూది

మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ వద్ద తగల బెట్టింది .ఇంటింటికి తిరిగి విదేశీ వస్త్రా లను పోగు చేసి తగల బెట్టించేది .బహిరంగ సభల్లో ధైర్యం గా పాల్గొని ఉత్సాహ పూర్వక ప్రసంగాలు చేసి మహిళలను స్వాతంత్రోద్యమం లో భాగస్వాములను చేసింది .ఉద్యమం తారా స్తాయిలో ఉన్నప్పుడు విద్యార్ధులు స్కూళ్ళు ,కాలీజీలు మానేస్తే ,వారికోసం ఆమె భర్త మౌలానా షఫీ ప్రత్యేకం గా ఒక స్కూల్ ను ఏర్పాటు చేసి చదువు  నేర్పించాడు .జుబేదా వారికి భోజనం వసతి సౌకర్యాలు సమకూర్చేది .

అజిజాన్

1832లో లక్నో లో పుట్టిన అజిజాన్ ముస్లిం స్వాతంత్ర్య యోధురాలు .సారంగి మహల్ లో ఉమ్రావ్ జాన్ తో ఉండేది .1857జూన్ నాలుగున హిందూ ముస్లిం లు ఏకమై ఐక్యం గా కలిసి తనతో పాటు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించటానికి  కలిసి రమ్మని నానా సాహెబ్  పిలుపు నిచ్చాడు .ఆ పిలుపుకు వెంటనే స్పందించిన అజిజాన్ నానాసాహెబ్ తో కలిసి తెల్ల వాళ్ళపై పోరాటం చేసింది .మహిళా సైన్యాన్ని ఏర్పరచి నాయకత్వం వహించింది .యుద్ధనైపుణ్యం బాగా తెలిసిన అజిజాన్ మిగిలిన మహిళలకు యుద్ధ సామగ్రిని ఎలా ఉపయోగించాలో శిక్షణ నిచ్చి నేర్పింది .బ్రిటిష్ సైన్యం పై ఒక కన్ను ఎప్పుడూ వేసి ఉంచి ,వారి ఆను పానులను  స్వాతంత్ర్య సమార యోధులకు ఎప్పటికప్పుడు తెలియ జేసేది .అయితే ఆమె ను వెంబడించిన బ్రిటిష్ వారు ఆమెను బంధించి జెనరల్ హావ్ లాక్ ముందు నిల బట్టారు .చేసిన తప్పులు ఒప్పుకొంటే క్షమిస్తానని హావ్ లాక్ అన్నాడు .ఆమె తిరస్కరించింది .వారి చేతుల్లో అజిజాన్ వీర మరణం పొందిన అసామాన్య పోరాట యోధురాలు .

అంజది బేగం

మౌలానా అహ్మద్ ఆలి జోహార్ భార్య అంజది బేగం .రాంపూర్ లో ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ.భర్త జోహార్ రాజకీయ తాత్విక ఆలోచనలను అనుసరించింది .భర్త తో బాటు అనేక సమావేశాలకు వెళ్ళేది .సత్యాగ్రహ ఉద్యమానికి ,ఖిలాఫత్ ఉద్యమానికి ధన సేకరణ చేసి అందించేది .మహాత్మా గాంధి గారి ప్రయాణపు ఖర్చులన్నీ తానె స్వయం గా భరించి ఆయన సభలను ఏర్పాటు చేయించి ప్రజలలో జాతీయ ఉద్యమ స్పూర్తి కలిగించిన సేవా పరాయణురాలు అం జది బేగం .

సాదత్ బానో కిచ్లూ

సాదత్ బానో కిచ్లూ డాక్టర్ షఫియుద్దీన్ కిచ్లూ  భార్య .ఉర్దూ ,పర్షియన్ భాషల్లో గొప్ప పాండిత్యం ఉన్న మహిళ .అనేక కవితలు,రచనలు చేసి , ప్రచురించి ప్రజల్ని ప్రభావితం చేసింది .దీనికి ఏంతో ధైర్యం కావాలి .ఆ నాటి సంఘం పరిస్తితులలో ఒక ముస్లిం మహిళ ఇలా బహిరంగం గా కవిత్వం రచనలు చేసి తన మనో భావాలను బయట పెట్టటం నేరం అని మత పెద్దలు భావించే రోజులవి  .1920లో భర్త కిచ్లూ అరెస్ట్ అయినప్పుడు ఆమె ‘’దేశ సేవలో నా భర్త జైలుకు వెళ్ళటం నాకు గర్వం గా ఉంది ‘’అని ప్రకటించిన ధీరో దాత్తురాలు సదాత్ బానో .’’దేశం కోసం వ్యక్తీ చేసే త్యాగం వెయ్యి జన్మలెత్తిన భాగ్యం ‘’అనేది .సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేది .భర్త స్థాపించి,చైర్మన్ గా ఉన్న ‘’స్వరాజ్ ఆశ్రమం ‘’లో సేవలందించింది .

జులేఖా బేగం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి భార్య జులేఖా బేగం .చాలా ధైర్య సాహసాలున్న మహిళ .కలాం గారు గాంధి గారి నాయకత్వం లో స్వరాజ్య ఉద్యమం లో ముందుకు దూసుకు పోతున్నప్పుడు ,ఇంటికి దూరమై జైలు పాలైనప్పుడు ఆమె ఎన్నో ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నది కాని ఏనాడు భర్త మార్గానికి అడ్డుగా నిలబడ లేదు .1942క్విట్ ఇండియా ఉద్యమంలో భర్తను ఏడాది పాటు ఖైదు చేసినప్పుడు గాంధీ గారికి ‘నాభర్తకు ఏడాది జైలు శిక్ష వేశారు .అది ఆయన చేసిన పోరాటానికి చిన్న శిక్షే .ఇంత తక్కువ కాలం శిక్ష పడుతుందని మేము ఊహించ లేదు .ఈ విషయం లో ఆయన శక్తి సామర్ధ్యాలకు తగిన సరైన న్యాయమైన శిక్ష కాదు . ఈ రోజు నుండి నేను బెంగాల్ ఖిలాఫత్ కమిటీ కార్య భారాన్ని వహించి నా శక్తి సామర్ధ్యాల మేరకు పని చేస్తాను ‘’అని రాసిన దేశ భక్తురాలు బేగం .ఇలా రాయటానికి ఎంత తెగువ సాహసం కావాలో అన్నీ ఆమెకున్నాయని రుజువు చేసింది . సహజం గా ఆమె  అనారోగ్యమనిషి. అయినా ఆమె ధైర్యానికి ఆశ్చర్యం వేస్తుంది .భర్త అరెస్ట్ ను నిబ్బరం గా భరించి స్వాతంత్ర్య పోరాటం లో ముందుకు దూకిన జుఖా బేగం అందరికి ఆదర్శ ప్రాయం .

నిషాత్ ఉన్నీసా బేగం

భర్త మౌలానా హస్రత్  మోహాని 1916ఏప్రిల్ పదమూడున  రెండవ సారి అరెస్ట్ అయినప్పుడు స్వాతంత్రోద్యమం లో చురుగ్గా పాల్గొన్న మహిళ నిషాత్ ఉన్నీసా బేగం.బ్రిటిష్ కోర్టులలో ఆమె భర్తకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేసేది  భర్తకు కేసుల్లో ఏంతో సాయం చేయటం తో బాటు ,ఏంతో దేశభక్తినీ కలిగి ఉండేది .ఆర్ధికం గా వెసులు బాటు లేకపోయినా ఇతరులకు సాయం చేయటానికి ముందు ఉండేది .భర్త తో సభలూ సమావేశాలకు హాజరై రాజకీయాలను బాగా అర్ధం చేసుకొన్నది .భర్త రాసిన పుస్తకాలను మేగజైన్ లను అమ్మి తమ ప్రయాణపు ఖర్చులకు ఉపయోగించేది .1921లో అబ్దుల్ హమీద్ ఖాజా భార్య బేగం ఖుర్షీద్ ఖాజా తో కలిసి కాంగ్రెస్ సబ్జెక్ట్ కమిటీకి నాయకత్వం వహించింది .స్వదేశీ ఉద్యమం లో చేరి ఆలీఘడ్ లో మౌలానా మోహాని ఏర్పాటు చేసిన ఖిలాఫత్  స్టోర్స్ కు సాయం చేసింది .క్వాజా అహ్మద్ జైలుకు వెళ్ళగానే భార్య కుర్షీద్ ఆయన నడుపుతున్న ‘’హింద్ ‘’పత్రిక బాధ్యతలు తీసుకొన్నది .జామి మిల ఇస్లామి బాధ్యతలను కూడా ఆయన లేనప్పుడు స్వీకరించి పని చేసింది .1930లో హమీదియా బాలికల సెకండరి స్కూల్ ను ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేసి నిర్వహించింది .ఇది తరువాత డిగ్రీ కాలేజ్ అయింది .

రజియా ఖాటూన్

నజీరుద్దీన్ కుమార్తె అయిన రజియా ఖాటూన్   బ్రిటిష్ పాలనను  ఎదిరించిన మొట్ట మొదటి బెంగాల్ ముస్లిం మహిళ.దీనికి కినిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి ‘’కాలాపానీ ‘’జైలు లో ఉంచారు .అక్కడే ఆమె ప్రాణాలు విడిచింది .బారిస్టర్ ఆసిఫ్ ఆలి తల్లి అక్బరీ బేగం ఆ రోజుల్లో ముస్లిం మహిళలను ప్రేరణ కలిగించి స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గోనేట్లు చేసింది .సహాయ నిరాకరణ మొదలైన ఉద్యమాలను వెంట ఉండి నడిపించింది .1920మే లో ఆమె ఒక చారిత్రాత్మక ప్రసంగం చేసింది .అందులో ఆమె ‘’మనం మన మతాన్ని పూర్తిగా విశ్వసించి ,అనుసరించాలి దీనికి వ్యతిరేకులైన వారిని సాంఘికం గా బహిష్కరించాలి ‘’అని పిలుపు నిచ్చిన ఉద్యమ కారిణి రజియా ఖాటూన్ .

వీరు మాత్రమె కాదు ఇంకా ఎందరో ముస్లిం మహిళా మణులు స్వాతంత్ర్య ఉద్యమం లో మగవారికి దీటుగా నిలిచారు .ముజఫర్ నగర్ కు చెందిన అస్గారి బేగం బ్రిటిష్ సైన్యం తో ధైర్యం గా పోరాడి  ఓడిపోతే బ్రిటిష్ కిరాతకులు ఆమెను నిలువునా కాల్చేశారు .ముజఫర్ నగర్ కే చెందినా హబీబా ,రహీమి ఇద్దరు బ్రిటిష్ సైన్యాన్ని ముందుకు రాకుండా అడ్డగించి ,వారికి చిక్కి ఉరి తీయబడ్డ దేశ భక్తులు .జహీదా ఖాటూన్ షెర్వాని దేశ భక్తీ గీతాలు రాసి పాడి అందర్నినీ ఉత్తేజితుల్ని చేసింది .ఖదీజా బేగం ఇంటింటికి టిరిగి స్వదీశీ వస్తువులనే వాడమని ఖాదీ దుస్తులే ధరించమని ప్రచారం చేసింది .మునీరాబెగం ,అమీనా కురేషి ,ఫాతిమా కురేషి అమీనా త్యాబ్జీ,హమీదా త్యాబ్జీ బేగం షకీలా లుక్మాని , ఫాతీమా టై ద్ఆలి ,శాఫాట్ ఉన్నీసా ,సఫియా సాద్ ,బేగం కుల్సూం శియాని ,అస్మత్ ఆరా ఖాటూన్ ,సుఘ్రా ఖాటూన్ ,బిబి అమాతుల్ ఇస్లాం ,ఫాతిమా ఇస్మాయిల్ ,సుల్తానా హయత్  అన్సారి ,హజరా బేగం ,జుహ్రా అన్సారి మొదలైన ఎందరో ముస్లిం మహిళల త్యాగాల వల్లనే మన స్వాతంత్ర్యం వచ్చిందని మనం మరువ రాదు .225మంది ముస్లిం మహిళలు స్వాతంత్ర్య ఉద్యమం లో అసువులు బాసి అమరులైనారు .

ఈ నెలలో వచ్చే భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా ఈ ముస్లిం మహిళా త్యాగధనుల్ని ఒక సారి స్మరించటానికి నేను చేసిన ప్రయత్నమే ఇది .వీరి జీవితాలకు సంబంధించిన పూర్తీ వివరాలు రికార్డ్ కాలేక పోవటం విచారకరం .నాకు అందిన సమాచారాన్ని బట్టి మాత్రమె రాయగలిగానని మనవి చేస్తున్నాను .

‘’ భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం మహిళలు’’ సమాప్తం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సామాన్యులలో అసామాన్యుడైన జయ శంకర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాణిశ్రీ హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేని కృష్ణం రాజు

ఆమె హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేను

Published at: 03-08-2014 00:36 AM

’’ సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో సావిత్రి స్థానాన్ని వాణిశ్రీ సునాయాసంగా భర్తీ చేసేసింది.., కొందరు ఆమె పొగరుగా ఉంటుందంటారు.. కానీ అది ఆత్మవిశ్వాసమని కొందరికే తెలుసు..’’ అంటారు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు. వాణిశ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలకరించినప్పుడు ఆ నాటి అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు…

టాలీవుడ్‌ సహజనటుల్లో వాణిశ్రీ ఒకరు. పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి పాత్ర నుంచి పౌరుషమున్న మధ్యతరగతి యువతి దాకా నటించిన అనేక పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే హఠాత్తుగా సినిమాల నుంచి వైదొలగిన వాణిశ్రీ  అంతరంగమిది..

వాణిశ్రీ అనగానే నాకు కృష్ణవేణి సినిమా తీస్తున్నప్పుడు జరిగిన రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి.  ఈ సినిమాని మా గోపికృష్ణ బ్యానర్‌లో  నిర్మించాం. మధుసూదనరావుగారు దీనికి డైరక్టర్‌. ఈ సినిమాలో వాణిశ్రీది ఒక సామాన్య మధ్యతరగతి యువతి పాత్ర. శ్రీశైలంలో టైటిల్‌ సాంగ్‌  తీస్తున్నాం. ఈ పాట కోసం ఎవరికీ చెప్పకుండా వాణిశ్రీ ఒక అందమైన హెయిర్‌స్టైల్‌తో షాట్‌కి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్‌హోస్టస్‌లు అలంకరించుకొనే హెయిర్‌స్టైల్‌ అది. ఆ అలంకరణకు బహుశా రెండు, మూడు గంటలు పట్టి ఉండచ్చు. లోకేషన్‌కి వచ్చిన తర్వాత ఆమె అలంకరణ మధుసూదనరావుగారికి నచ్చలేదు. ఒక మధ్య తరగతి యువతి పాత్రకి ఆ స్టైల్‌ నప్పదనేది ఆయన అభ్యంతరం. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పారు. నేను వెళ్లి ఆ హెయిర్‌స్టైల్‌ వద్దంటున్నారు.. అని చెప్పా. అంతే వాణశ్రీకి చాలా కోపం వచ్చింది. ’మళ్లీ వెళ్లి హెయిర్‌ స్టైల్‌ మార్చుకోవాలంటే రెండు, మూడు గంటలు పడుతుంది. అప్పటి దాకా మీరేం చేస్తారు? ఈ లోపులో టైమ్‌ అయిపోతే షూటింగ్‌ వాయిదా పడుతుంది’ అని కోపంగా అడిగింది. ’పరవాలేదు నీ కోసం  వెయిట్‌ చేస్తాం.. నువ్వు వెళ్లి మేకప్‌ మార్చుకొని రా..’’ అని చెప్పా. తర్వాత వెళ్లి మార్చుకువచ్చింది. ఇంకో సారి ఒక చిన్న షాట్‌ కోసం ఒక పెద్ద కొండ ఎక్కాల్సి వచ్చింది. నడుచుకుంటూ  పైకి ఎక్కి షాట్‌ తీసి కిందకు రావటానికి ఒక రోజంతా పట్టేసింది. అయినా వాణిశ్రీ ఎటువంటి కంప్లైంట్‌ చేయలేదు. ఈ రెండు సంఘటనలను జాగ్రత్తగా గమనిస్తే నటన పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత అర్థమవుతుంది. మొదటి సంఘటనలో కృష్ణవేణి పాత్రకు మరింత వన్నెలు దిద్దాలనే తపన  కనిపిస్తుంది. రెండో సంఘటనలో సీను ఎంత కష్టమైనదైనా నటించి ఒప్పించాలనే పట్టుదల కనిపిస్తుంది. ఒకప్పుడు ’వాణిశ్రీ పొగరుబోతు’ అనే వదంతి ప్రచారంలో ఉండేది. కానీ అది వదంతి మాత్రమే. నిజం కాదు.
మేమిద్దరం మొత్తం ఆరు సినిమాలు చేశాం. నేను నిర్మించిన ‘కృష్ణవేణి’, ‘భక్తకన్నప్ప’ చిత్రాల్లో  ఆమె నటించింది. వాస్తవానికి వాణిశ్రీ సినీ ప్రస్థానం చిన్న వేషాలతోనే ప్రారంభమయింది. చిన్న చెలికత్తె వేషం వేసినా ఆమె మంచి నటనను ప్రదర్శించేది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సావిత్రి, అంజలి, జమున ఒక తరం వారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? ఆ ఖాళీలను ఎవరు పూరిస్తారు? అని చాలా మంది అనుకుంటూ ఉండేవారు. ఈ ఖాళీని వాణిశ్రీ పూరించింది. కృష్ణవేణి సినిమా తర్వాత ఆమెకు తిరుగులేదు. ఈ సినిమాకు ఆమెను మేము ఎంపిక చేసుకోవటానికి కొన్ని కారణాలున్నాయి. ఆ సినిమాలో కృష్ణవేణి ఒక సామాన్య మధ్యతరగతి యువతి. ఎప్పుడో జరిగిందో లేదో సరిగ్గా తెలియని ఓ సంఘటనని గుర్తు చేసుకొని దాని వల్ల మానసిక సంఘర్షణకు లోనయ్యే పాత్ర అది.   పేరుకు నేను హీరో అయినా- అది  హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రమే.  కృష్ణవేణి పాత్ర  ఎవరు చేస్తే బావుంటుందని ఆలోచించి వాణిశ్రీని తీసుకున్నాం. ఆమె ఆ పాత్రలో ఎంత మమేకమైపోయిందంటే- సినిమా పూర్తయిన  మూడు నెలల దాకా ఈ పాత్ర నుంచి బయటకు రాలేకపోయింది. ఆమె మాట తీరు, హాహభావాలు అన్నీ అలాగే ఉండేవి. ఒక పాత్రలో నటి లేదా నటుడు మమేకమయిపోయినప్పుడే- ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. వాణిశ్రీలో ఆ లక్షణం పుష్కలంగా ఉండేది. ఈ గుణాన్ని భక్త కన్నప్పలో కూడా గమనించాను. ఆ సినిమాలో ఆమె ఒక బోయ యువతి. అప్పటి దాకా ఆమె చేసిన పాత్రలకు భిన్నమైనది. బోయవారి జీవితం, వారి వేషభాషలు, మాటతీరు అంతా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌  పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతంలో జరిపాం. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. అందరికీ అక్కడ ఉన్న ఇళ్లలోనే వసతి సౌకర్యం కల్పించాం. అప్పటికే వాణిశ్రీ పెద్ద నటి. అయినా ఎవరికీ ఇబ్బంది లేకుండా స్థానికులతో కూడా సర్ధుకుపోయింది.
వాణిశ్రీలో ఉన్న మరో రెండు లక్షణాలను కూడా చెప్పుకోవాలి. వీటిలో మొదటిది- పాత్ర నచ్చితే రెమ్యూనిరేషన్‌ గురించి పట్టించుకోకపోవటం. రెండోది ఆమెకు ఉన్న విపరీతమైన జ్ఞాపక శక్తి. చాలా సందర్భాలలో ఆమెకు పాత్ర నచ్చితే చాలు. పారితోషికాన్ని పట్టించుకోకుండా నటించేది. సాధారణంగా రెండు, మూడు పేజీల డైలాగ్‌లను గుర్తుపెట్టుకొని చెప్పటం అంత సామాన్యమైన విషయం కాదు. హీరో కృష్ణ మాదిరిగానే ఆమె కూడా పెద్ద పెద్ద డైలాగ్‌లను కూడా సులభంగా గుర్తు పెట్టుకొనేది. పెద్ద పెద్ద డైలాగ్‌లున్న సీనులను సింగిల్‌ షాట్‌లో ఓకే చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కెరీర్‌లో చాలా ఉన్నత స్థానంలో ఉన్న సమయంలో హఠాత్తుగా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆ సమయంలో నాతో సహా అనేక మంది స్నేహితులను సలహా అడిగింది. బహుశా సినిమా ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయి ఉండవచ్చు. ఈ నిర్ణయం వెనక  ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశం కూడా ఉంది. ఆ తర్వాత కూడా నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె హైదరాబాద్‌ వస్తే కలుస్తాం. మేము మొదటి సినిమాలో కలిసి నటించినప్పుడు ఎంత స్నేహంగా ఉందో ఇప్పుడే అంతే స్నేహంగా ఉంటుంది.

వినాయక విజయం సినిమాలో నేను శివుడు. తను పార్వతి. హీరాలాల్‌ మాస్టారు డ్యాన్స్‌ డైరక్టర్‌. నాకు డ్యాన్స్‌ నేర్పింది కూడా ఆయనే. నేను పెద్ద డ్యాన్సర్‌ని కాదు. వాణిశ్రీ మంచి డాన్సర్‌.  ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే శివతాండవం సన్నివేశంలో ఎక్కువ షాట్స్‌ ఆమెకే పెట్టారు. అలాగే మేమిద్దరం పక్కపక్కనే కూర్చుని నటించే సన్నివేశాల్లో నా మెడలో పాము అటు ఇటు కదులుతూ ఆమెని ఇబ్బంది పెట్టేది. అయినా భరిస్తూ ఆ సీన్‌ పూర్తి చేసేది.

‘‘చిన్నప్పుడు నేను మద్రాసు ఆంధ్ర మహిళాసభలో భరత నాట్యం నేర్చుకున్నా. ఒకసారి సభ యానివర్సరీకి కన్నడ డైరెక్టర్‌ హుణుసూరు కృష్ణమూర్తి వచ్చారు. ఆ వేడుకల్లో నా నాట్యంచూసి ‘ఈ అమ్మాయి సావిత్రి లా ఉందే? సినిమాల్లో నటిస్తుందా?’ అని అడిగారట. అమ్మ ఒప్పుకోలేదుగానీ, ఒప్పిం చి తొలిసారి కన్నడ సినిమాలో నటించాను. ‘నాదీ ఆడజన్మే’ సినిమా తీసిన కంపెనీ పేరు.. శ్రీవాణి ఫిలిమ్స్‌. వాళ్లే నాకు వాణిశ్రీ అని పెట్టారు..’’
‘‘నేను బాగా చేస్తానని, చేశానని అప్పట్లో ఎవరూ నాకు చెప్పలేదు. ఒకసారి ఎన్టీఆర్‌.. ‘కథానాయిక మొల్ల’ సినిమా బాగా చేశానని, చివర్లో నేను కూర్చునే భంగిమ బాగుందని అన్నారు. నేను చీరకట్టి, పైటవేసే విధానం ఏదో రాచకుటుంబం నుంచి వచ్చినట్టనిపిస్తుందని కృష్ణంరాజు మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు ఎప్పుడూ ప్రశంసించలేదు. కృష్ణ, నేను అసలు మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఏ హీరో అయినా మా కళ్లలోకి చూసి మాట్లాడేవారుగానీ, ఎన్టీఆర్‌ మాత్రం ఎక్స్‌రే చూపులు చూసేవారు కాదు. కారణ జన్ముడంటే ఆయనే అని చెప్పుకోవాలి. ఏఎన్నార్‌కి మూడ్‌స్వింగ్‌ ఎక్కువ. కోపంగా ఉంటే ఒకలా ఉండేవారు. మామూలు గా ఉంటే చిన్నచిన్న జోకులు వేసేవారు..’’
‘‘చిన్నపిల్లలకు వేసవి సెలవులిస్తారు. కానీ, నా వ్యవహారాలు చూసేవాళ్లు నాకు ఆ వెసులుబాటు కూడా ఇవ్వలేదు. మద్రాసులో షూటింగ్‌ చేయకూడని రోజుల్లో వేరే భాషల సినిమాలకు డేట్లు ఇచ్చేవారు. వాళ్లు అలా చేయకుండా నాకు కొంత విశ్రాంతి ఇచ్చి ఉంటే నేను పెళ్లి అనే మాట ఎత్తేదాన్నే కాదు. దీనికితోడు.. ‘ఎదురులేని మనిషి’ సినిమాలో ఒకపాట షూటింగ్‌లో అసభ్యమైన మూమెంట్లు చేయమన్నారు. నాకు ఒళ్లు మండింది. ఆ దశలో పెళ్లి నిర్ణ యం తీసుకున్నాను. మా ఆయన.. మా ఫ్యామిలీ డాక్టరే.’’
‘‘నాకు పెళ్లంటే కొంతమంది ఏడ్చారు. అంటే.. మనసులో నన్ను ప్రేమించారన్నమాట. ఇన్నిరోజులూ చెప్పలేదేమంటే.. ‘నాకు పిల్లలున్నారనా, కావాలంటే రీకేనలైజేషన్‌ చేయించుకుంటా’ అన్నారు. అప్పుడా వ్యక్తికి.. ఇట్స్‌ టూ లేట్‌, మనం స్నేహితులం అని చెప్పాను..’’
‘‘మనీ ఈజ్‌ టేస్టర్‌ దాన్‌ ఎనీథింగ్‌. డబ్బు రుచి తెలిసినతర్వాత.. ఇక అమ్మా లేదు.. నాన్నాలేదు.. ఎవరూ లేరు. నాకు కొండమీద కోతి కావాలన్నా మావాళ్లు దాన్ని తెచ్చి అక్కడ పెట్టేవాళ్లు. దీంతో డబ్బు విషయా లు ఎప్పుడూ పట్టించుకోలేదు. హీరోయిన్‌గా నేను సంపాదించినదాని గురించి అడిగితే మావాళ్లు కోర్టుకెళ్లారు. పన్నెండేళ్లు కేసు నడిచింది. మా లాయరు ‘వాళ్లు నీకు అప్పట్లో అంత పారితోషికం లేదంటున్నారు. మూడు సినిమాల్లో నటిం చి ఆ రెమ్యూనరేషన్‌ అగ్రిమెంట్లు పట్రా. వాళ్లని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా’ అన్నారు. అలా ‘అత్తకు యము డు అమ్మాయికి మొగుడు’ చేశాను. ఈలోగా మావాళ్లు రాజీకి వచ్చారు..’’
‘‘సినిమా మాత్రమే కాదు.. ప్రపంచమే మారుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చెడిపోలేదు. చాలామంది మంచి సినిమాలు తీస్తున్నారు. ఇక అశ్లీలమంటే.. కొందరు డైరెక్టర్లకు మనసులో ఎక్కడో ఉం టుంది ‘అలా’ లైవ్‌లో చూడాలని. అందుకే అలా చూపిస్తున్నారు. ఈ తరంలో అల్లు అర్జున్‌ డాన్స్‌ చూస్తే ‘ఈ పిల్లాడి కాళ్లు రబ్బర్‌తో చేశా రా’ అనిపిస్తుంది. రవితేజ, సిద్ధార్థ, మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం..’’
‘‘ఇప్పటికే నేను తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నాను. ఆధ్యాత్మికం వైపు ప్రయాణిస్తున్నాను. అలాగని కుంకుమ పూజలు చేస్తున్నానని, కొబ్బరికాయలు కొడుతున్నానని చెప్పను. దేవుడి ఉనికిని కనుగొనే దిశగా ప్రయత్నించి కనిపెట్టాను. దేవుడు ఎక్కడో ఉండడు. మనం దేవుడుగా మారడమే. ఒకరి నోటి దగ్గర అన్నం తీయకుండా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రికాల పూజ చేసుకుంటా. ప్రసాదాలేమీ ఉండవు..’’

 

Category:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2

‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2

ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన –   బి అమ్మా అనే ఆబాది బేగం

’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది బానో బేగం 1852లో జన్మించింది . బ్రిటిష్ పాలనకు ముందు వెయ్యేళ్ళు మన దేశాన్ని పాలించిన ముస్లిం రాజ వంశీకురాలామే .1857మొదటి స్వాతంత్ర్య సమర కాలానికి ఆమెకు అయిదేళ్ళు .అందువల్ల స్కూల్ ,కాలేజి లలో ఆమె చదవ లేక పోయింది .కాని ముస్లిం మత పద్ధతుల్లో ,సంస్కారం లో ఆమె పెరిగి అలవర్చుకోన్నది .అల్లా అన్నా ఆయన అనుచరులన్న గొప్ప భక్తీ తో ఉండేది .ఇస్లాం కోసం సర్వం త్యాగం చేసే గుణం ఉన్నది .ఆమె క్రమ శిక్షణా జీవితాన్ని చూసి పెద్దలే ఆశ్చర్య పోయేవారు .చిన్న వారు ఆదర్శం గా గ్రహించేవారు .రాంపూర్ రాజ్యం లో ప్రముఖ అధికారి అబ్దుల్ ఆలీఖాన్ కిచ్చి ఆమె పెళ్లి చేశారు .వీరికి మౌలానా షౌకత్ ఆలి ,మహమ్మదాలీ, జుల్ ఫికర్ అలీ,నవాజిష్ ఆలి అనే నలుగురు  కొడుకులతో బాటు ఒక అమ్మాయి పుట్టారు .నవాజిష్ ఆలి బాల్యం లోనే చనిపోయాడు .ముప్ఫై ఏళ్ళకే భర్త మరణించాడు .పిల్లల్ని పోషించి పెద్ద చేసే పెద్ద బాధ్యత ఆమె పై పడింది .

నవాజిష్ ఆలి చనిపోయినపుడు బంధువులు ,ప్రజలు ఆమెను ఓదార్చటానికి వస్తే ‘’భగవంతుడి దయ ఎలా ఉంటె అలా జరుగుతుంది .అయన ఏది ఇస్తే దాన్నే స్వేకరించాలి .మన కు ఆయనే దిక్కు ‘’అని, వచ్చిన వారినే ఓదార్చింది .ఆమె హాజ్ యాత్రకు మక్కా వెళ్ళినప్పుడు అక్కడి పవిత్ర శిలను స్పృశించి తన పిల్లలు యదార్ధ ముస్లిం లుగా ఎదిగేట్లు ఆశీర్వ దించమని ప్రార్ధించింది .ఆమె చదువుకోక పోయినా ఇండియా పాకిస్తాన్ ప్రాంతం లో ఉన్న ముస్లిం లందరూ విద్యా వంతులు కావాలని కోరుకొనేది. తన కొడుకుల్ని బాగా చదివించింది .చివరికొడుకు మహమ్మద్ ఆలి బుద్ధిలో హృదయం లో ఎన్నదగిన వాడని పించుకొన్నాడు .అన్నిటా దూసుకు పోయే స్వభాం అతనిది .అతని ప్రతిభ దేశ విదేశాలలో మారు మోగింది .ఒక సారి ఎవరో తల్లి వద్ద ఈ కొడుకు గొప్ప తనాన్ని పొగుడుతుంటే కొడుకు ను తీర్చిన తల్లి అని ఆమెను కీర్తిస్తుంటే ఆమె ‘’అల్లా ఎవరికి గౌరవం కల్పించాలో వారికి కల్పిస్తాడు అందులో నా ప్రమేయం లేదు .అంతా అల్లాదయ ‘’అంది నిగర్వం గా .

బ్రిటిష్ పాలనలో కొందరు ముస్లిం లు పాశ్చాశ్చ సంస్కృతి పట్ల వ్యామోహం చూపించారు .వారిని ‘’బిడ్డల్లారా ఆ వ్యామోహాన్ని వదలండి .మన పద్ధతిలో జీవించండి బ్రిటిష్ వారిచ్చే బిరుదులూ ,పదవులు తీసుకో వద్దు’’ అని హితవు చెప్పిన దేశ భక్తురాలు  .1972లో జరిగిన ఆఖిల భారత ముస్లిం సమ్మేళనం లో 62ఏళ్ళ ఈ నానమ్మ (బి అమ్మ)పాల్గొని  చరిత్రాత్మకమైన  ఉపన్యాసం చేసి అందరికి దేశ భక్తిని రంగ రించి పోసి చిరస్మరణీయం గా నిలిచింది .ఆమెకుమారులు షౌకత్ ఆలి మహామ్మదాలి లు బ్రిటిష్ వారి ఏ ప్రలోభానికి లొంగకుండా నిర్దుష్ట జీవన విధానాన్ని సాగించి ఆదర్శం గా నిలిచారు .అల్లా కు తప్ప దేనికీ భయపడని ధీరో దాత్తులయ్యారు .ఇదంతా బిఅమ్మ ప్రభావమే .ఖలీఫా ను విధ్వంసం చేసే బ్రిటిష్ వారిపై ఈ సోదరులు జీవితకాలమంతా పోరాటం చేస్తూనే ఉన్నారు .వారిద్దరిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెట్టినప్పుడు ఆమె ఆశ్చర్యానందాలకు అవధుల్లేవు .జైలుకు వెళ్లి వారిని పరా మర్శిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కష్టాలకు ఓర్చుకొమ్మని ఒక వేళ అవసరమైతే జీవితాన్ని త్యాగం చేయటానికైనా సంసిద్ధులు గా ఉండమని బోధించిన మాత్రు మూర్తి ఆమె .

కొడుకులు జైలు లో ఉన్నప్పుడు ఖిలాఫత్ ఉద్యమ పగ్గాలు చే బట్టి అందరికి  ప్రేరణ కల్గించింది .పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి ఉపన్యాసాలు చేసి ‘’ముస్లిం ఉమ్మా ‘’ సర్వాది కారాలను ఐక్యత తో కాపాడుకోమని ఉద్బోధించింది .ఆమె నినాదం ‘’ఖలాఫత్ కోసం మీ ప్రాణాలు త్యజించండి ‘’అన్నది ఒక మంత్రమై వ్యాపించింది .ఈ మంత్రమే కులమత వర్గ రహితం గా దేశమంతా వ్యాపించింది .1924మార్చ్ లో ఖిలాఫత్ ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .ఆ నవంబర్ పదమూడున లోనే నానమ్మ  మరణించింది .కాని ఆమె ఉద్యమ దీప్తి ముస్లిం మహిళల పై గొప్ప ప్రభావం చూపి తిరుగు లేని బలాన్ని  ప్రదర్శింప  జేసింది .ఇంతటి ప్రభావ శీలి బి అమ్మ .ఖిలాఫత్ ఉద్యమ ఫలితం గా  ముస్లిం సమైక్యత  ఏర్పడి పాకిస్తాన్ దేశం ఏర్పాటు కావటానికి మార్గం  సుగమం అయింది .ఇది బి అమ్మ ఖిలాఫత్ ఉద్యమ దీక్షా ఫలితమే .

Inline image 1

మరో మహిళగురించి ఈ సారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని సమన్వయము చేశారు .ఆ వైభోగమే మనం ఇప్పుడు దర్శించ బోతున్నాం .

ఏడవ శ్లోకం  ‘’భూమి రుహాగ్ర స్థాపిత భాండా ద్యో మధు పాయం పాయ మజశ్రం

విస్మృత విశ్వో నన్దతి మాత స్తత్ర కిల త్వం ధామ దదాసి ‘’-లో ‘’అమ్మా!చెట్టు చివరనున్న పాత్ర(తాటి చెట్టు చివర కట్టిన కల్లు కుండ) నుండి మదకరమైన మధువును నిరంతరం తాగి తాగి ప్రపంచాన్ని విస్మరించి ఆనందించే శివుని యందు నీవు ఉంటావట ‘’అన్నారు .ఇక్కడ వాసిష్ట గణపతి ముని ఆంతర్యం ఏమిటో తెలుసుకొందాం .శరీరమే చెట్టు .దాని చివరిభాగమే శిరస్సు .అందులోని సహస్రారమే పాత్ర .అందులో కారే సోమ రసమే మధువు .ఆ మధుపానం వలన కలిగిన బ్రహ్మానందమే మదం .దాని వల్లే ప్రపంచాన్ని మర్చి పోవటం .ఇలా బ్రహ్మానందం లో అన్నీ మరచి ఉన్న వ్యక్తీ పరమ శివుడు .ఆయన అంతటినీ దేవీమయం గానే భావిస్తూ ,అన్నిట్లోనూ దేవినే దర్శిస్తాడని భావం .తరువాత శ్లోకం

‘’కోపి సహస్రై రేష ముఖానాం శేష ఇతీడ్యఃపన్నగ రాజః –ఉద్గిర తీదంయద్వనేభ్యో దేవి!తనౌ మే తద్బత!పాసి ‘’

లో’’ఇలాంటిది అని వర్ణించ టానికి వీలు కాని ఒక అనుభవం వెయ్యి శిరస్సులున్న ఆది శేషుని లాగా నా దేహం లో అనుక్షణం విషం లాగా తాపాన్ని కలిగిస్తోంది .దాన్ని నువ్వు తాగి నా తాపాన్ని హరిస్తున్నావు .అయ్యో నీకు యెంత కష్టం కలిగిస్తున్నాను తల్లీ ‘’అంటారు .ఇందులోని అంతరార్ధం –దేవి అనుగ్రహం తో యోగ సాధన జరుగుతుంటే ,ఏ సిద్ధీ సిద్ధాచక ముందు ఒక తాపం శరీరం అంతా వ్యాపిస్తుంది .దాన్ని అమృతమయి అయిన దేవి హరించి సాధకుడిని కాపాడుతుంది .ఇది గణపతి ముని గారి స్వానుభవమే .ఇప్పుడు సముద్ర మధనం దగ్గరకు ప్రవేశిస్తున్నాం .

‘’మందర దారీ నామృత హేతు ర్వాసుకి రజ్జు ర్నామ్రుతా హేతుః -మంధన హేతు స్సామృత హెతుః సర్వ బలాత్మా శర్వ పురంధ్రీ ‘’

అన్న శ్లోకం లో ‘’అమృత మధన సమయం లో మందర పర్వతాన్ని మోసిన ఆది కూర్మ మైన శ్రీహరి కాని ,కవ్వం తాడు అయిన వాసుకి కాని అమృత ప్రాప్తికి కారణం కాదు .మధనానికి కారణం అయిన సర్వ బాల స్వరూపిణి అయిన ఉమా దేవియే అమృత ప్రాప్తికి కారణం అన్నారు గణపతి ముని .అంటే మందరం, వాసుకి సహాయ కారులె కాని అమృత ప్రాప్తికి భగవతి ఏ కారణం అని కవి హృదయం .

‘’ప్రాణి శరీరం మందర శైలో మూల సరోజం కచ్చప రాజః –పూర్ణ మనంతం క్షీర సముద్రః పృష్ట గ వీణా వాసుకి రజ్జుః’’

అనే శ్లోకం లో ముని ‘’జీవుని దేహమే మందర పర్వతం .మూలాధార పద్మమే కూర్మ రాజు .దహరా కాశమే క్షీర సాగరం వెన్నెముక అయిన వీణా దండమే రజ్జువు అయిన వాసుకి .అని యోగ శాస్త్ర రహస్యార్ధాన్ని వివరించారు .తరు వాతిశ్లోకం –

‘’దక్షిణ నాడీ నిర్జర సేనా వామగ నాడీదానవ సేనా –శక్తి విలాసో మంధన కృత్యం శీర్షజ ధారా కాపి సుదోక్తా ‘’

అంటే ‘’దేహమధ్యం లోఉన్న సుషుమ్నా నాడికి కుడి వైపు ఉన్న పింగళ నాడి దేవతా గణం .సుషుమ్నకు ఎడమ వైపున ఉన్న ఇడానాడి రాక్షస గణం .శక్తి యొక్క క్రీడయే మధనం అనే కార్యం .సహస్రం నుండి వెలు వడిన ఆనంద ధారయే అమృతం .అని యోగార్ధాన్ని వివరించారు .ఇంకొంచెం ముందుకు సాగి తరువాతి శ్లోకం లో

‘’కంఠ నిరుద్దే భూరి విషాగ్నౌ తైజస లింగా వాసి హరేణ-త్వద్బల జాతం  స్వాద్వమృతం కో దేవి!నిపీయ ప్రేత ఇహ స్యాత్ ‘’అంటారు –‘’తేజస్వరూపిణివి  అయిన మాతా !అమృత మధన సమయం లో మొదట వాసుకి ముఖం నుంచి వెలువడిన విషాగ్నిని తేజోమయ లింగ వాసి అయిన రుద్రుడు తన కంఠం లో  దాచేశాడు .నీ శక్తి  వలన పుట్టిన  మధురామ్రుతాన్ని గ్రోలాడు కనుక బతికి బయట పడ్డాడు ‘’.అంటే అమ్మ బలం వల్లకలిగిన అమృతాన్ని తాగిన వాడికి మరణం ఉండదని అర్ధం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ హాద్’’పిలుపు నివ్వగా ,ఉలేమాలు మొదలైన వారంతా దేశ వ్యాప్తం గా బ్రిటిష్ వారి దాస్టేకానికి నిరసన తెలియ జేశారు .అప్పటిదాకా పరదాల చాటునే ఉంటున్న ముస్లిం మహిళలు  బహిరంగం గా నినాదాలు చేసి తీవ్ర నిరసన తెలిపారు .ఈ జీహాద్ ఉద్యమం1857లో బలపడి1947 స్వాతంత్ర్య సాధన వరకు కోన సాగింది .ముస్లిం మహిళలు భర్తలు ఉద్యమం లో ఇంటికి దూరం గా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలన్నిటినీ తామే స్వీకరించి తండ్రులకు  కొడుకులకు  బంధువులకు ప్రేరణ కల్గించి ముందుకు నడిపించారు .బాహాటం గా స్వాతంత్ర్య దీప్తిని రగిలించారు .అహింసా ,హింసా విదానాలలోను భాగ స్వామినులయ్యారు .ఈ మహిళలు ఉన్నత కుటుంబాలకు ఉన్నత విద్య నేర్చిన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కాదు ,సాధారణ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యా గంధం లేని ముస్లిం మహిళలు కూడా ఎందరో ఉన్నారని గ్రహించాలి .ఇప్పుడు కొందరు ముస్లిం మహిళా దేశ భక్తుల పోరాట పటిమల గురించి తెలుసు కొందాం .

బీగం హజ్రత్ మహల్

నవాబ్ వాజిద్ ఆలి షా భార్య అయిన బీగం హజ్రత్ మహల్ తన భర్త కలకత్తాకు ప్రవాసానికి వెడితే బాధ్యతలను చే బట్టింది .భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం లోని నాయకులతో కలిసి పని చేసింది .సర్ హెన్రి లారెన్స్ మొదలైన ఆఫీసర్లను వెల్ల గొట్టి లక్నో రెసిడెన్సి ని ముట్టడించి వశ పరచు కొన్నది  .జెనరల్ హేవ్ లాక్ ఆఫీసర్లకు సైన్యానికి  రక్షణ గా వచ్చినా  విఫలమైనాడు .తర్వాత వచ్చిన కాంప్ బెల్ లక్నో ను తిరిగి స్వాధీనం చేసుకోవటం  లో విజయం పొందాడు .బీగం ను బలవంతం గా వెనక్కి మరలేటట్లు చేయ గలిగాడు .బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలు తనకక్కర లేదని క్షమా భిక్ష వేడనని ఖచ్చితం గా చెప్పింది .బ్రిటిష్ వారికి దొరక కుండా తప్పించుకుంటానని ధైర్యం గా ప్రకటించింది .తనకొడుకు యువరాజు బిర్జీస్ ఖాదిర్ ను అవద్ కు రాజును చేసింది .కొద్ది కాలమే అతను పరిపాలించాడు .బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పదవి నుండి తప్పించింది .తల్లి బీగం హజ్రత్ మహల్ నేపాల్ దేశానికి చేరి ప్రవాస జీవితం గడిపింది .1820లో జన్మించిన బీగం నేపాల్ లోనే 7-4-1879లో యాభై తొమ్మిదో ఏట మరణించింది .ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసు కొందాం .

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ హాద్’’పిలుపు నివ్వగా ,ఉలేమాలు మొదలైన వారంతా దేశ వ్యాప్తం గా బ్రిటిష్ వారి దాస్టేకానికి నిరసన తెలియ జేశారు .అప్పటిదాకా పరదాల చాటునే ఉంటున్న ముస్లిం మహిళలు  బహిరంగం గా నినాదాలు చేసి తీవ్ర నిరసన తెలిపారు .ఈ జీహాద్ ఉద్యమం1857లో బలపడి1947 స్వాతంత్ర్య సాధన వరకు కోన సాగింది .ముస్లిం మహిళలు భర్తలు ఉద్యమం లో ఇంటికి దూరం గా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలన్నిటినీ తామే స్వీకరించి తండ్రులకు  కొడుకులకు  బంధువులకు ప్రేరణ కల్గించి ముందుకు నడిపించారు .బాహాటం గా స్వాతంత్ర్య దీప్తిని రగిలించారు .అహింసా ,హింసా విదానాలలోను భాగ స్వామినులయ్యారు .ఈ మహిళలు ఉన్నత కుటుంబాలకు ఉన్నత విద్య నేర్చిన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కాదు ,సాధారణ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యా గంధం లేని ముస్లిం మహిళలు కూడా ఎందరో ఉన్నారని గ్రహించాలి .ఇప్పుడు కొందరు ముస్లిం మహిళా దేశ భక్తుల పోరాట పటిమల గురించి తెలుసు కొందాం .

బీగం హజ్రత్ మహల్

నవాబ్ వాజిద్ ఆలి షా భార్య అయిన బీగం హజ్రత్ మహల్ తన భర్త కలకత్తాకు ప్రవాసానికి వెడితే బాధ్యతలను చే బట్టింది .భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం లోని నాయకులతో కలిసి పని చేసింది .సర్ హెన్రి లారెన్స్ మొదలైన ఆఫీసర్లను వెల్ల గొట్టి లక్నో రెసిడెన్సి ని ముట్టడించి వశ పరచు కొన్నది  .జెనరల్ హేవ్ లాక్ ఆఫీసర్లకు సైన్యానికి  రక్షణ గా వచ్చినా  విఫలమైనాడు .తర్వాత వచ్చిన కాంప్ బెల్ లక్నో ను తిరిగి స్వాధీనం చేసుకోవటం  లో విజయం పొందాడు .బీగం ను బలవంతం గా వెనక్కి మరలేటట్లు చేయ గలిగాడు .బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలు తనకక్కర లేదని క్షమా భిక్ష వేడనని ఖచ్చితం గా చెప్పింది .బ్రిటిష్ వారికి దొరక కుండా తప్పించుకుంటానని ధైర్యం గా ప్రకటించింది .తనకొడుకు యువరాజు బిర్జీస్ ఖాదిర్ ను అవద్ కు రాజును చేసింది .కొద్ది కాలమే అతను పరిపాలించాడు .బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పదవి నుండి తప్పించింది .తల్లి బీగం హజ్రత్ మహల్ నేపాల్ దేశానికి చేరి ప్రవాస జీవితం గడిపింది .1820లో జన్మించిన బీగం నేపాల్ లోనే 7-4-1879లో యాభై తొమ్మిదో ఏట మరణించింది .ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసు కొందాం .

బీగం అసలు పేరు మొహమ్మది ఖానుం .అవద్ లోని ఫైజా బాద్ లో జన్మించింది .ఆమె రాజు గారి ఆస్థానం లో పని చేసింది .తలిదండ్రులు ఈమెను అమ్మేశారు .ఖవాసిన్ అయింది .తరువాత రాజ ప్రతినిధులకు అమ్ముడు పోయింది .అక్కడ ‘’పారి ‘’అయి అవద్  రాజు  లలో చివరి వాడైన వజీర్ అలీ షాకు కు చిన్న భార్య అయి  బీగం హజ్రత్ మహల్ పేరు తో స్తిర పడింది .బ్రిటిష్ ప్రభుత్వం అవ ద్రాజ్యాన్ని లోబరచుకోవటం తో షా కలకత్తాకు పారిపోయి ప్రవాస జీవి అయ్యాడు .భర్త తో విడాకులు పొందినా  రాజ్య వ్యవహారాలను  బీగం చే బట్టింది .అవద్ –ఇప్పుడున్న ఉత్తర ప్రదేశ్ లో చాలా పెద్ద ప్రాంతం గా ఉండేది .రాజా జైలాల్ సింగ్ వంటి దేశ భక్తుల తో కలిసి బ్రిటిష్ వారిపై ప్రధమ స్వాతంత్ర్య సమరం చేసింది .నానా సాహెబ్ తో కూడా కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించింది .శహజన్ పూర్ పై  గైజాబాద్ మౌలవి తో తో కలిసి దాడి చేసింది .

ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం లోని ప్రార్ధనా మందిరాలను రోడ్ల నిర్మాణం పేరు తో  కూల గొట్టి చర్చిలను నిర్మిస్తూ ఉంటె  వ్యతిరేకించింది .దైవారాధనకు స్వేచ్చ ఉండాలి అని ఎదురు తిరిగింది .ఈ విషయం లో ఆమె ‘’పందులను తింటూ మద్యం సేవిస్తూ ,తుపాకీ కాట్రిడ్జ్ లకు పంది కొవ్వు కలిపినతీపి పదార్ధాలను పూసి ,రోడ్ల విస్తరణ పేరు తో హిందూ ముస్లిం దేవాలయాలను కూల్చి వేస్తూ  చర్చిలు నిర్మిస్తూ ,మత ప్రచారకులను వీధుల్లో తిప్పి క్రిస్టియన్ మత ప్రచారం చేయిస్తూ,ఇంగ్లీష్ స్కూళ్ళు ఏర్పరచి ,ఇంగ్లీషు ,సైన్సు నేర్వటానికి స్టైఫెండ్ ఇస్తూ ,ఇప్పటిదాకా హిందూ ముస్లిం ల దేవాలయాల విషయమే పట్టించు కోకుండా అశ్రద్ధ చేసి,మీరు చేస్తున్న మీ నిర్వాకాన్ని చూస్తె  మత విశ్వాసాలలో మీరు తలదూర్చరని నమ్మకం ఎక్కడ కనీ పిస్తోంది ‘?’అని సూటిగానిప్పులు కక్కుతూ  ప్రశ్నించిన ధీర వనిత బీగం .

చివరికి నేపాల్ కు  శరణార్ధిగా వెళ్ళాల్సి వచ్చింది .మొదట అక్కడి ప్రధాని జంగ్ బహదూర్ ఆమె ప్రవేశాన్ని అడ్దగించినా తర్వాత అంగీకరించి ఆశ్రయ మిచ్చాడు .ఆమె నేపాల్ లోనే చనిపోయింది .ఆమె దేహాన్ని ఖాట్మండు లోని జామా మసీద్ లో ‘’ఒక అనాధ ‘’గా ఖననం చేశారు .అంతటి మహారాణికి స్వాతంత్ర్య సమర మహిళకు ఎంతటి దుర్గతి?. బీగం 135 వ వర్ధంతి నాడు జామా మసీద్ లోని ఆమె సమాధిపై భారత ,నేపాల్ రాయ బారులు పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళు లర్పించారు .ఇండియాలో లక్నో లో పురాతన పార్కుకు 15-8-1962 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమె పేరు పెట్టి గౌరవించారు .ఒక పాల రాతి స్మ్రుతి చిహ్నాన్ని అక్కడ నెల కోల్పారు .1984 మే పది న  భారత ప్రభుత్వం బీగం పేరిట 15,00,000లపోస్టల్ స్టాంప్ ల ను విడుదల చేసి ఆమె స్వాతంత్ర్య దీక్షను శ్లాఘించింది .

Begum hazrat mahal.jpg

మరో ముస్లిం మహిళా యోధురాలి గురించి మరో సారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

హిందూస్తాన్ – ఇండియా అంటే ?

హిందూస్తాన్

డయానా  తన పుస్తకం లో హిందూస్తాన్ పదావిష్కరణ గురించి రాసింది .టర్కులు ,ఆఫ్గన్లు ఇండియా ను ‘’అల్ హింద్’’అని మొదటపిలిచారని తరువాత హిందూస్తాన్ గా మారిందని చెప్పింది .పదకొండవ శతాబ్దం లో ఇస్లాం మతం ఇండియా లో ప్రవేశించింది .దీనివలన భౌగోళిక పరిస్తితి మరింత సం క్లిష్టమైంది .మధ్య దేశం గా భావింప బడే చోట ఉన్న కనోజ్ ఎపిసెంటర్ అయింది .అంటే భూకంప కేంద్రమయింది .ప్రతీహార రాజుల రాజధాని ,హిందూ సంస్కృతికి కేంద్రమూ అయింది .1018-19కాలం లో ఇండియా లోనే అతి సంపన్న నగరం అని పించుకోన్నది .దీన్ని గజని మహమ్మద్ కొల్ల గొట్టాడు .అతనే మధ్య ఆసియాలో బలీయమైన ఘజనావిడ్ సామ్రాజ్యానికి సామ్రాట్ అయ్యాడు .అతని మూలాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి .హిమాలయ కనుమల గుండా ఉత్తర భారత్ లోకి చొచ్చుకోచ్చాడు .

ఆండ్రే వింక్ అనే చరిత్రకారుని రచనలను బట్టి హిందూ దేశపు పవిత్ర భౌగోళిక స్తితి గతులన్నీ ముస్లిం చరిత్రకారులు ఆకళింపు చేసుకొన్నారు .పదకొండవ శతాబ్ది మొదటి కాలం లోనే పవిత్ర క్షేత్రాల గుట్టు మట్టులన్ని వారు కరతలా మలకం చేసుకొన్నారు .మధుర ,ఉజ్జయిని కాశి ,సోమనాద్ ల ప్రాధాన్యత ,ప్రాముఖ్యతలను ,అక్కడ ఉన్న అశేష ధన రాశులను గుర్తించి దోచుకొనే ప్లాన్ వేశారు .కనోజ్ అనే కన్యా కుబ్జం ఏడు కోటలతో ,పది వేల దేవాలయాలతో వర్ధిల్లింది .గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం సర్వ సంపన్నమైనది .రాజులు బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి ముక్తి మార్గాన్ని అనుసరించేవారు .సాంప్రదాయ సారం గా వచ్చే పూజా పునస్కారాలను చేసేవారు ..చరిత్ర లో రాసిన దాని ప్రకారం ముస్లిం సైన్యానికి కనోజ్ ను దోచుకోవటానికి ఒక్క రోజు కూడా  పట్ట లేదు .విగ్రహాలను ధ్వంసం చేశారు .దేవతలను అవమానించారు . భయ పడి పారిపోయిన వారిని వెంట తరిమి భీభత్సం సృష్టించారు .వేలాది మందిని నరికి పారేశారు క్రూరం గా ..సొమ్ము దోచుకొని గజని మళ్ళీ తన దేశం వెళ్లి పోయాడే కాని ఇక్కడ స్తిరం గా ఉండలేదు .లక్ష్మీ ధర పండితుని కధనం ప్రకారం  పన్నెండవ శతాబ్ది లో కనోజ్ ను ‘’గహాడ వాలా ‘’రాజులు పాలించారు .అప్పటికి కొంత స్తిరత్వం వచ్చింది .ఆ శతాబ్ది చివర్లో కుతుబుద్దేన్ ఐబక్ జయించి కనోజ్ ను ఆక్ర మించటం  తో ఢిల్లీ సుల్తానుల పరిపాలన ప్రారంభ మైంది .

పదకొండు నుండి పదమూడవ శతాబ్ది వరకు రెండు వందల ఏళ్ళు దేవాలయాలు విగ్రహాలు అవిచ్చిన్నం గా ధ్వంసం అవుతూనే ఉన్నాయి .అందినంత ,మోసినంత సంపద దోచుకొని పోతూనే ఉన్నారు .విగ్రహాలను ధ్వంసం చేస్తే మత భావాలు నశిస్తాయని ,ప్రతిమలు స్థానం తప్పి కాళ్ళ కింద వేసి తొక్కితే ప్రభావం కోల్పోతాయని భ్రమించారు వెర్రి నాయాళ్ళు .రాజుల ధన సంపద దేవాలయాలలోనే నిక్షిప్తం అయ్యాయని వాటిని కూల గోడితే రాజు బలేహీనుడై తమకు లొంగి పోతాడని కూడా ముస్లిం దండ యాత్రికుల ఉద్దేశ్యం అని రిచార్డ్ ఈటన్ రాశాడు .ఇది రాజకీయ ఆట .స్థానిక రాజు భౌగోళిక పరిస్తితి ననుసరించి దేవాలయాలను నిర్మించి పూజిస్తూ కాపాడుకొంటున్నాడు .దాన్ని విగ్రహారధాన నిషేధం తో భయ పెట్టారు .కాని వాళ్ళే చివరికి నాశనమైపోయారు .దేనికీ భయపడని హిందువులు మళ్ళీ కొత్త దేవాలయాలు కట్టుకున్నారు .పునర్వైభావాన్ని తెచ్చారు .ఇండియాకున్న పవిత్ర భౌగోళిక స్తితిని ముస్లిం దండ యాత్రికులు చేడ గోట్టారన్నది మాత్రం నిజం అంటాడు  ఆండ్రే వింక్ ..

ఈ దండ యాత్రా ఫలితమే ఒక కొత్త విశ్వ మత స్తాపనకు దారి తీసింది .హిందూ యాత్రికుల మీద పన్ను వేసినా యాత్రలు పెరిగాయే కాని తగ్గలేదు అదీ విశ్వాసం .సూఫీ మతం రావటం తో కొత్త యాత్రాస్తలాలేర్పడ్డాయి .ఇండియా లో మొదటి సూఫీ అనుచరులు క్రిస్టీ కి చెందినా వారు .క్రిస్టీ మత ప్రవక్తలు పుట్టిన చోటు మరణించిన చోటూ కూడా పవిత్ర యాత్రా స్థలాలైనాయి .పద మూడు నుండి పది హేడవ శతాబ్ది వరకు సూఫీ స్మారకాలు చాలా ప్రధాన పాత్ర పోషించాయి .వీటిని దర్శించటానికి ముస్లిం లతో బాటు హిందువులు కూడా ఎక్కువ సంఖ్య లో వచ్చేవారు .ఇండో ముస్లిం పాలకులు ఇండియన్లుగా ఇస్లామిక్ గా ఉండటం అనే కొత్త దశ ఏర్పడింది .

ఢిల్లీ లోని 1325కు చెందిన నిజాముద్దీన్ ఔలియ సమాధి దక్షిణ ఆసియాలోనే అతి ప్రధాన చిస్టే కేంద్రం అయింది .అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూ ముస్లిం భక్తులకు దివ్య క్షేత్రం గా నే ఉంది .1235కు చెందిన ఢిల్లీ లోని  కుతు బుదీన్ బఖ్తియార్ వద్ద మొగల్ చక్ర వర్తి బాబర్ ప్రార్ధనలు చేసే వాడు .గాంధి మహాత్ముడు దీనిని ఏకత్వ చిహ్నం గా భావించేవారు .హత్యకు ముందు ఆయన ఇక్కడికి వచ్చి వేల్లాడుకూడా .అదే కాలానికి చెందిన అజ్మీర్ లోని మౌఉద్దేన్ క్రిస్టి దర్గా కూడా అందరిని ఆకర్షిస్తోంది .ఈ దర్గాను అక్బర్ చక్ర వర్తి పద్నాలుగు సార్లు దర్శించాడు చాలా. సార్లు నడిచి వెళ్ళాడు కూడా .మౌఉద్దేన్ చని పోయిన రోజున జరిగే ఉర్స్ ఉత్సవానికి తీర్ధ యాత్రగా ప్రజలు రావటం విశేషం .ఈ మధ్య జరిగిన ఉర్స్ ఉత్సవానికి మూడు లక్షల మంది హిందూ ముస్లిం యాత్రికులు వచ్చినట్లు సమాచారం .ఈ సూఫీ ప్రవక్తల వలన ముస్లిం చాందస వాదం బల హీన పడింది క్రమ క్రమం గా .ఢిల్లీ సుల్తాన్లు వీరి దాసులవటం తో గణనీయ మైన మార్పే వచ్చింది .

భక్తియార్ కాకి ‘’సామ వేదాన్ని చదివే వాడు .దీన్ని చూసి ఉలేమా  క్రోధోన్మత్తుడయ్యాడు .కాని ‘’ కాకి ‘’గారు పాడుతుంటే రహస్యం గా వినేవాడట .నిజాముద్దీన్ ఔలియా గారు రాజులతో అధికారులతో సంబంధం పెట్టుకొనే వాడు కాదు .రాజు ముఖ  ద్వారం నుండి లోపలి ప్రవేశిస్తుంటే  వెనక  ద్వారం నుండి బయటికి వెళ్లి పోయే వాడట .దర్గా యెడల సుల్తానుల రాజు ల అభిమానం భక్తీ ఏ మాత్రం తగ్గలేదట .లక్నో –ఫైజా బాద్ మార్గమధ్యం లో ఉన్న సయ్యద్ సాలార్ మాసుద్ ఘాజి కి చెందిన దర్గా అక్బర్ కాలం నుండి ఈ నాటివరకు లక్షలాది సందర్శకులకు నిలయం గా ఉంది .ఘాజి మియాన్ అనే దైవ భక్తీ గల సైనికుడి మృతికి చిహ్నమే ఈ దర్గా .ఇక్కడ వసంత మేలా ,జ్యేష్ట మేలా నిర్వహిస్తారు .నిజాముద్ద్దీన్ ఔలియ శిష్యుడు నసీరుద్దేన్ చిరాగ్ దర్గా ఢిల్లీ కే కాదు యావత్ దేశానికి కాంతి నిస్తోంది .అక్కడి సరస్సు చుట్టూ గుడారాలు వేసుకొని భక్తులు ఉండి దర్శిస్తారు .నిజా ముద్దిన్ గారు ‘’ప్రతి దేశం  విశ్వాసానికి ,దైవానికి సరైన దారి చూపిస్తుంది ‘’అని ఒక ద్విపదలో మొదటి పంక్తి చెబితే శిష్యుడు కవి అయిన అమీర్ ఖుశ్రు ‘’నేను నా ఆలయాన్ని ఆయన దారి లోనే కోడీకల టోపీ తో ఏర్పరచుకోన్నాను ‘’అని రెండో పంక్తి పూర్తీ చేశాడట .ఇక్కడ ఆయన అంటే నిజాముద్దీన్ గారే నని కవి హృదయం .ఈక్రిస్టేలు ఎవరూ మక్కా యాత్ర చేయలేదు .వీరి ‘’కిలా’’ మాత్రం మక్కా వైపున ఉంటుంది అంతే .

హిందూ స్తాన్ అంటే ‘’వతన్ ‘’అంటే స్వదేశం .హిందూ ముస్లిం లందరిది .ఆల్ హింద్ పేరిట అక్బర్ రాజ్య పాలన చేశాడు .ఆయన కొద్ది ముక్క అయిన ఉత్తరభారత రాజు కాదు యావత్ భారతానికి చక్రవర్తిని అనే భావం తో పరిపాలన సాగించాడు .కాందహార్ నుండి దక్షిణ సముద్రం వరకు ,కామ్భాయిత్ నుండి బంగాళా ఖాతం వరకు రాజ్యాన్నిఏలాడు . గాంధారమే కాంద హార్. ఆఫ్గని స్తాన్ లో ఉంది దీన్నే ఆగ్నేయ ఇండియా అనేవారు .కంభాయిట్ అరేబియా సముద్రం లోని కాంబే జలసంధి. ఇదీ హిందూస్తానమంటే.ఇందులోని ఢిల్లీ ,లాహోర్ సూరత్ నగరాలన్నీ ,మధ్యలోని నదీ నదాలన్నీ ,భూమి అంతా హిందూస్తాన్ .పవిత్ర గంగా జలం అంటే విపరీతమైన భక్తీ ఉన్న పిచ్చి తుగ్లక్ అన బడే మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ దానిని ఢిల్లీ నుండి వెయ్యి కిలో మీటర్ల దూరం లో ఉన్నగంగా నదికి దగ్గరలో ఉన్న  దౌలతా బాద్ కు మార్చాడు .ఇది పిచ్చి పనికాదు .పవిత్ర గంగాజలంపై భక్తీ .ఇన్ని మంచి విషయాలు రాసి మనకు అందించిన రచయిత్రి డయానా ఎల్ ఎక్ ను అభి నందిస్తున్నా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

42 ఏళ్లుగా కొన సాగుతున్న సంగీత సమారోహం

తబస్తీ వెలుగులు – 5
రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్‌లోని మక్కా మసీదు కొలను అంచున రెండు రాళ్లతో కూడిన బెంచీల లాంటివి ఉన్నాయి. సందర్శకులు ఆ రాళ్ల మీద కూర్చుని సేద దీరుతుంటారు. అక్కడ కూర్చున్న వారు మళ్లీ హైదరాబాద్ సందర్శిస్తారన్నది స్థల పురాణంలో భాగం. ఆ మాట ఎలా ఉన్నా హైదరాబాద్‌తో సంబంధం ఏర్పడిన వారు ఈ నగరాన్ని మరిచి పోవడం మాత్రం కష్టం అన్నది మాత్రం వాస్తవం.  విడిచిపోరు అన్నది అంతకన్నా ఎక్కువ వాస్తవం. చాలా మంది ఇతరేతర ప్రయోజనాల కోసం ఈ నగరాన్ని విడవకుండా ఉంటే మరి కొందరు ఇక్కడి సంస్కృతికి ముగ్ధులై పోతారు. ఇంకొందరు ఈ నగర సంస్కృతికి దోహదం చేస్తుంటారు.శాస్త్రీయ గాయకుడైన పద్మభూషణ్ పండిత్ జస్రాజ్‌కు హైదరాబాద్‌తో అలాంటి బంధమే ఉంది. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్‌లో జన్మించారు. కాని గత 42 ఏళ్ల నుంచి ప్రతి నవంబర్ 29 నుంచి డిసెంబర్ ఒకటి దాకా ఇక్కడ సంగీత సమారోహం నిర్వహిస్తున్నారు. జస్రాజ్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి మోతీ రాం ఈ నగరంలోనే 1934‌లో తుది శ్వాస విడిచారు. 1934 నవంబర్ 30న పండిత్ మోతీ రాంను హైదరాబాద్ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమించాల్సి ఉండింది. ఆ పని జరగడానికి అయిదు గంటల ముందు పండిత్ మోతీ రాం అంతిమ శ్వాస విడిచారు. మహారాజా కిషన్ ప్రసాద్ పండిత్ మోతీ రాంను చౌమొహల్లా పాలెస్‌కు తీసుకెళ్లాల్సింది. అక్కడ ఆయన సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. కానీ మోతీ రాం స్వర్గస్థులైనందువల్ల ఆ కచేరీ జరగనే లేదు.పండిత్ మోతీ రాం సమాధి హైదరాబాద్‌లోనే ఉంది. పుత్లీ బౌలీ చౌరస్తా నుంచి గౌలీగుడా వెళ్లే దారిని పండిత్ మోతీరాం మార్గ్ అంటారు. ఆ రోడ్డులోనే ధరం సంగీత్ శ్రింగార్ అనే సంగీత వాద్యాలు విక్రయించే దుకాణం ఉండడం యాదృచ్ఛికమే కావచ్చు. పండిత్ మోతీ రాం ఈ నగరంలో మృతి చెందినందువల్ల, బాల్యంలో పండిత్ జస్రాజ్ ఇక్కడ కొంత కాలం ఉన్నందువల్ల జస్రాజ్‌కు హైదరాబాద్ మీద వల్ల మాలిన అభిమానం. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సంగీత సమ్మేళనం నిర్వహించి మోతీ రాంకు నివాళి అర్పిస్తుంటారు. 1972లో ప్రారంభమైన ఈ సంగీత సమారోహాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత కారులు, గాయకులు ఈ సంగీత సమ్మేళనంలో పాల్గొంటూ ఉంటారు. ఈ కచేరీ హైదరాబాద్ సంస్కృతిలో అంతర్భాగమై పోయింది. పండిత్ జస్రాజ్ అన్న పండిత్ మణీరాం కూడా ప్రసిద్ధ గాయకుడే. జస్రాజ్‌కు ఆయనే గురువు. మణీరాం 1986లో మరణించారు. ఆ తర్వాతి నుంచి పండిత్ మోతీ రాం సంగీత్ సమారోహం పండిత్ మోతీరాం, పండిత్ మణీరాం సంగీత సమారోహంగా కొనసాగుతూనే ఉంది.నిధుల కొరత ఉన్నా నిరంతరాయంగా నాలుగు దశాబ్దాలకు పైబడి ఈ సమారోహం నిర్వహించడం మాటలు కాదు. ఇది హైదరాబాద్ సంస్కృతి గొప్పతనమేనేమో. జస్రాజ్ గురు శిష్య పరంపరను కొనసాగించడమే కాకుండా అనేక మంది సంగీతకారులకు ఊపిరులూదిన కళా తపస్వి. ఈ ఉత్సవాలను 2009 నుంచి చౌమొహల్లా పాలెస్‌లో నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఇవి భారతీయ విద్యా భవన్, సీఐఈఎఫ్‌ఎల్, నిజాం కాలేజి లాంటి చోట్ల నిర్వహించారు. ఎక్కడ నిర్వహించినా ప్రవేశం ఉచితం. చలి ఎక్కువగా ఉండే నవంబర్ ఆఖరులో సైతం హిందుస్తానీ సంగీత ప్రియులు ఈ ఉత్సవాలకు హాజరై గానామృతాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు.పండిత్ మోతీ రాం, పండిత్ మణీరాం ప్రసిద్ధ గాయకులే కాదు అపురూపమైన సంగీత దర్శకులు కూడా. ఈ ఉత్సవాలలో హైదరాబాద్‌లోని హిందుస్తానీ సంగీత ప్రియులు ప్రఖ్యాత గాయకుల, వాద్యకారుల, సంగీత విద్వాంసుల కళాభినివేశాన్ని చవి చూసే అవకాశం కలుగుతోంది. అనంద్ శర్మ, అంకిత సర్సుంకర్, రతన్ మోహన్ శర్మ, సంజీవ్ అభయంకర్, మాండోలిన్ శ్రీనివాస్‌లాంటి వారి కచేరీలు చూసే అరుదైన అవకాశం పండిత్ జస్రాజ్ దీక్ష వల్ల సాధ్యమవుతోంది. హరిప్రసాద్ చౌరాసియా, సెల్వ గణేశ్, కేలూ చరన్ మహాపాత్ర  సంతానమైన రతీకాంత్ మహాపాత్ర, సుజాత లాంటి వారి ఒడిస్సీ నృత్యాన్ని చూసే అవకాశం కూడా కలుగుతోంది. జస్రాజ్ గానామృతం ఎటూ ఉంటుంది. జస్రాజ్ వినూత్నమైన జుగల్బందీ రూపొందించారు. ఆడ, మగ గాయకులు భిన్నమైన రాగాలలో పాడే ఈ జుగల్బందీని జస్రంగీ జుగల్బందీ అంటారు. జస్రాజ్ శిష్య గణంలో రతన్ మోహన్ శర్మ, సంజీవ్ అభయంకర్, రమేశ్ నారాయణ్, సుమన్ ఘోష్, తృప్తీ ముఖర్జీ, ప్రీతం భట్టాచార్జీ, కళా రాం నాథ్, సాధన సర్గం వంటి ఉద్ధండులు ఉన్నారు. వీరంతా ఏదో ఒక సందర్బంలో హైదరాబాద్‌లో తమ కళా కౌశలాన్ని ఆవిష్కరించిన వారే.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇండియా అంటే ?

ఇండియా అంటే ?

నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు Diana .L.Eck అనే ఆమె రాసిన ‘’India ,A sacred geography పుస్తకాన్ని ఆదరం తో నాకు 5-3-14న అందేట్లు పంపించారు .నేను 500పేజీలున్న దాన్ని 20-3-14నచదవటం ప్రారంభించి తాపీగా చదువుతూ 13-5-14 కు పూర్తీ చేశాను .అందులో నాకు తెలియని భారత్ యాత్రా విశేషాలను ఆమె స్వానుభవం తో చూసి చదివి తెలుసుకొని రాసింది .అవి అందరికి ఉపయోగ పడతాయని భావించి ఆ విశేషాలను మీ ముందుంచుతున్నాను .ముందుగా రచయిత్రి ఎక్ గురించి తెలియ జేస్తాను. ఆమె రిలీజియస్ స్కాలర్ .హార్వర్డ్ యూని వర్సిటి లో కంపారటివ్ రిలిజియన్స్ అండ్  ఇండియన్ స్టడీస్ లో  ప్రొఫెసర్ . లోవెల్ హౌస్ అనే సంస్థకు మాస్టర్ .హార్వర్డ్ వీకీ పీడియ లో ప్లూరలిజం ప్రాజెక్ట్ కు డైరెక్టర్ .5-7-1945లో అమెరికా లోని వాషింగ్టన్ దగ్గర టోకోమా లో జన్మించింది ..హార్వర్డ్ యూని వర్సిటి స్మిత్ కాలేజీలోను ,లండన్ లోని S.O.A.S. లోను చదివింది .అమెరికా ,కేనడాలలోని గుగ్గెన్ హీం ఫెలోషిప్ ను  హ్యుమానిటీస్ లో పొందింది .ఏ న్యు రెలిజియస్ అమెరికా ,దర్శన్ సీఇంగ్ ది డివైన్ , యెన్  కౌంటరింగ్ గాడ్,బనారస్ –సిటీ ఆఫ్ లైట్స్ మొదలైన పుస్తకాలు రాసింది .భారత దేశం అంతా ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి తీర్ధ యాత్రలో ఏ పరమార్ధం ఉందొ భౌగోళికం గా భారత దేశం లో తీర్ధ యాత్రకున్న ప్రాముఖ్యమేమిటో చాలా గొప్పగా అతి తేలిక భాషలో తెలుగులోనే చదువుతున్నామా అనే ట్లు రాసింది .ఆ విశేషాలే తెలియ జేస్తున్నాను .

భారత దేశ భౌగోళిక పరిస్తితి ని భారతీయులు రాసి ఉంచిన విషయాలను విధానాలను చూసి ప్రపంచ విజేత అలేక్సాందర్ బియాస్ నది ఒడ్డున సమీక్షించాడట .సైన్యాధ్యక్షులు సైనికులు ఇక జయించింది చాలు వెనక్కి తిరిగి వెళ్లి పోదామని గోల చేస్తున్నారు .అంతా విని ‘’అసలు ఇప్పుడు మనం యెక్క డున్నాం’’? అని అడిగాడు నియార్కాస్ అనే అతని చరిత్రకారుని ,మిగిలిన ఆఫీసర్లను .పంచ నదుల ప్రదేశం అయిన పంజాబ్ ను అలేక్సాండర్ ఈజిప్ట్ ఉత్తరమెట్ట ప్రాంతం అనుకోన్నడట .నైలు నదిని సమీపిస్తున్నామని భావించాడట .మధ్యధరా ప్రాంతం వెనుక ఉన్నామని తలచాడు .విజేత పోరపద్దాడని వారు గ్రహించి అసలు తాము ఎక్కడ ఉన్నామో అక్కడి నుండి ముందుకు అడుగు వేయటం యెంత కష్టమో వివరించారట .గ్రీకు చరిత్ర కారులు రాసినది తప్పు అని అర్ధమైంది .స్త్రాబో అనే చరిత్రకారుడు దీన్ని బయట పెట్టాడట .వాళ్ళు వర్ణించిన దాన్ని బట్టి గ్రీకు సైన్యం ఈజిప్ట్ లో లేదని దాన్ని దాటి ఏంతో దూరం వచ్చామని తెలుసుకొన్నాడు .

గ్రీకు చరిత్ర కారులు  భారత భౌగోళిక శాస్త్రజ్ఞుల రచనలు చదివి ఇండియా అంటే ‘’రాంబాయిడ్ ‘’ఆకారం లో (అసమ చతుర్భుజం )ఆకారం లో ఉందని , పడమర సింధు నది ,ఉత్తరాన పర్వతాలు ,తూర్పు ,దక్షిణాలలో సముద్రం ఉంటుందని చెప్పారు .అది పదహారు వేల స్స్టాడియా అంటే 1838మైళ్ళ దూరం లో ఇండస్ నదికి పడమరలోను ,గంగానదికి తూర్పున అంతే దూరం లోను ఉంటుందని రాశారు .గంగా ముఖ ద్వారం నుండి తూర్పుకు మరో పదహారు వేల స్టాడియా లు దక్షిణాగ్రానికి దూరం లో ఉందని చెప్పారు   కన్యా కుమారి నుండి సింధు నది ముఖ ద్వారానికి పడమటి కనుమల గుండా దూరం 19,000స్టాడియాలు అంటే 2,193మైళ్ళు  సింధు నది ముఖ ద్వారం నుండి  పూర్తీ జల రాసి వరకు 13000స్టాడి యాలు –అంటే 1496మైళ్ళు .దేశంచాలా విశాలమైందని రాశారు .తర్వాత ఎప్పుడో మెగస్థనీస్ యాత్రికుడు ఇండియా  నాలుగు భాగాలలో ఉందని అందులో అతి పెద్ద భాగం విభజింప బడిన దక్షిణ ఆసియా అంత ఉంటుందని చిన్న భాగం యూఫ్రటిస్ నుంచి సముద్రం వరకు ఉన్న భూ భాగం అంత ఉన్న అతి పెద్ద దేశం అని ఉందని చెప్పారు  .అందుకే అలేక్సాండర్ బియాస్ నది ఒడ్డున  ఒలింపియన్ దేవతలకు పన్నెండు  స్మ్రుతి చిహ్నాలు నిర్మించి వెనుదిరిగాడు .

క్రీ పూ 321లో మౌర్య రాజ్య స్థాపనకు పూర్వం ఇండియా ను గురించి రాసినది,తర్వాత ఇరవై ఏళ్ళకు మెగస్త నీస్ రాసింది ,పాటలీ పుత్రం లోని చంద్ర గుప్తా మౌర్యుని ఆస్థానం లో ‘’నికటర్ ‘’గా ఉన్న సెల్యూకస వర్ణించింది అన్ని చూస్తె ఇండియా సుమారుగా చతుర్భుజా కారం గా ఉన్నదని అందరూ ఒప్పుకున్నారని తెలుస్తోంది .సింధు నది పొడవు ,సింధునది నుండి పాటలీ పుత్ర వరకు దూరం ,అక్కడి నుండి గంగానది ముఖ ద్వారం వరకు తూర్పు ,పడమటి తీరాల దూరం అన్ని ఖచ్చితం గా ఉన్నాయి .  మెగాస్థ నీసు కూడా మార్గాలలలో మధ్య మధ్య రాళ్ళ స్తంభాలు పాతి దూరాన్ని తెలియ జేశారని రాశాడు .రెండు వేల సంవత్సరాల తర్వాత 1871 లో రాయల్ ఇంజినీర్ల మేజర్ జెనరల్ ,ఆ తర్వాత ఆర్కిలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా కు డైరెక్టర్ అయిన  అలేక్సాండర్ కన్నింగ్ హాం మెగస్తనీస్ రాసిన దానికి అదో సూచిక (ఫుట్ నోట్స్)రాస్తూ ‘’అలేక్సాండర్ కు అతని అనుచరులు ఇచ్చిన దూరాలన్ని ఖచ్చితం గా సరిపోయాయని ,దీన్ని బట్టి భారత దేశ వైశాల్యం పూర్తిగా రుజువైందని ఏ ఆధారాలు యంత్రాలు లేని  కాలం లో భారతీయుల గణితం యెంత నిర్దుష్టం గా ఉందొ ,వారి దేశ సరిహద్దుల్ని ఎంత ఖచ్చితం గా చెప్పారో తెలుసుకొంటే ఆశ్చర్యం వేస్తుంది ‘’అని రాశాడు .

భారతీయుల భౌగోళిక శాస్త్ర విజ్ఞానం చిరస్మరణీయం .హిందువులకు చరిత్ర తెలియదు అనే వారికి ఇది చెంప దెబ్బ .వారి భౌగోళిక పరిజ్ఞానం అత్యంత విశ్వసనీయమైనది .దేశం లో రాజకీయ ఐక్యత లేని ఆ కాలం లో అలేక్సాండర్ కు ఇండియా అంతా అతి విశాలమైన అతి పెద్ద ఒకే దేశం అని అతని ఆఫీసర్లు తెలియ జెప్పారని రచయిత్రి ఏక్ అంటుంది .

మరిన్ని విశేషాలు మరోసారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి బహుముఖ ప్రజ్ఞా శాలిని – డాక్టర్ నావల్ ఎల్ సాదావి

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి  బహుముఖ ప్రజ్ఞా శాలిని  – డాక్టర్ నావల్ ఎల్ సాదావి

ఈజిప్ట్ దేశం లో స్త్రీ వాద రచయిత్రిగా ,సాంఘిక సేవాకార్య క్రమ నిర్వాహకురాలిగా ,మానసిక శాస్త్ర  వైద్యురాలి  గా ఇస్లాం లో మహిళ లపై అనేక గ్రంధాలు రాసిన బహుముఖ పరజ్ఞా శాలి గా పేరొందిన నావల్ ఎల్ సాదావి గురించి మనం తెలుసుకో బోతున్నాం.

Nawal El Saadawi 02.JPG

1931అక్టోబర్ 27న కఫార్ తహ్లా అనే కుగ్రామం లో సాదావి జన్మించింది .తండ్రి ప్రభుత్వ విద్యాశాఖలో ఆఫీసర్ .1919లో ఈజిప్ట్ విప్లవ కాలం లో ఈజిప్ట్ ,సూడాన్ లను బ్రిటిష్ ప్రభుత్వం వశ పరచుకోవటం పై తీవ్ర నిరసన తెలిపిన దేశ భక్తుడు .దీని ఫలితం గా ఆయనకు ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వలేదు .పదేళ్ళు ఆయన ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది .ఆధునిక భావాలున్న వాడు కనుక కూతురికి విద్య నేర్పించి ,ఆమె మనసులోని భావాలను బయటికి చెప్పమని ఆరబిక్ భాష నేర్వమని ప్రోత్స హించే వాడు .ఆమె చిన్నతనం లోనే తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతురాలు .పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఆమె పై పడింది .

ధైర్యం గా ముందుకు అడుగులు వేస్తూ కైరో యూని వర్సిటి లో చేరి చదివి  మెడికల్ డిగ్రీ సంపాదించింది .తన పేషెంట్స్ లలో ఒకరిని ఆ నాటి హింసా దౌర్జన్యం నుండి కాపాడే ప్రయత్నం చేస్తే కైరో కు వెళ్ళిపొమ్మని అదేశాలోచ్చాయి .పబ్లిక్ హెల్త్ కు డైరెక్టర్ అయి ,షరీఫ్ హతాతా ను మూడవ పెళ్లి చేసుకొన్నది .భర్త కూడా ప్రభుత్వ డాక్టర్ ,రచయిత, ,పదమూడేళ్ళు రాజకీయ ఖైదీ గా ఉన్న వాడు కూడా .1972లో ‘’ఆల్ మర వ ఆల్ జీన్స్ ‘’-(స్స్త్రీలు –సెక్స్)అనే పుస్తకాన్ని రాసి ప్రచురించింది .ఈ పుస్తకం’’ సెకండ్ వేవ్ ఫెమినిజం ‘’కు పాఠ్య గ్రంధం అయింది .ఈ పుస్తక రచన ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది .హెల్త్ జర్నల్ కు చీఫ్ ఎడిటర్ పదవీ ఊడ గొట్టారు .దీనితో బాటు మెడికల్ ఆసోసియేషన్ లో అసిస్టంట్ జెనరల్ సెక్రెటరిపదవికీ మంగళం పాడారు . 1973నుంచి మూడేళ్ళు ఎయిన్ షామ్స్ యూని వర్సిటి కి చెందిన ఫాకల్టి ఆఫ్ మెడిసిన్ లో స్త్రీలు –నరాల వ్యాధులు ‘’పై రిసెర్చ్ చేసింది .మధ్య ప్రాచ్యం ,ఆఫ్రికాలలో మహిళా కార్య క్రమాలకు యునైటెడ్ నేషన్స్ కు సలహా దారు గా పని చేసింది .

ఈజిప్ట్ ప్రభుత్వం ఆమెను ఎప్పుడూ అనుమానం గా క్రూరం గా నే చూస్తున్నప్పటికీ ఆమెధైర్యం గా  ‘’కన్ ఫ్రాంటేషన్’’అనే మహిళా పత్రికను నిర్వహించింది  .ప్రెసిడెంట్ అన్వర్ సాదత్ ఆమెనుకనాతిర్ వుమెన్ ప్రిజన్ లో  ఖైదు  లో పెట్టించాడు .సాదత్ హత్యానంతరం ఒక నెలలోనే ఆమెను విడుదల చేశారు ఈ ఉదంతం పై ఆమె ‘’నేను కలం పట్టిరాయటం  ప్రారంభించిన దగ్గరనుండి  అనుక్షణం  ప్రమాదం అంచులోనే ఉన్నాను’’ అని చెప్పేది .దీనిపై ‘’జైలు అనుభవాలు ‘’పుస్తకం రాసింది .ఈ అనుభవాలతో ‘’ఏ వుమెన్ ఆఫ్ పాయింట్ జీరో ‘’పుస్తకమూ రాసింది .ఇస్లామిక్ మత ఛాందసులు ,రాజకీయ నాయకులు పెట్టిన ఒత్తిడి తట్టుకోలేక ఈజిప్ట్ నుండి పారిపోవాల్సి వచ్చింది .అమెరికాలోని డ్యూక్ యూని వర్సిటి ,వాషింగ్ టన్ యూనివర్సిటీలు ఆసియా ఆఫ్రికా భాషా డిపార్ట్ మెంట్ లో పని చేయమని ఆహ్వానిస్తే వెళ్లి చేరింది .అక్కడి నుండి ఆమె జైత్ర యాత్ర ప్రారంభమైంది .ఎన్నో కాలేజీలు యూని వర్సిటీలలో పని చేసే అవకాశం వచ్చింది .ప్రసిద్ధమైన హార్వర్డ్ ,కొలంబియా ,,ఏల్ జార్జి టౌన్ ,ఫ్లారిడా ,కైరో యూని వర్సిటీ కాలి ఫోర్నియా లోని బర్కిలీ యూని వర్సిటిలలో  లలో బోధించి గొప్ప గుర్తింపు పొందింది .1996లో మళ్ళీ ఈజిప్ట్ చేరుకొంది .అందుకే ఆమె మాతృభాష అరెబిక్ తో బాటు ఇంగ్లీష్ లోను అమోఘం గా మాట్లాడే సామర్ధ్యం కలిగింది .2005లో ఈజిప్ట్ అధ్యక్ష పదవికి పోటీ కూడా చేసింది .దాదాపు నలభైకి పైగా పుస్తకాలను వివిధ విషయాలపై రాసింది .అందులో చరిత్ర సంస్కృతీ బాల సాహిత్యం నవల ,నాటకం ,ఫెమినిస్ట్ రచనలు ,కదా సంపుటులు ,స్మృతులు వగైరాలున్నాయి .

ఆమె ప్రతిభను గుర్తించి కౌన్సిల్ ఆఫ్ యూరప్ వారు ‘’నార్త్ –సౌత్ ప్రైజ్ ‘’ను ఇచ్చి సత్కరించారు .బెల్జియం లోని బ్రసెల్ లో ఉన్న వ్రిజే యూని వర్సిటేట్ ,డిబ్రే డీ బెల్జీక్ ,మెక్సికో లోని నేషనల్ అటానమస్ యూని వర్సిటీలు ‘’గౌరవ దాక్ట రేట్ ‘’ నిచ్చి గౌరవించి సత్కరించాయి  ష్టిగ్ డాగర్మన్ ప్రైజ్ ఆమె ను వరించింది . ఈజిప్ట్ స్కూళ్ళలో మత బోధను నిషేధించాలని ఉద్యమం చేసింది .2011తాహిర్ స్క్వేర్ దంతం పై అందరితో కలిసి వ్యతిరేకించింది .చిన్నప్పటి నుంచే రాయటం ప్రారంభించిన సాదావి చిన్నకదల సంపుటిని మొదటగా వెలువరించింది .’’ఐ లేరండ్ లవ్ ‘’అనే నవల రాసింది .’’మేమైర్స్ ఆఫ్ ఏ వుమన్ డాక్టర్ ‘’అనే ఆత్మ కద రాసుకోంది.ఎన్నో యాంతాలజీ గ్రంధాలు రాసి ప్రచురించింది .ఆమె రచనలు దాదాపు ఇరవై భాషల్లోకి అనువాదం పొందాయి .1972లో ‘’వుమెన్ అండ్ సెక్స్ ‘’అనే నాన్ ఫిక్షన్ ,’’ది హిడెన్ ఫేస్ ఆఫ్ ఈవ్ ,’’గాడ్ డైస్ బై ది నైల్ ‘’,’’సర్క్లింగ్ సాంగ్ ‘’,దిఫెయిల్ ఆఫ్ ది ఇమాం ,’’సెర్చింగ్’’ మొదలైన ప్రభావ శీల రచనలు చేసి ఈజిప్ట్ ప్రభుత్వం గుండెల్లో నిద్ర లేకుండా చేసింది .మక్కా లో హజ్ యాత్రికులు ‘’నల్ల రాయి ‘’ని ముద్దు పెట్టుకోవటం ఇస్లాం కు పూర్వం ఉన్న పాగన్ భావమూలమే నని నిర్భయం గా చెప్పింది నావల్ ఎల్ .సాదావి .ముస్లిం లలో చిన్నతనం లో మగ పిల్లలకు ‘’సుల్తీ ‘’చేసినట్లే ,ఆడపిల్లలకు ‘’genital mutilation  ‘’ చేయటాన్ని వ్యతిరేకించింది .పన్నెండేళ్ళ బీదర్  శాకీర్ అనే అమ్మాయికి ఈ ఆపరేషన్ జరగటం చూసి భరించలేక ‘’  “Bedour, did you have to die for some light to shine in the dark minds? Did you have to pay with your dear life a price … for doctors and clerics to learn that the right religion   doesn’t cut children’s organs.’’అని బాధ పడింది. డాక్టర్ గా  మానవత్వం ఉన్న మహిళా గా దీన్ని ,మగపిల్లలకు చేసే సుల్తీని కూడా వ్యతిరేకించింది ప్రచారం చేసింది .ఇలా చేయటానికి ఎన్ని గుడేలు ఉండాలో  అన్నీ ఆమెకున్నాయి .అందుకే ఆమె గురించి తెలుసు కొంటున్నాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్ర బాబు తో మా మూడో అబ్బాయి డాక్టర్ మూర్తి -ముందడుగు మేగజైన్ తో బాబు కు కుడిపక్క

 

 

 

 

 

murti-babu 001
DEAR ALL,

Young Boy from among our relatives got Gold Meda in Chess in the Common Wealth Games-2014.  He got the award under disabled person category.  I wrote a small write up in my blog.  You can read it by clicking on the following link:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లు యమ సీరియస్‌!

అల్లు యమ సీరియస్‌!

Published at: 31-07-2014 00:19 AM

అల్లు.. ఈ పేరు వినగానే పెదాల మీద చిరునవ్వు దానంతట అదే వచ్చేస్తుంది.  కళ్ల ముందు రకరకాల పాత్రలు కదలాడతాయి. తెలుగు సినిమా చరిత్రలో హాస్య నటులకు ఒక అధ్యాయం ఉంటే..  దానిలో మొదటి పంక్తిలో అల్లు ఉంటారు. తన తర్వాతి తరాల నటులను ఎంతో ప్రభావితం చేసిన అల్లు గురించి ఆయన వర్థంతి సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం జ్ఞాపకాలు..

‘‘దాదాపు 35 ఏళ్ల క్రితం.. నేను వీరవాసరంలో కాలేజీలో చదివే రోజుల్లో- ఒక కార్యక్రమంలో అల్లురామలింగయ్య చీఫ్‌ గెస్ట్‌. ఆ కార్యక్రమంలో నేను మిమిక్రి చేశా. వెండి తెర మీద కాకుండా ఒక పెద్ద నటుణ్ణి నిజ జీవితంలో కలవటం నాకదే మొదటి సారి. నా మిమిక్రీని ఆయన చాలా మెచ్చుకున్నారు. ఒక పేరుమోసిన హాస్యనటుడు మామూలు కాలేజీ స్టూడెంట్‌ భుజం మీద చేయి వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేను ఏనుగెక్కినంత ఆనందపడ్డా. ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. కట్‌ చేస్తే.. ఆ తర్వాత నేను అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసు వెళ్లాను. అప్పుడు సినీఫీల్డ్‌ అంతా మద్రాసులోనే ఉండేది. షూటింగ్‌లు కూడా ఎక్కువగా అక్కడే జరిగేవి. ఒక రోజు చంటబ్బాయ్‌ షూటింగ్‌ జరుగుతుంటే చూడటానికి వెళ్లా. ఆ సినిమాలో అల్లు డ్రిల్‌ మాస్టర్‌ వేషం వేశారు. నేను షూటింగ్‌కి వెళ్లే సరికి స్కూలు సీను తీస్తున్నారు. అందులో ఆలీ స్కూలు విద్యార్థి. అల్లు కెమెరా ముందు నటించటం మొదటిసారి చూశాను. ఆయన నటన చాలా సహజంగా అనిపించింది. ఒక స్కూల్లో డ్రిల్‌ మాస్టర్‌ ఇలాగే ఉంటాడా అనిపించింది.

ఈ సహజత్వమే అల్లు గొప్పతనం. రేలంగి.. రాజబాబు..పద్మనాభం..రమణారెడ్డి.. ఇలా అనేక మంది హస్యనటులు మన సినిమాలలో నవ్వులు పండించారు. ఒక్కోక్కరిది ఒక్కో స్టైల్‌. వీరందరూ సహజనటులే. వీరికి అల్లుకి ఉన్న తేడా ఏమిటంటే- అల్లు వీరందరితో కలిసి నటించారు. తర్వాతి తరంలో నాగభూషణం, సత్యన్నారాయణ, రావుగోపాలరావు వంటి కాకలు తీరిన విలన్స్‌తో కూడా నటించారు. మెయిన్‌ విలన్‌ పక్కన ఉండి హాస్యం పండిస్తూ, స్ర్కీన్‌ ప్రిజన్స్‌ పోకుండా చూసుకోవటమనేది సామాన్యమైన విషయం కాదు. కానీ సహజనటులకు ఇది చాలా సులభంగా అబ్బేస్తుంది. ఇలా నటించాలంటే మన చుట్టూ ఉన్న సమాజంలోని రకరకాల వ్యక్తులను గమనిస్తూ ఉండాలి. వారికి సహజంగా ఉన్న లక్షణాలు, వృతిరీత్యా అబ్బిన మేనరిజాలను పరిశీలించాలి. ఉదాహరణకు డాక్టర్లనే తీసుకుందాం. అలోపతి డాక్టర్ల మాటతీరు, బాడీ లాంగ్వేజ్‌ ఒక విధంగా ఉంటుంది. ఆయిర్వేదం డాక్టర్ల మాటతీరు, బాడీలాంగ్వేజీ మరో విధంగా ఉంటుంది. సహజనటుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా పట్టుకుంటాడు. దానిని అనుకరించ గలుగుతాడు. ఈ విషయంలో అల్లుకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయన రకరకాల పాత్రలు చేసి మెప్పించగలిగాడు. ముఖ్యంగా పురోహితుడి పాత్ర వేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పూర్వాశ్రమంలో పురోహితుడా అనే విధంగా ఉండేవి. అల్లు నటనలో ఉన్న మరో ముఖ్యమైన అంశం- పాజ్‌. హావభావాలు, డైలాగ్‌ మీద పూర్తి పట్టు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. పిడుగు ముందు మెరుపు వచ్చినట్లు- హావభావాలు ముందు వస్తాయి. ఆ తర్వాత ఒక పాజ్‌తో డైలాగ్‌ వస్తుంది. ఇది కూడా చాలా సహజంగా ఉంటుంది. నేను ఆయనతో పది సినిమాలు నటించాను. ప్రతి క్యారెక్టర్‌లోను ఆయన ఒదిగిపోయేవారు. ఆ పాత్ర నిజజీవితంలో అలాగే ఉంటుందా అనిపించేది..

ఒక సారి అల్లు కాలి బొటన వేలికి గాయం తగిలింది. దానికి కట్టు కట్టుకున్నాడు. ఇంతలో ఒకాయన వచ్చాడు. ’’సార్‌.. ఏమైంది సార్‌.. కాలికి దెబ్బతగిలినట్లుంది.. పెద్ద దెబ్బే తగిలినట్లుంది.. ఏమైంది సార్‌..’’ అని వెయ్యి మెలికలు తిరిగి ఓవరేక్షన్‌ చేయటం మొదలుపెట్టాడు. అల్లు ఒక క్షణం ఏం మాట్లాడకుండా ఊరుకొని- ’ఏనుగు తొక్కింది’ అని సమాధానం చెప్పారు.

మద్రాసులో ఆయన తరచూ నిర్మాత జయకృష్ణ ఇంటికి వస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను కూడా కాలక్షేపానికి పిలిచేవారు. అప్పుడు ఆయనను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. చాలా మందికి అల్లు అంటే సినిమాల్లో ఆయన నటించిన రకరకాల పాత్రలు గుర్తుకొస్తాయి. కానీ నిజజీవితంలో ఆయన పూర్తిగా భిన్నంగా ఉండేవారు. స్వభావరీత్యా ఆయన కమ్యూనిస్టు. ఆ భావజాలాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. మార్క్స్‌, లెనిన్‌ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉండేవారు. అల్లు నిజజీవితంలో చాలా సీరియస్‌ మనిషి. తాను కచ్చితంగా ఉండేవాడు. ఇతరులు కూడా అలాగే ఉండాలనుకొనేవారు. అల్లు హోమియో డాక్టర్‌ కావటంతో ఆయన దగ్గరకు రకరకాల సమస్యలతో రోగులు వస్తూ ఉండేవారు. వారికి మందులు కూడా ఇచ్చేవారు. కొందరు హోమియో మందులతో పాటు- అలోపతి మందు కూడా వేసుకొనేవారు. ఆ మర్నాడు వచ్చి- ’’మీరిచ్చిన మందు వేసుకున్నామండి. నెప్పి తగ్గిపోయింది. అయితే మీ మందుతో పాటు మెడికల్‌ షాపులో కొన్న బిళ్ల కూడా వేసుకున్నామండి..’’ అనేవారు. అలాంటి మాటలు వింటే ఆయనకు కోపం వచ్చేది.

‘‘తను బతకాలి.. ఇతరులను బతకనివ్వాలి’’ అనేది అల్లు సూత్రం. ఆయన పక్కవాడిని పల్లెత్తు మాట అనే వారు కాదు. ఎవరైనా వచ్చి అతిగా పొగిడినా, ఆయన మెప్పు పొందాలని చూసినా వారిని ఆటపట్టించేవాడు. ఈ సందర్భంలో ఒక సంఘటన చెప్పుకోవాలి. ఒక సారి అల్లు కాలి బొటన వేలికి గాయం తగిలింది. దానికి కట్టు కట్టుకున్నాడు. ఇంతలో ఒకాయన వచ్చాడు. ’’సార్‌.. ఏమైంది సార్‌.. కాలికి దెబ్బతగిలినట్లుంది.. పెద్ద దెబ్బే తగిలినట్లుంది.. ఏమైంది సార్‌..’’ అని వెయ్యి మెలికలు తిరిగి ఓవరేక్షన్‌ చేయటం మొదలుపెట్టాడు. అల్లు ఒక క్షణం ఏం మాట్లాడకుండా ఊరుకొని- ’ఏనుగు తొక్కింది’ అని సమాధానం చెప్పారు. అప్పుడు అవతల వ్యక్తి మోహంలో ఫీలింగ్స్‌ చూడాల్సిందే తప్ప చెప్పటం వీలు కాదు.. అంతే కాదు. ఆయనకు తన చిన్ననాటి సంగతులన్నీ జ్ఞాపకముండేవి. వాటికి హాస్యం జోడించి అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అయితే దీనికి కూడా సరిహద్దు రేఖ ఉండేది. కొద్దిగా అతిశయోక్తి జోడించి చెప్పటమే తప్ప- ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడేవారు కాదు. అల్లు, ఆయన కుమారుడు అరవింద్‌ సంభాషణలు కూడా చాలా బావుండేవి. కొన్ని సార్లు అది హాస్య సమ్మేళనమా అనిపించేది. కానీ అరవింద్‌కు తన తండ్రి మీద ఉన్న అభిమానం, గౌరవం ఆ మాటల్లో వ్యక్తమవుతూ ఉండేది. ఒక సారి ఒకరు- ’ మీరు ఇన్ని పాత్రలు చేశారు కదా.. వీటిలో మీకు నచ్చిన పాత్ర ఏదీ?’ అని అల్లును అడిగారు. ’’నేను ఎన్ని పాత్రలు చేశాను. వెయ్యి చేసుంటా.. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక పాత్ర, దానికో స్ర్కీన్‌ప్లే ఉంటుంది. ఆ సంఖ్యతో పోల్చుకుంటే నేను చేసిన పాత్రలేమూలకొస్తాయి..’’ అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం చాలు.. ఆయనకు జీవితం పట్ల ఉన్న ధృక్పథాన్ని తెలియజేయటానికి..

. నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో

50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో!

Published at: 31-07-2014 00:15 AM

వంద చిత్రాలు పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్‌  తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇది సాంఘిక చిత్రమైతే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం ‘అగ్గిపిడుగు’. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘సత్యనారాయణ మహాత్మ్యం’ సినిమాలో కూడా రెండు పాత్రలు పోషించారు. అంటే ఒకే ఏడాది వరుసగా మూడు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి సంచలనం సృష్టించారు  ఎన్టీఆర్‌. తన నటనతో  తెలుగునాటే కాదు యావత్‌ దక్షిణాదిన డ్యూయెల్‌ రోల్స్‌కి ఒక క్రేజ్‌ తీసుకు వచ్చిన ఘనత కూడా ఆయనదే. జానపదబ్రహ్మగా కీర్తి గడించిన దర్శకుడు బి.విఠలాచార్య ‘విఠల్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై ‘అగ్గిపిడుగు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్రవిశేషాలను ఒకసారి పరిశీలిద్దాం..

ఎన్టీఆర్‌, విఠలాచార్య కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టిన చిత్రం ‘బందిపోటు’. జానపద చిత్రాల్లో ఒక ప్రత్యేక ఒరవడిని ఆ చిత్రం ఏర్పరచింది. వీరిద్దరి కలయికలో రూపొందిన రెండో చిత్రం ‘అగ్గిపిడుగు’. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాతోనే రాజన్‌-నాగేంద్ర సంగీత దర్శకులుగా తెలుగునాట వారి బాణీ తొలిసారి పలికించడం. ఈ జంట సంగీత దర్శకులు స్వరపరిచిన ‘ఏమో ఏమో ఇది.. నాకేమో ఏము అయినది’, ‘ఎవరనుకున్నావే.. ఏమనుకున్నావే’ పాటలు పాపులర్‌ అయ్యాయి.
అలెగ్జాండర్‌ డ్యూమస్‌ రాసిన ‘ది కార్సికన్‌ బ్రదర్స్‌’ నవల ఆధారంగా ‘అగ్గిపిడుగు’ చిత్రం రూపొందింది. ఈ కథతోనే 1941లో జూనియర్‌ డగ్లాస్‌ పెయిర్‌ బాంక్స్‌ ద్విపాత్రాభినయంతో ‘ ది కార్సికన్‌ బ్రదర్స్‌’ ఆంగ్ల చిత్రం రూపుదిద్దుకొని, ఘన విజయం సాధించింది. కథానుసారం ఇందులో ఒక దేశపు రాజకు కవలపిల్లలు అతుక్కొని పుడతారు. వారిని ఓ డాక్టర్‌ అతి కష్టం మీద వేరు చేస్తాడు. అయితే అన్న పొందే అనుభూతి తమ్మునికీ కలుగుతుంటుంది. అన్నకు దెబ్బ తగిలితే తమ్మునికీ తగలడం, అన్న ప్రేమించిన అమ్మాయిపైనే తమ్ముడూ అనురాగం పెంచుకోవడం ఈ కథలోని ప్రత్యేకతలు. ఆంగ్ల చిత్రంలో కథ చివరిలో తమ్ముడు చనిపోతాడు. తెలుగు వాతావరణానికి అనువుగా ఈ కథను మలచి సుఖాంతం చేశారు. తెలుగు చిత్రంలో అన్నదమ్ములు తమ తల్లిదండ్రులను చంపిన పినతండ్రిని అంతమొందించి, తమ రాజ్యాన్ని సంపాదించుకోవడం కథకు ముగింపు.
మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే తెలుగులోనే కాకుండా భారతదేశంలోనే అవిభక్త కవల పిల్లల ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న తొలి సినిమా ‘అగ్గిపిడుగు’. ఈ సినిమా ప్రేరణతోనే ‘హలో బ్రదర్‌’ చిత్రం రూపుదిద్దుకొందని చెప్పవచ్చు. ఆ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. అలాగే హీరో కృష్ణ నటించిన ‘దొంగలు బాబోయ్‌ దొంగలు’ చిత్రానికీ ‘అగ్గిపిడుగు’ చిత్రమే ప్రేరణ.
‘అగ్గిపిడుగు’ చిత్రంలో ఎన్టీఆర్‌ మాధవసేనుడు, రాజసేనుడు పాత్రలు పోషించారు. రాజసేనుడికి జోడీగా రాజశ్రీ, మాధవసేనుడికి జంటగా కృష్ణకుమారి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు డూప్‌గా సత్యనారాయణ నటించడమే కాకుండా చిత్రంలో ప్రతినాయకుడు రాజనాలకు అనుచరునిగా కూడా నటించడం మరో విశేషం. కవల పిల్లలను విడదీసే డాక్టర్‌గా ముక్కామల నటించారు. రవికాంత్‌ నగాయిచ్‌ ఛాయాగ్రాహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘అగ్గిపిడుగు’ చిత్రానికి రూ. ఐదు లక్షలు ఖర్చయితే, విడుదలైన మొదటి వారంలోనే ఆ మొత్తం వసూలు చేయడం విశేషం.  అంతకుముందు వంద రోజులు పూర్తయిన తరువాతే సినిమాల వసూళ్ల వివరాలు ప్రకటించేవారు. అయితే మొదటి వారం కలెక్షన్లను తెలుగునాట ప్రకటించిన తొలి సినిమాగా ‘అగ్గిపిడుగు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఒక సినిమా మొదటి ఏడు రోజుల్లో ఐదు లక్షల రూపాయల వసూలు చేయడం అప్పట్లో ఒక రికార్డ్‌ . ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వందరోజులు పూర్తి చేసుకొంది.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2

 

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2

డింగిరి –జగన్ నరకాసుర వధ అని మూడు రోజుల ఉద్యమం చేశాడేమిటి గురూ ?

టింగిరి –‘మూడు రొజుల ముచ్చటే అయింది కదరా శిష్యా .మూర్ఖులు తప్ప ఎవ్వరూ కదలలేదు .భస్మాసుర హస్తం అని చేస్తే బాగుండేది .వెర్రి తగ్గింది రోకలి తలకు చుట్టమన్నాట్ట ఒకడు .అదీ తీరు .

డిం-కెసిఆర్ ఎంసెట్ విద్యార్దుల ప్రవేశానికి అడ్డ పుల్ల వేస్తున్నాడెంటి స్వామీ ?

టిం –ఏదో ఒక సమస్య లేంది ఆయనకు తిన్నది జీర్ణం కాదు .పూర్వం శుక్రాచార్యుడు బలి చక్రవర్తి వామనుడికి భూమి దానం చేస్తుంటే నీళ్ళ చెంబులో దాక్కొని అడ్డు పడితే  వామన స్వామి దర్భ పుల్లతో పొడిచి ఒక కన్ను లేకుండా చేశాడు గుర్తుందా?

డిం –సోనియాకు లోక్ సభలో ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు మోడీ ?

టిం –ప్రభుత్వ పక్షం లో పదేళ్ళు చక్రం తిప్పి ఏం పొడి చేసిందినాయనా ఆబిడ ?ఇప్పుడు హోదా ఇస్తే అంతకంటే వెలగ బెట్టేదేమిటి ?పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పారేస్తుందని మోడీ అనుకోని ఉండచ్చు .

డిం –చంద్ర బాబు ది ఐరన్ లెగ్ అన్నారు ?

టిం –కరువు తీరా వర్షాలు కురుస్తుంటే ఇంకా ఎప్పటి పాత మాటో పట్టుకు వేళ్ళాడుతావేమిట్రా ?ఇప్పుడు అందరూ గోల్డెన్ లెగ్ అని సంబర పడుతుంటే ?

డిం –బీహార్ లో నితీష్ ,లాలూ సోనియా జతకట్టారట?

టిం –అదా !మోడీ బాధిత సంఘం .ముగ్గురు మూర్ఖులు సినిమా చూశావా ? ఓట్లు అడుక్కోవటానికి ఇదో వేషం .నమ్మేదేవరురా ?

డిం –మామ కెసిఆర్ లా మేనల్లుడు హరీష్  జనాన్ని రెచ్చ గొడుతున్నాడు ?

టిం –మామకు మొగుడు కావాల్సిన వాడు మామకు తగ్గ అల్లుడయ్యాడు .ఇద్దరికీ ఇంకా ఉద్యమ స్పిరిట్ పోలేదు .ప్రభుత్వం లో ఉన్నామన్న స్పురణ రావటం లేదు .అందుకే ఈకారు కూతలు .

డిం –మరికొడుకు మాటేమిటి స్వామీ ?

టిం –ఏ మాటకు ఆ మాటే చెప్పు కోవాలి .కే టి ఆర్ .ఆ అబ్బకు పుట్టాల్సిన కొడుకు కాదు .సంస్కారం తెలిసిన వాడు .తెలంగాణా బాగు పడాలంటే యెంత త్వరగా ‘’గులాబీ రాజును’’ దింపి ,’’చిన్న గులాబిని ‘’ఎక్కిస్తే అంతమంచిదని జనం అనుకొంటున్నట్లు  వేగుల వాని వార్త.

డిం – మాటలు చెప్పినంత తేలిగ్గా మోడీ మన రాష్ట్రానికి ఏమీ విదల్చలేదేంటి గురవా ?

టిం –రోడ్డు రోలర్ మెజారిటీ ఉంటె అంతే శిష్యా .ఎలక్షన్ ముందు బాబు అవసరం ఉంది మోడీకి .ఇప్పుడు మోడీ అవసరం బాబుకి .తిరగాలి వెంటపడాలి ఒత్తిడి చేయాలి ,తెచ్చుకోవాలి .మధ్యలో ఎవరూ అడ్డు పడకుండా చూసుకోవాలి .డిం –గవర్నర్ ఇఫ్తార్ విందుకు కెసిఆర్ డుమ్మా కొట్టాడెంటి?అంత బిజీనా ?

టిం –బిజీనా పాడా!కాళ్ళూపు కుంటూ కూచునే వాడికి బిజీ ఏంది? పిల్లలు బస్ ప్రమాదం లో చచ్చినా  చీమ కుట్టినట్లు గాపలకరించటానికో చూడటానికో వెళ్ళని వాడు ,గడీల చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ,దొరల్తో విందులు కుడవటానికి టైం ఉందికాని వీటికి సమయం లేదు దొర గారికి అని రేవంత్ రెడ్డి అన్నది అక్షరాలా నిజం .అదే చూడు బాబు ఆఘ మేఘాల మీద ప్రమాద  స్థలాలకు చెన్నై వెళ్లి ఓదార్చి సాయం అందించాడు .బ్లడ్ లో ఉండాలి రా ఏదైనా –ఇక చాలు వెళ్లిరా .

-మీ -గబ్బిట దుర్గా ప్రసాద్  -30-7-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ మండలి బుద్ధప్రసద్ అభినందన సభ ఫోటోలు

శ్రీ మండలి బుద్ధప్రసద్ అభినందన సభ ఫోటోలు

 

కృష్ణాజిల్లా రచయితల సంఘం , ఆంఢ్రా ఆర్ట్స్ అకాడెమీ, విజయవాద బుక్ ఫెష్టివల్ సొసైటీ తదితర సాహితీ సాంస్కృతిక సంస్థలు శ్రీ బుద్ధప్రసాద్ నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఎనికైన సందర్భంగా ఘనంగా వారిని సన్మానించాయి. అనేకమంది ప్రమ్లుఖులు ఈ* సభలో పాల్గొన్నారు ,

Raw00586 Raw00584

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శంకర శాస్త్రి పుణ్యమా అని నేను,అన్నయ్య ఎనిమిది ఏళ్ళు మాట్లాడుకోలేదు !

D25920268 (1) D25842194

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి 64వ సమావేశం –శ్రావణ మాసం విశిష్టత

సరస భారతి 64వ సమావేశం –శ్రావణ మాసం విశిష్టత

సరసభారతి 64వ సమావేశం ‘’శ్రావణ మాసం ‘’విశిష్టత పై ఈ రోజు  29-7-14-మంగళ వారం సాయంత్రం 6-30గం లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ‘’మహిత మందిరం ‘’లో జరిగింది .అధ్యక్షత వహించిన నేను ‘’శ్రవణా నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చిన నెల శ్రావణ మాసం అంటారు .వేదం లో ఈ నెలను ‘’నభస్ ‘’అన్నారు .శ్రవణం విష్ణు మూర్తి జన్మ నక్షత్రం కనుక ఆయనకు ఆయన అర్ధాంగి లక్ష్మీ దేవికి ప్రియమైన మాసం .ఈ నెలలో గృహ ప్రవేశం చేస్తే అన్నీ కలిసి వస్తాయి .ఈ మాసం లో జన్మించినవారు ప్రపంచ గౌరవం పొందుతారని జ్యోతిశ్శాస్త్రం చెప్పింది .జగన్నాధుడు ,శ్రీ కృష్ణుడు ,బలరాముడు హయగ్రీవుడు ,విఖనసా చార్యులుజన్మించారు. హయగ్రీవ జయంతిని శ్రావణ పౌర్ణమి  నాడు నిర్వహిస్తారు .పౌర్నమినాడే ఉపా కర్మ చేస్తారు .అలా చేస్తే ఆధ్యాత్మికత ,మానసిక ,శారీరక ఆరోగ్యం లభిస్తాయి .జంద్యానికి ఉపనయనం నాడు కట్టిన ‘’మౌంజి ‘’(జింక తోలు ముక్క)ను తీసేయ్యటమే ఉపాకర్మ ,.దీనితో వటువుకు అన్ని అర్హతలు సంక్రమిస్తాయి .రాష్ట్రీయ స్వయం సెవక సంఘం వారు   ఈ పౌర్ణమినాడు ‘’రక్షా బంధన్ ‘’ఉత్సవం నిర్వహిస్తారు .భగవాధ్వజ్ (కాషాయ జెండా)ను పూజించి రక్ష కట్టి స్వయం సేవకులందరూ ధ్వజ ప్రణామం చేసి ఒకరికొకరు ఎదురెదురు గా నిలబడి రక్ష కట్టుకొని దేశాన్ని రక్షిస్తామని శపథం చేస్తారు .దేశ భక్తీ గీతాలు పాడతారు .ఈ రోజే వారు ‘’గురు దక్షిణ ‘’కార్యక్రమం నిర్వహిస్తారు .దేశం కోసం  తమ వంతు ధర్మం గా తోచిన ధనసహాయం చేయటమే గురు దక్షిణ .ఇవ్వ దలచుకొన్న డబ్బును కవర్ లో పెట్టి అందులోని చీటీపై పేరు రాసి యెంత డబ్బు ఇచ్చిందో రాసి కవర్ మూసి ధ్వజం దగ్గర సమర్పిస్తారు .ఎవరెంత ఇచ్చిందీ ఎవరికీ తెలియదు .అంతా అయిన తర్వాత పదాదికారులు లెక్క వేసి నాగ పూర్ లోని ప్రధాన ఆఫీసుకు పపిస్తారు .ఆ తర్వాత మొత్తం యెంత వచిందో తెలియ జేస్తారు .ఇలా  గురు దక్షిణ ను ఏడాదికి ఒక సారి మాత్రమె నిర్వహిస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చందాలు వసూలు చేయక పోవటం వారి సంస్కృతి. శ్రావణం లో గర్భ ధారణా మంచిది కాదని చెపుతారు .

   ‘’ఇతర రాష్ట్రాలలో ఏం చేస్తారో తెలుసుకొందాం .తమిళ నెల ‘’ఆడి ‘’ఈ మాసం తోనే ప్రారంభమౌతుంది వారిది సూర్య గణనం .ఆడి అమావాస్య వారికి పరమ పవిత్రమైనది .అన్ని మంచిపనులు ఆరోజే చేస్తారు .గుజరాత్ ,మహారాష్ట్ర ,గోవాలలో శ్రావణ పౌర్ణమిని ‘’నరాలి ‘’పూర్ణిమ అంటారు .నారల్ అంటే కొబ్బరికాయ (నారికేళం )ఆ రోజున వరుణదేవుడి అనుగ్రహం కోసం కొబ్బరి కాయ కొట్టి పూజిస్తారు .కొంకణ తీర వాసులు సముద్రుని దేవతగా పూజించి కొబ్బరికాయ సమర్పిస్తారు .వారికి చేపల వేటకు ఇది అనువైన కాలం .చేపలు బాగా దొరుకుతాయని విశ్వాసం .శ్రావణ బహుళ పంచమి నాగ పంచమి .నాగ దేవతను అర్చిస్తారు శ్రావణ మాసం చివరి రోజును మహా రాష్ట్ర‘’పోలా ‘’ఉత్సవం జరుపుతారు .ఎద్దు ఆవు మొదలగు పశువులకు పూజ చేస్తారు .కర్నాటక లో కృష్ణ పంచమి ని ‘’బసవ పంచమి ‘’గా వీర శైవ మహా భక్తుడు బసవ్మహారాజు శివైక్యం చెందినా రోజు ననిర్వహిస్తారు .దక్షిణాన ‘’అవని ఆవిత్తం ‘’అంటే ఉపకర్మ పౌర్నమినాడే చేస్తారు .ఒరిస్సా లో ‘’గంహా పూర్ణిమ ‘’అంటారు .పశువులను అల్లంకరించి పూజిస్తారు .బంధువులకు ‘’పిదా ‘’అనే మిఠాయి పంచుతారు .

          జగన్నాధ సంస్కృతీ ని అనుసరించే ఒరిస్సా ,బెంగాల్ ప్రాంతాలలో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున రాదా  కృష్ణులు  వర్షా నందాన్ని పొందిన రోజు ను జరుపుతారు. ఆ రోజు నుండి పౌర్ణమి వరకు ‘’జులాన్ యాత్ర ‘’చేస్తారు .రాదా కృష్ణులను ఉయ్యాలలూపుతూ ఊరేగిస్తారు .మధ్య ప్రదేశ్ ,చతీష్ ఘడ్ ,జార్ఖండ్ ,బీహార్ లలో ‘’కజారి పూర్ణిమ ‘’పేరు తో నిర్వహిస్తారు .ఇది రైతులకు ఇష్టమైన పండుగ .మగ సంతానం ఉన్న వారు శుక్ల నవమి నుండి పౌర్నమివరకు దీన్ని చేస్తారు .గుజరాత్ లో ‘’పవిత్రోపన ‘’పేరుతొ పౌర్ణమిని నిర్వహిస్తారు .ఈ రోజు శివ పూజ చేసి తరించటం వారి సంప్రదాయం .జార్ఖండ్ లోని దియోగడ్ లో శ్రావణ మేలా నిర్వహిస్తారు .అందరూ కాషాయ వస్త్రాలు ధరించి వంద కిలో మీటర్ల దూరం లో ఉన్న గంగానది నుండి పవిత్ర జలాలను తెచ్చుకొని నిల్వ ఉంచుకొంటారు. ఇది శివ దర్శనానికి అనువైన కాలమని భావిస్తారు .దీనికే ‘’కన్వార్ యాత్ర’’అని పేరు .శ్రావణ బహుళ విదియ నాడు మంత్రాలయ రాఘ వేంద్ర స్వామి ముక్తి పొందిన రోజు ‘’అని చెప్పాను

 ముఖ్య అతిధి శ్రీమతి వేదాంతం శోభ శ్రీ శ్రావణమాసం లో గౌరీ దేవి పూజను ప్రతి మంగళ వారం పెండ్లి అయిన ముత్తైదువులు చేస్తారని ఇలా అయిదేళ్ళు చేసి ఉద్యాపన నిర్వహిస్తారని రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ చేసుకొంటారని ,అత్తమామలను ఆహ్వానిస్తారని లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని మంగళ వారం నోము నోస్తే మాంగల్యం బలం బాగా ఉంటుందని ,పార్వతి తపస్సు చేసి గౌరవర్ణం లోకి మారి గౌరీ అయిందని శ్రావణ గౌరీ వ్రతం సకల శుభ ప్రదామని ,శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాస్టమని ఆరోజు ఉట్టి కొడతారని కృష్ణుడికి ఇష్టమైన వెన్న  ,కట్టే కారం నైవేద్యం పెట్టి అందరికి ప్రసాదం గా ఇస్తారని , దీనికే గోకులాష్టమి అనిపేరని వివరించారు .

 డాక్టర్ దీవి చిన్మయ శ్రావణం లో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేశారు కాళ్ళకు పశుపు రాస్తే అది క్రిమి సంహారం కనుక వర్షాకాలం లో తిరిగినా కాళ్ళు పాసి పోవనిచెప్పారు శనగలు వాయనం ఇస్తారని ఇవి గర్భాన్ని శుద్ధి చేసి గర్భ కోశానికి బలం చేకూర్చి మంచి సంతానం కలిగేట్లు చేస్తాయన్నారు .ఈ నెలలో జలుబు దగ్గు మామూలేనని దీనికి అల్లం ,తేనే ,ధనియాలు ,జీలకర్ర కలిపి తింటే చాలన్నారు లేత వేపాకు రసం తేనే లో కలిపి నాలికకు రాస్తే చాలా దోషాలు పోతాయని చెప్పారు .మన వాళ్ళు ఏది చెప్పినా దానివెనక ఆరోగ్య సూత్రాలున్తాయని వాటిని గమనించాలని అప్పుడే చేసే పని సద్వినియోగం అవుతుందని చెప్పారు సరస భారతి ఇలాంటి విషయాలపై మంచి కార్య క్రమాన్ని నిర్వహించి నందుకు అభినందించారు .

      అతిదులిద్దరికి ఆలయ మర్యాద తో అర్చకుడుశ్రీ మురళి సత్కరించారు సరసభారతి శోభాశ్రీ కి శాలువ కప్పి ,సరసభారతి ప్రచురణలను జ్ఞాపికను నగదును అంద జేసి సత్కరించింది

               కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి   అతిధులను వేదికపైకి ఆహ్వానించి ,కార్య క్రమాన్ని నిర్వహింఛి వందన సమర్పణ చేశారు .

     సభ ప్రారంభం అవగానే ఇటీవల మరణించిన భాషా శాశ్ర్త్ర వేత్త  డా .చేకూరి రామా రావు మృతికి అందరు శ్రద్ధాంజలి ఘటింఛి మౌనం పాటించారు .నేను చే.రా.గురించి,అయన సాహితీ సేవ గురించి  క్లుప్తం గా వివరించాను .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-14-ఉయ్యూరు .

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బెజవాడలో తనికెళ్ళ కి సన్మానం -ఇంటర్ వ్యూ

2bharani 0011bharani 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

​mt. S​V. KRISHNA ​JAYANTHI​’​ Selected For ​NATIONAL FELLOWSHIP ​From TELUGU LITERATURE

JAYANTHI FellowSHIP- ENGLISH - 250714 JAYANTHI FellowSHIP- TELUGU - 250714

​mt. S​

V. KRISHNA

​JAYANTHI​

​ Selected For

 

​NATIONAL FELLOWSHIP

 

​From

 

TELUGU LITERATURE

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌

చరిత్రను చిత్రిక పట్టిన గడియారం – సంగిశెట్టి శ్రీనివాస్‌

Published at: 28-07-2014 07:24 AM

తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, చైతన్యాన్ని ప్రోది చేసిన పండిత పరిశోధకుడు, సంపాదకుడు, గతానికి-వర్తమానానికి వారధి గడియారం రామకృష్ణ శర్మ. హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసి ‘సుజాత’ పత్రిక సంపాదకులుగా, శాసనాల పరిష్కర్తగా, సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, సారస్వత పరిషత్తు నిర్వాహకుడిగా, సభలు, సమావేశాల, నిర్వాహకుడిగా, రేడియో ప్రయోక్తగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాలగర్భంలో కలసిపోయిన చరిత్ర ను రికార్డు చేసే విధంగా కొమర్రాజు లక్ష్మణరావు స్ఫూర్తి, ప్రోత్సాహంతో ‘తెలంగాణ శాసనాలు’ మొదట 1935లో ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’ పక్షాన ఆదిరాజు వీరభద్రరావు ప్రచురించారు. దూపాటి వెంకటరమణాచార్యులు, ఆదిరాజు వీరభద్రరావు పరంపరను కొనసాగిస్తూ అనంతర కాలంలో ‘తెలంగాణ శాసనాలు’ రెండో భాగాన్ని గడియారం రామకృష్ణ శర్మ సంపాదకత్వంలో ప్రచురించారు.

‘‘..83 శాసనములకు పండిత గడియారం రామకృష్ణశర్మగారు నకళ్ళు వ్రాసి యున్నారు. శ్రీ రామకృష్ణ శర్మ గారి చరిత్రాభిమానమును, చారిత్రక కోవిదత్వమును, ఉత్సాహశీలమును, రచనా నైపుణ్యమును ఈ గ్రంథము వేయినోళ్ళ జాటు చున్నది. శ్రీ రామకృష్ణ శర్మగారు ఈ గ్రంథ సంపాదకీయ భారము వహించి మమ్ముల కృతకృత్యుల జేసియున్నారు. సంస్కృతాంధ్ర కర్ణాటకాంగ్లేయ భాషలయందు పండితులును, విశేషించి శాసనములను వ్యాఖ్యాన సహితంగా ఇంగ్లీషునందును, తెలుగునందును ప్రకటించి, చరిత్ర పరిశోధన పండిత ప్రకాండుల మెప్పును గడిచినవారు శ్రీ రామకృష్ణ శర్మగారు’ అని ఆయన ప్రతిభను పరిశోధక మండలి గౌరవ కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావు తమ ‘పీఠిక’లో పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఆలంపూరు శిల్ప సంపద గురించి 1946లోనే పుస్తకాన్ని వెలువరించడమే గాకుండా, శిథిలావస్థలో ఉన ్న వాటిని, ముంపుకు గురైన గుడులను యథావిధిగా ఒడ్డుకు తరలించడంలో ఈయన కీలక భూమిక పోషించారు. కేవ లం శాసనాలే గాకుండా తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. మిత్రులు, ఆప్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో 1950లో ‘సుజాత’ సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. ఇందులో ఆది రాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు, సామల సదాశివ (కథలు), మల్లంపల్లి సోమశేఖర శర్మ, తదితర పండితుల రచనలతో పాటుగా, యువ కవులు, కథకులకు ఇది వేదికగా ఉండింది. దాశరథి ‘నా తెలం గాణ కోటి రతనాల వీణ’ కవిత మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రచురితమైంది.

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన సంచిక ‘సుజాత’ తెలంగాణ సంచిక ఇందులో తెలంగాణకు సంబంధించిన చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, పత్రికా రంగాలపై ఆయా విషయాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులచే విలువైన వ్యాసాలు రాయించి వెలువరించారు. ఈ సంచికను పునర్ముద్రించినట్లయితే తెలంగాణ వైభవము, ప్రతిభ అందరికీ తెలిసి వస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 1953లో ఆలంపురంలో ‘ఆంఽధ్రసారస్వత సభలు’ నిర్వహించారు. ఈ సభల్లో శ్రీ శ్రీ మొదలు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకు తెలుగునాట పేరున్న సాహితీవేత్తలందరూ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైలుని నడిపించారంటే ఆ సభలు ఎంత ఘనంగా నిర్వహించారో తెలుసుకోవచ్చు. ఈ సభల్లో సురవరం ప్రతాపరెడ్డికి జరిగిన అన్యాయం చర్చనీయాంశమైంది. రాజకీయ రంగంలో ఆయనకు అన్యాయం జరిగినా సాహిత్య రంగంలో ఈ సభ నిర్వహణ ఆ ప్రాంతానికి చెందిన సురవరంపై గౌరవాన్ని పెంపొందించింది. ఈ సమావేశాల్లో చేసిన చర్చలు తర్వాతి కాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన ‘సాహిత్య అకాడెమీ ఆవార్డు’ ప్రతాపరెడ్డికి దక్కేలా చేశాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఈ పురస్కారం లభించింది. ఈ సభల్లోనే కాళోజీ ‘నాగొడవ’ మొదటిసారిగా ఆవిష్కృతమైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది కూడా గడియారమే. ఆలంపూరు తాలూకాలోని చెన్నిపాడు గ్రంథాలయం, ఉండవెల్లిలోని శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాండాగారాలను రూపుదిద్దింది ఈయనే. తనకు అత్యంత సన్నిహితుడైన సురవరం ప్రతాపరెడ్డికి దక్కినట్లుగానే రామకృష్ణశర్మ స్వీయ చరిత్ర ‘శతపత్రం’కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కింది. ఈ పుస్తకం అలనాటి తెలంగాణకు దర్పణం. స్వీయ చరిత్రతో పాటుగా దశరూపసారం, భారత దేశ చరిత్రం, ఆలంపుర క్షేత్ర చరిత్ర, ఆలంపురం శిథిలములు, తెలుగుసిరి, బీచుపల్లి క్షేత్ర మహత్యం, ఉమామహేశ్వర చరిత్రం, భారతీయ వాస్తు విద్య తదితర గ్రంథాలు ఆయ న కలం నుంచి వెలువడ్డాయి.  1919లో అనంతపురం జిల్లా కదిరిలో జన్మించిన శర్మగారు చిన్నప్పుడే ఆలంపూరులో స్థిరపడ్డారు. తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి చిరస్మరణీయమైన సేవలందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా ఆయన చేసిన కృషిని ప్రభుత్వం కొనసాగించాలి. అదే ఆయనకు సరైన నివాళి.
(గడియారం రామకృష్ణ శర్మగారు గతించి ఎనిమిదేళ్ళు)
– సంగిశెట్టి శ్రీనివాస్‌

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

ఇద్దరి విరహ వేదనతో ,నారద మహర్షి ప్రవేశం తో రెండవ ఆశ్వాసం పూర్తయింది .మూడవ దానిలో మహర్షి లక్ష్మీ నారసింహ స్తోత్రం తో కద ప్రారంభ మౌతుంది .ఆయన బాధకు కారణం అడుగుతూ ‘’మానసికంపు  వ్యాధులకు మందు మరొక్కటి లేదు ,నీ లోన చెలంగు నట్టి యపు రూపపు బాధ ‘’చెబితే సాయం చేస్తానంటాడు జరిగిందంతా వివరిస్తాడు దేవ దేవుడు .చివరికి ‘’నీవే తల్లివి దండ్రివి ,నీవే నా పతియు గతియు నీవే గురుడవౌ ‘’అని ఉబ్బేసి ఎలాగైనా చెంచులక్ష్మితో కల్యాణం చేయించమని కొడుకైన నారదుడి ని తండ్రి నరసింహ రూప విష్ణు మూర్తి ప్రార్ధించాడు .చెంచు గూడెంవేల్లాడు .స్వాగత సత్కారాలందుకొన్నాడు .నెమ్మదిగా అసలు విషయం కక్కాడు .ఆయన ఎవరోకాదు ‘’మహాయత బలశాలి యైన యా  హరియే ‘’అని వివరించాడు .చెంచులక్ష్మిని ఆయన కిచ్చి కల్యాణం చేయమని హితవుచేప్పాడు .వెరగు వెరపు తో భిల్ల రాజు ‘’ఒల్లను పిల్లను ఇయ్యగా –ఎల్లా కుదురుద్ది మనువు ?ఎవరో అతడహో ‘’అని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు .అప్పుడు క్షీర సాగర మధనం దగ్గర నుంచి కద అంతా చెప్పి ,లక్ష్మీ దేవి సముద్రుని కుమార్తె అని ఆమెను శ్రీ హరికి ఇచ్చి వివాహం చేశాడని తనను పెళ్ళికి పిలవ లేదని దూర్వాస మహార్ద్షి కోపం తో వచ్చి తండ్రి ,కూతురు కలిసి చెంచు గూడెం లో భిల్ల రాజు గా భిల్ల కన్యగా జన్మించమని శాపం  ఇచ్చాడని  కాళ్ళా వేళ్ళా పడితే మరుసటిజన్మ లో హరి నరసింహావతారం ఎత్తి ఇక్కడికి వస్తాడని ఆయనకిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పాడని పాత కధంతా చెప్పాడు .అప్పుడు చెంచు రాజు’’ఔరా!ఇంత కతుందా-మజ్జ్హారే ఎంత బాగ్గేము –కలిగే నాకిప్పుడహో ‘’అని సంబర పడ్డాడు .పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ,ఈ అడవిలో పుట్రాత పురుగూ బారి పడకుండా కాపాడేట్లు అల్లుడితో చెప్పమని ,ఒక కోటి బంగారు నాణాలిచ్చి ‘’లచ్చి గైకొ మను –ఇంతకన్నా ఇంకేటిది కోరు కొందు ‘’అని మనసులో మాట బయట పెట్టాడు .సరే నరసిమ్మయ్య తో మాట్లాడతానని నారద నిష్క్రమణ తో మూడో ఆశ్వాసం పూర్తీ అయి శ్వాస హాయిగా పీలుస్తాం .

నాలుగవ అధ్యాయం లో  చెంచు రాజు అడిగిన కన్యా శుల్కాన్ని గురించి చెప్పి అంగీకారం పొందాడు నారదుడు .ఇక పెళ్లి సన్నాహాలు శురూ అయాయి .వధువుకు సాంప్రదాయ చెంచు దుస్తులు వేశారు .నెమలి  కోడీకల తురాయి పెట్టారు .ఆనందాల మధువే అయిందట వధువు .మరి స్వామి రత్న కిరీటం పెట్టుకొనే వాడికి నెమలి పించం పెట్టారు .మణి హారాలు పెట్టుకొనే వాడికి తులసి పూసల పేర్లు వేశారు .పట్టు పీతాంబర దారికి పసుపు కొమ్ముల పంచె కట్టారు .అంచుల ఉత్తరీయం వేసుకొనే వాడికి’’ బెట్లాకు టంగీని ‘’కట్ట బెట్టారు తిరుమణి బొట్టున్న వాడికి అడవి ఆకుల బాసికం కట్టారు .చందన చర్చలుందే వాడికి పునుగు జవ్వాది పూతలు పూశారు .తరువాత కవిగారు చెంచులక్ష్మీ నారసింహుల కళ్యాణ కమనీయ ఘట్టాన్ని వర్ణించారు .చదివిమ్పుల్లో ‘’పుట్ట తేనే ,కుందేళ్ళు చిట్టి పొట్టి పావురాళ్ళు ,జింకల్ని చదివించారు బంధుగణం .

‘’మాయ అనే తెరనే తీయగల సమర్ధుడికి తెరా సెల్లా అడ్డం పెట్టారని చమత్కరించారు .ఇక్కడ వధువు వర్ణన చాలా చమత్కారం గా చేశారు –

‘’సిగ్గుల నిగ్గు నెగ్గ గల చెల్వపు విల్వల కొల్వు దీర్చిమే –లుగ్గిడుతండు దగ్గకయే యూరేడు కన్నె గులాబి సోగ ళే –మొగ్గల బుగ్గలున్న నును మోమున సిగ్గుకే సిగ్గు నేర్పు బాల్ –జగ్గుల కన్నె గంగోనే దెరల్ విడా శ్రీ హరి సంభ్రమబునం ‘’-జీల కర్ర గుడం’’అన్యోన్య శీర్షాల మీద ఉంచారు .వనం లో దొరికే దాల్చినాకు గల మంగళ సూత్రాన్ని ‘’గుణ త్రయ రూపు డైన శ్రీహరి చెంచుమహా లక్ష్మి మెడలో కట్టాడు .వెదురు బియ్యపు తలంబ్రాలు పోయించారు .పెళ్లి సంబరాలను సందర్భానికి తగినట్లు ఉత్సాహ వృత్తాలలో వర్ణించి ఔచితిని పాటించారు .వధూవరుల అన్యోన్యాన్ని సీసం లో పోత పోశారు –

‘’శ్రుతిగానముల గీత గతినాటి రాజిల్ల లయ తాన పల్లవై రగిలే నతడు

నవ రసాస్పద పదార్నవ కాగ నన్నారి –యరద గౌరవ భూషుడాయే నతడు

చిత్ర లేఖన కళా శ్రీ కాగ నాలేమ –హవణిల్లు కుంచె గా నలరే నతడు

దివ్య శిల్పాల మందిరమే యా చెలికాగ-నులికి నూపిరులూద గలిగే నతడు

వనము సులలిత సత్కళా వనమే యగుచు –నూతనోత్సాహ మీదగా సంజా దీప్తి

జంచు లక్ష్మీ వధూ నారసింహవరులు –అక్షర సువర్ణ సృష్టి విహారు లైరి ‘’అని భావుకత రూపుదాల్చిన పద్యాన్ని చేమకూర వేంకట కవి శైలిలో చెప్పారు .ఇక్కడ ఇద్దరూ హాయిగా ఉన్నారు .కద కదలాలి కదా .దానికి ‘’భవ బంధ విమోచన వార్షుక ప్రభా నీరడుడు  వాక్ శారడుడు ‘’అయిన నారదుడు కావాలి .వెంటనే వైకుం ఠం చేరి అక్కడలక్ష్మీ దేవిని దర్శించి ‘’నీకెందమ్మి మో మదేమీ ?కందెను –శ్రీ హరి ఏదండ కందదు గాదె ‘’అని నర్మ గర్భం గా కందం లో అందం గా  అడిగాడు .ఆదిలక్ష్మి తన గోడు వెళ్ళ బోసుకోంది.ప్రహ్లాదుడిని కాపాడిన స్వామి నారసింహుడు అదే పోత పోయి తిరిగి రాలేదని బాధ పడింది .చీమ చిటుక్కుమన్నా అయన వస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను జాడ తెలిస్తే చెప్పమని వేడింది .మన ‘’పుడకల స్వామి ‘’చెంచులక్ష్మీ నారసింహ కద చెప్పేశాడు .ఆమె అలక పాన్పెక్కింది .మరి నిప్పురాజేయ్యాలికడా వెంటనే నరసిమ్మ సామికి ఆమెఅలక గురించి చెప్పాడు ఆయన ఆఘ మేఘాల మీద ప్రయాణం అవటం తో నాలుగో ఆశ్వాసం పూర్తీ .

చివరిదైన పంచమాశ్వాసం లో హరి వైకుంఠ పురి ప్రవేశం తో ప్రారంభ మౌతుంది .హుషారు సీనుల్లేవక్కడ .లచ్చిని చెంచు లచ్చిమగడు అనునయించే ప్రయత్నం  చేస్తూతూనంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోని ‘’నను భవ దీయ దాసుని ‘’పద్యం ధోరణిలో  ఎత్తుకొని ఓదారుస్తాడు .ఇద్దరి మధ్యా సంవాదం వస్తుంది .మళ్ళీ తిమ్మన గారి పద్యం ‘’ఏమేమీ కలహాశానుండి చటికై  యేతెంచి  ‘’తో మొదలెట్టి కవిగారు సొంతంగా రాశారు .కన్నులు అలసిఉన్నాయేమని అడిగితె జింక కన్నుల కోసం వేటాడి అలశానంటాడు .గంట్లు గాట్లు ఏమిటంటే పొదరింటి తుమ్మెద కుట్టిందని ఉరమున కుంకుమ ఏమిటి అంటే ఏనుగుల్ని పట్టినప్పుడు కారిన రక్తమని ,గంధ పరిమళం ఏమిటి అంటే హంసల్ని పట్టేటప్పుడు అంటిన పుప్పొడి అని చక్కగా బొంకుల గోడ కట్టేశాడు .

ఇంతలో నరహరిని వెతుక్కుంటూ చెంచు లక్ష్మి ఇక్కడికే వచ్చింది .సవతుల మధ్య వాదోపవాదాలు సమర్ధం గా నిర్వహించారు కవి .పానకం లో పుడక లాగా వచ్చావా అని లక్ష్మి అంటే మగని బతుకు పానకమైతే నే  తానూ బెల్లం అంటుంది చెంచు లక్ష్మి .ఆమెను గొగ్గుల  ఖర్జూర పండు అంటే ,’’సామి బతుకు మంట నదెల్ల సల్ల బరప –అడవి ఖర్జూరమైతి- అరవ బోకే ‘’అని చెంచిత .’’శ్రీశుడనేటి మేల్ పండు నారింజ గోరి –నక్క వలే వచ్చితే చెంచులక్క నీవు ‘అని అంటే ‘’అవును నారింజ ఈ సామి -అపుడు నాకు –అక్క !పెద నక్కవే నేను నక్కనైన ‘’అని మాటకు మాట అంటించి నోరు మూయిస్తుంది అడవిజాణ .అపుడు నరసింహుడు ఇద్దరి వాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ‘’మిగుల వాచాల లైతిరి –ఓరినాయనో మద్దెల మోత తొడ మొద్దు బారే నాదు బుద్ధి యంత ‘’అని చెంపలేసుకొన్నాడు .చివరికి ఆది లక్ష్మికి చెంచులక్ష్మి పూర్వ జన్మ కద అంతా వివరిస్తాడు .తనమామ గారైన సముద్రుని వర్ణన తో ప్రారంభిస్తాడు ఇక్కడ కవి గారు చమత్కారం తో ప్రతిగీత  పద్యాన్ని ‘’నాదు మామ గారని నేనంగ  రాదు ‘’తో మొదలెట్టి రాశారు.తమ జన్మ  వృత్తాంతాన్ని వివరించారు.ఆమె విచారించింది .అప్పుడు ధర్మ ప్రబోధం చేశాడు .అన్నికాలాలకు ఉపయోగపడేవే అవి .పంతాలు పట్టింపులు దాంపత్యానికి చేటు కలిగిస్తాయని ,ఇద్దరికీ సహనమే భూషణం అని హితవు చెప్పాడు .చెల్లీ అని చెంచీతను సంబోధించి అక్కున చేర్చింది .’’ప్రేమకు కొత్త భాష్యమును విస్తృత రీతి ని ‘’తెలిపాడు భర్త అని ఆనందాన్ని వెలి బుచ్చింది .’’నువ్వే నేను ‘’అని తెలిసి ఆనందం కలిగిందని చెంచులక్ష్మికి చెప్పింది .ఆమె కూడా కృతజ్ఞతలు చెప్పింది –

‘’ఇందాక కినుక తో నే –నేమోదో కూసి యుంటినే –సెమియించే –డెందం లో దయ ఉంచవే  -ఉందామె ఒక్క టౌచు ఊరే పొగడన్ ‘’అని సహజ శైలిలో అన్నది .నరసింహుడు ఆనందం తో మళ్ళీ ఉపదేశం అనే క్లాస్ తీసుకున్నాడు

‘’రాగ మటన్న గేవల నిరంతర దంపతి భావ దేహ సం –యోగము కాదు అద్ది యొక యోగమే శాస్త్ర మనామయైక శో- భా గరిమంబు గూర్చ గల భాగ్యమే ‘’అని చెప్పి ’’అరవై మూడు అంకె ఎలా ఉంటుందో పరస్పరాభి  ముఖం గా  సౌఖ్య సంపదలతో  నిరంతరం మునిగి తేలాలని బోధించాడు .దీనినే కవిగారు ‘’దాంపత్యోపనిషత్ ‘’అన్నారు .ఈ ప్రబంధం చదివిన వారికి దాంపత్య ప్రభ ,ధర్మ జీవనం , ఆనంద ముక్తి ప్రభ కలుగుతాయి అని ఫల శృతి తో ప్రబంధాన్ని ముగించారు రస మడుగైన రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .’వందేళ్ళ తర్వాత ఆంద్ర దేశం లో ’నది ‘’మాస పత్రిక ఈ ప్రబంధ రచనా శ్రోతస్విని ఇంతటితో ఇంకిపోకుండా  ఈ సుకవితా ప్రబంధ ప్రవాహం  ఇక ముందూ ప్రవహిస్తూనే ఉండాలని కోరు కొందాం .రసమడుగైన రామడుగు వారి నుండి మరింత స్పూర్తిదాయక రచనలు వెలువడాలని ఆశిద్దాం ..

ప్రబంధం లో ఉండాల్సిన సూర్యోదయ చంద్రోదయ వర్ణనలు ఇందులో లేవు .ఋతు వర్ణనలూ లేవు .అయితే అన్నీ అన్నీ  ఉండాల్సిన అవసరం లేదేమో ? ‘’మినీ ప్రబంధం’’ అనచ్చేమో .చిన్న చిక్కని చక్కని ప్రబంధం  శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం .శర్మ గారి పాండిత్య ప్రకర్షకు నిదర్శనం .ఈ ప్రబంధానికి ఆశీర్వాదం పలికారు  కుర్తాళం పీఠాధిపతి (కులపతిగారు )శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి వారు .పద్య ప్రియులకు హృద్యమైన ప్రబంధం అని ముదిగొండ శివ ప్రసాద్ గారు ,ఆంద్ర భారతి సిగలో మరో మల్లె పూదండ అన్నారు గరిక పాటి వారు .ఇదొక మధూదయ ముహూర్తం అని రసరాజు గారు,యువతకు భారతీయ దాంపత్య వైశిస్ట్యాన్ని ఉపదేశాత్మకం గా అందించారని మేరిక పూడి సీతా పతిరావు గారు ,నవీన సురుచిర ప్రబంధం అని మాల్యాద్రిగారు ,చెంచుల ప్రాకృతిక జీవనాన్ని రంగ రించు కొన్న సుకుమార మనోహర కావ్యం అని సన్నిధానం వారు ,అభినవ ధూర్జటి అని మెచ్చు కొన్నారు .శర్మ గారి శ్రీహరి నుతితో సమాప్తి చెబుతున్నాను .

‘’పారా వార గబీర భావ జగతీ భారాపహా ,దీపిత –క్షీరాంబోధి  విషాహి శేష శయనా ,శ్రీ చెంచు లక్ష్మీ హృద –

బ్జారామా నట దద్భుతాళి చరితా ,ఆనంద తేజా ,రుచి –స్మేరాలోకన దివ్య మూర్తి ,నృహరీ శ్రీ వత్స చిహ్నాంచితా ‘’

సమాప్తం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అనుక్షణ శ్రీప్రియం కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం

అనుక్షణ శ్రీప్రియం  కావ్య ‘’దృశ్యం ‘’,వెంకటేషీయం

అమ్మమ్మా ఎన్నేళ్ళ యింది ఒక మంచి సినిమాచూసి? పెద్ద హీరో తో కార్లు లేపకుండా గన్నులు  పేల్చకుండా  ,భీభత్సం సృస్టించకుండా తీసికూడా .నిన్న  మధ్యాహ్నం రెండు గంటలాటకు  ,మూడో వారం నడుస్తుండగా మా ముసలావిడా నేను మామనవరాలు రమ్య ఉయ్యూరుల్ దీపక్ మహల్ లో’’దృశ్యం ‘’ సినిమా చూశాం .చూసిన తర్వాత ఏర్పడిన అభిప్రాయమే పై మాటలు .పైత్య ప్రకోపం లేని పరుచూరు బ్రదర్స్ హుందా అయిన స్క్రీన్ ప్లె రాయటం ,సంభాషణలను ప్రతి సందర్భం లోను అత్యంత అర్ధ వంతం గా ఉండటం ,శ్రీ ప్రియ ప్రతి దృశ్యం లోను తన పరిణతిని చూపటం ,వెంకటేష్ ఫామిలీ సినిమాలలో ఈ మధ్య నటిస్తూ ,ఆ అనుభవాన్ని రంగరించి ఇందులో నటించటం ,మీనా జుట్టు విరబోసుకున్నా సరైన అర్ధాంగిగా ఉండటం, పిల్లలిద్దరూ పరిధిలో పక్వనటన ప్రదర్శించటం ,ఫామిలీ సెంటి మెంట్ లో డిటెక్టివ్ కధను అతి నాగరకం గాచొప్పించి  ,మానవత్వ విలువల నేపధ్యం గా ,యజమానికి కుటుంబ బాధ్యతా ,పోషణా ,రక్షణా పరమావధిగా ఉండాలని అనుక్షణం గుర్తు చేస్తూ శ్రీప్రియ దర్శకత్వం అందరిని ఆకర్షించింది .సస్పెన్స్  అంతర్వాహినిగా సాగింది .ఒక్క వీరభద్రం అనే పోలీస్ తప్ప అందరూ మంచి మనుషులుగానే ఉన్నారు అతను చూసిన దృశ్యాన్ని వెంకటేష్ అతి రహస్యం గా ,పకడ్బందీగా పోలీస్ స్టేషన్ పునాదుల్లోనే సమాధి చేసి ,అందరిని రాంగ్ ట్రాక్ లో బలే నాక్ గా నడిపించాడు .బ్రాహ్మడు మేక  దొంగలు కధలో దొంగలందరూఆవుదూడను మేక అని చెప్పటం వెర్రి బాపడు ఇంతమంది చెప్పింది నిజమే కదా అని నమ్మి మోసపోయి ఆవు పెయ్యను వాళ్ళ పాల పడేసి ఇంటికి చేరటం కద గురటు కొచ్చింది నాకు  .వెంకటేష్ తనకు పరిచయం ఉన్న వారందరి హృదయాల్లో ఒకే డేటు లను దృశ్యమానం గా ముద్రించి అదే పలికించి ,పోలీసుల చేత నిజాన్ని కనుక్కోనీకుండా చేస్తాడు .వీరభద్ర పాత్ర దారి బాగా చేశాడు కన్నులతోను ముఖ  భంగిమలతోను క్రూరత్వాన్ని భేషుగా చూపించాడు

నదియా పోలీస్ ఐ జి.గా ,దుస్టూడైన ఒక కొడుక్కి తల్లిగా ,’’హర్ మాస్టర్స్ వాయిస్’’ పాత్రలో నిమిత్తమాత్రుడైన సీనియర్ నటుడు నరేష్ ఆమె భర్తగా నటించారు .కొడుకు మిస్సింగ్ కోసం నదియా చేసిన అన్ని ప్రయత్నాలు వ్యర్ధమే అవుతాయి . అందరిది ఒకే మాట .దాన్ని చేదించే ప్రయత్నాలన్నీ విఫలం .దీని వెనక ఏదో రహస్యం ఉందని ఆమె భావన .తనకొడుకు గురించి చెడు కూడా తెలుసు కొన్నది .అయినా థర్డ్ డిగ్రీ ప్రదర్శింప జేసింది స్వయం గా దగ్గరుండి అదీ రాంబాబు అనే వెంకటేష్ అంటే అయిస్టూడూ లంచగొండి అయిన వీరభద్రం తో .చూడలేక బాధ పడతాడు నరేష్ .ఆపే ప్రయత్నం చేయమని ఇజి  భార్య కు చెప్పి ఆపే యిస్తాడు .పెద్దపరుచూరి కూడా పోలీస్  హెడ్ గా రాంబాబు విషయం లో సాఫ్ట్ కార్నర్ లో ఉంటాడు. భాద్రాన్ని ‘’జర బద్రం కొడుకో ‘’అని హెచ్చరిస్తూంటాడు .సినిమా  అందరితోను పాత్రోచితం గా నటింప జేయించింది శ్రీప్రియ .చంద్ర బోసు పాటలు రాశాడు కాని మ్యూజిక్ హోరులో మాటలే తెలియలేదు .

’’వెనక స్థల సంగీతం ‘’అదే  నండి బాగ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కలిసొచ్చింది .అసలు సినిమా చూస్తున్నాము అనే భావన రాదు .మన ఇంట్లో జరిగే సంఘటనకు మనం దృశ్య రూపం లో చూస్తున్నామని పించింది .అది చాలు శ్రీప్రియ దర్శ కత్వ ప్రతిభకు .ఈ సినిమా అందరికి పాఠాలు నేర్పింది .వ్యవస్థలో ఉన్న లోపాలు యువత వెర్రి వేషాలేస్తే వచ్చే ప్రమాదం ,ఆడపిల్ల తనకు జరిగే అపాయాన్ని తలిదండ్రులకు చెప్పక పొతే కలిగే ఫలితం చెప్పి ఎలా కాపాడుకోవాలో తెలియ జెప్పింది .మరో ఆడపిల్ల జోలికి పోకుండా బుద్ధి చెప్పిన ఆ కుటుంబం అత్యంత గుంభన గా కలిసి కట్టుగా ఒత్తిళ్లకు ,రాంగ్ ట్రాక్ లకు లొంగకుండా రహస్యాన్ని కాపాడుకోన్నది .నిజం చెప్పించే ప్రయత్నం లో విఫలమైన ఐ.జి నదియా రాజీనామా చేసి భర్తతో విదేశాలకు వెళ్ళా బోతూ వెంకటేష్ ను  ,తమకొడుకు ను గారాబం తో పెంచి ,పట్టించుకోకుండా ,అడిగిన వన్నీ అమర్చి అజమాయిషీ లేకుండా తప్పుచేశామని ఇప్పటికైనా నిజం చెప్పమని ఏడుస్తూ నరేష్ ప్రార్ధిస్తాడు .అప్పుడు వాళ్ళు మనసు విప్పి మాట్లాడారుకనుక ఉన్న విషయమంతా వివరించి చెప్పాడు .తనది చిన్న కుటుంబం అని ,తనకు తన కుటుంబమే ప్రపంచమని ,వారిలో ఏ ఒక్కరికి అపకారం జరిగినా తట్టుకోలేమని ,అందుకే అందరం కలిసి కట్టుగా ప్రవర్తిం చామని నిజం చెప్పాడు .అంతకు ముందు మీనా భర్త ను పోలీసులు ఇంత క్రూరం గా ప్రవర్తించిన తర్వాతనైనా నిజం చెబుదామని అన్నది .అప్పుడు వెంకీ ‘’మన పిళ్ళ వాడి చేతిలో పరాభవం పొందితే ,వారెవరైనా వచ్చి ఓదారుస్తారా ,మన నష్టాన్ని పూడుస్తారా ?నాకు తెలిసిందాన్ని బట్టి ణా కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశాను  సాక్షాధారాలు ఎవరికీ దొరకవు .నామీద నమ్మకం ఉంచుకోండి మనం అంతా ఒక్కటే’’ .అని చెప్పాడు .చివరికి ఐజి దంపతులు బయట పడ్డప్పుడే అసలు విషయం చెప్పి ఊరడించాడు. వాళ్ళు చూడటానికి శవం కూడా దొరకకుండా  కొత్త గా కట్టే పోలీస్ స్టేషన్ పునాదుల్లో దాన్ని వేసి పూడ్చేశాడు .అదే క్లైమాక్స్ సీన్ .మీనా అడిగితె అప్పుడు బయటికి చెప్పాడు .ఒకటి రెండు సందేహాలు వస్తాయి .కాని మనల్ని ఆ జోలికి పోకుండానే కద లాకేళ్లి పోతుంది .ఎక్కడా ఎరువు తెచ్చుకొన్నట్లు లేదు .అతి లేదు .పరుచూరు మార్కు భారీ డైలాగులు లేక పోవటం అన్నిటి కంటే మరీ ప్లస్ పాయింట్ .సభ్యతకు ,సంస్కారానికి మచ్చు తునకగా నిలిచే సినిమా ఇది .రామానాయుడు సంస్థ సురేష్ బానర్ పై నిర్మించి గర్వం గా చెప్పుకో దగ్గ సినిమా .తెలుగు ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్ ఇచ్చిన చిత్ర దృశ్యం .అందరూ అభినంద నీయులే .

హడావిడి ,ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఒక చల్లని నదీ ప్రవాహం లా సినిమా సాగిపోతుంది .చిన్నపిల్లలు చూడటానికి కొద్ది ఇబ్బంది పడతారేమోకాని ,మీనా వెంకీ ల సరస సల్లాపాలు మురిపాలు క్లాస్ గా రిచ్ గా ఉన్నాయి వెకిలి తనం ,జిడ్డు హాస్యం లేకుండా మైంటైన్ చేసిన శ్రీప్రియ అభినదనీయు రాలు. అందుకే సినిమా శ్రీప్రియం ,అనుక్షణ కావ్య దృశ్యం ,వెంకటేషీయం అన్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 29-7-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా సంగ్రామానికి వందేళ్ళు -కొక్కొండ వారి యుద్ధ కవిత

యూరపుఖండ ఘోరభండన భాస్వద్రత్నావళము – కొక్కొండ వేంకటరత్నశర్మ

Published at: 28-07-2014 07:25 AM

సరిగ్గా వంద సంవత్సరాల కిందట ఇదే రోజున మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇంతటి మహాయుద్ధం, ఇంతటి విధ్వంసం మునుపటి చరిత్రలో లేవు. తెలుగు కవిత్వంలో నిక్షిప్తమైన ఆ యుద్ధ ప్రకంపనలు ఈ రెండు ఖండికలు!

దించు లంగరు
దించు లంగరు దీర్ఘయుద్ధం
ధర్మపక్షము ముల్లు చూపెను
నరుల పీనుగు పెంట పోకల
నాటి వెలయును శాంతి వృక్షము.

పాత సంధులు పాతిపెట్టుము
యుద్ధముల కవి ఉనికి పట్టులు
లోక మంతయు ఏకమై
యుద్ధమునె మారణము చేయును.

వచ్చెనిది బంగారు కాలము
వాంఛ లెల్లను తీరు సుజనుల
కాంగిలేయుల ధర్మ రాజ్యము
జ్ఞానమును స్వాతంత్య్రమిచ్చుచు
సంతతము వర్థిల్లు గావుత!
– గురజాడ అప్పారావు
(‘కృష్ణాపత్రిక’ 1915 అక్టోబరు 30)

మానవులందఱు మహిచరు లగుటన్‌- మహినే యుద్ధ మొనర్తురు గా!
ఈ నవాహవంబున నన జలచరు-లింక వియచ్చరులై రహహా!
పూనికి నందందే పోరుం బొరిఁ-బొనరింతురు వేఁగులు, తీఁగెల్‌
గానఁబడమి నవి వేఁ గాకస మిటఁ-గాంచ మహాయుద్ధ మిదె కదా!

జయాపజయములు దైవికములె యైు-సమకొనుఁదుద, నిప్పటి యూహల్‌
ప్రయోజనము లేనివి యనుచుం జె-ప్పనౌ; నైన, నే నుడివెద సం
దియ మేటికిఁ? గైజరున కందఱుం-దెలియఁగ శత్రులు, మిత్రులుగా
నయమున న్జార్జిచక్రవర్తికి-న్జయము సిద్ధమని యననగుఁ గా!

సాయపడిరి యాస్ర్టియావారి కని-జర్మను; లింగ్లిషువా రన్నన్‌
దోయము వా రగు ప్రాన్సువారికిని-దుర్బలులగు బెల్జియనులకున్‌;
న్యాయం బీయది యగుట నందఱు స-హాయులైరి ఈ పక్షమునన్‌;
శ్రేయం బిదె కద దైవము దోడగు-సిదము జయ మాంగ్లేయుల కౌ

హైందవు లాంగ్లేయులతోఁ గూడి మ-హాహవముం జేయుటఁ జూడన్‌
బొందగుఁ గృష్ణార్జునులు గూడుకొని-పోరికిఁ దొడఁగినయ ట్లహహా!
సందేహంబుం గలదే జయ మిట-సమకొనుటకు, ధర్మం బెందుం
బొందపడు నొ యందే మేల్గెలు పగుఁ; బోలుం గద శాంతియె మేలై

అప్రార్థితు లయ్యును సమయజ్ఞత-నాంగిలేయులకు సహాయులునై
దీప్రప్రవిదారణముఁ జలుపుటం-దెలిసి వారలు కృతజ్ఞతతో
క్షిప్రముగ నె తమతో సమానులుగఁ-జింతిం చి సమస్వాతంత్య్రం
బే ప్రసిద్ధముగ నొసఁగవలయుటన్‌-హిత మిది హైందవులకు నెందున్‌

తన దొరునిది బలతారతమ్యమును-దలఁపక, వృషభము వ్యాఘ్రముతో
ననిసే సి వినాశముఁగాంచె; నటులె-యక్కట! యేనుఁ గహా!
ఘనమగు భల్లూకంబు న్మార్కెనె, కనునె గెలుపు? గడు గాసిపడున్‌,
గనుఁగొన నఖిల మృగంబుల సింహము-ఖ్యాతిగ గెల్చి జయముఁగాంచున్‌

ఫ్రెంచివార లింగ్లీషువారలును-బ్రేముడిఁ గూడుటఁ జూడఁగ
త్ర్పాంచిత చందన కర్పూరంబులు-వలనొప్పఁగ బొందినయట్లౌ
గాంచన్‌ జర్మను లాస్ర్టియనులు వే-డ్కం గూడుట రసమును బులుసున్‌
మించి కలసినట్లగపడు నెవరికి;-మేలగు రష్యావారె ధ్రువుల్‌

సర్వ విధంబుల స్వతంత్రశక్తిని- జనుట బ్రిటిషు ప్రభుతయె సూర్యుం;
డుర్విఁ బ్రజాప్రభుతచేతఁ జంద్రుని-యోజం దోఁచును ప్రాన్సు; మహా
గర్వంబునఁ గ్రౌర్యంబున జర్మను-ఖ్యాతిగ నంగారకుఁ డన నౌ;
గుర్వాభము రుష్యా సామ్రాజ్యము;-గొఱలు సర్వియా బుధుభంగిన్‌

ఆలమునకు మూలంబగు నాస్ర్టియ-యౌ శని; జర్మను పక్షమునం
దాలోచింపక చేరెఁగాన శు-క్రాచార్యుండగుఁ దుర్కీ; వే
యేలా? యాంగ్లేయ ప్రభుత్వ మను-నిద్ధ బలుండు జనార్దనుఁడే
కేల దర్భ గొనె; జపాను రాహువు;- కేతువు బెల్జియ మనఁగ జనున్‌
నెపోలియనువలెఁ బ్రపంచ జయమున-నెగడఁ గడఁగన ట్లెగ్గె యగున్‌;
విపులబలు లయిన యాంగిలేయులే-ఫ్రెంచివారితోఁ గలసిరి స
త్కృపాంతరంగులు గావున, వారలు- గేరక చేరినఁగడు లగ్గౌ
నిపుడు విపులకున్‌ హిత మిది; కైజరె- యెనవయవలె నశోకుని కాంతిన్‌.

భూమిఁ గంసునికి గెలుపబ్బెనె శ్రీ- పురుషోత్తముని కె గొల్పొదవెన్‌;
భీమశక్తి శల్యునికిన్‌ జయమయ్యెనె- భీమాగ్రజుండు యుధిష్ఠిరుఁడే
శ్రీమంతుఁడు విజయము హరికృపఁ గనెఁ;- జెందునె కైజరు గర్వితుఁ డా
స్వామి హరికృపన్‌? ధర్మిష్ఠుండగు- జార్జి చక్రవర్తి విజయుఁడౌ

ఆయనయ సంపన్నుండు న్నీతి-న్యాయ ధర్మ పరిపాలకుఁడు న్‌
దయావీరుఁ డాయోధనవీరుఁడు-తంత్రావాప విశారదుఁడు న్‌
గ్రియా ప్రధానుఁడు కైజరు లోఁగొని- కీర్తనీయ శాంతిం జేఁతన్‌
జయార్జునుం డఁట జయముం బ్రాఁతియె- జార్జి చక్రవర్తి విజయుఁడౌ.

శ్రీ మహామహోపాధ్యాయ నామ బిరుద- రత్న కొక్కొండ వేంకటరత్నశర్మ సముదితం బినరత్నావళ మిది భీమ-భండననివారకము శాంతిభద్రదంబు.

సమర శాంతిరస్తు. సర్వేజనాః సుఖినో భవంతు.
మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నశర్మగారు
(‘ఆంధ్రపత్రిక’ 1915 రాక్షస సంవత్సరాది సంచికనుండి)

 

Category:

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

(248) 786-8594(248) 786-8594

You’ll need Skype CreditFree via Skype
Click here to Reply or Forward
9.18 GB (61%) of 15 GB used
©2014 GoogleTerms & Privacy
Last account activity: 44 minutes ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

Family

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

ఆశ్వాశాలు పెరిగిన కొద్దీ రామడుగు వారి కవితా ధార విజ్రుమ్భిస్తూ భావం సాంద్రం అవుతూ వచ్చింది .ద్వితీయ ఆశ్వాసం లో చెంచు లక్ష్మిని చూసి నరసింహ స్వామి ఉగ్రం తగ్గి ప్రేమ ప్రకోపించి చల్ల బడ్డాడు .’’శాంత రస గంగ  సృజించిన స్వామి దివ్య శృంగార రసాది దేవుడయ్యాడు .నివ్వెర పోయినిల్వున నీఱయి పోయాడు .’’గుడ్డిదౌగవ్వయయ్యే నా క్రుధయే కంతుని గంతుల  వింత రంతులన్ ‘’అను కొన్నాడు .తనకోపం అంతా గుడ్డి గావ్వతో సమానమై పోయిందని భావించి బాధ పడ్డాడు .ఆమె ఎవరని అడిగితె చెంచేత గడుసుగా ‘చెలికత్తెలు ‘’సింగ మవే! నరుడౌదే’’అని సందేహిస్తూ ‘’మెకాల మచ్చిక సేసి కొనుటే –ఇంపుగా వేటలాడుటే ఈమె పిచ్చి –అచ్చి వచ్చిన లచ్చి మా అడవి దొరకు ‘’అని అంతర్భావ స్పోరకం గా జవాబిచ్చారు. రాబోయే కధకు నాంది ఇక్కడ పడింది .ఇక ఇద్ద్దరు డైరెక్ట్ అటాక్ లో మాట్లాడుకొన్నారు .’నిన్ను చూసి దర్పకు బారి ‘’కి చిక్కానని నరసింహ అంటే ‘’బుంగ మీసాల నామాల పోరగాడ –ఎరయిన సూస్తే కొంప కోల్లెరే –నన్ను సేరకుర-కోరల సిన్న వాడ ‘’అని కేరే ఝాట్ గా భావించి బదులిచ్చింది నరసిమ్హానికి .మరీ రెట్టించి ప్రేమా దోమా అంటున్న పంగనామాల సోమిని ‘’నాయి బానాలు-నీయి పానాలు తీక ముందే’’ తొలగిపోమ్మన్నది .ఊరుకుంటాడా ఉడుం పట్టు నరసయ్య !’’నిన్ను కౌగిటన్ బట్టక నిలువలేనే ‘’అని తెగేసి చెప్పేశాడు .అప్పుడు ఇద్దరి మధ్యా ‘’చెట్టులెక్క గలవా?’’పాట పద్యాలుగా పరవళ్ళు తొక్కింది .’’బాన మేసి మెకాల పట్టి తుంచుచు జారుడు బండల జారగలవా?అని ప్రశ్నిస్తే ,ఇప్పటికే ఎన్నో అవతారాలు గా జారి పోయిన  స్వామి అన్నిటికి ‘’ఎస్ ‘’అంటూ చివరికి ‘’నార సింహుడ బ్రేమ పూజారి నేనే –జారి పోనీకే గైకోవే –సంతసమున ‘’అని తన్ను జారి పోనీకుండా వలచి గట్టిగా చెట్టబట్ట మన్నాడు .ప్రేమ పూజారి అవతారం ఎత్తానని సిగ్గు విడిచి చెప్పుకొన్నాడు .

 

అంత మాత్రం తో వదలలేదు చెంచిత .మళ్ళీ పరీక్షలెన్నో పెట్టింది .పులుల్ని ,పెద్దపులుల్ని పట్టగలవా ,సాల పువ్వుల్ని పంచగలవా ,పుట్ట కుక్కలా పట్టి కట్ట గలవా ,పెట్టె సొమ్ములతో పేరు వేయగలవా అని సంధిస్తే అన్నిటికీ చేయగలననే జవాబులిచ్చి చివరికి ‘’ప్రేమ పూజారినని తనను వంచించ వద్దని ‘’రికార్డ్ పెట్టాడు .ఏనుగుల్ని ,పట్టగలనని ,కోల వేయ గలనని జీ హుజూర్ ప్రేమ పూజారినని మళ్ళీ మళ్ళీ చెప్పాడు .తాము చెంచులమని తమకు మనిషి మృగం అయిన ఈ వింత జంతువూ సరిపోలదని చెప్పగా అతడు ఆమె జాతి గురించి అడిగితె ‘’జాతేంది ?నీదైన జాడ తెల్సేను పోరా !’’ నీ మగ బుద్ధి పోనిచ్చుకున్నావు కావని ఎద్దేవా చేసింది . .అలా అయితే ‘’మీ నాన్న నాకు మంచి మామ నువ్వు నాకు మరదలువి ‘’అన్నాడు చిర్రున కోపం వచ్చి చెంచిత ‘’మరదలనే ?నీకు –నీ పేమ వరద గానే ?దోవ నిల్వంగా బోకు –నాకు నీ తొడ పనిఏంది? నారసింహ ‘’అని బదులిచ్చింది .పట్టు విడువని పట్టు బట్టల సామి వదలలేదు ప్రాధేయ పడ్డాడు .ఒద్దని చెబితే బుద్ధి లేదా అంది .తన భావం లో ఆమెయే తన భార్య అన్నాడు .’’మోరకా (మూర్ఖా)అలా పిలవద్దు అని సుద్ది చెప్పింది .మనవాడు మళ్ళీ ప్రేమ పూజారి మంత్రం చదివాడు .చివరకు అతని ప్రేమలో స్వార్ధం లేదని గ్రహించి ,అర్ధం చేసుకొని ‘’ఆకు సాటు పిందియనురా ‘’అని తల్లీ తండ్రీ చాటు కన్నేనని ,పెద్దాళ్ళు అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదని సాధారణం గా ఆ సీనులో మనసినిమాల్లో ,కదల్లో ఆడపిల్లలా ‘’బొటవ్రేల నుర్వి రాచే ‘’అంటారు సహజ సిద్ధం గా కవిగారు .ఆమె సిగ్గుకు అదొక ద్రుశ్యకావ్యమే .మనకన్నెలు ఓణీ అంచును నోటిలో పెట్టుకొని నమలుతారు కాలి బొటన వ్రేలు నెల కేసి తల దించుతూ ఎత్తుతూ సినిమాలలో.

ఉగ్రం తగ్గి ప్రేమ అగ్రమై ఆమె నవ్వుల పువ్వులు కోసుకొంటానని, పెదవి జుంటి తేనెను జుర్రుకొంటానని  ,ముఖ పద్మ పై తేనే తీగలా విహరిస్తానని ‘నరసుందరుడు తొందర పడ్డాడు .ఆమె పై పూలు చల్లి లైన్ క్లియర్ చే సు కొన్నాడు .’’పుష్ప మౌదునే ‘’ అన్న ఆ పురుషునికి లేత పూవులా మాల ఆ లేమ వేసి సిగ్గు బుగ్గల మొగ్గ అయింది చెంచు లక్ష్మి .దండ తీసుకొని కైదండ ఇచ్చి అక్కున చేర్చుకొన్నాడు నారసింహుడు .నిండు కౌగిట ఆమె’’ నిమీలిత నేత్ర’’ అయింది .యెంతో సహజసుందరం గానో సాగింది చెంచులక్ష్మీ నారసింహుల జాతి అతీత ,కులాతీత ప్రణయం .ప్రేమ పూజారికి  ప్రియ లక్ష్మీ సాక్షాత్కారమయింది .ఇంతలో ఆమె తండ్రి ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు .నరసిమ్హాన్ని చూసి ‘’ఇటుల దయ్యము ఓలేను వెంట నటేదే –పోమ్మేహే –ఇక ఆగర –బుద్దియు సుద్దియు లేదటే ‘’అని పాపం మాటలు పడ్డాడు వైకుంఠ వాసి .తానూ ఒంటరివాడినని చెప్పగా ‘’ఒంటికాయ సొంటి ముక్క ‘’అని సామెత చెప్పాడు భిల్ల రాజు .’’తోకాడిం చుచు అవాకులు సేవాకులు పేలద్దని మా బాల గోల నీకేలా’’ ఛోచొ’’పోరా ‘’అని పశువును అదిల్చి నట్లు అదిలించి ,నరసిమ్హానికి సింహానికి మాటల  గడ్డి పెట్టి పోపోమ్మన్నాడు .తన అమ్మాయికి ధూళో గాలో సోకిన్దనుకొన్నాడు .లేక పొతే ఆఎర్రి మొగం ఈ ‘’నర మెకాన్ని’’దగ్గర తీయటం ఏమిటి అనుకున్నాడు .ఇక లాభం లేదని కూతుర్ని వెంట బెట్టుకు ఇంటికి బయల్దేరాడు .తండ్రి వెంట నడిచే చెంచులక్ష్మి ‘’సరంగులు మొకుల్ని వదిలి తే బలవంతం గా వెళ్ళే పడవ లాగా ,ప్రారంభ దశలో వచ్చీరాని పదాల తో కడు నెమ్మదిగా సాగు కకవిత్వం లా ,మారాం చేస్తూ బడికి వెళ్ళే గారాల బిడ్డడు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళినట్లు ,అవును అమ్మితే కొన్న వాడి వెంట బెంగగా వెళ్ళే  ఆవు, దూడ లాగా నెమ్మదిగా నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ చెలికత్తెలు బలవంతం గా లాక్కు వెడుతుంటే అయిష్టం గా కదిలి వెడుతోంది

ప్రబంధాలలో ప్రణయంతర్వాత విరహం ఉండటం సాంప్రదాయం .ఇక్కడ కూడా కవి గారు నారసింహ ,చెంచు లక్ష్ముల  విరహ వేదనను వర్ణించారు .మారుని పుష్ప బాణానికి ఇంత పదునా అని తిట్టుకున్నారు .అతడు పువ్వుల నన్నిటికి తన విరహ బాధ చెప్పుకొన్నాడు ‘’అందాల మాకందమా ! ఏమి ?యా చందామా స్పర్శ యంత ప్రహ్లాద మిడేనే ? యెంత యోగమే –నాడు సౌఖ్యంబదేల్ల-జిక్కి చక్కని వన్నెల జింకయయ్యే –అరెరే వేటాడగా నరహరినే హరినే –బాల సొగసు కీల దర్పకుని కోల’’అని తన గోల వెళ్ళ బెట్టాడు .హరి అయినా నరహరి అయినా కందర్ప దర్పాన్ని ఆపలేక పోయి విజేతుడయనయ్యానని విచారించాడు కందర్ప దర్ప సుందర నారాయణుడు .

‘’సుమము సుమమును మదుప సంశోభితంబే –మదుప మధుపంబు ఝంకార మధురిమంబే

స్వరము స్వరమును సమర వికస్వర రవంబే –వనము వారల పాలి బంధనమే యయ్యే ‘’

అని ప్రబంధ కర్త ఆ వనం లో ప్రతిదీ వారి మన్మదోద్దేపనకు ఎలా సహకరించిందో  హృద్యమైన పద్యం లో చెప్పారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-14-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment