కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెనె సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.

స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.

తెలుగు కథా సంవిధానంలో సాధారణీకరింపబడిన యితివృత్తాల చిత్రణ చాలా ప్రధానభాగం ఆక్రమించినప్పటికీ, ప్రాంతీయ కథ కూడ, తెలుగు భౌగోళిక ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జీవన చిత్రాల వైవిధ్యాన్ని చిత్రించడం ద్వారా తనదైన ముద్ర వేయగల్గింది. ప్రాంతాల యాసలు, పలుకుబడులు, ఆచార వ్యవహారాలు పరిచయం చేయడం ద్వారా ప్రాంతీయ సంస్కృతి ఆవిష్కరింపబడింది. ప్రాంతీయ జీవితాలు, సమస్యలు, సంక్లిష్టతలు పాఠకులకు అందించడం ద్వారా ప్రాంతీయ అస్తిత్వ చింతనకు ఆలంబనగా మారింది. ప్రాంతీయ జీవితంలో ఖాళీలను చూపి, వాటి భర్తీకి వుద్యమాల్ని పురిగొల్పింది.

ఇది నాణానికి ఒకవైపు చిత్రం -వైవిధ్యత. రెండోవైపు చిత్రం – వైరుధ్యం. ఒక ప్రాంత సాహిత్యం తన ప్రాంత విశిష్టతను చిత్రించే క్రమంలో అది సమగ్రంగా చిత్రింపబడుతుం దా? కనిపించే దృశ్యానికి కనిపించని కారణాల్ని ఎత్తిపడుతుందా? వైవిధ్యతలోని గాఢతను అంతే స్పష్టంగా పట్టుకుంటుందా? చాలాసందర్భాల్లో వీటికిఆశావహ సమాధానాలు లభిం చవు – అదే వైరుధ్యం. ఈ విషయాన్ని రాయలసీమ వైపు నుంచీ చూసే ప్రయత్నమిది.

రాయలసీమ గురించి మొదటి కథ రాయలసీమకు బయటి రచయిత నుంచీ రావడమే పెద్ద వైరుధ్యం. చింతాదీక్షితులు ‘సుగాలీ కుటుంబం’ (1921) కథలో కరువు పీడిత జీవితాన్ని చిత్రించడం, ఆ తర్వాత ఆయనే ‘చెంచురాణీ’, ‘దాసరి పాట’ లాంటి కథలు రాయడం ద్వారా రాయలసీమ యితివృత్తాలను కథలుగా మలచడం ప్రారంభమైంది. ఆ తర్వాత యిరవైయేండ్లకు జి.రామకృష్ణ ‘చిరంజీవి’, ‘గంజి కోసరం’, కె.సభా ‘కడగండ్లు’ కథలు రాయలసీమలోని కరువునూ, ఫ్యూడలిజాన్ని చిత్రించాయి. ఆధునిక తెలుగు తొలి కథ సంస్కరణను (దిద్దుబాటు, స్త్రీ విద్య) చిత్రిస్తే, ఆధునిక రాయలసీమ కథ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ప్రాంతీయ దుఃఖాన్ని ఆలపించింది. జి.రామకృష్ణ/సభా ల నుండి యిటీవలి దేవేంద్రాచారి/వేంపల్లి షరీఫ్‌ల దాకా మంచి కథలు రాసారనిపించుకున్న సీమ కథా రచయితలందరూ, సాధారణాంశాలపై కథలు రాస్తూనే, ప్రధానంగా ప్రాంతీయ జీవిత దుఃఖ దృశ్యాల్ని పట్టి పట్టి చూపిస్తున్నారు, రాయలసీమ వైవిధ్యత, కరువూ (నీళ్ళు లేనితనమూ, వానలు రానితనమూ) ఫ్యాక్షన్ ఆవేశకావేశాల (ఫ్యూడల్ అవశేషం)ను చిత్రించడంగా చరిత్రలో మిగిలింది.

ఆర్థిక కారణాల వల్లనే రాయలసీమలో ఆధునిక తెలుగు కథ ఆలస్యంగా వచ్చిందని కొందరంటారు గానీ, అదే నిజమైతే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమైనా, దిద్దుబాటు అక్కడే ప్రారంభమైంది. వెనుకబాటుతనాన్ని గుర్తించే పౌరసమాజం వుద్భవిస్తేనే అది సాహిత్యంలోకి వస్తుంది. అది తెలంగాణ లాగా విముక్తికి బాటలు వేస్తుంది. ఇది రాయలసీమలో పాడిన పాట పాడిన దగ్గరే పాడుకుంటోంది. ‘గంజికోసరం’ ప్రత్యక్షంగా కరువును చిత్రించిన కథ. చిరంజీవులు, కడగండ్లు ఫ్యూడలిజాన్ని చిత్రించిన కథలు. అయితే, 1960ల కాలానికి సింగమనేని, ఒక అడుగు ముందుకు వేసి, ‘జూదం’ -రైతుకు గిట్టుబాటు లభించకపోవడం, ‘ఊబి’ -బావుల సేద్యం పోయి బోర్ల సేద్యం రావడం, ‘అడుసు’ -రైతుదళారుల చేతుల్లో మోసపోవడం దాకా పరిణమించడం కనిపిస్తుంది. నీళ్లు, వానరాలే, సావునీళ్లు, వ్యసనం, ఒక్క వాన చాలు, ఇలాంటి కథలన్ని రాయలసీమ మీద ప్రకృతి పగబూనడం యితివృత్తంగా వచ్చినవే. సింగమనేని ‘అగాధం’ కథ వుద్యమిస్తున్న రైతును చిత్రించిన కథ. ఆ తర్వాత మన్ను తిన్న మనిషి ప్రయాణం ‘అగాధం’ మీదుగా ‘తెల్లదయ్యం’, ‘రంకె’ కథా మార్గంలో సాగాల్సింది. అయితే అలా జరగలేదు. ఇది రాయలసీమ కరువు కథా సంవిధానంలోని వైరుధ్యం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి సంవత్సరం అత్యధిక ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించబడుతూవుంది. యిటీవలి కాలంలో యీ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో లేటెస్ట్ మోడల్ కార్లు కూడ విపరీతంగా సంచరిస్తున్నాయి. ఎండమావుల్లో తిమింగలాలవేట (సభా) కథ కరువులో మత్స్యకారులకు వలలకోసం, చేపల చెరువుల కోసం ఆర్థిక సహాయం మంజూరీలో మంత్రిగారి అవినీతిని చెప్పిన కథ. ఇటీవలి కాలంలో కరువెవరికి కథలో మూడు వర్గాల- అగ్రవర్ణ, వెనుకబడిన, దళిత స్త్రీల జీవితాలు కరువులో ఎలా వున్నాయో చిత్రింపబడింది. ఇలాంటి కథలు యింకా ఎన్నో వచ్చి వుండాల్సింది. భౌతిక దృష్టికి కరువు గురించి అద్భుత వైరుధ్యాన్ని పట్టిచ్చే యిట్లాంటి కథలు రాయలసీమ నుంచీ ఎక్కువగా రాకపోవడం ఒక పెద్ద వైరుధ్యం.

నీళ్లు లేకపోవడమంటే నాగరికత లేకపోవడం, భాషా సంస్కృతులూ ఆహారపు అలవాట్లూ చాలా తేడాగా వుండటం. సభా ‘పాతాళగంగ’లో నీళ్లు సాధనకు బేటప్ప పడే కష్టాల నుండి రైతుల వీపుల మీద పుట్టిన కరువు రాచపుండ్లను మాన్పేందుకు నీళ్లను తోలుకొచ్చే అపర భగీరథులను కలగనే విశ్వనాధరెడ్డి ‘పొడినిజం’ దాకా పొలాలకు నీళ్లు అందని తనాల్ని చిత్రించినంతగా మనిషిగొంతులోకి నీళ్లు దిగనితనాల్ని చిత్రించలేదనిపిస్తుంది. రాయలసీమలో కారం ఎందుకు ఎక్కువగా తింటారూ, కారానికీ కరువుకీ సంబంధమేమిటి? రాయలసీమ ఆహారపు అలవాట్లను చిత్రించిన కథల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇటీవలి ‘గాయాలు’ కథలో జొన్న రొట్టె చేయడాన్నీ, తినడాన్నీ ఒక ఆత్మగౌరవ విషయంగా చిత్రించడాన్ని చూస్తాము.
స్రీ రచయితలు అంతగా లేని రాయలసీమలో పురుష రచయితలే, స్త్రీల మీద కరువు చూపే ప్రభావాన్ని చిత్రించారు. నామిని కథల్లో కరువు అనే మాటే లేకుండా, కరువు చేసే విధ్వంసం కరుణ రస్రార్దంగా చిత్రితమైంది. చక్రవేణు ‘కసాయి కరువూ’, ‘కువైట్ సావిత్రమ్మా’, స్వామి ‘బతుకు వూబి’ కథల్లో జీవిత విధ్వంసం అన్ని రూపాల్లోనూ కన్పిస్తుంది. రాయలసీమ స్త్రీ రచయితలు, నిర్మలరాణి ‘గాజుకళ్ళు’ సుభాషిణి ‘కరువెవరికీ’ కథల్లో స్త్రీ వేదన ప్రతిభావంతంగా చిత్రితమైంది. తక్కువగా వచ్చినా రాయలసీమ కథల్లో స్త్రీ కోణం వైవిధ్యంగా కనబడుతుంది.

రాయలసీమలో ఫ్యాక్షన్, గ్రామాల్లో ఆవేశకావేషాలతో ఉద్రిక్త పరిస్థితిగా (కూలిన బురుజు) మొదలై, ఆ ఉద్రిక్తతలో నలిగిపోయేది చిన్నా బన్నా కులాలేనని (ఎలిగే పెద్దోల్లు-నలిగే చిన్నోల్లు) గ్రామాల్లో వుపాధి లేని కూలీలు ఆ ఫ్యాక్షన్‌లోకి అనివార్యంగా నడిచిపోతున్నారనీ (నడక), ఫ్యాక్షనిస్టుల అధికార సోపానాలకు నిచ్చెనలుగా (నిచ్చెన) వుపయోగపడుతూ, కుటుంబాలలోని స్త్రీలను పిల్లలనూ అభద్రతకు (కన్నీటి కత్తి) గురిచేస్తున్నారనీ, ఇది ఫ్యాక్షనిస్టుల కుటుంబాలలోని, స్త్రీలకైనా తప్పడం లేదనీ(చుక్క పొడిచింది, ఒక వేకువలోకి) కథలు చిత్రించాయి. ప్రభుత్వాలు ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు బదులు, వాళ్ల చేతుల్లోని ఆయుధాల్లాంటి అనుచరులను ఎన్‌కౌంటర్ల (పడగనీడ) రూపంలో నిర్మూలిస్తే, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులుగా మారి రాజధాని నగరాల్లో, దందాలూ/పంచాయితీలూ/భూ ఆక్రమణలూ కొనసాగించేందుకు రూపం మార్చుకోవడం, గ్రామాల్లోని కూలీలు కరువు వల్లనో, ఫ్యాక్షన్‌కు దూరంగా వుందామనో, గిట్టుబాటైన కూలీ దొరకుతుందనో, నగరాలకు వలస వస్తే, రూపం మారిన ఫ్యాక్షనిస్టుల చేతుల్లోకి మళ్లీ చేరి ‘లుంగీలోల్లు’గా ముద్ర వేసుకోవడం చూసాం. ఫ్యాక్షన్ ఎన్‌కౌంటర్ల దాకా కథగా మారిన చరిత్ర చివరి అంకంలో ‘లుంగీలోల్లు’గా ముద్ర పడడాన్ని మాత్రం ‘కథ’గా మార్చలేకపోయింది.

రాయలసీమ కథ వ్యవసాయాన్ని పట్టించుకుంది. వ్యవసాయం చుట్టు వున్న జీవితాన్నీ ఘర్షణనీ పట్టించుకుంది. అయితే ఆ పట్టించుకోవడం కూడ ఫిర్యాదు స్థాయి మించి ఎదగలేదనే, కారణాల విశ్లేషణ చేయలేదనే విమర్శకులు వున్నారు. అందులో నిజం కొంత వుండచ్చు. కరువూ ఫ్యాక్షన్ విరూపాల విశ్లేషణ విశ్వనాధరెడ్డి నుండి సన్నపురెడ్డి దాకా కథకులు కొంతైనా చేసి వుండొచ్చు. అయితే అదే పండని నేల కింద, తవ్వుకునే వాళ్ల, పంటలు పండిస్తున్న ముడిఖనిజాల మైనింగ్ గురించి కథలు అసలు రాలేదంటే, అందరూ అంగీకరించాల్సిందే. రాయలసీమ అంతటా గ్రానైట్, బాక్సైట్, బైరటీస్ ఐరన్, లైమ్‌స్టోన్ లాంటి విలువైన ముడిఖనిజాల అక్రమ/సక్రమ మైనింగ్ చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మైనింగ్‌లో జీవితమేమిటి ఘర్షణ ఏమిటి? అనేది యే మాత్రమూ చిత్రింపబడలేదు. లక్షల కోట్ల ముడిఖనిజం సీమ దాటిపోతుంటే ఒక్క కథా రాకపోవడం పౌరసమాజపు విస్మృతిని సూచిస్తుంది. కరువు నేలలో సంపద పోగుపడుతోంటే ఆ విరోధాబాసను పట్టుకోలేకపోవడం గొప్ప వైరుధ్యం.
అలాగే పర్యావరణ స్పృహ గురించిన కథలు కూడా అంతగా కన్పించవు. ‘కొమ్మిపూలు’ ‘సావునీళ్ళు’ కథల్లో పర్యావరణమ్మీద స్పృహ రేఖామాత్రంగా కన్పించినా, కరువుతో అంతస్సంబంధమున్న, చెట్లు లేమిని, అటవీ విధ్వంసాన్నీ చిత్రించడం, రాయలసీమ కథలో కన్పించదు. ఇటీవలి కాలంలో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుంటే…. యీ కథల ఆవశ్యకత స్పష్టంగా కన్పిస్తుంది.

నమ్ముకున్న నేలమీద కరువు నృత్యం చేస్తుంటే, అదే నేలమీద సిమెంట్ ఫ్యాక్టరీలు పుట్టుకొస్తుంటే, నేలను నమ్ముకున్న మనుషులే ఆ ఫ్యాక్టరీల్లోకి కూలీలుగా పోవడాన్ని, సిమెంట్ ఫ్యాక్టరీలవల్ల నేలతో తెగుతున్న వ్యవసాయ బంధాల గురించి, కడప కథా, బాగా నడుస్తున్న పేపర్ మిల్లు ఒక వ్యక్తి అత్యాశ వల్లా, కుట్ర వల్లా మూతబడే కాలానికి అందులోని కార్మికుడు కిరాయి హంతకుడిగా పరిణమించడాన్ని గురించి (పడగనీడ) కర్నూలు కథా, పట్టణీకరణ చెందుతున్న చిన్నగరంలోని చిన్న జీవితాల గురించి (రెండేళ్ల పద్నాలుగు) తిరుపతి కథా, యివీ రాయలసీమలో వేళ్లూనుకుంటున్న ఫాక్టరీల గురించీ, కార్మికుల స్థితిగతుల గురించీ, పట్టణీకరణ గురించీ, రేఖామాత్రంగానైన చిత్రించిన కథలు. వీటినిదాటి రాయలసీమ వర్తమానం రోడ్ల విస్తరణగా, రియల్ ఎస్టేట్ విస్తరణగా, పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్‌గా, అక్రమ మైనింగ్ స్మగ్లింగ్‌గా యింకా యిలాంటి ఎన్నో కొత్త విషయాల మీదుగా దూసుకుపోతున్నది. యీ విషయాల మీద రచయితలు దృష్టి పెట్టాల్సివుంది.

స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.

నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.

-జి.వెంకటకృష్ణ
(మే 31-జూన్ 1లలో కర్నూలు కథాసమయం నిర్వహించిన కథకుల సమావేశంలో చేసిన ప్రసంగానికి వ్యాసరూపం)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 

imggallery

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4

బ్రాహ్మణాలలో రాజులు

మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన సమాధానం చెప్పారు కాని రాజు సంతృప్తి చెందలేదు .కానిముగ్గురిలో యాజ్న్య వల్క్యుడు చర్చను బాగా నిర్వహించినందుకు వెయ్యి గోవులను బహుమానం గా ఇచ్చాడు .కాని ‘’అగ్ని హోత్ర తత్త్వం యాజ్న్య వల్కుడికీ సరిగ్గా బోధ పడలేదు ‘’అని చెప్పి సభ చాలించేశాడు జనకుడు .మిగిలిన ఇద్దరు ఋషులు జనకుడు పరి పూర్ణ జ్ఞానం తో తమను నిరుత్తరుల్ని చేశాడనుకొన్నారు .దీనికి ప్రతీకారం చేయాలని ఆలోచించి జనకు డిని బ్రహ్మ తత్వ విచారం లోకి   దించాలను కొంటే యాజ్న్య వల్క్యుడు ఒప్పుకో లేదు  .జనకునితో వాదానికి దిగి గెలిచినా ఓడినా తమకే అవమానం అన్నాడు .అగ్ని హోత్రం  నిజ విజ్ఞానాన్ని జిజ్ఞాస తో ఒంటరిగా తెలుసుకొని జనకునికి వివరించి విజయం సాధించాడు .మహా రాజైన జనకుడు ఎంత తత్వ వివేక సంపంన్నుడో మనకు తెలుస్తుంది ..జనకుడు సత్యకామ జాబాలి కి ముఖ్య శిష్యుడు .

వ్రతర్దనుడు అనే రాజు యజ్న విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రాహ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్దరు క్షత్రియులతో వాదం చేసినట్లు ఛాందోగ్యం చెబుతోంది .దాల్భ్యుని సోదరులు బక దాల్భ్యుడు జైమినీయ బ్రాహ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రాహ్మణం లోను  కనిపిస్తారు.ఈ ముగ్గురి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే  కౌరవ రాజు సోదరి .తండ్రి శాతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రాహ్మణం లో ఉన్నది .

ద్రుపద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు ‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తోంది .ద్రౌపదికి యాజ్ఞా సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్నులే ,కేశి దాల్భ్యుని సమకాలికులే .జీవల చైతకి ,ప్రాచీన శాల ,ఔపమన్యువు ,సత్య యజ్న పౌలుషి ,బుడిలఅశ్వత రాశ్వి మొదలైన క్షత్రియులు ఉద్దాలక ఆరుణి తో చర్చ చేసినట్లు చాన్దోగ్యమే చెప్పింది .జీవాల కారి ,ఆశాఢ సావయసుడు ,అనే ఇద్దరు క్షత్రియులగురించి కూడా జైమిని బ్రాహ్మణం లో ఉంది .జనక మహా రాజు సమకాలికులైన బార్కు వార్షుడు ,ప్రియ జాన శ్రుతేయుడు ,ల విషయం కూడా ఇందులోనే కనిపిస్తోంది .సుదక్షిణ క్డైమిఅన్న క్షత్రియుడు జనకుని తో ‘’స్తోమ ‘’శబ్దార్ధాన్ని చర్చిన్చాడని తెలుస్తోంది .

కౌశీతకీ ,జైమిని బ్రాహ్మణాలలో కోసల రాజు బ్రహ్మ దత్త ప్రాసేన జితుడి సమకాలికులైన హిరణ్మయ కుషణుడు ,ఇటన్  కావ్యుడు బ్రహ్మ దత్త చైకితానుల గురించి ఉన్నది .పర ఆహ్నర అనే కోసల రాజు ను గురించి,సమీస్వాహుడు అనే మరొక రాజు గురించి  తాండ్య బ్రాహ్మణం  ,శత పదాలలో ఉన్నది .’’సులభా ‘’అనే క్షత్రియ స్త్రీ జనక మహా రాజు తో ఆధ్యాత్మిక విషయ చర్చ చేసి నట్లు కనిపిస్తోంది ఈమె మైత్రేయి కావచ్చు .ఈమె పేర ‘’సౌలభ బ్రాహ్మణం ‘’ఉండేది అని కాశికా వ్రుత్తి లో చెప్ప బడింది కాని కాలం లో కలిసి పోయి కని పించ లేదు .వీరందరి గురించి తెలియ జెప్పిన బ్రాహ్మణాలు వీరిని  ‘’బ్రాహ్మణులు ‘’అని శ్రేష్ట వాచకం తో పేర్కొనటం వారికి ఉన్న ఆధ్యాత్మిక ప్రావీణ్యానికి ,సంఘం లో వారి పలుకు బడికి ,ప్రతిస్థ కు నిదర్శనం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ గబ్బిట వెంకట రావు (పౌరాణిక నాటక సినీ రచయిత-చెన్నై ))గారి మనవడి వివాహము

మాకు ఉన్న ఒకే ఒక్క జ్ఞాతి స్వర్గీయ గబ్బిట వెంకట రావు( పౌరాణిక నాటక ,సినీ రచయిత-చెన్నై ),కుమారుడు గబ్బిట మధుమోహన్ (చెన్నై)రెండవ కుమారుడుఛి సాయిరాం వివాహం విజయవాడ లో 22-6-14 ఆదివారం జరిగిన సందర్భం గా ఫోటో గాలెరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

 
తెలంగాణ కవులు, రచయితలకి మనవి : 

మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అయితే అశేషంగా ఉన్న మన కవుల/రచయితల పుస్తకాలని సేకరించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడం వలన మీ తోడ్పాటు ని కూడా అర్థిస్తున్నాను. దయచేసి సహకరించండి. 
                           నాకు పంపిన వారందరి బయో డేటాలని మీ ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు బ్లాగ్ లో అప్ డేట్ చేయడం జరుగుతుంది. అలా ఆన్ లైన్ లో మన తెలంగాణా కవుల/రచయితల సమగ్ర సమాచారం శాశ్వతం చేయబడుతుంది. కావున తెలంగాణాలోని  అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని పంపవలసిందిగా కోరుతున్నాను. 

గమనిక : ఈ మహాకార్యానికి కేవలం రచయితలే కాకుండా ఔత్సాహికులైన తెలంగాణా సాహితీ అభిమానులు కూడా స్పందించవచ్చు.మీ దగ్గరున్న ఏ తెలంగాణా కవి/రచయిత  రచించిన పుస్తకమున్నా వెంటనే నాకు పంపండి. ఒక పుస్తకం మొదలు మీకు వీలైనన్నీ పుస్తకాలు పాతవైనా , కొత్తవైనా మంచి కండిషన్ లో ఉంటే వెంటనే నాకు బుక్ పోస్ట్ చేయండి.(బుక్ పోస్ట్ కి పోస్టల్ చార్జీ చాలా తక్కువగా ఉంటుంది.)తెలంగాణా సాహితీ పరిరక్షణలో పాలుపంచుకోండి. నాకు పంపించిన వారందరి వివరాలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా  http://telanganaliterature.blogspot.in/ బ్లాగ్ లో పొందుపరచడం జరుగుతుంది. 

పుస్తకాలు పంపవలసిన నా చిరునామా : 
బొడ్డు మహేందర్, 
ఇంటి నంబర్ 2-26,
ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం , 
ఆదిలాబాద్ జిల్లా – 504201 
ఫోన్ : 9963427242

 
 
 
 
 
Boddu Mahender

chennur, Adilabad dist
Telugu Rakshana Vedika Secretary
ph: 9963427242
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కొల్లూరి కి శ్రద్ధాంజలి

       స్వర్గీయ కొల్లూరికి శ్రద్ధాంజలి గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమం
  విద్యారంగ అభి వృద్ధికి అవిరళ కృషి చేసి ,ఉపాధ్యాయ ,అధ్యాపక సమస్యా పరిష్కారాలకు  నాయకత్వం వహించి ,విద్యార్ధి దశలోనే ”తెలుగు విద్యార్ధి ”మాసపత్రికను స్థాపించి 61సంవత్సరాలుగా నిర్వహిస్తూ ,ఆంద్ర విశ్వ విద్యాలయం కు సెనేట్ సభ్యునిగా ,ఉపాధ్యాక నియోజక వర్గానికి కృష్ణా జిల్లా శాసన మండలి సభ్యునిగా 16ఏళ్ళు కృషి చేసి ,అందరికి మిత్రుడుగా మెలగుతూ ఉన్న శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు  19-6-14న మరణించిన సందర్భం గా సరస భారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ   కొల్లూరికి కి శ్రద్ధాంజలి  ఘటించ టానికి ఈ రోజు 23-6-14 సోమవారం ప్రత్యెక కార్యక్రమాన్ని స్థానిక ఎ .సి లైబ్రరి లో సాయంత్రం 6గం లకు నిర్వ హిస్తోంది .ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు సాహిత్యాభిమానులు పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి
   జోశ్యుల శ్యామలా దేవి -మాదిరాజు శివ లక్ష్మి -జి వి రమణ -గబ్బిట  దుర్గా ప్రసాద్
   గౌరవాధ్యక్షులు               కార్య దర్శి           కోశాధికారి      అధ్యక్క్షులు -సరసభారతి
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు

c కధా కమా మీషు- 3

బ్రాహ్మణాల లోని మహర్షులు

బ్రాహ్మణాలలో వేద ద్రస్టలైన మహర్షుల పేర్లే కాకుండా మరి కొందరు మహర్షుల పేర్లు కని  పిస్తాయి .ఇందులో  సప్తర్షులే కాక కుత్స ,అత్రి ,రేభ ,అగస్త్య ,కుశిక గణ ,వసిష్ట,వ్యస్వ మహర్షుల పేర్లున్నాయి .బృహదారన్యకోపనిషత్ లో గౌతమ ,భరద్వాజ ,విశ్వా మిత్ర ,జమదగ్ని ,విశిష్ట కశ్యప ,అత్రి మహర్షుల ను పేర్కొన్నది .అధర్వ వేదం లో అదనం గా ఆంగీరస ,గనిస్తికర ,కక్షీ వంత , కణ్వ మేదాటిది ,త్రిషాక ,ఉశనా ,కావ్య ముద్గల ఋషుల పేర్లు కని  పిస్తాయి .ఋగ్వేదం  తర్వాతి వాగ్మయం  సప్తర్షి నక్షత్ర మండలానికి సప్తర్షులకు ఉన్న సంబంధాన్ని చర్చించింది .సాయనుడు నక్షత్రానికి ఉన్న ‘’రుక్ష ‘’శబ్దానికి సప్తర్షులు అనే అర్ధం చెప్పింది .ఇప్పుడు ఆయా ఋషుల గురించి వివరాలు తెలుసు కొందాం .

అగస్త్యడు –ఈయన్నే ఆగస్తి అనీ అంటారు .ఈయన మరుద్దేవతలను వృషభాలను ప్రోక్షించి పూజ చేశాడు .అక్కడి పశువుల్ని ఇంద్రుడు అపహరించుకు పోగా మరుద్దేవతలు వజ్ర ధారులై ఇంద్రుని చంపటానికి వచ్చారు .అప్పుడు ఇంద్రుడు ,అగస్త్యుడు ‘’  కయా శుభీయ ‘’అనే సామ వేదం మంత్రాన్ని చదివి వారిని శాంతింప జేశారు .ఇంద్రుని బుద్ధి విశేషాన్ని గుర్తించి అగస్త్యుడు బ్రహ్మ జ్ఞానాన్ని మొట్టమొదటి సారిగా ఉపదేశించాడు .

కణ్వుడు—ఈయన వంశీకులే కణ్వులు లేక కాన్వులు.ఈయన్నే ‘’సౌశ్ర వసువులు ‘’అనీ బహువచనం లో పిలుస్తారు .అత్రి ,కన్వవంశాలకు సంబంధం ఉంది .

గౌతముడు –ఇది రుషి గోత్రం పేరు .ఈ గోత్రీకులకు ఆంగిరసులకు సన్నిహిత సంబంధాలున్నాయి .జనక ,యాజ్న్య వల్క్యులకు సమకాలికుడు .ఒక ఋగ్వేద స్తుతి ‘’స్తోమానికి ‘’ప్రణేత ‘’.విదేహ రాజు మాధవుడు వైశ్వానరాగ్ని ని తన నోటిలో ధరించాడు .రాజుకు పురోహితుడైన గౌతముడు అగ్నిని  పిలిచాడు .  బదులు పలికితే బయట పడతానేమో నని భయం తో పలక లేదు .ఎలాగైనా అగ్నిని బయటికి రప్పించాలని గౌతముడు ఋగ్వేద మంత్రాలతో అగ్నిని స్తోత్రం చేశాడు .అయినా రాజు కాని అగ్ని కాని పలక నే లేదు .రుషి మళ్ళీ దీర్ఘం గా తీవ్రం గా క్రోధం గా అగ్నిని పిలిచాడు .ఊహూ అగ్ని జాడే లేదు .అప్పుడు గౌతముడు ‘’తన్వ్యాఘ్రుత స్రవీ మహె ‘’అనే ఋగ్వేద మంత్రాన్ని పలికాడు. మంత్రం లో ఉన్న ‘’ఘ్రుత ‘’(నెయ్యి)శబ్దం వినపడగానే అగ్ని ఊర్ధ్వ ముఖం గా ప్రజ్వరిల్లాడు .రాజు అగ్నిని భరించలేక పోయాడు .అప్పుడా అగ్ని భూమి మీదకు చేరింది .అగ్నిని నోటిలో భరించటం వలన ఏర్పడిన తాపాన్ని పోగొట్టుకోవటానికి రాజు సరస్వతీ నదిలో మునిగాడు .అప్పుడు అగ్ని తూర్పు దిక్కు గా ప్రజ్వ రిల్లుతూ భూమి అంతటా వ్యాపించింది .గౌతమర్షి మండుతున్న అగ్నిని వెంబ డించాడు .అగ్ని భూమి పై ఉన్న నదులన్నిటిని ఎండింప జేసింది .అందువలననే ‘’మిత్ర విందా యష్టి ‘’విదేహ రాజైన జనకుని ఉద్దేశించి ఏర్పాటైంది .దాన్ని ఇతను చూశాడు .

కశ్యపుడు –విశ్వ కర్మ ‘’సర్వ మేధా యాగం ‘’చేశాడు .కశ్యపునికి భూదానం చేయాలను కున్నాడు విశ్వ కర్మ .భూమి అంగీకరించలేదు .కష్యపునికి దితి ,అదితి అనే ఇద్దరు భార్యలున్నారు .కశ్యపుడు బ్రహ్మ పుత్రుడైన మరీచి కొడుకు .కనుక దేవతలకు అసురులకు ,సర్వ ప్రాణి కోటికి కశ్యపుడు తండ్రి అన్నమాట .అదితి తో పాటు పన్నెండు మంది దక్ష పుత్రికలను పెళ్లి చేసుకొన్నాడు .వారి వలన ఎంతో ప్రాణి కోటిని సృష్టించాడు కశ్యపుడు .కశ్యపుడు ప్రజాపతి గోత్ర ఋషీకూడా .సామ వేదం లో నిక్షిప్తమైన జ్ఞానం మొదటి సారిగా ఇంద్రుని నుంచి అగ్నికి తర్వాత కశ్యపుడికి సంక్రమించింది .

అత్రి –రుషి గోత్రం .పరి వార రూపం గా ప్రియ మేధులు ,కణ్వులు ,గౌతమ ,కక్షీ వంత గుణాలతో అత్రి గణం ఏర్పడింది .అత్రి జమదగ్ని ,గౌతములు క్రిమి సంహారకులు అని  ఛాందోగ్య  బ్రాహ్మణం తెలియ జేస్తోంది .

యాజ్న్య వల్క్యుడు –శత పద బ్రాహ్మణాన్ని రచించింది యాజ్న్య వల్క్యుడే .మైత్రేయి కాత్యాయిని ఇతని భార్యలు .మైత్రేయి పైన అధిక ప్రేమ ఉండటం తో కాత్యాయినిని ‘’ఇతర ‘’అన్నాడు .ఇతర పుత్రుడే ‘’మహీదాస ఐత రేయుడు ‘’ఐత రేయ బ్రాహ్మణ రచయిత .వైశంపాయన శిష్యులలో యాజ్న్య వల్క్యుడొకడు .ఒక సారి జనక రాజు యజ్ఞం లో ‘’అందరి కంటే గొప్ప బ్రహ్మ జ్ఞానికి పది వేల గోవుల్ని ‘’ఇస్తానని ప్రకటించాడు .అక్కడే ఉన్న అశ్వల ,యార్త భాగ ,ఉషాస్తి ,ఆహోల ,ఉద్దాలక ,గార్గి మొదలైన రుషులతోను ,రుశషికల తోను వాదం చేసి గేలు పొంది ,రాజు ప్రకటించిన పది వేల ఆవులను తోలుకు పోయిన ధీశాలి .

ఒక సారి ఉపనిషత్ పురుషుని స్పష్టం గా ఆవిష్కరించమని ,లేక పొతే శిరస్సు తెగి పడుతుందని దేవ మిత్ర శాకల్యుని ప్రశ్నించాడు .శాకల్యుడు చెప్ప లేక పోయాడు .అంతే శిరస్సు తెగి పడి పోయింది .జనకుడు యాజ్న్య వల్క్యుని వలన బ్రహ్మ జ్ఞాన ఫలాన్ని పొంది రాజ్య సర్వస్వాన్ని గురు దక్షిణ గా సమర్పించాడు .యాజ్న్య వల్క్యుడు ఒద్దని చెప్పి జనకుడినే రాజ్యం ఏలుకోమ ని ఇచ్చేశాడు  .సన్యాసం తీసుకుంటూ  తన సంపదను భార్య లిద్దరికీ పంచేశాడు .మైత్రేయి  ఆత్మ సంపదను అడిగి పొందితే ,కాత్యాయని భౌతిక సంపదను  వాంచించి పొందింది .

భ్రుగువు –వరుణ పుత్రుడు భ్రుగువు అని శత పద బ్రాహ్మణం చెప్పింది .తైత్తిరీయం లో దీనికో కద ఉంది .భ్రుగు గణం ద్రుహ్యులకు పురోహితులుగా ఉండేవారు .వీరికి అన్గిరసులతో సంబంధం ఉంది .చ్యవనుడికి భార్గవుడని అన్గిరసుడని పేర్లున్నాయి .వీరిపై ఆక్రమణ ఫాలితం గా సృంజయ ,వైతహవ్యులు సర్వ నాశన మైపోయారు .

భరద్వాజుడు –గోత్ర రుషి .దివోదాసుని పురోహితుడు .మంత్ర ప్రణేత ,ద్రష్ట .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?

బ్రాహ్మణాల కదా కమా మీషు -2

బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?

‘’బ్రాహ్మణం చ వేదః ‘’అని జైమిని సూత్రాలకు భాష్యం రాసిన శబర స్వామి అన్నాడు అంటే మంత్రాలే కాదు బ్రాహ్మణాలు కూడా వేదమే నన్న మాట .బృహదారణ్యక ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ శ్రీ శంకర భగవత్పాదులు ‘’వేదాను వచనేన మంత్రం బ్రాహ్మణాధ్యయనే ‘’అన్నారు అనగా మంత్ర భాగాన్నీ ,బ్రాహ్మణ భాగాన్ని అధ్యయనం చేయటమే వేదాను వచనం అని చెప్పారు అంటే బ్రాహ్మణాలు వేదాలేనని అంగీకరించారు .తంత్ర వార్తికం లో కుమారిలుడు  బ్రాహ్మణాలకు వేదం అనే పేరుందని ఒక ధర్మ శాస్త్రాన్ని పేర్కొన్నాడు .మనుస్మృతి వ్యాఖ్యానం లో మేధా తిది,మస్కరి మున్నగు వారు  కూడా బ్రాహ్మనాలను వేదాలుగా  గుర్తించారు .’’మంత్రం బ్రాహ్మనయోర్వేద నామ దేయం ‘’శ్రోత స్మార్తం లో  మంత్రాలు బ్రాహ్మణాలు వేదాలే అని ఆపస్తంభుడు పేర్కొన్నాడు .సాయణుడు’’మంత్రం బ్రాహ్మణాత్మక శబ్ద రాశిర్వేదః ‘’అంటే మంత్రం భాగ ,బ్రాహ్మణ బాగ రూప మైన శబ్ద రాసి అంతా వేదమే నని చెప్పాడు .

బ్రాహ్మణాల  వల్ల ఏం ప్రయోజనం ?

సంహితలలో ఉన్న మంత్రాలను అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలు ఉపయోగ పడుతాయి .యజ్ఞాన్ని ఎలా చేస్తే ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో నిర్వ చిస్తాయి .సంహితలలో నిక్షిప్తమైన నిగూఢ భావ రాశిని అర్ధం చేసుకోవటానికి నిఘంటువులు కావాలి .వాటిని ఆధారాం గా యాస్కుడు మొదలైన మహర్షులు ‘’నిరుక్తాలు ‘’రాశారు .ఒకప్పుడు ప్రతి వేదానికి విడి విడిగా  నిఘంటువు , నిరుక్తం ఉండేవి .ఇప్పుడన్నీ నశించి పోయి యాస్కుడు రాసిన నిఘంటువు నిరుక్తం మాత్రమే లభిస్తున్నాయి .నిఘంటువులు సంహితలోని పదాలకు అర్ధ నిర్వచనం చేసేటప్పుడు బ్రాహ్మణాల పై ఆధార పడతాయి .బ్రాహ్మణాలలో ఆయా సందర్భాలలో ఇవ్వ బడిన అర్ధాలే నిఘంటువుల లో కూడా కన పడతాయి .దీన్ని  బట్టి  తేలేది ఏమిటి  అంటే వేదం మంత్ర పదాలకు, నిఘంటు అర్ధాలకు మూలాలు బ్రాహ్మణాలే. .మంత్రం భాగాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలే సరైనవి .

మంత్రం ద్రస్టలైన మహర్షులు  బ్రాహ్మణాలలో సత్య స్వరూప మంత్రార్ధాలను తెలియ జేశారు .వీటిని ఆధారం గానే నిఘంటువులు ,ఇతర భాష్యాలు ఏర్పడ్డాయని భారతీయ పండితులు భావించారు .మానవులకు వైదిక కర్మలను ఆచరించటానికి బ్రాహ్మణాలు ప్రేరణ నిస్తాయి అని ఆపస్తంభుడు తన యజ్న పరి భాషలో వివ రించాడు .విధి ,అర్ధ వాదరూప మైన  బ్రాహ్మణాలు  వైదిక కర్మలను విధిస్తూ ,వాటిలో మానవుడు ప్రవర్తిం చేట్లు  సందర్భాన్ని బట్టి స్తుతిని ,నిందను చేస్తూ ప్రేరణనిస్తాయి .బ్రాహ్మణాల ద్వారా ప్రేరణ పొందిన వాడు ,మంత్రార్ధాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ,యజ్న యాగాదులను చేస్తాడు .యాగాలు బాగా ఆచరించే కాలం లో బ్రాహ్మణాలే దారి చూపాయి .

బ్రాహ్మణాలను సరిగ్గా అధ్యయనం చేస్తే ప్రాచీన భారతీయ చరిత్రను ,సంస్కృతిని ,ఆచార వ్యవహారాలను ,జీవిత లక్ష్యాన్ని తెలుసుకో వచ్చు .బ్రాహ్మణాలలో సాంకేతికం గా ఉన్న ఉపాఖ్యానాలు ,తరువాత వాగ్మయం లో ఏ విధం గా నిరూపించ బడ్డాయో పోల్చుకొని తెలుసుకో వచ్చు .అంటే ప్రాచీన భారతీయులకు సంబంధిన అనేక అంశాలను బ్రాహ్మణాలను అధ్యయనం చేసి తెలుసుకో వచ్చు .ఒక్కమాటలో చెప్పా లంటే ప్రాచీన భారతీయ జీవన సంస్కృతులను ,ఆలోచనా ధోరణులను ,తత్వ చింతనకు బ్రాహ్మనాలే అద్దంపట్టాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-14-.ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -1

బ్రాహ్మణాల కదా కమామీషు -1

 

జూన్ తొమ్మిది సోమవారం మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,మా మనవడు ఛి సంకల్ప్ –అంటే మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు కలిసి ఆర్ టి సి వారి పాకేజ్ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్ నుండి తిరుమల వెళ్ళారు .మంగళ వారం ఉదయం చేరి దర్శనం పూర్తీ చేసుకొన్నారు అన్నీ వాళ్ళే దగ్గరుండి తీసుకుని వెళ్లారట. ప్రసాదం లాడ్ద్దూలు కూడా వాళ్ళే కలెక్ట్ చేసి ఇచ్చారట .పద్మావతీ అమ్మవారి దర్శనం శ్రీ కాళ హస్తి చూపించి మళ్ళీ రాత్రికే బయల్దేరి బుధవారం ఉదయం హైదరాబాద్ చేరారు .తిరుమలలో దేవస్థానం బుక్ స్టాల్ కు వెళ్ళిన మా అమ్మాయికి అక్కడ కొత్తగా ప్రచురించిన ‘’బ్రాహ్మణాలు ‘’కానీ పించాయి ‘’నాన్న న్నిటి మీదా రాశారు కాని బ్రాహ్మణాల పై రాయలేదే ‘’అనుకోని ఒక పుస్తకం కొని  తీసుకొని వచ్చింది  నాకోసం .దీని ప్రధాన సంపాదకులుఆచార్య ఎస్ బి.రఘునాదా చార్య గారు . దాన్ని ఆ పూట నుంచే చదవటం మొదలు పెట్టి నాలుగు వందల యాభై పేజీలను అయిదు రోజుల్లో పూర్తిచేశాను .బాగా ఉంది .అంతకు ముందెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం అరణ్యకాలు చదివాను .ఇందులో కొన్ని కధలు బాగున్నాయి వాటినీ అందులోని విశేషాలను బ్రాహ్మణాల వైశిస్త్యాన్ని తెలియ జేయటానికి ‘’ఆరణ్యకాల కదా కమా మీషు ‘’శీర్షికతో రాయటం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాను .నాకు తెలిసిన, నచ్చిన విషయాలను అందరికి అందివ్వటమే నా ఉద్దేశ్యం .ఇదొక దారి చూపే పనే కాని లోతులను తరచి చూపే పనికాదని సవినయం గా మనవి చేస్తూ ప్రారంభిస్తున్నాను .

బ్రాహ్మణాలు అంటే  ఏమిటి ?

వేదాలు భగవంతుని నిశ్వాసాలు .అవి రుక్ ,యజు ,సామ అధర్వాలని నాలుగు .వీటి మూల గ్రంధాలను ‘’సంహితలు ‘’అంటారు .ఇవన్నీ దాదాపు ఛందో బద్ధమంత్రాలే .కనుక మంత్రభాగమనీ పేరు .దేవాతా స్తుతులు ,యజ్న యాగాది వైదిక కర్మలు ,ధార్మిక ప్రక్రియలు ,తాత్విక చింతనలు వేదాలలో  ప్రతి పాదించ బడ్డాయి .మంత్రం ద్రస్టలైన మహర్షులు భావన లో వీటిని దర్శించారు .అందుకే వారు మంత్ర ద్రష్టలు  అయ్యారు . వారు దర్శించిన మంత్రాలనుపయోగించి వివిధ దేవతారూపం లో ఉన్న భగవంతుని ఆరాధించటమే యజ్ఞం .యజ్ఞం చరా చర సృష్టికి సుఖ సంతోషాలను తుష్టిని పుస్టిని ఇస్తుంది .యజ్న యాగాలకు కొన్ని పద్ధతులున్నాయి .వాటిల్లో సామాజిక ద్రుష్టి ,తాత్విక చింతన ,ధర్మాసక్తి ఉంటాయి .సంహితను సరిగ్గా అర్ధం చేసుకుని అనేక కర్మలలో ఉపయోగించుకుంటూ ,అందు లోని సాంకేతిక  పరిజ్ఞాన అర్ధాన్ని వివరిస్తూ ఏర్పడిన వాటినే  ‘’బ్రాహ్మణాలు’’ అన్నారు .ఇవి గద్యం లో ఉంటాయి .వేద సంహితలకు ,ఆ తర్వాత వచ్చిన వాజ్మయానికి బ్రాహ్మణాలు వంతెనలాంటివి.యాగస్వరూపాన్ని వివరించటమే బ్రాహ్మాణాల ముఖ్య కర్తవ్యం.

బ్రహ్మ అనే శబ్దానికి అర్ధం అంటున్నది శాత పద బ్రాహ్మణం .నాలుగు వేదాలలోను ఉన్న మంత్రం భాగానికి వినియోగాన్ని విధిస్తూ ,వ్యాఖ్యానం గా ఏర్పడిన గ్రంధమే బ్రాహ్మణం .మంత్రాలు  కాకుండా మిగిలిన వన్నీ బ బ్రాహ్మణాలే.ఇవి గొప్ప ప్రామాణిక గ్రంధాలు .

సంహితలు –బ్రాహ్మణాలు

సంహితలలో ప్రతి ముఖ్య శాఖ కు ఒక  బ్రాహ్మణం ఉండేది .రుక్సంహితకు 21శాఖలున్నా ఆరు  మాత్రమె కని  పిస్తున్నాయి అవే ఐతరేయ బ్రాహ్మణం ,కౌశీతకి బ్రాహ్మణం ,పైంగి బ్రాహ్మణం ,బహ్వాచ బ్రాహ్మణం ,ఆశ్వలాయన బ్రాహ్మణం ,గాలవ బ్రాహ్మణం .

యజుస్సంహితకు రెండు ప్రధాన శాఖలున్నాయి .అందులో కృష్ణ యుజుర్వేదానికి తైత్తిరీయ శాఖలకు సంబంధించింది తైత్తిరీయ బ్రాహ్మణం .మాధ్యందిన –కాన్వ భేదం తో శుక్ల యజుర్వేదానికి రెండు శాఖలున్నాయి వీటికి విడి విడిగా మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండున్నాయి ఇవికాక కాల గర్భం లో పన్నెండు కలిసి పోయాయి .

సామ సంహితకు మూడు  ప్రధాన బ్రాహ్మణాలు తలవకార బ్రాహ్మణం ,తాండ్య బ్రాహ్మణం ,ఛాందోగ్య బ్రాహ్మణం ఉన్నాయి ఇవి కాక ఉప బ్రాహ్మణాలు –సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం ,సంహితోపనిష బ్రాహ్మణం ఉన్నాయి

అధర్వ సంహితకు ఒకే ఒక బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ఉంది .

బ్రాహ్మణాలు వివిధ కాలాలో ఏర్పడ్డాయి. పంచ వింశ బ్రాహ్మణం ,తైత్తిరీయ బ్రాహ్మణం మిగిలిన వాటికంటే ప్రాచీన మైనవి .వీటి తర్వాత తలవకార లేక జైమినీయ బ్రాహ్మణం ఆ తర్వాత కౌశీతకి బ్రాహ్మణం ఏర్పడ్డాయి .దీనితర్వాత ఐతరేయం ఆ తర్వాత శత పధం ఏర్పడ్డాయని భావిస్తున్నారు .కృష్ణ ద్వైపాయన వ్యాసుని చేత కల్ప సూత్రాలతో బాటు నిర్మింప బడిన బ్రాహ్మణాలు ఆధునికమైనవి .అంతకు ముందున్న బ్రాహ్మణాలు ప్రాచీనమైనవి అని అనుకుంటారు .మొత్తం మీద ఐతరేయ ,పంచ వింశ ,తైత్తిరీయ బ్రాహ్మణాలు మిగిలిన వాటికంటే ప్రాచేనమైనవి శతపద బ్రాహ్మణం నవీనమైనది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం )

టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్

 

అమెరికా సాహిత్యం లో ‘’బాడ్ బాయ్’’ అని పించుకున్నవాడు ఇ .ఇ. కమింగ్స్ .1894అక్టోబర్ పద్నాలుగున మాసాచూసేట్స్ లోని కేంబ్రిడ్జి లో జన్మించాడు .తండ్రి మినిస్టర్ కాకముందు హార్వర్డ్ టీచర్ .కమింగ్స్ కూడా హార్వర్డ్ లో చదివి ఏం ఏ.పాసైనాడు .మొదటి ప్రపంచ యుద్ధం లో అంబులెన్స్ సర్వీస్ లో చేసి ,సెన్సార్ పొరపాటు వల్లమూడు నెలలు డిటేన్షన్ కాంప్ లో ఉండాల్సి వచ్చింది . దీన్నే ‘’ఎనార్మస్ రూమ్ ‘’లో వివరించాడు ఇదికాక కొన్ని వ్యాస సంపుటుల్ని తెచ్చాడు .’’టులిప్స్ అండ్ చిమ్నీస్ ‘’అనేది మొదటికవితా సంకలనం .దీని చివర వరుసగా చాలా సానేట్లు రాశాడు .ఇందులో చాలా విరుద్ధాలు కనిపిస్తాయి .మాటల శక్తికే ప్రాధాన్యం ఇచ్చాడు .పేజీ అంతా ఖాళీగా కొద్ది లైన్లు మాత్రమె ఉండేట్లు రాశాడు .ఉదాహరణకు –a tall

Wind

Is dragging

The

Sea

With

Dream

S

ఇది చూస్తె ఒక అడ్వర్టైజ్ మెంట్ పధ్ధతి అని పిస్తుంది .అరవై వయసులో ఆరు వందల కవితలను కూర్చి పోయెమ్స్ పేరిట విడుదల చేశాడు .పాత వాటినే కొత్త తరహాలో చెప్పాడు .స్ప్రింగ్ ,డెత్ ,రొసెస్ లపై కవితలు అల్లి నిర్లక్ష్యం గా సంభాషణ రూపం లో రాసి ప్రత్యేకత చూపాడు .అరవైఏడు లో 1962లోసెప్టెంబర్ మూడున  మరణించాడు .స్వీయ చరిత్ర నవలలు నాటకాలు రాసి పెయింటర్ గా కూడా ప్రఖ్యాతుడైనాడు .రాడికల్ బెహోమియన్ వాడైనా రిపబ్లికన్ గానే గుర్తింప బడ్డాడు .కవిత్వం లో బ్లూస్ ఫారం ను , ఎక్రాష్టిక్స్ రూపం లోను రాశాడుకొన్ని .ప్రేమ ,ప్రక్రుతి లపైనే ఎక్కువ గా రాశాడు .ఇమేజిస్ట్ ప్రభావం తో ముందు రాసినా తర్వాత ఫ్రెంచ్ కవుల ప్రత్యేకమైన  ‘డాడాయిజం ‘’ను అభిమానించి రాశాడు .అంత్యప్రాస ఛందస్సులకు అంతగా విలువ ఇవ్వలేదు .అతనిది’’టైపోగ్రాఫికల్లి ఎక్సూబరెంట్  స్టైల్ ‘’అంటారు .2,900కవితలు పండించాడు .ఆరో ఏట నే తండ్రిపై కవితరాశాడు –‘’father dear –be your father good and good –it is good –it is not good to see it rain’’.

‘’ ఎనార్మస్ రూమ్’’ అనే ఆటో బయాగ్రఫిక్ నవల రాశాడు .

E. E. Cummings NYWTS.jpg

 

 

కంప్రేస్సేడ్ మెటఫర్ కవి – హార్ట్ క్రేన్

ఇమేజ్ లను కేంద్రీకరించి ,అలంకారాలతో అలంకరించి కావ్య గౌరవాన్ని కల్పించి కవిత్వం రాసిన వాడు హార్ట్ క్రేన్ .’’కంప్రేస్సేడ్ మెటఫర్ ‘’ను పరిపూర్ణం చేశాడు .ఇందులో ‘’comparisons were stripped to their skeletal ideas ,he spoke of as an instinctive ‘’logic of metaphor ‘’ which he claimed antedated ‘’our so called pure logic and which is the genetic basis of all speech ‘’ అని దాని వివరణ ఇచ్చారు విశ్లేషకులు .

అమెరికా లో ఒహాయో లోని గారేట్స్ విల్  లో 21-7-1899న పుట్టి బాల్యం నుండి అశాంతితో నే గడిపాడు .అప్పుడే తండ్రి క్లీవ్ లాండ్ కు కుటుంబాన్ని మార్చి తలిదంద్రులిద్దరూ విడి పోయారు .తల్లినే  సమర్ధించాడు క్రేన్ .ఇతర్రులపై ఆధార పడటం ఇష్టం లేని క్రేన్ జీవితం నాశనమై పోయిన్దనుకున్నాడు .అనేక చిన్న ఉద్యోగాలు చేసి చివరికీ షిప్ లాండ్ రిపోర్టర్ గా ఉన్నాడు.తండ్రికి ఇష్టం లేక పోయినా కవిత్వానికి అంకితమై పోయాడు .ఉద్యోగాల్లో చేరటం ఊడి పోవటం తో నిర్లక్ష్యం గా బే ఫర్వాగా తిరిగాడు .విపరీతం గా తాగుడుకు అలవాటు పడి ,కుదురు లేకుండా యూరప్ అంతాచెడ తిరిగి ,అవమాన భారం తో కుంగిపోతూ ,ప్రతివాళ్ళతో పోట్లాడుతూ తగాదా పడుతూ గడిపాడు .

ఇరవై ఏడు లో మొదటి పుస్తకం ‘’వైట్ బిల్డింగ్స్ ‘’ముద్రించాడు .అతని అమోఘ కవితా శక్తిని గుర్తించారు. కవిత్వం లో మెరుపులు  మెరి పించాడు ..ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల ప్రభావం బాగా ఉన్న వాడు .స్వంత పదాలను’’ కార్పోసంట్ ,కంక్లా మెంట్ ,సిబిలేన్స్ సినేర్జి ఇంక్యునాబులా ,లేబి రింతిస్ ,క్ల స్ట్రస్ , గాల్వో దేర్మిక్ ,ట్రాన్స్మెంబెర్ మెంట్ ,కోరిమ్బులస్ ‘’మొదలైన మాట లను  సృష్టించుకుని ‘’వర్డ్  ఫైండర్’’అయ్యాడు .ఇరవైలలో దాత ఒట్టో హెచ్ కాహ్న్ క్రేన్ ప్రణాళికకు కావలసినంత ఆర్ధిక సాయం చేశాడు .దీనితో ‘’ది బ్రిడ్జి ‘’అనే పెద్ద పుస్తక ముద్రణ జరిగింది .తర్వాత ‘’మిత్ ఆఫ్ అమెరికా ‘’రాశాడు జాతీయ సింబల్స్ .లెజెండ్స్ ,పూర్వ చరిత్ర ,జానపద గీతాలు ,ఆధునిక సాంకేతికత అన్నీ కలిపి కావ్య రీతిలో రాశాడు .ఇందులో బ్లేక్ ,డికిన్సన్ ,మేల్విలీ ,విట్మన్ మొదలైన వారందరినీ కలిపి కేలేడోస్కోప్ రీతిలో లో హిస్టేరికల్ గా రాశాడు .’’సబ్ కాన్షస్ ‘’తో రాసినట్లని పిస్తుంది

రాతలో డిసిప్లిన్ లేక పోవటమే క్రేన్ కవిత్వానికి  కు కలర్ ఇచ్చింది .భావాత్మకం గా ,చిత్రాత్మకం గా రాసే వీలు కలిగింది .ఒక కవితా చిత్రాన్ని చూద్దాం –

‘’stick your patent name on a sign board –brother –all over going west –young man tintex –japalac –Certain-teed Overallas ads –and lands sakes under the new pay bill ripped ‘’అంటూ ఆర్డర్ లో కేయాస్ కలిపి రాస్తాడు .తన తరాన్ని ప్రభావితం చేసిన క్రేన్ ముప్ఫై రెండవ ఏట ఫ్లారిడా కోస్ట్ లో ఆత్మా హత్య చేసుకొని27-4-1932న చనిపోయాడు

Finding both inspiration and provocation in the poetry of T. S. Eliot, Crane wrote modernist poetry that was difficult, highly stylized, and ambitious in its scope. The logic of metaphor is so organically entrenched in pure sensibility that it can’t be thoroughly traced or explain outside of historical sciences, like philology and anthropology.”[.నాటక రచయితా యూజీన్ ఒ నీల్ ,కమింగ్స్ తోటే మొదలైన వారు క్రేన్ కవిత్వాన్ని మెచ్చుకున్నారు .

 

Hart Crane.jpg

 

 

                     ఎలిప్టికల్  కవి – రాబర్ట్ లోవెల్

       రాబర్ట్ ట్రైల్ స్పెంస్ లోవెల్ అమెరికా లో మాసాచూసేట్స్ లోని బోస్టన్ లో 1-3-1917 న జన్మించాడు .మే ఫ్లవర్ మూలాలున్న  ‘’బోస్టన్ బ్రాహ్మిన్ ‘’కుటుంబానికి చెందిన వాడు .జేమ్స్ రస్సెల్ లోవెల్ తాతగారు .ప్యూరిటన్ ఇన్ రివోల్ట్ గా ప్రసిద్ధుడు .కెన్యా కాలేజి లో చదివి జాన్ క్రూ రాన్సం దగ్గర క్లాసిక్స్ చదువుకున్నాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొని పౌరులపై బాంబులు వేసి చంపటం నేరమని,,దేశానికి ప్రమాదం లేదు కనుక యుద్ధం వద్దని వాదించి యుద్ద్ధం చేయటానికి నిరాకరిస్తే జైలు లో పెట్టి అయిదు నెలల తర్వాత విడిచి పెట్టారు .

దేనికీ చెందని మనస్త్వత్వం ఉన్న వాడు .దీనినే ‘’లాండ్ ఆఫ్ అన్ లైక్లి నెస్ ‘’పుస్తకం లో రాశాడు .ఇదులోని కవితలు తరువాత ‘’లార్డ్ వీరీ కాజిల్’’లోను చేర్చాడు .రెండేళ్ళ తర్వాత దీనికి పులిట్జర్ బహుమతిని పొందాడు .న్యు ఇంగ్లాండ్ హేయం గా తయారయిందని బాధ పడేవాడు .ఇరవైలలో రోమన్ కేధలిక్ అయి కవిత్వం లో నీతికి ప్రాధాన్యమిచ్చి రాశాడు .ముప్ఫై లో లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు కవిత్వానికి కన్సల్టంట్ అయ్యాడు .ఎలిజ బెత్ ఆర్విక్స్ అనే రచయిత్రిని పెళ్లి చేసుకున్నాడు ‘’ది మిల్స్ ఆఫ్ ది కావన్నాస్ ‘’రాశాడు .కవిత్వం బాగానే ఉన్నా ,ఇమేజెస్ దట్టమై పోయి ,స్వీయ ఉదాహరణలతో వెర్రి ఎత్తిస్తుంది అతనిలోని ‘’కావిలియనిజం ‘’కూ, కేధలిజం ‘’కు మధ్య ఉన్న ఘర్షణకు ప్రతిరూపం గా కొన్ని కవితలుంటాయి

ది క్వేకర్ గ్రేవ్ యార్డ్ కవిత’’ వారెన్  విన్ లో’’  పై స్మృతి కవిత .’’when ever winds are moving and their breath –heaves at the roped –in bulwarks of the pier the terns and the sea gulls tremble at your death –in these home  waters .Sailor can you hear? అని మొదలు పేటి హృదయ విదారకం గా రాస్తాడు .లోవెల్ పద్ధతిని ‘ఎలిప్టికల్ మెథడ్’’అన్నారు .సమాజం లో నైతిక దివాలా కోరు తనాన్ని ఏవగించుకున్నాడు .దేనికీ స్పందించని జాతిని తిట్టాడు .’’వేర్ ది రైన్ బోస్ ఎండ్స్ ‘’కవితలో

‘’Boston serpents whistle at the cold –the victim climbs the altarsteps and sings –Hosannah to the lion ,lamb and beast –who fans the furnace –face of I.S .with wings –I breathe the ether of my marriage feast ‘’ అని ఊగిపోతూ మనల్నీ ఊగిస్తూ కన్నీరు కార్పిస్తాడు .

లోవెల్ కున్న డిసిప్లిండ్ టెక్నిక్ ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వం లో అమెరికాలో  మరో ధోరణికి దారి తీసింది .అందుకే ట్రెండ్ సెట్టర్ అయ్యాడు .ఫ్రీ వేర్స్ ను త్యజించి  మళ్ళీ పాత ధోరణికి మారింది .కానీ యువ కవులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు . హుందాతనం పోగొట్టుకున్నారు .కారల్ షాపిరో రాసిన ‘’వి లెటర్ అండ్ ఆదర పోయెమ్స్ ‘’,పీటర్ వీర్క్ ‘’టెర్రర్ అండ్ డేకోరాం ‘’,థియోడార్ రోత్కే’’దివేకింగ్ ‘’,ఎలిజబెత్ బిషప్ ‘’నార్త్ అండ్ సౌత్ ‘’,రిచర్డ్ విల్ బర్ ‘’థింగ్స్ ఆఫ్ దిస్  వరల్డ్ల్ద్ ‘’కవితలకు పులిట్జర్ బహుమతులు వచ్చాయి .1960లలో అమెరికాలో ప్రఖ్యాత కవి అనే గుర్తింపు పొందాడులోవెల్  . The poems drift from one focus to another; they avoid the histrionic; they sigh more often than they expostulate. They acknowledge exhaustion; they expect death.” She praises some of Lowell’s descriptions, particularly his descriptions of impotencedepression, and old age.

 

 

 

 

 

Robert-lowell-by-elsa-dorfman.jpg

 

 

నియో రొమాంటిక్ కవి -డిలాన్ థామస్

ఆధునిక కవులలో ప్రత్యెక స్థానాన్ని పొందిన డిలాన్ థామస్ తన బాల్యాన్ని గురించి ‘’వన్స్  బి   ఏ టైం ‘’కవితలో ‘’up through the lubber crust of Wales –I rocketed to astonish –the flashing needle rock of squatters –the criers of Shabby and Shorten –the famous stitch droppers ‘’అని చెప్పాడు .తనలాగా ఉన్నతం గా  ఎదిగిన కవి లేడని చెప్పుకున్నాడు. ఇరవై ఒక్క ఏటనే ప్రపంచాన్ని అధ్యయనం చేసి అదొక హింసా సామ్రాజ్యం అన్నాడు .

1914 అక్టోబర్ 27 స్వన్సియా కు చెందిన వెల్ష్ సీ పోర్ట్ లో ఇంగ్లీష్ టీచర్ కు రెండవ కొడుకు గా  పుట్టిన థామస్ పెద్దగా స్కూల్ కు వెళ్లి చదవ లేదు .గ్రామర్ స్కూల్ లో చదవగానే సౌత్ వేల్స్ కు చెందిన  ‘’ఈవెనింగ్ పోస్ట్ ‘’పేపర్ కు రిపోర్టర్ అయ్యాడు .ఇరవై లో ;;’’యైటీన్ పోయెమ్స్ ‘’రాసి ముద్రించాడు .చదివిన ప్రతివాడూ అతని ‘’ఆటవికానికి ‘’ముగ్దులైతే విమర్శకులు ‘’సర్రియలిజం ‘అన్నారు రెండేళ్ళ తర్వాత మరికొన్ని కవితల్ని ‘’ట్వెంటి ఫైవ్ పోయెమ్స్ ‘’గా ప్రచురించి మళ్ళీ దిమ్మ తిరిగేట్లు చేశాడు .చిన్నప్పుడే అల్లరి చిల్లరగా  ‘’డర్తి కర్లీ ‘’గా ఉండేవాడినని రాశాడు .

పేదరికం లోనే జీవితమంతా గడిపాడు ధామస్ .డబ్బు సంపాదించటం అసలు తెలియనే తెలియదు .జర్నలిస్ట్ గా ,నటుడిగా ,స్క్రిప్ట్ రైటర్ గా,చివరికి పబ్లిక్ పెర్మార్మర్ గా కూడా ఏది దొరికితే అది చేసి పొట్ట పోసు కున్నాడు .రెండేళ్ళ తర్వాత కేట్లిన్ మాక్నమారా ను పెళ్ళాడి ముగ్గ్గురు పిల్లల్ని పొందాడు కర్మార్దేన్ షైర్ అనే చేపలు పట్టే ఊరిలో స్తిరపడ్డాడు ..బి బి .సి లో కవితలను చదివాడు .1950లో అమెరికా వెళ్లి ,రెండేళ్లకే తిరిగొచ్చి మళ్ళీ వెళ్ళాడు .కవితలు పాటలూ సందర్భోచితం గా లయాన్వితం గా భావ గర్భితం గా నటిస్తూ పాడి విని పిస్తూ డబ్బు సంపాదించాడు .అర్ధం కాకపోయినా చెవులప్పగించి విని ఆనందించేవారు .అమెరికానే స్వంత గడ్డను చేసుకొన్నాడు .న్యూయార్క్ పై నమ్మకంలేకపోయినా థర్డ్ ఎవేన్యు ను ఇస్టపడతానన్నాడు .జనాన్ని పోగేసి కవితాలు వినిపిస్తూ చప్పట్లూ కేరింతలు కొట్టించుకుంటూ గడిపాడు .’’ఏ టిప్కల్ డే ఇన్ మై వెల్ష్ బొగ్ ‘’,ఏ బార్డ్స్ ఐ వ్యూ ‘’మొదలైన వాటిపై ఊహాత్మకమైన వ్యూహాత్మకమైన ఉపన్యాసాలిచ్చి రంజింప చేసే  వాడు .I want to write only poems of God;s world –by aman who does not believe in God ‘’అని చెప్పాడు .

ముప్ఫై అయిదు దాటగానే తాను ‘’ముసలి చిన్న నల్ల డేరింగ్ డాటింగ్ దాటింగ్ – ఐడ్ బాల్దింగ్ అండ్ టూత్ లెస్సింగ్ ‘’’అని చెప్పుకున్నాడు .మూడవ సారి అమెరికా వచ్చి’’ ఐగార్ ట్రా విన్ స్కి’’ తోకలిసి  ఒపేరా కు పని చేయాలని  ప్లాన్ వేసుకున్నాడు .కాలి ఫోర్నియా నేపధ్యం గా చెయ్యాలని నిర్ణయం.ఇంతలోనే అతని ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’విడుదలై సెన్సేషన్ సృష్టించి బ్లాక్ బస్టర్ అయింది .న్యూయార్క్ లో ఆ విజయాన్ని ముప్ఫై తొమ్మిదవ బర్త్ డే గా జరుపుకున్నాడు .కాని అకస్మాత్తుగా జబ్బు చేసి కొలాప్స్ అయ్యాడు .సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినా  మెదడు లో భాగాలు దెబ్బతిని వేల్స్ నుంచి భార్య వచ్చిన కొన్ని గంటలలోనే 1953 నవంబర్ తొమ్మిది న థామస్ మరణించాడు .

చని పోయిన తర్వాత థామస్ ప్రాభవం మరీపెరిగింది .అతని పేర అనేక సంస్థలు వెలిసి గౌరావాన్ని చాటుకున్నాయి .వేర్నార్ వాట్కిన్స్ కు జాబు రాస్తూ వాళ్ళు అంద జేసిన పారి తోషికానికి క్రుతజ్నత తెలియ జేస్తూ ‘’మీరిచ్చిన గుండ్రని సిల్వర్ ట్రాష్ దిక్రౌన్ ను అమ్ముకుంటే నాకు వారం రోజులు గ్రాసం లభించి జీవితం  గడుస్తుంది .నా లాంటి వాడు చేతిలో పెన్నీ కూడా ప్రతి  రోజు జీవించటం దారుణం ‘’అని జీవితాంతం తన్ను వెంబడించిన దరిద్రాన్ని గురించి బాధ తో చెప్పుకున్నాడు .కవిత్వం తో పాటు ఆరు చిన్న కదా పుస్తకాలు రాశాడు .అందులో ‘’పోర్ట్రైట్ ఆఫ్ ది ఆర్టిస్ట్  యాజ్  ఏ యంగ్ డాగ్ ‘’,క్విట్ఎర్లి వన్ మార్నిగ్ ‘’మొదలైన కధలు బాగా పేరొందాయి .అతని రచనల్లో బాల్యం ,సెక్స్ సామర్ధ్యం ,కల్లోల మతం ,చావు లే విషయాలు .’’my world was chistened in a stream of milk –and earth and sky were asone airy hill –I dreamed my genesis in swear of sleep ‘’అని రాశాడు

థామస్ చివరి రచన ‘’అండర్ మిల్క్ వుడ్’’బి బి సి .లో ప్రసారం కావాల్సింది అమెరికా లో 1953లో ప్రసారమైంది .ఇందులో రెండు భాగాలు థామస్ స్వంత గొంతుక తో చదివాడు .తనకవితలలో ప్రతిదాంట్లోను మనిషిప్రేమ  దేవుని ప్రసంశ,ఉంటుందని అవి లేక పోతే తాను ఒక నిరర్ధక జీవినే అవుతానని చెప్పాడు .చదువుతూంటే విశ్లేషణకు అందనంత వేగం గా దూసుకు  పోతుంది కవిత్వం అదీ అతని ప్రత్యేకత . ‘’there was a cultural time lag –gradually our ears grew accustomed to the logical dissonances of modern music and the disordinances of modern poetry once this has been achieved ,we will be able to evaluate the intrinsic importance of the work of the period  At this  time ,we will know how much of modern poetry has permanence ,the wonder ,excitement ,and sustained power of enduring art ‘’అని ఆలోచనలను రేకెత్తిస్తుంది డిలాన్ థామస్ కవిత్వం .

‘’ డు నాట్ గో జెంటిల్ ఇన్ దట్గుడ్ నైట్ ‘’’’ఏ డెత్ షల్ హావ్ నొ డొమినియన్ ‘’కవితలు ‘’ప్లె ఫర్వాయిసెస్’’,’’అండర్ మిల్క్ వుడ్ ‘’నాటకాలు చాలు థామస్ ను చిరంజీవి ని చేయటానికి .ఏ సాహిత్య ముఠాకు చెందని వాడు థామస్ .’’నియో రోమాం టిక్ ‘’అన్నారు .ఫ్రాయిడ్ ప్రభావం వెల్ష్ జాతీయ ప్రభావం ఉన్న వాడు .అమెరికా వెళ్ళినప్పుడు థామస్ హార్డీ కవితల్ని చదివి ఆయనకే వినిపించాడు .వెల్ష్ జాతీయుడైనా వెల్ష్ జాతీయత అంటే అయిష్టం ‘’వెల్ష్ జాతీయత ‘’హిల్ ఫారం మొరాలిటి ‘’లాంటిది అన్నాడు .థామస్ లో ఉన్నది శబ్దాడంబరమే అంటారు  కొందరు .ఏంటో మంది కవులను ప్రభావితం చేసిన వాడు డిలాన్ థామస్ .అతని సమాధి పై అతనే రాసుకున్న కవితను చెక్కించి ఉంచారు –‘’oh! as I was young and easy in  the mercy of means –time held me green and dying –though I sang in my  chains like  the sea’’

థామస్ రచనలు సినిమాలుగా వచ్చాయి .

Not for the proud man apart
From the raging moon I write
On these spindrift pages
Nor for the towering dead
With their nightingales and psalms
But for the lovers, their arms
Round the griefs of the ages,
Who pay no praise or wages
Nor heed my craft or art.

అని గొప్ప కవిత్వం రాశాడు

Dylan Thomas photo.jpg

 

.

‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ఇంతటితో సమాప్తం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-14-ఉ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54

ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్

వాలెస్ స్టేవెంస్ కు స్నేహితుడు ,అభిమాని అయినా అతని భావాలు నచ్చని వాడు విలియం కార్లోస్ విలియమ్స్ ‘జీఎవితం లోని  అప సవ్యాన్ని  ప్రేమించి ,ఏ  కోరికను వదలక అనుభవించాడు .’’no ideas but in things ‘’అన్నదే సిద్ధాంతం .విలియమ్స్ న్యు జేర్సిలోని రూత్ ఫర్డ్ లో 17-9-1883న జన్మించాడు .పేరెంట్స్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ కుటుంబాలకు చెందిన వాళ్ళు .జ్యూయిష్ రక్తం ప్రవహిస్తున్న వాడు .తల్లి కేథలిక్ గా తండ్రి ఎపిక్యూరియాన్ గా విలియంస్ ను పెంచారు .న్యు యార్క్ లో హోరేస్ మాన్ హైస్కూల్ లో చదివి ,స్విట్జెర్లాండ్ లో మెడిసిన్ లో చేరి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో పూర్తీ చేసి ఎం డి.డిగ్రీ పొందాడు .ఇరవై మూడులో మొదటి కవితా సంకలం తెచ్చాడు .ఫ్లారెన్స్ హీర్మాన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులను   కని  ,ఒక కొడుకును డాక్టర్ ను చేశాడు .

ఇమేజిస్ట్ పౌండ్ ను అనుకరించాడు .క్రమం గా అమెరికన్ జాతీయాలకే ప్రాముఖ్యమిచ్చి రాశాడు .’’ఫ స్ట్  సెలెక్షన్  ఆఫ్ పోయెమ్స్ ‘’విడుదల చేశాడు దీనికి ముందు మాట రాసిన స్టీవెన్ ‘’the passion of anti poetic is a blood passion and not a passion of ink-pot’’అన్నాడు .వాస్తవ అవాస్తవాలను కలిపి రాసిన తీరు బాగుందని మెచ్చాడు .సెంటిమెంట్ ను  యాంటి పోఎటిక్ ను కలిపి రెండు విరుద్ధాలకు ఒకే చోట స్థానం కల్పించాడు .డెబ్భై అయిదేళ్లకు ముప్ఫై అయిదుకు పైగా పుస్తకాలు రాసి ప్రచురించాడు .అనేక పురస్కారాలు గౌరవాలు పొందాడు అందులో  గొప్పది బెల్లిన్జేన్ అవార్డ్ .దీనికి అయిదు వేల డాలర్ల పారితోషికం పొందాడు .ఎకాడేమి ఆఫ్ అమెరికన్ పోఎట్స్ లో ఫెలోషిప్ పొందాడు ‘’బుక్ టు ఆఫ్ పీటర్సన్ ‘’కు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .

‘’ఫ్లవర్స్ బై ది సి ‘’,ట్రాక్ట్ ‘’,ఏ గుడ్ నైట్ ‘’మొదలైనవి వ్యక్తిగతమైన ఆ నాటి ఫ్రీ వేర్స్ కవితలు .అన్నిటిని ప్రేమించే గొప్ప లక్షణం విలియమ్స్ కుండేది .వ్యత్యాసం తెలియని కవి .పనికిరానిది ఉందా అని ఆశ్చర్య పోయే వాడు .ప్రస్తుతాన్ని ,ప్రశ్నించరాని సాను భూతి తో రాయటం అతని ప్రత్యేకత .పేపర్ వార్త బజారు వార్తా అన్నీ కవిత్వం లో దిగాల్సిందే .దీన్ని’’If Williams errs on the side of objectivity ,he uses those objects ,fragments and disjointed documents to attain fresh and startling immediacy ‘’ గా అభి వర్ణించారు .4-3-1963న డెబ్భై తొమ్మిదేళ్ళ వయసులో చని పోయాడు .డాక్టర్ గా కంటే రచయితగానే ఎక్కువ సేవ చేశాడు .నిత్య జీవిత సంఘటనలే విలియమ్స్ కవితా వస్తువులు .’’poetry is equipment for living a necessary guide amid the bewilderments of life’’అని భావించాడు .మోడర్నిజాన్ని ఇమేజిజం తో కలగలిపి రాసిన వాడు కార్లోస్ విలియమ్స్ .

 

William Carlos Williams passport photograph 1921.jpg

 

ఐరనీ విట్ ల కవయిత్రి  — మరియాన్నే మూర్

మరియాన్నే క్రైగ్ మూర్ అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయీస్ లో 15-11-1887లో జన్మించింది బ్రయాన్ మార్ లో చదివి బి ఏ పాసై స్టేనోగ్రఫీ, టైపింగ్; బుక్ కీపింగ్ ,ఇంగ్లీష్  కమ్మర్షియల్  లా  లను పెన్సిల్వేనియా లో  బోధించింది .న్యూ యార్క్ హడ్సన్ పార్క్ బ్రాంచ్ కి అసిస్టంట్ గా  మూడేళ్ళు పని చేసింది ..సంప్రదాయం పధ్ధతి ఉన్న వనిత .మొదటి కవితా సంకలనం ‘’పోయెమ్స్ ‘’లండన్ లో ను ,’’అబ్సర్వేషన్స్ ‘’ను తర్వాతా ప్రచురించి రెండవ దానికి ‘’డయల్ అవార్డ్ ‘’ను కవిత్వం లో విశిష్ట సేవకు పొందింది .1944లో ‘’కాంటెంపరి పోయిట్రీ పేట్రన్స్ ప్రైజ్ ‘’ను పొందింది .చికాగో వర్సిటి నుండి ప్రతిష్టాత్మక హారియట్ మన్రో పోయెట్రి పురస్కారం అందుకొన్నది .గగ్గెన్ హీం ఫెలోషిప్ గౌరవం పొందింది .

1951లో ప్రచురించిన ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘కు బోలింజేన్ ,నేషనల్ బుక్ ,పులిట్జర్ ప్రైజ్ లను గెలుచు కొంది .నేషనల్ ఇంష్టి ట్యూట్ ఆఫ్ పోయెట్రి  అండ్  లెటర్స్ ’నుండి స్వర్ణ పతకం అందుకొన్నది .’’ఇందరు ఉండగా నా కవిత్వానికే ఇన్ని అవార్డులు యందు కిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు బహుశా న్యాయ నిర్ణేతలు నా కవితలలో కవిత్వం ఉంది అని గుర్తించినందుకు కృతజ్ఞతలు ‘’అని చెప్పింది .

మూర్ కవిత్వం లో ‘’పారడాక్స్ ‘’ఎక్కువ .అంతకంటే ఆ కాలం లో బాగా రాసిన వారు లేరు .ఆమె రాసిన వాటిని ఎందరో ఉదాహరించేవారు అందుకే ఆమెది  ‘’సిజర్ లైక్ మెథడ్‘’అన్నారు . ఇన్ వర్తేడ్ కామాలలో ఉండే ఫ్రేజులు ఆమె ప్రత్యేకం .’’వుడ్ వీసెల్ ‘’లో ఆమె సాంకేతిక ఆధిపత్యం పతాక స్తాయిని చేరింది .కవిత్వం లోసంగీతమే ఉండదు రెండు మూడు సార్లు చదివి అర్ధం చేసుకోవాలి .తాను  రాసిన ప్రతిదీ ‘’the chief interest is borrowed and since I have not been able to overgrow this hybrid method of composition ,acknowledgements seem only honest ‘’అని నిజాయితీని ప్రకటించింది .ఆమె కవిత్వం తెలివి తేటలు ,రుచికర స్తాయి నుండి నైతిక నిజాయితీ స్తాయికి చేరింది .’’this is a poetry made of personal notations ,verbal niceties ,and preserved curiosities ,but it is also playful ,surprising and as penetrating as it is exquisite  ‘’అని ఆమె కవిత్వాన్ని విశ్లేషించారు .5-2-1972 న  84ఏళ్ళ వయసులో మరణించింది .ఎజ్రా పౌండ్ ను అభిమానిన్చినా ఆయన ఫాసిస్ట్ సమర్ధతను వ్యతిరేకించింది .అమెరికా మోడర్నిస్ట్ కవయిత్రి రచయిత్రి గా మంచి గుర్తింపు పొందింది .ఐరనీ విట్ లలో అనితర సాధ్యకవితలల్లింది .

Marianne Moore 1948 hires.jpg

 

వ్యవసాయాధారిత పారిశ్రామిక విప్లవం కోరిన కవి -జాన్ క్రూ రాన్సం –ఫుజిటివ్ ఉద్యమం

జాన్ క్రూ రాన్సం అమెరికా లోని టెన్నిసీ లో పులస్కి లో 30-4-1888 లో పుట్టాడు స్కాటిష్ ఐరిష్ వంశం వాడు .తండ్రి మినిస్టర్ .పోర్ర్వీకులు ‘’కు క్లాక్స్ క్లాన్’’సంస్థకు చెందినా వారు .డిగ్రీ పొంది టెన్నిసీ నాష్ విల్ లోని వాండర్ బిల్ట్ యూని వర్సిటి లో ఆక్స్ ఫర్డ్ లోని క్రైస్ట్స్ట్ కాలేజి లో పూర్తీ చేసి  అమెరికా వచ్చి వాన్దర్ బిల్ట్ లో లెక్చర్ అయ్యాడు ఇక్కడే ‘’ఫుజిటివ్ గ్రూప్ ‘’ను ఏర్పాటు చేశాడు  .సభ్యులందరూ పెన్ నేమ్స్ తో సంతకాలు పెట్టారు ఏడాదిలో సభ్యుఅల సమాఖ్య పదహారైంది .వ్యవసాయవాణిజ్య  ఆధారిత పారిశ్రామిక ప్రగతి రావాలని కోరారు .’’ఐ విల్ టెక్ మై స్టాండ్ ‘’అనే సింపోజియం నిర్వహించారు .వీళ్ళు దక్షిణ రాష్ట్రాల వాళ్ళు అందుకని స్తానికులు భయ పడ్డారు .దేనికీ నిబద్దులని ప్రకటించుకోక పోవతామూ ఇబ్బంది కలిగించింది .ఇందులోని ‘’అలెన్ టాటే’’ప్రముఖ కవి రచయితా అయ్యాడు .డోనాల్డ్ డేవిడ్ సన్ స్థానికత ,చరిత్ర పై రెండు గ్రంధాలు ‘’ది తెన్నేస్సి ‘’పేరా రాశాడు .యాభై వేల ఫ్రీ వేర్స్ పంక్తుల్ని ,’’అమెరికన్ సానేట్స్ ‘’ను రాశాడు రాబర్ట్ పెన్ పులిట్జర్ బహుమతి ‘’ప్రామిసెస్ ‘’కవితా సంకలనానికి -పొందాడు .ఫుజితివ్ లు అంటే పలాయనం చిత్త గించే వారని ,అస్తిర మనస్కులని అర్ధం .

ఫుజితివ్ ఉద్యమం మఖ లో పుట్టి పుబ్బ లో మాడినట్లు కనుమరుగైంది .రాన్సం ఒహాయో లోని గాంబియర్ చేరి కెన్యా కాలేజి లో పోయెట్రి ప్రొఫెసర్ అయి ,కెన్యా రివ్యు పేపర్ కు ఎడిటర్ కూడా అయ్యాడు .కెన్యా స్కూల్ ఆఫ్  క్రిటిక్స్ సంస్థను స్తాపింఛి నూతన విమర్శను వ్యతిరేకించాడు . ‘’they insisted an order control ,and attentionto craftsmanship ,objectives which could only have a salutary influence ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించారు .ఈ న్యు క్రిటిక్స్ విశ్లేషణలో ఉన్నారు సృజించిన వాడికంటే విమర్శా విశ్లేషణ చేసేవాడిదే గొప్పఅన్నారు . రచన తోపాటు దాన్ని బహిర్గతం చేసే పరిశీలనాత్మకమైనా ,పరిశోధనాత్మక మైన విశ్లేషణ కే ప్రాధాన్యత నిచ్చారు ..’’poetry to be written not to delight but to dissect ‘’అని స్పష్టం చేశారు .దీనిపై స్పందిస్తూ ఇలియట్ ‘’thirty  three years ago it seems to have been the latter type  of criticism,the impressionistic –that ha caused the annoyance I felt when I were on ‘’the functions of criticism ‘’.to day it seems to me that we need to be more on guard against the purely explanatory ‘’అని స్పష్టం గా చెప్పాడు .

ఇంప్రె శష నిజం మీద విరక్తి చెందినా రామ్సన్ మాత్రం ప్యూర్లి ఎక్స ప్ల నేటరి కి వ్యతిరేకియే .అతని ‘’ఫస్ట్ ట్రావెల్స్ ‘’,జెంట్ వాకింగ్ ,బ్లూ గర్ల్స్మొదలైన కవితలు బాగా ప్రాచుర్యం చెందాయి .చావును కూడా ‘’కౌంటర్ ఫీట్ గ్రావిటి ‘’గా భావించాడు ‘’’here lies a lady of beauty and high degree –of chills and fever she died ,of fever and chills –to delight of her husband ,her aunts ,an infant of three –and of medicos marveling sweetly on her ills ‘’అని అధిక్షేపించాడు .మనసుకు ఊరట కల్గిస్తూ గుచ్చుకుంటా ఉండేట్లు రాస్తాడు  ‘’.his  inflection is both nervous and drawling ,a patrician softness of speech that mingles cavilier grace with diablerie ‘’  అని అతని కవిత్వాన్నిబేరీజు వేశారు .3-7-1974లో ఎనభై అరవ ఏట ఒహాయ్ లోని గంబియార్ లో మరణించాడు .

 

John Crowe Ransom 1941.jpg

 

సవన్నా కవి – కాన్రాడ్  ఐకెన్

అమెరికా లో జార్జియా లోని సవన్నా లో   కాన్రాడ్ ఐకెన్  5-8-1889 లో పుట్టాడు సమకాలీన కవులు సంగీతాన్ని వదిలేస్తే దాన్నే పట్టుకొని పట్టు సాధించాడు .పదేళ్ళప్పుడే తండ్రి తల్లిని చంపేసి ఆత్మా హత్య చేసుకున్నాడు .దీనితో జీవితమంతా విచారమే మిగిలింది .ఒక దూరపు బంధువు మాసా చూసేట్స్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే  జీవితాంతం ఉన్నాడు. హార్వర్డ్ లో చేరాడు ఇలియట్ ఇతనిక్లాస్ మేట్.గ్రాడ్యుయేట్ అవగానే  కే  కెనడియన్  అమ్మాయి జెస్సీ మాక్దోనాల్ద్ ను పెళ్ళాడాడు .ముగ్గురు పిల్లలు .కొద్దిపాటి ఆదాయం తో కుటుంబ పోషణ చేశాడు కవిత్వం పై దృష్టిపెట్టి స్వంత ప్రయోగాలు చేసి ‘’ఎర్త్ ట్రయంఫంట్ ‘’   పుస్తకం తెచ్చాడు .తర్వాత ‘’టర్న్స్ అండ్ మూవీస్ ‘’ను రెండవదిగా తీసుకొచ్చాడు .

ముప్ఫై లో ఇంగ్లాండ్ వెస్ట్ కోస్ట్ లో గడిపి ,హార్వర్డ్ కు వెళ్లి రెండో పెళ్లి చేసుకుని ,వదిలేసి మూడో పెళ్ళాడి ఐ-ఇంగ్లాండ్ చేరాడు .యాభై లో మాసాచూసేట్స్ లోనే ఉండిపోవాలనుకున్నాడు .’’ది న్యు యార్కర్ ‘’పత్రికకు లండన్ విలేకరిగా ఉన్నాడు .ఎనిమిదేక రాల పొలం కొన్నాడు .గౌరవాలు పురస్కారాలు వెంట పడ్డాయి .సేలేక్టే పోయెమ్స్ కు పులిట్జర్ వచ్చింది  నేషనల్ బుక్ అవార్డ్ ,తో బాటు కవిత్వానికి బంగారు పతకం కూడా వచ్చ్చింది .వచనం రాసినా కవిత్వానికి తీసి కట్టు .’’మిస్టర్ ఆర్క్యులరిస్ ‘’ను బాగా ఆదరించారు .’’  he relies too much on the hypnotic power of his smooth phrases’’   .ఒక డజన్ మాటలతోనే విపరీతాన్ని సృష్టించే నేర్పున్నకవి .ఇంగ్లిష్ రొమాంటిక్ కవిత్వం లోని మాజిక్ ను బాగా వాడాడు .ప్రతిధ్వని తో కూడిన సంగీత శబ్దాలను వాడి చెవులకు ఇంపు మనసుకుహాయి కలిగించాడు .’’ఎన్ని హిలేషన్ ‘’కవితలో లైన్లు బాగుంటాయి ,-‘’these are the secret and I could hate you –when as I lean for another kiss –I see in your eyes that I don’t meet you –and that love is this ‘’ అని ప్రేమకు భాష్యం చెప్పాడు . 1973  ఆగస్ట్ పదిహేడు న ఎనభై నాలుగో ఏట చనిపోయాడు . ఉషాంట్ అనే స్వీయ జీవిత చరిత్ర రాసుకున్నాడు నవలా కారుడిగా మంచి పేరుంది .అందులో పెళ్ళిళ్ళు శృంగారం అంగారం అన్నీ రంగ రించాడు . మతిస్తిమితం కోల్పోయి ఆత్మా హత్యా ప్రయత్నానికీ పాల్పడ్డాడు .   ‘’పోయెట్రి సొసైటీ ఆఫ్ అమెరికా ‘’ఐకెన్ ” కు మొదటి ‘’షెల్లీ మెమోరియల్ అవార్డ్ ‘’నిచ్చింది .

మొదటి లైబ్రేరియన్ కాంగ్రెస్ కవి, రచయిత- ఆర్చిబాల్డ్ మాక్లీష్

ఇలినాయిస్ లో గ్లేనోయి లో 1892 మే ఏడున పుట్టాడు మాక్లిష్ .పౌండ్ మనసంతా నిండిపోయాడు .విట్మన్ ఊరించాడు .సాంద్ బర్గ్ భావ జాలానికి ఊగి పోయాడు ..స్కాటిష్ మర్చంట్ కొడుకు మాక్లీష్ హార్వర్డ్ ఎల్ యూని వర్సిటి లా స్కూల్ లో చదివి మొదటి ప్రపంచ యుద్ధం లో ఆర్టిలరి గా చేరి తర్వాత బోస్టన్ లో అటార్నీ అయ్యాడు .మూడేళ్ళ తరువాత ‘’గౌను’’ విప్పేసి  సంగీతం పాడే ‘’అడా  హిచ్ కాక్ ‘’ను పెళ్లి చేసుకుని ,విదేశాలకు వెళ్లి అమెరికా తిరిగి వచ్చి పొలం కొని కనెక్టికట్ లో సెటిల్ అయ్యాడు .పబ్లిక్ ఫిగర్ అనిపించుకున్నాడు .ఫార్ట్యూన్ మేగజైన్ లో చేరి పని చేసి ,కాంగ్రెస్ లో లైబ్రేరియన్ అయి ,రెండవ ప్రపంచ యుద్ధం లో నిజ నిర్ధారణ కమిటి కి డైరెక్టర్ అయ్యాడు .ప్రెసిడెంట్ రూజ్  వెల్ట్   కు ఆంతరంగిక బృందం లో ఒకడై ,తర్వాత అసిస్టంట్ సెక్రటరి ఆఫ్ స్టేట్ పదవి సాధించాడు .రెండవ యుద్ధం లో చురుకైన పాత్ర పోషించాడు మాక్లీష్ .హార్వర్డ్ లో బోయిస్తాన్ ప్రొఫెసర్ ఆఫ్  ఆరేటరి  అండ్ రేటరిక్ ‘’కి ప్రొఫెసర్ అయ్యాడు .      ఇన్ని పదవులు పొంది ప్రాముఖ్యం లో ఉన్నా రచన ఆపలేదు .పద్దెనిమిది కవితా పుస్తకాలు ,అనేక నాటకాలు ,వ్యాసాలూ రాసి ఎన్నో రాజకీయ ప్రసంగాలు చేశాడు .మూడు సార్లు పులిట్జర్ బహుమతి ని ,నేషనల్ బుక్ అవార్డ్ ను పొందాడు .ప్రజలకు ఇష్టమైనది ,తగినదీ రుచికరం గా రాసి వండి వడ్డించాడు .ప్రతిభ తో పాటు అదృష్టం ఉన్న రచయిత .’’. and there there over heard there thee hung over –  those thousands of white faces those dozed eyes –there in the starless dark ,the poise ,the hover –there with vast wings across the canceled skies –there in the sudden blackness ,the black pall –of nothing nothing nothing at all ‘’అని ‘’ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ‘’కవితలో గొప్పగా వర్ణించాడు .  The library, almost alone of the great monuments of civilization, stands taller now than it ever did before. The city… decays. The nation loses its grandeur… The university is not always certain what it is. But the library remains: a silent and enduring affirmation that the great Reports still speak, and not alone but somehow all together…అని గ్రంధాలయ విశిష్టతను చాటి చెప్పాడు .పుస్తకం అంటే ‘’రిపోర్ట్ అపాన్ మిస్టరి ఆఫ్ థింగ్స్ ‘’అని గొప్ప నిర్వచనం చెప్పాడు .

 

Conrad Aiken poet.jpg

 

                 సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్ 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే…”హిట్టే ” అన్నడైలాగ్ రచయిత దివాకర్ బాబు

నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే…

Published at: 16-06-2014 01:08 AM

మాటలతో మాయ చేసే గారడివిద్య ఆయనకు తెలుసు కాబట్టే ‘మాయలోడు’లో ప్రేక్షకులందర్నీ మాయ చేశారు. ఎక్కడ ఏ అక్షరం పడితే బావుంటుందో తక్కెడలో తూకం వేసినట్లు రాయగలరు కాబట్టే ‘శుభలగ్నం’లో సెంటిమెంటును పండించారు. పొట్టి మాటలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి యముణ్ని సైతం భూలోకంలోకి రప్పించిన ఆయన అక్షర విన్యాసం.. ఎలాంటిదో ‘యమలీల’ చూస్తే తెలుస్తుంది. ఒక ముక్క మాట్లాడలేని మూగజీవానికి సైతం గుండెకు హత్తుకునే మాటలు రాయొచ్చని ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో నిరూపించుకున్నారు. ఫ్యామిలీ, హ్యూమర్, సెంటిమెంట్ డైలాగుల్లో ఆరితేరిన ఆయనే దివాకర్‌బాబు. బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకొచ్చి.. వంద సినిమాలకు మాటలు రాసిన ఆయనే ఈ వారం డైలాగ్‌గురు..
“నువ్వు నీ మొగుణ్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగుణ్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!”

“కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు”

“ఇంకేం యముండ.
అదుగో గోల్కొండ”

“అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు”

“గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ”

‘పుష్పక విమానం’లో ఒక్క డైలాగు లేదు. కాని ప్రేక్షకులకు అద్భుతంగా అర్థమైంది. చార్లీచాప్లిన్ సినిమాల్లోను మాటలు ఉండవు. ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే- సినిమాకు డైలాగులు అవసరం లేదని. తెర మీద ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా చెప్పలేనప్పుడు మాత్రమే డైలాగులు రాయాలన్నది నా అభిప్రాయం. ఊరికే సినిమా నిండా వాగుడు వాగుడు వాగుడు ఉండకూడదు. అయితే ఆ ప్రయత్నం.. నా పూర్వీకులు చేయలేదు. నేను చేయలేదు. నా తర్వాత వారు కూడా చేయలేదు.

‘శుభలగ్నం’ క్లయిమాక్స్ సీను రాయను అని మొండి కేశాను. ఎందుకంటే రాస్తే.. ఈ పాత్రలన్నీ నాకు దూరమైపోయినట్లే లెక్క. అంటే ఆ పాత్రలతో నాకు తెలియకుండానే అంత అనుబంధం ఏర్పడిందన్నమాట.

‘ఘటోత్కచుడు’లో ఏవీఎస్‌కు రాసిన.. ‘రంగు పడుద్ది’ బాగా పాపులర్ అయ్యింది. గుంటూరులో రౌడీబ్యాచు ఈ మాటను అంటుండే వాళ్లు. దాన్ని నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. రంగు అంటే రక్తం. అందుకే ‘రంగు పడుద్ది’ అంటుంటారు.

సినిమాల్లోకి వస్తానని ఏ నాడు అనుకోలేదు. కరూర్ వైశ్యాబ్యాంకులో ఉద్యోగం చేసేవాణ్ణి. చదువుకునే రోజుల నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం నాకు. నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం ఇదే పని. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేసేవాణ్ణి. అయితే బదిలీ మీద విజయవాడకొచ్చాను. ఏదో పని మీద మద్రాసు నుంచి రేలంగి నరసింహారావుగారు ఆ ఊరొచ్చారు. పూసల వెంకటేశ్వరరావు అనే రచయిత నా గురించి ఆయనకు చెబితే ఒకసారి వచ్చి కలవమన్నారు. రేలంగి బస చేసిన హోటల్ గదికి వెళ్లి ఆయన్ని కలిశాను.
ఒక సినిమాకు కథ చెప్పడం అదే ఫస్ట్‌టైమ్. చిన్న లైన్ చెప్పగానే ఆయనకు తెగ నచ్చింది. ‘లైన్ బాగుంది. ట్రీట్‌మెంట్ రాసి మద్రాసుకు పంపండి’ అన్నారాయన. వెంటనే రాసి పంపించేశాను.
అదే కథతో సినిమా తీస్తున్నట్లు నాకు కబురు పెట్టారు. “డైలాగులు కూడా నేనే రాస్తానండీ” అని రేలంగిని అడిగితే సరే అన్నారు. అలా ‘కొంటెకాపురం’తో డైలాగ్ రైటర్‌గా నా ప్రస్థానం మొదలైంది. అప్పట్లో అది పెద్ద హిట్. చంద్రమోహన్ హీరోగా ఫేడవుట్ అవుతున్న సమయంలో వచ్చిందది. సినిమా రచనలో అనుభవం లేకపోయినా.. నాటకాలకు, దృశ్యమాద్యమానికీ వ్యత్యాసం తెలుసు. ఆ తర్వాత ‘డబ్బు ఎవరికి చేదు’, ‘మన్మధలీల కామరాజు గోల’లకు మాటలు రాశాను. మెల్లగా అవకాశాలు పెరగడంతో.. బ్యాంకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పటికి పన్నెండేళ్లు బ్యాంకులో పనిచేశాను. ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’, ‘మావిచిగురు’, ‘చూడాలనివుంది’, ‘ఆహ్వానం’, ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించే అవకాశం వచ్చింది. మొత్తం కలిపితే వంద సినిమాలకు డైలాగుల్ని అందించాను నేను. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశాను. నాకు గుర్తున్న కొన్ని సినిమాల్లోని కొన్ని డైలాగులు ఇవి.
రాజేంద్రుడు గజేంద్రుడు
కథ సిద్ధమయ్యాక – దర్శకుడు ఎవరైతే బావుంటుంది? అని ఆలోచిస్తున్నాం. “మీరే చేయండి” అని ఎస్వీ కృష్ణారెడ్డిని ప్రోత్సహించాం. కథ ఆయన రాసిందే కావడంతో తీయడం సులువైంది. అప్పట్లో నేను కేవలం డైలాగులు రాయడం వరకే పరిమితం కాలేదు. స్క్రీన్‌ప్లేను మలచడం, పాత్రలకు ఒక స్వభావాన్ని ఇవ్వడం, కథా చర్చల్లో పాల్గొనడం చేసేవాణ్ణి. ఈ సినిమాకు పనిచేయడం మాత్రం కొత్త అనుభవం. సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక్కరే హీరో కాదు. ఏనుగు కూడా హీరోనే! అది జంతువు కాబట్టి మాట్లాడలేదు. దాని పక్కనున్న క్యారెక్టర్ మాట్లాడే మాటలను బట్టి.. ఏనుగు భావాలను ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఏనుగు తల ఊపితే.. “ఓహో! నువ్వు అలా అనుకుంటున్నావా” అని పక్క పాత్రలు చెబుతుండాలి. అలా రాయడం చాలా డిఫికల్ట్ ఫీట్. ఇంతకుమునుపు జంతువుల సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ చూశాను. అయితే ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’కు మాటలు రాయడం కష్టం అనిపించింది. ఏనుగు బాధ పడుతోంది. ఆ బాధను ఎలా చెప్పాలి? ఏనుగు పక్కనే అత్యంత ప్రీతిపాత్రమైన రాజేంద్రుడు అనే పాత్ర దాని హృదయాన్ని అర్థం చేసుగోలడు అనేది చెప్పగలగాలి. అయితే ఆ విషయం ప్రేక్షకులకు నేరుగా తెలియకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ.. సంభాషణలను రాశాను.
ఇందులో – అలీకి ఒక సన్నివేశముంది ‘జంబలకిడిపంబ’ తీస్తున్న సమయంలో.. నేను, అలీ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు.. ‘జిబ్రిష్ లాంగ్వేజ్’లో ఒక కామెడీ ట్రాక్ చేసి చూపించాడతను. అదే భాష కాదు. ఒట్టి సంజ్ఞలతో చేసే భావవ్యక్తీకరణ.అంతే!
అలీ చేసిన ఆ సీను బాగా గుర్తుండిపోయింది. దాన్నే క్యారెక్టర్‌గా మలిచి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో బ్రహ్మానందానికి పక్కనుండే ఒక పాత్రను పెట్టాను. ఆ పాత్రను అలీనే చేశాడు. అతను మాటి మాటికీ ‘ఇంద చాట’ అంటుంటాడు. అందులో ఒక్క ముక్క అర్థం కావు. దాని వల్ల బ్రహ్మానందం పడే అవస్థల్ని చూస్తే నవ్వొస్తుంది. వీళ్లిద్దరి మధ్య నడిచే సీన్ల కోసం పెద్ద పెద్ద డైలాగులేమీ రాయలేదు. అందుకే ప్రేక్షకులకు నచ్చింది.
మాయలోడు
ఆ రోజు నాకు జ్వరం వస్తే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ క్యాసెట్టును పంపిస్తే.. డీవీడీ ప్లేయర్‌లో వేసుకుని చూస్తున్నానప్పుడు. నా పక్కనే మసాజ్ చేసే వ్యక్తి కూర్చున్నాడు. సినిమాను చూస్తూ.. కొన నాలుకను బయటికి చాపి.. కనుబొమలు పైకి ఎగరేసి.. ఒక విచిత్రమైన ఫేసు పెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్నంత సేపు.. “ఇతను మెచ్చుకుంటున్నాడా? లేదంటే వెక్కిరిస్తున్నాడా?” అనేది అర్థం కాలేదు. ఇదే భావనను తీసుకుని క్యారెక్టరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా పుట్టిందే ‘మాయలోడు’లో బ్రహ్మానందం పక్కనుండే అలీ క్యారెక్టర్. బ్రహ్మానందం ఏం మాట్లాడినా నాలుక బయటపెట్టి కనుబొమలు పైకెగరేసి.. మౌనంగానే తలను అటూఇటూ ఆడిస్తుంటాడు అలీ. అతని వింత ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు నవ్వి నవ్వి ఊగిపోయారు. ఒకసీనులో అమ్మాయిలతో హోటల్‌లో కలిసి భోంచేసిన బ్రహ్మానందం బిల్లు కట్టలేక పిండి రుబ్బాల్సి వస్తుంది. అప్పుడు అలీ నాలుక బయటపెట్టి తల ఆడించే విన్యాసం అద్భుతంగా నవ్వించింది. ఆ సీనుకు డైలాగులు అవసరం లేదనే రాయలేదు. ఒక వేళ అలీకి మాటలుండి ఉంటే అంత నవ్వించగలిగేది కాదు ఆ సన్నివేశం. ఆ కిటుకు రచయితకు తెలిసుండాలి. డైలాగు రైటర్ ప్రతి పాత్రను వాగుడుకాయ చేయకూడదు.
‘నేను గానీ ఒక ఈలగానీ వేశానంటే’ అంటూ రాజేంద్రప్రసాద్ రోడ్డు మీద గారడివిద్య చేసి మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయే సీను అది. జనం వెళ్లిపోయినా.. అక్కడొకచిన్న పిల్ల దిగులు ముఖం పెట్టుకుని కూర్చునుంటుంది. ‘ఏంటమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు?’ అనడిగితే.. “మా మమ్మీడాడీని మా మావయ్య చంపేశాడు..” అని ఏడ్చినంత పని చేస్తుంది. అంతవరకు రాజేంద్రప్రసాద్ చేసిన గారడి విద్యలు నిజమని నమ్మిన ఆ పిల్ల ‘నువ్వుగానీ ఒక ఈలగానీ వేస్తే మా అమ్మానాన్నా వస్తారుగా’ అని ఆశగా అడుగుతుంది. ఆ చిన్న సన్నివేశం ప్రేక్షకుల గుండెల్ని తాకింది.
మరొక సీను – రాజేంద్రప్రసాద్ నిరక్షరాస్యుడు. అంధురాలైన అమ్మాయిని చేరదీసుంటాడు. ఒకసారి తన పేరు రాయమని కోరతాడు. అప్పుడు ఆ అమ్మాయి పలకలో రాస్తుంది. పక్కనున్న వ్యక్తితో రాజేంద్రప్రసాద్ “ఏంట్రా కరెక్టుగా రాసిందా” అని అడుగుతాడు. “గాడు అని రాసిందిరా” అంటాడతను. వీరబాబు ‘గాడు’ (సినిమాలో తన క్యారెక్టర్‌పేరు) అని రాసిందా” అని అంటాడు రాజేంద్రప్రసాద్. అప్పుడు ఆ వ్యక్తే మళ్లీ ‘జిఒడి గాడ్ అని రాసింది” అని చెప్పగానే హీరో కళ్లలో నీళ్లు మెదులుతాయి. అంటే ఆ పిల్ల తనను దేవునిగా భావిస్తోంది అని చెప్పడం ఆ చిన్న డైలాగు ఉద్దేశం. అంతకంటే మరొక్క మాట అక్కడ అక్కర్లేదు.
సినిమా అన్నది ‘మేక్ బిలీఫ్’. ప్రేక్షకులు చూస్తున్నంతసేపు వాళ్లను నమ్మిస్తే చాలు. ‘మాయలోడు’లో పెద్ద ఫ్లా యేంటో మేకర్స్‌గా మాకు తెలుసు. కాని అంతవరకు ఆలోచించకుండా ప్రేక్షకులను మాయ చేయగలిగాము. గారడీ తెలిసిన రాజేంద్రప్రసాద్ అవసరం అనుకుంటే టక్కున మాయమైపోగలడు. మనుషుల్ని కప్పల్ని, కుక్కల్ని, పిల్లుల్ని చేయగలడు. కాని ఇంట్లో వున్న గుడ్డి పిల్లకు మాత్రం కళ్లు తెప్పించలేడు. మరేమిటి నాన్సెన్సు. తనకున్న విద్యతో ఆ పిల్లకు కళ్లు తెప్పించొచ్చుగా! అని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే? అన్న తర్కం రాకుండా సీన్లు రాయాల్సొచ్చింది. ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్. స్క్రీన్ మీద చూపించిందే ప్రేక్షకుడు నమ్ముతాడు. దాని వెనకున్నది నమ్మడు.
శుభలగ్నం
దీనికి కథ భూపతిరాజా. ‘ఇన్‌డీసెంట్ ప్రపోజల్’ అనే ఆంగ్ల చిత్రం నుంచి కథను తీసుకున్నారాయన. ఆ కథలో కోటి రూపాయలకు భార్యను అమ్మేస్తాడు ఓ భర్త. అదే కథను తెలుగులో తిప్పి రాశాడు రాజా. కాబట్టే ‘శుభలగ్నం’లో భర్తను అమ్ముకుంటుంది భార్య. నాకు కథ వినిపించాక.. మీరు నమ్ముతారో లేదో కాని.. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే చకచకా మాటలన్నీ రాసేశాను. ఇందులో ఆమని పాత్రకు చిన్న అమాయకత్వం కనక జోడించకపోయుంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యుండేది. ఆమనిది సాధారణ గృహిణులు ఆశపడే స్వభావం. ప్రతిదాన్నీ పక్కవాళ్లతో పోల్చుకోవడం ఆమె నైజం. మాట మాటకు ఆఖర్న ‘ఏమిటో..’ అంటూ దీర్ఘం తీసి చెప్పే ఆమె మానరిజం అప్పట్లో అందరి మెప్పు పొందింది.
భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన ఆమని.. ఒక ఖరీదైన బంగళా కొంటుంది. ధగధగలాడే నగలు ధరించి, పట్టుచీర కట్టుకుని.. దర్జా ఒలకబోస్తుంటుంది. ఆ సమయంలో బంగళాను అమ్మేసిన సుహాసిని అక్కడికొస్తుంది. ఆవిడను చూసిన ఆమని “నా వైభోగం చూసిపోదామని వచ్చావా ఏమిటి?” అంటుంది. “లేదు పనివాళ్లు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. నా భర్త ఫోటో మాత్రం ఉంది. అది స్వయంగా తీసుకెళదామని వచ్చాను” అని చెబుతుంది సుహాసిని. మళ్లీ ఆమని కలుగజేసుకుని “ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకు అని చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. నీకంటే గొప్పదాన్నని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?” అని ఆమని కాస్త పొగరు స్వరంతో చెబుతుంది. “నువ్వు నీ మొగున్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగున్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!” అని సుహాసిని చెప్పే డైలాగ్ ఆమనిని ఆలోచనలో పడేస్తుంది.
ఆ రోజు పెళ్లి రోజు. పేకాటలో మునిగిపోయిన ఆమని ఆ సంగతిని మరిచిపోతుంది. ఆటలో గుర్తుకొచ్చి వెంటనే ఇంటికి పరిగెత్తుకొస్తుంది. అప్పటికే రెండో భార్య రోజాను తీసుకుని బయటికి వెళ్లుంటాడు జగపతిబాబు. ఇంటికొచ్చిన ఆమని గబగబ మేడ మీదికి ఎక్కి మొగుడి కోసం వెతుకుతుంది. లేడని తెలుసుకుని విసుగుతో మెట్లు దిగుతూ కిందికొస్తుంటే.. అక్కడే ఉన్న వాళ్లమ్మ అన్నపూర్ణ “ఇంతకన్నా దిగిపోవడానికి నీకు మెట్లు లేవమ్మా” అంటుంది. ఆ ఒక్క చిన్న డైలాగు ఆ సన్నివేశానికి ఎంత బలాన్ని అందించిందో చెప్పలేను. డబ్బు కోసం మొగున్ని అమ్ముకుని.. అతను లేని లోటును మెల్లగా తెలుసుకుంటున్న ఆమె.. రియలైజేషన్‌లోకి వెళ్లిందీ అని చెప్పటానికి ఆ మాట తోడ్పడింది.
అది క్లయిమాక్స్ సీను – డబ్బు మీద ఆశ చచ్చిపోయి ఉన్నదంతా అనాధాశ్రమానికి రాసిచ్చేసి.. విదేశాలకు వెళుతున్న మొగుడి కోసం ఎయిర్‌పోర్టుకు వస్తుంది ఆమని. అక్కడ రోజా, జగపతిబాబు మధ్య ఒక సీనుంటుంది. పరాయి మొగుడి మీద ఆశ పడటం ఎంత తప్పో తెలుసుకున్న రోజా.. “కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు” అని చెబుతుంది. ఈ డైలాగే కాదు. ఇందులోనివన్నీ చాలా క్లుప్తంగా ఉంటూనే, శక్తివంతగా అనిపిస్తాయి. కాబట్టే సామాన్యప్రేక్షకుల హృదయాలను పట్టుకున్నాయవి. నేనెక్కడా ఇందులో పంచ్‌లు పడాలని మాటలు రాయలేదు. ఆ సందర్భానికి ఆ పాత్ర మనసులో ఏముంది? ఏం మాట్లాడితే బాగుంటుంది? అన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను.
చూడాలని ఉంది
చిరంజీవి ఒక పెద్ద మాస్ హీరో. అయినాసరే చాంతాడంత మాటలు రాయలేదు. సౌందర్య తన ట్రంకుపెట్టెలో దాచుకున్న ప్రేమలేఖను చదివి వినిపించే సీనొకటి అద్భుతంగా పండింది.(మొదటిపేజీ తరువాయి)
ఆమెకు ఇదివరకు ఎవరో లవ్‌లెటర్ రాస్తే దాన్ని పెట్టెలో నుంచి అపురూపంగా బయటికి తీస్తుంది. లేఖను చదవమంటాడు చిరంజీవి. అప్పుడు సౌందర్య సిగ్గుతో కూడిన అమాయకపు ముఖంతో.. గొంతు సవరించుకుని.. లేఖ తీసుకుని.. “పద్మావతీ పద్మావతీ.. నీ ఎర్రని మూతి.. చూడగానేపోయింది నా మతి” అని చదువుతూ మెలికలు పోతుంది. చదవడం అయిపోగానే “చూశావా నా కోసం రక్తంతో రాశాడు” అంటుందామె. “అబ్బో అంత కలర్ ఇచ్చాడా?” అంటాడు చిరు.
డైలాగుల కోసమని డైలాగులను నేనెప్పుడూ రాయను. పొదుపుగా రాయడం అలవాటు. ఒక సీనులో విలన్ అనే ఒకే ఒక్క మాటతో హీరో గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన సీను అది. ఒక పాత సినిమాలో ఎస్వీ రంగారావు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో “నీకు మరణమే శరణ్యం. నీకు.. మరణమే.. శరణ్యం. నీకు.. మరణమే… శరణ్యం” అనే డైలాగును అద్భుతంగా చెబుతాడు. ఏకవాక్యాన్నే మొదట మెల్లగా, రెండోసారి ఇంకాస్త గట్టిగా, మూడోసారి మరికాస్త గట్టిగా హైపిచ్‌లో చెప్పాలి దీన్ని. అదే భావోద్వేగంతో ‘చూడాలనివుంది’లో విలన్ ప్రకాష్‌రాజ్‌కు డైలాగును రాశాను. “మీరొకసారి ఎస్వీరంగారావు గారి సినిమా చూస్తారా? అందులో ఆయన ఎలా చెప్పారో తెలుస్తుంది” అన్నాను ప్రకాష్‌రాజ్‌తో. అయితే ఆయన “వద్దండీ నేను చూడను. చూస్తే ఆయన ఇమేజ్ నా మీద పడుతుంది. నేను నా సొంత స్టయిల్‌లోనే చెబుతాను” అన్నారు. అప్పుడు ఆయనకు రాసిన డైలాగ్.. “వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు”. ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ డైలాగ్ హీరో రేంజ్‌ను పెంచింది.
యమలీల
ఒక్కోసారి రచనకు లొకేషన్లు కూడా పనికొస్తాయి అనేందుకు ఇందులోని ఒక సీను నిదర్శనం. ఈ స్క్రిప్టు నేను మద్రాసులోనో ఇంకోచోటో కూర్చుని రాసుంటే ఎలా రాసుండేవాన్నో తెలీదు. భవిష్యవాణి పుస్తకాన్ని పొరపాటున భూలోకంలోకి జారవిడచడంతో.. ఇంద్రుడు శపిస్తాడు. దాంతో యముడి వేషం వేసిన సత్యనారాయణ, చిత్రగుప్తుడైన బ్రహ్మానందం భవిష్యవాణి కోసం.. భూలోకంలోకి వస్తున్న సన్నివేశం అది. “శాపం పడితే పడింది కాని మనకు సెలవు దొరికింది” అని చమత్కరిస్తాడు చిత్రగుప్తుడు. అందుకు కోపమొచ్చిన యముడు “యముండా…..!!!!” అని ఘీంకరిస్తాడు. “ఇంకేం యముండ. అదుగో గోల్కొండ” అని బ్రహ్మానందం చెప్పిన డైలాగుకు థియేటర్లన్నీ విజిళ్లతో మోగిపోయాయి. వాళ్లిద్దరు భూలోకంలోకి వచ్చారు అని చెప్పడానికి గోల్కొండను చూపించడం నా ఉద్దేశం. యముండకు, గోల్కొండకు ధ్వని కూడా బాగా కుదిరింది. ఈ డైలాగును హైదరాబాద్‌లో కూర్చుని రాశాను కాబట్టే ఈ ఐడియా వచ్చింది. ఇంకోచోట అయ్యుంటే వచ్చేది కాదేమో!
ఇంకో సీనులో అమ్మ గొప్పతనాన్ని చెప్పాల్సొచ్చింది. భూలోకంలో యముడు భోజనం చేస్తుంటాడు. అప్పుడతను “అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు” అంటాడు. ఆ డైలాగు ప్రేక్షకుల మన్నన పొందింది. ఇంకో సీనులో యముడు ఒక తాగుబోతును తన సహజసిద్ధ ధోరణిలో ‘మానవా’ అని పిలుస్తాడు. అప్పుడు ‘మానను’ అంటాడు ఆ తాగుబోతు.
‘యమలీల’లో అందరికీ గుర్తున్న కవిత ఒకటుంది. తనికెళ్ల భరణి “గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ” అనేదే ఆ కవిత. ఆ సినిమా తర్వాత ఈ కవితకు వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు. అందర్నీ బాగా నవ్వించింది. ఇప్పటికీ నవ్విస్తోంది..” అని ముగించారు దివాకర్‌బాబు.

ప్రస్తుతం మణికొండలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ‘మీరు ఇప్పుడేమీ రాయడం లేదా’ అంటే ‘ప్రతి మనిషీ ఒక చోట ఆగాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. ఇప్పుడొస్తున్న సినిమాలకు మాలాంటి వాళ్లం రాయలేము. బూతులు అసలే రాయలేను..” అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారీ సక్సెస్‌ఫుల్ డైలాగ్ రైటర్.
ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని

— నిజం గానీ శ్రీ ఆలూరి భుజంగ రావు గారు మరణించి ఏడాది అయిందా?అని పిస్తోంది .నిజాయితీ  నిబద్ధతలకు మారు పేరు ,మా ఉయ్యూరు లో దశాబ్దం పైగా ఉన్నవారు నిత్యం కలిసి మాట్లాడిన వారు ,గుంటూరు నుండి ఉత్తర ప్రయ్తుత్తరాలు జరిపిన వార అతి నిరాడంబరులు ఆలూరి వారు .వారిని గురించి జ్ఞాపకం చేసిన ”కాలం కవి ”కి ”నాన్న గారు ”అని గుండె లోతుల్లోంచి పలికిన వారి సంస్కారానికి ధన్య వాదాలు చెబుతూ అందరికోసం దీన్ని మీకు అందిస్తున్నాను -దుర్గా ప్రసాద్

గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని

Published at: 16-06-2014 01:07 AM

నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు.

దేన్నీ మిగల్చదు. ముందూ వెనకగా సమ స్త ప్రాణికోటి కాలగర్భంలో కలసిపోవాల్సిందే! వ్యక్తు లు మిగలరు. వీళ్ల జ్ఞాపకాలే మిగుల్తాయి. నాకు గురుసమానులైన మా నాన్న – ఆలూరి భుజంగరావు గారు మరణించి అప్పుడే సంవత్సరం కావస్తోంది! ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. 2013 జూన్ 20న ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోయారు. సాహిత్యా న్ని చదువుతుంటే ఆయన జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి…

రచయితల రచనల్లోనే వాళ్ల వ్యక్తిత్వం ద్యోతకమవుతుందంటారు. అద్భుతమైన అనువాదాలనూ, రచనలనూ దాదాపుగా విపరీతమైన శారీరక, మానసిక బాధల్లోనే, దరిద్రంలోనే రాశారు. కానీ తనను మానవుడిగా, రచయితగా తీర్చిదిద్దింది ఈ దేశంలోని కూటికి, గుడ్డకు నోచుకోని కోట్లాది దరిద్ర మానవులే- అని సగర్వంగా చెప్పుకున్నారు. సమస్త విజ్ఞానాలూ, ఐశ్వర్యాలూ, సుఖాలూ- సంపదలూ అన్నీ మురికి ఓడుతూన్న మడి మనుషుల చెమట చుక్కల్లోంచేనని త్రికరణ శుద్ధిగా నమ్మారు. ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్న- ఆయన జీవితం అస్తిత్వాన్ని దాల్చిన క్షణం నుండి ఆయనను వేధించిన ప్రశ్న. ఆయన జీవితంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రశ్న. ‘జీవితాన్ని పొగల్లో, సెగల్లో, పంచాగ్నుల మధ్యా భస్మీపటలం చేస్తున్న ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్నకే ప్రాధాన్యతనిస్తే, నా జీవిత చరిత్రగా పేరు పెడితే? అది నా దేశంలోని అసంఖ్యాకులైన మానవుల చరిత్ర అవుతుందని రాసుకున్నారు. సరైన వైద్యం చేయించలేక ఇద్దరు మొగపిల్లల్ని పోగొట్టుకున్నారు. ‘ఈ సమాజ కరాళ దౌష్ట్యాలకు ఎరగా ఇప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఇచ్చానని’ 1974లో రాసుకున్నారు. హాలాహలం లాంటి జీవితంలోంచి అమృతమనే సాహిత్యాన్ని రచించారు.

ఆకలిగొన్నవారు, అన్నార్తులు, అభాగ్యులు కనపడితే వాళ్లు అడిగినా, అడగకపోయినా ఎంతో కొంత తన జేబులోంచి తీసి వాళ్ల చేతుల్లో పెడుతుండేవారు. వాళ్ల కళ్లల్లో దైన్యం, ఆకలి కనపడుతోందనేవారు. నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. జీవితంలో ఇంకా నేర్చుకోవలసింది ఎంతో వున్నదని భావించేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు. ఎంత బాధలో వున్నా హాస్యోక్తుల్ని విసురుతుండేవారు. ఆయన భాషలో సున్నితమైన హాస్యం మేళవించి వుండేది.

2000 నుండి 2013 దాకా అంటే దాదాపుగా 13 ఏళ్లు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కాకుండా, రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చివరి దశ లో ఏ రకమైన మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడ్డారో.. ఆ రకమైన బాధల్నే భుజంగరావు కూడా అనుభవించారు. ఒక్కొక్కప్పుడు సమయ, సం దర్భాలనుఆయన మెదడు స్వీకరించలేకపోయేది. తన కు వచ్చిన భావనను వెంటనే వ్యక్తపరచాలనుకునేవారు. తన మరుపు, మాటలు, ఆప్తులనూ, మిత్రులనూ బాధపెడుతున్నాయేమోనని కలవరపడిపోయేవారు. తనస్థితికి అమితంగా బాధపడేవారు. ఒక రకం గా మెదడుకు సంబంధించిన అనారోగ్యం ఆయన మెదడును కబళించివేసింది. ఐతే, సహృదయులైన సాహితీమిత్రులు ఆయన స్థితిని అర్థంచేసుకుని, ఆయ నను ఆదరించేవారు- తాను నమ్మిన ఆదర్శం, సిద్ధాం తం, ఆశయాల పట్ల చివరిదాకా పూర్తి జ్ఞాపకశక్తితో, చాలా ఖచ్చితంగా చెప్పగలిగి వుండడం గమనార్హం.

ఎంతో నిమగ్నత వుంటే తప్ప రాహుల్జీని అనువదించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలు (జిరాక్స్ మిషన్ లాంటివి) అప్పుడు లేవు. ఆర్థిక సమస్యలూ, అనారోగ్యం సరేసరి. పెద్ద కుటుంబం చిన్న ఇల్లు. ఇల్లంతా బంధువులతోటి, మిత్రులతోటి నిండి వుండేది. కమ్యూనిస్టు భావాలు కలిగి వుండటాన పనిచేసే చోట మేనేజ్‌మెంట్ నుండి మానసిక వత్తిడి, హింస ఎక్కువగా వుండేవి. ఇటువంటి పరిస్థితులలో నిరంతర అధ్యయనం. రాహుల్జీ, యశ్‌పాల్, ప్రేమ్‌చంద్ లాంటి ప్రముఖుల అనువాదాల్ని ఎలా చేయగలిగారో అని అనిపిస్తుంది. పేపరు కింద కార్బన్ పెట్టుకుని వేసవి వడగాలులతో, చెమటను తుండుగుడ్డతో తుడుచుకుంటూ రాసేవారనీ, రాహుల్జీని అనువదించేటపుడు అన్నం తింటూ మధ్యలో లేచివెళ్లిపోయి చెయ్యి కడుక్కునేవారని అమ్మ చెప్పేది. తన సొంత రచనలను, ఎంతో శ్రమకోర్చి అనువాదం చేసిన అనువాదాలను అనేకం పోగొట్టుకున్నారు. అవి వెలుగు చూడాలనీ, ఆ ఆణిముత్యాలను తెలుగు పాఠకులకు అందించాలనీ తపనపడేవారు. ప్రస్తుత సమాజంలో సాహితీపరుల బాధ్యతను గుర్తుచేస్తూ.. కవి ధరించవల్సింది కలమా? ఖడ్గమా? అన్న మీమాంస వచ్చినపుడు- సుబ్బారావు పాణిగ్రాహి కలంతో పాటు ఖడ్గాన్ని కూడా ధరించవల్సిందేనని అనేవారు. భవిష్యత్ తరాలు తప్పనిసరిగా ‘నాదీ-నీదీ’ అనేది లేని సమాజాన్ని నిర్మించుకుంటారని, అలాంటి సమాజాన్ని నిర్మిద్దామని కలలు కనేవారు. ఐతే అప్పటిదాకా ఎంతమంది మానవులు రక్తతర్పణం కావించారు? అంటూనే తప్పకుండా ఆ రోజులు వస్తాయని విశ్వసించేవారు.

‘జీవితంలో తాను అనుకున్నవి ఏవీ అనుకున్నట్టుగా జరగలేదని కనీసం చావైనా ప్రశాంతంగా రావాలని’ కోరుకున్నారు. ఆయన చనిపోయేదాకా గుంటూరులోని ఎ.టి.అగ్రహారం, 7వ లైనులో దాదాపుగా 10 ఏళ్ల పాటు వున్నారు. చనిపోయేనాటికి ఆ ఇంటి అద్దె 2,200 రూపాయలు. ఇంటి నేల గచ్చునేల కాదు. మట్టినేలకు ఎర్రకళాయి పూశారు. అందుకే కొంచెం తక్కువ అద్దె తీసుకునేవారు. ఆయన చనిపోయాక ‘ఇంత గొప్ప వ్యక్తి! గొప్ప సాహితీవేత్త! అనుకున్నది ఆచరించి చూపే నిజాయితీపరుడు! దహన కార్యక్రామాలు అయ్యేదాకా ఇంటి ఆవరణలోనే వుంచండి.. బయట వుంచవద్దని’ ఇంటి ఓనరు చెప్పారు. ప్రశాంతంగా చనిపోవాలన్నది ఒక్కటి మాత్రమే ఆయన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో తనకు కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మావోయిస్టు భావజాలం తోడ్పడ్డాయనీ, తనను మనిషిగా తీర్చిదిద్దాయనీ అటువంటి ఆ భావజాలానికీ, ఆలోచనా విధానానికీ, ఆచరణకీ అత్యంతగా కృతజ్ఞుణ్ణయి, వినమ్రుణ్ణయి తలవంచుకు అభినందనలు తెలియపరుచుకుంటున్నానని -సగౌరవంగా చెప్పుకున్నారు.

ఆయన ఆశయాలనూ, ఆదర్శాలనూ, నమ్మిన సిద్ధాంతాలనూ గౌరవించి, కొనసాగించడమే కా.ఆలూరి భుజంగరావు గారికి మనమిచ్చే నివాళి. శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరిస్తూ.. జోహార్లు చెప్తూ.. కన్నీటి పర్యంతమవుతూ..

– కవిని

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని ఆధిపత్యాలను ధిక్కరించడమే కవిత్వం – వివిధ

 అన్ని ఆధిపత్యాలను ధిక్కరించడమే కవిత్వం – వివిధ

మూడు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం సమగ్ర కవితా సంకలనం వచ్చిన సందర్భంగా పాత్రికేయుడు నగునూరి శేఖర్, రీడర్ బూర్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కవి అన్నవరం దేవేందర్, కథకుడు కె.వి.నరేందర్, మరొక తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు గాజోజు నాగభూషణం కలిసి చేసిన ఇంటర్వ్యూ ఇది. తెలంగాణ సమాజమే కాదు తెలుగు నేలంతా అతలాకుతలమై ఎదుర్కొన్న సంక్షోభాల, సంఘర్షణల, విధ్వంసాల సారాంశమే ఈ సంభాషణ…

కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు.. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.. కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.

శేఖర్: తెలంగాణ సాహిత్యంలో కవులు, కళాకారుల భాగస్వామ్యం ఎంత?

– ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ప్రముఖమైంది. భావజాల విస్తరణలో వీరి రచనలు అత్యంత ప్రభావవంతమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కవులు, కళాకారుల పాత్ర తెలంగాణ సాధనలో ప్రథమశ్రేణికి చెందినది.

శేఖర్: తెలంగాణ ఆవిర్భావానంతరం కవులు, రచయితల పాత్ర ఎలా ఉండాలి?

– ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కవులు, రచయితలు తమ తమ కార్యాకారణమైన రచనల ద్వారా ప్రజలను ఆధిపత్య నయా దోపిడీకి వ్యతిరేకంగా అప్రమత్తం చేసి ఉద్యమ దిశగా నడిపించాల్సివుంది.

శే: చరిత్ర, సంస్కృతి, భాష పునర్నిర్మాణానికే కవులు, రచయితలు పరిమితం కావాల్నా? లేక రాజకీయ మార్గదర్శనంలో వాళ్ల అవసరముందా?

– అస్తిత్వ ఉద్యమాలకు కారణభూతం ఆధిపత్య అణిచివేత. అందు లో భాగమే చరిత్ర, సంస్కృతి, భాషలను తిరిగి నిర్మించుకోవడం ఇందు లో భాగంగా గత దశాబ్దంన్నరగా తెలంగాణ కవిత్వ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏర్పడిన ఆధిపత్య రాజ్యానికి వ్యతిరేకంగా తిరిగి కవులు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో తప్పనిసరి సృజనాత్మకంగా ఆచరణాత్మకంగా వ్యవహరించాలి.

శే: తెలంగాణ భాషకు ప్రాధాన్యత విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు?

– తెలంగాణ రాష్ట్ర ఉద్యమం భాష న్యూనత నుండి ప్రారంభమైంది. రాష్ట్రంలో భాషకు, సంస్కృతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేయాలి. అందులో భాగంగా ముందు పాఠశాల వాచకాల్లో భాష, చరిత్ర, సంస్కృతిని ప్రవేశపెట్టాలి. గ్రామీణ కార్యాలయాల స్థాయి నుండి సచివాలయం వరకు అన్ని శాఖల్లో మన తెలుగును తప్పనిసరి చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడుకాని తెలంగాణ భాషకు అర్థం పరామర్థం కలుగదు.

వెంకటేశ్వర్లు: మీ కవిత్వం సమాజ సంఘర్షణను ఆవిష్కరించే భావజాల వ్యాప్తికే పరిమితం అవుతుందా? ఏదేనీ కార్యాచరణను సూచిస్తుందా?

– నా కవిత్వమే కాదు, ఏ ప్రవహించే కవి కవిత్వమైనా సామాజిక సంక్షోభ, సంఘర్షణ నుంచే పుడుతుంది. ఆ కవిత్వ కార్యాచరణే ఉద్యమాల చిరునామాగా ఉంటుంది.

వెం: మొదటి నుండి మీరు తెలంగాణ నుడికారంతో కవిత్వం రాశారు కదా! తెలంగాణ భావజాల వ్యాప్తిలో మీ కవిత్వం పాత్ర ఏమిటి?

– తెలంగాణలో పుట్టిన కవికే గాక ఏ వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన కవికైనా ప్రజల నుడికారంతోనే అతని కవిత్వం విద్యుత్ తేజాన్ని పొందుతుంది. దీనికి ప్రజల భాషకు కొనసాగింపు నేను. తెలంగాణ భావజాల వ్యాప్తిలో నా కవిత్వానిది పాయగొట్టలేని బంధం. అందులో భాగమే భాషా, సామెతలు, నుడికార తల్లి మమకారం.

వెం: తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలోనూ, పూర్వ అధ్యక్షునిగానూ మీ అనుభవాలేమిటీ?

– తెలంగాణ రచయితల వేదికకు నేను అధ్యక్షున్ని అయిన తర్వాత వేదికకు అదివరకు లేని ఒక బలమైన తాత్విక పునాదిని నిర్మించాను. అది పునాదికి, ఉపరితలానికి మధ్యనున్న వైరుధ్యాలను, ఐక్యతలను బాహాటంగా ముందుకు తీసుకువచ్చింది. అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించే దిశగా తెరవే ను ఉద్యమంలో నిటారుగా నిలిపింది. ఈ నిర్మాణంలో ఎందరో వ్యక్తులు అంతర్గత శత్రువులుగా మారితే, ఇరుప్రాంతాలలోని అనేక సమూహాలు బుద్ధితీరా ఆలింగనం చేసుకున్నాయి.

సుజాత: తెలంగాణ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందా?

– సీమాంధ్ర ఆధిపత్య ధిక్కారం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అనేక షరతులతో కూడిన భౌగోళిక తెలంగాణ సాధన పాక్షికంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరో దళారి ఆధిపత్య వర్గం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.
సుజాత: ఇప్పటివరకు విభజన జరిగిన చిన్నరాష్ట్రాలు తమ సహజ వనరులను బహుళ జాతి కంపెనీల చేతికి అప్పజెప్పాయి. అక్కడి ప్రజల కనీస అవసరాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ

క్రమంలో అక్కడ విప్లవోద్యమాల అవసరం కలిగింది. రేపటి తెలంగాణలో మళ్లీ విప్లవోద్యమాల పరిస్థితి రానుందా?

– ఏర్పడిన చిన్నరాష్ట్రాల్లో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు ఈ సంపదపై కన్నేసి కాజేస్తున్నాయి. వీటికి దన్నుగా కేంద్ర ప్రభుత్వం తన బలగాల ద్వారా గ్రీన్ హంట్ పేరున నిలిచి, ప్రజలపై అమానుష దాడులకు పాల్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లోని పేద ప్రజలకు విప్లవోద్యమం తోడుగా నిలిచింది. తెలంగాణలో గల సహజ వనరులపై, ఏర్పడిన నూతన ప్రభుత్వం అదే వైఖరిని అవలంబిస్తే విప్లవోద్యమాలు అనివార్యంగా తిరిగి మరో రూపంలో తప్పక రావడానికి ఆస్కారం ఉంది. అం తేగాక ఆ విప్లవశక్తులు క్రియాశీలకంగా రూపాంతరం చెందనున్నాయి.

సుజాత: గడీల చరిత్ర పునరావృతమవుతుందా? అట్టి చరిత్రను తిప్పికొట్టే పరిస్థితులు ఇప్పుడున్నాయా?

– మొదటి తెంలగాణ సాయుధ పోరాటం తర్వాత భూస్వామ్య వర్గాలు రూమీ టోపీ స్థానంలో గాంధీటోపీలు ధరించినట్టే, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మలిసాయుధ పోరాటంలో పట్టణాలకు, నగరాలకు పారిపోయిన వర్గాలే తిరిగి తెలంగాణ సాధన ఉద్యమంతో కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. అవి కూలిన గడీల పొగరు వగరులతో సరికొత్త అధికార వేషంలో ప్రజలపై ఆధిపత్యాన్ని సాగించనున్నాయి. ఈ వర్తమాన రాజ్యాశ్రిత పెట్టుబడి రూపం రాజ్యాన్ని తిప్పికొట్టే పరిస్థితులను అదే చేతులారా కొనితెచ్చుకుంటుంది.

సుజాత: కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ప్రాతిపదిక ఏమి ఉండాలి?

– తెలంగాణ ఉద్యమంలో ప్రతిపాదించిన కొత్త జిల్లాలన్నీ సహజ వనరుల దోపిడీకి, వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజా అవసరాలకు, పాలనకు, వనరుల రక్షణకు అనుకూలంగా జరగాల్సివుంది.

అన్నవరం: మూడు దశాబ్దాలుగా నిరంతర కవిత్వ వ్యవసాయం చేస్తున్నారు. మీ కవిత్వంలో ఇంతగా తాజాదనం కనపడడానికి మూల సూత్రం ఏమిటి?

– ప్రజాఉద్యమాలతో మమేకం కావడమే కాక, సమాజ చలనాలతో సమాంతరంగా కవిత్వమై ఉరుకడమే నా తాజాతనానికి కారణాలు.

అన్నవరం: తెలంగాణ అస్తిత్వ సాహిత్యంలో తెలంగాణ భాష సొర్రకముందే మీ కవిత్వం నిండా తెలంగాణ భాష పదాలు విరివిగా ఉన్నవి ఎట్లెట్ల?

– నేను కవిత్వం రాస్తున్నప్పటి నుంచే తెలంగాణ జీవద్భాష నన్ను అనవరతం వెంటాడేది. అప్పుడు విజయవాడ నుంచి వచ్చే పత్రికలకు కవిత్వం మధ్యలో ఇమిడిన తెలంగాణ పదాల్ని రాసి పంపితే ఆనాటి సంపాదకులు పచ్చింకుతో అండర్‌లైన్ చేసి తిప్పి పంపేవారు. కానీ నేను నెలా రెండు నెలల పిదప అదే కవితను అదే పత్రికకు అలాగే పంపితే అచ్చయ్యేది. అలా అలా నేడు పత్రికలో తెలంగాణ భాషకు కవిత్వం, కథల ద్వారా అనివార్యత కలిగింది. ఆ విధంగా భాషకు అనుకూల వాతావరణం కల్పించినట్లయ్యింది.

అన్నవరం: 1996లో వెలువరించిన ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’లోనే ప్రపంచీకరణ దుష్ప్రభావాలు దుర్బిణి వేసి దూరదృష్టితో ఎలా పట్టారు? తెలుగు కవిత్వంలో గ్లోబలైజేషన్ పట్టుకున్నది మీరు కదా!

– 1990 తర్వాత దేశం సామ్రాజ్యవాదానికి, బహుళజాతి కంపెనీలకు బహిరంగంగా తలుపులు బార్లా తెరిచింది. అందులో నాటి సీ.ఎం/సీఈవో అయిన చంద్రబాబునాయుడు ప్రపంచీకరణకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలను చేసాడు. అందులో తెలంగాణ విధ్వంసానికి పరాకాష్ట అయ్యింది. గ్రామీణ ప్రాంతాలు చిన్నాభిన్నమైపోయి పొట్టచేతపట్టుకొని వలసలకు పయనమయ్యాయి. అవసరమున్నా లేకున్నా వినిమయ సంస్కృతి మనిషిని పరాయీకరించి, మానవ సంబంధాల్ని అల్లకల్లోలం చేసింది. అందులో కవిగా నేను మినహాయింపు కాదు, కాబట్టి 1993 నుంచి 1996 వరకు రాసిన కవిత్వంతో మొట్టమొదటి సారిగా ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కవితా సంపుటిని తీసుకువచ్చాను. ఈ సంపుటి ద్వారా ప్రపంచీకరణ గురించి మున్ముందుగా విప్పిచెప్పాను.

అన్నవరం: దళిత బహుజన సాహిత్య ఉద్యమాలను తెలంగాణ ఉద్యమం కప్పేసింది కదా! తర్వాత తర్వాత దళిత బహుజన ఆదివాసి అస్తిత్వ సాహిత్యాలు ఎలా ఉంటాయి?

– తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమంలో అన్ని అస్తిత్వాలు మిళితమై ఉన్నాయి. అయితే పాయలు పాయలుగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో దళిత, బహుజన, స్త్రీ, గిరిజన, మైనార్టీ అస్తిత్వాలు ఉద్యమాల రూపంలో ముందెన్నడూ లేనంతగా ప్రముఖంగా ముందుకు వస్తాయి. నిలదీస్తాయి.

అన్నవరం: కొత్తగా సాహిత్యంలోకి వచ్చిన కవులకు మీరిచ్చే సూచనలు?

– నూతనంగా సాహిత్యంలోకి వచ్చేవారికి, 2000 నుంచి సాహిత్యంలో కొనసాగే వారికి చేతులు జోడించి ఒకటే నా సవినయ విన్నపం. సాహిత్యంతోపాటుగా తప్పక సామాజిక శాస్త్రాల అధ్యయనం చేయాలి. ప్రజా దృక్పథంతో రచనలను నిర్మాణాత్మకంగా కొనసాగించాలి. అప్పుడుగానీ ఆయా రచనలు రక్తమాంసాలు చెమటతో వెలుగొందుతాయి.

నరేందర్: మీ కవిత్వం ప్రపంచీకరణని సిసికెమెరాల్లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది? ఇంత గాఢంగా రాయడం మీకు ఎలా సాధ్యమైంది?

– నా కవిత్వానికి ప్రాణం 1975 ప్రాంతంలో తెలంగాణలో జరిగిన పోరాటాలు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన విధ్వంసాలే ఊపిరి. నా కవిత్వంలో అంతరిస్తున్న మానవ సంబంధాలు, ప్రపంచీకరణ, రక్తమంటకుండానే హత్యలు, రాజ్యం, వికృతరూపమైన ఆత్మహత్యలు, వలసలు అన్నీ దృశ్యమానమవుతాయి. ప్రత్యక్ష బాధితున్ని నేను కాబట్టి నా కవిత్వంలో అవి ప్రధాన శక్తిగా ఉంటాయి.

నరేందర్: వైపని లాంటి గొప్ప కతలు రాసిన మీరు కథలు రాయడం ఎందుకు ఆపేశారు?

– అత్యంత వేగంగా మార్పు చెందుతున్న సమాజాన్ని కథలుగా రాయడానికి తగిన సమయం, అధ్యయనం ఉండాలి. ఇవాళ ఉన్న స్థితి తెల్లారేసరికి మరోరూపంలోకి మార్పు చెందడాన్ని నాలోని కథకునికి సరిగ్గా సరైన తెలివిడిలోకి రాకపోవడం వలస జనం ఆశించినంతగా కథలు రాయలేకపోయాను తప్ప మరొకటి కాదు.

నరేందర్: మీ జీవితం వేరు, మీ కవిత్వం వేరు కాదనిపిస్తుంది. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యమా?

-నేనే నా మొదటి కవితా సంపుటికి ఆవిష్కరణగా ముందుమాట రాసుకున్నాను. అందులో పేర్కొన్నట్లు నాకు జీవితం, కవిత్వం వేరు వేరు కాదు. సమాజానికి నాకు నా కవిత్వం ఒక యానకం. ఇది గత మూడు దశాబ్దాలకు పైగా నా నిరంతర చలన కవిత్వం ద్వారా నిరూపించాను.

గాజోజు: తెరవే తర్వాత రచయితల సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి?

– తెరవే తర్వాత వచ్చిన రచయితల సంఘాలన్ని ఆయా వ్యక్తుల, శక్తుల, ఉనికి సంక్షోభాల నుంచి జన్మించాయి. ఈ సంఘాలు ప్రజల వైపా లేక అధికారం, ఆధిపత్యం దిక్కా అనేది వారి కార్యాచరణతో కాలపరీక్షలో తేలిపోనుంది.

గాజోజు: వామపక్ష ఉద్యమాలు కవిగా మీకొక వర్గదృక్పథాన్ని కలిగించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపాయి?

– 1972 నుంచి నేను ఏదో కవిత్వం రాస్తున్నాను కానీ 1975 అత్యవసర పరిస్థితి తర్వాత నా చుట్టూ జరుగుతున్న ప్రజా ఉద్యమాలు నన్ను ఒక స్పష్టమైన ప్రజాదృక్పథం కలిగిన కవిగా తీర్చిదిద్దాయి. అందులో జక్కని వెంకట్రాజం, నిజాం వెంకటేశం గారల చేయూతతో సాహిత్యంలో ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాను.

గాజోజు: కవి, రచయితలు ప్రజల పక్షం వహించి పాలకులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని మీరు పదే పదే చెపుతారు. ఈ బాటలో సాగిన మీ సాహితీ ప్రస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

– కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు. నా కవిత్వ యాత్రలో అణిచివేత, రాజ్యహింస జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. వాటిని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవలేదు.

గాజోజు: దోచుకొనేవాళ్లు, దోపిడీకి గురయ్యేవాళ్లుగా సమాజం విభజితమవుతున్న వేళ, రాజ్యహింసకు వ్యతిరేకంగా సమాంతర ఉద్యమ సమాజాన్ని నిర్మించడంలో సాహితీవేత్తల పాత్ర ఎలా ఉండాలి?

– తెలంగాణ సాధన ఉద్యమంలో దోపిడీదారుడు, దోపిడీకి లోనైనవాడు ప్రజావ్యతిరేకులు, ప్రజా అనుకూలురు కలిసి పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53

ఆందోళన కాలం

అమెరికా ,బ్రిటన్ దేశాలలో గడచిన రెండు శతాబ్దాలలో రెండు వందలకు పైగా కవులున్నట్లు తెలుస్తోంది .ఇందులో ఎవర్ని గుర్తుంచుకుంటారో ఎవర్ని మర్చి పోతారో కాలమే నిర్ణయించాలి .అందులో ఒక పదహారుగురు మాత్రం తమకాలం లోని సమస్యల్ని ,ఒత్తిడులను తట్టుకొని నిలిచారు .ఇరవై వ శతాబ్ది మొదటి భాగం అంతా రెండు ప్రపంచ యుద్దాలతో మరికొన్ని చిన్న యుద్దాలతో గడిచింది .వీటివలన శాంతి చేకూర లేదు కాని నిరంతర ఘర్షణ వాతావరణమేర్పడింది .మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చు అనే భయం తో కొంత మంచితనం దేశాల మధ్య వికసిస్తోంది ..సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ తోరో  నమ్మినట్లు   ‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలకు  ,లోపలి  టెన్షన్ లకు గురైన వాళ్ళే .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు ,అలవి కాక విసిరి వేయబడ్డారు .మరి కొందరు పలాయనానికి సిద్ధ పడ్డారు .వారిని గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

వామ భావ కవి – డబ్ల్యు .హెచ్ .ఆడెన్

విస్టాన్  హగ్ ఆడెన్ ‘’ది ఏజ్ ఆఫ్ యాన్క్సైటీ ‘’రాసిన పుస్తకం లో ఈ కవిత ముఖ్యమైనదే కాదుఆధునిక మానవుని లోని  భయాలు ,ఆందోళన ,కలవరం ,అసూయ ,నిరాశ లకు ప్రతిధ్వని ‘’factories bred them –corporate companies ,college towns –mothered his mind ,and many journals –backed his beliefs .He was born here ,The –bravura of revolvers in vogue now –and the cult of death are at home –inside the city ‘’ .తనకాలాన్ని అత్యధిక ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .రిటైర్డ్ డాక్టర్ పుత్ర రత్నం .ఆక్స్ ఫర్డ్ గ్రేశం స్కూల్ ,హాల్ట్ ,క్రిస్ట్ చర్చ్ లలో చదివాడు .మొదటి కవిత సంకలనం ‘’పోయెమ్స్ ‘’ఇరవై మూడు లో తెచ్చాడు .ఇరవై ఎనిమిది వరకు సక్లాలో లో పని చేసి వామపక్ష భావ కవుల్లో చేరాడు .తర్వాత ఫిలిం యూనిట్ కు పని చేశాడు స్పానిష్ సివిల్ వార్ లో స్త్రేచేర్ లాగే పని చేశాడు .’’స్పెయిన్ ‘’కవిత రాసి కింగ్స్ మెడల్ పొందాడు .’’ది పోయెట్స్ టంగ్ ‘’పత్రికకు సహాయ సంపాదకుడు .’’ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ లైట్ వేర్స్’’కు పూర్తీ బాధ్యతలతో ఎడిటర్ అయ్యాడు .థామస్ మాన్ కూతురు ఎరికా మాన్ ను పెళ్ళాడాడు .అమెరికా వచ్చి1846లో  సిటిజన్ అయ్యాడు .

ఇప్పటికే కవిత్వం లో నాలుగు పుస్తకాలు మూడు డ్రామాలు ,వ్యాస సంపుటి ,యాత్రపై రెండు ,మూడు ఆన్తాలజీలు వెలువరించాడు .రాజకీయాల్లో ,కవితా టెక్నిక్ లలో వివాదాలకు కేంద్రమయ్యాడు .ఆడెన్ పేర’’;ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’ అనే  ఒక ఇంగ్లీష్ మేగజైన్ తెచ్చారు .దీనికే ఉప శీర్షిక గా ‘’ది లిబరేషన్ ఆఫ్ పోయేట్రి’’అని పేరు పెట్టారు .ఇలియట్ తర్వాత సాహిత్యం లో పెద్ద దిక్కు ఆడెన్ అయ్యాడు .బాల్యం నుండి కవిత్వం రాస్తున్న తనకు హార్డీ ఆదర్శం అన్నాడు .వెయ్యేళ్ళ కిందటి ఆంగ్లో సాక్సన్ కవిత్వం పై ఆడెన్ కు మోజేక్కువ .వ్యక్తిగా ,కవిగా తనకొక స్థానాన్ని తన దేశం లో పొందాడు .అమెరికా తనను రాయటానికి ఆకర్షించింది అని చెప్పాడు ‘’.అమెరికా లో ఏది జరుగుతుందో ప్రాపంచమంతటా అదే జరుగుతుంది ‘’అని నమ్మకం గా చెప్పాడు .’’అమెరికన్ అకాడెమీఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’ అవార్డ్ ,పొందట మే కాదు అందులో సభ్యత్వాన్ని కూడా పొంది గౌరవం పెంచుకున్నాడు .పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .అనేక కాలేజీలలో యూని వర్సిటీలలో బోధించాడు .’’లండన్ టైమ్స్ ‘’ఆడెన్ పై సాహిత్య ప్రత్యెక సంచిక వెలువరించింది .

1956మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లేక్చర్లిచ్చాడు .మాధ్యూ ఆర్నాల్డ్ తర్వాతా ఆక్స్ ఫర్డ్ లో ‘’చైర్ ఆఫ్ పోయెట్రి ‘’స్థానం పొందాడు .కవితలు నాటకాలు రాస్తూనే ఉండి అయిదు సంపుటాలు తెచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్ ‘’ను ‘’ఏ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’పుస్తకాలు తెచ్చాడు .’’ది ఎంచేఫేడ్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు కాల్రిడ్జ్ ,లూయీస్ ,మాన్లి హాప్కిన్ మెల్విల్లే ,బాదేర్లిర్ ,జూల్స్ వెర్న్ వగైరాలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,పాస్కల్,వోల్టైర్ ,మాంటేగ్ , ఐన్స్టీన్ ,కీర్క్ గార్డ్ ,మొదలైన వారిపై కవితలు అల్లాడు .’’కవిత కు ఏదీ అనర్హం కాదు ‘’అని చాలా సార్లు రుజువు చేశాడు .ఆంగ్లో కేధలిజం ప్రవర్తనను ఎండగట్టాడు ‘’ఆన్ ది ఐలాండ్ ‘’లో సాంఘిక భావాలు స్పష్టం గా ఉన్నాయి .కొన్ని చోట్ల ఏంతో ఉదాత్తం గా రాస్తే మరి కొన్ని సార్లు వీధి రౌడీగా వెంబడించాడు .’’లా సే ది గార్దేనర్స్ ఈజ్ ది సన్ ‘’లో

‘’law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law as you know suppose –law is let me explain it once more –law is the law ‘’లో సహజ ప్రాకృతిక కవిలా కనిపిస్తాడు .’’but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty  but to me –the entirely beautiful ‘’ లో లిరికల్ అని పిస్తాడు .కొత్త జాడలను  పాత విధానాలలో రాశాడు .నాశనమై పోతున్న నాగరకత నుండి కొద్దిగా మత దృష్టిలోకి మళ్లాడు .న్యు యార్క్ లో ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపించాడు .కుంగిన ప్రపంచాన్ని చూసి –intellectual disgrace –stars from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’అని కలత చెందాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .’’ఒకరిపై ఒకరం ప్రేమ చూపించాలి లేక చచ్చి పోవాలి’’అని బాధగా రాస్తాడు .’’in the deserts of the heart –let the healing fountain start –in the prison of his days –teach the freeman how to praise ‘’అని రావాల్సిన మార్పు ను ఆశించాడు ఆడెన్ ‘’ఆమెన్ ‘’.

ప్రేమ ,రాజకీయం మతం నీతి పౌరసత్వం సైకాలజీ  లపై గొప్ప శైలితో టెక్నిక్ తో రాశాడు ఆడెన్ . అతని భావాలపై ఎన్నో డాక్యుమెంటరి ఫిలిం లను తయారు చేశారు .’’ఫనేరల్ బ్లూస్ ‘’,అ నోన్  సిటిజెన్ ,సెప్టెంబర్ ఫస్ట్ ,రెఫ్యూజీ బ్లూస్ ‘’కవితలు ఇప్పటికీ చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లో దూసుకు వెళ్ళిన కవిగా ఆధునిక కవులలో గొప్పవాడిగా భావించారు .నోబెల్ ప్రైజ్ కు ఎంపికయ్యాడు కాని రాలేదు .29-9-1973న అరవై ఆరేళ్ళ వయసులో   ఆస్ట్రియా  లోని వియన్నాలో చనిపోయాడు . లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక చిహ్నం ఉంచారు .ఇరవై వ  శాతాబ్దపు గొప్ప రచయితలలో ఒకడు ఆడెన్ .ఒపేరా లిబర్టోస్ రాసి భావాలను బలంగా సూటిగా చెప్పాడు .

AudenVanVechten1939.jpg

 

 

సాంఘిక న్యాయం కోసం పోరాడిన రచయిత – స్టీఫెన్ స్పెండర్

ఆడెన్ తో లింక్ ఉన్న వాడు స్టీఫెన్ స్పెండర్ .28-2-1909లో లండన్ లో జర్మన్ జ్యూయిష్ గా ఆంగ్ల ఆరిజిన్ తోజన్మించాడు . తండ్రి హెరాల్డ్ స్పెండర్ గొప్ప జర్నలిస్ట్ .తల్లి ‘’వయొలెట్ శస్టర్’’పదిహేడు లూ కేమిస్త్స్ లేబిల్స్ ను చైనా ప్రెస్ లో ముద్రించి జీవించాడు .ఆక్స్ ఫర్డ్  యూని వర్సిటి కాలేజిలో చదివి ఆడెన్ కు అసోసియేట్ అయ్యాడు .కమ్యూనిస్ట్ పార్టి లో చేరి వారి  నిర్బంధ విధానాన్ని ఎదిరించి బయటపడి ‘’ది గాడ్ దట్ ఫైల్ద్  ‘’లో తెలియ జేశాడు .

పందొమ్మిది లో దారుణం గా’’ నైన్ ఎక్స్ పెరి మెంట్స్ ‘’ను  పేపర్ బౌండ్  పాం ఫ్లేట్ గా ముద్రించి,రెండేళ్ళ తర్వాత ‘’ట్వెంటి పోయెమ్స్ ‘’అచ్చు వేశాడు .వీసా ను తిరస్కరించినా విదేశాలకు వెళ్ళిస్పెయిన్ లో ’’ఇంటర్ నేషనల్ రైటర్స్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొన్నాడు . కొన్ని నెలలు ఉండి స్పానిష్ లాయలిస్ట్ కవుల రచనలను అనువాదం చేశాడు .మొదటి భార్యకు విడాకు లిచ్చి పియానిస్ట్ నటాషా లిత్విన్ ‘’ను రెండో పెళ్లి చేసుకున్నాడు .’’ది హోరైజన్ ‘’పత్రికను మిత్రుడి తోకలిపి నడిపి రెండవ ప్రపంచ యుద్ధం లో ,తరచుగా అమెరికా వెళ్లి ఉపన్యాసా లిచ్చాడు .1953లో ఇర్వింగ్ క్రిస్టల్ తో కలిసి ‘’ఎన్కౌంటర్ ‘’ అనే అంతర్జాతీయ మాస పత్రికను ‘’కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడం’’ ఆర్ధిక సాయం తో  నడిపాడు .సమకాలీన సమస్యలపైనే స్పందించి ఎక్కువ గా రాశాడు .’’ది లాండ్ స్కేప్ నియర్ ఏరో డ్రోం’’కవితలో ‘’more beautiful and soft than any moth –with burning furred antennae feeling its huge path –through dusk ,the air-liner with shut off engines ‘’ అని సహజ వర్ణన చేశాడు .

‘’ఆధునిక కవిత్వం యంత్రాన్ని జీర్ణించుకోవాలి’’ అన్న హార్ట్ క్రేన్ అభిప్రాయం తో ఏకీభ వించాడు .యంత్రం కూడా చెట్టు పుట్ట ,పిట్ట ,పశువు లాంటిదే అన్నాడు .సాంకేతిక సింబల్స్ ను కవిత్వం లో ప్రవేశ పెట్టాడు .యంత్రం వెనక ఉన్న భావాన్ని అర్ధం చేసుకోవాలన్నాడు ‘’నాట్ పాలసేస్ ‘’లో మానవుని పై యంత్రం యొక్క ప్రభావాన్ని తెలిపాడు ‘’drink from here energy and only energy –as from the electric charge of a battery ‘’ ప్రక్రుతి లోని సర్వాన్గాలు శాఖలు సహక రించుకోవాలని కోరాడు .’’డెత్ టు ది కిల్లర్స్  బ్రింగింగ్ లైట్ టు లైఫ్ ‘అనేది అతని సిద్ధాంతం .’’యాన్ ఎలిమెంటరి క్లాస్ రూమ్ ఇన్ ఏ స్లం’’లో మానవ పీడనను చిత్రించాడు –‘’how that works, money, interest  building ,could ever hide –the palable and obvious love of man for man ‘’అంటాడు.నీతి భావనలు చూస్తున్న ఈ దారుణాలలోంచే పుట్టాయి .అప్పుడు ఉపన్యాసాం అయింది కవిత .  Poet Laureate Consultant in Poetry to the United States Library of Congress in 1965. అయ్యాడు 16-7-1995న ఎనభై ఆరవ ఏట లండన్ లో చనిపోయాడు ..ఇరవయ్యవ శాతాబ్ద విజ్ఞానాన్ని అందించటానికి స్టీఫెన్ స్పెండర్ క్లబ్ ఏర్పడి సేవ చేస్తోంది .జీన్ పాల్ సాత్రే వర్జీనియా ఉల్ఫ్ ల ప్రభావం స్పెండర్ పై అధికం .సాంఘిక న్యాయం కోసం పోరాడిన కవి రచయితా స్పెండర్ .

 

 

Stephen Spender.jpg

 

కొత్త విమర్శ కు మార్గం వేసిన – విలియం ఎంప్సన్

‘’ రొమాంటిక్ ఇర్రేషనాలిటి’’ పై పోరాడిన వాడు విలియం ఎంప్ సన్ .కవిగా కంటే రచయితగా ప్రసిద్ధుడు .27-9-1906లో యార్క్ షైర్  లో పుట్టి ,విన్చేస్టర్ ,కేంబ్రిడ్జి లోని మాగ్డలీన్ కాలేజి లలో చదివి గణితం  ప్రధాన విషయం గా డిగ్రీ పొందాడు .’’సెవెన్ టైప్స్ఆఫ్ ఆమ్బిగ్యుటి’’అనే మొదటి పుస్తకాన్ని ఇరవై నాలుగు లో ముద్రించాడు .’’న్యూ క్రిటిసిజం ‘’కు పునాది రాయి వేశాడు .పాతికేళ్ళ వయసు నుండే టీచర్ .టోక్యో చైనా ,ఇంగ్లాండ్ అమెరికాలలో లేక్చార్లిచ్చాడు .ముప్ఫై లో బి బి సి .లో ఉద్యోగి అయి ,ఏడాది తర్వాతా చైనీస్ భాషఉపన్యాసాలకు సూపర్వైజర్  అయ్యాడు .’’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’పేరిట రెండు కవితా సంకలనాలు పబ్లిష్ చేశాడు ఆ తర్వాత వచనానికే పరిమితమైనాడు .’’Johnson could see no bicycle would go –you bear yourself ,and the machine as well ‘’gannets for germans not from othello –and ixion rides upon a single wheel ‘’అని  జరగా వను కొన్నవి జరుగుతున్నాయని తెలియ జేశాడు .మంచి వక్త గా గొప్ప టీచర్ గా ఎమ్ ప్సన్ ప్రసిద్ధుడు .15-4-1984 న  77వయసులో మరణించాడు .సోషియో పొలిటికల్ భావ వ్యాప్తి చేశాడు . Empson’s Milton’s God is often described as a sustained attack on Christianity and defence of Milton‘s attempt to ‘justify God’s ways to man’ in Paradise Lost. .బౌద్ధ ఫిలాసఫీ ని రచనలలో కలిపి రాశాడు .

 

Formal portrait of William Empson, wearing eyeglasses and dressed in a coat and tie

 

 

జాజ్ సంగీతానికి దారి వేసిన – ఎడిత్ సిట్వేల్

7-9-1887లో స్కార్ బరో లో పుట్టింది .ఆకర్షణ కల యువతి ‘’క్లౌన్స్ హౌసెస్ ‘’,ది వుడేన్.పీగాస్ ‘’,ఫెకేడ్ ‘’సంపుటాలు రాసి ప్రచురించింది .భూలోక స్వర్గాన్ని స్వయం గా నిర్మించుకోన్నది .ఆబెద్ అనే కవితలో ‘’jane ,jane –tall as crane –the morning light creaks down again ‘’అంటూ నరస్రి రైం గా రాసింది .అరా మూత కన్నులతో ప్రాభాత సూర్యోదయాన్ని ,ఊహాత్మకం గా రాసింది .’’సర్ బెల్జేబబ్ ‘’లో ‘’when –sir –Beelzebub  called for his syllabub in the hotel in hell –where Proserpine fell –blue as the grandarmerie were the waves of the sea ‘’ అంటూ కలలలోకం లో విహరిస్తూ చెప్పింది

నలభై ఆరవ ఏట ఎదిత్ కు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ పతకం ఇచ్చి గౌరవించింది .రెండవ ఎలిజ బెత్ రాణి ‘’డేమ్  కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ‘’ను చేసింది .రోమన్ కేధలిక్ అయింది .కవిత్వం తో పాటు విమర్శ గ్రంధాలు ఎక్కువే రాసింది .పోప్ జీవిత చరిత్ర రాసి రికార్డ్ సృష్టించింది .అనేక ఆన్తాలజీలు రాసింది .9-12-1964న డెబ్భై ఏడు వయసులో మరణించింది . hythms of the tom-tom and of jazz, and shows considerable technical skill. .సృజన తో అందరికి దగ్గరైంది .

Roger Fry - Edith Sitwell.jpg

 

 

ప్రయోగ శీలి – విల్ఫ్రెడ్ ఓవెన్

మొదటి ప్రపంచ యుద్ధం కొత్త తరహా కవులను పరిచయం చేసింది .న్యాయ మైన యుద్ధం లేదని యువ గ్రూప్ వాదించింది .అందులో విల్ఫ్రెడ్ ఓవెన్ గొప్ప ప్రభావం చూపించాడు .శ్రోఫైర్ లో 18-3-1893లో పుట్టిన ఓవెన్ లండన్ యూని వర్సిటి లోని బర్కెన్ హెడ్  ఇంష్టి ట్యూట్ లో చేరి చదివి ట్యూటర్ అయి ,యుద్ధం లో సైనికుడిగా చేరి గాయ పడితే   వార్ హాస్పిటల్ లో చేర్చారు . తోటి బాధితుడుసీగ్ ఫ్రీడ్ ససూన్  ప్రేరణ తో కవిత్వం రాయటం ప్రారంభించాడు .ఏడాది తర్వాత వేస్త్రెన్ ఫ్రంట్ కు పంపేశారు .సాహస క్రుత్యానికి మిలిటరీ క్రాస్ అవార్డ్ పొందాడు .సామ్బెర్ కెనాల్ లో తన బృందాన్ని రక్షించే పనిలో చనిపోయాడు .ససూన్ బయట పెట్టిన వ్రాత ప్రతుల ద్వారానే కవిగా లోకానికి పరిచయమైనాడు .ముందు మాటగా ‘’this book is not about heroes >English poetry is not yet fit to speak of them .not is about deeds or lands  not any thing about glory ,honour or dominion –except war –above all this book is not concerned with poetry .the subject of it is war ,and the pity of war .the poetry is in the pity ‘’అని నిజాన్ని ‘’గన్  షాట్’’ గా చెప్పాడు .

ఓవెన్ ఇంగ్లిష్ వెర్స్ర్స్ లో ప్రయోగాలు చేశాడు .ఆడెన్  స్పెండర్ స మొదలైన కవుల మార్గాన్ని అనుసరించాడు .అతనిలో కవిత్వం చివరి రోజుల్లో జ్వాలగా వెలిగింది .కీట్స్ సమాధిని దర్శించి రాసిన కవిత కదలిన్చేస్తుంది .’’move him into the sun –gently in touch awoke him once –at home whispering of fields unsown –always it woke him even in France –until this morning and this snow –if anything might rouse him now –to kind old sun will know ‘’

4-11-1918న ఓవెన్ ఫ్రాన్స్ లో చనిపోయాడు .ఫ్రాయిడ్ ప్రభావం ఉన్న కవి ‘’యాంతం ఫర్ డూమ్డ్.యూత్ ‘’కవిత అద్భుతమైనది .’’యుద్ధ సాను భూతికి ;;అద్దంపట్టిన కవిత్వం రాశాడు .

 

Wilfred Owen plate from Poems (1920).jpg

 

ఇండివిడ్యువలిస్టు కవి – రాబర్ట్ గ్రేవ్స్

‘’ఇండివిడ్యువలిస్ట్’’అయిన రాబర్ట్ గ్రేవ్స్ ఐరిష్ కవి కుమారుడు .26-7-1895 లో లండన్ లో పుట్టి ఆక్స్ ఫర్డ్ కాలేజి లో  స్కాలర్షిప్ తో చదివి  యూని వర్సిటి లో చేరకుండా రాయల్ వేశ్ ఫుసిలర్స్ లో పేరు నమోదు చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసి మూడు కవితా సంకలానాలు తెచ్చాడు .సెయింట్ జోసెఫ్ లో డిగ్రీ పొంది ఈజిప్ట్ వెళ్లి కేయిరో యూని వర్సిటి లో ఇంగ్లీష్  ప్రొఫెసర్ అయి,ఏడాదికే బయటికొచ్చి పెళ్ళాన్ని  ఇంగ్లాండ్ నీ వదిలేశాడు .ఒక ప్రెస్ కొని అమెరికా కవి లార రైడింగ్ తో కలిసి అనేక విమర్శనాత్మక వ్యసాలు రాశాసి ప్రింట్ చేశాడు ‘’గుడ్ బై టు ఆల్ దట్’’అనే స్వీయ చరిత్ర రాసుకున్నాడు .అనేక చారిత్రిక నవలలు సీరియాల్ గా రాశాడు .గ్రీక్ మైధాలాజేఎ మీద మోజు ఏర్పడి ‘’క్రౌనింగ్ ప్రివిలేజ్ ‘’వగైరా రాశాడు .పౌండ్ వై-ఇలియట్ ,ఆడెన్ మొదలైన వారి పై విరుచుకు పడ్డాడు .వీళ్ళను ‘’ఫాల్స్ గాడ్స్ ఆఫ్ మోడరన్ పోయట్రి’’ అని నిందించాడు .’’ట్రాడ్డ్జి,’’కవిత లో ‘’Trudge body and climb ,trudge and climb –but not to stand again on any peak of time –trudge body –I will cool you ,body,with hot sun that draws the sweat –I will warm you body with ice –water that stings the blood –I will enrage you ,body with idleness ,to do –and having done tosleep the long night through –trudge body ‘’
ఇది చదువుతుంటే త్వమేవాహం లో ఆరుద్ర కవిత ‘’తోయ్యోయ్ మోయ్యూయ్ తోయ్’’జ్ఞాపకం వస్తుంది .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్మారక ఫలకాన్ని ఉంచి గౌరవించారు

Robert Graves.jpg

మోడర్నిస్ట్ కవి –  వాలెస్ స్టేవెన్స్

సమకాలీన సమస్యలతో ,ఆందోళనల తో విసిగి పోయిన వాలెస్ స్టే వెన్స్ ఆధునిక కవిత్వానికి కొంచెం దూరమైనాడు .రాక్షస యుద్దాన్నించి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు .ఎక్సి క్యూటివ్ గా ఉండాలనుకొన్నాడు .అక్టోబర్ రెండు1879 లో డచ్ ,జర్మన్ కుటుంబం లో పెన్సిల్వేనియా లోని రీడింగ్ లో పుట్టాడు .హార్వర్డ్ యూని వర్సిటి లో చేరి సంప్రదాయ సానేత్స్ రాశాడు .రైంకు ప్రాధాన్యత నిచ్చాడు హార్వర్డ్ అడ్వొకేట్ ‘’లో బాలడ్స్  సెంటిమెంటల్ పాటలు రాశాడు .న్యు యార్క్ లో లా చదివి బార్ సభ్యుడై కనెక్టి కట్ వెళ్లి హార్డ్ ఫోర్డ్ యాక్సి డెంట్ అండ్ ఇండెమ్నిటి ఇన్స్యూరెన్స్ కంపెని లో లీగల్ అడ్వైసర్ అయ్యాడు .యాభై అయిదులో దానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు .డెబ్భై అయిదేళ్ళ వయసులో 2-8-1955వరకు అందులోనే ఉద్యోగించాడు .

ద్వంద్వ మనస్తత్వానికి ఇష్టపడ లేదు .’’I prefer to think just a man ,not a poet part time  businessman the rest ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .నలభై నాలుగో ఏడు వచ్చేదాకా రచనలను ప్రచురించ లేదు .నాలుగు కవితలు మాత్రం  ఏ మేగజైన్ ఆఫ్ వేర్స్ ‘’లో వచ్చాయి తొమ్మిదేళ్ళ తర్వాత మొదటి పుస్తకం ‘’హార్మోనియం ‘’,తర్వాత ఐడియాస్ ఆఫ్ ఆర్డర్ ‘’,ది మాన్ విత్ ది బ్లూగిటార్ ,,పార్ట్ ఆఫ్ ఏ వరల్డ్ ,ట్రాన్స్ పోర్ట్ టు సమ్మర్ వగైరా లను ప్రచురించాడు  నేషనల్ బుక్ అవార్డ్ తో బాటు పులిట్జర్ బహుమతి పొందాడు .’’ఓపస్ పాస్తుమాస్ ‘’1957 లో విడుదల చేశాడు .’’తర్తీన్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఏ బ్లాక్ బర్డ్ ‘’కవిత లో’’I donot know which to prefer –the beauty of inflections –or the beauty of innuendos ‘అని సందేహ పడుతూ రాశాడు .’’ది ఎమ్పరార్ ఆఫ్ ఐస్ క్రీం’’ ‘’ది వర్మ్స్ ఎట్ హేవెంస్ గేట్ ‘’ది కిచెన్ కప్స్ ‘’మొదలైన కవితలు సందర్భ శుద్ధికి ఉదాహరణలు .’’the poem must resist the intelligence almost successfully ‘’అని అభిప్రాయ పడ్డాడు . ‘’the body;s death and beauty;s deathlessness ‘’,పై చక్కని కవిత రాసి మెప్పించాడు  స్టే వెన్స్ .

Beauty is momentary in the mind-the fitful tracing of portal –but in the flesh it is immortal –the body dies ,the body;s beauty lives ‘-so evenings die in the green going –a wave interminably flowing ‘’అంటూ సాగుతుంది ఆ కవిత .విలియం కవితలు ‘’not of the second part of life –they don’t make the visible a little hard to see ‘’అని అంచనా వేశారు .’’he employed every nuance of rhetoric dissolving imagery and paradoxical epigrams to achieve a mystical reality –a supreme fiction to move his readers in the direction of fact as we want it to be ‘’

అమెరికన్ మోడర్నిస్ట్ పోయేట్ గా గుర్తింపు పొందాడు .2-8-1955న  కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించాడు .మనస్సాక్షికి వాస్తవానికి ఉన్న సంబంధం పై ఎక్కువ గా రాశాడు .అతని ఇమాజినేషన్  అంత స్సాక్షీ కాదు  వాస్తవమూ కాదన్నారు .ఇది పొడిగా ఉన్న విషయం కాదు కానిజీవితం లో  నిజాన్ని దాని అంతరార్ధాన్ని కనిపెట్టే సరైన  అన్వేషణా విధానం .

 

Wallace Stevens.jpg

 

సశేషం –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-15-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గంగా తవ ”శుభ్ర ”భాతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శకుడు బి యెన్ రెడ్డి లేఖ మరియు వెండితెర బంగారమైన ”ఎస్వర” లక్ష్మి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్తూరి మురళీకృష్ణ కాలమ్: మ్యూజికల్ మ్యూజింగ్స్-7

నసున మల్లెల మాలలూగెనే
 

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ
ఎంత తొందరలే హరి పూజకు, ప్రొద్దు పొడవకముందె పూలిమ్మనీ 

‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ అన్న సినిమాలోని దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట పల్లవి వినగానే ఎద ఝల్లుమంటుంది. అసలింత సున్నితమైన అత్యంత సుందరమైన ఆలోచనలు ఈ కవులకు ఎలా వస్తాయన్న ఆలోచన కలుగుతుంది. పొద్దున్నే పూచే పూలు దేవుడి పూజలో పాలుపంచుకోవాలని ఆత్రపడుతూ సిద్ధంగా ఉన్నాయన్న సుందరమైన భావనను కలిగిస్తూ, ఇలా దైవపూజ కోసం పూలిమ్మని కొమ్మకొమ్మకూ ఎవరో (దైవం) నేర్పారన్న భావనను కలిగిస్తూ, దైవం పేరెత్తకుండా దైవ భావనను స్ఫురింపజేసి ఒక పవిత్రపుటాలోచనను కలిగిస్తుందీ పల్లవి. ఇలాంటి పల్లవులు రచించటం తెలుగులో కృష్ణశాస్త్రి ప్రత్యేకత. ఈపాట అచ్చమైన సినీ గేయ రచనకు అసలైన ఉదాహరణ లాంటిది. 

సినిమాలకు మాటలొచ్చినప్పటినుంచీ పాటలొచ్చాయి. ఆరంభ సినిమాల్లో మాటలకన్నా పాటలే ఎక్కువ ఉండేవి. నాటక రంగం నుంచి సినిమా ప్రత్యేక కళగా ఎదుగుతున్న సమయంలో నాటకం నుంచి పాటలు సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డాయని కొందరంటారు. ముఖ్యంగా పార్సీ నాటకాల ప్రభావమిది అని అంటారు. కానీ, పాటలు అన్నది భారతీయ జీవన విధానంలో ఒక విడదీయరాని భాగం. 

‘లయ’ అన్నది సృష్టిలో నిబిడీకృతమైన ఒక అంశమని వేదం ప్రకటించింది. వేదమంత్రాలన్నీ లయబద్ధంగా ఉంటాయి. లయబద్ధంగా ఉండేందుకు ఛందస్సు ఏర్పడింది. భారతీయ సంగీతానికి వేదం ప్రాతిపదిక. అందుకే మన దగ్గర లాలిపాటలు, జోలపాటలతో ఆరంభమై జీవితంలో ప్రతి క్షణానికీ, ప్రతి సందర్భానికీ, ప్రతి సన్నివేశానికీ పాట ఉంటుంది. కాబట్టి పాటలు మనకు పార్సీ థియేటర్ నుంచో ఇంకెవరినుంచో రావాల్సిన అవసరం లేదు. నాటకాలలో ఛందోబద్ధమైన పద్యాలు రాయటం, మాటలను కవిత్వపు పాదాల్లో రాయటం మనకు ప్రాచీన కాలం నుంచీ ఉంది. వేదాల్లో సైతం మంత్రాల నడుమ సంభాషణలు, చర్చలు, నాటకాలను పోలిన కథనాలు ఉన్నాయి. అందుకే మన సినిమాలలో పాటలు స్థిరపడటమే కాదు. సినిమాలను దాటి ఎదిగాయి. ఆధునిక సమాజంలో సాహిత్యం స్థానాన్ని ఆక్రమించాయి. 

కృష్ణశాస్త్రి రచించిన పాటను చూస్తే, పల్లవిలో మనకు కవిత్వం ఎక్కడా కనబడదు. కవి కనబడడు. ఒక అందమైన ఊహ కనిపిస్తుంది. ఒక చక్కని ఆలోచన కనిపిస్తుంది. ఇది గేయాన్ని కవిత్వంకన్నా భిన్నమైన సృజనాత్మక ప్రక్రియగా నిలబెడుతుంది. కవిత్వానికి సినిమా పాటల్లో స్థానం లేదు. కానీ కవులు అనేకులు సినిమాల వైపు ఆకర్షితులు అవటంతో సినీ గేయాలలో కవిత్వం జొరబడింది. అంతే తప్ప పాట వేరు, కవిత్వం వేరు. సినిమా గేయం ఇంకా భిన్నమైనది. కానీ సినీ గీతానికి సాహిత్య ప్రపంచంలో సముచితమైన స్థానం కల్పించి, గౌరవం పొందాలన్న సినీ కవుల తపన వల్ల సినిమా పాటలు కవితమయం అయ్యాయి. కానీ, ప్రతి కవిత పాట అవవచ్చేమోగానీ ప్రతి గేయం కవిత కాదు. 

ఈ విషయం తొలి నాటి సినిమాల గేయ రచయితలకు స్పష్టంగా తెలుసు. అందుకే వారు తమ గేయాలలోంచి కవిత్వాన్ని పరిహరించారు. వీలైనంత సరళంగా, సూటిగా పాటలను రచించారు. 

‘దోనైనా మత్వారే, తిహారే హమ్ పర్ జుల్మ్ కరే’ అని పాడతాడు సైగల్. నాయిక అందమైన రెండు కళ్లు అతడిపై అధికారం చలాయిస్తున్నాయట. ఇది కవిత్వం అనటం కష్టం. చమత్కారభరితమైన భావం కలిగించే గేయం అవుతుంది. ‘బాలమ్ ఆయో బసోమోరె మన్‌మే’ అంటాడు పాత సినిమా హీరో. అంటే ప్రేయసి వచ్చి అతడి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుందట. ఇది ఒక నిజాన్ని చెప్పటం. ఓ స్టేట్‌మెంట్. 

కృష్ణశాస్త్రి రచించిన అధిక శాతం పాటలు ఇలాంటి స్టేట్‌మెంట్లే. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ’ పాట కూడా ఇలాంటి స్టేట్‌మెంట్లు, ప్రశ్నలతో కూడుకున్నదే తప్ప కవిత్వం ఏ మాత్రం లేనిది. 

కొలువయితివా దేవి నా కోసము తులసి.. తులసి.. దయాపూర్ణ కలిసిమల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేలు నా స్వామికి 

ఇందులో కవిత్వం ఏది? అన్నీ స్టేట్‌మెంట్లే. పదాల కూర్పులోని లాలిత్యం,

 

యే లీల సేవింతు? యేమనుచు కీర్తింతు?

సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల, ఒక దివ్వె నీ మోల
ఒదిగి ఇదే వందనం…. ఇదే వందనం…
ఇదీ పాట. నిజానికి గేయ రచన అనేది దృశ్యాన్ని ఇనుమడింపజేయాలి. అవాంటి సినీ గేయ రచనకు ఇది చక్కని ఉదాహరణ. తెలుగులో ద్విత్వాక్షరాలు ఎక్కువ. కానీ కృష్ణశాస్త్రి ఈ పాటలో అరుదుగా వస్తున్నాయి ద్విత్వాక్షరాలు. సుందరమైన భావానికి లలితమైన పదాలు వాడటంతో పాటకొక అందమైన సౌకుమార్యం వచ్చింది. భావాల మృదుత్వం అధికమయింది. పాటలోని భావాన్ని, పదాల సౌకుమార్యాన్ని అర్థం చేసుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను ‘బిళహరి’ రాగంలో రూపొందించాడు. బిళహరి రాగం ఉదయరాగం. పాట, సినిమాలో, ఉదయం పూట నాయిక పూలు భగవదార్చన కోసం కోస్తూ పవిత్ర భావనతో పాడుతుంది. దాంతో బంగారానికి తావి అబ్బినట్టు.. రాగం, భావం, పదం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఫలితంగా అత్యుత్తమమైన కళాసృష్టి సంభవించింది. తరతరాలకు తరగని ఆనందగని లభించింది. 

కృష్ణశాస్త్రి గేయరచన పద్ధతి సిసలైనది అని ‘మల్లీశ్వరి’లోని ‘పరుగులు తీయాలి’ తిరుగులేని విధంగా నేర్పుతుంది.

 

పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి

బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
ఇదీ పల్లవి. ఇందులో చక్కని పదాలున్నాయి. సొంపుగా ధ్వనిస్తూ వేగాన్ని సూచించే పదాలున్నాయి. అద్భుతమైన లయ ఉంది. సినిమా దృశ్యాన్ని వివరించే స్క్రప్టులాంటిది ఈ పాట.

 

హోరు గాలి, కారుమబ్బులు ముసిరేలోగా, మూగేలోగా

ఊరు చేరాలి, మన ఊరు చేరాలి
ఇది కవిత్వమా? కాదు. అతి చక్కని చిక్కని గేయం. 

గలగల గలగల కొమ్మల గజ్జెలు

గణగణ గణగణ మెళ్లో గంటలు
వాగులు దాటి, వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. 
ఒక తొందర, ప్రయాణంలోని వేగం, ఉద్వేగం, అందం పదాల పరుగును సూచిస్తుంది. అంతే తప్ప పాటంతా ఒక స్టేట్‌మెంట్ లాంటిది.

 

అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు

తెల్లని కొంగలు బారులు బారులు  అదిగో అదిగో అదిగో
పచ్చని తోటలు, మెచ్చిన పువ్వులు, ఊగే గాలుల తూగే తీగలు
అవిగో అవిగో అవిగో
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
అయిపోయింది పాట. పాట మొత్తం పదాలు వేగాన్ని సృష్టిస్తాయి. దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. మనసును తాకుతాయి. ఆనంద పరుస్తాయి. ఈ పాటను బాణీని రాజేశ్వర రావు కూర్చిన విధానం పాటకు ఊపునిస్తుంది. భావాన్ని ఇనుమడింప జేస్తుంది. పశువుల మెడలో గంటలు, నల్లని మబ్బుల గుంపులు, బారులుగా ఉన్న తెల్లని కొంగలు, పచ్చని తోటలలో పూవులు, వీచే గాలి అన్నీ పాట వింటున్న శ్రోత కళ్లు మూసుకుని అనుభవించగలడు. వేగంగా సాగే బండిలో తానూ ప్రయాణిస్తున్న అనుభూతిని పొందగలడు. గమనిస్తే ఈ పాటలో కూడా కృష్ణ శాస్త్రి కవిత్వం రాయలేదు. సినీ గేయాన్ని గేయంలా రచించాడు. ఇదే మనకు ‘మనసున మల్లెల మాలలూగెనే’ లోనూ కనిపిస్తుంది.

 

మనసున మల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే
పల్లవిలోని రెండు పాదాలు వినగానే ‘ఆహా’ అనిపిస్తుంది. ‘మనసులో మల్లెల మాలలూగటం’ అనగానే ఒక ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. మల్లెపూల వాసన శృంగార భావానికి ప్రతీక. సంతోషకరమైన భావాన్ని తలపిస్తుంది. అందుకే మనసులో మల్లెల మాలలూగటమనగానే సంతోషము, ఆనందాన్ని కలిగించే శృంగార భావన తాలూకు మధురమైన గాలి తరగలు శ్రోతల మనస్సులను స్పందింపజేస్తాయి. కన్నుల వెన్నెల డోలలు ఈ భావనను స్థిర పరుస్తాయి. ఇలా ఈ విషయంలో ఎవరికయినా అనుమానం ఉంటే పల్లవిలోని మిగిలిన పాదాలు ఆ సందేహాన్ని చేరుస్తాయి. నిజానికి మనసున మల్లెల మాలలూగటం కూడా ఒక భావాత్మకమైన ప్రకటన. మనసులో మల్లెల మాలలూగటం ఏమిటి? అని కొట్టేసే వారు కూడా ఉన్నారు. సున్నిత హృదయులకు మాత్రం అలాంటి సందేహం రాదు. ఈ వాక్యం వినగానే వారి మనస్సుల్లో మల్లెల మాలలూగుతాయి. ఇది భావగీతం. భావ కవిత్వం కాదు.

 

ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో!
పాటలోని భావాన్ని ప్రకటించే పదాల మార్పు గేయాల్ని మరింత చేరువ చేస్తుంది. ‘ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో’ నిజానికి ఈ పాదాలు వచ్చేసరికి శ్రోత మనస్సు హాయితో నిండుతుంది. మల్లెల మాలలు, వెన్నెల డోలలు ఆ పని చేస్తాయి. బతుకు పండటం అనేది అత్యద్భుతమైన భావం. 

అత్యుత్తమ గేయ రచన పద్ధతి ఇది. ప్రియుడి దర్శనం కోసం తపిస్తున్న ప్రేయసికి, ఇంకాస్సేపటికి ప్రియుడిని కలవబోతున్నానన్న భావన ఎంత ఆనందాన్ని కలుగచేస్తుందో, ఆ ఆనందం తాలూకూ హర్షాతిరేక భావనను అత్యంత మృదువుగా, సాత్వికంగా ఈ పాటలో సందర్శించాడు గేయ రచయిత కృష్ణ శాస్త్రి. అందుకే ఈ పాట ఈనాటికీ కాదు.. మానవ మనస్సుల్లో మృదుత్వం, శంగార భావనలలో సున్నితత్వాలు సజీవంగా ఉన్నంత కాలం మల్లెల మాలలను, వెన్నెల డోలల ద్వారా అలౌకికానందం కలిగిస్తుంటుంది. ఈ పాటను భానుమతి మరింత ప్రత్యేకంగా తన ఆత్మతో పాడిందనిపిస్తుంది. ఆమె స్వరంలోని మృదుత్వం, శృంగార భావన, ప్రియుడిని కలవబోతున్నానన్న ఆనందాన్ని అదుపులో ఉంచుకుంటూ, తన భావనలను పాటలో వ్యక్తీకరించిన విధానం ఈ పాటను తెలుగు సినిమాలలోనే కాదు, ఇతర భాషల సినిమాల పాటలన్నింటిలోనూ విశిష్టంగా నిలుపుతుంది. ఇక్కడే సంగీత దర్శకుడి చమత్కారం గమనించాలి. 

పాటను నాయిక రాత్రిపూట ప్రశాంతమైన పరిస్థితిలో ఒంటరిగా ఆనందకరమైన ఘడియలను ఊహిస్తూ పాడుతుంది. గేయం భావమూ అలాంటిదే. ఈ పాటను స్వరపరచిన రాజేశ్వరరావు సందర్భాన్ని సంపూర్ణంగా ఉద్దీపితం చేసే రాగాన్ని ఎంచుకుని పాట బాణీని స్వర పరిచాడు. ‘కళ్యాణి’ రాగం అత్యంత శుభప్రదమైన రాగం. ‘కళ్యాణం’ అంటేనే అత్యంత శుభకరం అని అర్థం. అంటే ఆనందకరమైన, పవిత్రమైన సమయాల్లో గానం చేసే రాగం అన్నమాట ఇది. కళ్యాణి రాగాన్ని అర్ధరాత్రి దాటిన తరువాత తొలిజాములో గానం చేస్తారు. నాయిక పాటను అర్ధరాత్రి తొలి జాముననే గానం చేస్తుంది. అందుకే ఈ పాట అంత ప్రభావం చూపగల శక్తిని సంతరించుకుంది. 

16వ శతాబ్దానికి చెందిన మేష కర్ణుడు రాగాలలోకెల్లా కళ్యాణి రాగాన్ని అతిగొప్ప రాగంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా, ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తున్న ప్రేయసీ ప్రియుల భావనలను ఈ రాగం ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందని భావించాడు. ఆ కాలంనాటి ఓ పాట, ఈ రాగంలోనిదీ ‘నా ప్రియుడు నన్ను విడిచి వెళ్లాడు, అతడి రాక కోసం ఎదురుచూస్తూ తారలు లెక్కిస్తూ’ రాత్రులు గడుపుతున్నానన్న అర్థంలో ఉంటుంది. సాంప్రదాయం పద్ధతి తెలిసి భాషపై పట్టు, ఉన్నవారు సందర్భం తెలుసుకుని ఉత్తమ కళను ప్రజలకు అందించాలన్న తపనతో సృజించే అత్యుత్తమ కళకు అతి చక్కని నిదర్శనంగా ఈ పాట నిలుస్తుంది.

 

కొమ్మల గువ్వలు గుసగుస మనినా

రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయచూచితిని
ఘడియయేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో.
పాట వింటుంటే మనసు తెలియని మధురమైన బాధకు గురవుతుంది. సామాన్యులకు సామాన్యంగా అనుభవానికి రాని తీయని ప్రేమ వేదన అనుభవానికి వస్తుంది. పాట పూర్తయ్యేసరికి గుండె గొంతుకలో కొట్టు మిట్టాడుతుంటుంది. ఆరంభంలో మనసులో పూచిన మల్లెల మాలలు, చివరికి వచ్చేసరికి ఎక్కడ హృదయము పగులుతుందోనన్న సున్నితమైన భయానికి గురవుతాయి. అంత ఆనందంలోనూ భరించరాని వేదనను అనుభవిస్తాయి. ఇలాంటి పాటకు అంతే సున్నితమైన, సహృదయమైన చిత్రీకరణ తోడయితే ఇక ఆ దృశ్యం మరపురాని మధురమైన దృశ్యంలా మిగులుతుంది. ఇలాంటి పాటలను విని, చూసిన తరువాత సినిమాలలో పాటలనవసరం అని వాదించే వారిని చూసి జాలి కలుగుతుంది. మొదటి ఎన్నాళ్లకీ బతుకు పండెనోకీ ఇప్పటి ఎన్నాళ్లకీ బతుకు పండెనోకీ  పదాలలో సామ్యమున్నా, భావంలో ఎంతో తేడా ఉంది. ఈ తేడాను మనసులో మల్లెలూగిన సున్నితమైన భావుకులు మాత్రమే అనుభవించగలరు. 

ఇంత గొప్ప కళాత్మకతను తమ హృదయం లోతుల్లోంచి నిజాయితీగా ఆనాటి కళాకారులు ప్రదర్శించారు. కాబట్టి సినిమా పాటలు ఇతర ప్రక్రియలను దాటి సమాజంలో ప్రజల నిత్య జీవితంలో విడదీయరాని భాగమయ్యాయి. ఈనాడు సినిమాలు కానీ, పాటలు కానీ ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణమయ్యాయి. అయితే, ఇదే పాట, ఇదే సాహిత్యం, ఇదే బాణీతో దృశ్యాన్ని మార్చితే పాట నచ్చక పోవటమే కాదు సినిమా కూడా నచ్చదు. ఊహించండి.. నాయిక నాయకుడి కోసం ఎదురుచూస్తూ నృత్యం చేస్తుంటే, వెనకే ఓ వందమంది చెలికత్తెలు లయబద్ధంగా ఊపుతూ, ఊగుతూంటే… అందుకే ఈనాటి పాటలు మనకు నచ్చవు. గుర్తుండవు. పాత పాటలు మరపుకు రావు. మనసుకు అమిత ఆనందం కలిగిస్తాయి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని అడుగుతూ మనసులో మల్లెల మాలలు పూయిస్తాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 -(ఊసర క్షేత్రాలు-)ఎజ్రా పౌండ్ ,టి ఎస్ ఇలియట్ కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52

ఊసర క్షేత్రాలు

మనో భావం బుద్ధి కన్నా గొప్పది అన్న లారెన్స్ ను సవాలు చేసి ,అతన్ని ఒంటరి వాడని ,అసంబద్ధ రచయిత అని తీసి పారేసి ఆడెన్ ,స్పెండర్ ,లేవిస్ ,ఎంప్సన్ లు కొత్త పధ్ధతి కి తెర దీశారు . దీనినే ఆధునిక కవిత్వమని ,కొత్త పదాల ,పలుకు బడుల కవిత్వమని  ,బౌద్ధికం గా చురుకైన వాడికలదని అన్నారు .వీరికి కూడా ఒక ప్రణాళిక లేదు ,ఒక ఆలోచనా శాఖ లేదు .కాని వారికి ప్రత్యెక శైలి మాత్రం ఉంది .అందుకే వీరిని ‘’’శైలిస్ట్ కవులు ‘’అన్నారు .అందులో అగ్రభాగాన నిలిచిన వారు ఇద్దరు –ఎజ్రా పౌండ్ మరియు టి ఎస్ ఇలియట్ .

ఇమేజిస్ట్ కవి -ఎజ్రా పౌండ్

ఎజ్రా లూమిస్ పౌండ్ అమెరికాలో  న్యు ఇంగ్లాండ్ లోని ఇడాహో లో హైలీ లో 30-10-1885 న పుట్టాడు తల్లికి  లాంగ్ ఫెలోకవి బంధువు .తండ్రి ప్రభుత్వోద్యోగి .స్వశక్తి బుద్ధి తో హైలీ లో మొదటి ప్లాస్టర్ ఇంటిని నిర్మించాడు .పౌండ్ తూర్పున ఉన్న పెన్సిల్వేనియా యూని వర్సిటి లో విద్య నేర్చాడు . తర్వాత న్యు యార్క్ లోని హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైలో పెన్సిల్వేనియా యూని వర్సిటి డిగ్రీ పొందాడు .అందులోనే బోధించాడు .ఒక ఏడాది రిసెర్చ్ చేయటానికి స్పెయిన్ ,ఫ్రాన్స్ ,ఇటలీ లు తిరిగాడు .తిరిగొచ్చి ఇండియానాలోని కాఫోర్డ్స్ విల్ లోని వా బాష్ కాలేజి ఫాకల్టి లో చేరాడు .ఆ పట్నం మంచి  విద్యకు విద్యా వేత్తలకు కేంద్రం .పౌండ్ మాత్రం అక్కడే’’ బెన్ హర్’’ రాసిన ‘’ల్యూ వాలెస్ ‘’చని పోయాడని అన్నాడు .పౌండ్ కున్న బోహిమియన్ భావాలు నచ్చక ఉద్యోగం పీకేశారు .

అసహనం తో యూరప్ వెళ్ళాడు . గ్రామాలలోని ఆర్టిస్ట్ లను నమ్మని ,వారికి వ్యతిరేకం గా మాట్లాడే అమెరికన్లకు బుద్ధి చెప్పాలని నిర్ణ యించుకొన్నాడు .తన మనో భావాలను ‘’ఏ ల్యూం స్పెంటో’’లో పొందు పరచి ఇటాలి లోని వెనిస్ లో  పబ్లిష్ చేశాడు .లండన్లో నివాసముండి యువకులతో ఒక  గ్రూప్ ను తయారు చేసి లీడర్ అయి ,చైనా ,జపాన్ కవిత్వ సేకరణకై ఏర్పడిన ‘’ఫెనో ల్లోసా ‘’కు సాహిత్య కార్య నిర్వహణాధి కారిగా నియమింప బడ్డాడు .చైనా కవిత్వం లోని క్లుప్తత స్పష్టత ,జపాన్ కవిత్వం లోని ‘’టాంకా ,’’హోక్కా ‘’,.లలోని లోతైన భావాలు ఆకర్షించాయి .అవే పౌండ్ తోలి కవితల్లో చోటు చేసుకున్నాయి .అరవైలో రాసిన ‘’కాంటో’’లలోను వదలక నిలిచే ఉన్నాయి .ఇరవై ఆరులో ఓరియంటల్ పోయెట్రి లోని సౌందర్యం నచ్చి ఆ ధోరణిలో రాశాడు .అందులో ఒక లైన్ –the apparition of these faces in a crowd –petals on a wet –black bough ‘’

ఇరవై తొమ్మిదిలో డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకుని కొడుకును కన్నాడు .అప్పటికే అయిదు చిన్న కవితా పుస్తకాలు రాసిన రచయితఅయినాడు .చివరి నాలుగు  ‘’పెర్సానే ,ఎక్సుల్టే షన్స్ ,’’కాన్జోని ‘’,రిపోస్టెస్’’అని భావ గర్భితం గా పేర్లు పెట్ట్టుకున్నాడు .ఇవన్నీ ప్రాంతీయ ,పురాతన ఫ్రెంచి ,విక్టోరియన్ చివరి కాల ప్రభావం కలవే .బ్రౌనింగ్ ,మారిస్ ,ప్రీ రాఫెలడైట్స్ ఆవహించగా రాసిన కలగూర గంప కవితలే .దీని తర్వాతే స్పష్టమైన ఆలోచనా భావ ప్రకటన ఏర్పడ్డాయి .బాలడ్స్ ,సేష్టినాలు రాస్తూ ఫ్రెంచ్ ఫారంస్ ను వదిలేసి రిలీఫ్ పొందాడు .మనస్పూర్తి పరవళ్ళు తొక్కి ‘’ .come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather dislike –the gilded phaloi of the crouses –are thrusting at spring air ‘’అంటూ ఆవేశ పడ్డాడు బహుసా మన శ్రీ శ్రీ ‘’కవితా ఓ కవితా ‘’కూడా ఇలాంటిదే .

వాల్ట్ విట్మన్ భావాలను వ్యతిరేకించినా కవికి దగ్గరయ్యాడు పౌండ్ .’’it was you that broke the new wood ‘’అని మెచ్చాడు .తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నాడు .కాని ఆంగ్ల కవులు ఆదరించలేదు .పైగా  విన్దర్ హాం  లేవిస్ ‘’ఈ రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్- గ్లాసు నీళ్ళలో ఆయిల్ చుక్క  .తమాషా ఏమిటంటే అందులో కలవాలని కోరుకోడు.ఊరికే ఊరిస్తాడు ‘’అన్నాడు .కానీ పౌండ్ అహంకారం గర్వమే అతన్ని లెజెండ్ ను చేశాయి .సాహిత్యం కళ లపై స్పందన కలిగించే ఉపన్యాస సునామీ సృష్టించాడు .ఇంగ్లీష్ వాయిద్యం బ్లాస్ట్ ను బ్లాస్ట్ చేసే ధోరణిలో తీవ్రం గా భావోద్రేకం గా గుండెల్ని చీల్చి దూరేలా మాట్లాడాడు ,చరిత్రే సృష్టించాడు .చికాగో లో యెర్ర గడ్డం తో ,ఊగి పోతూ విప్లవ కారుడై విజ్రుమ్భించాడు .పౌండ్ సలహా పై తను రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కవితలను సగంమాత్రమె   ముద్రించి ఇలియట్ ఎజ్రా పౌండ్ కే అంకితమిచ్చాడు స్వామి భక్తిగా .

1914లో పౌండ్  ఒక కవి బృందాన్ని తయారు చేసి సమకాలీన కవిత్వం లోని అతిని నిరసిస్తూ ఒక మేని ఫెస్టో తయారు చేసి ,తన గ్రూపుకు ‘’ఇమేజిస్ట్స్ ‘’ అని కొత్త పేరు పెట్టాడు .రోమాన్టిసిజానికి వ్యతిరేకం గా ,ప్రతీకలకు ప్రాదాన్యామిచ్చారు .వారి సిద్ధాంతాలు ముఖ్యం గా మూడు .1-సామాన్య భాషలోసరి అయిన మాటను ప్రయోగించి దానికి తళుకు బెళుకులు అద్ద కుండా రాయాలి , .2-రిధం ను పాత పద్ధతిలో ఛందో బద్ధం గా కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వేర్స్ లో రాయాలి .3-కవిత్వ ఉత్పత్తి  అస్పష్టం గా  ఉండిపోవాలి .(ఇండేఫినిట్).అంతర్జాతీయ భావన పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు .కమ్యూని కేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యం . ఈ సెటిల్ మెంట్ కల్లోలం సృష్టించింది .దీన్ని ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్ ‘’అన్నారు .

అమెరికా లో ఇమేజిస్ట్ ఉద్యమానికి’’ ఆమి లోవెల్’’ పురుడు పోసింది .స్వయం గా ప్రచారం చేసింది .పౌండ్ కు తెలిసి ద్రోహం అన్నాడు .ముగ్గురు ఇంగ్లీష్ ఇమేజిస్టే లు రిచార్డ్ ఎడింగ్టన్ ,ఎఫ్ ఎస్ ఫ్లింట్ ,ది హెచ్ లారెన్స్  లను కిడ్నాప్ చేసి ,మరో ఇద్దరు అమెరికన్ కవులు జాన్ గోల్డ్ ఫ్ల్చేర్ ,హిల్డా డూ లిటిల్ (హెచ్ .డి)ల తో కలిసి ‘’సమ్ ఇమేజిస్ట్ పోఎట్స్ ‘’ను 1915 -16-17లను ఏర్పరచింది .ఈ బంది పోటు ‘’తనానికి నివ్వెర పోయి పౌండ్ అందులోంచి తప్పుకున్నాడు .’’ది లిటిల్ రివ్యు ‘’కు ఎడిటర్ అయ్యాడు .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే పారిస్ వెళ్లి పోయాడు పౌండ్ .

పారిస్ లో తన సృజనతో అగ్నిపర్వత ప్రేలుడు భావాలతో చెలరేగి పోయాడు .కొత్త శైలిని వ్యంగ్యాత్మకం గా ,సంభాషణా పద్ధతిలో ఏర్పరచుకున్నాడు .’’హగ్ సెల్వి మాబెర్లి ‘’ని ముప్ఫై అయిదులో పబ్లిష్ చేశాడు .ఆధునిక ప్రపంచాన్ని సెటైర్ తో కొరడా ఝాలిపించాడు .’’a positive document of sensibility –is compact of the experience of a certain man in a certain place at a certain time and is also the document of an epoch ,a genuine tragedy and comedy ‘’అని పించి ఆర్నోల్డ్ మాటల్లో ‘’జీవిత విమర్శ ‘’(క్రిటిసిజం ఆఫ్ లైఫ్ )అయింది . కాంటోస్ కు  విశేష ఆదరణ వచ్చింది .దాదాపు పాతికేళ్ళు రాశాడు దీనిని .వంద అధ్యాయాలున్న అతి పెద్ద గ్రంధం .చివరి పది అధ్యాయాలను పీసా లో అరెస్ట్ చేసి1945 లో జెయిల్ లో పెట్టినప్పుడు రాశాడు .’’రాక్ డ్రిల్ ‘’ను చదవాలని ప్రయత్నించిన వారికి  నిరాశ ఎదురైంది అది కోడ్ భాషలో రాశాడు కొరుకుడు పడలేదు .పొరపాటు పడ్డారుకాని అది తప్పు కాదు .స్పష్టం గానే రాశాడు .అవన్నీ స్వీయానుభవాలు ,వ్యక్తీ గతాలు .’కాంటోస్’’కు రాసిన సూచికే మూడు వందల ఇరవై పేజీలుంది .ఇదంతా ;’’ స్ట్రీమ్ఆఫ్ కాన్షస్ ‘’(చైతన్య స్రవంతి )రచన అప్పటికి కొత్త .యేట్స్ కవి ‘’విషయం కంటే శైలి గొప్పగా ఉంది .ఇంత బాగా భావాన్ని స్పష్టం గా తెలియ జెప్పిన సమకాలీన కవి లేనే లేడు .కాని మధ్యమధ్యలో తెగిపోతూ అతుకులు పడుతూ ,మెలికలు తిరుగుతూ ,నరాల ఉద్రేకం కలిగిస్తూ ,దివా స్వప్నమై ,గందర గోళం గా ఉన్నది మాత్రం నిజం ‘’అన్నాడు .

కాని పౌండ్ మాత్రం తానూ ‘’హ్యూమన్ కామెడీ ని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలతో ,కోణాలలో చిత్రించాను ‘’అని స్పష్టం గా చెప్పాడు .ఒక నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకొనే రాశాడు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావ్రుత్తాలు,సమకాలీన స్తితి గతులు  కలిసి అలా అనిపిస్తాయి .మొదటి ప్రపంచ యుద్ద్ధాన్ని ‘’ఇంఫెర్నో ‘’లో డబ్బు బాంకింగ్ పాపాలను ‘’పర్జ్ టోరియో ‘’లో క్లైమాక్స్ ను ‘’పరాడిసో ‘’చిత్ర్రించాడు .కొన్ని కవితా పంక్తుల్ని చూద్దాం –

‘’hang it all Robert Browing –there can be but the one ‘’Sordello ‘’-but Sordello ,and my Sordello ?-lo sordels sifo di –Mantovana-so shu-churned in the sea ‘’

1924లో ఫ్రాన్స్ వదిలి రాపల్లో లో స్తిర పడ్డాడు .స్నేహితులు తగ్గి శత్రువులు పెరిగారు .అమెరికా ప్రెసిడెంట్ జెఫర్సన్ కంటే ఇటలీ నియంత ముస్సోలినీ ప్రజాస్వామ్యాన్ని మెచ్చి ఫాసిజం ను సమర్ధించాడు .రోమ్ నగరం రేడియో లో మాట్లాడుతూ అమెరికాను చెడ తిట్టాడు ‘’.తన అమెరికా’’ పై దాడి చేయమని ఫాసిస్టూలకు ఉపదేశించాడు .ఉద్రేకి చివరకు దేశ ద్రోహి అయ్యాడు .1945 మే లో అరెస్ట్ చేసి వాషింగ్ట న్ కు తీసుకొచ్చారు .మరణ శిక్ష పదేదే కాని డాక్టర్లు పౌండ్ మానసిక పరిస్తితి బాగా లేదని తేల్చారు .తొమ్మిది నెలల తర్వాత సెయింట్ ఎలిజ బెత్ మానసిక హాస్పిటల్ కు మార్చారు .పన్నెండేళ్ళు కేసు నడిచింది చివరికి పౌండ్ ఇక ఏ మాత్రమూ విచారణకు నిలబడ లేడని,ఇటలీ లో చేసిన రేడియో ప్రసంగం మానసిక పరిస్తితి సరిగ్గా లేనందున చేసిన దే నని  తేల్చారు .ప్రజలు ,ప్రజా సంఘాలు రచయితలూ వాల్ట్ విట్మన్ నాయకత్వాన పెద్ద  నిరసన తెలియ జేశారు .1958మే లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీ వెళ్లి పోయాడు .ఇటలీని తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సాల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచ్చి వాళ్ళ శరణాలయం ‘’అన్నాడు .

రాజ కీయం గా తప్పుడు దోవలో నడిచినా కవిత్వ పరం గా ప్రయోగాలు చేసి కొత్త వరవడి పద బంధం ,సామెతలు  సృష్టించి నూతన శైలికి మార్గ దర్శి అయి ,ఎందరినో ప్రభావితం చేశాడు ఎజ్రా పౌండ్ .అనుయాయులు పౌండ్ మార్గాన్ని ఇంకా నిగ్గు తేల్చారు .’’ Pound could not teach his followers what to say ,but he had a great talent for showing them how to say it ‘’కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు . possessed of a sense of sound, an “ear” for words, imbuing his poetry with melopoeia. .’’కౌంటర్ పాయింట్ కు ప్రాధాన్యం ఇచ్చాడు .’’సాంద్ర’’ కవిత్వాన్నే రాశాడు .ఎన్నో అనువాదాలు చేసి పేరు పొందాడు . as a translator, Pound was a pioneer with a great gift of language and an incisive intelligenc.e The leitmotifs in Pound’s literary criticism are recurrent patterns found in historical events, which, he believed, through the use of judicious juxtapositions illuminate truth; and in them he reveals forgotten writers and cultures.. he sought to emphasize the value of art and to “aestheticize the political . He rejected traditional rhetoric and created his own. 1967 conversation with Allen Ginsberg, Pound told the young poet, “my poems don’t make sense.” He went on to call himself a moron, to characterize his writing as stupid and ignorant, “a mess”. Ginsberg reassured Pound that he “had shown us the way”, but Pound refused to be mollified. Any good I’ve done has been spoiled by bad intentions – the preoccupation with irrelevant and stupid things,’ [he] replied. Then very slowly, with emphasis, surely conscious of Ginsberg’s being Jewish: ‘But the worst mistake I made was that stupid, suburban prejudice of anti-semitism.’

మన చలం లాగా చివరికి లెంప లేసుకున్నాడు పౌండ్ .

photograph of Ezra H. Pound  book coverphotograph

ఆధునిక కవిత్వ మార్గ దర్శి – టి.ఎస్ ఇలియట్

ఎజ్రా పౌండ్, ఇలియట్ లను జంట గానే సాహిత్య చరిత్ర కారులు భావిస్తారు .గురు శిష్యులే .థామస్ స్ష్టియార్న్ ఇలియట్ ఆంగ్ల రచయితలపై విశేష ప్రభావం ఉన్న వాడు .తనకవిత్వం లో బ్రిటిష్ కంటే  అమెరిక కరెంట్ ఉందన్నాడు .ఇంగ్లాండ్ లోనే ఎక్కువ కాలం ఉన్నాడు .  అమెరికా లోని మిస్సోరిలో  సెయింట్ లూయీస్ లో 26-9-1888 న జన్మించాడు .పూర్ర్వీకులు న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్యూరిటన్ లు .తాత బోస్టన్ యూని వర్సిటి ని,సెయింట్ లూయిస్ లో మొదటి యూని టేరియన్ చర్చ్ ని  స్థాపించాడు .మిల్టన్ అకాడెమి లో చదివాడు. ఇరవై ఒకటిలో బి ఏ తర్వాత ఎం ఏ పాసై ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స ఫర్డ్ లో మేర్తాన్ కాలేజి లో స్కూల్ మేస్టర్  అయి బాంక్ క్లెర్క్ గా పని చేశాడు  .ఎనిమిదేళ్ళ తర్వాత లండన్ పబ్లిషింగ్ హౌస్ లో చేరి పూర్తీ భాగస్వామి అయ్యాడు  నలభై లో బ్రిటిష్ పౌరసత్వం పొందాడు .’’ఆంగ్లో కేధలిక్ ‘’నని ప్రక టించు కొన్నాడు .రాజకీయాలలో రాయలిస్ట్ ను అన్నాడు .సాహిత్యం లో క్లాసిస్ట్ నన్నాడు .ఇరవై ఏడులో వివేన్నా హేగ్ ను పెళ్లి  చేసుకున్నాడు .ఏడేళ్ళ కాపురం తర్వాత ఆమె చనిపోతే పదేళ్ళ తర్వాత తన సెక్రెటరి వాలెరీ ఫ్లెచర్ ను వివాహమాడాడు .

పందొమ్మిదేళ్ళ వయసులో సంప్రాదాయ పద్ధతిలో కవిత్వం రాశాడు .గ్రాడ్యుయేట్ కాకపూర్వమే ఫ్రెంచ్ సింబాలిజం అర్ధం చేసుకొన్నాడు .లా ఫోర్జ్ ను ఆదర్శం గా తీసుకున్నాడు .అప్పుడున్న కాల మాన పరిస్తితులకు అసహనం చూపాడు .కొత్త శైలిలో దాన్ని కవిత్వీకరించాడు స్నేహితులు దీన్ని ‘’ ఎలిప్టి కల్ స్కూల్ ‘’అన్నారు .ఇడియం ను ఇంకా పదును బెడుతూనే ఉన్నాడు .ఇరవై మూడులో ‘’ది లవ్ సాంగ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్  ఫ్రూ ఫోర్క్’’అనే మొదటి ముఖ్యమైన కవిత రాశాడు .కంటికి కని  పించిన ప్రతి దాన్ని ఇమేజరిగా వివరించాడు .దీనితో ఇంగ్లీష్ ప్రజల్లో దడ పుట్టించాడు .డాంటే రాసిన కొటేషన్ తో దీన్ని ప్రారంభించి రాశాడు అది చదివిన వారికే ఇది అర్ధమవుతుంది అదీ ఫిటింగ్.అసందిగ్ధం గా ,నిర్ణయాత్మక రహితం గా సాగిన కవిత అది .ఘనీభవించిన సమాజానికి ,వంధ్యత్వం పొందిన సంఘానికి అది ప్రతీక .’’let us go then if you and I –when the evening is spread out against the sky ‘’అంటూ సాగే కవిత అది . ‘’my life is measured by coffee spoons ‘’అంటాడు .’’do I dare –disturb the universe ?-and should I then presume ?-and how should I begin?అని ప్రశ్నించాడు .

ముప్ఫై నాలుగు లో రాసిన ‘’వేస్ట్ ల్యాండ్ ‘’కవితలలో బోర్ డం ,హారర్ ,కీర్తి లను ప్రతిస్టించాడు .ఇందులో జ్ఞాపకాలు ,కోరికలు ఉన్నాయి .క్రిష్టియానిటి చాలెంజి కి సమాధానం అన్నారు .లండన్ నగర జనజీవితం లో ఉన్న ‘’ఊసర క్షేత్ర’’ దర్శనమే ఇది .ప్రతి చోటా ఉన్న చావు ను కనిపెట్టాడు .కవితను ముక్కలు ముక్కలుగా చేసి రాశాడు అందులోని క్రియా సౌభాగ్యానికి మురిసిన వారున్నారు .ఇందులో శిధిల చిహ్నాలున్నాయి .’’బోలు మనుషుల ‘’నిజ రూపం చూడ గలం.అన్నీ కోల్పోయిన ప్రపంచాన్ని చూస్తాం .’’paralysed force ,gesture without motion ,men figures stuffed with straw ,gather on stony soil in a valley of dying stars ‘’అని కదలలేని కుళ్ళిన కంపు కొడుతున్న ,ధ్యేయం లేని సమాజాన్ని చూపించాడు .’’this is the way the world ends –this is the way the world ends –this is the way the world ends –not with a bang but a whimper ‘’అని మూడు మాటలు గంట కొట్టి ప్రపంచ పరిసమాప్తిని చెప్పాడు .

క్రమంగా అనుకోని మార్పులు ఇలిఎట్ లో కలిగాయి .నాటక రచయిత అయ్యాడు . ‘’ది రాక్ ‘’డ్రామా రాశాడు .మర్డర్ ఇన్ ది కేధడ్రిల్ ‘’  ను సెయింట్ థామస్ త్యాగాన్ని గుర్తు చేస్తూ రాశాడు .ఫామిలీ రి యూనియన్ ,కాక్  టైల్ పార్టీ ,ది కాన్ఫిడెం షియ ల్ క్లెర్క్ ,ది ఎల్డర్ స్టేట్స్ మన్ లు  మనసులోకి దూసుకు పోయేట్లు ,బాధ వ్యధ కలిగిస్తూ ,హాస్యం చిప్పిలుతూ రాశాడు .అరవైలో ‘’కన్సేర్వేటివ్ ఎల్డర్ స్టేట్స్ మన్ ‘’అని పించుకొన్నాడు .కమ్మని స్పష్టమైన స్వరం తో తన కవితలను రికార్డ్ చేసుకున్నాడు .వి ఎస్ ప్రిచేట్ ఇలియట్ ను’’a trim anti Bohemian with black bowler  and umbrella ,the well-known symbol of male respectability ,ushering us to our seats in hell ‘’వర్ణించాడు

యాభై సమీపిస్తుండగా ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’విడుదల చేశాడు .గొప్ప ఫిలసాఫికల్ పోయెం అన్నాడు .కాని అంతగా పేల లేదు .ఒక డిజైన్ లో ఇంకో డిజైన్ కలిసి పోయి గజి బిజీ అయింది .’’ట్రాడీదిషన్  అండ్ ఇండి విడ్యువల్ టేలెంట్ ‘’లో సాహిత్య విమర్శ చేశాడు .అరవై లో ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసినందుకు నోబెల్ ప్రైజ్ నిచ్చారు .నాలుగవ జార్జి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశాడు .’’the process of advancement is interesting .one seems to become a myth ,a fabulous creature that does not exist .one does not feel any different though .it is not you get bigger to fit the world ,the world gets smaller to fit you ‘’ అని ఫిలసాఫికల్ గా స్పందించాడు .డేబ్భైలో ఆయన పై ఒక సింపోజియం నిర్వహించారు .అతని ప్రభావం పై డజనుకు పైగా పుస్తకాలు తెచ్చారు .కొత్త క్రిటిక్స్ ను ‘’లెమన్ స్క్వీజేడ్ క్రిటిక్స్ ‘’అన్నారు .వీటిపై ‘’ good poetry must exhibit several qualities in proportion of which one is good sense ‘’అని కవిత్వ పరామావధి చెప్పాడు .మేధ  తో పాటు మత భావాన్నీ జోడించాడు .’’సేలేక్టేడ్ ఎస్సేస్ ‘’లో కవిత్వాన్ని గురించి చాలా రాశాడు .’’కవిత్వం ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూపిస్తుంది .అందులో కొత్త భాగాలనూ తెలియ జేస్తుంది .ఎప్పటికప్పుడు లోతుల ఆవిష్కరణ చేస్తుంది .నిజం గానే దూసుకు పోయేట్లు చేయగల సమర్ధతా ఉంది’’ .ఇలియట్ సాహిత్య సర్వస్వం కొత్త శబ్ద సృష్టి తో ముడి పడింది .కొత్త ,చూడని లోక దర్శనం చేయిస్తుంది .ఆనదాన్ని మాత్రమె కాక ఎక్కువ జాగ్రుతికలిగి స్తుంది .

చివరికాలం లో ఆల్కహాలిక్ అయి’’రిం జిమ్ రిం జిమ్ ‘’అంటూ జిమ్ ను జాం మంటూతెగ తాగే వాడు.  ఆయన ద్విశాతాబ్దికి లండన్ పోఎట్స్ కార్నర్ లో వెస్ట్ మినిస్టర్ ఆబే లో ఒక పెద్ద శిలను ఉంచి గౌరవించారు .వర్జీనియా ఉల్ఫ్ జేమ్స్ జాయిస్ మొదలైన వారిని ప్రభావితం చేశాడు .ఆధునిక కవిత్వ మార్గ దర్శి టి ఎస్ ఇలియట్ .భారతీయ వేదవిషయాలు ‘’దం ,దాంతం ధమద్వం’’మొదలైన పదాలను వేస్ట్ లాండ్ లో వాడాడు .

 

Thomas Stearns Eliot by Lady Ottoline Morrell (1934).jpg Inline image 1

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51

ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్

పోరాడే వారి యుద్ధ క్షేత్రం లారెన్స్ .ఆలోచనా పరుడైన ఫిలాసఫర్ .మానసిక అన్వేషణ ఉన్న రుషి తుల్యుడు .భవిష్యత్ దార్శనికుడు .కొరడా దెబ్బలు కొట్టగల మానవుడు .ఎక్కడా ఇమడలేని వాడు .వీటినన్నిటిని తన ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవల లో ఆవిష్కరించుకొన్నాడు .11-9-1885 న నాటింగ్ హాం షైర్లో ఈస్ట్ వుడ్ లో జన్మించాడు .ముగ్గురబ్బాయిలు ఇద్దరంమాయిలున్న కుటుంబం .అసలు పేరు డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ .కొండ దిగువన చిన్న ఇంట్లో ఉండేవారు .చదువు రాని తండ్రి బొగ్గుగని కార్మికుడు .తల్లి టీచర్ గా కొంతకాలం పని చేసింది .మంచిదే కాని దామినేటింగ్ పెర్సానాలిటి .తండ్రి తాగుబోతు అని తల్లి చెప్పగా తెలుసుకొన్నాడు .

నాటింగ్ హాం హైస్కూల్ లో చేరి చదువులో పెద్ద గా ప్రావీణ్యం చూపకుండా స్కాలర్షిప్ పొందకుండా చదివాడు .ఇంటిపక్క పిల్ల పై పదహారేళ్ళ వయసు లో ప్రేమ లో పడ్డాడు .అది రొమాంటిక్ వ్యవహారమే నని ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’లో రాశాడు ..తల్లి ప్రేమ లో పెరిగి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేశాడు .ప్రేమ శారీరకమైనది కాదని గ్రహించాడు .పదిహేడు కు చదువుకొంటూ చదువు చెబుతూ గడిపాడు .గని కూలీ పిల్లలకు చదువు నేర్పాడు .సాహిత్యాధ్యయనం చేస్తూ  బాతని ఫ్రెంచ్ లను నేర్చాడు .ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ కొంత చదువు చెప్పాడు .తర్వాతా స్వయం గానే చదివి సాధించాడు .దక్షిణ లండన్ లో క్రయోడాన్లోని డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పై తరగతులకు బోధించాడు .చదువు చెప్పటం చదువుకోవటం కంటే ‘’ఫ్లవర్ డ్రాయింగ్ ‘’లో నైపుణ్యం పొందాడు .అందం గా చక్కని శారీరక దారుధ్యం తో ఉండేవాడు .

టీన్ ఏజ్ లోనే అంతర్గత భావాలను రాయాలనే కోరిక కలిగింది .కవిత్వం రాస్తూ పూల బొమ్మలు వేస్తూ తనలాగే ఏ అమ్మాయి అయినా చదివి చూసి ఆనందిన్చాలను కొన్నాడు .ఇరవై లో మొదటి నవల ప్రారంభించాడు .జీవిత సాధనా వైఫల్యమే ముఖ్య విషయం గా రాశాడు .’’ది వైట్ పీకాక్ ‘’లారెన్స్ తోలి ఆవిష్కరణ .ఇరవై అయిదులో రాత –బోధనా మధ్య నలిగాడు .అప్పుడే తల్లి చని పోయింది .మాత్రు ప్రేమ కోసం అలమటించాడు తట్టుకోలేక ఏడ్చేవాడు .అంతా అయి పోయిన్దనుకొనే వాడు .చావు మర్మం ,నిత్య జీవితం లో వెంబడించే చావు పై ద్రుష్టి పడింది .ఎందరో అమ్మాయిలూ వలచారు .వలపించారు .మరణం తర్వాతా కూడా తల్లి ఇంకా బలీయం గా కనిపించింది అనిపించింది .అందుకనే ఏ అమ్మాయినీ ప్రేమించలేక పోయాడు .కొంత భయంతో  కొంత విశ్రాంతి కోసం టీచింగ్ మానేశాడు .కాని బోధిస్తున్నట్లు కలలోచ్చేవి వీటిని వదిలించు కొందామన్నా వదిలేవి కావు .

ఇరవై ఒకటి లో ఫ్రీడ వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ అనే ముప్ఫై ఒక్క ఏళ్ళ స్త్రీ పరిచయమైంది .ఆమె ఒకప్పుడు తనకు ప్రొఫెసర్ అయిన జర్మన్ తండ్రి కూతురే .అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు .ఆమె లో మాత్రు హృదయం ఉందని తెలుసుకొని ప్రేమించి ఆమె తో ఒక ఏడాది జెర్మని ఆస్ట్రేలియా ,ఇతలీలు తిరిగి ఆమె భర్త నుండి విడాకులు పొందిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .ఇదంతా మూడవ కవితా సంపుటిలో నిక్షిప్తం చేశాడు .దీనికి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోర్స్ ;;అని పేరు పెట్టాడు .అలాగే ‘’లుక్ వి హావ్ కం త్రు’’అనే స్వీయ చరిత్రలోనూ రాశాడు .

లారెన్స్ కు ప్రేమ అంటే పెనగులాట .దాని అన్ని ప్రభావాలకు తట్టుకోవాలి .’’I prefer my strife ,infinitely ,to other people;s peace ,havens and heavens ‘’అన్న గొప్ప ఆదర్శ సిద్ధాంతం లారెన్స్ ది .’’god deliver me from the peace of this world .As for the peace beyond understanding ,I find it in conflict ‘’అని సమాధానం చెప్పాడు .

‘’something in me remembers –and will not forget –the stream of my life in the darkness –deathward set ‘’—‘’grief grief ,I suppose and sufficient –grief makes us free –to be faithful and faithful together –as we have to be ‘’ వంటి కవితల్లో జీవిత తత్వాన్ని సత్యాన్ని తెలియ జేశాడు .

ఇరవై ఎనిమిది లో మూడవ నవల ‘’సన్స్ అండ్ లవర్స్’’రాశాడు మొదటి కదా సంపుటి ‘’ది ప్రస్ష్యన్ ఆఫీసర్’’తెచ్చాడు .ముప్ఫై లో ‘’ది రైన్ బో ‘’బాధా తప్త హృదయం తో రాశాడు .చట్టవ్యతిరేకం గా ,సెక్స్ ప్రేరకం గా ఉందని నిషేధించింది ప్రభుత్వం .లేబియన్ భావలున్నయనీ ఆరోపణ .తానూ రాత ప్రతి చదవ కుండా ముద్రించానని పబ్లిషర్ నెత్తీ నోరూ కొట్టుకున్నాడు .ఈ సమయం లో లారెన్స్ ‘’సూపర్ రేషనల్ వే ఆఫ్ లైఫ్ ‘’పై ఆలోచన చేశాడు .బుద్ధి కంటే సహజ జ్ఞానం గొప్ప అన్నాడు . ‘’my great religion is a belief in the blood ,the flesh ,as being wiser than the intellect .we can go wrong in our minds .but what our blood feels aand believes and says is always true ‘’.అని సిద్దాన్తీక రించాడు .

మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ దంపతులను ఇంగ్లాండ్ కు దక్క్షినం లో ఉన్న జేన్నార్ కు తరిమేసింది .అక్కడే కాల్ రిడ్జ్ సూతీ ఆలోచించిన  వదిలేసిన‘’ పాంటిసో క్రసి’’ని అక్కడి ప్రజల మనస్సుల్లో నింపాలని కల గన్నాడు .అందరితో కలిసి ఉంటున్నా లారెన్స్ వంట చేయటం ఇల్లు ఊదవటం లాంటి పనులు చూసి నగర ప్రజలు అనుమాన పడ్డారు .ఇదంతా విద్దూరం అనుకొన్నారు అసలే యుద్ధ భీతి . పైగా జర్మనీ తో యుద్ధం  .లారెన్స్ భార్య జర్మన్ .ఆమె సోదరుడు జర్మన్ వైమానికుడు .కనుక లారెన్స్ ఒక గూద చారి అని అనుమానించారు .లైట్లు ఆర్పేశారు ,ఇల్లంతా సోడా చేసి చివరికి గెంటేశారు .రెండేళ్ళు లండన్ బెర్కశైర్,ద్ర్బి షైర్,మిడ్ల్యాండ్ హిల్స్ లు తిరిగారు యుద్ధం అయి పోయిన తర్వాత1919 లో లారెన్స్ దంపతులు ఇంగ్లాండ్ వదిలి కాంటి నెంట్ కు చేరుకున్నారు .పుస్తకాలను పుంఖాను పుమ్ఖం గా రాస్తున్నా బీదరికం లోనే ఉంది పోవాల్సి వచ్చింది .అతని పుస్తకాలు ముద్రించటం సాహసాం ఇబ్బంది అనుకున్నారు పబ్లిషర్లు.ముప్ఫై అయిదు లో ‘’విమెన్ ఇన్ లవ్ ‘’ రైన్ బో కు సీక్వెల్ గా ప్రచురించాడు .ఇందులో ‘’సూపర్ సెక్సువల్ లవ్ ‘’ను ప్రతిపాదించాడు .ఆరేళ్ళు దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు .అప్పుడప్పుడు లండన్ వచ్చి కొద్ద్దికాలం ఉంది వెళ్లి పోతున్నాడు .’’నా నుంచి నేను దూరమై పారి పోతున్నాను ‘’అని రాసుకొన్నాడు .ఎక్కడ ఉన్నా కొద్దికాలం లో అది బాగా లేదని పించటం ఇంకో చోటికి వెళ్ళటం అక్కడా నచ్చక పోవటం అదీ అతని పరిస్తితి .సార్దినియా ఆస్ట్రేలియా అమెరికా ఎక్కడికెళ్ళినా ఇంతే .మెక్సికో చేరాడు .అక్కడ ఒక ప్రఫెత్గా ,నాయకుడిగా మారాడు అక్కడి సృజనాత్మక రచయితాలను ఆర్టిస్ట్ లను కలిసి తన మనో భావాలను చెప్పాడు .’’ది ప్లూమేడ్ సేర్పెంట్ ‘’,మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’రాసి అందులో ప్రక్రుతి లో ఉన్న ప్రతి వస్తువుపై తనకున్న ప్రేమ ఆరాధనకు పట్టం కట్టాడు .

సూర్యారాధన ,రక్త విజ్ఞానం మొదలైనవాటిని అమలు చేశాడు .ఇవన్నీ చూసిన వారు ‘’ప్రో ఫాసిస్ట్ ‘’అన్నారు .1925లో మళ్ళీ తిరిగి వచ్చ్చే ఉద్దేశ్యం తో అమెరికా వదిలి పెట్టాడు .మళ్ళీ సంచార చేస్తూ జేనోవా ఫ్లారెన్స్ ,ఆస్ట్రియ జెర్మని మొదలైనవి తిరిగి చివరికి ఫ్రాన్స్ చేరాడు .నిరంతర అన్వేషణే ధ్యేయం.ఇదే జీవితం లో చివరి మజిలీ అయింది .ఇక్కడే మరపు రాణి వచన గ్రంధాలు చిరస్మరణీయ కవితా సంకలనాలు రాశాడు .కోపం ఉద్రేకం తో రాసిన కవితలూ ఇక్కడివే .’’లేడీ చాట ర్లీన్ ‘’ఇక్కడ పుట్టిన నవలే.సెక్స్ కు పవిత్ర ప్రేమకు సంఘర్షణ ను ఈ నవలలో గొప్పగా చిత్రించాడు  .సమకాలీన సాహిత్యం లో ఇంట అలజడి సృష్టించిన నవల ఇంకోటి లేదు .అందులో కొన్ని ‘’పాశవిక శృంగార కధనాలు ‘’ఉన్నాయి .అందులోనే లోతైన సాను భూటినీ వ్యక్తీకరించాడు .మొదట దీని కి ‘’టెండర్ నేస్ ‘’అని పేరుపెట్టాడు .దీన్ని వ్యతిరేకించారు బహిష్కరించారు నిషేధించారు .ఆధునిక ప్రపంచం లో విపరీత అనాగారకతకు ,,మానసిక ,ఆధ్యాత్మిక కు మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నమే ఈ నవల .’’the source of all beauty and and all real gentleness ‘’అని విమర్శాకాభిప్రాయమే కాదు లారెన్స్ మహర్షి భావన కూడా .

ఇంకా రెండేళ్ళు జీవించాలి .మెటా ఫిజికల్ రెలిజియస్ ఎంక్వైరీ తో సూర్య స్తుతి ,చాతర్లీన్ పై ప్రతివిమర్శ ,డజను చిన్న కధలు ,వంద కవితలతో ఒక పుస్తకం వెలువ రిమ్చాడు .ప్రపంచ ప్రసిద్ధ హారర్ కధల్లో ఒకటి గా ఒక సూపర్ నేచురల్ చైల్డ్ కద  కూడా ఇందులో ఉంది .క్రమంగా లారెన్స్ ఆరోగ్యం తగ్గి పోతోంది విపరీతమైన ఒత్తిడి శ్రమ .భరించలేక పోతున్నాడు .’’పాన్సీస్ ‘’అనే కవితల రాత ప్రతిని హోమ్ సెక్రెటరి ఆర్డర్ పై సీజ్ చేసి ప్రింటింగ్ ను ఆపెయించారు పోలీస్ సహాయం తో .వెరవని లారెన్స్ ‘’trying to fulfill his living wholeness and his living union ‘’కోసం రాస్తూనే ఉన్నాడు . ‘’for one man ,as  for flower and beast and bird ,the supreme triumph is to be most vividly alive ‘’అని మనస్పూర్తిగా నమ్మిన లారెన్స్ మనీషి 1-3-1930న  ఇతలేఎ లోని వెనిస్ లో ఆద్ ఆస్ట్రఅని పిల్చుకొన్న ఫ్రెంచ్ రివేరా పైన నలభై అయిదేళ్ళ వయసులో  మరణించి అమరుడైనాడు .

జీవిత కాలం లో నలభై పుస్తకాలు రాశాడు లారెన్స్ ‘’a body of creative fiction ,poetry and plays and controversial works as studies in classic American literature ,psycho analysis of the un conscious ,pornography and obscenity and aseries of autobiographical travel books ,a long record of suffering ,agony ,and ecstasy. Almost Lawrence touched was translated into a struggle ,a death and resurrection of the flesh- he wrote as though his throat were choked in its own crimson ‘’.

ఒక తరాన్ని ప్రభావితం చేసిన లారెన్స్ ‘’తాత్కాలిక సంఘటనే చివరిది ‘’అనే భావం తో ఉడుకు రక్తం తోమూసుకున్న కళ్ళ కళ తో రాశాడు .అతనిది చైతన్య శీల ఆత్మాన్వేషణ .అతని కవితాత్మకా వచనం ,మనోహర కవిత్వం మానసిక సంఘర్షణ ,బాహ్య ప్రపంచ హింస కు ప్రతీకలే .లారెన్స్ ‘’one realm we have never conquered –the present .one great mystery of time is terra incognita tous –the instant .The most superb mystery we have hardly recognized –the immediate instant itself ‘’అని తన ఫిలాసఫీ ని స్పష్టం చేశాడు .ఆధునికత పేరుతో మానవతను దూరం చేసుకొంటూ పారిశ్రామిక ప్రగతిలో ఆదర్శాలను బాలి పెట్టుకుంటున్న సమాజాన్ని జాగృతం చేశాడు లారెన్స్ .’’ఆర్టిస్టిక్ ఇంటేగ్రిటి  ,మోరల్ సీరియస్ నేస్ ఉన్న బ్రిటిష్ రచయితఇంగ్లీష్ నవలకు మహా వారసుడు . విట్మన్ మేల్విల్లీ  ,ప్రభావాం తో రాశాడు పో . లారెన్స్ మరణం తరువాత అతని ఆరాధకురాలు కేధరీన్ కార్స్ వెల్ లారెన్స్ పై ఫారేస్తర్ లాంటి వారి క్రూర విమర్శలకు దీటుగా సమాధానం చెప్పింది .ఆల్డస్ హక్స్లీ కూడా1932లో విడుదలైన లారెన్స్ ఉత్తరాల సంచికలో లారెన్స్ ప్రభావాన్ని కీర్తించాడు . తన మనో భావాలను చిత్రాలలో చక్కగా పెయింట్ చేసి వ్యక్తపరచిన చతురుడైన చిత్రకారుడు లారెన్స్ .’’pictures of real beauty and great vitality ‘’అని మెచ్చుకున్నారు .జీవితం లో మూడు వంతులు దరిద్రం తో ,ఆహిష్కార సంచారం తో గడిపిన దురదృష్ట వంతుడు లారెన్స్ .సాంప్రదాయ ఆంగ్ల కల్పనా సాహిత్యానికి గొప్ప దోహదం చేసిన వాడు లారెన్స్ .అప్పుడప్పుడు స్త్రీలకూ వ్యతిరేకం గా రాసినా ,ఆబాల సబల కావాలని ,శక్తి సంపన్నమైన స్వయం  వ్యక్తిత్వం తో  సంపూర్ణ మహిళగా  ఎదగాలని కోరుకున్నాడు ఫెమినిజం అనే పేరు పెట్టక పోయినా వారికి అండగానే రాశాడు .స్వయం పద్ధతిలో సమాజం లో నిలబడిన స్త్రీలనే పాత్రలు చేసి రాశాడు .’’ప్రిసనర్ ఆఫ్ సెక్స్ ‘’నవలలో లారెన్స్ భావాలను నార్మన్ మైలెర్ సమర్ధించాడు .ఆ తరం లోఅన్ని ప్రక్రియలను చే పట్టి  నిరుపమాన రచయిత అని పించుకొన్నాడు లారెన్స్ .

 

D H Lawrence passport photograph.jpg  Lady Chatterley's Lover (1928)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-14-కాంప్ –మల్లా పూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50

ఇంగ్లాండ్ ధోరణులు

జార్జియన్ కవిత్వం

ఇప్పటి వరకు అమెరికా ధోరణుల లో వచ్చిన మార్పులు తెలుసుకోన్న్నాం .ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తోందో చూద్దాం .ఇరవై వ శతాబ్ది మొదటి పదేళ్ళలో దాదాపు పాతిక మంది ఇంగ్లీష్ కవులు ఒక తేలిక పాటి బృందం గా ఏర్పడి వరుసగా అనేక రచనలు చేసి ‘’జార్జియన్ పోయిట్రీ ‘’అని పేరు పెట్టు కొన్నారు . ఎడ్వర్డ్ మార్ష్ ఎడిటర్ గా వచ్చిన ఈ కవిత్వం పై కొత్త బలం అందాన్ని తెచ్చామని చెప్పాడు .ఒకే విధానానికి కట్టు బడి వారు రాయక పోయినా శక్తి,అందం కలిగించామని చెప్పుకొన్నారు .తమ చుట్టూ ఉన్న ప్రపంచ పరిస్తితులపై స్పందించి రాశారు .వాస్తవ పలుకు బడులను ప్రవేశ పెట్టారు .విరుద్ధ భావాల కవులయిన వీరే లాసిలాస్ ఆబెర్ క్రోమ్బీ ,గార్డన్ బాటం లి ,రూపర్ట్ బ్రూక్ ,జి కే చేస్టర్ టన్ , డబ్ల్యు హెచ్ డేవిస్ ,వాల్టర్ డీ లామేర్ ,జాన్ డ్రింక్ వాటర్ ,జేమ్స్ ఎల్లే ఫ్లేకేర్ ,విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ ,రాబర్ట్ గ్రేవ్స్ ,రాల్ఫ్ హాద్గాన్ ,ది హెచ్ లారెన్స్ ప్రభ్రుతులు .

ఇందులో కొద్ది మంది సమకాలీన ద్రుశ్యాలనే ఎంచుకొని కవిత్వం రాశారు .మేస్ ఫీల్డ్ నావికుల, ,,దిన కూలీల వేటగాళ్ళ హత్య చేసే వాళ్ళ గురించి రాశాడు .గిబ్సన్ రాళ్ళు  పగల కొట్టేవారిని ,వడ్రంగులను , ,రైతులను  ,ఫెర్రె నడిపే వారిని కవిత్వం లో ద్రమతైజ్ చేస్తూ రాశాడు .ది హెచ్ లారెన్స్ మాత్రం తన పుట్టిన గడ్డ నార్త్ అంప్ షైర్ కూలీల గురించి అధిక శ్రమ చేస్తున్న వారి జీవితాల గురించి కవిత్వం రాశాడు .పట్నం లో చీకటి లో మగ్గే వారి గురించి ,పల్లె ప్రజల అమాయకత్వాన్ని గురించి కూడా రాశాడు .’’జార్జియన్ గ్రూప్ ఎక్కువ కాలం బతక లేదు .అయిదు కవితా సంపుటాలు రెండేళ్ళ కోసారి తెచ్చారు ఇందులో వారిలో వారికి ఉన్న భేదాలు ప్రస్పుతమైనాయి .ఒకళ్ళని ఒకళ్ళు తిట్టి పోసుకున్నారు .రొమాంటిక్ యువతకు చిహ్నమైన రాబర్ట్ బ్రూక్ ఇరవై ఎదేల్లకే చని పోయాడు .ఫ్లేకర్ ముప్ఫై ఒకటికి ,చనిపోయారు మేస్ ఫీల్డ్ మళ్ళీ సాధారణ విషయాలపై రాశాడు .గిబ్సన్ సెమి రూరల్ స్టీరియో టైప్ కవితలల్లాడు .లారెన్స్ జార్జియన్ తత్త్వం ఉన్నవాడు కాకపోయినా అన్  కాన్షస్ తో  కవిత్వం రాశాడు ఆబార్ క్రోమ్బీ రాయటమే తగ్గించేశాడు .ఉద్యమం గా పిలువా బడిన జార్జియనిజం పలాయన వాదామే అయింది .జార్జియన్ తత్త్వం కొద్దిగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రక్రుతి పై రాస్తూ అది ఏంటో దయ ప్రేమ తమపై చూపిస్తోందని తృప్తి పడ్డారు .ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని కోరారు .ఇక్కడే మాధ్యూ ఆర్నోల్డ్ కవి ప్రక్రుతి ఆరాధకులకు చేసిన  సూచన గమనిద్దాం –

‘’man must begin ,know this ,where nature ends –nature and man can never be fast friends ‘’

వీధి కవి-  డబ్ల్యు హెచ్ డేవీస్

జార్జి బెర్నార్డ్ షా డేవీస్ ని గుర్తించి ఉండక పోయి నట్లయితే సంచారిగా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ బతికే వాడు .మాంట్ మౌత్ షైర్లో న్యు పోర్ట్ లో ఉన్న చర్చ్ హౌస్ లో 20-4- 1871లో పుట్టాడు .వెల్ష్ జాతి వాడు .తండ్రి తక్కువ ఆదాయం వచ్చే ఇన్ కీపర్ .చదివించటానికి డబ్బులు లేవు కనుక కొడుకును వ్యవసాయం పనులకు పంపాడు .దాని మీద శ్రద్ధ లేక పోవటం వలన వదిలేసి జులాయి గా తిరిగాడు .ఇర్వి కి న్యూయార్క్ చేరాడు .అక్కడ అడుక్కు తినటం లో ఒక ఘనుడు ట్రిక్కులు నేర్పించాడు  .లివర్ పూల్ బాల్టిమోర్ ల మధ్య పశువులబోటు పై చాలా సార్లు తిరిగాడు .ట్రైన్ లోంచి దూకటం నేర్చి దూకుతూ కుడి కాలు పోగొట్టు కొన్నాడు .

లండన్ తిరిగొచ్చి కూడా బెట్టుకోన్న్న డబ్బు దాదాపు ఖర్చు చేసి ఇక కవిత్వం శరణం గచ్చామి అనుకొన్నాడు .ఒక రాత్రికి ఆరు పెన్నీలిచ్చి గదుల్లో బతికాడు .చిల్లర వస్తువులమ్మి పొట్ట పోసుకొనే వాడు .’’ది సోల్స్ దిస్ట్రాయర్ ‘’అనే చిన్న కవితా సంకలనం తెచ్చాడు .ఇది బెర్నార్డ్ షా కంట పడింది .షా డేవీస్ ఆత్మా కధకు ఉపోద్ఘాతం రాస్తూ ఈ విషయం చెప్పాడు .వెంటనే చిల్లర అమ్మకాలు మానేసి గౌరవం గా బతకాలని భావించి మెట్రో పాలిటన్ రచయితల తో కలవ కుండా వేరుగా ఉన్నాడు .ఇరవై ఆరు కవితా సంకలనాలు పది వచన సంపుటాలు  మొత్తం ముప్ఫై ఆరు రాశాడు .డెబ్భై వ ఏట 26-9-1940న ఈ ‘’వీధి కవి ‘’ వినువీదికి చేరాడు .

ఒక రకం గా డేవీస్ చాలా రాసి నట్లే .విపరీతమైన ధోరణి వేగం తో రాసేవాడు రాసిన రాశిలో వాసి ఏంతో కని  పెట్టటం కష్టం .జీవితం పై చక్కని కవితలు అల్లాడు .

‘’what is this life ,full of care –we have no time to stand and stare –no time to stand beneath the boughs –and stare as long as sheep or cows –no time to wait till her mouth can –enrich that smile her eyes began ‘’ఇలా కవితా ప్రవాహం  జాలు వారుస్తూనే ఉండేవాడు .

William Henry Davies.jpg

 

రాల్ఫ్ హాద్గ్ సన్

సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పద్దెనిమిదో శతాబ్దపు విలువలతో కవిత్వం రాసిన వాడు రాల్ఫ్ హాద్గ్ సన్ .యార్క్ షైర్ లో 1871లో పుట్టాడు .ఒంటరిగా రహస్యం గా రెండు ప్రపంచాలలో జీవించాడు .నాణ్యమైన ఎద్దు లను తయారు చేయటం డాగ్ శో లకు జడ్జి గా ఉండటం చేసి డబ్బు సంపాదించాడు తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు .లండన్ ఈవెనింగ్ పేపర్ కు డ్రాఫ్ట్స్ మాన్ అయ్యాడు ‘’ఫ్రైస్ ‘’మేగజైన్ ను ఎడిట్ చేశాడు .ముప్ఫై ఆరులో చిన్న కవితా సంకలనం ‘’ది లాస్ట్ బ్లాక్ బర్డ్ ‘’తెచ్చి సాహిత్య లోకం లో కవిగా ప్రత్యక్ష మయ్యాడు .ఫ్రాస్టర్ ,జాక్సన్ ల తో కలిసి ఒక ప్రెస్ కొని పాత పుస్తకాలు ముద్రించి అమ్మాడు .రాయల్ సొసైటీ చేత పోలిజాక్ అవార్డ్ పొందాడు .’’పోయెమ్స్ ‘’1917లో ‘’ది బుల్ ‘’,ది సాంగ్ ఆఫ్ ఆనర్ ‘’ఉన్నాయి .

యాభై లో జపాన్ లో స్సేన్దాల్ యూని వర్సిటి లో ఇంగ్లీష్ లిటరేచర్ పై ఉపన్యాసాలిమ్మని ఆహ్వానం వస్తే అంగీకరించాడు .వెళ్ళలేక పొతే రెండో సారీ పిలిచారు .అమెరికాఅమ్మాయిని పెళ్ళాడి  కు భార్య తో వెళ్ళాడు .ఒహాయో బయట మినర్వా లో  ఒక ఫారం హౌస్ కొని అందులో పక్షుల ఆవాసానికి సగం కేటాయించాడు .’’పాకింగ్ ట న్స్ పౌండ్ ‘’అనే చిన్న ప్రెస్ కొని అందులో చిన్న పుస్తకాలు ముద్రించి అందజేసేవాడు అందులో ‘’సిల్వర్ వెడ్డింగ్ ‘’,మ్యూజ్ అండ్ మాస్తిఫ్ ‘’పుస్తకాలున్నాయి .ఇంగ్లీష్ పల్లె బాలిక గురించి బాగా రాశాడు .3-11-1962న మరణించాడు

‘’eve ,with her basket ,was –deep in the bells and grass –wading in bells and grass –up to her knees –picking a dish of sweet –berries and plums to eat –down in the bells and grass –under the trees ‘’లో వర్ణ చిత్రం గీసి నట్లు ఆమె ను వర్ణించాడు .వాల్ట్ డీ లా మెర్ కు మంచి స్నేహితుడు .నిరంతరం మాట్లాడే వస పిట్ట అన్నాడు లా మెర్

Walter de la Mare by Lady Ottoline Morrell.jpgbv

 

.

సూపర్ నేచురల్ కవి –  వాల్టర్ డీ లామేర్

తన కాలం భాష లో ఆ నాటి ప్రపంచం లో ఒక ఊహా సామ్రాజ్యమే సృష్టించుకొని దెయ్యాలు భూతాలతో ,ఫైరీ టేల్స్ రాస్తూ ఈవిల్ షాడోస్ మధ్య గడుపుతూ ఉన్మాదానికి సరి హద్దు లో ఉంటూ రాసిన వాడు వాల్టర్ డీ లా మెర్ .అతని భావాలకు ప్రతీకగా ఒక కవిత –

‘’two worlds have we ,without within –but all that sense can mete and span –until it conformation win –from heart and soul ,is death to man ‘’

వాల్టర్ జాన్ డీ లా మెర్ కెంట్ లోని చార్లటాన్ లో 25-4-1873లో పుట్టాడు .తల్లి బ్రౌనిగ్ బంధువు తండ్రిపూర్వీకులు  హ్యూగో నాట్స్కు చెందినా వారు .సెయింట్ పాల కేధద్రిల్ స్కూల్ లో చదివి కాలేజి మానేశాడు .స్టాండర్డ్ ఆయిల్ కంపెని లో గుమాస్తా గా పని చేశాడు .ఇరవై ఏళ్ళు ఇందులోనే పని చేసి తర్వాత ఇంగ్లిష్ గ్రామీణ వాతావరణం లో ఉన్నాడు

‘’సాంగ్ ఆఫ్ చైల్డ్ హుడ్’’మొదటి పుస్తకం గా తెచ్చాడు .ముప్ఫై ఆరులో సివిల్ లిస్టు పెన్షన్ పొందాడు .కంపెనీ విధుల నుంచి విడుదల చేసి రచనకు అంకితమవ మని చెప్పింది .యాభై సంపుటాల కవిత్వం ,చిన్న కధలు ,వ్యాసాలూ నవలలు  వెలువ రించాడు .డెబ్భై అయిదులో ‘’కంపానియన్ ఆఫ్ ఆనర్ ‘’అయ్యాడు .ఎనభై లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ పొందాడు .స్వంత ఇంట్లో ట్వికెన్ హాం లో ఎనభై మూడవ ఏట 22-6-1956న లా మెర్ ‘’నో మోర్ ‘’అయిపోయాడు . వర్తమానాన్ని వదిలి భూతకాలం లో జీవిస్తూ రచనలు చేశాడు .కవిత్వం ‘’మూడ్ ఆఫ్ మెమరి ‘’గా రాశాడు .అందులో అంతా మార్మికత ఎక్కువ . ‘’nature itself resembles a veil over some further reality of which the imagination in its visionary moments seems to acjeve a mere direct evidence ‘’అని తన గమ్యం గురించి చెప్పాడు .కవిత్వం లో గొప్ప శక్తి ఉండి ఆకర్షిస్తుంది .’’isled in the midnight air –musked with the dark;s faint bloom –out into glooming and secret haunts –the flame cries ‘’come ‘’.కధలు ఆన్తాలజీలు కళల శక్తికి నిదర్శానం గా ఉంటాయి  బయటి సంఘటనకు ,లోపలి చూపుకు సంఘర్షణ కని పించి మిస్టరి ని మిస్టరీ గా తెలియ జేస్తాయి .సైకలాజికల్ హారర్ కధలు రాసి గుమ్మరించాడు .కార్నెజీ మెడల్ ను బాల సాహిత్యానికి పొందాడు .సూపర్ నేచురలిజం లో అద్వితీయ ప్రతిభ కనపరచాడు .రామ్సే కాంప్ బెల్ వంటి వారికేందరికో ఆదర్శం .

 

Inline image 2

 

బ్రాంటే కు ప్రతిరూపమే –  షార్లెట్ మ్యు

ఎవరికీ అంతగా పరిచయం లేని రచయిత్రి షార్లెట్ మ్యు.సృజన శక్తి అమోఘం గా ఉన్న కొద్ది మంది స్త్రీ కవులలలో ఒకతే .బ్లూమ్స్ బరి లో 15-11-1869 న జన్మించింది .తండ్రి ఆర్కిటెక్ట్ ,బాల్యం లోనే తండ్రి చనిపోతే నలుగురు సంతానమ్ నానా అగచాట్లు పడుతూ దరిద్రం అనుభ వీస్తూ దుఖాన్ని  దిగ మింగు కుంటా బతికింది .అందులో ఒకమ్మాయి, అబ్బాయి పిచ్చి పట్టి శరణాలయం లోనే ఉండిపోయారు .ఉన్న ఇంటిలో సగం అద్దె కిచ్చి చీకటి గదిలో బతుకుతూ అద్దె డబ్బే ఆధారం గా జీవించారు తల్లి మిగిలిన ఇద్దరు పిల్లలు .వారాంతం లో వేసేక్స్ వెళ్లి థామస్ హార్డీ కి అతిధులుగా ఉండేవారు .మ్యు లోని కవితా శక్తిని హార్డీ గుర్తించి మెచ్చుకున్నాడు సివిల్ లిస్టు పెన్షన్ ఇప్పించాడు .వచ్చిన డెబ్భై పౌండ్లను జాగ్రత్త చేసి కాపాడుకోన్నది. చెల్లెలు అన్నే తరచూ అనారోగ్యం పాలై చని పోయింది .నర్సింగ్ హోమ్  కు వెడితే ఆదరణ లభించలేదు .దారిద్ర బాధ పడలేక విషం తీసుకొని ,డాక్టర్లు రక్షిద్దామని ప్రయత్నిస్తే ‘’don’t keep me –let me go ‘’అంటూ వారించి ప్రాణాలు వదిలేసింది .

బ్రాంటే సిస్టర్స్ మ్యూ సిస్టర్స్ గా పునర్జన్మ ఎత్త్తారని అనుకొంటారు .మ్యు తన రచనల్ని ఎన్నిటిని ధ్వంసం చేసిందో తెలియదుకాని అరవైకి పైగా కవితా సంకలనం వచ్చింది .’’బిసైద్ద్ ది బెడ్ ‘’కవితలో –‘’some one has shut the shining eyes ,straitened and folded –the wandering hands quietly covering the unquiet breast ‘’

‘’all night you have not turned to us or spoken –it is time for you to wake ,your dreams were never very deep –I for one have seen the  thin bright twisted threads of them dimmed suddenly and broken –this is only a most pretense of sleep ‘’అంతరంగాన్ని ఆవిష్కరించింది .విక్టోరియన్ కవిత్వానికి ఆధునిక కవిత్వానికి వారధి .’’బెస్ట్ వుమెన్ పోయేట్ ఆఫ్ ది డే ‘’అని హార్డీ మెచ్చాడు . she was ‘very good and quite unlike any one else ‘’ అని శ్లాఘించింది వర్జీనియా ఉల్ఫ్ ..

John Edward Masefield in 1916.jpg

 

ఆస్థాన కవి -జాన్ మాస్ ఫీల్డ్

డెబ్భై ఐదో ఏట  జాన్ మాస్ ఫీల్డ్ ఆత్మా కద’’సో లాంగ్ టు లేరన్ ‘’పేర రాసుకొన్నాడు .హియర్ ఫోర్డ్ షైర్లో 1-6-1878లో సొలిసిటర్ కొడుకుగా పుట్టాడు .వార్విక్ స్కూల్ లో చదివి మర్చంట్ సర్విస్ లో యువకులకు శిక్షణ నిచ్చే ‘’కాన్ వే ‘’లో చదివాడు .కేప్ హార్న్ కు వెళ్ళే షిప్ కు అసిస్టంట్  విండ్ జామర్ గా పని చేశాడు .ఇరవైయేళ్ళు కష్టపడ్డాడు .తాను  సహజ సముద్ర మనిషి కాదు .అమెరికా చేరి ఈ ఉద్యోగం మానేశాడు .బేకరి ,గుర్రపు శాల ,కార్పెట్ ఫాక్టరీ లలో పని చేశాడు న్యూయార్క్ యాంకర్స్ లలో .ఇంగ్లాండ్ కు 1897 చేరటానికి ముందు చాసర్ రాసిన కాంటర్ బారీ కధలు చదివాడు .లండన్ కు తిరిగి వచ్చి మాంచెస్టర్ గార్డియన్ పత్రికలో కాలమ్స్ రాశాడు .’’సాల్ట్ వాటర్ బాలడ్స్ ‘’పుస్తకాన్ని సెంటిమెంట్  హాస్యం తో నింపి రాశాడు .’’ది విడో ఇన్ ది బై స్ట్రీట్ ‘’,డాబర్ ,ది డాఫోడిల్ ఫీల్డ్స్ ‘’లను ముప్ఫై లలో రాశాడు .

మొదటి ప్రపంచ యుద్ధం అతని సృజనకు అవకాశం కల్పించింది .రెడ్ క్రాస్ లో సేవలందించాడు .’’లోల్లిగ్దన్ దౌన్స్ ‘’,రైట్ రాయల్ ‘’’’రేనార్డ్ ది ఫాక్స్ ‘’మొదలైన కవితా పుస్తకాలు ప రాసి ప్రచురించాడు .చివరిదానిలో కవిత్వం పక్వమైంది .రూరల్ స్పిరిట్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అద్దం పట్టే రచనలే చేశాడు 1930లో రాబర్ట్ బ్రిడ్జెస్ మరణం తర్వాత ఆస్థానకవి అయ్యాడు .ఇంగ్లాండ్ సిల్వర్ జూబిలీ ఉత్సవాలలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ పొందాడు .అయిదవ జార్జి మరణం పై ఫనేరల్ ట్రిబ్యూట్ రాశాడు .ఆస్తానపదవి అడ్డు పడిందో కవితా ప్రవాహం ఆగి పోయిందో కాని తర్వాత రాసింది తక్కువే .డెబ్భై ఏళ్ళకు తొంభై రచనలు పూర్తీ నిశ్చయం తో తగ్గిన కవితా ప్రతిభ తో రాసి ప్రచురించాడు . ఇప్పుడు విస్మృత కవే అయ్యాడుఫీల్డ్ .ఫీల్డ్ లో లేని కవి అనిపించాడు ఫీల్డ్ .

క్లాసిక్ చిల్ద్రెన్ నవలలు రాశాడు .’’ఎవర్  లాస్టింగ్  మెర్సి  ;;సి ఫీవర్ ‘’;కవితలు గొప్పవి .గౌరవ  డాక్త రేట్లు చాలా పొందాడు .అతని పేర పోయిట్రీ అసోసియేషన్స్ చాలా ఏర్పడ్డాయి .రాజాస్థాన సంగీత విద్వాంసులకు కవితలు రాశాడు .ప్రసిద్ధమైన సానేట్స్  రాశాడు .

 

 

 

‘’   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49

నేషనల్ బార్డ్ – కారల్  శాండ్ బర్గ్

‘’poetry is the synthesis of hyacinths and biscuits .poetry is the opening and closing of a door – a search for syllables to shoot at the barriers of the unknown and the unknowable ‘’ అని కవిత్వ లక్షణాలను నిర్వచించి దానికోసమే బతికిన వాడు కారల్ శాండ్  బర్గ్ .స్వీడిష్ జాతికి చెందిన ఈ కవి ఇలినాయిస్ రాష్ట్రం గేల్స్ బర్గ్ లో6-1-1878 లో పుట్టాడు .డబ్బు లేని కుటుంబం .మిల్క్ వాగన్ మీద  పని చేయటానికి  కు వెళ్ళే వాడు . పదిహేనవ ఏట బార్బర్ షాప్ లో ,దియేటర్ లో తెరలు లాగటం  ,ట్రాక్ డ్రైవర్ కు సహాయకుడిగా చిన్న చిన్న పనులు చేశాడు .పొలం పనులు ,హోటల్ సర్వర్ గా కూడా చేశాడు .స్పానిష్ అమెరికన్ యుద్ధం లో సైన్యం చేరి పోర్తారికా లో పని చేశాడు అమెరికా తిరిగి వచ్చి లాంబార్డ్ కాలేజి లో చేరాడు .కాలేజి పేపర్ కు ఎడిటర్ అయ్యాడు .బాస్కెట్ బాల్ టీం కెప్టెన్ అయ్యాడు .కాలేజి వదిలాక సేల్స్ మాన్ ,గ అడ్వేర్ టైజింగ్   మేనేజెర్ గా ,జర్నలిస్ట్ గా పని చేశాడు .

చిన్నప్పటి నుండే కవిత్వం చదవటం ఎలా రాయాలో కూడా తెలుసుకొన్నాడు .కొన్ని కవితలను పాతికేళ్ళ వయసులో ‘’ఇన్ రెక్ లెస్ ఎక్స్టసి ‘’పేర ముద్రించాడు .విట్మన్ రాసినట్లున్నాయవి .కవితా రీతిలో శాండ్ బర్గ్ ముద్ర ఉండేది .

‘’డౌన్ ఇన్ సథరన్ న్యూ జెర్సీ దే  మేక్ గ్లాస్ –బై డే అండ్ బై నైట్ ది ఫైర్ బర్న్స్ అం ది మిల్విల్లీ అండ్ బీడ్ ది శాండ్ లేట్ ఇన్ ది నైట్’’కవిత అచ్చయింది .ఇలా పత్రికలకు రాస్తూ బతుకుతున్నాడు .ఒక కవితా సంకలానికి ప్రైజ్ వచ్చింది .అమెరిక సాధారణ భాషనే కవిత్వానికి వాడాడు .’’చికాగో పోయెమ్స్ ‘’విడుదల చేస్తే దానిపై రగడ రేగింది .’’కూల్ టూమ్బ్’’ కవిత ఒక మచ్చు తునక .

‘’when Abraham Lincoln was shoveled into the tombs ,he forgot the copper heads and the assassin –in the dust in the cool tombs –and Ulysses Grant lost all thoughts of con men and wall street ,cash and collateral turned ashes —in the dust ,in the cool tombs ‘’

డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి శాండ్ బర్గ్ ఎనిమిది సంపుటాల కవిత్వం జానపద గీతాలు  ది అమెరికన్ సాంగ్ బాగ్ ,రిమేమ్బ్రెంస్ రాక్ అనే ఆటోబయాగ్రఫీ  వగైరా రాసి ముద్రించాడు .యువకుల కోసం ఎన్నో కదా పుస్తకాలు రాశాడు .అబ్రహాం లింకన్ పై ఆరు భాగాల జీవిత చరిత్ర రాశాడు .చారిత్రిక రచన చేసినందుకు పులిట్జర్ బహుమతి లభించింది .ఇలినాయిస్ గవర్నర్ అడ్లాయిడ్ స్టీవెన్సన్ శాండ్ బర్గ్ డెబ్భై అయిదవ జన్మ దినాన్ని’’కారల్ శాండ్ బర్గ్ డే ‘’గా ప్రకటించి నిర్వహించి గౌరవించాడు .అభిమానులు స్నేహితులు వచ్చి కోలాహలం చేశారు .స్వీడెన్ రాజు ‘’ఆర్డర్ ఆఫ్ ది నార్దార్న్ నార్దర్న్ స్టార్   ‘’ను అందజేసి గౌర్వవించాడు .అమెరిక అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ సంస్థ బంగారు పతాకాన్ని ప్రదానం చేసింది .

వాల్ట్ విట్మన్ తరువాత ఇంత గౌరవం పొందిన వాడు శాండ్ బర్గ్ ఒక్కడే .పంటపొలాలు  ప ,ఆకాశ హర్మ్యాలు ,స్టీలు మిల్లులు అతని కవితా వస్తువులై వాటిల్లో ఆత్మాన్వేషణ చేశాడు .’’ది పీపుల్ ‘’లో సామాన్య మానవుడిని అద్భుతం గా ఫోకస్ చేశాడు .ఇల్లినాయి స్ లో  చిన్న   గ్రామీణ వాతావరణం నుండి  నార్త్ కరోలినా లోని ఫ్లాట్ రాక్ కు చేరాడు ఉన్నతమైన దానిని మంచి దానిని సమాదరించాడు ,స్పూన్ లివర్ ఆన్తాలజి ని వ్యతిరేకించాడు .పొడుగ్గా నవ్వుతూ తెల్ల జుట్టు కళ్ళ మీదకు దూకుతూ కని  పించేవాడు .’’నేషనల్ బార్డ్ ‘’అని పించుకొన్నాడు శాండ్ బర్గ్ .  “indubitably an American in every pulse-beat”.అన్నారు .శతాబ్ది ఉత్సవానికి ప్రత్యెక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .అతని ‘’రూటా బాగా’’కధలు చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకొన్నాయి .

 

Carl Sandburg NYWTS.jpg

 

 

ప్రయరి ట్రూబడోర్ —  వాచల్  లిండ్ సే

జాజ్ పద్ధతిలో కవిత్వాన్ని,గాస్పెల్ ఆఫ్ బ్యూటీ ని  మెగా ఫోన్ ద్వారా వినిపించిన  ఇవాన్జేలిస్ట్  వాచల్ ల్ లిండ్ సే .10-11-1879లో ఇలినాయిస్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జన్మించాడు .లింకన్ పుట్టిన స్ప్రింగ్ ఫీల్డ్ అంటే వీరాభిమానం .అది అమెరికాకు భవిష్యత్  రాజ దాని కావాలని మనసారా కోరుకొన్నాడు .దీనినే ‘’గోల్డెన్ బుక్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్ ‘’పుస్తకం లో తెలియ జేశాడు .ఇక్కడే అమరుడైన గవర్నర్ ఆల్తెల్జ్ స్మరిస్తూ ‘’ది ఈగిల్ దట్ ఈజ్ ఫర్గాట్టేన్ ‘’కవిత రాశాడు .రచయితా గా కంటే ఆర్టిస్ట్ గా దీనికి వైభవం తేవాలని ఆశించాడు .ఒహాయోలోని హిరం కాలేజి లో చదివి చికాగో ఆర్ట్ కాలేజిలో చేరి  న్యు యార్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో కళ లో నిష్ణాతుడైనాడు .బ్లేక్ లాగా క్రూసేడ్ ల తయారీలో మునిగిపోయాడు .మద్య నిషేదాన్ని సమర్ధించి ప్రచారం చేశాడు ‘’యాంటి సేలూల్ లీగ్ ‘’పై అనేక ఉపన్యాసాలిచ్చాడు .’’విలేజ్ మేగ జైన్ ‘’నిర్వహించి ఎక్కడికి వెళ్ళినా ప్రతులను ప్రజలకు అంద జేసే వాడు .’’రైమ్స్ టు బి ట్రేడేడ్ ఫర్ బ్రెడ్ ‘’పై కరపటం తయారు చేసి ఇంటింటికీ తిరిగి ఇచ్చేవాడు .రైతులతో మాట్లాడుతూ తన కవితలు వినిపిస్తూ ఉత్సాహ పరచే వాడు .పిల్లలకు కధలు చెప్పి దగ్గరాకు తీసుకొనే వాడు .రాత్రి  ఏదో ఇంటిలో ఆతిధ్యం పొంది అక్కడే నిద్ర పోయేవాడు .

ముప్ఫై నాలుగవ ఏట మొదటి పుస్తకం ముద్రించాడు .’’జెనరల్ విలియం బూత్ ఎంటర్స్ ఇంటు హెవెన్ ‘’పుస్తకాన్ని మతం ,అభిమాన విషయాలు సమాజానికి అవసరమైనవి అన్నీ కలిపి రాశాడు ..తరువాత ‘’కాంగో అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’,ది చైనీస్ నైటింగేల్ ‘’ది గోల్డెన్ వేల్స్ ఆఫ్ కాలి ఫోర్నియా ‘’మొదలైన కవిత్వపు పుస్తకాలు వెలువరించాడు .ప్రజలకు తన కవిత్వాన్ని చదివి విని పించి కొత్త దారి తొక్కాడు .భావానికి తగ్గ పిచ్ ని ఉపయోగించి చక్కగా భావ గర్భితం గా పాడి మనసుల్ని గెలిచేవాడు .తలకాయను వివిధ భంగిమలలో తిప్పుతూ భలేగా గానం చేసేవాడు .కళ్ళు సగం మూసి అరగన్నులతో అభినయించి పాడుతుంటే జనం పరవశించి వినే వాళ్ళు .సమ్మోహనం లో ముంచి తేల్చే వాడు .చేతులాడిస్తూ వివిధ భంగిమలు పెడుతూ కవిత్వ గానం చేస్తుంటే మరో లోకం లో విహరించి నట్లుండేది .గ్రామీణ స్తాయి వాడే అయినా జాతీయ స్తాయి వాడయ్యాడు .’’హార్లీ బర్లీ’’ అమెరికా జీవిత విధానాలను కవితలో చూపాడు .

లిండ్ సే లెక్కలేనన్ని ప్రేమ పాటలు రాసిన సారా టీద్  సెల్ అనే అమ్మాయిని ప్రేమించి పదేడ్డామనుకొంటే ఆమె జారుకుంది . తర్వాత ఇరవై ఏళ్ళ స్కూల్ పిల్లను పెళ్లి చేసుకొన్నాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .కొన్ని తమాషా భావాలను బయట పెట్టాడు .’’క్రిష్టియానిటి కంటే బుద్ధిజం లో ఆకర్షణ ఎక్కువ అన్నాడు .బుద్ధుడు క్రీస్తుకన్నా అణకువ ,ప్రయోజనం ఉన్న వాడు కాదన్నాడు .తన హృదయం లో ఉత్తర నక్షత్ర గది ఉందని చెప్పాడు .అదీ మూసుకు పోయింది .ఇదివరకు ఎగబడి మూగి వినే జనం క్రమం గా దూరమైపోతున్నారు .అతనిలో కావలసినదేదో లోపించింది అనుకొన్నారు ..దరిద్రం తో మొదలైన జీవితం మళ్ళీ యాభైల్లో అదే పరిస్తితి ని తెచ్చింది. బీదరికం నిరాశా ఆవరించాయి భ్రమ భ్రాన్తులకు లోనయ్యాడు .యదార్ధానికి వ్యతిరేకి అయ్యాడు .భార్యతో నిత్యం తగాదా .మళ్ళీ యువకుడి నవుతాననే వాడు .చివరికి ఈ సంక్షోభం లో తట్టుకో లేక లైసాల్ తాగి 5-12-1931అర్ధ రాత్రి చనిపోయాడు .

అమెరికా లిండ్ సే ను సీరియస్ గా తీసుకో లేదు .సామాన్యులకు అసాధారణ హీరో అయిన లిండ్ సే అందరికి దూరమై పోయాడు .’’I am but the pioneer –voice of democracy –I am the gutter dream –I am the golden dream –listen to my g-o-l-d-e-n d-r-e-a-m’’అని కలకంటూ కల్లోల మనసుతో కాన రాని లోకాలకు చేరాడు .పెర్ఫార్మన్స్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందినకవి .

 

Nicholas Vachel Lindsay 1913.jpg

 

పర్యావరణ ఉద్యమ సారధి –  రాబిన్సన్ జెఫర్సన్

వెస్ట్ లో పుట్టి ఈస్ట్ లో రాబర్ట్ ఫ్రాస్ట్ పెరిగితే ఈస్ట్ లో పుట్టి వెస్ట్ లో పెరిగాడు రాబిన్సన్ జెఫర్సన్ . పెన్సిల్వేనియా లోని పిట్స్ బర్గ్ లో 10-1-1887న పుట్టి తండ్రితో యూరప్ పర్యటన చేసి జెర్మని ,స్విట్జెర్లాండ్ లలో చదివి ,అమెరికా లోని కాలిఫోర్నియా ,వాషింగ్టన్   లలో చదువు పూర్తీ చేశాడు .ఒక కజిన్ పేరణ తో జీవితాన్ని రచన కు అంకితం చేశాడు .’’ఫ్లాగాన్ అండ్ యాపిల్స్ ‘’పుస్తకాన్ని స్వంత ఖర్చులతో ముద్రించాడు.ఇరవై ఆరులో ఊనా కాల్ కస్టర్ ను పెళ్ళాడి ఇంగ్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .మొదటి ప్రపంచ యుద్ధం మొదలై కాలి ఫోర్నియా లోనే ఉండి పోయారు .తమకు తెలియ కుండానే తాము ఉండాల్సిన ప్రదేశం నిర్ణయ మైంది అనుకొన్నారు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు ,కొత్త భార్య ,కవల కొడుకులతో కలిసి ఒక దుర్గం లాంటి ఇల్లు కట్టుకొని ఉండిపోయి అక్కడే 1962లో చనిపోయాడు .ఇరవై అయిదు ఇరవై ఆరు లో పద్దెనిమిది గ్రంధాలు రాసి ‘’ఆత్మ వినాశన ప్రేమ ‘’కుస్థానమిచ్చి రాశాడు .జీవిత పోరాటం వ్యర్ధమని ,విలువలకు అర్ధం లేదని సిద్ధాంతీకరించాడు. కవిగా ఫిలాసఫర్ గా ద్వంద్వ ప్రవ్రుత్తులతో జీవించాడు. సృజన ఉన్నా తీవ్రం గా కవిత్వం రాశాడు .భయంకరత్వ ఉద్యమం గా కవితలుంటాయి .క్రియా బాహుళ్యం భీభచ్చ ప్రధానం .కవితల్ని ప్రేమించలేము .చదివితే మర్చీ పోలేము . అదీ జెఫర్సన్ విధానం .ఎన్విరాన్ మెంటల్ పోయేట్ అని పిలిచారు .మహాకావ్య విధానం లో పకడ బందీగా కవిత్వం రాసేవాడు .’’ఇన్ హ్యూమనిజం ‘’అంటే అమానుషత్వం అనే మాటను కాయినేజ్ చేసింది జేఫర్సనే .ప్రపంచం లోని వస్తువలావు అందాన్ని చూడకుండా ఏదీ పట్టనట్టు స్వఫలా పేక్ష తో ఉండేదాన్ని ఇన్ హ్యూమనిజం అన్నాడు .టైంమేగజైన ప్రత్యెక సంచిక తెచ్చి గౌరవిస్తే ప్రత్యెక స్టాంపు తెచ్చి ప్రభుత్వం గౌరవించింది .అమెరికా పశ్చిమ ఫోటోగ్రాఫర్లకు ఐకాన్ గా ఉండేవాడు .ఎన్విరాన్ మెంటలిజం నే సోషలిజం అన్నాడు

Robinsonjeffers.jpg

 

అమెరికన్ మహిళా బైరన్ -ఎడ్నాసెయింట్  విన్సెంట్ మిల్లె

పందొమ్మిది ఇరవై శతాబ్దాలలో మెల్లె కవిత్వం బాగా ప్రచారమైంది. వందలాది లిరిక్కులు సానేట్లూ రాసింది .అమెరికా లోని మెయిన్ రాష్ట్రం రాక్  లాండ్ లో22-2-1892 లో పుట్టి , .పందొమ్మిదో ఏట వంద లైన్ల కవితను అన్తాలజీ డిపార్ట్ మెంట్ పోటీ  నిర్వ హించిన ‘’ది లిరిక్ యియర్ ‘’కు పంపింది .బహుమతి రాక పోయినా ఆమె ‘’రేనేసేన్స్ ‘’కవిత అద్భుతం అనిపించి గుర్తుండి పోయింది .’’ all I could see from where I stood –was there long mountains and a wood –I turned and looked another way –and saw there islands in a bay ‘’అందులో ఒక పాదం ఇది .

మిల్లె అందం చందం కవిత్వం తిరుగు బాటు ధోరణి తో ఒక ‘’లెజెండ్ ‘’అయింది .వాసర్ కాలేజిలో చేరిన తర్వాతఈ లెజెండ్ గ్రీన్ విచ్ గ్రామం లో  ఒక చిహ్నమే అయింది .చిన్న కధలు రాసి జీవించింది .పాటలను అనువాదం చేసింది .ప్రావిన్స్ టౌన్ నటుల తో నటించి నాటక రచన చేస్తూ కవితలు రాసింది .మగాడికి సాటి అని నిరూపించింది అన్నిట్లో .చిలిపి ఈ చిన్నారి పెద్దలనే వణికించింది .ఆమె తెగువ ధైర్యం తెలివితేటలను చూసి ‘’అమెరిక మహిళా బైరన్ ‘’అన్నారు .అంతకు ముందు ఏ స్త్రీ ఇలా ప్రజా రంగం లో కాలు పెట్ట లేదు .

పదహారు గ్రంధాలు రాసినా మొదటి, రెండవది అయిన ‘’రేనాసేన్స్ ‘’సెకండ్ ఏప్రిల్ ‘’పుస్తకాలు మాత్రమె బాగా గుర్తింపు తెచ్చాయి .ఒక వ్యాపారిని వివాహ మాడింది .న్యు యార్క్ నుండి కాపురం బెర్క్ షైర్కు మార్చారు .ప్రజలు సంస్థల కోరిక పై బయటికి వెళ్లి తన కవితలను చదివి విని పించేది .ఉపన్యాసాలిచ్చేది .ఆమె ఉపన్యాసాలకు పిచ్చ క్రేజు ఉండేది .కాని ఆనారోగ్యం అడ్డు పడేది .చివరికి న్యూయార్క్ లోని పర్వత శిఖరం ఆస్తర్ లిజ్ లో ఉండేది .

రెడ్  హెడేడ్ రెబెల్ అయిన మిల్లె క్రమంగా ప్రజా కవిగా ,రాజకీయ ప్రచారకురాలిగా మారింది .చివరగా రాసిన ‘’వైన్ ఫ్రం దీస్ గ్రేప్స్ ‘’, హాంట్స్ మన్ న ,వాట్ కారీ ‘’రచనలు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయి .భర్త చనిపోయిన ఏడాదికి 19-10-1950న ఆ ఒంటరి బంగళాలో ఒంటరిగా జీవిస్తూ చనిపోయింది .ఆమె లిరిక్కులు సానేట్లు ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి .’’ a figure of passionate feeling,she was a symbol of her age not only in her life but in the paradoxes of her poetry ‘’అని ఆమె కవిత్వాన్ని జీవితాన్ని అంచనా వేశారు . ఆ శతాబ్దం లో గొప్ప సానేట్లు రాసిన కవిగా గుర్తింపు పొందింది .ఫ్రాస్ట్ మెడల్ సాధించిన ఆరవ మహిళా .థామస్ హార్డీ ‘’అమెరికా లో రెండే రెండు ఆకర్షణలు  ఒకటి ఆకాశ హర్మ్యాలు రెండు ఎడ్నా మిల్లె కవిత్వం ‘’అన్నాడు .అప్పటికి రెండు సార్లు పులిట్జర్ బహుమతి పొందిన మహిళా గా చరిత్ర కెక్కింది .

Edna St. Vincent Millay.jpg

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48

అమెరికా లో కొత్త ధోరణులు

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లో అమెరికా చివరి సరిహద్దును నిర్ణయించి సాహసోపేత అన్వేషణ కు దారి తీసింది 1920లో ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ‘’.THE BUSINESS OF AAAMERICAN DEMOCRACY IS BUSINESS’’ అని స్పష్టం గా చెప్పాడు .జాతీయ వాణిజ్యం అత్యంత నిర్మాణాత్మక ఆదర్శం అనీ చెప్పాడు .రాజకీయ నాయకులు ప్రభుత్వ ఆస్తుల పై  బాంకుల నిండా డబ్బు దాచుకొంటే ,గుమాస్తాలు మిలియనీర్లు అయి పోయారు ఒకే ఒక్క రాత్రిలో .ఇది ఆదర్శానికి  విరుద్ధం అని వాపోయారు కొందరు .అలాంటి వారిలో ఎడ్విన్ ఆర్లింగ్ టన్  రాబిన్సన్ ఒకడు.

సానేట్లకు  సాన బెట్టిన – ఎడ్విన్  ఆర్లింగ్ టన్  రాబిన్ సన్

అమెరికా లోని మెయిన్ రాష్ట్రం లో హెడ్ టైడ్ లో 22-12-1869న రాబిన్సన్ జన్మించాడు .తండ్రి దాన్యవ్యాపారి , బాంక్ డైరెక్టర్ ..పుట్టిన ఏడాదికే గార్దినర్ కు వెళ్ళిపోయారు .వేలాది జనాభా ,ఉత్పత్తులకు కేంద్రం అయిన ఇక్కడే తన భవిష్యత్తు తేల్చుకోవాలను కొన్నాడు .అందరిని తోసుకొని ముందుకు వెళ్ళ  లేన ని పించింది .  ఒంటరితనం బాధించినా వ్యక్తిత్వం పెంచుకోవ టానికి అవకాశం కలిగింది .రచయిత కావాలనే ఉద్దేశ్యం తో హార్వర్డ్ లో చేరి దాని మేగజైన్ కు  డజను కవితలు రాస్తే తిరస్కరించారు .రెండేళ్ళ తర్వాత మిల్లులు మూతపడ్డాయి  బాంకులు దివాలా తీశాయి .నలభై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడి ఉద్యమించారు .

బాల్యం లోనే ‘’మాస్టాయిడ్  ఇన్ఫెక్షన్ ‘’సోకి చెవి ఎముకలు బలహీనమై చెవులు వినిపించవేమో నని బాధ పడ్డాడు కళ్ళు కూడా సరిగ్గా కని  పించేవికావు .ఎవరి మీఎదో ఆధార పడుతున్నాననే భావమూ దెబ్బ తీస్తోంది .ప్రపంచం అంటే భయ పడుతున్నాడు .’’లిప్పిన్ కోట్ ‘’మేగజైన్ లో కవిత అచ్చు అయి డబ్బు లిస్తే యెగిరి గంతేశాడు .పో పై కవిత రాశాడు .’’ది టారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’అనే పేరుపెట్టి వంద పేజీలు  రాసి రెండు సార్లు పంపితే తిరస్కారానికి గురైంది .చివరికి ‘’రివర్ సైడ్ ప్రెస్ ‘’కు సంబంధించిన బంధువు రహస్యం గా మూడొందల కాపీలు యాభై రెండు డాలర్లకు ముద్రించి అమ్మాడు .బాగానే అమ్ముడుపోయి కొంత పేరొచ్చింది .’’వానిటి పబ్లిషర్ కొత్త ఎడిషన్ బాగా వేస్తానని ముందుకొచ్చి కొన్ని కవితలు చేర్చి కొన్ని తీసేసి పబ్లిష్ చేశాడు .’’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’అనే పోర్ట్రైట్ పుస్తకం1897లో తెచ్చాడు .

ఎక్కువ కాలం బతకను అని తెలుసుకొని రాయటానికి తొందర పడ్డాడు .వంద డాలర్ల తో న్యూ యార్క్ చేరాడు .అక్కడి పబ్లిషర్ల చుట్టూ తిరిగినా ఎవరూ కన్నెత్తి చూడ లేదు .ఒక పుస్తకాల షాపు వాడో ,టీచరో  అనుకొన్నారు .కాని రచయితగా గుర్తించలేదు .డబ్బులేదు పర్సనాలిటి లేదు .స్నేహితులు మృగ్యం .కనుక కవిత్వం తోనే జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .ఒక దీర్ఘ కవిత రాస్తే ఒకపబ్లిషర్ తీసుకొని రాత ప్రతి పోగొట్టాడు .దీన్ని ఒక వేశ్యా వాటికలో ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ వదిలేస్తే దాన్ని తీసుకొని మూడవ పుస్తకం గా ‘’కెప్టెన్ క్రైగ్ ‘’గ ప్రచురించాడు .దీనికి ఏడు డాలర్లు పొందాడు. ఇదే తోలి సంపాదన కవిత్వం మీద .హోటల్ లలో  ఫ్రీ లంచ్ మీద, మిగిలిన వారి దయా దాక్షిణ్యాల మీద బతికాడు .అద్దె చెల్లించటానికి న్యూ యార్క్ సబ్ వే లో పని చేసి గంటకు ఇరవై సెంట్లు సంపాదించాడు .అదొక నరక కూపం .

వింటర్ లో చలికి తట్టుకోలేక పోయాడు .ప్రెసిడెంట్ రూజ్ వెళ్త కొడుకులు తండ్రికి రాబిన్సన్ రాసిన పుస్తకాన్ని ఇస్తే దయ తలిచి న్యూయార్క్ కష్టం హౌస్ లో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఏడాదికి రెండు వేల డాలర్ల జీతం .స్నేహితుడికి జాబు రాస్తూ తానూ కవిత్వం రాయటానికీ కొత్త బూట్లు కొనుక్కోవ టానికి సరిపడా డబ్బు వస్తోందని చెప్పాడు .నలభై వ ఏట రూజ్ వెల్త్ పదవి అయి పోయినప్పుడు ఉద్యోగం ఊడింది .’’ది టౌన్ డౌన్ ది రివర్ ;;అనే కవితా సంకలం వెలువడి ప్రోత్సాహం లభించింది .బోహీమియన్ స్నేహితుల నుండి డబ్బు అప్పుగా తీసుకొన్నాడు .మరో సారి అదృష్టం తలుపు తట్టింది .కవి ,విమర్శకుడు రాబిన్సన్ జీవిత చరిత్ర కారుడు  అయిన హీర్మాన్ హేగ్ డార్న్ అతని జీవిత చరిత్ర రాసి ,మాక్దోవేల్ కాలనీ లో ఉంచాడు .సృజన శీలుర పాటి కామ ధేనువు అతను .న్యూయార్క్ బోస్టన్ ల మధ్య వింటర్ కాలాలు గడుపుతూ కవిత్వాన్ని ప్రసరిస్తూ ప్రవహింప జేస్తూ పుస్తకాలలో నిక్షిప్తం చేశాడు .

పన్నెండు ఏళ్ళ లో  పన్నెండు పుస్తకాలు రాశాడు .’’కలేక్తేడ్ పోయెమ్స్ ‘’కు పులిట్జర్ బహుమతి రెండు సార్లు వచ్చింది .బ్లాంక్ వేర్స్ లో నిష్ణాతుడయ్యాడు .చాలా కాలానికి బ్లాంక్ వేర్స్ మళ్ళీ అందర్నీ ఆకర్షించింది .మొదట్లో ఇష్టం లేక పోయినా చివర్లో రాసిన మెర్లిన్ ,లాన్సిలాట్ ,త్రిస్త్రాం నాటకాలలో దాన్నే వాడాడు .ఇందులో కదా కధనం అంతా పాత ధోరణి గా సాగింది .అందుకే ఎవరూ మెచ్చుకో లేదు .అరవైకి శారీరకం గా క్షీణించి కవితా పరం గా ఎండి పోయాడు .ఏడాదికి ఒకటి వంతున రాస్తూనే ఉన్నాడు .ఇసడోరా డంకన్ అనే డాన్సర్ ఇతన్ని లొంగ దీసుకొనే ప్రయత్నం చేస్తే తప్పించుకొన్నాడు .అరవై అయిదులో ‘’పాంక్రియాస్ ‘’వచ్చి బలహీనుడై ఆపరేషన్ జరిగినా బతకనని తెలిసి6-4-1935 న చనిపోయాడు .

రాబిన్సన్ చిన్న కవితలనే అందరూ ఇష్టపడి చదివారు .వ్యాపార ధోరణిని నిరసించాడు .’’He created an entire gallery of untypical  of American figures’’అంటారు .పాత విధానాల్లో కొత్త అర్ధాలు చూపాడు .సానెట్ లకు సాన పెట్టి ఎపిగ్రమాటిక్  ఎడ్జెస్ తో మిరుమిట్లు గోలిపించాడు తన ఓటమిని ప్రతి కవితలో ప్రతిబింబింప జేశాడు ..’’miniver cheevy ,born too late –scratched his head and kept on thinking –miniver coughed ,called it fate –and kept on drinking ‘’అని రాసుకొన్న నిర్భాగ్యకవి రాబిన్సన్ .

 

 

Edwin Arlington Robinson.jpg

అమెరికా వ్యావహారిక భాషా కవి – రాబర్ట్ ఫ్రాస్ట్

ప్రక్రుతి కవి అని అపవాదు పడిన రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రదేశాల కంటే  ప్రజలపై మమకారం తో రాశాడు .కాలిఫోర్నియా లోని శ సాన్ ఫ్రాన్సిస్కో లో పుట్టినా  తూర్పు వాడని పించుకొన్న రాబర్ట్ ఫ్రాస్ట్ 26-3-1875 న పుట్టాడు .తలిదండ్రులు న్యూ ఇంగ్లాండ్  స్కూల్ టీచర్స్ .ఎనిమిది తరాలనుండీ కుటుంబం ఇక్కడే ఉంది .తల్లి స్కాటిష్ .తండ్రి ఇంగ్లాండ్ నుండి వలస వచ్చిన కుటుంబం వాడు .నాన్ కాన్ఫర్మమిస్ట్ .ఉద్యోగం, రిపబ్లికన్   మాసా చూసేట్స్  వదిలి  కాలిఫోర్నియా వెళ్ళాడు .డెమోక్రాటిక్ పేపర్ ఎడిటరయ్యాడు . ఫ్రాస్ట్ పుట్టటానికి పదేళ్ళ ముందే సివిల్ వార్ సమాప్తమయింది .సౌత్ అంటే ఇష్టం తో కొడుకుకు రాబర్ట్ లీ అని పేరుపెట్టాడు .తండ్రి టి బి తో చనిపోయాడు .తల్లి ఫ్రాస్ట్ ను తీసుకొని మాసాచూసేట్స్ లోని లారెన్స్ చేరింది .

చదువు ఇష్టం లేదు .నాలుగేళ్ళు హైస్కూల్ లో చదివి పదిహేడు లో డార్ట్ మౌత్ లో చేరి మూన్నేల్లకే వదిలేశాడు .ఇరవై ఒకటిలో హార్వర్డ్ లో చేరి రెండేళ్లకే బయటికొచ్చాడు తల్లికి,చెల్లి సాయం చేసేవాడు . టీ దుకాణం లో చెప్పుల షాపులో ,బట్టల మిల్లులో పని చేశాడు  .కార్బన్ పెన్సిల్ లామ్ప్స్ ను శుభ్రం చేసేవాడు .లోకల్ న్యూస్ పేపర్లో రాయటానికి కుదిరాడు .ఇరవైకి న్యూ అంప్ షైర్ వ్యవసాయ దారుడైనాడు .రాళ్ళ భూమి ని చదును చేసి సాగు చేయాలి .వల్ల కాక టీచర్ అయ్యాడు ..అప్పటికే కవితలు రాసి పంపే వాడు .అవి అచ్చు అయి వచ్చేవి .మళ్ళీ కాడి బుజాన వేసుకొన్నాడు .స్నేహితులు కవులుగా చేలా మణి లో ఉన్నారు .మొదటి కవితా సంకలనం నలభయ్యవ ఏట ‘’ఏ బాయ్స్ విల్ ‘’పేర ఇంగ్లాండ్ లో అచ్చు అయిందంటే ఆశ్చర్య పోతాం ..అక్కడే రెండవది ‘’నార్త్ ఆఫ్ బోస్టన్ ‘’కూడా ప్రింట్ అయింది .

ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరేసరికి గొప్ప కవి అని పించుకున్నాడు .నాటకీయతను కవిత్వం లో జోడించాడు ‘’’’I am going out to clean the pasture spring –I will only stop to rake the leaves away –I shall not be gone long –you come too’’లాంటి వెన్నో ఉన్నాయి .నార్త్ బోస్టన్ కే మరో పేరు ‘’య బుక్ ఆఫ్ పీపుల్ ‘’దీనితో బాటు ఎనిమిది వాల్యూముల కవితలు రాశాడు .కవిత్వం రాయటం అందం గా చదవటం పాడటం ఫ్రాస్ట్ ప్రత్యేకత .ఎపిగ్రమాటిక్ గా రాసిన ‘’some say the world will  end in fire –some say in ice –from what I have tasted of desire –I hold with those who favour fire-but if it had to perish twice –I think I know enough of hate –to say that for destruction ice –is also great –and would suffice ‘’మంచి పేరు తెచ్చుకోంది

ఫ్రాస్ట్ ఆలోచనలు భావాలు ప్రక్రుతి దృశ్యాల ప్రేరేపణ లే .అమెరికా రాగానే మళ్ళీ వ్యవసాయం చేశాడు.న్యు అంప్ షైర్ లోని  ఫ్రాన్కోనియా దగ్గర ఎత్తైన కొండ పై ఫారం హౌస్ కొన్నాడు .ఈయన్ని చూసి మిగిలిన వారూ కొన్నారు .’’ఏ పోయేట్ ఇన్ రెసిడెన్స్ ‘’అని పించాడు . అం హీర్స్ట్  లో  మిచిగాన్  లో ఎక్కువ కాలం ఉండి ఏంతో నేర్చుకొన్నాడు నలభై వరకు ఎవరికీ తెలియని ఫ్రాస్ట్ అరవై డెబ్భై లలో అనేక గౌరవాలు పురస్కారాలు అందుకొన్నాడు .నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’నుండి బంగారు పతకం ,నాలుగు సార్లు పులిట్జర్ ప్రైజ్ సాధించి రికార్డ్ సృష్టించాడు ఇరవై ఎనిమిది యూని వర్సిటీల నుండిఅందులో రెండు ఇంగ్లాండ్ యూని వర్సిటీల నుండి  గౌరవ డిగ్రీలు పొందాడు .వెర్మాంట్ రాష్ట్రం ఫ్రాస్ట్ పేరు ను ఒక పర్వతానికి పెట్టి గౌరవించింది .ఎనభై లో ‘ఎఫోర్ సేడ్’’అనే ఆయనే ఎంపిక చేసిన ఆయన కిస్టమైన కవితల సంకలం గా తెచ్చారు .

రాసిన కవితలను బట్టి ఫ్రాస్ట్ ను వర్డ్స్ వర్త్ కవి తో పోలుస్తారు .ఫ్రాస్ట్ రుషియా లేక కవియా అని అనుమానిస్తారు .పబ్లిక్ లోకి బాగా వచ్చేవాడు ‘’గ్రీన్ ఆపిల్ జీనియస్ ‘’అనేవారు .’’క్రాకర్ బాక్స్ ఫిలాసఫర్ ‘’అనీ అంటించారు .ఫ్రాస్ట్ ‘’a poem should begin in delight and end in wisdom –I ;d as soon write free verse as play tennis with the net down ‘’అని కవిత్వ పరమావధి చెప్పాడు.’’ నీకు అదృష్టం దురదృష్టం ఏదైనా పట్ట వచ్చు కాని నీకు చివరికి కావాల్సింది కృప మాత్రమె ‘’అనే వాడు .దీనిపైనే ‘’ఏ మాస్క్ ఆఫ్ రీజన్ ‘’ ఏ మాస్క్ ఆఫ్ మెర్సి’’దీర్ఘ కవితలు రాశాడు .మనిషే కాదు అతని శైలీ ముఖ్యమేనంటాడు .ఎనభైతోమ్మిదేళ్ళు నాన్ కన్ఫర్మార్ గా జీవించి చివరి పుస్తకం గా ‘’ఇన్ ది క్లియరింగ్ ‘’తెచ్చి29-1-1963లో రాబర్ట్ ఫ్రాస్ట్ కవి చనిపోయాడు . అమెరికా వ్యావహారిక భాషలో కవిత్వం రాసిన రియలిస్టిక్ కవి .అరుదైన సాహితీ సంపన్నుడు అందరికి ప్రేమాస్పడుడు ఫ్రాస్ట్ .’’greatest of  the American poets of the century ‘’అని పించుకొన్నాడు .అస్తిత్వ  మూల కారణాలను ప్రశ్నించాడు .perhaps no other poet in our history has put the best of the Yankee spirit into a book so completely.”  his frequent use of rural settings and farm life, a  liked in these poems, Frost is most interested in “showing the human reaction to nature’s processes.” సానుభూతితో ఉన్న హాస్యాన్ని ప్రవేశ పెట్టాడు .న్యూ ఇంగ్లాండ్ జానపదుడు అని పించుకొన్న వాడు జాతీయ అంతర్జాతీయ కవిగా మన్ననలు అందుకొన్నాడు .జాన్ కేనేడి ప్రెసిడెంట్ అయినప్పుడు ఫ్రాస్ట్ కవిని పిలిపించి గౌరవించి ‘’ది గిఫ్ట్ అవుట్ రైట్ ‘’కవితను చదివించాడు .’ఇంతకూ ముందు ఏ అమెరికన్ కవికీ ఇలాంటి గౌరవం దక్కిన దాఖలా లేదు .

 

Robert Frost NYWTS.jpg

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు అని అభిప్రాయ పడిన అల్లూరి సీతా రామ రాజు

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు

Published at: 12-06-2014 00:35 AM

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ధాటికి ధీటుగా మన్నెం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. స్వరాజ్యం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అయితే ఆయనతో నేరుగా మాట్లాడి, వాటిని ప్రచురించిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి సందర్భం ఒకటి 1923లో చరిత్రలో నమోదయింది. 1923, ఏప్రిల్ 17వ తేదీన సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి వచ్చినప్పుడు-చెరుకూరి నరసింహమూర్తి అనే స్థానికుడు ఆయనను కలిసి మాట్లాడారు. సీతారామరాజుతో నరసింహమూర్తి సంభాషణను, నరసింహమూర్తితో ఆంధ్రపత్రిక విలేకరి సంభాషణను ఆంధ్రపత్రిక ఏప్రిల్ 21వ తేదీన ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలను, సీతారామరాజుకు సంబంధించిన అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను, సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విశేషాలను సేకరించి సీనియర్ పాత్రికేయుడు యు. వినాయకరావు ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ అనే పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. ఆ పుస్తకంలో నుంచి ఒక ఆసక్తికర భాగం..

అల్లూరి సీతారామరాజు అన్నవరం వెళ్లినపుడు ఆయనతో చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ.
మూర్తి: మీరిక్కడ ఎంతసేపు ఉంటారు?
రాజు: రెండు గంటలసేపు ఉంటాను. పది గంటల సమయంలో బయలుదేరుతాను. నర్సీపట్నం, కాకినాడలకు ఎస్ఐ తంతి వార్తలు పంపేందుకు కనీసం అరగంట ఆలస్యం కాక మానదు. ఆపై మాత్రమే పోలీసులు మోటారుబళ్లలో బయలుదేరుతారు. పది గంటల ప్రాంతంలోనే వారంతా ఆ గ్రామానికి చేరగలుగుతారు.
మూ: మీరెక్కడకు వెళ్లదలిచారు?
రా: నేను ముందుగా మకాములను నిర్ణయించుకోలేదు.
మూ: ఇక్కడికి ఎందుకు వచ్చారు?
రా: నా ఉత్తర్వులను అనుచరులు సరిగా గ్రహించలేదు. దారిలో తుపాకులను కాల్చారు. దాంతో నా జాడ తెలుస్తుందేమోనని నా ప్రయాణాన్ని మార్చి వెంటనే ఇక్కడికి వచ్చాను.
మూ: మీరేమి సంకల్పంతో పితూరిని నడుపుతున్నారు?
రా: ప్రజలకు స్వాతంత్య్రం లభించాలనే ఉద్దేశంతో.
మూ: ఏ సాధనంతో?
రా: దౌర్జన్యంతోనే. యుద్ధం చేస్తే గానీ మనకు స్వరాజ్యం రాదు.
మూ: స్వాతంత్య్రం పొందగలమన్న నమ్మకం మీకు ఉందా?
రా: రెండేళ్లలో స్వరాజ్యం తప్పక లభిస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
మూ: రెండేళ్లలో స్వరాజ్యమెలా లభిస్తుంది? మీరవలంబిస్తున్న పద్ధతిలోనే స్వరాజ్యం వస్తుందా?
రా: తప్పక వస్తుంది. నాకు అనుచరుల సంఖ్య చాలా ఎక్కువ. అందులో లోటు లేదు. అయితే తుపాకులు, మందుగుండు సామాగ్రి కావాలి. వాటి కోసమే ఈ సంచారం చేస్తున్నాను.
మూ: దౌర్జన్యంతో కూడిన యుద్ధాలతో ప్రపంచం విసుగు చెందింది. దౌర్జన్యరహిత సిద్ధాంతాన్నే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆదరిస్తున్నారు. జర్మనీవారు కూడా సాత్విక విరోధాన్నే ఆరంభించారు. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య సాధనాల్లో మాత్రమే మాకు నమ్మకం ఉంది. సకల ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించేందుకు దేవదూత గాంధీరూపంలో వచ్చిందని ప్రపంచ ప్రజలంతా నమ్ముతున్నారు.
రా: దౌర్జన్యరాహిత్యంపై నాకు నమ్మకం లేదు. దౌర్జన్యంతోనే స్వాతంత్య్రం సాధించగలమని గట్టిగా నమ్ముతున్నాను.
మూ: దౌర్జన్యంతో ప్రాణనష్టం, వినాశనం కలుగుతుంది. శాంతి సాధనతోనే స్వరాజ్యం లభిస్తుంది. ఇంతకుపూర్వం మీకు, పోలీసులకు జరిగిన యుద్ధాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది?
రా: మొదటి అయిదు యుద్ధాల్లో నేను సులభంగా గెలుపొందాను. ఆరోది, చివరి యుద్ధంలో మాత్రం అలసి మేము నిద్రపోతుండగా పోలీసువారు హఠాత్తుగా మాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. వారు దూరంగా ఉండి మందుపాతరలను, తుపాకులను కాల్చారు. అరగంటసేపు విడవకుండా కాల్చిన శబ్దాలకు మా జట్టులోని వారికి మెలకువ వచ్చింది. మరి రెండు నిమిషాలకు నాకు కూడా మెలకువ వచ్చింది. నేను లేచి చూసేసరికి పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతా చిల్లులు పడింది. అయితే, నాకు ఒక్కటీ తగలలేదు. మా వారితో కలిసి అక్కడి నుంచి తప్పించుకొన్నాం.
మూ: ఈ నాలుగు నెలలుగా మీరేమి చేస్తున్నారు?
రా: నేను జపం చేస్తున్నాను.
మూ: గయలో జరిగిన కాంగ్రెసు మహాసభలకు మీరు వెళ్లారని ప్రజలు బాగా చెప్పుకొన్నారు. నిజమేనా?
రా: నా స్థూల శరీరం గయకు పోలేదు. నా ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్లింది.
మూ: అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలియవన్న మాటేనా?
రా: నేనంతా స్వయంగా చూడగలిగాను. అక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కొందరు శాసనసభలను బహిష్కరించాలని, మరికొందరు వెళ్లాలని అన్నారు. వెళ్లాలనే వారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పం. ఉప్పు పన్నుని హెచ్చించినందుకు, ధర్మాదాయాల చట్టాన్ని ఆమోదించినందుకు భారత శాసనసభ్యుల్లోనూ, చెన్నపురి రాష్ట్రీయ శాసన సంఘ సభ్యుల్లోనూ ఎవరైనా రాజీనామాలు ఇచ్చారా?
మూ: ఎవరూ రాజీనామాలు ఈయలేదు. అసలు మీకీ రాజకీయ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి?
రా: నేను అందుకు తగు ఏర్పాట్లు చేసుకొన్నాను.

విప్లవజ్యోతి
అల్లూరి సీతారామరాజు
రచయిత: యు. వినాయకరావు
పేజీలు: 80, ధర: 100 రూపాయలు
ప్రతులకు: 98851 79428

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47

ఫ్రాన్సిస్ థామ్సన్

రోమన్ కేధలిక్ గా 18-12-1859న జన్మించి మాంచెస్టర్ లోని ఓవెన్స్ కాలేజి లో చేరి ఇష్టం లేక ,సరిగ్గా చదవక తప్పి ,లండన్ వెళ్ళాడు .అక్కడా  జ్యేస్టా దేవే ఎదురైంది .అగ్గిపెట్టెలు దగ్గర నుంచీ అన్నీ అమ్మాడు .బీదరికం తో కుంగిపోయాడు .కవిత్వమే భిక్ష పెట్టాలి అనుకోని దిగాడు .రాసుకోవటానికి పేపర్లూ కూడా కొనుక్కో లేని దరిద్రం .తండ్రి బ్రిటిష్ మ్యూజియం లోని రీడింగ్ రూమ్ కు అప్పుడప్పుడు డబ్బులు పంపుతున్నా  అతని మురికి బట్టలు ,వాలకం చూసి లోపలి అనుమతించే వారు కాదు .అక్కడే బయట అరుగుల మీద పడుకొంటుంటే ఒక వేశ్య దయ తలచి ఇంటికి తీసుకొని వెళ్ళి అన్ని సమకూర్చి సహాయం చేసింది .ఆమె దయతో బతుకుతూ కూడా నిర్లక్ష్యం గా డబ్బు తగలేస్తూ నల్లమందు కు అలవాటు పడ్డాడు .

మెర్రీ ఇంగ్లాండ్ పేపర్ కు కవిత రాసి పంపాడు .వేసుకోవటానికి ఎడిటర్ ఇష్టపడి లెటర్ పంపిస్తే అప్పటికే ఇల్లు మార్చ టం వలన అందుకోలేక పోయాడు .చివరికి పేపర్ వాళ్ళే అడ్రస్ కనుక్కొని ఎడిటోరియల్ ఆఫీసుకు వచ్చి మాట్లాడమన్నారు .చినిగిన బూట్లు ,షర్ట్ లేకుండా పైన వేసుకొన్న మురికి కోటు తో వెళ్ళాడు .మత్తు మందు మానెయ్యమని చెప్పి ఉద్యోగం ఇచ్చారు పందొమ్మిదేళ్ళు అందులోనే పని చేసి బతికాడు .ఎడిటర్ విల్ఫ్రిడ్ మే నెల్ అతని భార్య రచయిత్రి అయిన ఆలిస్ మే నెల్ లు థామ్సన్ రాసిన కవితల మొదటి సంపుటిని ముద్రించారు .బాగా ప్రోత్సాహం లభించింది .షెల్లీ రాసిన హౌన్డ్ ఆఫ్ హెవెన్ పై గొప్ప వ్యాసం రాశాడు .’’సిస్టర్ సాంగ్స్ ‘’రెండవ పుస్తకం గా వచ్చింది .దీనిని మే నెల్ పిల్లలకు అంకితమిచ్చాడు .చాలా జర్నల్స్ కు వ్యాసాలు రాశాడు .’’హెల్త్ అండ్ హోలినేస్ ‘’పై రాయటానికి ఎక్కువ కష్టపడ్డాడు .’’I  would be the the poet of the return to god ‘’అని చెప్పుకొన్నాడు అమాయకత్వం పసి  మనస్తత్వం తో రాసేవాడు .’’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు ‘’కవితకు మంచి పేరు .

‘’o world invisible ,we view thee –o world intangible ,we touch thee –o world unknowable ,we know thee –inapprehensible ,we clutch thee ‘’—‘’yea ,in the night ,my soul ,my daughter –cry –clinging heaven by the hems –and lo Christ walking on the water –not of Gennesareth ,but Thames ‘’

Francis Thompson at 19.jpg

 

ఏ యి .హౌస్మన్

హూస్మన్ రాసిన ‘’ఏ స్ట్రోఫైర్ లాడ్’’అనే నిరాశా జనక కవిత రాసి ఫిట్జెరాల్డ్ తో సమాన ప్రాముఖ్యం సంపాదించిన అల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌస్మన్ 26-3-1859లో వార్సేస్తర్ షైర్లోని బ్రూమస్ గ్రోవ్ లో పుట్టాడు .వయసుకంటే చిన్నగా కానీ పించేవాడు .అందుకే స్నేహితులు ‘’చిట్టెలుక ‘’(మౌసీ )అని పిలిచేవారు .తలిదండ్రులు బాగా పలుకుబడి ఉన్నవారు .ఆక్స్ ఫర్డ్ సెయింట్ జాన్ కాలేజి లో చేరటానికి స్కాలర్ షిప్ వచ్చింది .అప్పటికే గ్రీకు  లాటిన్ లో ప్రజ్న ఉండేది .హిస్టరీ ,ఫిలాసఫీ లపై మోజు లేదు .చదువు చెప్పాలనే కోరిక ఉండేది .డిగ్రీ పూర్తీ చేయలేదు కనుక యూని వర్సిటి ప్రవేశం జరగ లేదు ..

లండన్ వెళ్లి పేటెంట్ ఆఫీస్ లో చిన్న గుమాస్తా అయ్యాడు .జీతం తక్కువ క్లాసిక్స్ చదివాడు .పదకొండేళ్ళు నిరంతర శ్రమ చేసి అనుకొన్నది సాధించి లండన్ యూని వర్సిటి కాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ అయ్యాడు .పందొమ్మిదేళ్ళు పని చేసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ లాటిన్ ‘’పొందాడు .లండన్ లో ఉన్న కాలాన్ని దారుణ కాలం అన్నాడు .జాక్సన్ భావాలకు పూర్తీ విరుద్ధం గా ఉండేవాడు .తన కవిత్వానికి క్లాసికల్ ఆరిజన్  ఉంది  అంటే ఒప్పుకోలేదు ,లాడ్ రాసిన చాలా కాలానికి కాని ఏదీ రాయకపోవటానికి తానూ కవిని కాదని లాటిన్ ప్రొఫెసర్ నని    చెప్పాడు .ముప్ఫై ఆరేళ్ళ తర్వాత పోయెమ్స్ పేరిట రెండో పుస్తకం తెచ్చాడు   .చనిపోయిన తర్వాత ‘’మోర్ పోయెమ్స్ ‘’ఎడిషనల్ పోయెమ్స్ ‘’ముద్రించారు .చివరి పాతికేళ్ళు కవిత్వం రాయలేదు .ఎనభై  ఆరేళ్ళ  వయసులో 3-4-1936 న మరణించాడు .

 

200px

 

జంగిల్ బుక్ రచయిత –   రుడ్యార్డ్ కిప్లింగ్

వచనమే రాసి కవిత్వం తక్కువ రాసిన వాడు రుడ్యార్డ్ కిప్లింగ్ 30-12-1865 ఇండియాలోని బొంబాయ్ లో పుట్టాడు .మేతడిస్ట్ కుటుంబం .ఆరో ఏట ఇంగ్లాండ్ వెళ్ళాడు .నార్త్ డేవాన్ లో వెస్ట్ వార్డ్లో చదివాడు .స్కూల్ మేగజైన్ కు రచనలు చేసేవాడు .యూని వర్సిటి లో చేరకుండా ఇండియా తిరిగి వచ్చేశాడు .లాహోర్ సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ కు సహాయ సంపాదకుడు గ పదిహేడవ ఏట అయ్యాడు .’’ డిపార్ట మెంటల్  డిట్టీస్ ‘’  అనే మొదటి పుస్తకం రాశాడు .ఇరవై రెండు లో ‘’ప్లైన్ టేల్స్ ఫ్రం ది హిల్స్ ‘’రాసి ,ఆరు భాగాలుగా చిన్న కధలు ప్రచురించి ప్రపంచానికి భారత దేశాన్ని పరిచయం చేశాడు .’’అండర్ ది దేవదార్స్ ‘’,’’సోల్జేర్స్ ట్రీ ‘’లతో డికెన్స్ తో సమానం గా విభిన్న పాత్రలను సృష్టించాడు .ప్రతి విషయాన్ని క్షుణ్ణం గా పరిశీలించటం కిప్లింగ్ గొప్ప తనం .’’జంగిల్ బుక్ ‘’కిం ‘’కధలు సంచలనం సృష్టించాయి .’’బారక్ రూమ్ బాలడ్స్ ‘’’’,’’ది ఫైవ్ నేషన్స్ ‘’కవితలు రాసి ప్రచురించాడు .

ఇరవై ఒకటి లో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి లండన్ చేరి కవితలు కధలతో లండన్ ను జయించే శాడు .ఇరవై ఎడుకే ప్రసిద్ధ రచయిత అయ్యాడు .ప్రపంచ పర్యటన చేసి ‘’ది నాలహ్కా ‘’రాసి అమెరికాలోని వెర్మాంట్ లో ఉన్నాడు .ఇంకా ఉండి పోయే వాడేకాని బామ్మర్ది తో తగాదా వల్ల ఇంగ్లాండ్ వెళ్ళాల్సి వచ్చింది .సాంఘిక వ్యతిరేకి అయ్యాడు .కూతురు, మొదటి ప్రపంచ యుద్ధం లో కొడుకు చనిపోయారు .ససెక్స్ విలేజ్ లో ఒంటరి జీవితం గడిపాడు దుఖం లో .అయిదవ జార్జి రాజుకు ఉపన్యాసాలు రాసేవాడు .తరువాత రాసిన వన్నీ ఇమ్పీరియలిజాం భావాలతో రాశాడు .విధి క్రమశిక్షణ ,అధికారం ,విధేయత లను శాసించాడు .లార్డ్ లు, పై తరగతి వాళ్ళతోనే ఉండేవాడు .సామాన్యుల గోడు పట్టేదికాడు .ఇండియా లో మధ్యతరగతి వారు చదువుకొని పైకి ఎదగటం సహించ లేక పోయే వాడు .తెల్ల జాతి ఉత్క్రుస్టత నే ఎప్పుడూ పొగిడే వాడు .ఫాసిజం భావాలు నర నరానా జీర్ణించుకు పోయిన రచయిత కిప్లింగ్ .అందుకే బెర్నార్డ్ షా ‘’he never grew up .-he began by being behind the times’’అని దెబ్బ కొట్టాడు .విక్టోరియా రాణి డయమండ్ జూబిలీ ఉత్సవాలలో ఆంగ్ల సామ్రాజ్యం జాగ్రత్తగా ఉండాల్సిఉంటుందని హెచ్చరించాడు

క్రమం గా కిప్లింగ్ ప్రాభవం తగ్గి పోయింది .’పాస్తమస్  ఆధర్ ‘’(చనిపోయిన రచయిత ) అని పించుకొన్నాడు .ది లైట్ దట్ ఫైల్డ్ ‘’అనే శీర్షిక తో ‘’the forgotten man in English literature ‘’అని ఆయన అరవయ్యవ ఏట పత్రికలూ ఎడిటోరియల్స్  రాశాయి .స్వీయ జీవిత చరిత్ర గా ‘’సమ్ థింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’రాసి,ప్రచురించిన కొద్ది  కాలానికే డెబ్భై వ పుట్టిన రోజు తర్వాత కిప్లింగ్ కాల గర్భం లో కలిసి పోయాడు .ఆయన్ను జాతీయ పొగరు బోతు అన్నారు  ఆయన కాలం అంతా బ్రిడ్జి ల నిర్మాణం స్టీం ఇంజిన్ ప్రాభవం ,వైర్లెస్ సృష్టి తో ఆధునికత తాండ వించింది .కిప్లింగ్ సైనిక పద ఘట్టనల పైనా ,నావికుల పాటలా మీదా ,ఇంజినీర్ ల పనులపైనా కవిత లల్లాడు .కాని అతని సమకాలికులు మాత్రం ‘’his triumph was the triumph of the Philistine ,that he could never appreciate the romantic spirit ‘’అని తేల్చి పారేశారు .’ ఎక్స్ ప్రెస్   ట్రైన్ ‘’ను ‘’confound Romance —-and all unseen –Romance  brought up the nine fifteen ‘’అని కిప్లింగ్ రాశాడు .

ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ రచయితలలో కిప్లింగ్ మొదటి తరం వాడు .గొప్ప బాలడ్ మేకర్ .’’full bodied and active verse that kipling excels ‘’అని ఇలియట్ కవి భావించాడు .’’దుర్గా దిన్ ‘’,డాన్నీ డీవార్’’కవితలను  ఫుల్ జోష్ తో రాశాడు .కిప్లింగ్ కవితల కిప్లింగులు సాధారణం గా  జానపద పాటలుగా ఉంటాయి . స్కౌట్ ఉద్యమానికి సాయం చేశాడు దాని నిర్మాత బెదేన్ పావెల్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ లోని అనేక వాక్యాలను ఉదాహరించాడు .నెహ్రు ‘’కిం ‘’తన ఫేవరైట్ రచన అన్నాడు

Rudyard Kipling.jpg

 

 

మొదటి నోబెల్ బహుమతి పొందిన ఐర్లాండ్ కవి – విలియం బట్లర్ ఏట్స్

కవి నాటక రచయితా అయిన విలియం బట్లర్ ఏట్స్ ఐర్లాండ్ లో  డబ్లిన్ లో ని శాండీ మౌంట్ లో ప్రోటేస్తంట్ గా 13-6-1865న పుట్టాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లు .తండ్రి జాన్ బట్లర్ యేట్స్ట్స్ కళా కారుడేకాక రాయల్ హేబెర్నియాన్ అకాడెమి సభ్యుడు కూడా .ఐరిష్ రివైవల్ సాహిత్యంను ముద్రించిన కువాలా ప్రెస్ వీరి బంధువులదే .సోదరుడు జాక్  ల్యాండ్ స్కేప్ పెయింటర్ .చిన్నప్పుడే కుటుంబం లండన్ చేరింది .తల్లి పుట్టిల్లు  కౌంటే స్లిగో లో వేసవిలో క్లాసులకు వెళ్ళేవాడు .అది అడవీ ప్రాంతం. గాలిక్  ఫాంటసి  కి నిలయం .డబ్లిన్ మెట్రోపాలిటన్ స్కూల్  ఆఫ్ ఆర్ట్ లోచేరి టర్నర్ శైలిలో బొమ్మలు తయారు చేశాడు .

ఇరవై ఒకటిలో మొదటి పుస్తకం ‘’మోసడా ‘’రాసి అచ్చ్చేశాడు .లండన్ వచ్చి ఎర్నెస్ట్ రాయి తో కలిసి ‘’రైమేర్స్ క్లబ్ ‘’ఏర్పరచాడు .ఇది ఫ్రెంచ్ సిమ్లిజం మొదలైన ఆధునిక టెక్నిక్ ల గురించి ఆలోచించేది .డబ్బులు లేక గుర్రం మీద వెళ్ళలేక నడిచి డబ్లిన్ నుండి లండన్ చేరేవాడి నని  రాసుకొన్నాడు .తన జీవిత చరిత్రలో తానొక కొత్తమతాన్ని కవిత్వం ఆధారం గా నిర్మించానని చెప్పాడు .ఇది సగం  ఊహ సగం గారడీ .చివరకు థియాస ఫిస్ట్ అయ్యాడు .మేడం బ్లా వత్స్కి  అనుచరుడు గా పేరు పొందాడు .దెయ్యాలను పిలవటం మాట్లాడించటం లో సిద్ధ హస్తుడని పించాడు  కాని అసలైన ఫిలాసఫీ ఏమిటో తెలిసేదికాదు .అంతఃకరణ విలువ అర్ధం కాలేదు .

సిగ్గు పడే మనస్త్వం .’’హేర్మటిక్ స్టూడెంట్స్ ఆఫ్ ది గోల్డెన్  డాన్’’బృందం లో చేరాడు .ఇందులో మాయలు మంత్రాలు మాజిక్ ఎక్కువ .కవిత్వమే మార్గమని తెలుసుకొన్నాడు .సెల్టిక్ రివైవల్ లో చేరే నాటికి ఏట్స్ స్పిరిటిస్ట్, ,నేషనలిస్ట్ అని పించాడు .అప్పుడే ఐర్ లాండ్ లో   రెండు ఉద్యమాలు మొదలైనాయి .మొదటిది ‘’’గేలిక్ లీగ్ ;;’’ ప్రాచీన ఐరిష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం గేలిక్ ను జాతి భాష గా చేయటం వీరి ధ్యేయం .సహకార వ్యవ సాయం చేసి అధిక దిగు బడి సాధింఛి  జీవన  స్తితి గతులను మెరుగు పరచటం రెండోది  .వీటితో జాతీయ సాంస్కృతి పునర్ వైభవం పొందింది కమ్య్యూనిస్తులు ,జానపదులు ,విద్యా వేత్తలు కవులు రచయితలూ  అంతా కలిసి వచ్చి ఉద్యమాలను నడిపి అనుకొన్నవి సాధించారు .జార్జి రసెల్ ‘’ఏ .యి ‘’ అనే మారు పేరుతో కవితలు రాశాడు .ఉద్యమం ఊపు అందుకోగానే నిర్వాహకులు రాడికల్స్ గా మారి పోయారు .ద్వేషాలు పెరిగాయి .ఐరిక్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది . కవుల రక్తం తో నూతన ఫ్రీ ఐర్లాండ్ జన్మించింది . .గేలిక్ లీగ్ వ్యవస్తాపకుడు డగ్లాస్ హైడ్ అనే కవి ఐర్లాండ్ మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు  .

ఈ ఉద్యమకార్యక్రమాలకు   ఐరిష్ లిటరరీ దియేటర్  వేదిక అయింది .దీనితో మనకవి యేట్స్ట్స్ కూ పాత్ర ఉంది .మాడే గొన్నె అనే అందమైన అమ్మాయి ప్రేమలో పడిపోయాడు .ఉద్యమం లో ఆమె ‘’ఫైర్ బాండ్ ‘’పాత్ర వహించింది .ఈ విజయం తో ‘’కేతలీన్ ని హౌలిహాన్ ‘’నాటకాన్ని దేశ భక్తీ ప్రధానం గా రాసి ,అందులో కేతలీన్ అనే యువతి త్యాగాన్ని ధైర్యాన్ని సాహసాన్ని ఉద్యమం నడిపిన తీరును గొప్ప గా ప్రదర్శించి అందరి మెప్పూ పొందాడు .ముప్ఫై కే  ఆరు పుస్తకాలు రాసి ప్రచురించాడు .కొద్ది ప్రతీకలు మాత్రమె వాడాడు .క్రమంగా సంపూర్ణ కవి గా రూపొందాడు .యాభై వచ్చేసరికి సెంటి మెంట్ ను ,అలంకారాలను వదిలిన్చుకొన్నాడు .ఐర్లాండ్ రాజకీయ సంక్షోభామూ దానికి కారణ మైంది .1913లో ‘’romantic Ireland is dead and gone –it is with o Leary in the grave ‘’ అని ప్రకటించాడు .’’రేస్పాన్సి బిలిటీస్ ‘’పుస్తకం పేరు లోనుంచే ఈ మార్పు ను తెలియ జేసి ప్రజా కవిత్వం రాశాడు .’’ఏ కోట్ ‘’అనే కవిత లో

‘’I made my song a coat –covered with embroideries –out of old mythologies ‘’ అని ధ్యేయాన్ని ప్రకటించాడు .అయన రాసిన ‘’the fools caught it –wore it in the world;s eyes –as though they ;d wrought it’’ అన్న పంక్తుల్ని పదే పదే చదివారు జనం .తర్వాత దీన్నీ కాదనుకొన్నాడు .’’ఎస్సేస్ ‘’రాసి ప్రజల్లో ఉన్న నమ్మకాలు ,పాత విధానాలు ఐర్లాండ్ లో రొమాంటిక్ కవితలు ప్రభవిల్లిన నేపధ్యం పై రాశాడు .’’ది వైల్డ్ స్వాన్స్ ఎట్ కూలే ‘’లో మానసిక వాస్తవాలను చెప్పాడు .తర్వాత అయిదేళ్లకు ‘’లేటర్ పోయెమ్స్ ‘’ప్రచురించాడు .

క్రమంగా మంత్రాలు మాజిక్ తంత్రాల వైపు  మళ్లాడు .సూపర్ నేచురలిజం వైపు కదిలాడు .’’సియాన్స్ ‘’కు వెళ్ళాడు .ఈ అన్వేషణలో జార్జీ హైడ్ లీ ని చూసి ఆరేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆమెతో కలిసి ‘’ఆటో మేటిక్ రైటింగ్ కమ్మ్యూనికేటర్లు డిక్టేట్ చేస్తుండగా  ‘’ప్రాక్తీస్స్ చేశాడు . దీని ఫలితం గా ‘’ఏ విజన్ ‘’రాసి అరవైలో ముద్రించాడు .డెబ్భై రెండులో కొంతమార్చి మళ్ళీ ప్రింట్ చేశాడు .’’’’to me it means a last act of  defence against the chaos of the world ‘’అని అదే పరిష్కారం గా నమ్మి నట్లు చెప్పాడు .రెండవ ఎడిషన్ వచ్చే సరికే ఏట్స్ గొప్ప గౌరవం పొందాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా ఉన్నాడు .1923లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు .ప్రపంచ ప్రసిద్ధకవి అయ్యాడు .యాభై వ ఏట నుంచి రాసిన కవిత్వం అంతా సుప్రసిద్ధమైంది .కవిత్వం లో స్పష్టత ,మేలిమి ,సాధికారత సాధించాడు .ఊహా ప్రపంచం ఫైరీ లాండ్ ను వదిలేసి వాస్తవ ప్రజలకోసం ,వారి  అభిప్రాయాలకోసం  అనుభవాన్ని రంగ రించి రాశాడు .’’in the whole man –blood imagination ,intellect running together .i am content to follow to its source every event in action or in thought ‘’అని నిజాయితీగా చెప్పుకొన్నాడు .

‘’ ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో ‘’when  such as I cast out remorse –so great a sweetness flows into the breast –we must laugh and we must sing –we are blest by every thing –every thing we look upon is blest ‘’అని  కమ్మని భావ ధార పొంగించాడు ..రాసిన ప్రతి కవితనూ తిరిగి రాస్తూ సాన బెడుతూ తీర్చి దిద్దాడు .ఏట్స్ కు కవిత్వం ఆసు దారగా వచ్చేస్తుంది అదీ ఆయన ప్రత్యేకత .ఫాసిస్ట్ కాదు కాని ఫ్యూడల్ భావాలున్న వాడు ఐర్లాండ్ కు దూరం గా ఇటాలియన్ రెవెరి లోని రాపెల్లో లో చివరి రోజులు గడిపాడు .చివరి దాకా రాస్తున్నా చివరి ముఖ్య గ్రంధం ‘’బైజాంటియం ‘’.ఇందులో యేట్స్ కవిత పర వళ్ళు తొక్కింది .సృజనలో ,ప్రతీకలు ఎంచుకోవటం లో అంతా నవ్యత కని  పించి ఉత్కృష్ట రచన అని పిస్తుంది .

డెబ్భై దాటిన తర్వాత బలహీన పడ్డాడు .బతకటం కంటే చావే మేలనిపించేది .1938శీతాకాలాన్ని భరించ లేక పోయాడు .న్యాయం గా అదేమంత చలికాదు కాని శరీరం తట్టుకోలేక బ్రేక్ డౌన్ వచ్చి కోమా లోకి వెళ్లి గుండె ఆగి 28-1-1939న నైస్ లోని రాక్ బర్న్ లో యేట్స్ చనిపోయాడు .రాసిన నాటకాల పై జనం ద్రుష్టి ఇప్పుడు లేక పోయినా కవిత్వాన్ని ఇంకా ఆరాధిస్తున్నారు .చనిపోయిన పన్నెండేళ్ళ కు ‘’ది పెర్మనేన్స్ ఆఫ్ యేట్స్ ‘’అనే పుస్తకాన్ని ఇరవై నలుగురు విమర్శకుల వ్యాసాలతో ప్రచురించి ఘన నివాళి సమర్పించారు .’’we no longer listen to the half conscious music of a trance but to the deliberate and un compromising note of truth ‘’అంటూ శ్రద్ధాంజలి ఘటించారు . Nobel Committee described as “inspired poetry, which in a highly artistic form gives expression to the spirit of a whole nation.” అని మెచ్చింది .రవీంద్రుని గీతాంజలి ఆంగ్ల అనువాదానిక్ యేట్స్ ముందు మాట రాశాడు .సంప్రదాయ కవిత్వం లో మేటి .చరిత్ర పునరా వృత్తం అవుతుందని నమ్మే వాడు అందుకే  that his age represented the end of the cycle that began with the rise of Christianity.’’ అని చెప్పుకున్నాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరా బాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46

సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్

‘’గడ్డి పరకలు ‘’కు కావ్య గౌరవాన్ని సాధించి సమాజం లోని అన్ని వర్గాల వృత్తుల మనుషులకు గౌరవం కలిపించి ఇంగ్లాండ్ భావ దాస్యానికి భరతం పట్టి తేర దించి అసలు సిసలు అమెరికన్ కవిత్వాన్ని రాసిన వాడు జాతీయ కవిగా గుర్తింపు పొందిన వాడు వాల్ట్ విట్మన్ . 31-5-1819న అమెటాంరికా లోని లాంగ్ ఐలాండ్ లో హంటింగ్టన్లో వెస్ట్ హిల్స్ లో జన్మించాడు .తొమ్మిదిమంది సంతానం లో రెండవ వాడు .తండ్రి కార్పెంటర్ .కుటుంబాన్ని బ్రూక్లిన్ కు మార్చాడు .తండ్రికి ‘’టాం పైన్’’  అంటే వీరాభిమానం .ముగ్గురు కొడుకులకు అదే పేరు పెట్టుకొన్నాడు .మిగిలిన వారికి జార్జీ వాషింగ్ టన్ ,థామస్ జెఫర్సన్ ,ఆండ్రూ జాక్సన్ అని ప్రేసిడెంట్ల పేరు పెట్టుకొని మురిశాడు . పెద్దన్న సిఫిలిస్ వ్యాధి కి గురైనాడు .ఒక చెల్లెలు నరాల బలహీనత తో ఇబ్బంది పడింది .ఒక అన్న వాటర్ వర్క్స్ లో పని చేసేవాడు ఈ నేపధ్యం లో విట్మన్ పెరిగాడు .

పదకొండవ ఏట స్కూల్ చదువు పూర్తీ చేశాడు .ప్రింటర్ దగ్గర సహాయకుడైనాడు .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రిక ప్రెస్ లో పని చేశాడు .యువకుడిగా చాలా  రెస్ట్ లెస్  గా ఉండేవాడు .బతకటానికి అనేక పనులు చేశాడు. ఏదీ సంతృప్తినివ్వలేదు .న్యూ యార్క్ లో కంపోజిటర్ గా పని చేశాడు .స్కూల్ టీచర్ అయ్యాడు .చాలా కౌంటీ స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు .ఇరవై లో లాంగ్ ఐలాండర్ ప్రెస్ కొన్నాడు .ఒక ఏడాది స్వంత పత్రిక తేవాలని ప్రయత్నించి విఫలుడై మళ్ళీ ఉద్యోగాన్వేషణ లో పడ్డాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక పోయాడు .ఆరేళ్ళు అరడజన్ పత్రికలలో పని చేశాడు.చివరికి ఇరవై ఎనిమిదో ఏట ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే కొన్ని వచన రచనలు కొన్ని కవితలు రాశాడు .చిన్న కధలూ రాశాడు .’’ది ఇంకాస్ డాటర్ ‘’అనే బాలాద్ద్ స్తాన్జాలను రాసినట్లు  అందరూ మర్చి పోయారు . .ఈగిల్ సంపాదకుడిగా ముప్ఫై వ ఏడు వరకు పని చేశాడు .’’సోగ్గాడు ‘’వేషం తో ఉండేవాడు ఎప్పుడూ .అదే తరువాతతరానికి ఫాషన్ అయింది .న్యు ఆర్లియాన్ దిన పత్రిక ‘’డైలీ క్రిసేంట్ ‘’లో పని కుదిరింది .తమ్ముడు జెఫ్ తో కలిసి న్యూ ఆర్లియాన్స్ అంతా తిరిగి చూశాడు .మూడు నెలల తర్వాతా బ్రూక్లిన్ చేరాడు .ఫ్రీమన్ వార పత్రిక  కు ఎడిటర్ అయ్యాడు . హోమో సెక్సువల్ అయ్యాడు అమ్మాయిలతో తిరిగాడు .ముప్ఫై వ ఏట కవితాశైలి  పై ప్రయోగాలు చేశాడు .ఇది అతనికీ కొత్తా సాహితీ లోకానికి ఇతనూ కొత్త .స్వేచ్చగా ,నిబంధనలేని రైమ్స్ తో రాయటం మొదలు పెట్టాడు . కొంత మిస్టిజం ఉండేది .తన గురించి తన కవిత్వం గురించి చెప్పుకొన్నాడు –

‘’I am the poet of the body –and I am the poet of the soul –I go with the slaves of the earth equally with masters –and I will stand between the masters and the slaves –I will buoy you up –every room of your house do I fill with armed men –lovers of me ,baffles of hell-sleep for ,I and they stand guard this night .god and I are now here –speak !what would you have of us’’ఇదొక కొత్త గొంతు కొత్త భావం కొత్త ఆలోచన అందర్నీ తనతో తీసుకు వెళ్ళే ఆలోచన .అందర్నీ సమానం గా చూసే తత్త్వం .నోట్ పుస్తకం లో గిలికిన కవితలు పన్నెండిటిని  బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో అచ్చు వేశాడు .వీటికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’అని పేరు పెట్టాడు .అమెరికా స్పిరిట్ తో రాసిన కవితలివి .1855లో ఇవి లాంగ్ ఫెలో కవి రాసిన ‘’హైవాత ‘’తో బాటే ప్రింట్ అయ్యాయి .విట్మన్ తో అమెరికా జాతీయ కవిత్వం ఆవిర్భ వించింది .అమెరికా గొంతు విని పించింది .అమెరికా ఆశయం ప్రతిధ్వనించింది .దీనితో పేరు ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొన్నాడు .ముఖ చిత్రం మీద ఈ మార్పు ను స్పష్టం గా చూపించాడు .ఎవరికీ భయపడని మనిషిగా ,కోటు లేకుండా ,చొక్కా పైభాగం ఓపెన్ గా రంగుల లోపలి చొక్కా తో పోకిరీ పోజుతో  దర్శన మిచ్చాడు ముఖ చిత్రం పై .అప్పటినుండే విట్మన్ లిజేండరి ప్రారంభమైంది .

విట్మన్ లెజెండ్ అయిపోయాడు.దానికోసం అహరహం శ్రమించాడు. రాసినది చిత్రిక పడుతున్నాడు .రాయాల్సిన దానికి ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .తనను కూలీల సహచరిడిగా ,చదువు రాని వారి స్నేహితుడి గా చెప్పుకొన్నాడు .మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు .వారిలో మమేకమయ్యాడు .ప్రజాస్వామ్యకవి గా దాని విలువల రక్షకుడయ్యాడు .అప్పటిదాకా అమెరికన్లు సామాన్యులతో కలిసి పని చేయటానికి ఇబ్బంది పడ్డారు .లేబర్ ని దూరం చేశారు .వారి గురించిన కవిత్వమే రాలేదు .వీరందరినీ భాగ స్వాములను చేసి కవిత్వం రాశాడు కొత్త చరిత్ర సృష్టించాడు అదో జగత్ సహోదరులకు అండా దండా గా నిలిచాడు .ఇవేమీ పట్టించుకోని విమర్శక గణం  అతని తాగుడు వ్యభిచారం పొగరు బోతుతనం పోకిరీ వేషాల గురించేరాశారు కాని కవిత్వం గురించి పట్టించుకోలేదు .తన డబ్బా తానె కొట్టుకొంటున్నాడన్నారుకూడా .అతనికవితలు నిజం గానే గడ్డిపరకలని తొక్కి పారేయ దగ్గవని అతను సగం మనిషి సగం  జంతువూ అని ఈసడించారు .అమెరికాలోనే కాదు యూరప్ లో కూడా .విట్టియర్ కవి లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని నిప్పుల్లో వేసి కాలిస్తే ,లోవెల్ ‘’హంబగ్ ‘’కవిత్వమని కొట్టి పారేశాడు .

అయితే మేధావి కవి ఫిలాసఫర్ ఎమర్సన్ మాత్రం ఏంతో మెచ్చుకొన్నాడు ‘’dear sir –I am not blind to the worth of the wonderful gift of leaves of grass .I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy .i give you the joy of your free and brave thought I find the courage of treatment which so delights us .i greet you at the beginning of a great career ‘’అని మనస్పూర్తిగా ఆశీర్వ దించాడు ఆ యోగి  మహర్షి కవి వేదాంతి ,ఉత్తమ దేశికుడు అదే ఆశీర్వాదం అయింది .ఇక విట్మన్ కవితా ప్రవాహానికి అడ్డులేకుండా పోయింది .విమర్శకుల జడి వానలు కురుస్తున్నా అప్రతిహతం గా సాగిపోయాడు .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో –‘’I celebrate my self and sing my self –and what I assume you shall assume –for every atom belonging to me good belongs to you ‘’ఇలా వ్యక్తులతో కలిసి పోయాడు .దీనితో కవితలూ పెరిగాయి .బృహత్ గ్రంధం గా 384 పేజీలతో నూట ఇరవై నాలుగు కవితలతో లీవ్స్ ఆఫ్ గ్రాస్ రూపు దాల్చింది .తొమ్మిదో ఎడిషన్ లో మరిన్ని కవితలు చేరాయి .ఇంకా విమర్శకులు ఉస్త్ర పక్షి ద్రుక్పధాన్నే పాటించి కళ్ళు మూసుకొంటూనే ఉన్నారు .అయినా ఏదీ ఆగ లేదు .ప్రజలు ఏంతో ఇష్టం గా చదివారు ఆదరించారు తమకొక అన్నయ్యా తమ్ముడు మామయ్యా బాబాయి లభించాడని ఊరట చెందారు .బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు .కాని ఆదాయం రాలేదు. మళ్ళీ జర్నలిజం లో ప్రవేశించాడు .

రాజకీయం గా కలత చెందాడు ,స్లేవరిని సమర్ధించే వారేక్కువైనారు .బానిసల పై దయా సానుభూతి చూపే వారే కరువైనారు .దీనితో మనసు వికలమైంది విట్మన్ కు .అమెరికా పై పెట్టుకొన్న ఆశలు అడియాసలయ్యాయి .రాజ్యమే కాదు ,మనుషులూ దగా చేశారనుకొన్నాడు .కోపం ఉద్రేకం పెరిగి ఐరనీ తో ఒక కవిత రాశాడు దాన్ని గ్రాస్ లో చేర్చలేదు –‘’I pronounce openly for a new distribution of roles —–let the sun and moon go –let scenery take the applause of the audience –let there be apathy under the stars –అని ఆవేశం గా ఆలోచనాత్మకం గా కదిలించేలా రాశాడు .డైలీ టైమ్స్ లో పని చేశాడు .యుద్ధం లో చేరి పోరాడాలని భావించాడు ముసలితనం అడ్డమొచ్చినది .క్వేకర్ భావాల వాడుకనుకతుపాకి పట్టలేదు .  .సోదరుడు యుద్ధం లో తీవ్రం గా గాయ పడ్డాడు అతని సేవ చేశాడు .వాషింగ్ టన్అంతా ఒక హాస్పిటల్ గా మారి క్షత గాత్రుల ఆర్తనాదాలతో మారు మొగి పోతోంది .’’హాస్పిటల్ విజిట్స్ ‘’పేర ఆర్టికల్స్ రాశాడు .అంగ వికలురైన సైనికులకు  కట్లు కట్టి విట్మన్ సేవ లందించాడు .ప్రతి క్షణం దయా సాను భూతితో అలుపు లేకుండా   సేవ చేశాడు .అందరూ తన వాళ్ళే అనుకొన్నాడు . తన జీతం లో కొంత భాగం తో పొగాకు ,స్టాంపులు తిను బండారాలు ,పండ్లు ,పాలు బిస్కెట్లు చాకో లెట్లు పుస్తకాలు  కొని గాయ  పడిన సైనికులకు ఇచ్చి వారిలో ధైర్యం ,ఉత్సాహం జీవితేచ్చ కలిగించేవాడు .ఉత్తరాలు రాసి పెట్టేవాడు .’’డ్రం –టాప్స్ ‘’లో వీటిని వివరించాడు .కవిత్వం లో మానవత్వాన్ని ఎలిగెత్తి చాటటమే కాదు ,దాన్ని ఆచరించి చూపి సాటి వారి యెడ ఆత్మీయతానురాగాలను ప్రదర్శించి ,సాను భూతితో సేవలందించిన మానవీయ మాననీయ కవి విట్మన్ .ఈ సంఘటన తర్వాత అతన్ని బాగా అర్ధం చేసుకొన్నారు .గౌరవ ఆదరాలిచ్చి మెచ్చుకొన్నారు

అమెరికా ప్రజలు అత్యంత కృతజ్ఞతా భావాన్ని విట్మన్ పై ప్రదర్శించి అభిమానాన్ని చాటుకొన్నారు .అబ్రహాం లింకన్ కాబినెట్ లో’’ఇండియన్ బ్యూరో ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లో  గుమాస్తా ఉద్యోగం దీని ప్రభావం వలననే దొరికింది . ఇంటీరియర్ కు సెక్రెటరి అయిన జేమ్స్ హార్లాండ్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకాన్ని ఒక డ్రాయర్ సొరుగు లో చూసి చదివి భయపడి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాడామో నని తొందరపడి ఉద్యోగం తీసేశాడు .దీనికి విట్మన్ స్నేహితులు తీవ్రం గా స్పందించి ‘’గుడ్ గ్రే పోయెట్ ‘’పేర కరపత్రం విడుదల చేశారు .ఖంగు తిన్న ప్రభుత్వం తప్పు తెలుసుకొని ‘’అటార్నీ జెనరల్ ‘’శాఖ కు బదిలీ చేసింది .యాభై మూడవ  ఏడు వచ్చేవరకు అందులోనే హాయిగా సెక్యూర్ గా పని చేశాడు …తరువాత మళ్ళీ కవి రోడ్డున పడాల్సి వచ్చింది .తను రాసిన పాసేజ్ టు ఇండియా ,డెమోక్రాటిక్ విస్టా పుస్తకాలను డాలర్ కు డెబ్భై అయిదు సెంట్లకు అమ్ముకొని జీవించాడు .మెదడులో ఏదో అలజడి అనుభవించాడు .బహుశా రోగ గ్రస్తుల  పుండ్లుపు కడిగి డ్రెస్సింగ్ చేయటం వలన బాక్టీరియా తలలోకి ప్రవేశించి ఉండవచ్చునని భావించారు .తల్లి హృదయం తో మగ వాడిగా సేవ లందించాడు .వాషింగ్ టన్ అంటే ఇష్టం. అక్కడికి వెళ్లి సైనికులకు సేవలు చేస్తూనే ఉన్నాడు .అందరిని ప్రేమ దయ తో పలకరించికష్ట సుఖాలు తెలుసుకొని సహాయం అందించేవాడు .మాత్రు హృదయం తో సేవ చేస్తున్న ఈ ‘’గడ్డం కవి ‘’ని చూసి అమితాశ్చర్య పోయారు .చదివి కృతజ్ఞతలు చెప్పారు .విట్మన్ ‘’మగాడుగా మహిళ’’ గా అందిస్తున్న సేవలకు పులకించి పోయారు .తన ఆరోగ్యాన్ని గూర్చి గొప్పగా చెప్పుకొని తల్లికి జాబులు రాసేవాడు .తనను ‘’వైల్డ్ బఫెలో ‘’అనుకోనేవాడు .యాభై ఏళ్ళకు ఈ ముదురు బెండకాయ బ్రహ్మ చారికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది తనకూ ఒక కుటుంబం కావాలని తపించాడు .

తల్లిని సందర్శించైనా కొన్ని నెలలకే న్యు జెర్సీ లోని కామ్దేన్ లో  తల్లి చనిపోయింది .హతాశుడయ్య్యాడు .జార్జి ఇంటిపైభాగాన ఒక గది ఉండటానికి ఇచ్చాడు .కామ్దేన్ లో ‘’కామ్ ‘’గా ఉంటున్నాడు .ఒక్కసారిగా ముసలి వాడైనట్లు కని  పించాడు .డిప్రెషన్ ,ఫిట్స్ తో బాధ పడ్డాడు .పుస్తకాలను ఎవరూ ప్రింట్ చేయటానికి ముందుకు రానందుకు కున్గిపోయాడు .అదే  ఆధారం అనుకొంటే ఇలా అయింది .కొద్ది గా ఆరోగ్యం బాగు అవగానే కొలరాడో వెళ్లి లింకన్ పై ఉపన్యాసాలిచ్చాడు .’’లిలాక్స్ లాస్ట్ ఇన్ ది డోర్ యార్డ్ బ్లూమేడ్ ‘’కవిత ను ‘’నేటివ్ క్లాసిక్ ‘’అని అందరూ కితాబిచ్చారు .అరవై అయిదు లో చిన్న దీపం ,చుట్టూ న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు .చని పోయిన సైలర్ భార్య ఇంటిని కని  పెట్టుకొని ఉండేది .అభిమానులు చందాలు పోగు చేసి పంపితే దానితో జీవించాడు .ముప్ఫై మంది శ్రేయోభిలాషులు ఒక గుర్రబ్బండీని సమకూర్చారు .

అరవై తొమ్మిది లో పక్ష వాత లాక్షణాలు కని పించాయి .కిడ్నీ బాధ ఎక్కువైంది .డెబ్భై వ పుట్టిన రోజున ఫిలడెల్ఫియా వెళ్లి లింకన్ పై ప్రసంగించాడు .చని పోతున్నా ఓడిపోకుండా ఉంటున్నాడు.ఒంటరిగా మేడ గదిలో .చనిపోతానని తెలిసి సమాధి నిర్మాణం గురించి ఆలోచించాడు .అప్పగింతలన్నీ పూర్తీ చేస్తున్నాడు .డెబ్భై రెండు లో చివరి ఎడిషన్ గా1891 లో లీవ్స్ ఆఫ్ గ్రాస్ ప్రచురించాడు .దీన్నే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అన్నారు .మొదట పన్నెండు తో మొదలైన పుస్తకం ఇప్పుడు మూడు వందలకు పైగా కవితలతో బృహత్ రూపం గా విట్మన్  కవితా విశ్వ రూపం గా అవతరించింది .న్యుమోనియా సోకి 26-3-1892న మానవేయ మహా కవి విట్మన్ మరణించాడు .పెళ్ళికాని బ్రహ్మ చరిగానే మిగిలి పోయాడు .విట్మన్ ఫిలాసఫీ లో అన్ని కలగా పులగం గా కలిసి పోయాయి .అమెరికాపై రాసిన ‘’సాంగ్ ఆఫ్ ఎక్స్పో జిషన్ ‘’ఒక జాటీయ గీతం లాంటిదే .అన్ని రాష్ట్రాలను అన్ని దేశాలను కలిపాడు విశ్వ పౌరుడనిపించాడు .

‘’Whitman became the voice of  a rapidly developing civilization .half idealistic half materialistc some times corrupt  but ever expanding America ‘’

అమెరికాను అమెరికా గా గుర్తించటానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేశాడు. ఇంగ్లీష్ భావ దాస్యానికి దూరం చేశాడు .జాతీయ రక్తం ప్రవహింప జేశాడు .ప్రజా స్వామ్య మానవుడి భవితను నిర్దేశించాడు .తను చేస్తున్న పనేమిటో పూర్తీ అవగాహన ఉన్న వాడు .’’I have allowed the stress of my poems from beginning to end to bear upon American individuality and assist it –not only because that it is a great lesson in nature ,amid all her generalizing laws ,but as counterpoise to the leveling tendencies of democracy ‘’అని ఆరాట పడిన దేశ భక్త కవి .లీవ్స్ లో అతనికల సాకారమైంది .అదొక మాన్యుమెంటల్ బుక్ అయింది .’’it is a national phenomenon in which a poet identifies himself not only with a continent but with the cosmos .uttering the word democratic the word en-masse ‘’he sings seemingly of himself but actually ‘’

.’’of life immence in passion pulse and power –cheerful ,for forest action ,formed under the laws divine –the modern man I sing ‘’అని ఆధునిక మానవుడికోసం గీతాలు రాశాడు గానం చేశాడు .దేశం కోసం తన వీర విధేయతను ప్రదర్శించాడు .తన ‘’గడ్డిపరకలు ‘’గురించి విట్మన్ ఏం చెప్పాడో తెలుసుకొంటేనే మజా –

‘’this is no book .who touches this ,touches a man ‘’అని పొంగిపోయి చెప్పాడు సాహిత్య చరిత్రలో పుస్తకాన్ని మనిషిని ఒకటిగా చేసిన కవి రచయితా లేనే లేదు .’’in it Whitman emerges a titanic and controversial figure –messianic ,intuitive ,and often mistaken ,roughhewn ,and lopsided ,but un questionably the most challenging writer of his time and of ours ‘’అని కీర్తి కిరీటం పెట్టారు .త్రాన్సలిండేజం ,రియలిజం ల మధ్య నిలిచాడు .’’the proof of a poet is that his country absorbs him as affectionately as he has absorbed it ‘’ అని చెప్పాడు .గడ్డిపరకలు అమెరికన్ మహా కావ్యం అయింది .Whitman is American poet .he is America ‘’అని మనస్పూర్తిగా మెచ్చాడు ఎజ్రా పౌండ్.బీట్ ఉద్యమానికి ప్రతినిధిగా వాగా బాండ్ గా నిలిచాదన్నారు .అతని అనుచరుల్ని ‘’ విట్మనైట్స్’’ అని పిలువ బడ్డారు .ఎందరో సంగీతకారులు అతని కవితలకు సంగీతం సమకూర్చి అజరామరం చేశారు .

 

Walt Whitman - George Collins Cox.jpg

 

కవిత్వం లో ఆత్మాన్వేషణ చేసిన –ఎమిలీ డికిన్సన్

10-12-1830 లో మాసాచూసేట్స్ లోని ఆంహెర్స్ట్ లో ఎమిలీ డికెన్ సన్  పుట్టింది .తండ్రి గ్రామీణ లాయర్ ,లెజిస్లేటర్ ,ప్రభుత్వ కౌన్సిల్ మెంబర్ .బాల్యం నుండే తిరుగు బాటు ధోరణి ఉండేది .మౌంట్ హోలీ యెక్ ఫిమేల్ సేమిటరి లో చేరింది .అక్కడి బోధనా మత పద్ధతిలో ఉండేది .మత గ్రంధాలను అందరూ బట్టి పట్టి చెబితే వాటి అంతరార్ధాన్ని గూర్చి ఆలోచించేది .క్రిస్టియన్ కావటానికి వ్యతిరేకత లేదని ఒక సారి క్లాసులో చెప్పింది .నల్ల కళ్ళు తెల్ల శరీరం ఒత్తైన జుట్టు తో అందం గా ఉండేది .

యుక్త వయసు రాగానే కవిత్వమే శ్వాస  అయింది .ఆమే కు సెక్రెట్ లవర్స్ ఉన్నారని చరిత్రకారులు రాశారు .ముప్ఫై రెండేళ్ళ వయసులో థామస్ హిగ్గింసన్ కు ఉత్తరం రాసి తన మనసులోని ఇద్దరి మగాళ్ళ గురించి తెలిపింది .న్యూటన్ తనకు ‘’అమరత్వం ‘’బోధించాడని అన్నది .

‘’my life closed twice before its close –it yet remains to see –if immortality unveil –a third event to me –‘’అని మనో భావాన్ని ఎరుక పరచింది .’’angels twice descending –reimbursed my store-burglar banker  father –I am poor once more’’అని ఎదురు చూసింది .న్యూటన్ చని పోయిన తర్వాత తండ్రితో వాషింగ్ టన్ ,ఫిలడెల్ఫియా లు చూసింది .ఇరవై మూడు లో ప్రెస్బిటేరియన్ చర్చి లోని చార్లెస్ వాడ్స్ వర్త్ ను ప్రేమించింది .ఆయనకు దేవుడి ధ్యాసేకాని’’ ఈ దేవీ ‘’ధ్యాసే లేదు .ఆంహీర్త్స్ కు తిరిగొచ్చి అపస్మారకం గా ఏదేదో రాసి పారేసేది .’’I can’t live with you –it would be life –and life is over there-‘’మొదలైన కవితలు రాసింది .విరహం భరించలేక ‘’so we must keep apart –you there I here –with just door ajar –that oceans are –and prayer –that pale sustenance –despairఅని నిరాశగా రాసు కొంది .తనను తానూ అంకితం చేసుకొంటానని ‘’a wife at day break I shall be –sunrise ,hast thou a flag for me ?at midnight I am but a maid –how short it takes to make it bride ! అంటూ మన ‘’మీరా బాయి ‘’లా వలపు వల విసిరింది .

తండ్రి చనిపోయాడు .అప్పటి నుండి అంటే ఇరవై అయిదు నుండి డికిన్సన్ ఒంటరిగా ఉండిద పోయింది .నలభై లో తండ్రి చిరకాల మిత్రుడు ,మాసా చూసేట్స్త్ సుప్రీం కోర్ట్ లో అసోసియేట్ జస్టిస్అయిన ఓటిస్ పి లార్డ్ కు సుదీర్ఘ ఉత్తరం రాసింది .1883 ఆరోగ్యం దెబ్బతిని ,శోక దేవతగా సుదీర్ఘ కాలం ఉండటం తో నరాలు బాల హీనమై ‘’బ్రైట్స్ డిసీస్ ‘’వచ్చి 15-5-1886న యాభై ఆరో ఏట చని పోయింది .ఆమె చని పోయిన చాలా కాలానికి కాని రచనలు ప్రచురణ కాలేదు .ఆమె సోదరి లావీనియా అన్ని రాత ప్రతులను స్వాధీన పరచుకొంది .పక్కింటి ఆయన మేబల్ టాడ్ స హాయం తో నూట పది హీను కవితలను లిస్టు రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ ఎమిలి  డికేంసన్ ‘’పేర1890లో పబ్లిష్ చేసింది .ఏడాది తర్వాత మరో నూట డెబ్భై ఆరు చేర్చి రెండవఎదిషన్  గా తెచ్చింది .ఎమిలీ ఉత్తరాలను రెండు వాల్యూములుగా తర్వాత తెచ్చారు .ఇవన్నీ సరైన పద్ధతిలో లేవు .ఆమె రాత అర్ధం కాక పోవటం గజి బిజీ గా ఉండటం తో సందిగ్ధత వచ్చింది .

లావియానా పక్కింటి టాడ్ తో స్థలం విషయమై తగాదా పడింది .కోర్ట్ కేసులు వచ్చాయి .ఆమె మరణం తో ఎమిలీ ఆస్తి పాస్తులన్ని మార్తా డికిన్సన్ కు దక్కాయి ‘’ది సింగిల్ హౌన్డ్ ‘’పేర ఇదివరకు ప్రచురిమ్పని 143 కవితలు అచ్చేశారు .ఎమిలీ చనిపోయిన యాభై ఏళ్ళకు ఇంకో నూట ముప్ఫై కవితలు దొరికి 1945లప్ ప్రచురింప బడ్డాయి1958 డికిన్సన్ ఆరాధకులు మూడు గ్రంధాలుగా ఆమె వచన సాహిత్యాన్ని  వెయ్యి ఉత్తరాలతో సహా ముద్రించారు .వీటితో ఆమె కవితా స్వరూపం తెలుసుకొనే వీలు కలిగింది .ఆమె కవితలు క్రమ విధానం లో ఉండవు. ఆలోచనలూ కొద్ది పాటివే .ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలుతుంది .ఒకదానితో ఒకటి కలిపేస్తుంది .కొన్ని పలుకు బడులు అర్ధమవటం కష్టమే .

‘’the brain is wider than the sky –for ,put them side by side –the one the other will contain –with ease ,and you beside .’’

 

 

స్ప్రుంగ్ రిథం ను ప్రవేశ పెట్టిన –   జేరాల్డ్  మాన్లి హాప్కిన్స్

హాప్కిన్ కూడా ఎమిలీ  డికేంసన్  లాగే చనిపోయిన తర్వాతే వెలుగు లోకి వచ్చాడు .ఆధునికకాలపు పాత ధోరణి కవి .మధ్యతరగతి వాడు .శతాబ్దాలుగా రైతులు .గ్రేట్ బ్రిటన్ లో హవాన్ కౌన్సెల్ జెనరల్ గా తండ్రి పని చేశాడు .అనారోగ్యం తో తండ్రి నలభై ఏళ్ళకే చనిపోయాడు .ఎనిమిదో ఏట కుటుంబం హాంప్ స్త్రేడ్ కు మారింది . 28-7-1844 లో హాప్కిన్స్ స్ట్రా ఫర్డ్ ఎస్సెక్స్ లో పుట్టాడు .గ్రామర్ స్కూల్ లో చదివి పదిహేనవ ఏట రాసిన ‘’ది ఎస్కోరియాల్ ‘’కవితకు బహుమతి పొందాడు .ఆక్స్ ఫర్డ్ బిల్లియోల్ కాలేజి లో చేరి ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జెస్ వద్ద చదివాడు .సునాయాసం గా కవితలల్లే వాడు బొమ్మలేసేవాడు .’’trees by their yield –are known  but I –my sap is sealed –my root is dry –if life within –I none can show (except for sin )-nor fruit above –it must be so –I do not love ‘’మొదలైన అందమైన కవితలు రాశాడు .’’I have desires to go-where spring not fail –to fields where flies no sharp and sided hail –and a few lilies blow ‘’వంటివి అద్భుతంగా రాశాడు చర్చ్  ఆఫ్ ఇంగ్లాండ్ లో ఇమడలేక కేధలిక్ అయ్యాడు .చివరి పరీక్ష తర్వాత రోహామ్ప్ టన్లో ‘’సాహిత్య శాస్త్రం ‘’(రేటారిక్ )లో ప్రొఫెసర్ అయ్యాడు .మూడేళ్ళు పని చేసి ప్రీస్ట్ హుడ్ కు సన్నాహం లో ఉన్నాడు .పదేళ్ళు కవిత్వం జోలికే పోలేదు .

పై అధికారి తేమ్స్ నదిలో  జర్మన్ స్టీమర్ ‘’ద్యూచ్ లాండ్ ‘’ మునిగి ఎందరి ప్రాణాలో నీటిలో కలిసి పోయి న విషాద దృశ్యాన్ని గురించి రాయమంటే మళ్ళీ కలం పట్టి  రాశాడు .ఇది వరకు ఎవరూ ఉపయోగించని కొత్త భాషలో ,తన జీవిత చరిత్రను జోడించి అత్యంత విషాదాత్మక కధనం గా రాశాడు .1877లో హాప్కిన్స్ కు ఆర్డినేషన్ జరిగింది .నలభై కే అధిక శ్రమ తో ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది .డబ్లిన్ యూని వర్సిటి కాలేజి లో ‘’చైర్ ఆఫ్ క్లాసిక్స్ ‘’అది రోహించాడు కవిత్వం రాయటమే కష్టమైంది .జీవిత చరమాంకం లోనే గొప్ప కవిత్వం రాశాడు .నలభై అయిదవ ఏట ‘’ఐ యాం సో హాపీ ‘’అనుకుంటూ అనాయాసం గా మరణించాడు .

హాప్కిన్స్ చని పోయిన ముప్ఫై ఏళ్ళకు 1918లో ‘’పోయెమ్స్ ఆఫ్ జేరాల్ద్ మాన్లీ హాప్కిన్స్ ‘’పేరిట కొన్ని కవితలను బ్రిడ్జెస్ అనే ఆయన సేకరించి ముద్రించాడు .హాప్కిన్స్ కవిత్వం అంత తేలికగా  అర్ధం కాదు. కఠిన పదాలు అన్వయ క్లిష్టత ఇబ్బంది పెడతాయి .’’or to-fro tender trambeams truckle at the eye ‘’ఇదీ ధోరణి .అలంకారాలను మధ్యలోనే వదిలేసి గందర గోళం సృష్టిస్తాడు .భరించటం కష్టమే నని పిస్తుంది .సాంప్రదాయ కవితను ఇమేజరీ తోకలిపి రాశాడు .’’స్ప్రుంగ్ రిధం ‘’ను ప్రవేశ పెట్టాడు .రొమాంటిక్ –మోడరన్ కవులకు వారధిగా నిలిచాడు .

GerardManleyHopkins.jpg

 

 

ఇరవైయవ శతాబ్ది ఉదయం

పందొమ్మిదో శతాబ్దం తమాషా గా అంతమైంది .మర్యాద పద్ధతుల్ని అడ్డుకొన్నారు .అనేక భూమికలేర్పడ్డాయి .యువతులు పెద్దలపై తిరుగు బాటు చేశారు .మహిళా వోటు హక్కు ఒక ధ్యేయమైంది .యువకులు నిత్య ప్రార్ధనలకు వెళ్ళే వారు కాదు ‘’.ది సావాయ్ ‘’,ది ఎల్లో బుక్ ‘’అనే రెండు మేగజైన్లు ఈ హక్కులకు వేదికగా నిలిచాయి .ఎర్నెస్ట్ డౌసన్ అనే కవి తెగ తాగి ముప్ఫై మూడుకే చచ్చాడు .లిఒనేల్ జాన్సన్ అనారోగ్యం తో ముప్ఫై అయిదేళ్ళకే పోయాడు .జాన్ డేవిడ్ సన్ తిరస్కరణకు గురై యాభై అయిదులో ఆత్మ హత్య చేసుకొన్నాడు .ఆర్టిస్ట్ ఆబ్రే బియర్డ్స్ఇరవై ఆరుకే క్షయ తో చనిపోయాడు .కవి, రచయితా ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ఎనభై దాకా జీవింఛి నాటకాలు కవితలు రాసి సెన్సేషన్ సృష్టించాడు .ఆస్కార్ వైల్డ్ యాభై ఆరులో జైలు పాలై రెండేళ్ళ తర్వాత రచనా లోకం నుండి నిష్క్రమించాడు .

వీరికి  ఒక ధ్యేయం లేదు జీవిత సూత్రం లేదు .అయితే ‘’కళకళకోసమే’’ అని మాత్రం నిన దించారు .గిల్బర్ట్ మాత్రం ఒక కన్ను బ్రిటిష్ ప్రజల మీద రెండో కన్ను ఫ్రెంచ్ వాళ్ళపై ముద్ర వేయటం పైనా ఉంచాడు .లండన్ ఇనుప కచ్చడాల మధ్య నలిగింది .దీన్నే ‘’ఫాల్లెన్ మాగ్డ లేన్సేస్’’అన్నారు .విక్టోరియన్ శకం ముగింపు కొచ్చింది .ఏ బ బాల్ రూమ్ కు వెళ్ళినా అరడజను మంది  చెట్టా పట్టా లేసుకొని సానేట్స్త్స్ పాడుకొంటూ కనిపించారు .ఇంగ్లీష్ యువకులు ఫ్రెంచ్ పార్నాసియాన్ లను అనుకరించారు .పతనమై పోతున్న సంస్కృతికి అద్దం పట్టింది .’’fin de siecle’’అని దీనికి పేరు పెట్టారు .క్షీణ సంస్కృతీ అనవచ్చు .’’a swan song and a death bed repentence ‘’అని వాపోయారు .దింపుడు కళ్ళం ఆశ అన్నమాట .పదేళ్ళు ప్రభావం చూపిన ఆస్కార్ వైల్డ్ ఒక అభియోగం లో ఇరుక్కొని అతని ‘’ఈస్థటిక్ ఉద్యమం ‘’పతనమైపోవటానికి సిద్ధమైంది .గిల్బర్ట్ రాసిన ‘’పెషేన్స్ ‘’లోని సెటైర్లు ,రాబర్ట్ హిచిన్సన్ రాసిన ‘’గ్రీన్ కార్నేషన్ ‘’చావు దెబ్బలే కొట్టాయి .జీవితం అస్తవ్యస్తమై విపరీత ధోరణులకు నిలయమై పోయింది .

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లోనూసంస్కృతీ లో  ద్వంద్వ ధోరణలు వచ్చాయి .కొత్త ఆలోచనలు భావాలు ,చెప్పటం లో నూతనత్వం ఒక ప్రక్కన ,పాత పద్ధతులే శరణ్యం అని మరో ప్రక్కన ద్రుక్పదాలేర్పడ్డాయి .ఒకే వ్యక్తీ ఈ రెండిటిలోనూ నిష్ణాతుడై రాసిన వారున్నారు .కొందరు ఒకే దాన్ని పట్టుకు పాకులాడారు .విధాన భేదాలేర్పడ్డాయి .’’the proper school to learn art in is not life but art ‘’అన్నాడు ఆస్కార్ వైల్డ్ .కాని ఆర్ధర్ సిమాన్స్ మాత్రం ‘’life and nature were merely the crude materials which were to be woven cunningly into beautiful patterns ‘’అని చెప్పాడు ఈ భిన్న పాయలలో సాహిత్యం ప్రయాణించింది .ఫ్రాన్సిస్ థామ్సన్ మాత్రం సనాతన  భగవదన్వేషణ లోమునిగి పోయి కవిత్వం రాశాడు .ఆయన్ను గురించే మనం తర్వాత  తెలుసుకో బోతున్నాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45

అమెరికా కవులు –

మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని  కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా చదివి నా ప్రాక్టీస్ చేయలేదు .ఆఫీసు పెట్టినా క్లైంట్ ల కంటే పబ్లిషర్లు ఎడిటర్లను ఆకర్షించాడు .’’పెన్సిల్వేనియా ఫ్రీమన్ ‘’పేపర్ లో బానిసత్వ నిర్మూలనపై వ్యాసాలూ రాశాడు .మెక్సికో తో యుద్ధం వలన బానిస రాష్ట్రాలు  పెరుగుతాయని భావించాడు ‘’బిగ్లో పేపర్స్ ‘’లో సెటైర్లు దంచి రాశాడు .మొదటి కవితా సంపుటి ముద్రించాడు .ఇరవైలో ‘’ది విజన్ ఆఫ్ సర్ లాంఫాల్ ‘’రాసి రొమాంటిక్ అభిరుచి ఉన్నవారిని ఆకర్షించాడు .బిగ్లో పేపర్స్ లో ‘’బోస్టన్ కొరియర్ ‘’ ప్రారంభించి భిన్నత్వ ధోరణిలో నడిపాడు .యుద్ధ వ్యతిరేకం గా ఎన్నో కవితలు రాసి మెప్పించాడు .

‘’ez for war I call it murder –there you have it plain an flat –I donot want to go no further ‘’అన్నాడు ‘’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’రాసి తేలిక విషయాలపై దృష్టినీ పెట్టాడు .ఎమర్సన్ పో ,బ్రయంట్ మొదలైన వారి నందరిని ఉతికి ఆరేశాడు .

ఒక ఏడాది యూరప్ లో గడిపాడు .భార్య చనిపోయింది రచనలో మునిగాడు .లాంగ్ ఫెలో చైర్ కు ఎంపికైఆధునిక భాషలపై అనేక ఉపన్యాసాలిచ్చాడు .జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ భాషల్లో పండితుడైనాడు .స్పెయిన్ దేశానికి మంత్రి అయ్యాడు .రెండవ భార్య ఇంగ్లాండ్ లో ఉండగా చనిపోయింది .అమెరికా తిరిగి వచ్చి అనేక విమర్శనాత్మక వ్యాసాలూ రాశాడు .పది వాల్యూముల గ్రంధ రచన చేసిన ఉద్దండ పండితుడు .వందేళ్ళ వరకు రాయాల్సిన వన్నీ సిద్ధం చేసుకొన్నాడు .కాని పుట్టిన ఇంటిలోనే 12-8-1891న డెబ్భై రెండేళ్లకే చనిపోయాడు ..మధురమైన భాషలో కవిత్వం రాశాడు .రైమింగ్ బాగా తెలిసిన వాడు .మాండలికానికి హోదా ,గౌరవం కల్పించాడు .నిజాయితీ గా అసలైన యాంకీ గా ‘’హ్యూమర్ ను హ్యూమన్ ‘’ను మేళవించాడు .అమెరికం రొమాంటిక్ కవిగా ,’’ఫైర్ సైడ్ ‘’కవుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు .’’who ever is most universal is most national ‘’అని అంటాడు .బోస్టన్ ,హార్వర్డ్ బ్రాహ్మిన్ కల్చర్ కు ప్రతినిధి .ఆధునిక సివ్ల్ రైట్స్ ఉద్యమానికి ప్లాట్ ఫారం నిర్మించాడు .’’ది ప్రెసెంట్ క్రిసిస్ ‘’కవిత సివి ల్  వార్  కల్లోలాన్ని దృష్టికి తెచ్చింది .

James Russell Lowell circa 1855.jpg

 

 

అన్ని ప్రక్రియలకు ఆద్యుడు – ఎడ్గార్ అల్లాన్ పో

పేరులోనే ‘’ఎలోన్ ‘’ఉంది కనుక ఒంటరివాడుగానే జీవించాడు  .జీవితం లోని కస్టాలు దుఖాలకు కుంగి విచారమే పరమావధిగా ప్రవర్తించాడు ,రాశాడు  .తల్లీ తండ్రీ ఇద్దరూ స్టేజి నటులే .మాసా చూసేట్స్ లోని  బోస్టన్ లో19-1-1809 న జన్మించాడు .రిచ్మాండ్ లో న్యుమోనియా వచ్చింది .తండ్రి తరఫు తాత పెంపకం లో పెరిగాడు .రిచ్మాండ్ వ్యాపారి జాన్ అలన్ సంరక్షణ లో ఉన్నాడు .అలాన్ కు పిల్లల్లేరు .ఇంగ్లాండ్ లో మంచి స్కూల్ లో చేర్పించాడు అక్కడ ఒంటరితనం బాధించి ‘’ది లేక్ ‘’కవిత రాశాడు ‘’death was in that poisonous wave –and in its gulf a fitting grave –for him who thence would solace bring –to this lone imagining ‘’అని భావ గర్భిత కవిత రాశాడు .అమెరికా తిరిగి వచ్చిఒక స్నేహితుని తల్లి  మిసెస్ స్తానర్డ్ పై తల్లి భావం తో ప్రవర్తించాడు .వర్జీనియా వర్సిటిలో చేరి శ్రద్ధ చూపకుండా తాగుడులో పడి గెంటి వేయ బడ్డాడు .పెంపుడు తండ్రి అలాన్ తో పోట్లాడి బయటికొచ్చేశాడు .’’టామర్లేన్ ‘’ ‘’బై ఏ బోస్తోనియన్ ‘’అని తన పేరు లేకుండా రాసి ప్రచురించాడు .ఎవరికీ పట్టలేదు .రెండేళ్ళు సైన్యం లో పని చేసి ,అలాన్ వలన బయటికొచ్చాడు .మళ్ళీ అలాన్ తో పోట్లాడి తాగుడుతో చనిపోతున్న తమ్మిడికి సేవ చేశాడు .మళ్ళీ వెస్ట్ పాయింట్ లో ఉద్యోగం పొందాడు .అధికారుల ఆజ్ఞలను ఉల్లంఘించి నందుకు ఉద్యోగం లోంచి తప్పించేశారు .

పెంపుడు తండ్రి అలాన్ తో మళ్ళీ పోట్లాడి ,అతనేమీ ఇవ్వక పోయేసరికి’’ పెన్నీ లెస్ ఫెలో’’ గా రోడ్డున పడ్డాడు పో .అనారోగ్యం తాగుడు ,దరిద్రం నిరాశ దుఖం ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .సృజనాత్మక రచనలు చేశాడు .ఒక కదా రాస్తే యాభై డాలర్ల ప్రైజ్ వచ్చింది .కజిన్ వర్జీనియాను పెళ్లి చేసుకొన్నాడు .అనేక పత్ర్తికలకు ఎడిటర్ గా పని చేసి వదిలేశాడు .తాగనిదే ఉండ లేక పోయేవాడు కిక్కు కోసం తాగి జీవితాన్నికిక్ చేసుకొని  నాశనం చేసుకొన్నాడు .కుటుంబాన్ని ఫోర్డ్ హాం కు మార్చాడు.కుటుంబ  బాధ్యతలనుంచి ఎప్పుడూ వెనక్కు పోలేదు .భార్య చనిపోయింది .మరీ విషాదం లో మునిగాడు .తల్లి లేని లోటును జీవితాంతం అనుభవించి వేదన చెందాడు .అందుకే రచనలలో మాత్రుభావానికి పెద్ద పీట వేస్తాడు .

ముప్ఫై ఎనిమిది లో న్యూరోటిక్ ,గా మతి స్తిమితం లేని వాడుగా మారి పోయాడు .విధవ రాలైన సారా విలియం విట్మన్ తో కలిసి ఉన్నాడు .అస్తిమితత్వం తో ఆత్మా హత్యా ప్రయత్నాలు చేశాడు .భ్రమ, భ్రాంతులతో చివరి రోజులు గడిపాడు .ఎవరూ పట్టించుకో లేదు .రోడ్ల వెంబడి పది తిరిగే వాడు .అంత గొప్ప కవి అనాధగా రోడ్డు పక్క మురికి కాలవ దగ్గర పడి7-10-1849 లో నలభై రాకుండానే చనిపోయాడు .

‘’almost without the first sign of moral principle or the simpler affections of the heart ,poe;s verses illustrate an intense faculty of technical and abstract beauty with the rhyming art to excess ,an incorrigible propensity toward nocturnal themes and demoniac under tone behind every page ‘’ అని వాల్ట్ విట్మన్ ప్రశంసించాడు .అన్ని విషయాలలో అందమైన అమ్మాయి చావు ను వర్ణించాడు .క్రియ కు అత్యంత ప్రాధాన్యత నిచ్చి కవిత్వం రాశాడు .కవిత్వం అంటే ‘’is opposed to a work of science by having ,for its immediate object ,an idefinite instead of a definite pleasure being a poem only so far as the objects attained .అని అభిప్రాయ పడ్డాడు పోప్.గోల్డ్ బాగ్ రెవిన ,మర్డర్ ఇన్ ర్యు మాంటేగ్ ‘’కవితలు అతని ప్రతిభకు నిదర్శనాలు .దెయ్యాలు భూతాల కధలు రాశాడు .డిటెక్టివ్  కధలల్లాడు. కవిత్వం పై గొప్ప వ్యాస పరంపర రాశాడు .చివరగా ‘’poe;s poems are full of the music of another sphere ,a shadowy half world ,out of space ,out of time ,where Poe;s spirit was un happy at home ‘’అని అంచనా వేయ వచ్చు .మిస్టరి కధలకు ఆద్యుడు .కవిత్వం రాసి జీవితం గడప వచ్చునని రుజువు చేసిన కవి .గోదిక్ రచనలలో సుప్రసిద్ధుడు .హారర్ కదల సృష్టికర్త .పజిల్ నిర్మాత సాహిత్య విమర్శన లో శిఖరాగ్రాన నిలిచాడు ..నిర్దాక్షిణ్య సంపాదకీయాలు సాహితీ విమర్శలు చేశాడు .యూరప్ అంతటా ఆరాధనీయుడైన కవి .ఫిజిక్స్ లోను కాస్మాలజి  లోను ప్రవీణుడు .’’యురేకా’’ నుపూర్తీ  అంతరజ్ఞానం తో (ఇంట్యూషన్ )రాసి మెప్పు పొందాడు .’’క్రిప్టోగ్రఫీ ‘’అంతు చూసిన వాడు .చిన్నకధలు నాటికలు రాసి సుసంపన్నం చేశాడు .

Inline image 1

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44

అమెరికా కవులు

బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత  1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం  ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు వందేళ్ళ తర్వాత క్లాయోన్ బిషప్ వేదాంతి  జార్జి బెర్క్లీ  కొన్ని కవితలను ‘’ఆన్ ది  ప్రాస్పెక్టస్ ఆఫ్  ప్లాంటింగ్ ఆర్ట్స్ అండ్ లెర్నింగ్   ఇన్ అమెరికా ‘’రాస్తూ ,అమెరికా లో కవిత్వం రాయటానికి కొత్త విషయాలున్నాయన్నాడు .బెర్కిలీ ఆశాభావం తో కవిత్వం అల్లాడు .కాలనీ కాలం అంతా పాత ధోరణి సామేతలతోనే కవిత్వం సాగింది .అమెరికాలో మొదటి కవయిత్రి ,న్యూ ఇంగ్లాండ్ గవర్నర్ కూతురు ,ఇంకో గవర్నర్ భార్య అయిన ‘’అన్నే బ్రాడ్ స్ట్రీట్ ‘’1612-1672)గుర్తింపు పొందింది .తన కవితా సంకలనానికి ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లీ స్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’అని అర్ధవంతమైన పేరు పెట్టింది .పాత రొడ్డు కవిత్వ ధోరణిలో కాకుండా స్పెన్సర్ ,,రాలీ ,ఫ్రెంచ్ కవి ద్యు బర్తాస్ వంటి ప్రముఖుల ప్రభావం తో రాసింది . 1624-1729కాలం వాడైన ఎడ్వర్డ్ టైలర్ రాత ప్రతులు ఆయన చని పోయిన రెండు వందల ఏళ్ళ తర్వాత కాని బయట పడ లేదు ,టేలర్ మెటాఫిజికల్ గా  మత భావ స్పూర్తి గా హెర్బర్ట్,డోన్నెల మార్గం లో  రాశాడు .న్యూ ఇంగ్లాండ్ నుంచి న్యూ జేర్సికి కవిత్వపు సీనుమార్చిన వాడు 1752-1832కాలం వాడైనఫిలిప్  ఫ్రే న్యూ ‘’.అతను రాసిన ‘’ది ఇండియన్ బరియల్ గ్రౌండ్ ‘’మొదలైన కవితలలో స్థానిక విషయాల ప్రస్తావన ఉన్నా ,పద్దెనిమిదో శతాబ్ది ఇంగ్లీష్ పధ్ధతి లోనే రాశాడు .స్వంత సీమ భావం తో రాసిన మొదటికవి ,’’అమెరికా కవిత్వ పిత ‘’విలియం కల్లెన్ బ్రయాంట్ .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

అమెరికా కవిత్వ జనకుడు –విలియం  కల్లెన్ బ్రయాంట్

ఇంగ్లీష్ కవులు పోప్,నుండి కూపర్ దాకా మరీ ముఖ్యం గా ‘’రాబర్ట్ బ్లైర్ ఇంకా చెప్పా లంటే ‘’గ్రేవ్ యార్డ్ స్కూల్ ‘’ప్రభావం తో విలియం కల్లెన్ బ్రియాంట్ తన స్వంత బాణీ వాణి తో కవిత్వం చెప్పాడు .దీనితో అమెరికా కవిత్వానికి ఒక ‘’డిగ్నిటి’’అంటే గౌరవం ,పరువు లభించాయి .మే ఫ్లవర్ సంతతికి చెందిన వాడై  మాసా చూసేత్స్ లోని కమ్మింగ్ టన్ లో   3-11-1794న జన్మించాడు  .అర్భక జీవిగా  బతుకు తాడో లేడో అన్న  భావం తోపుట్టాడు .తల కాయ మామూలు కంటే పెద్ద సైజ్ లో ఉండేది .అక్కడి గ్రామీణ డాక్టర్ రోజూ మంచు నీటిధారలో ముంచి మామూలు సైజు కు తెచ్చాడు .ఆరోగ్య సూత్రం గా తండ్రి కొడుకును రోజూ తనతో అరణ్యాలకు నడకకు తీసుకొని వెళ్ళేవాడు .

రెండేళ్లకే చదవటం వచ్చేసింది .పదికి కవిత్వమే రాస్తే ‘’హాంప్ షిర్ గెజిట్ ‘’లో ప్రింట్ అయింది .పదమూడుకు జఫర్సన్ కు వ్యతిరేకం గా సెటైర్’’ది ఎంబార్గో ‘’ రాశాడు . పదిహేడు లో  పరిపూర్ణ  కవి అయ్యాడు .’’టానా టోప్సిస్ ‘’రాసి డెస్క్ లో ఉంచేశాడు  .ఎప్పుడో తండ్రి కంట బడితే ఆయన నార్త్ అమెరికన్ రివ్యూ ఎడిటర్ కు ఇస్తే చదివి ముచ్చట పడి నిరంతరం రాసి పంపించమని చెప్పాడు .అలాగే రాస్తే వేసేవారు పత్రికలో .ఈ కవితలు చదివిన రిచార్డ్ హెన్రి డొన్నా’’అట్లాంటిక్ సముద్ర ఈతీరం లో ఇలా అద్భుతం గా కవిత్వం రాసిన వాడేవరూ ఇంతవరకు లేరు ‘’అని శ్లాఘించాడు .రాసినవన్నీ పేపర్లు అచ్చువేశాయి మంచి రివ్యూలే వచ్చి ప్రోత్సహించారు .అప్పటికే లా చదివినా ప్రాక్టీస్ పై మనసు పోలేదు .విమర్శకులు ‘’అమెరికా నాయక కవి ‘’అని ప్రశంసిస్తున్నారు .ముప్ఫై అయిదులో ప్రసిద్ధ ‘’న్యూ యార్క్ ఈవెనింగ్ పోస్ట్ ‘’పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్ అయ్యాడు .జీవితాంతం ఇదే పోస్ట్ లో పనిచేశాడు .నలభై లో అయిదు కవిత సంకలనాలు ముద్రించాడు .ఫ్రాన్సెస్ ఫెయిర్ చైల్డ్ ను వివాహమాడా డు .

ప్రెసిడెంట్ లింకన్ బానిస విమోచనకు ఏంతో మనస్పూర్తిగా సహకరించి ప్రచారం చేశాడు ..ఇంగ్లాండ్ నవలా చక్ర వర్తి చార్లెస్ డికెన్స్ అమెరికా పర్యటనకు రాగానే ‘’బ్రియాంట్ ఎక్కడ?’’అని అడిగాడంటే అతని కీర్తి చంద్రికల వ్యాప్తి ఏమిటో తెలుస్తోంది .దేబ్భైలో కూడా మంచి ఆరోగ్యం గా ఉన్నాడు .నడక వ్యాయామం తో బాటు నిత్యం కవిత్వం రాసే వాడు .’’లైబ్రరి ఆఫ్ పోఎట్స్ అండ్ సాంగ్స్’’అనే బృహత్ గ్రంధాన్ని రివిజన్ చేశాడు .ఎనభై నాలుగవ ఏట న్యూ యార్క్ సెంట్రల్ పార్క్ లో ఇటలి దేశ భక్తుడు ‘’మజ్జిని ‘’ శిలా విగ్రహాన్ని మే నెలలో  ఆవిష్కరిస్తూ ,ఎక్కువ సేపు తల మీద టోపీ లేకుండా నిలబడి ఉండటం తో  ఎండ వేడికి తట్టుకోలేక కూలి పోయాడు మెదడుడలో రక్తనాళం గడ్డకట్టటం తో కోమా లోకి వెళ్లి పోయాడు .కొన్ని వారాల తర్వాత12-6-1878న ఎనభై నాలుగవ ఏట చనిపోయాడు .

యవ్వనం లో ముసలి వారికోసం ముసలి తనం లో పిల్లలకోసం రాశాడు బ్రియాంట్ .’’అమెరికా వర్డ్స్ వర్త్ ‘’అని అందరూ గౌరవం గా పిలిచే వారు .అతిసాదారణం గా ,స్వచ్చం గా ,పవిత్రం గా ఉండేవాడు .సరదా మనిషికూడా .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో లోవెల్ బ్రియాంట్ లోని లోపాలను తెలియ జేశాడు .అయితే వీరందరి కంటే ఎడ్గార్ అస్లేన్ పో ‘’ in character no man stands more loftily than Bryant .the peculiarity melancholy expression of his countenance has caused him to be accused of harshness or coldness of heart .Never was there a greater mistake .His soul is charity itself ,in all respects generous and noble ‘’అని ఖచ్చితమైన యదార్ధవివరణ చేశాడు .అమెరికన్ రొమాంటిక్ కవి గా పేరు .మార్టిన్ లూధర్ కింగ్ ఏంటో మెచ్చుకొని ఆయన చెప్పిన మాట ‘’truth crushed to earth will rise again ‘’అని పడే పడే గుర్తు చేసేవాడు .వాల్ట్ విట్మన్ కు ‘’మెంటార్ ‘’.

 

 

 

William Cullen Bryant Cabinet Card by Mora-crop.jpg

వ్యక్తిత్వ వికాస కవి   –రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

న్యు ఇంగ్లాండ్ కవిత్రయం గా ఎమర్సన్ విట్ట్టియర్ ,లాంగ్ ఫెలో లు గుర్తింపు పొందారు .సంస్కృతికి ఆనవాలుగా నిలిచారు .వీరి వలననే అమెరికా స్వంత గడ్డ పై   కవిత్వ బీజం  నాటబడి ,సాగు చేయబడి ,పోషింపబడి వికసిత పుష్పమై , అందంగా ఆకర్షణీయం గా  సువాసనలీనుతోంది .

‘’గాడ్ ఇంటాక్సికేటేడ్ యాంకీ ‘’గా పిలువాడే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 25-5-1803లో మాసా చూసేత్స్ లోని బోస్టన్ లో జన్మించాడు .తండ్రి వారసత్వం గా వచ్చిన యూనిటేరియన్ క్లేర్జిమన్ అయ్యాడు .మూఢాచారాలకు వ్యతిరేకి ..ఎనిమిదో ఏట తండ్రి చనిపోతే ఎనిమిది మంది సంతానాన్ని పోషించే బాధ్యతా ఎమర్సన్ పై పడింది. అందరి సానుభూతి సహకారం తో బాధ్యతను నేర వేర్చి పెంచి పెద్ద వాళ్ళను చేశాడు .అంత తెలివైన వాడు కాక పోయినా పందోమ్మిదేళ్ళకే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .కొంతకాలం స్కూల్ లో బోధించి తర్వాతా చర్చి మినిస్టర్ అయ్యాడు .ఎలెన్ లూసా టకర్ ను వివాహమాడి ,మినిస్టర్ పదవి వదిలేశాడు .ఇతరులకు బోధించటా న్ని సమర్ధించాడు .యూరప్ సందర్శించాడు .అదే జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .కార్ లైల్ వర్డ్స్ వర్త్ కవులతో సమావేశమై జీవితపు విలువలను అధ్యయనం చేశాడు .ఇంగ్లాడ్ తిరిగి లేక్ పోఎట్స్ ను చూశాడు .కార్ లైల్ కు సన్నిహితుడయ్యాడు .

తిరిగి వచ్చి కంకార్డ్ లో కాపురం పెట్టిలిడియా జాక్సన్ ను  రీండవ పెళ్లి చేసుకొన్నాడు .ప్రదేశాలు తిరుగుతూచాలా ఉపన్యాసాలిచ్చాడు .అసాధారణ మేధావిగా పండిన వేదాంతిగా గుర్తింపు వచ్చింది .’’మనిషి అంటే బంధుత్వాల కలయిక ,అస్తిత్వ వ్రేళ్ళ మూలం ‘’అనే వాడు .ఎవరు బాగా అర్ధం చేసుకొంటారో వారే గొప్ప .ఉత్సాహం లేకుండా దేన్నీ పొందాలెం హీరోయిజం కు రీజన్ అనవసరం అందుకే గొప్ప .వ్యక్తిలో ప్రపంచ భావన ఉంటేనే అది ఆకర్షిస్తుంది .మతం లో కొత్త ఆలోచనలు భావాలు వ్యాప్తి చెందించాడు ఎమర్సన్ .నలభై నాలుగులో ‘’పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఒక ఏడాది తర్వాతా ‘’మే డే అండ్ అదర్ పోయెమ్స్ ‘’తెచ్చాడు .వ్యాస సంకలనాలు రెండు ముద్రించాడు . డెబ్భై లో జ్ఞాపక శక్తి క్షీణించింది .లాంగ్ ఫెలో చని పొతే సమాధి దగ్గర ‘’అతను మంచి వాడు .కాని పేరు మాత్రం గుర్తుకు రావటం లేదు ‘’అన్న జ్ఞాని .సమాజానికి దూరమైపోయి కంకార్డ్ లో 27-4-1882లో డెబ్భై తొమ్మిదో ఏట మహా జ్ఞాని ,స్కాలర్ కవి వేదాంతి తత్వ వివేచనా పరుడు ఎమర్సన్ మరణించాడు .ఆయన వేదాంతం మానసిక మైంది .’’Emerson ;s poetry is both rich and casual –homespun cloth of gold –‘’అని లోవెల్ మెచ్చాడు .ఎన్నో భాషలలోని అనువాదం పొందిన రచనలు చేశాడు ముఖ్యం గా భారతీయ ఫిలాసఫర్లు ఎమర్సన్ ను ఆదర్శం గా భావించారు .

 

 

 

బానిసత్వ వ్యతిరేక కవి –  జాన్ గ్రీన్ లీఫ్ విట్టర్

ఎమర్సన్ లాగానే అనుదిన కర్మ కండను విట్టర్ వ్యతిరేకించాడు .తండ్రి వ్యవసాయ దారుడు 17-12-1807లో మాసా చూసేత్స్ లోని హావేర్ హిల్ లో పుట్టాడు చిన్నప్పుడే తండ్రితో పొలం వెళ్లి సాయం చేశాడు శీతాకాలం లో ఎనిమిది సెంట్లకు స్లిప్పర్ జత తాయారు చేసి అమ్మి ట్యూషన్ ఫీజు సంపాదించాడు మొదటి తరం అఎసత్రికి చేతిలో కేవలం ఇరవై అయిదు సెంట్లు మాత్రమె ఉన్నాయి ..దేనికైనా మైళ్ళకొద్దీ దూరం నడిచి తెచ్చుకోవాల్సి వచ్చేది స్కూల్ టీచర్ బుర్న్స్ కవిత్వ పుస్తకం ఇస్తే ఇష్టపడి చదివాడు .దాన్ని జీవితాంతం దగ్గర పెట్టుకొన్నాడు .పద్దేనిమిదేల్లకే ‘’ఫ్రీ ప్రెస్ ‘’మాసపత్రిక లో కవిత మొదటికవిత ప్రచురించారు .వరుసగా నూట యాభై కవితలు రాశాడు .బానిస వ్యతిరేకం గా ‘’జస్టిస్ అండ్ ఎక్స్పిదిఎంసి ‘’కరపత్రిక ముద్రించాడు ..బానిసత్వ వ్యతిరేకతపై స్పందించిన కవి రాజకీయ నాయకుడు అయ్యాడు .ఎమర్సన్ లాంటి ఫ్రీ థింకర్స్ బానిసత్వాన్ని సమర్ధించటం జీర్ణం చేసుకో లేక పోయాడు .

ఫిలడెల్ఫియా వెళ్లి ‘’పెన్సిల్వేనియా ఫ్రీమన్’’పత్రికకు సంపాదకుదయ్యాడు .బానిసత్వ నిర్మూలన సంఘానికి పెన్సిల్వేనియా హాల్ ను వేదిక చేశాడు .’’the crank of an opinion mill –making his rustic reed of song –a weapon in the war of wrong ‘’అని బాధపడ్డాడు .తర్వాత ‘’స్నో బౌండ్ ‘’లో తన కవితా శక్తియుక్తులన్నీ ప్రదర్శించాడు .ఎనిమిది సెంట్ లకు స్లిప్పర్ జత తయారు చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు అక్కడ ప్రముఖ సిటిజన్ అయ్యాడు .లిజేందరి ఫిగర్ అనిపించాడు .అతని ఎనభయ్యవ పుట్టిన రోజు జాతీయ పండుగ గా నిర్వహించారు .ఎనభై అయిదవ పుట్టిన రోజుకు కొన్ని నెలల ముందు 7-9-1892న విట్టర్ కవి మరణించాడు .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో రస్సెల్ లో వెల్ ‘’there is Whitttier ,whose swelling and vehement heart –strains the strait breasted darb of the Quaker apart –a fervor of mind which knows no separation –twixt simple excitement and pure inspiration ‘’అని మెచ్చుకొన్నాడు .’’సాంగ్ ఆఫ్ ది నీగ్రో బాట్ మాన్ ‘’అనేక ముద్రణలు పొందింది .క్వేకర్ ఉద్యమకవి గా కూడా ప్రసిద్ధుడు .

 

 

Inline image 1

హెన్రి వాడ్స్ వర్త్  లాంగ్ ఫెలో

లాంగ్ ఫెలో కవికి పాఠ్యపుస్తకాలు  తీవ్రఅన్యాయాన్ని  చేశాయి .చేత్తకవితలే ఎంచి ,వేసి ఆయన గౌరవ భంగం కల్గించాయి .అయన కవితలు నీతి బోదకాలు అంటూ అపచారమూ చేశారు .కనుక ఆయన అంటే వాల్ పోస్టర్ కవి అనుకొన్నారు .ఆకారమూ విలేజ్ మినిస్టర్ లా ఉండేది .’’వంటింటి కవి ‘’అని ముద్రపడింది .కాని అమెరికా కవుల్లో బాగా ప్రాభవ మున్న కవి లాంగ్ ఫెలో .ఇరవై నలుగురు పబ్లిషర్లు ఆయన రచనలను ప్రచురించాటమంటే అసామాన్య విషయమే .’’ది కోర్ట్ షిప్ ఆఫ్ మెయిల్స్ స్తాన్దిష్ ‘’పదివేల కాపీలుఒక్క రోజులోనే ఇంగ్లాండ్ లో  అమ్ముడయింది .’’ది సాంగ్ ఆఫ్ హైవత ‘’ప్రపంచ భాషలన్నిటిలోనూ అనువాదం పొందింది .కాని సమకాలీన కవులు లాంగ్ ఫెలోను’’ షార్ట్ ఫెలో ‘’గా భావించి అన్యాయం చేశారు .’’అమెరికా లోని భిన్న సామాజిక స్తితులపై విభిన్న మానవులపై ,సామాజిక వర్గాలపై ,వృత్తుల వారిపై విలువైన కవిత్వం రాసి మాబోటి వారికి మార్గ దర్శనం చేశాడు లాంగ్ ఫెలో ‘’అన్నాడు అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .సంవత్సర ఆదాయం యాభై వేల డాలర్లకు పైనే ఉండేది .’’ది హంగింగ్ ఆఫ్ ది క్రేన్ ‘’కవిత మూడు వేల డాలర్లు సంపాదించింది .

27-2-1807లో మెయిన్ లోని పోర్ట్ లాండ్ లో జన్మించాడు .తన బాల్యాన్ని ‘’a boy;s will is the wind;s will –and the thoughts of youth are long long thoughts ‘’అని రాసుకొన్నాడు .తండ్రికమ్మరి పని చేసేవాడు .చిన్నప్పుడే తను కవిని అవుతాననే నమ్మకముండేది లాంగ్ ఫెలోకి .ఇర్వింగ్ రాసిన దానికి అనుకరణగా ‘’స్కెచ్ బుక్ ‘’రాశాడు .పన్నెండో ఏట ‘’ది బాటిల్ ఆఫ్ లోవేల్స్ పాండ్ ‘’కవిత పోర్ట్ లాండ్ గెజెట్ లో అచ్చయింది .బోదేన్ కాలేజి లో చేరి అన్నిటా ప్రధముడు గా వచ్చాడు .’’చాతర్తాన్ అండ్ హిస్ పోయెమ్స్ ‘’పై రాయమంటే ‘’అవర్ నేటివ్ రైటర్స్ ‘’గా పేరు మార్చి రాసిన సాహసి .లాయర్ కావాలని లేదు .సాహిత్యం మీదే మనసు .ఆధునిక సాహిత్యం పై ఒక చైర్ ను ఏర్పరచి వచ్చి చేరమని బౌడెన్ ఆహ్వానిస్తే వెళ్లి చేరి పందొమ్మిదో ఏట దాన్ని నిర్వహించిన లేత కుర్రాడు అని పించాడు దీని వలన విదేశీ యాత్ర సాధ్యమైంది ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ జెర్మని వంటి దేశాలు తిరిగి సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ వారసత్వాన్ని తన దేశీయ అమెరికన్ కవిత్వం లో జోడించాడు ..ఇరవై నాలుగులో పదవి స్తిరపడింది మేరీ స్తోరేర్ పోటర్ ను వలచి పెళ్ళాడాడు బోధనపై పెద్దగా ఇష్టం లేక పోయినా పాతికేళ్ళు బోధనా చేసి హార్వర్డ్ ప్రొఫెసర్ అయ్యాడు .మళ్ళీ విదేశీయానం స్కాండినేవియన్ జర్మన్ సాహిత్యాన్ని అర్ధం చేసుకొని కార్లైల్ ను కలిసి విద్యా వేత్తతలతో మెదిలాడు .స్వీడిష్ భాష నేర్చాడు ఫిన్ని భాష లోని మహాకావ్యం ‘’కలేవేల ‘’ను జేర్ణం చేసుకొని తన ‘’హైవత ‘’లో ప్రతిబింబింప చేశాడు .

అమెరికా తిరిగి వచ్చి కరిగీ హౌస్ అనే చారిత్రాత్మక ప్రదేశం లో నివశించాడు .పదిహేనేళ్ళు చిన్నదైన ఫాని ఎలిజా ను వలచి వలపించి రెండో పెళ్లి చేసుకొన్నాడు .వీరి వివాహం బోస్టన్ లో పెద్ద పండగే అయింది .అయిదుగురు పిల్లల్ని కన్నారు .ఒక రోజు ప్రమాద వశాత్తు కొవ్వోత్తికి భార్య సమ్మర్ డ్రెస్ కు అంటుకొని కాలుతుంటే లాంగ్ ఫెలో పక్క రూమ్ లో నుంచి పరిగెత్తుకొని వచ్చినా ఆర్పలేక ఆమె పూర్తిగా కాలి చనిపోయింది .విచారం అలముకొన్నా కవిత్వం ఆగలేదు .’’పోయెమ్స్ ఆఫ్ స్లేవరి ‘’రాసి ఎవరూ చేయని సాహసం చేశాడు .ఇవాన్జిలీన్ మొదలైన లిరిక్స్ రాశాడు .ఇంకా గొప్ప రచనలు రావాల్సి ఉంది .

‘’టేల్స్ ఆఫ్ ఏ వె సైడ్ ఇన్ ‘’ప్రచురించి పేరు తెచ్చుకొన్నాడు .వయసు పబడిన కొద్దీ రచనా క వ్యాసంగం పెరిగింది .అరడజను పుస్తకాలు రాశాడు .నరాల జబ్బు బాధించింది హార్ట్ ఎటాక్ వచ్చింది .24-3-1882న చనిపోయాడు వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .కధలను మహాద్భుతం గా చెప్పాడు .కవిత్వం పర్వత ఝరి లాగా వేగం గా ప్రవహిస్తుంది .మార్గ దర్శిగా గుర్తింపు పొందాడు .అమెరికా గడ్డపై స్వంత కవితా సేద్యం చేసి అమూల్య ఫలాల నందించిన తోలి తరం కవులలో ముఖ్యుడు .అమెరికా కు సంపూర్ణ వికాసాన్ని ఇచ్చిన కవులలో ఒకడు .

డాంటే రాసిన డివైన్ కామెడీ ని అనువాదం చేసిన మొదటి అమెరికాన్ కవి లాంగ్ ఫెలో .లిరిక్ పోయెమ్స్ రాసి మాస్ కు చేరువైన కవి .హెక్సా మీటర్ లో ,ఫ్రీ వేర్స్ లో కూడా రాశాడు .హీరోయిక్ కప్లేట్స్ బాలడ్స్ నూ రాశాడు .నైతిక ,సాంస్కృతిక విలువలకుప్రాధాన్యత నిచ్చాడు  ,భౌతికానికి అతీతం గా ఆలోచన చేశాడు .ఆయన కాలం లో అందరికంటే ప్రసిద్ధుడు .విట్మన్ ఫ్రాస్ట్ మొదలైన కవులకు ప్రేరణ .

 

Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్ –మల్లాపూర్ –అమెరికా

 

 

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43

క్రిస్మస్ గీత రచయిత్రి –   క్రిస్టినా రోసేట్టి

క్రిస్టినా- రోసేట్టి కుటుంబం లో చిన్నది .5-12-1830లో లండన్ లో పుట్టింది .గాబ్రియల్ కు విరుద్ధం అందగత్తె కాదు .డాంటే గాబ్రియల్ రాసిన మొదటి  సినిమాలో వర్జిన్ గా నటించింది .కవిగా ,పైంటర్ గా వారసత్వాన్ని కాపాడుకోంది.ఇటాలియన్ నేపధ్యం ఉన్నందున విజయం రాలేదు .మగాళ్ళు వెంబడి పడే వారు .పద్దెనిమిదేళ్ళ పడుచు జేమ్స్ కాలింసన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోంది. ప్రీ రాఫేలైట్ బ్రదర్ హుడ్ అయిన అతను రోమన్ కేధలిక్ గా మారగానే ‘’తూ నా బొడ్డు’’ అని కాన్సిల్ చేసింది.కాలిన్స్ ఆమె ప్రశాంత మానసిక స్తితిని అల్ల కల్లోలం చేశాడు .ముప్ఫై వ ఏట చార్లెస్ కాయిలీని ప్రేమించి జీవితాంతం అతని తో ఉంది . ‘’హేవెన్లి బ్రైడ్  గ్రూం’’కోసం కలలు కన్నది . హంగూ ఆర్భాటం లేకుండా నే ఆ తరం లో పేరెన్నిక గన్న కవి గా గుర్తింపు పొందింది .’’గార్బిన్ మార్కెట్ ‘’,దిప్రిన్సెస్ అండ్ ఆదర్ పోయెమ్స్’’’’ఏ పీజిఎంట్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’వరుసగా రాసి ప్రచురించింది .గుండె బలహీనత తో బాధ పడింది .అరవై లలో కేన్సర్ వచ్చి ఆపరేషన్ చేయించు కొన్నది .కాని ప్రార్ధనలోనే ప్రశాంతం గా 29-12-1894 లో చని పోయింది .దాదాపు వెయ్యి కవితలు రాసింది .అందులో ప్రి రాల్ఫెలైట్ భావాలు పోదిగింది . ‘’గోబిన్ మార్కెట్ ‘’కవిత కు మంచి పేరుంది .’’ఎల్లెన్ ఎలిఎన్ ‘’అనే మారు పేరుతో రాసేది .చని పోయిన తర్వాతే ప్రసిద్ధి పొందింది .ఆమె రాసిన క్రిస్మస్ గీతం ‘’బ్లీక్ మిడ్ వింటర్ ‘’అందరు పాడుకొంటారు .

‘’white and golden Lizzie stood –like a lily in a flood –like a rock of blue-veined stone –lashed by tides obstreperously –like a beacon left alone –in a hoary roaring sea –sending up a golden fire’’లా కవిత్వం సాగిపోతుంది .ప్రయోగాలు లేని భావుకత .విచారాన్ని ,లిరికిజం తో సమ్మేళనం చేసి రాసింది .

‘’when I am dead ,my dearest –sing no sad songs for me –plant thou no roses at my head –nor shady cypress tree ‘’—-‘’I shall not see shadows –I shall not feel the rain –I shall not hear the nightingale –sing on ,as if in pain –happly I may remember –and haply may forget ‘’

 

 

Inline image 1

.

ఎడ్గార్ అలెన్ పో తో సాటి -ఆల్గేర్నాన్ చార్లెస్ స్విన్ బర్న్

స్విన్ బర్న్4-5-1837లో లండన్ లో పుట్టాడు .  అరిస్తో క్రాటిక్ కుటుంబం .తండ్రి అడ్మిరల్. తాత లార్డ్ .ప్రీ రాఫలైట్ లను అధిగమించాలని ప్రయత్నించాడు స్విన్ బర్న్.ఇరవై అయిదులో ‘’ది క్వీన్ మదర్ అండ్ రోసమాండ్ ‘’అనే రెండు చారిత్రాత్మక ట్రాజెడీ నాటకాలు రాసి రోసేట్టి కి అంకితమిచ్చాడు .బ్లాంక్ వేర్స్ లో లిరిక్స్ రాశాడు .’’అట్లాంటా ఇన్ కాలిడాన్ ‘’రాసి సెన్సేషన్ సృష్టించాడు .బైరన్ రాసిన చైల్డీ హరాల్డ్ తర్వాతా అంతటి గొప్ప కవిత రాలేదు .భావాలు తీవ్రం గా ,ఆచారాలకు విరుద్ధం గా ఉండటం తో యువకుల గుండె చప్పుడు కు దగ్గరైంది .’’వెన్ ది హౌండ్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో దుమ్ము దులిపేశాడు .

‘’they gave him light in his ways –and love ,and a space for delight –and beauty and length of days –and night and sleep in the night –his speech is a burning fire –with his lips he traveileth –in his heart is a blind desire –in his eyes foreknowledge of death –‘’అంటూ నిప్పులు కక్కుకుంటూ ఎగిరాడు నింగికి .

ముప్ఫై లో ప్రసిద్ధ కవి అని పించుకొన్నాడు .కవే కాక  ‘’ కాంట్ర వర్సీ’’ కూడా అయ్యాడు .అతని కామం బూతు అందరికి జుగుప్స కల్గించాయి .నలభై లలో ‘’స్టేడి ఆఫ్ షేక్స్ పియర్ ‘’,సాంగ్స్ అండ్ స్ప్రిన్గ్సైడ్స్ ‘’మోడరన్ హేపతాల్జియా ‘’లు వరుసగా రాసి సంచలం సృష్టించాడు .విడువ కుండా రాస్తూనే ఉన్నాడు అయిదు పద్య నాటకాలు ,ఒక నవల ,పది వచన పుస్తకాలు రాసి ఏదీ వదలకుండా రాశాడని పించుకొన్నాడు .’’swinburne has now said not only all he has to say about every thing  but all he has to say about nothing ‘’ అని ఎస్టిమేట్ చేశారు .ఆలోచనా పరుడిగా కంటే ఆవేశ పరుడు .’’యెన్ సైక్లో పీడియా బ్రిటానికా –పదకొండవ ఎడిషన్ ‘’కు సహక  రించాడు .రెండు సార్లు నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనాడు .కాని రాలేదు .’’the tumultuous out cry of the adjectives and head strong  rush of undisciplined sentences  are the index of the impatience and laziness  of a disorderly mind’’అని ఇలియట్ తీర్మానించాడు .ఎడ్గార్ అల్లెన్ పో తర్వాత ఇంగ్లాండ్ అమెరికాలలో నిజమైన కవి స్విన్ బర్న్ అన్నాడు హెచ్ పిలోక్రాఫ్ట్ .

Inline image 2

 

విక్టోరియన్ రియలిస్ట్ –  థామస్ హార్డీ

పందొమ్మిది ఇరవై శతాబ్దాలకు వారధి థామస్ హార్డీ .సగం రొమాంటిక్ సగం వాస్తవ వాది .రాసిన కవితలు ఆధునిక కవితలకు మార్గ నిర్దేశం చేశాయి .2-6-1840లో డార్సేట్ లోని డార్చెస్టర్ లో పుట్టాడు .రాసిన నవలకు ఇదే నేపధ్యం అయింది .అర్భకం గా పుట్టి తల్లి సంరక్షణ లో ఎనిమిదో ఏడు వరకు ఇంట్లోనే ఉన్నాడు .పదహారవ ఏట ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .అప్పటికే కవితలు గిలుకుతున్నాడు .’రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్ ప్రైజ్ పొందాడు కార న్ వాల్ వెళ్లి వికార్ మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆర్కి టేక్చార్ లో నీతులున్నా ధన లక్ష్మి కనికరించలేదు .వదిలేసి ‘’ది పూర్ మాన్ అండ్ ది లేడీ ‘’రాసి ప్రచురిద్దామనుకొంటే అందులో ‘’సరుకు లేదు ‘’అని తిప్పి పంపేశారు .కసిగా ‘’డెస్పరేట్ రేమిడీస్ ‘’రాస్తే ఒక మాదిరి ప్రోత్సాహం వస్తే ఇక రాస్తూనే ఉన్నాడు .నవలా ప్రయత్నమూ చేసి చివరికి కవిత్వమే ఫుడ్డూ బెద్డూ అనుకోన్న్నాడు  .ముప్ఫై అయిదు నలభై మధ్యలో ఎనిమిది నవలలు దించాడు .ముప్ఫై కి పైగా చిన్న కధలు రాశాడు .ఇవన్నీ క్లిక్ అయి లక్ష్మీ ప్రసన్నం కలిగించాయి .’’టెస్ట్ ఆఫ్ ది డీ ఆర్బర్ విల్లీస్’’రాసి విమర్శకులను ఆకర్షించాడు .ఓవిడ్ ,టేరిస్ లను యవ్వనం లోనే చదివాడు .డార్విన్ ను ,స్టువార్ట్ మిల్ ను అధ్యయనమ చేశాడు .’’టేస్స్ ‘’రాశాడు .’’తుస్సు ‘’మంది .విమర్శకుల జడివానకు ప్రతిగా సమాధాన గొడుగు పట్టి నిరుత్తరుల్ని చేశాడు .పిచ్చి కోపం తో ఒకడు దాన్ని తగల బెట్టి బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపాడు

అరవైలో ‘’వేసేక్స్ యెమ్స్ ‘’రాసి ప్రచురిస్తే ఎవరూ పట్టించుకో లేదు .మరో అయిదేళ్లకు ‘’పోయెమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’విడుదల చేస్తే కొంత ఉత్సాహం వచ్చింది ‘’డైనాస్టీ’’మొదటి భాగం రాసి ప్రచురించాడు .నాలుగేళ్ల తర్వాతా ‘’నెపోలియన్ యుద్ధాలు ‘’ను మూడు పుస్తకాలలో పందొమ్మిది అంకాలుగా రాశాడు .నూట ముప్ఫై సీన్లున్నాయి .డెబ్భై రెండులో భార్య మరణించింది .తన సేక్రేటరినే పెళ్లి చేసుకొన్నాడు .సోమర్ సెట్ మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఐల్స్ ‘’హార్డీ జీవితమే .మూడు గొప్ప కవితా పుస్తకాలను రాసి ముద్రించాడు .ఎనభై ఎనిమిదవ ఏట జలుబు చేసి తీవ్రమై .11-1-1928న హార్డీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి ,అయన వీలునామా లో రాసిన దాని ప్రకారం గుండెను తనకు అతి ఇష్టమైన డార్చేస్తర్ గ్రామం లో సమాధి చేశారు .

డార్విన్ ను సమర్ధించినా విశ్వానికి కేంద్రం మానవుడు అన్న దాన్ని హార్డీ ఒప్పుకో లేదు .సైన్సు ను సాహిత్యం గా మార్చిన ఘనుడు .ప్రకృతిని వర్డ్స్ వర్త్ తో బాటు అర్ధం చేసుకొన్నాడు .ప్రపంచం దేవుడి ఓటమి అన్నాడు .విక్టోరియా యుగపు చివరివాడైనా కొత్త దనం కోసం ప్రయత్నించాడు .

‘’when the present has latched its postern behind my trermulous stay’’మొదలైనవి అతని కవితలు  -విక్టోరియన్ రియలిస్ట్ అంటారు .పతనమై పోతున్న విక్టోరియన్ సంఘం పై విమర్శ చేశాడు .లారెన్స్ ,వర్జీనియా ఉల్ఫ్ లకు ప్రేరణ .లిరిక్స్ సెటైర్ బాలడ్స్ ,డ్రమాటిక్ మొనోలోగ్స్ రాసి మెప్పించాడు .బోయేర్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాలపై మంచి కవితలు రాశాడు .ప్రేమ జీవిత వైఫల్యాలపైనే ఎక్కువ గా రాశాడు .కవితల్లో ఐరనీ(పరిహాసమ్ ) పాలు ఎక్కువే .ఇరవయ్యవ శతాబ్ది గొప్ప కవుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు .జంతు హింసకు వ్యతిరేకి .ఫ్రాస్ట్, ఆడెన్ మొదలైన వారిపై ప్రభావం చూపాడు .ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ ట్వెంటి ఎత్ సెంచరి వెర్సెస్ ‘’లో హార్దీవి ఇరవై ఏడు కవితలను చేర్చి లార్కిన్ హార్డీ కవితా ప్రాభవానికి ప్రాచుర్యం కలిగించాడు .

Thomashardy restored.jpg

 

 

ఇంగ్లాండ్ దేశ పందొమ్మిదో శతాబ్ది  ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభ కవుల ముచ్చట్లు సమాప్తం .ఇక న్యూ ఇంగ్లాండ్ ‘’కొత్త ప్రపంచం ‘’అని పిలువ బడే అమెరికా కవుల ముచ్చట్లు తెలుసు కొందాం రేపటి నుంచి –

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42–విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42

విదరింగ్ హైట్స్ నవలా కారిణి –  ఎమిలి బ్రాంట్

టెన్నిసన్ కు భిన్నం గా ఎమిలీ బ్రాంట్ జీవవించింది  .ఐరిష్ తండ్రికి జన్మించింది  .తండ్రి  చిత్రకళ నేర్చుకొందామనుకొన్నాడు కానీ యవ్వనం లో నే మరణించాడు .ఎమిలీ బ్రాంట్ 1818-1848కున్న అక్కలు మంచి రచయిత్రులే .అయితే ఎమిలీ అక్కల్ని మించి పోయింది .దాదాపు చదువు అంతా ఇంటి వద్దే నేర్చింది .క్లేర్జి డాటర్స్ స్కూల్ లో చేరింది అక్కడి పరిస్తితులు ఆహారం దారుణం .సోదరి షార్లెట్ తోకలిసి బ్రసెల్స్ వెళ్లి ,అక్కడా ఇమడలేక వచ్చేసింది .ఆమె రచనల్లో స్వీయ చరిత్ర ఏంతో తెలుసుకోవటం కష్టమే .’’బ్రాన్ టేస్ వెబ్ ఆఫ్ చైల్డ్ హుడ్ ‘’అనే పుస్తకం లో ఫన్నీ ఎలిజబెత్ ఇచ్చిన వివరణే అందరికి ఆధారం .

ఎమిలీ సోదరీమణులు ఒక ఊహా గ్రామాన్ని నిర్మించుకొన్నారు దానికి ‘’గొండాల్ ‘’అని పేరు పెట్టారు .ఇది ఫసిఫిక్ దీవుల్లో ఉందనిమాపులు తయారు చేశారు .కవిత్వం లో ఫిక్షన్ ,ఎలిగరి ,స్వీయ చరిత్రా అన్నీ కల గలిపి ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’లో రాసింది ఎమిలీ పాత్రలు ‘’.గొండాల్ సాగా’’ గా సాగిపోతాయి .’’cold in the earth ,and the deep snow piled above thee –far ,far removed ,cold in the dreary grave –have I forgotten ,my only love ,to love thee –severed at last by Time;s  all wearing wave ‘’అంటూ సాగే కవిత్వం అది .ఈ అక్క చెల్లెళ్ళ పేరిట ఒకే ఒక పుస్తకం వెలువడింది వాళ్ళ అస్తిత్వాన్ని దాచేసుకొన్నారు .తాము ఆడవాళ్లమని చెప్పుకోదలచ లేదని అన్నారు .స్వంత ఖర్చుతో పుస్తకం ముద్రించి లాభా పేక్ష లేకుండా విడుదల చేశారు .రెండు కాపీలే అమ్ముడు పోయాయి మిగిలినవి ట్రంకు పెట్టెల్లో మూలుగుతున్నాయి .’’ఎల్లీస్ బెల్స్ ‘’అనే మారు పేరుతోనే రాసేది .ఆమె రాసిన గొప్ప నవల ‘’విదరింగ్ హైట్స్’’ఆదే ఆమె పేరుకు ,ప్రభావానికి కారణ మైంది .

బ్రాంటీ కుటుంబాన్ని క్షయ వ్యాధి పీడించింది అక్కలు చనిపోయారు ఎమిలీ ఎలాగో తట్టుకొని బతికింది .ముప్ఫై వ ఏట ఎమిలి కి దగ్గు జలుబు పట్టి క్షీణించింది మగాడి లా ధైర్యం గా జబ్బుతో పోరాడింది కాని విధికి లొంగి 19-12-1848న మరణించింది .’’షిర్లీ ‘’కవిత లో హీరోయిన్ ను ధైర్య వంతురాలిగా చూపింది .ఇరవై రెండేళ్ళ వయసులో రాసిన ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’కవితలో యెమిలీ అసాధారణ ధైర్యం వ్యక్తిత్వం కని  పిస్తుంది .ఒక సారి తొంగి చూద్దాం –

‘’riches I hold in high esteem –and love I laugh to scorn –and lust of fame was but a dream –that vanished with the morn ‘’-and if I pray ,the only prayer –that moves my lips for me –is ‘’leave the heart that now I bear –and give me liberty ‘’ సంగీత ,శబ్ద శక్తి కి ఎమిలీని మెచ్చుకొంటారు .ఒకే ఒక్క నవలతో నవలా మణిగా వెలిగిపోయింది .1850దాకా ఆమె అసలు పేరు వెలుగు లోకి రాలేదు .’’a peculiar mixture of timidity and sportan like character ‘’-she was painfully shy and physically brave to a surprising degree . తన విధి నుంచి అంగుళం కూడా ప్రక్కకు తొలగని దీక్షా పరురాలు ఎమిలీ .

 

Inline image 1    Wuthering Heights (1847)

 

ఫ్లారెన్స్ నైటింగేల్ కు  సెక్రెటరి  -ఆర్ధర్ హగ్ క్లగ్

ఆర్ధర్ హగ్ క్లగ్ మారుతున్న ప్రపంచం లో పుట్టాడు .మార్పు నచ్చక పూర్వ భావనలే గోప్పవనే వాడు .భవిష్యత్తుపై నమ్మకం లేని వాడు .మొదటి నుంచి ఒడి దుడుకుల జీవితమే .1-1-1819న లివర్ పూల్ లో పుట్టి నాలుగవ ఏట సౌత్ కారోలిన్ చేరాడు తండ్రి తో .రగ్బీ స్కూల్ లో చేరి ప్రముఖ హెడ్ మాస్టర్ అయిన డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ శిష్యుడైనాడు .ఆక్స్ ఫర్డ్ కాలేజిలో చేరి ,ప్రపంచ  పర్యటనకు బయల్దేరాడు .ఫ్రెంచ్ విప్లవ కాలం లో పారిస్ లో ఉన్నాడు .రోమ్ లో  అమెరికా ఫిలాసఫర్ ఎమర్సన్ ను కలిశాడు .ఆయన వలన అమెరికాలో వారానికి ఆరుడాలర్ల జీతం తో బతకచ్చు అని తెలుసుకొని అమెరికా వెళ్ళిపోయాడు .అమెరికాలో ఉపన్యాసాలిస్తూ ,అనువాదాలు చేస్తూ గడిపాడు ..లాభం లేదని గ్రహించి ఇంగ్లాండ్ చేరుకొన్నాడు ..పెళ్లి చేసుకొని ఫారిన్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ కు సెక్రెటరి అయ్యాడు ..ఆరోగ్యం దెబ్బతిని మలేరియా సోకి ఫ్లారెన్స్ లో 13-11-1861న చనిపోయాడు

క్లగ్ జేవితం వాగ్దానాల మయమే తప్ప సాధించింది శూన్యం .సత్యాన్వేషకుడు గా మిగిలి పోయాడు బౌద్ధిక జ్ఞానం స్తిమితం లేకుండా చేసింది .కొన్ని కవితలు బాగా రాశాడు .’’thou shalt have one God only ,who –would be at the expense of two –no graven images may be –worshipped ,except the currency ‘’అతని ‘’ఆమర్స్ డీవాయెజ్ ‘’లో సెటైర్ తో బాటు సీరి యెస్ నేస్ కూడా ఉంది .ప్రేమ ,ప్రయాణం ,మతం  పై అతని అభిప్రాయం తెలియదు కాని ఆత్మ అన్వేషణ కని పిస్తుంది .హెక్సా మీటర్లలో కవిత్వం రాశాడు .భార్య సోదరి ఫ్లారెన్స్ నైటింగేల్ కు యుద్ధ సమయం లో జీతం లేని సెక్రెటరి గా సేవలందించాడు .

Arthur Hugh Clough 1860.jpg

 

 

ముని కవి  – మాధ్యూ ఆర్నోల్డ్

ఆర్నోల్డ్ కూడా విక్టోరియన్ కవి .నమ్మకం ,అనుమానాల మధ్య ఊగిస లాడాడు .ఇంగ్లిష్ క్రిటిసిజం కు మూల భావాలుగా ఆయన మాటలుంటాయి .తండ్రి రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ .మాధ్యూ మిడిల్ సెక్స్ లోని లాలేహాం లో క్రిస్మస్ ఈవ్ నాడు 1822లో పుట్టాడు .రగ్బీ స్కూల్ లో చదివి కవిత్వం రాసి రాగ్బీ ప్రైజ్ సాధించాడు .ఇది ‘’అలారిక్ ఎట్ హోమ్’’గా ప్రసిద్ధం .ఎన్నో గౌరవాలు పొందాడు .బలోలి కాలేజికి స్కాలర్షిప్ వచ్చి చేరి హగ్ క్లగ్ కు హాస్టల్ మేట్అయ్యాడు .న్యుదిగేట్ ప్రైజ్ పొందాడు .

ఇరవై రెండులో డిగ్రీ పొంది రగ్బీ స్కూల్ లో పని చేసి ఒరిల్ కాలేజికి ఫెలోషిప్ సాధించాడు .లార్డ్ లాన్స్ డౌన్  కు పాతిక ఏళ్ళ కే  సెక్రెటరి అయ్యాడు  .వివాహం తో పొజిషన్ పెరిగి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అయ్యాడు .విదేశీయానం తరచూ ప్రయాణాం తనను ఇంటికి దూరం చేస్తున్నాయని బాధ పడేవాడు .’’ది స్త్రేయిడ్ రివీలర్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ను ఇరవై ఏడవ ఏట పబ్లిష్ చేశాడు .రెండేళ్ళ తర్వాత ‘’ఎమ్పిడికిల్స్ ఆన్ యెత్నా ‘’రాసి ప్రచురించాడు అరవై అయిదేళ్ళు మంచి ఆరోగ్యం తో జీవించి కొద్ది పాటి అస్వత్తత తో 15-4-1888న చనిపోయాడు . రోమాం టిజానికి-మోడరనిజానికి   వారది ఆర్నోల్డ్ .’’want of logic and thoroughness of thought’’కు ప్రాధాన్యత నిచ్చాడు .’’న్యు జర్నలిజం ‘’కు ఆద్యుడు ఆర్నోల్డ్ .ఆయన రాసిన వన్నీ ‘’కవర్ టు కవర్ ‘’చదివిస్తాయి .

ఆర్నోల్డ్ రాసిన సంస్కృతీ ,మతం వ్యాసాలూ బాగా ప్రసిద్ధి పొందాయి ‘’ఫైలిష్టినేస్ ‘’ను వ్యతిరేకించాడు .అంటే మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి ఉదాసీనతను వ్యతిరేకించాడు .’’poetry had an ethical purpose ,that it should be ‘’a criticism of life’’and he believed that he believed that his own verse exemplified it .’’అని అభ్ప్రాయ పడ్డాడు .కవిత్వం అంటే జీవితానికి వ్యాఖ్యానం .దీన్ని కవి అందం గా శక్తి వంతం గా అన్వయించి చెప్పాలి .నీటికి వ్యతిరేకమైన కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అవుతుంది .నైతికత కు ఉదాసీనం గా ఉండే కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అంటాడు ఆర్నోల్డ్ మహా సహాయుడు .ఆర్నోల్డ్ కవిత్వాన్ని గౌరవిన్చారుకాని ప్రేమించ లేదు .అతని డవర్ బీచ్ కవితలోని కొన్ని పంక్తులలో ‘’eternal note of sadness ‘’కానీ పిస్తుంది .’’the sea of faith-was  once too,at the full ,and round earth;s shore –lay like the folds of a bright girdle furled –but nowi only hear –its melancholy ,long withdrawing roar –retreating to the breath –of the night wind ,down the vast edge drear –and naked shingles of the world ‘’.

ప్రి రాఫెలైట్స్త్

మాధ్యూ ఆర్నోల్డ్ రాసింది పెసి మిస్టిక్ కవిత్వాన్నిఆదరించక పోయినా విక్టోరియన్ ప్రజలు    ఫిట్జెరాల్డ్ రాసిన ‘’ఒమర్ ఖయ్యాం ‘’,ఫర్కార్ టప్పర్ రాసిన ‘’ప్రావేర్బియాల్ ఫిలాసఫీ ‘’ని లక్షలాది మంది చదివారు .పందొమ్మిదో శతాబ్ది మధ్యలో యాంటి విక్టోరియన్ గ్రూప్ ఒకటేర్పడింది .దీన్ని ప్రి రాఫెలైట్స్  బృందం ‘’అన్నారు .1850లో వీళ్ళు ఒక మేగజైన్ ను ‘’ది జేర్మ్’’పేరిట విడుదల చేశారు .అది ఒక పైన్తర్స్ ఉద్యమంగా మొదలైంది .యాంత్రిక యుగాన్ని విమర్శిస్తూ  సమకాలీన జీవితాన్ని వ్యాఖ్యానించింది .కళకు కొత్త జవ జీవాలు,గౌరవ పరాభవాలు  కల్పించాలని కోరింది .మన ఆలోచనలలో నిజాయితీ ఉండాలని కోరింది రాఫెల్ ,రినైసేన్స్ ల తర్వాత ‘’we must be early Christian-pre –Raphaelite’’అన్నారు .ఈ ఉద్యమం బాగా వ్యాపించి పైన్తర్లను కొంతమంది రచయితలను ప్రభావితం చేసింది .అదొక మిశ్రమ సంస్థ అయింది .అందులో విలియం హాల్మాన్ హంట్ ,ఎడ్వర్డ్ బర్న్స్ జోన్స్ ,ఫోర్డ్ మదాక్స్ బ్రౌన్ ,జాన్ ఎవరెస్ట్ మిల్లేస్ వంటి పైన్తర్లున్నారు .దంటే గాబ్రియల్ రోసేట్టే పైంటర్ మాత్రమె కాక కవి కూడా .విలియం మోరిస్ ఒక కొత్త సంస్కృతికి దారి తీశాడు .గాజు కిటికీలను ,వస్తుసామగ్రిని ,కంబలీలను ,పరికరాలను కొత్త తరహాలో నిర్మించాడు .తనకాలం లో చిన్న బోయిన దాన్ని మళ్ళీ వైభవానికి తెచ్చాడు .దీన్ని యుటోపియన్ఆఫ్ ‘’న్యూస్ ఫ్రం నో వేర్ ‘’;గా తెలిపాడు

కోవెం ట్రీ పాట్ మోర్

జేర్మ్స్మేగజైన్ కు యధాశక్తి కృషి చేసిన వాడు కోవెంట్రీ పాట్ మోర్ .23-7-1823లో ఎప్పింగ్ ఫారెస్ట్ లో పుట్టి ,తండ్రి వద్దే అన్నీ నేర్చి ,తండ్రిలా పైంటర్ అవకుండా సాహిత్యానికే అంకితమయ్యాడు .థాకరే ‘’వికసిస్తున్న కవి మొగ్గ ‘’అన్నాడు .ఇరవై ఒకటిలో మొదటి సంకలనం ‘’యాన్ ఏంజెల్ ఇన్ ది హమ్ ‘’వదిలాడు  బ్రిటిష్ మ్యూజియం కు అసిస్టంట్ లైబ్రేరియన్ అయ్యాడు .భార్య మరణం తో రోమన్ కేధలిక్ అయి ,ఒక ఎస్టేట్ కు అధిపతి అయ్యాడు .’’అన్  నొన్  ఈరోస్ ‘’రాసి అందులో గృహస్థ జీవితం ,ప్రేర్మలను కరిపించాడు .మొద్దో పెళ్లి చేసుకొని లిమింగ్ టన్లో ఉన్నాడు .26-11-1896న డెబ్భై మూడో ఏట చనిపోయాడు .అతని భాష అధిక తియ్యదనం ,విసుగుదనం తో ఉంటుంది .

 

Inline image 2

 

కవి చిత్రకారుడు -డాంటే గేబ్రియల్ రోసేట్టి

విక్టోరియన్ కాలం లో రోసేట్టీలు ఫైన్ ఆర్ట్స్ కు గొప్ప సేవ చేశారు .తండ్రి ఇటాలియన్ తల్లి సగం ఇటాలియన్ .ఇల్లు అంతా నియో పోలిటన్లు టస్కాన్ సంస్కృతీ తో జీవించింది. పెద్ద కోడుకు డాంటే  గాబ్రియల్ కవిగా పెయింటర్ గా ,నాయకుడు గా ఎదిగాడు 12-5-1828లో పుట్టిన గాబ్రియేల్ తన కవితలకు స్వయం గా బొమ్మలు వేసుకొని చిన్నతనం లోనే అందరిని ఆకర్షించాడు .ఇరవైలలో ఫోర్డ్ మడాక్స్ బ్రౌన్ అనే గొప్ప పైంటర్ దగ్గర చేరి మెళకువలు గ్రహించాడు .కొన్ని నెలల తర్వాతా ఇద్దరు మిత్రులతోకలిసి ‘’ప్రి రాఫెలైట్ బ్రదర్ హుడ్ ‘’ను స్థాపించాడు .విలియం మోరిస్ మొదలైన వారందరూ చేరి ఊపు తెచ్చారు .రోసేట్టి వేసిన చిత్రాలు ప్రి రాఫెలైట్స్ కు అద్డ్డం పడతాయి .జాన్ రస్కిన్ ఈ ముఠాపై విరుచుకు పడ్డాడు .రోసేట్టి సంపూర్ణ మోడల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి సాధించాడు .ఎలిజబెత్ సిద్దాల్ తో ప్రేమాయణం సాగించి ,పెళ్ళాడి తన కలల స్వరూపాన్ని పొందాడు .ఆమె ఎప్పుడూ జబ్బు పడే ఉండేది బాధ భరించలేక మత్తు మందుకు అలవాటు పడింది .ఒక రోజు డోసు ఎక్కువై నిద్రలోనే చనిపోయింది

భార్య చనిపోయిన తర్వాతా రోసేట్టి లండన్ లోని చాల్సియా లో ఉన్నాడు .రొమాంటిసిజం పై కొంత కాలం ఊగాడు .కీట్స్ పై  ఆరాధన పెరిగింది ..’’బాలడ్స్ అండ్ సీన్స్ ‘’అనే అద్భుత కవితా సంకలనం తెచ్చి 9-4-1882న రోసేట్టీ మరణించాడు .యూరోపియన్ సింబాలిజం పై గొప్ప ప్రభావం చూపాడు .ఈస్థటిక్ ఉద్యమానికి ఊపిరిలూడాడు . పెయింటింగ్ లో  డేకరేటివ్ ఆర్ట్ లో గొప్ప సాధన చేశాడు .

Inline image 3

 

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -9-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -51 సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్

ఊసుల్లో ఉయ్యూరు -51

సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా  దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్

మేము  1950లో హిందూపూర్ నుంచి ఉయ్యూరుకు పూర్తిగా మకాం మార్చేశాము .అప్పుడు నాకు పది ఏళ్ళు .వేసవిలో దాహం వేస్తె ఉయ్యూరు సెంటర్ లో బూర గడ్డ బసవయ్య కొట్టు ముందు ‘’హిమాలయా కూల్ డ్రింక్స్ ‘’అనే షాపు ఉండేది అక్కడికి వెళ్లి ఐస్ లో పెట్టిన చల్లని సోడా కొట్టించుకొని తాగే వాళ్ళం .కావలసిన వాళ్ళు డ్రింకులు తాగే వాళ్ళు. అప్పుడు మాకు అంత ‘’దృశ్యం ‘’లేదు .దాని యజమానులు ఇద్దరు ముస్లిం లని జ్ఞాపకం .గళ్ళ లుంగీలతో బారెడు నల్ల యెర్ర గడ్డాలతో చూపులకు కొంచెం భయంకరం గా ఉండేవాళ్ళు .ఒకటని పేరు’’ బాబులు’’అని జ్ఞాపకం  ఊరు ఊరంతా సాయం వేళ సోడా డ్రింకులకు అక్కడికే చేరేవారు .సోడా ఓపెనింగ్ మోతలతో సెంటర్ అంతా దద్దరిల్లేది చూట్టానికి ,వినటానికి సరదాగా ఉండేది . ఆ డ్రింకు షాపు యజమానుల్లో ఒకాయన తర్వాత టైలర్ గా మారి మా బట్టలు కుట్టేవాడు వాళ్ళ అబ్బాయిలు నాకు క్లాసు మేట్లు.మా ఇళ్లదగ్గర ఆడవాళ్ళకు సోడా తాగాలంటే చాలా ఇబ్బంది గా ఉండేది .అవకాశమే ఉండేది కాదు .

అదుగో అలాంటి పరిస్తితులలో’’ సోడా మోహన్  ‘’   ఆపద్బాన్ధవుడే అయ్యాడు మాకు .ఇంటింటికీ సోడా బండీ  తీసుకొచ్చి సోడా అరలపై రెండు గొనె సంచీలు కప్పి ఎక్కడ నీళ్ళు ఉంటె అక్కడ వాటిని పూర్తిగా నీటి తో తడిపి ప్రతిక్షణం సోడా చల్లగా ఉండేట్లు చేసేవాడు .అవసరమైతే గడ్డి కప్పే వాడు .కనుక సెంటర్ కి సోడా కోసం వెళ్ళాల్సి వచ్చేదికాదు .అతనే మా ఇంటికి వచ్చేవాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా సోడా బండీ బ్రాహ్మణ కోమట్ల బజార్లలో తిప్పేవాడు .సోడాలన్నీ ఖర్చాయి పోయేవి మా దాహార్తిని తీర్చిన ‘’సోడా భగీరధుదు ‘’సోడా మోహన్ .ఎర్రగా కుది మట్టం  గా కాఖీ నిక్కర్ ,గళ్ళ చొక్కాతో ఉండేవాడు ఎప్పుడూ నవ్వు ముఖం తోనే కని పించేవాడు .సరదాగా మాట్లాడే వాడు .మాటల్లో దించి అక్కర లేక పోయినా సోడా కొట్టి తాగించటం మోహన్ ప్రత్యేకత .సోడా ను ఓపెనర్ తో కొట్టి దాదాపు మూడు నాలుగు నిమిషాలు  గాస్ ను  బుస బుస  పొంగించి కెవ్వు కేక లా శబ్దం వచ్చేట్లు చేసి తాగటానికి ఇచ్చేవాడు .ఆ సోడా తాగితే యెంత కడుపు నిండా భోజనం చేసినా యిట్టె అరిగి పోయేది .అదీ మోహన్ సోడా స్పెషాలిటి .కనుక ఒక సోడా తో ఆగే వారు కాదు రెండు తాగి బ్రేవ్ మని  త్రేం చాల్సిందే .అదీ దాని ప్రభావం .అందుకే నేను ‘’మోహన్ !నువ్వు సోడా కంటే నీ గాస్ మాటలనే మాకు అమ్ముతున్నావయ్యా ‘’అనే వాడిని .దాదాపు మా కంటే అయిదారేళ్ళు చిన్న వాడేమో మోహన్ .

సోడా మోహన్ అనే అందరూ పిలిచేవారు అవతల బజారు లో సోడా కోడితే మా బజారులో విని పించేట్లు చేయ గల నేర్పు అతనిది .కనుక ఆ శబ్దం విని లైన్ లో ఉన్నాడని తెలిసి మా సందు చివర నిలుచొని ఇంటికి పిలిచే వాళ్ళం .ఇంటిల్ల పాదీ తాగే వాళ్ళం  .అందుకని సాయంత్రం ప్రతి రోజు మా ఇంటికి రాకుండా వెళ్ళే వాడు కాదు .’’సోడా చల్లని ఐస్ సోడా ‘’అని అరుస్తూ సోడా అమ్మే వాడు .వేసవిలో మా అక్కయ్యలు బావలు మేనల్లుల్లు మేన కోడళ్ళు ఉయ్యూరు వచ్చేవారు కనుక సోడా లకు మంచి గిరాకీ ఉండేది .అప్పుడు సోడా అర్ధణా అని జ్ఞాపకం తరువాత అణా అయింది .ఆ తర్వాత పది పైసలు  ,పావలా అర్ధ రూపాయి దాకా పాకింది .అప్పట్లో సోదాలో నవాసారం కలిపే వారని అది హాని అని అనేవారు కాని సోడా మోహన్ సోడా లో అదిఉండేది కాదని మా నమ్మకమే కాదు ఊళ్ళో అందరి నమ్మకం కూడా .అందుకే మోహన్ అంటే ఆదరణ హెచ్చు .అతని సోడా తాగక  పొతే రోజు గడవదని నమ్మకం ఏర్పడ్డాయి .

సోడా మోహన్ అసలు పేరు రామ మోహన్ .ఇంటి పేరు కొలసాని  అని జ్ఞాపకం కాపులు .వాళ్ళ నాన్న నరసింహా రావు .హైస్కూల్ దగ్గర ఇప్పటి సుందరమ్మ పేటలో స్థలం కొని పాక వేసుకొని ఉండేవాడు అతను టైలర్ .బట్టలు కుట్ట్టే వాడు మా బట్టలూ కుట్టేవాడని జ్ఞాపకం .ఎర్రగా భారీ పర్సనాలిటి నీరుకావి లుంగీ కట్టేవాడు చొక్కా తోడుక్కుండగా నేను చూడ లేదు .ఒళ్లంతా బొచ్చు తో భీకరం గా ఉండేవాడు .మంచివాడు మేమంటే గౌరవం గా ఉండేవాడు .భార్య కూడా ఎర్రగా భారీ పర్సనాలిటీయే .రామ మోహన్ కు ఇద్దరు తమ్ముళ్ళు ,ఒక చెల్లెలు  రెండవ  వాడు కృష్ణ మోహన్ .ఊర వారి సినిమా హాల్ దగ్గర సోడా బీడీ సిగరెట్ బడ్డీ పెట్టాడు ఇప్పుడు ఆటో కొని నడుపుతున్నాడు .మూడవ వాడి పేరు జ్ఞాపకం లేదుకాని నేను ఉయ్యూరు హైస్కూల్ లోపని చేసినప్పుడు చదివాడు .చెల్లెలు కూడా ఎర్రగా బాగా ఉండేది స్కూల్ లో నా స్తూదేంటే సోడా మోహన్ ఆర్ ఎస్ ఎస్ కు వీర విధేయుడు .మాతో బాటు సంఘానికి వచ్చేవాడు .అతను ఎంత ఎర్రగా ఉంటాడో అంతటి నల్లని పిల్లను చేసుకొన్నాడు ఆశ్చర్య మేసింది .గేదెలను కొని మేపుతూ పాలు అమ్మేవాడుకూడా సాధారణం గా భార్యయే ఇళ్ళకు తెచ్చి పాలు పోసేది .ఇతనికి సోడా వ్యాపారమే సరి పోయేది .హైస్కూల్ లో గడ్డి పాట  పాడేవాడు గడ్డికోసి గేదెలను మేపే వాడు .పాట  అప్ప్రువ్ కాక పొతే వచ్చి నాకు చెప్పే వాడు . టైం పడుతుందని సలహా చెప్పేవాడిని   మాస్టార్ని అయిన తర్వాతా ‘’మేస్టారూ ‘’అనే పిలిచేవాడు .ఆప్యాయతకు మారు పేరు గా మసిలాడు .ఊరందరి కి మంచివాడని పించుకొన్నాడు తగాదా మనిషి కాదు .డబ్బులు చేతిలో లేక పొతే అప్పు పెట్టి తాగి ఒకే సారి చెల్లించే వాళ్ళం .బి జే పి  అన్నా మోహన్ కు మంచి అభిమానమే వాజ్ పాయి అద్వాని గురించి వీరావేశం గా చెప్పేవాడు .అలాగే ఒక పల్లెకారు అతను చిన్న వంతెన దగ్గర ఉండేవాడు పగలల్లా చేపలు లు పట్టి అమ్ముకొని సాయంత్రాలలో మా పార్ధి మేస్టారి పార్ల మెంట్ కు చేరేవాడు .పేరు  జగన్నాధం అని గుర్తు . ఆర్ ఎస్ ఎస్ జనసంఘ్  జెపి లంటే యెంత అభిమానమో అతనికి మాటల్లో చెప్పలేను మాతో పాటు టు చక్కగా పరిశుభ్రమైన భాష లో రాజకీయాలు మాట్లాడేవాడు మేము చెప్పింది వినేవాడు .తను చెప్పదలచింది సంకోచం లేకుండా చెప్పేవాడు .ఎలక్షన్లు వస్తే మాకు సందడే సందడిఅర్ధ రాత్రి దాకా కబుర్లే .కోమటి సాంబయ్య ,పార్ధి, కొలచల చలపతి ,మండా వీర భద్ర రావు ,ఎల్ ఐసీ శ్రీ హరిరావు ,ఇంకో ఎల్ ఐసీ కొమటా యన ,నేనూ ముత్తయ్య మేష్టారు ఆయన కెసీపి భాస్కర రావు మొదలైన వారందరం చేరే వాళ్ళం .భలే సరదాగా ఉండేది .సోడా మోహన్ సోడా లన్నీ అమ్ముకొని ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చి మాతో చేరేవాడు .

సోడాల ధ్యాసలో ఉన్నాం కనుక మా ఉయ్యూరు సోడా గాస్ గురించి చెప్పక పొతే ఉయ్యూరు నన్ను క్షమించదు .మా షుగర్ ఫాక్టరీ బై ప్రాడక్ట్ గా సోడా గాస్ ఉండేది సిలిండ ర్లలో నింపి  హై ప్రేసర్  లో లిక్విడ్ గా మార్చి నిలవ ఉంచి హోల్ సెల్ గా రిటైల్ గా అమ్మేవారు .అక్కడి నుండే తెచ్చుకొని సోడా మెషిన్ కు సిలిండర్ బిగించి సోడా కాయల్ని శుభ్రం గా గడ్డిపరకల తో కడిగి ,మిషన్ న్ కు తగిలించి సోడా గాస్ నింపి కేసుల్లో అమర్చుకొని బ లలోను సోడా బండీ లలోను పెట్టుకొని అమ్మేవారు .ఏ గాస్ కు లేని ప్రత్యేకత ఉయ్యూరు సోడా గాస్ కు ఉంది . దీని రుచి కిక్కు అదుర్స్ తాగిన వాడు కెవ్వు కేక .మిగతా ఊళ్ళలోని గాస్ ఎందుకో ఏదో వాసన వచ్చేది .ఇది మాత్రం చాలా స్వచ్చం గా ఉండేది .అందుకే రాష్ట్రం అంతా  ఉయ్యూరు నుంచే సిలిండర్లు తెప్పించుకొనే వారు .”ఇది గాస్ ”కాదు పచ్చినిజం . కంకిపాడు పామర్రులలో బస్ లు ఆగినా ఉయ్యూరులోనే ప్రయాణీకులు సోడా కొట్టించుకొని తాగే వారు  అదే  మా కెసీపి సోడా గాస్ కున్న ప్రత్యేకత

మా ఇంటినుంచి సెంటర్ కు వెడుతుంటే సెంటర్ కు దగ్గరలో కుడిప్రక్కన ఒక కుర్ర సాహేబు గారి కిళ్ళీ కొట్టు ఉండేది .అక్కడ కిళ్ళీ స్పెషల్ అక్కడే అందరూ కిళ్ళీలు కట్టించుకోనేవారు చాలా రుచిగా ఉండేది .అతని దగ్గరా సోడాల అమ్మకం ఉండేది .హిమాలయా కూల్ డ్రింక్స్ మూత పడిన తర్వాత ఈ బడ్డీ లోనే సోడా తాగేవారు బాగా ఉండేది కూడా .అతను మనిషి కురచ పొట్ట లావు .అతని బావ మరిది నా శిష్యుడు ట్యూషన్ కూడా చదివాడు .కొంత కాలం బస్ రిజర్వేశాషన్ టికెట్లు  కూడా అమ్మేవాడు అతనిదే కాటూరు రోడ్డులో ఉన్న సహారా ఆఫీసు బిల్డింగ్ అని విన్నాను .

సోడా మోహన్ కు పోటీగా ఇద్దరు ముగ్గురు సోడా బండీ లు వేసుకొని ఊరిలో తిరిగి సోడా లమ్మే వారు .అందులో ఒక  సాహేబు గారు ఒక సన్నగా పీలగా ఉండే కాపు ఆయనా ఉన్నారు .వీరి సోడా కంటే సోడా మోహన్ సోడా కే అప్పటికీ ఇప్పటికీ గిరాకీ ఎక్కువ .ఈ మధ్య మోకాళ్ళ నెప్పి తో బాధ పడుతున్నట్లు సోడా మోహన్ చెప్పాడు .కాని సోడా అమ్మకం మాన లేదు .ఇప్పుడు లక్ష్మి టాకీస్ అని పిలువ బడే ఏకాంబరేశ్వర పిక్చర్ పాలెస్ దగ్గర బడ్డీ కొట్టు లో సోడా లు అమ్మేవారు .అలాగే అన్ని దియేటర్ల దగ్గరా ఇప్పుడున్నాయి .

జనం తెలివి మీరి ఇప్పుడు మామూలు సోడా తాగటం మానేశారు నిమ్మకాయ సోడా లే తాగుతున్నారు .ఉయ్యూరు సెంటర్ లో అయిదారు షాపులు ఉన్నాయి నిమ్మకాయ కోసి రసం పిండి పోడవైనపెద్ద గాజు   గ్లాసులో పోసి కొద్దిగా సోడా ఉప్పు పంచదార  లేక ఉప్పు కలిపి రెండు మూడు సోడా లు దానిలో కొట్టి ,నురగలు తెప్పించి చెంచా తో కలిపి ఇస్తారు చాలా బాగుంటుంది వేసవి స్పెషల్ అయిన్దిప్పుడు నిమ్మకాయ సోడా .నా ముస్లిం శిష్యుడికి సెంటర్ లో కనక దుర్గా హోటల్ దగ్గర నిమ్మకాయ సోడా షాపులున్నాయి నేను తాగ టానికి వెడితే చాలా స్పెషల్ గా కలిపి ఇస్తాడు .అందరి కంటే డబ్బు తక్కువే తీసుకొంటా డుకూడా .ఇప్పుడు మా బజారులో కోట దగ్గరే నిమ్మకాయ సోడా తయారు చేసి అమ్మతున్నారు .కిందటి వేసవిలో అమెరికా నుంచి మా అమ్మాయి మనవలు వచ్చినప్పుడు రోజూ అక్కడికే వెళ్లి రాత్రివేళ నిమ్మకాయ సోడా తాగేవారు .అంతకు ముందు కొన్నేళ్ళు నిమ్మకాయ రసాం కలిపి గాస్ తో సోడా బుడ్డి  ని నింపి కొట్టి ఇచ్చేవారు . అది  అంత  బాగుండే దికాడు .ఇప్పటి విధానమే  చాలా బాగుంది .కొందరు సోడాను రబ్బరు ఓపెనర్ అక్కర్లేకుండా వ్రేల్లతోనే కొట్టే మొనగాళ్ళు ఉండేవారు వాళ్ళు కొడుతుంటే గుడ్లు అప్పగించి చోద్యం గా చూసే వాళ్ళం

ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు సోడా మోహన్ గురించి రాయటానికి అవకాశం కలిగింది ఇన్నేళ్ళు రాయ నందుకు సిగ్గు పడుతూ ఇప్పటికైనా రాయ గలిగి నందుకు ఆనందిస్తూ సోడా మోహన్ గురించి రాయలేదేమని నన్ను ప్రశ్నించిరాయమని గట్టిగా చెప్పి ప్రేరణ నిచ్చిన మా రెండో అబ్బాయి ఛి శర్మ  ను అభినందిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

 

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41

పూర్వఆంగ్ల  కవుల ముచ్చట్లు -41

                            పందొమ్మిదవ శతాబ్దం -చీకటి వెలుగులు
   విక్టోరియన్ యుగాన్ని”వింత ”యుగం అని సాధారణం గా అంటారు ..చాలా సీరియస్ గా రాసిన వారూ చాలా సుందరం గా కమ్మగా రాసిన వారూ ఉన్నారు .జీవితాన్ని తేలిక గా తీసుకొని రాసిన వారూ ఉన్నారు .నీతికి నిబద్ధులైన వారు ,,అజాగ్రత్త గా ఉన్న వారు ఉన్నారు ..సమాజం  లో తల్లులు భరించ  రానిది ,ఆడపిల్లలు చదవకుండా విడిచి పెట్టనిదీ  లేని కవిత్వం రాసి పేరు పొందిన వాడు టెన్నిసన్ కవి .కాలమ్ ,1870  .
      విక్టోరియన్ కాలం లో  పదవీ గౌరవాలే పరమార్ధాలు .దీనికె బెర్నార్డ్ షా ”సెవెన్ డేడ్లి వర్త్యూస్ ”అన్నాడు .మ ధ్య తరగతి ప్రజలు నీతికి పోరాడారు ..స్పెన్సర్ ”అభివృద్ధి అకస్మాత్తుగావచ్చేదికాక పోయినా అవసరమే ”అన్నాడు . భౌ తిక  వాదాన్ని నియంత్రించక పొతే ప్రమాదం అన్న వారూ ఉన్నారు .కార్మిక న్యాయాలు ,ట్రేడ్ యూనియన్ ల హక్కులు ,సహకార సంస్థలు ,వాటి ఉద్యమాలు ,కామన్ వెల్త్  దేశాలలో ప్రపంచ సోదర భావం వంటివి చోటుచేసుకొన్నాయి .
           lలఘు కవితలలలో మేటి అయిన ఆస్థానకవి -ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్
      ఈ విరుద్ధ భావాలను కవిత్వం లో నింపిన వాడు  ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్  6-8-1809లో లింకన్ షిర్ లోని సోమర్బై లో పన్నెండుగురు సంతానం లో నాలుగవ వాడుగా పుట్టాడు ..ఏడవ  ఏట లౌత్ స్కూల్ కు పంపారు చదువు బాగా రావాలని హెడ్ మాస్టారు పిల్లల తలను పుస్తకాలతో బాదేవాడు ..పన్నెండు ఏళ్ళకే  స్కూల్ వదిలి ,పందొమ్మిది వరకు తండ్రి దగ్గరే చదివాడు .తండ్రికి   క్లాసిక్స్ అభిమానం అయితె కొడుకు హోరేస్ రాసిన ఓడ్స్ బట్టీ పట్టిన తరువాతే యూనివర్సిటీకి   పంపాడు …తండ్రితమ్ముడి వలన మోసపోయి ఆస్తి పోగొట్టుకొని మూడీ గామారాడు .ఇద్దరు పిల్లలకు నరాల బలహీనత ..ఇంకొడు  మత్తుమందు కు బానిస  .యెప్పుడూ  నెల మీదే పడి  ఉండేవాడు ..ఈవిష యాలన్నీ కవిత్వం లో రాసుకొన్నాడు కవి టెన్నిసన్
               చదవటం రాక ముందే టెన్నిసన్ కవిత్వం చెప్పాడు .యెనిమిదెడి ఏళ్ళకే  బ్లాంక్ వేర్స్ లో ఆరువేల పంక్తుల మహా కావ్యాన్ని రాసిన చిన్నారి పెద్దకవి పద్నాలుగులో మిల్టన్ రాసిన ”సామ్సన్ అగోనిస్టెస్ ”.ను వ్యాఖ్యానించి వివరణా త్మకం గా రాసి విమర్శకుల జాబితాలో చేరాడు రెండు .  నాటకాలు ”ఆర్మ గడాన్ ”అనే కవిత రాశాడు .దీనినె తర్వాతా మార్చి ”టిం బుక్టూ ”పేర ముద్రింఛి బహుమతి పొందాడు ..బైరాన్ మృతికి విచారించి ,అడవుల్లోకి వెళ్లి రాళ్ళ మీద ”బైరాన్ ఈజ్ డేడ్ ”అని రాసి మనసులోని బాధ పోగొట్టుకొన్నాడు ..సొదరుడు చార్లెస్ తోకలిసి ”పోయెమ్స్ బై టు  బ్రదర్స్”రాసి అచ్చు వేశాడు ..ఇంకొ సోదరుడు ఫ్రెడరిక్ రాసిన నాలుగు కవితల్ని అరవై ఏళ్ళ తర్వాత ప్రసిద్ధ కవిగా పెరుపొందినా  చేర్చి ”కలేక్టేడ్  వర్క్ ”లో చేర్చి ప్రచురించిన పెద్దమనసు టెన్నిసన్ ది
   పందొమ్మిది లో చార్లెస్ తో కలిసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చేరి మెట్రిక్ పాస్ అయ్యాడు అక్కడే  ఆనందం గా ఉండలేక ఇంటి మీద మనసు మల్లింది .”ది అపోజిల్స్ ”అనే క్లబ్ ను స్నేహితులతో కలిసి స్తాపించాడు ..సైన్సును అభిమానిన్చినా అందులో దూసుకు పోలేక పోయాడు.డి గ్రీ పొందకుండానే కేంబ్రిడ్జి ని వదిలేశాడు .అండర్  గ్రాడ్యు ఎట్ గా ఉండగానే”పోయెమ్స్ చీఫ్లీ లిరికల్ ”రాసి ముద్రించాడు .అతి గా ఉందనిపించినా తియ్యదనామ్  ఎక్కువైందని పించినా ”మారియానా ”,వంటి వాటిలో సంగీతం అలరించింది  మూడేళ్ల  తర్వాత మరో కవితా సంకలనం తెచ్చాడు ..కీట్స్  ను చీల్చి చెండాడిన వాడే దీన్నీ అదే ధోరణి లో విమర్శించాడు ..తన ఆత్మ గౌరవం దెబ్బ తిందని టెన్నిసన్ అనుకొన్నాడు .. ఉపయోగం లేనిదైనా అందులోని సంగీత ధ్వనులు మెచ్చ కుండా ఉండలేక పోయారు
 ఇరవై మూడులో హెన్రి ఆలం అనే చరిత్ర పరిశోధకుడు ,తండ్రి ముఖ్య స్నేహితుడు అనుకోకుండా హోటల్ రూం లో రక్తం గడ్డ కట్టి చనిపోతే చలించిపోయి , బయటికి  రాలేక పోతున్నాడు .అయన పై ”ఇన్ మెమోరియం ”అనే కవిత రాశాడు ..దేవుడు  అంటే  ఏమిటో కొంచెం అవగాహనకు వచ్చాడు . కీట్స్ ,మిల్టన్ ల ఎలిజీ ల లాగా కాకుండా దీన్ని స్వీయ భావ ప్రకటన గా రాశాడు .ఇది కవిత మాత్రమె కాని జీవిత చరిత్ర కాదని చెప్పాడు .”ring out ,wild bells to the wild sky -the flying cloud ,the frosty light -the year is dying in the night -ring out ,wild bells ,and let him die ”
  ”ring out the old ,ring in the new -ring ,happy bells ,across the snow -the year is going ,let him go -ring out the false ,ring the true ”.. అనేవి అందరూ తరచుగా వాడే వె అంతగా జనం లోకి చొచ్చుకు పోయింది ..సొదరుడు  చార్లెస్  కు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాతా నల్ల  మందుకు అలవాటు పడ టం తో కాన్సిలయింది ..టె న్నిసన్ పద్నాలుగేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఎమిలీ ని పెళ్లి చేసుకొన్నాడు …ఈ హుషారులో మెమోరియం విడుదల చేశాడు అదే  సమయం లో వర్డ్స్ వర్త్ కవి చని పోవటం తో ఆస్థానకవి గా టెన్నిసన్ నియమింప బడ్డాడు ..పుట్టిన  కొడుకుకు ”హల్లాం ”పేరు పెట్టాడు ..ఇన్ని విజయాలు సాధించినా టెన్నిసన్ ప్రజల కవి అని పించుకో లేక పోయాడు .కాని విద్యావంతులలో ప్రముఖుడు గా నిలిచాడు అయిదేళ్ళ  తర్వాత ”ది ప్రిన్సెస్” రాసి ప్రచురించాడు ..ఇన్దులొ సంగీతాన్ని స్త్రీ సమస్యలతో మేళ వించాడు .. ఇవాళ దీన్ని పట్టించుకొనే వారెవరూ లేరు
  దంపతులు ఐల్ ఆఫ్ వైట్ లో స్తిరపడ్డారు .”టు సేక్రేడ్ పైప్స్ ”’రాశాడు 1855 లో రాసిన ”మౌడ్”ను మెలోడ్రామ గా వదిలాడు అది ”చిన్న హామ్లెట్ ”అని చెప్పుకొన్నాడు .కని పసలేదన్నారు .”ఐడిల్స్ ఆఫ్ ది కింగ్”రాసి అందులో ఆరవ శతాబ్దానికి చెందినా ఆడ మగ వారిని గురించి ”క్వీన్ ఈనోక్ ఆర్డెన్ ”గురించి రాశాడు .చివరి కాలం లో టెన్నిసన్ అత్యుత్తమ కవిత రాశాడు .దెబ్భై లో ”బలడ్స్ అండ్ ఆదర్  పోయెమ్స్”రాశాడు .ఇప్పుదె అనేక గౌరవాలు అందుకొన్నాడు ఽఅక్స్ ఫర్డ్ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది గ్లాస్గో యూని వర్సిటి రెక్తార్శిప్ ఇస్తానంటే తిరస్క రించాడు ..ప్రధాని గ్లాడ్ స్టన్ తో కలిసి నార్వే డెన్మార్క్ టూర్ చేశాడు ..యెనభై లో నరాల బలహీనత తో గౌట్ వచ్చింది ..ఇన్ఫ్ల్యు ఎంజా సోకింది .ఱచన మాత్రం మాన లేదు .ప్రూ ఫులు సరిదిద్దుతూనే ఉన్నాడు .”సిమ్బలీన్ ”లో ఒక పాసేజి పై చూపుడు వ్రేలిని ఉంచి చూస్తూ 6-10-1892అర్ధ రాత్రి మరణించాడు ఽఅయన శవ పేటిక లో షేక్స్ పియర్ నాటకాన్ని ఉంచి వెస్ట్ మినిస్టర్ ఆబ్బె లో గౌరవ లాంచనాలతో సమాధి చేశారు .
   ఆ కాలం లో బాగా ప్రాచుర్యం పొంది ,బాగా చదవ బడిన కవి టెన్నిసన్  మార్గ దర్శి కాదుకాని పూర్వకవుల దారిలో పయనించి గొప్ప కవితా సేద్యం చేసి మంచి పంటలే పండించాడు”he was one of the best and one of the worst of poets” అంటారు .సెంటి   మెంట్  ను ఎక్కువ గా వాడుకొన్నాడు.”what does little birdie say -in her nest at peep of day?-let me fly ,says little birdie -mother ,let me fly ” అనే లైన్లు అందరి మనస్సులో ఉండిపోయాయి .టె న్నిసన్ ను  ”a cross between the traditional ministrel and the conventional maiden aunt ”  అని ఆట పట్టించారు  టెన్నిసన్ కు జనాన్ని తనతో లాక్కుపోయే కవితా బలం లేదంటారు .చివరగా”if the style was not the complete man ,it was the expression of the artist who was a perfectionist in verbal felicities .few poets have had a finer ear for the delicate nuances of sound ,and still fewer have surpassed Tennyson;s  undulating ease ,his limpid lyricism ,and some times matchless music ”.
    రాసిన ప్రతిదానినీ పెర్ఫెక్షన్ కోసం అనేక మార్లు మార్చి రాసిన ఏకైక కవి టెన్నిసన్  గ్రీకు ,లాటిన్ కవిత్వం లోని నాణ్యమైన భావనలను ఛందస్సును చక్కగా ఉపయోగించుకొన్నాడు విక్టోరియన్ కవులలో క్రమ పధ్ధతి భావాలను అనుసరించి ఉత్తమ కవి గా భాసించాడు .తన కవిత్వం తో ప్రేరణ కల్గించలేక పోయినా వ్యక్తిత్వం తో ప్రభావితం చేశాడు జీవితాన్తమ్ డిప్రెషన్ తో బాధ పడుతున్నా కవితాధార ఆగిపోనీకుండా ఇంకి పోనీకుండా కాపాడుకొన్నాడు .”saddest of all English poets ”whose technical mastery of verse and language proved a surface to  his poetry;s depth to the abyss of sorrow  ” అని ఇలియట్ కవి టెన్నిసన్ కవి పై ముద్ర వేశాడు . సుమారు నలభై దాక రచనలు చేశాడు
Alfred Lord Tennyson 1869.jpg  
    సశేషం
  మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14–కాంప్ -మల్లాపూర్ -హైదరా బాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40 విక్టోరియా కాలపు ప్రేమ కధలు

పూర్వాంగ్ల  కవుల ముచ్చట్లు -40

         విక్టోరియా కాలపు ప్రేమ కధలు
             మొనోలోగ్స్ సిద్ధ హస్తుడు – రాబర్ట్ బ్రౌనింగ్
బ్రౌనింగ్ జీవించిన డెబ్భై ఏడు సంవత్సరాలలో న్పందోమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ అనేక ప్రశాంత విప్లవాలను చవి చూసింది .విక్టో రియన్ కాలం లో మార్పులు నెమ్మదిగా వచ్చినా అవి గణ నీయమైనవి .కారల్ మార్క్స్ కు అప్పటికి అంత సీను లేదు ..పార్ల ర మెంట్ లో డబ్బున్న వాళ్ళకే ఓటు హక్కు అనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది . సమాన  వోటు హక్కు కోసం ప్రజలు పట్టు బడుతున్నారు ..చారిటా న్ ల ఈ ఉద్యమం క్రమంగా బలపడి అనుకొన్నవి సాధించారు .ఆ  శతాబ్ది మధ్యలో కాని బాల కార్మికుల పని పై ఆంక్షలు రాలేదు .ఫక్తరీ కూలీల జీవితాలు బాగు పడలేదు .యెలిజ బెత్ బారెట్   బ్రౌనింగ్   ‘రిక్రై  ఆఫ్ ది చైల్డ్ ”థామస్ హుడ్ ”సంగ్ ఆఫ్ ది షర్ట్”లే వీటిని సాధించాయి . డార్విన్ పరిణామ [ సిద్ధాంతం సైన్సుకు మతానికి మధ్య చిచ్చు  పెట్టింది ..బైబిల్ చెప్పిందే నమ్మాలి అన్న దానికి సవాలుగా నిలిచింది ..విశ్వమ్ లో మానవుడి ఉనికికి ప్రాదాన్యమేర్పడింది .
       సాహిత్యం లోను ఎన్నో మార్పులోచాయి ..విక్టో రియన్ నవల అయిన స్కాట్ నవలపై ఏవ గింపు కలిగింది . కల్పనా సాహిత్యాన్ని డికెన్స్ విజ్రుమ్భించి రాసి మెప్పిస్తున్నాడు .నిజాయితీ కంటే బాధ్యతకు ఎక్కువ గౌరవం లభిస్తోంది . అదిగో ఇలాంటి నేపధ్యం లోనే రాబర్ట్ బ్రౌనింగ్ కవి7-5-1812నకంబర్వేల్ లో   ఉద యించాడు అందరు  ఇంగ్లాండ్ కవుల్లా కాకుండా ఇతని వ్రేళ్ళు వెస్ట్ ఇండీస్ లో ఉన్నాయి .తాత గ్రియోల్ రక్తం ఉన్నవాడుఅదే  నల్ల రంగు  బ్రౌనింగ్  కు వచ్చి యెర్ర ఇంగ్లాండ్ కవులకు భిన్నం గా ఉండేవాడు .తల్లి సార వీదర్మన్  జర్మన్ జ్యూఅయిన నావికుని కూతురు ..ఈతాతనె  బ్బ్రొఉనింగ్  షిప్ఓనర్  అనే వాడు .ఈయన డూండీ లోని స్కాటిష్ స్త్రీని పెళ్లి చేసుకొన్నాడు .తల్లి నుండి తనకు సంగీతం సంక్రమించిందని బ్రౌనింగ్ చెప్పాడు .
         తండ్రిపైనే బ్రౌనింగ్ ఎక్కువ ఆధార పడ్డాడు .. తండ్రి వెస్ట్ ఇండీస్ లోని కిట్స్ లో చెరుకు వ్యవసాయం చేసే వాడు ఽఅ క్కడి   బానిసల పై దౌర్జన్యాన్ని ఎదిరిస్తే తండ్రి బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో పనిలో పేట్టాడు ఽఅ క్కద పెద్దమనిషిగా ,విద్యా  వంతుడిగా ,బైబిల్ అభిమానిగా మారాడు  .తండ్రి  లైబ్రరీలో ఆరు వేల పుస్తకాలు వివిధ భాషల్లో ఉండేవి .ఇక్కదె పెరక్లియాస్ ,ఫాస్తాస్ ,మొదలైనవి చదివాడు ఈ విషయం లో జీవితాంతం తండ్రికి రుణ పడి  ఉన్నాడు . తండ్రి మంచి రచయిత కూడా .”డెవలప్ మెంట్ ”అనే స్వీయ చరిత్ర కవిత్వం లో వీటిని బ్రౌనింగ్ వివరించాడు . లండన్   వర్సిటి లో చదివిన కొద్దికాలం లోనే కావలసింది అంతా నేర్చేశాడు ..పన్నేండవ ఏట తాను ఎమికావాలనుకోన్నదీ ఖచ్చితం గా నిర్ణయించుకొన్నాడు ..”ఇన్ కండిటా ”అనే కవితా సంకలాన్ని తెచ్చాడు ..తండ్రి  మెచ్చుకొన్నాడు కాని దాన్ని నాశనం చేశాడు బ్రౌనింగ్ .
 ప ధ్నాలుగో ఏట ఒక గొప్ప సంచలనమే సృష్టించాడు .”పాలిన్ ”రాసి దానికి ”ఫ్రాగ్ మెంట్ ఆఫ్ కన్ఫెషన్ ”’పేరుతొ ఇరవై ఒక్క ఏట విడుదల చేశాడు .దానికి తానే అధికారినని ముప్ఫై నాలుగవ ఏట కాని చెప్పుకో లేదు .దీన్ని కలేక్తేడ్ పోయెమ్స్ లో చేర్చి ప్రచురించాడు .
 ఇరవై  రెండులో విదేశీ యాత్ర చేశాడు .రష్యా లో రెండు నెలలు ఉండి  రినైసేన్స్ డాక్టర్ పెరక్లియాస్ ను కలిశాడు ..ఈ ప్రభావం తో నలుగు వేల పంక్తుల ”పారసేల్సాస్ ”రాశాడు ..దీని ఖర్చు తండ్రి పెట్టాడు .దీన్ని చదివిన నటుడు విలియం మార్కేదీ తనకొక నాటకం రాసి పెట్టమని అడిగాడు ..”స్త్రఫోల్డ్స్ ”రాసి1837 లో ప్రచురించాడు ..దీనిని కోవెంట్ గార్డెన్ దియేటర్ లో అయిదు అంకాల నాటకం గా ప్రదర్శించారు ..నటులు బాగా చేయలేదని బ్రౌనింగ్  యిదేమి నాటకమని డైరెక్టర్ తిట్టుకొన్నారు .జీవితం  లో దియేటర్ నాటకం రాయను అని భీష్మించాడు .కాని రెండేళ్ళ తర్వాతా విజ్రుమ్భించి రాశాడు .
     మొదటి సారి ఇటలి వెళ్లి వెనిస్ అందానికి ముగ్ధుడయ్యాడు .”సార్దేల్లా ”అనే రైమేడ్ పోయెం రాశాడు .ఇది ఆరు వేల లైన్ల కవిత ..సంకల్ప బలం తో దేనినైనా సాధించ వచ్చు అనేది ఇందులో సారాంశం ..కార్ లైల్ భార్య ఇదేమి కవిత్వం అంటే ,టెన్నిసన్ మొదటి చివరి పంక్తులు బాగున్నాయని దేప్పాడు .అవే -who will may hear Sodello ;s story told ”అనే మొదటిది ”who would has heard sordello;s story told”అనే రెండో  లైనూ
 ఇలా విమర్శలోచ్చినా  మంచి రచన చేసి విజయం సాధించాలని నిశ్చయించాడు ..”పిప్పా పాస్సీ ”నాటిక రాశాడు .”కింగ్ వికార్ కింగ్ చార్లెస్ ”,రిటర్న్ ఆఫ్ ది ద్రూసేస్ ”,బ్లాట్ ఇన్ ది స్కచియాన్ ”కోలంబెస్ బర్త్ దే ”రాసి వదిలినా దేనికీ పేరు రానే లేదు .డ్రమాటిక్ . లిరిక్స్ డ్రమాటిక్ రొమాన్స్ అండ్ లిరిక్స్ రాశాడు .రెండవ  సారి ఇటలీ వెళ్ళినప్పుడు షెల్లీ కీట్స్  సమాధులను సందర్శించాడు .ఈ స్పూర్తితో ”లేడీ జేరాల్డైన్స్ కోర్ట్ షిప్   ”రాశాడు
  బ్రౌనింగ్ కుం ఆడ వాళ్ళపై వ్యామోహం కలగ లేదు ..ఒక వేళ  అవకాసం వస్తే తన కంటే పెద్ద వాళ్ళ నే ప్రేమించాడు  ఆరేళ్ళు  పెద్దదయిన  ఎలిజబెత్ బారెట్ తో లవ్ లెటర్స్ జరిపాడు అమె గ్రీకు లాటిన్ లలోన్ దిట్ట . తండ్రి  క్రూరుడు బ్రౌ నింగ్ ను స్నేహితునిగా చూసింది ..ప్రెమా దోమా అంటే కుదరని చెప్పింది ..నలభై లొఆమె ఆరోగ్యం దెబ్బతింటే ఇటలీ తీసుకు వెళ్ళాడు ..నయమ్ అయింది .ఇద్దరు దగ్గరయ్యారు కొడుకు పుట్టాడు .”సానేట్స్  ఫ్రం పోర్చుగీస్ ”రాశాడు .ఇది ”లవర్స్ పాస్ వర్డ్ ”గా కొన్ని త రాలను ప్రభావితం చేసింది .వర్ద్స్ వర్త్ మరణం తో  తనకు  కు ఆస్థాన పదవి దక్కుతుందని ఆశించింది ఎలిజ బెత్ కాని టెన్నిసన్ కు దక్కింది . .భర్తకంటె  పేరు ప్రఖ్యాతులు పొందింది ఒక రకం గా బ్రొనింగ్ ను  బారెట్ భర్త అనేవారు .విక్తొరియన్ కాల రచయితలలో నగ్రగామి అని పించుకోండి ఎలిజ బెత్ .”డి క్రి ఆఫ్ డి చిల్ద్రెన్ ”,మ్యూసికల్ ఇన్స్ట్రుమెంట్స్ ”,ఆరోరా లీ మాత్రమె జనానికి గుర్తున్నాయి .
    భార్య ప్రభావం నుండి బయట పడటానికి ఇటాలియన్ కవిత్వం వైపు వెళ్ళాడు .సాహిత్యమ్ లో ఇటలియే తన యూని   వర్సిటి అన్నాడు .బ్రొనింగ్ కు తండ్రి తరఫునుంచి వచ్చిన డబ్బు కంటే భార్య సంపాదనలో లభించిందే ఎక్కువ ..వీరి కుటుంబ స్నేహితుడు జాన్ కెన్యా చనిపోయి వీరికి పదకొండు వేల పౌండ్ల డబ్బు  ఇచ్చాడు ..బ్రొనింగ్ కు కొడుకు పుట్టాడు .విచరమ్ అలముకొంది .”మెన్ న్ అండ్ విమెన్ ”1855లో రాశాడు .ఇక రాసే వాటన్నిటిలో సంగీతం మేళ వించాడు .భార్య లోని కవిని మెచ్చాడు భర్త బ్రౌనింగ్ .ఫ్లా రెన్స్ లో ఆమె జబ్బు పడింది ..ఉబ్బస వ్యాధి బ్రౌనింగ్ ను పీడిస్తోంది  చనిపోయింది తర్వాతా ఇరవై ఎనిమిదేళ్ళు బతికాడు .
 ”డ్రా మాటి స్ పెర్సానే ”1864లో రాసి ప్రచురించాడు .డెత్   ఇన్ ది  మ డెసర్ట్ ,యూత్ అండ్ ఆర్ట్ ,చైనీస్ పజిల్ మొదలైనవి రాశాడు
డెత్ పునర్ముద్రణ పొందింది 1868లో ”రింగ్ అండ్ ది  బుక్ ”తెచ్చాడు .ఒక రోజు మార్కెట్ కు వెడుతుంటే పదిహేడవశ తాబ్దికి చెందిన లాటిన్ పుస్తకం న పడింది దాన్ని ఆధారం గా రాశాడు తండ్రి చనిపోయిన తర్వాత ,భార్య మరణం తర్వాత రెండో పెళ్లి ఆలోచన చేయలేదు జోలియా వేట్  వుడ్ తో సన్నిహితం గా ఉన్నా హద్దులు దాట  లేదు చివరి ఇరవై ఏళ్ళలో ఎన్నో రాసి ప్రచురించాడు ..ఒక నిష్ణాతుడైన సర్జన్ లా బాంక్ ప్రెసిడెంట్ లా కని  పించేవాడు
   1881లో మొదటి సారిగా బ్రౌనింగ్ సొసైటీ  ఏర్పడింది .దీనికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటు  ఎడిటర్ ఫ్రెడరిక్ జేమ్స్ ఫర్నివాల్ కారకుడు ఆ తర్వాత ఎన్నో క్లబ్బులు ,సొసైటీలు డిస్కషన్ గ్రూపులు ఏర్పడ్డాయి .దెబ్భై లో మాంచి హుషారుగా ఉన్నాడు .”డ్రమాటిక్ ఐడిల్స్ ”రాసి ముద్రించాడు .”ది  ఇన్ ఆల్బం” రాశాడు .. ఇంకా  ఎన్నో రాశాడు అయనలొని సృజన ఆగలేదు .లిబరల్ అయినా అన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరయ్యే వాడు .కొదుకు పైంటర్ అయి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు జలుబుతో ప్రారంభమై హార్ట్ ఎటాక్ తో 12-12-1889న నవ్వుతూ కను మూశాడు .వెస్ట్  మినిస్టర్ ఆబీ లో పోఎట్స్ కార్నర్ లో సమాధి చేశారు
 బ్రౌనింగ్ ను ఆశా వాది  అంటారు ”God is in heaven -all is right with the world ‘అన్నదే ఆయన తత్త్వం .అయనలొ గొప్ప టెక్నిక్ ఉంది ఛందస్సును విచ్చల విడిగా మార్చి రాశాడు ..సాహిత్యం  లో గొప్ప శక్తి సంపన్నుడైన కవి గా బ్రౌనింగ్ నిలిచి పోయాడు ‘
Brounning;s restless energy is inherent in the incalculable range of his interests .he seems to have determined as G;k Chesterton observed ”to leave no spot of the cosmos unadorned by his poetry ”and he almost succeeded ”.
   ఈ నాడు బ్రౌనింగ్ డ్రమాటిక్ మోనో లాగ్స్ నే బాగా అభిమానిస్తున్నారు అందులో వక్త స్వభావం ఖచ్చితం గా బయట పడుతుంది ఇవి సాలిలోక్వి లాగా కాకుండా పూర్తిగా పాత్రను ఆవిష్కరిస్తాయి మానవుని విషయం లో దైవ చేస్ట ల్ని తెలియ జేస్తాడు ఇలియట్ ,ఎజ్రా పౌండ్ లు ఈ మోనో లోగ్స్ ను బాగా వాడుకొని సుసంపన్నం చేశారు  నాటకీయ కవిత్వాన్ని బ్రౌనింగ్ అద్భుతం గా తీర్చి దిద్ది మార్గ దర్శకుడైనాడు భార్యా భర్తలు స్పిరిట్య లిజం కు ఆకర్షితులైనారు .దీని ప్రభావం వలననే దృఢమైన కొడుకు ”పెన్ ”పుట్టాడు చివరి రచన ”అసలాండో ”బ్రౌనింగ్ మరణించిన రోజే పబ్లిష్ అవటం యాదృచ్చికం జీవితకాలం లో ఎన్నో అవార్డులు పొందాడు .లండన్ యూని వర్సిటి కి జీవితకాలం గవర్నర్ గా ఉన్నాడు . గ్లాస్గో కు లార్డ్ రెక్టార్ షిప్ కు ఆహ్వానించినా ఉపన్యాసాలివ్వాల్సి వస్తుందని వద్దన్నాడు .సుమారు అరవై రచనలు రాసి ప్రచురించిన సాహిత్య జీవి బ్రౌనింగ్

Robert Browning by Herbert Rose Barraud c1888.jpg   

couple
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వేద పరమా (త్మ)ర్ధం

వేద పరమా (త్మ)ర్ధం

 

వేద పరమా (త్మ)ర్ధం

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో  ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన  వీర భద్రుడు చేసిన తెలుగు సేత పుస్తకాన్ని పంపారు .హైదరాబాద్ లో ఉంటున్న ఈ అయిదారు రోజుల్లో దాన్ని ఆసాంతం చదివాను .ఎన్నో విషయాలను గుది గుచ్చి ఒక చోట చేర్చి కరతలామలకం గా  వేదం ఎందుకు చదవాలి ,అందులో ఉన్న పరమార్ధం ఏమిటి ,ఎందుకు దానికి దూరమై పోతున్నాం ,పాశ్చాత్యులు వేదం ను సరిగ్గా అర్ధం చేసుకో కుండా ,ఏవేవో చదివి విపరీతార్ధాలను ఎలా రాశారు ,దానివలన వేద పరామార్దానికి ఏర్పడిన ఇబ్బంది ఏమిటి అన్న విషయాలను నాలుగు వేదాలు ఉపనిషత్తులు ,మహా భారత భాగవత రామాయణ ,మనుస్మ్రుతులు   మీమాంస ,శ్రీ శంకర ,రామానుజ ,మాధవాచార్యుల భాష్యాలు ,సాంఖ్య ,న్యాయ  వైశేషిక ,బ్రహ్మ సూత్ర ,భగవద గీతాదుల నాధారం గా  సవివరం గా శాస్త్ర ప్రమాణం గా చర్చించి నిగ్గుతేల్చి అతి సరళ భాషలో ఇంగ్లీష్ లో రచించి తన విశేష శేముషీ వైభవానికి ,పరిజ్ఞానానికి దర్పణం గా ‘’వేదార్ధ మీమాంస ‘’ను రాస్తే అంతకంటే సరళ సుందరం గా ప్రతి మాటను సాధికారికం గా ప్రతి భావాన్ని ఉజ్జ్వల తేజో విలసితం గా అనువాదం చేసి అసలు మూల గ్రందాన్నే చదువుతున్నామనే అమోఘ అనుభవాన్ని కలిగించారు  చిన వీర భద్రుడు .నిజం గా వాణినా రాణి అన్న చిన వీరభద్రకవి అనిపించి ,పెద వీర భద్రుడే అనే నిశ్చయాన్ని కల్పించారు .మూల ,అనువాద రచయితలిద్దరికీ కై మోడ్పు ఘటిస్తూ అందులో నేను తెలుసుకొన్న నాకు నచ్చిన  ముఖ్య విషయాలను ‘’వేద పరమా (త్మ)ర్ధం ‘’గా మీ ముందు ఉంచుతూ ,మీకూ ఆ అను భూతిని పంచుతున్నాను .

ఋగ్వేద,యజుర్వేదాలలో  లో సత్యమే జ్ఞానమని ,యజ్ఞం కర్తవ్యమని యజ్నమంటే శుద్ధి చేసే కర్మ అని తెలియ జేశారు .రుక్కుల ద్వారా వర్ణింప బడింది సామం ద్వారా గానమైంది . అధర్వం అన్ని వేదాల సారమే .యజ్న మార్గానికి దారి చూపింది ‘’అధర్వుడు ‘’. ఆయన పేర ఆ వేదం పిలువ బడింది .భ్రుగువులు కూడా ఆయనకు సమానమే అందుకే దానికి అధర్వాన్గీరసం లేక భ్రుగ్వాన్గీరసమని పిలుస్తారు   .కైవల్య పధం నాలుగు కొమ్ములు కల వృషభం అ కొమ్ములే నాలుగు వేదాలు యజ్న మార్గం లో పరమ పురుషుడిని తెలుసుకోవాలి .ప్రతిదీ ఈశ్వరునితో కూడుకొని ఉంది అనే భావం రావాలి .వేద వృక్షానికి పూసిన పువ్వే సామ వేదం .మానవుడిలో ఉన్న బ్రహ్మాన్ ను ఎరుక పరచేదే  అధర్వ వేదం .వేదాల్లో యజ్న యాగాదులకు సంబంధించింది అంతా ‘’త్వం ‘’, భగ వంతుని గుణ గణాలను వర్ణించేది ‘’తత్ ‘’ వేదాంతం బ్రాహ్మణ ,ఆత్మల ఏకత్వాన్ని తెలియ జేస్తుంది .

వేదాలు ఎ భేదామూ లేకుండా ఒకే విషయాన్ని గూర్చి చెప్పాయని భగవత్ పాదులన్నారు .జీవితం లోని అత్యున్నత సూత్రం గా సత్యాన్ని ప్రతిస్టించటం ఉపనిషత్తులు చేసిన గొప్ప పని అని ‘’లూడర్స్ ‘’వివరించాడు . ఏధర్మాన్ని  బ్రహ్మాన్ని ఎరుక పరుస్తుందో అదే వేదం .కోరిన కోర్కెలను తీర్చటానికే వేదాన్ని వాడుకో రాదు అంతకు   మించిన అమూల్య జ్ఞానం ఉందని గ్రహించాలి .మానవ జీవితం లో ఏ కర్మ అయినా యజ్ఞమే .అదొక ఆరాధనా కార్య క్రమం .మన కోరికలు తీర్చుకోవటం కోసం దేవతలకు అర్పించే కానుకలే యజ్ఞం .యజ్ఞం మానవుల్ని దేవతల్ని కలిపి ఉంచే ఒప్పందాలు .యజ్ఞం చేయక పోవటం అమానుషం ,సామాజిక ఉపద్రవం .దేవతలు పురుషుడిని హవిస్సు చేసి యజ్ఞం చేశారు .అంటే మానసికం గా చేశారని భావం ,ప్రపంచం మహా పురుషుని దేహం .యజ్ఞం చేయటం పురుష స్వరూపమే అవుతుంది .యజమాని యజ్ఞం హవిస్సు ,అగ్ని అన్నీ పురుషుడే .’’పురుషాత్మకం సర్వం ‘’అన్నది వేదం .భగవంతుడు తనలోని సమస్త జీవుల్ని వెలికి తీసి వాటి అనుభవం కోసం తన సర్వస్వాన్ని వారికి ప్రసాదిస్తున్నాడు .ఈ సృష్టి భగవంతుడు చేసే యాగమే .

యజ్ఞం చేసేటప్పుడు మానవుడు తన పాత అస్తిత్వాన్ని దేవతలకు హవిస్సుగా అర్పించి దగ్ధం చేసుకొంటాడు . ఏరూపం లో కొలిస్తే ఆయన ఆరూపం లో చేరువౌతాడు బగవంతుడు .బ్రాహ్మణాలు ఆరణ్యకాలు యజ్ఞాన్ని ఒక కారుణ్య కర్మ గా మార్చాయి .తన మంచికోసం చేసేది యజ్ఞం .సమస్త ప్రాణులకోసమూ  జ్ఞానోదయం కోసం చేస్తే మహా సత్రం అంటారు .అందరం బ్రహ్మ ,దేవ ,పితృ ,మనుష్య ,భూత యజ్ఞాలనే పంచ మహా యజ్ఞాలు చేయాల్సిందే ..వేదం అధ్యయనం చేస్తూ చిత్త ఏకాగ్రత ,ఇంద్రియ నిగ్రహం ,స్తిత ప్రజ్ఞత ,ఆధ్యాత్మిక శీలం ,యశస్సులో అభివృద్ధి  బ్రాహ్మన్  కు హవిస్సులంద జేయటమే బ్రహ్మ యజ్ఞం .తన దగ్గర ఏది ఉందొ దాన్ని భగ వంతుడికి సమర్పించటం దేవ యజ్ఞం .బీదలకు, అవసరమున్న వారికి సాయం చేయటం మనుష్య యజ్ఞం .సర్వ భూత కోటికీ వీలైనంత సాయం చేయటం ,ప్రేమించటం భూత యజ్ఞం .మొత్తం జీవ కోటితో సంబంధమే భూత దయ .మనిషి విశ్వ ప్రణాళిక లో ఒక భాగం .మనిషి శాశ్వత ,అతీతమైన దానితో బాటు తాత్కాలిక అస్తిత్వం తో కూడా ముడి పడి ఉంటాడు .తనకోసం తోటివారికోసం  భగవంతుడికోసం జీవించటమే అన్నిటికన్నా ఉత్క్రుస్ట మైన యజ్నం .

ఉపనిషత్తులు –ప్రజా పతియే తనను తానూ ఒక మహా యజ్న పశువుగా భావించి తనను తానె యజ్ఞం చేసుకొన్నాడని చెప్పింది మనిషి జీవితమంతా సోమయాగమే నంది .ప్రపంచమే ఒక హోమం .భూమి దాని ఇంధనం .అగ్ని దాని పొగ .రాత్రి దాని మంట .చంద్రుడు భస్మం .నక్షత్రాలు విస్ఫులిన్గాలు ఈ అగ్నికి దేవతాలు వర్షాన్ని హవిస్సుగా సమర్పిస్తారు .దాని నుంచి అన్నం వస్తుంది మనిషి ఒక అగ్ని .అతడికి దేవతలు అన్నాన్ని హవిస్సుగా అర్పిస్తారు .దానినుంచే జీవితం పుడుతుంది .పరబ్రహ్మ మనిషిలోనే ఉన్నాడు .మనిషి తినేది అంతా పరబ్రహ్మానికి నైవేద్యమే .కౌతికీ ఉపనిషత్తు –మనిషి నిద్రపోతున్నా మెలకువ గా ఉన్నా  నిర్విరామం గా యజ్ఞం చేస్తున్నట్లే లెక్క అని చెప్పింది

స్వర్గీయ ఉప్పులూరి గణపతి శాస్త్రి యజ్ఞాల ఘట్టాలు అధ్యయనం ,పారాయణ యజ్ఞం చేసిన దానితో సమానమే అన్నారు .స్వాధ్యాయ ప్రవచానలకు మించిన యజ్ఞమే లేదు .బ్రహ్మ జ్ఞానమే మానవ జీవిత పరమార్ధం .భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధిపత్యం ఎవరికి ఉందొ ,ఎవరు ఈ ప్రపంచానికి అతీతం గా ఉన్నాడో ఆయనే శాశ్వతుడు నిత్య నూతనుడు .ఆయనే మర్త్య ప్రపంచం లో ఉన్న అమర్త్యుడు ,అతడు మృత్యువుకు భయ పడడు .గాఢం గా కోరుకొనే వారికి పరమ ధామం లో ప్రతిదీ ఏక రూపం ధరించినట్లే ఉంటుంది .అన్నిటి లోను పని చేసే ఏక సూత్రమే బ్రాహ్మన్ అని ఆరణ్యన్యకాలు అంటున్నాయి  .అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మా .ఇవాళ ఉన్నది రేపు ఉండబోయేది ఆయన ఒక్కడు మాత్రమె .పరమ పదం లో దివ్య రూప రహితుడైన పురుషుడి నుంచే దేవ మనుష్య జీవరాశులన్నీ ప్రభ వీస్తున్నాయని ముండకోపనిషత్ అంటోంది .దేవాతలైనా బ్రాహ్మాన్ ను దాటి ముందుకు పోలేరు . ఈ మహా సత్యమే వేద సారం ఆ సత్యం తెలియక పోతే సారాంశం బోధ పడదు ‘’నా వేద విన్మనుతే తమ బృహంతం ‘’.

వేదాలు ఒక దానికొకటి అనుసంధించుకునే ఉన్నాయి .సత్యం జిజ్ఞాస ,మీమాంస వల్లనే గోచరిస్తుంది .’’పోస్ట్ మోడరన్ యుగ తాత్విక పధ్ధతి అయిన ‘’హెర్మ న్యూటి క్స్ ‘’అంటే ఇరవయ్యవ శతాబ్దపు పాశ్చాత్య తాత్వికులు తత్వ శాస్త్రం లో తాము కొత్తగా కనుక్కొనే సత్యం ఏదీ లేదని తాము ప్రాచీన తత్వ వేత్తల రచనలను మళ్ళీ పూర్తిగా చదివితే సరిపోతుందని భావించారు .గత పది హేను వందల ఏళ్లుగా భారతీయ ఆచార్యులేవ్వరూ తాము కొత్తగా యేదర్శనాన్ని ప్రతి పాదిస్తున్నట్లు చెప్ప లేదు ..పాత వాటికి భాష్యాలు మాత్రమె రాస్తున్నారు .భాష్య సంప్రదాయానికి ‘’హెర్మ న్యూటిక్స్‘’కు తేడా ఉంది .భాష్యం లో భాష్య కారుడు ఏదో ఒక సంప్రదాయానికి బద్ధుడై రాస్తాడు కానిహిర్మన్యూ టిక్స్  తటస్థ భావం తో నిష్పక్ష పాతం గా ,ఎటు వంటి లోగో  సేంత్రిజం  లోను కాకుండా ప్రాచీన రచనలను అర్ధం చేసుకొంటుంది .ఇదే విధానాన్నిపద్మ విభూషణ్ శ్రీ కొత్త సచ్చిదానంద మూర్తి గారు అవలంబించి వేద సారాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేశారు .ఇది నేడు భారత దేశానికి అత్యంత అవసరమైన రచన ‘అందుకే నాకు ఇష్టం ‘’అని అనువాదకులు శ్రీ చిన వీర భద్రుడు స్పష్టం గా తెలియ జేశారు .

‘’శబ్ద బ్రహ్మేతి యచ్చేదం  శాస్త్రం  వేదాఖ్య ముచ్యతే –తదిష్యదిధీస్టితం సర్వమేకేన  పరమాత్మనా ‘’

వేదం గా పిలువ బడే ఈ శాస్త్రం అంతా శబ్ద బ్రాహ్మ స్వరూపం గా ,ప్రసిద్ధి కెక్కినది అంతా కూడా ఆ పరమాత్మ వల్లనే ప్రేరేపిత మైంది .ఆయనలోనే పాదుకుని ఉంది ..(తాంత్రిక వార్తికం లో కుమారిలుడు )

 

 

 

 

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-14-కాంప్-బాచుపల్లి –హైదరా బాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రమణాచారి బాధ

అధికారులు రెండు రకాలు. ప్రభుత్వ నిబంధనలను తూచాతప్పకుండా పాటించేవారు ఒక రకమైతే నిబంధనలను పాటిస్తూనే- ప్రజల అవసరాలను గమనించి వాటిని తీర్చేవారు రెండోరకం. ఇటు రాజకీయనాయకులకు, అటు ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే అధికారుల పని ప్రతి రోజు కత్తి మీద సామే. అలాంటి బాధ్యతలను తనదైన శైలిలో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి జీవితానికి చీకోలు సుందరయ్య ‘ప్రజలు..ప్రభుత్వం.. ఒక ఐఏఎస్’గా పుస్తకరూపం ఇచ్చారు. అందులోనుంచి కొన్ని ఆసక్తికర భాగాలు…

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందరిలాంటి ముఖ్యమంత్రి కారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎవరెవరు ఏమిటో బాగా తెలిసినవారు. తన అధికారుల్లో ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటో ఎరిగినవారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా జి. కుమారస్వామి రెడ్డి ఉండేవారు. కె.వి. రమణ పీఆర్వో. ఆయనతోపాటు కిషన్‌రావు, రాజేంద్రమోహన్ గోనెల తదితర అధికారులుండేవారు. రమణ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకొస్తే రాత్రి రెండుగంటల వరకూ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండవలసి వచ్చేది. అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఓ రోజు రమణ సాహసించి కుమారస్వామిరెడ్డిగారిని అడగనే అడిగారు.
‘రోజూ ఇంతంతసేపంటే కష్టం కదా సార్? రాత్రి పదింటికైనా ఇంటికెళ్తే బాగుంటుంది.’
రెడ్డిగారు వెంటనే అన్నారు.
“నేనే ఉంటే నీకేం ప్రాబ్లం! ఇది మన డ్యూటీ. ముఖ్యమంత్రిగారు వెళ్లేంతవరకు మనం ఉండాలి. తప్పదు!”
చెన్నారెడ్డి అలవాట్లలో ముఖ్యమైనది ఆయన ఆఫీసు నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన కార్యాలయంలో ఎవరెవరున్నారు, ఎవరు లేరు… ఉన్న వారిలో సెల్యూట్ చేసిన వారెంతమంది… చేయని వారెవరెవరు… వంటి విషయాలు కూడా గమనించేవారు. ఎవరైనా కనిపించకపోతే రెండోరోజు ఆ విషయం ప్రస్తావన కొచ్చేది. దాంతో అధికారులు, సిబ్బంది విధిగా సి.ఎం. వెళ్లేంతవరకూ ఉండి ఆయనకు కనిపించి, సవినయంగా నమస్కరించి మరీ వెళ్లేవారు!
అందువల్ల రమణ ఆ విషయంలో రాజీపడ్డారు. ప్రభుత్వాధికారిగా తనకు పనివేళలు ఉండవు అన్న సత్యాన్ని గుర్తించారు. దానికి అలవాటుపడ్డారు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన మిత్రుల్లో చాలామంది సచివాలయానికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి, సీనియర్ రాజకీయనాయులు జి. వెంకటస్వామి, హాషిం, రోడామిస్త్రీ, ఉమా వెంకట్రామిరెడ్డి, గీతారెడ్డి వంటివారు తరచూ వచ్చేవారు. అలా ఎవరైనా వచ్చినపుడు మరీ అవసరమయితే తప్ప ఆయన అధికారుల్ని పిలిచేవారు కాదు.
ఓ పర్యాయం ఆంధ్ర మహిళా సభలో కార్యక్రమానికి ఆయన వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారుచేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ఆయన్ని బాగా ఆకట్టుకుంది.
‘లోగోంకే పాస్ వక్త్ హై – నఫ్రత్‌కే వాస్తే
జబ్‌కే హయాత్ కమ్‌హై – మొహబ్బత్‌కే వాస్తే’
ఇదీ ఆ ఉర్దూ కవిత. (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది… కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు.) దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. “మా కొత్త పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు” అంటూ పలుమార్లు ప్రశంసించారు. ఇది రమణలో ఆత్మవిశ్వాసం పెంచింది. అప్పట్నించి చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరయ్యారు.
నందమూరికి ప్రాతఃకాల సేవ
“నన్నెప్పుడూ కులీకుతుబ్‌షా అని (ఎన్.టి. రామారావు గారు) పిలిచేవారు. ఎందుకంటే ఆయన కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థకు చైర్మన్. నేను వైస్ చైర్మన్. ఉదయం నాలుగున్నర గంటలకి దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. మా పెద్దమ్మాయి వీణ పెళ్లికోసమని తార్నాకలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడిని. తార్నాక నుంచి రోడ్ నెం.13 బంజారాహిల్స్‌లో ఉన్న ఎన్.టి.ఆర్. గారింటికి వెళ్లేవాడిని. రాత్రి ఏ మూడుగంటలకో లేవవలసి వచ్చేది. ముఖ్యమంత్రిగారింటికి నాలుగుంబావుకి చేరుకునేవాడిని. సాంబ్రాణి ధూపం… పరిమళాల మధ్య శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని నాలుగన్నర గంటలకల్లా వినిపింపచేయడం ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంట్ కమీషనర్‌గా నా కర్తవ్యం. సుప్రభాతం వినిపింపచేసే టెక్నికల్ ఆపరేటర్ రాకున్నా కమీషనర్ రానట్టే లెక్క. టెక్నికల్ ఆపరేటర్ కూకట్‌పల్లిలో ఉండేవాడు. అతని అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఆటోకోసం పాతిక రూపాయలు చెల్లించేవాళ్లం. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంట్లోనే అతను ఏదో ఓ మూలన ఉండాల్సి వచ్చేది పాపం. ఇంచుమించుగా నాతోపాటు లేదా కొంచెం ముందు డి.జి.పి. గారు వచ్చేవారు. మీరు ముందా నేను ముందా అన్నట్లుండేది మా స్థితి. సాధారణంగా డి.జి.పి.యే సీనియారిటీ దృష్టిలో ఉంచుకొని ముందుగా సియంని సందర్శించేవారు. నేను కొన్నాళ్లు ఓపిక బట్టి డి.జి.పి. గారితో అన్నదేమిటంటే “పోలీస్ శాఖకి సంబంధించిన విషయాలన్నీ – అక్రమాలు, లాఠీచార్జీలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి ఉంటాయి. బ్రాహ్మీముహూర్తంలో సియం ఈ రకమైన విషయాలు వినేదానికంటే కమీషనర్‌గా నేను చెప్పే అంశాలు, వార్తలే ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి నేనే వెళ్లి చెబితే బాగుంటుందనే వాడిని.” ముందు నా విధిలో భాగమేమిటంటే వార్తాపత్రికల్లోని వివిధాంశాల్ని వారికి వివరించడం. ముందుగా పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత మోర్ నెగిటివ్‌గా విషయాలను విభజించుకొని తెలిపేవాడిని. వార్తాపత్రికలు తేవడానికి ఒక అసిస్టెంట్‌ని ఉదయం నాలుగు గంటలకే ముఖ్యమంత్రి గారి ఇంటికి తెచ్చేలా ఏర్పాటు చేశాం. వార్తాంశాల్ని వివరిస్తున్నంతసేపు ఆయన బుద్ఢుడిలా కూర్చుని వినేవారు. ఆయన కళ్లు మూసుకుని వింటే తదేకంగా వింటున్నట్లు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల అభిప్రాయాల్ని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని వివరించడం కూడా నా డ్యూటీలో భాగమే. అప్పుడప్పుడూ నా కంటే ముందే నందమూరి లక్ష్మీపార్వతి గారు కొన్ని చెప్తుండేవారు. ఒకనాడు ‘ఈనాడు’లో ఒక కార్టూను వచ్చింది. బండిని లాగుతున్న సియం, కొరడా ఝళిపిస్తున్న లక్ష్మీపార్వతి బొమ్మ ఉంది అందులో. ‘కమీషనర్‌గా ఏం చేస్తున్నట్లు మీరు’ అన్నారు.
‘పత్రికల్లో వచ్చే కార్టూన్లకి కమీషనర్‌కి సంబంధం ఉండదండీ’ అన్నాను.
‘నో… వెంటనే ఎడిటర్‌తో మాట్లాడండి. అవసరమైతే నా మాటగా చెప్పండి. మళ్లీ ఏ విషయం నాకొచ్చి చెప్పండి” అని ఆయన అన్నారు.
అప్పుడు ఎడిటరు ఎలాగూ ఉండడు. అది నాకు తెలుసు. అయినా ఆయన మూడ్ గమనించి నేను ఎడిటర్ గారిని కలుస్తాను అని చెప్పాను.
తర్వాత ఎడిటర్ గారిని కలవడం, సియంకి చెప్పడం అదో కథ.
ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్.
(డా. కె.వి. రమణాచారి జీవన తరంగాలు)
రచయిత: చీకోలు సుందరయ్య
పేజీలు: 208, ధర: 100 రూపాయలు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39

క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

సాధారణ చదువు మాత్రమె ఉన్నా  ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొన్న అదృష్టవంతుడు .తొలి సంతానమే జాన్ కీట్స్ .స్వాన్ అండ్ హోప్ స్తేబిల్స్ లో 1795  ఇరవై  తొమ్మిదిన   పుట్టాడు . బాల్యం బాగానే గడిచింది .పదేళ్ళ వయసులో తండ్రి గుర్రం  కిందపదేస్తే   చనిపోయాడు .మూడు నెలల తర్వాత తల్లి వేరొకరిని పెళ్ళాడి వెళ్లి పోయింది .అమ్మామ్మ జెన్నింగ్స్ దగ్గరకు పిల్లలు చేరారు .తల్లి అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసి వెళ్ళేది .తల్లి మరణానికి ముందు జాన్ ,అతని తమ్ముడు జార్జి యెన్ ఫీల్డ్ స్కూల్ లో చేరారు .అమ్మమ్మ ఈ పిల్లలకు గార్దియన్లుగా ఇద్దరినీ ఏర్పరచింది .అమ్మమ్మ చావు తర్వాత బంధువులే లేని వారయ్యారు .అమ్మమ్మ ఆస్తి తగాదాల్లో పడింది .ఈ తగాదా కీట్స్ మరణించిన సంవత్సరానికి కాని తేలలేదు .

కీట్స్ స్కూల్ జీవితం హుషారుగానే గడిచింది .అక్కడి హెడ్ మాస్టర్ జాన్ క్లార్క్ కీట్స్ పై గొప్ప ప్రభావం కలిగించాడు .కొత్త భావాలు ఆలోచనలు ,కళాత్మక విషయాలను ప్రోత్సహించేవాడు .కీట్స్ కంటే ఎనిమిదేళ్ళ పెద్ద వాడైన ఆయనకొడుకు చార్లెస్ అక్కడే టీచర్ గా పని చేస్తున్నాడు .కీట్స్ లోని కవిని గుర్తించారు తండ్రీ కొడుకులు .కీట్స్ కు ఆటలంటే ఇష్టం కుస్తీలు ,మరీ ఇష్టం ఎవరితోనైనా యే క్షణాన్నైనా పోటీపడి పీటీ దెబ్బ కొట్టగలదాడసవాలు చేసేవాడు .నిజానికి కీట్స్ సన్నగా బలహీనం గా ఉండేవాడు .ఒక రోజు పోటీలో రెచ్చిపోయి ఒకడి చెవులు కొరికి జేబులో వేసుకొన్నాడు కీట్స్ .

మహా కావ్యాలు  కంట బడ్డాయి .రాబిన్సన్ క్రూసో ,పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ లను దీక్షగా చదివాడు .ఓద్ రాసిన మెటా మార్ఫోసిస్ అనువాదాన్ని చదివాడు . క్లాసికల్ డిక్షనరి అనువాదాన్ని పూర్తీ చేశాడు .’’ఎనీద్ ‘’కు వచన అనువాదం చేశాడు ‘’ఇంట్రడక్షన్ ఫర్ ఆస్ట్రానమి ‘’,   మిల్టన్ పోప్ థామ్సన్ మొదలైన కోటే షాన్ లకు రెండు బహుమతులు పొందాడు . ‘’ఎడిక్షనరి ఆఫ్ మర్కండైజ్ ‘’ పై మోజేర్పడింది .సర్జన్ థామస్ హామ్మండ్ దగ్గర అప్రెంటిస్ చేశాడు .తమ్ముడు  బుక్ కీపింగ్ లో చేరాడు . ఇంటికి రెండుమైళ్ళ దూరం లో ఉన్న కౌడేన్ క్లార్క్ దగ్గరకు వారానికోసారి వెళ్లి అతను చదివేవి వినేవాడు .అది రొమాంటిక్ కాలం కనుక పాత ధోరణులకు స్వస్తి చెప్పి కొత్తగా ఇద్దరూ ఆలోచించేవారు .పూర్వకవుల భావాలను స్పెన్సర్ స్టాంజాలలో అద్భుతం గా కీట్స్ రాసి వినిపించేవాడు .కౌడేన్ దగ్గర నుంచి ‘’ది ఫైరీ క్వీన్ ‘’ను అరువుగా తీసుకొని ఆశ్విక వేగం తో చదివి పారేశాడు .నాలుగేళ్ళు అప్రాంటిస్ చేసిన తర్వాత స్వంత ఇల్లే లేని ఇంటిమీద ధ్యాస మళ్ళింది .అమ్మమ్మ చని పోయింది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరి వ్యాపకాలలో వాళ్ళున్నారు .డాక్టర్ అవాలనే కోరిక ఉండేది కాని సర్జన్ అవటం ఇస్టంలేదు.హామ్మన్డ్స్ హాస్పిటల్ వదిలేసి లండన్ లో గీస్ హాస్పిటల్ లో చేరాడు .మేటీరియామేదికా ,అనాటమీ మిడ్ వైఫ్   బాటని లెక్చర్లు వినేవాడు .  ఫ్లవర్ డ్రాయింగ్ లో పండి పోయాడు .తోటి వాడు హెన్రీ స్టీఫెన్స్ సర్జన్ అయి పోయాడు .కీట్స్ మనసు మాత్రం దేని మీదో ఉంది .కూపర్ కజిన్ పై మనసు పారేసుకొన్నాడు .తొమ్మిది నెలల తర్వాతమందుల దుకాణం పెట్టుకోవటానికి సర్టిఫికేట్ ఇచ్చారు .మందుల లక్షణాలు వాటి  కంపోజిష న్ లు గా గ్రహించాడు .ఇంత చేస్తున్నా’’ మనసంతా నువ్వే’’ అంటూ కవిత్వం మీదే ఉండిపోయింది .కవిత్వ శక్తికి దాసోహమన్నాడు .కౌడేన్ క్లార్క్ తో ఒక సారి  ‘’The other day during a lecture there came a sunbeam into the room and with it a whole troop of creatures floating in the ray and I was off with them into a fairy land ‘’ అంటూ స్వప్న లోకం లో విహరించాడు .జబ్బు పడ్డవారికి నయం చేయటం తనకు చేతకానిపని అని  గ్రహించాడు .చివరిసారిగా ఒక పేషెంట్ ఆర్టేరిను ఓపెన్ చేసి కలల్లో తేలిపోయి అద్భుతాలు చూసి ఇక మళ్ళీ సర్జికల్ సామగ్రి జోలికి   వెళ్ళలేదని  కీట్స్ స్వయం గా చెప్పాడు .

ఇరవై ఒకటి లో కొన్ని కవితలే రాశాడు .ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్ ‘’అనే సానెట్ రాశాడు .తను ఇంకా సర్జన్ గా ఉండలేనని తేల్చి చెప్పేశాడు .కీట్స్ కు సన్నిహితులు అతని సోదరులే .సేవేర్న్ అనే చిత్రకారుడు కీట్స్ అద్భుత చిత్రాన్ని గీశాడు .చాలా ముచ్చటగా కీట్స్ కనీ పిస్తాడు .లండన్ లో చాపి సై డ్ జిల్లాలో సోదరులతో కొంతకాలం ఉన్నాడు .ఒక రోజు ఉదయం  పదింటికి కీట్స్ ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మేలుకొని రాసిన ‘’ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇంటు  చాప్మాన్స్ హోమర్ ‘’ ‘’much have I travelled in the realms of gold –and many goodly states and kingdoms seen ‘’అని ప్రారంభమయ్యే సానెట్ చదివి వినిపించాడు .పసిఫిక్ సముద్ర అన్వేషణ పై ‘’కోర్తెజ్ ‘’కవిత రాశాడు .వీటి వ్రాత ప్రతులు ఉన్నాయి . హంట్ రాసిన దానికి ఫైన్ వేసి జైల్లో పెట్టారు . ‘’కవిత్వం కాన్షస్  తో రాసేది కాదు అన్ కాన్షస్ గా రాసేదని’’ కీట్స్ అభిప్రాయం ‘’.a drainless shower –of light is poesy –it is the supreme of power –its might half –slumbering on its own right arm ‘అన్నాడు  .హంట్ బృందం లో కీట్స్ సభ్యుడైనాడు .వర్డ్స్ వర్హ్ కీట్స్ ను మెచ్చాడు .హుంట్ తో సాన్నిహిత్యం కీట్స్ కు ఎంతో మేలు చేసింది .’’the poetry of earth is never dead ‘’తో ప్రారంభమైన కవిత అందరిని మెప్పించింది ‘’ ఆ న్ దిగ్రాస్ హాపర్ అండ్ ది క్రికెట్ ‘’మొదలైనవి పేరొందాయి .సమీక్షలూ అనుకూలం గానే వస్తున్నాయి .

ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు .సోదరుడు టాం అనారోగ్యం తో తిరిగి వచ్చాడు .అందరూకలిసి వెల్  వాక్ లో స్తిరపడ్డారు .హాంప్  స్టేడ్ బృందం  పెరిగి పోయింది .కీట్స్ ధ్యాస అంతా కవిత్వం మీదనే .కవిత్వం రాయకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు .షేక్స్ పియర్ ను చదివితే చాలు అతడొక విజ్ఞాన సర్వస్వం అనే వాడు .’’ఎందిమియాన్ ‘’ ‘’తన ప్రాజ్ఞా సర్వస్వం అని తన శక్తి అంతా  ధార పోసి రాశానని చెప్పాడు .దాన్ని ‘’పోలార్ స్టార్ ఆఫ్ పోయిట్రీ ‘’అన్నాడు .చాంపియన్ పత్రిక లో డ్రామా క్రిటిక్ గా ఉన్న రేనాల్డ్స్ సెలవలకు వెడుతూ బాధ్యతా కీట్స్ మీద ఉంచాడు ఒదేల్లో రిచర్డ్ త్రీ ,నాటకాలు చూసి సమీక్ష చేశాడు వర్డ్స్ వర్త తో కలయిక హుషా రునివ్వలేదు తన ప్రాభవం తగ్గి పోతోందని ఆ లేక్ పోయేట్ బాధ పడుతున్నాడు .కీట్స్ లండన్ వదిలి జార్జి స్థానం లో తీగ్ మౌట్  లో పని చేశాడు .

1818 ఏప్రిల్ లో ‘’ఎందిమియాన్ ‘’ప్రచురించాడు .సమీక్షలు చాలా వ్యతిరేకం గా వచ్చాయి .అందులోని’’a thing of beauty is a joy for ever ‘’ అందరి నాలుకల మీదా నాట్యమాడింది .విమర్శ జడివాన నుంచి బయట పడటానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు .బ్రౌన్ తోకలిసి ఐర్లాండ్ చూశాడు .వాతావరణం బాగోలేక వారానికే బెల్ఫాస్ట్ చేరారు అక్కడి నుండి బాలన్త్రే వెళ్లి విపరీతమైన వర్షాలు చలి దగ్గు జలుబు పట్టి క్షయ వ్యాధి లక్షణాలు కనిపించాయి .హాంప్ స్టేడ్ కు తిరిగోచ్చేశారు .టాం పరిస్తితి మరీ దారుణం .అతన్ని కనీ పెట్టి ఉంటున్నాడు కీట్స్ .రివ్యూలు డిప్రెషన్ తెప్పించాయి క్వార్తెర్లి రివ్యు కోకేరిస్కూల్  ,ఎందేమియాన్ లపై విషమే కక్కినా మిగిలిన వారికంటే కొంత నయం .పుస్తకాలు అమ్ముడుపోక డబ్బు ఇబ్బంది ఎక్కువైంది .బైరన్ సూతీ మూర్ లు ఆర్ధిక సాయం చేసి నిల బెట్టారు .టాం చనిపోయాడు తల్లికి, టాం కు ,వచ్చిన క్షయ తననూ కబ ళించివేస్తుందని తెలుసుకొన్నాడు .

ఇంతలో మరో ఎదురు దెబ్బ తగిలింది .ఫాన్నీ ప్రేమ అనుకొన్నట్లు ముందుకు సాగటం లేదు .భవిష్యత్తు అంధకారం గా ఉంది .విజయం పొందలేని కవి అని పించుకొన్నాడు .వారిద్దరి మధ్యా ప్రేమలేఖలు 1936లో మాత్రమె ప్రచురణ అయ్యాయి .ఆమె కు కీట్స్ పై ఆరాధన తగ్గలేదు .విధవ రాలు వేషం తో గడిపింది .1818లో ‘’ట్రూ థామస్ ‘’అనే బాలడ్ గొప్పగా రాశాడు .సోదరుడు జార్జి స్పెక్యులేషన్ లో బోలెడు సొమ్ము పోగొట్టుకొన్నాడు .ఎటూ పాలుపోక జర్నలిజం లో ఉండాలని మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని ఊగిస లాడాడు ..’’లామియా ‘’ఒతో ది గ్రేట్ ‘’రాశాడు .ఫాన్ని లేకుండా బతకలేనని చెప్పుతున్నాడు .ఎనిమిది వందల లైన్ ల ‘’ది కాప్  అండ్ ది  బెల్ ‘’ను సాహసోపేతం గా రాశాడు .బాగా డిప్రేస్ అయ్యాడు .ఏడు వందల పౌండ్లు ఆస్తిని అమ్మి జార్జి కిచ్చాడు వ్యాపారం కోసం .అదేమీ కీట్స్ స్వంతం కాదని కీట్స్ చనిపోయిన తర్వాత జార్జి చెప్పటం విడ్డూరం .

1820 ఫిబ్రవరి లో ఫాన్ని కి పరిస్తితి వివరిస్తూ జాబు రాశాడు. కీట్స్ కు చావు ఘడియలు దగ్గర పడ్డాయి .చలి దాగ్గు బలహీనత బాధిస్తున్నాయి రక్తం కక్కు కొంటున్నాడు .కొవ్వొత్తి వెలుగులో దుప్పటిపై కక్కిన రక్తాన్ని తానె పరీక్షించి చూసి ‘’that drop of blood is my death warrant ‘’అని తేల్చి చెప్పేశాడు .హేమరేజే లు ఎక్కువైనాయి .మార్చిలో కొంత గుణం కనిపించింది .లండన్ వెళ్లి ‘’క్రిస్ట్ ఎంట్రి ఇంటు జెరూసలెం ‘చూద్దామను కొన్నాడు .’’లామియా ఇసబెల్ల ,ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్ ‘’మొదలైన పోయెమ్స్  చివరి వాల్యూం లో చేర్చాడు .1820జులై లో ప్రింట్ చేశాడు .దీనిపై మంచి  స్పందనే వచ్చింది .అమ్మకాలు జోరుగా సాగాయి .ఇంగ్లాండ్ లో రాజకీయ దుమారం రేగింది నాలుగవ జార్జి భార్య ను వదిలేశాడు దీనితో అయిదు వందల కాపీలే అమ్ముడయ్యాయి .’’ఇసబెల్లా ఆర్  ది పాట్  ఆఫ్ బాసిల్ ‘’బోకాసియో లోని ఒక కద. ఈవ్  ఆఫ్ ఆగ్నెస్ గొప్ప విజయమే .సెప్టెంబర్ పద్దెనిమిదిన జోసెఫ్ సేవేర్న్ తోకలిసి కీట్స్ రొమ్ కు నావ మీద బయల్దేరాడు .నెల రోజులు ప్రయాణించి చేరారు .

కీట్స్ చివరి రెండు నెలలు మానసిక ఆందోళన శారీరక బాధ తో గడిపాడు .అసూయ ,ఆవేశాలకు అతీతం గా ఉన్నాడు .తన దీన స్తితిని నేపుల్స్ చేరిన తర్వాత బ్రౌన్ కు జాబు రాసి తెలిపాడు .బాధ విపరీతమై రాయలేక పోయే వాడు .23-2-1821న  సేవేర్న్ ను పిలిచి ‘’lift me up.iam dying .don;t be frightened .thank god it;s come ‘’అని చివరి మాటలు అని ఊపిరి అందకఏడు గంటలు బాధపడి అర్ధ రాత్రి అసువులు బాశాడు కీట్స్ కవి .రెండు రోజుల తర్వాతా రొమ్ లోని  ప్రోటేస్టంట్  సేమేటరి లో ఖననం చేశారు .ఆయన రాసిన కవితా (ఎపితా )’’here lies one whose name was writ in water ‘’ఉన్న ఫలకాన్ని ఉంచారు .కీట్స్ కోరిక మేరకు సమాధిపై అతని పేరు రాయలేదు .కవిగా అయిదేళ్ళ కాలమే జీవించాడు ..తన కవిత్వాన్ని సీరియస్ గా రాశాడు కాని గర్వం తో పొగరుతో రాయలేదు .కీట్స్ కవిత్వం అంటే ఒక భావోద్రేకమే కాని ఆలోచనా పరం కాదంటారు .ఇది అబద్ధం అది ఆలోచన భావోద్రేక సమ్మేలనమే .అతని ఊహకు ప్రతీకయే .సవ్యమార్గం లో జాగ్రత్తగా ఉండమనే కీట్స్ సందేశం .ఇంద్రియాతీత భావన కు రూప కల్పన చేశాడు నైటింగేల్ కవితలో గౌరవ ఆరాధననుంచి యదార్దానికి ప్రయాణించాడు .కీట్స్ కు ఒక దివ్యమైన కల ఉండేది అదే ‘’a dream of a world made not only lovelier but worthier of living .it was a pursuit of a dedicated poet ,a tragic lover ,and a brave man ,who wounded by derision and weakened by a fatal disease ,confronted death with a deathless vision ‘’.

ఐదారేళ్ళు మాత్రమె కవిగా ఉన్నా కీట్స్ కవిత్వాన్ని ఇప్పటికీ ఆరాదిస్తూనే ఉన్నారు .ఓడ్స్ మీద రసపట్టు ఉన్న కవి .టెన్నిసన్ ఇలియట్ లను ప్రభావితం చేశాడు .రొమాంటిక్ కవిత్వం లో షెల్లీ కీట్స్ లు ధ్రువ తారలు గా నిలిచారు . కీఎత్స్ రాసిన ఉత్తరాలకు కూడా సాహిత్య గౌరవం అమితం గా ఉంది .

 

John Keats by William Hilton.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38

శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న-  పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )

మేరీ కి పిల్లలు పుడుతూనే ఉన్నారు .గాద్విన్ పారసైట్ అయ్యాడని షెల్లీ బాధ పడుతూనే ఉన్నాడు .బిషప్ గెట్ లో ఒక ఏడాదే ఉన్నారు .ప్రతిచోట తనకు శత్రువులేక్కువైనారని భావించాడు .జేనేవా దగ్గర సేఖేరాన్ లో కాపురమున్నారు .బైరన్ వచ్చి చేరాడు .షెల్లీ బైరన్ లు కలిసి ఫ్రీ లవ్ సొసైటీ పెట్టారని గుసగుసలు వచ్చాయి .అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు .కొద్దికాలానికి బైరన్ ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు .గాద్విన్ కూతురు తండ్రి నిజ స్వభావాన్ని తెలియ జేస్తూ ఉత్తరాలు రాస్తోంది .లండన్ చేరిన నెలకే ఆమె ఆత్మ హత్య చేసుకొన్నట్లు తెలిసింది ..షెల్లీ షాకయ్యాడు .హారియట్ అకస్మాత్తుగా అదృశ్యమైంది .ఇది మరో షాక్ .ఆమె శవమై సేర్పెంటిన్ రివర్ లో తేలింది .ఆమె వయసు ఇరవైఒక్కటి మాత్రమె .ఎలిజా రాసిన ఉత్తరానికి షెల్లీ చలించలేదు .హారియట్ మరణం తో మేరీ ని పెళ్లి చేసుకొనే లైసెన్స్ వచ్చింది షెల్లీ కి .తన పిల్లల్ని ఇవ్వమని షెల్లీ ఎలిజా ను కోరాడు .కోర్టును ఆశ్రయించాడు .తండ్రిగా అనర్హుడు అని అనేక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు .కోర్టు నమ్మి అతని చేతుల్లో పిల్లలు పాడై పోతారుకనుక పిల్లల్ని తీసుకొనే అర్హత లేదని తీర్పు నిచ్చారు .కోర్టులో ఓడిపోవటం తో డిప్రేస్ అయ్యాడు .క్లారా  కు పిల్లాడు పుట్టినందుకు సంతోష పడ్డాడు .లీ హంట్ సర్కిల్ లో చేరిపోయాడు .ఇరవై రెండేళ్ళ కీట్స్ కవి వీళ్ళతో కలుస్తున్నా షెల్లీకి దగ్గర కాలేక పోయాడు  .

మార్లో లో కాపురమున్నాడు .మేరీ తో మెర్రీ  గా ఉంటున్నాడు .కవితా ఝరి పారిస్తూనే ఉన్నాడు .ముప్ఫై చిన్న కవితలను రాశాడు నాలుగు వేల ఎనిమిది వందల పంక్తుల దీర్ఘ కవిత  ‘’దీ రివోల్ట్ ఆఫ్ ఇస్లాం ‘’రాశాడు .గాద్విన్ బెదిరిమ్పులేమీ ఆగలేదు .బైరన్ క్లైర్  గురించి, పుట్టిన పిల్ల గురించి పట్టించుకోలేదు .షెల్లీ ఆరోగ్యమూ తగ్గిపోతోంది మొదటి సారి గుండెపోటు వచ్చింది .ఇంగ్లాండ్ వదిలి ఆరోగ్యం కోసం ఇటలీ వెళ్లాడు .మిలన్ కు క్లైర్ అల్లెగ్రా ,పిల్లలు చేరారు .తొమ్మిది వారాలు అక్కడే ప్రదేశాలు తిరుగుతూ ,ప్లేటో రాసిన ‘’సిమ్పోజియాంస్ ‘’ను అనువాదం చేశాడు .మనిషి యొక్క వ్యక్తిత్వం కోసం అన్వేషణ ,కలయిక యేప్రేమ అన్నాడు .బైరన్ షెల్లీ కుటుంబానికి తన సౌధం వాడుకొనేందుకు ఇచ్చాడు షెల్లీ ‘’జూలియన్ అండ్ మద్దాలో ‘’రాయటం మొదలు పెట్టాడు .’’దిసెన్సి ‘’అనే ట్రాజేడి లో మొదటి భాగం రాశాడు .క్లారా   డిసేంటరి వ్యాధితో బాధ పడి  చనిపోయింది .శోకం లో ఉన్నా జూలియన్ రాస్తూనే ఉన్నాడు .క్లైర్ తో లవ్ ఎఫైర్ సాగిస్తున్నాడు .వీళ్ళ పాపానికి పుట్టిన పిల్లలెవరో ఎవరికీ తెలీదు .

ముగ్గ్గురూ నేపుల్స్ చేరారు .రాయటం తగ్గించి బోట్ షికార్లు ,రైడింగ్ సైట్ సీయింగ్ లో గడిపాడు .ఆరోగ్యమూ శక్తి సమకూడాయి .కుర్రాడిగా కనిపిస్తున్నాడు .రొమ్ చేరారు .రెండున్నర ఏళ్ళ కొడుకు విలియం చనిపోయాడు .లెగ్ హారన్ కు మకాం మార్చారు .ఫ్లారెన్స్ చేరుకొన్నారు మేరీ నాలుగో సంతానం గా పెర్సి ఫ్లారెన్స్ ను కన్నది .సెన్సి రాయటం పూర్తీ చేశాడు .’’the best thing I ever wrote ‘అనుకొన్నాడు .కాని మంత్లీ క్వార్టర్లీ రివ్యూలు ‘’అసంబద్ధం ,అవివేక రచన ‘’అన్నాయి ఫ్లారెన్స్ లో గాలి తీవ్రత ఎక్కువ .ఎప్పుడూ వర్షమే .పీసా వెళ్లారు .అక్కడ ఉన్నరెండు ఏళ్లలో   అతని లోని జీనియస్ విజ్రుమ్బించాడు .’’ది మాస్క్ ఆఫ్ అనార్కి ‘’అనే శిఖరాయమానమైన కవిత రాశాడు అందులో ‘’rise like lions after slumber –in unvanquishable number –shake your chins to earth like dew –which in sleep had fallen on you –ye are many –they are few ‘’ .గొప్ప లైన్లు .ఇక్కడే అతని ‘’స్కైలార్క్ ‘’,క్లౌడ్ ,లవ్స్ ఫిలాసఫీ ‘’సెన్సిటివ్ ప్లాంట్ ‘’అనే అపూర్వ కవితలు రాశాడు .’’ఇంగ్లాండ్ ఇన్ 1819 ‘’రాశాడు .ఇక్కడి వేడి భరించలేక సాన్  గులియానో కు వెళ్లారు .అక్కడ వర్షాలు విపరీతమై నదులు పొంగి ప్రవహిస్తున్నాయి .వరదలు ముంచెత్తుతున్నాయి .టాం మెడ్విన్ వచ్చి చేరి షెల్లీ తో రాజకీయ సాహిత్య ప్రసంగాలు చేస్తూ షెల్లీకి తిండి ధ్యాసే లేకుండా చేస్తోంది .

ఇరవై తొమ్మిదో ఏట మరో అమ్మాయితో శ్రుంగారం రంగరించాడు.ఆమె ఇరవై రెండేళ్ళ ఏమిలా వివియాని .ఆమెకు కాన్వెంట్ చేర విడిపించి పెళ్లి చేసుకొని  చాంపియన్ అవ్వాలను కొన్నాడు . .ఏమిలా షెల్లీకి స్పిరిట్యువల్ సిస్టర్ అయింది ఆమె తండ్రి పీసా గవర్నర్ .కేసును షెల్లీ డ్యూక్ దాకా తీసుకెళ్ళాడు .గవర్నర్ మరోపార్శ్వం జనానికి తెలియాలనే వాడు .’’ఎపి సైకిడియాన్ ‘’అనే కవితను దీనిపై రాశాడు .ఇందులో ‘’ప్లాటోనిక్ లవ్ ‘’ఉంది .అదేకాక ఫ్రీ లవ్ సెక్స్ కోరికా ఉన్నాయి .ఆరు వందల లైన్ ల కవిత ఇది .సంఘం లోని ఇరుకు మనస్తత్వాన్ని చూపాడు ,’’  with one child friend ,perhaps a jealous foe –the dreariest and longest journey go ‘’ఉదాహరణకు చూపాను .ఇది పూర్తీ అయి ప్రింట్ అయ్యే లోపే ఎమిలీ జైలు నుంచి పారిపోయి వేరొకరిని పెళ్లి చేసుకొని షెల్లీ కి షాకిచ్చింది .వందకాపీలు మాతమే వేయించాడు .

పీకాక్ అనే వాడు ఆధునిక ప్రపంచం లో కవిత్వానికి స్థానం లేదని రాశాడు .తన శక్తి యుక్తులను కూడా దీసుకొని కవిత్వానికి ఉన్న శక్తి సామర్ధ్యాలను నిరూపిస్తూ ‘’డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ ‘’రాశాడు .సమాజం లో కవిపాత్ర గొప్పదని వాదించాడు .’’lift evil from the hidden beauty of the world and make familiar objects be as if they were not familiar . ‘’అని చెప్పి కవిత్వ సామర్ధ్యాన్ని ‘’ever strengthens and purifies the affections enlarges the imagination and adds spirit to sense .poets are the un acknowledged legislators of the world ‘’అని ధంకా బజాయించి చెప్పాడు .ఈ చివరి వాక్యాన్నే అందరూ ఉదాహరిస్తారు అంత ప్రాచుర్యం పొందిన వాక్యం అది .

‘’అడనోస్ ‘’అనే చివరి గొప్ప కవిత రాశాడు అది మహా గొప్ప ఏకైక కవిత అంటారు .ఫిబ్రవరిలో కీట్స్ కవి రొమ్ లో చనిపోయాడు .ఏప్రిల్ కు కాని ఈ విషాద వార్తా షెల్లీకి తెలియ లేదు .అడనోస్ కూడా కవిత్వాన్ని సమర్ధించే మరో కవితే.కీట్స్ ను అతని క్షయ వ్యాధి కంటే విమర్శకులే అతిగా రాసి దారుణం గా చంపేశారని షెల్లీ అభిప్రాయ పడ్డాడు .లిసిడియాస్ తర్వాత గొప్ప ఎలిజీ గా యాభై అయిదు  స్పెంసేరియన్ స్టాం జాలు గా రాశాడు .ఎక్కడా జోరు ,కాని భావం భాష తగ్గకుండా పకడ్బందీ గా రాశాడు .దుఖానికి పరాకాష్టగా  నిలిచి పోయి షెల్లీని చిరంజీవి ని చేసింది .

‘’the one remains ,the many change and past –heaven;s light for ever shines –earth;s shadow fly –that light whose smile kindles the universe –that beauty in which all things work and move –by man and beast and earth are mirrors of –the fire for which all thirst now beams on me –consuming the last clouds of cold mortality ‘’అని చలించి జ్వలించి  చెప్పాడు .ఈ దుఖం తో ఆగిపోలేదు .ఇంకా తన సృజన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు .కీట్స్ మరణం తర్వాత షెల్లీ  పీసన్ లిటరరీ సర్కిల్ సభ్యుడయ్యాడు .లేరిసి లో గల్ఫ్ ఆఫ్ స్పీజియా దగ్గర చిన్న ఇల్లుకోనుక్కున్నాడు .అయిదుగురూ అక్కడే ఉన్నారు .ఇల్లు ఇరుకు మురికి కొంప అందులోనే సర్డుకొంటున్నారు .షెల్లీకి ఈత రాకపోయినా బోట్ షికారంటే ఇష్టం

పన్నెండు అడుగుల బోట్ ‘’ఏరియల్ ‘’ను కొన్నాడు విలియం తో కలిసి మొదటిసారి గా హేగ్ హారన్ కు బో ట్ నడుపుకొంటూ వెళ్లారు .బైరన్ ఇంటికీ వెళ్లి వచ్చారు .జూలై ఎనిమిదిన విలియం తోకలిసి లేర్సికి బోట్లో తిరిగి వస్తున్నారు .కాని ఇంటికి చేర లేక పోయారు .విపరీతమైన గాలి ,వర్షం నడపటం అసాధ్యం అని పించింది .బోట్ నదిలో తిరగ బడిపోయింది .మళ్ళీ లేవలేక పోయారు .రెండు వారాల తర్వాత వారిద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుకోచ్చాయి .కీట్స్ రాసిన కవిత షెల్లీ జేబులో ఉండి పోయింది .కుళ్ళిన శవాలను బీచ్ ఒడ్డున సున్నపు పొరల్లో సమాధి చేశారు .మళ్ళీ కొన్ని నెలల తర్వాత వీరి అభ్యర్ధన పై తవ్వి తీసి శవాలను అప్పగించారు .షెల్లీ గుండె దెబ్బ తిన లేదట .ట్రేలావని అనే వాడు దాన్ని లాగేశాడు రొమ్ లోని ప్రోటేస్తంట్ సేమేటరిలో చితా భస్మాన్ని జాగ్రత్త చేశారు .ఇక్కడే కీట్స్ నూ సమాధి చేశారు  ఇద్దరు కవులు ప్రక్క ప్రక్కనే సమాధిలో ఉండిపోయారు .ఇంకో నెల లో షెల్లీకి ముప్ఫై ఏళ్ళువచ్చి ఉండేవి  .18-7-1822న షెల్లీ మరణించాడు .

షెల్లీజీవితం  .’’a paradox of reason and irresponsibility ‘’అన్నారు .’’where music and moon light and feeling are one ‘’అన్నాడు విలియమ్స్ .షెల్లీ ని మాధ్యూ ఆర్నోల్డ్ ‘’a beautiful and ineffectual angels  beating in the void his luminous wings in vain ‘’అంటూ కీర్తించాడు .కాని షెల్లీ లో మానవ దానవ స్వభావాలు రెండూ జమిలిగా ఉన్నాయని మనం తెలుసుకొన్న చరిత్ర  చెబుతోంది .’’drive my dead thoughts over the universe ‘’అన్నాడు షెల్లీ .సమాజం లో కవి పాత్రను విస్పష్టం గా విప్పి చెప్పిన వాడు షెల్లీయే .ప్రకృతిలోని అన్ని స్వభావాలకు రూప కల్పనకవి చేస్తాడని చెబుతూ ‘’from these create he can –forms more real than living man –nursing of immortality ‘’

షెల్లీ స్ప్లిట్ పెర్సానాలిటి .మనిషి గమ్యం తెలిసిన కవి .హింస ,స్వేచ్చ ల మధ్య యుద్ధం గురించి రాశాడు .నిరాశ అంటే చిరాకు పడ్డాడు .నిజానికి ‘’అసలైన కవి ‘’అని పించాడు షెల్లీ .కవితల్లో శిఖరాయమానవైనవీ పాతాళానికి చేరినవీ రాశాడు .సంపూర్ణ వికాసం  లేని కవితలు రాశాడనీ అన్నారు .అతని లిరికల్ పవర్ ముందుగా మనల్ని కట్టి పడేస్తుంది తర్వాత తల ఊపుకొంటూ మనం వెంటబడి పోతాం .స్కైలార్క్ కవిత అతని గుండెల లోతుల్లోంచి జలపాతం గా ఉబికిన కవిత .అలాగే ఒజిమండియాస్ కవితలో గొప్ప తాత్విక దృక్పధాన్ని వెలువరించాడు .

‘’the world;s great age begins anew –the golden years return –the earth doth like a snake  renew –her winter weeds outworn ‘’

‘’heaven smiles and faiths and empires gleam –like wrecks of dissolving dream ‘’

Oh!cease –must hate and death return ?-cease must men kill and die ?-cease drain not to its dregs the urn –of bitter prophecy –the world is weary of the past –oh!night it die or rest at least ‘’

వంటి అమ్రుతోపమానమైన కవితా పంక్తులు రాసి అమరకవి అయ్యాడు షెల్లీ .కవిత్వ సారాంశాన్ని వీటిలో తెలియ జేసిన మహా కవి .’’such poems convey the very essence of poetry .-an unbodied joy so keen that in spite of every prejudice the world must listen and respond to it ‘’

శోక లోకైక చక్ర వర్తి అని పించుకొన్న షెల్లీ తో మన దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారిని పోలుస్తారు .కృష్ణ శాస్త్రి మరణిస్తే శ్రీ శ్రీ ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అని అన్నమాట మనాకందరికి గుర్తుండే ఉంది .రొమాంటిక్ కవుల్లో అగ్రేసరుడు నాలుగైదు తరాలను ప్రభావితం చేసిన వాడు .విక్టోరియన్ పరి రాల్ఫిట్ కవుల పై విశేష ప్రాభావం చూపాడు .దంటే రోసేట్టి ఆస్కార్ వైల్డ్ వంటి హేమా హేమీలకు గురు తుల్యుడు .బెర్నార్డ్ షా కారల్ మార్క్స్ ,సిన్క్లైర్ దోరో ,లకు మార్గ దర్శి .అనేక ఉద్యమాలకు రాజకీయ ఆలోచనలకు షెల్లీ భావాలే తోడ్పాటైనాయి .అహింసా విధాన ఆందోళనకు తెర తీసిన వాడు షెల్లీ

షెల్లీ పూర్తీ

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37

వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

షెల్లీ పుట్టేనాటికి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితాల చేదు అనుభవాలతో ఉన్నా సృజనాత్మకత విజ్రుమ్భించింది .విలియం బ్లేక్ ముప్ఫై అయిదులో ‘’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ ‘’రాస్తున్నాడు బర్న్స్ ముప్ఫై మూడులో స్వీయ లిరిక్స్ తో చేల రేగుతున్నాడు .ఇరవై రెండేళ్ళ వర్డ్స్ వర్త్ ఫ్రాన్స్ లో విప్లవం రుచి చూస్తున్నాడు .ఇరవైలలో ఉన్న కాల్ రిడ్జి కేంబ్రిడ్జిలో చేరబోతుంటే ,పద్దెనిమిదో  ఏట సూతీ ,లాంబ్ పదిహేడు ,బైరన్ నాలుగేళ్ల బుడ్డాడు గా ఉన్నారు .

షెల్లీ పూర్వీకులు సంస్కృతి పట్ల పెద్దగా అభిరుచి ఉన్న వారు కాదు .సాధారణ కుటుంబీకులే అయినా అంతటా విస్తరించారు .వారి వ్రేళ్ళు  అమెరికాలోనూ ఉన్నాయి .షెల్లీ ముత్తవ్వ న్యూ యార్క్ మిల్లర్ కు విధవ రాలు .తిమోతీ షెల్లీని అనే కొత్తగా కాలనీకి చేరిన వాళ్ళబ్బాయి నిపెళ్ళాడి  బిషీ ని న్యూ యార్క్ లోని న్యూ జేర్సిలో 1752 లో కన్నది .కుటుంబం ఇంగ్లాండ్ చేరింది అప్పుడు బిషీ యువకుడే .స్వంతం గా ఎదగాలని నిర్ణయించుకొన్నాడు .డబ్బు బాగా ఉన్న ఒక క్లేర్జిమన్ కూతురితో లేచిపోయి పెళ్లి చేసుకొని ,ఆమె చనిపోయే నాటికిసంపదతో పాటు   ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు .రెండో పెళ్లి చేసుకొని ఏడుగురిని కన్నాడు .ఆమె నుంచి గొప్ప సంపద కలిసొచ్చింది .వీళ్ళ పెద్దబ్బాయి తిమోతీ కి కౌంటీలో మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు .వీరి ఏడుగురి సంతానం లోపెద్ద వాడు  పెర్సి బిషేల్లీ 4-8-1792.లో  లండన్ కు నలభై మిల్ల దూరం లో ఉన్న ససెక్స్ లోని హోషం ఫీల్డ్ బేస్ లో పుట్టాడు .

షెల్లీ తండ్రి ఆచారాలను తు చ తప్పకుండా పాటించాడు .కొడుకంటే విపరీతమైన గర్వం అభిమానం .చెల్లెళ్ళు అన్న మీద అమిత అనురాగాన్ని చూపారు .ఈ అనుబంధాల మధ్య హాయిగా బాల్యం గడిపాడు .ఇప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి .సియాన్ హౌస్ మిడిల్ క్లాస్ చదవ టానికి పంపారు .అతని చందాలు సున్నిత మనస్తత్వం  ,నాణ్యమైన ప్రవర్తన తోటి విద్యార్ధులకు ఈర్ష కలిగించాయి .అందులో ఒకడు అతనికజిన్ టాం మిద్విన్ కూడా ఉన్నాడు .అతనే తర్వాత షెల్లీ జీవిత చరిత్ర రాశాడు .ప్రతి రోజూ రౌడీయిజం చేసి షెల్లీని భయ పెట్టారు .ఒక రకం గా క్రూరం గా హింసించారు .కొద్దికాలం ఓర్చుకొన్నాడు .తరువాత ఎదురు తిరిగాడు .అక్కడ బోధించే సాహిత్యం భాషా శాస్త్రాలకంటే ఖగోళం కెమిస్ట్రి   ఫిజిక్స్ అంటే ఇష్టపడ్డాడు .పిల్లలందరి చేత చెట్ట పట్టాలు పట్టించి షాక్ కు గురి చేసేవాడు .పన్నెండేళ్ళ వయసులో సైన్స్ అంటే వీర అభిమనమేర్పడింది .యీటన్ లో ఉన్న ఆరేళ్ళు తోటి వారు షెల్లీతో చెలగాటం ఆడారు .ఆ హింస భరించలేక పిచ్చి వాడయ్యాడు .గ్రే రాసిన ఎలిజీ ని బట్టీ పట్టి అప్పగించాడు .అక్కడ గడిపిన చివరి కాలం లో ఒక ‘’ఊహా  ప్రపంచాన్ని ‘సృష్టించు కొన్నాడు .గోదిక్ రచనల పారం ఎరిగాడు .ఎన్నో క్లాసిక్స్ చదివాడు .కొడుకు సాహిత్యాభిమానానికి  తండ్రి ఏంతో మురిసి పోయేవాడు .

సూతీ చాటర్త న్  లు అభిమానులైనారు .బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే గౌరవం .1810లో తండ్రి చదివిన ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి కాలేజి లో చేరాడు .మొదటి రోజునే థామస్ జెఫర్సన్ హాగ్ తో పరిచయం కలిగింది .అతనితోకలిసి ఒక కరపత్రాన్ని అన్యాయాల నేదిరిస్తూ వెలువ రించాడు .ఇద్దర్నీ బహిష్కరించారు .తండ్రి ఎదుట పడటానికి సంకోచించాడు విషయం తెలిసిన తండ్రి షాకయ్యాడు .పద్దెనిమిదేళ్ళ షెల్లీ రాడికల్ అయిపోయాడు .’’రాముని బుద్ధిమంత తనం రావణుడి భాష్యం ‘’గా మారిపోయింది . తండ్రి  ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకోలేదు .అయినా దారికి రాలేదు కొద్ది పాటి దనం మాత్రమె అప్పగించి మిగిలింది అందరకు పంచేయ్యమని తిమోతీకి చెప్పాడు ఆమె  అవాక్కే అయింది  అతని స్నేహితుల్ని పిలిపించి మంచి దారిలో నడిచేట్లు చేయమని కోరింది .ఏడాదికి రెండు వందల పౌండ్లు ఇచ్చే ఏర్పాటు చేసింది .

గోదిక్ సాహిత్యం పై ఉన్న మోజు పెరిగిందే కాని తగ్గలేదు .ఒక వైన్ మర్చంట్ కూతురు హారియట్ వెస్ట్ బ్రూక్ ను ప్రేమించి ఆమెఇంటికి వెడితే  వోల్తైర్ రాసిన ‘’డిక్షనరీ ఫైలాసఫిక్ ‘’చదువుతూ కనీ పించింది .తండ్రి రాక్షసుడని గ్రహించి ఆ ఇంటి చేర విడిపిస్తానన్నాడు .మరో ఏడాదికి ఆమె ను తండ్రి ఆంక్షలను తిరస్కరించమన్నాడు ఫ్రీ లవ్  బాన్ధవ్యానికి సిద్ధమవ మన్నాడు .ఇది ఆమె అక్కకు ఇష్టం లేదు .ఆమెను ఎడిన్ బర్గ్ తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకొన్నాడు .ఇంటిని నుంచి గెంటివేత ,అమ్మాయితో పారిపోవటం షెల్లీ తల్లిని కలవర పెట్టాయి .ఇక సత్రం యజమాని కూతురితో సల్లాపం మరీ బాధించి ఆస్తిలో ఏమీ దక్కకుండా చేసింది .ఫ్రీ లవ్  ఆచరణసాధ్యం కాదని గ్రహించాడు .హాగ్ వీళ్ళతో ఉంటూ హారిఎట్ ను ముగ్గులో దించే ప్రయత్నం చేస్తున్నాడు .ఆమె పై మొహం పెంచు కొన్నందుకు కాదు అతని జెలసీ ని వ్యతిరేకించాడు .ఈ పరిస్థితుల్లో హారియట్ తల్లికంటే అధికం గా ప్రేమించే ఎలిజా వచ్చి అన్నిటిని చక్క బరిచింది .లేక్ డిస్ట్రిక్ట్ లో షెల్లీ దంపతుల తోబాటు ఆమె కూడా గెస్ట్ గా ఉంది . 1812లో ఈ రాక్షస ప్రేమ బాధ తప్పించుకోవటానికి డబ్లిన్ వెళ్లాడు భార్య ఎలిజా లతో .అక్కడ సుఖం గా ఉండటానికన్నా ప్రచారానికే వెళ్లాడు .’’అడ్రస్ టు ఐరిష్ పీపుల్ ‘’రాసి అతి తక్కువ ధరకే ప్రచారం కోసం అమ్మాడు .వీధుల చివర్లలో నిలబడి భార్యా భర్తా వాటిని అమ్మారు .ఇంటి బాల్కనీ పై నుంచి రోడ్డుమీదకు పామ్ఫ్లేత్స్ విసిరారు .’’డిక్ల రేషన్ ఆఫ్ రైట్స్ ‘’ను కూడా ఇలాగే చేశారు .

తనేదో తప్పు చేస్తున్నట్లు అనిపించేది యువకుడి కర్తవ్యమ్ ఇదికాదని పించింది .విలియం గాద్విన్ రాసిన ‘’పొలిటికల్ జస్టిస్ ‘’ను బైబిల్ గా భావించాడు .ఐర్లాండ్ లో స్వేచ్చ ఉద్యమం బల పడలేదు నిరాశ తో ఇంగ్లాండ్ చేరాడు .ఇరవై ఏళ్ళు వచ్చేసరికి షెల్లీ అనుమానాస్పడుదయ్యాడు .ఐరిష్ రాజకీయ వ్యవస్థను దెబ్బ తీయటానికి కుట్ర పన్నుతున్నాడని  ఆరోపణ వచ్చింది .దీనితో కొంచెం స్పీడ్ తగ్గించాడు .కవిత్వమే ఆయుధం అని నిర్ణ యించుకొన్నాడు .’’క్వీన్ మాబ్ ‘’అనే ఇరవై రెండొందల లైన్ల దీర్ఘ కవిత రాశాడు .ప్రపంచం లోని రాజకీయ సాంఘిక పరిస్తితులమీదా,రాబోయే కాలం లో జరగ బోయే విషయాలపైనా రాశాడు .ఇందులో  పరిణామ సిద్ధాంతం ,ప్రాచీన నాగరకతా ధ్వంసం ,యుద్ధ భీతి ,సమాజం లో అవినీతి లంచ గొండితనంఉన్నాయి  ,శాకా ఆహారం అవసరం పై ‘’విన్దికేషన్స్  ఆఫ్ నేచురల్ డయట్  ‘’రాయటమే కాక శాకా హారి గానే ఉండిపోయాడు .అవసర న్యాయం ను సమర్ధించాడు .చట్టబద్ధ వివాహాన్ని వ్యతి రేకించాడు .మతాధిపతుల ఆగడాలను బయట పెట్టాడు –‘’and priests dare babble of a god of peace –even whilst their hands are red with guiltless  blood –murdering the while ,uprooting every germ –of truth exterminating spoiling all –making the earth a slaughter house ‘’అని నిర్మొహమాటం గా వివరించాడు

క్వీన్ మాక్ పుస్తకాన్ని పైరసీ చేసి అమ్మారు .ప్రభుత్వం ఇలా రాసిన వాడు తన పిల్లలను పెంచేందుకు సమర్ధుడు కాదన్నది .కోర్టు కేసు అయింది దేవుడిని పవిత్ర గ్రంధాలను దూషిస్తున్నాడని నేరం .మొదటి బిడ్డ పుట్టింది ఆమెకు ఎలిజా ఇయాన్తే అని పేరు పెట్టాడు .తల్లి ఏమీ దగ్గరకు రానీయక పోవటం ఆర్ధికం గా ఆసరాగా నిలబడక పోవటం విషాదమే మిగిల్చింది .అప్పుల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు .పిల్లను చూసుకోవాలి కడుపులో ఇంకోరున్నారు .చివరికి గాద్విన్ ఏ శరణ్యమై గాడ్ అయ్యాడు జీవితాంతం .గాద్విన్ శిష్యురాలు మేరీ  పరిచయమైంది ఆమె స్త్రీహక్కు ఉద్యమ కారిణి .ఇంటికి దూరం గా మేరీకి దగ్గరగా బతుకు తున్నాడు .చివరికి హారియట్ అందరు కలిసి ఉందామని రాజీ చేసింది .భార్య హారియట్ సోదరిలాగా మేరీ భార్య లాగా ఉండే ఒప్పందం అది .బైరన్ కొడుకుని అని చెప్పుకొన్న వాడొకడు తరువాత ఈవిషయాలన్నీ  – బయట పెట్టాడు .అతను రాసిన ఉత్తరాలన్నిటినిత చనిపోయిన వందేళ్ళకు ప్రచురించారు .

మేరీ తో విడిగా కాపురం పెట్టాడు .గాద్విన్ దంపతుల అభ్యర్ధన తో మేరి షెల్లీని వదిలి వెళ్లి పోవటానికి వప్పందం కుదిర్చాడు దీన్ని తట్టుకోలేక పోయాడు కవి పుంగవుడు .ఇంత నల్లమందు మేరీ చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోతే ఆమెతో బాటు తానూ చస్తానని బెదిరించాడు .గాద్విన్ కూతురు అతన్ని ఓదార్చి ఇంటికి పంపేసింది .హారియట్ తో ఉంటున్న అతనిలో మానవ స్వభావం ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నాడు .ఆమెను సోదరి గా  చూడ లేక వ్యధ చెందుతున్నాడు .నిజాన్ని ఒప్పుకోలేక పోతున్నాడు క్షోభ అనుభ విస్తున్నాడు .డబ్బు లేక కాదు తోటి మనిషిని అర్ధం చేసుకొనే మనస్తత్వం లేని కవి అయ్యాడు .మానవత్వంగురించి తెలుసుకాని మనష్యుల గురించి తెలియని అవివేకి .కవిత్వాన్ని అనుభవించాలి వేదాంతాన్ని అర్ధం చేసుకోవాలి అనే హారియట్ పాటి జ్ఞానం లేక పోయింది .అన్నమాట నిలుపుకోకుండా రహస్యం గా మేరీ వచ్చి మెర్రి చేసుకొని వెడుతోంది .అతన్ని లేవ దీసుకొని పోయే ప్లాన్ వేసింది .తాను షెల్లీ జీవితం లోకి ప్రవేశించి ఉండకపోతే షెల్లీ ఎప్పుడో చచ్చేవాడని అన్నదికూడా .

28-7-1814తెల్ల వారు జామున నాలుగింటికి  షెల్లీ,మేరీ క్లైర్ లతో ఒక కోచ్ లో రహస్యం గా ఫ్రాన్స్ కు ఉడాయిన్చేశారు .పారిస్  కు మాంచి మిట్ట మధ్యాహ్నం చేరారు .బాగా అలసిపోయారు .వాచీని అమ్మేసి ఒక నాటు పడవ అద్దెకు తీసుకొని స్విట్ జర్లాండ్  కు బయల్దేరారు .షెల్లీ అంటే స్నేహితులందరికీ అసహ్యమేసింది .హారియట్ రెండవ బిడ్డను కడుపుతో ఉంది. లాయర్ సలహా కోరింది .కొడుకును కన్నది .’’డిసేర్టేడ్ వైఫ్ ‘’పేర ఉత్తరం రాసింది .షెల్లీ తాత చనిపోయాడు .షెల్ల్లీ కి లక్ష పౌండ్ల ఆస్తి దక్కింది .అప్పులు తీర్చేశాడు .గాద్విన్ కు వెయ్యి పౌండ్లు ముట్ట జెప్పాడు .ఒక రకం గా జీవితం కుదుట బడ్డట్లే .గ్రీక్ లాటిన్ ఫ్రెంచ్ లను మేరీ క్లైర్ లకు నేర్పుతున్నాడు .సానుభూతి పొందలేని జీవి అయ్యాడు .

 

 

 

Percy Bysshe Shelley by Alfred Clint crop.jpg

షెల్లీ విశేషాలు మళ్ళీ –

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6–14-కాంప్ –బాచుపల్లి –హైదరా బాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36

రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2

ఊరు మార్చినా బైరన్ తీరు మార్చుకోలేక పోయాడు .రాజ భోగాలు చిహ్నాలు వదల్లేదు కాని మనసు వ్యధా భరితమై ఉంది .మాథ్యూ ఆర్నోల్డ్ చెప్పినట్లు ‘’the pageant of his bleeding heart’’గా రక్తం కారుతున్న గుండెతో ఉత్సాహం గా ఉన్నాడు .ఆయన కారేజిలో మంచం పరుపు ,కుర్చీ ,రాత బల్ల ఉన్నాయి నెపోలియన్ అంటే అభిమానం ఈ హంగామా తో యూరప్ పర్యటన చేశాడు .జేనేవా చేరి షెల్లీ దంపతుల్ని చూశాడు .రాడికల్ ఫిలాసఫర్ విలియం గాద్విన్ ను కలుసుకొన్నాడు .తనకు ప్రేమాస్పదం గా ఉత్తరాలు రాసే క్లైర్ ను చూశాడు .చెడ తిరుగుడు తిరిగినా బైరన్ కు ‘’ఫ్రీ లవ్ సొసైటీ ‘’మీద ఇష్టం లేదు .కాని ఫ్రీ లవ్ వ్యాప్తికర్త షెల్లీ అంటే అభిమానం .షెల్లీ  కూడా బైరన్ తీవ్ర భావాలకు ముచ్చటపడ్డాడు అతని సృజన కు జోహార్లిచ్చాడు .లోవేల్ పీకాక్ తో బైరన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తీ అని కాని చంచల స్వభావం  ఉన్నవాడని రాశాడు .

క్లైర్ పై ప్రేమ లేకున్నా ,కోరిక గాఢమైతే ఆమెకూడా లొంగింది .షెల్లీ దంపతులతో వీరిద్దరూ కలిసి మెలిసి ఉన్నారు .ఇది ఎక్కువ కాలం సాగలేదు ఆమెను వదిలిన్చుకొన్నాడు బైరన్ .చిలాన్ కోట కు వెళ్లి పోయాడు .ఇక్కడే ‘’ది ప్రిసనర్ ఆఫ్ చిల్లాన్ ‘’కవిత రాశాడు. క్లైర్ తో పడుకోన్నాడుకాని ఆమె అంటే అయిస్టమే.ఆమెను ఒక ప్రైవేట్ సెక్రటరీగా తన గజి బిజీ రచల కాపీయిస్ట్ గానే భావించాడు .గర్భవతిని అని ఆమె చెప్పింది .షెల్లీలు ఇంగ్లాండ్ వెడుతూ ఆమెను జాగ్రత్తగా చూసుకోమంటే సరే అన్నాడు .తన మనోభావాలను అగస్తాకు రాస్తూ ఈ యువతుల బాధ ఎక్కువైన్దన్నాడు .జేనేవా నుండి ఇంగ్లాండ్ కు ఒక బిడ్డను కనటానికే వచ్చానని రాసుకొన్నాడు .క్లైరా వెళ్ళిపోయినా బాధ తాగ్గలేదు .మెటా ఫిజిక్స్ కు మౌంటెన్స్ కు మధ్య ఊగిసలాడుతున్నాడు .దానినే కవిత గా ఇలా చెప్పాడు .’’there is a power upon me which withholds –and makes it my fatality to live for I have ceased –to justify my deeds unto myself –the last infirmity of evil’’.

అగస్తాకు తన గుండె బాధ అంతా ఉత్తరాల్లో వివరిస్తున్నాడు .ఇటలీకి చేరి మూడినెస్’’ ను వదిలిన్చుకొన్నాడు .మిలన్ లో హుషారుగా ఉన్నాడు .ఆడ్రియాటిక్ కు చేరాడు జూలియెట్ సమాధి చూశాడు. నవంబర్ లో చలి రోజున వెనిస్ వచ్చాడు .అంతా తడి గా చీకటిగా ఉందని పించింది .మానసిక ప్రశాంతత అక్కడ దొరకదనుకొన్నాడు .ఇక్కడే గొప్ప పేరు పొందిన లిరిక్స్ రాశాడు అందులో ‘’సో వెల్  గో నో మోర్ ఏ రొవింగ్ ‘’కవిత ఉంది .’’for the sword outwears its sheath –and the soul wears out the breast –and the heart must pause to breathe –and love itself have rest ‘’క్లైర్ నుంచి ఉత్సాహం తో ఉత్తరాలోస్తూనే ఉన్నాయి. షెల్లీలతో ఉన్న ఆమె బాత్ లో పెళ్లి చేసుకోంది  కూతురు అల్లీగ్రా పుట్టిందని తెలిసి బైరన్   సంతోషించాడు .వెనిస్ దగ్గర బ్రెంతాలో ఒక కాటేజీ అద్దెకు తీసుకొని ఉన్నాడు .మార్గారిటా కాగ్నిఅనే మురికి వాడ పిల్ల తో  తో సన్నిహితం గా మెలిగాడు .ఆమె నిప్పుల కుంపటి ..ఇంటి ని కుదిర్చిన మేరియానాతో తగాదాపడి జుట్టూ జుట్టూ పట్టుకోన్నారిద్దరూ .డబ్బున్న  లార్డ్ కనుక సర్దుకు పోయారు .బైరన్ ఏది రాసినా ముందే డబ్బు చెల్లించే పబ్లిషర్ దొరికాడు .1818లో ‘’ డాన్ జువాన్ ‘’నవల ప్రారంభించాడు .అప్పులేవీ లేవు హాయిగా ఉన్నాడు .న్యుస్టేడ్ ఆబ్బే లక్ష పౌండ్లకు అమ్మేశాడు ఇటాలియన్ స్టేటస్ ప్రకారం ‘’ప్లూటోక్రాట్ ,అరిస్టోక్రాట్ ‘’అయ్యాడు .గ్రాండ్ కెనాల్ ఒడ్డున పలజో మోసినిగో కొని స్తిరపడ్డాడు .మందీ మార్బలం తో కుక్కా నక్కా ,నెమలి కొంగ కోతి లతో అక్కడ తిష్ట వేశాడు .

అదేమీ  ఖర్మమో ఇంత సంపద ఉన్నా ఇంకా సుఖం లేదనుకొంటున్నాడు .ఇంగ్లాండ్ వార్తలు శుభ సూచికం గా లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ దారుణ వార్తలు వినాల్సి వచ్చింది .అగస్తా అన్నబెల్లాలు వచ్చి సాయం చేస్తున్నారు అగస్తాను రక్షించే ఉద్దేశ్యం తో అనబెల్లా ఉంటోంది .సోదరుడు బైరన్ తో ఆమె ప్రవర్తన జుగుప్స కలిగిస్తోందని పధ్ధతి మార్చుకోమని కౌన్సెలింగ్ ఇస్తోంది .అగస్తా రాసిన ప్రేమ లేఖలను బైరన్ తిరిగి ఇచ్చేశాడు .’’నిన్ను నువ్వు కించ పరచు కోవద్దు ‘’అని సలహా ఇచ్చాడుకూడా .’’మనం మానవ మాత్రులం .మనం కలిసి ఉండాలని దైవ నిర్ణయం .వచ్చి ఇక్కడే ఉండు ‘’అని రాశాడు .ఆమె తిరస్కరించింది .ఉత్తరాలు రాయటం తాగ్గించింది .విడిపోవటం పతనం కాకూడదని బైరన్ నిర్ణయించాడు ‘’all suffering doth destroy ,or is destroyed –even by the sufferer and in each event ends’’అని కవిత చెప్పాడు .

బుర్ర్ర బానే ఉన్నా శరీరం దెబ్బ తింటోంది.లావయ్యాడు ముందుగానే జుట్టు తెల్లబడింది .డాన్ జువాన్ ను హుషారుగా రాస్తూనే ఉన్నాడు .వచనం అనుకొంటే కవితా దోరణి లో సాగుతోంది .ఇందులో సాహస కృత్యాలు సెటైర్ త్రుణీకారం అన్నీ ఉన్నాయి ‘’don Juan is one of the most personal aswell as one of the most enlivening long poems ever written ‘’అని పించుకోంది.’’టర్న్ కోట్  లేక్ పోయెట్స్’’అని పించుకొన్నవర్డ్స్ వర్త్  సూతీ లకు ఎదురొడ్డి రాసిన కవిత్వం ఇది వాళ్ళని అవహేళన చేస్తూ రాసిన పంక్తులెన్నో ఉన్నాయి దీనిని ‘’ masterly virtuoso performance ‘’అన్నారు .దీన్ని రాస్తూనే తాను ఏమిటో తన భావాలేమిటో నిర్వచనం చేశాడు .జ్ఞాపకాలను ,అనుభవాలను రాయాలని సంకల్పించాడు .దీని రాత ప్రతిని ముర్రే అనే పబ్లిషర్ కు ఇస్తే మళ్ళీ ఇంకొక స్కాండల్ లో ఇరుక్కుపోతాడేమో నని   తగల బెట్టేశాడు .

                   బైరన్ కు కస్టాలు ప్రారంభమయ్యాయి .నెర్వస్ అయిపోయాడు .కలత చెందుతున్నాడు .బాదర బందీ తగ్గించేసుకొన్నాడు .తెరిస్సా గుస్సియోలి తో పరిచయం అయింది .మన వాడికి ముప్ఫై ఒకటి ఆమెకు పందొమ్మిది .ఆమెకు అప్పటికే పెళ్లి అయింది బైరన్ తో చనువుగా ఉంటోంది పార్టీలకు వెంట  తిప్పుకొంటున్నది . అది ఇటలీ సంప్రదాయమే నట .బైరన్ ఒక ‘’లవర్ సర్వెంట్’’ .ఆమె భర్తకు ఇదంతా తెలుసు .కాని ఏమీ చేయలేని స్తితి .భార్యా భర్తా ఎక్కడికి వెళ్ళినా కుక్క లాగా వెంట వెళ్ళాల్సి వచ్చేది ఆమె బలవంతం మీద అయిష్టం గానే వెళ్ళే వాడు .’’the die is cast –and I must but bitterly pass the rubicon .Every thing is to be risked for a woman one likes’’అని తోకాడించు కొంటూ వెళ్ళేవాడు లార్డ్ బైరన్ .ఆమె గర్భం విచిన్నమైనప్పుడు మన వాడిని  సహాయానికి ఉంచారు .నయం అయిన తర్వాతా తెర్రేసా తో కలిసి గుర్రపు స్వారి చేశాడు వందకు పైగా ఆమెకు ప్రేమ లేఖలు గిలికాడు .బొలోనా వెళ్లారు దంపతులు .బైరన్ వెంట వెళ్లాడు .అక్కడా సుఖం దొరకలేదు చూపు సుఖమేకాని శారీరక సౌఖ్యం పొందలేక దిగులు .తనను తానూ చవటాయ్ వెర్రి వెధవాయ్ అయి పోతున్నానేమో నని ఆందోళన .తెరెసా తనను మోసం చేస్తోందని దిగులు  .ఇవన్నీ అగస్తాకు రాస్తున్నాడు ఆమె ఓదారుస్తూనే ఉంది .తెరిస్సా ధైర్యం చేసి   ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంది.కౌంట్ గుస్సియోలి తిరిగి వచ్చాడు రేవీనా కు భార్యను తీసుకు పోవటానికి నిశ్చయించాడు .బైరన్ ను ఇక తమ తో రావద్దని చెప్పాడు .హతాశుడై ప్లాటోనిక్ ప్రేమ వర్షిస్తూనే ఉన్నాడు  .కాని ఆమెకు జ్వరం వచ్చి బైరన్ తన వద్ద ఉండాలని కోరుకొన్నది .తప్పిందికాదు విసనకర్ర విసరటం ,పెళ్ళాడిన స్త్రీకి గుర్తింపు పొందిన ప్రేమికుడుగా ఉండటం చేస్తున్నాడు .తన హీన దీన స్తితిని ‘’  I have been more ravished myself than any body since Trojan war ‘’అని రాసుకొన్నాడు .

తెరెసా ఆరోగ్యం కుదుటబడి బ్రిటీష డిప్లమాటిక్ కార్పస్ కు బైరన్ సేవలు అవసరమని చెప్పి తమతో రమ్మన్నాడు ఈ కామెడీ ఇలా సాగుతూనే ఉంది .అందుకే ‘’Byron was more captured than captivated ‘’అన్నారు .చివరికి ఆమె భర్తనుంచి విడిపోవాలనుకోంది .విడాకులు అసాధ్యం .తలిదండ్రులు ఆమెనే సమర్ధింఛి కోర్టుకు వెళ్లి భర్త ఆమెను క్రూరం గా  హిం సిస్తు న్నాడన్నారు .  ఆమె గెలిచింది .కాని బైరాన్ కు ఈ విజయం అచ్చి రాలేదు .వెళ్లి పోతున్నానని చెప్పితే ఏడ్చేసింది వెళ్ళిన తర్వాత పుట్టింటికి చేరింది . .

బైరన్ తన కవిత్వం రా స్తూనే ఉన్నాడు .ఉత్సాహం ప్రేరణ కావాల్సి వస్తున్నాయి డాన్ జువాన్ లో ఐదో అధ్యాయం మొదలెట్టాడు .మెరీనో ఫెలీరియో ,సర్దానాపలాస్ ,ది తు ఫోస్కారి అనే మూడు ట్రాజెడీలు రాశాడు అతని ‘’విజన్ ఆఫ్ జడ్జి మెంట్ ‘’కు పేరు బాగా వచ్చింది .అతని రాజకీయ దోరణులు ఇబ్బంది కలిగిస్తున్నాయి .నిఘా ఉంచారు .కూతురు అల్లీగ్రా ఏమైందో ననే ఆందోళన ఎక్కువైంది. బాగా చలిగా ఉండే కాన్వెంట్ లో ఉంచారాపిల్లను  .అయిదేళ్ళ పిల్ల జబ్బు చేసి చచ్చిపోయిన్దని తెలిసింది .లిబరల్స్ పరిస్తితి దారుణం .గామ్బాలను దేశం వదిలిపోమ్మనే ఒత్తిడి ఎక్కువైంది ..ఆలస్యం చేస్తూ చివరికి పీసా చేరి షెల్లీలను కలిశాడు .మేలోడ్రమటిక్ స్టాంజాలు  అద్భుతం గా రాస్తున్నాడు .షెల్లీ బృందం లో తానొక ‘’యాహూ ‘’గాడి గా ఉన్నానను కొన్నాడు .బైరన్ ఉంటున్న ఇంట్లో నుంఛి లీహంట్ బయటికి నెట్టేసి ఆక్రమించాడు .బైరన్ ను నానా దుర్భాషలాడి అవమానించాడు .

తెరెసా ఉత్తరాలు రాస్తూ డాన్ జువాన్ ను ఆపెయ్యటం కాని లేదా ఇంకాస్త శృంగారాన్ని రంగరించి ,అవినీతిని తగ్గించి రాయమని కోరింది .నిజం గా ఆమె అతి గర్విష్టి .1822లో బైరన్ చావుకు దగ్గరయ్యాడు .షెల్లీ ఆకస్మిక చావుకు బాధపడి అంత గోప్పకవి స్వార్ధ రహితుడు ఎవరూ లేరని మెచ్చాడు గ్రీకులు స్వాతంత్ర యుద్ధం చేస్తున్నారు అక్కడికి వెళ్లి గ్రీకు కమిటీ సభ్యుడయ్యాడు .గేనోవా వెల్లాలనుకొంటే తెరెసా తానూ వస్తానంటే వద్దని వెళ్ళిపోయాడు .గ్రీస్ చేరాడుకాని శుభ సూచనలేవీ కనీ పించలేదు .గ్రీకుల్లో అంతర్య్ద్ద్ధం తీవ్రం గా ఉంది .వాతావరణమూ బాగా లేదు .అనుకోకుండా జబ్బు పడ్డాడు తన చావు డ్రమాటిక్ గా సమాప్తం అవ్వాలని అనుకొన్నాడు ఒక గ్రీకు కుర్రాడితో హోమో సెక్స్ లో పాల్గొని ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న కోర్కె ను తీర్చుకొన్నాడు .వాడికోసం ఒక కవిత కూడా రాశాడు ‘’if Greece should fall ,I will bury myself in its ruins .If she should establish her independence I will take up residence in some part or other perhaps Attica ‘’అని గ్రీకు స్వాతంత్రం కోసం కల కన్నాడు .గ్రీసు చేరి, తానూ ఉద్యమం లో పాల్గోనాలనుకోన్నాడుకాని అవకాశం ఇవ్వలేదు .యుద్ధం చేస్తూ వీర మరణం పొందాలనుకొన్న వాడు మంచం మీద జబ్బు పడి చనిపోవాల్సి వచ్చ్చింది .మలేరియా సోకింది డాక్టర్ల మీద బైరన్ కు గురి లేదు ,19-4-1824న ‘’నాకూతురు నా చెల్లెలు ‘’ అని  కలవరిస్తూ లార్డ్ బైరన్ కవి చనిపోయాడు .

బైరన్ కవి కవిత్వం అతని జీవిత విధానమే .అది కదిలించదు ప్రేరణ కల్గించదు  .కీట్స్ కవి ‘’సెన్సస్  తో జీవిస్తే ,బైరన్ ‘’సెన్సేషన్ ‘’జీవించాడు బైరన్ టెక్నిక్కులు అతని వేగం ,తెలివి ,అజాగ్రత్త  చేష్టలకు దర్పణాలు .అంత్యప్రాస హిట్ కాని ఫట్ కాని అవుతుంది .అతని సాహిత్య పరిజ్ఞానం విస్ఫోటనమే అని పిస్తుంది .’’oh 1might I kiss those eyes of fire?’’అన గల నేర్పున్నవాడు .బైరన్ సృజన శీలి మాత్రమె కాదు స్వయం వ్యక్తిత్వం ఉన్న నటుడు కూడా .నాటక రంగంపై అభిరుచి అతని లో ఉన్న కవిని దెబ్బ తీసింది .కవులపై ప్రేమ అతని కి స్త్రీలపై ఉన్న ప్రేమకంటే నీచం .కవితా దృక్పధాన్ని అర్ధం చేసుకోకుండా రాశాడు .సెన్సేషన్ మాత్రమె బైరన్ కవిత్వాన్ని బతికించింది .అతనిలోని సెక్సువల్ ఎనర్జీ ఊగినట్లు అతని కవితా పంక్తులు ఊగుతాయి .రొమాంటిక్ శక్తి సామర్ధ్యాలకు బైరన్ రాసిన ‘’డాన్ జువాన్ ‘’గొప్ప ఉదాహరణ మాస్టర్ పీస్ అన వచ్చు .సగం ఫిలాసఫర్ అంటారు బైరన్ ను .’’an ardent lover,a ruthless libertine –is creator intended him to be both a paragon and a paradox ,an amoral but some how indignant onlooker who wants to face a lying world with the truth ‘’అని ఆవిష్కరించారు ఆయన రాసిన జువాన్ ఆధారం గా .

‘’చైల్డ్ హోరాల్డ్స్ పిల్గ్రిమేజ్ ‘’బైరాన్ సాధించిన మరో విజయం మాన్ఫ్రేడ్ కవిత ఉత్సాహాన్నివ్వటమే కాక   గోప్పకవిత అనిపిస్తుంది .బైరన్ జీవితాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ‘’కిం ‘’కవిత చదవాలి .అందులో ఇటలీ విప్లవం ,అతని పాత్ర తెలుస్తాయి .దీన్ని లేక్ కవులు హారర్ కవిత్వం అన్నారు .’’వర్డ్స్ వర్త ది రాజీ పధ్ధతి అయితే బైరన్ ది తిరుగు బాటు ‘’అని కాల్  రిడ్జి జడ్జి చేశాడు .బైరన్ ఒక తరాన్ని పూర్తిగా ప్రభావితం చేశాడు .డాస్తోవిస్కి లాంటి వారికి ప్రేరణ గా నిలిచాడు. గోదేకు జర్మన్  రోమాం టి క్స్ కు  మార్గ దర్శి అయ్యాడు .స్వేచ్చను ప్రేమించిన ప్రేమికుడు బైరన్ .మనిషివిలువను గుర్తించాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక ఇమడలేక సంచారి గా జీవించాడు .అందుకే బైరన్ ను‘’exiled pilgrim of eternity .he had that within him which shall tire torture and time ‘’.

బైరానిక్ హీరోలను సృష్టించాడు అతని విధానాన్ని ‘’బైరో మానియా ‘’అంటారు .అతని ప్రభావం ఖండాంతరం గా వ్యాపించింది .బైరన్ సొసైటీ ఏర్పడి స్మారకోపన్యాసాల నేర్పరుస్తున్నారు .రొమాంటిక్ ఉద్యమానికి గొప్ప ప్రేరకుడు బైరన్ .

 

 

బైరన్ సమాప్తం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా రాజధాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35

చారిత్రిక బలి

జార్జి గార్డన్ లార్డ్ బైరన్

జార్జి గార్డన్ రొమాంటిక్  ఉద్యమ హీరో .నిజమైన బైరానిక్ వ్యక్తీ ,.అందగాడు ,దేన్నీ లెక్క చేయని వాడు .అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు .స్వేచ్చను కోరి ,కలల్లో తేలి ,మేధావి అయిన ప్రేమికుడు .

అడ్మిరల్ జాన్ బైరన్ బైరాన్ కవి తాత .తీవ్రస్వభావి కనుక ‘’ఫౌల్ వెదర్ జాక్ ‘’అని మారు పేరుతో పిలిచే వారు .కవి బైరన్ అంకుల్ ఒకడు హత్య కేసులో ఉన్నాడు .ఈ  స్వభావాలు వారసత్వం గా పొందిన బైరన్ కవి చిన్నప్పుడే స్నేహితుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .తండ్రిని ‘’మాడ్ జాక్ ‘’అనే వారు .తండ్రి ఒక వివాహితను లేపుకు పోయి ఆమె మొగుడికి  విడాకులిచ్చిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అగస్తా అనే కూతురు పుట్టింది .ఆమె డబ్బు అంతా హరించాడు.మొదటి జేమ్స్ రాజు బంధువులమ్మాయిని  చేసుకొన్నాడు .ఈమె తండ్రి గర్వి ,తీవ్ర మనస్తత్వం ఉన్నవాడు ..ఆత్మ హత్య చేసుకొన్నాడు .

ఇక జార్జి గార్డన్ విషయానికొస్తే 22-1-1788లో కాలు వంకర తో పుట్టి ఎన్ని ఆపరేషన్లు జరిగినా సరికాక ,తల్లి విపరీత ధోరణులకు బాధ పడుతూ చాలా కాలం గడిపాడు .కొడుకును ఈ తల్లి ‘’చిన్నారి కుంటి కుంక  ‘’అని పిలిచేది .తండ్రి డబ్బు జల్సాగా ఖర్చు చేసి తాగుడు తో చచ్చాడు .బైరన్ కు నర్సుగా ఉన్న మేరీ గ్రే తొమ్మిదేళ్లప్పుడు పాపం చేయవద్దని బోధిస్తూనే సెక్స్ లో మెకానిజం నూ బాగా నేర్పింది .ఇదే తర్వాత విజ్రుమ్భించింది .తండ్రి మరణం తో జార్జి గార్దన్ ఆస్తికి వారసుడైనాడు  ఈయన చనిపోవటం తో బైరన్ కు తోమ్మిది ఏళ్ళ ప్పుడే  లార్డ్ అయ్యాడు .న్యు స్తేడ్ ఆబ్బే లోని స్వంత ఎస్టేట్ కు తల్లి బైరన్ ను తీసుకు వెళ్ళింది .హారో స్కూల్ లో చదివాడు .స్వతంత్రుడు అవటం తో ఎవరినీ లెక్క చేసే వాడు కాదు .పదహారేళ్ళ వయసులో కజిన్ మేరీ చావర్త్ ను ప్రేమిస్తే ఆమె కూడా ప్రేమాయణం సాగించి చివరికి ఒక భూస్వామిని  పెళ్లి చేసుకొన్నది .గుండె జారి గల్లంతైన బైరన్ విరహం తో ఎన్నో కవితలు ‘’వైడ్ –దిడ్రీం ‘’రాశాడు .సాహిత్యం లో మేటి అనిపించుకొన్నాడు .

పది  హేడేళ్ళల్లప్పుడు ట్రినిటి కాలేజి లో చేరాడు. అయిదు వందల డాలర్ల అలవెన్స్ వచ్చేది .రూం ను అందం గా తీర్చి దిద్దుకోవటానికి దీన్ని ఖర్చు చేశాడు .యువ రాజు దర్జా వెలిగించాడు .అప్పుల అప్పారావు అయ్యాడు .కాలేజి నీతిని కాని డబ్బును కాని ఇవ్వదు అని స్నేహితుడికి ఉత్తరం రాశాడు .కొంత కవిత్వం గిలికాడు .కాని ఎవరూ మెచ్చ్చ లేదు ..ఉండలేక బయటికొచ్చాడు . మళ్ళీ చేరినా చదువు మీద శ్రద్ధ పెట్ట లేదు .రొమాంటిక్ నవలలు చదువుతూ ఫెన్సింగ్ వేస్తూ చదువు ఎగాగొట్టి కాల క్షేపం చేశాడు .కొందరు మంచి స్నేహితుల్ని సంపాదించుకొన్నాడు అందులో జాన్ కాం హాబ్ హౌస్ బైరన్ కు ఎక్సి క్యూటర్అయ్యాడు .గాంబ్లింగ్ లో ఆరితేరాడు .మొత్తం మీద ‘’ముక్కి’’ డిగ్రీ సాధించాడు .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం పొందాడు .’’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రేవ్యూయర్స్ ‘’రాసి ప్రచురించాడు .ఇది పోప్ రచనా స్తాయిని పొందింది .పోప్ అంటే బైరాన్ కు మహా ఇష్టం .’’దంసియాడ్ ‘’రాసినా పేరు రాలేదు .

1809బైరాన్ కు మెజారిటీ వయసు వచ్చింది .దానితో బాటు అదృష్టమూ వరించింది .పన్నెండు వేల పౌండ్ల అప్పులు తీర్చాడు .ఆదాయం తగ్గింది రౌడీ పార్టీ తో కలిశాడు .ఈ బృందం లో ప్రతివాడు ఒక సన్యాసి వేషం వేసుకొనే సన్నాసే ..విందు ,మందు, చిందు లతో కాలం గడిపారు .ఇది లేడీ బైరన్ కు నచ్చలేదు .భార్యను వదిలేసి యూరప్ వెళ్లాడు .లిస్బన్ లో ఉన్నాడు .అక్కడి నుండి అయిదు వందల మైళ్ళు గుర్రం మీద ప్రయాణించి ‘’పెర్ఫెక్ట్ సైబీరియా ‘’చేరుకొన్నాడు మాల్టా వెళ్లి అల్బేనియా చేరాడు . కాం స్టంట్ నోపిల్  వెళ్లి హేల్లెస్ పాయింట్ లో ఈత కొట్టి ఏథెన్స్ కు వచ్చాడు .ఆర్ధర్ ఎడ్లిస్తాన్ తో స్నేహం చేశాడు .గ్రీస్ వెళ్లి ‘’పాఫియాన్ ప్లెజర్ ‘’అనుభవించి లండన్ చేరాడు .ఆస్తిని పర్య వేక్షించేవారి అలసత  వలన రాబడి బాగా తగ్గిపోయింది బొగ్గుగనుల్లో బొగ్గు కాదుకదా సుఖమూ రాలేదని రాసుకొన్నాడు .తల్లి చని పోయింది .ఏదో పాపం తనను కుటుంబాన్ని పీడిస్తోందని గ్రహించాడు .ఐర్లాండ్ జాతీయ గాయకుడు కవి టాం మూర్ తో పరిచయమైంది .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మొదటి ప్రసంగం చేశాడు బైరన్ .ఆధునిక యంత్ర సామగ్రి రావటం తో వర్కర్లను తీసి వేయక  తప్పలేదు .వాళ్లకు కోపం వచ్చి అన్నీ ధ్వంసం చేశారు .’’మెషీన్ రెకర్స్ ‘’అనే నాటకాన్ని జర్మన్ నాటక కర్త ‘’ఎర్నెస్ట్ టోల్లెర్ ‘’రాశాడు .ప్రభుత్వం ‘’ఫ్రెం బ్రేకర్స్ బిల్ ‘’ప్రవేశపెడితే బైరన్ వ్యతిరేకించాడు .పని చేసే వారిలో బైరన్ కు స్నేహితులెవరూ లేరు .

యూరప్ పర్యటన లో ఉండగానే బైరాన్ దీర్ఘ కవిత ను స్పెన్సర్ స్తాన్జాలతో రాయటం ప్రారంభించాడు .గ్రీసు దేశం లో పూర్తీ చేశాడు .రెండు కాంటోలను 1818లో ముద్రించాడు.ఆ విషయాన్ని బైరన్ ‘’ Byron awoke one morning and found myself famous ‘’అని రాసుకొన్నాడు .ఇందులో విషయం బైరన్ దే.రొమాంటిక్ టచ్ ఇచ్చాడు అంతే..బైరన్ కు ఉన్న పురుషత్వం స్త్రీ మనస్సు ఆడవాళ్ళకు విపరీతమైన ఆకర్షణ అయింది చుట్టూ మూగే వారు .ఇతనికంటే ముందే వాళ్ళు అతన్ని ‘’ముగ్గులోకి దించే వారు ‘’.అప్పుడు పురుష సింహమే అయిపోయేవాడు .వల పన్ని పడేసేవాళ్ళు .అందం ఆకర్షణ రాచరికం ఉండటం తో అన్ని అంతస్తుల స్త్రీలు అతని తో సంగమించి సంతృప్తి చెందేవారు .అందులో మేరీ కరోలిన్ లాంబ్ ఒకరు .ఆమెకు  భర్త కాబోయే ప్రధాని .యవ్వనోద్రేకం లో ఉన్న ఆమెను  భర్త సుఖ పెట్టలేక పోతున్నాడని బైరన్ చెంత చేరి శృంగార లీలా విలాసం సాగించి ‘’ఈ లాంబ్ ఆ సింహానికి’’ ఎర అయి పోయింది .’’that beautiful face is my fate –mad ,bad ,dangerous to know ‘’అని డైరీలో రాసుకొంది.ఆడ వాళ్ళ శృంగార సామ్రాట్ అయ్యాడు .వాళ్ళ రక్షణా ఏడుగడ తానె అనిపించాడు .సర్వ సౌఖ్యాలు పొందాడు ,పొందించాడు .అదో లోకం గా గడిపాడు ఆ దక్షిణ నాయకుడు ..పడేయ్యటం పడ వేయించుకోవటం ‘’వీజీ ‘’అయి పోయింది .’’నాటీ’’అని అందరూ ప్రేమగా ఆప్యాయం గా పిలిచేవారు ఈ ‘’లవ్ లార్డ్ బైర’న్ ‘’ను .’’అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం –‘’తరం తరం నిరంతరం ఈ అందం ‘’గా గడిచి పోతోంది .కరోలిన్ ను యెంత దూరం చేయాలనీ ప్రయత్నించినా అంత మీద పడి పోతోంది .ఇప్పటికి మన శ్రుంగార లార్డ్ వయసు పాతిక మాత్రమె .

ఏది చేసినా పధ్ధతి ప్రకారమే సాగించాడు .అన్న బెల్లా బైరాన్ కు సాయం చేసేది .కాని ఆమె ఇష్టం లేకుండా ముందుకు అడుగు వెయ్యలేక పోయాడు ఇంతలో లేడీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ జెం ఎలిజబెత్ అనేవివాహిత  నలభై ఏళ్ళ పిల్లా జెల్లా తో ఉన్నావిడ బైరాన్ పై మోజు పడింది .ఎన్నో షరతులు పెడితే వదిలేశాడు .ఇంకా చాలా మంది గాలం వేస్తున్నారు మన’’కవి చేప’’ చిక్కటం లేదు .హాయిగా ప్రశాంతం గా గడపాలని కోరుకొన్నాడు .కవిత్వమే పరిష్కారం అని ఎంచుకొన్నాడు .1813లో ‘’ది  జియనోర్ అండ్ ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’పబ్లిష్ చేశాడు .తర్వాత ‘’కార్సైర్ ‘’రాస్తే పన్నెండు వేల కాపీలు అమ్ముడు పోయాయి .న్యు స్తేడ్ ఆబ్బే ఎస్టేట్ ను లాభానికి అమ్మాడు .కాని కొనే వాడు పూర్తీ డబ్బు ఇవ్వలేక పోవటం తో బైరన్ కే దక్కింది .బిజీ బిజినెస్ మాన్ అయ్యాడు .ఒంటరితనం బాధిస్తోంది .

తన టర్కిష్ కద ఆధారం గా ‘’ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’ఇద్దరు విఫల ప్రేమికుల కదరాశాడు విషాద ‘’ఎపిజిల్ తు ఆగస్తా ‘’రాసాడు .బిడ్డను కన బోయే ముందు లేడీ మేల్బోర్న్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చెల్లెలిని తీసుకొని యూరప్ వెళ్లాడు .పాపం చేస్తున్నావని ఆమె చెప్పినా పేడ చెవిని పెట్టాడు .పెళ్లి చేసుకోమని మేల బోర్న్ కోరుతోంది ,అనబెల్లా మీద మనసు దూరం కావటం లేదు .ఎటూ పాలు పోనీ స్తితి .కాని సృజన శక్తి మాత్రం విజ్రుమ్భిస్తూనే ఉంది .చెల్లెలు ఆగస్తా మాత్రం పాదరస బుద్ధి ఉన్న అన్న గారి జీవితం ఏమై పోతుందో అని కల వర పడుతోంది .1815లో అనబెల్లాను పెళ్లి చేసుకొన్నాడు .చర్చి లోంచి బయటికి రాగానే ‘’నన్ను సంస్కరించేంత గోప్పదానివా నువ్వు “’అని గురుడు పెట్రేగి పోయి అన్నాడు .పక్కలో పడుకోవచ్చా అని అడిగితే యవ్వనం దాటేదాకా పడుకోమ్మన్నాడు .తన సోదరితో బైరన్ ప్రేమకలాపం సాగిస్తున్నాడన్న రూమర్లు విన్నది .కాని అవి అబద్ధాలని నమ్మింది

బైరన్ పరిస్తితి రోజు రోజుకూ కుంగి పోతోంది .డిప్రెషన్ లో పడిపోతే అనబెల్లా సేవ చేస్తోంది .డబ్బు చేతిలో ఆడటం లేదు మరీ ఉద్రేకం పెరిగింది .అప్పుల వాళ్ళు రోజూ వచ్చి చెవిలో రోద పెడుతున్నారు అనబెల్లా గర్భిణి .సాయం కోసం అగస్తా వచ్చింది .బైరాన్ ను ప్రశాంతం గా ఉంచగలిగింది సోదరి ఆగస్తా మాత్రమె అను  బిడ్డ ను కన్నది .కాని బైరన్ కు ఇదేమీ పట్టలేదు .పిచ్చివాడై పోతున్నాడు .పిచ్చ పిచ్చగా భార్యను తిడుతున్నాడు బిడ్డ మీద ప్రేమే చూప లేదు కూతురికి ‘’అగస్తా ఆదా’’ పేరు పెట్టాడు .అగస్తాను పంపిడ్డామనుకొంటే ఆమె ఇక్కడే ఉండి పోయింది .బైరన్ ను ఎప్పుడూ ఎవరో ఒకరు కని  పెట్టుకొని ఉండాల్సిన అవసరమేర్పడింది .అగస్తా తలిదండ్రులను చేరి మళ్ళీ తిరిగి రాలేదు .పెళ్లి సంబడం ఒక ఏడాది మాత్రమె .ఈ విడిపోవటం అనేక పుకార్లకు చోటు కల్పించింది .’’నాకు రెండొందల మంది తో సంబంధం ఉంది ‘’గర్వం గా చెప్పుకొనే మగధీరుడు అనేక అభియోగాల్లో చిక్కుకొన్నాడు .అగస్తా తో అక్రమ సంబంధం ఉందనీ చెవులు కొరుక్కున్నారు .కాని బైరన్ ఆమెలో తన తల్లినే చూసుకొన్నాడు. తల్లి ప్రేమ ను పొందలేని బైరాన్ ఆమె సన్నిధిలో ఆ మాతృప్రేమ రుచిని పొందుతున్నాడు .25-4-1816న మన లార్డ్ గారు సెమి రాయల్  దర్జాతో ముగ్గురు సేవకులు ,ఒక డాక్టర్ తో స్వయం గా ప్రవాస జీవితాన్ని ఎన్నుకొని లండన్ వదిలి వెళ్లి పోయాడు .కుళ్ళి కంపుకొట్టే ఈ సమాజానికి దూరం గా వెళ్తున్నానని చెప్పుకొన్నాడు బైరన్ .ఇరవై ఎనిమిదేళ్ళ ఈ కవి వీరుడు ఇంకా సాధించాల్సిన అద్భుతాలెన్నో ఉన్నాయి .

 

 

 

 

 

మరిన్ని బైరన్ సంగతులు ఈ సారి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాజ లక్ష్మీ పార్ధ సారధి -విహంగ మహిళా వెబ్ మాసపత్రిక జూన్ లో నా వ్యాసం

రాజ లక్ష్మీ పార్ధ సారధి

                        రాజ లక్ష్మీ పార్ధ సారధి మద్రాస్ లో అలివేలు ,పార్ధ సారధి దంపతులకు 8-11-1925లో జన్మించింది .తండ్రి బర్మా షెల్ కంపెనీ ఉద్యోగి .ఆయన స్వాతంత్ర సమర యోధుడు టి రాఘవాచారి గారి కుమారుడు .రాజ లక్ష్మి సెయింట్ జాన్ స్కూల్ లో హోలీ క్రాస్ కాలేజిలో చదివి డిగ్రీ చేసింది .తర్వాత జర్నలిజం లోమద్రాస్ యూనివర్సిటీ నుండి 1947లో ఇరవై రెండేళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది .జర్నలిజం కాలేజీ ప్రారంభమైన మొదటి ఏడాదే జర్నలిజం చదివి పాసైన మొదటి విద్యార్ధిని గా లక్ష్మి చరిత్ర సృష్టించింది .ఎం.ఎడ్ పూర్తి చేసి మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి చరిత్రలో ఏం. ఏ .చదివి సాధించింది .

               జర్నలిజం లో డిగ్రీపొందగానే ‘’ది హిందూ ‘’ఆంగ్ల పత్రికలో ‘’ కుముదం’’,’’ స్వదేశ మిత్రన్’’ అనే తమిళ పత్రికలలో జర్నలిస్ట్ అయింది .’’దిమెయిల్’’ సబ్ ఎడిటర్ గా పని చేసి ఆర్ధర్ హేలేస్ వలన అపూర్వ జ్ఞానాన్ని పొందింది .క్రీడలు మొదలైన విషయాలపై రాసేది .ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆమెది . నాటక రంగ నటుడు ,ప్రయోక్త దర్శకుడు అయిన పార్ధ సారధిని వివాహమాడింది .పెళ్లి చేసుకొని జర్నలిస్ట్ ఉద్యోగం మానేసింది .1958లో ‘’పద్మా శేషాద్రి బాల భవన్ ‘’స్థాపించింది .నుంగంబాకం రిక్రియేషన్ క్లబ్ కు చెందిన మహిళలతో కలిసి నుంగంబాకం లో శేషాద్రి అనే దాత ఇచ్చిన ధనం తో ఆయన కోరిక మేరకు ఆయన భార్య పద్మ పేర పద్మా శేషాద్రి బాల భవన్ ను పదమూడు మంది విద్యార్ధులతో తన ఇంట్లో పై అంతస్తులో ఉన్న రేకుల షెడ్ లో ఏర్పరచింది .విద్యార్ధులు పెరిగారు .వసతి చాలటం లేదు .ఏడాది తర్వాత స్వంత భవనాన్ని ఏర్పరిచింది .1971లో టి. పి. రోడ్ లో మొదటి బ్రాంచ్ ని ఏర్పరిచింది .రెండేళ్ళ తర్వాత మొత్తం అయిదు బ్రాంచీలను స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది. 8000మంది విద్యార్ధులతో 500మంది స్టాఫ్ తో మూడు పువ్వులూ ఆరుకాయలుగా విస్తరిల్లింది .

                             ఈ స్కూల్ స్థాపించిన రోజు 1958 నుండి ఆ సంస్థకు డీన్ మరియు డైరెక్టర్ గా వ్యవహరించింది .ఉదయం స్కూల్ లో పని చేసిసాయంత్రం మహిళలకు విద్య నేర్పిస్తూ ,రాత్రి వర్ధమాన నటులకు నటన లో శిక్షణ నిస్తూ క్షణం విశ్రాంతి లేకుండా పని చేసింది .ఆమె ఇల్లు ఒక విద్యా సాంస్కృతిక కేంద్రమే అయింది .స్కూల్ లో హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను బోధించే ఏర్పాట్లు చేసింది .తమిళ నటుడు మాజీ ముఖ్య మంత్రి ఏం జి రామ చంద్రన్ స్కూల్ లో ‘’హేతువాదాన్ని ‘’బోధిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు .ఎందరో సినీ నటులు నాటక రంగ నటులు ఈ సంస్థకు భారీగా విరాళాలు అందించారు వాటిని సక్రమంగా ఖర్చు చేస్తూ సౌకర్యాలు కలిగిస్తూ స్వంత భవనాలను నిర్మిస్తూ పార్ధ సారధి విద్యా సంస్థలను ( వై జి పి సంస్థలను)అభి వృద్ధి చేసింది .

                  భారత దేశం లో విద్యా వ్యాప్తికి లక్ష్మీ పార్ధ సారది అవిశ్రాంత కృషి చేసింది .అన్ని దశలలో విద్యా స్థాయిని పెంచటానికి తీవ్రంగా పని చేసింది ..విద్యా వ్యవస్థలో’’ సి.బి ఎస్.బి. ‘’విధానాన్ని ‘’ అమలు చేయటం లో భాగస్వామిని అయింది .విద్యా వ్యాప్తికి ,సాహిత్యానికి ఆమె చేసిన కృషి ని గుర్తించి భారత ప్రభుత్వం రాజ లక్ష్మీ పార్ధ సారధికి’’ పద్మ శ్రీ ‘’పురస్కారాన్ని అందజేసి గౌరవించింది .ఆమె కుమారుడు మహేంద్ర తమిళ నాటక ,సినీ నటుడుగా రాణిస్తున్నాడు .
వై జి.పి గా గుర్తింపు పొందిన రాజలక్ష్మీ పార్ధసారధి ‘’ఎక్స్ లెన్స్ బియాండ్ క్లాస్ రూమ్ ‘’అనే స్వీయ చరిత్రను రాసుకొన్నది .ఏదైనా సాధించాలనే తీవ్రమైన తపన , విజన్ ,అలుపెరుగని పోరాట పటిమ ,అపార శక్తి సామర్ధ్యాలు ,సృజనాత్మక ఆలోచన ,అద్భుత జ్ఞాపక శక్తి ,అపూర్వ భావాలు ,నిర్భీకత ,నిర్దుష్ట విధానం ,సృజన శీలత ,భగవంతునిపై అపార విశ్వాసం తిరుగులేని ఆత్మ శక్తి ,మొహమాటం లేని వాగ్భాషణం ,నిష్కపటమైన హృదయం రాజలక్ష్మికి ఉన్న అనేక సుగుణాలలో కొన్నిమాత్రమే .

                            ఈ శతాబ్ది విద్యా వేత్త .ప్రపంచ విద్యా వ్యవస్థలో చురుకైన పాత్రతో విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తున్న విదుషీమణి .’’విద్యా సేవా రత్నం’’ అని బిరుదు పొంది ,’’నారీ రత్నం’’ గా భాసిస్తోంది .జర్నలిస్టు ‘రష్మి’’అని బంధువులు స్నేహితుల చేత ‘’రాజమ్మ’’ అని ఆప్యాయంగా పిలువబడుతోంది .ఏ ఇజానికి దగ్గర కాకుండా ,మానవతయే, ధ్యేయంగా నిర్విరామ కృషి చేస్తున్న ఆదర్శ గృహిణి .తన చరిత్రను తాను నిర్మించుకొన్న ఆదర్శ మహిళ .88 ఏళ్ళ వయసులో నిత్య యవ్వనం తో అనుక్షణం సేవా దృక్పథంతో జీవితాన్ని తీర్చిదిద్దుకొంటున్న నారీ శిరోమణి రాజలక్ష్మీ పార్ధ సారధి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34

చిత్ర విచిత్రాలకు ప్రేరణ

టెక్నిక్ ,ప్రయోగాలలో కవిత్వం లో అనేక మార్పులోచ్చి కొత్త శబ్ద సృష్టి జరిగింది  ఈ .  సృష్టికర్తలకు దూరం గా కొద్దిమంది దూరమై చిత్రాలు చేశారు అందులో సావేజ్ లాండర్ ,జాన్ క్లేర్ ,థామస్ లోవేల్ బెద్దోస్ఉన్నారు .

వాల్టర్ సావేజ్ లాండర్

తన విపరీత ధోరణులకు తానె బలి అయినవాడు వాల్టర్ సావేజ్ లాండర్ .ఆ శతాబ్దం లో చిక్కని కవిత్వాన్ని చెప్పాడు తొంభై ఏళ్ళ జీవితం లో పోరాటాలు పోట్లాటలతో ఎక్కువ గడిచి పోయింది .కోర్టు కేసులు ,అవమానాలు,అప్పుడప్పుడు విజయాలుతో మిశ్రమ జీవితం .ఓల్డ్ స్తాఫార్డ్ కుటుంబం లో వార్  విక్ లో 30-1-1775లో పుట్టాడు .మొదటి చార్లెస్ రాజు తల నరక బడిన సాంవత్సరిక దినమే  లాండర్ పుట్టిన రోజు అవటం విశేషం .తండ్రి సంపన్న డాక్టర్ .కొడుకును నాలుగో ఏట స్కూల్ లో చేర్చాడు . పదేళ్ళకే లాటిన్ లో అసమాన ప్రజ్ఞ చూపి  రగ్బీ స్కూల్ లో చరిత్ర సృష్టించాడు .అదే కొంప ముంచింది .ఒక మేస్ట రు తో  వాక్య నిర్మాణం విషయం లో గొడవ పడి తప్పు తెలుసుకొన్నా క్షమాపణ కోరకపోతే స్కూల్ నుంచి పంపించేశారు .పందొమ్మిదో ఏడు ట్రినిటి కాలేజి లో చేరి రోజు వారీ విధానాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే’’పిచ్చి జాకోబిన్ ‘’అన్నారట.ఉద్రేకం తో ఊగి ఒక సారి తోటి విద్యార్ధిని తుపాకితో కాల్చాడు .సస్పెండ్ చేశారు తండ్రి వచ్చి పధ్ధతి మార్చుకో మని చెప్పినా మార లేదు .పైగా ‘’నాకు చదువు చెప్పగలిగినంత స్థాయి లో ఆక్స్ ఫర్డ్ లేదు ‘’అన్న పొగరు బోతు .

లండన్ వెళ్లి ..ది   పోయెమ్స్ ఆఫ్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’పుస్తకాన్ని ముద్రించాడు .మరో మూడేళ్లకు ‘’జేబీర్ ‘’అనే మహా కావ్యాన్ని రాసి అచ్చు వేశాడు .దీనికి  లాటిన్ మాతృక ఉంది .మిల్టన్ కవితో పోల్చదగిన స్థాయి పొందాడు .రెండేళ్ళ తర్వాతామరీ విజ్రుమ్భించి దాదాపు యాభై దాకా కవిత్వాం వచన రచనలు రాసి ప్రచురించాడు ..ముప్ఫై ఏళ్లకే తండ్రి చనిపోయాడు .ఆస్తి సంక్రమించింది లేక్ డిస్ట్రిక్ట్ ,బ్రిస్టల్ ,లను చూస్తూ సూతీ వర్డ్స్ వర్త ల తో స్నేహం చేశాడు .వేల్స్ లో అందమైన ఎస్టేట్ కొనుక్కున్నాడు .ఫ్రాన్స్ విప్లవ నాయకులపై సాను భూతి చూపాడు .నెపోలియన్ ను వ్యతిరేకించాడు .గౌరవ కల్నల్ పదవి పొందాడు .అతని బృందం వారిలో కలిసి పొతే ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు .ముప్ఫై ఆరేళ్ళ వయసులో పదహారేళ్ళ పడుచును ఒక బాలే లో చూసి మోహించి చేతిలో పెన్నీ కూడా లేని బాంకర్ కూతురైన ఆమెను పెళ్లి చేసుకొని రెండు నెలల్లోనే తప్పు చేశానని గ్రహించి ,ఒక లేడీ హిట్లర్ ను పెళ్లి చేసుకోన్నానని నెత్తి బాదుకొన్నాడు .ఆమెకు లేని అలవాట్లు లేవు .విసిగెత్తి పోయాడు కోపం తీవ్రమైంది .భార్యతో పక్కింటి వాళ్ళతో ,అద్దెకుంటున్న వారితో పోట్లాడే వాడు .ప్రభుత్వానికి వ్యతిరేకం గా వ్యాసాలూ రాశాడు .ఇంగ్లాండ్ నుంచి బహిష్కరిస్తే భార్య తో ఇటలీ కి వెళ్ళిపోయి ,వీడి బాధ  భరిస్తూనే  ఆమె నలుగురు పిల్లల్ని కన్నది .ఇటలీ కవి తో తగాదా పెట్టుకొంటే ఇటలీ నుంచి బహిష్కరిస్తే జెనోవా వెళ్లి మెడిసి పాలస్ లో ఉన్నాడు .’’పానీ పట్టు ‘’(నీటి తగాదా)లో పొరుగు వాడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .పిచ్చ కోపం వచ్చి వంట వాడిని కిటికీ లోంచి తోటలోని పూల పొదల్లోకి నేట్టిపారేశాడు .’’అయ్యయ్యో వయొలెట్ పూల చెట్ల సంగతి మర్చిపోయానే ‘’అనుకొన్నాడట పాపం . నలభై –యాభైలలో వచనం రాస్తూ ‘’ఇమేజరీ కన్సర్వేషన్స్ ‘’రాసి ప్రచురించాడు హిస్టారికల్ డైలాగ్స్ ను రెండు భాగాలుగా తెచ్చాడు .అరవై లో సర్వ శ్రేస్టుడని పించుకొన్నాడు  కార్లైల్  a tall broad ,burly man with gray hair and large fierce –rolling eyes of the most restless ,impetuous vivacity ,not to be held in by the most perfect breeding ,expressing itself in high colored superlatives ,indeed in reckless exaggeration ,now and then in a dry ,sharp laugh ,not of sport but of mockery ‘’అనిలాండర్ రూపాన్ని  కళ్ళకు కట్టినట్లు  వర్ణించాడు .ఇదే రూపాన్ని చార్లెస్ డికెన్స్ తన ‘’బ్లీక్ హౌస్ ‘’నవలలో బాయ్ హారన్ ‘’గా చిత్రించాడు .

ఇరవై  అసంతృప్త   జీవితం వ్యధల పాలైంది .భార్యకు విదాకులిచ్చేశాడు .ఇంగ్లాండ్ చేరి బాత్ లో ఉండి  డికెన్స్ తో స్నేహం పొందాడు .పిల్లలతో సయోధ్య సాధించి దగ్గరకు పిలిపించుకొన్నాడు .తండ్రి తన కళ్ళ ముందే చని పోవటం జీర్ణించుకోలేక పోతున్నానని కూతురు బ్రౌనింగ్ కు రాసింది ..ఇంకో కోర్టు కేసు మీద మళ్ళీ ఇటలీకి పారి పోవాల్సోచ్చింది .వెయ్యి పౌండ్ల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది .బ్రౌనింగ్ ఎమర్సన్ తో పరిచయం కలిగింది .’’లాస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యాన్ ఓల్డ్ ట్రీ’’ని ఎనభై లో రాశాడు .మూడేళ్ళ తర్వాతా ‘’డ్రై స్టిక్స్ ఫాగోతేడ్ బై దిలేట్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’రాసి ప్రచురించాడు .తొంభై వ పుట్టిన రోజుకు మూడు నెలల ముందు లాండర్ 17-9-1864న చనిపోయాడు .మనిషి లోని కళ అతని జీవితం తో సమాంతరం గా నడవదు అని రుజువు చేశాడు .అతని కాన్వర్ సెషన్స్ ‘’క్లాసికల్ గా ఉంటుంది .అతని చిక్కని స్తాన్జాలు ఆకర్షణీయం గా ఉంటాయి ..అతని గొప్పలు కవిత్వం లో ఇరికించాడు .’’I strove with none for none was worth my strife –nature I loved and next to nature art –I warmed my hands before the fire of life –it sinks and I am ready to depart ‘’అతనిలో గర్వం ,అసంబద్ధ జీవితం తో గడిపాడు .జీవితమనే అగ్ని తో చేతుల్ని వెచ్చ చేసుకొన్నాడు .బైరన్ షెల్లీ లకు మధ్య వారధిగా ఉన్న కవి .ఎపిగ్రామ్స్ ను పకడ్బందీ గా రాశాడు ఎలిజీలను అపూర్వం గా సృష్టించాడు .’’he was a classic no formalist ‘’అని పించాడు .’’so royally serene in its commanding power upon tragic main springs of terror and of pity .’’

జాన్ క్లేర్

సమకాలీనులు ఇచ్చ్చా పూర్వక కవి అని పొగడిన జాన్ క్లేర్ ఇరవై వ శతాబ్ది దాకా ఎవరికీ గుర్తు లేడు.చని పోయిన అరవై ఏళ్ళ తర్వాతా అతని పై ఉన్న విరుద్దాలను ఖండించి అలాన్ పోర్టర్ ,ఎడ్మండ్ బ్లండర్ లు క్లేర్ రచనలను ప్రచురించారు .13-7-1793న జాన్ క్లేర్ న్యూ యంపి షైర్  లోని హెల్ప్ స్తాన్ లో అక్షరజ్ఞానం లేని తండ్రికి కొడుకుగా పుట్టాడు .తండ్రికున్న కొద్ది పాటి పొలం లో తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేశాడు .రాత్ర్ల్లు బడికి వెళ్లి చదివే వాడు ఒక సారి పొరిగింటి ఆయన గడ్డి వాగన్ నుంచి కిందపడి మెడ విరిగిన దృశ్యాన్ని చూసి జాన్ మానసికం గా చలించి స్తిమితం కోల్పోయాడు ..పశువులను కాచాడు తర్వాత తోటమాలి ఉద్యోగం చేసి మేరీ జాయిస్ సంపన్న రైతు కూతురు పై ప్రేమలో పది ఆమె తద్రి కట్టడి చేస్తే కుంగిపోయి మామూలు మనిషి కాలేదు .ఆమె చనిపోయిన తర్వాత బతికి ఉండనే భ్రమలో ఎన్నో కవితలు రాశాడు .అందులో కొన్ని వారేవా అనిపిస్తాయి .

ఇరవై రెండవ ఏట సున్నపు బట్టి లో పని చేశాడు .జిప్సీ లతో తిరిగాడు .కవిత్వం రాయటం మొదలెట్టాడు ..తండ్రి ఏదో సాయం చేస్తున్నాడు చాలటం లేదు .అదృష్ట వశాత్తు ఒక పబ్లిషర్ ఇతని ‘’పోయెమ్స్ దిస్క్రిప్తివ్ ఆఫ్ రూరల్ లైఫ్ ఆంద్ సీనరీ ‘’పుస్తకం ముద్రించాడు .బ్రహ్మాండ విజయం సాధించింది .కొందరు మాత్రం ‘’రైతు కవి ‘’అన్నారు .పుస్తకాలన్నీ వెంటనే అమ్ముడయ్యాయి .ఏ విజయం తో లండన్ చేరాడు .ఎడిన్బర్గ్ కోటరీ తో మమేకం అయ్యాడు .లార్డ్ మిల్టన్ వంటి వారితో పరిచయం కలిగింది .విలేజ్ మాన్ స్త్రల్,ముద్రణ పొందింది .ఇదీ బాగా ప్రాచుర్యం పొందింది స్నేహితులు ఇతనికోసం గ్లాసులు కొట్టుకొని అతని ఆరోగ్యం కోసం తాగి సంబురాలు చేసుకొన్నారు .

పొలం లో సేద్యం చేస్తూ ఖాళీ సమయం లో కవిత్వం రాస్తూ గడిపాడు .తన పుస్తకాలను ముప్ఫై మైళ్ల  దూరం  మోసుకొని వెళ్లి అమ్మే వాడు .రాయబోయే దాన్ని కూడా టేలర్ అనే పబ్లిషర్ కు ఇచ్చి రెండు వందల పౌండ్లు డబ్బు ఇమ్మని కోరితే ఆత ను ఇవ్వకుండా ‘’దేవుడు నిన్ను ఎలా పుట్టిన్చాడో అలానే ఉండు అంతకంటే ఆశ పడకు ‘’అని మనసును గాయ పరిచాడు .విపరీత శారీరక శ్రమ ,రచనల వలన మానసికశ్రమ తో అలసిపోయి నీరసపడ్డాడు .బాధలను మరచి పోవటానికి తాగుడు అలవాటు చేసుకొన్నాడు .కుటుంబ సభ్యులు తొమ్మిది మంది అయ్యారు .’’ది షెపర్డ్స్ కాలెండర్’’ను మరో ఎనిమిదేళ్ళకు ది రూరల్ మ్యూజ్ ‘’లను రాసి ప్రచురించాడు .కాని ఇవి జనాన్ని ఆకర్షించాఆలేక పోయాయి అతని విగర్ తగ్గిందని భావించారు .

నలభై లో మానసిక స్తితి మొదటి సారిగా దెబ్బ తిన్నది త్వరలోనే తెరుకొన్నాడు కాని ఏడాదికే మళ్ళీ తిరగ బెట్టింది .అతనిలో నిరాశ విచారం పెరిగాయి .ఒక రోజు మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకం చూస్తూ షైలాక్ పాత్ర దారి పై కోపం తో సీటు నుంచి లేచి చంపేస్తానని రంగం మేదీ వెల్ల బోయాడు .భ్రమ భ్రాంతి అతన్ని చుట్టుముట్టాయి .డాక్టర్ల దగ్గర చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించారు ఎప్పింగ్ ఫారెస్ట్ శానిటోరియం కు పంపారు .ఒక రోజు ఇంటికి వెళ్లాలనే కోరిక కలిగి స్వంత ఊరు హెల్ప్ స్తాన్ కు ఒంటరిగా నడిచి బయల్దేరి మూడు రోజులు ప్రయాణించి చేరాడు .కొంత ఆరోగ్యం బాగు పడిందని పించింది .కాని పరిస్తితి చే జారి పోతోంది పూర్తిగా పిచ్చి వాడై పోయాడని నిర్ధారించి నార్త్ యంతాన్ కంట్రీ అసిలియం కు తరలించారు .ఇక్కడే ఇరవై ఏళ్ళు ఉండిపోయాడు .ఇక్కడే ‘’ది షీప్ ఆఫ్ స్ప్రింగ్ ‘’,ఐ యాం ‘’,ఇన్విటేషన్ తు ఎతర్నితి ‘’మొదలైన గొప్ప కవితలు రాశాడు .ఒంటరి జీవితం బాధించింది .భార్య పిల్ల మంద తో ఇబ్బంది పడుతూ వచ్చి చూడ లేక పోయింది .శరీరకాయా భాగాలు పని చేయటం మానేశాయి కాళ్ళూ చేతులు కదిలించలేక పోయాడు .నడక అసలే లేదు చివరికి పక్ష వాతం వచ్చి డెబ్భై ఒకటి వయసులో మే నెల ఇరవై 1864 లో మరణించాడు .రొమాంటిక్ కవుల కంటే చాలా ముందుకు దూసుకొని పోయిన కవి .నార్త్ అమెరికా లో జాన్ క్లేర్ సొసైటీని ఏర్పరచి స్మరించి ,సేవలు చేస్తున్నారు .’’Clare was the most influential poet aside from Words Worth to practice it in an older style ‘’.

థామస్ లోవెల్ బెద్దోస్

బ్రిస్టల్ దగ్గర క్లిఫ్ తన లో జూన్ ముప్ఫిన 1830లో బెద్దోస్ పుట్టాడు .మెరియా ఎద్జి వర్త సోదరి అన్నా ఎద్జి వర్త ఇతని తల్లి .తండ్రి గొప్ప వైద్యుడు .కొంతవరాకు శాస్త్ర వేత్త కూడా రాయల అకాడెమి ప్రెసిడెంట్ డేవిస్ గిల్బర్ట్ దగ్గర సహాయకుడు .వింత ప్ర యోగాలు చేసేవాడు .పది హేదేల్లప్పుడు బెద్దోస్ రెండు బహుమతులు పొందాడు .ఒకటి గ్రీకులో రెండోది లాటిన్ లో .ఒక నాటిక రాసి మార్నింగ్ పోస్ట్ మేగజైన్ లో ప్రచురించాడు ఆక్స్ ఫర్డ్ పెం బ్రోక్ కాలేజి లో చేరి షి ల్లర్ పండితుడి ప్రభావానికి గురి అయి జర్మని సాహిత్యం పై అమిత శ్రద్ధ చూపాడు .జర్మని స్విట్జర్లాండ్ లు తిరిగి ,ఫిలాసఫీ కవిత్వం లకు అప్లికేషన్ పెట్టినా చివరికి ‘’అనాటమీ ‘’లో చేరి చదివాడు .అప్పుడే ‘’డే త్స్ జెస్ట్ బుక్ ‘’అనే త్రాజేడి ను ఇరవై నాలుగు లో రాయటం మొదలు పెట్టి ఎప్పటికప్పుడు మార్పులు చనిపోయే వరకు చేస్తూనే ఉన్నాడు .గోదిక్ సాహిత్యాన్ని అమిత ఇష్టపడ్డాడు .తానూ ఒక ప్రసిద్ధ ఎలిజబెతేనియాన్ అని భ్రమించేవాడు  .నలభై ఏళ్లకు ఎలిజబెతాన్లలలో తానూ చివరి వాదిననుకొని పిల్లి గడ్డం పెంచటం ప్రారంభించి షేక్స్ పియర్ లాగా పోజు పెట్టేవాడు .ఒక నటుడితోకలిసి నాటకాలాడి,వాడు తనకంటే గొప్ప నటుడని పేరు పొందితే అసూయ కలిగి చంప బోయాడు మరో సారి పోట్లాటలో క్షనికోద్రేకం లో .తనకాలి నరం  త్ర్మ్పుకొని  ఆత్మా హత్యా ప్రయత్నం చేసుకొన్నా మాన్  ఆఫ్ మూడ్స్ .ప్రాణాపాయం తప్పినా ,విషం తాగి 26-1-1849 న చనిపోయాడు ఏఎ క్షనికోద్రేకి ..

‘’Is that te wind dying ?o not-it is only two devils that blow –through a murderers bones ,to and fro –in the ghosts moon shine ‘’ఒక ఉదాహరణ కవిత మాత్రమె .డ్రమటిస్ట్  అయినా వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించలేక పోయాడు .అతని కవిత్వం మాత్రం ‘’full of thoughts and richness of diction’’అని బేరీజు వేశారు .

 

 

 

 

 

 

 

     సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-06-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ద్రోణ వ్యధ -జోస్యం విద్యా సాగర్ -పద్యాలు

drona badha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33

ముగ్గురు కవుల ముచ్చట్లు

కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ లో ఉన్న వర్డ్స్ వర్త్ ను కలుసుకొన్నాడు .అనుంగు మిత్రుల్లా ఉన్నారు .సూతే విషయం చర్చించారు .సాధారణం గా తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వర్డ్స్ వర్త్ ఇప్పుడు ఆతిధ్యం లో ఆరి తేరాడు .ఆల్ఫాక్సేన్ కు మారిన ఆయన్ను దాదాపు రోజూ చూసేవాడు .1798ఈ కవులిద్దరు కలిసి ‘’లిరికల్ బాల్లడ్స్ ‘’ను రొమాంటిక్ పద్ధతిలో రాయాలని నిశ్చయించారు .రాసిన దానికి కొత్తదనం ఆకర్షణ తెచ్చాడు కాల్ రిడ్జి.అది1800లో విడుదలైంది .మరో రెండేళ్ళ తర్వాత మార్పులు చేసి మళ్ళీ ప్రచురించారు .వర్డ్స్ వర్త్ ముందు మాట రాశాడు .’’wonder and beauty could be achieved by the mere mention of words like wondrous beautiful and that the clichés and circumlocuationsof the established poetic diction were in themselves poetry .’’ అనే అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు .’’poetry not only could but should be written in the language really used by men ‘’అని చెప్పాడు .లిరికల్ బాలడ్స్ కు స్పందన పెద్దగా రాలేదు .నిరుత్సాహ పడ్డారిద్దరూ .కొన్ని తరాలను ప్రభావితం చేసిన ఈ కవితలు అప్పుడు మాత్రం ఆదరణకు నోచుకోలేదు .కాల్ రిడ్జి రాసిన ‘’దిరైం ఆఫ్ ది ఎంషేంట్ మారినర్’’ఇంగ్లీష్ సాహిత్యానికే వన్నె తెచ్చింది .అలాగే వర్డ్స్ వర్త్ రాసిన సాలి లోక్వి ‘’lines composed a few miles above Tintern Abbey’’గోప్పప్రభావాన్ని కలిగించినా దానిపై దృష్టిపడలేదు .అందరూ ఎక్కువ గా ఉదహరించే వర్డ్స్ వర్త్ నిర్వచనం poetry is the spontaneous overflow of powerful feeling –takes its origin from emotion recollected in tranquility ‘’ కు మంచి ఉదాహరణ .

దీని తర్వాత కాల్ రిడ్జి కష్టాల్లో బాధల్లో పడ్డాడు .ప్రారంభించిన ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’పూర్తికాలేదు .అది పెద్ద నష్టం అన్నాడు .కుబ్లాయ్ ఖాన్ లో మంత్రాలున్నాయని ,పునరావ్వృతమైన ప్రతి చోటా అద్భుత శక్తి గోచరిస్తుందని ,అది గోదిక్ నమ్మకానికి విజయమని ,సర్వోత్కృష్ట రచన అని భావించాడు .

సూతీ ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు పోర్చుగల్ లో ఆరు నేలలుండిస్వభావాన్ని మార్చుకొన్నాడు .సూతీ వర్డ్స్ వర్త్ ను కాల్ రిడ్జి ని మరీ సన్నిహితులయ్యేట్లు చేశాడు .ఈ ఇద్దరు కలిసి జర్మని వెళ్ళారు .జర్మని సాహిత్యాన్ని అవలోడనం చేసి ఆ  ఫిలాసఫీని క్షుణ్ణం గా అవగాహన చేసుకొన్నాడు కాల్ రిడ్జి .వర్త్ మాత్రం అంత ఉత్సాహం చూపకుండా గోస్లార్ వెళ్ళాడు అక్కడ ‘’లూసీ పోయెమ్స్ ‘’రాయటం ప్రారంభించాడు .దీనికి దోరోతి కాని వేరెవరైనా అజ్ఞాత వ్యక్తీ కాని ప్రేరణ అయి ఉండాలి .ఇందులో తన బాల్య జ్ఞాపకాలను పొందు పరచాడు. జర్మన్ భాష నేర్వలేక పోయాడు. జర్మన్లను ప్రేమించ లేక పోయాడుకూడా .మన శ్రీనాధుడు రాయల సీమ బాధల్ని చాటువులుగా చెప్పినట్లు జర్మని అనుభవాల్ని కవిత్వీకరించాడు –‘

‘’I travelled among unknown men in lands beyond the sea –nor England ,didi I know till then –what love I bore to thee –it is past melancholy dream –nor will I quit the shore –a second time ,for still I seem –t love thee more and more ‘’అంటూ మాతృదేశం ఇంగ్లాండ్ కు దూరమైనందుకు బాధ పడ్డాడు .

1799 డిసెంబర్ ర్ లో దోరోతి తో విండర్ మియర్ దగ్గర డవ్ కాటేజీ లో కాపురం పెట్టాడు .పల్లె ప్రాంతం .అందమైన కొండలు ఆకర్షణీయ ప్రక్రుతి అందాలు మనసును పరవశింప జేశాయి .తాను డెమొక్రాట్ గా ఉన్నానని అక్కడే విశ్రాంతి పొందుతానని చెప్పాడు .డోరోతికూడా తన ‘’డార్లింగ్ బ్రదర్ ‘’వివాదాల జోలికి పోకుండా ప్రశాంతం గా ఇక్కడే ఉండటం ఇష్టం .ఆమెకు కాల్ రిడ్జి అంటే ఫాసినేషన్ ఏర్పడింది .అతను భార్యకు ఇంకా విడాకులివ్వలేదు .ఆమె మెంటల్ గా దెబ్బ తిన్నది .ఆమెను చిన్న పిల్లలా చూసుకోవాల్సి వచ్చింది .

విలియం తో యూరప్ వెళ్ళింది .ఆతను భార్య అన్నేట్టే ను కూతుర్ని చూశాడు .పెళ్లి సంగతి తేల లేదు .భర్తగా ఆమెను సంతృప్తి పరచలేదు .ఫ్రాన్స్ లో ఒక నెల ఉండి కూతురు కరోలిన్ తో షికార్లు చేస్తూ గడిపాడు .ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చి మేరీ హచిన్సన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెపై కవితలు చిలికాడు ‘’she was a phantom of delight –when first she gleamed upon my sight ‘’-a perfect woman nobly planned –to warm ,to comfort and command ‘’అని పొగిడాడు .మేరీదోరోతీలు అన్యోన్యం గా ఉన్నారు .హనీమూన్ కు ఈమె కూడా వెళ్ళింది ..మేరీ నలుగురు పిల్లల్ని కంటే ఇద్దరు ముందే పోయారు .సారా హచిన్సన్ కూడా వీరితో కలిసి పోయింది .

కాల్ రిడ్జి పరిస్తితి ‘’నానాటికి తీసి కట్టు నాగం భొట్లు ‘’గా తయారైంది .తనలో కవి చచ్చిపోయాడని చెప్పాడు ఆరోగ్యం కోసం మాల్టా వెళ్ళాడు .వర్డ్స్ వర్త్ తో కలిసి పని చేయలేననుకొని దానిని ‘’the lachet of whose shoes I am unworthy to unloose ‘’అని కవితాపరం గా చెప్పుకొన్నాడు .ఆధారం లేకుండా ఉండలేక పోతున్నాడు ఇబ్బందులూ పడుతున్నాడు, పెడుతున్నాడు .కవితా శక్తి మందగించింది ఆరోగ్యం తో బాటు .’క్రిస్టబెల్ ‘’మొదలు పెట్టి చాలా కాలం అయినా పూర్తీ చేయ లేదు .టెక్నికల్ క్రిటిసిజం ,వ్యాసాలూ ,జర్నలిజం తో గడపాలను కొన్నాడు .మాట్లాడటం మొదలెట్టితే నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడని హేజ్లిట్ అన్నాడు .ఉపన్యాసలిస్తున్నాడుకాని చప్పట్లు కొట్టించుకో లేక పోతున్నాడు .లండన్ వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు నలభై అయిదు లో కవళికల్లో మార్పు బాగా వచ్చింది .చివరి పద్దెనిమిదేళ్ళు కస్టాలు కొంత తగ్గాయి కొడుకులిద్దరూ కవిత్వం లో దూసుకు పోతున్నారు .ట్రీట్ మెంట్ పొందుతూ కూడా సృజన ఆపలేదు ‘’బయాగ్రఫా లిటరేటా ’’రాశాడు వ్యాసాలను పరిష్కరించి పునర్ ముద్రించాడు .మిల్టన్ షేక్స్ పియర్ లపై ఉపన్యాసాలిచ్చాడు .జనం మెచ్చారు దిఫ్రెండ్ అండ్ సిబిలిన్ ‘’కూ ఆదరణ వచ్చింది .ఫిలాసఫర్లు సైంటిస్టులు కాల్ రిడ్జి తో సమావేశమై చర్చలు జరిపి ఆయన విలువైన అనుభవాలను తెలుసుకొనేవారు .’’reason is much nearer to sense than to understanding –for reason is direct aspect of truth an inward beholding –‘’అని అభిప్రాయ పడ్డాడు .ఆ ఆత్మ శక్తి తోనే చివరి రోజులు గడిపి 25-7-1834నకాల్ రిడ్జి మహా కాలం లో కలిసి పోయాడు .

చనిపోయే ముందు సూతీ ని వచ్చి ఉండమన్నాడు .కాని అతను ఒక ఆదర్శం లో ఉన్నాడు ‘’all man needed to be successful was a comfortable religion and simply of common sense ‘’అని రాసి రాలేదు .అతని ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’బాగా పేరు పొందింది .అతని ఉత్తరాలూ బాగా ప్రఖ్యాతి తెచ్చుకోన్నాయి. చిన్న కవితలు బాగా ఆకర్షించాయి .’’టాలబా ది డి స్ట్రాయర్ ‘’,ది కార్స్ ఆఫ్ కహేమ ‘’అనే ఎపిక్ లు రాసి విమర్శకుల ప్రశంసలు పొందాడు.క్వార్తర్లి రివ్యు లో అతను రాసిన వ్యాసాలూ అందర్నీ అలరించాయి .’’హెన్రి జేమ్స్ పై’’ కవి చనిపోయిన తర్వాత మూడవ జార్జి సూతీ ని ఆస్థాన కవిని చేశాడు .సర్ వాల్టర్ స్కాట్ కు ఇవ్వాలని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించాడు .తగిన వాడు అని అందరూ మెచ్చారు .కాని నైతిక విలువలు లేని వాడికి ఈ పెద్దరికం ఏమిటి అని కొందరు గుసగుసలాడారు .గౌరవం తో బాటు కస్టాలు వచ్చాయి .చాలా కాలందూరం గా ఉన్న భార్యా పిల్లల్లో ఏడుగురు పిల్లలు చనిపోయారు .భార్యకు మతిస్తిమితం లేక శరణాలయం లో చేర్చారు .ఆమె చనిపోయిన వెంటనే కరోలిన్ బౌవేల్స్ అనే ఆవిడను పెళ్లి చేసుకొన్నాడు ..మనస్సాక్షికి ,సర్దుబాటుకు మధ్య నలిగిపోయాడు .21-3-1843నరాజాస్థానకవి సూతీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .యాభై వాల్యూముల వచనం కవిత్వం వెలువరించాడు .ఒకటి రెండు బాలడ్స్ తప్ప ఏవీ మిగల్లేదు .

ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి వర్డ్స్ వర్త్

ఈ త్రయం లో అందరికంటే పెద్ద వాడు వర్డ్స్ వర్త్ .సహచరుల మరణం తర్వాత చాలాకాలం జీవించి ఉన్నాడు .ఆత్మా దర్శనం ,ఆత్మా సంతృప్తి తో జీవించాడు .అతని మాటలు ‘’మోనో లోగ్స్ ‘’లా ఉంటాయి .సంభాషణాచాతుర్యం లేదు .లేక్ డిస్ట్రిక్ట్ లో మరో వైపున్న రైడాల్ మౌంట్ కు చేరాడు స్పానిష్ ప్రజలు క్రూర నియంత ప్రభుత్వాన్ని కూల దోసినప్పుడు మాట్లాడలేదు .ఇటాలియన్లు విముక్తి సాధించినప్పుడూ మౌనమే .స్వేచ్చ కంటే రక్షణ ముఖ్యం అని భావించాడు .ఫ్రీప్రెస్  ను వ్యతిరేకించాడు .వెస్ట్ మోర్ లాండ్ కు స్టాంప్స్ దిస్త్రిబ్యూటర్ గా నియమింప బడ్డాడు .లిబరల్ వ్యతిరేకులను   ఎదిరించాడు .దీనికి కానుక గా వెస్ట్ మోర్ లాండ్ కు ‘’జస్టిస్ ఆఫ్ దిపీస్ ‘’ను చేశారు డెబ్భై రెండులో పూర్తీ గా టోరీ అయి పోయాడు .రాజు ఏడాదికి మూడు వందల పౌన్ల్ పెన్షన్ ఏర్పాటు చేశాడు .సూతీ మరణించిన తర్వాత ఆస్థాన కవి అయ్యాడు .డ్రెస్ ను అరువు తెచ్చుకొని వేసుకొన్నాడు .రాణి విక్టోరియా ముందు ఆ డ్రస్ వేసి ఒంగొని సలాం చేశాడు .దీన్ని ఆయనకు సరిపోయేట్లు కత్తిరించి సరి చేయటానికి టైలర్ మాక్స్ టన్ చాలా కష్టపడ్డాడట .రాబర్ట్ బ్రౌనింగ్ అసూయ పడి కవితలో ఏడ్చాడు .

వర్డ్స్ వర్త్ జీవితం లో చివరి పాతిక ఏళ్ళలో పెద్దగా ఏమీ రాయనే లేదు .కవిత్వాన్ని సరిదిద్దుకొంటూ ,చర్చలు జరుపుతూ గడిపాడు ‘’యాభై లో మొదలు పెట్టిన ‘’దిఎక్స్ కర్షన్ ‘’జీవిత సాఫల్య రచనగా భావించాడు .అందులో ఫిలాసఫీ కానికవిత్వం కనీ లేదాన్నారు దోరోతి ఆరోగ్యం కుదుట బడలేదు .కళ్ళు సరిగ్గా కనిపించక చదవటం మానేశాడు. .ఎనభై వ పుట్టిన రోజు  తర్వాతా కొన్ని రోజులకే 23-4-1850వర్డ్స్ వర్త్ కవి ‘’ఈ వరల్డ్ ‘’ను వదిలేసి ‘’వర్త్ ను మాత్రమె’’ మిగిల్చిఉంచేసి ,పై లోకాలకు చేరాడు .ఆయన సమాధిపై ‘’two voices are there –one is of the sea –one of the mountains –each a mighty voice ‘’అని ఆయనే రాసుకొన్న కప్లేట్ ను రాసిన శిలా ఫలకాన్ని ఉంచారు .

ఇంగ్లాండ్ లో గొప్ప కవుల్లో ఒకడు .గొప్ప ఫిలాసఫర్ ..అందరు ఉదహరించే అనేక కవితా పంక్తుల్ని రాసి జనం నాలుక పై వర్దిల్లాడు అతనిలో రెండు విరుద్ధ ప్రక్రుతులున్నాయి ఒకటి యువ బే ఫర్వాతనం ,తీవ్ర మనస్తత్వం రెండోది పండిన ముసలితనం లో జ్ఞాన సంపాదన తో రాసిన ఆదర్శ కవిత్వం .ఇందులో ప్రతిమాటకూ సార్ధకత ఉంది .తన కవిత్వాన్ని తానె ఎస్టిమేట్ చేస్తూ ‘’to console the afflicted ,to add sunshine to day light  by making the happy happier .But a poem is not primarily a therapy its purpose is not to instruct ,although it may do so ,but to delight .అని చెప్పాడు .ఆత్మ పరిశీలన ఉన్నవాడు .ఒక ట్యూటర్ లాగా చెబుతాడు .అందుకని ఆయన కవిత్వం పాఠంలాగా కాకుండా రిపోర్ట్ కార్డ్ ల్లాగా ఉంటుందని కొందరి అభిప్రాయం .ఉపదేశం ఇవ్వటానికే ప్రాధాన్యం ఇచ్చాడు ఇది అబ్సర్డ్ గా అనిపిస్తుంది .మనుషుల యదార్ధ భాష నేమీ ఆయన ఉపయోగించలేక పోయాడు .గ్రామీణ ప్రజల గురించి రాసినా వారి ఆదరణ పొందలేదు .తనకు తాను తప్ప ఎవరూ తెలియదన్నాడు .

‘’the giant Words Worth –god love him ‘’అని కాల్ రిడ్జి మెచ్చాడు .మిల్టన్ తర్వాత ఇంత గొప్ప కవి ఇంగ్లాండ్ లో పుట్టలేదన్నారు .ప్రక్రుతి తన ఆరాధనకు స్పందించింది అంటాడాయన .ప్రక్రుతిని చూసి మురిసే పసి వాడి కంటే ఆరాధించే కుమారుడిలా కని  పిస్తాడు .ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా, అన్నా ఆయన మాత్రం ‘’mover and shaker ‘’గా ఉండిపోయాడు .’’He altered the course of English literature by the very contradictions of his theory and practice .he made us revise our concept of the poetic idiom and ,in his revitalization of the language ,changed the tone as well as the direction of modern poetry ‘’.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-14-ఉయ్యూరు

‘’ .

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment