బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత


—


బి యెన్ రెడ్డి లేఖ ,యాభై ఏళ్ళ డాక్టర్ చక్ర వర్తి ,శివా రెడ్డి కవిత


—


బ్రాహ్మణాల కధా కమా మీషు-15
ఉప బ్రాహ్మణాలు
సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ విధాన బ్రాహ్మణం ,దేవతాధ్యాయ బ్రాహ్మణం ,సంహితోపషత్ బ్రాహ్మణం ,వంశ బ్రాహ్మణం .మొదటి దానిలో వచ్చే జన్మ లో శాశ్వత సుఖ ప్రాప్తికోసం కృషి చేయాలని ,ఈలోకం లో దుఖాలతో బాధ పడరాదని ధర్మాన్ని అతిక్రమించకుండా ప్రయత్నించాలని ,ఏకోరిక తీరాలో ఆకోరికకు సామలు కూడా చెప్ప బడ్డాయి .
రెండవ దానిలో ఏ సామకు ఎవరు దేవత, అది దేవతలో ,చెప్పారుకనుక ‘’దైవత బ్రాహ్మణం ‘’అయింది .గానం చివర విని పించే ధ్వనిని బట్టి సామలను కని పెట్టి ,వాటి దేవతలను చెప్పింది .అనేక రాకాల ఛందస్సులు ,రంగులు ,దేవతలు పేర్కొన బడ్డారు .ప్రతీకను ఉపాసించే విధానాలకు బీజం ఇందులో ఏర్పడి నట్లు భావించాలి .మూడవ దాని లో మంత్రం సముదాయాన్ని సంహిత అంటారని మనకు తెలుసు .కాని ఇందులో సంహిత అంటే గానం అని అర్ధంఅని గ్రహించాలి సామ వేదం లో రుక్కులే గానం చేయబడి సామలు అని పిలువ బడ్డాయని మనం చెప్పుకొన్నాం .ఉపనిషత్ అంటే ఇక్కడ ‘’రహస్యం’’ అని అర్ధం .సామ గానం లో ఉండే విశేషాలను రహస్యాలను తెలియ జేసేదికనుక ‘’సంహితోపని షత్ బ్రాహ్మణం అని అన్నారు .నాల్గవ ఉప బ్రాహ్మణమే వంశ బ్రాహ్మణం .వేదాధ్యయనం గురు శిష్య పరంపరగా రావాలని సామల గానం గురువు అనుగ్రహం వలననే పొందాలని ,ఇలా ఈ పరంపరను కాపాడుకొస్తున్న మహర్షుల వివరాలను ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .అందుకే వంశ బ్రాహ్మణం అయింది .ఈ నాలుగు ఉప బ్రాహ్మణాలు కురుక్షేత్ర తూర్పు భాగం లో క్రీ పూ అయిదవ శతాబ్ది లో ఏర్పడ్డాయని భావిస్తారు .
మొదటిది అయిన సామ విధాన బ్రాహ్మణానికి సాయనుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’అనే భాష్యం రాస్తే ‘’పదార్ధ మాత్ర వివ్రుతి’’ అనే భాష్యాన్ని భారత స్వామి చెప్పాడు .ఈయన సామ సంహితకూ భాష్యం రాశాడు .హోసల రాజు రామ నాధుడి పాలనలో శ్రీ రంగం లో సామ సంహితకు భాష్యం రాసి నట్లు తెలుస్తోంది .తరువాతే ఈ బ్రాహ్మణానికి వ్యాఖ్య రాసి ఉంటాడు .రెండవది అయిన దేవతాధ్యాయ బ్రాహ్మణానికి వ్యాఖ్య అవసరమే లేదు .అయినా సాయనుడు భాష్యం రాసినట్లు చెప్తున్నారు .మూడవది అయిన సంహితో పని షత్ బ్రాహ్మణం మొదటిఖండం వరకు సాయణ భాష్యాం తో దొరుకుతోంది .చివరిదైన వంశ బ్రాహ్మణానికి సాయన భాష్యం దొరుకు తోంది .ఈ నాలుగింటిలోని విశేషాలను ఇప్పుడు తెలుసుకొందాం
ఆడ పిల్లను మనకు నచ్చిన వాడిడికి ఇచ్చి పెళ్లి చేయాలనీ చెప్పింది మొదటి బ్రాహ్మణం .దీనికి ఒక మార్గమూ సూచించింది పిల్ల తండ్రి అమా వాస్య రాత్రి నాలుగు దారుల కూడలి లో అమ్మాయిని కూర్చో బెట్టి ‘’ఏ హ్యూషు బ్రవాణితే ‘’ అనే సామ ను మూడు సార్లు అభిషేకం చేయాలి .ఇలా మూడు అమావాస్యల్లో మూడు సార్లు చేస్తే పిల్లకు ఇష్టమైన వాడితో పెళ్లి అవుతుంది అని కిటుకు చెప్పింది .
రెండవ దానిలో ఛందస్సుకు సంబంధించ ఎన్నో వివరాలున్నాయి .వేదం, సావిత్రీ దేవి, సత్యం నన్ను కాపాడు గాక అని ‘’బ్రహ్మ సత్యం చ పాతు మాం ‘’అనే సామ చాలా ప్రాముఖ్యమైనది .అంటే జ్ఞానం సావిత్రీ దేవి శాశ్వత సత్యం మనల్ని ఎప్పుడూ కాపాడాలని అర్ధం .నాల్గవ బ్రాహ్మణం లో సామ గానం చేసే వాళ్ళకు ,సామగాన విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి చింతామణి లాంటిది .యోగ్యుడైన శిష్యుడు దొరక్క పోతే గురువు విద్యనూ తన దగ్గరే ఉంచుకోవాలని అయోగ్యుని చేతిలో ఉంచరాదని చెప్పింది .నాల్గవ దానిలో సామ గాన మహర్షుల పూర్తీ వివరాల తో బాటు ,వంశ క్రమం ,చెప్పి ఏ సందేహం వచ్చినా తీర్చే విధం గా ఉంది .
సామం గొప్పతనం
సామ విధాన బ్రాహ్మణం లో సామ యొక్క గొప్ప తనం చెప్ప బడింది .మొదట బ్రహ్మం అనే పదార్ధం మాత్రమె ఉంది .దాని నుంచి హిరణ్య గర్భుడు ఉదయించాడు .ఆయన మనసు లో నుంచి ప్రజా పతి ఉద్భ వించాడు .ప్రజాపతి అంటే మనస్సు .అతడు చరాచర సృష్టిని చేశాడు .తన సృష్టికి సామ ను జీవన సారం గా ఇచ్చాడు .సప్త స్వరాలతో కూడిన సామమే దేవతలకు ,పితరులకు ,మానవ ,పశు పక్ష్యాడులకు జీవనోపాయం కనుక సామను ‘’అన్నం ‘’అని అన్నారు .సామ స్వరూపం వాక్కు .వాక్కు రూపమే రుక్కు .సమానం కనుక సామ అయింది .అంటే అనేక రకాల ఛందస్సులకు ఇది సమానం .సామ తత్వాన్ని తెలుసు కొంటె ఇహ లోకం లో ప్రతిష్ట పెరుగుతుంది .దీని అంతరార్ధం ఏమిటంటే -చక్కని గానమే సామం .దానికి సప్త స్వరాలు మూలం .భావంతో సాహిత్యాన్ని జోడించి గానం చేస్తే అమృతం లాగా ఆప్యాయం అవుతుంది .గానామృతం తో పరవశించని ప్రాణి సృష్టిలో లేదు. లోకానికి గాన ప్రాశస్త్యాన్ని ప్రసాదించింది భగ వంతుడే కనుక గానం యొక్క గొప్ప తనం ఇందులో తెలుప బడింది .
ఒకప్పుడు దేవతలు ప్రజాపతి చెప్పినట్లు యజ్న యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు .అయితే దేవతలా కన్నా తక్కువైన అజులు,ప్రుష్ణులు ,మొదలైన ఋషులు ,వైఖానసులు అనే మంత్రం ద్రష్టలు ,మానవులు వెళ్లి తమకు స్వర్గం చేరే మార్గాన్ని చెప్పమని తమ తండ్రి ప్రజాపతి ని అడిగారు. ‘’స్వాధ్యయనం ‘’అంటే యజ్ఞాలలో విధింప బడ్డ సామలను గానం చేయటం ,తపస్సు వల్లస్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు .వీరందరూ సామాధ్యయనం చేసి స్వర్గం పొందారు .
తపస్సు
శరీరాన్ని వేడెక్కించి ఇంద్రియాలను అదుపు లో ఉంచుకోవటానికి చేసే సాధనే తపస్సు .ఇందులో క్రుచ్చ్రం ,అతి క్రుచ్రం ,క్రుచ్చాతి క్రుచ్చ్యం అని మూడు రకాలున్నాయి .వీటిగురించి వివరాలు తరువాత తెలుసుకొందాం
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-14-ఉయ్యూరు
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’–పుస్తకా విష్కరణ
సాహితీ బంధువులకు శుభ కామనలు- నేను రాసిన ఎనిమిదవ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న పదమూడవ పుస్తకం ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’’పుస్తకం ,సరస భారతి ,స్థానిక ఏ.జి.అండ్ ఎస్ జి సిద్దార్ధ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహింపబడుతున్న సభలో ‘’28-8-2014గురు వారం ఉదయం 10గం .లకు ముఖ్య అతిధి ,ఆంద్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరింప బడుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .ఈ సభలో శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు ,ముఖ్య కార్య దర్శి డా .జి.వి.పూర్ణ చంద్ గారు ,రమ్య భారతి మాసపత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటున్నారు .
ఈ పుస్తకానికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అని, వారి బావ గారైన డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారికి, వారి 90వ జన్మ దినోత్సవం 28-8-14-గురువారం నాడు అంకిత మిస్తున్నామని ప్రముఖ రచయిత ,ప్రఖ్యాత వరంగల్ డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ గారు దీనికి సమీక్ష రాస్తున్నారని మరొక సారి గుర్తు చేస్తున్నాను .
పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రికను ఆగస్ట్ మొదటి వారం లో అందజేస్తామని తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-14-ఉయ్యూరు .
ఆంగ్ల కవిత్రయాన్ని అవపోసన పట్టిన కేతలీన్ రైన్
ఆమె బ్రిటన్ దేశపు కవి విమర్శకురాలు ,విద్యావేత్త మీదు మిక్కిలి విలియం బ్లేక్, యేట్స్ ,కాల్ రిడ్జి కవి త్రయాన్ని అధ్యయనం చేసి అధారిటీ అనిపించుకొని ,ఆధ్యాత్మక భావనలకు ఆలవాలం గా నిలిచి ముఖ్యం గా ప్లాటోనిజం నియో ప్లాటోనిజం లపై సాధికారమైన అవగాహన కలిగిన మహిళ. ఆమెయే కాతలీన్ రైన్ .
రైన్ 1908 జూన్ పద్నాలుగున బ్రిటన్ లోని ఎసేక్స్ లో ఇల్ ఫోర్డ్ లో జన్మించింది .తల్లి స్కాట్ లాండ్ స్త్రీ .తండ్రి రుర్హాం వాసి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో నార్త్ అంబర్ ల్యాండ్ లో అమ్మ తరఫు బంధువుల దగ్గర గడిపింది .అక్కడి పరిసరాలు ఆమె లో కవిత్వ ధారకు సహకరించాయి. పులకించిన ప్రకృతిని చూసి కవిత్వం ఉప్పొంగి వచ్చేది .వారి భౌతిక జీవితాలలో కవిత్వానికి స్థానమే లేదని గ్రహించింది .ఈ విషయాలను తన జీవిత చరిత్ర ‘’ఫేర్ వెల్ హాపీ ఫీల్డ్స్ ‘’లో రాసు కొన్నది .ఉదయం సాయంత్రం బైబిల్ ను శ్రద్ధగా చదివి బట్టీ పట్టి స్పూర్తి పొందింది .కవిత్వం అంటే జీవిత సారం అని భావించింది .తండ్రి హైస్కూల్ లో ఇంగ్లీష్ మేస్టార్ అవటం తో ధిసీస్ కోసం వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని ఎంచుకొన్నాడు .షేక్స్ పియర్ అన్నా వీరాభి మానం ఉండేది ఆయనకు .కనుక చిన్న పిల్లగా ఉండగానే తండ్రి తో షేక్స్పియర్ నాటకాలకు వెళ్లి చూసేది . వ్యాకరణం, శబ్ద శాస్త్రం మీద విపరీత మైన అభిమానమేర్పడింది .కవిత్వాన్ని ముఖతా చెప్పటం ఆమెకు ఎంతో ఇష్టం గా ఉండేది .నార్త్ అంబర్ లాండ్ ను ఈడెన్ గా భావించి పులకించేది .తనకు కవిత్వం భగవంతుడిచ్చిన వరం అని అనుకొన్నది .అదేమీతను కనీ పెట్టిన విద్యకాదన్నది .కవిత్వ వాతావరణం లో పెరగటం వలన కవికావాలనే ద్రుష్టి ఏర్పడిందని చెప్పింది .కవులు ఈ ప్రపంచానికి చెందని వారుగా వేరే స్థాయిలో ఉండేవారుగా ఆమె తండ్రి భావించేవాడు .అయిదవ గాస్పెల్ మీద ద్రుష్టి పెట్టమని చెప్పేవాడు. తల్లి ఆమె కవిత్వాన్ని ప్రోత్సహించేది .
ఇల్ ఫోర్డ్ కౌంటి హైస్కూల్ లో బాటనీ జువాలజీ లైన నేచురల్ సైన్స్ లను చదివింది .1929లో కేం బ్రిడ్జి లో మాస్టర్ దిగ్రీపొందింది .అప్పుడు ఆమెకు జాకబ్ బ్రౌన్స్కి ,విలియం ఎంప్ సన్ వంటి కవులు రచయితలతో పరిచయ మేర్పడింది .కబ్బాలిష్ రచయిత ఉపాధ్యాయుడు అయిన షిమాన్ హల్వేలి తో జీవితాంతం స్నేహం నెరపింది.1930 లో హాగ్ డేవిస్ ను పెళ్ళాడి ,వదిలేసి చార్లెస్ మద్గే ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనివదిలేసి గావీన్ మాక్స్ వెల్ ను ఆరాధించింది .అతను ‘’రింగ్ ఆఫ్ బ్రైట్ వాటర్ ‘’నవలా రచయిత . దీన్ని సినిమాగా కూడా తీశారు .,దీనికి ప్రేరణ రైన్ రాసిన కవిత ‘’ది మారేజ్ ఆఫ్ సైక్’’.ఆమె పెంపుడు కుక్క ‘’మిజ్బి ‘’మరణానికి మాక్స్స్ వెల్ బాధ్యుడని ,హోమో సెక్సువల్ అని భావించిశాపనార్ధాలు పెట్టి అతడిని వదిలేసింది . పాపం అతను కొద్ది రోజుల్లోనే కేన్సర్ వచ్చి చనిపోయాడు .ఇలా జరగటానికి అతని మరణానికి తనే కారకురాలని తెలుసుకొని పశ్చాత్తాప పడింది .భర్త మరణం తర్వాత పిల్లలిద్దరితో పెన్ రిత్ లో కాపురముంది .పిల్లల పెళ్ళిళ్ళు చేసింది .ఒకరికి నియో ప్లాటోనిస్ట్ అయిన టేలర్ వరాసు లతో బాంధవ్యం ఏర్పడింది . ఇదే టేలర్ పై పరిశోధనకు దారి చూపింది .ఒక ప్రమాదం లో రైన్ లండన్ లో 2003 జులై ఆరున 95వ ఏట మరణించింది .
స్టోన్ అండ్ ఫ్లవర్ అనే మొదటి కవితా సంపుటిని 1943లో ప్రచురించింది .తర్వాతా ‘’లివింగ్ ఇన్ టైమ్స్ ,ది పైతోనేసేస్ ,కలేక్తేడ్ పోయెమ్స్ వరుసగా ప్రచురించింది .’’హు ఆర్ వుయ్ ‘’అనే క్లాసిక్ రచన చేసింది .’’బ్లేక్ అండ్ ట్రడి షాన్ ‘’పేరా రెండు భాగాలుగా రాసింది . అమెరికాలోని వాషింగ్ తాన్ లో నేషనల్ గాలేరీ ఆఫ్ ఆర్ట్స్ లో విలియం బ్లేక్ పైన అన్ని విషయాలను సాకల్యం గా చర్చించి అద్భుతమైన ఉపన్యాసాన్ని 1968లో చేసి అందరిని ఆకట్టుకొని బ్లేక్ పై తనకున్న ఆరాధనను ఆయన గొప్పతనాన్ని ఎన్నో ఉదాహరణ లతో అనర్గళం గా మాట్లాడి ఆశ్చర్య పరచింది .సాంప్రదాయ ఫిలాసఫీకి భిన్నం గా బ్లేక్ చేసిన సిద్ధాంతాల పూర్వా పరాలను సమీక్షించింది .
మూడు భాగాలలో వచ్చిన ఆమె స్వీయ జీవిత చరిత్ర ఆమె మన తో మాట్లాడుతూ కబుర్లు చెప్పేంత గొప్పగా ఆకర్షణీయం గా ఉంటుంది .బాల్జాక్ రాసిన ‘’కజిన్ బెట్టె’’ను ‘’లాస్ట్ ఇల్లూజిన్స్ ‘’(lost illusions)ను అద్భుతం గా ఇంగ్లీష్ లోకి అనువదించింది .త్రైమాసిక పత్రిక అయిన ‘’స్టడీస్ ఇన్ కంపారటివ్ రెలిజియన్ ‘’కు వ్యాసాలను రాస్తూనే ఉంది .ఈ పత్రిక రెలిజియస్ సింబాలిజం ట్రాఫిడిషల్ పెర్స్పెక్టివ్ నెస్ అంటే మతాత్మిక ప్రతీకాత్మతకు సాంప్రదాయ దర్శన శాస్త్రానికి ప్రాముఖ్యత నిస్తుంది .’’టేమనాస్ ‘’అనే పత్రికన మరి ముగ్గురితోకలిసి స్థాపించింది .ఇదే తర్వాత అకాడెమీ గా మారి వివిధ విశ్వ విద్యాలయలాలో జరిగే ఫిలాస ఫి విషయాలను పర్య వేక్షించింది .కవిత్వం లో ప్లాటో నిజాన్న్న్ నియో ప్లాటో నిజాన్ని గూర్చి సమగ్ర చర్చ చేసింది .పద్దేనిమోదో శతాబ్దికి చెందిన ఇంగ్లీష్ ప్లాటోనిస్ట్ అయిన థామస్ టేలర్ పై గొప్ప అధ్యయనం చేసి రాసి పుస్తక రూపం లోకితెచ్చింది .
గిర్ట న్ కాలేజి లో 1955నుంచి ఆరేళ్ళు రిసెర్చ్ ఫెలో గా ఉంది .మిత్ అండ్ లిటరేచర్ ను హార్వర్డ్ యూని వర్సిటి లో లేక్చరర్ లకు ప్రొఫెసర్ లకు వేసవి తరగతుల్లో బోధించింది .సిగో లో ఉన్న యేట్స్ స్కూల్ లో బ్లేక్ మీద యేట్స్ మీద ఎన్నో ప్రసంగాలు చేసింది .కేం బ్రిడ్జిలో ప్రొఫెసర్ గా అనేక విశిస్ట రచనలు చేసిన కాతేలీన్ రైన్ కాల్ రిడ్జి ,బ్లేక్ యేట్స్ ల పై పూర్తీ అధారిటీ ఉన్న ఆమె . ఇంగ్లాండ్ అమెరికా ,ఫ్రాన్స్ దేశాలు రైన్ కు ఎన్నో విశిష్ట గౌరవాలిచ్చి సత్కరించాయి .అమెరికన్ పోయెట్రి అసోసియేషన్ ‘’విన్సెంట్ మిల్లె ప్రైజ్ ‘’నిచ్చి సత్కరించింది .హారియట్ మన్రో అవార్డ్ ,ఆర్ట్స్ కౌన్సిల్ అవార్డ్ ,ఆస్కార్ బ్లూ మెంతల్ అవార్డ్ ,కాల్మొండలీ ఆవార్డ్ ,స్మిత్ లిటరరీ అవార్డ్ ,క్వీన్స్ గోల్డ్ మెడల్ ,ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ,లి ఆర్డర్ దేశ ఆర్ట్స్ అవార్డుల వంటి ఎన్నో ప్రముఖ పురస్కారాలను అందుకొన్నది .
పది హీను కవితా సంపుటాలను కేతలీన్ వెలువరించింది .పద్నాలుగు వచన గ్రంధాలను రాసి ముద్రించింది .’’ఫేర్ వెల్ హాపీ ‘’,ది లాండ్ అన్ నోన్ ,’’,’’దిలయన్స్ మౌత్ ‘’,ఆటో బయాగ్రఫీస్ ‘’పేరిట స్వీయ జీవిత చిత్రణ చేసుకొన్నది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14-ఉయ్యూరు

దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. హిందువులందరూ అతి ప్రధానంగా పరిగణించే సూత్రం ‘యద్భావం తద్భవతి’.
అందుకే చెట్టు, పుట్ట, వుట్టి, గుట్ట, కొండకోన, వాగువంక, నింగినేల ఇలా కనిపించే సవుస్తాన్ని పరవూత్మకు ప్రతిరూపాలుగా భావించడం హిందూ ధర్మంలో పరిపాటి. ప్రకృతిలో ఏ ఒక్కటీ పరవూత్మకు వేరు కాద నేది ఒక పరవు సత్యం. ‘ఈశావాస్యమిదం సర్వం’ అని ఉపనిషత్తులు ‘నారాయణా ఏవేతి ఇదం సర్వం’ అని సూక్తాలు ‘వుత్తః పరతరం నాన్యత్ కించిదస్తి’ అని భగవద్గీత ఇందు గలడందులేడని సందేహవుు వలదు’ అని భాగవతం. ఇలా హిందూ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. హిందువులు వీటి ఆఽధారంగా కనిపించే ఈ చరాచర సవుస్తాన్ని ఆరాధించే ఒక వుహోన్నతమైన సంస్కృతిని అలవర్చుకున్నారు. అందులో భాగంగానే దేవతలు, గ్రావు దేవతలు, కొండదేవతలు ఇలా రకరకాలుగా ఆరాధించే వైవిధ్యమైన ఆచారాలున్నాయి. వీటితో పాటు జ్ఞానాన్ని బోధించే గురువులను, వుంత్రోపదేశం చేసే వుహనీయులను, వునసుకు స్వాంతన చేకూర్చి, వూర్గాన్ని సూచించే వుహాత్ములను కూడా పూజించడం శిష్యులు, భక్తులు అనుయాయుల వంతు. ఈ విధంగా వ్యక్తులను పూజించి ఆరాధించే సంస్కృతి కూడా హిందూ ధర్మంలో ఉంది. వుంత్రాలయం కేంద్రంగా తెలుగు ప్రాంతంలో దాదాపు ఊరికో రాఘవేంద్రస్వామి ఆలయం వెలిసింది. నిత్యవుూ రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అలాగే రావుకృష్ణ వుఠంలో రావుకృష్ణ పరవుహంస, శారదావూతలనే ఆరాధిస్తారు. అక్కడ నిత్యం భక్తులు, ఆరాత్రికం, అర్చనలు నిర్వహిస్తుంటారు. సత్యసాయిబాబానే దైవంగా భావించి పూజావుందిరాల్లో వారి ప్రతివునే ప్రధానంగా ఉంచి ఆరాధించే భక్తులున్నారు. ఇలా వుహనీయులను, వుహాత్ములను, గురువులను, జగద్గురువులను పూజించే ఆచారం హిందూధర్మంలో ఉంది. దీనిని ఆలంబన చేసుకుని ప్రస్తుతం షిర్డీసాయి దేవాలయాలు వీధికొకటి చొప్పున వెలుస్తున్నాయి. ఇది భక్తుల్లో సాయిబాబాపై పెరిగే విశ్వాసానికి సంకేతవుని చెప్పవచ్చు. అయితే ఈ అంశం పట్ల ద్వారకా పీఠాధిపతి స్వరూపానందస్వామి, షిరిడీ సాయిబాబా దేవుడు కాదని చేసిన వ్యాఖ్యలు పెను దువూరమే లేపాయి. ప్రత్యేకించి తెలుగువారిని ఈ వ్యాఖ్యలు వురింత ఎక్కువగా కలవరపరిచిన వూట వాస్తవం. సాయిబాబా దేవుడా? కాడా? అన్నింటిలో దైవాన్ని చూసే హిందువుకు సాయిబాబా వూత్రం దేవుడు కాకుండా పోతాడా? ఆయన కూడా దేవుడే. ఆయనలో దైవత్వాన్ని సంతరించుకున్న భక్తులు ఆయనను దైవంగా ఆరాధిస్తారు. ఇది పూర్తిగా వారి విశ్వాసంపై ఆధారపడిన అంశం. ఆయన కొన్ని వుహివులు చూపారని దుఃఖంలో దరిచేరిన వారికి స్వాంతన కలిగించారని చెబుతుంటారు. అలాగే ఆయన నమ్మిన సూత్రం ‘సబ్‌కా వూలిక్ ఏక్’. ఎవ రు ఎన్ని విధాలుగా పిలిచినా, ఎన్ని రకాలుగా తలచినా, దైవంలో వైవిధ్యం లేదు. అందరికీ ప్రభువు దేవుడే. అది ఒక్కటే సత్యం, అదే శాశ్వతం అని బాబా బోధన. ‘ఏకం సత్’ సత్యవుు ఒక్కటే. అదే దేవుడు. అందులో నానాత్వాలు, భేదాలు లేవని ఉపనిషత్తులు ఘోషించాయి. ‘ఏక్ సత్ నావ్‌ు’ ఒక్కటే సత్యవుు. రెండవది లేదు అన్నది సిక్కులు నమ్మిన వుూల సిద్ధాంతం. ఈ ఉపనిషత్తుల సారాన్ని బాబా భక్తులకు బోధించారని చెబుతుంటారు. వాస్తవానికి బాబా ఎప్పుడూ ‘నేనే భగవంతుణ్ని’ అంటూ ప్రకటించుకోలేదు. ఒకవేళ అలా చెప్పే ఉంటే ఈరోజు ఇన్ని లక్షల వుంది బాబాను ఆరాధించే వారు కాదు. భక్తులు ఆయన బోధనలను స్వీకరించారు. ఆయనలో దైవత్వాన్ని ద ర్శించారు. ఆయనను భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధిస్తున్నారు. అయినా, ఈయనే దేవుడని గానీ, ఈయన దేవుడు కాదని గానీ ఎవరు నిగ్గు తేల్చగలరు? ఈ అంశంపై ఏ ఒక్కరూ ప్రవూణం కాదు. అందుకే ‘ఎంత వూత్రం ఎవ్వరు తలచిన అంతవూత్రమే నీవు’ అంటూ అన్నవుయ్య తన కీర్తనల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి ఏ దేవుడికైనా, తానే దేవుడని చెప్పుకోవలసిన దుస్థితి రాకూడదు. ఎవరైనా ‘నేను దేవుడ్ని. నన్ను నవ్ముండి’ అంటే ఏ సవూజమైనా ఎలా నవు్ముతుంది? కొందరు నమ్మిన దానిని వేరే కొందరు అంగీకరించకపోవచ్చు. నాణానికి బొవ్ము, బొరుసు ఎలా ఉంటాయో, దైవం విషయంలో కూడా విశ్వాసం, అవిశ్వాసం అనే రెండు అంశాలు ఉంటాయి.
విశ్వాసాన్ని కుదిపేసి దెబ్బతీసే సత్తా వివుర్శకే ఉంటే, వురి విశ్వాసానికి బలం లేనట్లే కదా! బాబా దేవుడా? కాదా? అన్నది బాబాను భక్తితో కొలిచే లక్షలాది భక్తుల విశ్వాసంపై ఆధారపడే అంశమే గానీ, ఒక వివుర్శకు సంబంధించిన అంశం అసలు కానే కాదు. ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు సవుంజసమేనా? భారతదేశం అతి పెద్ద ప్రజాస్వవ్యు దేశం. ‘వాక్ స్వేచ్ఛ’ అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ‘‘రావుుడు దేవుడే కాడు. ఆయన ఇంజినీరింగ్ చదివాడా? రావుుడు మిథ్య, రావూయణం మిథ్య’’ అని ఆనాటి తమిళనాడు వుుఖ్యవుంత్రి కరుణానిధి బహిరంగంగానే వివుర్శించారు. అలాగే కృష్ణుడ్ని, జారుడు, చోరుడు అంటూ నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించినవారూ ఉన్నారు. సినివూల్లో హిందూ ఆచారాలను, బ్రాహ్మణులను, సాధువులను కించపరిచి చిత్రీకరించిన వారున్నారు. మేవుు గట్టిగా ఉమ్మేస్తే, మీ హిందూ దేవతలు వూ ఉవు్ములో కొట్టుకుపోతారని ప్రజా ప్రతినిధులే నిస్సిగ్గుగా బహిరంగంగా వివుర్శిస్తున్నారు. అసలు మీ దేవుడికి ఏం శక్తి ఉంది? కోతిని మీరు ఆంజనేయస్వామిగా కొలుస్తారు, ఏనుగును వినాయకుడిగా కొలుస్తారు. మీ దేవుళ్లు జంతువులా? అని రకరకాలుగా వివుర్శించే వుతాలు కూడా ఉన్నాయి. శివుడి గుడికి వెళ్లకూడదు. శివాలయ ప్రవేశం వుహాపాపం. శివాభిషేక తీర్థం వుహావుహా పాపం అని వివుర్శించే కొన్ని పొద్దుపోని సంప్రదాయాలు పనిగట్టుకుని వివుర్శిస్తున్నాయి. దీనిని ఏవునాలి? వివుర్శగా పరిగణించాలా? లేక భారత రాజ్యాంగం ఇక్కడ ప్రజలకిచ్చిన వాక్‌స్వేచ్ఛ అనుకోవాలా? ఇలాంటి వివుర్శలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోదు. అందుకే వీటికి శిక్షలు లేవు. దేవుడ్ని నమ్మేవారు కొందరుంటే, దేవుడు లేడు దెయ్యం లేదు అని వివుర్శించే వారి పక్షవుూ తప్పక ఉంటుంది. ‘యద్భావం తద్భవతి’ ఎవరి భావాన్ని బట్టి వారి విధానం కొనసాగుతుంది. వివుర్శను కొన్ని సందర్భాల్లో నిజాల నిగ్గుతేల్చడానికి ఉపయోగపడే అంశంగా పరిగణించాలి. వివుర్శలను భక్తుల విశ్వాసానికి గీటురాయిగా కూడా చెప్పవచ్చు. ద్వారకా పీఠాధిపతి కూడా ఈ స్వేచ్ఛతోనే సాయిబాబా దేవుడు కాడని వ్యాఖ్యానించారు. ఈ స్వేచ్ఛతో ఎవరైనా దేన్నయినా వివుర్శించవచ్చు. దీనికి భక్తులు బాధపడవచ్చునేమో గానీ, న్యాయస్థానాలు వూత్రం ఈ విషయాల్లో కలుగచేసుకోలేవు. ఏమైనా, వివుర్శలు మితిమీరి, వుత చాంధసాలను రెచ్చగొట్టి వూరణ హోవూలకు పాల్పడకూడదు. వివుర్శలు భక్తుల విశ్వాసాన్ని నిగ్గుతేల్చి, భగవంతుని పట్ల గల విశ్వాసాన్ని వురింత దృఢతరం చేస్తాయి. వలికంగా నవ్ముకం, అపనవ్ముకం అనేవి పూర్తిగా వ్యక్తిగత అంశాలు. వాటిపై ఎవరూ అంత తీవ్రవంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క హిందువులకే కాదు, భారత దేశంలో బతికే ప్రతి వుతానికీ వర్తిస్తుంది. ఒకరి విశ్వాసాన్ని వురొకరు వివుర్శించినంత వూత్రాన ఆ విషయాన్ని ఎవరూ రాద్ధాంతం చేయాల్సిన పనే లేదు. ఎవరి సంస్కారం వారిది. ‘దేవుడు’ అనేది అంతరంగంలో మెదిలే విశ్వాసానికి సంబంధించిన అంశం. మీరు నమ్మితే దాన్ని వురింత దృఢతరం చేసుకోండి. నవ్ముని వారి గురించి, నవ్ముకాలను వివుర్శించే వారిగురించి తీవ్రంగా ఆలోచించి మీ కాలాన్ని వృధా చేసుకోకండి. ఒకవేళ వివుర్శించినవారు సైద్ధాంతిక చర్చకు సిద్ధపడితే, చర్చించి వారి నోరు వుూయించండి. లేకుంటే, మీ విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా చూసుకోండి. బాబా భక్తులకు ఇదే నా విజ్ఞప్తి.
– స్వామి పరిపూర్ణానంద
9849028565
బ్రాహ్మణాల కదా కమామీషు -14
ఛాందోగ్య బ్రాహ్మణం
ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి .గృహ్య సూత్రాలకు ఇది మార్గ దర్శి .ఇందులోని చివరి ఎనిమిది ప్రపాఠకాలను ‘’ఛాందోగ్య ఉపనిషత్ ‘’అంటారు .
ఈ బ్రాహ్మణం లో రెండు ప్రపాఠకాలు ,ఒక్కొక్క టి ఎనిమిది ఖండాలుగా ఉన్నాయి మొదటి దానిలో 136,రెండవ దానిలో 121మంత్రాలున్నాయి .ఎనిమిదవ శాతబ్దికి చెందినది .దీనికి గుణ విష్ణువు ‘’ఛాందోగ్య మంత్రం భాష్యం ‘’,సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశిక ‘’పేర్ల తో వ్యాఖ్యానాలున్నాయి .ఈ బ్రాహ్మణం వివాహం ,గర్భాదానం ,సీమంతం మొదలైన గృహ కర్మలకు ప్రాధాన్యమిచ్చింది .కనుక మిగిలిన వాటికంటే ప్రత్యేకతను పొందింది .వివాహ సమయం లో వరుడు వధువుతో ‘’నీ హృదయం అంటే ణనీ అభీష్టం నాది కావాలి .నా హృదయం నీదికావాలి .మనిద్దరి ఆలోచనలు అభిలాషలు ఒకటికావాలి ‘’అని అంటాడు ఇది ఏంతో ఉదాత్త విషయం .వివాహ ప్రయోజనం ,గృహస్తాశ్రమ వాసం బాగా వివరింప బడింది .కుటుంబం లో స్త్రీ మకుటం లేని మహా రాణి కుటుంబ గౌరవ ప్రతిష్టలు ఆమె మూలం గా నే వృద్ధి చెందుతాయి అని చెప్పబడి ఉండటం తో అ నాడు స్త్రీకి ఉన్న అధిక ప్రాధాన్యం తెలుస్తోంది .వరుడు ‘’అత్త వారింట్లో అత్త మామ ఆడ బిడ్డలు బావలు బావ మరదులు మొదలైన వారందరిని ప్రేమాను బంధాలతో బాగా చూస్తూ ఇంటికి దీపం లాగ యజమానురాలు లాగా ఉండు ‘’అని వధువుతో అంటాడు మహిళామతల్లి బాధ్యతలను బాగా గుర్తు చేసిన బ్రాహ్మణం .సమాజం లో స్త్రీకి అత్యంత ఉన్నత స్తానాన్నిచ్చిన బ్రాహ్మణం ఇది .
దంపతులు కలిసి మెలిసి జీవిస్తే స్వర్గం అని చెప్పింది .ఇంట్లో పశువులు ,బిడ్డలు ,అపారమైన దనం ఉంటె కాపురం పాడి పంటలతో కళకళ లాడుతుందని ,సతీపతుల హృదయాలు ఏకమై అన్యోన్యం గా ఉంటె సంసార రధం చక్కగా సాగుతుందని చెప్ప బడింది .వివాహం తర్వాత వరుడి ఇంట్లో గృహ ప్రవేశం జరిగినప్పుడు ఒకే శయ్యపై నూతన దంపతులను కూర్చోబెట్టినప్పుడు వరుడు వధువుతో ‘’ఈ ఇంట్లో ధైర్య సాహసాలతో ఉండు .ఇక్కడే నాతో సుఖించు .నీకు ,నీ బంధువర్గానికి నాపై ప్రసన్న భావం ఏర్పడేలా ప్రవర్తించు .నాతో అనురాగం తో మెలగు ‘’అంటాడు .మగ పిల్లలే ఎక్కువగా పుట్ట్టాలని కోరుకొంటాడు .
గ్రామాంతరం వెళ్లి వచ్చిన తండ్రి కొడుకు శిరస్సును తాకుతూ ‘’అంగా దంగా త్సం స్రవసి’’ అనే మంత్రం చదివి దీర్ఘాయుస్సు తో జీవించమని ఆశీర్వ దిస్తాడు .పుత్రుడు ద్రుఢం గా ,తీక్షణం గా సువర్ణంలా తేజస్విశ గా నూరేండ్లు వర్ధిల్లాలని తండ్రి ఆకాంక్ష .పిల్లాడి మూడో ఏడులో ‘’చూడాకరణం ‘’చేయాలి .దీన్ని చేసే మంగలిని ‘’సావిత్రు దేవత ‘’గా భావించాలి ‘’ఆయమగాత్ సవితా క్షురేణ’’అనే మంత్రం వల్లఇది తెలుస్తోంది అంటే పనిలో దేవుణ్ణి చూసే విధానం ఇందులో కానీ పిస్తుంది ..క్షురకర్మ దీర్ఘాయుష్యానికి దోహాదమని చెప్పింది .ఉపనయనానికి ముందు వటువు అగ్ని వాయు సూర్య ,చంద్ర ఇంద్రులనుద్దేశించి హోమం చేయాలి .ఆ దేవతలను పేరు పేరునా పిలిచి ‘’’’దేవతలారా !ఉపనయనం అనే కర్మను అనుస్టింస్తిచ బోతున్నాను .ఈ సంగతి మీకు మనవి చేస్తున్నాను .మీ అనుజ్న తో దీన్ని సుఖం గా చేయగలను .ఇలా చేసి విద్యాభ్యాసం మొదలైన వాటిల్లో సమృద్ధిని సాధిస్తాను .అసత్యాన్ని వదిలి సత్యాన్ని ఆశ్రయిస్తాను ‘’అని అంటాడు
చదువుల్లో నైపుణ్యం ,సత్య వ్రత పాలన ఉపనయనానికి ముఖ్య ప్రయోజనాలని తెలియ జెప్పింది .బ్రహ్మ చారి అగ్ని కార్యం ,గురు శుశ్రూషస మొదలైనవి చేయాలని,పగలు నిద్ర పోరాదని ఈ బ్రాహ్మణం నిర్దేశిస్తోంది .మేఖలా బంధం (నడుం చుట్టూ త్రాడు )చేస్తారు దీని వలన పవిత్రత ,బల వృద్ధి తపో వృద్ధి శత్రు రక్షణ లభిస్తాయి .దీని తర్వాతా శిష్యుడు ఆచార్యుని దగ్గర కూర్చుని తనకోసం అధ్యయనం ప్రారంభించమని వేడుకొంటాడు .ఇలా అధ్యయనం కోసం గురువు చెంతాకు చేరటమే ఉపనయనానికి అర్ధం .గురువు శిష్యునితో మొదటగా గాయత్రీ మంత్రాన్ని చది వించటం తో వేదాధ్యయనం ప్రారంభ మౌతుంది .గానం చేసే వాడిని రక్షిస్తుంది కనుక ‘’గాయత్రి ‘’అయింది .
పశు క్షేమం ,స్వేచ్చామరణం ,దారిద్ర్య నిర్మూలనం ,కీర్తి అభి వృద్ధి ,శుభ ప్రాప్తి ,ఈశ్వర ప్రసాదం ,పుణ్య లాభం వృత్తిలో నిరాటంకం ,విష నివారణం ,క్రిమి నాశనం మొదలైన ఎన్నో ప్రయోజనాల గురించి వివరించింది .వంకరగా నడిచేవి ,రెండు తలలున్నవి ,తెల్లవి మొదలైన క్రిముల వర్ణన ఉంది .ఆచార్యుడు ,ఋత్విక్కు ,స్నాతకుడు ,రాజు ,వివాహం చేయ దగిన వాడు ,అతిధి లను సత్కరించాలి .ఈ బ్రాహ్మణం ఆ నాటి సాంఘిక వ్యవస్థకు ప్రతీక మాత్రమె కాదు నేటి సామాజికానికి మార్గ దర్శనం కూడా .స్శ్రౌత ,గృహ్య ,ధర్మ సూత్రాలను సంస్కృత వాజ్మయం లో ‘’కల్ప సూత్రాలు ‘’అని మహర్షులేపేరు పెట్టారు .బ్రాహ్మణాలలో ఉన్న మంత్రాలను గ్రహించి వివాహాది కార్య క్రమాలకు గృహ్య సూత్రాలను ఏర్పాటు చేశారు
స్త్రీ పురుషుల సంగమమే వివాహం .సంతానానికి కామ మూలకం .కామం సురా మూలకం ..కనుక పెళ్లి చేసుకొనేకన్యను సుర తో అభిషేకించాలి అని చెప్పారు .ఇదిప్పుడు పాటించటం లేదు .కన్య యొక్క ఉపస్థ ఇంద్రియాన్ని ‘’ఆనందేన్ద్రియం ‘’అని బ్రహ్మ దేవుని రెండవ ముఖమని వర్ణించారు .బ్రహ్మ ఒక ముఖం తో వేదాలు చదువుతూ రెండో ముఖం తో సంతానోత్పత్తి చేస్తాడట .ఈ ఇంద్రియం ద్వారానే స్త్రీలు పురుషుల్ని వశ పరచుకొంటారు .అందుకే అధికారిణులవుతున్నారని చెప్ప బడింది .పురుషుడు స్త్రీ యోని లో రేతస్సు అనే ఆజ్యాన్ని ఉంచటం వల్లనే సంతానం కలుగుతుంది అని యజ్న భాషలో చెప్పారు .కన్యలు ధరించేనూతన వస్త్రాలను స్త్రీలే నేయాలి .కొత్త బట్టలు కట్టిన వధువును భర్త నూరేళ్ళు కాంతిమంతం గా ,ధనవంతురాలుగా జీవించమని ఆశీర్వ దిస్తాడు .పెళ్ళిలో గుండ్రాయిని తోక్కించటం లో విశేషం ఉంది .ఆ రాయిలాగా వధువు స్తిరం గా ఉండిశత్రు బాధ లేకుండా చేసుకోమని సూచన .వధువు తన జ్ఞాతి వర్గాన్ని వృద్ధి పొందించాలని భర్త దీర్ఘాయుస్సు తో ఉండాలని పేలాల తో అంటే లాజ లతో హోమం చేస్తుంది .సప్త పది లో అన్యోన్యాను రాగం పెరుగుతుంది బలిని అణచిన విష్ణువును ప్రార్ధించి అగ్ని హోత్రం చుట్టూ ఏడడుగులు నడిపిస్తారు .అన్న సమృద్ధికోసం మొదటి అడుగు ,బలం కోసం రెండవది ,యజ్ఞం కోసం మూడోది ,సౌఖ్యం కోసం నాల్గవది,పశు సంపదకోసం అయిదవది ,పుష్టికోసం ఆరవది ,సప్త హోమ సాధ్య సోమ యాగం కోసం ఏడవ అడుగు వేయిస్తారు .
‘’ఏక మిషె విశ్నుస్త్యా నయతుహ్ –ద్వే ఊర్జేస్త్వా నయతు –త్రీణివ్రతాయ విష్ణుస్త్వా నయతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వా నయతు –పంచ పశుభ్యో విష్ణుస్త్వ్యా నయతు –షడ్ రాయ స్పోషాయ విష్ణుస్వ్యా నయతు –సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు ‘’
పెళ్లి లో పాణిగ్రహణం ముఖ్యమైంది .దీనితో వధువుకు అత్తమామలు ఆడ బడుచులు ,మరుదుల మీద అధికారం వస్తుంది .సర్వాధికారి అయి తనకూ బంధువులకూ భర్తకూ సంతృప్తిని ఆనందాన్ని కలిగించాలని భావన .కనుక గృహస్తాశ్రమ ధర్మాలేన్నిటినో ఈ బ్రాహ్మణం తెలియ జేసి మార్గ దర్శనం చేసింది .ఇది సామ వేదానికే చెందినా చాలా సూక్తాలు యజుర్వేదం నుండి గ్రహింప బడ్డాయి .నిత్య కర్మ చేసేవారికి ఇది కరదీపిక .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-14—ఉయ్యూరు .

సంగీత దర్శకుడు జె.బి. అనగానే ‘ఈరోజుల్లో’, ‘బస్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘చంద్రలేఖ’, ‘కొత్తజంట’.. సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవర్స్’, ‘కాయ్ రాజా కాయ్’, ‘మా లైఫ్ సినిమా’, ‘మిర్చి లాంటి కుర్రాడు’.. చిత్రాలకు స్వరాలను సమకూర్చింది కూడా అతనే. ఇన్ని సినిమాల సంగీత బాధ్యత భుజాలమీద ఉన్నా తన గురువు కీరవాణి దగ్గర కీబోర్డు ప్లే చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటారు జె.బి. ప్రముఖ స్వరకర్త కీరవాణి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారాయన. శుక్రవారం కీరవాణి పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి గురించి జె.బి. చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ‘చిత్రజ్యోతి’కి ప్రత్యేకం.. జూ ‘ఛత్రపతి’ నుంచి నేను కీరవాణిగారి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు సొంతంగా మ్యూజిక్ చేస్తున్నా. కీరవాణిగారి సినిమాలకు పనిచేయడంలో తృప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఆయన దగ్గర కొత్తగా నేర్చుకునే విషయాలు ఉంటూనే ఉంటాయి. జూ నేనే కాదు. సంగీతకళాకారులు అందరూ కీరవాణిగారి దగ్గర పనిచేయడానికి మొగ్గుచూపుతారు. గురువుగారి నుంచి పిలుపు అందగానే ఎంత దూరాన ఉన్నా వచ్చి వాలిపోతారు. కళాకారుల పనికి ఆయన ఇచ్చినంత ఎక్కువ పారితోషికం మిగిలిన వారు ఇవ్వరు. జూ వరల్డ్ మ్యూజిక్‌కి సంబంధించి ఆయన దగ్గరున్నంత కలెక్షన్ ఇంకెవరి దగ్గరా ఉండదు. అంత గొప్ప కలెక్షన్ ఆయన సెల్‌లోనూ, ల్యాప్‌టాప్‌లోనూ ఉంటుంది. ఆయన సెల్‌నూ, ల్యాప్‌టాప్‌ను వినియోగించినంత విరివిగా ఇంకెవరూ ఉపయోగించడం నేను చూడలేదు. జూ ఏ సంగీతాన్నైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఆయనకు నచ్చదు. ప్రతిదీ డబ్బిచ్చే కొనుగోలు చేస్తారు. ఎప్పుడూ సంగీతాన్ని వింటూ ఉంటారు. ఆయన ప్రపంచమే సంగీత ప్రపంచం. సంగీతంలో నిత్యం అప్‌డేట్ అవుతుంటారు. జూ సంగీతమంటే సృజన. ఆధ్యాత్మిక భావన. ఆయనతో సంగీత చర్చల్లో పాల్గొంటే ఆ భావం మనకు కూడా తెలియకుండానే మదిలో తిష్టవేసుకుంటుంది. చుట్టూ ఉన్న వారిని పనిలో నిమగ్నం చేయడంలో ఆయన చాలా గొప్పగా ప్రవర్తిస్తారు. ఎంతో గొప్పగా మోటివేట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ చెబుతూ మనలో ఉన్న ప్రతిభను మనకు కూడా తెలియకుండా రాబట్టగలరు. జూ ఆయన స్వతహాగా చమత్కారి. కళాకారులు ఎక్కడా అలసిపోకుండా చూసుకుంటారు. మధ్యమధ్యలో జోకులు చెబుతూ నవ్విస్తుంటారు. ఆయన ఎంత సరదాగా ఉన్నా, పని సక్రమంగా జరగాలనే టెన్షన్ మాలో ఉంటూనే ఉంటుంది. ఆయన కాంపౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఇదే భావన కలుగుతుంది. జూ ట్యూన్లు కంపోజ్ చేసేటప్పుడు ప్రతి నోట్‌నూ ఆయనే రాసిస్తారు. ఆయనతో పాటు జెమినిగారు, నేను ఉంటాం. జూ నేను సంగీత దర్శకత్వం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కీరవాణిగారు మాత్రం ‘నువ్వు సంగీతం చేయి జీవన్. నేను కూడా రిటైర్‌మెంట్ ఎప్పుడో అప్పుడు తీసుకుంటాను’ అని అన్నారు. జూ కీరవాణిగారికి ఉన్నంత జ్ఞాపకశక్తిని నేను ఇంకెవరి దగ్గరా చూడలేదు. నేను పరిచయమైన రోజు ఆయనతో ఏం మాట్లాడానో కూడా ఇప్పుడు చెప్పేయగలరు. విషయాల్ని అంత గొప్పగా గుర్తుంచుకుంటారు.
బ్రాహ్మణాల కదా కమా మీషు -13
తాండ్య బ్రాహ్మణం
సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ స్థానం ఉంది .180యాగాల నిర్వహణ వివారా లిందులో ఉన్నాయి .కురుక్షేత్రానికి దూరం గా ఇది వర్ధిల్లిందని భావన .క్రీ పూ.ఎనిమిదవ శతాబ్దికి చెందినదిగా భావిస్తున్నారు .యజ్న యాగాది విషయాలు వివరిస్తూనే మధ్యలో అనేక లౌకిక విషయాలను ఈ బ్బ్రాహ్మణం చెప్పింది .విద్యా సంపన్నుడైన అతిధి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఎవరూ కూడా మనసు నొప్పించే మాట మాట్లాడకూడదు .అతిధి మనసుకు నొప్పికలిగితే ఆతిధ్యం వ్యర్ధమౌతుందని తెలిపింది .కర్మకాండకు, దార్మికతకు బాగా తోడ్పడింది .
సత్ర యాగాలు రెండు రకాలు .పన్నెండు నుంచి వంద రోజులు చేసేయాగానికి రాత్రి సత్రమని ,వంద రోజులు దాటిన దాన్ని అయన సత్రమనీ అంటారు .గీత బద్ధం గా ఋక్కులను గానం చేస్తే స్తోత్రమని ,గీత రహిత రుక్కుల్ని ‘’శస్త్రమని ‘’అంటారు .సామ వేదాధ్యాయి అయిన ఉద్గాత స్తోత్రం చేస్తాడు .రుగ్వేదాధ్యేత అయిన హోత మంత్రోచ్చారణ చేస్తాడు ,సామ వేదం నేర్చిన ఉద్గాత ఋక్కులను గానం చేస్తే స్తోత్రం అవుతుంది .సామగానానికి ఉద్గాత ,స్తోత ,ప్రతి హర్త ,సుబ్రహ్మణ్యుడు అనే నలుగురు రుత్విక్కులుంటారు .మూడు డరుక్కులకు ఒక సామ గానం చేయాలి .ఇవి ఇరవై ,లేక ఇరవై ఎనిమిది ఆవ్రుత్తులుగా ఉంటాయి .ఈ సంఖ్యలకే స్తోమం అని పేరు .గానం చేయాల్సిన మంత్రాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయటాన్ని ‘’విష్టుతి ‘’అంటారు .ఇష్టి ,పశు యాగాలలో సోమ యాగం ఒక భాగం గా ఉంటుంది సోమయాగం రుక్ ,యజు సామ వేదాల ననుసరించే చేయాలి .వసంత రుతువులోనే సామయాగాన్ని నిర్వ హించాలి .పది పదిహేనవ అధ్యాయాల మధ్య పన్నెండు రోజులు చేసే ‘’వ్యూఢ ద్వాదశాహం ‘’అనే యాగం చెప్పా బడింది .కొన్ని యాగాలలో యజమాని మూడు రోజులు అడవిలో నివశించాలి .సర్వ సత్ర యాగం ఏడాది పాటు చేయాలి .
తాండ్య బ్రాహ్మణ శైలి ప్రాచీనమైనది .కల్ప సూత్ర శైలిలో ఇది ఉంటుంది .సామ వేదం బ్రాహ్మణాలు రెండు ఒకటి తాండ్య శాఖ రెండోది తలవర శాఖ .సరస్వతీ, ద్రుషద్వతి నదుల మధ్య ఈ యాగాలు చేశారు వ్రాత్య సోమాలు అనే యాగాల ద్వారా బ్రాహ్మణులు కాని ఆర్యులు ప్రాయశ్చిత్తం చేసుకొని బ్రాహ్మణ సంఘం లో ప్రవేశించటాన్ని ఈ బ్రాహ్మణం తెల్పింది .నైమిశారణ్యం లో ఋషులు అనేక యాగాలు చేశారు .ఇక్కడ ‘’సుదామ ‘’అనే నది ఉన్నట్లు చెప్ప బడింది .జనకుడి ప్రస్తావన ఇందులో కని పించదు .దీని చివరలో ‘’అతి రాత్రం ప్రజా పథెహ్ సహస్ర సంవత్సరః ‘’అంటే వెయ్యేళ్ళు అతి రాత్రం అనే సత్ర యాగాన్ని చేస్తే ప్రజాపతికి మళ్ళీ ప్రజా సృష్టి చేసే శక్తి ఏర్పడుతుంది అని అర్ధం .
సౌమిత్ర సామ గొప్ప తనాన్ని చెప్పే కద ఒకటి ఉంది .దీర్ఘ జిహ్వ అనే రాక్షసి చరువు ,పురోడాశాడులను తన నాలుక తో నాకేస్తూ యజ్ఞాన్ని పాడు చేసింది .ఇంద్రుడు దాన్ని ఏ విధం గానూ చంప లేక పోయాడు .సుమిత్రుడు అనే కుత్స మహర్షి సహకారాన్ని కోరాడు .సంస్కార వంతమైన యాగా శాలలో ఆమెను మాయ చేసి వశం చేసుకొని ఇంద్రుడితో సామసాయం తో ఆ రాక్షసిని చంపించాడు .అందుకే దీనికి ‘’సౌమిత్ర సామ ‘’అనే పేరొచ్చింది .
కాలేయం అని ఇంకొక సామ ఉంది .లోకాధి పత్యం సురాసురులు పోటీ పడ్డారు దేవతలు తండ్రి ప్రజాపతి తో మొర పెట్టుకొన్నారు .వారికి సామాను ఉపదేశించి అసుర బాధ నుండి విముక్తులవమని ఉపదేశించాడు ‘’ఏతే వైతాన్ కాలయిష్యద్వం ‘’అనటం వలన కాలేయం అనే పేరొచ్చింది .కలి అనే రుషి దర్శించాడుకనుక కాలేయం అనీ అంటారు .శ్వానాశ్వుడు సత్ర యాగం చేస్తుంటే కొందరు యాజ్ఞికులు క్రోధం తో అతడిని నీళ్ళు లేని మరు భూమికి తీసికెళ్ళి వదిలేశారు .అప్పుడు ఆయన వర్షం కోసం ఈ సామాను కను గోన్నాడు .దీన్ని గానం చేయగానే అక్కడ వర్షం పడి పంటలు బాగా పండాయి .మరుభూమిని సస్య శ్యామలం చేసి మళ్ళీ యజ్న భూమికి చేరాడు .దోవ తప్పిన వాడు ఈ సామాన్ని గానం చేస్తే మళ్ళీ గుర్తించగలడు అని సారాంశం .
కవి అంటే శుక్రాచార్యుడు .ఆయన దర్శించిన సామ ను ‘’కావం ‘’అంటారు .ఉశనా అన్నా శుక్రుడే కనుక ఇంకో సామకు ‘’ఔశనం ‘’అని పేరొచ్చింది .బ్రహ్మ అన్ని యజ్ఞాలను ఈ సామ చేత సృష్టించాడట .పూర్వం దేవతలు వేదరాశిని తమలో తాము పంచుకోగా బ్రహ్మ కొచ్చిన భాగమే పెద్దదిగా ఉందట .దీన్ని యజ్ఞా యజ్నీయం అంటారు .ఎద్దు మూత్రం పోసినప్పుడు ఎలా వంకర టింకర గా పోస్తుందో సామాన్నికూడా అలా మెలికలు గా గానం చేయాలి .దేవతలు అగ్నిని ముందు పెట్టుకొని అశ్వం తో శత్రువులను ముట్టడించేట ప్పుడు చేసిన సామగానాన్ని ‘’సాకమశ్వం ‘’అన్నారు .సాకం అంటే ‘’కూడా ‘’అని అర్ధం .
చర్మ రోగాలను కూడా సామ గానం వల్లపోగొట్టుకోవచ్చునని ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .ఆంగిరస్సు కుమార్తె ‘’ఆకూ పార’’కు చర్మమంతా ఉడుము చర్మం లాగా గట్టి ఆ మారింది .ఆమె ఇంద్రుని ప్రార్ధించి తే దోషాన్ని పోగొట్టాడు .ఎలాంటి కోరికతో నైనా ఈ సామాన్ని గానం చేస్తే వారికి ఆకోరికలు సిద్ధిస్తాయి అని ‘’ఆకూ పార ‘’అనే సామ బోధిస్తోంది .బ్రాహ్మణులేకాకుండా క్షత్రియులు కూడా కొన్ని సామలను దర్శించారు ..ఆర్శభ సామ ‘అనేది క్షత్రియ సామ .విశ్వామిత్రకుమారుడు ఋషభుడు పుట్టే వరకు మహర్షి క్షత్రియుడుగానే ఉన్నాడు .అందుకే అది క్షాత్ర సామ అయింది ‘’బ్రాహ్మాణా చ్చంసి సామ’’అని అందుకే అన్నారు .
బ్రాహ్మనాలలో విధించ బడిన శస్త్రాలు అంటే స్తోత్రాలు బ్రాహ్మణాలుగానే పిలువ బడుతున్నాయి .వీటిని పఠించే ఋత్విక్కు ‘’బ్రాహ్మనాచ్చంసి ‘’.స్తుతులు రెండు రకాలు ఒకటి స్తోత్రాలు రెండు శస్త్రాలు .గానం తో చేయబడిన మంత్రం స్తోత్రం .గానం లేని మంత్రం శస్త్రం..పురుషులే కాదు స్త్రీలు కూడా మంత్రం ద్రస్టలుగా ఉన్నట్లు ఈ బ్రాహ్మణం తెలిపింది .’’త్వాస్టీసామ ‘’అనేది త్వష్ట కుమార్తెలైన త్వాస్త్రులు ఇంద్రుడికి కంటి రోగం వలన నిద్ర పట్టక పోతే ఈ సామ గానం చేసి చంటి బిడ్డను జోల పాడినట్లు పాడి నిద్ర పుచ్చారట .’’ఔర్నాయణం ‘’అనే సామ లో పూర్వం అంగి రసులు సత్ర యాగం చేస్తే స్వర్గాన్ని పొందినా దేవా యాన మార్గం గోచరించ లేదు .వాళ్ళలో కళ్యాణుడు అనే అంగిరసుడు అంత రిక్షం లోకి వెళ్లి ‘’ఊర్నాయువు ‘’అనే గంధర్వుడిని ప్రార్ధిస్తే ఆయన మార్గాని తెలియ జేసి ‘’ఊర్నాయువు నాకు దాన్ని చెప్పాడు .నేనే తెలుసుకొన్నాను అని అబద్ధం చెప్పద్దు .’’అని చెప్పాడు కాని ఇతడు అబద్ధంఆడి మాట తప్పిజ్ఞానం నశించి కుష్టు రోగి అయ్యాడు .ఊర్నాయు సామకు అంతటి శక్తి ఉందని తెలుస్తోంది .ఇక్కడ దర్శనం అంటే కనుక్కోవటమే కాని రాయటం కాదని గ్రహించాలి .
ఋత్విక్కులు మర్చి పొతే ప్రక్క వాడు జ్ఞాపకం చేయ రాదు .ప్రజా పతిని అతిధిగా పిల్చి చరువు,పురోడాశం తో సంతృప్తి పరచేటప్పుడు కూడా మధ్యలో మర్చిపోయిన కర్మ ను గుర్తు చేయ రాదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-14-ఉయ్యూరు

విశాఖతీరంలోని రుషికొండ. ఎప్పటిలాగే పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కనుచూపు మేర కనిపించే సముద్రపు నీళ్లను చూస్తున్న వారికి ఒక ఎర్రటి చిన్న పడవ, అందులో తెడ్డు వేస్తున్న ఒక మహిళ కనిపించింది. అంత భీకరమైన సముద్రంలో ఒంటరి మహిళా? ఎవరీవిడ? ఏమిటీ సాహసం? అని ముక్కున వేలేసుకున్నారందరు. మెల్లగా తీరం చేరిందామె. బోటు దిగి ఒడ్డున నిల్చున్నవాళ్లందరినీ ‘హాయ్, హాయ్’ అని ఆత్మీయంగా పలకరించింది. ఇంతకూ ఈమె ఎవరంటే.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు కాయక్ (చిన్న పడవ) మీద ఒంటరిగా వెళుతున్న సాహస వనిత శాండీ రోబ్‌సన్. అబ్బురపరిచే ఆ యాత్ర వెనక ఆమె అనుభవాలు ఆసక్తికరం….
ఆయా దేశాల మనుషులు అక్కడున్న సంప్రదాయ వ్యవహారాలను బట్టి ప్రవర్తిస్తుంటారు. మా దేశంలో అయితే అమ్మాయిల వయసు అడిగితే కోపగించుకుంటారు. ‘నీకు పెళ్లి అయిందా?’ అని స్వేచ్ఛగా అడగలేరు. అదే యూరప్ దేశాల్లో అయితే ఇది సామాన్యమైన ప్రశ్న. ఇండియాలో మాత్రం ఎవరు ఎదురుపడినా ‘నీ మొగుడ్ని వదిలిపెట్టి నువ్విలా తిరుగుతున్నావేంటి?. ఆయనేమీ అనడా?” అంటుంటారు. నాకు నవ్వొస్తుంటుంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటే నావైపు అదోలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నాకు లాంగ్‌జర్నీలంటే మోజు. అదీ సముద్రంలో ఒంటరిగా వెళ్లడమంటే మరింత ఇష్టం. తీరప్రాంతం వెంబడి వెళుతుంటే ప్రపంచంలోని ఎంతోమంది కాయక్‌లు పరిచయం అవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. అవన్నీ వింటుంటే భలే థ్రిలింగ్ అనిపిస్తోంది.
ఈ యాత్రకు కావాల్సినంత డబ్బు నావద్ద లేదు. దాతలను ఆర్థిస్తున్నాను. ఎవరికి తోచింది వారు ఇవ్వొచ్చు. నా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ మెయిల్‌లో సంప్రదిస్తే నా బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తాను. అందులోకి జమ చేయొచ్చు. నేను సముద్ర ప్రయాణం చేస్తూ దగ్గర్లోని ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుంటాను.
నేను ఆస్ట్రేలియాకు చేరుకోగానే కాయక్ మీద సముద్రయానం చేసిన తొలి మహిళగా రికార్డు నమోదవుతుంది. నేను తిరిగిన దేశాలు, ప్రాంతాలు, కలిసిన మనుషులు, తిన్న ఆహారం, జరిగిన సంఘటనల ఆధారంగా ఒక పుస్తకం రాద్దామన్నది నా ఆలోచన.
రోజుకు 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాను. సముద్రపు ఒడ్డున ఉన్న పట్టణాలకు చేరుకున్నప్పుడు లాడ్జిలలో దిగి.. వారానికి సరిపడే కిరాణాసరుకులు, ఆహారం, నీళ్లు సమకూర్చుకుంటాను. రాత్రిళ్లు సముద్రానికి దగ్గర్లోని ఊర్లలో టెంటు వేసుకుని పడుకుంటాను.
“చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రిటైర్‌మెంటు. అప్పుడప్పుడు కొన్ని వేడుకలు, పండగలు.. సంతోషాలు, బాధలు. ఇంతకంటే గొప్ప జీవితం లేదా? మనమెందుకంత రోటీన్‌లో పడి కొట్టుకుపోతుంటాము అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ సాహసయాత్ర. నాకిప్పుడు 47 ఏళ్లు. అరవై ఏళ్ల వరకు చురుగ్గా ఉండగలను. అంతలోపు వీలైనంత ప్రపంచాన్ని చూడాలన్నది నా ఆలోచన. అందుకే చిన్న పడవ మీద ఒంటరిగా సుముద్రతీరం వెంబడి సాహసయాత్రకు పూనుకున్నాను. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ యాత్ర సాగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చేరుకున్నాను. నా సాహసయాత్ర గురించి మీకు మూడుముక్కల్లో చెబుతాను. కాయక్ అనేది ఒక పొడవైన చిన్న పడవ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ దీని మీద వెళ్లొచ్చు. 1930లో జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు తొలిసారిగా కాయక్ మీద సముద్రయానం చేశారు ఆస్కర్‌స్పెక్. ఇతనికి సముద్రాల్లో ప్రయాణించడమంటే పిచ్చి. ప్రపంచాన్ని చుట్టేయడానికి అతనికి ఏడేళ్లు పట్టింది. అయిదేళ్లలో పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. ఒక మహిళ ఒంటిరిగా సముద్రంలో కాయక్ మీద జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే – అది ప్రపంచరికార్డు అవుతుంది. ఆ రికార్డును నేనే ఎందుకు నెలకొల్పకూడదు అనుకున్నాను.
ఒకప్పుడు టీచర్..
నాది దక్షిణ ఆస్ట్రేలియా. నేను అక్కడే పుట్టి పెరిగాను. ఆ దేశంలో నేను ఔట్‌డోర్ టీచర్‌ను. ఆస్ట్రేలియాలో విద్యాబోధన ఎంతో ప్రయోగాత్మకంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అందులో భాగమే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్. ఇదొక సాహసయాత్రతో కూడుకున్న విద్యాబోధన. టీచర్లు సముద్రంలో ప్రయాణిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతారు. యాత్రలో భాగంగా రకరకాల ప్రదేశాలు, వాటి ఔన్నత్యం గురించి ప్రాక్టికల్‌గా బోధించడం, పిల్లలకు ప్రపంచం పట్ల అవగాహన కలిగించడం ఈ చదువు ఉద్దేశం. నాకు కూడా చిన్నప్పటి నుంచి లోకం తిరగడమంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. రకరకాల ప్రదేశాలు, మనుషులు, సంస్కృతి, ఆహారం.. ప్రపంచంలోని వైవిధ్యాన్ని దగ్గరగా చూస్తూ.. అందులో మమేకం కావడం ఇష్టం. అందుకనే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్‌లో టీచర్‌గా, ఇన్‌స్ట్రక్చర్‌గా చేరాను. ఆ రంగంలో ఇరవై ఏళ్లపాటు పనిచేశా. సముద్రంలో కాయక్‌ల మీద సాహసయాత్ర అందులో భాగంగానే అలవడింది. నా సొంత డబ్బులతో తొలిసారి కాయక్‌ను కొనుక్కున్నాను. అప్పటి నుంచి మెల్లగా సముద్రం మీద సాహసయాత్రలు మొదలయ్యాయి. దక్షిణ ఆస్ట్రేలియా సముద్రంలో తొలియాత్ర చేశాను. సముద్రపు అలలను దాటుకుంటూ చిన్న పడవ మీద తెడ్డు వేసుకుంటూ.. వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఆషామాషీ కాదు. ప్రమాదకరం కూడా! మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు శారీరక బలం కాస్త తక్కువ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ బోటును నడిపితే భుజాలన్నీ నొప్పిపెట్టేవి. సాయంత్రం అయ్యేసరికి ఒక్కోసారి నిద్రపట్టేది కాదు. అయినా సరే నా అలవాటును మానుకోలేదు.
నెల్లూరు జాలర్లతో..
కాయక్ మీద చిన్న చిన్న సాహసయాత్రలు చేస్తున్నప్పుడు నాకొక పుస్తకం దొరికింది. దాని పేరు ‘డ్రీమ్‌టైమ్ వొయేజ్’. రచయిత పాల్‌కాఫిన్. అతనిది న్యూజిలాండ్. జీవితాన్నంతటినీ కాయక్ వేసుకుని సముద్రం మీద ప్రయాణించడానికే కేటాయించాడతను. ఆ పుస్తకాన్ని చదివాక.. సాహసయాత్ర కేవలం రికార్డుల కోసమే కాదు, ప్రపంచాన్ని రకరకాల లెన్సుల్లో చూసేందుకు పనికొస్తుంది అని అర్థమైంది. వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు సముద్రంలోనే లాంగ్‌ట్రిప్ చేయాలని. కాయక్‌ల మీద యాత్రలు చేసే స్నేహితులు ఉన్నారు కాని.. ఇంత దూరప్రయాణానికి వారు ఒప్పుకోలేదు. ఇక చేసేది లేక నేనొక్కదాన్నే బయలుదేరాను. కేవలం సముద్ర తీరప్రాంతం వెంబడి మాత్రమే ప్రయాణిస్తున్నాను. లోతైన సముద్ర ప్రాంతంలోకి వెళ్లను. జర్మనీలో మొదలై ఇప్పటికి పదకొండు దేశాలు దాటుకుని.. శ్రీలంక మీదుగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడి నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది నా యాత్ర. ఇక్కడే నాకు కష్టాలు మొదలయ్యాయి. నెల్లూరు వద్దకు వచ్చేసరికి అప్పటికే సముద్రంలో చేపలు పట్టుకునే జాలర్లు నా వెంటపడ్డారు. నేనో ఉగ్రవాదినని వారు పొరబడినట్టున్నారు. అందుకే బోట్లు తీసుకుని అరుపులు కేకలు పెట్టుకుంటూ నా వద్దకు వచ్చారు. నేను చెప్పేది వాళ్లకు అర్థం కాలేదు. ఉన్నట్లుండి నా వద్ద ఉన్న కొన్ని వస్తువుల్ని లాగేసుకుని పారిపోయారు. వెంటనే అప్రమత్తమై తీరప్రాంతానికి సమీపంలోని ఊరికి వెళ్లి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి విశాఖపట్టణంలోని పూడిమడక సమీపానికి వచ్చేసరికి నా కాయక్ పడవ చెడిపోయింది. దిక్కుతోచలేదు. అక్కడున్న ప్రజలు చెబితే రుషికొండ బీచ్‌లోని శాప్ యాంటింగ్‌సెంటర్‌కు వెళ్లగా.. అక్కడ మెంటర్ మెల్‌విల్ స్మిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితోపాటు మెరైన్ పోలీసులు సాయపడటంతో పడవ రెడీ అయ్యింది. వాళ్లందరికీ కృతజ్ఞత చెప్పి విశాఖతీరం నుంచి బయలుదేరానిప్పుడు. మిగతా దేశాలతో పోలిస్తే.. ప్రయాణానికి ఆంధ్రతీర ప్రాంతం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాల మీదుగా పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నాను. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని బంగ్లాదేశ్ మీదుగా 2016 నాటికి ఆస్ట్రేలియాకు చేరుకోగలుగుతాను..” అంటున్న ఈ సాగరకన్య క్షేమంగా ఇంటికి చేరుకుని.. యాత్రను సంపూర్ణం చేయాలని ఆశిద్దాం.
– నవ్య డెస్క్
వాల్మీకం లో వర్షర్తు శరదృతు వర్ణన
రామ లక్ష్మణులు కిష్కింద దగ్గర ప్రస్రవణ పర్వతం పై ఉన్నప్పుడే వర్షరుతువు శరదృతువు వచ్చి వెళ్ళిపోయాయి.మహర్షి వాల్మీకి ఆ రెండిటిని అద్భుథ కవితా శైలిలో వర్ణించాడు .ఆ వైభోగాన్ని దర్శిద్దాం .
వర్షర్తు వర్ణనం
కిష్కింధలో సుగ్రీవుడు అంగదుడు పట్టాభి షేక ఆనందం లో హర్షాన్ని అనుభవిస్తున్నారు .ఇక్కడ ప్రస్రవణ పర్వతం మీద రామ సోదరులిద్దరు వర్షాకాలపు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు .శరత్ కాలం ఎప్పుడు వచ్చి సీతాన్వేషణ మొదలౌతుందా అని ఎదురు చూస్తూ చింతా క్రాంతు లైనారు.సింహాలు పులులూ , కొండా, కోనా .చెట్లూ చేమ ,పూలు పండ్లు చూడటానికి మనోహరం గా ఉన్నా ,మనస్సు దేనిమీదో ఉండటం వలన సోదరుల మనస్సును రంజింప లేక పోతున్నాయి .పర్వత శిఖరం ఎక్కి ప్రకృతి పులకిన్తను చూడాలనుకొను చూశారు మనోహరం గా ఉంది అసలే ప్రకృతి ప్రేమికులు వారి మనసులు పులకింతలై పరవశించిపోయారు .
పర్వత శిలలు అనేక వన్నె చిన్నెలతో భాసిస్తున్నాయి .అందులో అనేక ధాతువులున్నాయి .చాలా రకాల పూలు ,జలజల పారే సెల ఏళ్ళు ,సరోవరాలు నాలుగు దిక్కులా కని పిస్తున్నాయి .ఈశాన్యానికి దిగువ ,నైరుతికి ఎగువన గా ఉన్నందున రామ లక్ష్మణులుండే గుహ వాస యోగ్యం గా ఉంది .ఒక వైపు మేఘ మాలగా ,మరో వైపు కైలాస శిఖరం లాగా కానీ పించే పర్వత శిఖరం రక రకాల వృక్ష సంతతి తో పట్టు చీరకట్టి ,బంగారు ఆభరణాలతో అలంకరించుకొన్న అంగన లా ఉంది .ఎటు చూసినా పక్షుల కలకలారావాలు ,హంస సారసల మంద గమనం ,పుష్ప హాసం ,నిర్మల నదీ జలం చందన చెట్ల నుండి వచ్చే సుగంధం ,మనోహరం గా ఉన్నాయి .దగ్గరలోనే ఉన్న కిష్కింద నుండి నృత్య గీత సంరంభం విని పిస్తూనే ఉంది .అక్కడ సుగ్రీవుడు చాలాకాలం తర్వాత స్త్రీ సాంగత్య భోగాలనుభవిస్తుంటే ఇక్కడ రాము డు సీతా వియోగం తో విచారిస్తూంటాడు .రామానుజుడు అన్నకు ధైర్యం చెప్పుతున్నాడు .సకల లోకాలను జయించే కోదండ పాణికి రావణుడు ఒక లెక్క కాదని ధైర్యం చెప్పాడు .శరత్తు రాగానే విజయయాత్ర చేసి రావణ సంహారం చేద్దామంటాడు .
సోదరుల ఆవేదనకు ఉపశమనం గా చల్లని వాతా వరణం సహకరిస్తోంది .కొండల్లాంటి మేఘాలు ఆకాశమంతా నిండి చల్లని గాలితో బాటు రసధారలతో భూదేవి దాహాన్ని తీరుస్తున్నాయి .నవమాసాలు సూర్య కిరణాలతో పీల్చుకొన్న జలం తో గర్భ ధారణ చేసిన ఆకాశం శ్రావణ మాసం రాగానే కమ్మని రాసానయాన్ని కంటోంది .రంగు రంగుల మేఘాలు చూడ ముచ్చటగా ఉన్నాయి .ఎండకు ఎండి ఒత్తుగా కురిసిన వానకు నిట్టూర్పు విడిచే భూమ తల్లి లాగా సీతా మాత కూడా దిగులుతో నిశ్వ సిస్తూ ఉంటుందని రామయ్య భావించాడు . కాదంబినీ కడుపు లో నుంచి వెలువడే కమ్మ తెమ్మేరాలను రెండు చేతులతో తాగేయాలని పిస్తోంది .శత్రు సంహారం జరిగి నిర్భయం గా నిబ్బరం గా పట్టాభి షేకం చేసుకొంటున్న సుగ్రీవుడి లాగా పర్వత రాజం అప్పుడప్పుడు కురిసే వర్ష దారాలతో అభిషేకం చేసుకొంటోంది .మేఘాలను జింక చర్మం లా ధరించి జలదారాలను జందెం లా వేసుకొని గుహ లో నుంచి వెలువడే గాలిని వేద నాదం చేసుకొని గిరి కుమారులు వేదాధ్యయనం చేస్తున్నట్లుంది .కొరడా దెబ్బల లాంటి మెరుపు తీగల తాకిడికి తాళ లేక ఆకాశం అక్రంది స్తూంది . మేఘాలను తప్పించు కొని పోవాలని తల్లడిల్లే తటిల్లతలను చూస్తె రావణుడి ఒడిలో గిల గిల కొట్టు కున్న సీత రాముడి ఊహా ప్రపంచం లో ఒక్క సారి మెరుస్తుంది .దిక్కులను, కాలాలను మరిపింప జేసే ముసురు ప్రేయసీ ప్రియులకు ఆహ్లాదం గా ఉంది .వర్షం వస్తుందనే హర్షాతి రేకం తో కొండలు పుష్పించాయి .ధూళి అణగి పోయింది .గాలి చల్ల బడి పోయింది .వేసవి వైషమ్యం ఉప శమించింది .రాజులు విజయ యాత్రలు ఆపేసి విశ్రమించారు .హంసలు మానస సరోవరాలను చేరుకొన్నాయి .చక్ర వాకాలు అన్యోన్యం గా మెలగుతున్నాయి.దారులన్నీ ఏకమైనాయి .ఒక చోట వెలుతురు ఇంకో చోటా చీకటి ఉండటం వల్లఆకాశం వెలుగు నీడలతో రమణీయం గా ఉంది .సెలయేళ్ళు అతి వేగం గా ప్రవహిస్తున్నాయి .తుమ్మెదలు నేరేడు పండ్ల రుచి మరిగి ఆప్యాయం గా ఆరగిస్తూ ఉన్నాయి .పండిన మామిడి పళ్ళు రాలి కిందపడ్డాయి .పచ్చిక బయళ్ళు నెమళ్ళతో నిండి పోయాయి .మేఘాలు వర్ష దారాల తో నిర్విరామం గా నడవ లేక కొండ మీద విశ్రాంతి తీసుకొంటూ వెడుతున్నాయి ఇంద్ర గోపపు పురుగులతోబయళ్ళు పట్టు చీరల్లా కని పిస్తున్నాయి .కేశవ స్వామి నెమ్మదిగా నిద్ర పట్టిస్తుంటే నదులు సముద్రం లో కలిసి పోతున్నాయి .బలాక పక్షులు మేఘాల దగ్గరకు చేర్తున్నాయి .కాంతలు కౌగిట్లో నలిగి పోతుంటారు .నదులు ప్రవహిస్తూంటే మేఘాలు వర్షిస్తున్నాయి .ఏనుగు ఘీన్కారాలతో అడవులు మార్మ్రోగి పోతున్నాయి .అరణ్యాలు రమ్యం గా భాసిస్తున్నాయి .విరహ వేదన చెందే వారు ప్రియులను స్మరించుకొంటూ దిగులు పడుతూ ఉంటారు .నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి .ఏనుగులు జల పాతాలాల ధ్వనికి ఉలిక్కి పడి వెనక్కి చూస్తూ నృత్యం చేస్తున్నాయి .తుమ్మెదలు పై నుంచి పడే వాన జల్లుకు చిరాకు పడుతూ ,పూదేనే తాగుతూ తాగుతూ ఆగిపోతాయి .మేఘ గర్జన విన్న మత్తేభాలు తమ తో పోటీకి మరో మత్తేభం గర్జిస్తోంది అని భ్రమ పడుతున్నాయి .సృష్టిలోని సకల ప్రాణులు సుఖాన్ని అనుభ విస్తూ హాయిగా వర్షాకాలం గడుపుతున్నాయి సీత జాడ తెలియక రామ లక్ష్మణులు మాత్రం బాధ పడుతున్నారు .
శరదృతు వర్ణనం
వర్షాకాలం పోయి’’ శారదరాత్రు లుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ ‘’అని ఎర్రన గారు వర్ణించినట్లు శారదరాత్రులు వెలిగి పోతున్నాయి .ఆకాశం నిర్మలం గా కనిపిస్తోంది సుగ్రీవుడికిచ్చిన గడువు దాటి పోయింది .అన్వేషణ ప్రారంభం కాలేదని పించింది రాముడికి .తన ఆర్తిని తమ్ముడికి రాముడు చెప్పుకొంటాడు .అన్నకు ధైర్యం చెప్పి ,ఆత్మా సంయమనం తో యోగ సమాధి సాధించి దుఖాన్ని జయించమని రామానుజుడు అన్నకు చెప్పాడు .రావణుడు సీతను స్వాధీనం చేసుకోవటం అగ్నిని కౌగిలించుకోవటమే నన్నాడు .శర న్మేఘ సందర్శనం చేయాలని అన్న దమ్ములిద్దరూ ఉవ్విళ్ళూరుతుంటారు .వెన్నెల రాత్రుల వైభవాన్ని దర్శించి పులకించి పోతారు .చక్రవాకాలు హంసలు తుమ్మెదలు మదపు టేనుగులు వృషభ రాజులు ప్రకృతి లావణ్యాన్ని చూసి పరవశించి పోతూంటాయి .ఏనుగులు ప్రణయ లీలలోసర్వం మరచి క్రీడిస్తు రమణీయ వనాంతరాలలో విహరిస్తున్నాయి .హంసలు హర్షాతి రేకం లో జలక్రీడలు చేస్తూ పులకిస్తున్నాయి .నెమళ్లు కొంగలతో పోటీ పడి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి .ఇప్పటిదాకా పుట్టల్లో దాక్కున్న పాములు శరత్తు రాగానే బయటికి వస్తున్నాయి .సంధ్యా దేవి కూడా అనురాగం అతిశయించి చంద్రుని కిరణ స్పర్శకు పులకరించి తారకలాంటి కళ్ళను తెరచి తనంతట తానే అంబరాన్ని వదిలి వెడుతోంది .తెల్లని వెన్నెల చీర కట్ట్టుకున్న రజనీ కుమారి సౌకుమార్యం ,సౌందర్యం ఎంత చెప్పినా చాలదు .
వెన్నెల రాత్రిలో గగన వీధి లో కలిసి పోయిన జాబిల్లి లాగా నీటి మడుగులో కలువల మధ్య హంస హాయిగా నిద్ర పోతోంది .తెల్ల వారు జామున పల్లెల్లో విని పించే రధి మంధన ఘోష ,ఆబోతు ఆనంద నినాదాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి .తుమ్మెదలు కమ్మ తెమ్మరెల వెంట జంటలు జంటలుగా తిరుగుతూ ,మధ్య మధ్య మకరందాన్ని ఆస్వాదిస్తూ తుంటరి చేష్టలు చేస్తున్నాయి .చేపలకు నడుము కట్టు గా ఉన్న నదీ సుందరులు ప్రణయ క్రీడలతో అలసి పోయి మందం గా ముందుకు కదిలి వేడుతున్నాయి .ఎక్కడ చూసినా పైరు పంటలు కంటికి ఇంపుగా మనసుకు ఆహ్లాదం చేస్తున్నాయి .వసుమతిని రసప్లావితం చేసిన వారి దారలు అంటే మేఘాలు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతున్నాయి .వాన నీరు తగ్గి పోతుంటే నదీ తీరం లో నెమ్మదిగా భూమి కని పిస్తోంది .మొదటి సమాగమం సమయం లో తొడల మీద పట్టుకొని సిగ్గును నటించే సౌభాగ్య వతుల్లా నదీ ప్రవాహం ప్రసన్నం గా కని పిస్తోంది . వర్షాలు తగ్గ గానే రాజులు శత్రువులపై దాడికి సిద్ధమౌతున్నారు .కాని సుగ్రీవుడు కాంతా సక్తం లో మునిగి తమను పట్టించుకోవటం లేదని రాముడు భావించి సుగ్రీవుడి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని బాధ పడుతాడు .వానర రాజుకు బుద్ధి చెప్పి రమ్మని తమ్ముడు లక్ష్మణుడిని కిష్కింధకు పంపిస్తాడు .
వాల్మీకి మహర్షి చేసిన ఈ రెండు ఋతువుల వర్ణనలు కాళిదాసుకు ,ఆ తర్వాత నన్నయ ,తిక్కన ఎర్రనలకూ ఆదర్శమైంది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు

ఆంగ్లంలో ‘అరెస్టింగ్ పర్సనాలిటీ’ అనే పదం ఒకటుంది. అంటే వంద మందిలోనైనా ఇట్టే గుర్తించగల పర్సనాలిటీ అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తుల విషయంలో ఇలాంటి పద ప్రయోగం చేస్తుంటారు. మహానటుడు సామర్ల వెంకట రంగారావుది కూడా అటువంటి పర్సనాలిటీయే. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే సత్తా ఆయన సొంతం. మహా ప్రవాహంలాంటి చిత్ర పరిశ్రమలో ఆ ప్రవాహానికి ఎదురెళ్లి, ఆటుపోట్లను భరించి, ఒడ్డుకు చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతనటుడు ఎస్వీఆర్. తొలి సినిమా ‘వరూధిని’ ఆశాభంగం కలిగించినా, మళ్లీ ‘షావుకారు’తో నిలదొక్కుకొని తెలుగు, తమిళ భాషల్లో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేయగలగడం ఆయన అదృష్టమే కాదు ఆ అసామాన అభినయాన్ని తిలకించి, పులకించి పోవడం ప్రేక్షకుల పూర్వజన సుకృతంగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. సాధారణంగా చాలా మంది నటులకు వాళ్లు పోషించే పాత్రలను బట్టి గుర్తింపు లభిస్తుంటుంది. కానీ తన నటనతో పాత్రలకు మరింత పేరు తెచ్చిన నటుడు ఎస్వీఆర్. డైలాగ్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన మాడ్యులేషన్. పది పేజీల డైలాగుల్లో చెప్పే భావాన్ని కేవలం ఒకేఒక ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన ప్రదర్శించే నేర్పు కేవలం ఆయనకే సొంతం. సినిమాలో తనది చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా అది రంగారావు మాత్రమే చెయ్యాలనే రీతిలో ఆయన అభినయం ఉండేది. పాత్రకు తగ్గ టెంపోని పాటిస్తూ డైలాగ్ చెప్పడంలో ఎక్కడెక్కడ విరామం ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ పదాన్ని విరిచి మాట్లాడాలో రంగారావుకు బాగా తెలుసనిపిస్తుంది ఆయన సినిమాలు చూసినవారెవరికైనా.
సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు… ఒకటనేమిటి అన్ని రకాల చిత్రాల్లోనూ అభినయించి, సాటి లేని మేటి నటుడనిపించుకొన్నారు ఎస్వీఆర్. ‘షావుకారు’ చిత్రంలో సున్నం రంగడిగా రౌడీ పాత్ర పోషించిన రంగారావు తదనంతర కాలంలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జెట్టీలు’, ‘కత్తుల రత్తయ్య’, ‘బందిపోటు భీమన్న’ వంటి చిత్రాల్లో కూడా రౌడీ పాత్రలు పోషించారు. అయితే తన మార్క్ ఆ పాత్రల్లో ఉండేలా ఆయన జాగ్రత్త వహించారు. ‘పాతాళభైరవి’ చిత్రంలో నేపాళ మాంత్రికుని పాత్రతో ‘బుల్‌బుల్’, ‘డింగరీ’ వంటి కొత్త పదాల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రంగారావు ‘ బేవకూఫ్’, ‘డోంగ్రే’, ‘గూట్లే’ వంటి కొత్త తిట్లను రౌడీలకు అందించారు. ఏ తరహా పాత్ర ఆయన పోషించినా అందుకు అనుగుణమైన పర్సనాలిటీ ఉండటంతో ఆ పాత్ర రాణించేది. నిండైన విగ్రహం, కళ్లు ఆయనకు ఎస్సెట్స్ అని చెప్పాలి. వాటితోనే ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. తెలుగులో, తమిళంలో రాణించి, ‘విశ్వనట చక్రవర్తి’గా ప్రేక్షకుల ప్రశంసలు పొందినా, తనకు ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి రంగారావులో ఉండేది. అది మాత్రం నిజం.
(నేడు ఎస్వీఆర్ జయంతి)
బ్రాహ్మణాల కదా కమా మీషు-12
తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు
వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో ఇదొకటి .ఇందులో అయిదు కాండలుంటాయి అవే ఆగ్నేయ ,ఐంద్ర పవమాన అరుణ ,శుక్రియలు .నాల్గవ దాన్ని ఉపనిషద్ బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చివరి దానికి ఆర్షేయ బ్రాహ్మణం అనే పేరు కూడా ఉంది .సింధు నదీ తీర ప్రాంతం లో ఇది పుట్టిందని భావిస్తారు .సాయనుడు దీనికి భాష్యం రాయ లేదు .భావత్రాతుడు రాసినట్లు తెలుస్తోంది . సామగాచార్యులలో జైమిని ప్రసిద్ధుడు .కర్నాటక దేశం వాడని ‘’కర్నాటకే జైమినిహ్ ప్రసిద్ధః ‘’అని ‘’చరణ వ్యూహం’’ బట్టి తెలుస్తోంది .యజ్న యాగాదుల విషయాలే ఎక్కువ .జ్యోతి స్తోమం చేస్తే స్వర్గం వస్తుందని చెప్పింది స్వర్గం అంటే సుఖం అనే అర్ధం కూడా ఉంది .
ఇందులో ఋత్విక్కుల విధుల గురించి పూర్తీ సమాచారం ఉంది .యాగం మొదట్లో అధ్వర్యుడు ‘’దీక్షణీయ ‘’అనే ఇష్టి జరిపి యజమానికి అతని భార్యకు దీక్ష నిస్తాడు .దీక్షా కాలం లో యాజమాన దంపతులు వంటికి వెన్న రాసుకొని ,కంటికి కాటుక పెట్టుకొని ఉండాలి .గోళ్ళతో గోక్కో రాదు .జింక కొమ్ముతో గోక్కోవాలి .పాలు ,అత్తిపండ్లు ,పెరుగు ,పేలాలు మాత్రమె ఆహారం గా గ్రహించాలి .కడుపు నిండక పోతే వట్టి అన్నం తినచ్చు .అపశబ్దాలు ,అసత్యాలు పలకరాడు .పళ్ళు కనబడేట్లు నవ్వ రాదు .స్త్రీముఖం చూడరాదు .యజ్న శాల విడిచి వెళ్ళరాదు .ఋత్విక్కులకు దక్షిణ ఇచ్చేవరకూ తన చేతి తో ఎవరికీ ఏమీ ఇవ్వరాదు .యాగా ద్రవ్య సేకరణకు నాలుగు దిక్కులకు యాచకులను పంపాలి .యాచకులు అంటే అడుక్కొనే వాళ్ళు కాదు హోమ ద్రవ్యాలను సేకరించేవారు .యెంత ధన వంతుడైనా ఇది తప్పని సరి విధి .దీనితో మొదటి రోజు కార్య క్రమం పూర్తవుతుంది .
రెండవ రోజు ‘’ప్రాయణీయ ‘’ఇష్టి జరిపి వస్త్రాన్నిచ్చి సోమలతను కొనుక్కోవాలి .ఇప్పుడు సోమలత దొరకటం లేదుకనుక ‘’పూతిక ‘’ను ప్రత్యామ్నాయం గా వాడుతున్నారు .ఈ సోమాని కి ‘’రాజు ‘’అని వేదం పేరు పెట్టింది .
రాజు మన ఇంటికి వస్తే ఎలా ఆతిధ్యమిస్తామో సోమానికీ అలానే ఇవ్వాలి .దీన్ని ‘’అతిధ్యేష్టి’’అంటారు .దీని తర్వాత యజమాని ,ఋత్విక్కులు పరస్పరం స్నేహం తో ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి .తర్వాత ‘’ప్రవర్గ్య కర్మ ‘’ప్రారంభిస్తారు .మనశరీరం లో శిరస్సుకు యెంత ప్రాధాన్యం ఉందో దీనికీ అంటే ప్రాముఖ్యం ఉంది .దీనికో కద కూడా ఉంది .పూర్వం విష్ణు మూర్తి ధనుర్యుద్ధం లో దేవతలను ఓడించి ,ధనుస్సును గడ్డం కింద పెట్టుకొని విలాసం గా నిల బడి ఉంటె ,ప్రతీకారేచ్చ తో ఇంద్రుడు చెద పురుగులను పంపి అల్లే త్రాటిని కోరికిస్తాడు .బంధం ఊడిపోయి ధనుస్సుకర్ర అతి వేగం తో పైకెగిరి విష్ణువు శిరస్సును శరీరం నుండి వేరు చేస్తుంది .ప్రతిక్రియ జరిగింది కనుక యజ్ఞం విచ్చిన్నమైంది .అశ్వినీ దేవతలు వచ్చి శిరస్సును అతికించిన తర్వాత దేవతలు యజ్ఞాన్ని పూర్తీ చేశారు .దీన్ని అనుకరిస్తూ ‘’మహా వీర’’అనే శిరస్సు లాంటి కుండ ఒకదాన్ని మంత్రం పూతం గా తయారు చేసి అందులో ఆవుపాలను మేక పాలను నేతినీ పోస్తారు .వీటితో హోమం చేస్తారు ఇదే ప్రవర్గ్యం .ఉపసత్ అనే ఇష్టిని చేసి రెండో రోజు పని పూర్తీ చేస్తారు .మూడవ రోజు ‘’సుత్య’’అనే అయిదవ రోజుకుసోమయాగానికి కావాల్సిన వేదికను తయారు చేస్తారు .నాల్గవ నాడు ‘’అగ్నిస్తోమీయం ‘’అనే పశు యాగం చేస్తారు అ రోజే సోమలతను రాతి మీద ఉంచి ,రాతి తో దంచి రసం తీసి దాన్ని కొయ్య తో తయారైన ‘’గ్రహం ‘’అనే చిన్న పాత్రలో పోసి ఇంద్రాది దేవతల నుద్దేశించి హోమం చేస్తారు .హోమం చేయగా మిగిలిన రసాన్ని యజమానులు తాగుతారు .సోమ లత అనే ఓషధిని రాతి తో కొట్టి రసం తీయటం పీడనమే కనుక పరిహారం కోసం ‘’వసతీరా ‘’అనే పుణ్య జలాన్ని స్పర్శించి దోషాన్ని పోగొట్టుకొంటారు .
ఇందులో ఒక ఉపాఖ్యానం సరదాగా ఉంటుంది .జంటగా ఉండే కొండ గుహల్లాంటి చీకట్లో నివశించే బలుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతం గా పీడించేవాడు .వాళ్ళు బృహ స్పతి తో మొరపెట్టుకొంటే ఆయన ‘’బల భిత్ ‘’అనే యాగాన్ని చేసి వాడిని చీక ట్లోంచి వెలుగు లోకి రప్పించి ఆయుధాలతో చీల్చి చంపాడు .అంటే ఈ యాగం శత్రునాశన కారి అని తెలుస్తోంది .అన్న సమృద్ధి ద్ధికోసం విరాట అనే యాగాన్ని ,స్వారాట్ వల్ల స్వారాజ్యాన్ని అంటే తనకు తాను ప్రకాశించేలోకంపొందాలి ,వృషభ యాగం చేసి దేవ శ్రేస్టూడైనాడు ఇంద్రుడు వృషభం శ్రేస్టత్వానికి సూచిక .పదమూడు నుండి వెయ్యేళ్ళ వరకు చేసే యాగాన్ని సత్రం అంటారు .’’గవా మయనం’’అనేది అయన క్రతువులకు వికృతి .ఏడాదిపాటు చేస్తారు .ఇది చేస్తే స్వర్గం శత్రు విజయం ,వాక్పటుత్వం మొదలైనవి .పరమాత్మ సమర్పణ బుద్ధితో చేస్తే మోక్షం లభిస్తుందని ఈ బ్రాహ్మణం తెలియ జేస్తోంది .
ఇతర సామ వేద బ్రాహ్మణాల కంటే తలవికారం అతి పెద్దది .కాని ఇది సస్వరం గా లభించలేదు .దీని వ్యాఖ్యానం ,ప్రయోగ పధ్ధతి ,శ్రౌత సూత్రం కాని దొరక్క పోవటం దురదృష్టం .ఉపాఖ్యానాలలో ప్రసిద్ధ రాజుల ,ఆచార్యుల పేర్లు కని పిస్తాయి .జనకుని సమకాలిక రాజు లెందరినో ఇది ప్రస్తావించింది .వీరిలో చితుడు ,దాల్భ్య వంశ మూల పురుషుడు దర్భ్యుడు ,కేశి దార్భ్యుడు ,సుత్వా యాజన సేనుడు ,లుషాకపి ,ఖార్గాలి ,సుదక్షిణ క్లైమి,బ్రహ్మ దత్త ప్రసేన జిత్తులున్నారు .చెట్లు ,చేమలు లేక పొతే ప్రాణి మనుగడ అసాధ్యం అని ఈ బ్రాహ్మణం చెప్పింది .ఓషధులు వనస్పతులు లేక పోతే భూమి ప్రాణ నివాసా యోగ్యం కాదని గరుడుడు స్వర్గం నుంచి సోమలతను తెచ్చి భూమిపై పిండాడు .ఆ రస బిందువులు పడిన చోట్లలో తాబేలు వీపులాగా కఠినం గా ఉన్న బోడి గా ఉన్న భూమి మీద ఓషధ వనస్పతులు పుట్టాయట .వీటివల్లనే భూమి నివాస యోగ్యమైంది .
వాయువు అంతరిక్షం లో ప్రకాశిస్తుందని ,శక్తి వంతమైన అణువులతో నిండిన అయస్కాంత క్షేత్రం చేత ఆకర్షింప బడి అడ్డం గా వీస్తుందని ,ఉత్తరాభిముఖం గానే ఈ వాయువు వీస్తుందని ,తెల్లగా ప్రకాశించే రూపం తో ఉంటుందని ,ఈ వాయువే అంత రిక్షాదిపతి అని ఈ బ్రాహ్మణం చెప్పింది . అంతరిక్షం లో శక్తి పూరిత అణువులుంటాయి ప్రాణం నుంచి జలం నుంచి ,అగ్ని నుంచి ఇవి పుట్టి ప్రకాశిస్తాయని చెప్పింది ఇవే .ఈ బ్రాహ్మణం లో ‘’పశు ‘’శబ్దం చేత పేర్కొన బడ్డాయి .వర్షం కోసం దుందుభి అనే వాయిద్యాలను మోగించాలని చెప్పింది. యాజ్ఞిక ,చారిత్రిక ,భాషా ప్రయోగ దృష్టిలో తలవికార బ్రాహ్మణం ఎన్నో విశిష్టతలను ప్రదర్శించింది
‘’ఏష వై శశః య ఏషో న్తశ్చంద్రమసి ‘’అని చెప్పింది అంటే చంద్రునిలో కన బడే మచ్చ కుందేలే అని కవితా పరం గా చెప్పింది .వీణకు ఒకప్పుడు నూరు తీగాలుండేవని ‘’వాణంశత తంత్రి మాహరాంతి ‘’అనే వాక్యం వలన తెలుస్తోంది ..గర్భస్థ శిశువుకు అడ లేక మగ లక్షణాలు అయిదవ మాసంలో ఏర్పడతాయని ‘’తస్మాత్ పంచమే మాసి గర్భా విక్రియన్తే ‘’అన్నదాని ద్వారా తెలుస్తోంది .
దేవతలకు రాక్షసులకు తాగాదాలు మామూలే కాని ఇందులో దేవతలకు ఋషులకు తగాదాలున్నట్లు చెప్ప బడింది .మనువుపుత్రుడు శార్యావతుడు అనే రుషి యజ్ఞం చేశాడు .భ్రుగు వంశానికి చెందిన చ్యవన మహర్షి సోమ పాత్రను అశ్వినీ దేవతల కోసం హోమం చేయటానికి చేతిలోకి తీసుకొన్నాడు .ఇంద్రుడు మహర్షికి తెలియకుండా ఆ పాత్రను దొంగిలించుకు పారిపోయాడు .ఈ పని చేసింది ఇంద్రుడే అని తెలిసి చ్యవనుడు ఇంద్రుడిని కొట్టాడు .దేవతలకు కోపమొచ్చింది . రుషులకూశువాళ్ళ పై కోపం ఏర్పడింది .దేవతల యజ్ఞాలను ఋషులు ఋషుల యజ్ఞాలను దేవతలు పాడు చేయటానికి సిద్ధ పడ్డారు .ఋషులు దేవతలను ఎదుర్కొని ఓడించటానికి ‘’మదం ‘’అనే పేరుగల రాక్షసుడిని పుట్టించారని ఈ బ్రాహ్మణం కొత్త విషయం తెలియ జేసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
డిం .టిం.ప్ర.జ.-4
డిం –గురూ !ఎండలు పెరుగుతున్నాయేకాని తగ్గటం లేదు ?
టిం –రెండో ఎండాకాలం అంటున్నారందుకనే .బాబు పేరు ఇంగ్లీష్ లో ‘’Chandra babu ‘’అని రాస్తారుకడా .అది ‘’ చండ్ర బాబు ‘’గా కూడా చదువుతాం .కనుక చండ్ర నిప్పులు కక్కుతున్నాడు సూర్యుడు .అందుకే వరుణుడు దగ్గరికొచ్చి కూడా భయం తో పారిపోతున్నాడు .ఇలా ఉంటె ఖరీఫ్ పంటకూడా అనుమానమే .
డిం –నిజమే గురూజీ !
టిం –పాపం బాబు అధికారానికి వచ్చిన ప్రతిసారి ఇలాదురద్రుస్టం వెంటాడటం బాధగానే ఉంది .ఈ సారైనా అన్నీ కలిసోస్తాయనుకొంటే విధి వెక్కి రెక్కిస్తోంది .సమర్ధుడైన నాయకుడికి దేవుడు పరీక్క్షలు పెడుతూ పరిశీలిస్తున్నాడు .లెట్ అస్ హోప్ బెటర్ .
డిం –ఈ మధ్య బాబు మోడీ ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతున్నాడు?
టిం –అంటే నక్షత్రకుడిలా వెంట పడుతున్నడనే గా నీ భావం ? తప్పదు నాయనా !రాష్ట్రం బాగు పడాలంటే ఇలా వెంటపడి కంటపడి పని సాధించుకోవాల్సిందే .రాకెట్ లాంచింగ్ కు ముందు రోజునా ,రాకెట్ ప్రయోగానికి కాసేపు ముందూ మోడీని రెండు సార్లు కలిసి చేయాల్సిన పని లిస్టు తో మోదీ ని బాది పారేశాడు బాబు .
డిం –శ్రీహరి కోట రాకెట్ విజయమైంది కదా గురూ !
టిం –అవున్రా శిష్యా !అక్కడ మోడీ మాట్లాడిన మాటలు ఎంతో స్పూర్తి నిచ్చేవిగా దార్శనికం గా ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి .అ హాలీ వుడ్ సినిమా ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే చంద్రయాన్ కు మనం నాలుగొందల యాభై కోట్లే ఖర్చు చేశామని గుర్తు చేసి వెన్ను తట్టాడు శాస్త్ర వేత్తలను .అంతేకాదు సార్క్ దేశాల అవసరాలకు తగిన రాకెట్ ప్రయోగం చేయమని గొప్ప సూచనా చేశాడు .బహుశా తోలి ప్రధాని నెహ్రు తర్వాత ఇంత ఆలోచన చూపిన వాడు మోడీ అని పించాడు .జియో పొజిషన్ ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంటె దాన్ని సార్క్ చేతుల్లోకి తీసుకొవాల్సిన అవసరాన్ని చెప్పిన ప్రాజ్నుడని పించాడు .అదే దేశానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు .హాట్స్ ఆఫ్ టు మోడీ .
డిం –గురూజీ ఏదో మూడ్ లోకి వెళ్లి పోయారు ?
టిం –నిజమేరా మంచి చేస్తే మెచ్చాలి .చెడు చేస్తే బుద్ధి చెప్పాలి .అందుకే ముసలాయన ఆద్వాని ‘’మొదటి టెస్ట్ లోనే మోడీ ట్రిపుల్ సెంచరి సాధించాడు ‘’అని మెచ్చాడు .
డిం –నిన్న మమత ఎంపి ఏదో ప్రేలాడట ?
టిం –అవును .మార్క్సిస్ట్ పార్టీ ఆడవాళ్ళను రేప్ చేయిస్తానన్నాడు తపన్ పాల్ .ఇంకా అలా మాట్లాడిన వాడిపై చర్య తీసుకోకుండా ఉంచటం మమత కు మంచిది కాదు .చివరికి ఆయన భార్యే క్షమాపణ చెప్పింది భర్త తరఫున .ఇప్పటికైనా మమత తీవ్ర చర్య తీసుకోక పోతే పరువు కలకత్తా కాళికి బలి అయి పోతుందని గుర్తించాలి .ఇప్పుడే విన్న వార్త .ఏదో మొక్కు బడిగా క్షమాపణ చెప్పాడట ఆ ప్రబుద్ధుడు .
డిం –విప్పుల విషయం లో కొప్పులు పట్టుకొంటున్నారు నాయకులు ?
టిం –అవును .జగన్ పార్టీ వాళ్ళు ధిక్కరించి ఓటేస్తే అనర్హత వేటు పడుతుందని మైసూరా అంటూంటే అదేమీ ఉండదు హాయిగా గోడ దూకేయండి అని తెలుగు సోమిరెడ్డి అభయం ఇస్తున్నాడు .ఏది ఏమైనా ఈ కప్పల తక్కెడ తూకం కొద్దికాలం తప్పదు .స్వార్ధం యెంత పనైనా చేయిస్తుంది .
డిం –డిగ్గీ ఈ మధ్యేదో వాగి లేమ్పలేసుకొన్నాడు?
టిం –అది ఆయనకు మామూలే .రాహుల్ కు దమ్ములేదని నాయకత్వ లక్షణాలు పూజ్యం అని ,పార్టీ దారుణ వైఫల్యం పొందటానికి అతనే కారణమనీ కూశాడు .కాని వెంటనే ప్లేట్ మార్చేసి తాను అలా అనలేదని పేపర్ వాళ్ళ సృష్టే అని దబాయించాడు .శాంతం పాపం అని లేమ్పలేసుకొన్నాడు .ఏమైనా తాగిన వాడు నిజం బాగా చెబుతాడు అన్నట్లు డిగ్గీ నిజాన్ని నిర్భయం గా బైట పెట్టాడు .
డిం –షార్ లో మోడీ హుషార్ అన్నారు ?
టిం –ఇరవై ఆరుసార్లు విజయవంతం గా ప్రయోగం చేసన సంస్థను చూస్తె ఎవరికైనా అంత హుషార్ వస్తుంది ప్రధాని మంచివిషయానికి సహజ స్పందనే అది .శాస్త్ర సాంకేతిక వేత్తల ఉమ్మడి కృషి ఫలితమే ఇది .అంతా స్వంత పరికరాల విజ్ఞానం తో సాధించిన అద్భుత విజయమే కదా .అందుకే అంత ఆనందపడ్డాడు ప్రధాని మోడీ .అయినా ‘’ఇది నా మనసుకు చాలటం లేదు ‘’అని చెప్పి మార్గ నిర్దేశామూ చేశాడు .ఇన్నాళ్ళకు దేశ భవిష్యత్తు ఒక ప్రాజ్నుడి చేతిలో దూర ద్రుష్టి ఉన్న వాడి చేతిలోకి వచ్చినందుకు మనం గర్వ పడాలి శుభం భూయాత్ .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు
సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )
వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని ఉత్తి చేతులతోదర్శించటానికి భయపడి నిస్పృహతో ప్రాయోప వేశం చేస్తున్న వానరులకు మార్గ దర్శనం చేసి జటాయువు సాయపడ్డాడు .ఈ వివరాలను వాల్మీకి మహర్షి కిష్కింద కాండలో వర్ణించాడు .
సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తీ అయి అతనికి భయపడి బాబాయిని నానా మాటలు అంటాడు అంగదుడు .వానర సైన్యాన్ని పెడమార్గం పట్టించి ,సుగ్రీవునికి ఎదురు నిలిచేలా చేలని మనసులో ఆలోచనా చేశాడు .ఈవిషయం సూక్ష్మగ్రాహి అయిన హనుమ గ్రహించాడు . అంగ దుడికి నయానా భయానా చెప్పి తప్పు మార్గం లో నడవద్దని హెచ్చరించాడు .వానరులెవరూ అతన్ని అనుసరించరని గట్టిగానే చెప్పాడు .ఇవన్నీ యువరాజు మనసు మార్చలేక పోయాయి .పిన తండ్రి కి స్థైర్యం పారిశుధ్యం ,సౌమ్యత ,సౌజన్యం ,సామర్ధ్యం వంటి సద్గుణాలు లేవన్నాడు అంగదుడు .తల్లిలాంటి వదిన తార తో కాపురం చేసిన వాడికి ధర్మం ఏమి తెలుసన్నాడు .రామ కార్యం లో ఆలస్యం చేసిన సోమరికి కార్య శూరత్వం తెలీదన్నాడు .ధర్మానికంటే లకష్మణుడి కోపానికి భయపడి సీతాన్వేషణకు వానరుల్ని పంపాడని ,తనకు పట్టం కట్టడని చెప్పి కిష్కింద కు రానని భీష్మించాడు .తనకోసం తల్లి తార విలపిస్తూ ఉంటుందని గుర్తు చేసుకొని దర్భలు పరచి ఆమరణ నిరాహార దీక్ష కు పూను కొన్నాడు .హనుమ అంతకు ముందే వానరుల్ని యువరాజుకు సాయం చెయ్యద్దని చెప్పినా కొద్దిమంది అంగదుడి తో పాటు నిరాహార దీక్షకు కూర్చున్నారు.ఊరికే కూర్చోక జరిగిన విషయాలు అంటే శ్రీరామ వన వాసం ,సీతాపహరణం ,జటాయువధ విషయాలను ఏడుస్తూ పాటల్లాగా పాడుకొంటున్నారు .బిగ్గ్గరగా కేకలు పెడుతున్నారు .ఆర్త నాదాలు చేస్తున్నారు .
ఈ ఆర్తనాదాలు అక్కడే పర్వత గుహలో ఉన్న సంపాతికి వినిపించాయి .అందులే తన తమ్ముడు జటాయువు పేరుకూడా వినపడటం తో మరీ కంగారు పడ్డాడు .అసలే ముసలితనం రెక్కలు తెగి పోయాయి.ఆహర సంపాదన లేక చిక్కాడు .ఇంతమందిని చూడగానే మంచి ఆహారం చాలా రోజులకు సరిపడ్డ ఆహారం దొరికిన్దికదా అని సంబర పడ్డాడు .సంపాతి పక్షి అక్కడ ఉండి తీక్ష్ణ దృష్టితో తమల్ని గమనించటం అంగదుడు చూశాడు .కిష్కింధకు వెళ్ళలేడు ,రామ కార్యం సాధించానూ లేడు ఇప్పుడు ఈ పక్షికి బలికావలసి వస్తుందేమోనని భయపడి హనుమకు చెప్పాడు .తమ్ముడు జటాయువు రావణుడి చేతిలో చంపబద్దాడని విని వివరం తెలుసు కొందామనుకోన్నాడు కాని కదల లేడు మెదల లేడు .కిందికి దిగలేకపోయాడు .జటాయు వృత్తాంతం తెలుసుకోవాలని ఉన్న తనను దింపమని వేడుకొంటాడు .రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వేరవటం దేనికి అని అంగదుడు సంపాతిని వానర సాయం తో కిందికి దింపుతారు .
వానరుల వల్ల తానూ బతికుండగానే తన తమ్ముడు చని పోయిన వార్త విని తల్లడిల్లాడు .ముసలితనం వలన తానేమీ పోరాడలేనని వాక్కు సాయం మాత్రం చేస్తానని వారికి చెప్పాడు .రావణుడుడు ఉండే చోటు చెబితే చాలు అన్నాడు అంగదుడు .తన కధను చెప్పుకొస్తాడు సంపాతి .పూర్వం తమ్ముడు జటాయువుతోకలిసి స్వర్గానికి వెళ్తాడు తిరిగి వస్తుంటే సూర్య కిరాణ తాపం బాగా హెచ్చుగా ఉంటె తమ్ముడు తట్టుకోలేక అల్లల్లాడుతుంటే తాన రెక్కల కింద అతడిని ఉంచుకొని కాపాడాడు దానితో ఆ సూర్య ప్రతాపానికి సంపాతి రెక్కలు కాలిపోయాయి . సంపాతి వింధ్య పర్వతం పైన పడిపోతే ,జటాయువు జనస్థానం లో పడిపోయాడు .అప్పటినుంచి ఒకరి సంగతి మరొకరికి తెలియదు .కాని సంపాతికి దూర దర్శన శక్తి మాత్రం ఉంది .ఆ విషయాన్ని వివరిస్తాడు .ఆకాశం లో అనేక మార్గాలున్నాయని ,పిచ్చుకలు ,పావురాళ్ళు మొదటి వలయం లోనే సంచరిస్తాయని తర్వాత కాకులు ఆ తర్వాత ,క్రౌంచ పక్షులు ఆ తర్వాత ,డేగలు ,తర్వాతా గద్దలు తర్వాతా హంసలు ,అన్నిటికంటే పైన వైన తేయులు విహరిస్తాయని ,పక్షులు వైన తేయ సంతతికి చెందినవని ,ఎవరి ఆహరం ఎక్కడ ఉంటె అక్కడికి వాటి ద్రుష్టి ప్రసరిస్తుందని గృధ్ర జాతికి శత యోజనం వరకు చూసే ద్రుష్టిశక్తి ఉందని చెప్పాడు .తేరిపార చూసి లంకలో రావణాసురిడి అశోక వనం లో రాక్ష స స్త్రీల మధ్య సీతా దేవి ఉందని ,శత యోజన విస్తీర్ణ సముద్రం దాటితేనే సీతాదేవి కని పిస్తుందని అనునయంగా చెప్పాడు. అమ్మయ్యా దారి దొరికింది ప్రాణాపాయం తప్పింది అని అందరూ సంతోషపడి క్రుతజ్ఞతలు చెప్పారు .
తన తమ్ముడు జటాయువుకు ధర్మోదకాలివ్వాలనే కోరిక తనకు కలిగిందని సంపాతి అనగానే కృతజ్ఞత గా వానరులు నెమ్మదిగా మోసుకొని వెళ్లి సముద్ర తీరం వద్ద దించారు .తమ్ముడికి ధర్మోదకాలు వదిలిన అన్నను మళ్ళీ మోసుకొని వెళ్లి గుహలో చేరుస్తారు .జాంబవంతుడు సీతాపహరణ వృత్తాంతాన్ని తెలిసి నంత వరకు చెప్పమని సంపాతిని కోరాడు .అప్పుడు సంపాతి తన కొడుకు సుపార్శ్వుడు రావణుడు సీతను ఎత్తుకు పోతుండగా చూశాడని ,అతనితో పోరాటం కూడా చేశాడని ,తనకు రోజూ ఆహారాన్ని కొడుకే సంపాదించి తెచ్చిస్తాడని ఒక రోజు ఆహారం దొరక్క సముద్రం దగ్గరకు వెడితే సీతను ఎత్తుకు పోతున్న రావణుడిని చూశాడని ,వాల్లిద్దరినిఆహారం గా గ్రహించటానికి సిద్ధపడితే రావణుడు దీనం గా బ్రతిమిలాడితే వదిలి పెట్టాడని ,ఆ విషయం తనకు చెప్పగానే కొడుకును కోపగించానని చెప్పాడు .సంపాతి చెప్పిన విషయాలు వానరులలో నిస్తేజాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని కల్గించాయి .సంపాతి చరిత్రను తెలుసుకోవాలని అడిగితే పూస గుచ్చినట్లు వివరించాడు .
వింధ్య పర్వత ప్రాంతం లో ‘’నిశాకరుడు ‘’అనే దివ్య ద్రుష్టి ఉన్న మహర్షి ఉన్నాడని ,ఆయన మహిమతో తనకు రెక్కలూ చూపు రావచ్చుననే ఆశతో ఆయన్ను దర్శించానని తన చూపు పోవటానికి కారణం మహర్షి అడిగితే సవివరం గా చెప్పానని సంపాతి వివరించాడు. మహర్షి దివ్య దృష్టితో చూసి జరుగ బోయే రామ కదను వివరించి ,సీతాన్వేషణ లో ఉన్న వానరులకు వాక్సహాయం చేస్తే మళ్ళీ రెక్కలోస్తాయని చెప్పాడని అన్నాడు .మహర్షి తాను సీతా రామ లక్ష్మణుల వన వాసం ,సీతాపహరణం రావణ ప్రలోభం ,సీత సంయమనం ,దివ్య పాయస భక్షణం ,రామ లక్ష్మణులకు నివేదించిన తర్వాతే తాను ఆరగిస్తానని చెప్పాడు సంపాతికి .తనకున్న తపో బలం తో సంపాతికి అప్పటికప్పుడే రెక్కలు వచ్చేట్లు చేయగలడు కాని రామ కార్యం లో సంపాతికి కూడా సంబంధం కలిగించాలని అలా చేయటం లేదని మహర్షి సంపాతికి వివరించాడు .తనకు కూడా రామ లక్ష్మణులను చూసి తరించాలని ఉన్నా అంతదాకా ప్రాణాలను కాపాడుకోలేనని మహర్షి అంటాడు .కాని తన ప్రభావం వల్ల సంపాతి శరీరం అంతవరకు నిలబడి ఉంటుందని అభయమిస్తాడు .
మహర్షి మాట నమ్మి సంపాతి ఎనిమిది వేల సంవత్సరాలు శరీరాన్ని కాపాడుకొంటూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాని వానరులకు తెలియ జేశాడు .ఇలా సంపాతి తన కధను వివరించి చెప్పుతున్డగానే అతని ఎర్రని రెక్కలు మళ్ళీ మొలుస్తాయి .యెగిరి చూసి సంతోష పడతాడు .ఇది శుభ లక్షణమని సీతాన్వేషణ ఫలి స్తుంది అని చెప్పటానికి కిది నిదర్శనమని భరోసా ఇస్తాడు .కోల్పోయిన పౌరుషం వానరులకు తిరిగి వస్తుంది .కృత నిశ్చయం తో సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు బయల్దేరి వెడతారు .ఇక్కడ ఒక తమాషా సంగతి గమనించాలి .సంపాతి మాట్లాడినంత సేపు హనుమ మౌనం గా ఉండిపోతాడు .ఇది విచిత్రం గా కని పిస్తుంది .మరో విశేషం సంతాపాన్ని సంతోషం గా తాను మార్చుకోవటమేకాకుండా వానరులకూ కలిగించాడు ఆ అను భూతి .అంతకు ముందు స్వయం ప్రభ గుహలోకి ప్రవేశించిన వానరులను స్వయం ప్రభ ఎందుకు వచ్చారని అడిగితే రామ వృత్తాంతాన్ని చెప్పారు వానరులు .అక్కడ ఆమె కూడా ఏమీ ప్రశ్నించకుండా విన్నది .మౌనం లో ఎన్నో అర్ధాలను వెతుక్కో వచ్చని మహర్షి అభిప్రాయమేమో ?
రామ కార్యం లో వానరులతో పాటు పక్షిజాతికి చెందిన అన్న దమ్ములు జటాయువు ,సంపాతి సహకరించటం విశేషం .
ఆధారం –డాక్టర్ ఇలపావులూరి పాండురంగా రావు గారి –అనుదిన రామాయణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు
.
ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )
ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్ కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా శృంగారాన్ని అర్ధం చేసుకొని ,అందులోని అందాన్ని పొందాలని సూచన గా భావిస్తారు .అది మాత్రమె కాదు ముసలితనం లో మానవులు ఆ భావనకు దూరం కావాలని క్రమంగా విసర్జించాలని సూచనా ఉంది .ఖజురాహో దేవాలయాలలో ముఖ్యమైనది శివాలయం .ఈ శృంగార భంగిమల శిల్పాలు అంతరాలయానికి వెలుపల ఉన్న భాగాల పైనే ఉంటాయి .మానవ పునరుత్పత్తికి ఇవి సంకేతాలు .
‘’డివైన్ ఎక్టసి –ది స్టోరి ఆఫ్ ఖజురాహో ‘’అనే పుస్తకం రాసిన శోభితా పుంజా దీన్ని ‘’దైవ పార వశ్యం ‘’(డివైన్ ఎక్స్ట సి )అన్నది ఖజురహో శిల్పాలను చూసి .అది దైవ వివాహానికి ప్రతి రూపాలన్నది .అంటే శివ పార్వతుల వివాహ దర్పణం అని చెప్పింది .శివ రాత్రి నాడు ఈ దేవాలయానికి వేలాది భక్తులోచ్చి దర్శనం చేసుకొని పులకిస్తారు .ఇక్కడున్న అన్నిదేవాలయాలో ఇదొక్కటే శివ పూజకు ఉపయోగిస్తున్న దేవాలయం .మహా శివ రాత్రి నాడు శివ పార్వతీ కల్యాణం ఇక్కడ నిర్వహిస్తారు .హరహర మహా దేవా ఉచ్చారణతో ఆ ప్రాంతమంతా మారు మోగుతుంది .క్రైస్తవ చర్చిలలో కూడా ఆరాధన మానవ జీవితం లాగే ఉండాలని ఉంది .ఖజురహో శివాలయం లో కల్యాణం తరువాత దేవుడికి దేవేరికి గర్భాదాన కార్యక్రమానే పూజారి నిర్వహించటం విశేషం .ఇది తెల్లారే వరకు జరిగే ఉత్సవం .
శోభితా పుంజాచెప్పిన దాన్ని బట్టి ఆది దేవులు జగత్తుకు మాతా పితలు అయిన శివ పార్వతులు జీవిత పరమార్దానికి ప్రతీకలు .విరుద్ధ ప్రకృతుల కలయికలు .మన భాషలో పురుష స్త్రీ సంగమానికి చిహ్నాలు .అవేక్కడో బయట ఉన్నవికావు మానవ అంతరంగం లోఉన్న భావనలే మగా ఆడా .ఖజురహో శిల్పాలు దొంగ చాటుగా చూసేవేమీ కాదు .అవి రాయిలో ఉన్న జీవన ధర్మాలు .శృంగారాన్ని అణచుకో వద్దని చెప్పే సందేశాలు .సెక్స్ సరదాకి ,వినోదానికి కాదని వివరించే విధానాలు .సెక్స్ ప్రధాన మైనదే అని దాన్ని తొసిరాజా అనె పధ్ధతి పనికి రాదనీ వివరించేవి .దాన్ని పవిత్ర భావం తో ఆరాధనగా చేయాలి అనే సందేశం ఇచ్చేవి .
అమెరికా విశ్లేషకుడు రాబర్ట్ ఏ .జాన్సన్ రాసిన ‘’అండర్ స్టాండింగ్ ది సైకాలజీ ఆఫ్ రొమాంటిక్ లవ్ ‘’పుస్తకం లో ‘’the great paradoxes in romantic love is that it never produces human relationship as long as it stays romantic .It produces drama during adventures ,wondrous ,intense love scenes jealousies and betrayals but pe0ple never seem to settle into relationship with each other a flesh and blood human beings until they are out of the romantic love stage ,until they love each other instead of being in love ‘’అని చాలా అర్ధ వంతమైన విషయాలు రాశాడు . రొమాంటిక్ ప్రేమను విసర్జించమని దీని భావం మాత్రం కాదు .అది మనం చేయలేం .మన వల్లకాదు కూడా .శివ పార్వతుల పురాణకధలు కూడా దీనినే సూచిస్తాయని మరువ రాదు .శివ పార్వతులు కోరికకు వ్యతిరేకులు కారు .దాని ప్రాధాన్యాన్ని కాదనీ అనలేదు .కాముడనే పేరున్న మన్మధుడు తపస్సు చేసుకొంటున్న శివుని చలింప చేయటానికి బాణం వేస్తె శివుడు మూడో కంటితో భస్మం చేశాడు .కాని శివపార్వతుల కల్యాణం తర్వాత పార్వతి కోరిక మేరకు మన్మధు డిని సృస్తికార్యం ఆగి పోరాదని భావించి బతికించాడు .ఇక్కడే భారతీయులు పవిత్ర తకు ఇంద్రియ భోగానికి మధ్య సమతుల్య్తః సాధించారు .అదే ఆదర్శం గా ఖజురహో లో చెప్పారు .
రజనీష్ కూడా సెక్స్ జ్ఞాన వృద్ధి కి మార్గం అన్నాడు .ఇండియాలోని తాంత్రిక విధానాలను పాశ్చాత్యులు తప్పుగా అర్ధం చేసుకొన్నారు . తాంత్రికుల ఆవాసం శ్మశానమే .అది చావును ఎప్పుడూ గుర్తు చేస్తుందని వారి విశ్వాసం .తాంత్రికం లో భయాన్ని జయించే చర్యలే ఉంటాయి .చావు ఉన్నతికి ఒక మార్గమని నమ్ముతారు.తాను భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉంటానని తాంత్రికుని విశ్వాసం .మురికి ,కాలుష్యం లపై భయాన్ని తొలగించటం .వీరి ప్రవర్తన ,పద్ధతులు హిందువులకు అంగీకారం కాదు .పాశ్చాత్య దేశాలలో మారుమూల గ్రామాల్లో ఇంకా సెక్స్ అంటే భయపడుతూనే ఉన్నారు .కొందరు దాన్ని అధిగమించి ముందుకు రాలేక పోవటమూ ఉంది .కాని సెక్స్ అనేది భయపడాల్సింది కాదు .అది ఆత్మ సాక్షికి శుద్ధ స్వరూపం .మెరుపు లోని కాంతి వంటిది .సృష్టికి కారణమైన ఇద్దరి మధ్యా ఉన్న తామర తూడు దారం లాఉన్న సంబంధం .
‘’ఇంటిమేట్ రిలేషన్స్ ‘’పుస్తకం లో సుదీర్ కాకర్ సెక్స్ అనేది అందులో పాల్గొన్న ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఆన్నాడు .కొందమంది స్త్రీలకూ అది అయిష్టం గా బాధాకరం గా అనిపించ వచ్చు కొందరు స్త్రీలు భర్త కొడతాడేమో నని అయిస్ట మైనా అందులో పాల్గొన్నా సంతృప్తి పొందారు. ఇది మరీ మురికి వాడలలోని దంపతుల పరిస్తితి .మర్మాంగాల పేర్లు చెప్పటానికే సిగ్గూ బిడియం పడతారు .పూర్వం ఇండియా లో బహి రంగా ముద్దు నిషిద్ధం .ఇప్పుడు కాస్త స్వేచ్చ వచ్చింది .ఇంద్రియ సుఖం లో మనవాళ్ళు పవిత్రతను ఆశించారు .ఒకప్పుడు కండోం లను వ్యతిరేకించిన వారు ఇప్పుడు దారి లోకి వచ్చారు .గాంధి గారు ఇంద్రియ నిగ్రహం పై ఎన్నో ప్రయోగాలు చేశాడు కొన్ని విమర్శలోచ్చినా ఆయన అంతస్సాక్షిని శంకించ లేము. .రామాయణం లో సీత ఒక బలహీన ఆబల అని కొందరి భావన .కాని పార్వతి అలా కాదు శక్తి శ్వరూపిణి.
శివుడు శక్తి లేనిదే ఏ పనీ చేయలేడు ఆశక్తియే పార్వతీ దేవి .వారిద్దరూ ఒకే నాణానికిబొమ్మా బొరుసు వంటి వారు .ఇ .ఒకరు లేక పోతే ఇంకొరు లేరు .కనుక పార్వతి మహిళలకే ప్రతీక మాత్రమె కాదు ,ఆమె పురుషునికీ ప్రతేకయే వారిద్దరిది అర్ధనారీశ్వర సంబంధం అని మర్చి పోరాడు .పాశ్చాత్య దేశాలలో దేవుడంటే పురుషుడిగానే చూపిస్తారు .చర్చిలలో ఫాదర్స్ ఉంటారుకాని మదర్స్ ఉండరు .కాని ఎందరో క్రిస్టియన్ పౌరాణిక మహిళలు ఉన్నా ,మహిళా క్రిస్టియన్ మతాధికారులు ఇటీవలి కాలం వరకు లేరు .ప్లాటో నుండి అరిస్టాటిల్ వరకుఫిలాసఫర్ లలో ఆడవాళ్ళు కు స్థానమే లేదు .బెర్ట్రాండ్ రసెల్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ వేస్త్రెన్ ఫిలాసఫీ ‘’పుస్తకం లో ఒక్క మహిళ పేరు కూడా లేక పోవటం బాధ కలిగిస్తుంది .’’ది పాషన్ ఆఫ్ దివేస్త్రెన్ మైండ్ ‘’లో రిచార్డ్ టర్నాస్’masculinity of thought as fundamental to the women struggle to establish our human autonomy from nature .The evolution of the western mind has been driven by a heroic impulse to forget an autonomous rational human self by separating itself from the primordial unity with nature ‘’అని రాశాడు .ఇటీవలి కాలం లో మగాడు ‘’మ్రుగాడు ‘’గా మారి ప్రవర్తిస్తున్న తీరు ఏక పక్షం గా మగాడు తీసుకొనే నిర్ణయాలను ఎత్తి చూపాడు .ఇవన్నీ ఆలోచిస్తే మనం ఖజురహో- శివ పార్వతుల లోక కల్యాణానికి ఒక ప్రతీకాత్మక ప్రత్యెక నిదర్శనమని తెలుస్తోంది .మహిళకు మగవాడికి భావాత్మక సమతుల్యాన్ని పరస్పర గౌరవాన్ని ఖజురహో దేవాలయాలు సందేశం గా తెలియ జేస్తున్నాయి .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూ

అదొక సరస్వతీనిలయం. నిజాం రాజుల మీద, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయాలన్న ఉన్నత ఆశయంతో ఊపిరిపోసుకున్న ట్రస్ట్ ‘గురుకుల్’. ఎంతోమంది దాతల ఔన్నత్యంతో బన్సీలాల్‌వ్యాస్ ఆ ట్రస్టును విద్యాలయంగా నెలకొల్పారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసులు అష్టకష్టాలతో బతుకుతున్నారు. వారి కుటుంబీకులలో ఒకరైన స్నిగ్ధావ్యాస్.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌లో కేవలం అయిదువేల జీతంతో పనిచేస్తున్నారిప్పుడు. వేలకోట్ల రూపాయల విలువ చేసే ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమైపోవడం, కొన్నింటిని గత ప్రభుత్వాలు అమ్ముకోవడం.. వీటన్నిటిమీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టడంతో.. మరోసారి ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్నిగ్దావ్యాస్ మాట్లాడారు..
పూర్వం మాది కోల్‌కతా. నాన్న పేరు హరిప్రసాద్ పండిట్. నేను అక్కడే పుట్టి పెరిగాను. మా అన్నయ్య బట్టలషాపు నడిపేందుకు హైదరాబాదుకు వలస వచ్చాడు. అప్పట్లో మాదేమీ ఉన్నోళ్ల కుటుంబం కాదు. ఉన్నంత వరకు బాగానే ఉండేవాళ్లం. మా అన్నయ్య హైదరాబాదులో ఉన్నందున నేను కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది. మేము బ్రాహ్మణులం. సంప్రదాయ పద్ధతులను పాటించేవాళ్లం. అలాంటి గౌరవ కుటుంబీకులకే నన్నిచ్చి పెళ్లిచేయాలని మా కుటుంబీకులు భావించేవారు. చుట్టాల ద్వారా సంబంధం వెతుకుతున్నప్పుడు బన్సీలాల్ కుటుంబం గురించి తెలిసింది. బన్సీలాల్, జానకీదేవిలకు ఒక కొడుకు, మరో కూతురు. కొడుకైన దేవేంద్రనాథ్‌కు ఇద్దరు కొడుకులు సురేంద్రనాథ్, రవీంధ్రనాథ్. వాళ్లలో రెండో అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి అయ్యాక వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం గొప్పతనం గురించి తెలిసింది. దేశానికి ఎంతో సేవ చేయాలన్న ఉత్తమ ఆశయంతో బన్సీలాల్ అప్పట్లో గురుకుల్ నెలకొల్పారు. అందుకు స్పందించిన కొందరు దాతలు భూముల్ని దానం చేశారు. నాకు తెలిసినంత వరకు మా పెద్దలు చెప్పిన సమాచారం మేరకు – నిజాం రాజులు, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయడం గురుకుల్ లక్ష్యమట. అప్పట్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా.. బన్సీలాల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. చదువుతోపాటు వ్యక్తిత్వ నిర్మాణంలోను గురుకుల్ కృషి ఆదర్శనీయం.
జీతాలకే దిక్కులేదు..
గురుకుల్ ట్రస్టు కింద ఎన్ని వందల ఎకరాల భూమి ఉందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌ట్రస్ట్‌ను మాత్రం ఆర్థికసంక్షోభాలతోనే నడుపుతున్నాము. నా భర్త కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయాడు. నేనిప్పుడు ఒక్కదాన్నే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలేతై వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ఒకరు మద్రాసులో మరొకరు రాజస్థాన్‌లో ఉంటున్నారిప్పుడు. అందమైన భవనాలు నిత్యయఙ్ఞంతో ప్రత్యేక హాస్టల్ వసతి గల ఈ విద్యాలయాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదొక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం లాభం! మా పరిస్థితి మారలేదు. వందల ఎకరాల ఆస్తులను గురుకుల్ అభివృద్ది కోసమే కేటాయించాలన్నది నా అభిప్రాయం. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ మాతృసంస్థ అయిన గురుకుల్‌కు పైసా చెల్లించడం లేదు. జిల్లాలోనే ఏకైక ఎయిడెడ్ కళాశాలగా ఉన్న గురుకుల్ కళాశాలలో పోస్టులను భర్తీ చేయలేదు. ట్రస్టులో మా మామగారి తల్లి జానకీదేవి, బి.కిషన్‌లాల్‌లు సభ్యులుగా ఉండేవారు. అప్పుడు గురుకుల్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. ఆ తర్వాత ఎండోమెంటు పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మాలాంటి వాళ్లం ఏమీ చేయలేక బాధపడుతూ కూర్చున్నాం.
గురుకుల్ అభివృద్ధిని ఎండోమెంట్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకుల్‌ను ట్రస్టులోనే కొనసాగించాలి. సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నప్పటికీ చాక్‌పీసుల కోసం, కనీస అవసరాల కోసం దాతలను అభ్యర్ధించాల్సి వస్తోంది. గురుకుల్‌లో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వమే విద్యను అందించే ఏర్పాట్లు చేస్తే మంచిది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇటు హైదరాబాద్‌కు దగ్గర్లోని ఘట్‌కేసర్, కీసర, బీబీనగర్, ఉప్పల్ మండలాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాకు వేతనాల వరకు అయితే – గత ఆరేళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ ట్రస్టు ద్వారా అందుతున్నాయి..” అని ముగించారు స్నిగ్ధావ్యాస్.
సాధారణంగా కళాఖండాలుగా పేరొందిన చిత్రాలు ఆర్ధిక విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఆర్థికంగా విజయం సాధించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం కూడా అరుదే. అయితే కళని, కాసుని కలగలపి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో కదిరి వెంకటరెడ్డి(కె.వి.రెడ్డి)స్థానం చాలా ప్రత్యేకం. ‘భక్త పోతన’.’యోగి వేమన’ వంటి చిత్రాలను తీసిన ఆయనే ఆ తరువాత ‘పాతాళభైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి అద్భుతజానపదాలను, ‘మాయాబజార్’ వంటి ఆణిముత్యాన్ని ప్రేక్షకులకు అందించారు. వినోదభరిత చిత్రాలతో పాటు ‘పెద్దమనుషులు’ వంటి ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలూ తీశారు. ‘దొంగరాముడు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’ వంటి అద్భుత సాంఘిక చిత్రాలు రూపొందించారు. 35 ఏళ్ల సుదీర్ఘమైన తన చలనచిత్రజీవితంలో ఆయన తెలుగులో 14, తమిళంలో 3, హిందీలో ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ప్రతి సినిమా దర్శకత్వశాఖలో కొత్తగా ప్రవేశించేవారికి ఒక పాఠ్యాంశమే. ఆయన పద్ధతుల్ని చాలా మంది అనుసరించారు కానీ ఆయన మాత్రం ఎవరినీ అనుసరించలేదు, అనుకరించలేదు.
కె.వి.రెడ్డి పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే చిత్రం ‘మాయాబజార్’. జనబాహుళ్యంలో ఉన్న కథను ఆ చిత్రంలో ‘స్ట్రెయిట్ నేరేషన్’లో ఆయన చెప్పారు. అయితే అందులో ‘హైడ్ అండ్ సీక్’ పద్ధతిలో పాండవుల ప్రస్థావన మొదటి నుంచీ వస్తున్నా, వారు తెరపై ఎక్కడా కనిపించని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శక దిగ్గజం కేవీ. ఈ విధానం ఏకపాత్రాభినయాల్లోనూ, స్త్రీ పాత్రలేని నాటకాల్లోనూ సుపరిచితమే అయినా, తెరపై దానిని అద్భుతంగా పర డించిన తీరు నేటికీ ఆకట్టుకుంటుంది. నేటి మేటి దర్శకులుగా కీర్తిగడించిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జార్జ్ లూకాస్ వంటివారు జపాన్ దర్శకుడు అకిరా కురసోవా తెరకెక్కించిన ‘వైప్ షాట్స్’ను వేనోళ్ళ కీర్తించారు. లూకాస్ తన ‘స్టార్ వార్స్’ చిత్రాల్లో వైప్ షాట్స్ రూపొందడానికి అకిరా ప్రభావమే కారణమని చెబుతారు. దాదాపు కురసోవా కాలంలోనే ‘పాతాళభైరవి’ (1951)లోనూ, ఈ ‘మాయాబజార్’లోనూ కేవీ అనుసరించిన ‘వైప్ షాట్స్’ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు అని ఈ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అంత గొప్ప దర్శకుడు కేవీ. అలాగే ఈ చిత్రంతోనే ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణునిగా ఆవిష్కరించిన ఘనత కూడా ఆయనదే.
ఇవాళ్టి రోజుల్లో షాట్ పూర్తి కాగానే ఆర్టిస్టులు ఫ్లోర్ బయటకి వెళ్లి బాతాఖానీ ప్రారంభిస్తుంటారు. లేదా కార్‌వాన్‌లో వెళ్లి కూర్చుంటారు. కానీ దర్శకుడు కె.వి.రెడ్డి పద్దతి అదికాదు. ఆర్టిస్ట్ సెట్ బయటకు వెళ్లడానికి ఆయన ఒప్పుకొనేవారు కాదు. పని ఉన్నా లేకపోయినా షూటింగ్ చూస్తూ అలా కూర్చోవలసిందే. అలాగే సెట్లో గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు. తనకు ఇబ్బందిగా అనిపిస్తే ‘ఏమా ఫిష్ మార్కెట్’ అనేవారు. అది కేవీ ఊతపదం. ఆయన షూటింగ్స్‌కు విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. పాత్రికేయులకు కూడా ప్రవేశం ఉండేదికాదు. మరీ తప్పనిసరి అయితే ముగ్గురో, నలుగురో విజిటర్స్‌కి సెట్‌లోకి అనుమతి లభించేది. వాళ్లయినా పది నిముషాల సేపు షూటింగ్ చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోవాలి.
ఆయన చాలా డిసిప్లిన్ కలిగిన దర్శకుడు. పరిశ్రమలో ఆయన తరువాత అంత క్రమశిక్షణని పాటించే వ్యక్తిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకొన్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే మేకప్‌తో సహా ఆర్టిస్టులు సెట్‌లో ఉండేవారు. లేకపోతే కేవీ ఏమన్నా అంటారేమోనని పెద్దపెద్ద ఆర్టిస్టులు సైతం హడలిపోయేవారు. అదే పద్ధతిని దర్శకునిగా ఎన్టీఆర్ కూడా ఫాలో అయ్యేవారు. తను దర్శకుడు కావడానికి ప్రేరణ కె.వి.రెడ్డి అని ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ వెల్లడించారు.( మరో విషయమేమిటంటే కేవీ రెడ్డి శిష్యులు చిత్రపరిశ్రమలో ఎందరో ఉనా ్న అవసరమైన సమయంలో ఆయన్ని ఆర్థికంగా ఆదుకొని గురుదక్షిణ చెల్లించిన ఏకైక శిష్యుడు ఎన్టీఆర్. ‘శ్రీకృష్ణ సత్య’ చిత్రాన్ని కేవీ దర్శకత్వంలో నిర్మించారు ఎన్టీఆర్. ‘ఉమాచండీగౌరీశంకరుల కథ’, ‘సత్యహరిశ్చంద్ర’ అపజయంతో ‘ప్లాప్ చిత్రాలతో తన కెరీర్ పూర్తవుతుందేమోననే ఆందోళన చెందిన కేవీకి ఊరట కలిగిస్తూ ఎన్టీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం ఆయనకి ఎంతో మానసిక బలాన్ని ఇచ్చింది. ‘శ్రీకృష్ణ సత్య’ హిట్‌తో ఆయన సంతృప్తిగా తన వృత్తికి గుడ్‌బై చెప్పారు. ఆ సినిమా విడుదలైన కొద్ది కాలానికే కేవీ కన్నుమూశారు.)
ఒక సినిమా పూర్తయిన తరువాతే మరో సినిమా గురించి కేవీ ఆలోచించేవారు. తను ఎన్నుకొన్న కథని ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పడం కేవీ స్క్రీన్‌ప్లేలో ప్రత్యేకత. నేల క్లాసు ప్రేక్షకుడికి పూర్తి వినోదం ఎలా అందించాలా అనే ఆయన ఆలోచించేవారు.
కె.వి.రెడ్డి క్రమశిక్షణ, కార్యదక్షత ఈ కాలం వారికి చాదస్తంగా అనిపించవచ్చు. అవసరానికంటే ఎక్కువగా షాట్స్ తీసేసి సినిమాలో ఏ షాట్ ఉంచాలో ఏది తీసెయ్యాలో తెలీక ఎడిటింగ్ రూమ్‌లో తికమక పడే దర్శకులు కె.వి. రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే సినిమాని ఎన్ని అడుగుల్లో తీయాలో ముందే పక్కాగా అనుకొని దానికి తగ్గట్లుగానే సినిమాలు తీసిన దర్శకుడాయన. స్క్రిప్ట్ రీడింగ్ సమయంలోనే ఏ షాట్ నిడివి ఎంత ఉండాలో అనుకొని అంత నిడివిలో తీసిన ఏకైక దర్శకుడు కె.వి.రెడ్డి.
ఆయన సీన్ మొత్తం వివరించి నటించమని చెప్పేవారు. రెండు మూడు రకాలుగా ఆర్టిస్టులు చేసి చూపించేవారు. అవీ నచ్చకపోతే మరోలా చెయ్యమని చెప్పేవారు తప్పితే ఇలా చేయాలని నటించి చూపించే అలవాటు ఆయనకుండేది కాదు. ఇలాగే చేయండని నటించి చూపించకుండా నటీనటులకే స్వేచ్ఛ ఇచ్చి వారి నుంచి తను అనుకొన్న ఎఫెక్ట్ రాబట్టుకొనేవారు కేవీ.
దర్శకునిగా మారడానికి ముందు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవంతో తను ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా దానికి సంబంధించిన బడ్జెట్, ప్లానింగ్ అంతా కేవీ తయారు చేసేవారు. పాత్రకు తగిన ఆర్టిస్టులను నిర్ణయించడం, వారితో పారితోషిక వివరాలు మాట్లాడటం ఆయనే చేసేవారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే షూటింగ్ సమయంలో తనని, నిర్మాతని ఇబ్బంది పెట్టని నటీన టులను, సాంకేతికనిపుణులను ఆయన జాగ్రత్తగా ఎన్నుకొనేవారు. ‘నాకు సహకరించిన జీనియస్ కంటే సహకరించే సామాన్యమైన వారు చాలు బ్రదర్’ అనేవారట ఆయన.
అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. భారీ తారాగణంతో రూపుదిద్దుకొన్న ‘మాయాబజార్’ చిత్రం అనుకొన్న బడ్జెట్‌లో పూర్తికాదేమో అనే భయంతో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మధ్యలో షూటింగ్ ఆపేస్తే, తను చెప్పిన బడ్జెట్‌కు ఒక్క రూపాయి ఎక్కువైనా దాన్ని తనే భరిస్తానని వారికి అభయం ఇచ్చి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు కె.వి.రెడ్డి. తెలుగుజాతి గర్వించే చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకునిగా ప్రేక్షకుల హృదయాల్లో కె.వి.రెడ్డి స్థానం ఎప్పటికీ పదిలం. అయితే ప్రభుత్వమే ఆనాడు ఆయన్ని గుర్తించలేదు. ఏ అవార్డుతోనూ సత్కరించలేదు. (నేడు కె.వి.రెడ్డి జయంతి)
బ్రాహ్మణాల కదా కమామీషు -11
శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు
శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల యజ్ఞయాగాదుల గురించి వివరణ ఉంది .ఇందులో రాజసూయ యాగం గురించి సంపూర్ణం గా ఉంది .
రాజ సూయ యాగం
రాజ్యాధికారానికి వచ్చిన రాజు రాజసూయ యాగం చేయాలి. దీని వల్లరాజు ప్రతిష్ట పెరగటమేకాక పవిత్రత కూడా పెరుగుతుంది .ఇందులో 6 సోమయాగాలు ,2పశు యాగాలు ,129ఇష్టులు ఉంటాయి ఏడు దర్వీ హోమాలతో పద్నాలుగు నెలల్లో పూర్తవుతుంది .ఫాల్గుణ శుక్ల పాడ్యమి నాడు రాజసూయాన్ని ప్రారంభిస్తారు .అభిషేక సంస్కారం చేసి ఆరు యాగాలు చేసి ,అభిషేచనీయ మనే సోమ యాగం తో మధ్యాహ్న సవనం ,ప్రధాన ఆహుతి చేసిన తర్వాత బ్రహ్మ గారు రాజు చేయి పట్టుకొని సభ్యులకు ,ప్రజలకు ఇతడు రాజు అని పరిచయం చేస్తాడు .తరువాత అభిషేకం జరుగుతుంది .సముద్రం నది ,సరస్సు ,సెలయేరు మొదలైన పదహారు పుణ్య తీర్ధాలలో ని పవిత్ర జలాన్ని సేకరించి ఇరుగు నెయ్యి ,పాలు తేనే మొదలైన పంచాగవ్యాలను కలిపి రాజును అభి షెకిస్తారు .దీనికి మేడి పాత్రను ఉపయోగిస్తారు .
విల్లు బాణం పట్టుకొని రాజు పులి తోలు పరచిన మేడిసింహాసనం పై ఆహవనీయాగ్ని దగ్గర కూర్చుంటాడు .ఆరు పార్ధ హోమాలు చేస్తారు .మహేంద్ర స్తోత్రాన్ని ఉద్గాత పఠిస్తాడు .అధ్వర్యుడు బ్రహ్మా ,హోత ,ఉద్గాత రాజు చుట్టూ నిలుచుని పవిత్ర జలాలతో అభిషేకిస్తారు .తర్వాత రాజు నూతన వస్త్రాలు ధరిస్తాడు ..మళ్ళీ ఆరు పార్ధ హోమాలు చేస్తారు అందులో ‘’రత్నినాం హవీ షింఛి ‘’అనే పన్నెండు ఇష్టులు చేస్తారు .ఈ కార్యక్రమం వలననే రాజ ఉద్యోగులకు రత్నిన్ అంటే రత్నాలు అనే పేరొచ్చింది . వీరే పురోహిత ,సూత ,సంగ్రహీత్రు ,అక్షావాప ,క్షత్రి ,గోణికర్తన ,పాలాగల ,తక్షన్ ,రధకార మొదలైన వారు .
రాజు మూడు గుర్రాలు ఇద్దరు అంగ రక్షకులు గల రధాన్ని ఎక్కి ఒక వీరుడితో ద్వంద్వ యుద్ధం చేసి జయిస్తాడు .పరిహాసానికి తన బంధువులకు చెందిన గో సమూహం మీదకు దండెత్తి ,జయించి ,కొంత దనం రాజ్య భాగం వారికి ప్రతి ఫలం గాఇస్తాడు .తర్వాత అధ్వర్యుని తో పాచిక లాడుతాడు .ఇందులో పందెం ఆవు .దాన్నీ జయిస్తాడు .సోమయాగం తర్వాత శునస్షేఫుని వృత్తాంతాన్ని రాజు పఠిస్తాడు..మర్నాటి నుంచి పది రోజులు ‘’సంసృపాం హవీం షి ‘’అనే పది ఇష్టులు చేస్తారు .పదకొండవ రోజు ‘’దశ పేయం ‘’చేస్తారు ఈ సోమయాగం లో పది చమనలు అంటే పాత్రలు ఉపయోగిస్తారు .పది మంది ఋత్విక్కులు పాల్గొంటారు అందుకే దశపేయం అయింది . ‘’కేశవా నీయ ‘’అనే సోమయాగం ఒక ఏడాది తర్వాత చేస్తారు .తర్వాత వ్యుస్టిద్విరాత్ర ,క్షత్రస్య ధృతి అనే సోమయాగ నిర్వాహణ జరుగుతుంది .దీనితో రాజ సూయం సమాప్తమౌతుంది .ఈ యాగం లో ప్రధాన దేవత వరుణుడు ..’’వరునసవో వా యేష యద్ రాజ సూయం ‘’అని ఈ బ్రాహ్మణం చెప్పింది .రాజ సూయ ,అశ్వ మేధ ,పురుష మేధ ,సర్వమేద యాగాలు క్షత్రియ యాగాలు .రాజ సూయం లో రాజును ప్రజా పతికి ప్రత్యక్ష ప్రతి నిదిగా పేర్కొన్నారు .ఈ బ్రాహ్మణం లో పద్నాలుగు కాన్దలున్నాయి .
అగ్ని స్మార్తాగ్ని అని శ్రౌతాగ్ని అని రెండు రకాలు .వివాహం అయిన గృహస్తు స్మార్తాగ్ని ని సేవించాలి .స్మార్తాగ్ని తో చేసే యజ్ఞాలన్నిటికీ పాక యజ్ఞాలంటారు .వీటిని చేసిన వారు పాక యాజులు .ఇందులో ఔపోసన హోమం ,విశ్వ దేవం ,పార్వణ యజ్ఞాలు, ఇస్టకాలు మొదలైన ఏడు యజ్ఞాలుంటాయి..గార్హ పత్యం ఆహవనీయం ,దాక్షిణ్యం ,సభ్యం అని శ్రౌతాగ్ని నాలుగు రకాలు .దీని విదానం లో గాంధార ,కేకయ ,సాల్వ కురు పాంచాల కోసల దేశాది ప్రస్తావన వస్తుంది
ఒక సంవత్సరం పాటు చేసే ‘’సౌత్రామణి యజ్ఞం ‘’గురించి ఇందులో ఉన్నది .ఈ బ్రాహ్మణం లో అప్పుడే పుట్టిన బౌద్ధ ,సాంఖ్య మతాల ప్రస్తావన కని పిస్తుంది .జనమేజయుడు కురు రాజు గా పేర్కొన బడ్డాడు . పాండవ ప్రస్తావన ఉండదు .ఇందులో అర్జున శబ్దం కేవలం ఇంద్రుడికే పరిమితం .జనకుడు మిదిలాదిపతిగా, సీత కు జనకుడిగా చెప్ప బడ్డాడు .ఊర్వశీ పురూరవోపాఖ్యానం శకుంతల దుష్యన్తోపాఖ్యానమూ ఉన్నాయి .భరతుని ప్రస్తావన ఉంది .ప్రళయానికి సంబంధించిన మను –మత్స్యాల వృత్తాంతం రమణీయం గా వర్ణించ బడింది .శుక్ల యజుర్వేదం లో మాధ్యందిన ,కాన్వశాఖా భేదం వలన మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండు ఉన్నాయి ఈ బ్రాహ్మణాన్ని యాజ్న్య వల్క్య మహర్షి ముసలితనం లో రాసి ఉంటాడని భావిస్తున్నారు .పాంచాల దేశానికి చెందినగొప్ప యాజ్ఞికుడు ఆరుణి శిష్యుడే యాజ్న్య వల్క్యుడు .జనక రాజు ఆస్థాన సభాపతి యాజ్ఞావల్క్యుడే .దీనికే వాజసనేయ బ్రాహ్మణం అని కూడా పేరుంది .,
ఈ బ్రాహ్మణం క్రీ పూ 800-500మధ్య కాలం నాటిదని చెపుతున్నారు .మాధ్యందిన శతపదానికి హరిస్వామి ‘’శ్రుత్యర్ధ వివ్రుతి ‘’అనే ప్రసిద్ధ భాష్యం రాశాడు ..అవంతీ రాజు విక్రమాదిత్యుని ఆస్థానం లో ధర్మాధ్యక్షుడు ,దానాధ్యక్షుడు గా హరిస్వామి ఉండేవాడు .తండ్రి నాగ స్వామి. హరిస్వామికి ‘’సర్వ విద్యా నిధాన కవీన్ద్రాచార్య సరస్వతి ‘’బిరుదు ఉంది .ఇతని భాష్యం సమగ్రం గా దొరక లేదు .దొరికిన దానిలో అతని గాంభీర్య విధానం కని పిస్తుంది .దీనికి సాయణుడు సమగ్రమైన భాష్యం రాశాడు .అరి వీర భయంకరుడు ,వైదిక ధర్మ సంరక్షకుడు అయిన హరిహర రాయలు యజ్న విధిని పూర్తిగా తెలియ జేసే ఒక గ్రంధానికి ఒక దానికి వ్యాఖ్యానం రాయమని కోరితే సాయణుడు శత పద బ్రాహ్మనానికి వ్యాఖ్యానం రాశాడు .కనుక సంహితల తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని పొందింది శత పద బ్రాహ్మణం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు
ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1
మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా ,ఇప్పటికీ లక్షలాది దేశీయులు వేలాది విదేశీయులనుఖజురాహో ఆకర్షిస్తోంది .అసలా శిల్పులు ,రాజులు ఏమి ఆశించి వీటిని నిర్మించారనేది అప్పటి నుచి ఇప్పటిదాకా ప్రశ్నార్ధకం గానే ఉండి పోయింది .ఖజురహో ను దర్శించిన ఇంగ్లాండ్ దేశీయుడు ,బి బి సి ప్రతినిధి గ్రంధకర్త మార్క్ టుల్లి ఈ విశేషాలను తన పుస్తకం ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘’లో చర్చించాడు.అందులోని ముఖ్య విషయాలనే నేను మీకు అందిస్తున్నాను .
మనిషిని అనై తిక నుండి కాపాడేది వివాహ బంధమొక్కటే అని అన్నిదేశాల వారి నమ్మకం . వివాహం కాని వారంతా పాపులు అని క్రైస్తవమతాధిపతులు కొందరు భావించారు .ఆదినికత పెచ్చు పెరిగిన ఈ కాలం లో విశ్రుమ్ఖలత పెరిగి,వివాహం లేకుండానే అన్నీ జరిగి పోతున్నాయి .మరి ఈ రెండిటికీ సమతుల్యం సాధించాలేమా?సాధించాలంటే మార్గం ఏమిటి ?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి . దీన్ని గూర్చి జంగియన్ అయిన రశ్నా’’స్వేచ్చ హద్దులు దాటుతోంది ఇది నిజమే .ఇప్పటి పరిస్తితి మల బద్ధకం నుండి అతిసారానికి (కాన్ ష్టి పేషన్ నుండి డయేరియా ) పాకినట్లుంది అన్నది .దీనికి కారణం తలిదండ్రులు భౌతికతకే అధిక ప్రాధాన్యత నివ్వటమే అన్నది .ఆధునిక స్త్రీల వస్త్రధారణ కూడా రెచ్చ గొట్టేట్లు ఉండటం బాధాకరమనీ చెప్పింది .
మహిళను సెక్స్ సింబల్స్ గా వస్తు విక్రయానికి బ్రాండ్ ఎమ్బాసిడర్లుగా మార్చి చూపింటచటమూ పతనానికి కారణమే ,కారు నుండి బారు సబ్బు వరకు స్త్రీ లనే ఆడ్స్ కు వాడి వారిని అవమానిస్తున్నారు . వారిది తెలుసుకోకుండా అందులో ధన సంపాదనే చూసుకొని మోస పోతున్నారు .ఇతర పాశ్చాత్య దేశాల కంటే డ్రెస్ కోడ్ విషయం లో ఇండియా కు ప్రత్యేకత ఉండేది. ఇప్పుడా సరిహద్దు చెరిపేశారు .చానళ్ళ ప్రకటనలో సెక్సీ గా హక్సీ గా మాట్లాడటం ఎక్కువై .ఇది వరకు ఎప్పుడో కాని విని పించని సెక్స్ పదం ఇవాళ ఒక మంత్రమే అయింది .ఇది దారుణం .ప్రతిదానికీ ‘’సెక్సీ సెక్సీ ‘’అంటూ రోదచేసి దాని పవిత్రతను బజారు పాలు చేస్తున్న్నారు .ఒకప్పుడు బ్రిటన్ లో మహిళా వోటు హక్కు కోసం ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పోరాట ఫలితం గా పొందారు. తరువాత సమాన హక్కుల ఉద్యమం చేసి సాధించారు .ఇప్పుడు సంస్కృతిలో సెక్స్ విపరీత ధోరణుల చొరబాటు (హైపర్ సేక్సువలై జేషన్ )పై ఆందోళన చేస్తున్నారు .ఇది అయిస్టతకు ఒక చిహ్నమే .
ఇప్పుడు మహిళలు కొత్త మహిళా విధానం _(న్యూ వేవ్ ఆఫ్ ఫెమినిజం )పై ద్రుష్టి పెట్టారు .దీనివలన స్త్రే పురుషుల మధ్య శక్తి సంబంధాలపై బలమైన ముద్ర పడుతుంది .సమాన హక్కులు సమాన హోదాలు జీతాలు మహిళలు సాదించుకొన్నారు .బ్రిటన్ లో కొన్ని మార్పులొచ్చాయి .పెళ్ళిలో రేప్ చట్ట వ్యతిరేకమైంది .పని చేసే చోట సెక్సువల్ హెరాస్ మెంట్ జరిగితే కోర్టులో కేసు వేయ వచ్చు .ప్రసూతి సెలవు పొందారుమహిళలు .కేధలిక్ ల కబంధ హస్తాల నుండి విడిపించుకొన్న ఐరలాండ్ దేశం లో ఇప్పుడు సుఖ శాంతులేక్కువగా ఉన్నాయిసెక్స్ ను అర్ధం చేసుకోవటం లో అనేక పద్ధతులు కలిసి కట్టుగా పని చేస్తున్నాయి .అతి సెక్స్ పై వెనుకడుగు వేస్తున్నారు .ఇది శుభ సూచకమే .
ఇండియాలో ‘’కామ సూత్ర’ వాత్సాయనుడి చేత ’రచింప బడింది .మానవ ప్రవర్తనను భారతీయులు శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించారు .ధర్మ ,అర్ధ ,కామ మొక్షాలను ఎలా పొందాలో వివరం గా చర్చించారు .కామ సూత్ర రచనలో మూడవదైన కామాన్ని అలక్ష్యం చేయకుండా ఉపెక్షిచకుండా దానినీ శాస్త్రీయం గానే ఆలోచించారు .కామ సూత్ర అంటే సెక్స్ గైడ్ అనుకోవటం పొరబాటు .నైతికతను వాత్సాయనుడు వదిలి పెట్టలేదని గుర్తించాలి .ప్రతి అధ్యాయం చివరా ఇతరుల భార్యలను ఎలా ముగ్గు లోకి దించ వచ్చో చెప్పాడు ఈ టెక్నిక్కులు వ్యభిచారానికో ,అసంగత శృంగారానికో కాదని ,భర్తలు భార్యల చేత మోస గింప బడకుండా ఉండటానికే నని భర్త భార్య కోరికలను తీర్చి సంతృప్తి చెందించ టానికే నని వివరించాడు .కామ సూత్ర మగాళ్ళకు మాత్రమె సంబంధించిందికాదు .ఆడ వాళ్లకు కూడా సెక్స్ కోరికలు ఉంటాయని మగాడు గ్రహించాటానికే .ఆ కోరికలనుఎలా సంతృప్తి పరచాలో తెలియ జెప్పటానికే వాత్సాయనుడు కామ సూత్ర రాశాడు .కన్యలు మంచి భర్తను ఎలా పొందాలి ,ఆడామగా మర్మాంగాల చర్చ ఎలా ఆరోగ్య వంతం గా చేయాలి ,అనే వాటికి మార్గ దర్శకాలు రాశాడు .కామ సూత్రా లో వర్ణింప బడిన స్త్రీలు పప్పు దద్దమ్మలు కాదు. శృంగారం లో అన్గారాన్ని రంగ రించిన స్త్రీమూర్తులు .అధిక చేత ఉన్న వారు .సెక్స్ లో వారికోరికలు ఇష్టాలు ,భంగిమలపై పొందే ఆనందం దీని వల్ల మగాడు చేజారిపోకుండా చూసుకోవటం వివరించాడు .స్త్రీల చురుకుదనాన్ని బాగా వర్ణించాడు ఇవన్నీ చూసి ,చదివి మగాడు జాగ్రత్త పడాల్సినవే .
వాత్సాయనుడు కొత్త మార్గం చూపించాడు కామ సూత్రాలలో .’’సెక్స్ లో ప్రేమ’’ ‘’అనే ది ముఖ్యం గా బల పరచాడు .కన్య భర్తను నమ్మి ప్రేమ తో అతని హృదయాన్ని జయించాలని బోధించాడు .కనుక కామ సూత్రలో వాత్సాయనుడు కామం తో కూడిన ప్రేమకు శృంగార భావాలను కలగి ఉన్నా అణచుకోవటానికి మధ్య సమతుల్యతను సాధించాడు .విచ్చల విడి శృంగారానికి , క్రమ పధ్ధతితో నైతిక శృంగారానికి మధ్య బాలన్స్ రూపొందించాడు .ప్రక్రుతి ప్రేరణకు ,సంస్కృతీ నాగరకతకూ మధ్యే మార్గాన్ని కను గోన్నాడు .కామ సూత్రాలలో అంతర్ ద్రుష్టి ఉందని గ్రహించాలి .ఆనందాన్ని అలవరచుకోవాలని ,శృంగారం లో సంస్కృతి ని రూపొందించు కోవాలని కామ సూత్ర కర్త ధ్యేయం.కామ సూత్రకు అనువాదకులు పెద్ద అన్యాయమే చేశారు .సెక్స్ ప్రేరక సామాగ్రికే ప్రాధాన్యం ఇచ్చి నట్లు అనువాదాలు చేసి గొప్ప ద్రోహం చేశారు
.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు
బ్రాహ్మణాల కదా కమా మీషు -10
తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు
కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట .కృష్ణ యజుస్సంహితలో బ్రాహ్మణ భాగాలు కలిసి పోయే ఉంటాయి .. బ్రాహ్మణానికి సంహితకు పెద్దగా తేడా కని పించదు.వైశంపాయనుడి శిష్యుడు పైంగి యాస్కుడు .అతని శిష్యుడే తిత్తిరి మహర్షి .ఉఖ మహర్షి తిత్తిరి శిష్యుడు .ఆత్రేయుడు తిత్తిరి ప్రశిష్యుడు .తైత్తిరీయ శాఖా ప్రవర్తకులలో తిత్తిరి మహర్షి మణి లాంటివాడు .అతనే ఈ బ్రాహ్మణ కర్త కనుక ఆయన పేరనే చెలా మణి అయింది . ఈ బ్రాహ్మణం లో మొదటికాన్డను పార క్షుద్ర అని రెండవ దాన్ని అగ్ని హోత్రం అనీ అంటారు మూడవ దానిలో విభాగాలకు వాటి ప్రత్యెక పేర్లున్నాయి .
ఒకప్పుడు విదేహ రాజు జనకుడు సావిత్రాగ్ని జ్ఞానాని సంపాదిన్చాలనుకొని దేవతలను కలిశాడు .వాళ్ళు లోకం లో ఎవరు తమను సావిత్రాగ్ని స్వరూపం గా ఉపాసన చేస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుండి ,అప మృత్యువు నుండి ముక్తులౌతారని ,పూర్నాయుస్సుపొంది ఎప్పటికీ అన్నాదులకు లోటు లేకుండా సర్వాన్న సామ్రుద్ధి కలవారై స్వర్గాన్ని పొందుతారు అని చెప్పారు .అశ్వత్థ మహర్షి శిష్యుడు అహీన మహర్షి సావిత్రాగ్ని స్వరూపాన్ని ధ్యానం చేసి సాక్షాత్కరింప జేసుకొన్నాడు .అందుకనే ఆయన దేహ అవసాన దశలో’’ బంగారు హంస’’ అయి స్వర్గం చేరి ఆదిత్యునితో తాదాత్మ్యం చెందాడు .
ఈ బ్రాహ్మణం లో నీతికధలు తో బాటు లౌకిక జ్ఞాన విషయాలూ చాలానే ఉన్నాయి .చంద్రుడు ఏ రోజు ఏ నక్షత్రం తో కలిసి ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుందని లోక వ్యవహారం .కృత్తికా నక్షత్రం తో చంద్రుడు కలిసి ఉన్న రోజు కృత్తికా నక్షత్రం అని అర్ధం .రోజుకొక నక్షత్రం ఉంటుంది కనుక దీన్ని బట్టి తెలుసుకోవాలి .కృత్తిక ఒకప్పుడు మొదటి నక్షత్రం గా ఉండేది .ఆ నక్షత్రం లో ఆధానం చేస్తే బ్రహ్మ వర్చస్సు కలుగుతుందని శాస్త్రం .రోహిణి లో చేస్తే సిరి సంపదలు కలుగుతాయి .దేవతలు ఒకప్పుడు ధన గర్వం లో విర్ర వీగుతూ అశ్రద్ధగా అగ్న్యాధానం చేసి సిరి సంపదలు పోగొట్టుకొని దరిద్రులైనారు .తప్పు తెలుసుకొని పునర్వసు నక్షత్రం లో శ్రద్ధ గా చేసి మళ్ళీ ధనికులైనారు .పునః అంటే మళ్ళీ వసు అంటే సంపద పొందారు కనుక ఆ నక్షత్రానికి పునర్వసు అనే పేరొచ్చింది .అలాగే విషువత్ కు ఇందులో అర్ధం చెప్పబడింది .సంవత్సరాన్ని రెండు భాగాలు చేయాలి .మొదటి భాగం లో చివరి నాలుగు రోజులు ,రెండో భాగం లోని మొదటి నాలుగు రోజులు తీసుకొని మధ్యలో ఉన్న రోజును విషువత్ అంటారని ఈ తొమ్మిద రోజుల్లో యాగం చేస్తే అష్ట దిక్పాలకులు పాలించే ఎనిమిది స్వర్గాలు,అంత కంటే పై నుండే స్వర్గం పొందగలరు .
అన్నం రెండు సార్లు ఎందుకు తినాలి?
ఒకప్పుడు దేవతలు ,పితరులు ,మనుష్యులు ,పశువులు ,అసురులు (వీరందరికీ ప్రజలనే పేరు )ఉపవాసం తో ఉండే సత్రాన్ని గురించి తపస్సు చేశారు .వారిలో దేవతలు నేతితో నిండిన చమన పాత్రను చూసి హోమం చేసి పది హీను రోజులకోసారి భోజనం చేసే రస పదార్ధాన్ని పొందారు .అందుకే అమావాస్య ,పొర్ణమి రోజుల్లో దేవతల ప్రీతికోసం దర్శ ,పూర్నమాస యాగాలు చేస్తారు .పితృదేవతలు నెలకోసారి భోజనాన్ని సంపాదించుకొన్నారు .అందుకే ప్రతి అమా వాస్య నాడు ‘’పిండ పితృ యజ్ఞం ‘’చేసి పితృ దేవతలను సంతృప్తి పరుస్తారు .మానవులు ఒకేరోజు రెండు భోజనాలను సంపాదించారు .పశువులు మూడు సార్లు తిని మిగిలిన సమయం లో నెమరేస్తాయి .రాక్షసులు సంవత్సరానికి ఒక సారే తిండి సంపాదించారు .అందుకే ఏడాదికి ఒక సారే తిండి తిని మిగిలిన రోజుల్లో దేవతల తో యుద్ధాలు చేసే వారు .
నక్షత్రాలే ప్రజా పతి శరీరం .హస్తా నక్షత్రం ప్రజా పతి హస్తం .చిత్తా నక్షత్రం శిరస్సు .స్వాతి హృదయం .విశాఖ తొడలు ,అనురాధ పాదాలు .ఇలా నక్షత్ర స్వరూపిగా ప్రజాపతిని ధ్యానిస్తారు .
గోవులే అగ్ని హోత్రాలు
పర్వతాలు మొదలైన అచేతనాలను సృష్టించి తర్వాత ప్రజాపతి అగ్ని వాయువు ,ఆదిత్యుడు అనే చేతనలను హోమం ద్వారా సృష్టించాడు .ఈ ముగ్గురూ తాము కూడా ప్రజా పతి లాగానే సృష్టి చేయాలను కొని అగ్ని ప్రాణం కోసం వాయువు శరీరం కోసం ,ఆదిత్యుడు కండ్ల కోసం హోమం చేశారు .దీనితో ఒక గోవు పుట్టింది .దాని పాలు పంచుకోవటం లో ముగ్గురికీ పేచీ వచ్చింది .పరిష్కారం కోసం ప్రజా పతి దగ్గరకు చేరారు .ప్రాణాలు లేని శరీరం, కండ్లు వ్యర్ధం కనుక ప్రాణాలకోసం హోమం చేసిన అగ్నిదే ఆవు అని తీర్పు చెప్పాడు .అప్పటి నుంచి ఆవుకు ‘’అగ్ని హోత్రం ‘అనే పేరొచ్చింది .ఆవును అగ్ని హోత్రం గా ఉపాసించే వారికి అప మృత్యు భయం ఉండదని ఈ బ్రాహ్మణం చెప్పింది .
మానవ సృష్టి
ప్రజాపతి సృష్టి చేయాలను కొని ముందు ప్రాణ వాయువు తో బలాదికులైన అసురుల్ని సృష్టింఛి ‘’పిత ‘’అని పించుకొన్నాడు .తర్వాత పితృదేవతలను సృష్టించి ,ఇంకా ఏమేమి సృష్టించాలా అని మనసులో ఆలోచించాడు .అప్పుడు మనుష్యులేర్పడ్డారు .మననం చేయటం వాళ్ళ ఎర్పడ్డారుకనుక మానవులని పించుకొన్నారు .మనుష్యులు లౌకిక వైదిక వ్యవ హారాలు చేసే సరికి అంతా కాంతి తో నిండి పోయింది .ఆ కాంతి ననుసరించి దేవతలను సృష్టించాడు .ఈ ఆలుగు రకాల సృష్టి’’ జలం’’ లాంటిది .నదీ జలం తటాక జలం వగైరా ఎలా భోగానికి ఉపయోగిస్తాయో సృష్టి కూడా భోగానికి ఉపయోగ పడుతుందని అంతరార్ధం .
బొల్లి ఎల్లా పోతుంది?
తెల్ల బొల్లి మచ్చలున్న శరీరాన్ని ‘’కిలాపం ‘’అంటారు .తల నెరిసి పోవడాన్ని ‘’పలితం’’అంటారు.;;నీలి ‘’అనే ఓషది ఈ రెండు వ్యాదుల్నీ పోగొట్టు తుంది .ఈ ఓషధిని అభిమంత్రిస్తూ చెప్పాల్సిన మంత్రాలు ఇందులో ఉన్నాయి .బొల్లి ఎన్ని రకాలో ,వాటిని పోగొట్టె శక్తి నీలికి ఎలా వచ్చిందో వివరాలున్నాయి .
పగలు రాత్రులకు పేర్లు
సావిత్ర చయనం లో కొన్ని వైదిక పరిభాషలున్నాయి .ప్రతీనెలలో మొదటి పదిహేను రోజులు శుక్ల పక్షం .తరువాతిది కృష్ణ పక్షం .శుక్లపాడ్యమి తో మొదలైన తిధుల పగటి వేళలను వరుసగా సంజ్ఞానం ,విజ్ఞానం ,ప్రజ్ఞానం ,జానాథ్ ,అభిజానాథ్ ,సంకల్పమానం ,ప్రకల్ప మానం ,ఉపకల్పమానం ,ఉప క్లప్తం,క్లప్తం,శ్రేయః ,వసీయ ,ఆయత్,సంభూతం ,భూతం అనే పేర్లతో పిలుస్తారు .శుక్ల పక్ష రాత్రులకు వరుసగా దర్శ ,దృష్టా ,దర్శత ,విశ్వ రూపా ,సుదర్శనా ,ఆప్యాయ మానా ,ప్యాయ మానా ,ప్యాయా ,సూనృతా ,ఇరా ,అపూర్యమానా ,పూరయన్తీ ,పూర్నా ,పౌర్న మాసీ అనే పేర్లున్నాయి .అలాగే కృష్ణ పక్ష పగళ్ళకు రాత్రులకు పేర్లు చెప్పా బడ్డాయి
తైత్తిరీయం మూడు కాండలలో అనేక పేర్లున్న యజ్న యాగాదుల నిర్వహణ విధానం వివరణ ఉంది మధ్యమధ్యలో సందర్భాన్ని బట్టి లోకానికి పనికి వచ్చే కబుర్లెన్నో చెప్పింది.వీటినన్నిటిని అర్ధం చేసుకొని సంస్కారం తో జీవితాన్ని మలచుకొని సమాజ భ్యుదయానికి పాటు పడమనే ఏ బ్రాహ్మనమైనా బోధించే విషయం .
తరువాత శత పద బ్రాహ్మణ విశేషాలు తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు

అమ్మా…కథ చెప్పవూ అంటే చెప్పే అమ్మలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కానీ… ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మ ఆ పని చేసి చూపుతోంది. ఆమె పేరు ఉమా చల్లా. తన పాప చారుమతికి కథలు చెపుదామని తెలుగు కథల పుస్తకాల కోసం ఆమె ఎన్నో చోట్ల వెతికారట. కానీ అవి దొరకలేదు. అప్పుడు పిల్లల కోసం తానే తెలుగులో మంచి కథల పుస్తకాలు తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా తన కథల పుస్తకాల ద్వారా రామాయణం నుంచి సౖౖెన్స్ దాకా ప్రతీ విషయాన్ని ఎంతో సరళమైన తెలుగులో పిల్లలకు కథలుగా చెప్తున్నారామె. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే…
నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణ పరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను.
‘మాది హైదరాబాద్. ఇంటర్ వరకే నేను కాలేజికి వెళ్లి చదువుకున్నాను. ఎందుకో తెలియదు కానీ కాలేజీ నాలుగు గోడల మధ్య చెప్తున్న చదువు నాకు నచ్చలేదు. అందుకే ఇంటిపట్టునే ఉండి బిఎ డిగ్రీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ చేశాను. ఎం.ఎ ఆంత్రపాలజీ, ఎం.ఎస్.సి బయోలజీ అమెరికాలో చదివాను. ఫ్రెంచి భాషలో డిప్లొమా తీసుకున్నాను.
మావారు కిరణంతో 2004లో (మా అత్తవారు ఆయనకు అచ్చమైన తెలుగు పేరు పెట్టాలని కిరణం అని పెట్టారు) నా పెళ్లయింది. 2011లో మా పాప చారుమతి నా జీవితంలో ప్రవేశించింది. పాప ప్రవేశం నా జీవితంలో ముఖ్యమైన మలుపని చెప్పాలి.
మా పాపే స్ఫూర్తి…
ఏడాది వయసులో ఉండగానే మా పాప చారుమతికి ఉషశ్రీ రామాయణ, మహాభారత, భాగవతకథలు చెప్పాను. వాటిల్లోని కొన్ని ఘట్టాలైతే తనకు బాగా గుర్తు. పాప ఇష్టాయిష్టాల కనుగుణంగా తనను పెంచాలని నా ఉద్దేశం. మా ఇల్లు కూడా పాపకు నచ్చినట్టు పెడతాను. ఒకచోట బుక్స్. మరో చోట కంప్యూటర్. ఇంకోచోట ఆడుకునే బొమ్మలు, పక్కనే జారుడు బల్ల, మరోవైపు ఆటబొమ్మలు, బిల్డింగ్ బ్లాకులు వీటితో పాటు మేక-పిల్లి, వామనగుంటలు లాంటి బోర్డ్ గేమ్స్ సెట్…అన్నీ హాల్‌లో పరిచి ఉంచుతాను. ఎప్పుడు ఏది ఆడాలనిపిస్తే అది ఆడుతుంది.
మా పాప చారులతకు కథలంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు కథల పుస్తకాల కోసం ఎంతగానో వెతికాను. ఇంగ్లీషులో పెద్ద పెద్ద బొమ్మలతో మంచి కథల పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి గానీ తెలుగులో మటుకు ఈ లోటు బాగా కొట్టొచ్చినట్టు నాకు కనిపించింది. తెలుగులో మంచి కథల పుస్తకాలు దొరక్కపోవడంతో వాటిని తెచ్చే పని నేనే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది.
పిల్లల కథలకు బొమ్మలు ప్రాణం…
పిల్లలకు కథలు రాయడం ఒక ఎత్తయితే ఆ కథలకు బొమ్మలు గీయడం మరో ఎత్తు. అవి పిల్లలను ఆకర్షించేలా రంగు రంగుల్లో పెద్దవిగా ఉండాలి. ఎక్కువ బొమ్మలుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లల భాషా విషయానికి వస్తే లయ, ప్రాస ఉన్న వాక్యాలు వాళ్లు బాగా ఆస్వాదిస్తారు. మా పాపకు కథలు చెప్పేటప్పుడు ఎలా చెప్తే పిల్లలకు తొందరగా అర్థమవుతుంది, భాష ఎలా ఉండాలి అన్న అంశాలపై నేను బాగా పరిశోధన చేశాను. పిల్లలకు నచ్చేలాగ బొమ్మలు వేయడం నాకు పెద్ద సవాలుగా నిలిచింది. మా అన్నయ్య బొమ్మలు వేయగలరు. కథలకు బొమ్మలు ఆయన చేత వేయించాను కూడా. ఎందుకో అవి పిల్లలకు నేను చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా కమ్యూనికేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇలా కాదని బొమ్మలు కూడా నేనే వేయాలనుకున్నాను. రోజంతా నేను మా పాపతో గడుపుతానుకాబట్టి పిల్లల ఆలోచనా తీరు ఎలా ఉంటుందో ఒక తల్లిగా నాకు బాగా అర్థమయినట్టు మా అన్నయ్యకు సాధ్యం కాదనిపించింది. అందుకే బొమ్మలు వేసే పనిని కూడా నేనే తలకెత్తుకున్నాను. బొమ్మ సింపుల్‌గా ఉండాలి. అన్ని విషయాలూ చెప్పగలగాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి అనేది నా అభిప్రాయం. మొత్తానికి చిన్నారులకు నచ్చేలాగ కథలకు బొమ్మలు గీయడానికి నేను చాలానే శ్రమపడ్డాను.
నా మొదటి కథ ‘కాకమ్మ దాహం’. ఇంకా’ సీతాకోకచిలుక’, ‘తాబేలు-కుందేలు’, ‘నక్క-ద్రాక్షపళ్లు’ లాంటివి మొత్తం 10 పుస్తకాలు రాశాను. కథలు రాయడం, బొమ్మలేయడం దగ్గరి నుంచి పుస్తకాల డిజైనింగ్, ప్రచురణ అన్ని పనులూ నేనే చేశాను. ఈ పుస్తకాలు వేసేముందు నేను ఇపుడున్న ప్రచురణరంగ పోకడలను సైతం బాగా స్టడీ చేశాను. ఎందుకంటే పిల్లల పుస్తకాల డిజైనింగ్ వేరుగా ఉంటుంది. అవి పిల్లలను బాగా ఆకటుకునేలా ఉండాలి. ఇక్కడ డబ్బులెక్కలు చూడకూడదని నా అభిప్రాయం. ఈ కథల పుస్తకాల ప్రచురణ కోసం నేను మా వారు ఇన్స్‌రెన్స్ పాలసీలను వాడేశాం.
ఆదివారం కథాకాలక్షేపం…
రామాయణానికి సంబంధించి పిల్లల కథల పుస్తకాలు తేవాలనుకుంటున్నాను. రామాయణంలో బాలకాండ మీద కథలు పూర్తి చేశాను. ఇంకొన్ని రోజుల్లో ఈ కథల పుస్తకం బయటకు వస్తుంది. నా పుస్తకాల ద్వారా సైన్స్ గురించి అంటే గ్రహాల దగ్గరి నుంచి నక్షత్రాలు, విశ్వం అన్నింటినీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను. విలువలు బోధించే కథలు నా పుస్తకాల్లో చెప్పాను. అలాగే మన సంస్కృతి, పండుగల గురించి వివరించాను. తెలుగు అంకెలు, తెలుగు నెలల గురించి పిల్లలకు అర్థమయ్యేలా నా పుస్తకాల్లో చెప్పాను.
సప్తపర్ణి అనురాధగారికి ఈ పుస్తకాలు చూపించినప్పుడు ఆవిడ చాలా బావున్నాయి, మా సెంటర్‌లో పెట్టండి అన్నారు. ఆ తర్వాత నా పుస్తకాలకి మంచి స్పందన వచ్చింది. తల్లిద్రండులు కూడా ఆసక్తిగా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మాతృభాషలో ఏది చెప్పినా దాని స్పందన చాలా బాగుంటుంది. అంతేకాదు మన భాషపై మనం పట్టు సంపాదించినపుడే మిగతా భాషల్ని కూడా తొందరగా నేర్చుకోగలుగుతాం. ఈమధ్యనే సేక్రడ్ స్పేస్‌లో ప్రతి ఆదివారం కథాకాలక్షేపం అని ఒకటి మొదలెట్టాను. నా పుస్తకాల్లో బొమ్మలు చూపిస్తూ కథలు పిల్లలకు చెపుతా. నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణపరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు కథలు చెప్పే తీరులో కూడా జాగ్రత్తలు తీసుకుంటాను. ఉదాహరణకు రామాయణం గురించి చెప్పేటప్పుడు మ్యాప్ తీసుకుని రామాయణంలోని ఫలానా ప్రాంతం ఎక్కడ ఉంది మ్యాప్‌లో చూపిస్తూ చెప్పడం, సన్నివేశాలను వివరించడం చే స్తాను. మన పాత ఆటలు పులిమేక, వామనగుంటలు, చదరంగం, వైకుంఠపాళి వంటివి కూడా వారికి నేర్పుతాను. బోర్డు గేమ్స్ వల్ల పిల్లలకు మేథమేటిక్స్ బాగా వస్తుంది.
సేక్రెడ్ స్పేస్‌లో ఒక్కొక్కవారం ఒక్కొక్కదానిగురించి పిల్లలకు చెబుతాను. ఆడుదామా అష్టాచమ్మా అని పాత ఆటల గురించి పిల్లలకు ఒక వారం నే ర్పిస్తాను. మరోవారం పద్యం పాడుకుందాం, ఇంకోవారం తెలుగుపాట నేర్చుకుందాం, తర్వాతి వారం దండకం నేర్చుకుందాం వంటివి పిల్లలకు చెపుతుంటాను. నిజానికి ఇవన్నీ ఇళ్లల్లో జరగాల్సిన పనులు. కానీ జరగడంలేదు. మా పాపతో నేను రోజూ ఇలానే గడుపుతాను. పిల్లల ఏకాగ్రత స్థాయిని బట్టి ఏ విషయాన్నైనా వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. వారికి ప్రేమగా చెప్పాలి. పిల్లల వికాసానికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారానే ఎన్నో విషయాలను వారికి సులువుగా చెప్పొచ్చు.
నాకు తెలుగు మీద ఇష్టం కలిగింది మా అమ్మమ్మ వల్లే. ఆమె ఇంట్లో పనిచేసుకుంటూ పాడే పాటలు, పద్యాలు, వంట అయిన తర్వాత తను చెప్పిన కథలు ఇవన్నీ నా మీద చాలా ప్రభావం చూపాయి. పిల్లలతో కూర్చున్నప్పుడు వారికి సందర్భానుసారం చెప్పగలగే సృజనాత్మకత మనకు కావాలి. అలాంటి వాతావరణం మనం సృష్టించాలి. అప్పుడు పిల్లలు కూడా సహజంగా వికసిస్తారు.’
ం నవ్య డెస్క్
మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మాలాంటి ఢిల్లీ వాసులకు ఆంధ్రప్రభుత్వం మాత్రమే జవాబుదారీ అంటూ నాటక నవలల పోటీ కొత్త మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది. న్యాయనిర్ణేతల తీర్పు అన్యాయంగా అనిపిస్తోంది. గతంలో చాలాచోట్ల పలుమార్లు జరిగిన రచనల పోటీల్లో అత్యుత్తమ బహుమతి ప్రమాణాలకు స్థాయికి తగినవి రాకపోతే ఎలాంటి తటపటాయింపు లేకుండా బహుమతికి అనర్హంగా ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం విభజన సంధికాలంలో నాటకం -నవలల పోటీల్లో బహుమతులు పంచిన తీరు చాలా విడ్డూరంగా అసంబద్దంగా ఉంది. నాటకంలో పద్యం, చారిత్రికం సాంఘికం ప్రక్రియలతో పాటుగా నవలకు ప్రాధమ్యం కల్పిస్తూ ఒక్కోదానికి లక్ష నగదుతో పాటు ప్రచురణ, ప్రదర్శనలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఆయా రచనలకు ఆహ్వానం ప్రకటిస్తే మహత్తర స్పందన వచ్చిందని చాటుకుంటూ పోటీల గడువు తేదీని పొడిగించారు.
అద్భుత రచనలు వెలువడుతున్నాయని మాలాంటివాళ్ళం మురిసిపోతూ ఎదురుచూసాం. అన్నీ అయిన తరువాత పోటీల్లో మొత్తంగా 3 నాటక ప్రక్రియలకు సంబంధించి 150 నాటకాలు 57 నవలలు వచ్చాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో నందితో సహా ఇతర పోటీల్లో ఎంట్రీలుగా ప్రతిఏటా ఇంచుమించుగా అదే సంఖ్యలో రావటం పరిపాటిగా ఉంది. తెలుగు నాటకరంగంలో ఎక్కువగా ప్రదర్శనలు ప్రేక్షకుల ఆదరణ పొందే సాంఘిక నాటకాలల్లో ఉత్తమంగా లక్ష రూపాయల బహుమతికి దాపుల్లో ఏదీలేదని న్యాయనిర్ణేతలు నిర్ధారించారు. రావికొండలరావు, దుగ్గిరాల సోమేశ్వరరావు, కందిమళ్ల సాంబశివరావు, శంకరమంచి పార్థసారధి జడ్జిలుగా వ్యవహరించారని తెలిసింది. తక్కువ సంఖ్యలో వచ్చిన నవలల్లో ప్రథమ బహుమతి పొందగల అర్హత లేనేలేదని అంపశయ్య నవీన్, నవ్య జగన్నాధశర్మ, వాడ్రేవు చినవీరభ ద్రుడు, మృణాళిని, మధురాంతకం నరేంద్ర నిర్ధారించారు. సాంస్కృతిక శాఖ 12 నవలలకు 10 నాటకాలకు ఒక్కోదానికి 25,000 చొప్పున బహుమతుల పందేరం ప్రకటించారు. వాటిల్లో కొందరి రచనలు వేరే వాళ్లు నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకుని ఉండడం గమనార్హం. గతంలో ప్రభుత్వపరంగా వరుసపెట్టు సత్కారాలు పురస్కారాలు పొందిన వారికే మళ్లా కన్సొలేషన్‌గా పేర్కొనతగ్గ బహుమతుల్లో సింహభాగం దక్కింది. తాము ఆశించిన ప్రమాణాలు, వాసి లేదని నిర్దారిస్తూనే మళ్లా మళ్లా బహుమతులు ఇచ్చి ప్రోత్సా హం అనటంలో హేతుబద్దత ఎంత ? ప్రభుత్వ నిధులతో మళ్లా మళ్లా బహుమతులు ప్రశంసలు కురిపించటంలో సాంస్కృతిక శాఖ సంస్కారం ఇంకో సారి విమర్శలు పెంచుకుంటోంది. తెలుగుతనానికి సంబంధించిన ఈ పొటీలు, బహుమతుల నిర్ణయాన్ని పూర్తిగా సీమాంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారమని అప్పగింతలు పెట్టిన అధికారుల విజ్ఞతను ఆయా నాటకాలవాసి నాణ్యత తెలుసుకునేలా ఎప్పుడు చేస్తారని అడిగితే కప్పదాటు జవాబులు చెబుతున్న సాంస్కృతిక శాఖ శైలిని పలువురు కళారంగ మిత్రులం తీవ్రంగా నిరసిస్తున్నాం.
– దేవరకొండ సుబ్రమణ్యం
గురుగాం, ఢిల్లీ 08800968130
సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో 3 జూలై 1914న జన్మించారు. వారి జీవితమే మహత్తరమైనది. చిన్నతనంలోనే హిమాలయాలలో కొంత కాలమున్నారు. అచటనే ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. వారితో మాట్లాడుతుంటే కాలగమనమే మనకు తెలిసేది కాదు.
1963లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రతి ఆదివారం ‘తెగిన జ్ఞాపకాలు’ అని తమ జీవిత చరిత్రను రాసారు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్, తిరుపతి- దుర్గా ప్రసాద్ వారు ‘తుమ్మపూడి’ అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించారు.
సంజీవదేవ్ ‘రసరేఖ’ పుస్తకాన్ని రచించారు. తమ ఇంటికి ‘రసరేఖ’ అని పేరు పెట్టారు. వీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు ఎంతోమంది మేధావులతో, ప్రముఖులతో పరిచయాలు పొందారు. ఎన్నో పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసారు. వీరు చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవారు. చదివేవారు. వారి చేతిరాత అచ్చం అచ్చువలె వుండేది. ప్రతిదినం పలువురు అభిమానుల దగ్గర నుండి కట్టలుగా వుత్తరాలు వచ్చేవి. చిన్నా పెద్దా అని చూడకుండా అందరికి ఆప్యాయంగా జవాబులు రాసేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు వచ్చేవారు. నేను తిరుమల నుండి వెళ్లేవాడిని.
‘విద్యార్థి’ అనే మాసపత్రిక 1963 అక్టోబర్ సంచికలో సంజీవదేవ్ ‘కీర్తి-తృష్ణ’ అనే వ్యాసాన్ని రాసారు. అందులో- ‘కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడ ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే వుంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు’ అని రాసారు.
నేనంటే మొదటినుంచి వాత్సల్యం చూపేవారు. ‘జీవితం ఒక గొప్ప సంగ్రామం. ఈ సంగ్రామంలో తలెత్తే వ్యతిరేక పరిస్థితులలో ప్రశాంతంగా, ధైర్యంగా పోరాడితే విజయం దానంతటదే లభించుతుంది. వ్యతిరేకతలు అనుకూలతలుగా మారుతాయి. చిన్న చిన్న ఇబ్బందులకు జంకక ధీరుని వలె జీవించాలి’ అని 9.4.1966న ఒక జాబు రాసారు.
‘వస్తున్న అసంఖ్యాక అభినందనలకు జవాబులు వ్రాయుటయే సరిపోతుంది ఇప్పటివరకు. వరికోతలు కోస్తున్నారు. పైన మబ్బులు పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా రైతులు ఈ వ్యతిరేక వాతావర ణంలో చాలా నష్టపోతున్నారు’ అని 16.11.82న రాశారు.
‘మానవ జాతి అంతా ప్రపంచంలో ఒకటే. అయినప్పటికీ ఎవరి ప్రత్యేక జీవితాలు వారివే. జీవితంలో వికసించటానికి రెండు విషయాలు ప్రధానమైనవి- ఒకటి మనోవికాసానికి సంబంధిం చిన ప్రతిభ, రెండవది భౌతికమైన కృషి. వీటినే Intelligence and industry అంటారు. ఈ రెండు శక్తులు కూడ నీలో శక్తివంతమై వున్నవి. అందుకే నీవు తగిన ఔన్నత్యాన్ని జీవితంలో పొందగలుగు తున్నావు’ అని 3.3.1999లో రాసారు. నేను 31.8.1999న ఉద్యోగము నుండి రిటైరవుతానని రాసిన జాబుకు జవాబు ఆ రకంగా రాసారు. కాని నేను రిటైరవక ముందుగానే 25.8.99న ఆయన మరణించారు. నాకు అలా ఆయన చాలా వుత్తరాలు రాసారు.
ఆయన వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న ఘనంగా జరగనుండటం ఆనందదాయకం.
– ఎస్.డి.గిరిజా ప్రసాద్
(సంజీవదేవ్ వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న జరుగనున్నాయి)

కేదార్ ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలి స్తాయి.. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు.
‘రాలిపోతున్నాయి వేపచెట్టు ఆకులు.. పెరిగిపోతోంది మనసులో నైరాశ్యం..’ అని జీవితంలో ఖాళీతనాన్ని చిత్రించిన కవి, సాహిత్య విమర్శకుడు, అధ్యాపకుడు కేదార్‌నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషం కలిగింది. 1988లో డా.సి.నారాయణరెడ్డికి ఈ అవార్డు వచ్చిన తర్వాత మళ్లీ ఈ పురస్కారం లభించిన లబ్దప్రతిష్టులైన గొప్ప కవుల్లో కేదార్‌నాథ్ ఒకరు.
హిందీలో గొప్ప కవులెందరో ఉన్నారు. హరివంశరాయ్ బచ్చన్, దినకర్, నిరాలా, అజ్ఞేయ, సుమిత్రానందన్ పంత్, సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, మహదేవి వర్మ, నిర్మల్ వర్మ.. వీరు కవిత్వంలో ఉన్నత ప్రమాణాలు సాధించినవారు. మానవీయ విలువల్ని ప్రతిబింబించిన వారు. వారి శ్రేణికి కేదార్‌నాథ్ సింగ్ వస్తారనడంలో సందేహం లేదు. నిజానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సాహిత్యాన్ని సృజించిన ఉత్తమ భారతీయ రచయితలకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వాలనే ఆలోచన కవుల నుంచే పుట్టింది. 1961 మే నెలలో కలకత్తాలో శాంతి ప్రసాద్ జైన్ నివాసంలో సమావేశమైన బచ్చన్, దినకర్ మొదలైన కవుల సమక్షంలోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చి అది ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డుగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిజంగానే ఉత్తమ రచయితలకు, కవులకు ఈ అవార్డు ఇస్తూ సార్థకత సాధించింది.
కేదార్‌నాథ్ కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే హిందీ సాహిత్యాన్ని, దాని సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి 20వ శతాబ్దంలోనే హిందీలో కవిత్వం ప్రారంభమైంది. అంతకుముందు మధ్యయుగాల హిందీలో రకరకాల స్థానిక భాషల్లో సాహిత్య రచన సాగేది. రాజస్థానీ, మైథిలీ, అవధి, బ్రజ్‌భాషల్లో ఉత్తమ సాహిత్యం వెలువడింది. 14వ శతాబ్దం నుంచి ఉత్తర భారతంలో భక్తి సాహిత్యం ఒక్క ఊపు ఊపింది. 17వ శతాబ్దంలో రాజాస్థానాల్లో ప్రణయం సాహిత్యంలో ఆధిపత్యం వహించింది. రాధాకృష్ణుల ప్రణయం సాహిత్యాన్ని ఆవరించింది. భక్తి, ఆదర్శ ప్రేమ (రీతి) రచనలే చాలా కాలం హిందీ సాహిత్యంపై ప్రభావం చూపాయి. 20వ శతాబ్దంలో హిందీ సాహిత్య తీరు తెన్నులే మారాయి.
సాంప్రదాయ, బ్రజ్ భాషా హిందీ స్థానంలో మాట్లాడే హిందీలో (ఖరీబోలీ) రచనలు ప్రారంభమయ్యాయి. సాహిత్యం కొత్త ప్రతీకల్ని, వస్తువుల్ని, భావా వేశాల్ని ఎంచుకోవడం మొదలైం ది. సామాజిక సంస్కరణలు, జాతీయ వాదానికి హిందీ ఆలం బన అయింది. మహాదేవీ ప్రసాద్ ద్వివేదీ, మైథిలీ శరణ్ గుప్తా లాంటి వారు మార్పుకు దోహద కారులయ్యారు. ఆ తర్వాతి కాలం లో వ్యక్తుల భావావేశాలను, బాధల్ని చిత్రించే ఛాయావాదం హిందీ సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. రాజకీయ స్వాతంత్య్రం ఒకవైపు, వ్యక్తి స్వేచ్ఛ మరోవైపు రచయితలను వివిధ మార్గాల్లో వెళ్లడానికి ప్రోద్బల పరిచాయి. ఆ తర్వాత ప్రగతిశీల ఉద్యమాలు హిందీ సాహిత్యంలో ఉత్తమ రచయితలను సృష్టించాయి. ఛాయావాదం ఆశించే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వప్నాల స్థానంలో ప్రగతివాదం సామాజిక వాస్తవికత చోటుచేసుకుంది. అదే ప్రయోగవాదం, నయీ కవిత (కొత్త కవిత)ల కాలానికి దారి తీసింది. ఆ రోజుల్లో కవి, సాహితీ విమర్శకుడు అజ్ఞేయ ఆధ్వర్యంలో వెలువడిన తార్ సప్తక్ పత్రిక అనేకమంది యువకవుల గళాలను ధ్వనించింది. వారి ఆవేశం, ఆలోచన నాటి సమాజానికి ప్రతిబింబాలయ్యాయి. ఆ కవుల్లో కేదార్‌నాథ్ సింగ్ ఒకరు.
ప్రేమ్‌చంద్, బచ్చన్, పంత్ లాంటి అనేకమంది ఉత్తమ కవులను సృష్టించిన గడ్డ ఉత్తర ప్రదేశ్‌లోనే కేదార్ నాథ్ సింగ్ జన్మించారు. గోరఖ్‌పూర్ సమీపంలోని బలియా జిల్లాలో చకియా అనే గ్రామంలో ఆయన 1934లో జన్మించారు. ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే బనారస్ వెళ్లాల్సిందే. కేదార్‌నాథ్ కూడా బనారస్‌లోనే ఉన్నత పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచే ఆయన హిందీలో ఎంఏ, పిహెచ్‌డి చేశారు. దాదాపు దశాబ్దం పాటు బనారస్‌లో ఉదయ్ ప్రతాప్ కళాశాల, గోరఖ్‌పూర్ యూనివర్సిటీల్లో ఆయన విద్యార్థులకు హిందీ బోధించారు. 1976లో ఆయన ఢిల్లీలోని జెఎన్‌యూలో హిందీ బోధించేందుకు వచ్చారు. అక్కడే రిటైర్ అయ్యేంత వరకూ కొనసాగారు.
కేదార్‌నాథ్ సింగ్ కవిగా మారడానికి కారణం ఆయన ప్రగతివాద కవుల ప్రభావంలో పడడమే. 1952లో 18 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. సమాజ్ అనే పత్రికలో ఆయన తొలి కవిత పడింది. ప్రగతివాదం అనేదాన్ని సాధారణ అర్థంలో తీసుకోవాలి. ప్రగతివాద కవుల్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని అభిమానించే అజ్ఞేయ నుంచి మార్క్సిస్టులైన ముక్తిబోధ్ వంటి వారు కూడా ఉండేవారు. ‘మా కవులు ప్రయాణీకులు కూడా కారు.. రహదారులను వెతుకుతున్నవారు..’ అని అజ్ఞేయ తన పత్రికలో రాశారు. ఈ దృష్ట్యా నయీ కవితా.. అంటే కేవలం కొత్త భావాలు మాత్రమే కాదు, కొత్త ప్రతీకలు, కవిత్వానికి కొత్త రూపాలు వెతికేవారు అని కూడా అర్థం. కేదార్‌నాథ్, రఘువీర్ సహాయ్ లాంటి వారి కవితలు ఇందుకు నిదర్శనం. ఈ కొత్త కవులందరూ తొలుత తీస్రా సప్తక్‌లో దర్శనమిచ్చేవారు. 1960లోనే కేదార్‌నాథ్ కవితా సంకలనం అభీ, బిల్కుల్ అభీ వెలువడింది.
కేదార్‌నాథ్ తొలి కవితలు చూస్తే మనకు శ్రీశ్రీయే గుర్తుకువస్తారు. నవీన్ జోష్ జిందగీ జాగాయే చల్.. జగాయే చల్, జగాయే చల్.. (కొత్త ఆవేశం జీవితాన్ని మేల్కొల్పేందుకు పదండి..), గులామీయోంకే చిన్హ్ మిటాయే చల్.. మిటాయే చల్.. మిటాయే చల్ (బానిసత్వ అవశేషాలను తుడిచిపెట్టేందుకు వెళదాం పదండి.. పదండి..) అని లయాత్మకంగా రాశారు. 1960లో వెలువడిన ఆయన తొలి సంకలనంలో అన్నీ ఇలాంటి కవితలే కనిపిస్తాయి. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు కాని 1980లో ఆయన మరో కవితా సంకలనం జమీన్ పక్‌రహీ హై వెలువడలేదు. ఆయన మూడో కవితా సంకలనం అకాల్ మే సరస్ (1989)కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1995లో ఉత్తర్ కబీర్ అవుర్ అన్య కవితా, 1996లో బాగ్, 2004లో టాల్‌స్టాయ్ అవుర్ సైకిల్ అనే కవితా సంకలనాలు వెలువడ్డాయి. పులి పేరిట రాసిన సుదీర్ఘ కవితా సంకలనంలో ఆయన మనిషి జీవితంలో సంక్లిష్టతను పులి అనే ప్రతీక ద్వారా అద్భుతంగా చిత్రించారు. పలు సాహిత్య విమర్శా గ్రంథాలు కూడా ఆయన రాశారు. కల్పనా అవుర్ ఛాయావాద్ అనే వ్యాససంకలనంలో ఆయన ఛాయావాదం గురించి రాశారు. మేరీ సమాజ్, మేరీ శబ్ద్ అనే వ్యాస సంకలనంలో సాహిత్యోద్యమాల గురించి రాశారు. ఖబరిస్తాన్ మే పంచాయత్ అనే వ్యాస సంకలనంలో మానవ భావోద్వేగాలు, జీవితంలో సంక్లిష్టత, సాంస్కృతిక చైతన్యం గురించి రాశారు. ఆయన ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలిస్తాయి. కుమార్ ఆసన్, మైథిలీ శరణ్ గుప్తా, దినకర్, జాషువాల పేరిట ఆయనకు పలు అవార్డులు లభించాయి. స్పానిష్, డచ్, జర్మన్, రష్యన్, హంగరీ భాషల్లో ఆయన కవితలు అనువాదాలయ్యాయి.
ఆయన కవితలు ఒకో దశలో ఒకో సామాజిక వాతావరణాన్ని ప్రతిఫలి స్తాయి. తొలి కవితల్లో భావావేశం, ప్రగతివాదం, గ్రామీణ వాతావరణం, గంగానది గలగలలు, సామాన్యుడి జీవితం కనపడతాయి. తర్వాతి కవితల్లో ఆలోచన, తాత్వికత, తాజా కవితల్లో ఆవేదన, యుద్ధాలు, హింసాకాండ, నిరాశా నిస్పృహలు, ప్రపంచీకరణ సృష్టిస్తున్న వైపరీత్యం ప్రతిఫలిస్తాయి. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. అంతేకాదు, శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు. పడవ నడిపేవారు, పసుల గాచేవారు, ఆడుకునే పిల్లలు, బండ్లు నడిపే ఎద్దులు, సూర్యుడు, వెన్నెల నక్షత్రాలు, పక్షులూ, నేలా ఇవన్నీ ఆయన ఇష్టమైన కవితా వస్తువులు. మనిషి వైపు శబ్దాల్ని విసిరేయాలనుకుంటాను.. అని కేదార్ నాథ్ అంటారు ఒక కవితలో. ఆయన విసిరివేసిన శబ్దాలే నేడు ఆయనకు జ్ఞానపీఠ అవార్డును ఇచ్చాయి.
-ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఉపాధ్యక్షులు, కేంద్రీయ హిందీ సంస్థాన్
జటాయు రావణ యుద్ధం
తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా ధారపోసి పోరాడింది ఒక పక్షి .ఆ పక్షిరాజే జటాయువు .ఆ రాక్షసుడే దశ కంఠ రావణుడు . ఆవిడే సీతా మాత .ఇది శ్రీ మద్రామాయణం లో అరణ్య కాండ లో మహర్షి వాల్మీకి ఆ పోరాటాన్ని అత్యద్భుతం గా చిత్రించాడు .విలువలు మానవులకే కాదు పక్షులకూ ఉంటాయని రుజువు చేశాడు .అదే ఇప్పుడు మనం తెల్సుకో బోతున్నాం .
జనస్థానం లో సీత కోసం అన్వేషిస్తున్నారు రామ లక్ష్మణులు .పర్వతాలు గుహలు ,అడవులు యక్ష కిన్నర గాంధర్వ గృహాలు వెతుకుతూ ,మధ్యలో ఒకరి నొకరు ఒఓదార్చు కుంటూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అన్నను తమ్ముడు అనునయిస్తూ తిరుగుతున్నారు .కొంత దూరం వెళ్ళే సరికి పర్వతాకారం గా నెత్తురోడుతూ పడిఉన్న పక్షిరాజు జటాయువును చూశారు .ఆ పక్షి సీతను మింగి అలా పడి పోయి ఉంటుంది అని అనుమాన పడ్డాదు రాముడు బాణం ఎక్కు పెట్టి ఆ పెద్ద పక్షిమీద బాణం సం ధించటా నికి సిద్ధ పడ్డాడు .
రాముడిని చూడగానే జటాయువుకు ప్రాణం లేచి వచ్చింది .శ్రీ రాముడికి సీత జాడ వివరించి ప్రాణాలు వదలాలని బతుకుతున్నాడు ప్రాణాలు ఉగ్గ బట్టి .ముక్తసరిగా రావణుడు సీతా దేవి తో బాటు ,తన ప్రాణాలనూ అపహరించాడని చెప్పాడు .అన్నదమ్ములిద్దరూ దగ్గర లేని సమయం చూసి రావణుడు వచ్చి బలాత్కారం గా సీతను ఎత్తుకు పోయాడని ,అమ్మను కాపాడటానికి తాను ఆ దుస్ట రాక్షసుడితో పోరాడాను అన్నాడు .వాడి రధాన్ని ముక్కలు ముక్కలు చేశానని ,ఆ ముక్కలే ఇక్కడ పడి ఉన్నాయని చూపించాడు .తన రెక్కలు ముక్కలు చేసి సీతను ఎత్తుకొని పారిపోయాడని చెప్పాడు .రావణుడి చేతిలో చని పోయిన తనను ఇంక చంపక్కర్లేదని అన్నాడు .రాముడు తన తొందర పాటుకు పశ్చాత్తాప పడి ,జటాయువును కౌగలించుకొని బిగ్గర గా ఏడుస్తాడు .లక్ష్మణుడు కూడా చాలా దుఖిస్తాడు .రాజ్యం పోయింది భార్య శత్రువు చేత చిక్కింది చివరికి తన భార్యను కాపాడే ప్రయత్నం లో శత్రువు తో పోరాడిన పక్షిని కూడా తాను రక్షించలేక పోతున్నానని రాముడు విచారించాడు .తన లాంటి దురదృష్ట వంతుడు ఈ ప్రపంచం లో బతక కూడదని ,తన దౌర్భాగ్యం అగ్నిని కూడా దహింప జేస్తుందని ఆవేదన పడ్డాడు .తన శోకాగ్ని ని చల్లార్చేందుకు మహా సముద్రం కూడా చాలదని వాపోయాడు .తన దురదృష్టం తనకు తమ్ముడికి భార్యకే కాక ఈ పక్షికి కూడా అంటింది అని ఆవేదన చెందాడు .
జటాయువు ‘’విగతాయువు ‘’అయి పోయాడని చింతించిన రామ లక్ష్మణులు మరిన్ని వివరాలు చెప్పమని జటాయువును అర్ధించారు .సీతను మాయతో రావణుడు దక్షిణ దిక్కుకు తీసుకొని వెళ్ళాడని ,రావణుడు సీతను తీసుకు వెళ్ళిన ముహూర్తం ‘’వింద ముహూర్తం ‘’అని , ఆ ముహూర్తం లో పోయిన వస్తువు తిరిగి యజమానికి దక్కుతుందని ,ఎరను కరచుకొన్న చేపలాగా రావణుడు ఆత్మ నాశనం చెందుతాడని ,త్వరలోనే రావణ ప్రాణాలను రాముడు అపహరించి సీతమ్మను తెచ్చుకొంటాడని దిగులు అక్కరలేదని ,రావణుడు విశ్రస వసువు కుమారుడైన కుబేరుని సోదరుడని చెప్పాడు .ఇంకా చెప్పమని అడుగుతూ నే ఉన్నాడు ఇంతలో జటాయువు ప్రాణ వాయువులు అనంత వాయువులలో కలిసి పోయాయి .
ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్దాం .సీతను ఎత్తుకెళ్లే తన విషయం భర్తకు ఎలా తెలుస్తుందీ అని సీత బాధపడుతూ ,రావణుడితో శక్తి మేరకు వాదులాడుతూ రామా రామా లక్ష్మణా లక్ష్మణా అని విలపిస్తూ వెడుతోంది .రామ సామర్ధ్యం మీద విపరీతమైన విశ్వాసం సీతమ్మకు ఉంది. అయినా ఈ ఆపదనుండి బయట పడాలి .అన్ని వైపులకూ చూస్తోంది .ఎవరైనా కనిపిస్తారేమోనని .ఇంతలో నేల మీద జడలా ముడి పడ్డ ఆయువు కల ,అరవై వేల సంవత్సరాల ముసలి జటాయువు కని పించాడు .కళ్ళు పెద్దవి చేసుకొని చూసి జాటాయువే అని అతను తనమామ గారు దశరధుని మిత్రుడని గుర్తు చేసుకొని ‘’జటాయూ జటాయూ ‘’అని బిగ్గరగా అరిచింది .దిక్కు లేని తనను రావణుడు బల వంతం గా ఎత్తుకొని తీసుకొని పోతున్నాడని ఆ దుస్ట రావణుడితో జటాయువు పోరాడే సామర్ధ్యం లేని వాడని కాని ఈవార్త తన భర్త శ్రీ రాముడికి తెలియ జేయమని బతిమాలింది .ఆ మాటలు జటాయువు చెవిన పడి తల పైకెత్తి చూసి జానకిని దర్శించాడు .
వెంటనే లేచి ఒక్క సారి ఆకాశానికి యెగిరి రావణుడి ని వెంటపడి మంచి మాటలతో మందలించాడు .నీతిని మన్నించాల్సిన రాజే ధర్మ మార్గం తప్పితే మిగిలిన వారి గతేమిటి అని ప్రశ్నించాడు పర దారాపహరణం ప్రాణాంతకం అని మందలించాడు .రావణుడు త సోదరుడి లాంటి వాడని ,కనుక సోదర భావం తో మేలు కోరి చెబుతున్నానని ,రాముడు తనకేమీ ద్రోహం చేయక పోయినా ఆయన భార్యా పహరణం కొరివి తో తల గూక్కోవటమేనని ,జనస్థానం లో శూర్పణఖ వలన ఏర్పడిన రాక్షస సంహారం లో రాముడి తప్పేమీ లేదని దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రాముడితో పోరాడాలికాని ఈ అకృత్యం పనికి రాదనీ హితవు చెప్పాడు .రామాగ్ని దశ కంఠుడిని భస్మం చేస్తుందని ,విషసర్పాన్ని మూటకట్టు కొని వెడుతున్నాడని తర్కానికి వేదాంతం దొరకదని రావణ బలపరాక్రమాలకు సీతమ్మ దక్కదని ,క్షణం లో పద్నాలుగు వేల మంది రాక్షసులని చంపిన రాముడి ముందు ఎవరూ ఆగలేరని ,పిరికి గా సీతా పహరణం చేయటం వినాశమని చెట్టు నుంచి పండుకోసి నట్లు రావణుని తల పండును క్షణం లో తుంచే స్తానని జటాయువు చెప్పాడు .సామ దాన భేదాల తో పక్షి రాజు లంకాధిపతి కి బుద్ధి చెప్పాలని శత ప్రయత్నం చేశాడు .లాభం కని పించలేదు .చివరికి జటాయువుకు దండోపాయమే శరణ్యమైంది .
అంత రిక్షం లో రావణ జటాయువులకు తీవ్ర యుద్ధం జరిగింది .రావణుడు బాణాలతో యుద్ధం చేస్తే పక్షిరాజు వాడి గోళ్ళతో చేశాడు .రావణుడు వేసిన పది బాణాలను జటాయువు గోళ్ళతోనే చీల్చి వేశాడు రధం లో చింతలో ఉన్న సీతను చూడగానే జటాయువులో పౌరుషాగ్ని ప్రజ్వ రిల్లింది .రావణుడు శర వర్షం కురిపించి జటాయువును గూటిలో ఉన్న చిన్న పిట్ట లా చేశాడు ..కాని దీనికి భయపడని జటాయువు రెక్కలతో రావణుని కవచాన్ని రధాన్ని ,రధాన్ని నడిపే పిశాచాలను ముక్కలు ముక్కలు చేశాడు .రావణుని చత్ర చామరాలు చిన్నా భిన్నమైనాయి .సారధి తల బద్దలై పోయింది .చివరికి రావణుడు గతి లేక సీతను ఒడి లో పెట్టుకొని ,కిందికి దిగాడు .పంచ భూతాలు జటాయువు ను ప్రశంసించాయి .జటాయువు కొంచెం అలసి నట్లు కని పించగా ,రావణుడు పారిపోయే ప్రయత్నం చేశాడు.అతని చేతిలో ఒక కత్తి మాత్రమె ఉంది .రెండవ చేతిలో సీత ఉంది .ఆ దృశ్యాన్ని చూసి సహించలేక జటాయువు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రయత్నించాడు .మరో సారి మంచిమాటలు చెప్పి దుస్ట మార్గాన్ని మార్చుకోమన్నాడు .వాడు వినేట్లు లేదని గ్రాహించాడు .
రావణుడి వీపు మీద కూర్చుని రెక్కలతో జటాయువు రక్కి రక్కి ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ముక్కులతో అతని బాహువుల్ని చేదిస్తాడు .తెగినవి తెగినట్లు మళ్ళీ మొల కేత్తుతున్నాయి .సీతా దేవిని నేల మీద దించి రావణుడు జటాయువు తో మల్ల యుద్ధం చేశాడు .ఘోర యుద్ధమే ఇద్దరిమధ్యా కొన్ని క్షణాలు జరిగాయి .పక్షి బాధ భరించలేని రావణుడు జటాయువు ను తన ఖడ్గం తో ఖండించాడు .జటాయువు శక్తికోల్పోయి నేల మీద పడి పోయాడు .రావణుడు సీతను పట్టుకొని ఆకాశ మార్గం లో యెగిరి లంకకు చేరాడు ..
జటాయు మరణానికి రామ లక్ష్మణులు శోకించారు .అనేక సంవత్సరాలు దండకారణ్యంలో గడిపిన జటాయువు చిరాయువుగా ఉండాల్సిన వాడు తన కోసం తనువు చాలించాడని రాముడు లక్ష్మణుడికి చెప్పి శోక సాగరం లో మునిగి పోయాడు .పశు పక్ష్యాదులలో కూడా సాధువులు పుణ్యాత్ములు ,ధర్మాత్ములు ఉంటారని ,సీత కని పించక పోవటం అనే బాధ కంటే తనకోసం జటాయువు ప్రాణాలు అర్పించటం మరీ బాధ గా ఉందని చెప్పాడు .తన తండ్రి దశరధ మహా రాజుకు దహన సంస్కారాలు చేయ లేక పోయిన రాముడు తండ్రిలాంటి వాడు తండ్రికి ప్రాణ మిత్రుడు అయిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి ఋణం తీర్చుకొంటానన్నాడు .లక్ష్మణుడు చేత చితి పేర్పించి శాస్త్రీయం గా జటాయువు కు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు .యజ్న యాగాదులు చేసి యుద్ధం లో వెనుదీయ కుండా పోరాడి భూదానం చేసిన పుణ్యాత్ములు వెళ్ళే అక్షయ పుణ్య లోకాలకు తన మాట మీద జటాయువు తరలి వెళ్లాలని శ్రీ రాముడు శాసించాడు .దానికి అనువైన మంత్రాన్ని జపించాడు .
కనుక పశు పక్ష్యాదులు కూడా ధర్మాన్ని తప్పక ఆచరించి తమ విద్యుక్త ధర్మాన్ని నెర వేరుస్తాయని జటాయువు కద ద్వారా మహర్షి వాల్మీకి ఎరుక పరచాడు .మనిషి కూడా తన వంతు ధర్మాన్ని నేర వేర్చాలని శ్రీ రాముని పాత్రద్వారా జటాయువు కు రాముడు పితృ సంస్కారాలు చేసి ఋణం తీర్చుకోన్నాడని తెలియ జేస్తాడు
ఆధారం -స్వర్గీయ ఇలపావులూరి పాండు రంగా రావు గారు రాసిన ”అనుదిన రామాయణం ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-14-ఉయ్యూరు
రమ్యమైన అక్షర భారతి
శ్రీ చలపాక ప్రకాష్ సంపాదకత్వం లో మే –జులై రమ్య భారతి సంచిక ఉత్తరాంధ్ర మాండలిక రచయిత శ్రీ గంటేడ గౌరు నాయుడు ముఖ చిత్రం తో ,లోపల ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిన్నమాటలు చిన్న వాక్యాలతో చక్కగా వివరం గా ఆయన మాటల్లోనే వివరించి స్పూర్తి కలిగించారు .ఆయన అనుభవాలు ఆయనకు ప్రేరణ నిచ్చిన అప్పల నాయుడు ,వేసిన తోలి అడుగులు , ఎదిగిన విధానం ఆకర్షిస్తుంది . ప్రసిద్ధ నటుడు ,రచయిత ’’జెన్నీ ‘’(పోలాప్రగడ జనార్దన రావు )కద’’తోడూ –నీడ’’ఆరవ జాతీయ స్థాయి చిన్నకదల పోటీల్లో ‘’ప్రత్యెక సోమేపల్లి సాహితీ పురస్కారం ‘’పొందింది .ఆ కదను ఫన్నీ గా జెన్నీ రాస్తాడనుకొంటే కన్నీళ్లు, మానసిక ఆనందం ,’’ప్రేమించే గుణం ఉంటె ఆస్తి లేక పోయినా ఆరోగ్యం లేక పోయినా హాయిగా బతక వచ్చు’’అనే సత్యాన్ని ఆవిష్కరించి జెన్నీ కదా కధనానికి జోహార్ అన బుద్దేస్తుంది .’’యాభై ఏళ్ళ వాన ‘లో తడిసి ముద్ద అయిన కొప్పర్తి గురించి సజ్జా వెంకటేశ్వర్లు రాసిన విధానం బాగుంది .కవి ఆకాశాన్ని నల్లని గొడుగు గ విప్పెదేవరు ,వికీర్ణం చేసి చినుకుల్లా రాల్చేదేవరు ,అని ప్రశ్నించి ,వాన ఎప్పుడు కురిసినా నిండా ప్రేమ కురిసి నట్లే ఉందన్నారు .చీకటిని జయించటం మానవ నాగరకతా లక్షణం అని మూఢ నమ్మకాలను దూరం చేయమన్నారు .’’బుష్ ను వ్యతి రే కించ గలను కాని సద్దాం ను సమర్ధిం చ లేనన్నారు ‘తన భార్య గుణ సౌందర్యం ,కుటుంబ జీవనం అనురాగాంకి గుర్తుగా కొప్పర్తి కవిత ఆమె శ్రమ సౌందర్యానికి అద్దం పట్టింది .తటి వర్తి నాగేశ్వరి ‘’దాడి ‘’కదా ,పుస్తక సూక్ష్మ సమీక్ష నానీల వంటి కవితలు ,కొత్త ఆవిష్కరణ పుస్తక వివరం ,పాఠకుల చర్చా రమ్య భారతికి అదనపు ఆకర్షణలు .ప్రకాష్ అవిశ్రాంత అక్షరార్చనకు రమ్య భారతి సజీవ సాక్షాత్కారం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-6-14-ఉయ్యూరు
బ్రాహ్మణాల కదా కమా మీషు -9
కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద
అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు ఈ అగ్నులు అవసరమే .ముందు అగ్నిని ప్రతిష్టించి మిగిలిన కార్య క్రమాలు మొదలు పెట్టాలి .
ఒకప్పుడు మానవుల్లాగా దేవతలు కూడా భూలోకం లోనే ఉండి కర్మానుస్టానాలు చేసుకొంటూ స్వర్గం పొందటానికి సాధన చేస్తూండే వారు .ఈ అనుష్టానం వల్ల దేవతలు పునర్జన్మ నుండి విమ్ముక్తులై పునరా వ్రుత్తి లేని స్వర్గాన్ని పొందారు .దీనితో మనుష్యుల కంటే వేరు గా ఉన్నారు .స్వర్గానికి పోతున్న దేవతలు అగ్నితో ‘’నువ్వు భూలోకం లో ఉండి మానవులకు ,మాకు అధ్యక్షుడు గా ఉండు .మానవులు శ్రౌత స్మార్త కర్మల ద్వారా సమర్పించిన వి నీ ద్వారా మేం స్వీకరిస్తాం .మా అనుగ్రహం చేత మానవులకు ఐహికాముష్మిక పురుషార్ధాలు పొందుతారు .మనుష్యులకు మాకు సంబంధం కలుపుతూ నువ్వు భూమి మీదే ఉండిపో .మానవులు యజ్న యాగాదులలో ఇచ్చే ద్రవ్యాలను నువ్వు స్వీకరించు .మా తరఫున వారి కోర్కెలు తీర్చు .’’అని చెప్పారు .దానికి అగ్ని ‘’నాకు తీవ్ర దాహం ఉన్న సంగతి మీకు తెలుసు .నన్ను సమీపించటానికే భస్మమై పోతామనే భయం తో ఎవరూ సాహసం చేయలేరు కదా అందువల్ల మీరనుకోన్నట్లు ‘’పురోడాశం ‘’మొదలైనవి నాకు మానవులు ఇవ్వరు ‘’అన్నాడు .
దేవతలకు సంకట పరిస్తితి వచ్చి బాగా ఆలోచించారు .అగ్ని లో ఇతరులు సహింప రాని తీవ్ర దాహక శక్తి ,మంగళకరమైన మానవాభ్య్దయానికి ఉపయోగించే శోభనకర దాహక శక్తి అని రెండు రకాలు ఉన్నాయి .రెండో దానివలననే మనం వంటలు వగైరా చేసుకో గాలుగుతున్నాం .ఈ శోభన శక్తిని మాత్రం అగ్ని లో ఉంచి ,దేవతలు తీవ్ర శక్తిని వేరు చేసి దాన్ని నీటిలో ఉంచారు .దీనికే ‘’పవమానాగ్ని ‘’అని పేరు .కొంత వాయువులో ఉంచారు .ఇదే పావకాగ్ని .మిగిలిన శక్తి నంతటిని సూర్యుని లో ఉంచారు ఈ అగ్నికే శుచి అని పేరు .కనుక అగ్ని దేవుడిని పూజించాలంటే ఆహవనీయ , గార్హపత్య ,అన్వాహార్య రూపాలలో ఉండే శోభంకర అగ్నులనే కాకుండా పావక ,పవమాన ,శుచి పేర్లతో ఉన్న అగ్ని స్వరూపలనూ పూజించాల్సిందే .అందుచేత ఈ మూడు శరీరాలకు మూడు ఇష్టులు చేయాలి .పావకేష్టి పూర్ణ మాసేష్టికి వికృతి .శుచి ,పవమానేస్టూలకు దర్శేష్టి ప్రకృతి .ఇవన్నీ చేస్తేనే అగ్న్యాధానం పూర్తీ అయి నట్లు లెక్క .
కౌశీతకీ బ్రాహ్మణం విశిష్టత సోమయాగ నిరూపణం మీదే ఆధారపడి ఉంది. సోమయాగం పది రోజులు చేస్తారు వాగ్దీక్ష తో ఇది ప్రారంభ మవుతుంది .ఈ దీక్షతో ప్రాణ దీక్ష లభిస్తుంది .ఈ రెండిటి వల్లా యజమానికి కోరిక నేర వేరుతుంది .కనుక మాటకున్న విలువ ,దాన్ని ప్రేరేపించే మనసుకున్న సంయమనం ,మనసుతో ప్రభావితమయ్యే ప్రాణ శక్తి ప్రయోజనం ఇందులో సూచించారు .ఇందులో సూచిన అభిజిత్ ,విశ్వజిత్ యాగాలు విశిష్టమైనవి .అభిజిత్ అంటే అగ్ని .విశ్వజిత్ అంటే ఇంద్రుడు .దేవతలు అభిజ్త్ యాగం తో ముల్లోకాలను జయించారు .మిగిలిన లోకాలన్ విశ్వ జిత్ చేసి జయించారు .ప్రజా రక్షకుడైన డైన రాజుకు విశ్వ జిద్యాగం చాలా అవసరం అని తెలుస్తోంది .శత్రు శేషం లేకుండా చేస్తుంది.దీనితో సామాన్య ప్రజల సంక్షేమానికి హాని తల పెట్టె దుస్త శక్తులను మట్టు పెట్ట వచ్చు లోక క్షేమం కలుగు తుంది .
మనసుకు పరిధులు లేవు అని ,మనస్సు ప్రజాపతి అని ,ఆ ప్రజాపతి యజ్న మయుడని ,మనః పూర్వకం గా యజ్ఞం కోసమే యజ్ఞం చేయాలని తెలియ జేయ బడింది .ప్రజా రక్షకు డైన రాజు మనస్సుజీవితం నిస్వార్ధం గా ఉండాలి అనే సూచన ఉంది .విజ్నుడి రాక తో యజ్ఞం ఆనందిస్తుందని చెప్ప బడింది .ఏదైనా ప్రమాద వశాత్తు తప్పులు చేస్తే సరి దిద్దుకోవాలని సూచించింది ..అందరూ చేరలేని ఎత్తులకు ఎగిరే గరుత్మంతుడే వాయువు అని ,వాయువు అంటే ప్రాణమని చివర సుపర్ణ పర్వం లో వివరింప బడింది .వాల ఖిల్యులు అంటే భౌతిక శరీరం నుండి విడి పోని ప్రాణాలు అని ,వైశాల్యం లో వాలం అంటే కేశం అంటే వెంట్రుక వంటి ప్రాణాలు ,శరీరాన్ని వదల లేవుకనుక వాటికి వాలఖిల్యులు అనే పేరొచ్చింది .రెండిటితో సంబంధం లేని దాన్ని ఖిల అంటారు . సూక్ష్మ సంబంధం ఉన్దికనుక వాలఖిల్యులన్నారని భావం .చివరలో కర్మ బద్ధుడైన జీవుని ప్రస్థానాన్ని కూడా సవివరం గా కౌశీతకి బ్రాహ్మణం వివరించింది .
అగ్ని బ్రహ్మణ శక్తి .సోమం క్షాత్ర శక్తి .అన్ని కోర్కెలను తీర్చే వాక్కు మనస్సు లే హోమ ద్రవ్యాలు .బలి సమర్పించటం అంటే పురోడాశం సమర్పించటమే పశుబలి .పశువును కాక పశువుకు ప్రతీక అయిన పురోడాశం ను సమర్పించాలి .యజ్ఞం చేసే యజమానికి ఇహ పరాల్లోను అంతరిక్షం లోను మేలు జరుగుతుంది .సంతానంకావాలని యజ్ఞం చేసేవారు ‘’శుద్ధ ప్రణవం ‘’ను ,పరువు ప్రతిస్టలకై చేసే వాళ్ళు ‘’మకార లేకుండా ఉన్న ప్రణవాన్ని ‘’ఉచ్చరించాలి ఈ యజ్ఞం సు సంపన్నం అయితే స్వర్గ రూపం ,తగ్గితే అన్నాది రూపం ,హెచ్చితే సంతాన రూపం అవుతుందని వివరించింది కౌశీతికం .సోమమే సవనీయం చేయాల్సిన పశువు .యజ్నమే ప్రజాపతి స్వరూపం అని ముందే తెలుసుకొన్నాం .ప్రాజాపత్య యజ్ఞం సర్వా భీస్టాలను తీరుస్తుంది .సూక్షం గా విచారిస్తే యజ్న కర్త శరీరమే పురోడాశం .ఆయన ఉచ్చ్వాస నిస్శ్వాసాలే సోమ పాన పాత్రలు .యజ్ఞకర్త ఇహలోకం లో సంపూర్ణ జీవితం గడిపి స్వర్గం లో అమరుడౌతాడు .
షోడశి లో ఈ విశ్వం షోడశ కళాత్మక రూపం గా చెప్ప బడింది షోడశి ఇంద్రుడే .ఇంద్రుడు హరి యే.యజ్ఞం పురుష స్వరూపమే .పురుషుని శిరస్సు ‘’హవిర్వాహకం ‘’.ముఖమే ఆహవ నీయం .ఉదరం సదస్సు .ఆహారమే దేవతలకు చేసే స్తోత్రాలు .బాహువులు మార్జాలీయాగ్ని ద్రీయాలు .లోపలి దివ్య శక్తులు సదస్సులోని దేవతా పీఠాలు .మనస్సు బ్రహ్మ. .ప్రాణమే ఉద్గాత .అపానం ప్రస్తోత .వ్యానం ప్రతి హర్త.వాక్కు హోత .నేత్రమే అధ్వర్యుడు .సంతతే సదస్యులు .ఆత్మ యజమాని .అవయవాలు హోత్రాశంసులు .ఇవన్నీ గమనిస్తే మానవ జీవితం యజ్న మయం అనే అంతరార్ధం తెలుస్తుంది .
పూరీ జగన్నాధ రధ యాత్ర శుభా కాంక్షలు –
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-14-ఉయ్యూరు
డిం .టిం.ప్ర.జ.-3
డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ?
టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు .
డిం –కారణం ఏమిటి స్వామీ?
టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని తెలియ జెప్పటానికే ఈ ఆక్రోశం .మీడియా లో కనిపిస్తే మళ్ళీ ‘’డిగ్గీ రాజా’’ లాంటివారు వచ్చి పాదాలను ఆశ్రయిస్తారనే ఆరాటం .గ్లామర్ తగ్గినప్పుడల్లా ఆయనకు ఇదొక వినోదం .గిల్లి జోకొట్టటం .
డిం –ఆయన మాటల్లో నిజం లేదాగురూ!
టిం –అది నమ్మకం మీద ఆధార పడిదఉంటుంది .అసలు సాయిబాబా ఒక కారణ జన్ముడు అని నమ్మే వారి సంఖ్య బహుళం గా ఉంటె సముద్రం లో కాకి రెట్టలా ఈ వ్యాఖ్యానాలు వ్యర్ధం .ఆకాశం మీద ఉమ్మేస్తే వచ్చి మీద పడేది మన మొహం మీదే కదా శిష్యా !.ప్రతి వాడిలోను దైవాంశ ఉందని మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సిద్ధ యోగి పుంగవులు ఘోషిస్తుంటే దానినేమాత్రం అర్ధం చేసుకో కుండా ఈ ప్రేలాపన అహంకారాన్ని ,అజ్ఞానాన్ని తెలియ జేస్తుంది .ఇదొక ప్రచార ఆర్భాటమే .
డిం –‘’నగరం’’ లో అ గాస్ భీభత్సం ఏమిటి గురూ?
టిం –అనుకోకుండా వచ్చేవి ఉపద్రవాలు .ఇది మానవ తప్పిదం .గాస్ ను యెంత జాగ్రత్త గా ఉపయోగించుకోవాలో తెలియ జేసే ఉదంతం ఇది .హెచ్చరికలు చేసినా పై అధికారులు చలించక పోవటం బాధ్యతా రాహిత్యమే .ఆఘ మేఘాల మీద ముఖ్య మంత్రి బాబు వచ్చి పరామర్శించి ఓదార్చి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసి ,కేంద్రాన్ని ఒప్పించి పాతిక లక్షల నష్ట పరిహారం ఇప్పించే ఏర్పాటు చేశాడు ఇలాంటి సందర్భాలలో చంద్ర బాబు యెంత వేగం గా స్పందిస్తాడో తెలియ జేస్తుంది .అందుకే అంతనమ్మకం ఆయన పైన .
డిం –సరిపోతుందా ?
టిం –ప్రాణాలను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాని బాధిత కుటుంబానికి .పరిహారం ఉద్యోగం చదువు కూడా ఏర్పాటు చేయటం కొంతలో కొంత నయం .
డిం –ఇవాళ జగన్ వచ్చి చూసి వెళ్ళాడు ?
టిం –మానవత్వమున్న ఏ వ్యక్తీ అయినా ఇలా స్పందించాల్సిందే .కాని వచ్చి చూసి వెళ్ళాడు .కోటి ఇమ్మని నీతి చెప్పాడు .కాని తన పాపం సోమ్ములోంచి కొంత ఇచ్చి ఒదార్చితే బాగుండేది .పని లేనప్పుడు ఓదారుస్తా ఓదారుస్తా అని వెళ్లి జనాన్ని కావ లించుకొని ముద్దేట్టుకొని హడావిడి చేసిన వాడు ఇలా ఉత్త చేతులతో వెడితే బాగా లేదని పించదా ఎవరి కైనా ?
డిం –బ్లాక్ మనీ మార్చుకోటానికే కిరణ్ బి జెపి చెప్పులు తోడుక్కుం టుక్కుం టున్నాడని డొక్కా అంటున్నాడు ?
టిం –నిజమే .ఎవరికి ఏ జత నచ్చితే ఆ చెప్పులేసుకొంటారు .ఇది సహజం .ఎన్నికల ముందు డొక్కా ఎన్ని ఊపులూపాడు దేనిలో చేరాలో తెలీక ?ఎక్కడా ఇమడలేక అక్కడే చతికిల పడ్డాడుకాని .కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మనీ లేదని డొక్కా అభిప్రాయమా ?త్వరలోనే స్విస్ లో దాచిన నల్ల కుబేరుల డబ్బు చిట్టా విప్పుతోంది కేంద్రం .అప్పటిదాకా ఆగి ఆ ఆ మాట అని ఉంటె బాగుండేది
డిం –పి వి జయంతి ని ఘనం గా నిర్వహించాడు కేసి ఆర్ ?
టిం –చాలా మంచిపనే చేశాడు .అలాగే హైదరాబాద్ లో ఒక ఘనమైన స్మ్రుతి చిహ్నం ,ధిల్లీ లో ఒక ఘాట్ ఏర్పాటు చేయిస్తే ఇంకా ఘనం గా ఉంటుంది .కొత్త జిల్లాకు ఆయన పేరు పెడతాననటం ఒక చిన్న అడుగే కాని ఆయన గౌరవానికి తగినదికాదు .భారత రత్న ఇప్పించాలి కేసి ఆర్ .అప్పుడే ఆయనకు జరిగిన అవమానానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్లు అవుతుంది. దీనికి ఆంద్ర ప్రభుత్వమూ మద్దతు పలకాలి .ఇచ్చినా ఇవ్వక పోయినా ఆయనకు వోరి గేదేమీ లేదు .మనకే ఆ గర్వం శోభ నిస్తుంది అంతే .
డిం –అబ్బో గురూగారికి పెద్దాయన మీద ఇంత ఇది ఉందా ?
టిం –బడుద్దాయిలం కనుక మనం ఇంతకాలం ఊరు కున్నాం .ఇంకో రాష్ట్రం వాళ్ళయితే ఆయనకు అవమానం చేసిన వారి భరతం పట్టి ఆయనకు గౌరవం చేకూర్చే వారు .
డిం –కంచే దూకే వాళ్లకు త్వరలో తానూ సి ఏం అవుతానని జగన్ ఊర దించాడట ?
టిం –ఎంతకాలం కాపు కాస్తాడు ?ఒట్టిపోయిన గొడ్డును పిండితే ఏమొస్తుంది తన్నులు తప్ప ?అందుకే తమ్ముళ్ళు తెలుగు అన్న దగ్గరే సేఫ్టి అని గోడదూకటానికి రెడీ అయితే ఇలా ఓదారుస్తు మభ్య పెడుత్రున్నాదేమో ?
డిం –గురూ !చాలా ఆవేశం లో ఉన్నావ్. వస్తా
టిం –సరే శిష్యా
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14 –ఉయ్యూరు
.G.D.P.-2(చివరి భాగం )
పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల వాడకం పెరిగి అడుగంటి పోయే ప్రమాదం ఉంది .ఇండియా చైనాలు చమురు విపరీతం గా వాడటం వల్లనే అంతర్జాతీయం గా చంరు ధరలకు రెక్క లోచ్చాయి .అమెరికా లాంటి అభి వృద్ధి చెందిన దేశాలు కూడా తమ విధానాలను మార్చుకోవాలి .ధనిక దేశాలు ఇండియా ఆయిల్ పై చేసే ఖర్చును చూస్తూ ఊరుకోలేవు . భరించి రక్షించే అభివృద్ధి అంటే ఇప్పటి అవసరాలకు తగినట్లుగా ,భవిష్యత్తుకు తరాల వారి కోరికలను కూడా తీర్చేది .ఇప్పటి జి డి పి అభివృద్ధి ప్రక్రుతి మీద ఒత్తిడి ఎక్కువ కలిపిస్తుంది .మన కోరికలను అవసరాలను మరొక్క సారి నిర్వచించుకొని ముందుకు సాగక పోతే ఆగామి తరాలకు చేటు తెచ్చే వాళ్ళం అవుతాము .
అలాగే వస్తువుల మీద మోజు కూడా ఇబ్బందే కలిగిస్తుంది .అన్నీ కొనాలనే కోరిక ,మనకే ఉండాలనే భావం తో కన్సూమరిజం అభివృద్ధి ఇంజెన్ కు శక్తి సమకూరుస్తున్దనుకోవటం పిచ్చి ఆలోచన .అలాగే స్వంత ఇల్లు ఆలోచన పెరిగిన కొద్దీ బ్యాంకులు ముందుకొచ్చి రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి .బ్రిటిష్ మేనేజ్ మెంట్ నిష్ణాతుడు చార్లెస్ హండి రాసిన ‘’ది హంగరీ స్పిరిట్ ‘’పుస్తకం లో ఇలా ప్రతిదీ కొని పారేస్తుంటే వందేళ్ళలో పదహారు రెట్లు వస్తువుల్ని కొని ఏం చేసుకోవాలో తెలీక ,పర్యావరణానికి భంగం కలిగించి దోషులమవుతామని చెప్పాడు .వినియోగం ఎక్కువై కొనుబడి పెరుగుతూంటే దౌర్జన్యాలు దొమ్మీలు ఎక్కువైనట్లు బ్రిటన్ చరిత్ర చెబుతోంది .ఇలా అయినకాడికి కొనటం ఆత్మ గౌరవం అని భావించటం వెర్రి ఆలోచనే .ఆశ ఎంతటి పనైనా చేయిస్తుంది .దురాశ దుఖానికి దారి .కోరిక వస్తువులను అనుభవించి పొందే ఆనందాన్ని సంతృప్తి చెందించదు .అగ్నికి ఆజ్యం పోస్తే చేల రేగినట్లు చేల రేగుతుంది అని గీతా చార్య తో బాటు మనువు కూడా ఉవాచ .సంపద ,కీర్తి ,ఇంద్రియ సుఖం లలో చివరిది పశ్చాత్తాపం తో పరిహరమౌతున్దికాని మొదటి రెండిటిని ఎప్పటికీ సంతృప్తి పరచలేము అని పదిహేడవ హతాబ్ది ఫిలాసఫర్ స్పినోజా చెప్పాడు .
క్రైస్తవం కూడా కోరిక ను తిరస్కరించింది .మధ్యయుగ మతాధికారులు దీన్ని అమలు చేయటానికి ఏంతో ఒత్తిడికి గురైనారు .జుడాదయిజం లో కూడా దురాశకు తావు లేదు .సంపద ,అధీనం లోని వస్తువులు అన్నీ భగవంతుని కృపగా భావించి ఒక సంస్థ ద్వారా వినియోగం లోకి తేవాలని జుడాయిజం కోరింది . కంజూ మరిజం మనస్తత్వం పెరిగితే భోపాల్ గాస్ దుర్ఘటనలెన్నో చోటు చేసుకొంటాయి . ఆవిష వాయువులోని కాంపోజిషన్ ఏమిటో యూనియన్ కార్బైడ్ చెప్పక పోవటం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం పోగొట్టుకోన్నాం .మనిషికి ,ప్రకృతికి మధ్య అనుబంధం ఎక్కువైతేనే భోపాల్ సంఘటనలు లాంటివి తగ్గించ గలం .దీర్ఘకాల జీవితం, ఆరోగ్యం అనేవి సాధించగలం ఐర్లాండ్ లో ఆర్ధికాభి వృద్ధి వేగం గా జరిగింది .జి డి పి కొలత సరైనదికాదని ఆ దేశపు ఆర్ధిక వేత్త ఫాదర్ సియాన్ హేర్లీ అన్నాడు .ఇంట్లో పిల్లాడిని పెంచే ఖర్చు జి డిపి లో భాగం కాదు .కాని ఒక తల్లి పనికి వెళ్లి తేనే జి డిపి పెరుగుతుంది .పిల్ల పెంపకానికి రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఎక్కడైనా కేర్ లో పెడితే .కనుక ఇప్పుడు ఆమెకోచ్చే జీతం ఈ ఖర్చు జి డి పిలో భాగమవుతుందని ఫాదర్ చెప్పాడు .
నేషనల్ అకౌంటింగ్ ను వ్యాప్తి లోకి తెచ్చిన సైమన్ కుజ్నెట్స్ ‘’సంక్షేమానికి జిడిపి కొలమానం పనికి రాదన్నాడు .1934లో కుజ్నెట్స్ అమెరికా కాంగ్రెస్ ను జాతీయ ఆదాయం తో అమెరికా సంక్షేమాన్ని ముడి పెట్ట వద్దు అని హెచ్చరించాడు .అమెరికా కాంగ్రెస్ కాని,ఏ రాష్ట్ర ప్రభుత్వం కాని ఆయన మాటలను పట్టించుకో లేదు .1962లో నేషనల్ అక్కౌంటింగ్ ను పునరాలోచించమని హితవు చెప్పాడు .అభి వృద్ధిలో క్వాలిటి కి క్వాంటిటికీ మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించాలన్నాడు . దీర్ఘ కాల, స్వల్ప కాల ప్రయోజనాలను గమనించాలన్నాడు .అధిక వృద్ధి దేని కోసం? ఎందుకోసం? అని ప్రశ్నించుకొని విధానాలు ఎర్పరచుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం .
రాజీవ్ కుమార్ చెప్పినట్లు వృద్ధి అవసరమే కాని అదొక్కటే చాలదు .ఇలా వృద్ధి చేసుకొంటూనే పోవాలా ?ఎంతకాలం ?అనీ ఆలోచించాలి .సైన్సు ,టెక్నాలజీ అభివ్రుద్ధినివ్వటం నిజమే .టెక్నాలజీ లో ప్రతి ముందడుగు వెనక ఎత్తు పల్లాలున్నాయని గ్రహించాలి .న్యూక్లియర్ ఎనర్జీ ఎన్నోఅద్భుతాలను సాధించి ఇచ్చింది కాని న్యూక్లియర్ వేస్ట్ఒక పెద్ద సమస్య అయి దెయ్యం లా భయ పెడుతోంది .న్యూక్లియర్ ఆయుధాలు రాక్షణకే అయితే మంచిదే అవి టెర్రరిస్టుల, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలోకి వస్తే యెంత ప్రమాదమో కూడా ఆలోచించాలి .టెక్నాలజీ ని సృస్తిస్తున్నాం కాని దాన్ని సమ తూకం లో ఉపయోగించలేక పోతున్నాం .ఇవాళ కారు మనమీద సవారీ చేస్తోంది .అదొక వ్యసనమైంది .అలాగే కమ్మ్యూనికేషన్ టెక్నాలజీ లో దూసుకు పోతూ ఏంతో ప్రగతి సాధిస్తున్నాం .సెల్ సోల్లుకే ఎక్కువ పయోగాపడటం దారుణం .కన్స్యూమరిజం ను విద్యా వైద్య , సాంఘికా కావసరాల సేవలో నియంత్రించి ఉపయోగించాలి .కిందికి కారటం ప్రారంభిస్తే అంతా ఖాళీయే .
గాంధి మహాత్ముడు చెప్పినట్లు మనం భారతీయులం మాత్రమె కాము ప్రపంచ పౌరులం అని మర్చి పోరాదు. ప్రపంచ అవగాహన తో అడుగులు వెయ్యాలి .మన్మోహన్ సింగ్ కన్జూమరిజం అక్కర్లేదు గాంధి గారి నిష్ట ఉంటె చాలన్నాడు .సాధారణ జీవితం గడిపితే సమస్యలే ఉండవన్నాడు .దీనికి మహాత్ముడే ఆదర్శం అన్నాడు .భారతీయులు పాశ్చాత్యం వైపు ద్రుష్టి పెట్టి ఇండియాలోని మనుష్యులను మర్చిపోతున్నారు .ఆర్దికాన్ని నమ్మవద్దని దానివలన నైతికత దెబ్బ తింటుందని గాంధీ ఉవాచ .ఇండియా గాంధీ మాటలను వల్లే వేస్తుంది కాని ఆచరించక పోవటమే అన్ని అనర్దాలకు మూలం .త్యాగం అంటే సంపద ,భార్యా పిల్లలు వద్దు అని కాదువాటితో అనుబంధం తగ్గించుకోమని అని గాంధి అన్నాడు .కాని దీన్ని పట్టించుకొన్న వారు తక్కువే .పాశ్చాత్య రాజకీయ వేత్తలు జీవిత ధర్మం లోనే స్వేచ్చ ఉందంటారు .భౌతిక సంపద మాత్రమే బాధల్ని పోగొట్టదు .వేస్త్రెన్ సైన్స్ ,ఎకనామిక్స్ బాధ లను పట్టించుకోవు .బిజినెస్ మోడల్స్ ఖరీదు గురింఛి ,లాభాలు ,షేర్ ల గురించే ఆలోచిస్తాయి .కనుక జి డి,పి. బలుపు అవ్వాలే కాని వాపుగా మార రాదనీ గ్రహించాలి .
ఆధారం –మార్క్ టుల్లి రాసిన ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14-ఉయ్యూరు

యక్షులు, బ్రహ్మరాక్షసులు
భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన
ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా
వజ్రాలు రాశులు పోసి వుంటాయి
కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు
ప్రాణాలతో తిరిగి రాలేదు
పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి
జయశీలుడు అనే ఒక సాహసవీరుడు
ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు!
అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా?
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
జయశీలుడి సాహసయాత్ర
వజ్రాల దీవి
అడపా చిరంజీవి జానపద నవల!
బ్రాహ్మణాల కదా కమామీషు -8
తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు
సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం .
పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ?
సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు ‘’అంటారు .ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం .వసిష్ట మహర్షి ఇక్ష్వాకు వంశ పురోహితుడని మనకు తెలిసిన విషయమే .వసిస్టూని సంతతి లోని వారందర్నీ వసిస్టూడు అనే పేరు తోనే పిలుస్తారు .అంతేకాక సామాన్య పురోహితుడినికూడా ఆ గౌరవ వాచకం తో ‘’వసిస్టూడు ‘’అనే పేరు తో పిలవటం లోకం లో సహజమై వసిస్టూడు అందరి వాడయ్యాడు .
ఒకప్పుడు రుషులందరికీ ఇంద్రుడిని ప్రత్యక్షం గా చూడాలని పించింది .కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు చేశారు .కాని ఎవరి వల్లా కాలేదు .వసిష్ట మహర్షి ఆలోచించి ‘’నివహం ‘’అనే పేరుగల సామ మంత్రం తో ఇంద్రుడిని స్తుతించాడు .వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమై అనేక యజ్న యాగాది క్రతువులను వాటి అనుస్టాన పద్ధతులను సవివరం గా తెలియ జేశాడు .అందుకనే మిగిలిన రుషులకంటే వశిస్టూడి కే ప్రాధాన్యత కలిగింది .సకల వైదిక కర్మలూ సమగ్రం గా తెలిసిన వాడవటం వల్ల చక్రవర్తలు ఇతర ఋషులను వదిలి పెట్టి వశిస్టూడినే పురోహితుడిగా చేసుకొన్నారు .
నిజమైన పుత్రుడు ఎవరు?
ప్రజాపతి భూమిని ,అందులోని ప్రాణుల్ని ,స్వర్గం మొదలైన లోకాలను ,సూర్య చంద్రాది మండలాలను సృష్టించాడు .కాని సృష్టిలోని ప్రాణులు ప్రజా పతి గారి పెద్దరికాన్ని మన్నించ లేదు .అప్పుడు ప్రజా పతి సృష్టి సారాన్ని అంతటిని ఒక మాలగా చేసి మెడలో ధరించాడు .దీనితో సకల సృష్టీ ప్రజాపతి పాద క్రాంతమై దాసోహమన్నది .ఇప్పుడు ప్రజాపతికి తన సృష్టి కి ఒక నాయకుడు ఉంటె బాగుండును అని పించి తన మెడలోని మాలను ఇంద్రుని మెడలో వేశాడు .ప్రజాపతికి ఇంద్రుడుకాక చాలా మంది పుత్రులున్నారు కాని తండ్రి ఇంద్రుని మెడలో మాల వేశాడు కనుక వంశ రక్షకుడిగా సమర్ధుడిగా ఇంద్రుడినే ఎంపిక చేసి నట్లు లెక్క .తండ్రి విశ్వాసానికి పాత్రుడై ఆయన ఆస్తిలో అధిక భాగాన్ని పొందిన వాడే నిజమైన పుత్రుడు అని తాండ్య బ్రహ్మనం చెప్పింది .
తర్వాత ఇంద్రుడు ‘’అభిజిత్ ‘’విశ్వ జిత్ ‘’అనే యాగాలు చేసి ,జైత్ర యాత్ర చేసి సమస్తలోకాది పతి అయ్యాడు .కనుక తండ్రి అధికారం ఇచ్చి నందు వల్లనే కాక స్వంత ప్రతిభా సామర్ధ్యాలు కూడా ఇంద్రునిలో ఉన్నాయని ఈ బ్రాహ్మణం తెలియ జేస్తోంది .ఇందులోని ఉపాఖ్యానాలు ఎక్కువ గా సామల గురించే ఉన్నాయి .దేవాసురులు పశు సంపద కోసం యుద్ధం చేశారు .దేవతలు ‘’ఆతే అగ్న’’అనే ‘’సంజయ సామ ‘’ను గానం చేసి సాధించారు .దేవతల మీద అలిగి పక్షి రూపం తో వెళ్లి పోయిన యజ్న పురుషుడిని ,దేవతలు ‘’సౌవర్ణ సామ ‘’తో తిరిగి పొందారు .ఇంద్రుడు ‘’పదస్తోభ సామ ‘’గానం చేసి వ్రుత్రాసురిడిని సంహరింఛి నందుకు కలిగిన పాపాన్ని పోగొట్టుకొన్నాడు
విఖనసుని పుత్రులను వైఖానసులు అంటారు వీరు ఇంద్రునికి ప్రీతి పాత్రులు .వైఖానసులు దేవతలకు ఉపకారం చేస్తున్నారని క్కోపం తో ఒక రాక్షసుడు వారిని రహస్యం గా ఎత్తుకొని వెళ్లి ‘’ముని మరణం ‘’అనే చోట దాచేశారు .తన ఆప్తులు కానీ పించక పోయే సరికి ఇంద్రుడు కలవరం చెంది నలుమూలలా వెతికించాడు .చివరికి వైఖానసుల కళేబరాలు కానీ పించాయి .ఇంద్రుడు అక్కడికి వెళ్లి ‘’వైఖానస సామ ‘’ను గానం చేసి వారిని పునరుజ్జీవులను చేశాడు .అందకని సామాలలో వైఖానస సామ కు అధిక ప్రాధాన్యం ఉంది అది తీర్చలేని కోరిక అన్తోఉన్దదని విశ్వాసం .దానం పట్టటం దోషమే కాని కొందరికి తప్పని పని అది ఆ దోష నివారణకు ‘’ధ్వస్రమొహ్ పురుశాస్తన్యొహ్ ‘’అనే మంత్రాన్ని చదువుతారు .ఇప్పుడు గో పద బ్రాహ్మ ఉపాఖ్యానాలను గూర్చి తెలుసు కొందాం .
గోపద బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు
అధర్వ వేదానికి చెందిన గోపద బ్రాహ్మణం లో చాలా గంభీర అంతరార్దాలున్న ఉపాఖ్యానాలు ఉన్నాయి .ఇందులో ముఖ్యమైన ‘’ఉద్దాలక –శౌనక సంవాదం ‘’గురించి తెలుసుకొందాం .
అరుణుడు అనే మహర్షి పుత్రుడే ఉద్దాలకుడు .ఉద్దాలకుడు శాస్త్రార్ధం చేసి తనను జయించిన వారి కి తన మెడలో ఉన్న విలువైన హారం ఇస్తానంటూ దేశాలన్నీ తిరిగాడు .ఎవరికి అంతసాహాసం కని పించలేదు .చివరికి ఉత్తర దేశ పండితులు శౌనకుడు అనే పేరున్న ‘’సద్రేవాయనుడు ‘’ను నాయకుడిగా చేసుకొని ఉద్దాలకునితో శాస్త్రార్దానికి తల పడ్డారు ,ఉద్దాలకుడు ప్రశ్నిస్తుంటే శౌనకుడు జవాబులిచ్చాడు .ఈ కధలో విజ్ఞాన్నాన్ని పొందటమే కాక దాన్ని శాస్రార్ధ చర్చలతో పెంపొందించుకోవాలనే సందేశం ఉంది .
ప్రేది –ఉద్దాలకుడు
ఉద్దాలకుని గురువు ఇప్పటి పాట్నా అయిన కౌశాంబి నగర నివాసి ‘’ప్రేది’’. శిష్యుడికి బ్రహ్మ చర్యాన్ని గూర్చి బోధించి ‘’నీ తండ్రి సంవత్సర యజ్ఞాన్ని ఎన్ని రోజుల్లో పూర్తీ చేస్తాడు ?’’అని అడిగితె ఉద్దాలకుడు ‘’పది రోజుల్లో ‘’అని సమాధానం చెప్పాడు .ఇలా చెప్పటానికి ఉద్దాలకుడికి ఒక లెక్క ఉంది .ముఖ్యమైన విరాట్ ఛందస్సుకు పదే అక్షరాలుంటాయి .ఆచార్యుడు మళ్ళీ అడిగితే ‘’తొమ్మిది ‘’అన్నాడు శిష్యుడు .ప్రాణాలు(నవ రంధ్రాలు ) తొమ్మిది కనుక సరైన సమాధానమే చెప్పాడు .మళ్ళీ అడిగితే గాయత్రి అష్టాక్షరి కనుక ఎనిమిది అన్నాడు .మళ్ళీ అడిగితె ముఖ్య ఛందస్సులు ఏడు కనుక ఏడు అన్నాడు .ఇలా సంఖ్య తగ్గుతూ చివరికి మనిషికి రెండు పాదాలు కనుక రెండు అన్నాడు .ఇక్కడ పాదం అంటే మనం అనుకొనే కాలు కాదు కర్మ ,జ్ఞాన మార్గాలు .చివరి ప్రశ్నకు ఒకటి అన్నాడు ఉద్దాలకుడు .అంటే ఒక సంవత్సరం అని అర్ధం .మానవుని కి పరమార్ధాన్ని బోధించే విషయాలెన్నో ఇందులో ఉన్నాయి .
దక్ష యజ్న ధ్వంసం
ఒక సారి ప్రజాపతి దక్షుడు రుద్రునికి భాగం లేకుండా యజ్ఞం ప్రారంభించాడు .కూతురు సతీదేవిని అవమానించాడు కోపించిన రుద్రుడు వీర భద్రుని సృష్టించి దక్షాధ్వర విధ్వంసం చేశాడు .యజ్ఞం లో మిగిలిన ‘’ప్రాశిత్రాన్ని ‘’చూడగానే భగుడి కళ్ళు పోయాయి .సవిత్రు దేవత దాన్ని తాకగానే చేతులు తెగిపోయాయి .బంగారు చేతులు అమర్చాడు . .అందుకే హిరణ్య పాణి అనే పేరొచ్చింది. సవిత్రునికి .సూర్యుడు సాహసించి తిన బోతే పళ్ళు ఊది పోయి ‘’పూషుడు ‘’అని పిలువా బడ్డాడు .అందుకే సూర్యునికి పళ్ళు లేవుకనుక మెత్తని పిండి పదార్దాలే నై వేద్యం పెట్టాలని శృతి చెప్పింది .ఇద్ముడికి శిరస్సు ,బర్హికి కీళ్ళు పడిపోయాయి .చివరికి బృహస్పతి మంత్రోచ్చారణ తో సూర్యుని కళ్ళ తో చూస్తూ అశ్వినీ దేవతల బాహువులతో స్వీకరించి లోపాన్ని సరి దిద్దాడు .ఇందులో ఉన్న అంతరార్ధం –ప్రజా పతి శరీర అవయవాలకు అది పతి అయిన జీవాత్మ .రుద్రుడు సర్వజ్నుడైన పరమాత్మ .యజ్ఞం అంటే పరమాణు సంయోగం తో ఏర్పడిన శరీరం .ప్రజా పతి రుద్రుడని యజ్ఞం నుంచి దూరం చేయటం వలన భగ ,సవిత్రు ,పూషా ,ఇధ్మ,బర్హిస్ తత్వాలు తమ తమ పనులు చేయ లేక పోయాయి అని గ్రహించాలి .జ్ఞాని ఏ పనిలోనూ పరమాత్మ ను మరువ రాదు అని నీతి .
సశేషం
ఈ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి –‘’మహా కవి కాళి దాసు దివస్’’ సందర్భం గా శుభా కాంక్షలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14-ఉయ్యూరు
ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది. షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది.
ఇది భారతదేశం. హిందూ దేశం. మరీ ప్రాచీన కాలంలో జంబూ ద్వీపం. పాశ్చాత్యులకు ఇండియా. ఇది బహు మతాల, బహుతాత్విక ధోరణుల, బహుళ సంస్కృతుల నేల. ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానందకు దేశం గురించి ఈ అవగాహన ఉన్నట్లు కనపడదు.
ఈ దేశంలో భక్తులున్నారు. యోగులున్నారు. జ్ఞానులున్నారు. ఫకీర్లున్నారు. సూఫీలున్నారు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారికి గుళ్ళూ, గోపురాలూ, దర్గాలూ, ఆశ్రమాలూ, మెమోరియల్సూ ఉంటాయి. ప్రజలు తమకు ఎవరి మీద గురి కలిగితే వారిని ఆరాధిస్తారు. నామస్మరణలు చేస్తారు. కోహమ్ అనో, సోహమ్ అనో వారి బోధనలను అనుసరించి సాధనలు చేస్తారు. ప్రార్థనలు చేస్తారు. ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది.
షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది. ముస్లింలు ఏడుకొండల వాడిని వేడుకోబోయినా, హిందువులు దర్గాలకు పోయి ప్రార్థనలు చేసినా పీఠాధిపతులూ, ముల్లాలూ ఆమోదించకపోవచ్చు. కానీ వివిధ మతాలలోని ఈ ఉదార భావాన్ని వ్యతిరేకించే హక్కు వారికి లేదు.
షిర్డీ నాథుని హిందువులు పూజించినంత ఎక్కువగా ముస్లింలు ఎందుకు పూజించడం లేదని స్వరూపానందులు అలగడం చూస్తుంటే, అది ఆయన అమాయకత్వమనుకోవాలో, అజ్ఞానమనుకోవాలో, లేక అసూయ ద్వేషమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉండటమూ, వారికి విగ్రహారాధన ఒక సాధన మార్గంగా ఉండటమూ బాబాను హిందువులు ఎక్కువ సంఖ్యలో కొలవడానికి కలిసొచ్చిన అంశాలు. ముఖ్యంగా ఈ దేశంలో ముస్లింలకు ఉన్నంత మత కట్టడులు బ్రాహ్మణులకు లేవు. బ్రాహ్మణులకున్న మతకట్టడులు శూద్ర హిందువులకు అస్సలు లేవు. హిందూ మతం శాఖోపశాఖలకు చెందిన తన తాత్విక మార్గాల వైవిధ్యాల్నీ, ఉదార భావాల్నీ వదిలేసి ఇస్లాంలోని ముల్లాల కరుడుగట్టిన తనాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ, అనుసరించాలనీ స్వరూపానందులు ఎందుకు కోరుకుంటున్నారు? రెండు మతాల మధ్య పోలరైజేషన్ సృష్టిస్తే తప్ప స్వరూపానందులు వంటి పీఠాధిపతులకు అస్తిత్వం ఉండదా?
ఈ దేశంలో భక్తులూ, యోగులూ, జ్ఞానులూ, సిద్ధులూ, పరమ హంసలూ చరిత్రకెక్కిన వారే వందల్లో ఉన్నారు.
సనాతన ధర్మమంటే ఏమిటో స్వరూపానందులకు తెలుసా? ఆయన చెప్పిన 24 అవతారాల లిస్టుకు బయట ఎంతమంది జ్ఞానులూ మహాగురువులూ పూజలందుకుంటున్నారో ఆయనకు తెలియదా? భగవాన్ రమణ మహర్షీ, శంకరాచార్యుల వంటి వారి గుళ్ళూ, ఆశ్రమాలూ కట్టి పూజిస్తే లేని తప్పు షిర్డీ సాయినాథునికి గుళ్ళు కట్టి పూజిస్తే వచ్చిందా?
గురువు కావడానికి మాంసాహారం అడ్డు వస్తుందని చెప్పే స్వరూపానందులది కుల చాదస్తం కాక మతోద్ధరణ అవుతుందా? బుద్ధుడు మాంసాహారి కాదని ఆయన చెప్పగలడా?
అంత్యజుడు అని పిలవబడే వ్యక్తి ఇచ్చిన పంది మాంసం భిక్షను ఆయన స్వీకరించలేదా?
కల్కి మాంసాహారి కాబోడని ఆయన జోస్యం చెప్పగలడా?
నిన్నటికి నిన్న నిసర్గదత్తమ మహరాజ్ గురువు మాంసాహారిగా లేడా?
ఒక బెస్తవాని కొట్టంలో ఉట్టిలోని వట్టి చేప ముక్కను నోట్లో వేసుకుని అతని ఆతిథ్యం స్వీకరించలేదా జిల్లేళ్ళ మూడి అమ్మ!
క్షత్రియునిగా పుట్టిన రాముడు మాంసాహారి కాదా? క్షత్రియుడిగా పుట్టి శూద్రుడిగా పెరిగిన కృష్ణుడు శాకాహారేనా? శాకాహారం సాధకునికి ఆహార నియమమే తప్ప, ఆ నియమం గురువును నిర్ణయించే సూత్రం కాదని స్వరూపానందులు వంటి పండితునికి తెలియదు అనుకోవాలా?
రామ మందిర నిర్మాణానికీ, షిర్డీ సాయిగుళ్ళు కట్టడానికీ ఏమైనా సంబంధం ఉందా? స్వరూపానందులు మాట్లాడుతున్నది మతమా? ఆధ్యాత్మికమా? రాజకీయమా? నిశ్చయంగా మత రాజకీయమే!! స్వరూపానందుల మాటల ప్రభావం ఆరెస్సెస్, భజరంగదళ్ వంటి మతసంస్థల మీద పడితే; పరిస్థితులు ఎంత దారుణంగా విషమిస్తాయో రామ జన్మభూమి కంటే ఎక్కువగా ఊహకందని ప్రమాదం!
ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ దేశం మొత్తానికి కాదు. శూద్ర హిందువులకూ కాదు. చివరికి బ్రాహ్మణ సామాజిక వర్గానికీ కాదు. ఆ సామాజిక వర్గంలోని ఒక చిన్న శాఖకే అని గుర్తు పెట్టుకుని తన పరిమితులు తాను తెలుసుకోవడం మంచిది. వయసుకు తగిన హుందాతనంతో జీవించడం మంచిది. మతాన్ని మతంగా, మతాన్ని దాటిన ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికంగా మన్నించడం మరీ మంచిది.
నేను రాముడిని పూజిస్తా
హర హర మహదేవ నామస్మరణ చేస్తా
గంగానది పవిత్రస్నానం చేస్తా
షిరిడీ సాయినాథునీ సేవిస్తా!
ఇంకా చెప్పాలంటే-
భగవంతుడు ఎక్కడ కన్పిస్తే అక్కడ
సాగిలబడి మొక్కుతా!
వద్దనడానికి మీరెవరు స్వరూపానందులూ??
-బండి నారాయణస్వామి
వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు రాశారు. అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించారు.
తెలుగు వెలుగు పి.వి. నరసింహారావుకు వరంగల్లు నగరంతో అవినాభావ ఆత్మీయ సంబంధముండేది. సంస్కృతి, సంప్రదాయం, దేశీయ ప్రాచీన వారసత్వం గురించిన సదభిప్రాయం కల్గిన వ్యక్తి పి.వి. ఆ రోజుల్లో వరంగల్ నగరంలో ఏటేటా కూచిపూడి, భాగవతుల ప్రదర్శనలు సాగుతుండేవి. భామాకలాపం, గొల్లకలాపం, ఉషాపరిణయం, దాదిని వేషం, ప్రహ్లాద, భాగవతులు, పగటి వేషాలు, శారద వేషం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడప్పుడూ నిర్వహించేవారు. వీటితో పాటు దీపావళి పండుగ రోజుల్లో హారతులు, భోగం మేళాలు, గానసభలు కూడా జరిగేవి. పెండ్లిండు,్ల పేరంటాల సందర్భాలలోనూ పాట కచేరీలు, సానిమేళ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఇలాంటి కార్యక్రమాలంటే పి.వి.కి అమిత సరదా, అభిరుచి ఉండేవి. పి.వి.కి కరీంనగర్ స్వంత జిల్లా కాగా వరంగల్ జిల్లా పెంపుడు జిల్లా. పల్లెటూర్లలో ముఖ్యంగా వంగరలో జరిగే చిందు భాగవతుల కార్యక్రమాన్ని కూడా బాల్య ప్రాయంలో పి.వి. తెల్లవార్లు కూర్చొని తనివి తీరా చూసి ఆనందించేవారట. ఒకసారి సురభివారి లంకాదహనం చూసి అందులోని ఆంజనేయ పాత్రను అనుకరిస్తూ దూడతలుగు తోకగా పట్టుకొని ఇంటి చుట్టూ గంతులు వేసిన సందర్భాలున్నాయి. పి.వి.లో మొదటి నుంచి అంటే బాల్యం నుంచి భావావేశం, రసాస్వాదన చెందే స్వభావ ప్రేరణ ఉండేది. కళాత్మకంగా తాదాత్మ్యానుభవం పొందే చిత్త స్ఫూర్తి ఉండేది. పి.వి.కి వరంగల్లులో హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుడు వినోదం కూడా ఎక్కువగానే ఉండేది. హనుమకొండలోను, లష్కర్‌బజారులో ఈ వినోదం సాగిపోతుండేది. ఎవరో కొందరు సహచరులను వెంటేసుకోవడం, రోడ్ల వెంబడి తిరగడం సాయంకాలం కాలక్షేపం. ‘అప్ఫూ హోటల్’ పరిసరాల్లో మిత్రుల రాకకై గస్తీ తిరగడం, అర్ధణా ప్లేటు ఆలూ బజ్జీ, మూడు పైసల ‘టీ’, పైసా పాన్ బీడా సేవానంతరం ఇరుగు పొరుగువారి ముంగిళ్ళు గాలించే వ్యాహ్యాళీ మరో రకం తిరుగుడు కార్యక్రమం.
శుక్రవారం స్కూల్ సెలవు సందర్భంగా మరీ తాపీగా బయలుదేరి సిద్ధేశ్వరుని గుడి, పద్మాక్షి గుట్ట, భద్రీ తాలబ్ గట్టు, భీమారం రోడ్డు, కాజీపేట స్టేషన్, ఓరుగల్లు కోట రాతి ప్రాకారం మొదలగు స్థానిక చరిత్ర పరిశోధన తిరుగుబడులు మరో తరహావి. గుట్టలు ఎక్కడం, గుండాల్లో ఈదడం, గుహల్లో దూరడం, బావుల్లో దూకి ఈత కొట్టడం లాంటి అఘాయిత్యపు తిరుగుళ్ళు ఉండేవి. మధ్య మధ్య భద్రకాళి చెరువు శికంలో సెనగచెట్ల వేట, ఊరిబయట బేనామి భూ ఖండాల్లో సీమ చింతకాయల దాడి, అప్పుడప్పుడు రేగుబండ్లు, సీతాఫలాలు, మామిడి పిందెల దొమ్మిలాంటి ఘాతుక తిరుగుళ్ళు కూడా జరుగుతుండేవి. ఈ తిరుగుడు అభ్యాసం కేవలం బాల్య చాపల్యం కావచ్చు. కానీ అది మానవ ప్రకృతి వైచిత్య్రంతోగల సాన్నిహిత్య ప్రకృతికి ప్రతీక. అనుతత్వ సూత్రం కూడా అతనికి ఆ రోజుల్లో అనుభవ పూర్వకం. అంటే కేవలం తిరగడంలో కూడా ‘జీవిత తత్వం’ ఉందన్నమాట. అందుకే ‘సైర్‌కర్ దున్యాకీ గాఫల్ జిందగాని ఫిర్‌కహా-జిందగీగరో కుచ్ రహేతో నౌజవానీ ఫిర్‌కహా’ అన్నాడో తిరుగు సరదా ఉర్దూ భాషా కవి.
వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు వ్రాయడం జరిగిందని, అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించడం జరిగింది. గాంధీ, నెహ్రూ, సావర్కర్, తిలక్ గ్రంథాలను పి.వి. చదివారు. వీరేశలింగం, చిలకమర్తి, పానుగంటి, గురజాడ అప్పారావు, వేంకట పార్వతీశ్వర కవులు, విశ్వనాథ, బంకించంద్ర, రవీంద్రనాథ్ ఠాగోర్, శరత్‌బాబు, ప్రేమ్‌చంద్, ద్విజేంద్రలాల్‌రాయ్ మొదలైన జాతీయ మహా రచయితల సాహిత్యాన్ని వరంగల్లులో విద్యార్ధి దశలోనే పారాయణం చేశారు. గోరా, గోదాన్, చరిత్రహీన్, ఆనంద్‌మఠ్, నూర్జాహాన్ మొదలగు అనేక గ్రంథాలను అభిమానించేవారు. అంగ్లంలో ‘లే మిజరబుల్స్’ ‘జీన్‌వల్జ్యీ’ ‘టెస్’ ‘ఉదరింగ్ హైట్స్’, ‘కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో’ నవలలను చదవడమేగాక, వాటిలోని విశిష్టతలను సాహితీ మిత్రులతో తరచూ చర్చిస్తూ ఉండేవారు.
మరో వైపు పి.వి.కి శాస్త్రీయ సంగీతంలో కూడా అంతో ఇంతో అభిరుచి, అభినివేశం ఉండేది. పద్యాలు, పాటలు, శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులను, జావళీలను వాటిలోని రాగ, తాళ విన్యాసాలను అభిమానించేవారు. కర్ణాటక సంగీత విద్యాంసుడు బిడారం కృష్టప్ప రికార్డ్, హిందూస్థానీ సంగీత విద్యాంసుడు నారాయణ్‌రావు వ్యాస్ పాటలు, మీరాబాయి భజనలే గాక గజల్లు వింటుండేవారు. ముఖ్యంగా ఓంకార్‌నాథ్ ఠాకూర్, అబ్దుల్ కరీంఖాన్ ఖయాల్, టుమ్రీ గ్రామ ఫోన్ రికార్డులు, శాస్త్రీయ సంగీత రికార్డులు తనివితీరా విని ఆనందించేవారు. అంతేగాక అయా పాటలను అనుకరిస్తూ చాటుమాటుగా అంతో ఇంతో కసరత్తు కూడా చేసేవారు.
శాస్త్రీయ సంగీత శ్రుత పాండిత్యం అబ్బడం కష్టమన్నది త్వరలోనే తెలుసుకున్నారు. అయినా అనేక రాగాలను గుర్తు పట్టడం, తాళ విన్యాసాన్ని, గతి భేదాలను గుర్తించడం అలవర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్, పన్నాలాల్ ఘోష్ వేణువు, హీరాబాయి బడోడేకర్, రోషనారా బేగం, కేసరీబాయి, రవూఫ్‌ల గాత్రం, ఆహ్మద్ జాన్ తింక్వా తబలా అంటే మోజు పడేవారు. అయితే తాను మాత్రం సినిమా పాటలు, భజనలు, స్టేజీ కీర్తనలు మున్నగు బాణీల్లో చక్కగా పాడేవారు.
ఆ రోజుల్లో కూడా వరంగల్ పట్టణానికి రాజకీయ ప్రాధాన్యం విశేషంగానే ఉండేది. పౌర హక్కులనే వాటికి గుర్తింపు లేని పరిస్థితులు గనుక దేవుడి పేర వరంగల్ యువకులు, విద్యార్థులు, ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకొని తద్వారా హిందూ సమీకరణ శక్తికి పూనుకునేవారు. ఆ రోజుల్లో హనుమకొండ స్కూల్ విద్యార్ధి యువకులు ‘భజన మండలి’ అనే పేరుతో ఒక సంస్థను నెలకొల్పుకొని అందులో చాటుమాటుగా రాజకీయ చర్చలు సాగిస్తుండేవారు. భజన మండలి స్థాపకుల్లో ఒకడిగా పి.వి. జాతీయవాద పక్షాన్ని బలపరిచేవారు. గణేశ్ ఉత్సవాలు, ఆర్యసమాజ కార్యక్రమాలు, గ్రంథాలయ సభలు మొదలగు ఉద్యమాలలో ఆసక్తిగా పాల్గొనేవారు. పి.వి. ఏది రాసిన అందులో తన నిర్దిష్ట శైలిని పొదగడానికి ప్రయత్నం చేసేవారు. పి.వి. వరంగల్లు హైస్కూల్‌లో విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆయన జ్ఞాపకశక్తికి అంతా ఆశ్చర్యపడేవారు. ఒకసారి ‘కృష్ణకుమారి’ అనే నాటకం వేసారు. అందులో పి.వి.ది కృష్ణకుమారి వేషం. ఆయన తన పాత్ర పోర్షనేగాక నాటకంలోని అన్ని వేషాల సంభాషణలను పుల్‌స్టాప్, కామాలతో సహా బట్టీ పట్టారు. ఇక రిహార్సల్స్‌లో ప్రాంప్టర్ ఆయనే. ఏ వేషం వేసేవాడు రాకున్నా అతనికి బదులు ఆ వేషం నిర్వహించి రిహార్సల్ కుంటుపడకుండా నడిపించేవారు. అతినిలోని జ్ఞాపకశక్తి అలాంటిది. పనిలో శ్రద్ధ పరిశ్రమ అనేది కూడా ప్రత్యేకతే. కృష్ణకుమారి నాటకంలో పి.వి. అభినయాన్ని ప్రశంసించకుండా ఉండనివారు లేరు. పరీక్షల్లో అతని ఆన్సర్ పేపర్లు టీచర్లు ఇతర విద్యార్థులకు చదవి వినిపించి విశ్లేషించేవారు.
పి.వి. తెలుగులోనే గాక ఇంగ్లీష్ భాషలో కూడా చెప్పుకోదగిన గద్య పద్య రచనలు చేసేవారు. ఈ విషయంలో ఆయన మొదటి గురువు గార్లపాటి రాఘవరెడ్డి. తరుచూ ఆయన ఆశ్రమానికి వెళ్ళి కాలక్షేపం చేయడం ఆనవాయితీగా ఉండేది. రాఘవరెడ్డికి ఆంగ్లభాషా సాహిత్యాలతో పరిచయం లేదు. పి.వి. ఆయనకు వర్డ్స్‌వర్త్, షెల్లీ, కీట్స్, బైరన్, షేక్‌స్పియర్ నాటకాలు, థాకరే, చార్లెస్ డికెన్స్, ధామస్ హార్డీ నవలలు మొదలగువాటి విశిష్టతపై శృత పాండిత్యం కలిగించారు. ఆదే విధంగా రాఘవరెడ్డి మనుచరిత్ర, నైషధం వంటి మహా ప్రబంధాలు, కాళీదాసు, భవభూతి కావ్యాల శైలీ విన్యాసంపై పి.వి.లో అసక్తిని ఇనుమడింప చేశారు. ప్రాచీనత, ఆధునికత అనేవి రెండూ పెనవేసుకొని ఉభయుల్లోనూ సమంగా పెంపొందిన భావసరళి వారి స్నేహంలోని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఆ రోజుల్లో అప్పుడప్పుడు నాటక ప్రదర్శనలు కూడా జరుగుతుండేవి. డివి సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, స్థానం నరసింహారావు సారంగధర, జహ్వారీబాయి రోషనార, తెనాలి కంపెనీ కృష్ణ లీలలు, మైలవరం కంపెనీవారి సావిత్రి లాంటి ప్రదర్శనలు పి.వి. తప్పక చేసేవారు. ఆ రోజుల్లో సోహరాబ్ మోడీ వరంగల్‌లో కొన్ని నెలల పాటు తన హిందీ నాటకాలు ఘనంగా ప్రదర్శించేవారు. తర్వాత కొంత కాలానికి మినర్వా మూవీ టౌన్ స్థాపించి ‘యహుదీకీ లడ్కే’తో పాటు హిందీ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆయన నిర్మించిన ‘జైలర్’, ‘సికిందర్’, ‘పుకార్’ చిత్రాలు ఆ రోజుల్లో విడుదలైౖ ఘన విజయం సాధించాయి. పి.వి. అప్పుడప్పుడు హాస్టల్ ఎగవేసి సినిమాలు, నాటకాలు మధ్య మధ్య సర్కస్‌లను చూడడం ఆనవాయితీగా మారింది. శాంతారాం ‘ఆద్మీ’ చూడడానికి ఎవరికీ తెలియకుండా హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సినిమా చూసి రావడం లాంటి సాహసచర్యలతో కూడింది ఆయన విద్యార్ధికాలం నాటి అనుభవాలు.
-వి.ఎల్. నరసింహారావు

తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ పేరు శంకరమ్మ.
కుర్చీలో కూర్చున్న బామ్మ చుట్టూ కొడుకు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లు. తెగ అల్లరి చేస్తున్నారు. కంప్యూటర్ తీసుకొచ్చి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆమె ఫోటోను చూపిస్తున్నారు వాళ్లందరూ. విశేషం ఏంటంటే- ఆ రోజు బామ్మ తొంభైయవ పుట్టిన రోజు. తొంభైమంది రక్తసంబంధీకులు కలిశారు మరి!
“ఈ వేడుక మీకెలా అనిపించింది?” అని శంకరమ్మను అడిగితే “పానం లేచొచ్చినట్టయింది బిడ్డా! నా వాళ్లందరినీ ఒక దగ్గర సూడ్డం వారితో గడపడం సానా బాగుంది. ఏమైనా చెప్పు కలసి ఉంటేనే మంచిగుంటది. కానీ ఈ కాలంలో అలాంటి కుటుంబాలు ఎక్కడున్నాయి సెప్పు తల్లి… ఎవరికి వారు యమునాతీరెనన్నట్టున్నారాయె” అంది.
90 ఏళ్ల శంకరమ్మకు తన మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు అందర్నీ బాగా గుర్తుపడుతుంది. రక్త సంబంధాలను తెంచుకుంటే అనుబంధాల తీయదనం గురించి పిల్లలకు ఎలా తెలుస్తుంది అని బామ్మ వాపోతుంటుందట. కుటుంబీకులు ఎవరు ఇంటికొచ్చినా ఆమె దీవెనలు తప్పనిసరిగా తీసుకుంటారు. “పెద్దావిడ ఆశీర్వాదం వల్ల మేము పొందే ఆనందం వేరు. మా కుటుంబానికి పెద్ద అండ ఉందన్న ధైర్యం కలుగుతుంది” అంటోంది పెద్ద కూతురు పద్మావతి. ఫోటో ఆల్బమ్‌లో ఉన్న తన భర్త ఫోటోను మనుమరాలు సాయికి చూపుతూ “మీ తాత” అని శంకరమ్మ బోసినవ్వులు చిందించింది. ఆ వయసులో కూడా చూపు మందగించలేదు. శుక్లాల శస్త్రచికిత్స కూడా చేయించుకోలేదట. శంకరమ్మను “మీ ఆయన పేరేంటి” అని అడిగితే చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది కానీ జవాబు మాత్రం చెప్పలేదు. “ఆ ముసలాయన పేరును మా అమ్మ ఎప్పుడూ నోటితో చెప్పదు. అది సంప్రదాయం కాదంటుంది” అన్నారు శంకరమ్మ ఏకైక కొడుకు ఓంప్రకాష్ యాదవ్.
ఇల్లే లోకం
బామ్మకు మొత్తం ఏడుగురు పిల్లలు. వారిలో ఆరుగురు కూతుళ్లు, ఒక కొడుకు. శంకరమ్మ భర్త పేరు ఆకుల నర్సయ్య. ఒకప్పుడు ఆప్కోలో పనిచేసేవారు. ఇప్పుడు లేరు. ఆయన స్వాతంత్య్రసమరయోధుడు కూడా. శంకరమ్మ స్వస్థలం మెదక్ జిల్లా పెద్దశంకర్‌పేట్. పెళ్లయ్యాక హైదరాబాదు తాళ్లగడ్డలోని అత్తారింటికి వచ్చేసింది. శంకరమ్మ తల్లి ఎల్లమ్మ, తండ్రి పోతన్న. వీరిది వ్యవసాయకుటుంబం. బామ్మ ఎప్పుడు పుట్టింది ఎవరికీ తెలియదు. కానీ తమ వయసును బట్టి ఆమెకు 90 ఏళ్లు ఉండొచ్చని ఇంట్లో వాళ్లు లెక్కగట్టారు. నాలుగేళ్ల వయసులోనే శంకరమ్మకు పెళ్లయిపోయింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసింది. “పెళ్లయిన కాడి నుంచి నా ఇల్లు, నా పిల్లలే నా లోకం. ఇంటిని అద్దంలా పెట్టుకోవడం, పిల్లల్ని మంచిగా చూసుకోవడం. ఇదే పని” అంటుందీ బామ్మ.
“వేరుపడక ముందుఅన్ని పనులను అందరం కలిసి చేసుకునేవాళ్లం. కలిసి భోంచేసేవాళ్లం. కలిసి సతోషాలను పంచుకునేవాళ్లం. అయితే కాలంతోపాటు మేము కూడా ఎవరి జీవితాలు వాళ్లవి అన్నట్లు వెళ్లదీస్తున్నాం. కాని సమయం దొరికినప్పుడు మాత్రం అందరం ఒక రోజున కలిసి.. ఆనందోత్సాహాలతో దావత్ చేసుకుంటున్నాం. పండగలు, పుట్టినరోజుల వంటి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలం.
ఉగాది పండగ వస్తే ఆ రోజు మా ఇల్లు చూడాలి. సందడే సందడి. ఇంట్లో అయితే మనుమలు, మునిమనుమల అల్లరి ఇంతా అంతా కాదు. మా అమ్మకైతే ఆరోజు అందరినీ చూశాక కడుపునిండిపోతుంది. కళ్లు మెరిసిపోతుంటాయి. ఇప్పటికీ మేమందరం ఒకే చోట ఉండాలన్నది ఆమె కోరిక..” అంటూ చెప్పుకొచ్చింది కూతురు పద్మావతి.
శంకరమ్మ మునిమనమలు కొందరు ఇక్కడ చదువుతుంటే మరికొందరు విదేశాల్లో చదువుతున్నారు. ఎవరైనా పొరపాటున తన దీవెనలు తీసుకోవడం మరిచిపోయారో వారిని పిలిపించి మరీ దీవించి పంపుతుందట ఈ బామ్మ. ఇళ్లలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా ఆమెకు చెప్పే తీసుకుంటారు.
“ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ తన పని తనే చేసుకుంటుంది. చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది. రోజులో ఎక్కువ టైమును దైవజపానికే కేటాయిస్తుంది బామ్మ” అని మనుమరాలు సాయి చెబుతుంటే కళ్లింత చేసుకుని చూస్తోంది శంకరమ్మ.
బామ్మమాట ఆరోగ్యబాట
. ఎంత కోపం తెప్పించే విషయానికైనా కించిత్తు విసుక్కోదు. ఆలోచిస్తుంది. సహనంతో వ్యవహరిస్తుంది.
. తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానపానాదులు కానించేసి.. దేవుడికి దీపం పెడతారామె. క్రమం తప్పకుండా ఉపవాసాలు చేసేవారు.
. ఇంటిని, పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవడంలో బామ్మ రాజీ పడదు. శుభ్రతలేకపోతే సహించదు.
. ఏడాదికి ఒక పుణ్యక్షేత్ర యాత్ర ఉండాల్సిందే! చక్కటి ప్రణాళికతో గుళ్లుగోపురాలు తిరిగొచ్చి, ఆ విశేషాలను కుటుంబసభ్యులతో పంచుకునేవారు.
. ఇంటినిండా మనుషులుండాలి. పండగలు, వేడుకలలో లీనమైపోతుంది. అందరి యోగక్షేమాలు కనుక్కుంటుంది.
. ఆశ్చర్యం ఏంటంటే తొంభైఏళ్ల ఈ బామ్మకు బీపీ కాని, షుగర్ కాని లేవు. బాధించే జబ్బులేవీ రాలేదు. చూపు మందగించలేదు. కళ్లకు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదు. దటీజ్ బామ్మ!
ం నాగసుందరి

“నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను” అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. ‘సాక్షి’ నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు ‘ముత్యాల ముగ్గు’ తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర ‘ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ’ అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. ‘ముత్యాల ముగ్గు’ నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా ‘బుద్ధిమంతుడు’ కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.
గుడికీ, బడికీ మధ్య పోటీ
బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘బుద్ధిమంతుడు’ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు – మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది అనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. ‘భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా’ అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి ‘బుద్ధిమంతుని’గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య “వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?” అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. “అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా” అంటాడు గోపి ఆవేదనగా.
నిజం రాణిస్తుంది
తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాన్నట్లు మాట్లాడితే “నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది” అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య “సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. ‘అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను’ అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు మాధవయ్య. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. “అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేదో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు” అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.
మానవసేవే మాధవసేవ
ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. ‘మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?’ అని ప్రశ్నించిన కృష్ణుడు “నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట
పెరిగాననీ నువ్వెరుగవా?” అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. “సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను” అంటాడు. తమ్ముడితో “మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం” అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.
‘ఆమ్యామ్యా’ ఇందులోనిదే
ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే ‘ఆమ్యామ్యా’ అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. “ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది” అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి ‘బుద్ధిమంతుడు’ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.
తాక సన్నివేశాలు అద్భుతం – తనికెళ్ల భరణి

రమణగారు రచన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఆస్తికునిగా అన్ననూ, నాస్తికునిగా తమ్ముణ్ణీ మలచి, ఆ రెండు పాత్రల మధ్య సంఘర్షణను గొప్పగా చిత్రించారు రమణ. క్లైమాక్స్ సన్నివేశాలైతే అద్భుతం. అన్న ప్రాణాలు నిలబెట్టడానికీ, జనంలో అన్న మాటను నిలబెట్టడానికీ తమ్ముడు గుడి గోపురం మీద కలశాన్ని పైకి లేపడం, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య జరిగే సంభాషణ అపూర్వం. అలాగే అన్నయ్య పాత్రకు కృష్ణుడు కనిపించే సన్నివేశాలు, భక్తునికీ, భగవంతునికీ మధ్య జరిగే సంభాషణలు గొప్పగా ఉంటాయి. భక్తుని నమ్మకానికీ, అతని అమాయకత్వానికీ మాధవయ్య పాత్ర నిదర్శనంగా నిలుస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విషయం ఈ సినిమా ద్వారా రమణగారు బాగా చెప్పారు. ఇవాళ లంచానికి మారుపేరుగా మారిన ‘ఆమ్యామ్యా’ అనే పదం ఈ సినిమాలోనిదే. రమణగారి సంభాషణలు ఎంత సహజంగా, ఎంత పదునుగా, ఎంత హాస్య స్ఫోరకంగా ఉంటాయో నిరూపించే సినిమా ‘బుద్ధిమంతుడు’. ఆయన రచన చేసిన ఓ సినిమాలో నేను నటించాను. అది ‘మిస్టర్ పెళ్లాం’. అయితే చాలా మందికి తెలీని సంగతి, దానికంటే ముందు వారి సినిమా ‘పెళ్లి పుస్తకం’లోనూ ఓ సన్నివేశం చేశాను. నేను ‘సీతారామయ్యగారి మనవరాలు’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది.. చేయాలంటూ కబురొచ్చింది. పెళ్లికి సంబంధించిన సన్నివేశం అది. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, నా మీద ఆ షాట్. నాది పురోహితుని పాత్ర. మూడు నిమిషాల సీన్. నా పాత్ర సంభాషణలు, పెళ్లి మంత్రాలు నావే. దాదాపు 400 అడుగుల సీను. గంటలో పూర్తి చేశాం. అది చేసినందుకు మేనేజర్ నాకు రూ. 10 వేలు పారితోషికంగా ఇచ్చారు. నా పాత్రకు అది పెద్ద మొత్తమే. నేను వద్దని చెప్పినా, మేనేజర్ వినలేదు. అక్కణ్ణించి వస్తుంటే రమణగారు ఎదురై మరో రూ. 10 వేలుకు చెక్కు రాశారు. నేను ఆశ్చర్యపోయి, పది వేలు తీసుకున్న సంగతి చెప్పాను. నా స్క్రిప్టుని నేను రాసుకున్నా కాబట్టి, దానికి ఇస్తున్నాననీ, తీసుకొమ్మనీ ఆయన చెక్కు చేతిలో పెట్టారు. చిత్రమేమంటే నేను చేసిన ఆ సన్నివేశం సినిమాలో లేదు. అదీ కొసమెరుపు.

ఆయన తెలుగు వాడు! తెలంగాణ బిడ్డ! ఆర్థిక నిపుణుడు! ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు! కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వాడు! అపర చాణుక్యుడు! ఆయన… పాములపర్తి వెంకట నరసింహరావు. అటువంటి మహనీయుని జయంతి (జూన్ 28)ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం…
పీవీ నరసింహరావు… అపర మేధావి. బహు భాషా కోవిదుడు. సాహితీవేత్త. ముఖ్యమంత్రిగా.. ప్రధాన మంత్రిగా పనిచేసి ప్రపంచ దేశాల్లోనే శభాష్ అని పించుకున్న ఘనత ఆయనది.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను కూడా లెక్క చేయని ముక్కుసూటి మనస్తత్వం ఆయనది.. అటువంటి మహోన్నత వ్యక్తికి నేడు చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వ గుర్తింపు లభించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సముచిత స్థానం లభించింది. ఎంతో మందికి రాజకీయ భవితవ్యం కల్పించిన పీవీని మొన్నటి వరకు ఇటు ప్రభుత్వాలు.. అటు పార్టీ మరచి పోయింది. గతంలో ప్రధానులుగా చేసిన వ్యక్తుల విగ్రహాలు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ పీవీ విగ్రహాలు కనిపించటం కూడా అరుదే.
వంగర నుంచి ఢిల్లీ దాకా..
పీవీ పుట్టింది వరంగల్ జిల్లా వంగరలో. చదివింది వరంగల్‌లో. నాగపూర్‌లో బీఎస్సీ ఎల్ఎల్‌బి చేసిన అనంతరం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. ముందు రాష్ట్ర రాజకీయాల్లో, ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించటం మొదలుపెట్టారు. సాధరణంగా రాజకీయనేతలు సంపన్న వర్గాలను దూరం చేసుకోవటానికి ఇష్టపడరు. కానీ పీవీ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు తీసుకువచ్చారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పీవీ ఈ చట్టంతో తనకున్న వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు అశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యశాఖలో కీలక మార్పులు తీసుకువచ్చారు. తెలుగు అకాడమీని ప్రారంభించిన ఘనత కూడా పీవీదే. 1977లో హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీకి అంతరంగిక సలహాదారునిగా వ్యవహరించారు. వీరిద్దరి మంత్రివర్గంలో విదేశాంగమంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, హోంమంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం 1995లో దేశప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు కొనసాగించిన ఘనత పీవీకి దక్కింది. మరణానంతరం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పీవీని సముచిత రీతిలో గుర్తుంచుకోలేదు. ఇప్పుడు ఆయన జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
సాహిత్యం, సంగీతమంటే ఎంతో ఇష్టం
సీనియర్ పాత్రికేయులు వీఎల్ నర్సింహారావు
వరంగల్‌లో హై స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుతూ వినోదంగా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ రోజుల్లో హన్మకొండలో ‘అప్పూ’ హోటల్ పరిసరాల్లో మిత్రులతో తిరగడం, అర్ధణాకు ప్లేట్ బజ్జీ, మూడు పైసలకు టీ తాగిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతున్నాయి. శుక్రవారం పాఠశాలకు సెలవులిస్తే సిద్ధేశ్వరునిగుడి, పద్మాక్షిగుట్ట, భద్రీ తలాబ్‌గట్టు, ఓరుగల్లు కోట లాంటి ప్రదేశాలను ఎన్నిసార్లు చుట్టివచ్చామో లెక్కలేదు.. గురజాడ, విశ్వనాథ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్, ప్రేమ్‌చంద్ లాంటి అనేక మంది ప్రముఖుల రచనలను చదవి వాటి గురించి చర్చించటం కూడా మధురమైన అనుభూతే!
అవన్నీ మధుర జ్ఞాపకాలే..
బాల్యమిత్రుడు చొల్లెటీ భద్రయ్య
కోతికొమ్మచ్చి..చిర్రగోనే.. చెరువు కట్టమీద ఆటలు.. బావుల్లో ఈతలు.. ఇలా ఒకటేమిటీ బాల్యంలో పీవీతో గడిపిన మధుర క్షణాలు మరచిపోలేనివి. నేను, పీవీ, నల్ల ఆగారెడ్డి, రఘునాయకుల వెంకన్న, గంట్యాల వెంకట్రాజం, చెప్యాల రాజిరెడ్డిలు ఇలా మేమందరం ఒక బ్యాచ్‌గా ఉండే వాళ్ళం.. నాకిప్పుడు 94 ఏళ్లు. బాల్య మిత్రులు అందరు చనిపోయారు..తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో గెంతులేయాలని ఉంది.. కానీ వయస్సు సహకరించటం లేదు..
శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.
‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!
నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!
ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.
ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.
‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!
నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!
ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.
ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. కూడా ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.
ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించాలి. పి.వి. ప్రధానిగా వుండగానే -అమెరికాకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ, అణ్వస్త్ర పరీక్షకు భారతదేశం సర్వసన్నధమైనది. అణ్వస్త్ర పరీక్షను జరపరాదని అమెరికా భారతదేశాన్ని హెచ్చరించింది. అయినా, పి.వి. లెక్క చేయలేదు! పరీక్ష జరపడానికి ఉద్యుక్తుడైనారు. అంతకు పూర్వం ఇందిరాగాంధీ హయాంలో 1974 మేలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణ్వస్త్రపాటవ పరీక్ష జరిపారు. 22 ఏళ్ళ తరువాత భారత అణు పాటవం ఎలా వున్నదో ప్రపంచానికి తెలియడానికి అణ్వస్త్ర పరీక్షను ఉద్దేశించారు. అయితే, ఇంతలో జనరల్ ఎన్నికలు రావడంతో అణ్వస్త్ర పరీక్షకు అంతరాయం కలిగింది. ఆ తరువాత వచ్చిన వాజపేయి ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది! పి.వి., వాజపేయిలు పరస్పరం తమ ‘గురువు’ అని చెప్పుకునేవారు!
పి.వి.నరసింహారావు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఆయన స్వస్థలం వంగర. ఆయన లాయర్. మహా మేధావి. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో పి.వి.మంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి వస్తూనే ‘ఏడీ? మన బృహస్పతి వచ్చాడా?’ అని పి.వి.ని గురించి ఆరా తీసేవారు! ఒకానొక దశలో ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఏఐసీసీ తీర్మానాలను, ఎన్నికల ప్రణాళికలను పి.వి.యే రూపొందించేవారు.
చాలామందిని అంత అర్హత లేకపోయినా ‘బహుముఖ ప్రజ్ఞానిధి’ అని అంటూ వుంటారు. అయితే పి.వి.కి ఆ పదంలోని ప్రత్యక్షరం వర్తిస్తుంది. ఆయన కవి, రచయిత, జర్నలిస్టు, సంగీత ప్రియుడు, నటుడు, కంప్యూటర్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతుడు.
అన్నింటినీ మించి ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. మరాఠీ భాష నుంచి తెలుగులోకి ఒక గ్రంథాన్ని అనువదించారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు’ నవలను ఆయన హిందీలోకి ‘సహస్రఫణ్’ అన్న పేరుతో అనువదించారు. భారతీయ సంస్కృతి, తత్వచింతన పట్ల ఆయనకు ఎనలేని ఆసక్తి. ఆయన ఆధ్యాత్మికవేత్త. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ పలుకులలో ‘పి.వి. సంస్కృత పండితులను మించిన సంస్కృత భాషా నిష్ణాతుడు’. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత జటిల సమస్య వచ్చినా, ఆయన స్థితప్రజ్ఞుడు. అందువల్లనే ఆయనకు స్వామి రామానంద తీర్థ అధ్యయన సమితి ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చింది. ఇంతటి మహామహుని చరమదశలో, ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఎంతగానే సేవలు చేసిన జాతీయసంస్థ సరిగా గుర్తించలేదు! ఇప్పటికైనా ఆయనకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలి. ఎందువల్లనో, ఆనాడు ఢిల్లీ పెద్దలకు ఆయన పేరుచెబితే ఉలికిపాటు! తనపై వచ్చిన అసత్యారోపణలన్నీ వీగిపోయిన తరువాత -తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆయన ఈ రచయితకు లేఖ రాస్తే, ఢిల్లీ పెద్దలు ఎంతగా ఉలిక్కిపడ్డారు! ఏమైనా ఆయన జయంతిని ఆ మహనీయునికి జన్మనిచ్చిన తెలంగాణ, అక్కడి ప్రభుత్వం ‘ప్రభుత్వ వేడుక’గా ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించడం ముదావహం. ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ సలహా యిచ్చిన కె.వి. రమణాచారి ఎంతైనా అభినందనీయులు.
– డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
(నేడు పి.వి.నరసింహారావు జయంతి)
G.D.P.-1
జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది .అది నిజమేనా ?అనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి .ఈ విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .దీనికీ మార్క్ టుల్లి రాసిన పుస్తకమే ఆధారం .
ఈ జి డి.పి. పేదరికాన్ని పార ద్రోల గలుగుతుందా అని భారత ఆర్ధిక వేత్త సుర్జీత్ భల్లా తాను రాసిన పుస్తకం ‘’పావర్టి—ఇనీక్వాలిటి అండ్ గ్రోత్ ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ ‘’లో ప్రశ్నించాడు .పేదరికం తో తలపడ టానికి అభి వృద్ధి సరిపడా జరిగింది అనీ అన్నాడు .ఆస్ట్రేలియా శాస్త్ర వేత్త సంపద గురించి పట్టించుకోనక్కరలేదు సంతృప్తి ముఖ్యం అని తేల్చాడు .ఇక్కడే భూటాన్ రాజ్య ప్రస్తావన చేస్తూ దాని రాజు ఆ దేశం లో భూటాన్ ఆరోగ్యం దాని స్థూల జాతీయ సంతోషం తో సరిపోలుస్తారని తెలియ జేసిన విషయం వివరించాడు .’’సంతోషంఎక్కడ ఉంటె ఆరోగ్యం అక్కడ ఉంటుంది అని ‘’లైఫ్ బాయ్ సబ్బు యాడ్ లాగా .అనేక శోధనలలో బీదరికం లో స్వేచ్చ వికసిస్తున్దనుకోవటమూ భ్రమే అని తేలింది .ధిల్లీ లో మురికి వాడలు పెరిగాయే కాని తగ్గ లేదు .పేదల విద్య ఇంకా మిధ్య గానే ఉంది .రచయిత ధిల్లీ దగ్గరలో ఉన్న గుర్గావ్ గ్రామం లోని పేద రైతు జీవితాన్ని తరచి చూసి అతని చిన్నతలం లో ‘’పశువుల పేడ తో బాటు బయటికి వచ్చిన గింజలను ఏరుకొని నీళ్ళతో కడుక్కుని తినే వారని తెలిసింది .ఇప్పుడు పనికి ఆహారం పధకం వచ్చి కొంత నయం గా ఉంది .ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తున్నా అందులో దళారీలు బ్యూరోక్రాట్ ల వలన రావాల్సిన డబ్బు పూర్తిగా పేద వారికి అందటం లేనే లేదు .దొంగ పేర్ల తో దొంగ లిస్టులు తయారు చేసి డబ్బు నొక్కేస్తున్నారు .పాత తరం వారి జీవితాలలో స్వాతంత్ర్యం లేక పోయినా ఇప్పటి బీదలకు కొంత స్వేచ్చ లభిస్తోంది .అమెరికా లో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ధన వంతుల పై పన్నులను తగ్గించి అధిక సంపదను సృష్టించి పేదలకు అందించమని కోరితే అది ఉల్టా పల్టా అయి ధనికులు మరీ ధన వంతులు బీద వారు మరీ పేదవారు అయి పోయారు .
భారత దేశం లో అమెరికా రాయ బారి జాన్ కెన్నెత్ గాల్ బ్రైత్,భారతీయులకు చాలా సన్నిహితుడు .ఆయన రాసిన ‘’ది ఎఫ్ఫ్లు ఎంట్ సొసైటీ ‘’లో’’ ప్రైవేట్ సంపద పబ్లిక్ మురికి కూపానికి దారి తీసింది ‘’అన్నాడు (private affluence led to public squalor).అయన మాట ను పెడ చెవిని పెట్టారు .2006-7ప్రపంచ పట్టణాల నగరాల పరిస్తితి పై అమెరికా అధ్యయన రిపోర్ట్ లో వంద మిలియన్ ల జనం ప్రపంచ వ్యాప్తం గా ఇంకా మురికి వాడలలోనే జీవిస్తున్నారు .చివరి పది హేను ఏళ్ళలో ఆసియాలో అభి వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నా ,మురికి వాడల సంఖ్య పెరిగిందే కాని తగ్గ క పోవటం విశేషమే కాదు విచారకరం కూడా .ఇండియాలో గాల్ బ్రైత్ అమెరికా రాయ బారి గా ఉన్న కాలం లో ధిల్లీ లో మురికి వాడను కనీ పెట్టటం కష్టం గా ఉండేది .ఇప్పుడు వాటిని తప్పించుకు పోలేని స్తితి .మురికి కాలనీ వాసులు ఏదో నేరం లో ఇరుక్కొని జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు .ఇప్పుడు స్థానికులు వారిని వేరే చోట పునరావాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .దిల్లీలో జన సాంద్రతని జన సముద్రాన్ని తట్టుకోలేక దిల్లీకి పాతిక కిలో మీటర్ల దూరం లోఉన్న గుర్గావ్ కు భారతీయ ,విదేశీ సమస్థలు వలస పోయాయి .అది చిన్న పట్ట్టణమే అయినా’’ ఆకాశ హర్మ్యాలు ‘’నిర్మించి శాటి లైట్ టౌన్ గా అభి వృద్ధి చెందించారు .
అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘’మైక్రో సాఫ్ట్ ‘’గుర్గావ్ లో ఆఫీసులు ఏర్పాటు చేసు కొన్నది .దాని చైర్మన్ అయిన రవి వెంకట రామన్ మూడు విషయాలపై అధ్యయనం చేసి తన అభిప్రాయాలను విడుదల చేశాడు .ఇండియా పార దర్శకం గా వ్యవహరించి లంచ గొండితనాన్ని తగ్గించింది అన్నాడు కంప్యూటర్లు. బ్యూరో క్రాట్ ‘’బాబుల ‘’బండారం బయట పెట్టాయి .ఆన్ లైన్ లావా దేవీలు ఎలా జరుగుతునన్నాయో తెలిపే ఉదంతం ఒకటి చెప్పాడు .ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఐ టి వలన వేరి హాపీఅనీ వాళ్లకు వారానికి వచ్చే మామూళ్ళు, లంచాలు ఠంచన్ గా ‘’ఈ మెయిల్’’ లో నమోదై చేతికి అందుతున్నాయని ఆనందం గా చెప్పాడు .కంప్యూటర్ గొప్ప తనం ఇదా అని ముక్కున వేలేసుకో కండి మరి .
రామన్ చెప్పినదానిలో మైక్రో సాఫ్ట్ మిగిలిన వాటికంటే ఎక్కువ సమానత్వాన్ని సాధించింది .అక్కడ బాస్ కు మామూలు ఉద్యోగికి ఒకే భోజనం .ఐ టి విప్లవం పారిశ్రామిక విప్లవం కంటే గొప్ప విప్లవమైంది .ఇండియా ఇప్పుడున్న పధం లోనే ప్రయాణించి ఆర్ధికాభి వృద్ధిని వేగ వంతం చేసి మైనారిటీజనాల సంక్షేమం కోసం పాటు పడాలి .ఇందులో మూడు మార్గాలున్నాయి .మొదటిది ‘’ఇండియా ఫస్ట్ ‘’అనేది .అంటే అన్నిట్లో ఇండియా అగ్రగామి గా ఉండాలన్నది .దీనివలన అందరూ కలిసి ఇండియాని మొదటి స్థానం లో నిలబెట్టాలి .దేశం మొత్తం అభి వృద్ధిలో భాగస్వామ్యం పొందాలి దాని ఫలితాలు అనుభవించాలి .రెండోది ‘’ఇండియా అక్కడే ఆగిపోవటం ‘’(India getting stuck).ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మంద గించటం ,భారతీయ ఎగుమతులకు అవకాశాలు తగ్గి పోవటం దేశం లో కూడా అభి వృద్ధి అసమానం గా ఉండటం .మూడవది ఐ టి ప్రయోజనాలను కమ్మ్యూనిటి టెక్నాలజీ ,లెర్నింగ్ సెంటర్స్ ను ఏర్పరచి అట్టడుగు వర్గాలకు చేర్చటం .విద్యార్ధుల స్థాయి పెంచటం, వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచటం ,వారికి కొత్త టెక్నాలజీ తో పరిచయం కల్గించటం ,వాళ్లకు స్థానికం గానే శిక్షణ ను కల్పించటం .ఎక్కడఆర్ధిక వ్యవస్తలో లోపాలున్నాయో గమనించి వాటిని సరిదిద్దటం .గ్రామీణ ఆర్ధిక స్తితిని శక్తి వంతం చేయటం .పట్టణాభి వృద్ధి తో గ్రామీణా భివృద్ధి పోటీపడి సాధించటం .చిన్న ,,మధ్య తరగతి వ్యాపార సంస్థలను గ్లోబల్ గా పోటీ పడే ట్లు చేయటం .వీతన్నిటి కోసం మైక్రో సాఫ్ట్ పని చేస్తోందని రవి చెప్పాడు .మైక్రో సాఫ్ట్ పూర్తిగా ఒక ప్రైవేట్ సెక్టార్ కాదు .గవర్న మెంట్ తో సంబంధం లేకుండాను లేదు .దాని అన్ని ప్రాజెక్టులు ప్రైవేట్ –పబ్లిక్ భాగ స్వామ్యం తో పని చేస్తాయి .ఇందులో వ్యక్తికీ తగిన స్థానం ఉంటుంది బిజినెస్ ,ప్రభుత్వమూ అతి సన్నిహితమవుతాయి .అభి వృద్ధి నిరోధకులు ,కాపిటలిజానికి వ్యతి రేకులు మైక్రో సాఫ్ట్ విధానాలను స్వంత ప్రయోజనాలకోసం చేస్తున్నవే నని విరుచుకు పడుతున్నారు .ఇండియాలో సమతుల్య ఆర్ధిక వ్యవస్థకు మైక్రో సాఫ్ట్ మీద ఆధార పడితేనే మంచిదని పిస్తోంది .బిజినెస్ ఉత్సాహం ఉన్న వారు సంపద సృష్టికి పెద్ద పాత్ర పోషించాలి .బిల్ అండ్ మెలిండాఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్అసమానత ను అమెరికా లోను ప్రపంచ మంతటా తగ్గించటానికే అంకితమయ్యాడు .ఆయనది లాభ నష్టాల మీద నడిచే సంస్థకాదని,షేర్ హోల్డర్ విలువను పెంచుకోవటానికి కాని కాదని గ్రహిం చాలీ . ‘’ఇండియా ఫస్ట్’’ప్లాన్ లో అభి వృద్ధి యెలాఉన్దని రవిని అడిగితే ఇండియా పాశ్చాత్య దేశాలను అనుకరిస్తే విషాదమే మిగుల్తుంది అన్నాడు .ఉదాహరణకు రోడ్డు రవాణా సంస్థను తీసుకొంటే పెరుగుతున్న జనాభా కోసం పెరిగిన రావాణా వ్యవస్థ వలన శక్తి వనరుల వాడకం ఎక్కువై పర్యావరణ సమస్యలు పెరిగి పోయాయని చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు
ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )
భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి ఆర్దికంపై కంట్రోల్ లను సడలించే దాకా తాము ఏమాత్రం ఆదుకోలేమని చెప్పింది .అప్పటిదాకా అమలు లో ఉన్న సోషలిస్టు భావాలను పద్ధతుల్ని వదులుకోటానికి ఆయన మంత్రులు ఇష్టపడలేదు .అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్ మోహన్ సింగ్ సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిస్తే తప్ప గండం గడవదు అని అర్ధం చేసుకొని ప్రధానికి చెప్పాడు ,పేద దేశమైన ఇండియా ప్రభుత్వానికి మార్కెట్ కు మధ్యే మార్గాన్ని అనుసరించి బయట పడాలని సూచించాడు .బంగారాన్ని అమ్మేసి ఆర్ధిక స్తితి మెరుగు పరచి సంస్కరణలు అమలు చేసి ఆర్ధికం గా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దారు ప్రధాని రావు మన మోహన్ .సింగ్ ప్రధాని అయి ఈ విధానాన్నే కోన సాగించాడు .గ్రామీణ ప్రజలకు పని కల్పించటం ,విద్యా విధానాలలో మార్పులు తేవటం ద్వారా కొంత మెరుగు పరచాడు సింగ్
సోషలిజం ఓడి పోవటం ,మార్కెట్ బల బడటం వలన మళ్ళీ ఆర్ధిక అసమానత్వం ఏర్పడింది .ప్రపంచీకరణ విజయమై ప్రపంచమంతా మార్కెట్ మయం అయింది.సోషలిజం పతనం తో బాటు ప్రపంచీకరణ ప్రాధాన్యత పెరిగింది .1991 తర్వాతా ఇతర దేశాలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి .కోకా కోలా సామ్రాజ్యం విస్తరించింది .జనతా ప్రభుత్వ హయాం లో దీన్ని నెట్టేశారు .’’కోక్ ను కిక్ చేయటం భారత దేశ స్వాతంత్రయానికి చిహ్నం ‘’అయిందప్పుడు .ఇప్పుడు మళ్ళీ వచ్చి తిష్ట వేసి ఇండియాను లొంగ దీసుకోంది.ఇండియా గ్లోబలై జేషన్ వలన లాభ పడింది ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ ,బిజినెస్ అవుట్ సోర్సింగ్ లకు అంతర్జాతీయ మార్కెట్ లభించింది .భారత్ కూడా ఉత్పత్తి లో ముందడుగు వేసి ‘’ఇంటర్నేషనల్ ప్లేయర్ ‘’ పాత్ర పోషిస్తోంది .ఇంతకీ ప్రపంచీకరణ పేదలకు ఏమి లాభం కలిగిస్తుంది అనే ఆలోచనా సాగింది .
సోవియట్ యూనియన్ పతనం తర్వాతా రష్యాలో ‘’బిగ్ బాంగ్ గ్లోబలైజేషన్ ‘’పెరిగి పోయింది .రోరింగ్ నైన్ టీస్ పుస్తకంలో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’ఆర్ధిక ప్రపంచీకరణ రాజకీయ ప్రపంచీకరణ ను తోసి రాజైంది ‘’అన్నాడు .’’ఆన్ గ్లోబలైజేషన్ ‘’పుస్తకం లో ఫైనాన్సేర్ ,దాత అయిన జార్జ్ సారోస్ ‘’మార్కెట్ ఫండ మెంటలిస్టూలకు అంటి గ్లోబలైజేషన్ కార్య కర్తలకు మధ్య ఒక తమాషా ఒడంబడిక కుదిరింది .ఇది శుభ పరిణామం .అంతర్జాతీయ సంస్థలు బలోపేతం గా ఉండాలి .సంస్కరణలకు అంగీకరించే వారితో జతకలవాలి .అంతర్జాతీయ పద్ధతులు బలపడాలికాని బలహీన పడరాదు ‘’అన్నాడు .ఇవాళ గ్రామాలలో కూడా మనిషి తో చేసే వ్యవసాయం కంటే యంత్రం తో చేసేదే ఎక్కువైంది .అమెరికా వ్యవ సాయ దారులు కూడా ప్రభుత్వం తమకు సబ్సిడీలిచ్చి ఉత్పత్తికి సహకరించాలని కోరుతున్నారు .పంజాబ్ లాంటి రాష్ట్రాలలో భూమి ఉప్పు బారి పోయి పంటలకు అనుకూలమవ్వటం లేదు .వీరు తాయ్ ల్యాండ్ మొదలైన దేశాలలో బియ్యం మొదలైనవి హాయిగా పండించుకొనే ఆలోచనలో ఉన్నారు .
ఇండియా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ లకు ఆహ్వానం పలుకుతోంది .అంబాని వాల్ మార్ట్ టేస్కో లాంటి సంస్స్తలను ఆహ్వానించి మార్కెట్ రంగం లో దూసుకు పోయే ఆలోచన తో ఉన్నాడు .భారతీయ చిల్లర దుకాణాలు దీని వల్ల కనుమరుగౌతాయి .ఉపాధి పోతుంది .చిల్లర వర్తకులు స్వయం సమృద్ధి గా యాజమాన్యం వహించి కస్టమర్ల్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు .వీరి పొట్ట కొట్టటం భావ్యం కాదు .వీరంతా భారత జాతీయతకు వెన్నెముకలే .గ్లోబలై జేషన్ వలన జాతీయత దెబ్బ తింటుంది అని కొందరి వాదన .పాశ్చాత్య సంస్థలు ఇక్కడ బల పడితే భౌతిక నాగరకత పెరిగి ఆధ్యాత్మికత దెబ్బ తింటుందనే భయమూ ఉంది .
ఆస్ట్రేలియా కు చెందిన ఆర్ధిక వేత్త ,రాజకీయ శాస్త్రజ్ఞుడు క్లైవ్ హామిల్టన్ తన ‘’గ్రోత్ ఫిటీష్ ‘’పుస్తకం లో ప్రపంచీకరణ అంటే ఆపకుండా వృద్ధిని వ్యాపించ చేయటం ,వినియోగ దారుల పెట్టుబడిని అభివృద్ధి పరచటం ‘’అని అన్నాడు .గ్లోబలైజేషన్ అనేది సాంస్కృతిక పరం గా ఒక ప్రత్యెక సిద్ధాంతం ,మాత్రమేకాక ఒక స్వేచ్చా శక్తి కూడా ‘అన్నాడు రాస్ ..మీడియా లో ప్రకటనల జోరు వ్యాపారాలను బాగా పెపెంచింది .ఇండియాలోని ఒకప్పుడు మద్రాస్ కే పరిమిత మైన శరవణ భవన్ హోటల్ ఇవాళ చాలా దేశాల్లో స్తానం సాధించింది .ఢిల్లీ లోని కన్నాట్ సర్కస్ లో ఉన్న ఆ హోటల్ ముందు జనం క్యూలు కట్టి నిలబడతారు .పక్కనే ఉన్న మాక్దోనాల్ద్ స్టాల్ వెల వెల బోతూ కని పిస్తుంది .పాశ్చాత్య దేశాలలో గ్లోబల్ సంస్కృతీ తప్పని సరి అంతకంటే వారేమీ చేయలేరు .నియంత్రించనూ లేరు .
ఇండియా లో కమ్మ్యూనిస్ట్ లు మాత్రమె ప్రపంచీకరణ ను అడ్డుకొంటున్నారు .దీని వలన నష్టమే కాని లాభం లేదు .వారి వాదం కాలం చెల్లిన వాదమే అయి పోయింది .వీరు అధికారాలలో ఉన్న దేశాలలో ప్రపంచీకరణకు పెద్ద పీట వేస్తున్నారు .ఊరికే బయటి షో వారి ప్రదర్శనలూ స్లోగాన్లూ .మన్ మోహన్ సింగ్ మాట్లాడుతూ కాపిటలిజం ఇండియా కున్న అవసరాలను తీర్చేదిగా ,క్రమ విధానం లో ఒక దాని తర్వాతా ఒకటిగా పని చేయాలన్నాడు .మోరల్ ఎకనామిక్స్ విషయం లో నిస్పృహ చెందరాదన్నాడు .ఇవాళ సోషలిస్ట్ ఏకనా మిస్ట్ లే ఒంటరి వారై పోయారని చెప్పాడు సింగ్ .మోరల్ ఎకనామిజం వస్తే మార్కెట్ ఎకనామిజం వెనకడుగేస్తుందని నమ్మకం గా చెప్పాడు .
ఇండియా ఎకానమిస్ట్ రాజీవ్ కుమార్ మోరల్ ఎకనామిక్స్ పై అధారిటి .నక్సల్ భావాలు బాగా జీర్నిచుకు పోయిన వాడు .ఆయన ఆక్స్ ఫర్డ్ విద్యార్ధి గా ఉన్నప్పుడు ‘’డి సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ‘’పుస్తకం చదివి ఏంతో మారిపోయానని చెప్పాడు .పదార్ధానికి అవతల ఏదో ఒక గొప్ప విషయం ఉంది .అదొక స్పిరిట్ ఆత్మా శక్తి అన్నాడు. మొక్కలు మాట్లాడుతాయని ,తెలుసుకోన్నానన్నాడు .ఆయన మోరల్ ఎకనామిజం గురించిచెబుతూ మార్కెట్ ను గాడిద తో పోల్చాడు .గాడిద వెనక ,అదే మన లీడర్ అనుకోని నడుస్తుంటే లాగి తంతుంది .మనం దాని మీద కూర్చుని స్వారి చేస్తూ దానికి దారి చూపిస్తే అది మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది .కనుక మనం పెట్టుకొనే రూల్స్ ,విధి విధానాలు పకడ్బందీ గా ఉంటె ఆహార వస్తు సరఫరా సవ్యం గా జరిగి ,సేవ అత్యున్నత నైపుణ్యం తో నిర్వహించ వచ్చు .మనకేమి కావాలో స్పష్టం గా మనకు తెలిస్తే ఆ దిశలో కృషి చేస్తే కావలసింది సిద్ధిస్తుంది .’’అని చెప్పాడు .జపాన్ కొరియాలు మార్కెట్ ద్వారా ప్రజలకు మంచివిద్య నిప్పిస్తున్నాయి .ఇండియా కూడా దీన్ని వాళ్ళ లాగే సాధించాలి .మార్కెట్ సేవను ముఖ్యం గా విద్యా రంగానికి ఉపయోగిస్తే సమస్య పరిష్కారమవుతుంది .మార్కెట్ తక్కువ ధరకు పేదవారికి అందు బాటు ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలి .ఎగుమతి కోసం ఖరీదైన వస్తువుల్ని తయారు చేసి అమ్ముకో వచ్చు .స్థానికం గా మాత్రం చీప్ అండ్ బెస్ట్ వి అందుబాటులోకి తేవాలి .
రోరింగ్ నైన్టీస్ లో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’మా అమెరికా విధానం లో ఇతర దేశాలలో అసమానత్వం ,కొన్ని సందర్భాలలో స్థానిక విలువలను సంస్కృతిని త్రునీకరించటం జరుగు తోంది ఇది మంచిది కాదు . గ్లోబల్ సోషల్ జస్టిస్ అంటేప్రాపంచిక సాంఘిక న్యాయం మీద ద్రుష్టి పెట్టాలి .ప్రభుత్వం ,మార్కెట్ కలిసి సమ తూకం లో పాత్ర నిర్వ హించాలి .దానికోసమే అందరి దృస్టీ కేంద్రీకరించాలి ‘’అన్నాడు .దీన్ని బట్టి మనకు తేలేది ఏమిటి?పూర్తిగా గుడ్డిగా ప్రపంచీకరణ ను త్రుణీక రించరాదు. ప్రపంచీకరణ లోచాలా దూరం ముందుకు వెళ్లాం ఇక వెనక్కి మరలే ప్రశక్తి లేదు .ఇప్పుడు సమస్య దాన్ని ఎలా మన అవసరాలకు పని చేయించుకోవాలి అన్నదే .నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ కూడా గ్లోబలైజేషన్ ను ,ట్రేడ్ ఎకనామిక్స్ ను ఇక ఆపలేము అన్నాడు .మరి గ్లోబలైజేషన్ ను ఎలా పని చేయించాలి?దీనికి ఒకటే పరిష్కార మార్గం ఉంది .విధాన నిర్ణయాలు గ్లోబల్ స్థాయలో తీసుకొని జాతీయ స్థాయిలోఅమలు జరపాలి . సమతుల్యతను సాధించాలి .దీనివల్ల అంతర్జాతీయ సంస్థలను బలీయం చేయాలి .మార్కెట్ మనల్ని ముక్కుపట్టుకొని ముందుకు లాక్కెళ్ళ కుండా జాగ్రత్త పడాలి .ప్రభుత్వము ,మార్కెట్ల పాత్రకూడా సమతుల్యం గా బాలన్స్ గా ఉండాలి .అలాంటి మధ్యేమార్గ సమతుల్యత సాధించాలంటే ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ,చర్చలు అర్ధవంతం గా అభివృద్ధికి మార్గ దర్శకం గా జరుగుతూ ఉండాలి .మార్కేట్ ఫండ మెంటలిస్టూలను, గ్లోబలైజేషన్ వ్యరిరేకులను ఒక కంట కని పెడుతూ వారి స్లోగన్ల కు అరుపులు కేకలకు అదరక బెదరక సమతుల్యతః తో మధ్యే మార్గాన్ని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించగలం .
ఆధారం –ఇండియా అన్ ఎండింగ్ జర్నీ –రచయిత మార్క్ టుల్లి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు
—