బంగారు’ వాగ్దానాల మాటున.. – కంచ ఐలయ్య

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు.

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి 

ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం నాయకుడు చం ద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రను రూపొందిస్తే, తెలంగాణలో టీఆర్ ఎస్ నాయకుడు బంగారు తెలంగాణను నిర్మిస్తానంటున్నాడు. వీటి అర్థమేంటి అనేది ప్రజలకు మాత్రం అర్థమైత లేదు. దేశచరిత్రలో గుప్త యుగాన్ని బ్రాహ్మణీయ చరిత్రకారులు ‘స్వర్ణ యుగం’ అని పిలిచారు. ఆ స్వర్ణయుగంలో నిజానికి జరిగిందేమిటో తెలుసా? వర్ణ వ్యవస్థను పటిష్ఠం చేసి కుల వ్యవస్థను ఇప్పుడున్న రూపంలో తీర్చిదిద్దారు! గుప్తులు వైశ్యులు కనుక వారికి జంజాలు వేసి వ్యాపారం చేసుకునే హక్కుతో పాటు రాజ్యమేలే హక్కు కల్పించబడింది. హిందూ జీవన విధానంలో చనిపోయిన వ్యక్తుల పార్థివ దేహాలు అంటరానివిగా ప్రకటించారు. దీనితో ఇప్పుడు మనం వాడుకలో చూస్తున్న ‘సూదకం’ ఉనికిలోకి వచ్చింది. మృత దేహాలను పరిశోధించి శరీర నిర్మాణాన్ని ఆవిష్కరించే విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ఆగిపోయింది. మూఢనమ్మకాలను విపరీతంగా పెంచారు. మానవ అంటరానితనాన్ని ఆకాశానికి ఎత్తారు. క్షత్రియులను మూడోస్థానంలోకి నెట్టి బ్రాహ్మణులు, వైశ్యులు ఇచ్చిపుచ్చుకునే కులాలుగా మారింది గుప్తుల స్వర్ణయుగంలోనే!

నేను గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అగ్రకుల ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో ఒక అగ్రకుల ప్రాంతీయ పార్టీ తిష్ఠ వేశాయి. తెలంగాణలో తెలుగుదేశం బీసీల పార్టీగా అవతరిస్తుందని టీడీపీ చెబుతోంది. వాస్తవంగా ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణకు మేమే వారసులమంటున్న టీఆర్ఎస్ బంగారు తెలంగాణ స్వరూపాన్ని ముందు చూద్దాం. ఈ రాష్ట్ర ంలో అతి దయనీయ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు గ్రామ, పట్టణ స్థాయి ఆదివాసులు, దళితులు, బీసీలుగా విభజింపబడి వున్నారు. ఇక్కడి ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులు ఇక్కడి ఎస్సీ, బీసీలకు ఇటు, అటుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు శ్రమ జీవులు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. ప్రత్యేక రాష్ట్రమొస్తే తమ పరిస్థితి మెరుగుపడుతుందని, పిల్లల భవిష్యత్తూ విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగుపడుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఈ వర్గాల్లోని చదువుకున్నవారు, మేధావులు, రాజకీయనాయకులు ఇంత కాలంగా రెడ్డి, వెలమల చేతుల్లో ఉన్న అధికారం తమకు బదలాయించబడుతుందని ఒక బలమైన ఆశపెట్టుకొని ఉద్యమాల్లో తిరిగారు. ఈ విధంగా కుల పర అధికార బదలాయింపుతో ఏం ప్రయోజనం, బంగారు తెలంగాణ ఎవరు రూపొందించగలుగుతారనేది ముఖ్యం అనే మేధావులు, వ్యక్తులు లేకపోలేదు.

విచిత్రమేమంటే 66 ఏళ్లు ఈ ప్రాంత అధికారాన్ని రెడ్డి, వెలమల చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ తనను తాను కొంత మార్చుకుంది. ఒక బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్‌ను చేసింది. ఒక ఎస్సీ నాయకుడిని ప్రచార కమిటీ అధ్యక్షుణ్ణి చేసింది. ఈ శక్తులు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. అయితే ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉద్యమంలో దండుకున్న డబ్బుతో ఇక్కడి ఆడోళ్లను మొగాళ్ళను బంగారు గొలుసులేసి తిప్పుతారా? కుటుంబం, కులం మొత్తంగా బొడ్డూడని ప్రత్యేక రాష్ట్రంపై పెత్తనానికి దిగి, ఈ కుటుంబ తాబేదారు జేఏసీని పెట్టుకొని అది ఈ పార్టీని ఉద్యమ పార్టీ అని కితాబు లిస్తుంటే తెలంగాణ, జనం పిచ్చివాళ్ళలా చూస్తారనుకుంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్‌ను వెనుకేసుకు రావడమంటే తెలంగాణలో అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగించాలని జేఏసీలోని మూకలు భావించడమే. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని ఆరెస్సెస్‌కు ఒప్పజెప్పే ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నాడు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేస్తే దేశరక్షణ పదిలంగా ఉంటుందని పిచ్చివాళ్ళను నమ్మించాలి గానీ మనల్ని ఎలా నమ్మిస్తాడు? తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని కాషాయదళమయం చేశాడు. అటు ఛత్తీస్‌గఢ్ నుంచి, ఇటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్దఎత్తున ఆరెస్సెస్, భజరంగ్ దళ్ శక్తులు గ్రామాల్లోకి వ్యాపిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలలో టీఆర్ఎస్, రాజకీయ జేఏసీ పేరుతో భూస్వామ్య శక్తులు గ్రామాలు చేరితే వారికి తోడు ఇప్పుడు సంఘ్ పరివార్ శక్తులు చేరుతున్నాయి.

తెలంగాణలో ఉద్యమం… ఉద్యమం.. అని కాళ్ళకు గజ్జెలు కట్టి ఎగిరిన మావోయిస్టులు, విప్లవకారులు ఎన్నికల రంగం రాగానే కనుమరుగయ్యారు. రాజకీయ రంగస్థలాన్ని కేసీఆర్‌కు, అగ్రకుల ఆధిపత్య శక్తులకు ఒప్పజెప్పారు. తెలంగాణ కావాలని కోరుకుంటే సరిపోదు. ఇక్కడ వెలమ, రెడ్డి భూస్వాములను ఎట్లా అదుపులో పెట్టాల్నో ఆలోచించకుండా చిన్న రాష్ట్రమని చిందులేస్తే ప్రజలు మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడుతారు. తెలంగాణ రాగానే కేసీఆర్ గొడుగుకింద ఎమ్మెల్యేలూ, మంత్రులు అవుదామనుకున్న మాజీ నక్సలైట్లు టికెట్ ఇవ్వకపోతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ టికెట్ దొరికినోళ్ళు దొరకు సలాం కొట్టి పోటీలో ఉన్నారు. ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్న దేశంలో విప్లవశక్తుల్ని ప్రజాస్వామ్య శక్తులుగా మలచలేకపోయినపుడు భూస్వామ్య వర్గం కొత్త రంగులు పులుముకొని మళ్ళీ పెత్తనం చేస్తుంది. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఇక్కడోళ్ళు, చంద్రబాబు స్వర్ణాంధ్ర అంటే అక్కడోళ్ళు జబ్బలు చరుచుకుంటే ఇంతవరకు జరిగిన అభివృద్ధి వెనక్కిపోతుంది. వీళ్ళంతా మంత్రగాళ్ళా అన్నీ ఆకాశంనుంచి కిందికి దించడానికి? కేసీఆర్ అన్నీ అరచేతి నుంచి తీసి ఇస్తామంటే ఇక్కడెట్లా నమ్ముతారు? అక్కడ చంద్రబాబు సింగపూర్, దుబాయిల గురించి మాట్లాడితే అక్కడెట్లా నమ్ముతారు? వీళ్ళ మాయమాటలకొక హద్దు ఉండాలి కదా? ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న శక్తులూ వీరిని అదుపుచేయాలి కదా? జాతీయ కాంగ్రెస్ బీజేపీకి దాసోహం అని తెలంగాణ ఇచ్చిందనే స్థితి రాకుండా చూసుకోవల్సి వుంటుంది. బీజేపీ ఎటువంటి పార్టీయో ఢిల్లీపెద్దలకు తెలువదా? రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తెల్లారి నుంచే అందరూ అబద్ధాలాడడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసుకునే ప్రక్రియలోకి ఆ పార్టీ స్వయంగాపోతే మునిగిన నావ మీద మూడురాళ్ళు ఎక్కువ పడేసినట్టు జేఏసీలల్లోని దందానాయకులు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా పవిత్రులని ఒక కొత్త సిద్ధాంతం అల్లుతున్నారు. ప్రాంతీయ ఉద్యమాల్లో అందరితో పాటు గుండాలు, రౌడీలు, పోలీసు ఏజెంట్లు, డబ్బువసూలుదార్లు, పాఠాలు అసలే చెప్పని పంతుళ్లు, భూదందాల వాళ్ళు అందరుంటారు. ప్రాం తీయ ఉద్యమాలకు సిద్ధాంత భూమిక, నిర్మాణాత్మకత, ఆచరణ చిత్తశుద్ధి అనే నియమాలు ఉండవు. జై తెలంగాణ అనో, జై సమైక్యాంధ్ర అనో రోజూ రోడ్లమీద తిరిగినోళ్ళు పెద్ద ఉద్యమకారుల్లా చెలామణీ అవుతారు. ఈ రకమైన ఉద్యమ గుండాగిరిని ఇక అన్ని రకాల శక్తులు ఆపెయ్యాలి. తెలంగాణ రావడానికి ఎవరు కారకులనే సమస్యను పూర్తిగా పక్కకు పెట్టాలి. ఏ సామాజిక శక్తులు ఇక్కడ అభివృద్ధి చెం దాలి, ఏ సామాజిక శక్తులు అధికారంలోకి రావాలి, సంక్షేమ రాజ్యం ఎలా నడవాలి… ఇవి కీలకమైనవి. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలనే అంశంపై గ్రామాల నుంచి సోనియా గాంధీ వరకు ఒక కామన్ అవగాహన ఏర్పడింది. సామాజిక తెలంగాణ నిర్మాణానికి శత్రువు టీఆర్ఎస్; బీజేపీతో పొత్తుపెట్టుకొని టీడీపీ కూడా ఈ ప్రాంత ముస్లింలకు క్రైస్తవులకు ప్రమాదం తలపెట్టే పార్టీగా మారుతుంది. టీడీపీ ఈ ఉచ్చులో ఇరుక్కుంటుందని ఎవరూ ఊహించలేదు.

ఈ స్థితిలో దళిత బహుజన యువత, ప్రజాస్వామిక శక్తులు ఒక కొత్త కర్తవ్యాన్ని రెండురాష్ట్రాల్లో పోషించాల్సిన అవసరముంది. బోగస్ బంగారం, స్వర్ణాంధ్ర వాగ్దానాలను పక్కనపెట్టి అణచివేయబడ్డ శక్తుల అభివృద్ధి, విద్యారంగంలో కీలకమైన మార్పులు, ప్రజాస్వామిక సంస్థల్ని నడుపగలిగే రాజకీయ శక్తుల్ని బలపర్చాలి. తెలంగాణలో ఎంఐఎం ఒక రాజకీయ మార్పును సమాజం ముందుకు తెచ్చింది. ఆ పార్టీలో దళిత, వెనుకబడిన శక్తులను చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చింది. ఇది మైనార్టీల ఆత్మరక్షణకు, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో మార్పుకు దోహదపడే చర్చ. మరో పక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ చాలా చోట్ల పోటీచేస్తుంది. ఈ శక్తుల్ని బలపర్చాల్సిన అవసరం దళిత, బహుజన యువత మీద ఉంది. ఈ ప్రాంతంలోని విప్లవ శక్తులు తమ ఉనికిని కోల్పోవటమే కాక, కనీస సిద్ధాంత పట్టును కూడా కోల్పోయాయి. మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు స్వయంగా ఒక ప్రకటన ఇవ్వడం మంచిదే. కానీ ప్రకటన సిద్ధాంతాన్ని చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో చేసిన తప్పు, తెలంగాణలో చేసి బీజేపీనో, టీఆర్ఎస్‌నో పెంచితే చరిత్ర వాళ్ళను క్షమించదు. దేశంలోనే కమ్యూనిస్టులు కనుమరుగయ్యే దశ వస్తుంది. ఇది కూడా ప్రమాదమే. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. నరేంద్ర మోదీ ఒక వ్యక్తి కాడు, రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాడు. వారి వెనుక భిన్న రకాల శక్తులు పనిచేస్తున్నాయి. దేశ భవిష్యత్ కోసం, శాంతి భద్రతల కోసం ఈ రెండు రాజకీయశక్తుల్ని సుదీర్ఘ దృష్టితో అంచనా వెయ్యాలి. ఇప్పటికైనా టీడీపీ శక్తులు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సహకరించకుండా ఉంటే దేశానికి మేలు జరుగుతుంది. టీఆర్ఎస్‌ను ఉద్యమ పార్టీగా చూడకుండా ఒక ఫ్యూడల్ కుటుంబ పార్టీగా చూసి యువత నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్‌ను మతోన్మాద శక్తుల నుంచి కాపాడాలి.
– కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Category:
Posted in సేకరణలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -25(ఎన్నికల ఊపులో )

      రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -25(ఎన్నికల ఊపులో )

1-ఎన్నికలలో ముందు బలి అయ్యేది ‘’సత్యం ‘’

 వర్దిల్లేది మాత్రం హింస ,అధర్మం ‘’అసత్యం .’’

2-కే.సి ఆర్ .నోరుజారితే ఒలుస్తాడట’’ తాట’’

  ఆవేశం లో ఉన్నా పవన్ !ఒద్దు మాటల ‘’తీట’’.

3-కే.వి.పి .ఎవరి నెత్తిన రుద్దుతాడో ‘’టైటానియం ?’’

 భయం తో బెంబే లెత్తు తోంది  నెత్తికెత్తుకొన్న విషవలయం .

4-తెలంగాణా బిల్ సమయం లో కెసిఆర్ .సభలో లేడని ఇప్పుడన్న ‘’సోనియమ్మ’’

  అదే మో’’చేతి ‘’కింద  నీరు తాగి ఉంటె అనేదా ఈ కల్ల బొల్లి మాటల ‘’ఇటలమ్మ ‘’?

5- ఎన్నిక ఫలితాలకూ’’ జూన్ రెండుకు’’ మధ్య రంగ ప్రవేశం చేస్తాట్ట ఇంకో ‘’కృష్ణుడు ‘’

   నరసింహ ఎవర్ని నియమిస్తాడో డాల్ కత్తులు మెరయగ ?కిరణ్ కాడట చివరి ‘’కిస్టిడు ‘’

6–గులాబి నేతను -నెత్తి కెత్తు కొన్న ఒ.యు .విద్యార్ధులు

 ‘ గోబాక్’’ స్వరం తో నిలదీసి తెలివితో బుద్ధి  చెప్పారు సద్బుద్ధులు .

7- కొండా సురేఖ ను మండీ బజార్ లో అడ్డుకొన్న స్థానికులు

   ఎన్ని పార్టీలు మారినా మారని బుద్ధికి ఇచ్చారు సవాలు .

8- అల్లుడి కుంభ కోణం తో కమలం  వీడియో విడుదల

  ‘’వాధా ‘’మెడకు బిగుస్తున్న ఉచ్చు –అవగలడా విడుదల ?

9’’మూడోకాలు ‘’కావాలి  ఆధారం అన్న ‘’కారత్ ‘’

   రెంటికీ చెడ్డ రేవడి స్తితి లో  పాపం ‘’కమ్మీ’’ ల నేత .

10-‘’అమ్మ’’ అనుగ్రహిస్తే అవుతుందిట తెలంగాణా సి.ఏం .

     ‘’ విజిగి శాంతి ‘’గొంతెమ్మ కోర్కెలకు అంతులేదా మినిమం ?

11-సోనియా, రాహుల్ పర్యటన మాకొద్దు మహా ప్రభో అంటున్న సీమాంద్ర  కాంగీ’’ అభ్యర్ధులు ‘’

     ఓడిపోతున్నామని తెలిసి మరీ డిపాజిట్లూ కూడా దక్కవేమో నన్నబెంగ తో చేతులెత్తేసిన’’అభాగ్యులు’’.

12-   మన్మోహన్ కేబినేట్ కు సోనియావ్యవహరించింది  ‘’రిమోట్ కంట్రోల్ ‘’

      ‘’సంజయ బారు ‘’రాసి నిజాలు  కేబినేట్ పై  పి.ఏం కు లేదని తెలుస్తుంది ‘’కంట్రోల్ ‘’.

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

‘ఓటు’వులు -శతకం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జాన్ అప్ డైక్ , చైతన్య శిఖరం ఎలీస్ వాకర్

జాన్ అప్ డైక్

అమెరికా సాహిత్యం లో జాన్ అప్ డైక్ కు ఒక ప్రత్యెక స్థానం ఉంది .అతని శైలీ  విన్యాసం అనితర సాధ్యం .దానిద్వారా అతని విజన్ మనకు స్పష్టం చేస్తాడు .1932మార్చ్18న పెన్సిల్వేనియా లో’’జాన్ హోయర్ అప్ డైక్ ‘’ పుట్టాడు .జీవించటం కోసమే రాసిన రచయిత .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో డిగ్రీ పొందాడు .న్యూయార్క్ నగరం గురించి ‘’the trouble with living here that nothng seems important ‘’అని ఆ మహానగరాన్ని ‘’లైట్’’గా  తీసుకొన్నాడు ‘’.1958లో ‘’ది పూర్ హౌస్ ఫెయిర్’’నవల రాశాడు .తర్వాత ‘’రాబిట్ రన్’’రాసి ప్రచురించాడు . 1960లో అప్ డైక్ ను సన్మానించి అవార్డ్ ఇవ్వని సంస్థ అమెరికాలోనే లేదంటే ఆశ్చర్యం లేదు   .అంత పాప్యులారిటీ సాధించాడు .1966లో  లో ప్రముఖ కదా రచయిత ఒ.హెన్రి స్మారక కదా పురస్కారాన్ని అందుకొన్నాడు .’’ది బుల్గారియాన్ పొయేటేస్ కు మొదటి బహుమతి  వచ్చింది .’’టైమ్ మేగజైన్ కు ధారావాహికం గా చాలా రాశాడు

‘’బెచ్ ఎ బుక్ ‘’ అనే పుస్తకాలను సీరియల్ గా రాసి ప్రచురించాడు .అతని రాబిట్ రన్ నవలను సినిమాగా తీశారు .’’స్కార్లెట్ లెటర్ ట్రయాలజి  ‘’రాసి పేరు తెచ్చుకొన్నాడు .1979 లో రాసిన ‘’ది కూప్ ‘’నవల బాగా ప్రాచుర్యం పొందింది .ఆతను రాసిన ‘’ది మ్యూజిక్ స్కూల్ ‘’ను టెలివిజన్ లో ధారావాహికం గా ప్రసారం చేశారు .’’రాబిట్ ఇన్ రిచ్ ‘’నవలకు పులిట్జర్ బహుమతి నందుకొన్నాడు .ఆ తర్వాత న్యూ యార్క్ బుక్ క్రిటిక్ అవార్డ్ పొందాడు .1984అప్ డైక్ రాసిన ‘’ది విచేస్ ఆఫ్ ఈస్ట్ విక్ ‘’నవలను సినిమా గా తీశారు .1988 లో అమెరికన్ ప్రెసిడెంట్ జార్జి బుష్ నుండి ‘’నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ను అందుకొన్నాడు .1990లో చివరి నవలా సీరియల్ రాశాడు .ఒ హెన్రి .స్మారక కదా పురస్కారాన్ని రెండవ సారి ‘’sand stone farm house ‘’ ‘’అనే కధకు అందుకొన్నాడు .మొత్తం మీద 50కి పైగా పుస్తకాలు రాశాడు .అతని కధల్లో బాగా పేరు తెచ్చుకోన్నవి ‘’ace in the whole ‘’,Aand P ‘’,flight కధలు

John Updike with Bushes new.jpg  

 

సామాన్య అమెరికన్ ల కస్టాలు కన్నీళ్ళూ బాధలూ వ్యధలు అప్ డైక్ కధల్లో చోటు చేసుకొన్నాయి .చర్చి ,కుటుంబ సమస్యలు సాంఘిక అవాంచనీయ సంఘటనలపై స్పందించి రాశాడు .క్రిస్టియన్ మతాభిమానం గా రచనలు చేశాడు .సమకాలీన అమెరికన్ రచయితలలో అప్ డైక్ శిఖరాయ మానం గా నిలిచాడు .అద్భుత కధాకధన శైలికి అప్ డైక్ ఉదాహరణ గా నిలిచాడు .వాస్తవ వాది.బయటి ప్రపంచాన్ని వర్ణిస్తూ అంతరంగానికి ప్రాముఖ్యత నిచ్చాడు .తన రచనా విదాన్నాన్ని, శైలిని i  గురించి  చెప్పుకొంటూ ‘’to give  the mundane its beautiful due’’అన్నదే తన  శైలి  అన్నాడు .76వ ఏట 2009జనవరి 27న అప్ డైక్ రచయిత మరణించాడు .

 

 

చైతన్య శిఖరం  ఎలీస్ వాకర్

ఎలీస్ వాకర్ ఆఫ్రో అమెరికన్ రచయిత్రి .1944లో ఫిబ్రవరి 9న జార్జియా లో జన్మించింది .చిన్నప్పుడే ఆమె కు అన్న చేతి పిస్టల్ పేలి ఒక కన్ను దెబ్బ తిన్నది .తర్వాత నయమైంది .నల్ల జాతి వారి ప్రాధమిక హక్కుల పోరాటం లో పాల్గొన్నది .చిన్నప్పుడే కడుపోచ్చి ‘’ఎబార్షన్ ‘’చేయిన్చుకోన్నది .1965లో బి ఏ.డిగ్రీ పొందింది .’’once’’అనే కవితా సంపుటిని ప్రచురించింది .’’లేవెంతాల్ ‘’అనే సివి రైట్స్ నాయకుడిని పెళ్ళాడింది .కాని వెంటనే విదాకులిచ్చేసింది .1970లో మొదటి నవల ‘’revolutionary petunias ‘’కు న్యూ యార్క్ బుక్ ప్రైజ్ వచ్చింది .1960మార్టిన్ లూధర్ కింగ్ ను స్టూడెంట్ గా ఉండగానే కలిసి మాట్లాడింది .

Alice Walker.jpg  

‘’ఇన్ లవ్ అండ్ ట్రబుల్ ‘’అనే కదా సంకలనం వెలువరించింది. తర్వాత ‘’మెరిడియన్ ‘’నవల రాసింది .ఇది పౌహక్కుల కోసం రాయబడిన నవలల లో అద్వితీయ నవల గా గుర్తింపు పొందింది .’’ఐ లవ్ మై సెల్ఫ్ వేన్ ఐ యాం లాఫింగ్ ‘’అనే నవల రాసి పేరు తెచ్చుకోంది. 1983లో రాసిన ‘’కలర్ పర్పుల్ ‘’నవల కు పులిట్జర్ బహుమతి అందుకోంది .ఆఫ్రికా దేవత పై ‘’the temple of my familiar ‘’నవల రాసింది .వాకర్ రచనలన్నీ నల్ల జాతి మహిళల కోసమే రాసింది .అందులోని పాత్రలన్నీ చైతన్యం తో సజీవం గా కని  పిస్తాయి ‘’కలర్ పర్పుల్ ‘’నవల అంతా ఒక నల్ల జాతి ఒక తండ్రి తన కూతుర్ని’’ రేప్’’ చేయటం ,అక్రమ సంతానం ,ఒకడి పెళ్ళాం తో ఇంకోడు పోవటం ఉంది .ఆఫ్రికన్ అమెరికన్ జీవన వ్యవస్థకు  అద్దం పడుతుంది .యదార్ధాన్ని యదార్ధం గా రాసి తన నల్ల సమాజం లోని చెడును మంచినీ సమానంగా చూపించింది .

2008లో బారక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఎన్నికై అధ్యక్ష పదవిని చేబట్టినప్పుడు వాకర్ అతనికి ఒక’’ ఓపెన్ లెటర్’’  రాస్తూ ‘’Brother Obama! seeing you take right position based solely on your  wisdom,stamina and character  is a balm  for the weary warriors of hope  previously only sung about ‘’అని ఇన్ని ఏళ్ళకు నల్ల జాతి కి గుర్తింపు లభించినందుకు అభినందించింది .ఈ లెటర్ ను ‘’the root ‘’ఆన్ లైన్ లో ప్రసారం చేసింది. 2009లో వాకర్ మరో60 మంది మహిళల తో గాజా వెళ్లి యుద్ధ వ్యతిరేక ప్రచారం చేసింది .2011లో ‘’గాజా ఫ్లోటిల్లా ‘’లో వాకర్ పాల్గొన్న విషయాన్ని ‘’దిగార్దినర్ పత్రిక ‘’ప్రముఖం గా ప్రచురించింది .ఇస్రాయిల్ మీద, జూదుల ప్రవర్తన మీద విరుచుకు పడింది .మిచిగాన్ యూని వర్సిటి లో ఆమె ప్రసంగాన్ని అనుమతించలేదు .ఆమె ఇస్రాయిల్ వ్యతిరేకతే దీనికి కారణం అప్పుడామే స్త్రీలు ఇంట్లోనే కాదు బయటా స్వాతంత్ర్యాన్ని సాధించాలని లేక పోతే ఇలాంటి సవాళ్లు తప్పవని తెలియ జేసింది .

వాకర్ పద్నాలుగు ప్రతిభా పురస్కారాలు అందుకొన్నది .పదమూడు కదా సంకలనాలు ,తొమ్మిది కవితా సంపుటులు ,పదకొండు ఇతర సాహిత్య విషయ సంపుటులు ప్రచురించి అగ్రగామి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత గా కీర్తి పొందింది .

28-10-2002సోమవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ -24—ఎన్నికల బరి

రాచకీయ ద్విప్లేట్స్ -24—ఎన్నికల బరి

1-ఇప్పటిదాకా ‘’రెడ్ కార్పెట్ ‘’వెల్కం తో హల్ చల్ చేసిన’’ కే.వి.పి .’’

ఇప్పుడు ‘’టైటానియం ‘’కేసు లో ‘’రెడ్ కార్నర్ ‘’తో అయ్యాడు ‘’ఉత్త వి పి.’’

2-రద్దయిన శాసన సభ

 రాష్ట్ర పతి పాలన పెంచిన శోభ .

3-గవర్నర్ పాలన లోనూ అవినీతి  ,వేధింపు ,డబ్బుపంపిణీ ,కుంభకోణాలు

 ఎవరొచ్చినా చేదించలేని మాయా జాలం –విస్తరించింది బహు కోణాలు .

4-రాహులోచ్చి కెసిఆర్ పై సాగించాడు’’ దూకుడు ‘’

 పార్టీని ‘’చిరు’’లా గంగలో కలిపేస్తే  చేసే వాడా ఏకుడు?

5-అవినీతి ఆక్రమణల నేత  ‘’పొన్నాల ‘’శిఖండి

 అడ్డుపెట్టుకొని ఇదేమి వాచాలం అన్న ‘’గులాబి దండి’’.

6-మోడీ  బాబూ ,పవన్ అయ్యారు బలే జోడీ

 యువత ఆకాంక్షకు ,ఇదొక గొప్ప ‘’మోళీ మోడీ ‘’.

7-అయిదు సంతకాలతో రాత మార్చేస్తాడట ‘’జగన్’’

 ‘’తన రాతే’’ మార్చుకొంటాడు అనుకొంటున్నారు జనం .

8-తెలంగాణా కల సాధ్యం చేసింది’’ చెయ్యి ‘’అన్న ‘ప్రధాని మన్మోహన్ ‘’

 పాపం ఆయన్ను చూసి ఓటేసే  జనం ఉన్నారను కుంటున్నాడా’’ మౌన మోహన్ ?’’

9-కొత్తతరానికి ఇచ్చింది కాంగీ అవకాశం అన్న ‘’చిరు ‘’

 ‘’అన్న’’ తీరు చూసి చిందులేస్తూ పవన్ ‘’చిరు బురు ‘’.

10- మంత్రులూ ,భార్యలూ బస్సుల్లో తరలిస్తున్న ఎన్నికల ధనం

     పట్టుకోగా మిగిలింది తిలాపాపం తలా పిడికెడు అయింది గెలుపు కు ’’ ఇంధనం’’ .

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మహిళా మాణిక్యాలు పుస్తకం pdf మీ కోసం

mahila manikyalu

Mahila copy

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

లంకె బిందెలు, సరదాగా మరి కాసేపు

 

D25504024

 

లంకె బిందెలు, సరదాగా మరి కాసేపు

 

పుస్తకాల సమీక్ష ఈరోజు (26-04-2014) సాక్షి పత్రికలో 
 
గబ్బిట కృష్ణమోహన్ 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

మనం ఈనాడు మన చరిత్ర పునాదుల మీద నిల్చున్నాం. మన చరిత్ర పునాదులను గురించి తెలియజేసేది పురావస్తు శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తుశాఖ ఏర్పాటై సరిగ్గా నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సంస్థ ఏర్పాటుకు కారకుడైన డాక్టర్ గులామ్ యాజ్దాని తెలంగాణ చరిత్రకు పితామహుడు. అప్పటికే భారత పురావస్తు శాఖలో ప్రసిద్ధుడైన సర్ జాన్ మార్షల్, యాజ్దానిని ఆనాటి నిజాం ప్రభుత్వానికి రిఫర్ చేశారు. యాజ్దాని హైదరాబాదుకు వచ్చి నైజాం రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుని అధికారాలు, విధుల గురించి 1914, ఏప్రిల్ 26న వివరణాత్మక నోట్ రాసి ప్రభుత్వానికి సమర్పించారు. దాన్ని ప్రభుత్వం అంగీకరించడంతో నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ ఏర్పడింది.
హైదరాబాద్ పురావస్తు శాఖ సంచాలకులుగా యాజ్దాని దశాబ్దాల పాటు వ్యవహరించారు. గుర్రాల మీద వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ తిండి తిప్పలు తదితర ఎన్నో ప్రయాసలకోర్చి తెలంగాణలో ప్రముఖమైన దేవాలయాలు, కోటగోడలు తదితర చారిత్రక స్థలాలను పరిశీలించి, పరిశోధించారు. ఇతర పండితులతో పరిశోధింప చేయించారు. శాసనాలు ఇతరత్రా చారిత్రక ఆధారాలను సేకరించి, పరిష్కరించి, ప్రచురించి తెలంగాణ చారిత్రక సంస్కృతికి పునాదులుగా నిలిచే కృషి ఫలితాలను మనకు అందుబాటులోకి తెచ్చారు.
యాజ్దాని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో ఎం.ఏ. చేశారు. విద్యార్ధి దశలో క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన క్రీడల్లో ఆయన నిష్ణాతులు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో పర్షియన్ భాషలో పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది.

ఒక్క వ్యక్తితో ప్రారంభమైన నిజాం రాష్ట్ర పురావస్తు శాఖను తన హయాంలో బహుముఖంగా విస్తరింపజేశారు. సహచరులు, సిబ్బందితో కలిసిపోయి వారిని నవ్విస్తూ అలసట తెలియకుండా ఎన్నో పనులను చేయించేవారట. అలా ఈనాడు మనకు రామప్ప శిల్పాలు, తెలంగాణ శాసనాలు, రాచకొండ రాజధానీ నగరం మీద యాజ్దానీ పరిశోధన ఫలితాలే ఆధారం.

ఆయన పని నిబద్ధతకు ఒక నిదర్శనాన్ని నెమరువేసుకుందాం. 1930 ప్రాంతంలో ఒకసారి యాజ్దానీ కలకత్తాలోని ఒక మేధావుల సదస్సులో ఉన్నారు. మరునాటి ఉదయం ఆయన సదస్సులో ప్రసంగించవలసి ఉంది. కానీ ఆనాటి రాత్రి యాజ్దానీ కలలో రామప్ప దేవాయలం కనిపించి తాను త్వరలో కూలిపోనున్నానని, కాబట్టి తనను వెంటనే కాపాడాలని చెప్పిందట. వెంటనే యాజ్దానీ లేచి ఉన్న పళంగా గుర్రమెక్కి రెండు రోజుల్లో రామప్పను చేరుకొని మూడో రోజు రామప్ప ఆలయం ఆగ్నేయ భాగం కూలిపోకుండా సపోర్టింగ్ స్తంభాలు కట్టి దాని సమగ్ర చరిత్ర, శాసనాలను అక్షరబద్ధం చేయించారు. అలాగే 1915లో రాచకొండ మీద ఆయన ఎం.శ్రీనివాస్‌తో చేయించిన చారిత్రక సర్వేనే ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఏకైక ఆధారం. 14-16 శతాబ్దాల మధ్య తెలంగాణ ప్రాంతానికి రాజధానియైన రాచకొండకు మళ్ళీ వందేళ్ళ తరువాత 2014-15 సంవత్సరంలోనే రూ. 2 లక్షలు కేటాయించారు. రాచకొండ ప్రాధాన్యాన్ని వందేళ్ళ కిత్రమే గుర్తించారు గులామ్ యాజ్దానీ.
క్రీ.శ. 1948 వరకు తెలంగాణ, మరట్వాడా, రాయచూర్ ప్రాంతాలు నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉండేవనే విషయం అందరికీ తెలిసినదే. ఈ ప్రాంతాలను ఆనాడు దక్కన్ అనేవారు. కాబట్టి ఈ దక్కన్ ప్రాంతపు సమగ్ర చరిత్రను నిర్మించ తలపెట్టి ప్రొఫెసర్ హరూన్ ఖాన్ షేర్వాణీ, నవాబ్ అలీయవార్ జంగ్‌లతో కలిసి ప్రభుత్వానికి పలుమార్లు విన్నపాలు చేసి, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో (1939-1945) కూడా పది భాగాల దక్కను చరిత్ర రచన, ప్రచురణల కోసం నిధులను విడుదల చేయించారు యాజ్దానీ. డా. పి.యస్. జోషి, డా. యూసుఫ్ హుస్సేన్ ఖాన్, ప్రొఫెసర్ నీలకంఠ శాస్త్రి వంటి ఉద్దండ పండితులతో దక్కన్‌ను పాలించిన రాజవంశాల గురించి రాయించి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీచే ప్రచురింప జేయించారు. ఈ రచనా యజ్ఞం 1952 వరకు సాగింది. ఇప్పుడు ఆ ప్రామాణిక గ్రంథం పేరు ‘ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్’ పేరుతో రెండు భాగాలుగా అందుబాటులో ఉన్నది. తెలుగు, తెలంగాణ వంటి పదాల నేపథ్యంలో తెలంగాణ చారిత్రక మూలాలను వెదకటం కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఈ గ్రంథం వేసిన బాటలోనే తరువాతి కాలంలో ‘మిడివల్ హిస్టరీ ఆఫ్ దక్కన్’, ‘మోడరన్ హిస్టరీ ఆఫ్ దక్కన్’ అనే ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి.

దక్కనులో ప్రధానమైన చారిత్రక స్థలాలను సమగ్రంగా సంరక్షించి వాటిని సందర్శన యోగ్యంగా చేసింది కూడా యాజ్దానీనే. ఈనాడు ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించబడిన అజంతా, ఎల్లోరాల్లోని చిత్రాలు, శిల్పకళలను ఇటలీ శాస్త్రవేత్తల సహాయంతో వెలుగులోకి తెచ్చారు. ఆ క్రమంలో అజంతా చిత్రాలను ఒరిజినల్ కలర్స్‌లో యాజ్దానీ చేయించి హైదరాబాద్ పురావస్తు మ్యూజియంలో పెట్టించారు. అవే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు చూడాలనుకున్నా చూడడానికి మిగిలినవి. ఎందుకంటే ఆ తరువాత అజంతా గుహల్లోని చిత్రాలు రంగు వెలిసిపోయి శిథిలస్థితికి చేరుకున్నాయి. అలాగే ఎల్లోరాలోని శిల్పాలు, చిత్రాలకు కూడా యాజ్దానీగారి రచనలే ప్రథమ ప్రామాణికలు.

యాజ్దానీ చారిత్రక స్థలాలను వెలుగులోకి తీసుకు రావడమే కాకుండా వాటిని ప్రజలు సందర్శించేందుకు వీలుపడే చర్యలు కూడా తీసుకున్నారు. ఉదాహరణకు, జహీరాబాద్‌కు అల్లంత దూరంలో ఈనాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ కోటను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా నిజాం ప్రభుత్వంచే నిధులు కేటాయింపజేయించి హైదరాబాద్ నుంచి అక్కడి వరకు పక్కా రోడ్డు వేయించారు. అలాగే టోలి మసీద్, గోల్కొండ కోటలను సందర్శన యోగ్యం చేయించి, హైదరాబాద్ నుంచి ఆ ప్రదేశాలకూ రోడ్డు వేయించారు.
తన బహుముఖ సేవలకు గుర్తింపుగా యాజ్దానీ పద్మభూషణ్, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ వంటి ఎన్నో అవార్డులను పొందారు.

ఇలా తెలుగు, దక్కను ప్రజల చారిత్రక సంస్కృతులను వెలికి తీసి మనకు గర్వకారణాలను అందుబాటులోకి తెచ్చి పురావస్తు పరిశోధనల వికాసానికి బాటలు వేసిన గులామ్ యాజ్దానీ పేరిట సంవత్సరం పాటు కొత్త తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, పరిశోధకులు అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని తమ వైభవోపేత సమగ్ర చరిత్రను పునర్నిర్మించుకోవలసి ఉంది.
n డా. ద్యావనపల్లి సత్యనారాయణ
చరిత్రకారులు, ఏపీ గిరిజన సంగ్రహాలయ సంరక్షకులు
(నేటికి రాష్ట్ర పురావస్తు శాఖ ఆవిర్భవించి 100 సంవత్సరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలియం బట్లర్ యేట్స్ కవి

విలియం బట్లర్ యేట్స్ కవి

డబ్ల్యు బి.యేట్స్ గా ఈ కవి అందరికి సుపరిచితుడు .ఈయన రాసిన 520’’కవితల సంపూర్ణ కవితా సంకలనం ‘’.చదివాను .అందులో భారతీయ విషయాలైన ‘’అనసూయా దేవి ,‘’‘’విజయ ‘’,మేరు పర్వతం’’కవితలు నన్ను ఆకర్షించాయి  .అలాగే ‘’ది ఇండియన్ అపాన్ గాడ్ ‘’కవితా బాగుంది .చావు ,జీవితం  ,బాధ దుఖలపై కేంద్రీకరించి కవిత్వం అల్లాడు యేట్సు కవి .సాహిత్యం లో1923లో నోబెల్ బహుమతి నందుకొన్నాడు .ఐర్లాండ్ దేశీయుడు ప్రేమ ,ప్రక్రుతి ,కళల మీదా విస్తృతం గానే రాశాడు .మేధస్సును ,కళను ఏకీకృతం చేసి కవితలు రాసిన మహా కవి యేట్స్ .స్వీయ చరిత్ర తో బాటు నాటకాలు ,వ్యాసాలు రాసి సాహిత్యాకాశం లో మెరిశాడు .

1865జూన్ పదమూడున జన్మించి ,ఇరవై ఎనిమిది జనవరి 1939లో డెబ్భై నాలుగవ ఏట మరణించాడు యేట్స్ కవి .ఐరిష్ సెనేటర్ గా రెండు దఫాలు పని చేశాడు .ఐరిష్ సాహిత్య పునరుద్ధారణకు  యేట్స్ ముఖ్య కారకుడు .ఏబ్బీ  దియేటర్ స్తాపించి  నిర్వాహకుడుగా ఉన్నాడు .నోబెల్ పురస్కారాన్ని అందజేస్తూ ఆ సంస్థ ‘’ for yeat’sinspired poetry  which is highly artistic form gives expression to the spirit of a whole nation ‘’అని కీర్తించింది .’’దిటవర్’’,’’ది వైన్దింగ్ స్టార్ ,మొదలైన కవుతా సంపుటులు వెలయించాడు .అమెరికా కవి ఎజ్రా పౌండ్ కు యేట్స్ మంచి మిత్రుడు .రవీంద్రుని గీతాంజలికి యేట్స్ కవి ‘’ఉపోద్ఘాతం ‘’రాశాడు .దీన్ని ఇండియన్ సొసైటీ ముద్రించింది .

డబ్లిన్ లో పుట్టి ఇంగ్లాండ్ లో విద్య నేర్చాడు యేట్స్ .చిన్నప్పటినుండే ఐరిష్ కవిత్వమూ మాయా మంత్రాల (అక్కల్ట్)సాహిత్యం పై ద్రుష్టి పడింది .1889లో మొదటి కవితా సంపుటి విడుదల చేశాడు .స్పెన్సర్ ,షెల్లీ కవులకు ఏంతో రుణ పడిఉన్నాడు యేట్స్ .యదార్ధ వాదకవిత్వానికి ప్రాముఖ్యత నిచ్చాడు .జీవిత చరమాంకం లో వాల్ స్ట్రీట్ పతనం,  ఆర్ధిక మాంద్యం వలన మళ్ళీ అరిస్టాక్రటిక్ వ్యవస్థ పై సానుభూతి చూపాడు .అరవై తొమ్మిదేళ్ళ వయసులో మేజర్ ఆపరేషన్ చేయిన్చుకొన్నాడు ,మళ్ళీ శక్తి సామర్ధ్యాలను పుంజుకొని కవిత్వం లోనూ ,నవ యువ కన్యలపైనా విజ్రుమ్భించాడు .ఎంతోమంది నటీమణులతో సంఘం లో ఉన్నత కుటుంబ స్త్రీలతో ,సాధారణ యువతులతో శృంగార సామ్రాజ్యాన్ని ఏలిన ‘’కవి సార్వభౌముడు’’ యేట్స్ .”’oxford book of modern verse’’కు సంపాదక బాధ్యతలు స్వీకరించాడు .చనిపోయిన తర్వాత రహస్యం గా ఫ్రాన్స్ లో ఖననం చేశారు .’’if I die bury me up there ,and then a year’s time ,when the news papers have forgotten me  dig me up and plant me in Silgo’’అని చని పోవటానికి ముందే రాసుకొన్నాడు .అలానే చేసి ఆయన కోరిక తీర్చారు .ఐరిష్ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు .అతని సమాధిపై ఆయన రాసుకొన్న కవితా పంక్తులు ‘’cast a cold eye –on life ,on death –horse men pass by ‘’రాసిన శిలా ఫలకాన్ని అమర్చారు .

యేట్స్ మహా కవి రాసిన ‘’అనసూయ ,విజయ ‘’ల మధ్య సంభాషణ ను ఇప్పుడు చూద్దాం .అనసూయ స్వర్ణ యుగం లో ఒక దేవాలయం వద్ద దేవునికి ప్రనమిల్లుతోంది అది ఒక అరణ్య ప్రదేశం .ఇదీ దీని నేపధ్యం .

Anasuya –‘’send peace on all the lands and flickering corn .Oh! my tranquility walk by his elbow –when wandering in the forest if he love –no other –may panthers end him –hear and  may the indolent flocks –be plentiful –and if he love another –may panthers end himhear and load our king –with wisdom hour by hour –may we two stand –when we are dead –beyond the setting suns –a little from the other shades apart with mingling hair and play upon one lute ‘’.

ఇంతలో విజయ వచ్చి ఒక పుష్పాన్ని అనసూయ పైకి విసిరి ‘’hail anasuya “అంటాడు. అప్పుడు అనసూయ ‘’no be still –I priestess of this  temple offer up –praayers for the lord ‘’అన్నది.వెంటనే విజయ తాను పూజ అయ్యేవరకు వేచి ఉంటా ‘’అమృతా ‘’అంతాడు    .అనసూయ ‘’ by mighty brahmana’s ever rustling robe –who is amritha?-sorrow of sorrows?another fills your mind ‘’అని అంటుంది .విజయ వెంటనే ‘’మా అమ్మ పేరే అమృత ‘’అంటాడు  .వెంటనే అనసూయ ‘’vijaya –I have brought my evening rice –the sun has laid his chin on the grey wood –weary with all his poppies gather round him ‘’అని బదులిస్తుంది .విజయ తెలివిగా  ‘’the hour when kama –full of sleepy laughter –rises and showers abroad his fragrant arrows –piercing the twilight

with the murmering bards ‘’అని నర్మ గర్భం గా పలు కుతాడు  .

అనసూయ ‘’see-how the sacred of old flamingoes came painting with the shadow all the marble steps –now cut off him –he is off –akiss for you –becaause you saved my rice ‘’అని కృతజ్ఞతలు చెప్పుకోంది.నక్షత్రాల సందేశం ఏమిటో నని ప్రశ్నిస్తే అనసూయకు విజయ అవి కాంతి విహీనం గా ఉన్నాయని తాము అరణ్యం లో ఉండటం వలన చలిగాలి తప్పించుకోన్నామని అంటూ అమృతా అని మళ్ళీ సంబోధిస్తాడు  ..విజయ ఎవరినో  ప్రేమించాడని భ్రమ పడుతుంది  . తాను  ఒక్కరినే ప్రేమించానని వేరొకరికి స్థానం లేదని అన్నాడు విజయ .

చలించి పోయిన అనసూయ మనసులోని మాటను బయటికి చెప్పుకోంది .’’swear by the parents of the gods –dread oath who dwell on sacred Himalaya –on the far golden peak enormous shapes –who still ewere old when the great sea was young –the joyus flocks of deer and antilope –who never hear the unforgiving bound –swear ‘’అనగానే ‘’దేవుడికే తలిదండ్రులా అంటే ఈశ్వరుడా ?’’అని అడుగుతాడు  విజయ .ఇక చాలు నువ్వు వెళ్ళు అని విజయకు చెప్పగానే  విజయ వెళ్ళిపోతాడు  .మనసులోని భావాలను అనసూయ ఆవిష్కరిస్తుంది .’’Oh !Brahma!-guard in sleep –the merry lambs and the complacement kine –the flies below the leaves and the young mice –in the tree roots and all the sacred flocks –of red flamingoes and my love vijaya –and may no restless fay with fideget finger –trouble his sleeping give him dreams of me ‘’అను కొంటుంది .

అలాగే యేట్స్ కవి ఉప్పొంగి పోతూ భారతీయులు దేవునిపై ఉంచిన భక్తిని ‘’the Indian upon God ‘కవితలో నిక్షిప్తం చేశాడు ,’’’’’Who made the world and ruleth it –he hangeth on stalks –for I am in His image made and all this tinkling tide –is but a sliding drop of rain between his petals wide –he is gentle or roeback –for how else I pray could He ?-conceive a thing so sad and soft –a gentle thing like me?’’అని భారతీయ భావనకు నీరాజనాలు పట్టాడు .మేరు పర్వతం పై రాసిన కవితా ఎన్న దగినదే –

‘’civilization is hooped together brought –under a rudy under the semblance of peace –by manfold illusion –but man’s life is tought –and he despite his terror cannot ease –hermit up on mount Meru r Everest –cavered in night under the drifted snow –or where that snow and winter dreadful blast –beat down upon their naked bodies know –that day brings round the night –that before dawn his glory and his monuments are gone ‘’అని ఆ సౌందర్యాని ఆరాదించాడు  .చివరగా  యేట్స్ కవి రాసిన’’the coming of wisdom with time ‘’ కవితను ఆస్వాదించి యేట్స్ మహాకవికి సెలవు ఇప్పిద్దాం –

‘’though leaves are many the root is one –though all the lying days of my youth –is swayed my leaves and flowers in the sun –Now I may wither into the truth ‘’అని వినమ్రంగా జీవితానుభవం తో అంటాడు కవి యేట్స్

 

 

 

  

వాల్టర్ డే ఆమార్ తో యేట్స్

.

.24-10-2002గురువారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-14-ఉయ్యూరు

 

Posted in నా డైరీ | Tagged | Leave a comment

హెర్మన్ మెల్ విల్లీ –

హెర్మన్ మెల్ విల్లీ –

‘’ రేబెకా స్టేఫాఫ్ ‘’రాసిన ‘’హెర్మన్ మెల్ విల్లీ ‘’పుస్తకం చదివాను .ఆద్యంతం మహాద్భుతం గా రాసిన్దామే .మెల్ విల్లీ జీవితం లోని ఏ విషయాన్ని వదలలేదు .మేల్విల్లీ చేసిన అనేక సముద్ర ప్రయాణాలను మనమే చేస్తున్నామా అన్నంత అనుభూతి కలిగించింది రచయిత్రి..మేల్విల్లీ ‘’south seas’s exploration ,typce ,white jacket నవలలు రాసినా ‘’మోబీ డిక్ ‘’నవలతోనే ప్రసిద్ధుడయ్యాడు ,చరిత్ర సృష్టించాడు .చని పోయిన తర్వాత కొద్ది కాలం అతని ని మరచి పోయినా ,1920లో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు .జనం మళ్ళీ చదివి  కొత్త వ్యాఖ్యానాలు చేసి చిరాస్మరణీయుడిని చేశారు .దుర్భర జీవితం గడిపి ,జీవితాన్ని నౌకా జీవితాన్ని ఔపోసన పట్టి ‘’అద్భుత యాత్రా సాహిత్యం ‘’సృష్టించాడు .’’నర మాంస  భక్షకుల హంతకుల (కానిబాల్స్)‘’బారిన పడి కొద్దిలో తప్పించుకొని బయట పడ్డాడు .జీవిత చరమాంకం లో సంతృప్తికర జీవితాన్ని గడిపాడు .

మెల్ విల్లీ 1918ఆగస్ట్ ఒకటిన న్యూ యార్క్ లో పుట్టాడు .1991సెప్టెంబర్ 28న అక్కడే మరణించాడు .డెబ్భై మూడేళ్ళు జీవించాడు .ప్రఖ్యాత అమెరికన్ రచయిత నేతానియాల్ హతారన్ ను గురువుగా మేల్విల్లీ భావించాడు .గాలాపగాస్ ఐలాండ్స్ ను ‘’ఎంచాన్తేడ్ ఐలాండ్స్ ‘’అంటారు. ఇవి ఒక్కోసారి కనిపించకుండా అదృశ్యామౌతాయట .అదీ వీటి ప్రత్యేకత .డార్విన్ కు ఈ దీవులు పరిశోధనా కేంద్రాలైనాయి .సముద్ర తిమింగిలాలను ‘’వేల్స్ ‘’అంటారు వీటిని వేటాడే విధానాన్ని మెల్ విల్లీ గొప్పగా వర్ణించాడు .వేల్స్ ను వేటాడటం లో ‘’దిలైన్ ‘’అంటే హార్పూన్ అనే దానికి కట్టబడిన బలమైన త్రాడు .హార్ప్పోన్ తో పొడిచి వేల్ నుపడవ దగ్గరకు  లాగుతారు .మెల్ విల్లీ దీనికి మరో భాష్యం చెప్పాడు .’’మనుషులను బంధింఛి లోపలి .నెట్టి జీవితం ద్వారా బయటికి లాగటం ‘’అదే అంతరార్ధం.అతని మాటల్లోనే ఆ వేదాంత ధోరణి తెలుసుకొందాం ‘’All men live enveloped in  whale lines .All are born with halters round their necks  but it is only when caught in the swift ,sudden turn of death  ,that mortals realize the silent subtle ever present  perils of life .And if you be a philosopher though seated in a whale boat ,you would not at heart feel one wit more  of terror than though seated before your enemy fire with poker and not a harpoon by your side ‘’ఇలా సింబాలిక్ గా మోబీ డిక్ నవల అంతా రాస్తాడు మెల్ విల్లీ .ప్రకృతిలోనే నరమాస భక్షణ  ఉందన్నాడు .దానిపై స్పందిస్తూ ‘’pray up on each other .carrying on eternal war since the world began .’’అన్నాడు .ఇందులో ‘’పిప్ ‘’అనే వాడి పాత్రను గురించి చెబుతూ ‘’pip symbolizes the power of the sea both to terrify and destroy men also to return them to a  state of child like innocence ‘’అని భాష్యం చెప్పాడు .

 

 

 

Herman Melville.jpg

 

melvillee                                        route of melvillie sea voyage

 

మోబీ డిక్ పై రచయిత్రి రేబెకా ‘’మోబీ డిక్ కు ప్రతీక మోబీ డిక్ మాత్రమే .అది అన్నిటికీ ప్రతీక గానే నిలుస్తుంది .మనిషి కంట్రోల్ లో లేనిదీ ,అతనికి అందు బాటులో లేనిదీ ప్రతిదీ మోబీ డిక్ ‘’అని అర్ధం చెప్పింది .ఇందులో తెల్ల తిమింగిలం అంటే మంచికి ,స్వచ్చతకి చిహ్నం .వేల్ అంటే తప్పించుకోలేని చావుకు ప్రతీక .అదొక  మనుష్యులను వినాశనం చేసే భౌతిక ప్రపంచం .అయితే ఆ పని తెలివి తక్కువగానో లేక బుద్ధి లేకుండానో చేసే పని మాత్రం కాదు .అందులో దురుద్దేశ్యం ఏమీ లేదు ‘’అని వ్యాఖ్యాతలు తెలిపారు . మేల్విల్లీ వేల్ ను  ప్రక్రుతి కి సింబల్ గా ,పారిశ్రామిక టెక్నాలజీకి వికృత చేస్ట గా భావించాడని చాలామంది వ్యాఖ్యానించారు .ఇందులో వర్ణించ బడిన ‘’స్పెర్ం వేల్’’కు రెండు కళ్ళు మనిషికి ఉన్నట్లుగా కాకుండా రెండు వైపులా ఉంటాయి .అదీ ప్రత్యేకత .అందుకే అది వాటితో రెండు విడి విడి ప్రతిబింబాలను ఒకే సారి చూడ గలుగుతుంది .ఇందులోనూ మెల్ విల్లీ భావం ,అంతరార్ధం  ఉంది .ప్రతి వాడూ ప్రతి దాన్ని ‘’మల్టిపుల్ ఇమేజేస్ ‘’గా చూడాలి .వేల్ ప్రపంచాన్ని  ద్వంద్వ భావం తో చూస్తున్దన్నమాట .కాని మనిషి ఒకే సారి ఒకే దాన్ని చూస్తాడు .అదీ ఇద్దరికీ ఉన్న భేదం .’’whale knows reality not a single picture ,but is made of many layers of meaning ‘’అని భావించాలి .తిమిగిలం తెలుపుదనం లో ప్రపంచపు యదార్ధ అర్ధం దాగి ఉందంటాడు .అది మనిషి మేధా పరిధికి అందదని, జీవిత రహస్యాన్ని,జీవిత పరమార్ధాన్ని  అనుభవం ద్వారా చేదించి తెలుసుకోవాలని అంటాడు .ఒక రకం గా అదేమీ రహస్యం కానే కాదన్నాడు .

నావికా యానం లోని విశేషాలనూ మెల్ విల్లీ ప్రతీకాత్మకం గా వర్ణిస్తాడు .’’యుద్ధ యోధుడిగా మనిషి సముద్రయానం చేస్తున్నట్లే ,ఈ భూమి కూడా గాలిలో ప్రయాణం చేస్తోంది .మరణం తప్పని మానవులం మనం వేగం గా ,ఎన్నటికీ మునిగి పోనీ నౌకాయానం చేస్తున్నాము .దేవుడే నావికాదిపతి. పైన మిల్కీ వే మాత్రమె దారి చూపేది .భగవానుడే సుప్రీం కెప్టెన్ .మనం ప్రయాణించే నౌకా తీరం  మారి పోతూ ఉంటుంది .తీరానికి సుదూరం గా జీవితకాలాల బాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాం .మన చిట్ట చివరి గమ్యం మాత్రం రహస్యమే. మనకు తెలీనే తెలియదు .నౌక నడిపే నావికులకూ అధికారులకూ అంతు  బట్టదు ..మనం ఎక్కడికి చేరాలో ముందే రాసి ఉంచాడు దేవుడు .లేక పొతే సృష్టి నుంచి మనం జారి పడి పోయి ఉండేవాళ్ళం కదా ‘’అన్నాడు మహాద్భుత వేదాంత భావన తో .

అందుకే ‘’there is no secret .-that may be the secret of Moby Dick ‘’అంటారు .

ఈ భావనలన్నిటిని దృష్టిలో ఉంచుకొని మెల్ విల్లీ ని ‘’existentialist’’అంటే అస్తిత్వ వాదిఅన్నారు .ప్రపంచం ఈదలేని మహా సముద్రమని ,మనిషి తన పనులకు తానే బాధ్యత వహించాలని ‘’భావం .మోబీ డిక్ నవలలో ‘’ఆహాబ్ ‘’అనే పాత్ర భగవంతుని నమ్మడు .అంతేకాక తనకంటే తెలివి గల జీవి ప్రపంచం లోనే లేదనే గర్వం కూడా ఉన్న వాడు .అందుకే ఈ నవలలో వాడు చనిపోతాడు .అంటే రచయిత వాడిని  చని  పోయేట్లు చేశాడు .మరో పాత్ర ‘’ఎశామల్  ‘’సముద్రం గొప్ప తనానికి లొంగి దాని కారుణ్యానికి క్రుతాజ్ఞాతా భావం తో ఉంటాడు. అందుకే ఆ పాత్ర చివరిదాకా ఉంటుంది .ఈ కధనంతటిని మెల్ విల్లీ వాడితోనే చెప్పిస్తాడు

మోబీ డిక్ నవలలో మరో విశేషాన్ని విమర్శకులు గుర్తించారు .అదే ‘’ the contrast between isolation and community .next to his mono mania ,Ahab’s chief characteristic is his isolation from the other people .’’కనుక మనిషి సంఘ జీవిగా మనుగడ సాగించాలి. నన్ను ముట్టుకోకు నా –కాకీ ‘’అన్నట్లు గా వ్యవహరించ రాదు అని మోబే డిక్ సారాంశం .’’రేచెల్ ‘’ను అన్వేషించ టానికి ఆహాబ్ సహక రించాడు. అందుకే వేల్ వాడిని  వేటాడి చంపేసింది .మానవుల మధ్య దయ  రక్షణా అనే బంధాలు చాలా బలహీనం గా ఉన్నాయని చెబుతూనే అవే మనకు ఆధారాలన్నాడు మెల్ విల్లీ .అవే మనకు పరిష్కారా మార్గాలని తెలిపాడు .మోబీ డిక్ నవల ఒక సాహస కృత్యం మాత్రమె కాదు .అది జీవితం మొత్తం వేదాంత భాషలో స్పష్టం చేసిన దిక్సూచి .ప్రపంచం మొత్తం మేల్విల్లీ రాసిన మోబీ డిక్ నవలను శిరస్సున ధరించి పూజించింది .అతని ప్రతిభా సర్వస్వమ ని కీర్తించింది .’’the individual is a part of the whole ‘’అనేది మోబీ డిక్ నవల లోని సారాంశం .ప్రపంచాన్నితన ద్రుష్టి తో చూసి గొప్ప భాష్యం గా మోబీ డిక్ నవలను తీర్చి దిద్దాడు మెల్ విల్లీ మహాశయుడు .

‘’along with mark Twain’s “Huckle Berri Finn ‘’and Walt Whitman’s “”leaves Of grass ‘’Moby Dick is considered a caandidate for the greatest Amercan book ‘’అని చిరస్థాయి ని కలిగించారు విశ్లేషకులు .మేల్విల్లీ ఈ నవలలో తన నాణ్యమైన విశాలమైన మిరుమిట్లు గొలిపే భావ ప్రకటన చేశాడని కొనియాడారు .’’each individual mind or soul is an un fathomable mystery ‘’అని ఇందులోని పిండితార్ధాన్ని పండితులు లాగారు .

మేల్విల్లీ ‘’I love all men who dive ‘’అన్నాడు .థాట్ డైవేర్షన్ ‘’అంటే మెల్లీ కి అమిత ఇస్టం .షేక్స్పియర్ మీద వీరాభిమానం .అందుకే మోబీ డిక్ నవలే అయినా కవితాత్మకం గా మనోహరం గా మార్మికం గా మహిమాన్వితం గా ఉంటుంది .ఇందులోని’’ రూపకాలన్నీ’’(మెటాఫర్లు ) అతని జీవితానికి చెందినవే .ఎన్నో విషయాలు తెలుస్తాయి .అతని మిస్సోరీ ,మిసిసిపి ,యీరీ నదుల మధ్య చేసిన పర్యటనలను చదివితే మనమూ అతని వెంట ఉండి అనుభవం పొందినట్లుగా ఉంటుంది .మరుగై పోయిన ఒక మహా రచయిత మెల్ విల్లీ ని మళ్ళీ అమెరికన్ లు చదువుతూ సార్ధకత పొందుతున్నారంటే వారికి జేజేలు

 

.

24-10-2002నాటి ణా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-14-ఉయ్యూరు

 

Posted in నా డైరీ | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -18(చివరి భాగం ) తిరుగు ప్రయాణం

మా నవ రాత్రి యాత్ర -18(చివరి భాగం )

తిరుగు ప్రయాణం

16 ఏప్రిల్ బుధవారం తెల్లావారు జామున మేము ఉంటున్న రైల్వే రిటైరీ రూములకు ఆనుకొనే ఉన్న ఒకటవ నంబర్ ప్లాట్ ఫాం మీదకు సామాను చేర్చాము .జైపూర్ –కోయంబత్తూర్ సూపెర్ ఎక్స్ప్రెస్స్ సరిగ్గా నాలుగు పదికి స్టేషన్ చేరింది .మా ఎసి కంపార్ట్మెంట్ లోకి చేరాం మాకు ఈ బోగీలో రిజర్వేస్స్హన్ భోపాల్ నుంచే దొరికింది .ఉజ్జైన్ నుంచి ఎస్ 5లో భోపాల్ వరకు శర్మ ముందే రిజర్వ్ చేశాడు .సామాన్లతో మళ్ళీ మళ్ళీ మారలేమని ఎసి కంపార్ట్ మెంట్ లోనే చేరిపోయాం నిజానికి మా బెర్త్ లు ఖాళీగానే ఉన్నాయి కండక్టర్ ను మేనేజ్ చేసి  ఎవరో ఆక్క్యుపై చేశారు. మా సీట్లకేమీ ఇబ్బంది లేదు కూర్చున్నాం .ఉజ్జైన్ నుంచే భోపాల్ లో ఉన్న విజ్జి స్నేహితురాలు ప్రీతికి ఫోన్ చేసి ఈ ట్రెయిన్ లో వస్తున్నామని ,అవకాశం ఉంటె స్టేషన్ లో కలవమని మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది .ఉదయం ఏడు గంటలకు భోపాల్ చేరాం .ప్రీతి భర్త శాస్త్రిగారు వాళ్ళమ్మాయి మా బోగీలోకి వచ్చి పలకరించారు .మేము వాళ్లకు ప్రసాదం దేవుడి ఫోటో ఒక బాగ్ లో ఉంచి అందజేశాం .పది నిమిషాలే భోపాల్ లో ట్రెయిన్ ఆగింది .మాకు కేటాయించిన బెర్త్లకు చేరి కూర్చున్నాము .

ప్రీతికరమైన ప్రీతి ఇడ్లీలు ,పెరుగన్నం

ప్రీతీ ఫామిలి మమ్మల్ని చూసి ఏంతో సంతోషించారు .ప్రీతీ కుటుంబం చేత  అమెరికాలో డెట్రాయిట్  దగ్గర ట్రాయ్ లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం  పూజ చేయించిన సంగతి గుర్తుకొచ్చింది .వాళ్ళు వీడ్కోలు చెప్పి దిగి వెళ్లి పోయారు .ఒక తెలుగాయన భోపాల్ లో ఎక్కారు. నా వయస్సు వారే .భమిడి పాటి సుబ్రహ్మణ్యం గారు .కృష్ణా జిల్లా కౌతవరం లో జన్మించారట .అక్కడే విద్యాభ్యాసం .తండ్రి భమిడి పాటి మృత్యుంజయుడు గారు జిల్లా పరిషద్ హైస్కూల్ లో హెడ్ మాస్టారుగా చేశారట .భోపాల్ లో బి హెచ్ ఇ లో లో ఉద్యోగం చేస్తూ నలభై ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారట .అక్కడ ఆ సంస్థ కట్టించిన బాలాజీ  దేవాలయ నిర్మాణ సంఘంలో అధ్యక్షులుగా ఇప్పటికీ సేవ చేస్తున్నారు .సరదాగా గడిచి పోయింది ఆయన తో సంభాషణం .ఆయన తిరుపతి వెళ్తున్నారు

ప్రీతీ  కారీ  బాగ్ లో ఎమిచ్చిందో చూశారు మా వాళ్ళు .ఫ్లాస్క్ నిండా కాఫీ పోసిచ్చింది ప్రీతీ. తాలో అరా ముందు తాగేశాం .తరువాత ఇడ్ళీలపై పడ్డాం. మనిషికి నాలుగు ఇడ్లీలు వంతున పాక్ చేసి మహా రుచికరమైన చట్నీ పెట్టింది .ఇడ్లీలు పచ్చడీ అదరహో అని పించాయి .గుటకలేస్తూ హాయిగా తిన్నాం .ఎన్ని రోజులయిందో కడుపులో తృప్తిగా ఏదైనా పడి .తృప్తిగా తినేశాం మళ్ళీ కాఫీ తాగాం .మందులేసుకోన్నాం .బెర్తుల మీదకు  చేరాం .కాసేపు నిద్రపోయామేమో .కింద భమిడి పాటి వారు మా అమ్మాయితో పిచ్చా పాటీ మాట్లాడుతున్నారు .మాఎదురు కింది బెర్త్ మీద ఇద్దరు గున్న యేనుగుల్లాంటి అమ్మాయి అబ్బాయి ఎక్కిన దగ్గర్నుంచి నాన్ స్టాప్ కబుర్లే కబుర్లు .మొగుడూ పెళ్ళాలు అని పించలేదు . సహా ఉద్యోగులేమో?

పగలల్లా ప్రయాణం .నాగ పూర్ వచ్చేసరికి హైదరాబాద్ రేడియో  స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి   ఆదిత్య ప్రసాద్ గారు ఫోన్ చేశారు .’’మాస్టారూ!మహిళా మాణిక్యాలు పుస్తకం అందింది. మహా గొప్పగా ఉంది .ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి సంపాదించారో ఆశ్చర్యం గా ఉంది .చాలా గొప్ప ప్రయత్నం .వైవిధ్యం అద్భుతం .’’అని మెచ్చుకొన్నారు .నేనునాగ్ పూర్ లో ఉన్నానని ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పి ,కృతజ్ఞతలు తెలియ జేశాను .ప్రసాద్ గారేప్పుడూ నన్ను ‘’మాస్టారూ ‘’అని సంబోధిస్తారు .అదీ ఆయన సంస్కారం .

పదహారవ తేదీ రాత్రి రెండుగంటలకు మా రైలు విజయవాడ స్టేషన్ చేరింది .ముందే మా ఆస్థాన డ్రైవర్ రాముకు ఫోన్ చేయటం వలన కారు తెచ్చి రెడీ గా ఉంచాడు. సామాను మేమే తీసుకొని స్టేషన్ బయటికి తెచ్చాం .కారు లో సామాను ఎక్కించి బయల్దేరాం .పదిహేడు గురువారం ఉదయం మూడుమ్బావు కే ఉయ్యూరులో మా ఇంటికి చేరుకొన్నాం .

ఉదయం శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారికి నేను కాశీలో ఇచ్చిన మాట ప్రకారం ఫోన్ చేసి మాట్లాడాను .2012జనవరి లో బెజవాడ పుస్తక మహోత్సవం లో శ్రీ తిరుమల రామ చంద్ర ,శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యు వారి శతజయంతి వేడుకలలో పద్మిని గారు మాట్లాడిన విశేషాలు ఆసభా  విశేషాలు నేను మర్నాడే సరసభారతిలో వ్యాసం గా రాశాను .ఆ విషయం ఆమె సోదరి చూశారట .ఆ విషయం తనతో చెప్పారట .బేజ వాడ పుస్తక మహోత్సవం వారు ఫోటోలు ఆ వివరాలు పంపిస్తామని చెప్పి ఇంతవరకూ పంపలేదని నాదగ్గర ఆ వ్యాసం ఉంటె పంపమని కోరారు మెయిల్ అడ్రస్ తీసుకొని పంపించాను .ఆమెను సాహితీ బందులో చేర్చాము .అప్పటి నుండిన రేగ్యులర్ గా సరసభారతి ఆర్టికల్స్ పంపుతూనే ఉన్నాం .సరసభారతి ప్రచురించిన పుస్తకాలు ఆరోజే ఆవిడకు కొరియర్ లో పంపాను .మర్నాడే ఆమెకు అందగా ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పి నాక్రుషి కి ఎంతగానో మెచ్చుకొని నన్ను మరో ‘’జానుమద్ది హనుమచ్చాస్త్రి’’ ‘’అని మెచ్చారు .’’అంత సీను నా దగ్గర లేదని ‘’చెప్పానామెకు వినమ్రంగా ..ఆమెతో మాట్లాడటం నాకూ ఆనందం కలిగింది .మన సరస భారతి బ్లాగ్ కు ఆమె వీర అభిమాని .

ఓంకారేశ్వర్ విశేషాలు

మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగా క్షేత్రం ఉంది .ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్లు .ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’.నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది .అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం .అదీ ఈక్షేత్ర ప్రశస్తి .ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుదు ,పైన ఓంకారేశ్వరుడు ఉంటారు.ఇక్కడ ఓంకారేశ్వర్ లో కింద ఓంకారేశ్వరుడు ,పైన మహా కాలేశ్వరుదు ఉండటం విచిత్రం .గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది .కింద ఓంకారేశ్వరుడు ,మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుదు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి .శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులోఉన్నాయి  .నర్మదానది నర్మదా ,కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది .ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి  మాం దాత్రు పురి అని పిలుస్తారు .ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట .ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు .

పురాణ గాధ

సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు .మాంధాత ఇక్కడేపర్వతం పై  తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు .ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారం లో ఉండిఓంకారేశ్వర్ , దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది  దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి .వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది .ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య  పర్వతం  వద్దకు వచ్చాడు  విన్ధ్యుడి పూజ గ్రహించాడు .తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు .’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే .మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు .సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రం లో ఘోర తపస్సు చేశాడు .ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి .తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతం గా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు .సంతోషించిన శివుడు ప్రణవాకారాం లో జ్యోతిర్లింగం గా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు .ఓంకారేశ్వరుదని ,పార్దివాకారం లో అమలేశ్వరుడని రెండు పేర్ల తో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు .

ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు  ఉపనిషత్తులకు భాష్యం రాశారు .ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధ రించారు .ఇక్కడి గౌరీ సోమనాధ మందిరం లో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం .రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట.అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు .

మామ లేశ్వర జ్యోత్రిర్లింగం

నర్మదా నదీ తీరం లో శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంది .ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం  అభిషేకం మనమే చేసుకో వచ్చు వెనక పార్వతి అమ్మవారు శివ లింగం వెనుక ఉంటారు  .ఒకప్పుదు నారదుడి ప్రేరేపణ తో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహిమ్పబడి దేవతల కోరికపై ఇక్కడే మా మలేశ్వరుడిగా ఉంది పోయాడు వరగర్వం తో వింధ్య పర్వతం  మేరువు ను దాటి గర్వం గా పెరిగి పోయింది.సోర్యుదు ఉత్తరాదిశాలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అంధకారం ఽప్పుదు దేవతలు విష్ణువు ను ప్రార్ధించారు వింధ్య గర్వం హరిన్చాటా నికి అతని గురువు అగస్త్య మహర్షికి  మాత్రమెసాధ్యమని చెప్పి కాశీ పంపాడు మహర్షిని   ప్రార్ధించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు  సరేనన్న మహర్షి కాశీ విశ్వనాదుడిని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు .శిశ్యుదు వంగిగురువుకు  నమస్కరించాడు  తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగెఉంది పొమ్మని  శిష్యుడిని శాసించాడు  అప్పటి  నుండి అలానే వింధ్య పర్వతం ఉందిఽన్తె ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట

               

 

ఓంకారేశ్వరుడు

 

  

ఆలయ శిల్పాలు

 

maa

                     Image    

మ మలేశ్వర జ్యోతిర్లింగం

మా నవ రాత్రి యాత్ర సర్వం సంపూర్ణం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర-17 ఓంకారేశ్వర యాత్ర

మా నవ రాత్రి యాత్ర-17

ఓంకారేశ్వర యాత్ర

ఏప్రిల్ 15మంగళ వారం తెల్లవారు జామున శ్రీ మహాకాకేశ్వర భస్మహారతి కార్యక్రమం లో పాల్గొని ఎనిమిది గంటలకు ఇండికా కారు లో మేము నలుగురం ఎక్కి ఓంకారేశ్వర దర్శనానికి బయల్దేరాం .ఇండోర్ మీదుగా వింధ్య పర్వతాల గుండా ప్రయాణం .శ్రీశైలం వెళ్ళే మార్గం లా అని పిస్తుంది .ఉజ్జైన్ కు సుమారు యాభై కిలో మీటర్ల దూరం లో ఇండోర్ ఉంది.ఇది ఒకప్పటి సంస్థానం .రైల్వే కూడలి .మాల్వా పీఠ భూమి భాగం .దాదాపు ఒక గంట ప్రయాణం తర్వాతా రోడ్డు పక్క దాభా దగ్గర ఆగాం .నాకేమీ తినాలని పించేలేదు .నేను మా ఆవిడ సగం కాఫీ తాగాం .రమణ చపాతీ తిన్నాడు .మా ఇద్దరికీ దారిలో మజ్జిగా బిస్కెట్లు స్ప్రైట్ మాత్రమె ఆహారం .ఉదయం పదిన్నరకు అంటే రెండున్నర గంటల ప్రయాణం తర్వాత నర్మదా నదీ తీరం నర్మదా ఆనకట్ట దగ్గరకు చేరాం .ఓంకార్ కు పన్నెండు కిలో మీటర్ల దూరం లో ‘’ఓంకారేశ్వర్ రోడ్ ‘’రైల్వే స్టేషన్ ఉంది .అక్కడినుంచి ఇక్కడికి యాత్రికులు ఆటోలో చేరుకొంటారు .మధ్యాహ్నం పన్నెండున్నరకు దేవాలయాలు మూసేస్తారని మా కారు డ్రైవర్ సోనీ చెప్పాడు .అక్కడ పడవ వాళ్ళు వచ్చి మూగుతారు .ఒక పడవను రానూ పోనూ మనిషికి వంద రూపాయలకు మాట్లాడుకొన్నాం .

నది గట్టు ఎత్తుగా ఉంటుంది. స్తీప్ గా జారుతూ దిగి నర్మదా నది ఒడ్డుకు చేరాం .ప్రవాహం బాగా ఉంది .డాం కు దగ్గరలో నర్మదా ,కవేరియా రేవా నదులు సంగమిస్తాయి .అందుకే దీన్ని త్రివేణీ అంటారు   .బోటు వాడు ముందుగా అవతలి తీరం దగ్గరకు స్నానాల రేవు దగ్గరకు చేర్చి స్నానం చేసి ఓంకారేశ్వర దర్శనం చేసి మున్దూన్న రేవు దగ్గర నున్చోమన్నాడు .మధ్యలో మాలో మేము ‘’డిషుం డిషుం’’ మాటామాటా అనుకోవటం మూతులు బిగేసుకోవటం ఒక పావుగంట డ్రామా సాగింది .మా అమ్మాయికి నేను కేక లేసానని కోపమూ వచ్చింది .స్నానానికి నేను కాళ్ళ డ్రాయరు ,తువ్వాల తీసుకొని దిగాను. మా ఆవిడా నాతో దిగింది .చల్లగా నర్మదా జలం సేద దీరేల ఉన్నది .ఇదే మొదటి సారి నర్మదా నదిని దర్శించటం స్నానించటం . పది నిమిషాలు హాయిగా స్నానం చేశాం .స్నానమంత్రం నేనే చెప్పాను .ఫోటోలు ఒక్కొక్కటి పది రూపాయలిచ్చి ఇన్స్టంట్ ఫోట్లు స్నాన ఘట్టం లో తీయిన్చుకోన్నాం .మా అబ్బాయి రమణ తో కూడా మంత్రం చెప్పి స్నానం చేయించాను .మా అమ్మాయి ‘’షటించి’’ స్నానానికి దిగ లేదు .మేము నర్మదా నీళ్ళు దానిపై చిలకరించి స్నానం చేసిన ఫలితం కలిగించాము .బట్టలు మార్చుకోన్నాం .ఇక్కడ నది రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది .మేము స్నానం చేసిన తీరం లో మెట్లు ఎక్కి పైకి వెడితే ‘’ఓంకారేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది .దీనికి ఎదురుగుండా ఉన్న రేవు దగ్గర ‘’మమలేశ్వరాలయం ఉంది .ఈ రెండిటిని ఇక్కడ జ్యోతిర్లిన్గాలనే అంటారు .

స్నాన ఘట్టం నుండి నెమ్మదిగా ఎత్తైన మెట్లు సుమారు ఎనభై ఎక్కితే కాని ఓంకారేశ్వర దర్శనం లభించదు .మాకు ఇబ్బంది లేదుకాని మా ఆవిడకు మెట్లు ఎక్కటం కష్టమే .అలాగే ఓపికగా నెమ్మదిగా మెట్లు ఎక్కి రాగలిగింది. క్షేత్ర మహాత్మ్యమే.  లేక పోతే మూడు రోజులుగా కడుపులో ఏదీ ఘన పదార్ధం పడకుండా ఇంత ఓపిక యెట్లా వస్తుంది?రెండు కొండల మధ్య బ్రిడ్జ్ లు కట్టారు .నడిచి అలానూ వెళ్ళ వచ్చు .పడవ ప్రయాణాన్నే మేము ఎంనుకోన్నాం .

శ్రీ గోవింద భగవత్ పాదుల వారి నివాసం

తీరం నుండి ఇరవై మెట్లు ఎక్కగానే కుడి వైపున ఒక గుహ ఉంటుంది .ఇక్కడీకే  శ్రీ శంకర భాగవత్పాదులనే ఆదిశంకరాచార్యుల వారు కేరళ నుండి చిన్నతనం లోనే తల్లి ఆర్యామ్బచేత సన్యాస దీక్షకు ఒప్పించి ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ తగిన గురువు ను వెదుక్కుంటూ ఈ నర్మదా తీరం లోని ఓంకార క్షేత్రానికి చేరుకొన్నారు .గోవింద భగవత్ పాదుల వారు అప్పుడు ఈ ప్రాంతం మహా విద్వాంసులుగా బ్రహ్మ సూత్రా ,వేదం శాస్త్ర అధ్యాపకులుగా చిర కీర్తి నార్జించి ఉన్నారు .శంకరాచార్య గురువు గారిని చేరి అనుమతి తో ఇక్కడే వారి ఆశ్రమం లో ఉన్నారు .ఒకరోజు అర్ధ రాత్రి నర్మదా నదికి విపరీతం గా వరదలు వచ్చి ఆశ్రమం లోకి ఉద్ధృతం గా ప్రవేశించ బోతోంది .గురువు గారు గాఢ నిద్రలో ఉన్నారు .భగవత్ పాదులు అపాయం గ్రహించి నర్మదా నది పై ఆశువుగా స్తోత్రసం చెప్పి ఆమె ను అనుగ్రహించి ఉద్ద్రుతాన్ని తగ్గించుకోమని ప్రార్ధించారు .శాంతించిన నర్మదామాత దిశ మార్చుకొని వెళ్లి పోయింది .ఉదయం లేచి గురువు గారు గోవింద భగవత్ పాదులు ప్రమాద విషయాన్ని శంకరుల  నివారణా రహస్యాన్ని గ్రహించారు .తాను ఎదురు చూస్తున శిష్యుడు శ్రీ శంకరులే అని గ్రహించి దీక్షనిచ్చి శిష్యునిగా స్వీకరించి విద్య నేర్పి బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయించారు .ఇక్కడ గుహలో ‘’’శ్రీ గోవింద భగవత్ పాదుల చిన్న విగ్రం శ్రీశంకరచార్యుల  విగ్రహాలు ఉండి చరిత్రకు సాక్షీ భూతం గా నిలుస్తున్నాయి .ఈ  ఫిబ్రవరి లో ఆదిశంకరుల జన్మస్థలం కేరళ లోని ‘’కాలడి’’ ని దర్శించటం ,ఇప్పుడు ఆయన దేశ సంచారం చేసి తగిన గురువు శ్రీ గోవింద భగవత్ పాడుల వద్ద శిష్యులై సన్యాస దీక్ష పొంది  విద్య నేర్చి గ్రంధ రచనకు శ్రీకారం చుట్టిన చరిత్ర సృష్టించినప్రదేశం ఓంకార క్షేత్ర దర్శనం చేయటం మా పూర్వ జన్మ సుకృతం .జన్మ చరితార్ధం .భక్తీ ప్రపత్తులతో ఆ గురుశిష్యులకు ప్రణమిల్లి మెల్లగా మెట్లెక్కి ఓంకారేశ్వర సన్నిధానం చేరుకొన్నాం .గుడి చిన్నది మార్గమూ ఇరుకు .దీనికి తోడూ’’ పండాల’’  ‘’దందా’’ .పైనుంచి చూస్తె శోభాయమానమైన ప్రదేశం ళా అని పిస్తుంది .ఓంకారేశ్వరుడినే ‘’అమరేశ్వరుడు ‘’అని కూడా అంటారు .ఈ జ్యోతిర్లిన్గాన్ని స్ప్రుశిన్చాటానికి ,అభిషేకం చేయటానికి వీలు లేకుండా గ్లాసు చేంబర్ ఉంటుంది .ప్రక్కనే ఉన్న మరో లింగానికే అభిషేకం పూజా .ఇది స్పర్శనీయం .మా అమ్మాయి కూడా లోపలి వచ్చి మా ముగ్గురితో బాటు దర్శనం చేసుకొన్నది .మా రమణను ఒక ‘’పండా.’’పట్టుకొని పూజ అంటూ వెంబడి పడ్డాడు. వాడు మేము ఒద్దని చెప్పినా ఆలయం బయట హాలులో కూర్చో బెట్టి ‘’భుషం భుషం ‘’అంటూ చెప్పిన మంత్రాలే చెప్పి మాతో కూర్చోబెట్టి కలశ ఆవాహన చేసి పూజ లాగా ఏదో చేసి ‘’రెండు వందలు ‘’మా వాడి దగ్గర నొక్కేశాడు .సరే అనుకొన్నాం .అమ్మవారి దర్శనమూ చేసి మెట్లు దిగి మళ్ళీ రేవు దగ్గరకు చేరంగానే పడవ వాడు రెడీ గా ఉన్నాడు .

బోటు ఎక్కి నెమ్మదిగా అవతలి ఒడ్డున ఉన్న శ్రీ మమలేశ్వరజ్యోతిర్లింగ దేవాలయానికి చేరుకొన్నాం .గట్టుకు దగ్గరే పెద్దగా మెట్లు ఎక్కక్కర లేదు .రద్దీ లేదు హాయిగా విశ్రాంతిగా శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగా దర్శనం చేశాం .దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర  దాటింది .అక్కడే బయట బత్తాయి రసం తాగి సేద దీరాం .ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుగులో డివిడి ఉజ్జైన్ పై డివిడి రెండూ కలిపి వంద రూపాయలకు కొన్నాం .ప్రసాదాలు తీసుకొన్నాం .ఆలయం బయట ఇద్దరు కుర్రాళ్ళు మొలతాడు లాంటి దారాలతో మనం ఏ పేరు చెబితే ఆపేరు తో’’ బ్రెస్ లెట్’’ తయారు చేస్తున్నారు . మా అబ్బాయి అమ్మాయి చూశారు ఆ ఆర్ట్ ముచ్చటగా ఉంది .మా మనవాళ్ళు మనవ రాళ్ళు అందరికీ తలోటి ఆర్డర్ ఇచ్చి అల్లించారు .రమణ వాడి విలేకరి మిత్రుల పేర ఆర్డర్ ఇచ్చి అల్లించాడు .ఒక్కో దాని ఖరీదు పది రూపాయలే  అల్లిక  మహా తమాషా గా ఉంది .దారం ఖరీదు కూడా రాదు ఆ రేట్ కి .వాళ్ళ నైపుణ్యానికి వేల కట్టలేము .

రెండుకొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలు ఆకాశం నుండి చూస్తె ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది .

ఉమా మహేశ్వర పురం

సుమారు రెండున్నరకు మళ్ళీ కారులో బయల్దేరాం .నాలుగు గంటలకు ‘’ఉమామహేశ్వరం ‘’అనే గ్రామం చేరాం .ఇది నర్మదా  నది ఒడ్డున ఉంది .ఇక్కడే హోల్కార్ రాజులు నదీ తీరాన బ్రహ్మాండమైన కోట కట్టుకొన్నారు ఉమామహేశ్వర దేవాలయం నిర్మించారు .పాటిస్ట మైన భద్రత కలిగించారు .శ్రీరామ మందిరమూ శ్రీ హనుమ విగ్రహమూ ఉంది .మెట్లు దిగి ఇవన్నీ చూశాము  ముగ్గురం.మా ఆవిడా కారులోనే కూర్చుంది .హోల్కరు  రాణి అహల్యా బాయి నిలు వెత్తు కాంశ్య  విగ్రహం కోట బయట ఉంది .ఆమె చేతిలో భక్తీ ప్రపత్తులతో పట్టుకొన్న శివ లింగం ఉంటుంది .

అహల్యా బాయి భర్త ,మామ గారు నిరంతరం యుద్ధాలలో మునిగి ,రాజ్య విస్తరణ కోసం పోరాడుతూ ఉండేవారు .అహల్యా బాయి కోటను సంరక్షిస్తూ ప్రజల ఆలనా పాలనా చూసేది .కాశీ నుంచి రామేశ్వరం దాకా ఆమె అనేక దేవాలయాలకు ఎన్నో సేవలందించింది ,యాత్రికులకు సౌకర్యాలు కలిగించింది .అన్నసత్రాలు ఎర్పరచింది. ఆమె కీర్తి చిరస్థాయి గా ఉండిపోయింది .మంచి డిప్లమాట్ గా పేరు పొందింది .భర్త రాజా కుమ్భేర్ హోల్కార్  యుద్ధం లో 1754లో మరణించాడు.పన్నెండేళ్ళ  తర్వాత మామగారు  మల్హర్ రావు హోల్కార్ మరణించాడు .ఏడాది తర్వాత ‘’మాల్వా ‘’సామ్రాజ్యానికి రాణి గా పట్టాభిషిక్తురాలైంది .’’ధగ్గుల ‘’దోపిడీ నుంచి రాజ్యాన్ని కాపాడింది .తుక్కోజి రావు హోల్కార్ ను ముఖ్య సేనాని గా నియమించి స్వయం గా యుద్ధానికి దిగింది .

రాణీ అహల్యా బాయి దేశం లో ఎన్నో దేవాలయాలను నిర్మించింది. అన్నసత్రాలను ఏర్పరచింది .గుజరాత్ లోని ద్వారకలో ,ఉత్తర ప్రదేశ్లోని కాశీ లో ,ఉజ్జైన్ లో నాసిక్ లో  గయా లో ,వైద్య నాద లలో ధర్మ శాలలను నిర్మించి సేవలందించింది  గుజరాత్ లోని జ్యోతిర్లింగా క్షేత్మ్త్రమైన సోమనాద్ లో సోమనాదాలయం ధ్వంసం కాగా దగ్గరుండి కొత్త ఆలయాన్ని నిర్మించిన మహా భక్తురాలు రాణి అహల్యా బాయ్ .దాదాపు వంద క్షేత్రాలలో అహల్యా బాయి దేవాలయలు ధర్మశాలలు నిర్మించి చరిత్ర సృష్టించింది .హోల్కార్ రాజ వంశీకులు ప్రజాధనాన్ని తమ స్వంత ఖర్చుల కోసం విని యోగించుకొని త్యాగ దనులు .వారి స్వంత డబ్బునే తమకోసమైనా దేవాలయ ధర్మ శాలల నిర్మాణ నిర్వహణల కైనా ఖర్చు చేసిన గొప్ప రాజ వంశం హోల్కారులది .రాణి అహల్యా బాయి కి సంవత్సరానికి ఆకాలం లోనే పదహారు కోట్ల స్వంత ఆదాయం వచ్చేది. దానినే ఖర్చు చేసేది. ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేదికాదు.35 ఏళ్ళు రాజ్య పాలన చేసి 1795ఆగస్ట్ పదమూడున రాణి అహల్యాబాయి స్వర్గాస్తురాలైంది .ఇంతటి మహనీయురాలు తిరుగాడిన నేల పై మేమూ తిరిగామనే గర్వం కలిగింది .రాజ దర్బారు రాజ మందిరాలు అన్నీ పకడ్బందీ గా ఉన్నాయి .ప్రభుత్వం ఉమా మహేశ్వరం ను జాతీయ స్మారక చిహ్నం గా చేసి సైనిక కాపలా పెట్టి సంరక్షిస్తున్నారు .

మళ్ళీ బయల్దేరాం .మా అమ్మాయి కోట దగ్గర ఒక అమ్మాయి అమ్మిన ‘’శివ లింగం ఆకారం ‘’ఉన్నదీ ‘’శివ పార్వతుల’’ ఆకారం లో ఉన్నదీ అయిన రెండు రుద్రాక్షలను ఇరవై రూపాయలిచ్చి కొన్నది .దారిలో నర్మదా నది నుండి ఇండోర్ కు నీటి సప్ప్లైని కొండలమీదనుంచి పెద్ద పెద్ద వేడల్పు గొట్టాలతో సరఫరా చేసే వాటర్ స్కీం క ని పించింది .ఇండోర్ మీదుగా ఉజ్జైన్ కు రాత్రి ఎనిమిదింటికి చేరాం .మళ్ళీ మూడో సారి శ్రీ మహా కాలేశ్వర దర్శనం చేద్దామంటే మా వాళ్ళు ‘’రాలేము బాబోయ్’’ అన్నారు  నేనుమాత్రం  వెంటనే స్నానం చేసి బయటికొచ్చి ఆటోలో రాత్రి తొమ్మిదింటికి బయల్దేరి శ్రీ కాలేశ్వర జ్యోతిర్లిన్గాన్ని మూడవ సారి మహా ఆనందం గా స్పర్శించి దర్శించి తరించాను .ఈ జన్మకు ఈ అనుభవం చాలు అని పించింది .జనం పెద్దగా లేరు హాయిగా. దర్శనం అయింది .కాళికా ఆలయం చూడాలంటే ఆటోలో వెళ్లాలని చెప్పారు. తిరిగి రూమ్ కు చేరి మజ్జిగ తాగి బిస్కెట్ తిని హాయిగా పడుకోన్నాం. తెల్ల వారు జామున మూడున్నరకు కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయ వాడ కు బయల్దేరి వెళ్ళాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర—16 శ్రీ మహా కాళేశ్వర విశేషాలు

మా నవ రాత్రి యాత్ర—16

శ్రీ మహా కాళేశ్వర విశేషాలు

ఉజ్జయిని లోని మహా కాలేశ్వర జ్యోతిర్లిన్గానికి ఒక ప్రత్యేకత ఉంది .దక్షినాభి ముఖంగా ఉన్న ఈశ్వరుడు శ్రీ దక్షిణా మూర్తి గా అర్చింప బడటం ఇక్కడి విశేషం .పన్నెండు జ్యోతిర్లింగ మహా క్షేత్రాలలో ఒక్క ఉజ్జయిని లోనే శంకరుడు దక్షిణా మూర్తిగా కొలువై ఉన్న దివ్య క్షేత్రం .మరెక్కడా ఇలా లేదు .దక్షిణాభిముఖం గా స్వయం భువు డై శివుడు విరాజిల్లిన దివ్య ధామం .శ్మశానం నుంచి తెచ్చిన చితా భస్మము  తో రోజూ తెల్లవారు ఝామున అభిషేకం చేయటం ఇక్కడి మరో విశేషం .దీని తరువాత హారతినిస్తారు ఈ మొత్తం కార్యక్రమాన్ని ‘’భస్మ హారతి’’ అంటారు

స్థల పురాణం ప్రకారం క్షిప్రా నదీ తీరం లో ఉన్న ఉజ్జయిని సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు ఇరుగు పొరుగు రాజులు ఎప్పుడూ సిద్ధం గా ఉండేవారు .ఉజ్జయిని రాజు శిక్షకు గురి అయిన శ్రీకరుడు అనే చిన్నపిల్లాడు అపాయాన్ని గ్రహించి పూజారికి చెబుతాడు . పూజారి రాజుగారికి ఈ విషయం చెప్పే లోపే బ్రహ్మ వరం తో మాయారూపి ,అయిన ‘’దూషణుడు ‘’అనే రాక్షసుడి అండతో  శత్రురాజులు ఉజ్జయిని పై విరుచుకు పడతారు .అప్పుడు శ్రీకరుడు ,పూజారి కలిసి కైలసనాధ శివుడిని ప్రార్ధిస్తారు .వారి మొర ఆలకించిన రుద్రుడు  ప్రళయ  కాల మహా ఘోష తో మహా కాళేశ్వరుని గా ఉగ్రాతి  ఉగ్ర రూపం లో అవతరించి శత్రుసేనలను చీల్చి చెండాడి  దూషణా సురుడిని సంహరించి రాజ్యాన్ని సంరక్షిస్తాడు .తరువాత భక్తుల కోరిక మేరకు మహా కాలేశ్వరుదు అనే పేరిట జ్యోతిర్లిన్గమై దక్షినాభిముఖం గా వెలసి దక్షిణా మూర్తిగా పూజలు అందుకొంటూ భక్త వరదుడి గా ప్రసిద్ధి కెక్కాడు .ఆలయం లో వాత్సల్య గణపతి స్వామి పార్వతీ దేవి  విగ్రహ రూపం గా దర్శనమిస్తాడు .

మహాకాలేశ్వరాలయం లోనే ‘’తాంత్రిక  శివ నేత్ర ‘’ఆరాధన జరుగుతుంది .శివుని ముందు నందీశ్వరుడు ప్రక్క వైపున పార్వతి ఉంటారు .మూడవ అంతస్తులో ‘’నాగ చంద్రేశ్వర స్వామి ‘’ఉంటాడు .దీనిని నాగ పంచమి నాడు మాత్రమె దర్శించాలి.అప్పుడే ఆలయం తెరచి ఉంచుతారు .ఉజ్జయిని నగరాన్ని ప్రభావితం చేసి భక్తుల హృదయాలలో కొలువు దీరాడు మహా కాలేశ్వరుదు .సతీదేవి’’ పై పెదిమ ‘’ఇక్కడ పడటం చేత శక్తి పీఠం గా వెలసిల్లింది. అమ్మవారు కాళికా దేవి .

ఆలయాన్ని షాసుద్దీన్ సుల్తాన్1234లో  ధ్వంసం చేశాడు .1736లో సింధియా రాజు హిందూ పద షాహిషా  బిరుదాంకితుడు శ్రీమంత్ రానోజీ రావు షిండే మహారాజు ,పీష్వా బాజీ రావు ,ఛత్రపతి సాహూ మహా రాజ్ లు కలిసి పునర్నిర్మిచారు .

ఉజ్జయిని విశేషాలు

మహోజ్వల ధార్మిక స్థలం గా ఉజ్జయినీ నగరం వెలిగింది .క్రీపూ నుండి దీని కీర్తి దిశాన్తాలకు వ్యాపించింది .విక్రమార్క చక్ర వర్తిపాలించిన నగరం .ప్రాచీన కాలం లో అవంతి అనే పేరుతొ పిలువ బడింది. స్కాంద పురాణం లో దీనికి కనక ,శ్రుంగా ,పద్మావతి ,కుశస్తలి ,కుముద్వతి అనే పేర్లున్నాయి .మహా కాలేశ్వరాలయం అద్భుత నిర్మాణం .పరిణత శిల్ప శోభా విలసితం .భూగర్భం నుండి అయిదు  అంతస్తులలతో  ఆలయం ఉంటుంది .మెట్లు దిగుతూ వెళ్లి దర్శించాలి . ఆలయం లోని ‘’కోటి తీర్ధ కోనేటి ‘’లో అభిషేక జాలం లభిస్తుంది .విశాల మైన మూడు ప్రాకారు దాటి వెడితే మహాకాళేశ్వర జ్యోతిర్లింగా దర్శన ప్రాప్తి కలుగుతుంది .

ఉజ్జయిని లోని కాలభైరవ స్వామి మద్య ప్రియుడు ఎంత మంది భక్తులు మద్యాన్ని అందించినా పూటు  గా సేవిస్తాడు. సీసాలో మద్యాన్ని స్వామి నోటి దగ్గర పెడితే శబ్దం చేస్తూ ఖాళీ అయిపోవటం విచిత్రం .దీనికి  హేతువాదులేవరూ కారణాలు కనుక్కోలేక పోయారని అంటారు .కాల భైరవ దర్శనం తో హత్యా పాతకం పోతున్దని విశ్వాసం .తాంత్రిక పూజలకు కేంద్రం .

కాళిదాస మహా కవి నాలుకపై కాళికా దేవి బీజాక్షరాలను రాసి మహాకవిగా మార్చిన ప్రదేశం ఇదే .ఇక్కడి కాళికా దేవిని ఘాట్ కాళీ అంటారు .

భర్తృహరి కవి సుభాషితాలు రాసిన గుహలు ఉజ్జయినికి ఏడు కిలో మీటర్ల దూరం లో సిప్రా నది ఒడ్డున ఉన్నాయి . ఉజ్జయినికి అయిదు కిలో మీటర్ల దూరం లో శ్రీకృష్ణుడు అన్నగారు బాల రాముడితో స్నేహితుడు సుదాముడనే కుచేలునితో’’ సాందీప మహర్షి ‘’వద్ద విద్య నేర్చిన సాన్దీపముని ఆశ్రమం ఇక్కడే ఉంది. ఇక్కడ కుచేలుని విగ్రహం ఆకర్షనీయం .

మహా కాలేశ్వరాలయం దగ్గరే ‘’హర సిద్ధి మాత ‘’ఆలయం ఉన్నది .ఈమె ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఆరాధ్యదైవం .భేతాళ కధలలో పట్టు వదలని విక్రమార్కుని కధలు ఇక్కడే జరిగాయి .దీనికి దగ్గరలో కృష్ణ చైతన్య ,ప్రభు నిర్వహణలో ఉన్న ద్వారకాధీశ ,గోపాల విగ్రహాలున్నాయి .కొండపై మంగళ నాధుని పేర కుజుడిని ఆరాధించే గుడి ఉంది .మంగళ వారం విశేష పూజలు జరుగుతాయి .మహా భారతకాలం లో ఉజ్జయినిలో ఖగోళ పరిశోధనలు జరిగేవి 1730రాజా జై సింగ్ నిర్మించిన అయిదు నక్షత్ర శాలలు అంటే అబ్సర్వేతరీలలో ఒకటి ఉజ్జయిని లోనే ఉంది మిగిలినవి ధిల్లీ ,కాశీ మధుర  జైపూర్లలో ఉన్నాయీక్కద సామ్రాట్ యంత్రం ,రిగ్నేష్ యంత్రం నారీ వలయ యంత్రం  భీతి యంత్రం ఇప్పటికీ పరిశోధకులకు ఉపయోగాపడుతూనే ఉండటం విశేషం .

కాలిదాస మహా కవి ‘’మేఘ సందేశం ‘’కావ్యం లో ఈ నగర శోభను వర్ణించాడు .ఉజ్జయినికి కాళిదాసుకూ అవినాభావ సంబంధం ఎక్కువ .

ఔరంగ జేబు ఆలయ పాలన కోసమూ ధనం అందజేశాడు .కవీన్ద్రాచార్య సరస్వతి అనేకవికి రక్షణ కల్పించాడు అయన రాసినవి సింధియా లైబ్రరీలో భద్రపరచారు .ఉజ్జైన్ లో సూర్య దేవాలయం ఉన్నట్లు స్కాంద పురాణం చెప్పింది .దాని దగ్గర సూర్య కుండం బ్రహ్మ కుండం ఉన్నట్లు పేర్కొన్నది .మహమ్మద్ ఖిల్జీ నగరాన్ని చల్లగా ఉంచేందుకు చుట్టూ తటాకాలు నిర్మించాడు .ఇక్కడ విక్రమాదిత్యుని పేరా విక్రం యూని వర్సిటి ఉంది .మౌర్యుల గుప్తుల కాలం లో నలందా తక్షిశిలా ల తో బాటు ఉజ్జయిని కూడా గొప్ప విద్యాకేంద్రం .’’నాలెడ్జి సిటి ‘’అంటారు ఉజ్జైన్ ను .ఇక్కడి కాళిదాస ఎకాడమి సంస్కృత సాహిత్యాన్ని సంస్కృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేస్తూన్నది .మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస సమ్మాన్ ‘’అనే పురస్కారాన్ని విశేష ప్రజ్ఞాకన బరచిన సాహితీ వేత్తలకు కళా కారులకు అంద జేస్తోంది .విక్రమాదిత్యుని పేర ‘’విక్రమ కీర్తి మందిరం ‘’ఉంది .ఇక్కడి బజార్లకు సంస్థలకు చాణక్య, చంద్ర గుప్త ,మౌర్య మొదలైన పేర్లు ఉండటం  గర్వించదగిన విషయం .

Redkali3.jpg  కాళికాదేవి Mahakal Temple Ujjain.JPG  Mahakaleshwar temple, Ujjain (credit : Internet)

 

కాళికాదేవి

 

మహా కాలేశ్వ రాలయం

 

 

 

 

తరువాత ఓంకారేశ్వర యాత్ర చేద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -15 ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం

మా నవరాత్రి యాత్ర -15

ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం

ఖజురహో నుండి ఏప్రిల్ పదమూడ వ తేదీ ఆదివారం సాయంత్రం బయల్దేరి నిజాముద్దీన్ ,ఇండోర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కి ఝాన్సి ద్వారా ఉజ్జైన్ కు  14సోమవారం మధ్యాహ్నం పదకొండుగంటలకు చేరాం .రైల్వే రిటైరింగ్ రూమ్ లు రెండు మా అబ్బాయి శర్మ ముందే బుక్ చేశాడు .కనుక తొమ్మిదో నంబర్ ప్లాట్ ఫాం నుండి తోపుడు బండి వాడి సాయంతో ఒకటో నంబర్ ప్లాట్ ఫాం దగ్గరున్న రిటైరింగ్ రూమ్ లకు చేరుకొన్నాం. ఇక్కడ పాస్ పోర్ట్ ఐడెంటిటి  చూపించాలంటే చూపించాను .సామాన్లు రూమ్ లోకి చేర్చి హాయిగావేడినీళ్ళ స్నానాలు చేశాము.రెండు ఏ.సి లున్నాయి .విశాలమైణ డీలక్స్ రూములు .అద్దె అయిదు వందలే .IMG_0750ఉన్నదేదో తిని విశ్రాంతి తీసుకొన్నాం .విజ్జి ,రమణ కిందికి వెళ్లి అన్నం ,పెరుగు కొనుక్కోచ్చారు .పెరుగులో అన్నం కలిపి తిన్నాం .దాదాపు మూడు రోజుల నుండి తిండి లేనే లేదు .హార్లిక్స్ బిస్కేట్లే నాకు ఆహారం .ఏదీ తినాలని పించలేదు .మా అమ్మాయి నా విషయం లోను  వాళ్ళ మ్మ విషయం లోను శ్రద్ధ తీసుకొని గ్లాసులకు గ్లాసులు మజ్జిగ ఆరగా ఆరగా ఇచ్చి తాగిస్తూ నీరసాన్ని తగ్గించింది .మెడికల్ షాప్ కు వెళ్లి మా ఇద్దరికీ కాప్సిల్లు టాబ్లెట్లు తినే ముందు ఒకటి  తిన్న తర్వాత ఒకటి వేసి మింగించింది .రాత్రికి కొంత ఉపశమనం కలిగింది .

సోమవారం ఉజ్జయినిలో ఉన్నాం కనుక జ్యోతిర్లింగం అయిన  శ్రీ మహా కాళేశ్వర దర్శనం చేసి తరించాలను కొన్నాం .సాయంకాలం మళ్ళీ స్నానాలు చేసి చేతిలో ఏమీ లేకుండా రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న’’ మహాకాళ్’’దర్శనానికి ఆటోలో వెళ్లాం .ఇక్కడ అందరూ మహాకాల్ టెంపుల్ అంటారు. అక్కడ పెద్దగా క్యూ లేదు .మేము టికెట్ కొని వెళ్ళే మార్గం లో వెడుతుంటే మా ముగ్గుర్ని పంపి మా అమ్మాయిని గేట్ దగ్గర ఆపి టికెట్ కొనమన్నారు .అప్పటికే మేము ఆలయ ప్రవేశం చేశాం .ఏమనుకొన్నారో ఏమో మా అమ్మాయికి మాత్రమె టికెట్ డబ్బు 150రూపాయలు తీసుకొని లోపలి పంపారు .లోపల జనం బాగానే చేరారు .దర్శనం మహా దివ్యం గా జరిగింది .ఎన్నాళ్ళ కలో ఇప్పటికి తీరింది .ఆరున్నర నుంచి ఏడింటి వరకు హారతి జరిగింది .శంఖాలు దమురుక నాదాలు తప్పెట్లు తాళాలతో అపర కైలాసమే అని పించింది .ఒకాయన తప్పెట మోగిస్తూ విపరీతం గా తన్మయం లో ఊగి పోయాడు .ఎప్పుడో కాశీ లో శ్రీ విశ్వేశ్వరాలయం లో ఈ అనుభూతిని పొందాం. మళ్ళీ ఇక్కడ లభించింది .అందరం పరమ సంతోష పడ్డాం .జన్మ కో శివరాత్రి అని పించింది .జీవితం ధన్యమని భావించాము .ఈతన్మయత్వం లో శివ స్తోత్రాలే మర్చిపోయానని పించింది .అంతటి ఆనంద  స్థితి అది .ఆలయం ఏర్పాట్లు బాగా ఉన్నాయి .ఎక్కడా అసౌకర్యం కని పించలేదు  నెమ్మది గా బయటికి వచ్చాం .అక్కడే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దర్శించాం .మంగళ వారం మా స్వామి దర్శనం లభించతమూ పరమానందమే ఆలయం బయట హోటల్ లో మా అమ్మాయి పెరుగు ,అన్నం తీసుకొన్నది .మళ్ళీ ఆటోలో రూములకు చేరుకొన్నాం .

ఇలా మహా పవిత్ర సోమవారం ఉజ్జయిని శ్రీ  మహా కాళేశ్వర సన్నిధిలో గడిపాం .రాత్రి పెందరాళేపడుకోన్నాం .

ఉజ్జయిని లో స్పెషల్ ‘’భస్మ హారతి ‘’ దీన్ని తెల్లవారుజ్హామున నాలుగింటి నుండి ఆరువరకు జరుపుతారు .దీనిని దర్శించాలంటే వారం పది రోజుల ముందే ‘’ఆన్ లైన్ లో రిజర్వ్ ‘’చేయించుకోవాలి .మా పక్కింటి మేష్టారు వాళ్ళు వెళ్లి వచ్చారుకనుక విషయం తెలిసి మా అబ్బాయి శర్మ తో మా నలుగురికి ఆన్ లైన్ భస్మ హారతి దర్శనానికి 15ఉదయానికి బుక్ చేయించాం .దీనికి రుసుమేమేమీ లేదు .పాస్ పోర్ట్ ఆధారం గా ఫోటో ఐడెంటిటి ఉంటుంది .దాన్ని సబ్మిట్ చేసి నెట్ ద్వారా బుక్ చేయాలి ఆ తంటాలేవో మా శర్మే మాకోసం పడ్డాడు .వాళ్ళ అనుమతిని ప్రింట్ అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోన్నాం .

15వ తేదీ మంగళ వారం తెల్ల వారు జామున రెండున్నరకే లేచాం .స్నానాలు చేశాం . మగవాళ్ళు  పంచ ఉత్తరీయాలతో ,ఆడవాళ్ళు చీర జాకెట్ లతో నే దర్శించాలి .భస్మ హారతి సమయం లో ఆడవారు నెత్తిమీద ముసుగు తప్పక ధరించాలి .ముసుగు లేకుండా భస్మ హారతి చూడరాదని నియమం .అలానే తయారై బయల్దేరి ఆటోలో పావుతక్కువ నాలుగుకు చేరాం .మెటల్  డిటెక్టర్ సాయం తో తనిఖీ చేసి ఆన్ లైన్ రిజర్వేషన్ కాగితాలతో మనుషులను గుర్తించి లోపలి అనుమతించారు .జనం బాగానే ఉన్నారు .నాలుగు గంటల నుండి మనం వెంట తీసుకొని వెళ్ళిన చెంబు తో దేవాలయం లో రెడీ గా ఉన్న నీటిని నింపుకొని లైన్ లో నిలబడాలి  .క్యూప్రారంభం అయింది.  అందరూ ఒక్కొక్కరుగా గర్భాలయం ప్రవేశించి శ్రీ మహాకాలేశ్వార్ జ్యోతిర్లిన్గాన్ని తనివి తీరా స్పర్శించి తెచ్చిన నీటిని అభిషేకం చేయాలి అలానే మేమూ చేశాం .ఇదో దివ్యానుభూతి .ఇది అయ్యేసరికి నాలుగు ఇరవై  అయింది .అప్పుడు ముందున్న ఖాళీ ప్రదేశం లో వరుసలలో కూర్చున్నాం .వెనక మెట్ల వరుసలో కొందరు కూర్చున్నారు .భక్తుల అభిషేకం తరువాత ఆలయ పూజారులు అభిషేకం చేయటం మొదలు పెట్టారు .నమకం విని పించింది కాని చమకం వినిపించలేదను కొన్నాను .క్షీరం ,పండ్ల రసం పెరుగు నేయి మొదలైన వాటితో జ్యోతిర్లిన్గానికి అభిషేకం చేసి చివరికి జలాభిషేకం చేశారు ఇవన్నీ క్లోజేడ్ సర్క్యూట్ టి వి లలో కూడా చూసే ఏర్పాటు చేశారు .కనుక ఏదీ మిస్ అయ్యం అయ్యాం అని పించదు .ఆ తర్వాత లింగానికి అలంకరణ చేస్తారు .మూతి పెదవులు కన్నులు ముక్కు చెవులు అన్నిటిని గంధం తో తీర్చి దిద్ది పరమ వైభవం గా శివలింగాన్ని మానవాకృతి ముఖం గా మారుస్తారు .భక్తులు తెచ్చిన ప్రసాదాలు వస్త్రాలు వరుసగా తీసుకొని స్వామి ముందు ఉంచి మళ్ళీ ఎవరివి వారికి అందజేయటం ప్రత్యేకం గా కని  పించింది .స్త్రీ వాలంటీర్లు కూడా చాలా శ్రద్ధ గా విధులు నిర్వహించటం బాగుంది .

ఇదంతా అయిన తర్వాత ఒక తెల్ల గుడ్డలో స్మశానం నుంచి తెచ్చిన ‘’చితా భస్మాన్ని’’ మూట గా కట్టి జ్యోతిర్లింగం పై వరుసగా చల్లి అభిషేకం చేయటమే భస్మ హారతి .ఒక పది నిమిషాలు. లింగం పాన వట్టం మీద ఒక్క  సెంటి మీటరు  కూడా వదల కుండా భస్మం తో అభిషేకిస్తారు. ఇదీ ఉజ్జయిని ప్రత్యేకత .భస్మాభిషేకం తరువాత స్వామికి నూతన వస్త్రాలను సమర్పించి అలంకారం గా ఉంచుతారు .తరువాత వివిధ దీపాలతో వివిధ భంగిమల తో అనేక రకాలుగా హారతినిస్తారు. ఈ హారతికి పావు గంట పడుతుంది .చూసి తీరాల్సిందే ఇది .ఇదొక మహా విభూతి అని పించింది .ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఈ దివ్య దర్శనం అనిపిస్తుంది .ఈ జన్మకు ఇది చాలు అని సంతృప్తి కలుగుతుంది ,కలిగింది .నేను మనసులో ‘’మిధున పతయే నమః మిధున పతాన్తికాయనమః ఊర్ధ్వాయనమః ఊర్ధ్వ లింగాయనమః ‘’అను కొంటూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా చూసి తరించాను .

మా శర్మ ఉజ్జైన్ నుండి రెండువందల కిలో మీటర్లకు పైగా ఉన్న నర్మదానదీ తీరం లోని ఓంకార జ్యోతిర్లింగా క్షేత్ర దర్శానికి  ఇండికా కార్ బుక్ చేశాడు .డ్రైవర్ కు ఫోన్ చేసి ఉదయం ఎనిమిదింటికి స్టేషన్ దగ్గరకు రమ్మని చెప్పాం .ఆలయం నుండి బయటికి వచ్చి కాఫీ తాగాం .ప్రసాదాలు కొన్నాం .ఆటోలో రూమ్స్ కు చేరాం .డ్రైవర్ కోసం ఎదురు చూస్తూన్నాం .ఎనిమిదింటికి డ్రైవర్ వచ్చి ఫోన్ చేశాడు .అందరం బయల్దేరి ఇండికా కారు లో ఎక్కి కూర్చున్నాం .ఇక ఓంకారేశ్వర్ కు బయల్దేరాం .ఆ యాత్రవిశేషాలు తరువాత తెలియ జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

నా అంతరంగం -పి జి ఉడ్ హౌస్- గబ్బిట కృష్ణ మోహన్ తరంగ రేడియోలో (18th April 2014)

Ahavanam with Krishna Mohan by Lanka Venkateswarlu.Show Aired on 18th April 2014.Listen Podcast here….

తరంగ రేడియోలో

 

gabbita-Krishna-mohan-150x150

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’ అచ్చా

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’  అచ్చా

 

మేము వెళ్లి చూడలేదు కాని ఓర్చా ను గురించి చెప్పగా విన్నాం .దాని విశేషాలే ఇప్పుడు తెలియ జేస్తున్నాను .పదహారవ శతాబ్ది నగరం ఓర్చా .బుందేల్ ఖండ్ ప్రాంతం లో ‘’బెట్వా నది ‘’తీరం లో నిర్మించబడిన పట్నం .ఝాన్సి –ఖజురహో రోడ్డుపై ఉంది .ఝాంసికి పదహారు కిలోమీటర్ల దూరం .బుందేల్ రాజ పుత్ర సైన్యాధికారి  రుద్రప్రతాప్ నిర్మించిన నగరం .ఇతని తర్వాత కొడుకు బీర్ సింగ్ దేవ్ నగరాభి వృద్ధి చేశాడు .అనేక శతాబ్దాలుగా యాత్రికులకు ప్రత్యెక ఆకర్షణ గా’’ ఓర్చా ‘’ఉండి ‘’అచ్చా’’ అని పించుకొంటోంది ,మధ్యప్రదేశ్ లో మరుగున పడిన మాణిక్యం ఓర్చా .ప్రేమ త్యాగాలకు నిలయం .దీని గాధలు పాటలుగా పద్యాలుగా జనం పాడుకొంటారు . మధ్య ప్రదేశ్ కు ఉత్తరాన మాల్వా పీఠ భూమి లో ఓర్చా ఉంది .వేసవిలో వేడి తక్కువగా ఉండటం శీతాకాలం లో ఆహ్లాద వాతావరణం దీని ప్రత్యేకత.బుందేల్ ఖండ్ రాజులు దీన్ని రెండు శతాబ్దాల పాటు 1531నుండి పాలించారు .ఒకప్పుడు ఒక రాజ పుత్రా వీరుడు తనను విన్ధ్యవాసిని దేవికి సమర్పించుకోవాలని సిద్ధ పడ్డాడు .అప్పుడా దేవి అతని త్యాగానికి మెచ్చి అతన్ని ‘’బుందేలా ‘’ అంటే ‘’రక్త తర్పణం చేసిన వాడా ‘’అని పిలిచింది .అప్పటి నుంచి ఆ వంశీకులు బుందేల్ ఖండ్ రాజ పుత్రులై చరిత్రలో చిర కీర్తి సాధించారని కధనం .బుందేల రాజ  వంశం  పదకొండవ శతాబ్దిలో ఆరంభమైంది .ఒర్చాను రాజ దాని గా చేసుకొని బుందేల రాజులు మధ్య భారతాన్ని పాలించారు .మొదట్లో గర్ఖురార్ వీరి రాజధాని .తరువాత రాజా రుద్రా ప్రతాప్ 1531లో  ఓర్చా కు మార్చారు . మొగలాయీ రాజులతో బుందేల రాజుల సాన్నిహిత్యం కష్టాలనే తెచ్చి పెట్టింది .1605-27కాలపు రాజు బీర్ సింగ్ దేవ్ మొగలాయీ చక్ర వర్తి అక్బర్ కి కోపం తెప్పించాడు .దీనికి కారణం అక్బర్ కొడుకు జహంగీర్ తో బీర్ సింగ్ కు మంచి దోస్తీ ఉండటమే .1602లో అక్బర్ తన కోపాన్ని బుందేల్ఖండ్ పై ప్రదర్శించి యుద్ధానికి దిగి నాశనం చేశాడు.1605లో అక్బర్ చావు తర్వాతా జహంగీర్ సామ్రాట్టు అయ్యాడు .స్నేహ భావం తో జహంగీర్ మిత్రుడిని 1606లో ఓర్చా వచ్చి కలిసి స్నేహ హస్తం చాచాడు .ఆ తరువాత ఇరవై రెండేళ్ళు జహంగీర్ బీర్ సింగ్ మంచి స్నేహితులుగా మెలిగారు .రెండు రాజ్యాలమధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండేది .జహంగీర్ మరణం తర్వాత షాజహాన్ రాజయ్యాడు అప్పుడు బీర్ సింగ్ షాజహాన్ పై దాడి చేశాడు .కాని ఔరంగ జేబు దీన్ని అణచేశాడు .బుందేల రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి వారికే స్వాధీనం చేశాడు చక్ర వర్తి .1783బుందేల్ రాజులు రాజధానిని ఓర్చా నుండి’’ తికం గర్’’ కు మార్చారు. ఓర్చా వైభవమంతా కోటలో ఉంది .అనేక రాజ భవనాలు, ఆలయాలు, తోటలు స్మ్రుతి  చిహ్నాలు ఉన్నాయి బుందేల స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ప్రసిద్ధమైనది .పుష్పాలఅలంకరణ కు ప్రసిద్ధి .బెట్వా నది ఒడ్డున ఓర్చా కోట ఉంటుంది .మొగల్  చక్రవర్తి సందర్శన సందర్భం గా బీర్ సింగ్ రాజు స్మారక మందిరం నిర్మించాడు .కోర్టు ,దర్బారు గొప్పగా ఉంటాయి . హిందూ మొగల రాజ భవనాలు ఆకర్షణీయం గా తీర్చి దిద్దారు . రాజా ఇంద్రమణి అనే కవి ,సంగీతజ్నురాలు పేర ‘’రాజ్ ప్రవీణ్ మహల్ ‘’నిర్మించారు .ఆమె గొప్ప అంద గత్తే  నాట్యకారిణి .జహంగీర్ ఆమెను ప్రేమించాడని కధనం .వీరిద్దరి ప్రణయ గాధ పాటలుగా కావ్యాలుగా ప్రసిద్ధమైనాయి .ఆమె భర్తను వదిలి వెళ్ళటం ఇష్టపడని రాజ పుత్ర స్త్రీ పతివ్రత . .. ఆనంద మహల్  ,హర్దు వాల్ మందిరాలు వైభవం గా ఉంటాయి .హర్దువాల్ బీర్ సింగ్ కుమారుడు .అన్న ఝుహార్ కు తన అమాయకత్వాన్ని నిరూపించటానికి ప్రాణ త్యాగం చేశాడు .మరణం తరువాత అతనిని దేవతా భావం తో విగ్రహం నెలకొల్పి పూజిస్తూ ఆరాధిస్తున్నారు . మధుకర్ షా భార్య రాణి గణేష్ కున్వారీదేవి అయోధ్య నుంచి శ్రీరాముని విగ్రహం తనతో ఒర్చాకు తీసుకొచ్చింది .దాన్ని రాజ ప్రాసాదం లో ఒక చోట తాత్కాలికం గా ఉంచింది .వేరొక చోట దాన్ని ప్రతిష్టిద్దామని ప్రయత్నం చేస్తే  విగ్రహం ఊడి రాలేదట .చివరికి ఈ రాజ ప్రాసాదాన్నే శ్రీరాముని సమర్పించారు రాణీ రాజు .ఇక్కడ శ్రీరాముడు రాజు గా పూజింప బడుతున్నాడు .భారత దేశం మొత్తం మీద ఎక్కడా శ్రీరాముడు రాజుగా  అర్చింప బడటం  లేదు ఇక్కడే అది జరుగటం  తో ఓర్చా తన ప్రత్యేకతను  నిలుపు కొంటోంది . కున్వారి రాణీ కోసం మధుకర్ షా చతుర్భుజ దేవాలయాన్ని ఓర్చాలో నిర్మించాడు .ఉన్నతమైన శిఖరం తో మహా గొప్ప  కళా నికేతన్ గా ఉంటుంది .రామ రాజ ,లక్ష్మీ నారాయణ దేవాలయాలూ ఉన్నాయి .’’బుందేల్ చిత్రకళ ‘’విశేష ప్రాముఖ్యత పొందింది ..విప్లవ వీరుడు స్వాతంత్ర సమరం లో వీర మరణం పొందిన చంద్ర శేఖర ఆజాద్ ఓర్చా లో1926-27లో నివసించటం దీని విఖ్యాతిని మరింత పెంచింది .సిద్ధ బాబా మందిర్ ,జుగల్ కిషోర్ మందిర్ ,జానకీ మందిర్ దర్శింప దగినవి .ఇక్కడ రాజస్తాని ,జైన,  మొగల్  శిల్ప కళలు  వర్ధిల్లి కళా త్రివేణీ సంగమ స్థానమైంది .

Inline image 1   Orchha Palace  Inline image 2

Inline image 3     

రాజ రుద్రా ప్రతాప్ సింగ్                               రాజా బీర్ సింగ్ దేవ్   ఇక ఉజ్జయినీ యాత్ర సాగిద్దాం సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-14—ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -13 ఖజురహో కళలహో అదరహో ఆలయ వైవిధ్యం -2

మా నవ రాత్రి యాత్ర -13

ఖజురహో కళలహో అదరహో

ఆలయ వైవిధ్యం -2

11-శిధిల శివాలయం

పదకొండవ శతాబ్దికి చెందిన ఈ శివాలయం దాదాపు శిధిలమై పోయింది .కండరీయ ,జగదాంబా ఆలయాల మధ్య ఉన్నది .శివునిచిత్రాలు ద్వారంపై చెక్కారు గర్భగుడి పాడైపోయింది .శార్దూల విగ్రహం ఆకర్షణీయం గా కనిపిస్తుంది .

12-కందరీయ మహాదేవాలయం

1025-50కాలం లో నిర్మితమైంది .102,66,102అడుగుల పొడవు వెడల్పు ఎత్తు  ఉన్న బృహత్తర దేవాలయం .ఒకప్పుడు ఇది పంచాయతన దేవాలయమే .ఇప్పుడు టెర్రేస్ మూలాలు ద్వంసమైనాయి .ఖజురహో శైలి శిల్ప విన్యాసానికి గొప్ప నిదర్శనం .అర్ధ మండపం ,మండపం ,మహా మండపం ,అంతరాలయం ,గర్భాలయం ,ప్రదక్షిణ మార్గం ఉన్నాయి .అన్నీ కలిపి ఎకాముఖీనం గా దర్శన మిస్తాయి .ఇందులోని ప్రతి భాగం యొక్క శిఖరం ఒక పర్వతాగ్రం లా మలచ బడ్డాయి. చివరికి ఆమలక ,కలశాలతో విరాజిల్లు తాయి .ఖజురహో దేవాలయ సమూహం లో కందారియ దేవాలయమే సర్వోత్క్రుస్టమైనది .కట్టడపు పని తో ఒక హిమాలయాన్నే మన ముందు ఉంచిన అనుభూతి కలుగుతుంది .అగ్రం పై అగ్రం ముందుకు చొచ్చుకోచ్చే విభాగాలు ,దేనికదే అందాలను ఆరబోసే కళా ఖండాలతో అఖండ కళా రాశి గా అద్భుత పని తనానికి తార్కాణ గా అపర కళావిలాసం గా భాసించే మహోన్నతాలయం .సమాంతర సముదాయ నిర్మాణం .అద్భుతమైన మెట్ల సముదాయం .హిమాలయ పర్వతారోహణ చేస్తున్న అనుభూతి కలిగిస్తుంది కైలాసం లో పరమ శివుని దర్శనానికి వెడుతున్నామా అనే భావం మనసంతా నిండిపోతుంది .శిల్ప తోరణాలు ,దేవతా విగ్రహాలు ,మిదునాలు ,పాటపాడేవారు నృత్యభామలు ,కీర్తి ముఖాలు ,మకారాలు తో రెండు మకర తోరణాలున్న ఏకైక దేవాలయం గా గణన కెక్కింది .మహా మండపం పైభాగం లో వలయాలు ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోయి పరమ వైభవం గా కని  పిస్తాయి .గర్భాలయ ద్వారం గోడలపై అనేక పుష్ప జాతులు కను విందు గా శిల్పీకరించారు .గంగా ,యమునా దేవీ విగ్రహాలు వారి వాహనాలు మొసళ్ళు  కూర్మము దూర్జంబ్ లపై చెక్కారు .మార్బుల్ తో చేయబడిన లింగం గర్భగుడి లో ఉంది .

800విగ్రహాలు లోపలి, వెలుపలి గోడలపై చెక్కబడ్డాయి .అపసరసల అందాలను అనేక కోణాల్లో భంగిమల్లో శిల్పీ కరించారు .మహిళ ల మానసిక ,దైహిక స్తితి గతులను అనేక రీతుల్లో ప్రదర్శితం చేశారు శిల్పాలలో .ఖజురాహో శిల్ప కళ కన్దూరియా దేవాలయం లో పరమ వైభవ స్థితి లో అత్యున్నతం గా సర్వ శ్రేష్టం గా మహా కళా విభూతిగా విరాజమాన మైనదని శిల్ప మర్మజ్ఞుల మనోభావం .నగిషీలు ,సూక్ష్మ విషయ పరిశీలనం లకు ఇది గొప్ప ఉదాహరణ .అనేక స్థానిక చరిత్ర గాధలన్నీ చుట్టూ చెక్కబడి చారిత్రిక నేపధ్యాన్ని కలిగించాడు శిల్పి .ఏదేవతా విగ్రాహమైనా సర్వ శ్రేష్టం గా సంపూర్ణం గా పూర్తీ వైభవం గా ఉంటుంది .అదీ దీని ప్రత్యేకత .

ఇక్కడితో పడమర వైపు దేవాలయాల సందర్శన పూర్తీ అవుతుంది .

తూర్పు వైపు దేవాలయ సముదాయం

బ్రహ్మ ,వామన ,ఆదినాధ ,జవేరి ,జైన దేవాలయాలు ఇందులో ఉన్నాయి .

1-బ్రహ్మ దేవాలయం

తొమ్మిది వందల కాలం లో నిర్మితం .సాదా సీదా ఆలయం .ఇసుక రాయి  గ్రానైట్ తో నిర్మాణం .వీటిని ఖజురహో సాగర్ అనబడే ‘’నినోరా తాల్ ‘’నుండి తెచ్చారు .నాలుగు ముఖాల విగ్రహం ఉంది. కనుక బ్రహ్మ గుడి అని పొరపాటుగా అంటున్నారు .నిజానికి విష్ణు గుడి .ఈ విషయం గర్భ గుడి ద్వారం పై చెక్కబడిన శిల్పాలను బట్టి తెలుస్తోంది .పిరమిడ్ ఆకారపు శిఖరం ఉన్నది .ద్వారం పై యమునా  గంగా ప్రతిమలు ప్రతి చిన్నచిన్న విషయాలతో సహా  స్పష్టం గా చెక్క బడ్డాయి .మహాదేవాలయం నమూనా ఇది .

2-హనుమంతుడి విగ్రహం

పడమటి దేవాలయాలకు ,ఖజురహో గ్రామానికి మధ్య  నిర్మించిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది .హర్షుడి కాలం అంటే922కు చెందినదిగా బేస్ మీదున్న శాసనం వలన తెలుస్తోంది .ఇదే అతి ప్రాచీన శాసనం .

3-వామనాలయం

1050-75 కాలం లో నిర్మింప బడిన వామనాలయం శ్రీ మహా విష్ణువుకు అంకితం .గర్భాలయం లో బలిని కాళ్ళ కింద తొక్కి పాతాళం లోకి పంపే వామన మూర్తి దర్శన మిస్తాడు .చండేలా శిల్ప కళ ఈ ఆలయం లో పూర్తిగా వికసిన్చిందని అంటారు .గర్భాలయ గోడపై బుద్ధుడు భూమి స్పర్శ ముద్ర తో ఆసీనుడైనట్లు చెక్క బడింది .ద్వారం పై అద్భుత శిల్ప విన్యాసం ఉంది .చతుర్భుజ వామన మూర్తి నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటాడు .

4-శాంతి నాద జైనాలయం

పార్శ్వనాధ ,జైన ఆలయానికి దక్షిణాన కొత్త ‘’శాంతి నాదాలయం ‘’ఉంది . 14అడుగుల శాంతినాధుడు దిగంబరం గా దర్శన మిస్తాడు  .అనేక జైన దేవీ దేవతల విగ్రహాలున్నాయి

5-పార్శ్వనాధాలయం

ఖజురాహో లోని అతి ముఖ్య జైన  దేవాలయం ఇది . పదవ శాతాబ్డిది .ఆదినాదుడికి అంకితం .ఇప్పుడున్న పార్శ్వనాధ విగ్రహాన్ని 1860లో ఏర్పాటు చేశారు .’’సాన్దార ప్రాసాదం ‘’ఉన్న గుడి .ఆదినాధ శాంతి నాదాలయాల మధ్య ఉంది .బయటి గోడలపై శిల్ప కళ వర్ణించ లేనంత  గొప్పగా ఉంటుంది .వైష్ణవ జైన విగ్రహాలూ ఉండటం విశేషం .చక్రేశ్వారి ,పరశురాముడు ,రేవతీ బలరాములు ,సీతారాములు హనుమాన్ ఉండటం ప్రత్యేకత .ఒక నాయిక ప్రియుడికి ఉత్తరం రాస్తున్నట్లు చెక్కిన శిల్పం మనోహరం .స్త్రీ తన గారాల పట్టి కొడుకును ముద్దాడే దృశ్యమూ మరువలేనిదే .

6-ఆదినాదాలయం

జైన తీర్ధంకరుడు ఆదినాదునికి అన్కితామివ్వ బడిన ఈ ఆలయం పదకొండవ శాతాబ్డిది .గర్భాలయం లోని విగ్రహం కనపడక పోతే కొత్త విగ్రహం పెట్టారు .వామనాలయం నమూనా గా ఉంటుంది .శిఖరం కొంచెం భిన్నం గా సరళం గా ఉంటుంది .హిందూ దేవతా విగ్రహాలు గోడలపై ఉంటాయి  .

7-ఘంట దేవాలయం

పదో శతాబ్ది ఆలయం .ఇక్కడ క గంట ,గొలుసు ఉండటం వలన గంటాలయం అనే పేరొచ్చింది. జైన దేవత గరుడ వాహనం పై ఉండటం ప్రత్యేకత .ద్వారం పై మహా వీర ,నవగ్రహాలు ఉండి పార్శ్వ నాదాలయం లా కని  పిస్తుంది .

8-జవేరీ దేవాలయం

చిన్న ఆలయమే అయినా శిల్ప కళకు పుట్టినిల్లుగా ఉంటుంది .పెద్ద విశాలమైన టెర్రేస్ ఉండి దానిపై ఆలయం నిర్మితమైంది .1075-1100నాటి ఆలయం .నిరాధార ప్రాసాదం మోడల్ .అర్ధ మండప మహా మండప గర్భాలయాలున్నాయి .చతుర్భుజుడైన విష్ణు మూర్తి ముఖ్య దేవత .ఈయన్నే బలరాముడి గా భావిస్తారు .

దక్షిణ దిశ దేవాలయాలు

దక్షిణ దిశాలయాలలో దులాదేవ్ ,చతుర్భుజ ,జత్కారి ఆలయాలున్నాయి .

1-దులాదేవ్ దేవాలయం

దీన్ని 1100-50మధ్య కట్టారు .దీనికి ‘’కున్వార్ మఠ’’ఆలయం అంటారు పెళ్లి చేసుకొన్నా నవ వధూ వరులు తప్పక ఈ ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకొంటారు కనుక ఆ పేరొచ్చింది .గంటాలయానికి దక్షిణాన ఉంది .ఖుదార్ నాలా ఒడ్డున ఉన్న ఆలయం .ఇదే ఖజురహో ఆలయాలలో ఆధునికమైనది .శివుడికి అంకితం .నిరాదారాలయం .గర్భ గుడి మహా మండపం చిన్న శిఖరాలు ఇరవై మంది అప్సరస ప్రతిమలు గుండ్రని సీలింగు తో’’సింప్లీ  సూపర్బ్ ‘’అని పిస్తుంది .నృత్యం చేసే  అప్సరసల హావ భావాలు చేష్టలు  ఆభరణాల  బరువుతో వంగిపోయినట్లు కని పిస్తారు .అద్భుత శిల్పకళా సృష్టికి నిదర్శనం .అష్ట వసువు విగ్రహాలు మకర వాహనాలపై ఉండటం ప్రత్యేకత .ఖజురహోశైలీ   వైవిధ్యం దర్శన మిస్తున్దిక్కడ .

2-చతుర్భుజాలయం

పదకొండవ శతాబ్దికి చెందిన ఈ ఆలయం జకారి గ్రామానికి అరకిలో మీటర్ల దూరం లో ఉంది .నిరాదారాలయం .మహాశిఖరం తో శోభాయమానం .చతుర్భుజ విష్ణువే ఇక్కడి ముఖ్య దేవుడు .దక్షిణా మూర్తి విగ్రహం పడమటి ముఖం గా ఉంటుంది .దక్షిణా మూర్తి పది అడుగుల భారీ విగ్రహం .కిరీట దారిగా ఆభారణాలతో మెరసి పోతూ  దర్శన మిస్తాడు .ఈఏక శిలా విగ్రాహం శివుని కిరీటం తో బుద్ధుడి ముఖం తో ,విష్ణు మూర్తి శరీరం తో శ్రీ కృష్ణుని ముఖ భంగిమలతో ఉండటం విశేషం .సింహ శిరస్సు కలిగిన స్త్రీ ఉత్తరం వైపు ఉండి వింత గొలుపుతుంది . ఈమె నరసింహావతార విష్ణు మూర్తి కి  భార్యా మణి అని స్థానికులు భావిస్తారు .అర్ధ నారీశ్వర శివుడున్నాడు .

పురావస్తుశాఖ మ్యూజియం

పడమర దేవాలయ సమూహానికి దగ్గర గేటు సమీపం లో మ్యూజియం ఉంది .ఇక్కడ 2,000పైగా శిల్పాలున్నాయి .వీటిని యాభై ఏళ్ళుగా కస్టపడి త్రవ్వి తీసి ఇందులో అమర్చారు. నృత్య గణపతి ,అనేకమంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి వైష్ణవ గాలెరి లో విష్ణుమూర్తి అనేక అవతారాల శిల్పాలుంటాయి .అలాగే బుద్ధుడు అయిదు శిరస్సుల శివుడు ఉంటారు ‘.

ఇదీ ఖజురహో దేవాలయ వైవిధ్యం .ప్రతి ఆలయాన్ని చూస్తె నాకు ఒకటి అనిపించింది .’’ఎండు ఖర్జూర కాయను’’ నిల బెడితే ఎలా వంపులు సొంపులు తో కని  పిస్తుందో  అదే రంగుతో ప్రతి ఆలయం అలానే కని  పిస్తుంది అనేకత్వం లోఏకత్వం గోచరిస్తుంది .అన్ని సముదాయాల నిర్మాణం ఒకే వైపుకు కలిసి పోయి ఏక నిర్మితమని అఖండత్వం అనంతత్వం కలిసి శిఖరీ భూతమై ముగుస్తుందని అని పించింది .ఉత్తర దేశం లో ఖజురాహో ను మించిన శిల్ప సంపద మరెక్కడా కనిపించదు .కాని మన దక్షిణ దేశానికి ఇదేమీ కొత్త కాదు .మన దక్షిణ దేశ దేవాలయాలన్నీ మహా బృహత్తరమైనవి, శిల్ప కళా శోభితమైనవీను .ముఖ్యం గా కర్నాటక రాష్ట్రం లోని హాలీ బీడు లాంటి దేవాలయాలలో రాయి మైనం ముద్దలా జిలిబిలి వంపుసోమ్పులు పోయి మహా నాజూకుగా శిల్ప శిరోమణులు తీర్చి దిద్దిన వైభోగం మనకు అనుభవమే .కాని ఉత్తరాది వారికి ఖజురహో ను మించిన కళా సంపద లేదని పిస్తుంది .ఈ రెండు శిల్ప కళా శైలీ విన్యాసాలను చూసిన అదృష్టం. నాది అనుభూతి పొందిన జీవితం నాది .దేనికదే గొప్పదని నాభావన .ఎక్కువ తక్కువల ప్రసక్తి లేదిక్కడ. ఆ మహా శిల్పుల శిల్ప విన్నాణానికి చేయెత్తి జేజేలు పలకాలిసిందే అందరం ‘’కళాజిందాబాద్ ‘’అనాల్సిందే .నేను చూసిన వాటిని నేను అర్ధం చేసుకొన్న వాటిని నేను చదివి తెలుసుకొన్న వాటిని నాకు తెలిసిన భాషలో రాశాను .ఇది ఆసక్తి కలవారికి మరింత ఆసక్తి కలిగి అందులోని లోతులు తరచి చూడటానికి ఒక దారి మాత్రమె .ఇదే సమగ్రం ,సంపూర్ణం    కాదని మనవి .

ఖజురహో దగ్గర ఉన్న ‘’ఓర్చా ‘’శిల్ప కళా వైభవం గురించి తరువాత తెలియ జేసి ఈ ఖజురాహో సీరియల్ ను పూర్తీ చేసి మా యాత్రలో మిగిలి ఉన్న ఉజ్జయిని ఓంకారేశ్వర్ యాత్ర గురించి రాస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-15-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -12 ఖజురహో కళలహో అదరహో ఖజురహో దేవాలయాల వైవిధ్యం

మా నవరాత్రి యాత్ర -12

ఖజురహో కళలహో  అదరహో

ఖజురహో దేవాలయాల వైవిధ్యం

ఖజురహో దేవాలయాలు దేవ విహార భూములు .ఈ దేవాలయ సముదాయం శివుడికో విష్ణువు కో లేక జైన తీర్ధంకరులకో అన్కితమివ్వబడ్డాయి . ఎనభై అయిదు దేవాలయాలకు నేడు ఉన్నవి పాతిక మాత్రమె.సౌకర్యార్ధం వీటిని మూడు గ్రూపులుగా చేశారు పడమటి తూర్పు ,దక్షిణ దేవాలయాలుగా వీటిని పేర్కొంటారు .

పశ్చిమ దేవాలయాలు

పశ్చిమ వైపున్న దేవాలయాలకు అందమైన ఉద్యాన వనం స్వాగత మిస్తుంది .ఇవి బ్రమీతా రాజ నగర్ రోడ్ లో ఖజురహో గ్రామానికి పడమర గా ఉన్నాయి .ఇవి రెండు వరుసలలో ఉన్నాయి .చుట్టూ ఫెన్సింగ్ తో ప్రవేశ ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది .ఒకప్పుడు ఇది అంతా పెద్ద తటాకం .ఇక్కడి లక్ష్మణ ,విశ్వనాధ దేవాలయాలను మహా రాజులు నిర్మించారని ,మూడవది అతి పెద్దది అయిన  కందరీయ మహాదేవ ఆలయాన్ని రాజసం గా నిర్మించారని చెబుతారు  .ఇందులోని పెద్ద ఆలయాలు ఎక్కువ భాగం తూర్పు ముఖం గా ఉండి ఉత్తర దక్షిణా లకు వ్యాపించి ఉంటాయి .ఇందులో ఉన్నవి శివ లేక విష్ణు ఆలయాలే .చిత్ర గుప్త దేవాలయం ఒక్కటే సూర్య దేవాలయం .

1- చౌసత్ –యోగిని దేవాలయం

ఇది తొమ్మిదో శతాబ్ది ఆలయం .ముతక గ్రానైట్ రాయితో నిర్మింప బడిన ప్రాచీన ఆలయం .శివ సాగర్ జలాశయం ప్రాంతం నుండి నిర్మాణానికి గ్రానైట్ తెప్పించి వాడారు .దాదాపు అయిదున్నర మీటర్ల ప్లాట్ ఫారం పై  చతుర్భుజా కారం గా31 మీటర్లు , 18మీటర్ల కొలత లో ఉంది అరవై ఏడు చుట్టూ దేవతలతో కనిపిస్తుంది .చిన్న గూడులలో దేవతా విగ్రహాలుంటాయి. గుండ్రం గా ఉండే శిఖరం ఉంటుంది .ఇందులో ఖజురహో శైలి కొద్దిగా నే ప్రదర్శిత మౌతుంది .బ్రాహ్మణి ,మహేశ్వరి మహిషాసుర మర్దిని పెద్ద విగ్రహాలు అబ్బుర పరుస్తాయి .మహేశ్వరి హింగులాజీ విగ్రహాలు తరువాత చేరాయి

2-లాల్ గాన్ –మహాదేవాలయం

క్రీ.శ  900లో నిర్మించారు .చౌసాత్ యోగిని దేవాలయానికి ఎనిమిది వందల మీటర్ల పడమర ఈ ఆలయం ఉన్నది పిరమిడ్ ఆకారపు నిర్మాణం .ప్రవేశ భాగం శిదిలై పోయింది .సంధి కాలానికి చెందినా ఆలయం ఇసుక రాయి ని మొదటి సారిగా గ్రానైట్ తో బాటు ఎక్కువగా వాడారు .ప్లాట్ ఫారానికి గ్రానైట్ ను శిఖరానికి’’ సాంద్ స్టోన్’’ ను వాడారు .ప్రవేశం లో విరిగిన నంది విగ్రహం ఉంది .పడమటి ముఖపు ఆలయమిది శివునికి అంకితమైన ఆలయం .

3-వరాహ ఆలయం

ఇది 900-925కాలపు నిర్మాణం .వరాహ విగ్రహం ఒక చిన్న ఎత్తైన గుడి లాంటి ఆకారం లో ఉంటుంది భారీ విగ్రహమే .పిరమిడ్ పై కప్పు ఉంది .విష్ణువు యొక్క వరాహావతారమే ఈ విగ్రహం .తోమ్మిదడుగుల పొడవు ఆరడుగుల ఎత్తుఉన్న విగ్రహం ఇది .ఏక నల్ల శిలా నిర్మితం. వరాహం శరీరం పై 672హిందూ దేవతలా విగ్రహాలు ఉండటం ఆశ్చర్యం ఆకర్షణీయం కూడా .భూదేవతను శేష నాగుడు కాపాడే ముచ్చట గా ఉంది .వికసించిన పద్మ శిల్పం మనోహరం .ఇది పూర్తిగా ఇసుక రాయితో చేయబడింది .బ్రహ్మ ,లాల్ గువాన్ మహాదేవ దేవాలయాలు గ్రానైట్ ,ఇసుక రాయి వాడకపు సంధికాలం లోనివి .

4-మాతంగేశ్వరాలయం

900-925కాలం లో నిర్మించ బడింది .శివుడికి అంకి తం గర్భాలయం లోపెద్ద శివ లింగం ఉంది మూడున్నర  అడుగుల కైవారం తో ఎనిమిదిన్నర అడుగుల భారీ శివలింగం మెరిసి పోతూ పసుపు రంగులో ఉంటుంది .విశాల మైన గౌరీ పట్టా అంటే పాను వాట్టం ఉంటుంది .మూడు వైపులా కిటికీలున్నా చతుర్భుజ ఆలయం బ్రహ్మ దెవాలయానికీది విస్తృత రూపం .ఈ ఆలయం లోనే ఖజురాహో శిలల్ప శైలి . వికసించటం ప్రారంభమైందని చెబుతారు .పాను వాట్టం పైనే నడిచి లింగాన్ని  దర్శిస్తారు .పూజారి కూడా దాని మీదే కూచుని పూజాదికాలు చేస్తాడు

5-పార్వతి ఆలయం

950-1000కాలం లో కట్టిన ఆలయం విశ్వనాదాలయానికి దక్షిణాన ఉన్నది .గర్భాగ్రుహం హాలు ఉన్నాయి ద్వారం పై వైష్ణవ దేవతా విగ్రహాలు ,గర్భ గుడిలో గౌరీ దేవి విగ్రహం ఆమె వాహనమూ ఉంటాయి. దీనికి దగ్గరలో అంతకు ముందు వందేళ్ళ క్రితం ఛాత్రపూర్ రాజు కట్టిన ప్రాచీనఆలయమిది .

6-లక్ష్మణ దేవాలయం

930-950కాలం నాటిది .శివ సాగర్ సమీపం లోని అతి విశాలమైన ఎత్తైన దేవాలయం .చండేలా రాజుల శిల్ప కళా తృష్ణ కు శిల్ప కళా వైభావానినికి నిదర్శనం .పరిపూర్ణతకు ఉదాహరణ.చతుర్భుజుడైన వైకుంఠ విష్ణుదేవునికి అంకితమైంది .యశోవర్మ రాజు కట్టించిన ఆలయం .ఎత్తైన విశాలమైన ప్లాట్ ఫారం పై నిర్మింప బడింది .సహజం గా ఇది’’ గరుడుడి’’కి అన్కితమివ్వ బడింది .బ్రాహ్మణి అనే దేవి ఉంటుంది .కందరీయ ,మహాదేవ ,విశ్వనాధ ఆలయాలు పంచాయతన ఆలయాలు .లక్ష్మణ ఆలయం లో నాలుగు మూలలా దేవతా విగ్రహాలున్నాయి .కిందినుంచి పైకి మెట్లు ఎక్కి చేరాలి .గుర్రపు వరుసలు ఏనుగుల వరుస ఒతేలు యుద్ద్ధ దృశ్యాలు నృత్యకారులు సంగీత కారులు ,రతి భంగిమలలో అనేక దృశ్యాల శిల్పాలు బయటి గోడపై ఉంటాయి .లోపల రెండు మకర తతోరణాలతో భాగాలున్నాయి .స్తంభాల ఆలయం లో అప్సరసలు కొలువై ఉన్నారు .ఇక్కడి ఎనిమిది శిల్పాలు తంత్ర విభాగం లో ఎనిమిది విశేషాలు .గర్భాలయానికి ద్వారం పై సింహాలు విష్ణు అవతారాలు ,నవ గ్రహాలూ సాగర మధనం చేకబడ్డాయి సురసున్దరిలు అపసరాలు దేవి సేవలో తరిస్తూ కానీ పిస్తారు .మధ్యయుగపు కళకు నిదర్శనం గా దేవి సేవికలు సేవాభావం తో ఎదురు చూడటం నాట్య గణపతి అద్భుత కళా ఖండాలుగా ఇక్కడ దర్శన మిస్తాయి .

7-విశ్వనాదాలయం

దుగావాన్ అనే శిధిల సరస్సు ఒడ్డున ఉంది .1002కాలపు నిర్మాణం .శివునికి అంకితం .దంగా దేవా రాజు దీన్ని నిర్మించాడు .లక్ష్మణ కండరీయ దేవాలయ శైలి ఇక్కడా కని  పిస్తుంది .ఎత్తైన ప్లాట్ ఫారం పై ఆలయం నిర్మితమైంది .దంపతులు వాహన శ్రేణులు సప్త మాతృకలు గణేష్ వీరభద్ర విగ్రహాలు ఉన్నాయి అందమైన ముఖ ద్వారం గర్భాలయానికి దారి తీస్తుంది .మధ్యాహాలు చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉన్నాయి ఒక చేతిలో చిలుక వేరొక చేతిలో పండు ఉన్న స్త్రీ శిల్పం బాగుంటుంది మధ్య హాలుపైకప్పుపై అనేక పుష్పాలు చెక్కబడి కను విందు చేస్తాయి .అంది విగ్రహం తూర్పున ఉంది పిరమిడ్ ఆకారపు కప్పు ఉంటుంది .

8-నంది విగ్రహం

విశ్వనాదాలయానికి అను బంధం గా  నంది  విగ్రహం ఉంది .ఇది బృహన్నంది.శివాభిముఖం గా ఉంటుంది పిరమిడ్ రూఫ్ ఉంది .

9-చిత్ర గుప్తాలయం

పదకొండవ శతాబ్ది ఆలయం .సూర్య దేవుడికి అంకితం .జగదాంబాలయానికి దక్షిణాన ఉంటుంది .మూడు అంతస్తుల చోప్రా అనే టాంక్ ఉంది. ముఖ్య దేవుడు సప్తాశ్వ రధ సారధి సూర్య దేవుడు ముఖ ద్వారం పై చెక్కారు .దశావతారాలూ ఉంటాయి దీన్ని భరత్ జి దేవాలయం అంటారు .గర్భాలయం లో సూర్య దేవుడి నిలువెత్తు విగ్రహం ఉంటుంది .

10-జగదాంబా దేవి ఆలయం

ఇదీ పదకొండవ శతాబ్ది ఆలయమే .విష్ణువుకు అంకితం  గర్భ  గుడిలో పార్వతి మాత విగ్రహం ఉంది.తూర్పు ముఖ ద్వారం .చిత్రగుప్తాలయపు నమూనానే .కాళికాలయమనీ అంటారు .బయటి గోడలపై శిల్పాలు అత్యంత నాణ్యమైనవని గుర్తించారు .విష్ణు, యమ దేవతా విగ్రహాలున్నాయి .చందేల కళ సంపూర్ణం గా వికసించిన వైభవం ఈ ఆలయం లో కని  పిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -10 ఖజురహో కళలహో అదరహోఖజురహో శిల్ప శోభ

మా నవ రాత్రి యాత్ర -10

ఖజురహో కళలహో అదరహో

ఖజురహో శిల్ప శోభ

హిందూ దేవతా విగ్రహ నిర్మాణానికి అత్యున్నత వైభవం కల్పించింది ఖజురహో .అనేక తరహాల హావభావ శోభా విలసితమైన విగ్రహాలకు ఇది తార్కాణ.పర్వతం అంత భారీ దేవాలయము  వెలుపలి లోపలి గోడలన్నీ శిల్పాక్రుతులతో పరవశం కలిగిస్తాయి .గోడలపై ఉన్న శిల్పకళా చాతుర్యం చూస్తె ఒకే విధమైన అపూర్వ శిల్పకళా సృష్టితో ఆకర్షించి అంతా ఒకటేనన్న భావం కలుగుతుంది .ఒక్క అంగుళం కూడా వదలకుండా గోడలన్నీ శిల్ప కళతో జీవం పోసుకోన్నాయి .రెండున్నర నుండి మూడు అడుగుల ఎత్తుఉన్న శిల్పాలు 872 కందరీయ దేవాలయం గోడలపై ఉన్నాయి .విశ్వనాధాలయం పై 674,విగ్రహాలున్నాయి .వరాహ దేవాలయం లోని వరాహ మూర్తి శరీరం పై 672హిందూ దేవతా మూర్తులు  శిల్పీకరించ బడి  ముక్కున వేలేసుకొనేట్లు చేస్తాయి .పనికి రాని రాయి ని ప్రతిదానినీ అద్భుత శిల్పం గా మలిచారు శిల్ప బ్రహ్మలు .ఒక కన్య కాళ్ళు జాపుకొని ఉన్న విగ్రహం ,స్నానం చేసిన తర్వాత తడి జుట్టు నుండి రాలి పడుతున్న జల బిందువులు ,ఒక సురసుందరి కాలి లో ముళ్ళు తీసుకోవటం ,కండరాలు నాడులు అన్నీ అతి స్పష్టం గా కని  పించేట్లు చెక్కి దివ్య విభూతిని కలిగిస్తాయి .వీటికి సాటి శిల్పాలు ప్రపంచం లో ఇంకా ఎక్కడా మనకు కనిపించవన్న మాట .ముమ్మాటికీ నిజం అని ధంకా బజాయించి చెబుతున్నారు శిల్ప రహస్య వేత్తలు .ఇవికాక దర్బారు సీన్లు ,యుద్ధ విన్యాసాలు ,రాజులు కొలువై ప్రజల ఫిర్యాదులు వినటం సలహాలివ్వటం వగైరా మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని సంతృప్తినీ కలిగిస్తాయి .

ఈ అద్భుత శిల్ప రాశి మధ్యలో ఖాళీ ఉండి శోభాయమానం గా ఉన్నాయి.కైమూర్ ఇసుక రాయి ని ఖజురహో విగ్రహాల నిర్మాణానికి వాడారు .ఇది సూక్ష్మ శిల్పీకరణకు మైనం లాగా ఒదిగి పోతుంది .అందుకే ఈ రాయి తో ఆభరణాలు ,వస్త్రాలు ,నీటి బిందువులు ,జుట్టు వెంట్రుకలు ,బట్టల మడతలు ,శరీరం ముడుతలు అన్నిటినీ స్పష్టం గా కని  పించేట్లు చెక్క టానికి అనువుగా ఉన్న రాయి ఇది .అందుకే అంతటి శిలా సౌందర్యం వెల్లి విరిసింది .శిల్ప శాస్త్ర విధానాన్ని తు చ తప్పక పాటించి మలచిన విగ్రహాలివి .ముఖం కోడి అండాక్రుతి లో ఉండాలని శిల్ప శాస్త్రం చెబుతోంది .నుదురు ధనువు లా ,కళ్ళు విశాలం గా కొనదేలి మత్స్యాక్రుతిగా ,కంటి రెప్పలు వేపాకుల్లా ,గడ్డం మామిడి టెంకలా కాళ్ళూ చేతులూ పద్మాలు గా ,చాతీ విశాలం గా ,పిరుదులు చనులు బలం గా విశాలంగా  ఉండాలన్నది శిల్ప శాస్త్ర నియమ మే .దాన్నే పాటిం చారీ  శిల్పులు .

ఖజురహో లో సమాంతర శిలలపై నిలువు శిలలు ఉంచి కప్పు ఆకృతిని కల్పించారు .సిమెంటు గానుగ సున్నం చాలా తక్కువగా వాడారు .గ్రానైట్ శిలను ముందే శిల్పం గా చెక్కి ఉంచాల్సిన స్థానం లో అమర్చారు .ఖజురాహో శిల్పుల ప్రతిభా సామర్ధ్యం సృజనా నైపుణ్యం వైవిధ్యం మాటలకు అందనివి .ఆదిశేషుడు కూడా వాటిని పొగడటానికి చాలదు అని పిస్తుంది .

ముఖ్య దేవతా విగ్రహాలైన శివుడు ,విష్ణు ,సూర్యుడు జైన తీర్ధన్కరులను ఆగమ శాస్త్ర నియమాలకు లోబడే శిల్పీకరించారు .మిగిలిన వాటిని తమ సృజనతో తీర్చి దిద్దారు .ఇదొక విభాగం.సాధారణ దేవతా విగ్రహాలను  అంటే అప్సరసలు ,సుర సుందరిల విగ్రహాలను లోపలి గోడలపై చెక్కటం రెండవ విభాగం .కొన్ని విగ్రహాలు ‘’త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ ‘’ను ఇవ్వటం పరమాశ్చర్యమేస్తుంది .ఖజురహో సుందరులు శిల్పుల ఊహా  వికాసానికి మచ్చుతునకలు .పరిపుష్టమైన అంగ సౌష్టవం తో ఉలి నుంచి జాలువారిన సుందరీమణులు .శరీరం లోని ప్రతి అణువునూ వంపులు సొంపులను అన్నిటినీ ప్రతిఫలింప జేశాడు ముఖ్య శిల్పి .ఆవలింతలు బట్టలు విప్పి వేయటాలు ,కుచాలను హత్తుకోవటాలు గోరింటాకు పెట్టుకోవటం ,వేణువు ఊదటం ,నృత్య ప్రదర్శనను అత్యంత సమర్ధం గా చేయటం ,జాబులు  రాయటం ,రాస్తూ కలాన్ని పెదిమకు ఆనించి పెట్టుకోవటం ,నిరాశా నిస్పృహ విరహం తో వేదన చెందటం ఓహ్ ఒకటేమిటి సకల భంగిమలు ఆ శిల్పి చిత్రీకరించి జీవం పోశాడు .సేవకులు సేవికలు సజీవం గా కనిపిస్తారు .

ఖజురహో ఆలయ గోడలపై ఉన్న శృంగార భంగిమలు మైధున క్రీడకు చెందినవి .ఇవి మూడవ విభాగానికి చెందినవి .రతిక్రీడల తో అనేక భంగిమల్లో చెక్కిన శిల్పాలు కామ శాస్త్ర కేళీ విలాసానికి చెందినవే ‘’ the couple exibit gymnastic or un natural poses described in texts like kaama sootra ,rati rahasya ,ananga ranga .They fornicate in standing ,sitting ,supine ,side and reverse positions .They engage oral sex extravaginal or autocratic sex .the lady mounts the man like mounting a tree .She bends and stands on all fours 0n the ground like a cow ,while theman performs from behind .she engulfs aman in coital embrace like a creeper embraces a tree .the main performer stand on his or her head supporting other .The make up picks up and supports the girl on his this by flexing his necks while the lady wraps her arms around his neck .A man  has sex with a mare .A nude male and female showing genetial organs or touching one another form of erotic sculpture .Sexula congress in group or plural intercourse wherein four persons participate with one women or three women with one man is another type of erotic sculpture in khajuraho temples .ఇటువంటివన్నీ మూడవ విభాగానికి చెందాయి .

నాలుగో విభాగం లో గ్రూపు డాన్సులు ,సంగీత వాద్య కారులు ,వేట దృశ్యాలు ,జంతువులతో పోరాటాలు ,సైనిక కవాతులు ,శిల్పాలు చెక్కే శిల్పి బొమ్మలు ఉన్నాయి సమకాలీన చరిత్రకు అడ్డం పట్టేవే ఇవన్నీ .అయిదవది చివరిదీ అయిన విభాగం లో వ్యాలంలేక శార్దూలం ,కోరల సింహం దానితో ఒరాడే యోధుడు .ఏనుగు ముఖాలు  చిలుకలు ఎలుగు బంటి  శిల్పాలు ఇందులో చేరతాయి .దాదాపు ఇవన్నీ ప్రతికాత్మికాలే నని గ్రహించాలి .ఖజురహో దేవాలయాలు రెండు తరగతులకు చెందాయి ఒకటి లక్ష్మణ కందరీయ ,మహాదేవ, దేవి, చిత్ర గుప్త,విశ్వనాధ  ఆలయాలు .వీటి బయటి గోడలపై శృంగార భంగిమ లున్న శిల్పాలెన్నో ఉన్నాయి .ఇక రెండవ తరగతికి చెందిన వాటిలో చతుర్భుజ ,పార్శ్వనాధ ,ఆదినాధ ,జవారి ,వామన దులాదేవ ఆలయాలున్నాయి ఇవి 1050-1150కాలం లో నిర్మితమైనవి .ఇందులో అసభ్యకర శృంగార శిల్పాలు అతి తక్కువ గా ఉన్నాయి .దులాదేవ దేవాలయం లో చాలా శృంగార భంగిమలున్న   చిత్రాలున్నయన్నది నిజమే .జవేరి వామన దేవాలయాలలో ఈ దృశ్యాలు కనీ పించవు .ఆదినాధ చతుర్భుజ దేవాలయాలలో ఈ శృంగార వాసన అసలే కనీ పించక పోవటం విచిత్రం గా ఉంది .

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -9 ఖజురహో కళలాహో అదురహో

మా నవ రాత్రి యాత్ర -9

ఖజురహో కళలాహో అదురహో

ఖజురహో ఆలయ శిల్ప కళావైభవం

ఖజురహో దేవాలయ సముదాయ శిల్పకళ ఇండో ఆర్యన్ సంస్కృతికి చెందింది .మధ్యయుగ శిల్పకళా వైభవానికి నిలు వెత్తు నీరాజనాలివి .శిల్పకళ పరి పూర్ణం గా వర్ధిల్లి నేటికీ భద్రం గా రక్షింపబడిన సమూహం ఇది .బెంజమిన్ రోలాండ్ అనే ప్రఖ్యాత శిల్ప శాస్త్ర వేత్త దీన్ని ‘’ The Khajuraho artist seems to be thoroughly versed in the mnemonic traditions and textual canons ,the grammar and syntax of architecture and iconography’’అని కీర్తి కిరీటం పెట్టాడు .ఇండో ఆర్యనుల కళా మేళవింపు మేధావితనం ఈ సముదాయాన్ని సర్వోత్క్రుస్త స్తితికి తెచ్చిందని మెచ్చుకున్నాడాయన .

నగర్ ఆలయ నిర్మాణ శైలి భూమి,పై శిఖరం లోను ,సూచీ అగ్రం గాను చుట్టూ విస్తరించి ఉండటం లోను జ్యోతకమవుతుంది .చౌన్స్ నాద దేవాలయం తప్ప మిగిలిన ఖజురహో ఆలయాలన్నీ అత్యంత నాణ్యమైన  శుద్ధి చేసిన ఇసుక రాయి తో నిర్మితమైనాయి .లేత పసుపు రంగు కొద్ది పాటి ఊదారంగు రాయి తూర్పు తాటాక తీరం లోని  ‘’పన్నా ‘’నుండి తెచ్చారు .పెద్ద రాళ్ళను క్వారీల వద్దనే శిల్పాలుగా మలిచి ఇక్కడికి రవాణా చేశారు .వాటిని దేవాలయ ప్రాంతం లో ఒకదానితో ఒకటి అంటించి ఆలయాలన్నిటినీ నిర్మించారు .చౌశాత్ యోగిని దేవాలయాన్ని మాత్రం గ్రానైట్ రాయితో కట్టారు .స్థానికం గా దొరికే గ్రానైట్ ముతకగా ఉండటం తో పన్నా వెళ్లిఇసుక రాతిని  తేవాల్సివచ్చింది .

This slideshow requires JavaScript.

ఫెర్గూసన్  పండితుడు ‘’ఖజురహో దేవాలయాలను ఒకదానికొకటి విడ మరచి  తెలుసుకోవటానికి సూక్ష్మ పరిశీలన అవసరం .అన్నీ ఒకే రాజు నిర్మించి నట్లు అని పిస్తుంది .ఒకదాన్ని చూసి రెండోది ఈర్ష్య కల్గిన్చేదిగా కని  పిస్తుంది .అధిక శ్రమకు ఇవి ప్రతీకలు ‘’అన్నాడు .మిగతా చోట్లున్న దేవాలయాల కంటే ఖజురాహో ఆలయాలు కోణ నిర్మాణాలకు సూక్ష్మ అగ్రాలకు ప్రతినిధులుగా కనిపిస్తాయి .సమాంతరం గ నైనా నిలువుగానైనా ,మూలల్లోనైనా ఈ ప్రత్యేకత గోచరిస్తుంది .శిఖర సముదాయాలతో కూడిన ఆలయ శిఖరం వంకీలతో నగిషీ చెక్కిన ట్లుంది ఆశ్చర్య పరుస్తుంది .ఇలా పైకి పోయి పోయి గుండ్రని ఆమలక శిఖర రూపు దాలుస్తుంది .పద్మంవికశించి సూక్షం రూపం లో కి మారినట్లు ,అంతరిక్ష శూన్యానికి ప్రతీకగా విశ్వమానవ కపాల భాగం గా రూపు దాల్చటం ఖజురాహో ఆలయాల విచక్షణత .రోలాండ్ భాషలో ‘’Distinct characteristic of Khajuraho temple archi tecture is that the temples stand on a lofty terrace and are not surrounded by usual enclosure walls ,proudly proclaiming their presence asif they had nothing to fear from iconoclasts ,vandals and marauders .The terrace or the lofty platform provides an outer pradakshina or open ambulatory on which the devotees can go round the temple .The shrines can be entered into only after ascending a number of stairs which lead to the portico or Ardha mandapa .Usually most of the temples except the Chaturbhuja temple and Lalgaun Madhav temple have their entrance from the east .these two have west entrance ..’

పెర్సి బ్రౌన్ అనే మరో విశ్లేషకుడు ‘’అర్ధమండపాలు మహా శిల్ప సౌందర్యం గల మకర తోరణాలతో విరాజిల్లాయి .ఇవి దంతపు నగిషీని  తలదన్నే శిల్ప విన్నాణాన్ని ప్రదర్శిస్తాయి .లక్ష్మణ ,కందరీయ ,విశ్వనాధ దేవాలయాలను ‘’పంచాయతన దేవాలయాలు ‘’అంటారు .పంచాయతన దేవాలయం అంటే గర్భ గుడిలో ఆ దేవాలయానికి చెందినా పెద్దదేవతా  విగ్రహంతో బాటు నాలుగు చిన్న విగ్రహాలు నాలుగు మూలలా ఉండటం .దేవాలయ నిర్మాణం అయిదు సోపానాల్లో ఉంటుంది .అర్ధమండపం ,మండపం అనే హాలు ,అంతరాలయం లేక గర్భాలయం ,మహా మండపం ,ప్రదక్షిణ సౌకర్యం కల దారి కలిగి ఉంటాయి .ఇందులో ప్రతి దాని శైలి భిన్నం గా నేఉండి శిల్ప శోభగల పైకప్పు ఉంటుంది .ప్రతి ఆలయం సంపూర్ణ కళా విలాసమై ఒకే తరహాలో కని  పిస్తుంది తప్ప దేనికది ప్రత్యేకం  ఉండక పోవటం ఖజురహో ప్రత్యేకత .’’ ‘’all these separate structure do not appear as an independent structures or buildings but are co-ordinated into a compact architectural synthesis ‘’

ఆలయ వివిధ భాగాలు ఒకదానికొకటి సంబంధం కలిగి కోరికను బహిర్గతం చేసేదానికి చిహ్నం గా ఉంటుంది టేర్రాస్ పై నిలువుగా గోడలు బాల్కనీలు లోపలి గృహాలు రెండు లేక మూడు సమాంతర శిల్పాలు ఆ పైన కప్పు ,ఇవన్నీ కలిసి అపురూప శిఖరావతారం దాలుస్తాయి .ఆమలక ఉంగరపు రూపు వస్తుంది చివరగా కలశాలు ,బాల్కనీ కిటికీలు ,వాటి గుండా కొద్దిగా  కాంతి ప్రసారం తో ఆలయం లోపల సగం వెలుగు సగం చీకటి గా చీకటి వెలుగుల రంగేళీ గా భాసిస్తుంది .గర్భ గృహం వెలుపల ప్రదక్షిణ మార్గం ఉంటుంది .ఈ మార్గం లో ఎన్నో శిల్పాలు మూడు అంతస్తులలో  దివ్య విభూతి తో దర్శన మిస్తాయి .ఇలా కందరియ ,లక్ష్మణ ,విశ్వనాధ  పార్శ్వనాధ దేవాలయాలలో ఉంటుంది .వీటిని ‘’సాం ధార  ప్రాసాదాలు ‘’అంటారు .పార్శ్వనాధాలయం లో రెండు గర్భ గ్రుహాలుంటాయి ఒకటి ఉత్తరానికి రెండోది దక్షిణానికి ఉంటుంది .చిత్రగుప్త ,జగదాంబా ,వామన ,జవారి దులాదేవ్ చతుర్భుజ ఆదినాధ ఆలయాలను ‘’నిరాధార ప్రాసాదాలు ‘’అంటారు .కారణం వీటికి ప్రదక్షిణ మార్గం లేక పోవటమే .పిరమిడ్ ఆకారపు ప్రత్యెక శిఖరాలు అర్ధ మండపం నుండి గర్భ గృహం వరకు పైకి వ్యాపించి ఉన్నతాశాయాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి .బెంజమిన్ రోలాండ్ దీనిపై స్పందిస్తూ ‘’The dominant impression of Khajuraho shrines is that of number of separate super structures ,each with its Amalaka and final ,building up a great mountain of masonry .The verticalism is emphasized through out from  the high base through the successive walls and roofs to the ultimate range of lesser peaks and constitute the main spire ‘’అని ఆ శిల్ప నిర్మాణ రహస్యాన్ని విప్పి చెప్పాడు .అతి విశాల హాలు పైన ఉన్న అతి పెద్ద శిఖరం ‘’సుకనాసం ‘(చిలుక ముక్కు)అనే స్తంభం కింది వరకు ఉంటుంది .సుక నాసమే చివరి బిందువు .ఒక సింహం పై కప్పును చూస్తూ ఉంటుంది .ముఖ్య శిఖరం ప్రక్కటెముకల సముదాయం గా అని పిస్తుంది ఇవన్నీ గుండ్రని కలశాలు  కలిగి ఉంటాయి .శిఖరం మీద శిల్పీకరించిన విగ్రహాలలో అనేక రీతులుంటాయి.అష్టభుజాక్రుతి కీర్తి ముఖాలుంటాయి .మొదలు వెడల్పుగా ఉండి పైకి సూచీలాగా తేలటం వీటి ప్రత్యేకత .సాలభంజికలు ,తీర్ధన్కరులవిగ్రహాలతో విరాజమానమవుతాయి ఒక్క క్షణం  కూడా దృష్టిని మరల్చటానికి వీలు లేనంత తన్మయ తన్మయ స్తితిలో చూస్తాం .ఆలయ లోపలి భాగాలన్నీ వాస్తు ననుసరించే ఉంటాయి .అంతరాలయం లో చంద్ర శిల గర్భాలయానికిదారి తీస్తుంది .లోపల రధాలు ,సలిలాన్తరాలు ముఖ్య దేవీ దేవతా విగ్రహాలతో పాటు చెక్కి ఉంటాయి నాగుల ,శార్దూలాలశిల్పాలు మహిమాన్వితం గా ఉంటాయి .ఆలయ పైకప్పు అంతా శిల్పకళా విరాజితమే .ఖజురహో దేవాలయ శిల్పా విన్యాసం ‘’నాగర ‘’శైలికి పరమోత్క్రుస్త ఉదాహరణ గా నిలిచింది ‘’khajuraho templearchi tecture was a marvel of the perfectly evolved Nagra style in which the counter pointed melodies of architecture and sculpture were held in a fine tune complex balance .The sculptor’s fine skill and a sense of imagination have given form to human emotion in the form of spiritual and physical love ‘’అని ఖజురహో ఆలయ శిల్ప కళా రహస్యాన్ని విడమర్చి చెప్పారు .

మరికొన్ని శిల్ప విశేషాలు మరో సారి

సశేషం

మీ– దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -8 ఖజురహో కళలహో అదరహో

మా నవ రాత్రి యాత్ర -8

IMG_0688

చారిత్రకాంశాలు

ఆర్.వి రసెల్ పండితుని దృష్టిలో మధ్య భారతం లో సుప్రసిద్ధులైన ‘’భారులు ‘’అనే శిల్ప వంశానికి చెందినవారే  చండేలా రాజ వంశ మూల పురుషులు .954కాలపు శిలా శాసనం ప్రకారం ఈ వంశ మూల పురుషుడు ‘’చంద్రాత్రేయ మహర్షి ‘’.కనుక చంద్రాత్రేయుడు లేక చంద్ర వర్మ ఈ వంశానికి మూలపురుషుడు .చంద్రవర్మ ఖజురహో లో రాజదానినేర్పరచి పాలించాడు .కన్నింగ్ హాం ఊహించిన దాని ప్రకారం కాశీ కి చెందిన ఘద్వారా రాజు ఇంద్రజిత్ పురోహితుడు హేమరాజే చంద్ర వర్మ గా క్రీ.శ.168లో ఖజురహో రాజు గా అభిషిక్తుడయ్యాడు .చరిత్ర లోతుల్లోకి వెడితే తొమ్మిదో శతాబ్ది పూర్వభాగం లో పాలించిన ‘’నన్నూకుడు ‘’ఈ వంశానికి మొదటి రాజు .ప్రతీహార రాజులు బలహీన పాలకులుగాతయారై విచ్చిత్తి చెందే సమయం లో    చందేలీ రాజులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు .నన్నూకుడే మొదట స్వాతంత్ర చండేలా రాజు .అతని తర్వాత కొడుకు’’ వాక్ పతి’’ రాజు అయి తొమ్మిదో శతాబ్దం ఉత్తరార్ధం అంతా పాలించాడు .సామ్రాజ్యాన్ని క్రమం గా విస్తరిస్తూ వింధ్య పర్వత భాగాలలో కొన్ని స్వాధీన పరచుకొన్నాడు వాక్ పతి ..అతని ఇద్దరుకోడుకులు జయ శక్తి ,విజయ శక్తి తండ్రి తరువాత చందేలా రాజులై పాలించారు .అన్నదమ్ములిద్దరూ  ధైర్య సాహస వంతులై నందున అనేక రాజ్యాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించారు .మొదట జైశక్తి రాజై  రాజ్యం చేశాడు .ఇతనినే ‘’జైజక్ ‘’లేక ‘’జేజకా ‘’అనే వారు .తను పాలించిన ప్రాంతాన్ని అంతటిని ‘’’’జైజక భుక్తి ‘’గా ప్రకటించుకొన్నాడు .కొడుకులు లేనందున వారసుడిగా తమ్ముడు విజయ శక్తిని ప్రకటించి రాజ్య పాలన చేయించాడు .

శిలా శాసనాదారాలను బట్టి విజయ శక్తి అనేక యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను వశపరచుకొని రాజ్య విస్తరణ చేసి విజేత అయ్యాడు .అన్నదమ్ములైన జయ ,విజయుల వీరగాదలను కధలుగా గేయాలుగా పాడుకొనే వారు .ఇద్దరూ కలిసి పాలించినట్లే భావించేవారు ప్రజలు .విజయశక్తి తర్వాత కొడుకు రాహిల్ రాజయ్యాడు .రెండేళ్ళు పాలించాడు మహోబా కు దగ్గరలో రహీలా గ్రామం అతని పేర ఏర్పడింది .’’రహీల్ సాగర్’’ సరస్సు నిర్మించాడు .అతని తర్వాత కొడుకు హర్షదేవుడు క్రీ.శ900లోరాజై, 25 ఏళ్ళు సుదీర్ఘ రాజ్య పాలన చేశాడు .అతనికాలమే మహోన్నతమైన్డిగా చరిత్రాకారులు భావిస్తారు .’’ఓద్’’ కు  చెందిన కనోజ రాజ్యానికి ప్రతీహార రాజు మొదటి మహీ పాలుడిని రాజు గా చేయటానికి  హర్ష దేవుడు కృషి చేశాడు .అంతకు ముందు రాష్ట్ర కూటులు మహీపాల్ ను ఓడించి రాజ్యాన్ని లోబరచుకొన్నారు .ఇది 915లో జరిగింది .ఈ వరుస విజయాలతో హర్ష దేవ రాజు ఖజురాహో లో ‘’మాతం గేశ్వరాలయం ‘’నిర్మించి శివుడికి కానుకగా సమర్పించాడు .

అతని కుమారుడు యశోవర్మ హర్షదేవుని తర్వాత రాజయ్యాడు . అతన్ని లక్షవర్మ అనీ అంటారు .యశోవర్మనే చండేలా రాజ్య పాలకులలో మహా శ్రేస్టూడని అంటారు .ధీర ,వీర శూరుడైన యశో వర్మదక్కన్ పాలకులు  రాష్ట్ర కూటుల్ని జయించి ,దక్షిణాన మాల్వా వరకు తూర్పున గండా ,మిధిల వరకూ రాజ్య విస్తరణ చేశాడు .తానే సర్వ స్వతంత్ర రాజు గా ప్రకటించుకొన్న ధీశాలి యశోవర్మ .ఇతని కాలం లో చండేలా రాజులు మధ్య భారతం లోనే  మహా శక్తి వంతులుగా సమర్ధులుగా గణన కెక్కారు .యశోవర్మ సర్వ సమర్దుడే కాక కళా పిపాసి .అందువల్లనే ఖజురాహో లో ఇంత విశేష దేవాలయ సముదాయ నిర్మాణం జరిగింది .’’లక్ష్మణ దేవాలయాన్ని’’ యశోవర్మ నిర్మించాడిక్కడ .దీన్ని  శ్రీ మహా విష్ణువుకు అంకితమిచ్చాడు .

యశోవర్మ కొడుకు ‘’దంగా ‘’తరువాత రాజై 954-1002కాలం లో రాజ్యం చేశాడు .ప్రతీహారులకు తండ్రి లాగే కప్పం కట్టకుండా కనోజ్ రాజులకు విదేయుడైనాడు .చాలా రాజ్యాలు జయించి రాజ్య విస్తరణ చేశాడు .’’మహా రాజాది రాజు ‘’అని పించుకొన్నాడు .యుద్ధ నిపుణుడేకాక కళా సంస్కృతులపై అపారమైన అభినివేశం ఉన్నవాడు దంగా రాజు .అతనికాలం లోనే మహోత్రుస్టమైన ‘’విశ్వనాధ దేవాలయం’’ ,’’పార్శ్వనాధ దేవాలయం ‘’నిర్మించాడు .పదవ శతాబ్దం లో ఉత్తర భారత దేశం లో దంగా మహా శక్తి వంతమైన మహా రాజు గా వెలిగి పోయాడు .దంగా తర్వాతా కొడుకు ‘’గండ ‘’రాజయ్యాడు .ఇతను(1108-1017) కాలం లో రాజ్య పాలన చేశాడు .తొమ్మిదేళ్ళు మాత్రమె పాలించి రాజా గండ ‘’చిత్ర గుప్త ‘’దేవాలయం ‘’ శ్రీ జగదాంబా దేవాలయాల’’ను నిర్మించాడు .

రాజా గండ మరణం తర్వాత కుమారుడు ‘’విద్యాధరుడు ‘’రాజై1017-1029పాలించాడు .యుద్ధ వీరుడు ,శక్తి వంతుడు అయిన విద్యాధరుడు మహమ్మద్ గజనీ తో రెండు సార్లు యుద్ధం చేసి (1019,1022)కల్చారీలను ,పాలమారులను ఓడించి మధ్యభారతం లో విశిస్టస్తానాన్ని సంపాదించాడు ఇతనికాలం లో చండేలా రాజ్యపాలన ప్రఖ్యాతమైంది .యుద్ధ వీరుడేగాక కళాభిమాని సంస్కృతీ గౌరవం ఉన్న మహారాజు .ఖజురాహో లో ‘’కందారియా మహా దేవా ‘’ఆలయాన్ని అత్యద్భుత శిల్ప కళా నికేతనం గా నిర్మించాడు .ఇతని కొడుకు ‘’విజయపాలుడు ‘’తండ్రి రాజాన్ని సుస్తిరం చేసి దేవాలయ నిర్మాణాలను కొనసాగించాడు .యితడు నిర్మించినదే ‘’వామన దేవాలయం ‘’.ఇతని పెద్దకొడుకు దేవవర్మ తండ్రి మరణానంతరం రాజయ్యాడు .రాజ్యాన్ని కల్చూరీల వరకు వ్యాపింప జేశాడు .ఇతను చనిపోయిన తర్వాతా 1060లో తమ్ముడు ‘’కీర్తివర్మ’’ రాజయ్యాడు .అనేక యుద్ధాలు గెలిచి కల్చూరియాలు ఆక్రమించిన భాగాలన్నితిని కైవశం చేసుకొన్నాడు .

చండేలా రాజు కీర్తి వర్మ 40ఏళ్ళు ఖజురహో ను పరిపాలించాడు .కళలను సాహిత్యాన్ని సంస్కృతినీ అభివృద్ధి చేశాడు ఇతని కాలం లోనే ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రచింప బడి కీర్తి వర్మ ఎదుట ప్రదర్శింప బడింది .’’ఆదినాధ దేవాలయం’’ ,’’జవేరి అంటే బలరామ దేవాలయం’’ ‘’,చతుర్భుజ కృష్ణ దేవాలయం ‘’మొదలైన వాటిని నిర్మించాడు .కీర్తివర్మ పాలన1100తో పూర్తీ అయింది .అతని తర్వాతి రాజులు అనేక క్లిష్ట పరిస్థితుల నెదుర్కొన్నారు .వారి పాలన అంతా యుద్దాలతోనే గడిచి పోయింది .ఉత్తర ,మధ్య భారతాలలో ఈ యుద్ధ వాతావరణం పరమ భీభత్సం గా ఉండేది .చాళుక్యులు కల్చూరియలు ఎప్పుడూ ఖజురహో పై దండ యాత్ర చేస్తూనే ఉండేవారు .కీర్తివర్మ తర్వాతి రాజు’’ సల్లక్షన్ ‘’లేక హోల్లక్షన్ వర్మ రాజై ,తర్వాత జైవర్మ కు పాలన అప్పగించాడు .జయవర్మ గాహర్వార్ రాజుగోవింద వర్మ చేతిలో  చేతిలో1120లో  ఓడిపోయాడు .రాజ్యం వదిలి అరణ్యాలకు చేరాడు .

పృధ్వీ వర్మ అనే ఇతని పిన తండ్రి రాజయ్యాడు .ఏదో విధం గా ఖజురహో రాజ్యాన్ని కాపాడాడు .తర్వాత పృధ్వీ వర్మ కొడుకు’’ మండన వర్మ’1130 లో సింహాసనం ఎక్కిపోయిన రాజ్యాన్ని కీర్తిని మళ్ళీ సంపాదించి పునర్వైభవం కల్పించాడు కలిన్జార్ ,మహోబా ,అజైగర్ లను లోబరచుకొని పరాక్రమోన్నతుడు అయ్యాడు .’’దులాదేవ ‘’ఆలయాన్ని ఖజురాహో లో నిర్మించాడు . 1163వరకు మండన వర్మ పాలన సాగింది .తర్వాత కొడుకు’’ యశోవర్మ’’ రాజయ్యాడు .రెండేళ్ళు మాత్రమె  పాలన చేశాడు. తండ్రి హతాన్మరణం వలన కొడుకు ‘’పరమార్ధ దేవుడు’’ రాజ్యానికి వచ్చాడు .చండేలా రాజ వంశానికి పారమార్ధి దేవుడే చివరి రాజు .35ఏళ్ళు సమర్ధ వంతం గా రాజ్యం ఎలాడు .డిల్లీరాజ పుత్రారాజు   పృధ్వీరాజ చౌహాన్ పారమార్ధి దేవుడిపై దాడి చేశాడు .పారమార్ధి కుమారులు అలహా ,ఉదాల్ లు వీరోచిత యుద్ధం చేశారు .వారి సాహసోపేత ధైర్య సాహస పోరాటాలను ఈ నాటికే పాటలుగా పాడి కీ ర్తిస్తూనే ఉంటారుజనం .’అలహా ఉదాల్ ‘’అనే జాన పద గీతం ఇందులో బాగా ప్రసిద్ది, ప్రచారం పొందింది .ముఖ్యం గా ఉత్తరభారతం లోను బుందేల్ ఖండ్ ప్రాంతం లోను .1182లో ప్రుద్వీ రాజు  పరమార్ధ దేవ మహా రాజును యుద్ధం లో జయించాడు .మహోబా ,ను కోల్పోయాడు .1202లో కుతుబుద్దీన్ ఐబక్ అనే మహమ్మద్ ఘోరి బానిస కలన్జార్ పై దాడి చేసి ఓడించాడు .పారమార్ధి దేవుడు లొంగి పోయాడు .అతని మంత్రి ఈ పిరికి తనానికి ఇతన్ని చంపేశాడు .అప్పటి నుంచి చండేలా రాజ్యం సుల్తానుల పాలన లోకి వచ్చింది .ఇంతకాలం ఖజురహో ను కాపాడుకుంటూ కళా సాంస్కృతిక విస్తరణ చేస్తూ దేవాలయ నిర్మాణాలకు కొత్త జవం జీవం ఇస్తూ సాగిన చండేలా రాజ్య పాలన ఇలా అర్దాంతరం గా ముగిసింది .

ఇంత మంది రాజుల చరిత్ర తో సుత్తి కొట్టానను కొంటున్నారా? వారందరూ లేక పోతే ఖజురహో దేవాలయ శిల్ప చాతుర్యం ప్రపంచానికి తెలిసేదే కాదు .అందుకే ఈ ప్రయత్నం

ఖజురహో శిల్ప సంపద విశేషాలను తరువాత అంద జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -7 అదరహో ఖజురహో విశేషాలు

మా నవరాత్రి యాత్ర -7

అదరహో ఖజురహో విశేషాలు

ఇండియా లో  ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో .తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది .చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల  కళా సృష్టికి దర్పణం .85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమె .ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది .మధ్యప్రదేశ్ లో చట్టర్పూర్ జిల్లాలో ఖజురహో ఉంది .నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం .ఉత్తర దక్షిణ భారత దేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్ప కళ కు కాణాచి గా వెలసిల్లింది .సాత్నా రైల్వే స్టేషన్ దీనికి దగ్గర గా ఉంటుంది .వాతావరణం ఉష్ణ మండల శీతోష్ణ స్తితి .పూర్వకాలం లో వర్షపు నీటిని నిలవ చేయటానికి 60తటాకాలున్దేవి .ఇప్పుడు మూడు తటాకాలు మాత్రమె ఉన్నాయి .అవే ఖజురహో సాగర్ ,శివ సాగర్ ,ప్రేమ సాగర్ లు .ఇ క్కడ ఇప్ప పూల చెట్లు విపరీతం .వీటిని సాగు చేసి పెంచుతారు .ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి .

16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయి పోయింది .1838వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియ లేదు .కెప్టెన్ టి ఎస్ బర్ట్ పల్లకీ లో వెడుతూ ఉంటె అది ఒరిగి పడిపోతే బాగు చేయిస్తూ ఈ కళా ఖండాలను చూసి ఆశ్చర్య పడ్డాడు .’’భారత దేశం లోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించ వచ్చు ‘’అని రిపోర్టు రాశాడు .’’దంగాకు చెందిన 1002నాటి  శిలా శాసనాన్ని’’ కాపీ చేసి పెట్టుకొన్నాడు .ఇది విశ్వనాధ దేవాలయం లో ఉంది .అలేక్సాందర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘’ఖర్జూర వనం’’ అని అర్ధం చెప్పాడు .’’ఖర్జూర వాటిక ‘’అనే వారు ఆ నాడు .అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతం గా పండేది .దీనికి సాక్ష్యం గా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి .ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం .వాటిని విడి గా చూడకుండా మొత్తం ఒకే ద్రుష్టి తో చూడాలని చరిత్రకారులన్నారు .1864లో కన్నింగ్ హాం దర్శించి 872విగ్రహాలున్నాయని ,అందులో గోడలకు వెలుపల 646ఉన్నాయని రిపోర్ట్ రాశాడు .అవన్నీ చెల్లా చెదరుగా పడి కుప్పలు గా ఉండిపోయాయని ఆ శిలాశిల్ప నిధి అపూర్వమనీ చెప్పాడు .

మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘’చాలా జుగుప్సా కరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని ‘’హితవు పలికాడు .దానికి స్పందించిన గురుదేవులు రవీంద్ర నాద టాగూర్ ‘’ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయ మనటం అవివేకమని ,అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ‘’అని గాంధీకే ‘’క్లాస్ ‘’పీకాడు .ఖజురహో పద్నాలుగో శతాబ్దపు చండేలా వంశ రాజుల మతాత్మక రాజధాని అన్నారు ఆరబ్ యాత్రికుడు’’ ఐబాన్ బుటూటా’’దీన్ని1335 లో చూసి దీన్ని ‘’కజర్రా ‘’అనే వారని ఇక్కడ యోగులు బారు గడ్డాలతో జటాజూటాలతో ఉండేవారని నిరాహారం  వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు .ఇప్పుడున్న ఖజురహో సాగర్ ఎనిమిది వందల మీటర్లు పడమటి దేవాలయాలకు దూరం గా ఉండేది .అప్పుడిది ఖజురహో నగరానికి గుండె కాయ గా వర్ధిల్లిందని చెప్పాడు .ఇప్పటికీ శివరాత్రి నాడు వేలాది  భక్తులు వచ్చి దర్శించితరిస్తారు .అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు .ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’లైట్ అండ్ సౌండ్ ‘’ప్రోగ్రాం తప్పక చూసి అనుభూతి పొందాలి .ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి .భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు .ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు .ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి .స్థానికం గా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతం లో ప్రదర్శించి అమ్ముతారు .ఈ ఉత్సవం భారత దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే .

ఖజురహో వృత్తాంతం

చండేలా రాజులు రాజపుత్ర వంశానికి చెందిన చంద్ర వంశ రాజులు. చండేలా రాజులు మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు .తొమ్మిదో శతాబ్ది నుండి పద్నాలుగో శతాబ్ది వరకు వీరి పాలన సాగింది .వీరిని ‘’జేజక భుక్తి’’రాజులనే వారు ఇప్పుడు’’ బుందేల్ ఖండ్ ‘’రాజులంటారు .చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి ధిల్లీ అజ్మీర్ ల పాలకుడైన పృధ్వీరాజుచౌహాన్ ఆస్థాన కవి గా ఉండేవాడు .ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వారా రాజు ఇంద్ర జిత్ ఆస్థాన పురోహితుడి కూతురు   హేమవతి.హేమావతి గొప్ప అంద గత్తే .ఇంద్రుడే ఆమె సౌందర్యానికి నీరైపోయాడు. అతన్ని పెళ్లి చేసుకొనంది. ఇంద్రుడి శాపం వలన విధవ రాలైంది .అప్పటికి ఆమె వయసు పదహారే .ఒక రాత్రి విరహ వేదన భరించలేక ‘’రతి తాలిబ్ ‘’అనే సరస్సులో నగ్నం గా స్నానం చేస్తుంటే చంద్రుడు ఆమెను మోహించి ఆమెను చేరి సల్లాపాలాడాడు .ఆమె కన్యత్వం కోల్పోయింది .ఈ పరాభవాన్ని దాచుకోవటానికి ఎంతో ప్రయత్నించింది .చంద్రుడు ఆమెనుకర్ణావతి నదీ తీరం లోని ఖజూర వాటిక లో తల దాచుకోమని సలహా ఇచ్చాడు .ఆమెకు పుట్టబోయే కుమారుడు అద్వితీయ బల సంపన్నుడై పదహారవ ఏట రాజు అవుతాడని రాజ్య విస్తరణ చేస్తాడని అనునయింఛి అదృశ్యమైనాడు  చంద్రుడు .

హేమావతి కాశీ లో తండ్రి ఇంటికి చేరింది .మళ్ళీ కలన్జార్ కు తిరిగొచ్చింది .కొడుకును కన్నది .చంద్ర వర్మ అనే పేరు పెట్టింది .అతడు పెరిగి పెద్దవాడై బల పరాక్రమ సంపన్నుడైనాడు .పదహారో ఏట ఒక సింహాన్ని పులిని సునాయాసం గా పోరాడి చంపాడు .సంతోషించిన తల్లి హేమావతి చంద్రుని ప్రార్ధించింది .చంద్రుడు దిగి వచ్చి కొడుక్కి ‘’ఒక పరుస వేది’’నిచ్చాడు అది దేన్నీ తాకితే అది బంగారం అవుతుంది .క్రమంగా ధనమూ పెరిగి ‘’మహోబా ‘’కు రాజై  రాజ్య విస్తరణ చేశాడు .కాశీ లోని గాహద్వారా రాజును ఓడించి కాశీని కూడా తన రాజ్యం లో కలిపేశాడు హేమావతి కొడుకు చంద్ర వర్మ రాజు .వివాహం చేసుకొని రాణీ తో ఖజురాహో చేరి ‘’భంద్య యజ్ఞం ‘’చేసి తల్లి పై పడిన మచ్చను అవమానాన్ని తొలగించాడు .తల్లి కోరిన వన్నీ తీర్చాడు .విశ్వ కర్మ ను ఆహ్వానించి ఖజురహో లో 85దేవాలయాలను నిర్మించి తల్లి హేమావతికి కానుక గా సమర్పించాడు .అందుకే ఇక్కడ ఏ దేవాలయం లో చూసినా ఆలయం ముందు సింహం తో పోరాడే బాలుడి శిల్పం కని  పిస్తుంది .ఆ బాలుడే చంద్ర వర్మ .100_2416

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -6 అదరహో ఖజురహో

మా నవ రాత్రి యాత్ర -6

అదరహో ఖజురహో

ఖజురహో స్టేషన్ ను చూస్తె కొత్తగా నిర్మించి నట్లని పించింది .అప్ప్రోచ్ రోడ్లూ కొత్తవే ,పర్యాటక కేంద్రం గ అభి వృద్ధి చేయటానికి కృషి చేస్తున్నట్లని పించింది .విమానశ్రయమూ ఏర్పడింది .

This slideshow requires JavaScript.

స్టేషన్ నుంచి ఊరిలోకి ఎనిమిది కిలో మీటర్ల దూరం .రోడ్డు కచ్చా పచ్చా గా ఉంది .దారికి రెండు వైపులా ‘’ఇప్ప చెట్లు’’ విరగ బూసి ఉన్నాయి .ఇప్పపూలు రాలి నేలమీద విపరీతం గా పడుతున్నాయి .వాటిని చిన్నా పెద్దా ఆడా మగా అంతా సంచుల్లోకి యేరుకోంటు న్నారు .ఇప్పపూవు భద్రాద్రి రామయ్యకు ప్రసాదం అని మనకు తెలుసు .ఇప్పపూవు సారా మంచి ‘’కిక్ ‘’ఇస్తున్దంటారు. కనుక దానికోసం ఏరి సొమ్ము చేసుకొంటున్నారు .దారిలో మోదుగ చెట్లు అగ్గి పూలతో మధ్య ప్రదేశ్ ఎండలకు సాక్ష్యం గా కని  పిస్తున్నాయి .సూర్యా హోటల్ లో రూమ్ బుక్ చేశాడు మా అబ్బాయి శర్మ .హోటల్ వాడు పంపిన ఆటోలో హోటల్ కు చేరాము .సౌకర్యం గానే ఉంది ..వేడి నీరు వస్తోంది .పళ్ళు తోముకొని వేడి నీట జలకాలాడి సిద్ధమయ్యాం .

ఇండికా కారు బుక్ చేశాడు మా వాడు .డ్రైవర్ ను ఎనిమిదింటికి రమ్మని చెప్పాం .హోటల్ లో కాఫీ తాగుదామని అడిగితె ముప్ఫై రూపాయలన్నాడు .అమ్మో అని పించింది .డ్రైవర్ వచ్చేసరికి రెడీ అయ్యాం .కారు లో బయల్దేరి దగ్గరలో ఉన్న ‘’మద్రాస్ హోటల్ ‘’కు చేరాం .ఇంకా ‘’పొయ్యి వెలిగించిన ‘’వాసన కని  పించలేదు .వెళ్ళిపో బోతుంటే ‘’ఓనరైన అమ్మాయి ‘’అయిదు నిమిషాల్లో కాఫీ ,పది నిమిషాల్లో టిఫిన్ రెడీ అవుతుందని ఉండమని చెప్పింది .కూల బడిపోయాం .నాకేమీ తినాలని పించలేదు. ఆ వాతావరణం చూసి .రెండు కాఫీలు తెప్పించి నలుగురం తాగాం .ప్రభావతి  సాదా దోసె ఆర్డర్ ఇచ్చి తిన్నది .పరవాలేదని చెప్పింది .కాలే కడుపుతో పొద్దున్న తిన్న హార్లిక్స్ బిస్కట్ల తో  మళ్ళీ కారు ఎక్కి  దగ్గరలో నే ఉన్న ఖాజురాహో దేవాలయ సముదాయాలను దర్శించటానికి వెళ్లాం .కారు బయటే ఆపేసి మమ్మల్ని లోపలి తోలాడు. డ్రైవర్ టికెట్టు కూడా ఉంది మనిషికి పది రూపాయలు .ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని ఆ విశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పరచి కాపలా పెట్టి  ఆ విలువైన శిల్ప సంపదనిరక్షిస్తోంది ..మంచి నీటి సౌకర్యం ,పచ్చగడ్డి తివాచీలు కూర్చోటానికి బెంచీలు అన్నీ సౌకర్యాలు కలిపించింది .సాయం వేళ ‘’లైట్ అండ్ సౌండ్ ‘’లతో ఈ శిల్ప రహస్యాలను తెలియ జేసే ప్రోగ్రాం ఉంది .మేము సాయంత్రం తిరుగు ప్రయాణం కనుక ఆ అవకాశం ఉపయోగించుకో లేక పోయాం .

మొదటగా వరాహ దేవాలయం చూశాం .అక్కడే లక్ష్మణ దేవాలయం ఉంది .చిత్రగుప్తుడికి ,శివుడికీ ఆలయాలున్నాయి .ప్రక్కనే మాతం గేశ్వరాలయం ఉంది .అమ్మవారి గుడీ ఉంది. అన్నీ ‘’జైగాంటిక్ టెంపుల్స్ ‘’ అని పించాయి అ.న్ని ఆలయాల గర్భాలయాలు ఒకే రీతి లో ఉండటం విశేషం .నందీశ్వరాలయం బృహత్తరం .పన్నెండుకు పైగా ఆలయాలున్న మహా ప్రాంతం ఇది .ఎండ ముదరక ముందే  చూడాలి  లేక పొతే వేడి తట్టుకోలేము .ఆలయాల శిఖరాలు మహా సున్నితం గా మలచ బడ్డాయి .కామ శాస్త్ర శిల్పాలే ఎక్కడ చూసినా వివిధ భంగిమల్లో కని  పిస్తాయి .యేదేవాలయం లో ను నిత్య పూజ లేదు .మాతగేశ్వరాలయం లో పెద్ద పాను వట్టం మీద ఆరేడు అడుగుల ఎట్టు రెండడుగుల వెడల్పు పసుపు రంగు శివ లింగం ఉంది .పాను వట్టం మీదనే కూర్చుని పూజారి పూజ చేస్తాడు .మనమూ దాని మీదే నడవాలి .తమాషా అని పిస్తుంది ..ఒక్కో ఆలయానికి కనీసం ఇరవై ఎత్తైన నిలువు మెట్లు ఉంటాయి .ఇవి ఎక్కి దిగాలి అంటే ఏంతో ఓపిక కావాలి .మా ఆవిడ రెండు దేవాలయాలు మాత్రమె చూసి నీడలో కూల బడింది .మా అబ్బాయి మరో రెండు చూసి చతికిల పడ్డాడు .పట్టు వదలని విక్రమార్కులం లాగా నేనూ మా అమ్మాయి అన్ని దేవాలయాలు చూసి పిచ్చ పిచ్చగా ఫోటోలు తీశాము. దేనినీ వదలలేదు .ఆ అమ్మాయి ‘’ఐ పాడ్ ‘’తో తీసిన ఫోటోలు బాగా పెద్దవిగా ‘’అదరహో గా ‘’వచ్చాయి .నాది  తొమ్మిదేళ్ళ నాడు అమెరికా లో కొన్న కోడాక్ .బుజ్జి ముండ ఎన్ని వేల ఫోటోలు ఇప్పటి దాకా తీసిందో తెలీదు .అద్భుతం గా పని చేస్తోంది .వీడియో కూ పని కొస్తుంది

.

ఇవన్నీ చూసి అక్కడి నుండి జైన దేవాలయానికి తీసుకెళ్ళాడు ‘’ డ్రైవర్ రాముడు’’ .ఇవాళ ‘’మహా వీర్ జయంతి ‘’అని అక్కడికి వెళ్ళేదాకా తెలీదు.మాకు. జైనులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శిస్తున్నారు .పార్శ్వనాధ ,ఆది జైన ఆలయాలను దర్శించాం  తెలీకుండానే .మహా పర్వదినాన జైన మహా వీర సందర్శనం జరగటం మా పూర్వ జన్మాసుకృతం అని పించింది .మధ్యలో మరో రెండు దేవాలయాలు చూపించి మమ్మల్ని ‘’ఖజురహో వాటర్ ఫాల్స్ ‘’కు పది హీను కిలో మీటర్ల దూరం డ్రైవ్ చేసి తీసుకెళ్ళాడు .కారుకు ఎంట్రన్స్ ఫీజు మనమే కట్టాలి .ఫీజు మూడు వందలు ఎండ అదిరి పోతోంది .కాళ్లు కింద పెట్టాలంటే బెదురూ గా ఉంది .అలాగే దిగి మా ఆవిడను కారులోనే ఉంచి మేము ముగ్గురం చూశాము .అక్కడ ఒకతను దీని వివరాలు చెప్పాడు .అతని చేతిలో ఇరవై  పెట్టాను .

అతను చెప్పిన దాని ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్ని పర్వతం బ్రద్దలై లావా ఎగా చిమ్మి ఈ కొండ ప్రాంతం ముక్కలు ముక్కలుగా చీలి ఒక పెద్ద ,ఒక చిన్న జల పాతాలేర్పడ్డాయి .వేసవిలో కూడా నీరు పై నుంచి కిందికి ప్రవహిస్తూనే ఉంటుంది జూన్ జులై నెలల్లో ఈ ప్రదేశం అంతా అంతులేని జల రాశి తో కళకళలాడుతుంది .అప్పుడు దీని సౌందర్యం వర్ణనాతీతం అన్నాడు .దీని ప్రక్కనే అభయారణ్యం ఉంది .ఇక్కడ వాల్కనో వలన  అనేక రంగుల శిలలేర్పడ్డాయట. డోలమైట్ ,క్వార్జ్, గ్రానైట్  మొదలైనవి .ఇవన్నీ చూసి డ్రింకులు అంటే ‘’స్ప్రైట్ ‘’ఆరగా ఆరగా తాగుతూ హోటల్ సూర్యా కు చేరే సరికి దాదాపు రెండు గంటలైంది మధ్యాహ్నం .మా వాళ్ళు ఇక కాలు తీసి కాలు బయట పెట్టలేమంటున్నారు .రమణా అలసి పోయాడు .ఇంకా రెండు దేవాలయాలున్నాయన్నాడు డ్రైవర్ .

ఆడవాల్లిద్దర్నీ హోటల్ రూమ్ కు చేర్చి నేను రమణ ,మద్రాస్ హోటల్ కు వెళ్లాం .నేనూ వాడు ఇడ్లీ ఆర్డరిచ్చి తిన్నాం చట్నీ సాంబారు ఇచ్చాడు .నాకెందుకో లోపలి పోలేదు .ఏదో ‘’కతికా ‘’.వాడు దోసె కూడా తిన్నాడు .తల్లీ కూతుళ్ళకు ఇడ్లీ దోసె పార్సెల్ చేయించుకొని ,మజ్జిగ కొని రమణ ను రూమ్ దగ్గర దిమ్పాను .డ్రైవర్ తో మిగిలిన రెండు దేవాలయాలు చూడటానికి బయల్దేరా. మా వాళ్ళు వెళ్ళద్దని గోల .వెళ్లి తీరాల్సిందే నని నేను పట్టు బట్టాను .సరే అందులో ఒకటి ‘’బలరాముడి’’ దేవాలయం రెండవది ‘’వామనావతార్’’ దేవాలయం .రెండూ చూసి రూము కు చేరే సరికి మధ్యాహ్నం మూడు దాటింది .సాయంత్రం అయిదూ నలభై అయిదుకు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ పట్టుకోవాలి .కాసేపు రెస్ట్ .తరువాత నాలుగున్నరకే సామాను సర్దేసి హోటల్ దగ్గరే ఉన్న ఆటో మాట్లాడుకొని స్టేషన్ కు బయల్దేరాం శర్మ మాట్లాడిన ‘’పాకేజ్ ‘’ప్రకారం ఖజురాహో చూపించటానికి ఇండికా కారుకు 1750రూపాయలు ,హోటల్ రెంట్ అయిదు వందలు .హోటల్ రెంట్ ఫరవా లేదు కాని కారు డబ్బులు దండగే అని పించింది .అంత దూరం తిరిగిందేమీ లేదు .చలికాలం ఆటో చాలు లేక పొతే మామూలు కారు చాలు .కాని వేసవి కనుక తప్పదని సర్డుకోన్నాం .మా అమ్మాయి రాత్రి నుంచి ‘’లూజ్ మోషన్స్ ‘’తో బాధ పడుతోంది .చెబితే తిడతానేమో నని చెప్పలేదు .ఈ ఉడుకు ప్రదేశం లో ఇప్పటికే మూడు ప్రాంతాలలో తిరుగుడు తెల్ల వారు జామున లేవటాలు దారిలో తిండి లేక పోవటాలు అన్నీ కలిసి అందర్నీ బాధించాయి

నాకూ అలానే ఉన్నా ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక నాకే అర్ధం కాలేదు .దాదాపు అన్ని దేవాలయాల 600మెట్లూ ఎక్కి దిగానంటే నాకే ఆశ్చర్యం గా ఉంది. కాళ్లు తేలి పోతున్నాయి .పడతానేమో నని మా వాళ్ళు మధ్య మధ్యలో హెచ్చరిస్తున్నారు .’’ఈ సీతయ్య ఎవరి మాటా వినడు ‘’అన్నట్లు మొండిగా అంతా ఎక్కి, దిగి, కలయ తిరిగి చూసి ఆనందాన్ని సంతృప్తినీ పొందాను .ఎప్పటి నుంచో ఖజురహో చూడాలనే తాపత్రయం .మా అమ్మాయి వలన ఈ’’ నవరాత్రి మహాత్మ్యం’’ లో తీరింది .ఇక్కడ అంతా వర్షాధార పంటలే .బావుల నీటి తో వ్యవసాయం .సెనగ పంట బాగా పండుతుంది .ఖజురహో అంటే ‘’ఖర్జూర వనం ‘’అని అర్ధం  .దాదాపు ఎడారి ప్రాంతం లా ఉంటుంది .కాని పంటలు బాగా నే పండిస్తున్నారు .ఖజురాహో విశేషాలు ఈ సారి రాసి అదురహో అని పిస్తాను .ట్రెయిన్ అయిదింటికే స్టేషన్ లోకి వచ్చింది .ఇక్కడి నుంచే బయల్దేరాలి. ఒకే ఒక ఎసి బోగీ .ఎక్కి కూర్చున్నాం .ఇంతలో కోసూరు నుండి ఆదినారాయణ ఫోన్ చేసి పెదముత్తేవి వార్షికోత్సవం పందొమ్మిదో తేదీ అని గురువు గారు  సీతా రామ యతీంద్రుల వారుచెప్పారని  నన్ను తప్పక వచ్చి మాట్లాడమని ఆదేశించారని చెప్పారు సరే నన్నాను .

ఆ తరువాత నా శరీరం నా స్వాధీనం లో లేదు .వెంట వెంటనే మూడు విరేచనాలు అయ్యాయి .విపరీతం గా నీరసం గా ఉంది. వెంట తెచ్చుకొన్న ‘’నేట్రం మూర్ ‘’హోమియో మందు వడ దెబ్బ తగల కుండా ప్రయాణం మొదట్నించీ వేసుకొంటూనే ఉన్నాము  .దానితో బాటు ‘’ఫెర్రం ఫాస్ ‘’కూడా ఇప్పుడు వాడాను. కొంత ఉపశమనం గా ఉంది .నిద్ర బానే పట్టింది .రాత్రి రెండు గంటలకు ఝాన్సీ చేరాం .అక్కడ ఇండోర్ ఎక్స్ప్రెస్ ను తెల్లవారు జామున నాలుగింటికి ఎక్కి ఉజ్జైన్ మధ్యాహ్నం పదకొండింటికి చేరుకొన్నాం .ణా బాధ సంగతి మా వాళ్లకు చెప్పా లేదు చెబితే ‘’తకిట తడికిం ‘’అవుతుందని మూసుక్కూర్చుని. ఉజ్జైన్ లో రైల్వే రిటైరింగ్ రూమ్ కు చేరిన తర్వాత నెమ్మదిగా చెప్పాను .

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

వీరేశలింగం గారిని ప్రభావితం చేసిన -హిత సూచిని –

ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితు లయ్యారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు.

మంత్రాలకు చింతకాయలు రాలవు. జాతరలూ ఉత్సవాలూ రోగాలను తగ్గించలేవు. తలక్రిందులగా తపస్సు చేసినా ఏ లోహాన్నీ బంగారంగా మార్చలేం. మరణించిన వారు పిశాచాలుగానో, రాక్షసులుగానో మారరు. ఒక జ్యోతిష్కుడు చెప్పినదానికీ మరో జ్యోతిష్కుడు చెప్పినదానికీ పొంతన ఉండదు. ఆడపిల్లలకు యుక్తవయసు వచ్చాక వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళిచేయాలి.

‘ఈ మాటల్లో విశేషం ఏముంది? ఈ రోజుల్లో కొంచెం హేతుబద్ధంగా ఆలోచించే వారెవరైనా ఇలాగే మాట్లాడుతారు.’ అనిపిస్తోంది కదూ! కానీ ఈ అభిప్రాయాలు ఈనాటివి కాదు. నూటయాభై ఏళ్ళ క్రితం నాటి ‘హితసూచని’ అనే పుస్తకంలోవి. రచయిత సామినేని ముద్దునరసింహం. ఇది 1862లో ప్రచురితమైంది. చిత్రం ఏమిటంటే ఈయన నాస్తికుడు కాదు. కానీ ఎంతో హేతువాద దృష్టికలవాడు. 1792(?)లో రాజమండ్రిలో పుట్టారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో పాండిత్యం సంపాదించారు. పుట్టిన ఊళ్లోనే ఫస్ట్‌క్లాస్ ఆక్టింగ్ డిస్ట్రిక్ మునసబుగా ఉద్యోగం చేశారు. ఇంగ్లీషు వారితో స్నేహం చేసి తర్కబద్ధమైన ఆలోచనలతో తన భావాలకు పదును పెట్టుకున్నారు. ఆ ఫలితమే ఈ హితసూచని. దీన్ని వచనంలో రాశారు. మనం వచన గ్రంథం అంటాం కానీ ఈయన వాక్య గ్రంథం అన్నారు. ‘వాడుక భాషలో వాక్య గ్రంథాలకు బహుశా ఈయన ఆద్యుడు’ అని ఆరుద్ర తమ ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో అన్నారు. మనం వ్యాసాలు అంటాం. ఈయన ‘ప్రమేయాలు’ అన్నారు. మొత్తం ఎనిమిది ప్రమేయాలు ‘హితసూచని’లో ఉన్నాయి.

పీఠికను చదివితే ఈయన భాష విషయంలో కూడా సంస్కరణ భావాలు గలవాడే అనిపిస్తుంది. రచనా వ్యాసంగం సజావుగా జరగాలంటే భాషానియమాలు లక్షణ గ్రంథాలలో ఉన్నట్టుకాక సాధ్యమైనంత సరళంగా ఉండాలని చెప్పి, అర్థానుస్వారం గురించీ శకటరేఫ గురించీ ప్రస్తావించారు. ఉదాహరణకు ‘వాడు’ అనే పదానికి అరసున్న చేరితే (వాఁడు) అతను అనీ, చేరకపోతే కళావిహీనమవడం అని అర్థం. అలాగే వీడు అనే పదానికి అరసున్న చేరితే ఇతను అనీ, చేరకపోతే విడిచిపెట్టు, పట్టణం వంటి అర్థాలున్నాయి. ఈయన ఏమంటారంటే ‘వాడుకలో చాలా పదాలు అర్థానుస్వారం లేకుండానే ఉన్నాయి. కాబట్టి తానుకూడా అలాగే రాశానన్నారు. అలాగే కొన్ని పదాలలో శకటరేఫ రాయాలని లక్షణ గ్రంథాలలో ఉందికానీ అటువంటి పదాలలో రేఫను చేర్చినా శకటరేఫను చేర్చినా అర్థము ఒకటి ఐయుంటుంది కనుకనున్ను’ అటువంటివన్నీ రేఫతోనే రాశానన్నారు. గ్రామ్యభాషను ‘–వాక్యరచనలో నంగీకరించ తగినదిగా భావిస్తున్నా’నన్నారు.
ఇక వ్యాసాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు చూద్దాం! మొదటిది ‘విద్యాప్రమేయం’. ఇందులో ‘విద్యలు సమస్త ప్రయోజనములకు ఆవశ్యకమైయున్నవి’. సంగీతానికి సంబంధించినవి తప్ప మిగిలిన గ్రంథాలన్నీ వచన రూపంలో ఉంటే బావుంటుంది. ఛందోబద్ధంగా రచించేటప్పుడు కవిదృష్టి ఛందస్సు కూర్చుకోవడం మీదే ఉంటుంది కాబట్టి అతను తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చెయ్యలేడు. ‘శాస్త్ర గ్రంథాలన్నీ సులభంగా బోధపడేలా దేశభాషలలో వచనంలో రాయించి ప్రచురించాలి’ అన్నారు. ఈయన ‘1853లో సూచించిన పద్ధతిని తెలుగు అకాడమీ చేపట్టటానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింద’ని ఆరుద్ర అన్నారు.

రెండోది ‘వైద్యప్రమేయం’. ఇందులో ఈయన చెప్పిన విషయాలు ఈనాడు కూడా పనికొచ్చేవే. ‘శాస్త్రవిహీనుడైన వైద్యుడు రోగిపాలిటి యమదూతతో సమానం’ అన్నారు. ఇది సార్వకాలిక సత్యం. అంతేకాదు చాలామంది వైద్యులకు అధ్యయనం కొరవడుతోంది. వారు సిఫారసు చేసే ఔషధగుణ దోషాల పట్ల వారికే అవగాహన ఉండటం లేదు. ‘రసవిషాదుల వైద్యముకంటె మూలికా వైద్యం శ్రేష్ఠం’ అన్నారు.

మూడోది ‘సువర్ణ ప్రమేయం’. లోహాలను బంగారంగా మార్చడంపై విమర్శ ఇందులో ఉంది. శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన లేక రాత్రికి రాత్రే అడ్డగోలుగా ధనవంతులైపోవాలనే దురాశాపరుల కోసం పుట్టినదే ఇతర లోహాలను బంగారంగా మార్చే విద్య. దీన్నే ‘రసవాదం’ అంటారు. ఈనాడు కూడా బంగారానికి మెరుగు పెడతామనీ, ఇతర లోహాలను బంగారంగా మారుస్తామనీ శాంతులనీ దుష్టగ్రహాలనీ కాకమ్మకబుర్లు చెప్పి మోసం చేసేవారి గురించి రోజూ వార్తల్లో చూస్తున్నాం. “ఒకసారి తాకించిన వెంటనే ఎలాంటి లోహాన్నైనా సువర్ణంగా మార్చే మణిని ‘స్పర్శమణి’ అంటార”ని సి.పి.బ్రౌన్ తన నిఘంటువులో చెప్పారు. గురజాడ అప్పారావు గారి కాలంలో కూడా ఇలాంటి మోసాలున్నాయేమో! కన్యాశుల్కంలో బైరాగి ‘తులం రాగి తెచ్చుకో. బంగారం చేసియిస్తాం–‘ అంటాడు దుకాణదారుడితో. ఇలాంటి వాటిని ముద్దు నరసింహంగారు ఆనాడే ఖండించారు. ‘బుద్ధిమంతులైనవారు బాగా యోచిస్తే మరియొక లోహమును బంగారముగా చెయ్యడము అసాధ్యమని తెలియదగియున్నది’. ‘అసలు లోహములలో నొకదాన్ని మరియొకటిగా చేయడమెవరికిన్ని సాధ్యమైన పనికాదు.’ అలా సాధ్యమైతే ‘ఒక ధాన్యమును మరియొక ధాన్యముగా గాని ఒక జంతువును మరియొక జంతువుగా గాని మనుష్యుడు చెయ్యవచ్చును. ఈలాగున ఏమానవుడూ చెయ్యలేడు.’ స్పర్శవేది ఇనుమును బంగారంగా మారుస్తుందని నమ్మకం ఉంది. కానీ ‘స్పర్శవేది అనే వస్తువును ఇహలోకమందు చూసినవారెవరూ ఉన్నట్టు తెలియడము లేదు.’ అన్నారు.

నాలుగోది జంతుసంజ్ఞా ప్రమేయం. పూర్వం కొంతమందికి పశుపక్ష్యాదుల భాషను అర్థం చేసుకునే శక్తి ఉండేదనే కథలను ఇందులో ఖండించారు. ‘కొన్ని జంతువులకు వాటి జాతి సహజములైన ధ్వనులు చెయ్యడమునకే తప్ప వాగింద్రియ సామర్థ్యం లేదు’ అంటూ ధర్మరాజు అశ్వమేధయాగం చేసేటప్పుడు ఒక ముంగిస మా ట్లాడినట్టు ఉన్న కథా, కైకతండ్రి అయిన కేకయరాజు చీమల సంభాషణ విన్నాడని చెప్పుకుంటున్న కథా ఎంతమాత్రం వాస్తవాలు కాదన్నారు. పూర్వకాలంలో ఇలాంటివి జరిగాయని అం టారు గానీ ‘ప్రపంచమర్యాదకు విరుద్ధములైన ధర్మములు ఏయుగమందున్ను జరిగినట్టు చెప్పడమునకు సబబులేదు’ అన్నారు.
ఐదవది ‘రక్ష : ప్రమేయం’. అంటే రాక్షసుల గురించీ, పిశాచాల గురించీ ఇది వివరిస్తుంది. ఇందులో ‘చనిపోయిన మనుష్యులు కొందరు రాక్షసులున్ను – పిశ్చాములున్ను- భూతములున్న, దయ్యములున్నుఐ- పూర్వ స్వరూపములతోనే కొందరికి కనబడడమున్ను- వారిని గూర్చి మాటలు చెప్పడమున్ను – కద్దని చాలామంది నమ్ముతున్నారు. -ఈ నమ్మకము నిజమైన ఆధారము గలదికాదు’ అన్నారు. చనిపోయి దయ్యాలుగా మారినవారు పెట్టెల్లో బట్టలు కాల్చేయడం, ఇళ్ళమీద రాళ్ళేయడం, అతిబరువైన వస్తువులను సునాయాసంగా ఎత్తగలగడం వంటివి సత్యం కాదన్నారు.

ఆరోది ‘మంత్ర ప్రమేయం’. మంత్రాలకు అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మే అజ్ఞానులు ముద్దునరసింహం గారి కాలంలోనే కాదు ఈనాడు కూడా ఉన్నారు. వారి గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించారు. ఒక దేవత పేరు మంత్రంగా చేసుకుని, ఆ దేవత పేరు జపిస్తే ఆ దేవత కరుణించి వారి కోర్కెలు తీరుస్తుందని నమ్మేవారున్నారనీ ‘యేదేవతయొక్క నామమైనా ఏమనిషి ఐనా ఎంతకాలం జపించినప్పటికిన్నీ- ఆ దేవత ఆ మనిషికి స్వాధీనమైయుండడమున్ను సంభవించదు’ అన్నారు. ఒకవేళ అలా మంత్రసిద్ధి కలిగితే ‘వారు భూమండలమంతా ఏలే అధికారమునే కోరవచ్చును, వారి విరోధులను సాధించవచ్చును’ అంటారు. ‘అసలు మంత్రాలు ఫలించినట్టు ఎక్కడా ఆధారాలు లేవు’ అన్నారు.
ఏడోది ‘పరోక్షాది జ్ఞానప్రమేయం.’ ఇందులోని అంశం దివ్యదృష్టి. “గ్రంథములయందు చెప్పబడియుండటమే కానీ అటువ ంటి దృష్టిగల మనుష్యులు ఎక్కడా ఉన్నట్టు కనుపడడములేదు. దేవతోపాసన చేసేవారికి ముందుజరగబోయే సంగతులు ఎలా తెలుస్తాయి?’ అని ప్రశ్నిస్తారు. జాతక గ్రంథాలు అనేకం ఉన్నాయి. ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండదు. ‘ఒక జ్యోతిష్కుని యూహకు మరియొక జ్యోతిష్కుని యూహభేదించే యుండునుగాని సరిగా యుండనేరదు’ కాబట్టి అవి నమ్మదగినవి కావన్నారు.

చివరిది ‘వివాహ ప్రమేయం’. నాటి బాల్యవివాహాలను ఇందులో ఖండించారు. ‘వివాహము కాకమునుపే చిన్నది రజస్వలయైన పక్షంలో తల్లిదండ్రులు, తోడబుట్టినవారు ఆ చిన్నదానితో నదీగర్భమందు ప్రవేశించవలసినదని ఒక పురుషుడు నిర్ణయించినాడు.’ ‘అది నిరర్ధకమైనది’. ‘చిన్నది వ్యక్తురాలైన మీద వివాహము చెయ్యడమే మిక్కిలి నాయమైయున్నది’ అని చెప్పడమే కాకుండా కన్యాశుల్కం, బాలవితంతువుల సమస్యలకు మూలం బాల్యవివాహాలే అన్నారు. అంతేకాదు ‘తమ పిల్లలకు జీవనాధారమయ్యే సంపదలను వివాహ వేడుకల కోసం తల్లిదండ్రులు ఖర్చుచెయ్యకూడదు’ అని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు వధూవరుల పరస్పరాంగీకారంతో జరగడం లేదని అందుకు సాక్ష్యంగా పెళ్ళిమంత్రాలను ఉదాహరించారు. ‘మదర్ధం కన్యాం వృణీధ్వం’ (నన్ను మోహించినటువంటి ఫలానా పురుషుణ్ణి నాకొరకు కోరవలసినది) అనే మంత్రం చిన్నదానితో చెప్పిస్తున్నారు. వరుడితో ‘మదర్ధం కన్యాం వృణీధ్వం’ (నాకొరకు కన్యను వరించవలసినది) అనే మంత్రం చెప్పిస్తున్నారు. ఈ మం త్రాలు ‘తల్లిదండ్రులచేత ఏర్పాటు చేయబడ్డ వధూవరుల గురించి ఏర్పాటు చేయబడినవి’ అన్నారు.

ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితులయ్యారు. వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని పుస్తకం వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారి దగ్గర ఉంద”ని ఆరుద్ర తెలిపారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అందుకే “వ్యావహారిక భాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు. అంతేకాదు సంఘసంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మసమాజము ద్వారా బంగాళాదేశం నుంచి ఆంధ్ర దేశంలోకి దిగుమతి కావడం కాదు. అంతకు పూర్వమే మన తెలుగు వాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు అని రుజువు చేయడానికి ఈ ‘హితసూచని’ ఆధారం” అన్నారు ఆరుద్ర. ముద్దు నరసింహం గారు రాసిన పుస్తకం ఇదొక్కటే. ఇది తళుకుబెళుకుల గాజురాయికాదు. ‘నిక్కమైన మంచినీలం’. సంస్కరణాభిలాషులంతా తప్పక చదవాల్సిన మంచి పుస్తకం ‘హితసూచని’. ఈ పుస్తకంలో ‘ఉమేదువారీ’ ‘మశ్చాలీ’ వంటి ఆనాటి ఉద్యోగాలకు సంబంధించిన పదాలు, ‘అదాత్తు’ ‘సోలుపులు’ వంటి అచ్చతెలుగు పదాలు, ‘చాపాఖానా’ ‘హల్కా’ వంటి ఉర్దూ పదాలు ముద్దు నరసింహం చాలా ఉపయోగించారు. ఈనాడవి కనిపించవు. వినిపించవు.
– డా. పి.యస్. ప్రకాశరావు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహిత్య నోబెల్ ప్రైజ్ గ్రహీత ,లాటిన్ అమెరికా రచయిత స్వర్గీయ మార్క్వెజ్ -వి చంద్ర శేఖర రావు –

‘ఎలిజీగానే గుర్తు చేసుకుంటాను’ – డాక్టర్ వి. చంద్రశేఖరరావు

మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imagination ను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charm ను, magic చేసే proseను కనిపెట్టాడు. త్రోసుకొచ్చే మరణపు రాత్రుల్ని ఆపివేసే, వెలుగుల కిరణాల, ఎగిరే పక్షుల రెక్కల, శక్తిని తన పాత్రలకు ఇచ్చిన కథా/ నవలా మాంత్రికుడు మార్క్వెజ్.

లిజీగానే మొదలుపెడతాను. పాతికేళ్ళనాడు, మద్రాసు మౌంట్‌రోడ్ పేవ్‌మెంటు పైన దొరికిన న్యూయార్కర్ మ్యాగజైన్‌లో మొదటిసారి మార్క్వెజ్ కథ చదివి విస్తుపోయాను. కథలో ఒక్కసారిగా, అంత Twist, అంత dark humour చదివి, కథలు ఇట్లా కూడా రాయొచ్చా అని అబ్బురపడ్డాను. ‘One hundred years of solitude’ నవల్ని దాదాపు నెలపాటు చదివాను. ఒక ‘Collective Dream’లోకి నేను మేలు కొన్నాను. మామూలు వాక్యం, క్రమంగా ఒక ‘మెటాఫర్’గా మారటం నేను చూశాను. కథలోని ఒక దృశ్యం ఒక ‘మిత్’లా రూపాంతరం చెందటం చూశాను. రియాలిటీ, ఒక్కసారిగా ఇమాజినరీ రియాలిటీలోకి చొచ్చుకుపోవటం చూశాను. ఆ అనుభవం, మళ్ళీ పుట్టటం లాంటి ఒక అనుభవం.
డోస్టవిస్కీ, టాల్‌స్టాయ్, చెహోవ్‌లను ఆరాధించిన తరం నాది. మార్క్వెజ్ మోళీ కట్టిన మాంత్రికుడిలా నన్ను వశపరచుకున్నాడు.
ఇక ఆయన కథలు, ఒక్కో కథ ఒక సర్రియల్ అనుభవం. మార్మిక స్వప్నం. ఉన్న స్థితి నుంచి పారానార్మల్ స్థితికి తరలిపోవటం. ఒక కొత్త కథా రూపం. కొత్త నెరేటివ్, కొత్త టోపోగ్రఫీ, కొత్త ఉద్వేగం. నేనో సరికొత్త మానవుడిగా మారిపోవటం.

‘పారిస్ రివ్యూ’లో మార్క్వెజ్ ఇంటర్వ్యూ ఒక ఆశ్చర్యం. ‘కాఫ్కా’ ఆయన inspiration అంటాడు. జేమ్స్ జాయిస్, బోర్జస్, ఆశ్చర్యంగా హెమింగ్వే కూడా తనని Influence చేశారని చెబుతారు. ఆ ఇంటర్య్వూని తెలుగులో అనువాదం చెయ్యాలనే కోరిక అట్లాగే మిగిలి ఉంది. ‘Living to tell the tale’ అనే ఆయన ఆత్మకథాత్మక జ్ఞాపకాల పుస్తకం, ఒక అద్భుతం. ఆయన జ్ఞాపకాల ఛాయల్లో, ఆయన రచనల జాడలన్నీ కనబడటం. నేనెంతో ఇష్టపడే మిత్రుడొకడు నా ఇంటికి వచ్చాడు. నా పర్సనల్ లైబ్రరీని పరిశీలిస్తూ, ‘గోర్కీ ఎక్కడ? డోస్టవిస్కీ పుస్తకాలేవీ, ‘రాదుగ’ వాళ్ళ రష్యన్ సాహిత్యమంతా ఏది?’ అంటూ విసుగు ప్రకటించాడు. మార్క్వెజ్‌ని ఆయన మొదటిసారి చూడ టం. ‘ఈ పుస్తకాలా’ అంటూ గాఢంగానిట్టూర్చి; ‘పర్సనల్ లైబ్రరీ మనమేమిటో చెబుతుంది. మన అభిరుచులు, ఆదర్శాలు, మన ఇష్టాలు, ఆశలూ; మన లైబ్రరీ అంటే మన లోపలి వ్యక్తిని ఆదర్శీకరించుకోవటమే’ అని క్లాసు తీశాడు. ఆ మిత్రుడు సంవత్సరం క్రితం మార్క్వెజ్‌ని చదివి, ఇన్నాళ్ళు ఆయన్ను చదవకపోవటం ఒకలోటే, అంటూ Confess చేసుకున్నారు. ఒక యువకవి మార్క్వెజ్‌ని చదివాక, తన అనుభవాన్ని ఇట్లా ఉత్తరం రాశాడు.

‘ఉదయం వైపు ఎగరడానికి రెక్కలేవో విచ్చుకున్నాయి
కాంతి సముద్రం వైపు, నా శరీరం ప్రయాణిస్తున్నట్లు
నేనో మెలాంకలీగా, పాటగా, పక్షిగా మారిపోయినట్లు’
ఒక ఎలిజీగానే మార్క్వెజ్‌ని గుర్తుచేసుకుంటాను. తన సాహిత్యమంతా ‘beautiful labyrinth of human experience’ చెప్పుకుంటాడు ఆయన. నా రచనల్లోని మిరాకిల్స్ అన్నీ, నా ఇమాజినేషన్ నుంచే పుట్టాయి అంటాడు. కథలో, నవలలో, మన మరో జీవితం కదా; అవి కలల్లాగా మన జీవితాల్లోని సంక్లిష్టతని, వర్ణమిశ్రమాన్ని తెలియజేయాలి కదా;
“Where races condemned to one hundred years of solitude, will have, at last and forever, a second opportunity on earth”
అంటాడు మార్క్వెజ్, తన నోబుల్ బహుమతి స్వీకరణ ప్రసంగంలో. ‘one hundered years of solitude’ లోని, ఒక దృశం : జోస్ అర్కాడియో బోండియా, ‘మెకాండో’ సమాజపు నాయకుడు, తన సమూహాన్ని (ప్రపంచం తెలియని) ఆ అజ్ఞాత భూమి నుంచి మరో ప్రాంతానికి తరలించాలని, ప్రయత్నిస్తాడు. సమస్తం ధ్వంసం కాబోతుందని అతనికి తెలుసు. తన జాతిని కాపాడుకోవాలని; అయితే ఎవరూ అతనితో రారు. ఆఖరికి ఆయన కుటుంబం కూడా. అతని భార్య(ఉర్సుల)తో, ‘మరణం ఇంకా రాలేదు కదా, ఇదే సమయం. ఇదేం మన సొంత భూమి కాదు చనిపోయి భూస్థాపితం అయినాక ఇది మన భూమి అవుతుంది. ఇప్పటికి అపరిచిత భూమే’ అంటాడు. ‘ఇదంతా నా చావు కోసమే అయితే, మీ అందరి కోసం, నేను ఇక్కడే చచ్చిపోతాను’ అంటుంది ఉర్సుల.

భూములన్నీ అపరిచిత భూములౌతున్న సందర్భం, ‘మెకాండో’ లాంటి ఒక ప్రాంతంలా ప్రపంచమంతా మారుతున్న వేళ; మనందరం జోస్ అర్కాడియో బోండియా, వారసులం అయినవేళ, మార్క్వెజ్ భవిష్యత్ దర్శనాన్ని చేసిన రచయితగా, ఆయన రచనలు ఎపిక్‌లుగా మారటంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎలిజీలో మార్క్వెజ్ కథా మాంత్రికుణ్ణి గుర్తుచేసుకుంటాను. అటు ఫెడరల్ కాస్ట్రో, ఇటు బిల్ క్లింటన్ ఇద్దరూ అతని అభిమానులే. బైబిల్ తరువాత తను ఇష్టపడే పుస్తకం మార్క్వెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కలరా’ అంటాడు ఒక అమెరికన్ రచయిత. మార్క్వెజ్ రాసింది కొత్త ప్రపంచమే కాదు, మనం జీవిస్తున్న ఇవాళ్టి ప్రపంచమే అంటాడు సాల్మన్ రష్దీ.

‘Living to tell the tale’ నుంచి ఒక జ్ఞాపకం : మార్క్వెజ్ తాతకో వర్క్ షాపు ఉండేది. వర్క్‌షాపు గోడలన్నిటినీ తెల్లరంగుతో అలంకరిస్తాడు ఆయన. తన మనుమడిలో ఆ తెలుపు వర్ణం, సరికొత్త స్వప్నాల్ని, అద్భుతమైన ఊహల్ని మొలకెత్తించాలని, ఆయన కోరిక. నానమ్మ Fortune Teller; సాధారణదృశ్యాల్ని, అసాధారణ అనుభవాలుగా మార్చటం ఎట్లాగో తెలియజేసేది. ‘చూడు, చూడు, తోటల్లోని మల్లెల పరిమళం, మనపై దాడిచేస్తున్నట్లుగా ఉంది కదూ; కనపడని ఆత్మల దాడి అట్లాగే ఉంటుంది’ అనేది.

మార్క్వెజ్ బాల్యమంతా ‘అరకటకా’ అనే మారుమూల పట్టణంలో గడిచింది. తుఫానులు, ఉప్పెనలు, భీకరమైన కరువు, ముంచెత్తే వరదలు; బనానా – ఫీవర్, ప్లేగు; బహుశా అరకటకా జ్ఞాపకాల్లో, లోలోపల దాగి, మెకాండో అనే ప్రదేశంగా (Hundred years of solitude) రూపుదిద్దుకొని ఉంటుంది. ‘మెకాండో’ వాస్తవం, స్వప్నం రెండూ కలసిపోయి, ఒకానొక మర్మదేశంలా; బహుశా ఆనాటి లాటిన్ అమెరికా దేశాల స్థితిని ‘మెటా ఫర్’గా చూపించాడు మార్క్వెజ్. సామాజిక సూత్రాలు పనికిరాని కాలంలో, నమ్ముకున్న ఉద్యమాలు తెరలు దించేసిన కాలంలో, నాయకులంతా విదూషకుల్లా, శకారుల్లా మారిన కాలంలో; మార్క్వెజ్ సాహిత్యం ఎంత relevence అర్థమవుతుంది.

మార్క్వెజ్ భాష ప్రత్యేకమైంది. తన కాలపు స్వప్నాల్నీ ఫాంటసీలను నిక్షిప్తం చేసుకున్న భాష అది. తట్టుకోలేని బీభత్సం, మరణం, వందలాది నియంతల ఉద్భవం, అంతర్యుద్ధాలు, వాటిని చెప్పడానికి తన భాషకు సర్రియల్ టచ్ ఇచ్చాడు మార్క్వెజ్. మామూలు వచన మే, హఠాత్తుగా వందలాది ఇమేజస్‌లా మారుతుంది. భాషకు ఐంద్ర జాలిక శక్తులు వస్తాయి. ఒక Poetic Process వస్తుంది. సమాజంలోని Obsessions, Distrubences నెరేటివ్‌లోకి ప్రవేశిస్తాయి. Dark humour, Fantasy కథా నిర్మాణంలోకి ప్రవేశిస్తాయి. మార్క్వెజ్ కథలు ఒక Evocation (సంరావించటం) లా అనిపిస్తాయి. పాఠకుడిలో ఒక Illusion లాంటిది నిర్మితమవుతుంది. వచనం, ఒక Visual imaginationను కలిగిస్తుంది.

అయితే ఈ చర్య బౌద్ధిక స్థాయిలో జరుగుతుంది. ఒకానొక ఉద్వేగాన్ని, నెరేటివ్‌లో ప్రవేశపెట్టే ప్రయత్నంలో,visual imagination, ఒక ‘సర్రియల్ ఎటాక్’లా మారిపోతుంది. విశాలమైన రెక్కలున్న మనిషి, మన పెరట్లో జారిపడతాడు. అతనితో మనం, మన పిల్లలు మామూలుగానే సంభాషిస్తుంటాము. అతనికొక దుఃఖం, కథ; పిల్లి లోపల నివశించే ఆడమనిషి కథ చెబుతాడు. చనిపోయిన పొరుగింటి పిల్ల శరీరం, శవపేటికలో, రోజురోజుకీ అట్లా పెరుగుతూనే ఉంటుంది.
జర్నలిస్టుగా పనిచేసిన మార్క్వెజ్, తన కథా భాషలో ఫాల్కనర్, జాయిస్‌ల వచనాల్లో కనబడే రిధమ్‌ని, కాఫ్కా నుంచి మెటాఫోరికల్ స్పర్శను, బోర్జస్‌లా కలల్లాంటి ఇమేజిరీని, అన్నింటినీ కలగలపిన తనదైన భాషను సృష్టించుకున్నారు. ఆయన కథా భాష నిండా నిశ్శబ్ద మాంత్రికత ఉంటుంది.

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా, ప్రేమ పైన గొప్ప వ్యాఖ్యానం. ప్రేమ గురించిన ఒక మెడిటేషన్. spiritual history of human sexuality
అది. the autumn of patriarch ఒక epic, లాటిన్. అమెరికా రాజకీయ చరిత్ర ; తనకాలపు నియంతలందరి పోలికలతో ఒక పాత్రలా రూపొందిన నవల.
మార్క్వెజ్, తన రచనల్లో కాలం, జ్ఞాపకం మానవుని కలలు, ఆశలు, వాటిని నిరూపించడానికి ప్రయత్నించారు. ఆయన రచనలు మనతో సంభాషిస్తాయి. అవి మనపై ‘mild sorcery’లా పనిచేస్తాయి. మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్రలోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imaginationను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charmను, magic చేసే prose కనిపెట్టాడు. త్రోసుకొచ్చే మరణపు రాత్రుల్ని ఆపివేసే, వెలుగుల కిరణాల, ఎగిరే పక్షుల రెక్కల, శక్తిని తన పాత్రలకు ఇచ్చిన కథా/ నవలా మాంత్రికుడు మార్క్వెజ్. ఆయనకు వీడ్కోలు.
– డాక్టర్ వి. చంద్రశేఖరరావు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మా ఇంటి నేటి అతిధులు

మా ఇంటి నేటి అతిధులు స్వర్గీయ టి ఎల్ కాంతా రావు గారి మేనకోడలు శ్రీమతి శేషుకుమారి దంపతులు ,పెంజేంద్ర మాజీ టీచర్ ,నా శిష్యురాలు శ్రీమతి శేషుమాంబ ,కుమారుడు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఒరిఎంటల్ హైస్కూల్ 53 వ వార్షి కొత్సవం

భోపాల్ స్టేషన్ లో ప్రీతి దంపతులతో మేము -కోసూరులో ఆదినారాయణ ,పెదముత్తేవిలోణా మిత్రుడు  స్వర్గీయ వేమూరి దుర్గయ్య గారిళ్ళల్లో  ,పెదముత్తేవి ఒరిఎంటల్ హైస్కూల్ 53 వ వార్షి కొత్సవం లో నేనూ మా అమ్మాయి -19-4-14

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర-5 కాశీ యాత్ర

మా నవ రాత్రి యాత్ర-5

కాశీ యాత్ర

12వ తేదీ శనివారం ఉదయమే లేచి కరివెన వారి సత్రం రూముల్లో నే స్నానాలు పూర్తీ చేసుకొని బయటికి వచ్చాం .ప్రక్కనే ఒక దక్షిణాది హోటల్ ఉంటె అక్కడే ఇడ్లీ ,అట్టు తిని కాఫీ తాగాం .అక్కడి నుండి రిక్షాలో బయల్దేరి శ్రీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి చేరాం .అమ్మవారిని దర్శించాం .మా అమ్మాయి వంద రూపాయలు పూజారికిచ్చి పూజా సామగ్రి గాజులు పసుపు కుంకుమ జాకేట్టు ప్రసాదం గా  తీసుకోంది .విశాలాక్షి గుడి అనగానే రెండేళ్ళ కితం మా బావ మరిది కుటుంబం తో విశ్వనాధ దేవాలయం నుండి రాత్రి వేళ బయల్దేరి దగ్గర లోనే ఉన్న విశాలాక్షి మందిరానికి రావటానికి దారి తెలీక బురదలో, రొచ్చులో, ఆవుల మధ్య, వాటి పేడల మధ్య,ఇరుకు  సందు గొందులు, తిరిగి గంటపైగా నడిచి ,కరెంటు పోయి, చీకటి రాత్రి ఎట్టకేలకు అమ్మవారి గుడికి చేరిన సంఘటన గుర్తుకొచ్చింది .దశాశ్వమేద ఘాట్ ఒడ్డునే విశాలాక్షి ఆలయం ఉంది .కాశీ విశాలాక్షీ దేవి గా భక్తుల పాలిటి కొంగు బంగారం గా అమ్మ వారు కాశీలో కొలువై ఉంది .అమ్మ వారి దర్శనం సకల పుణ్య ఫలదం అని అందరి విశ్వాసం .దివ్యం గా దర్శనం పొంది ఆనందించాము .

గుడికి దగ్గరలోనే చేనేత వస్త్రాలయం ఉంటె మా వాళ్ళు అందులో దూరి మూడు వందల రూపాయల చీరే రెండువందల ఇరవై కి బేరమాడి పది హీను చీరలు వివిధ రంగుల్లో కొన్నారు. అందులో జాకెట్ పీస్ కూడా ఉండతం విశేషం .అక్కడి నుంచి నడిచి దగ్గరలోనే ఉన్న శ్రీ విశ్వేశ్వర మహా జ్యోతిర్లింగా దర్శనం రెండవ సారి చేశాం .విశాలాక్షి గుడి నుండి విశ్వనాధ గుడికి రెండో నంబర్ గేటు ద్వారా వెళ్ళాలి .గేటు నంబరు తెలీకుండానే సెక్యూరిటీ అంతా పూర్తీ చేయించుకొని మా అమ్మాయిని రమణ ను అక్కడే ఉంచి మా దంపతులం లోపలి వెళ్లి తనివార విశ్వేశ్వర దర్శనం చేసి అభిషేకం చేసి ,అన్నపూర్ణ అమ్మవారి దర్శనమూ చేసి సెక్యూరిటీ నుండి బయట పడ్డాం .బయటికొచ్చి చూస్తె మా వాళ్ళిద్దరూ కనిపించలేదు .కంగారు పడ్డాం .అటూ ఇటూ అరగంట తిరిగి పోలీసుల ను అడిగి రెండో నంబర్ గేటు దగ్గరకు చేరుకొన్నాం .అక్కడే ఉన్నాడు మా రమణ .మా అమ్మాయి కని  పించలేదు .ఏమయిందని అడిగితె మీ కోసమే వెళ్ళింది అన్నాడు  .ఫోన్ తీసుకెళ్ల లేదన్నాడు. నాకు ‘’ఎక్కడో కాలింది ‘’.అరిచాను .సరే వాడినీ, వెళ్లి దర్శనం చేసుకు రమ్మన్నాం .వెళ్లి అన్నా చెల్లీ ఒక పావు గంటలో వచ్చారు ..జనం విపరీతం గా ఉన్నారు క్యూలో ఉన్న భక్తులకు ఇక్కడ కాశీలో ఏ దేవుడు ఉన్నాడో ఎవరిని దర్శించటానికి వచ్చారో కూడా తెలియదు అని వారిని మాట్లాడిస్తే అర్ధమైంది .వివరం గా నేనే చెప్పాను .గ్రూపులను వెంట బెట్టుకొని దర్శనం చేయించే వారుంటారు వారేమీ వీరికి వివరం గా చెప్పక పోవటం తో వచ్చిన చిక్కు ఇది అని అర్ధ మయింది .అంతా హడావిడే సందడే .ఏ గేటులో నుంచి లోపలి వేడుతున్నామో గ్రహించి వెళ్ళక పోవటం తో వచ్చిన తిప్పలు ఇవి అందుకని గుడికి వెళ్ళే వారందినీ హెచ్చరించి చెప్పాం .

మేము రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు తెల్ల ‘’పైజమా లాల్చీ ‘’మొదటి సారిగా ఇక్కడే కొన్నాను .అంతకు మున్దేప్పుదేప్పుడూ వీటిని ధరించలేదు .వేసుకోవటం మొదలెట్టిన తర్వాత బానే ఉందని పించింది .అప్పుడు జత నూట యాభై కే కొన్నాం. ఇప్పుడు చూస్తె మూదొందలకు పైగా చెప్పాడు .ఒక హోల్ సెల్ షాప్ మీద పడి ఒక జత తెల్లవి  పట్టు ది ఒకటి కొన్నాను .మా రమణా కొనుక్కున్నాడు. మా మనవళ్ళు సంకల్ప్ ,భువన హర్ష చరణ్ లకు కూడా తెల్ల పైజమా లాల్చీలుమా అమ్మాయి కొన్నది   .రమణ మా అమ్మాయి పిల్లలు శ్రీ కెత్ ,ఆశుతోష్, పీయూష్ లకుకుట్టిన  పట్టు పంచెలు కొన్నాడు. వాడూ పట్టు బట్టలు కొనుక్కున్నాడు .మా ఆవిడా రెందొందలకు నేత చీర కొన్నది  .మా అమ్మాయి మా అల్లుడికీ తెల్ల పైజమా లాల్చీ కొంది .మాశ్రీ  సువర్చలన్జనేయ స్వామి వారలకు పట్ట్టు బట్టలు కొన్నాం .

మౌంట్ సోమా ‘’మా ‘’మా అమ్మాయిని వాళ్ళ ఆయనగారికి అంటే ప్రసాదావధాని గారికి కుట్టిన పట్టు పంచెలు కొనమంటే రెండు జతలు కొన్నది .మంచి రంగువే దొరికాయి .నిన్నటి నుంచి మా అమ్మాయి స్పటిక శివ లింగాలు కొందామని ప్రయత్నిస్తే ఇవాళ ఒక చోట దొరికాయి .శివలింగం ,పాను  వట్టం ఉన్నవి రెండు ,మధ్యరకం వి కొన్నది .అభిషేకం చేసే స్టాండ్ పై నీటి ధారా పాత్ర ఉన్నదిఒకటిఉన్న లింగం  పెద్దది కొన్నది .’వీటి ఖరీదు రెండు వందల యాభై ఒక్కొక్కటి .’సో మా మా ‘’గారి కోసం దర్భ చాపల సెట్ నాలుగు చాపల సెట్ ఎనభై రూపాయలకు కొన్నది .ఇక్కడా దర్భ చాపలు అని అడిగితె యెవరిఏ తెలీదు .’’కుశాసన్ ‘’అని అడగాలని ఒక సాధువు చెప్పాడు .దేవుడి ఫోటోలు,ప్రసాదాలు  కొన్నాం .పైజమా షాపు  వాడు మంచి టీ తెప్పించి ఇప్పించాడు .

షాపింగ్ అంతా అయేసరికి ఒంటి గంట దాటింది .బయటికి వచ్చి రిక్షాలు ఒక్కొక్కటి నలభై రూపాయలకు మాట్లాడి కరివేన సత్రం చేరాం .సామానంతా రూముల్లో పడేసి రమణ ఆకలిగా లేదంటే మేము ముగ్గురం సత్రానికి భోజనానికి వెళ్లాం .అప్పటికే రెండు బాచీలు భోజనం చేశారు .మా అమ్మాయి కింద కూర్చుంటే మేమిద్దరం టేబుళ్ళ వద్ద కుర్చీలలో కూర్చున్నాం భోజనానికి .లుంగీ తువ్వాల తో నేను వచ్చాను .పప్పు ,బంగాళా దుంప వేపుడు వంకాయ కూర ,దోసకాయ చట్నీ ,పరవాన్నం ,బజ్జీ సాంబారు మజ్జిగ లతో బహు కమ్మని భోజనం పెట్టారు .అడిగి అడిగి వాళ్ళూ కావాల్సినవి అడిగి మేమూ కడుపు నిండా తిని ‘’బ్రేవ్ మని త్రేంచాం’’.అన్నదాతా సుఖీ భావ ‘’భోజన దాతలకు కృతజ్ఞత చెప్పాం భోజనానికి ముందు అన్నపూర్ణా దేవిని స్తుతిన్చాం  .

రూము రెంటు యెంత అని అడిగితె గదికి మూడొందలు అని చెప్పారు .రెండు రూములకు రెండు రోజులకు పన్నెండు వందలు చెల్లించి రసీదు తీసుకొన్నాను. నిన్నా ఈ రోజు భోజనాలు చేసినందుకు సత్రానికి డొనేషన్ గా అయిదు వందలు ఇచ్చాను. రసీదు ఇచ్చారు .నాలుగింటికి రూములు ఖాళీ చేస్తామని చెప్పి గదులకు చేరాం .ఈ సారి ‘’కరెంటు కోత’’ పెద్దగా లేదని పించింది .రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు కనీసం నాలుగైదు గంటలు పగలూ రాత్రి కరెంట్ కట్ చేశాడు .ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాం .ఎన్నికల రోజులు కనక జాగ్రత్త పడ్డారేమో? మూడున్నర దాకా విశ్రాంతి తీసుకొన్నాం సామాను అంతా సర్ది రెడీ గా ఉంచుకోన్నాం .తొమ్మిది నెలలు బ్రాహ్మణ సేవ చేయాలనే తలంపుతో రామయ్య అనే ఒక గోల్లాయన కరీం నగర్ నుంచి వచ్చి ఇక్కడ సేవకుడిగా సత్రం లో సేవ చేస్తున్నాడు .భోజనం టిఫిన్లు వసతి ఉచితం అని చెప్పాడు .మా సామాను ఆటో వరకు తీసుకు రావటానికి మాకు సహాయం చేశాడు .రమణ ఆయన జేబులో కొంత డబ్బు పెట్టాడు ..ఇక్కడే ‘’సైకిల్ స్వామి ‘’ఆశ్రమం ఉంది .సరాసరి వెడితే శ్రీ విశ్వ నాద గల్లీ చేరుతుంది దారికోసం కంగారు పడక్కర లేదు నడిచి తిన్నగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించ వచ్చు .ఆటోకురెండు వందలు ఇచ్చివారణాసి స్టేషన్ కు చేరుకొన్నాం  .అయిదుముప్పావుకు ‘’ఖజురహో ‘’వెళ్ళే బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ ఎక్కాం . అది వారణాసి నుంచే బయల్దేరే లింక్ ఎక్స్ప్రెస్ .అనేక స్టేషన్లలో బోగీలు తగిలించుకొంటూ వదిలిన్చుకొంటూ ,చివరికి యిదే యిదే అయిదు బోగీలతో అందులో ఒకే ఒక ఏ సి బోగీతో మర్నాడు అంటే పదమూడు ఆదివారం ఉదయం అయిదున్నరకు ఖజురహో చేరాము .ఆ విశేషాలు ఈ సారి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -4 కాశీ సందర్శనం

మా నవ రాత్రి యాత్ర -4

 

కాశీ సందర్శనం

11ఏప్రిల్ శుక్రవారం ఉదయం అలహాబాద్ లో లోకమాన్య ఎక్స్ ప్రెస్  ను నాలుగు గంటలకు ఎక్కాం .అది మూడు గంటలు ప్రయాణం చేసి వారణాసి కి ఉదయం ఏడింటికి చేరింది .’’అఖిల భారతీయ కరివేన నిత్యాన్న దాన సత్రం ‘’లో ఫోన్ పై రెండు రూములు ముందుగానే మా అబ్బాయి శర్మ బుక్ చేశాడు .నేరుగా స్టేషన్ నుండి ఆటో లో కరివేన సత్రం చేరాం.

ఇది మానస సరోవర్ ఘాట్ దగ్గర ఉంటుంది. దీని దగ్గరే నారద ఘాట్ ,ఆంధ్రాశ్రమం ఉంటాయి .కింద రూములు రెండు ఇచ్చారు .ఎసి లేక పోయినా చల్లగా ఉంది .భోజనం కూడా ఇక్కడే కనుక హాయిగా ఉంటుంది . స్నానాలకు కావలసిన బట్టలు విడిగా   సంచీలలో సర్దుకొని నారద ఘాట్ మీదుగా కేదార్ ఘాట్ నుంచి బోటులో మనిషికి వంద రానూ పోనూ కు ఇచ్చి నీటి ప్రవాహం ఉన్న చోటకు చేరాం .అక్కడే అందరూ స్నానాలు చేస్తున్నారు .బోటు దిగి స్నానాలు నేను మంత్రం చెబుతూ చేయించాను .గంగమ్మకు మా వాళ్ళు హారతి ఇచ్చారు .మళ్ళీ బోటు ఎక్కి కేదార్ ఘాట్ చేరాం .అక్కడ మెట్లు చాలా ‘’స్టేప్’’ గా ఉంటాయి .ప్రభావతికి కష్టమే అయినా ఎక్కింది మాతో బాటు .అప్పటికే సూర్యుడు మండి పోతున్నాడు .చెప్పులు తీస్తే కాళ్లు కాలి పోతున్నాయి .కేదారేశ్వర దర్శనం చేశాం .ఆలయం వెనక భాగం వైపుకు చేరాం .అక్కడ మంచి కాఫీ తాగాం .అక్కడినుంచి ఆటో లో శ్రీ విశ్వనాదాలయానికి చేరాం .మేము చేరే సరికి పదకొండు దాటింది అభిషేక సమయం .కనుక గంట సేపు క్యూ ఆపేశారు .పన్నెండు పావుకు దర్శనం మొదలైంది .పావు గంటలో ఆలయం లోకి చేరుకొన్నాం. తనివి తీరా కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లిన్గాన్ని స్పృశించి పరవశించి క్షీరం తో అభిషేకం చేశాము .ఉత్తర దేశం లో శివుడికి ఉమ్మెత్త పువ్వులు తో దండ వేస్తారు .తనువూ చరితార్ధమైంది .ఇది అయిదవ సారి కాశీ రావటం .రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు బయటి నుండే దర్శించాల్సి వచ్చింది .స్వామి దర్శనం తర్వాత అన్నపూర్ణా దేవి దర్శనం చేసుకోన్నాం

.ఆన్నపూర్నాలయం లో ప్రసాదం గా ‘’బియ్యం ‘’కొద్దిగా ఇస్తారు .వాటిని ఇంటికి వచ్చి మన బియ్యం లో కలుపు కొని పరవాన్నం వండుకొని నైవేద్యం పెట్టటం సంప్రదాయం .అమ్మ వారి కుంకుమ కూడా తెచ్చుకోవాలి .ఆలయానికి ముందే సెక్యూరిటీ చెక్ ఉంటుంది .బాగులను అనుమతించరు .కెమెరా, సెల్ ఫోన్ కూడా తీసుకు వెళ్ళ రాదు .అందుకని ముందు మేమిద్దరం వెళ్లాం రమణ ,విజ్జి సామాను కాపలా కాశారు .మేము వచ్చిన తర్వాతా వాళ్ళిద్దరూ వెళ్లి దర్శనం చేసుకొచ్చారు .నిన్న ఏకాదశి నాడు త్రివేణీ స్నానం ఇవాళ శుక్రవారం నాడు అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వనాధ దర్శనం .అనుకోకుండా భలే గా కుదిరి అదిరిందను కొన్నాం .అందరికి ఏంతో సంతృప్తి గా ఉంది .అంతా అయి బయటికి వచ్చేసరికి ఒంటి గంట దాటింది .ఇక విశాలాక్షీ దేవి ని చూడటానికి సమయం చాలదని రిక్షాలలో బయల్దేరి కరివేన వారి సత్రానికి చేరుకొన్నాం . కరివేన వారి నిత్యాన్న దాన సత్రం అప్పటికే ఒక బాచ్ భోజనాలు అయి పోయాయి .ఇక్కడ భోజనం చేయాలంటే ఉదయం పది గంటల లోపు చెప్పి రాయిన్చుకోవాలి. గోత్రనామం చెప్పాలి. ఎందరు వచ్చి భోజనం చేస్తారో రాయించాలి .మేము ఉదయమే ఆ పని చేసే వెళ్లాం .కింద కూర్చో బెట్టి విస్తళ్లలో వడ్డిస్తారు .కూచోలేని వారికోసం రెండు టేబుళ్లున్నాయి .వాటిపై  పై కుర్చీలలో కూర్చుని భోజనం చేయచ్చు .మా శ్రీమతి అలాగే చేసింది .మేము ముగ్గురం కిందే కూర్చున్నాం .చొక్కా బనీను విప్పేసి మగవాళ్ళు భోజనానికి కూర్చో వాలి .ఇది ఖచ్చితం గా అందరూ పాటిస్తారు .రెండు  కూరలు , పప్పు, పచ్చడి, పులుసు  మజ్జిగ నెయ్యి లతో చాలా ఆప్యాయం గా భోజనం వడ్డించి మారు అడిగి మరీ వడ్డించి సంతృప్తి గా తినేట్లు చేయటం వీరి ప్రత్యేకత .ఎవరూ విసుక్కోరు ,కసుక్కోరు సేవా భావం అంకిత భావాలతో వడ్డిస్తారు .చల్లని మంచి నీరు పోస్తారు .అందరం భోజనానికి ముందు ఒకాయన చెప్పే అన్నపూర్ణ మంత్రం చెప్పి భోజనం చేయాలి .భోజనాంతరం అందరి చేత ‘’అన్నదాతా !సుఖీభవ “’అని పిస్తారు .అందరం చాలా సంతృప్తి గా భోజనాలు ముగించాము .వడ్డన ఆడవాళ్లే చేస్తారు ,పదార్ధాలన్నీ రుచికరం గా మళ్ళీ మళ్ళీ అడిగి వేయిన్చుకోనేట్లున్నాయి .ఇందులో కొందరు సేవా భావం తో చేస్తే కొందరు జీతాలకు పని చేస్తారు .మంచి వంట శాలా ఇద్దరు వంట మేస్త్ర్రీలు ఉంటారు .ఎక్కడో కర్నూలు జిల్లా కరివేన గ్రామం లో శ్రీశైలం వెళ్ళే బ్రాహ్మణ యాత్రికులకు భోజనసదుపాయం

వందేళ్ళ క్రితం ప్రారంభించిన సత్రం ఇవాళ కాశీ  శ్రీశైలం ,షిర్డీ భద్రాచలం మొదలైన ప్రదేశాలకు  విస్తరించి ఉచితాన్న దానం చేసి ఏంతో సేవ చేస్తున్నారు .కరివేన వారి వారి ఉదాత్త ఆశయానికి ఇది మచ్చుతునక .. భోజనం చేసిన వారినెవరినీ రూపాయి కూడా అడగక పోవటం ఇక్కడి విశేషం .భోజనం చేసిన వారు ఏంతోకొంత తమ సంతృప్తికోసం డబ్బు విరాళం గా ఇస్తారు .దానికి రసీదు ఇచ్చేస్తారు .ప్రతి రూపాయి జమ అవుతుంది .ఆడిట్ జామా ఖర్చులు పర్యవేక్షణ నిఘా అన్నీ పకడ్బందీ గా ఉంటాయి .అందుకే అపారమైన నమ్మకం తో డబ్బు చెల్లిస్తారు .పాతిక వేలు చెల్లిస్తే నిత్యాన్న దానం చేస్తారు అట్లా దీనికి గ్రేడులుంటాయి .ఆ డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ లో ఉంచి వడ్డీ మీద కార్య క్రమం నిర్వాహిస్తారు .నేను మా నాన్న గారి తిది ‘’కార్తీక శుద్ధ ఏకాదశి ‘’నాడు అన్నదానానికి నిరుడే మా ఇంట్లో అద్దె కుంటున్న కృష్ణ మూర్తి మేస్టార్ గారి కుటుంబం ఇక్కడికి వస్తే 2050రూపాయలు ఇచ్చి పంపి కట్టించాను కాశీ లో .మా అమ్మ గారికి ,మా నాయనమ్మ గారి తిధులకు ‘’ఫాల్గుణ శుక్ల పాడ్యమి’’ మరియు ‘’ఆశ్వయుజ శుక్ల అష్టమి’’ (దుర్గాష్టమి )లకు శ్రీశైలం లో ఒక్కొక్కరికి 2050రూపాయల చొప్పున కట్టాను .మా అన్నగారు స్వర్గీయ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ గారి తిది ‘’ఫాల్గుణ శుద్ధ సప్తమి ‘’కి గాను మా అన్న గారబ్బాయి రామనాధ బాబు నాకు ఇచ్చి పంపిన డబ్బు 2050రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నాను .కంప్యూటర్ రసీదు,డిపాజిట్  సర్టిఫికేట్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇచ్చారు . మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడుఛి కోమలి సాంబా వధాని ల ‘’మేరేజ్ డే ‘’సందర్భం గా జూన్ 18న అన్నదానం చేయించమని 1750రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నది. అలాగే అమెరికా లో ఉంటున్న మా అమ్మాయి స్నేహితురాలు ఛి సౌ మాధవి  భర్త ఛి సుధీంద్ర లు ఇచ్చి పంపిన 1750రూపాయలను వారి కోరిక మేరకు ‘’కార్తీక పౌర్ణమి ‘’నాడు అన్నదానం చేయటానికి మ అమ్మాయి కట్టి రసీదు పొందింది .మనం రాయించిన తేదీకి ఆ పని చేస్తున్నట్లు కార్డు రాసి పోస్ట్ చేయటమూ వీరి ప్రత్యేకతే .ఇలా రోజూ ఏంతోమంది డబ్బులు చెల్లించి నిత్యాన్న దానానికి ప్రోత్సహిస్తూ ఉంటారు .ఏ మహాను భావుడు తన చల్లని చేతులతో ఈ సత్రాన్ని స్తాపించాడో ఆ మహనీయునికి అందరూ క్రుత్జంత చెప్పుకోవాలి .ఈ ధనాన్ని ఆశించి వారెవ్వరూ ఈ సత్రం పెట్టలేదు యాత్రకు వచ్చిన వారికి భోజనం ఇబ్బంది కలుగ కుండా చేయాలన్న ఉన్నత ఆదర్శమే ఇంత గా విస్థ రించింది .వందేళ్ళకు పైగా కరివేన వారి సత్రాలు యాత్రికులకు భోజన వసతి కలిపించి సేవ చేస్తున్నాయి .వారి ఉదార  హృదయానికి నమశ్శతాలు. .

Secretary- ABBKN Satram
67/87, Lakshmi Madhava Nilayam,
Fort, Kurnool – 518001
Andhra Pradesh
India
Phone: +91-8518-241175

 

కాశీ నగర సందర్శనం భోజనం చేసి మా రూముల్లోకి చేరి విశ్రాంతి తీసుకొన్నాం .సాయంత్రం నాలుగింటికి బయల్దేరి ఆటో లో మనిషికి వంద రూపాయలిచ్చి నగర సందర్శన కు బయల్దేరాం .తులసీ మానస మందిర్ చూశాం ఇదే బిర్లా మందిరం ఇక్కడే తులసీ దాసు రామ చరిత మానస్  మార్బుల్ గోడల పై శిలా ఫలకాలకలపై  రాయబడి ఉంటుంది రెండు అంతస్తుల భవనం తులసీ దాసు గారి విగ్రహం మెట్ల ప్రక్కగా ఉంటుంది. ఆయన చేతిలో తులసీ రామాయణం ఉండిద పాడుతున్నట్లు రికార్డు విని పించి ఆయనే పాడుతున్నాడా అనే అనుభూతి కలిగించడం ఇక్కడి విశేషం .తరువాత శక్తి పీఠం దుర్గా దేవి ఆలయం ,సంకట మోచన హనుమాన్ దేవాలయం ,మ్యూజియం అందులో అనేక శిలాలు చిత్రాలు ఆయుధాలు ,పక్షులు జంతువులే కాక గాంధీ గారికి విడిగా ఒక మ్యూజియం ఉన్నాయి .అన్నీ తిరిగి చూశాం ఫోటోలు తీసుకోవటానికి పాతిక రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నాం .ఎంట్రన్స్ ఫీజు మనిషికి అయిదు రూపాయలే .చాలా బాగా ఉంది. చూడాల్సిన మ్యూజియమే .ఇన్ని సార్లు వచ్చినా చూడటం కుదరనే లేదు. గాంధీ గారి అపురూప ఫోటోలున్నాయి దేన్నీ వదల కుండా ఫోటోలలో బంధించాను . పార్కు చూశాం .గవ్వల గౌరిదేవాలయం దర్శించాం  ఈమె విశ్వనాధుని సోదరి .గవ్వలు కొని ఆమె కు సమర్పించాలి .’’గవ్వలు నీకు కాశీయాత్ర ఫలం నాకు ‘’అని పూజారి చెప్పిస్తాడు .

ఇక్కడ కోతుల బెడద బాగా ఎక్కువ సంకట మోచన్ దగ్గరా అంతే అక్కడ ప్రసాదాలు కొని నైవేద్యం పెట్టించి తెచ్చుకొంటారు .ఇవన్నీ తిరిగి చూసి సాయంత్రం ఆరున్నరకు గంగా హారతి చూడాలనుకోన్నాం .కాని ఏడున్నర అయి పోయింది .మా అమ్మాయి గంగ హారతి మిస్ అయినందుకు మమ్మల్ని దేప్పుతూనే ఉంది .చివరగా శ్రీ కాలభైరవ దర్శనం చేశాం అక్కడే మా ఆవిడ తప్పి పోయి పావుగంట మమ్మల్ని తిప్పలు పెట్టి మా అమ్మాయి తిరిగి గుడిలో ఉంటె తీసుకొచ్చింది .ఒక సిల్క్ సారీ షాప్ లో మా అమ్మాయి చీర కొనుక్కోంది .అక్కడి నుండి సరాసరి ఆటోలో కరివేన సత్రం చేరాం .రాత్రి పూట భోజనాలు ఉండవు .టిఫిన్ మాత్రమె .మా నలుగురికి పిండి ఉప్మా టిఫిన్ నాలుగు పాకెట్లు కట్టి ఇచ్చి మజ్జిగ కూడా పాక్ చేసి ఇచ్చారు .రూము కు తెచ్చు కొని తిని పడుకోన్నాం .రేపు మళ్ళీ విశ్వనాధ విశాలాక్షీ అన్న పూర్నా దర్శనం చేయాలి . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-14-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -3

మా నవ రాత్రి యాత్ర -3

అలహా బాద్ విశేషాలు

క్రీ పూ.644లో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ హర్ష చక్రవర్తి పరిపాలనాకాలం లో ప్రయాగ సందర్శించాడు .ప్రయాగ లో ఉన్న రెండు నదుల మధ్య ప్రదేశం నాలుగు మైళ్ళ పరిధిలో వ్యాపించి ఉందన్నాడు .నగరం లో రెండు మతాలున్నాయని ,అనేక దేవాలయాలు చంపక్ వాటిక లో పెద్ద స్తూపం ఉందని ,దాన్ని అశోకుడు నిర్మించాడని తెలియ బరచాడు .మానవ జన్మ చరితార్ధత ప్రయాగ లోనే సాధ్యమని ఇక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదనే విశ్వాసం ఉందని రాశాడు .1575లో అక్బర్ నదీ ప్రయాణం చేసి ప్రయాగ చేరాడు .అప్పుడే ప్రయాగకు ‘’అలహా బాద్ ‘’అనే కొత్త పేరు అక్బర్ పెట్టాడు .తన కొత్త మతం ‘’దీన్ ఇలాహి ‘’ఇక్కడే పుట్టింది .కనుక అలహా బాద్ పేరు సార్ధక నామ మయింది . అందుకే హిందీలో ‘’ఇలహా బాద్ ‘’అని రాస్తారు    .    మొగలాయీ సామ్రాజ్య విచ్చిన్నం తో మరాఠా రాజులు దీన్ని స్వాధీన పరచుకొని ‘’అవధ వంశ ‘’పాలన సాగించారు లక్నో రాజ్యం ఏర్పరచారు .కాని అవధ లో అలహా బాద్ భాగం గానే ఉండేది .లక్నో నవాబులు అవధ కీర్తిని పెంచలేక పోయారు .చివరికి 1801బ్రిటిష్ వారి వశమయింది .ఆంగ్లేయులు ‘’ఆగ్రా అవద్ సంయుక్త రాష్ట్రాలు ‘’పేర కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు .దీనికి అలహా బాద్ రాజధాని .

బ్రిటిష్ వారిని దేశం నుంచి సాగనంపటానికిస్వతంత్ర సంగ్రామం లో  అలహా బాద్ ముఖ్య కేంద్రమే అయింది .1857మొదటి స్వాతంత్ర సమరం లో అలహాబాద్ ప్రధాన పాత్ర పోషించింది .అనేక స్వతంత్ర యోధులకు ఆవాస భూమి అయింది .చాలా తిరుగు బాట్లు ఇక్కడే పురుడు పోసుకోన్నాయి .కాంగ్రెస్ పార్టీ ప్రాభవం లోకి వచ్చినప్పుడు ఎన్నో కాంగ్రెస్ మహా సభలు అలహా బాద్ లోనే జరిగాయి .గొప్ప యాత్రీక కేంద్రమే కాక అలహా బాద్ రాజకీయ పోరాట యాత్రిక కేంద్రమూ అయింది .దీనికి ఉదాహరణలే ‘’ఆనంద భవనం ‘’,ఆల్ఫ్రెడ్ పార్కులు .స్వాతంత్ర సాధన తరువాత కూడా అలహా బాద్ ప్రాముఖ్యత తగ్గ లేదు .కారణం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ ఇక్కడి పూల్ పూర్ లోక్ సభా నియోజక వర్గం నుంచే ఎన్నికయ్యాడు .భరద్వాజ ఆశ్రమానికి సమీపం లో ఉన్న ఆనంద భవన్ ఉంది .నెహ్రు తర్వాతా లాల్ బహదూర్ శాస్త్రి అలహా బాద్  పార్లమెంట్ నియోజక వర్గం నుంచే గెలిఛి ప్రధాని అయ్యారు. తరువాత ఇందిరా గాంధి ,రాజీవ్ ,వి.పి సింగ్ ,ఇక్కడి నుంచే ఎన్నికై ప్రదానులయ్యారు .రాజకీయాలతో బాటు అనేక కార్యక్రమాలకు అలహా బాద్ కేంద్రం గా ఉంది గొప్ప. విద్య కేంద్రం గా గుర్తింపు పొందింది .ఫిరాఖ్ గోరఖ్ పూరి, హరి వంశ రాయ్ బచన్ ,మహాదేవ వర్మ రాం కుమార్ వర్మా సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ (ఆగే) ఉపేంద్ర నాద్(అశ్క్) ,భగవతీ చరణ్ వర్మా ,ఉపేంద్ర నాద సూర్య కాంత త్రిపాఠీ(నిరాలా ) వంటి కవులు పండితులు తమ సాహితీ విహార భూమి గా అలహా బాద్ నే ఎంచుకొన్నారు .

సంగమ క్షేత్రం ఒడ్డున అక్బర్ కట్టించిన పెద్ద కోట ఉంది .ఇప్పుడు సైన్యం అధీనం లో ఉంది .కోట లో అక్బర్ స్థంభం ఉంది .లోపల ‘’పాతాళ పురి ‘’అనే ఆలయం ఉన్నది అక్కడ అక్షయ వట వృక్షం చూదాల్సినది .దాని వ్రేళ్ళు చాలా లోతులో ఉంటాయి చూడటానికి అనుమతించరు .సరస్వతి ఘాట్ యమునా నది ఒడ్డున ఉంటుంది .సాయం సంధ్యలో దీని దర్శనం మనోహరం .ఇక్కడే ఉన్న పురాతాన ‘’మన్ కామేశ్వర దేవాలయం ‘’దర్శించాలి .ఈ స్వామిని అర్చిస్తే మనసులోని కోరికలు తీరుతాయని విశ్వాసం  .చంద్ర శేఖర ఆజాద్ పార్క్ ఆ త్యాగ ధనుడి పేరు మీద నెలకొల్పారు ఇక్కడే ఆయన బ్రిటిష్ తుపాకీ దెబ్బలకు అసువులర్పించి వీర మరణం పొందాడు .స్మ్రుతి చిహ్నం యేర్పరచారు .

భరద్వాజ ఆశ్రమం

త్రేతాయుగం లో శ్రీరాముడు ,భరతుడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించి మహర్షి ఆశీస్సులు పొందారు .ఈ ఆశ్రమం లో అనేక మంది మునులు శిష్యులు ఉంది ఆయన ఆతిధ్యాన్ని పొందారు ఇక్కడ ఉన్నత విద్యా కేంద్రాన్ని ఏర్పరచాలని ప్రభుత్వం ఆలోచన లో ఉంది .గంగా నది ఒడ్డున ‘’శివ కూటి ‘’దేవాలయం ఉన్నది. నారాయణి ఆశ్రమమూ చూడ  దగినదే .గంగ ఒడ్డున ఝూన్సి అనే ప్రదేశం ఉంది ఇదే పూర్వపు ‘’ప్రతిష్టాన పురం ‘’.ఇక్కడ అనేక ప్రాచీన ఆలయాలున్నాయి .శివాలయం, హంసాలయం ‘’సముద్ర కూపం’’ ఇక్కడే ఉన్నాయి .శ్రుంగ వేర పురం ఇక్కడే ఉంది.ఇదే గుహుడి రాజ దాని . ఇక్కడే ఋష్య శ్రుంగా మహర్షి ఉండేవారు .ఆయన సమాధి కూడా చూడచ్చు .మహా భారత కాలం లోని లక్క ఇల్లు అనే లాక్షా గృహం ఇక్కడి త్రవ్వకాలలో బయట పడింది .ఇది అలహాబాద్ కు యాభై కిలో మీటర్ల దూరం లో ఉంది .

స్వరాజ్య భవనం

1899లో మోతీలాల్ నెహ్రు దీన్ని కొన్నాడు .అభివృద్ధి చేసి ‘’ఆనంద భవన్ ‘’అని పేరు పెట్టాడు .1927లో నెహ్రు కుటుంబం ఇక్కడ స్తిర పడింది .ఇది స్వతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించింది .మోతీలాల్ ఇక్కడే కోర్టులో వకీలుగా ఉన్నాడు. తర్వాతా జవహర్ ఉన్నాడు .మ్యూజియం ఉంది అనేక ప్రముఖులు ఇక్కడే సమావేశమై నిర్ణయాలు తీసుకొనే వారు .ఆనంద భవన్ కు జవహర్ లాల్ 1926లో సంకుస్తాపన చేశాడు .ఇందిరా గాంధి ఈ బృహత్తర భవన సముదాయాన్ని1970లో జాతికి అంకితం చేసింది .అలహా బాద్ కోర్టు చూడ తగినది .

అలహా బాద్ విశ్వ విద్యాలయం

దేశీయ య విశ్వ విద్యాలయాలలో అలహా బాద్ యూని వర్సిటీ ఒక ప్రత్యెక గుర్తింపు పొందింది ‘’.తూర్పు దేశ ఆక్స్ ఫర్ద్ యూని  వర్సిటి “’అని పేరు పొందింది .1887లో దీన్ని ఆల్ఫ్రెడ్ లాయల్ ప్రేరణ వలన స్థాపించారు .ప్రముఖ బ్రిటిష్ ఆర్కి టెక్ట్ ఎమర్సన్ దీన్ని డిజైన్ చేశాడు ఇక్కడే పూర్వ భరద్వాజ ఆశ్రమం ఉండేది .ఈ యూని వర్సిటి ని .1873లో లార్డ్ నార్త్ బ్రూక్ ప్రారంభించాడు .దీని విద్యార్ధులు చాలా మంది స్వాతంత్ర సమరం లో పోరాడి చరిత్ర సృష్టించారు .అందులో ప్రముఖులు యెన్ డి తివారి ,హేమవటీ నందన్ బహుగుణ వంటివారున్నారు .

అలహా బాద్ కు అరవై కిలో మీటర్లలో కౌశాంబి ఉంది బుద్ధుడి కాలం లో పదహారు జిల్లాలకు ముఖ్య కేంద్రం యమునా ఒడ్డున ఉన్నది .బౌద్ద, జైన మతాలూ విస్తరించిన ప్రదేశం .ఉదయనుడు గొప్ప పరిపాలనా సమర్ధుడని పించుకొన్నాడు త్రావ్వకాలలో   అశోక స్థంభం ,మౌర్య సామ్రాజ్య నివాస గృహాలు ,గోశింఠ రామ నివాసం ,ఒక రాజ భవన ము వంటి అయిదు పెద్ద చిహ్నాలు బయట పడ్డాయి  .కౌశాంబి ఇటుక లతో గృహ నిర్మాణాలు చేసుకొనే వారు .దిగంబర జైన దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది

అలహా బాద్ కు డెబ్భై కిలో మీటర్ల లో ‘’కారా ‘’అనే చోటు మౌర్య సామ్రాజ్య కాలం లో ప్రసిద్ధి చెందింది మౌర్యుల ప్రాంతీయ రాజ దాని గా ఉండేది .ఇక్కడ ఇప్పుడు ‘’మాతా సీతలా దేవి ‘’ఆలయం ప్రసిద్ధమైనది .ఈమెనే ‘’కారా దేవి’’ అంటారు .అందుకే కరా అనే పేరు వచ్చింది .ప్రముఖ కవి మాలుక్ దాస్ సమాధి ఇక్కడే ఉన్నది .సంగమ క్షేత్రానికి అరిల్ అనే ఈ నాటి ప్రదేశం ‘’అలార్క పురి ‘’గా ప్రసిద్ద్ధం కాశీ రాజు అలర్కుడు బ్రాహ్మణుల కోసం నేత్రాలను దానం చేశాడు .అందుకే ఆ పేరొచ్చింది .వల్లభా చార్య మతానికి పట్టుగొమ్మ గా ఉండేది .బుద్ధుడికి మహా వీరుడికి సమకాలికుడైన ఉదయనుడు పాలించిన ప్రాంతం అలహా బాడ్ కు ఇరవై అయిదు కిలోమీటర్ల లో ఉంది .విత్మే పట్టణ అనే వారు .అలహా బాద్ కు ఇరవై కిలో మీటర్లలో ‘’గర్హా ‘’అనే ప్రదేశం లో కోట ఉండేది .త్రవ్వకాలలో అనేక దేవతలవిగ్రహాలు ,గుప్తులకాలం నాటి గ్రంధాలు బయట పడ్డాయి గుప్త రాజులు అనేక బంగారు నాణాలు బ్రాహ్మణులకు ఇక్కడ దానం చేశారని తెలుస్తోంది .విష్ణు మూర్తి దశావతారాల తో ఒక దేవాలయం ఉందిక్కడ .

ప్రయాగ లో గంగా నది యమునా నది తో కలిసి నిండు గా ఉంటుంది .గంగ నీటి మట్టం పెరుగుతున్దిక్కడ .కాశీ వైపుకు ప్రయాణించి అక్కడ కూడా భారీ జల రాశితో కళ కళ లాడుతుంది .యమునోత్రి లో పుట్టిన యమునా నది మధుర చేరి  శ్రీ కృష్ణుని మురళీ గానం తో పులకరించి  ఆగ్రా లో తాజమహాల్ కు స్నానం చేయించి ప్రయాగ లో గంగలో కలిసి పోతుంది .కనిపించకుండా పోతుంది అదే అంతర్వాహిని సరస్వతి నది .

ప్రయాగ ఒడ్డున ఉన్న బడే ఆంజనేయ స్వామి దేవాలయంవరదలలో మునిగి పోతుంది .ఈ శయన ఆన్జనేయుడిని త్రవ్వి తీసి వేరే చోట ప్రతిష్టించాలని చాల సార్లు ప్రయత్నించారు .త్రవ్విన కొద్దీ భూమి లోకి దిగి పోతుంది కాని బయటకు రావటం లేదు. అందుకని ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు .ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద తటాకం ఉండేది అని తెలుస్తోంది .

ఇటీవల నాలుగు అంతస్తుల విమాన మండపాన్ని కట్టారు ఆలయం ఎత్తుట నలభై మీటర్లు .ప్రాతి అంతస్తు లో ఒక్కో దేవతాలయం ఉంది ఒకప్పుడిది  శివా లయం .కుమార భట్టు ,జగద్గురు శంకరాచార్య ,కామాక్షి దేవి ,తిరుపతి బాలాజీ యోగ శాస్త్ర లింగ విగ్రహాలున్నాయి. ఆలయ గోడలపై రామాయణ చిత్రాలు ముచ్చట గొలుపుతాయి .ద్రవిడ సంప్రదాయం లో మలచిన ఆలయం ఇది .

దారా గంజ్ లో నాగ పూర్ కు చెందినా భోంస్లే మహారాష్ట్ర రాజులు ‘’ పాముల రాజు వాసుకి కి  ‘’నాగ వాసు ‘’దేవాలయం నిర్మించారు ఇది గంగ ఒడ్డునే ఉంది .నాగ పంచమి రోజు వేలాది యాత్రికులు సందర్శించి తరిస్తారు .కోటలో’’సరస్వతి బావి ‘’ఉంది దీని నుంచే అంతర్వాహిని గా సరస్వతి నది ప్రవిహిస్తుందని భావిస్తారు .

అక్షయ వట వృక్షం పై ప్రళయ కాలం లో శ్రీ మహా విష్ణువు శయనిస్తాడని పురాణ కధనం .హుయాన్ సాంగ్ కూడా దీని గొప్పతనాన్ని వర్ణించాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాచీన వ్రుక్షాలలో అక్షయ వటం ఒకటి .దారాగంజ్  గ మహల్లా దగ్గర ‘’వేణీ మాధవ మందిరం ఉంది’’ .ఇది అతి ప్రాచీనాలయం ఇది శ్రీ మహా విష్ణు దేవాలయం .దారా గంజ్ లో తెలుగు పురోహిట్లు హరి జగన్నాధ శాస్త్రి గారున్దేవారు .ఆయన మరణం తర్వాత కుమారులు నిర్వహిస్తున్నారు చక్కని తెలుగు మాట్లాడుతారు భోజన వసతి కలిగిస్తారు ఉండటానికి రూములూ ఉంటాయి

షేర్షా సూరి రోడ్డు లో అలోపీ దేవి ఆలయం ఉంది ఇది శక్తి క్షేత్రం .దేవి అలోప్ శాంకరి అంటారు .నవ రాత్రుఅలలో గొప్ప ఉత్సవం జరుగుతుంది .ఇక్కడ మ్మ వారెవరూ ఉండరు .ఒకచిన్న  కొయ్య ఉయ్యాల పై నుండి వేలాడుతూ ఉంటుంది అదే అమ్మ వారు .

తెహసీల్ హాన్దియా అనే ప్రదేశం లహా బాద్ కు నలభై కిలో మీటర్ల లో ఉంది ఇక్కడే మహా భారత కాలం నాటి లక్క ఇల్లు ఉంది .పాండవులను మట్టు పెట్టటానికి కౌరవులు నిర్మించిన లాక్షా గృహం ఇదే .విదురుని సలహా తో పాండవులు బతికి బయట పడ్డారు .త్రవ్వకాలలో అనేక దేవతా విగ్రహాలు ,నాణాలు దొరికాయి తక్షశిలా కౌశాంబి ల సమకాలీన నగరం గా భావించారు చరిత్ర కారులు .అలహా బాద్ కు పది కిలో మీటర్ల్ లో జైత్వార్ దేహ్ లో పాండవులు కొద్దికాలం ఉన్న ప్రదేశం ఉంది ఇక్కడి దేవాలయం మహా మండలేశ్వర  నాధ శివాలయం పంచ క్రోషి పరిక్రమ యాత్ర ‘’ఇక్కడి తో పూర్తీ అవుతుంది .ఇక్కడే భీముడు హిడింబా  సురుడిని వధింఛి అతని సోదరి హిడింబ ను వివాహం చేసుకొని ఘటోత్కచునికి జన్మ నిచ్చాడు. భీముడే ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని కధనం .

Inline image 3Inline image 5Inline image 4Inline image 1Inline image 2     

 

 

ఇంతటి తో అలహా బాద్ విశేషాలు సంపూర్ణం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -2 అలహా బాద్ లో త్రివేణీ సంగమం

మా నవ రాత్రి యాత్ర -2

అలహా బాద్ లో త్రివేణీ సంగమం

ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళ వారం రాత్రి మా ఆస్థాన టాక్సీ ఓనర్ రాము పంపిన కారులో సామాను అంతా సర్దుకొని తొమ్మిదింటికి  బయల్దేరాం .బెజవాడ స్టేషన్ చేరే సరికి పది అయింది .నరస పూర్ ఎక్స్ ప్రెస్ పదిన్నరకు వచ్చింది .అందులో క్కి మా ఎసి రిజర్వేషన్ బెర్త్ లలో పడుకోన్నాం .తొమ్మిది ఉదయం నాలుగుముప్పావుకే అది గుంటూర్ మీదుగా సికంద్రా బాద్ చేరింది .వెంటనే ఆటోలో బయల్దేరి అయిదుం బావుకు  మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళు ఉంటున్న మల్లా పూర్ చేరాం .అప్పటికే మా కోడలు సమత కాఫీ టిఫిన్లు రెడీ చేసి కూరలు ,పచ్చళ్ళు ,అన్నం వండి రెడీ గా పెట్టింది .మేము కాల కృత్యాల తర్వాత టిఫిన్ చేసి కాఫీ రెండో సారి తాగాం .మా అమ్మాయి ,తల్లీ అన్నం వగైరాలు ప్లాస్టిక్ డబ్బా లలో సర్దుకొని ‘’బిస్లేరి ‘’ మంచినీళ్ళ బాటిల్స్ ముందే మా అబ్బాయితో కొని పించి ,బత్తాయి పళ్ళు వగైరా అన్నీ పూర్తిగా సర్దుకొన్నారు .మా  కోడలు ,మనవడు భువన్   స్కూల్ టైం కు స్కూల్ కు వెల్లారు .కోడలు  తెలిసిన ఆటో ను స్టేషన్ కు మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి మాట్లాడి ఉంచింది .ఎనిమిదిన్నరకు ఆటోలో మేము నలుగురం అంటే నేను మా శ్రీమతి మా అబ్బాయి రమణ అమ్మాయి విజ్జి బయల్దేరి తొమ్మిదిం బావుకు సికందరా బాద్ స్టేషన్ చేరాము .

పాట్నా ఎక్స్ప్రెస్ తొమ్మిదిన్నరకే ప్లాట్ ఫాం పైకి వచ్చింది .ఇక్కడి నుంచే బయల్దేరుతుంది .ఎక్కి మాసామాను సర్దుకొని బెర్తులలో పడుకోన్నాం . మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనాలు చేశాము .మా అమ్మాయికి ,అబ్బాయి రమణ కు ఇదే మొదటి సారి ఈ రూట్ లో ప్రయాణం .నాకు కాశీ ప్రయాణం ఐదో సారి మా ఆవిడకు నాలుగో సారి .సేవాగ్రం రాగానే పిల్లలతో బాటు నేనూ దిగి స్టేషన్ లో ఫోటోలు తీసుకొన్నాం .మహాత్ముని ‘’వార్ధా ఆశ్రమం ‘’ఇక్కడే ఉంది .ఇక్కడి నుంచే మొదటి సారిగా సమాజ సేవాకార్యక్రమాలు గాంధీ ప్రారంభించారు .నాగ పూర్ రాత్రికి చేరింది అక్కడ కమలా తోటలు నిండుగా కని పిస్తాయని చెప్పా. చీకట్లో కానీ పించలేదని ‘’దేప్పింది’’ మా అమ్మాయి .ట్రెయిన్ బాగానే వేగం గా నే వెడుతోంది .రాత్రి టిఫిన్ పెరుగన్నం తినేసి పడుకోన్నాం .పగలు ప్రయాణం దారికి ఇరువైపులా ‘’మోదుగ చెట్లు ‘’యెర్రని పూలతోIMG_0551 వికసించి కనుల పండువు చేశాయి వీటినే అగ్గి పూలు అంటారు ‘’మోదుగ పూలు ‘’పేరు మీదశ్రీ దాశారదిరంగా చార్యులు నవల రాశారు చాలా పేరొచ్చిన నవల అది .మా చిన్న తనాలలో మోదుగ ఆకు విస్తళ్ళు ఉండేవి అందులోనే భోజనం .మెత్తగా బాగుండేవి .మోదుగ చెట్టు కొమ్మ ఒడుగు సమయం లో ‘’బ్రహ్మ దండం ‘’గా పనికొచ్చే పవిత్రమైనకర్ర్ర .

పదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రైలు అలహా బాద్ చేరింది .మేము బయల్దేరిన దగ్గర్నుంచి గూగుల్ పొజిషన్ లో మా అబ్బాయి శర్మ ట్రయిన్ ను గమనిస్తూ యెంత లేటో యెంత ముందు వస్తోందో ఫోన్ చేసి చెబుతూ తెలుసుకొంటూ మానిటరింగ్ చేస్తూనే ఉన్నాడు .ఏ స్టేషన్ తర్వాత యేది వచ్చేదీ ‘’ఇటినరీ’’ కూడా టైము తో సహా నెట్లో పంపిస్తే ప్రింట్ అవుట్ తీయించి వెంట తెచ్చుకోన్నాం .కనుక ఎవర్నీ అడగాల్సిన పనే లేకుండా పోయింది .అలహా బాద్ లో దిగి సామాను అంతా మేమే వీల్ సూట్ కేసులను లాక్కుంటూ రిటైరింగ్ రూమ్స్ కు చేరాం . కింద కేంటీన్ ఉంది .టూరిజం వాళ్ళ రూమ్ ఉంది .వాళ్ళను అడిగి త్రివేణీ సంగమ స్నానం ,నగర దర్శనం కు ఇండికా కారు మాట్లాడాం .వెయ్యి రూపాయలు .బోటు ఖర్చులు మావే .స్నానానికి తినటానికి మాత్రమె సర్దుకొని ,సామాను అంతా రూముల్లో ఉంచేసి బయల్దేరాం .పన్నెండు గంటలకు కారు ఎక్కి బయల్దేరాం .ఒక అరగంట లో ప్రయాగ సంగమ ప్రదేశం చేరాం .కారు ఒడ్డునే ఆపేశాడు .సంగమ స్నానానికి తిరిగి తీసుకు రావటానికి మనిషికి నాలుగు వందల ప్రకారం ప్రత్యెక బోటు మాట్లాడుకొన్నాం .బోటు వాడు యమునా నదిని గంగా నదినీ సంగమ ప్రదేశాన్ని చూపిస్తూ స్నాన ఘట్టానికి తీసుకు వెళ్ళాడు .అక్కడ బోటులు లంగరు వేసి కదల కుండా ఉంచుతారు .బోటు అడుగు భాగాన లావు పాటి దూలం కడతారు దాన్ని ఆధారం గా చేసుకొని సంగమ స్నానం చేయాలి. ఇనప గొలుసులు కూడా అటూ ఇటూ కట్టి ఉంటాయి .ప్రవాహం ఉధృతం గా ఉంటుంది  కాళ్లు ఆనవు .  కొద్ది అడుగులు దాటగానే మెరక తగుల్తుంది. దాని మీద నిల బడి స్నానం చేయాలి .

బట్టలు సంచీలు బోటులో పెట్టి స్నానానికి మాత్రమె తయారై నేనూ మా ఆవిడా ముందు స్నానం చేశాము .మంత్రం నేనే చెప్పి సూర్యునికి అర్ఘ్యమిచ్చి సంధ్యావందనమూ అయిందని పించాను .తర్వాతా మా అమ్మాయి దిగింది దానికీ మంత్రం చెప్ప మా అబ్బాయినీ దింపి మంత్రం తో స్నానం చేయించాను .మా అమ్మాయి’’ మహా త్రిల్ గా ఫీల్ ‘’అయింది నిజం గా ఎన్ని సార్లు త్రివేణీ లో స్నానం చేసినా కొత్త గా నే ఉంటుంది .గొప్పఅనుభవం .ఎన్ని వేల మంది మహర్షులు పుణ్యాత్ముల పాద స్పర్శ తో పులలకించి పవిత్ర వంతమైన నేల ఇది .గంగమ్మ తల్లి కరుణ యమునమ్మ తల్లి చల్లదనం ,అంతర్వాహిని సరస్వతీ కలిసి పవిత్ర త్రివేణీ సంగమం అయింది .అందరూ పులకించి పరవశించాం రెండేళ్ళ క్రితం జూన్ నెలలో మా బావ మరిది కుటుంబం తో కలిసి వచ్చాం .అప్పుడు నా పుట్టినరోజు కూడా బోటు మీదే త్రివేణీ లో జరుపుకోన్నాం .మా శ్రీమతి ఉయ్యూరు లో చేసి తెచ్చిన నాకు ఇష్టమైన ‘’మైసూర్ పాక్ ‘’అందరికి పెట్టి సంతోష పెట్టింది .

కృష్ణ నుంచి గంగదాక-2

సంగమ స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకొని అందరం బోటు ఎక్కి ఒడ్డుకు చేరాం .ఒడ్డునే అక్బర్ చక్ర వర్తి కట్టించిన కోట ఉంది .అందులోకి వెళ్లి ,అక్కడ  వేలాది సంవత్సరాల వయసున్న  ‘’ఆక్షయ వట వృక్ష ‘దర్శనం చేశాం .కోటలో నుంచి బయటికొచ్చి పక్కనే ఉన్న ‘’బడే హనుమాన్ ‘’ను దర్శించాం .పడుకున్న పోజు లో హనుమ ఉంటాడు .అక్కడి నుంచి నాలుగింటికి భరద్వాజ ఆశ్రమం చేరుకొన్నాం .అనేక భూ గర్భ గృహాలలో దేవతా దర్శనం చేశాము .అప్పుడే హైదరాబాద్ నుంచి శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు ఫోన్ చేశారు .మధ్య మధ్యలో కట్ అవుఓ అస్పస్టం గా విని పించాయి మాటలు .అలహా బాద్ లో ఉన్నామని పది హేడు ఉదయానికి ఉయ్యూరు వస్తామని అప్పుడు నేనే ఫోన్ చేసి మాట్లాడుతానని చెప్పాను. సరే నన్నరామే .

అక్కడి నుండి మోతీలాల్ నెహ్రు గారి ‘’ఆనంద భవన్ ‘’చూసి   చంద్రా శేఖర ఆజాద్ పార్కు ,హైకోర్టు ,అలహా బాద్ యూని వర్సిటి వగైరాలు తిరిగి చూశాం కారులో .ఆరింటికి మొదట గా ప్రయాగ లో కట్టిన శ్రీ మహా విష్ణు ఆలయం ‘’శ్రీ వేణీ మాధవ ‘’దర్శనం చేశాం .రెండేళ్ళ క్రితం చూడ లేక పోయాం .చాలా ప్రాచీన మైన ఆలయమిది .కొత్త నిర్మాణాలు చేసి వైభవోపేతం గా తీర్చి దిద్దారు .ఏడు గంటలకు రిటైరింగ్ రూమ్స్ కు చేరుకొన్నాం .రైల్వే కేంటీన్ లో టిఫిన్లు తిన్నాము .హాయిగా పడుకోన్నాం .తెల్ల వారు ఝామున నాలుగింటికి వారణాసి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి .

 

Triveni Sangam   

అలహా బాద్ విశేషాలు

‘’ప్రయాగ రాజం సింహం లాంటిది .అత్యున్నత పుణ్య క్షేత్రం .పెద్ద పెద్ద పాపరాశులను క్షాళనం చేసి పవిత్రీకరించే క్షేత్రం ప్రయాగ కు సాటి ఏదీ లేదు .ప్రయాగ మహిమ వర్ణించటం ఆదిశేషుని వల్ల  కూడా కాదు ‘’అని శ్రీ రామ చంద్రుడే తులసీ దాస మహాకవి విరచిత శ్రీ రామ చరిత మానస్ ‘’లో అంటాడు . దివ్య ధామం ప్రయాగ .అందుకే తీర్ధ రాజం (కింగ్ ఆఫ్ పిలిగ్రిమేజేస్)అంటారు . దేవ నదులైన గంగా ,యమునా అంతర్వాహిని సరస్వతి సంగమ స్థానం ప్రయాగ .వేలాది సంవత్సరాలుగా వేలది యోగి పుంగవులు ,మహర్షులు తపస్సు చేసి చరితార్దులైన ప్రదేశం .మాఘ మాసం లో జరిగే మాఘ మేలా కు లక్షలాది భక్త జన సందోహం త్రివేణీ స్నానం చేసి పునీతులౌతారు .పన్నెండేళ్ళ కోసారి వచ్చే మహా కుంభ మేలా లో దీని ప్రభావం వర్ణించటానికి అలవి కానిదిగా ఉంటుంది .ఇసుక వేస్తె రాలనంత జనం ఎక్కడో అరణ్యాలలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే అనేక రకాల సాదు సంతులు వచ్చి త్రివేణీ సంగమ స్నానం చేసి తమ వారికి జ్ఞాన బోధ చేసి సన్మార్గం లో నడి చెట్లు చేస్తారు.ఇంతటి ప్రత్యెక మేలా నిర్వహించటానికి ఒక కద ఉంది .

దేవ దానవులు సాగర మధనం చేస్తున్నప్పుడు అమృతం ఉద్భ వించింది .దీనికోసం సురులు అసురులు పోట్లాడుకొంటారు. దానవులకు దక్కకుండా చేయాలని విష్ణువు మోహినీ రూపం లో వచ్చి అమృత కలశాన్ని జాగ్రత్త పరుస్తుంటే కొన్ని బిందువులు ఒలికి త్రివేణీ సంగమం లో పడ్డాయి .ఇక్కడేకాక నాసిక్ లో ,ఉజ్జైన్ లో హరిద్వార్ లో పడ్డాయి .అందుకే కుంభ మేలా మహా కుంభ మేలా లను నిర్వహిస్తారు .గంగా నదీ దర్శనమే ముక్తి హేతువు అని పురాణ కధనం .గంగా యమునా దర్శనం చాలు అనేక జన్మ పాపాలు హరించి పోవటానికి అని గోస్వామి తులసీదాసు అంటారు .ప్రకృష్టమైన యోగం అంటే కూడలి కనుక ప్రయాగ అనే పేరొచ్చింది .బ్రహ్మ దేవుడు ‘’ప్రకృష్ట యాగం ‘’ఇక్కడ చేశాడు కనుక ప్రయాగ అయింది అనీ చెబుతారు .యజ్ఞం లేక యాగం వలన ఈ పెరోచ్చిందన్న మాట .పురాణ కాలం నుంచి ప్రసిద్ధమైన మహా పుణ్య స్థలం ప్రయాగ.

ఒకప్పుడు ఇక్కడే యమునా నదీ తీరం లో నగరానికి పడమర ‘’కౌశాంబి ‘’నగరం ఉండేది .ఇదే రాజధాని .దాని అవశేషాలు ఇప్పుడూ అక్కడ కని పిస్తాయి . 1997లో కౌశాంబి జిల్లా ఏర్పడింది .క్రీ శ ఆరవ శతాబ్ది వరకు కౌశాంబి మహోత్క్రుస్తం గా వెలిగింది .గౌతమ బుద్ధుడు చాలా సార్లు ఇక్కడికి విచ్చేసి జ్ఞాన బోధ చేశాడు .వేలాది బౌద్ధ భిక్షువులకు ఆవాస భూమి గా ఉండేది .జైన మతానికీ కేంద్ర స్తానమైంది కౌశాంబి .మౌర్య సామ్రాజ్యానికి ఉప రాజధానిగా కౌశాంబి ఉండేదని చరిత్ర చెబుతోంది .అశోక చక్ర వర్తి ఇక్కడ రెండు అంతస్తుల స్తంభాలు నిర్మించాడు .సముద్ర గుప్త చక్రవర్తి తన జయ గాధలను విజయ స్తంభాలపై 326b.c.లో చెక్కించాడు .సముద్ర గుప్తుడు ప్రయాగ లో  పన్నెండు ఏళ్ళు వరుసగా  యాగాలు చేశాడు .దాని స్మారకార్ధం ‘’సముద్ర కూపం ‘’అనే బావిని ప్రతిష్టాన పురం లో తవ్వించాడు .అప్పటిదాకా ప్రయాగ ఒక ఆశ్రమ స్థానం గానే ఉండేది సముద్ర గుప్తుని పన్నెండు వరుస యజ్ఞాల వలన అనేక మంది మహర్షులు ఋషులు తాపసులు ఇక్కడికి వచ్చి స్తిరపడి పోయారు .అనేక జాతుల వారు మతాల వారు ప్రయాగ చేరి శాశ్వతం గా నిలిచి పోయి దీనికి ఒక పట్టణ స్థాయిని కల్పించారు .ప్రయాగ మహా పట్టణమే అయింది కాల  క్రమం లో .

 

Inline image 1  Inline image 2  Samudracoin1.jpg  Inline image 3

 

మా నవ రాత్రి యాత్ర -1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -1 ప్రయాణానికి నేపధ్యం

మా నవ రాత్రి యాత్ర -1

ప్రయాణానికి నేపధ్యం

మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మి అమెరికా నుంచి ఉయ్యూరుకు సరసభారతి నిర్వహిస్తున్న ‘’శ్రీ జయ ఉగాది వేడుకలు ,అందులో భాగం గా మా దంపతుల యాభై వసంతాల వివాహ వేడుకల కోసం వస్తోందని తెలిసి ఏంతో సంతోషించాం .మార్చి ఇరవై న బయల్దేరి హైదరాబాద్ కు ఇరవై రెండు చేరి అన్నల ఇళ్ళల్లో రెండు రోజులు గడిపి ,ఉయ్యూరు కు చేరింది .వచ్చిన దగ్గర్నుంచి హడావిడే .

సుమారు 32ఏళ్ళ క్రితం మా  కుటుంబం మా అమ్మఅస్తికలను కాశీలో గంగ లో కలిపి ,అక్కడే మాసికం కూడా జరిపాం .అప్పుడు మా అమ్మాయి చిన్న పిల్ల .దాన్ని ఉయ్యూరులోనే వదిలి పెట్టి మేమిద్దరమే వెళ్లాం .కాని పాట్నా నుంచి మా  రెండో అక్కయ్యా బావ గారు ,మేనళ్ళుడూ మేనకోదలూ ,పూనా నుంచి మా తమ్ముడు మోహను  భార్యా ,పిల్లలూ కూడా వచ్చారు .అప్పుడని పించింది మా అమ్మాయి విజ్జి ని కూడా తీసికేడితే బాగుండేదని .కాని అస్తికలు ఉయ్యూరు నుంచి తీసుకొని వెడుతూ ,అమ్మాయిని మాతో తీసుకు వెళ్ళటం ఉచితం కాదని మానేశాం .అదుగో అప్పటి నుంచి మా అమ్మాయి సరదాగా గునుస్తూనే ఉంది ‘’నన్ను కాశీ తీసికెళ్ళ కుండా వెళ్ళారు ‘’అని .అది సరదానే అన్నా మా ఇద్దరి మనస్సులో బాధ గానే ఉంది .దానికి కూడా ఉత్తర దేశ యాత్ర ఫలం కలిగించాలని గాఢం గా మనసులో నిలిచి పోయింది .పిల్లలు అమెరికా లో ఉన్నారు కనుక ఎండలైనా ఇప్పుడే దానితో మేమూ వెళ్లి చూపించాలని నిర్ణయించాం .మా అబ్బాయి రమణ కూడా వీటిని చూడలేదు .కనుక మేము నలుగురం కలిసి సుమారు వారం రోజుల యాత్రకు ఆలోచించాం .

రిజర్వేషన్లు –టూర్ ప్రోగ్రాం

మా అమ్మాయి అమెరికా నుంచి ఇంకా బయల్దేరక ముందే మా రెండో అబ్బాయి శర్మ కు వివరాలు చెప్పి కాశీ ,ప్రయాగ ఖజురహో ,ఉజ్జైన్ ఓంకారేశ్వర్ ల టూర్ ప్రోగ్రాం ఖరారు చేయమన్నాం .వేసవి కనుక ఏ.సి లోనే వెళ్ళమని ,టికెట్లు చూస్తానని ,హోటల్ రూములు కారు కూడా ఎసి మాత్రమె వాడుదామని సూచించి టికెట్ల వేటలో పడ్డాడు .ఎప్పుడు బయల్దేరాలి అన్న సమస్య వచ్చింది. నేను మాత్రం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో  శ్రీరామ నవమి కల్యాణం చేసి మాత్రమె బయల్దేరాలి అని చెప్పాను .దాని ప్రకారం ఏప్రిల్ 8మంగళ వారం శ్రీ రామ నవమి కల్యాణం అయిన రాత్రికే బయల్దేరే ఏర్పాటు చేశాడు .బేజ వాడ నుంచి డైరెక్ట్  టికెట్లు దొరక్క పోవటం తో సికంద్రా బాద్ వెళ్లి ,ఆ మర్నాడు అంటే తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు సికందరాబాద్ నుంచి బయల్దేరే పాట్నా ఎక్స్ ప్రెస్ కు బయల్దేరెట్లు బుక్ చేశాడు .అది మర్నాడు అంటే పదవ తేదీ మధ్యాహ్నం అలహా బాదు చేరుతుంది .అక్కడ రైల్వే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేశాడు .ఆ రోజంతా అలహా బాద్ లో త్రివేణీ స్నానం నగర దర్శనం .మర్నాడు ఉదయమే నాలుగింటికి వారణాశి ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి ఏడింటికి కాశీ చేరటం’’ కరి వెన’’ వారి సత్రం లో రూమ్స్ లో ఉండి, అక్కడే భోజనం చేయటం ,పన్నేండవ  తేదీ సాయంత్రం ఖజురహో కి వెళ్ళే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ ఎక్కి పదమూడు ఉదయం ఖజురహోచేరటం ,ముందే బుక్ చేసిన హోటల్ రూమ్ లో ఉండి స్నానాల తర్వాత కారులో ఖజురాహో దేవాలయ దర్శనాలు ,వాటర్ ఫాల్స్ చూడటం రాత్రికి బయల్దేరి పద్నాలుగవ  తేదీ ఝాన్సి మీదుగా  ఉదయం ఉజ్జైన్ చేరటం .అక్కడే రైల్వే రూమ్స్ లో ఉండటం ఆ రోజూ మర్నాడు దర్శనాలు పది హీను  ఉదయం భస్మ హారతి దర్శనం తర్వాత ఏడింటికి బయల్దేరి కారు లో ఓంకారేశ్వర్ వెళ్ళటం ,రాత్రికి అంటే తెల్లవారితే పదహారు బయల్దేరి భోపాల్ మీదు గా విజయవాడ కు రాత్రి రెండు గంటలకు చేరటం గా శర్మ టూర్ ప్రోగ్రాం తయారు చేసి ఆన్ లైన్ రిజర్వేషన్ చేశాడు .హోటల్ రూములు రైల్వే రూములు కార్లు అన్నీ ఫోన్ లోనో, ఆన్ లైన్ లోనో బుక్ చేశాడు కనక మాకు ఏ టెన్షన్ లేకుండా పోయింది .

ఉగాది కి అందరం ఉయ్యూరులో కలుసుకొన్నాం .ఉగాది వెళ్ళిన తర్వాతే నేను ప్రయాణం మూడ్ లోకి వచ్చి టికెట్లు వరుసలో రమణ డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసి ఇస్తే లైన్ లో పెట్టుకొన్నాను .మధ్యలో ఒక మార్పు జరిగింది .ఉజ్జైన్ నుంచి ఓంకారేశ్వర్ కు రైల్ ప్రయాణానికి తిరుగు ప్రయాణానికి బుక్ చేశాడు ముందే .కాని రైల్వే వాళ్ళు అ ట్రాక్ ను తీసేస్తున్నారని తర్వాత తెలియ జేశారట .అందుకని రిజర్వేషన్ కేన్సిల్ చేసి  ఉజ్జైన్ నుంచి ఓంకారేశ్వర్ అక్కడినుండి ఉజ్జైన్ కి కారు బుక్ చేయాల్సి వచ్చింది .ఇది రేపు ప్రయాణం అనే వరకూ నేను గమనించలేదు .అప్పుడు శర్మకు ఫోన్ చేయటం వాడు వివరించి చెప్పటం తో విషయం అవగత మైంది

ప్రయాణ సన్నాహాలు

ఇక ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాం తలొక చిన్న సూట్ కేసు ,ఒక హాండ్  బాగ్ తో బయల్దేరాలను కొన్నాం .అలహాబాద్ చేరే దాక భోజనం టిఫిన్ వగైరా అంతా తయారు చేసి తీసుకొని వెళ్ళాలను కొన్నారు. తల్లీ కూతుళ్ళు .మా అమ్మాయి తెచ్చిన’’ ధేర్మో కూలింగ్ బాగ్’’ లో ఐస్ క్యూబులు వేసి ఇంట్లో తయారు చేసిన పూరీ కూర ,అట్లూ అందులో సర్దారు .రెండు రోజుల వరకు అందులో పదార్ధం వేడిగా చల్లగా ఉంటుంది .అదీ ఆ బాగ్ ప్రత్యేకత .బిస్కెట్లు పళ్ళూ పెరుగు అన్నీ సర్దారు .కాఫీ ,మంచినీళ్ళకు డిస్పర్సిబుల్ గ్లాసులు ,ప్లాస్టిక్ ప్లేట్లు ,అరటి ఆకులు , నదీ స్నాన సమయం లో దీపారాధనకు అరటి దోప్పలూ ,వత్తులూ ఆవు నేయి అన్నీ వాళ్ళే సర్దుకొన్నారు .నేను ఆ క్షణం వరకూ కంప్యూటరు లో ఆర్టికల్స్ రాయటం మా ఆవిడ భాష లో ‘’కంపు కొట్టు కొంటూ ‘’ శ్రీరామ నవమి ఫోటోలు పంపటం ,మహిళా మాణిక్యాలు బుక్ పోస్ట్ లో హితులకు సన్నిహితులకూ పంపటం తోనే సరి పోయింది .

నవ రాత్రి కి మరో కారణం

ఇంతకీ ఈ టూర్ ప్రోగ్రాం కి ఇంకో కారణమూ ఉంది .తొమ్మిదేళ్ళ క్రితం మేము రెండో సారి అమెరికా వెళ్ళినప్పుడు మ అమ్మాయి వాళ్ళు ఉంటున్న ‘’మిఛిగాన్’’  రాష్ట్రం లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళాం .అప్పుడే మా అమ్మాయిని ‘’ట్విన్స్ ‘’మగ పిల్లలు పుట్టారు. డిసెంబర్  నెల గజ గజ వణికే చలి .రోజూ అడుగుకు తక్కువ కాకుండా ఐస్ పడేది .కాని అక్కడ మా అమ్మాయి స్నేహితురాళ్ళు ప్రీతీ ,జ్యోతి, బిందు, లావణ్యా ,షబ్రీన్ మొదలైన భలే మంచి బృందం ఉండేది .వారానికో సారి ఎవరొ ఒకరి ఇంట  భోజనాలు ,బ్రేక్ ఫాస్ట్లు ,సాయంకాలం టిఫిన్లు ,విష్ణు.లలితా  సహస్రనామ పారాయణాలు భలేగా గడిచి పోయింది. అంతా ఏంతో ఆప్యాయం గా ఆత్మీయం గా మా ఇద్దర్నీ ‘’ ఆంటీ  అంకుల్ ‘’అంటూ మహా ప్రేమగా ఉండేవారు భలే సరదా బృందం అది .కడుపుతో ఉన్న వాళ్లకు సీమంతాలు ,పుట్టిన రోజు పండుగలు ,భలే కాలాక్షేపం .అంత చలి లోను .ప్రీతీ ,ఆమె భర్త శాస్త్రి గారి కోరిక పై  వాళ్ళ ఇంట్లో  అమెరికా లో మొదటి సారి గా నేను శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం చేయించాను . ఆ ప్రీతి వాళ్ళు ఆ తర్వాత హైదరాబాద్ చేరారు .హైదరాబాద్ లో మా అమ్మాయి వాళ్ళ మియాపూర్ స్వంత ఇంట్లో గ్రామ కుంకుమ నోము నోచుకొంటే ప్రీతి ,ఆమె తల్లి గారు వచ్చి వాయినాలు తీసుకొని భోజనం చేసి వెళ్ళారు .ఇప్పుడు ప్రీతీ వాళ్ళు భోపాల్ లో ఉంటున్నారు .అందుకని ప్రీతీ కోరికపై మా అమ్మాయి భోపాల్ వెళ్లి చూసి రావాలను కొన్నది .అది ఈ నవ రాత్రి యాత్ర గా పరిణమించింది .

ఇక ప్రయాణం విషయాలు వరుసగా ముందు తెలియ జేసి ఆ తర్వాత ఆ ప్రదేశ విశేషాలు ధారావాహికం గా రాస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు

 

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

సాహితీ భోజనాలు! 1

సాహితీ భోజనాలు!

తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి.

భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితమ్,
మహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దథి’
అని ఒక దేశీయ కవి పలికాడు. జీవులకెల్లరకు ముఖ్యంగా కావలసినది భోజనం. అట్టి భోజనమెవరి వలన సమకూరుచున్నది? మన వలన – మన వలన. కావున మన వృత్తియే ప్రప్రధానమైనది. గీ ‘వృత్తులన్నిటిలో వంట వృత్తి మొదలు’ అని మహాకవి గంగాదాసు గారి సూత్రమున్నది. ఈ వృత్తి కళయా, శాస్త్రమా యని కృతయుగము నుండియు బూర్యపక్ష రాద్ధాంతములగుచూనే యున్నవి. బుద్ధ దేవుని అభిప్రాయం ఇది కళ అనియే. కానీ యశోకాదుల మహాసభలలో ఇది శాస్త్రమని నిర్ణయింపబడినదని తాళపత్ర గ్రంథములలో ఉన్నట్లు తెలియుచున్నది. ఇది కళ అనియే నా నమ్మకం. గానము, శిల్పము, చిత్రలేఖనము, కవిత్వము అను కళలు దీని కాలిక్రింద దిగదుడుపు. అవి లేకున్నా ప్రపంచానికి నష్టం లేదు. నిత్య ప్రపంచ యాత్ర దీనితో జరుగవలసినది కానీ, వానితో గాదు. గాన ప్రపంచమున భైరవిరాగము లేకపోయిన యెడల బ్రాణోపద్రవమేమియ లేదు. మహానన ప్రపంచమున బప్పు లేకపోయిన యెడలనెంత ప్రాణసంకటమో యోజింపుడు. పేరొందిన ‘టాజ్‌మహల్’ పెసరట్ల పలావు కంటె నెక్కువది కాదు. కన్నుల నిండు కంటె గడువు నిండే ఘనమని పాశ్చాత్య పండితులందరు బ్రహ్మసూత్ర నిర్మాణ మొనర్చి యున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థాము దేశమున కొనర్చిన మేలు కంటే నొక నీరుళ్లిపాయ ప్రపంచమున కొనర్చుచున్న యుపకారము శత సహస్ర గుణాధికమై విరజిల్లుచున్నది. క్రొత్త చింతకాయ పచ్చడికున్న ‘మజా’ గుహాంతర్దేవాలయముల కెక్కడిది? సోమనాథేశ్వరుని యాలయమును గజినీ మహ్మదు కూలద్రోసినాడు. భారతమాత కొక్క తలవెంట్రుక యూడినట్లయిన లేదు. కానీ ఈ దినమున బనసకాయను బచన కళా ప్రపంచము నుండి బహిష్కరింపుడు. ఆర్యావర్త మల్లలాడి యల్లలాడి యంబుధిలో బడిపోవదా? చెవులు గోసిన గొర్రెలవలె బేరుమని పితృదేవతలు నెత్తినోరు కొట్టుకొని యేడువరా? ఉద్గతులూడి భ్రష్టులైపోవరా? పచనకళ యందు శిల్పమే ఇట్లు మాఱునప్పుడింక జిత్ర లేఖనమా? మిళ్లి గరిటె యెక్కడ? ఒంటె వెండ్రుక కుంచెక్కడ? పులుసు గూనల ముందు రంగుచిప్పి లాగునా? రవివర్మ రాయబారపు సభాపటమంతయు మా కామిగాడు చేసిన కందబచ్చల కాడమీర కాలిగోటికి సాటియగునా? కొత్తిమీరెపు గారమునకు గోటి మోహినుల తమాషా అంతే! మనము బుద్ధిహీనులమై ఈ వృత్తి నాశ్రయింపలేదు. హెచ్చుతగ్గులుగా గాక సమానముగ నుప్పుపడిన గంజియైన ద్రాగవచ్చును గానీ, పంచదార తక్కువయైన పరమాన్నము పశువుల గోలెములకే కాని పనికిరాదే? ఏ రసము కూడ నేమాత్రము హెచ్చు కాకూడదు, తక్కువ కాకూడదు. సమానముగా నుండవలయు’నని కామకవితో చెప్పించినారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు.
‘కవితా సమాధిలో కూచున్నాడా- సరి అయిన తాదాత్మ్యం సిద్ధించిందా, ఒక అతనికి భోగాల మీదికి దృష్టిపోదు. కష్టాలు కనబడవు. నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోగూడదు. పేగులు మాడి దృష్టి చెదిరిపోకూడదు. ఈ ప్రతిబంధకాలు కలక్కుండా వుండడానికే కవికాహారం. ధనికుడైన వాడికయినా కవితావేశం కలిగినప్పుడిదే ప్రవృత్తి. పర్సులో (బహుమితంగానే) డబ్బుండినా, దృష్టి రచనా వ్యగ్రమై కదలలేక కలమూ, కాగితాలు క్రింద బెట్టలేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్ఫురణే కలక్క, ‘కూరగాయలేవీ లేవు మరి’ అంటూ వంటింట్లో నుంచి కేకవినవచ్చినా ప్రకృతిలో పడలేక, వేళకి మాత్రం పీటమీదికి వెళ్ళి – ఆ పూటకు వూరగాయలతోనూ, చారు, మజ్జిగలతోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం తడవుగా మళ్ళీ కలం పట్టి, దాంతో ప్రపంచం మరిచిపోయిన సందర్భాలెన్నో వున్నాయి నా జీవితంలో’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు.
సత్రాలు – భోజనాలను గురించి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి మాటల్లో – ‘కొన్ని ఊళ్ళల్లో భుక్తల గృహాలల్లోనూ (తూర్పు దేశంతో అగ్రహారకులను భుక్తలంటారు), కొన్ని ఊళ్ళల్లో సత్రాలలోనూ భోంచేస్తూ ఎలాగైతేనేం కాశీ నుండి తుని చేరాం. గంజాం వచ్చింది మొదలు స్వయంగా వండుకోవడం తప్పింది. త్రోవలో చాలా వరకు సత్రాలన్నీ శ్రీమహారాజులం గారివే. ఆ సత్రాలు సదుపాయంగా అన్నోదకాలివ్వడానికే అసలు ద్రవ్యదాత లేర్పరచి వున్నారట. కానీ ఇటీవల ఆ సంస్థానానికి దివాన్‌గిరి చేసిన శ్రీ పెనుమత్స జగన్నాథ రాజుగారు ఒక్క సత్రం తాలూకు సొమ్ముతో రెండేసి సత్రాలు పెట్టి ఆ సదుపాయం పూర్తిగా తగ్గించారని మా గురువుగారు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రులు గారు చెప్పగా విన్నాను. నాకు ఈ కాశీయాత్ర ప్రయాణంలో గురువుగారు చెప్పిన మాట అనుభవంలోకి వచ్చింది. దివాన్‌జీ జగన్నాథ రాజుగారు కూడా మహాయోగ్యుడే కానీ, వారి ఉద్దేశం – ఏదో ఆ పూట తిని వెళ్ళేవాళ్ళకి సదుపాయమెందుకు? అసలు లేకపోవడం కంటే, ఇంత చారునీళ్లు – అన్నం వుంటే చాలదా అనియట. మంచి యోగ్యులకు తోచే వూహలు కూడా ఒకప్పుడు లోకాపకారకాలవుతాయి అన్నందులకీ సత్రాలే ఉదాహరణ. దివాన్‌జీ గారు ఒకటి రెండు చేస్తే; దానిలోని గుమాస్తాలు, వంట బ్రాహ్మలు మరికొంత తగ్గిస్తే, తుదకు నీళ్లలో పప్పుమాత్రం వేసి తీసిన తోటకూర, సుద్ద కలిపిన నీళ్ళవంటి మజ్జిగ – ఈ రీతిగా భోజనం ఏర్పాటవుతుందని వేరే వ్రాయనక్కరలేదు. ఈ భోజనం అప్పుడే చూచాను. మళ్ళీ ఈ మధ్య నాలుగేండ్ల నాడు విజయనగరం విద్యార్థులు భోంచేసే సత్రంలో చూచాను.

చూడడమంటే చూడడం కాదు, తిని చూచాను. మీరీ రోజులలో సత్రభోజనానికెందుకెళ్ళారని శంకింతురేమో! బొబ్బిలి పట్టాభిషేకం కృతి ఇచ్చి వచ్చేటప్పుడు, ఇదివరలో నావద్ద చదివిన కొందరి కోరిక మీద విజయగనరంలో ఆగవలసి వచ్చింది. ఆ విద్యార్థులు నాకోసమేదో పెద్ద ప్రయత్నం చేయబోతే, ‘అబ్బాయీ! మీరంతా ఎక్కడ భోంచేస్తే, అక్కడే నేనుకూడా భోంచేస్తాను. ఒక పూటకేమిటి, మీ విద్యార్థుల పంక్తిని భోంచేయడం నాకు పరమ సంతోషం’ అన్నాను. దానిమీద ఆ సత్రాధికారితో చెప్పి ఏదో సదుపాయం కల్పించాలని అనుకున్నారు కానీ, నేను దానికి అంగీకరించక, ‘నా పేరు చెప్పనే వద్దు. నేను వచ్చినట్లు విజయనగరంలో ఎవ్వరికిన్నీ తెలియకూడదు. అలాగైతేనే నేను వస్తాను. లేకుంటే రానేరాను’ అని ఖండితంగా చెప్పేటప్పటికి, విధిలేక వాళ్లు అందుకే అంగీకరించారు. ఆ కారణం చేత ఆ విద్యార్థుల సత్రభోజనం నాకు అనుభవానికి వచ్చింది. ద్రవ్యదాతల లోపముందేమో అంటే, రోజు ఒకటింటికి పన్నెండు రూపాయలు కూరలకే ఇస్తారట! ఈ సత్రాధికారి ఎవరో సామాన్యుడు కాక వేదం వచ్చిన వారి కుటుంబంలో పుట్టి, వేదం చెప్పికొన్న శోత్రియుడని కూడా విన్నాను. అందుకే కాబోలు ఇంత శోత్రియంగా విద్యార్థుల భోజనం వుందనుకోవలసి వచ్చింది.’ అన్నారు శాస్త్రిగారు.
ఒకసారి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు బందరు వచ్చారు.

ఒకరాత్రి వారిని అడివి బాపిరాజు గారు తమ ఇంటికి విందుకు పిలిచారు. ప్రక్కనున్న కాటూరి వారిని, మరొకరిని పిలిచారు. ఆ సాయంత్రం బజారుకి వెళ్ళి కూరగాయలు వగైరాలు కొనుక్కు వెడుతూ కనిపించిన మిత్రులందరితో ‘ఈ రాత్రి వేంకట శాస్త్రిగారు మా ఇంటికి విందుకు వస్తున్నారు. మీరు కూడా వస్తారా?’ అని చెబుతూ వెళ్ళారు. భోజనం వేళకి ముప్పై మంది గుంపు చేరిందక్కడ. బాపిరాజు గారు తిందర విందర్లాడుతున్నారు. పిలవడంలో ఆయన ఉద్దేశం విందు తర్వాత గోష్టిలో పాల్గొనడానికి రమ్మని. అది స్పష్టంగా లేక అంతా విందుకే వచ్చారు. కాటూరి వారు బాపిరాజు గారిని కోప్పడి దొడ్డి దోవన పక్క ఇళ్ళలోంచి సామాన్లు జేరవేయించారు. తొమ్మిదవుతోంది. చెళ్ళపిళ్ళవారు ‘పొద్దుపోతుంది మడి కట్టుకోమన్నావా? ఈ కబుర్లు భోజనాల దగ్గరే చెప్పుకుందాం’ అన్నారు. బాపిరాజు గారు ‘చిత్తం చిత్తం’ అంటూ లోపలికి వెళ్ళారు. అందరికీ విస్తర్లు వేశారు. అంతా కూర్చున్నారు. మొదటగా వండిన పప్పు, పచ్చడీ, కూరా కొంచెం కొంచెంగా విస్తట్లో రాచిపోతున్నారు. విస్తట్లో వేసిన పదార్థాలు చూచి చెళ్ళపిళ్ళవారు ‘మా బాపిరాజు కాగితాల మీదనే చిత్రలేఖనం అనుకున్నాను. విస్తళ్ళలో కూడా గరిటెను కుంచెగా చేసి చక్కని చిత్రాలు గీశాడు’ అన్నారు. అంతా గొప్పగా నవ్వుకున్నారు. అసలు విషయం అర్థమై, శాస్త్రిగారు సంభాషణలోకి దింపారు. పదార్థాలన్నీ పదిగంటలకు తయారైనాయి. తృప్తిగా భోజనాలైనాయి. శాస్త్రులు గారు చేయి కడుక్కుని వచ్చి, వాకిట్లో మడత కుర్చీలో పడుకుని, బాపిరాజు గార్ని పిలిచి ‘ఆలస్యమైనా అమృతతుల్యమైన భోజనం పెట్టావు. నీ సంకల్పం మంచిది. అందువల్లనే ముగ్గురు ముప్పై అయినారు’ అన్నారు.
ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు మద్రాసులో హోటలుకు భోజనానికి వెళ్ళారు. ఒక ముద్ద తిని మళ్ళీ కాస్త నెయ్యి వేయమన్నారు. సర్వరు నేతికి అదనపు చార్జీ అన్నాడు. ‘అన్నానికి’ అన్నారు విశ్వనాథ వారు. ‘దానికీ అంతే’నన్నాడు సర్వరు. ‘మరి దేనికి లేదు అదనం’ అన్నారు. ‘కూర, పచ్చడి, సాంబారు’ అన్నాడు సర్వరు. ‘అయితే కూర తీసుకురా’ అన్నారు. ఉండచేసి నోట్లో పెట్టారు. మళ్ళీ కూర… మళ్ళీ కూర… ఇలా ఎనిమిది సార్లు అడిగారు. ‘ఎన్నిమార్లండీ బాబు’ అని వాడు విసుక్కున్నాడు. ‘దీనికి అదనం లేదన్నావుగా? ఎన్ని సార్లయితేనేం?’ అన్నారాయన.
వాడింకొకసారి వేసి, దణ్ణం పెట్టాడు మళ్ళీ అడగవద్దని.

అప్పుడు కోపం వచ్చి ‘అదనం ఏమిటి? నీ మొహం. తినేవాళ్ళకు పెట్టాలి. తినలేని వాళ్ళెలాగు వుంటారు. వాళ్ళందరి వంతూ నువ్వే తింటావా?’ అన్నారు. వాడికేం అర్థం అవుతుంది, వెళ్ళిపోయాడు. ప్రక్కనున్న మిత్రుడు ‘అంత కూర ఎలా తిన్నారు’ అన్నాడు. ‘ఇంతమాత్రం తెలియదు. పంతంలో ఎంత బలమన్నా వస్తుంది. నేతికి అదనం ఏమిటి? రాను రాను దేశంలో బతుకులు అదనం అయిపోతున్నాయి. నిజానికి మనందరివి అదనపు బ్రతుకులే’ అని విసుక్కున్నారు.
విశ్వనాథ వారు భోజన ప్రియులు. ఒక్కోసారి కూరగాయలు తామే తరుక్కునే వారు. ఆయనకెంతో సంతోషం ఆ పని. ఒకసారి ఆయన కత్తిపీట దగ్గర కూర్చుని కూరగాయలు తరుగుతున్న ఫొటోను ప్రభలో వేశారు. అందరూ జడిశారు ఆయనకు కోసం వస్తుందని. తరువాత కనిపించిన రావూరి సత్యనారాయణతో ‘కత్తిపీట ఫోటో వేశారే! బాగుంది. ఏం, కవిగారు కలం పట్టుకోవాలంటే ఏదైనా తినాలా, వద్దా? కూర రుచి మనకు తెలుస్తుంది. మనం తరిగితే ఏం వండుతున్నారో ముందు తెలుస్తుంది. అసలు విషయం చెప్తాను. ఇది రాస్తే రాయి, లేకపోతే లేదు గానీ పడకటింటి ముచ్చట్ల కంటే, వంటింటి ముచ్చట్లు గొప్పవి. ఇక్కడ ముసలితనంలో ముచ్చట్లు తిరుగుతాయి, అక్కడ పెరుగుతాయి. జీవిత సాఫల్యం మాట ఎలా వున్నా, జిహ్వ చాపల్యం గొప్పది’ అన్నారు విశ్వనాథ వారు.
తినడం ఒక భోగం- తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం.
– మువ్వల సుబ్బరామయ్య

Category:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం

పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది… మహా పండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు.

అన్యాయం చేయడంలో కాలం కూడా అతీతం కాదే మో!. చరిత్ర గతులను సవరించిన మహా నేతలు కొందరిని సరిగా అర్థం చేసుకున్నట్లు కనిపించదు. వైతాళికులందరినీ ఒక తీరున దర్శించలేదేమో అనిపిస్తుంది. మార్గదర్శకులు కొందరి పట్ల ఒక వివక్షాపూరిత వైఖరిని అవలంభించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రచయితలు, కవులు ఒక పక్షం వైపు వొరిగి రచనలు సాగించినట్లు ధ్రువపడుతుంది. అట్లా అనేక విధాలుగా రచనలలో వక్రీకరణకు గురైన మహా మహిళా నేత ‘నాయకురాలు నాగమ్మ’ ఒకరు.
నాగమ్మ సుగుణ శీలమైన వ్యక్తిత్వం, శాంతికాముక స్వభావం అనేక మంది రచనలలో వక్ర భాష్యానికి లోనయ్యాయని ‘పలనాటి చరిత్ర’ లోలోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వెల్లడవుతుంది. నాయకురాలును ఆవిష్కరించిన అనేక మంది రచయితలు నిజాలు తెలిసినప్పటికీ తమ కలాలను వక్రగతుల్లోనే నడిపారు. నీతిమంతమైన ఆమె రుజుమార్గాన్ని కుడికంటితో గమనిస్తూనే, ఎడమ కంటితో ఆమెను నేరస్థురాలిగా చిత్రీకరిస్తూ వచ్చారు. శాంతిదూత, మధ్యయుగాల మహిళామణి అయిన నాయకురాలిపై దోషిగా ముద్ర వేసి చరిత్రలో నిలబెట్టారు. మహాకవి శ్రీనాథుని ప్రామాణిక రచన ‘పలనాటి వీరచరిత్ర’లోని అంశాలను మరుగునవేస్తూ వంకర భావాలు చెబుతూ వస్తున్నారు; అనంతర కాలానికి చెందిన కవులు, రచయితలు, పలనాటి చరిత్రను అక్షర బద్ధం చేయడానికి పూనుకున్న వారిలో నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరూ మూల ప్రామాణిక గాథను దోవ తప్పించినవారే.

దాదాపుగా కలం పట్టిన ప్రతి రచయిత నాయకురాలిపై సిరా విదిలించిన వారే. ఏతా వాతా అందరూ ఆమెకు మరక అంటించిన వారే. నాయకురాలి మనస్తత్వాన్ని, నడవడిని, ఆలోచనా సరళిని మధ్య రేఖపై నిలుచుని దర్శించకపోవడం వారి హ్రస్వ దృష్టి అని నేననుకోవడం లేదు. రచన ప్రారంభానికి పూర్వమే వారివారి ఆలోచనలలోకి దోషం ప్రవేశించడమే ఈ ధోరణికి ఆలంబన అనిపిస్తుంది. పరిశోధకుల్లా లోతుల్లోకి వెళ్ళిన వారు తమ తమ కలాలను నిజాయితీగా నడపలేకపోయారు. కారణాలేమైనప్పటికీ; అనేకమంది నాయకురాలిని కపటిలా, యుద్ధపిపాసిలా, కుట్రదారుగా ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు తమ ఆలోచనలకు ఎనలేని పదును పెట్టారు. ఆమెను దోషిగా, నేరస్థురాలిగా నిరూపించేందుకు అనేక కట్టుకథలు, పుట్టకథలు సృష్టించారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ తమ విజ్ఞానాన్నంతా ఉపయోగించి గాథను కల్పనా మలుపులు తిప్పారు. బ్రహ్మనాయుడు, ఆయన పుత్రరత్నం బాలచంద్రుని తప్పిదాలన్నింటినీ నాయకురాలికి ఆపాదించి ఆమెను చారిత్రక యవనికపై ముద్దాయిగా నిలిపారు. ప్రఖ్యాత కవులు, రచయితలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఎలాంటి సంశయం, సంకోచం లేకుండా నాయకురాలిపై అభాండాలు వేశారు. నిగ్గు తేలకుండానే నిందలు మోపారు.
మచ్చుకు పల్నాటి యుద్ధానికి కారకాలను, ప్రేరకాలను మూల్యాంకనం చేసుకుంటే…! పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది. మొత్తం రక్తపాతానికి నాయకురాలి యుద్ధకాంక్షే కారణమని జనబాహుళ్యంలోనూ, అనేక రచనల్లోనూ తొంగిచూస్తున్న అంశం. కవులు, రచయితలు ఈ నిందా ప్రచారాన్ని తమతమ కపాలాలలోకి, కలాలలోకి దట్టించి వదిలారు. సాహితీ లోకంలో ఉద్దండులైన మహాపండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు. అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు పలనాటి వీర చరిత్రకు సంబంధించిన కాలాలు అన్నింటినీ ధ్రువపర్చడానికి చాలా శ్రమకోర్చారు. ఈ వీరగాథపై ఆయన లోతైన పరిశోధన గావించి వివిధ అస్పష్ట అంశాలను పరిష్కరిస్తూ 1911లో ప్రథమ భూమిక శీర్షికతో 82 పేజీల సంపాదకీయం ముద్రించగా, 1938లో ద్వితీయ భూమిక మకుటంతో 96 పేజీల మరో సంపాదకీయం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సంపాదకీయాలకు శ్రీనాథ విరచిత ‘బాలచంద్రయుద్ధం’ ద్విపద ఘట్టాన్ని అదే పుస్తకంలో చివరన జతచేసి తెచ్చారు.
పలనాటి వీరచరిత్రను శ్రీనాథుడు తొలుతగా గ్రంథీకరణ గావించిన విషయం ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకుందాం. అంటే శ్రీనాథుడికి మునుపు ఈ వీరగాథ మౌఖికరూపంలో కొనసాగింది.

అనగా శ్రీనాథుడి ‘పలనాటి వీరచరిత్ర’ కావ్యమే చరిత్రపై తొట్టతొలి రచన, ఆయన గ్రంథమే ప్రామాణికమని స్పష్టమౌతుంది. అయితే శ్రీనాథుని పలనాటి వీరచరిత్రలోని ‘కల్లిపోరు’, ‘బాలచంద్ర యుద్ధం’ ఖండికలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఈ రెండు ఖండికలలోనే నాయకురాలి రాజనీతి, మానవతా ధోరణి, బ్రహ్మనాయుని రణదాహం, కుట్రపూరిత స్వభావం, బాలచంద్రుని శౌర్యం, దుందుడుకు పోకడలు మనకు తేటతెల్లమౌతాయి. అయితే ఈ ప్రామాణిక అంశాలను వదిలి వేసిన అక్కిరాజు, త్రిపురనేని నాయకురాలినే దుష్టురాలిగా మలిచారు. అక్కిరాజు తన ‘శ్రీనాథ భట్టకృతి పల్నాటి వీరచరిత్ర’ ప్రథమ భూమికలో వ్యాఖ్యానించిన విషయమేమిటంటే ‘పల్నాటి యుద్ధమునకు నాగమ్మయే కారకురాలు’. అదే విధంగా కవిరాజు తిప్రురనేని తమ ‘భగవద్గీత’లో మహాభారత గాథలోని ద్రౌపది, పల్నాటి వీరచరిత్రలోని నాయకురాలి వ్యక్తిత్వాలను సమాంతరంగా విశ్లేషిస్తూ చెప్పుకొచ్చిందేమిటంటే – ‘నలగాముని వైపున నాగసాని లేనియెడల బల్నాటి యుద్ధ మెసంగియుండదు. మనుజుల పుఱ్ఱెలతో జదరంగమాడనేర్చిన చతురుపాయ ప్రయోగ. విధానవేత్త నాగసాని’
నిజానికి అపారమైన తన సేనావాహినితో కారంపూడి రణభూమికి చేరుకున్న అనంతరం తనంత తానుగా సుహృద్భావ ఆలోచన చేసిన నాయకురాలు నలుగాముని ఒప్పించి సంధి ఒడంబడికకు శ్రీకారం చుట్టింది. తనకు అత్యంత ఆప్తులైన వారిని రాయబారులుగా సంధి కార్యక్రమం చక్కబెట్టుకురమ్మని బ్రహ్మనాయుడి శ్రేణుల వద్దకు పంపింది. బ్రాహ్మనాయుడి వర్గీయుల గొంతెమ్మ కోర్కెలన్నీ అంగీకరించింది. వారిని సంతృప్తి పరిచి సంధి మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ సంఘటనా సారాన్ని శ్రీనాథుడు తన ‘పలనాటి వీరచరిత్ర’లో అక్షరబద్ధం చేశారు. అక్కిరాజు వారు తమ ‘శ్రీనాథ భట్టకృతి పల్నాటి వీరచరిత్ర’కు అనుసంధానం చేసిన ‘బాలచంద్ర యుద్ధ ఘట్టం’లో ఈ సంధి సంఘటనలు ద్విపద ప్రకియలో సూర్యబింబంలా ప్రకాశిస్తూనే ఉన్నాయి. ‘తలపోసి మదిలోన తగిన వారలను/ వాసిగా బ్రహ్మన్న వద్దకు బంపి/ బవరంబు గాకుండా పట్టుటకార్య/ మని పెద్దలనదగు ఆప్తవర్గమును/ కొండ అన్నమరాజు కోటకేతుండు/ కూరిమి హితుడు మాడ్గుల వీరరెడ్డి/ పరమాప్తుడౌ చింతమల్లి రెడ్డియును/ మొదలైన సువిచార ముఖ్యులైనట్టి/ చనపర్ల బిలిపించి నదుబుద్దిననియె/ బహుపరాక్రమ ప్రాభవులైన/ వీరులు రాజులు వెలియశోభిల్లు/ కొలువులులోనికి పోయి కూరిమి మీర/ సవరంబు గాకుండి సంధిÄౌనట్లు/ మాటాడి ఆటమీద మాచర్ల భాగ/ మేలుకొమ్మని చెప్పు మింకొక మాట/ నాయుని వద్దకు నరసింగుదెచ్చి/ కులవైరమడతుము కోరిమీరంద/ రొక్కటి కమ్మని యొప్పించిరండు’.
ఈ మొత్తం ద్విపదలో బ్రహ్మనాయుడి పక్షం వారి మాచర్ల రాజ్యాన్ని వారికే ఇచ్చివేస్తామని, మరింకనూ అలరాజు హంతుకుడని అభియోగాన్ని ఎదుర్కొంటున్న నరసింగరాజును కూడా అప్పగించుతామని నాయకురాలు సంధి అంశాలుగా ప్రతిపాదించిన వైనం మనకు బోధపడుతుంది.
ఆరు సంవత్సరాల పాటు పల్నాడుతో పాటు పలనాటి చరిత్రకు అనవాళ్ళు దొరికే ఇతరేతర ప్రాంతాలలో సంచరించి THE EPIC OF PALNADU అను మకుఠంతో పలనాటి వీర చరిత్రను వెలువరించిన అమెరికన్ పరిశోధకుడు H.Roghair కూడా యుద్ధపరిణామాలను విశదీకరిస్తూ : ‘యుద్ధం చేయలేమంటూ, యుద్ధానికి కారణం లేదంటూ బ్రహ్మన్న వర్గీయులు గోసంగులు (మాదిగలు/దళితులు) యుద్ధ భూమిని విడిచి వెళ్ళిన వైనాన్ని తెలియజేశార’ని అన్నారు. నాయకురాలి పక్షానే ధర్మం ఉందన్న గోసంగుల నిర్ణయం ఆమె నిబద్ధతను, చిత్తశుద్ధిని నిరూపిస్తున్నాయి. యుద్ధరహిత పల్నాడు కోసం నాయకురాలు చూపిన చొరవ, తపన, స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఖౌజజ్చిజీట ఇలా రాశారు : “But the Gosangis saw no reason for the war, and they turned back. Each man went to his own place. After they were gone, repeatedly messages were sent to them, asking them to come back. But whenthe messengers came, the Gosangis said that they would not come. The Gosangis were the first followers of the creed (Bhram Naidu)”. (THE EPIC OF PALNADU ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.)
శ్రీనాథుని ప్రామాణిక రచనలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే పండితశ్రీ అక్కిరాజు, కవిరాజు త్రిపురనేని నాయకురాలికి ప్రతికూలంగా ఎందుకు వ్యాఖ్యానించారు? పండితులచే, ప్రముఖులచే ప్రతిభా ప్రశంసలు అందుకుని శహభాష్ అనిపించుకున్న వారు ఈ ఇద్దరు. శ్రీనాథుని కావ్యాంగాలు చదవకుండానే నాయకురాలే యుద్ధానికి కారకురాలని ఈ ఇరువురూ నిర్ధారించారా? నాయకురాలిని తప్పుపట్టడానికి కారణం వీరికి బ్రహ్మనాయుడిపై గల వాత్సల్యమా? లేక నాయకురాలిపై పెంచుకున్న వ్యతిరేక భావనా? అనే ప్రశ్నలు మన ముందుకొస్తాయి. ప్రామాణిక అంశాలను పక్కదోవ పట్టించడం ఎంత వరకు సబబు? వీరిరువురికి సమాజంలో గల గౌరవ ప్రతిష్ఠలకు ఇలాంటి సత్యదూర అల్లికలు భంగం కలిగించవా? నాయకురాలి మేరునగ మార్గాన్ని కురచపరిస్తే, విశాల మానవతావాదాన్ని పలుచపరిస్తే వీరికి వొరిగేదేమిటో అర్థం కాదు. పల్నాటి చరిత్రను ఆవిష్కరించడానికి ముందుకొచ్చిన అనేకమంది రచయితలు ప్రమాణాలను పాటించకుండా, నిజాలను గౌరవించకుండా నాయకురాలిని కించపరచడానికే ప్రయత్నించారని తెలియజేయడానికే ఈ విషయాలను మీ ముందుకు తెచ్చాను. ఇకనైనా నాయకురాలిని, ఆమె నీతిమంతమైన జీవన గమనాన్ని, అజేయమైన ఆమె ధీరత్వాన్ని తెలుగు సమాజమంతా నిజాయితీగా అర్థం చేసుకోవాలి.
– వై.హెచ్.కె. మోహన్‌రావు
అధ్యక్షులు, పల్నాడు రచయితల సంఘం

Category:

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాళాలు, మహాభారతం, లెక్కలు

ఒక పుస్తకం కవర్ మీద ఈ శీర్షిక కనిపిస్తే ఏమనుకుంటారు? పైత్యమో, పరిశోధనో అయ్యుంటుందనుకోవచ్చు. కాని రెండూ కాదు. మధ్యస్థంగా మూడోది. తాళాలకు, మహాభారతంలోని కొన్ని ఘటనలకు, గణితానికి మధ్య తాను గమనించిన కొన్ని సామ్యాలను సగం సరదాగా, సగం సీరియస్‌గా రాశారు వి.రఘునాథన్. అందులోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం…

జరాసంధుడి తాళం
మగధను పాలించే బృహద్రథుడికి చాలాకాలం పిల్లల్లేరు. ఆయన భార్యలిద్దరూ కాశీ రాజు కుమార్తెలైన కవలలు. రాజు, రాణులిద్దరూ ఈ విషయమై బాధ పడుతున్నపుడు కౌశిక మహాముని ఒక మామిడి పండు ఇచ్చి దీన్ని నీ భార్యకిచ్చి తినిపిస్తే సంతాన యోగం కలుగుతుందని చెపుతాడు. ఇద్దరు భార్యల్నీ సమానంగా చూడాలని భావించే రాజు పండును చెరిసగం ఇస్తాడు. ఫలితంగా ఇద్దరూ గర్భవతులై చెరో సగం బిడ్డకు జన్మనిస్తారు.
ఈ వైపరీత్యానికి కుమిలిపోయిన రాజు ఆ రెండు సగాల్ని పారవేయిస్తాడు. మాంసభక్షణ చేసే ఒక రాక్షసి యాదృచ్ఛికంగా ఆ రెండిటినీ పక్కపక్కనే పెట్టినపుడు అవి అతుక్కుపోయి ఒకటే మగబిడ్డగా మారతాయి. ఆ బిడ్డే జరాసంధుడు. బృహద్రథుడి తర్వాత మగధను చాలా ఏళ్లపాటు పరిపాలించి చివరికి భీముడి చేతిలో మరణిస్తాడు. మొదట్లో భీముడు జరాసంధుడ్ని చీల్చి ఆ ముక్కల్ని పక్కపక్కనే పడేయడంతో అవి మళ్లీ మళ్లీ అతుక్కుపోతూ ఉంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు ఆ ముక్కల్ని పక్కపక్కనే కాకుండా వ్యతిరేక దిశలో పడేయడంతో జరాసంధుడు తిరిగి ఒకటి కాలేకపోతాడు. ఆ విధంగా జరాసంధుడ్ని చంపి పాండవులు రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు.
ఇంతకీ ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నట్టు? జరాసంధుడి లాంటి రెండు సగాలున్న ఒక తాళం కప్ప ఉందని చెప్పడానికి. ఈ బొమ్మలోని తాళం కప్ప చూడడానికి ఒకటిగా ఉన్నా నిజానికి ఇందులో రెండు సగాలున్నాయి. వాటిని సరిగ్గా పెట్టి అమర్చినప్పుడే తాళం పడుతుంది. లేకపోతే వేస్టే. తాళం చెవితో దాన్ని తీసినపుడు అవి రెండు ముక్కలుగా విడిపోతాయి. అచ్చు జరాసంధుడి టెక్నిక్నే ఇందులోనూ ఉంది.
కోతి తాళాలు
కోతి ఆకారంలోని తాళం కప్పల్ని చూశారా! 1 ఎ. తాళం వేసి ఉన్నప్పటి చిత్రం. 1 బి. తాళం తీసినప్పటి చిత్రం. 2 వ బొమ్మలోని కోతి తాళం కూడా అలాంటిదే. తోకే దాని తాళం చెవి. దాన్ని లోపలికి పెట్టి పైకి తోసినప్పుడే తాళం తెరుచుకుంటుంది.
హనుమంతుడి తాళం
హనుమంతుడి ఆకారంలో ఉన్న ఈ తాళం కప్పకు నాభి దగ్గర ఉంది తాళం చెవి రంధ్రం.
సింహ తాళం
భారతంలోని యక్షప్రశ్నల ఘట్టం గుర్తుంది కదా! దప్పికతో అల్లాడుతూ సరస్సు దగ్గరకు వచ్చిన పాండవులను యక్షుడు నిలవరించి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. సమాధానాలు చెప్పకుండా మొండిగా వ్యవహరించి నలుగురు అన్నదమ్ములు విగతజీవులవడంతో ధర్మరాజు ఆ బాధ్యతను తీసుకుంటాడు. ధర్మరాజు సమాధానాలతో సంతృప్తి చెందాక యక్షుడు ‘ఒక తమ్ముడ్ని బ్రతికిస్తాను. కోరుకో’ అంటాడు. అప్పుడు ధర్మరాజు నకులుడ్ని బ్రతికించమంటాడు. భీముడ్ని, అర్జునుడ్ని వదిలేసి నకులుడ్ని ఎందుకు అడిగావంటే తన పినతల్లి మాద్రికి కూడా ఒక కొడుకు ఉండాలన్న ఉద్దేశంతో అని జవాబిస్తాడు. ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించి యక్షుడు పాండవులందరినీ బ్రతికిస్తాడు. ఈ కథ మీకందరికీ తెలిసిందే. ఇందులో ఎవరికైనా నచ్చేది ధర్మరాజు యుక్తి.
అటువంటి యుక్తితో మాత్రమే తీయగల ఒక తాళం కప్ప ఉంది. అది చూడడానికి ప్రశాంతంగా కూర్చున్న సింహం పిల్లలా ఉంటుంది. తాళం చెవి రంధ్రం కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. కాని ఎన్నిసార్లు తాళంచెవి లోపల పెట్టినా తాళం మాత్రం ఊడిరాదు. యక్షుడు, మంచినీటి సరస్సులాగే తాళంకప్ప, చెవి రెండూ వాస్తవంగానే ఉంటాయి కాని మార్మికంగా వ్యవహరిస్తుంటాయి. తాళంచెవి లోపల పెట్టి తిప్పితే చాలదు. బొమ్మలో చూపెట్టినట్టుగా చివరికంటా పోనిస్తేనే తాళం తెరుచుకుంటుంది.

Category:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ రాత్రి యాత్ర

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఎనిమిది తారీకు శ్రీ రామ నవమి చేసి రాత్రికి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి నేను మా శ్రీమతి ,maa  అబ్బాయి ఛి రమణ కలిసి ప్రయాగ ,కాశి ,ఖజురహో ,ఉజ్జైన్ ,ఓంకేరేశ్వార్ లను దర్శించి ఈ రోజు ఉదయమే ఉయ్యూరు సుఖం గా చేరుకొన్నాము అందు  వలన ఈ తొమ్మిది రోజులూ మిమ్మల్ని మెయిలు ”మొయిలు ”(మేఘం )ద్వారా పlల కలించ లేక పోయాను .ఇక యదా ప్రకారం కలుద్దాం . మీ -దుర్గా ప్రసాద్ -ఉయ్యూరు  -17-4-14-ఉదయం 4-28

 

Posted in నవ రాత్రి యాత్ర, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్

మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్

నాలు గేళ్ళ పరిచయం మాత్రమేఆయనతో  .కాని అది ఎన్నో ఏళ్ళ పరిచయం గా మారింది .మనసున్న సాహితీ జీవి .పెద్దల యెడ అత్యంత భక్తీ ఉన్నవారు .నిరంతరం స్వంత వ్యవహారాల్లో మునిగి తేలుతూ కూడా సాహిత్య వ్యాసంగం ఏ మాత్రం తగ్గకుండా చేస్తుంటారు .సాహిత్య సభలు దిగ్విజయం గా నిర్వహిస్తారు .పుస్తక ప్రచురణ తో క్షణం ఖాళీ గా ఉండరు .వీటన్నిటికంటే ఆయన ఆరో ప్రాణం ‘’రమ్య భారతి ‘’ద్విమాస పత్రిక .అందులో ఎన్నెన్నో విషయాలు విశేషాలు నింపుతారు .పుస్తక పరిచయం చేస్తారు .సమీక్షలు రాస్తారు .కవిత్వం కధలు తో తీర్చి దిద్దుతారు ఎన్నో బహుమతులు సాధించారు .సోమేపల్లి అవార్డుల ప్రదానం లో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారు .విజయ వాడలో జరిగే ఏ ముఖ్య సాహితీ కార్యక్రమమైనా ఆయన లేనిదే నిండుగా ఉండదు .శోభ రాదు .ఆయనే శ్రీ చలపాక ప్రకాష్ .100_1630

ఆయన సాహితీ సేవను గుర్తించి సరసభారతి ప్రకాష్ గారికి మూడేళ్ళ  క్రితం ఉగాది పురస్కారాన్ని అందించింది .అది చంద్రుడికో నూలు పోగు మాత్రమె .అప్పుడే ప్రకాష్ తో పరిచయం గాఢమైంది .ఉగాది కవితలను ‘’ఆదిత్య హృదయం ‘’పేరు తో తీసుకు రావాలను కొన్నాం .సభలోనే ఈ విషయం ప్రకాష్ గారికి చెప్పి సహకరించి ఆ కవితలను ముద్రించే బాధ్యత తీసుకోమని కోరాం క్షణం కూడా ఆలోచించకుండా సరేనన్నారు .ఆ నెల లోనే మేము అమెరికా వెళ్లాం .విజయ వాడ ఆకాశవాణి కేంద్ర ముఖ్య సంచాలకులు సరసభారతికి ఆప్తులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు హైదరా బాద్ కు బదిలీ అవుతున్నట్లు చెప్పారు .అందుకని పుస్తక ముద్రణ బాధ్యత మా అబ్బాయి రమణ ,ప్రకాష్ లపై పెట్టి నిశ్చింతగా మేము అమెరికా వెళ్లాం .ఆదిత్య ప్రసాద్ గారి బదిలీ మే నెల లోనే జరగటం తో ప్రకాష్ గారు చాలా త్వరలో ఆ పుస్తకాన్ని ముద్రించి మే నెలలో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఆదిత్య ప్రసాద్ గుత్తికొండ సుబ్బారావు పూర్ణ చంద్ ప్రకాష్ గార్ల సమక్షం లో పుస్తకావిష్కరణ జరిపించాడు మా రమణ .పుస్తకం ముఖ చిత్రం అదిరి పోయింది .క్వాలిటీ బాగుంది అని అందరూ మెచ్చుకొన్నారు అని రమణ మాకు అమెరికా కు ఫోన్ చేసి చెప్పాడు .ప్రకాష్ గారి కృషి, అంకిత భావం అప్పుడు అర్ధమయ్యాయి .

‘’విజయ వాడ’’ పై ప్రకాష్ విజయ వాడలో’’ కవి సమ్మేళనాన్ని’’ నిర్వహించి నన్ను ఆత్మీయ అతిధి గా ఆహ్వానిస్తే వెళ్లి పాల్గొన్నాను .శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదికి ’’సిద్ధ యోగి పుంగవులు ‘’.పుస్తక ముద్రణకూడా ప్రకాష్ గారిపైనే వేశాను .దానినీ సమర్ధం గా నిర్వహించి తక్కువ సమయం లో తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన పేపర్ ,ఆకర్షణీయ ముఖ చిత్రం తో తీర్చి దిద్దారు .ఈ పుస్తకాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తల్లి గారుస్వర్గీయ  సౌభాగ్యమ్మ గారికి మైనేని వారి కోరిక పై  అంకితమిచ్చిన సంగతి అందరికి తెలుసు .అందరూ ఏంతో సంతోషించారు .అందులో ఆయన చేసిన సహాయం విషయం రాస్తే అటువంటి మాటలు తనకు సరిపడవని తొలగించిన సుమనస్కుడు .సభా ముఖం గా ఆయన గురించి చెప్పటమే తప్ప అచ్చులో దాన్ని రానివ్వరాయన .ఆలాగే శ్రీ హనుమజ్జయంటికి ‘’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’పుస్తక ముద్రణ కూడా చలపాక గారి పైనే మోపాను .దానికీ సంసిద్ధులై చక్కని పుస్తకాన్ని తయారు చేయించి సకాలాని కి అంద జేశారు .అదీ ప్రకాష్ తీసుకొనే శ్రద్ధ .ఈ సారి కూడా వారికి క్రుతజ్ఞత చెబుతూపుస్తకం లో  రాస్తే తీసేయించారు .ఈ పుస్తకం లో అనేక సంస్కృత పదాలు శ్లోకాలు ఉన్నాయి .వాటిలో ఎక్కడా తప్పు దొరల కుండా ఏంతో జాగ్రత్త తీసుకొని పుస్తకం తెచ్చారు. ఏమిచ్చి వారి ఋణం నేను ,సరసభారతి తీర్చు కో గలం ?

ఇప్పుడీ ‘’మహిళా మాణిక్యాలు ‘’కూడా ప్రకాష్ గారి భుజస్కంధాల పైనే ఉంచాను .ఆనందం గా స్వీకరించి అత్యద్భుతం గా గొప్ప క్వాలిటీ తో అర్ధ వంతమైన ముఖ చిత్రం తో స్పాన్సర్ అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి అర్ధాంగి సౌ శ్రీమతి సత్య వతి ,గారి కి గోపాల కృష్ణ గారి కోరిక పై అంకితమిచ్చిన సంగతి మీరు ఎరిగినదే .సత్యవతి గారి ఫోటో ,గోపాల కృష్ణసత్యవతి  గార్ల దంపతుల ఫోటో ,వారి పెద్దబ్బాయి శ్రీ కృష్ణ ,చిన్నబ్బాయి శ్రీ రవి కుటుంబ ఫోటోలు  చేర్చి గొప్ప నిండుదనాన్ని తెచ్చారు .మంచి  మిసమిస లాడే తెల్లని స్వచ్చమైన పేపరు అందమైన ముద్రణ తో ‘’మహిళా మాణిక్యాలు ‘’ను ‘మాణిక్య సమూహం ‘’గా మాల గా కూర్చి అంద జేశారు .అందులోని మహిళా మాణిక్యాల ఫొటోలనూ చక్కగా జత చేసి మరింత వన్నె తెచ్చారు  శ్రీ ప్రకాష్ .ఆవిష్కరణ లో ఈ విషయాల న్నీ సభా ముఖం గా చెప్పాను .ఈ సారి కూడా తనను  గురించి రాస్తానంటే ఒద్దన్నారు .పుస్తక సమీక్ష చేయమని కోరాను .దాన్నీ తిరస్కరించారు ‘’.మీకు, ,మైనేని గారికి మధ్య నేను ఎందుకు సార్’’అని చెప్పి తప్పించుకొన్న సంస్కారి .ఇలాంటి ‘’మాణిక్యాన్ని’’ గురించి నేను రాయక పొతే సంస్కారం అని పించు కోదు. అందుకే ఇంత రాయాల్సి వచ్చింది .అంటే ప్రకాష్ గారు సరస భారతి కి నాలుగు పుస్తకాలు ముద్రించి ఇచ్చారు .ఎక్కడా క్వాలిటీలో రాజీ పడలేదు .సమయాన్ని దాటి పోనివ్వలేదు డబ్బు ఖర్చు చాలా సరళం గా ఉండేట్లు చేశారు .అంతా అనుకొన్న సమయానికే అనుకొన్న విధం గా ముద్రణ చేయించి అంద జేసిన సాహితీ బాంధవుడు  .వారి అమ్మాయి డి.టి.పి కి చాలా సహకరించింది. ఎక్కడో బాగా పట్టి చూస్తె తప్ప తప్పులు దొరల లేదు .అంత పకడ్బందీ గా చేసింది ఆ చిన్నారి .ఆమెకూ ఆయన ద్వారా అభినందనలు ఆశీస్సులు ..ముఖ చిత్రాని శ్రీ ఎల్లపు కళా సాగర్ తో తయారు చేయించారు .అన్నీ సమపాళం లో కుదిరాయి . మాణిక్యాలు పుస్తకాన్ని చూసి స్వర్గీయ రావి శాస్త్రి గారి సోదరులు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారు (మైనేని వారి బావ గారు ) విశాఖ నుండి ఫోన్ చేసి పుస్తకం క్వాలిటీని గూర్చి ఏంతో మెచ్చుకొన్నారు .’’యెంత అయింది ?’’అని అడిగితె చెప్పాను .’’విశాఖ లో యాభై పేజీల పుస్తకనికే బోలెడు అవుతోందని మంచి వ్యక్తీ మీకు దొరికి నందుకు సంతోషంగా  ఉంది అతనికి ధన్యవాదాలు చెప్పండి ‘’అని కొనియాడారు ప్రకాష్ గారిని .మా ఇద్దరిది జననాంతర సౌహృదం అని పిస్తుంది నాకు .అంతటి ఆత్మీయులు దొరకటం నా అదృష్టం .

ఇంతటి సహృదయులు శ్రీ చల పాక ప్రకాష్ గారు.  ఆప్తులవటం సరసభారతి చేసుకొన్న పుణ్యం అదృష్టం .పుస్తకం లో ఎలానూ నన్ను తనను గురించి రాయనివ్వని ప్రకాష్ గారికి ఇది నా’’అభినందన మాణిక్య మాల ‘’.

రేపు శ్రీరామ నవమి సందర్భంగా శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14- ఉయ్యూరు

.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’జయ ‘’వసంత హే(ఈ)ల

‘’జయ ‘’వసంత హే(ఈ)ల

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి ఉగాదికిఒక రోజు  ముందు నిర్వహించిందని మీకు తెలుసు .మా వివాహ యాభై వ వసంతోత్సవం కూడా కలిసి వచ్చినందున మాకు పెద్దగా దానిపై ఆసక్తి లేక పోయినా దానికోసం అమెరికా నుంచి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ముందుగానే బయల్దేరి మార్చి ఇరవై రెండుకల్లా ఇండియా రావటం తో మా అందరికీ, మా అబ్బాయిలకూ హుషారు వచ్చింది .సరస భారతి వేడుకలో ఇదొక భాగం గానే మేము చూశాం   ప్రత్యేకతను చాటలేదు .కాని ప్రత్యేకత అందరూ రావటం తో వచ్చింది .ఇది ఊహించనే లేని పరిణామం .దీని కోసం ప్రత్యెకం గా మేం చేసిందేమీ లేదు .మా అమ్మాయి హడావిడితో దీనికి ‘’ముమెంటం వచ్చింది ‘’.అన్నలతో కలిసి కార్యక్రమాన్ని ఆలోచించి అమలు చేసింది .అదంతా వేదిక పై’’ క్లిక్ ‘’అయింది .మర్నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మరీ ఘనం అయింది .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆశీస్స్సుల తో ఇంతమంది పాలు పంచుకొంటే అభిమానం చూపిస్తే ,ఆత్మీయత ప్రదర్శిస్తే ,పెద్దలు ఆశీర్వ దిస్తే విజయ వంతమైంది .

ఈ ఉగాది వేడుకలను విభిన్నం గా జరపాలని భావించాను .ముఖ్య అతిధి గా శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో మా మనసులో మెదుల్తూనే ఉన్నారు .2012జూన్ లో అమెరికా లో మా అమ్మాయి గారింట్లో వారితో పరిచయమైనప్పటినుండి వారితో ఉయ్యూరు లో ఒక ఈల పాట సంగీత కచేరి చేయించాలని గట్టి సంకల్పం కలిగింది .వారి కచేరీల వివరాలను నాకు ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తూ ‘’మీ ఆశీర్వాదం కావాలి ‘’అని రా స్తూ ఉన్నారు .అక్టోబర్ లో ఇండియా కు మేము తిరిగి వచ్చిన తరువాత ఆ ఆలోచన కు కార్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాం .సరసభారతి ద్వారా చేస్తే అంత ఘనం గా ఉండదు అని అందర్నీ ఇందులో భాగ స్వాములను చేయాలని ఆలోచించాము .రోటరీ క్లబ్ నిర్వాహకులు శ్రీ కొండలు గారి తో మా అబ్బాయి రమణ ఒకటి రెండు సార్లు మాట్లాడాడు .ఆయన సరే నన్నారు .2013మే నెలలో చేద్దామని అన్నారు. కాని ముందుకు సాగలేదు .ఒకటి రెండు  సార్లు మంగళ వారాలలో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఆయన వచ్చినప్పుడు జ్ఞాపకం చేశాను .చేద్దామనే అన్నారు కాని ఎందుకో బ్రేక్ పడింది .ఈ విషయాలన్నీ ఎప్పటి కప్పుడు శివ ప్రసాద్ గారికి మెయిల్ రాసి తెలియ జేస్తూనే ఉన్నాను  మా వాడు కనిపించినప్పుడల్లా చెబుతూనే ఉన్నాడు  సరే నంటున్నారు .కాని ప్రణాళిక సిద్ధం కాలేదు .అందుకని శ్రీ జయ ఉగాది వేడుకలకు శివప్రసాద్ గారిని ముఖ్య అతిధి గా  ఆహ్వానించి సత్కరించి కచేరీ చేయిడ్డామనే సంకల్పానికి మా కుటుంబం వచ్చింది .అన్నీ కలిసి వచ్చాయి. ఉగాది కవి సమ్మేళనం ,పుస్తకా విష్కరణ ,ఉగాది పురస్కార ప్రదానం తో ఈ ఆలోచన పరి పూర్ణ మైంది .రమణ కొండలు  గారిని కెసీపి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ జి వెంకటేశ్వర రావు గారినీ కలిసి శివప్రసాద్ గారిని ఇక్కడికి తీసుకొస్తున్న సంగతి చెప్పాడు .వారిద్దరూ ఓకే చెప్పి అవసరమైన సహాయ సహకారాలు అందించటానికి ముందుకొచ్చారు .ఇంత విస్తృత వేదిక ఉంటేనే ‘’ప్రపంచ ప్రసిద్ధవిద్వాంసులు శ్రీ శివ ప్రసాద్ గారి  ‘’గళ మురళీ విన్యాసానికి ‘’గొప్ప స్థాయి లభిస్తుందని నేను ఆశించినది సఫల మైంది .రోటరీ క్లబ్ ఆడిటోరియం అయితే విశాలం గా పెద్దగా అన్ని వసతులతో ఉంటుందని భావించి అడిగితె   సరేనని బుక్ చేసేశారు .శివ ప్రసాద్ గారి బృందానికి కెసీపి గెస్ట్ ఔస్ లో రెండు  ఎసి రూములు ఇస్తామన్నారు ఆయనబృందాన్నితీసుకు రావటానికి మళ్ళీ తీసుకు వెళ్ళటానికి వెహికిల్ ఏర్పాటు చేస్తామన్నారు .దీనితో ఒక గొప్ప ప్రాముఖ్యత కార్య క్రమానికి లభించింది .

మరి ఆ స్థాయి వ్యక్తీ తో వేదిక పంచుకొనే ఆత్మీయ అతిధులను గురించి ఆలోచించి వారికీ ఉగాది పురస్కారాలను అందించాలని వారిలో ఒకరితోమహిళా మాణిక్యాలు పుస్తకావిష్కరణ చేయించాలని అనుకొన్నాం .వెంటనే విజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకురాలు శ్రీమతి మున్జులూరి కృష్ణ కుమారి గారు నా దృష్టికి వచ్చారు. ఆమెతో చాలా సార్లు బెజవాడ సభల్లో వేదిక పై ఉన్నాను .చాలా సభల్లో చూశాను ,నేనెవరో ఆవిడకు తెలుసు .కనుక వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పి శివ ప్రసాద్ గారోస్తున్నారని ఈల పాట కచేరి చేస్తారని పుస్తకావిష్కరణ ఆమె చేయాలని మా ఆత్మీయ ఉగాది పురస్కారాన్ని స్వీకరించాలని చెప్పాను. వెంటనే అంగీకరించారు .ఇది కొంత ముందు అడుగు అని పించింది .అప్పటీ శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారిని సంప్రదిస్తే ఆయన మార్చి 20న అమెరికా బయల్దేరి వెళ్తున్నాని మే చివర్లో కాని రానని చెప్పి శుభా కాంక్షలు తెలిపారు.శ్రీ పూర్ణ చంద్ ఉంటె కృష్ణా జిల్లా రచయితల సభ నిర్వాహకులు ఒకరు ఉంటారు కనుక వేదిక సుసంపన్నం అవుతుందని పించి చెప్పగానే అంగీకరించి తప్పక వస్తానని అభయమిచ్చారు .తర్వాతఒక పత్రికా సంపాదకులు కూడా ఉంటె మంచి ప్రచారమూ వస్తుందని భావించి శ్రీ వల్లీశ్వర్ గారిని సంప్రదిస్తే నిమిషాల మీద అంగీకారం తెలిపారు .దీనితో పరి కొంత స్థాయి ఏర్పడింది .కెసీపి జి ఏం శ్రీ వెంకటేశ్వర రావు గారు పారిశ్రామిక రంగం లో ప్రసిద్ధులు కెసీపి కి అనేక ఎక్సలెన్సీ అవార్డులు సాధించిన వారూ కనుక వారికి ఆత్మీయ ఉగాది పురస్కారాన్నివ్వాలని భావించి కోరగా సమ్మతించారు .ఒక ఆయుర్వేద మహిళా డాక్టర్ కు కూడా పురస్కారం ఇద్దామనుకోన్నాను  వెంటనే మామిత్రులు  కోసూరు ఆదినారాయణ గారి కోడలుశ్రీమతి శ్రీవిద్య  బందరులో ఆయుర్వేద డాక్టర్ అని గుర్తు చేసుకొని ఆమెను సంప్రదించగా సరేనన్నారు .ఇలా అర్హులైన వ్యక్తులు వేదిక పై ఉండటం గొప్ప శుభ పరిణామం అయింది .విజయవాడ రేడియో కేంద్రానికి నాలుగు ఆహ్వానాలు పంపాము .’ఉదయం’’వచ్చే  వార్తా విపంచి ‘’లో చెపుతారని ఆశించాను చెప్పినట్లు లేదు .చెప్పినట్లు ఎవరూ ణా దృష్టికి తెలేడుకూడా .ఇది కొంత నిరాశ కలిగించింది .పూర్వం మేము చేసిన కార్యక్రమాలన్నిత్నీ రేడియో వారు వార్తా విపంచి ద్వారా శ్రోతలకు వారం రోజులు ముందునుంచే తెలియ జేసేవారు .ఆనవాయితీ తప్పటం ఆశ్చర్యమేసింది .

ఆహ్వాన పత్రాలను మామూలు’’ మూస ‘’పద్ధతిలో కాకుండా భిన్నం గా ఆకర్షనీయం గా ఉండాలని మా రమణ భావించి శ్రీ ప్రకాష్ చేత డిజైన్ చేయించి బెజవాడ లో ప్రింట్ చేయించాడు .బాగా వచ్చి అందరికీ నచ్చింది .దాదాపు అరవై మంది కవులను ఫోన్ లో సంప్రదించి ఆహ్వానించి ‘’వివాహం –దాంపత్యం ‘’పైన మాత్రమె కవిత ఉండాలని కోరాను అందరూ వస్తామనే చెప్పారు .వారం ముందు మళ్ళీ అందరికీ ఫోన్ చేసి గుర్తు చేశాను .ఇందులో కొందరికి ఎలక్షన్ డ్యూటీలు ఉండటం వలన రాలేక పోయారు .ఊరిలో  కూడా ఆహ్వానాలను ప్రతి హైస్కూల్ కాలేజి ఆఫీసు బ్యాంకు లకు  అభిరుచి ఉన్న వ్యక్తుఅలకు పంచాము .28 వ తేదీన రోటరీ ఆడిటోరియం లో ‘’ప్రెస్ మీట్ ‘’ఏర్పాటు చేసి నేనూ రోతరీక్లాబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారు కార్యక్రమాన్ని వివరించి ఆహ్వానాలు అందజేశాం .వారు బాగానే స్పందించి రాశారు ‘’మన చానల్’’లో 29 ,30 తేదీలలో స్క్రోలింగ్ చాలా సార్లు వేసి ప్రజల దృష్టికి ఉగాది వేడుకలను తెచ్చారు .ఊరంతా మునిసిపల్ ఎన్నికల కోలాహలం గా ఉండటం వారూ ఏదో ఒక పార్టీ తరఫున పని చేయటం వలన ఎక్కువ మంది రాలేక పోయారు .ఏమైనా దాదాపు రెండు వందమ మంది పాల్గొన్న సమావేశం గా గుర్తింపు పొందింది .శివ ప్రసాద్ గారు ఆ రోజు ఉదయం మా ఇంటికొచ్చినప్పుడు ‘’సార్  మీ వాళ్ళు ఒక యాభై మంది ఉంటారా?’’అని నన్ను అడిగారు .’’నూట యాభై మందికి తక్కువ ఉండరు .’’ఎలైట్ ఆడియెన్స్’’ కోసమే రోటరీ ఆడిటోరియం లో ఏర్పాటు చేశాం ‘’అని చెప్పాను సంతోషించారు . సంగీత సాహిత్య కళాభిమానులు విశేషం గా విచ్చేసి సరసభారతి నిర్వాహించినశ్రీ జయ నామ సంవత్సర  ఉగాది వేడుకలను తిలకించారు .శ్రీ శివ ప్రసాద్ గారి ‘’గళ మురళీ విన్యాసం ‘’లో పులకించారు .శ్రీ జయ వసంత ఈలా హేలలో పరవశం చెంది సరసభారతిని ఆశీర్వదించారు .

8-4-14-మంగళ వారం శ్రీ రామ నవమి సందర్భం గా శుభా కాంక్షలు

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14-ఉయ్యూరు

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

 

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సశేషం

.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వర్గీయ” భరాగో’కి బహిరంగ లేఖ – గొరుసు , మూలింటామె – నామిని :

భరాగో గారూ.. మీరు కనిపించక సరిగ్గా నాలుగేళ్లు పూర్తి. సత్యభామగారి జాడ తెలుసుకొస్తానని మమ్మల్ని మభ్యపెట్టి వెళ్లడం వెళ్లడమే.. ఇప్పటికి ఐపు లేరు. ఇలా మమ్మల్ని మధ్యంతరంగా వదిలేసి వెళిపోవడం న్యాయమా చెప్పండి? మొన్న మీ అనుంగు మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు ఫోన్‌చేసి ‘రామగోపాలంగారి సంగతి యావైనా తెలిసిందా?’ అని కన్నీళ్ళెట్టుకుని అడిగారు. మీ గురించి ఎవరిని వాకబు చేసినా లాభం లేకపోయింది కదా. అందుకే ‘ఉండండి.. ఒకఉత్తరం రాసి పడేస్తాను’ అని రామడుగు గారికి మాటిచ్చి, ఇదిగో ఇలా మొదలెట్టాను. నాలేఖ అందగానే బయల్దేరండి!
ఇక్కడ పనులన్నీ మధ్యంతరంగా వదిలేసి వెళ్లిపోయారు మీరు. ‘నూట పదహార్లు’, ‘మరో నూట పదహార్లు’ తీసుకురాగానే సరిపోయిందా? అలాంటి నూట పదహార్లు ఇంకా ఎన్ని రావాలో. మట్టిలో మాణిక్యాలుంటాయిని తెలుసు కానీ, వాటిని గుర్తుపట్టి మాకందించేవోరు ఉండాలి కదా. మీరు ఆ నూట పదహార్లు తీసుకురాబట్టే కదా ‘ఎంత మధుర సీమ ప్రియతమా’, ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’, ‘అందానికి అందం నేనే జీవన మకరందం నేనే’, ‘నిదురమ్మా.. కదలీ వేగమే రావమ్మా’, ‘పండూ వెన్నెలా మనసు నిండా వెన్నెలా’ లాంటి రసగుళికలు వినగలిగాము.
సాలూరి రాజేశ్వరరావు గారి పాట మీనోట వినడమనేది మా చెవుల్లో అమృతం పోసినట్టే కదా. సరే, అదలా ఉంచండి. సాలూరిగారి సావనీర్ తెద్దామని మాటిచ్చారు నాకు. అదీ పెండింగులో పడిపోయింది. రావిశాస్త్రి, అడవి బాపిరాజు, రావు బాలసరస్వతిదేవి, భానుమతి, సుశీల గార్ల సావనీర్లని మీరు తీసుకొచ్చిన చందంగా మరొకరు తీసుకురాగలరా? మీరు పూనుకోబట్టే కదా ఆచంట జానకీరామ్ మాకు దగ్గరయ్యారు. ఇంకా మీరు తీసుకురావలసిన పాటలు, పుస్తకాలు, సావనీర్లూ బోల్డు మిగిలిపోయాయి. వీటిని మీ అంత నాణ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వారు మరొకరు లేరంటే నమ్మండి.
అన్నట్టు.. నడవలేననే బెంగ మీకుందేమో! నడక మీకో సమస్యే కాదు. కుర్చీలో ఉండే పనులు పురమాయించీగల్రు. పదిహేనేళ్లపాటు మీ చుట్టూ బొంగరంలా తిరిగినోడ్ని… మీగురించి నాకు అంతమాత్రం తెలీదనుకోకండి. మీరు ‘వంటొచ్చిన మగాడే’ కాదు సుమా.. సాహిత్య, సంగీతాల ఒడుపు తెలిసిన చమత్కారులూనూ. నా మాటిని వేగిరం వచ్చీయండి. వచ్చేస్తారు కదూ.
మీరు వెళ్లిపోయారు కానీ, మీ తమాషా కబుర్లు మాటిమాటికీ గుర్తొచ్చి కురుపులా సలుపుతూ కళ్లు చెమ్మగిల్లని రోజంటూ ఉందా? కనకలతగారి పెళ్లికి ముందొకసారి ‘అబ్బాయిల్ని చూస్తున్నారా?’ అని నే మాటవరసకంటే మీరు ఒక చేతి వేలు చూపిస్తూ ‘ఒక్కడు చాలు’ అని గుంభనంగా నవ్వలేదూ? ఆనక ఆ ఒక్కడూ కళ్లెదుటే అమాంతం అదృశ్యమైపోతే భూగోళమంత బాధని మీ గుప్పెడు గుండెలో దాచుకుని మాకందరికీ ధైర్యం చెప్పలేదూ! మీకు ఏ చిన్న జలుబు చేసినా చిటికెలో మీ ముందు వాలిపోయే ధన్వంతరి నాయిక్‌గారుండగా మీకేల బెంగ? వచ్చీయండి వచ్చీయండి… బేగొచ్చేస్తారు కదూ!
‘ఇట్లు మీ విధేయుడు’
– గొరుసు

 

 

మూలింటామె – నామిని

చీమంతమ్మ యింటికి పోతే బాగుండును, లేదంటే చీమంతమ్మే యీడికొస్తే కడుప్మంట కొంచానికి కొంచిమన్నా చల్లారును అని అనుకుంటూ వుండంగా మొలకమ్మ పెట్రమాక్సు లైట్టు మాదిర్తో యెలిగిపోతా, ‘ఏమే మూలింటి మొదులా! తలకాయి నెప్పి అణసరయ్యిందా; కూతురు తిరప్తి నుంచొచ్చినాక యింగా జాస్తయ్యిందా?’ అంటా వొచ్చి పక్కన్నే బండ మింద కుచ్చునింది. వొళ్లో అబ్బనాకారంగా కుచ్చోనుండిన నల్లపిల్లి దుసబెరుక్కోని పట్టూ పరుగు!
మొలకమ్మను ఏమీ ఎక్కడా అని అనకుండా మూలింటామె నల్లపిల్లితో, ‘నువ్వు నల్లదానివి కొడకా! నరుల కన్ను నీ మిందనే వుంటాది, నువ్వు యీదల్లోకి పోబాక. నా బట్టల్ నా సవుతుల్ నిన్ను బట్టుకోని బలీయబోతారు వాళ్ల గుండాల ముందు. నల్ల పుట్టక బుట్టినావు జాగర్త.’ అనింది.
మొలకమ్మ వొళ్లు పొగలుబోతా, ‘నువ్వాడదా, గాడిదా? నీ కొంపలో యింత జరిగినా ఆ పిల్లుల్తో నీ చెళ్ల బోలేదే! తెల్లారి లేచి ఆ పిల్లుల మొకాలు జూసే నీ కొంపలో యింత జరిగుండేది లోకానికే యిచ్చిత్రంగా! ఇంగన్నా నీకు బుద్దొస్తుండాదా?’ అని పిల్లుల మిందికి పొయ్యింది.
మూలింటామెకి వుచ్చిన యెంటిక చివక్కన పైకి లేచినా, అణుసుకోని, ‘నోరూ వాయీ లేని పిల్లులేమి జేసినాయి నిన్ను మొలకా! నన్నను పడతా. వాటిని అనబాక. అవి బేదం బెట్టుకుంటాయి. వాటి కత నీకు తెల్దు. పిల్లులు పున్నాత్మురాళ్లు’ అనింది మంచిగానే.
‘నీ వాటం జూస్తా వుంటే కడుప్మంట బొయ్ నవ్వొస్తా వుండాదే మూలింటా! నీకు దోడు బొయ్యిందొగటి రాగలరాళ్లు కొట్టకపోతున్నా ఎరగనోచ్ అంటా వుండి పుల్లిస్త రాకులు ఎగిరి పోతుంటే నెత్తీ నోరూ కొట్టుకునిందట. అట్టుండాది నీ వాటం. నీ మనవరాలు జాత్తక్కవ నా బట్టతో పూడిసి వూరు మొత్తానికీ చెడ్డ పేరు దెచ్చినా నీకు లెక్కా జమా లేకుండా వుండాది. నల్ల పిల్లికి జాగర్తలు చెప్పే లంజివి నీ కోడాలికి చెప్పక పోతివా!’ అని వక్కాకెంగిలి ఎర్రంగా వూంచింది మిట్టమింద మొలకమ్మ.
****
‘నా మనవరాలు గురమ్మకు వొక పెట్ట పిల్లను పైరు జేసుకోమని యిచ్చిన కత నాకు తెలుసునా! గురమ్మ చెప్తేనే గదా తెలిసింది. మాలపల్లి దాకా పోయి ఒక కూతేసి పిల్చకొస్తే కడుపారా తిన్దా!’ అనిపించి మాలపల్లికి ఎలబారాలను కొనింది. ‘నేను లేంది జూసి వీళ్లు ఏమేమి మాట్లాడుకోని వొకరిలో వొకరు కలుసుకొని పోతారో! పోదారా వొద్దా’ అని కొంచేపు గుంజకలాడి, తీరా మాలపల్లికి పోతే దేముడి దరమ్మాన గురమ్మ వుండింది. గురమ్మ మాటతో గూడా కుశాలగా మొదుటామె యింటికి మొదుటామె యెనకాన నడస్తా, ‘ఒక మాలదాన్ని కోడి కూర తిందువు రా అని మాలపల్లికొచ్చి ఎవురన్నా పిల్చకపోదురా! మంచోళ్ల బుద్ది మాంసం కాడ తెలిస్తిందంటారు. మూలింటక్కా, నువ్వు బాద పడబాక. నీ మనవరాల్ని యీ పొద్దు అందురూ గూడా జిల్లా పటంగి అని అంటా వుండొచ్చు. నీ బిడ్డి జిల్లా పటంగో, పతివర్త కూతురో ఎవురికి తెలుసు, దేముడికి దా తెలవాల.’ అనింది.
దీనికి, ‘గురివీ! నా కొడుక్కి సమందం జూడాలంటుండాది నా కూతురు. నా కూతురికి డోలు కొడతా వుండాది దాని పెద్దం. బీమారం నుంచి దాని పెద్దం దాని అందమ్ముడికి సమందం తెచ్చినట్టే అనిపిస్తుండాది. నువ్విప్పుడు మా యింటికొస్తుండావు గదా, పెండ్లి సమందం కత నీ ముందర గాన ఎత్తినారంటే – నువ్వు గెట్టంగా చెప్పు. నా మనవరాలి బిడ్లకు సవిత్తల్లి పోరుండకుండా చెయ్ నా కూతరా!’ అని ఏడస్తా నడస్తుండాది మొదుటామె.
ఈ మిట్టూరులో పుట్టి, పెరిగి, బీమారానికి కోడాలిగా పోయ్‌న ఆడదే గదా ఎర్రక్క. మాలోళ్ల గురివిని చూడంగానే, గురివిని గుర్తుబట్టి, నడిపమ్మితో, “చూడు నడుపమ్మీ! నేను యాడ గొంతు కానేటట్టు కోడిపుంజు కూర తినేస్తానేమోనని వొప్పక, ‘మాలోళ్ల గురివి గూడా వుండాది, ఎడెనిమిది పిల్లులు గూడా వుండాయి. నువ్వు కొంచిం మితంగా తిను.’ అని చెప్పేదానికి, ఎండ మింద బడి మాలపల్లికి పోయ్ పిలచకొచ్చింది చూడు. నేను ముందు ఎంగిలి జేసిన రొమ్మును, మళ్ల ఒకట్రెండు సమచ్చరాలకు ఎంగిలి జేసిన ముండిది. నన్ను అక్క అని యిది తలిస్తే – నాతో గూడా కోడికూర తినేదానికి వొక మాలదాన్ని పిలచకొచ్చునా! అంటే దీనికి నేను అంచన బుట్టి పంచన పెరిగిన సుట్టంగాదు. యీ మాలది దీనికి సుట్టం. కాబట్టే దీని మనవరాలికీ పొద్దు వొక అరవమాదిగోడు మిండగోడయినాడు. నడిపమ్మీ, నేను తిన్నింకీ కోడికూర, నాకంత శెనిగ్గింజలూరుబిండి చెయ్.” అని కాసుకు గాకుండా మాట్లాడింది.
ఈ మాటలకు గురమ్మేం రోస పడలా. ‘మూలింటక్కా బూమ్మింద కేర్ మని పడినప్పుట్ను ంచీ యిట్టాటి మాటలే యింటుండా. మీఅక్క అన్న మాట్లకి నేను బేదం బెట్టుకోను. యీ జలమ్మకింతే!’- మూలింటామె యాడ బాద పెట్టుకుంటాదో అని నంగిగా మాట్లాడింది గురివి.
– నామిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరామాయణ పరమార్ధం

శ్రీరామాయణ పరమార్ధం

‘’భక్త మహాకవి తులసీ దాసు ‘’’సీతారామ మయంబీ జగతి ‘’అన్నా ,భువన మెల్ల నీవై ఉండగా బ్రోవ భారమా ?’’అని త్యాగరాజు ప్రశ్నించినా అందరి అనుభూతిలో ఒకే ఒక విభూతి వెలుగుతున్నట్లు గోచరిస్తుంది.అది లౌకికం గా  భవభూతి .,పారమార్ధికం గా ఆత్మ విభూతి ‘.అదే రామాయణ పరమార్ధం  బోధించే ఆత్మాను భూతి ‘’అన్నారు శ్రీమద్రామాయణాన్ని 18 సంవత్సరాలు దీక్షగా పారాయణం చేసి జీర్ణించుకొని అను భూతి పొంది ,అదొక అఖండ ప్రాణాయన మని భావించిన స్వర్గీయ శ్రీ ఇల పావులూరి పాండు రంగా రావు గారు .రామాయణం తనను ‘’జీవిని ‘’చేసిందన్నారు .ఏదో ఒక సమాజానికి సంబంధిన రచన కాదు రామాయణం .అందరికీ సంబంధిన అను భూతిని ఎవరికి వారి వారి అను భూతి అని పించేట్లు పంచి పెట్టిన’’ జీవరసాయనం’’ అన్నారు ఏంతో భక్తిగా .జీవ కోటికి జీవ లక్షణాలు ప్రసాదించే ‘’రామకోటి’’ అంటారాయన .కౌసల్య గర్భం లోనుంచి ఆవిష్కరించుకొన్న ‘’ఆదిత్య హృదయం ‘’శ్రీ రామ చంద్రోదయం అని పులకించి పోతారు ‘’కారుణ్యాలయ ,భక్త వరద నిను కన్నది కానుపు రామా !’’అని భక్త రామ దాసు రామ జననం లో రామ –ఆయనాన్ని సందర్శించి తరించాడని మెచ్చారు  .ఈ ఆయనాన్ని ఆవిష్కరించిన తపస్వి ఆదికవి వాల్మీకి మహర్షి అని కీర్తిస్తారు ఇలపావులూరి వారు .

 

 

Valmiki Ramayana.jpg  

 

 

 

వాల్మీకి పెట్టు కొన్న పేరు లో నే రామాయణ పరమార్ధం ఇమిడి ఉంది .’’రామ’’ శబ్దం లోని  రామణీయకత ,,’’ఆయన ‘’ శబ్దం లోని ఆచార్యత రెండింటి సహజ సమ్మేళనమే రామాయణ రసాయనం అంటారు పాండురంగా రావు గారు .తనలో తానూ రమిస్తూ ,తనతో బాటు తోటి వారిన్నీ రమింప జేస్తూ ,,ఆనంద పరుస్తూ నిరంతర నిర్విరామం గా  నిత్య సత్య సందీప్తి తో నిర్లిప్తం గా నియత కర్మలను ఆచరిస్తూ ,సమభావం తో సంచరించటమే ‘’రామాయణీయత ‘’అన్నారు .ఇది అన్నికాలాలకు అన్ని దేశాలకు , ,అందరికి వర్తించి ప్రపంచాన్ని ప్రవర్తింప జేసే చిరంతన చైతన్యం అన్నారు ఇలపావులూరి .ఈ పరమ తత్వాన్ని రమణీయం గా ప్రసన్నం గా తన జీవిత –ఆయనం లో సాధించి అందరికి అందులోని ఆనందాన్ని ప్రసాదించిన ప్రసన్న రాఘవుడు రామ భద్రుడు .

సామాన్య మానవులు ఎలా ప్రవర్తించాలి అనేదే రామాయణం లోకానికి చెప్పే హితవు .అసత్యాన్ని సత్యం తో ,అన్యాయాన్ని న్యాయం తో ,స్వార్ధాన్ని పరమార్ధం తో ,హింసను అహింస తో ,మాయను మమ కారం తో ,అసూయను అనురాగం తో ఎలా జయించాలి అనేదే రామాయణం ప్రపంచానికి అందించే సందేశం .వీటిని చాటి చెప్పేందుకే,సాధించటానికే  సీతా రాములు అష్టకష్టాలు పడ్డారు .అందుకే వారి చరిత్ర ఈ నాటికీ నిలిచి ఉందంటారు .’’ఇదం హాయ చరితం లోకే ప్రతిస్టాస్యతి శాశ్వతం ‘’అని మంత్రం కోవిదుడు అయిన సుమంత్రుడు దుఖం తో కుమిలి పోతున్న కౌసల్యా దశరధులకు చెప్పాడు .కాని ఆ సుమంత్రుడే రామాదులను అడవిలో వదిలేసి వచ్చేందుకు ఏంతో బాధ పడతాడు .ఇది ప్రతి వ్యక్తీ జీవితం లో ప్రతి దినం ఎదుర్కొనే చిక్కు ప్రశ్న .రామాయణం లో ఇలాంటి వి అడుగడుగునా కాని  పిస్తాయి .వాటిని వివేకం తో పరిశీలించి మనసుకు నచ్చ చెప్పు కుంటూ ఉండటమే జీవితం మనకు నేర్పే గుణ పాఠంఅని వివరిస్తారు .ఈ గుణ పాఠాన్నేరమణీయం గా మనకు బోధిస్తుంది రామాయణం .

యదార్ధం గా రామాయణం కేవలం కద కాదు .ఆయనమూ కాదు ఇది ఒక ‘’ఆత్మ దర్శనం’’ .రామాయణ పాత్రలు నిత్య జీవితం లో మనకు కనిపించేవే .అందుకే రామాయణం ప్రతి రోజు మనకు కనిపించే వ్యక్తుల్లో ,జరిగే  వృత్తాంతాలలో  ,అనుభవించే కష్టాల్లో ప్రతి ఫలిస్తూనే ఉంటుంది .వాల్మీకి భాషా ప్రపంచానికి ప్రసాదించిన వాగ్విభూతి నే తాను తన మాటల్లో చెప్పానని ఇలపావులూరి వారు వినయం గా చెప్పారు .తనది వాల్మీకి ప్రవచించిన’’ ప్రణవ నాదానికి అను నాదం ‘’మాత్రమె నని నిగర్వం గా చాటుకొన్నారు .ఆదికవిది ఆర్ష హృదయం చూసిన యానం అయితే తను చెప్పింది ఆర్త హృదయం చేసిన పయనం అంటారు వినమ్రం గా .శ్రీకారం లాంటి సేతమ్మ ,ఓంకారం లాంటి రామయ్య చేదోడు వాదోడుగా ఉంటె జీవితం సఫలం అన్నారు .

దశరధ రాముడు తారక రాముడు కావాలి .చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రం లో కర్కాటక లగ్నం లో చంద్ర గురు మొదలైన అయిదు గ్రహాలూ ఉచ్చస్తితి లోస్వక్షేత్రం లో  ఉండగా కౌసల్య గర్భం  నుండి శ్రీ రామ చంద్రోదయమైంది .రాముడికి రాత్రి నిద్రపట్టదట .కారణం ఆదిశేషుడు పానుపుగా లేక పోవటమేనేమో ?సత్య పరాక్రముడు రాముడైతే సత్య సంధుడు దశరధుడు .విశ్వామిత్రునికి కొత్త ఆయుధాలను సృష్టించే శక్తి ఉందని అవి రాముడికి ఉపయోగ పడుతాయని వసిస్టమహర్షి  దశరధుడికి నచ్చ చెప్పి వెంట పంపించేట్లు చేస్తాడు .ధనుర్బాణాలతో శ్రీరామ లక్ష్మణులు అగ్ని దేవతల్లాగా అంటే కుమార స్వామి విశాఖుడు లాగా స్థాణువు అంటే శివ స్వరూపం అయిన మహర్షి వెంట వెళ్ళారు అంటాడు మహర్షి వాల్మీకి .

రామాయణానికి మూల కందమైన రాక్షస సంహారం తాటక వధ తో పునాది ఏర్పడింది .ముందు యానం .తరువాత సంహారం .మారీచ సుబాహు వధ ముందు తాటక సంహారం తమో నివృత్తి సూచకం .తమోప సంహారమే తాటక వధ .రాముడు సందేహిస్తే పూర్వం మంధర ను ఇంద్రుడు చంపిన వృత్తాంతం ,భ్రుగు మహర్షి భార్య లోకాన్ని అనింద్రం చెయ్యాలని ప్రయత్నిస్తే విష్ణువు ఆమె ను సంహరించటం చెప్పి ‘’ఇది నా. శాసనం ‘’అని విశ్వామిత్ర ముని ప్రేమగా హితవు బోధిస్తాడు .శిరసావహించి రాముడు తాటకను చంపేస్తాడు .దుస్ట శిక్షణకూ ,రాక్షస సంహరానికీ రామాయణం లో ఇది నాంది .

అయోధ్య నుంచి శ్రీ రామ చంద్రుని యానం అంటే గమనం ప్రారంభం అవగానే బల ,అతి బల అనే విద్యలు మహర్షి స్వాధీనం చేశాడు .ఆ విద్యా బలం తో రామ యానం అంటే రామాయణం సుఖం గా సాగుతుంది . రాముడికి మాత్రమె ముని  అస్త్ర బలాలను ఉపదేశించాడు .లక్ష్మణుడికేమీ ఇవ్వలేదు .కాని అన్నదమ్ములిద్దరిలో రాగ ద్వేషాలు లేనే లేక పోవటం గమనించాలి . ఇద్దరిలో ఒకే ప్రాణం ప్రచరిస్తూ ఉంటుంది .శరీరాలు వేరైనా తత్త్వం ఒకటే .పయనం గమనం లేక యానం రాముడిది మాత్రమె .లక్ష్మణుడు సాక్షీభూతుడు మాత్రమె .రాముడు అభ్యసించినవన్నీ  లక్ష్మణ  స్వామికి చూచినంత మాత్రానే ఆకళింపు అవుతాయి. ఆయన అది శేషావతారం సకల విద్యా సారం కదా .రాముడు అంతరంగ   వీక్షణానికి ప్రతినిధి అయితే తమ్ముడు బహిర్లక్షణ మైన లోక దృష్టికి నిదర్శనం .రాముడు పరంధాముడు .లక్ష్మణుడు లక్ష్యకాముడు అని విశ్లేషిస్తారు డాక్టర్ ఇల పావులూరి .విశ్వామిత్రుడు ప్రసాదించిన ‘’మానవాస్త్రాన్ని ‘’మారీచుని పై ప్రయోగించగానే వాడు సముద్రం లో పడిపోతాడు .అస్త్రం అమోఘం గా పని చేసినందుకు రాముడు సంతసిస్తాడు .ఇది రామ సత్య పరాక్రమానికి మొదటి విజయం .తాటక వధ రామ కారుణ్యానికి పరీక్ష మాత్రమె .మారీచ మదం సుబాహుని ప్రాణం హరించటం నిజం గా రామ భద్రుడికి గర్వ కారణం .విశ్వామిత్రునికి ముని గణానికి ఆనంద కారణం అవుతుంది .

రామాయణం ప్రారంభం నుంచి సంధ్యలను ,సంద్యోపాసన ను వాల్మీకి మహర్షి ప్రత్యేకించి స్మరించటం గమనించాల్సిన విషయం .ఆ నాటి సంధ్యకు ఒక ప్రత్యేకత ఉంది అది’’ విజయ సంధ్య ‘’ అంటారు పాండురంగా రావు గారు .గాయత్రీ మంత్రం లోని రెండవ బీజాక్షరం ఇక్కడ దర్శన మిస్తుంది .’’నాహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్నఘ్నాన్ రఘు నందనః –రుశిభిహ్ పూజితః సమ్యగ్ యదేన్ద్రో విజయే పురా ‘’.రామాయణం లో బాల కాండ వరకు నాలుగు యజ్ఞాలు వస్తాయి మొదటిది అశ్వ మేధం ,రెండవది పుత్రకామేష్టి .మూడవది విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం లో చేసిన యజ్ఞం నాల్గవది జనకుడు మిధిల లో చేస్తున్న యజ్ఞం .ఇలా యజ్ఞం తర్వాత యజ్ఞం ఒక ఆశ్రమం తరువాత మరో ఆశ్రమం ఒక  రుషి మండలి తర్వాత మరో రుషి మండలి రావటం రామాయణ క్రమం .ఈ యానం లో సంధ్యలకు కూడా ప్రాశస్త్యం ఉంది . యజ్ఞంఅంటే ఇష్టి .సంధ్యలోని సారం ద్రుష్టి .కనుక రామాయణం లో ఇష్టికీ దృష్టికీ ప్రత్యెక ప్రాధాన్యం ఉంది .అని వివరించారు డాక్టర్ ఇలపావులూరి పాండురంగా రావు గారు. ఈ విషయాలన్నీ వారు రాసిన ‘’అనుదిన రామాయణం ‘’లో ఉన్నాయి .వాటినే శ్రీరామ నవమి సందర్భం గా అందరికి అంద జేశాను .

 

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం -సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం -ఆజాను బాహుం అరవింద దళా య తే క్షం -రామం నిశాచర వినాశకరం నమామి . .

8-4-14 మంగళ వారం శ్రీ రామ నవమి సందర్భం గా శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14-

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు

శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు

వాల్మీకి రామాయణం లో మహర్షి వాల్మీకి శ్రీరామునికి హేమంత ఋతువు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు .అరణ్య వాసం లో సీతా రామ లక్ష్మణులు పంచవటి లో ప్రశాంతం గా ఉంటున్నారు . శరదృతువు వెళ్లి హేమంతం ప్రవేశించింది .ఒక రోజు సీతా సమేతం గా రామ లక్ష్మణులు గోదావరీ నదీ స్నానం చేసేందుకు బయలు దేరారు .దారిలో లక్ష్మణ స్వామి హేమంత ఋతువు ను గురించి చెబుతూ జల కలశాన్ని చేతి లో ధరించి నడుస్తూ ఉంటాడు .

ఈ సందర్భం లో వాల్మీకి మహర్షి హేమంత శోభను అద్వితీయం గా వర్ణిస్తాడు .హేమంతం సంవత్సారానికి మంచి అలంకారం చేస్తుంది .ఎండ, వాన, చలి ఒక దాని తర్వాత ఒకటి వచ్చి తమ ప్రతాపాన్ని ప్రదర్శించి వెళ్లి పోతాయి .అప్పుడు హేమంతం ప్రవేశిస్తుంది .అన్న శ్రీ రాముని మాటల్లో యెంత ఆప్యాయం ఉందొ అంతటి ఆత్మీయత హేమంతం లో ఉంది అంటాడు అన్న హృదయం తెలిసిన రామానుజుడైన లక్ష్మణుడు .మంచు వలన ప్రక్రుతి అంతా శుష్కం గా ఉన్నట్లు తోస్తోంది .పంట చేలు మాత్రం ఎటు చూసినా కంటికి ఇంపుగా కనుల పండువుగా కని పిస్తున్నాయి .జిల్లు మనే నీళ్ళు తాగాలంటే ఒళ్ళు ఝల్లు  మంటోంది.మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా హాయిగా ఉంటుంది .హేమంతం దేవతలను ఆరాధించటానికి అనువైన కాలం .అగ్ని హోత్రం దగ్గర కూర్చుని అనుష్టానం చేసుకోనేంత వరకు నిర్మలం గా నే ఉంటుంది .పల్లెల్లో ఆహార పదార్ధాలు పుష్కలం గా ఉంటాయి .క్షత్రియులు విజయ యాత్రకు బయాల్దేరే మంచి తరుణం హేమంతం .సూర్యుడు దక్షిణ దిశ వైపు ఉండటం వలన ఉత్తర దిక్కు బొట్టు లేని సువాసిని గా బోసిగా కన్పిస్తుంది .అసలే మంచు కొండ అయిన హిమ వంతుడు మరింత హిమ మయమై పేరు సార్ధకం చేసుకొంటాడు .

మధ్యాహ్న సమయం లో ఇంపైన ఎండకు సరదాగా అలా అలా తిరగాలని పిస్తుంది .రవి కిరణాలు పరమ మనోహరం గా ఉంటాయి .నీడకూ, నీటికీ మనసు దూరం అవుతుంది .సూర్యుని మెత్తదనం, చలిగాలి చెలగాటం తో పగలంతా శూన్యం గా ఉంటుంది .పగటి కంటే రాత్రి మరీ నిర్జనం గా ఉంటుంది .ఆరు బయట పడకలు అరుదై పోతాయి .పుష్య నక్షత్ర ప్రభావం వల్ల మంచు, చలి రోజు రోజుకూ పెరిగి పోతుంది .దానితో మూడో జాము రాత్రి ఎన్ని జాములకూ ముగియనట్లు అని పిస్తుంది .చలికి అన్నీ సంకోచిస్తాయి .కాని కాలం మాత్రం వ్యాకోచించి నట్లని పిస్తుంది .ఆవిరితో కప్పేసిన అద్దం లాకనిపించే చంద్రుడి లోని అంద చందాలన్నీ సూర్య బింబం లో ప్రవేశించాయా అన్నట్లు అనిపిస్తుంది .

యెర్రని సూర్య బింబం పొగ మంచు వ్యాపించటం వలన పున్నమి వెన్నెల కూడా సంపూర్ణం గా కని  పించదు .ఎండకు వాడిన స్త్రీ ముఖం లా .పున్నమి వెన్నెల మంచుతో మలినమవుతుంది .పడమటి గాలికి చలి ఎక్కువౌతుంది .కనుక చలికాలం లో మరింత చలి వేస్తుంది .దూరం నుంచి చూస్తె సూర్యుడు కూడా చంద్రుడిలా చల్లగా అని పిస్తాడు .ఉదయం మందం గా ,మధ్యాహ్నం మధురం గా ,సాయంత్రం కంది పోయి కొంచెం పాలి  పోయినట్లు సూర్య భగవానుడు కని  పిస్తాడు .ఉదయం పచ్చికపై విస్తరిల్లిన హిమ బిందువులు చూడ ముచ్చట గా ఉంటాయి .ఏనుగులు చల్లని నీటిని చూసి ఉల్లాసం గా దగ్గరకు వెడతాయే కాని నీటి స్పర్శ సోకగానే వాటి తొండాలు ముడుచుకు పోతాయి .పక్షులు కూడా నీటి పై వాలుతాయే కాని యుద్ధ భూమిని చూసి జంకే పిరికి యోధుల లాగా నీళ్ళు తాగ టానికి భయ పడతాయి .చీకట్లో మంచు పొరల వెనక దాగిన చెట్లు నిద్ర పోతున్నట్లు స్తబ్దు గా ఉంటాయి. సరోవరాలు మంచుమయం అవటం వలన అక్కడ విహరించే కొంగల చప్పుడు వలననే అవి అక్కడున్నట్లు తెలుస్తుంది .కొండమీద ప్రవహించే నీరు కూడా రస వంతంగా  ఉంటుంది .దీనికి కారణం తుషారం ,రవి కిరణాలలో మృదుత్వం .కొలను లోని కమలాలు కూడా మంచు వలన మలినం గా అని పిస్తాయి .

ఈ విధం గా హేమంత ఋతువు ను వర్ణించు కొంటూ ఆ ముగ్గురూ గోదావరి తీరం చేరుకొంటారు .తమ సోదరుడు భరతుడు కూడా ఈ సమయం లో తమ లాగే సరయూ నదిలో స్నానం చేయటానికి వెడుతూ ఉంటాడని లక్ష్మణ స్వామికి మనసులో ఒక ఊహ పుడుతుంది .రాజ భోగాలను ఇచ్చాపూర్వాకం గా త్యజించి తమ లాగే తపోవన జీవితాన్ని గడుపుతున్న భరతుడు ధన్య జీవి అనుకొన్నాడు లక్ష్మణుడు .అంత సుమనస్కతకు అలాంటి కర్కోటక  కైక ఎలా తల్లి అయిందో నని ఆశ్చర్య పోతాడు .ఈ మాటలకు రాముడు అడ్డు పడి ,పిన తల్లి ని అనవసరం గా తూల నాడ వద్దని హెచ్చరిస్తాడు .

భరతుడి సంగతిని మరికొంచెం చెప్పమని తమ్ముడిని కోరుతాడు రామ భద్రుడు .సుకుమారుడు సుమనస్కుడు ,శ్రీమంతుడు ,ధర్మజ్ఞుడు సత్య వాది ,జితేంద్రియుడు ,వినయ సంపన్నుడు ప్రియ భాషి అంటూ భరతుడి త్యాగాన్ని వెయ్యి విధాల వర్ణిస్తాడు ఆదిశేషా వతారమైన లక్ష్మణ స్వామి .ఇంత విన్నా శ్రీరాముడికి తనివి తీరదు .వనవాస దీక్షలో తాను యెంత పట్టుదల తో ఉన్నా భరతుడు గుర్తుకు వస్తే అయోధ్యకు వెళ్లాలని పిస్తోంది అంటాడు భ్రాత్రు వత్సలుడైన శ్రీరమ చంద్రుడు .అదీ ఆయన మనస్సౌన్దర్యం .భరతుని గురించి విన్నప్పుడల్లా తన మనస్సు పసి పిల్ల వాడి మనస్సు లాగా అవుతుందన్నారు రాముడు .సోదరుడైన భరతుని మృదుమధుర వాక్కులు ,హృద్యమైన ఆలోచనలు ,అమ్రుతోపమాన మైన మాటలు ,మనసును ఆకట్టుకొనే భావనలు మాటి మాటికీ గుర్తుకు తెచ్చుకొని కంట తడి తో  పరవశిస్తాడు కౌసల్యా నందనుడు .తాము నలుగురు అన్నదమ్ములు మళ్ళీ అయోధ్యలో ఒక్క చోట ఎప్పుడు కలుసు కొనే అవకాశం వస్తుందో అని ఆ సదయ హృదయుడుశ్రీ  రామ చంద్ర మూర్తి ఆవేదన చెందుతాడు .

 

 

 

8-4-14 మంగళ వారం శ్రీరామ నవమి సందర్భం గా శుభా కాంక్షలు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | 1 Comment

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5

వివాహం –దాంపత్యం

21-కలిసి ఉండటం ముఖ్యం –శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )

ఇంటికి పునాది లాగ –దాంపత్యానికి వివాహం సహజం

అన్ని వివాహాల శాస్త్రీయతా ఒక్కటే –

ఇద్దరు జీవితకాలం కలిసి ఉండటమే వివాహ పరమార్ధం

నిజానికి ఇద్దరూ కలవటం కలిసి ఉండటం యెంత కష్టం ?-యెంత కష్టమో అంతతేలిక

ఎన్ని అహంభావ కవచాలు విప్పాలి ?ఎన్ని అహంకార కవాటాలు తెరవాలి?

ఒకచో వలపు వాగ్దానాలు మెరవాలి –ఒకచో కానుకల ప్రశంసలు తళుక్కు మనాలి

కన్నీటి వేళ ఓదార్పు స్పర్శలు –భరోసా ఇచ్చే సాహచర్యం కావాలి

మనసెరిగి మసలటం కమ్మనైన నమ్మకం –జీవితకాలం కలిపి ఉంచే సూత్రం

ఒకరికొకరు చేసుకొన్న ప్రమాణాలతో –కలిసి చేసే ప్రయాణాలు జీవన సాఫల్యం

ఒకరి లోకి ఒకరు ప్రవహిస్తూ –ఒకరిగా ఉండటం

పాటకు ప్రాణం గా కవితకు భావం లా కలిసుం డటం ముఖ్యం

కలిపుంచేది ఏదైనా సమ్మతమే –విడదీసేది ఏదైనా దుర్మార్గమే

జీవితకాలం కలిసుండటమే మరీ మరీ ముఖ్యం .

22-అంతర్జాతీయం –శ్రీ బందా వెంకట రామా రావు (విజయ వాడ)

ఊరూరా ఉండేవి మెరక వీదులోక నాడు –ఆమెరకలన్ని కలిసి అమెరిక అయిం దీనాడు

హత విధీ !ఇంకెక్కడి వివాహం ,లేదేక్కడా దాంపత్యం –చాటింగులు ,డేతింగులు మీటింగుల పర్వం లో

స్త్రీకి స్త్రీకి వివాహామట –పురుషుల మధ్య దాంపత్యమట

విడాకుల చట్టాల వికృత రూపం విశ్వమంతా అలముకొంది

వేరుకుంపట్లు ,నిర్లక్ష్యం నిర్లజ్జా నాగరకత పేరులో నిండిన లోకం లో

వివాహ పరమార్ధం మరిచి విశ్రుంఖలత వెర్రి చేష్టలతో చేస్ట లుడిగి పోతున్నాం

వివాహ దాంప త్యాలు వంశోన్నతికోసమే నని మరిచి పోరాదు

ఉన్నది ఇవ్వటం లేనిది పొందటమే సహజీవన సౌందర్య పరమార్ధం .

23-జయీ భవ –శ్రీ మతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )

కొత్త తలపులతో గుండె ఝల్లు మంటుంటే –హృదయాంతరాళాల్లో మధురిమలు మోగుతుంటే

భారత ఖండాన ఒక దివ్య శిశువునివ్వాలనని –ఉవ్విళ్ళూరుతూ కొంగు ముడి వేసుకొంటారు

సుక్షేత్ర దేశం లో పవిత్రాశయాలు నెరవేర్చాలని –అందరూ ధన ధాన్యాలతో సుఖం గా వర్ధిల్లాలని

నూతన దంపతులు ఆ ఆది దంపతులను వేడుకొంటారు

ప్రపంచానికే మకుటాయమైన భారతీయ వైవాహిక వ్యవస్థ కు

జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ .

24-జేజేలు –కుమారి మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ (యాకమూరు)

చక్కగా చిక్కగా ఆత్మీయంగా –అపురూపం గా అనురాగం గా దైవాంశ సంభూతం గా

సాగుతున్న దాంపత్యం నిత్య నూతనం –అదే శ్రీ దుర్గా ప్రసాద్ గారి అయిదు పదుల దాంపత్య జీవనం

నవనీతమై నిత్య ‘’ప్రభావతం ‘’అయి –సరస భారతి యై –

సమాజానికి సాహితీ వెలుగు లందిస్తున్న దంపతులు వారు

కుటుంబాన్ని ,సమాజాన్నీ సమన్వయ పరుస్తూ

తెలుగు తల్లికి ముద్దుల పట్టియై –సరసభారతికి సారదులై అలరారుతున్న సుమనస్కులు

ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తిని అభి వ్యక్తీకరిస్తూ –గృహస్తాశ్రమ ధర్మానికి నిలువుటద్దాలై

ఈ తాత గారు అమ్మమ్మ గారి అర్ధ శతాబ్ది దాంపత్య మహోత్సవానికి జేజేలు .

25-మన ధర్మం మనో ధర్మం –రోటేరియన్- శ్రీ నిమ్మగడ్డ సుబ్బా రావు (ఉయ్యూరు )

వివాహం ఇష్టం తో చేసుకోవాలి –దంపతులు ఆదర్శ ప్రాయం గా మసలుకోవాలి

వంశం సమాజం అభివృద్ధికి సంభావన తో సహక రించాలి

ఆకళింపు అవగాహన ఆచరణ తో అందరి మనసులు ఆకర్షించాలి

ధర్మార్ధ కామాలకు సమ వర్తనులై సాగాలి -వీటితోనే మోక్షం సాధించాలి

మనిషి లోని ‘’షి ‘’ని లుప్తం చేయరాదు –అప్పుడే పరి పూర్ణ దాంపత్య ఘనత .

26-నిన్ను నీవు తెలుసుకో –శ్రీమతి కోకా విమల కుమారి (విజయ వాడ )

మల్లెల పరిమళం పంచిన పరమానంద జీవన సారం అన్యోన్య దాంపత్యం

తాళిని ఎగ తాళి  చేస్తే తప్పవు తిప్పలు –అనాలోచిత పోరాటాలు

అనర్ధ హేతువని మహిళా తెలుసుకోవాలి

శృతి మించిన ఆత్మాభిమానం వరం కాదు శాపమే అవుతుందని గ్రహించాలి .

మూడు ముళ్ళ బంధాన్ని ముచ్చట అని తేలిక చేయొద్దు

నిన్ను నువ్వే తెలుసు కొంటేనే –నీఉనికి రక్షణ

27-వివాహమే జగద్రక్ష –శ్రీమతి కోపూరి పుష్పా దేవి (విజయ వాడ )

ప్రపంచాన్ని సవ్యం గా నడిపేది ,లోకాన్ని స్వచ్చం గా ఉంచేదీ వివాహమే

ఆధునిక సమాజానికి వారధి వివాహం –

మానవ విలువలపై విశ్వశాంతి భవన నిర్మాణమే వివాహం

మమకారాల ఎరువులు చల్లి –ప్రేమ సుమోద్యానవనాల్ని వృద్ధి చేస్తుంది

సాంస్కారానికి కట్టిన పట్టం వివాహం –స్త్రీకి పురుషుడు ఆలంబన

పురుషుడికి  స్త్రీకి ఆరాధన –సంసార వ్యవ సాయం తో సంతాన పంట పండాలి

ఆదర్శ సమాజాలే శ్రీ రామ రక్ష –అందుకే వివాహమే జగద్రక్ష .

దాంపత్యం

అక్కడి అమ్మాయి ఇక్కడి అబ్బాయి కలిస్తే కమనీయం

సృష్టికి ఉషోదయం –అతనికి ఆమె అపురూపం అతనికి ఆమె ప్రాణ దీపం

ఆమె ప్రమిద అయితే ఆతను తైలం –కళ్యాణ వత్తి ని వెలిగిస్తే జగతికి వెన్నెల కాంతులే

ఆమె తోడుంటే కొండలే అవుతాయి పిండి –అతని కోపాగ్ని ఆమె చిరునవ్వు మంచుకి తలొం చుతుంది

ఆమె రుస రుసల సెగలూ పొగలూ –అతని ఆప్యాయతాబిమానాల పవనానికి పరారు

చిన్ని చిన్ని కలతలు –కాపురపు మధుర భాష

కోపాలూ ఆవేశాలు సంతోషాలూ సరిగమలూ –సంసార కావ్యం లో మధుర ఘట్టాలు

సంప్రదింపుల శృతి లయలు –సర్దు బాట్ల దిద్దు బాట్ల ఐక్యతా రాగాలు

కష్టాల్లో కన్నీళ్ళల్లో అండా దండా –మనవల ముద్దు మురిపాలలో స్వర్గ సుఖాలు

మంచికి బాసటగా సమాజానికి చేరువగా

ప్రాణ శరీరాల్లా ఏకమై మమైకమై ఒకరికొకరై

వర్దిల్లేదే దాంపత్యం –ఇది స్వర్గానికి సాపత్యం .

28-స్థిర  నిర్ణయం –లయన్ శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ (యాక మూరు )

వివాహ వ్యవస్థను పునరుద్ధ రించటానికి పదండి ముందుకు

దాంపత్య జీవిత పరమార్ధాన్ని చాటి చెప్పుదాం రా రండి

కలిసి మెలిసి బతికి కుటుంబాలను కాపాడుకోవటానికి తరలి రండి

వారసత్వ విలువలు కాపాడాలంటే సంస్కృతిని   పాడాలంటే ముందుకు నడవండి

మనసున మల్లెలు పూయించి మధురానుభూతుల్ని పంచె

దాంపత్య జీవన ఔన్నత్యం నవతరానికి తెలియ జేద్దాం

అని మనసులో అందరం స్థిర నిర్ణయం చేసుకొందాం –అనుకొన్నది సాధిద్దాం

29-.శ్రీమతి డా.జి రేజీనా (విజయ వాడ )

ఇరు మనసులు పెన వేసుకొనే మధుర క్షణాలే వివాహం

మూడు ముళ్ళ బంధం రెండు కుటుంబాల బాంధవ్యానికి నాంది

కొత్త జీవితానికి తెర దీసే మహిమాన్విత రసధుని

వావి వరుసలు పెరిగి బల పడే బంధుత్వం

గళానికి తాళి నల్ల పూసలు  కాలికి  మట్టెలు తో నూతన వధువు నవ కాంతులజ్యోతి

ఆలూ మగలూ  పాలూ తేనే వలే కలిసి రెండువైపులా బందుత్వాన్ని దృఢ పరచాలి

చిలిపి సరస సాంగత్య విలాసాల నుండి సంసార చదరంగం లో

అన్నీ తట్టుకొంటూ గమనం సాగించాలి

జీవన నౌకను గమ్యం చేర్చటానికి బాధ్యతల ఇరుసు పై చాక చక్యం గా

ద్వంద్వాలను అనుభ విస్తూ –ఆవలి తీరం చేరటమే దాంపత్య పరమావధి .

30-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల అర్ధ శతాబ్ది వివాహ మహోత్సవ సందర్భం గా

శుభాభి నందనలు –శ్రీమతి వారణాసి సూర్య కుమారి (మచిలీ పట్నం )

సీ.ఆదర్శ మూర్తులైనట్టి దుర్గాప్రసాద్ –గారు ప్రభావతి ఘనులు వారు

ఆదిదంపతులిల నవతరించితి రను –చందమ్ము భాసిల్లు జంట వారు

సాహితీ రధమునకు సారధి యగుచును –ప్రగతి పదము నడుప గల వారు

అర్ధ శతాబ్ది వివాహ వేడుకలను –సురల యాశీస్సుల నరయు వారు

తే.గీ.నాల్గు ముఖముల నరయునా నలుడు సతిని –వక్ష మందిడుకొనే హరి లక్షణముగ

పార్శ్వమున నిలిపే సతి ని పరమ శివుడు –మనసు నిడిరి దుర్గా ప్రసాద్ మమత నింపి .

సీ.ఆడంబరము లేక ఆనంద లహరిని –జీవితమున శాంతి సిరుల నొంది

పిల్ల  పాపల తోడ చల్లగ కాలము –గబ్బిట వారికి గడుచు చుండ

బంధు మిత్రుల యెడ బాంధవ్య బంధమున్ –సహజ రీతి మెలగు సహ్రుదయులుగ

పూర్వ పుణ్య ఫలము పొంది వీరు శతాబ్ది –కళ్యాణ వేడుకల్ ఘనత గాంచు

తే.గీ  పూవు తావి చంద్రుడు వెన్నెల వలెనుండి –భావి తరముల వారికి భాగ్య మనగ

వీరు అన్యోన్య దాంపత్య విలువ తెలిపి –మంచి మార్గము సూచించు మాన్యు లగుచు

ఆయురారోగ్య సంపద లలరు గాక .

‘’వివాహం –దామత్యం ‘’శీర్షిక లో కవితలు సంపూర్ణం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి 60వ సమావేశం , ఉగాది వేదిక దృశ్యాలు

This gallery contains 102 photos.

More Galleries | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ జయ నామ సంవత్సర ఉగాది

మా ఇంట్లో శ్రీ జయ నామ సంవత్సర ఉగాది

మా పిల్లలంతా ఉగాదికి వచ్చి చాలా ఏళ్ళయింది .సరసభారతి ఉగాది వేడుకలు మా వివాహ యాభై వసంతాల వేడుక ,ఉగాది కలిసి రావటం వలన అందరూ కుటుంబాలతో తరలి వచ్చారు .కనుక మంచి సందడి గా ఈ ఉగాది జరిగింది .31-3-14సోమవారం ఉగాది .మా రెండో అబ్బాయి శర్మ మంచి హడావిడి గాడు .పొద్దున్నే నీళ్ళ కాగు వేయటం ,వేడి నీళ్ళు కాయించటం తోకార్యక్త్రమాలు ప్రారంభమైనాయి .మా శ్రీమతి కొడుకులకు కోడళ్ళకు అమ్మాయికి మనవలు మనవ రాళ్ళకు తలంటికి గాను ‘’మాడున చమురు’’ పెట్టింది .ఇది అనాదిగా వస్తున్నా సాంప్రదాయం .వేప పువ్వు కోయటం పెరటిలో మేము పెంచిన చెరకు గడ కొట్టి ముక్కలు చేసి ఆకులను అలంకరించటం ,మామిడి తోరణాలు కట్టటం శర్మ సరదాగా చేశాడు .నేను స్నానం చేసి వంట వాళ్ళ కోసం మది నీళ్ళు పట్టి ఉంచాను .నాసంధ్యావందనం ప్,పూజ పూర్తీ అయేసరికి మా ఆవిడ వేప పువ్వు తో ఉగాది పచ్చడి వెండి గిన్నెలో చేసి రెడీ చేసింది పండ్లూ ,పరవాన్నం తో బాటూ దానినీ నైవేద్యం పెట్టి స్నానాలు చేసిన వారందరికీ వేప పువ్వు ప్రసాదం వెండి చెంచా తో పెట్టాను .కోడళ్ళకు పెట్టాల్సిన కొత్త బట్టలు ,మా ఆవిడ కొడుకులకు అల్లుడికి ఇవ్వాలను కొన్న స్వర్ణం అన్నీ దేవుడి ముందు పెట్టింది .టిఫిన్ లు పూర్తీ చేసి అందరం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాము .100_1724 100_1726 100_1729 100_1723 100_1714 100_1720

దేవాలయం లో స్వామి వారలకు అస్త్త్తర సహస్ర నామార్చన చేశాడు మా పూజారి మురళి .లడ్డూలు పులిహోర ప్రసాదం చేయించాము .స్వామి సన్నిధిలో నాతో మా పూజారి పంచాంగ శ్రవణం చేయించాడు .ఇది ఏటా చేస్తున్న విధానమే .హారతి ,నైవేద్యం అయిన తర్వాతా మంత్రం పుష్పం పూర్తీ చేశాక ప్రసాదం అందరికి పూజారి పెట్టాడు .’’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలను ఆలయానికి తీసుకొని వచ్చి వచ్చిన వారందరికీ అంద జేశాము .క్రితం రోజు ఉగాది వేడుకలలో దాదాపు రెండు వందల మందికి పుస్తకాలు ఉచితం గా అండ జేశాం . పూజారి మురళి ,బల రామ కృష్ణ  బడ్డి బుడ్డి ,చంద్ర శేఖర రావు రామనాధ బాబులకు ‘’కర్నాటక సంగీత త్రయం ‘’జ్ఞాపికలు అందించాము .తరువాత పిల్లలు వేడుక గా మా అర్ధ శతాబ్ది వివాహ వేడుకలను స్వామి సమక్షం లో నిర్వహించారు .

మా దంపతులిద్దరిని కుర్చీలలో కూర్చో బెట్టి మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ బాబు కోడలు జయ మనుమడు కళ్యాణ్ లు  ముందుగా మా ఇద్దరికీ పుష్ప హారాలు వేసి నాకు  పట్టు బట్టలు ,మా శ్రీమతికి చీరే సారే పెట్టి ఆశీస్సులు పొందారు .తర్వాతా మా అబ్బాయిలు శాస్త్రి శర్మ ,రమణ కోడళ్ళు సమతా ,ఇందిరా ,రాణి మహేశ్వరి  ,మా అమ్మాయి విజయ లక్ష్మి మనుమలు సంకల్ప్ ,భువన్, హర్ష ,శ్రీ చరణ్ ,మనుమ రాళ్ళు హర్షితాన్జని ,రమ్య లు అందరూ కలిసి నూతన వస్త్రాలను మా ఇద్దరికీ పెట్టి పుష్ప మాలలతో ,కవర్ లో నగదు తో సత్కరించి ఆశీస్సు లు అందుకొన్నారు .మాతో దండలు మార్పించారు .మా ఇంట్లో అద్దెకుంటున్న గోపాల కృష్ణ మూర్తి మేష్టారు దంపతులు మా ఇద్దరికీ బట్టలు పెట్టి ఆశీర్వ దించారు .పెద్ద సందడే చేశారు అంతా కలిసి ఇది వాళ్ళు కూడా బలుక్కుని చేసిన పని మాకు అప్పటి దాకా తెలియదు .సర్ప్రైజ్ సందడి అన్నమాట .అంటా అయ్యే సరికి మధ్యాహ్నం పన్నెండు అయింది .వెంటనే ఇంటికి చేరాం .

అప్పటికే ఇంటి దగ్గర వంట వాళ్ళు గోపాల్ దంపతులు వంట పూర్తీ చేసి రెడీ గా ఉన్నారు .ప్రక్క మేస్టారు దంపతులు భవాని గారు మల్లికాంబ గారూ కూడా వచ్చారు అందరికి కోడళ్ళు చక్కగా వడ్డన చేశారు .బొబ్బట్లు లడ్లు ,పులిహోర ,వంకాయ కూర ఆవకాయ సాంబారు మామిడికాయ పప్పు ,టమేటా చట్నీ పెరుగు తో అందరం కమ్మగా భోజనం చేశాం ముందు రోజు ఈ రోజు రెండు రోజులూ గోపాల్ దంపతులు వంట అదిరి పోయేలా చేసి అందరికి సంతృప్తి కలిగించారు .ఇదో ‘’తుత్తి ‘’.అన్నీ సమపాళ్ల లో కుదిరి అందరూ మెచ్చుకొన్నారు .

100_1741 100_1742 100_1743 100_1744 100_1740అందరు క్రితం రోజు శ్రీ శివప్రసాద్ గారు చేసిన  ‘’ఈల పాటసంగీత కచేరీ ‘’గురించే మాట్లాడి ఆనందాన్ని ప్రకటించి అను భూతిని అందరితో పంచుకొన్నారు .ఆ ‘’కోమా’’ లోంచి ఇంకా ఎవరూ బయట పడ లేదు .అదీ శివ ప్రసాద్ గారి ప్రభావం .మనస్సులో చెవుల్లో ఈల పాట గింగిర్లు కొడుతూనే ఉంది అందరికి .ఏ పని చేస్తున్నా ‘’శివ ‘’స్మరణమే ‘’.ఈల’’ ప్రసాదమే ‘’అయి పోయింది .భోజనాల తర్వాత మా పెద్దబ్బాయి శాస్త్రి రెండో వాడు శర్మ కుటుంబాలతో కార్లలో ప్రయాణాలకు సిద్ధమైనారు .మా శ్రీమతి కొడుకులకు  అల్లుడికి ఇవ్వాలను కొన్న ‘’పండుగ కానుక ‘’ను ఇచ్చేసింది .కోడళ్ళకు నూతన వస్త్రాలు ఇచ్చింది .దొడ్లో ఉన్నఅమృత పాళీ అరటి గెల కోసి శర్మ అందరికీ ఇచ్చాడు .ఇంట్లో ఉన్న కూరలు గుమ్మడికాయలు ఎవరికి కావాల్సినవి వాళ్ళను పట్టుకొని వెళ్ళమన్నాం .అలాగే చేశారు .గానుగ లో పట్టించిన కోబ్బరి నూనె ,చేలో పండిన మినుముల పప్పు తీసుకొని వెళ్ళారు .క్రమం గా సందడి తగ్గింది .

మధ్యాహ్నం నన్ను శ్రీ విష్ణ్వాలయం లో ఏటా చేస్తున్నట్లే పంచాంగ శ్రవణం చేయమని ఎండూరి నాగ రాజు కోరితే చేశాను. విష్ణ్వాలయం లో పంచాంగ శ్రవణం ప్రారంభమై 30ఏళ్ళు అయింది . నాగ రాజు తండ్రి సుబ్బారావు ఆ నాటి అర్చకులు వేదాంతం వాసు దేవా చార్ల గారి ప్రోత్సాహం తో ప్రారంభించాడు .సుబ్బారావు చనిపోయినా ,భార్య మరణించినా కొడుకులు నాగరాజు సోదరులు దీన్ని అవిచ్చిన్నం గా కోన సాగిస్తూనే ఉన్నారు .నాగ రాజు అన్న కూడా మరణించాడు .అయినా దీన్ని ఆపకుండా నిర్వహించటం ఎండూరి వారి సంకల్ప బలానికి నిదర్శనం .ఈ ముప్ఫై ఏళ్ళలో దాదాపు ఇరవై ఏళ్ళు నాతోనే పంచాంగ శ్రవణం చేయించారని గుర్తు .నాగ రాజుహైస్కూల్ లో  నా శిష్యుడే కాక ట్యూషన్ కూడా చదివాడు .ఆతను వచ్చి అడిగితె కాదనలేను .నూతన వస్త్రాలతో నాగ రాజు సత్కరించాడు .

సాయంత్రం ఆరు గంటలకు గండి గుంట శ్రీ దత్త గుడిలో పంచాంగ శ్రవణం చేయవలసిందిగా నిర్వాహకులు ఆయుర్వేద మందుల షాపు ఆచార్యుల గారు వారం క్రితమే వచ్చి చెప్పారు.సరేనన్నాను .పావుతక్కువ ఏడు గంటలకు మొదలు పెట్టి ఎనిమిదింటికి పూర్తీ చేసి అందరికి సంతోషం కలిగించా .నా సహాధ్యాయికనక వల్లి వాసి  దత్త భక్తుడు శ్రీ విష్ణు భొట్ల సోమయాజులు తో నాకు నూతన వస్త్రాలు ,కానుక బహూక రింప జేశారు .

మొవ్వలో క్షేత్రయ్య పద పరిషత్ నిర్వాహకు రాలు శ్రీమతి రామ కుమారి గారు ఉయ్యూరు కు సరసభారతి ఉగాది వేడుకలకు వచ్చి ఉగాది నాడు మొవ్వ లో జరిగే కవి సమ్మేళనానికి రమ్మనమని ఆహ్వానిస్తూ నా పేరు కూడా చేర్చిన ఆహ్వాన పత్రిక ను అంద జేశారు .తప్పక రమ్మని కోరారు .దత్త గుడి కార్య క్రమం వలన రాలేనేమో అని చెప్పాను .ప్రతి ఏడాది నన్ను ఆహ్వానిస్తూనే ఉన్నారు .వెళ్లి వస్తున్నాను ఈ సారి కుదర లేదు

ఇలా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది మా ఇంట్లోను ,దేవాలయాల్లోనూ ఘనం గా జరిగి అందులో మా వివాహ వేడుక ఒక భాగమై అందరికి సంతోషాన్నిచ్చింది .

మహిళా మాణిక్యాలు పుస్తకాలు 29-3-14ఉదయమే పార్సిల్ లో ఉయ్యూరు మా ఇంటికి చేరాయి .వెంటనే శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి 10కాపీలు ఎయిర్ మెయిల్ రిజిస్టర్డ్ పార్సెల్ లో పంపాను .వారు ఇచ్చినఅడ్రస్ ల ప్రకారం  వారి బంధు, మిత్రులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నపంపించాను .సరసభారతికి సన్నిహితులు మిత్రులు ఆప్తులు అందరికి రెండవ తేదీ పోస్ట్ లో పంపాను .నిన్ననే ప్రముఖ కదా రచయిత శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి పుస్తకం అందిందని బాగుందని మంచి సమాచారం ఉందని అభినందించారు .నిన్న రాత్రి మా బావ మరది ఆనంద్ వియ్యంకులు శ్రీ మూర్తి గారు తణుకు నుంచి ఫోన్ చేసి అద్భుతం గా పుస్తకం వచ్చిందని అందులో ‘’ఆడదై పుట్టటమే ఆమె నేరమా ?అనేది  చదివి కన్నీరు కార్చానని అనుభూతి తో చెప్పారు .ఇలా దాదాపు మూడు వందలకు పైగా పుస్తకాలను అందరికీ పంపిణీ చేశాను .శ్రీ గోపాల కృష్ణ గారి వితరణ కు మా వంతు సహకారం అందించాము .అంతే .

ఇంతమంది ఉగాది వేడుకలలో పాల్గొని అందం కలిగించినా సరస భారతికి ఆత్మీయులు నాకు ఆప్తులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు సభలో లేని లోటు కొట్ట  వచ్చినట్లు కనిపించింది .సుబ్బారావు, పూర్ణ చంద్ గార్లు లేకుండా సరసభారతి ఏ బృహత్తర కార్యక్రమాన్ని ఇంతవరకూ నిర్వహించలేదు .సుబ్బా రావు గారు అమెరిక నుండే శుభా కాంక్షలు తెలియ బరచి వారి సౌజన్యాన్ని చాటుకున్నారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-14-ఉయ్యూరు

 

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

 

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కో యి(ఈ)ల -2

ఉయ్యూరు లో  ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కో యి(ఈ)ల -2

30-3-14ఆదివారం సరస భారతి 60వ సమా వేశం గా నిర్వహిస్తున్న శ్రీ జయ ఉగాది వేడుకల నిర్వహణ కు మేమందరం సకుటుంబ సపరి వారం గా మధ్యాహ్నం మూడు గంటలకే రోటరీ ఆడి టోరియానికి కార్లలో చేరాం .వేదిక దివ్య సుందరం గా ఉంది .కుర్చీలు  మైకులు అక్కడి సిబ్బంది సిద్ధం గా ఉంచారు .మేము తీసుకు వెళ్ళిన ఫలాలను  జ్ఞాపికలను  ఆవిష్కరించ బోయే ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలూ సన్మాన శాలువాలు ,నూతన వస్త్రాలు పూల హారాలను వేదికపై సన్నద్ధం చేశాం . మా గుడి దగ్గర బడ్డీ నడిపే ‘’పెద్దాడు ‘’మాకు సాయం చేశాడు .మా అబ్బాయి శర్మ వీటి నన్నిటినీ పర్య వేక్షించాడు .ఎండ బాగా ఉంది జనం ఝడిసి రారేమో నను కొన్నాము .క్రమం ఆ అందరూ రావటం ప్రారంభించారు ధైర్యం వచ్చింది .ఇంతలో కాంటీన్ వారు స్నాక్స్ రెడీ చేశారు .అప్పుడే  అమెరికా నుండి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆర్డర్ పై పంపిన కానుకలు ,పుష్ప గుచ్చం అందించాడు ఒకాయన .100_1419 100_1418ఫోటోలు తీసుకొన్నాం వారి కి సంతృప్తి కోసం .అందరిని స్నాక్స్ తీసుకోమని కోరాం . అందరూ వచ్చి తీసుకొన్నారు .DSCN8532 DSCN8534 DSCN8538

అంతకు ముందు రాత్రి బందరు నుండి శ్రీ వి వి ఏం శాస్త్రి గారు ఫోన్ చేసి తమ చిన్నారులు ఏక పాత్రాభినయం చేస్తారని అవకాశం ఇప్పించమని కోరారు .రమ్మని చెప్పి ఆహ్వానించాను 100_1423 100_1422 100_1429 100_1426 100_1420 100_1421.అలాగే కొందరు కవి మిత్రులు ఆహ్వానం లో తమ పెరులేకున్నా రావచ్చా అని ఫోన్ లో అడిగితె రమ్మనమని ఆహ్వానించాను వారూ వచ్చారు .ఉయ్యూరు సాహిత్య సంగీతాభిమానులూ విశేషం గా విచ్చేయగా  ఆడిటోరియం నిండుగా కని  పించింది ,తేనీరు సేవనం అయిన తర్వాత ముందుగా శ్రీ కే.టి వి.ఎల్ యెన్ ఆచార్యులు గారు  రచించి స్వర పరచిన ‘’ఆమని కి స్వాగతం ‘’ గీతం కమనీయం గా గానం చేసి ఆమనికి స్వాగతమ పలికారు .మచిలీ పట్నం నాగార్జున పబ్లిక్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న ఛి వి యెన్ వి ఎస్ పవన్ కుమార్ ‘పల నాటి బాల చంద్రుడు ‘’ఏక పాత్రాభినయం చేసి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశాడు .అతని తమ్ముడు ఒకటవ తరగతి చదువుతున్న ‘ఛి వర ప్రసాద్ ‘’దుర్యోధనుడు ‘’ఏక పాత్రాభినయం తో  సంభ్రమం  కలిగించి సుభాష్ అని పించాడు ఈ సోదరులకు తండ్రి శ్రీ శాస్త్రి గారే ఆహార్యం సమ కూర్చి వేషాలు వేయించి పాత్రోచితం గా నటింప జేశారు .చిన్నారులు పాడిన పద్యాలు వన్స్ మోర్ అని పించాయి .అందరికి మహదానందం కలిగించిన ఈ చిన్నారి బాల నటులకు సరసభారతి తరఫున 500రూపాయలు జ్ఞాపిక బహూకరించాను.

సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి అతిధులను వేదిక పై ఆహ్వానించగా పుష్ప గుచ్చాలతో జంట కమలా ఫలాల తో సరసభారతి కార్య వర్గ సభ్యులు ,మా మనవాళ్ళు మనవ రాళ్ళు స్వాగతం పలికారు .కుమారి బిందు దత్తశ్రీ ‘’మా తెలుగు తల్లి కి ‘’ గీతా గానం తో సభ ప్రారంభ మైంది .  సభాధ్యక్షుని గా కార్య క్రమం జరిగే విధానం వివరించాను .శివ లక్ష్మి ‘’సరస భారతి నివేదిక ‘’ను చదివి సంస్థ ఏర్పడిన నాటి నుండీ జరిగిన పురోగతిని వివరించింది .100_1430 100_1434 DSCN8583 DSCN8606 DSC_8036 DSC_8035

మొదట గా    ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్నివిజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకులు శ్రీమతి ముంజు లూరి కృష్ణ కుమారి గారు ఆవిష్కరించి వేదిక పై ఉన్న అతిధులకు అంద జేశారు .తరువాత వక్తలు ఉగాది సందేశాలను అభిప్రాయాలను తెలియ జేశారు .మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం .ఆ నాడు కాక పోయినా ఆ నెల లో మహిళా మాణిక్యాలను ఆవిష్కరించామన్న సంతృప్తి ఉంది .ఈ పుస్తక ముద్రణకు పూర్తీ ఖర్చులు భరించి స్పాన్సర్ గా మాకు వెన్ను దన్నుగా నిలిచిన శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారికి కృతజ్ఞతలు సభా ముఖం గా తెలియ బర్చాను .వారి కోరిక మేరకు వారి సతీమణి ,మహిళా మాణిక్యమూ అయిన   సౌ. శ్రీమతి సత్యవతి గారికి ఈపుస్తకం అంకితమిచ్చిమైనేని వారికి సంతృప్తి ని కలిగించాం .DSCN8588

శ్రీ వల్లీశ్వర్ తన జర్న లిజం అనుభవాలను తెలియ జేశారు .ఇలాంటి కార్య క్రమాలు ఇక్కడ జరగటం సంతోషం అన్నారు .తరువాత శ్రీమతి మున్జులూరి కృష్ణ కుమారి తమ ప్రసంగం లో సరసభారతి అధ్యక్షులు తనకు పరిచయమే నని మంచి చురుకైన కార్య కర్త అని ,అన్ని సభలకూ హాజరై తన వంతు ధర్మాన్ని నేరవేరుస్తారని అన్నారు .శ్రీ పూర్ణచంద్ ‘’నాన్న గారి లో ఉన్న ఉత్సాహం చూసి మా బోటి వాళ్ళం మరింత ఉత్సాహం గా పని చేస్తాం .ఉయ్యూరు అంటే మాకు దుర్గా ప్రసాద్ నాన్న గారే గుర్తుకోస్తారు .తమ యాభై ఏళ్ళ వైవాహిక సంరంభాన్ని సాహితీ ప్రియుల సంగీత ప్రియుల మధ్య జరుపుకోవటం అయన ఆనందానికి కొలమానం ‘’అన్నారు .రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర రావు గారు తమ సంస్థ కు కూడా ఈ వేడుకలలో భాగస్వామ్యం కల్పించి  నందుకు అభినందించారు .DSCN8580 DSCN8579

ముందుగా ముఖ్య అతిధి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారిని  వారి సతీ మణి శ్రీమతి హైమవతి గారిని సన్మాన ఆసనాల  పైకి ఆహ్వానించాను .వారికి మా దంపతుల వివాహ అర్ధ శతాబ్ది ఉత్సవ ప్రత్యెక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసింది గా కోరాము శ్రీ శివ ప్రసాద్ గారి  గురించిన పరిచయాన్ని నేనే రాసి చదివాను .పుష్పహారం,గంధం పన్నీరు ,సెంటు  శాలువా ,నూతన వస్త్రాలతో సత్కరించి వారికి ఇవ్వదలచిన కానుక ను కవర్ లో పెట్టి వారికి అంద జేశాను .మా అల్లుడు శ్రీ కోమలి అవధాని ,మా అమ్మాయి ఛి సౌ .విజయ లక్ష్మి శివ ప్రసాద్ గారికి చేయించిన స్వర్ణ హస్తాభరణం (బ్రేస్  లెట్ )ను మా అమ్మాయిఛి సౌ విజ్జి  మా మనవడు చరణ్ కలిసి ప్రదానం చేసి చేతికి అలంకరించారు .ఇది మాకు తృప్తి. వారి తాహతుకు తగినది కాక పోవచ్చు. కాని మా శక్తికి తగిన కానుక .

శ్రీమతి  హైమవతి గారికి క్కూడా చీర ,జాకెట్ పసుపు కుంకుమ అందించింది మా శ్రీమతి మా కోడళ్ళుతో  అందరూ కలిసి .మా అబ్బాయిలు మనవాళ్ళు మనవ రాళ్ళు అంతావేదిక పైనే ఉండి నిండు దనం తెచ్చారు .శోభ తో వేదిక కళ కళ లాడింది .శివ ప్రసాద్ గారు తమకు జరిగిన ఈ సత్కారానికి మహదానందం గా స్వీకరించి ఈ అను భూతిని మరువ లేమన్నారు ,స్వంత ఇంటికొచ్చిన ఆనందం గా ఉందని సంబర పడ్డారు .నేను చదివిన పరిచయం అద్భుతం అని దాన్ని ఫ్రేం కట్టించి దాచు కొంటామని దంపతులు అన్నారు ‘

తర్వాత స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారాల ఉగాది పురస్కారాలను అంద జేశాం .మొదట  శ్రీమతి కృష్ణ కుమారి గారికి సన్మానం చేశాం . వీరి పరిచయాన్ని శివ లక్ష్మి చేసింది .నూతన వస్త్రాలు శాలువా కవర్ తో బాటు సరసభారతి పుస్తకాలు పూలహారం గంధం వగైరా లతో మా శ్రీమతి, కోడళ్ళు సన్మానించారు .శ్రీ వల్లీశ్వర్ గారికి కూడా ఇదే విధానం లో మా అబ్బాయిలు సన్మానించారు శ్రీ వేణు గోపాల రెడ్డి పరిచయాం చేశారు .శ్రీమతి డాక్టర్ శ్రీ విద్య కు కూడా అదే విధానం లో కోడళ్ళు సత్కారం చేశారు .శ్రీమతి కనక దుర్గ పరిచయాన్ని చదివారు .శ్రీ పూర్ణ చంద్ ను అందరం ఆత్మీయం గా సత్కరించి సాహిత్య సరస్వతిని  సన్మా నిన్చామని  సంబర పడ్డాం .పూర్ణ చంద్ ను శ్రీ విజయ సారధి చదివి పరిచయం చేశారు .రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారికీ పై విధం గా సన్మానం చేశాము .దీనితో ఉగాది పురస్కార ప్రదానం పూర్తీ అయింది .DSC_8096 DSCN8581

అటుతర్వాత మా కుటుంబ సభ్యులందరూ మా దంపతులను ఆసనాలలో కూర్చో బెట్టి ఆత్మీయ గౌరవ సత్కారం చేశారు పూల దండలతో ముంచేశారు .శివ ప్రసాద్ దంపతులు మాకు  శాలువా కప్పి గౌరవించారు. శ్రీమతి వారణాసి సూర్య కుమారి గారు మా దంపత్యాం పై పద్యాలు రాసి ఫ్రేం కట్టి బహూకరించారు .అలాగే మిత్రులూ అభినందించారు .

తరువాత ‘’వివాహం –దాంపత్యం ‘’అనే అంశం పై ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించాం .దీనిని డా.జి రేజీన ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీమతి కే . కనక దుర్గా మహాలక్ష్మి నిర్వహించారు .ముప్ఫై మంది కి పైగా విచ్చేసిన కవి మిత్రులు కమ్మగా చదివి అభినందనలు పొందారు .అయితే సభ ఆలస్యం గా మొదలవటం వలన కార్య క్రమాన్ని కుదించి అందరికి జ్ఞాపికలను అంద జేషి సంతృప్తి పడ్డాం .నిర్వాహకులు ముగ్గురికి శాలువాలు కప్పి జ్ఞాపిక లందించి కృతజ్ఞతలు చెప్పాను .జరిగిన ఈ అసౌకర్యాన్ని సభా ముఖం గా చెప్పి మన్నించమని కోరాను .ఈ కవితలను ఇంటర్ నెట్ లో పెడతామని తెలియ జేశాను .

అసలు కార్యక్రమం  విజిల్ విజార్డ్ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారిని వారి సహకార వాద్య బృందాన్ని వేదిక పైకి శివ లక్ష్మి ఆహ్వానించగా మా అబ్బాయిలు ,మన వళ్ళు శాలువాలతో పుష్ప గుచ్చాలు ,ఫల ద్వయం తో స్వాగతించారు .వయోలిన్ పై శ్రీ ఎస్ వి రమణ మూర్తి ,కీ బోర్డు పై శ్రీ లావు కృష్ణ ,మృదంగం పై శ్రీ కాపా శ్రీనివాస రావు ,తబలా పై శ్రీ ఏం ఎస్ పవన కుమార్ ,మొర్సింగ్ పై డా.పి శ్రీనివాస రావు లు సహకరించారు .శ్రీ శివప్రసాద్ తమ ఈల లీలా విలాసాన్ని అందరి అభినందనల మధ్య ప్రారంభించారు .వీరందరికీ జ్ఞాపిక లందిన్చాము

మొదట ప్రార్ధనా గీతం గా హంస ధ్వని రాగం లో ‘’వాతాపి గణపతిం భజే ‘’కీర్తనను అద్భుతం గా గళమురళీ విన్యాసం తో (ఈల పాట సంగీత కచేరి )అలరించి స్వామి ఆశీస్సులన్డుకొని ప్రేక్షకానందం కలిగించారు. అసలు వారి గొంతులో వేణువు ఉందా అన్న అనుమానం కలుగుతుంది వారు ఈల పాట పాడుతుంటే .అంత అలవోక గా సాగింది .చప్పట్ల తో హాలు ప్రతిధ్వనించింది .తరువాత శివ ప్రసాద్ ‘’జగదానంద కారకా ‘’ అనే త్యాగ రాజ కృతిని న భూతో అన్నట్లు పాడి పరవశం కలిగించారు .ఇహలోకపు స్పృహ కోల్పోయి మరో లోకం లో విహరిస్తున్న అను భూతిని కలిగించారు .సహకార వాద్య కారులందరూ సర్వ సమర్దులే .వారి పాండిత్య గరిమకూ గొప్ప అవకాశం ఇచ్చి వారి సమర్ధతను తెలియ జేసేట్లు చేశారు .’’సామజ వర గమన ‘’లో ఎన్ని హొయలు పోకడలు పోయారో చెప్పటం మన వల్ల  కాదు .ఉచ్చ స్థాయి లో పాడినా మందరం గా ఆలాపించినా మధ్య రకం గా ఈల లీల ను ప్రదర్శించినా అంతటా స్పష్టత యే .ఏదీ జారి పోదు. ఏ పదమూ అర్ధం కాకుండా ఉండదు .అన్ని పదాలు అతి స్పష్టం గా గుర్తు పట్టేట్లు పాడగల సమర్ధత శ్రీ శివ ప్రసాద్ గారిది .

ప్రఖ్యాత వైణిక విద్వాంసు లు స్వర్గీయ చిట్టి బాబు ఎప్పుడూ వాయించే ‘’కొమ్మలో కోయిల ‘’గీతాన్ని ఆహ్లాదం గా పాడారు .  కోయిల స్వరాలు పలికించి పులకింప జేశారు .అతి తక్కువ స్తాయి అతి ఉత్కృష్ట స్థాయి లలో సాగే ఈ పాట హృదయాలను తాకి  మనస్సులో దూరి పోయి మైమరపించి మరో లోకం లో విహరింప జేశారు .దీనికి ప్రశంసల వెల్లువే విరిసింది .అన్నమాచార్య కీర్తనలో పదకవితా పితామహుని సంగీత సాహిత్య వాహినిని తన ఈల పాటలో ప్రతిధ్వనింప జేశారు .గాత్రం తో పాడుతున్న అను భూతిని వేణువు పై పలికిస్తున్న భావాన్ని కల్పించి మనల్ని అబ్బుర పరుస్తారు .పరిచారు .

హిందూ స్థానీ గీతం తో తనకు ఆ భాషలో ఉన్న పట్టు ను సత్తాను ప్రదర్శించి చూపారు .భో ’భో శంభో స్వయం భో ‘’గీతాన్ని మహా నైపుణ్యం గా సాహిత్య సంగీత సుస్వర మాలికగా గళవిన్యాసం లో చూపారు .’’అరుణాచల శివ అరుణా చల శివ ‘’ద్వారా సాక్షాత్తు ఆ అరుణాచల అగ్ని లింగ దర్శనమే చేయించారు .ఆ పలుకు బడి అనితర సాధ్యం .నారాయణ తీర్ధుల వారి తరంగాన్ని  అన్ని స్థాయిల్లో వాద్య సహకారం తో సంపూర్ణ సిద్ధి కలిగించారు .ఈల తో వారు పోయిన పోకడలు మాటల తో వివరించ లేనివి .అను భూతి పొందటమే కాని వాచ్యం గా చెప్ప లేనివి .మన మనసులు  కర్ణాలు వారి వశమై పోతాయి .ఆనందం అనుభవించటమే .ఇహ లోక స్పృహ ఉండదు .అదీ ఆ రోజు శ్రోతల పరిస్తితి .’’ఇంత గొప్ప కార్య క్రమం ఉయ్యూరు లో జరిపించి మాకు పరవశం కలిగించిన మీకు, శ్రీ శివ ప్రసాద్ గారికి మేము రుణంతీర్చుకోలేము  ‘’అని సభ అయిన తర్వాత నాతొ అందరూ అన్నారు .ఇది చాలు .అందరి జన్మ ధన్యమయ్యాయని భావించారు .పరవశం తో జనం మై మరచి పోయినట్లు ఆనంద బాష్పాలు రాలుస్తూ స్పందించారు ..’’ఈ అనుభూతి న భూతో న భవిష్యతి ‘’అని పించింది అందరికీ .

ఈల పాట కచేరి మధ్యలో మాజీ ఏమ్  ఎల్ సి,  నా శిష్యుడు ఛి వై  వి బి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక హడావిడి పూర్తీ అయిన తర్వాతా వచ్చాడు అతనితో శివ ప్రసాద్ గారికి పుష్ప హారం సమర్పింప జేషి అభినదనలు తెలియ జేయిన్చాం .రాజేంద్ర ప్రసాద్ మా దంపతులిద్దరికీ శాలువా కప్పి పుష్పహారం వేసి అభినదించాడు .మా అబ్బాయిలతో, మాతో శివ ప్రసాద్ గారి తో ఫోటోలు దిగి సంబరం లో భాగ స్వామి అయ్యాడు మా ఆశీస్సులన్డుకొన్నాడు అతనికి అతనితో వచ్చిన వారికీ జ్ఞాపికలంద జేశాం.DSC_8049-SMILE DSC_8054

కచేరీ పూర్తీ అవగానే నేను ‘’సంగీత సరస్వతి షణ్ముఖ రూపం లో షడ్జమ ధ్వని తో ఈలా నాట్య లీలా విలాసాన్ని ప్రదర్శించింది .వాద్య కారు లందరూ  మహా పండితులు ఎవరూ తీసిపోయే వారుకాదు వారి సంగీత ప్రతిభను గొప్ప గా ప్రదర్శించారు .మంచి సహకారం అందించి కచేరీకి వన్నె తెచ్చారు .వీరు షస్టే సంగీత స్వరూపాలు గా భాసిస్తున్నారు .వీరికి నా ఆశీస్సులు ఈ షణ్ముఖ సరస్వతులకు నమస్కారాలు ‘’అని అభినందించాను .

సరసభారతి సభ్యులందరికీ జ్ఞాపికలందించి వారు చేసిన కృషికి అభినందనలు తెలియ జేశాను .మా టెక్నికల్ ఎడ్వైజర్ శ్రీ వి బి జి రావు గారి సహకారం మరువ లేనిది .కార్య క్రమాన్ని నిర్వ హించిన శ్రీమతి శివ లక్ష్మిని అభినందించాను .రోటరీ నిర్వాహకులు శ్రీ కొండలు గారికి ,ఆహ్వాన పత్రం, బానర్ ,జ్ఞాపిక ల డిజైనర్ శ్రీ ప్రకాష్ ఆరికి శివ ప్రసాద్ ఆరితో శాలువా కప్పించి జ్ఞాపిక లంద జేశాం .వారి తోడ్పాటు కు ఏమిచ్చినా ఋణం తీరదు వారిద్దరూ మంచి సహాయకులు గొప్ప కార్య కర్తలు ఆత్మీయులు .

గబ్బిట వారి కుటుంబం సభా సదు లందరికి విందు భోజనం ఏర్పాటు చేశారు  .అందరూ భోజనాలు పూర్తీ చేసే సరికి రాత్రి పది దాటింది .శివప్రసాద్ బృందానికి వీడుకోలు పలికి వారిని కారు లో విజయ వాడ స్టేషన్ కు పంపి, మేము కార్ల లో ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .ఇలా ఉగాది కోయి(ఈ)ల ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసి విందులు చేసింది ఆనందం పంచింది .

పదనిసలు –స్టేజి మీద ఉన్న వారికీ వేదిక మీద నుంచి మాట్లాడే వారి మాటలేమీ విని పించ లేదు.కాని ఎదుట కూర్చున్న వారికీ మాత్రం మహాద్భుతం గా విని పించాయి .ఈ విషయం నేనూ గమనించాను స్టేషన్ డైరెక్టర్ కృష్ణ కుమారి గారూ గమనించి నాకు చెప్పారు నేను కొండలు గారికి తెలియ జేశాను .ఈకో సిస్టం సరిగ్గా లేకపోవటం,స్పీకర్ల అమరిక సరిగ్గా లేక పోవటం కారణం కావచ్చు .ఇదొక్కటే లోపం మిగిలినది అంతా భేషుగ్గా ఉంది .ఆడిటోరియం ,స్టేజి కుర్చీల అమరిక ,మైకులు  ,సర్వీసు ,కాంటిన్ సేవలూ ఆగున్నాయి .డిన్నర్ మాత్రం అంత సంతృప్తి గా లేదని పించింది

సమాప్తం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

 

.

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

 

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సశేషం

.

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment