ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా కు చిన్నారి మదర్ తెరిస్సా అని పించుకొన్న పార్వతి (పార్బతి)గిరి ప్రముఖ సాంఘిక సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధురాలు .ఒరిస్సా లోని సంబల్ పూర్ జిల్లా బీజాపూర్ దగ్గరున్న సమలైపాదర్ అనేగ్రామం లో 1926లో జన్మించింది .ఈమె జననానికి ముందే స్వాతంత్ర్యోద్యమ విషయం ఒరిస్సా లోని అన్ని గ్రామాలకు పాకింది .పార్వతి జన్మించిన గ్రామం రాజకీయాలకు ముఖ్య కేంద్రం గా ఉండేది .లక్ష్మినారాయణ మిశ్ర ,దుర్గా ప్రసాద్ గురు మొదలైన ఉద్యమ నాయకులు అక్కడ నుంచే పని చేశారు .అక్కడే కాంగ్రెస్ సభల గురించి చర్చలు తీవ్రం గా జరిగేవి .స్కూల్ లో చదువుతున్నప్పుడే పార్వతికి రాజకీయాలపై ద్రుష్టిపడి ,తానూ వారిలా ఉద్యమాలలో పాల్గోవాలనే కోరిక ఏర్పడింది .అక్కడ జరిగే కాంగ్రెస్ సభలకు హాజరౌతూ ,ప్రేరణ పొందేది .మూడో క్లాస్ చదువుతున్న పార్వతి కాంగ్రెస్ సభ్యత్వం కోసం గ్రామాల వెంట తిరిగి చేర్పించేది .
1937లో సంబల్ పూర్ లో కాంగ్రెస్ సభ జరిగింది .కాంగ్రెస్ నాయకులు ఆమె చురుకుదనాన్ని గుర్తించి తండ్రిని ఆమె సేవలు కాంగ్రెస్ సంస్థకు అవసరమని ,తమకు ఆమె ను కార్య కర్తగా తీర్చి దిద్దే అవకాశం ఇవ్వమని అర్ధించారు .మరుసటి సంవత్సరం సంబల్ పూర్ లో పెద్ద కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం జరిగింది .మాలతి చౌదరి ,ప్రాణ కృష్ణచౌదరి వంటి ప్రముఖులు పాల్గొని ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు .మళ్ళీ కాంగ్రెస్ నాయకులు పార్వతి తండ్రిని ఆమె సేవలు పార్టీకి అందించే సహాయం చేయమని విన్నవించారు .అనేక సార్లు ఆలోచించి తండ్రి ఒప్పుకొన్నాడు .రమాదేవి నడుపుతున్న బారి ఆశ్రమం లో పార్వతి చేరింది .
ఒక మైనర్ బాలిక ఇలా ఇల్లు వదిలి ఒక ఆశ్రమంలో చేరటం అ నాడు సంప్రదాయ ఉన్నత కుటుంబాలలో జరగని విషయం. ఆమెయే ఆద్యురాలై అందర్నీ ఆశ్చర్యం లో ముంచేసింది .కూతురుకున్న అకుంఠి దీక్ష ,సేవాభావం, మాతృదేశ భక్తీ కి ముగ్ధుడైన తండ్రి ఆమె సేవలు దేశానికి అవసరమని అది తమ కుటుంబానికి వరమని భావించి సమ్మతించాడు .ఒక అజ్ఞాత కుగ్రామం లో పుట్టిన చిన్న పిల్ల ప్రముఖ పట్నం జైపూర్ లోని బారి ఆశ్రమానికి వెళ్ళటం ,అక్కడ ఉండి పని చేయటం వింతగా అందరూ చెప్పుకొనే వారు .14-1-1938నఇల్లు వదిలి బారి ఆశ్రమం లో పార్వతి చేరింది .ప్రభావతి దేవి అనే బాల్య వితంతువు కూడా పార్వతి తో బాటే ఆశ్రమం లో చేరింది .పార్వతి కుటుంబం వారు ఎన్నో సార్లు ఆశ్రమం వదిలేసి ఇంటికి వచ్చేయమని ఇద్దరిపై ఒత్తిడి తెచ్చారు .కాని స్తిర చిత్తం తో అక్కడే ఉండిపోయారిద్దరూ .ఆశ్రమం లో రమాదేవి ,గోప బంధు చౌదరి ఏంతో సంతోషించారు .
ఈ నాటి ఆశ్రమాలు గా కాకుండా ఆశ్రమాన్ని ఏంతో క్రమశిక్షంతో నైతిక విలువలతో రమాదేవి నడుపుతోంది .ఇలాంటి ఆశ్రమాలను ‘’సంగ్రామి శిబిర’’, ‘’అహింసా తీర్ధ ‘’అనే వారు .గోప బంధు డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తూ గాంధీగారి పిల్పు విని స్వరాజ్య ఉద్యమం లో చేరి పని చేస్తున్నాడు .రామా దేవి ,గోప బంధుల అమిత ప్రేమ ఆదరణలు ,వారిద్దరూ గాంధీగారి ప్రభావానికి లోనవటం పార్వతి పై కూడా ప్రాభావం కలిగించి దేశ సేవలో ధన్యత చెందాలనే నిశ్చయానికి వచ్చింది .ఆశ్రమంలో ఉన్న వారందరినీ కంటికి రెప్పలాగా చూసుకొంటూ ప్రేమ దయా సాను భూతులను వారిపై వర్షించింది .1940లో సత్యాగ్రహం ఉద్యమం సూటిగా ప్రారంభ మైంది .అన్ని ఆశ్రమాలు సంగ్రామ శిబిరాలుగా మారిపోయాయి .స్వరాజ్య పోరాట యోధులతో నిండిపోయాయి .
పార్వతి గిరి స్వగ్రామం బారాగర్ కు తిరిగి వచ్చి,సంబల్ పూర్ ,పద్మాపూర్ ,పనిమార ,ఘెంస్ మొదలైన చోట్లకు వెళ్లి ప్రజలను ఉత్తేజ పరచి మీటింగులు నిర్వహిస్తూ స్వరాజ్య కాంక్ష కలిగించి బ్రిటిష్ పరపాలనాను వ్యతిరేకించేలా సంసిద్ధులను చేసింది .గ్రామాల్లో ,పట్టణాలలో నూలు వడకటం దారం తీయటం అందరికి నేర్పింది .సంబల్ పూర్ లో శ్రద్ధాకర్ సుపాకర్ అనే సమార యోధుడి తల్లి దగ్గర ఉండేది . గాంధీగారి ‘’ఖాదీ ఆందోళనోద్యమం ‘’లో చురుకు గా తానూ పాల్గొని అందరిని పాల్గోనేట్లు చేసింది .క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా వ్యాపించినట్లే ఒరిస్సాలోని గ్రామ గ్రామాన వెల్లి విరిసింది .సామలై పాదార్ ,పనిమార ,ఘెంస్ వంటి ప్రముఖులు నాయకత్వం వహించగా ,రామ చంద్ర గిరి ఉజ్జల్ గిరి ,మంగళ గిరి ,ద్వితీయ గిరి ,కుబెర్ గిరి మంగళ గిరి ,ద్వాదదేసి రానా మొదలైన అనుచరులు పాల్గొని అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు .
యువకులను ఒక దళం గా ఏర్పరచి నాయకత్వం వహించి పార్వతి గిరి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ‘’క్విట్ ఇండియా ‘’అని అరుస్తూ ప్రదర్శన నిర్వహించింది .ఆమె ఇంకా మైనర్ బాలికే .కనుక పోలీసులు ఆమెను అరెస్ట్ చేయటానికి జంకారు .మరుసటి రోజు ముగ్గురు పిల్లలతో కలిసి పార్వతి గిరి బార్గా లోని s.D.O.ఆఫీస్ కు వచ్చింది .అక్కడ కుర్చీలో కూర్చుని తానే జడ్జిగా నటించింది .ఒక కుర్రాడు లాయర్ గా మరొకడు బంట్రోతు గా సీన్ సృష్టించారు .ఎస్ డి వొ .లోపలి ప్రవేశించగానే జడ్జి స్తానం లో ఉన్న పార్వతి ప్యూన్ గా నటిస్తున్న కుర్రాడిని అసలైన దోషిని బంధించి తాడుతో లాక్కుని తన దగ్గరకు తీసుకొని రమ్మని ఆర్డర్ జారీ చేసింది .ఇది చూస్తున్న పోలీసులు ఆమె చుట్టూ చేరి కుర్చీ లోంచి లాగి పారెయ్యటానికి ప్రాయత్నిచారు .ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేసినందున ఆమెను బంధించి రెండేళ్ళు జైలు శిక్ష విధించారు .ఇందులో పార్వతి గిరి భావం –బ్రిటిష్ వలస పాలన ,వారి పెత్తనం భారత దేశం లో ఉండరాదనే .
బారాగర్ కోర్టులో మరొక ఉదంతం జరిగింది .బారాగర్ కోర్టు కు వెళ్లి బార్ లో లాయర్ కూర్చునే సీట్ లో కూర్చుంది .అభం శుభం తెలియని ఆ పిల్ల లాయర్లన్దరిని కోర్టు విడిచి బయటికి వెళ్ళిపొమ్మని ఆర్డర్ వేసింది .బ్రిటిష్ ఆఫీసర్లకు ఇండియా లాయర్లు సహక రించ కూదడనే ఆమె ఉద్దేశ్యం .ఆమె మాట విని కొందరు లాయర్లు బయటికి వెళ్ళిపోయారు .మిగిలి వెళ్ళని వారి చేతులకు గాజులు తొడిగింది ఈ చిన్నారి పిడుగు .ఆ వయసులో ఆమె చూపిన ధైర్య సాహసాలకు ,చొరవకు దేశ ప్రజలంతా హర్షించి ఆశీర్వ దించారు .త్రికరణ శుద్ధిగా గాంధీజీ బోధించిన సూత్రాలనే నమ్మి పాటించింది పార్వతి గిరి .
అనాధలకు విధి వంచితలకు ఆమె ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహించింది .ఆమె చిరస్మరణీయ వ్యక్తీ మాత్రమె కాదు ,ఒక సేవా సంస్థ సమగ్ర రూపమే పార్వతి ..
శ్రావణ శుక్రవారం –శ్రీవరలక్ష్మి వ్రతం సందర్భం గా శుభా కాంక్షలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-14-ఉయ్యూరు
