బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి

బ్రౌన్ సాహిత్య గుడి పూజారి స్వర్గీయ  శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి

ఒకప్పుడు   సాహితీ మండలికి కన్వీనర్ గా ఉన్న నేను ఒక సంక్రాంతికి దాదాపు నలభై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి ,ఆ కవితలను ‘’నవ కవితా సంపుటి ‘’గా కృష్ణా జిల్లా రచయితల సంఘం సౌజన్యం ,ఆర్ధిక సహకారం ముద్రణ  తో నా సంపాదకత్వాన పుస్తకం వెలువరించాను. అందరికి ఉచితం గా అందించాను. అప్పుడు కడప లో ఉన్న శ్రీ జాను మద్ది హనుమచ్చాస్త్రి గారికి ఒక పుస్తకం పంపాను .వారు దాన్ని అందుకొని తాను చదివానని ,బాగా ఉందని ,మంచి ప్రయత్నం అని మెచ్చి ఆ పుస్తకాన్ని తమ బ్రౌన్ లైబ్రరీ కి అందించానని ఉత్తరం రాశారు .అప్పటి దాకా వారి గురించి విని ఉండటమే కాని ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరప లేదు .ఏంతో ఆనందం కలిగింది .వారి ఆశీస్సులు అమోఘం అని పించాయి .

 

అయి దేళ్ళ క్రితం 2009నవంబర్ 24  న నేను అధ్యక్షుడి గా సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ను ఏర్పరచిన తరువాత ప్రతి ముఖ్యమైన కార్య క్రమం ఆహ్వానాలు వారికి పంపుతూనే ఉన్నాను .సరసభారతి ప్రచురించిన పద కొండు పుస్తకాలను   ఆవిష్కరణ జరిగిన వెంటనేవారికి పంపే వాడిని .వారు ప్రతి పుస్తకాన్ని అందుకొని ,చదివి బాగుందని మెచ్చు కొంటూ దానిని బ్రౌన్ లైబ్రరీకి అంద జేస్తున్నానని తెలిపే వారు .వారి సౌజన్యం మరువ లేనిది .వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చి సత్క రించి ఆ పుంభావ సరస్వతి ఆంధ్ర సాహిత్యానికి చేసిన సేవకు ఋణం తీర్చుకోవాలని భావించాను .కాని అది ఒక కల గానే మిగిలి పోయింది .ఆచరణ కు నోచుకోలేదు .మనసులో బాధ గా నే ఉండేది .వారి వయసు ఇంత దూరం ప్రయాణానికి అనుమతిస్తుందా అనేదీ నాకు లోపల పీడించిన సందేహం కూడా .

నేను రాసి  , సరసభారతి ప్రచురించిన పదవ పుస్తకం ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’వారికి చేరగానే నాకు ఫోన్ చేసి మాట్లాడారు జాను మద్ది వారు .చాలా విషయాలను సేకరించి శ్రమ తో నేను రాసిన పుస్తకం గా దాన్ని మెచ్చారు .అంతే కాదు అందులో నేను రాసిన ‘’త్రైలింగ స్వామి ‘’గారిని గూర్చి తన వద్ద మరింత సమాచారం ఉందని దాన్ని నాకు పంపిస్తానని దాని తో బాటు వారు రాసిన ‘’52 మహా శక్తి పీఠాలు ‘’పుస్తకాన్ని పంపుతున్నానని చెప్పారు .అలా గే ఆ రెండూ నాకు చేరేట్లు పంపారు .వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పుకొన్నాను .వారి మాట కొంచెం కడప యాస తో ఉన్నా ఏంతో విజ్ఞాన దాయక సంభాషణ చేస్తారు .ఆ మహాను భావుడి తో మాట్లాడే అరుదైన అవకాశం నాకు లభించిందని ఏంతోసంతృప్తి చెందాను  .

నేను రాసిన నా ఆరవ పుస్తకం ‘’శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’ను జాను మద్ది వారికీపంపినపుడు అందినట్లు తెలియ జేసి అందులో నేను రాసిన ‘’శ్రీ హనుమత్ కదా నిధి ‘’ పుస్తకం తనకు నేను పంప లేదని గుర్తు చేశారు .అందుకని  వెంటనే పంపాను .ఈ కదా నిధి పుస్తకానికి స్పాన్సర్ కడప వాసి ,ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న శ్రీమతి పవని మాధవి  అమెరికాలో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి కి కుటుంబ స్నేహితురాలు .మేము మూడవ సారి అమెరికా వెళ్లి నప్పుడు మాధవి కుటుంబం తో మంచి పరిచయమేర్పడింది .ఆమె తండ్రి పవని రాదా కృష్ణ గారు కడప లో ఏలెక్ట్రికల్ ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .ఆయన కు అంకితమిచ్చి ‘’కదా నిధి ‘’ని ప్రచురించమని మాధవి కోరింది .కాని ఆయన తన తల్లి గారికి అంకితమివ్వమని నాకు ఫోన్ చేసి చెప్పారు. దురద్రుస్టవశాత్తు అయన గుండె పోటు  తో 2011జనవరి ఒకటవ తేదీ న అకస్మాత్తు గా మరణించారు ..మాధవి కోరిన దాని ప్రకారం ఆ పుస్తకాన్ని రాదా కృష్ణ గారికి వారితల్లి  గారికి కలిపి అంకితం ఇచ్చాను .  దీని ముద్రణ ఖర్చులన్నీ మాధవి భరించింది .

హనుమత్ కదా నిధి పుస్తకం చదివిన శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు ఫోను చేసి రాదా కృష్ణ గారి కుటుంబం తో తనకు చాలా కాలం గా పరిచయం ఉందని మాధవి వాళ్ళు బాగా తెలుసని చెప్పారు .సంతోషం కలిగింది నాకు .మళ్ళీ ఒక సారి జాను మద్ది వారు ఫోన్ చేసి రాదా కృష్ణ గారి సోదరులు తమ తో మాట్లాడటానికి అప్పుడే తమ ఇంటికి వచ్చారని వారితో  మాట్లాడమని చెప్పారు .ఆయన తో మాట్లాడి పరిచయం చేసుకొన్నాను .అలా మాధవి కుటుంబం వారితో పరిచయం కలిగించారు హనుమచ్చాస్త్రి గారు .మరో సారి వారే ఫోన్ చేసి తాను రాసిన ‘’చారిత్రిక మహా పురుషులు ‘’పుస్తకాన్ని పంపిస్తానని చెప్పి పంపారు .అందగానే ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను .

ఈ విధం గా ఆ సాహితీ విరాణ్మూర్తి తో పరిచయం కలిగి నందుకు ఆనందం గా ఉంది .కడప లో ఆయన్ను అందరూ ‘’జానుమద్ది గారు ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .ఆయన వ్యాసాలూ ముద్రించని పత్రిక ఆంద్ర దేశం లో లేదు అంటే అతిశయోక్తి కాదు .ప్రతి విషయాన్నీ మూలాలకువెళ్లి పరిశోధించి  సాదికారికం గా  గా చెప్పే సామర్ధ్యం వారిది .వారి వ్యాసం ఎక్కడ చూసినా ముందు చదివే వాడిని .చాలా ఇన్ఫర్మేటివ్ గా ,ఆలోచనాత్మకం గా రాస్తారు .ఆయన రాసిన దాని కంటే అదనం గా మనకు ఇక ఏ సమాచారమూ మిగలదు .అదీ వారి ప్రత్యేకత .మొదటి విమానాన్ని భారతీయులే రైట్ సోదరుల కంటే ముందే బొంబాయి లో నడిపారని వారు రాసిన వ్యాసం ఎంతో వివరణాత్మకం గా, స్పూర్తి దాయకం గా ఉంది .తొంభై ఏళ్ళ వయసులోనూ వారి సాహితీ వ్యాసంగం కుంటూ పడక పోవటం ఆశ్చర్యమేస్తుంది .సార్ధక జీవి .అందరి తో మంచి గా ఉంటూ ,అన్ని మతాలను ఆదరిస్తూ స్నేహం చేస్తూ ,మంచి మనిషి అని పించుకొన్నారు .బ్రౌన్ లైబ్రరీని కడప లో నిర్మించి ,దాతల సహకారం తో వేలాది పుస్తకాలు సేకరించి ,గ్రంధాలయానికి ‘’అక్షర నిధి ‘’సేకరించిన అలుపెరుగని సాహితీ యోద్ధ .అందుకే వారిని ‘’బ్రౌన్ శాస్త్రి ‘’అని ఆప్యాయం గా పిలుచుకొంటారు .వారి సర్వమత సహనం వారిని ‘’జాన్ అహ్మద్ శాస్త్రి ‘’ని చేసింది .బ్రౌన్ లైబ్రరీకి ఏటా ముప్ఫై లక్షల రూపాయల గ్రాంట్ ను ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి తో  శాంక్షన్ చేయించుకొన్న ఘనత వారిది .ఆ  దనం  తో ఇప్పటికి ఆ లైబ్రరీలో లక్ష కు పైగా పుస్తకాలు ఉన్నాయి .ఇది జానుమద్ది వారి కృషికి గొప్ప నిదర్శనం .ఈ సాహితీ శిఖరం అద్రుశ్యమైనందుకు చింతిస్తూ  అక్షర నివాళులు అందిస్తున్నాను .

శ్రీ హనుమచ్చాస్త్రి గారు నాకు రాసిన లేఖ ను దీనితో జత పరుస్తూ మరొక్క మారు క్రుతజ్ఞాతాంజలి ఘటిస్తున్నాను ..

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-3-14-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి వితరణ

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి వితరణ

ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లోని హాంట్స్ విల్ లో నివాసం  ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం ,స్నేహం ఆత్మీయత, ఆదరణ ,పరోప కార పారీణత ,వితరణ అందరకు తెలిసిన విషయమే . 2004లో ఆయన ఉయ్యూరుకు వారి భూరి విరాళం తో రూపు దిద్దుకొన్న ఏ.సి గ్రంధాలయ ప్రారంభోత్సవానికి వారు వచ్చిన సందర్భం గా దాని నిర్మాణ కమిటీ కన్వీనర్ గా వారితో తోలి పరిచయం ఏర్పడింది .2008లో మేము అమెరికా వెళ్ళిన సందర్భం లో  ఈ బంధం గాఢ పడింది .అప్పుడే సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివలక్ష్మి  కుమార్తె ఛి బిందు వెంకట దత్తశ్రీ అమెరికా లో  భగవద్గీత పోటీలలో పాల్గొన టానికి  కుమార్తె తో వచ్చింది .శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఫోన్ నంబర్ అడిగి తీసుకొన్నది .గోపాల కృష్ణ గారికి తన ఆర్ధిక పరిస్తితి వివరించి ,బిందు కు ఏదైనా ఆర్ధిక సాయం చేయమని కోరిందట .ఈ విషయం నాకు ఆయనా చెప్పలేదు ఈమె కూడా చెప్పలేదు .ఆమె కు సాయం చేయాలని ఆ నాటి నుంచీ మనసులో ఉంది కాని వెసులు బాటు కాక డబ్బు సాయం చేయలేక పోయానని ఈ ఫిబ్రవరి చివర్లో నాకు మెయిల్ రాసి ,ఇప్పుడు కొంత వీలు దొరికిందని బిందుకు అందజేయ మని నాకు వేస్త్రెన్ మని ట్రాన్స్ ఫర్ ద్వారా 15,000రూపాయలు పంపి నాకు తెలియ జేసి ఆ పైకాన్ని శివ లక్ష్మి ద్వారా బిందు కు అంద జేయమన్నారు .ఆ డబ్బును మార్చి ఒకటవ తేదీ న పోస్ట్ ఆఫీసు నుండి నేను తీసుకొని శివలక్ష్మికి ఫోన్ చేసి ఆమె మా ఇంటికి ఆ సాయంత్రం రాగానే అంద జేశాను ..

ఈ పారితోషికాన్ని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో మీడియా మిత్రుల ముందు సరసభారతి అధ్యక్షుని గా  నన్ను అంద జేయ మని శివ లక్ష్మి   కోరింది .ఈ రోజు మార్చి నాలుగవ తేదీ మంగళ వారం’’ స్వామి’’ సన్నిధిలో భక్తుల సమక్షం లో శివ లక్ష్మి శ్రీనివాస శర్మ దంపతుల సమక్షం లో ఛి బిందు కు  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తరఫున నేను అంద జేశాను.అందరూ మైనేని వారికి కృతజ్ఞతా సూచకం గా కర తాళ ధ్వనులు చేశారు .ఆయన వితరణ గురించి నాలుగు మాటలు చెప్పాను .బిందు బాగా చదివి అభి వృద్ధి లోకి రావాలని ఆశీర్వ దించాను .మాది రాజు కుటుంబం ఉచిత రీతిని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు .

ఛి బిందు వెంకట దత్తశ్రీ  కి శ్రీ మైనేని గోపా కృష్ణ గారు (అమెరికా ) పంపిన పారి తోషికం -15,000రూపాయలు నేను శ్రీ సువర్చలన్జనేయ దేవాలయం లో అంద జేసే దృశ్య మాలిక

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-14-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13

    రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -13

1-తెలంగాణా లో వర్షం తో పడిన ‘’వడ గండ్లు ‘’

   రాబోయే అస్తవ్యస్తాలకు సూచనా? భరింపరాని  ’’ కడగండ్లు? ‘.

2-’ఒద్దు చేరే దాకా ఓడ మల్లన్న –చేరాక బోడి ‘’మల్లన్న’’

     టి.ఆర్.ఎస్.నోట చెప్పించిన కే.సి.ఆర్ ‘’.పెద్దన్న’’ .

3-గులాబీ హస్తమూ దొందూ దొందే

  ఒకే ఒరలో ఇరకని కత్తులై పెట్టుకొనే ‘’బొందె ‘’.

4-ఇక్కడ రాష్ట్ర పతి  పాలన,నరసింహం చేతిలో  ‘’ఒకే.’’

  అసమర్ధ పాలన ఉన్న ధిల్లీ లో నూ ‘’దాదా’’ పాలనైతే డబుల్ ఒకే .

4-‘’తీన్ మార్ ‘’ఎన్నికలు పెట్టి ,అమలై పోయింది  ‘’కోడు ‘’

    అంటే  ప్రజాభిప్రాయం ఎలా వ్యక్తమై ఎవరికి చెప్పాలి’’ గోడు’’ ?

5- వై  ఎస్ .,కిరణ్ బొమ్మల్ని చింపే శాడట ‘’శంకరన్న ‘’

   ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలీని  ‘’తలతిక్క శంకరన్న’’.

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-14-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )

   గోదే రాసిన ఫాస్ట్ నాటకం -2(చివరి భాగం )

గోదే కార్య కలాపాల లిస్టు చూస్తె ఆయన ప్రతిభ ఏమిటో యిట్టె తెలుస్తుంది .స్వతహాగా కవి ,నాటక రచయితా ,నాటక దర్శకుడు ,గొప్ప విమర్శకుడు ,విజ్ఞాన శాస్త్ర వేత్త ,మహా రాజకీయ వేత్త అంటే స్టేట్స్ మాన్ .ఇవన్నీ చూస్తె ఆయన ఉన్న కాలం నాటి మేధావులలో ఆగ్ర శ్రేణి లో నిలిచి నట్లు తెలుస్తుంది .ఈ సర్వజ్ఞత్వం అంతా ఆయన రాసిన ఫ్రాస్ట్ నాటకం లో ప్రతి బిమ్బిస్తుంది .ఈ నాటకం వలన గోదే,గ్రీకు ప్రాచీన కవి  హోమర్  ప్రముఖ రాచయిత డాంటే ,ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్ పియర్ సరసన చేరాడు .ఈ నాటకం లో రసభావాలు  తరచుగా మారి పోతూ గోదే శక్తి సామర్ధ్యాలను,హాస్య చతురతను వ్యంగ్య వైభవాన్ని ,సాను భూతి ని ,వీటి నన్నిటిని మించి ఆయన కవితాఝారి,ప్రతిభను  ని  నియంత్రించు కుంటూ ముందుకు సాగి పోతూ ఉంటుంది .

ఫాస్ట్ నాటకం ‘’universal experience of the troubled human soul ,ut its spiritual values far transcend

mere Satanism and its consequences ‘’అని కీర్తింప బడింది .ఇందులో డైరెక్టర్ చేత ‘for art may need long years of true devotion –to bring perfection to the light of the day ,the brilliant passes like the dew at morn ,-the true endures for ages yet un born ‘’అని పిస్తాడు కళాత్మక విషయానికి యెంత విలువ ఉండాలో దీని వలన తెలుస్తుంది .అలాగే ఒక కమెడియన్ తో ‘’but never put good fooling out of fashion ‘’అని నిజం చెప్పించాడు .ప్రేక్షక స్త్రీలను గురించి దర్శకుడు అన్న మాటలు చూద్దాం ‘’the ladies bring us fashion’s gallery –and play their parts without a salary ‘’అని వారి పాత్రనూ వివరిస్తాడు .ఇందులో ఒక పాత్ర అయిన లార్డ్ ‘’enwrap your minds in love’s immortal folds –and all that life in floating semblance holds –estabilish in fast thought that shall ‘’endure ‘’.లార్డ్ తన తో చాలా మంచిగా మాట్లాడతానని గురించి మేఫేటోఫ్లేస్ ఇలా అనుకొంటాడు ‘’it is decent in the first of gentlemen –to speak so friendly even to the devil ‘’.ముఖ్య పాత్ర ఫాస్ట్ ‘’I stand no   wiser than I was before ‘’అని,’’ I made in god’s wn image –not with you cmpare ‘.if feelings fail yu vain will be yurs  co urse-and idle what you plan unless you art –springs  from the soul with elemental force to  hold ‘’. తనను తానూ ఆవిష్కరించు కంటాడు .వాగ్నర్ అనే పాత్రతో మాట్లాడుతూ ‘’god’s own image who have seemed for sooth –near to the mirror of eternal l truth ‘’అంటాడు .ఈ కవన్నీ చిక్కని మధురసం వలక బోసేకవితా పంక్తులే చదువుతుంటే ఆనందం ,హాయి గంభీర భావం తో పరవశం కలుగు తుంది .పంచ భూతాలలో ఏమి ఉందొ తెలియ జేస్తూ ఇలా అంటాడు ‘’in elements of water ,earth and air –in  moisture  r in drought –in warm or cold –a ceaseless multitude of seeds un fold ‘’.

అదృష్టం ఎలా ఉంటుందో చెప్పాడు ‘’fortune some times scores a lucky pint ‘’అంటాడు .

ఫాస్ట్ తో చాలా విలువైన మాటలను గోదే చెప్పిస్తాడు చివరలో .’’life has taught me with its weary weight –to long for death –and the dear light to hate ‘’అని పిస్తాడు .ఫినిషింగ్ టచ్ గా ‘’happy the man who keeps his faith un strained –no sacrifice will come to him amiss ‘’అని ఫాస్ట్ తో గోదే అనిపిస్తాడు .

Goethe (Stieler 1828).jpg        

gothe’s birth place                  gothe ‘s water colour painting

గోదే జీవిత విశేషాలు

-28-8-1749లో గోదే జెర్మని లోని ఫ్రాంక్ ఫర్ట్ లో   జన్మించాడు .తండ్రి జోహాన్ కాస్పర్ గోదే .తల్లి కేతలీనా ఎలిజబెత్  టేక్స్తార్ .ఇంటికే మేస్టర్లను పిలిపించి తండ్రి చదువు చెప్పించాడు,నాట్యం ,గుర్రపు స్వారి ఫెన్సింగ్ నేర్చాడు .తనకు రాణి విద్యలన్నీ తన సంతానం నేర్చుకోవాలని తండ్రి కల . కవిత విమర్శ నాటకం ల తో బాటు స్వీయ జీవిత చరిత్ర రాసుకొన్నాడు .రాజకీయం గా గొప్ప పేరూ పొందాడు రాజ నీతిజ్ఞుడు గా రాణించాడు .బాటని,అనాటమీ ,కలర్ ల మీద అనేక పరిశోధనాత్మక వ్యాసాలూ రాశాడు .వెయ్యి ఉత్తరాలు మూడు వేల డ్రాయింగులతో బాటు నాలుగు నవలాలూ రాసిన అక్షర శిల్పి .’’సారోసాఫ్ యంగ్ వేర్టర్ అనే మొదటి నవల అందర్నీ ఆకర్షించింది .జెర్మని పాలకుడు డ్యూక్ ప్రీవీ కౌన్సిల్ లో ఉన్నత పదవి చేబట్టాడు .యుద్ధ పర్య వేక్షకుడు గా ఉన్నాడు .జేనా యూని వర్సిటి లో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టాడు .వీమార్స్ బొటానికల్ గార్డెన్ కు రూప శిల్పి అయ్యాడు .ద్యూకల్ పాలస్ ను అనేక మార్పులతో సర్వాంగ సుందరం చేశాడు .ఇటలీ పర్యటన చేసి 1788లో తిరిగి వచ్చిన తర్వాత ‘’మెటా మార్ఫసిస్ ఆఫ్ ప్లాంట్స్ (వృక్షాలలో రూప విక్రియ )అనే సైంటిఫిక్ గ్రంధాన్ని రాసి వెలువ రించాడు .వీమార్ నాటక శాలకు డైరెక్టర్ గా నియమింప బడ్డాడు .నాటక రచయితా చరిత్ర కారుడు ఫిలాసఫర్ అయిన ‘’ఫ్రెడరిక్ షీలర్ ‘’తో మంచి పరిచయం ఏర్పడింది .’’విలియం మీస్టర్  అప్ప్రేంటి షిప్ ‘’అనే రెండవా నవల రాశాడు .1808ఆయన మేధో సృష్టి అయిన నాటకం ఫాస్ట్ మొదటి భాగం విడుదల చేశాడు .తనకు ముందున్న ఫిలాసఫర్ ల రచనల పై ‘’వీమర్ క్లాసిసిజం ‘’రాశాడు .ఆర్ధర్ స్కోపెంహార్ గోదే రాసిన మొదటి నవల వీహేల్మ్  అప్ప్రేంటి షిప్ జెర్మని భాషలో వచ్చిన అత్యున్నత నాలుగు నవలలో ఒకటి అని మెచ్చాడు .మహా రచయితా విమర్శకుడు ఎమర్సన్ గోదే ప్రతిభకు నీరాజనాలు అందించాడు .జంగ్ ,ఫ్రాయిడ్ ,థామస్ మాన్ వంటి అగ్ర శ్రేణి రచయితల పై గోదే ప్రభావం అధికం .గోదే రాసిన అనేక కవితలను సంగీత దర్శకులైన మొజార్ట్ ,బీతొవెన్ బ్రాహం ,వాగ్నర్ లను పద్దెనిమిది పందొమ్మిదవ శతాబ్దం లో తమ సంగీత కచేరీలలో ఉపయోగించుకొని ప్రేరణ పంది ఆయన కవితా మాధుర్యాన్ని చాటారు .

Photograph of a large bronze statue of two men standing side-by-side and facing forward. The statue is on a stone pedestal, which has a plaque that reads "Dem Dichterpaar/Goethe und Schiller/das Vaterland".     

gothe and scheler monument                   portrait of gothe                                  gothe s monument in chikago

గోదే కు రోమన్ కేధలిక్ మతం అంటే ఇష్టం ఉండేది కాదు .1765-68కాలం లో న్యాయ శాస్త్రం చదివవాడు.కాని పాత బడిన ఆ శాస్త్రం చదివి బట్టీ పట్టటం అంటే ఏవ గింపు కలిగింది .దానికి బదులు పోయిట్రీ క్లాసులకు వెళ్ళే వాడు ..’’అన్నా కేధరీన పెంకాఫ్ ‘’అనే ఆమెను వలచాడు .ఆమె పై ఎన్నో కవితలు రాసి ‘’రోకో కో ‘’పేరు మీద విడుదల చేశాడు .అల్సేస్ అనే చోటుకు మారి ఆరోగ్యం బాగు చేసుకొన్నాడు .జోహాన్ గాట్ ఫ్రీదర్ తో పరిచయం ఏర్పడి అభి వృద్ధికి దోహద మైంది .ఆయన వల్లనే  షేక్స్ పియర్ సాహిత్యం చదివాడు,అభిరుచి పెరిగింది ..17-10-1772న మొట్ట మొదటి సారిగా జెర్మని లో షేక్స్ పియర్ దినోత్సవాన్ని వైభవం గా నిర్వ హించాడు .షేక్స్ పియర్ రచనలు చదవటం వలననే తనలో సాహిత్య స్పృహ ఇనుమడించింది  అని గోదే స్వయం గా వెళ్ళ డించాడు

    

gothe;s monument in leipgig                      gothe with contemporaries

1771లో లా డిగ్రీ పొంది ఫ్రాంక్ ఫర్ట్ నగరం లో ప్రాక్టీసు ప్రారంభించాడు .తొందర బాటు  తనం తో మొదట్లో వచ్చిన కేసులను చట్ట పరిమితి నతిక్రమించి వాదించి దెబ్బ తిని కేసులు లేకుండా చేసుకొన్నాడు .బావ మరిది తో పరిచయం మళ్ళీ సాహిత్యం వైపు మళ్ళించింది .తన జీవిత చరిత్ర ను నాటకం గా మలిచి ప్రదర్శిస్తే అద్భుతం గా విజయ వంతమైంది .1815లో గ్రాండ్ డ్యూక్ వద్ద చేరి వీమార్ లోనే జీవితాంతం ఉండిపోయాడు .ఏంతో మంది అమ్మాయిలను ప్రేమించాడు కాని అన్నీ విఫలమే అయ్యాయి .తన రచనలలో  మేరీ బాల్డ్ ఎలిజీ అనేది గొప్ప దని గోదే భావించే వాడు .22-3-1832 న 82వ ఏట గోదే మహా రచయిత మరణించాడు .వీమార్ లోని హిస్టారికల్ సేమేటరి ద్యూకల్ వాల్ట్ లో గోదే ను ఖననం చేశారు .

20-10-2002 ఆదివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-14-ఉయ్యూరు

 
 
 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి జి మేరీ కృపా బాయ్ ”వందకధలు”ఆవిష్కరణ సభ ఆహ్వానం

meri krupabay 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గోధే రాసిన ‘’ ఫాస్ట్ ‘’నాటకం

గోధే రాసిన  ‘’ ఫాస్ట్ ‘’నాటకం

మహాకవి కాళిదాసు రచించిన ‘’అభిజ్ఞాన శాకుంతలం ‘’నాటకం చదివిన జర్మన్ నాటక కథ ,విమర్శకుడు దార్శనికుడు గోధే ఆనందం తో నృత్యం చేశాడని ‘’దివి ని భువి ని కలిపిన మహత్తర నాటకం ‘’అని శ్లాఘిన్చాడని చదివినప్పటి నుంచి ఆయనపై మహా క్రేజు ఏర్పడింది ఆయన రచనలు చదవాలనే కోరిక కలిగింది .అది ఇప్పుడు తీరింది .అయన రాసిన ఫాస్ట్ నాటకానికి గొప్ప పేరుంది అది చదివే భాగ్యం కలిగింది .పెంగ్విన్ వారు ప్రచురించిన పేపెర్ పాక్ ఎడిషన్ అది .

గోదే గురించిన పరిచయం అద్భుతం గా ఉంది ‘’All intelligent thoughts have already been thought .what is necessary is only to try to think them again .ఇంటర్నెట్ లో ఆయన వెబ్ లో ఈ మాటలున్నాయి .గోదే అసలు పూర్తీ పేరు ‘’జోహాన్నో ఉల్ఫ్ గాంగ్ గోదే’’ .’’నేచురల్ ఫిలాసఫర్ ‘’అంటారు ఆయన్ను .జర్మనీ రోమాన్స్ సాహిత్యం లో శిఖర సద్రుశుడే కాదు సంపూర్ణ జర్మన్ కూడా గోదే .82ఏళ్ళ నిండు జీవితాన్ని గడిపాడు .ఫాస్ట్ అనే ఈ నాటకం గురించిన ఆలోచనలు  60  ఏళ్ళు గా ఆయన మనసులో సుళ్ళు  తిరుగుతూ ఉన్నాయి ..ఇక్కడ మన కవి సామ్రాట్  విశ్వనాధ గారు’’కల్ప  వృక్షం ‘’పై పడిన మధన  జ్ఞాపకం  వస్తుంది . దాదాపు ఆయన తన జీవితమంతా దీనికే కృషి చేశాడు .

గోదే తన 20వ ఏట’’ ఫాస్ట్ ‘’రచన ప్రారంభించాడు .51వ ఏట దానిని పూర్తీ చేశాడు .రెండవ భాగం పూర్తీ అయేసరికి ఆయన జీవిత నాటకమూ సమాప్తి చెందింది .ఈ నాటకాన్ని ‘’Faust is a complex work of idealism ,removed from the human conflict of conscience and love that the pet gives in part 1,with aan ardour and a vivacity of temperament for which he he has been idolized.in his own country and else where .’’అందుకే నెమో శాకుంతల నాటకం చదివి గోదే  అంత ఉత్సాహ పడ్డాడు .యవ్వన దశ లోను ముసలి తనం లోను జీవితాన్ని ‘’స్ట్రాంగ్ ఐరానిక్ స్క్రుటిని ‘’తో చూసిన వాడు .దీనిని తన తోటి వారికి ప్రేమ తో సమర్పించిన పుస్తకం ఇది .అందుకే ఆయన అంటాడు ‘’Why have I sought my path with fervent care –if not in hope to bring my brothers there ?’’The paths of Goethe’s inner being of his wit and of his passion are vivid in his  faust’’ .’’అన్నారు విశ్లేషకులు .1587లో ఇది ప్రచురితమైంది .

 

Goethe (Stieler 1828).jpg

 

అప్పుడు ఉన్న కాలాన్ని ‘’ఏజ్ ఆఫ్ యెన్ లైటన్ మెంట్ ‘’ అంటారు .’’in ages of skepticism like our own ,men disowning religion have been impatient with all barriers of convention and have sought to satisfy their vague hunger by grasping at occult powers that seemed to lie beyond the keen of pedant authority ‘’.ఇదీ ఆ యుగ లక్షణం .అయితే  ఫాస్ట్   నాటకం లో ‘scetical spirit is grave and mature ,except when he is goaded to bitterness ,in any case one must not identify Gothe withF aust any more than Mephistopheles –for their creator was bigger than the two of them .Gothe intended egotism as faust ;s  faulta.అందులో ఫాస్ట్ పాత్ర దారి తో ‘’my name is Faust in every thing thy equal .’’అని ‘’only the fruit ful thing is true .’’అన్న గోతే టెస్టమెంట్  వాక్యానికి ఇది దర్పణం అన్నారు .ఈ నాటకాన్ని ‘’big dramatic poem rather than a play ‘’అని కీర్తిస్తారు .అంటే మన అప్పా రావు గారి కన్యా శుల్కం నాటకం లా అన్న మాట .నాటకాన్ని స్టేజి మీద ఆడటం కష్టం .చదివి ఆనందించాల్సిందే .గోదే ని ‘’Germany ‘s foremost lyric poet ‘’గా ఆరాధిస్తారు .’’German language is homeliar than English .Gothe is the world’s most convincing portrait of satan and cynicism scoffing negation is the keynote of his intellectuality ‘’అంటారు .గోదే తన రచన ను ‘’హైబ్రిడ్ ‘’అన్నాడు భావ శుద్ధి తో .ఆయన రచనలో సెక్స్ అనేది ‘’tribunal of self ‘’.the true action of love lies in a willing death of self ,where by life is saved  in a richer continuity ‘’.అని .గోదే రచన ను ఇంగ్లీష్ లోకి అనువదించి ముందు మాట రాసిన రచయిత‘’ఫిలిప్ వేన్’’.

19-10-2002 శనివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అ. అ. విభో ఫౌండేషన్ తెలుగు జాతికి కొండంత అండ -అంటున్న జి.వి.ఎల్.యెన్ మూర్తి –

 

అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో కూడా తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు నేలపై సన్మానాల కంపెనీలు, ఊకదంపుడు పొగడ్తలు పెరిగిపోతున్న రోజుల్లో అమెరికాకు చెందిన నలుగురు మిత్రులు తమ సంపాదన నుంచి తెలుగు వికాసం కోసం వెచ్చిస్తున్నారు. వీరు తెలుగు సాంస్కృతిక రంగంలో అచ్చమైన ప్రతిభకు పట్టంకడుతున్నారు. స్వస్థలానికి దూరమైన తెలుగు బిడ్డలకు తమ తల్లి భాషలోని పుస్తకాలు చదవటానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. లక్షలు దాటి కోట్ల రూపాయల వ్యయం పెరుగుతున్నా తమ ఉద్యమానికి దన్ను గా అవసరమైన వనరుల్ని సమకూరుస్తూనే ఉన్నారు. అజో-విభో ఫౌండేషన్‌గా మన సాంస్కృతిక రంగంలో ప్రత్యేక ఒరవడి సృష్టించిన ఆ నలుగురు మిత్రుల తెలుగు మైత్రీ ప్రస్థానం తెలుగు గడ్డపై అన్ని చెరగుల్లో కొత్తమిత్రుల్ని, పుస్తక ప్రేమికుల్ని నిశ్శబ్దంగా పెంచుతోంది. సుమారు 16,000 పుస్తకాలను సమీకరించి అడిగినవారికి అసలు ధర కన్నా రాయితీతో ఇంటి ముంగిట్లోకి తెచ్చి అందిస్తున్నారు. ఎక్కడా ఏ రూపంలోనూ ప్రభుత్వం నుంచి తోడ్పాటు కోసం వెంపర్లాడకుండా అనేక ప్రభుత్వ కార్యక్రమాల తీరుతెన్నులు సిగ్గు పడేలా చేసి జేజేలు అందుకుంటున్న ఈ అజో విభో సంస్థకు ప్రధాన సారథి అయిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణతో మాటా మంతీ-
తెలుగు వికాసానికి కృషి
బాపట్లలో చదువుకుని కంప్యూటర్ శాస్త్ర అధ్యాపకుడిగా అమెరికాలో స్థిరపడ్డాను. సగటున నెలకు అయిదు లక్షల రూపాయల ఆదాయంతో నాకు నా కుటుంబ సభ్యులకు అన్ని అవసరాలు తీరేలా సంతృప్తికర జీవితం అందివచ్చింది. మాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం, కళలు వంటివాటిపై మక్కువ ఏర్పడింది. చాలామంది కవి పండితుల్ని చూస్తూ వారి ప్రతిభతో పాటు తెలుగు నేలపై వారి విద్వత్తుకు తగిన ఆదరణ లభించటం లేదని కూడా అర్థమైంది. నా వంతుగా మన వాళ్ల ప్రతిభకు పట్టం కట్టడంతో పాటు వివిధ వేదికల ద్వారా తెలుగు సాంస్కృతిక ప్రాభవం వెలుగులోకి వచ్చేలా చేయాలన్న తపన పెరిగింది. ఆ ఆలోచన వచ్చిన తరువాత ఈ రంగంలో జరుగుతున్నవన్నీ గమనించటం, సమాచారం సేకరించటం మొదలుపెట్టాను. నా అంతరంగానికి అశాంతి పెంచినవారే తప్ప అసలు సిసలు సంస్కృతిపై ఇష్టంతో ఉన్నవారు తక్కువే. అదంతా ఓ రకమైన మాయా ప్రపంచంగా కనిపించింది. కొంతమంది కొందరి కోసం వారి వారి అభిరుచులు ఆలోచనలకు తగ్గట్టు జోరుగా హోరుగా కార్యక్రమాలు చేస్తుంటారని అవగతం అయింది.
ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందులో కాస్తంత మిగుల్చుకోవటం వంటివి జరుగుతూంటాయని కథలు కథలుగా చెప్పారు. ఏడాదిలో కొద్ది రోజులు సెలవు పెట్టుకుని మన ప్రాంతానికి వచ్చి తెలుగువారి మధ్య, కళాకారులు సాంస్కృతిక రంగ అభిమానుల మధ్య గడపటం, గొప్ప గొప్పవారిని సత్కరించుకోవడం నా దారిగా చేసుకున్నాను. నాతో పాటు సన్నిహితంగా మెలిగే అమెరికా మిత్రులలో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రాంతం నుంచి శాస్త్రవేత్తలుగా వికసించిన విష్ణుభొట్ల రామన్న లక్ష్మణ ్ణలు ఆసక్తితో స్పందించారు. వారి తరువాత భౌతిక శాస్త్రంలో ప్రతిభతో రాణించిన కందాళం చారి కలసి వచ్చారు.
ఎక్కడా చేయి చాపని పౌండేషన్
చేసేదేదో మన సొత్తుతో మనం చేద్దాం, ఎవరినీ ఎప్పుడూ ఏ సాయం కోసం అడగవద్దనే నిర్ణయంతో మా సంకల్పాన్ని సాకారం చేసుకున్నాం. 1993లో మా ఫౌండేషన్ తరపున తొలి కార్యక్రమం హైదరాబాదులో జరపటానికి సన్నాహాలు మెదలుపెట్టాం. 1994 జూన్‌లో మా ప్రప్రథమ కార్యక్రమం జరిగింది. ఆ ప్రయత్నానికి అన్ని రంగాల నుంచి ఉత్తమాభిరుచి కలవారు హజరై మా కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ తీరులపై అన్ని వివరాలూ కనుక్కుని, చాలా బాగున్నాయని మమ్మల్ని ప్రోత్సహించారు. మంచి మంచి నాటకాలు, సాహితీ సదస్సులు వంటివాటితో పాటు ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారంతో మేము ఆరంభించిన ఒరవడి తెలుగు గడ్డపై అర్థవంతమైన కార్యక్రమాలకు మంచి మెప్పు లభించింది. మా మిత్రులు, కళాభిమానులు పలు సూచనలు సహాయ సహకారాలకు అవకాశాలు కూడా పెంచారు. మా పురస్కారాల ఎంపికతో పాటు ప్రదానం చేసే పద్ధతులలో సంస్కారవంతమైన సంప్రదాయాలను నిక్కచ్చిగా పాటిస్తున్నాము. హైదరాబాదు తరువాత 1995లో విశాఖపట్నంలో కార్యక్రమాలతో మాకు అన్ని ప్రాంతాల్లో కళాకారుల సాన్నిహిత్యం పెద్ద దన్నుగా అందివచ్చింది. ఆ తరువాత నుంచి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, భీమవరం, మళ్లా 2002లో హైదరాబాదు, తిరిగి విజయనగరం, తెనాలి, కాకినాడలలో దిగ్విజయంగా మా కార్యక్రమాలు జరిగాయి.
అమెరికా పద్ధతులు, స్థానిక వైభవం
మాకు ఎక్కడా పెద్ద యంత్రాంగం, కార్యకర్తల హంగూ ఆర్భాటాలు లేకపోయినా అందరికన్నా మెరుగ్గా తొలినాటి నుంచి 20 ఏళ్ల పాటు మహా వైభవంగా చేయగలిగాము. మేము ఏడాది ముందుగానే ఆయా ప్రాంతాల సాంస్కృతిక రంగ నిర్వాహకులు, అక్కడి కార్యకర్తలతో సంప్రదింపులతో అన్నీ సజావుగా చేయగలుగుతున్నాము. అన్ని వనరులూ మా ఫౌండేషన్ నుంచి అందిస్తున్నాము. స్థానికంగా వేదిక నిర్వహణతో పాటు ఆతిథ్యం, వసతి సౌకర్యాలతో సహకరిస్తే చాలు మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మేము నాటకాలలో చేసిన ప్రయోగాలు, రచనలకు అందించిన స్ఫూర్తి చాలా మేలు చేశాయి.
ప్రతి ఏటా నాటకాల పోటీలతో పాటు మా వేదికతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వాటిని పుస్తక రూపంతో తొలి ప్రదర్శన సమయంలోనే ఖచ్చితంగా అందరికి అందిస్తున్నాం. వాటివల్ల రంగస్థల ప్రచారంతో పాటు అన్ని ప్రాతాల్లోని వారికి మంచి నాటకాలు అందించగలిగాం. మా వల్లే 700 పైచిలుకు నాటకాలు వచ్చాయి. వేదికెక్కించి వాటికి తెర తీసింది కూడా మేమే. ప్రతి ఏడాదీ మేము ప్రదానం చేస్తున్న ప్రతిభామూర్తి, విశిష్టసేవామూర్తి, సేవామూర్తి పురస్కారాలలో మేము పాటించిన ప్రమాణాలు అందరి మన్ననలూ పొందాయి. లక్ష రూపాయల నగదుతో పాటు మా సత్కార గ్రహీతల వ్యక్తిత్వం గుణశీలంపై ఉద్దండ విద్వాంసులతో వ్యాసాలు రాయించి ప్రామాణికమైన ప్రత్యేకమైన సంచికను వెలువరిస్తూనే ఉన్నాము. ఎ్కడా ఎన్నడూ రాజకీయ నాయకులు మా వేదిక పై లేకుండా నిక్కచ్చిగా మనగలుగుతున్నాం. కొత్త కథలు, నవలల పోటీలు మేము నిర్వహించటం వల్లనే సాహితీ గగనంలో అక్షరాల తారలుగా మిలమిలలాడుతున్నాయి. మేము ప్రతి ఏటా మంచి మంచి ప్రతిభావంతుల్ని అమెరికాకు ఆహ్వానించి అక్కడ వేరు వేరు ప్రాంతాలలో సదస్సులు, సభలు నిర్వహించటంతో అక్కడ సారస్వతం వెల్లువెత్తేలా చేయగలుగుతున్నాం. వీటకన్నిటికి తోడుగా మేము తెలుగు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఎక్కడ మంచి పుస్తకం ఉంటుందో వెతుక్కోవటం, తెలుసుకోవటం కష్టమైపోయిన ఈ రోజుల్లో మా సేవతో వేల వేల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి .కొనేవాళ్లు, చదివేవాళ్లు తరిగిపోతున్నారని నిట్టూర్పులు విడిచేవారికి అది నిజం కాదని చేసి చూపిస్తున్నాం. అన్ని రకాల అభిరుచుల కలబోతగా మాత్రమే కాక తెలుగు గడ్డకు దూరమైన తెలుగు బిడ్డలకు అక్షరాలు, చిట్టిగీతాలు, కవితలు, కథలు వంటివి సమస్త ప్రక్రియల సారస్వతం విదేశీ లోగిళ్లలో తెలుగుతనం పండిస్తున్నాయి.
శుష్కప్రియాలు, శూన్యహస్తాలు
కాస్తంత కళ అబ్బితే చాలు ప్రభుత్వ సహాయం, ప్రోత్సాహం కోరటం, విమర్శలు, ఉద్యమాలతో విరుచుకు పడటం మన వాళ్లకు బాగా అలవాటు అయింది. ప్రేక్షకులు, కళాభిమానుల్ని పెంచుకుని అన్ని ప్రాంతాలలోనూ జైత్రయాత్ర చేయాలన్న ఆలోచన కూడా మనలో చాలా మందిలో లేశమాత్రం కూడా కనిపించదు. పాత కాలంలో మహారాజుల ప్రాపకంతో ముందుకు సాగిన సాహిత్యం, కళల తీరు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉండి కూడా కుంచించుకుపోయి చిన్న పరిధిలో మనుగడ సాగించటం సరికాదు. ఆలోచించండి. పొరుగు దేశాల్లో ఏం జరుగుతోందో గమనించండి. తెలుగుదనం వ్యాప్తికి మహత్తర సృజనకు, అంతటి ఆస్వాదనకు మనకు ఉన్న రాశి, వాసిని ఆత్మవిశ్వాసంతో గర్వంగా చాటుకుని ఆదర్శంగా నిలిచేలా చేయటానికి మా సంపాదనలో కొంత వెచ్చిస్తూ సార్థకం చేస్తున్నాం.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..

ఆ కవిత చదవగానే భోరున ఏడ్చింది..

ఆరడుగుల అందం..ఆకట్టుకునే కంచు కంఠం.. ఉరకలెత్తే భావుకత్వం.. మూర్తీభవించిన నటనా చాతుర్యం.. ఇవన్నీ కలిపితే నటుడు రంగనాథ్ అవుతారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాళ్లను అలరిస్తున్న ఆయనలోని బహుముఖ కోణాలను ఆవిష్కరించారు ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో వేమూరి రాధాకృష్ణ. ఎబీఎన్‌లో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ ‘నవ్య’ పాఠకుల కోసం..

ఆర్కే : రంగనాథ్‌గారు ఎలా ఉన్నారు? నటులకు రిటైర్‌మెంట్ లేదు కదా! వ్యక్తి జీవితం ఎలా ఉంది? వృత్తి జీవితం ఎలా ఉంది?
రంగనాథ్ : అసంతృప్తి అయితే లేదు. మనం ఆశించిన జీవితం కోసం ఎదురుచూడటం కన్నా, జీవితం ఎలా వస్తే అలా స్వీకరించడమే మంచిది అన్నది నా ఉద్దేశ్యం.
ఆర్కే: వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకుంటాం కదా? మీకు ఆ వయసులోనే అలాంటి భావన ఎలా కలిగింది?
రంగనాథ్ : మా తాతగారికి మా అమ్మ ఒక్కతే కూతురు. నేను పుట్టాక.. నన్ను ఇవ్వమని తాతగారు అడగడంతో వాళ్లింట్లోనే పెరగాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఆస్తిపాస్తుల మీద ఏనాడూ చర్చలు జరిగేవి కావు. చదువు, ఆటపాటలు తప్పిస్తే మరో టాపిక్ ఏదీ ఉండేది కాదు. మా తాతగారు మందసా మహారాజు ఎస్టేట్‌లో వైద్యుడుగా ఉండేవారు. ఆయనకు సంపాదన మీద ఆలోచనే ఉంటే అదీఇదీ చేసి.. అగ్రహారాలనే రాయించుకునేవారేమో! రాజుగారి గురించి వారు ఎప్పుడు చెప్పినా.. ఆయన గొప్పదనం గురించి చెప్పలేదు. వాళ్లు ప్రజలను ఎలా ఆదుకున్నారు, ఎలా సేవ చేస్తున్నారు అనేవే చెప్పేవారు. అవే ఆలోచనలు నాలో ఉండిపోయాయి.

ఆర్కే : మీరు సినిమా నటుడుగానే అందరికీ తెలుసు. మీలో కవి ఉన్నారని చాలామందికి తెలీదు? కేఆర్ విజయ నవ్వు మీద కూడా కవిత్వం రాశారట కదా?
రంగనాథ్ : ముప్పయి ఏళ్ల కిందట రాసిన కవిత అది..
“కలకండ తొట్టిలో/మంచి గంధం మట్టివేసి
నిండు పున్నమినాటి /వెండి వెన్నెల మొక్క నాటి
పుట్టతేనెల నీరుపోసి/వెన్నముద్దల ఎరువు వేసి
నవరత్నరాసుల ఎండలో/పన్నీటి జల్లుల వానలో
ఉంచి పెంచి పోషిస్తే/దానికి పూచే పువ్వు పేరేమి?
కేఆర్ విజయ నవ్వుకాక వేరేమి?” అని రాశాను.
ఆర్కే : ఆమె నవ్వుకు మీరంతగా పడిపోయారే?

రంగనాథ్ : ప్రపంచమే పడిపోయింది కదండీ. తమిళంలో ఆవిడ నవ్వుకే ‘మోహనపున్నగై’ అనే టైటిల్ పెట్టారు. ఆ కవితను తమిళంలోకి అనువదించి దానికొక ఫ్రేము కట్టించి మొన్న రెండు సంవత్సరాల కిందట కేఆర్ విజయకు ఇచ్చొచ్చాను. ఆ కవిత ముప్పయి ఏళ్లు నా దగ్గర ఉంది.
ఆర్కే : కవిత్వం రాయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది?
రంగనాథ్ : మాది సంగీత విద్వాంసుల కుటుంబం. బాల్యంలో చదువుకుంటున్న రోజుల్లో తెలుగుమాస్ట్టారు ఒక పద్యం చెప్పారు. బాగుందే అనిపించింది. ఇంటర్‌వెల్‌లో పిల్లలందరూ బయటికి వెళ్లారు. నేను వెళ్లలేదు. పెన్ను కాగితం తీసుకుని.. “అత్తగారి పెత్తనంబు నెత్తి మీద రుద్దుచుండ తత్తరిల్లి బిత్తరిల్లి చెంతనున్న కత్తినెత్తి నెత్తిమీద మొత్తజూచ కొత్తదైన కోడలమ్మి” అని రాశాను. ఇది నా వయసుకు సంబంధం లేని కవిత. మాస్టారుకు చూపిస్తే బావుంది అన్నారు. ఆ తర్వాత రాయలేదు. మళ్లీ రామ్మోహన్ అనే ఆయన రాసిన గేయాలను చదివి.. నేను కూడా కొన్ని రాశాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు మరికొన్ని కథలు రాశాను.

ఆర్కే : మీలో ఇంత భావుకత ఉంది కదా? యుక్తవయసులో ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు?
రంగనాథ్ : నాకు చిన్నప్పుడు ‘నందా’ అని ఫ్రెండు ఉండేవాడు. ఇప్పటికీ అతనే ఫ్రెండు. సంవత్సరానికి ఒకసారి మా ఇంటికొచ్చి కొన్నాళ్లుండి పోతుండేవాడు. మా భార్యాభర్తలిద్దరికీ ఏవైనా కంప్లయింట్స్ ఉంటే అతని చెప్పుకునేవాళ్లం. కొన్నాళ్లకు అతను ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోయాడు. ఇక ఎవరూ లేరే అని బాధ కలిగింది. ఆ సమయంలో ఎందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తిరుపతి నుంచి 156 ట్రైన్ వస్తుందని.. పట్టాల ముందు కూర్చున్నాను. అయితే ట్రైన్ రావడం లేటు అయ్యింది. చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్టు కావాలని కోరుకుంది అమ్మ. ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి? అనిపించింది. వెంటనే ఇంటికొచ్చేశాను.
ఆర్కే : సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా నిలదొక్కుకోవడం కష్టం కదా? మీరెలా నిలబడ్డారు?
రంగనాథ్ : నేను ఆర్థికంగా సున్నా. అయితే విద్వత్తు ఉంది. మా తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు.. అదే రాజుకు తాపీధర్మారావుగారు ట్యూటర్‌గా ఉండేవారు. వాళ్లు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిలది మా అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ మా అమ్మమ్మకు ఇద్దరు అన్నలు. వాళ్లు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. మా అమ్మ జానకి సింగర్. తబలాప్లేయర్. మా అమ్మమ్మ వీణలో గోల్డ్‌మెడలిస్టు. మా అమ్మ గాయని కావాలనుకునేది. అదే టైమ్‌లో ఎస్.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల అమ్మ కోరిక నెరవేరకపోవడంతో కొడుకునైన నేనైనా ఆర్టిస్టు కావాలనుకుంది.

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?
రంగనాథ్ : ఒక దశలో – సినిమా పిచ్చి పెట్టుకుని వెళుతూపోతే జీవితం ఏమైపోతుంది? అనుకున్నాను. నేను బీఏ ఇంగ్లీష్్ లిటరేచర్ చేశాను. రైల్వే సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి.. టికెట్ కలెక్టర్ అయ్యాను. అప్పుడు నా వయసు ఇరవై ఏళ్లు. రాజమండ్రిలోనే ఉండిపోయాను. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే పెళ్లి అయ్యింది. వెంటనే పిల్లలు పుట్టారు. ఎంఎస్ రెడ్డి గారు ‘కోడెనాగు’ అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన తీయబోయే సినిమాలో నటించేందుకు వెళ్లి.. ఆయన్ని కలిసినప్పుడు “అవును మా ‘కోడెనాగు’ సినిమాకు నటులు కావాలని ప్రకటిస్తే నువ్వెందుకు రాలేదు’ అని అన్నారు. ఏమీ చెప్పలేకపోయాను. రాజమండ్రికి చెందిన ఒక మిత్రుడు “ఎంఎస్‌రెడ్డి నాకు తెలుసు. నీ ఫోటోలు ఉంటే ఇవ్వు. నేను తీసుకెళ్లి ఇస్తాను” అన్నాడు. “మూడు ఫోటోలు కావాలాయ్యా. ఫోటో అయిదు చొప్పున మూడూ కలిపితే పదిహేను రూపాయలు అవుతాయి. ఆ పదిహేను పెడితే పిల్లకు పాలడబ్బా వస్తుంది” అని చెప్పాను.

ఆర్కే : మీ తొలిసినిమా ఎలా మొదలైంది?
రంగనాథ్ : ‘బుద్ధిమంతుడు’ నా ఫస్టు పిక్చరు. బాపు తీశారు. అందులో అవకాశం ఎలా వచ్చిందంటే – మా ‘వీణాపాణి’ బ్యానర్‌లో ఒకతను పనిచేసేవాడు. అతనికి ‘సుజనరంజని’ అనే సొంత ట్రూపు ఒకటుండేది. ‘టాటా వీడుకోలు’ పాట కోసం “మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్లను ఎందుకు తీసుకురావడం. స్థానికంగా ఉండే వాళ్లను తెచ్చుకుందాం” అనుకున్నారేమో సుజనరంజనికి కబురు చేశారు. స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లాను. షూటింగ్‌లో ఆర్కెస్ట్రా మీద షూట్ చేస్తున్నారు. నేను ఫ్లూట్ పెట్టుకుని నిలబడ్డాను. ఆ సినిమాలో నన్ను క్లోజప్‌లో చూపించారు. నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న ‘అందాలరాముడు’లో స్థలపురాణం ఉందని రాముడు వేషానికి పిలిచారు. అదే టైమ్‌లో గిరిబాబు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు. అప్పుడు నేను వెళ్లి రమణగారికి పరిస్థితి చెప్పాను. ఆ టైమ్‌లో హీరోగా మిస్ అయ్యాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేజారిపోయాయి. ‘ఇద్దరూ ఇద్దరే’లో కృష్ణంరాజు నటించి పైకొచ్చారు. ‘భారతంలో అమ్మాయి’లోనేమో మురళీమోహన్ హీరోగా చేసి క్లిక్ అయ్యారు.

ఆర్కే : మీ టైమ్ బాగలేదన్నమాట..?
రంగనాథ్ : ఒకసారి విఠలాచార్య గారు.. “ఏమిటి రంగనాథ్ మీకు పర్సనాలిటీ ఉంది, వాయిస్ ఉంది, బిహేవియర్ ఉంది, టాలెంట్ ఉంది.. ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావడం లేదు?” అనడిగారు. “నాకేం తెలుసు సార్?” అన్నాను. “మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి ?” అని అడిగారాయన. ఇచ్చాను. దాన్ని చూసి “ఇందులో ఉందండీ. మీరు హీరోగా కూడా ఉండరు. 1980లో శని ఎంటర్ అవుతోంది. కొడుతుంది మిమ్మల్ని దెబ్బ. పందొమ్మిదేళ్లు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత బుధ దశలో వచ్చినప్పుడు నిలబడతారు” అని చెప్పారు. ఆయన చెప్పడంతో అలర్ట్ అయ్యాను. ఎంత ఇమ్మీడియెట్ ఎఫెక్ట్ అంటే – నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లో పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది. ఆయన చెప్పినట్లే జరిగింది. అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది. నా సినిమాలు సక్సెస్ కాలేదు.

ఆర్కే : ఫ్యామిలీని ఎలా నెట్టుకొచ్చారు?
రంగనాథ్ : నాకు నలుగురు అన్నదమ్ములు. నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురుచూడలేను. అప్పుడు హీరో కృష్ణంరాజు గారి వద్దకు వెళ్లాను. “బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి. ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు నేనేం చేయాలి? విలన్ చేస్తే ఎలా ఉంటుంది? ” అడిగాను. “తప్పులేదు. ఏ టైమ్‌లో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేము. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది. నిజం చెప్పాలంటే హీరోలకంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు” అన్నారాయన. కృష్ణంరాజు ఒకసారి నాకు ఫోన్ చేసి “బెంగాలీ పిక్చరు ఒకటి కొన్నాను. తెలుగులో తీస్తున్నాను. ఇందులో నువ్వు విలన్ వేస్తే బావుంటుంది? నువ్వు ఒకసారి చూడు” అని సినిమాను చూపించారు. అందులోనే నేను విలన్‌గా చేశాను. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత – నలభై యాభై సినిమాల్లో విలన్‌గా చేసే అవకాశం వచ్చింది.
ఆర్కే: మీరొక దశలో అందర్నీ ఆకర్షించారు. అప్పుడు ఎలా ఫీలయ్యారు?
రంగనాథ్ : నేను ఇప్పటికీ హీరో అనే ఫీలవుతుంటాను. నాలోని హీరోనే నాతో ఈ వేషాలు వేయిస్తున్నాడు అనుకుంటాను. మొన్న ఎవరో అన్నారు ‘మీలో ఇంకా హీరో కనిపిస్తున్నాడు’ అని. అదెక్కడికి పోతుంది. అదే నాకు బేస్. నాలో ఆ హీరో ఉన్నాడు కాబట్టే ఇంకా పోరాడుతున్నాడు.

ఆర్కే: ఇండస్ట్రీలో మీకేమైనా ఇబ్బందులొచ్చాయా?
రంగనాథ్ : ఏ ఇబ్బందీ రాలేదు. అయితే రాజమౌళితో ఒక చిన్న తమాషా జరిగింది. ఇండస్ట్రీలో ఏదైనా గొడవ జరిగిందంటే అదే మొదటిది ఆఖరుది. ‘శాంతినివాసం’ సీరియల్ తీస్తున్నప్పుడు “సార్, దండం పెట్టినప్పుడు కళ్లు మూసుకున్నారు. కాస్త తెరవండి” అన్నారు రాజమౌళి. “కళ్లు తెరిస్తే కామెడీ వస్తుంది” అన్నాను నేను. “కామెడీనే కావాలి” అని ఆయన అన్నారు. అలా చిన్న విషయమే పెద్ద ఆర్గ్యుమెంటుకు వెళ్లిపోయింది. ఆయనకు కోపమొచ్చి “విల్ గో ఫర్ ద నెక్ట్స్ షాట్” అన్నారు. నాకూ కోపం వచ్చింది. “ప్యాకప్” అని లేచి ఇంటికి వెళ్లిపోయాను. అలా జరగడం నా లైఫ్‌లో అదే ఫస్ట్ టైమ్. ఆ తర్వాత మళ్లీ నేను, రాజమౌళి కలుసుకున్నప్పుడు “మీ వల్లే శాంతినివాసానికి అంత పేరొచ్చింది. రేపటి నుంచి ఇక రాలేనేమో! సినిమా తీసేందుకు దర్శకునిగా అవకాశం వచ్చింది” అన్నారు. “మీలో విషయం ఉంది. నేను ఒక నటుడిగా సంతృప్తి పొందిన సీరియల్‌కు మీ దర్శకత్వంలో చేశానన్న కృతజ్ఞత మీ మీద ఉంది” అని నేను చెప్పాను. “నువ్వు తప్పకుండా పైకొస్తావు. నిలబెట్టుకోవాలి” అని మళ్లీ అన్నాను.

ఆర్కే : వేషాల కోసం ఎవరిని అడిగారు?
రంగనాథ్ : ‘ఖైదీగారు’లో నటించిన తర్వాత ఏదో వేడుకకు రేపల్లెకు వెళ్లాల్సి వచ్చింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి రేపల్లెలో దిగేదాగా “ఖైదీగారు’ చూశాం.. మీరు ఏం యాక్టింగ్ చేశారు సార్. మీరప్పుడప్పుడు సినిమాల్లో కనబడాలి. మీరంత మంచి ఆర్టిస్టు కనిపించకపోతే ఎలా సార్” అనడం మొదలుపెట్టారు అభిమానులు. వాళ్ల కోరికలో నుంచి ఒక థియరీ వచ్చింది. నేను వ్యక్తి రంగనాథ్ అనుకున్నాను. కాని వాళ్లు ఆర్టిస్టు రంగనాథ్ అనుకుంటున్నారు. అంటే నాలో ఇద్దరం ఉన్నాం. మరి నేను నన్ను – వ్యక్తి రంగనాథ్‌గా అనుకుంటున్నాను కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్లి వేషం అడగటం లేదు. ఆర్టిస్టు రంగనాథ్ వెళ్లి అడగాలి కదా? ఎందుకంటే వాళ్లంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి రంగనాథ్ అనేవాడు ఆర్టిస్టు రంగనాథ్‌కు సెక్రెటరీ. వాణ్ణి ప్రమోట్ చేయడం వీడి పని అనుకున్నాను. అప్పుడే వెళ్లి ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డిలను వేషాలు ఇవ్వమని అడగాల్సి వచ్చింది. అడిగిన వెంటనే వాళ్లు ఇచ్చారు.

ఆర్కే : మీ వాళ్లు సెటిల్ అయ్యారా? మీ కుటుంబం ఆర్థికంగా ఎలా ఉంది?
రంగనాథ్ : అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు. మా ఆవిడ ఉన్నంత వరకు డబ్బు మిగల్లేదు. ఆవిడ పోయిన తర్వాత మిగలబెట్టే అవకాశం వచ్చింది. నాకొచ్చే డబ్బుతో దర్జాగానే బతుకుతున్నాను.
ఆర్కే : ఇవాళ రేపు అంత వ్యక్తిగతంగా, అంత ఎమోషనల్‌గా సేవ చేయడం అరుదు కదా?
రంగనాథ్ : ఆవిడ పడిపోయి నడుం విరిగిపోయింది. కాళ్లు చచ్చుపడిపోయాయి. పద్నాలుగేళ్లు మంచం మీదనే ఉండిపోయింది. చాలామంది ఆమెకు నేను ప్రేమతో సేవ చేశాను అంటుంటారు. కానీ బాధ్యతతో చేశాను అంటాను నేను. మా ఆవిడ కూడా “నా మీద ప్రేమ లేకుండా ఇంత సేవ ఎలా చేస్తారు?” అంటుండేది. నా ఉద్దేశ్యంలో ప్రేమ కంటే బాధ్యత గొప్పది.

ఆర్కే : మీ పిల్లలు ఏం చేస్తున్నారు?
రంగనాథ్ : పెద్దమ్మాయి ఇక్కడే ఉంది. మా భార్య సోదరుని కొడుక్కు ఇచ్చాం. అల్లుడు ఫార్మా కంపెనీలో ఏరియా మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అమ్మాయి బెంగళూరులో లెక్చరర్. భర్త ఏరోనాటిక్స్ ఉద్యోగి. మా అబ్బాయి దుబాయ్‌లో ఉన్నాడు. అందరూ స్థిరపడ్డారు.
ఆర్కే : మళ్లీ కవిత్వం దగ్గరికి వద్దాం. మీరు రాసిన వాటిలో మీకేది బాగా నచ్చింది?
రంగనాథ్ : చాలానే ఉన్నాయి. ‘అందమైన అమ్మ’ అనే కవిత ఒకటి రాశాను. అది రాజశ్రీకి బాగా నచ్చింది. ఒకతను అనువదించి పంపితే హిందీపత్రికలో వేసుకున్నారు. ఒకసారి – తిరుపతిరెడ్డి (వేట, ఖైదీ ప్రొడ్యూసర్)తో కలిసి కాళహస్తికి వెళ్లాను. ఆయన ఫ్రెండు ఒక డాక్టర్. వాళ్లింటికి నన్ను తీసుకెళ్లాడు. ఆ ఫ్రెండు భార్య నాకు అభిమాని. “మీ కవితలు అవీ చదువుతుంటానండీ. మీరు ఎదురుగా వచ్చారు. మీ నోటితో ఒకటి చదవండి” అని అడిగింది. చదివాను.

“అప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు /అమ్మానాన్న మాటలన్నీ విన్నాను
ముద్దొచ్చే నుదిటి కుంకుమ తానవ్వాలని/పట్టుకుచ్చులాంటి జెడపై పూలదండ కావాలని /ఆదరించే అమ్మ చేతుల్ని గాజులై బంధించాలని/తెగ పొగిడేవాడు నాన్న/అబ్బా.. అమ్మ అంత అందమైనదా అని/అంత అందమైన అమ్మను
నేనెప్పుడు చూడటమాని ఆరాటపడ్డాను/ఇప్పుడు నేను పుట్టాను
అమ్మను చూశాను/నిజమే! అమ్మ అందమైనదే!
కానీ, నుదిటి కుంకుమ /జడలో పూదండ /చేతులకు గాజులు
అన్నీ అబద్ధాలు/నాన్న పోయాడట/అవన్నీ తనకిష్టమని పట్టుకుపోయాడట”
అని కవిత చదివేసరికి ఆమె భోరున ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. ఆవిడకు ఎవరో గుర్తుకొచ్చారు.
ఆర్కే : ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా?
రంగనాథ్ : ఇప్పుడు ఒక పుస్తకం సిద్ధంగా ఉంది. త్వరలో వస్తుంది. దాని పేరు ‘అక్షరసాక్ష్యం’. ఆధ్యాత్మిక కోణంలో రాశాను.
ఒకసారి ఎన్.గోపీ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆయన భార్య ఒక నాని (రెండు మూడు లైన్ల కవిత్వం) వినిపించారు. అద్భుతం అనిపించింది. అది “వివాహమా ఎంత పని చేశావ్? పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్”. ఆ తర్వాత నేను కూడా కొన్ని నానీలను రాశాను.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యార్ల గడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ యాత్రానుభావాలు -మరియు ఆనాటి గయ్యాళి పాత్ర దారి,

seshamamba 001 travelogue1 001 travelogue2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశావతారాలలో

2dashavataralu 001 3dasavataralu 001 dashavataralu -1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోదరి నివేదిత -శ్రీ రామ కృష్ణ ప్రభ

nivedita 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విదేశాల్లో హారర్ సాహిత్యం

విదేశాల్లో హారర్ సాహిత్యం

1764లో హోరేస్ వాల్ పోల్ రాసిన’’ ది కాజిల్ ఆఫ్ ఆర్ త్రాంటో’’మొదటి గోతిక్ నవల గా వచ్చింది .1787లో ‘’విలియం బ్లాక్ ఫోర్డ్ ‘’రాసిన ‘’ వాతెక్’’విడుదల అయింది . ‘’ది మిస్టరీస్ ఆఫ్ ఉడాల్ ఫో ‘’హారర్ నవలను ‘’అన్నే రాడ్ క్లిఫ్ ‘’1794లో రాసి ప్రచురించాడు .1796 లో’’ ది మాంక్ ‘’ పేరిట ఏం. జి .లీవీస్ రాశాడు .తర్వాత సి.బి . బ్రౌన్ రాసిన ‘’వీ లాండ్ ‘’విడుదలైంది .1818లో ప్రఖ్యాత కవి షెల్లీ భార్య ‘’మేరీ షెల్లీ ‘’’’ఫ్రాన్కేం స్టీన్ ‘’నవల వచ్చింది .

‘’మొదటి  ఇంగ్లీష్ వాం పైరీ కద ‘’గా పేరు పొందిన జే.పోల్దారిస్ రాసిన ‘’ది వాం పైరీ ‘’1819లో వచ్చింది .ప్రఖ్యాత కవి కధకుడు నవలా రచయిత విమర్శకుడు డిటెక్టివ్ నవలా రచయిత ,అయిన ‘’ఎడ్గార్ అల్లెన్ పో’’ 1840 లో రాసిన ‘’టేల్స్ ఆఫ్ గ్రోటోస్కి అండ్ అరెబిస్కి  ‘’ హారర్ నవల విడుదలై సంచలం సృష్టించింది. ఫిమేల్ వామ్పైర్  ‘’గా పేరొందిన జే.ఎస్.లఫాన్  1872లో రాసిన ‘’కార్ మిల్లా ‘’మంచి పేరు పొందింది .ఆ తర్వాత ‘’డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ ‘’అనే అద్భుత నవలను ‘’రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ‘’1880 లో రాసి ఒక చరిత్ర నే సృష్టించాడు .మనిషి లోని ద్వంద్వ ప్రవృత్తికి ఈ నవల అద్దంపట్టింది .మనిషి లోని ‘’అపరిచితుడు ‘’బయటి కొచ్చి భీభత్సం  సృష్టించాడు .ఇందులో ‘’స్ప్లిట్ పర్సనాలిటి’’అని మనం ఈ రోజున పిలిచే ఆ ప్రవృత్తిని ఆ నాడే స్టీవెన్సన్ సృష్టించాడు .దీన్ని సినిమా గా కూడా తీసి ప్రచారం చేశారు .

Dracula  The Exorcist

‘’బ్రాం స్తోకర్స్ ‘’1897రాసి ప్రచురించిన ‘’ది డ్రాక్యులా ‘’అంతకు ముందెప్పుడూ రాని హారర్ నవలగా ప్రసిద్ధ మైంది. ఇదీ సినిమా1821లో  అయింది. సీరియల్ గా అనేక డ్రాక్యులాలు వచ్చాయి కూడా ..చదివితేనే ఒళ్ళు గగుర్పోడిస్తే సినిమా చూస్తె గుండె ఆగి పోయినంత పనే అవుతుంది. భీభత్స భయానక నవల గా చిత్రం గా డ్రాక్యులా పేరొందింది . ఆ తర్వాత’’ రాబర్ట్ బ్లాచ్’’ రాసిన ‘’సైకో ‘’నవల 1959 లో వచ్చి పిచ్చ క్రేజ్ ను పెంచింది .వెంట్రుకలను నిక్క బోడుచుకోనేట్లు చేసింది .భయ పడి పారి పోయేట్లు చేసింది .అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ‘’ది ఎక్సార్సిస్ట్’’హారర్ నవలను ‘’విలియం పీటర్ బ్లాట్టీ ‘’రాసి సంచలనానలకే సంచలనం సృష్టించాడు .1974లో స్టీఫెన్ కింగ్ రచించిన ‘’కారీ ‘’విడుదలై హారర్ ను ఆగకుండా కారీ చేసింది .

Product DetailsProduct DetailsProduct DetailsProduct Details

Product DetailsProduct DetailsProduct Details

‘’అన్నే రైస్’’ రాసిన ‘’ఇంటర్ వ్యూ విత్ వామ్పైరి ‘’తరువాత వచ్చిన నవల .1978 లో ‘’స్టీఫెన్ కింగ్ ‘’’’ది  షై నింగ్ నవల రాసి హారర్ సాహిత్యానికి షైనింగ్ పెట్టాడు .1987లో ‘’ది.సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ ‘’హారర్ నవలను ‘’థామస్ హీరీస్ ‘’రాశాడు .ఆయనే మళ్ళీ 1999లో ‘’హాని బాల్ ‘’నవల రాసి మరోతీవ్ర సంచలమే కలిగించాడు .

ఇంతకీ హారర్ కు ఆధారం ఏమిటో తెలుసా ?’’By the same particular form of content the emotion is produced and that is called fear –is the basis for horror ‘’ అని చెప్పారు .

16-10-2002 బుధ వారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-3-14- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత)

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ –12(‘’దాదా ‘పాలన ప్రకటన తర్వాత)

1-తల్లి ఉసురు తీసి తెలంగాణా బిడ్డకు జన్మ

 అన్న మోడీ మాట వినకుంటే తప్పదు మన ఖర్మ .

2-‘’దేశం ‘’లోకి  ‘’బుద్ధుడు ,సారధి’’ మిగిలిన నిరాశా జనం దూకుతారట

  బుద్ధుడు ‘’వాకే’’ సారధి’’ నాట్ ఒకే’’  బలుపు కాక వాపు అవుతుందేమో ఈ గెంతులాట.

3- వలసదారుల వల్ల తెలుగు దేశం అవు తుంది ‘’మరో కాంగ్రెస్ ‘’

    హెచ్చరించిన ‘’కోడెల ‘’మాట వినకుంటే అవుతుంది  టి.డి.పి.బెలూన్’’ తుస్’’.

4-వంట గాసుకు  నిన్నటిదాకా మొండికేసి ముడి పెట్టి ‘’ఆధార్ ‘’

  చేతులు కాలి ,బుద్ధి తెచ్చుకొని  చేశారిప్పుడు ‘’నిరాదార్ ‘’ .

5-నిలువెత్తు సాహిత్య శిఖరం స్వర్గీయ జాను మద్ది హనుమచ్చాస్త్రి

  బ్రౌన్ కు సాహిత్య గుడి కట్టిన ‘’బ్రౌన్ శాస్త్రి’’  అందరి వాడై  అయ్యారు ‘’జాన్ అహ్మద్ శాస్త్రి ‘’.

6-‘’తెలంగాణా రావటం నాకూ సంబరం లేదు’’ అన్నసాంఘిక  మేధావి  ఐలయ్య కంచే

   అక్కడ చైతన్యం ,సంస్కరణ సమైక్యాంధ్ర వల్లనే సాధ్యమయిందని చిత్రించింది  ఆయన ‘’కలం కుంచె’’.

7- గవర్నర్ ‘’నరసింహం ‘’వీరాంగానికి ,ఇన్నేళ్ళుగా  గా ఎదురు చూసిన దానికి  తెర లేచింది

 ‘’శబ్ద సభను’’   సుప్త చేతనం లో ఉంచి  ‘’శవ చేతనం’’ కాకుండా,బూడిద లో నుంచి లేచే ‘’ఫీనిక్స్’’ లా చెయ్యాలని         తెర దించింది .

8-‘’మోడీ యే మొగాడు’’ అని కితాబిచ్చిన కళ్ళ జోడు ‘’కరుణా నిధి’’

  ‘’జంపింగ్ ఫ్రాగ్’’ అవబోతున్నాడా అవినీతి ‘’కనిమొలి ‘’తండ్రి హత విధీ! .    

9-లోక సభకు పోటీ చేస్తానన్న మహాశయుడు ఆద్వాణి

  పెద్ద ముత్తైదు లా మళ్ళీ కుచ్చేళ్ళూ చీరా సవరించి చేయబోతున్నాడా బోణి ?

10-సూత్రధారి ,వ్యాపారీ సంపన్నుడు ,సుబ్రతా రాయ్ చేస్తాడా స్వంత  సంస్థ  ‘’సహారా ‘’

  చిక్కడూ దొరకడూ లా దోబూచులాడి జైలు పాలై  ఏమీ లేని  ‘’ఎడారి సహారా ‘’?

11-‘’లగడ పాటి ‘’ ఆవేశం లో  కాడీ మేడీ పారేసి చేశాడు ‘’ అస్త్ర సన్యాసం ‘’

  అనుచరులకు నచ్చక, దీక్ష చేసి చేయిం చేట్లున్నారు మళ్ళీ  ‘’అస్త్ర విన్యాసం ‘’.

12-‘’ అందర్నీ పిలిచి హైదరా బాద్ లో అందరి మాటలూ విన్న’’ దాదా ‘’

    పెద్దమనిషివని నమ్మిన  ఆశలన్నీ ‘’తూ నా  బొడ్డూ ‘’ అని నిరాశ పరచావేం’’ ప్రణ(వ) య దాదా ‘’? .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-3-14-ఉయ్యూరు

 

.

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

‘సొన’ సొంపులు మాయం! (ఆవరణం)- వెన్నెలకంటి రామారావు

 

భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత స్వచ్ఛమైన నీటితో కూడిన పురాతన ఇసుక తిన్నెలు (ఏన్షియంట్ డ్యూన్స్) ప్రకృతి అతిశయంగా అవతరించాయి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా, చిల్లకూరు మండలంలోని అద్దేపల్లి, బల్లవోలు, చింతవరం, వేళ్ల పాలెం, ఏరూరు రెవెన్యూ గ్రామాలు, కోట మండలంలోని కర్లపూడి, కొత్తపట్నం, సిద్ధవరం రెవెన్యూ గ్రామాల పరిధిలో ఇలాంటి తిన్నెలు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతం తీరానికి రెండు కిలోమీటర్ల దూరం ఇవతలి నుంచి 17 కిలోమీటర్ల పొడవు, 2.5 కిలోమీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతుతో అర్ధ చంద్రాకారంగా ఈ పురాతన ఇసుక తిన్నెలు వ్యాపించాయి. ఈ తిన్నెల మ«ధ్య పడమటి దిశగా ప్రవహిస్తున్న, సహజ సిద్ధంగా ఏర్పడిన ఊట నీటి ప్రవాహాలను సొన కాలువ లు (స్ప్రింగ్ ఛానెల్స్) అని స్థానికంగా పిలుస్తారు.

‘సొన’ నీట వనరుల ఆ«ధారంగా వ్యవసాయ సంస్కృతి నెలకొంది. తీరంలో నేర్పుతో కట్టిన పిచ్చుక గూళ్ళులా ఉన్న ఆ గ్రామాలు. చూడగానే ఎడారి శాపంలా ఎటు చూసినా ఇసుకతో పెనవేసుకున్న పల్లె జీవనం. ఇసుక కుదుళ్ళలోకి వేళ్ళూనుకున్న గ్రామసీమలు. ఇళ్ళనానుకుని పరుచుకున్న పచ్చని పొలాలు. అక్కడక్కడా దిబ్బలపై ఏపుగా పెరిగిన పచ్చగడ్డితో మైళ్ళకొద్దీ విస్తరించిన ఇసుక తిన్నెలు. మినరల్ వాటర్ కంటే స్వచ్ఛమైన ఊటనీటి కాలువలపై ఆధారపడి శతాబ్దాలుగా గ్రామాలు విలసిల్లాయి. తాటి తోపులు, పశువుల మందలు, పాడి పంటలతో నేల నాగకరికతల అతిశయోన్నతమైన సమతుల్యత. ప్రకృతి-సంస్కృతి (రెండవ ప్రకృతి) మధ్య అపురూప సమ్మేళనం. ప్రకృతి వనరులను మానవీకరించిన అద్భుతంలా సాగే పల్లెసీమలు. నోరూరించే మంచి నీళ్ళున్నా, రాక్షసంగా పరచుకున్న ఇసుక వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించిన ప్రాంతమది. మానవ సమష్టి-సహకార కార్యకలాపంతో సొన కాలువ సాగువిధానం (స్ప్రింగ్ ఛానెల్ కల్టివేషన్) ఆవిర్భవించింది. ఒక వ్యవసాయ సాంస్కృతిక అద్భుతం ఆవిష్కృతమైంది. అలాంటి ప్రాంతంపై నేడు సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) రూపంలో ‘అభివృద్ధి’ నీలినీడలు కమ్ముకున్నాయి.

సాధారణంగా సారవంతమైన నేలలున్నప్పటికీ సాగునీళ్ళ కోసం పోరాడవలసిన పరిస్థితి. అయితే ఈ సొన కాలువల ప్రాంతం అందుకు పూర్తిగా విరుద్ధం. నీళ్ళున్నాయే గానీ వ్యవసాయానికి అనివార్యమైన సారవంతమైన మట్టి లేదు. నిస్సారమైన ఇసుక మనిషికి సవాలు విసిరింది. దాంతో జీవనం కోసం మట్టిని తరలించవలసిన విచిత్రం. సుదూర ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి, సొనలు చుట్టూ పరచుకొని ఉన్న ఇసుక పర్రలను సాగుయోగ్యమైన భూములుగా ప్రజలు మలచుకున్నారు. ఈ తిన్నెల వద్ద వాటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వర్షంపడినా తిన్నెలలోని నీటి ఊటల నుంచి ఏడాది పొడవునా మంచి నీటి ప్రవాహాలు ఏర్పడుతాయి. నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో మాత్రమే వర్షం పడినా ఏడాది పొడుగునా సొన కాలువల్లో నీటి ప్రవాహాలు ఉంటాయి. ఇక్కడ 35కు పైగా చిన్నా పెద్దా సొన కాలువలున్నాయి. కాలువకు కాలువకు మధ్యన సగటున రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. నీటి ఊటల నుంచి వచ్చే మంచినీటి ప్రవాహాల్ని చెరువులలోకి సమీకరించి, సాగుకు వినియోగిస్తారు. నీరు పుష్కలంగా లభించడంతో ప్రధానంగా వరి పండిస్తారు. దాంతోపాటు వేరుసెనగ, సవక, జీడిమామిడి, పుచ్చ, నువ్వు పంటలు పండిస్తారు. పన్నెండు వేల కుటుంబాలకు పైగా ఈ సొన కాలువల ఆధారంగా వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు విక్టోరియా స్ట్రీట్స్, ట్రింప్, గ్యాప్, అడిడాస్, నైక్, స్పీడో, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటివి భాగస్వాములుగా ఉన్న ‘మాస్ అప్పారల్ హోల్డింగ్స్ లిమిటెడ్’ (మాస్) అనే సంస్థ ‘టెక్స్‌టైల్స్, అప్పారెల్ పార్క్’ను ఈ సెజ్‌లో ఏర్పాటు చేయబోతోంది. ఈ సంస్థ ద్వారా 30వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 45వేల మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తామన్న హామీతో దీన్ని నెలకొల్పుతున్నారు. ఈ సొన కాలువలకు అత్యంత సమీపంలో దుగరాజపట్నం వద్ద నిర్మించబోతున్న భారీ రేవుపట్నంలో సాగే కార్యకలాపాలు అనేక కాలుష్యాలను వెదజల్లుతుంది. ప్రభుత్వం, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సం స్థలు, రాజకీయ పార్టీలు కుమ్మకై అభివృద్ధి, ఉపాధి పేరుతో సరైన ప్రమాణాలను పాటించ క పోవడమే కాకుండా, వంచించి స్థానిక ప్రజల జీవనాన్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయి.

ఇక్కడి ఇసుకలో పారిశ్రామిక అవసరాలకు పనికి వచ్చే పలు రకాల ఖనిజాలుండడంతో అక్రమ మైనింగ్ కార్యక్రమాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఏడాదికి 6.8 లక్షల టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఇసుక అక్రమ మైనింగ్, సెజ్‌ల కారణంగా ఈ ఇసుక తిన్నెల్లోని సొన కాలువలు అంతరించి పోతున్నాయి. పర్యావరణ విధ్వంసం వల్ల సేద్యం దెబ్బతినడమే కాకుండా, సెజ్‌ల కోసం ఆ గ్రామాల్లో సాగిన అక్రమ భూసేకరణతో ప్రజలు బతుకుదెరువు కోల్పోయి అల్లాడుతున్నారు. చిత్తడి నేలలతో సమానంగా భారీ మంచినీటి కేంద్రాలుగా ఉన్న ఇసుక తిన్నెలను కూడా పరిగణించాలి. సోంపేట మండలంలోని బీల భూముల్లో (చిత్తడి నేలలు) ప్రభుత్వం నెలకొల్పబోతున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణవేత్తల ఉద్యమ ఫలితంగా థర్మల్ స్టేషన్ నిర్మాణం ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వం ఆ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు కేటాయించిన భూమిని కూడా వాపసు తీసుకునే ట్టు చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. సోంపేట నేపథ్యంలో సొన వ్యవసాయం, పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా ఉన్న చింతవరం సెజ్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించేలా ప్రజలు ఉద్యమించాలి.
n వెన్నెలకంటి రామారావు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ

 

కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్‌గా, ఆ తర్వాత ఇంగ్లీషు ఆచార్యులుగా 1984 వరకు ప్రభుత్వ సేవలందించారు.

గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది వారిని తెలుగు సేవకుణ్ణి చేసింంది. వయోజన విద్యా వ్యాప్తి కోసం గాడిచర్ల ఆనాటి బళ్ళారి జిల్లా ‘కుడ్‌లిగి’ ప్రాంతంలో పర్యటించారు. అయితే గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను కన్నడ భాషలో బళ్ళారి జిల్లావాసులకు అనువా దం చేసే వ్యక్తి అవసరమైంది. ఆ కాలంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి బళ్ళారి జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఆ జిల్లా డీఈవో జానమద్ది పేరును సూచించారు. జానమద్ది వెంటనే సమ్మతించి గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను చక్కగా కన్నడంలో, ఆయన వెంట రేయింబవళ్ళు తిరిగి మూడు వారాల పాటు చేశారు. సరిగ్గా అప్పుడే జానమద్ది గాడిచర్లతో స్ఫూర్తిపొందారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం, గాడిచర్ల సాయంతో జానమద్ది తెలు గు సీమకు, తర్వాత కవుల గడప కడపకు బదిలీ మీద వచ్చారు. జీవితకాల భాషాసేవ చేశారు. జాతీయ అభిమానం, రాష్ట్రాభిమానం, ప్రాంతీయ అభిమానం, మూడూ మేళవించిన సాహిత్య వ్యకిత్త్వం జానమద్దిది.
సీపీ బ్రౌన్ కోసం చేసిన దశాబ్దాల కృషి శాస్త్రిని అందరూ ‘బ్రౌన్ శాస్త్రి’ అని పిలిచేటట్లు చేసింది.

కడప పట్టణం యర్రముక్కపల్లి ప్రాంతంలో ఒకనాడు బ్రౌన్ మహాశయుడు నివసించేవారు. బ్రౌన్ తోట, బ్రౌన్ కాలేజ్ అక్కడ వుండేవి. ఆ బ్రౌన్ కాలేజీలో బ్రౌన్ 12 మంది పండితులను ఏర్పాటుచేసి తన జీతంలోంచి ఆ పండితులకు నెలజీతాలిచ్చి, తెలుగు కావ్యాలను ఉద్ధరింపజేశారు. కానీ కాలగర్భంలో ఆ బ్రౌన్ కాలేజీ మొండిగోడల శిధిల ఆలయంగా మారింది. ఆ చారిత్రక స్థలాన్ని మహాపరిశోధకుడు ఆరుద్ర దర్శించారు. అక్కడ బ్రౌన్‌కు స్మారకంగా ఏదైనా కట్టడం నిర్మించమని జానమద్దిని ఆరుద్ర కోరారు.దీనితో శాస్త్రి ఆ స్థలం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకున్నారు. ఆడిటర్ సంపత్‌కుమార్ ఆ స్థలం యజమానిగా ఉన్నారని గ్రహించారు. వెంటనే ఆయన్ను కలిసి తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఆయన సంతోషంగా బ్రౌన్ స్మారక భవన నిర్మాణం కోసం ఆ 20 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలంలో బ్రౌన్ లైబ్రరీ నిర్మాణానికి హనుమచ్ఛాస్త్రి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరికి 1995 నాటికి బ్రౌన్ లైబ్రరీ భవనం నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.

సరిగ్గా అప్పుడే స్వాతంత్య్ర సమరయోధులు, గాంధేయ వాది వావిలాల గోపాలకృష్ణయ్య అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడైతే వావిలాల గోపాలకృష్ణయ్యను జానమద్ది చూశారో వెంటనే చంద్రబాబుకు పరిచయం చేశారు. అంత గొప్ప మహానుభావుడు ఉన్నపళంగా అక్కడ కనిపించడంతో చంద్రబాబు తన చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని వావివాలతో చేయించడం విశేషం.
ముఖ్యమంత్రిగా వైఎస్ ఒక పర్యాయం జానమద్ది ఆహ్వానంమీద బ్రౌన్ లైబ్రరీని సందర్శించారు. అపుడు రాజశేఖర్ రెడ్డి జానమద్దితో ‘బ్రౌన్ లైబ్రరీ కోసం నన్ను ఏం చేయమంటారు?’ అని ప్రశ్నించారు. వెంటనే జానమద్ది ‘ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏటా ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఇప్పించ’మని కోరారు. తరువాత జానమద్ది, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి బ్రౌన్ లైబ్రరీ నివేదిక సిద్ధం చేసి ఇచ్చారు. వెంటనే రాజశేఖర రెడ్డి ఏటా రూ.30లక్షలు గ్రాంట్ వచ్చేలా చేశారు. దీంతో బ్రౌన్ లైబ్రరీకి జవజీవాలు సమకూరాయి. ఇపుడు జానమద్ది కృషి కారణంగా బ్రౌన్ లైబ్రరీలో దాదాపు లక్ష గ్రంథాలు, 300 వరకు తాళపత్ర గ్రంథాలు, తెలుగు గ్రామాల స్థానిక చరిత్ర తెలిపే మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ లేఖలు, రాతప్రతులు సమకూరాయి. 2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.15 గంటలకు కడపలో ఆయన చివరిశ్వాస తీసుకున్నారు. జానమద్ది ప్రాణదీపంఆరిపోయింది. కానీ కడపలో బ్రౌన్ పేరిట నిర్మించిన గ్రంథాలయ దీపం -మొత్త ం తెలుగు జాతికి వెలుగుదీపం- వెలుగుతూనే ఉంది… ఉంటుంది.
శశిశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య

 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు సంబురాలు చేసుకుంటుంటే, సీమాంధ్ర ప్రాం తాల్లో పై వర్గాల్లో విషాదం కనిపిస్తుంది. నేను తెలంగాణ వాణ్ణి. చిన్నప్పటినాటి చదువురీత్యా తెలుగు వాణ్ణి, భారతీయుడిని. ఈ ప్రక్రియ అంతటితో నాకు సంబురపడాలనే తపన కలుగలేదు. కొంతమంది అంటున్నట్లు తెలుగు ప్రజలు విడిపోయినందుకు కాదు. నేను తెలుగువాదిని కాదు, ఆంగ్ల భాషా అభివృద్ధి వాదిని.
రాష్ట్రాలు విడిపోవడం, రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఇరు పక్కల సృష్టించడానికి నేను వ్యతిరేకం. శారీరక పోరాటాల కంటే రెండు ప్రాంతాల మధ్య ఒక మానసిక పోరాటం జరగడం, ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతిని, ప్రజల మధ్య ద్వేషాలు పెరుగడం… ఈ క్రమంలో జరిగిన పెద్ద నష్టం. నష్టాన్ని పూడ్చడానికి మానవత్వం కీలకమౌతుంది.

ఇరుపక్షాల్లో ఇది ప్రజలందరి పోరాటం అని చెప్పినప్పటికీ రెండు ప్రాంతాల ఆధిపత్య వర్గాలు, కులాలు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఒక ప్రాంతపు ఫ్యూఢల్ శక్తులు, మరో ప్రాంతపు పెట్టుబడి ఆధిపత్య శక్తులు గత మూడేళ్లుగా బాహాబాహీకి దిగాయి. ఈ నరాల యుద్ధం టీవీల్లో జరిగింది. అది అన్ని ప్రాంతాల శ్రమ జీవుల్ని, ముఖ్యంగా దళితుల్ని, ఆదివాసుల్ని, వెనుకబడిన తరగతుల వారిని గందరగోళపర్చింది. చివరికి బిల్లు రెండుసభల్లో అదే మానసిక యుద్ధ వాతావరణంలో పాసవ్వడంతో పరిస్థితి భీకర మానసిక ఉప్పెన ఆగిపోయి ఒక పక్క కొంత సంబురాలు, మరోపక్క కొంత ఓటమి ఓదార్పుల్లో ప్రజలున్నారు. ఈ స్థితిలో 1956 నుంచి 2014 నాటి ఈ ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు లాభనష్టాలు మరో కోణం నుంచి అంచనా వేయాలి.

1956 ముందు తెలంగాణ గ్రామాల్లో పాఠశాలలు లేవు. ఇక్కడి భూస్వామ్య శక్తులు సైతం ఆధునిక విద్య లేక బడులే బందీఖానాలనే స్థితిలో ఉన్నారు. సీమాంధ్ర ప్రాం తంలో బ్రిటిష్ వలసవాదం, క్రిస్టియన్ మిషనరీలు విద్యను ఆదర్శవంతమైందిగా, ఆంగ్ల విద్యను అవకాశాల పట్టుకొమ్మగా ప్రచారం చేశారు. ఆ విలువలు గ్రామ స్థాయి వరకు పాకివున్నాయి. ఆనాడు రాష్ట్రం సమైక్యతను సంతరించుకోకపోతే తెలంగాణలోని భూస్వామ్య పాలక వర్గాలు దాని అభివృద్ధిని ఆకాంక్షించే వారే కాదు. రాజకీయ పాలకులే కాక అటునుంచి హైదరాబాదుకొచ్చిన బ్యూరాక్రటిక్ శక్తులు విద్యాకాంక్ష కొంత ప్రయోజనం ఒనగూర్చింది.

సమైక్యరాష్ట్ర అభివృద్ధి క్రమంలో కమ్మ మైగ్రెంట్స్ (ఎక్కువగా క్రైస్తవ మైగ్రెంట్స్) ఈ ప్రాంతం వచ్చి సెటిల్ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వీరి ప్రభావం వ్యవసాయం ఆధునికత మీద, అంటరానితనాన్ని తగ్గించడంలో విద్యా వ్యాప్తిని పెంచడంలో చాలా వుంది. ఇక్కడి కరుడుకట్టిన రెడ్డి, వెలమ భూస్వామ్య సంస్కృతికి, క్రైస్తవ కమ్మల సంస్కృతికి చాలా తేడా ఉం డేది, ఉన్నది. ఉదాహరణకు చెన్నరావుపేట మండలంలోని తిమ్మారావు గ్రామసంస్కృతి పరిశీలిస్తే ఈనాటికీ తేడాతెలుస్తుంది. ఆ గ్రామ ప్రభావం మొత్తం తాలూకా మీద పడిందంటే అతిశయోక్తికాదు. ఇన్ని పోరాటాలు, ఒడిదుడుకుల మధ్య కూడా విద్యారంగం తెలంగాణలో ఈ స్థాయికైనా ఎదిగిందంటే సమైక్యత ఫలితమని చెప్పక తప్పదు.

విద్యారంగం, ఆధునిక వ్యవసాయం, పట్టణ సంస్కృతి, తిండి, బట్ట వంటి వాటిలో ముందంజలో ఉన్న వారి ప్రభావం వెనుకబడిన వారిమీద పడుతుంది. తెలంగాణ భూస్వాములకు విద్యలో పోటీపడాలనే ఆలోచన సమైక్యతలో వచ్చిందే. అయితే ఇక్కడి భూస్వామ్య వర్గంలో ఈనాటికీ సాంఘిక సంస్కరణ లేదు. అందుకే వీళ్ళు ‘తెలంగాణ పునర్నిర్మాణ’మంటే ఇక్కడి నుంచి విద్యారంగాన్ని, జీవన విధానాన్ని, ఆంగ్లేయ విద్యను మళ్ళీ వెనక్కి తీసుకుపోవడమా అనే అనుమానం నాకైతే ఉన్నది.

గత నాలుగేళ్ళు తెలంగాణలోని మూడు అగ్ర కులాలు సంపూర్ణ ఐక్యతను సాధించాయి. ఇక్కడి భూస్వామ్య వర్గానికి ఒక రాజకీయపార్టీ వచ్చింది. సంఘ సంస్కరణతో ముడివడని ఏ రాజకీయ ఉద్యమమైనా అగ్రకుల ఆధిపత్యాన్నే పెంచుతుంది.
రాజకీయ రంగంలో సమైక్యత వలనే జరిగిన కొన్ని కీలక మార్పులున్నాయి. అందులో ముఖ్యమైనవి పటేల్, పట్వారీల రద్దు. అవి రద్దు చేసిన రోజుల్లో ఎన్.టి.రామారావు పాలన మీద ఇక్కడి రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు ఎంత కోపంగా ఉన్నారో మనకు తెలుసు. దీనికి తోడు తాలూకాలను రద్దుచేసి మండలాలను ఏర్పర్చడం. ఇది కూడా ఇక్కడి భూస్వామ్య ఆధిపత్యం మీద పెద్దదెబ్బ తీసింది. ఈ వ్యవస్థ ఎన్నికల రంగంలోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఈ వ్యవస్థను పునర్నిర్మాణం పేరుతో ముందుకు తీసుకెళ్తారో, వెనక్కి తీసుకెళ్తారో తెలియదు. తెలంగాణలో ఇప్పుడు మాత్రం భూస్వాములను ప్రశ్నించే చైతన్యం జీరోస్థాయికి చేరుకొని వున్నది. ఇది టీఆర్ఎస్ ఘనత. తెలంగాణ భూస్వాములు ఆ పార్టీకి చాలాకాలం విధేయులుగా ఉంటారు. అది కాంగ్రెస్‌లో విలీనమైనా ఆ శక్తులదే పైచేయి.

దళిత బహుజన చైతన్యం 1985లో కారంచేడు సంఘటన తరువాత ఒకరూపం దిద్దుకుని తెలంగాణజిల్లాల్లోకి పాకింది కూడా ఆంధ్ర జిల్లాల్లో పుట్టిపెరిగిన అంబేద్కరిజం వల్లనే. నాలాటి వాళ్ళకెంతో మందికి బొజ్జా తారకం, కత్తి పద్మారావు, జెబీ రాజు వంటివారి నుంచి అంబేద్కరిజంపై పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది సమైక్య రాష్ట్రమై ఉండకపోతే ఆ బంధమేర్పడేది కాదు. ఆ తరువాత వచ్చిన మాదిగ దండోరా చుట్టూ ఏర్పడిన పెద్ద సంస్కరణ చైతన్యం సమైక్యరాష్ట్రంలో వచ్చింది. కృష్ణ మాదిగ తెలంగాణవాడైనా, ఆ చైతన్యం పునాదులు ఒంగోలులో పడ్డాయి.

అంతకంటే ముఖ్యంగా వాళ్ళు తమ తమ పేరు మార్పిడి, మాదిగ వాడల్లో ఆత్మగౌరవ పాఠాలు నేర్చుకున్న విలువలు అటు నుంచి ఇటు దిగుమతి అయినవే. టీడీపీ ఓట్ల రాజకీయం కోసమే అయినా రిజర్వేషన్ వర్గీకరణ వచ్చాక దాన్ని అమలు చేయించుకునే ఉద్యమం రాష్ట్రాన్ని ఊపేసింది. దానికి 2009డిసెంబర్ ప్రకటన తరువాత తెలంగాణ ఇస్తామని కేంద్రం ప్రకటించిన అనంతరం వచ్చిన ఉద్యమానికి చాలా పోలిక ఉన్నది. అయితే మాదిగ దండోరా ఉద్యమానికి బలమైన సాంఘిక సంస్కరణ లక్షణమున్నది.. ఒకప్పుడు కమ్మ క్రిస్టియన్లు మైగ్రెంట్స్‌గా వచ్చి తెలంగాణలో మార్పు తెచ్చినట్లే మాదిగ దండోరా ఉద్యమంలో బలమైన భూమికను పోషించింది క్రిస్టియన్ మాదిగలు.
నాకు తెలిసి తెలంగాణలో ఒక్క భాగ్యరెడ్డివర్మ ఉద్యమంలో -అదీ సంస్కృతీకరించబడ్డ రూపంలో తప్ప కులాలను కదలించిన ఉద్యమాలు పుట్టలేదు. అందుకుకారణం తెలంగాణ భూస్వాముల్లో సంఘ సంస్కర్తలు ఎదక్కపోవడం. ఆ రకంగా మాదిగ దండోరాతో వచ్చిన చైతన్యం అనన్యసామాన్యమైంది. దానితో రాష్ట్రంలోని మాలలు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ అది తెలంగాణ జిల్లాల్ని, గ్రామాల్ని ఏ ఉద్యమం చెయ్యనంత మార్పుకు గురిచేసింది.

రాష్ట్రాలు విడిపోయాక రాష్ట్రాల అభివృద్ధికి విద్యారంగం మూలం. దీన్ని గత పదేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో కుప్పకూల్చారు. రాష్ట్ర సాధన రాజకీయరంగానికి వదిలివేయకుండా విద్యారంగం బాధ్యతగా చిత్రీకరించారు. అందువల్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజూ రోడ్ల మీద ఉన్నారు. దీనివల్ల రేపు అధికారంలో ఉండే ఫ్యూఢల్ శక్తులకు పెద్దగా నష్టం ఉండదు. కానీ తెలంగాణ ప్రాంతపు దళిత బహుజన వర్గాల్లో ఒక బలమైన బ్యూరాక్రటిక్ క్లాస్ రూపొందదు. జీతం తీసుకునే ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రతినిత్యం పనితనాన్ని, జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యవస్థ సమర్థతను పెంచే ఉద్యోగ వ్యవస్థ ఏర్పడాలి. దానికి బ్యూరాక్రటిక్ డిసిప్లిన్ చాలా అవసరం. అది అభివృద్ధి కావాలంటే పాలక వర్గం దూరదృష్టికలదిగా తయారవ్వాలి.
గత అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ఫ్యూఢల్ వ్యవస్థ ఎందుకు బలహీన పడలేదు? పెట్టుబడిదారీ వర్గం ఎందుకు ఏర్పడలేదు? మున్ము ందు ఏర్పడ్డా దాని కుల వర్గ స్వభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు కీలకమైనవి. ఇంతకాలం ప్రతి దానికి ఆంధ్రులను తిట్టిన శక్తులకు ఇక్కడ అభివృద్ధి కాముక మేధావివర్గాన్ని డెవలప్‌చేసే వ్యవస్థలు రూపొందకపోతే తెలంగాణ ఇంకా వెనక్కిపోతుంది అని తెలుసు.
ఇక్కడి అగ్రకుల రాజకీయ శక్తులు తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాన్నంతా తీవ్రంగా ద్వేషించుకున్నాయి. ఆ కాలంలో కింది కుల ప్రాతినిధ్యం కాస్తా పెరిగింది. ఇప్పుడంతే కసితో ఎస్.సి., ఎస్.టి.లను ముఖ్యంగా బీసీలను అణగదొక్కాలనే శక్తులు తెలంగాణ ఉద్యమకాలమంతా బలపడ్డాయి. అగ్రకుల ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగే కింది కులరాజకీయ శక్తులు ఎదుగలేదు. మీడియా కూడా వాటిని ఎదగనివ్వకుండా జాగ్రత్తపడుతున్నది. మీడియా తల్చుకుంటే నాయకుల్ని ఎలా తయారు చెయ్యగలదో కేజ్రీవాల్ ఎదుగుదల మంచి ఉదాహరణ.

అగ్రకుల నాయకత్వం వైరుద్ధ్యాల్లో ఉన్నప్పుడు దళిత బహుజన నాయకత్వం ఎదగడం కొంత సులభం. ఆ స్థితి కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చుట్టూ కొంత కనబడుతంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు ముగ్గురు అగ్రకుల నాయకుల చేతుల్లో ఉండడంతో కాంగ్రెసు కిందికులాల మీద ఆధారపడక తప్పదు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. టీడీపీ కూడా ఒక బీసీనో, ఎస్.సి.నో బలమైన నాయకుడుగా ఎదుగనిచ్చే పరిస్థితి కనబడటం లేదు. ముందు ముందు వాళ్ల అవసరాలరీత్యా సీమాంధ్ర ప్రాంత నాయకులు కూడా, తెలంగాణ అగ్ర కులాలతో గూడుపుఠాణీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది.

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరకుండా ఉంటే రాష్ట్రం సాధించిన ప్రతిష్ఠను ఒక్క అగ్రకులం మూటకట్టుకొని మిగతా రెండు అగ్రకులాలను (రెడ్డి, బ్రాహ్మణ) తాబేదార్ల ద్వారా బుజ్జగించి కింది కులాలను తొక్కేసి ఆ ప్రక్రియకు పునర్‌నిర్మాణం అని పేరు పెట్టే అవకాశం లేకపోలేదు. అది కాంగ్రెస్‌లో విలీనమైతే పరిస్థితి కొంత వేరుగా ఉంటుంది.

రాష్ట్రం ఏర్పడ్డాకే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి అన్న మేధావులు కొత్త రాష్ట్రంలో కుటుంబ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదు. దిక్కులేని శక్తులు కమ్యూనిస్టుల మీదనో, విప్లవకారుల మీదనో ఆధారపడే అవకాశం లేదు. ఆ శక్తులన్నీ ‘జై తెలంగాణ’ జెండాలు మోసి కనిపించకుండా పోయాయి. కొద్దో, గొప్పో ఉన్నవి అగ్రకులాల అనుబంధంతో ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు కూడా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. కానీ ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. సీమాంధ్ర ప్రజల్లో ముఖ్యంగా శ్రమ జీవుల్లో, బరువు బాధ ఉంటే, రెండు రాష్ట్రాల్లోని వారంతా కలిసి కష్టాలు పంచుకుందామని చెప్పాల్పిన అవసరం ఎంతైనా ఉన్నది.
– కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

 

ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో ‘రామలింగేశ్వరస్వామి’గా పూజలందుకున్న శివుడు కాలం గడుస్తున్నకొద్దీ గణపేశ్వరస్వామిగా ప్రసిద్ధిచెందాడు.
నక్షత్రాకార ఆలయం
ఈ దేవాలయ శిల్ప నిర్మాణ చాతుర్యాన్ని చూస్తే కళ్లు మిరుమిట్లుగొలుపుతాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ద్వారాలను పెద్దపెద్ద రాతి మెట్లతో నిర్మించి, మధ్య పన్నెండు అడుగుల వృత్తాకార వైశాల్యంలో కళ్యాణమండపాన్ని నిర్మించారు. రెండు రాతి వరుసలతో గోడలుంటాయి. వీటిపై శిల్పుల నైపుణ్యాన్ని, గణపతిదేవుడి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా నగిషీలు చెక్కి ఉన్నాయి. లోపలి గోడ తర్వాత 15 అడుగుల పొడవు ఐదడుగుల వెడల్పు గల రాతి దిమ్మెలు పేర్చి గర్భాలయం, ముఖమంటపం నిర్మించారు. గర్భాలయంలోని శివలింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. దీనికింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించారు. పైకప్పును చక్రం ఆకారంలో నిర్మించారు. బయట నుంచి చూస్తే ఈ దేవాలయం లింగాకారంగా, నక్షత్రాకారంగా కన్పిస్తుంది.
సూర్యస్పర్శ
ఒకప్పుడు చరిత్రలో ఎంతో వైభవంగా పూజలందుకున్న ఈ దేవాలయం కాలక్రమంలో ఆదరణను కోల్పోయింది. 2001 వరకు నిర్జీవంగా కంపచెట్ల మధ్య ఉన్న దీన్ని అధికారులు, గ్రామస్థులు కలిసి బాగుచేశారు. తర్వాత దేవాదాయ శాఖ ఈ శివాలయాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించడంతో అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే – ప్రతి నిత్యం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు.
– భువనగిరి లక్ష్మీనరసింహారావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత

 

కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని  బ్రౌన్ గ్రంథాలయం ఆవరణలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం  జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ  కృషి చేశారు. రాష్ట్రంలోని వివిధ తెలుగు సాహిత్య  సంస్థలు, కవులు, రాజకీయ నాయకులు జానమద్ది మరణానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  కూడా జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతికి సంతాపం తెలిపారు.

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

 

సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- జయజానకీ ప్రాణనాయకా’ వంటి భక్తిగీతాలు ఎంత ప్రేక్షకాదరణ పొందాయో, ‘చినుకు చినుకు అందెలతో’, ‘ఓ వాలు జడ…’వంటి ప్రణయగీతాలు కూడా అంతే ఆదరణ పొందాయి. మూడు దశాబ్దాల, సాహిత్య, సినీ జీవిత ప్రస్థానంలో జొన్నవిత్తులకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిని అంటూ తన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చాడు. కొద్ది క్షణాల తర్వాత ‘మేము సింగపూర్ ఆహ్వానిస్తే వస్తారా?’ అన్నాడు. అంతకు ముందు కూడా చాలామంది ఇలా విజిటింగ్ కార్డులు ఇచ్చి ఈ మాటే చెప్పారు. వాళ్లెవరూ నన్ను ఆ తర్వాత పిలవలేదు. నేను కూడా వాళ్లెవరికీ ఫోను చేయలేదు. ఇదీ అలాంటిదే అనిపించి నిర్లిప్తంగా ‘వస్తాలెండి’ అన్నాను.

“మాది విజయవాడ. నాన్న టీచర్‌గా పని చేసేవారు. చాలీచాలని జీతాలతో జీవితాలు కష్టంగానే గడిచేవి. పదవ తరగతి దాకా ఎలాగోలా చదువు సాగినా ఆర్థిక కారణాలతో ఇంటర్‌లో చేరకుండా మూడేళ్లు ఖాళీగానే ఉండిపోయి మళ్లీ చదువు కొనసాగించాను. ఇంటర్, డిగ్రీ చదువుతున్న సమయాల్లోనే భాషా ప్రవీణ కూడా చదివాను. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు నేను ఓ 10 నెలల పాటు మద్రాసులోని ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీలో ఉద్యోగం చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం పోయింది. నాలో ఒక అయోమయం చోటుచేసుకుంది. తిరిగి విజయవాడ వెళ్లిపోదామనుకున్నాను. సినీ పరిశ్రమలోని వాళ్లకు యోగా నేర్పించే నా రూమ్మేట్ వేద భాస్కర్ నన్ను వారించాడు. నేను రాసిన నాటకాల్లోని పద్యాలు, పాటల్ని గమనించిన ఆయన ‘సాహిత్య పరమైన కొంత ప్రతిభ నీలో ఉంది. దాంతో ఏం చేయాలో ఆలోచించుకోవడం ఇప్పుడు నీ పని. అదేమీ లేకుండా వెనక్కి వెళ్లిపోయి ఏం చేస్తావు? మరికొన్నాళ్లు ఇక్కడే ఉండు. ఆరు మాసాలు కొన్ని ప్రయత్నాలు చేద్దాం. అప్పటికీ ఏమీ కాకపోతే అప్పుడు నేనే స్వయంగా విజయవాడకు పంపిస్తా’నన్నాడు. కానీ ఆరు మాసాలకంటే ముందే నాకు అవకాశాలు వచ్చాయి. రాఘవేంద్రరావు గారి ‘మన ఊరి పాండవులు’ సినిమాకు మొత్తం పాటలు రాయడంతో మొదలైన నా ప్రస్థానం మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మనలో ఏముందో గుర్తించి, ఆ దిశగా కృషి చేయకపోతే, మనది కాని జీవితంలోకి ప్రవేశించి చివరికి ఏమీ కాకుండాపోతామన్నది నా జీవితం నాకు నేర్పిన తొలిపాఠం.
మాటసాయమైనా చాలు
పసి వయసులోనే పోయిన వారు పోగా మా అమ్మకు మిగిలిన సంతానం ఐదుగురు. అబ్బాయిల్లో నేనే పెద్దవాడ్ని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక దశలో అమ్మ ఆరోగ్యం క్షీణించడం ఆగలేదు. విజయవాడలోని ఓ హాస్పిటల్‌లో ఆమెకు వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. కానీ, ఎక్కువ రోజులు బతకదనే విషయం స్పష్టమవుతూనే ఉంది. మేమంతా ఒకచోట ఆందోళనగా ఉన్న సమయంలో అమ్మ మా అందరినీ దగ్గరకు రమ్మంటూ సంజ్ఞ చేసింది. మేమంతా దగ్గరగా వెళ్లాం. మా అక్కయ్య వర్ధనికి సంతానం లేదు. మా బావగారు చనిపోయారు. ‘నేను పోయినా వర్ధ్థనిని నువ్వు బాగా చూడాలిరా’ అంటుందేమో అనుకున్నా. చివరి ఘడియల్లో ఆమె నుంచి ఆ మాట చెప్పించుకోవడం ఎందుకులే అనుకుని, ముందుగా నేనే ‘అమ్మా..! అక్కయ్యను ఇప్పుడు ఎలా చూస్తూ వచ్చానో ఎప్పటికీ అలాగే చూస్తాను. నువ్వేమీ బెంగపెట్టుకోకమ్మా’ అన్నాను. కాని మా అమ్మ ‘ఆ విషయం నీకు చెప్పేదేముందిరా. నువ్వే చూస్తావు. నేను చెప్పాలనుకుంది అది కాదురా. ఎన్నాళ్లు బతికినా అందరూ పోవాల్సిన వాళ్లమే. కాకపోతే మనం బతుకుతూ పక్కవాడి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి నాయనా! మనం డబ్బులైతే పెట్టలేం. ఇరుగూ పొరుగుకు మీ చేతనైనంత మాట సాయమైనా చేయండి నాయనా!’ అంది. ఆ మాట వినగానే నా మనసులో ఏదో కల్లోలం మొదలయ్యింది. మృత్యువు అంచున కూర్చుని, ఇప్పుడో కాసేపో అన్నట్లున్న ఈ స్థితిలో అమ్మ నోట ఈ మాటలా? ఆ దశలో ఎవరైనా కుటుంబ పరమైన జాగ్రత్తలు చెబుతారు గానీ, ఇరుగూ పొరుగుకు మాట సాయం చేయండి అనా చెబుతారు! నా మనసు ఆ్రర్దమైపోయింది. నా కళ్లెంట బొటబొటా నీళ్లొచ్చేశాయి. రేయీ పగలు జీవితంలో కొట్టుకుపోవడం కాదు జీవన్మరణాలకు అతీతంగా ఆలోచించే మానసిక స్థితి కూడా ఉండాలి. అప్పుడు గానీ, జీవితానికి సార్థకత ఏర్పడదేమో అనిపించింది.
అమ్మ చెప్పింది…
నేను భాషాప్రవీణ చేస్తున్న రోజుల్లోనే అంటే 23 ఏళ్ల వయసు నుంచే పద్యాలూ, పాటలూ రాస్తూ ఉండేవాణ్ణి. ఇతరులెవరో వాటిని మెచ్చుకుంటే విన్న అమ్మ ఒకరోజు ‘ఒరే..! రామలింగేశ్వర స్వామికి మొక్కితే నువ్వు పుట్టావురా, ఆ దేవుని మీద ఓ నాలుగు పద్యాలు రాయి’ అంది. ఆమె మాట మేరకు నేను కొన్ని పద్యాలు రాశాను. 108 పద్యాలతో ‘శ్రీరామలింగేశ్వర శతకం’ అన్న పేరుతో ఒక పుస్తకమే వేశాను. అలా1984లో రాయడం మొదలెట్టిన ఈ పద్యరచన పాతికేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 12 శతకాలు పూర్తయ్యేలా చేసింది. నేను రాసిన ‘బతుకమ్మ శతకా’న్ని సిలికానాంధ్ర సంస్థ ప్రచురించడంతో పాటు, ఒకేసారి పది దేశాల్లో ఆవిష్కరించింది. ‘నైమిశ వెంకటేశ శతకం’ రాస్తే, దేవస్థానం వారు దాన్ని ప్రచురించడమే కాకుండా నన్ను ఆ దేవస్థానపు ఆస్థానకవిగా నియమించారు. ఏవో నాలుగు పద్యాలు రాయమని అమ్మ చెబితే నేను దాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకున్నానో చాలారోజుల దాకా నాకు అర్థమే కాలేదు. అమ్మ మాట మీదున్న ప్రేమ గౌరవాలే కారణం. కానీ, ఏ కారణంగానైనా ఒకసారి ఒక ప్రవాహంలోకి కాలుమోపితే ఆ తర్వాత ఆ ప్రవాహమే మనల్ని నడిపిస్తుందేమోనని నాకనిపిస్తుంది.
నీ బలమే నీ రక్ష
మనుషులే కాదు, ఒక మంచి పుస్తకం, లేదా ఒక పద్యం, ఒక పాట ఎదురుకావడం కూడా మానవ జీవితంలో ఒక పెద్ద సంఘటనే అని నేననుకుంటాను. భాస్కర శతకంలోని ‘బలహితుడైన వేళ నిజబంధువు తోడ్పడు’ అనే పద్యాన్ని చూడటం నా జీవితంలో ఒక పెద్ద సంఘటనగా భావిస్తాను. ‘మంటలు పెద్దగా ఉన్నప్పుడు దానికి గాలి తోడై మంటను ఉధృతం చేసి ఒక కీకారణ్యాన్నే దగ్ధం చేసేందుకు తోడ్పడుతుంది. అదే మంట చిన్న దీపంగా ఉన్నప్పుడు ఆ గాలే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది. నువ్వు బలంగా ఉన్నప్పుడు బలవంతుడు కూడా నీకు సహకరిస్తాడు. అదే నువ్వు బలహీనంగా మారినప్పుడు నీ స్నేహితుడే నిన్ను ద్వేషిస్తాడు. నీ శత్రువుగా కూడా మారతాడు’ ఇదీ ఆ పద్యం సారాంశం. అలాగే, ‘నువ్వు బలంగా ఉంటే, నీ నుదుటి రాతను ఆ దేవుడు కూడా నిన్ను అడిగే రాస్తాడు’ అన్న చైనా సూక్తి నాకు బాగా నచ్చుతుంది. సంఘటనలు చెప్పను గానీ, ఇప్పటికీ నన్ను ఆటంక పరిచే వారున్నారు. పరోక్షంగానే అయినా, న న్ను ఇబ్బందులకు గురిచేసే వారున్నారు. అయితే, నేను ఎక్కడ బలంగా ఉంటానో అక్కడ ఆ ఆటంకాలు నన్ను ఏమీ చేయలేకపోతున్నాయి. ఎక్కడెక్కడ నేను బలహీనపడుతున్నానో అక్కడ ఎవరో ఒకరు నన్ను తక్కువ చేయడమో, పక్కకు నెట్టేయడమో జరుగుతోంది. ఇవి నా స్వానుభవంలో చవిచూసిన పరిణామాలు. ఎవరి జీవితంలోనైనా ఇదే జరుగుతుందని నా నమ్మకం. మీరు శక్తివంతులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుంగదీసేందుకు ఇతరుల ప్రయత్నాలు ఫలించవు. ఇది నా నమ్మకం. నా జీవిత సిద్ధాంతం.
పుట్టుకతోనే అర్భకులా?
ఇటీవల లక్నోకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిశారణ్యం వెళ్లాను. అక్కడ ‘రుద్రావర్తం’ అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. నేను అక్కడికి వెళ్లేసరికి కొంత మంది పిల్లలు వెంటపడి ముష్టి అడుగుతున్నారు. అదే సమయంలో పక్కనున్న ఒక గుడిసెలోంచి 18 మాసాల పసిపాప, తప్పటడుగులు వేస్తూ, నాదగ్గరగా వచ్చి చేయి చాచింది. బార్న్ రైటర్, బార్న్ సింగర్, బార్న్ డ్యాన్సర్ అంటూ ఉంటాం కదా మరైతే ఈ పసిపాప బార్న్ బెగ్గర్ అనుకోవాలా? నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ నైమిశ వెంకటేశ దేవస్థానానికి నేను ఆస్థాన కవినో అక్కడ నాకు ఎదురైన సంఘటన ఇది. అనుక్షణం దివ్యత్వం గురించి మాట్లడటం బాగానే ఉంది గానీ ఈ దీనత్వం మాటేమిటి? ఏమిటీ దేశం? ఆ దైన్యత నుంచి వారిని బయటికి తీసుకురాకపోతే, వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగేదెప్పుడు? బలపడేదెప్పుడు? వారు ఆత్మగౌరవంతో బతికేదెప్పుడు? మనిషిని బతికించని, ఒక శిఖరంగా నిలబెట్టని ఏ దివ్యబోధలకైనా మనుగడేముంటుంది? ఏ సాహిత్యమైనా జీవన సత్యాన్ని బోధించాల్సి ఉంది. అందరి జీవితాలకూ వర్తించే సార్వత్రిక సత్యాలు ఏ ఉ్రద్గంధాల్లోనూ దొరకవు. ఎవరికి వారు ఆ సత్యాల్ని తెలుసుకోవలసిందే. వారికి ఆ స్థాయి రాకపోతే సాహిత్యం ఆ భూమికను నిర్వహించాల్సిందేనని నేననుకుంటాను.
హృదయబంధమే మిన్న
2004 సంక్రాంతి రోజున రవీంద్రభారతిలో జంధ్యాల వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు నేను కొద్ది నిమిషాల పాటు ప్రసంగించాను. అది విన్న ఒకాయన నా వద్దకు వచ్చి తన పేరు వామరాజు సత్యమూర్తి అని, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిని అంటూ తన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చాడు. కొద్ది క్షణాల తర్వాత ‘మేము సింగపూర్ ఆహ్వానిస్తే వస్తారా?’ అన్నాడు. అంతకు ముందు కూడా చాలామంది ఇలా విజిటింగ్ కార్డులు ఇచ్చి ఈ మాటే చెప్పారు. వాళ్లెవరూ నన్ను ఆ తర్వాత పిలవలేదు. నేను కూడా వాళ్లెవరికీ ఫోను చేయలేదు. ఇదీ అలాంటిదే అనిపించి నిర్లిప్తంగా ‘వస్తాలెండి’ అన్నాను. కొద్ది రోజుల తర్వాత తనే ఫోన్ చేసి సింగపూర్‌కు ఆహ్వానించాడు. నేను వెళ్లాను. ఆయనే తనకు సన్నిహితులైన పెద్ద పెద్ద వాళ్లనెందరినో నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇప్పటికి నేను పదిసార్లు సింగపూర్ వెళ్లాను. ఆయన ద్వారానే నేను మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా వెళ్లాను. నా కవిత్వాన్ని అభిమానించడమే కాదు, గత పదేళ్లుగా నా ప్రాణంలో ప్రాణంగా ఉంటున్నారాయన. నాకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి, ఏ బాధనైనా పంచుకోవడానికి మొట్టమొదట నాకు గుర్తుకొచ్చేది సత్యమూర్తిగారే. ఆయనతో నాకు ఏర్పడిన స్నేహం నా జీవితానికి ఎంతో సుస్థిరత నిచ్చింది. కష్టసుఖాల్ని పరస్పరం పంచుకోగలిగేదే కదా నిజమైన స్నేహం. అప్పటిదాకా నేనెవరో కూడా తెలియని సత్యమూర్తి నా జీవనసమస్తంగా మారిపోయారు. ప్రతి పరిచయం నీ జీవితంలో భాగం కాకపోవచ్చు కానీ, కొన్ని బంధాలు మమేకం కావడమే కాదు మన ముందు కోటి కాంతిపుంజాల్ని పరుస్తాయి. రక్తబంధాలకన్నా మిన్నగా నీకొక లోకాన్ని ప్రసాదిస్తాయి. వాటి ముందు ప్రాణం కూడా తక్కువే, ప్రపంచం కూడా తక్కువేనని నేననుకుంటాను”
-బమ్మెర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో

రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు . భావాలను అంత కరణను ఉపయోగించి ,వీటి తో బాహ్య సంబంధాలను సెల్ఫ్ ను నిర్వచించ టానికి కృషి చేశాడు .దానినే ఆయన ‘’నేచురల్ మాన్ ‘’అన్నాడు .తానూ రాసిన కాన్ఫరెంసేస్ ,కాంటాక్ట్స్ ,దిస్కోర్సేస్ లో వీటిని క్షున్నం గాచర్చించి  వివ రించాడు .’’Rousseu criticized the civilized man of reason whose behavior has become so constrained y organized society that his individuality is obliterated ‘’

ప్రక్రుతి గురిం చి ఆరోపణలు చేసేవారు ,వారికి వచ్చే దురదృస్టం అంతా వారి ప్రవర్తన వలననే కలుగుతుందని తెలియని పిచ్చి వాళ్ళు అన్నాడు .అవినీతి సమాజం లోకి ఇప్పుడే రాలేదని అది సాంప్రదాయం గా వచ్చిన్దేనన్నాడు .హేతువు లేక రీజన్ యొక్క మూలాలను కదిలించి పారేశాడు రూసో .’’men live not in order to live but to make others believe that they have lived ‘’అన్న గొప్ప సిద్ధాంతాన్ని చెప్పిన మేధావి రూసో .’’desire involves the other becoming self and the self becoming other ‘’అన్నాడు .సెల్ఫ్ ను అంటే ఆత్మ ను సెక్స్ కు ముడి వేసిన మహాను భావుడు రూసో  కన్నీళ్లను గురించి చెబుతూ ‘’tears are a body language and naturally express physical discomfort and are peals for help . అంటే కన్నీళ్లు శారీరక భాష శారీరక అసౌకర్యాన్ని సాహజ సిద్ధం గా చెప్పి సహాయం కోసం ఆర్భాటం చేయటం అన్నాడు .

Inline image 1       

birth place                                      porttrait

Jean-Jacques Rousseau Signature.svg

జెనీవా ఫిలాసఫర్ గా పెద్ద పేరు తెచ్చుకొన్నాడు .ఆయన రచనలు ఫ్రెంచ్ విప్లవానికి మార్గ దర్శకం చేశాయి .పౌరుడుగా ఉండటానికి అర్హతలను వివ రించాడు .ఆయన  ఆత్మ కద కాన్ఫరెన్స్ లలో కని  పిస్తుంది .పద్దెనిమిదవ శతాబ్దపు ‘’ఏజ్ ఆఫ్ సేన్సిబిలిటి ‘’భావాలకురూసో రాసిన ‘’రివరీస్ ఆఫ్ సాలిటరి వాకర్ ‘’పుస్తకం అద్దం పడుతుంది .ఆధునిక రాజకీయ సాంఘిక ఆలోచనలకు రూసో రాసిన ‘’డిస్కోర్స్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఇన్ ఈక్వాలిటి’’,’’ఆన్ దిసోషల్ కాంట్రాక్ట్ ‘’గ్రంధాలు రిఫరెన్స్ పుస్తకాలే .ఫ్రెంచ్ విప్లవ కాలం లో జాకోబిన్ క్లబ్ సభ్యులలో ప్రభావ వంత మైన ఫిలాసఫర్ గా గుర్తింపు పొందాడు .రూసో మరణించిన పదహారు ఏళ్ళకు 1794లో పారిస్ హీరో గా పాంథర్స్ గుర్తించి ఆరాధించారు .

జాన్ డ్రై డెన్

డ్రై డెన్  ఒక కవి నాటక రచయితా ,వ్యంగ్య రచయిత ,.పుంఖాను పుంఖాలుగా కర పత్రాలను రాసిన వాడిగా గొప్ప గుర్తింపు ఉంది .రాజకీయ ,తత్వ సంక్షోభ కాలం లో జీవించాడు .వీటిని తన రచనలలో చక్కగా పొందు పరచాడు. 1649లో లార్డ్ హేస్టింగ్స్ పై మొదటి కవిత రాశాడు ..1659లో ఆలివర్ క్రాం వెల్ మీద కవిత చెప్పాడు .1663 లో’’ ది వైల్డ్ గాలంట్’’నాటకం రాశాడు . 1675లో ‘’ఔరంగ జేబ్ ‘’నాటకం రచించాడు .1631లో ఇంగ్లాండ్ లోని నార్త్  యాంప్ టన్ షైర్లో పుట్టి 1700మే నెల ఒకటిన అరవై తొమ్మిదేళ్ళకు చనిపోయాడు .ప్రముఖుల ను ఖననం చేసే వెస్ట్ మినిస్టర్ ఆబే లో సమాధి చేశారు .సర్వ స్వతంత్రుడు గా జీవిం చాడు .రాజులకు తల వంఛ లేదు .తన కాలపు మేధావులలో పెద్ద డ్రా డెన్ . ‘’మాస్టర్ ఆఫ్ ది.మిడిల్ స్టైల్ ‘’ అని ఆడెన్ ప్రశంసించాడు . కవి అలేక్సాండర్ పోప్ పై  డ్రై డెన్  ప్రభావం విపరీతం గా ఉంది .ఆంగ్ల సాహిత్యాన్ని మలుపు తిప్పి నాన్యతః పెంచి,శుద్ధి చేసి  కవిత్వానికి వైభవం కల్పించిన మహాను భావుడు డ్రా డెన్ అని సామ్యుల్ జాన్సన్ కీర్తించాడు .వర్జిల్ సాహిత్యానికిఆంగ్ల అనువాదం తో  ప్రాణ ప్రతిష్ట చేశాడని కొందరు భావిస్తే చాలా పేలవం గా డ్రై డెన్  అనువదించాడని వర్డ్స్ వర్త్ అన్నాడు .ఆంగ్ల వాక్యాలను విభక్తుల తో అంతం చేయరాదని, లాటిన్ భాష లో కూడా అలా చెయ్యరని చెప్పిన వాడు డ్రై డెన్ . .థామస్ షాద్వెల్  అనే నాటక రచయిత పై వ్యంగ్యం గా ‘’మాక్ ఫ్లేక్నో ‘’రాసి నవ్వుల పువ్వులు పూయించాడు .మతానికి సంబంధించిన కవిత్వమూ రాశాడు .

  

11-10-2002శుక్రవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు నేపధ్యం లో అందం గా గొప్ప గా మాటల గారడీ తో తయారు చేశారు .నౌకర్లు అయిన చవలాయ్ లాంటి వారికి ప్రాణ ప్రతిష్ట చేశారు .లోభిత్వం, రెండో పెళ్లి పై మోజు న్న వారిపై మాటల బాణాలు సంధించారు .నౌకర్ల పాత్రలు లేక పోతీ మేస్టారి నాటికలలో పసేలేదు అంత గొప్ప గా వారిని తీర్చి దిద్దారు .వాళ్ళ కాంట్రిబ్యూషన్ మహా గొప్పగా ఉంది కదా మలుపులు తిరిగి ,జ్ఞాన బోధ చేసి సుఖాంతం అవటానికి వారికి ప్రాణ ప్రతిష్ట చేశారుమేష్టారు .

మోలియర్ అసలు పేరు Jean Baptiste ‘Poquelin’’’ అయితే Molie RE’’పేరు మీద నాటకాలు రాశాడు ఆయన సాంఘిక విమర్శ ,వాస్తవం ,కవితాత్మక వచనాలు ,వేగా వంతమైన కదా గమనం ,ప్రేమ ,సంఘం ,మతం ,అధికారం మొదలైన సమస్త విషయాలపై వ్యంగ్యం తో విరుచుకు పడ్డాడు .1622లో మోలియర్ ఫ్రాన్స్ దేశం లోని పారిస్ నగరం లో జన్మించాడు .1641లో పందొమ్మిదేళ్ళ కే ‘’లా’’పాస్ అయ్యాడు 1645.లోపలే 13సంవత్సరాలు అనేక   ప్రదేశాలలో పర్యటన చేశాడు .1650-51-లో ప్రభుత్వోద్యోగం చేశాడు .1659లో ‘’less preciessus of ridicules ‘’ అనే కొత్త తరహా హాస్యపు రచన చేశాడు మోలియర్ రాసిన నాటక ప్రదర్శనలు చూడటానికి రాజు నాలుగవ హెన్రీ వచ్చేవాడు .1673 ఫిబ్రవరి 17న 53ఏళ్ళకే మోలియర్ మరణించాడు .

 

 

 

Moliere is the first rank writer of comedy .social criticism ,,suggestion of reality ,farcial style ‘’ఉన్న చిన్న చిన్న మాస్టర్ పీసెస్ రాశాడని విమర్శకులు మెచ్చుకొన్న నాటక రచయిత మోలియర్ .అతని దృష్టిలో ‘’laughter may be inner or boisterously on the out side .it is a recognition the human follies that we are –an on going process of creation share .The plays are everprepared.to go on stage .An on going  process of creation was set in motion by Moliere  .He is a great man alive on stage .he is more than a genius .he is a great soul who exhibits himself and sacrifices himself for the theater ‘’అని గొప్ప ప్రశంసలను అందుకొన్నాడు .

మోలియర్ అకున్తిత దీక్ష తపన అంకిత భావం ,ఆచరణ ఆలోచన ,ఉదాహరణ గా నిలవటం వలననే దియేటర్ కళలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకొన్నాయి .దాని తీరు మారింది .నాటక రంగం పై( దియేటర్)  జనాలకు ఆశ ,ఉత్సాహం పెరిగాయి .జీవితం అనే గొప్ప సత్యానికి నాటకం లో ఆవిష్కరణ జరిగింది .వాస్తవాన్ని నాటకం ప్రతి బిమ్బించాలన్న దృక్పధం ఏర్పడింది .నాటక కళా సిద్ధాంతాల తో సృజనాత్మతను జోడించి గొప్ప ఫలితాలను మోలియర్ సాధించాడు .

జనం లో ఇంత క్రేజు మోజు ఉన్నా మోలియర్ ను అతని రచనలను మోరలిస్టూలు ,రోమన్ కేధలిక్ చర్చి వారు ఆక్షే పిన్చారు, తీవ్రం గా విమర్శించారు .’’డాన్ జూన్ ‘’అనే నాటిక ను చర్చి నిషేధించింది కూడా .దానితో అతను తీవ్ర మనో వ్యధకు గురి అయ్యాడు .1667లో ఆరోగ్యమూ దీని వల్ల  దెబ్బ తింది.కొంతకాలం నాటక రచనకు దూరం గా ఉండిపోవాల్సోచ్చింది .1673లో మళ్ళీ రాయటం ప్రారంభించాడు .చివరి నాటిక ‘’దిఇమేజనరి ఇన్ వాలిద్’’ప్రొడక్షన్ చేస్తుండగా ‘’పల్మనరిట్యూబర్ క్యులోసిస్’’విజ్రుమ్భించి   ,విపరీతమైన దగ్గుతో బాధ పడి,మెదడులో రక్త నాళాలు చిట్లి పోయాయి. ప్రదర్శన ఎట్లాగో పూర్తీ చేశాడు .పూర్తీ అయిన కొన్ని గంటలకేఇంటి వద్ద  తుది శ్వాస వదిలాడు మోలియర్ .అంతటి హాస్య రచయితా ఇంతటి తీవ్ర అనారోగ్యం పాలై విషాదాంతం గా జీవిత నాటకాన్ని ముగించాడు .

మోలియర్ శవానికి అంతిమ క్రియలు చేయటానికి ఇద్దరు  ప్రీస్టులు అంగీకరించ లేదు .మూడవ ప్రీస్ట్ ఆలస్యం గా వచ్చాడు కాని మోలియర్ చని పోయినప్పుడు ధరించిన దుస్తుల వల్ల  పీడ కలుగుతుందనే సెంటి మెంట్ తో ఉడాయించాడు . . ఆ నాడు  ఫ్రాన్స్ దేశం లో ఉన్న ఆచారం ప్రకారం నటులు మరణిస్తే వారిని  పవిత్ర మైన  చర్చి లో పాతి పెట్టె వారు కాదు .మోలియర్ భార్య ఆర్ముడ తన భర్తకు రాత్రి పూట మామూలు గా  అంతిమ సంస్కారాలు జరిపించటానికి అనుజ్న ఇమ్మని రాజును ప్రార్ధించింది .రాజు అనుజ్న పై శ్మశానం లో బాప్టిస్టులు కాని చిన్న పిల్లలను సమాధి చేసే చోట అంత గొప్ప హాస్య రచయితను సమాధి చేయాల్సి వచ్చింది పాపం .1717లో మోలియర్ అస్తికలను మ్యూజియం ఆఫ్ ఫ్రెంచ్ మాన్యుమెంట్స్ కు ,అక్కడి  నుండి పారిస్ లో ప్రసిద్ధ మైన లా ఫాన్టేన్ సేమిటరి దగ్గరలో ఉన్న ‘’పీరీ లాకేస్ సేమిటరి’’కి తీసుకొని వెళ్లి  భద్రపరచారు

మోలియర్ రచనలను ఆంగ్లం లోకి ఒజేల్ అనువదించాడు . పారిస్ నాటక శాలలో 14ఏళ్ళలో 85నాటక ప్రదర్శనలు జరిగితే అందులో మోలియర్ ఒంటి చేత్తో రాసిన నాటకాలు 31ఉండటం అతని రచనలకు ఎంత పాపులారిటి ఉందొ తెలియ జేస్తుంది

1.1-10-2002 మంగళ వారం నాటి నా అమెరికా  (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

‘తెలుగు వెలుగు’ మార్చి 2014 సంచికలో లంకె బిందెలు గురించిన పుస్తక సమీక్ష కృష్ణ మోహన్

scan0001

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ )

 రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ )

1-శివ రాత్రి నాడు’’ చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం ‘’

  అనకుండా  వెంకటేషాదులు  అంటున్నారు  ‘’చంద్ర బాబూ పాహిమాం ‘’.

2-ఓటు తో గెలవలేని సూడో మేధావి,బాకా  మంత్రి ’’ జై రాం రమేష్ ‘’

 సీమాన్ధ్రకు అన్నీ ఇచ్చేశాం మూసుకోండి నోరు అంటున్నాడు ‘’కామోష్ ‘’.

3-పాపం  అయిదో  కిస్టూడిగా గద్దె నెక్కుదామను కొన్నాడు కొణిదల ’’ శివుడు ‘’

 ‘’చిరంజీవ ‘’ అంటారని అనుకొంటే  రాష్ట్ర పతి పాలన అంటూ తుమ్మాడు  ‘’శంక’’రుడు .

4-సీమాంధ్ర ను చేస్తాడట ‘’బాబు’’ మోడల్ సింగపూర్

 అవకాశం ఇస్తే  గ్యారంటీగా పోతుందా ఇప్పటిదాకా ఉన్న ‘పూర్ ‘’?.

5-తెలంగాణా ను కే.సి.ఆర్ .చేస్తాడా మరో పారిస్?

  లేక శంభో శంకర అంటూ శంకర గిరి మాన్యాలేనా ?‘’ఇస్ ‘’ ?

6-సీమాంధ్రకు కిరణ్ ను  శాశ్వత సి.ఏం చేస్తామని శపథం పట్టిన  విద్యార్ధులు

  ఆశకు అంతు ఉండాలని ,రాచ కీయ లౌక్యం  తెలియని   అమాయకులు .

7-అప్పటిదాకా జగన్ ను అంటకాగి ,జైలు కెళ్తే ప్లేటు మార్చి జై కిరణ్ అన్న రఘు వీరా!

  ఇప్పుడు మళ్ళీ జంప్ జిలానీ అయి కిరణ్ నే ‘’బోడి లింగం ‘’ అంటావా  మాటల వీరా ? .

8-అన్ని పదవులూ ఒక్కడికేనా లక్ష్మీ ప్రసాద్ యార్ల గడ్డా?

 ఇంకెవరూ లేరా నీ సాటి నీ కంటే ధాటి మొగాడు ఈ గడ్డా?

9-  మీ భయాలు,ఆందోళనలు  తొలగించటానికి ఆమె వస్తారు

  డిగ్గీ గారి మాటలు కోటలు దాటి  వినేందుకు  ఎవరు ఉంటారు?.

10-‘’సింధురత్న’’ ప్రమాదానికి ‘’నేవీ చీఫ్’’ రాజీ నామా  పదవిని భావించి ‘’బలాదూర్ ‘’

     ‘’దేవేంద్ర కుమార్ జోషి ‘’దోషి అని పించుకోకుండా  అయ్యాడు మరో ‘’లాల్ బహదూర్ ‘’.

11-తడి గుడ్డల తో గొంతు కోయ జూస్తున్నాడు డొక్కా

   గడియకో మాట మారుస్తూ ఈ మధ్య  నేర్చాడు లౌక్యం పక్కా .

12-సీమాంద్ర  కు చిచ్చు పెట్టాడు సత్తి బాబు

   ఆ చిచ్చు కొంప నూ కాల్చి పగబట్టాడు సుత్తి బాబు .

13-అన్నెం పుణ్యం ఎరుగని అమాయక చక్ర వర్తి పాపం అనుకొన్నారు  

    ఆర్ధిక మంత్రి ‘’ఆనం’’- నెరజాణ ‘’అని వి’’భజన’’ తర్వాత  తెలుసుకొన్నారు .

    మహా శివ రాత్రి శుభా కాంక్షలతో

   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-2-14-ఉయ్యూరు

 

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం

 

 
 
 

శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల హడావుడి ఇంతింతనలేం. పేరున్న ఆలయాల గురించి అందరికీ తెలుసు. కాని పూర్వం ఎన్నో పూజలందుకుని, కాలక్రమంలో వైభవాన్ని కోల్పోయిన శివాలయాలు కొన్ని ఉన్నాయి. అలా అపూర్వమైన శిల్పకళావైభవాన్ని, ఘనమైన చరిత్రను తమలో పొదువుకున్న రెండు దేవాలయాల గురించే ఈ కథనం…

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మానవ పురుషాంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగం ఎక్కడుందో తెలుసా?
ఎక్కడంటే చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో.
1911లో గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగ ఉనికి గురించి ప్రపంచానికి తెలియజేశారు. మొదట ఒక మహావృక్షం కింద ఆరుబయట పూజలందుకునే లింగంగా దీన్ని ప్రతిష్ఠించారని ఆయన అంచనా. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో దొరికిన ఎముకలను (గొర్రె లేదా పంది) బట్టి ఇక్కడ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవారని ఒక అభిప్రాయం. మట్టిపాత్రలు, కుండలు, ఎముకలు వంటి అవశేషాలున్న ఒక పురాతన దిబ్బపై ఈ లింగం ప్రతిష్టించబడి ఉండొచ్చని చరిత్రకారుల నిర్ణయం.
ఋగ్వేద రుద్రుడు
పురుషాంగంపై ఉండే సన్నని ఈనెల వంటి సున్నితమైన నరాలను సైతం అద్భుతంగా, స్పష్టంగా కనిపించేలా చెక్కిన దీని శిల్పకళ అత్యంత సహజంగా ఉంటుంది. దీనిపైన – ఒక చేత్తో గొడ్డలి (పరశువు), మరో చేత్తో గొర్రెను పట్టుకొన్న రుద్రుడు ఒక యక్షుని భుజాలపై నిలబడ్డట్టు ఉంటుంది విగ్రహం. ఈ రుద్రుడిని ధ్యాన ప్రతిమగా చూపడం విశేషం. తలపాగా, ధోవతి ధరించిన ఈ రుద్రుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానాన్ని సవివరంగా తెలిపే ఈ అద్భుత లింగం చెక్కేందుకు వాడిన రాయిని గురించి ఎటువంటి సమాచారమూ లేదు. గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగినాణేలపై ఈ లింగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇలాంటి శిల్పముంది. మొద ట్లో ఈ శివలింగం ఆరుబయటే పూజలందుకునేది. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దానిచుట్టూ గుడిని నిర్మించాయి. ఆలయ సముదాయాలన్నీ పరిపల్లవ, బాణ, చోళుల శిల్పశైలిని పోలి ఉన్నాయి. గర్భగుడి సైతం గజపుష్టాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీన్ని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య దేవాలయాలున్నాయి.
నిర్మాణ చాతుర్యం
ఏకలింగంపై శివుని అనేక రూపాలను మలచిన తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనం. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతున ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగంపై పడేలా నిర్మాణచాతుర్యం చూపారు. అలా 2005 డిసెంబర్ 4న నీళ్లు వచ్చాయి. ఈ గుడిని తాళం లాంటి ఆకారంలో నిర్మించడం వల్ల లింగాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోతుందని కొందరంటారు. ఆనందకుమారస్వామి, జితేంద్రనాథ్‌బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు, వ్యాఖ్యానకారులు, శాస్త్రవేత్తలు శిల్పచరిత్రలోనే అపురూపమైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో అభిమానించి ఆరాధించి ప్రేమించారు. ఇంగువ కార్తికేయశర్మ రాసిన ‘పరశురామేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే రెండు పుస్తకాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారమూ లే దు.
పూజలు మొదలయ్యాయి..
బాణ, చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్య ధూపదీపనైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్థుల నుంచి భారత పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి. గ్రామస్థుల తరపున వున్నం గుణశేఖర్‌నాయుడు 2006 నుంచి 2008 వరకు సమాచారహక్కు చట్టం సాయంతో పోరాడాడు. గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు కాదుగదా, కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదన్న చేదు నిజాన్ని వెలికితీశాడు. అతని పోరాటం ఫలితంగా గుడిలో పూజలు చేసేందుకు 2009లో గ్రామస్థులకు అనుమతి లభించింది.
(రేణిగుంట నుంచి గుడిమల్లం 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పాపారాయుడుపేట మీదుగా వెళ్లాలి)
– డి. లెనిన్
ఫోటోలు : మద్దెన హరిబాబు

 
 
 
 
 
 
 
 

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

శివ శంభో అని నినదిస్తున్న శివాలయాలు

 

శివరాత్రి ప్రత్యేక కథనాలు

మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు..

ఏడుపాయలుగా ఎందుకు…

ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి రాజైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతం చేసేందుకు ఇక్కడే సర్పయాగం చేశాడంటారు. ఏడుగురు మహర్షుల ఆధర్వంలో జరిగిన యాగాగ్ని గుండాల్లో ఆహుతైన సర్పరాజులకు సద్గతులు కలిగించడానికి గరుడుడు కంకణం కట్టుకున్నాడట. పాతాళంలో ప్రవహించే భోగవతి అనే నదిని భూమ్మీదికి తీసుకొస్తే అది ఏడు యజ్ఞ గుండాలను చల్లార్చేందుకు ఏడు పాయలుగా చీలి ప్రవహించిందనే పురాగాధ ప్రచారంలో ఉంది. ఆనాటి భోగవతి నదే భూమ్మీద మంజీర అయిందని చెబుతారు. ఆ నది ఏడు పాయలను జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమ అనే ఏడుగురు ఋషుల పేర్లతో వ్యవహరిస్తుంటారు.

మహాశివరాత్రి అనగానే పూజలన్నీ శివుడికే జరుగుతాయి. కాని మెదక్ జిల్లా పాపన్నపేట సమీపంలోని ఏడుపాయల గుట్టల్లో మాత్రం శివరాత్రి అంటే వనదుర్గాదేవిని కొలిచే ఉత్సవ సమయం. ఏడాదికోసారి వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు పదిహేను లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు. 2006లో మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్యాటక ఉత్సవంగా ప్రకటించింది కూడా.

కొండకోనలను దాటుకుంటూ చిట్టడవుల్లో నుంచి ప్రవహిస్తూ వచ్చే మంజీరా నది అక్కడికి వచ్చేసరికి ఏడు పాయలుగా చీలుతుంది. ఆ చీలిన ప్రదేశంలోనే కొండ గుట్టల సొరంగంలో అమ్మవారు వనదుర్గామాతగా వెలసింది. ఆమెకు 17వ శతాబ్దానికి పూర్వం నుంచీ పూజలు జరిగేవని చారిత్రకాధారాలు చెబుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఏడుపాయలగుట్టలో జరిగే బ్రహ్మాండమైన జాతరకు మన రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, అడుగడుగునా జంతుబలులు, బోనాలు, బండ్ల ఊరేగింపులు వీటన్నిటితో అక్కడి వాతావరణం భిన్న సంస్కృతుల సంగమంగా కనిపించి భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తుంది.

మంజీరా నది పాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో జాతర మొదటి రోజు మొదలవుతుంది. ఆ రోజు నుంచి స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. పసుపు కలిపిన బియ్యంలో ఎండు వక్కలు, ఖర్జూరాలు, కుడుకలు, తమలపాకులు, రవికె కనుములు, కొత్త చీరెలను ఉంచి వనదుర్గాదేవికి మొక్కులు చెల్లిస్తారు. రెండో రోజు అమ్మవారికి ఫలహార బండ్ల ఊరేగింపు, మూడో రోజు రథోత్సవం వైభవంగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో బస్సులు నడుపుతుంది ప్రభుత్వం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. భక్తులు స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. మంచినీరు, వసతి, పారిశుధ్య సమస్యలు తల్తెకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి జాతరకు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు.

వనదుర్గాదేవి ఆలయంతో పాటు తపోభూమి, పాపాలమడుగు, సంతానగుండం, ముత్యాలమ్మ గుడి, శివాలయం, గంగమ్మగుడి, వినాయకుడి ఆలయం వంటి చోట్ల కూడా చేస్తుంటారు. అమ్మవారి ఆలయం ముందు పెద్ద బండరాయిపై ఒక జంట స్నానం ఆచరించడానికి సరిపడే గొయ్యి ఉంటుంది. సంతానం లేని దంపతులు ఈ గుండంలో పుణ్య స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. జాతర సమయంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా పిల్లలు లేని దంపతులు ఈ గుండంలో స్నానాలు చేస్తుంటారు.
– కె. శ్రీనివాస్, పాపన్నపేట

కోడెమొక్కుల రాజరాజేశ్వరుడు

దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కులు చెల్లించుకునే ఆచారం ఉన్న ఏకైక దేవాలయం కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర క్షేత్రం. కోడెమొక్కులంటే ఏమిటో, వేములవాడకు ఇంకా ఎన్ని ప్రత్యేకతలున్నాయో తెలుసుకుందాం.

ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనారోగ్యం, సంతానలేమి వంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు తమ సమస్యలు తీరితే వేములవాడ రాజరాజేశ్వరస్వామికి కోడెదూడలను సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరిక తీరిన వెంటనే కోడెదూడను తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. అలాగే నిలువెత్తు బెల్లం దానం చేస్తారు. వేములవాడ ఆలయం ప్రధానంగా శైవక్షేత్రమే అయినా, మహాశివరాత్రితో సహా అన్ని ప్రధాన పర్వదినాల్లోనూ హరిహరులిద్దరికీ పూజలు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఏ ఉత్సవమైనా శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మీఅనంతపద్మనాభస్వాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలోనే ముస్లిముల హజరత్ బాబా ఖాజాబాగ్ సావర్ దర్గా కూడా ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మహాశివరాత్రి నాడు లక్షలాది భక్తులు ఆలయ ఆవరణలోనే జాగరణ చేస్తారు.

చారిత్రక విశిష్టత
క్రీ.శ. 750 నుంచి క్రీ.శ. 973 వరకు ఈ ప్రాంతాన్నేలిన చాళుక్యరాజులను వేములవాడ చాళుక్యులంటారు. 11వ శతాబ్దంలో రాజరాజనరేంద్రుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న మఠాలు మత ప్రచారానికే కాక విద్య, వైద్య కేంద్రాలుగా విలసిల్లాయి. శిల్పకళకు, జైన, శైవ, వైష్ణవ, శాక్తేయం వంటి మతాలకు, మతశాఖలకు, సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలకు నిలయమై ఈ క్షేత్రం వర్థిల్లిందని చరిత్రకారుల కథనం.

స్థలపురాణం
నారదుని కోరిక మేరకు మొదట కాశీలో ప్రత్యక్షమైన పరమశివుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడకు వచ్చాడని ఒక కథ. ద్వాపర – కలియుగాల సంధి సమయాన శ్రీరాజరాజేశ్వరుడు ధర్మగుండంలో గుప్తుడయ్యాడట. కాలక్రమంలో ధర్మగుండంలో లింగాకారంలో ఉన్న రాజరాజేశ్వరుడిని ప్రతిష్టించారని మరో కథ. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొన్ని ఆసక్తికరమైన పురాణగాధలు కూడా వినిపిస్తుంటాయి.
– దాసరి దేవేందర్, వేములవాడ

చేదుకో కోటయ్యా… చేదుకోవయ్యా

‘చేదుకో కోటయ్యా…చేదుకోవయ్యా’ అని ఆర్తితో పిలవగానే ఎంతటి పాపాలనైనా హరించి భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తాడనే పేరున్న దేవుడు శ్రీత్రికోటేశ్వర స్వామి. గుంటూరు జిల్లాలోని ఈ ప్రసిద్ధ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా తరలివచ్చే ప్రభలు చూడటానికి రెండు కళ్లు చాలవు.

ఇది బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడం వల్ల ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు. ధ్వజ స్తంభం కూడా వుండదు. ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి కనుక కొండ పై వెలసిన దేవుడికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను త్రిమూర్తులుగా వ్యవహరిస్తారు.

దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత శివుడు శాంతించి పన్నెండేళ్ల బాలుడిగా మారి బ్రహ్మచర్య దీక్షతో కైలాసంలో సమాధి నిష్టలో దక్షిణామూర్తిగా ఉన్నాడట. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆయన వద్దకు వెళ్ళి తమకు బ్రహ్మోపదేశం చేయమని కోరారట. అందుకు శివుడు అంగీకరించి త్రికూటాద్రి (కోటప్పకొండ)కు వచ్చి బ్రహ్మోపదేశం చేశాడని స్థలపురాణం. ఇది బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడం వల్ల ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు. ధ్వజ స్తంభం కూడా వుండదు. ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి కనుక కొండ పై వెలసిన దేవుడికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను త్రిమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం చోళరాజులకు పూర్వం నుంచే ప్రసిద్ధికెక్కిందని కొండ మీద లభ్యమైన పురాతన శాసనాలు తెలియజేస్తున్నాయి. వాటి ఆధారంగా చూసినప్పుడు ఇది వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రదేశమని భావించవచ్చు.

కోటప్పకొండ తిరునాళ్లంటే గుంటూరు జిల్లాలో పెద్ద సంబరం. శివరాత్రి సందర్భంగా విద్యుత్ ప్రభల నిర్మాణానికి పోటీ పడతారు చుట్టుపక్కల గ్రామస్థులు. ఒక్కొక్క విద్యుత్ ప్రభ నిర్మాణానికి దాదాపు నెల రోజులు పడుతుంది. సుమారు 90 అడుగుల ఎత్తు వరకు వీటిని నిర్మిస్తారు. ఒక్కొక్క విద్యుత్ ప్రభకు 12 – 15 లక్షల రూపాయల వ్యయమవుతుంది. సర్వాంగసుందరంగా తయారైన ప్రభలు విద్యుత్ కాంతులీనుతూ ఎంతో కోలాహలంగా గ్రామాల నుంచి కొండకు తరలివస్తాయి. కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కూడా కల్పించింది. శివరాత్రి సమయంలో ఆలయ అలంకరణ అద్భుతంగా ఉంటుంది. కొండ దిగువన ఉన్న వివిధ సామాజిక సత్రాల్లో యాత్రికులకు అన్నదానం భారీగా జరుగుతుంది. ఘాట్ రోడ్డులోని పర్యాటక కేంద్రం ఇప్పటికే ముస్తాబయ్యింది. బోట్ షికారు, చిన్నారుల కోసం ఆట వస్తువులు కూడా ఏర్పాటయ్యాయి.
– కె. శ్రీనివాసరావు, నరసరావుపేట
ఫోటోలు : ఉమామహేశ్వర్రావు, గుంటూరు

తిన్నడి భక్తి మూగజీవుల ముక్తి శ్రీకాళహస్తి

గ్రహణాల సమయంలో మూతబడని దేవాలయం ఏదంటే శ్రీకాళహస్తీశ్వరాలయమే. చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి.
శ్రీకాళహస్తిలోని వాయులింగం స్వయంభువని భక్తుల నమ్మకం. అది శ్వాసిస్తున్నట్టు దీపాలు అటూఇటూ కదులుతాయని వారు నమ్ముతారు. సాలెపురుగు, పాము, ఏనుగులు భక్తితో అర్చించిన స్వామి కనుక ఈ దేవుడికి శ్రీకాళహస్తీశ్వరుడనే పేరొచ్చింది. పేరుకు తగినట్టే ఇక్కడి శివలింగం పొడుగ్గా ఉండి, శిరస్సు భాగాన సర్పాకారం, మధ్యలో ఏనుగు దంతాలు, అడుగు భాగంలో సాలీడు చిహ్నాలు ఉంటాయి. వాటికి తోడు వాయులింగేశ్వరుడు నిత్యం నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటాడు. అందుకే ఇక్కడి ముక్కంటి ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతిగాంచింది. ఆ కవచం వల్లనే ఉమాశంకరుడికి గ్రహణ దోషాలు కలగవు. అందుకే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో దేశంలో అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరుచుకునే ఉంటుంది. గ్రహణ సమయంలో ఇక్కడ శంకరుడికి సర్వాభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో స్వామి దర్శనం కోసం ఇక్కడకు తండోపతండాలుగా వస్తారు భక్తులు.

శ్రీకాళహస్తి ఆలయం లోపల, వెలుపల, గోపురాల పైన కనిపించే అద్భుతమైన శిల్పశైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చోళ, పల్లవ రాజుల శైలి కలగలసి ఈ దేవాలయానికి ఒక ప్రత్యేక శోభనిచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు గజపతిరాజులపై లభించిన విజయానికి చిహ్నంగా 1516వ సంవత్సరంలో ఏడు అంతస్తులతో 136 అడుగుల ఎత్తులో రాజగోపురాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ గోపురంపై కనిపించని శిల్పం లేదు, శిల్పులు ప్రదర్శించని నైపుణ్యం లేదు. అంత గొప్ప గాలిగోపురం 2010 మే 26వ తేదీన కూలిపోయిన సంగతి తెలిసిందే. అంతే స్థాయిలో సౌందర్యం ఉట్టిపడేలా రాజగోపుర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పట్టే అవకాశముంది. రాయల వంశానికి చెందిన అచ్యుతరాయల వారి పట్టాభిషేకం ఆలయ ముఖద్వారానికి కుడివైపున గల పదహారుకాళ్ళ మండపంలో జరిగిందని చెబుతారు. ఆ మండపాన్ని అచ్యుతరాయ మండపంగా పిలుస్తారు.
– వలిపి శ్రీరాములు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం

   మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో పదకొండు అనువాకాలు ఉన్నాయి .ఈ ఇరవై  రెండు అనువాకాలను కలిపి ‘’రుద్రాధ్యాయం ‘’అంటారు .దీనికే మరో పేరు ‘’శత రుద్రీయం ‘’.అంటే అపరిమిత శివ రూపాలు అని అర్ధం .మహా భారత యుద్ధ ప్రారంభం అప్పుడు అర్జునుడు భయ కంపితుడై   శస్త్ర అస్త్రాలను లను కింద పడేసి భీరువు లా ఏడుస్తూ ఉంటె శ్రీ క్రిష్ణ భగవానుడు ధైర్యం చెప్పి ‘’గీత ‘’ను ఉపదేశించిన సంగతి మనకు తెలుసు .దీనిని ‘’’’ సాం గ్రామికం ‘’అంటారు .అశ్వత్థామ శ్రీ కృష్ణ ,అర్జునులపై బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని భీష్మ పర్వం లో ప్రయోగించినప్పుడు అది వారినిద్దరినీ ఏమీ చేయలేక పోయింది .అప్పుడు ద్రోణ సుతుడు వ్యాస భగవానుడిని ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమైనాడు .అశ్వత్థామ తన అస్త్రం ఎందుకు విఫలమైందని అడిగాడు .దానికి వ్యాసభగవానుడు పూర్వ జన్మ లో కృష్ణుడు, అర్జునుడు శివలింగాన్ని పూజించారని ,అశ్వత్థామ శివుని ప్రతిమను అర్చిన్చాడని ,లింగాభిషేకం సకల శ్రేయోదాయకం అని ,దాని ఫలితం గొప్పదని అంతటి ఫలితం ప్రతిమా పూజ వలన లభించ దని తెలియ జేశాడు .అందుకే శివలింగానికే పూజా, అభిషేకము చేయాలి .ద్రోణుడు మరణించిన తర్వాత మహా శివుని విభూతిని గొప్పగా ఆవిష్కరించి అశ్వత్థామకు వివ రించాడు .అలాగే అర్జునునికి మరో సారి శివుని మహత్వాన్ని వివరించాడు .వ్యాసుడు చెప్పిన ఈ విషయాలన్నీ ‘’శత రుద్రీయం ‘’అంటారు .కనుక భగవద్ గీత లాగే శత రుద్రీయం కూడా ‘’సాం గ్రామికం ‘’అని పించు కొంది.

    శత రుద్రీయం అమృతత్వ సాధనం అని ‘’జాబాల శ్రుతి’’ చెప్పింది .’’నమశ్శివాయ శివ తరాయచ ‘’లో పంచాక్షరి మంత్రం ఉంది .శివ అంటే అవాజ్మానస గోచమయిన సత్య ,జ్ఞాన ,ఆనంద లక్షణం ఉన్న పర బ్రాహ్మయే. కనుక శివ అంటే అమృత భావన .అంటే శ్రీ విద్యా పరం కూడా .నమకం లో మొదటి అనువాకం లో అన్ని వ్యసనాలకు మూలం అయిన క్రోధానికి నమస్కారం చెప్ప బడింది .తరువాత బాధ కలిగించే బాణానికి ,దాన్ని పూరించే ధనుస్సుకు ,దాన్ని సంధించే చేతులకు నమస్కారాలు చెప్పారు .అంటే ఈ జగత్తు ను లయం చేసే రుద్రుడైన శివుని’’ ఘోర రూపం’’ వర్ణించ బడింది .శివుడు ‘’అఘోర రూపం’’ లో కూడా ఉంటాడు . రెండవ అనువాకం లో సుఖాన్ని కలిగించే ‘’శాంత స్వభావం ‘’వర్ణించ బడింది .ఎనిమిదవ అనువాకం లో ‘’శివ పంచాక్షరి ‘’మంత్రం ఉంది .ఇది బంధ విచ్చేదనం చేసే సాధనం అయి ,జ్ఞానాన్ని ఇచ్చి ,ముక్తిని కలిగిస్తుంది . ఈ ఎనిమిదవ అనువాకం రుద్రాధ్యాయ మాలలో మణి పూస గా నిలిచింది .

 నమకం లో మొదటి  అనువాకం ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః’’-నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం నమః ‘’అనే మంత్రం తో ప్రారంభ మవ్తుంది .క్రోధం నశిస్తే శాంతి లభిస్తుంది .శాంతి ఉంటె  అన్నీ ఉన్నట్లే .అందుకే జగత్ ను  పరి పాలించే ,మహా విష్ణువు  ‘’శాంతా కారం భుజగ శయనం  ,పద్మ నాభం సురేశం-విశ్వాకారం  గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం ‘’అనీ ,లయ కారకుడైన మహా దేవుడిని ‘’శాంతం పద్మాసనస్తం శశి ధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం ‘’అనీ ‘’శాంతం’’ అనే  ముందు మాట తోనే స్తుతిస్తాం .చమకం ‘’అగ్నా విష్ణూ సజోష సేమా వర్ధంతు వాంగిరః –ద్యుమ్నై ర్వాజేభి రాగతం ‘’అనే మంత్రం తో ప్రారంభ మవుతుంది .నమకం లో శివునికి నమస్కారాలు ఉంటె చమకం లో శివుడిని అర్దించే విషయాలు కో కొల్లలు గా ఉన్నాయి .ఇందులో ‘’చమే ‘’అనే మాట అనేక సార్లు వస్తుంది .అంటే ‘’కూడా నాకు కావాలి ‘’అని అర్ధం .’’కల్పతాం’’ అనే మాట లో’’ కలుగు గాక ‘’ అనే అర్ధం ఉంది .రుద్రీయం లో రెండు వాక్యాలున్న మంత్రాలను’’ రుక్కులు ‘’అని,ఒకే వాక్యం ఉన్న మంత్రాలను ‘’యజుస్సు ‘’లని అంటారు .

 

  Inline image 1  

 

                           రుద్రుడు అంటే ?

   రుద్రుడు అంటే రోదసి లేక అంతరిక్షం (ఈధర్ )కు అధిపతి .పదకొండు రూపాలలో వ్యక్తమయ్యే అంతరిక్ష దేవత .అంత రిక్ష రుద్రులు పద కొండు మంది.వీరికి’’ ఏకాదశ రుద్రుల’’ని పేరు . వీరిని ‘’gods of vibration ‘’అంటారు .దివికి సంబంధించిన దేవతలు పన్నెండు మంది వీరిని ‘’ద్వాదశాదిత్యులు’’ అంటారు .వీరికి ‘’gods of radiation ‘’అని పేరు .పృధివి లేక భూమి కి సంబంధించిన దేవతలు ఎనిమిది మంది .వీరిని’’ అష్ట వసువు’’లంటారు .’’gods of materialization ‘’అని వీరిని పిలుస్తారు .ఈ సంఖ్యలను బట్టే ‘త్రిష్టుప్ ‘’అనే పద కొందు అక్షరాల ఛందస్సు ,’’జగతి ‘’అనే పన్నెండు అక్షరాల ఛందస్సు ,’’గాయత్రి ‘’అనే ఎనిమిది అక్షరాల ఛందస్సు ,పదహారు అక్షరాల ‘’అనుష్టుప్ ‘’ఛందస్సు లు ఏర్పడ్డాయి .

   ‘’శివ తమా ‘’అనే మంత్రం లో శివ తమ అంటే శివత్వమే .అంటే మోక్షమే నన్న మాట .రుద్రుడు ధరించే ధనుస్సు మొదటి సగం మన శిరస్సు లో  బ్రహ్మ రంధ్రం నుండి ముందు వైపుకు భ్రూ మద్యం వరకు ఉంటుంది .ఇక్కడే ‘’మన్యువు ‘’అనే శక్తి ఉంటుంది .శివధనుస్సు రెండవ సగం బ్రాహ్మ రంధ్రం నుంచి మెడ వరకు ఉంటుంది .మన కను బొమల నుండి మెడ వరకు అడ్డంగా పుర్రె పై వ్యాపించి ఉన్న రేఖ యే’’ శివ ధనుస్సు’’ గా భావిస్తారు .అందుకే శివుడు కపాలాన్ని  చేత ధరిస్తాడు .అది సంకేతం అన్న మాట .అలాగే ఆకాశం లో ఉదయం నుంచి అస్తమయం దాకా సూర్యుని దారి ఒక చాపం ‘’ఆర్క్’’ లాగా ఉంటుంది . ఇది కూడా శివ ధనుస్సుయే.దీని వలన పగలు ,రాత్రి ఏర్పడతాయి .శివుడు కాల  స్వరూపుడు అందుకే ‘’మహా కాలుడు’’ అన్నారు .మనస్సు ,ఇంద్రియ ప్రవృత్తులు ,కపాలం నుండి రుద్ర గ్రంధి వరకు అంటే ‘’మెడుల్లా ‘’ మీదుగా పని చేస్తాయి .అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు ,మనసు ను ఆశ్రయించిన రుద్రుని పదకొండు రూపాలే శివుని పదకొండు బాణాలు .

   మహాశివ రాత్రి శుభా కాంక్షలతో

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | 1 Comment

పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

   పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

1848లో మొదటి సారిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత’’ ఈసప్ నీతి కధ’’లనుబాలల కోసం  ఇంగ్లాండ్ దేశం లో ముద్రించారు .దీని రచయిత విలియం ‘’కాక్ స్టన్’’.1647లో ‘’ఆర్బిస్ పిక్చర్స్ (illustrated world )అనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ‘’జోహాన్ ఆమోస్ కమినాస్’’ రాసి ప్రచురించాడు .1691లో నీతి కధలున్న ను ‘’ఇంగ్లాండ్ ప్రైమర్ ‘’వచ్చింది .1719లో పిల్లలకు యువతకు ఆకర్షణీయం గా ‘’డేనియల్  డీఫో ‘’రాసిన రాబిన్ సన్ క్రూసో అచ్చయింది .దీని తర్వాత ‘’చార్లెస్ పెర్లాట్ ‘’రచించిన ‘’టేల్స్ ఆఫ్ మదర్ గూస్ ‘’అనే మొదటి ‘’-ఫెయిరీ టేల్’’ 1721లో ముద్రణ పొందింది .1736లో వచ్చిన ‘’జోనాధన్ స్విఫ్ట్ ‘’రాసిన ‘’గలివర్స్ ట్రావెల్స్ ‘’అందర్నీ ఆశ్చర్య పరచి ఆకట్టుకుంది .1714లో పిల్లల కోసమే ‘’జాన్ న్యు బెర్రీ ‘’రాసిన ‘’ఏ లిటిల్ ప్రెట్టి పాకెట్ బుక్ ‘’ విడుదలైంది .ఇది వినోదాత్మక రచన గా గుర్తింపు పొందింది .1765లో ‘’ది రినౌనేడ్ హిస్టరీ ఆఫ్ ఎ లిటిల్ గూడీ టు షూస్ ‘’అనే దాన్ని’’ ఆలివర్ గోల్డ్ స్మిత్ ‘’రాయగా ముద్రింప బడి మొదటి పూర్తీ చిన్నపిల్లల నవల గా పేరు పొందింది .

ప్రఖ్యాత కవి విలియం బ్లేక్ రాసిన ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ ‘’‘1789లో అచ్చు అయిన మొదటి చిన్న పిల్లల కవితలు  గా గుర్తింపు పొందింది .1823లో’’ విలియం అండ్ జాకబ్ గ్రింలు’’ రాసి ముద్రించిన ‘’గ్రిమ్స్ ఫెయిరీ టేల్స్ ‘’పుస్తకం మొదటి సంప్రదాయ కధలు అని మెప్పు పొందింది .మహా రచయిత ‘’చార్లెస్ డికెన్స్’’ 1843 లో రాసిన ‘’ఎ క్రిస్టమస్ పెరోల్ ‘’గుండెలను తాకే నవలగా కీర్తింప బడింది .’’హెచ్ సి ఆండెర్సన్’’ 1846రాసి ప్రచురించిన ‘’ఫెయిరీ  టేల్స్ ‘కూ పేరొచ్చింది .1865లో’’ లూయీ కరోల్ ‘’రాసిన ‘’ఆలిస్ అడ్వెంచర్స్ ‘’ పుస్తకం బాలల కోసం  మొట్ట మొదటి గొప్ప సంపూర్ణ నవల గా కొని యాడ బడింది . ఇదే బాల సాహిత్యానికి వేయ బడిన గొప్ప పునాది గా గుర్తింపు పొందింది .నిజ జీవితానికి చెందినకద ,పాత్రలతో వచ్చిన బాల సాహిత్యం గా 1867లో ‘’ఏం ఎల్ ఆల్కాట్ ‘’రాసిన ‘’లిటిల్ విమెన్ ‘’పేరు తెచ్చుకొన్నది .1871లో’’ జి మెక్ డోనాల్డ్’’ రాసిన ‘ఏ లిటిల్ బాక్ ఆఫ్ ది నార్త్ విండ్ ‘’కూడా మెప్పు పొందింది .

1876లో ప్రముఖ అమెరికన్ రచయిత ‘’మార్క్ ట్వేన్’’ రాసిన ‘’అడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ ‘’అమెరికా రోల్  మోడల్ పాత్రలతో హాస్యం తో అసలైన అమెరికా నవల గా విపరీతం గా పేరు పొందింది  .బొమ్మలతో, కదల తో ‘’కేట్ గ్రీన్ వే’’ రాసిన ‘’అండర్ ది విండో ‘’1778లో వచ్చింది . 1883లో ‘’రాబర్ట్ లూయీ స్టీవెన్సన్’’ రాసిన ‘’ట్రెజర్ ఐలాండ్ ‘’అద్భుత మైన ప్లాట్ ,నాణ్యమైన కూర్పు ,వాస్తవ నేపధ్యం ,పాత్రలతో సంచలనమే సృష్టించింది .’’హ్యూజర్ స్పైరీ’’ రజర్మనీ భాష నుంచి అనువదించిన  ‘’హీడీ ‘’1884లో విడుదలై ప్రపంచం అంతా ఆదరణ పొందింది .చిన్న పిల్లల కోసం ‘’లూయీ స్టీవెన్సన్’’ రాసిన ‘’ఏ చైల్డ్ గార్డెన్ ఆఫ్ వెర్సెస్ ‘’1885 లో ముద్రణ పొంది అలరించింది .

ప్రపంచ ప్రసిద్ధ బాల కధలను’’ఆండ్రూలాంగ్  సేకరించి  1889‘లో ‘’ది బ్లూ ఫెయిర్ బుక్ ‘’పేరిట విడుదల చేశాడు .అదే ఏడాది ‘’రుడ్యార్డ్ కిప్లింగ్’’ రాసిన ‘’ది జంగిల్ బుక్ ‘’,అందులోని ‘’మోగ్లీ’’పాత్ర బాలలను విశేషం గా ఆకర్షించాయి .కుటుంబ ఫాంటసి నవలగా 1899లో ‘’ఎడిత్ నెస్ బిట్ ‘’రాసి ప్రచురించిన ‘’ది స్టోరి ఆఫ్ ది ట్రెజర్ సీకర్స్ ‘’పేరు పొందింది .అమెరికా దేశపు ‘’మొదటి ఫెయిరీ రీ టేల్’’ గా 1900లో’’ ఫ్రాంక్ బ్రాన్’’ రాసి ముద్రించిన ‘’ది విజార్డ్స్ ఆఫ్ ఓజ్’’ప్రసిద్ధి చెందింది ‘’.బ్యూట్రిక్స్  పాటర్’’రాసిన ‘’ది టేల్ ఆఫ్ పీటర్ రాబర్ట్ ‘’1901లో వచ్చింది .1908 లో’’ కే.గ్రహామి ‘’రాసిన ‘’దివిండ్ ఇన్ ది విల్లోస్ ‘’లో సహజ సిద్ధ మైన స్నేహం, ప్రేమ   కని పిస్తాయి .

1919లోఅమెరికా లో  బాల సాహిత్యం కోసమే ‘’మాక్ మిలన్ కంపెని ‘’ఏర్పడి కొత్త ద్వారాలను తెరిచింది .దీనితో బాటు బాల సాహిత్యాన్ని రాసిన వారికి ప్రోత్సాహకరం గా ఉండటానికి 1921లో ‘’ఉత్తమ అమెరికన్ బాల సాహిత్య రచయిత కు ‘’న్యు బెరీ ‘’బంగారు పతాకాన్ని ఏర్పాటు చేశారు .1922లో’’ ఏ.ఏ.మిల్నే’’ రాసిన ‘’విన్నర్ ది పూ ‘’సరదాగా సరళం గా హాస్యం మేళ వించి లయ బద్ధం గా రాసిన వచనం గా పేరు పొందింది .1924బాలల కోసమే ప్రత్యేకం గా ‘’ది హారన్ బుక్ మేగజైన్ ‘’ వచ్చి ఆకర్షించింది .1928లో ‘’వాండా గాగ్ ‘’ రాసిన బొమ్మల పుస్తకం ‘’మిలియన్స్ ఆఫ్ కాట్స్ ‘’ప్రసిద్ధమైంది .’’ఎడ్వర్డ్ స్ట్రాట్  మేయర్’’ రాసిన’’  ది నాన్సీ డ్రు ‘’1930ప్రారంభమై ఇంకా ప్రచురింప బడుతూనే ఉంది .‘’లారా ఇగ్నాల్డ్స్  వైల్డర్ ‘’రాసిన ‘’లిటిల్ హౌస్ ఇన్ ది బిగ్ వుడ్స్ ‘’1932లో వచ్చి గొప్ప పాప్యులర్ సీరియల్ అయింది .

‘’జే ఆర్ ఆర్ టోల్కిన్ ‘’ 1937లో ఒక కొత్త ప్రపంచాన్ని, అందులో అనుసరించాల్సిన నిబంధనలను’’ ది హాబిట్ ‘’నవలలో  సృష్టించి మహా రచయిత గా గుర్తుండి పోయాడు .1938లో ఉత్తమ సంచలనాత్మక బొమ్మల పుస్తకానికి ‘’కాల్దీ కోల్ట్ ‘’పురస్కారాన్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు .చారిత్రాత్మక ఫిక్షన్ పుస్తకం గా ‘’ఈధర్ ఫోర్బ్స్’’ రాసిన ‘జానీ  ట్రెమైన్ ‘’ 1943లో పేరొందింది .’’ ఏం డబ్ల్యు  బ్రౌన్ ‘’రాసిన ‘’గుడ్ నైట్ మూన్ ‘’1947లో ప్రచురింప బడి ‘’ఫస్ట్ బెడ్ టైం స్టోరి ‘’గా గుర్తింపు తెచ్చుకోంది. ‘’సి ఎస్ లూయీస్’’ 1950లో రాసిన ‘’ది లయన్ ,ది రైటర్ ,అండ్ ది వార్డ్ రోబ్ ‘’ను నారియా సిరీస్ లో వచ్చిన ఏడు పుస్తకాలు .వీటిలో ఎలిగేరి ,ఫాంటసి పుష్కలం గా ఉంటాయి . 1952లో ప్రచురింప బడిన ‘’అన్నే ఫ్రాంక్  డైరీ’’నాజీ దురంతాలను కళ్ళకు కట్టి నట్లు చూపించి ప్రపంచ ప్రసిద్ధ మైంది

‘’డాక్టర్ స్యూస్ ‘’1957లో రాసిన ‘’ది కాట్ ఇన్ ది హాట్ ‘’హాయిగా చదివించే విభాగం లో పేరు పొందింది .1962లో వచ్చిన ‘’ఈ .జే కీట్స్’’ రాసిన  ‘’ది స్నో డే ‘’అనే బొమ్మల కదా పుస్తకం బాలల హస్తభూషణం అని పించు కొంది. ‘’ఏం .సేండాక్’’ రాసిన ‘’వేర్ ది .వైల్డ్ థింగ్స్ ఆర్’’పుస్తకం 1963లో విడుదలై పిల్లలలో అంతర్గతం గా ఉన్న భయాలను ఆందోళనలనుతెలియబర్చి మళ్ళీ మామూలు వారిని గా చేసే తమాషా కదల తో ఆకట్టుకొన్నది  .’’ఎస్.ఇ హింటన్’’ అనే రచయిత ’’ది అవుట్ సైడర్స్ ‘’1967లో వెలువరించాడు .ఇది టీనేజర్స్ కు కొత్త నిజాలను ఆవిష్కరించింది .1970లో ‘’జే.బ్లూమ్’’ రాసిన ‘’ఆర్ యు దేర్  గాడ్ ?’’అడాలసెంట్ పుస్తకం గా గుర్తింపు పొందింది .’’ది చాకలేట్ వార్’’పుస్తకాన్ని ‘’ఆర్.కోర్మియర్ ‘’1974లో రాసి జీవితం అంటే ఎప్పుడూ సుఖాంతం గా ఉండదని హెచ్చరించాడు  .’’కే .పాటర్సన్ ‘’‘’బ్రిడ్జ్ టు టేరాలిటియా ‘’1977లో రాసి ప్రచురించాడు .ఇందులో ప్రేమించిన వారిని దూరం చేసుకోవటం లో వచ్చే దుఖం ,బాధలను తెలియ జేస్తూ,వాటిని నయం చేసుకొని మామూలు గా ప్రవర్తించే రీతిని వివరించాడు .1986లో ‘’ది బేబీ సిట్టర్స్ క్లబ్ ‘’ను ‘’యాన్ ఏం మార్టిన్’’ రాసి పేపర్ పాక్ సిరీస్ గా విడుదల చేసింది .1993లో ‘’ఆర్ ఎల్ స్టీన్’’ ‘’గూస్ బంప్స్ ‘’అనే ‘’హారర్’’ పుస్తకం రాశాడు .1998లో ‘’జే కే రౌలింగ్’’ రాసిన సంచలనాత్మక ‘’  హారీ పోటర్ అండ్ ది సోర్సేస్ స్టోన్ ’అన్ని రికార్డులను బద్దలు కొట్టింది .అప్పటి నుంచి ఆ సీరియల్ పుస్తకాలు విడుదల అవుతూనే ఉన్నాయి .దుమారం లేపుతూనే ఉన్నాయి .అత్యంత పాప్యులర్ రచయిత గా రౌలింగ్ నిల బడింది .

‘’అన్నే అండ్ జేం  టైలర్’’  ట్వింకిల్ ట్వింకిల్ ‘’కధలు రాస్తే ‘’లాంబ్ ‘’షేక్స్ పియర్ నాటకాలను కధలుగా మార్చి అందించాడు . ‘’ఎడ్వర్డ్ స్రేట్ మేయర్ ‘’అనే రచయిత ఒక్కడే 20వ శతాబ్దం లో 1300పిల్లల పుస్తకాలు రాసి రికార్డు సృష్టించాడు .అందులో ‘’టోం స్విఫ్ట్ ,’’ది హార్డీ బాయ్స్’’’’ది బాబ్సీ ట్విన్స్ ‘’,ది రోవర్ బాయ్స్ ‘’మొదలైన పుస్తకాలు చిన్న పిల్లల్ని చెడగొట్టే  పేడ దారి పట్టించే ‘’చౌక బారు సాహిత్యం ‘’అంటూ ‘’అమెరికా లైబ్రరి అసోసియేషన్ ‘’వగైరా సంస్థలు ఆ సాహిత్యాన్ని నిషేధించాలని  ఆలోచించి 36,000 పిల్లలపై ‘’ఒపినియన్ పోల్ ‘’నిర్వహిస్తే 98%పిల్లలు ‘’మాకు అవే కావాలని’’ నిక్కచ్చిగా ఖండితం గా చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించారు .

‘’ ఎలిజ బెత్ మేడన్ రాబర్ట్స్’’ అనే 7 ఏళ్ళ పిల్ల ‘’ఫైర్ ఫ్లై’’ అనే కవిత రాసింది .ఆ కవిత చదివి ఆనందిద్దాం –

‘’A little light is going by –is going up to see the sky

In ever could had thought of it –To have a little bug all lit

And  made   to go on the wings ‘’.

ఈ చిన్నారి రాసిన ఈ చిట్టి కవితను ప్రసిద్ధ మహా కవి టి ఎస్.ఇలియట్ రాసిన ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’అనే ప్రముఖ  కవిత అంత గొప్పది అని మెచ్చారు విమర్శకు లు విశ్లేషకులు .ఇంత గౌరవం పొందింది ఆ చిన్నారి .

‘’Any  one who can write a children’s story without a moral ,had better to do so –childish is some how comic ‘’అంటారు .

‘’స్ట్రేట్ మేయర్ ‘’రాసిన బాల సాహిత్యం పుస్తకాలు 125 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయి అంటే ముక్కున వేలు వేసుకొని ఆశ్చర్య పోతాం .ఆయన చని పోయిన తర్వాత వేసిన పుస్తకాలు కూడా మిలియన్ల కొద్దీ అమ్ముడవటం మరీ విశేషం .

తెలుగు లో బాల సాహిత్యం వెనక పడింది . అంత ఊపు ఎన్నడూ రాలేదు .రాసినా ఆచ్చు వేయలేక ,వేసినా ,అమ్ముడు అవక ,అయినా చేతికి డబ్బులు రాక బాధ పడిన రచయితలెందరో మనకు తెలుసు .బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు రావాలని కోరు కొందాం .

16-10-2002 బుధ వారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మహా శివ రాత్రి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపకాల పరిమళాలు – 2

శ్రీ  మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు  జ్ఞాపకాల పరిమళాలు – 2

కాంగ్రెస్ కు అండగా  మునసబు గా నరసయ్య గారు

మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి వెంకట నరసయ్య గారు ఉయ్యూరు లో కాంగ్రెస్ పార్టీకి ఆరోజుల్లో పెద్ద దిక్కుగా గొప్ప అండగా నిలిచారు .కాంగ్రెస్ ఆఫీసును ఏర్పరచి చాలా ఏళ్ళు నిర్వహించారు .ఆ సమయం లో ఉయ్యూరుకు వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు శ్రీ ప్రకాశం పంతులుగారు, శ్రీ మాగంటి బాపినీడు శ్రీ మరు పిళ్ళ చిట్టి గారు వీరింటికి వచ్చి ఆతిధ్యం అందుకొనే వారు .నరసయ్య గారు అత్యంత ప్రమాద, విపత్కర పరిస్తితులలో ఉయూరు మునసబు గా ఉన్నారు .అప్పుడే కాటూరు లో కమ్మ్యూనిస్ట్ ఉద్యమం  తీవ్రం గా ఉండేది .ప్రభుత్వం బూటకపు యెన్ కౌంటర్ల  లో కమ్యూనిస్ట్ లను  సామూహికం గా కాల్చి చంపుతున్న  దారుణ సమయం అది .మలబార్ పోలీసులను రప్పించి కమ్యూనిజాన్ని అనగార్చ టానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న రోజులవి . అలాంటి భయంకర సమయం లో  మునసబు గిరీ చేయటం అత్యంత సాహసం ,ప్రమాదం .కాని వీరు సమర్ధ వంతం గా తమ విధులను నిర్వహించి ప్రజల మెప్పు పొందారు .

కోట సూర్య నారాయణ మేష్టారు

గోపాల కృష్ణ గారి మరో ముఖ్య మైన జ్ఞాపకం వారికి ట్యూషన్ చెప్పి తాడంకి హైస్కూల్ లో చేర్పించిన ప్రైవేట్ మాస్టారు శ్రీ కోట సూర్య నారాయణ గారు ,ఇంటికి వచ్చి ప్రైవేట్ చెప్పేవారని తాము ఆయనకు అత్యంతా విధేయుడిగా ఉండేవాడినని తమ కుటుంబం సూర్య నారాయణ మేస్టారిని ఏంతో గౌరవిన్చిందని ,ఆయన దగ్గర చదువు కోవటమే తన అదృష్టమని అలాంటి గురువులు చాలా అరుదుగా ఉంటారని ,తాను ఇంతటి వాడినవ్వటానికి మేష్టారు  వేసిన విద్యా పునాదులే కారణమని అత్యంత వినయం గా ,భక్తీ తో చెబుతారు గోపాల కృష్ణ గారు .

నా గురువు కూడా

కోట సూర్య నారాయణ గారు నాకు కూడా గురువు గారు అవటం గొప్ప విషయం.మా ఇంటికికుడి ప్రక్క అంటే దక్షిణం గా  మూడవ ఇంటిలో దేవుల పల్లి సీతమ్మ కావమ్మ గారింటిలో ఆయన ఆద్దే కుండే వారు .నల్లని మనిషి భారీ విగ్రహం వీపు చాల వెడల్పు .నుదురు పెద్దది .పంచా చొక్కా తో ఉండేవారు చేతిలో పేం బెత్తం ఉండేది ట్యూషన్ చెప్పేటప్పుడు చొక్కా ఉండేది కాదని జ్ఞాపకం .తువ్వాల మీద వేసుకొనే వారు .ఆయన్ను చూడగానే చూసిన వారికి ’’కింది నుంచి కారి పోయేట్లు ఉండేవారు ‘’.కాని ఆయన బోధన అసామాన్యం .చదువు చెప్పేటప్పుడు ఆయన చూపించే ప్రేమ నిరుపమానం .నేను వారి దగ్గర నాలుగో క్లాసు చదివాను .ఒక్కోసారి భయపడి ఆయన ప్రైవేటు కు వెళ్ళకుండా,అలిగి మా పడమటింట్లో ఉండే ‘’భోషాణం ‘’ఎక్కి పడుకొనే వాడిని .ఆయన నేను రాలేదని తెలుసుకొని ముందు పిల్లలను పంపేవారు నన్ను తీసుకొని రమ్మని .అయినా వెళ్ళక పోతే తానే మా ఇంటికి వచ్చి బతిమాలి స్కూల్ కు తీసుకొని వెళ్ళే వారు .ఒడిలో కూర్చో బెట్టుకొని చదువు చెప్పేవారు .ఆ ఆప్యాయత జీవితం లో మరువ లేనిది .ఆయనా, ఆయన అన్న గారు కో ఆపరేటివ్ బాంక్ లో పని  చేసిన  కోట శ్రీరామ మూర్తి గారు మా  నాన్న గారి శిష్యులే .అందుకని మేస్టారికి నా మీద అంత ప్రేమ .వారి కృప, దయా, ప్రేమ ఆత్మీయత వలననే నేనూ నాలుగక్షరాలు నేర్చుకొని ఈ విధం గా నిలబడ గలిగానని వినమ్రం గా చెప్పుకొంటాను .నేను అయిదవ తరగతి హిందూ పురం లో చదివాను .మేము అక్కడి నుండి వచ్చేసరికి సూర్య నారాయణ మేష్టారు గుడివాడ దగ్గర బేతవోలు కు వెళ్లి పోయారని తెలిసింది .మా అన్నయ్య గారి అమ్మాయి ఛి సౌ  వేదవల్లి ని 1974లో చిరివాడ లో ఉంటున్న వేలూరి రామ కృష్ణ కు ఇచ్చి వివాహం చేశాము .వీళ్ళ కుటుంబం అప్పుడు చదువు కోసం బేత వోలు లో ఉండేది .వీరరు అద్దెకు ఉంటున్న ఇల్లు  సూర్య నారాయణ మేస్టారి ఇంటికి దగ్గరే .మేము తెలుసుకొని మేస్టారింటికి వెళ్లాం. వారు స్వర్గస్తులయ్యారని తెలిసింది .మేస్టారి భార్య గారిని చూశాం .వీరి పిల్లలూ ,మా అన్నయ్య గారి అల్లుడు రామ కృష్ణ,అతని  సోదరులూ గుడివాడ  కాలేజి లో క్లాస్ మేట్స్ .అలా మేస్టారిని చూడ లేక పోయినా వారి కుటుంబాన్ని చూసిన సంతృప్తి మిగిలింది

నరసయ్య గారి గుర్రపు స్వారి

గోపాల కృష్ణ గారి తండ్రి గారికి గుర్రపు స్వారీ హాబీ గా ఉండేది దానినే మంచి వ్యాయామం గ అభ్యాసం చేసే వారు .దీనికోసం కాశ్మీర్ నుంచి జాతి గుర్రాన్ని తెప్పించారు  .ఈయన తో బాటు తెలుగు దేశం మాజీ మంత్రి ,లోక్ సభ సభ్యుడు  వడ్డీ శోభనాద్రీశ్వరరావు తండ్రి  అంకయ్య చౌదరి కి కూడా కాశ్మీర్ నుంచి గుర్రాన్ని తెప్పించారు నరసయ్య గారు .దురదృష్ట వశాత్తు అంకయ్య చౌదరి గారి గుర్రానికి తీవ్రమైన జబ్బు చేసింది .ఆయన కోరిక మేరకు గుర్రాన్ని తుపాకీ తో కాల్చి చంపేశారు .నరసయ్య గారి గుర్రానికి వీర్యం   నష్టం కాకుండా ఉయ్యూరు పశువుల ఆస్పత్రి లో ఆప రేషన్ చేయించారు .విధి వక్రించి ఈ గుర్రానికి ఇన్ఫెక్షన్ సోకి చని పోయింది పాపం . ఏంతో ఉత్సాహం తో  ,గుర్రపు స్వారీ పై మోజు తో అంత దూరం నుంచి తెప్పించుకొన్న ఇద్దరి గుర్రాలు ఇలా జబ్బు పడి  చని పోవటం దురదృష్టకర సంఘటన అని గోపాల కృష్ణ గుర్తు చేసుకొన్నారు .

కమ్యూనిస్టులు –పోలీసుల వేటాట

గోపాల కృష్ణ గారి జ్ఞాపకాలలో ‘’కాటూరు ,యల మర్రులలో  ‘’పోలీసు జులుం ఇప్పటికి వణుకు పుట్టిస్తుంది ఒళ్ళు జలదరిస్తుందని చెప్పారు . కాటూరును ఆ రోజుల్లో’’ ఆంధ్రా మాస్కో ‘’అనే వారని గుర్తు చేసుకొన్నారు .ఆ రెండు ఊర్లలోఊరి లోని వారందరినీ బట్టలు విప్పదీయించి నడి బజార్లో భార్యా పిల్లల ముందు పోలీసులు పెరేడ్ చేయించే వారట .చూసే వాళ్ళు తల దించుకొనే వారట .ఇంత పాశవికం గా ,కిరాతకం గా ఆనాడు మల బారు పోలీసులు వ్యవహరించి ప్రజల్లో భీభత్సం సృష్టించారు .ఇలా చేయటానికి పోలీసులు చెప్పే కారణం వారందరూ కమ్యూనిస్ట్ టేర్రరిస్టూలకు ఇళ్ళల్లో ఆశ్రయం కలిపించి తిండి పెడుతున్నారనే అనుమానం .వాళ్ళను పోలీసుల కంట పడకుండా తప్పిస్తున్నారనే శంక .ఈ దారుణ ఉదంతం మన రాష్ట్రం లో మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో జరగటం సిగ్గు చేటు,ఘోరాతి ఘోరమైన పాశవిక చర్య  అని అభిప్రాయ పడ్డారు గోపాల కృష్ణ గారు . ఆ కాలం లో ప్రజల పరిస్తితి  ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉండేదని అన్నారు .తమను గురించి పోలీసులకు సమాచారం ఇస్తే కమ్యూనిస్టులు ప్రజలను చంపే వారు .సమాచారం ఇవ్వక ఊరుకొంటే, తెలియదని చెబితే పోలీసుల చేతి లో నరక యాతన .ఇదీ ఆ నాటి విపరీత విపత్కర పరిస్తితి .ఇరువైపులా హింస మధ్య ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపిన చీకటి రోజులవి .

కమ్యూనిస్టుల దారుణాలు కూడా మహా ఘోరం గా ఉండేవి .ఉయ్యూరు దగ్గర చిన ఒగిరాల కరణం గారు మిట్ట మధ్యాహ్నం భోజనానికి కూర్చుని తింటుండగా కమ్యూనిస్టులు వారి ఇంటిపై  దాడి చేసి తమ ఆచూకి పోలీసులకు చెప్పాడనే నెపం తో ఆ ముసలి ప్రాణం ఆప సోపాలు పడుతూ కాళ్ళా వేళ్ళా పడి ప్రాధేయ పడుతున్నా ,భార్య ముందే నిర్దాక్షిణ్యం గా కాల్చి చంపేశారు .ఇదొక సంచలనమే సృష్టించింది ఆ నాడు .చిన ఒగిరాల, పెదోగిరాల గ్రామాలు కమ్యూనిస్టు లకు పట్టు కొమ్మలు ఆనాడు .యల మర్రు లో ‘’హోం గార్డ్’’ ను కమ్యూనిస్టుల ఆచూకీ ని పై అధికారులకు తెలియ జేస్తున్నాడనే అనుమానం తో కమ్యూనిస్టులు దాడి చేసి చంపేశారు .దీన్ని బట్టి ఈ ఉదంతాల న్నిటికి పోలీసులు ,కమ్యూనిస్టులు ఇద్దరూ బాధ్యులే నంటారు గోపాల కృష్ణ గారు  ఇరువైపులా అతి ఉండటం దారుణం అన్నారు . ఈ  ఉదంతాలు చరిత్రలో మిగిలి పోయిన మాయని మచ్చలు .

మా ఇంటిలో ఇంటి బట్టలు ఉతికే యాక మూరు కు చెందిన ‘’మాణిక్యం’’ అనే చాకలి అమ్మాయి మా చిన్నతనం లో  ఈ రెండు ఊళ్లలో జరిగిన దురంతాలను మాకు కధలూ గాధలుగా కళ్ళకు కట్టి నట్లు చెప్పేది . నిశ్చేస్టూలమై  అలా చూస్తూ విం టూండే వాళ్ళం .ఎన్నో రోజులు ఈ విషయాలనే ప్రత్యక్షం గా చూసి నట్లు వీడియో లో చూపించినట్లు ఏదీ వదల కుండా పూస గుచ్చు నట్లు చెప్పి మాకు మా మాణిక్యం   చెబుతుంటే ఒళ్ళు గగుర్పోడిచేది .భయం తో పెద్ద వాళ్ళ వెనక చేరి ,వినే వాళ్ళం .అంత భయంకర సంఘటనలు ఇవన్నీ .

నూనె చంద్రయ్య

ఉయ్యూరు లో ‘’తెలక ‘’కులానికి చెందిన వాడు చంద్రయ్య .వేరుసెనగ నూనె నువ్వుల నూనె ఆముదం నూనెలను ఇంటింటికీ వచ్చి అమ్మేవాడు .ఆతని గురించిన జ్ఞాపకాలను నెమరేసుకొన్నారు గోపాల కృష్ణ గారు పచ్చని ఛాయా తో మల్లె పువ్వు లాంటి పంచ తో అలాంటి తెల్ల మల్లు చేతి బనీను తో   నూనె డబ్బాలను ఒక ట్రే లాంటి దాని లో పెట్టుకొని ఇంటింటికీ తిరిగి అమ్మేవాడు .మహా మాటకారి అన్నారు గోపాల కృష్ణ గారు ..చంద్రయ్య నార్త్ ఆఫ్రికా లోని ఈజిప్ట్ ,మరొక దేశం లో ఒక రాయ బారి ఇంట్లో చీఫ్ కుక్ గా అంటే’’ చెఫ్ ‘’గా కొన్నేళ్ళు పని చేసి మళ్ళీ ఉయ్యూరు చేరాడని గోపాల్జీ అంటారు .అప్పుడు అతను ఆ దేశాల గురించి ,ప్రజల గురించి అక్కడి ప్రజల పద్ధతుల గురించి తన వంట అనుభవాల గురించి  ,ఆచార వ్యవహారాల గురించి గోపాల కృష్ణ గారింటికి నూనె అమ్మ టానికి వచ్చి నప్పుడు కబుర్లలో కధలు గా,గాధలుగా  చెబుతూంటే ‘’అరేబియన్ నైట్స్ ‘’కధలు విన్నంత మహా అద్భుతం గా ఉత్కంఠ గా ఉండేదని చెవులు నిక్క బోడుచుకుని నోరు తెరుచుకొని వినే వాళ్ళ మని గుర్తు చేసుకొన్నారు .

చంద్రయ్య గురించి నా జ్ఞాపకాలు

చంద్రయ్య గురించి నా అనుభవాలనూ ఇక్కడ గుర్తు చేసుకొంటాను .ఆతను మాట్లాడుతుంటే అదో ‘’తమాషా యాస ‘’తో ఉండేది .కబుర్ల పోగు .బట్ట నలిగేది కాదు ఎప్పుడూ స్వచ్చం గా ఉండేవాడు నుదుట యెర్రని పెద్ద పొడవైన బొట్టు ఉండేది .అతను ఎంత నీట్ గా  ఉంటాడో అతను నూనె అమ్మే పాత్రలూ,కొల పాత్రలూ అంత నీట్ గా  నూ ఉండేవి .ఎప్పటికప్పుడు తుడుస్తూ తళ తళ మెరిసేట్లు వాటిని ఉంచేవాడు .చిన్న ఒంపు గొట్టం ఉన్న జర్మన్ సిల్వర్ పాత్రలలో నూనెలు పోసుకోచ్చేవాడు .ఎంత కావాలో చెబితే అకోల పాత్రను దాని కింద పెట్టి ఆ గొట్టం ద్వారా ఒంచి పాత్రలో నూనె పడేట్లు చేసి మన పాత్రలో పోసేవాడు .ఆవిధానం అంతా చూడ ముచ్చటగా ఉండేది .అతని వద్ద అతి స్వచ్చమైన నూనేలే ఉండేవని అందరూ చెప్పుకొనే వారు .లావు పాటి మనిషి గోచీ పోసి పంచ కట్టేవాడు ఎక్కడా నూనె మరక ఆయన బట్టలకు అంటగా నేను చూడలేదు .అంత జాగ్రత్త తీసుకొనే వాడు .చంద్రయ్య దగ్గరే అప్పుడు అందరూ నూనె కొనే వారు. లేక పోతే గానుగ దగ్గరకు వెళ్లి కొనేవారు .కాపుల బజారులో నువ్వుల నూనె గానుగ ఉండేది .

చంద్రయ్య క్రమంగా నూనె అమ్మకం మానేసి వంట మేస్త్రీ గానే  స్తిర పడ్డాడు .ఇతర కులాల వారి చాలా పెద్ద పెద్ద వంటలకు  పెళ్ళిళ్ళకూ ,పార్టీ మీటింగులకు  చంద్రయ్యే వంట చేసేవాడు .చాలా రుచిగా శుచిగా చేసేవాడని పేరు .చాలా దూరపు ఊర్లకు కూడా పిలిపించుకొని వంట చేయించుకొనే వారు . ఉయ్యూరు లో కాకాని వెంకట రత్నం గారు శాసన సభకు నిల బడి నప్పుడల్లా ఉయ్యూరు సెంటర్ లో బూరగడ్డ బసవయ్య గారి డాబా మీద పెద్ద పందిరి వేసి కాంగ్రెస్ ఆఫీసు ఏర్పాటు చేసి మీటింగులు నిర్వహించేవారు .ఆఫీస్ ఓపెనింగ్ కు చంద్రయ్య తో ఉప్మా ,కాఫీ చేయించే వారు .’’ఉక్కు కాకాని ఊర (వీర )కాకాని అంటూ మా స్నేహితుడు పెద్ది భొట్ల ఆదినారాయణ అక్కడికి వెళ్లి జైలు కొట్టేవాడు .ఓపెనింగ్ సమయం లో మమ్మల్నీ అక్కడికి తీసుకొని వెళ్లి ఉప్మా తిని పించి కాఫీ తాగించేవాడు. మహా రుచిగా ఉండేవి రెండూ .అంతే తప్ప చంద్రయ్య చేతి వంట భోజనం తిన్న గుర్తు లేదు

మిగిలిన జ్ఞాపకాలు

గోపాల కృష్ణ గారి జ్ఞాపకాల’’ తేగల పాతర ‘’లో ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల మరుపు రాని మరో సంఘటన గా చెప్పారు .అక్కడి రంగుల రాట్నం వాటిపై ఎక్కి తిరగటం ,’’చెర్ బొప్పాయి గుండు’’ ఆడటం గొప్ప అనుభవం అన్నారు .ఉయ్యూరు శివాలయం, రామాలయం అనే విష్ణా లయం ,ఉయ్యూరుకు మొదటి పంచాయితీ అధ్యక్షుడైన అలీం సాహేబు గారి డాబాలో పాత పంచాయితీ ఆఫీసు, పంచాయితీ రేడియోలో వార్తలు వినటం ,ఇప్పుడు డి.బి.ఆర్ కాంప్లెక్స్ గా ఉన్న చోట ఉన్న పాత పోస్ట్ ఆఫీసు ,పోలీసు స్టేషన్ వెనక ‘’వేశ్యాలోలుర డ్రైనేజ్’’ గా పిలువ బడే ‘’రత్తి’’ అనే వెడల్పు బొట్టు చెరగని చీర తో ఉండే భారీ పర్సనాలిటి తో ఉన్న ఆవిడా ,ఆయన జ్ఞాపకాల స్మృతుల లోనుంచి ఇంకా పోలేదు .

వెన్న పూస శేషయ్య   ,సున్నంవీరయ్య , గూడెం లో పూనకాలు పూనే కోటప్ప ,టైలర్ ఖాసిం సాహేబు ,ఉయ్యూరు సెంటర్ల్ ఉన్న్న రంగూన్ సేట్ సరుకుల కొట్టూ ,ఒంటెద్దు బండి సూరి ,సీతా రామయ్య సైకిల్ షాపు,ఊర వెంకయ్య దుకాణం లో సరుకులు కొనటం అక్కడే మందు గుండు సామాను దీపావళికి కొనుక్కోవటం ,రామి నేని బుచ్చి బాబు గారి  ఏకాంబరేశ్వర పిక్చర్ పాలెస్, దానికెదురు గా రోడ్డు మీద రామ కృష్ణా రావు కాఫీ హోటల్ అందులో ఆల్ ఇన్ వన్ గా పంచేసే లుంగీతో తెల్ల చొక్కా తో ఉండే ‘’ఓనర్ కం క్లీనర్ కం సరుకు మేస్త్రి’’ అయిన కోమటి  రామ కృష్ణా రావు  ఆ హోటల్లో పెసరట్టు రుచి ,ఇడ్లీ పై వేసే స్వచ్చమైన నేతి గుబాళింపు ,అల్లం చట్నీ పుట్నాల చట్నీ ,కారప్పొడి సాంబారు మరచి పోలేదు ఆయన .హోటల్ కు వచ్చిన వారి దగ్గర ఆర్డర్ తీసుకొని ‘’రెండు పెసరా మూడు ఉల్లి అట్టూ ‘’అని అరిచి లోపల ఎవిరికో పురమాయిస్తున్నాదేమో నాన్న భావం కలిగించేవాడు వెంటనే లోపలి వెళ్లి తానే అవన్నీ వేసి కాల్చి ప్లేట్ లలో తెచ్చేవాడు .తమాషాగా ఉండేది ఆ హోటల్ ను  కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహించే వారు. అలాగే అక్కడే ప్రక్కన ఉన్న సారదీ స్టూడియో దాని ఓనర్ మోహన రావు అతను ఫోటో లు తీసే నేర్పు ఆ కాలం లో అతనిది ఒక్కటే ఫోటో స్టూడియో కావటం, తరువాత సినిమా హాల్ రోడ్డులో ఎవరెస్ట్ ఫోటో స్టూడియో-వీరమాచనేని బాల గంగాధర రావు గారి తండ్రి గారిది ) రావటం మరిచిపోని విషయాలే ఆయనకు .రోగులకు అత్యంత స్వల్ప ఖర్చులతో వైద్య సేవలందించిన సి బి.ఏం హాస్పటల్ అప్పటి డాక్టర్ ‘’టింపిణీఅమ్మ గారు’’,సి బి ఏం స్కూలు ఆయన మరవ లేదు .

ఉయ్యూరుకు స్పెషల్ అయిన కడుపు నొప్పి తగ్గించే ‘’వామ్ వాటర్ ‘’మందు ,తయారు చేసి లక్షలు సంపాదించిన కంతేటి సూర్రాజు విశ్వనాధంధన రాజు  సోదరులు ,వారి వడ్ల మర బియ్యం మర ,పెద్ద వంతెన దగ్గర కంతేటి ధన రాజు వడ్లు ,అటుకుల మర ,ఆది రాజు చంద్ర మౌలీశ్వర రావు గారి దంపుడు బియ్యం మరా ఉయ్యూరులో ఆయనే మొదలు పెట్టిన మొదటి ప్రింటింగ్ ప్రెస్ ‘’ఉమా ప్రెస్ ‘’ మరపుకు  రావు అంటారు .

 

బెజవాడ ,బందరు రోడ్డు పై రెండువైపులా ఉన్న మామిడి వేప మద్ది ,గానుగ ,ఎనుగులవడాచెట్లు దానికి కాసే పొడవైన లావైన బ్రౌన్ రంగు కాయలు దానికింద ఏనుగులు వడ దెబ్బకు నీడలో విశ్రాంతి తీసుకోవటం ,తుమ్మ ,బొప్పాయి ,వాక ,చింత నేరేడు ఈత పళ్ళు మామిడి పళ్ళు ,అరటి తోటలు నేరేడు పళ్ళు ,వెలగ చెట్లు కాయలు ,సీమ తుమ్మ చెట్లు అతిరుచికరమైన వాటికాయలు కోసుకు తినటం ,రేగు పళ్ళు వడ్లు పోసి  కొనటం సంక్రాంతికి వచ్చే గంగి రెద్దు మేళాలు, హరిదాసులు ,అన్న పూర్ణ కావడితో బ్రహ్మం గారి తత్వాలు పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగే పానకాలు ,దసరా వేషాలు ,గూడెం లో ఫాల్గుణ పౌర్ణమికి ఊరే గిమ్పుగా వచ్చే వందలాది ఎడ్ల జతల బళ్ళు వాటి పై ఊరేగే ఆడవేషం లో వచ్చే లావుపాటి పూజారి అన్నీ ఆయనకు జ్ఞాపకమే .

ఉయ్యూరులోని పుల్లేరు కాలవలో ఈత కొట్టటం ,చిన్న వంతెన పై నుండి మంచి ఉరవడిగా ప్రవహించే  పుల్లేరు లో దూకి ఆనందించటం ,తీయటి మధుర జ్ఞాపకాలే మైనేని గోపాల కృష్ణ గారికి .అలాగే కుమ్మ మూరు గ్రామం లో వేసవి లో బందరు కాలువ గట్ల వెంబడి తిరుగుతూ సీమ చింత కాయల్ని కోసుకోవటం, స్నేహితుల తో తిరగటం మర్చి పోలేదు .ఒకటి రెండు పెళ్లిళ్లకు వెళ్ళటం జ్ఞాపకం .ఆయనకు ఉయ్యూరు జ్ఞాపకాలే ఎక్కువ .కుమ్మ మూరు జ్ఞాపకాలు చాలా తక్కువ .

ఉయ్యూరు గురించి ఇన్ని ‘’మధురోహలు ‘’మనతో పంచు కొన్నందుకు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిని అభినందిస్తున్నాను .

27-2-14-గురువారం –‘’మహా శివ రాత్రి ‘’సందర్భం గా శుభా కాంక్షలతో

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-14-ఉయ్యూరు

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

‘మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం

చల్ల పల్లి కె.సి.పి జనరల్ మేనేజర్ గారింట్లో ”ఆధ్యాత్మిక ప్రవచనం”

చల్లపల్లి లో కే.సి.పి.ప్లాంట్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు గారింట్లో రోటరీ ,ఇన్నర్ వీల్ సభ్యుల సమా వేశం లో నా ”మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కేరళ యాత్రా సంతర్పణ

మల్లికాంబ గారింట్లో కేరళ యాత్రా సంతర్పణ –

.మల్లికాంబ గారింటి నుంచి భోజనం  మా మిడి కాయ పప్పు ,వంకాయ చిక్కుడు కూర ఆలూ ఫ్రై ,కొత్త మామిడి ముక్కాల అవకాయి ,మామిడి అల్లం పచ్చడి ,పరవాన్నం ,చిత్రాన్నం ,గారెలు  పులుసు, అదిరే తియ్యటి గడ్డ పెరుగు తో భోజనం.కదుపు నిండా తిని  ఉన్నాం  భవాని  గారు కూడా వచ్చారు మా ఇద్దరికీ బట్టలు, ఆవిడకూ చీరా జాకెట్ పెట్టారు మల్లిక గారు .ఇది ఆవిడ సంతర్పణ   కేరళ యాత్రా ఫలిత భోజనం .

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాంగ్రెస్‌లో విలీనం తగదు

కాంగ్రెస్‌లో విలీనం తగదు

  • – బుద్దా మురళి

డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన కారణం ఇది ఆస్తిత్వ పోరాటం.
ఉద్యమం విజయవంతం అయ్యాక ఇప్పుడు టిఆర్‌ఎస్ కాంగ్రెస్ విలీన చర్చ సాగుతోంది. భౌగోళిక తెలంగాణను సాధించుకోవడం అంటే పది శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు, సాధించిన తెలంగాణను సమున్నత స్థాయిలో నిలబెట్టడానికి పునర్నిర్మాణం జరపడం 90 శాతం లక్ష్యం అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచుగా అనే వారు. ఇప్పుడు తెలంగాణ సాధించారు. లక్ష్యం ముగిసినట్టేనా? మిగిలిన 90 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది?
‘‘సీమాంధ్ర పార్టీల అవసరం మనకు లేదు, స్వీయ అస్తిత్వం కోసం తెలంగాణ పార్టీ అవసరం’’ అని పలు సందర్భాల్లో కెసిఆర్ బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సాధించిన తెలంగాణను గమ్యం చేర్చేందుకు ఇదే పోరాట పటిమ చూపిందేకు తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. అది టిఆర్‌ఎస్ కావచ్చు, కొత్తగా తెలంగాణ కోసం పుట్టే పార్టీలు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశం అస్తిత్వ పోరాటం. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం వల్లనే ఉద్యమం అంటే ప్యాకేజీలతో ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఎన్ని 610జివోలు జారీ చేసినా ఎవరూ తమ అస్తిత్వాన్ని వదలుకోవడానికి సిద్ధపడరు. తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి చివరకు తెలంగాణ అనే పదానికే అవమానం జరినప్పుడు, చివరకు తన గడ్డమీద తానే పరాయి దిగా నిలిచినప్పుడు అస్తిత్వ వాదంగానే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది. తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి కులం, ప్రతి మనిషి ఈ పోరాటంలో తానున్నానని చాటి చెప్పాడు. అస్తిత్వ వాదంతోనే ఉద్యమం సాగినప్పుడు తెలంగాణ సాకారం అయినప్పుడు తెలంగాణకు సొంత రాజకీయ పార్టీ ఉండా లా? అనే ప్రశ్న ఉదయించడమే విడ్డూరం. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎన్టీఆర్ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు భాష, సంస్కృతి కోసం పెద్దగా చేసిందేమీ లేదు. పైగా అప్పటి వరకు తెలుగు సంస్కృతి కోసం అంతో ఇంతో కృషి చేసిన నాటక , సంగీత అకాడమీ, సాంస్కృతిక అకాడమీ, అధికార భాష సంఘం వంటి వాటినన్నింటిని రద్దు చేశారు. సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఆవిర్భవించిన టిడిపిని ప్రజల ఆదరించడానికి తెలుగువారి ఆస్తిత్వ పోరాటం ఎంత మాత్రం కాదు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజలకు పీకల లోతు కోపం ఉంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. మేం వేదిక మొత్తం సిద్ధం చేసిన తరువాత అందులో ఎన్టీఆర్ వచ్చి కూర్చున్నట్టు అయింది అని ఆనాటి రాజకీయాలను విశే్లషిస్తూ బిజెపి నేత కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు ఒక సారి వ్యాఖ్యానించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది, తనకు ప్రజల్లో విపరీతమైన సినిమా గ్లామర్ ఉంది. దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగింది.
ఎలాంటి సినిమా గ్లామర్ లేదు , రాజకీయాల్లో నాలుగేళ్లపాటు మంత్రిగా పని చేసిన అనుభవం, సొంత జిల్లాలో గుర్తింపు తప్ప పక్క జిల్లాలో సైతం పెద్దగా గుర్తింపులేదు, తెలంగాణ వాదాన్ని నమ్ముకొని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో 13 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేయడం, చివరకు అసాధ్యం అనుకున్న తెలంగాణ కలను సాకారం చేశారు. కెసిఆర్ వెనక ఉన్న అసలైన బలం తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినా, రాజీనామా చేసినా, పదే పదే ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి టిడిపితో చేతులు కలిపినా అన్నింటికీ తెలంగాణ వాదులు సరేనన్నారు. కెసిఆర్ ప్రతి వ్యూహం సరైనదే అనే ఉద్దేశం తో కాదు… కెసిఆర్‌తోనే తెలంగాణ అస్తిత్వ వాదానికి గుర్తింపు లభిస్తుందనే గట్టి నమ్మ కం.. కెసిఆర్‌పై తెలంగాణ వారికే కాదు….. సీమాంధ్రులకు సైతం గట్టి నమ్మకం. అందుకే కెసిఆర్‌ను తెలంగాణకు గుర్తింపుగా తెలంగాణ వాదులు భావిస్తే, తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్ర నాయకులు సైతం కెసిఆర్‌నే తెలంగాణకు ప్రతిరూపంగా భావించారు. సీమాంధ్రులు తెలంగాణకు వ్యతిరేకంగా కెసిఆర్‌పై ఎక్కువ పెట్టిన బాణాలన్నీ, చేసిన విమర్శలన్నీ, రాసిన రాతలన్నీ తెలంగాణలో కెసిఆర్ ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగపడ్డాయి. అంతకు ముందు హేమా హేమీలు అనుకున్న ఎంతో మంది నాయకులు పోటీగా తెలంగాణ వాదం వినిపించినా తెలంగాణ అంటే కెసిఆరే అనే తెలంగాణ వాదులు భావించడం వల్ల ప్రత్యామ్నాయం వైపు కనె్నత్తి చూడలేదు. విజయశాంతి, నరేంద్ర, గద్దర్, దేవేందర్‌గౌడ్ లాంటి వారిని కెసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా నిలపాలని మీడి యా తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మీడియా కులం కార్డును ప్రయోగించినా దాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. ఒకటి రెండు శాతానికి మించని కెసిఆర్ సామాజిక వర్గం ఏదనేది తెలంగాణ వారు పట్టించుకోలేదు, సీమాంధ్ర మీడియా, నాయకులు ఈ అంశానే్న ప్రధానంగా ఎత్తి చూపించినా పట్టించుకోలేదు. చివరకు విజయశాంతి, నరేంద్రలు తమ పార్టీలను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. మీడియా బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్న సీమాంధ్ర వర్గాన్ని ఎదుర్కోవడానికి కెసిఆరే తెలంగాణ వారికి ఏకైక దిక్కుగా కనిపించారు. తమ అస్తిత్వాన్ని తాము ఇష్టపడం, తమ అస్తిత్వానికే సవాల్‌గా మారిన పరిస్థితులను ఎదుర్కోవాలన్న కసితో తెలంగాణ వారు కెసిఆర్ నాయకత్వానికి కొండంత అండగా నిలిచారు. పదే పదే రాజీనామాలతో తెలంగాణపై ఎంత అభిమానం ఉందో చూపించాలని కోరినా విసుక్కోలేదు. తీరా ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్‌ను ఎలాగైనా కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కొందరి ప్రయత్నం. ఇది కాంగ్రెస్‌పై ప్రేమతో కాదు… టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తీసుకు రావాలని, ఆ పార్టీ బాగుపడేట్టు చేయాలనే కోరికతో..
ఈ రెండు పార్టీలు విలీనం కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల ప్రకారం తెలంగాణలో టిఆర్‌ఎస్ మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలుస్తుంది. ఇక మూడవ, నాలుగవ స్థానం కోసం టిడిపి, వైకాపా, బిజెపి పోటీ పడాలి. అలా కాకుండా టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే టిడిపి, బిజెపి కలిసే అవకాశాలు ఉంటాయి. దాంతో వాళ్లు రెండవ స్థానంలో బలమైన ప్రత్యర్థులుగా నిలుస్తారు. టిడిపి మేలు కోరే వారికి కావలసింది ఇదే. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవలసిందే, వెంటనే విలీనం చేయాలి అంటూ టిటిపి నాయకులు విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేయడం రాజకీయ విడ్డూరం.
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తనకు రాజకీయ ప్రయోజనం ఉండాలని, టిఆర్‌ఎస్ విలీనం వల్ల అది సాధ్యం అవుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన టిఆర్‌ఎస్ ఇతర పార్టీల వలే ఒక కుటుంబ పార్టీ కాదని, పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ వాదం కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు చేసిన కృషి వల్ల టిఆర్‌ఎస్ ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకుందని గ్రహించాలి. ‘‘నియోజక వర్గానికో జగ్గారెడ్డి ఉంటాడు, మనం తెలంగాణ సాధించి కాంగ్రెస్‌లో విలీనం అయితే ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఇలాంటి వారికి తెలంగాణ అప్పగించినట్టు అవుతుంది’’, అని గతంలో పార్టీ నేతలతో కెసిఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లినట్టుగా కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఉపయోగించలేదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ఆత్మగౌరవ నినాదంగానే భావించారు. ఒకవైపు అభివృద్ధి సాధించడంతో పాటు మరో వైపు తెలంగాణ సంస్కృతి, కళలు, తెలంగాణ ఆస్తిత్వం నిలిచిపోయేట్టు, మహోన్నతంగా వెలిగిపోయేట్టు చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. విలీనం వల్ల ఇది సాధ్యం కాదు. తెలంగాణ జాగృతి సంస్థ చొరవ వల్ల గత దశాబ్ద కాలంలో తెలంగాణలో మళ్లీ బతుకమ్మ పండుగ సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. తెలంగాణ ఉద్యమమే లేకపోయి ఉంటే మహానగరంలో కాదు మారుమూల పల్లెలో సైతం బతుకమ్మ బిక్కుబిక్కుమంటూ కనిపించీ కనిపించకుండా దాక్కునేది. ఒక చిన్న సంస్థ ఆ పని చేసినప్పుడు తెలంగాణ సంస్కృతి తలెత్తుకునేట్టు తెలంగాణ ప్రభు త్వం చేయలేదా? ప్రాంతీయ సంస్కృతులపై జాతీయ పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేవు. అవి ప్రాంతీయ పార్టీల వల్లనే సాధ్యం. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చూపించాలనుకుంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు. ఎంపి సీట్లు ఎన్ని వచ్చినా కాంగ్రెస్‌కే భరోసా ఇవ్వవచ్చు. కానీ విలీనం చేస్తే ఇంత కాలం సాగించిన అస్తిత్వ పోరాటానికి అర్ధమే లేకుండా పోతుంది. తెలంగాణ ఆస్తిత్వమే లేకుండా పోతుంది. ఆస్తిత్వ పోరాటాన్ని గౌరవించాలనుకుంటే తెలంగాణకు సొంత రాజకీయ పక్షాలు అవసరం. అది టిఆర్‌ఎస్ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు కేవలం తెలంగాణ కోసమే పని చేసేట్టుగా ఉండాలి. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా తెలంగాణ కోసం మరో బలమైన పార్టీ వస్తుంది. రాజకీయంగా చూసినా విలీనం తప్పుడు వ్యూహం అవుతుంది. తమిళనాడు తరహాలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సొంత రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి అంటే తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. కొత్త రాష్ట్రం తప్పటడుగులు తప్పవు అలాంటి సమయంలో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవు. తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తును టిఆర్‌ఎస్ చేతిలో పెట్టినప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పులిపై స్వారీ ప్రమాదకరం!

పులిపై స్వారీ ప్రమాదకరం!

  • ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668

ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి భారీ సంఖ్యలో విదేశీయులు వెస్ట్ బెంగాల్‌లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే! ఇందుకు కారణం ‘జనాభా విస్ఫోటనం’అని సామ్యవాదులు వ్యాఖ్యానించారు. అంటే జనం ఎక్కువైనప్పుడు ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతానికి వలసపోతారని వారి వాదం. అంటే ఇక్కడ సరిహద్దులు దేశాలు సంస్కృతి మతం వంటివి అడ్డురావని వారి భావన. నిజానికి బెంగాల్ సంస్కృతి భాష బంగ్లాదేశ్ సంస్కృతి భాష వేరువేరు కాదు. రెండూ ఒకటే. కేవలం మతం మాత్రమే తేడా! 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. దానినే వందేమాతరం ఉద్యమం అంటారు.
1947కు ముందు భారతదేశపు జనాభా నలభై కోట్లలోపే ఉండేది. నలుబది కోట్ల భారతీయులే కల్యాణి చల్లని కడుపుపంట’అని జంధ్యాల పాపయ్యశాస్ర్తీగారు అప్పుడు కవిత్వం వ్రాశారు. ఇవ్వాళ (2013) భారత జనాభా నూటఇరవై కోట్లు దాటింది. తద్వారా అవసరాలు పెరిగాయి. అరణ్యాలు వ్యవసాయభూములు చెరువులూ ఆవాసాలుగా మారిపోయాయి. హైదరాబాదు నగరం మూడు లక్షల మందికోసం ప్లాన్ చేయబడింది. నేడు గ్రేటర్ హైదరాబాదులో కోటి మంది జనాభా ఉంది. అంటే దాదాపు సింగపూర్ వంటి ఒక స్వతంత్ర దేశంలో సమానమన్నమాట. నా తెలంగాణా కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి. ఇది 1950కి ముందుమాట. నేడు తెలంగాణా జనాభా మూడు కోట్లు దాటింది. ‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం’అని ఓ సినిమా పాట 1960వ దశకంలో వచ్చింది. కాని నేడు ఆంధ్రప్రదేశ్ జన సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. అందువల్ల పరిపాలనా సౌకర్యంకోసం మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాలని బిజెపివారు వాదిస్తున్నారు.
1950వ దశకంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది జరిగింది. దానిని చక్రవర్తుల రాజగోపాలాచారి వ్యతిరేకించారు. ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.గోల్వార్కర్ వ్యతిరేకించారు (చూడండి: బంచ్ ఆఫ్ థాట్స్.) వారు యూనిటరీ రాజ్యాంగ వ్యవస్థను సమర్ధించారు. ఐతే అప్పుడు బలంగా ఉన్న సంయుక్త కమ్యూనిస్టుపార్టీ తెలుగు మాట్లాడేవారంతా ఒకే గూడుకు నీడకు రావాలని వాదించారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవాడా? అని కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ వ్రాసిన గేయం చాలా ప్రచారాన్ని పొందింది. ‘మాకు తెలుగు ప్రాంతం ఇవ్వకపోతే రష్యా సహాయం తీసుకుంటా’అని ఒక ప్రకటన చేయటం ఈ తరంవారికి తెలియదు. మొత్తంమీద పండిత్ జవహర్‌లాల్ నెహ్రూగారు భాషాప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణా సంయుక్త మహారాష్టన్రుండి గుజరాత్ వేరు చేయబడింది. శాసనసభ రద్దు కావటంతో విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్‌గా 1956 నవంబరు 1వ తేదీ అవతరించింది. అయితే 1969లో తిరిగి ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాలు విడిపోవాలనే ఉద్యమం తీవ్రంగా సాగింది. అలాగే ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాంచల్‌ను విడదీశారు. మధ్యప్రదేశ్ నుండి చత్తీస్‌గఢ్‌ను వేరుచేశారు. బీహారునుండి జార్ఖండ్ విడివడింది. ఇదంతా పరిపాలనా సౌకర్యంకోసమేనని అప్పటి ఎన్.డి.ఏ. ప్రభుత్వం చెప్పింది అంటే జనాభా పెరిగినప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రాల దృష్టికోణం (కానె్సప్ట్) పక్కనపెట్టి సత్వరాభివృద్ధికోసం చిన్న చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేయాలనే వాదం మొదలైంది. అంటే ఒకే హిందీ భాష మాట్లాడే వారికి నాలుగు రాష్ట్రాలు ఉండవచ్చు. అదే తర్కం తెలుగువారికి కూడా వర్తింపజేసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టారు. ఇదంతా పరిపాలనా సౌకర్యంకోసమే నని వాదించవచ్చు. కానీ పాలనాసౌల్భ్యంకోసనే విభజన చేసామని చెప్ప కున్నా, మరో వాదన ప్రకారం తెలంగాణాలోని తొమ్మిది జిల్లాలు ఒక రాష్ట్రం చేసివుండాల్సింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కల్పుకొని గ్రేటర్ హైదరాబాదు మరొక రాష్టమ్రవుతుంది. కోస్తా మొత్తం ఒక రాష్ట్రం. రాయలసీమ మొత్తం మరొక రాష్ట్రం. అంతేకాదు రాయలసీమలో కర్ణాటకనుండి బళ్లారిని విడదీసి కలుపవచ్చు. తమిళనాడు నుండి కృష్ణగిరి-తిరుత్తని విడదీసి కలుపవచ్చు. తిరుపతి కేంద్రంగా ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయవచ్చు. దీనిని గ్రేటర్ రాయలసీమ అంటారు. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కాని ఇవేమీ పాలక పార్టీలకు పట్టలేదు. అంటే పరిపాలనా సౌకర్యం, భాషాప్రయుక్త రాష్ట్రం అనే దృష్టి (కానె్సప్ట్) కాకుండా ఏంచేస్తే తమ పార్టీ అధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుంది? అనే దృష్టికోణం ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాయ. దానే్న అమలు పరచాయ.
మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో బీహారీలు యుపివారు ఉండకూడదని రాజథాకరే హెచ్చరించారు. హైదరాబాదులో ఆంధ్రోళ్లు ఉండకూడదని తెలంగాణా నాయకులు చిల్లకల్లు (నల్గొండ జిల్లా బార్డర్)వద్ద అడ్డుగోడ కట్టారు. అంటే పరిపాలనా సౌకర్యంకోసంకాక విద్వేషాలతో ఈ ఉద్యమాలు నడుస్తున్నాయని సారాంశం. అఖిల భారత స్థాయిగల కాంగ్రెసు-బిజెపిలు దీనికి ఏం సమాధానం చెపుతాయి? ఒక పార్టీ గెలిచినా ఓడినా ప్రజాక్షేమమే ప్రధాన దృష్టిగా ఉండాలి అనే ఆలోచన దాదాపు అన్ని రాజకీయ పార్టీలల్లోనూ శూన్యం. ఇదే అసలు సమస్య.
చిన్న రాష్ట్రాలు- పెద్ద రాష్ట్రాలు అనే దృక్పధంతో సమస్యలు పరిష్కారం కావు. భారతీయులంతా ఒకటే అనే భావాత్మక సమైక్యత లేకపోతే భారతదేశం 1990లో రష్యా విడివడినట్లు చిన్న చిన్న దేశాలుగా విడిపోతుంది. ఇది ఊహాగానం కాదు. చైనావారు స్పష్టంగా తమ వెబ్‌సైట్‌లో ఈమధ్య ఈ అంశాన్ని ప్రచురించారు. ‘‘్భరత్ 50 చిన్న దేశాలుగా మారుతుంది’’ అని తేల్చి చెప్పారు. ప్రాంతీయ పార్టీల సంగతి అటుంచి అఖిల భారతీయ పార్టీలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వేచిచూడవలసిందే.
1947కు ముందు భారతదేశంలో మూడువందల స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాటన్నింటినీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇండియన్ యూనియన్‌లో నయానా భయానా సామదానభేద దండోపాయాలు ప్రయోగించి కలిపివేశారు. కాని నేడు ఇటు గల్లీలో కాని అటు ఢిల్లీలో గాని సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఉక్కుమనుషులు ఒక్కరూ లేరు. ఇదే సమస్య.
భాష- మతం- సంస్కృతి అనుబంధ హేతువులని ఒకప్పుడు భ్రమించేవాళ్లం. కాని పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడివడటం ఆంధ్రనుండి తెలంగాణా విభజన కోరటం- వంటి అంశాలు పరిశీలిస్తే మతం-్భష మానవ హృదయాల మధ్య అనుసంధాన సేతువు హేతువుకాజాలదని సిద్ధాంతీకరింపవలసి వస్తుంది!! భాషాపరంగా జయలలిత-కరుణానిధి ఒకటే. అయినా పరస్పర గవనానికి ఎందుకు సిద్ధపడ్డారు?? అరాజక పరిస్థితులలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు. అప్పుడేమవుతుంది? పాకిస్తాన్‌లో వలె సైనిక పాలన వస్తుంది. అంటే పెనంనుండి పొయ్యిలోకి పోయినట్లవుతుంది.
జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో నక్సలైట్ల సమస్య పెరిగింది. ఇక గోవా, హర్యానాలల్లో ఆయారాం గయారాం ప్రభుత్వాలు వచ్చాయి. తాత్పర్యం ఏమంటే వౌలికంగా ప్రజలలో మార్పులు తీసుకురానంతవరకు భౌగోళిక పరిణామాలతో హద్దులూ సరిహద్దులూ మార్చి రెండవ ఎస్.ఆర్.సి వేయటంవల్ల ప్రయోజనం ఉండదు. పదవీ లాలస మరిగినవారు మరికొన్ని కొత్త సమస్యలు సృష్టిస్తారు. రాబోయే ఎన్నికల లాభాన్ని గురించి ఆలోచించేవాడు పొలిటీషియన్- రాబోయే తరాన్ని గురించి ఆలోచించేవాడు స్టేట్స్‌మన్. గుర్రపు స్వారీ సరే- కాని పులిస్వారీ ప్రమాదకరం? భింద్రేన్‌వాలే అనే పులి ఇందిరాగాంధీని తినేసింది. ప్రభాకరన్ అనే టైగర్ సత్పురుషుడైన రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకున్నది. ఇప్పు డు భ్రమ (ఇల్యుషన్)తో వ్యాఘ్రభ్రమణం ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు.

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

భరద్వాజ గారి కార్యక్రమం పై పేపరు సందడి

అమరవాణి హైస్కూల్ లోరావూరి భరద్వాజ గారి అవగాహనా సభ

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభnews coverage 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లెట్స్-బాబు పై

chandra babu pai  dviplets 001

Posted in రాజకీయం | Tagged | 2 Comments

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు- 60వ సమావేశం –శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

                            60వ సమావేశం –శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

                                  ఆహ్వానం

తేదీ సమయం –30 -3-2014—ఆదివారం –మధ్యాహ్నం 3-గం లకు

వేదిక –         ఉయ్యూరు షుగర్ ఫాక్టరీ దగ్గర ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం  

సరస భారతి 60 వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం మధ్యాహ్నం 3గం ల నుండి కె.సీ.పి. ,రోటరీ క్లబ్ వారి సౌజన్య సహాయ సహకారాలతో నిర్వహిస్తోంది .ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రపంచ ప్రసిద్ధ ‘’ఈల విద్వాంసులు ‘’శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు విచ్చేసి సరసభారతి ఉగాది పురస్కారాన్ని స్వీకరిస్తారు .తరువాత వారు ‘’ఈల కచేరి ‘’నిర్వహించి శ్రోతలను తన్మయులను చేస్తారు .

   జర్న లిస్టు ఘనాపాఠీ,’’ఆంద్ర ప్రదేశ్ మాస పత్రిక ‘’సంపాదకులు శ్రీ జి.వల్లీశ్వర్ ,విజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకులు శ్రీమతి ముంజలూరి కృష్ణ కుమారి ,కే.సి.పి .సి ఒ.ఒ. శ్రీ జి వెంకటేశ్వర రావు ,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.కే శ్రీ విద్య(ఏం డి.) ఆత్మీయ అతిధులుగా విచ్చేసి ఉగాది ఆత్మీయ పురస్కారాలను అందుకొంటారు .

 జిల్లా నలు మూలల నుండి యాభై మందికి పైగా కవులు ‘’ఉగాది కవి సమ్మేళనం’’ లో పాల్గొని ‘’వివాహం –దాంపత్యం ‘’అంశం పై తమ కవితలను వినిపించి అలరిస్తారు

   .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది  .

   సంగీత సాహిత్యాభిమానులు కవులు ,కళా కారులు , అందరూ  ఈ కార్య క్రమం లో పాల్గొని విజయ వంతం చేయ ప్రార్ధన .

    అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక త్వరలోనే అందజేస్తాం .

    జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్

    గౌరవాధ్యక్షులు                 కార్య దర్శి            కోశాధికారి               అధ్యక్షులు –సరసభారతి

                                                                ఉయ్యూరు -24-2-14

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అమరావాణి హైస్కూల్ లోరావూరి భరద్వాజ గారి అవగాహనా సభ -మరియు పమిడి ముక్కాలా హై స్కూల్ లో మాత్రు భాషా దినోత్సవం -22-2-14

This gallery contains 54 photos.

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

More Galleries | Tagged | Leave a comment

శివ రాత్రి -ప్రత్యేకం –

2maha prana nadham 001 3maha prananadham 001 mahaprana naadham 1 001

Posted in వార్తా పత్రికలో, సేకరణలు | Tagged , | Leave a comment

మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా

సాహితీ బంధువులకు -రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్తితుల దృష్ట్యా మార్చి 1,2,3లలో జరగాల్సిన0001  మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా పడినాయని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు ఫోన్ లో ఇప్పుడే నాకు తెలియ జేయగా మీకందరికీ తెలియ బరుస్తున్నాను .–దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వెండి తేర బంగారం ఆఅ నాటి విలన్ ఆర్ నాగేశ్వర రావు

gaddi kala 001 r nag 001

Posted in సినిమా | Tagged | Leave a comment

మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపక పరిమళాలు

    మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు   జ్ఞాపక పరిమళాలు

శ్రీ మైనేని ని గోపాల కృష్ణ గారి స్వగ్రామం కొమ్మ మూరు .ఉయ్యూరుకు నాలుగు కిలో మీటర్లు .వారి తండ్రిగారు వెంకట నరసయ్య గారు. తల్లి గారు సౌభాగ్యమ్మ గారు .తాత గారు తాతయ్య చౌదరి గారు .నాయనమ్మ చిలకమ్మ గారిది ఆ ప్రక్కనే ఉన్న గరిక పర్రు .తాత గారి మేన మామ సూరప నేని సూరయ్య  గారి పుత్రికే చిలకమ్మ గారు .గోపాల కృష్ణ గారి పెద్దన్నయ్యకు సూర్య నారాయణ అని నాయనమ్మ గారే పేరు పెట్టించారు .అందుకని ఆయన్ను ‘’బాబు ‘’ అని ఆమె పిలిచే వారు .అందువల్ల ఆయన్ను అందరూ’’ బాబు’’ అని లేక’’ పెద బాబు’’ అని పిలిచేవారు  .చిలకమ్మ గారు 80ఏళ్ళకు పై బడి జీవించారు .గోపాల కృష్ణ గారికి ఆమె బాగా జ్ఞాపకం ఉన్నారు .రాత్రి పూట ఆమె ‘’హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘’మంత్రాన్ని ఆరుబయట కూర్చో బెట్టి  చెప్పిన   జ్ఞాపకమూ ఆయనకు ఉన్నది .గోపాల కృష్ణ గారి తాత గారి మరణ సమయం ఆసన్న మైనదని తెలుసుకొన్న తండ్రి గారు బెజా వాడ నుండి ఫోటో గ్రాఫర్ ను తీసుకు వచ్చి వీరి తాత గారి ఫోటో తీయించారు. ఫోటో తీసిన కొన్ని రోజులకే తాతయ్య గారు1928లో  మరణించారని గోపాల కృష్ణ గారికి చెప్పారట  . .వారి మరణం వీరికి తెలియదు .అప్పటికి వీరి కుటుంబం ఉయ్యూరుకు రాలేదు .

గోపాల కృష్ణ గారు 10-1-1935లో ఉయ్యూరు లో జన్మించారు అందువల్ల తన స్వగ్రామం ఉయ్యూరు అనే చెబుతారు .పిల్లల చదువు పల్లెటూరు అయిన కుమ్మ మూరు లో సాగదు అని తండ్రి గారి తో పోరి, కాపురాన్నివీరి తల్లి గారు ఉయ్యూరు లో కాపురం పెట్టించారట .అప్పటి శ్రీ రామ కృష్ణా రైస్ మిల్ నుకీ శే .వెంట్రప్రగడ  మల్లయ్య గారి కుమారుదు అంజయ్య గారు ,రామి నేని బ్రదర్స్ ,మైనేని బ్రదర్స్ కలిసి నిర్మించారట .ఉయ్యూరు లో మొదటి కలప వ్యాపారాన్ని,(ఇది వెల్లంకి వెంకట రాయులు పేర ఉన్నా ) మొదటికాంక్రీటు వర్క్స్  ,  మొదటి సినిమా హాలు ను కూడా మైనేని గోపాల క్రిష్నయ్య గారి తండ్రిగారు వెంకట నరసయ్య గారే ప్రారంభించారు  ,వ్యాపారం వారికి వెన్నతో బెట్టిన విద్యలా అలవడింది .గాలి వానకు రెండు సార్లు కూలి పోయినందు వలన  మాను కొన్నారు .అదే ఇప్పుడు శాంతి దియేటర్ ఉన్న స్థలం .అంతకు ముందు ఉప్పుడు మిల్లు ఉండేది .వీరి తండ్రిగారు ‘’సౌభాగ్య కోటేశ్వరి సూపర్ మార్కెట్ ‘’ను ఏర్పాటు చేయాలని శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారి తండ్రి గారిసలహా సంప్రదింపులతో  ప్లాన్ కూడా వేశారు .ఇప్పుడున్న పిల్లి మాణిక్యం కొడుకు తిరుపతి రావు డాబాలో ఒక బట్టల షాపు కూడా ప్రారంభించారు .ఇవన్నీ గోపాల కృష్ణ గారి బాల్య జ్ఞాపకాలు .వీరితల్లి దండ్రులకు  చాలా కాలం పిల్లలు కలుగక పోతే కాశీ ,ప్రయాగ, బదరీనాధ, కేదార నాద ,రామేశ్వర పుణ్య క్షేత్రాలను దర్శించి వచ్చారు అలహా బాద్ లో మోతీలాల్ నెహ్రు గారి ఇల్లు కూడా చూసి వచ్చారట వారు .యాత్రా ఫలము ,పూర్వపు నోముల ఫలమూ కలిసి తొమ్మిది మంది సంతానం కలిగింది .ఇంత వరకే గోపాల కృష్ణ గారికి జ్ఞాపకం అన్నారు .ఇదంతా 1950కి పూర్వం జరిగిన సంఘటనలు .ఆ తర్వాత గోపాల కృష్ణ గారు పై చదువులకోసం బెజవాడ వెళ్ళారు .

1976లో గోపాల కృష్ణ గారి తండ్రి గారు నరసయ్య గారు మరణించారు .అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరికి ఏదికావాలో తీసుకోమని అంటే గోపాల కృష్ణ గారు ‘’నానా రాజన్య విఖ్యాత జన చరిత్రము ‘’అనే పుస్తకం కావాలని చెప్పి తీసుకోన్నారట .అది తరువాత ఏమైనదో తెలియదని ఇప్పటికి బాధ పడతారు .ఆ పుస్తకాన్ని అంత విలువైనదిగా ఆయన భావించారు .2004 లో గోపాల కృష్ణ గారి భూరి విరాళం తో ఇప్పుడున్న ఏ సి గ్రంధాలయం ఏర్పడి ప్రారంభోత్సవానికి వారు వచ్చారు .అప్పుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర ఒక పాత ప్రతిని సంపాదించి ఉయ్యూరులో వీరికి అందజేశారు .ఆ పుస్తకం లో ఏంతో మంది ఆంద్ర ప్రముఖుల జీవిత చరిత్రలు ఫోటోలు ఉన్నాయని అది అమూల్య మైన పుస్తకమని,దాన్ని చేజార్చు కొన్నందుకు ఇంకా బాధ పడుతూనే ఉన్నానని గోపాల కృష్ణ గారంటారు .ఆ గ్రంధం లో  వీరి తాత గారు తాతయ్య చౌదరి గారి గురించి కూడా వివరం గా ఉంది .అందులోని ముఖ్య విషయాలు తెలుసు కొందాం .                          శ్రీ మైనేని తాతయ్య చౌదరి

1861 దుందుభి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కుమ్మ మూరు గ్రామం లో కమ్మ వారి ఇంట శ్రీ మైనేని తాతయ్య చౌదరి గారు జన్మించారు .పూర్వాచార పరాయణులు ,గుణ శీల సంపన్నులు .వీరి పూర్వీకులు దేవర కోట సంస్థానం లో ముఖ్యనాయకులు .బంది పోట్లను అణచి వేసి, శాంతి భద్రతలను కాపాడిన ధైర్య సాహసో పేతులు .అందువల్ల .సంస్థానాదిపతుల మన్ననలను పొందారు .అందులో వెంకయ్య గారొకరు .విశేషం గా దనం సంపాదించి .వితరణము నందు ముందు నిలిచారు .వెంకయ్య గారికి వెంకట నరసయ్య అనే పుత్రుడు కలిగాడు .పశువులకు మనుష్యులకు త్రాగు నీటి సౌకర్యం లేనందువలన వెంకట నరసయ్య గారు బందరు పడవల కాలువ కు ఆనుకొని ఉన్న కుమ్మ మూరు గ్రామానికి దగ్గర ‘’దేశాలమ్మ చెరువును ‘’ఎంతోస్వంత  డబ్బునుఖర్చు చేసి   ‘’త్రవ్వించి నీటి కొరత తీర్చిన దయామయుడు .వీరికి మొదటి భార్య వలన ఇద్దరు కుమార్తెలు కలిగారు .పుత్ర సంతానం కోసం 80వ ఏట ద్వితీయ వివాహం చేసుకొన్నారు .వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కలిగారు .ఈ కొడుకులలో ఒక రైన వెంకట రత్నం గారికిలక్ష్మీ నారాయణ ,తాతయ్య అనే కుమారులు పుట్టారు .

మైనేని తాతయ్య గారు చిన్నతనం నుండి కుటుంబ వ్యవహారాలకు దూరం గా ఉంటూ ,అనేక సద్విషయాలను సంగ్రహిస్తూ ,గడిపారు .వీరి యవ్వనం లో తండ్రిగారే కుటుంబ బాధ్యతలను నిర్వహించేవారు .వీరి వార్ధక్యం లో కూడా వీరి కుమారులే వ్యవహారాలను చూసుకోవటం వలన ఎప్పుడూ ధర్మా చారాలతో వెళ్ళ బుచ్చుతూ విశ్రాంతి గా ఉండేవారు తాతయ్య గారు .ఐహికం పై కాక అముష్మికం పైనే ద్రుష్టి నిలిపిన వీరి జీవితం లో ఒక సంఘటన మార్పు తెచ్చింది .యోగుల వలన ,చదివిన ఆధ్యాత్మిక గ్రంధ పరిచయం వలన తాతయ్య గారికి ఉన్మాదాన్ని  నివారించే ఔషధం తయారు చేసే ప్రక్రియ అలవడింది .తన స్వంత మందులతో వేలాది మంది పిచ్చి వాళ్లకు వైద్యం చేసి నయం చేసి మంచి కీర్తిని పొందారు .వీరి పేరు జిల్లా దాటి వ్యాపించింది .ఎక్కడెక్కడి నుండో రోగులు వచ్చి  చికిత్స చేయించుకొని స్వస్థత పొంది వెళ్ళేవారు .బందరు వాసి ముక్తేవి ప్రకాశ రావు అనే లాయరు గారి సోదరుడు తీవ్ర ఉన్మాదం తో ఉంటె వైద్యం చేసి మామూలు మనిషి ని చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటింగ్ ఇన్స్పెక్టర్ అప్పల నరసయ్య గారి పిచ్చి ని కూడా నయం చేశారు .వీరు ఇచ్చే  డాక్టర్ సరిఫికేట్ కు ఏంతో  విలువా ,గౌరవం ఉండేది .ప్రతిఫలాపేక్ష లేకుండా పశువులకూ గుర్రాలకూ వైద్యం చేసి రోగాలను పోగొట్టే చాతుర్యం తాతయ్య గారిది .

తాతయ్య చౌదరి గారు అశ్వ పరీక్ష లో ,ఆశ్విక శిక్షణ లో గొప్ప సమర్ధులు .వీరు తలబెట్టిన ప్రతి పనిని కుమారుల నుండి మంచి ప్రోత్సాహం లభించేది .దైవ చింతన తో ,పరోప కార పారీణత తో,సార్ధక జీవనాన్ని సంతృప్తిగా గడిపి  ,1928 శ్రీ విభవ నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి సోమవారం  డిసెంబర్ మూడవ తేదీన మరణించారు .

తాతయ్య గారి పెద్ద కుమార్తె ను గుడ్ల వల్లేరు లోని మల్లికార్జున చౌదరి అనే సంపన్నునికిచ్చి వివాహం చేశారు .చిన్న కుమార్తెను చిన ఒగిరాల వాస్తవ్యులు ,భూస్వామి అయిన కంచెర్ల వెంకట రత్నం గారికిచ్చి పెళ్లి చేశారు .పెద్దకుమారుడు నరసయ్య గారు కుమ్మమూరు మునసబ్ గా ఉండేవారు నరసయ్య గారు సాదు శీలి దకష్ట గల వారు వ్యాపార వేత్తలు .ఆంద్ర ఆంగ్ల భాషలలో నిష్ణాతులు .తమ్ముడు  లక్ష్మీ  నారాయణ ను గృహ వ్యవహారాలను నిర్వహించే ట్లు చేశారు మిగిలిన ఇద్దరు సోదరులు గోపాల క్రిష్నయ్య ,పరందాంయ్యలను ఇంగ్లీష్ విద్య చదవటానికి ప్రోత్సహించారు .వీరిలో మూడవ వారైన గోపాల క్రిష్నయ్య గారు సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ,పాఠ శాల ను పరిత్యజించి ,కొంతకాలం సంస్కృతాన్ని అభ్యసించి ,ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తించి మళ్ళీ బడిలో చేరి చదువు కున్నారు .పరంధామయ్య గారు పట్ట భద్రులయ్యారు .

మైనేని వెంకట నర్సయ్య గారు అంటే గోపాల కృష్ణ గారి తండ్రి గారు కుమ్మ మూరు గ్రామం లో మంచి పలుకు బడిని సంపాదించి పెద్దరికం తో అందరి దృష్టినీ ఆకర్షించారు .గ్రామం లో విద్యాభి వృద్ధికి ఒక పాఠ శాల నెలకొల్పి,మంచి భవనాన్ని నిర్మించిన ఆదర్శ మూర్తి , విద్యాభిమాని ..ఈ స్కూల్ లోనే మొదట్లో  స్వర్గీయ లంకా బసవా చారి గారు టీచర్ గా పని చేశారు .ఆయన వద్దనే గోపాల కృష్ణ గారి అక్కగారు ,అన్నగారు చదువుకొన్నారు .బసవాచారి గారు నాకూ ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి క్లాస్ టీచర్ .ఇంగ్లీషు సోషల్ చెప్పేవారు .ఆ తర్వాత అదే స్కూల్ లో ఇద్దరం కలిసి ఉపాధ్యాయులు గా పని చేశాం .విద్య పై నరసయ్య గారికి ఉన్నఅభిమానం , ఆదరణ మాటల తో చెప్ప లేనిది .బందరు జాతీయ కళా శాలకు ఒక అర ఎకరం మాగాణి భూమిని ,,వెయ్యి రూపాయలను విరాళం గా ఇచ్చి దాన శాసనాన్ని రాయించిన వితరణ శీలి ,దాత, దాన గుణ సంపన్నులు ,ధర్మ స్వరూపులు .ఈ పవిత్ర కార్యానికి తండ్రి గారు తాతయ్య చౌదరిని ప్రోత్సాహ పరచి కీర్తిని సాధించిన పుణ్య మూర్తి .డబ్బు, సంపదా పుష్కలం గా ఉన్న మైనేని వారి కుటుంబం ఉదార శీలం చేత దాన గుణం చేత, విద్యాభిమానం చేత, ధర్మా చరణం చేత అందరి మనసులనుఆకర్షించారు . ఏది చేసినా సామాజిక బాధ్యత గా చేశారే  తప్ప కీర్తి కోసం ఆశ పడి చేయనే లేదు ..

ఇందులోని మైనేని తాతయ్య చౌదరి గారి  జీవిత విశేషాలను  గోపాల కృష్ణ గారు నాకు 2011 జూన్ నాలుగవ తేదీ పంపిన  బందరు హిందూ కాలేజి తెలుగు పండితులైన శ్రీరాం వీర బ్రాహ్మ కవి గారు రాసిన ‘’నానా రాజన్య చరిత్రము ‘’లోని వ్యాసం లోనివే. భాష సరళం చేసి రాశాను అంతే .

myneni tatayya choudari chilakamma 001 myneni venkata narasayya 001ఫోటోలు జత చేయ బడినవి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-14-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

సీకుంతలక్కయ్యా.. సినయ్యగారికి ఫోన్లు? సినీ మాటల రచయిత చింతపల్లి రమణ- మాటల పోగు

లను విడివిడిగా గిన్నెల్లో పోసి.. నీకు ఏదంటే ఇష్టం? అని అడిగితే- గబగబా వాటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో పోసి కలిపి ‘ఇదంటే ఇష్టం’ అనే రకం చింతపల్లి రమణ. లేకపోతే ఆయన ‘నవరస మాటకారి’ అయ్యుండేవారు కాదేమో! జనం నోళ్లలో నానే భాషనే ఏరుకుని.. ఆ మాటలకు చక్కెర పూత పూసి.. సినిమా గొంతుగా మార్చి.. తెర మీద ఆడించాక.. వాటిని విని విజిళ్లు కొట్టే జనమే తనకు ప్రేరణ అంటున్న ఆయన.. తను రాసిన డైలాగుల్లో కొన్నింటిని ‘నవ్య’ కోసం గుర్తుచేసుకున్నారు. ఆయనే ఈ వారం ‘డైలాగ్‌గురూ’..

సుప్రభాతం
భర్తను అపార్థం చేసుకునే భార్యతో ఆమె తల్లిదండ్రులు “ఓం అనే అక్షరంలో నీకు వంకర కనపడుతోంది. మాకేమో దేవుడు కనబడుతున్నాడు” అంటారు.

తొలిప్రేమ
పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్లిపోతుంటుంది చెల్లెలు. హీరో అయిన అన్నయ్య అప్పటికే ప్రేమించిన అమ్మాయికి దూరమై ఉంటాడు. ఇన్నాళ్లూ తోడుగా ఉన్న చెల్లి కూడా వెళ్లిపోతుండే సరికి “బుజ్జీ నువ్వు కూడా వెళ్లిపోతున్నావా?” అంటాడు పవన్. ఆ సన్నివేశానికి అయిదుపేజీల డైలాగ్ రాయాల్సిన అవసరమున్నా ఈ ఒకే ఒక్క డైలాగ్ ఆ కొరతను తీర్చింది.

సలీం
పెగ్గు పెగ్గుకు మందుప్రియుల స్వభావం ఎలా మారుతుందో పెగ్గుబోధ చేశారు మోహన్‌బాబు. “మొదటి పెగ్ అవ్వగానే కుక్క బ్లడ్ అవుతుంది. అందుకని వాగుతారు. రెండో పెగ్‌కు కోతి బ్లడ్ అవుతుంది. అందుకే తూగుతారు. ఆఖర్న పిగ్ బ్లడ్ అవుతుంది. అప్పుడు తొంగుంటారు”. ఈ సన్నివేశాన్ని బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. ఈ డైలాగు మోహన్‌బాబుకు నచ్చడంతో.. యూనిట్ మొత్తానికి చదివి వినిపించారట. రైటర్ రమణను పిలిచి అభినందించారు.

సుస్వాగతం
వాడుకలో ఉన్న పదాలనే అటు విరిచి ఇటు విరిచి.. నవ్వించే కొత్తపదాల్ని అల్లడం చింతపల్లి రమణకు ఇష్టం. బయట ఎవరో కాలింగ్‌బెల్ కొట్టడంతో తలుపు తీస్తూ వై.విజయ “లింగులింగుమంటూ ఈ కాలింగు బెల్లొకటి” అంటుంది. నడిచే నడకకు లింగులింగుమంటూ వస్తున్నాడు అంటుంటారు. అదే మాటను కాలింగులోని మొదటి అక్షరం ‘కా’ను తీసేసి ‘లింగు’ను తీసుకుని ‘లింగు లింగు’మని రాశాడు. చిత్రనిర్మాణబృందం మొత్తానికీ అది బాగా నచ్చింది.

సుస్వాగతం
“ఇందులో ప్రకాష్‌రాజ్‌ది శాడిస్టు పాత్ర. శాడిస్టులు మనల్ని ఎంత భయపెడతారో, లోపల వాళ్లంత భయపడుతుంటారు. అదొక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. పాలకొల్లులో ‘నెలబాలుడు’ అనే చిత్రమైన పేరుపెట్టుకున్న కుర్రాడొకడు ఉండేవాడు. అప్పట్లో వాడు టెన్త్‌క్లాస్. క్లాస్‌లీడర్‌కు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు “నేను మోనార్క్‌ను. తెలుసుకదా! మీరంతా నాకే ఓటెయ్యాలి” అని నవ్వుతూ అంటుండేవాడు. వాడికి వాడు మోనార్క్ అని ప్రకటించుకున్నా.. ఒక రోజు ఎయిత్‌క్లాస్ అబ్బాయి వాణ్ణి కొట్టాడనుకోండి. అది వేరేవిషయం. చిన్నప్పుడు నెలబాలుడి డైలాగ్ క్లాస్‌రూం వరకే ఆగిపోలేదు. అది నాతోపాటు ఫిలింనగర్ వరకు వచ్చింది. ఆ మాట – సినిమాలో ప్రకాష్‌రాజ్‌కు సరిగ్గా సరిపోయింది. అందుకే రాశాను.. “నేను మోనార్క్‌ను. నన్నెవ్వడూ మోసం చెయ్యలేడు” అని.

తొలిప్రేమ
ఏ రైటర్ అయినా అవకాశం వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట తన ఐడెంటిటీని కోరుకోవడం సహజం. ‘తొలిప్రేమ’లో నాకు అలాంటి అవకాశమే వచ్చింది. అందమైన అమ్మాయిని చూస్తాడు హీరో. కాని ఎక్కడుందో తెలీదు. ఆమె జాడ కనుక్కోమని ఫ్రెండ్స్‌కు చెబుతున్నప్పుడు ఈడైలాగ్ పడింది. హీరోకు వేణుమాధవ్ చేసే జ్ఞానబోధ ఇది – “చూడు బాలు. ఈ సిటీలో మొత్తం ఆరు లేడీస్ కాలేజీలు ఉన్నాయి. ఏడు కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి. అమ్మాయిలవే ఇరవై జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఇరవైనాలుగువేల ఆరొందల యాభై నాలుగు మంది ఉన్నార్రా! ఇందులో ‘ఎ’ క్లాస్ అమ్మాయిలు..”ఊపిరి తీసుకోకుండా చెప్పిన ఆ డైలాగ్ కుర్రాళ్లకు భలే నచ్చింది. మద్రాసులో సాయిరెడ్డి అని నాకొక ఫ్రెండ్ ఉండేవాడు. ఆదివారం పూట అతని రూముకు వెళ్లేవాణ్ణి. పొద్దున్నే లేచి పేపర్ కొనుక్కుని పెళ్లిపందిరి క్లాసిఫైడ్స్ చూడందే వాడు స్నానం చేసేవాడు కాదు. ‘వధువు కావలెను’ కాలమ్‌లో కొన్ని చదువుతూ – “ఒరే రవణా, ఈ అమ్మాయికి అందమైన వరుడు కావాలట. తెలుపు రంగు మస్ట్ అంటోంది. పెద్ద జీతం తప్పదు. అంటే ఈ అమ్మాయి ‘ఎ’క్లాస్ అమ్మాయిరో! నాకు సరిపోతుందో లేదో? నువ్వుచెప్పురా.. నేను ఏ క్లాస్‌కు ట్రై చేయమంటావ్?” అని తినేసేవాడు. పెళ్లిప్రకటనల్లో పెళ్లి కోసం వధువు, వరుడులను క్యాటగిరీలుగా ఇచ్చినట్లు ప్రేమ గురించి ఇస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచే ఈ ఐడియా పుట్టింది.

తమ్ముడు
మా ఊర్లో శకుంతలమ్మ అనే ముసలావిడ జంతికలు అమ్ముతుండేది. వీలుదొరికినప్పుడల్లా ఆవిడ దగ్గర చేరి తన గొప్పలు చెప్పుకునేవాడు అక్కడ పనిచేసుకునే నాయీబ్రాహ్మడు సత్యనారాయణ. అతను మాట్లాడే తీరే నవ్వు తెప్పిస్తుంది. అందుకే అతనేం మాట్లాడినా ఆసక్తిగా వినేవాణ్ణి. ఒక రోజున అతను “పొద్దుట బజారుకెళ్లాను సీకుంతలక్కయ్యా. ఆ పక్కేమో మునెమ్మ, ఈ పక్కనేమో గడ్డిరెడ్డిగాడు పిత్తపరిగెలు అమ్ముతున్నారు. మీ సెల్లేమో ‘సేప తినాలనుంది. నాకు పెద్ద సేపే కావాలి ఎట్టుకురా’ అని సెప్పింది. ఆడ సూత్తే లేవు..” అన్నాడు సత్తి. “మరేటి సేశావ్” అంది శకుంతలమ్మ. “ఏటి సేత్తాం. ఎడిటింగ్ సేత్తాం. పెంటమ్మ కొడుకు వేటకు వెళ్లి ఇంతపెద్ద సేప తెచ్చాడు. నువు నమ్మవుగానీ సీకుంతలక్కయ్యా.. ఆ సేప ఇంత పొడువుంది. శానా రేటు సెప్పాడు. మనమిత్తామేటి? సత్తిగాడికి ఎవర్ని ఎక్కడ నొక్కాలో తెల్సుగదా సీకుంతలక్కయ్యా” అన్నాడు. ఆ జ్ఞాపకాన్ని అక్కడితో వదిలేసి సినిమాలోకి జంప్ అయితే – డబ్బున్న అమ్మాయికి లైన్ వేస్తుంటాడు హీరో పవన్‌కళ్యాణ్. ఒకసారి ఆమె “కెన్ ఐ స్పీక్ టు సుభాష్ (హీరో)” అని ఫోన్ చేస్తుంది. “సాయంత్రం కలుద్దాం. కారులో నేను అక్కడికి వస్తున్నా” అని పవన్ చెప్పాల్సిన సీను. దాన్నే కాస్త డ్రెమటైజ్ చేయాలనిపించింది. “ఆడంగులకు ఆమడదూరంలో ఉండే సినయ్యగారి కోసం ఆడపిల్లలు పోను సెయ్యటమా? ఏటి బాబూ ఈ విడ్డూరం. ఒక్క నిమిషమమ్మ కాలింగు సేత్తానే. సీకుంతలక్కయ్యా.. సీకుంతలక్కయ్యా. నిన్నేనే సినయ్యగారు ఏటి సేత్తున్నారు. ఓ.. సెక్కుల మీద సంతకాలెట్టేత్తున్నారా? మీకు తెల్దుగానమ్మా మా సినయ్యగార్ని పట్టుకోవడం సాలా కట్టమమ్మా! మార్నింగు మార్నింగే లేత్తారా. సెటిలాడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్‌బెడ్డు మీద తొంగోని గెడ్డం గీసేసుకుంటారు” అని పనిమనిషి చెప్పినట్టుగా ఆయన చేసిన ఏకపాత్రాభినయం అద్భుతం.

లాహిరి లాహిరి లాహిరిలో
అప్పటికి నేను ప్రేమ, కుటుంబ, సెంటిమెంటు కథా చిత్రాలన్నింటికీ డైలాగులు రాశాను. కాని స్త్రీ గొప్పతనం గురించి రాసే అవకాశం రాలేదు. ‘లాహిరి లాహిరిలో’కు రాస్తున్నప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. హరికృష్ణ ఒక చోట పూజ చేస్తుండగా, ఆ పక్కనే భానుప్రియ, రమాప్రభలు కూడా పూజలో నిమగ్నమై ఉంటారు. రౌడీలు వచ్చి భానుప్రియను ఏడిపిస్తారు. ముసలామె రమాప్రభకు శక్తి లేకపోయినా అడ్డుకుంటుంది. పూజ పూర్తయ్యే వరకు లేవడు హరికృష్ణ. ఆ తర్వాత లేచి రౌడీలను చితకబాది “ఆడదంటే ఆడేదనుకున్నార్రా? స్త్రీని గౌరవించమని దేవాలయాల్లో, స్టేజీల్లో, ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా వినరేంట్రా?” అంటాడు. ఈ మాటకు ప్రేరణ మా అమ్మమ్మ జోగమ్మ. మాది పాలకొల్లు అయితే ఆవిడది పిఠాపురం పక్కనుండే నాగులాపల్లి. వేసవి సెలవుల్లో మేమందరం ఇంటి దగ్గరే ఉంటామని చూసిపోయేందుకు వచ్చేది. ఆమె వచ్చినప్పుడు ఒక రోజు ఊరిలో పేదోళ్ల గుడిసెలు తగలబడిపోతున్నాయి. వెంటనే అక్కడికి వెళ్లిపోయి మంటల్ని ఆర్పేందుకు నీళ్లను అందిస్తోంది. ఇంట్లో వాళ్లు అమ్మమ్మను తల్చుకున్నప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు చేసుకునేవాళ్లు. ఒక స్త్రీ పట్ల మరో స్త్రీ చూపించే ప్రేమ ప్రకృతి అంత సహజమైనది. సినిమాలో ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో.. ఒక ఉదయాన్నే హరికృష్ణ నుంచి కబురొచ్చింది నాకు. ఆయన వద్దకు వెళ్లగానే ‘రమణగారు.. మంచి డైలాగు రాశారు’ అంటూ గుజరాతీ మిఠాయిల్ని తినిపించారు. నాకు అదొక తీపి గురుతు.

ప్రియమైన నీకు
‘లవ్వు సీన్లు’ అనగానే చింతపల్లి రమణ గుర్తుకురావడానికి కారణం.. ఆ సబ్జెక్టు మీద నాకు గురి కుదరడం. ఒక భావనను వెయ్యి కోణాల్లో దర్శించడానికి ఏదో ఒక అనుభవం అవసరం. బాల్యంలో అలాంటి ఒక డిస్ట్రబెన్సే జరిగింది. నాకొక మిత్రుడు ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ల అన్నయ్య చాక్లెట్లు ఇచ్చేవాడు. “ఒరే రవణా, నీకు పాటలంటే ఇష్టం కదా. అక్కడ పాటలకొట్టు (పోటీలు) ఉంది. వెళ్లి పాల్గొను. ఫ్రైజ్ ఇస్తారు” అని ప్రోత్సహించేవారు. ఒక రోజున స్కూలుకు వెళ్లి ఇంటికొస్తుంటే- ఆయన శవాన్ని పాడిమీద మోసుకొస్తున్నారు. అదే పాడెకు ఎదురుగ్గా మరో అమ్మాయి శవాన్ని పాడె మీద తీసుకొస్తున్నారు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. ఏమీ అర్థం కాలేదు. ఊహకు కూడా అందని దృశ్యం అది. ప్రేమ విఫలం కావడం వల్ల వాళ్లిద్దరూ పురుగులమందు తాగి చనిపోయారట. ‘ప్రేమ’కు మనుషుల్ని చంపే శక్తి ఉందా? మరణం వరకు తీసుకెళుతుందా? అని తీవ్రంగా ఆలోచించాను. సినిమాలకు ప్రేమ డైలాగులు రాయాల్సి వచ్చిన ప్రతిసారీ.. మనసులో ఏదో ఒక మూలన అదే జ్ఞాపకం గిర్రున తిరుగుతుండేది. అందుకేనేమో ప్రేమ సన్నివేశాలకు నేను రాస్తున్నప్పుడు నాకు తెలియకుండానే అంతగా ఇన్వాల్వ్ అవుతుంటాను. ‘ప్రియమైన నీకు’లో తరుణ్ అంటాడు “పువ్వులు పూయడానికి ఒక టైమ్ ఉంటుంది. నక్షత్రాలు పుట్టడానికి ఒక టైమ్ ఉంటుంది. ప్రేమ రావడానికి టైమ్ అంటూ ఉండదు. అదొచ్చిన తర్వాత ఏ పనీ చేయడానికి మనసుండదు” అని. ‘లాహిరి లాహిరిలో’ అయితే “మనిషిని చంపడానికి ఆయుధాలు కనిపెట్టారు. ప్రేమను చంపడానికి ఒక్క ఆయుధం కూడా కనిపెట్టలేదు” అని లక్ష్మి చెప్పే మాట ప్రేక్షకుల మెప్పు పొందింది. ‘దేవదాసు’లో నాకు వ్యక్తిగతంగా నచ్చిన డైలాగ్ “కోస్తారని తెలిసినా పూలు పూస్తాయి. ప్రేమ కూడా అంతే!”. ప్రేమకున్న సహజత్వమే ఈ వాక్యానికి ఉంది అని చాలామంది చెప్పారు.

అరుంధతి
‘అరుంధతి’ కథ వినడానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వద్దకు వెళుతున్నప్పుడు నాకొక అనుమానం వచ్చింది. ‘నేను డైలాగులు రాసిన సినిమాలన్నీ ఒక రకమైన సబ్జెక్టులు. ఇదేమో బీభత్సరసమున్న కథ. దీనికి నేను రాయగలనని ఆయన ఎలా పిలిచారు?” అని. అదే మాటను ఆయనతో అంటే “లాహిరి లాహిరిలో’ కొన్ని సీన్లు చూసి మీరైతే దీనికి రాయగలరు అని మిమ్మల్ని పిలిపించాను” అని చెప్పారు. కథాబలమున్న ఇంత మంచి సినిమాకు రాయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. మా ఊరి దగ్గర తాళ్లసాయిబు ఉండేవాడు. పిల్లలు జడుసుకుంటే తాయత్తులు అవీ కడుతుంటాడు అతను. అక్కడికి వెళ్లి అతను మాట్లాడే తీరు, అక్కడికి వచ్చేవాళ్లు చెప్పుకునే బాధలు పరిశీలించాను. గద్దెల దగ్గర కొన్నిరోజులు ఉండిపోయాను. ముసలివాళ్ల దగ్గరికి వెళ్లి పాత దెయ్యాల కథలు చెప్పించుకున్నాను. అయినా కథ మూడ్‌లోకి వెళ్లలేదు. హైదరాబాద్‌లోని కోఠీకి వెళ్లి పాత చందమామ, బాలమిత్ర పుస్తకాల్ని కొనుక్కుని చదవడం మొదలుపెట్టా. కథకు తగ్గట్టు బ్రెయిన్ ట్యూన్ అయ్యింది. ప్రతి క్యారెక్టర్‌కు డైలాగులతోనే ఒక మాడ్యులేషన్‌ను ఫ్రేమ్ చెయ్యాలి. దీనికి ఏదైనా కొత్త భాష కావాలి. ఆ వెతుకులాటలో నాకు నేనే ఒకటి ఊహించుకున్నాను.

ఒక ఆడది నన్ను కొట్టి, పచ్చిబూతులు తిట్టి వెళ్లిపోతే, చంపితే? అని. ఆ మూడ్‌లో సోనూసూద్‌కు మాటలు రాస్తున్నప్పుడు- అతను సమాధిలో ఉంటాడు కాబట్టి మనిషి కనిపించడు. కేవలం డైలాగ్ ఒక్కటే వినిపిస్తుంటుంది. అప్పుడు నేను “నన్ను చంపి ఈ సమాధిలో కుళ్లబెట్టిన నిన్ను వదలను వదలను” అని రాశాను. ఇంకా ఏదో లోపం. వాక్యం చివర్న భయపెట్టే పదం కావాలి. బజారుకు వెళ్లినప్పుడు అందమైన అమ్మాయిలను చూసి ‘ఫిగరు భలేవుంది’ అని ఎవరో అంటుండగా వినొచ్చాను. ఫిగరు అంటే బొమ్మ. పైన రాసిన డైలాగ్‌కు ‘బొమ్మ’ను జతచేస్తే అనుకుని “వదలను బొమ్మా వదలను” రాశాక నాకే నచ్చలేదు. బొమ్మను అటుతిప్పి ఇటుతిప్పి ‘బొమ్మాళీ’గా మార్చాక ఫరవాలేదు అనిపించింది. వ్యక్తీకరణ ఇంకొంచెం తాజాగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పుడు – పక్క గదిలో మా రెండో అమ్మాయికి ట్యూషన్ చెప్పేందుకు వచ్చింది టీచరు. “ఏంటి? నిన్ననే కదా ఈ మిస్టేక్ చేశావ్. మళ్లీ అదే తప్పు. చెప్పింది చెవికి ఎక్కడం లేదా” అని గట్టిగా మందలిస్తోంది. అప్పుడు మా అమ్మాయి “చెయ్య టీచర్.. చెయ్య” అంటోంది. అది విన్న నేను “ఆ భాష ఏదో బావుందే” అనిపించింది. ‘చెయ్యను’కు బదులు ‘చెయ్య’లాగే ‘వదలను’కు బదులు ‘వదల’రాస్తే? తట్టిన వెంటనే కాగితం మీద పెట్టాను. ఆ పదాన్ని బొమ్మాళీకి అటొకటి ఇటొకటి పెట్టాను. అప్పుడు ‘వదల బొమ్మాళీ వదల’ అయ్యింది. సూపర్! మరుసటి రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి వినిపిస్తే “వాటీజ్ దిస్ బొమ్మళీ సార్” అడిగారు. “అర్థమేమీ లేదండీ. ఇదొక తిట్టు కూడా కాదు. చెవికి ఇంపైన ఒక ఉద్వేగం. ఆ పాత్రకు సరిపోయే ఒక కొత్త పదం” అని చెప్పాను. “చాలా బావుంది. సినిమాలో దీన్నే పెడదాం. యు కెన్ కంటిన్యూ” అన్నారు. ‘అరుంధతి’లో బొమ్మాళీ ఎంత పాపులర్ అయ్యుందో మీకు తెలుసు. కొన్ని సందర్భాల్లో పత్రికల్లో పతాకశీర్షికలకు కూడా దీన్ని వాడారు..” అని ముగించారు చింతపల్లి రమణ.

చింతపల్లి రమణ సొంతూరు పాలకొల్లు. చదువుకునే రోజుల్లోనే రేడియోకు నాటికలు, పద్యాలు రాయడం అలవాటు. రచనా వ్యాసంగంలో కొంత అనుభవం వచ్చాక.. రేలంగి నరసింహారావు వద్దకు వెళ్లి పాతిక సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశారు. ఏఆర్‌కే మోహన్‌రావు అవకాశం ఇవ్వడంతో ‘చిన్నబ్బులు’తో డైలాగ్ రైటర్ అయ్యారు. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు, ఎడిటర్ మోహన్ సినిమాలకు రచనా సహకారం అందించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘సందడే సందడి’, ‘దిల్’, ‘దేవదాసు’, ‘ ఆనందం’, ‘యువరాజు’, ‘వసంతం’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘అరుంధతి’, ‘దుబాయ్ శీను’, ‘నమో వెంకటేశా’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి ఎన్నో మాటలు రాశారీయన.

ం మల్లెంపూటి ఆదినారాయణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

ఒకే రోజు రెండు సభలు

స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

ఉయ్యూరు లో అమర వాణి హైస్కూల్ లో సరసభారతి జ్ఞాన పీఠపురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారి పై విద్యార్ధులకు అవగాహన సభ నిర్వహించింది అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సభాధ్యక్షత వహించగా ప్రముఖ కవి విమర్శకు రాలు విజయ వాడకు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు  శ్రీమతి మందరపు హైమవతి గారు ముఖ్య అతిధిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు .విజయ వాడకే చెందిన కవి రచయిత, వ్యవసాయ అధికారి శ్రీ కే.ఆంజనేయ కుమార్ సహ వక్త గా ప్రసంగించారు .అమరావాణి ప్రిన్సిపాల్ శ్రీ పి.వి.నాగ రాజు సభా నిర్వహణ చేశారు .

శ్రీ దుర్గా ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘’సామాన్యులను అర్ధం చేసుకొన్న అసమాన్యుడు ,మనుష్యులను తెలుసు కొన్న మనీషి భరద్వాజ ‘’ అని స్వర్గీయ  దాశరధి  కీర్తిం చాడని చెప్పారు .ఈశాతాబ్దపు గొప్ప రచయిత ,రష్యా ప్రముఖ రచయిత చెకోవ్ తో సరి సమాన మైనవారు అన్నారు .’’రాతా కూతా కన్నా చేత ముఖ్యం ‘’అని రావూరి భావించారని ,అక్షరం లోను ,ఆచరణ లోను ఆయన’’ ఆజాను బాహువు’’ అని కీర్తించారు .’’సమస్త వృత్తుల వారిని మన ముందు నిల బెట్టి –ఇదీ వారి జీవితం – ఏం సాయం చేయాలో చేసి ఆదుకోండి ‘’అని ‘’జీవన సమరం’’ ద్వారా సమాజానికి తెలియ బరచారని శ్రీ శ్రీ అన్న మాట ను గుర్తు చేశారు .గొర్రెల కాపరి, పేపర్ బాయ్ గా ,కాఫీ హోటల్ సర్వర్ గా, ప్రెస్ కార్మికుడిగా ,జర్న లిస్టు గా ,ఆకాశ వాణి ప్రోగ్రాం నిర్వాహకుడి గా ,ఆయన చేయని వ్రుత్తి అంటూ లేదు .డిటెక్టివ్ నవలలూ రాశారు శృంగార కధలూ గిలికారు .ఇవన్నీ పొట్ట పోసుకోవ టానికే రాశానని నిర్భయం గా చెప్పిన నిజాయితీ గల రచయిత భరద్వాజ .’’భరద్వాజ ఒక విశ్వ విద్యాలయం’’ .ఆయన ఏది రాసినా విపరీతం గా చదివింప జేస్తుంది అంటే ‘’రీడబిలిటి ‘’ఉన్న మహా రచయిత .అనేక భాషల్లోకి ఆయన రచనలు తర్జుమా అయ్యాయి .అనేక సంస్థలు ఆయన్ను గౌరవించి, సన్మానించాయి .సన్మానాలు పొందటమే కాదు అయన పేర స్వర్గీయ భార్య కాంతమ్మ గారి పేర ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది అయిదు వేల రూపాయలను పేద విద్యార్ధులకు అంద జేసిన మహా మాన వోత్తముడు ‘’అని చెప్పారు .

శ్రీమతి మందరపు హైమవతి తమ ప్రసంగం లో భరద్వాజ  అట్టడుగు స్థాయి నుంచి వచ్చారని ,సాహిత్యం లో అత్యుత్తమ స్థాయికి ఎదిగారని ఇలా ఎవరూ లేరని చెప్పారు .కృష్ణా జిల్లా పరిటాల దగ్గర మొగులూరు గ్రామం లో1927లో భరద్వాజ జన్మించారని తండ్రి కోటయ్య అని దరిద్రం తోనే ఆయన జీవితం గడిచిందని  .గుంటరు జిల్లా తాడికొండ లో బాల్యం గడిపారని ఏడవ తరగతి తో విద్య ఆగి పోయిందని ఎనిమిది లో చేరటానికి కట్టాల్సిన జీతం మూడు రూపాయలు లేక చదువు ఆగి పోయిందని  .పగలల్లాదొరికిన పని చేయటం ,రాత్రిళ్ళు లైబ్రరీ లో కూర్చుని సాహిత్యాన్ని చదవట చేసి, అందరి కంటే ఉన్నత విద్యా వంతుడయ్యారని ,‘’’గ్రందాలయమే ఆయన గురువు’’ అని రవీంద్ర నాధ టాగూర్ లా అయన గడ్డం తో కని పిస్తారని ఇద్దరూ స్వయం కృషి తోనే విద్యా వంతులయ్యారని గుర్తు చేశారు .తెనాలిలో దుర్భర దారిద్ర్యం తో గడిపారన్నారు .కొడవటి గంటి కుటుంబ రావు ,త్రిపుర నేని గోపీచంద్ ,దని కొండ హనుమంత రావు ,తమిళుడైనా తెలుగు లో గొప్ప నవలలు’’శారద ‘’ పేరు తో రాసిన నటరాజన్ ,ఆలూరి భుజంగ రావు ల తో మంచి స్నేహం చేసి జీవితాన్ని తీర్చి దిద్దు కొన్నారు .తెనాలి నుండి మద్రాస్ చేరి సినిమా పత్రికలలో ఉద్యోగం చేశారు .అక్కడి నుండి హైదరాబాద్ ఆకాశ వాణి లో ప్రోగ్రాం నిర్మాత గా పని చేశారు .ఇప్పుడే జీవితం కొంత స్థిర పడింది .అక్కడి నుండి అంతా అభివృద్దే .

కృష్ణా పత్రిక లో ‘’పాకుడు రాళ్ళు ‘’కద గా రాస్తే దాన్ని నవల గా పెంచమని ఎడిటర్ కోరితే ‘’మాయ జలతారు ‘’పేరుతో సీరియల్ గా ప్రారంభిస్తే శ్రీ శిలా వీర్రాజు గారు ‘’పాకుడు రాళ్ళు ‘’అని మార్చారు. అది అద్భుత విజయం సాధించింది 1965 లో ముద్రణ పొంది గొప్ప పేరు తెచ్చింది .యాభై రెండు వివిధ వృత్తులు చేసే  వారిని ఇంటర్వ్యు చేసి వారిళ్ళకు వెళ్లి పరిస్తితులను పరిశీలించి వారిపై ఈనాడు లో సీరియల్ గా ‘జీవన సమరం ‘’పేర రాశారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .కమ్మరి, కుమ్మరి, చెప్పులు కుట్టేవాళ్ళు ,తాళాలు బాగు చేసే వాళ్ళు,గొడుగులు బాగు చేసేవాళ్ళు దర్జీ పని చేసే వారు వీరందరినీ కధానాయకులుగా చేసి రాసిన ఆ పుస్తకం గొప్ప సంచలనమే సృష్టించింది .భరద్వాజ రాసినవి 37 సంపుటాలుగా వచ్చాయని అందులో పది హేడు నవలలు ,బాలల కోసం ఆరు నవలికలు ,అయిదు కదా సంపుటాలు ,మూడు వ్యాస సంపుటాలు ,ఎనిమిది నాటికలు ఉన్నాయన్నారు . భార్య కాంతం జ్ఞాప కార్ధం ‘’స్మృతి సాహిత్యం ‘’రాశారని అవి ఎంతో ఆర్ద్రత ను కలిగిస్తుందని అన్నారు .ఆనేక పి.హెచ్ డి.లు పొందారని .రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డులు ,గొపే చంద్ అవార్డు ,రాజ్య లక్ష్మి ఫౌండేషన్ అవార్డు ,లోక నాయక అవార్డ్ పొందిన ధన్య జీవి అని చెప్పారు .1952 లో ‘’చిత్ర గ్రహం ‘’నవలిక సైన్స్ ఫిక్షన్ గా రాశారు .అప్పటికి చంద్రుని పై ఆర్మస్త్రాంగ్ కాలు పెట్టనే లేదు .దారిలో ‘’శుసూన్ ‘’అనే గ్రహం పై మనిషి అడుగు పెట్టి నట్లు రాశారు. హెచ్ జి.వవెల్స్ రాసిన  సైన్స్ ఫిక్షన్ లా ఇది ఉండి ఆశ్చర్య పరుస్తుంది .అక్కడికి చేరిన వాడు ‘’దారుణం గా నరుక్కు చచ్చే భూమండలాన్ని చూసి సిగ్గు పడుతున్నాను ‘’అని అతని తో అని పిస్తారు భరద్వాజ .ఎనభై ఆరేళ్ళు జీవించి18-9-2013 ణ భరద్వాజ మరనిన్చారన్నారు ఆయన రచనలు చదివి జ్ఞానాన్ని సంపాదించండి ‘’అంటూ ముగించారు హైమవతి గారు .విద్యార్ధినీ విద్యార్ధులు అత్యంత క్రమ శిక్షణ తో మెలగి నందుకు శ్రద్ధగా విన్నందుకువారిని  ఎంతో అభినందించారు .విద్యార్ధుల స్థాయికి దిగి వచ్చి ఆమె ప్రసంగించిన తీరు పరమ అద్భుతం గా ఉందని అందరూ మెచ్చారు

శ్రీ ఆంజ నేయ కుమార్ తమ ప్రసంగం లో భారద్వాజ ను చూస్తె టాగూర్ గుర్తుకు వస్తారని ,అతి నిరుపేద ఇంతటి ఉన్నత స్తితి కి రావటం విశేషమని ఆయన లా అందరూ ఉన్నత స్తితికి రావాలని ,తాను వ్యవసాయాదికారి గా ఉన్నా సాహిత్యం పై మక్కువ కలగటానికి భరద్వాజ వంటి వారే స్పూర్తి అని  ఇక్కడ ఈ పాఠశాల విద్యార్ధులను చూస్తె ముచ్చటగా ఉందని మెచ్చు కొన్నారు .

శ్రీ దుర్గా ప్రసాద్ ముగింపు ప్రసంగం  చేస్తూ ‘’నా ఊహలకే అందని కవి భరద్వాజ ‘’అని విశ్వనాధ కీర్తిన్చారని ,ఇంగ్లాండ్ రచయిత చార్లెస్ డికెన్స్ లాగా మనుషుల మనస్తత్వాలను క్షున్నం గా పరిశీలించి రచనలు చేశారాని ఒక డాక్యు మెంటరి సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తార న్నారు .తను అనుభవించిన పేదరికం దరిద్రం అవమానం ,ఆకలి ఎవరూ అనుభవించ కూడదని ,ఇవి లేని సమాజం కావాలని కోరుకున్న మనసున్న రచయిత అన్నారు .ఉన్నది ఉన్నట్లు రాశారని చెప్పారు .’’నిజాన్ని నిజాయితీగా చెప్పాలి ‘’అనే వారని గుర్తు చేశారు .పట్టుదల స్వయం కృషి ,అధ్యయనం ఉంటె బడి చదువు జ్ఞానం కన్నా ఎక్కువ పరిజ్ఞానం కలుగుతుందని భరద్వాజ రుజువు చేశారని చెప్పారు .అన్ని రచనలను చదివి ఆకళింపు చేసుకొన్నారని వ్యక్తీ గత జ్ఞానానికి అనుభవ జ్ఞానాన్ని కలిపితే పరిణతి వస్తుందని భరద్వాజ నిరూపించారన్నారు   .తనకు జ్ఞాన భిక్ష పెట్టిన వారిని ,అన్నం పెట్టి ఆదుకున్న వారినీ జీవితాన్తం గుర్తుంచుకొని క్రుతజ్ఞతలు చెప్పటం భారద్వాజ కే చెల్లిందని, అపకారికి కూడా ఉపకారం చేసి తప్పు తెలుసు కోనేట్లు చేశారని అన్నారు .నియమ బద్ధ జీవితం సాదా సీదా జీవనం ఆయనది అని ,ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మనీషి అని అన్నారు

‘’భరద్వాజ జీవితం ‘’పై వ్యాస రచన ,’’రచనల లో మానవీయ దృక్పధం’’ పై వక్త్రుత్వ పోటీలను ఈ పాఠ శాల విద్యార్ధులకు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన వారికి సరసభారతి తరఫున  భారద్వ్వాజ రాసిన ‘’కాదంబరి నవల ,సి నారాయణ రెడ్డి రాసిన ‘’విశ్వం భర’’ ,’’మన చరిత్ర’’ అనే  విలువైన పుస్తకాలను విద్యార్ధులకు హైమవతి, ఆంజనేయ కుమార్ గార్ల చేతుల మీదుగా అందజేశారు .అలాగే రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ ఇచ్చిన శతకాలను నానీలను విద్యార్ధులకూ ,పాఠ శాల గ్రంధాలయానికి దుర్గా ప్రసాద్ ప్రిన్సిపాల్ నాగ రాజుకు అంద జేశారు.ప్రిన్సిపాల్ ‘’ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తమ స్కూలు లో నిర్వహించినందుకు విద్యార్ధులకు భరద్వాజ పై అవగాహన కలిగించి నందుకు వారికి ఆయన జీవితం రచనపై పోటీలు నిర్వ హించి,బహుమతులు అందజేసిన సరసభారతికి ,ఇక్కడికి వచ్చి మంచి ఉపన్యాసాలతో విద్యార్ధుల హృదయాలకు విషయాలను చేరువయ్యేలా చేసిన హైమవతి, ఆంజనేయ కుమార్ గారలను అభినందించారు .సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి వందన సమర్పణ చేస్తూ ,ఇలాంటి వినూత్నమైన కార్య క్రామాలను సరసభారతి నిర్వహించటం గొప్ప ప్రేరణ అని ,విచ్చేసిన అతిధులకు ఆతిధ్యం ఇచ్చిన నాగ రాజు గారికి ఉత్సాహం గా పాల్గొన్న విద్యార్ధినీ విద్యార్దులకు క్రుతజ్ఞతలు తెలియ జేశారు .అతిధులకు సరసభారతి  ముద్రించిన  సిద్ధ యోగి పుంగవులు శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం పుస్తకాలతో బాటు నగదు పారి తోషికాన్నిదుర్గా ప్రసాద్  అంద జేశారు .ఈ సభలో మాజీ  లెక్చరర్ లు శ్రీ ప్రసాద్ ,శ్రీ నారాయణ మూర్తి ,మాజీ హెడ్ మాస్టర్ శ్రీ భావాన్ని శంకర రావు ,సరసభారతి టెక్నీషియన్ శ్రీ వి బి.జి రావు ,రామ గుండం మాజీ ఉద్యోగి శ్రీ బలరాం గార్లు పాల్గొని సభకు నిండుతనాన్ని వన్నెను తెచ్చారు

సభ అనంతరం  ప్రిన్సిపాల్ అతిధులకు కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు.

పమిడి ముక్కాల హైస్కూల్  లో ‘’మాతృభాషా దినోత్సవం ‘’

రెండు రోజుల క్రితం పమిడి ముక్కాల హైస్కూల్ తరఫున తెలుగు పండితులు శ్రీ బలే ఉమామహేశ్వరరావు మరొకరు వచ్చి ఇరవై రెండవ తేదీ న తమ స్కూల్ లో జరిగే మాతృభాషా దినోత్సవానికి ముఖ్య అతిధి గా వచ్చి తెలుగు భాష గొప్ప తనాన్ని గురించి ప్రసంగించ మని కోరారు .అలానే అన్నాను .అమరావాణి లో సభ అయిన తర్వాత మధ్యాహ్నం మూడింటికి పమిడి ముక్కాల హైస్కూల్ కు వెళ్లి ‘’ తెలుగు భాష ‘’గొప్పతనాన్ని విద్యార్ధులకు వివారించాను .మాత్రు భాషా దినోత్సవమైన ఇరవై ఒక్కటి న ప్రారంభించారు . ఇంట్లో తెలుగు మాట్లాడాలని పద్యాలు శతకాలు నేర్వాలని లేక పోతే తెలుగు భాష అంత రించి పోతుందని ,నాలువు వేల అయిదు వందల ఏళ్ళ చరిత్ర కల తెలుగుభాష అందమైన అజంత భాష అని ,అందరూ మెచ్చిన భాష అని ,దాన్ని మాట్లాడుకొంటూ కాపాడమని కోరాను.దీనికి తలి దండ్రులు ఉపాధ్యాయులు సమాజం బాధ్యత తీసుకోవాలని హితవు చెప్పాను  .ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి రమా దేవి అధ్యక్షత వహించగా ఏం. ఇ .వొ .తోలి ప్రసంగం చేశారు .భాషా భి వృద్ధికి కృషి చేస్తున్నందుకు నాకు స్కూల్ తరఫున శాలువా కప్పి గౌరవించారు .తెలుగు మేష్టారు ఉమామహేశ్వర రావు ఇద్దరు వంతల తో శ్రావ్యం గా బుర్రకధ చెబుతూ తెలుగు భాష గొప్ప తనాన్ని ఆవిష్కరించి అలరించారు. హెడ్ మిస్త్రేస్ రమా దేవి ప్రముఖ విమర్శకులు స్వర్గీయ టి ఎల్ కాంతా రావు గారి భార్య కమల కుమారి గారితో బెజవాడ అమరవాణి హైస్కూల్ లో పని చేసినట్లు చెప్పారు .

ఇలా రెండు సభలలోఒకే రోజు  పాల్గొన్నందుకు ఆనందం గా ఉంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-14-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మలేసియా లో మహా నాగ ద్వయ బుద్ద దేవాలయం -బుద్ధ భూమి

001 malesia buddha 3 001 malesia buddha1 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘జీవననాదాన్ని పలికిన అభినయ వేదం- అక్కినేని’ అన్న కె బి లక్ష్మి -తెలుగు విద్యార్ధి-

2akkineni 001 3akkineni 001 4akkineni 001 5akkineni 001 akkineni1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోల సభలు

golasabhalu 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment