పిబరే కృష్ణ.ర.సం

పిబరే కృష్ణ.ర.సం.

మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల తీరు తెన్నులను అడిగి తెలుసుకొని ,వారిమాతల్లోనే రికార్డ్ చేసుకొన్నాను .హోసూరు కు ఒక ప్రత్యేకత ఉంది .దాన్ని తమిళం వాళ్ళు కన్నడిగులు పట్టించుకోవటం లేదు .భాషా ప్రయుక్త రాస్త్రల్లు ఎర్పదినప్పుదేర్పడ్డ ఆంద్ర రాష్ట్రం కాని ఇప్పుడు విడి పోయి అప్పుడు కలిసి ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాని హోసూరు మొర ఆలకిన్చాలేదని తమల్ని రెంటికి చెడ్డ రేవళ్ళు గా చూస్తున్నారని మనసులోని బాధ నంతా వెల్ల గక్కారు .వీలైనప్పుడల్లా వెల్ల గాక్కుతూనే ఉన్నారు .అయితే ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా అక్కడి మిత్రులందరూ కలిసి తమ తెలుగును కాపాడుకోవాలని కృత నిశ్చయం తో ఉద్యమాలు చేసి తెలుగు బడులను భాషను బతికిన్చుకొంతున్నారు .హోసూరు కృష్ణ గిరి జిల్లాలో తమిళ నాడులో ఉంది .అందుకని కృష్ణ గిరి రచయితల సంఘం గా అంటే ‘’కృష్ణ రసం ‘’గా ఏర్పడి సామూహికం గా పండగలు ,పబ్బాలు ,జాతీయ దినోత్సవాలు అరుపు కొంటున్నారు .హోసూరు తెలుగు మాండలికాన్ని జీవింప జేయటానికి కవితాలు కతలు ఆ యాసలోనే రాసి రూపు కట్టిస్తున్నారు .విడువ కుండా పుస్తక ప్రచురణ చేస్తున్నారు .నాతో మూడేళ్ళ క్రితం ఏర్పడ్డ సన్నిహితత్వాన్ని మర్చిపోకుండా వారి ప్రచురణలు నాకు పంపిస్తూనే ఉన్నారు నేనూ సరసభారతి రచనలను వారికి చేరుస్తూనే ఉన్నాను .ఈ నెల పడవ తేదీన డాక్టర్ వసంత్ గారు ఈ సంవత్సరం మే నెలలో ప్రచురించిన రెండు కదా సంకలనాలు ‘’మోతుకు పూల వాన ‘’,వెండి మొయిళ్ళు  బండ బతుకులు ‘’పుస్తకాలు పంపారు .మా అమ్మాయి వాళ్ళను అమెరికాకు ఫ్లైట్ ఎక్కించటానికి పన్నెండు రాత్రికి హైదరాబాద్  బయల్దేరి వెళ్లాం .పదమూడు ,పద్నాలుగు ,పది హీను తేదీలలో  ఆ పుస్తకాలను ఆబగా చదివేశాను .నిజమైన జీవితం  వాళ్ళు అనుభవిస్తున్న  బాధలు  కస్టాలు సుఖాలు ,ప్రక్రుతి సంపద ,ఆపేక్షలు అనురాగాలు ,ఆత్మీయతలు పరోపకారం మోసం ,దగా,తెలుగు భాషను మనవాళ్ళు పట్టించుకోక పోవటం ,పండగలు ,పబ్బాలు అన్నీ ఈ రెండిటిలో పుష్కలం గా ఉన్నాయి .అన్నిటిలో అంతర్వాహినిగా వారి వేదన ఉంది .వారి హోసూరు మాధ్యమం లో పుట్టిపెరిగిన కతలివి .వారి జీవిత ,జీవన విధానాలకు దర్పణాలివి .వారి ఆవేదనకు గుర్తులివి .ఆ భాషా మాధుర్యం లో అలా కొట్టుకు పోతూనే ఉంటాం. ఆ తీయ తేనియ తెలుగు రసాన్ని తాగుతూనే ఉంటాం మనం మర్చి పోయిన తిక్కన తెలుగును పాదు చేసి చక్కగా పోషిస్తున్నారు .చిక్కగా రాస్తున్నారు మత్తేక్కిస్తున్నారు .వారి నిరంతర సాహితీ కృషికి మనసారా అభినందిస్తున్నాను .ఇంత గొప్ప సేవ చేస్తున్న వారిని  బయట ప్రాంతాలలో ఉన్న ఏ సాహితీ సంస్థా గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదని బాధగా కూడా ఉంది .అయితే ఎవరి సాయం అక్కరలేని అసహాయ శూరులు కృష్ణ గిరి రచయితల సంఘం సభ్యులు .సూటిగా నడవటమే వారికి తెలిసిన విద్య .అదే వారికి రాచ మార్గం .ఈ సంఘానికి మార్గ దర్షులు శ్రీ సామల రమేష్ బాబు ,శ్రీ సా వేం రమేష్ గార్లు .వారంటే వీరికి అపారమైన గౌరవం . ఆ సాహితీ మూర్తులందించిన కదల గురించే నేను మీకు తెలియ  జేస్తూ ‘’పిబరే కృష్ణ రసం ‘’అంటున్నాను

మోతుకు పూల వాన

ఈ పుస్తకం లో ముందు మాట రాస్తూ కృష్ణ రసం సభ్యులు శ్రీ జి నారాయణ రెడ్డి ‘’తల్లికోసం తల్లి నుదికోసం ,తల్లి నుడి లో మాట కోసం ,పాట కోసం ,చదువుకోసం ,చదువును చెప్పించే బడి కోసం ,తెలుగు ఏలుబడికోసం –ఈ గడ్డ పడుతున్న తపన లో నుంచి పుట్టిందే మా కృష్ణ రసం .సుమారు ఏభై మంది కవులు రచయితల వేదిక ఇది ‘’అని చెప్పారు .ఈ సంస్థ 2010నుంచి ఏడాదికి రెండు ‘’పోత్తాలు ‘’వెలువరిస్తున్నారు .ఇందులో పందొమ్మిది మంది కధకుల కధలున్నాయి .వీరిలో నలుగురు  దేవి శెట్టి పల్లెకు చెందిన వారే కావటం విశేషం .వారి ఆశయాన్ని పద్య రూపం లో నారాయణ రెడ్డి గారు ‘’వత్సరంబున కోక సారి వరుసగాను –వింత వింత గా కతలు విస్తరింప

పుస్తకంబులు ముద్రించి పంచు చుండు –తెలుగు భాషను నిల బెట్టు దీక్ష తోడ ‘’అని చెప్పారు .

..శ్రీ అగరం వసంత్ రాసిన ‘’కొరివి పెట్టె కొడుకు ‘’కద’’ప్రక్రుతి గురించినది .’’బంగారం తింటారా?బదికేకి బోజనము కావాల.’’అని ప్రక్రుతి పిల్లను సోమ్ముగలాడైన సూర్యుడి  కిచ్చి పెళ్లి చేస్తే దాని బతుకు బూడిదే అవుతుందని ఒక నాయనమ్మ కొడుక్కి చెబుతుంది .సూర్యుడిని ‘’పోద్దప్ప ‘’అని చంద్రుడిని’’ వెలుగు నాయాల ‘’అని ఆప్యాయం గా పిల్చుకొంటారు .పెళ్ళికి సూర్యుడి కొడుకు అంగారకుడు మధ్యలో అగ్గి రాజేస్తాడు .అవ్వను తిడతాడు .అవ్వకు వెలుగు నాయాలకిచ్చి పెళ్లి చేస్తే కాపురం బాగుంటుందని చెప్పింది. చివరికి అందరూ ఒప్పుకుని ప్రకృతిని వెలుగు నాయాలకిచ్చి లగ్గం చేస్తారు . పెళ్లి అయిన  ఏడాదికి ప్రక్రుతి ప్రక్రుతమ్మ అయింది . ‘’నేల చరాలు ‘’అనే బిడ్డను కన్నది .కొన్నేళ్ళకు ఉభయ చరాల్ని కని ,పక్షులను ప్రసవించి ఇక చాలనుకొని ‘’మనిషి ‘’ అనే బిడ్డడిని కన్నది .వాడు పెరిగి  తల్లికే కొరివి పెట్టె ప్రక్రుతి వినాశకుడైనాడు .ఈ విషయం ప్రక్రుతమ్మకు  తెలియక కన్నది అని ముగిస్తాడు డాక్టర్ వసంత్ .

శ్రీ అమర నారా బసవ రాజు రాసిన ‘’మా వూరు బతికి పోయే ‘’కదఒక కుక్క ఆంతర్యం .అది విన్న కధలూ కమామీషు .బలే కమ్మగా చెప్పారు రాజు గారు .తన చిన్నతనం లో ఏంతో హాయిగా బతికానని  ఇప్పుడు ముద్దకు దిక్కు లేదని  పెద్దింటి కుక్క బాధ పడుతుంది .ఆ కాలం లో అందరూ హాయిగా వాకిళ్ళలో చేరి రాత్రిపూట పిచ్చా పాటీ కబుర్లు చెప్పుకుని ,’’కుంటి  ముట్టిచ్చే ఆట ‘’,’’ఉప్పడి పట్టు ఆట ‘’,ఆదేవారాని ఆడాళ్ళు  ముసిలోళ్ళు వక్కాకు నములుతూ కాలక్షేపం చేసేవారని జ్ఞాపకాలను నేమరేసుకొంటుంది .,ఇప్పుడు ‘’మాపు’’అయితే చాలు ఊరు ‘’బెకో ‘’అంటూ ఉంటోంది . అంతా  సీరియళ్ళలో మునిగి బయటికే రావటం లేదట .ఆ ఇల్లు ఈ ఇల్లూ తిరిగి అక్కడ దొరికినదేదో తినేది కుక్క బతులని అంటున్నారని ,కాని ఈ కాలం లో ముసిలోళ్ళ బతుకులు కుక్క బతుకుల్ని చేస్తున్నారని వాపోయింది .ఒక ముసలాడు ముసలి భార్యను ఓదారుస్తూ ‘’మనం పండు టాకులం .నీడలో పడితే కుళ్లుతాం .ఎండలో పడితే ఎండుతాం .శివరాత్రికి చివుళ్ళు వస్తాయికదా ,మనకొచ్చిన కాలం ఈ కుర్రనాయాల్లకూ  వస్తుందిలే ‘’అని ఊరడించటం కుక్క వింటుంది .ఈ నాటి పిల్లలకు ఒక్క వేమన పద్యమూ రాదు అని క్షోభ పడతాడు తాత .ఆ కాలం చదువులు పండితునికి పామరునికి తెలిసేట్లు తెలుగు లో ఉండేవని మెచ్చాడు .ఇప్పటి సదువులు ఆళ్ళ అబ్బాలకే తెల్వట్లా ఆల్లకేం తెలుస్తాయని ఆవేదన పడ్డాడు .

పెద్దింట్లో రోజూ నీళ్ళు కాచుకొనే కాగు ను విసిరి బయట పారేస్తే అది కుక్క తో తన గోడు వెల్ల బోసుకోన్నది .ఇప్పుడు హీటర్లు గీజర్లు వచ్చి తనకు పని లేకుండా పోయిందని కాగు ఏడ్చింది .గౌడు ఇంట్లో గౌడు సాని పెత్తనం పోయి కోడలు పెత్తనం వచ్చింది ముసలాళ్ళను లెక్క చేయటం లేదు ‘’వెలక్కాయ కంటే కొంచెం పెద్ద రాగి సంకటి ముద్ద ‘’ను మామకు పెడుతోంది .ఆయన ఇక తనకేం పెడతాడు అని వగచింది .కాని ముసలి ‘’’ఎన్ని పిల్లల్ని పెట్టిం డావో .మనిషికే దిక్కు లేని ఈ కొంపను నమ్ముకోన్నావే .తిను కూతురా ‘’అని ఆప్యాయం గా కొంత కుక్కకు పెట్టాడు .’’జూ రాయే ముండా!ఈ కాడి తిని పో ‘’అని రెండు పిడికిళ్ల చద్ది వేశాడు .అదీ జీవకారుణ్యం .ఇవన్నీ గమనిస్తున్న కుక్క ‘’కరెంటు పోవాల అందరూ ఈదిలోకి రావాల సందడి సేయాల ‘’అను కొంటోంది మనసులో .

తధాస్తు దేవతలు దీవించారు .కరెంటు ఎప్పుడిస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలీని పరిస్తితి వచ్చింది .ఇళ్ళల్లో టి విలు  బందు అయ్యాయి. కాగు బయటికి తీసి నీళ్ళు కాస్తున్నారు .నూనె దీపాలు వెలిగించుకొంటున్నారు .పగలూ రాతివీది అరుగుల మీదికి చేరుకొని కబుర్లు చెప్పుకొంటూ ఆటా పాటా పాడుకొంటూ కోళ్ళకూ కుక్కలకీ సంగటి మెతుకులు రాలుస్తున్నారు .ప్రతి శనివారం ఆంజనేయ గుడిలో పూజలు భజనలు హరికధలు చెప్పిస్తున్నారు .మళ్ళీ పూర్వకాలం బతికి వచ్చి ‘’మా వూరు బతికి పోయే ‘’అను కొన్నది గ్రామ సింహం .అద్భుతం గా కధను నడిపించారు రాజు గారు .

సశేషం

దక్షిణాయన పుణ్యకాల ప్రవేశ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్  గార్డిమేర్

తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన గడ్డ జోహాన్స్ బర్గ్ లో మరణించింది .ఆమె జీవితం అందరికి ఆదర్శ ప్రాయం .

 

Inline image 1  July's People (1981)    The Pickup (2001)

 

గార్డి మెర్ 1923నవంబర్ ఇరవై న దక్షిణాఫ్రికా లోని జోహేన్స్ బర్గ్ దగ్గర గనులకు నెలవైన స్ప్రింగ్స్ గూటంగ్ లో జన్మించింది .తండ్రి ఇసిడోర్  గార్డి  మెర్ వాచీలను తయారు చేసే యూదు సంతతి వాడు .తల్లి హన్నా లండన్ కు చెందినది .తల్లి పూర్తిగా జ్యూ యిష్ సంప్రదాయం లోను ,తండ్రి దానికి విరుద్ధం గ సెక్యులర్ పద్ధతిలోను ఉన్న కుటుంబాల వారు .నదీన్ ఆ దేశం లోని ఆర్ధిక అసమానత్వాన్ని ,జాతి విద్వేషానికి  వ్యతిరేక భావ వ్యాప్తికి  తలిదండ్రులే కారకులు ,ప్రేరకులయ్యారు .తండ్రి రష్యాలోని జారిస్ట్ రాజుల కబంధ హస్తాల నుండి తప్పించుకు వచ్చినా దక్షిణాఫ్రికాలోని నల్ల జాతి వారి పట్ల సాను భూతి లేని వాడు .తండ్రికి విరుద్ధం గా తల్లి నల్ల జాతీయుల బానిసత్వాన్ని ,పేదరికాన్ని చూసి జాలిపడి సహాయం చేస్తూండేది .నల్ల జాతి పిల్లలకోసం క్రేచీ అనే శరణాలయాన్ని స్థాపించింది .ప్రభుత్వం కూడా నల్ల జాతి వారి పట్ల నిర్దాక్షిణ్యం గా క్రూరంగా అమూనుశం గా వ్యవ హరించేది .ఒక సారి ప్రభుత్వ పోలీసులు వీరింటిపై దాడి చేసి సర్వెంట్ రూమ్ లో ఉన్న డైరీలు,సాహిత్యాన్ని పట్టుకు పోయారు .

గార్డి మెర్ కేధలిక్ కాన్వెంట్ స్కూల్ లో చేరి చదివి నప్పటికీ ఇంటి వద్దే తల్లి ఎక్కువగా నేర్పింది .తల్లికి పిల్లను స్కూల్ కు పంపటం అంతగా నచ్చేదికాదు .ఇంటి దగ్గర ఖాళీ సమయం లో రచన చేస్తూ 1937అంటే పద్నాలుగేళ్ళప్పుడే ‘’ది క్వెస్ట్ ఫర్ సీన్ గోల్డ్ ‘’అనే చిన్న పిల్లల కదా పుస్తకం రాసి ప్రచురించింది .ఈ కధలు చిల్డ్రన్స్ సండే ఎక్స్ప్రెస్స్ పత్రికలో ప్రచురింప బడ్డాయి .రెండవ పుస్తకమూ పిల్లల కోసమే ‘’కం ఎగైన్ టు మారో ‘’రాసింది .పదహారవ ఏట యువ రచయిత్రి గా ప్రఖ్యాతమైంది .విల్ట్ వాటర్ స్త్రాండ్ యూని వర్సిటిలో ఒక ఏడాది చదివి అన్ని జాతుల వారితో కలసి మెలసి తిరిగింది .డిగ్రీ పూర్తీ చేయకుండానే జోహాన్స్ బర్గ్ కు 1948కి చేరింది .బోధనలో గడుపుతూ రచనలు చేస్తూస్థానిక పత్రికలకు రాస్తూ  ప్రచురిస్తూ అక్కడే ఉండేది .తన తోలి రచనలను ‘’ఫేస్ టు ఫేస్ ‘’పేరిట 1949లో ముద్రించింది .

1951లో ‘’ది న్యూ యార్కర్ ‘’పత్రికలో ఆమె కద ‘’ఏ వాచర్ ఆఫ్ ది డేడ్’’ప్రచురణ తో ఆమె కీర్తి విపరీతం గా వ్యాపించింది .తనకాలం లో చిన్న కద గొప్ప ప్రాచుర్యం, ప్రభావం కల్గించిందని గార్డి మెర్ అంటుంది .న్యు యార్కర్ తో పాటు అనేక ప్రముఖ పత్రికలకు ఆమె కధలు రాసింది .అన్నీ గొప్ప విజయాలనే తెచ్చి పెట్టాయి .ఆమె పుస్తకాలను మొదట ప్రచురించిన లులూ  ఫ్రీడ్ మాన్ అనే మహిళ, పార్ల మెంటేరియాన్ అయిన బెర్నార్డ్ ఫ్రీడమన్ భార్య .వాళ్ళ ఇంట్లోనే జాతి వ్యతిరేకతను తిరస్కరించే రచయితలను గార్డి మెర్ కలుసు కొన్నది .డెంటిస్ట్ జేరాల్ద్ గావ్రాన్ ను వివాహం చేసుకొని ఆడపిల్లను కన్నది .’’ది లైయింగ్ దేశ’’అనే మొదటి నవల రాసి 1953లో ప్రచురించింది . మూడేళ్ళ తర్వాత భర్తకు విడాకులిచ్చి రీనోల్ద్ కాషియేర్ అనే గొప్ప కళా పోషకుడిని పెళ్లి చేసుకొన్నది .జీవితాంతం ఈ బంధం కొనసాగింది .కొడుకు సినిమా రంగం లో ఉన్నాడు .

1960 లో జరిగిన హింసాత్మక ఘటనలు ,జాతి వ్యతిరేక పోరాటాల ను చూసి ఆమె ఉద్యమం లో కి అడుగు పెట్టింది .త్వరగా రాజకీయం గా ఎదిగి నెల్సన్ మండేలా  డిఫెన్స్ అటార్నీలలో ఒకరైంది .మండేలా గొప్ప ఉపన్యాసం ‘’ఐ యాం ప్రిపెరేడ్ టు డై ‘’రాసింది గార్దిమేర్ .అది ఒక మంత్రం లా పని చేసి గొప్ప ప్రభావాన్ని కలిగించింది .దేశం తెల్ల జాతి నుండి విముక్తి పొందింది .1990లో మండేలా చెర నుండి విముక్తి పొందినప్పుడు మొదటిగా ఆయన  చూడాలనుకొన్న వ్యక్తీ గార్డి మెర్ నే .అలా నే చూసి పులకిన్చిపోయాడు ఆమె కర్తవ్య దీక్షకు అంకిత భావానికి ఉద్యమ స్పూర్తికీ .1960-70దశకం లో ఎక్కువ కాలం జోహాన్స్ బర్గ్ లోనే గడుపుతూ అమెరికాలోని అనేక యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి బోధించేది ఉపన్యసిస్తూండేది .దీనితో ఆమె అంతర్జాతీయ వ్యక్తీ అయింది .ఇక్కడే ఆమె కు మొదటి అత్యుత్తమ పురస్కారం లభించింది .అక్కడ ఉండగానే రచనల ద్వారా ప్రసంగాల ద్వారా దక్షిణా ఫ్రికాలోని జాతి విద్వేషాన్ని రూపు మాపాలని డిమాండ్ చేసింది .

ఆమె అమెరికా లో ఉన్నప్పుడే ఆమె రచనలను దక్షిణాఫ్రికా తెల్ల జాతి ప్రభుత్వం చాలా కాలం  నిషేధించింది ..’’ది లెట్ బూర్జువాస్ వరల్డ్ ‘’అనే స్వీయ అనుభవ గ్రంధాన్ని రాసింది .ఆమె రాసిన ‘’ఏ వరల్డ్ ఆఫ్ స్ట్రేంజర్స్ ‘’పుస్తకాన్ని పుష్కరం పాటు తెల్ల ప్రభుత్వం నిషేధించింది .బూర్జువాస్ వరల్డ్ పుస్తకాన్ని ప్రచురణ అంతరం ఒక నెల రోజుల్లో నిషేధించింది ప్రభుత్వం .కాని పబ్లికేషన్స్ కమిటీ ఈ నిషేధాన్ని తిరస్కరించి ఆమెకు న్యాయం చేసింది .ఆరు నెలల తర్వాత ప్రభుత్వం మరో కుంటి సాకుతో నిషేధిస్తే ఆమె జవాబుగా ‘’ఎస్సేన్శియల్ గేస్స్చర్స్ ‘’రాసి,ఇద్దరు నల్ల రచయితల పుస్తకాలను నిషేధించి తన పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదో వివరించమని కమిటీని ప్రశ్నించింది .అలాగే ‘’జులిస్ పీపుల్ ‘’పుస్తకమూ నిషేధానికి గురి అయింది .ప్రాంతీయ విద్యా బోర్డ్ ఈ పుస్తకం తో పాటు మిగిలిన నల్ల వారి పుస్తకాలపై నిషేధపు ఆంక్షలను తాత్కాలికం గా తొలగించింది .’’జులై ‘’పుస్తకం మరే జాతి  విద్వేషానికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది అన్న కమిటీ అభిప్రాయాన్ని ఈమె తప్పుపట్టింది .ప్రజలూ ప్రజా సంఘాలు ఆమెనే సమర్ధించాయి .ఇలా  నిరంతరం పోరాటం చేస్తూనే ఉండేది .

దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిషేధించిన నెల్సన్ మండేలా పార్టీ ‘’ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ‘’లో ఆమె మొదటి నుంచి సభ్యురాలు .అదే దక్షిణాఫ్రికా ప్రజలకు విముక్తి సాధనం అని నమ్మి పని చేసింది .ఉద్యమకారులకు తన ఇంటిలో ఆశ్రయమిచ్చి అరెస్ట్ కాకుండా కాపాడింది .1986లో ఇరవై రెండు మంది ఉద్యమ కారుల తరఫున ‘’దేల్మాస్ ట్రేజన్ ట్రయల్ ‘’లో వారికి అనుకూలం గా వాదించటం తన జీవితం లో మరచి పోనీ రోజు అంటుంది .జాతి వ్యతిరేక కార్యక్రమాలలో ప్రదర్శనలో ఉత్సాహం గా పాల్గొనేది .రాజకీయ ,జాత్యహంకార ధోరణి పై ఉపన్యాసాలలో నిప్పులు కురిపించేది .

గార్డి మెర్ లోని సాహితీ మూర్తికి జనం నీరాజనాలన్దించారు .అనేక పురస్కారాలిచ్చి సన్మానించారు .1991లో సాహిత్యం లో అత్యుత్తమ పురస్కారం నోబెల్ బహుమతినిచ్చి అందుకొన్నది .బహుమతి ప్రదానం రోజున ఆమె మానవ జాతి సేవకు సాహిత్యానికి  చేసిన సేవ ,చిరస్మరణీయం అని నోబెల్ కమిటీ ప్రశంసించింది .జాతి వ్యతిరేకతనేకాదు ,పత్రికా హక్కుల నిషేధాన్ని ,ఇన్ఫర్మేషన్ పై సెన్సార్ ను వ్యతిరేకించింది .’’సౌత్ ఆఫ్రికా యాంటి సెన్సార్షిప్ యాక్షన్ గ్రూప్  ‘’స్టీరింగ్ కమిటీ లో పని చేసింది .’’సౌత్ ఆఫ్రికా రైటర్స్ కాంగ్రెస్ ‘’కు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉంది .’’సౌత్ ఆఫ్రికా లెటర్స్ అండ్ ఇంటర్నేషనల్ లిటరరీ ఆర్గ నైజేషన్స్’’(PEN)కు వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది .దక్షిణాఫ్రికా ఎయిడ్స్ మహమ్మారి పాలైతే ప్రజలకు అవగాహన కల్పించి ఎందరి ప్రాణా లనో  కాపాడింది .’’ట్రీట్ మెంట్ యాక్షన్ కాంపైన్ ‘’కోసం ఇరవై మంది రచయితల చేత ‘’టేల్లింగ్ టేల్స్ ‘’పేర చిన్న కధలు రాయించింది . ఎయిడ్స్ నివారణ కోసం దాతల నుండి నిధి సేకరించి ప్రభుత్వానికి అంద జేసింది .ప్రెసిడెంట్ టాబూ మోబాకి ఎయిడ్స్ విషయం లో సరైన శ్రద్ధ తీసుకో నందుకు ప్రశ్నించి మిగిలిన అన్ని విధానాలను సమర్ధించింది .

తన దేశం విషయం లోనే కాదు ఏ దేశం లో అన్యాయం జరిగినా నిరసన తెలియ జేసింది .క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో తీవ్రం గా జబ్బు పడ్డప్పుడు తన తో బాటు ఆరుగురు నోబెల్ పురస్కార గరహీతల చేత  వ్రాత పూర్వకం గా క్యూబా లో అస్తిరత్వం రెచ్చ గొట్టవద్దని అమెరికాను హెచ్చరించింది .ఆరంజ్ ప్రైజ్ ను మహిళలకే ఇవ్వటాన్ని నిరసించి తనకు ఇవ్వబోయిన ప్రైజ్ ను తిరస్కరించింది .2006 లో ఆమె ఇంట్లో దొంగలు పది భీభత్సం సృష్టించారు .స్నేహితులు కేసు పెట్టమని ప్రోత్సహించినా ఆ పని చేయలేదు .తానూ నాస్తిక వాదిని అని చెప్పుకున్నా దాన్ని ఏ నాడూ ప్రచారం చేయలేదు .ఆమె జీవిత చరిత్రను ‘’నొ కోల్డ్ కిచెన్ ‘’గా రోనాల్డ్ సురేష్ రాబర్ట్ రాసి 2006లో ప్రచురించాడు .ఇద్దరు కూర్చుని చర్చించుకుని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత రచన అంతా ముందుగా తనకు చూపించి ఓకే చేసిన తర్వాత ముద్రించాలను కొన్నారు .కాని రచయిత ఆమె కు ఇష్టం లేని విషయాలను అందులో రాసినందుకు నిరసన తెలియ జేసి తన అనుమతి లేదని చెప్పింది .రోనాల్డ్ స్వంతం గా పుస్తకాన్ని రాసి ప్రచురించాడు. దాన్ని ఆమె సమర్ధించ లేదు .

ఆమె రచనలలో ప్రేమ ,రాజకీయమే చోటు చేసుకొంటాయి తన దేశం విదిపోవటాన్ని ఆమె వ్యతిరేకించింది .అధికార అనుబంధాలను సత్యాన్ని శోధించి రాసింది .ఆమె రచనలు సామాన్య ప్రజలకు కధలు చెప్పినట్లుగా రాయటం ప్రత్యేకతను  సంత రించుకోన్నది .ఆమెకు వచ్చిన అవార్డులు రివార్డులు అసంఖ్యాకం .జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ ప్రైజ్ ,బుకర్ ప్రైజ్ ,సి యెన్ ఏ ప్రైజ్ ,స్కాటిష్ ఆర్ట్స్ ప్రైజ్ ,రోమ్ ప్రైజ్ ,బెన్నెట్ అవార్డ్ ,అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అవార్డ్ ,ఫెలో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ,పాట్రన్  కాంగ్రెస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అవార్డ్  మొదలైన వాటితో బాటు నోబెల్ ప్రైజ్ ను పొందింది .పది హీను నవలలు ,’’ది ఫస్ట్ సర్కిల్ ‘’అనే నాటకం దాదాపు ఇరవై కదా సంకలనాల పుస్తకాలు ,అయిదు వ్యాససంపుటులను గార్డి మెర్ తన జీవిత కాలం లో రాసింది .తొంభై ఏళ్ళు జీవించి 2014 జులై 13ణ ఆ మహా రచయిత్రి సంఘ సేవకురాలు నదీన్  గార్దిమేర్ జోహాన్స్ బర్గ్ లో తనువు చాలించింది .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

రచయిత: పంకజ్ సెక్షారియా
 

వాళ్లు చరిత్రలో అతిపెద్ద సునామీని కూడా తట్టుకున్నారు. 2004లో భారత దేశమే కాకుండా, దక్షిణాసియా మొత్తంగా సునామీ ధాటికి ప్రకంపించిపోయిన భీకర క్షణాల్లో కూడా వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రమట్టానికి ఎత్తున పర్వత ప్రాంతాల్లో నివసించడం తెలిసిన వారికి తమ జాతి అంతర్ధానమైపోతుండటానికి కారణాలు మాత్రం తెలీవు.
సునామీలు, తుఫానులు వారిని కదిలించలేవు. కాని కాలం గడిచే కొద్దీ తమ జాతి అంతర్థానమవుతున్న సూచనలు వారికి స్పష్టమవుతూనే వస్తున్నాయి. వాళ్లెవరో కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆదిమ జాతుల్లో ఒకటైన జార్వా తెగ ప్రజలు. అండమాన్ వీరి నివాస స్థలం. వాళ్ల జీవితంలోని కొత్త కోణాలను బయటపెట్టిన కాల్పనిక నవల ‘ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’. రచయిత పర్యావరణ కార్యకర్త పంకజ్ సేక్సారియా. తను హైదరాబాద్ నివాసి కావడం మరీ విశేషం.

 

ఒక పరిశోధకుడిగా అనేకసార్లు పంకజ్ అండమాన్‌ని సందర్శించారు. ప్రతి యాత్రలోనూ తనకు అండమాన్ కొత్తకోణంలో కనిపిస్తూ వచ్చింది. పర్యావరణ కార్యకర్తగా జార్వాల జీవితాలను సన్నిహితంగా స్పర్శించిన పంకజ్ అంతరించి పోనున్న జాతుల్లో ఒకటిగా నిలిచిన జార్వా తెగ ప్రజల జీవితాలకు అక్షరరూపమిచ్చారు. అదీ కాల్పనిక సాహిత్య రూపంలో.. జార్వా తెగను వెంటాడుతున్న కఠిన వాస్తవాలకు సాహిత్య రూపం ఇవ్వడం ఇదే మొదటిసారి.

జార్వా తెగ ప్రజల సమస్యలపై రూపొందిన ‘ది లాస్ట్ వేవ్’ నవలను గత శుక్రవారం హైదరాబాద్‌లోని గోతె-జెంట్రుమ్‌లో ఆవిష్కరించారు. లక్ష్యం లేని ఒక పర్యాటకుడు పురాతన జార్వా తెగప్రజలను ఎలా కలిశాడు, ఆ తెగ ప్రజల జీవితాలను కళ్లారా ఎలా దర్శించాడు అన్నదే ఈ వినూత్న నవలాంశం.

 

కథ: నవల మొత్తంగా హరీష్ అనే ఈ సముద్ర ప్రయాణికుడి చుట్టూనే తిరుగుతుంది. జార్వా తెగ అంతర్థానానికి దారితీస్తున్న అనేక బాహ్య కారణాలను దగ్గరనుంచి గమనిస్తున్న క్రమంలో ఈ నవల కథానాయకుడు తనకు తానుగా ఈ కమ్యూనిటీ కోసం పోరాటకారుడిగా మారిపోతాడు. ఈ నవల మొత్తానికి ఇదే కీలకాంశం.ఈ నవలలో 30 ఏళ్ల హరీష్ ప్రధాన పాత్రధారి. పెళ్లి విడాకులకు దారితీయడంతో విషాదంలో కూరుకుపోయాడు. అండమాన దీవుల గురించి తెలుసుకోవడానికి తన స్నేహితుడితో కలిసి ఆ దీవికి పయనమవుతాడు. ఆ దీవిలో ఉన్నప్పుడు అక్కడి గిరిజనులు, ఇతర ప్రాకృతిక ప్రాణులకూ మధ్య ఘర్షణలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటాడు. ఇక్కడే అతడు స్థానికురాలైన సీమను కలుసుకుంటాడు. ఇక్కడే పుట్టి పెరిగిన ప్రజలపై తను పరిశోధన సాగిస్తూంటారు. జారా కమ్యూనిటీ ప్రవర్తనలో వస్తున్న మార్పులు దీవివాసులకు వినోదం కలిగిస్తుంటాయి. బయటి ప్రపంచం పట్ల వారి శత్రుభావం ఉన్నట్లుండి మాయమౌతుంది. వారి వైఖరి కాస్త మారుతుంది. చివరకు హరీష్, జార్వా తెగ ప్రజల సమస్యలపై పోరాడేందుకు నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. 

రచయితకు నవలా పరంగా ఇది తొలి రచన కాకపోవచ్చు. అంతకుముందు పర్యావరణంపై, జార్వా తెగపై ఎన్నో వ్యాసాలు రచించారు. ప్రచురించారు. ‘ఒక ఘటనను, కథను వర్ణించడంలో కాల్పనిక సాహిత్యం ఒక వినూత్న ప్రక్రియ. మన కళ్లముందు జరుగుతున్న ఒక జాతి పతనావస్థను నవలా రూపంలో చెప్పడాన్ని నేను నిజంగానే సవాలుగా తీసుకున్నాను’ అని రచయిత చెప్పారు. న్యూఢిల్లీలోని జామా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు.

 

జార్వా కమ్యూనిటి ఉనికిపై ఇంతవరకు ఎవరూ సమగ్రంగా దృష్టి పెట్టలేకపోయారు. తన పుస్తకం ఇతవరకు తెలియని ఇతర కోణాలను స్పృశించిందని పంకజ్ చెబుతారు. ‘మీడియాలో అనేక కథలు, కథనాలు వస్తుంటాయి. చాలాకాలంగా అండమాన్ దీవులకు వెళుతూ వస్తున్నాను. వారి జీవన విధానం, వారి జీవితాల చుట్టూ అలుముకున్న అనేక గాథలను అర్థం చేసుకుంటూ వచ్చాను. అయితే బయటి ప్రపంచానికి మాత్రం ఇప్పటికీ జార్వాల గురించి తెలిసింది చాలా తక్కువే. అండమాన్ లోని సెల్యులార్ జైలు, మంచి టూరిస్ట్ ప్రదేశంగా అండమాన్ విశిష్టత, ఆ దీవి చుట్టూ నెలకొన్ని వివాదాలు ఇవే ప్రధానంగా మీడియాలో వస్తున్నాయి. కాని అంత పెద్ద సునామీనే అవలీలగా జయించిన జార్వా తెగ ప్రజలు ఎందుకు అంతర్థానమవుతున్న జాతిగా మిగిలిపోతున్నారనే అంశం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. బయటి సమాజానికి తెలియని కొత్త కోణాలనే నా కాల్పనిక నవలలో స్పృశించాను’ అంటున్నారు రచయిత. 

రచయిత చాలాకాలంగా ఎన్జీఓ, కార్యాచరణ గ్రూప్ కల్పవృక్ష్‌‌తో కలిసి పనిచేస్తున్నారు. ఇది 30 ఏళ్ల నుండి ఉనికిలో ఉంది. ఈ సంస్థ కార్యకర్తగానే తను అండమాన్ దీవులకు పలుసార్లు వెళ్లివచ్చారు. ఈ ఎన్జీవో నేతృత్వంలో అండమాన్ లోని జార్వా తెగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారు. 2006లోనే అటవీ సమాచార హక్కుపై వీరు పనిచేశారు. ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి చెందిన స్థానికుల కోసం పర్యావరణ విద్యను కూడా చేపట్టారు. జార్వాల వర్యావరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇది వివరిస్తుంది. ఈ తెగ ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు వారిముందు పరిష్కారమార్గాలను కూడా చూపించారు. వాటిని కాలానుగుణంగా అక్షరబద్ధం చేశారు. 

కొంత మంది అండమాన్ దీవుల నిసర్గ సౌందర్యాన్ని గురించి చెప్పారు. కొందరు ఆ దీవిలోని ఆదిమ గిరిజన జాతి గురించి చెప్పారు. కాని రచయిత, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త పంకజ్ సెక్షారియా నవల విశిష్టమైనది. ఇది కాల్పనిక రచనే కావచ్చు, కాని అందమైన కథ, అద్బుతమైన సజీవపాత్రలతో ఇది రూపొందింది. పైగా అనేక వాస్తవమైన, చారిత్రక ఆధారాలను ఈ నవలలో మనం గమనించవచ్చు. అండమాన్ దీవులపై అత్యంత అభిమానం, 20 ఏళ్ల పాటు సాగించిన అవిరామ పరిశోధనా ఫలితమే ‘ది లాస్ట్ వేవ్’ నవల. అండమాన్ దీవి అద్బుత గాథను ఈ నవల చిత్రిక పట్టింది. 

రచయిత మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ స్వీయ అభిరుచితో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు. తర్వాత నానోటెక్నాలజీ రీసెర్చ్‌లో సృజనాత్మక సంస్కృతులు అనే అంశంపై పీహెచ్‌డి చేశారు. కల్పవృక్ష్ ఎన్జీవో సభ్యుడు. రెండు లఘుచిత్రాలను కూడా తీశారు. అండమాన్ దీవిగురించిన తృష్ణతో రెండు దశాబ్దాలతరబడి అండమాన్ భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రజలు, వారి పర్యావరణ వ్యవస్థ వంటి అనేక అంశాలపై రచయిత పరిశోధిస్తూ పోయారు. ఇప్పటికే మూడు కాల్పనిక రచనలు చేసిన పంకజ్ 2010లో కల్పవృక్ష ఎన్జీవో ప్రచురించిన ‘ది జార్వా ట్రైబల్ రిజర్వ్ డోజియర్ – కల్చరల్ అండ్ బయొలాజికల్ డైవర్సిటీస్ ఇన్ ది అండమాన్ ఐలండ్స్’ అనే పుస్తకానికి సహ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. 

ఇంతవరకు రచయిత ది హిందూ, ఫ్రంట్‌లైన్, శాంక్చువరీ ఆసియా, డౌన్ టు ఎర్త్, తెహెల్కా తదితర పత్రికలలో 200 ప్రత్యేక కథనాలు, ఫీచర్ కథనాలు, ఫొటో ఫీచర్లు, అభిప్రాయ వ్యాఖ్యలు ప్రచురించారు. 

భారతీయ ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ ఇండియా మే నెలలో ‘ది లాస్ట్ వేవ్ – యాన్ ఐలండ్ నావెల్’ను ప్రచురించింది. అసలు ధర రూ.350 కాగా పుస్తకాల షాపుల్లో, ఆన్ లైన్లో కాస్త తక్కువకే లభ్యమవుతోంది. అండమాన్ దీవుల, జార్వా తెగ చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ నవలను తప్పక చదవాలి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ ఆన్‌లైన్ పుస్తక షాపుల్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ ఆగస్టులో ఈ నవలను అండమాన్ దీవుల్లోనే ఆవిష్కరించడానికి రచయిత ప్రయత్నిస్తున్నారు. 

అండమాన్ దీవులు, దీంట్లో నివసిస్తున్న గిరిజన తెగల మార్మికత, నిగూఢత గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న రచయిత హైదరాబాద్ నివాసి కావడం విశేషం. ఈ దీవులకు, జార్వా తెగకు సంబంధించి వెలుగులోకి రాని పలు అంశాలపై కొన్నేళ్లుగా రచయిత కథనాలు రాస్తూ వచ్చారు. జర్నలిజం, రీసెర్చ్‌ను దాటి ఇక్కడి జీవితం గురించి చెప్పడానికి నవలను ఎంచుకున్నాను, దీనిద్వారా దీవిపై కొత్త దృక్కోణాలు వెలుగు చూడటమే కాకుండా విస్తృత పాఠకులకు అండమాన్ విశేషాలు అందుతాయనే అభిప్రాయంతోనే ఈసారి నవలా రచనను ఎంచుకున్నానని పంకజ్ చెప్పారు. 

గిరిజన జాతుల అంతర్థాన ప్రక్రియపై ఈ నవల ఒక సందేశాన్ని ఇస్తుంది. పర్యావరణంతో సహా వారు ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఈ కథ వివరిస్తుంది.

 

ప్రతులకు

భాగ్యనగరంలోని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
వెల: రూ. 224 కిండల్ వెబ్‌సైట్‌లో రూ.214
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్య కధనం -శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు -మూసీ మాసపత్రిక -జులై

padyakadha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్సెలర్ ప్రస్తుత గీతం యోని వర్సిటి చాన్సెలర్ పద్మశ్రీ కోనేరు రామ కృష్ణా రావు గారి స్పందన

koneru 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు :

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు

Published at: 14-07-2014 02:22 AM

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలపడ్డాక, తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక చాలామందికి అదివరకటి సుపరిచితులు అపరిచితుల్లాంటి వారైపోయారు, ఇంకా అయిపోతూనే ఉన్నారని అచటచటా అనడం జరుగుతోంది. కానీ నాకు మాత్రం నా సుపరిచితులు అప్పటికీ, ఇప్పటికీ సుపరిచితులే. వారి యెడ నా గుండె అప్పటికీ ఇప్పటికీ అలాగే కొట్టుకొంటుంది, నా మనసు వారివైపు అలాగే నాకు తెలియకుండానే లాగుతుంది.

అప్పటి రావెల సోమయ్య గారు, ఐ.వి. చలపతిరావు  గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, సి. సుబ్బారావు  గారు, నాయని కృష్ణకుమారి గారు, తంగిరాల సుబ్బారావు గారు, ఛాయాదేవి గారు, రాఘవాచారి గారు, కె.వై.ఎల్‌.  నరసింహారావు గారు, సి.ఎస్‌. రావు గారు, బి.వి.ఎల్‌. నారాయణరావు గారు, జి.ఆర్‌.ఎస్‌. రావు గారు, కృష్ణమోహన్‌ గారు, వైద్యనాథ అయ్యర్‌ గారు, హరిప్రసాద్‌ గారు, సుందరయ్య గారు, ఆత్రేయ శర్మగారు, అరుణా వ్యాస్‌   గారు, మండలి బుద్ధప్రసాద్‌ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మునిపల్లె రాజు గారు, ప్రసన్నకుమార్‌ గారు, కె. నాగేశ్వరరావు గారు, ఇంకా ఎందరో అప్పటికీ ఇప్పటికీ ఒకలాంటి వారే, నావారు.

అలాగే నేను ప్రేమించినవారు, నన్ను ప్రేమించిన వారు చనిపోయిన వారిలో కూడా ఎంతో ముందున్నారు. ఆవుల సాంబశివరావు గారు, ధూళిపాళ్ల శ్రీరామమూర్తి గారు, పి.ఎస్‌. రామచందర్‌రావు గారు, అప్పయ్యశాసి్త్ర గారు, నండూరి కృష్ణమాచార్య గారు నా క్లాస్‌మేట్‌ ఎం. వీరభద్రరావు గారు… ఇంకా మరెందరో.

నేను తెలంగాణ వాణ్ణి. పైన పేర్కొన్న వారంతా తెలంగాణేతరులు. కానీ నన్ను వారలా చూడలేదు, నేను వారినలా అనుకోలేదు. అసలాభావమే ఎన్నడూ మాకురాలేదు. ఎప్పుడు కలిసినా కులాసాగా మాట్లాడుకునేవారం, నవ్వేవారం, నానా కబుర్లు చెప్పుకునే వారం.
అప్పట్లో నేను కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు చలపతిరావు గారు మాకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. ఆయన సతీసమేతంగా దిగారు బస్టాండ్‌లో. స్ఫురద్రూపి, ఆజానుబాహువు. తెల్లని వస్ర్తాల్లో ఉన్న ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను.  రండి మా ఇంటికని తీసుకెళ్ళాను. రెండు మూడు రోజులున్నాక కిరాయింటికి వెళ్ళారు. కాలేజ్‌లో అందరమూ కలిసి ఆడుకునేవారం, పాడుకొనేవారం, నవ్వుకొనేవారం, అనేకానేక విషయాల గురించి చర్చించుకొనేవారం.

ఐ.వి. చలపతిరావు గారికి మంచి వక్తగానే కాక సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా చాలా ఆసక్తి కలవారిగా పేరుంది. అతనికి చెందిన ఆ గౌరవం కళాశాలలో పనిచేసే మా అందరికీ దక్కేది. మాకే కాదు, విద్యావంతులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు వారివలన గౌరవం, గుర్తింపు సమకూరేది. మా గౌరవానికి వారు నిధిగా, మాప్రతినిధిగా మేమందరమూ భావించేవారం. ఇంతకూ ఇక్కడ చెప్పదలచిన విషయమేమిటంటే, ఆ రోజుల్లో ఇతడు అక్కడివాడు, ఇక్కడివాడను భేదమెవరికీ వుండేది కాదు. వారలాంటి భావం వచ్చేట్లు నడిచేవారు కారు. అందరం ఎంతో కలిసి మెలిసి ఉండేవాళ్లం. విశ్వనాథగారి లాంటి, కె.వై.ఎల్‌. నరసింహారావు గారి లాంటి, పాండురంగం గారి లాంటి, ఐ.వి. చలపతిరావు గారి లాంటి సుపరిచితులు, శ్రేయోభిలాషులు నాకెంతో మందున్నారు. నన్నడిగితే నాకు ఇక్కడి వారిలో కంటే అక్కడి వారిలోనే తెలిసిన వారు ఎక్కువున్నారు.

మా కరీంనగర్‌ వారు అప్పటికీ ఇప్పటికీ స్థానికులమైన మాకన్నా కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారి, ఐ.వి. చలపతిరావు గారి, కె.వై.ఎల్‌. నరసింహారావు గారి పేర్లు ఎక్కువచెప్పుకుంటారు. వారిని మరిచిపోరు, పోలేరు. ఎందుకంటే వారు అక్కడ అంత శ్రద్ధా నిమగ్నతలతో పనిచేసేవారు. అక్కడివారిని అంత ప్రేమించేవారు, గుర్తించేవారు, గౌరవించేవారు. అదీ ‘సమైక్యత’ అను పదానికి అసలర్థం. కలిసుండడం కాదు కలిసిమెలిసి ఉండడం, ఒకేచోట ఉండడం కాదు, ఒకటిగా ఉండడం.

ఇక, కవి సమ్రాట్‌ విశ్వనాథ వారు, తనకు జ్ఞానపీఠ పురస్కారం వస్తే తెలంగాణ వారమైన జువ్వాడి గౌతమ రావుగారిని, కోవెల సంపత్కుమారాచార్య గారిని, నారాయణరావు గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని, నన్ను వారి ఊరికి (నందమూరు) తీసుకెళ్ళి అనేకానేక అతిథి సత్కా రాలు చేసి స్వయానా తమ చేతులతో వడ్డిస్తూ, ‘ఈ కరీంనగర్‌ వాసుల రుణం నేనెన్ని జన్మలకు తీర్చుకోగలను’ అని అన్నారంటే మనమూహించుకోవచ్చు వారు ఆ నేలను, ఆచటి వారిని ప్రేమించారో, గౌరవించారో, ఎంతగా  వారితో మమేకమయ్యారో.

విశ్వనాథ, ఐ.వి. చలపతిరావు, కె.వై.ఎల్‌. నరసింహారావు ముగ్గురూ ముగ్గురే ముత్యాల లాంటి వారు. వారి ప్రిన్సిపాల్‌గిరీ కాలంలో వారొక విధమైన పరిపాలనా చరిత్రను సృష్టించారు. అచటి విద్యార్థులకే కాదు అచటి వారందరికీ విద్యంటే, సాహిత్యమంటే, సంస్కృతంటే, దేశభక్తంటే, సామాజిక స్ఫూర్తి అంటే ఏమిటో, వారి పాఠాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఉద్బోధల ద్వారానే కాక వారి జీవన విధానాల ద్వారా చూపెట్టారు. అలాగే సాదాసీదాగా బ్రతకడమంటే, నీతి నిజాయితీగా ఉండడమంటే, వికాసవంతం గా, వినయవంతంగా, వివేకవంతంగా, ఆత్మాభిమానంతో, ఆత్మ విశ్వాసంతో జీవించడమంటే ఎలాగో వారు స్వయానా జీవించి చూపించారు.

అలాగే పాండిత్యమంటే ప్రతిభంటే ఏమిటో, వాటి కొరకు ఎలా పరిశ్రమించాలో, పాటుపడాలో చూపెట్టారు. ఒక మంచి ఆచార్యుడంటే, ఒక మంచి విద్యా పరిపాలకుడంటే ఎలాంటి వాడో కూడా. ఆరోజుల్లో కళాశాలలకు బైటి ప్రపంచానికి సంబంధమే ఉండేది కాదు. కానీ, ప్రిన్సిపాళ్ళుగా చలపతిరావుగారు, కె.వై.ఎల్‌. నరసింహారావుగారు అలాంటి సంస్కృతిని బ్రేక్‌ చేసి సంస్థకూ, సంఘానికీ సంబంధం ఏర్పరిచారు. చలపతిరావు గారు, పి.వి. నరసింహారావు గారితో కలిసి జిల్లా అంతటా పర్యటించి విద్య, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విషయాలపై కూడా ఉపన్యసించేవారు. ఇంగ్లీషులోనే కాక తెలుగులో కూడా ధారాళంగా మాట్లాడేవారు. ఆ విధంగా అక్కడి వారికి ఎంతో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య సాంస్కృతిక చైతన్యం, సామాజిక ప్రేరణ కలిగించేవారు. అలాగే దేశభక్తి, స్వయంశక్తి కూడా. ఎవరూ వారివైపు వ్రేలు చూపించేవారు కారు వారు అక్కడివారు కారని. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణవారు వారందరినీ తెలంగాణ వారికన్నా ఎక్కువ ప్రేమిస్తారు, ఆ కాలేజీలో వారు గడిపిన రోజులు అపుడపుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు, వాటిని ‘గోల్డెన్‌ డేస్‌’గా, ‘లక్కీడేస్‌’గా భావిస్తారు.

నాకూ ప్రిన్సిపాల్‌గా మంచిపేరు వచ్చిందంటే అది వారి వలననే, వారిచ్చిన స్ఫూర్తి వలననే. నేనెప్పుడూ ప్రిన్సిపాల్‌ అంటే అలాగుండాలని అనుకునే వాడిని వారిని చూసి,   వక్త అంటే అలా ఉండాలని అనుకునే వాడిని వారిని విని.  వారు జీవితమంతా అలాగే నిస్వార్థంగా గడిపారు నిప్పులాంటి నిజాయితీ పరులుగా. నూరేళ్ళకు దగ్గర పడుతూ కూడా ఇప్పటికీ ఐ.వి. చలపతిరావు గారు నిర్విరామంగా రచనలు చేస్తూ, ఉద్బోధలు చేస్తూ అలాగే ఉన్నారు అప్పటిలాగే ఆదర్శప్రాయంగా, ఇప్పటికీ ఈ వయసులో కూడా ఇంకా అనేకానేక పుస్తకాలు వ్రాస్తూ, అనేకానేక చోట్ల ఉద్యమిస్తూ, అనేకానేక విద్యాసంస్థల్లో సలహాదారులుగా పనిచేస్తూ, వారి పాత కొత్త పరిచయస్తులందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆనందపరుస్తూ.
అందుకే అంటాం మేము విశ్వనాథ వారిని, ఐ.వి. చలపతిరావు గారిని, కె.వై.ఎల్‌. నరసింహారావు గారిని వారు మీ వారే కాదు మా వారు కూడానని. మీవారికన్నా వారు మా వారే ఎక్కువని. అందుకే అంటాము అప్పటికీ ఇప్పటికీ మా విశ్వనాథయని. మా చలపతి రావుగారని, మా కె.వై.ఎల్‌. నరసింహారావు గారని.

అందుకే గదా అన్నారు విశ్వనాథ వారు వారి వేయిపడగలలో…

‘ఏ కులం, ఏ వర్ణం, ఏ ప్రాంతం వారయితేనేమి? తాదృశ్య మహా ప్రకృతులకు నమస్కారం!’ అని. అలాంటివారు ఆంధ్రా ప్రాంతం వారైనా, తెలంగాణ ప్రాంతం వారైనా మరి మనవారే కదా మరి మనందరివారు.

– డా. వెల్చాల కొండలరావు
కన్వీనర్‌, తెలంగాణ కల్చరల్‌ ఫోరమ్‌.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రావి శాస్త్రి గారి స్నేహితులలో ఒకడిగా ఉండాలనుకొన్న దర్శకుడు బి యెన్ రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెల్లూరు టౌన్ హాల్ కు శతాయుస్షు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం’తో ఆ తప్పులన్నీ తుడుచుకుపోయాయి అంటున్న నాగార్జున

గతంలో కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన తప్పులన్నీ ‘మనం’ సినిమాతో తుడుచుకుపొయ్యాయని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న (ఏఎన్నార్‌) లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాల నటులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ విడుదలై 85 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్‌కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా విజయోత్సవాన్ని సోమవారం రాత్రి అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ సినిమా సెట్స్‌ మీదుండగానే నాన్నకిది చివరి సినిమా అవుతుందని తెలిసి కుమిలిపోయాం. చివరి రోజుల్లో నటించడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా వచ్చి తన పాత్రను ఆయన పూర్తి చేశారు. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా హిట్టవుతుందో, లేదోనని భయపడ్డాను. ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్టవడంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న లేకపోవడం ఎంతో బాధనిపించింది. ఆయన లేనిలోటును ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ద్వారా మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆయన చెప్పారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని చెబుతూ ‘‘దర్శకుడు విక్రమ్‌కుమార్‌ అయితే వేరే లోకమనేది లేకుండా పనిచేశాడు. అద్భుత దృశ్యకావ్యంలా దీన్ని మలచాడు. ఆయనను అక్కినేని కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మనం మంచి సినిమాయే కాదు, అందమైన సినిమా. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది’’ అని ఆయనన్నారు. ఈ సినిమాకి సంబంధించి తనకెన్నో అద్భుతమైన అనుభూతులున్నాయని విక్రమ్‌కుమార్‌ అన్నారు.
ఈ చిత్రంలో నటించడం ఓ బాగ్యంగా భావిస్తున్నానని జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈఓ మహేశ్‌ రామనాథన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం లాంటిది ఈ చిత్రం. ఇది తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునే చిత్రం. ముంబైలో ఈ చిత్రాన్ని చూసిన మా మిత్రులు హిందీలో దీన్ని రీమేక్‌ చేయడం అసాధ్యమని తేల్చేశారు’’ అని చెప్పారు. ‘మనం’ విడుదలైనప్పుడు ఆస్ర్టేలియాలో ఉన్నాననీ, అక్కడే ఈ చిత్రాన్ని చూశాననీ, తన కళ్లవెంట నీళ్లు వచ్చాయనీ వెంకట్‌ అక్కినేని తెలిపారు. ఇప్పటికి ఈ సినిమాను తాను మూడు సార్లు చూశాననీ, దీనిని ప్రశంసిస్తూ లెక్కలేనన్ని ఫోన్లు వచ్చాయనీ ఏఎన్నార్‌ కుమార్తె నాగసుశీల అన్నారు. విక్రమ్‌కుమార్‌ అద్భుతంగా చిత్రాన్ని మలచాడనీ, అనూప్‌ తన సంగీతంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్లాడనీ నాగచైతన్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు, ‘శిరిడిసాయి’ నిర్మాత మహేశ్‌రెడ్డి అతిథులుగా పాల్గొని యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. రచయిత హర్షవర్థన్‌, కళా దర్శకుడు రాజీవన్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, గేయ రచయిత చంద్రబోస్‌, నటులు కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్‌, కౌశల్‌, నటి విజయలక్ష్మి, ఇతర యూనిట్‌ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహిళలకూ ఓ అఖాడా! :

అలహాబాద్‌గా పేరొందిన ప్రయాగ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగ, యమున, సరస్వతి త్రివేణీ సంగమ నిలయం. ఇక్కడ  సాధువులెంతోమంది గంగా నదీ తీరం పొడవునా ఆశ్రమాలేర్పరుచుకుని కనిపిస్తారు. ఆ నివాస ప్రదేశాలే ‘అఖాడా’లు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 అఖాడాల్లో 4 అలహాబాద్‌ సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొనటం కోసం సాధువులెంతో మంది తరలి వస్తూ ఉంటారు. ఒళ్లంతా బూడిద పూసుకున్న అఘోరాలు, నాగ సాధువులు, లక్షల మంది సన్యాసులు అమావాస్య రోజున గంగానదిలో స్నానాలాచరిస్తూ కనిపిస్తారు. అయితే వారిలో మహిళా సాధ్వీలు చాలా తక్కువ. వారికంటూ ప్రత్యేకంగా అఖాడా కూడా లేదు.  అందుకే  దేశ వ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న సన్యాసినులందరూ ఒక అఖాడాను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి శంకరాచార్య అఖాడా అని పేరు పెట్టుకున్నారు. ఈ అఖాడాకు ప్రధాన సాధ్వి  50 ఏళ్ల ‘మహంత్‌ త్రికాల్‌ భవంత’.
అసలీ అఖాడా పుట్టడం వెనకొక కారణముంది. సాధారణంగా కుంభమేళాలో అఖాడాల కోసం ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తారు. 99 శాతం పురుషులు నివసించే ప్రదేశంలో మహిళలు నివసించటం కష్టం కాబట్టి తమకు కూడా ప్రత్యేక ప్రాంతం కావాలని సాధ్వీలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అయితే వీరి డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. తమకు ఒక ప్రత్యేకమైన అఖాడా ఉంటే అక్కడ నివసించటం సులభమవుతుందని భవంత, ఆమె అనుచరులు భావించారు. జగద్గురు శంకరాచార్య పేరిట ఒక అఖాడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక అఖాడా ఉండాలని సాధ్వీలు పట్టుపట్టడం, దానిని ఏర్పాటు చేసుకోవటం చరిత్రలో ఇదే ప్రథమం.  ‘‘హిందూ ధర్మంలో పురుషులు, సీ్త్రలు అనే వివక్ష లేదు. ఇద్దరూ సమాన భాగస్వాములే. అంతే కాదు మహిళలు పుట్టుకతోనే పూజ్యులు. వారే భగవంతుడిని శ్రద్ధగా సేవిస్తారు..’’ అంటారు భవంత. ప్రస్తుతం శంకాచార్య అఖాడాలో అనేక మంది సాధ్వీలు నివసిస్తున్నారు. పురుష అఖాడాలలో మాదిరిగానే ఇక్కడ కూడా బాధ్యతలన్నింటినీ స్పష్టంగా విడగొట్టారు. వీటిని అఖాడాలలో నివసించే కొందరికి అప్పచెప్పారు. ప్రస్తుతం అఖాడాలో హిందు సంప్రదాయ పద్ధతులను బోధించటంతో పాటుగా ఆయుధాలను ఉపయోగించటం కూడా నేర్పుతున్నారు. మహిళల స్వీయ రక్షణకు ఇది తప్పవనేది భవంత అభిప్రాయం. వచ్చేసారి జరిగే కుంభమేళాలో తమకు కూడా సముచిత గౌరవం కల్పించాలని లేకపోతే తాము తిరగబడతామని కూడా భవంత హెచ్చరిస్తున్నారు.
ఆధ్యాత్మికతకు అంకితం
మహంతి త్రికాల్‌ భవంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ వాసి. ఈమెకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భవంతకు చిన్న వయసులోనే ఆధ్యాత్మికతపై ఆసక్తి ఏర్పడింది. వివాహమంటే విముఖత ఉన్నా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్న భవంతకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిన భవంత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆమె పప్పులు, తృణ ధాన్యాలు ముట్టుకోరు.   పళ్లు, కూరగాయలు మాత్రమే తింటారు.  పొడవాటి దుస్తులు ధరించి, బంతిపూలు పెట్టుకొనే  భవంత అఖాడాలోని  దేవాలయం లోపలి గదిలో గడుపుతారు. ఈమె ఉపయోగించే చేతి సంచులు, ల్యాప్‌టాప్‌ కవర్‌ అన్నీ కాషాయ రంగులోనే ఉండటం విశేషం.

విధులు         – పేర్లు
కొఠారి               – కోశాధికారి
భండారి            –  పాకశాల అధిపతి
కొత్వాల్‌            – కాపలాదారు
రమ్తా పంచ్‌      – దేశంలోని అన్ని శాఖలనూ పర్యవేక్షించే వ్యక్తి
వీటిలోని అన్ని ప్రధాన హోదాలు పూర్తిగా మహిళలకే పరిమితం.

అఖాడాలో ఒక రోజు
ఉదయం 4గం. – నిద్ర మేల్కొనటం.
5 – 6 – మంగళ హారతి
6 – 7-  ధ్యానం, జపం
8-9.30  – టీ, అల్పాహారం
9.30 – 10 – హారతి పూజ
11 గంటలకు  – భోగ ప్రసాదం
మధ్యాహ్నం నుంచి – భక్తుల దర్శనం
సాయంత్రం 5 – దేవాలయం, పరిసరాలు శుభ్రం చేయటం
7 – సంధ్య హారతి
8 – 9 – భజన,  ప్రసాదం
10 – నిద్ర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

Published at: 14-07-2014 02:26 AM

చారిత్రక కల్పనా నవల ‘బోయకొట్టములు పండెండ్రు’లో రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్‌ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా  తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి  ఒక కొత్త వొరవడిని సృష్టించారు.

పండరంగని అద్దంకి శాసనానికి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది చరిత్ర నిర్మాణానికీ, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక నిర్మాణానికీ, భాషా పరిణామానికీ అన్నింటికీ ముఖ్యమైనదే. క్రీ.శ. 624 నాటి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలోని రాజకీయ కల్లోలం ఒక సామ్రాజ్య ఆవిర్భావానికి దోహదం చేసింది. ఈ చారిత్రక యుగానికి సంబంధించిన ప్రజా జీవనం ఏంటి? ఈ చరిత్రను నడిపించిన శక్తులేవి? అనేవి నిజానికి ఇప్పటికీ సాధికారిక సమాధానం లేని ప్రశ్నలు.
ఆంధ్ర దేశంలో షోడశ మహా సామ్రాజ్యాలలోని అస్సక గణం శాతవాహన సామ్రాజ్యంగా విస్తరించడం భారత చరిత్రలో ముఖ్య ఘట్టం. అటు తరువాత విష్ణుకుండినులు.. రాష్ట్రకూటులు పరిపాలన సాగించినా రెండో పులకేశి వేంగిని జయించి కుబ్జ విష్టువర్థనుణ్ణి పాలకుడుగా నియమించడం తెలుగు చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుని తీసుకొచ్చింది. మధ్యయుగాల యుద్ధకాంక్షలు- సాంస్కృతిక విస్తరణలూ- వీరుల క్రూరత్వాలు మొదలైనవన్నీ మొదలై పతాక స్థాయికి చేరుకున్న కాలం ఇది. దక్షిణా పథ రాజ్యాల మధ్య ఘోరయుద్ధాలతో పాటు వైవాహిక సంబంధాలు ఏర్పడి చిన్న చిన్న రాజ్యాలు బలమైన రెండు సామ్రాజ్యాలుగా ఆవిర్భవించవలసిన కాలం ఇది.

భారత ఉపఖండంగా వందలాది జాతులు- వలసలతో నిరంతరం సంఘర్షించుకున్న ఈ ఉపఖండం ఒక దేశంగా ఏర్పడటానికి దోహదం చేసిన ముఖ్యమైన చోదక శక్తులు వ్యవసాయం -సంస్కృతి అని చెప్పాలి. చారిత్రక యుగంలో వర్ధిల్లిన సార్ధవాహులు -బౌద్ధం- జైనం ఒక తాత్విక సామాజిక విప్లవానికి నాంది పలికాయి. అప్పుడప్పుడే ఏర్పడుతున్న లేత రాజ్యం ముందు రెండు మార్గాలు పరుచుకున్నాయి.
ఒకటి వ్యవసాయం -గ్రామం పునాదిగా వర్ణ కుల వ్యవస్థ సామాజిక రూపంగా ఉండి బ్రాహ్మణుల మంత్రాంగం క్షత్రియుల నాయకత్వంలోని వైదిక వర్ణ వ్యవస్థ.
రెండోది వ్యవసాయం -వర్తకం -పట్టణాలు పునాదిగా వర్ణకుల వ్యవస్థ లేని సమాజంగా ఉండి బ్రాహ్మణ మంత్రాంగానికి చోటులేని క్షత్రియ నాయకత్వంలోని గణతంత్ర వ్యవస్థ.
ఈ రెండు మార్గాలలో రాజ్యం ఏ మార్గం ఎంచుకోవాలి అనేదాన్ని వైదిక ఆర్థిక వ్యవస్థ నిర్దేశించింది.
వ్యవసాయం-గ్రామం-చేతివృత్తులు -బ్రాహ్మణులు -అవైదిక అగ్రకులాలు -సత్శూద్రులు- దేవాలయం ఉండే స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడటం అంత సునాయాసంగా జరిగింది కాదు. లేదా అహింసాయుతంగా ఏర్పడిందీ కాదు. బ్రాహ్మణులు- క్షత్రియులు- వైశ్యులు ఒక వర్గంగా శూద్రులు -ఆదివాసులు మరో వర్గంగా జరిగిన వర్గపోరాటం ఫలితంగా ఏర్పడిన వ్యవస్థ ఇది. హింస -వర్ణసాంకర్యం -కులం -వైదిక సంస్కృతి సాధనాలుగా దేశమంతా వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది.

భారత చరిత్రలో మనకి ఈ ఘర్షణకి సంబంధించిన చారిత్రక ఆధారాలు అతి తక్కువగా కనిపిస్తాయి. వందలాది సంవత్సరాలు స్థిరంగా ఉండిపోయిన ఈ ఆర్థిక వ్యవస్థ పాత ఘర్షణల తాలూకూ ఆనవాళ్లని దరిదాపుగా చెరిపివేసింది.
కాబట్టి ఈ ఘర్షణ చరిత్రని పునర్నిర్మించుకోవడానికి ఆధునిక కాలంలో జీవించి ఉన్న గత చరిత్రని విశ్లేషించుకుంటూ భౌతిక ఆధారాల చుట్టూ కల్పనని జోడించుకుంటూ పోవాలి. ఇది చరిత్ర అధ్యయనానికీ కళా సౌందర్యానికీ దోహదం చేసే అద్భుత కళా రూపం అవుతుంది. అటువంటి అద్భుత కళారూపం కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళే రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’ నవల.

తెలుగులో చరిత్రని ఆధారం చేసుకొని అల్లిన చరిత్ర కాల్పనిక నవలల సంఖ్య కొద్దిపాటివే. పురాణవైర గ్రంథమాల చారిత్రక నవలల కోవలోనివి కాదు. బాపిరాజు -గోనగన్నారెడ్డి, అడివి శాంతిశ్రీ, నోరి నరసింహశాసి్త్ర -వాఘిరా, తెన్నేటి సూరి -చంఘీజ్‌ ఖాన్‌, అల్లం రాజయ్య, సాహుల -కొమురం భీం లాంటి నవలలు చారిత్రక కాల్పనిక నవలలు. ఈ కోవలోని నవల ‘బోయకొట్టములు పండ్రెండు’.

పండరంగని శాసనంలోని ఈ మాటను తీసుకొని ఇప్పటి దాకా ఉన్న చరిత్రని అధ్యయనం చేసి రాసిన ఒక జాతి వీర గాథ ఇది. ఆ జాతి బోయ.

బహుశా నల్లమల అటవీ ప్రాంతంలో నివసించిన గిరిజన జాతి బోయలు. ఒక్క ఆంధ్ర ప్రాంతాన్నే తీసుకున్నా అటవీ ప్రాంతంలోని జాతుల సంఖ్య తక్కువ కాదు. దండకారణ్యంలో గోండులు కోయలు గుత్తికోయలు సవరలు జాతాబులు చెంచులు ఇంకా ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు. వేలాది సంవత్సరాల క్రితం ఇప్పటికన్నా ఎన్నో రెట్ల వైశాల్యంలో ఉండిన అటవీ ప్రాంతాలలో చరిత్రకెక్కని ఎన్నో రకాల ప్రజలు నివసించి ఉండొచ్చని ఊహించవచ్చు.

భారత ఉపఖండంలో రాజ్యం అనేది ఏర్పడిన తరువాత మొదటి నుండీ దానికున్న కర్తవ్యం ఈ వేరు వేరు జాతుల ప్రజల్ని ఒక రాజ్యపు పాలితులుగా మార్చడం. అందుకోసం వైదిక సమాజ చట్రంలోకి ఈ జనాన్ని చేర్చుకోవడం. ఈ పరిణామం అంతా మనం చరిత్రలో చూడొచ్చు. వందల తరాలు గడిచాక ఈ జాతుల ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా అవన్నీ వివిధ అవైదిక కులాలుగా వైదిక సమాజ చట్రంలోకి చేరిపోయాయి.

కానైతే బౌద్ధం, జైనం లాంటి తాత్విక చింతనలు మనకి చేసిన మహోపకారం ఆయా జాతుల అమ్మదేవతల పూజల్ని కొనసాగనివ్వడం. బౌద్ధ శ్రమణకులు ఆనాటి ప్రజల అనూచాన పూజాదికాలలో కల్పించుకోకుండా అష్టాంగ మార్గాన్ని ప్రబోధించారు. ఫలితంగా బ్రాహ్మణ్యం ఈ జాతుల ప్రజల్ని వాళ్ళ వాళ్ళ అమ్మ దేవతలు వాళ్ల జాతి పురాణ గాథలతో సహా చేర్చుకోవల్సి వచ్చింది. అంతేకాక అమ్మదేవతలనీ, పురాణ గాథల్నీ ఆమోదించాల్సి వచ్చింది.

ఈ గాథలు, ఈ పండుగలు ఈ ఆచార వ్యవహారాలే ఇవాళ మనం గతాన్ని గురించి ఊహించడానికి ఉన్న ఆధారాలు. వీటికి ఉన్న భౌతిక యదార్థత ఎంత తక్కువైనా అది ఈవేల్టికీ మన జీవితంలో కొనసాగుతున్నది. మన చారిత్రక జీవనంలోని ఈ సంక్లిష్టతలోంచి ఒక సాంఘిక జీవనాన్నీ పరిణామాన్నీ చిత్రించిన బోయకొట్టములు పండ్రెండు అచ్చంగా తెలుగు ప్రజల వీరగాథ.

పల్లవులకీ వేంగి చాళుక్యులకీ మధ్య జరిగిన యుద్ధాలలో త్రిపురాంతకం ప్రాంతంలోని బోయలు నలిగిపోయి తమ జీవనం కోసం అణ్డెక్కి ప్రాంతానికి బయలుదేరడంతో ఈ నవల ప్రారంభమవుతుంది. మొదటి బోయ వీరు వీరనబోయడు అతని భార్య మంగసాని పల్లవుల ప్రాపకాన్ని సంపాదించి అణ్డెక్కి ప్రాంతంలో స్థిరపడతారు. క్రమంలో ఇవి పన్నెండు బోయకొట్టాలుగా విస్తరిల్లుతాయి.

పల్లవులతోనూ చాళుక్యులతోనూ కలవకుండా తమ మానాన తాము జీవిద్దామని బోయ నాయకులు భావించినా అది సాధ్యపడదు. ఇటు పల్లవ రాజో అటు చాళుక్య రాజో ఎవరో ఒకరివైపు ఉండాల్సిన స్థితి బోయలది.

పల్లవులైనా చాళుక్యులైనా వాళ్ళు విస్తరింప చేయదల్చుకున్న వ్యవస్థ మాత్రం ఒకటే. రాజ్యం కోసం విస్తరణ కోసం యుద్ధాలు చేసుకున్నా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం వీరి ధ్యేయం.

పల్లవ రాజప్రతినిధి జయవర్మ మొదటి వీరనబోయనితో కట్టెపు దుర్గాన్ని నిర్మించమనీ, వీరన బోయన వంశం వారు మొత్తం బోయ కొట్టాలకు పాలకులుగా ఉండాలనీ, పన్నులు వసూలు చేయాలనీ, జనం అంతా యుద్ధ విద్యలలో ఆరి తేరి ఉండాలనీ ఆజ్ఞాపిస్తాడు.

బోయ కొట్టాల మీదికి వచ్చిన చాళుక్య జయసింహ వల్లభుడు పల్లవుల అనుమతులనీ ఆమోదిస్తూనే వాటితో పాటు బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల్ని గ్రామంలో ఉంచుకోవాలనీ శివాలయాలు కట్టుకోవాలనీ పూజలు చేయాలనీ ఆజ్ఞాపిస్తాడు. అంతటితో ఆగకుండా రెండవ వీరన బోయణ్ని శిక్షణ కోసమని తనతో తీసుకుపోతాడు.

తమని పోలిన ఒక వైదిక రాజరిక వ్యవస్థని బోయల్లో నెలకొల్పి ఆ వ్యవస్థని తమ సామంత రాజ్యంగా చేసుకోవాలనే యోచన ఇరువేపులా కనిపిస్తుంది. కానీ బోయలు ఈ వైదిక రాజరిక వ్యవస్థలో చేరకుండా తాము తాముగా ఉండిపోవాలని ప్రయత్నిస్తారు. ఈ రెంటి మధ్య ఏ విధమైన ఘర్షణ -శాంతి జరిగాయనేదే ఈ నవల.

ఒకటవ వీరన బోయడు- మంగసాని, రెండవ వీరనబోయడు- జయశ్రీ, సంపంగి, కసవనబోయడు- పృధ్వీవ్యాఘ్రరాజు, నన్ని బోయడు- పొన్ని బోయడు, పొన్ని బోయడు- వకుళ, గుణగ విజయాదిత్యుడు- పండరంగడు.. ఈ ప్రధాన పాత్రల చుట్టూ జరిగిన ఘట్టాలు తొలి మధ్యయుగ చరిత్రని మన ముందు ఉంచుతాయి.

పృధ్వీవ్యాఘ్రరాజు బలవంతంగా వైదిక రాజరికాన్ని బోయలలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తాడు. బోయ కొట్టాలుగా ఉన్న సమాజాన్ని ఒక రాజరిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నమే ఫలించి ఉంటే చరిత్రలో చాళుక్యులకి ఒక బలమైన సామంత రాజ్యం ఉండేది. లేదా బోయలే బలపడి తెలుగు నాట ఒక కొత్త రాజవంశంగా తలెత్తేది.

తలెత్తలేదు. పృధ్వీవ్యాఘ్రరాజు కాలానికి నిరంతర యుద్ధాలనించి బయటపడి తీరికగా ఉన్న పల్లవులు బోయకొట్టాల మీద తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకున్నారు. పల్లవ ఉదయచంద్రుడు కసవనబోయని మనుమడు వీరభద్ర బోయణ్ణి నాయకుడిగా చేశాడు. వీరభద్ర బోయడు పసి వయస్సులోనే హత్యకు గురౌతాడు. తరువాత నన్ని బోయడు పొన్ని బోయడు అనేవారు బోయకొట్టాలకు నాయకులౌతారు.

ఇక్కడి వరకూ వేంగి చాళుక్యులతో మైత్రినీ బంధాన్నీ పెంచుకున్న బోయ కొట్టాలు ఇప్పుడు పల్లవులతో మైత్రినీ, బంధాన్నీ పెంచుకుంటారు. బోయ ప్రతినిధిగా నన్ని బోయడు- నాగరికతను నేర్చి వైదిక రాచరిక మర్యాదల్ని వంట పట్టించుకున్న పొన్ని బోయడు ఇద్దరూ కలిసి బోయకొట్టాలను బలపరుచుకున్నారు. పొన్ని బోయడు వకుళను వివాహమాడడం ద్వారా పల్లవుల బంధుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు.

బహుశా బోయ కొట్టాల వంటి ఒక పరిపాలనా విభాగం ఇక రాజ్యంగా రూపాంతరం చెందాల్సి ఉంది. అప్పటికే గ్రామం ఏర్పడిపోయింది. బ్రాహ్మణులు, వివిధ కులాల చేతివృత్తుల వారు వ్యవసాయం అన్నీ బోయ కొట్టాలలో స్థిరపడ్డాయి. వైదిక గ్రామం ఏర్పడి ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వైదిక బోయ రాజ్యం ఏర్పడడానికి నేపథ్యం ఏర్పడింది.

కానీ చరిత్ర ఇంకోలా సాగింది. 108 యుద్ధాలతో విసిగి వేసారిన చాళుక్యరాజు మరణం తరువాత గుణగ విజయాదిత్యుడు అధికారంలోనికి వచ్చాడు. ఇతడికి స్పష్టమైన లక్ష్యం ఉంది. అందుకు తోడు వీరుడూ అతి క్రూరుడూ అయిన పండరంగని సేనాధిపత్యం ఉంది.

చారిత్రక కల్పనా నవలలో రచయిత చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్‌ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. చాలా ముఖ్యంగా చారిత్రక నవలలో కల్పన అనేది చాలా క్లిష్టమైన అంశం. చారిత్రక సంఘటనల వాస్తవికత మీద కొన్ని చారిత్రక పాత్రల్ని ఆధారంగా తీసుకొని కల్పిత పాత్రల్ని సృష్టించి రాయడం రచయిత సామర్థ్యానికి పరీక్ష. మనకి చాలా చారిత్రక నవలల్లో చరిత్రని కల్పన అధిగమిస్తూ ఉంటుంది.

చరిత్ర గమనంలోని భౌతిక వాస్తవికతని ఏ మాత్రం విస్మరించకుండా ఏ మాత్రం అధిగమించకుండా వాస్తవికతని ప్రస్ఫుటీకరించే కల్పనని జోడించడం ఈ నవలకి అద్భుతమైన శైలిని ఇచ్చింది. ఒక్కొక్క తరంలోని -ఒక్కొక్క కాలంలోని సంఘటనల మధ్య ఉత్థాన పతనాల గతితార్కికతనీ, వాటి వెనుక ఉండే చారిత్రక చోదక శక్తుల్నీ కళాత్మకంగా చిత్రించారు.

మొట్ట మొదట నవల పేరే మన్ని కట్టిపడేస్తుంది. తెలుగు భాషా చర్చ నవలలో సందర్భాఆనికి తగినట్లుగా ప్రవేశిస్తుంది. జానపద పాటలు వాటి శైలీ సంస్కృత సంధుల్ని సమాసాలనీ తెలుగులోకి ప్రవేశపెట్టడానికి కృషినీ దానికి వ్యతిరేకతనీ కూడా చిత్రిస్తుంది ఈ నవల.

నిజంగానే చరిత్రలో చాలా సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. రాజ్యం- మానవుల చైతన్య శీల కార్యాచరణనించి జరుగుతాయి. రాజ్యం అండదండలతోనే వైదిక ఆర్థిక వ్యవస్థ విస్తరించింది. దీనికి సముద్రగుప్తుడి నించి అన్ని రాజ్యాలు దోహదం చేస్తాయి. సాంస్కృతిక రంగంలో ఇది సహజ పరిణామం అనిపించవచ్చు గానీ ఇది బలప్రయోగంతో విస్తరించినదే. అలాగే భాష- తెలుగు భాష, కవిత్వం, ఛందస్సు, ఇవన్నీ సాహిత్యేతర రాజరిక అవసరాల కోసం సృష్టించినవి. అన్నంత మాత్రాన అందులో మనం వ్యతిరేకంగా తీసుకోవల్సింది  ఏమీ లేదు.

మరో ముఖ్యమైన అంశం బౌద్ధం. ఈ నవలా చారిత్రక కాలానికి బౌద్ధ విస్తరణ భీతి వైదిక రాచరికాన్ని వెన్నాడుతూనే ఉంది. అందుకే బౌద్ధం విస్తరించకుండా- ముఖ్యంగా పాలితులలో, అంతకన్నా ముఖ్యంగా బోయల వంటి జాతులలో విస్తరించకుండా రాజ్యం ఎన్నో పటిష్ఠమైన ఏర్పాట్లు చేసుకుంది. దీని చివరి ఫలితం నన్నయ మహా భారత అనువాదం.

తెలుగు భాషలో వచ్చిన చారిత్రక కల్పన నవలల్లో ఇది ప్రజల చారిత్రక వీరగాథని చిత్రించిన అద్భుత నవల.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం

నా దారి తీరు- 75

బ్రాహ్మణ వ్యవసాయం

మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు అని భావం. కస్ట పడకుండా ఫలితం వస్తుంది .వాళ్ళని కౌలు పేరుతో మోసం చేయచ్చు అని వ్యంగ్యార్ధం .కారణం వీళ్ళు పొలం వెళ్లరు .ఏ పంట వేస్తున్నారో తెలుసుకోరు .యెంత ఆదాయం వస్తుందో యెంత రేటుకు అమ్మాడో  అక్కర్లేదు .సంవత్సరం అవగానే వాళ్ళ చేతిలో ఏదో కొంత పెడితే చాలు అని అందరూ అనుకోవటమే బ్రాహ్మణ వ్యవసాయం .

కాని మా ఉయ్యూరులో పక్కనున్న సాయిపురం ,కనక వల్లి ,పెనమకూరు పేద వోగిరాలలో  లలో బ్రాహ్మణులు గొప్పగా వ్యవసాయం చేసేవారున్నారు .వీరందర్నీ స్వయం గా నేను చూశానుకూడా .ఉయ్యూరు లో మా మేన మామ గంగయ్య గారు ఆయన తండ్రి శింగిరి శాస్త్రిగారు ,పిన తండ్రి నరసింహం గారు నిత్యం పొలం వెడుతూ పాలేళ్ళతో పని చేయిస్తూ అజమాయిషీ చేస్తూ ,అవసరమైతే దుక్కి దున్నటం , నాట్లు వేయటం, కలుపు తీయటం కొత్త కోయటం   ,కట్టి వెత నూర్పిడి పనుల్లో ఆరి తేరిన వారే .వీరు పొలంలో  కని  పిస్తే చాలు కూలీలకు తమ కంటే ఆసాములకే పనులు బాగా తెలుసునని మరింత కస్టపడి పని చేసేవారు .మా అమామయ్య ధాన్యం బస్తాలు మినుము బస్తాలు కూడా మోసెంత సామర్ధ్యం ఉన్నవాడు .పాలేళ్ళతో కలిసి కట్టెలు కొట్టేవాడు .ఈయన దెబ్బకి వాళ్ళు ఝాడిసే వాళ్ళు .అంత పనిమంతుడు .ఎడ్ల బండీ కట్టటం తోలటం ఆయనకు బాగా అలవాటే . కనుక మా మామయ్య కుటుంబం బ్రాహ్మణ వ్యవసాయం అనేదానికి తగరు అన్నమాట .అలాగే శాయి పురం లో బ్రాహ్మణులంత గొప్ప వ్యవసాయ దారులే .అన్ని పనులూ స్వయం గా చేసుకొనే వారే మంచి పంటలు పండించే వారు కనుక వీరికీ ఈ మాట కుదరదు .

కనకవల్లి ,పెనమకూరు లో ఎక్కువ మంది బ్రాహ్మణులు స్వంత వ్యవసాయం చేసి బాగు పడ్డ వాళ్ళే .కనక వల్లిలో వారిని శ్రీ మంతులు  అంటారు .వారు కూడా గొప్ప వ్యవసాయ దారులు .దగ్గరుండి వ్యవసాయం చేయించేవారు .చెరుకూ బాగా సాగు చేసేవారు . మంచి స్థితిపరులు .దాన గుణ సంపన్నులు .అక్కడి పేద ప్రజలకు తమ భూమి లో కొంత పంచి పెట్టిన వదాన్యులు .కనక వల్లి అగ్రహారం అంతా వారి అధీనం లోనే ఉండేది .వారి అబ్బాయి సోమయాజులు గారు సర్పంచ్ గా చాలా కాలం పని చేశారు .ఇప్పటికీ వారికి అక్కడ భూములున్నాయి .కాని చదువులకోసం కుటుంబం ఉయ్యూరు కు చేరింది .అయిన అజమాయిషీ చేస్తూ పంటలను పండిస్తున్నారు .మిగిలిన వారిలో విష్ణుభొట్ల సోమయాజులు  హైస్కూల్ లో నా క్లాస్ మేట్ .అతనికీ మంచి భూవసతి ఉంది .స్వంత వ్యవసాయం చేసేవాడు .వయసు దృష్ట్యా ఉయ్యూరు లో కాపురం ఉండి యాజమాన్యం చేస్తున్నాడు .అలాగే వెంపటి వారికీ పొలాలున్నాయి వారూ కస్టపడి వ్యవసాయం చేసేవారే .ఇప్పుడు ఆ కుటుంబమూ పట్నాలకు చేరారు .ఇప్పుడు బ్రాహ్మణీకం అక్కడ నామ మాత్రమె .పెనమకూరు లో బ్రాహ్మణులలో మంచి వ్యవసాయ దారులున్నారు .ఇప్పటికీ స్వంత వ్యవసాయం చేస్తూ అనేక రకాల పంటలు పండిస్తున్నారు .అందులో ‘’అనుముల ‘’వారి కుటుంబం వ్యవసాయానికి పెద్ద పేరు .

ఉయ్యూరులో చోడవరపు వారు మంచి  స్థితి పరులు .వ్యవసాయానికి పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉండేవి .ఇది చంద్ర శేఖర రావు గారి కాలం వరకు సాగింది .ఆయన మా నాన్నగారికి సహాధ్యాయి .వారి కుమారుల అజమాయిషీ వచ్చేసరికి వ్యవసాయాన్ని కౌలుకు ఇచ్చి పంట తీసుకొనే వారు .మంత్రాల రాధాకృష్ణ మూర్తి ,ఆయన మామ గారు ఉయ్యూరులో మొదటి ఎరువుల డిపో పెట్టిన యడవల్లి శ్రీరామ మూర్తిగారు శ్రీమంతులే. గొప్ప వ్యవసాయదారులే .వారూ తర్వాత వ్యవసాయాన్ని వదిలేశారు .ఉయ్యూరులో గోవిందరాజు శ్రీరామ మూర్తిగారు ఆయన తమ్ముడు  , నా సహాధ్యాయి అబ్బి అనే పరబ్రహ్మానంద శర్మ లకు గరుగు దగ్గర మెత్త భూమి ఉంది. చెరుకు ,పసుపు కంద మొదలైనవి బాగా పండించేవారు గొప్ప ఫలసాయాన్ని తీసేవారు .మెట్ట వ్యవసాయం లో బాగా లాభ పడ్డారు .వీరందరికీ మించి వ్యవసాయం ఇప్పటికీ చేస్తున్నవారు గరుగు మీద సోమయాజుల కృష్ణ మూర్తి గారి కుటుంబం .కృష్ణ మూర్తిగారు చెరుకు ,మొదలైన  మెట్ట పంటలు బాగా పండించేవారు .పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉన్నాయి  దున్నటం దగ్గరనుండి అన్ని పనులు చేయగల వారు .ఫాక్టరీ కి చేరుకును వారే స్వయం గా తోలే వారు .ఆయన తర్వాత అబ్బాయిలు కూడా ఇప్పటికి శ్రద్ధగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు .అలాగే మా అమామయ్య గారి అబ్బాయి చేస్తూనే ఉన్నాడు .

మా నాన్న గారి కాలం లోను నా టైం లోను మేము గట్టు మీద కూర్చునే వ్యవసాయం చేయించాం .కనుక మాది ‘’బ్రాహ్మణ వ్యవసాయం ‘’అనచ్చు .కాని వ్యవసాయం కోసం ఎప్పుడూ అప్పులు చేయకుండా గడుపుకోచ్చాం .మంచి నిఖామానులైన సీతారామయ్య కాటూరు పొలానికి ,చిన్నబ్బాయి ఉయ్యూరు పొలానికి ఉండి మాకు ఏ ఇబ్బందీ లేకుండా చేశారు ..నేను తప్పకుండా పొలం లో జరిగే అన్ని ముఖ్యమైన పనులు దగ్గరుండే చేయిన్చేవాడిని .కనుక వ్యవ సాయం లో ఎప్పుడూ నష్టం రాలేదు .జాయింటు కౌలుకూ కొంతకాలం చేశాము .పూర్తిగా వాళ్ళ మీద వదిలీ చేశాను .ఎందులోనూ ఇబ్బంది రాలేదు వ్యవసాయం కోసం ఎకరాలు అమ్మక పోవటమే నేను చేసిన మంచిపని అనుకుంటాను .అంతకు మించి ఏమీ లేదు .ఈ వ్యవసాయమే మా కుటుంబానికి ఏడు గడ గా నిల బడింది .దాని వల్లనే అందరం హాయిగా ఉన్నాం .మా తమ్ముడి భాగం అతనికిచ్చి ,ఫలసాయం కూడా అతను అమ్ముకొనే దాకా ప్రతి ఏడాది అప్పగించేవాడిని .మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ బాబు కు కాటూ రులో నాతో పాటు పొలం ఇప్పటికీ ఉంది .పంటలు రాగానే ఫలసాయం అందిస్తాను  .కనుక బ్రాహ్మణ వ్యవసాయమే అని పించినా నేను చేసింది నష్ట వ్యవసాయం కాదు లాభం తోనే చేశాను .దానికి కారణం నమ్మకస్తులైన నిఘా మానులే అని నిక్కచ్చిగా చెప్పగలను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.12-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాస జయంతి గా గురు పూజ

 

వ్యాస జయంతి గా గురు పూజ

వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు మహా భారతంరాయటమే కాక  అందులో లో ముఖ్య పాత్ర దారికూడా .విష్ణు మూర్తి అవతారమే వ్యాసభగవానుడు .సత్యవతీ దాశరాజుల కుమారుడు .సేతి,మాది నదుల సంగమ స్థానం లో జన్మించాడని కూడా అంటారు .ఈ ప్రదేశానికి ఆయన పేరే పెట్టారు .ప్రస్తుతం నేపాల్ లో తనాహు జిల్లాలోని తనౌళి పట్నం లో వ్యాసుడు జన్మించినట్లు భావిస్తారు . .విచిత్ర వీర్యుడు వ్యాసుడి కుమారుడు .విచిత్ర వీర్యుని కుమారులే పాండురాజు ,ద్రుత రాస్త్రుడు .విదురుడు వీరిద్దరికీ సోదరుడు .

Inline image 1

 

ప్రతి ద్వాపర యుగం లోను వ్యాసుడు జన్మించి వేద విభజన చేస్తాడని విష్ణు పురాణం చెబుతోంది .మహా భారత రచనకు రాయసకారుడిగా గణపతిని పెట్టుకొన్నాడు .తన ఘంటానికి ఆప కుండా పని చెప్పితేనే రాస్తానని షరతుపెట్టి రాశాడు .భారతానికి జయ అనే పేరుంది .ఇందులో విష్ణు సహస్రనామం భగవద్ గీతా ఉన్నాయని మనకు తెలుసు .వ్యాసుని చివరి రచనే మహా భారతం .భారతాన్ని ఉగ్ర సేన సౌతి మౌఖికం గా వ్యాపింప జేశాడు .నైమిశారణ్యం లో శౌనకుడనే కులపతి  ,ఆయన  శిష్యులైన మహర్షుల సమక్షం లో దీన్ని వినిపించాడు .

వ్యాసుడు బౌద్ధ వాజ్మయం లోను చోటు చేసుకొన్నాడు . పాళీ భాషలో’’ కన్హ దిపాయన’’ అన్నారు .జాతక కధల్లో బాగా కనిపిస్తాడు .సిక్కుల మత గ్రంధం గురు గ్రంధ సాహెబ్ లోవ్యాసుడు బ్రహ్మ దేవుని కుమారుడు అని ఉంది .గురు గోవింద సింగ్ వ్యాసుడిని వేద నిధి అన్నాడు ,కౌటిల్యుడు రాసిన అర్ధ శాస్త్రం లో వ్యాసుని విషయం తమాషాగా ఉంటుంది . దాండక్య అనే పేరున్న భోజుడనే రాజు ఒక బ్రాహ్మణ స్త్రీని  బలాత్కరించ బోతే రాజ్యం వంశం పూర్తిగా నాశమై పోయాయి .వాతాపి అనే వాడు అహంకారం తో అగస్త్యుని అవమా  నించి నప్పుడు ద్వైపాయనుడిని పైకి వెళ్ళినప్పుడు  నశించి పోయారని చాణక్యుడు వివరించాడు .ఈ కదా బౌద్ధ జాతక కధల్లో వృష్ణి కధను పోలి ఉంటుంది .

వ్యాసుడు బదరీ అంటే రేగు చెట్ల వనం లో జన్మించాడుకనుక బాదరాయణుడు అయ్యాడనే కధనం ఒకటి ఉంది .ఈయనే బ్రహ్మ సూత్రాలు రాసి వేద వేదాంత విశేషాలను అందులో నిక్షిప్తం చేశాడు .బ్రహ్మ సూత్రాలు భగవద్ గీత ఉపనిషత్తులను ప్రస్తాన త్రయం అంటారు .ఈ మూడిటికీ కర్త వ్యాసుడే .పతంజలి యోగ శాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలే అని అంటారు .ఇంత విశిష్ట వ్యక్తీ భగవాన్ వేదం వ్యాస మహర్షి జన్మ దినం ఈ రోజు .ఒక్క సారి స్మరించి తరిద్దాం .ఆయన పెట్టిన అక్షర భిక్ష అన్నపూర్ణ గా వెలుగుతోంది .మహర్షి వ్యాసునికి మనః పూర్వకం గా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిద్దాం .

వ్యాసపౌర్ణమి –గురు పౌర్ణమి –వ్యాస జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-14-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు

నా దారి తీరు -74

షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు

చెరుకు ను ఫాక్టరీ కి తోలిన తర్వాత ,లేక అవసరం అయితే కొంత తోలిన తర్వాత మనం తోలిన చెరుకు తాలూకు ఫాక్టరీ వాళ్ళు నమోదు చేసిన చెరుకు తూకం ఉన్న టికెట్లు ఇస్తారు .వాటిని తేదీ క్రమం లో అమర్చి మొత్తం  మనం ఇచ్చిన టికెట్ల నంబర్ చివరి టికెట్ వెనకాల వేసి ,పాస్ బుక్ లో పెట్టి ,వోచర్ మీద రెవిన్యు స్టాంప్ అంటించి దానిమీద సంతకం పెట్టి ,సాక్షి సంతకం కూడా తెలిసిన రైతు తో చేయించి ఆయన రైతు నంబర్ ను కూడా నమోదు చేయించి ,ఫాక్టరీ లో దీన్నీ చూసే గుమాస్తాకు ఇవ్వాలి .దానికి పెద్ద క్యూ ఉంటుంది .అందులో నిలబడి మన వంతు వచ్చిందాకా ఉండి ఇవ్వాలి. దానిపైన వాళ్ళు ఫలానా రోజుకు ఇస్తామని చెప్పి వాయిదా వేసి ,రాస్తారు .అప్పుడు వెళ్లి తీసుకోవాలి .మా నాన్న గారి చనిపోయిన 1961నుండి నాకు దీని అనుభవం ఉంది .అప్పుడు అంతా మాన్యు వల్ వర్క్ .కనుక తోలిన   చెరకుకు  దానికి తగిన టికెట్లు వచ్చాయో లేదో వాళ్ళు తనిఖీ చేసి ఫాక్టరీ,నుంచి ఏదైనా ధన రూపం లో లేక ఎరువుల రూపం లో లబ్దిపొందారా లేదా అని చెక్ చేసి  లేడ్జేర్లు, ఫైళ్లు తిరగేసి ఒకటికి రెండు సార్లు కౌంటర్ చెక్ చేసుకొని  ముందు ఆ డబ్బు మినహాయించి మిగిలినదాంట్లో దాదాపు ఎనభై శాతం డబ్బు ఇచ్చేవాళ్ళు .వాయిదా వేసిన రోజుకు ,సమయానికీ మళ్ళీ వెళ్ళాలి .అప్పుడూ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారుకనుక మళ్ళీ క్యూ ఆ క్యూ అంతా అవటానికి చాలా సమయం పట్టేది .మన వంతు రాగానే యెంత డబ్బు వచ్చేదీ చెప్పి ,మెయిన్ ఆఫీస్ లో ఉన్న కాష్ కౌంటర్ దగ్గరకు పంపిస్తారు .అక్కడా లైన్ ఉంటుంది .డబ్బు ఇచ్చె ఆయ న మన మొహం చూసి మనమే ఆ వోచర్ మీద సంతకం పెట్టామని తేల్చుకొని ,ఆ వోచర్ మనకిచ్చి ,దాని వెనక మళ్ళీ సంతకం చేయించి మన వూరి వారెవరైనా అక్కడ ఉంటె వారి తో సాక్షి సంతకాలు రెండు చేయించి వాళ్ళ రైతు నంబర్లు నాట్ చేయించి  ఆయన కిస్తే అప్పుడు డబ్బు ఇస్తాడు .అప్పుడు బాంకులు లావా దేవీలు లేవు .అంతా స్వయం గా వెళ్లి తెచ్చుకోవాల్సిందే .డబ్బు ఇచ్చే ముందు అక్కడే కూర్చున్న మేనేజర్ చెక్ చేస్తాడు తోలిన  చెరకుకు  ఉన్న రేటు ప్రకారం సరిగ్గా లెక్క వేశారా లేదా చూస్తాడు .

1960-70కాలం లో టికెట్లు తీసుకొనే కౌంటర్ లో అంజయ్య గారు అనే ఆయన ఉండేవాడు ఆయనది గోపువాని పురం అని జ్ఞాపకం .పంచె కట్టి కొంచెం లావు కళ్ళద్దాలతో ఉండేవాడు .జోడు ముక్కు మీదికి జారుతూ ఉండేది సకిల్ మీద వచ్చేవాడు కమ్మ వారు .చాలా మంచి వాడు .లెక్కల్లో దిట్ట .అచ్చం మన అల్లు రామ లింగయ్య లా గా ఉండేవాడు  నేను అన్నా, మా నాన్న గారన్నా చాలా అభిమానం గా ఉండేవాడు ..నాకు తక్కువ రోజుల్లో వాయిదా పడేట్లు చేసేవాడు .ఆమ్యామ్యాలు ఆయనకు తెలియవు .పరిచయమే .ముక్కు సూటి మనిషి అందరికి ఆయన అంటే గౌరవం విసుగు ఉండేదికాదు .ఆ పెద్ద పెద్ద  లేద్జేర్ల పుస్తకాల మధ్య ఆయన  ఒక లిలీ పుట్ లా కని పించేవాడు .చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం .అందుకే మరీ గుర్తుంచుకొని ఆయన గురించి రాస్తున్నాను .ఇలా చాలా సంవత్సరాలు నడిచింది .

ఆ తర్వాతా బ్యాంకులు రైతులకు అప్పులివ్వ టానికి ముందుకొచ్చాయి .వాటిల్లో డబ్బు లేని రైతులే కాదు అందరూ అప్పు తీసుకొనే వారు కొంచెం వడ్డీ తక్కువ .యెంత డబ్బు అప్పు తీసుకోన్నామో  బ్యాంకి వాళ్ళు తెలియ జేసేవారు .అగ్రిమెంట్ లో బ్యాంక్  కాగితాలు కూడా చేర్చేవారు .బ్యాంకి అప్పు ,వడ్డీ పోను మిగిలిందే ఫాక్టరీలో చెల్లించే వారు .పనులు కొంత తేలికయ్యాయి .కాష్ ఇచ్చే ఆఫీసులో కలువ పాములకు చెందిన భాస్కర రావు గారు అనే ఆయన ఉండేవాడు .ఎర్రగా పాంట్ షార్ట్ తో ఉండేవాడు .మా బజారు లోనే టాంక్ దగ్గర అద్దేకుండేవాడు,. వాళ్ళబ్బాయి నాదగ్గర ట్యూషన్ కూడా చదివే వాడు .చాలా స్పీడ్ మనిషి .కౌంటర్ చెక్ చేయటానికి ఆయన భలే తమాషాగా స్పీడ్ గా చేసి సంతకం పెట్టె వాడు .నాకు బాగా పరిచయం కనుక ఆ విధానానం నచ్చి అడిగితే చెప్పాడు .పైసా కూడా తేడా  వచ్చేదికాదు. ఇప్పుడది మర్చిపోయాను .తోలిన టన్ను లను టన్నుకు రేట్ తో హెచ్చించి యెంత మొత్తం డబ్బు వస్తుందో చెక్ చేయటం అన్నమాట .గుమాస్తాలు ఓచర్ మీద అవన్నీ వేసి రాసి లేద్జేర్ లో పోస్టింగ్ వేసి ఈయన కు పంపిస్తే అప్పుడు కౌంటర్ చెక్ చేసి డబ్బు ఇవ్వమని సంతకం పెడితే కౌంటర్ లో డబ్బు ఇచ్చేవారు. భాస్కర రావు గారు గలగలా మాట్లాడేవాడు. రాత్రి పూట మా ‘’పార్ధి గారి పార్ల మెంట్ ‘’కు వచ్చి మాతో కూర్చునే వాడు .కమ్మ వారు .మర్యాదున్న పెద్దమనిషి .

వెలగ పూడి రామ కృష్ణ గారి ఇద్దరబ్బాయిలు దత్తు గారు మారుతీ రావు ఇద్దరూ కొంతకాలం ఉయ్యూరు షుగర్  ఫాక్టరీ రీని మేనేజ్ చేశారు .తర్వాత వాటాలు పంచుకొన్నారు వి.ఏం.రావు అనే మారుతీ రావు గారికి ఉయ్యూరు ,చల్ల పల్లి ఫాక్టరీలు వచ్చాయి. దత్తు గారికి మాచెర్ల సిమెంట్ ఫాక్టరీ మద్రాస్ లోని సెంట్రల్  వర్క్ షాప్  వచ్చాయి .దత్తు గారి  కే.సి.పి .పేరు వచ్చింది. రావు గారు కెసీపి తో పాటు ind cor  పేరొచ్చింది .రెండిట్లోనూ నాకు షెర్లున్నాయి .రావు గారు గొప్ప మెకానిక్ .ఫాక్టరీ లో ఏ భాగం లో ఏముందో ఆయనకు  క్షుణ్ణం గా తెలుసు అనుకొనే వారు. ఎక్కడైనా రిపేర్ వస్తే స్పాట్ లోకి వెళ్లి రెండు మూడు నిమిషాలలో దాన్ని  రెక్టిఫై చేసేవారని చెప్పుకొంటారు . మేషిన్రి మీద అంత అవాగాహన ఉన్న వారు .అయన చేతిలోకి ఫాక్టరీ వచ్చిన తర్వాత ఫాక్టరీ సామర్ధ్యాన్ని పెంచారు .పూర్వం కన్నా రెట్టింపు సామర్ధ్యం తో రెట్టింపు చెరుకు ఆడే యంత్రాలను తెప్పించి బిగించారు . కనుక క్రషింగ్ కెపాసిటి పెరిగింది .రైతులకు సబ్సిడీలు బోనస్ లు బాగా ఇచ్చారు .క్షుణ్ణంగా మేనేజ్ మెంట్ అవగాహన ఉన్న వాడు కనుక మెషీన్ పవర్ పెంచి మాన్ పవర్ తగ్గించటం ప్రారంభించారు .రైతులు తాము తోలిన చెరకు డబ్బు కోసం ఫాక్టరీ చుట్టూ తిరిగే పద్ధతికి స్వస్తి చెప్పారు .ప్రతి రైతు తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి డబ్బు వారి అకౌంట్ లో సరాసరి పడేట్లు చేసి ఎంతో రిస్క్ నుంచి రైతుల్ని కాపాడారు మారుతీ రావు .అగ్రిమెంట్ ఇవ్వటమే రైతుపని మిగిలిన లావాదేవీలన్నీ బ్యాంక్ ద్వారానే .

రైతు తోలిన చేరుక్కు టన్నుకు ఇంత అని కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బు ఇస్తుంది .దానికీ వాయిదాల మీద వాయిదాలు పడేవి .ఖాళీ గా ఉన్న వారికైతే ఫరవాలేదు .ఉద్యోగస్తులకు, ఆడ వాళ్లకు మహా ఇబ్బందిగా ఉండేది.ఒకోసారి సెలవు పెట్టాల్సి వచ్చేది . ఆ నరకం  నుండి కాపాడిన వాడు రావు గారే .ఇప్పుడు ఏంతో హాయిగా ఉంది .యెంత డబ్బు వచ్చినా బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది .కావాల్సినప్పుడు తీసుకోవటమే .ఇంత గొప్ప సంస్కరణ తెచ్చిన వ్యక్తీ మారుతీరావు .ఫాక్టరీకి ‘’ప్లాంట్ మేనేజర్’’ ఉన్నతాధికారి .దాన్ని తర్వాత  ‘’జెనరల్ మేనేజర్’’ అన్నారు . నాకు తెలిసినప్పటి నుంచి సీతా రామా రావు గారు ఇంజేటి జగన్నాధ రావు గారు ,బసవయ్య గారు ఇలా చాలా మంది పని చేశారు .ఇప్పుడు ఆ పోస్ట్ ను ‘’చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ‘’గా పిలుస్తున్నారు .ఇప్పటి ఆ ఆఫీసర్ శ్రీ జి వెంకటేశ్వర రావు .ఉయ్యూరు ,చల్లపల్లి ఫాక్టరీలు రెండిటికీ కలిపి ఈయనే సి ఇ ఒ.

జగన్నాధ రావు గారు ప్లాంట్ మేనేజర్ గా  ఉన్నప్పుడు మంచి ప్రజా సంబంధాలు కలిగి ఉండేవారు .ఉన్నతమైన ఉదాత్త వ్యక్తీ .ఎత్తుగా  ఎర్రగా కళ్ళద్దాలతో తెల్ల పాంటు షార్ట్ లతో చూస్తూ ఉంటేనే గౌరవం కలిగేది అందరి తో సత్సంబంధాలు నేరపే వారు  . ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వ హించారు .ఫాక్టరీ ఎదురుగా సాయి బాబా ఆలయం ,కార్మిక భవనం కెసీపి స్కూల్ లో బిల్డింగ్ ల నిర్మాణం చుట్టూ ప్రక్క గ్రామాలకు పక్కా రోడ్లు వంతెనలు ,బస్ షెల్టర్లు ఆయనతోనే ప్రారంభమైనాయి .అనేక దేవాలయాల అభి వృద్ధికి తోడ్పడ్డారు .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి అయిదు వేల రూపాయలు విరాళం ఇవ్వటమే కాదు మేము కోరిన వెంటనే వచ్చి మాతో బాటు స్వామి వారల ప్రతిష్ట ను చేశారు .ఆయన భార్య శ్రీమతి వసుమతి దేవి రామ కృష్ణ మహిళా సమాజం ఏర్పరచి మహిళలకు చేతిపని ,కుట్టుపని మొదలైన వాటిల్లో శిక్షణ నిప్పించి మహిళాభ్యుదయానికి పాటు పడ్డారు. ఆ దంపతులను చూడగానే ఆది దంపతుల్లా అని పించే వారు .రైతులకే కాదు కార్మికులకూ అండగా ఉండేవారు .ఉయ్యూరు చుట్టూ ప్రక్క గ్రామాల హైస్కూళ్లలో భావన నిర్మాణాలు రక్షిత మంచి నీటి సరఫరా ,టిఫిన్ షెడ్ ,సైకిల్ షెడ్ వంటివి ఎన్నో ఆయన పాలన లో  రికార్డ్  బ్రేక్ గా నిలిచాయి .ఉయ్యూరు శివాలయం లో దక్షిణాన ఉన్న  రేకుల షెడ్ నిర్మాణం మా వార్డ్ మెంబర్ కోలచల చలపతి ,గోవింద రాజు శ్రీరామ మూర్తి గారు వంటి పెద్దల సహకారం తో ఫాక్టరీ వారి సాయం తో జరిగిన బృహత్తర కార్య క్రమం. వృద్ధాశ్రమం, కంటి ఆస్పత్రి ,రోటరీ క్లబ్ ఏర్పాటు దాని ద్వారా ప్రజా సేవ ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధ రావు గారి చొరవ కృషి ,అవగాహన వల్లనే సాధ్యమైనాయి .కార్మికులు సమ్మే చేయకుండా వారి అన్ని కోర్కెలను ఫాక్టరీ తీర్చేట్లు మేనేజ్ మెంట్ తో చర్చలు జరిపి చొరవ తీసుకొనే వారు .ఆయన  అంటే  మేనేజి మెంట్ కు కూడా అంత గౌరవం . ఫాక్టరీ సంక్షేమం కోసం నెల రోజులు యజ్ఞం చేయించారు .రోజూ సాయంకాలం ప్రవచన సామ్రాట్ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి వంటి పెద్దల నాహ్వానించి వేదం శాస్త్రాల పై ప్రసంగాలు చేయించారు .సాయి బాబా ఆలయ నిర్మాణానికి మద్రాస్ నుంచి స్వామి కేశవయ్య గారిని ఆహ్వానించి ఆయనతో సాయి బాబా చిత్రపటాన్ని ఆవిష్కరింప జేశారు .ప్రతి ఏటా శ్రీ రామ నవమి జరిపి,సీతా రామ కల్యాణం చేసేవారు .ఫాక్టరీ ఉద్యోగస్తులతో నాటకాలు వేయించేవారు .వేదాంతం సత్యనారాయణ  శోభానాయుడు లాంటి కళా కారులను పిలిపించి ప్రదర్స్ధనలు ఏర్పాటు చేసి కళలకు ప్రోత్సాహం కల్పించారు .పౌరాణిక నాటకాలు,ఓలేటి వెంకటేశ్వర్లు మల్లాది సూరి బాబు , వంటి సంగీత కళా నిదులచే పాట కచేరీ జరిపించారు .

కార్మిక నాయకుడు చొప్పరపు సుబ్బారావు  గారు ఫాక్టరికి కార్మికులకు మధ్య ఏ సమస్యలు లేకుండా చేసి చనిపోయే వరకు నాయకత్వాన్ని వహించారు ప్రస్తుతం వారి అబ్బాయి శ్రీ కొండలు పలాగే ప్రజా సంబంధాలను కలిగి ఫాక్టరీలో పని చేస్తూ అందరికి తలలో నాలుక లాగా ఉన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-14-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మాస్కోలో ఓ అమెరికన్ సైంటిస్ట్

యుఎస్ఎస్ఆర్ జ్ఞాపకాలు
 

ఆంగ్ల మూలం: మెల్విన్ బి. నథాన్సన్:

 

ఇ మొ గెల్ఫాండ్‌కి అంకితం – (ఆయన శతజయంతికి)
(ఆంగ్ల మూలానికి తెనుగు అనువాదం : వాసుదేవరావు ఎరికలపూడి)’
టీసెస్ ఆఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి, 2014 సంచిక నుండి.
అనువాదకుని ముందుమాట:
ఈ వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి నథాన్సన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని సిటీ యూనివర్సిటీ అఫ్ న్యూయార్క్‌కు చెందిన లెహ్మన్ కాలేజ్ అండ్ గ్రాడ్యుయేట్ సెంటర్‌లో గణితాచార్యుడు. ప్రొఫెసర్ నథాన్సన్, సోవియట్ యునియన్ కొనసాగుతున్న రోజుల్లో కొంతకాలం మాస్కో నగరంలోని స్టేట్ యూనివర్సిటీ అఫ్ మాస్కోలో ప్రసిద్ధ గణితాచార్యుడు ప్రొఫెసర్ గెల్ఫాండ్ దగ్గర విద్యార్థిగా ఉన్నారు. ప్రొఫెసర్ గెల్ఫాండ్ శతజయంతికి రాసిన వ్యాసంగా ఈ రచన ‘నోటీసెస్ అఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి 2014 సంచికలో వచ్చింది. ఇంటర్నెట్‌లో సోవియట్ నాళ్ళల్లో వివిధ రంగాల్లోని శాస్త్రజ్ఞుల స్థితి గతుల గురించీ, వారి పరిశోధనల గురించీ ఎన్నో వ్యాసాలూ, ఎంతో సమాచారమూ దొరుకుతాయి. కానీ, ఈ అనువాదకుని చూపుకి ఈ వ్యాసం క్లుప్తంగానూ, సూటిగానూ, సరళంగానూ ఉన్నట్టుగా అనిపించి తెలుగు పాఠకులకు అనువదించి అందజేయాలనిపింపజేసింది. 

సోవియట్ రష్యా గతించి చాలా కాలమయింది. సోవియట్ యూనియన్ బతికున్న రోజుల్లో అక్కడ ఒక నియంతృత్వం స్వైరవిహారం చేసింది. సోవియట్ యూనియన్ లోనూ  తూర్పు ఐరోపాలోని సోవియట్ కబంధ హస్తాల్లో ఇరుక్కున్న కమ్యూనిస్ట్ దేశాల్లోనూ ఆ రోజుల్లో ఏమి జరుగుతోంది అన్నది బయట ప్రపంచానికి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు తెలియనిచ్చేవారు కారు. అప్పటి ఆ పరిస్ఠితిని (మొదటగా చర్చిల్) ‘ఇనుపతెర’గా అభివర్ణించేవారు.

ఎన్నో విధాలుగా శక్తివంతమైన అమెరికాకు సైతం సోవియట్ యూనియన్‌లో ఏమి జరుగుతున్నదో ఇతమిత్థంగా తెలిసేది కాదు. రష్యాలో అంతరిక్ష పరిశోధన ఏ దిశగా నడుస్తోందో తెలుసుకోవటానికి అమెరికన్ ప్రభుత్వం కొట్టుకు పోయేది. అయినా అప్పటి రాజకీయ పరిస్థితులతో మనలో కొంతమందికైనా కొద్దోగొప్పో పరిచయం ఉంది, కానీ ఉన్నతవిద్యా, పరిశోధనా ఆనాటి రష్యాలో ఎలా సాగాయో మనలో చాలామందికి ఏమాత్రమూ తెలియదనే చెప్పాలి. 

ఇతర శాస్త్రాల విషయం ఎట్లా ఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలోక విహరణం. ఈ కారణంగా సాధారణంగా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు.

ఇతర శాస్త్ర అధ్యయనాలతో పోలిస్తే గణిత శాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతితొ మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ  శ్రమించి పరమోత్కృష్టమైన మేథో నైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారనీ, శాస్త్ర పరిథుల్ని అబ్బుర పరచే రీతిలో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగు నాట నేటి మన వైజ్ఞానికులకూ, ఉన్నత విద్యాలయాలలోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్ని ఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు.

 

వాసుదేవ రావు ఎరికలపూడి 

*******************

 

ఒక అమెరికన్ మాథమాటిషియన్ (లేదా)

నేను సోవియట్ యూనియన్‌ని ఎలా ధ్వంసం చేశాను?
విశిష్ట సోవియట్ గణితశాస్త్ర వేత్త ఇస్రేల్ మొయిసీవిచ్ గెల్ఫాండ్ సెప్టెంబర్ 2, 1913 న యుక్రెయిన్ లోని ఒడెస దగ్గరి ఓక్నీ (తరువాత కాలం లో క్రాస్ని ఓక్నీ లేదా ఎర్ర ఒక్నీ )లో జన్మించి న్యూ జెర్సీ లోని న్యూ బ్రన్ స్విక్‌లో అక్టోబర్ ఐదు, 2009లో దివంగతుడయాడు. 1917 రష్యా విప్లవాలు యూనియన్ అఫ్ సోవియట్ సోషలిష్ట్ రిపబ్లిక్ (యుఎస్ఎస్ఆర్) ని డిసెంబర్ 29, 1922 న నిర్మించుకోవటానికి జరిగిన ఒప్పందాన్ని ఖరారు చేశాయి. సోవియట్ యూనియన్ డిసెంబర్ 26, 1991 తన ఉనికిని చాలించింది. గెల్ఫాండ్ సోవియట్ యూనియన్ కన్నా ముందు పుట్టి అది శిధిలమైన తరువాత కూడా బతికాడు. 

ఆయనతో నా పరిచయం పరోక్షంగా జరిగింది. 1970 లెంట్, ఈస్టర్ సెమెస్టర్‌లలో నేను కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్యూర్ మాథమాటిక్స్ అండ్ మాథమాటికల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్‌లో సందర్శక పరిశోధనా విద్యార్థిగా ఉన్నాను. ఆ రోజుల్లో బేల బల్లొబాస్ నా స్నేహితులలో ఒకడు. బేల హంగేరియన్. ఆక్స్ ఫర్డ్ నుంచి పిహెచ్. డి తెచ్చుకున్న బేల ఇంగ్లండ్ లోనే ఉండి పోవాలని నిశ్చయించుకున్నాడు. మరిక హంగరీకి తిరిగి వెళ్ళకూడదని గూడా నిర్ణయిం చుకున్నాడు. కోల్డ్ వార్ పరిభాషలో బేల హుంగరీని విడిచి పలాయనం చిత్తగించి ప్రతిపక్షులు, పెట్టుబడి దారుల పంచనజేరాడు. పాశ్చాత్య దేశాలలో చదువుకోటానికి వెళ్ళే ముందు ప్రాచ్య దేశం, అంటే యుయస్‌యస్ఆర్‌లో చదవాలని హంగరీ వాళ్ళు బేలకి షరతు పెట్టారు. దాంతో బేల ఒక సంవత్సరం మాస్కో స్టేట్ యునివర్సిటీలో గడిపాడు. అక్కడ బేల గెల్ఫాండ్ దగ్గర చదువు కున్నాడు. వ్యక్తిగతం గానూ, గణితశాస్త్ర వేత్త గానూ ప్రొఫెసర్ గెల్ఫాండ్ బేలను గాఢంగా ప్రభావితం చేశాడు. గెల్ఫాండ్ ఎలా అసాధారణమైన వాడో –  ఆయన వైశిష్ట్యం గురించి –  బేల నాకు తరచూ చెపుతుండేవాడు. 

కేంబ్రిడ్జ్‌లో నా చదువు ముగిసిన 1970 వేసవిలో నేను సోవియట్ యూనియన్‌కి చిన్న ట్రిప్‌గా వెళ్లాను. జీవశాస్త్రంలో డాక్టరేట్ తర్వాతి పరిశోధనకి మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి వచ్చి కేంబ్రిడ్జ్‌లో ఒక సంవత్సరం గడిపిన మరొక అమెరికన్ బులెటిన్ బోర్డ్ మీద తను యుఎస్‌ఎస్ఆర్‌లో డ్రైవింగ్ చేస్తూ తిరగాలను కుంటున్నాననీ తోడుగా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాననీ ఒక నోట్ పెట్టాడు. హెల్సింకి నుంచి  ట్రైన్‌లో ప్రయాణం చేసి సోవియట్ యునియన్ లోకి లెనిన్ గ్రాడ్‌లో  అడుగుపెట్టి, కారు అద్దెకు తీసుకుని దక్షిణంగా మాస్కో మీదుగా కాకేషస్ దాకా డ్రైవ్ చేసుకుంటూ పోవటం అతని ప్రణాళిక. 

సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ నుంచి ఈ అమెరికన్ జీవశాస్త్రజ్ఞుడికి అతిథిగా ఉపన్యసించ వలసిందని ఆహ్వానం వచ్చింది. అక్కడ ఇతనికి ఆతిధ్యమిచ్చే సాధికార బాధ్యత బయో కెమిస్ట్రీలో ఎన్నదగిన సోవియట్ విజ్ఞానవేత్త డేవిడ్ గోల్డ్ ఫార్బ్ ది. నేను కూడా గోల్డ్ ఫార్బ్‌ని కలుసుకున్నాను. ఆయనతో నాకు గెల్ఫాండ్‌ని కలుసుకోవాల నున్నదని చెప్పాను. గోల్డ్ ఫార్బ్, గెల్ఫాండ్‌ని కాంటాక్ట్ చేశాడు. గెల్ఫాండ్ బాగా బిజీగా నైనా ఉండి ఉండాలి లేదా పూర్వ పరిచయం లేని ఒక అమెరికన్‌తో సమావేశమవటం విజ్ఞత కాదనైనా అనుకుని ఉండాలి. నాకు నంబర్ థియరీలో ఆసక్తి ఉందని గోల్డ్ ఫార్బ్ గెల్ఫాండ్‌తో చెప్పినప్పుడు గెల్ఫాండ్ తను యమ్.జె. గ్రెవ్, ఐ.  ఐ. ప్యాటెట్స్కీ- షపీరోలతో కలిసి – జెనరలైజ్డ్ ఫంక్షన్ల మీద రాసిన పుస్తకాల్లో ఆరో భాగం ‘రిప్రసెన్టేషన్ థియరీ అండ్ ఆటోమార్ఫిక్ ఫంక్షన్స్’ అన్న పుస్తకాన్ని నాకిమ్మని చెప్పిగోల్డ్ ఫార్బ్‌కి ఇచ్చాడు. 

క్గోల్డ్ ఫార్బ్‌కి ఒక కాలు లేదు. అతను ఆ కాలిని రెండవ ప్రపంచ యుద్ధ భూమిలో పోగొట్టుకున్నాడు. గోల్డ్ ఫార్బ్ హిస్టారియన్ అవుదామనుకున్నాడు. కానీ నియంతృత్వ పాలనలో వృత్తిగా చరిత్ర చాలా ప్రమాదకరమైనది. స్టాలిన్ రష్యాలో చరిత్ర ప్రత్యేకంగా ప్రాణాంతకమైనది. ఆ కారణంగా గోల్డ్ ఫార్బ్ మెడికల్ స్కూల్‌లో చేరి మాలిక్యులార్ జెనెటిక్స్‌లో రీసెర్చ్ చేశాడు. ‘పొట్ట ఎప్పుడూ  పొట్టే’ అన్నాడతను నాతో. 

నా తోటి పర్యాటకుడైన జీవశాస్త్రవేత్త ప్రబల వామపక్షవాది. [అమెరికన్] విద్యా సంస్థలలో ఉన్న చాలామంది లాగానే నేనూ వియత్నాం యుద్ధ వ్యతిరేకినే. ఐనప్పటికీ అతను నాకు ఎంత ఎడమగా ఉంటాడంటే అతని పక్కన నేను రైటిస్ట్ లాగా కనిపించాను. పైకి ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు విధేయులుగా కనపడుతూ  లోలోపల నియంతృత్వానికి తీవ్ర వ్యతిరేకతతో వియత్నాంలో అమెరికా సైన్యాల ప్రవేశాన్ని -ఎంతోమంది అమెరికన్ సైంటిస్టులు నిరసిస్తున్నప్పుడు- సమర్ధిస్తున్న సోవియట్ సైంటిస్టులకు నేను ఇలా రైటిస్ట్‌గా కనపడటం నన్ను వాళ్ళకు తృటిలో దగ్గరి వాణ్ణి చేసింది. కమ్యూనిస్టులను అంతం చేయటమన్న దాంట్లోవాళ్ళకు నమ్మకం ఉంది. ఇది మాస్కోలో నేను ఈ (ప్రచ్చన్న) వైరుధ్యంలో నేర్చుకున్న మొదటి పాఠం. 

కమ్యూనిస్ట్ పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ల పిల్లలకు  సైన్స్‌కి సంబంధించిన ఉద్యోగాల కోసం పరిచయాలను వాడుకునేవారు. వాళ్లు – నియంతృత్వం లో- తాము సమసిపోకుండా ఉండటానికి చేయవలసినదంతా చేసినవాళ్ళు, రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకున్నవాళ్లు. వాళ్ళపిల్లలు – నిర్భయంగా- భద్రత తో బతకాలని కోరుకుంటున్నవాళ్లు. 

సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో గానీ, యూనివర్సిటీలలో గానీ, డిగ్రీ చదువుల్లో ఉన్న పిల్లల్లోనూ, పరిశోధనల స్థాయిలో ఉన్న విద్యార్థుల్లోనూ  చాలామంది పార్టీకార్యకలాపాల నిర్వహణలో పై స్థాయిలో ఉన్నవాళ్లతో  సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళే. సైంటిస్టులకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండటమనేది ఎప్పుడూ అది తెచ్చిపెట్టే లాభాలను తెచ్చిపెడుతునే ఉండేది. పార్టీతో సంబంధాలు లేని పెద్ద సైంటిస్టులు వాళ్ళకూ, వాళ్ళ విద్యార్థులకూ నిలవ నీడ కోసం పార్టీతో గట్టి సంబంధాలున్న చాలా చిన్న స్థాయి సైంటిస్టులతో కలిసి పనిచేసేవారు. ‘కలిసి పనిచేయడం’ అంటే పార్టీ సభ్యులుగా ఉన్న అంతంత మాత్రం సైంటిస్టు గాళ్ళకు పరిశోధనల ప్రచురణలలో సహ రచయితల హోదా ఇవ్వటం. ఇటువంటి వైజ్ఞానిక రాజకీయం నియంతృత్వ పాలన లేని చోట్ల కూడా కనపడే విషయమే అనుకోండి. 

నాకు గెల్ఫాండ్ దగ్గర ఒక సంవత్సరం పాటు గణిత శాస్త్ర విషయాలు నేర్చుకుంటూ గడపగలిగే అవకాశం కోసం ప్రయత్నించాలని అనిపించటానికి బేల బొల్లబాసే కారణం. ఇది సాధ్యపడేటట్టు చేయటం అంత తేలికైన విషయం కాదు. కోల్డ్ వార్ రోజుల్లో ఒక అమెరికన్ మాస్కోలో ఏ అధ్యయనమైనా, పరిశోధనైనా చేయటమన్నది దాదాపు అసాధ్యమైన విషయమే. పారిస్‌లోనో, కేంబ్రిడ్జ్ లోనో అయితే చిటికిన వేలిగోటితో ఏర్పాటు చేసుకోగలం. విమానం ఎక్కటం ఫ్రాన్స్‌కో ఇంగ్లాండ్‌కో వెళ్ళటం, అంతే. కానీ ఒక సామాన్య అమెరికన్ సోవియట్ యూనియన్‌లోకి ప్రవేశించాలంటే కొద్దికాలానికి మాత్రమే అనుమతితో ఎంతో డబ్బు కర్చయ్యే పర్యాటకం గానే సాధ్యం. 

అయినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో రెండు దేశాల మధ్యా రెండు రకాల ఒప్పందాలున్నాయి. ఇక్కడినుంచి అక్కడకు ఒకళ్ళు వెళ్తే అక్కడనుంచి ఇక్కడకు ఒకళ్ళు వచ్చే ధోరణి లో. వీటిలో ఒకటి వాషింగ్టన్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ, సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ మధ్య కుదిరిన ఒప్పందం. కానీ ఇది కుర్ర సైంటిస్టులకు కాదు. సీనియర్లకు, కొద్ది కాలానికి. 

రెండవది ఈ రెండు దేశాల మధ్యా కొంత విశాలమైన సాంస్కృతిక సంబంధాల విషయంలో ఉన్నపరస్పర అంగీకారం. మేము ‘న్యూయార్క్ ఫిల్హార్మానిక్’ను మాస్కోకి పంపుతామనుకుంటే వాళ్ళూ ‘బొల్ష్ వా బాలే’ని న్యూయార్క్‌కి  పంపే పధ్ధతిలో. ఈ ఒప్పందంలో ఉన్న మరో చిన్న అంశంగా యూనివర్సిటీ స్థాయిలో డాక్టరేట్ కోసం కృషి చేస్తున్న విద్యార్థులకూ, డాక్టరేట్ వచ్చింతర్వాత పరిశోధనలను విస్తృత పరచుకునే పోస్ట్ డాక్టొరల్ విద్యార్థులకూ ‘పరస్పర’ రీతిలో సందర్శనకు అవకాశం ఉంది. 

ప్రతి సంవత్సరం అమెరికనులు నలభైమంది అమెరికన్ యువ పండితులను ఎంపిక చేస్తే సోవియట్లు నలభైమంది సోవియట్ యువ పండితులను ఎంపిక చేస్తారు. ఒక దేశం ఎంపిక చేసిన పండితులను అతిథులుగా రానివ్వటానికి రెండవ దేశం అంగీకరించాలి. అమెరికన్ వైపునుండి ఈ కార్యకలాపాలు న్యూయార్క్ లోని వివిధ అమెరికన్ విద్యావేత్తల సంఘాల సమాహార సంస్థకు అనుబంధంగా ఉన్న ఐరెక్స్ (ఇంటర్నేషనల్ రిసెర్చ్ అండ్ ఎక్స్ ఛెంజెస్ బోర్డ్) నిర్వహించేది. 

ఈ పరస్పర సందర్శనలో పండితుల ఎంపిక ఒక పధ్ధతిలో జరిగేది. రష్యనులు నలభై మంది ఇంజనీర్లను, కంప్యుటర్ సైంటిస్టులను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కి పంపిస్తే అమెరికన్లు నలభై మంది విద్యార్థులను మాస్కోకి డాస్ టొవిస్కీ‌నీ , రాస్పుటిన్‌నీ అధ్యయనం చేయటానికి పంపేవాళ్ళు. ఐరెక్స్ ఎప్పుడూ అతి తక్కువ మంది సైంటిస్టులను యుఎస్ఎస్ఆర్‌కి పంపేది. దీనికి కారణం రష్యాలో సైన్స్‌లో రిసెర్చ్‌కి చాలా తక్కువ అవకాశాలుండటంతో అక్కడ తప్ప వేరెక్కడా వీలు కాని రీసెర్చ్ విషయం అయితేనే ఆ శాస్త్రవిభాగంలో పరిశోధకులను రష్యాకు ఎంపిక చేయటం జరిగేది. సైన్స్ ప్రతిచోటా ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఏదైనా సమస్యని యుఎస్‌ఎస్ఆర్‌లో మాత్రమే పరిష్కరించగలమని అనటం అంత తేలిక కాదు. నువ్వు చేసే పరిశోధనాంశ విశేషాలు రష్యన్ భాషలో ఉన్నా, నీ పరిశోధన రష్యన్ సాహిత్యం లోనో, లేదా రష్యన్ చరిత్ర లోనో అయి దానికి సంబంధించిన వెనకటి కథలన్నీ సోవియట్ యూనియన్‌లో మాత్రమే దొరికే పక్షాన నువ్వు నీ పరిశోధన కోసం మాస్కో వెళ్ళాల్సి ఉంటుందని నీ ప్రణాళికలో పేర్కొనటం సమంజసంగా ఉంటుంది. 

ఐరెక్స్ ప్రోగ్రాంలో పాలుపంచుకున్న మొట్టమొదటి గణిత శాస్త్ర పరిశోధకుణ్ణి అయ్యాను నేను, 1972-73లో. ఐరెక్స్‌కి నేను పెట్టుకున్న దరఖాస్తులో ప్రపంచంలో ఉన్నఅత్యున్నత స్థాయికి చెందిన గణిత శాస్త్రవేత్తలలో పెక్కుమంది సోవియట్ యూనియన్లో ఉన్నారనీ, వాళ్ళందరూ మాస్కోలో కేంద్రీకృతమైయున్నారనీ వాళ్ళు దేశం విడిచి బయటకెక్కడికీ ప్రయాణం చేయటానికి వీలులేదనీ వాళ్ళతో కలిసి పనిచేయటం ఎంతో విలువైన అనుభవమనీ రాసాను. ఇవి బలమైన కారణాలు. ఐరెక్స్ఆమోదం లభించింది. ఐరెక్స్‌కి నెను గెల్ఫాండ్‌తో కలిసి పనిచేయటమే నా ప్రణాళికగా దరఖాస్తు చేసుకున్నాను. దీనికి, నా అధ్యయనానికి పర్యవేక్షకునిగా  ఉండటానికి  గెల్ఫాండ్ అంగీకరించాలి. ఆయన ఒప్పుకున్నాడు. నాకు వీసా వచ్చింది. నేను మాస్కో వెళ్ళాను. 

ఒక విడతలో ఐరెక్స్ పథకంలో యుఎస్ఎస్ఆర్ వెళ్ళే అమెరికన్లందరూ ఆగస్ట్ నెలలో పారిస్‌లో కలుసుకోవాలి. పారిస్‌లో కలుసుకుని అక్కణ్ణుంచి విమానంలో మాస్కో వెళ్ళాలి. నేను కొద్ది రోజులు ముందుగానే పెట్టె నిండా లెక్కల పుస్తకాలూ, ఒక ‘ఒలివెత్తి‘  టైపు రైటర్‌తో పారిస్ చేరుకుని, పారిస్‌లో బడి వీథిలో ఒక చౌకరకం  హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఉండి పాల్ ఎర్డొష్‌తో నా మొట్టమొదటి రీసెర్చ్ పేపర్‌గా తయారయిన విషయం మీద విపరీతంగా కష్టపడి పనిచేశాను. ఆ పని పూర్తయి పేపర్ రాయటం అయింతర్వాత వ్రాత ప్రతిని ఫ్రాన్స్ నుంచి  పోస్ట్ చేయటానికి సమయం చాలకపోయింది. కానీ ఐరెక్స్ విద్యార్థులకు మాస్కోలోని అమెరికన్ దౌత్య కార్యాలయం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కలగ జేసింది. అన్నిటికన్నాఎక్కువ ఉపయోగపడే సౌకర్యాలలో ఒకటుంది. అది యూఎస్ఎస్ఆర్ బయటికి దౌత్య తపాలా సంచిలో ఉత్తరాలు పంపించుకునే వీలు. సైంటిఫిక్ వ్రాత ప్రతులను అమెరికాకు పంపించటంలో యుఎస్ఎస్ఆర్ తపాలా -మృదువుగా చెప్పాలంటే- అంత నమ్మదగింది కాదు. నేను నా పేపర్‌ని వియన్నాకు వెళ్తున్న ఒక నావికుడు చేత్తో పట్టుకుపోతున్న తపాలా సంచిలో పడేసి ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ కి పంపగలిగాను. 

గెల్ఫాండ్‌తో నా మొట్టమొదటి సమావేశం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో నలుగురూ కూచుని కబుర్లు చెప్పుకునే చోట జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పిన రెండు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. మొదటిది ఆయన మంత్రంగా ప్రసిద్ధిచెందినది. “ఉన్నది ఒకే గణిత శాస్త్రం”.  తర్వాత ఆయన సోవియట్ యూనియన్‌లో ఉన్న యువ గణిత వేత్తలలో కల్లా మరీ ప్రతిభావంతుల పేర్లు – ఒక చిన్న చిట్టా – అప్పజెప్పినట్టుగా చెప్పి, “నాకన్నా వాళ్ళకు గణిత శాస్త్రం చాలా ఎక్కువ తెలుసు, కానీ నా కున్న ఊహాశక్తి  మెరుగైనది.” అన్నాడు. ప్యాతెత్ స్కీ-షపిరో, మనిన్‌లు చెపుతున్న పాఠాలకు హాజరవమని  గెల్ఫాండ్ నాకు సూచించాడు గానీ, అన్నింటికన్నా నా మాస్కో గణిత శాస్త్రాభ్యాసంలో విలువైనదని నేననుకునేది ఎంతో ప్రఖ్యాతి పొందిన ‘గెల్ఫాండ్ సోమవారం రాత్రుల సెమినార్లలో పాలు పంచుకోవటం . ఆ సెమినార్లు ‘ఇన్నింటికి మొదలు పెట్టాలి’ అని అధికారికంగా ఏమన్నా ఉండేదేమో నాకు గుర్తుకు రావటం లేదు. అందరూ చాలా ముందుగానే వచ్చి ఆ హాల్లో జేరుకుని లెక్కలే మాట్లాడుకోవటం మొదలుపెట్టే వారు. అసలు సెమినారు -ముందుగా నిర్ణయించుకున్న శాస్త్ర విషయ చర్చ – మెల్లిగా మొదలయ్యేది. ఒకళ్ళతర్వాత ఒకళ్ళు మాట్లాడుతునే ఉండే వారు. సెమినారు ముగియాలనుకున్న టైమ్ ఏదైనా ఉంటే అది దాటి చాలా కాలం అయిపోయేది. చివరికి ఆ హాలు తుడిచి శుభ్రం చేసే ఆవిడ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేదాకా. 

ఎవరైనా మాట్లాడుతుండగా గెల్ఫాండ్ వాళ్ళను ఆపి వింటున్నవాళ్ళలో ఎవరినైనా ఉద్దేశించి అప్పుడు నడుస్తున్న విషయాన్ని వివరించమని అడగటం సర్వసాధారణంగా జరిగేది. నేను మొదటి సారి ఈ సెమినార్లకి హాజరయింది ఒక ఉపన్యాసం కొనసాగుతూఉంటే మధ్యలో వెళ్లినప్పుడు. గెల్ఫాండ్ “మెల్విన్ నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. “కావట్లేదు”. ” ఏం, ఎందుకని?” “వాళ్ళు రష్యన్‌లో మాట్లాడుకుంటున్నందువల్ల”. ఆయన వెంటనే డిమా ఫుక్స్‌ని నా పక్కన కూచుని నాకు వాళ్ళ రష్యన్‌ని ఇంగ్లిష్‌లోకి అనువదించి చెప్పమని పురమాయించాడు. కొద్దికాలానికే నా రష్యన్ భాషా పరిచయం మెరుగై ఇంక భాష మీద నెపం వేసే అవకాశం పోయింది. 

ఎవరు ఏం నేర్చుకోవాలో గెల్ఫాండే నిర్ణయించేవాడు, సెమినార్‌లో చెప్పేవాడూ. ఒకసారి గెల్ఫాండ్ ఆర్నాల్డ్‌ను ‘పి -యాడిక్ సంఖ్యల’ గురించి కొన్ని వరస ఉపన్యాసాలు ఇమ్మన్నాడు. ఆర్నాల్డ్‌కి ఈ పని కష్టంగా తోచింది. ఆర్నాల్డ్ ‘రియల్ సంఖ్యల’ పరిధిలోనూ, ‘కాంప్లెక్స్ సంఖ్యల’ పరిధి లోనూ ఉద్దండుడు, కానీ పి -యాడిక్ సంఖ్యలకు సంబంధించిన గణితంలోవచ్చే కొన్ని ముఖ్యమైన విలువలను అవగాహన చేసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. ఈ విలువల గురించి  సంఖ్యాశాస్త్రంలో కృషి చేస్తున్న ప్రతి యువ గణిత విద్యార్థికీ తెలుసు. ఆర్నాల్డ్ వంటి గొప్ప గణితజ్ఞుడు ఇలా కొంతమందికి చాలా సులువుగా తెలిసిన శాస్త్ర విషయాలను అర్థం చేసుకోవటానికి తన్నుకోవటం ఒక పాఠం నేర్పింది. అంతమందికీ మంచినీళ్ళ ప్రాయంగా అనిపించిన విషయమే అయినా అది నీకు కష్టంగా అనిపిస్తే నిన్ను నువ్వు దద్దమ్మగా పరిగణించుకోనవసరం లేదని. 

నడవటం రష్యన్ సంప్రదాయం. చలికాలం నిజంగానే చల్లగా ఉంటుంది. అయినా గాలి తక్కువగా ఉండటం వల్ల అంత చలిని భరించగలం. సెమినారు ముగిసిన తర్వాత తరచుగా కొంతమంది ఒక జట్టుగా గెల్ఫాండ్‌తో బయలుదేరేవారు. వాళ్ళు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా దట్టంగా మంచు పడ్డ రోడ్ల పక్కల మీద లెక్కలు చేసుకుంటూ. రాసుకుంటూ ఆయనతో వెళ్ళేవారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా మాట్లాడు కోవచ్చు. గదుల్లో అయితే గోడలకు చెవులుంటాయి. చాలామంది గణిత శాస్త్రజ్ఞులు నన్ను “నడుద్దాం రమ్మ”నే వారు. రోడ్ల మీది వేరెవరి జోక్యమూ లేని ‘ఏకాంత స్వేచ్చ’లో నన్ను “అమెరికాలో ఎలా ఉంటుంది?”, అమెరికా లో యూదులంటే ద్వేషం ఎంత ఎక్కువగాఉంది?”, “అమెరికన్ యూనివర్సిటీలలో ఉద్యోగం రావటం ఎంత కష్టం?” అని అడిగేవారు. ఆనతి కాలంలో వలస విధానం సులభమవటంతో వాళ్ళందరూ వలస వెళ్లి పోయారు. 

1989లో గెల్ఫాండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్ళాడు. తొలుత హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోనూ, మసచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనూసందర్శకాచార్యునిగా ఉండి, రట్జర్స్ యూనివర్సిటీలో విశిష్టాచార్యునిగా ఉన్నాడు. జీవశాస్త్రవేత్త గోల్డ్ ఫార్బ్ కూడా రష్యాను వదిలి న్యూయార్క్ వెళ్లి పోయాడు. 

ఇరెక్స్‌లో మాస్కో వచ్చిన అమెరికన్ విద్యార్థులందరూ శయనా గారాలవంటి గదుల్లో ఉండేవారు. సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చే అమెరికన్ విద్యార్థులు మారొచ్చు గానీ అమెరికన్లకు ఇచ్చే గదులు మాత్రం మారేవి కావని నాకు విశదమైంది. ఆ గదులు అన్నీ ఒకే అంతస్తులో కాక వేరు వేరు అంతస్తులలో, ఒక దాని మీద ఒకటి, సరిగ్గా మీదగా, అమెరికన్లను వీళ్ళ ఆవాసంలో గూఢంగా కనిపెట్టి ఉండటానికి భవనానికి నిలువుగా కేబుళ్లను అమర్చుకోవటానికి సులువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసేవారు. “నీ గదిలో నీకు ఏమైనా ప్రత్యేకంగా కావలసినది అమర్చాలని నువ్వు అధికారులకు చెప్పాలనుకుంటే అదుగో ఆ బల్బుకు చెప్పు’ అన్నది అక్కడ సుపరిచితమైన నవ్వూసు. 

యూనివర్సిటీలో ఉన్న’కమసోల్’లో చురుకుగా ఉన్న వాళ్ళలో నాకు చాలా మంది మిత్రులు. కమసోల్ కమ్యూనిస్ట్ పార్టీ యువజన శాఖ. అందులో ఉన్న వాళ్ళకు అమెరికన్లతో స్నేహం వాళ్ళు విధిగా చేయవలసిన పార్టీ కార్యక్రమంగా అప్పజెప్పబడిందని అనుకోవచ్చు. “మీ గదుల్లో టేపు చేసిన మాటల్లో ప్రతి గొంతూ వాళ్లు గుర్తుపట్టలేర”ని నాతో కొమోజోలు వ్యక్తి ఒకరన్నారు. 

యూనివర్సిటీ బయటి జీవితానికి కొమోసోల్ అద్దం పట్టేది. బయటి జీవితంలో సామాన్య ప్రజానీకానికి లేని కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులూ, సదుపాయాలూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులకు ఉన్నాయి. ఉదాహరణకు, యూనివర్సిటీలో పై తరకల కొమోసోల్ వ్యక్తులకు వాళ్ళల్లో వాళ్లు మాత్రమే జరుపుకునే పార్టీలు ఉండేవి. అటువంటి పార్టీ కొకదానికి నేను వెళ్ళాను. ఆ పార్టీలో ఎస్టోనియా నుంచి తెప్పించుకున్న బృందం రాక్ సంగీతం ఉండింది. ఇతర మామూలు విద్యార్థులు ఆ పార్టీలోకి జొరబడటానికి ప్రయత్నించినప్పుడు కొమొసోల్ పోలీసులను పిలిచారు. 

మధ్యలో వచ్చిన క్రిస్మస్ సలవులకు నేను అస్వస్థతో ఉన్న నా తల్లిని చూడటానికి వెనక్కు -ఫిలడెల్ఫియాకి- వచ్చాను. శలవల తర్వాత తిరిగి మాస్కో వెళ్ళినప్పుడుగెల్ఫాండ్, “సోవియట్ యూనియన్‌లో కొన్నాళ్ళుండి, అమెరికా వెళ్లి మళ్ళీ సోవియట్‌కి రావటం నీకెలా అనిపించింది?”అని అడిగాడు. “బాగానే ఉంది గానీ, ఇంటిదగ్గర మొదటి వారమంతా ఫోన్ మాట్లాడాలంటే జంకుపుట్టేది” అన్నాను. 

రష్యన్ సాహిత్యం, ప్రత్యేకించి పుష్కిన్ రచనలను, చదవమని గెల్ఫాండ్ నన్ను ఉద్బోధించేవాడు. పుష్కిన్ కవిత ‘మొట్జార్ట్ అండ్ సాలియెరి’ రికార్డునూ, ఇల్యా -పెత్రోఫ్‌లు కలిసి రాసిన నవలలనూ నాకు ఇచ్చాడు. నాకు ఆయన మిన్లోసూ, షపిరోలతో కలిసి తను రాసిన ‘రిప్రజంటేషన్ ఆఫ్ ది రొటేషన్ గ్రూప్ అండ్ లారెంజ్ గ్రూప్’ అన్న పుస్తకమూ, ఇంగ్లిష్‌లో ఉన్న(ఆంద్రే) వెయిల్ రాసిన ‘బేసిక్ నంబర్ థియరీ’ అన్న పుస్తకమూ వాటితో పాటు వివిధ గణితశాస్త్ర  విభాగాలలో పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నేహాలు చేసుకోవటంలో గెల్ఫాండ్‌కి ఉన్న ఆసక్తి, నేర్పూ అపారమైనవి. ఆంద్రే వెయిల్ గెల్ఫాండ్‌ను చూడటానికి మాస్కో వచ్చాడు. వాళ్ళిద్దరూ దగ్గరి  స్నేహితులయ్యారు. నేను వెనక్కి వచ్చింతర్వాత ఒక సంవత్సరం పాటు తనకు సహాయకునిగా ఉండటానికి వెయిల్ నన్నుప్రిన్స్‌టన్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఆహ్వానించాడు. నాకైతే నిజం తెలీదు గానీ నన్ను గెల్ఫాండ్ వెయిల్‌కి సిఫార్స్ చేసి ఉంటాడనీ వెయిల్ స్నేహితుని మాటను గౌరవించాడనీ అనే నేననుకుంటూ ఉంటాను. 

మాస్కోలో నువ్వు నీ సోవియట్ స్నేహితులను ఒకరి కొకరు కలుసుకోలేని చట్రాలలో ఉంచటం నేర్చుకుంటావు. అమెరికన్‌తో పరిచయం ఉండటం ప్రమాదకరమైనది. ఎక్కడబడితే అక్కడ సమాచారం చేరవేసేవాళ్ళు. నీ పరిచయస్తులే, ఒక అమెరికన్ కలుసుకుంటున్న ప్రతి వ్యక్తి గురించీ తెలుసుకునే పార్టీలో సాధికారిక పై విభాగాలకి  నిస్సందేహంగా ఉప్పు అందిస్తారు. 

నాకు మాత్రం భయభ్రాంతుణ్ణై పోవలసిన అవసరం కనిపించలేదు. జాగ్రత్తగా మసలుకోవాలని మాత్రం తెలుసును. నాకు ఏ ప్రమాదమూ లేదని నేనెరుగుదును. ఈ  నిర్భీకతకు కారణం నాకు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉండటమే. రష్యన్లు అంతర్జాతీయ వ్యవహారాలతో గొడవలు కోరుకోరు. నన్ను అరెస్ట్ చేస్తే చేయవచ్చు, జడిపించవచ్చు. నేను ఉద్రేకపడకుండా ప్రశాంతంగా ఉన్న పక్షాన నన్ను ఇంటికి తరలించేస్తారు. అది పెద్ద విషయమేమీ కాదు. సోవియట్ పౌరుల పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. వాళ్ళ పరిస్థితి ప్రమాదాలలోకి నెట్టే పరిస్థితే. వాళ్ళను యూనివర్సిటీ నుంచి పంపించేయటం మొదలుకొని, ఉద్యోగాలలోంచి తొలగించటం దాకా, వాళ్ళ జీవితాలను బుగ్గిచేయటం దాకా ఏదైనా సంభవమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వియత్నాంలో ఘోర యుద్ధం చేస్తున్నప్పటికీ, హనోయి మీద బాంబులు వేస్తున్నప్పటికీ, ఒక వంక ఆగ్నేయాసియాలో కర్ర చూపిస్తూ, మరొక వంక – అమెరికన్లతో వ్యాపారాన్ని పెంచుతున్నట్టుగా రాయితీలూ, రష్యాకు ఎగుమతులూ ఎరగా – యూఎస్ఎస్ఆర్‌కి కారట్లూ చూపిస్తూ, కిసింజర్ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జోడు గుర్రాల సవారీ సూత్రం కారణంగా రెందు దేశాల మధ్యనా ఏర్పరుచుకున్న విద్యా విషయకమైన పరస్పర ఒడంబడికతో, మాస్కోలో, ఎటువంటి గూఢచారి చర్యలతోనూ సంబంధం లేకుండా కేవలం ‘అమెరికన్ లాగా వ్యవహరిస్తున్నాడన్న ‘నేరం’ మాత్రం మోపబడ్డ అమెరికన్ పౌరుడి భద్రతకు ఏమీ ముప్పు లేదు. 

సోవియట్ యూనివర్శిటీలన్నిటిలో లాగే, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కూడా ‘మొదటి విభాగం ‘ -రష్యన్‌లో పెర్వియ్ ఒట్ డెల్ – ఉండేది. ఇది KGB అనే సంక్షిప్త నామం తో ప్రసిద్ధమైన సోవియట్ భద్రతా – గూఢచర్యా సంస్థ యూనివర్సిటీలలో ఎర్పాటు చేసుకున్న కార్యాలయం పేరు. గెల్ఫాండ్ అమెరికాకు వచ్చేసి రట్జర్స్‌లో ఆచార్యుడుగా ఉన్న రోజుల్లో నా ఎదుట నెమరు వేసుకున్న కథ. “నేనిది నువ్వు మాస్కోలో ఉన్న రోజుల్లో చెప్పలేకపోయాను. నీవక్కడ ఉన్నప్పుడు నన్ను చూడటానికి పెర్వియ్ ఒట్ డెల్ మనిషి ఒకరొచ్చారు. ‘మీదగ్గర నథాన్సన్ అనే ఒక అమెరికన్ విద్యార్థి ఉన్నాడు. అమెరికన్లు వాళ్ళకిష్ట మొచ్చినట్టుగా ఉంటారని నాకు తెలుసు. అయినా నథాన్సన్ అమెరికన్లతో పోల్చినా మరీ విచ్చలవిడిగా ఉన్నాడు. అతన్ని మేము దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది ‘, ఇవి ఆ KGB అధికారి అన్న మాటలు.” 

రాజకీయ చతురత పుష్కలంగా ఉన్న గెల్ఫాండ్ , “దానికేం, మీరు అతన్ని పంపించేయటం మీకు తప్పని సరి అయితే పంపించేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకూ  నథాన్సన్‌కి అమెరికాలో చాలా మంది స్నేహితులున్నారు. అతన్ని మీరు వెనక్కి పంపించేస్తే  అంతర్జాతీయంగా పెద్ద లొల్లి అవుతుంది. అతన్ని ఇప్పుడు పంపించేయటం కన్నా అతను తన ఈ సంవత్సరం గడువు పూర్తి చేసుకుని వెళ్లి పోయింతర్వాత మళ్ళీ రానీయకుండా చేయడం మేలుగా ఉంటుంది.” అన్నాడు. అలాగే జరిగింది. 

నేను  మరొక సంవత్సరం పాటు మాస్కోలో అతనితో గడపటం నా గణిత శాస్త్ర విద్యాభివృద్ధికి మేలని గెల్ఫాండ్ భావించాడు. కానీ నేను మాస్కో స్టేట్ యునివర్సిటీకి మళ్లీ వెళ్ళటమన్నది జరగని పని అని తేటతెల్లంగా తెలుస్తూనే ఉంది. సంయుక్త రాష్ట్రాలకీ సోవియట్‌కీ మధ్య పరస్పరం సైంటిస్టులను అతిథులుగా పంపే రెండో ఒడంబడిక అటువైపు సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ పరిథిలో ఉంది. గెల్ఫాండ్ నన్ను సోవియట్ అకాడమీకి దరఖాస్తు చేసుకోమన్నాడు. అలా చెబుతూనే ఈ సారి నేను రష్యాలో వేరొక విద్యాసంస్థకే రాగలను కాబట్టి, నేను జేరబోయేచోటు ‘స్తెఖ్లొఫ్ ఇన్‌స్టిట్యూట్’ మాత్రం కాకుండా చూసుకోమని హెచ్చరించాడు, ఆ గణితశాస్త్రాధ్యయన సంస్థ  సోవియట్ కెల్లా యూదు ద్వేషానికి పరాకాష్ఠ  అన్నాడు. సోవియట్‌లో ఉన్న ప్రథమశ్రేణి గణిత శాస్త్రవేత్తలైన పలువురు యూదు పండితులకు ఆశ్రయమై. సమాచారాన్ని చేరవేయటంలో వచ్చే సమస్యలను గణిత శాస్త్ర సమస్యలుగా అధ్యయనం చేసే ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్  ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ని నాకు రికమండ్ చేస్తూ నన్ను ఆ సంస్థకు అర్జీ పెట్టుకోమన్నాడు. 1977లో నేను అలాగే దరఖాస్తు చేసాను వాళ్లు అంగీకరించటం గూడా జరిగింది. 

అయితే చివరి క్షణాలలో సోవియట్ విదేశ వ్యవహారాల మంత్రాలయం నాకు వీసా ఇవ్వటానికి నిరాకరించింది. నేను వెళ్ళలేక పోయాను. నాకు సోవియట్ వీసా ఇవ్వకపోవడం – గెల్ఫాండ్ అప్పుడేదో మాటవరసకు అంటే – నిజంగా అంతర్జాతీయ వ్యవహారంగా తయారై, ‘న్యూయార్క్ టైమ్స్’లో పడి వార్తా మాధ్యమాలు సోవియట్ చర్యని  అంతర్జాతీయంగా సైంటిస్ట్‌లను ఆదరించటంలో హెల్సింకి ఒప్పందాలను సోవియట్ అతిక్రమించినట్లుగా చిత్రించాయి. 

కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి, వేరుచేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్ను’ అని పిలుచుకునే ఈస్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’.  మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండి పార్టీ అంగీకరించిన వారికే దక్కేవి. 

గణితశాస్త్రం చదువుకునేవాళ్ళకు – ఆమాటకొస్తే గణితశాస్త్రమే జీవితంగా గడిపేవాళ్ళకు – పెద్దగా ఆదాయం గానీ పోషణ గానీ ఉండేవి కావు. వాళ్ళు కేవలం గణిత శాస్త్రం మీద ప్రేమతో, గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే బుద్ధివికాసం కోసం, ఆత్మానందం కోసం, తప్ప పశ్చిమ దేశాలలో లాగా వృత్తిగా తీసుకుని అందులో పైపైకి పోదామని ఈ విద్యాభ్యాసానికి వచ్చిన వారు కారు. ఐతే సోవియట్ వ్యవస్థ సమసి పోయిన తర్వాత రష్యన్ గణిత శాస్త్ర అధ్యయనం ఈ అమాయకత్వాన్నీ, స్వచ్చతనీ కొంత వరకూ కోల్పోయి అమెరికా, ఇరోపాలోల్లాగా వృత్తి లక్షణాలను సంతరించుకుంది. అంతే కాదు, ఇప్పుడు ఇర్కుట్‌స్క్‌లో “మాంసం” కొనుక్కోవచ్చు. ఏనాడూ సోవియట్ అనుభవించిన స్థాయిలో లేమిని మనం అనుభవించలేదు. ఇప్పటి రష్యన్ గణిత శాస్త్ర వాతావరణాన్ని మనం నిందించకూడదు. కోల్డ్ వార్ రొజుల్లో మాస్కోలో ఉన్న (ఒక) అమెరికన్‌కి అప్పటి రష్యన్ గణిత శాస్త్ర జీవితంలో కనపడిన బుద్ధి తీక్ష్ణతా నాణ్యత పరమాద్భుతమైనది. 

నాతొ పరిచయమయేదాకా, భయమన్నది తెలీకుండా, జీవితాన్నొక  హాయిగా తీసుకునే ధోరణి గల మనుషులుంటారని తను అనుకోలేదన్నాడు ఖజ్దన్ ఒకసారి నాతో. రష్యా లో ప్రతివాళ్ళూ సర్వకాల సర్వావస్థల లోనూ ఒక  ప్రమాదం పొంచిఉన్నదనీ దానినుంచి తమను కాపాడుకోటానికి చేసే ప్రయత్నమే జీవించటంగా బతికుతూ ఉండేవాళ్ళు. 

ఏమి మాట్లాడినా, కావాలని కాకపోయినా, లేదూ కావాలని అపకారం చేసే ఉద్దేశ్యంతో తాము అన్నదానికి వ్యాఖ్యానాలు జోడించి ‘పై వాళ్ళకు’ అందజేసే వాళ్ళున్నారనీ , పర్యవసానంగా తాము బడినుంచి వెళ్ళగొట్టబడవచ్చు, దేశ బహిష్కారం కాబడవచ్చు, జైల్లో వేయబడవచ్చు, చంపబడవచ్చునన్న నిత్య భయంతో వేయికళ్లతోతమను తము చూసుకుంటూ గడిపేవాళ్ళు. బతుకన్న తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఎవర్ని నమ్మాలి? ఈ మనిషిని ఎంతవరకు నమ్మొచ్చు?  ఎంత వరకూ మనసు విప్పి చెప్పుకోవచ్చు? ఈ వ్యక్తీ నామీద KGBకి ఫిర్యాదు  చేయవచ్చా? నా గురించి  తన స్వప్రయోజనాలకోసం అబద్ధాలు చెప్పొచ్చేమో ?అమెరికన్లకు ఇటువంటి ఒత్తిడి తెలీదు. ‘పెర్సెక్యూషన్’ – పుట్టుకను బట్టీ, మతవిశ్వాసాలను బట్టీ, ఆలోచనా సరళిని బట్టీ శిక్షించటం, హింసించటం, అంతంచేయటం – అన్నది ఒకటున్నదని తెలియకుండా, అటువంటి భయాలు లేకుండా పెరిగాం. మనదేశం భాగ్యవంతమైనది, మనం కాకపోయినా. ఇక్కడ వివక్షత లేని న్యాయ చింతన ఉన్నది. పాత రోజుల్లో, బాణామతి వంటి క్షుద్రారాధకుల్ని తరిమి కొట్టినట్టుగా కమ్యూనిస్ట్‌ల వెంటబడి వేటాడటమన్న మెకార్తీఇజం – చెడ్డదే కానీ, అది సాగినది చాలా స్వల్పకాలంపాటు.. – చెలరేగినప్పుడు కూడా ఆ పాత తరం వాళ్ళు సోవియట్ ప్రజలు భయపడినంతగా భయపడింది లేదు. 

గతించిన యూఎస్ఎస్ఆర్ గాంభీర్యం యెంత పెళుసుగా ఉండేదంటే ఆ పెళుసు దనాన్ని గురించి ఏమి చెప్పినా అతిశయోక్తి అవదు. ఒక అమెరికన్, మాస్కోకి వెళ్లి – తన చదువు కోసం ఉన్న కొద్దికాలంలోనే – అక్కడ అమెరికన్ లాగా సంచరిస్తూ, ఎవరికీ భయపడకుండా, లైబ్రరీలనుంచీ, శాస్త్ర ప్రాచీనతనీ, పాతరోజుల పరిశోధకుల కృషి ఫలితాలనీ పదిలపరిచి ఉంచి అధ్యయనానికి తోడ్పడే చోట్లు యేవైతే ఉంటాయో వాటన్నిటి నుంచీ బయటికి తోసేస్తామనే బెదిరింపులకు వణికిపోకుండా, ఒంటిచేత్తో సోవియట్ రాజకీయ వ్యవస్థని ధ్వంసం చేయగలిగేవాడని చెప్పినా కూడా అత్యుక్తి కాదు. సోవియట్లు ఒక స్వతంత్ర దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో బతుకుతున్న వాళ్ళ మనస్థితికీ, నియంతృత్వ పాలన ఉన్న దేశంలో బతుకుతున్న ప్రజల మానసిక స్థితి గతులకూ మధ్య ఉన్న తేడాని గ్రహించగలిగారు. సోవియట్ అధికారులు తమ సామాన్య ప్రజాజీవనం నుంచి అమెరికన్లని దూరంగా ఉంచాలనుకోవటం సరియైన ఆలోచనే. మనం వాళ్ళ రాజ్య వ్యవస్థకు ముప్పు, సోవియట్లకు మనం ఒక ప్రమాదం. 

 

నా అభ్యర్థనను మన్నించి అనువాదానికి అనుమతి ఇచ్చిన ఆంగ్ల వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి నథాన్సన్‌కీ, అమెరికన్ మాథమాటికల్ సొసైటీకీ ధన్యవాదాలు. 

 

వాసుదేవరావు ఎరికలపూడి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ

అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ

Published at: 11-07-2014 00:39 AM

‘‘సంగీత దర్శకుడిగా నా జర్నీ సో ఫార్‌ సో గుడ్‌. మా నాన్నగారు మ్యూజిక్‌ నేర్చుకోకపోతే నాకు సంగీతంతో పరిచయం ఏర్పడేది కాదేమో. నాన్నగారికి మ్యూజిక్‌ వచ్చి… పరిశ్రమకు రాకపోయినా నేను పరిశ్రమకు వచ్చేవాడిని కాదేమో. ఏ సభల్లోనో వాయించుకుంటూ ఉండేవాడినేమో. ఏదేమైనా చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌ అంటే నాకు ఆసక్తి ఉండేది కానీ, మ్యూజిక్‌ డైరక్టర్‌ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మ్యూజిక్‌ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఆటోమేటిగ్గా జరిగాయి. అంతేగానీ నేను ఎప్పుడూ ప్లాన్‌ చేసుకోలేదు. ఇప్పటికీ నాకంటూ ప్రత్యేకంగా గోల్‌ ఏదీ లేదు’’ అంటున్నారు మణిశర్మ. సంగీత దర్శకుడిగా ఆయన ఎన్ని హృదయాలను ఏలారో అందరికీ తెలిసిందే. శుక్రవారం పుట్టిన రోజు చేసుకుంటున్న మణిశర్మతో ‘చిత్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ సరిగమలు మీకోసం..

 ప్ర: ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలూ చేశారు. ఎలా బ్యాలన్స్‌ చేసుకోగలిగారు. ఆ రహస్యం మాతో పంచుకుంటారా?
మామూలుగా నాలో ఏదో భయం ఉండేది. అందుకే ఓ యాటిట్యూడ్‌ అలవాటైంది. అది మా ఇళయరాజాగారిని ఫాలో అవడం. ఆయన కూడా అంతే. ఒక వైపు పెద్ద సినిమాలు చేసేవారు. మరో వైపు కామెడీ సినిమాలు చేసేవారు. గోపీచంద్‌ ‘యజ్ఞం’ సినిమాకు నేనే సంగీతం చేశాను. నా కెరీర్‌ మొత్తం మీద అంత తక్కువ ఎమౌంట్‌ని నేనెప్పుడూ తీసుకోలేదు. చిరంజీవిగారు, మహేష్‌బాబు సినిమాలకు సంగీతం చేసినప్పుడే ఈ సినిమా కూడా చేశాను. ఎందుకు చేశానంటే కారణాలున్నాయి.. కొంతమంది దర్శకులుగానీ, నిర్మాతలు గానీ తొలిసారి సినిమాలు చేసేటప్పుడు ‘అన్నగారూ… మీరు చేయాలి. మీరు చేస్తే నాకు లైఫ్‌ వస్తుంది’ అని అనేవారు. వెంటనే చేసేవాడిని. అప్పుడు వారు చాలా ఆనందించేవారు. వాళ్ల సంతోషంలో నేను ఆనందాన్నివెతుక్కునేవాడిని. ఎందుకంటే… ఎంత సంపాదించి ఏం లాభం? ఎంత తింటాం? డబ్బు అనేది ఆల్వేస్‌ హ్యాపీనెస్‌ కాదు. బతకడానికి కావాలనుకోండి. కానీ మా లాంటి మ్యుజిషియన్స్‌కి, సెన్సిటివ్‌ మ్యుజిషియన్స్‌కి అదే ఆనందం.  డైరక్టర్‌ వచ్చి సన్నివేశాలు చెప్పగానే హార్మోనియం ముందు కూర్చుని బాణీలు కడతాను.

ప్ర: ఇప్పటికీ హార్మోనియం ముందు కూర్చుంటారా..
అవునండీ. అందుకే నా పాటల్లో ఇప్పటికీ మెలోడీ ఉంటుంది.

 ప్ర: మీ పేరు చూసి సీడీలు కొనేవారు కోకొల్లలు కదండీ..
అది హార్డ్‌ ఎర్న్‌డ్‌ నేమ్‌. హార్డ్‌ ఎర్న్‌న్డ్‌ మనీ అంటారు కదా. అలా ఇది నేమ్‌. ఈ రోజున కూడా చాలా మంది నన్ను కలిసి ‘ఎందుకు సార్‌ వరుసగా చేయడం లేదు’ అని అడుగుతుంటారు. ‘ఊరికేలేవయ్యా. వాళ్లకి నా సంగీతం నుంచి రిలీఫ్‌ కావాల్సి వచ్చింది. 15 ఏళ్లు దాదాపుగా అన్ని సినిమాలు నేనే చేశాను కదా. కొత్త టాలెంట్‌ వస్తున్నారు. దేవి అయితేనేం, తమన్‌ అయితేనేం, హారిస్‌, జోష్వా శ్రీధర్‌… ఇలా అందరూ మన దగ్గర పనిచేసిన వారే వస్తున్నారు’ అని అంటున్నా.

 ప్ర: మీ అబ్బాయి సాగర్‌ మహతి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు కదా?
అవునండీ. గోపీచంద్‌ సినిమాకు సంగీతం చేస్తున్నాడు. వెస్ట్రన్‌, క్లాసికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఓ ఐదేళ్లు కీబోర్డు ప్లేయర్‌గా చేశాడు. నా దగ్గర కూడా నేర్చుకున్నాడు.

ప్ర: మిమ్మల్ని సలహాలూ, సూచనలు అడుగుతుంటాడా?
లేదండీ. నేను ఇళయరాజాగారి దగ్గర, ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ గారి దగ్గర, కీరవాణిగారి దగ్గర (నా ఫస్ట్‌ సినిమా నుంచి 100 సినిమాల దాకా చేశా), విద్యాసాగర్‌ దగ్గర, అలాగే రాజ్‌-కోటిగారి దగ్గర కీబోర్డు ప్లే చేశాను. 15ఏళ్ల పాటు వాళ్లతో మెలిగిన నేను అవేమీ నా సంగీతంలో కనిపించకుండా ఉండాలని 6 నెలలు కీబోర్డు వాయించడం మానేశాను. నాకు కొంత ప్రాబ్లెమ్‌ వచ్చినా నేను ఎక్కడికీ వెళ్లకుండా నా రోల్‌ నేను చేంజ్‌ చేసుకున్నా. శాటిస్‌ఫాక్షన్‌ ఉండాలంటే ఆ మాత్రం శాక్రిఫైజ్‌ చేయాల్సిందే. ‘చూడాలని ఉంది’ ఆడియో ఈ రోజు వేసుకున్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ‘తీసెయ్‌రా ఆ పాట’ అనేటట్టు ఉండదు. చిరు, పవన్‌, మహేష్‌.. కాంబినేషన్లతో నేను చేసిన పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. శివరాత్రి వస్తే ఇప్పటికీ ‘భం భం భోలే..’, ‘సదా శివ సన్యాసి’ వంటి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా నెల్లూరు నుంచి ఒకాయన ఫోన్‌ చేసి ‘నాయనా.. నేను డిస్టర్బ్‌డ్‌గా ఉన్నప్పుడు ‘నమ్మిన నా మది మంత్రాలయమే’ అనే పాట వింటాను. నా కళ్లమ్మట నీళ్లు వస్తాయి’ అని చెప్పాడు. ఇలాంటివి వింటున్నప్పుడు నాకు చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది.

   ప్ర: అంత ఆత్మ సంతృప్తిని అనుభవించిన మీరు కావాలనే సినిమాలు తగ్గించుకున్నారా?
అదృష్టవశాత్తూ తగ్గాయండీ. 15 ఏళ్లు కీబోర్డు ప్లేయర్‌గా రాత్రింబవళ్లు పనిచేశా. ఆ తర్వాత 15 ఏళ్లు మ్యూజిక్‌ డైరక్టర్‌గా చేశా. ఇప్పుడు కూసింత సమయం దొరికింది. అయామ్‌ ఎంజాయింగ్‌ మై లైఫ్‌. నాకు లైఫంతా నాలుగు గోడల మఽధ్యే గడిచిపోయింది. ఇప్పుడే అయామ్‌ ట్రావెలింగ్‌ ఆల్‌ ఓవర్‌ ద వరల్డ్‌. ఇప్పుడు హీరోలు డ్యాన్సింగ్‌ చేసే పాటలు చేయాలని లేదు. అవి కూడా ఒకప్పుడు చేశాను. కానీ ఆ టైమ్‌ అయిపోయింది. అందుకే నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా పేరు నిలబెట్టే పాటలు చేయాలనుకొంటున్నాను. ఇప్పుడు నేను పెద్దగా సినిమాలు చేయకపోయినా నేను మిస్‌ అయ్యేంతగా ఏమీ ఉండటం లేదు.

   ప్ర: మిక్సింగ్‌లో కింగ్‌ మీరే అనే పేరుంది. అందుకు స్పెషల్‌గా ఏమైనా చేసేవారా?
నా పాటలో ముందు మాట వినిపించాలి. వేటూరిగారు, శాసి్త్రగారు వంటి లిరిసిస్ట్‌లు మనదగ్గర ఉన్నప్పుడు, వాళ్లిచ్చే సాహిత్యం వినిపించకుండా పీకనొక్కేస్తే ఇంక భాష ఏం నిలుస్తుంది? అందుకే మొదటి నుంచీ నేను ఆ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాను.‘రామ్మా చిలకమ్మ’ అయినా ఇంకోటయినా పాటలో పదాలు వినిపించాల్సిందే. పాట వింటూ ఆ పదాలను పేపరుపై ఎవరైనా రాయగలగాలి అనుకునేవాడిని.

   ప్ర: నాలుగ్గోడల మధ్య జీవితాన్ని గడిపిన మీరు ఎలా అప్‌డేట్‌ అయ్యేవారు?
ఇంటికి వెళ్లినప్పటి నుంచీ మ్యూజిక్‌ రన్‌ అవుతూనే ఉండేది. వరల్డ్‌లో ఏ యే మ్యూజిక్‌లున్నాయి.. జాజ్‌, వెస్టర్న్‌.. వాటిలో కొత్తగా ఏం వచ్చాయి. వాటిని కొనడం, వినడం.. స్నానం చేసినా, నిద్రపోయినా… 24 గంటలు సంగీతం రన్‌ అవుతూనే ఉండేది. దీనివల్ల ప్రాబ్లమ్‌ అయింది. ఓ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ శబ్దంలో ఆ శబ్దం వినిపించలేదు. అప్పటినుంచి రాత్రుళ్లు వినడం మానేశా.

   ప్ర: అప్పట్లో ఇంటర్నెట్‌ ఇంతగా అందుబాటులో ఉండేది కాదుగా. మరి వరల్డ్‌ మ్యూజిక్‌ని మీరెలా సంపాదించేవారు?
నేను ప్రతి ఏడాది విదేశాల్లో మ్యూజిక్‌ టూర్‌లకు వెళ్లేవాడిని. అప్పుడు క్యాసెట్లు, సీడీలను సేకరించేవాడిని. నా స్నేహితులు పంపేవారు. బాలుగారు  వెళ్లినప్పుడు తెచ్చేవారు. సౌండ్‌కి ఆల్వేస్‌ టచ్‌లో ఉండేవాడిని. సౌండ్‌ని ఆరాధించేవాడిని. పాటల్లో ఏం చెప్పినా పద్ధతిలో చెప్పాలని ప్రయత్నించేవాడిని.

   ప్ర: మీరు పరిశ్రమకి వచ్చిన కొత్తలో పాటలకు ఇంత ప్రాచుర్యం ఉండేదా?
ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. యూట్యూబ్‌, రేడియోలు, ఇంటర్నెట్‌లు.. ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్‌పోజర్‌ మంచిదే.  సంగీతం బావుంటే ఎంత త్వరగా శ్రోతలకు చేరువవుతుందో, బాగా లేకుంటే అంతే త్వరగా స్టేల్‌ అయిపోతుంది.
 ప్ర: ఇప్పుడు సీడీలు కొనేవాళ్లే లేరు. మొత్తం డిజిటలైజేషన్‌ అవుతోంది. దాని గురించి మీరేమంటారు?
ఇందాక చెప్పినట్టు డిజిటల్‌ ఎక్స్‌పోజర్‌ ద్వారా ఆడియోకు కాస్త మార్కెట్‌ వస్తోంది. రెహమాన్‌, హారిస్‌ లాంటి వారు చాలా ప్లానింగ్‌గా ఉంటున్నారు. ఎక్కడా మోసపోవట్లేదు. తాము చేసిన సంగీతాన్ని చాలా బాగా సంరక్షించుకుంటున్నారు. కానీ నేను ఆ రకంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు అవన్నీ చేసిపెట్టేవారు కూడా లేరు.  ‘మీకున్నన్ని హిట్లు నాకు ఉంటే అవి ప్లే అయితే వచ్చే డబ్బులతో జల్సాగా ఉండేవాడిని. పనే చేసేవాడిని కాదు సార్‌’ అని హారిస్‌ జైరాజ్‌ ఎన్నోసార్లు నాతో అంటుంటాడు. డిజిటల్‌ విధానంలో పాటలు ప్లే అయిన ప్రతిసారీ మీటర్‌ తిరుగుతూనే ఉంటుంది. సృజనకారులకు డబ్బులు వస్తూనే ఉన్నాయి.

    ప్ర: రీరికార్డింగ్‌లో మీరు దిట్ట అనే పేరుంది..
నేను మా గురువుగారిని ఎక్కువగా అనుసరిస్తుంటాను. పాటలకన్నా రీరికార్డింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది. టీవీల్లో వచ్చే ఆర్‌.ఆర్‌.ను రికార్డ్‌ చేసేవాడిని. అలాగే రికార్డింగ్‌ రూముల్లోనూ రికార్డ్‌ చేసుకునేవాడిని. ఏదైనా దర్శకుడు చెప్పే సన్నివేశాన్ని ఆకళింపు చేసుకోవడం వల్లనే మంచి సంగీతం వీలవుతుంది.

   ప్ర: సినిమాలు తీయాలనే ఆలోచన ఎంత వరకు వచ్చింది?
సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను.  ‘ముంబై 125 కి.మీ’ త్రీడీ హారర్‌ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు.

   ప్ర: లైవ్‌ రికార్డింగ్‌లు తగ్గిపోతున్న తరుణంలో వాద్యకారుల పరిస్థితి?
ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడిపోతున్నారు. ఇళయరాజాగారు ఇప్పటిదాకా ఒక్క రికార్డింగ్‌ కూడా లైవ్‌ ఆర్కెసా్ట్ర లేకుండా చేయలేదంటే నమ్మండి. నేను కూడా నా వంతుగా చాలా కృషి చేస్తున్నాను.

  ప్ర: మ్యూజిక్‌ స్కూల్‌ ప్రారంభించే ఆలోచనలున్నాయా?
చేద్దామనే ఓ ప్లేస్‌ తీసుకున్నా. చెన్నైలోని ఈసీఆర్‌లో. స్కూలు, బోర్డింగ్‌ వసతులు కల్పిస్తూ స్కూలును ఏర్పాటు చేద్దామనుకున్నా. మునులు తపస్సు చేస్తే అడ్డంకులు సృష్టించే రాక్షసులు ఎప్పుడూ ఉంటారని మనం చదివాం. నేను ఈసీఆర్‌లో తీసుకున్న స్థలం విషయంలోనూ అదే జరిగింది.  డాక్యుమెంట్‌లో నాకు అమ్మిన వారు చిన్న తప్పు చేశారు. అది తెలుసుకుని ఒక వ్యక్తి నాపై  కేసు పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు సివిల్‌ కోర్టులో ఉంది. నేను 2002లో స్థలం కొంటే 2010లో అతను మీద పడ్డాడు.

     ప్ర: అదెలా సాధ్యం?
మా నాన్నగారు వేదం నేర్చుకున్నారు. మ్యూజిక్‌ ఫ్యామిలీలో పుట్టాను. నేను మోసం ఎందుకు చేస్తాను? నాకు రికార్డింగ్‌ రూమ్‌, ఎయిర్‌పోర్టు తప్ప ఇంకేమీ తెలియదు. నేను ఎంతో పోగొట్టుకున్నాను గానీ, ఇతరులది తీసుకోవడం ఎప్పుడూ లేదు. మణిశర్మ ల్యాండ్‌ గొడవ అని వార్తలను రాసేవారు కనీసం నా అభిప్రాయం తీసుకోవాలి కదా. నేను ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ల్యాండ్‌ కూడా తీసుకోలేదు. మా రికార్డింగ్‌ థియేటర్‌ను కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకుని నేనే కట్టుకున్నాను. ఏ ప్రభుత్వం నాకు సెంటు భూమిని ఇవ్వలేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదాలకు భావాల తళుకులు.. -మల్లాది కృష్ణానంద్

పదాలకు భావాల తళుకులు..

  • -మల్లాది కృష్ణానంద్

నీటిరంగుల ఛిత్రం
-వాడ్రేవు చినవీరభద్రుడు
వెల: రూ.150
e-book కోసం www.kinige.com

వాఢ్రేవు చిన వీరభద్రుడు వెలువరించిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. ఈ సంపుటిలో జీవితానందం సిద్ధించే మెలకువ కోసం కవి నిరంతరంగా అనే్వషించడం కనిపిస్తుంది. వాడ్రేవుగారి నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరి చేల మధ్య ఒక్కత్తే అమ్మ (1995), పుర్యానం (2004), కోకిల ప్రవేశించే కాలం (2009) తర్వాత వచ్చిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. తన కవిత్వం గురించి, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ చినవీరభద్రుడు, మరో సాహిత్యాభిమాని ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటిలో ప్రచురించారు. ఇది ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ అనొచ్చు.
కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ, అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగి తీగ లోపలనుంచి కాకుండా రాగి తీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటల చుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడగునా కనిపిస్తుందని వాడ్రేవు అంటారు. నా కవితలో రాగాత్మక ఉంది. పొందిక కూడా ఉంది. ఒక స్వర్ణకారుడు బంగారు నగకి నగిషీ పెట్టడంలో ఉండే పనివాడితనమంతా నా కవితలో ఉంటుందంటాడు వాడ్రేవు.
కవి కేవలం తన భావాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం తొలిరోజుల్లో జరిగే పని. కవి పరిణతి చెందే కొద్దీ శిల్పం మీద దృష్టిపెట్టక తప్పదు.
మనకి ‘ద్రష్ట’, ‘స్రష్ట’ అనే రెండు పదాలున్నాయి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థాన‘ గీతాలనాడు ద్రష్ట, ‘మరో ప్రస్థానం’ నాటికి శ్రీశ్రీ స్రష్టగా మారాడంటారు వాడ్రేవు. కవిత అంటే కేవలం వర్ణన లేదా అభిప్రాయ ప్రకటన కాదు.చిన్ని చిన్ని వివరాల వల్ల కవిత తన అనుభూతిని తన శ్రోత హృదయంలో ఎంతో విశ్వసనీయంగా ముద్రిస్తాడని కూడా మనం గమనించాలంటాడు. ఎంత మేరకు వదిలిపెట్టాలన్నదే కవి శిల్ప పరిణతికి గీటురాయి అంటాడాయన. నా దృష్టిలో కవిత్వం దానికదే అత్యంత శక్తివంతమైన భావ ప్రసార సాధనమంటాడు వాడ్రేవు. నా కవిత్వంలో సాధారణ పత్రికా భాషనీ, సామాజిక రాజకీయ భాషనీ వీలైనంతగా పరిహరించడానికే ప్రయత్నించానంటాడు వాడ్రేవు.
ఈ కవితా సంపుటిలో వాడ్రేవు 182 కవితలు 208 పేజీలలో ప్రచురించాడు.
ముందుగా కాపాడుకోవల్సిన పద్యం అంటూ…
‘‘ఇంధనం అగ్నిగా మారినట్లు, ప్రతిరోజూ ఒక పద్యంగా మారాలని ప్రార్థిస్తున్నానంటాడు‘‘ కవి.
పాలుగారే ప్రపంచంతో-అనే కవితతో ప్రారంభించిన వాడ్రేవు నా ఆరాటమిదే అనే శీర్షికతో బహు చతురతతో ముగించాడు.
ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో ప్రముఖ కవి, శిల్పి మైకెలాంజిలోని స్థానికులు అడిగారట.
ఏమని?
మేం రోజూ చూసే శిలనే ప్రవక్తగా నువ్వెట్లా మలిచావని?
ఏది డేవిడ్ కాదో దాన్ని చెక్కేసానని మైకెలాంజి జవాబిచ్చాడు.
చమత్కారుడైన వాడ్రేవు కూడా..
‘‘నాలో ఏది చిన వీరభద్రుడు కాదో దాన్ని తొలగించాలని, నా ఆరాటమిదేనని, కడు రమ్యంగా కవితా సంపుటిని ముగించారు.
ఆ తర్వాత ఓ 10 పేజీలలో యువకవి ఆదిత్యతో కొర్రపాటితో అభయ వచనాలు శీర్షికతో ప్రశ్న-జవాబులో వాడ్రేవు తన మనస్సును పాఠకుల మందుంచాడు.
చక్కని మధుర లలిత పదాలతో పాఠకుల్నీ భావకవులుగా తీర్చేలాగ సాగే ఈ కవితా సంపుటిని ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలి. తెలుగు కవిత్వాన్ని అభిమానించే ప్రతి వారింటా తప్పక ఉండవల్సిన పుస్తకం.
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్ తదితర అన్ని పుస్తకాల షాపుల్లో లభిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు అంటున్నసినీ నిర్మాత సురేష్

చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు

యాభై ఏళ్ల కృషి ఫలితంగానే తాము నేడున్న స్థాయికి చేరుకున్నామనీ, కష్టం, ప్రతిభతోటే ఎవరైనా ఎదుగుతారనీ, తాను న్యాయంగానే థియేటర్లను నడుపుతున్నానే కానీ, చట్ట విరుద్ధంగా ఏమీ చేయట్లేదనీ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు చెప్పారు. వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీప్రియ డైరెక్ట్‌ చేసిన ‘దృశ్యం’ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ సేతుపతితో కలిసి ఆయన నిర్మించారు. శుక్రవారం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం తమ స్టూడియోలో పత్రికలవారితో మాట్లాడిన ఆయన చిత్ర రంగానికి చెందిన పలు అంశాలతో పాటు, తనపై వస్తున్న విమర్శలకూ సమాధానం చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఇది సురేశ్‌ ప్రొడక్షన్‌కు 50వ సంవత్సరం. నేను 32 ఏళ్ల క్రితం 1982లో నా కెరీర్‌ను ప్రారంభించా. ‘దేవత’ నుంచి ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్తూ వస్తున్నా. అయితే నా పేరు ‘బొబ్బిలి రాజా’ నుంచి ఉంటుంది. మనకంటూ కొన్ని డ్రీమ్‌ సినిమాలుంటాయి. లైఫ్‌లో అలాంటి సినిమాలను కొన్నే తీస్తాం. నాకు ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’ డ్రీమ్‌ ఫిలిమ్స్‌. మనం ఎదిగేకొద్దీ ఫ్యామిలీ విలువలున్న సినిమాల వేపు మొగ్గు చూపుతాం. కానీ ముప్పై ఏళ్ల తర్వాత కథలు వింటుంటే అప్పటి కథల్లానే ఉంటున్నాయి. అదే విజన్‌ కనిపిస్తోంది. అందుకే మంచి కథల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటున్నాం. వెంకటేశ్‌ ఎప్పుడూ కొత్త కథల కోసం చూస్తుంటాడు. నేను ఫ్యామిలీ ఓరియంటెడ్‌ డిటెక్టివ్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఎప్పట్నించో చూస్తున్నా. చాలామందిని అడిగా – షెర్లాక్‌ హోమ్స్‌ లాంటి సినిమాని ఫ్యామిలీ డ్రామాలో సెటప్‌ చేసి చెప్పమని. ‘దృశ్యం’ చూసినప్పుడు, మంచి అనుభూతిని పొందాను. సింపుల్‌ స్టోరీని చాలా బ్రిలియంట్‌గా చెప్పారు. ఔట్‌స్టాండింగ్‌ స్ర్కీన్‌ప్లే. వెంకటేశ్‌ ‘ఐ యామ్‌ రెడీ టు డూ ద ఫిల్మ్‌. ఆర్‌ యు రెడీ టు మేక్‌ ది ఫిల్మ్‌?’ అన్నాడు. ఆ సినిమా హక్కులు రాజ్‌కుమార్‌ సేతుపతి వద్ద ఉండటంతో ఆయనతో కలిసి ఈ సినిమా చేశాం. మలయాళంలో డిసెంబర్‌లో రిలీజైతే, జనవరిలో ఓకే చేశాం. మార్చి 6 నుంచి రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేసి, సినిమాని పూర్తి చేశాం.
నేటి కాలపు కథ
‘దృశ్యం’ ఏ ఇంట్లో అయినా జరగ్గలిగిన ఓ కథ. నేటి కథ. రెగ్యులర్‌ ఫ్యామిలీ డ్రామా సినిమా కాదు. నేటి టెక్నాలజీతో వచ్చే సమస్యలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. సమస్య, దానికి పరిష్కారం, ఇన్వెస్టిగేషన్‌ అన్నీ టెక్నాలజీ ఆధారంగా కనిపిస్తాయి. విజయనగరం, అరకు మధ్య ఉండే ఒక కాల్పనిక గ్రామంలో హీరో కేబుల్‌ ఆపరేటర్‌ . అతనికి సినిమాలంటే పిచ్చి. నాలుగో తరగతి పాసైన అనాథ. తన లైఫ్‌లో వచ్చే సమస్యలకి పరిష్కారాలను సినిమాల నుంచే తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఓ సీరియస్‌ ప్రాబ్లెమ్‌ వస్తే తన సినిమా జ్ఞానాన్ని ఉపయోగించి, దాన్నెలా పరిష్కరించాడనేది ఆసక్తికరం. సమస్యను హీరో గెలిచే తీరును చూస్తే ఇలా గెలవాలని ప్రేక్షకులు ఫీలవుతారు. ఇందులో వచ్చే సమస్యని చూస్తే అందరి వళ్లూ జలదరిస్తాయి. కొత్త కథలు రాయడానికి ఇది హెల్పవుతుంది.
పేరు కోసమే స్టూడియోలు
మా నాన్న జెమిని, ఏవీఎం స్టూడియోస్‌ లాగా ఓ స్టూడియోస్‌ కట్టాలని రామానాయుడు స్టూడియోస్‌ కట్టారు. కానీ అప్పటి స్టూడియోల్లో చాలా మూతపడిపోయాయి. వాహిని, జెమిని, భరణి స్టూడియోలు ఇప్పుడు లేవు. ఇటీవల ఏవీఎం స్టూడియోకు వెళ్తే అందులో నాలుగు గోడలు కట్టేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. రేపు నాకూ అలాంటిదే జరగొచ్చు. ఇవాళ హైదరాబాద్‌లో సారథీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, రామానాయుడు స్టూడియోస్‌, నానక్‌రామ్‌గూడ స్టూడియోస్‌ రన్నింగ్‌లో ఉన్నాయి. పద్మాలయా స్టూడియోస్‌ రన్‌ కావట్లేదు. సారథీ స్టూడియోస్‌ను నైజీరియా ఉంటున్న వ్యక్తి కొన్నారు. ఎప్పుడైనా దాన్ని ఆయన రియల్‌ ఎస్టేట్‌ కింద మార్చవచ్చు. మా స్టూడియోను ఎంత కాలం వీలైతే అంత కాలం నడపాలనేది మా ఆశయం. నానక్‌రామ్‌గూడ స్టూడియో ప్రభుత్వ స్థలంతో కట్టింది కాదు. మా అమ్మాయి పెళ్లయ్యాక అక్కడ షాదీఖానా కడదామనుకున్నా. కానీ నాకు సినిమా తీయడానికి లొకేషన్లు లేకపోతే నేను దాన్ని కన్వెర్ట్‌ చేయను. నా సినిమాలకు కావాల్సిన సెట్లు వేసుకుని సినిమాలు తీస్తుంటాను. నాకు తెలిసి ఫిల్మ్‌ స్టూడియోలు డబ్బులు సంపాదించవు. నాగేశ్వరరావు గారు సినిమాల్లో సంపాదించి స్టూడియో కట్టారు. ఆయన గనక బ్యాంకులో అప్పులు తెచ్చి కట్టుంటే దివాలా అయ్యుండేవారు. మాకు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలు గనక వచ్చి ఉండకపోతే మేం స్టూడియో కట్టేవాళ్లం కాదు. వెంకటేశ్‌ యాక్టర్‌ కాకపోతే స్టూడియోలో ల్యాబులు పెట్టేవాళ్లం కాదు. కృష్ణగారు సక్సెస్‌లో ఉండటం వల్లే స్టూడియో కట్టగలిగారు. తమ పేరు నిలవాలనుకునే వాళ్లు కట్టుకుంటారు తప్ప వ్యాపారం చేద్దామని ఎవరూ కట్టరు. ఇవాళ 95 శాతం సినిమాల షూటింగులు ఔట్‌డోర్‌లో జరుగుతున్నాయి. పెద్ద సినిమాలకు సెట్స్‌ కావాలి కాబట్టి స్టూడియోలు అవసరం. రూ. రెండు కోట్లలోపు బడ్జెట్‌ సినిమాలు స్టూడియోల్లో సినిమాలు తీయలేవు. ఏడాదికి 150 సినిమాల్లో స్టూడియోల్లోని ఫ్లోర్స్‌లో షూటింగ్‌ జరిపే సినిమాలు 20 నుంచి 25 మాత్రమే ఉంటాయి.
పెద్ద కలలు కనాలి
సినిమాని మరో లెవల్‌కు తీసుకెళ్లే డైరెక్టర్స్‌ కావాలి. తమిళనాడులో శంకర్‌ ఉంటే మనకు రాజమౌళి వచ్చాడు. హైదరాబాద్‌ నుంచి ‘అవతార్‌’, ‘టైటానిక్‌’ ఎప్పుడు తీస్తారు? మనం అసలు ఢిల్లీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కే వెళ్లం. నేషనల్‌ అవార్డ్స్‌కు వెళ్లం. ఇలాగైతే తెలుగు సినిమా ఎప్పుడు ఎదుగుతుంది? హాలీవుడ్‌ సినిమా తీయాలనేది నా కల. దానికి కావాల్సిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నా. పెద్ద కలలు కనాలి. ఇవాళ 95 శాతం మంది నిర్మాతలు, దర్శకులు అప్పుడు చేస్తున్న సినిమా బాగా ఆడితే చాలన్నట్లు అనుకుంటుంటారు. మనకి ఎలాంటి గోల్స్‌ ఉండవు. రాజమౌళి లక్ష్యం ఉంది. హాలీవుడ్‌లో మహాభారతం తియ్యాలనేది ఆయన గోల్‌. దానివైపే ఆయన జర్నీ ఉంటుంది. శంకర్‌ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే తాను వంద కోట్ల సినిమా తియ్యాలని కలలు కనేవాడు. అలాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మనకు ఎక్కువమంది కావాలి. మా నాన్న స్టూడియో కట్టాలని కలలు కని కట్టారు. నేను సర్వైవల్‌ ప్రొడ్యూసర్‌ని. నా కంపెనీని ఇబ్బందులు లేకుండా రన్‌ చేయాలనుకుంటాను. మళ్లీ నా కొడుకు రానా డ్రీమర్‌. ఇంటర్నేషనల్‌ స్టార్‌ని అవుతాననేది అతని కల. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చెయ్యాలనేది అతని కల.
మనం ఎదగాలి
ఇవాళ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ క్వాలిటీతో సినిమాలు తియ్యడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కానీ మనకు మైండ్‌ లేదు. స్ర్కిప్ట్‌ లేదు. స్కిల్‌ లేదు. మనకు తెలుగు సినిమాలు తియ్యడం వచ్చు, హిందీ సినిమాలు మేనేజ్‌ చెయ్యడం వచ్చు కానీ, ఒక ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ను హ్యాండిల్‌ చెయ్యడానికి మొత్తం యాభై మంది కూడా లేరు. అలా కాకుండా మన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. బాలీవుడ్‌లో వాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటారు. మనం అవాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ మన సినిమా వీకెండ్‌ బిజినెస్‌ అయిపోయింది. 365 రోజుల్లో 175 రోజుల్లోనే బిజినెస్‌ వస్తుంది. మిగతా రోజుల్లో బిజినెస్‌ కాదు. దాంతో ఆ 175 రోజులను తెలివైన నిర్మాతలు లాగేసుకుంటున్నారు. కొంతమంది ఆ రోజులు తమక్కావాలని అడుగుతుంటారు కానీ, వాళ్లకు దొరకవు.
నాలుగు స్ర్కిప్టులు రెడీ
రానా కోసం ఇంతదాకా నేను ఏం చేయలేదు. ఒళ్లు తగ్గించుకుంటే సినిమా చేస్తానని చెప్పాను. వాడు తగ్గించుకున్నాడు. ఈలోగా శేఖర్‌ కమ్ముల వచ్చి తాను చేస్తానని ‘లీడర్‌’ చేశాడు. తర్వాత వాడు చేసిన రెండు కథలు – ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’ నాకు నచ్చలేదు. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ ఐడియా నాకు నచ్చింది. నేను తీద్దామనుకుంటే తానే తీసుకుంటానని క్రిష్‌ అన్నాడు. ఇప్పుడు ‘బాహుబలి’తో బిజీ అయ్యాడు. నాకు వాడితో చేయడానికి టైమ్‌ దొరకట్లేదు. త్వరలోనే వాడితో ఖచ్చితంగా ఓ సినిమా చేస్తా. డైరెక్టర్‌ హను ‘కవచం’ అనే స్ర్కిప్ట్‌ రెడీ చేశాడు. అలాగే పరశురామ్‌ ‘చుట్టాలబ్బాయ్‌’ అనే కథను రెడీ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్‌, శ్రీధర్‌ రాఘవన్‌ (బాలీవుడ్‌ డైరెక్టర్‌) కలిసి ఓ కథ రెడీ చేస్తున్నారు. సెల్వ రాఘవన్‌ ఓ స్ర్కిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. మా రెండో అబ్బాయి అభిరామ్‌ను ప్రొడక్షన్‌ వ్యవహారాల్లో పెట్టాను. వాడిని హీరోగా పరిచయం చేస్తామని చాలామంది వస్తున్నారు. వాణ్ణి అప్పుడే చెడగొట్టకండని చెబుతున్నా.
కష్టంతోటే
ఫలితం
ఏ బిజినెస్‌లోనూ రాత్రికి రాత్రే అంతా వచ్చేయదు. ఇవాళ మేం ఈ స్థితిలో ఉన్నామంటే యాభై ఏళ్ల కృషి ఫలితం. మాకు ఉన్నదంతా న్యాయంగా వచ్చిందే, న్యాయంగా చేసిందే. ‘చిరంజీవి ఇంట్లో ఐదుగురు హీరోలున్నారు, మా ఇంట్లో ఒక్కరే హీరో ఉన్నారు’ అని ఎవరైనా ఏడుస్తారా? చిరంజీవి గారు కష్టపడ్డారు. పవన్‌కల్యాణ్‌, బన్నీ, రామ్‌చరణ్‌ కష్టపడ్డారు. వాళ్లు ఊరికే హీరోలు కాలేదు. ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టే హీరోలయ్యారు. కృష్ణ గారికి ఇద్దరు కొడుకులున్నారు. మహేశ్‌ ఒక్కడే సూపర్‌స్టార్‌ అయ్యాడు. ఇంకొకతను కాలేదు. ఎందుకని? మహేశ్‌లో టాలెంట్‌ ఉంది కాబట్టే అయ్యాడు. ఎవరికీ ఊరికే ఏదీ రాదు. డిసి్ట్రబ్యూటర్‌గా ఉన్న దిల్‌ రాజు టాలెంట్‌తో నిర్మాత అయ్యారు. ఎం.ఎస్‌. రెడ్డి విజయవంతమైన నిర్మాత కాలేకపోయారు. కానీ వారబ్బాయి శ్యాంప్రసాద్‌రెడ్డి తన ప్రతిభతో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ అయ్యారు. వాళ్లకు ఎవరికో ఉందని నేనేడుస్తుంటే ఎలా? ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోనే మొత్తం థియేటర్లను నలుగురైదుగురే కంట్రోల్‌ చేయబోతున్నారు. ఒక కంపెనీ వాళ్లు ఈ ఏడాది 300 థియేటర్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకొని కొనేయబోతున్నారు. ఇంటరెస్ట్‌ ఉన్నవాళ్లు వాటిని రన్‌ చేస్తుంటారు. రేపు నాకు ఆసక్తి లేకపోతే నా థియేటర్లను వేరే వాళ్లకు అమ్మేస్తాను.  నేను వాస్తవానికి ‘దృశ్యం’ను ఆగస్ట్‌ 14కు తీసుకు రావాలని అనుకున్నా. కానీ అదే టైమ్‌కు ఎన్టీఆర్‌ ‘రభస’, సూర్య ‘అంజాన్‌’ వస్తున్నాయి కాబట్టి, నా సినిమా ముందుగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడే తెస్తున్నా. అదే నేను ఆగస్ట్‌ 14కి తేవాలనుకుంటే నా సినిమా రెండు లేదా మూడో ఆప్షన్‌ అవుతుంది. ఎగ్జిబిటర్లు మొదట ఎన్టీఆర్‌ సినిమాకి ప్రిఫరెన్స్‌ ఇచ్చి, తర్వాత ‘దృశ్యం’కు ఇస్తారు. అది నేను అండర్‌స్టాండ్‌ చేసుకోవాలి. నేను మొండిగా అప్పుడే తేవాలనుకుంటే ఎగ్జిబిటరే చెబుతాడు, అప్పుడు వద్దని. జూలై 11కి ఏ సినిమాలూ లేవు కాబట్టి తెస్తున్నా. ఎగ్జిబిటర్‌కు అవసరాన్ని సృష్టించాకే సినిమా తేవాలి. మన సినిమాకు డిమాండ్‌ని సృష్టించాలి. సినిమా పూర్తవడంతోటే థియేటర్‌ దొరకాలంటే ఎలా దొరుకుతుంది? ‘ఆ నలుగురి దగ్గర అవున్నాయి, ఈ ముగ్గురి దగ్గర ఇవున్నాయి’ అంటే ఏం చేస్తాం? దానికి సమాధానం ఉండదు. నేనేదైనా చట్టవిరుద్ధంగా చేస్తుంటే అప్పుడడగవచ్చు. కాంపిటిషన్‌ కమీషన్‌లో ఇలా చేయకూడదనుంటే చేయను. చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదే.
ఇండసీ్ట్ర తరలిపోవచ్చు
ఇండసీ్ట్ర ఎక్కడికైనా, ఎప్పుడైనా తరలిపోవచ్చు. మంచి వాతావరణం ఉన్నచోటకీ, మంచి రాయితీలు ఉన్నచోటకీ వెళ్తుంది. తడ, వైజాగ్‌, విజయవాడ వంటి చోట్లకి తరలిపోవచ్చు. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్‌ టెక్నీషియన్స్‌ వచ్చేస్తారు. కేరళ తరహాలో తమ చుట్టూనే సినిమా తీసేసుకుంటారు. నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నీషియన్లు ఆఫీసుల్లో కూర్చోరు. తమ ఇళ్లదగ్గరే తమదైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. ఎడిటింగ్‌ రూమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డబ్బింగ్‌ థియేటర్‌ను కూడా తమ దగ్గరే పెట్టుకుంటారు. ఒన్‌ డే ఆర్టిస్టుల గురించే ఇండసీ్ట్ర ఒకచోట ఉండాలి. నేను వేరే ఊరికి వెళితే వాళ్లకు ఖర్చులు పెట్టుకోవాలి. దాని కోసమే ఇండసీ్ట్ర ఇక్కడ ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు రెండు రాషా్ట్రలయ్యాయి. ఇండసీ్ట్రకి ఒక బేస్‌ హైదరాబాద్‌లో ఉంటుంది. మరో బేస్‌ వైజాగ్‌ లేదా తడలో ఉండొచ్చు. షూటింగ్‌లు చేసుకోవడానికి ప్రాబ్లెమ్స్‌ లేకుండా ఉండాలి. ఇక్కడ స్టూడియో మినహా ఎక్కడ షూటింగ్‌ చేసినా పోలీస్‌ పర్మిషన్‌ కావాలి. విదేశాల్లో అలాంటివి అవసరం లేదు కాబట్టే వెళ్లి చేసుకుంటున్నారు. కేరళలో ‘దృశ్యం’ షూటింగ్‌ హాయిగా చేసుకున్నాం. ఇక్కడ అలాంటి వాతావరణం లేదు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటి” మీనా ” ను రెహమాన్‌ కూడా పాడమన్నారట-

రెహమాన్‌ కూడా పాడమన్నారు

‘పూసింది పూసింది పున్నాగ..  పూసంత నవ్వింది నీలాగ..’ లాంటి  పాటలతో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మరిపించి, మురిపించిన మీనా చాలా కాలం తర్వాత ‘దృశ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ సీతారామయ్యగారి మనవరాలు  నవ్యతో తన జ్ఞాపకాలను పంచుకుంది…

‘‘పెళ్లయ్యాక కొన్నాళ్లు గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలు చేయమని నా వద్దకు బోలెడు స్ర్కిప్టులు వచ్చాయి. వైవిధ్యమున్న పాత్ర అయితేనే ఒప్పుకుంటాను అని చెప్పాను. అలాంటి సమయంలో ‘దృశ్యం’ ఆఫర్‌ వచ్చింది. కథ నచ్చింది. తెలుగులో నన్ను అందరు కుటుంబ కథా చిత్రాలతో బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాలో చక్కటి ఫ్యామిలీ కథ నడుస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ‘జ్యోతి’. అన్ని షేడ్స్‌ కలిగిన పాత్ర ఇది. స్ర్కిప్టు చెప్పినప్పుడు నాకదే నచ్చింది. ఇప్పుడు ‘దృశ్యం’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. తెలుగులో నాకు చిన్నప్పుడే హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్‌ సినిమాలోను బాలనటిగా చేశాను. అప్పట్లోనే సుమారు ముప్పై నుంచి నలభై చిత్రాల్లో చేశాననుకుంటా. ఏడో తరగతి పూర్తయ్యాక రాజేంద్రప్రసాద్‌గారి సరసన హీరోయిన్‌గా ఆఫర్‌ వచ్చింది. అలా తెలుగులో ‘నవయుగం’తో కథానాయికను అయ్యాను. అంత చిన్నవయసులో చేద్దామా వద్దా అని ఆలోచించాను. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ‘సీతారామయ్యగారి మనవరాలు’లో అక్కినేని నాగేశ్వరరావుగారి మనవరాలిగా చేసే ఛాన్స్‌ రావడం కలిసొచ్చింది. అప్పుడు ‘వద్దండీ, స్టడీస్‌ డిస్ట్రబ్‌ అవుతుంది’ అని మా తల్లిదండ్రులు చెప్పారు. అయితే కథపరంగా నా పాత్రకు ఒక ప్రత్యేకత ఉందని చెబితే సరే అన్నారు. ఆ చిత్రం నాకొక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే!

 

పాడటం అదే ఆఖరు..
విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయికగానే నేను అందరికీ తెలుసు. కాని నేనొక మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసిన సంగతి చాలామందికి తెలియదు. నిజానికి నాకు మ్యూజిక్‌ గురించి పెద్దగా తెలియదు. ఇక పాడటం అంటే ఎంత కష్టమో ఊహించుకోండి. అదే మాటను భారతీరాజ గారి కొడుకు మనోజ్‌తో అన్నాను. ఎందుకంటే అతనే నన్ను తమిళ ఆల్బమ్‌ చేయమని అడిగాడు కాబట్టి. అప్పట్లో ఇంగ్లీష్‌ ఆల్బమ్స్‌ హవా నడుస్తుండేది. ‘మీరు పాడాలి’ అని అడిగేసరికి నాకు షాక్‌. ‘మీకు తమిళం వచ్చు. మంచి స్వరం ఉంది. అంతకంటే ఏం కావాలి?’’ అన్నాడతను. సరే, ఒకసారి ప్రయత్నించి చూద్దామని పాడాను. ఆ ఆల్బమ్‌లో ఎనిమిది పాటలు ఉన్నాయి. సంగీతాభిమానులను ఆకట్టుకుంది. ఆ ఆల్బమ్‌ను చూసి.. డి.ఇమామ్‌గారు ఒక చిత్రానికి పాడమంటే ఒక పాట పాడాను. అది చాలా క్యూట్‌ అండ్‌ బబ్లీ సాంగ్‌. సినిమాల్లో అదే నేను పాడిన తొలి, చివరి పాట. అంతకుముందు రెహమాన్‌గారు కూడా పాడమని అడిగితే – ‘‘అదేంటి? మీరు అంత పెద్ద పెద్ద మ్యూజిక్‌డైరెక్టర్లు, నన్ను పాడమంటారేంటి? నాకు ఏం తెలుసు?’’ అని సరదాగా చెప్పాను. నాతో పాడించాలన్నది వారి ముచ్చట. అంతే!

 

ఆ పాటకు ఏడ్చాను..
తమిళం, మళయాలం, తెలుగు, కన్నడలలోని పెద్ద పెద్ద స్టార్స్‌తో అంటే – రజనీకాంత్‌, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర నటులతో కలిసి చేసే అవకాశం నాకే వచ్చింది. అది నా అదృష్టం. ఇంతపెద్ద స్టార్‌లతో నటిస్తున్నప్పుడు నటనలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి బాలనటి కావడం వల్ల ఆ సమస్య రాలేదనుకుంటా! అయితే ‘ముఠామేస్ర్తీ’లో చిరంజీవిగారి పక్కన ఒక పాటకు స్టెప్పులు వేస్తున్నప్పుడు మాత్రం అబ్బో చాలా ఇబ్బందే పడ్డాను. ఆయనతో పోటీపడి డ్యాన్స్‌ చేయడమంటే మాటలు కాదు. నేను క్లాసికల్‌డ్యాన్స్‌ నేర్చుకున్నాను కాని బ్రేక్‌డ్యాన్సులు గట్రా తెలీవు. ఎప్పుడు టీవీల్లో కూడా చూడలేదు. అందులో ‘చికుచికుచాం చాం’ అనే పాటొకటి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారప్పుడు. ఒకపక్కనేమో చిరంజీవి, మరోవైపు పాటకు డ్యాన్సులు కంపోజ్‌ చేసింది ప్రభుదేవా. అమ్మో!! వారిద్దరిదీ డెడ్‌లీ కాంబినేషనండీ (నవ్వుతూ). వాళ్లతో నేనెక్కడ పోటీపడేది? అదిరిపోయాను. ప్రాక్టీస్‌ చేస్తుంటే ఏడుపొచ్చేది. ‘భయపడకు. నేనున్నానుగా..’ అంటూ చిరంజీవిగారు నా కోసం రిహార్సల్స్‌ చేసి ప్రోత్సహించేవారు. ఎనిమిదిసార్లు వేయాల్సిన ఒకే రకమైన స్టెప్పుల్ని కంటిన్యూస్‌గా చేయడం నాకు చాతకాలేదు. నాలుగుసార్లు చెప్పున రెండు దఫాలుగా డ్యాన్స్‌ చేసేలా చేశారు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. నేను ఆ పాటకు బాగా డ్యాన్స్‌ చేశాననిచెప్పి.. వారి ఇంటికి ఫోన్‌ చేసి.. వేడి వేడి దోశ, కర్రీ చెప్పించారు చిరంజీవిగారు.

 

రజనీ ఎక్కడున్నారో..
ఇలాంటి అనుభవాలు చెబుతున్నప్పుడు రాజమండ్రిలో రజనీకాంత్‌ గారు గుర్తుకొస్తారు. ఆయనతో నా మొదటి చిత్రం ‘యజమాని’. ఒకప్పుడు ఆయనతోనే బాలనటిగా చేసిన నేను.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుండటం కొంత చిత్రంగా అనిపించింది. రాజమండ్రిలో షూటింగ్‌ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్లిపోతున్నాము అప్పుడు. ‘యజమాని’కి ముందే తెలుగులో ‘మనవరాలు’, ‘చంటి’, ‘అల్లరిఅల్లుడు’ వంటి మంచి చిత్రాలు చేయడంతో హీరోయిన్‌గా ఎంతో ఫాలోయింగ్‌ వచ్చింది. అది రజనీకాంత్‌కు తెలియదు. మేము మద్రాసుకు రైల్లో వెళ్లేందుకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాము. రజనీగారు ప్లాట్‌ఫాం మీదకు వెళ్లిపోయారు. నేను మాత్రం రైలు వచ్చాక వస్తానని చెప్పి కారులోనే కూర్చుండిపోయా. ‘లేదు మేడమ్‌ మాతోపాటు రండి.. రండి. ఫ్లాట్‌ఫాం మీద కూర్చుని మాట్లాడుకోవచ్చు’ అన్నారు యూనిట్‌ సభ్యులు. నేను అక్కడికి వెళితే ప్రయాణికులంతా నన్ను చుట్టుముట్టేస్తారని తెలుసు. వాళ్లకు తెలీదు. ఎంతచెప్పిన వినకపోతే కారు దిగి ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లిపోయాను. అప్పటికే అక్కడ రజనీకాంత్‌గారు కూర్చున్నారు. ఆయన్ను పట్టించుకోని ప్రయాణికులు నన్ను చూస్తూనే వరద వచ్చిపడ్డట్టు నన్ను ముంచెత్తేశారు. జనం దాడికి మా వాళ్లందరు చెల్లాచెదరయ్యారు. ఎవరు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఆ హడావిడిలో రజనీ ఏమైయ్యారో కూడా తెలీలేదు. ఇక నాకు ఊపిరాడక రైలు వస్తూనే కనిపించిన బోగీలోకి ఎక్కి.. ఊపిరి పీల్చుకున్నా. రైలు కదిలింది. అరగంటయ్యాక.. మరో స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత.. రజనీకాంత్‌గారు నేను కూర్చున్న పెట్టెలోకి వచ్చి.. ‘‘ఓ మీనా.. మై గాడ్‌.. ఏమిటీ క్రేజ్‌. నీకింత ఫాలోయింగ్‌ ఉందా. అద్భుతం!!’’ అన్నారు ఆయన ఆశ్చర్యంగా. నాకది అప్పట్లో పెద్ద కాంప్లిమెంట్‌. ఇంకోసారి ‘వీర’ అని ఆయనతోనే సినిమా చేస్తున్నాను. అది కూడా రాజమండ్రిలోనే షూటింగ్‌. అదే టైమ్‌లోనే రాజశేఖర్‌గారితో నేను చేసిన ‘అంగరక్షకుడు’ రిలీజ్‌ అయ్యింది. సినిమా చూడాలి చూడాలి అని తమిళ యూనిట్‌సభ్యులు అడిగితే.. టికెట్లు కొని బయలుదేరేందుకు సిద్ధమయ్యాను. రజనీగారిని పిలవాలా వద్దాని సంశయంతో పిలిచాను. వెంటనే ఆయన ‘నువ్వు వెళుతున్నావు కదా! అయితే నేనొస్తాను’ అని మాతోపాటు సినిమాకొచ్చారు. సినిమాచూసి హోటల్‌కు వచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. నచ్చిందో లేదో నాకు చెప్పలేదు. హోటల్‌లో దిగుతూనే ‘గ్రేట్‌ జాబ్‌ మీనా. చాలా హెవీ క్యారెక్టర్‌. సులువుగా చేశావు’ అన్నారు. రాజమండ్రిలో రజనీతో కలిసి సినిమా చూడటం నిజంగా స్వీట్‌ మెమొరీ!

రియాల్టీ మరింత వినోదం
‘‘సీరియల్‌ కంటే రియాల్టీషోలు బోర్‌ కొట్టవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందులోను రకరకాల వ్యక్తులతో స్పాంటేనియస్‌గా మాట్లాడటం పెద్ద వినోదం. అయితే సహజంగా నేను మితస్వభావిని కావడంతో ‘నీకొంగు బంగారం కాను’ టీవీ షో చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ‘‘మాట్లాడండి మాట్లాడండి..’’ అని షో నిర్వాహకులు అడిగేవారు. నాకైతే ఏం మాట్లాడాలో అర్ధమయ్యేది కాదు. ఆ తర్వాత అలవాటైపోయింది..’’

టీవీ అన్‌లిమిటెడ్‌
‘‘సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాతే టీవీరంగంలోకి వస్తారు అనే అభిప్రాయం ఉంది. నా విషయంలో అది సరైనది కాదు. నాకు డిమాండ్‌ ఉన్నప్పుడే కోరి టీవీరంగం వైపు వచ్చాను. నిజానికి సినిమాల్లో చేయలేని ఫెర్ఫార్మెన్స్‌ను టీవీ సీరియల్స్‌లో చేయవచ్చు. అన్ని రకాల షేడ్స్‌లో నటించే అవకాశం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం. తొలిసారిగా ‘లక్ష్మీ’ అనే తమిళ సీరియల్‌ చేశాను. ఆతర్వాత అదే భాషలో రెండు చేశాను. తెలుగులో ‘అనుబంధాలు’ సీరియల్‌ కూడా పేరుతెచ్చింది’’

. నవ్య డెస్క్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

 

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

గోపధ  బ్రాహ్మణం -2

గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం .

1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి  కంఠస్తం కావాలంటే చమట పట్టేట్లు చదవాలి .కా బట్టే ఈ సువేద పదం స్వేదం గా మారిందని వివరణ ఇచ్చారు ఇందులో .

2-రధం –రస అనే శబ్దం నుంచి వచ్చింది .రస పూర్ణం అంటే ఆనంద పూర్ణం గా ఉండటం .దీని వల్ల రధం అనే సంజ్ఞ రూపొందింది .

3-దీక్షిత –ధీక్షిత పదం నుండి ఇది వచ్చింది .శ్రేష్టమైన బుద్ధిని పొందేవాడు ధీక్షితుడు .అదే దీక్షిత గా మారింది.అందుచేత అతడు పెద్దలచే నమస్కరింప దగిన వాడు అవుతాడు .

4-మఖ –అంటే యజ్ఞం .ఖ అంటే చిద్రాలు దోషాలు .మ అంటే పోగొట్టేది .దోషాలు లేనిదిగా చేసేది .మఖ అంటే యజ్ఞం .దోషాలు లేనిదిగా యజ్ఞం ఉండాలి ..అంటే యజ్న కర్మ లో ఏ విధమైన పోరబాట్లు, దోషాలు ఉండరాదని తెలుస్తోంది .

5-సామ –సా అంటే లక్ష్మి అమ అంటే జ్ఞానం .లక్ష్మీ సంబంధమైన జ్ఞానం అని సామ కు  అర్ధం .

6-కుంతాపసూక్తం – కు అంటే చెడు తాప అంటే తపింప జేయటం .చెడును నశింప చేసే సూక్తమే కుంతాప సూక్తం .అధర్వ వేదం లో దీనికి ప్రసిద్ధి ఎక్కువ .

కొన్ని సుభాషితాలు

1-దేవతలు పరోక్ష ప్రియులు ,ప్రత్యక్ష ద్వేషులు .ఈశ్వరుని అచింత్య శక్తిని వర్ణించే సందర్భం లో నిది .ఈశ్వరుడు పరోక్షం గా ఉన్నా ఇష్టుడు .ఈ భౌతిక జగత్తు ప్రత్యక్షం గా ఉన్నా ద్వేషింప దగినది .ఇది అశాశ్వతం .

2-యజ్ఞాలలో ఋత్విక్కులు అసమర్ధులు గా ,బ్రహ్మ చర్య దీక్ష లేని వారుగా ,రాగ ద్వేషాలున్న వారు గా ఉంటె ఆ యజ్ఞం నాశనమవుతుంది .సదాచారమే యజ్న ఋత్విక్కులకు ముఖ్యం .

3-మట్టి బెడ్డలు కుండలో వేస్తె అవి శౌచ కర్మకు ,దాన్యోత్పత్తికి పనికి రావు .ఉపయోగపడే వాటిని తగని స్థానం లో ఉంచరాదు అని అర్ధం .

4-యాజకుడు తేజస్వి ,సత్య వాది,వ్రత నిస్టూడు గా ఉండాలి .అతడు మంచి వాడు కాక పోతే పచ్చికుండలో నీళ్ళు పోసినప్పుడు విచ్చి నీరు కారిపోయినట్లు యజమాని ప్రయోజాన్ని నాశనం చేస్తాయి .

5-తలిదండ్రులు చిన్న తనం లో కుమారుడిని పోషిస్తే ,వాడు పెద్ద వాడై వారిని పోషించాలి .ఇది తెలిస్తేనే నిజమైన యజ్ఞం .తలిదండ్రుల సేవే నిజమైన శ్రాద్ధం ,తర్పణం కూడా .బతికి ఉండగా పట్టించుకోకుండా చని పోయిన తర్వాత శ్రాద్దాలు చేసినా అది నిష్ప్రయోజనం .

6-జరిగి పోయిన కాలం పరిమితం .రాబోయే కాలం అపరిమితం. గతం లో చెడు చేసినంత మాత్రాన  కుంగి పోనవసరం లేదు .భవిష్యత్తు తరువాత వచ్చేదికనుక మంచి చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు .నిరాశ చెందక్కర లేదు .

ఇప్పుడొక్క సారి ఈ బ్రాహ్మణం లో చెప్ప బడిన విషయాలను పునరాలోకిద్దాం .  పూర్వ బ్రాహ్మణం లో సృష్టి విధానం ఓం మహాత్మ్యాన్ని వివరించారు .సృష్టి అంతా ఓం నుండే ఏర్పడింది .ఓం బ్రహ్మ ,విష్ణు, రుద్రాత్మకం .దీన్ని వెయ్యి సార్లు జపిస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి .గాయత్రీ మంత్రోపాసన చేస్తే సంతతి కూడా బలం గా ఉంటుంది. శిష్యుడు గురు శుశ్రూష చేసి పంచాగ్నులను వశం చేసుకోవాలి .గృహిణి అతడికి భిక్ష పెట్టాలి .భిక్ష పెట్టక పోతే పుణ్యాలన్నీ నశిస్తాయి .మాంస భక్షణ నిషిద్ధం .విపాట్ నది ఒడ్డున వసిస్టా శ్రమం ఉన్నది

ఉత్తర బ్రాహ్మణం లో దర్శ పూర్నమాసం నుండి చిన్న యాగాలు ,పెద్ద యాగాల వివరణ ఉంది .ఖగోళ ,జ్యోతిష సంబంధ విషయాలు చెప్ప బడ్డాయి .చిత్త మొదలైన నక్షత్రాలు పౌర్ణమి రోజు చంద్రునితో కలిసే చైత్రం మొదలైన నెలలు ఏర్పడుతాయని చెప్పారు. ఫాల్గుణ పూర్ణమి నుండి సంవత్సరం మొదలైంది అని పేర్కొన బడింది .భూమి గోళాకారామని ,సూర్యుడు ఎప్పుడూ చాటు కాడని వివరించింది .తిరుగుతూ ఉండే భూమి అంచున సూర్య కాంతి పడుతుందని తెలిపారు .

బ్రాహ్మణాల కధా కమా మీషు  సర్వం సంపూర్ణం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

ప్రణవం

పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం లో రెండు వర్ణాలు ,నాలుగు మాత్రలు ఉన్నాయి .ఇది సర్వ వ్యాపి ,మార్పు లేనిది ,బ్రాహ్మీ మాయం .దీని నుంచే కోరిన వస్తువులు ,సమస్త లోకాలు ,దేవతలు ,యజ్ఞాలు ,శబ్దాలు ,స్థావర జన్గమాత్మకమైన భూతాలు పుట్టాయి .

ప్రణవం లోని మొదటి అక్షరం నుండి స్వర్గం ,రెండవ అక్షరం నుంచి తేజస్సు వెలుగు పుట్టాయి .ఓంకారం లోని మొదటి స్వర మాతృక నుంచి భూమి అగ్ని ఓషధులు ,వృక్షాలు ,భూహ్ అనే వ్యాహృతి ,గాయత్రీ ఛందస్సు మూడు విధాలైన స్తామాలు ,తూర్పు దిక్కు ,వసంత రుతువు వాక్కు ,నాలుక సృష్టింప బడ్డాయి .దాని రెండవ స్వర మాత్ర నుంచి అంత రిక్షం ,వాయువు ,యజుర్వేదం ,భువ అనే వ్యాహృతి ,త్రిష్టుప్ ఛందస్సు ,పది హేనురకాల స్తామాలు ,పశ్చిమ దిక్కు ,గ్రీష్మ ఋతువు ఉచ్చ్వాస నిస్శ్వాసాలు చేసే అవయవాలు నిర్మించ బడ్డాయి .మూడవ స్వర మాత్ర నుండి స్వర్గం ,సూర్యుడు ,సామ వేదం ,స్వః అనే వ్యాహృతి ,జగతీ ఛందస్సు ,ఉత్తర దిక్కు ,వర్ష రుతువు ,కళ్ళు మొదలైనవి ఏర్పడ్డాయి .దాని ‘’వ’’కార మాత్ర నుండి నీరు ,చంద్రుడు ,అధర్వ వేదం ,నక్షత్రాలు , అంగీరసులు ,అనుష్టుప్ ఛందస్సు దక్షిణ దిక్కు ,శరదృతువు  మనసు మొదలైనవి జనించాయి .దాని ‘’మ’’కార మాత్ర నుండి ఇతిహాస పురాణాలు ,వాక్కు ,ఛందో యుక్తమైన భాష ,ఉపనిషత్తులు ,వ్రుధాత్ ,కారత్ ,గుహన్ ,మహాత్ ,తత్ ,శం,ఓం అనే వ్యాహృతులు ,నృత్యం ,గానం .చైత్ర రాధా దేవతలు ,తేజస్సు ,తేజస్సు ,వెలుతురూ ,ఊర్ధ్వ దిక్కు ,అదో దిక్కు ,హేమంత ,శిశిర ఋతువులు సృష్టింప బడ్డాయి .

ఓంకార సహాయం తో దేవతలు రాక్షసులని జయించారు ఓంకారమే అన్ని వేదాలకు మూలం .ప్రపంచానికి ఆధారం .ఈ విధం గా దిక్కులు ,ఛందస్సు ,పంచ భూతాలు ,వేదాలు రుతువులు ,సూర్య చంద్రులు ,ఇతిహాస పురాణాలు ,ఓంకారం నుండి పుట్టాయని గోపద  బ్రాహ్మణం  చెప్పింది .

గాయత్రీ మంత్రం

గాయత్రిని మించిన మంత్రం లేదు ‘’ఓం భూర్భువస్సువః త్తత్చావితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ‘’అనేది గాయత్రి మంత్రం .గాయత్రికే సావిత్రి అని పేరు ఈ మంత్రం తత్త్వం గ్లావుడు ,మౌద్గాల్యుడు అనే ఇద్దరు ఋషుల మధ్య జరిగిన సంభాషణ రూపం లో వివరించ బడింది .మైత్రేయ వంశం లో పుట్టిన గ్లావుడు మౌద్గాల్యునికి వేదాలు వాటి అర్ధాలు తెలియవు అని నిందించాడు .అందుకు మౌద్గాల్యుడు ‘’సకల వేదం సారం ,సకల ఆధార మైన గాయత్రీ మంత్రం యొక్క తత్త్వం నీకు తెలుసా?’’అని శిష్యుని ద్వారా ప్రశ్నించాడు .మంత్రం తత్త్వం తనకు తెలియదని ,మౌద్గాల్యుని తూల నాది నందుకు క్షమాపణ చెప్పుకొని గాయత్రీ మంత్రం తత్వాన్ని ఉపదేశించమని వేడుకొన్నాడు .మౌద్గాల్యుడు సాకల్యం గా వివరించి చెప్పాడు .

‘’వేదాలు ఛందస్సు ,సవిత (సూర్యుడు)యొక్క శ్రేష్టమైన భాగాలు .అన్నం ఆయన ప్రకాశం .ధియః అంటే విధులు లేక కర్మలు .వీటి వల్లనే ఆయన లోకమంతా  సంచ రిస్తాడు .మనస్సు సవిత .వాక్కు సావిత్రి .మనసున్న చోట వాక్కు ,వాక్కు ఉన్న చోట  మనస్సు ,ఉంటుంది .అగ్నియె సావిత్రి .పృథ్వి సావిత్రి .అగ్ని ఆదిత్యుడు వేదాలు వేదాలు ఛందస్సులు యజ్ఞం దక్షిణ సమస్తం సావిత్రియే .దీని తత్వాన్ని తెలుసుకొన్న వాడు సర్వ పాప విముక్తుడై సుఖ సంతోషాలను పొందుతాడు .

రుక్ –సామల సంబంధం

ఉత్తర భాగం లోని తృతీయ ప్రపాఠకం లో ఈ రెంటి సంబంధం చెప్ప బడింది .ఆదిలో రుక్ ,సామలు మాత్రమె ఉండేవి .రుక్కు కు ‘’సా’’అని సామకు ‘’ఆమ ‘’అని పేరు .పుల్లింగం లో ఉన్న సా తో స్త్రీలింగం లో ఉన్న’’ ఆమ ‘తో’’సకల జీవరాసులని అభి వృద్ధి చేయతామికి మనం కలుసు కొందాం ‘’అని చెప్పింది .కాని సామ అందుకు ఒప్పుకోలేదు .రుక్ కన్నా తానే గొప్ప అని ప్రగల్భాలు పోయింది .కోపించిన  రుక్ తానె రెండు భాగాలుగా విడిపోయి మొదటి భాగం రెండో భాగం తో మాట్లాడింది .కాని రెండో భాగం పలకనే లేదు .అప్పుడు తాను మూడు భాగాలుగా విడిపోయి సామను మళ్ళీ పలకరించింది .కనుక సామ మూడు రుక్కుల చేత కీర్తింప బడుతోంది .ఈ సంభాషణ అంతా ‘’సా’’,’’మ’’మధ్య జరిగింది .

గమ్ అనే ధాతువుకు డో’’ ప్రత్యయం చేరిస్తే గో’’శబ్దం ఏర్పడుతుంది .గో శబ్దానికి పొందదగిన పదార్ధం అని అర్ధం .పొంద దగింది వేదవాణి ,పృధివీ రాజ్యం ,స్వర్గ సుఖం .వీటిని పొందే మార్గాన్ని తెలిపే బ్రాహ్మణం కాబట్టి గోపధం అయింది .వేదం విజ్ఞానం పొందటం ,రాజ్య వ్యవహారాలూనడపటం ,పరమ సుఖాన్ని పొందటం అనే పురుషార్ధాలు కలుగుతాయి .

పూర్వం వైదిక యుగం లో ‘’పని ‘’అనే కొండ జాతి వాళ్ళు బ్రాహ్మణుల ఆవులను దొంగిలించి కొండ గుహలో దాచారట .’’సరమ ‘’అనే ఇంద్రుని కుక్క ఆ ఆవులకోసం వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగి కనుక్కోన్నది .ఇంద్రునికి తెలిసింది ఇంద్రుడు దండెత్తి పణి జాతి వారి బలాన్ని చేదించి ఆవులను విడిపించాడు .అన్గిరసులు ఇంద్రునికి సాయం చేశారు .అందుకే గోపద బ్రాహ్మణం   అధర్వాం గీరస బ్రాహ్మణం ఆనే పేరు తెచ్చుకోంది .ఈ నాటి డిటెక్టివ్ పరిశోధనకు ఆ నాడే బీజం పడిందని భావించ వచ్చు .అడుగు జాడలు వేలి ముద్రలు కుక్కల సాయం తో నేరస్తుల ఆచూకీ ఇవన్నిటికీ ఈ బ్రాహ్మణం ఆధారమే .

తొలి ఏకాదశి శుభా కాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – . 8-7-14 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌

 

‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్‌ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్‌ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్‌. ఒకప్పటి హీరోయిన్‌ శ్రీప్రియ డైరెక్ట్‌ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ పత్రికల వారితో విపులంగా సంభాషించారు వెంకటేశ్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

చాలా రోజుల తర్వాత సింపుల్‌, హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్‌ చేశాను. ఫ్యామిలీ సబ్జెక్ట్‌లోనే నైస్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ ఉంది. అది నచ్చి చేశా. నాకూ కాస్త భిన్నమైన పాత్ర. భార్య, ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడిపే రాంబాబు ఆనే కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ పాత్ర. జీవితంలో జాగ్రత్తగా ఉండాలనే, డబ్బు విలువ తెలిసిన మనిషి. సినిమాలను ఇష్టంగా చూస్తూ వాటితో ప్రభావితమయ్యే మనిషి. కుటుంబంలో అనుకోని ఓ ఘటన జరిగితే దాన్ని రాంబాబు ఎలా తెలివిగా, ఆసక్తికరంగా హ్యాండిల్‌ చేశాడనేది ప్రధానాంశం. ఈ మనసుకు బాగా దగ్గరైన పాత్ర. నిజ జీవితంలో నేను పిల్లల తండ్రినే కాబట్టి ఆ పాత్రలో సులువుగా ఇమిడిపోయా. ఎప్పుడూ చెయ్యని థ్రిల్లర్‌ 27 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులో థ్రిల్లర్‌ చేయలేదు. అది చేసే మంచి అవకాశం వచ్చింది. మంచి స్ర్కిప్టులు రావట్లేదని ఎప్పుడూ అంటుంటాం. వచ్చినప్పుడు వాటిని చెయ్యాలి కదా. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నా. ఇది ప్రేక్షకుల భావోద్వేగాలను అందుకునే సినిమా. కమర్షియల్‌ అంశాలతో పాటు వైవిధ్యం ఉన్న సినిమా. ఇండసీ్ట్రవాళ్లతో పాటు జనం కూడా ఇలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నా ఇందులో రాంబాబు సినిమాలు చూస్తూ ఏవైనా ఎమోషనల్‌ సీన్స్‌ వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంటాడు. నిజ జీవితంలో నేనైనా, ఎవరైనా అంతే. నా సినిమాల్లోనే కాదు, ఎవరి సినిమాల్లో అయినా మనసును కదిలిందే భావోద్వేగ సన్నివేశాలు వచ్చినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నావి ఎక్కువగా కన్నీళ్లు తెప్పించే సినిమాలే కదా. నేను చేసిన వాటిలోనే ‘రాజా’, ‘ధర్మచక్రం’, ‘ప్రేమ’, ‘వసంతం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటివి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను. లేడీ డైరెక్టర్‌తో మొదటిసారి శ్రీప్రియ అనుభవం ఉన్న నటి. ఎనర్జిటిక్‌ పర్సనాలిటీ. ఇదివరకే ఓ సినిమాని డైరెక్ట్‌ చేశారు. టెలివిజన్‌లో చాలా వర్క్‌ చేశారు. షి డన్‌ గుడ్‌ జాబ్‌. ఈ సినిమాని ఆమె చాలా బాగా రూపొందించారు. సబ్జెక్ట్‌ను బాగా హ్యాండిల్‌ చేశారు. నటులందరితో మంచి పర్ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెలుగులో ఈ సినిమాని చెయ్యాలనుకున్నప్పుడు ఆమెకు మొదటి ఛాయిస్‌ను నేనే. ఓ రెండు సార్లు కూర్చొని మాట్లాడుకున్నాం. దానితో పరస్పరం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకొని, ఏ ఇబ్బందీ లేకుండా చేశాం. అలా మొదటిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో చేశాను. రజనీకాంత్‌ను ఇమిటేట్‌ చేశా ‘దృశ్యం’ విశ్వజనీనత ఉన్న సబ్జెక్ట్‌. ఏ ప్రాంతంలోని కుటుంబంలోనైనా జరిగే సంఘటనలతో తయారైన సినిమా. ఎక్స్‌ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. అందువల్ల ఒరిజినల్‌కు ఎక్కువ మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అందులో మోహన్‌లాల్‌ ఓ చోట మమ్ముట్టిని ఇమిటేట్‌ చేస్తే, ఇందులో నేను రజనీకాంత్‌ను ఇమిటేట్‌ చేశాను. ఛాలెంజ్‌గా తీసుకున్నా ఈ సినిమా ఒరిజినల్‌ చేసిన మోహన్‌లాల్‌తో మాట్లాడా. చాలా కాలం తర్వాత ఆయన చేసిన డిఫరెంట్‌ ఫిల్మ్‌ ఇది. అక్కడ అతి పెద్ద హిట్లలో ఇదొకటి. సాధారణంగా ఆయన సినిమాలను రీమేక్‌ చెయ్యడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఆయనది ఔట్‌స్టాండింగ్‌ అండ్‌ డిఫరెంట్‌ స్టయిల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌. ఆయన వాయిస్‌తో, నటనతో మ్యాచ్‌ కావడం అంత ఈజీ కాదు. అయితే ఇది యూనివర్సల్‌ ఫీల్‌ ఉన్న సబ్జెక్ట్‌ కాబట్టి ఛాలెంజ్‌గా తీసుకుని చేశా. కొత్త అనుభవం సాధారణంగా నా సినిమాల గురించి నేనెక్కువగా చెప్పను. కానీ దీనికి చెప్పాలనిపిస్తోంది. మొత్తంగా ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభవాన్నిస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో అందరి ప్రశంసలూ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇవాళ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్‌ అవసరం లేని ఇలాంటి సబ్జెక్టుల వల్లా నిర్మాతలకూ, డిసి్ట్రబ్యూటర్లకూ సంతోషం కలుగుతుంది. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అభిమానులకూ ఇది ఆనందాన్నిచ్చే సినిమా. ఇండసీ్ట్రకి మేలు ఈ సినిమాకి ప్రధాన బలం స్ర్కిప్టే. వెరీ గ్రిప్పింగ్‌ అండ్‌ ఎక్స్‌ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. మానవ భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి. సినిమా ప్రారంభమైన అరగంటలో మనం సినిమా చూస్తున్నామనేది మరిచిపోయి, కథలో భాగంగా మారిపోతాం. మన జీవితంలోనే అలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు లీనమైపోతాం. అందులో సందేహమే లేదు. ఆ ఇన్‌వాల్వ్‌మెంటే ఈ సినిమాకి కీలకం. కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నాం. వాటిలో పది శాతం సినిమాలే ఆడుతున్నాయి. ఆ ఆడుతున్న వాటిలో జనం ఏదో ఓ ఎమోషన్‌కు కనెక్టయ్యారన్నమాట. ఇది అలా ప్రేక్షకులకు కనెక్టయ్యే సినిమా. కనెక్టయితే చాలు జనం చూస్తారు. ఇలాంటి సినిమాలు హిట్టయితే ఇండసీ్ట్రకి కూడా మేలు జరుగుతుంది. భిన్నమైన కథలు వస్తాయి. వాళ్లను అడుగుతా మల్టీస్టారర్స్‌లో నాకు మంచి రోల్‌ ఇస్తే తప్పకుండా చేస్తా. ఇవాళ్టి యంగ్‌ హీరోస్‌ అందరూ నాకు మంచి స్నేహితులే. వాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతా. అలాగే డైరెక్టర్లు నాకు చాలా సన్నిహితం. తప్పకుండా మంచి పాత్రలను డిజైన్‌ చెయ్యమని వాళ్లను అడుగుతా. నాకు విలన్‌గా చెయ్యాలని ఉంది. అయితే జనం నన్ను యాక్సెప్ట్‌ చేస్తారో, నా కోసం డైరెక్టర్స్‌ విలన్‌ రోల్‌ సృష్టిస్తారో, లేదో.. నా చేతుల్లో లేదు. నాకు కావాల్సింది ఒకటి, వచ్చేది ఒకటి, తీసుకోవడం ఒకటి. ‘నాగమల్లి’లో గ్రే షేడ్స్‌లో ఉన్న పాత్ర చేశా. దాన్నెవరూ చూడలేదు. అందరికీ పని దొరకాలి నేనెప్పుడూ పని కోసం ఎదురు చూస్తుంటాను. ప్రతి ఒక్కరితో కలిసి పనిచెయ్యాలనుకుంటా. వాళ్లు ఏ రాషా్ట్రనికి సంబంధించిన వాళ్లనేది నేను పట్టించుకోను. నాకు తెలిసి తెలుగు ఫిల్మ్‌ ఇండసీ్ట్రని సెపరేట్‌ చెయ్యాలని ఎవరికీ లేదనుకుంటాను. నిజంగా ఎవరైనా కోరుకుంటే పెద్దలు కూర్చొని సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాను. ఏదైనా విభజన అనేది ఎవరికీ ఇబ్బంది కలగకుండా, మృదువుగా జరగాలని కోరుకుంటా. ఇది వినోద పరిశ్రమ. అన్ని భాషా చిత్రాలను మన తెలుగువాళ్లు ఆదరిస్తుంటారు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలెన్నో ఇక్కడ బిగ్గెస్ట్‌ హిట్స్‌ అయ్యాయి. అందరూ ఒకటిగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. విభజన జరిగినా అందరికీ పని దొరకాలి. ప్రతిభకు అవకాశం లభించాలి. ఏం జరుగుతుందో చూడాలి. యావరేజ్‌ స్ర్కిప్టులొస్తున్నాయి ‘మనం’ వంటి సబ్జెక్ట్‌ దొరకడం నాగ్‌ అదృష్టం. నాగేశ్వరరావుగారి చివరి సినిమా. ఆయనకు సరైన నివాళి. ఆ సినిమా రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ సబ్జెక్ట్‌ వాళ్లకి కరెక్ట్‌. ఆ సినిమాని చూస్తూ బాగా ఎంజాయ్‌ చేశాను. నాన్న, నేను, రానా కలిసి నటించాలంటే మంచి స్ర్కిప్ట్‌ దొరకాలి. అందరూ యావరేజ్‌ స్ర్కిప్టులు తెస్తుంటే ఎవరు చేస్తారు? మంచి స్ర్కిప్టులు మా వద్దకు రావట్లేదు. ‘రాధ’ చెయ్యట్లేదు ‘గోపాల గోపాల’ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ‘దృశ్యం’ రిలీజ్‌కు రావడంతో దానికి కాస్త విరామం ఇచ్చాం. ప్రధాన పాత్ర దేవుని మీద కేసు వెయ్యడం అనేది ఆసక్తికరమైన పాయింట్‌. పవన్‌కల్యాణ్‌ ఈ నెలాఖరున షూటింగ్‌లో జాయినవుతారు. మొదట నా కేరక్టర్‌ వర్క్‌ మొదలైంది. మా మధ్య చాలా ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయి. ఈ సినిమాని జనం కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ మధ్య ఓ పెద్ద సీన్‌ చేశాను. ఫెంటాస్టిక్‌ అనిపించింది. అద్భుతమైన డైలాగ్స్‌ ఉంటాయి. ఒరిజినల్‌ స్ర్కిప్టు (ఓఎంజి – ఓ మై గాడ్‌)లో మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశారు. ‘రాధ’ సినిమా చెయ్యట్లేదు. కొత్తగా ఏ సినిమాకీ కమిట్‌ కాలేదు. స్ర్కిప్టులు వింటున్నా.

 

 

Posted in సినిమా | Tagged | Leave a comment

ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

ప్రజలకోసమే  పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక వాదన ,కార్య నిర్వాహక సామర్ధ్యం ,ఉన్న ఐ ఏ ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కే ప్రసాద్ .వివిధ విరుద్ధ స్వభావాలున్న ముఖ్యమంత్రుల వద్ద ను ,సాక్షాత్తు శ్రీ వారి ఆలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వాహణాదికారిగా ,విశాఖ పోర్ట్ చైర్మన్ గా  ప్రధాన మంత్రి పి.వి గారి దగ్గర ,వివిధ హోదాలలో ప్రసాద్ పని చేశారు .అందరి వాడు అనిపించుకొన్నారు . సమర్ధత కు ప్రతి రూపం .నిస్వార్ధ సేవకు నిలువెత్తు రూపం .తన శ్రీవారి అనుభవాలను ‘’నాహం కర్తా –హరిహ్ కర్తా ‘’అని మొదటి పుస్తకం రాసిన సంగతి అందరికి తెలుసు .రెండేళ్ళ క్రితం ‘’అసలేం జరిగిందంటే –‘’పేరు తో రాసిన పుస్తకం లో ప్రజా సేవలో తన జీవితం ధన్య మైన సంఘటనలు పూస గ్రుచ్చినట్లు ఎక్కడో మొదలు పెట్టి గిరికాలు తిప్పుతూ ,సంఘటన పూర్వా పరాలను స్పృశిస్తూ ,తనకెదురైన సమస్యలను వివరిస్తూ ,వాటిని అధిగమించటానికి నిస్వార్ధం గా ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పని చేశారు .నాలుగు వందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని  అయిదారు  రోజుల్లో ఆమూలాగ్రం చదివాను .అందులోనుంచి సంఘటనలకు మాత్రామే ప్రాధాన్యం ఇచ్చే విషయాలను ,నాకు నచ్చిన విషయాలను మీ అందరికోసం అందిస్తున్నాను .

శ్రీ ప్రసాద్ ఖమ్మం జిల్లా కలెక్టర్  గా జలగం వారు కావాలని వేయిన్చుకొన్నారు . శ్రీ జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుమూడున్నర ఏళ్ళు పని చేసి ఆ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేట్లు చేశారు .ముఖ్యమంత్రి ఈయనకు కావలసిన అధికారాలు డబ్బు అన్నీ అందించారు .వాటితో జిల్లా రూపురేఖలే మార్చేశారిద్దరూ .ఏ రాజకీయ నాయకుని క్రీనీడ పడకుండా జాగ్రత పడ్డారు .చివరికి వాళ్లకు కోపం వచ్చి ప్రసాద్ గారి దగ్గరకొచ్చి ‘’అయ్యా అన్నీ మీరిద్దరే చేస్తున్నారు  మా రాజకీయ నాయకులం ఎందుకూ పనికి రాకుండా పోతున్నాం .మీరు చేసిన అభివృద్ధి చాలు .ఇక మాకు పెత్తనం రాక పోతే ఓట్లు పడవు కనుక మీరు మీ కు కావాల్సిన చోటుకు బదిలే చేయించుకోండి ‘’అని చెప్పారు .ఇలాంటిస్పందన వస్తుందని ఆయన ఊహించలేక ముఖ్యమంత్రిని తన్ను హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేయమని కోరారు .ఆయన  అఖండ  మేధావి .’’ప్రసాద్ మా వాళ్ళు ఏమైనా అన్నారా?’’అని కూపీ లాగి విషయం అర్ధమై హైదరబాద్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు .

అక్కడ చేరిన మూడు నెలల్లోనే దివి సీమ ఉప్పెన వచ్చింది .వేలాది జనంచనిపోయాయి  ,వేలాది పశువులు చనిపోయాఇ . .నీళ్ళు అన్నీ కలుషితమయ్యాయి .తాగు నీరు లేక,అంటువ్యాధులు పెరిగే ప్రమాదం వచ్చింది . జలగం ఫోన్ చేసి ప్రసాద్ కు పూర్తీ అధికారాలిచ్చి దివి సీమకు పంపి పది రోజుల్లో ఎక్కడ వీలైతే అక్కడ రిగ్గులతో బోరు బావులు తవ్వించి భూ గర్భ జలాలను జనాలకు అంద జేయవలసిందని యెంత డబ్బు ఖర్చైనా పరవా లేదని  ఆర్డర్ జారీ చేశారు . అంతే ఆఘ మేఘాల మీద దివి సీమకు ప్రభుత్వ రిగ్గులు ,ప్రైవేట్ రిగ్గులను తెప్పించి డీజల్  డ్రమ్ములు  గాస్ లైట్లు ఇప్పించి ,స్థానిక ప్రజలను అగ్గి పుల్ల కూడా అడగ కుండా అన్నీ ఏర్పాటు చేసి ,పర్య వేక్షిస్తూ ,అత్యవసర కార్యక్రమంగా  మంచి  నీటి సరఫరాను భావించి అధికారులతో పని చేయించారు .మరమ్మత్తులకు మెకానిక్కులు ,టెంట్ లు వారి భోజన వసతి అన్నీ చూశారు .’’దెబ్బ తిన్న ప్రతి గ్రామానికి తాగునీరు ఇద్దాం .ఆకలి ,నిద్రకోసమే తప్ప మిగిలిన సమయ మంతా ఈ పనికే కేటా ఇంచండి మీ సామర్ధ్యం వలన కొన్ని వేల కుటుంబాలను నిల బెట్ట గలుగుతాం .’’అని కింది అధికారుల్ని ప్రోత్సహించి పంపారు .

ప్రసాద్ గారు అక్కడే ఉండి పర్య వేక్షిస్తూ ,ప్రతి రోజు జీపులో తిను బండారాలు డీజిల్ కాన్లు రిగ్గ్గులు పై చేస్తున్న గ్రామాలకు పంపించారు .ఎన్ని అడుగులు లోతుకు వెళ్ళినా నీరు పడనీ గ్రామాలకు  టాంకర్ల ద్వారా మంచి నీరు సప్ప్లై చేయించారు .రోజూ గ్రామలో నీటి సరఫరా ఆ తటాంకర్ల తోనే చేయించారు .చీకటి రాత్రులలో చుట్టూ శవాలమధ్య  వాటికంపు మధ్య ,చలిగాలిలో ,ఆ సిబ్బంది దాదాపు ఇరవై నాలుగు గంటలూ శ్రమించారు .వారికీ అంటూ రోగాలు సోకాయి ,విరేచనాలు పట్టుకున్నాయి .అయినా మొక్క వోని ధైర్యం తో సిబ్బంది పని చేసి పది రోజుల పనిని ఆరు రోజుల్లోనే సంతృప్తికరం గా పూర్తీ చేశారు .ఆ నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి గారు సిబ్బందిలో ప్రతి ఒక్కరిని  ప్ర శం సించి అభినందించారు .తనకు ముఖ్య మంత్రి ఇచ్చిన పనిని సంతృప్తిగా దిగ్విజయం గా పూర్తీ చేసి ప్రసాద్ గారు ముఖ్యమంత్రిని కలిసి  వివరించారు .జలగం   ఆనందం  పట్టలేక ‘’రాజ కీయ ప్రయోజనాలకోసం నిన్ను ఖమ్మం జిల్లా నుంచి పంపించేశారు .కాని ఇప్పుడు దివి తాలూకాకి  నువ్వే అవసరం అయ్యావు ప్రసాద్ .ఇక్కడ నీ అవసరం ఉందనే నెమో ముందు చూపుగా నిన్ను మా జిల్లా వాళ్ళు వద్దని ఉంటారు ‘’అని మెచ్చుకొన్నారు ..

Product Details

 

 

రేపు తొలి ఏకాదశి –శుభాకాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌ అన్న కిమ్స్ హాస్పిటల్స్ అధిపతి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాషా్ట్రల్లో అతి పెద్ద ఆసుపత్రుల గ్రూపుల్లో కిమ్స్‌ ఒకటి. అతి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి ఆసుపత్రిగా ఎదిగిన కిమ్స్‌ సీఈఓ డాక్టర్‌ భాస్కరరావుతో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’

ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం డాక్టర్‌ గారు భాస్కరరావు: నమస్కారం ఆర్కే: డాక్టర్‌గా పాపులర్‌గా అవటం, ఒక సంస్థను నడపటం వేర్వేరు అంశాలు. వీటిని మీరు ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?

భాస్కరరావు: డాక్టర్‌గా వృత్తి ప్రారంభించినప్పుడు- పెద్ద డాక్టరు అవ్వాలి. ఎక్కువ సర్జరీలు చేయాలని ఉండేది. పెద్ద ఆసుపత్రి కట్టాలని నాకు మొదట లేదు. ఆ తర్వాత అనుకోకుండా ఆసుపత్రి స్థాపించాను.

ఆర్కే: డాక్టర్‌గానే మీకు సంతృప్తి ఎక్కువంటారు?

భాస్కరరావు: అవును. అడ్మినిసే్ట్రషన్‌ అనేది థాంక్‌లెస్‌ జాబ్‌. ఎవ్వరినీ సంతృప్తి పర్చలేం. పేషెంట్లు అయితే నూటికి 98 మందికి న్యాయం చేయగలం. అందుకే డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌!

ఆర్కే: ఇప్పుడు రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు?

భాస్కరరావు: రెండు, మూడు ఆపరేషన్‌లు చేస్తున్నాను. రోజూ దాదాపు ఏడు గంటలపాటు సర్జరీల్లో బిజీగా ఉంటాను. నాలుగైదు గంటలు అడ్మినిసే్ట్రషన్‌ వ్యవహారాలు చూస్తాను. ఓ అరగంట హాస్పిటల్‌లో రౌండ్స్‌ వేస్తాను.

ఆర్కే: ఎన్ని వేల ఆపరేషన్‌లు చేశారు?

భాస్కరరావు: నేను సొంతంగా 16వేల ఆపరేషన్‌లు చేశాను. నేను ఇన్‌వాల్వ్‌ అయిన ఆపరేషన్‌లు స్టూడెంట్‌ లైఫ్‌నుంచి అసిస్ట్‌ చేసిన కేసులతో సహా 30వేలదాకా ఉంటాయి.

ఆర్కే: ఎలాంటి ఆపరేషన్లు చేసినప్పుడు తృప్తి అనిపిస్తుంది?

భాస్కరరావు: చిన్నపిల్లలకు సర్జరీలు చేయటం చాలా కష్టం. అలాంటివి చేసినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. కొన్ని ఎమర్జెన్సీలుంటాయి. ఆ టైమ్‌లో చేయకపోతే ప్రాణాపాయం ఉంటుంది. అలాంటి వారికి ఆపరేషన్‌లు చేసి వారు సక్సెస్‌పుల్‌గా ఇంటికెళ్లినపుడు చాలా సంతోషంగా ఉంటుంది.

ఆర్కే: కొందరు డాక్టర్లు కేసులను ఎందుకు రిజెక్ట్‌ చేస్తున్నారు? బతికినా బతకకపోయినా తన వద్దకు వచ్చిన వారిని కాదనకుండా చేయాలి కదా!

భాస్కరరావు: క్రిటికల్‌ కేసులను హ్యాండిల్‌ చేయాలంటే సర్జన్‌ ఒకడే సరిపోడు. ఒక వ్యవస్థ ఉండాలి. మానవ వనరులు ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలి. టెక్నాలజీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కేసు ఫెయిలయినా పేషెంట్లు అర్థం చేసుకుంటారు. లేకపోతే మనకు కూడా గిల్టీగానే ఉంటుంది.

ఆర్కే: హాస్పిటల్‌ సక్సెస్‌ రేటు దెబ్బతింటుందనే భయంతో క్రిటికల్‌ కేసులను పుచ్చుకోరనే అపవాదు కూడా ఉంది కదా! భాస్కరరావు: బాగా అనుభవమున్న సర్జన్‌ అయినా, మౌలిక సదుపాయాలు లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు.

ఆర్కే: నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఎక్కువ మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. అందరూ తిరస్కరించిన కేసులను మా దగ్గరకు తీసుకువస్తారు.. వారు చనిపోతే మా అకౌంట్‌లో వేస్తారని వారు అంటూ ఉంటారు..

భాస్కరరావు: అవును. కార్పొరేట్‌ ఆసపత్రుల్లో ఖర్చును భరించలేనివారు ఉంటారు. వారు ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళ్తారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత గాడ్జెట్స్‌ అవసరం. సర్కారు ఆసుపత్రుల్లో ఆ టెక్నాలజీ లేదు.

ఆర్కే: కిమ్స్‌ పెట్టాలని ఎందుకు అనుకున్నారు?

భాస్కరరావు: నేను రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత ఆసే్ట్రలియా వెళ్లి వచ్చాను. వెల్లూరు హాస్పిటల్‌లో, నిమ్స్‌లో పనిచేశా. మనం ఎంత చేసినా ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పరిమితులుంటాయి. అందువల్ల, ఉత్సాహం పోతుంది. వృత్తిలో ఇంకా రాణించాలంటే ప్రయివేటు ఆస్పత్రి పెట్టడం మంచిదని భావించాను. మా నాన్నగారు గుండె సమస్యతో మరణించారు. అందువల్ల ఆయన పేరిట నెల్లూరులో ఒక ఆసుపత్రి ప్రారంభించాను. హైదరాబాద్‌ నుంచి వారానికి ఓ రోజు వెళ్లి సర్జరీలు చేసేవాడిని. దానికి బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టా. పది మంది స్నేహితులతో కలిసి కిమ్స్‌ ప్రారంభించాను. మొదట్లో 120 బెడ్స్‌ ఉండేవి. ఇప్పుడవి వెయ్యి బెడ్స్‌ అయ్యాయి.

ఆర్కే: మిగతా హాస్పిటల్స్‌తో పోలిస్తే మీ దగ్గర ఫీజు తక్కువ ఉంటుందా?

భాస్కరరావు: మా వద్ద 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు తక్కువగా ఉంటాయి.

ఆర్కే: కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగుల్ని పిప్పి పీల్చేస్తున్నాయనే అపవాదు ఉంది. దాని నుంచి మీరు బయటపడ్డారా?

భాస్కరరావు: కార్పొరేట్‌ హాస్పిటల్‌కు వెళితే దోపిడీ అనీ, అన్నీ అమ్మేసుకోవాల్సిందేననే నానుడి ఉంది. మా హాస్పిటల్‌లో అలా ఉండదు. నేను నెలకు అరవై లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తుంటాను. ఏమైనా ప్రజల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించిన చైతన్యం రావాల్సి ఉంది. మనం తాగే కప్పు కాఫీ ఖర్చు నెలకు 600 రూపాయలు. అంటే సంవత్సరానికి 7,200. ఇదే సొమ్ముతో ఒక కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల వరకూ మెడిక్లెయిమ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోవచ్చు. బైక్‌ కొంటే, ఇల్లు కడితే ఇన్స్యూరెన్స్‌ చేయిస్తాం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చెల్లించం. ఆరోగ్యం ఉచితంగా అందాలనే భావన బలంగా నాటుకుపోయింది.

ఆర్కే: ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్‌ మోడల్‌ ఏమిటి?

భాస్కరరావు: మునుముందు ఇన్స్యూరెన్స్‌ చేసుకోకపోతే సామాన్యులు బతకలేరు. అందువల్ల అందరూ ఇన్సూరెన్స్‌ కట్టాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి ఉండాలి.

ఆర్కే: ఆరోగ్యశ్రీకి మోటివేషన్‌ మీరే కదా?

భాస్కరరావు: అవునండి. రాజశేఖర్‌రెడ్డి గారు నాకు పర్సనల్‌గా తెలుసు. అగర్వాల్‌ గారని హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పట్టుబట్టారు. నా దగ్గరకు మూడు సార్లు వచ్చారు. అలా పుట్టిందే ఆరోగ్యశ్రీ. అయితే కొందరు బాస్కరరావు కోసమే రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని ఆరోపణలు చేశారు. మన రాష్ట్రంలోని 2 కోట్ల 23 లక్షల కుటుంబాలకు- ప్రతి ఫ్యామిలీకి మూడువేల రూపాయల చొప్పున ఏడువేల కోట్ల రూపాయలు ఇన్స్యూరెన్స్‌ చెల్లిస్తే రోగులందరూ ఏ ఆసుపత్రికైనా వెళ్లి చికిత్స తీసుకోవచ్చునని సూచించాను. చాలా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. అమెరికన్‌లు కూడా పరిశీలించి వెళ్లారు.

ఆర్కే: ఆరోగ్యశ్రీ వచ్చాక కొన్ని హాస్పిటల్స్‌ తాము చేయనివి కూడా చేశామని చెప్పి క్లెయిమ్స్‌ పెట్టుకొని డబ్బు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అవి మీ దృష్టికి వచ్చాయా?

భాస్కరరావు: అవి అంత తీవ్రమైన ఆరోపణలు కాదండి. మిగతా గవర్నమెంటు పథకాలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ పారదర్శకంగా సాగుతుంది.

ఆర్కే: మీ నేపథ్యమేమిటి? అసలు మెడిసిన్‌ చదవాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: నాది చాలా లోయర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ. ముగ్గురు బ్రదర్స్‌ము. ఇద్దరు సిస్టర్స్‌. మా మదర్‌కు పిల్లల్ని చదివించాలనే ఒక బలమైన కోరిక. మా ఊళ్లో 5వత తరగతి వరకే ఉంది. అందుకే మేమంతా మా మామయ్య వాళ్ల ఊరు బుచ్చిరెడ్డిపాలెంలో ఉండి చదువుకున్నాం. చదువు మాకు బాగా అబ్బింది. మా నాన్న గారు కూడా ఆర్థికంగా బాగా సపోర్టు చేసి చదివించారు. మా పెద్దన్నయ్య ఇంజనీరు అయ్యాడు. రెండో బ్రదర్‌ అగ్రికల్చర్‌ బిఎస్సీ. సెకండ్‌ బ్రదర్‌ మెడిసిన్‌ చేద్దామంటే రాలేదు. నేను మూడోవాడ్ని. అప్పటికే మా బ్రదర్‌ కృష్ణయ్య కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా బలోపేతమయ్యారు. సపోర్టు ఆయన నుంచి మొదలైంది.! ఆయనకు గవర్నమెంటు జాబ్‌ వచ్చింది. అయితే గవర్నమెంటు జాబ్‌లో చేరితే కుటుంబాన్ని సజావుగా చూడలేరని చదువుకు పెట్టిన అప్పులు తీర్చలేమని, కాంట్రాక్టులు చేస్తూ, కుటుంబాన్ని పైకి తీసుకువచ్చారు. నన్ను డాక్టరును చేయాలని మా బ్రదర్‌కు కోరికగా ఉండేది. మేం ముగ్గురం చదువుకుంటే దాని విలువ తెలిసివచ్చింది. వందల ఎకరాల భూములున్నా ఆ విలువ రాదు.

ఆర్కే: ప్రాక్టీసు చేస్తున్న మీకు సర్పంచి అవ్వాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: పవర్‌ ముగ్గురి వద్ద ఉంటుంది. ఒకరు కలెక్టరు, రెండు సీఎం, మూడు పీఎం. దేశాన్ని మార్చాలనుకుంటే ఈ ముగ్గురికీ నిమిషం కూడా పట్టదు. అయితే, సర్పంచి అయ్యాక మనమేమీ చేయలేమని తెలిసొచ్చింది. రోడ్లు వేసినా, రక్షితనీటి పథకాన్ని నిర్మించినా ఆనందం లేదు. ప్రొఫెషన్‌ బెటరని డిసైడ్‌ అయ్యాను.

ఆర్కే: ఇప్పటికీ మీ అన్నదమ్ములు ముగ్గురూ ఉమ్మడిగానే ఉన్నారా?

భాస్కరరావు: కలిసే ఉన్నాం. ఈ రోజుకు కూడా మా మధ్య డిస్కషన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌ జరుగుతుంటాయి. అయినా ఎక్కడా సమస్యలు తలెత్తవు. మా పెద్ద బ్రదర్‌ కృష్ణయ్య మమ్మల్ని చదివించి పెంచారు కాబట్టి ఆయనదే చివరి మాట. వివాదాలు ఎక్కువగా ఆడవాళ్ల దగ్గరి నుంచి వస్తాయి. కాని వారు మమ్మల్ని ప్రభావితం చేయలేక పోయారు. వారు కూడా మమ్మల్ని పట్టించుకోరు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా ఏదైనా ఆయన చెప్పినట్లు వినాల్సిందే.

ఆర్కే: ఆస్తులన్నీ ఉమ్మడిగానే ఉన్నాయా?

భాస్కరరావు: ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటీ అనేది మాక్కూడా తెలియదు. అంతా సంపాదించింది ఆయనే . మేమంతా ఖర్చుపెట్టడమే తప్ప ఎవరికి వారు సంపాదించుకోవటం, అది నాది, ఇది నాది అనే విభజన భావన లేనేలేదు. ఆర్కే: ఇంట్లో ఆడవాళ్లతో ఏమీ సమస్యలు రావా? మీది అరెంజడ్‌ మ్యారేజా ? లవ్‌ మ్యారేజా? భాస్కరరావు: మాది అరేంజ్డ్‌ మ్యారేజే. మా బ్రదర్స్‌ ఇద్దరూ బంఽధువులనే చేసుకున్నారు. అందరూ బిగినింగ్‌ నుంచి తె లుసు. నేనొక్కడినే బయటి సంబంధం చేసుకున్నాను. లక్కీగా అందరూ మంచివాళ్లే దొరికారు. అందరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే ఏ సమస్యలూ లేవు.

ఆర్కే: గురవారెడ్డి గారు మీరు తోడళ్లుళ్లు కదా ? మీరిద్దరికీ కంపాటబులిటీ బాగుంటుందా?

భాస్కరరావు: సొంతంగా పెట్టుకుంటే బాగుంటుందని వెళ్లిపోయి సన్‌షైన్‌ హాస్పిటల్‌ ప్రారంభించాడు. బాగా ఎదుగుతున్నాడు. ఫ్యామిలీ పరంగా కలిసే ఉంటాం.

ఆర్కే: మీ మిసెస్‌ భవనం వెంకట్రాం కూతురు కదా!

భాస్కరరావు: అవును. ఆయన సీఎంగా ఉన్నపుడు నా పెళ్లి అయింది. మాదాల జానకీరాం గారు సంబంధం తెచ్చారు. ఆయన మాకు బంధువు.ఆయనకు ముగ్గురు అల్లుళ్లు ఉన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడే వారు.

ఆర్కే: ఇప్పుడు స్టేట్‌ డివైడ్‌ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లా ఉండబోతోంది. ఆంధ్రాలో ఎలా ఉంటుంది?

భాస్కరరావు: రెండింట్లోనూ బాగుంటుంది. మాకు ఇక్కడ 1000 బెడ్లు ఉన్నాయి. ఆంధ్రాలోనూ వెయ్యి పడకల హాస్పిటల్స్‌ ఉన్నాయి. కొత్తగా, గుంటూరులో గానీ, విజయవాడలో గానీ హాస్పిటల్‌ కట్టాలని చూస్తున్నాం. ఇప్పుడున్న హాస్పిటల్స్‌ను 300 బెడ్‌ల ఆసత్రిగా తీర్చిదిద్దుతాం. సీమాంధ్రలో అడ్వాన్సు పరికరాలతో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.

ఆర్కే: మీకు పిల్లలు ఎంత మంది?

భాస్కరరావు: ఇద్దరు బాబులు. పెద్దబ్బాయి ఎంబీబీఎస్‌ చేశాడు. సూపర్‌స్పెషాలిటీ చే స్తానంటే నేనే అక్కర్లేదని హాస్పిటల్స్‌ చూసుకోమని చెప్పాను. రెండో అబ్బాయి బీబీఏ చదివి ఎంఎస్‌ ఫైనాన్స్‌ చేశాడు. ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసుకోమని చెప్పాను.

ఆర్కే: నెక్ట్‌ ్స మీరు ఏం అచీవ్‌ చేయాలనుకుంటున్నారు.?

భాస్కరరావు: మెడికల్‌ ఫీల్డులో చేయాల్సింది చాలా ఉంది. నర్సింగ్‌ స్కూలు, ఫార్మసీ, ఫిజియోథెరపీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలి. నర్సింగ్‌ కేర్‌ చాలా ముఖ్యమైనది. దాన్ని డెవలప్‌ చేయాలి. మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ తీసుకురావాలనేది నా సంకల్పం. శ్రీకాకుళంలో మెడికల్‌ కళాశాల తీసుకున్నాను. క్వాలిటీతో వైద్యసేవలు అందించాలని అనుకుంటున్నాను. మరో వందేళ్లపాటు హాస్పిటల్స్‌ను ముందుకు తీసుకువెళ్లేలా చూడాలనేది నా లక్ష్యం.

‘‘ రాజశేఖర్‌రెడ్డి గారు నాకు పర్సనల్‌గా తెలుసు. అగర్వాల్‌ గారని హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పట్టుబట్టారు. నా దగ్గరకు మూడు సార్లు వచ్చారు. అలా పుట్టిందే ఆరోగ్యశ్రీ. అయితే కొందరు బాస్కరరావు కోసమే రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని ఆరోపణలు చేశారు ’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిమితుల్ని దాటి చూసే వాస్తవికతే మార్మికత (వివిధ

నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే తను రాయాలనుకున్న వస్తువుని మరింత బాగా రాయటం

90ల తర్వాత తెలుగు సాహిత్య ప్రపంచంలో మాజికల్‌ రియలిజానికి మార్క్వెజ్‌ పర్యాయపదం అయ్యాడు. 1982లో నోబెల్‌ ప్రైజ్‌ తెచ్చిపెట్టిన ‘ఒన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’ నవలలోని యునైటెడ్‌ ఫ్రూట్‌ కంపెనీ గ్లోబలైజేషన్‌కి ఉదాహరణగా మారింది. గ్రామీణ నేపథ్యం గల మన రచయితలు ఎక్కడో ఖండాంతరాల అవతల మకొండోలో తమ ఊరినీ, తమ ఊరిలో ఉర్సులా వంటి తల్లుల్నీ చూడగలిగారు. మొన్న తన మరణం తర్వాత వేలాది సామాన్య పాఠకులు, రచయితలతో పాటు, కొలంబియా అధ్యక్షుడు, అమెరికన్‌ ప్రెసిడెంట్‌ కూడా సంతాపం ప్రకటించారు. ఇంతగా ఖండాంతర నానా జాతుల సాహిత్య హృదయాలనీ ప్రపంచపు నలుమూలలా కొల్లగొట్టిన మార్క్వెజ్‌ దక్షిణ అమెరియా కొలంబియాలోని ఓ మారుమూల అరాచక రచయిత. తన నవయవ్వనంలో ఎలా రాయాలో తెలీక తబ్బిబ్బయిన మన తోటి తెలుగు కుర్ర రచయితలలాంటి వాడే అయినా, రాయటం కోసం బతికేందుకు దుర్భరమైన కష్టాలకు సిద్ధమవటం, తనదైన రచనా శిల్పాన్ని సాధించటం అందుకు దోహదపడ్డాయి. ఓ మామూలు కథ రాయడానికి 500కి పైగా కాగితాలు తగలేస్తాననే మార్క్వెజ్‌ అంటే, మన రచయితలకు షాక్‌ తగలక తప్పదు. 1983లో సహ రచయిత, తన మిత్రుడు కూడా అయిన మెండోజాకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మార్క్వెజ్‌ అనేక విషయాలను ప్రస్తావించాడు. రష్యా, ఫ్రెంచి, చైనాల తర్వాత, ఇప్పుడు లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యం మనల్ని వెంటాడబోతోంది గనుక, మార్క్వెజ్‌ మాటలని జాగ్రత్తగా విని వాటిని మనదైన వాస్తవికతలోంచి ఆలోచించటం, చర్చకు పెట్టటం తెలుగు సాహిత్యానికి తప్పనిసరి. అందులో ఇదొక ప్రయత్నం…

 నువ్వు అలా నవు్ముతావా?

– అవును. రచయిత తన జీవిత కాలంలో రాసేది ఒకే ఒక పుస్తకం అని నవు్ముతాను. అదెన్ని పేర్లయినా తగిలించుకోనీ, ఎన్ని సంపుటాల్లో అయినా రానీ. బాల్జాక్‌, కాన్రాడ్‌, మిల్‌విల్లే, కాఫ్కా ఎవర్నయినా తీసుకో. రాసేది ఒకే పుస్తకం. ఒక్కోసారి రాసిన వాటిలో ఒకదానికి బాగా పేరొచ్చిందనుకో, ఇక ఆ రచయిత ‘ఆ ఒకే ఒక పుస్తకం తాలూకూ రచయిత’గా చరిత్రలో మిగిలిపోతాడు. సెర్యాంటిస్‌ డాన్‌క్విక్సోట్‌ రచయిత. ఆయన రాసిన కథలు ఎవరికి గుర్తున్నాయి? గాటివూలా రచయిత మిగ్యుల్‌ ఏంజెల్‌ ఆసి్ట్రయాస్‌కి ‘ది ప్రెసిడెంట్‌’ నవలా రచయితగానే పేరు. కానీ అది అతని ‘లెజెండ్స్‌ ఆఫ్‌ గాటివూలా’ కంటే గొప్పదేం కాదు.

అలా అయితే, రచయిత ఒకే ఒక పుస్తకం కోసం జీవిస్తాడని అనుకుంటే, నీ సంగతేంటి? నీ ఒకే ఒక పుస్తకం ‘వుకోండో’ పుస్తకమేనా?(వూర్క్యెజ్‌ రచనల్లో తరచూ వచ్చే ఊరి పేరు వుకోండో)

– కాదు. నీకూ తెలుసు. Leaf Storm, One Hundered Years of Solitude ఈ రెండు నవలల్లో వూత్రమే వుకోండో వస్తుంది. మిగతా రచనల నేపథ్యం కొలంబియా తీరాన ఉండే ఒక వూరువుూల పట్నం. అక్కడికి రైలూ, రోడ్డూ ఉండవు. లాంచీలో ప్రయాణమే.

ఫ అయితే నీ ఒకే ఒక పుస్తకం…

– నా ఒకే ఒక పుస్తకం ఏకాంతం. ఏకాంత వాసానికి చెందిన వునిషి. Leaf Storm లో వుుఖ్యపాత్ర బతుకూ చావూ అంతా ఏకాంతంలోనే.No one writes to the colonel లో కల్నల్‌ ఎదురుచూస్తూ.. చూస్తూనే ఉంటాడు. ఎప్పటికీ రాని తన పెన్షన్‌ కోసం. In Evil Hour నవలలో మేయర్‌ కూడా ఏకాంత జీవి. అయితే అతనికిది ‘అధికారం వల్ల వచ్చిన ఏకాంతం.’

 ఏకాంతమే నీ అన్ని రచనలకీ వస్తువయితే దాని వుూలాలు ఎక్కడ నుంచీ వచ్చాయి? నీ బాల్యం నుంచా?

– అది నా ఒక్కడికి సంబంధించింది కాదు. అది అందరి సవుస్య. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా దాన్ని ప్రకటించవచ్చు. ఏకాంత భావన చాలావుంది రచనలలోకి చొరబడింది. కొంతవుంది రచయితలకి తెలిసీ – ఇంకొందరికి తెలీక. నీ రచనల్లో కూడా. కాదా?

అవును. నేనూ రాశాను. నీ One Hundered Years of Solitude నవలకి బీజ రూపం నువ్వు ఎప్పుడో రాసిన Leaf Storm లో ఉంది. అప్పటి ఆ యువ వూర్క్వెజ్‌ గురించి ఇప్పుడు నువ్వే వునుకుంటున్నావు?

– జాలి పడతాను. ఎందుకంటే అతను నవలని త్వరత్వరగా వుుగించేశాడు. తను మొదటిసారీ చివరిసారీ రాసేది ఆ నవలే అనుకున్నాడు. అప్పటి తన ప్రపంచ జ్ఞానాన్నంతా – వుుఖ్యంగా తను అమెరికన్‌, యూరోపియన్‌ రచయితల నుంచి నేర్చుకున్న అన్ని మెళకువల్నీ, చవుక్కుల్నీ అందులో ప్రదర్శించాడు.

 ఆ నవల రాసినప్పుడు నీకు ఇరవై రెండేళ్లు. బారాంక్విలా లో ఉండి అందరూ వెళ్లిపోయాక పత్రికాఫీసులో తెల్లార్లూ కూర్చుని రాసుకునే వాడివి.

– అవును. నేనక్కడే ఓ హోటల్‌లో ఉండేవాడిని. అదో వేశ్యల అడ్డా. రూం అద్దె ఒకటిన్నర పెసోలు. ఓ కాలవ్‌ు రాస్తే వుూడు పెసోలు వచ్చేవి. సంపాదకీయం రాస్తే ఇంకో వుూడు. రూం అద్దె క్టటలేని రోజు నా Leaf Storm రాత ప్రతిని హోటల్‌ గువుస్తా దగ్గర తనఖా పెట్టేవాడిని. నేను ఆ కాగితాల కోసం తప్పక తిరిగి వస్తానని అతని నవ్ముకం.

 ఆ నవల అచ్చువేయటం కష్టవుయిందా?

– అవును. ప్రచురణకరర్త దొరకటానికే ఐదేళ్లు పట్టింది. ఓ అర్జెంటినా ఎడిటర్‌ అయితే నువ్వు రచనలు వూనేసి చేపలు పట్టుకోటం వుంచిదని పెద్ద ఉత్తరం రాశాడు.No Body Writes to the Colonel ని ఫ్రాన్స్‌లో గాలివూర్డ్‌ వాళ్లకి పంపాను. దాన్ని రెండో రోజే తిరగ్గొట్టారు.

 నీ రచనా పద్ధతిలో వచ్చిన తేడాల గురించి అడగాలి. Leaf Storm నవలకీOne Hundered Years of Solitude నవలకీ మధ్య రాసినWrites to the Colonel, In Evil Hour, Big Mama’s Funerel నవలల్లో నువ్వు హఠాత్తుగా వాస్తవిక పద్ధతిని ఆశ్రయించావు నీ వ్యూజిక్‌ని వదిలేసి. భాష సూటిగా, శిల్పం సాపుగా చాలా పరిమితుల్ని విధించుకున్నట్టు ఉంటుంది. ఎందుకనీ?

– Leaf Storm రాసినప్పటికి వాస్తవికతను కవితాత్మకంగా పాఠకులకి చేర్చేదే వుంచి నవల అనుకునేవాడిని. అది వచ్చిన కాలం- కొలంబియాలో రక్తసిక్త నిర్బంధం, తీవ్రమైన అణచి వేత అవులవుతున్న కాలం. ‘ఆ పాలకుల క్రూరత్వాన్ని నీ నవల బహిర్గతం చేయలేదు. ఖండించలేదు’ అని నా ‘మిలిటెంట్‌ మిత్రులు’ అనటం మొదలుపెట్టారు. దాంతో నేను ఒక అపరాధ భావనకి గురయ్యాను. అలాంటి భావాల్ని ఇవాళ ఒప్పుకోలేను. అవి సాహిత్యాన్ని తేలిక పరిచే పొరపాటు అభిప్రాయాలు. కానీ అప్పుడే వున్పించిందంటే- దేశం ఎదుర్కొంటున్న తక్షణ రాజకీయ సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించటం రచయిత బాధ్యత అని. ఆ దశలో రాసినవే అలాంటివి. అయితే అదృష్టవశాత్తూ నేను త్వరలోనే ఆ దశను దాటి సాహిత్యం గురించిన నా పాత భావనలోకి తిరిగి వెళ్లాను. ఆ రచనలు కొలంబియా జీవన వాస్తవికతను యథాతథంగా ప్రతిబింబిస్తాయి. అవి రాయడం పొరపాటు అనీ అనుకోను. అయితే వాటిలో వాస్తవికతకు సంబంధించిన దూరదృష్టి లేకపోవటం కన్పిస్తుంది. అవి సూటిగా బల్ల గుద్ది నట్టు ఉంటాయి. అట్టే పరిపక్వం చెందని దశ అది. ఇంకో టేవుంటే ఆ రచనలన్నీ ‘చివరి పేజీతోనే ఖచ్చితంగా వుుగు స్తాయి.’ ఆ రచనా పద్ధతి ఇప్పుడయితే ఇరుకుగా అన్న్పిస్తుంది. అంతకంటే బాగా రాయగలనని అప్పటికే నాకు తెలుసు.

 నీలో ఆ మార్పుకి కారణం ఏమిటి?

– నా రచనల గురించి విశ్లేషించుకోవటం. చాలా కాలం ఆలోచించాక ఒక నిర్ధారణకి వచ్చాను. నేను చేయాల్సిన పని- ఇంకా పెద్ద పని- మిగిలి ఉందని అర్థమయింది. అదేమంటే నా దేశ రాజకీయ సాంఘిక వాస్తవికతను చెప్పటానికి మాత్ర మే నిబద్ధుడిననటం కాదు. అంతకంటే పెద్దదయిన ఈ ప్రపం చాన్నీ దాని వాస్తవికతనూ చెప్పటం. ఆ చెప్పటంలో కూడా నిస్పక్షపాతంగా ఉండటం, దేనివైపూ మొగ్గు చూపకపోవటం. అలా నా స్వానుభవం ద్వారా లాటిన్‌ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా చెలామణి అవుతున్న దాన్ని నేను అంగీకరించలేకపోయాను. అలాంటి సాహిత్య నిబద్ధతలో చాలా సమస్యలున్నాయి. అయితే వ్యక్తిగతంగా నేను రాజకీయ నిబద్ధుడిని. నా రాజకీయ నిబద్ధత నీకు తెలుసు.

 సోషలిజానికా…?

– అవును. నేను సోషలిస్టు ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. ఆ సమసమాజం ఇవాళ కాకపోతే రేపు వస్తుందని నమ్ముతున్నాను. అయితే లాటిన్‌ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా పిలవబడుతున్న దానితో ఇంకా చెప్పాలంటే సామాజిక ప్రతిఘటనా నవలా ప్రక్రియతో నాకు విభేదాలున్నాయి. ఎందుకంటే దాని ప్రాపంచిక దృక్పథానికి పరిమితులున్నాయి. అందువల్ల అది తాను ఆశించిన రాజకీయ చర్యలకు ఉపయోగపడదు. సరికదా! అందుకు వ్యతిరేక ఫలితాన్నే ఇస్తోంది. ఎందుకంటే లాటిన్‌ అమెరికన్‌ ప్రజలు నిర్బంధం మీదా అన్యాయాల మీదా గురిపెట్టే నవలలని మించిన సాహిత్యాన్ని ఆశిస్తున్నారు. సాహిత్యం గురించిన వారి అంచనాలు మరింత పెద్దవి. ఎందుకంటే ఆ సమస్యల గురించి వారికి లోతుగా ముందే తెలుసు కాబట్టి. రచయితలు ఏమి రాయాలో రాయకూడదో నిర్దేశించటం ద్వారా రచయితల సృజనాత్మక శక్తికి బంధనాలు వేయటం అనే తప్పుని నా మిలిటెంట్‌ మిత్రులు తెలిసో తెలియకో చేస్తూ ఒక్కోసారి రియాక్షనరీగా కూడా వ్యవహరిస్తున్నారు. నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే తను రాయాలనుకున్న వస్తువుని ‘మరింత బాగా రాయటం’.

 తక్షణ రాజకీయ అవసరాల కోసం రాయటం ఆపావు. సరే,One Hundered Years of Solitude లాంటి వాటిలో మార్మిక వాస్తవికతా పద్ధతిని ఎలా సాధించావు?

– అలా కథ చెప్పే పద్ధతి మా అమ్మమ్మది. ఓ చిన్న మారుమూల పట్టణంలో ఆమె జీవితం గడిచింది. అక్కడ సమ్మకాలకీ మూఢనమ్మకాలకీ తేడా లేదు. వాళ్ల కథలూ కబుర్లూ ఎంత నమ్మశక్యంగా ఉంటాయంటే అవి వాళ్ల రోజువారీ చర్యల్లో భాగం. నేనా రచనా పద్ధతిని కొత్తగా కనుక్కోలేదు. దెయ్యాలూ, భూతాలూ, కల్పనలూ, చిత్రమయిన జబ్బులూ, మంత్ర వైద్యాలూ, మూఢనమ్మకాలూ మా లాటిన్‌ అమెరికన్‌ సమాజానికే ప్రత్యేకం. వాటినే నేను రచనల్లోకి తీసుకువచ్చాను.

భాష దగ్గరికి వద్దాం.One Hundered Years..నవలలో పదజాలం ఘాటుగా, సారవంతంగా, మెరుపుల్లాంటి విన్యాసాలతో నిండి ఉంటుంది. ఆ భాష నీ ఇతర పుస్తకాల్లో అట్టే కన్పించదు. ఎందుకని?

– ఇలా అంటే స్వాతిశయంగా ఉంటుందేమో కానీ ఆ స్థాయిలో నేనే నవలనయినా రాయగలను. కానీ వాటికి ఆ భాష అవసరం లేదు. అందుకే అవి వేరుగా ఉంటాయి.

 ఇదెలా ఉందంటే రచయిత రోజుకో చొక్కాని మార్చినట్లు, ప్రతి పుస్తకానికీ ఒక్కో రకమైన భాష వాడుకోవచ్చు అన్నట్లుంది. భాష రచయిత అస్తిత్వంలో ఒక భాగం కాదా?

– కాదు. రచయిత కాదు భాషని నిర్దేశించేది. వస్తువు తనకవసరమైన భాషను శిల్పాన్నీ ఎంచుకుంటుంది. అందుకే In EVIL Hourలాంటి నా రచనలు సూటిగా పత్రికా విలేఖరి పద్ధతిలో ఉంటాయి.One Hundered Years నవలకి శైలీ, శిల్పం సంపద్వంతంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అది కల్పనాత్మక ఇంద్రజాలిక వాస్తవికతను చిత్రించాలి కనుక- భాష కూడా అలానే ఉండాలి.

 ప్రపంచ సాహిత్య విమర్శకులంతాOne Hundered Years.. నవలని తిరుగులేని ఉత్తమ రచనగా పరిగణిస్తుంటారు. నువ్వు మాత్రం ఎక్కడా దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. అదంటే నీకంతగా ఇష్టం ఉన్నట్లు లేదు…

– అవును. ఇష్టం లేదు. అది నా జీవితాన్ని నాశనం చేసింది. అది అచ్చయ్యాక అంతకు ముందటి నా జీవితాన్ని కోల్పోయాను.

ఎలా?

– అది తెచ్చిన పేరు ప్రఖ్యాతులు. అవి వచ్చాక వాస్తవికతను గ్రహించే సున్నితత్వం పోతుంది. అధికారం చేజిక్కించుకోవటం వల్ల కూడా అదే జరుగుతుంది. దానికయ్యే ఖర్చు స్వంత జీవితాన్ని పణంగా పెట్టటం. అది అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు.

 ఆ నవలకి దక్కిన బ్రహ్మాండమయిన విజయం న్యాయం కాదంటావు?

– అవును. న్యాయం కాదు. నా దృష్టిలో అది సాపుగా, సరళంగా, మెరుగులద్ది రాసిన నవల. సంక్లిష్టత లేదు. ఫ ఆ నవలని తిరస్కరిస్తున్నావా? – లేదు. కానీ లోకంలో ఉండే చమక్కులూ, అలంకారాలూ అన్నీ కలగలిపి అది రాస్తున్నప్పుడే నాకు తెలుసు.

ఏమని?

– అంతకంటే బాగా రాయగలనని. దాన్ని మించి రాయగలనని..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

గోపద బ్రాహ్మణం

అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి ఇతర బ్రాహ్మణాలు చెప్పలేదు .కర్మ లోపం వల్లజరిగే పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నది. రుత్విక్కులలో బ్రహ్మ కున్న ఉన్నత స్థానాన్ని వివ రిం చింది .

‘’ప్రాయశ్చి త్త రాను ధ్యానై రనుజ్ఞానాను మన్త్రనైహ్-హోమైశ్చ యజ్న విభ్రంశం సర్వం బ్రహ్మ ప్రపూరయేత్’’

ఇందులో నూరు ప్రపాఠకాలుఉండేవి అని  తెలుస్తోంది దిరికినవి కేవలం పదకొండే పతంజలి మహర్షి పేర్కొన్న అవయవ లక్షణం దీని లోనిదే .ఓంకార స్వరూపం ,ప్రతి వేదం బ్రహ్మ చర్యం ,గాయత్రీ మంత్రం రహస్యార్ధం తెలుసుకోవటానికి గోపద బ్రాహ్మణం ఏంతో ఉప యోగ పడుతుంది .

ఈ బ్రాహ్మణం  పూర్వభాగం ఉత్తర భాగం అని రెండుగావిభజింప బడింది .పూర్వం లో అయిదు ఉత్తరం లో ఆరు ప్రపాఠకాలున్నాయి .పూర్వ భాగం లో సృష్టి సముద్రాల పుట్టుక ,భ్రుగువు మహర్షి జననం  ,అధర్వ మహర్షి ఉత్పత్తి ,అధర్వ వేదావిర్భావం బ్రహ్మ సృష్టి ,ఓంకారోత్పత్తి ,గాయత్రీ మాహాత్మ్యం ,బ్రహ్మ చారి ధర్మాలు ,యాగాలలో బ్రహ్మ స్థానం ,దేవ యజనం ,బ్రహ్మోదనం ,ఆత్రేయ యజ్ఞం ,ఋత్విక్కుల అర్హత ,స్వాహా శబ్ద ఉత్పత్తి ,యజ్న దీక్ష ,వాటిల్లో వేదం మంత్రం వినిమయం ఉంటాయి .ఉత్తర భాగం లో యజమాని ,అతిధులు ,నక్షత్రోత్పత్తి ,చాతుర్మాస్య యాగాలు  ,,దేవాసుర యుద్ధం ,అగ్నీధ్ర నియమానం ,వషట్కార విశేషాలు ,దక్షిణ ,ఉక్త దేవతలు షోడశి నిర్వచనం ,శర్వం ,వాజపేయ ప్రశంస ,ఆప్తార్యామ ప్రశంస ,సంపాత మంత్రోత్పత్తి ,అహీన యాగ విశిష్టత ,మొదలైనవి చెప్ప బడ్డాయి .ఈ బ్రాహ్మణం గుజరాత్ ప్రాంతం లో ఏర్పడిందని క్రీ పూ అయిదవ శతాబ్ది ది అని తెలుస్తోంది .దీనికెవరూ వ్యాఖ్యానం రాసినట్లు లేదు

యజ్ఞం లో పాల్గొనే రుత్విక్కులలో బ్రహ్మ ప్రధానమైన వాడు .ఆయన అధర్వ వేదాం లో నిష్ణాతుడై ఉండాలి .యజ్న యాగాలలో జరిగేలోపాలకు బ్రహ్మ గారు చేయాల్సిన ప్రాయస్చిత్తాలు  చెప్పారు.ఇందులో యజ్నక్రమ వైశిష్ట్యాన్ని బాగా తెలియ జేశారు .అగ్న్యా దేయం కంటే పూర్ణాహుతి ,దానికన్నా హోమం ,అంతకంటే దర్శ పూర్ణ మాసాలు ,వాటి కంటే ఆ  ఆగ్రయణం  ,దానికంటే చాతుర్మాస్యలు ,వాటికంటే పశు బంధం ,దానికన్నా అగ్ని స్టోమం , అంతకంటే రాజ సూయం ,దానికన్నా వాజ పేయం ,అంతకంటే అశ్వ మేధం ,దానికన్నా పురుష మేధం ,అంతకంటే సర్వ మేధం ,దానికన్నా దక్షిణా వంతాలు ,వాటికంటే దక్షిణలు , అదక్షినలు ,సహస్ర దక్షిణం ఉత్తమ మైనవని తెలియ జేయ బడిందిం . పురుషునికి సంవత్సరానికి పోలికలను మహా ఆశ్చర్యం గా చెప్పారు .దీనితోనే ఈ బ్రాహ్మణానికి ప్రాముఖ్యత పెరిగింది .

ప్రపంచ సృష్టి

ఏ వేదం లోనూ  లేనంత గొప్పగా సృష్టి గురించి గోపధం తెలియ జేసింది .మొదట్లో పరబ్రహ్మ ఒకడే ఉండేవాడు .తనలాంటి మరో దైవాన్ని సృష్టించాలని తపస్సు చేసి తన దేహం లో వేడి పుట్టించి ఫాల భాగం నుండి చెమట కార్చాడు .ఈ స్వేదానికే సువేదం అనీ పేరు .అంటే బాగా జ్ఞానం కలిగింది అని అర్ధం .దీనివల్ల  సమస్తమూ ఆయనకు అవగతమవుతుంది .మరింత తపస్సు చేశాడు .రోమ కూపాలనుంచి స్వేదం ధారలుగా ప్రవహించింది .ఆ దారాలతో ప్రపంచ సృష్టి చేసి ,సృష్టిని ధరించి పాలించాలనుకొన్నాడు .వెంటనే స్వేద ధారలలోకి తొంగి చూశాడు .తన ప్రతి బింబం కనిపించింది .ఆయన రేతస్సు ఆ స్వేదం లో జారి పడింది .స్వేదం లో వేడి పుట్టించి దాన్ని రెండు భాగాలుగా చేశాడు ..అందులో ఒకటి తాగటానికి వీలు లేని ఉప్పు సముద్రం ,మరొకటి తియ్యని నీరు ఏర్పడ్డాయి .ఈ తీయని  నీటిలో వేడి పుట్టించాడు .అంతకు ముందే అందులో పడిన రేతస్సు ఎండిపోయి దాని నుంచి భ్రుగువు అనే రుషి జన్మించాడు .వెంటనే పరబ్రహ్మ అదృశ్యమైనాడు .

భ్రుగువు పరబ్రహ్మను వెతక టానికి అన్ని దిక్కులూ వెతికాడు .తూర్పులో వాయువు ,దక్షిణం లో మాత రిశ్వ ,,పడమర లో పవమానం ,ఉత్తరం లో వాతం అని అశరీర వాణి పలికి కింద నీటిలో చూడమన్నది .చూడగా నోటి నుండి అదర్వుడు అనే రుషి పుట్టాడు .కింద నుంచి పుట్టాడు కనుక అదర్వుడు అనే పేరు .ఆయన దేహం బ్రహ్మ దేహం లాగా తేజో వంతం గా ఉంది .ఆయనే సృష్టికార్యం జరిపే ప్రజా పతి .పర బ్రహ్మ అధర్వుని దేహాన్ని తపింపజేసి  వేడేక్కించటం వలన ఆయన దేహం నుండి  ఏకర్చ ,ద్వార్చ్య ,త్ర్యర్చ,చతుర్చపంచర్చ ,షడర్చ ,సప్తార్చ ,అస్టర్చ ,నవర్చ ,దశర్చ అనే పది మంది ఆదర్వణ ఋషులు జన్మించారు .వీరి నుంచి ఏకాదశర స్చ ,ద్వాదశర్చ ,త్రయోదశర్చ , చతుర్దశర్చ,పంచ దశర్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,త్రయోదశార్చ ,చతుర్ధశార్చ ,పంచాదశార్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,అష్ట దశర్చ ,ఎకోనవవిమ్షర్చ , విమ్శారస్చ  అనే పది మంది అధర్వ ఋషులు తిరిగి పుట్టారు .అధర్వణుడు ,అధర్వ ఋషులు దర్శించిన మంత్రాలకే అధర్వ వ్రేదం అని పేరు .దీని నుండి ఓంకారం పుట్టింది .

పరబ్రహ్మం నుండి భూమి ,అంతరిక్షం ,స్వర్గ అనే మూడు లోకాలు పుట్టాయి .ఆయన పాదం నుండి భూమిని ,ఉదరం నుండి అంతరిక్షాన్ని ,తలనుండి స్వర్గాన్ని సృష్టించాడు .భూమి  నుండి  అగ్ని ,అంతరిక్షం నుండి వాయువు ,స్వర్గం నుండి ఆదిత్యుడు లను సృష్టించాడు .అగ్ని వలన ఋగ్వేదం ,వాయువు నుండి యజుర్వేదం ,ఆదిత్యుని నుండి సామ వేదం ,వెలశాయి .ఋగ్వేదం నుండి    భూహ్ అనే వ్యాహృతి ,యజుస్సు నుండి భువః ,సామం నుండి సవః అనే వ్యాహృతులు పుట్టాయి .

ఉప్పు నీటి నుండి సముద్రం ,అన్ని వైపులకు వ్యాపించి తమకు ఒక దేవు డిని మ్మని ప్రార్ధిస్తే ,వరుణుడు అధి దేవత అయ్యాడు .వరుణుడి నుండి ముచ్యుడు ,పుట్టాడు ఇతనే మృత్యు దేవత .ఇతని దేహం నుండి రసాలు కారాయి.రసాల నుండి పుట్టిన వారే అంగీరస ఋషులు .ఇలా అధర్వాన్గీరసులు భ్రుగ్వాన్గీరస ఋషులు జన్మించారు .అంగీరసులు దర్శించినదే అంగీరస వేదం .దీని నుండి జనత్ అనే వ్యాహృతి పుట్టింది .పరబ్రహ్మ తూర్పు దిక్కు నుంచి సర్ప వేదాన్ని ,దక్షిణ దిక్కు నుండి పిశాచ వేదాన్ని ,పశ్చిమం నుంచి అసుర వేదాన్ని ,ఉత్తరం నుండి ఇతిహాస వేదాన్ని ,ఊర్ధ్వ ,అదో దిక్కుల నుండి పురాణ వేదాన్ని సృష్టించాడు .సర్ప వేదం నుండి ‘’వ్రుధాత్ ‘’,పిశాచ వేదం నుండి కారత్ ,అసుర వేదం నుండి గుహన్ ఇతిహాస వేదం నుండి మహాత్ ,పురాణ వేదం నుండి తత్ అనే వ్యాహృతులను సృష్టించాడు .తర్వాత చంద్రుడు ,గ్రహాలూ ,వృక్షాలు మొదలైనవి సృష్టించాడు .

పిమ్మట పర బ్రహ్మ ఒక యజ్ఞాన్ని చేసి దానిలో అగ్ని ని హోత గా ,వాయువు అధ్వర్యుగా ,సూర్యుని ఉద్గాత గా ,చంద్రున్ని బ్రాహ్మ గా ,పర్జన్యుడిని సదస్యునిగా ,ఓషధులు ,వృక్షాలు  చమస్సులు (గరిట లాంటిది )గాను ,విశ్వేదేవతలను హోత గాను ,అధర్వాన్గీరాసులు గోప్తలుగాను నియమించాడు .గోప్తలు యజ్ఞం లో జరిగే లోపాలను సవరిస్తారు .ఇలా అధర్వ వేదం ,దాని ప్రాముఖ్యత ,అధర్వామ్గీరాసుల ప్రాశస్త్యం విశిష్టం గా గోపద బ్రాహ్మణం లో వివరించ బడింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13th July Invitation

Top

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్

Attached a copy of the article that appeared in Reader’sscan0001 Digest July 2014 and its Telugu translation for wide publicity రైలు ప్రయాణం  లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు   – రీడేర్స్ డైజెస్ట్  -లీన శర్మ  – తెలుగు అనువాదం -గబ్బిట  కృష్ణమోహన్
0001 0002 0003 0004
Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -16

బ్రాహ్మణాల కధా కమామీషు -16

ఉప బ్రాహ్మణాలు -2

తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య  సాధనం  అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం .

క్రుచ్చ్రం

మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు రోజులు ప్రయత్నం చేయకుండా దొరికిందే తింటూ ,చివరి మూడు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి .ఇలా పన్నెండు రోజులు దీక్షగా  చేస్తూ , వెంటనే ఫలితం రావాలంటే పగలంతా నిల్చునే ఉండాలి .రాత్రిళ్ళు కూర్చునే ఉండాలి .సత్యం మాత్రమే మాట్లాడాలి .చెడు సాంగత్యం పనికి రాదు .’’రౌరవం ‘’,’’యౌదాజయం ‘’అనే సామలను గానం చేస్తూ ఉండాలి .చివరికి దేవతా తర్పణం మొదలైనవి చేసి ,దేవతలకు నైవేద్యం పెట్టి తినాలి .ఈ పన్నెండు రోజుల తపస్సును ‘’క్రుచ్చ్రం ‘’అంటారు .

అతి క్రుచ్చ్రం

పైన చెప్పిన నియమాలన్నిటిని పాటిస్తూ ,కుడి చేతిలో పట్టినంత అన్నాన్ని మాత్రమె రోజుకు ఒక సారి తినాలి .అదే అతి క్రుచ్చ్రం .

క్రుచ్చ్రాతి క్రుచ్చ్రం

ఈ రెంటికి మించిన ఘోర తపస్సు .పన్నెండు రోజులూ నీటిలోనే ఉండాలి .మిగిలిన నియమాలన్నీ పై మాదిరే .ఈ మూడు తపస్సులు చేస్తే పాపాలు నశిస్తాయి

ప్రాయశ్చిత్తాలు

.శాస్త్రం చెప్పినట్లు చేయక పోవటం ,నిషేధించిన పనులు చేయటం ,సమాజానికి హాని కలిగేవి చేయటం పాపాలు అని పించుకొంటాయి .పాపాలకు చేసే ప్రతీకారమే ప్రాయశ్చిత్తం .అనేక రకాల పాపాలకు వాటికి తగిన ప్రాయశ్చిత్త విధులున్నాయి .ఉదాహరణకు –అశ్లీలం లేక బూతు మాట్లాడితే ‘’దదిక్రా వ్ణో అకార్షం ‘’మొదలైన సామలను గానం చేయాలి .ఎవరినైనా దూషిస్తే ప్రాయశ్చిత్తం గా ‘’ఇదం విశ్నుర్వి చక్రమే ‘’సామను చదవాలి .తలిదండ్రులను గురువును దూషించిన పాపం పోవటానికి ‘’తమాహం సోమ రారణ ‘’సామ చదవాలి .ఇలా ఎన్నో ఉన్నాయి .

కామ్య కర్మలు

ఆయుర్దాయం పెరగటానికి ‘’తు చే తునాయ ‘’మొదలైన సామలతో తెల్ల ఆవాలను మంత్రించి ప్రతి రోజూ తినాలి. చిన్న చిన్న రోగాలకు ‘’శం నొ దేవీ రభీస్టయే ‘’సామతో నేతిని మంత్రించి రోజూ శరీరానికి రాసుకోవాలి .సర్ప భయం లేకుండా చేసుకోవటానికి శంఖ పుష్పి ,సర్ప గంధ లను నూరి గుళిక చేసి దగ్గరుంచుకొని ‘’చర్శానీ ద్రుతం ‘’ సామ తో  మూడు సార్లు అగ్నిలో హోమం చేయాలి .అప్పుడు ఆ  గుళికను మెడలో కట్టుకోవాలి. విషం తిన్నా హాని చేయకుండా ఉండటానికి ‘’త్వమిమీ ఓషధీ ‘’సామను రోజూ గానం చేయాలి .ముసలితనం మృత్యువు రాకుండా దుంపలు పండ్లూ తింటూ ,జింక తోలు ధరించి మౌనం గా నెల రోజులు అడవిలో ఉండి పుష్య పూర్ణిమ నాడు  ‘’ఉద్వయంత మసస్పరి ‘’అనే సామ తో సూర్యుడిని పూజించాలి .ఇలా నాలుగేళ్ళు చేస్తే జరా మ్రుత్యువులు దూరం .

దేవతాధ్యయన బ్రాహ్మణం

అగ్ని ,ఇంద్రుడు ,ప్రజాపతి ,సోముడు ,వరుణుడు ,త్వష్ట ,అంగిరసుడు ,పూషా ,సరస్వతి ,ఇంద్రాగ్నులు కలిసి పది మంది సామ గానానికి అది దేవతలు .కాలేయం రౌరవం మహోత్సవం మొదలైన సామలకు దేవత అగ్ని .వామ దేవ్యం ,సామకు ప్రజాపతి దేవత .ఔశన కావం అనే సామకు సోముడు దేవత .యజ్న యజ్నీయం కు వరుణుడు,వార వంతీయం ,ఆభీవర్తనం సామలకు త్వస్ట దేవతలు .స్వ్హ ప్రుస్టా అనే సామకు అంగిరసుడు ,కౌశీతం ,దైవోదానం మొదలైన వాటికి పూషా దేవతలు .కొన్నిటికి సరస్వతి మరికొన్నిటికి ఇంద్రాగ్నులు దేవతలు .మిగిలిన సామలన్నిటికీ ఇంద్రుడే దేవత .వసువులు ,రుద్రులు ,ఆదిత్యులు విశ్వే దేవులు అనే నలుగురు సామ దేవతలు .ఇంద్రాగ్ని ప్రజాపతులు దేవతలు ఇంకా కుదిస్తే ‘’బ్రహ్మ ‘’ఒక్కడే సామ లన్నిటికీ దేవత

రుక్కు ను తల్లి అని ,గానాన్ని తండ్రి అని ,స్వరాన్ని ప్రజాపతి అంటారు .గాయత్రి అన్నా సావిత్రి అన్నా ఒక్కటే .

సంహితో పనిషత్ బ్రాహ్మణం

సామ గాన రహస్యాలను తెలియ జెప్పేది ఈ బ్రాహ్మణం .అధ్యయనం గురు శిష్య సంబంధం ,ధర్మ శాస్త్ర విషయాలు చెప్ప బడ్డాయి .మందరం మాధ్యమం తార అనే స్థాయీ భేదాన్ని బట్టి గానం మూడు రకాలు .వీటికి దేవ సంహిత ,అసుర సంహిత ,రుషి సంహిత మొదలైన సాంకేతిక పదాలనుప యోగించారు .ఆయా గాన ఫలితాలూ చెప్ప బడ్డాయి .గానం చేసేటప్పుడు మూల మంత్రాలలో వచ్చే మార్పులను అంటే ఉన్న అక్షరాలూ జారిపోవటం కొత్తవి చేరటం ‘’హో ,హోఇ.,తాఇ’’మొదలైన విచిత్ర ధ్వనులు ,ద్రుతం విలంబితం మొదలైన వృత్తులు ,స్వర ప్రస్తార విషయాలు ఉన్నాయి. గాన ప్రభావం వలన మూల సాహిత్యం లో కలిగే అనేక మార్పులను సామ వేదమే నాంది పలికింది

స్వాధ్యయనం ఏరోజు మాన రాదనీ సామ జపం వలన యజ్న యాగాలు చేసిన ఫలితం వస్తుందని ప్రోత్సహించింది .

వంశ బ్రాహ్మణం

సామగాన ఋషుల పరంపర ఇందులో ఉంది .’’బ్రహ్మకు ,ఆచార్యులకు ఋషులకు సకల దేవతలకు నమస్కారం ‘’అనే మాటతో ఇది ప్రారంభ మౌతుంది .మిత్ర వర్చాసుడు ,బ్రహ్మ వృద్ధి ,గిరి శర్మ ,నిగడుడు ,త్రాతుడు ,రుద్ర భూతి మొదలైన అరవై మంది సామ గురువుల గురించి వారి గోత్రాల గురించి పేర్కొన బడింది .అందరికీ మొదటి గురువు ‘’బ్రహ్మ ‘’మాత్రమె అన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండి తెర బంగారం కుమారి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత

బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రిసెర్చ్ సెంటర్ -ఇమారత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు-15

బ్రాహ్మణాల కధా కమా మీషు-15

ఉప బ్రాహ్మణాలు

సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,సంహితోపషత్  బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం .మొదటి దానిలో వచ్చే జన్మ లో శాశ్వత సుఖ ప్రాప్తికోసం కృషి చేయాలని ,ఈలోకం లో దుఖాలతో బాధ పడరాదని ధర్మాన్ని అతిక్రమించకుండా ప్రయత్నించాలని ,ఏకోరిక తీరాలో ఆకోరికకు సామలు కూడా చెప్ప బడ్డాయి .

రెండవ దానిలో ఏ సామకు ఎవరు దేవత, అది దేవతలో ,చెప్పారుకనుక ‘’దైవత బ్రాహ్మణం ‘’అయింది .గానం చివర  విని పించే ధ్వనిని బట్టి సామలను కని పెట్టి ,వాటి దేవతలను చెప్పింది .అనేక రాకాల ఛందస్సులు ,రంగులు ,దేవతలు పేర్కొన బడ్డారు .ప్రతీకను ఉపాసించే విధానాలకు బీజం ఇందులో ఏర్పడి నట్లు భావించాలి .మూడవ దాని లో మంత్రం సముదాయాన్ని  సంహిత అంటారని  మనకు తెలుసు .కాని ఇందులో సంహిత అంటే గానం అని అర్ధంఅని గ్రహించాలి సామ వేదం లో రుక్కులే గానం చేయబడి సామలు అని పిలువ  బడ్డాయని మనం చెప్పుకొన్నాం .ఉపనిషత్ అంటే ఇక్కడ ‘’రహస్యం’’ అని అర్ధం .సామ గానం లో ఉండే విశేషాలను రహస్యాలను తెలియ జేసేదికనుక ‘’సంహితోపని షత్ బ్రాహ్మణం అని అన్నారు .నాల్గవ ఉప బ్రాహ్మణమే వంశ బ్రాహ్మణం .వేదాధ్యయనం గురు శిష్య పరంపరగా రావాలని సామల గానం గురువు అనుగ్రహం వలననే పొందాలని ,ఇలా ఈ పరంపరను కాపాడుకొస్తున్న మహర్షుల వివరాలను ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .అందుకే వంశ బ్రాహ్మణం అయింది .ఈ నాలుగు ఉప బ్రాహ్మణాలు కురుక్షేత్ర తూర్పు భాగం లో క్రీ పూ అయిదవ శతాబ్ది లో ఏర్పడ్డాయని భావిస్తారు .

మొదటిది అయిన సామ విధాన బ్రాహ్మణానికి సాయనుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’అనే భాష్యం రాస్తే ‘’పదార్ధ మాత్ర వివ్రుతి’’ అనే భాష్యాన్ని భారత స్వామి చెప్పాడు .ఈయన సామ సంహితకూ భాష్యం రాశాడు .హోసల రాజు రామ నాధుడి పాలనలో శ్రీ రంగం లో సామ సంహితకు భాష్యం రాసి నట్లు తెలుస్తోంది .తరువాతే ఈ బ్రాహ్మణానికి వ్యాఖ్య రాసి ఉంటాడు .రెండవది అయిన దేవతాధ్యాయ బ్రాహ్మణానికి వ్యాఖ్య అవసరమే లేదు .అయినా సాయనుడు భాష్యం రాసినట్లు చెప్తున్నారు .మూడవది అయిన సంహితో పని షత్  బ్రాహ్మణం మొదటిఖండం వరకు సాయణ భాష్యాం తో దొరుకుతోంది .చివరిదైన వంశ  బ్రాహ్మణానికి సాయన భాష్యం దొరుకు తోంది .ఈ నాలుగింటిలోని విశేషాలను ఇప్పుడు తెలుసుకొందాం

ఆడ పిల్లను మనకు నచ్చిన వాడిడికి ఇచ్చి పెళ్లి చేయాలనీ చెప్పింది మొదటి బ్రాహ్మణం .దీనికి ఒక మార్గమూ సూచించింది పిల్ల తండ్రి అమా వాస్య రాత్రి నాలుగు దారుల కూడలి లో అమ్మాయిని కూర్చో బెట్టి ‘’ఏ హ్యూషు బ్రవాణితే ‘’ అనే సామ ను మూడు సార్లు అభిషేకం చేయాలి .ఇలా మూడు అమావాస్యల్లో మూడు సార్లు చేస్తే పిల్లకు ఇష్టమైన వాడితో పెళ్లి అవుతుంది అని కిటుకు చెప్పింది .

రెండవ దానిలో ఛందస్సుకు సంబంధించ ఎన్నో వివరాలున్నాయి .వేదం, సావిత్రీ దేవి, సత్యం నన్ను కాపాడు గాక అని ‘’బ్రహ్మ సత్యం చ పాతు మాం ‘’అనే సామ చాలా ప్రాముఖ్యమైనది .అంటే జ్ఞానం సావిత్రీ దేవి శాశ్వత సత్యం మనల్ని ఎప్పుడూ కాపాడాలని అర్ధం .నాల్గవ బ్రాహ్మణం లో సామ గానం చేసే వాళ్ళకు ,సామగాన విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి చింతామణి లాంటిది .యోగ్యుడైన శిష్యుడు దొరక్క పోతే గురువు విద్యనూ తన దగ్గరే ఉంచుకోవాలని అయోగ్యుని చేతిలో ఉంచరాదని చెప్పింది .నాల్గవ దానిలో సామ గాన మహర్షుల పూర్తీ వివరాల తో బాటు ,వంశ క్రమం ,చెప్పి ఏ సందేహం వచ్చినా తీర్చే విధం గా ఉంది  .

సామం గొప్పతనం

సామ విధాన బ్రాహ్మణం లో సామ యొక్క గొప్ప తనం చెప్ప బడింది .మొదట బ్రహ్మం అనే పదార్ధం మాత్రమె ఉంది .దాని నుంచి హిరణ్య గర్భుడు ఉదయించాడు .ఆయన  మనసు  లో నుంచి ప్రజా పతి ఉద్భ వించాడు .ప్రజాపతి అంటే మనస్సు .అతడు చరాచర సృష్టిని చేశాడు .తన సృష్టికి సామ ను జీవన సారం గా ఇచ్చాడు .సప్త స్వరాలతో కూడిన సామమే  దేవతలకు ,పితరులకు ,మానవ ,పశు పక్ష్యాడులకు జీవనోపాయం కనుక సామను ‘’అన్నం ‘’అని అన్నారు .సామ స్వరూపం వాక్కు .వాక్కు రూపమే రుక్కు .సమానం కనుక సామ అయింది .అంటే అనేక రకాల ఛందస్సులకు ఇది సమానం .సామ తత్వాన్ని తెలుసు కొంటె ఇహ లోకం లో ప్రతిష్ట పెరుగుతుంది .దీని అంతరార్ధం ఏమిటంటే -చక్కని గానమే సామం .దానికి సప్త స్వరాలు మూలం .భావంతో సాహిత్యాన్ని జోడించి గానం చేస్తే అమృతం లాగా ఆప్యాయం అవుతుంది .గానామృతం తో పరవశించని ప్రాణి సృష్టిలో లేదు. లోకానికి గాన ప్రాశస్త్యాన్ని ప్రసాదించింది  భగ వంతుడే కనుక గానం యొక్క గొప్ప తనం ఇందులో తెలుప బడింది .

ఒకప్పుడు దేవతలు ప్రజాపతి చెప్పినట్లు యజ్న యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు .అయితే దేవతలా కన్నా తక్కువైన అజులు,ప్రుష్ణులు ,మొదలైన ఋషులు ,వైఖానసులు అనే మంత్రం ద్రష్టలు ,మానవులు వెళ్లి తమకు స్వర్గం చేరే మార్గాన్ని చెప్పమని తమ తండ్రి  ప్రజాపతి ని అడిగారు. ‘’స్వాధ్యయనం ‘’అంటే యజ్ఞాలలో విధింప బడ్డ సామలను గానం చేయటం ,తపస్సు వల్లస్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు .వీరందరూ సామాధ్యయనం చేసి స్వర్గం పొందారు .

తపస్సు

శరీరాన్ని వేడెక్కించి ఇంద్రియాలను అదుపు లో ఉంచుకోవటానికి చేసే సాధనే తపస్సు .ఇందులో క్రుచ్చ్రం ,అతి క్రుచ్రం ,క్రుచ్చాతి క్రుచ్చ్యం అని మూడు రకాలున్నాయి .వీటిగురించి వివరాలు తరువాత తెలుసుకొందాం

సశేషం –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ

 

సాహితీ బంధువులకు శుభ కామనలు- నేను రాసిన ఎనిమిదవ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న పదమూడవ  పుస్తకం  ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’’పుస్తకం  ,సరస భారతి ,స్థానిక ఏ.జి.అండ్ ఎస్ జి సిద్దార్ధ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహింపబడుతున్న సభలో  ‘’28-8-2014గురు వారం ఉదయం 10గం .లకు ముఖ్య అతిధి ,ఆంద్ర ప్రదేశ్ శాసనసభ  ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరింప బడుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .ఈ సభలో శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు ,ముఖ్య కార్య దర్శి డా .జి.వి.పూర్ణ చంద్ గారు ,రమ్య భారతి మాసపత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటున్నారు .

ఈ పుస్తకానికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అని, వారి బావ గారైన డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారికి, వారి 90వ జన్మ దినోత్సవం 28-8-14-గురువారం నాడు అంకిత మిస్తున్నామని   ప్రముఖ రచయిత ,ప్రఖ్యాత వరంగల్ డాక్టర్ శ్రీ లంకా శివ  రామ ప్రసాద్ గారు దీనికి సమీక్ష రాస్తున్నారని  మరొక సారి గుర్తు చేస్తున్నాను .

పూర్తీ వివరాలతో  ఆహ్వాన పత్రికను ఆగస్ట్ మొదటి వారం లో అందజేస్తామని తెలియ జేస్తున్నాను .

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-14-ఉయ్యూరు .

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్

ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్

ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి  త్రయాన్ని   అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. ఆమెయే కాతలీన్ రైన్ .

రైన్ 1908 జూన్ పద్నాలుగున బ్రిటన్ లోని ఎసేక్స్ లో ఇల్ ఫోర్డ్ లో జన్మించింది .తల్లి స్కాట్ లాండ్ స్త్రీ .తండ్రి రుర్హాం వాసి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో నార్త్ అంబర్ ల్యాండ్  లో అమ్మ తరఫు బంధువుల   దగ్గర గడిపింది .అక్కడి పరిసరాలు ఆమె లో కవిత్వ ధారకు సహకరించాయి. పులకించిన ప్రకృతిని చూసి కవిత్వం ఉప్పొంగి వచ్చేది .వారి భౌతిక జీవితాలలో కవిత్వానికి స్థానమే లేదని గ్రహించింది .ఈ విషయాలను తన జీవిత చరిత్ర ‘’ఫేర్ వెల్ హాపీ ఫీల్డ్స్ ‘’లో రాసు కొన్నది .ఉదయం సాయంత్రం బైబిల్ ను శ్రద్ధగా చదివి   బట్టీ పట్టి   స్పూర్తి పొందింది .కవిత్వం అంటే జీవిత సారం అని భావించింది .తండ్రి హైస్కూల్ లో ఇంగ్లీష్ మేస్టార్ అవటం తో ధిసీస్ కోసం వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని ఎంచుకొన్నాడు  .షేక్స్ పియర్ అన్నా వీరాభి మానం ఉండేది ఆయనకు  .కనుక చిన్న పిల్లగా ఉండగానే తండ్రి తో షేక్స్పియర్ నాటకాలకు వెళ్లి చూసేది . వ్యాకరణం, శబ్ద శాస్త్రం మీద విపరీత మైన అభిమానమేర్పడింది .కవిత్వాన్ని ముఖతా చెప్పటం ఆమెకు ఎంతో ఇష్టం గా ఉండేది .నార్త్ అంబర్ లాండ్ ను ఈడెన్ గా భావించి పులకించేది .తనకు కవిత్వం భగవంతుడిచ్చిన వరం అని అనుకొన్నది .అదేమీతను  కనీ పెట్టిన విద్యకాదన్నది .కవిత్వ వాతావరణం లో పెరగటం వలన కవికావాలనే ద్రుష్టి ఏర్పడిందని చెప్పింది .కవులు ఈ ప్రపంచానికి చెందని వారుగా వేరే స్థాయిలో  ఉండేవారుగా ఆమె తండ్రి భావించేవాడు .అయిదవ  గాస్పెల్  మీద ద్రుష్టి పెట్టమని చెప్పేవాడు. తల్లి ఆమె కవిత్వాన్ని ప్రోత్సహించేది .

ఇల్ ఫోర్డ్ కౌంటి హైస్కూల్ లో  బాటనీ జువాలజీ లైన నేచురల్ సైన్స్ లను చదివింది .1929లో కేం బ్రిడ్జి లో మాస్టర్ దిగ్రీపొందింది .అప్పుడు ఆమెకు జాకబ్  బ్రౌన్స్కి ,విలియం  ఎంప్ సన్ వంటి కవులు రచయితలతో పరిచయ మేర్పడింది .కబ్బాలిష్ రచయిత ఉపాధ్యాయుడు అయిన షిమాన్ హల్వేలి తో జీవితాంతం స్నేహం  నెరపింది.1930 లో హాగ్ డేవిస్ ను పెళ్ళాడి ,వదిలేసి చార్లెస్ మద్గే ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనివదిలేసి గావీన్ మాక్స్ వెల్ ను ఆరాధించింది  .అతను ‘’రింగ్ ఆఫ్ బ్రైట్ వాటర్ ‘’నవలా రచయిత . దీన్ని సినిమాగా కూడా తీశారు .,దీనికి ప్రేరణ రైన్ రాసిన కవిత ‘’ది మారేజ్ ఆఫ్ సైక్’’.ఆమె పెంపుడు కుక్క ‘’మిజ్బి ‘’మరణానికి మాక్స్స్ వెల్ బాధ్యుడని ,హోమో సెక్సువల్ అని భావించిశాపనార్ధాలు పెట్టి అతడిని వదిలేసింది . పాపం అతను కొద్ది రోజుల్లోనే కేన్సర్ వచ్చి చనిపోయాడు .ఇలా జరగటానికి  అతని మరణానికి తనే కారకురాలని తెలుసుకొని పశ్చాత్తాప పడింది .భర్త మరణం తర్వాత పిల్లలిద్దరితో పెన్ రిత్ లో కాపురముంది .పిల్లల పెళ్ళిళ్ళు చేసింది .ఒకరికి నియో ప్లాటోనిస్ట్ అయిన టేలర్ వరాసు లతో బాంధవ్యం ఏర్పడింది  . ఇదే  టేలర్ పై  పరిశోధనకు దారి చూపింది .ఒక ప్రమాదం లో రైన్ లండన్ లో 2003 జులై ఆరున 95వ ఏట మరణించింది .

స్టోన్ అండ్ ఫ్లవర్ అనే మొదటి కవితా సంపుటిని 1943లో ప్రచురించింది .తర్వాతా ‘’లివింగ్ ఇన్ టైమ్స్ ,ది పైతోనేసేస్ ,కలేక్తేడ్ పోయెమ్స్ వరుసగా ప్రచురించింది .’’హు ఆర్ వుయ్ ‘’అనే క్లాసిక్ రచన చేసింది .’’బ్లేక్ అండ్ ట్రడి షాన్ ‘’పేరా రెండు భాగాలుగా రాసింది . అమెరికాలోని వాషింగ్ తాన్ లో నేషనల్ గాలేరీ ఆఫ్ ఆర్ట్స్ లో విలియం బ్లేక్ పైన అన్ని విషయాలను సాకల్యం గా చర్చించి అద్భుతమైన ఉపన్యాసాన్ని 1968లో చేసి అందరిని ఆకట్టుకొని బ్లేక్ పై తనకున్న ఆరాధనను ఆయన గొప్పతనాన్ని ఎన్నో ఉదాహరణ లతో అనర్గళం గా మాట్లాడి ఆశ్చర్య పరచింది .సాంప్రదాయ ఫిలాసఫీకి భిన్నం గా బ్లేక్ చేసిన సిద్ధాంతాల పూర్వా పరాలను సమీక్షించింది .

మూడు భాగాలలో వచ్చిన ఆమె స్వీయ జీవిత చరిత్ర ఆమె మన తో మాట్లాడుతూ కబుర్లు చెప్పేంత గొప్పగా ఆకర్షణీయం గా ఉంటుంది .బాల్జాక్ రాసిన ‘’కజిన్ బెట్టె’’ను ‘’లాస్ట్ ఇల్లూజిన్స్ ‘’(lost illusions)ను అద్భుతం గా ఇంగ్లీష్ లోకి అనువదించింది .త్రైమాసిక పత్రిక అయిన ‘’స్టడీస్ ఇన్ కంపారటివ్ రెలిజియన్ ‘’కు వ్యాసాలను రాస్తూనే ఉంది .ఈ పత్రిక రెలిజియస్ సింబాలిజం ట్రాఫిడిషల్ పెర్స్పెక్టివ్ నెస్ అంటే మతాత్మిక ప్రతీకాత్మతకు సాంప్రదాయ దర్శన శాస్త్రానికి ప్రాముఖ్యత నిస్తుంది .’’టేమనాస్ ‘’అనే పత్రికన  మరి ముగ్గురితోకలిసి స్థాపించింది .ఇదే తర్వాత అకాడెమీ గా మారి వివిధ విశ్వ విద్యాలయలాలో జరిగే ఫిలాస ఫి విషయాలను పర్య వేక్షించింది .కవిత్వం లో ప్లాటో నిజాన్న్న్ నియో ప్లాటో నిజాన్ని గూర్చి సమగ్ర చర్చ చేసింది .పద్దేనిమోదో శతాబ్దికి చెందిన ఇంగ్లీష్ ప్లాటోనిస్ట్ అయిన థామస్ టేలర్ పై గొప్ప అధ్యయనం చేసి రాసి  పుస్తక రూపం లోకితెచ్చింది .

గిర్ట న్  కాలేజి లో 1955నుంచి ఆరేళ్ళు రిసెర్చ్ ఫెలో గా ఉంది .మిత్ అండ్ లిటరేచర్ ను హార్వర్డ్ యూని వర్సిటి లో లేక్చరర్ లకు  ప్రొఫెసర్ లకు వేసవి తరగతుల్లో బోధించింది .సిగో లో ఉన్న యేట్స్ స్కూల్ లో బ్లేక్ మీద యేట్స్ మీద ఎన్నో ప్రసంగాలు చేసింది .కేం బ్రిడ్జిలో ప్రొఫెసర్ గా  అనేక విశిస్ట రచనలు చేసిన  కాతేలీన్ రైన్ కాల్ రిడ్జి ,బ్లేక్  యేట్స్ ల  పై పూర్తీ అధారిటీ ఉన్న ఆమె .  ఇంగ్లాండ్ అమెరికా ,ఫ్రాన్స్ దేశాలు రైన్ కు ఎన్నో విశిష్ట గౌరవాలిచ్చి సత్కరించాయి .అమెరికన్ పోయెట్రి అసోసియేషన్ ‘’విన్సెంట్ మిల్లె ప్రైజ్ ‘’నిచ్చి సత్కరించింది .హారియట్ మన్రో అవార్డ్ ,ఆర్ట్స్ కౌన్సిల్ అవార్డ్ ,ఆస్కార్ బ్లూ మెంతల్ అవార్డ్ ,కాల్మొండలీ ఆవార్డ్ ,స్మిత్ లిటరరీ అవార్డ్ ,క్వీన్స్ గోల్డ్ మెడల్ ,ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ,లి ఆర్డర్ దేశ ఆర్ట్స్ అవార్డుల వంటి ఎన్నో ప్రముఖ పురస్కారాలను అందుకొన్నది .

పది హీను కవితా సంపుటాలను కేతలీన్ వెలువరించింది .పద్నాలుగు వచన గ్రంధాలను రాసి ముద్రించింది .’’ఫేర్ వెల్ హాపీ ‘’,ది లాండ్ అన్ నోన్ ,’’,’’దిలయన్స్ మౌత్ ‘’,ఆటో బయాగ్రఫీస్ ‘’పేరిట స్వీయ జీవిత చిత్రణ చేసుకొన్నది .

 

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

”యద్భావం తద్భవతి ”అన్న స్వామి పరి పూర్ణానంద

యద్భావం తద్భవతి

Published at: 04-07-2014 07:00 AM

దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. హిందువులందరూ అతి ప్రధానంగా పరిగణించే సూత్రం ‘యద్భావం తద్భవతి’.

అందుకే చెట్టు, పుట్ట, వుట్టి, గుట్ట, కొండకోన, వాగువంక, నింగినేల ఇలా కనిపించే సవుస్తాన్ని పరవూత్మకు ప్రతిరూపాలుగా భావించడం హిందూ ధర్మంలో పరిపాటి. ప్రకృతిలో ఏ ఒక్కటీ పరవూత్మకు వేరు కాద నేది ఒక పరవు సత్యం. ‘ఈశావాస్యమిదం సర్వం’ అని ఉపనిషత్తులు ‘నారాయణా ఏవేతి ఇదం సర్వం’ అని సూక్తాలు ‘వుత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి’ అని భగవద్గీత ఇందు గలడందులేడని సందేహవుు వలదు’ అని భాగవతం. ఇలా హిందూ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. హిందువులు వీటి ఆఽధారంగా కనిపించే ఈ చరాచర సవుస్తాన్ని ఆరాధించే ఒక వుహోన్నతమైన సంస్కృతిని అలవర్చుకున్నారు. అందులో భాగంగానే దేవతలు, గ్రావు దేవతలు, కొండదేవతలు ఇలా రకరకాలుగా ఆరాధించే వైవిధ్యమైన ఆచారాలున్నాయి. వీటితో పాటు జ్ఞానాన్ని బోధించే గురువులను, వుంత్రోపదేశం చేసే వుహనీయులను, వునసుకు స్వాంతన చేకూర్చి, వూర్గాన్ని సూచించే వుహాత్ములను కూడా పూజించడం శిష్యులు, భక్తులు అనుయాయుల వంతు. ఈ విధంగా వ్యక్తులను పూజించి ఆరాధించే సంస్కృతి కూడా హిందూ ధర్మంలో ఉంది. వుంత్రాలయం కేంద్రంగా తెలుగు ప్రాంతంలో దాదాపు ఊరికో రాఘవేంద్రస్వామి ఆలయం వెలిసింది. నిత్యవుూ రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అలాగే రావుకృష్ణ వుఠంలో రావుకృష్ణ పరవుహంస, శారదావూతలనే ఆరాధిస్తారు. అక్కడ నిత్యం భక్తులు, ఆరాత్రికం, అర్చనలు నిర్వహిస్తుంటారు. సత్యసాయిబాబానే దైవంగా భావించి పూజావుందిరాల్లో వారి ప్రతివునే ప్రధానంగా ఉంచి ఆరాధించే భక్తులున్నారు. ఇలా వుహనీయులను, వుహాత్ములను, గురువులను, జగద్గురువులను పూజించే ఆచారం హిందూధర్మంలో ఉంది. దీనిని ఆలంబన చేసుకుని ప్రస్తుతం షిర్డీసాయి దేవాలయాలు వీధికొకటి చొప్పున వెలుస్తున్నాయి. ఇది భక్తుల్లో సాయిబాబాపై పెరిగే విశ్వాసానికి సంకేతవుని చెప్పవచ్చు. అయితే ఈ అంశం పట్ల ద్వారకా పీఠాధిపతి స్వరూపానందస్వామి, షిరిడీ సాయిబాబా దేవుడు కాదని చేసిన వ్యాఖ్యలు పెను దువూరమే లేపాయి. ప్రత్యేకించి తెలుగువారిని ఈ వ్యాఖ్యలు వురింత ఎక్కువగా కలవరపరిచిన వూట వాస్తవం. సాయిబాబా దేవుడా? కాడా? అన్నింటిలో దైవాన్ని చూసే హిందువుకు సాయిబాబా వూత్రం దేవుడు కాకుండా పోతాడా? ఆయన కూడా దేవుడే. ఆయనలో దైవత్వాన్ని సంతరించుకున్న భక్తులు ఆయనను దైవంగా ఆరాధిస్తారు. ఇది పూర్తిగా వారి విశ్వాసంపై ఆధారపడిన అంశం. ఆయన కొన్ని వుహివులు చూపారని దుఃఖంలో దరిచేరిన వారికి స్వాంతన కలిగించారని చెబుతుంటారు. అలాగే ఆయన నమ్మిన సూత్రం ‘సబ్‌కా వూలిక్‌ ఏక్‌’. ఎవ రు ఎన్ని విధాలుగా పిలిచినా, ఎన్ని రకాలుగా తలచినా, దైవంలో వైవిధ్యం లేదు. అందరికీ ప్రభువు దేవుడే. అది ఒక్కటే సత్యం, అదే శాశ్వతం అని బాబా బోధన. ‘ఏకం సత్‌’ సత్యవుు ఒక్కటే. అదే దేవుడు. అందులో నానాత్వాలు, భేదాలు లేవని ఉపనిషత్తులు ఘోషించాయి. ‘ఏక్‌ సత్‌ నావ్‌ు’ ఒక్కటే సత్యవుు. రెండవది లేదు అన్నది సిక్కులు నమ్మిన వుూల సిద్ధాంతం. ఈ ఉపనిషత్తుల సారాన్ని బాబా భక్తులకు బోధించారని చెబుతుంటారు. వాస్తవానికి బాబా ఎప్పుడూ ‘నేనే భగవంతుణ్ని’ అంటూ ప్రకటించుకోలేదు. ఒకవేళ అలా చెప్పే ఉంటే ఈరోజు ఇన్ని లక్షల వుంది బాబాను ఆరాధించే వారు కాదు. భక్తులు ఆయన బోధనలను స్వీకరించారు. ఆయనలో దైవత్వాన్ని ద ర్శించారు. ఆయనను భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారు. అయినా, ఈయనే దేవుడని గానీ, ఈయన దేవుడు కాదని గానీ ఎవరు నిగ్గు తేల్చగలరు? ఈ అంశంపై ఏ ఒక్కరూ ప్రవూణం కాదు. అందుకే ‘ఎంత వూత్రం ఎవ్వరు తలచిన అంతవూత్రమే నీవు’ అంటూ అన్నవుయ్య తన కీర్తనల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి ఏ దేవుడికైనా, తానే దేవుడని చెప్పుకోవలసిన దుస్థితి రాకూడదు. ఎవరైనా ‘నేను దేవుడ్ని. నన్ను నవ్ముండి’ అంటే ఏ సవూజమైనా ఎలా నవు్ముతుంది? కొందరు నమ్మిన దానిని వేరే కొందరు అంగీకరించకపోవచ్చు. నాణానికి బొవ్ము, బొరుసు ఎలా ఉంటాయో, దైవం విషయంలో కూడా విశ్వాసం, అవిశ్వాసం అనే రెండు అంశాలు ఉంటాయి.

విశ్వాసాన్ని కుదిపేసి దెబ్బతీసే సత్తా వివుర్శకే ఉంటే, వురి విశ్వాసానికి బలం లేనట్లే కదా! బాబా దేవుడా? కాదా? అన్నది బాబాను భక్తితో కొలిచే లక్షలాది భక్తుల విశ్వాసంపై ఆధారపడే అంశమే గానీ, ఒక వివుర్శకు సంబంధించిన అంశం అసలు కానే కాదు. ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు సవుంజసమేనా? భారతదేశం అతి పెద్ద ప్రజాస్వవ్యు దేశం. ‘వాక్‌ స్వేచ్ఛ’ అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ‘‘రావుుడు దేవుడే కాడు. ఆయన ఇంజినీరింగ్‌ చదివాడా? రావుుడు మిథ్య, రావూయణం మిథ్య’’ అని ఆనాటి తమిళనాడు వుుఖ్యవుంత్రి కరుణానిధి బహిరంగంగానే వివుర్శించారు. అలాగే కృష్ణుడ్ని, జారుడు, చోరుడు అంటూ నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించినవారూ ఉన్నారు. సినివూల్లో హిందూ ఆచారాలను, బ్రాహ్మణులను, సాధువులను కించపరిచి చిత్రీకరించిన వారున్నారు. మేవుు గట్టిగా ఉమ్మేస్తే, మీ హిందూ దేవతలు వూ ఉవు్ములో కొట్టుకుపోతారని ప్రజా ప్రతినిధులే నిస్సిగ్గుగా బహిరంగంగా వివుర్శిస్తున్నారు. అసలు మీ దేవుడికి ఏం శక్తి ఉంది? కోతిని మీరు ఆంజనేయస్వామిగా కొలుస్తారు, ఏనుగును వినాయకుడిగా కొలుస్తారు. మీ దేవుళ్లు జంతువులా? అని రకరకాలుగా వివుర్శించే వుతాలు కూడా ఉన్నాయి. శివుడి గుడికి వెళ్లకూడదు. శివాలయ ప్రవేశం వుహాపాపం. శివాభిషేక తీర్థం వుహావుహా పాపం అని వివుర్శించే కొన్ని పొద్దుపోని సంప్రదాయాలు పనిగట్టుకుని వివుర్శిస్తున్నాయి. దీనిని ఏవునాలి? వివుర్శగా పరిగణించాలా? లేక భారత రాజ్యాంగం ఇక్కడ ప్రజలకిచ్చిన వాక్‌స్వేచ్ఛ అనుకోవాలా? ఇలాంటి వివుర్శలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోదు. అందుకే వీటికి శిక్షలు లేవు. దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. వివుర్శను కొన్ని సందర్భాల్లో నిజాల నిగ్గుతేల్చడానికి ఉపయోగపడే అంశంగా పరిగణించాలి. వివుర్శలను భక్తుల విశ్వాసానికి గీటురాయిగా కూడా చెప్పవచ్చు. ద్వారకా పీఠాధిపతి కూడా ఈ స్వేచ్ఛతోనే సాయిబాబా దేవుడు కాడని వ్యాఖ్యానించారు. ఈ స్వేచ్ఛతో ఎవరైనా దేన్నయినా వివుర్శించవచ్చు. దీనికి భక్తులు బాధపడవచ్చునేమో గానీ, న్యాయస్థానాలు వూత్రం ఈ విషయాల్లో కలుగచేసుకోలేవు. ఏమైనా, వివుర్శలు మితిమీరి, వుత చాంధసాలను రెచ్చగొట్టి వూరణ హోవూలకు పాల్పడకూడదు. వివుర్శలు భక్తుల విశ్వాసాన్ని నిగ్గుతేల్చి, భగవంతుని పట్ల గల విశ్వాసాన్ని వురింత దృఢతరం చేస్తాయి. వలికంగా నవ్ముకం, అపనవ్ముకం అనేవి పూర్తిగా వ్యక్తిగత అంశాలు. వాటిపై ఎవరూ అంత తీవ్రవంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క హిందువులకే కాదు, భారత దేశంలో బతికే ప్రతి వుతానికీ వర్తిస్తుంది. ఒకరి విశ్వాసాన్ని వురొకరు వివుర్శించినంత వూత్రాన ఆ విషయాన్ని ఎవరూ రాద్ధాంతం చేయాల్సిన పనే లేదు. ఎవరి సంస్కారం వారిది. ‘దేవుడు’ అనేది అంతరంగంలో మెదిలే విశ్వాసానికి సంబంధించిన అంశం. మీరు నమ్మితే దాన్ని వురింత దృఢతరం చేసుకోండి. నవ్ముని వారి గురించి, నవ్ముకాలను వివుర్శించే వారిగురించి తీవ్రంగా ఆలోచించి మీ కాలాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ వివుర్శించినవారు సైద్ధాంతిక చర్చకు సిద్ధపడితే, చర్చించి వారి నోరు వుూయించండి. లేకుంటే, మీ విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా చూసుకోండి. బాబా భక్తులకు ఇదే నా విజ్ఞప్తి.

– స్వామి పరిపూర్ణానంద

9849028565

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -14

బ్రాహ్మణాల కదా కమామీషు -14

ఛాందోగ్య  బ్రాహ్మణం

ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి  .గృహ్య సూత్రాలకు ఇది మార్గ దర్శి .ఇందులోని చివరి ఎనిమిది ప్రపాఠకాలను ‘’ఛాందోగ్య ఉపనిషత్ ‘’అంటారు .

ఈ బ్రాహ్మణం లో రెండు ప్రపాఠకాలు ,ఒక్కొక్క టి ఎనిమిది ఖండాలుగా ఉన్నాయి మొదటి దానిలో 136,రెండవ దానిలో 121మంత్రాలున్నాయి .ఎనిమిదవ శాతబ్దికి చెందినది .దీనికి గుణ విష్ణువు ‘’ఛాందోగ్య మంత్రం భాష్యం ‘’,సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’పేర్ల తో వ్యాఖ్యానాలున్నాయి .ఈ బ్రాహ్మణం వివాహం ,గర్భాదానం ,సీమంతం మొదలైన గృహ కర్మలకు ప్రాధాన్యమిచ్చింది .కనుక మిగిలిన వాటికంటే ప్రత్యేకతను పొందింది .వివాహ సమయం లో వరుడు వధువుతో  ‘’నీ హృదయం అంటే ణనీ అభీష్టం నాది కావాలి .నా హృదయం నీదికావాలి .మనిద్దరి ఆలోచనలు అభిలాషలు ఒకటికావాలి ‘’అని అంటాడు ఇది ఏంతో ఉదాత్త విషయం .వివాహ ప్రయోజనం ,గృహస్తాశ్రమ వాసం బాగా వివరింప బడింది .కుటుంబం లో స్త్రీ మకుటం లేని మహా రాణి కుటుంబ గౌరవ ప్రతిష్టలు ఆమె మూలం గా నే వృద్ధి చెందుతాయి అని చెప్పబడి ఉండటం తో అ నాడు స్త్రీకి ఉన్న అధిక ప్రాధాన్యం తెలుస్తోంది .వరుడు ‘’అత్త వారింట్లో అత్త మామ ఆడ బిడ్డలు  బావలు బావ మరదులు మొదలైన వారందరిని ప్రేమాను బంధాలతో బాగా చూస్తూ ఇంటికి దీపం లాగ యజమానురాలు లాగా ఉండు ‘’అని వధువుతో అంటాడు మహిళామతల్లి బాధ్యతలను బాగా గుర్తు చేసిన బ్రాహ్మణం .సమాజం లో స్త్రీకి అత్యంత ఉన్నత స్తానాన్నిచ్చిన బ్రాహ్మణం ఇది .

దంపతులు కలిసి మెలిసి జీవిస్తే స్వర్గం అని చెప్పింది .ఇంట్లో పశువులు ,బిడ్డలు ,అపారమైన దనం ఉంటె కాపురం పాడి పంటలతో కళకళ లాడుతుందని ,సతీపతుల హృదయాలు ఏకమై అన్యోన్యం గా ఉంటె సంసార రధం చక్కగా సాగుతుందని చెప్ప బడింది .వివాహం తర్వాత వరుడి ఇంట్లో గృహ ప్రవేశం జరిగినప్పుడు ఒకే శయ్యపై నూతన దంపతులను కూర్చోబెట్టినప్పుడు వరుడు వధువుతో ‘’ఈ ఇంట్లో ధైర్య సాహసాలతో ఉండు .ఇక్కడే నాతో సుఖించు .నీకు ,నీ బంధువర్గానికి నాపై ప్రసన్న భావం ఏర్పడేలా ప్రవర్తించు .నాతో అనురాగం తో మెలగు ‘’అంటాడు .మగ పిల్లలే ఎక్కువగా పుట్ట్టాలని కోరుకొంటాడు .

గ్రామాంతరం వెళ్లి వచ్చిన తండ్రి కొడుకు శిరస్సును తాకుతూ ‘’అంగా దంగా త్సం స్రవసి’’ అనే మంత్రం చదివి దీర్ఘాయుస్సు  తో జీవించమని  ఆశీర్వ దిస్తాడు .పుత్రుడు ద్రుఢం గా ,తీక్షణం గా సువర్ణంలా తేజస్విశ గా నూరేండ్లు వర్ధిల్లాలని తండ్రి ఆకాంక్ష .పిల్లాడి మూడో ఏడులో ‘’చూడాకరణం ‘’చేయాలి .దీన్ని చేసే మంగలిని ‘’సావిత్రు దేవత ‘’గా భావించాలి ‘’ఆయమగాత్ సవితా క్షురేణ’’అనే మంత్రం వల్లఇది తెలుస్తోంది అంటే పనిలో దేవుణ్ణి చూసే విధానం ఇందులో కానీ పిస్తుంది ..క్షురకర్మ దీర్ఘాయుష్యానికి దోహాదమని చెప్పింది .ఉపనయనానికి ముందు వటువు అగ్ని వాయు సూర్య ,చంద్ర ఇంద్రులనుద్దేశించి హోమం చేయాలి .ఆ దేవతలను పేరు పేరునా పిలిచి ‘’’’దేవతలారా !ఉపనయనం అనే కర్మను అనుస్టింస్తిచ బోతున్నాను .ఈ సంగతి మీకు మనవి చేస్తున్నాను .మీ అనుజ్న తో దీన్ని సుఖం గా చేయగలను .ఇలా చేసి విద్యాభ్యాసం మొదలైన వాటిల్లో సమృద్ధిని సాధిస్తాను .అసత్యాన్ని వదిలి సత్యాన్ని ఆశ్రయిస్తాను ‘’అని అంటాడు

చదువుల్లో నైపుణ్యం ,సత్య వ్రత పాలన ఉపనయనానికి ముఖ్య ప్రయోజనాలని తెలియ జెప్పింది .బ్రహ్మ చారి అగ్ని కార్యం ,గురు శుశ్రూషస మొదలైనవి చేయాలని,పగలు నిద్ర పోరాదని ఈ బ్రాహ్మణం నిర్దేశిస్తోంది .మేఖలా బంధం (నడుం చుట్టూ త్రాడు )చేస్తారు దీని వలన పవిత్రత ,బల వృద్ధి తపో వృద్ధి శత్రు రక్షణ లభిస్తాయి .దీని తర్వాతా శిష్యుడు ఆచార్యుని దగ్గర కూర్చుని తనకోసం అధ్యయనం ప్రారంభించమని వేడుకొంటాడు .ఇలా అధ్యయనం కోసం గురువు చెంతాకు చేరటమే ఉపనయనానికి అర్ధం .గురువు శిష్యునితో మొదటగా గాయత్రీ మంత్రాన్ని చది  వించటం తో వేదాధ్యయనం ప్రారంభ మౌతుంది .గానం చేసే వాడిని రక్షిస్తుంది కనుక ‘’గాయత్రి ‘’అయింది .

పశు క్షేమం ,స్వేచ్చామరణం ,దారిద్ర్య నిర్మూలనం ,కీర్తి అభి వృద్ధి ,శుభ ప్రాప్తి ,ఈశ్వర ప్రసాదం ,పుణ్య లాభం వృత్తిలో నిరాటంకం ,విష నివారణం ,క్రిమి నాశనం మొదలైన ఎన్నో ప్రయోజనాల గురించి వివరించింది .వంకరగా నడిచేవి ,రెండు తలలున్నవి ,తెల్లవి మొదలైన క్రిముల వర్ణన ఉంది .ఆచార్యుడు ,ఋత్విక్కు ,స్నాతకుడు ,రాజు ,వివాహం చేయ దగిన వాడు ,అతిధి లను సత్కరించాలి .ఈ బ్రాహ్మణం ఆ నాటి సాంఘిక వ్యవస్థకు ప్రతీక మాత్రమె కాదు నేటి సామాజికానికి మార్గ దర్శనం కూడా .స్శ్రౌత ,గృహ్య ,ధర్మ సూత్రాలను సంస్కృత వాజ్మయం లో ‘’కల్ప సూత్రాలు ‘’అని మహర్షులేపేరు పెట్టారు .బ్రాహ్మణాలలో ఉన్న మంత్రాలను గ్రహించి వివాహాది కార్య క్రమాలకు గృహ్య సూత్రాలను ఏర్పాటు చేశారు

స్త్రీ పురుషుల  సంగమమే  వివాహం .సంతానానికి కామ మూలకం .కామం సురా మూలకం ..కనుక పెళ్లి చేసుకొనేకన్యను సుర తో అభిషేకించాలి అని చెప్పారు .ఇదిప్పుడు పాటించటం లేదు .కన్య యొక్క ఉపస్థ ఇంద్రియాన్ని ‘’ఆనందేన్ద్రియం ‘’అని బ్రహ్మ దేవుని రెండవ ముఖమని వర్ణించారు .బ్రహ్మ ఒక ముఖం తో వేదాలు చదువుతూ రెండో ముఖం తో సంతానోత్పత్తి చేస్తాడట .ఈ ఇంద్రియం ద్వారానే స్త్రీలు పురుషుల్ని వశ  పరచుకొంటారు .అందుకే అధికారిణులవుతున్నారని చెప్ప బడింది .పురుషుడు స్త్రీ యోని లో రేతస్సు అనే ఆజ్యాన్ని ఉంచటం వల్లనే సంతానం కలుగుతుంది అని యజ్న భాషలో చెప్పారు .కన్యలు ధరించేనూతన  వస్త్రాలను  స్త్రీలే  నేయాలి .కొత్త బట్టలు కట్టిన వధువును భర్త నూరేళ్ళు కాంతిమంతం గా ,ధనవంతురాలుగా జీవించమని ఆశీర్వ దిస్తాడు .పెళ్ళిలో గుండ్రాయిని తోక్కించటం లో విశేషం ఉంది .ఆ రాయిలాగా వధువు స్తిరం గా ఉండిశత్రు బాధ లేకుండా చేసుకోమని సూచన .వధువు తన జ్ఞాతి వర్గాన్ని వృద్ధి పొందించాలని  భర్త దీర్ఘాయుస్సు తో ఉండాలని పేలాల తో అంటే లాజ లతో హోమం చేస్తుంది .సప్త పది లో అన్యోన్యాను రాగం పెరుగుతుంది బలిని అణచిన  విష్ణువును ప్రార్ధించి అగ్ని హోత్రం చుట్టూ ఏడడుగులు నడిపిస్తారు .అన్న  సమృద్ధికోసం మొదటి అడుగు ,బలం కోసం రెండవది ,యజ్ఞం కోసం మూడోది ,సౌఖ్యం కోసం నాల్గవది,పశు సంపదకోసం అయిదవది ,పుష్టికోసం ఆరవది ,సప్త హోమ సాధ్య సోమ యాగం కోసం ఏడవ అడుగు వేయిస్తారు .

‘’ఏక మిషె విశ్నుస్త్యా నయతుహ్  –ద్వే ఊర్జేస్త్వా నయతు –త్రీణివ్రతాయ విష్ణుస్త్వా నయతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వా నయతు –పంచ పశుభ్యో విష్ణుస్త్వ్యా నయతు –షడ్ రాయ  స్పోషాయ విష్ణుస్వ్యా నయతు –సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు ‘’

పెళ్లి లో పాణిగ్రహణం ముఖ్యమైంది .దీనితో వధువుకు అత్తమామలు ఆడ బడుచులు ,మరుదుల మీద అధికారం వస్తుంది .సర్వాధికారి అయి తనకూ బంధువులకూ భర్తకూ సంతృప్తిని ఆనందాన్ని కలిగించాలని భావన .కనుక గృహస్తాశ్రమ ధర్మాలేన్నిటినో ఈ బ్రాహ్మణం తెలియ జేసి మార్గ దర్శనం చేసింది .ఇది సామ వేదానికే చెందినా చాలా సూక్తాలు యజుర్వేదం నుండి గ్రహింప బడ్డాయి .నిత్య కర్మ చేసేవారికి ఇది కరదీపిక .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14—ఉయ్యూరు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంగీతం అంటే సృజన ,ఆధ్యాత్మిక భావన అంటున్న ”స్వర కీర వాణి ”పుట్టిన రోజు

సంగీతమంటే సృజన.. ఆధ్యాత్మిక భావన

Published at: 04-07-2014 06:22 AM

సంగీత దర్శకుడు జె.బి. అనగానే ‘ఈరోజుల్లో’, ‘బస్టాప్‌’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘చంద్రలేఖ’, ‘కొత్తజంట’.. సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవర్స్‌’, ‘కాయ్‌ రాజా కాయ్‌’, ‘మా లైఫ్‌ సినిమా’, ‘మిర్చి లాంటి కుర్రాడు’.. చిత్రాలకు స్వరాలను సమకూర్చింది కూడా అతనే. ఇన్ని సినిమాల సంగీత బాధ్యత భుజాలమీద ఉన్నా తన గురువు కీరవాణి దగ్గర కీబోర్డు ప్లే చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటారు జె.బి. ప్రముఖ స్వరకర్త కీరవాణి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారాయన. శుక్రవారం కీరవాణి పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి గురించి జె.బి. చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ‘చిత్రజ్యోతి’కి ప్రత్యేకం.. జూ ‘ఛత్రపతి’ నుంచి నేను కీరవాణిగారి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు సొంతంగా మ్యూజిక్‌ చేస్తున్నా. కీరవాణిగారి సినిమాలకు పనిచేయడంలో తృప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఆయన దగ్గర కొత్తగా నేర్చుకునే విషయాలు ఉంటూనే ఉంటాయి. జూ నేనే కాదు. సంగీతకళాకారులు అందరూ కీరవాణిగారి దగ్గర పనిచేయడానికి మొగ్గుచూపుతారు. గురువుగారి నుంచి పిలుపు అందగానే ఎంత దూరాన ఉన్నా వచ్చి వాలిపోతారు. కళాకారుల పనికి ఆయన ఇచ్చినంత ఎక్కువ పారితోషికం మిగిలిన వారు ఇవ్వరు. జూ వరల్డ్‌ మ్యూజిక్‌కి సంబంధించి ఆయన దగ్గరున్నంత కలెక్షన్‌ ఇంకెవరి దగ్గరా ఉండదు. అంత గొప్ప కలెక్షన్‌ ఆయన సెల్‌లోనూ, ల్యాప్‌టాప్‌లోనూ ఉంటుంది. ఆయన సెల్‌నూ, ల్యాప్‌టాప్‌ను వినియోగించినంత విరివిగా ఇంకెవరూ ఉపయోగించడం నేను చూడలేదు. జూ ఏ సంగీతాన్నైనా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఆయనకు నచ్చదు. ప్రతిదీ డబ్బిచ్చే కొనుగోలు చేస్తారు. ఎప్పుడూ సంగీతాన్ని వింటూ ఉంటారు. ఆయన ప్రపంచమే సంగీత ప్రపంచం. సంగీతంలో నిత్యం అప్‌డేట్‌ అవుతుంటారు. జూ సంగీతమంటే సృజన. ఆధ్యాత్మిక భావన. ఆయనతో సంగీత చర్చల్లో పాల్గొంటే ఆ భావం మనకు కూడా తెలియకుండానే మదిలో తిష్టవేసుకుంటుంది. చుట్టూ ఉన్న వారిని పనిలో నిమగ్నం చేయడంలో ఆయన చాలా గొప్పగా ప్రవర్తిస్తారు. ఎంతో గొప్పగా మోటివేట్‌ చేస్తారు. ఎగ్జాంపుల్స్‌ చెబుతూ మనలో ఉన్న ప్రతిభను మనకు కూడా తెలియకుండా రాబట్టగలరు. జూ ఆయన స్వతహాగా చమత్కారి. కళాకారులు ఎక్కడా అలసిపోకుండా చూసుకుంటారు. మధ్యమధ్యలో జోకులు చెబుతూ నవ్విస్తుంటారు. ఆయన ఎంత సరదాగా ఉన్నా, పని సక్రమంగా జరగాలనే టెన్షన్‌ మాలో ఉంటూనే ఉంటుంది. ఆయన కాంపౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఇదే భావన కలుగుతుంది. జూ ట్యూన్లు కంపోజ్‌ చేసేటప్పుడు ప్రతి నోట్‌నూ ఆయనే రాసిస్తారు. ఆయనతో పాటు జెమినిగారు, నేను ఉంటాం. జూ నేను సంగీత దర్శకత్వం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కీరవాణిగారు మాత్రం ‘నువ్వు సంగీతం చేయి జీవన్‌. నేను కూడా రిటైర్‌మెంట్‌ ఎప్పుడో అప్పుడు తీసుకుంటాను’ అని అన్నారు. జూ కీరవాణిగారికి ఉన్నంత జ్ఞాపకశక్తిని నేను ఇంకెవరి దగ్గరా చూడలేదు. నేను పరిచయమైన రోజు ఆయనతో ఏం మాట్లాడానో కూడా ఇప్పుడు చెప్పేయగలరు. విషయాల్ని అంత గొప్పగా గుర్తుంచుకుంటారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -13

బ్రాహ్మణాల కదా కమా మీషు -13

తాండ్య బ్రాహ్మణం

సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత  పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ స్థానం ఉంది .180యాగాల నిర్వహణ వివారా లిందులో ఉన్నాయి .కురుక్షేత్రానికి దూరం గా ఇది వర్ధిల్లిందని భావన .క్రీ పూ.ఎనిమిదవ శతాబ్దికి చెందినదిగా  భావిస్తున్నారు .యజ్న యాగాది విషయాలు వివరిస్తూనే మధ్యలో అనేక లౌకిక విషయాలను ఈ బ్బ్రాహ్మణం చెప్పింది .విద్యా సంపన్నుడైన అతిధి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఎవరూ కూడా మనసు నొప్పించే మాట మాట్లాడకూడదు .అతిధి మనసుకు నొప్పికలిగితే ఆతిధ్యం వ్యర్ధమౌతుందని తెలిపింది .కర్మకాండకు, దార్మికతకు బాగా తోడ్పడింది .

సత్ర యాగాలు రెండు రకాలు .పన్నెండు నుంచి వంద రోజులు చేసేయాగానికి రాత్రి సత్రమని ,వంద రోజులు దాటిన దాన్ని అయన సత్రమనీ అంటారు .గీత బద్ధం గా ఋక్కులను గానం చేస్తే స్తోత్రమని ,గీత రహిత రుక్కుల్ని ‘’శస్త్రమని ‘’అంటారు .సామ వేదాధ్యాయి అయిన ఉద్గాత స్తోత్రం చేస్తాడు .రుగ్వేదాధ్యేత అయిన హోత మంత్రోచ్చారణ చేస్తాడు ,సామ వేదం నేర్చిన ఉద్గాత ఋక్కులను గానం చేస్తే స్తోత్రం అవుతుంది .సామగానానికి ఉద్గాత ,స్తోత ,ప్రతి హర్త ,సుబ్రహ్మణ్యుడు అనే నలుగురు రుత్విక్కులుంటారు .మూడు డరుక్కులకు ఒక సామ గానం చేయాలి .ఇవి ఇరవై ,లేక ఇరవై ఎనిమిది ఆవ్రుత్తులుగా ఉంటాయి .ఈ సంఖ్యలకే స్తోమం అని పేరు .గానం చేయాల్సిన మంత్రాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయటాన్ని ‘’విష్టుతి ‘’అంటారు .ఇష్టి ,పశు యాగాలలో సోమ యాగం ఒక భాగం గా ఉంటుంది సోమయాగం రుక్ ,యజు సామ వేదాల ననుసరించే చేయాలి .వసంత రుతువులోనే సామయాగాన్ని నిర్వ హించాలి .పది పదిహేనవ అధ్యాయాల మధ్య పన్నెండు రోజులు చేసే ‘’వ్యూఢ ద్వాదశాహం ‘’అనే యాగం చెప్పా బడింది .కొన్ని యాగాలలో యజమాని మూడు రోజులు అడవిలో నివశించాలి .సర్వ సత్ర యాగం ఏడాది పాటు చేయాలి .

తాండ్య బ్రాహ్మణ శైలి ప్రాచీనమైనది .కల్ప సూత్ర శైలిలో ఇది ఉంటుంది .సామ వేదం బ్రాహ్మణాలు రెండు ఒకటి తాండ్య శాఖ రెండోది తలవర శాఖ .సరస్వతీ, ద్రుషద్వతి నదుల మధ్య ఈ యాగాలు చేశారు వ్రాత్య  సోమాలు అనే యాగాల ద్వారా బ్రాహ్మణులు కాని ఆర్యులు ప్రాయశ్చిత్తం చేసుకొని బ్రాహ్మణ సంఘం లో ప్రవేశించటాన్ని ఈ బ్రాహ్మణం తెల్పింది .నైమిశారణ్యం లో ఋషులు అనేక యాగాలు చేశారు .ఇక్కడ ‘’సుదామ ‘’అనే నది ఉన్నట్లు చెప్ప బడింది .జనకుడి ప్రస్తావన ఇందులో కని  పించదు  .దీని చివరలో ‘’అతి రాత్రం ప్రజా పథెహ్ సహస్ర సంవత్సరః ‘’అంటే వెయ్యేళ్ళు అతి రాత్రం అనే సత్ర యాగాన్ని చేస్తే ప్రజాపతికి మళ్ళీ ప్రజా సృష్టి చేసే శక్తి ఏర్పడుతుంది అని అర్ధం .

సౌమిత్ర సామ గొప్ప తనాన్ని చెప్పే కద ఒకటి ఉంది .దీర్ఘ జిహ్వ అనే రాక్షసి చరువు ,పురోడాశాడులను తన నాలుక తో నాకేస్తూ యజ్ఞాన్ని పాడు చేసింది .ఇంద్రుడు దాన్ని ఏ విధం గానూ చంప లేక పోయాడు .సుమిత్రుడు అనే కుత్స మహర్షి సహకారాన్ని కోరాడు .సంస్కార వంతమైన యాగా శాలలో ఆమెను మాయ చేసి వశం చేసుకొని ఇంద్రుడితో సామసాయం తో ఆ రాక్షసిని చంపించాడు .అందుకే దీనికి ‘’సౌమిత్ర సామ ‘’అనే పేరొచ్చింది .

కాలేయం అని ఇంకొక సామ ఉంది .లోకాధి పత్యం సురాసురులు పోటీ పడ్డారు  దేవతలు తండ్రి ప్రజాపతి తో మొర పెట్టుకొన్నారు .వారికి సామాను ఉపదేశించి అసుర బాధ నుండి విముక్తులవమని ఉపదేశించాడు ‘’ఏతే వైతాన్ కాలయిష్యద్వం ‘’అనటం వలన కాలేయం అనే పేరొచ్చింది .కలి అనే రుషి దర్శించాడుకనుక కాలేయం అనీ అంటారు .శ్వానాశ్వుడు సత్ర యాగం చేస్తుంటే కొందరు యాజ్ఞికులు క్రోధం తో అతడిని నీళ్ళు లేని మరు భూమికి తీసికెళ్ళి వదిలేశారు .అప్పుడు ఆయన వర్షం కోసం ఈ సామాను కను గోన్నాడు .దీన్ని గానం చేయగానే అక్కడ వర్షం పడి పంటలు బాగా పండాయి .మరుభూమిని సస్య శ్యామలం చేసి మళ్ళీ యజ్న భూమికి చేరాడు .దోవ తప్పిన వాడు ఈ సామాన్ని గానం చేస్తే మళ్ళీ గుర్తించగలడు అని సారాంశం .

కవి అంటే శుక్రాచార్యుడు .ఆయన దర్శించిన సామ ను ‘’కావం ‘’అంటారు .ఉశనా అన్నా శుక్రుడే కనుక ఇంకో సామకు ‘’ఔశనం ‘’అని పేరొచ్చింది .బ్రహ్మ అన్ని యజ్ఞాలను ఈ సామ చేత సృష్టించాడట .పూర్వం దేవతలు వేదరాశిని తమలో తాము పంచుకోగా బ్రహ్మ కొచ్చిన భాగమే పెద్దదిగా ఉందట .దీన్ని యజ్ఞా యజ్నీయం అంటారు .ఎద్దు మూత్రం పోసినప్పుడు ఎలా వంకర  టింకర గా పోస్తుందో సామాన్నికూడా అలా మెలికలు గా గానం చేయాలి .దేవతలు అగ్నిని ముందు పెట్టుకొని అశ్వం తో శత్రువులను ముట్టడించేట ప్పుడు చేసిన సామగానాన్ని  ‘’సాకమశ్వం ‘’అన్నారు .సాకం అంటే ‘’కూడా ‘’అని అర్ధం .

చర్మ రోగాలను కూడా సామ గానం వల్లపోగొట్టుకోవచ్చునని ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .ఆంగిరస్సు కుమార్తె ‘’ఆకూ పార’’కు చర్మమంతా ఉడుము చర్మం లాగా  గట్టి ఆ మారింది .ఆమె ఇంద్రుని ప్రార్ధించి తే దోషాన్ని పోగొట్టాడు .ఎలాంటి కోరికతో నైనా ఈ సామాన్ని గానం చేస్తే వారికి ఆకోరికలు సిద్ధిస్తాయి అని ‘’ఆకూ పార ‘’అనే సామ బోధిస్తోంది .బ్రాహ్మణులేకాకుండా క్షత్రియులు కూడా కొన్ని సామలను దర్శించారు ..ఆర్శభ సామ ‘అనేది క్షత్రియ సామ .విశ్వామిత్రకుమారుడు ఋషభుడు పుట్టే వరకు మహర్షి క్షత్రియుడుగానే ఉన్నాడు .అందుకే అది క్షాత్ర సామ అయింది ‘’బ్రాహ్మాణా చ్చంసి సామ’’అని అందుకే అన్నారు .

బ్రాహ్మనాలలో విధించ బడిన శస్త్రాలు అంటే స్తోత్రాలు బ్రాహ్మణాలుగానే పిలువ బడుతున్నాయి .వీటిని పఠించే ఋత్విక్కు ‘’బ్రాహ్మనాచ్చంసి ‘’.స్తుతులు రెండు రకాలు ఒకటి స్తోత్రాలు రెండు శస్త్రాలు .గానం తో చేయబడిన మంత్రం స్తోత్రం .గానం లేని మంత్రం శస్త్రం..పురుషులే కాదు స్త్రీలు కూడా మంత్రం ద్రస్టలుగా ఉన్నట్లు ఈ బ్రాహ్మణం తెలిపింది .’’త్వాస్టీసామ ‘’అనేది త్వష్ట కుమార్తెలైన త్వాస్త్రులు ఇంద్రుడికి కంటి రోగం వలన నిద్ర పట్టక పోతే ఈ సామ గానం చేసి చంటి బిడ్డను జోల పాడినట్లు పాడి నిద్ర పుచ్చారట .’’ఔర్నాయణం ‘’అనే సామ లో పూర్వం అంగి రసులు సత్ర యాగం చేస్తే స్వర్గాన్ని పొందినా దేవా యాన మార్గం గోచరించ లేదు .వాళ్ళలో కళ్యాణుడు అనే అంగిరసుడు అంత రిక్షం లోకి వెళ్లి ‘’ఊర్నాయువు ‘’అనే గంధర్వుడిని ప్రార్ధిస్తే ఆయన మార్గాని తెలియ జేసి ‘’ఊర్నాయువు నాకు దాన్ని చెప్పాడు .నేనే తెలుసుకొన్నాను అని అబద్ధం చెప్పద్దు .’’అని చెప్పాడు కాని ఇతడు అబద్ధంఆడి  మాట తప్పిజ్ఞానం నశించి  కుష్టు రోగి అయ్యాడు .ఊర్నాయు సామకు అంతటి శక్తి ఉందని తెలుస్తోంది .ఇక్కడ దర్శనం అంటే కనుక్కోవటమే కాని రాయటం కాదని గ్రహించాలి .

ఋత్విక్కులు మర్చి పొతే ప్రక్క వాడు జ్ఞాపకం చేయ రాదు .ప్రజా పతిని అతిధిగా పిల్చి చరువు,పురోడాశం తో సంతృప్తి పరచేటప్పుడు కూడా మధ్యలో మర్చిపోయిన కర్మ ను గుర్తు చేయ రాదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహసమే శాండీ రోబ్సన్ ఊపిరి.

సాహసమే ఆమె ఊపిరి….

Published at: 03-07-2014 00:38 AM

విశాఖతీరంలోని రుషికొండ. ఎప్పటిలాగే పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కనుచూపు మేర కనిపించే సముద్రపు నీళ్లను చూస్తున్న వారికి ఒక ఎర్రటి చిన్న పడవ, అందులో తెడ్డు వేస్తున్న ఒక మహిళ కనిపించింది. అంత భీకరమైన సముద్రంలో ఒంటరి మహిళా? ఎవరీవిడ? ఏమిటీ సాహసం? అని ముక్కున వేలేసుకున్నారందరు. మెల్లగా తీరం చేరిందామె. బోటు దిగి ఒడ్డున నిల్చున్నవాళ్లందరినీ ‘హాయ్, హాయ్’ అని ఆత్మీయంగా పలకరించింది. ఇంతకూ ఈమె ఎవరంటే.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు కాయక్ (చిన్న పడవ) మీద ఒంటరిగా వెళుతున్న సాహస వనిత శాండీ రోబ్‌సన్. అబ్బురపరిచే ఆ యాత్ర వెనక ఆమె అనుభవాలు ఆసక్తికరం….

ఆయా దేశాల మనుషులు అక్కడున్న సంప్రదాయ వ్యవహారాలను బట్టి ప్రవర్తిస్తుంటారు. మా దేశంలో అయితే అమ్మాయిల వయసు అడిగితే కోపగించుకుంటారు. ‘నీకు పెళ్లి అయిందా?’ అని స్వేచ్ఛగా అడగలేరు. అదే యూరప్ దేశాల్లో అయితే ఇది సామాన్యమైన ప్రశ్న. ఇండియాలో మాత్రం ఎవరు ఎదురుపడినా ‘నీ మొగుడ్ని వదిలిపెట్టి నువ్విలా తిరుగుతున్నావేంటి?. ఆయనేమీ అనడా?” అంటుంటారు. నాకు నవ్వొస్తుంటుంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటే నావైపు అదోలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నాకు లాంగ్‌జర్నీలంటే మోజు. అదీ సముద్రంలో ఒంటరిగా వెళ్లడమంటే మరింత ఇష్టం. తీరప్రాంతం వెంబడి వెళుతుంటే ప్రపంచంలోని ఎంతోమంది కాయక్‌లు పరిచయం అవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. అవన్నీ వింటుంటే భలే థ్రిలింగ్ అనిపిస్తోంది.

ఈ యాత్రకు కావాల్సినంత డబ్బు నావద్ద లేదు. దాతలను ఆర్థిస్తున్నాను. ఎవరికి తోచింది వారు ఇవ్వొచ్చు. నా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ మెయిల్‌లో సంప్రదిస్తే నా బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తాను. అందులోకి జమ చేయొచ్చు. నేను సముద్ర ప్రయాణం చేస్తూ దగ్గర్లోని ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుంటాను.

నేను ఆస్ట్రేలియాకు చేరుకోగానే కాయక్ మీద సముద్రయానం చేసిన తొలి మహిళగా రికార్డు నమోదవుతుంది. నేను తిరిగిన దేశాలు, ప్రాంతాలు, కలిసిన మనుషులు, తిన్న ఆహారం, జరిగిన సంఘటనల ఆధారంగా ఒక పుస్తకం రాద్దామన్నది నా ఆలోచన.

రోజుకు 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాను. సముద్రపు ఒడ్డున ఉన్న పట్టణాలకు చేరుకున్నప్పుడు లాడ్జిలలో దిగి.. వారానికి సరిపడే కిరాణాసరుకులు, ఆహారం, నీళ్లు సమకూర్చుకుంటాను. రాత్రిళ్లు సముద్రానికి దగ్గర్లోని ఊర్లలో టెంటు వేసుకుని పడుకుంటాను.

“చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రిటైర్‌మెంటు. అప్పుడప్పుడు కొన్ని వేడుకలు, పండగలు.. సంతోషాలు, బాధలు. ఇంతకంటే గొప్ప జీవితం లేదా? మనమెందుకంత రోటీన్‌లో పడి కొట్టుకుపోతుంటాము అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ సాహసయాత్ర. నాకిప్పుడు 47 ఏళ్లు. అరవై ఏళ్ల వరకు చురుగ్గా ఉండగలను. అంతలోపు వీలైనంత ప్రపంచాన్ని చూడాలన్నది నా ఆలోచన. అందుకే చిన్న పడవ మీద ఒంటరిగా సుముద్రతీరం వెంబడి సాహసయాత్రకు పూనుకున్నాను. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ యాత్ర సాగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చేరుకున్నాను. నా సాహసయాత్ర గురించి మీకు మూడుముక్కల్లో చెబుతాను. కాయక్ అనేది ఒక పొడవైన చిన్న పడవ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ దీని మీద వెళ్లొచ్చు. 1930లో జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు తొలిసారిగా కాయక్ మీద సముద్రయానం చేశారు ఆస్కర్‌స్పెక్. ఇతనికి సముద్రాల్లో ప్రయాణించడమంటే పిచ్చి. ప్రపంచాన్ని చుట్టేయడానికి అతనికి ఏడేళ్లు పట్టింది. అయిదేళ్లలో పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. ఒక మహిళ ఒంటిరిగా సముద్రంలో కాయక్ మీద జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే – అది ప్రపంచరికార్డు అవుతుంది. ఆ రికార్డును నేనే ఎందుకు నెలకొల్పకూడదు అనుకున్నాను.
ఒకప్పుడు టీచర్..
నాది దక్షిణ ఆస్ట్రేలియా. నేను అక్కడే పుట్టి పెరిగాను. ఆ దేశంలో నేను ఔట్‌డోర్ టీచర్‌ను. ఆస్ట్రేలియాలో విద్యాబోధన ఎంతో ప్రయోగాత్మకంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అందులో భాగమే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్. ఇదొక సాహసయాత్రతో కూడుకున్న విద్యాబోధన. టీచర్లు సముద్రంలో ప్రయాణిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతారు. యాత్రలో భాగంగా రకరకాల ప్రదేశాలు, వాటి ఔన్నత్యం గురించి ప్రాక్టికల్‌గా బోధించడం, పిల్లలకు ప్రపంచం పట్ల అవగాహన కలిగించడం ఈ చదువు ఉద్దేశం. నాకు కూడా చిన్నప్పటి నుంచి లోకం తిరగడమంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. రకరకాల ప్రదేశాలు, మనుషులు, సంస్కృతి, ఆహారం.. ప్రపంచంలోని వైవిధ్యాన్ని దగ్గరగా చూస్తూ.. అందులో మమేకం కావడం ఇష్టం. అందుకనే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్‌లో టీచర్‌గా, ఇన్‌స్ట్రక్చర్‌గా చేరాను. ఆ రంగంలో ఇరవై ఏళ్లపాటు పనిచేశా. సముద్రంలో కాయక్‌ల మీద సాహసయాత్ర అందులో భాగంగానే అలవడింది. నా సొంత డబ్బులతో తొలిసారి కాయక్‌ను కొనుక్కున్నాను. అప్పటి నుంచి మెల్లగా సముద్రం మీద సాహసయాత్రలు మొదలయ్యాయి. దక్షిణ ఆస్ట్రేలియా సముద్రంలో తొలియాత్ర చేశాను. సముద్రపు అలలను దాటుకుంటూ చిన్న పడవ మీద తెడ్డు వేసుకుంటూ.. వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఆషామాషీ కాదు. ప్రమాదకరం కూడా! మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు శారీరక బలం కాస్త తక్కువ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ బోటును నడిపితే భుజాలన్నీ నొప్పిపెట్టేవి. సాయంత్రం అయ్యేసరికి ఒక్కోసారి నిద్రపట్టేది కాదు. అయినా సరే నా అలవాటును మానుకోలేదు.
నెల్లూరు జాలర్లతో..
కాయక్ మీద చిన్న చిన్న సాహసయాత్రలు చేస్తున్నప్పుడు నాకొక పుస్తకం దొరికింది. దాని పేరు ‘డ్రీమ్‌టైమ్ వొయేజ్’. రచయిత పాల్‌కాఫిన్. అతనిది న్యూజిలాండ్. జీవితాన్నంతటినీ కాయక్ వేసుకుని సముద్రం మీద ప్రయాణించడానికే కేటాయించాడతను. ఆ పుస్తకాన్ని చదివాక.. సాహసయాత్ర కేవలం రికార్డుల కోసమే కాదు, ప్రపంచాన్ని రకరకాల లెన్సుల్లో చూసేందుకు పనికొస్తుంది అని అర్థమైంది. వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు సముద్రంలోనే లాంగ్‌ట్రిప్ చేయాలని. కాయక్‌ల మీద యాత్రలు చేసే స్నేహితులు ఉన్నారు కాని.. ఇంత దూరప్రయాణానికి వారు ఒప్పుకోలేదు. ఇక చేసేది లేక నేనొక్కదాన్నే బయలుదేరాను. కేవలం సముద్ర తీరప్రాంతం వెంబడి మాత్రమే ప్రయాణిస్తున్నాను. లోతైన సముద్ర ప్రాంతంలోకి వెళ్లను. జర్మనీలో మొదలై ఇప్పటికి పదకొండు దేశాలు దాటుకుని.. శ్రీలంక మీదుగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడి నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది నా యాత్ర. ఇక్కడే నాకు కష్టాలు మొదలయ్యాయి. నెల్లూరు వద్దకు వచ్చేసరికి అప్పటికే సముద్రంలో చేపలు పట్టుకునే జాలర్లు నా వెంటపడ్డారు. నేనో ఉగ్రవాదినని వారు పొరబడినట్టున్నారు. అందుకే బోట్లు తీసుకుని అరుపులు కేకలు పెట్టుకుంటూ నా వద్దకు వచ్చారు. నేను చెప్పేది వాళ్లకు అర్థం కాలేదు. ఉన్నట్లుండి నా వద్ద ఉన్న కొన్ని వస్తువుల్ని లాగేసుకుని పారిపోయారు. వెంటనే అప్రమత్తమై తీరప్రాంతానికి సమీపంలోని ఊరికి వెళ్లి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి విశాఖపట్టణంలోని పూడిమడక సమీపానికి వచ్చేసరికి నా కాయక్ పడవ చెడిపోయింది. దిక్కుతోచలేదు. అక్కడున్న ప్రజలు చెబితే రుషికొండ బీచ్‌లోని శాప్ యాంటింగ్‌సెంటర్‌కు వెళ్లగా.. అక్కడ మెంటర్ మెల్‌విల్ స్మిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితోపాటు మెరైన్ పోలీసులు సాయపడటంతో పడవ రెడీ అయ్యింది. వాళ్లందరికీ కృతజ్ఞత చెప్పి విశాఖతీరం నుంచి బయలుదేరానిప్పుడు. మిగతా దేశాలతో పోలిస్తే.. ప్రయాణానికి ఆంధ్రతీర ప్రాంతం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాల మీదుగా పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నాను. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని బంగ్లాదేశ్ మీదుగా 2016 నాటికి ఆస్ట్రేలియాకు చేరుకోగలుగుతాను..” అంటున్న ఈ సాగరకన్య క్షేమంగా ఇంటికి చేరుకుని.. యాత్రను సంపూర్ణం చేయాలని ఆశిద్దాం.
 నవ్య డెస్క్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాల్మీకం లో వర్షర్తు శరదృతు వర్ణన

వాల్మీకం లో  వర్షర్తు శరదృతు వర్ణన

రామ లక్ష్మణులు కిష్కింద దగ్గర ప్రస్రవణ పర్వతం పై ఉన్నప్పుడే వర్షరుతువు శరదృతువు వచ్చి వెళ్ళిపోయాయి.మహర్షి వాల్మీకి  ఆ రెండిటిని అద్భుథ కవితా శైలిలో వర్ణించాడు .ఆ వైభోగాన్ని దర్శిద్దాం .

వర్షర్తు వర్ణనం

కిష్కింధలో సుగ్రీవుడు అంగదుడు పట్టాభి షేక ఆనందం లో హర్షాన్ని అనుభవిస్తున్నారు .ఇక్కడ ప్రస్రవణ పర్వతం మీద రామ సోదరులిద్దరు వర్షాకాలపు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు .శరత్ కాలం ఎప్పుడు వచ్చి సీతాన్వేషణ మొదలౌతుందా అని ఎదురు చూస్తూ చింతా క్రాంతు లైనారు.సింహాలు పులులూ , కొండా, కోనా .చెట్లూ చేమ ,పూలు పండ్లు చూడటానికి మనోహరం గా ఉన్నా ,మనస్సు దేనిమీదో ఉండటం వలన సోదరుల మనస్సును రంజింప లేక పోతున్నాయి .పర్వత శిఖరం ఎక్కి ప్రకృతి పులకిన్తను చూడాలనుకొను  చూశారు మనోహరం గా ఉంది అసలే ప్రకృతి ప్రేమికులు వారి మనసులు పులకింతలై పరవశించిపోయారు .

పర్వత శిలలు అనేక వన్నె చిన్నెలతో భాసిస్తున్నాయి .అందులో అనేక ధాతువులున్నాయి .చాలా రకాల పూలు ,జలజల పారే సెల ఏళ్ళు ,సరోవరాలు నాలుగు దిక్కులా కని పిస్తున్నాయి  .ఈశాన్యానికి దిగువ ,నైరుతికి ఎగువన గా ఉన్నందున రామ లక్ష్మణులుండే గుహ వాస యోగ్యం గా ఉంది .ఒక వైపు మేఘ మాలగా ,మరో వైపు కైలాస శిఖరం లాగా కానీ పించే పర్వత శిఖరం రక రకాల వృక్ష సంతతి తో పట్టు చీరకట్టి ,బంగారు ఆభరణాలతో అలంకరించుకొన్న  అంగన లా ఉంది .ఎటు చూసినా పక్షుల కలకలారావాలు ,హంస సారసల మంద గమనం ,పుష్ప హాసం ,నిర్మల నదీ జలం చందన చెట్ల నుండి వచ్చే సుగంధం ,మనోహరం గా ఉన్నాయి .దగ్గరలోనే ఉన్న కిష్కింద నుండి నృత్య గీత సంరంభం విని పిస్తూనే ఉంది .అక్కడ సుగ్రీవుడు చాలాకాలం తర్వాత స్త్రీ సాంగత్య భోగాలనుభవిస్తుంటే ఇక్కడ రాము డు సీతా వియోగం తో విచారిస్తూంటాడు .రామానుజుడు అన్నకు ధైర్యం చెప్పుతున్నాడు .సకల లోకాలను జయించే కోదండ పాణికి రావణుడు ఒక లెక్క కాదని ధైర్యం చెప్పాడు .శరత్తు రాగానే విజయయాత్ర చేసి రావణ సంహారం చేద్దామంటాడు .

సోదరుల ఆవేదనకు ఉపశమనం గా చల్లని వాతా వరణం సహకరిస్తోంది .కొండల్లాంటి మేఘాలు ఆకాశమంతా నిండి చల్లని గాలితో బాటు రసధారలతో భూదేవి దాహాన్ని తీరుస్తున్నాయి .నవమాసాలు సూర్య కిరణాలతో పీల్చుకొన్న జలం తో గర్భ ధారణ చేసిన ఆకాశం శ్రావణ మాసం రాగానే కమ్మని రాసానయాన్ని కంటోంది .రంగు రంగుల మేఘాలు చూడ ముచ్చటగా ఉన్నాయి .ఎండకు ఎండి ఒత్తుగా కురిసిన వానకు నిట్టూర్పు విడిచే భూమ తల్లి లాగా సీతా మాత కూడా దిగులుతో నిశ్వ సిస్తూ ఉంటుందని రామయ్య భావించాడు . కాదంబినీ కడుపు లో నుంచి వెలువడే కమ్మ తెమ్మేరాలను రెండు చేతులతో తాగేయాలని పిస్తోంది .శత్రు సంహారం జరిగి నిర్భయం గా నిబ్బరం గా పట్టాభి షేకం చేసుకొంటున్న సుగ్రీవుడి లాగా పర్వత రాజం అప్పుడప్పుడు కురిసే వర్ష దారాలతో అభిషేకం చేసుకొంటోంది .మేఘాలను జింక చర్మం లా ధరించి జలదారాలను జందెం లా వేసుకొని గుహ లో నుంచి వెలువడే గాలిని వేద నాదం చేసుకొని గిరి కుమారులు వేదాధ్యయనం చేస్తున్నట్లుంది .కొరడా దెబ్బల లాంటి మెరుపు తీగల తాకిడికి తాళ లేక ఆకాశం  అక్రంది స్తూంది  . మేఘాలను తప్పించు కొని పోవాలని తల్లడిల్లే తటిల్లతలను చూస్తె రావణుడి ఒడిలో గిల గిల కొట్టు కున్న సీత రాముడి ఊహా  ప్రపంచం లో  ఒక్క సారి మెరుస్తుంది .దిక్కులను, కాలాలను మరిపింప జేసే ముసురు ప్రేయసీ ప్రియులకు ఆహ్లాదం గా ఉంది .వర్షం వస్తుందనే హర్షాతి రేకం తో కొండలు పుష్పించాయి .ధూళి అణగి పోయింది .గాలి చల్ల బడి పోయింది .వేసవి వైషమ్యం ఉప శమించింది .రాజులు విజయ యాత్రలు ఆపేసి విశ్రమించారు .హంసలు మానస సరోవరాలను చేరుకొన్నాయి .చక్ర వాకాలు అన్యోన్యం గా మెలగుతున్నాయి.దారులన్నీ ఏకమైనాయి .ఒక చోట వెలుతురు ఇంకో చోటా చీకటి ఉండటం వల్లఆకాశం వెలుగు నీడలతో రమణీయం గా ఉంది .సెలయేళ్ళు అతి వేగం గా ప్రవహిస్తున్నాయి .తుమ్మెదలు నేరేడు పండ్ల రుచి మరిగి ఆప్యాయం గా ఆరగిస్తూ ఉన్నాయి .పండిన మామిడి పళ్ళు రాలి కిందపడ్డాయి .పచ్చిక బయళ్ళు నెమళ్ళతో నిండి పోయాయి .మేఘాలు వర్ష దారాల తో నిర్విరామం గా నడవ లేక కొండ మీద విశ్రాంతి తీసుకొంటూ వెడుతున్నాయి ఇంద్ర గోపపు పురుగులతోబయళ్ళు పట్టు చీరల్లా కని  పిస్తున్నాయి .కేశవ స్వామి నెమ్మదిగా నిద్ర పట్టిస్తుంటే నదులు సముద్రం లో కలిసి పోతున్నాయి .బలాక పక్షులు మేఘాల దగ్గరకు చేర్తున్నాయి .కాంతలు కౌగిట్లో నలిగి పోతుంటారు .నదులు ప్రవహిస్తూంటే మేఘాలు వర్షిస్తున్నాయి .ఏనుగు ఘీన్కారాలతో అడవులు మార్మ్రోగి పోతున్నాయి .అరణ్యాలు రమ్యం గా భాసిస్తున్నాయి .విరహ వేదన చెందే వారు ప్రియులను స్మరించుకొంటూ దిగులు పడుతూ ఉంటారు .నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి .ఏనుగులు జల పాతాలాల ధ్వనికి ఉలిక్కి పడి వెనక్కి చూస్తూ నృత్యం చేస్తున్నాయి .తుమ్మెదలు పై నుంచి పడే వాన జల్లుకు చిరాకు పడుతూ ,పూదేనే తాగుతూ తాగుతూ ఆగిపోతాయి .మేఘ గర్జన విన్న మత్తేభాలు తమ తో పోటీకి మరో మత్తేభం గర్జిస్తోంది అని   భ్రమ పడుతున్నాయి .సృష్టిలోని సకల ప్రాణులు సుఖాన్ని అనుభ విస్తూ హాయిగా వర్షాకాలం గడుపుతున్నాయి సీత జాడ తెలియక రామ లక్ష్మణులు మాత్రం బాధ పడుతున్నారు .

శరదృతు  వర్ణనం

వర్షాకాలం పోయి’’  శారదరాత్రు లుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ ‘’అని ఎర్రన గారు వర్ణించినట్లు శారదరాత్రులు వెలిగి పోతున్నాయి .ఆకాశం నిర్మలం గా కనిపిస్తోంది సుగ్రీవుడికిచ్చిన గడువు దాటి పోయింది .అన్వేషణ ప్రారంభం కాలేదని పించింది రాముడికి .తన ఆర్తిని తమ్ముడికి రాముడు చెప్పుకొంటాడు .అన్నకు ధైర్యం చెప్పి ,ఆత్మా సంయమనం తో యోగ సమాధి సాధించి దుఖాన్ని జయించమని రామానుజుడు అన్నకు చెప్పాడు .రావణుడు సీతను స్వాధీనం చేసుకోవటం అగ్నిని కౌగిలించుకోవటమే నన్నాడు .శర న్మేఘ సందర్శనం చేయాలని అన్న దమ్ములిద్దరూ ఉవ్విళ్ళూరుతుంటారు .వెన్నెల రాత్రుల వైభవాన్ని దర్శించి పులకించి పోతారు .చక్రవాకాలు హంసలు తుమ్మెదలు మదపు టేనుగులు వృషభ రాజులు ప్రకృతి లావణ్యాన్ని చూసి పరవశించి పోతూంటాయి .ఏనుగులు ప్రణయ లీలలోసర్వం మరచి క్రీడిస్తు రమణీయ వనాంతరాలలో విహరిస్తున్నాయి .హంసలు హర్షాతి రేకం లో జలక్రీడలు చేస్తూ పులకిస్తున్నాయి .నెమళ్లు కొంగలతో పోటీ పడి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి .ఇప్పటిదాకా పుట్టల్లో దాక్కున్న పాములు శరత్తు రాగానే బయటికి వస్తున్నాయి .సంధ్యా దేవి కూడా అనురాగం అతిశయించి చంద్రుని కిరణ  స్పర్శకు పులకరించి తారకలాంటి కళ్ళను తెరచి తనంతట తానే అంబరాన్ని వదిలి వెడుతోంది .తెల్లని వెన్నెల చీర కట్ట్టుకున్న రజనీ కుమారి సౌకుమార్యం ,సౌందర్యం ఎంత చెప్పినా చాలదు .

వెన్నెల రాత్రిలో గగన వీధి లో కలిసి పోయిన జాబిల్లి లాగా నీటి మడుగులో కలువల మధ్య హంస హాయిగా నిద్ర పోతోంది .తెల్ల వారు జామున పల్లెల్లో విని పించే రధి మంధన ఘోష ,ఆబోతు ఆనంద నినాదాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి .తుమ్మెదలు కమ్మ తెమ్మరెల వెంట జంటలు జంటలుగా తిరుగుతూ ,మధ్య మధ్య మకరందాన్ని ఆస్వాదిస్తూ తుంటరి చేష్టలు చేస్తున్నాయి .చేపలకు నడుము కట్టు గా ఉన్న నదీ సుందరులు ప్రణయ క్రీడలతో అలసి పోయి మందం గా ముందుకు కదిలి వేడుతున్నాయి  .ఎక్కడ చూసినా పైరు పంటలు కంటికి ఇంపుగా మనసుకు ఆహ్లాదం చేస్తున్నాయి .వసుమతిని రసప్లావితం చేసిన వారి దారలు అంటే మేఘాలు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతున్నాయి .వాన నీరు తగ్గి పోతుంటే నదీ తీరం లో నెమ్మదిగా భూమి కని  పిస్తోంది .మొదటి సమాగమం సమయం లో తొడల మీద పట్టుకొని సిగ్గును నటించే సౌభాగ్య వతుల్లా నదీ ప్రవాహం ప్రసన్నం గా కని  పిస్తోంది . వర్షాలు తగ్గ గానే రాజులు శత్రువులపై దాడికి సిద్ధమౌతున్నారు .కాని సుగ్రీవుడు కాంతా సక్తం లో మునిగి తమను పట్టించుకోవటం లేదని రాముడు భావించి సుగ్రీవుడి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని బాధ పడుతాడు .వానర రాజుకు బుద్ధి చెప్పి రమ్మని తమ్ముడు లక్ష్మణుడిని కిష్కింధకు పంపిస్తాడు .

వాల్మీకి మహర్షి చేసిన ఈ రెండు ఋతువుల వర్ణనలు కాళిదాసుకు ,ఆ తర్వాత నన్నయ ,తిక్కన ఎర్రనలకూ ఆదర్శమైంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వ నటచక్రవర్తి” యశస్వి” రంగా రావు ది ”అరెస్తింగ్ పర్సనాలిటి ”

విశ్వ నటచక్రవర్తి

Published at: 03-07-2014 00:16 AM

ఆంగ్లంలో ‘అరెస్టింగ్ పర్సనాలిటీ’ అనే పదం ఒకటుంది. అంటే వంద మందిలోనైనా ఇట్టే గుర్తించగల పర్సనాలిటీ అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తుల విషయంలో ఇలాంటి పద ప్రయోగం చేస్తుంటారు. మహానటుడు సామర్ల వెంకట రంగారావుది కూడా అటువంటి పర్సనాలిటీయే. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే సత్తా ఆయన సొంతం. మహా ప్రవాహంలాంటి చిత్ర పరిశ్రమలో ఆ ప్రవాహానికి ఎదురెళ్లి, ఆటుపోట్లను భరించి, ఒడ్డుకు చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతనటుడు ఎస్వీఆర్. తొలి సినిమా ‘వరూధిని’ ఆశాభంగం కలిగించినా, మళ్లీ ‘షావుకారు’తో నిలదొక్కుకొని తెలుగు, తమిళ భాషల్లో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేయగలగడం ఆయన అదృష్టమే కాదు ఆ అసామాన అభినయాన్ని తిలకించి, పులకించి పోవడం ప్రేక్షకుల పూర్వజన సుకృతంగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. సాధారణంగా చాలా మంది నటులకు వాళ్లు పోషించే పాత్రలను బట్టి గుర్తింపు లభిస్తుంటుంది. కానీ తన నటనతో పాత్రలకు మరింత పేరు తెచ్చిన నటుడు ఎస్వీఆర్. డైలాగ్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన మాడ్యులేషన్. పది పేజీల డైలాగుల్లో చెప్పే భావాన్ని కేవలం ఒకేఒక ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన ప్రదర్శించే నేర్పు కేవలం ఆయనకే సొంతం. సినిమాలో తనది చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా అది రంగారావు మాత్రమే చెయ్యాలనే రీతిలో ఆయన అభినయం ఉండేది. పాత్రకు తగ్గ టెంపోని పాటిస్తూ డైలాగ్ చెప్పడంలో ఎక్కడెక్కడ విరామం ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ పదాన్ని విరిచి మాట్లాడాలో రంగారావుకు బాగా తెలుసనిపిస్తుంది ఆయన సినిమాలు చూసినవారెవరికైనా.
సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు… ఒకటనేమిటి అన్ని రకాల చిత్రాల్లోనూ అభినయించి, సాటి లేని మేటి నటుడనిపించుకొన్నారు ఎస్వీఆర్. ‘షావుకారు’ చిత్రంలో సున్నం రంగడిగా రౌడీ పాత్ర పోషించిన రంగారావు తదనంతర కాలంలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జెట్టీలు’, ‘కత్తుల రత్తయ్య’, ‘బందిపోటు భీమన్న’ వంటి చిత్రాల్లో కూడా రౌడీ పాత్రలు పోషించారు. అయితే తన మార్క్ ఆ పాత్రల్లో ఉండేలా ఆయన జాగ్రత్త వహించారు. ‘పాతాళభైరవి’ చిత్రంలో నేపాళ మాంత్రికుని పాత్రతో ‘బుల్‌బుల్’, ‘డింగరీ’ వంటి కొత్త పదాల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రంగారావు ‘ బేవకూఫ్’, ‘డోంగ్రే’, ‘గూట్లే’ వంటి కొత్త తిట్లను రౌడీలకు అందించారు. ఏ తరహా పాత్ర ఆయన పోషించినా అందుకు అనుగుణమైన పర్సనాలిటీ ఉండటంతో ఆ పాత్ర రాణించేది. నిండైన విగ్రహం, కళ్లు ఆయనకు ఎస్సెట్స్ అని చెప్పాలి. వాటితోనే ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. తెలుగులో, తమిళంలో రాణించి, ‘విశ్వనట చక్రవర్తి’గా ప్రేక్షకుల ప్రశంసలు పొందినా, తనకు ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి రంగారావులో ఉండేది. అది మాత్రం నిజం.
(నేడు ఎస్వీఆర్ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు-12

బ్రాహ్మణాల కదా కమా మీషు-12

తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ  బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో ఇదొకటి .ఇందులో అయిదు కాండలుంటాయి అవే ఆగ్నేయ ,ఐంద్ర  పవమాన అరుణ ,శుక్రియలు .నాల్గవ దాన్ని ఉపనిషద్ బ్రాహ్మణం  అనీ పిలుస్తారు .చివరి దానికి ఆర్షేయ బ్రాహ్మణం అనే పేరు కూడా ఉంది .సింధు నదీ తీర ప్రాంతం లో ఇది పుట్టిందని భావిస్తారు .సాయనుడు దీనికి భాష్యం రాయ లేదు .భావత్రాతుడు రాసినట్లు తెలుస్తోంది .  సామగాచార్యులలో జైమిని ప్రసిద్ధుడు .కర్నాటక దేశం వాడని ‘’కర్నాటకే జైమినిహ్ ప్రసిద్ధః ‘’అని ‘’చరణ వ్యూహం’’ బట్టి తెలుస్తోంది .యజ్న యాగాదుల విషయాలే ఎక్కువ .జ్యోతి స్తోమం చేస్తే స్వర్గం వస్తుందని చెప్పింది  స్వర్గం  అంటే  సుఖం అనే అర్ధం కూడా ఉంది .

ఇందులో ఋత్విక్కుల విధుల గురించి పూర్తీ సమాచారం ఉంది .యాగం మొదట్లో అధ్వర్యుడు ‘’దీక్షణీయ ‘’అనే ఇష్టి జరిపి యజమానికి అతని భార్యకు దీక్ష నిస్తాడు .దీక్షా కాలం లో యాజమాన దంపతులు వంటికి వెన్న రాసుకొని ,కంటికి కాటుక పెట్టుకొని ఉండాలి .గోళ్ళతో గోక్కో రాదు .జింక కొమ్ముతో గోక్కోవాలి .పాలు ,అత్తిపండ్లు ,పెరుగు ,పేలాలు మాత్రమె ఆహారం గా గ్రహించాలి .కడుపు నిండక పోతే వట్టి అన్నం తినచ్చు .అపశబ్దాలు ,అసత్యాలు పలకరాడు .పళ్ళు కనబడేట్లు నవ్వ రాదు .స్త్రీముఖం చూడరాదు .యజ్న శాల విడిచి వెళ్ళరాదు  .ఋత్విక్కులకు దక్షిణ ఇచ్చేవరకూ తన చేతి తో ఎవరికీ ఏమీ ఇవ్వరాదు .యాగా ద్రవ్య సేకరణకు నాలుగు దిక్కులకు యాచకులను పంపాలి .యాచకులు అంటే అడుక్కొనే వాళ్ళు కాదు హోమ ద్రవ్యాలను  సేకరించేవారు .యెంత ధన వంతుడైనా ఇది తప్పని సరి విధి .దీనితో మొదటి రోజు కార్య క్రమం పూర్తవుతుంది .

రెండవ రోజు ‘’ప్రాయణీయ ‘’ఇష్టి జరిపి వస్త్రాన్నిచ్చి సోమలతను కొనుక్కోవాలి .ఇప్పుడు సోమలత దొరకటం లేదుకనుక ‘’పూతిక ‘’ను ప్రత్యామ్నాయం గా వాడుతున్నారు .ఈ సోమాని కి ‘’రాజు ‘’అని వేదం పేరు పెట్టింది .

రాజు మన ఇంటికి వస్తే ఎలా ఆతిధ్యమిస్తామో సోమానికీ అలానే ఇవ్వాలి .దీన్ని ‘’అతిధ్యేష్టి’’అంటారు .దీని తర్వాత యజమాని ,ఋత్విక్కులు పరస్పరం స్నేహం తో ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి .తర్వాత ‘’ప్రవర్గ్య కర్మ ‘’ప్రారంభిస్తారు .మనశరీరం లో శిరస్సుకు యెంత ప్రాధాన్యం ఉందో దీనికీ అంటే ప్రాముఖ్యం ఉంది .దీనికో కద కూడా ఉంది .పూర్వం విష్ణు మూర్తి ధనుర్యుద్ధం లో దేవతలను ఓడించి ,ధనుస్సును గడ్డం కింద పెట్టుకొని విలాసం గా నిల బడి ఉంటె ,ప్రతీకారేచ్చ తో ఇంద్రుడు చెద పురుగులను పంపి అల్లే త్రాటిని కోరికిస్తాడు .బంధం ఊడిపోయి ధనుస్సుకర్ర అతి వేగం తో పైకెగిరి విష్ణువు శిరస్సును శరీరం నుండి వేరు చేస్తుంది .ప్రతిక్రియ జరిగింది కనుక యజ్ఞం విచ్చిన్నమైంది .అశ్వినీ దేవతలు వచ్చి శిరస్సును అతికించిన తర్వాత దేవతలు యజ్ఞాన్ని పూర్తీ చేశారు .దీన్ని అనుకరిస్తూ ‘’మహా వీర’’అనే శిరస్సు లాంటి  కుండ ఒకదాన్ని మంత్రం పూతం గా తయారు చేసి  అందులో  ఆవుపాలను మేక పాలను నేతినీ పోస్తారు .వీటితో హోమం చేస్తారు ఇదే ప్రవర్గ్యం .ఉపసత్ అనే ఇష్టిని చేసి రెండో రోజు పని పూర్తీ చేస్తారు .మూడవ రోజు ‘’సుత్య’’అనే అయిదవ రోజుకుసోమయాగానికి  కావాల్సిన వేదికను తయారు చేస్తారు .నాల్గవ నాడు ‘’అగ్నిస్తోమీయం ‘’అనే పశు యాగం చేస్తారు అ రోజే సోమలతను రాతి మీద ఉంచి ,రాతి తో దంచి రసం తీసి దాన్ని కొయ్య తో తయారైన ‘’గ్రహం ‘’అనే చిన్న పాత్రలో పోసి ఇంద్రాది దేవతల నుద్దేశించి హోమం చేస్తారు .హోమం చేయగా మిగిలిన రసాన్ని యజమానులు తాగుతారు .సోమ లత అనే ఓషధిని రాతి తో కొట్టి రసం తీయటం పీడనమే కనుక పరిహారం కోసం ‘’వసతీరా ‘’అనే పుణ్య జలాన్ని స్పర్శించి దోషాన్ని పోగొట్టుకొంటారు .

ఇందులో ఒక ఉపాఖ్యానం సరదాగా ఉంటుంది .జంటగా ఉండే కొండ గుహల్లాంటి చీకట్లో నివశించే బలుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతం గా పీడించేవాడు .వాళ్ళు బృహ స్పతి  తో మొరపెట్టుకొంటే ఆయన ‘’బల  భిత్ ‘’అనే యాగాన్ని చేసి వాడిని  చీక ట్లోంచి వెలుగు లోకి రప్పించి ఆయుధాలతో చీల్చి చంపాడు .అంటే ఈ యాగం శత్రునాశన కారి అని తెలుస్తోంది .అన్న  సమృద్ధి ద్ధికోసం విరాట అనే యాగాన్ని ,స్వారాట్ వల్ల  స్వారాజ్యాన్ని అంటే తనకు తాను ప్రకాశించేలోకంపొందాలి  ,వృషభ యాగం చేసి దేవ శ్రేస్టూడైనాడు ఇంద్రుడు  వృషభం శ్రేస్టత్వానికి సూచిక .పదమూడు నుండి వెయ్యేళ్ళ వరకు చేసే యాగాన్ని సత్రం అంటారు .’’గవా మయనం’’అనేది అయన క్రతువులకు వికృతి .ఏడాదిపాటు చేస్తారు .ఇది చేస్తే స్వర్గం శత్రు విజయం ,వాక్పటుత్వం మొదలైనవి .పరమాత్మ సమర్పణ బుద్ధితో చేస్తే మోక్షం లభిస్తుందని ఈ బ్రాహ్మణం తెలియ జేస్తోంది .

ఇతర సామ వేద బ్రాహ్మణాల కంటే  తలవికారం అతి పెద్దది .కాని ఇది సస్వరం గా లభించలేదు .దీని వ్యాఖ్యానం ,ప్రయోగ పధ్ధతి ,శ్రౌత సూత్రం కాని దొరక్క పోవటం దురదృష్టం .ఉపాఖ్యానాలలో ప్రసిద్ధ రాజుల ,ఆచార్యుల పేర్లు కని పిస్తాయి .జనకుని సమకాలిక రాజు లెందరినో ఇది ప్రస్తావించింది .వీరిలో చితుడు ,దాల్భ్య వంశ మూల పురుషుడు దర్భ్యుడు ,కేశి దార్భ్యుడు ,సుత్వా యాజన సేనుడు ,లుషాకపి ,ఖార్గాలి ,సుదక్షిణ క్లైమి,బ్రహ్మ దత్త ప్రసేన జిత్తులున్నారు .చెట్లు ,చేమలు లేక పొతే ప్రాణి మనుగడ అసాధ్యం అని ఈ బ్రాహ్మణం చెప్పింది .ఓషధులు వనస్పతులు లేక పోతే భూమి ప్రాణ నివాసా యోగ్యం కాదని గరుడుడు స్వర్గం నుంచి సోమలతను తెచ్చి భూమిపై పిండాడు .ఆ రస బిందువులు పడిన చోట్లలో తాబేలు వీపులాగా కఠినం గా ఉన్న బోడి గా ఉన్న భూమి మీద ఓషధ వనస్పతులు పుట్టాయట .వీటివల్లనే భూమి నివాస యోగ్యమైంది .

వాయువు అంతరిక్షం లో ప్రకాశిస్తుందని ,శక్తి వంతమైన అణువులతో నిండిన అయస్కాంత క్షేత్రం చేత ఆకర్షింప బడి అడ్డం గా వీస్తుందని ,ఉత్తరాభిముఖం గానే ఈ వాయువు వీస్తుందని ,తెల్లగా ప్రకాశించే రూపం తో ఉంటుందని ,ఈ వాయువే అంత రిక్షాదిపతి అని ఈ  బ్రాహ్మణం  చెప్పింది . అంతరిక్షం లో శక్తి పూరిత అణువులుంటాయి  ప్రాణం నుంచి జలం నుంచి ,అగ్ని నుంచి ఇవి పుట్టి ప్రకాశిస్తాయని చెప్పింది ఇవే .ఈ బ్రాహ్మణం లో  ‘’పశు ‘’శబ్దం చేత పేర్కొన బడ్డాయి .వర్షం కోసం దుందుభి అనే వాయిద్యాలను  మోగించాలని చెప్పింది. యాజ్ఞిక ,చారిత్రిక ,భాషా ప్రయోగ దృష్టిలో తలవికార బ్రాహ్మణం ఎన్నో విశిష్టతలను ప్రదర్శించింది

‘’ఏష వై శశః య ఏషో న్తశ్చంద్రమసి ‘’అని చెప్పింది అంటే చంద్రునిలో కన బడే మచ్చ కుందేలే అని కవితా పరం గా చెప్పింది .వీణకు ఒకప్పుడు నూరు తీగాలుండేవని  ‘’వాణంశత తంత్రి మాహరాంతి ‘’అనే వాక్యం వలన తెలుస్తోంది ..గర్భస్థ శిశువుకు అడ లేక మగ లక్షణాలు అయిదవ మాసంలో ఏర్పడతాయని ‘’తస్మాత్ పంచమే మాసి గర్భా విక్రియన్తే ‘’అన్నదాని ద్వారా తెలుస్తోంది .

దేవతలకు రాక్షసులకు తాగాదాలు మామూలే కాని ఇందులో దేవతలకు ఋషులకు తగాదాలున్నట్లు చెప్ప బడింది .మనువుపుత్రుడు శార్యావతుడు అనే రుషి యజ్ఞం చేశాడు .భ్రుగు వంశానికి చెందిన చ్యవన మహర్షి సోమ పాత్రను అశ్వినీ దేవతల కోసం హోమం చేయటానికి చేతిలోకి తీసుకొన్నాడు .ఇంద్రుడు మహర్షికి తెలియకుండా ఆ పాత్రను దొంగిలించుకు పారిపోయాడు .ఈ పని చేసింది ఇంద్రుడే అని తెలిసి చ్యవనుడు ఇంద్రుడిని కొట్టాడు .దేవతలకు కోపమొచ్చింది . రుషులకూశువాళ్ళ పై  కోపం ఏర్పడింది .దేవతల యజ్ఞాలను ఋషులు ఋషుల యజ్ఞాలను దేవతలు పాడు చేయటానికి సిద్ధ పడ్డారు .ఋషులు దేవతలను ఎదుర్కొని ఓడించటానికి ‘’మదం ‘’అనే పేరుగల రాక్షసుడిని పుట్టించారని ఈ  బ్రాహ్మణం కొత్త విషయం తెలియ జేసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండే-జులై నెల” విహంగ”s లో నా వ్యాసం

భరత నాట్య గురువు,జంతు ప్రేమి -రుక్మిణీ దేవి అరండేల్

(విహంగ కు ప్రత్యేకం )

                భారత నాట్య శిరోమణి ,సాంఘిక సేవా దీక్షితురాలు ,జంతు ప్రేమి ,థియాసఫిస్ట్ శ్రీమతి రుక్మిణీ దేవి అరండేల్ ఆదర్శ మహిళా మాణిక్యాన్ని గురించి తెలుసుకుందాం .1904 ఫిబ్రవరి 29న తమిళ నాడు లోని మదురై లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించింది .తండ్రి నీల కంఠ శాస్త్రి ఇంజినీర్ .తల్లి శేషమ్మ కు సంగీతం ఇష్టం .తండ్రికి తరచూ ఉద్యోగ బదిలీలు ఉండేవి.ఆనిబి సెంట్ మద్రాస్ లోని అడయార్ లో నిర్వహిస్తున్న థియోసాఫికల్ సొసైటీ తో తండ్రికి పరిచయమై ,తండ్రితో పాటు వెళ్ళిన రుక్మిణికి ఆ సంస్థ తోను నాట్యం సంగీతం ,భారతీయ సంస్కృతులపై మంచి అవగాహన కలిగింది .ఆ సంస్థ  నిర్వాహకు రాలైన అనిబిసెంట్ అనుచరుడు   జార్జి అరండేల్ ను చూసింది . ఆయన అప్పుడు వారణాసి లోని సెంట్రల్ హిందూ కాలేజి ప్రిన్సిపాల్.ఆయనపై ప్రేమాభిమానాలేర్పడి అందరికి ఆశ్చర్యం కలిగిస్తూ అరండేల్ ను మతాంతర  వివాహమాడి సంచలనం సృష్టించింది  రుక్మిణీ దేవి .

         భర్త అరండేల్ తో కలిసి ప్రపంచ పర్యటన చేస్తూ ఎందరో థియసాఫిస్ట్ లను  జేమ్స్ కజిన్స్  అనే కవిని ,మేరియా మాంటిసోరి అనే విద్యా వేత్తనూ కలుసు కొన్నది.కొద్దికాలం లోనే అఖిల భారత యువ ధియాసఫిస్ట్ సమాఖ్య కు అధ్యక్షురాలై తర్వాత ‘’ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ యంగ్ ధియాసఫిస్ట్స్ ‘’.గౌరవ స్థానాన్ని అందుకొన్నది .అనుకోకుండా బాంబే లో రష్యా బాలే నాట్య కళా కారిణి ‘’అన్నా ప్రావ్లోవా ‘’కార్య క్రమాన్ని అరండేల్ దంపతులు చూశారు .ప్రావ్లోవా తో పరిచయం రుక్మిణి కి నాట్యం పై అభి రుచి కల్గి, ,  ఆమెతో నౌక లో ఆస్ట్రేలియా వెళ్లి నాట్యం అభ్యసించి  ఆమె బృందం లో ప్రదర్శనలిస్తూ ‘’సోలో ‘’లలో విశేష ప్రతిభ కన పరిచింది .అన్నా ప్రావ్లోవా ప్రోద్బలం తో రుక్మిణి కి భారతీయ నాట్యం పై విపరీతమైన అభిమానం కలిగి జీవితాంతం ఆ కళకే అంకితమైంది .

   1933లో మద్రాస్ మ్యూజిక్ అకాడమి వార్షికోత్సవం  రుక్మిణీ దేవి జీవితాన్ని మలుపు  తిప్పింది .ఆ రోజు ‘’సాదిర్’’‘’అనే నాట్యాన్ని చూసి ,మైలాపూర్ గౌరీ అమ్మాళ్ దగ్గర  ,ఈ కృష్ణయ్యర్  పర్య వేక్షణలో అభ్యసించి చివరగా ‘’పండనల్లార్ మీనాక్షి  సుందరం పిళ్లే ‘’వద్ద మెళకువలు నేర్చింది .రుక్మిణీ మొదటి ప్రదర్శనను 1935లో థియాసాఫికల్ సొసైటీ డైమండ్  జూబిలీ ‘’ఉత్సవాలలో చేసి అరంగేట్రం చేసి అందరి ప్రశంసలు పొందింది .1936జనవరి లో భర్తతో కలిసి సంగీత , నృట్యాభి వృద్ధికోసం ‘’కళా క్షేత్ర ‘’సంస్థను స్థాపించి  భారతీయ సాంప్రదాయ ‘’గురు కుల ‘’విధానం లో నేర్పటం ప్రారంభించింది . ఈసంస్థను  వంద ఎకరాల సువిశాల ప్రాంగణం లో  ’తిరువన్మియూర్ ‘’ లో అన్ని వసతులతో ఏర్పాటు చేశారు దంపతులు .కళాక్షేత్ర లో విద్య నభ్యసించి ప్రసిద్ధులైన నాట్య కోవిదులలో శ్రీమతి యామిని కృష్ణ మూర్తి సంయుక్తా పాణిగ్రాహి కమలాదేవి చటోపాధ్యాయ ,లీలా సామ్సన్ ,రాదా బర్నర్ ,అంజలి మెహర్ ,శారదా హాఫ్మన్ ,తో బాటు శ్రీ సి వి చంద్ర శేఖర్ లు ఉన్నారు .

   ‘’సాదిర్ ‘’నుంచే భారత నాట్యం ఆవిర్భవించింది .భరతనాట్యం పేరు రావటానికి ముఖ్య కారకులు కృష్ణయ్యర్ ,రుక్మిణీ దేవి .పండనల్లార్ శైలి లో ఉన్న విధానం లో ఎన్నో గణనీయ మైన మార్పులు తెచ్చి ఆధునిక భారత నాట్యాన్ని అభి వృద్ధి చేసి  ప్రపంచ ప్రసిద్ధి చేసిన ఘనత వీరిద్దరికే దక్కింది .ఒకప్పటి ‘’దేవ దాసీ’’నృత్య సంప్రదాయం ఇప్పుడీ భరతనాట్య సంప్రదాయం గా రూపు దాల్చింది . ఆలయ శిల్పాలను అధ్యయనం చేసి ఆహార్యం ,తగిన వస్త్రాలు వయోలిన్ లాంటి వాద్య సహకారం ,లైటింగ్ ,ఆభరణాలు మొదలైన హంగులన్నీ ఏర్పాటు చేసి మహోన్నత వైభవాన్ని సంతరించింది .ఎందరో సంగీత, నృత్య గురువులను ఆహ్వానించి మెలకువలను నేర్పించింది .విషయం లో కొత్తదనాన్ని ప్రవేశ పెట్టి రామాయణ  గీత గోవిందం లను వినూత్న విధానాలలో జనరంజకం గా అభినయించే పద్ధతులను ప్రవేశ పెట్టి కళ ను జన సామాన్యం దగ్గరకు తీసుకు వెళ్ళింది . రామాయణం లోని ముఖ్య ఘట్టాలైన సీతా స్వయం వరం ,రామ వనవాసం పాదుకా పట్టాభిషేకం శబరీ మోక్షం లను ,కాళిదాస మహా కవి రచించిన కుమార సంభవ కావ్యం లో ముఖ్య విషయాలను  జయదేవుని గీత గోవిందాన్ని ,ఉషా పరిణయం లను రుక్మిణీ దేవి అసమాన ప్రతిభ తో భారత నాట్యాన్నిఅభినయింప జేసి ప్రేక్షకుల అభినందనలనందుకోన్నది. నిత్య ప్రయోగ శీలిగా ఉండేది .

        భారత నాట్య శిక్షణ ఇస్తూనే విద్యా భి వృద్ధికి రుక్మిణి దంపతులు అవిరళ సేవ లందించారు .భారత దేశం లోనే మొట్ట మొదట గా ‘ మాంటిస్సోరి ‘’ విద్యా విధానాన్ని కళా క్షేత్ర ఆవరణలో ప్రవేశ పెట్టారు .’’బీసెంట్ థియాసాఫికల్ హై స్కూల్ లో 1939లో తరగతులు ప్రారంభించ టానికి మరియా మాంటిస్సొరి ని డాక్టర్  అరండేల్ ఆహ్వానించాడు .తరువాత ‘’బీసెంట్ అరండేల్ సీనియర్ సెకండరి స్కూల్ ‘’ ,’’కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ‘’,మరియా మాంటిస్సొరి  స్కూల్  ఫర్ చిల్ద్రెన్ ,క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సెంటర్ ,యు .వి స్వామినాధయ్యర్ లైబ్రరి ,మొదలైన సంస్థలను కళాక్షేత్ర ఆవరణలోనే నెలకొల్పి విద్యాభి వృద్ధికి ఏంతో తోడ్పడ్డారు .1952 ,56లో  రాజ్య సభ సభ్యురాలై సమర్ధ వంతం గా దేశ సేవ చేసింది .

         రాజ్య సభ సభ్యురాలిగా అనేక సంస్థలతో సంబంధం కలిగి ఉంది .మాన వ సేవాకార్యక్రమాల నెన్నిటినో చే బట్టింది .రాజ్య సభ సభ్యురాలుగా జంతు హింస ను నిషేధిస్తూ ప్రభుత్వం 1960 లో తెచ్చిన ‘’ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ ‘’ను కేంద్ర ప్రభుత్వం పై  ఒత్తిడి తెచ్చి తీసుకు రావటం లో రుక్మిణీ అరండేల్ కృషి  ప్రశంసనీయం .ప్రభుత్వం 1962లో’’యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ‘’ను ఏర్పాటు చేసి రుక్మిణీ దేవిని దానికి చైర్మన్ ను చేసి గౌరవించింది .ఆ పదవిలో జీవితాంతం పని చేసి జంతు సంక్షేమానికి ఎనలేని సేవలందించింది . తాను  శాకా హారిగానే ఉంటూ శాకా హార వ్యాప్తికి చాలా కృషి చేసింది .1955నుండి 31సంవత్సరాలు అంటే జీవితాంతం ‘’ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ‘’కు ఉపాధ్యక్షురాలుగా పని చేసింది .

             రుక్మిణీ దేవి సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన ఆ నాటి జనతా పార్టి ప్రధానమంత్రి ,గాంధేయ వాది శ్రీ మొరార్జీ దేశాయ్ ఆమెను ‘’రాష్ట్ర పతి ‘’పదవి కి అభ్యర్ధిగా ప్రకటిస్తామని కోరితే  మర్యాదగా తిరస్కరించిన సంస్కారి రుక్మిణీ అరండేల్ .82ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి భారత నాట్యానికి, విద్యాభి వృద్ధికి జంతు సంక్షేమానికి సేవలు అందించిన రుక్మిణీ దేవి 1986 ఫిబ్రవరి 24న మరణించింది .

         భారతీయ చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని 1987లో కళాక్షేత్రం లో ‘’కలం కారి కేంద్రం ‘’ను ప్రారంభించారు .దీని ప్రాధాన్యతను గుర్తించిన  కేంద్ర ప్రభుత్వం 1994లో ‘’జాతీయ ప్రాముఖ్య సంస్థ ‘’గా ప్రకటించింది .    రుక్మిణీ దేవి అరండేల్ శత జయంతిని 29-2-2004న కళాక్షేత్రం లోను ప్రపంచం లో వివిధ ప్రాంతాలలోను సభలూ సమావేశాలు సెమినార్లు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు .ప్రపంచ వ్యాప్తం గా యువత పాల్గొని పాటలు నృత్యాలు, పద్య పఠనం లతో మారు మోగించారు .ఆ రోజే న్యుధిల్లీ లో లలితా కళా ఆడిటోరియం లో రుక్మిణీ దేవి ఫోటో ప్రదర్శన నిర్వహించారు .   ఆ నాడే డాక్టర్ సునీల్ కొఠారి రచించిన రుక్మిణీ దేవి జీవిత చరిత్ర ,ఫోటో లతో ఉన్న పుస్తకాన్ని  మాజీ రాష్ట్ర పతి వెంకట్రామన్ ముందు మాట రాయగా ,భారత రాష్ట్ర పతి ఏ.పి జే .అబ్దుల్ కలాం ఆవిష్కరించారు .

  రుక్మిణీ దేవి నృత్య  విద్యా,  సాంఘిక సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956’’పద్మ భూషణ్ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .విశ్వ భారతి ‘’దేశికోత్తమ ‘’అవార్డును ప్రదానం చేసింది .సంగీత నాటక ఎకాడేమి ,పురస్కారాన్ని, ఫెలోషిప్ ను అంద జేసింది .భారత జంతు సంక్షేమ సంస్థ ‘’ప్రాణి మిత్ర ‘’ను ,లండన్ లోని ‘’రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ‘’సంస్థ ‘’క్వీన్ విక్టోరియా సిల్వర్ మెడల్ ‘’,నుఇచ్చాయి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారం అందించి సత్కరించింది .అమెరికాలోని వేన్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్ట రేట్ ను ,లాస్ ఏంజిల్స్ కౌంటి అండ్ సిటి వారు ‘’స్క్రోల్ ఆఫ్ ఆనర్ ‘’అందజేసి గౌరవించారు .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం.ప్ర.జ.-4

డిం .టిం.ప్ర.జ.-4

డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ?

టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా ఉంటె ఖరీఫ్ పంటకూడా అనుమానమే .

డిం –నిజమే గురూజీ !

టిం –పాపం బాబు అధికారానికి వచ్చిన ప్రతిసారి ఇలాదురద్రుస్టం వెంటాడటం బాధగానే ఉంది .ఈ సారైనా అన్నీ కలిసోస్తాయనుకొంటే విధి వెక్కి రెక్కిస్తోంది .సమర్ధుడైన నాయకుడికి దేవుడు పరీక్క్షలు పెడుతూ పరిశీలిస్తున్నాడు .లెట్ అస్ హోప్ బెటర్ .

డిం –ఈ మధ్య బాబు మోడీ ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతున్నాడు?

టిం –అంటే నక్షత్రకుడిలా వెంట పడుతున్నడనే గా నీ భావం ? తప్పదు నాయనా !రాష్ట్రం బాగు పడాలంటే ఇలా వెంటపడి  కంటపడి పని సాధించుకోవాల్సిందే .రాకెట్ లాంచింగ్ కు ముందు రోజునా ,రాకెట్ ప్రయోగానికి కాసేపు ముందూ మోడీని రెండు సార్లు కలిసి చేయాల్సిన పని లిస్టు తో మోదీ ని బాది పారేశాడు బాబు .

డిం –శ్రీహరి కోట రాకెట్ విజయమైంది కదా గురూ !

టిం –అవున్రా శిష్యా !అక్కడ మోడీ మాట్లాడిన మాటలు ఎంతో స్పూర్తి నిచ్చేవిగా దార్శనికం గా ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి .అ హాలీ  వుడ్ సినిమా ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే చంద్రయాన్ కు మనం నాలుగొందల యాభై కోట్లే ఖర్చు చేశామని గుర్తు చేసి వెన్ను తట్టాడు శాస్త్ర వేత్తలను .అంతేకాదు సార్క్ దేశాల అవసరాలకు తగిన రాకెట్ ప్రయోగం చేయమని గొప్ప సూచనా చేశాడు .బహుశా తోలి ప్రధాని నెహ్రు తర్వాత ఇంత ఆలోచన చూపిన వాడు మోడీ అని పించాడు .జియో పొజిషన్ ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంటె దాన్ని సార్క్ చేతుల్లోకి తీసుకొవాల్సిన అవసరాన్ని చెప్పిన ప్రాజ్నుడని పించాడు .అదే దేశానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు .హాట్స్ ఆఫ్ టు మోడీ .

డిం –గురూజీ ఏదో మూడ్ లోకి వెళ్లి పోయారు ?

టిం –నిజమేరా మంచి చేస్తే మెచ్చాలి .చెడు చేస్తే బుద్ధి చెప్పాలి .అందుకే ముసలాయన ఆద్వాని ‘’మొదటి టెస్ట్ లోనే మోడీ ట్రిపుల్ సెంచరి సాధించాడు ‘’అని మెచ్చాడు .

డిం –నిన్న మమత ఎంపి  ఏదో ప్రేలాడట ?

టిం –అవును .మార్క్సిస్ట్ పార్టీ ఆడవాళ్ళను రేప్ చేయిస్తానన్నాడు తపన్ పాల్ .ఇంకా అలా మాట్లాడిన వాడిపై  చర్య తీసుకోకుండా ఉంచటం మమత కు మంచిది కాదు .చివరికి ఆయన  భార్యే క్షమాపణ చెప్పింది భర్త తరఫున .ఇప్పటికైనా మమత తీవ్ర చర్య తీసుకోక పోతే పరువు కలకత్తా కాళికి బలి అయి పోతుందని గుర్తించాలి .ఇప్పుడే విన్న వార్త .ఏదో మొక్కు బడిగా క్షమాపణ చెప్పాడట ఆ ప్రబుద్ధుడు .

డిం –విప్పుల విషయం లో కొప్పులు పట్టుకొంటున్నారు నాయకులు ?

టిం –అవును .జగన్ పార్టీ వాళ్ళు ధిక్కరించి ఓటేస్తే అనర్హత వేటు పడుతుందని మైసూరా అంటూంటే అదేమీ ఉండదు హాయిగా గోడ దూకేయండి అని తెలుగు సోమిరెడ్డి అభయం  ఇస్తున్నాడు .ఏది ఏమైనా ఈ కప్పల తక్కెడ తూకం కొద్దికాలం తప్పదు .స్వార్ధం యెంత పనైనా చేయిస్తుంది .

డిం –డిగ్గీ ఈ మధ్యేదో వాగి లేమ్పలేసుకొన్నాడు?

టిం –అది ఆయనకు మామూలే .రాహుల్ కు దమ్ములేదని నాయకత్వ లక్షణాలు పూజ్యం అని ,పార్టీ దారుణ వైఫల్యం పొందటానికి అతనే కారణమనీ కూశాడు .కాని వెంటనే ప్లేట్ మార్చేసి తాను అలా అనలేదని పేపర్ వాళ్ళ సృష్టే అని దబాయించాడు .శాంతం పాపం అని లేమ్పలేసుకొన్నాడు .ఏమైనా తాగిన వాడు నిజం బాగా చెబుతాడు అన్నట్లు డిగ్గీ నిజాన్ని నిర్భయం గా బైట పెట్టాడు .

డిం –షార్ లో మోడీ హుషార్ అన్నారు ?

టిం –ఇరవై ఆరుసార్లు విజయవంతం గా ప్రయోగం చేసన సంస్థను చూస్తె ఎవరికైనా అంత హుషార్ వస్తుంది ప్రధాని మంచివిషయానికి సహజ స్పందనే అది .శాస్త్ర సాంకేతిక వేత్తల ఉమ్మడి కృషి ఫలితమే ఇది .అంతా స్వంత పరికరాల విజ్ఞానం తో సాధించిన అద్భుత విజయమే కదా .అందుకే అంత ఆనందపడ్డాడు ప్రధాని మోడీ .అయినా ‘’ఇది నా మనసుకు చాలటం లేదు ‘’అని చెప్పి మార్గ నిర్దేశామూ చేశాడు .ఇన్నాళ్ళకు దేశ భవిష్యత్తు ఒక ప్రాజ్నుడి చేతిలో దూర ద్రుష్టి ఉన్న వాడి చేతిలోకి వచ్చినందుకు మనం గర్వ పడాలి శుభం భూయాత్ .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment