శ్రీ దేవిని లొకేషన్ కు ఎత్తుకు వెళ్ళే వాడట రామానాయుడు –

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న నిర్మాత రామానాయుడు. అనేక భారతీయ భాషలలో వందకు పైగా చిత్రాలను నిర్మించిన ఆయన చిత్ర విశేషాల మాలిక – ‘మూవీ మొఘల్‌’ ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికర భాగాలు..

కెమెరా మాంత్రికుడు మార్కస్‌ బార్‌ట్లే పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయాబజార్‌’. ఆ సినిమాలో కెమెరాతో ఆయన చేసిన మాయలు అన్నీ ఇన్నీ కావు. విజయా వారి చిత్రాలకే పరిమితమైన బార్‌ట్లే 1965లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసి, ఇతర నిర్మాతల చిత్రాలకూ పనిచేశారు. తెలుగులో ఆయన చివరి చిత్రం ‘చక్రవాకం’. ఈ చిత్రం ఆయన పనితనానికి మరోసారి అద్దం పడుతుంది. ముఖ్యంగా కాశ్మీరులో చిత్రీకరించిన సన్నివేశాలు సింప్లీ సూపర్బ్‌. తెలుగు చిత్రాలకి విదేశీ మార్కెట్‌ ఏర్పరచాలన్న తనపతో రామానాయుడు ‘చక్రవాకం’ చిత్రాన్ని ఆంగ్ల సబ్‌ టైటిల్స్‌తో ‘మ్యూజిక్‌ ఆఫ్‌ లవ్‌’ పేరుతో విదేశాల్లో విడుదల చేశారు. విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. తెలుగులో మాత్రం ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.

తొలి రీరికార్డింగ్‌
తెలుగు చిత్రాలను ఎక్కడ నిర్మించినా రీరికార్డింగ్‌ మాత్రం మద్రాసులో చేయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఆ సదుపాయాన్ని హైదరాబాద్‌లో కల్పించారు రామానాయుడు. ఆయన నిర్మించిన రామానాయుడు రికార్డింగ్‌ థియేటర్‌ని 1995 మే 12న మహానటుడు ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఆ థియేటర్‌లో రీరికార్డింగ్‌ జరుపుకొన్న తొలి చిత్రం ‘తాజ్‌మహల్‌’. 1995లో నిర్మించిన తెలుగు చిత్రం, హిందీ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో అపజయాలతోనే ఆ ఏడాది ముగుస్తుందేమోనని భయపడిన రామానాయుడికి ‘తాజ్‌మహల్‌’ చిత్రం ఘనవిజయం సాధించి ఊరట కలిగించింది. జాతీయ సమైక్యతాభావం నేపథ్య సందేశంగా కలిగిన ఈ చిత్రం 1996 ఢిల్లీలో జరిగిన 27వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని మెయిన్‌స్ర్టీమ్‌ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలందుకొంది.
బిందెల సాంగ్‌
‘దేవత ’ చిత్రం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ ఆసినిమాలోని బిందెల సాంగ్‌. ‘వెల్లువొచ్చి గోదారమ్మా…’ అనే ఆ పాటని శోభన్‌బాబు, శ్రీదేవిపై రాజమండ్రి సమీపంలోని అగ్రహారంలో గోదావరి ఒడ్డున చిత్రీకరించారు. పాటల చిత్రీకరణలో తనదైన ప్రత్యేకత కలిగిన రాఘవేంద్రరావు బోర్లించిన బిందెల నేపథ్యంలో ఈ పాటని కొత్త తరహాలో తీసి ప్రశంసలందుకున్నారు. రాజమండ్రి నుంచి వందల సంఖ్యలో కొత్త బిందెలు కొని తెచ్చి ఈ పాటకోసం ఉపయోగించేవారు. రోజూ బోట్‌లో గోదావరి మధ్యలోకి వెళ్లేవారు. బోట్‌ దిగాక లొకేషన్‌ చేరుకోవాలంటే కొంతదూరం బురదలో నడవాలి. బురదలో నడిస్తే శ్రీదేవి కాస్ట్యూమ్స్‌ పాడవుతాయని తనే ఆమెని ఎత్తుకుని లొకేషన్‌కి తీసికెళ్లే వాడినని రామానాయుడు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెబుతారు.
…….
కారంచేడులో కథ తయారైంది
‘దేవత’ ఘన విజయం తరువాత రామానాయుడు మల్టీస్టారర్‌గా ‘ముందడుగు’ చిత్రం తీస్తున్నట్లు ప్రకటించగానే… ‘దేవతలో డబ్బులు వచ్చాయి కదా.. అవి కాస్తా పోతాయిలే’ అనే కామెంట్స్‌ మొదలయ్యాయి. తిట్లే ఒక్కోసారి ఆశీస్సులవుతాయని అంటుంటారు. అది రామానాయుడు విషయంలో ఎన్నోసార్లు రుజువైంది కూడా. జనం ఎలా అనుకున్నా తనుచేయాలనుకున్నది చేసే మనస్తత్వం ఆయనది. మంచికథతో ఆ సినిమా తీసి విమర్శకుల నోళ్లు మూయించాలనుకున్నారు. పరుచూరి సోదరులను కారంచేడు తీసుకెళ్లి ఓ నెలరోజులు కూర్చోబెట్టి అద్భుతమైన కథ తయారుచేయించారు.
……..
అదే రామానాయుడు గొప్పతనం
తొలిసారిగా దర్శకత్వం వహించే వ్యక్తికి రామానాయుడు వంటి నిర్మాత దొరకడం ఒకరకంగా అదృష్టమే. ఎందుకూ.. అనే ప్రశ్నకి సమాధానంగా ‘సంఘర్షణ’ చిత్రం షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఔట్‌డోర్‌ షూటింగ్‌ ఊటీలో ప్లాన్‌ చేశారు రామానాయుడు. తీరా అక్కడికి వెళ్లేసరికి వర్షం ఎదురైంది. తరువాత అది తుపానుగా మారింది.
ఔట్‌డోర్‌ షూటింగ్‌ అంటే రామానాయుడికి బ్రయిట్‌లైట్‌, బ్లూ స్కై తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే వర్క్‌ చేయడానికి ఆయన ఒప్పుకోరు. వర్షం కొంచెం తగ్గగానే ఉన్న లైటింగ్‌లోనే షూటింగ్‌ చేద్దామని ఛాయాగ్రాహకుడు లోక్‌సింగ్‌ అనగానే ‘నువ్వు స్కైని ఎవాయిడ్‌ చేసి షూటింగ్‌ చేస్తావు… వద్దులే’ అనేశారు రామానాయుడు. దాంతో వారం రోజులు షూటింగ్‌ లేకుండానే హోటల్‌ రూమ్స్‌కే పరిమితమయ్యారు యూనిట్‌ సభ్యులు. ఆ తరువాత కూడా వాతావరణంలో పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ లోక్‌సింగ్‌ బలవంతం మీద కొన్ని సీన్లు తీసి, షూటింగ్‌కి ప్యాకప్‌చెప్పారు. వర్క్‌ అలాగే మిగిలిపోయింది. ఆ వర్క్‌ కోసం మళ్లీ ఊటీ వెళ్లకుండా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేద్దామని దర్శకుడు మురళీమోహనరావు లొకేషన్ల కోసం వెదుకుతుంటే, ఒక రోజు రామానాయుడు పిలిచి షెడ్యూల్‌ ప్లాన్‌ ఏమిటని అడిగారు. ‘మళ్లీ ఊటీ వెళితే చాలా ఖర్చవుతుందని ఇక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాను సార్‌’ అని చెప్పారు మురళీ మోహనరావు. వెంటనే రామానాయుడు ‘ఖర్చు విషయం నేను ఆలోచించాలి కానీ ఆ గొడవ నీకెందుకయ్యా.. ఇది నీ తొలి సినిమా. ఎంత బాగా తియ్యాలో ఆలోచించు. మిగిలిన విషయాలు నాకు వదిలెయ్యి’ అన్నారు.
………
జడ్జి పాత్రలో రామానాయుడు
తన సినిమాలో ఎక్కడో ఒక చోట చిన్న పాత్రలో కనిపించడం నిర్మాత రామానాయుడుకి అలవాటు. అయితే ‘సూరిగాడు’ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో ఆయన నటించారు. కథని కీలకమైన మలుపు తిప్పే జడ్జి పాత్ర అది. టెన్నిస్‌ ఆడుతున్న రామానాయుడు మీదే సినిమాలో ఓపెనింగ్‌ షాట్‌ ఉంటుంది. ఆయన ఇంతకుముందు పోషించిన పాత్రలకు భిన్నంగా, గంభీరంగా ఈ పాత్ర సాగింది.
……..
మరోసారి సోగ్గాడు
విజయవంతమైన ఒక చిత్రానికి ఉన్న టైటిల్‌ను కొన్నేళ్ల తరువాత వేరే నిర్మాత తన సినిమాకు పెట్టుకోవడం చిత్రపరిశ్రమలో సాధారణంగా జరిగే విషయమే. అయితే ఒకసారి తను పెట్టిన టైటిల్‌ను మళ్లీ మరో సినిమాకి పెట్టే నిర్మాతలు అరుదుగా కనిపిస్తారు. ఈ విషయంలో రామానాయుడి పేరుని ప్రత్యేకంగా పేర్కొనాలి. శోభన్‌బాబు హీరోగా తను నిర్మించిన ‘సోగ్గాడు’ చిత్రం టైటిల్‌నే దాదాపు 30 ఏళ్ల తరువాత తరుణ్‌ హీరోగా నిర్మించిన చిత్రానికీ పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారు.
మూవీమొఘల్‌
రచయిత: యు. వినాయకరావు
వెల: 300 రూపాయలు
ప్రతులకు: జయా పబ్లికేషన్స్‌, ఫోన్‌: 98851 79428

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మేము చేస్తున్న డాన్సులు ఇప్పుడు హీరో యిన్లె చేస్తున్నారు -జయమాలిని

ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే..
ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే..
ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు ఆరువందలకి పైగా చిత్రాల్లో నటించిన ఈ ‘జగన్మోహిని’ ఇరవయ్యేళ్ల తరువాత ‘నవ్య’ ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు…

నా అన్నేళ్ల సినిమా జీవితంలో నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. నా పనేదో నేను చేసుకుంటూ పోయానే తప్ప ఏనాడూ హద్దులు దాటలేదు.

అల్లు రామలింగయ్యగారు ఎప్పుడూ చెబుతుండేవారు – ‘రెడీ యాక్షన్‌ అంటేనే జయమాలిని నవ్వుతుంది. పేకప్‌ చెప్పాక ఒక్క క్షణం కూడా సెట్‌లో వుండదు’ అని. వృత్తిని వృత్తిగానే చూశాను. అంతే!

 
 

‘‘నేను సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌ చేసినా నా క్రమశిక్షణ, వ్యక్తిత్వం బాగా తెలుసుగనుకే మా వారు నన్ను చేసుకున్నారు..’’

. జయమాలినిగారు నమస్కారం. పత్రికల్లో, టీవీల్లో ఎక్కడా కనిపించడం లేదు. తెలుగు ప్రేక్షకులను మరిచిపోయారా?
తెలుగు ప్రేక్షకులను ఎలా మరిచిపోగలను చెప్పండి (నవ్వుతూ). నా సినిమాలన్నీ అక్కడే కదా! అన్నట్టు నేను పత్రికలకు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలాయేళ్ల తరువాత ఇదే ఇంటర్వూ ఇస్తున్నాను.
. మీ అసలు పేరు జయమాలినేనా?
కాదు. నా అసలు పేరు అలమేలు మంగ. మా అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో విఠలాచార్య గారు నాకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు. బహుశా నాకు ‘జయం’ కలగాలనే ఆ పేరు పెట్టినట్లున్నా రాయన.
. మీ జన్మస్థలమేది? మీ కుటుంబ నేపథ్యం..?
మా అమ్మ శాంభవిగారిది కాంచీపురం నాయుడుగారి కుటుంబం. మా నాన్నగారు టీకే రామరాజన్‌ గారిది తంజావూరు. మాది సినిమా నేపథ్య కుటుంబమే. నాన్న ‘వినాయక ప్రొడక్షన్స్‌’లో భాగస్వామి. మేం ఎనిమిది మంది సంతానం. ఐదుగురం ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ఎనిమిదిమందిలో పెద్దావిడ జ్యోతిలక్ష్మి, అందరికంటే నేను చిన్నదాన్ని. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే.
. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు?
మా మేనత్త టీఆర్‌ రాజకుమారి 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. తొలి తమిళ సినీ డ్రీమ్‌గాళ్‌ ఆమె. మా అంకుల్‌ టీఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు టీఏ రామన్‌ మా అమ్మవద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, నన్ను అందులో నటింపజేస్తానని అమ్మని అడిగారు. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. అదే నా తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత విఠలాచార్య నా ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడదాని అదృష్టం’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని అమ్మని అడిగారు. నేను చాలా పీలగా వుండడంతో పాటలో నటించేందుకు అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకే చెప్పింది. అదే నా తొలి తెలుగు సినిమా.
. అంత చిన్న వయసులో వున్న మిమ్మల్ని ఐటమ్‌సాంగ్‌లో నటింపజేయాలని ఆయనకెందు కనిపించింది?
నేను భరతనాట్యం నేర్చుకుని వున్నాను. అప్పటికే అక్క జ్యోతిలక్ష్మి ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే నేను కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నాను. చాలా చలాకీగా వుండేదాన్ని. ఆ సమయంలో మా ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ నన్ను చూసి ‘ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా’ అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో నేను నటించాను. అలా నా చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే విఠలాచార్య నాకు అవకాశం కల్పించినట్లున్నారు.
. భరతనాట్యం సినిమాలకే పరిమితమైందా?
నేను చాలా బాగా డ్యాన్స్‌ చేస్తానని అప్పట్లో అందరూ మెచ్చుకునేవారు. నా భరతనాట్య అరంగేట్రం టి.నగర్‌, జీఎన్‌ చెట్టి రోడ్డులో వున్న వాణీమహల్లోనే జరిగింది. నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, ప్రముఖ నటులైన కాంతారావు, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మాతృమూర్తి తదితరులెంతోమంది వచ్చారు. ఒక్క పాట చూసేందుకు వచ్చిన ఎంజీఆర్‌.. కార్యక్రమం చివరి వరకూ వుండి నా నృత్యాలన్నింటినీ వీక్షించారు. ‘అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే వారిని బాగా చూసుకోవాలి కూడా’ అని ఎంజీఆర్‌ నా అరంగేట్రం సందర్భంగా సూచించారు. నేనెప్పుడూ ఆయన మాటల్ని పక్కనబెట్టలేదు. చివరి వరకూ మా అమ్మ నా వద్దనే వుంది. సినిమాలు చేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాల్లో అనేక చోట్ల నేను నృత్యం చేశాను. నా ప్రోగ్రామ్‌ అంటే జనం విరగబడి వచ్చేవారు. అప్పటికి సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా నా డ్యాన్స్‌ కోసం జనం బారులు తీరేవారు. మా అమ్మ పేరుతో పెట్టిన ‘శాంభవి ఆర్ట్స్‌’ సంస్థ నేతృత్వంలోనే ఈ డ్యాన్స్‌ పోగ్రామ్‌లు నడిచేవి.
. మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?
సుమారు 600 సినిమాల వరకూ నటించాను. అప్పట్లో ఇంత జ్ఞానం లేదు. దాంతో సినిమాల జాబితా కూడా దగ్గర పెట్టుకోలేకపోయాను. అన్నీ అమ్మ చూసుకునేది కదా, ఆమెకేమో ఈ పరిజ్ఞానం తెలియదు.
. ఏ భాషలో ఎక్కువ చేశారు?
తెలుగులోనే. తెలుగు పరిశ్రమే నన్ను బాగా ఆదరించింది. తెలుగు ప్రేక్షకుల కారణంగానే నేనీ స్థాయిలో వుండగలిగాను.
. వ్యాంప్‌ పాత్రలకే ఎందుకు పరిమితమయ్యారు?
అప్పటికే మా అక్క వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తోంది. జ్యోతిలక్ష్మి చెల్లెలన్న భావనతో నాకు అలాంటి పాత్రల్నే నిర్మాతలు ఇచ్చారు. తెలుగులో ‘జగన్మోహిని’, ‘మదనమోహిని’, తమిళంలో ‘కరాటే కమల’ వంటి సినిమాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలు చేశాను. కానీ ఎందుకో ఆ తరువాత కూడా వ్యాంప్‌ పాత్రలే వచ్చాయి మరి. అక్కను చిన్నతనంలోనే మా మేనత్తగారికి దత్తత ఇవ్వడంతో కుటుంబ బాధ్యత అమ్మపై పడింది. దాంతో నేను ఆమెకు సపోర్టుగా వుండాల్సి వచ్చింది. అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా చేయక తప్పలేదు.
. అందంలో, నటనలో, ప్రతిభలో మిగిలిన హీరోయిన్ల కన్నా తక్కువ కాకపోయినా.. మీకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదని బాధపడలేదా?
చిన్నప్పుడు పెద్దగా అనిపించలేదు. ఊహ తెలియడం మొదలుపెట్టాక హీరోయిన్‌ కాలేకపోయానే అని మనసు బాధపడేది. దాసరి నారాయణరావు గారు లాంటివారు ‘ఈ పాత్రలు ఆ అమ్మాయికి తగినవి కావు’ అని చెప్పినప్పుడల్లా మరింత బాధేసేది. హీరోయిన్‌ అయ్యేందుకు ప్రయత్నించాను. కానీ అప్పటికే ఐటమ్‌సాంగ్స్‌లో పడిపోయాను. చివరి వరకూ అదే కొనసాగింది.
. ఎవరితో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించేది?
నాకెవ్వరితోనూ కంఫర్ట్‌గా లేదు. అలాగని ఎవ్వరితోనూ ఇబ్బందీ లేదు. నేను ఇప్పుడే బాగా మాట్లాడుతున్నాను. సినిమాల్లో నటించేటప్పుడు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. సెట్‌లో కామ్‌గా కూర్చొనేదాన్ని, షూటింగ్‌ అయిన వెంటనే ఇంటికెళ్లిపోయేదాన్ని. ఎన్‌టీఆర్‌ గారితో ఎక్కువ సినిమాలు చేశాను. అలాగే చిరంజీవి, శోభన్‌బాబు గారితో కూడా. వారంతా సెట్‌లో సరదాగా వుండేవారు. అక్కినేనితో తక్కువ సినిమాలే చేశాను. సెట్‌లో ఆయన బాగా అల్లరి చేసేవారు. కృష్ణగారు నాలాగే పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. నా పనేదో నేను చేసుకునేదాన్ని. అందువల్ల కంఫర్టబుల్‌ అన్నదాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.
. సినీరంగంలో మీ స్నేహితులు?
చెప్పాను కదా, నేను మాట్లాడేది చాలా తక్కువని. అందుకే సినీపరిశ్రమలో నాకు స్నేహితులెవ్వరూ లేరు. కాకుంటే జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మిత అంటే చాలా ఇష్టం. సిల్క్‌స్మిత చాలామంచి నటి, డ్యాన్సర్‌.
. మీ ఐటమ్‌సాంగ్‌ వల్లనే హిట్టయిన సినిమాలు చాలానే వున్నాయి. పారితోషికం కూడా ఆ స్థాయిలోనే వుండేదా?
ఎక్కడండీ, చాలా తక్కువే ఇచ్చేవారు. అప్పట్లో హీరోకే రూ.3 లక్షల పారితోషికం వుండేదేమో! ఇక హీరోయిన్‌కు దానికన్నా తక్కువే. ఐటమ్‌ సాంగ్‌కు తక్కువే వుండేది. ఎంత ఇస్తారో సరిగ్గా తెలియదు గానీ, రూ.20 వేలు వుంటుందని అనుకుంటున్నా. ఒకే సినిమా మూడు-నాలుగు భాషల్లో కూడా( మొదటిపేజీ తరువాయి )
తీసేవారు. అప్పుడు మాత్రం భారీగా ఇచ్చేవారు. డబ్బు గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ అమ్మే చూసుకునేది. ‘యాక్షన్‌-పేకప్‌’ వరకే మన పని.
. కొన్నాళ్లు మీ అక్క జ్యోతిలక్ష్మికి మీరే పోటీ అయినట్లున్నారు?
లేదండీ. ఆమె నాకన్నా చాలా సీనియర్‌. ఆమె పదేళ్లకు పైగా సినిమాలు చేసిన తరువాత నేను అడుగుపెట్టాను. ఆమెతో నేనెక్కడ పోటీ పడగలను? అయితే నాకు హీరోయిన్‌ ఫేస్‌ వుందని అందరూ అనేవారు.
. మీరు నటించిన చివరి చిత్రం?
దాసరి గారి దర్శకత్వంలోనే చేశాను. పేరు గుర్తు లేదు.
. ఎన్నేళ్లు సినీ పరిశ్రమలో ఉన్నారు?
పద్నాలుగేళ్లు ఉన్నాను. 11-12 ఏళ్లు మంచి పీక్‌ సీజన్‌. తరువాత ఓ మేరకు సినిమాలు చేశాను.
. పన్నెండేళ్లకే సినిమాల్లోకి అడుగు పెట్టిన మీరు… ఇరవయ్యారేళ్లకే పరిశ్రమకు బరువయ్యారా?
ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. నేను మొదట్లో చాలా సన్నగా ఉన్నానని చెప్పాను కదా! సినిమాల్లో నేను పెద్దదానిలా కనిపించడం కోసం అమ్మ ఏవేవో పదార్థాలు పెట్టేది. ప్రతిరోజూ పచ్చి కోడిగుడ్డు పగలగొట్టి నోట్లో పోసేది. దాంతో బాగా శరీరం పెరిగింది. అప్పట్లో ఇప్పటిలా శరీరం గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం కాదు. ఈనాటి జిమ్‌లు, శరీరం నాజూగ్గా ఉండేందుకు మందులు, ఫిట్‌నెస్‌ కోసం చిట్కాలు అప్పట్లో లేవు. సెట్‌లో కూడా ఏది పెడితే అది తినేవాళ్లం. ఇంట్లో మనసుకి నచ్చిందంతా లాగించేసేవాళ్లం. దాంతో శరీరం పెరిగింది.
. సినిమాలు తగ్గాయని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కోసం సినిమాలు వదులుకున్నారా?
సినిమాలు తగ్గుతూ వచ్చిన తరువాతే పెళ్లికి దిగాను. అప్పటికే మా అన్నలు, అక్కల్లో ఒక్కొక్కరికి పెళ్లిళ్లు చేసింది అమ్మ. సినిమాలు చేస్తున్నప్పుడే మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి. కానీ మధ్యలో సినిమాలు మానేస్తే కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని అమ్మ వద్దనడంతో కొంతకాలం ఆగాను.
. సినిమావాళ్ల నుంచి ప్రపోజల్స్‌ రాలేదా?
మధ్యలో వచ్చిన పెళ్లి సంబంధాలు సినిమావాళ్ల నుంచే. పేర్లు వద్దులెండి. కానీ నా కుటుం బం కోసం ఆ సంబంధాలు వద్దనుకున్నాను.
. మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
పెద్దలు కుదిర్చిన పెళ్లే. మా అన్నయ్య స్నేహితుడే మావారు. ఆయన పేరు పార్తీబన్‌. మా ఇద్దరి నివాసాలు అప్పట్లో పక్కపక్కనే ఉండేవి. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా నిజజీవితంలో నా నడవడిక, నా తీరుతెన్నులు చూసి మా అత్తగారే నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. మా వారికి కూడా నా గురించి అంతా తెలుసు. నా అన్నేళ్ల సినిమా జీవితంలో నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. నా పనేదో నేను చేసుకుంటూ పోయానే తప్ప ఏనాడూ హద్దులు దాటలేదు. అల్లు రామలింగయ్యగారు ఎప్పుడూ చెబుతుండేవారు – ‘రెడీ యాక్షన్‌ అంటేనే జయమాలిని నవ్వుతుంది. పేకప్‌ చెప్పాక ఒక్క క్షణం కూడా సెట్‌లో ఉండదు’ అని. వృత్తిని వృత్తిగానే చూశాను. అంతే! నేను సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌ చేసినా నా క్రమశిక్షణ, వ్యక్తిత్వం బాగా తెలుసుగనుకే మా వారు నన్ను చేసుకున్నారు. మా పెళ్లి 1994 జూలై 19వ తేదీన తిరుమలలో జరిగింది.
. పెళ్లి తరువాత సినిమాలవైపు రాలేదెందుకని?
నేనే వద్దని అనుకున్నాను.
. ఎందుకు వద్దనుకున్నారు?
పెళ్లి ముచ్చట తీరేసరికి బాబు పుట్టాడు. అతని ఆలనాపాలనా చూసేసరికి సగం కాలం గడిచిపోయింది. ఆ తరువాత కుటుంబానికి అలవాటుపడిపోయాను.
. సినిమాల్లోకి రావద్దని మీవారు ఏమైనా కండీషన్‌ పెట్టారా?
అయ్యయ్యో! అలాంటివేమీలేదు. ఆయన ఎప్పుడూ సినిమాలు వద్దని చెప్పలేదు. పెళ్లికి ముందు దీని గురించి ప్రస్తావనే రాలేదు. తరువాత నా ఇష్టానికే వదిలేశారు.
. ఫ్యామిలీ లైఫ్‌ ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. మా పెళ్లయ్యేనాటికి మా వారు తమిళనాడు పోలీస్‌శాఖలో ఎస్సైగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆయన మనసు బంగారం. నన్ను అర్థం చేసుకున్న భాగస్వామి దొరకడం నా అదృష్టం. మాకు ఒక బాబు. వాడి వయసు 19 ఏళ్లు. చెన్నైలోనే బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంతకు మించి వివరాలు వద్దులెండి.
. ఎందుకని?
మా అబ్బాయి వివరాలు బయటకు చెప్పడం వాడికి ఇష్టం లేదు. తనెవ్వరో తెలిస్తే కాలేజీలో ఇబ్బందిగా ఉంటుందని బాబు అభిప్రాయం. సినిమావాళ్లంటే ఆ క్రేజ్‌ వేరు కదా. ప్రత్యేక సెలబ్రిటీగా చూస్తారని అతని ఉద్దేశం. తన ఫ్రెండ్స్‌ నన్ను సినిమా ఆర్టిస్టుగా గుర్తించడం బాబుకు ఇష్టం లేదు.
. మళ్లీ సినిమాల్లోగానీ, టీవీ సీరియళ్లలోగానీ నటించే ఉద్దేశం ఉందా?
చేయాలని మనసు కోరుకుంటోంది. మంచి క్యారెక్టర్‌ దొరికితే చేస్తా. అది కూడా బాబు కాలేజీ చదువు పూర్తయ్యాకే. అంతా భగవంతుడి దయ.
. మరి మీ అబ్బాయిని సినిమాల్లోకి తెచ్చే ఉద్దేశమేమైనా ఉందా?
ఇప్పటి జనరేషన్‌లో వారికేం కావాలో వారే నిర్ణయించుకుంటున్నారు. మా అమ్మ చెప్పిందని నేను సినిమాల్లోకి వచ్చాను. కానీ ఈకాలం వారు మన మాట వింటారా? అందుకే ఎటువైపు వెళ్లాలన్నది అతనిష్టం.
. జీవితంలో బాగా సంతోషకరమైన సంఘటన?
మా అబ్బాయి పుట్టడమే. అంతకన్నా సంతోషకరమేముంది?
. బాధాకరమైన సంఘటన?
రెండేళ్లక్రితం మా అమ్మ చనిపోవడం.
. తీరని కోరిక ఏమైనా ఉందా?
ఎంజీఆర్‌తో నటించలేకపోయాను. ఎంజీఆర్‌ హీరోగా ‘అన్నా! నీ ఎన్‌ దైవం’ అనే సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అందులో నాకొక పాత్ర ఇచ్చారు. కానీ అంతలోనే ఆయన సీఎం కావడంతో ఆ సినిమా అలానే ఉండిపోయింది. నా భరతనాట్య అరంగేట్రం ఆయనతోనే జరిగినా.. ఆయనతో కలిసి సినిమాలో నటించలేకపోవడం మాత్రం కొరతే.
. మీరు జీవితచరిత్ర రాయాలనుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది?
అలాంటిదేమీ లేదు. ఇలాంటి ప్రచారాలు నేను కూడా చాలా విన్నాను. నేను అమెరికా వెళ్లిపోయానని, ఇంకెక్కడెక్కడో ఉంటున్నానని, నేను చెప్పినట్లు కూడా ఏవేవో వారే ఊహించి రాసేశారు. నేను చెన్నైలోనే ఉన్నాను. నా వివాహమైన తరువాత నేను ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇదే.
. మీరు బయటికొచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ స్పందన ఉంటోందా?
ఎందుకు లేదు? జనాలు మరచిపోతే కదా స్పందన కరువవ్వడానికి! అప్పట్లో నేను, శ్రీదేవి, జయసుధ ఎప్పుడైనా బయటికెళ్లాలంటే బురఖా వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడంత లేదు. నేను మొదటి నుంచీ సినిమా ఫంక్షన్లకు వెళ్లడం కూడా తక్కువే. ఇప్పటికీ అంతే, బయటికి ఎక్కువగా వెళ్లను. ఇంట్లోనే మా మేనత్త కట్టించిన ఆలయం ఉంది. ఎప్పుడైనా అరుదుగా బయటి ఆలయాలకు వెళ్తాను. అప్పుడెవరైనా గుర్తు పట్టి పలుకరిస్తుంటారు, కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటుంటారు.

ఇప్పుడవన్నీ హీరోయిన్లే చేసేస్తున్నారు కదా! ఇప్పటి జనరేషన్‌లో చాలా ప్రతిభ వుంది. సిల్క్‌స్మిత, డిస్కోశాంతి వరకూ వ్యాంప్‌ పాత్రలుండేవి. ఆ తరువాత కామెడీ, ఫారిన్‌సాంగ్స్‌తో సినిమా నడిచేస్తోంది. డిస్కోశాంతి కూడా బాగా సెటిలైంది. శ్రీహరి ఆమెకు మంచి లైఫ్‌ ఇచ్చారు. ఆయన మనసు చాలా మంచిదని విన్నాను. బహుశా నేను సినీ కెరీర్‌ ముగించేనాటికి ఆయన ఎంటర్‌ అయినట్లున్నారు. ఆ దంపతులిద్దరూ చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారట కదా!

నాక్కూడా డ్రీమ్‌గర్లే! – జయమాలిని భర్త పార్తీబన్‌

. జయమాలినిని మొదటిసారిగా ఎప్పుడు చూశారు?
సినిమాల్లో చాలాసార్లే చూశాను. కానీ మొదటిసారి ఆమె అన్న కుమార్తె బర్త్‌డే ఫంక్షన్లో చూశాను. షూటింగ్‌ నుంచి నేరుగా మేకప్‌తోనే ఆ ఫంక్షన్‌కి వచ్చింది. అప్పటికే 10-15 యేళ్లుగా మా రెండు కుటుంబాలు పక్కపక్కనే వున్నాయి. మా అమ్మ- జయమాలిని మాతృమూర్తి మంచి స్నేహితులు.
. అప్పట్లో ఎంతోమందికి డ్రీమ్‌గర్ల్‌గా వున్న ఆమె మీ స్వంతమైనప్పుడు ఏమనిపించింది?
సంతోషమే కదా! నాకూ ఆమె డ్రీమ్‌గర్లే. ఆ తరువాత ఫ్యామిలీ గర్ల్‌ అయ్యింది.
. పెళ్లప్పుడు ఏమైనా కండీషన్లు పెట్టారా?
ఏమీ లేదు. నా వృత్తిలాగే నటన కూడా ఒక వృత్తే కదా. అలాంటప్పుడు ఆమెకు కండీషన్లు పెట్టడమెందుకు? ఆమెకు పూర్తి స్వేచ్ఛ వుంది. మా నాన్న ఫేమస్‌ జర్నలిస్ట్‌. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అందువల్ల నిజానిజాలేంటో గ్రహించగలను.
. వ్యాంప్‌ పాత్రలు చేసే నటిని చేసుకోవడం పట్ల మీ కుటుంబంలో అభ్యంతరం రాలేదా?
చాలా వ్యతిరేకత వచ్చింది. బంధువులు, ఫ్రెండ్స్‌ వద్దన్నారు. కానీ జయమాలిని ఏంటో నాకు తెలుసు. మా అమ్మకు ఇంకా బాగా తెలుసు. ఆమె అన్నీ పరిశీలించిన తరువాతే ఓకే చేసింది. ఆమే మాటే నాకు వేదవాక్కు.
. ఆమె మళ్లీ నటించడానికి మీకేమైనా అభ్యంతరమా?
నాకేమీ అభ్యంతరం లేదు. కానీ బాబుకి ఇష్టం లేదు. ఒక వయసు వచ్చిన తరువాత పిల్లల మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి కదా!


ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వేశ్వరయ్య విలువలు కావాలి –

దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంజనీర్లుగా దేశంలోనే కాదు విదేశాల్లో రాణిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. దానితోపాటే నేర్చుకున్న విద్యను హైటెక్‌ మోసాలకు వినియోగించి కటకటాలపాలవుతున్నవారు కూడా ఉన్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. కాసులకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోద కాలు ఇస్తూ అవినీతి నిరోధకశాఖ చేతికి చిక్కుతున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఈ దుష్ప్రభావాల నుంచి ఈ రంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నేటి ఇంజ నీరింగ్‌ విద్యార్థులపై ఉంది. ఇందుకు మనం ఈ రంగంలో సేవలందించి, సమాజంలో విశిష్ఠ స్థానాన్ని పొందిన ఇంజనీరింగ్‌ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య (ఎం.వి) 1861 సెప్టెంబరు 15న కర్ణాటకలోని ముద్దనహల్లిలో జన్మించి 1883లో పూనా సైన్స్‌ కాలేజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారాయన. కర్ణాటకలో కృష్ణసాగర్‌ డ్యాం, దేశంలో విలువైన ఆస్తిగా గర్వంగా చెప్పుకుంటున్న భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్‌ సాండల్‌ సబ్బు కర్మాగారం ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్‌ ఇంజనీరింగ్‌లో ప్రావీణ్యత కారణంగా దేశంలో అనేక ప్రాజెక్టులను ఆయన రూపొందించారు. సుక్కూరు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసేందుకు అతి క్లిష్టమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నీటి వృథాను అరికట్టడానికి ‘బ్లాక్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు నిజాం ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను రూపకల్పన చేసిన విషయం మనకు తెలిసిందే.
విశ్వేశ్వరయ్య మైసూరు రాజ్యంలో దివాన్‌గా పనిచేస్తున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు ఒకరు తన ఉద్యోగ ప్రమోషన్‌ కోసం ఒక సంతకం చేయమని అడుగుతారు. విశ్వేశ్వరయ్య దానిని సున్నితంగా తిరస్కరించడం చూస్తే ఒక ఇంజనీర్‌గా ఏ విధంగా నీతిపరమైన పాలనను అందించవచ్చో నిరూపించారు. దివాన్‌గా ప్రభుత్వం ఇచ్చిన కారును ప్రభుత్వ పనులకే ఉపయోగించి, తన పనిని, బాధ్యతలు ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదన్న సూత్రాన్ని అనునిత్యం పాటించేవారు. దేశంలోని పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం, వృత్తివిద్య ప్రాధాన్యతను పెంచే విషయంలోనూ అనేక కార్యక్రమాలు రూపొందించిన విశ్వేశ్వరయ్య ఉద్యోగ విరమణ తరువాత కూడా పలుదేశాల్లో పర్యటించి సలహాలు ఇస్తుండేవారు. ప్రతి వ్యక్తీ జీవితాంతం విద్యార్థిగానే ఉండాలని కాంక్షించే ఆయన ఎక్కడ ఏ కొత్త సమాచారం తెలిసినా నోట్‌ చేసుకునేవారు. దేశ స్వాతంత్య్రం రాకముందే దేశం సక్రమంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో 1920లో ‘భారత దేశ పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాలను రాశారు.
మౌలిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్‌ రంగం ఎంత ప్రాథమికమైనదో, ప్రధానమైనదో జీవితాంతం కార్యశీలురుగా నిరూపించిన మహామనిషి ఆయన. నైతిక విలువల ఆధారంగా పనిచేసి ఇంజనీరింగ్‌ రంగానికి విశిష్టమైన గుర్తింపు, గౌరవం సంపాదించిపెట్టారు. అందుకే ఆ మహనీయుని జన్మదినాన్ని ‘ఇంజనీర్స్‌ డే’గా జరుపుకొనే అవకాశం మనకు దక్కింది. ఆయన వేసిన పునాది, చూపిన మార్గం, పాటించిన ఆదర్శాలతో నేటివరకూ ఎన్నో ఉన్నత లక్ష్యాలను చేరుకున్నాం. అనేక పరిశోధనలు జరిపి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఆధునికీకరణ చేసుకొంటున్నాం. భారత్‌ వంటి సువిశాల దేశంలో ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పించడంలో ఇంజనీరింగ్‌ రంగం సైతం విశేషమైన కృషి చేస్తుంది. విప్లవాత్మకమైన మార్పులు, ప్రయోగాలు వస్తున్నాయి.
దురదృష్టవశాత్తు ‘ఇంజనీర్స్‌ డే’ మొక్కుబడి కార్యక్రమంగా మారడంతో ఇంజనీరింగ్‌ రంగంలో ఉండాల్సిన నైతిక విలువలు పతనమవుతున్నాయి. విశ్వేశ్వరయ్య ఆశయాలు, ఆదర్శాలు మార్గదర్శకత్వం గాలిలో కొట్టుకుపోయాయి. బీహార్‌లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన, హైదరాబాద్‌లో నడిబొడ్డున కూలిన ఫ్లై ఓవర్‌, ఏసీబీ, సీబిఐలకు చిక్కుకున్న అవినీతి బాగోతాలతో ఇంజనీరింగ్‌ రంగం అప్రతిష్ట పాలవుతున్నది. నాటి రోజుల్లో ఇంజనీరింగ్‌ రంగంలో ఉన్న వ్యక్తుల పట్టుదల, కార్యదీక్ష, నిజాయితీ, తపన నేటి రోజుల్లో ఏమి అయ్యాయన్నది, అందుకు కారణం ఎవరన్నది, విరుగుడు ఏమిటో పునరాలోచించాలి. నైతికత, నిబద్ధత కలిగని విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఇంజనీర్లు మార్గదర్శిగా స్వీకరించాలి. ఆయన విలువలను వ్యక్తిగతంగా, సామాజికంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరిగినప్పుడే భావిభారతం ప్రపపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది.
– పి. మోహన్‌ చారి
(నేడు విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్‌ డే)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8 దేవీ స్తుతి

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -8

దేవీ స్తుతి

ఋగ్వేదం లో దేవీ సూక్తుం, రాత్రి సూక్తం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి  సూక్తం ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తాయి .కేన ఉపనిషత్ లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు లోను దుర్గా స్తుతి ఉందని పుట్టపర్తి వారన్నారు .మార్కండేయ పురాణం లో దుర్గా స్మరణ ఉన్నది .అందులో ఎనభై ఒకటి నుండి తొంభై మూడు అధ్యాయాల్లో దుర్గా పూజ విశేషాలు వర్ణింప బడ్డాయి .మొహంజొదారో ,హరప్పా  సింధు లోయాల్లో దుర్గా విగ్రహాలున్నాయి .ఇవి అయిదు వేల ఏళ్ళ కిందటివి .ఆ రోజుల్లో దుర్గా పూజ ఉండేది . పూజల్లో చండీ పూజకు విశేషం ఉంది .దీనికి ‘’దుర్గా సప్త శతి’’ ముఖ్య గ్రంధం .దానిలో మొదట కాళి,తర్వాత మహా లక్ష్మి ,సరస్వతి లలోని రూప భేద వర్ణన ఉంది .కాళికి గాయత్రీ ఛందస్సు ,మహా లక్ష్మికి ఉష్ణిక్ ఛందస్సు ,సరస్వతికి అనుష్టుప్ ఛందస్సు ఇష్టమైనవి అందులోనే వారుంటారు .తమో ,రజ సత్వ గుణాలు వీరికి ప్రతీకలు. సప్తశతి వేదం లోనే ఉంది అనే వారూ ఉన్నారు .దుర్గా ,కాళి,కుమారి ,చండి ,కాత్యాయని పేర్లు పురాణాలలో కూడా వింటాము .లలితా దేవికి నవావరణ పూజ ముఖ్యం .శాక్తం లో దక్షిణ ,వామాచారాలున్నాయి .రామాయణ  భారతాలలో దుర్గా స్తుతి ఉన్న సంగతి మనకు తెలుసు .

ధర్మ రాజు దుర్గా స్తుతి చేసినట్లు వ్యాసుడు రాశాడు .విరాట ,భీష్మ పర్వాలలో ఇది కనిపిస్తుంది .ధర్మ రాజు దుర్గను మహిషాసుర మర్దినిగా వర్ణించాడు .వింధ్య వాసినిగా పేర్కొన్నాడు .యుద్ధానికి ముందు దుర్గా స్తవం చేయమని శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పాడు .రావణుడు ,ఇంద్రజిత్తు దుర్గా రాధకులని రామాయణం తెలియ జేస్తోంది .బెంగాలీలకు శక్తి పూజ ముఖ్యం .చండీ పారాయణం వారి నిత్య కృత్యం .చండీ సంప్రదాయం నర్మదా నదీ తీరం లోని ఉజ్జయిని లో పుట్టిందని ఆచార్య భాషణం .క్రీస్తు పూర్వమే ఈ ఆరాధన ఉన్నట్లు కనిపిస్తోంది .సప్త శతి పై ముప్ఫై వ్యాఖ్యానాలున్నాయి .శంకరుల గురువు గౌడ పాడులూ ఒక వ్యాఖ్యానం రాశారు .నాగోజి భట్ట వ్యాఖ్యానమూ గొప్పదే .దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .మన్మధుడు మరణించిన తర్వాత దేవతలు  ఈశ్వరుడిని ప్రార్ధిస్తే అతడికి రూపం ఇచ్చాడు .వాడు భండాసురుడు అయ్యాడు .శోణిత పురాన్ని రాజధానిగా చేసు కొని దేవతలపైకి కాలుదువ్వాడు .దిక్కు తోచక దేవతలు పార్వతీ దేవిని అర్ధించారు .ఆమె త్రిపురసుందరి అయి భండాసుర వధ చేసింది .మళ్ళీ ఆమె మన్మధుని అనంగుడిగా చేసింది .ఇందులో ఒక శ్లోకం ఉంది –

‘’పుం రూపం వాస్మరేద్దేవిం స్త్రీ రూపం వావి చింత యేత్ –అధవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్ష.ణాం’’అంటే దుర్గ ను పురుష రూపం లోనూ  ధ్యానించ వచ్చునని తెలుస్తోంది  .ఆమె పురుష రూపం విష్ణు మూర్తి అట .కోప రూపం కాళికాదేవి.యుద్ధ రూపం దుర్గ .ఆమె ఉపాసనకు మంత్రం ,యంత్ర ,తంత్రాలు ముఖ్యాలు అన్నారు ఆచార్యుల వారు .పంచదశి మంత్రం .శ్రీ చక్రం యంత్రం .తంత్ర కలాపం ఎక్కువ .ప్రతి వాడి హృదయం శాక్తేయమే .బాహ్యం లో శివుడు ,పూజలో వైష్ణవుడు అంటారు పుట్టపర్తి వారు .అంటే ఈ మూడిటికి భేదమే లేదని భావం .అర్జునుడు గొప్ప శివ భక్తుడు .కాని శ్రీకృష్ణుని చెలికాడు బావ మరదికూడా .కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్గా పూజ చాలా నిష్టతో చేశాడు .కనుక ప్రతి హిందువు శాక్తుడు శివుడు వైష్ణవుడే అని తేల్చారు నారాయణా చార్యులవారు .ఈ సత్యాన్ని  గుర్తించ కుండా మత భేదాలు పెంచుకొని  ,విద్వేషాలతో మనుషులు ఒకరికొకరికి దూరమై పోతున్నారు . సరసం గా సమన్వయము గా బతకటం తెలియని మూర్ఖులుగా జీవించటం బాధకలిగిస్తోందని దుర్గా పూజ సప్త శతి సారం ఇదే అని గ్రహించాలని మనందరినీ ఆచార్యులవారు హెచ్చరిస్తున్నారు .ఇది తెలుసుకోకుండా చేసే పూజా ,పారాయణం ఫలితం ఇవ్వదు అని మనం గుర్తించాలి

మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్

myneni1 001 myneni2 001శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -7 మంత్రం యోగం

పుట్ట పర్తి వారి   పుట్ట తేనె చినుకులు -7

మంత్రం  యోగం

యోగం అంటే సంబంధం .ఒక లక్ష్యం తో సంబంధాన్ని పొందటం .ఇందులో హఠ ,లయ మొదలైన యోగాలున్నాయి .సాధారణం గా అందరూ ద్వైతులే .అద్వైత భావం కలిగేది కొన్ని క్షణాల పాటు మాత్రమె .’’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు గీతా  చార్యుడు కృష్ణుడు . యోగాలలో మంత్రం యోగమూ ఒకటి .మంత్రాన్ని అనుష్టానం చేస్తూ లక్ష్యాన్ని సాధించి అందులో లయం అవటం అన్న మాట .దీని ప్రధాన లక్ష్యం వైరాగ్యమే .కాని వైరాగ్యం తో మొదలు అవ్వదు .మంత్రాలు  వైదికాలు అని  , తాంత్రి కాలని రెండు రకాలు .వీటిలో వైదికాలు శ్రేష్టమైనవి .శ్రీ సూక్తం  ,పురుష సూక్తం లలో  అనేక ప్రయోగ విశేషాలున్నాయి .జపం హోమం ,తర్పణ ,మార్జనం భోజనం సాధనకు అంగాలు .అన్నీ కుదరక పొతే జపమే చాలు .జపం లక్ష చేస్తే హోమం అందులో పదో వంతు చేయాలి .దీనిలో పదో వంతు తర్పణం .హోమం లేకుండా జపం చేయాలంటే హోమ అంశానికి  రెట్టింపు జపం కూడా చేయాలి .

రుద్ర నమక చమకాదులకూ ఇదే విధానం  దనం కావాలంటే శ్రీ సూక్తాన్ని బిల్వ వృక్షం కింద కూర్చుని జపించాలి .ప్రతి మంత్రానికి యంత్రం ఉంటుంది .వైదికం గా చేయలేనివారికి తంత్రం సాయ పడింది. శివుని అనుగ్రహం లేక పొతే తంత్రాలు సిద్ధిం చవు .అరవై నాలుగు తంత్రాలున్నాయి .ఇందులో కొన్ని భయంకరాలు కొన్ని జుగుప్స అసహ్యం కలిగించేవి ఉన్నాయి .ముఖ్యం గా శైవాలు వైష్ణవాలు శాక్తాలు అని మూడు భాగాలుగా చెప్ప వచ్చు .ఉపాసకుడు ఎవరైనా సరే ముందు శాక్తేయుడే అని తర్వాతే శివుడో వైష్ణవుడో అవుతాడని కొందరు అంటారు .లోపల ఉండే పంచ భూతాత్మక పదార్ధాలను జయించి,వాటి ద్వారా బాహ్యాన్ని బంధించే ప్రయత్నమే తంత్ర శాస్త్రం .ప్రతి మంత్రానికి రుషి ఛందస్సు ,బీజం శక్తి కీలకాలు .న్యాసం తో సాధకుడు అభేదాన్ని ముందు పొందుతాడు .ధ్యాన శ్లోకం లో ఉన్న మూర్తిని జపం లో అనుస్టిం చు కొంటాడు .మంత్రాలలో అనేక భేదాలున్నాయి .

కొన్ని మంత్రాలు శాపగ్రస్తాలు .కొన్నిటికి శాపం లేవు .గాయత్రీ మంత్రానికి విశ్వామిత్ర మహర్షి శాపం ఉందట .అన్ని మంత్రాలను పరశురాముడు శపించడట .అందుకే భార్గవ రామ మంత్రాన్ని సాధించిన వారికి గురువు ఉపదేశం అక్కర లేదని పుట్ట పర్తి వారు సెలవిచ్చారు .పుస్తకం లో చూసి జపిస్తే చాలని ‘’మేరు తంత్రం ‘’అనే గ్రంధం తెలియ జేస్తోందని సరస్వతీ పుత్రుల అభిభాషణ .అన్ని వర్ణాల వారు సాధించే మంత్రాలు కొన్ని ఉన్నాయి .ఒక్కో వర్ణం వారికి ఒక్కో మంత్రమూ చెప్ప బడింది .పునశ్చరణ చేసిన తర్వాతే కార్య సాధనానికి ఉపయోగ పడే మంత్రాలు కొన్ని .దాని అపేక్ష లేకుండానే కార్య సాధన ఇచ్చేవికొన్ని .ఇలాంటి వాటిలో ‘’నారసింహ మంత్రం ‘’ఒకటి .మంత్రోపదేశం లో ‘’సిద్దారి చక్రం ‘’ప్రాముఖ్యత ఉంది .ఏ మంత్రాన్ని అనుష్టిస్తే ఏమి లాభం అనేది ఇది తెలియ జేస్తుంది .కొన్నిటికి ఈ చక్రాన్ని చూసే పని లేదనీ శాస్త్రం చెబుతోందని ఆచార్య ఉవాచ .మంత్రాలలో శ్రీ ,పుంస మంత్రాలున్నాయి .ప్రతి మంత్రానికి కుండ భేదం ఉంటుంది .మానసికం గా జపించేటప్పుడు దీని ఆపేక్ష అక్కర్లేదు .గురువు శిష్యుడికి ఉపదేశించాల్సిన మంత్రాన్ని ముందుగా సాధించిన తర్వాతే శిష్యుడికి  ఉపదేశించాలి .అప్పుడు శిష్యుడికి ఏ సాధనా అక్కర్లేదు అని ‘’మేరు తంత్రం ‘’బోధిస్తోందని నారాయణాచార్యుల వారు తెలిపారు .అలాంటి గురువు దొరకటం  పరమ భాగ్యం అన్నారు .మంత్రానికి ఆరు ప్రయోజనాలున్నాయి .

వశ్యాకర్షక మంత్రాలు ,మారణం చేసే మంత్రాలూ,స్తంభన మంత్రాలు ,మోహన మంత్రాలు  ఉన్నాయి .పల్లవం అనేదాన్నికలిపినప్పుడు ఈ భేదాలేర్పడతాయి .విధి విధానం లో మాలా భేదం, ఆసన భేదం చెప్ప బడ్డాయి.ముద్రా ప్రదర్శన కూడా రక రకాలుగా ఉంటాయి .ఇలా షట్ ప్రయోజనాలతో ఒక్క మంత్రాన్ని సాదిస్తే చాలు ఐహిక ,ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి .ఇప్పుడు గురూజీ లు పెరిగిపోయి స్వార్ధం కోసం డబ్బుకో మంత్రం ,ఆకర్ణకో మంత్రం చెప్పి డబ్బు గుంజుతూ పీల్చి పిప్పి చేస్తున్నారు .దీనివలన సాధకుడి లక్ష్యం సిద్ధించటం లేదని పుట్ట పర్తి వారు బాధ పడ్డారు .అందుకే ఒక్కడు కూడా ఒక్క దానిలోనైనా నిష్ణాతుడు కాలేక పోతున్నాడని విచారించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి -రమ్య భారతి, సరసభారతి ,మల్లె తీగ ల సౌజన్యం తో 14-9-14

paper

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -5 ’మట్టి బండి ‘’ప్రకరణ కర్త -శూద్రక మహా కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -5

 

‘’మట్టి బండి ‘’ప్రకరణ కర్త  -శూద్రక మహా కవి

సూద్రక మహాకవి నాటక నవలా కారుడు .మూడవ శతాబ్దికి చెందిన వాడు .సూద్రకనామం కలం పేరు అసలు పేరు అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహిస్తున్నారు .ఇంద్రాణి గుప్తుడు లేక ఈశ్వర సేనుని తండ్రి శివ దత్తుడే సూద్రాక మహా రాజు అని భావిస్తున్నారు .’’పద్మ ప్రభ్రుతిక ‘’అనే భాణం  ఏకాంకిక నాటక రచనా చేశాడు .ఇది ఒకే వ్యక్తీ తన అంతరంగాన్ని వివరిస్తూ స్వగతం(మోనోలోగ్) గా చెప్పుకొనే తమాషా ప్రయోగం .మృచ్చకటికం లేక మట్టి బండి నాటకం తో లోక విఖ్యాతుడైనాడు .దీనికే ప్రకరణం అనే పేరుంది .ప్రకరణ రచనకు ఆద్యుడు సూద్రకుడు .

శూద్రక మహాకవిరాజు కు సకల శాస్త్రాలలో పాండిత్యం ఉంది .శివుడి అనుగ్రహం తో లోకోత్తర దర్శనం పొందాడట .గొప్ప యోధుడని ,పరాక్రమ శాలి అని ,వందేళ్ళపై పది రోజులు జీవించి అశ్వమేధ యాగం చేసి ,రాజ్యాన్ని కుమారుడికి అప్పగించాడు . ‘’సర్వస్వ హరం ‘’అనే యజ్ఞం చేసి దాని విధి విధానం ప్రకారం అగ్ని ప్రవేశం చేశాడనేది ప్రచారం లో ఉంది .పాశ్చాత్యులు కొందరు మృచ్చకటికం ఈతని రచన కాదన్నారు .కాని విల్సన్ డాక్టర్ స్మిత్ లు మాత్రం శాతవాహన రాజు శ్రీముఖుడే శూద్రకుడు అన్నారు .అయితే క్రీ పూ.రెండవ శతాబ్ది వాడై  ఉండాలి . ప్రాచీనకాలం లో ‘’శూద్రకు ‘’అనే గణ రాజ్యం ఉండేదని ,అలేక్సాండర్ భారత దేశం పై దండ యాత్ర చేసినప్పుడు వీరు ఎదిరించారు  ,వీరిని గ్రీకులు ‘’సోద్రోయి ‘’అని పిలిచేవారట. అలేక్సాందర్ తో వీరోచితం గా యుద్ధం చేసినట్లు గ్రీకు చరిత్రకారులే రాసుకోన్నారట . ,వ్యాకరణ కర్త పాణిని ‘’శౌద్రాయణులు ‘’అని అంటే పతంజలి బ్రాహ్మణేతరులని పే ర్కొన్నాడని తెలుస్తోంది .శూద్రులు ,మహా శూద్రులుఅని  వీరిలో రెండు తెగలున్నాయట.

శూద్రకుడు వామన కవి చేత ఉద్ధరింప బడ్డాడని ప్రచారం లో ఉంది .బాణుడు, దండి కూడా ఇతనికి పరిచయస్తులే .భేతాళ పంచ  వింశతిక లో సూద్రక ప్రసక్తి ఉంది .విక్రమాదిత్యుని సమకాలీనుడు కావచ్చుననే వారూ ఉన్నారు .ఆయనకంటే ఇరవై ఏడేళ్లకు పూర్వం శూద్రక మహారాజు రాజ్య పాలన చేశాడట .రాజధాని ‘’శోభావతి ‘’అని కదా సరిత్సాగరం లో ఉన్నది .కాళిదాసుకు పూర్వం భాసుని తర్వాతి వాడు అని మరికొందరివాదం. కాదు మృచ్చకటికం లో కాళిదాసును అనుసరించిన సందర్భాలున్నాయికనుక కాళిదాసు తర్వాత వాడు అన్నారు మరికొందరు . .

మృచ్చకటిక ఔన్నత్యం

ఈ నాటకం లో పది  అంకాలు న్నాయి .భాసమహాకవి రాసిన ‘’చారుదత్త ‘’నాటకం ఆధారం గా కద నడుస్తుంది .ఇది ప్రకరణం అనే రూపక భేదానికి చెందింది .ఇందులో నాయకుడు చారుదత్తుడు వ్యాపారి .ఆస్తి అంతా దాన ధర్మాలు చేసి దరిద్రం పాలైనాడు .నాయిక వసంత సేన వేశ్య .వీరిద్దరూ గాఢప్రేమికులు .ఈమెను రాజుగారి బావమరిది శకారుడు కోరుకొంటాడు .వసంత సేన ప్రియుడిని కల్సుకోటానికి వెడుతూ శకారుడి చేతిలో పడుతుంది .మెడ పిసికేస్తే మూర్చ పోతుంది .చనిపోయిన్దనుకొని చారుదత్తుడే చంపాడని ప్రచారం చేస్తాడు .దత్తుడికి మరణ శిక్ష పడుతుంది .వద్య స్తానానికి తీసుకొని వెడతారు .వసంత సేన ఒక బౌద్ధ భిక్షువు చేత కాపాడ  బడి అక్కడికి చేరుకొంటుంది .చారుదత్తుని స్నేహితుడు ఆర్యకుడు గోపాల వేషం లో పాలకుడు అనే వాడిని తొలగించి రాజు అవుతాడు చారుదత్తు ని క్షమించి వారిద్దరికీ పెళ్లి చేయటం తో సుఖాంతం అవుతుంది

చారుదత్తుడి కొడుకు మట్టి బండీ తొ ఆడు కొంటాడు .చారు కు సాయం చేయ దలచి వసంత తన నగలను మూటకట్టి ఆ బండిలో పెడుతుంది .ఆమె నగలకోసం చారుదత్తుడే చంపాడని అభియోగం మోపి మ్రుచ్చకటికాన్ని న్యాయ స్తానానికి తెస్తారు ..బండిలో నగలు సాక్ష్యం కనుక మరణ దండన పడుతుంది .మట్టి బండి గొప్ప పాత్ర పోషించిన్దికనుక నాటక కర్త ఆ పేరు పెట్టటం ఏంతో సముచితం గా ఉంది . చిన్న సంఘటన ఇతి వృత్తమై ఆసాంతం రక్తి కట్టిస్తుంది .రక్షించాలనే ఉద్దేశ్యం తో ప్రియురాలు బండీలో పెట్టిన నగలు ప్రియుడికి మరణ శిక్ష పడటం దాకా వెళ్ళింది .కనుక నామౌచిత్యం భేషుగ్గా ఉంది .

నాటక రచన శాస్త్రీయ పద్ధతిలో సాగలేదంటారు ,నీతి బోధకం కాదు సాంఘిక పరిస్తితికి దర్పణం .పాశ్చాత్యుల ‘’కామెడీ’’కి దగ్గర ..ప్రదర్శన యోగ్యత లేదని కొందరి వాదన .సంభాషణలు అర్ధ వంతంగా సన్నివేశ కల్పనా మహత్తరం గా ఉంటుంది .అనేక రకాల మనస్తత్వాలున్న మనుషులు కనిపిస్తారు నాటకం లో .గణికలు, వేశ్యలు, విటులు పాత్ర దారులే .సముద్ర వ్యాపారం ఆకాలం లో ఉండేదని తెలుస్తోంది .

సూద్రక మహా కవిరాజు ప్రాసాద గుణం తో మాధుర్యం తో కవిత్వ రచన చేశాడు .చక్కని శైలి నాటక గమనానికి బాగా తోడ్పడింది .ఉదాత్త భావాల్న కల్పలనలను చేసి మెప్పు పొందాడు .వర్ణనలు అతి సహజం గా ఉండటం ప్రత్యేకత .దృశ్యకావ్యం గా మలిచాడు .శృంగారం ప్రధాన రసంగా ప్రవహిస్తుంది .దరిద్రం మీద సూద్రకుడు చెప్పిన శ్లోకాలు చిరస్మరణీయాలై అందరి నాలుకల మీదా నేటికీ నర్తిస్తున్నాయి –‘’

‘’దారిద్ర్యాత్ పురుషస్య బాంధవ జనో వాక్యేన సంతిస్టతే-సుస్నిగ్దా విముఖీ భవంతి సుహృదః సపరీ భావంత్యాపదః –సత్వంహాసముపైతి శీల శశినః కాంతిః పరిమ్లాయతే –పాపం కర్మచ యత్న రైరపి కృతం తత్తస్యసంభావ్యతే ‘’-దీని అర్ధం

‘’దరిద్రం తో ఉన్న వాడి మాటలు  బంధువులు వినరు .మిత్రులు విముఖులౌతారు .కస్టాలు రోజు రోజుకూ పెరుగుతాయి .తేజస్సు క్షీణించింది .శీల కాంతి మలినం అవుతుంది .ఇతరులు చేసే చెడ్డ పనులు కూడా వాడి నెత్తినే పడతాయి .’’

మృచ్చకటికం తర్వాతే భవ భూతి మాలతీ మాధవం ప్రకరణం రాశాడు .కనుక ప్రకరణానికి ఆద్యుడు సూద్రక కవి .ఈ నాటకం అనేక ఇతర భాషల్లోకి అనువదింపబడి ప్రదర్శింప బడి విఖ్యాతమైంది ..ఫ్రాన్స్ ,జర్మనీ లలో రంగస్థల నాటకం గా ఆడబడి ప్రేక్షకాదరణ పొందింది .’’వసంత సేన ‘’పేరిట తెలుగు సినిమా వచ్చింది .నాగేశ్వరరావు బి సరోజా నాయకా నాయికలు .రాజేశ్వరరావు సంగీతం .అందులో ‘’బంగారు బండిలో వజ్రాల బొమ్మతో ‘’అనే పాట ప్రజాదరణ పొందింది .

Inline image 1  Raja Ravi Varma, Vasanthasena (Oleographic print).jpg

మరో కవితో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉర్సు గుట్ట గుండెల్లో గునపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపుకు కవితా నీరాజనం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ సుద్దాల అశోక్ తేజ ,శ్రీ రాఘవేంద్ర రావు లకు డాక్టరేట్లు

డాక్టరేట్‌ వస్తుందని
ఆ రోజే ఊహించా… -సుద్దాల అశోక్‌ తేజ

తెలుగుచిత్రపరిశ్రమకు సంబంధించి ఇద్దరు ప్రతిభామూర్లులు ఈ రోజు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం బహూకరించే గౌరవ డాక్టరేట్లు స్వీకరించనున్నారు. జనరంజకమైన సినిమాలతో పాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరైతే, 1700కు పైగా పాటలు రాసి తెలుగు పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సుద్దాల అశోక్‌తేజ మరొకరు. ఈ సందర్భంగా వారిద్దరి గురించి చిత్రజ్యోతి అందిస్తున్న వివరాలు…

‘‘కేవలం సినిమా పాటలు రాసి పేరు తెచ్చుకోవాలనే తపన కన్నా, సినిమా మాధ్యమం ద్వారా మానవ, సామాజిక సంబంధమైన విషయాలను గురించి పాటల రూపంలో ప్రజలకు తెలియజెప్పాలనే ప్రత్యేకమైన స్ఫూర్తితో గేయ రచయితగా మారాను. ఈ విధంగా ఉండాలని 20 ఏళ్ళ క్రితమే నిర్ణయించుకున్నాను. అల్లరి పాటలు, వినోదాత్మక పాటలు రాసి పేరు తెచ్చుకోవడం కోసం నేనిక్కడికి రాలేదు. పాటంటే సినిమా చూసి ఈలలు వేసి బయటికొచ్చాక మరచిపోయేలా ఉండకూడదు. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలి. నా సాహిత్యం జనాల మనసులో చెరగని గుర్తులా ఉండేందుకు అనుక్షణం శ్రమిస్తాను’’ అని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. 2000కు పైగా ఉద్యమ, సామాజిక, విప్లవ గీతాలు, 800 సినిమాలకు 1700 పాటలను రచించారాయన. గీత రచయితగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు వైజాగ్‌లోని గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రజ్యోతితో ప్రత్యేకంగా సంభాషించారు అశోక్‌తేజ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…..
సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. దీంతో కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చు. తరగతిలో 60 మందికి పాఠాలు చెప్పడం కంటే 6 కోట్ల మందిని పాటతో సులభంగా ప్రభావితం చెయ్యొచ్చనే ఆలోచనతో 20 ఏళ్ళ క్రితం ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి గేయ రచయితగా మారాను. నా ఆలోచనా రీతికి తగ్గట్టే నాకు చక్కని అవకాశాలొచ్చాయి. అదృష్టవశాత్తు చక్కని ఆదరణ లభించడంతోపాటు పరిశ్రమ నుండి మంచి గుర్తింపు పొందాను. దాసరి నారాయణరావుగారి స్కూల్‌ నుంచి వచ్చినవాణ్ణి నేను. రాఘవేంద్రరావుగారితో కూడా పనిచేశాను. నేటితరం దర్శకుల్లో కృష్ణవంశీ, రాజమౌళి, వి.వి.వినాయక్‌ వంటి దర్శకులతో కూడా పనిచేస్తున్నాను. వీరంతా నా ఆలోచనా రీతికి తగ్గటే అవకాశాలిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, సినిమాకు సంబంధం లేకుండా నేను రాసిన ఉద్యమ గీతాలు, జన్మభూమికి సంబంధించి ‘తరలుదాం రండి మన జన్మభూమికి.. తల్లిపాల రుణం కొంత తీర్చడానికి’’, ‘నేలమ్మ నేలమ్మ’(రైతన్న కోసం), ‘ఆకుపచ్చ చందమామ’, ‘టపటప చెమట బొట్టు’ (పాట ఎలా పుట్టిందనే పాట), ఓ లంబాడి తల్లి పాలివ్వలేక కల్లు తాగించిన సమయంలో నా గుండె కదలి కన్నీటి గీతంగా ‘కమ్లి’ సినిమా కోసం రాసిన పాట నాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. చెప్పుకుంటూపోతే ఇంకెన్నో పాటలున్నాయి.
నేను రాసిన సినిమా గీతాలు ఒక ఎత్తైతే, సామాజిక గీతాలు ఒక మరో ఎత్తుగా భావిస్తాను. ఈ 20 ఏళ్ళుగా సినిమా, సమాజం అనే సవ్యసాచిత్వాన్ని నేనొదిలిపెట్టలేదు. రెండింటిని సమస్థాయిలో నిర్వర్తించుకుంటూ వచ్చాను. మాటల, పాటల రూపంలో నేను వేసిన విత్తనాలే ఈ డాక్టరేట్‌ రావడానికి కారణమని నేను నమ్ముతున్నాను. నా సేవలను గుర్తించి ‘గీతం’ యూనివర్శిటీ డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
అంచనా ప్రకారమే
డాక్టరేట్‌ అనేది ఒక పాటకు సంబంధించి ఇచ్చేది కాదు. సాహిత్యరంగంలో నిరంతరం కృషి చేస్తూ… పాటలతో అనేక మంది హృదయాలను ఆకట్టుకున్న వారికి అనేక పరీక్షల జల్లెడలు, పలు అధ్యాయనాలు చేసి ఇచ్చే పురస్కారమిది. మన కెరీర్‌ను బట్టి ఒక అంచనాకు వచ్చి మనం రాసిన పాటలో సందేశాన్ని గ్రహించి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. సంగీత రంగంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారి తరువాత మా తరం గేయ రచయితల్లో అతి తక్కువ సమయంలో డాక్టరేట్‌ను అందుకుంటోంది నేనే కాబోలు. గేయ రచయితగా 20 ఏళ్శ కెరీర్‌ చాలా తృప్తికరంగా ఉంది.
ఆనాడే ఊహించా
ఏ రంగంలోనైనా నిజాయితీగా పనిచేసే ప్రతి మనిషికి పదివేల చేతులు సహకరిస్తాయి. రచయితలుగా మేం చేసేది అద్భుతమైన పని అని నేను భావిస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జన్మభూమి కార్యక్రమం కోసం ‘తరలుదాం రండి మనం జన్మభూమికి’ పాట రాశాను. ఆరోజు వేదికపై చంద్రబాబునాయుడుగారు ప్రశంసించిన విషయాన్ని ఎప్పటికీ మరువలేను. అప్పట్లోనే నేనూహించా, ఏదో రోజు నాకు ఇలాంటి పురస్కారం వరిస్తుందని. కానీ ఎప్పుడనేది మన చేతిలో లేదుకదా. ‘నేను సైతం’ పాట కోసం ఉత్తమ రచయితగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను. అదొక మెట్టయితే డాక్టరేట్‌ను అందుకోవడం నా కెరీర్‌కి మరో మెట్టుగా భావిస్తున్నాను.

Related News
కమర్షియల్‌ సినిమాకు బాక్సాఫీసు సూత్రాలను రచించిన దర్శకుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి కె.రాఘవేంద్రరావు. ఆయన్ని చాలామంది ‘దర్శకేంద్రుడు’ అని పిలుస్తుంటారు. అలాగే రొమాంటిక్‌టచ్‌తో సినిమాలు తీస్తుంటారు కనుక ‘ఆంధ్రా రాజ్‌కపూర్‌’ బిరుదు ఉండనే ఉంది. కథానాయకుడి ధీరోదాత్తతని సినిమాలో అడుగడుగునా ప్రదర్శించే ఈ రాఘవేంద్రునికి హీరోయిన్లను మరింత అందంగా చూపెట్టగలడనే పేరూ ఉంది. కథానాయికల గ్లామర్‌ని గరిమ‘నాభి’గా తన చిత్రాలను ఆయన రూపొందిస్తారనడం అతిశయోక్తి కాదు. పూలు, పళ్లనుంచి హీరోయిన్ల నాభిపై ఆయన పడెయ్యని వస్తువంటూ లేదు. కథానాయికల్లో లేని గ్లామర్‌ కూడా రాఘవేంద్రుని చిత్రాల్లో నటిస్తే కనపడుతుంటుంది. హీరోయిజం, హీరోయిన్ల గ్లామర్‌ కాకుండా వీనులవిందైన సంగీతం, పాటల్లో సాహిత్యపు విలువలు ఆయన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే అంశాలు. తన సినిమాల్లో వినోదానికి ఆయన పెద్ద పీట వేసినా రాఘవేంద్రరావు పేరు చెప్పగానే సామాన్య ప్రేక్షకుడికి మాత్రం గుర్తుకు వచ్చేవి పాటలే.
‘బాబు’ (1975) సినిమాతో దర్శకునిగా పరిచయమైన రాఘవేంద్రరావు రెండేళ్లు తిరగకుండానే ప్రముఖ దర్శకుడయ్యారు. అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఆయన చేసిన తొలి చిత్రం ‘అడవిరాముడు’ ఓ ఎత్తు. ఆ చిత్రం ఆయ న కెరీర్‌కే కాదు చిత్రపరిశ్రమకూ ఒక మలుపు, భారీ కుదుపు. వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన ‘అడవిరాముడు’ ‘ఫక్తు కమర్షియల్‌ సినిమా అంటే ఇదే’ అనిపించింది. ఇక అప్పటినుంచి కమర్షియల్‌ సినిమాల ప్రవాహంలో జోరుగా ముందుకు సాగుతున్న రాఘవేంద్రరావు కెరీర్‌లో ఆధ్యాత్మిక మలుపు ‘అన్నమయ్య’ చిత్రం. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన చిత్రమిది. తెలుగు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్రను అంతకుముందు ఎంతో మంది తీయాలని ప్రయత్నించినా చివరకు రాఘవేంద్రరావు మాత్రమే తీయగలిగారు. తన శైలికి తగ్గట్లుగానే భారీ తారాగణంతో, మంచి సంగీతంతో, కమర్షియల్‌ ఛాయలు వదిలిపెట్టకుండా అద్భుతంగా ఆయన రూపొందించారు. ఈ సినిమా ఒక గొప్ప చిత్రంగా పండిత, పామరుల ప్రశంసలు పొందింది ( ఈ సినిమాయే ఇప్పుడు ఆయనకి డాక్టరేట్‌ తెచ్చి పెట్టింది). ఆ తరువాత ‘శ్రీరామదాసు’, ‘పాండురంగడు’, ‘శిరిడి సాయి’.. ఇలా ఆధ్యాత్మిక బాటలో సాగుతున్న రాఘవేంద్రరావుకు సరికొత్త ప్రేక్షకులు తోడయ్యారు. అంతవరకూ ఆయన సినిమాలు చూడని వాళ్లు సైతం ఈ సినిమాల తరువాత రాఘవేంద్రరావు అభిమానులుగా మారడం గమనార్హం. రాఘవేంద్రరావుకి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. ఇటువంటి నే పథ్యంలో గౌరవ డాక్టరేట్‌ రావడం అభినందనీయం. ఇంతవరకూ ఏడు నంది అవార్డులు, మూడు సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకొన్న రాఘవేంద్రునికి ఇదే తొలి డాక్టరేట్‌.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6

ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తోంది .శ్రుతుల కాలం లో గుర్రం సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రులకు ప్రతీక వృషభం .చక్రానికి ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రాన్ని ఉంచేవారు .ఇదే ప్రభా మండలం గా అభి వృద్ధిపొంది ఉండవచ్చు అని పుట్టపర్తి వారూహించారు .తర్వాత అదే విష్ణు చక్రం అయింది .బౌద్దులకాలం లో అదే ధర్మ చక్రం అయింది .జీవితానికి సంకేతమే అయిం దది. శ్రీరామ పట్టాభిషేక సమయం లో శ్రీరాముడు తన కులదైవం అయిన శ్రీ రంగ నాదుడి విగ్రహాన్ని సుగ్రీవుడికి ప్రదానం చేశాడు .అదే శ్రీరంగం లోని రంగనాధ విగ్రహం ..మహా భారతం లో స్త్రీపర్వం లో ఇలాంటి కొన్ని సన్నీ వేశాలు కనిపిస్తాయి .పూజలకే కాక మనుషులకు  కూడా ప్రతిక్రుతుల్ని ఏర్పాటు చేసేవారట .రాముడు సీతా విరహం తో అశ్వమేధ యాగాన్ని జానకి ప్రతిమ ను దగ్గరుంచుకొని  చేశాడు .ద్రుతరాసత్రుడికి భీముడిపై ఉన్న కోపం తీర్చటానికి కృష్ణుడు భీముని ఇనుప ప్రతిమ చేయించి  గుడ్డిరాజు   ముందు పెడితే భీముడే అనుకోని కౌగిట్లో నలిపేశాడు అది పొడి పొడి అయింది . దీన్నే ద్రుతరాస్ట్ర కౌగిలి గా లోకం లో ప్రచారం అయింది .

దేవాలయాలలో అర్చా మూర్తులనేకాక ,చక్రాలన్ని ,యంత్రాన్ని స్థాపించే అలవాటుంది .వైష్ణవులు సాలగ్రామాలను భక్తితో  అర్చిస్తారు . అవి నేపాల్ దగ్గరలోని గండకీ నదిలో దొరుకుతాయి.ఇది గంగకు ఉపనది .గండకి ఒకప్పుడు వేశ్య .తర్వాత పరమ భక్తురాలైంది .భక్తీ తో శ్రీ మహా విష్ణువును చేరువైంది .ఆయన వరం కోరుకో మంటే ,ఆయన తన గర్భం లో జన్మించాలని కోరుకొన్నది .సాలగ్రామ రూపం లో గండకి కి జన్మిస్తానని అభయమిచ్చాడు .శై వులకు ‘’బాణ లింగాలు ‘’ పూజార్హాలు .ఇవి నర్మదానది గుండం  లోని ఓంకార క్షేత్రం లో లభిస్తాయి .గండకీ నది ,సాలగ్రామ విషయాలు వరాహ పురాణం లో ఉన్నాయి .సాల గ్రామాలలో నల్లనివి ,గోధుమ రంగువి ,ఆకు పచ్చనివి ,తెల్లనివీ ఉంటాయి .కొన్ని మిరియం గింజ సైజు నుండి ,చాలా పెద్ద సైజు వరకూ ఉంటాయి .శ్రీ కూర్మ క్షేత్రం లో సాలగ్రామం చుట్టుకొలత మూడడుగులు .అహోబిల కొండపై నరసింహ దేవాలయం లోని సాలగ్రామం కూడా పెద్దదే .ఇళ్ళల్లో ఉండేవి చిన్నవిగానే ఉండాలి .అరచేతిలో పట్టే దిగా ఉంటె ప్రశస్తం .

సాలగ్రామాలలో ఉన్న చక్రాలను బట్టి ,రంధ్రాలను బట్టి వాటి స్వరూప నిర్ణయం చేస్తారు .తెరచున్న నాలుక లా ఉండేది ఉగ్రనారసింహం .ఇది గృహస్తులు పూజించ దగినది కాదు .వక్త్రాలు బాగా  తెరచి ఉన్నట్లు కాక సామాన్యం గా ఉంటె శ్రేష్టం అంటారు వాటి విలువ తెలిసిన సరస్వతీ పుత్రులు .వీటిలో నూటికి పైగా భేదాలున్నాయట .మూడు చక్రాలతో నల్లగా ఉండేది లక్ష్మీ నారాయణం .పైన రెండు చక్రాలుండి కొండ ఒకే రంధ్రం ఉంటె లక్ష్మీ నారసింహం.అలాగే వరాహ ,భూ వరాహ మొదలైన సంకేతాలెన్నో ఉన్నాయట .మత్స్య సాలగ్రామం ఇంట్లో ఉంటె చాలా మంచిది .దట్టమైన రంగుతో కాకుండా ,లేత రంగులున్నవి వ్యూహావతార సాలగ్రామాలు .అంటే వాసుదేవ  సంకర్ష ణాలు ,అని రుద్ధ ప్రద్యుమ్నాలు .ఇవి కాక హిరణ్య గర్భ సాలగ్రామం అని ఇంకోటి ఉంది .సాధారణం గా సాలగ్రామాన్ని పాలల్లో కాని ,నీళ్ళల్లో కాని వేస్తె  కొద్దిగా బరువు పెరగటం దాని లక్షణం . ఆకారం కూడా పెరుగుతుంది..ఇదే సాలగ్రామ పరీక్ష .వరాహ పురాణం లో ఈ పరీక్ష పై ఆ చాలా విషయాలున్నాయి .సాలగ్రామాన్ని రాగి నాణాల మధ్య ఉంచి పట్టుకొంటే అది గుండ్రం గా తిరుగు తుంది .సాలగ్రామం పగిలినా దోషం ఉండదని ఆచార్య ఉవాచ .  .సాలగ్రామం లో దేవుడు ఎప్పుడూ ఉంటాడనే, పూజ లో దానికి  ఆవాహనాదులు ఉండవు .కొన్ని దేవాలయాలో సాలగ్రామ మూర్తులే ఉంటాయి .ఇలాంటి అర్చావతారాలకు శక్తి ఎక్కువ .తిరుమల శ్రీనివాసుడు ఇలాంటి సాలగ్రామ విగ్రహమే .అందుకే ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు .కంచి ,ఆళ్వారు తిరునగరి ,మద్రాసు లోని  పార్ధ సారధి విగ్రహాలు ఇలాంటి విశిస్టమైనవే .

బాణ లింగాలు గుండ్రం గా ఉంటాయి .శ్రీశైలం లో అనేక బాణ లింగాలున్నయంటారు నారాయణాచార్యులవారు . గోమతీ నది సముద్రం లో కలిసే చోట ‘’ద్వారకా మూర్తి ‘’ఒకటి ప్రసిద్ధమైనది .ఇది సాలగ్రామలకంటే గొప్పది అని అంటారు .ద్వారకా మూర్తి ఉన్న ఇంట్లో అన్న వస్త్రాదులకు లోటుండదు .’’శోణ భద్ర గణపతి ‘’మరో విశిష్టమైనది .ఎర్రగా ఉండి శోణ నదిలో దొరుకుతుంది .’’ఆదిత్యం ,స్పటికం’’ కాశీ లో దొరుకుతాయి .’’హేమాక్షి ‘’ఒక విధమైన లోహం.అది శక్తికి సంకేతం .’’హేమాక్షి ‘’శిలయొక్క మలం . .యంత్రాలలో వైష్ణవులకు ‘’సుదర్శనం ‘’శ్రేష్టం .శాక్తులకు ‘’శ్రీచక్రం’’ విశిష్టమైనది .ఉత్తరాది కొన్ని  దేవాలయాలో మూర్తులకు బదులు’’గ్రంధాలు ‘’పూజింప బడుతాయి .పంజాబ్ లో గురు గ్రంధ సాహెబ్ అలాంటిదే.కొన్ని రామాలయాలలో తులసీ రామాయణం ‘’ఉంచి పూజిస్తారు .ఒరిస్సాలోని క్రిష్ణాలయాలలో ‘’భాగవత మహా గ్రంధం ‘’ఉంచి పూజిస్తారు .తిరువంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో పది వేల సాలగ్రామాలున్నాయట .భక్తిలో యెంత వైవిధ్యం ఉందొ మూర్తుల్లోనూ అంతే వైవిధ్యం ఉందని పుట్టపర్తి వారు అంటూ ముగించారు ప్రతిమా రాదన విషయాన్ని .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5

శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం

శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను వారు పిలుచుకొనే తీరే గమ్మత్తుగా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్ ‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రుఘ్నులను భరతాళ్వాన్ ,శత్రుఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య రక్షకురాలు కనుక సీతమ్మను ‘’పిరాట్టి ‘’అంటారు .సుగ్రీవుడు మహారాజర్ .జటాయువు ‘’పెరియఉడయ్యార్ ‘’.దశరధుడిని చక్రవర్తి అని ,హనుమను ‘’శిరియ తిరువడి ‘’అని పిలవటం ఉంది .గరుత్మంతుడు  స్వామి అన్ని అవతారల్లోను సేవిన్చాడుకనుక ‘’పెరియ తిరువడి ‘’అయ్యాడు. హనుమకు రామావతారం తోనే సంబంధం .లక్ష్మణుడు శ్రీవైష్ణవం లోని ‘’శేషత్వానికి ‘’ప్రతీక .శేష శేషిత్వం ఈ సంప్రదాయం లో మాత్రమె ఉంటుంది .దీనికే ‘’ప్రతి తంత్రం ‘’అంటారు వారు .అంటే ఇతర సిద్ధాంతాలలో లేకుండా ఒకే ఒక్క సిద్ధాంతం లో వచ్చ్చే నియమం .భరతుడు ‘’భగవత్ పార తంత్రానికి ‘’చిహ్నం .’’భాగవత శేషత్వం ‘’శత్రుఘ్నునిలో దర్శిస్తారు .శరణాగతికి విభీషణుడు నిలు వెత్తు రూపు .హనుమ లో ‘’ఆచార్య స్వరూపం ‘’చూస్తారు .రామాయణ పాత్రలన్నీ రాముని శరణాగతి పొందినవే నని వారు భావిస్తారు .శ్రీవైష్ణవం లో పరమేశ్వర స్వరూపం నిరూపిత స్వరూప ధర్మం ,స్వరూప ని రూపక ధర్మం అని రెండు పద్ధతులున్నాయి .నిరూపిత స్వరూప ధర్మం లో శ్రీరాముని పరతత్వాన్ని శూర్పణఖ ప్రకాశింప జేసింది..స్వామి స్వరూప ధర్మం అయిన నిత్య యవ్వనం ను ఆమె దర్శించింది .స్వామి నేత్రాలను ‘’పుండరీకాక్షుడు ‘’గా చెప్పింది అన్న రావణుడితో .ఆచార్య సేవకు శబరి గొప్ప ఉదాహరణ .రాముడు  ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె స్వామితో ‘’మయా తు వివిధం వన్యం సంచితం పురుషభ-తవార్దే పురుష వ్యాఘ్రః పంపా యాస్తీర సంభవం ‘’అన్నది .అంటే ‘’స్వామీ !నువ్వు పురుష శ్రేస్టూడివి .పరమ పురుషుడివి .నీకోసం ఈ ఫల పుష్పాలు సేకరించాను .’’అన్నది .గురు శుశ్రూష ఫలించిందా అని ఆమెను రాముడు ప్రశ్నిస్తే ‘’చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన –పాద మూలం గమిష్యామి యానహం పర్య చారిషం ‘’అంటుంది .అంటే నీ ప్రసన్న దృక్కుల తో పవిత్రురాలి నయ్యాను .నీ ఆజ్ఞతో నేను నాజన్మ అంతా సేవించిన ఆచార్యుల సన్నిధికి పోతున్నాను ‘’అన్నది .శ్రీవైష్ణవం లో ఆచార్యునికి ఉన్న గౌరవం మరి దేనికీ లేదు అందుకే ఆ మాట అన్నది .పుణ్య లోకాలకో శ్రీ వైకుంఠానీకో పో తు న్నానని అనలేదామే .గురు సన్నిధికి చేరుతున్నానన్నది .అదే పరమ వైష్ణవ ధర్మ అంటారు పుట్టపర్తి వారు వ్యాఖ్యానిస్తూ .ఆచార్య పాదం చేరటమే ఉత్తమ స్తితి  స వారికి .ఆచార్య పాద కైంకర్యమే బంధ మోక్షాలకు  ముఖ్య ఫలం అని నారాయణా చార్యుల వారి వ్యాఖ్య

శ్రీ వైష్ణవం లో సీతాదేవి పురుష కార స్వరూపిణి .ఆమె అనుగ్రహం లేకుండా పురుశు డికి కి కారుణ్యం లభించదు .ఆమెను తిరస్కరించి నందుకే శూర్పణఖ ఇడుముల పాలైంది .రావణుడు పరమ పురుషుడిని తృణీకరించి ఫలితం అనుభ విన్చాడని వారు అంటారు .రావణ సంహారం తర్వాత రాక్షస స్త్రీలనుహనుమ చంప బోతుంటే పురుషకార స్వరూపిణి అయిన సీతాదేవి వారించింది .ఓం కారానికి వీరి సిద్ధాంతం లో అ అంటే అకార వాచ్యుడు అయిన పరమాత్మ .మ జీవుడు .మధ్యలో ఉన్న ఉకారం లక్ష్మీ స్వరూపం .లక్ష్మీదేవి పురుషకారం వల్లనే జీవుడు పరమాత్మను పొందుతాడు అని అర్ధం .దీనికి సీతారామ వన వాసం లో ఉన్న శ్లోకాన్ని ఉదహరిస్తారు –

‘’అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా –పృష్ట తస్తు ధనుష్పాణిః లక్ష్మణో నుజగామ సః’’

ముందు రాముడు మధ్యలో సీత చివర ధనుస్సు ధరించిన లక్ష్మణుడు .దీనినే తులసీదాసు తమాషాగా చెప్పాడని పుట్టపర్తివారు అంటారు .ఏమిటంటే –రాముడిని చూడాలి అని తమ్ముడికి కోరిక కలిగితే సీతాదేవికి నమస్కరిస్తాడట అప్పుడు సీత కొద్దిగా పక్కకు జరుగుతుంది. అప్పుడు రాముడిని చూసి నమస్కరిస్తాడట రామానుజుడు .విశిస్టాద్వైతుల సిద్ధాంతం లో రామాయణాన్ని వర్ణించాలంటే పెద్ద గ్రంధమే అవుతుందన్నారు ‘’కొన్వస్విన్ సాం ప్రతం లోకే ‘’అనే మూడు శ్లోకాలలో పదహారు గుణాలున్నాయని శ్రీవైష్ణవుల భావన ..ఈ గుణాలకు వారు చేసే వ్యాఖ్యానాలు అనేకం .శ్రీవైష్ణవం లో రామాయణం ‘’ద్వయ మంత్రం ‘’కు ,మూల మంత్రానికి వివరణ మాత్రమే అంటారు సరస్వతీ పుత్రులు.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

గద్య మహా కావ్య రచయిత-సుబందు

గుప్త చక్ర వర్తుల కాలానికి సంబంధించిన కల్పిత  ఆఖ్యాయికను అంటే కదను సుందర సురుచిర శైలిలో వచనం గా రాసిన కవి ‘’సుబందు ‘’.414-454 కాలపు రాజు కుమార గుప్తుడు 455-467కు చెందిన అతనికొడుకు స్కంద గుప్తుల ఆస్థానం లో సుబందు ఉండేవాడు .పాండిత్య గర్వ స్పర్శ ప్రతి అంగుళం  లో కనిపించేట్లు రాసిన కవి సుబందు .తరువాత కాలపు వచన రచయితలను ఎందరినో ప్రభావితం చేశాడు .అతని రచనా పటిమకు అద్దం’’వాసవ దత్త ‘’.దీనిపై పద్దెనిమిదో శతాబ్దం లో రెండు వ్యాఖ్యానాలు వెలశాయి .శివరామ త్రిపాఠి రాసిన ‘’కాంచన దర్పణం ‘’,జగద్దారుడు రచించిన ‘’తత్వ దీపిని ‘’సుబందును అజరామరం చేశాయి .లూయిస్ హెర్బర్ట్ గ్రే వాసవదత్త ను ఆంగ్లం లోకి అనువాదం చేస్తే 1913 లో కొలంబియా యూని వర్సిటి ప్రెస్ ప్రచురించింది .విలియమ్స్ జాక్స్సన్ సంపాదకత్వం లో కొలంబియా యూని వర్సిటి –ఇండో ఇరానియన్ సిరీస్ లో పదమూడు భాగాలుగా వెలువరించింది .

ప్రాకృత వ్యాకరణం రాసిన వర రుచి కి సుబందు మేనల్లుడు అంటారు .విక్రమాదిత్య చక్రవర్తి చనిపోయిన తర్వాత సుబందు వాసవ దత్తను రాశాడని నరసింహ వైద్య అన్నాడు .కాని బహుజనాభిప్రాయం ప్రకారం  గుణాధ్యుడి తరువాత వాడు .1859లో వాసవ దత్తను పరిష్కరించి ఫిద్జ్ ఎడ్వర్డ్ హాల్ సంస్కృత ప్రతిని ముద్రించాడు .వచన రచనలో మేటి అయిన బాణుడి ప్రశంసలుపొండాడు సుబందు .’’అలబ్ద వైదగ్ధ్య విలాస ముగ్ధయా దియా నిబద్ద్దే య మతిద్వయా కదా ‘’అని బాణుడు మెచ్చాడు అంటే సుబందు రచనా ప్రౌఢిమ యెంత గొప్పదో తెలుస్తోంది .వాసవ దత్త చారిత్రిక కద కాదు .కవికల్పితమే .భాస ,కాళిదాసాదుల సరసన చేరిన కవి సుబందు .వక్రోక్తి కవిగా సుబందును పన్నెండవ శతాబ్దం వాడైన ‘’కవిరాజు ‘’పేర్కొన్నాడు .మంఖ అనేకవి భారవి బాణ కవుల తో చేర్చి శ్లాఘించాడు .పది హేనవ శతాబ్దికి చెందిన వామన భట్ట బాణుడు మయూరుడు మొదలగు కవులతో పోల్చాడు  ‘’ప్రతి కవి భేద బాణః కవితా త్రుగహన విహరణ మయూరః -సహృదయ లోక సుబందుర్జయతి శ్రీ భట్ట బాణ కవి రాజః ‘’అని కీర్తించాడు .

వాసవ దత్త కద

కందర్ప కేతు అనే రాజకుమారుడు కలలో అందమైన కన్యను చూసి మనసుపారేసుకొని స్నేహితుడు మకరాండుడి తో వెతుకుతూ ఉంటాడు .అడవిలో ఒక చెట్టుకింద పడుకొని ఉంటె చెట్టుపైఉన్న చిలుకా గోరింకల సంభాషణలో వాసవదత్త కలలో కనిపించిన రాకుమారుడికోసం అన్వేషణకు బయల్దేరినట్లు వింటాడు .పక్షుల సాయం తో వాసవ దత్తను కలుస్తాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .ఆమె తండ్రి ఒక గాంధర్వ రాజుతో కూతురు పెళ్లి చేయాలనుకొంటాడు .ఇది తెలిసి వీళ్ళిద్దరూ జంప్ జిలానీ .అడవిలోకి చేరి పడుకొంటారు .వాసవ దత్తకు నిద్రరాక ఒంటరిగా అడవిలోకి వెడుతుంది .ఇంతలో రెండు కిరాత దళాలు వచ్చి ఆమె కోసం తగాదా పడతాయి .ఇదే అదను అనుకోనితప్పించుకొని ఒక ఆశ్రమలో చేరుతుంది .ముని శాపం తో రాయిగా మారిపోతుంది .కందర్పుడు వెతుక్కుంటూ వచ్చి కనపడక ఆత్మ హత్యకు పూనుకొంటాడు .ఆకాశ వాణివిషయం తెలియ జేస్తే ఆ రాయిని కౌగలించుకోగానే వాసవ దత్త గా మారిపోతుంది .ఇద్దరూ రాజనగరానికి వెళ్లి పెళ్లి చేసుకొనిహాయిగా ఉంటారు .

సుబందు కవితా గీర్వాణం

శ్లేష కవిత్వానికి సుబందు పెట్టింది పేరు ‘’సరస్వతీదత్త వర ప్రసాదా చ్చక్రే సుబన్ధుః –సుజనైక బన్ధుఃప్రత్యక్షర శ్లేష మయ ప్రపంచ విన్యాస వైదగ్ధ్య నిధిం ప్రబంధం ‘’అని చెప్పుకొన్నాడు .ఈ శైలి బాణుడికి ఆధారం అయింది . కదా ,కధనం శైలీ పరిపక్వం గా ఉండి చదివే వారిని ఊపిరి సలపనివ్వడు .చాలా ఆహ్లాదం కలిగించటం అతని లక్షణం .గ్రీకు రోమాన్స్ ఇక్కడికి చేరి ఉండవచ్చునని భావన .వక్రోక్తి ,విరోదా భాస లకూ సముచిత న్యాయం చేశాడు .మీలిత ,రత్నావళి,సమ ,సంభావన ,కారణ మాల మొదలైన అరుదైన  అలంకారాలను మిగిలిన అలంకారాలతో పాటు వాడి కావ్యానికి సౌన్దర్యంతెచ్చాడు .ఋతు ,సూర్య చంద్రో దయ  అస్తమయాలను  హ్రుదయాహ్లాదకం గా వర్ణించాడు .మార్గ దర్శిగా మారాడు .ఇందులో పక్షులు మాట్లాడి జానపదం అని పిస్తుంది .మాయా గుర్రం ఉంది. కదా కదన కల్పనా శైలిలలో సుబందు తరువాతి వారికి స్పూర్తిగా నిలిచాడు .

Inline image 1

మరోకవితో మళ్ళీ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఏ బి యెన్ ఆంధ్ర జ్యోతి ఏ తప్పో చేయలేదు- కట్జు

కేసీఆర్‌ చెప్పడం వల్లే ఎంఎస్‌వోలు ఇలా చేశారు
ఈ మేరకు నాకు సమాచారం ఉంది
సీఎం అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా?
టీవీ 9 క్షమాపణలు చెప్పినా ఇలా చేయడమేంటి?
తక్షణం రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలి
మూడు రోజుల్లో చేయకుంటే బృందాన్ని పంపుతాం
ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ కట్జు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా?’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జు ధ్వజమెత్తారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’, టీవీ 9 చానళ్లను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీవీ 9 తప్పు చేసినప్పటికీ క్షమాపణలు తెలిపిందని, ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ అయితే ఏ తప్పూ చేయలేదని, మరి వాటి ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని అడిగారు. తక్షణం చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఎంఎస్‌వోలకు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలను విమర్శిస్తూ ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ), తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ తనకు ఫిర్యాదులు చేశాయని ఆయన తెలిపారు. మూడురోజుల్లోగా రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించకుంటే పీసీఐ నుంచి ఒక బృందాన్ని పంపుతానన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మీడియాను 10 కిలోమీటర్ల లోతున పాతేస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు?
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి, తగనివి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి. నాకు తెలిసిందేమిటంటే.. టీవీ 9 అనే ఒక చానల్‌ తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అమర్యాదకరమైన వ్యాఖ్యలను ప్రసారం చేసింది. టీవీ 9 చానల్‌కు ఇది తగదు. దీన్ని వారు ప్రసారం చేయకుండా ఉండాల్సింది. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా వారు చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా, టీవీ 9 చానల్‌ ఇందుకుగాను ఎంఎస్‌వోలకు, ఎమ్మెల్యేలకు, స్పీకర్‌కు పలుమార్లు క్షమాపణలు చెప్పినట్లు నాకు తెలిసింది. అయినప్పటికీ.. ‘‘తెలంగాణకు వ్యతిరేకంగా ఏమైనా అంటే మీడియా మెడలు విరిచేస్తాను, 10 కిలోమీటర్ల లోతున భూమిలో పాతిపెట్టేస్తాను’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇదేం భాష? ఒక ముఖ్యమంత్రి ఉపయోగించాల్సిన భాషేనా ఇది? రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది? నాగరిక భాషలో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇది ఎంతమాత్రం తగదు. తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఎంఎస్‌వోలు రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేసినట్లు నాకు తెలిసింది. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎలాంటి అమర్యాదకరమైన వ్యాఖ్యలను, ఏ ఎమ్మెల్యేను ఉద్దేశించీ చేయలేదని నాకు తెలిసింది. కాబట్టి, తక్షణం చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని కేసీఆర్‌, ఎంఎస్‌వోలకు నేను సూచిస్తున్నాను. మీడియా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. దానిని ఈ రీతిలో అణచివేయటం తగదు. భవిష్యత్తులో ఎలాంటి భాషను ఉపయోగించాలో సీఎం తెలుసుకోవాలి.
తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు మీరేం చేస్తారు?
మేం తగిన చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం మా పరిధి పత్రికల వరకే ఉంటుంది. చానళ్లకు సంబంధించి కాదు. (సీఎం కేసీఆర్‌ పత్రికల్ని కూడా బెదిరిస్తున్నారని చెప్పగా..) మేం దీనిని సహించబోం. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏమాత్రం సహించబోదు. అలా బెదిరించాలని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన మీడియా స్వేచ్ఛను అణగదొక్కాలని చూస్తే.. ఇదే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తారా?
ఇప్పుడు కాదు! ప్రస్తుతం నేను ఒక పత్రికా ప్రకటన జారీ చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి ఏమాత్రం సహించరానిది, తీవ్రంగా అభ్యంతరకరమైనది. మీడియా స్వేచ్ఛను కాపాడటమే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పని.
గతంలో మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు కదా! చానళ్లను ప్రసారం చేసేందుకు ఉన్నన్యాయపరమైన మార్గా లేంటో చెప్పగలరా?
మీరిప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌ 1(ఎ) ప్రకారం మీడియాకు స్వేచ్ఛ ఉంది. అది ప్రాథమిక హక్కు. దీన్ని న్యాయ సమస్యగా మార్చాల్సిన పనిలేదు. టీవీ చానళ్ల ప్రసారాల నిషేధాన్ని ఎత్తివేయాలని నేను (తెలంగాణ) ముఖ్యమంత్రి, ఎంఎస్‌వోలకు సూచిస్తాను.
ఎంఎస్‌ఓలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, చానళ్ల ప్రసారాలు రద్దు చేయటాన్ని ఎలా చూస్తారు?
వారు తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి మేరకే అలా చేశారు. వారు స్వతంత్రులే అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ, ప్రధానంగా ముఖ్యమంత్రి ఒత్తిడికి వారు తలొగ్గారు. ఇలాంటి వాటిని సహించరాదు. 1967లో ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం చేశారు. అప్పట్లో ఎలకా్ట్రనిక్‌ మీడియా లేదు. ఆ తర్వాత ఎలకా్ట్రనిక్‌ మీడియా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టాన్ని సవరించి, మీడియా కౌన్సిల్‌గా మార్చాలని సూచించాను. ఎలకా్ట్రనిక్‌ మీడియాను కూడా కౌన్సిల్‌ పరిధిలోకి తీసుకురావాలని చెప్పాను. కానీ, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు – శ్రీశైలం విశేషాలు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు –

శ్రీశైలం విశేషాలు

శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహోబిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది .ఇక్కడి మల్లికార్జున స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు పుట్టపర్తి వారు .శ్రీశైల క్షేత్రం వయసు నూరు కోట్లసం వత్సరాలట..కాశీ క్షేత్రం దీనికన్నా కోటి ఏళ్ళు ప తర్వాతది అని శైవుల భావనత .ఇక్కడ కాపాలికులు ,క్షపణకులు ,మొదలైన వివిధ సంప్రదాయాల వారున్దేవారట .శాక్తేయులకు మొదటినుంచి నిలయం .ఆడి శంకరులు శ్రీశైలానికి వచ్చినపుడు ‘’కాపాలిక భైరవుడు ‘’ఒకడు చంప టానికి ప్రయత్నించాడు .శిష్యుడైన పద్మ పాదునిపై  ఉగ్ర నరసింహ మూర్తి ఆవేశించి వాడిని చీల్చి చంపేశాడు .శంకర భగవత్ పాదులు క్షేత్ర స్తుతి లో ప్రత్యేకం గా క్షేత్రం పేరు చెప్పరు .కాని మల్లికార్జున స్వామిని రెండు మూడు చోట్ల పేర్కొన్నారు .స్వామిపై అంతటి భక్తీ ప్రపత్తులు వారికి .

శ్రీశైలం వీర శైవులకు ఆట పట్టు .వీరందరూ మల్లికార్జునుని మహా భక్తులు .కన్నడ వీర శైవులూ ఆరాధించారు .ఇక్కడి దేవాలయ అర్చన జంగములదే.నన్నెచోడకవి గురువు పండితారాధ్యుడు ఇక్కడే ఉండేవాడు. అక్కడ ఆయన సమాదికూడా నేటికీ దర్శ్శనీయ క్షేత్రమే .పాండవులు అర్చించిన లింగం ఇది .శ్రీరాముడు ఈ అరణ్యాలలో సంచరించాడు .ఇక్కడ అనేక సత్కార్యాలు జరిగాయి అన్ని కాలాలో .అదేవిధం గా చెడ్డ పనులూ కూడా .వామాచార తత్పరులకు ఆవాస భూమి .మధ్య యుగం లో శ్రీశైలం ఒక మహా నగరం .జైన ,బౌద్ధులు ఇక్కడే ఉండేవారు .ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఈ మహా పట్నాన్ని సర్వ నాశనం చేసే వరకు నిద్రపోలేదు వారు .చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ క్షేత్రాన్ని నగరాన్ని గొప్పగా వర్ణించాడు .అంతకు ముందే ఇద్దరు విదేసీరాయ బారులు వచ్చారు .

శ్రీశైల భ్రమరాంబికా ఆలయం వెనుక అయిదారు చిన్న చిన్న రంద్రాలున్నాయి .వాటిపై చెవి పెట్టి వింటే తుమ్మెదల ఝన్కారం విని పిస్తుంది .ఇక్కడ ఉన్నది భ్రామరీ శక్తి అని అర్ధమౌతుంది .అమ్మవారి అలంకారాలు తీసేస్తే మూల మూర్తి ‘’మహిషాసుర మర్దిని ‘’యే.ఆలయానికి ప్రక్కనున్న అగన్నేరు చెట్టు వయసు కనీసం ఆరు వందల ఏళ్ళు .దాని వేరుకింద పెద్ద బావి ఉంది . దీని మూలాన్ని చూసిన వారు ఇంతవరకూ ఎవరూ లేరట .’’ఏదో ఒక నక్షత్రం వారం రోజు అర్ధ రాత్రి కి చంద్ర బింబం ఆ నీటిలో రెండు మూడు నిమిషాలు మాత్త్రమే ప్రతి ఫలిస్తుందని  అప్పుడు ఆ నీటిని తాగితే ఆయుస్సు పెరుగుతుందని ‘’బెల్లం కొండ సన్యాసి ‘’అనే మహాను భావుడు తానూ త్రాగి నూట ఏభై ఏళ్ళు బతికానని చెప్పేవారట ఆయన్ను చూసిన వారిలో నారాయణా చార్యుల వారి మిత్రులనేకులున్నారట .ఆయన అక్కడే సమాధి అయ్యాడట .’’నవనాధ సిద్ధులు ‘’ఇక్కడే ఉండేవారు .వారు బంగారాన్ని ఇక్కడ అనేక చోట్ల దాచారట .దానికోసం కొందరు తవ్వకాలూ చేశారట .

శ్రీశైలం అడవుల్లో అనేక దివ్య వనమూలికలున్నాయి ఇక్కడ ఉండే చెంచులకు వాటి రహస్యం బాగా తెలుసు .వాటి ప్రభావాలను వారే బాగా వర్ణించి చెప్పా గలరు .హటకేశ్వరుడు ,సిద్ధేశ్వరుడు ,సారంగేశ్వరుడు ,శిఖరేశ్వరుడు మొదలైన లైన వారెందరో ఇక్కడ వెలశారు .హాట కేశ్వరం దగ్గర ‘’భోగ వతి ‘’అనే కాలువ ఉంది .ఇది కిందున్న పాతాల గంగ అన బడే కృష్ణమ్మ లో కలుస్తుంది .అది పాతాళం లో ఉండే నది అని అందరి నమ్మకం .హాటకేశ్వర మూర్తి భూమికి చాలా లోతులో ఉండేదట  .శిఖరేశ్వరాన్ని చూస్తె పునర్జన్మ ఉండదని నమ్మకం .పాతళ గంగలో ‘’సరస్వతి ‘’అనే చిన్న ప్రవాహం కూడా కలుస్తుంది .శ్రీశైలం ఆన కట్ట భూలోక వింత .మనశాస్త్ర వేత్తల బుద్ధికి ప్రమాణం అని మెచ్చుకొన్నారు సరస్వతీ పుత్రులు .ప్రకృతిపై మానవ విజయానికి సంకేతం అంటారు వారు .ఈ మధ్య ఒక చోట త్రవ్వగా ఒక బిలం కన్పించిందట .రెండు మూడు ఫర్లాంగులు దానిలో ప్రయాణం చేసినా దాని అంతూ దరి కనిపించలేదట .ఆ మార్గం ‘’త్రిపురాంతకం ‘’కు దారి మార్గం అట .ఆనకట్ట కట్టేటప్పుడు దాన్ని పూడ్చేశారట .

ఇక్కడి శివ లింగాన్ని అందరూ తాకి అభిషేకం చేసుకొనే వీలుండేది .ఇక్కడి కల్యాణోత్సవం తమాషా గా ఉంటుంది .’’పేటా’’అనే పెద్ద వస్త్రాన్ని ‘’దేవాం గుడు ‘’స్వయం గా పరగడుపున ఉదయమే  నేసి తెస్తాడు .ఉత్సవం రోజున దాన్ని స్వామికి అర్పిస్తాడు .అతనికి భక్తులు కానుకలు సమర్పిస్తారు .సాలె వారు కూడా అనేక పేటాలను నేసి తెస్తారు .శివరాత్రి నాడు ఒక భక్తుడు గుడిని దీనితో అలమ్కరిస్తాడు .అంటే పేటా అలంకరణ దేవాలయానికే ,దేవుడికి కాదు మొదట కలశానికి చుట్టి తర్వాత గుడికి చుట్టూ ఉన్న నంది కేశ్వరుల మెడలకు చుట్టుతాడు .ఆ చుట్టేటప్పుడు ఆతను ‘’దిగంబరం ‘’గా మొలత్రాడుకూడా లేకుండా ఉండటం  విశేషం .ఒక్క ఇంటి వారికే దీని అధికారం ఉంది. పరంపరగా సాగే ఆచారం ఇది .ఇది వీరశివాచారం ఏమో అని ఆచార్యుల వారి సందేహం .ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జున మూర్తులు తప్ప అన్నీ మారిపోయాయి అంటారు  హాట కేశ్వరంహాత  లో జాతి జాతి నాగ సర్పాలు ఉంటాయి .అవి ఎవరి జోలికీ రాక పోవటం వింత .శ్రీశైలం కొండ మీద తేలు ,కాని పాము కాని కరిచి చని పోయిన వారెవ్వరూ లేరని పుట్టపర్తి వారు ఘంటా పధం గా చెప్పారు .’’డాం’’ కట్టేటప్పుడు ఏంతో మందిని ఆచార్యుల వారు విచారించారట .అందరూ అది నిజమే అన్నారట .ఇలా శ్రీశైల గధ  లేన్నేటినో తవ్వి తీసి మనకు అందించారు పుట్టపర్తి వారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి -రమ్య భారతి, సరసభారతి ,మల్లె తీగ ల సౌజన్యం తో 14-9-14

విజయవాడ  టాగూర్ గ్రంధాలయం లో14-9-14  ఆదివారం ఉదయం పది గంటలకు  పై మూడు సంస్థలు నిర్వహిస్తున్న ”గాలి వాన ”కధకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి సభ జరుగుతుంది  అందరూ  ఆహ్వానితులే . సరసాభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం” 5,000రూపాయలు కదా రచనలో అద్వితీయ సేవ లందిస్తున్న శ్రీ వేదగిరి రాం  బాబు గారికి సరసభారతి ద్వారా ఈ సభలో ప్రదానం చేయ బడుతుందని తెలియ  జేస్తున్నాం –గబ్బిట   దుర్గా ప్రసాద్

PALAGUMMI

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎజెండా లేని దండగ మారిపాలన

తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ వంద రోజులలో మెరుగూ తరుగూ పరిశీలించుకోవడం అధికారంలో వున్నవారికి చాలా అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ అవసరం గుర్తించబట్టే తన పాలన సంతృప్తిగా లేదని ప్రకటించుకున్నారు. ప్రణాళికల రూపకల్పన పూర్తి కావాలన్నారు. ఈ స్వల్ప కాలంలో అద్భుతాలు ఆశించడానికి లేదన్న ఆయన మాటలను బలపర్చవలసిందే. అయితే వంద రోజులకు తగిన సంతృప్తి కూడా లేదేమిటని ప్రశ్నించవలసి వస్తుంది. నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు ఇతరులను శ్రమ పెట్టడం ఎందుకు అన్నాడో ఆంగ్ల రచయిత. అదే సూత్రాన్ని తిరగేస్తే గనక నిన్ను నీవే విమర్శించుకోవడం మరో వ్యూహం. కేసీఆర్‌ మాటల్లో ఆ వుద్దేశం వుందో లేదో గానీ ఆయన వెలిబుచ్చిన అసంతృప్తి తెలంగాణ సమాజంలోనూ పరిశీలకుల్లోనూ వున్న అభిప్రాయాన్నే ప్రతిబింబించింది. మొదట చాలా దూకుడుగా మొదలై ప్రకటన పరంపరతో హామీలు వాగ్దానాల వరద ఉప్పొంగిన పరిస్థితి. దాంతో పోలిస్తే ఫలితాలు పరిమితంగానూ సందేహాస్పదంగానూ వున్నాయనేది కళ్లముందు కనిపిస్తున్న నిజం.
తెలంగాణ కొత్త రాష్ట్రం గనక దిశా నిర్దేశం సమయం పట్టే పని. అదే సమయంలో రాజధాని కొనసాగింపు, మిగులు బడ్జెట్‌తో సహా కొన్ని అనుకూలాంశాలూ వున్నాయి. నిన్నటిదాకా కదంతొక్కిన ఉద్యమ శ్రేణులు అంకిత భావంతో వచ్చిన అధికారులు, మద్దతుగా వుంటాయనే ఉద్యోగులు ఉన్నారు. విద్యుచ్ఛక్తి కొరత వంటి గడ్డు సమస్యలు వున్నా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగానే వున్నారు. అధికార పీఠం అధిష్టించిన టీఆర్‌ఎస్‌ అధినేతపై సుహృద్భావం రీత్యా ప్రతిపక్షాలు కూడా పెద్దగా విమర్శలు చేయడానికి తటపటాయించాయి. వామపక్షాలు కూడా సముచిత వ్యవధి ఇవ్వాలనే భావించాయి. కేబినెట్‌ మంత్రులు పార్టీ నాయకులు సర్వాధికారం అధినేతకే అప్పగించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇన్ని అనుకూలాంశాల మధ్య తనకు స్పష్టమైన దార్శనిక విధానాలున్నాయని ఒకటికి రెండు సార్లు ప్రకటించిన అధినేత బడ్జెట్‌ కసరత్తు కూడా వాయిదా వేసుకోవడం దేనికి నిదర్శనం? ఉమ్మడి అంశాల్లోనూ కొన్ని విడివిడి విషయాల్లోనూ కూడా న్యాయస్థానంలో అక్షింతలు వేయించుకోవడం నిర్ణయాలు వెనక్కు పోవడం ఏం సూచిస్తుంది?
కాంగ్రెస్‌ తెలుగుదేశం వంటి పార్టీలు గతంలో సుదీర్ఘ కాలం పాలించాయి. ఇప్పుడు అవి పాలిస్తున్న చోట్ల కూడా పెద్ద ఒరగబెట్టింది లేదు. కనుక అవి ఈ మూడు నెలల్లోనే ఏదో మునిగిపోయినట్టు మాట్లాడితే పెద్ద విలువుండదు. విభజనకు ఆధ్వర్యం వహించింది కూడా కాంగ్రెసే గనక అనంతర సమస్యలలో వారికీ చాలా పాత్ర వుంటుంది. తెలుగుదేశం కూడా తమ వల్లే జరిగిందని ఇప్పుడున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తమకు అనుకూలమైందనీ చెబుతున్నందున వారి వ్యాఖ్యలను కూడా యథాతథంగా తీసుకోలేము. బీజేపీ నాయకులు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రంగానే దాడిచేస్తున్నారు గానీ కేంద్రంలో వారి ప్రభుత్వం ఇరు రాష్ర్టాలకూ చేసిందేమీ లేదన్నది నిజం. కనుక వీరి విమర్శలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి స్వీయ అసంతృప్తినే మనం పరిశీలించవచ్చు. కేసీఆర్‌ వాగ్దానాలు ఘనంగా వున్నా ఆచరణ స్వల్పంగా వుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నమాటతో విభేదించే వారెవరూ వుం డరు. కర్త కర్మ క్రియ అన్నీ ఒకరే అయినప్పుడు పోరాడి తెచ్చుకున్న నవతెలంగాణ తొలిఅడుగులు ఇంత మందకొడిగా వుండటానికి కారణమేమిటి? విధానాల్లో అస్పష్టతకు కారకులెవ్వరు?
సింగపూర్‌ కబుర్లు, కరీంనగర్‌ను లండన్‌గా మార్చడం వంటి మాటలు అతిశయోక్తులని వదిలేయొచ్చు. ప్రజల తక్షణ సమస్యలపై చొరవతో స్పందించకపోవడాన్ని ఏమనాలి? రైతులు రుణమాఫీపై అయోమయాన్ని ఎలా వివరించాలి? ఫీజుల సమస్యపై కోర్టులో ఎదురైన సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి? దళితులకు మూడెకరాల భూమి పంపకం మొక్కుబడిగా ముగించడం దేనికి సంకేతం?పారిశ్రామిక వేత్తలకు లక్షల ఎకరాల భూ నిల్వ వుందంటున్న ప్రభుత్వం దళితుల కోసం మాత్రం భూమి కొని ఇస్తాననడం దళారుల దందాకు అవకాశమిస్తున్న మాట నిజం కాదా?
సర్వే పూర్తి కాకుండా వివరాలు విశ్లేషించుకోకుండా అసలు జరపడమే ఘనమైనట్టు అమితంగా చెప్పుకుని ఆనందించడంలో ఔచిత్యమెంత? కేజీ టు పీజీ విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, నిధుల విడుదల వంటి అనేకానేక తక్షణ సమస్యలు కూడా తర్వాతకు వాయిదా వేయడంలో ఔచిత్యం ఏమిటి? రోజుకో కార్పొరేట్‌ కరోడ్‌పతిని కలుసుకునే వారు కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కాలం కేటాయించకపోవడం వెనక కారణాలేమిటి? విద్యార్థులు, రైతులు ఆఖరుకు మహిళా జర్నలిస్టులపైన కూడా లాఠీచార్జీలు చేయించాల్సినంత అగత్యం ఏమొచ్చింది? ప్రభుత్వాధినేతలకు కష్టం కలిగించినా అనివార్యంగా ముందుకొచ్చే ప్రశ్నలివి. అసలు అన్నిచోట్లా సమస్యలకు మూలమైన సరళీకరణ నమూనాకు భిన్నంగా చెప్పినమాట ఒకటైనా వుందా?
ఇతర పార్టీల వారిని టోకున తెచ్చుకుని శాసనసభ్యుల సంఖ్యను 63 నుంచి 75కు పెంచుకోవడానికి ఈ సమయం సరిపోయింది. గద్దెక్కిన మరురోజే మజ్లిస్‌తో దోస్తీకి ఆతృత వ్యక్తమైంది. పదవీ సంతర్పణలు రాజకీయ పునరావాసాలు షరా మామూలుగానే నడిచాయి. మెదక్‌లో సర్వశక్తులూ మొహరించడానికీ ఆటంకం లేకపోయింది. (అక్కడా వామపక్షాలు టీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నాయనేది నిజం) ఈ రాజకీయ క్రియాశీలతకు తగినట్టు సమస్యల పరిష్కారంలో చొరవ చూపించడానికి నిధులు మంజూరు చేసి రంగంలోకి దిగడానికి మాత్రం సమయం చాలలేదు. కేబినెట్‌ సమిష్టి సూత్రం వెనక్కుపోయి సర్వం ముఖ్యమంత్రి ప్రవచితమేనన్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఆఖరుకు ఒక ఉప ముఖ్యమంత్రిని తప్పిస్తారన్న కథనాల నేపథ్యంలో బహిరంగంగా అభిశంసించినంత పని జరిగిపోయింది. రుణమాఫీ విషయంలో తొలి వారంలోనే ఆర్థిక మంత్రికి అక్షింతలు వేసిన అధినేత బడ్జెట్‌ వాయిదాను కూడా తానే ప్రకటించే పరిస్థితి ఏర్పడింది.
ఇవన్నీ ఒకటైతే రెండు చానళ్ల ప్రసారాలు నిలిచిపోవడం నవ తెలంగాణ తొలి ఘట్టంలో ఒక మచ్చగా మారింది. దీనిపై గతంలో కూడా ఈ శీర్షికన చర్చించాము. టీవీ9 క్షమాపణలు పదే పదే చెప్పిన తర్వాత కూడా ప్రసారాలు పునరుద్ధరించబడలేదు. ఇక ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌పై ఎందుకు ‘శిక్ష’ వేశారో కూడా చెప్పలేదు. కథనాలు పొరబాటని ఖండించవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రసారాలు నిలిపివేత నిరవధికంగా సాగించడం ప్రజాస్వామిక వాదులెవరూ హర్షించగలిగింది కాదు. కక్ష కట్టేంత అసహనపూరితమైందీ కాదు. ఇది మా ప్రమేయం లేకుండా ఎంఎస్‌వోలు చేశారని తప్పుకోవడం వారి భుజంపై తుపాకీ పెట్టి కాల్చిన చందమే. అలా అయితే పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదు? సంబంధం లేదని చేతులు దులుపుకోవడం, ఆ చేత్తోనే ప్రసారాలు నిలిపేసిన వారికి సెల్యూట్‌ చేయడం అత్యున్నత పదవీ పరివేష్టితులకు వన్నె తెచ్చేవి కావు. ‘ఈ గడ్డపై వుండదల్చుకుంటే మాకు సెల్యూట్‌ చెయాలి’ అని చెప్పడంలో ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమైనా ప్రణమిల్లాలని శాసించే హక్కు రాజ్యాంగంలో లేదు. బానిసోన్నిదొరా కాల్మొక్కతా అనే పరిస్థితికి సమాధి కట్టి ప్రజా చైతన్య ప్రతీకగా నిల్చిన తెలంగాణ సమాజం అలాంటి ఆధిపత్య కాంక్షలకు ఎన్నడూ పాల్పడదు. ఈ నిలిపివేత వల్ల అభద్రత పాలైన ఆ సంస్థల తెలంగాణ జర్నలిస్టులు మహిళలు ఆందోళన చేస్తే లాఠీచార్జి కూడా దారుణమే. సమరశీలతతో పాటు సహనశీలత కూడా కలిగిన తెలంగాణ సమాజం పత్రికా స్వేచ్ఛ కోరుకునే వారు ఈ ఆంక్షలు ఆటంకాలను ఎంతమాత్రం ఆమోదించలేరు. పైగా ఈ ధోరణి రేపు ఇతరులకూ విస్తరిస్తే కలిగే అనర్థం చాలా వుంటుంది.

కేసీఆర్‌ ప్రభుత్వానికి శతదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఆకాంక్షలు నిజంగా శుభం కలిగించాలని, ఆంక్షలు తొలగిపోవాలని కోరుకుందాం.
తెలకపల్లి రవి
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు మీకు మీ ప్రభుత్వానికి అభినందనలు. ఏ ప్రభుత్వం పనితీరైనా వంద రోజుల్లో అంచనా వేసి తీర్పు చెప్పడం న్యాయం కాకపోవచ్చు. కానీ ఐదేళ్ళ పాలనకు సంబంధించి ఒక క్రియాశీల ప్రణాళికను తయారు చేసేందుకు ఆశలతో ఎన్నుకొన్న ప్రజానీకానికి ఒక సానుకూల సంకేతాన్ని ఇవ్వటానికి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుంది. కానీ గడచిన జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు ఈ దిశలో ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా ఒక ఎజెండా అంటూ లేకుండా మాటలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుండటం దురదృష్టకరం. మీరు ప్రకటించిన వందల పథకాలలో ఒక్కటి కూడా మొదలు కాలేదు. సింగపూర్‌ వెళ్ళివచ్చారు. అక్కడి అభివృద్ధిని ‘కాపీ-పేస్ట్‌’ చేస్తామన్నంత ఉద్వేగభరితమైన ఆశలు కల్పించారు. కరీంనగర్‌ను లండన్‌ నగరంలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తెలంగాణ ఉద్య మంలో చురుకైన పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ కూడా మీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని భావించింది. దురదృష్టవశాత్తు మాటలే తప్ప చేతలు కనిపించని పరిస్థితి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
లక్ష రూపాయలలోపు రైతులకు రుణ మాఫీ చేస్తామని మీరు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో దీని అమలుకు వాస్తవానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఖరీఫ్‌ సీజన్‌ పూర్తికావస్తున్నా ఇంకా రుణ మాఫీ అర్హుల జాబితా రూపొందిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. క్రాప్‌లోన్స్‌ దొరకక రైతులు వడ్డీ వ్యాపారుల రుణ చక్రంలో ఇరుక్కుంటున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేసి ‘ఫాస్ట్‌’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్టే ప్రకటించారు. ఫాస్ట్‌ పథకం కింద ఫీజు మాఫీకి స్థానికత ప్రామాణికం, 1956 సంవత్సరానికి ముందే తెలంగాణలో స్థిరపడిన వారే అర్హులంటూ ఒక గందర గోళానికి తెర తీశారు. దీని వల్ల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆలస్య మవ్వటం, గతంలోలా సీటు దొరికిన సమయంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేసే విధానం లేకపోవటంతో దాదాపు లక్షన్నర మంది పేద విద్యార్థులు కౌన్సెలింగ్‌ నుంచి వైదొలిగారు. ఇది మీ ప్రభుత్వానికి గౌరవప్రదమనిపిస్తుందా? కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు రద్దుచేయటం వల్ల అందులో చదువుకుంటున్న ద్వితీయ, తృతీయ, ఫైనల్‌ సంవత్సరాల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. మెడికల్‌ విద్యార్థులకు ఫీజులను భారీగా పెంచుకునేలా కాలేజీలను అనుమతించడాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈ స్థాయి ఫీజులు దేఽశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేవన్న విషయం వాస్తవం కాదా? రైతులకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని మీ హామీ పత్రంలో గొప్పగా చెప్పారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే రక్తాలు చిందేటట్టు లాఠీచార్జి చేయించారు. మీ సొంత గజ్వేల్‌ నియోజకవర్గ రైతులకు సైతం లాఠీల గాయాలు తప్పలేదు. ఎన్నికలప్పుడు ‘మీ కాలిలో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా’ అని తేనెలాంటి తియ్యటి మాటలు చెప్పిన మీరు…. లాఠీ దెబ్బలు తిన్న రైతులను కనీసం పరామర్శించారా? గతంలో రైతుల రక్తం కళ్ళ చూసిన ప్రభుత్వాలు, వరుసగా సాగిన ఆత్మహత్యలను అడ్డుకోలేకపోయిన ప్రభుత్వాలు పతనమై ప్రజలకు దూరమైన వాస్తవం మీకు తెలియదా?
మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 200 మంది రైతులు అప్పుల బాధతో ప్రాణత్యాగం చేస్తే మీకు చీమకుట్టినట్లయినా అనిపించలేదా? రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆ ప్రక్రియను మొదలుపెట్టి ఉంటే వీరి ఆత్మహత్యలు ఆగి ఉండేవి కాదా? చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించటానికి వెళ్ళే తీరిక మీకైతే ఎట్లాగూ ఉండదు. మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా లేదా?
ఆ మధ్య మీ సొంత జిల్లా మాసాయిపేట రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 24 మంది పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే… ఆ కుటుంబాలను ఓదార్చే తీరిక మీకు దొరకలేదా? దేశమంతా కన్నీరుపెట్టిన ఈ దుర్ఘటన బహుశా మీకు చాలా చిన్న ఉదంతంగా అనిపించి ఉండవచ్చు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగమన్నారు. మీ మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది యువకులు, విద్యార్థులే కదా? ఇప్పుడు ఉద్యోగాల విషయంలో స్పష్టత కావాలని ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్థులను అరెస్టులు చేయించటం చూస్తే వారి పట్ల మీ వైఖరి ఇలాగే ఉంటుందని అనుకోవచ్చా? తిన్నది అరగక ఉద్యోగాల పేరుతో దీక్షలు చేస్తున్నారని ముఖ్యమంత్రిగా వారిని అవమానించేలా వ్యాఖ్యానించటం సబబేనా? ఆంధ్ర విడిపోతే 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయని అనలేదా? ఇక మీ విద్యామంత్రి ఇప్పట్లో డీఎస్పీ నియామకాలు ఉండవని తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రంలో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని అక్కడి విద్యామంత్రి ప్రకటించటం మీ దృష్టికి వచ్చే ఉంటుంది.
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించే విషయమై ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీతో అంటకాగుతున్న ఎమ్‌ఐఎమ్‌ ఈ ఉత్సవాల విషయంలో అయి ష్టంగా ఉన్నందుకేనా? ఇళ్ళు లేనివారికి పిల్లర్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ నివాసం 125 గజాల్లో మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇస్తానని మీరిచ్చిన హామీ ప్రకారం ఎప్పటికి అమలు చేయటం సాధ్యమౌతుందని మీరనుకుంటున్నారు? ఎన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనుకుంటున్నారో అంచనాలేవైనా మీ దగ్గర ఉన్నాయా?
భూమిలేని దళితులకు మూడెకరాల సాగుభూమిని పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పారు. రాష్ట్రంలోని లక్షల కుటుంబాలకు గజం భూమి కూడా లేదు. వీరందరికీ భూ పంపిణి చేయటానికి మీరు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద యేటా పదివేల కోట్ల చొప్పున ఐదేళ్ళలో యాభై వేల కోట్లు ఖర్చుపెడతామన్నారు. మరి మొదటి ఏడాదిలో నాల్గవ నెల మొదలైనా నాలుగు లక్షల రూపాయలైనా విదల్చలేదెందుకు?
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ మిగులు విద్యుత్తు వెయ్యి మెగావాట్లను రాషా్ట్రనికి రప్పిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒప్పంద ప్రతిపాదనలేవీ అందలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తెలిపారు. ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టడానికి జాప్యం ఎందుకు జరుగుతోంది?
ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ జరిపించారు. ఈ సర్వేలో పాల్గొనకపోతే జనాభా లెక్కల్లో లేనట్లేనని మీరు చేసిన హెచ్చరికకు భయపడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఒంటికాలిపై ప్రయాణం చేసి ఇళ్ళకి చేరుకున్నారు. సర్వేలో ఇల్లులేదని చెపితే ఇల్లు ఇస్తారేమోనని, రేషన్‌కార్డు లేకపోతే కార్డులిస్తారని, చదువుకొనే పిల్లలుంటే ఫీజులు కడతారేమోనని, అప్పులేమైనా ఉంటే మాఫీ చేయిస్తారేమోనని పాపం ప్రజలు ఎన్నో ఆశలతో ఆ రోజు ఎన్యుమరేటర్ల కోసం గడప దాటకుండా లోపలే ఉండిపోయారు. సర్వే పూర్తయింది. పదిహేను రోజులు కూడా దాటింది. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమౌతున్నది ఏమిటంటే రేషను కార్డులు తొలగించడానికి, ఆరోగ్య్రశీ కార్డులు తీసివేయటానికి, వృద్ధాప్య -వితంతు పింఛన్లును అర్హతలేదనే పేరుతోలాక్కోవడానికని.
మీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన వరంగల్‌లో మీడియా సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించడం, అన్యాయంగా అరెస్టు చేయించడం చూస్తే మున్ముందు కూడా మీ పాలనలో మీడియాకు వేధింపులు తప్పవని అనుకోవచ్చా? హైదరాబాదులో మీ అధికార నివాసం వద్ద మహిళా టీవీ జర్నలిస్టుల పైకి మగ పోలీసులతో దాడి చేయించటం, కెమెరాలు లాక్కోవటం, ఓబీ వ్యాన్ల లైవ్‌వైర్లను తెంచేయటం మీ ప్రభుత్వానికి వన్నెతెచ్చే అంశం కాదు. తలలు నరుకుతాం.. తరిమికొడతాం.. పది కిలోమీటర్ల లోతున బొందపెడతాం.. లాంటి మాటలు మీరు అనాల్సినవి కావు. మీ ప్రతిష్ఠను పెంచేవి కావు.
ప్రజలు మీకు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టినా ఎందువల్లనో మీరు అభద్రతా భావంతో ఉన్నట్టు కనబడుతున్నది. మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలలో చీలిక తెస్తారని నిరంతరం మీరు పీడకలలు కంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ కారణం వల్లనే ఇతర పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను పార్టీలోకి తీసుకున్నారు. పదివేలకు పైగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ దరాఖాస్తులు మీ ఆఫీసులో పెండింగులో ఉన్న విషయం వాస్తవం కాదా? చావు బతుకుల్లో ఉన్న రోగులు శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తుంటే రిలీఫ్‌ఫండ్‌ నిధులు విడుదల చేసే తీరిక మీకు దొరకటం లేదా? మనసొప్పటం లేదా?
సుమారు 2,500 ముఖ్యమైన ఫైళ్ళు మీ సంతకం కోసం ఎదురుచూస్తున్న విషయం నిజం కాదా? హైదరాబాదు సిటీలో 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విద్యుత్‌ బకాయిలు చెల్లించని కారణంగా సరఫరాను నిలిపివేసిన విషయం మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. ఎస్సీ, బీసీ హాస్టళ్ళు, పాఠశాలల్లో కరెంటు డిస్‌కనెక్ట్‌ చేసిన విషయం కూడా మీ దృష్టికి రాలేదా?
సమైక్యాంధ్ర అనుకూల పార్టీ అయిన సీపీఎం మద్దతును మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎందుకు తీసుకుంటున్నారు? ఇది అవకాశవాదం కాదా? సమైక్యాంధ్రకు నిలువెత్తు సాక్షి అయిన తెలుగుదేశం నేత తుమ్మల నాగేశ్వరరావును ఆ పార్టీనుంచి మీవద్దకు ఫిరాయించేలా ఉరుకులాడటం ఏ విధమైన తెలంగాణ వాదం?
 జి. కిషన్‌రెడ్డి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

— గొయ్యి తవ్వ్వుతూ అందులో ఉండిపోయిన గులాబి నాయన

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం

విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం

10-9-14కవి సమ్రాట్ ,పద్మభూషణ్ ,కళాప్రపూర్ణ ,జ్ఞాన పీఠ పురస్కృత బ్రహ్మశ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 120వ జయంతిఉత్సవం ఉదయం  విజయవాడ మాచవరం లోని వారి స్వగృహం ‘’కల్ప వృక్షం ‘’లోవారి మనుమల చేత , సాయంత్రం శ్రీ ఘంట సాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యం లోను నిర్వహించ బడింది. రెండిటికి భక్తీ శ్రద్ధలతో  నేనూ నా భార్య ప్రభావతి హాజరై జీవితాలను ధన్యం చేసుకోన్నాం  .ఉదయం ఎనిమిదింటికే ఉయ్యూరులో టిఫిన్ చేసి బయల్దేరి మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ,తర్వాత విశ్వనాధ వారింటికి వెళ్లి ఉదయం కార్యక్రమం లో పాల్గొని ,హోటల్ లో భోజనం చేసి ,తర్వాత ఐ టి ఐ దగ్గరున్న స్టేట్ బాంక్ కాలనీలో  ఉంటున్న మా తోడల్లుడి గారింటికి వెళ్లి నాలుగింటిదాక విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయల్దేరి సీతారాం పురం లో ఉంటున్నడాక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారింటికి వెళ్లి  ,వారిని దర్శించి ,అక్కడినుండి సత్యనారాయణ పురంలో ఘంట సాల మ్యూజిక్ కాలేజ్ లో జరిగిన విశ్వనాధ వారి పై ప్రభుత్వ కార్యక్రమం అయిన శ్రీ గారిక పాటి వారి ప్రసంగం  విని ,నిన్నటి రోజును పూర్తిగా సార్ధకం చేసుకోన్నాము .ఆ విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .

ముచ్చటైన చిరంజీవులు – ముగురన్న దమ్ములు

ఒక కార్యక్రమాన్ని స్వంత భుజ స్కంధాలపై భారం వేసుకొని దానికొక సంపూర్ణ రూపాన్నిచ్చి ,ఆచరణ లోకి తేవటం తేలికైన విషయం కాదు .దాన్ని సుసాధ్యం చేశారు విశ్వానాధ గారి మనుమలు ఛి విశ్వనాధ సత్యనారాయణ ,మనోహర శ్రీ పాణిని ,శక్తిధర పావకి .తాతగారి సాహిత్యాన్ని ఆసాంతం చదివి ఆకళింపు చేసుకొని దారాపాతం గ వారి కలప వృక్ష పద్యాలను నోట పలుకుతూ ,అనన్యమైన భక్తీ శ్రద్ధలతో తాతగారి ఆశయాన్ని తండ్రి కీ .శే పావని శాస్త్రి గారి ఆశయానికి అంకితమై ,అందరికీ ఆదర్శ ప్రాయమైనారు .ఇందులో మొదటి చివరి కుర్రాళ్ళది ముఖ్య పాత్ర అయితే మధ్యలో ఆతను అన్నా తమ్ములను వీర విదేయం గా అనుసరిస్తున్నారు .ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధార పడకుండా తమ సంపాదనలో కొంత భాగాన్ని తాతగారి కార్యక్రమాలకు సద్వినియోగం చేసుకొంటున్న ధన్యులా సోదరులు .వారిని యెంత అభినందించినా తక్కువే .దాదాపు పది ఏళ్ళనుంచి జనవరిలో జరిగే పుస్తక మహోత్సవం లో విశ్వనాధ వారి స్టాల్ పెట్టి సమగ్ర సాహిత్యాన్ని అందజేస్తున్న పుణ్య మూర్తులు .అంతకు ముందు తండ్రి పావని గారికి అండగా నిలబడేవారు .అప్పటి నుంచే నాకు పరిచయమే .ఈ  మధ్య ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్రం నుండి విశ్వనాధ పైస్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి సారధ్యం లో ప్రసారమైన ‘’వేయి పడగలు ‘’నవలపై వారం వారం వచ్చిన కార్యక్రమాలపై నేను రాసిన సమీక్షలు వారి మెయిల్ అడ్రస్ కు పంపటం తో మనుమడు సత్యనారాయన తో పరిచయం గాఢ మైంది .ఫోన్లు చేసి మాట్లాడటం అలవాటైంది . బుధ జన విధేయులు ,తల వంచని దీరుల్లా కన్పించారు ఆసోదర త్రయం .వారిని తీర్చి దిద్దుతున్నది వారి తల్లిగారు శ్రీమతి రాజేశ్వరి గారు .ఆమె విశ్వనాధకు కూతురు బిడ్డ ,పావని భార్యయై కోడలైన మనుమరాలు కూడా .ఇంటి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి మమ్మల్నీ రమ్మంటే వెళ్లాం .ఇంటి వద్ద తాతగారిజయంతి జరపటం వాలళ్ళకోచ్చిన గొప్ప ఆలోచన. కార్య రూపం దాల్చింది .సఫలమైంది .వారికి శుభాభినందనలు .

కల్ప వృక్షం

శిధిలమైన తాత గారి ఇంటిని తమకున్న వనరులతో సర్వాంగ సుందరం గా రూపు మార్చి ‘’కల్ప వృక్షం ‘’అని సార్ధక నామం పెట్టిన వారి సుమనస్కత ఎన్న తగినది .తాతగారికిస్టమైన ‘’కదంబ వృక్షం ‘’ను పెంచుతున్న వారి భక్తీ కి ఆశీస్సులు . ఆయింటిని గొప్ప సందర్శక కేంద్రం గా మార్చాలనుకొంటున్న వారి భావనకు అభినందనలు .ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొంటే ఇక ఇంతే సంగతులు .ఆ విషయంలో  వారు జాగ రూకులై ఉంటారని ఆశిస్తున్నాను .ఇంటిలో తాతగారి చాయా చిత్రాలు ,ఉపయోగించిన వస్తువులు ,రాసిన పుస్తకాల ప్రదర్శన పెట్టాలనే వారి కోరిక త్వరలో కార్య రూపం దాలుస్తోంది .విశ్వనాధ విగ్రహమూ అక్కడ వెలువ బోతోంది .’’విశ్వ నాద ఫౌండేషన్ ‘’ను సోదరులు ఏర్పరచి కృషి చేసి అందరి దృష్టికి ఆయన సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు .కల్ప వృక్షం రామాయణానికే కాక ‘అందరికి ‘’సాహిత్య కల్ప వృక్షం ‘’కావాలని నా కోరిక. చేయగల సమర్ధులు  వారు అనే నమ్మకమూ కనిపించింది .

శ్రీమతి  రాజేశ్వరి గారు

మేమిద్దరం లోపలి వెళ్లి రాజేశ్వరి గారిని చూసి మాట్లాడాం .ఉయ్యూరు నుంచి వచ్చాం. అంటే ఎంతో సంబర పడిపోయారు .మా విషయాలు అడిగి తెలుసుకొన్నారు .విశ్వనాధ గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరులో ట్యుటోరియల్ కాలేజిలో తెలుగు పండితులుగా పని చేశారని ,మా ఇంటికి నెల నెలా వచ్చి పాత ఒడ్లు బస్తాలు కొని తీసుకొని వెళ్ళేవారని ,తరచుగా కలిసి మాట్లాడుకోనేవారమని ,తానె తమ అన్నగారు చెప్పిన వ్యాసాలను పుస్తకాలను రాశానని చెప్పేవారని గుర్తు చేసుకొన్నాను ఆమెతో .అంతేకాదు వెంకటేశ్వర్లుగారి అబ్బాయి వ్స్వర్గీయ వేణుగోపాల్ నా దగ్గర ట్యూషన్ చదివే వాడని ,అతని చదువు సంగతి ని ఎప్పటికప్పుడు ఇంటికొచ్చి తెలుసుకొనే వారని చెప్పాను .గోపాల్ కుమారుడు మురారికి హైదరాబాద్ లో ఉంటున్న మా పెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ కుమార్తె ఛి సౌ భార్గావి నిచ్చి వివాహం చేశారాని ఈరకం గా బాంధవ్యమూ ఉందని చెప్పాం . విశ్వనాధ ఎస్ ఎస్ ఆర్ కాలేజిలో పని చేసినప్పుడు నేను 1956-60కాలం లో ఇంటర్ ,డిగ్రీలు చదివానని ,అయన నాక్లాసుకొచ్చి పాఠాలు చెప్పారని దువ్వూరి రామి రెడ్డి గారి ‘’పాన శాల ‘’చెప్పటం ఇంకా గుర్తుందని అన్నాను .

మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు  అనంత పురం జిల్లా హిందూ పురం మునిసిపల్ హై స్కూల్ లో ఇరవై రెండేళ్ళు సీనియర్ తెలుగు పండితులు  గా ఉండేవారని నా చిన్నతనం అక్కడే గడిచిందని చెప్పా .అప్పుడు విశ్వనాధ వారు సభలకోసం హిందూ పురం ,చుట్టూ  ప్రక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవారని ఆతిధ్యాన్ని మా తలిదండ్రులు ఇచ్చేవారని మ అమ్మగారు భవానమ్మ గారు ఎప్పుడూ చేబుతూ ఉండేవారని ,మా నాన్న గారికి విశ్వనాధ అంటే విపరీతమైన అభిమానం అని ఉయ్యూరుహైస్కూల్ లో పని చేసినప్పడు విశ్వనాధను ఆహ్వానించి1952లో  వారం రోజులు కల్ప వృక్షం పై మాట్లాడిం చటం నాకు ఇంకా గుర్తుందని చెప్పా. ఇంగ్లీష్ లెక్చరర్ .శ్రీ జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారు సంస్కృత అధ్యాపకులు  శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు కూడా హిందూ పురం లో మా ఇంట ఆతిధ్యం పొందారని మా అమ్మగారు గుర్తుచేసుకున్న విషయాన్నీ వివరించా .అప్పటినుంచి మా కుటుంబాకి విశ్వనాధ తో పరిచయం అని చెప్పాను .చాలా ఆనంద పడి మా ఇద్దరినీ బంధువులుగా భావించి టీ తెప్పించి తోటి కోడలు చేత ఇప్పించారు .కుమారులకు ఆమె గొప్ప ప్రేరణ గా కనిపించారు .తాతా, మామ అయిన విశ్వనాధ కు సేవ చేసి మెప్పుపొందానని  ఆమె అన్నారు .మా శ్రీమతి విశ్వనాధ గారి ప్రధమ కళత్రం గారి పుత్రులు శ్రీ కృష్ణ దేవరాయలు గారి భార్య తో వారి పిల్లలతో తానూ ప్రక్క ఇంట్లో తన చిన్నతనం లో ఆడుకోన్నానని ,జ్ఞాపకం చేసుకొన్నది .నేను కృష్ణ దేవరాయలు గారు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’అనే పేరుతొ వచన రామాయణాన్ని రాశారని అమెరికా తెలుగు పత్రిక లో అది ధారావాహికం గా ప్రసారమిందని నేను చదివానని గుర్తు చేసుకొన్నాను .  అక్టోబర్ పందొమ్మిదవ తేదీ ఆదివారం  విశ్వనాధ స్వగ్రామం నందమూరు లో వారి వర్ధంతి సభను ‘’సరసభారతి ‘’నిర్వ హిస్తోందని ,పింగళి వారి చిట్టూర్పు లోను ,పెండ్యాల వారి స్వగ్రామం కాటూరు లోను ఇలాగే నిర్వహించామని తెలియ జేస్తే ఆమె ఏంతో సంతృప్తి చెందారు .సరసభారతి ప్రచురణలు, నేను రాసిన ‘’శ్రీహనుమత్ కదా నిధి శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధ యోగి పుంగవులు మహిళా మాణిక్యాలు ,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అయిదు పుస్తకాలు మనువళ్ళ పేర ఆప్యాయం గారాసి  రాజేశ్వరిగారికి అందజేస్తే ఆమె ఇవన్నీ తప్పక చదవాల్సినవే నని చదివి సార్ధకం చేస్తానన్నారు .

కల్ప వృక్షం లో   విశ్వనాధ జయంతి  సభ

పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభ పదకొండుకు ప్రారంభమైంది . ముందు కాసేపు పావకి విశ్వనాధ పద్యాలు పాడి వినిపించాడు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు రాగానే విశ్వనాధ చిత్రానికి పూల మాల వేసి నమస్సు లర్పిచారు మా అందరి చేతా చేయించారు .బుద్ధ ప్రసాద్ గారికి ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’ఇస్తూ ‘’మీ ఆవిష్కరణకు నోచుకోని పుస్తకం ‘’అని చెప్పి నవ్వాను .ఆయనా నవ్వారు .పూర్ణ చంద్ నా ప్రక్కనే ఉండి’’దుర్గా ప్రసాద్ గారి తీవ్ర పరిశోధనా గ్రంధం ఇది ‘’అన్నారు బుద్ధ ప్రసాద్ గారితో .పావకి ప్రార్ధన  లెక్చరర్ బాలకృష్ణ పర్య వేక్షణ  లో సభ జరిగింది .నేపధ్యాన్ని సత్యనారాయణ వివరించాడు .తమ తాతగారి తండ్రిగారు విశ్వనాధ శోభనాద్రి గారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే శివలింగం రెండు చేతుల్లోకి దైవ సంకల్పం గా వచ్చి చేరిందని అప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా  నంద దమూరు లో ప్రతిష్ట చేసే దాకా దాన్ని కింద పెట్టకుండా చేతుల్లోనే ఒకరితర్వాత ఒకరు జాగ్రత్తగా పట్టుకొని ఉండి ప్రతిష్టించి దాని శక్తిని కాపాడిన మహా చరితులని గుర్తు చేసుకొన్నాడు .ఇప్పటికీ  అక్కడి ఆలయం తమ కిందే ఉందని చెప్పాడు .ఫౌండేషన్ ఏర్పాటు గురించి వివరించాడు .ఆశయాలు ,పడిన పాట్లు ముందుకు, దూసుకొని పోతున్న మొక్క వోని ధైర్యాన్ని వివరించి అందరి ప్రశంసలు అందుకోన్నారా సోదర త్రయం .ప్రతినెలా కల్ప వృక్ష చాయలో ఒక కార్య క్రమం నిర్వహించాలనే ఆశయం లో ఉన్నారు వారు .శుభం భూయాత్ అనారు అందరూ .

తాతయ్య మామ

ముందుగా శ్రీమతి రాజేశ్వరి గారు తమ అనుభవాలను తెలియ జేశారు సుదీర్ఘం గా ఆత్మీయం గా ఆర్ద్రం గా .’’నేను విశ్వనాధ  కుమార్తెకు కూతురిని .నేను పుట్టగానే ఎత్తుకొని తాతయ్య విశ్వనాధ మా అబ్బాయి పావని ని పెళ్లి చేసుకో . ఆస్తి అంతా రాసిస్తాను .అన్నాడు .ఆయన వశ్య వాక్కు .దానికి మహిమ ఉంది అలానే ఆయనకు  కోడలినైన మనవరాలు అయిన   నాకు ఈ ఇంట్లో రెండు బాధ్యతలు కోడలిగా మనవ రాలిగా .ఆయన నన్ను మనవరాలిగానే ముద్దు చేశాడు .ఏనాడు పెత్తనం చేయలేదు. తాతయ్యా అమ్మమ్మా వారిఇంట్లో పిల్లగానే పెరిగాను .పావని గారితో కాపురం చేశాను .తాతయ్యకు వంట బాగా వచ్చు .అన్నీ సాయం చేసేవాడు .అమ్మమ్మా కు నేను ప్రాణం .పిల్లలు ఇంట్లో అరుస్తున్నా అల్లరి చేస్తున్నా తాతయ్య ఏకాగ్ర మైన రాతకు ,చదువుకు ఇబ్బంది పడేవాడు కాదు. అసలు పట్టించుకోనేవాడు .అంతటి ఏకాగ్రత ఉండేది .సినిమాకు డబ్బులడిగితే ఉంటె పంపేవాడు .లేక పొతే చేతికొచ్చిన తర్వాత ‘’సినిమాకి అఘోరించండి ‘’అని చెప్పి చేతిలో డబ్బు పెట్టేవాడు .ఆయన చూడని ఇంగ్లీష్ సినిమా ఉండేదికాదు .అయన పుస్తకాలు చదివితే ప్రపంచం అంతా తెలుస్తుంది .అర్ధం కాక పోవటం ఉండదు. ఆయన రాసినవన్నీ నేను చదివి లోక జ్ఞానం పొందాను .ఒక సారి నేను పుస్తకం  చదువుతో అందులో లో లీనమై పోయా .అమ్మమ్మ పిలిచినా విన పడలేదు .అప్పుడు తాతయ్య’’ అమ్మాయీ అమ్మమ్మ పిలుస్తోంది విన పడలేదా?’’ అని అడిగితె లేదని చెప్పాను  ఏంచేస్తున్నా వని అడిగితె’’విశ్వనాధ ట. ఎవరో రచయిత ట .ఆయన రాసిన కాశ్మీర రాజుల నవల కవలలు చదువుతున్నా .లోకమే తెలియ లేదు .ఇది రాసిన ఆయనది తప్పుకాని  తప్పునాదా?  అని దబాయించాను.ఆయన ముసి ముసి నవ్వులు నవ్వాడు .నేను ఎప్పుడైనా మా పుట్టిల్లు గుంటూరు వెడితే వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేసేవాడు. నేను ఇంట్లో తిరుగుతూ ఉంటె ఆయాయనకు ఆనందం సంతృప్తి .వేయిపడగలు నవలకు వచ్చిన డబ్బుతో అరవై ఏళ్ళ క్రితం ఇక్కడే స్థలం కొని ఇల్లుకట్టాడు .అప్పుడు నేను పుట్టాను .అంటే ఈ ఇంటికి షష్టి వత్సరం కూడా .అందరూ విశ్వనాధ ను చదవండి జీర్ణం చేసుకొని అనుస్టించండి ఆయనకు తెలియని విషయం లేదు. చదవని ఇంగ్లీష్ పుస్తకం లేదు .అన్నీ చదివి ఆకళింపు చేసుకొన్నా వాడే అయినా తన దోరణిలో తానూ రాసి గొప్ప సృష్టికర్త అయ్యాడు .జ్ఞాన పీఠ పురస్కారం వస్తే, దీనికంటే కిలో ఇరవై రూపాయలకు పెరిగిన మిర్చి ధర తగ్గిస్తే సంతోషించేవాడిని అన్న నిర్లిప్తుడే కాక అందరికి ప్రభుత్వం మేలు చేయాలనే సామ్య వాది విశ్వ నాధ ను మించి సోషలిస్టు కమ్యూనిస్టూ లేడు .కాని సనాతనం అనే ముద్ర వేసి తమను తామే వేలివేసుకొన్నారుపాపం  కొందరు .తాతయ్య నాకు అన్నీ ఇచ్చాడు .ఈ ఇల్లు అయన ఆన్నట్లే నాకే రాశాడు .నా భర్తా, పిల్లలు తాతయ్య వారసత్వానికి అంకితం అవటం నాకు గర్వం గా ఉంది .నేనేదో పైనుండి చెప్పేదాన్నే కాని వాళ్ళే అన్నిటా స్వంతం గా ఆలోచించి మంచి నిర్ణయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు .మా అంద కోరికా  ఈ కల్ప వృక్షం ఒక ప్రముఖ దర్శనీయ  కేంద్రం గా వర్ధిల్లాలని. మా శక్తి మేరకు మేము ఆ దిశలో సాగుతున్నాం .మీ అందరి తోడ్పాటు ఉంటె సుసాధ్యమే  అవుతుందని నమ్ముతున్నాం .’’అని చాలా భావా వేశం గా కన్నీరు  కారుస్తూ గత స్మృతులను నేమరేసుకొంటూ  సందర్భానికి తగినట్లు విశ్వనాధ సాహితీ విశ్వరూపాన్ని   బాంధవ్య మాధుర్యాన్ని విశ్వనాధ కుటుంబం తో తనకున్న కోడలి మనవరాలి పాత్రలను అందరి ప్రేమాస్పదాలను చాలా గంభీరం గా ,తడబాటులేకుండా విశ్వనాధ కోడలిగా తాతయ్య రచనలను సర్వం జీర్ణించుకొన్న మనవరాలిగా పావని గారి భార్యగా సోదరాత్రయానికి  తల్లిగా తన అనుభవాలను అతి సరళం గా గుండె లోతుల్లోంచి అందించి అందరి ప్రశంసలు పొందారు శ్రీమతి రాజేశ్వరి గారు  .

శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’విశ్వనాధ  తమ తండ్రిగారు మండలి వెంకట కృష్ణా రావు గారికి ఒక పుస్తకం అంకితమిచ్చిన నాటి నుండి తెలుసనీ ,తెలుగు పండితులు శ్రీజోశ్యుల  సూర్య నారాయణ  గారు దగ్గరుండి విశ్వనాధ సాహిత్యాన్ని చదివించి ,ప్రభావితం చేశారని విశ్వనాధ సోదర త్రయం చేస్తున్న కృషి అపారం అని వచ్చేనెలలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఇక్కడే విశ్వనాధ విగ్రహావిష్కరణ చేస్తారని ,ఆయన గురించి సభలు రాష్ట్రం లో చాలా చోట్ల నిర్వహిస్తున్నామని  ,ఈ తరం వారు  చదివి  స్పూర్తి పొందాలని ,రసజ్నుడైన మహా కవి అని, అలాంటి వారు అరుదుగా జన్మిస్తారని ,కృష్ణా జిల్లా వారి పుట్టుక చేత ధన్యమయిందని వారికి తగిన రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుందని ,ఇలాంటి ప్రైవేట్ సంస్తలే నిర్వహణ బాధ్యతలు బాగా చేస్తాయని షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ లాంటి ఆంగ్ల కవుల గృహాలు మాన్యుమెంట్లు లా ఇంగ్లాండ్ లో ఉన్నాయని ,ప్రభుత్వం గురజాడ ఇంటిని స్మారక చిహ్నం గా చేసే ప్రయత్నం లో చాలా అశ్రద్ధ వహిస్తే తానె ఫండు విడుదల చేయించి కొంత మార్పు తెచ్చానని అన్నారు .రాజేశ్వరి గారి అనుభవాలు గ్రంధ రూపం లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు .నందిగామ ఎన్నిక ఉన్ది కనుక కోడ్ అమల్లో ఉందని మినిస్టర్లేవరూ పాల్గొనలేక పోతున్నారని అన్నారు .తెలంగాణలో కూడా సిద్ధిపేట ఎన్నిక ఉన్నా అక్కడి ముఖ్య మంత్రి కే సి ఆర్ .కాళోజి  శత  జయంతిలో పాల్గోన్నా డు ,విగ్రహావిష్కరణ చేశాడు మంత్రులలో వేర్వేరు చోట్ల జరిపారు .వాళ్లకు లేని ఎన్నికల కోడు మనకేందుకోచ్చిందో నాకు మాత్రం అర్ధం కాదు .’’తెగించిన వాడికి —‘’అనే సామెత గుర్తుకొచ్చింది . వీటికీ కోడ్ కు సంబంధం ఉండదు .ఇక్కడేమీ వాగ్దానాలు చేసేది ఉండదు .స్మరించుకోవటం మరో సారి కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటమే .ఇది మరిచారు మన నాయమ్మన్యులు .

శ్రీ చివుకుల సుందర రామ మూర్తి తానూ విశ్వనాధ పై చేసిన రిసెర్చ్ ఇంకా అజ్ఞాతం లోనే ఉందని ,విశ్వనాధ అంతే వాసుల్లో తానూ ఉన్నానని సాయం వేళల్లో విశ్వనాధ తో కబుర్లు విజ్ఞానదాయకాలని ,అవి మర్చిపోలేని తీపి గురు తులని అన్నారు .ప్రముఖ న్యాయ వాది శ్రీ వరప్రసాద్ తమ అనుభవాలు చెప్పారు .శ్రీగోళ్ళనారాయణ రావు ఆర్ధికం గా పుస్తక ముద్రణకు సహకారం ఇస్తానని వాగ్దానం చేశారు .శ్రీ వేదాంతంరాజగోపాల చక్ర వర్తి సందర్భం లేని అసందర్భపు మాటలు ,సీత రాముడికి కుడిపక్క ఉంటుందా ఎడమ పక్క ఉంటుందా అనే సందేహం ,విశ్వనాధ తిండికి లేక ఎవరిమీదో కవిత్వం చెప్పి డబ్బు సంపాదించాడనీ ,తమ తండ్రి తాతలనుండి సంప్రదాయాన్ని గ్రహించాడని పనికి రాని  అవాస్తవమైన  మాటలు మాట్లాడి విశ్వనాధ ధిషణకు  పాదరస బుద్ధికి ఆయన చెప్పుకొనే ‘’అవిచ్చిన్న సంప్రదాయానికి ‘’అవమానం తెచ్చారని పించింది. ఆయన మాట్లాడకుండా ఉంటె సభ ఇంకా హుందాగా ఉండేదని మాత్రం నాకు అనిపించింది .విశ్వనాధ కు అయన తీవ్ర అపకారం చేశారు .ఆయన కవిత్వం లో మెరుపులు చెబితే ఏంతో ఆనందించేవాళ్ళం .సొల్లు కు సమయం కాదు విశ్వనాధ వ్యక్తిత్వాన్ని భావి తరాలకు అందించాలి .సోదరుల కృషిని  అప్రస్తుత ప్రసంగం తో నీరు గార్చారని బాధ గా ఉంది నాకు .

నేనూ మాట్లాడతాను రెండు నిమిషాలు అన్నాను కాని సమయాభావం వలన కుదరలేదు .అయినా నేను చెప్పా దలచుకొన్నది ఇది –‘మొదటిది -’అమెరికా సాహిత్య కారుడు ‘’ -ఎడ్గార్ ఆలెన్ పో  ‘’పై ఒక సమగ్ర ‘’విజ్ఞాన సర్వస్వం ‘’వెలువడింది .దాన్ని మొదటి సారి 2002లో అమెరికా వెళ్ళినప్పుడు నేను చదివాను .అందులో పో కవి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ,అన్నికధలు నవలలు హారర్ డిటెక్టివ్ కధలు నాటకాలు సాహిత్య వ్యాసాలూ పోయేటిక్స్ పై ఆయన అసాధారణం గా రాసిన విమర్శలు పుస్తక సమీక్షలు ఒక టేమిటి అందులో ‘’పో సాహితీ విశ్వ రూప సందర్శనం’’ దర్శన మిస్తుంది .నేను ప్రతి సభలోనూ విశ్వనాధ పై అలాంటి సర్వస్వం రావాలని చెబుతూనే ఉన్నా .దాన్ని తీసుకొచ్చి ఒక మాన్యుమెంట్ గా చేయాలి .దీన్ని సోదరత్రయం ఇతర సాహితీ వేత్తలతో సంప్రదించి తీసుకు రావాలి .

రెండవది విశ్వనాధ ను పూజిస్తున్నామనే వారు ఆయన్ను సమగ్రం గా అర్ధం చేసుకోలేని వాళ్ళే .ఒక సారి హైదరాబాద్ అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీలో విశ్వనాధ కల్ప వృక్షం పై  మాజీ ఐఎస్ అధికారి  శ్రీ కనమలూరి వెంకట శివయ్య గారు మాట్లాడితే విన్నాను  అంతా అయి పోయి మేడ దిగి వస్తుంటే ‘’శివయ్య గారూ !విశ్వనాధను ఇందులో బాగా ఆవిష్కరించానని అనుకొంటున్నారా ?’’అని అడిగా ‘’అదేమిటి గంట మాట్లాడా అన్నీ చెప్పాగా “’అన్నారు .అసలైనది చెప్ప లేదు అన్నా ఏమిటది అన్నారు .’’విశ్వనాధ ఏది రాసినా ఒక యజ్న స్పూర్తి తో రాశారు ఏ కాండలో చూసినా అదికనిపిస్తుంది సృష్టియజ్న కార్యం అని  వేదోపనిషత్తులు చెప్పినదాన్నే ఆయన వ్యాఖ్యానించారు .దాన్ని అందరూ వదిలేశారు మీతో సహా ‘’అన్నారు అవాక్కయ్యారు .’నేను దాన్ని గురించి ఆలోచించలేదండి మంచి విషయం నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు ‘’అన్న సంస్కారి .

‘’అలాగే విశ్వనాధ ఇంట్లో చనువుగా తిరిగిన సాహితీ కారుడు ,విశ్వనాధ రామాయణం పై వాల్మీకి రామాయణం పై అధారిటీ శ్రీ జానకీ జాని నాతో చెప్పిన ఎన్నో అమూల్య విషయాలున్నాయి. ఇద్దరినీ తులనాత్మకం గా పరిశీలించిమాట్లాడేవారు .వారొక సారి ఉయ్యూరు మా ఇంటికి ఆకస్మికం గా వస్తే దాదాపు యాభై మంది సాహిత్యాభిమానులతో సమావేశం ఏర్పాటు చేయించి వారితో రెండు గంటలు కల్ప వృక్షం పై మా ఇంట్లోనే మాట్లాడిస్టే జనం మరో లోకం లో తేలిపోయారు .ఆయన చదివే పద్యం తీరుకూడా మహా గొప్పది .ఇంగ్లీష్ లెక్చరర్ గా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేసి ,రామాయణం పై వందలాది ప్రసంగాలు చేసిన మహా మనీషి జానకీ జాని .వారితో నా పరిచయం నా పూర్వ జనం సుకృతం .

మూడు –విశ్వనాధ పై  శరభయ్య గారు ,భరత శర్మ గారు ,ఆయనే విశాఖ నుండి వచ్చే సద్గురు సదానంద మూర్తి ర్గారి పత్రిక ‘’సుపద ‘’లో రాసిన అమూల్య వ్యాసాలు ,’’పొరబాటై జని యించితిని ప్రభూ ‘’అన్న పద్యం తో విశ్వనాధకు కైమోడ్పు పల్కి వారిపై చిరస్మరణీయ వ్యాసాలూ రాసిన కేత వరపు వారివి ,జీనియస్ జీవి ఎస్ వారివి ,వెల్చాల కొండల రావు గారివి ,మొదలైన వారి వ్యాస సంగ్రహాలను ఒకచిన్న  పుస్తకం గా తెచ్చి ఈ నాటి తరానికి అందిస్తే లాభదాయకం .

నాలుగు –కల్ప వృక్షం లో అత్యంత అద్భుత పద్యాలను ఏరి ఒక లఘు పుస్తకం గా వివరాలతో ప్రచురిస్తే కొత్తతరానికి అందుబాటులో ఉంటుంది.మొత్తం కావ్యంపై సమగ్ర టీకా తాత్పర్యలు తేవాలనుకోవటం గొప్ప పనే .కాని అది లైబ్రరీలకే పరిమితమైపోతాయి .అలా కాకూడదని నాఉద్దేశ్యం .నేనే నాకు నచ్చిన నాలుగు వందల దాకా కల్పవృక్ష పద్యాలను స్వదస్తూరితో రాసుకొని దాచుకోన్నానని –

విశ్వనాధ సోదరులు అతిధులను శాలువాలు కప్పి సత్కరిస్తే ,బుద్ధ ప్రసాద్ గారు విశ్వనాధ సత్యనారాయణకు తల్లిగారు రాజేశ్వరిగారికి శాలువాలు కప్పి గౌరవించారు .

తోక ముక్క –ఇంత అభిమానం తో సోదర త్రయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెండుకాలేజీలకు చెందిన ఒక ముప్ఫై మంది విద్యార్దినీవిద్యార్ధులు లేక పోయి ఉంటె సభ పేలవం గా  ఉండేది. వీళ్ళకైనా వాళ్ళ పాత్ర ఏమీ లేక పోవటం  వెనకాల లేక్చారర్లున్నారనే భయమే తప్ప ఆసక్తి కనిపించలేదు .శోచనీయం .పద్యాలు నేర్పి వాళ్ళతో పాడిస్తే శోభాయ మానం గా ఉండేది .ఇక మిగిలిన జనం మాత్రం ‘’నిలయ విద్వాంసులే ‘’అవటం బాధకలిగించింది .ఆ బజారులోరెండుమూడుకాలేజీలున్నా  తెలుగు అధ్యాపకులూ ,ప్రిన్సిపాళ్లు కూడా రాకపోవటం మరో విషయమ  .పిలిచి ఉండక పోవచ్చని నాకు నేను సమాధానం చెప్పుకొన్నాను . వారెవరూ కన్నెత్తి చూదడక పోవటం ఆశ్చర్యం .తమ  బజారులోని ఇంతటి మహనీయునికి ఇచ్చే మర్యాదా ఇది?అని వేదన కలిగింది .సరే గతం గతః .

గాన ‘’రజనీ ‘’గంధం

సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి స్వగృహం ‘’నాగా లాండ్ ‘’కు మేమిద్దరం వెళ్లి ఆ93ఏళ్ళ  వృద్ధ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తి ని సందర్శించాము. ఏంతో ఆదరం గా మాట్లాడారు .మాట కొంచెం స్పుటత్వం తగ్గింది కాని చక్కగా మాట్లాడారు .1956లో నేను ఎస్ ఎస్ ఆర్ కాలేజి లో ఇంటర్ చదివేటప్పుడు ‘’తెల్లటి పైజమా లాల్చీ’’లతో కాలేజి లోని సమావేశ రేకుల షెడ్  హాల్ ‘’R4 ‘’లో శ్రీమతి వింజమూరి లక్ష్మి తో కలిసి లలిత సంగీత విభావరి నిర్వహించిన విషయం జ్ఞాపకం చేసుకొని చెప్పాను .తర్వాత రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ప్రతి కవి  సమ్మేళనానానికి నేనూ మిత్రుడు స్వర్గీయ టి ఎల్ కాంతారావు ,మొదలైన వారితో వెళ్లి చూసిన విషయం జ్ఞాపకం చేసుకొన్నాను వారితో .వారి ‘’సూర్య నారాయణా ‘’స్తోత్రం ఏంతో అభిమానం అని ఆ పాటను మైమరచి వింటానని మా శ్రీమతి చెప్పితే ఏంతో సంతోషించి ‘’పొడుస్తూ భానుడూ ‘’కదా అని కాసేపు పాడి వినిపించి ఆయన గానం రజనీ గంధమే ఇప్పటికీ అని రుజువు చేశారు .ఆయన చుట్టూ అనేక పుస్తకాలు అందుబాటులో  ఉంచారు చదువుకోవటానికి  వీలుగా .కాళ్ళ జోడు అక్కర్లేదు వారికి .ఇటీవలె విడుదలైన పామర్రు డాక్టర్ శ్రీమతి భార్గవి ‘’గీతాంజలి ‘’అనువాదం కూడా చదివి సంతోషించిన సాహితీ మూర్తి రజని . వాగ్గేయ కారులు రజని  గారి పాదాలకు భక్తిపూర్వకం గా  నమస్కారాలు చేసి అక్కడినుండి బయల్దేరాం .

విశ్వనాధ జయంతి –ప్రభుత్వ వేడుక

సాయంత్రం అయిదింటికి మొదలు పెట్టాల్సిన శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి విశ్వనాధ పై ప్రసంగం రెండు గంటలు ఆలస్యం గా ఏడు గంటలకు ప్రారంభమైంది .రాజసంగా అన్నా వదినే గార్లతో వచ్చారు గారిక పాటి .సత్యనారాయణ వేదికపై కి ఆహ్వానించాడు విశ్వనాధ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్ర్రజ్వలన చేసి ప్రసంగం ప్రారంభించారు నర  సింహా వధాని .ఆశువుగా విశ్వనాధకు జోహార్లు అర్పించారు .నిద్రాణమైన జాతిని నిర్నిర్ద్ర సిద్ధిసమాధి తో  తో జాగృతం చేశారు  విశ్వనాధ అని తాత్పర్యం .రాసిన ప్రతిదాన్ని రసనిస్టం చేశారని .అదొక వాజ్మయ లోకం అని స్తుతించారు .మామూలు ధోరణి లోకి దిగి అందర్నీ దెప్పుతూ వెక్కిరిస్తూ  మా అమ్మాయి రోజూ ఆయన మాటలు చానెల్స్ లో వింటూ  అనే మాటా ,లేక పెట్టిన పేరు అయిన  ‘’పల్లీలు బటానీలు ‘’గాచానెళ్ళలో తన మామూలు ప్రసంగం గా  ప్రసంగాన్ని మార్చేశారు .విశ్వనాధ లోకోత్తర కవితా భావ సంపత్తిని అందిస్తారనుకొంటే ఈ బాధేమిటిరా బాబూ అనుకోని ఒక అరగంటమాత్రమె ఉన్నాం  . మొదట్లో జనం లేరుకాని ఏడింటికి ఫుల్ అయ్యారు గరిక పాటివారి ‘’దంపుడు’’ వినటానికి వచ్చిన వాళ్ళే తప్ప విశ్వనాధ గురించి తెలుసుకొనటానికి వచ్చిన వారుకాదని ఆ ‘’చప్పట్ల’’ వలన తెలిసింది   .అక్కడే ఒక రూమ్ లో ఏర్పాటు చేసిన విశ్వనాధ పుస్తక, ఫోటో ప్రదర్శన చూశాం .సోదర త్రయ తీవ్ర అభినివేశానికి ఈ ప్రదర్శన ఒక ఉదాహరణ మాత్రమె   .గరికపాటి ప్రసంగం తర్వాత వచ్చే తమ వంతుకోసం ముసలికవి ముఠా మేకప్పులేసుకొని ప్రాక్టీస్ చేసుకొంటూ సాయంత్రం అయిదింటి నించి పడిగాపు పడి ఉన్నారు .వారిని చూస్తె జాలి వేసింది . ప్రసంగం అయ్యేదేప్పుడో వీళ్ళు స్టేజి ఎక్కి తమ పాత్రల్ని ప్రదర్శించటం ఎప్పుడో ?  బెజవాడ  .బస్ స్టాండు కాంటీన్ లో టిఫిన్ లాగించి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర .అప్పుడే మా అమ్మాయి అమెరికా  నుంచి ఫోన్ చేస్తే విషయాలన్నీ పూసగుచ్చి  నట్లు వివరం గా తెలియ జేసి , పడుకోన్నాం  .

దీన్ని ఈ తెల్లవారు జామున అయిదింటికి ప్రారంభించి మధ్యలో ఒక అరగంట  సంధ్యా  పూజా వగైరాలకు వినియోగించి మళ్ళీ మొదలెట్టి ఇప్పుడే పదకొండుం బావుకు పూర్తీ చేశా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-14-ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వనాధ 120 వ జయంతి ఉత్సవాలు -కల్ప వృక్ష గృహం లో ,ఘంటసాల సంగీత కళాశాలలో ఆహ్వానాలు

govet vishva 001 govt2 001visvanadha at home 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ముచ్చట్లు ”పై శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారు (చెన్నై),శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి స్పనదన

nori1 001 nori2 001 velaga 001purvamgla kavula muchatlu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇవేం మాటలు -సాల్యూట్ కొడితే నే బతుకు ట -కె సి ఆర్ ఉవాచ

తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ సగర్వంగా స్మరించుకుని ఉండవచ్చు. అవన్నీ సంతోషించదగ్గవే. కానీ, కాళోజీ నమ్మిన విలువలకు కూడా గౌరవం దక్కినప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. నిషేధాలకు జైకొడితే కాళోజీ సంతోషిస్తారా?
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై, మరో వార్తా చానెల్‌పై తెలంగాణ ప్రాంతంలో అప్రకటిత నిషేధం ప్రారంభమై 87 రోజులైంది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణతో కేబుల్‌ ఆపరేటర్లు ఈ నిషేధాన్ని ఆరంభించారు. ఒక చానెల్‌ (ఏబీఎన్‌ కాదు) ప్రసారం చేసిన ఒక వ్యాఖ్యా కార్యక్రమాన్ని ఆ నిషేధానికి సమర్థనగా పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలోని వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లూ ఖండించదగ్గవే. పాత్రికేయ సంస్కారానికే కాదు, మానవీయ విలువలకు కూడా వ్యతిరేకమయిన ఆ వ్యాఖ్యలను తప్పుపట్టని వారెవరూ ఉండరు. వాటిని ప్రసారం చేసిన చానెల్‌ నిర్వాహకులు తమ తప్పును గుర్తించి, క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే, నొచ్చుకున్నారు కాబట్టి నిరసన తెలుపుతున్నారని సమాధాన పడవచ్చు. కానీ, ప్రతిదానికి ఒక ప్రారంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉండాలి కదా, పోనీ, ఆ చానెల్‌ నిషేధానికి ఏదో కారణమున్నదనుకున్నా, ఏబీఎన్‌పై చర్యకు కారణమేమిటి? ఏ వ్యాఖ్యలను, ఏ కార్యక్రమాన్ని సమర్థనగా చూపించగలరు? కేవలం కేబుల్‌ ఆపరేటర్లు మాత్రమే ఈ నిషేధాన్ని అమలుచేస్తున్నారా? వారికి అంతటి శక్తి ఉన్నదా, వారికి ఆ అధికారం ఉండవచ్చునా- ఇవన్నీ ప్రశ్నలే. వివాదాస్పదమైన వ్యాఖ్యా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించి, ఆవేదన చెందారు కాబట్టి, ఆయన నుంచి కేబుల్‌ ఆపరేటర్లు ప్రేరణ పొందారని ఊహిస్తూ వచ్చాము. కానీ, మంగళవారం నాడు వరంగల్‌లో కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలను చూస్తే, టీవీ చానెళ్ల అప్రకటిత నిషేధాన్ని ఆయన ఆమోదిస్తున్నారని, సమర్థిస్తున్నారని అర్థమయింది. చానెళ్లపై నిషేధం విధించిన కేబుల్‌ ఆపరేటర్లకు శెల్యూట్‌ చేస్తున్నానని కేసీఆర్‌ అన్నారు. ‘నాకేం సంబంధం లేదు’ అని ఇక ఆయన అనలేరు. ప్రత్యక్షంగా నిషేధాన్ని ఆదేశించి ఉండక పోవచ్చును కానీ, నిషేధాన్ని తొలగించడానికి కావలసిన చొరవ చూపకపోవడానికి ఆయన అభిప్రాయాలే కారణమని భావించవలసి ఉంటుంది. ‘ఇక్కడ ఉండదలచుకుంటే, బతక దలచుకుంటే, మాకు శెల్యూట్‌ కొట్టవలసిందే, తెలంగాణ ప్రజలను గౌరవించవలసిందే’ అని ఆయన ఆ సభలో అన్న మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనవలసిన మాటలు కావు. ప్రజలను గౌరవించవలసిన బాధ్యత, సంస్కారమూ ఉండితీరవలసిన లక్షణాలే కానీ, పాలకులకు వంగి, లొంగి ఉండవలసిన అగత్యమూ కర్తవ్యమూ మాత్రం మీడియాకు లేవు. తనకు విధేయంగా ఉండడమూ, తెలంగాణ ప్రజలను గౌరవించడమూ- రెంటినీ సమానార్థ కాలుగా పరిగణించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. తెలంగాణ ఉద్యమాన్ని, రాషా్ట్రన్ని, ప్రజలను గౌరవించడం విధాయకం కాగా, తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శనాత్మకంగా చూడడం మీడియా హక్కు. తెలంగాణకు లభించే గౌరవ ప్రతిపత్తులే, తమకు కూడా దక్కాలనుకోవడం, తద్వారా, పరిపాలనపై విమర్శలను నిరోధించాలనుకోవడం పాలకుల అత్యాశనే సూచిస్తుంది.
రెండు చానెళ్లపై నిరవధిక నిషేధం ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్ఛకు అవరోధం అవుతుందని, కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళా జర్నలిస్టులు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం వద్ద ప్రదర్శన జరిపారు. జోక్యం చేసుకుని, చానెళ్ల పునరుద్ధరణకు సహాయం చేయమని మాత్రమే ప్రదర్శనకారులు కోరారు. అయినా, అక్కడ పోలీసులు వారిపై తీవ్రమయిన బలప్రయోగం జరిపారు. మహిళలన్న పరిగణన కూడా చూపకుండా దారుణంగా వ్యవహరించారు. కాళోజీ కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్‌కు వరంగల్‌లో కూడా స్థానిక పాత్రికేయుల నుంచి నినాదాలు ఎదురయ్యాయి. ఈ నిరసనలను గమనించి, సమస్యను పరిష్కరించడానికి పూనుకోవలసింది పోయి కేసీఆర్‌ తన ప్రసంగంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. అణచివేతను, అన్యాయాన్ని వ్యతిరేకించిన ఉద్యమాన్ని నిర్వహించినవారెవరూ ఇతరులను అణచివేయాలని కోరుకోరు, తొక్కేస్తానని పాతిపెడతానని ప్రతిజ్ఞలు చేయరు. ఉద్యమాలకు మీడియా సహజ శ్రేయోభిలాషి. మీడియా అందదండలు లేకుండా తెలంగాణ ఉద్యమం కూడా ఎదగలేదు, విజయం సాధించలేదు. ఆ ఎరుకను విడనాడి, అప్రజాస్వామికమైన ప్రకటనలు చేయడం నాయకులకు తగినది కాదు.
మీడియా దోషరహితమైనదని ఎవరూ అనరు. ప్రజల ఒత్తిడులు, నిరసనలు, ఉద్యమాల మధ్యనే మీడియా కూడా తనలోని అవలక్షణాలను సరిదిద్దుకుంటూ వస్తున్నది. మీడియాకు అపారమయిన స్వేచ్ఛ ఇచ్చిన వ్యవస్థ, హద్దుమీరినప్పుడు అనుసరించవలసిన పద్ధతులను కూడా రూపొందించింది. ప్రజల మనోభావాలను ఖాతరు చేయని మీడియాతో వ్యవహరించడానికి చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. మీడియా తప్పులను చూపించి, అణచివేస్తామని చెప్పేవారు సాధారణంగా ఆ తప్పుల విషయంలో కాక, మీడియాకున్న విమర్శనాశక్తిపైనే అభ్యంతరం ఉన్నవారు. పాలన మంచిచెడ్డలను, పాలకుల తీరుతెన్నులను తెలుసుకునే హక్కు తెలంగాణ పాఠకులకు కూడా ఉన్నది. విమర్శలను పాలు-నీరు వలె వేరుచేయగల శక్తి కూడా వారికి ఉన్నది. అటువంటప్పుడు, సత్పరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్నవారు మీడియాను చూసి భయపడడం ఎందుకు?

 

తెలంగాణ గౌరవాన్ని కించపరిస్తే
మెడలు విరిచేస్తాం జాగ్రత్త!
పది కిలోమీటర్ల లోపల పాతరేస్తాం జాగ్రత్త!
కేబుల్‌ ఆపరేటర్లకు శాల్యూట్‌ చేస్తున్నా!
గరీబ్‌గాళ్లు నినాదాలు చేస్తున్నారు..
ఆగ్రహంతో ఊగిపోయిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాపై నిప్పులు చెరిగారు. ‘ఈ గడ్డమీద ఉండదలచుకుంటే, బతకదలచుకుంటే మాకు శాల్యూట్‌ కొట్టి ఉండాలె’ అంటూ హెచ్చరించారు. మంగళవారం కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్‌ వరంగల్‌ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కాళోజీ విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేయడానికి వచ్చినప్పుడు ప్లకార్డులు ప్రదర్శించారు. నిట్‌ కళాశాలలో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగిస్తుండగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రకటించారు. దీంతో కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. పాతరేస్తాం, చీరేస్తాం, ఇడియట్‌ ఆటలు అంటూ విరుచుకుపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరించవద్దని నినదించిన జర్నలిస్టులను ‘గరీబ్‌గాళ్లు’గా అభివర్ణించారు. టీవీ9లో శాసనసభ్యులనుద్దేశించి ప్రసారమైన వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావించారు. కానీ… ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎప్పుడు, ఎక్కడ తెలంగాణ ప్రజలను కించపరిచిందో మాత్రం చెప్పలేదు. శాసనసభలో టీవీ9లో ప్రసారమైన కార్యక్రమంపై మాత్రమే తీర్మానం చేయగా… ‘ఆ రెండు చానళ్లు’ అంటూ ఏబీఎన్‌ను కూడా కలిపేశారు.

‘‘స్వేచ్ఛ కొరకు కాళోజీ చాలా పెద్ద పోరాటం చేసిండు. ఇయాల కూడా వరంగల్‌లో ‘పత్రికా స్వేచ్ఛ హరిస్తుండ్రు మాకు’ అని ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మిత్రులు, పాపం గరీబ్‌గాళ్లు నినాదం చేస్తున్రు. సంతోషం. పత్రికలు.. స్వేచ్ఛ.. స్వేచ్ఛ ఉండవలసిందే! ఎట్లా ఉండాలె స్వేచ్ఛ? నువు డెమోక్రట్‌గా ఉంటే, నీకు సంస్కారం ఉంటే.. నువు నిజంగా పత్రిక అనే సోయిలో ఉంటే… నీకా మర్యాద దొరుకుతది. మల్లా ఇయాల తప్పు చేసిండ్రు వాళ్లిద్దరు.. ఆ రెండు చానెల్లోళ్లు. మల్లా స్పీకర్‌గారికెదురుగ్గా నల్లజెండాలు చూపిత్తిరి ఇయాల. నేను ముఖ్యమంత్రిగని, ఆయన శాసనసభ స్పీకర్‌. వారు కూడా ఉన్నారు కార్యక్రమంలో! తెలంగాణ శాసనసభ్యులు మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటే.. ఆ చానెళ్లు ఏమి ప్రచారం చేసినాయో మీరు చూసిన్రు. ఈ రోజుకు కూడా నేను చెబుతా ఉన్నా. సింగరేణిలో అద్భుతంగా పని చేయండని నేను అధికారులకు చెబితే, తెల్లారి పేపర్లలో వస్తే ‘ఇది కాదు..సాధ్యం కాదు‘’ అని రాస్తరు. రాష్ట్ర వ్యతిరేక వార్తలు.. కేసీఆర్‌కు వ్యతిరేకమయితే డోన్ట్‌ కేర్‌. నన్ను చాలామంది తిట్టిండ్రు. నేనెవరికీ భయపడ.. తెలంగాణ రాష్ర్టానికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వ్యతిరేకంగా, రాష్ట్ర శాసనసభ్యులను ‘పాచికల్లు తాగే ముఖా’లంటే వాళ్లను క్షమించాలా.. ఈ గడ్డమీద! దేని కోసం క్షమించలా? ఇది పత్రికా స్వేచ్ఛ అయితదా? తెలంగాణ బిడ్డలు గెల్చి అసెంబ్లీకొస్తే వాళ్లను టూరింగ్‌ టాకీస్‌లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్‌లో కూర్చొండబెట్టిన పని చేసిండ్రని చెప్పిన్రు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా.. ఎవరు చెప్తారు? ఏ మీడియా చెప్తది కమాన్‌! మాకు కూడా తెలంగాణ మేధావులున్నారు. అసలు వాళ్లకు (ఎమ్మెల్యేలకు) ల్యాప్‌టాప్‌లు ఇయ్యలె. ల్యాప్‌టాప్‌లు ఇచ్చినట్టు కథలు సృష్టించిన్రు. ఎవనికో ఏదో ఇస్తే యాడనో పెట్టుకున్నాడన్నట్టు… తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్‌టాప్‌లిస్తే యేడ మలిచిపెట్టుకుంటరు! ఇది టీవీయా? ఏదీ మొట్టమొదటి రోజు! తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, అనేకమంది త్యాగాల మీద, బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలిరోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేరోజు.. ఈ టెలీకాస్ట్‌ చేసే చానల్‌ ఒక చానలా మాకూ? పాతర… పాతరేస్తాం జాగ్రత్త అని చెబుతా ఉన్నాం. పది కిలోమీటర్ల లోపల పాతరేస్తాం.
కేసీఆర్‌ను తిడితే బాధ లేదు. కానీ, తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా మెడలు విరిచి అవతల పారేస్తాం జాగ్రత్త! నువు మీడియా ముసుగులో చేస్తామంటే, నీ ఇడియట్‌ ఆటలు సాగనీయమని చెబుతా ఉన్నా. నేను చెబుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా! అయినా మేం చెయలే. మేం బ్యాన్‌ చేయలె. గౌరవనీయులైన శాసనసభ సభాపతి విచారణలో ఉందది. మొత్తం యావత్తూ శాసనసభ తీర్మానం చేసి స్పీకర్‌గారికి అప్పగిచ్చిన్రు. ‘అయ్యా, తమరు ఏ నిర్ణయం చేసినా శిరోధార్యమే’ అని! అది వారి విచారణలో ఉంది. మంచినో, చెడ్డనో వారు తీర్పు వెలువరించాల్సి ఉంది. పెద్దలు రెడ్యానాయక్‌ గారు ఉన్నారు. వారు కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు. అందరం కలిసి యునానమస్‌ తీర్మానం చేసినం. ఏ ఒక్కరో చేయలె. ఏ ఒక్క పార్టీ చెయలే. ఒక టీఆర్‌ఎస్‌ పార్టీ చేయలె. ఒక కేసీఆర్‌ చేయలె. శాసనసభ్యు లమంతా, తెలంగాణ శాసనసభంతా సమావేశమై చోట తీర్మానం చేసి ఇస్తే దానికి స్పందించి, ఈ ప్రజా వ్యతిరేక చానెళ్లు ప్రచారం చేయమని చెప్పి బంద్‌ చేసిన్రు. తెలంగాణ కేబుల్‌ ఆపరేటర్‌లకు నేను శాల్యూట్‌ చేస్తా ఉన్నా. ఇంతకుముందు లక్ష్మీకాంతరావుగారు చెప్పిండ్రిఉ… విండ్రాయిల్‌ సింట్రమ్స్‌ అంటారు వీటిని. దయ్యం వదిలేముందు వట్టిగా వదులుతాది? కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి తేపకొకమాలి దెబ్బ తిన్నంకనే వదులుతాది. దీని గురించి మనం బాధపడాల్సింది లేదు. దీటుగా ఎదుర్కోవాలె. ధీరత్వంతోన ఎదుర్కొనాలె. ఈ చిల్లరమల్లర ప్రయత్నాలకు కల్లిబిల్లిగాము. ఎందుకంటే ధర్మం మాట్లాడితే మాట్లాడదాం. సత్యం మాట్లాడితే మాట్లాడదాం. మంచి పని చేద్దామంటే చేద్దాం.
కానీ స్వేచ్ఛ ముసుగులో ‘మేం మీ అందరినీ కించపరుస్తాం. మీ తెలంగాణ వాళ్లకు చేతగాదంటం’ అయినా మాకు స్వేచ్ఛ కావాలి అంటే.. ఉండది. ఉండదుగాక ఉండది! ఇంకా ఎక్కువ చేస్తే, ఇంకేమేమి ఉండాలో అది ఉంటది జాగ్రత్త! ఇక్కడున్న తెలంగాణ జర్నలిస్టులకు నేను చెబుతా ఉన్నా! మీరు కూడా తెలంగాణ బిడ్డలు. మీరు కూడా సంస్కారంతో ఆలోచన చేయండ్రి. ఇక్కడ హెలికాప్టర్‌ దిగినప్పుడు నాకు మెమోరండం ఇచ్చినప్పుడు చెప్పిన. ‘మీ శాసనసభ్యులను పట్టుకొని పాచికల్లు తాగే ముఖాలన్న చానెల్లు మీకు గావాల్నా?’ అని అడిగిన. ప్రజలేమీ బాధపడతల్లేదే? ఎవరూ అడుగుతా లేరే? ఎందుకు అనవసరంగా ఈ రాద్ధాంతం చేస్తున్నరు? ఇక్కడ ఉండదలచుకుంటే, ఈ గడ్డపై ఉండదలచుకుంటే, బతకదలచుకుంటే మాకు శాల్యూట్‌ కొట్టి ఉండాలె. మా తెలంగాణ ప్రజలను గౌరవించి ఉండాలె. తెలంగాణ సమాజంలో కలిసిపోయి బతకాలె. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలిదాకా తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరపెడతాం’ అని కాళోజీ అన్నడు. కాళోజీ చెప్పిన నీతేంది? వాడు ప్రాంతం వాడయినా, ప్రాంతేతరుడైనా.. వాడు ఎవడైనా మా జాతికి ద్రోహం చేస్తే.. క్షమించం అని ఎలుగెత్తి గొంతెత్తి చెప్పిన బిడ్డ గౌరవనీయులు, మహనీయులు కాళోజీ. వారి బాటలోనే నేను నడుస్తున్నా. కాబట్టి, దయజేసి వరంగల్‌లోని జర్నలిస్టు మిత్రులను నేను కోరతా ఉన్నా. మీకెమైనా ఉంటే నాకు చెప్పండి. షేర్‌ చేసుకుందాం. నేనున్నకాడికి రండి. కానీ, అనవసరంగా ఆంధ్రా వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకొని, తెలంగాణను కించపరిచిన వాళ్ల తరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటే అది మీకు శ్రేయస్కరం కాదని మనవి చేస్తున్నా!’’
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ గడ్డపై గాయత్రి వీణ నాదం

ఆరేళ్ల ప్రాయంలోనే సరస్వతీదేవి కటాక్షించింది… తన చేతుల్లోని వీణనే ఆమెకు ఇంటిపేరుగా ప్రసాదించింది.. ఇంకేముందీ !! బాల గాయత్రి అంచెలంచెలుగా ఎదిగి, ‘వీణా’గాయత్రిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమే ఈచంపాటి గాయత్రి. నిన్నటి తరం సినీసంగీత ప్రియులను తన మధురబాణీలతో ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం అశ్వత్థామ కుమార్తెగా కన్నా, వీణా గాయత్రిగా సంప్రదాయ సంగీత ప్రపంచంలో గుర్తింపు పొందారామె. తమిళనాడు సంగీతం, లలిత కళల విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా పదవిని చేపట్టి.. అభినందనలు అందుకుంటున్న ఆమె తెలుగింటి ఆడపడుచు.

1984 సంవత్సరంలో దివంగత భారతరత్న ఎంజీఆర్‌ చేతుల మీదుగా తమిళనాడు ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘కలైమామణి’ దక్కడం మరో ఎత్తు. అప్పటికే లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నా, కలైమామణి ఇచ్చిన సంతృప్తి ప్రత్యేకం. బీబీసీ సంస్థ వారు నా ప్రదర్శన సమర్పకులుగా వ్యవహరించడాన్ని కూడా నేను గొప్పగా భావిస్తున్నా.

ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయంలో జరుగుతున్న త్యాగరాజ ఉత్సవాల్లో కచేరి ఇవ్వాల్సిందిగా పిలుపొచ్చింది. సుప్రసిద్ధ ఆలయంలో, అందునా త్యాగరాజ ఉత్సవాల్లో కచ్చేరి అంటే మాటలా..? ఆ కచ్చేరి కోసం ఎంతలా ఎదురుచూశానో.. ఎట్టకేలకు సమయం వచ్చింది. భారీ వేదిక జనాలు కిక్కిరిసి ఉన్నారు. అయినా నాలో ఏ మాత్రం భయం కానీ, బెరుకు కానీ లేవు. తన్మయత్వంలో మునిగిపోయి నేను వీణను వాయించినంత సేపు అంతా మౌనంగానే ఉన్నారు.

‘‘మా నాన్న అశ్వత్థామ ప్రముఖ సంగీత దర్శకులు. అమ్మ కమల అశ్వత్థామ సంగీత విద్యాంసురాలు. ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండడంతో నేను కూడా అటువైపే ప్రయాణించానని అనుకోవడం లేదు. కాని, నా రక్తంలోనే సంగీతం ఉందని మాత్రం గట్టిగా నమ్ముతాను. మాట నేర్చిన వయస్సు నుంచే అమ్మ ఆలపించే కీర్తనలను ఆసక్తిగా విని, అందుకు తగ్గట్టుగా తాళం వేసేదాన్నని నాన్న చెబుతుండే వారు. అమ్మకు వీణావాయిద్యంలో మంచి ప్రావీణ్యం ఉండడంతో నేను కూడా వీణనే నా ప్రధాన వాయిద్యంగా ఎంచుకున్నాను. నాన్న నిత్యం సినిమా సంగీతంలో బిజీగా ఉండడంతో అమ్మతోనే సాన్నిహిత్యం పెరిగి అమ్మతోనే నా సంగీత ప్రయాణం ప్రారంభించా. ఆ రకంగా నాకు ఆది గురువులు తల్లిదండ్రులే!
ఆరేళ్ల ప్రాయంలోనే…
అతి చిన్న వయస్సు నుంచే వీణా వాద్యంతో మమేకమైన నేను సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే, ఏడ్చేదాన్నట. నేను పెద్దయిన తరువాత మా నాన్న ఈ విషయం చెప్పి మరీ నవ్వించే వారు. అంతలా వీణను ప్రేమించాను కాబట్టే ఆరేళ్ల ప్రాయంలోనే తొలి ప్రదర్శనఇవ్వగలిగాను. చెన్నై రాజా అన్నామలై పురంలోని కర్పగ వినాయకర్‌ ఆలయం (గణపతి ఆలయం) నా తొలి వేదిక. ఆదిపూజలు అందుకునే గణనాథుడి ఆలయంలో ప్రదర్శన ప్రారంభం కావడం కూడా ఒకరకంగా దైవాధీనమేనని ఇప్పటికీ భావిస్తుంటా. ఆ వయస్సులోనే వీణపై నా చేతులు పలికించిన తీరు అందరినీ ముగ్ధులను చేసేదట. ఆ ప్రదర్శనతో ఆరేళ్ల వయస్సులోనే మా వీధిలో నేనో బుల్లి సెలబ్రిటీని అయ్యా. నాలో ప్రతిభను తొలుత అమ్మ గుర్తిస్తే, ఆ ప్రదర్శనతో నాన్న కూడా నేనో ప్రత్యేకమని అప్పటి నుంచే గుర్తించడం ప్రారంభించారు. ఆ రకంగా నా ధ్యాస పూర్తిగా సాధనపైనే ఉండేది.
త్యాగరాజ ఉత్సవాల్లో..
అప్పుడు నాకు సరిగ్గా తొమ్మిదేళ్లుంటాయి. అప్పటికే బాలగాయత్రిగా మా వీధి చుట్టుపక్కలకు కూడా నా పేరు పాకింది. ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయంలో జరుగుతున్న త్యాగరాజ ఉత్సవాల్లో కచేరి ఇవ్వాల్సిందిగా పిలుపొచ్చింది. సుప్రసిద్ధ ఆలయంలో, అందునా త్యాగరాజ ఉత్సవాల్లో కచ్చేరి అంటే మాటలా..? ఆ కచ్చేరి కోసం ఎంతలా ఎదురుచూశానో.. ఎట్టకేలకు సమయం వచ్చింది. భారీ వేదిక జనాలు కిక్కిరిసి ఉన్నారు. అయినా నాలో ఏ మాత్రం భయం కానీ, బెరుకు కానీ లేవు. తన్మయత్వంలో మునిగిపోయి నేను వీణను వాయించినంత సేపు అంతా మౌనంగానే ఉన్నారు. సంగీత దిగ్గజం సాంబమూర్తి గారు అక్కడే ఉన్నారు. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆయన వేదికపైకి వచ్చి, ఈ చిన్నారి ‘బాల సంగీత మేధావి’ అని అభివర్ణించడం ఇప్పటికీ మరపురాని జ్ఞాపకం. ఆ సందర్భం తలచుకున్నప్పుడల్లా వందలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు కరతాళ ధ్వనులు నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మరచిపోలేని అనుభూతి అది. అక్కడ నుంచి నేను వెనుదిరగాల్సిన పని లేకుండా పోయింది. అమ్మ సారథ్యంలోనే వీణా సాధన చేస్తూ వచ్చిన నేను గాత్రంలో మాత్రం సంగీత కళానిధి టి. త్యాగరాజన్‌ వద్ద శిక్షణ పొందాను. కర్ణాటక సంగీతంలోని మెళకువలు ఆయన శిక్షణలో చాలా వరకు నేర్చుకున్నా.
జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి సమక్షంలో..
ఇవన్నీ ఒక ఎత్తయితే, నా పదకొండో ఏట కంచి కామకోటి పీఠం జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం. మహామహులకు ఆయన దర్శనం దొరకని రోజుల్లో, నాకు ఆయన సమక్షంలో వీణ వాయించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచే నాలో ఆధ్యాత్మిక చింతన పెరిగిందనుకుంటా. నా ప్రదర్శన ముగిసిన వెంటనే స్వామి నాకు గంధపు చెక్కతో చేసిన ‘ఓం’ ముద్రను ఇచ్చారు. ప్రదర్శన సమయంలో దీన్ని ధరించమని సూచించారు. నాకు దక్కిన అపురూపమైన బహుమతి అది. ఇప్పటి వరకు నా దగ్గర ఆ బహుమతిని పదిలంగా దాచుకున్నా.
తమిళనాడు ప్రభుత్వ గుర్తింపు…
అతి చిన్నవయస్సులోనే ప్రొఫెషనల్‌ కావడంతో చెన్నై ఆకాశవాణి కేంద్రంతో పాటు, పలు ప్రఖ్యాత వేదికలపై కచ్చేరీలు చేసే అవకాశం దక్కింది. యూఎస్‌ఏ, యూకే, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లోనూ నా ప్రదర్శనలకు మంచి ఆదరణ లభించింది. సినీ పరిశ్రమలోని దాదాపు మేటి సంగీత దర్శకుల వద్ద పనిచేసిన తృప్తి కూడా మిగిలింది. రెండు దశాబ్దాల పాటు పలువురు సంగీత దర్శకుల వద్ద వీణా కళాకారిణిగా పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే,
1984 సంవత్సరంలో దివంగత భారతరత్న ఎంజీఆర్‌ చేతుల మీదుగా తమిళనాడు ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘కలైమామణి’ దక్కడం మరో ఎత్తు. అప్పటికే లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నా, కలైమామణి ఇచ్చిన సంతృప్తి ప్రత్యేకం. బీబీసీ సంస్థ వారు నా ప్రదర్శన సమర్పకులుగా వ్యవహరించడాన్ని కూడా నేను గొప్పగా భావిస్తున్నా.
వీసీ కావడం అదృష్టం.. 
రాష్ట్రంలో సంగీతానికి, లలిత కళలకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆమె విశ్వవిద్యాలయం కులపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొయంబత్తూరు, మధురై, తిరువైయ్యారు, తిరుచ్చి, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ సంగీత కళాశాలలు ఉండగా, వీటన్నిటినీ ఒక యూనివర్శిటీ కిందకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే యూనివర్శిటీని ప్రారంభించారు. అంతకుముందు సంగీత కళాశాలలు అన్నిటికీ కలిపి నన్ను గౌరవ డైరెక్టర్‌గా ముఖ్యమంత్రి జయలలిత నియమించారు. అప్పటికే ఆమె దృష్టిలో నేను ఉండడం, సంగీత సాధనలో నా ప్రయాణాన్ని దగ్గరుండి చూడడం వల్ల ఆమె నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆ రకంగా 2011 సంవత్సరంలో వర్శిటీ గౌరవ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టాను. ఆ తర్వాత గత ఏడాది తమిళనాడు సంగీత, లలిత కళల యూనివర్శిటీ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించాను. యూనివర్శిటీ తొలి ఉపకులపతి కావడం నా అధృష్టం..’’
ఫ గొల్లపల్లి ప్రభాకర్‌, చెన్నై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి కుమార్తె బిందు శ్రీ రజని గారి సన్నిధిలో -విజయవాడ

IMG_4352 IMG_4354 IMG_4355 IMG_4357

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

Condolence meet for Bapu on 11 09 2014 at 6.30 pm at Telugu University auditorium

Bapu condolence meet

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3 వాల్మీకి –రామాయణం

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3

వాల్మీకి –రామాయణం

భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్టపర్తి వారు .రామాయణం రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొందారు .మహారాష్ట్రలో పాండు రంగ విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తాగ్రేసరుడు తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో రామ చరిత మానసాన్ని రచించాడు .తమిళం లో ‘’కంబ కవి’’ రామాయణం మలయాళం లో ‘’ఎజుత్తచ్చన్ ‘’రామాయణాలు ప్రసిద్ధాలు .ఆ తర్వాత ప్రతి భాషలో ఎందరోకొందరు రామాయణాలను రాస్తూనే ఉన్నారు. రామాయణ కల్ప వృక్షం రాసి జ్ఞాన పీఠం సాధించారి విశ్వనాధ. రంగ నాధుడు ,మొల్ల  భాస్కరాదులు రాసినా వాల్మీకి స్థాయి ఎవరూ అందుకోలేక పోయారు. అరవింద మహర్షి ‘’వాల్మీకి వంటి రచన చేయ లేక పోయానే ‘’అని బాధ పడ్డారట .భవ భూతి రాసిన ఉత్తర రామ చరిత్ర చూస్తె భవ భూతి రామాయణాన్ని పూర్తిగా అర్ధం చేసుకో లేక పోయాడే అని అని పించిందట నారాయణా చార్యుల వారికి .

సంస్కృత సాహిత్యం లో మహా కవులు ఇద్దరే వ్యాస ,వాల్మీకులు .వ్యాసుడు చేసిన పని ఊహించటానికే శక్యం కానిది అంటారు .అందుకే వ్యాసో  నారయణో హరిః అన్నారు లోకులు .కాని కావ్యం విషయానికి వస్తే కవి అంటే వాల్మీకి యే.కావ్యం అంటే రామాయణమే .భాసుడు ,కాళిదాసాదులు రామ కదా సరస్సులో మునకలు వేశారు .వాల్మీకి చెప్పిన సూక్ష్మ విషయాన్ని కాళిదాసు విస్తృతం చేశాడు .విక్రమోర్వశీయ నాటకం లో వాల్మీకి శ్లోకాన్నే యదా తదం గా ఇరి కిం చే శాడుకూడా .వాల్మీకిని దోసిళ్ళతో తాగేద్దామనే ‘’ఆబ ‘’ ఆయన లో అధికం గా ఉంది .’’శక్య మంజలి భిహ్ పాతుం వాతాఃక –కై తిక గందినః ‘’ అంటాడు వాల్మీకి . ఆ కైతవ గంది సమీరం వాల్మీకి అయి తానూ తాగితే యెంత బాగుండేదో అని మహాకవి ఎన్నో సార్లు అనుకోని ఉంటాడని సరస్వతీ పుత్రుల ఊహ .వాల్మీకి లో తాదాత్మ్యం చెందటానికి ఆయన భాష అడ్డం వచ్చిందట .అంటే కాళిదాసు భాషలో కొంత కృతకత్వం ఉందన్న మాట .’’కాళిదాసు కంటే భాసుడు వాల్మీకి భాషలోను భావం లోను దగ్గరయ్యాడేమో నని పించింది పుట్టపర్తి వారికి .

గుంటూరు లో ఉండేవ్యాకరణ వేత్త సాహితీ భూషణులు  ‘’పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యుల’’ వారి దగ్గరకు శ్రీనాధ రావు అనే ఆయన వెళ్లి తనకు వాల్మీకి రామాయణం చదవాలని ఉందని అన్నాడట. దానికి వారు ‘’చదువు .ఇందులో కష్టం ఏముంది ?అదంతా తెలుగే కదా ?’’అన్నారట .కన్నడిగులకు కన్నడం లాగా ,మళయాళీలకు వారి భాష లాగా ,మిగిలిన ఆర్య భాషలకు వారి వారి భాషలలాగా వాల్మీకం అని పిస్తుంది .అదీ గొప్పతనం అంటారు నారాయణా చార్యులు .గారు .తమిళానికి మాత్రమె ఈ ప్రత్యేకత లేదన్నారు .వాల్మీకం ఏ భాషలోనైనా ఒదిగిపోయి అది తమ భాషే అనిపించేంత గొప్పది అని తేల్చారు .వ్యాసుడి రచనలలో అనేక గ్రంధులు అంటే ముడులు ఉంటాయి అవి విప్పుకొని వేడితేనే పరమార్ధం తెలుస్తుంది .వాల్మీకిది కోమల సరళ హృదయం .క్లిష్ట సమస్య వస్తే ‘’ఏషాద్ధర్మ స్సనాతనః ‘’అని జారుకొంతాడట వాల్మీకి .

‘’ఇదం మరుసత మిదం స్వాదు ప్రఫుల్ల మిద మిత్యపి –రాగ మత్తో మధుకరః కుసుమేష్వేవ లీయతే ‘’దీని అర్ధం తేనే రుచిగా ఉంది .పువ్వు బాగా వికసించింది .ఇక్కడ తేనే బాగా దొరుకుతుంది అని ఒక తుమ్మెద ప్రతి పుష్పం మీదా వాలుతూ పోతోందట .’’రాగ మత్త’’అనే మాట వలన దానితో బాటు ఆడ తుమ్మెద కూడా ఉంది అని భావం ధ్వనితం అవుతోంది .ఇలాంటిదే కాళిదాసు ఒక సందర్భం లో ‘’మధు ద్విరేఫః కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వామను వర్త మానః ‘’అంటాడు సులభం గా ఉన్నా భాషలో లాలిత్యం కరువైంది .భాసుడు వాల్మీకిని పూర్తిగా అనుసరిస్తాడు .రామాయణం లో ఏ పాత్రను చూసినా మితం గా మాట్లాడుతుంది ఇంకో రెండు ముక్కలు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది .త్యాగయ్య గారిలో శృంగారం అంతర్గతం గా ఉన్నట్లు వాల్మీకిలో ఏ రసంపైనా పెద్దగా అభినివేశం ఉన్నట్లు గోచరించదు అన్నారు ఆచార్యుల వారు .’’ఏ చిన్న సౌందర్య రేఖ కూడా వాల్మీకి నుంచి తప్పించుకు పోలేదు ‘’అంటారు శ్రీరాముడు పరమ సౌందర్య దృష్టికలవాడు .అంతటి నియమ శీలి జీవితాన్ని ఎలా గడిపాడా అని ఆశ్చర్యమేస్తున్దన్నారు .వాల్మీకి మనస్సు ఒక్కో సారి తీవ్రం గా స్పందిస్తున్దికూడా .

సుగ్రీవుడు చేసిన ప్రతిజ్ఞ ను గుర్తు చేయటానికి  తమ్ముడు  లక్ష్మణుడి ని పంపిస్తూ ‘’సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పద మన్వగాః –నచ సంకుచితః పదా ఏవ యేన వాలి హతో గతః ‘’అంటే –‘’ముందుగా చేసుకొన్న వాగ్దానం ప్రకారం నడువు ,వాలి తొక్కిన మార్గం తోక్కద్దు. నాబాణం తో చచ్చిన వాలి ఏ మార్గం ద్వారా వెళ్ళాడో ఆ మార్గం ఇరుకేమీ కాదు ‘’అంటే అందులో సుగ్రీవుడు కూడా పడతాడు అనే ధ్వని ఉంది .అంటే నీకూ అదే గతి .అని సూచన .’’న చ సంకుచిత పదాః’’అని ఆపెయ్యటం లోనే ఉంది మజా .

రావణ సంహారం తర్వాత మండోదరి వచ్చి కింద పడిపోయిన భర్తను చూసి  ‘’ఇన్ద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా –స్మరద్భిరివా తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః ‘’అంటూ విలపిస్తుంది ‘నాధా !నువ్వు ముందు రజో గుణం తో కూడిన తపస్సు తో ఇంద్రియాలను బల వంతం గా పాముల్ని బుట్టలో పెట్టినట్లు కట్టేశావు .ఆ రజోగుణం తోనే మూడు లోకాలు జయిన్చావుకూడా .తమల్ని బల వంతం గా అణచిపెట్టావని నీఇంద్రియాలు పగ బట్టాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి .సీతా దేవి అనే చిన్నఆధారం దొరలక గానే అవి విజ్రుమ్భించాయి .తిరగ బడి నిన్ను కాటేసి చంపేశాయి .వివేకం తో ఇంద్రియాలను నువ్వు లోబరచుకోలేదు .అందుకని నిన్ను చంపింది నీఇంద్రియాలే తప్ప రాముడు కాడుఅని గ్రహించు ‘’అన్నది .అంతకు ముందుచాలా సార్లు అడ్డుపడింది తనకన్నా సీతా దేనిలోనూ దీటు కాదని చెప్పింది .భర్త ప్రవ్రుత్తి మండోదరికి బాగా తెలుసు .

రామానుజుడు సుగ్రీవ మందిరానికి రాముని పంపున వచ్చినప్పుడు రాజు బయటికి రాకుండా తార ను పంపాడు .తార గొప్ప రాజ నీతిజ్నురాలు. ఆమె సలహా వినకుండా తాను చనిపోతున్నానని  వాలి చివర్లో ఏడుస్తూ ‘’క్లిష్ట సమయం లో తార సలహా తీసుకో ‘’అని సుగ్రీవుడికి చెప్పి మరణించాడు .ఆమెలకష్మణుడి  దగ్గరకు ‘’సా ప్రస్కలంతీ మద విహ్వ లాక్షీ –ప్రలంబ కాంచీ గుణ హేమ సూత్రా-సలక్ష్నా లక్ష్మణ సన్నిధానం –జగామ తారా నమితాంగ యస్తిః ‘’’’నువ్వు ముందు వెళ్లి రామానుజుడిని శాంత పరచు తర్వాత నేనొచ్చి అనునయిస్తాను ‘’అని తారకు చెప్పిపంపాడు సుగ్రీవుడు .‘కాని ఆవిడ వచ్చిన వేషం చూస్తె మనకే మతి చలిస్తుంది .పచ్చి శృంగారాన్ని సుగ్రీవుడితో అనుభవిస్తూ అదే మేకప్ తో వచ్చింది అదీ తమాషా .తార ఒక అప్సరస .సముద్ర మధనం లో సుషేణుడు అనే వానర రాజుకు దొరికితే కూతురు లాగా పెంచి వాలికిచ్చి చేశాడు .కానీ ఆమెకు సుగ్రీవునిపై మనసేక్కువ .కాపురం వాలితో మనసు సుగ్రీవునిపై అదీ ఆమె వాలకం .ఏ విషయాన్ని అంతా వాల్మీకి ‘’ఈప్సిత తమాం’’అనే మాటలో ధ్వనింప జేశాడు. అంతేనా  అతని ముఖ్య కోరిక అయిన తారను కూడా పొందాడు అనే అర్ధమూ ఉంది .తమప్ ప్రత్యయం పొట్టలో  అంత అర్ధం దాక్కొని ఉందన్నారు సరస్వతీ పుత్రులు .తార ను చూసి లక్ష్మణుడు జావ గారిపోయాడు ఆది శేషుని బుసలు లేనే లేవు .తార ముఖం కళ్ళూ తిప్పుతూ అనేక భంగిమలు పెడుతూ ‘’రాజేంద్ర కుమారా !నీకెందుకు కోపం వచ్చింది?నీ ఆజ్ఞను ఎవరు దిక్కరించారు ?దావాగ్నికి ఎవరు ఎదురు నిలవ గలడు?’’అన్నది .మెత్తబడ్డాడు లక్ష్మణ స్వామి .ఇలా ధ్వని పూర్వకం గా ఎన్నో సందర్భాలలో వాల్మీకి కధను నడిపిస్తాడు .

మేనకా విశ్వామిత్రుల కధను మహర్షి పతనాన్ని నాలుగే నాలుగు శ్లోకాలలో చెప్పేశాడు వాల్మీకి అంటారు పుట్టపర్తి వారు .ఇది విశ్వామిత్రుడి లో ఉన్న చిన్న దౌర్బల్యం దీన్ని పెంచి పెద్దగా రాయకూడదని, ఔచిత్య  భంగమనీ వాల్మీకి భావించాడు .జనక సభలో జనకుడు శివ ధనుస్సు గురించి చాలా చెబుతాడు .విశ్వామిత్రుడికి ఇది కేవలం అతి సామాన్య విషయం అనిపించి ‘’వత్స రామ ధనుః పశ్య ‘’అని మాత్రమె అంటాడు .రాముడు కొంచెం చేత్తో ధనుస్సును తాకుతానని మాత్త్రమే అంటాడు . అది విరిగి పోతుంది ఇక్కడ రెండే రెండు శ్లోకాలు రాస్తాడు మహర్షి –

‘’తస్య శబ్దో మహా నాసీత్ నిర్ఘాతసమ నిస్వనః –భూమి కంప శ్చ సుమహాన్ ,పర్వతస్యేవ దీర్యతః ‘’

నిపెతుశ్చనరాస్సర్వే తేన శబ్దేనా మోహితాః –వర్జయిత్వా మునివరం ,రాజానం తౌచ ,రాఘవౌ ‘’ఇవే ఆ రెండు శ్లోకాలు .

రాముడికి కూడా ధనుర్భంగం సామాన్యమైన విషయమే .సీతా రామల శృంగారాన్నే అంతే ఉదాత్తం గా చెప్పాడు మహర్షి .ఈ పెళ్లిని తలి దండ్రులు చేశారు ‘’దారాః పిత్రుక్రుతా ఇతి ‘’అదే వాళ్ళ అనురాగానికి కారణం .’’గుణాద్రూప గుణాచ్చాపి ‘’రూపం తో పరస్పరం ఉన్న సద్గుణాలతో పెరిగింది వారిమధ్య అనురాగ బంధం. రాముడి మనసులో సీత కంటే సీత మనస్సులో రాముడు ఎక్కువగా కొలువై ఉన్నాడంటారు .అడవికి   వెళ్ళేటప్పుడు సీతకు నార చీర కట్టుకోవటం రాక పొతే రాముడే చుట్టాడు .సీతారాముల ప్రేమను ఆలంకారికులు ‘’నీలి రాగం ‘అన్నారని ఆచార్య వాక్కు .ప్రతి  వర్ణనలోను వాల్మీకి సంయమనం తో చిత్రిస్తాడు .మంత్రం శాస్త్రం లో రామాయణానికి ప్రచారం ఉంది .కార్య సిద్ధికోసం సుందర కాండ ,పారాయణ చేస్తారు .సుఖ ప్రసవానికి రామ జన్మ సర్గ పారాయణ ,కన్యా వివాహానికి సీతారామ కళ్యాణ సర్గ ,’’ధర్మాత్మ సత్య సంధశ్చశ్లోకాన్ని ఆపద నివారించుకోవటానికి జపిస్తారు .లలితా ఉపాసకులు రామాయణాన్ని లలితా దేవిగా భావించి పారాయణ చేస్తారు. శాక్తులూ దీన్ని పారాయణ చేస్తారు .లలితాదేవి శ్రీరాముడిగా అవతరించిందని శాక్తేయుల నమ్మకం .శ్యామలా దేవికి పురుష వేషం వేస్తె శ్రీ కృష్ణుడు అవుతాడట  ‘

రేపు 10-9-14బుధవారం విశ్వనాధ వారి 120వ జయంతి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-14-

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రెయిలీ లిపి దీక్షలో తరిస్తున్న టీచర్ శ్రీమతి యాదేశ్వరి –

ఇప్పటి వరకు గొప్ప పనులు చేసిన వాళ్లు, సాహసవంతులే మనకు కనిపించే హీరోలు. కాని కొందరు ఎవరూ చేయలేని గొప్పకార్యాన్ని భుజం మీద వేసుకున్నా… అంతగా ప్రాచుర్యానికి నోచుకోరు. అలాంటి వాళ్లలో నిజమైన హీరో మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు యాదేశ్వరి. ఈమె చేస్తున్న నిశ్శబ్ధ యజ్ఞ ఫలితం – బ్రెయిలీలో అయిదు వందల ఆధ్యాత్మిక గ్రంథాలను రాయడం. ఈ మధ్యనే ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పాఠ్యపుస్తకాలను సైతం అదే లిపిలో రాసి అంధులపాలిట దైవమైపోయింది.
‘‘పుట్టుకతో కనుచూపు పోవడం ఆడపిల్లలు చేసుకున్న పాపం అని నిందిస్తుంటారు. అదే కనక మగపిల్లలు అంధులైనా సరే, వారికి పెళ్లిళ్లు అవుతున్నాయి. ఆడపిల్లలకేమిటీ శిక్ష! తల్చుకుంటేనే గుండె బరువెక్కుతుంది. కొందరు చాదస్తపు స్వాములైతే అంధత్వంతో బాధపడే ఆడపిల్లలు పూజలకు కూడా పనికిరారు అంటున్నారు. ఇదంతా లోకం పోకడే కావొచ్చు. నేను స్వయంగా విన్నప్పుడు.. చూసినప్పుడు.. మనిషికి అంధత్వం అనేది ఎంత శాపం అనిపిస్తుండేది. చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటనతో.. ఈ బాధ రెట్టింపైంది. కరెంట్‌ సరిగా లేని రోజుల్లో కిరోసిన్‌ దీపాలను వాడేవాళ్లం. పొరపాటున ఆ దీపం మీద నేను పడిపోవడంతో ఒక కన్ను కమిలిపోయింది. భరించలేని నొప్పితో డాక్టర్‌ వద్దకు వెళితే.. ఆయన వైద్యం చేసి ‘‘భవిష్యత్తులో మీకు చూపు తగ్గొచ్చు. అంధత్వమొచ్చే ప్రమాదమూ ఉంది. జాగ్రత్త!’’ అని చెప్పి పంపించారు. ఆస్పత్రి నుంచి ఇంటికొస్తున్నప్పుడే నాలో ఆందోళన మొదలైంది. ఇక నాకు చూపు పోతోందనగానే భరించలేకపోయాను. శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా మనుగడకు ముప్పు ఉండదు కాని కంటిచూపు పోతే – ప్రపంచమంతా అంధకారమే! ఒకరు తోడుంటే తప్ప ఏ పనీ స్వయంగా చేసుకోలేని పరిస్థితి. ఆ దిగులే కొన్నాళ్ల పాటు వేధించింది నన్ను. అయితే నేను ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో కాని ఆ వైద్యుడు చెప్పినట్లు నా కన్ను దెబ్బతినలేదు. ఒక అంధురాలు భరించే బాధను గుర్తుండిపోయేలా చేసిందా సంఘటన. ఆ తర్వాత – అంధులను చూసినప్పుడల్లా వారి కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం మొదలైంది.

అదే పెద్ద మలుపు..
మా మామయ్య బోడ నారాయణ రిటైర్డు హిందీపండిట్‌. ఆయనకు ఒక కన్ను లేదు. ఉన్న ఇంకో కన్నుకూ జబ్బు సోకడంతో ఆపరేషన్‌ చేయాల్సొచ్చింది. అప్పుడు మామయ్య పడిన అవస్థను దగ్గరుండి చూశాను. మనసులో ఇటువంటి ఆలోచనలన్నీ గిర్రున తిరుగుతున్న సమయంలో – హైదరాబాదుకు వెళ్లి అంధుల కోసం పెట్టిన బ్లయిండ్‌ డిప్లొమో కోర్సును పూర్తి చేశాను. 2001లో అనుకుంటా.. దత్తపీఠం గణపతి సచ్చిదానందస్వామి వద్దకు వెళ్లాను. అక్కడొక నమ్మశక్యం కాని దృశ్యం కంటపడింది. కంటిచూపులేని కొందరు అమ్మాయిలు అద్భుతమైన నాట్యప్రదర్శనతో భక్తులను అబ్బురపరుస్తున్నారు. వాళ్ల పట్టుదలకు నా మనసు మూగబోయింది. ‘కళ్లు లేనివాళ్లు అంతబాగా నృత్యం చేస్తుంటే.. కళ్లున్న నేను ఎందుకు డ్యాన్స్‌ నేర్చుకోకూడదు..’ అదే మాటను స్వామీజీతో చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు ‘‘ఆ పని నువ్వే ఎందుకు చేయాలి? నువ్వు చేయాల్సిన పనులు ప్రత్యేకమైనవి. నువ్వు ఎలాగు బ్లయిండ్‌ డిప్లమో చేశావు కదా! అంధుల కోసం ఆధ్యాత్మిక గ్రంథాలను బ్రెయిలీ లిపిలో రాసిన వాళ్లు చాలా తక్కువ. ఆ లోటు నువ్వు భర్తీ చెయ్యి. చూపులేని వాళ్లకు ఎంతో మేలు చేసినదానివి అవుతావు’’ అన్నారు. ఆయన చెప్పిన ఆ మాటకు అంఽధులు ఆధ్యాత్మికతకు పనికిరారు అనే మాటలకు జవాబు దొరికినట్లనిపించింది. దాంతో ఆ రోజే బ్రెయిలీలిపిలో పుస్తక రచనకు పూనుకున్నాను.
భారత భాగవతాలన్నీ..
గురువుల విశిష్టతను తెలిపే గ్రంథం ‘శ్రీగురుగీత’. మైసూరు దత్తపీఠం వారే ప్రచురించారు. ముందు ఆ పుస్తకాన్నే బ్రెయిలీలో రాశాను. 22.2.2002 తేదీ నాడు బ్రెయిలీలో విడుదల చేసిన తొలిపుస్తకం అదే! అప్పట్లో ప్రింటర్లు అందుబాటులో ఉండేవి కావు. మాన్యువల్‌గానే రాయాల్సొచ్చేది. సాధారణ పుస్తకాన్ని బ్రెయిలీలో రాస్తే అంతకు ఆరురెట్లు సైజు పెరుగుతుంది. ఒక వైపు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే ఇంటికొచ్చాక.. ఈ పని ముందేసుకునేదాన్ని. అలా.. దత్తపీఠంలోని ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ బ్రెయిలీలో రాసేశాను. భారతం, రామాయణం, భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లతో పాటు దేవతల చరిత్ర, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అయిదువందలకు పైగా పుస్తకాలను బ్రెయిలీలో రాసుంటాను. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి ‘వొడువని ముచ్చట’ పుస్తకాన్ని సైతం బ్రెయిలీలో రాసిన సంతృప్తి దక్కింది. వెనక్కి తిరిగిచూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ నేను ఆర్భాటానికో గుర్తింపుకో చేసినవి కావు. నా అంతరాత్మ ప్రభోధం మేరకు అంధుల కోసం చరిత్రలో నిలిచిపోయే ఒక్క పని చేసి పోయినా జీవితానికి సార్థకత చేకూరుతుందన్న ఏకైక లక్ష్యంతో చేసిన పని. దత్తపీఠం వారే నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి బ్రెయిలీ ఫ్రింటర్‌ను కొనిచ్చారు నాకు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న జగన్‌ అనే వ్యక్తి నా గురించి తెలుసుకుని.. ఒక ల్యాప్‌టాప్‌తోపాటు, బ్రెయిలీలిపి రాసుకునే 30 వేల కాగితాలు పంపించారు. నేను ఒక్క తెలుగు భాషతోనే సరిపెట్టుకోలేదు. హిందీ, మరాఠీ, గుజరాతీ, రష్యన్‌, జర్మన్‌ భాషల్లోని పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి మార్చాను. జర్మన్‌భాష కష్టతరమైనది. అయినా సరే, స్కూలు నుంచి ఇంటికిరాగానే ఇంటర్‌నెట్‌మీద కూర్చుని భాష పట్ల ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకున్నాను.
ఒకటి నుంచి ఇంటర్‌ దాకా..
ఇలా నడుస్తున్న నా ప్రయాణం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న కొత్తకోట హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలైన గాయత్రి గారు అంధురాలు. క్లాసుకు వెళ్లి పాఠం చెప్పాలంటే.. అంతకుముందు రోజే మరొకరితో ఆ పాఠం చదివించుకొచ్చేవారు. ఆమె బాధ చూసి.. అంధత్వంతో బాధపడే ప్రతి టీచరుదీ ఇదే సమస్య కదా! అనిపించింది. వెంటనే నేను ఆ తరగతి పుస్తకాన్ని బ్రెయిలీలోకి తీసుకొచ్చి ఆమెకు అందించినప్పుడు చాలా సంతోషించింది. ఆ తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉన్న పాఠ్యపుస్తకాలన్నీ చకచకా బ్రెయిలీలో చేశాను. వేలాది పేజీలయ్యాయి. పదో తరగతి సైన్సు పుస్తకాన్ని బ్రెయిలీలోకి మార్చినప్పుడు ఆరు వాల్యూమ్స్‌ అయ్యాయి. ప్రతి వాల్యూమ్‌లో నూటా యాభై పేజీలు వచ్చాయి. ప్రతి పుస్తకానికి ఇంతేసి పనుంటుంది. బ్రెయిలీలో రాసిన పాఠ్యపుస్తకాలను ఈ మధ్యనే తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు. కొన్ని బ్రెయిలీ పాఠ్యగ్రంథాలను విశాఖపట్టణం, హిందూపురం అంధుల పాఠశాలలకు పంపించాను. నేనింత పని చేస్తున్నా ఏనాడు శ్రమ అనిపించలేదు. అయితే మా ఇంటికొచ్చి నన్ను చూసే వాళ్లకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ‘‘స్కూలుకు వెళ్లి పాఠాలు చెప్పి ఇంటికి రావడంతోనే అలసిపోతాము. నువ్వు ఇంత భారాన్ని ఎలా మోయగలుగుతున్నావు? ఇంత ఖర్చు, శ్రమకు ఓర్చి బ్రెయిలీలోకి తీసుకొస్తే నీకేమొస్తుంది? ఈ కాలంలో ఎవరైనా గుర్తిస్తారా?’’ అనేవారు. అలాంటి ప్రశ్నలన్నింటికీ చిరునవ్వే సమాధానం. భవిష్యత్తులో పురాణాలు, ఇతిహాసాలు.. కష్టమైనా సరే వేదాలను కూడా బ్రెయిలీలోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాను. అప్పుడే నా జీవితానికి పరిపూర్ణత లభిస్తుందన్నది నా విశ్వాసం’’
ఫ నవ్య డెస్క్‌൹൹్ణహాౌ ్క్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాండలిక భాషోత్సవ దినం గా కాలోజి జయంతి -చేయాలని జన వాక్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం-3

కవికుల గురువు – కాళిదాస మహా కవి

కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను  భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు .ఐదవ శతాబ్ది వాడని అనుకుంటారు .అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి .

కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తిన్చాడుకనుక హిమాలయ సానువులలో  ఉండే వాడేమో  నని కొందరి ఊహ .మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పాడుకనుక ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం .రఘు వంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశాడు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం .లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పాడు .అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం  కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వాడే .ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు .దానితో ఆయన మహా కవిగా రూపు దాల్చాడనే కద అందరికి తెలిసిందే .శ్రీ లంక రాజు కుమార దాసును కలిశాడని అక్కడ జరిగిన కుట్రలో హత్య చేయబడ్డాడనే కధనమూ ఉంది .

కాని కాళిదాసుకాలం  నాలుగవ శతాబ్దికి విక్రమాదిత్య  మహా రాజు కాలం తో సరిపోతోందని కొందరు వాదిస్తే, కాదు అయిదవ శతాబ్దపు చంద్ర గుప్తుని సమకాలీనుడని మరి కొందరి వాదన .ఇదంతా శుద్ధ తప్పు క్రీ పూ.ఒకటవ శతాబ్దం లోని అప్పటిఉజ్జయిని పాలకుడు  విక్రమాదిత్యుని కాలం వాడని అన్నారు మరింత వెనక్కి నెట్టేసి .,ఆధునికులు మాత్రం అయిదు ఆరు శతాబ్దికి చెందాడు అంటారు .634శిలాశాసనం ప్రకారం బారవి కాళిదాసు పేర్లు ఒకే చోట కనిపించాయి .ఈ శాసనం కర్నాటక లోని ఐహోల్ లో లభించింది .,కాళిదాస కాలం పై చర్చను వదిలేసి ఆ మహాకవి రచనా వైవిధ్యాన్ని సామర్ధ్యాన్ని గురించి తెలుసు కొందాం .

మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ,మాళవికాగ్ని మిత్రం ,విక్రమోర్వశీయం అనే మూడు నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధ నాటకం గా గుర్తింపు పొందింది .జర్మనీ ఫిలాసఫర్ కవి విమర్శకుడు నాటక కర్త శాకుంతలాన్ని చదివి యెగిరి గంతేసి నాట్యం చేశడని ‘’దివిని భువిని ఏకం చేశాడు కాకాళి దాసు ‘’అని సంభ్రమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలు కార్చాడని చెబుతారు .అంతటి కీర్తి పొందింది .ఇందులో నాలుగో అంకం నాలుగో శ్లోకం అన్నిటికంటే గొప్పది అనే పేరుంది కాన్వ మహర్షి పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కాలి దాసు ఆయనతో అనిపించినా శ్లోకే ఇది పెంచిన తండ్రి తానె దుఖాన్ని ఆపుకోలేక పోతుంటే కానీ పెంచి పెళ్లి చేసి అత్త వారింటికి కూతుర్నిపంపించే తల్లిదండ్రుల మనోక్షోభ ఎంతటిదో అనే భావం ఇందులో ఉంది .వీరేశలింగం గారు ఈ నాటాకాన్ని తెలుగులో గొప్పగా అనువదించారు .మాళవికాగ్ని మిత్రం అంటే ఆ ఇద్దరి కదా .మాళవిక అనే ఒక దాసీ పై ప్రేమలో పడిన రాజు అగ్ని మిత్రుడి కద .రాణి గారికి వీరి ప్రేమాయణం తెలిసి దాసిని నిర్బందిస్తుంది .మాళవిక రాజ పుత్రికయే నని తెలుస్తుంది .రెండవది అభిజ్ఞాన శాకుంతలం .దీని కద అందరికి తెలిసిందే .మూడవది విక్రామోర్వశీయం –పురూరవ రాజు దేవతా స్త్రీ ఊర్వశి ల ప్రణయం ఇతి వృత్తం .వీరి ప్రేమ అనేక ఆటంకాలకు లోననై  చివరికి ఇద్దరూ ఏకమై ఊర్వశి విజయ విక్రమ అవుతుంది .

కాళిదాస మహా కవి మహా కావ్యాలు కుమార సంభవం ,రఘువంశం .పార్వతి దేవిజననం శివునితో కల్యాణం తాటక సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భావం కద కుమారా సంభవం .రఘు వంశ రాజుల చరిత్రను తెలిపేది రఘువంశం .ఈ రెండు కావ్యాలలో కాళిదాస ప్రతిభ బహుముఖీనం గా విస్తరించింది . గీర్వాణం అంటే దైవ స్వభావాన్ని పొందింది .వీటితో బాటు ఋతు ఘోష ,మేఘ  దూతం అనే రెండు ఖండ కావ్యాలు రాశాడు కాళిదాసు  భారత దేశ ఋతు వర్ణనను ప్రతిభా వంతం గా  గా ఋతు ఘోషలో వర్ణించాడు .మేఘ దూతం లో మేఘాన్ని రాయ బారిగా ఒక యక్షుడు తన ప్రియురాలికి పంపిన సందేశాన్ని కవితాత్మకం గా దారిలో కనిపించే ప్రదేశాల వివరాలతో సహా రాశాడు .

కాళిదాసు కవితా ప్రతిభ

శృంగార రసాన్ని పిండి వడ బోశాడు కాళిదాసు .ఆయన దృష్టిలో ప్రపంచం రాగమయం గా దర్శన మిస్తుంది .వైదర్భీశైలి తో నాటకాలు రాశాడు .సులభ శైలిలోనే రాశాడు .ఆయన సూక్తులు రసమాదుర్యం తో తోణికిస లాడతాయి .శకుంతల సొందర్యమే కాళిదాసు కవితా సౌందర్యం ‘’అనాఘ్రాతమ్ పుష్పం కి.సలయ మలూనం కరరుహై –రానావిధం రత్నం మధునవ మనాస్వాదిత రసం –అఖండం పుణ్యానాం ఫల మివచ తద్రూప మనఘం ‘’.కవుల్లో అగ్రేసరుడు కాళిదాసు .దీన్ని ఒక కవి తమాషాగా చెప్పాడు ‘’కవులు ఎవరెవరు అని లెక్కించటానికి చిటికెన వేలుతో ప్రారంభిస్తే మొదటి వాడు కాళిదాసు రెండవ వాడు తగలనే లేదట అదీ ఆయన గొప్పతనం అంటాడు ..శాస్త్ర సంబంధ ఉపమానంకాలారాలు విరివిగా వాడాడు .

‘’తతో మందానిలోద్ధత కమలాకర శోభినా –గురుం నేత్ర సహ్శ్రేనా నోదయామాస వాసవః ‘’ఇంద్రుడు తనకున్న వెయ్యి కళ్ళతో గురువు బృహస్పతిని చూశాడట .ఆ కదలిక మెల్లని చల్లని గాలి చేత కమల వనం కదిలి నట్లు గా ఉందట.   .మరో ఉపమాలంకారం –ఇందుమతీ స్వయం వరం లో రాజులు వరుసలో కూర్చున్నారు .ఆమె ఒక్కొక్కరిని చూస్తూ తిరస్కరిస్తూ వెడుతుంటే ప్రతివారికి తననే వరిస్తుందనే ఆశ తో ముఖం వెలిగింది .దాటిపోగానే ముఖాలు చిన్న బోయాయి .దీన్ని దీప శిఖ తో పోల్చాడు దీపం ముందుకు వెడుతుంటే వెనకాల చీకటిని వదిలి పెట్టటం సహజం కదా అలా ఉంది ఈ సీను .దీప శిఖా వర్ణన కాళిదాసు చాలా చోట్ల చేశాడు .దేని ప్రత్యేకత దానికి ఉంది .

ఉత్ప్రేక్ష లను  ,అర్ధాంతర న్యాసాలను అర్ధవ వంతం గా వాడాడు .వాల్మీకి తర్వాత ప్రక్రుతి వర్ణనలకు  కకాళిదాసుకే పేరు .ప్రకృతిని కవిత్వం లో చిత్రం గీసి చూపిస్తాడు .స్త్రీలను కోమలం గా వర్ణించాడు .వారికి ప్రత్యెక వ్యక్తిత్వం ఉంటుంది .సంవాదాలు నాటకీయం గా నడిపిస్తాడు .ఋతు సంహారం లో ఒక్కో సర్గలో ఒక్కో రుతువును వర్ణించాడు .మల్లినాద సూరి కాళిదాస కావ్యాలకు గొప్పగా టీకా తాత్పర్యాలు సంస్కృతం లో రాస్తే వేదం వెంకటరాయ శాస్త్రిగారు చక్కని తెలుగులో చెప్పారు .కాళిదాస రచనలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం పొందాయి .కొందరు ఆంగ్ల కవి నాటక రచయితా షేక్స్ పియర్ తో కాళిదాసును పోలుస్తారుకాని  కాళిదాసు ప్రతిభ ముందు ఆయన సరిపోలడని ఎక్కువ మంది అభిప్రాయం .కొందరి భావనలు చూద్దాం –ముందుగా గోతే ఏమన్నాడో  గమనించండి  –

Wouldst thou the young year’s blossoms and the fruits of its decline
And all by which the soul is charmed, enraptured, feasted, fed,
Wouldst thou the earth and heaven itself in one sole name combine?
I name thee, O Sakuntala! and all at once is said.

—translation by E. B. Eastwick

 

“Here the poet seems to be in the height of his talent in representation of the natural order, of the finest mode of life, of the purest moral endeavor, of the most worthy sovereign, and of the most sober divine meditation; still he remains in such a manner the lord and master of his creation.”

—Goethe, quoted in Winternitz[14]

       Inline image 1       Inline image 2

 

 

మరో కవితో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీలంక అనూ రాధ పురం లో బౌద్ధ విహార్ – బుద్ధ భూమి -సెప్టెంబర్

vihar1 001 vihar2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి సామ్రాట్ కు 120 ఏళ్ళు -రేపు జయంతి మహోత్సవం -మాచవరం లో స్వగృహం లో

2vishvanadha 120 001 vishvanadha 120- 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారి స్పందన

purvamgla kavula muchatlu1ippagunta 001 2ippagunta 001

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళోజి ప్రజల మనిషి -ఆంధ్రజ్యోతి సంపాదకీయం – ననుమాన స్వామిరాసిన ”తెలంగాణా కీర్తి పతాక ”

అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్‌ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అణగారిపోయిన తరువాత, ఎటువంటి అలజడీ లేని కాలంలో కూడా ప్రతి రాషా్ట్రవతరణ దినోత్సవాన అసెంబ్లీ ఎదుటి గన్‌పార్క్‌ దగ్గర నివాళు లర్పిస్తూ వచ్చిన అతి కొద్దిమందిలో కాళోజీ ఒకరు. విశ్వసించిన అంశాలపై గట్టి కట్టుబాటు, దాన్ని ప్రకటించడానికి సాహసమూ – రెండూ ఉన్న అరుదైన వ్యక్తిత్వం కనుకనే, కాళోజీని ఫ్రెంచి కవి, రచయిత లూయీ ఆరగాన్‌తో శ్రీశ్రీ పోల్చారు. అత్యంత సంక్షోభ కాలంలో కూడా ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీని వదలకుండా నిలబడ్డ రచయిత లూయీ ఆరగాన్‌.
కాళోజీ కవిత్వమూ రచనలూ ఆయన జీవితం నుంచి వేరు కావు కనుకనే, జీవితాచరణే ఆయన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతి అంశంలోనూ ప్రజాహితమైన వైఖరి తీసుకోవడం, న్యాయం మీద ఉద్వేగపూర్వకమైన ఆకాంక్షను ప్రకటించడం, స్వార్థరహితమైన జీవితాన్ని గడపడం- క్లుప్తంగా చెప్పవలసివస్తే ఇవీ ఆయన గుణగణాలు. మహారాష్ట్ర కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, తెలుగు సాహిత్యంలో, సమాజంలో విశేషమైన పాత్రను పోషించడం ఒక విశేషమైతే, తెలుగు భాషపై ఇతర భాషల ఆధిపత్యాన్ని, తెలుగు భాషలోని కొన్ని రీతులపై సొంతవారే ప్రదర్శించే వివక్షను ప్రతిఘటించడం మరో విశేషం. తెలంగాణ తోను, ప్రత్యేక ఉద్యమంతోను కాళోజీ అనుబంధం ఆయన వ్యక్తిత్వంలో ఒకానొక పార్శ్వం మాత్రమే. ఆయనకు తెలుగునేల నాలుగుచెరగులా మిత్రులున్నారు, ఆయన ఇష్టపడిన రచయితలు, ఆయనను ఇష్టపడిన పాఠకులు అన్నిప్రాంతాలలోను ఉన్నారు. అటు శ్రీశ్రీకి, ఇటు విశ్వనాథ సత్యనారాయణకి ఆయన సన్నిహితుడు. ప్రజాస్వామికవాదిగా ఆయన గళం విప్పని తెలుగు జిల్లా లేదు. ఆయన పోరాడని అంశం లేదు. అందుకే, ఈ రోజు రెండు తెలుగు రాషా్ట్రలలోను కాళోజీ శతజయంతిని అభిమానులు జరుపుకుంటున్నారు.
కాళోజీ తన కవిత్వాన్ని ‘గొడవ’ గానే చెప్పుకునేవారు. తన గొడవ ప్రజలందరి గొడవ అని ఆయన అనేవారు. కొంత వాడుక భాష, కొంత సరళగ్రాంథికం, కొంత లయ, కొంత ప్రాస- ఇవన్నీ కలిస్తే ఆయన కవిత. తాననుకున్నది, తాను చూసింది వెంటనే కవిత అల్లడం ఆయన అలవాటు. ఆయన కవితలు అనేకం సూక్తులుగా జనం నోట నానాయి. కబీర్‌ వంటి భక్తకవుల ‘దోహా’ సంప్రదాయం కాళోజీదని భారత ప్రధాని స్థాయికి వెళ్లిన ఆయన మిత్రుడు పి.వి. నరసింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎంతటి దగ్గరివారినైనా, ఎంతటి గొప్పవారినైనా నిర్మొహమాటంగా తప్పుపట్టే కాళోజీ సోదరులంటే తనకు ఎంతో భయమూ బెరుకూ అని పి.వి. అనేవారు. కాళోజీ అన్న, ఉర్దూ కవి షాద్‌ కాళోజీ రామేశ్వరరావు, తమ్ముడి ద్వారానూ, తాను సొంతంగానూ పరిసరాలను, సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. మిత్రుడు పి.వి. అభ్యర్థనను కాదనలేకనే కాళోజీ ‘పద్మవిభూషణ్‌’ గౌరవాన్ని స్వీకరించారు. ఆ పురస్కారాన్ని స్వీకరించిన తరువాత కూడా కాళోజీ ప్రజానుకూలత రవ్వంత కూడా తగ్గలేదు, ఏలికలపై విమర్శల పదునూ తగ్గలేదు.
తెలుగుసమాజానికి ఒక పెద్దదిక్కుగా, ప్రజాస్వామికవాదులందరికి అండగా వ్యవహరించిన కాళోజీ, మలిదశ తెలంగాణ ఉద్యమం బలపడే దశ వరకు సజీవులుగా ఉండి ఉంటే, విమర్శనాత్మకమైన మార్గదర్శకత్వం అందించి ఉండేవారు. ఆయన లోటు గత పన్నెండేళ్లుగా తెలుగుసమాజం అనుభవిస్తూనే ఉంది. ఆయనకు తిరుగులేని నైతికాధికారం కానీ, గౌరవం కానీ సంక్రమించడానికి కారణం కేవలం ఆయన కవి కావడం మాత్రమే కాదు, గాంధేయవాదో, ప్రజాస్వామిక వాదో కావడం మాత్రమే కాదు. ఏ సిద్ధాంతాన్ని కూడా ఆయన బేషరతుగానో, తాను రాజీపడి కానీ ఆమోదించలేదు. ‘పార్టీవ్రత్యం’ తనకు లేదని ఆయన చేసిన వ్యాఖ్య ఒకనాడు వివాదాస్పదమైనది కూడా. తాను సొంతంగా ఏది న్యాయం, ఏది ధర్మం అని భావించారో దానిని గాఢంగా, మమత్వంతో దగ్గరకు తీసుకోవడమే ఆయనలోని బలం. దేనినీ ఖాతరు చేయకపోవడం, కష్టనష్టాలను స్థితప్రజ్ఞతతో స్వీకరించడం, చిరునవ్వును కన్నీటిని ఏ తెరలూ లేకుండా ఉప్పొంగించడం- కాళోజీని పసిబాలుణ్ణి చేశాయి, ప్రజల మనిషిని చేశాయి. పుట్టుకనూ చావునూ సొంతం చేసుకుని, తక్కినదంతా దేశానికి ఇచ్చిన త్యాగశీలిని చేశాయి.
అన్యాయాన్ని, ఆగ్రహాన్ని, పోరాటాన్ని, నిర్వేదాన్ని పాడుకుంటూ సంచరించిన ప్రజాకవి కాళోజీ. తన జీవితాన్ని, స్మృతిని గొప్పస్ఫూర్తిగా మిగిల్చిపోయిన ధన్యజీవి కాళోజీ. ఆయన తన గురించి పాడుకున్న ఈ కవిత అక్షరాలా ఆయన జీవితవేదం.
‘‘అతిథివోలె వుండి వుండి
అవని విడిచి వెళ్లుతాను
…..
గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను
లోయలలో దూకి దూకి లోతులెన్నొ చూచినాను
..
నే ప్రాకని ఎత్తు లేదు
నేజారని లోతు లేదు

మూలజేరి మునుల వోలె మూగనోము బట్టినాను
ఈగవోలె దోమవోలె
వాగుచు తిరుగాడినాను’’
కాళోజీలో నిజాయితీగల నాయకత్వం, ప్రాణాన్ని సహితం లెక్క చేయక ప్రశ్నించే తత్వం, నిలువెల్ల నింపుకొన్న తెలంగాణ సెంటిమెంట్‌ ఆనాటి యువతకే గాదు ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ‘అక్షరరూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటూ కవులకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. అన్యాయాన్నెదిరించడమే జీవితలక్ష్యమైన వారు కాళోజీ.

తెలంగాణ కవుల్లో ఎవరికీలేని విలక్షణత ఒక్క కాళోజీ నారాయణరావులోనే కనిపిస్తుంది. ఆయన పూర్తిపేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరావు రాజారాం కాళోజీ. అమ్మమ్మది కర్ణాటక, తండ్రిది మహారాష్ట్ర. తాను జీవించింది తెలంగాణ ప్రాంతంలో కావడంతో ఆయన జీవితం మూడు రాష్ట్రాలతో ముడివడి వుంది. 1947 తరువాత దేశంలో చోటుచేసుకున్న ఉద్యమాలలో ఆయన సమరశీలమైన పాత్రనే వహించారు. సాయుధ పోరాటాన్ని సమర్థించారు. నిప్పుకుచెదలంటుతుందేమో గానీ ఆయన జీవితానికి అంటదు. బుద్దెరిగిన నాటి నుంచి ఏ సిద్ధాంతాలను నమ్మాడో జీవితాంతం వాటికోసమే పనిచేశారు. ధిక్కార స్వరం, తిరగబడేగుణం, తెలంగాణ పౌరుషం కొట్టొచ్చినట్టు ఆయనలో కనిపిస్తుంది. 1952లో తెలంగాణలో తొలిసారి పెల్లుబికిన ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటం, తుదిదశ తెలంగాణ పోరు(2002)లో అంటే అరవై యేండ్లు తెలంగాణ జెండా ఎత్తుకొని భుజం మీద మోశారు. ఖలీల్‌ జీబ్రాన్‌ ‘ది ప్రాఫెట్‌’ను ‘జీవన గీత’గా అనువదించడమే గాదు ప్రతిఘటన కావ్యం ‘నా గొడవ’ లాంటివి రచించి పేరొందారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మవిభూషణ్‌’ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
కాళోజీకి సంబంధించిన అన్ని వాదాలు దేశ ప్రజల పరమైనవయితే, ఒక్క తెలంగాణ వాదం మాత్రం ఆయనకు స్వంతమయింది. ఆయన తనువూ మనసూ తెలంగాణదే. తొలి సాధారణ ఎన్నికలు 1952లో వచ్చాయి. ఆ సంవత్సరమే ‘గైర్‌ (నాన్‌) ముల్కీ గో బ్యాక్‌ ’ ఉద్యమం పుట్టింది. ఎక్కడ ఉద్యమం పుడితే అక్కడ ప్రత్యక్ష మయ్యే గైర్‌ ముల్కీ గోబ్యాక్‌ ఉద్యమంలోనూ ప్రత్యక్షమై దాన్ని వేగవంతం చేశారు. కాళోజీ పిలుపందుకున్న ప్రజలు తామర తంపరలుగా ఉద్యమంలోకి చేరి ఆనాటి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఉప్పెనలా ఉద్యమించిన ప్రజలను బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపిస్తే ఆ తుపాకి తూటాలకు 18 మంది బలయ్యారు. 1953లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పరిచింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది. తెలంగాణకు న్యాయం జరగలేదు. 1968 జూలై 10న ‘తెలంగాణ రక్షణ దినం’ పాటించాలని వచ్చిన నిరసన ఉద్యమంలో కాళోజీ కీలక పాత్ర వహించారు.
1969 జనవరిలో తెలంగాణ పోరురగుల్కొని ఉధృతంగా సాగింది. అదే నెల 22న కాళోజీ ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ తరఫున పెద్ద సదస్సును జరిపారు. మరునాడే వరంగల్‌లోని జయప్రకాష్‌ నారాయణ్‌ రోడ్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారి వ్యాపార సముదాయాలపై తెలంగాణ వాదులు దాడులు చేశారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి మింట్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ, శ్రీరామాంజనేయ రైస్‌ మిల్లు, ఫిలిప్స్‌ రేడియో షాపు, మరికొన్ని దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఉద్యమానికి ఒక జెండా, ఎజెండాను సిద్ధం చేసుకొని 1969 ఫిబ్రవరి 29న రాజకీయేతరంగా తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది. అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ పిలుపు మేరకు తెలంగాణ పోరాట దినాన్ని పాటించడం జరిగింది. అది జరిగిన వారం రోజులకు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిలో చేరారు.
1969 మే లో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి ఉద్యమంలోకి దూకారు. జూన్‌ 6న కాళోజీ అధ్యక్షుడుగా రచయితల సదస్సు జరిగింది. పది రోజుల తర్వాత 1969 జూన్‌ 16న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. కాళోజీ, చిరంజీవి, జయశంకర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లో బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు హింసకు దిగారు. ఆ రాత్రికి రాత్రే పోలీసులు ప్రజాసమితిలో ఉన్న విద్యార్థిసంఘ నాయకులను అరెస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. నర్సంపేటలో చింతకింది వీరమల్లు, ననుమాసస్వామి, ఆయన గాయక బృందాన్ని, కె.సుదర్శనరావు, పింగిళి మాధవరావులతో సహా 94 మందిని తొలుత అరెస్ట్‌ చేశారు. బహుశా 1969 ఉద్యమానికి సంబంధించి విద్యార్థులు క్రిమినల్‌ కేసుల కింద అరెస్ట్‌ అయినారు. నర్సంపేట వారేనని చెప్పాలి. ఆ విధంగా అరెస్ట్‌చేసిన పోలీసులు 1969 జూన్‌ 17న నుంచే రోజుకు 25 మంది విద్యార్థుల చొప్పున జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరుస్తూ జూన్‌ 20న తేదీ దాకా వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు పంపుతూ పోయారు. ఒక్క వారం రోజుల్లోనే అంటే జూన్‌ 21 నాటికే 94 మంది నర్సంపేట విద్యార్థులను కోర్ట్‌ ఆదేశాలతో వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కుక్కారు. జూన్‌ 24 నాటికి ఈ నర్సంపేట పోరాటయోధుల అరెస్ట్‌ 260కి చేరింది. ఆ తర్వాత ఉద్యమ నాయకుడైన కాళోజీని, విద్యార్థి నాయకుడు చిరంజీవిని 151వ సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేశారు.
న్యాయవాది వృత్తిలో చట్టాన్ని కరతలామలకం చేసుకొన్న కాళోజీ పౌర హక్కుల పరిరక్షణకు దాన్నొక ఆయుధం చేసుకొన్నారు. ఆయన 37 సంవత్సరాల వయస్సులో అంటే 1952లో ‘గైర్‌ ముల్కీ గో బ్యాక్‌’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటికి ఉద్యమాల్లో అనుభవం గడించి నాటి యువతకు స్ఫూర్తిని కలిగించారు. జూన్‌ రెండో తేదీన జరిగిన కాల్పులకు నిరసనగా మూడో తేదీన అనుకొంటాను ఆనాడు వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో పెద్ద బహిరంగ సభ జరిగింది. సభ మొదలయింది. వరంగల్‌ జిల్లా తెలంగాణ ప్రజాసమితి నాయకులను నిర్వాహకులు పిలుస్తున్నారు. అప్పుడు వేదికకు ఎదురుగా కాళోజీ మా (ననుమాసస్వామి)గాయక బృందం మధ్య కూర్చొని వున్నారు. మేము పాడే రెండు పాటలు అయ్యయ్యో బ్రహ్మయ్యా, ఉల్లిచెట్టు మల్లిగాదు నచ్చాయని, అయితే తెలంగాణ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే గీతాలు రాయాలని ఉపదేశించారు. ఆయన స్ఫూర్తితో ‘నా తెలంగాణ సమరాలకు నెలవైన నేల’ అనే పల్లవితో స్వామి రాసిన దానిని మా గాయక బృందం వినిపించి ప్రశంసలు పొందారు. కాళోజీలో నిజాయితీగల నాయకత్వం, ప్రాణాన్ని సహితం లెక్క చేయక ప్రశ్నించే తత్వం, నిలువెల్ల నింపుకొన్న తెలంగాణ సెంటిమెంట్‌ ఆనాటి యువతకే గాదు అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ‘అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అంటూ కవులకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు.
తెలంగాణ ప్రజలందరికీ కాళోజీ ప్రాణంలో ప్రాణమై మెదిలారు. ఇక్కడి జనజీవన చారిత్రక గమనంలో అప్రమత్తమై ప్రజలను ముందుకు నడిపించారు. అన్యాయాన్ని ఎదిరించడమే జీవితలక్ష్యమైన వారు కాళోజీ. వందేమాతర ఉద్యమం, సత్యాగ్రహోద్యమం, రజాకార్ల నిరసనోద్యమాల్లో పాల్గొన్న అరుదైన కవి కాళోజీతో తెలంగాణ ఉద్యమంలోనే గాదు, ఆ తర్వాత నడిచిన ఉద్యమాలతో కలిసి నడవడం అపూర్వంగా భావించేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మరణం లేని ఆయనకు సజీవ గుర్తులమై మేమున్నామనే గర్వం మాకు ఉందనే వాళ్ళలో నేనొకణ్ని. త్యాగం కాళోజీది బతుకంతా తెలంగాణది. ఇంతటి మహోన్నతుని శతజయంతి తెలంగాణ ఇంటింటి పండగ కావాలి.
ుఽ ప్రొఫెసర్‌ ననుమాసస్వామి
రాష్ట్ర అధ్యక్షుడు, 1969 పోరాటయోధుల సంఘం
(నేడు కాళోజీ శతజయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – విహారి

పూర్వాంగ్ల కవుల  ముచ్చట్లు    పుస్తకం  

purvamgla kavula muchatlu

 
మాన్య మిత్రు   లు శ్రీ   దుర్గా   ప్ర  సాద్ గారూ , నమస్తే 
మీరు ఎంతో సౌజన్యంతో పంపిన మీ రచన అందినది . కృతజ్ఞ  తలు .   
అపూర్వమూ , అనితర సాధ్యమూ  ఐన  ఒక మహా గ్ర  మ్ ధాన్ని 
రచించారు   మీరు. హృదయపూర్వక అభినందనలు . 
 
ముచ్చట్ల   తీరు లో  మీరు ఏర్పాటు చేసుకున్న  అధ్యాయాల  
విభజన చాలా  ఔచిత్యవంటంగా వున్నది .  కవులకు కొందరికి 
మీరిచ్చిన శీర్షి  కలు చాలా అర్ధవంతంగా వచ్చాయి .  ఉదాహరణకి 
పెళ్లి చావు పాటల కవి , బీద డాక్టర్ కవి , శోక కవి , వీధి కవి  వంటివి .
ఆంగ్ల  సాహిత్య విద్యార్ధి  గా — ఎమిలి బ్రా  న్ట్ , ఇ.ఏ ఱాబిన్సన్ 
స్టీ  ఫెన్ స్పెండర్, రాబర్ట్  గ్రే  వ్స్ , డబ్లు  యు.సి . విలియమ్స్ 
వంటి వారిని చాలా  చదివాను .   విషయ వి వరణ , శైలి — రెండూ 
సరళంగా , చదివించే గుణం తో  సాగినాయి .  
 
 అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ   అంశాల్ని ఇంత పెద్ద 
పుస్తకంగా  రాయటం మీ ప్రతిభకు, వ్యుత్పత్తి  కి నిదర్శనం . 
మీ శారణా శక్తి   కూడా  ప్ర  శమ్సనీయమ్!
 
          గౌరవాభినందనలతో     మీ      విహారి 
======================
Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2

శమీ వృక్షం

‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ –రామస్య ప్రియ దర్శినీ ‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తాం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తాం .బ్రాహ్మణులకు దక్షిణ  తాంబూలాలిస్తాం  .ఇది  సంప్ర దాయ సిద్ధం గా   వస్తున్న అలవాటు . ఈ శ్లోకం లో పుట్టపర్తి వారు రెండు లోపాలు గమనించారు .శబ్దాల మధ్య ఏ కాన్వయం లేదన్నారు .  అర్జున శబ్దం ధనుస్సుతో సమన్వయము .దారీ కి కూడా .దారీ పుంలింగ శబ్దం .శమీ శబ్దానికి విశేషణం గా ఇది కుదరదు .కాని ఈ శ్లోకం పరంపరాగతం గా వస్తున్న శ్లోకం కనుక గౌరవించాలి అంటారు .

శమీ వృక్షం అర్జునుని ధనుస్సును ధరించిందే కాక శ్రీ రాముడికి సంతోషకరమైన దర్శనాన్ని కల్గించింది .అంటే త్రేతా ,ద్వాపర యుగ రామాయణ భారత కదల తో ఈ వృక్షానికి సంబంధం ఉందన్న మాట .ఆశ్వయుజ శుక్ల  దశమి విజయ దశమి .ఆ రోజు సాయంకాలాన్ని ‘’విజయ కాలం ‘’అంటారు .ఈ దశమి శ్రవణా నక్షత్రం తో కలిసి ఉంటె మహా భేషుగ్గా ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది .పై శ్లోకానికి కొంత చేర్చి కూడా లోకం లో ప్రచారం ఉంది ‘’శమీ శమయతే పాపం ,శమీ లోభిత కంటకా- దారిన్ అర్జున బాణానాం –రామస్య ప్రియ వాదినీ –కరిష్య మాణయాత్రాయాం –యదాకాలం సుఖం మయా –తత్ర నిర్విఘ్న  కర్త్రీత్వం ,భవ శ్రీరామ పూజితే ‘’.ఇందులో యాత్ర అంటే యుద్ధ యాత్ర అని అర్ధం .అంటే ఈ పండగ రాజులకు సంబంధించిన ముఖ్య పండగ .వర్షాకాలం  యుద్ధానికి ప్రతికూలం .కనుక చాతుర్మాస్య దినాలు అవగానే శరదృతువు లో యుద్ధానికి బయల్దేరటం ఆచారం .శమీ పూజ చేసి రాజులు యుద్ధాలకు బయల్దేరుతారు .కన్నడ దేశం లో ‘’జంబూ సవారీ ‘’అని విజయ దశమి నాడు గ్రామ పొలిమేర  దాటి బండ్లలోనో బండీలమీదనో కాలి నడకలోనో గ్రామ సరిహద్దు దాటి వెళ్ళటం ఆన వాయితీ .ఇప్పటికీ చేస్తున్నారు .దీనికే ‘’సీమోల్లంఘనం ‘’అంటారు .మేము హిందూపురం లో ఉండగా ఈ జమ్బూసవారి మాకు ఏంతో ఇష్టంగా ఉదేది ఆ రోజుల్లో గుర్రపు బళ్ళే.వాళ్ళు కూడా సరదాగా డబ్బులు వసూలు చేయకుండా ప్రక్కనే ఉన్న’’ సూగూరు ‘’దాకా తీసుకొని వెళ్లి తీసుకొచ్చేవారు .అక్కడ ప్రసిద్ధ శ్రీ  ఆంజ నేయ స్వామి దేవాలయం ఉంది .స్వామికి మొక్కి తిరిగి వచ్చేవాళ్ళం అదొక పెద్ద కోలాహలం. బజారులన్నీ ఇలాంటి జనాలతో కిక్కిరిసి పోయేవి .మను స్మృతిలో కూడా యాత్ర అంటే దండ యాత్ర అనే అర్ధం లోనే వాడారు అని సరస్వతీ పుత్రులు చెప్పారు .

రామాయణం లో రామ రావణ యుద్ధం అతి తీవ్రం గా జరుగు తోంది .రాముడు రావణుడి తలలు  తుంపిన  కొద్దీ మళ్ళీ మొలుస్తూ చీకాకు పెట్టిస్తున్నాడు . రాముడు  అలసి కొంత, భయ పడి కొంత ‘’దేవీపూజ ‘’చేశాడు. ఆమె మేల్కొన్నది ఆమె మేల్కొన్న రోజే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి .ఆమె ప్రసన్న అయి శ్రీరాముడికి విజయం   సిద్ధిం చ టానికి వరం అనుగ్రహించింది .అ రోజు మొదలు పది రోజుల్లో రావణ సంహారం చేస ,విజయం పొంది పుష్పకం ఎక్కి  సీతా దేవితో సహా అయోధ్య చేరాడు .అయోధ్యకు బయల్దేరటానికి ముందు కూడా రాముడు శమీ పూజ చేసే బయల్దేరాడని ఆచార్యుల వారు సెలవిచ్చారు .అయితే వాల్మీకి దీన్ని చెప్పలేదన్నారు .

ఇక భారత కధకు వస్తే అర్జునుడు పాండవ ఆయుధాలన్నీ శమీ వృక్షం మీద దాచి అజ్ఞాత వాసానికి బయల్దేరాడు .వాసం పూర్తికాగానే ఇక్కడికి వచ్చి శమీ పూజ చేసి ఉత్తర గోగ్రహణం లో విజయాన్ని  కురుక్షేత్ర యుద్ధం లో శత్రు సంహారాన్ని చేసి విజయం సాధించి అన్నగారిని రాజ్యాభి షిక్తుడిని చేశాడు .విజయదశమి రోజే అర్జునుడు ‘’బృహన్నల ‘’గా మారిన రోజట.తిక్కన గారు భారతం లో –

‘’బహుళాస్టమి నీతడు స-న్నాహముతో పశువు బత్తు నవమిని మనగో-హ్రహణమని నిర్ణయించిన –నహి కేతను పలుకులకు మహాహ్లాదమునన్ ‘’అని తెలిపారు .వ్యాస మహర్షి సంస్కృత శ్లోకం లో –

‘ఆదా తుమ్గాః స్సుశార్మోధ కృష్ణ పక్షస్య సప్తమీం –అపరే దివసే సర్వ్ రాజన్ సంభూయ కౌరవాః- అష్ట మ్యాంతే హ్యగ్రుహ్నంత గోకులాని సహశ్రశః ‘’అని రాశారు .బహుళ అష్టమీ ,నవమీ తిధులు ఉత్తర గోగ్రహణానికి నిర్ణయింప బడ్డాయి అని తిక్కన రాస్తే ,వ్యాసుడు సప్తమి అష్టమి తిధుల్లో అని మూలం లో చెప్పాడు .బహుళ పక్షం లో అని ఇద్దరూ అన్నరుకనుక తిధులు పెద్దగా పట్టించుకోవక్కర్లేదని ,శుక్ల పక్ష  దశమి కి దీనికి సంబంధం లేదని నారాయణాచార్యుల వారి తీర్పు .దీన్ని బట్టి అభిమన్యుని వివాహ ముహూర్తాన్ని నిర్ణయించ వచ్చు అంటారు ఆచార్య శ్రీ .

శ్రీ కృష్ణుడు కర్ణుడి తో ‘’అది సూర్యదయం మైత్రీ ముహూర్తం ,కార్తీక మాసం శరత్తు వెళ్లి హేమంతం వచ్చింది .రేవతీ నక్షత్ర యుక్తం .కాలం యుద్ధానికి మంచి అనుకూలం .ఈ మాసం సౌమ్య మాసం .కట్టెలు ,పొట్టు ,ఔషధాలు అన్నీ లభించేకాలం .బురద ఉండదు .ఈగా దోమా బాధ ఉండదు ఈ రోజుకి ఏడవ రోజున అమా వాస్య వస్తుంది .ఆరోజే యుద్ధం ప్రారంభం .’’అని చెప్పాడు .శ్రీ కృష్ణ రాయ బారం కార్తీక మాసం బహుళ  షష్టి నాడు  ప్రారంభమైంది .అష్టమి నాటికి హస్తిన నుంచి కృష్ణుడు తిరిగి వచ్చాడు .రాయబారం మాటలన్నీ కురు సభలో అష్టమి నాడే జరిగాయి .యుద్ధం ప్రారంభమైంది కార్తీక అమావాస్య నాడు .అభిమన్యుని వధ నాటికి అతని పెళ్లి అయి ఆరు నెలలయింది .ఏడవ నెలలో మృత్యువు పాలయ్యాడు .కనుక అభిమన్యుని వివాహం వైశాఖ మాసం లో జరిగింది .పాండవులు ఆశ్వయుజ శుక్ల దశమి నాడు శమీ పూజ చేశారు .కనుక ఈ పూజ అయిన ఏడెనిమిది నెలలకే అభిమన్యు వివాహం జరిగి ఉండాలి .కనుక విజయ దశమికి రామాయణ కదా తో సంబంధమే కరెక్ట్ గా సరి పోతోందని పుట్టపర్తి వారు లెక్కలు కట్టి నిగ్గు తేల్చారు .

ఆర్య కాలం లో ‘’అపరాజిత ‘’అనే శక్తి  ఉంది .యుద్ధం లో జయం కోసం ఆమెను పూజించేవారు .మౌర్య చంద్ర గుప్తులకాలం లో కూడా ఈమె కు ప్రచారం బాగానే ఉండేది .చాణక్యుడు అర్ధ శాస్త్రం లో ‘’వైజయంత ‘’అనే దేవత పేరు చెప్పాడు .విజయ దశమికి ఈదేవతను పూజించి యుద్ధానికి బయలు దేరేవారట రాజులు .వైద్య శాస్త్రం లో అపరాజిత అంటే ‘’శమీ వృక్షం ‘’అనే పేరు ఉంది .అంటే అపరాజితా దేవికి స్థానం శమీ వ్రుక్షమేమో నని పుట్టపర్తి వారు ఊహించారు క్రమం గా ఆ దేవీ పూజ  స్థానం లో శమీ పూజ ప్రారంభమై ఉండ వచ్చును అన్నారు వారు .దీని రహస్యం మంత్రం శాస్త్ర వేత్తలే తేల్చాలని వారు అభిప్రాయ పడ్డారు కూడా .శమీ వృక్షానికి విజయం చేకూర్చే లక్షణం ఉండి ఉండాలని నిశ్చయం గా చెప్పారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు   .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు ముందే దండి జీవిన్చిఉన్నడని అంటారు .దండం చేతిలో ఉన్న వాడిని దండి అంటారని మనకు తెలుసు .ముగ్గురు దండి లున్నారని మరో కధనం .దండి అనేది అసలు పేరుకాక పోవచ్చు .అయిదవ శతాబ్దికి చెందినా‘’సేతు బంధ ‘’కావ్యం లో కావ్యాదర్శాన్ని గురించి ఉన్ది కనుక అయిదు ఆరు శతాబ్దాల మధ్యకాలమే దండి జీవించిన కాలం అని గట్టిగా చెబుతున్నారు .పదవ శతాబ్దము వరకు దశకుమార చరిత్రను ఎవరూ పేర్కొనక పోవటం విచిత్రమే .మరికొందరు కాళిదాసు సమకాలీనుడు అన్నారుకాని అది నమ్మ శక్యం కాని విషయమే .వచన కావ్యాలు ,అలంకార శాస్త్రమూ రాసి పేరుపొందాడు .సృజన కు మారుపేరుగా ఆయన రాసిన ‘’దశ కుమార చరిత్ర ‘’నిలబడింది . దండి ని పదలాలిత్యానికి  ఉదహరిస్తారు ‘’.కావ్యాదర్శం’’ అనే గొప్ప అలంకార శాస్త్రాన్నికవిత్వం గా  సృష్టించాడు .ఇది మొదటి అలంకార శాస్త్రం గా గుర్తింపు పొందింది .తమిళ నాడులోని కాంచీపుర వాసి .భట్టి కావ్యాలకు ఈ అలంకార శాస్త్రం ప్రేరణ నిచ్చింది .ముప్ఫై ఆరు రకాల అలంకారాల గురించి చర్చించాడు .అలంకారాలు కావ్యానికి నిజమైన అలంకారాలని వాటి వలన శోభ కలుగుతుందని దండి భావన .సంక్లిష్ట సమాస రచన దండి ప్రత్యేకత .సుదీర్ఘ వాక్య విన్యాసం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ఒక్కోసారి వాక్యం అరపేజీ దాకా ఉండేట్లు రాసిన సందర్భాలున్నాయి ..అనేక సంయుక్తపదాలను అలవోకగా వాడి నిండుదనాన్ని తెచ్చాడు .

దశ కుమార చరిత్రలో పది మంది యువరాజులు ప్రేమ ,రాజరిక అధికారం కోసం చేసే ప్రయత్నాల కధలుంటాయి .ఆ నాటి సమాజం లోని వివిధ అంశాలకు ప్రతి రూపం గా కమనీయమైన సంస్కృత వచన శైలితో దీనిని తీర్చిదిద్దాడు .సామాన్య జన జీవితాన్ని ప్రదర్శించాడు ఆ కధల్లో .ఇందులో పూర్వ పీఠిక ,దశ కుమార చరిత్ర ,ఉత్తర పీఠిక అని మూడు భాగాలున్నాయి .ముందే చెప్పినట్లు పదలాలిత్యానికి పట్టాభిషేకం చేశాడు దండి .అందుకే ‘’దండినః పదలాలిత్యం ‘’అంటారు .(Dandi is the master of playful words ).దండి దశకుమార చరిత్రను ఆంగ్లం లో ‘’హిందూ టేల్స్’’అని ‘’అడ్వెంచర్స్ ఆఫ్ టెన్ ప్రిన్సెస్ “’అనీ1927లో  అనువదించారు  .దశ కుమార చరిత్రలో మొదటి చివరి భాగాలలో కొన్ని పేజీలు  లభ్యం కాలేదు .రాజవాహన ,విశ్రుత రాజకుమారుల చరిత్రలు అసంపూర్ణం గా ఉన్నాయి .మొదటి ,మూడు భాగాలలో కొంత ఇతరులు రాసిన చేర్పులున్నాయి .అందుకే బహుక్రుతం అనే పేరొచ్చింది .అయితే ఆసాంతం కద ఏక రీతిగానే నడిచింది .

దశకుమార చరిత్రం లో మొదటి రెండు అధ్యాయాల్లో ఉపోద్ఘాతం గ కధను చెప్పాడు .ముసలి రాజు రాజహంస తన కుమారులు చాలాకాలం కనిపించక పోవటం తో ఒక మునీశ్వరుడిని అర్ధిస్తే, వాళ్లు పదహారేళ్ళ తర్వాత తిరిగి వస్తారని ఆయన  సెలవి విచ్చాడు .అలాగే వారు చేరుకొని పెద్ద సైన్యం తో వచ్చి శత్రురాజు ‘’మనసార ‘’ను ఓడించి ,అనేక దేశాలను జయించి సుస్తిరం గా దేశసంచారం లో లభించిన విజ్ఞానం తో ప్రజారంజకం గా రాజ్య పాలన చేశారు .

కేతన కవి తెలుగులోకి పద్య కావ్యం గా దశ కుమార చరిత్రను 1250లో అనువదించాడు .సంస్కృత మూల కావ్యాన్ని అగాశే ,కాలే  గాడ్ బోలె మొదలైన వారు సేకరించి ముద్రించారు .ఆంగ్లం లోకి హస్కర్ ,కాలే ,జాకబ్ మున్నగు వారు అనువదించారు .అజంతా గుహల  నిర్మాణాన్ని దశ కుమార చరిత్ర ఆధారం గా అధ్యయనం చేశారు .అవి అయిదవ శతాబ్దికి చెందిన వాకటక వంశ రాజుల కాలం నుండి ఏడవ శతాబ్దానికి చెందిన పల్లవ రాజుల కాలం వరకు విస్తరించాయని తేల్చారు .వాకటక రాజుల కాలం లో దండికి ముఖ్య పాత్ర ఉండి ఉండేదని తెలిపారు పరిశోధకులు .ఈకాలం లో వ్యాపించిన ‘’వింధ్య వాసిని ‘’గురించికూడా దండి రచనలో ఉందని భావించారు .

దశ కుమార చరిత్రను స్పెయిన్ దేశపు ‘’పికారేస్క్యు ‘’ కావ్యం తో పోలుస్తారు .మొదటి దానిలో ఆరవ శతాబ్దపు రాజకీయ అస్తవ్యస్తత ఉంటె రెండో దానిలో స్పెయిన్ దేశం లోని రాజకీయ కల్లోలం కనిపిస్తుందని అన్నారు .మొదటి దానిలో దొంగలు వ్యభిచారులు సంఘ విద్రోహులుమొదలైన సమాజ తిరస్క్రుతులే  ఎక్కువ గా కనిపిస్తారని అంటారు ,.ఇందులోని ముఖ్య కదా భాగాన్ని దండి ‘’బృహత్కధ ‘’నుండి గ్రహించినట్లు అనిపిస్తుంది .ఆ నాటి ప్రజలు, సంఘం ఎలా ఉన్నారో చెప్పాడుకాని ,దండి ఎలా ఉడాలో చెప్పలేదు అనే విమర్శా  అంటించు కొన్నాడు .Inline image 1   Inline image 2

దండి రాసిన అలంకార శాస్త్ర కావ్యం లో మూడు అధ్యాలున్నాయి .660శ్లోకాలున్నాయి .’’గుణ ప్రస్తాన ‘’భావాన్ని దండి వ్యాపింప జేశాడు .కవిత్వం లో శ్లేష ,ప్రసాద గుణం ,సమతా గుణం ,మాధుర్యం ,అర్ధ వ్యక్తీ ,ఓజా అనే గుణాలు లేక లక్షణాలు ఉంటె నే అది గొప్ప కావ్యం అవుతుందని ఈ శాస్త్ర తాత్పర్యం .

 

మరోకవి తో రేపుకలుద్దాం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి చేస్తున్నాను .అమరుక కవితో ప్రారంభించి విశాఖ దత్త కవి తో ముగిసే ఈ ధారవాహికను ఆదరిస్తారని భావిస్తున్నాను .

1-శృంగార శతక కర్త -అమరుక కవి

అమరుక కవి ని గూర్చిన పూర్తీ వివరాలు తెలియ రావటం లేదు .కాని కాశ్మీర్ రాజు అమరకుడే అమరకవి అని అందరూ భావిస్తున్నారు .ఆయన రాసినవాటిని పరి శీలిస్తే అవి ఒక్కరే రాసినట్లు కనిపించదు .అమరుకుని కాలం క్రీ శ ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్యకాలం .అమరుక జీవితం పై అనేక కధలు ప్రచారం లో ఉన్నాయి .ఒక కధనం లో అద్వైత మత స్థాపకులు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్ర పండితుని తో వాదానికి దిగి ఓడిస్తే ఆయన భార్య ఉమా భారతి తనను కూడా వాదం లో జయిస్తీనే శంకరులకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదని తెలియ జేసి కామశాస్త్రం పై ప్రశ్నలు సంధించింది .ఆదిశంకరులకు అది అనుభవం లోని విషయం కదా అందుకని ఆ శాస్త్రాధ్యయనానికి వంద రోజులు గడువుకోరుతూ వాదాన్ని వాయిదా వేయించాడు .అప్పుడు కాశ్మీర రాజు అమరకుడు మరణిస్తే ,ఆయన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజాన్తః పురం లో కామశాస్త్రాన్ని  వంద రోజుల్లో ఆపోసన పట్టాడు .ఒక్కో రోజు శృంగారాను భవాన్ని ఒక్కొక్క శ్లోకం లో వర్ణించి రాసిన శతకం ఇది .రాజు అమరకుడు శృంగారం లో   నిష్ణాతుడు .ఈ అనుభవాన్ని భగవత్పాదులు ‘’అమరుకాస్టకం ‘’లో రాసి చిరస్మరణీయం చేశారు .

అమరుకాస్టకంపై భాష్యం రాసిన ‘’రవి చంద్రుడు’’ శంకరులు అమరకు డిని చిరంజీవినిచేయటానికే ఈ అష్టకం రాశారని ,ఇందులో రూపకాలంకారాలు విశేషం గా వాడారని చెప్పాడు .శంకరుల వింత,విపరీత ప్రవర్తనను గుర్తించిన రాణులు ఉద్యోగులు గేలి చేయటం ప్రారంభిస్తే మళ్ళీ రాజు శరీరం లో ప్రవేశించాడని తెలిపాడు .ఆధిభౌతిక శాస్త్రం లో నిష్ణాతుడైన  బెంగాలు కవి విమర్శకుడు అయిన రవి చంద్రుడు అమరుకాస్టకానికి ఆధ్యాత్మిక భావాన్ని జోడించి వ్యాఖ్యానం చేశాడు .అది  శంకర  క్రుతమేకాని అమరుక రచన కాదన్నాడుకూడా .దీనికే అమరుక శతకం అని కూడా పేరుంది .

సంస్కృత సాహిత్యం లో ‘’అమరుకాస్టకం’’ప్రత్యెక స్థానాన్ని పొందింది. కవి ప్రతిభకు తార్కణ గా నిలిచింది .ఆమహాకవి కాళిదాసుకవిత్వానికి   ,భర్తు హరి శృంగార శతకాని కి సరి సమానం గా నిలుస్తుందని తేల్చారు కూడా .తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ధ్వన్యాలోకం అనే  అలంకార శాస్త్ర కారుడు ఆనంద వర్ధనుడు దీన్ని విపరీతం గా మెచ్చుకొన్నాడు .ఇందులో ఒక్క శ్లోకం చదివి అర్ధం చేసుకొంటే ప్రేమ శృంగారాల సర్వవిషయాలు అవగతం అవుతాయన్నాడు .అమరుక శ్లోకాలను ఎందరో ఉదాహరించారు. వీటితోనే ఇతరకవుల కవిత్వాలను బేరీజు వేసి నిగ్గు తేల్చారు విమర్శకులు ,విశ్లేషకులు .ఆండ్రూ షీలే అనే ప్రఖ్యాత విమర్శకుడు ‘’ఈ భూ మండలం పై ఇంతటి ప్రేమ శృంగారకవిత్వం ఉన్న గ్రంధం లేనే లేదు ‘’అని నిర్ద్వంద్వం గా ప్రకటించాడు .ప్రేమ ,మనోభావం ,విరహం ,కోరిక, వ్యామోహం ,పునస్సంధానం,ఆనందం విషాదం దుఖం  మొదలైన శృంగారం   విషయాలకు ఈ కావ్య శతకం అద్దం పడుతుంది .గ్రెగ్ బైలీ అనే మరో విఖ్యాత విమర్శకుడు ఇందులో ప్రేముకుడిని ప్రేమలో పడేయ్యటానికి పడే తిప్పలు ,వారి కలయికల్లో అలకలు ,ప్రేమికుల మధ్య అనుమానాలు ,మోసాలు ,ఆనాటి సమాజ స్థితి అంతా తెలుస్తోంది అని చెప్పాడు .పురుషత్వాన్ని నమ్మిమోసపోవటం ,స్వీయ సానుభూతి కూడా ఇందులో దర్శనమిస్తాయి .ప్రేమలో కలయిక కోసం వెదికే దారులు ,విరహం లో పొందే వేదనలు ,తిరిగి కలవాలనే తహ తహా ఈ శతకం లో పరమ అద్భుతం గా కవి చిత్రించాడు .

అమరుక అస్టకానికి విశ్వ వ్యాప్తం గా ఆదరణ ఉంది .ఇంగ్లీష్ లో దీన్ని ‘’ఈసోటిక్ పోయెమ్స్ ఆఫ్ ఇండియా ‘’పేరిట ఆండ్రూ షెల్లింగ్ అనువాదం చేశాడు .’’లవ్ లిరిక్స్ ‘’పేరు మీద గ్రెగ్ బైలీ మరో అనువాదం చేశాడు .

అమరక కవి అష్టకం లో రెండు శ్లోకాలు వాటి రామణీయకత చూద్దాం

‘’ నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో
నేత్రే దూరమనఞ్ఝనే పులకితా తన్వీ తవేయం తనుః
మిధ్యావాదిని దూతి బాంధవజన స్యాజ్ఞాతపీడాగమే
వాపీం స్నాతుమితో గతాసి న పుంస్త స్యాథమస్యానికమ్‌. –

నాయకుడి దగ్గరకు నాయక దూతికను పంపింది .అది సందట్లో సడేమియా అని నాయకునితో శృంగారం లో మునిగి తేలింది .ఈ విషయం పసికట్టిన నాయిక దాన్ని వక్రోక్తి లో దూషించింది .భావం –చనులమీద గంధం జారింది ,కింది పెదవి ఎర్రదనం మాసింది ,కన్నుల కాటుక చెదిరింది .శరీరం అంతా పులకాన్కితం గా ఉంది ,బంధు పీడ తెలియటం లేదు .అబద్ధాలు ఆడు తున్నావు .బావి నీళ్ళకు వెళ్లావు  .ఆ వెధవ దగ్గరికి పోలేడుకదా? –రెండో శ్లోకం –

స్విన్నం కేనముఖం? దివాకకరైస్తే రాగిణీలోచనే?
రోషాత్త్వద్వచనోదితాద్‌ విలులితా నీలాలకా? వాయునా
భ్రష్టం కుంకుమ? ముత్తరీయ కషణా త్క్లాంతాసి? గత్యాగతై-
ర్యుక్తం తత్సకలం కి మత్ర వద హే దూతి! క్షతాస్యాధరే. –

ఎందుకు మొహం చెమ్మగిలింది?అంటే అది ఎండకు అన్నది .కన్నుల్లో ఆ ఎరుపేమిటి ?అంటే నీ మాటలకు అని జవాబు .జుట్టు చిక్కుపడిందేమిటి?గాలికి అని జవాబు .కుంకుమ జారిందేమిటి ?పైట రాపిడికి .అలసిపోయావేమిటి?రాకా పోకా వలన అని జవాబు .అంతా బానే ఉంది కాని పెదిమపై ఆ గాట్లేమిటి?

అమరు శతకాన్ని గరిక పాటి మల్లావ దాన్లుగారు తెలుగు పద్యాలలోకి అనువాదం చేశారు .క్లాసు విద్యార్ధులకు వాటిని బోధించారట కూడా .1981లో ‘’వైజయంతి ‘’పత్రిక ‘’అనే స్వీయ  కవితా సంకలనం లో వీటిని వెలువరించారట .అలానే వెంపరాల సూర్య నారాయణ శాస్త్రి గారు కూడా పద్యాలలో చెప్పారు .ఈ రెండు అనువాదాల్లో గరిక పాటి అనువాదమే ధారశుద్ధితో ఉందని వెంపరాల వారే స్వయం గా చెప్పారట .అమరుక శ్లోకాలు అనేక మంది ఉదాహరించారు .విద్యాకరుని ‘’శుభాషిత రత్న కోశం ‘’లో అనేక మంది కవుల పేర్ల తో ఈ శ్లోకాలు కనిపిస్తాయి .

భర్త కోసం భార్య ఎదురు చూపు –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నిజం –కవిత –శ్రీమతి పెళ్లూరి శేష కుమారి

        నిజం –కవిత –శ్రీమతి  పెళ్లూరి శేష కుమారి

 

            నీతి బోధించటం సులభం –ఆచరణకు మాత్రం అసాధ్యం

            వాస్తవం లో ఈ నిజం –కనబడుతోంది అనుక్షణం .

                           తన తప్పు తప్పు కాదు –ఎదుట మంచి పనికి రాదు

                           ఎక్కడైనా తనదే పై చేయి –ఈ నడవడిక ఎంతో ముప్పోయి .

         జీవితం చాలా చిన్నది –అనుభవం ఏంతో పెద్దది –

         ఆశలు కోకొల్లలు –ఊహలు వాటికి ఎల్లలు .

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అంటా కాళన్న అడుగు జాడలె -సి నా రే –


ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014

‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు.

కాళన్న పేరు తలంపు రాగానే కవిగా నా గొడవ గుర్తుకు వస్తుంది. అది అప్పటికి సరికొత్త నామకరణం. ఆ శీర్షికలో కాళోజీ బహిరంగముఖీనంగా ఉన్న అంతరంగం నిక్షిప్తంగా ఉంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నడు.

మరాఠాల కుటుంబంలో పుట్టినా తెలంగాణ పలుకుబడి తో ప్రజల మాట, వ్యధలను వ్యక్తం చేయటంలో కాళోజీ కృషి మనందరికీ ఆదర్శప్రాయం. నా కన్నా వయసులో పదహారేళ్ళు పెద్ద అయిన ఆయనను నేను కాళన్నా అంటూ చనువుగా పలుకరించి సన్నిహితంగా మెసిలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజాం పాలనలో జరిగిన అరాచకాలు, ఆరళ్ళతో పాటు ఉర్దూ మాధ్యమంలోనే చదువుకోవాల్సిన తప్పనిసరి స్థితి అప్పుడు ఉండేది. ఆ పాలన ముగిసి స్వాతంత్య్ర వీచికలు, స్వేచ్ఛావాయువులు పొంగుతున్న కాలంలో లేలేత యువకుడిగా హైదరాబాద్‌లో చదువుకోవటానికి నేను వచ్చాను. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో తెలుగుతనం కోసం జరిగిన ఉద్యమాలు, వ్యవస్థలు అందరికీ కొత్త స్ఫూర్తిని అందించేలా అల్లుకుపోయాయి.
నేను ఉస్మానియా యూనివర్సిటీలో బి.ఎ.చదువు కోవటం కోసం ఆర్ట్స్‌కాలేజీలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంగణంలో సన్నిహితులైన ప్రముఖ తెలంగాణ కవులల్లో ప్రథమ అగ్రగణ్యుడు కాళన్న. ఆ తరువాత ఏడేళ్ళు పెద్దయిన దాశరథి నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. అగ్రజులైన వారికి జన్మజన్మల కవి సౌమిత్రి నేను అంటూ పద్యాలు కూడా రాశాను. ఆ ఇరువురూ చిన్నవాడినైన నన్ను ఎంతో వాత్సల్యంతో చేరదీసి ప్రోత్సహించేవారు. తెలంగాణ రచయితల సంఘం స్థాపించినప్పుడు తొట్టతొలి అధ్యక్షుడు కాళోజీ కాగా, ఉపాధ్యక్షుడు దాశరథి. నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాను. చాలా కార్యక్రమాలు చురుగ్గా చేశాం. కొన్నేళ్ళ తరువాత దాశరథి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రాంతపు అన్ని జిల్లాల్లో యువకవి సమ్మేళనాలు నిర్వహించాం. అప్పటి పెద్దల కవితా స్పూర్తికి దోహదం చేసే అవకాశం కలిగింది. అప్పటికే కాళోజీ నిజాం ముష్కర పాలనకు వ్యతిరేకంగా గళం, కలం ఎత్తిన స్వాతంత్య్ర సమరయోధుడుగా ప్రసిద్ధుడు. దాశరథి కూడా ఆ కోవలోని వాడే.
కాళోజీ ‘నా గొడవ’ ఆలంపూర్‌లో ఆవిష్కరించిన కాలంలోనే నేను యువకవిగా ‘జలపాతం’ కవితా సంపుటిని ప్రచురితం చేశాను. దాశరథీ మనోజ్ఞ కవితాశరథీ అన్న మకుటంతో అంకిత పద్యాలు రాశాను. మధ్యలో ఒక పద్యంలో వానమామలై వరదాచార్యులు, బిరుదురాజు రామరాజు, ఆళ్వార్‌స్వామి, కాళోజీలను కవితల్లో ప్రస్తుతిస్తూ ఉటంకించాను. ఆ నలుగురు నన్‌ గుండెలకద్దుకున్న రసమూర్తులే అంటూ పద్యకవిత రాశాను.
కాళన్న పేరు తలంపు రాగానే కవిగా నా గొడవ గుర్తుకు వస్తుంది. అది అప్పటికి సరికొత్త నామకరణం. ఆ శీర్షికలో కాళోజీ బహిరంగముఖీనంగా ఉన్న అంతరంగం నిక్షిప్తంగా ఉంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నడు. అవనిపై జరిగేటివి అవకతవకలకు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు- ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికి కాళోజీ కలం స్పందించి కవితలు చిందించేది. కాళోజీ కవితలు కొన్ని పంక్తులు గేయ ఛందోబద్ధంగా ఉండేవి. అంతలోనే అవి వచనకవితలుగా మారిపోయేవి. ఆ కవితల భావావేశం, ఆగ్రహం అంతా సమకాలీన సమాజం పట్ల కలిగే స్పందన ప్రతిస్పందనలతో స్ఫూర్త్తివంతంగా ఉండేవి. తెలుగుభాష పట్ల ఆ ప్రజాకవికి ఉన్న మమకారం గణనీయమైనది. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ పరుషంగా అన్న కాళన్నలో తెలుగు తనం పట్ల అనంతమైన అపేక్ష పరవళ్ళు తొక్కేది.
నాకు ప్రత్యక్ష ప్రమేయం లేని చారిత్రక సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు 1943 మే 26న ఆవిర్భవించింది. అప్పట్లో బూర్గుల రంగనాధరావు, భాస్కరభట్ల కృష్ణారావు, లోకనంది శంకరనారాయణ వంటి వారు గొప్ప ఉద్యమ స్ఫూర్తితో స్పందించారు. అప్పటి కార్యస్థానాలుగా గోల్కొండ పత్రిక కార్యాలయం, రెడ్డి హాస్టల్‌లో సమావేశాలు జరిగేవి. పర్సా వెంకటేశ్వర రావు స్థలం మూలధనంతో సారస్వత పరిషత్తు వెలిసింది. మొట్టమొదటి కార్యవర్గంలో కాళోజీ ఉన్నారు. వరంగల్‌, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్‌, ఆలంపూర్‌, తోటపల్లిలో శాఖలు ఉండేవి. మా పరిషత్తు ద్వితీయ మహాసభలు 1944లో డిసెంబరు 28,29,30 తేదీల్లో జరిగాయి. ఆ ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉదయరాజు రాజేశ్వరరావు, కార్యదర్శిగా కాళోజీ వ్యవహరించారు. అప్పటికి నేను మా గ్రామం ప్రాంతంలో మాత్రమే పెరుగుతున్న పిల్లవాడిని. ముసిపట్ల పట్టాభిరామారావు అధ్యక్షుడుగా ఆ సభలు ఓరుగల్లు కోటలో జరుగుతున్నప్పుడు ముష్కర మూకలు దాడిచేసి అవరోధం కల్పించారు. ఆ సమయంలో వారికి ఎదురొడ్డి ధైర్యంగా సారస్వత పరిషత్తు సభలు సజావుగా జరిగేలా చేశారు. అవన్నీ ఈ తరం వారు తెలుసుకోవాల్సిన చారిత్రక స్మృతులు. నారాయణరావు త్రయంగా చెప్పుకునే కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణ రావు, కాళోజీ నారాయణ రావులు గ్రంథాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంతంలోని పల్లెపల్లెల్లో చదువరులను పెంచటంలో ఆ తరం పెద్దలు మహత్తర కృషి చేశారు. ఆర్యసమాజ్‌, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు, ప్రజల సమస్యలు అన్నింటా కాళన్న ఉండేవారు. నేను, నా కార్యక్షేత్రం కేవలం సారస్వతం కావటంతో మా పరిచయాలు, సాన్నిహిత్యం అంతవరకే పరిమితం. కాళన్న స్మృతిలో అధికారికంగా శతజయంతి కార్యక్రమాలు, వరంగల్‌లో ప్రత్యేకమైన సాంస్కృతిక సదనం, గ్రంథాలయం వంటివి ఏర్పాటు చేయడం హర్షణీయం.
– డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి (ఇంటర్వ్యూకు వ్యాసరూపం : జి.ఎల్‌.ఎన్‌.మూర్తి)
కాళోజీ శతజయంతి సమాపనోత్సవం

తెలంగాణ సాంస్కృతిక శాఖ, కాళోజీ ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు శతజయంతి సమాపనోత్సవం సెప్టెంబరు 9వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు రవీంద్ర భారతిలో జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి సభాధ్యక్షత వహిస్తారు. ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య విశిష్ట అతిథి. కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షులు నాగిళ్ళ రామశాసి్త్ర గారు కీలకోపన్యాసం చేస్తారు. అంపశయ్య నవీన్‌, దేశపతి శ్రీనివాస్‌ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. కాళోజీ జీవితంపై బి. నరసింగరావు రూపొందించిన ‘మన కాళోజీ’ డాక్యుమెంటరీ, కాళోజీ రచనలపై ప్రయోగాత్మక నాటకం ‘నా కవితలు – నా కలలు’ ఈ సందర్భంగా ప్రదర్శితమతాయి.
– భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనెరిగిన బాపు -వేలూరి వెంకటేశ్వర రావు- మరియు ”సారీ బాపూ”-శ్రీమతి చలసాని వసుమతి గారి కవిత

తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది.
వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో వాడుకున్నా ఎవరూ కాదనరు. వేమన, నా పద్యాలు నన్నడక్కండా వేశారేం అని కోప్పడడు. మనకాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడుకూడా బాపు తనబొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగుదేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకుపోనిచ్చాడు.
బొమ్మ అడగడం తడవు- ఆశు కవిత్వం చెప్పే కవికన్నా వేగంగా బొమ్మలు వేసే బాపు- తన బొమ్మలని తెలుగు మాటలు బతికున్న ప్రతిచోటికీ, మాటలకన్నా వేగంగా ప్రసారం కానిచ్చాడు.
తెలుగు వాళ్ళు వేమనలాంటి కవులకి సన్మానాలు చెయ్యలేదు. వాళ్ళని తమ మామూలు మాటల్లో కలిపేసుకొని సొంతం చేసుకున్నారు, అంతే! బాపూ కూడా అలాంటి వాడైపోయాడు. చిత్రకారుడుగా అతన్ని పనికట్టు కొని ఎవరూ పొగడినట్టు లేదు. కాని, అతని బొమ్మలు లేకుండా ఎవరూ ఏ పనీ చెయ్యరు. పత్రిక పెట్టినా, ప్లైయర్‌ పంపినా, పుస్తకం అచ్చేసుకున్నా, బాపు గీత లేనిదే అది మనకి పూర్తి కాదు.
‘బాపు గొప్పవాడు. మనం పట్టంకట్టి నువ్వు గొప్పవాడివి అని చెప్పవలసిన అవసరం లేనంత గొప్పవాడు,’ అని నేను 1983 తెలుగువెలుగు (షికాగో) రాత పత్రికకి సంపాదకుడిగా రాశాను. మా పత్రికకి మీ బొమ్మలు కావాలి, అని అడగంగానే, పాతిక పైచిలుకు బొమ్మలు – అట ్టమీద వేసుకోడానికి గాను పెద్ద సైజు బొమ్మలు – గ్యాప్‌ ఫిల్లర్స్‌ లాగా వాడుకోటానికి మరో పాతిక చిన్న సైజు బొమ్మలు, పంపించాడు బాపు.
తరువాత, ఆ బొమ్మలన్నీ సెయింట్‌ లూయిస్‌ తానా వాళ్ళకిచ్చాను, ప్రదర్శన కోసం! అంతే! ఆ బొమ్మలే కొన్ని సంవత్సరాల పాటు అమెరికా తెలుగు పత్రికలన్నింటినీ అలంకరించాయి.
1985లో లాస్‌ ఏంజిల్స్‌ తానా సభలు అయిన తరువాత, ఒక వారం రోజులుండేట్టు చికాగో వస్తున్నానని చెప్పాడు. ఆయన్ని అప్పుడు అడిగాను, అక్కడ బొమ్మల కొలువు పెట్టారా? అని. సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. వెంటనే, విశాల షికాగో తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఒక బొమ్మలకొలువు పెట్టాం. దగ్గిర దగ్గిర మూడు వందల మంది వచ్చారు, బొమ్మలు చూడటానికి!
తరువాత, ఆయన్ని చాలాసార్లు కలిశాను; భారతంలోను, అమెరికాలోనూ!
ఒకసారి ఆయన, పెమ్మరాజు వేణుగోపాలరావు, నేనూ హ్యూస్టన్లో సదస్సుకి వచ్చాం. కారులో ఆయన్ని, రావుగారినీ సదస్సుకి తీసుకెళ్ళాలి. ‘బాపు! మీరు వెనక సీటులో కూచోండి, రావు గారు ముందు కూచుంటా రు. ఆయన నాకు డైరెక్షన్లు చెప్పాలి,’ అన్నాను. ‘నేనూ డైరెక్టరునే! ఆ పని నేను చెయ్యలేననుకున్నావా?’ అన్నాడు. మాకు నవ్వాగలేదు.
ఇప్పుడు బాపు లేడు. అమెరికా తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో వేమన పద్యాల పుస్తకం ఉండక పోవచ్చు. బాపు వేసిన బొమ్మ ఉండి తీరుతుంది.
– వేలూరి వెంకటేశ్వరరావు

సారీ బాపూ! నీ కుంచెలో నేనొదిగిపోలేను
కోమలం లేదు, లాప్‌టాప్‌ బరువులలో
మధురం లేదు-
పరుగుల వేటలో సౌందర్యం పారిపోతోంది
పని నిండిన ఆఫీసుల్లో
లాలిత్యం లేదు లిఫ్ట్‌లు
సారీ బాపూ! నీ కుంచెలో నేనొదిగిపోలేను
వాల్జడ లేదు నిమిషాలను గమనించటానికి
స్పాలో వదిలేశాను
వయ్యారం అడ్రస్‌ లేదు, బాస్‌ల శాల్యూట్‌లతో
బారెడు కళ్ళున్నాయి తెరచి చూస్తే అత్యాచారాలు
లంగావోణీలంటే స్పీడ్‌ వాక్కులు నాలుగు పల్టీలు
సారీ బాపూ! నీ కుంచెలో నేనొదగలేను
చిగురాకుల చిలకమ్మను పలికించాలంటే
రూపాయలివిగో శ్రమ ఫలితాలంటాయి
విరిసిన చిరునవ్వు కావాలనుకున్నా సుడిగాలులెదురొస్తాయి
మీటుతున్న హృదయ హేల రొటీనుతో పాషాణమయింది
అరనవ్వుల అధరాలు లిప్‌స్టిక్‌ మాటున దాగిపోతున్నాయి
సారీ బాపూ! నీకుంచెలో నేనొదగలేను.
నా మనసున తెలియని నీవు ఎదురుతెన్నులు చూసి చూసి
అలసిపోయి వెళ్ళిపోయాయి..
మరలా జన్మించు నీ గీతలో నన్ను మలచటానికి రమణను
మర్చిపోకే..!
సారీ బాపూ! నీ కుంచెలో నేనొదగలేను.
– వసుమతి చలసాని
9989944128

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు కు సరసభారత నివాళి -ఆంద్ర జ్యోతి వార్త -7-9-14

nivali -bapu 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్

ఇంటినిండా గణపయ్యలే..!
మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను సేకరించడమంటే మాటలు కాదు… చవితి ఉత్సవాల్లో తరిస్తున్న శంకర్‌ ‘నవ్య’తో ముచ్చటించారిలా..
‘‘అది 1973 నాటి మాట. అమ్మానాన్నలతో కలిసి షిరిడీకి తీర్థయాత్ర వెళ్లాను. అక్కడ ఓ బుల్లి గణపయ్య కనిపిస్తే.. నాన్న దగ్గర యాభై పైసలు తీసుకుని కొనుక్కున్నాను. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహం అది. ఆ రోజే ఎందుకో వినాయక విగ్రహాలు సేకరిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన కలిగింది. అక్కడి నుంచే నా ప్రస్తానం మొదలైంది. మా కుటుంబ సంగతికొస్తే – అమ్మానాన్నలు మహరాషీ్ట్రయులు. నాన్న బ్యాంకులో పనిచేసి రిటైరు అయ్యారు. మేము హైదరాబాద్‌లో స్థిరపడటం వల్ల చదువంతా ఇక్కడే సాగింది. ప్రస్తుతం నేను కూడా బ్యాంకులోనే పనిచేస్తున్నాను. పదిహేనువందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్నాను. ప్రస్తుతం ఈ ఇంట్లో సగభాగం బొజ్జ గణపయ్యదే! హాలు, రెండు బెడ్‌రూములు ఆయన విగ్రహాలతోనే నిండిపోయాయి. భవిష్యత్తులో ఇదే ఇంటిమీద రెండో ఫ్లోరు కట్టించి.. ఆ ఫ్లోరును మ్యూజియంగా మార్చే ఆలోచన ఉంది. అందులో ఈ విగ్రహాలన్నింటినీ కొలువుతీర్చి.. సందర్శకుల కోసం స్వల్పమొత్తంలో టికెట్‌ పెట్టాలనుంది. ఆ వచ్చిన మొత్తాన్ని వ్యక్తిగతమైన అవసరాలకు వాడుకోకుండా.. అనాధాశ్రమానికి ఇద్దామన్న ఆలోచన చేస్తున్నాను.
విదేశాల నుంచి… 
నేను సేకరించిన 32 వేల విగ్రహాలలో యాభై పైసల నుంచి యాభైవేల రూపాయల వరకు విలువగలవి ఉన్నాయి. ఇన్ని విగ్రహాలను కొనడానికి ఎంత ఖర్చు అయ్యుంటుంది అని వచ్చిపోయేవాళ్లు అడుగుతుంటారు. అలాంటి లెక్కలన్నీ నేను వేసుకుంటూ కూర్చుంటే ఇంతమంది గణపయ్యలు నా ఇంటికి వచ్చేవారా.. మీరే చెప్పండి? అందుకే నేను ఏ నాడు ఇంత మొత్తం అయ్యిందని లెక్కపెట్టలేదు. నా సంపాదనలో కొంత భాగాన్ని విగ్రహాల కోసం వెచ్చించేవాణ్ణి. అంతే! ఇదిగో మొన్ననే నేపాల్‌ నుంచి తొమ్మిది వినాయక విగ్రహాలను తెప్పించాను. మరొక విలువైన విగ్రహం తమిళనాడులోని కుంభకోణం నుంచి వచ్చింది. ఇది చాలా విభిన్నమైన విగ్రహం. పాతిక కిలోల బరువుంది. ధర ముప్పయివేలు. విగ్రహాలన్నీ కేవలం ఇండియాలో తయారైనవే కాదు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌, ఇండోనేషియా, మలేసియా.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ నుంచి.. తెప్పించాను. ఒక్కోసారి జేబులో డబ్బులేకపోయినా.. సరే ఇబ్బందులను పక్కనపెట్టి సేకరించిన సందర్భాలు ఉన్నాయి. విగ్రహాలలో ఆకారంలోను, వాడిన మెటీరియల్‌లోను, రంగులోను భిన్నమైనవి. అన్నీ ఒకే ఎత్తు లేవు. అర అంగుళం నుంచి 4.5 అంగుళాల మధ్య ఉంటాయివి. విగ్రహాల తయారీకి వాడిన లోహాలు పలు రకాలు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, మట్టి, బంగారు, వెండి, గాజు, పాలరాతితో తయారైనవి ఎక్కువ. నేను కేవలం విగ్రహాల సేకరణకే పరిమితం కాలేదు. వినాయకుని రూపంలో వచ్చిన పోస్టర్లు, పుస్తకాలు, కీచెయిన్‌లు, ఆడియో- వీడియో క్యాసెట్లు, భజనపాటలు ఇలా ప్రతిదాన్నీ దాచిపెడుతున్నాను.
విశ్వవినాయక గ్రంథం .. 
వీటన్నిటికంటే గొప్ప కార్యం మరొకటుంది. దేశవ్యాప్తంగా వినాయకునికి ఉన్నన్ని దేవాలయాలు మరొక దేవునికి లేవు. ఒక్కో ఆలయానిది ఒక్కో చరిత్ర. అవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క బెంగళూరులోనే పదిహేనువందల గణపతి ఆలయాలు వెలశాయి. మహారాష్ట్రలో అయితే లెక్కపెట్టడం కష్టం. విదేశాలలోను అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. ఇలా ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలన్నింటి సమాచారం సేకరిస్తున్నాను. వీటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా వేద్దామన్నది ఆలోచన. అయితే పరిశోధనలోకి అడుగుపెట్టగానే ఒక పుస్తకం సరిపోదు అనిపించింది. అందుకే మెల్లగా అయినా సరే.. సమాచారమంతా చేతికొచ్చాక.. వాల్యూమ్స్‌ రూపంలో తీసుకొద్దామని కృషి చేస్తున్నాను. ఈ విధంగా నా జీవితం మొత్తం గణపయ్యకే అంకితం చేశాను. నా కొడుకుకు కూడా గణేష్‌ అని పేరు పెట్టాను. కూతురు సంజన, భార్య అనురాధ కూడా ఇంట్లోని విగ్రహాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నా అభిరుచిని మెచ్చి ఇప్పటికే లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ దగ్గర నుంచి పలు విలువైన గుర్తింపులన్నీ వచ్చాయి. మన దేశంలో నాకు తెలిసినంత వరకు నా దగ్గరున్నన్ని గణపతి విగ్రహాలు మరొకరి దగ్గర లేవు. ఇదంతా నేను చేసిన ఘనకార్యం కాదు. పైనున్న ఆ విజ్ఞేశ్వరుడే చేయించాడు..’’
– నవ్య డెస్క్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ

తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్‌ ఆర్‌ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్‌ ఆర్ట్స్‌.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్‌ ఆర్ట్స్‌ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టిన సినిమా కూడా ఇదే. భారతీరాజా తమిళంలో తీసిన ‘మన్‌ వాసనై’( మట్టి వాసన) చిత్రానికి ఇది రీమేక్‌. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడమే కాకుండా కమర్షియల్‌ అంశాలు జోడించిడంతో తెలుగు ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. బాలకృష్ణకు ఇది 15వ సినిమా. సోలోగా ఆయన నటించిన నాలుగో సినిమా. ఆయనకు ఇదే తొలి శతదినోత్స చిత్రం. అత్యధిక స్థాయిలో 565 రోజులు ఈ చిత్రం ప్రదర్శితమవడం ఒక రికార్డ్‌. సినిమాలో పంచె కట్టుతో బాలకృష్ణ కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే తొలిసారిగా ఒక పాటలో రాముడు, కృష్ణుడు గెటప్స్‌లో ఆయన కనిపిస్తారు. సుహాసిని కథానాయిక. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన భానుమతీరామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 1984 సెప్టెంబర్‌ 7న ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం విడుదలైంది. నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ‘చిత్రజ్యోతి’కి వివరించిన విశేషాలు ఆయన మాటల్లోనే…

మద్రాస్‌లో చూసిన ఓ చిన్న సినిమా ఈ కథకు స్పూర్తి.. ఓసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా గోపాల్‌రెడ్డిగారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రొసీడ్‌ అన్నారు. అప్పటి వరకు భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థ రెండు చిన్న సినిమాలు తీసింది.. ఆ బ్యానర్‌ నుండి వచ్చిన తొలి పెద్ద చిత్రమిది. చిన్న సినిమాలతో హ్యాపీగానే ఉన్నారుగా పెద్ద బడ్జెట్‌ చిత్రాలవైపు వెళ్ళడం ఎందుకని చాలామంది గోపాలరెడ్డిగారిని నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేశారాయన. బాలకృష్ణని హీరోగా తీసుకుందాం నేటివిటీ, సెంటిమెంట్‌ పాత్రలకు అతనే సూటవుతాడని చెప్పగానే అందుకు కూడా ఆయన అంగీకరించారు.

నిర్మాత భయపడ్డారు…
ఇందులో బాలయ్యకు బామ్మగా భానుమతిగారిని తీసుకుందాం అనగానే గోపాల్‌రెడ్డిగారు ఆమె చాలా యారొగెంట్‌ అని, టైమ్‌కి సరిగా రాదని, ఎక్కువ డిమాండ్‌ చేస్తుందేమోనని భయపడ్డారు. అదేంకాదని ఆయన్ని భానుమతిగారి దగ్గరకు తీసుకెళ్లాను. గోపాలరెడ్డిగారి భయం గురించి చెప్పగానే ఆవిడ పక్కున నవ్వి… ‘ఏమనుకుంటున్నావ్‌ నా గురించి, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌తో సినిమాలు చేశాను. మొదట్నుంచీ నాకు సిస్టమేటిక్‌గా ఉండడం అలవాటు. దాన్ని యారోగెంట్‌ అనుకుంటే నేనేమీ చేయలేను. ఈ కథ నచ్చింది కాబట్టి మీరు చెప్పిన సమయానికి వచ్చి యాక్ట్‌ చేసి వెళ్తాను’ అని భరోసా ఇచ్చాక గోపాలరెడ్డి శాంతించారు.
ఆ డైలాగ్‌లు పలకలేనంది…
ఈ సినిమాలో మనవడి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, బామ్మ పాత్రకు కూడా అంతే ఉంది. ఓ రోజు భానుమతి గారి దగ్గరకు వెళ్ళి కొన్ని డైలాగ్‌లు చెప్పాను. వాటిని వినగానే‘ ఈ సినిమా నేను చెయ్యను. ఈ శృంగారపు సంభాషణల్ని నేను పలకలేను. విప్రనారాయణ వంటి సినిమాలు చేసిన నాతో ఇలాంటి డైలాగ్‌లు పలికిస్తావా? ఏమనుకుంటున్నావ్‌ భానుమతంటే’ అని కసిరేసి, ‘ ఆ మాటలు తొలగిస్తే… యాక్ట్‌ చేస్తా’ అనేశారు. మళ్ళీ గోపాలరెడ్డిగారికి టెన్షన్‌ మొదలైంది. అలాకాదని ఆమెకు నచ్చజెప్పి షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఉదయం 9 గంటలకు భానుమతిగారిని సెట్‌కి తీసుకెళ్ళి క్లోజ్‌ షాట్‌లో ఓ డైలాగ్‌ చెప్పించాను. ‘భయంగల బుల్లి బావగారొచ్చారని బట్టల్లేకుండా లేచి నిలబడింది’ అనే ఆ డైలాగ్‌ని ఆమె స్టైల్లో చెప్పించేసరికి షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నవాళ్ళతోపాటు షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చప్పట్లతో కోలహలం చేసేశారు. ‘భానుమతి డైలాగ్‌ చెప్తే జనాల స్పందన ఎలా ఉందో చూశావా’ అని ఆనందించారామె. ‘అమ్మా ఇందులో ఉన్న డైలాగ్‌లన్ని చెప్తే… థియేటర్‌ దద్దరిల్లిపోతుంది’ అనగానే ‘అంతేనంటావా’ అని సంతృప్తి చెందారు. ఆ ఆనందంలో అంతకుముందు తను చెప్పనన్న డైలాగులన్నీ చెప్పేశారు.
బాలయ్య పట్టుదల 
బాలకృష్ణ, నా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రమిది. ఈ సినిమాను 70 మంది యూనిట్‌తో మద్రాస్‌, ఆ పక్క గ్రామాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. దీని కోసం బాలయ్య 40 రోజులు పనిచేశారు. మొత్తం సినిమా 48 రోజుల్లో పూర్తయింది. ప్రతి రోజు చెప్పిన టైమ్‌కంటే ముందు సెట్‌లో ఉండేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌లను అడిగి ఈ రోజు సీన్లేంటి అని తెలుసుకుని ఏకాగ్రతతో పనిచేసేవారు.. ఒకసారి బాలయ్య మాంచి జోరు మీద డాన్స్‌ చేస్తుండగా ఓ కాలులో చెట్టు మోడు దిగిపోయింది. అంతే. బాలయ్యని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాం. డాక్టర్‌ కాలుకి రెస్ట్‌ అవసరం అని చెప్పడంతో సాంగ్‌కి గ్యాప్‌ ఇచ్చి వేరే సీన్లు చేద్దామని నిర్మాతకు చెప్పాను. మర్నాడు ఉదయం బాలయ్య సెట్‌కొచ్చి సాంగ్‌ పూర్తి చేసేద్దాం నాకేమీ నొప్పి లేదు అంటూ ఆ సాంగ్‌ పూర్తి చేశారు. అప్పుడే పట్టుదల, క్రమశిక్షణ అనేది బాలయ్యలో చూశాను. అదే క్రమశిక్షణ, అంకితభావం ఆయనలో ఇప్పటికీ ఉంది. ఈగో అనేది ఆయనకి తెలీదు. సిఎమ్‌ కొడుకుని అనే ఫీలింగ్‌ ఆ రోజుల్లో ఆయనకి ఉండేదికాదు.
సొంత మనవడిలా చూసేది…
భానుమతిగారితో సెట్లో చాలా గౌరవంగా ఉండాలని ఎన్టీఆర్‌ స్వయంగా బాలయ్యకు చెప్పారట. అందుకే బాలయ్య ఆమె అంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. ఆవిడ కూడా బాలయ్యని సొంత మనవడిలా చూసేది. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండడంతో ఆ పాత్రలు పండాయి.
ఎన్టీఆరే స్వయంగా మేకప్‌ వేయించారు..
ఇందులో బాలకృష్ణతో రాముడు-కృష్ణుడు పాత్రలు వేయించాను. ‘నాన్నగారు చేసిన పాత్రలు చేయడం నా వల్ల కాదు. అది ఆయనకే సూటవుతుంది’ అంటూ మొదట్లో బాలకృష్ణ ఒప్పుకోలేదు. గోపాలరెడ్డిగారు కూడా ఎన్టీఆర్‌ నటించిన పాత సీన్స్‌ ఇందులో ఉపయోగిద్దాం అన్నారు. నేనేమో బాలయ్యతోనే చేయాలని ఫిక్స్‌ అయ్యాను. దాంతో తరువాత రోజు బాలయ్య ఆ పాత్రలకు తగ్గట్టు రెడీ అయివచ్చారు. మేకప్‌ టెస్ట్‌ చేశాం అంతా ఓకే అయింది. షూటింగ్‌ రోజున ఎన్టీఆర్‌గారి పర్సనల్‌ మేకప్‌మెన్‌ పీతాంబరం సెట్‌కి వచ్చారు. ఏంటిలా వచ్చారని బాలయ్య పశ్నించగా నాన్నగారు పంపారని చెప్పాడాయన. కాసేపట్లో స్వయంగా ఎన్టీఆర్‌గారే వచ్చారు. ‘రాముడు- కృష్ణుడు పాత్రలంటే వేళాకోళం అనుకుంటున్నారా? ఆ వేషం వేరేవారు వేయడం వేరు. రామారావు కొడుకు వేయడం వేరు’ అని ఆయన తొడపై బాలయ్యను కూర్చోబెట్టుకుని పీతాంబరం చేత మేకప్‌ వేయించారు. ఆయనే స్వయంగా బొట్టు పెట్టారు. ఆ పాత్రల్లో బాలయ్యని చూసి ఆడియన్స్‌ థ్రిల్‌ అయ్యారు.
ప్రశ్నించడం నిర్మాత లక్షణం…
ఏ నిర్మాతకైనా తన సెట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రశ్నించే లక్షణం ఉండాలి. అప్పుడే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. గోపాలరెడ్డిగారు విజన్‌ ఉన్న నిర్మాత. సినిమా విషయంలో ప్రేక్షకుడిలా ఆలోచించేవారు. ఈ సినిమా కోసం ఆయన అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. ‘మంగమ్మగారి మనవడు’ నాకు, బాలకృష్ణకి, భార్గవ ఆర్ట్‌ సంస్థకి ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే గోపాలరెడ్డిగారు పెద్ద నిర్మాతగా మారారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యెన్ టిన్ ఆర్ ను నేనే మార్చాను -అన్న దర్శకుడు కె బాపయ్య

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం..

నేపథ్యం.. 
మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను గ్రామం. నాకు ఇద్దరు తల్లిదండ్రులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు సుమతి, సత్యనారాయణ. అయితే నా మూడవ యేట అమ్మ, ఐదవ యేట నాన్న చనిపోవంతో మా బాబాయి కె.ప్రకాశరావుగారే నన్ను పెంచి పోషించారు. ఆయనను నేను ‘డాడీ’ అనే పిలుస్తాను. ప్రకాశరావు దంపతులే నన్ను ఇంతవాణ్ని చేశారు. నా ఇంటర్‌ చదువు పూర్తయ్యే నాటికి డాడీ ప్రముఖ డైరెక్టర్‌. మాకు చెన్నైలో స్టూడియో వుండేది. సెలవుల్లో సీనియర్‌ డైరెక్టర్‌ తిలక్‌ వద్ద పని నేర్చుకోమని నాన్న సూచించారు. తిలక్‌ గారు మొదట్లో ఫిల్మ్‌ ఎడిటర్‌. ఆయన వద్ద కొంచెం కొంచెం పని నేర్చుకున్నా. ఆ సమయంలోనే ఎడిటింగ్‌ నుంచి ఆయన దర్శకత్వంలోకి మారారు.

‘‘మీరు చెబితే నమ్మరు. నేను చేసిన తొలి సినిమా ‘ద్రోహి’ సూపర్‌డూపర్‌ ఫ్లాప్‌. ఇప్పటి వరకూ అంత చెత్త సినిమా మరెవ్వరూ తీయలేదేమో! ఆ సినిమాకు నాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చింది రామానాయుడు గారు. హీరో లేని సబ్జెక్టుతో కథ రూపొందించి సినిమా తీసాం. ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లో కూడా తీశారు. అక్కడ కూడా ఫ్ల్లాపే. ద్రోహి సినిమా ఫ్లాపవ్వడంతో మళ్లీ డాడీ (కె. ప్రకాశరావు) తీసిన ‘ప్రేమనగర్‌’కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశా. ఆ తరువాత ‘మేమూ మనుషులమే’ తీశాం. ఈ రెండూ హిట్లు కావటంతో క్రాంతికుమార్‌ ‘ఊర్వశి’కి అవకాశం ఇచ్చారు. అదీ హిట్టే. ఆ తర్వాత తీసిన ‘వైకుంఠపాళి’ కూడా బాగా ఆడింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఎదురులేని మనిషి!
1974 ప్రాంతంలో ఎన్‌టీఆర్‌ వయసు ముదిరిన పాత్రలు చేస్తున్నారు. మరోవైపు అక్కినేని తన స్టెప్పులతో దూసుకుపోతున్నారు. ఎన్‌టీఆర్‌ ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా వున్నా కొంతమందికి వెనుకంజలో వున్నారేమో అన్న భావన వుండేది. ఆ సమయంలో ఆయన హీరోగా ‘ఎదురు లేని మనిషి’ సినిమా తీశాను నేను. దీనికి వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్‌ నిర్మాత. ఒకరకంగా చెప్పాలంటే ఎన్‌టీఆర్‌ను కొత్తగా చూపించాలన్న ఉద్దేశంతో పట్టుబట్టి మరీ ఆ సబ్జెక్టుతో సినిమా తీశా. ఆ సినిమాలో అప్పటి వరకూ ఎన్‌టీఆర్‌ వేయని డ్రెస్సులు, స్టెప్పులు వేశారు. షూటింగ్‌లో కూడా ‘ఇవన్నీ అవసరమా బ్రదర్‌’ అనేవారు. ఆ సినిమా కెమెరామెన్‌ కూడా ‘ఆ డ్రెస్సులు, డ్యాన్సులు చూడలేకపోతున్నాను. జనం ఈ సినిమాను చూడలేరు’ అని పెదవి విరిచేశాడు. డాడీ అయితే ‘బయట టాక్‌ లేదు. ఈ సినిమా విడుదల చేయవద్దు’ అన్నారు. రామానాయుడుగారు చూసి ‘ఇక ముందైనా ఇలాంటి రిస్క్‌ తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చారు. ఇంత మంది పెద్దల మాటలు విన్న తర్వాత నాలో భయం మొదలయింది. నా అసిస్టెంట్లు బయట రష్‌ చూద్దామని సినిమా రిలీజ్‌కు ముందురోజు కారులో నెల్లూరు వెళ్లారు. ఆ రాత్రికి హోటల్లో పడుకొని ఉదయాన్నే థియేటర్‌ వద్దకెళ్లేసరికి విపరీతంగా జనాలున్నారట. వారు వెళ్లేసరికే ఉదయం 5 గంటలకు మొదలైన షో పూర్తి కావస్తోంది. సినిమా బ్రహ్మాండమని టాక్‌. అది బాగా ప్రచారం కావటంతో విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి. ‘ఏదో మనవాడు అడిగాడు కదా అని చేశాను. జనం ఏ మేరకు రిసీవ్‌ చేసుకుంటారోనని నాకూ అనుమానంగానే ఉండేది. ఇంత హిట్టవుతుందని అనుకోలేదు. కానీ ‘బాపయ్య హిట్‌ చేశాడు’ అని ఎన్టీఆర్‌ వందో రోజు ఫంక్షన్లో ప్రశంసించటం మరచిపోలేని అనుభవం.
ఎన్టీఆర్‌తో అనుభవాలు!
నేను బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత బాగా బిజీ అయిపోయా. ఎంత బిజీ అంటే- కొన్నిసార్లు ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌ పూర్తి చేసేందుకు అదనపు డేట్స్‌ ఇవ్వడం కూడా కష్టమయ్యేది. ‘యుగపురుషుడు’ పూర్తిచేయటం కుదరకపోవటంతో- దానిలో రెండుమూడు సీన్లను డాడీయే తీశారు. అలాగే కృష్ణ హీరోగా నటించిన ‘ఊరికి మొనగాడు’ విషయంలో కొంత కాంప్రమైజ్‌ కావాల్సి వచ్చింది. దీనిలో కూడా కొన్ని సీన్లకు నాన్న దర్శకత్వం వహించారు. ఎన్‌టీఆర్‌ ఔట్‌డోర్‌ షూటింగ్‌కు రావడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఆయన ‘సాహసవంతుడు’ సినిమాను ఏకంగా నేపాల్‌లో షూట్‌ చేశాం. విదేశాల్లో షూటింగ్‌ జరుపుకున్న ఆయన తొలిచిత్రమదే. ఓ సన్నివేశం విమానంలో తీయాలి. అప్పట్లో ‘మౌంటెయిన్‌ ఫ్లయిట్స్‌’ అని వుండేవి. సందర్శకులు మంచుపర్వతాలను చూసేందుకు ఏర్పాటు చేసిన విమానాలవి. ముందస్తు అనుమతి తీసుకుని ఆ విమానంలో షూటింగ్‌ మొదలుపెట్టాం. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా ఉదయం పూట షూటింగ్‌ ప్రారంభించాం. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు బంగారురంగులో సూర్య కిరణాలు కనిపించాయి. పాత్రలో లీనమైన ఎన్‌టీఆర్‌ ఆ సూర్య కిరణాలు చూడగానే బిగుసుకుపోయారు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనై ఆ సుందర కిరణాలకు అలా ముకుళిత హస్తాలతో నమస్కరించారు.
అమితాబ్‌తో తప్ప.. 
ఎదురులేని మనిషి తరువాత ‘సోగ్గాడు’, ‘ముందడుగు’, సినిమాలకు దర్శకత్వం వహించా. అవీ హిట్టే. ఆ తరువాత కృష్ణ హీరోగా ‘ఇంద్రధనుస్సు’ చేస్తుండగా ‘సోగ్గాడు’ సినిమాను హిందీలో తీయాలని రామానాయుడు పిలిచారు. 1977లో జితేంద్ర, రేఖలతో తీసిన ఆ సినిమానే ‘దిల్‌దార్‌’. రామానాయుడు గారి వల్లనే బాలీవుడ్‌కు వెళ్లాను. ఆ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏకబిగిన హిందీలో 45 సినిమాలకు దర్శకత్వం చేశా. పద్మాలయ వారు తొలిగా హిందీలో జితేంద్ర హీరోగా ‘టక్కర్‌’ సినిమా తీశారు. దానికి నేనే దర్శకత్వం. ‘ఘర్‌ ఏక్‌ మందిర్‌’, ‘మవ్వాలి’, ‘మక్సద్‌’, ‘స్వర్గ్‌ సే సుందర్‌’, ‘పాతాళ భైరవి’ వంటి ఎన్నో సినిమాలు ఏడాదిపాటు థియేటర్లలో నిరంతరాయంగా ఆడాయి. ఒక్క అమితాబ్‌తో తప్ప మిగిలిన ఆ తరం బాలీవుడ్‌ హీరోలందరితోను పనిచేశా. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తీద్దామని కొంతమంది నిర్మాతలు వచ్చారు. అప్పుడు ఇద్దరికీ డేట్స్‌ కుదరలేదు. ఇద్దరికీ డేట్స్‌ కుదిరేటప్పటికీ అమితాబ్‌ బాగా డౌన్‌లో వున్నారు. అప్పుడాయన ‘ఖుదా గవా’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమా అయిన తరువాత ఆలోచిద్దామని అన్నారు. కానీ ఆ తరువాత ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. దాంతో సినిమా తీయలేకపోయాం. హిందీలో నా చివరి చిత్రం మిథున్‌ చక్రవర్తి-మధుబాల జంటగా 2000 సంవత్సరంలో రూపొందిన ‘దియా ఔర్‌ తూఫాన్‌’.
అవి మాఫియా సినిమాలే!
నేను బాలీవుడ్‌లో ఉన్న సమయంలోనే మాఫియా వేళ్లూనుకుంది. నటులకు, డైరెక్టర్లకు భాయ్‌ల (మాఫియా) దగ్గర నుంచి బెదిరింపులు వస్తుండేవి. దిలీప్‌కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, శ్రీదేవిలతో మెహబూబ్‌ స్టూడియోలో ‘ఇజ్జత్‌దార్‌’ అనే సినిమా ప్లాన్‌ చేశాం. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు రోజు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ సినిమా ప్రారంభిస్తే చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని నిర్మాతలకు చెప్పా. వారూ కొంత జంకారు. ఏదైతే అదవుతుందనుకుని సినిమా మొదలుపెట్టాం. స్టూడియో గేట్‌ నుంచి ఫ్లోర్‌ వరకూ కొన్ని వందలమంది సెక్యూరిటీ వారిని ఏర్పాటు చేసి షూటింగ్‌ ప్రారంభించాం. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలో మిథున్‌కు బదులు గోవిందాను, శ్రీదేవికి బదులు మాధురీదీక్షిత్‌ను తీసుకోవాల్సి వచ్చింది. కొంత కథను కూడా మార్చాల్సి వచ్చింది. మిథున్‌ చక్రవర్తి హీరోగా నిర్మితమైన ‘ముద్ధత్‌’, రిషికపూర్‌ హీరోగా ‘కసక్‌’ సినిమాలు మాఫియావారు తీసినవే. అయితే ఆ సినిమాలు తీసేటప్పుడు మాకు ఆ విషయం తెలియదు. ఆ తరువాత తెలిసింది అవి మాఫియా గ్యాంగ్‌లు వెనుకుండి తీయించిన సినిమాలని. ఎవరో వచ్చారు, అడ్వాన్స్‌ ఇచ్చారు. కథ నచ్చింది సినిమా తీసేశాం. ఆ మనుషులు మాఫియా వారా కాదా అని అప్పుడు మనకు తెలియదు కదా! మాఫియా బెదిరింపులు చాలానే వచ్చేవి. ఒకరకంగా చెప్పాలంటే నన్ను కొంతవరకు ఇబ్బంది పెట్టాయి కూడా. ఇప్పుడు కార్పొరేట్‌ వారు బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడంతో మాఫియా రగడ తగ్గింది. కాకుంటే కార్పొరేట్‌ సంస్థల వల్ల చిన్న సినిమా బ్రతికే పరిస్థితి లేకుండా పోతోంది. అవార్డులు వచ్చాయా లేదా అనే విషయాన్ని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ హాలీవుడ్‌కు వెళ్లాలని మనసులో బాగా కోరిక వుండేది. ఒక యూకే సినిమా కోసం అప్పట్లో నేను అడ్వాన్స్‌ కూడా తీసుకున్నా. కానీ డేట్స్‌ కుదరక ఆ అవకాశం మిస్సయ్యా.
ఎన్టీఆర్‌ మంచి విద్యార్థి!
తెలుగులో ఎన్‌టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణలతో బాగా సాన్నిహిత్యం. కథ వినేంత వరకే ఎన్‌టీఆర్‌ సీనియర్‌ నటుడు. షూటింగ్‌ ప్రారంభమైందంటే ఆయన మంచి విద్యార్థే. డైరెక్టర్‌ చెప్పినట్లు చేయడమే ఆయన లక్ష్యంగా వుంటుంది. డైరెక్టర్‌ అనుకున్న పర్‌ఫెక్షన్‌ వచ్చేంత వరకు ఆయన కష్టపడతారు. నేను, మా రాఘవేంద్రరావు ఎన్‌టీఆర్‌కు మోడ్రన్‌ థింకింగ్‌, మోడ్రన్‌ ఫ్యాషన్‌ అలవాటు చేశామనే చెప్పుకోవచ్చు. ఎన్‌టీఆర్‌కు సహాయం చేసే గుణం అధికం. ఆయన స్వంత బ్యానర్‌లో సినిమా తీసేటప్పుడు అధికారికంగా ఇచ్చింది కాకుండా ‘మీకేమైనా డబ్బు కావాలంటే చెప్పండి బ్రదర్‌’ అని అడిగేవారు. స్థిరాస్తులు కొనాలంటే ఆయన ఎంతైనా ఇచ్చేవారు. కానీ కారు కొనాలంటే మాత్రం పైసా కూడా విదిల్చేవారు కాదు. వృథా ఖర్చులకు డబ్బెందుకు ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. ఇక హిందీలో దిలీప్‌కుమార్‌ అంటే నాకు చాలా ఇష్టం. అంకితభావానికి, క్రమశిక్షణకు, పట్టుదలకు ఆయన మారుపేరు. నిత్యకృషీవలుడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎనలేని గౌరవం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో! ఒక సన్నివేశంలో నటించాలంటే దాని బ్యాగ్రౌండ్‌ ఏంటి, అప్పటి పరిస్థితేంటి, ఆ తరువాత స్థితిగతులేంటి అన్న విషయాలన్నీ తెలుసుకుని, అవగాహన చేసుకుని నటిస్తారాయన. దిలీప్‌కుమార్‌కు ఎన్నో భాషలు తెలుసు. ఆయనతో నేను రెండు సినిమాలు చేశాను. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు 10 సినిమాల అనుభవం వస్తుంది. ఇది నా మాట కాదు, మిగతా ఆర్టిస్టుల మాట కూడా.
మనకు సక్సెస్‌రేటు తక్కువ
అప్పటికీ ఇప్పటికీ డైరెక్టన్‌, స్టోరీ తీరులో మార్పు లేదు. టెక్నాలజీలో, దాని వినియోగంలోనే మార్పు వచ్చింది. తమిళంలో అప్పుడూ ఇప్పుడూ మంచి కథలే వున్నాయి. అవి నేటివిటీకి దగ్గర్లో వుంటాయి. ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేయడానికే తమిళ దర్శకులు ప్రయత్నిస్తారు. ‘ప్రేక్షకుడిని రంజింపజేయడానికే సినిమా తీస్తున్నాం’ అన్న స్పృహ వారి మనసులో ప్రధానంగా వుంటుంది. అందుకే కోలీవుడ్‌లో సక్సెస్‌రేట్‌ అధికం. బాలీవుడ్‌లో మరీ ఎక్కువ. అది తెలుగులో కనిపించదు.
– డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment