రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ –

11-నీరు, బిజిలీ కేజ్రీ వాల్ ఇస్తాడట ఉచితం

    యై ఎస్ పదకాల్లా కావు కదా అనుచితం . 
12-శాసన సభను చేస్తే శ్రీధర బాబు హైజాక్
      శాఖ మార్చిఇచ్చాడు కిరణ్ దిమ్మ తిరిగే షాక్    
 
 13- జనవరి ఇరవై మూడు పి.ఏం.మార్పు ?
      మన్మోహన్ మారి రాహుల్ గద్దె నేక్కించే తీర్పు 
14-యై ఎస్ బామ్మర్దికి అప్పనం గా స్తలం దోచి ఇచ్చిన మిట్టల్ నవీన్  
     ఎవడబ్బ సొమ్ము?వాడేవాడు?  అనిఓనర్   నీరజా రావుచీత్కరించేన్ 
15-  సభా వ్యవహారరాలకిప్పుడు సాకే  శైలజా ద్
                                                                              సి.ఏం.మనసు దోచి సమైక్యానికి అయ్యాడు అధినాద్  

 

— 

   కొత్త ఏడాది శుభా కాంక్షలతో 
             మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014 

 

Posted in రాజకీయం | Tagged | 1 Comment

అమెరికా తొలి మహిళా డాక్టర్ –ఎలిజబెత్ బ్లాక్ వెల్

అమెరికా తొలి మహిళా డాక్టర్ –ఎలిజబెత్ బ్లాక్ వెల్

T909228_081821 ఫిబ్రవరి మూడున ఎలిజబెత్ బ్లాక్ వెల్ ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో సామ్యుల్ బ్లాక్ వెల్స్ కి, హన్నాకు జన్మించింది .తండ్రి ఉదారుడూ రిఫైనరీ నడిపే వాడు ,మత సంస్థలతో మంచి సంబంధాలున్న వాడు . తండ్రికి పిల్లల విద్య మీద అమిత శ్రద్ధ ఉండేది .అందుకు కావలసిన వసతులు కల్పించి ప్రోత్స హించాడు .దురదృష్ట వశాత్తు ఆయిల్ రిఫైనరి ఒడిదుడుకుల తో నడిచి ఆర్ధికం గా కుంగి పోయాడు .అప్పుడు కుటుంబం తో సహా 1832 లో అమెరికాకు చేరాడు అక్కడ కాంగ్రెస్ రిఫైనరి స్థాపించాడు .సామ్యుల్ హాక్స్ కాంగ్రిగేషన్ లో చేరి మంచి పేరు తెచ్చుకొన్నాడు సంస్కరణలంటే ఆయనకు మహా ఇష్టం .అమెరికా లోని బానిస వ్యతిరేక ఉద్యమం లో చురుకు గా పాల్గొన్నాడు .కుమార్తె ఎలిజబెత్ పై ఆయన ప్రభావం పడి ,ఆమెకూడా బానిస వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నది . దురదృష్టవశాత్తు రిఫైనరి 1836లో తగల బడింది .ఆర్దిక ఇబ్బందులేర్పడ్డాయి నౌకర్లను తగ్గించేశాడు .ఇక అక్కడ ఉండలేక సిన్సినాటికి కుటుంబం మార్చాడు .అక్కడ నల్ల లేబర్ సమస్యల ను ఎదుర్కోవటానికి బీట్ రూట్ తో పంచదార తీసే పధ్ధతి పై ఆలోచించాడు .కాని కొద్ది రోజుల్లోనే తండ్రి భార్యనూ ,తొమ్మిది మంది సంతానాన్నీ ,తీర్చాల్సిన అప్పుల్నీ వదిలి,తీవ్ర జ్వరం తో చని పోయాడు .

కుటుంబ పోషణ భారం మీద పడటం తో ఎలిజ బెత్’’’’ సిన్సి నాటి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అకాడెమి ఫర్ యంగ్ లేడీస్ ‘’అనే స్కూల్ ను ప్రారంభించింది .అక్కడ అన్ని సబ్జెక్టు లను బోధించే ఏర్పాటు ,వసతి,ట్యూషన్లను కల్పించి వాటికి రుసుము తీసుకొనే ఏర్పాటు చేసింది . అదేమీ ఆదర్శం కోసం ఏర్పాటు చేసింది కాదు .ఆర్ధికం గా ఆసరా ఇస్తుందని మాత్రమే . ఈ స్కూల్ బాధ్యతా, నిర్వహణ వల్ల స్లేవరిపై ఆలోచించి పని చేసే సమయం దొరకలేదామెకు .దీనికి తోడు అక్కడి ప్రజల్లో బానిసల విముక్తి వ్యతిరేకత ఎక్కువవటమూ కారణమే . సోదరి ‘అన్నా’ ప్రభావం వల్లఈమె ఎపిస్కోపలనిజం లోకి మారింది రెండేళ్ళ లోనే ఆ చర్చ్ కార్య కలాపాలలో చురుగ్గా పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది .కాని చానెల్ అనే యునిటేరియన్ మినిస్టర్ ద్వారా ‘ భావాతీత ధ్యానం లోకి మారింది .దీనికి ఆగ్రహించిన చర్చ్అధికారుల వల్ల ఎకాడెమి మూతపడింది పిల్లలకు ట్యూషన్లు చెప్పి జీవితం కొనసాగించింది .

చానెల్ గారి ప్రభావం తో సంస్కరణలు ,విద్యా వ్యాసంగం పెరిగింది .ఎన్నో సమావేశాల్లో పాల్గొని ,కథలు రాయటం కూడా మొదలు పెట్టింది .స్త్రీ విద్య ,హక్కులు మహిళా సాధికారత పై దృష్టి నిలిపింది .అన్నా అండతో టీచర్ ఉద్యోగాన్నిపొంది ఏడాదికి నాలుగు వందల డాలర్ల జీతానికి పని చేసింది .కాని స్కూల్ లో విద్యార్ధులకు తగిన సౌకర్యాలు లేవు హెడ్ మాస్టర్ చెప్పే సాధారణ జీవితం అంటే ఇది కాదని తెలుసుకొని మానేసింది . మళ్ళీ సిన్సినాటి చేరి,వాస్తవ దృక్పథాన్ని అలవరచుకొంది.అప్పుడే ఆమె కు మొదటి సారిగా మెడిసిన్ చదవాలనే కోరిక కలిగింది .దీనికి కారణం అక్కడ స్నేహితురాలొకరు ‘యుటినరి కేన్సర్ తో చని పోవటం ఆమెను కలచి వేసింది .ఒక లేడీ డాక్టర్ ఉండి ఉంటే తనస్నేహితురాలు చని పోయేదికాదుకదా అని పించింది .అంతే ఇక ఆమె దృష్టి అంతా మెడిసిన్ చదువు పైనే నిలిపింది .ఆ రోజుల్లో ‘’అబార్షనిస్ట్’’లను’’ ఫిమేల్ ఫిజీషియన్స్ ‘’అనేవారు ..ఆనాడున్న ఆనవాయితీల ప్రకారం మెడిసిన్ చేయటం అంత తేలిక కాదు కాని ఆమె దృఢ నిశ్చయం ఆమెను ముందుకు నడిపించి మెడిసిన్ చదివించి డిగ్రీ సాధించేట్లు చేసింది .

కాని దీనికి మూడు వేల డాలర్లు అవసరమైనాయి. అంత డబ్బు ఆమె దగ్గర లేదు .మళ్ళీ అన్నా సహాయం తో ఒక మ్యూజిక్ టీచర్ గా నార్త్ కరోలినా లోని నాష్ వెల్ స్కూల్ లో చేరింది .అక్కడ మాజీ ఫిజిషియన్ అయిన క్లేర్జిమన్ డిక్సన్ తో పరిచయమేర్పడింది ఆయన తన మెడిసిన్ పుస్తకాలను లైబ్రరీ ని వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాడు . దాన్ని సద్వినియోగం చేసుకొంటూ బానిస వ్యతిరేకోద్యమానికి సహకరించింది కాని ఆమె పని చేసే స్కూల్ మూత పడింది . అప్పుడు డిక్సన్ గారి సోదరుడు,చార్లేస్టన్ లో ఫిజిషియన్ అయిన హెన్రి డిక్సన్ సహాయం తో ఒక బోర్డింగ్ స్కూల్ లో టీచర్ గా చేరింది . ఫిలడెల్ఫియా చేరి జోనాథన్ అలెన్ అనే ఆయన దగ్గర ప్రైవేటుగా అనాటమీ చదివి ఫిలడెల్ఫియా లో మెడిసిన్ లో చేరటానికి దారి ఏర్పరచుకొంది .అందరూ ఆమెఆశలపై నీళ్ళు చల్లిన వారే. ప్రోత్సహించిన వారే లేక పోయారు .కొందరు ఫిజిషియన్లు ఆమెను పారిస్ వెళ్ళమని సలహా ఇచ్చారు

ఇంతలో న్యూయార్క్ లోని అప్ స్టెయిర్ మెడికల్ యూని వర్సిటి లో చేరమని ఆహ్వానం వచ్చింది . అక్కడ మగ స్టూడెంట్లు ఒప్పుకుంటేనే స్త్రీ విద్యార్ధి చేరగలదు .కాని విద్యార్ధులందరూ ఏకగ్రీవం గా ఆమెకు మద్దతిచ్చి చేర్చుకోటానికి అనుమతించారు .కాలేజీ లో చేరింది కాని అంతా కొత్త .పుస్తకాలెక్కడ దొరుకుతాయో తెలీదు ఎవరి నైనా అడగాలంటే సిగ్గు .చేరిన కొద్ది రోజుల్లోనే ఆమె ప్రభావం మగ విద్యార్ధులపై పడి అల్లరి తగ్గింది. అప్పటి వరకు మెడికల్ క్లాస్ లో వారు గందర గోళమే సృష్టించే వారు .ఈమె రాకతో అందరూ నిశ్శబ్దం గా పాఠాలు విన్నారు .అనాటమీ ప్రొఫెసర్ వెబ్ స్టార్ పునరుత్పత్తి పాఠం చెప్ప బోతూ ఇలాంటివి సున్నిత మనస్కులైన ఆడపిల్లలు వినటం భావ్యం కాదని క్లాసులకు రావద్దన్నాడు కాని ఆమె క్లాసులకు వెళ్ళింది .అప్పటి వరకు చాలా అసహ్యంగా చెప్పే విషయాలను ఆమె ఉండటం తో హుందాగా బోధించటం ప్రారంభమైంది .దీనిని లెక్చరర్లు స్టూడెంట్లు అందరూ అభినందించారు .మొదట్లో జెనీవా ప్రజలు ఈమెను వింతగా చూసినా తర్వాత సర్దుకు పోయారు .ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండేది. క్లినికల్ అనుభవం కావాలని అనుకొని దరఖాస్తు చేస్తే ‘’బ్లాకీ ఆం హౌస్ ‘’అవకాశమిచ్చింది .రోగాలను గుర్తించటం తగిన చికిత్స చేయటం ద్వారా అభిమానం పొందింది .సిఫిలిస్ వ్యాధి దానికి కారణమైన .టైఫస్ పై ప్రత్యేక విషయంగా ఆమె జెనీవా మెడికల్ కాలేజి నుండి మెడికల్ డిగ్రీ పొంది తన లక్ష్యాన్ని సాధించింది .’సాంఘిక నైతిక స్థిరత్వం- ఆరోగ్యం’ పై థీసిస్ రాసి మెడికల్

కోర్సువిజయ వంతం గా పూర్తిచేసి,1848,జనవరి 23న మెడిసిన్ లో డిగ్రీ పొందిన అమెరికా మొదటి మహిళగా గుర్తింపు పొందింది .డీన్ చార్లెస్ లీన్అనే ఆయన బ్లాక్ వెల్ కు డిగ్రీ ప్రదానం చేస్తున్నప్పుడు వంగి గౌరవ పురస్సరం గా అందజేసి నట్లు పత్రికలన్నీ గొప్పగా ప్రచురించాయి .

యూరప్ వెళ్లి పై చదువులు చదవాలని ఎలిజబెత్ భావించింది ఇంగ్లాండ్ వెళ్లి ప్రయత్నం చేసి అవకాశాలు లేక పారిస్ చేరింది …స్త్రీ అవటం వల్ల ఎక్కడా అవకాశం లభించలేదు.పాల్ డూబోస్ అనే ఆయన ఆమె అనుభవాన్నీ అంకిత భావాన్ని గుర్తించి గొప్ప డాక్టర్ అవుతుందని చెప్పాడు .మిడ్ వైఫ్ గా పని చేయాల్సి వచ్చింది .ఒక సారి ఒక కంటి జబ్బు రోగికి చికిత్స చేస్తుంటే ఆ జబ్బు ఈమెకు అంటింది. దానితో ఎడమ కన్ను చూపు పోయింది .అందువల్ల సర్జన్ అవ్వాలనే కోరిక తీరలేదామెకు .నయం అయిన తర్వాత 1850లో లండన్ లో సెయింట్ బెత్ లోం హాస్పిటల్ లో ఎన్రోల్ అయింది .సెయింట్ పాగట్ బోధలు తరచూ వినేది .కాని ఆమెకు అమెరికా వెళ్లి ప్రజా సేవ చేయాలని పించి 1851 లో న్యూయార్క్ చేరి స్వయంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది .ప్రజా వ్యతిరేకత ఉన్నా న్యూ యార్క్ టైమ్స్ పేపర్ ఆమెకు సపోర్ట్ గా నిలిచింది. .ఉపన్యాసాలిస్తూ ‘’ది లాస్ ఆఫ్ లైఫ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ‘’అనే పుస్తకం రాసి ప్రచురించింది .టాంపిక్న్స్ స్క్వేర్ లో చిన్న డిస్పెన్సరీ ప్రారంభించింది .డాక్టర్ మేరీ జాక్సా ,సోదరి ఎమిలీ సాయం తో 1857 లో దాన్ని విస్తరించి ‘’న్యూయార్క్ ఇంఫర్మరి ఫర్ ఇండిజేంట్ వుమెన్ అండ్ చైల్డ్ ‘’ నెలకొల్పింది .బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా స్త్రీలనే తీసుకొంది .ఇన్ అండ్ అవుట్ పేషెంట్ లను అంగీకరించింది .ఒక్క ఏడాది లోనే ఏంతో అభి వృద్ధి చేసింది.చెల్లెలు ఎమిలీ కూడా డాక్టర్ డిగ్రీ పొందిన అమెరికా మూడవ మహిళా డాక్టర్ అయింది

అమెరికా సివిల్ వార్ లో బ్లాక్ వెల్ క్షత గాత్రులకు సేవ లందించింది .ఇది మగ డాక్టర్లకు ఇష్టం లేదు .డోరోతీ డిక్స్ సాయం తో నర్స్ ట్రైనింగ్ ప్రారంభించింది .సంస్థ ఆర్ధిక అభివృద్ధికోసం ఇంగ్లాండ్ కు చాలా సార్లు వెళ్లి వచ్చింది బ్రిటన్ లో ఈమె కు గుర్తింపు లభించి జెనరల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లో 1859 లో నమోదు అయింది. ఇలా నమోదైన తొలి మహిళా ఆమెయే .1868 లో మహిళా మెడికల్ కాలేజిని స్థాపించింది ఆ తర్వాత ఇలాంటిదే లండన్ లో మెడికల్ స్కూల్1869 లో ప్రారంభించింది ..దానికి అనుబంధం గా లేబరేటరి ని నెలకొల్పింది .ఈ కృషిలో నిమగ్నమై కూడా ఆమె సంస్కరణ భావాలను వదిలి పెట్టలేదు. ఆమె శిష్యురాలు మేరీ పుట్నం జాకోబి అందర్నీ ఎదిరించి వైద్య సేవలందిస్తోంది .స్త్రీలు సున్నితమైన మనస్కులు కనుక వైద్య సేవ లో వారు బాగా రాణిస్తారని బ్లాక్ వెల్ నమ్మింది .ఇంగ్లాండ్ లో వైద్యసేవలు చేస్తూనే 1871లో ‘’నేషనల్ హెల్త్ సొసైటీ’’ఏర్పాటు చేసింది యూరప్ అంతా తిరిగి స్త్రీ విద్యకు మహిళా వైద్యానికి మద్దతు సంపాదించింది .

ఉద్యోగ విరమణ తర్వాత ఆమె జీవితాన్ని సాంఘిక నైతిక విలువలకు, స్వచ్చమైన సెక్స్ వ్యాప్తికీ అంకితమిచ్చినది .మహిలా హక్కుల కోసం ,కుటుంబ నియంత్రణ కోసం కృషి చేసింది .రెండు యుటోపియన్ కమ్యూనిటీ లకువిరాళాలు సేకరించి నిలబెట్టింది . జబ్బులు నైతికత్వం లేకపోవటం వల్లనే వ్యాప్తి చెందుతాయికాని ,క్రిముల వల్ల కాదని దృఢం గా నమ్మింది .వేశ్యలకు లైసెన్స్ ఇవ్వటం, గర్భ నిరోధక మాత్రలకు వ్యతిరేకంగా పని చేసింది .తలిదండ్రులు పిల్లల విషయమై తీసుకోవాల్సిన నైతిక బాధ్యతలపై ఒక పుస్తకం రాసింది .

సంఘం లో ఆదర్శ మహిళ గా,సేవా భావం తో పని చేసే మహిళా డాక్టర్ గా ఆమె పేరు మారు మోగింది జీవితం చివరి రోజుల్లో కూడా ఆమె కార్యక్రమాల చురుకుదనం ఏ మాత్రమూ తగ్గలేదు .1895లో తన జీవిత చరిత్ర ‘’పయనీర్ వర్క్ ఇన్ ఓపెనింగ్ ది మెడికల్ ప్రొఫెషన్ ఫర్ వుమెన్ ‘’‘’పేర రాసుకోంది..ఎన్నో పర్యటనలలో కాలం గడిపింది 1906లో అమెరికా వెళ్లి మోటార్ కార్ నడిపి సంచలనం సృష్టించింది .1907 ఇంగ్లాండ్ వచ్చి మెట్ల మీది నుంచి జారి శారీరక ,మానసిక ఆరోగ్యం కోల్పోయింది 1910 మే31 90 వ ఏట శాశ్వతం గా రోగార్తులకు దూరమైంది . అశేష ప్రజా వాహిని ఆమె అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించి కృతజ్ఞత తెలుపుకొన్నారు ఎలిజ బెత్ బ్లాక్ వెల్ పేర అనేక బహుమతులంద జేస్తున్నారు ఎన్నో సంస్థలకు ఆమె పేరు పెట్టి గౌరవించారు .

అమెరికాలో మొదటి మహిళా డాక్టర్ గా ,ఇంగ్లాండ్ లో రిజిస్టర్ అయిన మొదటి మహిళా డాక్టర్ గా ,సాంఘిక, నైతిక సంస్కరణలను ఇటు అమెరికాలోను అటు యూరప్ లోను ప్రారంభించిన స్త్రీ గా ,అక్కడా, ఇక్కడా మహిళా మెడిసిన్ విద్యా వ్యాప్తికి ,స్త్రీ హక్కులకు ,బానిసత్వ విమోచానానికి అంకితమై కృషి చేసిన ఎలిజ బెత్ బ్లాక్ వెల్ జీవితం మహిళా లోకానికి . ఒక చారిత్రిక సత్యం అయింది.

– గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | 2 Comments

నా దారి తీరు -64 మామయ్య స్థాపించిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ

నా దారి తీరు -64

మామయ్య స్థాపించిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ

మా ఉయ్యూరు లో ఏవైనా ఆధ్యాత్మిక కార్య క్రమాలు విష్ణ్వాలయం లోనే జరిగేవి .హరికధలు కాపుల వీధి రామాయలం లో ,శివాలయం లో కూడా జరిగేవి . అవీ ఎప్పుడో ఒకటి రెండు సార్లు జరిగేవి .నిరంతరం నిర్వహించటానికి తగిన వేదిక లేదు .దానికోసం పూను కున్న వారూ లేరు .ఆ ఆలోచన ఉన్న వారూలేరు .అప్పుడు తెరమీదకు వచ్చాడు చోడవరపు చంద్ర శేఖర రావు గారి పెద్దబ్బాయి .ఆయన బొంబాయి లో ఏదో పెద్ద ఉద్యోగస్తుడే రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడని అందరు అనుకొనే వారు .ఏడాదికి ఒకటి రెండు సార్లు ఉయ్యూరు వచ్చి తలిదండ్రులైన చంద్ర శేఖర రావు గారిని అమ్మ అమ్మన్న గారిని ,సోదర సోదరీలను చూసి వెళ్ళుతూ ఉండేవాడు .అలా ఒక సారి ఉయ్యూరు వచ్చినప్పుడు ఆయన మనసులో ఇక్కడ ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది .మా మేన మామ గంగయ్య గారితో ఆయనకు మంచి చనువు ఉండేది .మామయ్య విష్ణ్వాలయం లో పురాణాలు చెప్పటం సప్తాహాలు నిర్వహించటం అందరికి తెలిసిన విషయమే .చంద్ర శేఖర రావు గారు మా నాన్నగారికి మంచి స్నేహిలు .,’’ఒరే’’అని పిలుచుకొనే చనువున్న వారు మా మామయ్యా అమ్మన్న గారి తమ్ముడు క హెడ్ కరణం  గారైన ఆదిరాజు నరసింహా రావు గారి అక్క గారు .మామయ్య ఈ కరణం గారూ ‘’ఒరే’’అని పిల్చుకొనే వారు .విష్ణ్వాలయ కార్యక్రమాలకు ఈయనే ఆధ్వర్యం వహించేవాడు .మామయ్యా తో చోడవరపు వారి పెద్దబ్బాయి చర్చించి ,వారింటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్తలం లో రెండు నిట్టాళ్ళ తాటాకుల పాక ఏర్పాటు చేసేట్లు అందులో ‘’శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’పేర ఒక ఆధ్యాత్మిక సంస్థ ను ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు .ఖర్చు అంతా ఆయనే పెట్టుకోనేట్లు మామయ్య సభను అన్ని విధాలా అందరికి ఉపయోగ పడేట్లు , నిర్వహణ చేసేట్లు అనుకొన్నారు .అలా ఈ సభ చోడవరపు వారి ఆర్ధిక సహాయం తో మామయ్యా నిర్వహణ లో వెలిసింది .

మామయ్య చాలా నిక్కచ్చి మనిషి ప్రతి రూపాయిని జాగ్రత్త చేస్తాడు .లెక్కలు రాస్తాడు .అందుకనే ఈయన మీద ఆయన పూర్తీ బాధ్యతను పెట్టాడు .మామయ్య కూడా దాన్ని తన శక్తి సామర్ధ్యాలతో తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు .పురాణాలు చెప్పే వాడు .హరి కధలు చెప్పే వాడు ధార్మిక ప్రవచనాలను చెప్పించేవాడు .శివ రాత్రికి అభిషేకాలు నిర్వహించేవాడు..

మామయ్యనిర్వహించిన మరొక ప్రత్యెక కార్యక్రమం ‘’వేద సభల నిర్వహణ ‘’.రాష్ట్రం లోని వేదం పండితులందరూ మామయ్య ఆహ్వానం మేరకు ఉయ్యూరు వచ్చే వారు .వారందరికీ మామయ్య గారింట్లోనే భోజనం వసతికి మా ఇల్లు కూడా ఉప యోగ పడేది .వారందరికీ మా అత్తయ్య  మహా లక్ష్మమ్మ గారే మడి తో వంట చేసేది,వడ్డించేది . లడ్డూ లు మొదలైన స్వీట్ల తో భోజనం ఎత్తేవారు .మేమూ వాళ్ళింట్లోనే భోజనం .వేదం పండితులు శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’లో ఉచ్చైస్వరంతో అంతా కలిసి ఏక స్వరం తో వేద పనసలు చదువుతుంటే ఏమీ తెలీక పోయినా అర్ధం కాక పోయినా మహా ఆనందం గా  ఉండేది .చెవులు రిక్కిన్చుకొని ఆసాంతం వినే వాళ్ళం .అదొక దివ్యాను భూతి ,సాయంత్రం వేళ ఈ సభ జరిగేది .అందరితో బాటు ఒక లావుపాటి ఆచార్యుల వారు వచ్చే వారు .వారు మహా పండితులని తెలిసింది వారు ఒక అరగంట సేపు’’ వేదార్ధాన్ని ‘’చాలా సరళమైన భాష లో అందరికి అర్ధమయ్యే రీతి లో స్పష్టమైన ఉచ్చారణ తో వివ రించేవారు .ఈ కార్యక్రమం లో వీరి వాక్కులే హై లైట్ .ఆ తర్వాతా క్రమ, ఘనా ,జటా లతో ఎవరి పాండిత్యాన్ని వారు ప్రదర్శించేవారు .దాదాపు రెండు గంటలు జరిగేది . మామయ్యా కు ఎవరి  అర్హతత ఏమిటో క్షున్నం గా తెలుసు .దానిని బట్టి తాంబూలం దక్షిణా ఏంతో మర్యాద పూర్వకం గా అంద జేసే వాడు .ఈ సభలకు వీలైతే చోడవరపు వారి పెద్దబ్బాయి వచ్చేవాడు .యదా శక్తి ఆయనా దక్షిణ లిచ్చి ఉత్సాహ పరచే వాడు .మామయ్యఅందరిని చక్కగా పరిచయం చేస్తూ వారి విద్వత్ ఏమిటో వివరిస్తూ ఆహ్వానించి వారి వేద విద్యా ప్రదర్శన చేయించే వాడు .తర్వాత అందరూ మామయ్య గారింటికి వచ్చి భోజనాలు చేసే వారు .ఇక్కడా మామయ్యా యదా శక్తి దక్షిణ తామ్బూలాలిచ్చి సత్కరించి పంపేవాడు .చాలా మంది ఆ రాత్రికే బయల్దేరి తమ స్వగ్రామాకో  లేక వేరే చోట జరిగే సభలకో వెళ్ళే వారు మిగిలిన వారు మామయ్యా గారింట్లోను మా ఇంట్లోను నిద్రించే వారు .మర్నాడు ఉదయం కార్య క్రమాలు పూర్తీ చేసుకొని బయల్దేరి వెళ్ళే వారు .లేక ఊళ్ళో అందరిళ్ళకు వెళ్లి ,వేదం విని పించి దక్షిణ పొంది తర్వాత మరో ఊరు వెళ్ళే వారు .ఇలా మహా వైభవం గా మామయ్య అందరికి సంతృప్తి కలిగేట్లు సభలను న భూతో న భవిష్యతి గా నిర్వ హించాడు .ఇది ఆయన కు ఒక సవాలు గా నిలిచి ఆయన పేరు బాగా వ్యాప్త మైంది .

వైదిక సభలో మామయ్య ప్రతి మాస శివ రాత్రి నాడు పగలు సీతా రామ కల్యాణాన్ని ఉత్సాహ వంతులైన దంపతుల తో చేయించేవాడు .మా దంపతులం రెండో నెల లోనే కల్యాణం చేశాం .వెంటనే మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి వివాహం నిశ్చయమై వెంటనే పెళ్లి జరిగింది ఇది ఒకశుభ  సూచకం గా అందరికి తెలిసి మున్డుకోచ్చేవారు .ఇలా రెండేళ్ళు కళ్యాణాలు నిరాఘాటం గా సాగాయి .వేదసభలకు అందరిని ప్రోత్సహించటానికి మామయ్యా ఎవరింట్లో వివాహ మైనా ఉపనయనం అయినా ఏదైనా శుభ కార్యక్రమం జరిగినా ఆ కుటుంబం వారిని నూట పదహారు రూపాయలు శాశ్వత నిధికి చందా ఇచ్చేట్లు ఏర్పాటు చేశాడు .అందరూ ఇది చాలా మంచి కార్యక్రమం, ఆలోచన అని భావించి స్వచ్చందం గా ముందుకొచ్చి విరాళాలు అందించారు .సంస్థ ఆర్ధికం గా బలోపేతం చేయటానికి సహకరించారు  ఆ డబ్బును మామయ్య బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేసి దాని పై వచ్చే వడ్డీ తో కార్య క్రమాలు చేసేవాడు ఇదొక ఆదర్శం గా మిగిలింది .చోడవరపు వారబ్బాయి పూనికా సంకల్పం మామయ్య వల్ల నెర వేరి ఈ సభ రాష్ట్రం లోనే మంచి పేరు తెచ్చుకొని అందరికి అనుసర ణీయం అయింది .ఉయ్యూరు చరిత్ర లో మామయ్య పేరు శాశ్వతం గా నిలిచి పోయింది .

ఈ సభ గురించిన మరిన్ని వివరాలు మరో సారి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014 –ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

బాల్జాక్

         బాల్జాక్

బాల్జాక్ పై ‘’లి లెస్ డాన్స్ లవల్లీ ‘’రాసిన పుస్తకం గొప్ప పరిశోదనాత్మకం గా ,వివరణాత్మకం గా ఉంది , బాల్జాక్ రచనల్లో మానవ మనస్తత్వ పరిశీలన శాస్త్రీయ దృక్పధం లో సాంఘిక సంబంధాల ఆధారం గా ఉంటాయి .సమన్వయము ఉంటుంది .దీనికి కారణం బాల్జాక్ సైన్స్ చదువుకొన్న వాడు కావటమే .గొప్ప సాహిత్యం లో విశ్వజనీనత ఉండాల్సిన అవసరం లేదంటాడు లవల్లి .బాల్జాక్ రచనల్లో మగ తనం ఆడతనం సంపూర్ణం గా ఉండి ,సెక్స్ కు అతీతం గా  ఉంటుంది .సంఘర్షణ వల్లనే సెక్స్ ఏర్పడుతుంది .మనస్తత్వ శాస్త్ర దృష్టిలో మానసిక బలంమాత్రమె  సెక్సువల్ ఐడెంటిటి ని బాల్జాక్ రచనల్లో కల్పిస్తాడు .ఆయన రచనల్లో హంతకులు ,దొంగలు చివరికి పిల్లల్లాగా మారి పోవటం ప్రత్యేకత .కోరిక అధికారానికి దారి చూపుతుంది కాని ఈ రెండు వినాశ హేతువులే .వర్జిన్స్ తో స్వలింగ సంపర్కాన్ని బాల్జాక్ ఎంచుకొన్నాడు .దీనిపై చేసే సాధన ఒకరిపై ఒకరికి అధికారాన్ని ఇస్తుందని నమ్మాడు వర్జినిటి లో ప్రత్యేకత ఉందంటాడు .దీనిని పిసినారిలా  కాపాడుకొన్నాడు .

 

Bazac grammar   school                 baljaak house in paris

Honoré de Balzac (1842).jpg   

Honoré de Balzac signature c1842-43.svg

బాల్జాక్ స్వీయ జ్ఞానం అంతాఖర్చు అయిన తర్వాతే చని పోయాడు .నిజం కంటే ఊహకే ప్రాధాన్యత నిచ్చాడు .ఆత్మ త్యాగం తో ఉన్నత స్తితి కి వెళ్ళటం కనీ పిస్తుంది. అతీత శక్తేదో ఉందని పిస్తాడు ‘’లా కామెడి హుమేన్ ‘’లో హింస ఎక్కువ అసమానత్వం లో వంశ పారం పర్యత్వం సమానత్వాన్ని తెస్తుందని నమ్మాడు బాల్జాక్ దృష్టిలో సంఘం స్నేహం తో కూడిన పోటీతత్వం ఉన్న కారడవి . .మన సంఘం లో దేవుడు దెయ్యాలకు ప్రతినిధి .అతని భావన లో ప్రజాస్వామ్యప్రభుత్వం సాంఘిక సుస్తిరత్వానికి భంగకరం .’’social aristocracy can discipline the aristocratic nature ‘’అని నమ్మాడు బాల్జాక్. ‘’without intelligence ,’’a broad skull ‘’,the nobility can not survive –I feel many ‘’me ‘’s in my self ‘’అంటాడు .’’images of social disintegration are constantly images of family disintegration ‘’అని న్నిస్చయం గా నమ్మాడు .చట్టాన్ని అందరు గౌరవిన్చాలన్నాడు .

బాల్జాక్ హీరోయిన్ హెన్రిట్టీ’’appetite is primarily sexual ‘’అంటుంది .sexuality makes lives a drama of ingenuity ‘’దీనినే ‘’ఇమ్పీరియాస్ ప్లేసర్ ‘’అన్నాడు .’’the mystery of duel sexuality in a single person solves the greater mystery of division of seperateness they becoe a single being –find a constant source of pleasure .desire is tamed by merged sexual identities .she loves him less than a lover more than a brother lovers desires are sublimated in toa life of service .ఇవీ బాల్జాక్ నమ్మినవి

 

పారిస్ లో విగ్రహం                                                                                             విక్టోరియా మ్యూజియం లో బాల్జాక్ విగ్

పారిస్

     

బాల్జాక్ ప్రత్యేకత జీవితం లోని అన్ని సందర్భాలను సమానం గా చూస్తాడే తప్ప దేనినీ అవసరానికి ఎక్స్ప్లాయిట్ చెయ్యక పోవటం .అధికారం తక్కువ గా ఉంచుకున్న మనిషి జీవితమ్ ఇచ్చిన అవాకాశాలలో తేడాగా ప్రవర్తిస్తాడు .ఇతని తర్వాత వచ్చిన స్తేన్దాల్ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు

అసలు పేరు హానారే డి బాల్జాక్ .1799 -5-20 ణ ఫ్రాన్స్ లో జన్మించిన కదా నవలా రచయితా .నెపోలియన్ పతనం తర్వాత ఫ్రెంచ్ సంఘం లో వచ్చిన మార్పుల్ని రచనల్లో చూపాడు యూరోపియన్ లిటరేచర్ లో ‘’రియాలిజం ‘’ని రచనల్లో చూపించిన మొదటి రచయిత.ఈయన వారసులే ఎమిలీ జోలా డికెన్స్ ,అలాన్ పో దాస్తో విస్కీ మొదలైన వారు మార్క్స్ ఏంజెల్ లనుకూడాప్రభావితం చేశాడు  ఇతని రచనలన్నీ సినిమాలు తీశారు .విపరీతం గా రచనలు నిరంతరం చేస్తూ ఉండటం తో ఆరోగ్యాన్ని కోల్పోయాడు1850ఆగస్ట్18 ణ యాభై ఒక్క సంవత్సరాలకే మరణించాడు

నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బిల్ పోర్టర్

        బిల్ పోర్టర్

ఆ దర్శ జీవితం గడిపి మార్గ దర్శి అయిన బిల్ పోర్టర్ అనే ఆయన గురించి అతని ఏజెంట్ షెల్లీ బ్రాడి రాసిన జీవిత చరిత్ర ఇది . బిల్ పోర్టర్ అమెరికా లోని ఒరిగాన్ రాష్ట్రం లో పోర్ట్ లాండ్ లో జన్మించాడు . బిల్ పోర్టర్ పుట్టుక తోనే ‘’సెరిబ్రల్ పాస్సి ‘’అనే జబ్బుతో పుట్ట్టాడు .తల్లి పురిటి నొప్పులు పడుతుండగా కడుపు లో ఉన్న బిల్ అడ్డం తిరిగాడు .’’ఫోర్సేప్స్ ‘’ఉపయోగించి బిడ్డ ను బయటికి తీయటం వల్ల మెదడు దెబ్బ తింది .మాటలు సరిగా రాలేదు .కండరాలు సహక రించలేదు బిల్ పోర్టర్ కు .అందుకని మామూలు స్కూల్ లో కాకుండా ఇలాంటి వారికోసం ఉన్న ప్రత్యెక స్కూల్ లో చేర్పించారు .

బిల్ తల్లి తండ్రి అక్క కూడా అక్కడే ఉద్యోగం లో చేరారు అతనికి సాయం గా ఉండటం కోసం ..చదువు పూర్తీ అవగానే ఉద్యోగం చూసుకోమన్నాడు తండ్రి .చాలా ఇంటర్వ్యు లకు వెళ్ళాడు పోర్టర్ .చివరికి సేల్స్ మాన్ గా ట్రయల్ బేసిస్ మీద ఉద్యోగం వచ్చింది .డిటర్జెంట్ వగైరాలు అమ్మే పని లో చేరాడు .ఒక సూట్ కేసు లో వాటిని తీసుకొని ఇంటింటికీ తిరిగి  రోజుకు  వంద ఇళ్ళ తలుపు తట్టే వాడు .చాలా మంది తమకు వద్దు అనే వాళ్ళు .కోప తాపాలు లేకుండా విసుక్కో కుండా చిరు నవ్వే సమాధానం గా వెళ్లి పోయే వాడు .చివరికి అతని మంచితనం మీద అందరికి గౌరవం ఏర్పడి కస్టమర్స్ ఏర్పడ్డారు .ఎక్కడికి వెళ్ళినా ఎన్నిఇళ్ళు తిరిగినా అంతా నడక తోనే చేరే వాడు .తెల్ల వారు జామున నాలుగు గంటలకు లేచి తన కార్య క్రమాలన్నీ పూర్తీ చేసుకొని ఎనిమిదింటికి ఇంటి నుంచి బయల్దేరే వాడు .తన సరుకును ఎవరు కొన్నా ,కొనక పోయినా అతనికి చింత ఉండేది కాదు .రొటీన్ మార్చలేదు .ఇలానే జీవితం సాగించాడు పట్టువదలని విక్రమార్కుడి లా చివరికి అనుకొన్నది సాధించాడు ‘’బెస్ట్ సేల్స్ మాన్ అవార్డ్ ‘’పొందాడు .షెల్లీ ని ఉద్యోగం లో పెట్టుకొని తిరిగే వాడు .కొంతకాలానికి అమెరికా లోనే సెలబ్రేటేడ్ పెర్సన్ అయ్యాడు బిల్ పోర్టర్ .ఎన్నో టి.వి.ఇంటర్వ్యు లు చేస్సిన్ది షెల్లీ.అతని జీవితాన్ని సినిమా గా కూడా తీశారు .

వాషింగ్ టన్ డి.సి. లో జే.ఎఫ్ కే సెంటర్ లో బిల్ పోర్టర్ 66వ జన్మ దినోత్సవాన్ని ఆ కంపెనీ వారు ఏర్పాటు చేశారు సేల్స్ మెన్ అందరూ అశేష సంఖ్య లో హాజరై గౌరవ పూర్వకం గా నిలబడి చప్పట్లు చరిచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు .తరువాత సాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ఇలానే జరిపారు . .ఆ తర్వాతఫోన్ ద్వారా కస్టమర్ లకు ఆర్డర్ తీసుకొని అందజేయటం మొదలు పెట్టి వ్యాపారం పెంచాడు .పోర్టర్ జీవితాన్నుంచి తాను  ‘’టెన్ కమాండ్ మెంట్స్ ‘’తీసుకొన్నానని ఏజెంట్ అయిన షెల్లీ చెప్పింది .అవే ‘’faith ,divine nature ,individual worth ,knowledge ,choice and accountability ,good works ,integrity ,family values ‘’

పోర్టర్ జీవితాన్ని గురించి తెలుసు కొని చాలా మంది  అభిమానం తో ఉత్తరాలు రాశారు .తమ జీవితాలను తీర్చి దిద్దు కొన్నారు .పోర్టర్ జీవితం ‘’is a sterling example that each of us can overcome any adversity set back or handicap. Bill is inspirational to every one ‘’అని పూర్తీ చేస్తుంది బిల్ పోర్టర్ చరిత్రను అతని ఏజెంట్ అయిన షెల్లీ బ్రాడి.

బిల్ పోర్టర్ కున్న టెన్ కమాండ్ మెంట్స్ ఏమిటో తెలుసు కొందాం

1-follow your passion -2-it does not matter how you got here only where you are going 3-mother knows best 4-persistence pys off 5-do not take ‘’no’’for an answer 6-know your limits and reach beyond them 7-be a team player 8-if it is not broken do not fix it 9-there are no obstacles 10-live your  values .’’

3-10-2002బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి

2014 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-13-ఉయ్యూరు

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 68,000 times in 2013. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్కానింగ్ ది సెంచరి

పెంగ్విన్ సంస్థ వారు ‘’The Penguin book of 20th century in poetry ‘’పుస్తకాన్ని పీటర్ ఫోర్బ్స్ సంపాదకత్వం లో  ప్రచురించారు ఇది చదివితే విశ్వ దర్శనం చేస్సిన అనుభూతి కలుగు తుంది .ఆ శతాబ్దిలోని ప్రతి అంశాన్ని కవులు స్పృశించి మెచ్చారు .అవసరమైన చోట చీల్చి చెండారారు కూడా .ప్రతి సంఘటనకు స్పందించారు .దాదాపు అన్ని దేశాల కవితలు ఇందులో చోటు చేసుకోవటం ఆహ్వానించ దగిన విషయం .ప్రఖ్యాత కవుల దగ్గర నుచి కొత్త గళం విని పించిన వారి వరకు ఇందు లో చోటు కల్పించటం బాగుంది

ఈ కవితా సంకలనం ఉద్దేశ్యాన్ని ‘’a neutral tone is  now a days preferred .And yet it may be better if we must to praise a stance impressive and absurd –Than not to see the hero for the dust ‘’ఆదర్శం గా దీన్ని తీర్చి దిద్దారు .ఈ శతాబ్దం ఎవరిది /అన్న ప్రశ్నకు జవాబుగా ‘’omen ‘’తో ప్రారంభించి unfinished business ‘’తో పూర్తీ చేశారు .ఇందులో కాల విభజన దశాబ్దాలలో ఉంది .ఇది కాక సైన్స్ స్పోర్ట్స్ గేమ్స్ జాజ్ యుద్ధాలు వగైరా విభజన ప్రత్యేకం .అందులో కొన్ని ఆసక్తి కరమై నాకు నచ్చిన పోయెమ్స్ ను అందిస్తున్నాను

1-‘’the wounded man ‘’అనే స్పానిష్ కవి హీర్మాందిజ్ కవిత

‘’the body;s relics that I give up in each wound –will bud again in autumnaless fluttering of sap

Because I am like the cropped tree and I bud again –because I still have life ‘’

2-james tati కవిత

‘’spring was truly begging to be born –like a cipher that aspires to the nmber one

Hush it is all hearsy irresistible heresay .

3-E.C .Cummings రాసిన ‘’may I feel ‘’కవిత sex and love  చాప్టర్ లో ఉంది

‘’may I feel said he –“I will squeal  said she –just once said he –it is fun said she –may I touch said he –how much said she –a lot said he –why not said she –let us go said he –not too far said she –what too far said he –where you are said she –may I stay said he –which waay siaid she –like this said he –if you kiss said  she –may I move said he –is it love said she –if you are willing said he –but you are killing said she –but it is safe said he –but your wife said she –now said he –ow said she –tiptop said he –do not stop said she –oh no said he –go slow said she –ccome said he –ummon said she –you are divine said he –you are mine said she ‘’

4-Anne sexton రాసిన ‘’for my loverreturning to his wife కవిత

‘’  she is so naked and singular –she is the sum of yourself and you dream climb her like a mountain step after step –she is said As for me I am a water colour _I was off

2-10-2002 ణా అమెరికా డైరీ నుండి

2014 నూతన సంవత్సర శుభా కాంక్షలతో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-13-ఉయ్యూరు

 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కథా భారతంలో తొలి అడుగులు -ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు

 

తొలి తెలుగు కథ ఏది? సమాధానం వెతుక్కుంటూనే ఉన్నాం ఇప్పటికీ. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కన్నా ముందే బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ అచ్చయిందని బయట పడింది. అచ్చమాంబవే 1902 కన్నా ముందు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అసలు ‘దిద్దుబాటు’కి ముందు తొంబై తెలుగు కథలున్నాయని ‘కథానిలయం’ ఇప్పుడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో- కొన్ని భారతీయ భాషల్లోని తొలి కథలతో ఒక సంకలనం తెలుగులో వస్తోంది. స.వెం.రమేశ్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు సంకలనం చేసిన ఈ పుస్తకం, జనవరి 4న పొన్నూరులో అ.జో.వి.భో భాషా సదస్సులో విడుదలవుతోంది. ‘తొలి కతలు’ ముందుమాట ఇది…

‘కతా కతా… నువ్వెప్పుడు పుట్టావు?’ అనడిగితే, పక్కున నవ్వింది కత. పగలబడి నవ్వింది కత. పడీ పడీ నవ్వింది కత. మూతి ముడుచుకుని, ‘ఎక్కడ పుట్టావో చెప్పు?’ అన్నా. ఎర్రిబాగులోడా… అన్నట్టుగా చురుగ్గా చూసింది కత, నా చేతిలోని పెన్నూ కాయితాలని జాలిగా చూస్తా. ‘పోనీ గానీ, ఎవురికి పుట్టావో అదన్నా చెప్పు?’ అన్నా. ఈ తూరి, కోపంగా చూసింది కత. కొర కొరా చూసింది కత. ‘అనగనగా… అంటా నీకు కతలు చెప్పిన అవ్వనడుగుపో’ అనింది విసురుగా. ‘మా యవ్వ ఇప్పుడేడుండాది అడిగేదానికి…’ అన్నా. ‘అయితే, సందేళ సందేళ నిన్ను సంకనేసుకోని, అద్దో సందమామలో అవ్వ పిలగాడికి బువ్వ పెడతావుండాది చూడు అంటా కత చెప్పి నిన్ను మరిపించి అన్నం తినిపించిన మీయమ్మ నడుగు’ అనింది కత. ‘అమ్మ గూడా ఎల్లిపాయనే ఈ నడమే’ అన్నా నిట్టూరస్తా. ‘పోనీ, యాపచెట్టుకింద ఎండపూట ఎన్నెన్ని కతలు చెప్పినాడు మీ చెంగన్న… ఆయన్ననడుగుపో’ అనింది దయగా.

‘యాడ చెంగన్నా… ఎప్పుటి కతా…’ అన్నా, ఇంకేమన్నా చెప్పు అన్నట్టుగా. సందర్భాన్ని బట్టి కత చెప్పే సమాది రవణయ్యనీ, కతలగంప అని అందురూ అనే మాదిగ పేరమ్మనీ, దెయ్యం కతలే చెప్పే బయపిత్తులోడు ముక్కుతిమ్మడినీ… ఇట్టా ఎందురెందురినో గుర్తు చేసింది కత. ‘ఎవురెవురి కతో నాకెందుకు గానీ… నీ కతేందో చెప్పు ముందు’ అని తగులుకున్నా వదలకుండా. ‘నీకు అమ్మంటే పిచ్చి కదా… మీయమ్మకి అమ్మెవురు?’ అనడిగింది. ‘చెంచురత్నమ్మ’ అన్నా టక్కున. ‘చెంచురత్నమ్మకి అమ్మెవురు?’ అనడిగింది. ‘పేరు తెలీదు, కానీ ఉండేవుంటాది గదా’ అన్నా. ‘ఆ ఉండే ఉండిన అమ్మకి అమ్మెవురు? ఆయమ్మకి అమ్మెవురు? అసలుకి ఈ బూమండలం మింద తొట్టతొలి అమ్మెవురో కనుక్కోని రాబో… అప్పుడు చెప్తా నా కత’ అని నా కళ్ళలోకి లోతుగా చూసింది కత. దిక్కూ దిశా తెలీక తికమకగా చూశా, అప్పుడు నవ్వింది కత. విరగబడి నవ్వింది. మళ్ళీ మళ్ళీ నవ్వింది. నవ్వీ నవ్వీ నవ్వులోనే మాయమై పొయ్యింది కత.

అవును గదా, అమ్మలగన్న అమ్మ ఎవురూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైనా సాధ్యమయ్యేదేనా? తొలి అమ్మ మాదిరే గదా, తొలి కతా! ఏదన్నా ఒక గీత గీసుకుంటే తప్ప తొలి అని దేన్నయినా అనుకోలేంగదా. కతలకి సంబంధించినంత దాకా ఆ గీత అచ్చు మిషను. అచ్చులోకి వచ్చిన కాణ్ణుంచీ దొరికిన కతల్నే తొలి కతలని అనుకుంటా ఉన్నాం. అనుకుని ఎతుక్కుంటా ఉన్నాం. ఎతుక్కుని ఏరుకుంటా ఉన్నాం. ఏ దేశాన అయినా, ఏ భాషలో అయినా ఇదే తీరు. మొరసునాడనీ, తొండనాడనీ, హోసూరనీ… యాడాడ కతలో ఏరి కూర్చి పుస్తకాలేసే పనిలో ఉండేటపుడు చేతికొచ్చింది ఒక పుస్తకం. ‘తొలి తెలుగు కథ-ఏడు అభిప్రాయాలు’ దాని పేరు. గురజాడ దిద్దుబాటా, బండారు అచ్చమాంబ ధన త్రయోదశా ఏది తొలి కత అని ఇప్పటికే చాలా కొట్లాట జరిగిపొయ్యింది తెలుగులో. ఈ పుస్తకం బుర్రలో దూరి రొద పెడతా ఉండాది. 1910 లేదా 1902, తొలి కత ఏదైనా ఎనిమిదేళ్లే వారా. తెలుగులో కత ఇంత ఎనకబడి మొదులయ్యిందేందబ్బా? అయినా, ఆ రెండు కతల్లో గూడా ఆ భాషేంది సామీ గులకరాళ్ళు నవిలినట్టు అని బాధ కలగతానే ఉండింది. అప్పుడు తెలిసింది తాతాచారి కతల గురించి. నెల్లూరు నుంచి ఈతకోట సుబ్బారావు, తాతాచారి కతలు జెరాక్సు చేసి పంపించినాడు. బంగోరే వేసిన పుస్తకం కాపీ అది. 1855లోనే తాతాచారి కతల పుస్తకాన్ని బ్రౌన్ దొర అచ్చేయించినాడు. ఈ కతలు మనం మాట్లాడుకున్నంత తేలిగ్గా ఉండాయి. అయితే, తాతాచారి స్వయంగా ఈ కతలు రాయలేదు.

తాతాచారి చెప్పిన కతలన్నిట్నీ గుర్తు బెట్టుకుని బ్రౌన్‌దొర ఇంకెవురి దగ్గరో రాయించి అచ్చేయించినాడు. ఓహో, ఇందుకన్నమాట వీటిని మొదుటి కతలు అనలేదనుకుంటా ఉండంగానే, వాసిరెడ్డి నవీన్ చెప్పినాడు, దిద్దుబాటు కన్నా ముందరే అరవై అయిదు కతలుండాయి తెలుగులో అని. అసలికి, బండారు అచ్చమాంబ రాసినవే ధన త్రయోదశి కన్నా ముందుటి కతలుండాయని మహబూబ్ బాషా బయటపెట్టినాడు. తెలుగులో తొలికత చుట్టూరానే ఇంత కత నడస్తా ఉండాది కదా, మన దేశంలోనే వేరే వేరే భాషల్లో తొలి కతలు ఏ మాదిరిగా ఉండాయి? మనకన్నా ముందొచ్చినాయా, తర్వాతనా? అనే దాని మీదకి మనసు మళ్ళింది. అప్పుడు మొదులైంది, తండ్లాట. ఎందురికో ఫోన్‌లు చేసి, ఎందురితోనో నేరుగా మాట్లాడి, వెంటబడి, వేధించి, విసిగించి, కోపం తెప్పించి పన్నెండు కతలు కువ్వబోసినాం. ఏది తొలి కత అనే గొడవ తెలుగులో ఉన్నంత గంగనాగోలగా వేరే భాషల్లో ఉన్నట్టు లేదు.

మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, బెంగాలీలో కూడా తొలి కత ఏదనే దాని మింద వాదాలు నడిచినా, వాళ్ళకి వాళ్ళే కొన్ని గీతలు గీసుకుని ఇదీ మా భాషలో తొలి కత అని ఒప్పందానికి ఒచ్చేసినారు. ఈ లెక్కన చూస్తే, మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన ‘గుజారుహా జమానా’ కతని తొలీదని అనుకోవాలి. 1884లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘ఘాటీర్ కథ’నే బెంగాలీలు, వాళ్ళ భాషలో తొలికత అనేసుకున్నారు. 1890లో మరాఠీ భాషలో హరినారాయణ్ ఆప్టే రాసిన ‘దహా రూపాయాంచీ ఫేడ్’ని తొలి కతగా చెప్పుకుంటా ఉండారు.

అయితే, మరాఠీలో దీనికన్నా ముందే ఒక దళిత రచయిత కత రాసాడనే వాదనా ఉండాది. ఆ కత జాడ దొరకలేదు. మలయాళంలో 1891లో తొలి కత అచ్చయితే, ఒడియాలో 1898లో తొలి కత వచ్చింది. కన్నడ, గుజరాతీ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 1900 తర్వాతే తొలి కతలు వచ్చాయి. కొంకణి, తుళు భాషల్లో 1933 దాకా కత లేదు. కాశ్మీరీలో 1955లో గానీ తొలి కత రాలేదు. అంటే అప్పటి దాకా అక్కడ అమ్మలూ, అవ్వలూ, తాతలూ పిలకాయలకి కతలే చెప్పలేదని కాదు. చెప్పిన కతలు అచ్చుకాలేదు. అచ్చయినా సాహితీ ప్రపంచం గీసుకున్న గీతల్లోకి అవి ఒదగలేదు. అసలీ గీతలు తొలీగా గీసుకున్నది మనం కాదు, ఐరోపాలో, అమెరికాలో చిన్నకత అనే మాట 1700 ఆఖర్లోనే వాడుకలోకి వచ్చింది. పిట్టకతలు అనే మాట మన జానపద సాహత్యంలోనూ ఉన్నా, ఇంగ్లీషులో పోస్తేనే కదా తీర్థం! 1790-1830 నడుమనే ఈ దేశాల్లో చిన్న కతలు ప్రచారంలోకి వచ్చినాయి. ఇంగ్లండులో వాల్టర్ స్కాట్ రాసిన ‘ది టూ డ్రోవర్స్’ 1827లో అచ్చయింది. అమెరికాలో 1837లో నెతానియేల్ హాతరాన్ రాసిన ‘ట్వైస్ టోల్డ్ టేల్స్’తో చిన్న కతల దుమారం మొదులైందని అంటారు.

తెలుగులో తొలికత చుట్టూరానే ఇంత కత నడస్తా ఉండాది కదా, మన దేశంలోనే వేరే వేరే భాషల్లో తొలి కతలు ఏ మాదిరిగా ఉండాయి? మనకన్నా ముందొచ్చినాయా, తర్వాతనా? -అని పన్నెండు కతలు కువ్వబోసినాం. మరాఠీలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, బెంగాలీలో కూడా తొలి కత ఏదనే దాని మింద వాదాలు నడిచినా, ఇదీ మా భాషలో తొలి కత అని ఒప్పందానికి ఒచ్చేసినారు. ఈ లెక్కన చూస్తే, మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన ‘గుజారుహా జమానా’ కతని తొలీదని అనుకోవాలి.

చార్లెస్ బ్రోకెన్ బ్రౌన్ 1805లోనే చిన్న కతలు రాసినా, 1819లోనే వాషింగ్టన్ ఇర్వింగ్ రాసినా హాతరాన్‌తోనే చిన్న కతల గురించి మాట్లాడుకోవటం పెరిగింది. 1832-1849 నడమ ఎడ్గార్ ఎలెన్ పో కతలు వచ్చాకే, ఇవి గదా చిన్న కతలంటే అన్నారు. జర్మనీలో 1810లోనూ, ఫ్రాన్స్‌లో 1829లోనూ తొలి కతలు వచ్చినాయని అంటారు. 1860 నుంచీ రష్యాలో చెహోవ్ చిన్నకతల యుగం మొదలైంది. తొలి రోజుల్లో జానపద, నీతి, డిటెక్టివ్ కతలు అందరికీ నచ్చినాయి. బతుకు సమస్యలు, మనుషుల నడుమ సంబంధాలు వంటివి ఆ తర్వాత కతలుగా మారాయి. ప్రపంచ యుద్ధాల తర్వాత చిన్నకత మరింత ముదురుపాకాన పడింది. కావ్యాలూ, నవలలూ వీర విహారం చేసే దినాలలో… మొదులుబెడితే ఒకే తూరి చదివేయగలిగిన కతలు జనానికి బలే నచ్చినాయి. పత్రికలు వీటిని బాగా అచ్చేసేవి. తొలి దినాల్లో నూరు పేజీల కతని కూడా చిన్న కత అనే అనేవాళ్లు. ఇంతకీ ఈ కతల వెనకుండే కతంతా ఆడా ఈడా పోగేసి తెలుసుకునిందే. ఇదంతా తెలుసుకున్నాక అనిపించిందేమంటే, ఐరోపాలోనో, అమెరికాలోనో పుట్టినా చిన్న కత అదే మాదిరి గుణాలతో మన దేశంలోకి అడుగు పెట్టడానికి ఎక్కువ కాలమేం పట్టలేదని. 1840ల్లో ఎడ్గార్ ఎలన్ పో రాసిన కతలనే అచ్చమైన కతలుగా అనుకుంటారు.

1870 నాటికే మన దేశంలో తొలి కత అచ్చయిపొయ్యింది. ఇంగ్లీషోళ్ళ పాలన వల్లే మనకు ఈ కతలు బిన్నా వచ్చేసినాయి. చిన్నతనంలోనే మొగుడికి దూరమైన అమ్మాయి, గంగలో తనువు చాలించిన కతని ఒక రేవు చెప్పినట్టుగా రవీంద్రనాధ్ ఠాగూర్ 1884లోనే రాశాడు. ఇరవై నాలుగేళ్ళ తరువాత వచ్చిన తమిళ కతకీ, ఈ బెంగాలీ కతకీ పోలికలుండాయి. మాట తప్పిన మొగుడ్ని పల్లెత్తు మాట అనకుండా నీట మునిగి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి కతని గుంట కట్ట మీదుండే రాగిమాను చెబుతాది. ఇది ఠాగూర్‌కి కాపీ అని తమిళనాట కొంత గొడవ జరిగినా, కానే కాదని ఆ తరువాత తేల్చేసినారు. ఇంటి పెద్ద చావుతో స్మశానంగా మారిన గ్రామ కరణం కుటుంబం కతని ఒడియాలో ఫకీర్ మోహన్ సేనాపతి 1898లోనే మనసుకి పట్టుకునే మాదిరిగా రాసినాడు. చేసిన పని తలుచుకుని చింతపడుతున్న దొంగ కతని మలయాళంలో వేంగయిల్ కున్హిరామన్ నయనార్ 1891లో రాసినాడు. ఒక్కో కతదీ ఒక్కో తీరు. ఈ కతల్లో మరీ లేటుగా వచ్చిన కత కాశ్మీరీ భాషలో. 1955లో అఖ్తర్ మొహియుద్దీన్ రాసిన మేజికల్ వెబ్ తొలి కాశ్మీరీ కత. కాలానికి తగిన కత ఇది. ఈ కతని మాత్రమే ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి తెచ్చుకోవాల్సి వచ్చింది. మిగతా కతలన్నీ నేరుగా ఆ భాషల నుంచే తెలుగులోకి వచ్చినాయి.

ఈ కతలన్నీ పోగేసుకున్నాక కొంచం దిగులూ కలిగింది. కొంచెం సంతోషమూ వేసింది, అమెరికా, ఐరోపా దేశాల కతేమోగానీ మన దేశంలో గూడా తొలీగా వచ్చిన కతల్లో మంచి మంచివి ఎన్నో ఉండాయి. ఇంక, దిగులెందుకంటే.. కత నడిపే తీరులో, కతకి ఎన్నుకున్న విషయంలో, కత చెప్పే భాషలో తొలి తెలుగు కతలు ఎనకబడే ఉండాయి కదా అని. సాహిత్యాన్నీ, చరిత్రనీ తెలంగాణలో మళ్ళీ లోడి బయటకి తీసుకుంటా వుండారు గదా, అదే మాదిరిగా తెలుగులో గూడా తొలి తెలుగు కతల కోసం వెతుకులాట ఇంకా లోతుగా జరిగితే, మంచి కతలే దొరకతాయనే ఆశగా ఉండాది. ఈ మాదిరిగా ఇన్ని భాషల కతలనీ ముందేసుకోని తలబోసుకుంటా ఉంటే, ‘అబయా..’ అంటా వచ్చి పలకరించింది కత. ఎళ్ళిపోయిన అమ్మ, ఎనక్కొచ్చి నిద్దర మంచం కాడ నిలబడి పిలిచినంత సంతోషం కలిగింది.
-ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలోని రచయితను నటుడు డామినేట్ చేశాడు….(ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే)

 

రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో పంచుకున్నారు..

ఆర్కే : నమస్కారం గొల్లపూడి మారుతీరావుగారు. ఎలా ఉన్నారు? చాలా ఏళ్ల తర్వాత కలిశారు.
గొల్లపూడి: బావున్నాను. ఆంధ్రజ్యోతిని కలిస్తే సంప్రదాయాన్ని కలిసినట్లు ఉంటుంది. ఈ పత్రికతో నాకు చాలా బంధం ఉంది. ‘జీవనకాలమ్’ కొన్నేళ్ల పాటు రాశాను.
ఆర్కే : ఇక్కడ తెలుగువాళ్లు కొట్టుకుంటుంటే మీరు మద్రాసులో కూర్చుంటే ఎలాగండీ (నవ్వుతూ)?
గొల్లపూడి: నేను మద్రాసులో ఉండేందుకు కారణం – ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండటం. ఒరిస్సాలో ఆలిండియా రేడియో నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని మద్రాసుకు వచ్చాను. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వెళ్లిపోయేనాటికి కెరీర్‌లో నిలబడ్డాను. పిల్లలు స్థిరపడటం మొదలుపెట్టారు. ఏ లక్నోలోనో రాయపూర్‌లోనో ఉంటే తెలుగువాళ్లకు దూరమయ్యామనిపిస్తుంది. కాని మద్రాసులో అలా అనిపించదు. అందువల్ల 43 ఏళ్లు మద్రాసులోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఆర్కే : అక్కడి నుంచి చూసినపుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు మీకేమనిపిస్తున్నాయి?
గొల్లపూడి: దూరంగా చూసేంత దూరంలో లేనండి. తెల్లవారిలేస్తే తెలుగువాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాను. మా తరం చిన్న తెలుగు సమాజం ఇప్పటికీ మద్రాసులో ఉంది. నాకెందుకో ఈ విభజన ఎప్పుడో జరిగుండాల్సింది అనిపిస్తుంది. చరిత్ర చూస్తే ఉద్యమాలు జరుగుతూనే వస్తున్నాయి. చిన్న అసంతృప్తి ఉంటూనే ఉంది. అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు. ఇక్కడ ఆగుతాను నేను. ఎందుకు ఆగుతానో చెబుతాను (నవ్వుతూ). విచిత్రంగా మా ఆవిడ తెలంగాణలో పెరిగింది. భువనగిరిలోని ఎలిమెంటరీస్కూల్‌లో చదువుకుంది. కరీంనగర్‌లో ఎస్ఎస్ఎల్‌సి, వరంగల్‌లో బీఏ చదువుకుంది. నా పెళ్లి హన్మకొండలో జరిగింది. వరవరరావుకు మా ఆవిడ క్లాస్‌మేట్. మా ముగ్గురు పిల్లలు హన్మకొండలోనే పుట్టారు. నేనేమో కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాను. కాబట్టి ఎటూ మాట్లాడలేని పరిస్థితి.
ఆర్కే : మీ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. రంగస్థలం, నాటకాలు, సినిమాలు, రచనలు.. మీరెంతో బహుముఖప్రజ్ఞాశాలి. ఇది ఎలా సాధ్యమైంది?

గొల్లపూడి: నాలో విపరీతమైన ఫైర్ ఉండేది. 14 వ ఏటనే కథ రాశాను. ఈ వయసులో ఇప్పటికీ ఇంత చురుగ్గా ఉన్నానంటే 54 ఏళ్ల కిందట ఇంకెంత ఉత్సాహంగా ఉండేవాణ్ణో ఊహించుకోండి. అప్పట్లో ఇన్నేసి తెలుగు పత్రికలు లేవు. ఇన్నేసి టీవీ ఛానళ్లు లేవు. ప్రతి పనినీ ఉపాధి కోణం నుంచే చూసేవారు. స్టామినా ఎక్కువ ఉండటం వల్ల పని చేయాలన్న తాపత్రయం ఎక్కువగా ఉండేది. దాన్ని వెంటిలేట్ చేయగలిగే వాతావరణం ఉండేది. నేను సినిమా రచయితను, నటుడ్ని అవుదామనుకోలేదు ఏ నాడూ. నటనకు ముందు రెండు దశాబ్దాలపాటు రచనలు చేశాను నేను. గొట్టిపాటి మధుసూదనరావుగారు ‘మీరొక వేషం వేయాలండీ మారుతీరావుగారు’ అనేవారు. ఆలిండియా రేడియోలో వేషం వేయడం, రచనలు చేయడం నిషిద్ధం. అయినా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్లం. నా రేడియో సహచరుల గురించి చెప్పాల్సివస్తే అదొక భువనవిజయాన్ని తలపించేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, దాశరథి, జీవీ సత్యానంద్, స్థానం నరసింహారావు, జీవీ కృష్ణారావు, మునిమాణిక్యం నరసింహారావు, నాయిని సుబ్బారావు వంటి వాళ్లతో కలిసి పదిహేనేళ్ల కుర్రాడు (గొల్లపూడి) పనిచేస్తే అతని ఉత్సాహం ఎలా స్కై రాకెట్ అవుతుందో ఊహించండి.

ఒకరోజు దాశరథిగారు నన్ను పిలిచి ‘మారుతీరావు.. ఎక్కడుంటున్నావయ్యా? దుక్కిపాటి మధుసూదనరావుగారు నిన్ను కలుద్దామనుకుంటున్నారు’ అన్నారు. ‘అంత పెద్దాయన నన్నెందుకు కలుద్దామనుకుంటున్నారండీ’ అన్నాను. నేను గగన్‌మహల్ రోడ్డులో ఒక చిన్న షెడ్‌లో ఉండేవాణ్ణి. అక్కడికి దుక్కిపాటి, దాశరథిగార్లు వచ్చారు. ఒక చిన్న బల్లమీద కూర్చున్నారు. ఒక సినిమాకు కథ రాయమన్నారు. తాజ్‌మహల్ హోటల్ రూంనెంబర్ 18లో అప్పటి దాకా నేను రాసిన పుస్తకాలు దుక్కిపాటి మధుసూదనరావుగారి బెడ్ మీద ఉండడం చూశాను. ఆయనలో ఉన్న గొప్పదనం ఏమిటంటే – ఆంధ్ర నాటక కళా పరిషత్ నుంచి వచ్చినవారు కాబట్టి.. రచయితను కూర్చోబెట్టుకుని కొత్తదనాన్ని రాబట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. అలా వారి ప్రోత్సాహంతో రాసిన మొదటి సినిమా (కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం) ‘డాక్టర్ చక్రవర్తి’. ఆ సినిమా ఫెయిర్‌కాపీ రాసిన మహానుభావుడు ఒకరున్నారు. ఆయనే కె.విశ్వనాథ్. ఆ సినిమాకు ఆయన కో- డైరెక్టర్.

ఆర్కే : మీరు తొలి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు?
గొల్లపూడి: అప్పట్లో రెమ్యునరేషన్ గురించిన ఆలోచనే లేదు. ఇప్పుడు రూపాయి విలువ మారిపోయింది. నా పెళ్లయ్యేనాటికి రేడియోలో నా జీతం వంద రూపాయలు. వంద అంటే ఆ రోజుల్లో ఒక తులం బంగారం. నేను చాలా బాగా రాశానని.. వెయ్యినూట పదహార్లు ఇచ్చారు దుక్కిపాటిగారు. అప్పట్లో దాని విలువ ఎక్కువ. ఇప్పటి ప్రేక్షకులకు ఆ డబ్బు విలువ తెలియాలంటే ఒకటి చెబుతాను. తొంభై అయిదు రూపాయలు పెడితే.. గ్యాస్ సిలిండర్, స్టవ్ వచ్చేవి.
ఆ తర్వాత – నేను ఒక కుర్రాడికి సినిమా కథ రాసిచ్చాను. అప్పుడే హైస్కూల్‌లో క్లాసుఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలా ఉండేవాడతను. ఆ కుర్రాడి పేరు కోడిరామకృష్ణ. ‘మారుతీరావుగారు మీరు వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తాను’ అన్నాడు నిర్మాత కె.రాఘవ. నేనప్పటికి రచయితను మాత్రమే. ఎంతోమంది నటులు ఉండగా నన్నే ఎందుకు నటించమంటున్నారు అని సరదాగా అడిగాను. లేదు.. లేదు.. మీరు వేషం వేయాల్సిందే అన్నారాయన. అలా మొదటివేషం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో వేశాను. అప్పటికి నా వయసు 42 ఏళ్లు.

నా పిల్లలకు అప్పుడొక మాట చెప్పాను “ఈ సినిమాకు సంబంధించిన ఒక మంచి ఫోటో తీసి జాగ్రత్తగా దాచిపెట్టండ్రా. ఈ దిక్కుమాలిన పని చేశానన్న జ్ఞాపకమైనా మిగులుతుంది. మళ్లీ నటించమని ఇంకెవ్వరూ పిలవరు. ఈ వయసులో నటనలోకి వెళ్లి ఏమి ఉద్ధరిస్తాను’ అని చెప్పాను. అయితే ఆ సినిమానే నాకు లైఫ్ ఇచ్చింది. ఒక రోజు మధ్యాహ్నం నేను నిద్రపోతుంటే.. చిరంజీవిగారు ఫోన్ చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా రిలీజ్ కాకముందే అందులోని ఒక సన్నివేశాన్ని క్రాంతికుమార్‌కు చూపించారాయన. వెంటనే క్రాంతికుమార్ తీయబోయే సినిమాలో నన్ను బుక్ చేసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ ఫేసును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. కాని ఆ తర్వాత 30 ఏళ్లు ఏకధాటిగా నటించాను. అయితే నాలోని రచయితను నటుడు డామినేట్ చేయడం బాధ అనిపిస్తుంది. మొన్న ఒకసారి స్వీడన్‌కు వెళితే – అక్కడొకాయన ‘మీరు రచనలు కూడా చేశారా?’ అన్నాడు. అప్పుడప్పుడు మన వాళ్లు కూడా ఇలా అడుగుతుంటారు. అప్పుడు నవ్వొస్తుంది.

ఆర్కే : మీకు సాహిత్యం మీద జిజ్ఞాస ఎలా కలిగింది.. మీ కుటుంబ సభ్యుల వల్ల అలవడిందా?
గొల్లపూడి: నాటకాలు, సినిమాలు, కథలు రాసి చెడిపోతున్నానని.. మా అమ్మగారు అనేవారు. మా నాన్నగారైతే నాతో మాట్లాడేవారే కాదు. ఒక హోటల్‌లో ‘గొల్లపూడి మారుతీరావు నటించు..’ అని ఒక చిన్న పోస్టరు అతికించారు. దాన్ని చూసిన నాన్న- ‘బీఎస్సీ ఆనర్స్ చదువుకున్న నువ్వు కోమలవిలాస్‌లో పోస్టర్ పెట్టుకునే దౌర్భాగ్యపు దశకు వచ్చావు’ అనుకున్నాడట. ఇవాళ ఇన్నేసి థియేటర్లు, టీవీచానళ్లు… ఇంత ఎక్స్‌పోజర్ వస్తుందని ఆయన ఊహించలేదు. ఇవన్నీ డబ్బులు ఇవ్వగల ప్రొఫెషన్స్ అవుతాయన్న సంగతీ తెలియదు.
ఒక తల్లి తన కూతురును ప్రపంచం గర్వించదగ్గ టెన్నిస్ ప్లేయర్‌గా తయారుచేయాలని అలాంటి ప్లేయర్ పేరే పెట్టుకుంది. ఆ అమ్మాయి పేరు మార్టినా హింగిస్. పెట్టుకున్న పేరు మార్టినా నవ్రతిలోవా. మా అమ్మ , నాన్నలు నన్ను అలా ప్రోత్సహించలేదు. వాళ్లు ప్రోత్సహించి ఉంటే నేను ఇంకా ఎక్కడికో వెళ్లేవాడ్నేమో. కేవలం సర్వైవల్ కోసమే కష్టపడ్డాను.
ఆర్కే : మీరు నటుడు కావడం మీ అమ్మానాన్నకు నచ్చేది కాదా?

గొల్లపూడి: ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాను మా అమ్మకు నాన్నకు చూపించాలనుకున్నా. వాళ్లిద్దర్నీ థియేటర్‌కు తీసుకెళ్లాను. నాలుగైదు సీన్లు అయ్యాయి. మా అమ్మ ఏమీ రియాక్టు కావడం లేదు. ‘సినిమా చూస్తున్నావా అమ్మా. అందులో ఉన్నది నేనే’ అన్నాను. సినిమా అంతా పూర్తయ్యాక కారులో వెళుతున్నపుడు మరోసారి అడిగితే ‘ఏమోరా ఆ సినిమాలో నిన్ను అందరూ తిడుతున్నారు. ఇంకో వేషం ఉందే అది వేయాల్సింది’ అంది. ఇంకో వేషం అంటే చిరంజీవి వేషం (నవ్వులు). అమ్మ అనే పరిధి నుంచి ఆవిడ బయటికి వచ్చి నన్ను చూడలేకపోయింది. ‘అభిలాష’ కోసం శ్మశానంలో నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా ‘నువ్వు నటించడానికి వీల్లేదు’ అంది అమ్మ. ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు కూడా ‘అమ్మా నేను అక్కడ పెద్ద డ్యూటీ ఆఫీసర్‌ను..’ అంటే – ‘నువ్వు రేడియోలో ఏమైనా మాట్లాడతావా?’ అనేది. ‘నేను మాట్లాడేవాళ్లకు ఇంఛార్జిని’ అన్నాను. ‘ఎందుకు ఆ దిక్కుమాలిన ఉద్యోగం. కనీసం మాట్లాడితేనైనా రేడియోలో వినొచ్చు కదా!’ అనేది.
ఒక రోజు హైదరాబాద్ రేడియో స్టేషన్‌కు వచ్చింది అమ్మ. అక్కడ స్థానం నరసింహారావుగారు కనిపించారు. ఆయనకు అమ్మను పరిచయం చేయగానే – ‘బాగా రాస్తాడమ్మా వీడు. మంచి కుర్రాడు’ అన్నారాయన. నరసింహారావుగారిని అమ్మ గుర్తుపట్టింది. ‘వీళ్లందరి దగ్గర పనిచేస్తున్నావా నువ్వు.. పోన్లే మంచి ఉద్యోగమే’ అంది. నేను పనిచేసే ఆలిండియా రేడియో కంటే వాళ్లు పనిచేస్తున్న ఆలిండియా రేడియోనే ఆవిడకు గొప్పగా అనిపించింది.

ఆర్కే : రచయిత, నటుడు.. ఈ రెండింటిలో మీకేదంటే ఇష్టం?
గొల్లపూడి: ఈ ప్రశ్నను చాలామంది అడుగుతుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే సమాధానం. రైటింగ్ ఈజ్ మై వైఫ్. యాక్టింగ్ ఈజ్ మై మిస్ట్రెస్. ఎప్పటికప్పుడు నాకు ఆనందాన్నిచ్చే, ఉత్సాహాన్నిచ్చి నన్ను ఆదుకునేది రచనే.
ఆర్కే : నటుడిగా మీ జీవితం ఎలా గడిచింది..
గొల్లపూడి: రేడియో అనుభవానికి తోడు ఒకప్పుడు నేను స్టేజి ఆర్టిస్టును కూడా. అందుకని సినిమా అనేది సులువైంది. తొలి సినిమా తర్వాత ‘మనిషికో చరిత్ర’, ‘ఇది పెళ్లంటారా’, ‘తరంగిణి’లో విలక్షణమైన పాత్రలు వేశాను. వీటిలో రెండు సినిమాలు ఏడాదిపాటు ఆడాయి. మూడో సినిమాకే ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చింది. ఒక నటుడు అయిదేళ్లపాటు నటిస్తే ఎలాంటి పాత్రలు వస్తాయో.. నాకు తొలి అయిదు సినిమాలకే అలాంటి పాత్రలు వచ్చాయి. ఆ తర్వాత ఇరవై ఏళ్లు వెనక్కిచూసుకోలేదు. నేను ఏ కారు ఎక్కుతున్నానో, ఏ డ్రెస్సు మారుస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసేది కాదు.
ఆర్కే : సినిమాల్లో నటించడం ఎందుకు తగ్గించారు?
గొల్లపూడి: తగ్గించాను అనేదానికంటే అవకాశాలు తగ్గాయి అనడం సబబు. ఇప్పుడు ఏ సినిమాల్లో తండ్రులు ఉన్నారు? ఏ సినిమాల్లో మేనమామలు ఉంటున్నారు? ఏ సినిమాల్లో వృద్ధుల సమస్యలు ఉంటున్నాయి? ఏ సినిమాల్లో పిల్లలు కనిపిస్తున్నారు? ఎక్కడ సంసారం చదరంగం ఉంది? ఎక్కడ తరంగిణి ఉంది? ఎక్కడ గద్దముక్కు పంతులు ఉన్నాడు? ఇవాళ మాలాంటి నటుల అవసరమే లేదు. ఆ రోజుల్లో మంచి కథలు వచ్చేవి. కుటుంబం ఐడెంటిటీ చేసుకోగలిగిన కథల్లో నుంచి పాత్రలు వచ్చేవి. ఇప్పుడు పాత్రల అట్రాక్షన్ కోసమే కథలు వస్తున్నాయి. సినిమా అనేది వస్తూత్పత్తిలాగ అయిపోయింది.

ఆర్కే : కాలం మారుతోంది కదా?
గొల్లపూడి: అవును. సినిమాలే కాదు. పిల్లల అభిరుచులు, ఆలోచనలు కూడా మారుతున్నాయి. నా పిల్లలకు పెళ్లి అయ్యేటప్పుడు మా వియ్యంకుల వారికి రెండు షరతులు పెట్టాను. ఒకటి- మీరేమీ నాకు కట్నం ఇవ్వక్కర్లేదు అని. రెండోది- ఇంట్లో కోడళ్లు సల్వారు కమీజులు, నైట్‌గౌన్లు వేయకూడదు అని. 24 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నా కోడళ్లు ఏ రోజూ ఈ షరతులను ఉల్లంఘించలేదు.
ఆర్కే : మరి, మీ కోడళ్ల స్వేచ్ఛను హరించినట్లే కదా?
గొల్లపూడి: హరించినట్లే మరి. అది యారగెన్సీనే (నవ్వులు). దాన్ని చెల్లేటట్లు చెయ్యగలిగే వాళ్లతో కాబట్టి చెల్లింది. చెల్లక్కర్లేని, చెల్లడానికి కూడా ఆలోచించని మరో తరం వచ్చిందిప్పుడు. మనల్ని నోరుమూసుకుని కూర్చోమని కూడా చెప్పింది. కాబట్టే ఊరుకున్నాం. మా అబ్బాయి అప్పుడప్పుడు అంటుంటాడు ‘అదే షరతులు మీ మనవళ్లు, మనవరాళ్లకు పెట్టండి చేతనైతే’నని. అది సాధ్యం అయ్యేపని కాదు అని చెబుతుంటాను.

ఆర్కే : రాజకీయాల మీద తీవ్రమైన వాఖ్యలు చేసేవారు కదా? చట్టసభల్లో దొంగలున్నారని అనేవారు. అప్పట్లోనే దొంగలు ఉన్నారంటే ఇప్పుడు ఎలాంటి వారున్నారని?
గొల్లపూడి: ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. అవినీతి చేసినవాళ్లే మేము చేయలేదని టీవీల ముందుకొచ్చి ధైర్యంగా వాదిస్తున్నారు. మునుపటికంటే ఈ ధోరణి పెరిగింది. మా నాన్న ఓ కథ చెప్పేవాడు – ఒక దొర తాగుడుకు అలవాటు పడి ఆఫీసు సొమ్ము వాడుకోవడం అలవాటు చేసుకున్నాడట. ఇంగ్లండు నుంచి పై అధికారి వస్తున్నాడని తెలిసి.. రెండొందల యాభై రూపాయలు వాడుకున్న విషయం అతనికి తెలిస్తే, ముఖమెలా చూపించాలని.. బీచ్‌కు వెళ్లి షూట్ చేసుకుని చచ్చిపోయాడట. ఇవాళ లక్షా డెబ్బైఅయిదు వేల కోట్లు అవినీతి చేసినవాడు కూడా.. చేయలేదని గర్వంగా చెబుతున్నాడు. అవినీతి చేసిన వాళ్ల పేర్లు కూడా ప్రముఖంగా రాస్తున్నారు. బురదలో నుంచి పద్మం వికసించినట్లుగా.. బహుశా కొత్త మలుపు వస్తుందేమోనని ఆశిస్తున్నాను.
ఆర్కే : మీరు ఇంత అనుభవజ్ఞులు కదా! సామాన్యుల చేతిలో మహామహులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాని సమాజంలో మౌలికమార్పు రాలేదు ఎందుకని?
గొల్లపూడి: ఇదివరకటిలా కాదు. తమ విసుగుదలను, అసహనాన్ని, విచక్షణను చెప్పగలిగే ఆయుధం తన చేతిలో ఉంది అనే విషయాన్ని ఓటర్లు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. లోక్‌పాల్ బిల్లు అంశం, సమాచార హక్కు చట్టం.. ఇవన్నీ అందులో భాగమే.

ఆర్కే : కాని అవినీతిని ఆమోదించే ధోరణి పెరుగుతోంది.
గొల్లపూడి: ఓటరు తన ఆలోచనను నిర్దిష్టంగా చెప్పగలిగిన నాడు.. మార్పు వస్తుంది. హిట్లర్‌ను మనం అసహ్యించుకుంటున్నాం కాని ఎటువంటి పరిస్థితులలో వారు హిట్లర్‌ను ఆదరించారు?- వర్సెల్స్‌లో జర్మనీ వాళ్లను కూర్చోబెట్టి ఫ్రాన్స్ బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, ఆ దేశ ప్రజలు అవమానాలను ఎదుర్కోవడం, ఊచకోతలకు గురికావడం.. వంటి పరిణామాల తర్వాత- ఎవరైనా మమ్మల్ని కాపాడితే బావుండనే నిర్వేదంలో నుంచి.. ‘నేను జర్మన్‌ను కాపాడతాను’ అని హిట్లర్ ముందుకొచ్చాడు. అందుకే ఆ నాయకుని ఉనికి చరిత్రలో నిలబడింది. ఆ తర్వాత హిట్లర్ పరిస్థితి ఏంటన్నది వేరే విషయం. అలాంటి మాస్ రియాక్షన్ మన దేశంలోనూ వస్తుందేమో అనిపిస్తుంది.

ఆర్కే : మీ కుటుంబం గురించి..
గొల్లపూడి: నాకు ముగ్గురు అబ్బాయిలు. ఒకరు పోయారు. ఇద్దరు ఎమ్మే ఇంగ్లీషు లిటరేచర్ చేశారు. పిల్లలకు ఆంగ్లసాహిత్యాన్ని ఇంట్లోనే బోధించాను. నా నాటకం మీదనే నా కొడుకు మధురాంతకం నరేంద్ర దగ్గర పరిశోధన చేశాడు. మాకు ఇంటర్నేషనల్ టికెటింగ్ చేసే ట్రావెల్స్ ఉంది. నాకు అయిదుగురు మనవరాళ్లు. ఒక మనుమడు. మా కుటుంబంలో 42 ఏళ్లు ఆడపిల్లలు లేరు. ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలున్నారు. చాలా ఆనందమేస్తుంది.
ఆర్కే : యువతరాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది?
గొల్లపూడి: వాళ్లలో అజ్ఞాతంగా ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. వాళ్లకున్న రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీని కాని, నింపుకోవలసిన జీనియస్‌ను కాని.. నింపుకోకుండా బయటికొస్తున్నారు. ఇవాళ మీడియా అనేది బ్లాస్ట్. ఒక చిన్న పని చేస్తే పదహారు ఛానళ్లు వాడిని మహానుభావుడ్ని చేస్తున్నాయి. నెగటివ్ ఏంటంటే – పదహారేళ్లున్న ఓ కుర్రాడు లెక్చరర్ చొక్కా పట్టుకున్నా అన్ని ఛానళ్లు చూపిస్తున్నాయి. అలా చూపిస్తే వాడేమవుతాడు? హీరో అవుతాడు.

ఆర్కే : నటుడిగా బిజీ అయ్యాక మీలోని రచయితను పట్టించుకోలేకపోయారా?
గొల్లపూడి: నిజం చెప్పాలంటే ఒక దశలో రచనను మానుకున్నాను. టైమ్ ఉండేది కాదు. అయిదు కాల్షీట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అంత బిజీలో ఒక రోజు రామారావుగారు ఫోన్ చేసి.. ఒక సినిమాకు రాయమంటే ‘ఇప్పుడు రాస్తున్న అయిదు సినిమాలూ మీవే. మరొకటంటే కష్టం’ అన్నాను. అప్పుడే -ఒక రోజు రాత్రి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి ‘ఏమండీ మీరు సినిమాకు ఎంత పుచ్చుకుంటారండీ’ అంది. నేను చెప్పాను. ‘నేనొక పనిచేస్తానండి. ఆ అమౌంట్ మీ అకౌంట్‌లో వేస్తాను. నాక్కూడా ఒక గంట టైమ్ ఇవ్వండి..’ అంది. ఆ మాట విన్నాక రాస్తున్న కలాన్ని కిందపడేశాను. ‘ఆ గంటలో ఏం చేస్తావ్?’ అన్నాను. ‘ఆ గంటలో మన అబ్బాయికి ఎలాంటి బట్టలు కుట్టిద్దాం, ఊరికి వెళ్లినప్పుడు వాడు ఏం చేశాడు, ఎన్నో క్లాసు చదువుతున్నాడు, ఏ పుస్తకం చదువుతున్నాడు.. ఇవాళ ఏ కూర వండుదాం.. ఇవన్నీ చెబుతాను’ అని చెప్పింది. నేను కెరీర్‌లో పడి ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న సంగతి అర్థమైంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తెలుగు వికాసానికి కొత్త లక్ష్యాలు

 

తెలుగు భాష, సాంస్కృతిక వికాసంలో ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కిన సాంస్కృతిక శాఖ కొత్త సంవత్సరంలో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వస్తోంది.

విజయ నామ సంవత్సరం నుంచి ‘జయ’ ముంగిలిలోకి వచ్చిన తెలుగుభాష సాంస్కృతిక వికాసం సరికొత్త దారిలోకి మళ్ళింది. తెలుగుదనం పెంపొందించే సరికొత్త కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెరతీస్తోంది. 2013 ఏడాది అంతా తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఉగాది దాకా ఆయా కార్యక్రమాలు కొనసాగేలా పొడిగించింది. క్రిందటి ఏడాది డిసెంబర్‌లో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల దరిమిలా తలపెట్టినవన్నీ తప్పటడుగుల దశ నుంచి సరైన నడక దారిలో పడేలా ప్రభుత్వ చర్యల దిశ మళ్ళింది.
గత ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలిగిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు ఆర్.వి. రమణమూర్తి సాంస్కృతిక మండలికి అధ్యక్షుడిగా మూడేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వహించిన తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ‘మండలి’ మూతపడింది. స్పష్టమైన అధికారాలు, మార్గదర్శక సూత్రాలు రూపొందని ఆ మండలి ఉనికిపై సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన వారిలో ఎక్కడా చర్చ లేకపోవడంతో 19 ఏళ్ళ మండలి ఉనికికి శాశ్వతంగా తెరపడిందని చెప్పకనే చెప్పినట్టు అయింది.

ఈ ఏడాదిలో సగ భాగం దాకా సాంస్కృతిక శాఖకు సలహాదారుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన కె.వి. రమణ ప్రస్తుతం ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల తీవ్ర అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా పలు సభలు, సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ చేస్తున్న విమర్శలు, సూచనలు సంబంధిత అధికారులకు చురకల్లా తగులుతూ, సరైన దారికి దోవ చూపుతున్నట్టు అవుతున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖలోని 32 మంది సంచాలకులు పటిష్ఠమైన కార్యక్రమాలతో తమ విభాగాన్ని చక్కదిద్దుతున్నారు. ఇన్నేళ్ళుగా ఎన్నడూ లేని విధంగా సుమారు 100 కోట్లు సాంస్కృతిక శాఖలో గలగలలాడాయి. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు ప్రపంచ దేశాల ప్రతినిధుల మన్ననలు పొందాయి. ముందు చెప్పినవి, అనుకున్నవి, అందుకు సంబంధించిన లెక్కలు వంటివన్నీ మరుగున పడిపోయాయి. అట్టహాసం, పటాటోపం వంటివి మాత్రం అందరి జ్ఞాపకాల్లో మెదిలేలా ముద్ర వేసుకున్నాయి.

భారీగా పథకాలు
సుమారు 40 కోట్లకు తగ్గని తెలుగు మహసభల వ్యయం ఆ తరువాత అన్ని జిల్లాల్లో నిర్వహించాలని తలపెట్టిన తెలుగుబాటతో సహా పలు కార్యక్రమాలకు మరో 45 కోట్లు కేటాయింపులు జరిగాయి. కరువు లేని వనరులు, ఎల్లలు లేని తెలుగుదనానికి దన్నుగా ఈ ఏడాదిలో అందివచ్చాయి. రాజకీయాలు, విభజన ఉద్యమాల కొలిమిలో తెలుగుదనం తల్లడిల్లుతున్నా, తలపెట్టినవన్నీ చకచకా జరుగుతున్న తీరుపై దీర్ఘకాలిక ప్రయోజయాలు సాధించేలా ఇరువురు అధికారులు సమష్టిగా 2014లో తాజాదనంతో గుబాళించేలా చేస్తున్నారు. చేయాలనుకున్న పనిపట్ల చిత్తశుద్ధి ఉంటే చాలు, అందరికీ ఆదర్శంగా మనం ముందుండవచ్చు అనే అభిప్రాయంతో, తెలుగుభాష అమలులో అన్నిటా శభాష్ అనిపించుకున్న నందివెలుగు ముక్తేశ్వరరావు సాంస్కృతిక శాఖ పగ్గాలు పట్టుకున్నారు.
ఈ విజయ ‘జయ’ సంధి కాలంలో పాత పద్ధతుల్ని వదిలి సరికొత్త ఆలోచనలకు, చర్యలకు పునాది వేసిన ఆయనకు సంచాలకుడు తోడయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖలోని అధికారి ప్రసాదరాజు సాహిత్యం పట్ల ప్రీతి, అవధాన విద్యలో ప్రతిభతో మెప్పిస్తూ కవితా ప్రసాద్‌గా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్దేశకుడయ్యారు. తొట్రుబాట్లు, తప్పిదాలన్నింటికి తట్టుకుని చిల్లరమల్లర దారుల్లోకి మళ్ళిన శాఖను సూటిగా నేర్పుగా తేట తెనుగుదనంలోకి మళ్ళిస్తున్నారు. ఆ జంట అధికారుల ఆలోచనలు, తాజాగా ప్రకటించిన కొత్త కార్యక్రమాలు వారి మాటల్లోనే….

“మన సాంస్కృతిక శాఖ 33 సంవత్సరాల ప్రస్థానంలో సాధించలేనివన్నీ 2013-14లో సాకారమయ్యేలా చేయగలుగుతున్నాం. ఇప్పటిదాకా 1.50 లక్షల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు జారీచేయగలిగాం. వారిలోని ప్రతిభ, సృజన, పాటవాలు సమస్త ప్రపంచానికి తెలిసేలా సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్‌ను రూపొందించి, ఈ-గవర్నెస్ ద్వారా చురుగ్గా వ్యవహరిస్తున్నాం. ఒక మీట ద్వారా సకల కళారూపాలు, పేరెన్నిక గన్న మహత్తర ప్రదర్శనలు, వాటి స్రష్టలు, కళాకారులు, మహనీయులు వరసపెట్టుగా కళ్ళ ముందు కదలాడేలా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన సమాచారం, వర్గీకరణ, క్రోడీకరణతో అన్నింటా తెలుగుతేజం పల్లవించేలా చేస్తున్నాం. ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చేయలేనివి, తలపెట్టనివి మన దేశంలో, మన రాష్ట్రంలో ఒనగూడేలా జరిగేలా భాష, సాంస్కృతిక రంగాలకు చెందిన అడుగులు పడుతున్నాయి. సుమారు 15,000 మందికి పైగా వయోధిక ప్రావీణ్యులకు, కళాకారులకు పెన్షన్లు ఇచ్చే పథకంలో ఇప్పుడు 8788 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియపరచడానికి ఇదొక మచ్చు మాత్రమే. ఈ ఏడాదిలో వరుసగా 100 రోజులపాటు జరిగిన ‘శతరూపం’లో 76 లక్షలు వ్యయం చేసి 2600 మంది కళాకారులకు అవకాశం, వనరులు అందివచ్చేలా చేశాం. 2012 డిసెంబర్ తెలుగు మహాసభల తీర్మానం ఉత్తేజంతో కదిలిన తెలుగు కళారంగం 2013 నుంచి 2014లో అడుగుపెట్టేలోగానే భవిష్యత్ తరాలకు మేలుచేసే పటిష్టమైన పునాది పడేలా సమిష్టి కృషి సాధించాం.

పోటాపోటీగా ప్రదర్శనలు
అన్ని ప్రక్రియల్లో అత్యంత మేటిగా సకల కళల సమాహారంగా సృజన, ఆకర్షణ ఉండేలా నాటకాల పోటీని ఏర్పాటు చేశాం. ముక్కలు ముక్కలైన తెలుగు రంగస్థల వికాసం మళ్ళీ ఒకే ఒక్క కేంద్రంలో వెలుగులు విరజిమ్మేలా, విశ్వవ్యాప్త వేదికలు ఎక్కేలా పలు రూపాల చర్యలు చేపట్టాం. ఆ దిశలో ఒక సోపానంగా తెలుగు నాటకం, నవల పోటీలు నిర్వహిస్తున్నాం. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను మూడు ప్రక్రియలుగా చేసి వాటిల్లో తాజా రచనకు ఒక్కొక్క దానిలో లక్ష రూపాయల బహుమతిని అందజేస్తున్నాం. అత్యుత్తమంగా ఎంపికైన వాటికి తోడుగా మరో 10 నాటకాలకు ప్రశంస బహుమతులు కూడా అందజేస్తున్నాం. కేవలం బహుమతి ప్రదానంతో, పురస్కారంతో అయిపోయిందనుకోకుండా వాటి ప్రచురణ, ప్రదర్శనల బాధ్యత కూడా ప్రభుత్వం వహిస్తుంది. తెలుగుగడ్డ ఎల్లలు దాటి రంగస్థల వ్యాప్తికి అవసరమైనవన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది. కళాకారులు, సృజనకారులు చేయాల్సిందల్లా వరుసపెట్టుగా చూపరుల్ని మెప్పించి జేజేలు అందుకోవటమే!
ఈ ఏడాదికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం తెలిపే సమయంలో డిసెంబర్ 31 సాయంత్రం రవీంద్రభారతి వేదికగా నవతరం ప్రతిభాదీప్తి వికసించేలా సంకల్పించాం. కొత్తతరం ప్రతినిధులు సరికొత్త ఆలోచనలు, సృజన ప్రతిబింబించేలా ఆలోచనలు, కళారూపాలతో అందరి ముందుకు రావాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. యువతరం ప్రతినిధులతో సాంస్కృతిక రంగం కళకళలాడేలా వికసించేలా చేయటానికి మా శాఖ అన్ని సన్నాహాలు రూపొందించింది.

కళామైత్రి
ప్రభుత్వ సత్కారాలు, నంది విజేతలు, విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాలు, ప్రతిష్టాత్మక బిరుదులు, జవహర్ బాల భవన్ వారి బాలశ్రీలు వంటివి పొందిన ప్రతిభావంతుల్ని, ఆ కోవలో తమ స్థానం పదిలపరచుకోవాలనుకునే వారిని నూతన సంవత్సరంలో చురుగ్గా సరికొత్త సృజనా పాటవాలతో మన సాంస్కృతిక రంగాన్ని పరిపుష్టం చేయమని ఆహ్వానిస్తున్నాం. అందరికీ పేరుపేరునా ప్రభుత్వం నుంచి శుభాకాంక్షల వినతులతో లేఖలు రాస్తున్నాం. తెలుగు కళారూపాలన్నీ సరికొత్త సమ్మిళిత ప్రదర్శనలతో వినూత్న ప్రక్రియలు, ప్రదర్శనలతో విరాజిల్లేలా చేయడానికి కళాకారులు కోరినవన్నీ ప్రభుత్వం పనుపున అందివచ్చేలా చేయబోతున్నాం.

కళాపరిచయం
ఈ పేరుతో పిన్నలు, పెద్దలు మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల పద్ధతులు, పండుగలు, పర్వదినాల లోతుపాతులు వంటివి మతాలు, ప్రాంతాలకు అతీతంగా అవగాహన పెంచుకునేలా చేయడానికి అన్ని వనరుల్ని సమన్వయం చేశాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్ట్ అప్రీసియేషన్ కోర్సుగా విస్తృతంగా నిర్వహించే పద్ధతులకు మించిన శిక్షణ, అవగాహనతో ప్రాథమికంగా అభిరుచి, ఆస్వాదనలో మెళకువలు పెంపొందించేలా ప్రభుత్వ నిర్వహణలో ‘కళాపరిచయం’ ఉండేలా తీర్చిదిద్దాం. ఒక తరగతి గదికి తగినట్టుగా చిన్న చిన్న బృందాలు, కూటములు ఉంటేచాలు ప్రభుత్వం నియమించే నిపుణుడు వారి ముంగిలికే వచ్చి తర్ఫీదుతోపాటు అవసరమైన అవకాశాలు అందిపుచ్చుకునే పద్ధతులన్నీ తెలియచెపుతారు. నామమాత్రపు రుసుం, కళాభిరుచి, సాంస్కృతిక రంగంపట్ల మక్కువ మాత్రమే ఇందుకు అర్హతలు. మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా, తెలుగువారు ఎక్కడ ఉన్నా సాంస్కృతిక శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, వనరులు వారి వద్దకు అందివచ్చేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి.

శ్రుత కావ్యాలు: ఇంటింటా సత్కాలక్షేపం
పుస్తకాల చదువుల అలవాటు తగ్గి వెండితెర, బుల్లితెరల్లో గంటలు గంటలు హెచ్చిస్తున్న వారికి అనువుగా వారు పొందుతున్న వాటికి మించిన వినోదం, ఉల్లాసం, మనోవికాసం రంగరించిన డీవీడీలు, సీడీలు సాంస్కృతిక శాఖ నుంచి విరివిగా ఉత్పత్తి, పంపిణీ ఉండేలా సరికొత్త పథకం అమలవుతోంది. తెలుగు విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన రికార్డింగ్ థియేటర్ ద్వారా తొలిదశ ప్రయత్నాలు కొత్త ఏడాది తొలిరోజునే శ్రీకారం చుట్టుకోబోతున్నాయి. రసవత్తరమైన రూపకాలు, నాటకాలు, కథలు, మహనీయుల జీవిత గమనంలో రసవత్తర ఘట్టాలు, కళారూపాలకు సంబంధించిన సరికొత్త పాఠాలు వంటివి ప్రతివారికి అందుబాటులో పదిలంగా హత్తుకుని పదే పదే చూసి, విని పరవశించేలా చేస్తున్నాం. ఈ రంగంలో ఉత్సాహం, ప్రతిభ ఉన్నవారు సాంస్కృతిక శాఖ వారిని వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా సంప్రదించవచ్చు.ఈ ఏడాదిలో సాంస్కృతిక ప్రదర్శనలు వేదికలపై కార్యక్రమాల నిర్వహణకు ఇంచుమించుగా 140 లక్షలు ప్రభుత్వం అందించింది. తెలుగుదనం వైతాళికులుగా అందరి మన్ననలు పొందిన పలువురు ప్రముఖుల శత జయంతి కార్యక్రమాలు ఏడాది అంతా జరిగేలా కార్యక్రమాల పరంపరకు అన్ని విధాలా సహకరిస్తున్నాము. సులువుగా నిధులు, పుస్తకాలు అందిస్తున్నాం. గురజాడ 150 ఏళ్ళ ఉత్సవ సందర్భంలో 5 కోట్లు, ఆయనతోపాటు తెలుగుదనం పండించిన గిడుగు రామమూర్తి, ఆదిభట్ల నారాయణ దాసు, రఘుపతి వెంకటరత్నం నాయుడుల ఉత్సవాలకు సంబంధించి 50 లక్షల మేరకు కేటాయింపులు జరిగాయి.

కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాహితీమూర్తి త్రయం పేరిట తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, కాళోజీలతోపాటు నీలం సంజీవరెడ్డి శత జయంతి కార్యక్రమాలకు 25 లక్షలు మంజూరు అయ్యాయి. మధిర మ«ధురోత్సవాలు నిర్వహించడానికి 10 లక్షలు ఇతర ప్రాంతాల్లో ఉత్సవాలు, కళారూపాలకు పలు విధాల సాంస్కృతి శాఖ తోడ్పాటు అందిస్తోంది. పాత ఏడాది అనుభవాలతో కొత్త ఏడాదిలో అన్నింటా ప్రమాణాలు, విలువలు పెంపొందించడానికి అందరూ కలసికట్టుగా స్పందించాలని సాంస్కృతిక శాఖ విజ్ఞప్తి చేస్తోంది. సూచనలు, సందేహాలు, వివరాలు, ఫిర్యాదులు వంటి వాటితోపాటు ప్రతినిత్యం సాంస్కృతిక వ్యవహారాలు, కార్యక్రమాల్లో పాల్గొనాలన్న అభిలాష గల ప్రేక్షకులు అందుకు సంబంధించిన సంఘాలకు తోడ్పాటు ఉంటుంది. నమోదు చేయించుకుంటే చాలు, అందుకు సంబంధించినవన్నీ తెలిసి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. సాంస్కృతిక సంస్థలు కూడా శాఖలో నమోదు చేసుకుంటే చాలు ప్రభుత్వం తరఫున కళాకారులలకు తగిన ఆర్థిక సాయం అందిస్తాయి. ఆసక్తి కలవారు ఏమాత్రం తటపటాయించకుండా 040-23212832, 040-23242482 ఫోన్‌ల ద్వారా సాంస్కృతిక శాఖతో నిత్య సంబంధాలు పెంపొందించుకోవచ్చు.
-జి.ఎల్.ఎన్. మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పొట్టి ప్రసాద్ వెండి తెర బంగారం

 
Posted in సినిమా | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ -5

        రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’  -5

1-అంతా కొత్త అన్నీ కొత్త విధానాలతో చీపురు మయమైన మైదానం రాం లీలా

 ఈపొంగు  చల్లారకుండా ఉండి ప్రజాసేవలో తరించాలి అంఆద్మీ సి.ఏం. కేజ్రీ వాలా

2-తెలుగు దేశం దళపతి బాబు దిసిద్ధాంతం రెండు కళ్ళు

  దీన్ని మింగలేక కక్కలేక అన్నారు పెట్టాడని రెండు పడవల్లో కాళ్ళు

3-  కాంగీ మీటింగ్ కు కిరణ్ కొట్టాడు డుమ్మా

    రేపో మాపో పై వారితో అడుతాడేమో అష్టా చమ్మా .

4-  కొత్త ఏడాదికి ముందు కొత్తపట్నం రైల్ బగ్గీ లో జనం అగ్గీ బుగ్గీ

    బుద్ధి రాని యంత్రాంగం  ఇంకా చూస్తోంది మొహాలు వేసి పగ్లీ .

5- గుండు గీయించి రెడీ గా ఉన్నాడు లాంకో లగడపాటి

    కొత్త పార్టీ ‘’షురూ’’కి వెంకన్న మొక్కేమో? అందుకే ఈ ధాటి?

6- సమైక్యం వచ్చింది తెలుగు తల్లి గర్భం నుంచి

 రాజ గోపాల్ కు తెలీదా విభజన వచ్చింది ఇటలీ గర్భం నుంచి?

7-  అవినీతి లేని  సమాజంకోసం బాబు వెంకన్నకు మొక్కు

   మన చేతుల్లో,చేతల్లో  లేనప్పుడు అంతే కదా దేవుడే దిక్కు ?

8-అసెంబ్లీ చర్చకు అడ్డు పడితే చరిత్ర హీనులన్న పొన్నాల

  ఈ చర్చేమిటో రచ్చేమిటో తెలీకుండా అప్పుడే ఎందుకా గోల?

9- శంకరరావు కోరుతున్నాడు ముఖ్యమంత్రి జైలు

    ఈ మధ్య వెళ్ళొచ్చి తెలుసుకోన్నాడేమో ఆ సుకమూ  వీలు

 

10- రాహుల్ భజనతో పులకిస్తున్న లాలు  

     ఇచ్చిందేమో షాక్ తో  అక్కడ జ్ఞానోదయం –జైలు

   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-12-13—ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

పూజా ఫలానికి ఏభై ఏళ్ళు

Posted in సినిమా | Tagged | Leave a comment

యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి -అప్పటి విద్యార్ధిని భారతి

యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి=అప్పటి విద్యార్ధిని భారతి

నేను మోపిదేవి జిల్లా పరిషద్ హైస్కూల్ లో సైన్స్ మేస్ట ర్ గా 1963-65 కాలం లో పని చేశాను .అది నేను మొదట పని చేసిన స్కూల్.ఆ స్కూల్ లో నే నా సర్వీస్ ప్రారంబమైంది .అప్పటి హెడ్ మాస్టర్ తూమాటి కోటేశ్వర రావుగారు .నేనంటే మహా ఆప్యాయం గా ఉండేవారు .ఆయన కూతురు ప్రభావతి ఎస్.ఎస్.ఎల్.సి .లోకి వచ్చినందువల్ల నన్ను ఉయ్యూరుకు బదిలీ ప్రయత్నిస్తుంటే ఆపేశారు  ఆ అమ్మాయి నా దగ్గర సైన్స్ చదువుకోవాలని ఆయన ఉద్దేశ్యం .అలానే ఆగి పోయాను .అప్పుడే మోపి దేవి దగ్గరున్న రావివారి పాలెం గ్రామం కు చెందిన కొల్లి భారతి అనే అమ్మాయి ఆస్కూల్ లో చదివింది ..కోటేశ్వర రావు గారమ్మాయి క్లాస్ మేటె.చాలా మంచి తెలివి గల అమ్మాయి వీళ్ళు స్కూల్ టాప్ క్లాస్ నా దగ్గర చదివారు .అక్కడి నుండి నేను వాళ్ళ క్లాస్ అపూర్తి అయిన తర్వాతా ఉయ్యూరు బదిలీ అయి వెళ్లాను .కాని మోపిదేవి నా జీవితం లో ఒక మధుర ఘట్టం.అక్కడ ఉండగానే మా పెళ్లి అవటం ,కాపురం పెదప్రోలు లో పెట్టటం మా పెద్దబ్బాయి అక్కడే కడుపు లో పడటం మా పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే మా దంపతుల చేత శ్రీ లొల్లా బాల కోటేశ్వర రావు గారు అనే సెకండరి గ్రేడ్ మాస్టారు శ్రీ వల్లీ దేవా సేనా సమేత శ్రీ సుబ్రష్మన్యేశ్వర స్వామి వారల కల్యాణాన్ని కమనీయం గా చేయించటం ,అక్కడే గాన లోల ఘంటసాల  వారిని అక్కడి పూజారి గారింట్లో చూడటం ,కలిసి గంటకు పైగా మాట్లాడటం ,ఆక్విదేక్ట్ చూడటం ,అవని గడ్డ సంతా ,కృష్ణానది వరదలు మరపు కు రాని మధురాను భావాలు .

ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు భారతి బందరు మునిసిపల్ హై స్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేస్తూ స్పాట్ వాల్యుయేషన్ లో కనిపించి గుర్తు పట్టి నన్ను పకరించింది .అప్పటి నుంచి తరచూ స్పాట్ లో కలిసి మాట్లాడేది .అప్పుడు యెంత వినయం గా ఉండేదో అంత వినయం గా ఇప్పుడూ ఉంది ‘’మా సైన్స్ మేష్టారు ‘’అని అందరికి గొప్పగా పరిచయం చేసేది ..అలా మళ్ళీ మా గురుశిష్య బంధం కోన సాగింది .ఆమె బందరు లో అదే స్కూల్ లో ప్రదానోపాధ్యాయురాలైంది .అప్పుడు కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్ అసోసియేషన్ లో చేరి క్రమంగా ఎదిగింది ఆమెను అధ్యక్షురాలిని ఏక గ్రీవం గా చేశాము .సమర్ధం గా పని చేసింది ఆమె రిటైర్ అయినప్పుడు మమ్మలనందరినీ ఆహ్వానించింది ,ఘన సన్మానం పొందింది .DSCF4884 DSCF4885

అప్పటి నుండి  ఆదినారాయణ  రామం  గారు, ఉమా మహేశ్వర రావు ,విశ్వం, రాజు ,రాజేంద్ర ప్రసాద్ సుగుణ ,విజయ లక్ష్మి ,శర్మ మొదలైన రిటైరేడ్ హెడ్ మాస్టర్ లతో మేము ఏపని చేసినా మాతో సహకరించింది భారతి .మమ్మల్ని అందర్నీ తరచూ సమావేశం అయెట్లు చేసిన వారు తెన్నేరు వాసి దేవి నేని మధుసూదన రావు గారు .వారి ఇంట్లో  తరచు కలిసి విద్యాభి వృద్ధి పై ఆలోచించే వారం .

.ఎప్పుడు ఎక్కడ కనీ పించినా అదే మర్యాద అదే మన్నన అదే పలకరింపు .పాపం ఆమె భర్త మరణించాడు పదేళ్ళ క్రితం. ఆత్మ స్తైర్యం కోల్పోకుండా అమ్మాయిని అబ్బాయిని పెంచి వారి ఆలనా పాలనా చూసి ,చదివించి ప్రయోజకుల్ని చేసింది .దైవ భక్తీ తో ,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధన్యమవుతోంది .మా గురు శిష్య బంధం పెరిగిందే కానీ తగ్గలేదు దీనికి ఆదినారాయణ ప్రోద్బలం ఏంతో ఉంది మమ్మల్ని అందర్నీ ఫోన్ చేసి పిలుస్తూ కలుపుతూ అను బంధాన్ని పెంచుతున్నాడు

నాలుగు రోజుల క్రితం సాయంత్రం భారతి ఫోన్ చేసి ‘’మా స్టారూ !మా అమ్మాయికి కూతురు పుట్టి నన్ను అమ్మమ్మ ను చేసింది పురిటికి ఇంగ్లాండ్ వెళ్లాను .ఇప్పుడు తల్లీ పిల్లను తీసుకొని ఇండియా వచ్చాను .మా మనవరాలి అన్నప్రాసన మోపిదేవి శివాలయం లో 28-12-13-శనివారం ఏర్పాటు చేస్తున్నాం .మీరు నాకు మొదటి గురువు గారు .మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను .’’అని చెప్పింది తప్పక  వస్తానని చెప్పాను .

ఇవాళ ఉదయం బయల్దేరి పదింటికి మోపిదేవి చేరి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామిని దర్శించి ,శివాలయమూ సందర్శించి ,హైస్కూల్ కు వెళ్లాను. యాభై ఏళ్ళ క్రితం పని చేసిన స్కూలు .ఏంతో త్రిల్ అని పించింది ఫోటోలు తీసుకొన్నాను అక్కడి నుండి తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ  మండపానికి వెళ్లాను .అక్కడ భారతి ఆప్యాయం గా పలకరించి టిఫిన్ తిని పించింది .ఆ తర్వాత ఆదినారాయణ, విశ్వం, శర్మ గారు ఉమా మహేశ్వర రావు సుగుణ కుమారి రాజేంద్ర ప్రసాద్ దంపతులు మొదలైన వారందరూ వచ్చారు కాసేపు కబుర్లు చెప్పుకొని చిన్నారిని అందరం కలిసి ఆశీర్వదిన్చాము .భారతికి’’ సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’ రెండు పుస్తకాలు బహూకరించాను .మేమంతా కలిసి వచ్చి నందుకు అమితానందాన్ని పొందింది భారతి .ఆ తర్వాత మంచి విందు ఇచ్చింది అందరికి కానుక లిచ్చి వీడ్కోలు చెప్పింది .

పింగళి లక్ష్మీ కాంతం గారు పెరిగిన చిట్టూర్పు

శ్రీ గూడూరి నమశ్శివాయ గారు రాసిన పింగళి లక్ష్మీ కాంతం గారి జీవిత చరిత్రను ఆ మధ్య చదివాను అందులో ఆయన అర్తమూరు లో జన్మించి ఇక్కడ చల్ల పల్లి దగ్గరున్న చిట్టూర్పు లో పెరిగారని తెలుసు కొన్నాను మా సరసభారతి కార్య దర్శి శివ లక్ష్మి  ఆ ఊరే. వాళ్ళ తలిదండ్రులు అక్కడే ఉన్నారు .ఈవిడ వారానికోసారి వెళ్లి వస్తుంది .ఒక సారి ఆమెతో మీ చిట్టూర్పు లో పింగళి వారు పెరిగారు తెలుసా అని అడిగాను తెలుసు అంది .కాని అక్కడి వారెవరికి తెలీదు అన్నది .నేను సరసభారతి తరఫున అక్కడ ఒక కార్య క్రమం నిర్వహించి ఆ తరానికి ఈ తరానికి పింగళివారిని ఒక సారి జ్ఞాపకం చేద్దాం .ఊరి వారి సహకారమేలా ఉంటుందో తెలీదు అన్నాను ఆమె మూడు రోజుల క్రితం ఆ ఊరు వెళ్లి అక్కడ వారికి మేము అనుకొన్న విషయం చెప్పి వారిలో ఉత్సాహం కల్పించింది వచ్చి నాకు చెప్పింది నేను ఈ కార్య క్రామాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం చ తో కలిపి చేస్తే బాగుంటుందని పించి గుత్తికొండ సుబ్బారావు పూర్ణ చంద్ గార్లకు చెప్పాను వారు ఏంతో సంతోషించారు .బుద్ధ ప్రసాద్ గారిని అడిగితె వస్తానన్నారు పింగళి వారి మీద రిసెర్చ్ చేసిన డాక్టర్పింగళి  వెంకట కృష్ణా రావు గారికి చెప్పి ఆహ్వానిస్తే తప్పక వస్తానన్నారు .మాది రాజు రామ లింగేశ్వర రావు గారు సరే నన్నారు ఊళ్ళో వారు కొందరు ఆయన గురించి తెలిసిన వారిని ఆహ్వానించాం .ఒకే  అన్నారు .లక్ష్మీ కాంతం గారు 1894జన వరి 10న జన్మించి ,జనవరి 10 తేదీ 1972లో మరణించారు .అంటే వారి జయంతి వర్ధంతి ఒకే రోజు అంటే జనవరి పది అయింది తామాషాగా. అందుకని వచ్చే జనవరి పది న వారి పై సభను చిట్టూర్పు లో జరపాలని అందరం నిర్ణయించాం .కాని బుద్ధ ప్రసాద్ గారు అ రోజు న విశాఖ లో ప్రోగ్రాం ఉందని ఈ ఉదయం చెప్పి పన్నెండు కు మారిస్తే వస్తామన్నారు సరే అన్నాం .

చిట్టూర్పు ప్రముఖులను  కలవటం

మోపిదేవి లో బారతి ఇచ్చిన విందు తీసుకొన్న తర్వాత నేను ,శర్మగారు ఉమా మహేశ్వర రావు విశ్వం కారు లో చిట్టూర్పు చేరాం  అక్కడ ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోపాల రావు ఇంటికి వెళ్లి విషయం చెప్పాం ఆయన సంతోషం గా తనకు తెలిసిన వారందరికీ చెప్పి అందర్నీ శివాలయం దగ్గర కలిసేట్లు చేశాడు

.అక్కడే సభ చేద్దామని ముందే అనుకొన్నాం కనుక ఎలా ఉందొ చూశాం .సరి పోతుంది .ఇలా సభ ఇక్కడ పెట్టటం అందరికి చాలా సంతోషం గా ఉంది .స్తానిక ఏర్పాట్లను వారు చేస్తామని నిలబడి పని చేస్తామని  కుర్చీలు ,మైకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .నేను మైక్ లో ఆ రోజు అందరికి చెప్పించమని చెబితే అలానే చేస్తామన్నారు .ఆహ్వాన పత్రాలు తయారు చేసి పంపిస్తామని వాటిని పంచమని సర్పంచ్ గారిని కూడా ఆహ్వానిద్దామని చెప్పాను. గొప్ప మంచి కార్యక్రమం ఇక్క డ చేస్తున్నందుకు గ్రా మస్తులకు సంతృప్తి ,సంతోషం కలిగి ముఖాలు వెలిగాయి .అక్కడి నుండి నేను ఉయ్యూరు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయింది శివ లక్ష్మి కి ఫోన్ చేసి విషయం చెప్పాను .అందరి సహా కారం తో లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42 వ వర్ధంతి ని చిట్టూర్పు లో12-1-2014 ఆదివారం మధ్యాహ్న మూడు గంటలకు శివాలయం లో నిర్వహిస్తున్నాముఅని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది .

ఈ విధం గా ఈ రోజు  రెండు సంతోషకరమైన కార్య క్రమాలలో పాల్గొన్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 28-12-13-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4

      రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4

1— ఆం ఆద్మీ చీపురు పట్టి రాచకీయ చెత్తను ఊడ్చి పారేశాడు

      ఆ చేత్తనే నాయకుడు మళ్ళీ నెత్తి నెట్టుకొని సింహాసనం ఎక్కుతున్నాడు  

2-.చేతిని ,కాషాయాన్ని పక్కకు ఊడ్చి పైకొచ్చాడు కేస్రీవాల్

   మంచిపనే జరిగిందను కొంటె భస్మాసుర హస్తం నెత్తి నేంటి ప్యారేలాల్ ?

3-ఏ అనుభవం లేని ఆద్మీలు గద్దె నెక్కుతారట

   దిల్లీని యేలి ఆం ఆద్మీలకు స్వర్గం చూపిస్తారట .

4-మాలే గాం మహర్షి కి ఎందుకీ ఆద్మీ పైన కోపం ?

   అడుగడుగునా అవరోధం కల్పిస్తూ పెడుతున్నాడు శాపం ?

5-లోకం కోసం లోక్ పాల్ అని తెచ్చారు

   లొసుగులున్నా బాగుందనే అందరూ మెచ్చారు .

6-జే సి పై ఫైర్ అవుతున్న బొత్స

  సంజాయిషీ అంటూ చేస్తున్నాడు రచ్చ .

7-బోలారం లో తిష్టవేసిన ప్రణబ్ ముఖర్జీ   రాష్ట్ర పతి

    మోరలెత్తుకొని దర్శించి  మరీ మొత్తుకుంటున్నాడు ప్రతి పార్టీ పతి

8-బెంగుళూరు వోల్వా లో మూకుమ్మడి సజీవ దహనం

   బాధ్యత మరచిన నాయక అధికారగణ మానవత్వ హననం

9- సన్యాసం స్వీకరించిన సినీ నటి రంజిత

   నిత్యానందం లో మునుగు తూచేస్తుంది మనసు రంజిత  

  10-అనాలోచిత అహంకార స్వార్ధ పూరిత బిల్లు తెలంగాణా

 

    అని ఇప్పుడు రోదిస్తూ మోగిస్తున్నాడు జే.పి.జాగృతి గంటలు  గణా గణా .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్

నా దారి తీరు -63

తమ్ముడికి శాటిలైట్

మా తమ్ముడు మోహన్ పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ అత్త గారు మామ గారు ఉయ్యూరు వచ్చి ఇక్కడి పరిస్తితులు చూసి వెళ్ళారు గౌరవ మర్యాదలతో చూశాం ..అప్పటి నుంచి మోహన్ వీలైనప్పుడల్లా నాకు ఉత్తరాలు రాస్తూ కొత్త దంపతుల కార్య క్రమాలను ఎప్పటికప్పుడు తెలియ జేస్తూన్దేవాడు .వాళ్ళిద్దరూ తిరుపతి కి వెళ్ళినప్పుడు నాకు తెలియ జేస్తూ నన్ను కూడా తమ తో రమ్మనే వాడు .నేను అలానే అని’’ తోకాడించు కొంటు’’ వెళ్ళేవాడిని .మా అమ్మ వెళ్ళ మనేది .మా ఆవిడకు నేను ఒక్కడినే వాళ్ళ తో వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు .అందుకని దెప్పుతూ ఉండేది .అయినా మా వాడు నన్నోక్కడినే రామ్మనటం ఏమిటి ?/అని నాకు అప్పుడు ఆలోచనే వచ్చేదికాదు .తమ్ముడు పిల్చాడు కదా నని’’ ఎగరేసుకొంటూ వెళ్ళటమే’’నాకు అప్పుడు చేతనైంది .ఒక సారి అలాగే వెళ్లి అక్కడ సత్రం లో ఉండి అన్నీ చూసి వచ్చాను .తిరుపతి వరకు నా ఖర్చే మిగిలినవి వాళ్ళే చూసే వాళ్ళు .శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది మంగా పురం శ్రీ కాల హస్తికి కూడా వెళ్లి దర్శించుకోన్నాం .ఇలా వాళ్ళు మాతో కలిసి పోవటానికి చేసే ప్రయత్నమే ఇది అని ఆలస్యం గా గ్రహించటం ణా మంద మతి తత్వానికి ప్రతీక సూక్ష్మ గ్రాహి కనుక మా ఆవిడ యిట్టె పసి గట్టింది .

ఇంకో సారి మోహన్ పెద్ద బావమరిది వెంకట్ వివాహం తిరుపతి లో జరిగితే శుభలేఖ పంపి రమ్మని చెబితే నాతొ బాటు మా అబ్బాయి రమణ ను కూడా తీసుకొని వెళ్లాను .కింది తిరుపతి లో దిగిన దగ్గర్నుంచి పైకి వెళ్ళే దాకా మా వాడి చేత ‘’అరవ చాకిరీ’’ చేయించారు అత్తమామలు బామ్మర్దులు ..వాళ్ళు చేయిన్చారన్న దానికంటే వీడే ఎక్కువ చేశాదేమో పూసుకొని ,పూనుకొని అని నాకు అని పించింది .ఎన్ని సార్లు సామాన్లు మోసు కొంటు పైకి కిందికి తిరిగాడో  నాకంటే మా రమణ బాగా గమనించాడు .అక్కడ రెండు మూడు రూములు బుక్ చేశారు మేమూ వాళ్ళతోనే ఉండేవాళ్ళం పెళ్లి బానే చేశారు పెళ్లి కూతురు వీళ్ళకు దగ్గరి బందుత్వమే .వెంకట్ నన్ను ‘’బావ గారు బావ గారు ‘’అంటూ ఏంతో గౌరవం గా పిలిచే వాడు .అతని తమ్ముడు వసంత్  కూడా అదే ధోరణిగా నాతో ప్రవర్తించేవాడు .వీళ్ళకు ఒక బెంగుళూరు దంపతులు బాగా క్లోజు .అలానే మోహన్ మామ గారి తమ్ముడు మునిసిపల్ కమిషనర్ గా పని చేసే వాడు హైదరాబాద్ విజయ నగర్ కాలనీ లో ఉండేవాడు ఆ బెంగుళూరు ఆయనా ,ఈయన ఈయన అన్న అందరు ఖాళీ ఉంటె పేకాట ఆడుతూ కాలక్షేపం చేసే వారు .మా వాడేమో అటూ ఇటూ ‘’ఆసులో గొట్టం లా తిరుగుతూ’’చిన్నా ,పెద్దా పనులు చేస్తూ ఎవర్ బిజీ గా ఉండేవాడు .కడుపు నిండా అన్నం తినే వాడో లేదో కంటి నిండా నిద్ర పోయాడో లేదో తెలీదు .అంతచాకిరీ చేస్తూనే ఉన్నాడు ..దైవ దర్శనం రెండు మూడు సార్లు చేసుకోన్నాం వీళ్ళ బంధువు ఒకతను అక్కడ ఆఫీసర్. అందుకని సాధ్యమైంది .ఏది ఏమైనా తిరుపతి స్వామి దర్శనాలు ఇలా జరుగుతున్నందుకు సంతృప్తి గా ఉండేది

పెళ్లి అవగానే వీళ్ళు ఆదోని వెళ్ళాలి .నేను ,మా అబ్బాయి మద్రాస్ వెళ్లాలని ప్లాన్ వేసుకోన్నాం .అందుకని అందరం రేణి గుంట రైల్వే స్టేషన్ కు వెళ్లాం అప్పుడు బొంబాయి నుంచి మద్రాస్ కు మెయిల్ రాత్రి రెండిన్తికో మూడింటికో ఉండేది .మేమందరం స్టేషన్ కు రాత్రి పదింటికే బస్ లో కార్ లో చేరు కొన్నాం . చేసేదేమీ లేక ట్రెయిన్లు వచ్చేదాకా ‘’‘’కేర్ ఆఫ్ ప్లాట్ ఫాం’’ ‘’గా చిన్నా ,పెద్ద కొత్త దంపతులతో సహా ప్లాట్ ఫారం మీదే గడిపాం .మేమిద్దరం ఉయ్యూరు నుంచి తిరుపతి కి పెళ్ళికి వచ్చినందుకు వాళ్ళ సంప్రదాయం ప్రకారం డబ్బు నాచేతి లో పెట్టారు ఇది మాకు కొత్త .మా ఇద్దరికీ వెంకట్ మద్రాస్ కు టికెట్లు తీశాడు .రమణ మొదటి సారి మద్రాస్ చూడ టానికి వస్తున్నాడు .ఇక్కడ స్టేషన్ లోను మా వాడు సామాన్లు మోయటం లో ‘’తన లాఘవం’’ బాగానే చూపాడు. కొత్త అల్లుడితో అంత చాకిరీ చేయిస్తున్నందుకు మా రమణ కు ‘’ఎక్కడో కాలుతోంది సహిన్చలేకుండా ఉన్నాడు .నాకు ఇదేమీ కొత్తగా అని పించలేదు .వాడికిది మామూలే అనుకొన్నాను .కానిరమణ బాధ పడుతూనే ఉన్నాడట .నాకెప్పుడో తర్వాతా మద్రాస్ నుంచి ఉయ్యూరు వచ్చిన తర్వాత తెలిసింది .

మద్రాస్ లో మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాం .రమణ ను చూసి మేనల్లుడు మేన కోడళ్ళు ఆనందించారు .బాగా ఆదుకొన్నారు .రమణ ను తీసుకొని మా అక్కయ్య తో మద్రాస్ లో ముఖ్యమైన ప్రదేశాలు చూపించాను .వాడు ఏంతో సంతోషించాడు .మద్రాస్ వచ్చినందుకు, చూడనివి చూసి నందుకు .అక్కడ నాలుగైదు రోజు లున్నామేమో .అక్కడి నుంచి విజయ వాడ మీదు గా ఉయ్యూరు చేరాము

మా అమ్మ తో మర్నాడు మా రమణ ‘’మామ్మా !బాబాయిని వాళ్ళ ఇంట్లో పెళ్లి లో ఒక కూలీ వాడు గా చూసి ,చాకిరీ అంతా చేయిస్తుంటే నాకు ఏడుపొచ్చింది భరించలేక పోయాను ఏడుపొచ్చింది మామ్మా .కొత్త అల్లుడితో ఇట్లా ఎవరైనా చేయిస్తారా ?’’’’అని ఏడుస్తుండగా మా ఆవిడ చూసిందట .ఆవిడ చెబితేనే తరువాత నాకు తెలిసింది .మా అమ్మ మాత్రం ఏమీ అనలేదట .మా ఆవిడ మాత్రం నన్ను ‘’తమ్ముడు పిలవటం తమరు ఒళ్ళు తెలియ కుండా వెంట పడి తోకాడించు ఝాడింకొంటూ ది వెళ్ళటం  మీకు బానే ఉంటుందేమో కాని మాకు చాలా అసహ్యం గా ఉంది ‘’అని మళ్ళీ ఒక ఝాడింపు జాదించింది .’’నా స్కిన్ రఫ్ ‘’కనుక పప్పుడు పట్టించుకో లేదు .అందుకే నన్ను నేను తమ్ముడికి సాటి లైట్ అనుకొన్నాను హెడ్డింగ్ లో రాసి నట్లు .

వాడి పెళ్ళికాక ముందు మోహన్ ఒక టి రెండు సార్లు ఎక్కడికో టూర్ వెళ్లి నప్పుడు తిరిగి వస్తున్నప్పుడూ నన్ను బేజ వాడ స్టేషన్ లో కలవ మనే వాడు ‘’.ఊపుకుంటూ వెళ్ళే వాడిని’’ తెల్లారు ఝామున ట్రేయినయినా ,అర్ధ రాత్రి రైల్ అయినా అప్పుడు ఆ సమయానికి బస్సులు ఉండవు కనుక ముందే బయల్దేరి స్టేషన్ లోనే పడుకొని రైల్ వచ్చేదాకా ఉండి చూసి వచ్చే వాడిని .ఇంట్లో ఏదైనా టిఫిన్ కాని భోజనం కాని చేసి ఇస్తే స్టేషన్ లో వాడికి అంద జేసే వాడిని. ఒక సారి అలాగే వెడితే కొంత మంది స్నేహితులతో ట్రెయిన్ లో వెళ్తూరమ్మంటే వెళ్లాను పది మందికి మా వాళ్ళు పూరీ కూర అన్నం పెరుగూ చేయించి తీసుకొని రమ్మంటే అలానే తీసుకొని వెళ్లి ఇచ్చాను  అందులో ఒక అమ్మాయి కూడా ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది .’’మా కొలీగ్ ‘’ అని నాకు పరిచయం చేశాడు .నమస్తే అంటే నమస్తే అనుకొన్నాం .ఆ అమ్మాయే తర్వాత మా వాడి జీవిత భాగస్వామిని సునీత అని అప్పుడు నాకు అనిపించక పోవటం నా కు లోకజ్ఞానం లేక పోవటానికి గొప్ప ఉదాహరణ .ఈ విషయం ఆ తర్వాత ఎప్పుడో మోహన్ చెప్పే దాకా ‘’నా బల్బు వెలగ లేదు ‘’అదీ నా శాటిలైట్  తత్త్వం ..

మరో సారి దివి సీమ వరద బాధితులను పరామర్శించి వాళ్లకు వీళ్ళిద్దరూ సేకరించిన వస్త్రాలు డబ్బు అంద జేసేందుకు అవని గడ్డ వెళ్లాం .ఇదీ అలాంటిదే నని ప్రభావతి భావన .ఇవి తప్పవు అని నేను అనుకొంటాను .ఇంకా ఒకటి రెండు సార్లు ఇలా వాళ్ళ తో వెళ్ళిన జ్ఞాపకం .

సశేషం

మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-12-13-.ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అమెరికా ప్రత్యేకత ఏమిటి ?-3

అమెరికా ప్రత్యేకత ఏమిటి ?-3

సల్మాన్ రష్దీ అమెరికన్లు దేవుడు లేదని స్వలింగ సంపర్కులని అంటూ ‘’rapists of your grand mother’s pet goat ‘’అని ఎద్దేవా చేసిన విషయాన్ని తెలియ జేస్తూ స్వేచ్చను ఆయన ఎలా దుర్వినియోగం చేశాడో డి సౌజా చెప్పాడు .1950వరకు అమెరికా లో అందరూ సిటి కి దూరం గా’’ఫాం హౌస్’’ లలోనే ఉండేవారని చిన్న కారు అందరికి ఫోర్డ్ దయ వల్ల అందు బాటులోకి రావటం వలన అమెరికా నగర చరిత్రే మారిపోయిందని అన్నాడు .టెక్నాలజీ లో వచ్చిన అభివృద్ధి కుటుంబ విలువలనే మార్చింది .నైతిక విలువలూ మారి పోయాయి .’’డిబాచెరి’’పెరిగింది .డైనమిక్ మొబైల్ సొసైటీ వచ్చింది .అన్ని పనులు కాంట్రాక్టు లతో జరగటం జీవితల పై  ,పెళ్లి వగైరా ల పై ప్రభావం చూపింది .’’హావ్ ఏ నైస్ డే ‘’అన్నది అమెరికన్ల స్లోగన్ అయింది .ఆతిధ్యం తక్కువే .1969నుంచి మగ వాళ్ళ జుట్లు పెరిగి ఆడ వాళ్ళ వి తగ్గిపోయాయి .బీటిల్స్ ప్రభావం ఎక్కువైంది .ఫ్రీడం కు అంతులేకుండా పోయింది .’’కౌంటర్ కల్చర్ ‘’పెరిగింది .రూసో రొమాంటిక్ ఫిలాసఫీ బోధించటం తో యువకులలో గొప్ప విప్లవమే వచ్చింది.

రూసో ‘’discource on the origin of inequality ‘’పుస్తకం రాశాడు .’’నోబుల్ సావేజ్ ‘’జీవితాన్నే మార్చేయాలన్నాడు .రాడికల్ ఫ్రీడం కావాలన్నాడు .ఇన్నర్ ఫ్రీడం అవసరం అని చెప్పాడు ‘’I should decide fr my self ‘’ be truthful to oneself ,’’అని బోధించాడు మనపై ఎవరి ప్రభావసం ఉండరాదని రూసో భావన .1960నుంచి ఈ భావం పెరిగింది .’’there is no will other than his own will ‘’దీనితో స్వేచ్చ గా నిర్ణయించుకొనే విధానం ఏర్పడింది బయటి ఒత్తిడికి లోను కాకుండా తనను తానూ తీర్చి దిద్దుకొనే స్తితి వచ్చింది నిజమైన వ్యక్తిత్వం ఒరిజినాలిటి నిబద్ధత ,సాను భూతి ల పై ఆధార పడి ఉంటుంది దీనితో వ్యభిచారం మాస్టర్బెషన్  షాడో మాస్క్యులిజం వంటి చెడు విపరీతమై పోయింది ఇలా ఒక గొప్ప విప్లవాన్ని ఆలోచనలలో తెచ్చాడు రూసో .కాని రూసో మాత్రం చాలా మంది కి చాలా మంది పిల్లల్ని కనీ వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసిన మహాను భావుడు .ఇదేమి పని /అని ఎవరైనా అడిగితె ‘’ఇది నాజీవితం నీకెందుకు బే’’’’అని మొండి సమాధానం చెప్పేవాడు .

అప్పటి నుంచి రైట్ వే రాంగ్ వే సెలెక్షన్ మారిపోయింది తలి దండ్రుల మాటకు విలువే లేకుండా పోయింది .’’ఓల్డ్ మొరాలిటి ‘’అని ‘’న్యూ మొరాలిటి ‘’అని రెండు ఏర్పడ్డాయి .రూసో ఒక మాట చెప్పాడు మానవ ప్రక్రుతి సహజం గా మంచిదే దాన్ని సమాజమే పాడు చేస్తుంది ‘’అన్నాడు దీనితో మతం స్తానం లో కళ ప్రవేశించింది .అంతరిక ప్రకృతికి ప్రాధాన్యత పెరిగింది ‘’true to oneself ‘’బాగా వ్యాపించింది .ఆ మధ్య అమెరికా సుప్రీం కోర్ట్ ‘’right to define ones own concept of existence of meaning of the universeand the mystery of human life ‘’అని తీర్పు చెప్పింది సామాజిక బాధ్యతకు అధిక విలువను ఇచ్చింది కోర్టు .ఇంత గొప్ప స్వేచ్చనిచ్చిన అమెరికా అందరికి ఆదర్శం అయిందంటాడు డిసౌజా .

ఇతరదేశాల విషయాలలో అమెరికా జోక్యం చేసుకొన్నా దాని ఉద్దేశ్యం అక్కడ ప్రజాస్వామ్య రక్షణ హక్కుల పునరుద్ధరణ కే  అంటాడుఅమెరికా ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొన్న వాడి లాగా  డిసౌజా ..చివరగా డిసౌజా అందరికి ఒక విజ్ఞప్తివి చేశాడు అదేమిటో చూద్దాం .’,, America is a new kind of society that produces a new kind of human being .That human being confident ,self relient ,tolerant ,generous ,future oriented,,is a vast improvemen over wretched systems .America is the greatest ,freest decent society in existence .We have to protect American way of life .we have to redeem humanity from global menance .History will view America as a great gift to the world- a gift that Americans to day must preserve and cherish .’’

సమాప్తం

3-10-2002  నా అమెరికా డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 27-12-13-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అడుగేయ్యాలంటే ఆటంకాలను అధిగామించాల్సిందే అన్న పద్మ భూషణ్ పద్మనాభయ్య

 

మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో కె. పద్మనాభయ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విపరీత పరిస్థితులను చక్కదిద్ది కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిగేలా చూడటంలో, నాగాలాండ్ శాంతి చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఆయన సేవలకు మెచ్చి ప్రభుత్వం ‘పద్మభూషణ్’గా గుర్తించి గౌరవించింది. 1997లో పదవీవిరమణ చేసిన తర్వాత కూడా మరో పన్నెండేళ్లు ఆయనను వివిధ పదవుల్లో కొనసాగించింది మన ప్రభుత్వం. ఒకరూ ఇద్దరూ కాదు, ఏకంగా ఐదుగురు ప్రధానమంత్రుల దగ్గర హోమ్ సెక్రటరీగా పనిచేసిన ఏకైక అధికారిగా ఘనత సొంతం చేసుకున్న పద్మనాభయ్యకు ఎదురైన కొన్ని సంఘటనల సమాహారమే ఈ వారం ‘అనుభవం’

కృష్ణా జిల్లాలోని కౌతరం మా ఊరు. మా తాతల కాలంలో 500 ఎకరాల భూమి ఉండేదట. కానీ, రకరకాల లిటిగేషన్ల కారణంగా నాకు ఊహ తెలిసేనాటికి అదంతా పోయి ఎనిమిదెకరాలు మిగిలింది. నా స్కూలు ఫైనలయ్యే నాటికి అదీ పోయింది. మా నాన్నగారు చిన్న ప్రభుత్వ ఉద్యోగి. మేం ఎనిమిదిమంది సంతానం. నేను అందరిక న్నా పెద్దవాణ్ని. పెద్ద కుటుంబం కావడం వల్ల ఇల్లు గడవడం కష్టమైపోయేది. మా ఊరికి మూడుమైళ్ల దూరంలోని గుడ్లవల్లేరు హైస్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ కోసం గుడివాడలోని ఒక ప్రైవేట్ కాలే జీలో చేరాను. అప్పటికే భూగర్భశాస్త్రం పట్ల ఏర్పడిన ఆసక్తి కారణంగా ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ(ఆనర్స్)లో చేరాలనుకున్నాను. కానీ, డబ్బుల్లేవు. ఆ స్థితిలో నూరే ళ్లు దాటిన మా ముత్తవ్వ అంటే అమ్మమ్మ గారి తల్లి నన్ను చేరదీసింది. ఆమె పేరిట ఎకరం భూమి ఉండేది.

‘వ చ్చే ధాన్యంలో నాకు అవసరమైన కొంత ఉంచుకుంటాను, మిగిలింది అమ్ముకుని నీ చదువుకు ఖర్చు చేసుకో’ అందామె. నాకు కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే యూనివర్సిటీలో చేరిపోయాను. ఒక ఏడాది గడిచిందో లేదో ఆమె హఠాత్తుగా చనిపోయింది. అంతటితో అప్పటిదాకా నాకు అందుతున్న సాయాన్ని ఆమె కొడుకు నిలిపివేశాడు. నా బతుకు మళ్లీ రోడ్డు మీదికి వచ్చింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు విశాఖపట్నంలో మొలాసిస్ ఎగుమతి చేసే ఒక కంపెనీలో సాయంత్రం వేళ పార్ట్‌టైం జాబ్ దొరికింది. వాళ్లు నెలకు 100 రూపాయలు ఇవ్వడంతో నా చదువు గట్టెక్కింది. డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. మూల స్థంభం ఉంది కదా అని కుటీరం వేయడానికి సిద్ధమైపోతాం. అదే కూలిపోతే? తక్షణమే ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పరుచుకోకపోతే జీవితం ఎక్కడికక్కడ ఆగిపోయే ప్రమాదముంది – అన్న సత్యాన్ని ఆ పరిస్థితి నాకు నేర్పింది.

ఐఏఎస్ అంటేనే తెలియదు
ఒక రోజు యూనివర్సిటీ ఆవ రణలో నలుగురు విద్యార్థులు ఒకరిని భుజాల మీద ఎత్తుకుని హర్షధ్వనాలు చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే, ‘అతడు ఐఏఎస్‌కి ఎంపికయ్యాడు’ అన్నారు. ‘ఐ.ఏ.ఎస్ అంటే ఏమిటి’ అన్నాన్నేను. నా ప్రశ్న వినగానే వాళ్లందరికీ చిర్రెత్తిపోయింది. ‘ఏమిట్రా ఐఏఎస్ అంటే ఏమిటో కూడా తెలియదా? పో అవతలికి’ అంటూ బండబండగా తిట్టారు. ఒకడైతే నన్ను కొట్టడానికే వచ్చాడు. కాని నిజంగానే అప్పటికి నాకు దాని గురించేమీ తెలియదు మరి! ఆ చివాట్లకు రోషం వచ్చి వెంటనే యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లి ఓ పుస్తకం తిరిగేస్తే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంది. కొద్దిక్షణాల్లోనే నా రోషం పోయి నాలో ఒక కోరిక మొదలయ్యింది. ఇదేదో గొప్పగా ఉన్నట్టుంది, ఎలాగైనా మనం ఇది చేయాల్సిందే అనుకున్నాను. అలా నా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక రకంగా ఐఏఎస్ పట్ల నాలో ఒక పిచ్చి ఏర్పడింది. ఉదయం యూవర్సిటీ లైబ్రరీ తెరవగానే వెళ్లే తొలి వ్యక్తిని, సాయంత్రం మూసేప్పుడు బయటికొచ్చే చివరివాణ్ని నేనే అయ్యేవాణ్ని. అలా అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకి ఎంపికయ్యాను. ముందు ఏమీ తెలియనంత మాత్రాన దాన్ని అందుకోవడం అసాధ్యం అనేమీ కాదు కదా! ఏ స్థాయిలో నువ్వు శ్రమిస్తావనే దానిమీదే నీ విజయాలు ఆధారపడతాయన్నది నా దృఢ విశ్వాసం.

నిప్పుల మీద నడక
పి.వి.నర్సింహారావుగారు ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన దగ్గర హోమ్ సెక్రెటరీగా ఉన్నాను. ఆ సమయంలో లండన్‌లో పచ్చళ్ల వ్యాపారం చేసే లక్కూబాయి పాఠక్ అనే అతను చంద్రస్వామి మీద కేసు వేశాడు. ‘నర్సింహారావుగారు చంద్రస్వామితో కలిసి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఒక ఇండస్ట్రీ ఇప్పిస్తామని నా వద్ద లక్ష డాలర్లు లంచం తీసుకున్నారు. మా ఒప్పందం ప్రకారం నాకు అది ఇవ్వలేదు..’ అని పాఠక్ ఆరోపణ. ఆ కేసు జరుగుతున్న సమయంలో కోర్టులో పాఠ క్ ఒక ప్రకటన చేస్తూ ‘నే ను లంచం ఇస్తున్నప్పుడు నర్సింహారావుగారు కూడా అక్కడున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ కారణంగా అప్పుడున్న మహిళా మేజిస్ట్రేట్ నర్సింహారావు గారిని అందులో పార్టీని చేసింది. అయితే ప్రధానమంత్రిని విచారించాలంటే హోమ్ మినిస్ట్రీ అంటే నేను ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వాలి. దాన్ని కోరుతూ కోర్టు నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. కేసంతా క్షుణ్ణంగా చదివితే, అందులో ప్రధానిని విచారించాల్సినంత విషయమే లేదు. ఇంతకీ పాటక్ ఏమంటాడు? తాను లంచం ఇచ్చినప్పుడు నర్సింహారావు గారు లోపల ఉన్నారు. డబ్బులు తీసుకున్నాక చంద్రస్వామి లోపలికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత నర్సింహారావు చంద్రస్వామితో కలిసి బయటికి వచ్చి ‘చంద్రస్వామి మీ కేసు గురించి చెప్పారు. చూద్దాం..!’ అన్నారంటూ ఉంది. ఇదేమంత గొప్ప ఆధారం? దాని ఆధారంగా నర్సింహారావుగారి మీద కేసెలా వేస్తారు? పాఠక్ డబ్బును ప్రధానికి నేరుగా ఇవ్వలేదు. చంద్రస్వామికి ఇస్తున్నప్పుడు అక్కడ ప్రధాని లేరు. కావాలని ఇరికించడం తప్ప ఈ కేసులో ఎంతమాత్రం బలం లేదని నాకు అర్థమైపోయింది.

నేను నర్సింహారావుగారికి ఆ మాటే చెప్పాను. ‘ఈ కేసుకూ మీకూ ఏ సంబంధమూ లేదు సార్! కాని మనం ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వకుండా ఉండిపోతే, అందరూ వేలెత్తి చూపుతారు. ప్రధానమంత్రిని రక్షించడానికే హోమ్ మినిస్ట్రీ శాంక్షన్ ఇవ్వడం లేదంటూ రచ్చ చేస్తారు. కోర్టు కూడా రోజూ ఒత్తిడి చేస్తుంది. అందువల్ల శాంక్షన్ ఇచ్చేయడమే మంచిది’ అన్నాను. అందుకాయన సరేనన్నారు. అలా నేను విచారణకు అనుమతినిచ్చాను. అయితే నేనిచ్చే శాంక్షన్ మీద హోమ్ మినిస్టర్ శంకర్రావ్ చౌహాన్ సంతకం పెట్టాలి. ఆ సమయంలో ఆయన సొంతూరు నాందేడ్‌లో ఉన్నారు. ఆ మరుసటి రోజే కోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి సంతకానికి వ్యవధి లేదు. అప్పుడు నేను సంతకం కోసం ఆ ఫైల్‌ను ఒక ప్రత్యేక విమానంలో (బిఎస్ఎఫ్) నాందేడ్‌కు పంపించాల్సి వచ్చింది. ఒక ఏడాదిపాటు కొనసాగిన ఆ కేసును తర్వాత కొట్టేశారు. హోమ్ సెక్రెటరీగా నర్సింహారావుగారి కిందే పనిచేస్తూ, ఆయన్నే విచారించేందుకు ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వాల్సి రావడం నన్ను విపరీతమైన ఆత్మసంఘర్షణకు గురిచేసింది. నిజమేదో మనకు తెలిసినా విధినిర్వహణలో కొన్నిసార్లు నిప్పులు మింగక తప్పదని ఆ అనుభవం నేర్పింది.

పెకిలించుకు రావడమే….
నర్సింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను హోమ్ సెక్రెటరీనే కాకుండా, జమ్ము-కాశ్మీర్ వ్యవహారాలకు ఇంఛార్జిని కూడా. అదెలా జరిగిందంటే – హోమ్ మినిస్టర్ శంకర్రావ్ చౌహాన్ అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్‌గా రాజేశ్ పైలట్ ఉండేవారు. వ్యక్తిగతంగా ఇద్దరూ మంచివారే. చౌహాన్‌గారేమో సీనియర్ రాజకీయనాయకుడు, వయసులో పెద్ద. ఎంతో పరిణతి చెందిన మనిషి. అందువల్ల ప్రతి పనినీ లోతుగా పరిశీలిస్తూ, చాలా నిదానంగా చర్యలు తీసుకునేవారు. రాజేశ్ పైలట్ యువకుడు. అన్నీ వేగంగా, చకచకా జరిగిపోవాలన్నట్లు వ్యవహరించేవాడు. దాంతో ఇద్దరికీ పడేది కాదు. చౌహాన్‌గారు కాశ్మీర్ వెళ్లి ఏదైనా వ్యాఖ్య చేస్తే, తర్వాత కొద్దిరోజులకే రాజేశ్ పైలట్ వెళ్లి అందుకు పూర్తి విరుద్ధంగా మరో వ్యాఖ్య చేసి వచ్చేవారు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ప్రభుత్వంలో, ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించేవి. ఈ పరిణామాల్ని భరించలేక చివరకు నర్సింహారావుగారు జమ్మూకాశ్మీర్ వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని హోమ్ మినిస్టరీ నుంచి తొలగించి తన దగ్గర అట్టిపెట్టుకున్నారు.

ఒకవైపు హోమ్ మినిస్టర్ సెక్రెటరీగా కొనసాగిస్తూనే. ఆ కొత్త విభాగానికి కూడా సెక్రెటరీగా నన్నే పెట్టాడు. అప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరుగుతోందో చెప్పమంటూ అటు చౌహాన్, ఇటు పైలట్ అస్తమానం నన్నడుగుతూ ఉండేవారు. ప్రధానమంత్రి చేతిలో ఉన్న విషయాలు వీళ్లకు నేనెలా చెప్పగలను? మంత్రులు కనుక వాళ్లడిగినప్పుడు అసలే చెప్పనని భీష్మించుకోవడం కూడా కష్టమైన పనే. ఆ కష్టమంతా పడుతూనే ఉండేవాణ్ని, వీళ్లు నా మీద పదేపదే ఒత్తిడి చేస్తూనే ఉండేవారు. వాళ్ల ఒత్తిడికి తట్టుకోలేక ఏదైనా విషయం వాళ్లకు చెప్పానే అనుకోండి. మళ్లీ మునుపటిలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసి గందరగోళం సృష్టిస్తారు. చివరికి ఒకసారి వాళ్లిద్దరి దగ్గరకూ వెళ్లి, ‘ప్రధానమంత్రి గారే కదా మీ వద్ద ఉన్న ఆ విభాగాన్ని తీసేసి స్వయంగా తన వద్ద పెట్టుకున్నారు? ఇంత జరిగాక కూడా నేనా వివరాలన్నీ మీకు చెప్పడం చాలా పెద్ద తప్పవుతుంది. మీకు అంతగా ఆసక్తి ఉంటే నేరుగా ప్రధానమంత్రినే అడగండి’ అని చెప్పేశాను. ఆ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఇరుకున పెట్టడం మానేశారు. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. వాటి ని పెకి లించుకుని బయటపడలేకపోతే దేశానికే కాదు మనకు మనమే పూచీదారులుగా ఉండలేమని బలంగా నమ్ముతాను.

సమయం విలువ తెలియాలి…
1986 నుంచి 1990 వరకు అంటే నాలుగేళ్ల పాటు లండన్‌లోని భారతీయ హైక మిషన్‌లో పనిచేశాను. ఒకరోజు ఒక బ్రిటిష్ మహిళ తన కేసు విషయం మాట్లాడటానికి మా ఆఫీసుకు వచ్చింది. ఆమె వచ్చి నా ఎదురుగా కూర్చున్న కొద్దిసేపటికి నాకో ఫోన్ వచ్చింది. మాట్లాడాను. ఫోన్ పెట్టేసి ఆమెతో మాట్లాడటం మొదలెట్టిన కాసేపటికే మళ్లీ నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లే దో… ఆమె నా చేతిలోంచి ఫోన్ లాక్కుని పక్కన పెట్టేసి ‘మిస్టర్ పద్మనాభయ్యా, మీరు నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయానికి నేను వచ్చాను. మీరు మీ దృష్టినంతా నా కే సు మీదే పెట్టాలి. మాటిమాటికీ ఈ ఫోన్లు మాట్లాడటమేమిటి?’ అంది ఎంతో అసహనంగా. నేను ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా, వెంటనే తే రుకుని సవినయంగా ‘మేడమ్! ఒక ఫోనేమో మా ఇండియా నుంచి, ఇంకో ఫోనేమో హైకమిషన్ నుంచి అందుకే…’ నా వాక్యం పూర్తి కాకుండానే ‘హై కమిషనేగానీ, దేవుడేగానీ నాకు అనవసరం. ఈ సమయం పూర్తిగా నాది. అందుకే నేనున్న ఈ సమయంలో మీరు మరెవరితోనూ మాట్లాడటానికి వీలు లేదు’ అంది. నేను కొద్ది క్షణాలు స్థాణువులా ఉండిపోయాను. ఆ తర్వాత ఆమె కేసంతా విని పంపించాను. మనకు మన సమయం, మన వ్యవహారాలు ఎంత ముఖ్యమో, ఎదుటి వారికి కూడా వారివి అంతే ముఖ్యమనే విషయాన్ని మనం మరిచిపోతుంటాం. ఎక్కడో ఉన్నవాళ్లు ఎక్కువైపోయి ఎదురుగా ఉన్నవాళ్లు తక్కువైపోవడం న్యాయం కాదు కదా మరి!

నా మంత్రి మీద నేనే విచారణ..
దేవెగౌడ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా నేనే హోమ్ సెక్రెటరీని. అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ పదవిని బీహార్‌కు చెందిన తస్లీముద్దీన్‌కు ఇచ్చారు. ‘తస్లీముద్దీన్ పెద్ద నేరగాడు. అతనికి మీరా పదవినెలా ఇస్తారు? వెంటన్నే అతన్ని తొలగించాలి..’ అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దేవెగౌడ నన్ను పిలిచి అతని మీద విచారణ చేసి ఆయనకు నివేదిక ఇవ్వమన్నారు. ‘సెక్రెటరీగా ఉండి మంత్రి మీద ఎలా విచారణ చేస్తాను? ఆ బాధ్యత మరెవరికైనా అప్పగించండి’ అన్నాను. ‘లేదు లేదు. నాకు మరెవరి మీదా నమ్మకం లేదు. అందువల్ల మీరే పరిశీలించాలి’ అన్నారాయన. అది నాకు చాలా ఇబ్బందికరమైన విషయమైపోయింది. ప్రతిపక్షం వాళ్లేమో రోజురోజుకూ స్వరం పెంచేస్తున్నారు. దేవెగౌడగారేమో మళ్లీమళ్లీ ఆ మాటే చెబుతున్నాడు. అప్పుడు తప్పక, నేనూ నా జాయింట్ సెక్రెటరీ యు.కె.సిన్హా ఇద్దరం కలసి ఆ కే సు పరిశీలనలోకి దిగాం. ప్రతిపక్షాలు చెప్పినట్లు తస్లీముద్దీన్ మీద చాలా క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. దేవెగౌడకు నివేదికనిస్తే, దాని ఆధారంగా ఆయన తస్లీముద్దీన్‌ను వెంటనే తొలగించారు.

– బమ్మెర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -62 నగర సంకీర్తన

నా దారి తీరు -62

నగర సంకీర్తన

మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో ఉండగా మా ఇంటికి దగ్గరలో శివాలయం లో ధనుర్మాస కార్య క్రమాలకు వెళ్ళే వాళ్ళం ఆ ప్రసాదాలు తినటం ఇప్పటికి గుర్తే .మా మామ్మ కూడా మాతో వచ్చేది .కాని ఉయ్యూరులో నేనెప్పుడు ఉదయం పూట ధనుర్మాస పూజకు వెళ్ళిన జ్ఞాపకం లేదు .కాని 1970లో ఊళ్ళోని ఆడవారూ మగ వారూ అందరుకలిసి మొదటి సారిగా తెల్ల వారుజామున నగర సంకీర్తన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం దీనికి ప్రోద్బలం విష్ణ్వాలయ  అర్చకులు స్వర్గీయ వేదాంతం రామా చార్యులు గారు ఆయన తమ్ముడు వాసుదేవాచార్యులు గారే   .స్టేట్ బాంక్ లో ఆపని చేసిన ఒక కుర్రాయన దీనికి నాయకత్వం తీసుకొన్నాడు .మేమందరం అనుసరించాం .ఆయన బాగా పాడేవాడు కీర్తనలు శ్రావ్యం గా గానం చేసేవాడు తాళం లయ జ్ఞానం ఉన్న వాడు కొంతకాలానికి పెనమ కూరు ట్రాన్స్ ఫర్ మీద వెళ్లి పోయాడు

ఆ బృందం లో మంత్రాల రాదా కృష్ణ మూర్తి ,మండా వీర భద్ర రావు నేను ,మంత్రాల మంగమ్మ ,వారణాసి దుర్గ ఆమె భర్త ,మొదలైన వారందరం ఉండేవాళ్ళం సుమారు పది మంది ఆడ వారు ,పది మంది మొగ వారు కలిసి విష్ణ్వాలయం నుంచి తెల్ల వారు జామున నాలుగున్నరకే బయల్దేరే వాళ్ళం .దుర్గ  గారు బాగా భక్తీ గీతాలు పాడేవారు భజనా బాగా చేసే వారు .మిగతా వాళ్ళం వీరితో గొంతులు కలిపే వాళ్ళం .తాళాలు వేసే వారు కొందరున్దేవారు .ముఖ్యం గా కే సి పి లో వర్కర్ గా పని చేసే ఆయన ఒకాయన మంచి భక్తీ పరుడున్నాడు నల్లగా ఉండేవాడు చక్కగా పంచ కట్టే వాడు ఆయన అందరి కంటే ముందు వచ్చేవాడు .ఇప్పుడాయన చని పోయాడు .వాళ్ళ అబ్బాయి కూడా జత కలిసే వాడు .అలానే అమర నాద చెల్లెళ్ళు ముగ్గురూ పెళ్ళిళ్ళు అయ్యే దాకా నగర సంకీర్తన లో పాల్గొనే వారు .విష్ణు భొట్ల సోమయాజులు భార్య ఆవిడ తోడికోడలు వాళ్ళ అమ్మాయి, ,కోమట్ల బజారు రాజా భార్య ,గెల్లి మల్లికార్జున రావు భార్య ,వీరభద్ర రావు ఇందాక చెప్పిన స్టేట్ బాంక్ ఆయనా పాల్గొనే వాళ్ళం. అందరు వీలైనంత వరకు శృతి కలిపి పాడుకుంటూ విష్ణ్వాలయం దగ్గర బయల్దేరి  నుండి సూరి వారి బజారు అక్కడినుండి మా ఆంజనేయ స్వామి గుడి మీదుగా ,వెనక ఉన్న కోట వారి బజారు అక్కడి నుండి కొబ్బరి తోట మీదుగా పుల్లెరుదాకా అక్కడి నుండి మా బజారు ,సూరి పార్ధి వాకిలి దాటి శివాలయం మీదుగా సెంటర్ చేరి అక్కడి మసీదు మీదుగా విశ్వ బ్రాహ్మణ బజారు నుండి రావి చెట్టు బజారు వెళ్లి ,కోమట్ల బజారు చూసి మళ్ళీ విష్ణ్వాలయం చేరే వాళ్ళం దాదాపు రెండు గంటలు పట్టేది . జోలె సంచులు బుజానికి తగిలించుకొని వెళ్ళే వాళ్ళం చిడతలు తాళాలు మోగిస్తూ వెడుతుంటే భలే గా ఉండేది మధ్యలో ఎక్కడైనా చలి మంటవేసుకొనే వాళ్ళం .స్వెట్టరు శాలువా మగాళ్ళు వేసుకొంటే ఆడ వారు సాధారణ వస్త్రాలతో వచ్చే వారు నాలుగింటికే లేచి స్నానాలు చేసి దీపారాధన చేసుకొని స్త్రీలు శుచిగా వచ్చే వారు .మేము దంత ధావనం మాత్రం చేసి వెళ్ళే వాళ్ళం ఇంటికొచ్చి స్నానం  సోమయాజులు భార్య సావిత్రమ్మ గారు భక్తీ భావం కురిసేట్లు ఆర్తిగా మంచి గీతాలు పాడేవారు .మధ్య మధ్య లో’’ శ్రీ మద్రమారమణ   గోవిందా ‘’అని అందరం అంటూ హుషారుగా తిరిగే వారం .చలి పులి మమ్మల్నేమీ చేసేది కాదు .

విష్ణ్వాలయంలయం  చేరి పూజారిగారికి భక్తులు వేసిన బియ్యం కాయ గూరలు డబ్బు అప్పగించి ఒక పుస్తకం లో లెక్క రాయించే వాళ్ళం ..క్రమం గా నేను తగ్గించుకోన్నాను  .బూరగడ్డ బసవయ్య  మనవడు కృష్ణ మోహన్ ఈ సంకీర్తన సంఘానికి నాయకత్వం తీసుకొన్నాడు .అతని భార్య కూడా సంకీర్తనలో ఉండేది .తర్వాత ఎండూరి సుబ్బారావు నాయకుడైనాడు .వచ్చిన ద్రవ్యాన్ని ఏ రోజు కారోజు మైకు లో చెప్పటం రాయించటం జరిగుతుంది .ధనుర్మాసం పూర్తీ అవ్వగానే వచ్చే మొదటి ఆదివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం .ఆ ద్రవ్యాన్ని ఇలా సద్విని యోగ పరచే వాళ్ళం .ఇప్పటి వాళ్ళు కూడా అంత జాగ్రత్తా తీసుకొంటున్నారు ఇక్కడ పెత్తనం అని కాక నిబద్ధత సేవ కే ప్రాధాన్యం .అన్న సమారాధన రోజున మొదట్లో ఆడ వాళ్ళందరూ కూరగాయలు తరగటం పదార్ధాలు వండటం ,చేస్తే మగ వారు వడ్డించటం మొదలైన వి చేసే వారు ఇక్కడ కులాల పట్టింపు ఉండేది కాదు .ఇప్పటికీ లేదు .మొదట్లో మేమూ వెళ్లి భోజనం చేసే వాళ్ళం క్రమంగా మానేశాము .

ఈ మధ్య పదేళ్లుగా సంకీర్తన బాచ్ పలచ బడి కొంచెం నిరుత్సాహం గా ఉంటె పువ్వాడ వెంకటేశ్వర రావు ను నెలకు ఏదో కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసి పాల్గోనేట్లు చేస్తున్నారు అతను గుడ్డి వాడు కాని అద్భుతమైన భజన చేస్తాడు అతన్ని చాలా చోట్లకు ఆహ్వానించి భజనలు ఏర్పాటు చేసుకొంటారు గిరాకీ ఎక్కువే అతను భార్య మిగిలిన వాళ్ళో కలుస్తున్నారు .కూనప రెడ్డి వెంకటేశ్వర రావు మంచి భజన పరుడు బాగా తాళం డప్పు వాయించగలడు అతనికీ గిరాకీ బాగా ఉంది అతనికి ప్రత్యేకం గా ఒక బాచ్ ఉంది శ్రీ హనుమజ్జయంటికి మా గుడిలో అతని తో భజన చేయిస్తాము ణా శిష్యుడు కూడా . .తూర్పు కాపుల ఆడ వారు మగ వారు కూడా ఇప్పుడు చాలా భక్తిగా సంకీర్తన చెస్తు సంప్రదాయాన్ని నిల బెట్టు కోస్తున్నారు .ఆ నాడు మేము నాటిన ఈ సంకీర్తన బీజం అభి వృద్ధి చెందుతూనే ఉంది ద్రవ్యమూ ఇబ్బడి ముబ్బడిగా .వస్తోంది నెల చివరికి దాదాపు మూడు బస్తాల బియ్యం అయిదారు వేల రూపాయల డబ్బు వస్తోంది కూరగాయలను పూజారి గారి కుటుంబానికి ఏ రోజుకారోజు ఇచ్చేస్తున్నారు ఒక సేరు బియ్యం కూడా రోజూ ఇస్తారని అన్తుకొంటున్నాను .పూజారి కర్తవ్యమ్ మరీ కష్టమైంది .

ఇప్పుడు వంట వాళ్ళను మాట్లాడి మైకులో అనౌన్స్ చేస్తూ అన్న సమారాధన భారీగా చేస్తున్నారు .నగర సంకీర్తన లో వచ్చినదే కాక దాతలు తమకు తోచినది ధన ,ధనేతరం గా ఇచ్చి సంతర్పణ సంతృప్తి గా జరిగేట్లు తోడ్పడుతున్నారు  .ఈ ధనుర్మాసం నెల రోజులు సంకీర్తన బృందం నగర సంకీర్తన పూర్తీ చేసి విష్ణ్వాలయం చేరుకొన్న తర్వాతనే మంత్రం పుష్పం తీర్ధ ప్రసాద విని యోగం జరుగుతుంది నగర సంకీర్తన కు బయాల్దేర గానే పూజారి పూజ ప్రారంభించిస్తాడు .వాళ్ళు వచ్చేసరికి పూజ పూర్తీ చేసి ,నైవేద్యం కూడా పెట్టి సిద్ధం గా ఉంటాడు .తెల్లవారు జామున నాలుగింటికే మైకు ఆన్ చేసి భక్తీ గీతాలు పెడతారు .అందరు అది విని నిద్ర లేచి ఆలయానికి ఇప్పుడు పావు తక్కువ అయిదింటికి చేరి భజన చేస్తూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అప్పుడు ఆదిరాజు వారింటి మీదుగాఇదివరకు చెప్పిన విధం గా  రావి చెట్టు బజారు దక్షిణం వైపు వెళ్లి సూరి వారి బజారుకు వెళ్ళటం సాంప్రదాయం గా పాటిస్తున్నారు .అప్పటికే గృహిణులు ఇళ్ళ ముందు కల్లాపి జల్లి ముగ్గులేసి గొబ్బెమ్మలను పెట్టి అలంకరించి సిద్ధం గా ఉంటారు కానుకలు సమర్పించటానికి ముందుకు వస్తారు బృందం అలా కీర్తనలు పాడుకొంటూ వెడుతుంటే దగ్గరకు వచ్చి భక్తీ తో కానుకలు సమర్పిస్తారు .

హరి కధలు –

మొదట్లో విశ్వాలయం లో ధనుర్మాసం లో హరికధా కాలక్షేపం ఉండేది .రాత్రి ఏడింటికి మొదలై తొమ్మిదికి పూర్తీ అయ్యేవి .ముదునూరు శంకర రావు గారు అనే ఆయన చాలా సార్లు ఇక్కడ కద చెప్పారు నెల రోజులు రామాయణం చెప్పేవారు .కల్యాణం కూడా చేసే వారు .ఆ తర్వాత కాపుల రామాలయం దగ్గర అందరూ కలిసి పందిళ్ళు వేసి నెల రోజులు హరికధలు చెప్పించేవారు .రాత్రి తొమ్మిదింటికి ప్రారంభమై పన్నెండు దాకా జరిగేవి ఆంద్ర దేశం లో ప్రసిద్ధ హరికధకు లందరూ వచ్చే వారు దీన్ని. సుబ్బారావు గారు అనే ఆయన నాయకత్వం లో నిర్వహించేవారు. ఆయనే మా  ఆంజ నేయ స్వామి ఆలయాన్ని మాతో దగ్గరుండి కట్టించిన మహాను భావుడు .పట్నాల మల్లేశ్వర రావు ,పొడుగు పాండు రంగ దాసు ,చైనా రాకెట్ ప్రభ ప్రసిద్ధులైన మహిళా కధకులు మోపర్రు దాసు అందరూ ఇక్కడ కదా గానం చేసిన వారే మేము. భోజనం ,ట్యూషన్ అన్నీ అయిన తర్వాత తీరికగా వెళ్లి ఒక గంట చూసి వచ్చే వాడిని .ఇది ఇలా దేదీప్యమానం గా సాగుతుండగా శివాలయం లో గోవిందరాజుల సత్యం కోల చల చలపతి, బొల్లి పోత రాజు మొదలైన వాళ్ళు పోటీ గా హరి కధలను నిర్వహించారు . మర్రివాదకు చెందిన జగన్నాధ దాసు కడలి వీరయ్య భాగవతార్ ,తెనాలికి చెందిన  కోట సచ్చిదానంద శాస్త్రి  భాగవతార్  ల తో పోటా పోటీగా కధలు చెప్పించేవారు .భలే సరదాగా ఉండేది .రెండు చోట్లకూ వెళ్లి అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు చూసి వచ్చేవాళ్ళం .పొడుగు వారి కధలు రస వత్తరం గా ఉండేవి ‘’ఓం హరా శంకరా ‘’అని పాడుతుంటే జనం ఊగి పోయే వారు కైలాసం దిగి వచ్చిందా అని పించేది ..మోపర్రు దాసు చెబుతూ ఎన్నో దేశ భక్తీ గీతాలు పాడేవాడు .నే లకు వంగి అరచేత్తో నేల మీద చరుస్తూ పాడుతుంటే థ్రిల్లింగ్ గా ఉండేది .ఆ రోజులే వేరు ఆ భావనలే వేరు .మా ఉయ్యూరు దాసు చేవూరి కనకరత్నం గారు ఇక్కడ జీరో మిగతా దేశమంతా గొప్ప హీరో .ఆదిభట్ల నారాయణ దాసు గారు ,పేరు చెబితే ఒళ్ళు పులకరించేది .ఆ కదా ,గమనం మరువరానివి .ఆయన శిష్యులూ అంతటి ఘనులే .పెద్దింటి సూర్య నారాయణ దీక్షితులు గారు ,ములుకుట్ల సదా శివ శాస్త్రిగారు పిల్లల మర్రి రామ దాసు లబ్ధ ప్రతిస్తులైన కధకులు  రామ దాసు ,గారి హరికధాలను ణా చిన్నప్పుడు హిందూ పూర్ లో విన్నాను ఆయన అంటే నాకు విపరీత మైన క్రేజ్ .

గత పది హేనేల్లుగా ఈ హరికదల సందడే లేదు. రేడియో లో దూర దర్శన్ లో తప్ప ఎక్కడా కనీ పించటం లేదు ,విని పించటం లేదు .చెప్పినా వచ్చి వినే వారే లేరు అయ్యో అని పిస్తుంది ఈ ప్రజలే ఆ నాడు వారికి నీరాజనాలుపట్టారు పట్టు పీతాంబరాలు కప్పారు సువర్ణ కంకణాలు తొడిగారు ఘనమైన బిరుడులిచ్చి సత్కరించారు వారు కద చెబితే చాలు యెంత దబ్బుఇవ్వటానికైనా సిద్ధ పడే వారు .అదంతా పోయింది .ఉల్టా పల్టా అయింది.పరిస్తితి. కాల ప్రభావం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

మావో లో కవి -ఆంద్ర జ్యోతి

 

విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో లేదా ఒక విప్లవ కమ్యూనిస్టు యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.

నవ చైనా జాతి పిత మావో 120 వ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు కమ్యూనిస్టు చైనా సిద్ధమవుతోంది. వంద కోట్ల రూపాయల వ్యయంతో ధగ ధగలాడే (యాభై కిలోలకు పైగా ఉన్న) మావో బంగారు విగ్రహంను ఇప్పటికే షెంజెన్ పట్టణంలో ఆవిష్కరించారు. వాస్తవానికి వంద అడుగుల నిడివిగల మావో సే టుంగ్ భారీ విగ్రహాన్ని కూడా ఆయన 120 వ జయంతిని పురస్కరించుకుని నేడు ఆ మహానాయకుని స్వస్థలమైన ఛాంగ్ షాలో ప్రతిష్ఠించనున్నారు. మావో 32 వ ఏట ఎలా ఉండేవాడో , అచ్చు అలానే , అది కూడా ఛాంగ్ షా గురించి ఆయన తనదైన శైలిలో ఒక చక్కటి వచన కవిత రాసినప్పుడు ఏ విధంగా కూర్చుని ఉన్నారో అలాగే తీర్చి దిద్దారు ఆ విగ్రహాన్ని . ఆ కవిత ఇలా సాగుతుంది:

‘వణికించే చలిలో ఏకాంతంగా
ఉత్తరాన పారే నదిని వీక్షించగా
నారింజ వర్ణ ద్వీపం సమీపాన
గులాబి పర్వతాల పక్కన
అడవిలోని ఎర్రని ఆకుల నందుకుని
ఆ ఉద్రేకపూరితమైన నీళ్లలో ఎలా వెళ్లామో
నాతోవచ్చిన వందలాది నేస్తాలు నీకు గుర్తున్నారా?

భయానకమైన ఉప్పెనలో
మన నావలు చిక్కుకున్న తీరు
నీటి అలజడి సృష్టిస్తున్న హోరు
మనమంతా అల్లల్లాడిన వైనం
చేసేదిలేక వెనుతిరగాలనుకున్న తరుణం
నీకు గుర్తున్నదా?’

ఉత్తర దిక్కుగా ప్రవహించి, టుంగ్ టింగ్ నదిలో కలుస్తుండే ప్రదేశంలో, షియాంగ్ నదికి తూర్పుతీరాన వుంటుంది ఛాంగ్ షా నగరం. నారింజ వర్ణ ద్వీపంగా ఆయన పేర్కొన్న ప్రాంతం పడమర దిశగావుండగా, మరింత పడమటగా వెళ్తే, పర్వతాల సముదాయం కన్పిస్తుంది. మావో రాసిన వచన కవితల్లో కల్లా దానికొక ప్రత్యేకత వుందంటారు. ఆయన వర్ణించిన భూ భాగం, మావో జ్ఞాపకాలను ప్రతిబింబిస్తాయి. అలాంటిది మరో వచన కవిత 1929 అక్టోబర్ 11న ఆయన రాశారు. ఆంగ్ల సంవత్సరాదిలోని తొమ్మిదో నెల తొమ్మిదో తేదీని వర్ణించుతూ రాసిందది. ఆనందంతో పొంగిపోయే రోజుగా ఆహ్లాదంగా పండుగ జరుపుకునే రోజుగా మావో వర్ణించారు. చైనీస్ భాషలో మావో రాసిన వచన కవితలను మైఖెల్ బుల్లక్, జెరోమ్ చెన్ ఇంగ్లీష్‌లోకి అనువదించారు. తొమ్మిదో నెల తొమ్మిదో తేదీ గురించి మావో కవిత ఇలా సాగుతుంది:

‘వయసు పైబడేది స్వర్గానికి కాదు
మనిషికి
నవ మాసంలో వచ్చే నవ్యమైన పండగ
ఏటా వచ్చే పండగ
ఏటేటా వస్తూనే వుంటుంది
యుద్ధభూమిలో మాత్రం పసుపు పుష్పాలు

సువాసనలు వెదజల్లుతూనే వున్నాయి
ఏడాదికి ఒకసారి వచ్చే శీతాకాలం
ఈ ఏడు భారంగా వచ్చి నవ్వింది
ఎప్పటి లాగ కాక నిస్సారమైన రంగు పులుముకుంది
గతం కన్న మిన్నగా
చల్లని అకాశంలో ఆ నీటిలో
లెక్కలేనన్ని ఆకులు పలకరిస్తున్నాయి’.

1949లో మావో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నెలకొల్పారు. 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన వారిలో మావో ఒకరు. మార్క్సియన్ కమ్యూనిజం సిద్ధాంతాలను నేల నాలుగు చెరగులా ప్రచారం చేసిన వారిలో మార్క్స్, లెనిన్ సరసన మావో కూడా ఉన్నారు. అభివృద్ధి దిశగా, సామ్యవాదం-కమ్యూనిజం స్థాయిలలో వర్గపోరాటం ఎలా కొనసాగుతుందో అనే దానికి సైద్ధాంతిక స్వరూపం ఇచ్చిన ఘనత ఒక మార్క్సిస్ట్ ఆలోచనాపరుడిగా మావోకు మాత్రమే దక్కుతుంది. గ్రామీణ రైతాంగానికి నిరుపేదలకు భూమి పెంపకం ఒక్క అవసరాన్ని ప్రాధాన్యతను నొక్కి వక్కాణించిన వ్యక్తిగా మావో చరిత్ర ప్రసిద్ధికెక్కారు. ఆయన సిద్ధాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధిచెందని మూడో ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి.

ఒక రాజకీయవేత్తగా, సైనికనాయకుడిగా, విప్లవకారుడిగా, తిరుగుబాటుదారుడిగా మావో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినవాడే. బహుశా అందరికీ తెలియక పోయినా మావో ఒక గొప్ప రచయిత, వచన కవి, సాహితీవేత్త. చరిత్ర గమనానికి, మార్పులకు మావో చేసిన సేవ ప్రపంచ చరిత్ర మార్పుకే దారి తీసింది. చైనా దేశానికి ఒక స్థిరత్వాన్ని, ప్రజల ప్రజాస్వామ్యాన్ని అందించిన వ్యక్తిగా అలనాటి చైనాను సంకెళ్ల నుంచి విముక్తి చేయించిన వ్యక్తిగా, పీపుల్స్ రిపబ్లిక్ స్థాపనకు ముఖ్యకారకుడిగా మావో చిరస్మరణీయుడు. ఆయన మాటల్లో చేతల్లో కనిపించే నిజాయితీ, ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో చూపిన చొరవ బహుశా అతికొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. కష్టకాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీని ఏక తాటిపై నడిపించడానికి, అందులో భాగంగా మావో రాసిన ఉద్రేకపూరితమైన వచన కవిత్వం ఆయనలోని స్నేహ కోణాన్ని ఆవిష్కరించేలా వుంటాయి.

తనను, తన ఆలోచలను, సిద్ధాంతాలను అంగీకరించని వారికి వ్యతిరేకంగా మావో చేసిన పోరాటాలను విశ్లేషిస్తే ఆయనలోని పోరాట పటిమ, శత్రువులను అణచివేసిన విధానం స్పష్టంగా గోచరిస్తుంది. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే 1919లో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. ఒక తిరుగుబాటుదారుడిగా, విప్లవకారుడిగా మారి ఆయుధాలు పట్టుకుని అధికార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడడం మరో ఎనిమిది సంవత్సరాలు తరువాత అంటే 1927లో ప్రారంభమయింది. 1934-35లో ఓటమితో సహా, లాంగ్ మార్చ్, యునైటెడ్ ఫ్రంట్, అంతర్యుద్ధం.. ఇవన్నీ దాటుకుంటూ అంతిమ విజయం సాధించడానికి మావోకు సుమారు 22 సంవత్సరాలు పట్టింది. అంతకాలం ఆయన నిరంతర పోరాటం సాగిస్తూనే వున్నారు.

గ్రామీణ వాతావరణ నేపథ్యంలో 1893 డిసెంబర్ 26న మావో జన్మించారు. ఆయన తండ్రి నూటికి నూరుపాళ్లు రైతు. కాకపోతే బీదరికంలోను, అప్పుల బాధలలోను జీవించే వాడు మొదట్లో . దరిమిలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నాడు . తల్లికి నైతిక విలువలంటే అమిత మైన గౌరవం . ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయపడాలనే మనసత్త్వం ఆమెది. దైవమంటే భక్తి ప్రపత్తులు మెండుగా వుండేవి. చిన్నతనం నుంచే మావోకు, తాను చేసే ప్రతి పనిలోను ఒక రకమైన స్పష్టత ఉండేది. చిన్న తనంలో ఏడేళ్ల వయసులో చదువుకొరకు మాస్టారు దగ్గరకు పంపడంతో పుస్తకాల మీద అభిమానం, శ్రద్ధ పెరిగింది. గ్రంథపఠనంతో ఒక కొత్త ప్రపంచం మొదలైందన్న భావన కలిగింది ఆ చిన్నారి మనసులో. చదువుతోపాటు తండ్రి వ్యవసాయక్షేత్రంలో కూడా పనిచేస్తుండేవాడు మావో. విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా కూడా చైనా ప్రజలకు సుపరిచితుడే .

బహుశా మావో రాజకీయ విప్లవ నేపథ్యం, దేశనాయకుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగా కూడా పేరు తెచ్చి పెట్టి వుండవచ్చు. అయితే మావోకు రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. సమకాలీన చైనా సాహిత్యంలో ఆయన రాజకీయ జీవితంతో ముడిపెట్టకుండా మావోకు మంచి పేరు వచ్చేది. మావో వచన కవితల రచనా శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో లేదా ఒక విప్లవ కమ్యూనిస్టు యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.
ఒకటి రెండు సందర్భాలలో తప్ప మహిళలు, ప్రేమ అనే పదాలు అరుదుగా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. మానవ నైజం, మానవవిలువలు, సమాజం, చైనా దేశం, ప్రపంచం… సంబంధించిన అంశాలే మావో కవితల కథా వస్తువు. పాఠశాల విద్యార్థిగా వుండగానే సాహిత్యంపై అభిలాష కలగడం, కవితలు అల్లడం ప్రారంభించారు. వచన రచన అంటే మావోకు చాలా ఇష్టం. ఆయన వచన కవిత్వానికి, గేయ కవిత్వానికి పోలికలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం, ప్రకృతి అందచందాలు మావో కవితల ప్రత్యేకత. మావో రాసిన మరో కవిత ఇలా సాగుతుంది:

‘ఆ శ్వేత మేరు పర్వతాల పైన
మబ్బులు వెలిశాయి
అదే తెల్లని కొండల కింద
వేదన ఉబికింది
ఎండిపోయిన అడవులు వృక్షాలు సైతం
యుద్ధానికి సై అన్నాయి
తుపాకీల మోత మోగింది
ఫిరంగుల వాన కురిసింది
ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు

సైన్యం ముందుకు దూసుకొచ్చింది
పదిహేనురోజుల్లో రెండు వందల మైళ్లు
సైనికుల దండు కదిలింది
ఫ్యూకేన్ పర్వతాల మీదుగా
కన్ నదికి చేరువగా
శత్రు సైన్యాన్ని తుద ముట్టించే దిశగా
వేలాదిగా సేన కదిలింది విజయం వైపు

కాని మెల్లగా ముందుకొచ్చిన తీరుని
ఆలశ్యంగా పన్నిన పన్నాగాన్ని
జీర్ణించుకోలేని మనసు ఒకటి
మౌనంగా కన్నీరు పెట్టింది’
ఇతర చైనా సాహితీవేత్తల మాదిరిగానే మావో కూడా అపారమైన సాహితీసంపదను తన కవిత్వం ద్వారా ఆ దేశానికి అందించారు. ఆయన రచనలు చాలావరకు ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. బహుశా ఇతర భాషలలో కూడా వచ్చి వుండవచ్చు. ప్రాచీన-ఆధునిక ప్రపంచం పోకడలను ప్రతిబింబిస్తాయి మావో రచనలు.
– వనం జ్వాలా నరసింహారావు
(నేడు మావో 120వ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరణాగతి అత్యవసరం -తిరుప్పావై

 

ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు.
నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్!
మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్
నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్
పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్
కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్
తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే!
తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!!
నోము నోచి ఫలం అనుభవించేదానా! లేవమ్మా! బయటి గోపికలు ఎంత పిలిచినా లోపలి గోపిక నిద్ర లేవడం లేదు. ఆమెలో ఉలుకూ పలుకూ లేదు. ఏమీ మాట్లాడడం లేదు. వాకిటి తలుపులు తెరవకపోయినా కనీసం ఓ మాట మాట్లాడాలి కదా? “మా పిలుపులకు సమాధానంగా ఒక్క మాట కూడా మాట్లాడవేమిటి?” అంటున్నారు బయట ఉన్న గోపికలు. అంతేకాదు, భక్తో, ప్రపత్తో సాధన చేసి, తాను ఉన్న చోటనే పరమాత్మానుభవాన్ని పొందుతున్న ఈ గోపిక అదృష్టాన్ని ‘ఏమి అదృష్టమమ్మా’ అని మెచ్చుకుంటున్నారు.
ఈ గోపిక శ్రీకృష్ణ తత్వాన్ని బాగా తెలుసుకుని ఉంది. శ్రీకృష్ణుడే సిద్ధో పాయమని తెలుసుకుని ఆయనను ఆశ్రయించింది. ఆయనను శరణాగతి చెందడం తప్ప ఇంకేమీ చేయనవసరం లేదని భావించింది. పరమ శరణాగతి చేసిన ఏకాంత భక్తులకు ఆమె స్ఫూర్తిగా, సంకేతంగా నిలిచింది. ఉపాయోపాయాలు రెండు నారాయణుడేనని ఈ గోపిక ద్వారా అర్థమవుతోంది. “పరిమళించే తులసి మాలను తలపై పెట్టుకున్న నారాయణుడే మన రక్షకుడు. ఆయననే కీర్తిద్దాం. శ్రీరాముడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుంభకర్ణుడు తన నిద్రను నీకిచ్చాడా? లేచి తలుపులు తీయవమ్మా! మా గోష్టికి నాయకురాలి లాంటిదానివి. నీలాంటి భాగవతోత్తమురాలు మాతో చేరితేనే మా గోష్టి పూర్తవుతుంది. నెమ్మదిగా వచ్చి, తలుపు గడియ తీసి, నువ్వు పొందిన పరమాత్మానుభవాన్ని మాకు కూడా దయ చేయవమ్మా!” అని బయట నుంచి గోపికలు వేడుకుంటున్నారు.
అయిదవ వాక్యమైన ‘శ్రీమత్ పరాంకుశ దాసాయ నమః’ ప్రకారం, పెరియాళ్వారుల్ని(మహా యోగిని) నిద్ర లేపుతున్నారు.
వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535

 

భగవంతుడితోనే జీవితం

Published at: 26-12-2013 00:32 AM
Select ratingGive it 1/5Give it 2/5Give it 3/5Give it 4/5Give it 5/5

తిరుప్పావైలోని పదకొండవ పాశురం కూడా గోపికలను నిద్ర లేపడానికి సంబంధించిందే. ఇందులో గోకులాన్ని గురించిన అద్భుతమైన వర్ణన మిళితమై ఉంది.
కత్తు క్కరవైక్కణంగళ్ పలకరన్దు
శెత్తార్ తిరలళియచ్చెన్రు శెరుచ్చెయ్యమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్‌దమ్ పొర్కొడియే
పుత్తవ రవల్‌గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళి మారెల్లారుమ్ వన్దు నిన్
ముత్తమ్ పుగున్రు ముగిల్ వర్రన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తుక్కుఅంగుమ్ పారుళేలోరెమ్బావాయ్!!

ఈ పదకొండవ రోజున లెక్కలేనన్ని గోవుల పాలు పితుకుతూ ఉండే గొల్ల కులంలో పుట్టిన బంగారు తీగ వంటి గోపికను మిగిలిన గోపికలంతా నిద్ర లేపుతున్నారు. “లేవమ్మా, లేచి తయారై మా గోష్టికి రావమ్మా!” అని బయటి గోపికలంతా ఆమెను అనేక విధాలుగా పిలుస్తున్నారు. గోకులంలోని గోవులు కూడా నాలుగైదు ఈతలు ఈనినప్పటికీ, లేగ దూడల్లాగానే ఉంటాయట. బృందావనంలోని గోవులు విశిష్టతే అదట. కారణం ఏమిటంటే, ఈ గోవుల్ని బాలకృష్ణుడే మేపుతుండడం వల్ల అవి మరింత ఆనందంతో చిన్న దూడలుగా కనిపిస్తుంటాయట. తీగ ఎట్లా కొమ్మను వదిలి ఉండలేదో, అలాగే శ్రీకృష్ణ పరమాత్మను వదిలి ఉండలేని స్థితి గల ఈ గోపికను “పుట్టలోని సర్పం లాంటి నితంబం కలదానా! అడవిలో నెమలి వంటి కేశపాశాలు కలదానా! బంగారు తీగ వంటి దానా! లేచి రావమ్మా” అని బయటి గోపికలు ఆప్యాయంగా పిలుస్తున్నారు.
“నేను రావడానికి అంతా వచ్చారా” అని లోపలి గోపిక అడుగుతోంది. “పరమప్రాప్యమైన నీ ఇంటి ముందు నీ బంధువులు, స్నేహితురాళ్లు అందరమూ చేరామమ్మా! నీల మేఘ శ్యాముడైన కృష్ణ పరమాత్మ తిరునామ సంకీర్తనం చేస్తున్నప్పటికీ, ఆయన కల్యాణ గుణాలను మనసారా కీర్తిస్తున్నప్పటికీ, నీలో కొంచెమైనా మార్పు రాలేదే! మాట్లాడకుండా పడుకున్నావేమమ్మా” అని అంటున్నారు బయటి గోపికలు. అంతేకాదు, “నువ్కొక్కదానివే పరమాత్మానుభవాన్ని పొందుతున్నావే! భాగవతులు లేని పరమాత్మానుభవం కైవల్యంతో సమానమా! బంగారు తీగ వంటి నువ్వు మా గోష్టికి రాకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావమ్మా” అని బయటి గోపికలు అడుగుతున్నారు. ఈ రోజు గురు పరంపరలోని ‘శ్రీమద్యామునయే నమః’ అనే ఆరవ వాక్యంతో ప్రతిపాదించిన ‘పూదత్తాళ్వారు’లను మేల్కొలుపుతున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి

 

వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా….

వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు ఉద్యోగం చేపట్టినప్పటికీ ఆయన మనసు అందులో నిలవలేదు. ఆయన తండ్రి కుప్పా లక్ష్మణావధాని. అనంతర కాలంలో ఆయన శ్రీజనార్దనానన్ద సరస్వతీ స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన వేద విద్వత్తు ఆయనను ఆధునిక విద్య, ఉపాధి మార్గం నుంచి వేదాల వైపు నడిపించింది. ఫలితంగా ఆయన 37వ ఏటనే బ్యాంకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి వేద పరిరక్షణ, వేద విజ్ఞాన వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో పట్టు ఉండటం వల్ల వేద విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో అందించే సామర్థ్యం వీరి సొంతమైంది.
ఆధునిక – వేద విజ్ఞానాల సంగమం
అటు ఆధునిక విజ్ఞానం, ఇటు వేద విజ్ఞానాల మేలు కలయికగా ఉండే కృష్ణమూర్తి అవధూత దత్తపీఠంలో విద్యాధికారిగా, ట్రస్టీగా పనిచేశారు. 1986లో శ్రీదత్తదర్శనం చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. ఆ తరువాత దశాబ్ద కాలం క్రితం వేదాలపై శాస్త్రీయ పరిశోధన సంస్థ (ఐసర్వ్)ను స్థాపించి వేదాల వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 36 జాతీయ సమ్మేళనాలు రచించారు. 30కి పైగా ఆధ్యాత్మిక, వైజ్ఞానికి గ్రం«థాలు ప్రచురించారు. 11 ఆధునిక వైజ్ఞానికి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఆయుర్వేదం, పాణినీయ వ్యాకరణం ద్వారా నూతన కంప్యూటర్ లాజిక్ ఆవిష్కరణ, నవీన వైజ్ఞానిక రీతులలో పురాతన సంఘటనల కాలనిర్ణయం, సనాతన భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్ర, వైదిక పద్ధతుల్లో భూకంపాది ఉత్పాతాల నిర్ణయం, అధర్వణ వేద పరిశీలన వంటి పరిశోధన ప్రాజెక్టులను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు.
30 గ్రంథాల రచన
ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషల్లో ఆయన ఇప్పటి వరకు 30 గ్రంథాలు రచించారు. యోగావశిష్ఠ హృదయం నాలుగు గ్రం«థాలు తెలుగు వచనం, ఆంగ్లంలో కూడా రచించారు. గురు తత్వ, గురు సచ్చిదానంద సద్గురు చరిత్ర, అధ్యాయ శ్లోకావళి, యోగ తారావళి, రుద్ర ప్రపంచ సత్వం ఆయన రచించిన గ్రంథాల్లో మచ్చుకు కొన్ని. ్‌భక్తి మాల* అనే ఆధ్యాత్మిక మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. వేద గణితంపై పుస్తకాలు రచించడంతో పాటు అనేక పరిశోధన వ్యాసాలు కూడా సమర్పించారు. వేద పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక రంగానికి చేస్తున్న సేవలకు గాను 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. జ్ఞాన సరస్వతి పురస్కారం, కల్యాణ భారతి ప్రతిభా పురస్కారం, మహర్షి విజ్ఞాన పీఠం నుంచి జ్ఞాన కులపతి పురస్కారం, డాక్టర్ పైడి లక్ష్మయ్య ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ధర్మనిధి పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గురుదేవుల ఆదేశం మేరుకు ఐసర్వ్ సంస్థను ఏర్పాటు చేసి, వేదాల్లో ఉన్న అనంతమైన విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు వీరు చేస్తున్న కృషి అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుకుంటోంది.

అభినందన సభ
వేద విజ్ఞాన పరిరక్షణ దీక్షితులు కుప్పా వేంకట కృష్ణమూర్తిగారికి ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు రాజధానిలోని తెలుగు విశ్వవిద్యాలయం కళామందిరంలో అభినందన సభ నిర్వహిస్తున్నట్టు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ శ్రీసీతారామ వేద సంస్కృత విద్యాపీఠం వెల్లడించింది. అభినందన సభతో పాటు వివేక చూడామణి, చతుస్సూత్రీ తాత్పర్య దీపిక, శ్రీమత్ భాగవత రహస్యము, ఈశావాస్యోపనిషత్తు, శ్రీమద్ భగవద్గీత 1-6 అధ్యాయాల ఆంగ్ల తరగతులు ఆడియో సిడిల అవిష్కరణ కూడా జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ ఎ.యజ్ఞరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డి.జి.పి. కె. అరవిందరావు, పుల్లెల శ్రీరామచంద్రుడు తదితరులు పాల్గొంటారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి

 

అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన ఆయన జీవితకథ-” హీలర్”ను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తొలి ప్రతిని అందించారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

“తను స్టాన్లీ కాలేజీ విద్యార్థి సంఘానికి నేతృత్వం వహిస్తున్నానని కూడా చెప్పారు. ఈ విషయం చెప్పిన వెంటనే నెహ్రూ చిరాకుపడ్డారు. “యూనియనేమిటి..? అలాంటి పనులతో మీ జీవితాలను ఎందుకు పాడుచేసుకుంటారు? చదువుపైనే శ్రద్ధ పెట్టాలి..” అన్నారు నెహ్రూ. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రేమించే నెహ్రూకు విద్యార్థి సంఘాలపై అలాంటి అభిప్రాయం ఉండటం ప్రతాప్‌కు ఆశ్చర్యం కలిగించింది.

మలుపు తిప్పిన లేఖ..
( ప్రతాప్ సి. రెడ్డి 1963లో అమెరికాకు వైద్యవిద్య చదువుకోవటానికి వెళ్లారు. 69 నాటికి స్ప్రింగ్ ఫీల్డ్‌లోని మిస్సోరి స్టేట్ చెస్ట్ ఆసుపత్రిలో హృద్రోగనిపుణుడిగా స్థిరపడ్డారు..)
ప్రతాప్ తండ్రి రాఘవరెడ్డి ప్రతి ఏడాది ఆరేడు ఉత్తరాలు రాసేవారు. ప్రతాప్ పుట్టిన రోజుకు (ఫిబ్రవరి 5వతేదీ) అందేటట్లు ఒక ఉత్తరం తప్పనిసరిగా వచ్చేది. కాని 1969 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరం రాలేదు. రాఘవరెడ్డి చిత్తూరు జిల్లాలోని అరకొండకు గ్రామపెద్ద. అక్కడ ఆయన చెప్పిందే వేదం. తండ్రి నుంచి ఉత్తరం రాకపోయేసరికి ప్రతాప్‌కు ఏదో వెలితిగా అనిపించింది. కాని అప్పట్లో భారత్ నుంచి అమెరికాకు ఉత్తరం రావాలంటే చాలా కాలం పట్టేది. కొన్ని సార్లు అసలే వచ్చేవి కూడా కాదు. మొత్తానికి ఉత్తరం ఫిబ్రవరి 15వ తేదీకి వచ్చింది. ప్రతాప్ కవర్ చింపి చూశాడు. అందులో రాఘవరెడ్డి తెలుగులో రాసిన లేఖ ఉంది. సాధారణంగా ఆయన స్వయంగా ఎప్పుడూ రాయరు. కరణం చేత రాయిస్తారు. అలాంటిది తండ్రే స్వయంగా ఉత్తరం రాసేసరికి ప్రతాప్‌కు ఆదుర్దా పెరిగింది. సాధారణంగా ఉత్తరం మొదట్లోనే పుట్టిన రోజు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ ఆ ఉత్తరంలో ఆ ప్రస్తావనే లేదు. దీనితో ప్రతాప్‌కు ఆదుర్దా మరింతగా పెరిగింది.. ఆ ఉత్తరంలో-“నువ్వు, నీ కుటుంబం అమెరికాలో ఆనందంగా ఉన్నారని తెలిసి నేను, అమ్మ చాలా సంతోషపడుతున్నాం. నువ్వు చేస్తున్న పనుల గురించి నువ్వు ఉత్తరాలు రాస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటోంది. కాని నీకు నీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తుంచుకో.. నువ్వు భారత్‌కు తిరిగి వస్తే- విదేశాలలో నువ్వు పొందిన శిక్షణ వల్ల ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందో ఒక్క సారి ఆలోచించు.. ఎంత మంది ఆరోగ్యవంతులవుతారో ఆలోచించు..” అని ఉంది. ఆ ఉత్తరం చదివిన వెంటనే ప్రతాప్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య సుచరిత వైపు తిరిగి- “ఏం చేయాలి” అని అడిగే లోపే – “మనం ఇంటికి వెళ్లిపోదాం..” అన్నారామె. ఆ ఒక్క ఉత్తరం ప్రతాప్ జీవితాన్ని మలుపు తిప్పింది. కాని ప్రతాప్ జీవితంలో సాధించిన విజయాలను ఆయన తండ్రి మాత్రం ఎప్పుడూ చూడలేకపోయారు. “ఈ రోజుకూ నేనేదైనా ఫంక్షన్‌లో మాట్లాడుతున్నా, అపోలోలో నా సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నా, మా నాన్న మొదటి వరసలో కూర్చున్నట్లే అనిపిస్తుంది. ఆయన మొహంలో సన్నటి చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. నన్ను దీవించటానికి ఆయన అక్కడ ఉంటారని నాకు తెలుసు. నేను ఒక మంచి కొడుకు కావాలని ప్రయత్నించా. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు..” అంటారు ప్రతాప్.
బంగారు బాల్యం..
ప్రతాప్ తాత మునిస్వామి రెడ్డి కూడా అరకొండకు గ్రామపెద్దగా వ్యవహరించేవారు. గ్రామప్రజలను తన బిడ్డల్లా చూసుకొనేవారు. ప్రతాప్ చిన్నతనమంతా ఆ ఊళ్లోనే సాగింది. ఆ సమయంలో వాళ్లింట్లో 50 మంది దాకా ఉండేవారు. ఆరుగురు వంటవాళ్లు ఎప్పుడూ వంటలు వండుతూ ఉండేవారు. మునిస్వామిరెడ్డి చనిపోయిన తర్వాత రాఘవరెడ్డి గ్రామ పెద్ద అయ్యారు. “నాన్న, అమ్మ మేడ మీద ఉండేవారు. మిగిలినవాళ్లందరం కిందే పడుకొనేవాళ్లం. రాత్రి టాయిలెట్‌కు వెళ్లాలన్నా- ఇంటి వెనక ఉన్న పొలాల్లోకి వెళ్లేవాళ్లం..” అని ప్రతాప్ తన చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వెంకోబారావు అనే ఉపాధ్యాయుడు వచ్చి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇంగ్లీషు గ్రామర్, లెక్కలు చెప్పేవారు. ఏ చిన్న తప్పు చేసినా కర్రతో మోకాళ్ల మీద కొట్టేవారు. వెంకోబారావు చేతిలో ఎక్కువ దెబ్బలు తిన్నది విమల (ప్రతాప్ కజిన్). ఆ తర్వాతి స్థానం ప్రతాప్‌దే. ఇప్పటికీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతాప్ తన మోకాళ్లవైపు చూసుకుంటూ ఉంటారు. మొత్తం పిల్లలందరిలోను ప్రతాప్ చాలా అల్లరిగా ఉండేవాడు. తండ్రి గదిలో నుంచి మూచ్ సిగరెట్లు తీసుకువచ్చి రహస్యంగా కాల్చేవాడు. ఆయన జీపును తీసుకొని ఎవరితో చెప్పకుండా బయటకు వెళ్లిపోయేవాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కోప్పడితే- “ఈ రోజు నేను దెబ్బలు తినేశాను. కావాలంటే నా చేతులు, కాళ్లు చూసుకో..” అని చూపించేవాడు. అలాంటి సమయాల్లో ప్రతాప్ వాళ్ళ అమ్మ పిల్లలందరికీ పూరీలు చేసి పెట్టేది. ఆ సమయంలో ప్రతాప్‌కి తిండి పుష్టి చాలా ఉండేది. పది, పదకొండు పూరీలు ఒకేసారి తినేవాడు.
ఎన్టీఆర్ స్నేహం!
దేశంలో పురాతనమైన కాలేజీలలో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ఒకటి. బ్రిటిష్ పాలకులు- ప్రెసిడెన్సీ పేరిట రెండు కాలేజీలు స్థాపించారు. ఒకటి కలకత్తాలో ఉంటే మరొకటి మద్రాసులో ఉండేది. ఈ కాలేజీలో చదివినంత కాలం ప్రతాప్‌కు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాని స్టాన్లీ మెడికల్ కాలేజీకి మారేసరికి రకరకాల ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సమయంలో ప్రతాప్‌కు కోదండరామయ్య అనే రూమ్మేట్ ఉండేవాడు. అన్ని కోర్సుల్లో ఫెయిల్ అయి, మళ్లీ మళ్లీ చదువుతూ ఉండేవాడు. కోదండరామయ్యకు ఎన్టీఆర్, కాంతారావులు స్నేహితులు. వీరిద్దరూ స్టాన్లీ మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కాదు. అయినా కాలేజీలో వేసే షేక్‌స్పియర్ నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. వీరిద్దరికి తిండిపుష్టి చాలా ఉండేది. వీరిద్దరి కోసం ప్రతాప్ బిర్యానీని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. ఎన్టీఆర్‌కు ఆవకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకసారి మూడు బాటిళ్ల బ్రాందీని దొంగతనంగా హాస్టల్‌లోకి తరలించారు కూడా! ఎన్టీఆర్ ఆ సమయంలో-” వద్దంటే డబ్బు” సినిమాలో హీరోగా నటించాడు. దీనికి సంబంధించిన పార్టీకి ప్రతాప్‌ను కూడా ఆహ్వానించారు. ఈ విషయం అరకొండ గ్రామస్థుల ద్వారా రాఘవరెడ్డికి తెలిసిపోయింది. ఆయనకు చాలా కోపం వచ్చింది. దీంతో ప్రతాప్ తల్లి శకుంతల- “కొద్ది కాలం మీ నాన్నకు దూరంగా ఉండు. ఆయనకు నువ్వంటే చాలా కోపంగా ఉంది” అని ఉత్తరం రాసింది. ఆ సమయంలో ప్రతాప్ చూడటానికి అందంగా ఉండేవాడు. అంతే కాకుండా ఎన్టీఆర్, కాంతారావులు స్నేహితులు కూడా. కావాలంటే సినిమాల్లో ప్రయత్నించి ఉండచ్చు కూడా. కానీ ఆ ఆలోచన తనకెప్పుడు రాలేదంటారు ప్రతాప్. “బయటకు వెళ్లాలి. సరదాగా గడపాలి. అంతే తప్ప.. సినిమాల్లో చేరే ఆలోచనే లేదు..” అంటారు.
నెహ్రూ అపాయింట్‌మెంట్..
స్టాన్లీ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి రాజకీయాలలో ప్రతాప్ చురుకుగా ఉండేవారు. ఆ సమయంలో నెహ్రూ మద్రాసుకు వచ్చారు. ఆ విషయం తెలిసి నెహ్రూ కలిసి, తమ కళాశాలకు ఆహ్వానించటానికి ప్రతాప్- రాష్ట్ర గవర్నర్ శ్రీప్రకాష్ ఆఫీసుకు వెళ్లారు. కొద్ది సేపు బయట కూర్చున్న తర్వాత ప్రతాప్‌ను లోపలికి పిలిచారు. పిలిచిన వెంటనే నెహ్రూ- “నీకేం కావాలి?” అని అడిగారు. “సర్.. మద్రాసులో 21 కాలేజీల విద్యార్థులు మీ స్పీచ్ వినాలనుకుంటున్నారు..” అన్నారు ప్రతాప్. తను స్టాన్లీ కాలేజీ విద్యార్థి సంఘానికి నేతృత్వం వహిస్తున్నానని కూడా చెప్పారు. ఈ విషయం చెప్పిన వెంటనే నెహ్రూ చిరాకుపడ్డారు. “యూనియనేమిటి..? అలాంటి పనులతో మీ జీవితాలను ఎందుకు పాడుచేసుకుంటారు? చదువుపైనే శ్రద్ధ పెట్టాలి..” అన్నారు నెహ్రూ. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రేమించే నెహ్రూకు విద్యార్థి సంఘాలపై అలాంటి అభిప్రాయం ఉండటం ప్రతాప్‌కు ఆశ్చర్యం కలిగించింది. “సర్.. ఒకరికొకరు ఎలా సాయం చేసుకోవచ్చనే విషయాన్ని తెలుసుకోవటానికే సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఆందోళనలు చేయటానికి కాదు..” అని నెహ్రూకు సమాధానం చెప్పటానికి ప్రయత్నించారు. “సరే.. రావటానికి ప్రయత్నిస్తా. నాతో టచ్‌లో ఉండు. సంఘాలు పెట్టి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు” అన్నారు నెహ్రూ. ఆ తర్వాత నెహ్రూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటానికి ప్రెసిడెన్సీ కాలేజీకి వచ్చారు. నెహ్రూ ప్రసంగాన్ని వినటానికి ఐదు వేల మంది విద్యార్థులు వచ్చారు. ప్రతాప్ స్వాగతం చెప్పిన వెంటనే, మరొక వ్యక్తి మాట్లాడబోయాడు. నెహ్రూ అసహనంతో అతని దగ్గర నుంచి మైక్రోఫోన్ తీసుకుని ప్రసంగించటం ప్రారంభించారు. 45 నిమిషాలు అనర్గళంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

హీలర్
రచయిత: ప్రణయ్ గుప్తే
ప్రచురణ: పెంగ్విన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా గొప్పతనం ఏమిటి ?-2

        అమెరికా గొప్పతనం ఏమిటి ?-2

అమెరికా లో ధన వంతులు ,మధ్యతరగతి ప్రజల్లా గా దుస్తులు ధరించటం ,నువ్వు ఏది కావలి అనుకొంటే అది అవ్వు అనే మనస్తత్వం ,చిన్న వారితో స్నేహం గా ఉంటూ వారిని నీతో సమానం గా చూసుకోవాలి అనే అభిప్రాయం ,కాలేజి లో చేరిన  తర్వాత ఇంటికి తిరిగి రావద్దు అనే భావం ,సోమరితనాన్ని అలవారచుకోకుండా విశ్రాంతి లో కూడా వ్యాపకం కలిగి ఉండటం ,డెబ్భై ఏళ్ళ వయసులో కూడా ఆనందం గా జీవిస్తూ ,సెక్స్ ,పెళ్లి లను ఎంజాయ్ చేయటం ,అంతిమ సంస్కారాలు బహిరంగం గా జరపక పోవటం ,అమెరికన్లు అంటే నిజం గా చని పోరని , కేవలం అదృశ్యం అవుతారని అనుకోవటం అమెరికన్ల ప్రత్యేకత అన్నాడు డిసౌజా .

పదిహేనవ శతాబ్ది వరకు స్తబ్దుగా ఉన్న పాశ్చాత్య దేశాలు ,ఆ తర్వాత ఎలా విజ్రుమ్భించారో తెలియ జేశాడు డిసౌజా .అప్పటిదాకా గ్రీకులు చైనీయులు చాలా ముందున్నారు అన్నిటిలో .ఆ తర్వాత అంటా తమకే తెలిసింది అనే తృప్తి వారిని ఎదగ నియ్యలేదు .అప్పటి వరకు ఉన్న విజ్ఞాన్నాన్ని విస్తరింప జేసుకోలేదు .కాని వెస్ట్ దేశాలు శాస్త్రీయ అద్భుతాలు సాధించి ,ఇతర దేశాలలోని విషయాలను సేకరించి అభివృద్ధి పరచుకొని ముందుకు దూసుకొని వెళ్ళాయి దీనికి కారణాలు ప్రజాస్వామ్యం ,సైన్సు ,కాలనైజేషన్ .వీటితో వెస్ట్- ప్రపంచాన్నే ఆక్రమించింది .వీటికి  కేపిటలిజం బాగా తోడ్పడింది .’’the idea of right is simply that of virtue introduced into the political world ‘’అంటాడు డిసౌజా .అలానే మిల్టన్ కవి కూడా ‘’who overcomes by forces hath overcome but half his foe .’’అన్నాడని గుర్తు చేశాడు .’’if Hitler had been ruling india ,Gandhi would have been a lamp shade ‘’అన్నాడట ఒకాయన .

ఇరవై వ శతాబ్దం వచ్చే సరికి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వెనకడుగు వేసింది .యూరప్ మృత్యు ద్వారం వద్ద ఉంది అన్నాడు జీన్ పాల్ సాత్రే .1989 లో బెర్లిన్ గోడ కూల్చారు .దీనితో స్వేచ్చ పెరిగింది .అన్ని దేశాలు ఎదురు తిరిగి స్వాతంత్ర్యాన్ని పొందాయి .స్వేచ్చ ఎక్కడ ఉంటె ప్రజలు అక్కడికి చేరారు .అందుకే అందరి ద్రుష్టి అమెరికా పై పడి అన్ని దేశాల నుంచి జనం అమెరికా కు చేరారు, చేరుతున్నారు అన్నాడు .ఉన్న దాని కంటే ఇంకా బాగా జీవించే అవకాశాలను అమెరికా ఇచ్చింది. అమెరికా చేరిన ఇండియన్లు ఇండియా జీవన విధానాలనే అనుసరిస్తు,అమెరికా స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తో జీవిస్తున్నారు .అమెరికా లో ప్రతి పని సాధ్యమే .ఇక్కడ వైటార్ర్ లను ‘’సర్ ‘’అని పిలిచే సంస్కారం ఉంది .అమెరికా ప్రెసిడెంట్ ప్రజలతో మాట్లాడేటప్పుడు హాట్ తీసి మాట్లాడి గౌరవాన్నిస్తాడు .చాలా మందికి తర్వాతి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలీనంత థ్రిల్లింగ్ .జబ్బు పడ్డ వారికి ఇన్స్యూ రెన్స్ కవరేజ్ ఉంది .బీద దుస్తులు వేసుకొంటే ఎవ గిన్చుకోరు..ఇతరా దేశాల్లో సంపన్నులు హాయిగా జీవిస్తే ,అమెరికా  లో సామాన్యులు హాయిగా సుఖం గాజీవిస్తారు .చిన్న జీత గాళ్ళు సైతం వారాంతం లో యూరాప్ లాంటి దేశాల టూర్ చేస్తారు అందుకే అమెరికా జీవితం జీవనం ‘’లాంగర్ ,హెల్దియర్, ఫుల్లర్ ‘’అంటాడు రచయిత డిసౌజా . .

అమెరికా గురించి మరిన్ని విషయాలు చెబుతూ ‘’you get to write the script of your own life .your destiny is not prescribed ,it is constructed ..it is a blank sheet of paper –you are the artist >.America is the pursuit of happiness అన్నాడు నోబుల్ ప్రైజ్ విన్నెర్ నయీ పాల్ ప్రతి వ్యక్తీ భావన ,బాధ్యతా ,అవకాశం ,మేధా ,ఉద్యోగం ,సామర్ధ్యం అభివృద్ధి కి సదుపాయాలున్న దేశం .వీటిని తగ్గించే వీలు లేదు ఒక చట్రం లో బిగింప బడి ఉండదు .ఊహ కల్పనా  అతిశాయోక్తులకు స్తానం లేదుఅన్నాడు నయీ పాల్ అమెరికా నిర్మాతలు  లభ్యత లేక పోవటం ,భిన్నత్వం అనే రెండు సమస్యల్ని సాధించారు .వాళ్ళ దృష్టిలో ప్రజలు ‘’wide berth of freedom –economic political and speech and religion in order to shape their own lives and pursue happiness ‘’అందుకనే అమెరికా ‘’rich ,dyanamic ,tolerant society ‘’గా మారింది .ఎమెర్సన్ రాసిన ‘’other revolutions have been the instruction of the oppressed –this was the repentance f the tyrant ‘’గొప్పగా భావిస్తారు .అబ్రహాం లింకన్ అమెరికాకు ‘’new birth of freedom ‘’ఇచ్చి సార్వ భౌమత్వాన్ని కాపాడి ,ఆఫ్రికన్ అమెరికన్ లకు అండగా నిలబడి బానిసత్వ శ్రుమ్ఖలాలను చేదించే ప్రయత్నం చేశాడు .అమెరికా అంతర్యుద్ధం లో ‘’one life for every 6slaves were killed ‘’గా ఉండేది అన్నాడు సివిల్ రైట్స్ నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ ‘’we do with ur rights what we  make ourselves the kind of script that we write our lives ,this finally is up to us ‘’అని తమను తీర్చి దిద్దుకోనేది తామే నని స్పష్టం చేశాడు

మరిన్ని వివరాలు మళ్ళీ

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-13-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం

నా దారి తీరు -61

రెండో సారి బెంగాల్ ప్రయాణం

జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు ,మేనకోడలు పద్మ కాల్నా లోనే ఉన్నారు .,కనుక బావ మేము వెడితే ‘’చెయ్యి కాల్చు కోవాల్సిన అవసరం లేదు ‘’అనిపించింది .సరేనని ఏర్పాట్లు చేసుకోన్నాం మా శ్రీమతి మా రమణ నుకడుపుతో   ఉంది .ఆవిడను మా రెండో తోడల్లుడు శ్రీరామ మూర్తి గారింట్లో భట్టిప్రోలుకు పంపి  మేము ప్రయాణమయ్యాం .

ప్రయాణం లో అపశ్రుతి

నేను, అశోక్, వేదవల్లి సామానులతో రిక్షా ఎక్కి సెంటర్ కు బస్సు యెక్క టానికి బయల్దేరాం .శివాలయం దగ్గర కు వచ్చేసరికి గోతుల రోడ్డు అవటం వల్ల  రిక్షా ఒరిగి పాపాయి అని మేము పిలుచుకొనే వేదవల్లి రిక్షా నుంచి కింద పడింది .కుడి మణి కట్టు వద్ద దెబ్బ తగిలి వెంటనే వాచింది ..కంగారు పడ్డాం .వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు అడిగి కొని వేశాను .ఆ నాడు వాపులకు ‘’టెన్డరిల్ ‘’టాబ్లెట్లు డాక్టర్ రాసేవారు. అదే వాడాం .తడిగుడ్డ చేతికి కట్టాం .ప్రయాణం ఆప లేదు .బయల్దేరాం దేవుడికి దణ్ణం పెట్టుకొని ప్రయాణం సుఖం గా సాగాలని ప్రార్ధించాను .బస్ ఎక్కి ట్రెయిన్ ఎక్కి హౌరా చేరాం .అక్కడికి బావ వివేకానందం గారు వచ్చారు అక్కడి నుంచి ఇంకేదో జంక్షన్ కు ట్రెయిన్ లో వెళ్లి అక్కడి నుంచి బస్ లో కాల్నాఅనే పల్లె టూరికి చేరుకొన్నాం. బస్ టాప్  సర్వీస్ కూడా చూశానిక్కడ .రోడ్లేమీ బాగా లేవు .గతుకులు కంకర రోడ్లే .బీదతనం ప్రతి చోటా కనీ పించింది .. గ్రామాల్లో చేపలు పెంచటానికి ప్రతి ఇంటా చిన్న చెరువులు ఉన్నాయి .ఇది బెంగాల్ జీవిత విధానమే .ఇంటికి చేరుకొన్నాం అక్కయ్యా వాళ్ళు బాగా సంతోషించారువచ్చినందుకు .’

పాపాయి ని వాళ్ళ ఫామిలి డాక్టర్ కు చూపించారిక్కడ .కంగారేమీ లేదని వాపు క్రమంగా తగ్గి పోతుందని టేన్దరిల్ తో బాటు పై పూతకు ఆయింట్ మెంట్ రాసి వాడించాడు .క్రమంగా వాపు తగ్గింది .కోలుకోంది .ఇల్లు చిన్నది .అన్ని సౌకర్యాలు ఉన్నాయి .పని మనిషి ,నౌకర్లు ఉన్నారు .మమ్మల్ని ఆదరం గా అందరూ చూశారు .రోజూ ఏదో స్పెషల్ చేసి పెట్టేది మా అక్కయ్య దుర్గ .పిల్లలు కలిసి ఆడుకొనే వారు .వేసవి లో వాళ్లకు మంచి కాలక్షేపం. బయటి వారితో మాట్లాడటానికి వీళ్ళకు బెంగాలీ భాష రాదు కనుక ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే వారు .పెద్దగా బయటి

ప్రదేశాలకు వెళ్లి చూసిన గుర్తు లేదు .శాంతి నికేతన్ కు  మళ్ళీ వెళ్ళామేమో  ?ఇంత మంది కలిసి సైట్ సీయింగ్ అంటే కష్టం కూడా కదా .

వేసవి అవటం లో దుర్గా దేవి ఆరాధన ను జనం బాగా చేస్తున్నారు ప్రతి చోటా పందిళ్ళు విగ్రహాలు పూజలు భజనలు ,ప్రసాదాలు  భక్తులతో ప్రతి చోటా కోలాహలం గా ఉంది అలంకరణలు బాగా ఉన్నాయి .ముచ్చటేసింది .భక్తీ ప్రవహిస్తోందని పించింది రాత్రి వేళ ఇదే మాకు కాల క్షేపం అందరం కలిసి వెళ్లి తిరిగి చూసే వాళ్ళం .మా అక్కయ్య రాత్రిపూట పూరీ కాని చపాతి కాని చేసి కూర  లేక సాంబారు తో మాకు పెట్టేది .రక రకాలకూరల తో ,పచ్చళ్ళ తో రసం గడ్డ పెరుగు తో మహా రుచికరం గా చేసేది. బంగాళా దుంప వేపుడు అదిరేది .సాంబారు రుచి చూస్తె వదల లేము .రసమూ అంతే.రక రకాల పిండి వంటలు చేసి పెట్టేది మొత్తం మీద రోజులు గడిచి పోతున్నాయి .అంత హుషారు గా అని పించలేదు ఈ ట్రిప్ ఎందుకో .

బావ ఇల్లు మారాడు అది పెద్ద ఇల్లు .చిన్నిల్లు నుంచి పెద్ద్దిల్లు అన్న మాట .సామాను సర్దటం తో అయిదారు రోజులు గడిచి పోయాయి .ఆ తర్వాత మళ్ళీ మేము ముగ్గురం ఉయ్యూరుకు బయల్దేరాం బావ హౌరాలో ట్రెయిన్ ఎక్కించాడు బేజ వాడ కు .అక్కడ దిగి బస్ లో ఉయ్యూరు చేరుకొన్నాం

తుఫాను భీభత్సం

మేము వచ్చే సరికి ఆంద్ర దేశాన్ని తుఫాను దులిపేసి భీభత్సం సృష్టించింది ఎన్నో మరణాలు ,పంట నష్టం .నేను అశోక్ పాపాయిలను ఇంట్లో దింపి మర్నాడు భట్టి ప్రోలు వెళ్లాను .అక్కడా చాలా నస్టమే చేసింది తుఫాను .మా తోడల్లుడు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో పని చేస్తున్నాడు మంచి సౌకర్యం ఉన్న ఇల్లు .భట్టిప్రోలు బౌద్ధ మతానికి కేంద్రం గా ఉండేది .ఇక్కడ అనేక శాసనాలున్నాయని చదివా .కాని ఎక్కడికీ పెద్దగా వెళ్ళల్లేదు ..రేపల్లె ఇక్కడికి దగ్గరే .అందుకని ఒక రోజు నేను రేపల్లె వెళ్లాను అక్కడ మా శివ రామ దీక్షితులు బాబాయి వాళ్ళు ఉన్నారు .రైల్ స్టేషన్ కు దగ్గరే వారికి స్వంత డాబా ఇల్లు ఉంది .నేను వచ్చినందుకు బాబాయి లక్ష్మీ కాంతం పిన్ని ఏంతో సంతోషించారు .ప్రభావతిని తానూ చూడలేదని తీసుకొస్తే బాగుండేదని పిన్ని అన్నది .విషయం చెప్పాను నేను జిల్లా పరిషత్ లో పని చేస్తున్నందుకు బాబాయి సంతోషించి నా జీతం ఏంతో అడిగి తెలుసుకొనినేను  చెప్పగా ‘’మేస్టార్ల కు కూడా ఇంత జీతమా ?’’అని ఆశ్చర్య పోయాడు బాబాయి ..మళ్ళీ భట్టిప్రోలు చేరాను ప్రభావతిని నన్ను పిల్లల్ని మా తోడల్లుడు శ్రీరామ మూర్తి భార్య జానకి ఏంతో ఆదరం గా చూసుకొన్నారు నేను బెంగాల్ వెళ్లి వచ్చేదాకా .అందరం కలిసి ఉయ్యూరు చేరుకొన్నాం .ఇంట్లో అందర్నీ వదిలి నేను భట్టిప్రోలు వెళ్లి నందుకు మా అమ్మ సూటీ పోటీ మాటలు అని ప్రభావతి మనసు గాయ పరిచింది .ఉమ్మడి సంసారం లో ఇవి మామూలే అని నేను సర్దుకు పోతాను అప్పుడు ఏమీ అనలేక మా ఆవిడ సమయం దొరికి నప్పుడల్లా అలాంటి వాటిని గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు నన్ను దులిపెస్తోంది ఇదీ ఓ తీయటి బాదే నని నవ్వి ఊరుకొంతున్నాను పడ్డ వాళ్లకు తెలుస్తాయి కాని ఒడ్డునున్న వాల్లకేం తెలుస్తాయి ?

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1

దినేష్ డి సౌజా రాసిన ‘’వాట్ ఇస్ సో గ్రేట్ అబౌట్ అమెరికా ?’’అనే పుస్తకం రాశాడు ఆయన బొంబాయి వాడు .అమెరికా చేరి ఇరవై ఏళ్ళు అయింది రోనాల్డ్ రీగన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ‘’వైట్ హౌస్ డొమెస్టిక్ పాలిసి అనలిస్ట్ ‘’గా ఉన్నాడు .స్టాండ్ ఫోర్డ్ యూని వర్సిటి హోవర్ ఇన్స్టిట్యూట్ లో రి సెర్చ్ స్కాలర్ గా పని చేశాడు .ఇతను రాసిన ‘’Regan –how an ordinary man became an extraordinary leader ‘’,’’the virtue of prosperity ‘’మొదలైన పుస్తకాలు రాశాడు

డి సౌజా తన రచనను 430 B.C. గ్రీకు రచయిత పెరాక్లిస్ ఇచ్చిన ఫునేరాల్ ఆరేషన్  తో ప్రారంభించాడు ‘’we are free and tolerant in our private lives ,but in public ,we keep to the law .it commands our deep respect .>there is an easy traffic of people across the world .our city is open to the world and we have no periodical deportations in order to prevent people observing or finding our secrets which might be of military advantage to the enemy ..others are brave ot of ignorance ‘’అని పెరిక్లిస్ చెప్పాడు ఇదే అమెరికా దేశం యొక్క ఆదర్శం అంటాడు డి సౌజా .పెరిక్లిస్ దృష్టిలో ‘’Aethens was the city that makes the quest for wisdom and the good life possible for themselves for them selves and for their children and cals upon citizens to developnan ‘’eros ‘’for their city ,a deep and abiding love that will justify and make possible the sacrifices that must be made to preserve Aethenial liberty and the way of life .’’ ఈ విధానమే అమెరికా కూడా అనుసరిస్తోంది కనుక. అమెరికా ను కాపాడుకోవాలి అని డిసౌజా హెచ్చ రించాడు .‘’

అమెరికా ను ద్వేషించేవి మాత్రం ఇస్లామిక్ రాజ్యాలేనని ,అక్కడ అభి వృద్ధి లేక పోవటమేకారనమైనందువల్ల ‘’జీహాద్ ‘’ను తప్పు దోవ పట్టించారన్నాడు .’’the cry that comes  from the heart of believer overcomes every thing even the white house ‘’ అన్నాడట  .ఆయతుల్లా ఖోమైని .సెప్టెంబర్ పదకొండు జరిగింది పిరికి వాళ్ళ చర్య కాదని విద్రోహ చర్య అని ,కరడు గట్టిన ఉగ్ర వాదులు ,బాగా శిక్షణ పొందిన వాళ్ళ చర్య అని డిసౌజా నిరూపిస్తాడు .అప్పటి వరకు అమెరిక కు తన శత్రువెవరో తెలియదని ,ఇప్పుడు తెలిసి పోట్లాడిందని చెప్పాడు ‘’it is anew kind of war against an enemy that refuses to identify him self ‘’అని అమెరికా ను సమర్ధిస్తాడు .ప్రపంచం లోనే అతి ప్రాచీన మతమైన ఇస్లాం ఇవాళ ‘’’’incubator of fascism and terrorism ‘’గా మారి పోయిందన్నాడు సౌజా .’’ట్విన్ టవర్స్ అమెరికా కేపిటలిజం ,అమెరికా ప్రభుత్వం లకు చిహ్నాలు అంటాడు .

బిన్ లాడెన్ ఆస్తులు వంద మిలియన్ డాలర్లని అందమైన అడ వాళ్ళను అటూ ఇటూ ఉంచుకొని బోటు షికార్లు చేస్తాడని చెప్పాడు లాడెన్ యువకులకు ఇచ్చే శిక్షణ లోstrike above the neck ,practice what prophet says ,feel

complete tranquility ,because the time between you and your marriage in heaven is very short ‘’అని బోధిస్తాదట .ఇవన్నీ పిరికి బొందలకు పిచ్చి వాళ్లకు ఇచ్చే సూచనలు కావు అన్నాడు డి సౌజా .జీహాద్ అంటే ‘’a moral struggle to conquer the evil in himself ‘’అన్న నిజాన్ని తెలిపాడు .ప్రపంచం మొత్తం మీద ఉన్న వేలాది టెర్రరిస్టులు అందరు ముస్లిములే .ఇదంతా ఇస్లాం కు వ్యతి రేకం అన్నాడు .ఇరవై రెండు ముస్లిం దేశాలలో ఏ దేశమూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించటం లేదని కుండ బద్దలు కొట్టాడు .చివరికి ‘’jihad aof the heart jihad of the pen ‘’అయి చివరికి పూర్తిగా ‘’jihad of the sword ‘’గా పేద దారి పట్టిందని లోకానికి తెలిపాడు డిసౌజా .

ఇవాళ అమెరికా ప్రపంచం లో ‘’ప్లానెట్ అమెరికా ‘’గా మారిందని ,ఏది రించే ఏ శక్తీ లేక ‘’సింగిల్ గ్లోబల్ ఎకానమీ ‘’వచ్చింది..సిలికాన్ విప్లవం లో ప్రపంచాన్ని డామినేట్ చేసి శాసిస్తోందని ‘’హైపర్ పవర్ ‘’లో చాలా మొండిగా ఆరోగంట్ గా మారిందని విశ్లేషించాడు .మలేసియా లో ‘’చ్యూయింగ్ గం ‘’ను నమల నీయరు .నమిలితే పబ్లిక్ లో నుంచో బెట్టి కొరడాతో కొడతారు .అమెరికా విదేశీ విధానం చాలా ముస్లిం దేశాలు ఆమోదింవని అందులో ముఖ్యం గా ఇస్రాయిల్ దేశానికి సాయం చేయటం వాళ్లకు మింగుడు పడదని చెప్పాడు డిసౌజా .

ముస్లిం దేశాలలో మానవ హక్కులకు ప్రాధాన్యతఃలేదు .అమెరికా మాత్రం వాటికే విలువ నిస్తుంది ,వాటి కోసం పోరాటం చేస్తుంది .,మద్దతు నిస్తుంది .అమెరికా గురించి ముస్లిం దేశాలలో ‘’your women are whores –American mothers prefer to work than to take care of their children .Aetheism is the official religion of the west ..You are spreading your way of life throughout the world .American culture is a kind of syphilis disease ‘’అనే చాలా తేలిక భావం ఉందని స్పష్ట పరచాడు .అంతమాత్రాన అమెరికా లో అంతా మంచే ఉందని భ్రమ పడకూదదన్నాడు సౌజా .’’social chaos , sexual pro miscrui ty polyetheism ,unbelief మొదలనిఅవి అమెరికా లో ఉన్న దుర్గుణాలన్నాడు డిసౌజా .అయితే ఇస్లాం అంటే సర్వ రక్షకుడైన అల్లా కు లొంగి పోవటమే నన్నాడు .మహమ్మద్ ప్రవక్త చెప్పిన సూక్తులను పరిపాలన ,యుద్ధ నైపుణ్యం ,సంధి ,విడాకులు గురించి ముస్లిం ఛత్రం లో ప్రాజాస్వామ్య భావాలకు అవకాశమే లేదన్నాడు .పాశ్చాత్య  సమాజం స్వేచ్చ మీద నిర్మింప బడిందని ,ఇస్లాం సుగుణం మీద నిలబడుతుందని వివరించాడు ప్రజలే పాలకులు కనుక చివరికి ‘’kill the apostrates ,kill the infedals ‘’ అనే నినాదాలలోకి  మారిపోయారని బాధ పడ్డాడు

1830లో Tocquevellie’encounterd a distinct species of man kind inordinate love of material gratification ‘’అమెరికా లో పౌర హక్కుల చురుకు దనం ఉందని ,మతం పై మోజు లేదని  అంటాడు .అమెరికా ఎవరికీ తల వంచని స్తితి లో ఉందని డిసౌజా అన్నాడు .

మిగిలిన వివరాలు ఈ సారి

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ – 25-12-13-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సరస భారతి 55వ సమావేశం –సమీక్ష

సరస భారతి 55వ సమావేశం –సమీక్ష

24-12-13-మంగళ వారం సాయంత్రం ఆరున్నర గంటలకు సరస భారతి యాభై అయిదవ సమావేశాన్ని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మహిత మందిరం లో ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాముఖ్యం ‘’అనే అంశం పై నిర్వహించింది .ముందుగా స్తానిక వి.ఆర్ .కే.ఏం హైస్కూల్ విద్యార్ధినులు ఇద్దరు చక్కగా భగవద్ గీతా పతనం చేశారు .వారికిని సరసభారతి నగదు తో అభి నందిన్చింది .

సరసభారతి 55 వ సమావేశం – ధనుర్మాసం – తిరుప్పావై దృశ్య మాలిక

నేను అధ్యక్షత వహించిన ఈ సభలో వక్తలు గా స్రేఎ మాదిరాజు శ్రీనివాస శర్మ శివ లక్ష్మి దంపతులు విచ్చేశారు .ణా ప్రసంగం లో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించాను .’’సూర్యుడు దనూ రాశిలో ప్రవేశించినపుడు వచ్చేదే ధనుస్సంక్రమణం.సాధారణం గా డిసెంబర్ పదిహేడున వస్తుంది అప్పటి నుంచి నెల రోజులు ధనుస్సు ఉంటుంది దీనినే నెల పట్టటం అని ఆంద్ర దేశం లో పిలుస్తారు ఇంటి ముందు ఆవు పేద తో కల్లాపి జల్లి రంగ వల్లులు తీర్చి ఆవు పేద తో గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ముగ్గు మీద భక్తిగా అలంకరిస్తారు .దీనితో వాకిలికి లక్ష్మీ కల శోభ వస్తాయి ఆడపిల్లలే గొబ్బెమ్మలు పెడతారు మంచి భర్త రావాలని మొక్కుతారు ..వైష్ణవ దేవాలయాల్లో తెల్ల వారుజామున పూజ చేసి నైవేద్యం పెడతారు భజనలు చేసుకొంటూ ఇంటింటికి తిరుగుటు నగర సంకీర్తన చేస్తారు యదా శక్తిగా యజమానులు వారికి దానం తో బియ్యం తో సహకరిస్తారు నెల వగానే ఈ డబ్బు బియ్యం ద్ర్వవ్యాలతో అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు .హరిదాసులు గంగి రెడ్డు మేళాలు ఈ నెల ప్రత్యేకత కోడి పందాలు ,కొత్తా అల్లుడు ఇంటికి రావటం సంక్రాంతినాడు పితృదేవతలకు తర్పణాలు బ్రాహ్మణులకు గుమ్మడికాయ బంగారం దానాలు చేస్తారు .గొబ్బి పిడకల తో రాధా సప్తమి నాడు పరవాన్నం వండి సూర్యుదినికి నైఒవెద్యమ్ పెడతారు .కనుము నాడు గారెలు వండుతారు .ఇలా నెల అంటా శోభాయ మానం గా ఊరంతా దర్శన మిస్తుంది

ధనుర్మాసం లో పూజ ఎప్పుడు చేయాలి ?/ఎందుకు చేయాలి ?

సూర్యోదయానికి మున్డున్నకాలాన్ని ‘’అరుణోదయ కాలం ‘’అంటారు దీనికే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు .అప్పటికి ఇంకా ఆకాశం లో నక్షత్రాలు మినుకు మినుకు మంటూనే ఉంటాయి ఈ సమయం లో దైవ పూజ చేయాలి .దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి .మనకు ఒక నెల వారికి రెండు గంటలు మాత్రమె .దక్షిణాయనం చివరలో అంటే దేవతలా రాత్రికాలం చొ చివరి ఘడియల్లో దేవతలు విష్ణువు ను ఆరాధించి పూజిస్తారు .ఇదే మనం చెప్పుకొన్న అరుణోదయ కాలం .ఆ సమయం లో మానవులు కూడా పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది ఈ కాలం ధనుర్మాసం లోనే సాధ్యం అవుతుంది అందుకే ధనుస్సుకు అంట ప్రత్యేకత మార్గ శిర మాసం విష్ణువు కు ప్రీతికరం కూడా .ధనుస్సులో క రోజు పూక చేస్తే మిగితా వెయ్యి రోజుల పూజకు సమానం అని చెబుతారు .

కాత్యాయని వ్రతం –  శ్రీ నోము

ద్వాపర యుగం లో నంద గోప కన్నెలు  కాత్యాయని వ్రతం  చేశారు .అప్పుడొక సారి వర్షాలు లేక పంటలు లేక వారు ఇబ్బంది పడుతుంటే గోప వృద్ధులు వారిని శ్రీ కృష్ణుని గూర్చి కాత్యాయని వ్రతం ను నిష్టగా చేయమని దాని వల్ల  వర్షాలు బాగా కురిసి భూమి సస్య శ్యామల మవుతుందని చెప్పి గోప కన్యలను శ్రీ కృష్ణుని వశం చేశారు .ఆయన వాళ్ళతో తనను అపరాత్రి వేళ స్నానానికి, వ్రతానికి సరైన సమయం లో నిద్ర లేప మని చెప్పి నీలా దేవి గృహానికి వెళ్లి పోయాడు .వీరందరూ మిగిలిన గోపికలను నిద్రలేపి కృష్ణుని మేలు కొలిపి నెల రోజులు దీక్షగా కాత్యాయని వ్రతం చేశారు వారి కోరికలన్నీ కృష్ణుడు తీర్చాడు.అది గొప్ప ప్రేరణ గా నిలిచింది

ఆండాళ్ –తిరుప్పావై

కలియుగం ప్రారంభమైన  98ఏళ్ళకు అంటే ఇప్పటికి .5,017సంవత్సరాల క్రితం నల నామ సంవత్సర ఆశాఢ శుద్ధ చతుర్దశి మంగళ వారం నాడు పూర్వ ఫల్గునీ నక్షత్రం లో పెరియాళ్వార నే విష్ణు చిత్తుడు అనే పరమ భాగవతోత్తమునికి ఆయన తులసీ వనమైన బృందావనం లో గోదా దేవి అయోనిజ గా ఉద్భవించి దొరికింది .ఆయన అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు .ఆమె శ్రీ రంగానాదునికి పుష్ప హారాలు కడుతూ అవి బాగున్నాయో లేవో నని తలలో ముడుచుకొని చూసుకొని అప్పుడు వాటిని రంగనాధ స్వామి కోవెలకు తండ్రితో పంపేది .స్వామి ఏంతో సంతోషం తో వాటిని .గ్రహించే వాడు అందువల్ల గోదా దేవిని ‘’చూడి కొడు త్త నాచ్చియార్ ‘’లేక  ‘’ఆముక్త మాల్యద ‘’అన్నారు అంటే తానూ ధరించిన హారాలను ఇచ్చిన కన్నె పిల్ల  అని అర్ధం  . .ఒక రోజు తండ్రి ఇది చూసి ఆ మాల ను తీసుకు వెళ్ళకుండా వేరే మాల ను స్వామికి సమర్పిస్తే ఆయన స్వీకరించకుండా గోదా ధరించి ఇచ్చిన మాలయే  కావాలన్నాడు .అప్పటి నుంచీ మళ్ళీ యధావిధి గా అలానే చేసేది .రంగని వలచిన ఈ చిన్నది తన కోరిక తీరటానికి గోపికలు లాగా ‘’మేలి నోము ‘’నోచి రోజుకొక పాశురం రంగని పై చెప్పింది అవే ‘’తిరుప్పావై ‘’అని పిలువా బడ్డాయి ఆమెను ఆయన స్వీకరించి వివాహం చేసుకొని తనలో ఐక్యం చేసుకొన్నాడు .అప్పటి నుంచి ఆలయాలలో రోజుకొక పాశురం చదవటం అలవాటైంది .

Inline image 1    Inline image 2   Inline image 3   

మొదటి తొమ్మిది పాశురాలలో శ్రీ నోము ప్రాముఖ్యత ,ఆడంబరాల విసర్జన ,వర్షం వస్తే సంపద పెరిగే తీరు ప్రస్తావన ఉంది .తరువాతి పదింటిలో ఈ నోములో సమాజం పాల్గోనేట్లు చేయటం ,స్నేహితురాళ్ళతో పూలు సేకరించటం ,ప్రక్రుతి అందాలు పులకరింత ,,ప్రతి ఇంటికి వెళ్లి కన్నెలను నిద్ర లేపటం స్నానం ,దేవాలయ సందర్శనం .సుప్రభాత సేవ ,శ్రీ కృష్ణ బల రాముల శౌర్య పటిమ ఉంటాయి .చివరి తొమ్మిది పాశురాలలో దైవ ప్రభావం చెప్ప బడింది .పూజకు కావలసిన వస్తు సంబారాలైన పాలు ,శంఖం ,అలంకరాన నైవేద్యం ,నెయ్యి ,వెన్న మొదలైన వాటి

వివరణ ఉంది  చివరి పాశురం లో శ్రీ కృష్ణునితో తాదాత్మ్యం చెందటం ఉంది .దక్షిణ దేశం లో తిరుప్పావైకి ఉన్న ప్రాధాన్యత దేనికీ లేదు అదొక పారాయణ గ్రంధమే విశిస్టాద్వైతులకు . .జయ దేవుని గీత గోవిందం తో సమానమని అంటారు

విశిష్టాద్వైత మత  స్తాపకులు భగవద్ రామానుజా చార్యులు .ముప్ఫై మూడవ ఏట ఆత్మ జ్ఞానం పొంది ఈ మతాన్ని స్తాపించి నూట ఇరవై సంవత్సరాలు సార్ధక జీవితం గడిపిన మహాత్ముడు .అద్వైత మార్గం లో నేతి నేతి తో బుర్రలు పగల కొట్టుకున్న వేదాన్తులకు వారు కోల్పోయిన ఆత్మను వెదికి ఇచ్చిన వాడు ఈ ఆచార్యుల వారుఅని చమత్కారం గా అంటారు  .అందుకే ‘’బ్రహ్మం ‘’శంకరు డి నుంచి రామానుజులకు సూక్షం నుంచి స్తూలం లోకి పరిణతి చెందింది అన్నారు .ప్రేమ తత్వాన్ని చెప్పిన వాడు .శరణాగతి ప్రేమ లతోనే భగవంతుని చేరగలం అన్నాడు .భక్తికి తరించటానికి కుల మత ,తర తమ భేదాలు లేవని ఎలుగెత్తి చాటాడు .మంత్రాలను సమాజ పరం చేసి అందరికి ముక్తి మార్గాన్ని అందించాడు .శంకరుడు రామానుజుడు ఇద్దరూ వైశాఖ  మాసం లో ఒకే నక్షత్రమా లో జన్మించటం విశేషం

రామానుజ పరంపర లో వారే ఆళ్వారులు .వీరు పన్నెండు మంది వీరినే ‘’పన్నిద్దరాళ్వారులు ‘’అన్నారు కృష్ణ దేవరాయలు ‘’పన్నిద్దరు సూరులు ‘’అన్నాడు ద్వాదశాదిత్యుల్లాంటి వారు సూరి అంటే పండితుడని సూర్యుడని అర్ధం .వీరు ద్రావిడ భాషా సాహిత్య మతాలను సుసంపన్నం చేసిన మహాను భావులు .ఆళ్వారు అంటే భక్తీ తన్మయత్వం ఉన్న వారు అని అర్ధం .వీరుప్రపంచానికి నాగరకత ను నేర్పారు.సర్వ మానవాళికి చెందిన రుషి తుల్యులు .వీరి పేర్లు ‘’సారో భూత ,భక్తీ సార ,మధుర కవి ,శఠ కోప ,కుల శేఖర ,విష్ణు చిత్త,గోదా దేవి ,భక్తాంఘ్రి రేణు ,ప్రాణనాధ ,పరకాల యోగి ‘’.ఇందులో విష్ణు చిత్తుల వారిని ‘’పెరియాళ్వార్ ‘’అనీ ఆయన కుమార్తె గోదా దేవిని ‘’ఆండాళ్ ‘’అనీ అంటారు .కుల శేఖరులు కేరళలో జన్మించి ‘’ముకుంద మాల ‘’రాశారు .పాదాన్ఘ్రి రేణువు  అంటే విప్రనారాయణ .ఈయన్నే ద్రవిదభాషలో ‘’తొందరప్పోడి రాల్వార్ ‘’అంటారు .ఆల్వారుల హృదయం లో నారాయణ మూర్తి సదా ఉంటాడని వీరంతా మోక్ష సామ్రాజ్యాన్ని సాధించారని అర్ధం చేసుకోవాలి ఆండాళ్ అనబడే గోదా దేవి ప్రపత్తి మార్గానికి మార్గ దర్శి భక్తికి పరాకాష్ట .ఆమె నోచిన మేలి నోము లేక శ్రీ నోము బాపు- రమణ భాషలో ‘’సిరి నోము ‘’.తానూ ఒక గొల్లెత గా భావించి కాత్యాయని వ్రత దీక్ష చేబట్టింది గొల్లతనం అంటే అజ్ఞానం అంటారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్ని పొందటమే గోదా దేవి తిరుప్పావై లో అంత రార్ధం అదే .పవిత్రమైన పాట.’’అని ధనుర్మాసం, తిరుప్పావై ల ప్రాముఖ్యతను చెప్పాను .

శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి మాట్లాడుతూ రాయలు రాసిన ఆముక్త మాల్యద ప్రబంధం కు నాంది కృష్ణా జిల్లా శ్రీ కాకుళం లోనే జరిగిందని ఆంద్ర మహా విష్ణువు  ఆలయం లో నిద్రించిన రాయలకు కలలో కనిపించి తన్ను ప్రేమించి

పెళ్లి చేసుకొన్న ఆకన్య అంటే గోదా దేవి చరిత్రను కావ్యం గా రాయమని ఆదేశించాడని ,అక్కడే ఆ కావ్యానికి శ్రీకారం చుట్టాడని చెప్పింది .అక్కడ శ్రీ కృష్ణ దేవరాలు నిద్రించిన మందిరం ఇప్పటికి ఉందని రాయల విగ్రహాన్ని మండలి బుద్ధ ప్రసాద్ అందరి సహకారం తో అక్కడ ఏర్పాటు చేశారని అదొక దర్శనీయ క్షేత్రం అని చెప్పింది .రాయలు ఆముక్తమాల్యద లో గోదా దేవి అందాన్ని గొప్పగా వర్ణించాడని చెబుతూ ఆమె ముఖం చంద్ర బింబమే నని కళ్ళు లేడి కళ్ళు అని ఆ కనుల చేత ముఖం కస్తూరి మృగాన్ని జయిన్చిందని ,అందుకని అది ఆమె ముఖాన్ని ఎలాగై నా గెలవాలనే ఉద్దేశ్యం తో చంద్రుడి సాయం కోరిందని ఆతను అందం లో ఆమె కు సరి సమానం అయినా ఆమెలో సహజ పరిమళం ఉంది కనుక పోటీ చేయ లేనని చెప్పగా తానె చంద్రుని లో చేరి చంద్రుడికి మ్రుగాన్కుడిని చేసిందని రాయలు తమాషాగా చెప్పాడు. కాని ఇది తెలిసిన గోదా దేవి కస్తూరి మృగం తన తో పోటీకి వచ్చి నందుకు దాని నెత్తురు  అయిన పచ్చి కస్తూరిని తన నుదుట బొట్టు గా ధరించిందని అందుకే ఆమెకు సహజ కస్తూరి పరిమళం అబ్బిందని చమత్కారం గా రాయలు ఊహించి అద్భుత వర్ణన చేశాడని చెప్పింది దీన్ని ఇంకొంచెం వివరిస్తూ కస్తూరి మృగానికి అండ కోశం లో కస్తూరి పుడుతుందని ,అందుకే కస్తూరికి ‘’నాభిజం ‘’అని పేరుందని వేట గాళ్ళు దాన్ని చంపి కస్తూరిని తీస్తారని ,పచ్చి కస్తూరికి సువాసన ఎక్కువ అని అందుకే నుదుట కస్తూరి బొట్టు ధరిస్తారని చెప్పింది సహజం గా లోకం లో ఏ రాజైన శత్రు రాజును యుద్ధం లో చంపి వాడి నెత్తురును తన నుదుట బొట్టుగా ధరించటం ఉందని ఈ విషయాన్ని కస్తూరి మృగాన్ని చంపి కస్తూరిని నుదుట బొట్టుగా పెట్టుకొన్నది గోదా దేవి అని రాయలు మహా బాగా సమర్దిన్చాడని  వివరించి అందరి హర్ష ద్వానాలను అందుకొన్నది .

శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ కార్తీకం శివునికి ప్రీతి అని మార్గశిరం విష్ణువుకు ప్రీతి అని శివుడు అభిషేక ప్రియుడని విష్ణువు అలంకారప్రియుడని చెప్పారు .వైష్ణవాలయాలలో ధనుర్మాసాన్ని అత్యంత వైభవం గా నిర్వహించట చూస్తుంటే నేత్ర పర్వం గా ఉంటుందని .చలికి బద్ధ కిన్చేవారికి ఈ కాలం లో లేచి నదీ స్నానం చేస్తే శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుందని ,పెసలు అన్నం కలిపి వండిన న నైవేద్యాన్ని ముద్గలం అంటారని దాన్ని ధనుర్మాసం లో నైవేద్యం పెట్టి ప్రసాదం గా ఇస్తారని ఇది ఒంటికి వేడి కలిగిస్తుందని చెప్పారు భోగి నాడు గోదా కల్యాణం లోకానికి శుభం కోసం చేస్తారని గోదా దేవి లాగా వ్యక్తిత్వాన్ని ప్రతి ఆడపిల్లా కలిగి ఉండాలని రంగనాధుడు ఆమె తండ్రితో గోదా దేవిని శ్రీరంగం తీసుకొచ్చి తనతో వివాహం చేయమనికోరితే ఆమె ఒప్పుకోలేదని రంగడి నే విల్లి పుత్తూరు వచ్చి మామ గారింట సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని తన్ను స్వీకరించమని చెప్పిన వ్యక్తిత్వం గోదా దేవిది అని వివరించారు

అనంతరం శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా భక్తులు భజన కార్యక్రమం చేశారు ఆ తర్వాతమంగళ హారతి నైవేద్యం తీర్ధ ప్రసాద వినియోగం జరిగి కార్యక్రమం సమాప్తమైంది ..

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-13-ఉయ్యూరు

.

..

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 55 వ సమావేశం – ధనుర్మాసం – తిరుప్పావై

This gallery contains 64 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసులో (1948-49)అనంత పురం జిల్లా హిందూ పూర్ లో మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు అక్కడి ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా పని చేస్తున్న కాలం లో మొదటి సారిగా ఆ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సభలో నీలం సంజీవ రెడ్డిని ,బాబూ రాజేంద్ర ప్రసాద్ ను చూశాను ..రెడ్డి మాట తీరు నాకు ఎందుకో మహా నచ్చింది .ఆయన పై వీరాభిమానం మనసులో ఏర్పడి పోయింది .అలాగే రాజెన్ బాబు అన్నా ఆరాధనా భావం మనసంతా నిండి ఉంది అప్పటికీ ఇప్పటికీ . ఆ తర్వాత నా చదువు ,ఉద్యోగం లో రెడ్డిపై గాఢ మైన అభిమానం పెరిగింది .ఆయన పదవిలో ఉన్నాలేక  పోయినా పదవులను తృణ ప్రాయం గా వదిలేసినా ఉన్నత శిఖరాలు అధిస్టించినా ఇది పెరిగిందే కాని తగ్గలేదు .నాకు తోడూ నాతొ పని చేసిన నాసహా ఉపాధ్యాయ్డు పసుమర్తి ఆంజనేయ శాస్త్రి కీ స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కూ కూడా రెడ్డిపై నాలానే అభిమానం ఉండేది మేము రెడ్డిని ‘’మన గురువు గారు లేక మన గురువు ‘’అని మా సంభాషణల్లో అనుకొనే వాళ్ళం. అందుకే ఆయన్ను గురువు సంజీవ రెడ్డి అన్నాను .మరి ఆయన శీలం నీలమణి కనుక ఘన నీలం అన్నాను

Inline image 2  Inline image 4Inline image 5

.

బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ (ఓల్డ్ కాంగ్రెస్) పార్టీ తరఫున ప్రచారం చేస్తూ శిష్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య తో పర్యటన చేస్తూ ఉయ్యూరు కు వచ్చినప్పుడు చూశాను అప్పటికే పెండేకంటి గురువుకు పంగనామాలు పెట్టి బాక్ టు పెవిలియన్ అయ్యాడు .రెడ్డిఒక్కడే ఉయ్యూరు వచ్చాడు .రహదారి బంగళాలో ఉన్నాడు .అప్పుడు ఇంకా మీటింగ్ మొదలు కాలేదు .జనమూ పెద్దగా లేరు .లోపల వాలు కుర్చీలో  తెల్లటి ఖద్దరు పంచ ,ఖద్దరు లాల్చీ నెత్తిన గాంధీ టోపీ తో కూర్చుని ఉన్నాడు .అప్పుడు ధైర్యం గా నేను ఆయన దగ్గరకు వెళ్లి పలకరించి నమస్కారం చేశాను .షేక్ హాండ్ ఇచ్చాను సంతోషం గా స్వీకరించాడు .కాని జన ప్రభావం లేనందున మనసులో కొంచెం కలవరం గా ఉన్నట్లు అని పించింది .ఆ తర్వాత మీటింగ్ ప్రారంభామవటం ఆయన మాట్లాడి వెళ్లి పోవటం జరిగింది .కనుక  ‘’నా అభిమాన హీరో’’ ను కలిసి ,తాకి ,మాట్లాడిన అను భూతి నాకెంతో గర్వం గా ఉండేది .ఇది అందరికి చెప్పి పులకరించి పోయే వాడిని అంతటి అదృస్టం  నన్ను వరించిందని పొంగిపోతానేప్పుడూ .

సంజీవ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రెసిడెంట్ పదవికి కాంగ్రెస్ అధికార కమిటి ఇందిరా గాంధి నాయకత్వం లో ఆమోదించి డిక్లేర్ చేసింది . ఇది ఆ తర్వాత ఇందిరకు ఇష్టం కాక గిరి ని బరిలో దింపింది ,అంతరాత్మ ప్రబోధం అంది .పార్టీ కాండిడేట్ రెడ్డి ఓడిపోయాడు చెంచాఅని పిలువ బడ్డ  ‘’గిరి ‘ప్రెసిడెంట్ అయ్యాడు హోరా హరీ జరిగిన ఈ పోరాటం లో నేను రెడ్డి నే సమర్ధించా .రెడ్డి గెలవాలని అందరితో చెప్పేవాడిని మా ఆంజనేయ శాస్త్రి కూడా అలానే కలలు కన్నాడు .కాని ఓడిపోయాడు. ఓడినా హుందాగా వెళ్లి పోయి తన పుట్టిన ఊరిలో జామ తోటలో కూర్చున్నాడు

అవసరమైతేనే మాట్లాడేవాడు .కాని దేశం క్లిష్ట పరిస్తితుల్లో ఉంటె తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పే నైజం ఖలేజా ఉన్న మొనగాడు రెడ్డి .సంకోచం నదురూ బెదురూ ఉండేది కాదు అందుకే నాకు అభిమానం పెరుగుతూ వచ్చింది  జనతాపార్టీ ఏర్పడటంలోక నాయక ,జయప్రకాష నారాయణ  నాయకత్వం లో రెడ్డి పని చేసి ఆంద్ర ప్రదేశ లో జనతా పార్టీ వారంతా పార్ల మెంటు ఎన్నికలలో ఒడి పొతే తానొక్కడే గెలిచి రెండో సారి స్పీకర్ అయి మొరార్జీ ప్రధాని అయి రెడ్డినే ఏకగ్రీవం గా ప్రెసిడెంట్ ను చేయటం చారిత్రాత్మక విషయం .బంతి కింద పడినా మళ్ళీ పైకి ఎగురుతుందని తెలియ జెప్పిన పరమ సత్యం .అందుకే ఆయనపై నా ఆరాధనా భావం పెరుగుతూనే ఉంది .ఒక మట్టి మనిస్ది గ్రామ స్తాయి నుండి దేశ స్తాయిలో ప్రధమ పౌరుదు అవటం ,ఈ మధ్యలో స్పీకర్ కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి పదవుల్ని అలంకరించటం పార్టీ పదవులకు శోభ తేవటం అసాధారణమైన విషయం అందుకే రెడ్డి అంటే అంతటి అభిమానం

Inline image 3   

.’

భారత  దేశానికి సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్ర పతి 1977 నుంచి 82వరకు పదవిలో ఉన్నాడు దానికి వన్నె తెచ్చాడు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ బసప్ప దానప్ప జెట్టి  హిదయతుల్లాలు రెడ్డి తర్వాత జెట్టి ఆక్టింగ్ ప్రెసిడెంట్ అవగా జైలు సింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు .అంతకు ముందు సంజీవ రెడ్డి రెండవ సారి నాల్గవ లోక్ సభ స్పీకర్ అయ్యాడు .మార్చ్77 నుంచి జులై పదిహేడు వరకు చేశాడు అంతకు ముందు బలీరాం భగత్ ఉండేవాడు రెడ్డి తర్వాత కే.ఎస్.హెగ్డే అయ్యాడు ఆంద్ర ప్రదేశ్  ముఖ్య మంత్రిగా సంజీవ రెడ్డి1962 నుంచి 64 వరకు పని చేశాడు అప్పుడు గవర్నర్ భీమ సేన్ సచార్ రెడ్డికి ముందు దామోదరం సంజీవయ్య తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి అయ్యారు ఇలా కీలక పదవుల్లో ఉన్నాడు

సంజీవ రెడ్డి పుట్టిన ఊరు అనంతాపురం జిల్లాలోని ‘’ఇల్లూరు ‘’అనే పల్లె టూరు ప్రాధమిక విద్య ఇక్కడే చదివి తర్వాత మద్రాస్  అడయార్ లోని దియాసఫికల్ స్కూల్ లో చేరి,అనంతపురం లో డిగ్రీ పూర్తీ చేశాడు . నాగరత్నమ్మ ను వివాహమాడాడు వీరికి ఒక కొడుకుముగ్గురు  కూతుర్లు .గాంధీజీ పిలుపు విని స్వాతంత్ర సమరం లో పాల్గొన్నాడు యూత్ లీగ్ కు నాయకుడయ్యాడు .ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరి గా  పదేళ్లున్నాడు  క్విట్ ఇండియా ఉద్యమలో చేరి అరెస్ట్ అయి 1940 -45కాలం లో జైలు లో ఉన్నాడు 1942లో విడుదల అయినా మళ్ళీ ఖైదీ అయి అమరావతి జైలు కు పంప బడ్డాడు అక్కడే ప్రముఖ స్వాతంత్ర సమారయోధులు ప్రకాశం పంతులు కామ రాజు సత్య మూర్తి వి వి.గిరి లతో శిక్ష అనుభ వించాడు .

1946లో సంజీవ రెడ్డి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికై ,లెజిస్లేటివ్ పార్టీ కి సెక్రటరి అయ్యాడు భారత రాజ్యంగా రచనా సంఘం లో సభ్యుడయ్యాడు మద్రాస్ ప్రభుత్వ ప్రొహిబిషన్ అడవులు గృహ మంత్రిగా పని చేశాడు 1951లో ఆంద్ర

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రెసిడెంట్ గా ఉన్నాడు 1952లోఆంద్ర రాష్ట్రానికి  టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్య మంత్రి సంజీవ రెడ్డి ఉప ముఖ్య మంత్రి గా పని చేశారు తెలంగాణా తో కలిసి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంద్ర ప్రదేశ్ కు మొదటి ముఖ్య మంత్రి 1956-60లో సంజీవ రెడ్డి అయ్యాడు రెండవసారి ముఖ్య మంత్రిగా 62-64 ఉన్నాడు మొత్తం మీద అయిదేళ్ళు ముఖ్య మంత్రిగా చేశాడు .శ్రీ కాళ హస్తి నుంచి ద్రోణా చలం నుంచి శాసన సభకు ఎన్నికయ్యే వాడు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం రెడ్డి హయాం లోనే ప్రారంభమయ్యాయి శ్రీశైలం ప్రాజెక్ట్ నుముఖ్యమంత్రి  చంద్ర బాబు నాయుడు ‘’నీలం సంజీవ రెడ్డి  సాగర్ ‘’ ‘’అనిమార్చి  గౌరవమ్ కల్గించాడు  రెడ్డి గ్రామీణాభి వృద్ధి వ్యవసాయం లకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు 1964లో అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షుడైనప్పుడు సంజీవ రెడ్డి ముఖ్య మంత్రి పదవికి రాజీ నామా చేశాడు .బస్సుల జాతీయీకరణ లో సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యానానికి స్పందించి 1964 లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నాడు .

కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బెంగుళూర్ భావనగర్ పాట్నా లలో భారీ సదస్సులు నిర్వహించాడు నీలం .1962 గోవా కాంగ్రెస్ సభలో గోవా విముక్తి ని చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టటానికి చేసిన ప్రసంగం ఏంతో స్పూర్తి నిచ్చి రెడ్డి నాయకత్వానికి యేన లేని కీర్తిని తెచ్చింది .లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు సంజీవ రెడ్డి కేంద్ర మంత్రి వర్గం లో ఉక్కు గనుల శాఖా మంత్రిగాఇందిరా ప్రభుత్వం లో  సివిల్ ఏవియేషన్ షిప్పింగ్ శాఖా మంత్రిగా సమర్ధం గ 1967 వరకు పని చేశాడు పని చేశాడు అప్పుడే విమాన ప్రమాదం లో హోమీ జహంగీర భాభా అనే అను శాస్త్ర వేత్త మరణించాడు 1969లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసమయం లో స్పీకర్ పదవికి రాజీ నామ చేశాడు గిరి చేతిలో స్వల్ప మెజారిటి తో ఇందిరా కుతంత్రం తో ఓడిపోయినా తర్వాత అనంత పురం వెళ్లి పోయి వ్యవసాయం చేసుకొంటూ కాలం గడిపాడు .

జనతా పార్టీ చేతిలో ఇందిరా ఓడిపోయినప్పుడు రెడ్డి లోక్ సభకు ఎన్నికై రెండో సారి స్పీకర్ అయి ఏకగ్రీవం గా1977 లో రాష్ట్ర పతి అయ్యాడు ఓడి మళ్ళీ ఆ పదవిని దక్కించుకొన్న వాడుగా చరిత్ర పుటల్లో నిలిచి పోయాడు రెడ్డి ఇలా ఏక గ్రీవం గా అయిన మొదటి వాడని పించుకొన్నాడు నీలం .మొరార్జీ చరణ్ సింగ్ మళ్ళీ ఇందిరా ప్రభుత్వాలలున్నప్పుడు నీలమే ప్రెసిడెంట్ ..తన జీవిత చరిత్రను ‘’reminiscences and reflections of a president ‘’గా రాసుకొన్నాడు .అంతకు  ముందు ‘’వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ‘’పుస్తకం రాశాడు పి.వి.నరసింహా రావు ఆత్మ కదా లో మహేంద్ర నాద కేరక్టర్ సంజీవ రెడ్దియే ఆయనకు ఆయన శిష్యుడైన బ్రాహ్మానంద రెడ్డి కి జరిగిన రాజ కీయ పోరు నరసింహా రావు చిత్రించాడు .1996లో ఎనభై మూడేళ్ళ వయసులో సంజీవ రెడ్డి నీలం అమరుడైనాడు. విలువలకు నిర్భీతికి నిజాయితీకి పట్టుదలకు రాజకీయ చాణక్యానికి ,పెద్దమన్సిషి తత్వానికి హుందా తనానికి,ఆత్మా గౌరవానికి ,నిబద్ధతకు,అంకిత   భావానికి మీదు మిక్కిలిమహా దేశ భక్తికి జాతీయతకు  నీలం సంజీవ రెడ్డి గొప్ప ఉదాహరణ అందుకే ఆయన అంటే అంత ప్రేమాభిమానాలు నాకు

నీలం వారి శత జయంతికి రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ రావటం అయన పై ప్రశంసలు కురిపించటం అటు  కేంద్రం ఇటు  రాష్ట్ర ప్రభుత్వం .చేసిన ఘన మైన ఏర్పాటు లు అభినంద నీయం .కాని మాజీ ప్రధాని బహు భాషా కోవిదుడు ప్రధాని అయిన మొదటి ఆంధ్రుడు  పాముల పర్తి వెంకట నరసింహా రావు గారి వర్ధంతిని ప్రభుత్వ కార్య క్రమంగా చెయ్యక పోవటం క్షమించా రాని నేరమే .

నీలం సంజీవ రెడ్డి శత జయంతి సందర్భం గా –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-13-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పెరల్ ఎస్ బక్ -2

పెరల్ ఎస్ బక్ -2

పెరల్స్ బక్’’ ‘గ్లోబల్ ’ విద్య ‘’కు నాంది పలికిన మహిళా తేజం .స్టాలిన్ దుశ్చర్యలను ఖండించి ముందు నిలిచింది .ఆమె రాసిన రెండు పుస్తకాలు ‘’దియాంగ్రీ వైఫ్ ‘’,’’హౌ ఇట్  హాపెన్స్ ‘’లు బాగా గుర్తింపు పొందాయి న్యూ యార్క్ నగరం లో 1960లో ‘’గాంధి మెమోరియల్ లెక్చర్ ‘’ఇచ్చింది .కేన్నేడి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఈమెను సాదరం గా డిన్నర్ కు ఆహ్వానించి రచయితలకు అగ్రస్తానాన్ని కల్పించాడు .1963లో ‘’దిలివింగ్ రీడ్ ‘’రాసింది .తన పై పెట్టిన కేసులు ,ఎఫ్ బి.ఐ.ఎంక్వైరీ మొదలైన వాటిని చూసి 77వ పుట్టిన రోజు నాడు ‘’మానవత్వం కోసం చేసిన సేవకు అవమానం ఫలితమా ?’’(for life time humanitarian  service – humiliation  is the reward?””అని వ్యధ చెందింది

 

          

నోబుల్ బహుమతి స్వీకరిస్తున్న బక్

పెరల్స్ బక్ తన జీవిత చరిత్రను రెండు భాగాలుగా రాసుకొన్నది .6-3-1973.ణ మానవ సేవలో సాహితీ సేవలో సార్ధక జీవితాన్ని గడిపిన పెరల్స్ బక్ మరణించింది .ఆమెకు చార్లెస్ డికెన్స్ అన్నా ఆయన రచనాలన్నా మహా ఇష్టం పదే పదే వాటిని చదువుకొనేది తన దగ్గర ఎప్పుడూ ఆయన పుస్తకాలను ఉంచుకొని స్పూర్తి పొందేది .చని పోయే రోజున చివరి సారిగా డికెన్స్ ను స్మరిస్తూ తన చుట్టూ డికెన్స్ రచనలన్నిటినీ పెర్పించుకోంది బహుశా సాహిత్య చరిత్రలో ఇలా చేసిన వారెవరూ లేరేమో ?

ఆ నాటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్  ఆమె ‘కు ’లిటరరీ మెంటార్ ‘’నిక్సన్ బక్  సేవలను ప్రశంసిస్తూ ‘’pearl S. Buck is a bridge between the civilizations of East and West ‘’అని కీర్తిం చాడు .ఆమె తన సమాధి పై తన పేరు ను ఇంగ్లీష్ లో రాయించలేదు .సమాధి లోపల’’ Chine characters representing the name Pearl Syndensticker  ‘’.ను చిత్రింప జేసి తనకు ఉన్న చైనా అభిమానాన్ని నిరూపించుకొంది .ఈ విధం గా ఆసియా అమెరికా సాహిత్య వారధి నిత్య జ్వలన జ్యోతి ఆరి పోయింది .

పెరల్స్ బక్ అమెరికా లోని వెస్ట్ వర్జీనియా లో ని హిల్స్ బోరో లో ‘’కెరొలిన స్తంట్లింగ్ ,ఆబ్సలాంసిన్దేన్స్టికర్  దంపతులకు1892 జూన్ 26న జన్మించింది .ప్రెస్బిటేరియన్ చర్చ్ తో కుటుంబానికి సంబంధం ఉంది ఈమే పుట్టాక ముందే తలిదండ్రుల వివాహం తర్వాత చైనా వెళ్లి బక్ పుట్టుక కోసం అమెరికా వచ్చారు మళ్ళీ బక్ మూడో నెల పిల్లగా ఉండగా చైనా వెళ్లి పోయారు తాను  రెండు ప్రపంచాలలో జీవిన్చానని ఆమె చెప్పేది ఒకటి ప్రెస్బిటేరియన్ ప్రపంచమైతే రెండోది చైనా జీవిత ప్రపంచం .పందొమ్మిదవ ఏట చైనా వదిలి అమెరికా లో వర్జీనియా లో ఉన్న రాండాల్ఫ్ మెకన్ వుమెన్ కాలేజి లో చేరింది . గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి మళ్ళీ చైనా చేరింది .జాన్ లసింగ్ బక్ అనే వ్యవసాయ ఆర్ధిక వేత్తను పెళ్ళాడింది .దంపతులు యూని వర్సిటి ఆఫ్ నాంకింగ్ లో గడిపారు .కరోల్ అనే కూతురు పుట్టింది .అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీ ని కార్నెల్ వర్సిటి నుండి పొందింది భార్యా భర్తలు తిరిగి చైనా వచ్చారు

.1927లో చైనా ఒడిదుడుకులలో ఉంది చాంగ్ కై షేక్ ప్రభుత్వానికి కమ్మ్యూనిస్ట్ లకు తీవ్ర పోరాటాలు జరిగాయి నాన్జింగ్ లో ఉన్న వీరికి రక్షణ కరువైంది .జాలి తో ఒక చైనా కుటుంబం వీరిని ఆదరించి ఇంట్లో ఉంచుకోండి .రచనలు చేయటం మొదలెట్టి ఆకర్షించింది ఆమె నవల ‘’ఈస్ట్ విండ్ వెస్ట్ విండ్ ‘’కు న్యూయార్క్ పబ్లిషర్లు ప్రోత్సహించారు .వదల కుండా రచయిత్రి గా ఉండమని సలహా ఇచ్చారు .నాన్జింగ్ ఇల్లు తగలెట్టారు జపాన్ చేరారు ఏడాది తారవాత మళ్ళీ చైనా వచ్చారు ఇతాకా కు మారారు .బక్ నుప్రెస్బిటేరియన్ స్త్రీల సంఘం లో మాట్లాడ మని ఆహ్వానిస్తే మాట్లాడి స్పూర్తి నిచ్చింది . ఇది హార్పర్స్ మేగజైన్ లో పబ్లిష్ అయింది .జాన్ డే పబ్లిషర్ అయిన రిచార్డ్ వాల్ష్ తో పరిచయం అయి పెళ్లిదాకా వెళ్ళింది .అప్పుడే గుడ్ ఎర్త్ నవల రాసింది భర్తకు విడాకు లిచ్చి  వాల్ష్ ను పెళ్లి చేసుకోంది .1960లో వాల్ష్ మరణం దాకా పెన్సిల్వేనియా లో ఉన్నారు కల్చరల్ రివల్యూషన్ కాలం లో చైనా పల్లె జీవితం పై రచనలు చేసింది 1972 నిక్సన్ తో చైనా వెళ్ళటానికి అనుమతి రాలేదు బాధ పడింది .లంగ్గ్ కేన్సర్ కు గురై పెరల్స్ బక్ 1973మార్చ్ ఆరున 81 ఏళ్ళ వయసులో వెర్మాంట్ లోని డాన్ బి  లో చని పోయింది తన సమాధి నిర్మాణాన్ని తానె డిజైన్ చేసుకోంది .

3-10-2002 నాటి నా అమెరికా డైరీ నుండి

క్రిస్మస్ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-13-ఉయ్యూరు

 

 

.

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్

నా దారి తీరు -60

బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్

నేను ఉయ్యూరు లో పని చేస్తున్న కాలం లో ప్రైవేట్లు బాగా ఉండేవి ఎక్కువ మందే చేరి చదువుకొనే వారు .అందులో ముస్లిం ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు కూడా ఉండేవారు .మా అమ్మ కు మడీ ఆచారం ఉన్నందువల్ల ఆవిడకు కొంత ఇబ్బంది గానే ఉండేది .కాని ఏమీ అనలేక పోయేది .అందుకోసం ఒక రకం గా ఆవిడకు సంతృప్తి కలిగించేవాడిని .బ్రాహ్మణ ఆడపిల్లల్ని మా అమ్మ ఉండే మా పడమటింట్లోకూర్చుని  చదివేట్లు చేశాను .మిగిలిన అన్నికులాల ఆడపిల్లలు మా సావిట్లో గట్టు మీద కూర్చునే వారు మగ పిల్లలు ఉత్తరం వైపు నేలలో ఉన్న ధాన్యం దంచే చిన్న రోలు దగ్గర కూర్చునే వారు .ఇంకా మిగిలి ఉంటె బయట వరండాలో కూర్చో బెట్టె వాడిని ఒక్కో సారి క్లాసులను బట్టి కూర్చో బెట్టి చెప్పటం, చది వించటం చేసే  వాడిని…బంధువుల ఆడపిల్లలందరికి ఫ్రీ ట్యూ షనే. వాళ్ళు బాగా చదివే వాళ్ళు కూడా. అందులో మా లక్షమ్మ పిన్ని కూతుళ్ళు మనవ రాళ్ళు ఉండేవారు .చిలుకూరి మా ఇంట్లో వాడే .పేద పిల్లలెవరైనా ఏకులం వారైనా ఉచితం గానే చెప్పే వాడిని .పరీక్షల ముందు రివిజన్ కోసం ప్రైవేట్ చదవక పోయినా విద్యార్ధులను రమ్మనే వాడిని .వాళ్ళు ఏంతో సంతోషం గా వచ్చి లెక్కలు చేసి పరీక్షకు తయారయ్యే వారు. వారందరూ ఇలా రావటం నాకెంతో సంతృప్తిగా ఉండేది .తలిదండ్రులు ఏంతో బతిమిలాడి పిల్లల్నినా  దగ్గరకు ప్రైవేట్ కు పంపే వారు ..ఇలా చాల కాలం సాగింది .ఆ తర్వాత నాకు తరచూ బదిలీల వల్ల,మళ్ళీ ఇక్కడ పని చేసినా పిల్లలు రావటం తగ్గింది .మనసులో కొంచెం బాధ గానే ఉండేది కాలం కూడా కలిసి రావాలి కదా .

మా గురువు గారు బసవా చారి గారు రిటైర్ అయ్యారు .ఆయన కు ఒకప్పుడు ప్రైవేట్లు చెప్పటం అంటే చిరాకుగా ఉండేది .ఆమాట అంటే మండిపడే వారు .దానికి ఆయన దూరం .అలాంటి వారు ఆదిరాజు పున్నయ్య మేస్టారి తో కలిసి ప్రైవేట్లు చెప్పటం ప్రారంభించారు .బానే చెబుతున్నారని పేరొచ్చింది .పున్నయ్య గారు అంటే ఇంగ్లీష్ లో నిధి .పూర్వకాలం చదువు వారు కనుక అన్నీ ఆయనకు బాగా తెలుసు .చదువు చెప్పటం లో గ్రామర్ ను అర్ధ మయ్యేట్లు చెప్పటం లో ఆయనకు ఆయనే సాటి. మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడే వారు ,రాసే వారు .లెక్కల్లోనూ దిట్ట .అయితే లెక్కల పుస్తకాలూ మారి కొత్త విషయాలు చేరాయి అవి చెప్పాలంటే ఆయనకు వీలు కాదు .అందుకని బసవా చారి గారు ఒక సారి నా దగ్గరకు వచ్చి’’ప్రసాడూ !మనిద్దరం కలిసి కంబైండ్ ట్యూషన్స్ చెబుదాం .నువ్వు లెక్కలు, సైన్సు చెప్పు నేను ఇంగ్లీష్, సోషల్ చెబుతాను .తెలుగు నువ్వు చూడు హిందీ నేను తంటాలు పడతాను .వచ్చిన డబ్బులో చేరి సగం తీసుకొందాం .డబ్బు వసూలు చేసే బాధ్యతా నాది నెల జీతాలు తీసుకొందాం .వాళ్ళకీ తేలిక మనకూ సుఖం ‘’అన్నారు నేను వెంటనే సరే నన్నాను

మా వరండాలో ట్యూషన్ మొదలు పెట్టాం నేను బోర్డ్ మీద లెక్కలు చెప్పే వాడిని .చేయించే వాడిని నాకు లెక్కలంటే మహా సరదా .బానే చేరారు తొమ్మిది ,పది క్లాసులకు చెప్పే వారం .తొమ్మిది వారికి నెలకు ఇరవై పది కి  ముప్ఫై రూపాయలు నెలకు జీతం ఏర్పాటు చేశాం .అలానే ప్రతి నేలా పిల్లలు జీతాలు సకాలం లోనే చెల్లించే వారు .మా దగ్గర ట్యూషన్ చదివిన పిల్లలో మీసాల రెడ్డి గారి అబ్బాయి పువ్వాడ అచ్యుత రావు ఇద్దరుకోడుకులూ , తెలుగు మేష్టారు రంగారావు గారబ్బాయి  మొదలైన వారుండే వారు ..ఠంచం గా మేష్టారు డబ్బు వసూలు చేసే .వారు పుస్తకం లో లెక్కలు రాసే వారు .నాకు రావాల్సిన సగం డబ్బును నయా పైసా లతో సహా ఇచ్చేవారు .యెంత వచ్చిందని నాకు ఆలోచన లేదు .రోజూ కాఫీ ఇచ్చే వాళ్ళం మేస్తారికి మేము చేసుకొన్నా టిఫిన్ కూడా పెట్టె వాళ్ళం మొహమాటా పడే వారు కాని ణా మీద వాత్సల్యం తో కాదనకుండా తినే వారు .ఆయన నాకు హైస్కూల్ లో ఎనిమిదో తరగతికి క్లాస్ టీచర్ ఇంగ్లీష్ సోషల్ చెప్పే వారు ఆ బంధం మళ్ళీ ఇలా కోన సాగింది సరదాగా ఇలా గడచి పోతున్నందుకు సంతోషం గా ఉంది రెండేళ్ళు ఇలా గడిచిపోయాయి.ఆ తర్వాతా నాకు ట్రాన్స్ ఫర్ అయింది .దానితో ఈ’’ ఉమ్మడి ప్రైవేట్ ‘’కు స్వస్తి పలికాం .ఆయన మాత్రం పున్నయ్య గారి ఇంట్లో ట్యూషన్లు కొన సాగించారు .

శారదా నికేతన్ లో పని చేయటం

మా రెండో అబ్బాయి శర్మ టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి నాకు పామర్రు ట్రాన్స్ ఫర్ అయింది .అప్పుడు మా మేనమామ వరుస ,నా సహాధ్యాయి గుండు బాల భాస్కరం అంటే ‘’బాచి ‘’శారదా నికేతన్ అనే ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాడు వాడు ఇంగ్లీష్ లో మహా చురుకు చాలాస్పీడ్  గా  మాట్లాడే వాడు .మంచి ఇంగ్లీష్ రాసేవాడు ఇంటర్ విద్యార్ధులకు ఇంగ్లిష్ ట్యూషన్ ను అక్కడ చెప్పే వాడు .విపరీతమైన క్రేజ్ ఉండేది ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి చదివే వారు భాస్కర దగ్గర చదివితే’’ ఇంగ్లీష్ లో పాస్ గ్యారంటీ’’ అనే గొప్ప నమ్మకం కలిగించాడు కస్టపడి చెప్పే వాడు వీలయితే కొట్టే వాడు బండ బూతులూ తిట్టే వాడు .అన్నీ సహించి వాడి మీద అభిమానం తో ఆడా మగా అక్కడే చదివారు కాని వదిలి పెట్టివెళ్ళలేదు  అప్పుడు కాలేజి లో ట్యూషన్స్ చెప్పే వారు కాదు అందుకని మహా గ్రాకీ గా ఉండేది బాచికి రెండు చేతులా సంపాదించాడు పిల్లల్లెరని కొరత ఉండేది భార్య తో కలిసి హాస్టల్ కూడా పెట్టాడు అదీ క్లిక్ అయింది  లేదు .అంట పేరు సంపాదించాడు ఒక్క ఇంగ్లీషే చెప్పేవాడు తరువాత అమరానాద్ అనే  బి.ఏ.చదివిన ఒక కుర్రాడు ,వాడి శిష్యుడు తోడయ్యాడు లెక్కల ట్యూషన్ కూడా ప్రారంభించారిద్దరూ కలిసి. అమర నాద్ లెక్కలు  బాగా చెప్పేవాడు .ఇంగ్లీష్ లో ను లెక్కల్లోనూ మంచి టీచర్లు దొరికారు కనుక ఎక్కువ మంది శారదా నికేతన్ లో చేరి చదువుకొనే వారు ,బోలెడు స్తలం ఉండేది అందులో రేకుల షెడ్లు వేశాడు .టెన్త్ క్లాస్ కూ ట్యూషన్ ప్రారంభించాడు వాడి భార్య లక్ష్మి నాకు రాజ మండ్రి ట్రేయినిగ్ మేట్ .ప్రభుత్వ హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేస్తోంది నేచురల్ సైన్స్ టీచర్ .కనుక బాచి భార్య అమర నాద ల ట్యూషన్ బాగా క్లిక్ అయింది .ఆ తర్వాత అమర నాద్ విడిగా ట్యూషన్ పెట్టుకొని రోజంతా క్షణం తీరుబడి లేకుండా డిగ్రీ వారికీ చెప్పి బాగా సంపాదించాడు భార్య పోలీస్ శాఖలో ఉద్యోగి. రెండేళ్ళు మాదైన మా ప్రక్క పెంకుటింట్లో అద్దెకుండే వాడు .అందుకని నేను శారదా నికేతన్ లో లెక్కలు చెప్పటానికి అడిగాడు బాచి .సరే నన్నాను మా శర్మ ను కూడా అక్కడే చేర్చాను శర్మ క్లాస్ మేట్ చంద్ర శేఖర్ ,మండా వీర భద్ర రావు కొడుకు ప్రసాద్ వాడికి అక్కడ ట్యూషన్ మేట్స్ .నేను ఫిజిక్స్ కూడా చెప్పే వాడిని ఆవిడ బయాలజీ చెప్పేది ఇంగ్లీష్ బాచి చూసే వాడు వేమూరి శివరామ

క్రిష్నయ్య గారు అనే నా గురువు గారబ్బాయి ఆయన ట్యూషన్ లో నాకు సహాధ్యాయియిఅయిన  వేమూరి దుర్గా ప్రసాద్ అనే దుర్గయ్య కూడా ఇక్కడ తెలుగు చెప్పే వాడు .వాడు అంతకు  ముందు కరీం నగర్ ధర్మ పురి ఒరిఎంట ల్ కాలేజి లో తెలుగు లెక్చరర్ గా పని చేశాడు. కారణాలేమిటో తెలీదు కాని ,అక్కడ మానేసి ఉయ్యూరు వచ్చి ఉన్నాడు ఇంటి దగ్గర చిన్నక్లాసులకు ట్యూషన్ చెప్పేవాడు వంగల సుబ్బయ్య గారింటి ప్రక్కన ఉండేవాడు తర్వాత శారదా నికేతాన్ లో చేరి ఆ తర్వాత కే.సి.పి వారి స్కూల్ వెలగ పూడి రామ కృష్ణా మెమోరియల్ హై స్కూల్లో తెలుగు పండిట్ గా చేరి అక్కడే రిటైర్ అయి ,పెన్షన్ కూడా పొందాడు .వాళ్ళది అసలు పెద ముత్తేవి .అక్కడ ఇల్లూ వాకిలీ ఉన్నాయి మా మేష్టారు శివరామ క్రిష్నయ్య గారు ఇక్కడ నుంచి వెళ్లి అక్కడే స్తిర పడ్డారు అప్పుడప్పుడు ఉయ్యూరు వచ్చి మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళే వారు .నేనం టే అమిత అభిమానం వారికి. వారి వల్లనే నాచదువుకు మంచి పునాది పడింది, . ముందుకు సాగిందికూడా . వారి నెప్పుడూ మరవలేను నన్ను తీర్చి దిద్దిన వారు ఆయనే .దుర్గయ్య నేను గోవిందరాజు వెంకటేశ్వర రావు సీతం రాజు సత్య నారాయణ మంత్రాల రాదా కృష్ణ మూర్తి మొదలైన వారందరం కలిసి బ్రాహ్మణా సేవా సంఘాన్ని పునర్నిర్మించి దానికొక వైభవం తెచ్చాం దుర్గయ్య ను అధ్యక్షుడిని సత్యనారాయణ గారిని సెక్రటరి ని చేశాం నేను ఉపాధ్యక్షుడిని .

శారద నికేతన్ లో ట్యూషన్ ఉదయం ఆరింటికే మొదలు పెట్టె వాడిని గంట లెక్కలు చెప్పి ఇంటికొచ్చి భోజనం చేసి పామర్రు వెళ్ళేవాడిని సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి ట్యూషన్ కు వెళ్లి సైన్స్ చెప్పే వాడిని .వాడు నాకు ఇచ్చిన డబ్బూఏమి  లేదు మా శర్మ ట్యూషన్ చదువుతున్నందుకు డబ్బు అడిగే వాడు వాడు డబ్బు దగ్గర మొహమాటం పడదు .నేనూ వాడికేమీ ఇవ్వలేదు ఇద్దరం దొంగాతాదాం .ఇలా ఒక ఏడాది గడిపాను .ఇదీ ణా ఉమ్మడి ట్యూషన్ కదా కమా మీషూను .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-13-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పెరల్ ఎస్.బక్-1

        పెరల్ ఎస్.బక్-1

ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై  పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’  ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి ఉందని పించింది మట్టి మనిషి గా అనిపిస్తుంది .నేల విడిచి సాము చేయదు .చిన్న పిల్లలకు కూర్చో బెట్టి కధలు చెబుతున్నట్లు ఉంటుంది ఆమె రచన .అందుకే అందరికీ ఇష్టం .ఆమె జీవిత చరిత్రను పీటర్ కూన్  అనే రచయిత ‘’ఏ కల్చరల్ బయాగ్రఫి ‘’అన్న పేరు తో గొప్పగా రాశాడు అది చదివి ఏంతో ఆమెను గురించి తెలుసుకొన్నా .ఆ వివరాలే ఇప్పుడు అందిస్తున్నాను .

అమెరికా లో పుట్టిన బక్ ఎనభై ఏళ్ళు జీవించింది ఇందులో సగం కాలం ఆమె చైనా లోనే గడిపింది .అందువల్ల అమెరికా వారికీ చైనా వాళ్ళకూ కూడా ఆమె ‘’విదేశీ ‘’ఏ అయింది .చైనా పల్లెటూరి జీవితాన్ని నేపధ్యం గా ఆమె రాసిన నవలలు కధలు ఆమె అనుభవానికి అవగాహనా సామర్ధ్యానికి నిలు వెత్తు అద్దాలు గా కనీ పిస్తాయి .మానవ విలువల పై ఆమెకు అమిత మైన అభిమానం .కుటుంబ  విలువల కోసం నిరంతరం పోరాడిన మహిళ బక్ .నల్ల జాతి ప్రజల హక్కుల పోరాటం లోను ముందు నిలిచింది .స్త్రీ లకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని ఏంతో శ్రమించింది .యుద్ద్ధం వల్ల  దెబ్బ తిన్న దేశాలకు సహాయ సహకారాలన్దించింది .రెడ్ క్రాస్ ద్వారా ఆమె అనేక సేవా కార్యక్రమాలను చేబట్టి పూర్తీ చేసి అందరికి సంతృప్తి కల్గించింది .అమెరికా సైన్యం ఆసియా దేశాలలో చేసిన యుద్దాలలో అక్కడి ఆడవాళ్ళ తో పెంచుకొన్న సంబంధాల వల్ల పుట్టిన పిల్లలను ‘’అమెరికన్స్ ‘’అని పేరు పెట్టి ,వాళ్ళ జీవితాల కోసం వికలాంగుల కోసం ‘’వెల్ కం హోమ్ ‘’స్తాపించిన మాన వీయురాలు .మొదట్లో కమ్యూనిజాన్ని తిరస్కరించింది చివర్లో మేకార్దీ ఇజం కు లోనైంది .జీవిత్స కాలం లో సంపాదించిన సంపదను అంతటినీ రెండు ట్రస్ట్ లకు రాసిచ్చేసిన త్యాగ మూర్తి .

Inline image 1

 

 

 

1938లో పెరల్స్ బక్ కు సాహిత్యం లో నోబుల్ పురస్కారం లభించింది .ఆమె కు వచ్చిన 70,000డాలర్ల బహుమతి డబ్బులో నలభై వేల డాలర్ల తో ఒక స్కూల్ కు సకల సదుపాయాలను కలుగ జేసిన సాంఘిక సేవా పరాయణు రాలు బక్ .భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రధానిపై ఒత్తిడి తేవాల్సిందిగా ఆ నాటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ పై తీవ్ర మైన ఒత్తిడి తెచ్చిన స్వాతంట్ర్య ప్రియురాలు .బక్ ..రెండు సార్లు వివాహం చేస్సుకోన్నది .ఆమె రచనల్లో తండ్రి మొండితనం తల్లి అనారోగ్యం మనకు కనీ పిస్తాయి .అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో చిక్కు కొని విల విల లాడుతున్నప్పుడు కూడా పెరల్స్ బక్ పుస్తకాలు బాగా అమ్ముడయ్యాయి .అదీ ఆమె గొప్ప తనం .ఆమె రాసిన కధకు

ఆ రోజుల్లో కనీసం 1500డాలర్లు పారితోషికం గా  ఇచ్చేవారు .ఆమె రచనలు లక్షలాది కాపీలు అమ్ముడు పోయాయి .వాటిపై రాయల్టీ కూడా ఎక్కువ మొత్తం లో లభించేది .నోబుల్ ప్రైజ్ వచ్చిన ముగ్గ్గురిలో ఈమె  మూడవ  అమెరికన్ .మొదటి సారి సింక్లైర్ లూయీస్ కు రెండవ సారి ప్రఖ్యాత నాటక రచయిత వొ నీల్ కు వచ్చింది .మూడవ వారు బక్ .అప్పటికి అయిదుగురికి వస్తే ఈమె మొదటి మహిళ గా నోబుల్ ను అందుకొని అమెరికాకు కీర్తిని తెచ్చింది మహిళా లోకానికి గుర్తింపు తీసుకొచ్చింది .అమెరికా  చేసిన వియత్నాం యుద్ధాన్నిపూర్తిగా వ్యతిరేకించింది .భారత దేశం లో పర్యటించింది .భారత్ లో ఉన్న బీదరికాన్ని ,కుల పోరాటాలను పోగొట్టాలని సూచించింది . కొరియా యుద్ధానికీ ఆమె వ్యతిరేకమే .ఆమె రచనలు 69 ఒకే సంవత్సరం లో ప్రపంచం మొత్తం మీద వివిధ భాషలలోని అనువదింప బడ్డాయి .ఎర్నెస్ట్ హెమింగ్ వే అనేప్రముఖ  ఆమెరికా నవలా కారుని రచనలు 64,మరో ప్రసిద్ధ నవలా రచయిత స్టెయిన్ బెక్ రచనలు48 మాత్రమె అనువదింప బడ్డాయి ఇది ఆమె కు దక్కిన ప్రపంచ వ్యాప్త గౌరవం అభిమానం ఆదరణ .అందుకే బక్ ను ‘’money machine ‘’((ధన యంత్రం ) అన్నారు .తన కార్యక్రమాలకు ఇంచార్జ్ గా ‘’టెడ్ ‘’అనే వాడిని నియమిస్తే వాడు నమ్మకం గా ‘’తెడ్డు ‘’చూపించాడు .చివరికి కేసులు ,విచారణలు ,గొడవల్లో పడింది .అయినా వాడినే నమ్మింది బక్ చని పోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కోర్టుకు వెడితే వారికి అయిదు నిమిషాల్లో వారిపక్షాన కోర్టు తీర్పు నిచ్చి ఆమె ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడింది

.’’The Kennedy women ‘’అనే పుస్తకాన్ని బక్ రాసింది .స్టాలిన్ ను ‘’రాక్షసుడు ‘(మాన్ స్ట)ర్  అంది నిర్భయం గా .సివిల్ లిబర్టీస్ కోసం పరితపించింది ఆమె ఎప్పుడూ ‘’be careful when you become famous ‘’అని హితవు చెప్పేది .ఆమెను కద చెప్పే దానిగా తప్ప ఆర్టిస్ట్ గా గుర్తించలేదుకొందరు  .రూజ్ వెల్ట్వె భార్య ఎల్నార్ ‘’’’if we older people have the courage that miss Buck has had .perhaps the next generation ill haave the courage to make this country a real democracy ‘’అని పెరల్స్ బక్ ను మనసారా కొని యాడినది .ఆమె రాసిన ‘’డ్రాగన్ సీడ్ ‘’నవల 1991లో మూడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి .దీన్ని ఏం జి.ఏం సంస్థ సినిమా గా తీయటానికి ఒక లక్షా అయిదు వేల డాలర్లు ఈమెకు  చెల్లించి రైట్స్ కొనుక్కున్నారు .ఏదైనా ఒక మంచి పని కోసం శ్రమించినప్పుడల్లా తన శక్తి పెరుగుతుందని బక్ అనేది. చాన్కై షేక్ ప్రభుత్వ విధానాలను దుయ్య బట్టింది సన్యట్  సేన్ మీద కొంత సాను భూతి చూపించింది

మిగిలిన బక్ విశేషాలు మరో సారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-13-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రిడిని మరిచారా?అని బాధ పడుతున్న జి.వి.యెల్.యెన్ మూర్తి -ఆంధ్ర జ్యోతి

 

సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి ఉత్సవాలు సందడి లేకుండా చప్పచప్పగా జరుగుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదినంతా ్‌తెలుగు భాష, సాంస్కృతిక సంవత్సరం*గా ప్రకటించిన రోజుల్లోనే వచ్చిన ్‌రాయలసీమ సాహితీరత్నం* సంస్మరణ కూడా ఆ ప్రాంతాల పరిధికి కుంచించుకుపోతోంది. తెలుగుగడ్డ హద్దులు దాటి దిగంతాలకు విస్తరించిన పుట్టపర్తి సృజనా సౌరభాలు శతజయంతి సంవత్సరంలో ప్రభుత్వం తలపెట్టినవన్నీ నత్తలకన్నా మందగమనంలో మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అన్న చందంగా సాగుతున్నాయి.
ప్రొద్దుటూరులో ఆ ఊరి పెద్దలు, అభిమానులు కలిసి చేసిన పనులు, విగ్రహం పెట్టి నోరారా పుట్టపర్తి సెంటర్‌గా నిత్యం పిలుచుకునే స్ఫూర్తి ఈ ఏడాది ఉత్సవాలలో ఎక్కడా కలికానికి కూడా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా ఉన్న వేల వేల మంది అభిమానులను కూడగడితే ఒనగూడే మేలుపై బాధ్యతగలవారు స్పందించకుండానే మూడొంతుల ఉత్సవ కాలం కరిగిపోయింది. 1914 మార్చి 28న జన్మించి 1990 సెప్టెంబర్ 1న కన్నుమూసిన నారాయణాచార్యులు శత జయంతికి ఈ ఏడాది జూన్ నెలాఖరులో 10 లక్షల నిధుల మంజూరుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. 1914-2014 ఏడాదిని శత జయంతి సంవత్సరంగా వైభవంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సరస్వతీపుత్రుడి అముద్రిత రచనలన్నిటినీ సేకరించి ఆధునిక పరిజ్ఙానంతో వాటిని నిక్షిప్తం చేసి, వాటిని భావితరాల కోసం పరిరక్షించడానికి అన్ని చర్యలూ చేపట్టాలని సాంస్కృతిక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అనేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావించింది. గతంలో తెలుగు సాహితీవేత్తల శత జయంతులు, సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక శాఖలో పుట్టపర్తి వారి వ్యవహారాలన్నీ ఆయన కుమార్తె నాగపద్మిని చొరవతోనే ఆచరణలోకి వస్తున్నాయి.
ప్రతిభను వరించి వచ్చిన పద్మశ్రీతో పొంగిపోని పుట్టపర్తి నారాయణాచార్యులు ఢిల్లీలో కొందరి అడ్డుపుల్లలతో మాత్రం కుంగిపోయారు. సారస్వతంలో వ్యక్తుల పైరవీలు, రకరకాల ఒత్తిడులు ప్రభుత్వ పురస్కారాలు ప్రతిష్టాత్మక వేదికలపై సన్మానాలకు ప్రాతిపదిక కావటం, ప్రబలం కావటంపై ఆయన తీవ్రంగా కలత చెందేవారు. ఆయన గతించిన తరువాత కూడా ఆ ఛాయలు శతజయంతి వేడుకలపై తమ నీలి నీడల్ని ప్రసరింపజేస్తున్నాయి. సుమారుగా 45 రోజులపాటు మాత్రమే విధులు, భాధ్యతలు నిర్వహించిన ఒక అధికారిణి వల్లనే సరికొత్త కృతుల పెన్నిధి అందుబాటులోకి రాబోతోంది. మన రాష్ట్ర ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో సంచాలక పదవిని 1997 నవంబర్‌లో చేపట్టి అదే ఏడాది డిసెంబర్ 31 నాటికి ఒప్పగించి వెడలిపోయిన సరళారాణి చొరవతో సేకరించినవి 2013 నవంబరులో వెలుగు చూశాయి.
ఇక అధికార భాషా సంఘం అద్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్‌లో యా«థాలాపంగా ఆ గ్రంథాలయంలోని అముద్రిత గ్రంథాల జాబితాను పరిశీలిస్తుంటే పుట్టపర్తి నారాయణాచార్యులవారి చేతిరాతతో వందలాది కృతులు కట్టలు కట్టలుగా ఉన్నాయని తెలిసింది. వెంటనే ఆయన దీన్ని ఇప్పటి సంచాలకుడు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం దృష్టికి తేగా ఆయన చిన్న చిన్న నోట్ బుక్‌లలో పడి ఉన్న లయతాళ బద్ధమైన వేలాది కృతులను ఒక క్రమంలో అమరికలోకి తెచ్చారు. విశ్రాంత రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగిగా పని చేస్తున్న పుట్టపర్తివారి కుమారుడు అరవింద్ కుమార్ తన ఇంట్లో ట్రంకుపెట్టిలో పదిలపరుచుకున్న సుమారు 3000 పాటలను సేకరించి, వాటి నుంచి 1001 కృతులను ఆలాపనకు అనువుగా స్వరరాగయుక్తంగా ప్రచురించే సన్నాహాలు మొదలుపెట్టారు. సంగీత రంగం ఉదండులు ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కొమండూరి శేషాద్రి వంటివారు వాటిని అందరి ఆలాపనకు అనువైన బాణీలలో అందించటానికి సహకరిస్తున్నారు. వీలయినంత త్వరలో వాటిని పుస్తక రూపంతో తమ గ్రంథాలయ ముద్రణల పరంపరలో విడుదల అయ్యేలా చేస్తున్నామని శ్రీపాద సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

కాగితాలకే పరిమితం
పలువురు పెద్దలు, అభిమానులు కోరుకున్న రీతిలో పుట్టపర్తి నారాయణచార్యుల శత జయంతి సంబరాల కోసం 15 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తే కాగితాలన్నీ కదిలి సచివాలయం స్థాయిలో 10 లక్షల మంజూరుతో ముక్తాయింపుకు వచ్చింది. అందులో భాగంగా అధికారులందరి ఆమోదంతో కడప పట్టణంలో పుట్టపర్తివారి విగ్రహం నెలకొల్పటానికి చర్యలు మొదలయ్యాయి. అలా అనుకున్న తరువాత ఏడు నెలలు గడిచినా విగ్రహం నెలకొల్పటానికి మాత్రం స్థలం గుర్తింపు, అందుకు అవసరమైన చర్యలు ఇంతవరకు అమలుకు దగ్గరగా కూడా లేవు. 1972లో పుట్టపర్తి వారికి పద్మశ్రీ పురస్కారం అందివచ్చిన సందర్బంలో రాయలసీమ వికాసం కోసం కృషిచేసిన నేత పైడి లక్ష్మయ్య కుమారుడు ఐఎఎస్ అధికారి పి.ఎల్. సంజీవరెడ్డి కృషితో 200 గజాల స్థలం కేటాయించారు.
విజయవాడలో జ్ఙానపీఠ్‌తో తెలుగువారి సారస్వత తేజాన్ని దేశానికి చాటిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నివాసాన్ని ఆయన సంతానం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించటాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. విజయనగరంలో గురజాడ నివాసం, పర్లాకిమిడిలో గిడుగు సీతాపతి గృహం వంటివాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా చాలా మంది సాహితీప్రియుల మనసుల్లో కలవరం కలిగిస్తోంది. ప్రొద్దుటూరుకు సంబంధించిన పలువురు సాహితీ అభిమానులు నెలకొల్పిన పుట్టపర్తి నారాయణచార్యుల పీఠంవారి వినతుల మేరకుతో జూన్ నెలలో సాంస్కృతిక శాఖ వారు 4 లక్షలు కేటాయించి కాంస్య విగ్రహం నెలకొల్పటానికి సిద్ధమై, ఆ మేరకు లేఖలు కూడా రాసినా జిల్లా అధికారుల నుంచి స్పందన లేదు. అభిమానులు కొందరు కడప జిల్లా అధికారులను సంప్రదిస్తే నిధులు చాలవని చెప్పడమే కాక, విగ్రహాలు ప్రతిష్టించవద్దని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పిందని వాదిస్తున్నారని చెబుతున్నారు.
పుట్టపర్తి ఆవేదన
కడప పట్టణంలోని అభిమానులు, నేతలు కలిసి విరాళాలు సేకరించి విగ్రహం నెలకొల్పుతామని చెప్పినా అధికారులు లెక్క చేయడం లేదనే ఆరోపణలు వినవ స్తున్నాయి. ప్రొద్దుటూరులో కేవలం అయ్యవారి అభిమానుల వల్లనే పుట్టపర్తి సర్కిల్ పుట్టుకొచ్చిందన్న విషయాన్ని అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 1990 సెప్టెంబర్ 1న మరణించిన ఆ అయ్యవారిని నిత్యం స్మరించుకునేలా ఆ ఊరు మధ్యలో మొదటి వర్ధంతి నాటికే ఒక రాతి విగ్రహాన్ని అభిమానులు నెలకొల్పారు. అదే ఏడాది జనవరిలో అనంతపురంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో 74 ఏళ్ల పుట్టపర్తి వారు, ‘మనం బతికి ఉన్నప్పుడే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక మనం పోయిన తరువాత తలచుకునేవాడుంటారా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అది విన్న రాజన్న కవి, జింకా సుబ్రహ్మణ్యం వంటివారు వెంటనే నడుం బిగించి, పలు సంస్మరణ కార్యక్రమాలు తలపెట్టారు. ప్రొద్దుటూరులో జరిగిన మొట్టమెదటి సంతాప సభలో 60 మంది అభిమానులు ఆత్మీయమైన అనుభూతుల్ని నెమరుకు తెచ్చుకుంటూ పరస్పరం పంచుకున్నారు. అయ్యగారి మనసు మాటలు గుర్తుకు తెచ్చుకున్న వారి జ్ఙాపకాలతో స్పందిస్తూ కామిశెట్టి సుబ్బారావు, అంబటి గంగయ్య , సదాశివశర్మలు అవసరమైన మొత్తాలు సమకూర్చి ఊరి మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆయన గతించి సరిగ్గా ఏడాది తిరిగొచ్చే నాటికి అన్నీ సమకూరేలా చేసి 1991 సెప్టెంబరు 20 నాడు మాజీ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ప్రతిష్టించారు. రాయలసీమలో కక్షలు కార్పణ్యాలతో హత్యలు రక్తపాతం ఉంటుందనే జనాభిప్రాయానికి భిన్నంగా అభిమానంతో గుండెలకు హత్తుకుని ఎంతకైనా ఉద్యమిస్తారని చేసి చూపించారు. 2006లో పుట్టపర్తి అయ్యవారి విగ్రహాన్ని పెళ్లగించి ఇందిరమ్మ విగ్రహం పెడదామని తలపెట్టిన కాంగ్రెసు నేతలను ఆగ్రహావేశాలతో వెనక్కినెట్టి ఆ ప్రయత్నాన్ని విరమించేలా చేశారు. పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా అందరూ కలసి ధర్నాలు, శవయాత్రలు చేసి రాజకీయ నాయకులను సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ముఖ్యమంత్రి కూడా తప్పయిందని ఒప్పుకునేదాకా ఉద్యమ ప్రకంపనలు సృష్టించారు. కడకు కాంగ్రెసు నేతలే అవసరమైనంత సొమ్మును సమకూర్చి ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహాన్ని నాటి గవర్నర్ ఎన్.డి. తివారి వచ్చి ప్రతిష్టించేలా చేశారు. ఒక కవి పండితుడి విగ్రహాన్ని ఇద్దరు గవర్నర్‌లు తమ ఊరికి తరలి వచ్చి ప్రతిష్టించేలా ప్రొద్దుటూరు వాసులు చరిత్ర సృష్టిించారు.
నిధులు సరే, విధులేవీ?
సరస్వతీపుత్రుని శత జయంతిని తెలుగువారందరమూ కలిసి చేద్దామంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పారు కానీ, వారి మాటలు వాగాడంబరాలేనని తేలిపోయింది. ఆయన రచనలు అన్నీ మళ్లీ కొత్త సంకలనాలుగా విరివిగా అందుబాటులోకి తేవాలన్న యోచన కాగితాలు ప్రింటింగ్‌ప్రెస్‌ల మాటు నుంచి వెలుగు చూడనేలేదు. పునర్ముద్రితాల వ్యవహారాలు తెమిలినా అముద్రితాల జాబితాలు మాత్రం ఖరారు కాలేదు. గురజాడ, బోయి భీమన్న, గుర్రం జాషువాల కార్యక్రమాలపై ప్రభుత్వం వెచ్చించిన ధనంతో పోలిస్తే అయ్యవారి జమాఖర్చులు తేలిపోతున్నాయి. అనుకున్న పనులు ఎక్కడివక్కడే నలుగుతున్నాయి. అయిదు విశ్వవిద్యాలయాలలో సదస్సులు పెడదామని తీర్మానిస్తే 21 చోట్ల నిర్వహిద్దామని మరొకరు సూచించారు. తీరా ఒక్క చోట కూడా జరుపలేక పోయారు.
పెద్దాయన గళంలో వినవస్తూ కళ్ల ముందు మెదిలే ్‌శివతాండవం* రచన కూడా కొద్దిమందికే పరిమితమై పోయింది. శత జయంతుల సంవత్సరంగా తిరుమల రామచంద్ర, పుట్టపర్తి, కాళోజీల త్రయంలో చేయాలనుకున్నవి చేసినవి కూడా పొంతన లేకుండా ఉన్నాయి. సుమారు 14 భాషలలో పాండిత్యంతో 7 భాషలలో రచనలు చేసిన అయ్యవారి జీవితంలో, వ్యక్తిత్వంలో చెప్పుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చక్కని పండిత వంశ వృక్షంతో, సంపదలతో తులతూగిన పెద్దలున ్న కుటుంబంలో పుట్టి, తుంటరి పనులు, బీడీ పొగ రింగులతో సరదా తిరుగుళ్లతో పేదరికంతో గడిపిన బాల్యం నుంచి సరస్వతీపుత్రుడుగా ఎదిగే వరకు ఆయన జీవనగమనం ఎత్తు పల్లాలమయంగా, స్ఫూర్తి, ఉత్తేజం పెంచేలా సాగింది. సంప్రదాయ సాహిత్యాన్ని, కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రణాళిక, ప్రాకృత భాషలను ఆకళింపు చేసుకున్న ఆయనను ఈ తరానికి, ముందుతరాల వారికి తెలిసేలా చేయటం పాలకుల కనీస కర్తవ్యం. వారిని కూడగట్టి పదిలమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించటం ప్రభుత్వం పని. సంగీతం, సాహిత్యం, నృత్యం సమ్మిళితమైన ్‌శివతాండవం* వంటి ఆయన రచన ప్రదర్శనలను విస్తృతంగా వేదికల పైనా, డీవీడీల ద్వారా ప్రాచుర్యంలోకి తేవటం కనీస చర్య. తపాలా బిళ్ల, శివుడి సుప్రభాతం, పెనుగొండ లక్ష్మి, మేఘదూతం వంటివి ప్రతి తెలుగువారికి తెలిసేలా చేయటం నిజమైన సంస్మరణ, నివాళి. 2014 మార్చి 28న జరిగే శతజయంతి నాటికి అన్నీ ఒనగూడేలా చేసి, అయ్యవారితో పాటు ఆయన సహచరి కనకవల్లి రచనలను, సాహితీ సేవను కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయాలని అభిమానుల ఆకాంక్ష.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శా కేతనం విద్మహే -ప్రొ.బన్న అయిలయ్య

 

ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన పద్ధతి ప్రత్యేకంగానే ఉంది. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అన్న పితృస్వామిక భావజాలంను పరాస్తం చేస్తూ మహాభారతంలోని స్త్రీపర్వంను ఉదహరిస్తారు. స్త్రీల కోణం అసలు పట్టించుకోని మధ్యయుగం సాహిత్యం స్థితిగతి తేటతెల్లం చేశారు. అట్లాగే ‘మను చరిత్ర లైంగిక దృక్పథం’లోనూ పితృస్వామ్య భావజాలం ఎప్పుడూ స్త్రీ శరీరాన్ని సుఖం కోసమే వాడుకుంది తప్ప ఆమె హృదయాన్ని పట్టించుకోలేదని తెలిపారు.

తెలుగు సాహిత్య విమర్శ ప్రస్తావన వచ్చి నప్పుడు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేను మినహాయించి మాట్లాడలేం. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆమె విమర్శారంగంలో చైతన్య వంతంగా కనిపిస్తూనే ఉన్నారు. నిరంతరం అధ్యయనం, బోధన, పరిశోధనలతో పాటు వివిధ సంస్థల ద్వారా సాహిత్య సంస్కారాన్ని పెంపొందిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య అధ్యయనం-విమర్శ వారి శ్వాస, ధ్యాస.

సాహిత్యంతో అంతగా విద్మహే జీవితం ముడిపడడానికి కారణం కేవలం ఆచార్యులుగా విద్యను బోధించడం మాత్రమే కాదు. తాను పనిచేస్తున్న బోధనా రంగంపై మక్కువను పెంచుకోవడం వెనక కుటుంబ నేపథ్యమూ ఉంది. కీ.శే. కేతవరపు రామకోటిశాస్త్రి తెలుగు సాహిత్యం పాదం ముట్టిన పండితులు, విమర్శకులు, పరిశోధకులు. తల్లి ఇందిరాదేవి సాహిత్య సంస్కారులే. తల్లిదండ్రుల పాండిత్య పటిమ, సంస్కారం విద్మహేలో కొత్తపుంతలు తొక్కింది. 12 ఏళ్ల వయస్సు నుండే సాహిత్యాధ్యయనం మక్కువతో చేసారు. ఆ కాలంలోనే తల్లి సహాయంతో వేయి పడగలు లాంటి బృహద్ నవలను చదివారు. క్రమంగా ఎం.ఏ.లో ప్రత్యేక అధ్యయనంగా నవలను ఎన్నుకోడం, పిహెచ్.డి. పరిశోధన కోసం బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలనే స్వీకరించడం వారి అధ్యయనాసక్తిని తెలుపుతుంది. నవల అనగానే ఇతివృత్తం, పాత్రలు, వాతావరణం, సంభాషణల్లాంటి రొటీన్ అంశాల జోలికి వెళ్లకుండా ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ’ అని అంశాన్ని నిర్ధారించుకొని లోతైన పరిశోధన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి పర్యవేక్షణలో చేసారు. అప్పటికే పరిశోధకులకు మార్గదర్శనం చేయాల్సింత సత్తా ఉన్న మార్క్సిస్టు దృక్పథ నైశిత్యం కలిగిన వరవరరావు పరిచయం కూడా కాత్యాయనీ విద్మహేకు నవలను సామాజిక, రాజకీయ, మానసిక కోణాల నుండి మరింత అధ్యయనం చేయడానికి దోహదపడింది.

కాత్యాయని విమర్శ అభ్యుదయ దృక్పథం, మార్క్సిస్టు భావజాలం నుండి రూపుదిద్దుకుంది. వారి వ్యాసాలలో ఈ ధోరణుల తాత్విక పరిమళమే ఉంటుంది. ఈ దృక్పథ నిబద్ధురాలు కనకనే తెలుగు సాహిత్యా విమర్శ వ్యక్తిగత స్థాయికి వెళ్లిన కాలంలోను వారు అకాడమిక్ విమర్శకే ప్రాధాన్యమిచ్చారు. ఇలాంటి ఆరోగ్యకరమైన విమర్శ చేశారు కనకనే నిరంతరం అధ్యయన, విమర్శ, పరిశోధక రంగాల్లో చైతన్యవంతంగా ఉండగలిగారు. కాలక్రమంలో సామాజిక పరిణామాలు, సాహిత్య పరిస్థితులూ మారుతూ వచ్చాయి. ఆ మార్పులను నిశితంగా గమనిస్తూ తన విమర్శా కోణాలను విస్తరించుకున్నారు.

1980 నుండి తెలుగునాట స్త్రీవాద సాహిత్యం స్పృహ పెరిగింది. రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, ఓల్గా లాంటి రచయితలు ఇందుకు దోహదపడ్డారు. రంగనాయకమ్మ స్వీట్ హోమ్ నవలాధ్యయనంతో కాత్యాయని స్త్రీవాద స్పృహను పెంచుకున్నారు. అట్లాగే వారు రాసిన ‘పెళ్లానికి ప్రేమలేఖ’ కథ విశ్లేషణతో స్త్రీవాద సాహిత్య విమర్శకు దారులు వేసుకున్నారు. రోజు రోజుకు అధ్యయనం, విమర్శ, పరిశోధనలో పరిణతి సాధించినా కొద్దీ తన కార్యరంగాన్ని సామాజిక కోణంలోకి మళ్లించారు. స్త్రీజనాభ్యుదయ సంస్థను ఏర్పాటు చేసి స్త్రీల సమస్యలను సామాజిక అవగాహనతో చూడడం ఎలాగో తాను గుర్తిస్తూ తోటి స్త్రీలకు చెప్పడం ప్రారంభించారు. అంటే రచయితగా వారెప్పుడూ దంతపు శిఖరాలపై కూర్చోలేదు. సామాన్య స్త్రీల స్థితిగతులను మధ్యతరగతిలోని డాంబికాన్ని అర్థం చేసికోవాలంటే తప్పకుండా సంస్థల నిర్మాణం జరగాలని గుర్తించారు.

అందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని తరగతుల స్త్రీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మేధోపరమైన కృషి చేసారు. ఇందుకు వారి సహచర స్త్రీవాదులు దోహదపడ్డారు. కాత్యాయనీ గారిది అంతర్లీనమైన సాహిత్య కృషి కాదు. బహిర్ముఖీనమైనది. సామూహిక కృషి ఎప్పుడూ కొత్త అంచనాలకు అధ్యయనాలకు దారులు వేస్తుందని వారు బలంగా విశ్వసిస్తారు. తన సమాన స్థాయి వ్యక్తులతో ఎట్లా కార్యరంగంలోకి దూకుతారో, తన విద్యార్థులతోను అంతే ఉత్సాహంతో కలిసి పనిచేయడం ఆమెలోని మంచి లక్షణం. అంటే నేర్పడం, నేర్చుకోవడం ఎప్పుడూ ఇష్టపడతారు వారు. తన పరిశోధక విద్యార్థి మార్క యాదయ్యతో కలిసి ‘రావిశాస్త్రి సాహిత్య దృక్పథం’ గ్రంథం రాసారు. దృక్పథ సామ్యం కలిగిన కందాళ శోభ, తోట జ్యోతిరాణిలతో కలిసి మహిళా జీవన సమస్యలపై గ్రంథం రాసా రు. ‘ప్రపంచీకరణ ప్రతిఫలనాలు, ప్రభావాలు’ జ్యోతిరాణితో కలిసి రాసి ప్రచురించారు. అట్లాగే స్వాతంత్య్రానంతర భారతదేశం-స్త్రీల స్థితిగతులపై జ్యోతిరాణి, బుర్రా రాములుతో కలిసి రాసిన గ్రంథాల వల్ల వారు ఇతరులతో కలిసి పనిచేయడంలోని తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో వారికున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది.

సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడం లో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన పద్ధతి ప్రత్యేకంగానే ఉంది. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అన్న పితృస్వామిక భావజాలంను పరాస్తం చేస్తూ మహాభారతంలోని స్త్రీపర్వంను ఉదహరిస్తారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత భర్తలను కోల్పోయిన తన కోడళ్ల భవిష్యత్తును తల్చుకొన్న గాంధారి దుఃఖా న్ని ఉదాహరణగా తీసుకొని స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న ఉక్తి తప్పని కాత్యాయనీ స్త్రీవాద కోణం నుండి రుజువు చేసారు.

మహాభారతంలోని యాభై పెళ్ళిళ్ళను ఒక ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేసిన వీరు ఈ పెళ్ళిళ్ళ ప్రయోజనాలను బహిర్గతం చేశారు. ప్రేమ, స్నేహం కోసం పెళ్ళిళ్ళు, ధర్మం, దాంపత్యం కోసం, ఆస్తి, సంతానం కోసం పెళ్ళిళ్ళున్నాయని, వీటన్నింటినీ పితృస్వామిక, భూస్వామ్య భావజాలం నుండి చూడాలని నిర్ధారించారు. స్త్రీల కోణం అసలు పట్టించుకోని మధ్యయుగం సాహిత్యం స్థితిగతి తేటతెల్లం చేశారు. అట్లాగే ‘మను చరిత్ర లైంగిక దృక్పథం’లోనూ పితృస్వామ్య భావజాలం ఎప్పుడూ స్త్రీ శరీరాన్ని సుఖం కోసమే వాడుకుంది తప్ప ఆమె హృదయాన్ని పట్టించుకోలేదని తెలిపారు.

కాత్యాయనీ విద్మహే స్త్రీవాద సాహిత్య కృషి 1980లో స్పృహగా ప్రారంభమై, చైతన్యం పొంది క్రమంగా ఉద్యమ రూపంలోకి మారింది. నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందే శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. ‘సాహిత్యాకాశంలో సగం -స్త్రీల కవిత్వం-కథ-అస్తిత్వ చైతన్యం’ గ్రంథంకు పురస్కారం లభించడం ముదావహం. ఈ గ్రంథంలో స్త్రీవాద సాహిత్య విమర్శలో కాత్యాయని విమర్శా పరిణతి కన్పిస్తుంది. దీనికంటేముందే 2006లో ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీవాద భూమికను అచ్చువేసిన భావజాల వ్యాప్తికి ఈ గ్రంథం పనికొచ్చింది గాని, సాహిత్యాకాశంలో సగం మాత్రం అకడమిక్ విమర్శాస్థాయిలో అత్యున్నతంగా ఎదిగి ఉంది. స్త్రీవాద సాహిత్యాన్ని విలువ కట్టడానికి ఒక నమూనాగా నిలుస్తుంది. మూడు భాగాలుగా ఉన్న ఈ గ్రంథంలో, మొదటిది స్త్రీల సాహిత్య అధ్యయన పద్ధతి-పరిణామం, రెండోది స్త్రీల కవిత్వం, మూడోది స్త్రీల కథ. దీనిలోని 28 వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాసినవే అయినా వీటికి ఏకసూత్రత ఉంది. స్త్రీవాద సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కావలసిన పరికరాలను మొదటి భాగంలో ఇచ్చారు. అవి:
1. స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ, ఎంత సమర్థవంతంగా, శిల్పారామంగా వ్రాశారని కానీ నిర్ధారిత సంప్రదాయ సాహిత్య విలువలతో అంచనావేయడం కాక అంతకంటే ముఖ్యంగా అసలు వారేం రాశారో, ఎందుకు రాశారో, ఎందుకు రాయలేకపోయారో కూడా తెలుసు కోవాలి.

2. స్త్రీలు తక్కువగా రాయడాన్ని గానీ, రాసినదాని సాహిత్య స్థాయి తక్కువ ఉండడాన్ని గానీ సర్వస్వతంత్ర అంశాలుగా పరిగణించి తిరస్కరించడం కాక పితృస్వామిక అధికార సంబంధాలలో వివక్షకు, అణచివేతకు గురయిన సామాజిక వర్గం సృష్టించిన సాహిత్యంగా దాని ప్రత్యేకతను గుర్తించి నిరూపించాలి.
3. స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజపు స్థితి అందులో స్త్రీలకున్న అవకాశాలు, ఆ అవకాశాల నుండి వాళ్లు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలి. ఆ రచనలు ఏ సామాజిక భావ సంఘర్షణలో భాగమో ఆలోచించినప్పుడు స్త్రీలు ఏ ప్రయోజనాన్ని ఆశించి సాహిత్య సృజన చేసారో అర్థమవుతుంది.

-అంటూ స్త్రీల అధ్యయనాన్ని నిర్దిష్టత వైపుకు మళ్లించాల్సిన అవసరం ఉందని భావించారు. స్త్రీల సాహిత్యం అధ్యయనం చేయడానికి సిద్ధాంతం-పద్ధతిని సూచించారు. సిద్ధాంతమంటే దృక్పథమని, పద్ధతి అంటే నిర్దిష్టతకు సంబంధించిందని వివరించారు. వీరు మాత్రం మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక శాస్త్ర దృక్పథం నుండి స్త్రీవాద సాహిత్యాన్ని అధ్యయనం చేసారు.

స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల కవిత్వం, సావిత్రి సాహిత్య జీవితం, నిర్మల, భవానీదేవీ రేవతీదేవి, మహె జబీన్ కవిత్వాలను విశ్లేషించారు. రంగనాయకమ్మ కథలు, సత్యవతి కథలు, రుక్మిణి కథలు, ద్వివేదుల విశాలాక్షి కథలు, జలంధర కథలను కాత్యాయని ఈ గ్రంథంలో విశ్లేషించారు. విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రుల కథలను కూడా వారిదైన మార్గంలో విమర్శించారు.

విమర్శలో ఒక పద్ధతిని, క్రమశిక్షణని, ప్రామాణికతను పాటించే కాత్యాయని విశ్వవిద్యాలయాల్లో స్త్రీవాద సాహి త్యం, మహిళా సాహిత్య అధ్యయనానికి కావలసిన పాఠ్యాంశాలను రూపొందించడంలోను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ తరం సాహితీ పాఠకులకు సామాజిక అవగాహన, రాజకీయ దృక్పథం ఉంటే తప్ప సాహిత్యాన్ని అర్థం చేసుకోలేరని వారి విమర్శను చదివితే తెలుస్తుంది.
మొత్తానికి స్త్రీవాద సాహిత్య విమర్శకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాధించి పెట్టిన ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేకు శుభాకాంక్షలు.
-ప్రొ.బన్న అయిలయ్య
99491 06968

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని వాదాల నుంచి అందరూ నేర్చుకోవాలి -(ఇంటర్వ్యూ: వివిధ)

 

‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ…

ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు గుర్తింపు ఎలా ఉన్నదని అనుకుంటున్నారు, మేధా వ్యాపారమైన విమర్శను మహిళలు చేయగలరని, రాణించగలరని తెలుగు సాహిత్య లోకం నమ్ముతుందా?
– ఏ రంగంలోనైనా స్త్రీలు చేస్తున్న పనిని మనుషులు చేస్తున్న పనిగా గుర్తించే సంస్కారం పెరగాలని కోరుకుంటా. స్త్రీలకు ఆలోచించే మెదడు ఉందన్న స్పృహ ఉండాలి కదా, అంగీకరించాలంటే. మేధో వ్యాపారమయిన పనులు స్త్రీలు ఎంతో సమర్ధవంతంగా చేయగలరని అంతర్జాతీయంగా రుజువవుతున్న వర్తమానం ఒక వైపు కనపడుతున్నా, తెలుగు సాహిత్య లోకం మహిళలు విమర్శ చేయలేరని అనుకుంటే అంతకన్నా వెనకబాటుతనం మరొకటి లేదు. ఎన్నో విషయాలలో ముందున్న తెలుగు జాతి స్త్రీల మేధా వ్యాపారం గురించి కూడా గౌరవకరంగానే ప్రవర్తిస్తుందని స్త్రీలు నమ్ముతున్నారు. ఇప్పుడు మనం శ్రద్ధ పెట్టాల్సింది, స్త్రీల మేధో వికాసానికి అనుకూలమైన ప్రజాస్వామిక వాతావరణం కల్పించడం మీదే.

మీ పూర్వ స్త్రీ విమర్శకులలో మీరెవరిని ఇష్టపడతారు?
– విమర్శ వ్యాసం రాసింది ఒక్కటే అయినా బెంగుళూరు నాగరత్నమ్మ పరిశీలనా శక్తి, పదును నాకు నచ్చిన అంశాలు.
యశోదారెడ్డి, నాయని కృష్ణకుమారి మా తరానికి ఒక నమూనా. ఓల్గా, మృణాళిని విమర్శలు ఇష్టపడతాను.

స్త్రీవాదాన్ని ఒకానొక అస్తిత్వ సిద్ధాంతంగా భావిస్తారా? లేక, ప్రపంచాన్నంతా వ్యాఖ్యానించగల సమగ్ర రాజకీయ సిద్ధాంతంగా దాన్ని భావిస్తారా?
– స్త్రీవాదం కేవలం అస్తిత్వ సిద్ధాంతం మాత్రమే అనుకోను. అనేక ప్రాపంచిక విషయాలను, అధికార రాజకీయాలను అర్థం చేసుకొనటానికి స్త్రీవాద తత్వశాస్త్రం ఉపకరిస్తుందని భావిస్తాను.
మీరు స్త్రీవాద విమర్శ జెండర్ ప్రాథమిక/స్థూల స్వభావానికి పరిమితమై చేశారా, లేక స్త్రీవాదం ప్రత్యేకంగా ఆవిష్కరించిన సిద్ధాంత పరికరాలను ఉపయోగించి చేశారా?
– రెండింటిని ఉపయోగించుకున్నా. మార్క్సిస్ట్ సిద్ధాంత పరికరాలు, వాచక విమర్శ వంటి సాధారణ విమర్శ విధానాలు…. ఏవి అవసరమనుకొంటే అవన్నీ వాడుకుంటాను. కవిత్వం, కథ దేనినయినా మొదటినుండి అది ఏ భావాన్ని అంచలంచలుగా నిర్మించుకుంటూ పోతున్నదో గుర్తించటం విమర్శలో ప్రాథమిక అంశంగా ఉండాలి. స్త్రీవాద విమర్శకు అది మరీ ముఖ్యం.

ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని కూడా మీరు స్త్రీవాద కోణం నుంచి పరిశీలించారు. అటువంటి విమర్శ ప్రధానంగా స్త్రీ రచనలు లేదా స్త్రీ పాత్రలు వీటిని పరిశీలించడంగా ఉంటుంది. సాహిత్యాన్ని మొత్తంగా స్త్రీ దృష్టి నుంచి అంచనా వేయాల్సిన అవసరం లేదంటారా? అలాగే ఆధునిక సాహిత్యంలో కూడా ప్రతి వాదం నుంచి వచ్చిన సాహిత్యాన్ని, తిరిగి స్త్రీకోణం నుంచి మదింపు జరగాలి కదా…
– ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించటం స్త్రీల రచనలకు స్త్రీ పాత్రల పరామర్శకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీల రచనలలో స్త్రీలకే ప్రత్యేకమైన భావోద్వేగాలు, బాధలు, భయా లు కోపాలు, నిరసనలు నిష్ఠూరాలు ఎలా ప్రతిఫలించాయో, అవి రచయిత్రుల సాంఘిక సాం స్కృతిక స్థాయికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాయో నిర్ధారించటం ముఖ్యం. స్త్రీ పాత్రల పరిశీలన వాళ్ల గుణ శీలాలను, ప్రవర్తన రీతులను గుర్తించి చెప్పటానికే కాక వాటినలా నిర్ధారించిన పితృస్వామిక రాజకీయాలను విశ్లేషించటానికి ఉపయోగపడాలి. అందువల్ల ప్రాచీన ఆర్వాచీన సాహిత్యాలను, స్త్రీ పురుష రచనలను అన్నిటిని స్త్రీ కోణం నుండి కావచ్చు, స్త్రీవాద దృక్పథం నుండి కావచ్చు… అంచనా వేయాల్సిందే. యిక ఏ వాదం నుండి వచ్చిన సాహిత్యాన్నయినా స్త్రీ కోణంతో స్త్రీల ప్రయోజనాల దృష్ట్యా పునర్ మూల్యాంకనం చేయవలసిందే. ఆ పని ఇంకా సరిగా మొదలు కాలేదు. ఆ పని జరగటానికి అవసరమైన వస్తుగత దృష్టికోణంతో పాటు సహనం సంయమనం మన సంస్కారంలో భాగం కావాలి.

స్త్రీవాద విమర్శ లేదా సాహిత్యం కూడా ఇతర అస్తిత్వ వాదనల నుంచి నేర్చుకోవాలి కదా?
– తప్పకుండా..! స్త్రీవాద విమర్శ లేదా సాహిత్యం ఇతర అస్తిత్వ వాదాల నుంచి నేర్చుకోవలసినది తప్పక నేర్చుకోవలసిందే, నేర్చుకుంటున్నది కూడా. ఏ వాదమైనా ఒక నిర్దిష్ట జీవితానుభవం నుండి వచ్చేదే, అనుభవాలను పంచుకొనటం మన జీవితాలను విస్తృత పరుస్తుంది. మనలను మానవీయం చేస్తుంది. మార్క్సిజం నుండి స్త్రీవాదం, స్త్రీవాదం నుండి దళితవాదం… వాటినుండి మైనారిటివాదం.. ప్రాంతీయవాదం… ఆయా సందర్భాలలో అవి పెట్టే డిమాండ్లను పట్టి.. మిగిలినవి.. తగిన సవరణలతో సర్దుబాట్లతో ఒకదానినొకటి మార్చుకుంటూ అభివృద్ధి ముఖంగా సాగాలి. వీటి మధ్య వైరుధ్యాలు ఉండవచ్చు కానీ, అవి శత్రు వైరుధ్యాలు మాత్రం కాదు.

స్త్రీవాద దృష్టి నుంచి సాహిత్య చరిత్రను పునర్నిర్మించే సంకల్పం ఉందా?
– ముందు స్త్రీల సాహిత్య చరిత్ర రాయాలి. 1950 వరకు రచనలు చేసిన స్త్రీలు 500కు పైగా ఉన్నారు. వాళ్లకు తెలుగు సాహిత్య చరిత్రలో చోటే దొరకలేదు. అందువల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు స్త్రీల సాహిత్యం సేకరించే పని పెట్టుకున్నాను. సమగ్ర స్త్రీల సాహిత్య చరిత్ర రచన తరువాత స్త్రీవాద దృష్టి నుండి తెలుగు సాహిత్య చరిత్రను పునర్నిర్మించే పని.
(ఇంటర్వ్యూ: వివిధ)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)

      జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)

‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ  ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా అంతర్ ద్రుష్టి తో రాసినవే .ఇరవై వ శతాబ్ద జీవ శాస్త్ర రుషి అంటారాయన్ను .ఇరవయ్యవ శతాబ్ది జీవ శాస్త్ర మేధావులలో ఒకనిగా ఆయన్ను పరిగణిస్తారు .’’ఇరవయ్యవ శతాబ్దపు డార్విన్ ‘’గా ఆయన్ను కీర్తిస్తారు .ఫసిఫిక్ ద్వీప పక్షులపై ప్రత్యెక పరిశోధన చేశాడు మేయర్ .అమెరికా లోని  హార్వర్డ్ విశ్వ శ్వ   విద్యాలయం లో ‘’professor of Emerittus in the museum of comparative zoolozy ‘’గా పని చేశాడు .డజనుకు పైగా పుస్తకాలు రాశాడు ఆయ5-7-1904 లో జన్మించి 3-2-2005న  శతమాన జీవి గా జీవించి ణ జర్మన్ అమెరికన్ .ఆయనకు డార్వి -వాలేస్ మెడల్ ,డేనియల్ జిరాద్ ఇలియట్ మెడల్లభించాయి క్రాఫోర్డ్ ప్రైజ్ ను పొందిన ఘనుడు మేయర్ .

Ernst Mayr PLoS.jpg

 

-.

 

పైన పేర్కొన్న పుస్తకం లోని ముఖ్య విషయాలను తెలుసుకొందాం .డార్విన్ చెప్పిన ‘’కామన్ డిసేంట్ బై మాడిఫికేషన్’’సిద్ధాంతాన్ని ఏర్నేస్స్ట్ మేయర్ ఆమోదించాడు .జీవ శాస్త్రం లో ప్రతిదీ పరిణామం అనే వెలుగు లోనే చూడాలన్నాడు .కణజాలం ను నింపే ద్రవాన్ని కోలోమిన్ అంటారని చెప్పాడు .’’Evolution is best understood as the genetic  turn  over  of the individuals  of every population from generation to generation ‘’ అని వివరించాడు .అయితే జనాభా(పాప్యులేషన్ ) అంటే ఏమిటి ?ప్రతి తెగ అనేక స్తానిక జనాభాలతో ఏర్పడి ఉంటుంది .ఒక తీరు జనాభాలో తరగతి కి ఇది విభేదించి ఉంటుంది .ప్రతి ఒక్క జీవి మరొక దానితో భేదిస్తుంది ఇదే జనాభా అన్నాడు .

ముందుగా డార్విన్ చెప్పిన ముఖ్యమైన అయిదు సూత్రాలను తెలుసుకొందాం .1-the constsncy of species 2-the descent of all organisms 3-gradualness of evolution 4-the multiplication of species 5-natural selection పరిసరాలకు అనుగుణం గా స్పెసీస్ ప్రవర్తించే ఏర్పాటును ‘’నిచీ ‘’అంటారు పరిణామం అనేది ఒక దిశా నిర్దేశనమే అన్నాడు మేయర్ .మానవ పరిణామం గూర్చి చెబుతూ ‘’ఏపులు ‘’ఆసియా ఏపులు ఆసియా ఏపులు అని రెండురకాలని అన్నాడు .మానవ శరీర నిర్మాణం  అధ్యయనం  చేస్తే అది ఆఫ్రికన్ ఏపులకుసమానం గా ఉంటుంది .మానవ మాలిక్యూల్స్ చింపాంజీ వాటి తో సదృశం గా ఉంటాయి .ఆఫ్రికన్ ఏపులుమనిషికి దగ్గర స్వరూపం లో ఉన్నాయి .హిమోగ్లోబిన్ ,ఎంజైములు ప్రోటీన్లు మొదలైనవి చిమ్ప్ లో ఉన్నట్లే బాగా పోలి ఉంటాయి అంటాడు ఎర్నెస్ట్ .వీటనన్నిటినీ పరిశీలిస్తే ‘’Africa was the cradle of ma n  kind’’అని ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పాడు .

మానవుడు మిగిలిన జంతువుఅలకు భిన్నం గా ఉంటాడు .అతనిది ఒక ప్రత్యేకత .మానసిక శాస్త్రవేత్తలు దాదాపు రెండు దశాబ్దాలుగా చిమ్ప్ లకు భాషలను నేర్పే ప్రయత్నం చేస్తున్నారు .కాని అవి వ్యర్ధ ప్రయత్నాలయ్యాయి వ్యాకరణాన్ని స్వీకరించే నాడీ  మండలం వాటిలో ఏర్పడలేదు .అందుకే అవి భూత, భవిష్యత్తుల గురించి మాట్లాడలేవు

.మానవ మేధ అన్నిటికన్నా గొప్పది .ఉష్ణ రక్తం ఉన్న వెన్నెముక జంతువులలో బుద్ధి ఎక్కువగా ఉంటుంది అన్నాడు మేయర్ .కొన్ని ప్రాధమిక జీవ రాశులు ఇతర గ్రహాలపై ఏర్పడి ఉండవచ్చు .కాని అధిక మేధా సంపద గల జంతు జాలం  మాత్రం భూమి మీదనే  3,00,000 ఏళ్ళ కిందటే ఏర్పడింది అని స్పష్ట పరిచాడు ఎర్నెస్ట్ .ఆయన చెప్పిన మరో గొప్ప విషయం ఆయన మాటల్లోనే చెబితే బాగుంటుంది –‘’even though if something parallel to the origin of human intelligence ,should indeed have happened somewhere in the infinite universe ,the chance that we would be able to communicate  it must be considered as zero .yes ,for all purposes man is alone ‘’

జీవ పరిణామం అంటే ఒక నిజం అంటే అనుమానం లేదు .ప్రాణి ఉత్పత్తి జరిగి న నాటి నుంచి ఇది జరుగుతూనే ఉంది .అని తన పుస్తకాన్ని ముగిస్తాడు’’ జీవ శాస్త్ర మేయర్ ‘’ అయిన ఎర్నెస్ట్ మేయర్

30-9-2002 .నాటి నా అమెరికా డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

                  నా దారి తీరు -59

ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

మొదటి నుంచి నాకు ఎవరైనా మంచిపని   చేస్తే వారిని అభి నందించటం అలవాటైంది .చిన్నప్పుడే నా సహమిత్రుల కు ఆట ల్లో ,పాటల్లో పద్యాలలో వక్తృత్వం లో పోటీలు పెట్టి వారికి నాకు తోచిన బహుమతులన్దించే వాడిని .కాలేజి లో దీనిని చేయటానికి సాహసించలేక పోయానో లేక అవకాశమే రాలేదో ?తెలీదు .కాని ట్రెయినింగ్ కాలేజి లో మాత్రం దీన్ని అవకాశం గా తీసుకొన్నాను .కాలేజి పరీక్షల్లో ఫస్ట్ మార్కులోచ్చిన నా తోడి విద్యార్ధులకు లెక్చరర్ ల అను మతితో బహుమతులిచ్చే వాడిని .నేనిచ్చిన  బహుమతి అయిదు రూపాయలు మాత్రమె .అప్పుడు నేనింకా ఇంటి నుండి వచ్చిన డబ్బుతో చదువు కొంటున్న విద్యార్ధి నే కదా .అప్పుడు కాలేజి నాటకాలలో నాకు నచ్చిన నటులకు బహుమతులిచ్చే వాడిని వారెంతో సంతోషించే వారు .ఈ పని లెక్చరర్లు, యాజమాన్యం చేయాలి .కాని అదేమీ నేను ఆలోచించలేదు నాకు తోచిందీ చేశాను అంతే .దానికి మించి నా మనసులో ఏమీ ఉండేది కాదు కాని మా బాటని మేడం మాకు ఇంచార్జి  గాఉండేది .ఆవిడకు నేనిలా చేయటం అంతగా ఇష్టం ఉండేది కాదు .ఒకటి రెండు సార్లు నెమ్మదిగా నాకు చెప్పింది కూడా .నేను మాత్రం నా పధ్ధతి మార్చలేదు .

ఆ తర్వాత నేను ఉద్యోగం లో చేరిన తర్వాత ఇలాంటి ప్రోత్సాహాలను వీలైనప్పుడల్లా చేసి విద్యార్ధులను బాగా ప్రోత్సహించేవాడిని .దీనికి అందరూ మెచ్చుకొన్నారు .పని చేసిన ప్రతి చోటా కూడా ఇలా చేసి విద్యార్ధుల అభిమానాన్ని చూర గోన్నాను .ఇది బాగా చదివిన వారిని ,ఉత్సాహం గా పోటీలలో పాల్గొన్న వారిని ప్రత్యెక విషయాలలో తమ ప్రతిభ కన బరచిన వారికి ఊతం గా ఉంది .తమ శక్తి యుక్తులను మరింత కనబరచాటానికి అవకాశ మేర్పడేది వీటికి నేను చేస్తున్నది దోహద కారి అయిందని నాకు మరింత  ఆనందం గా ఉండేది .అలాగే ఏ రంగం లో నైనా ప్రత్యెకం గా  కనీ పిస్తే గుర్తింపు పొందితే ,వారి ని అభినందిస్తూ జాబులు రాసే వాడిని వీలయితే వారిని స్వయం గా కలిసి అభినందిన్చేవాడిని .నేను రాసిన ఉత్తరం వాళ్ళు తమ వారందరికీ చూపి చాలా సంతోషించేవారు వారిని గుర్తించి నందుకు వారికదొక సంతృప్తి గా ఉండేది . ఉయ్యూరు స్టేట్ బాంక్ మేనేజర్ బాగా పని చేసి అందరితో చేయిస్తుంటే బాంక్ కరెక్ట్ గా పది గంటలకే ప్రారంభమైతే ,లావాదేవీలన్నీ పకడ్బందీ గా జరుగుతూంటే వారి ప్రత్యేకతను గుర్తించి ఉత్తరం రాశానొక సారి. ఆ ఆఫీసర్, స్టాఫ్ అందరికి సర్కులేట్ చేసి సంతృప్తి చెందారు ఈ విషయాన్ని బాంక్ స్టాఫ్ లో ఒక రైన రెడ్డి గారు నాకు చెప్పి మేనేజర్ గారు కృతజ్ఞత తెలియ జేయమన్నారని తెలియ జేశారు మేనేజర్ యెంత సంతోషించారో నాకూ అంత ఆనందం కలిగింది ఇదో ‘’తుత్తి’’ఏ.వి.ఎస్.మాటల్లో .

అప్పుడు ఉత్తర ప్రదేశ్ కు కమలా పతి త్రిపాఠీముఖ్య మంత్రిగా ఉండేవాడు ఆయన చాలా శ్రోత్రియుడు .అందరూ ఆయన పాదాలపై పడినమస్కారాలు చేసే వారు. ముఖాన పేద్ద కుంకుమ బొట్టు తో పంచా ,లాల్చీ తో కురచగా ఉండేవాడు .తన కాళ్ళ మీద పడని  వారిపై గుర్రుగా ఉండేవాడు ఒక రకం గా ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను చాలా కాలం శాశించాడు .కేంద్రం లోను ఆయన మాటకు తిరుగుండేది కాదు ఆయన చెప్పిన వాళ్ళకే కేంద్ర మంత్రి పదవి .ఇందిరా గాంధి కూడా ఆయన కు భక్తురాలే .తర్వాత అక్కడ బెడిసింది ఆయన్ను గద్దె నుంచి తప్పించి కేంద్రం లో రైల్వే మంత్రి చేసింది .అప్పుడు ఆ రాష్ట్ర రాజ కీయాలు ఒడిదుడుకులకు లోనైనాయి

.ఆసమయం లో ‘’త్రిభువన నారాయణ్ సింగ్ ‘’అంటే టి యెన్ .సింగ్ అనుకోకుండాఉత్తర ప్రదేశ్  ముఖ్య మంత్రి అయ్యారు .ఆయన ఏంతో నీతి నిజాయితీలు,వ్యక్తిత్వం రుజు వర్తన ,నిర్భీకత ఉన్న వారు ఈ విషయాలన్నీ పేపర్ల ద్వారా చదివాను .అప్పటికి ఆయనకు శాసన సభలో సభ్యులు కూడా కాదు .ముఖ్య మంత్రి పదవి చే బట్టిన ఆరు నెలల లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలని రూలు ఉంది .దానికి ఆయన సిద్ధమైనారు అలాంటి గొప్ప సుగుణాలున్న ముఖ్య మంత్రి ఆ రాష్ట్రానికి దొరకటం అదృష్టం అని అందరి భావన .అందుకని నేను ఆయన్ను అభి నందిస్తూ ఒక ‘’కార్డు ముక్క ‘’రా శా ను .ఇదే ఒక రాజకీయ ప్రముఖుడికి రాసిన ప్రధమ ఉత్తరం దాన్ని అందుకొన్న  ముఖ్య మంత్రి  టి యెన్ సింగ్ గారు నాకు కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరం రాశారు ఇది నాకు ఏంతో ఆనందాన్నే కాక ఆశ్చర్యాన్ని కలిగించింది దాన్ని భద్రం గా దాచి అందరికి చూపించి సంతృప్తి చెందేవాడిని ఆ జా బును చాలా కాలం దాచుకొన్నాను ప్రాణ ప్రదం గా .ఆ తర్వాత కనీ పించలేదు .

బ్రాహ్మణ ఆది పత్యాన్ని కాదని ఒక సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడని త్రిపాఠీ ఆగ్రహావేశాలకు లోనై నాడు   అతనికి  ‘’చెక్’’ పెట్టటానికి తేరా వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు .ధిల్లీ నుంఛీ ,అలహాబాద్ వచ్చీ తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు ఆయనకు సహనం నశించిపోయి సూటీ పోటీ మాటలతో విరుచుకు పడేవాడు .శాసన సభ్యుడు కానట్టి ముఖ్య మంత్రి శాసన సభ ఉప ఎన్నిక లలో పోటీ చేసి గెలవక పొతే పదవి ఉండదు కనుక పోటీ చేశారు సింగ్ జీ .అంతే కులం మతం అన్నీ పని చేశాయి .’’చపాతీ ‘’(త్రిపాఠీ )గారి యంత్రాంగం మంత్రాంగం పని చేశాయి సింగ్ గారిది రాజ మార్గం .కుయుక్తులు తెలియని అసలైన గాంధేయ వాది.నిజాయితీకి మారు పేరు .ఎన్నిక సంగ్రామం లో నూ తనదైన క్రమ శిక్షణ నే పాటించారు .రాజకీయ చదరంగం బ్రహ్మాండం గా నడిచింది . .ప్రజలను అన్ని రకాల ప్రలోభ పెట్టారు త్రిపాఠీ .దానికి వాళ్ళు లొంగిపోయారు సింగ్ లాంటి నిజాయితీ పరుడిని గాంధేయ వాదినీ ప్రజలు ఓడించి తమ అసమర్ధతను చక్కగా చాటుకొన్నారు .టి.యెన్ సింగ్ గారు ఉప ఎన్నికలో ఓడిపోయారు .వారు వెంటనే రాజీనామా చేసేశారు .తన నిజాయితీని చాటుకొన్నారు .మంచికి చెడుకు జరిగే రాజ కీయ పోరాటం లో చెడె గెలుస్తుంది తాత్కాలికం గా అని మరో సారి రుజువైంది .ఇలా యు .పి .లో త్రిభువన నారయణ్ సింగ్ గారి ప్రభుత్వం ఆరు నెలలకే పతనమైంది .ఇది నాకు ఏంతో బాధించింది .ఈ బాధ చాలా కాలం మనసులో ఉండి పోయింది

నేను రాసిన రెండో ఉత్తరం మహా వక్త ,రాజకీయ దురంధరుడు ,పాతికేళ్ళుగా పార్ల మెంట్ మెంబర్ ,యు యెన్ వొ లో తన మాత్రు భాష హిందీలోనే మాట్లాడి చరిత్ర సృష్టించిన వాడు ,మూడు సార్లు భారత దేశ ప్రధాన మంత్రి అయిన వాడు అయిన అటల్ బిహారీ వాజీ పేయి గారికి ,ఆయన పార్ల మెంట్ మెంబర్ గా ఉన్నకాలం లో రాశాను ఏ సంవత్సరం లోనో గుర్తు లేదు ..సందర్భం ఏమిటంటే –అప్పటికే కాంగ్రెస్ అంటే ప్రజల్లో విముఖత ఏర్పడి ,ప్రజాస్వామ్య విలువలన్నీ మంట గలిసిపోయి దేశం పరువు బజారుపడ్డ సమయం ,అనేక పార్టీలు ఎవరి దారి వారిదే నన్నట్లున్న రాజకీయ అస్తిరత్వం సమర్ధమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని పెద్దలందరూ భావిస్తున్న తరుణం అది .అప్పుడు అటల్జీ.కిఇంగ్లీష్ లో  జాబు రాశాను .కవర్ రాశానని జ్ఞాపకం .అందులో నేను ఆయనకు ఒక సూచన చేశాను స్క్రిప్ట్ అంటా ఇదే అని కాదు దాని భావమే నేనిక్కడ తెలియ జేస్తున్నాను ..’’అయ్యా !దేశం లో ఉన్న సంక్లిష్ట రాజకీయ సంక్షోభం లో ఎవరికి వారు గిరి గీసుకొని వారంటే వీరికి వీరంటే వారికి పడకుండా విభేదాల తో కాలం గడుపుతుంటే కాంగ్రెస్ దీన్ని అదను గా తీసుకొని ప్రజా సంక్షేమం పట్టకుండా పబ్బం గడుపు కొంతోంది .దానితో కాంగ్రెస్ కు ప్రత్యామ్నానం లేదను కొంటున్న ప్రజలు మనసులో కాదను కొన్నా కాంగ్రెస్ కే  వోటు వేసి అధికారం దక్కిస్తున్నారు .మీ  పార్టీ ,కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే గొప్ప ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పడి ప్రజల ఆశలు తీర టానికి గొప్ప అవకాశం ఏర్పడుతుంది ఈదిశ గా ఆలోచించండి ప్రజల కస్టాలు తీర్చే ప్రయత్నం చేయండి .కాంగ్రెస్ అంటే విసుగేత్తిపోయిన జనానికి ఇదొక మంచి అవకాశం కలిగి విరుద్ధ భావాలు కల మీరు ఒక కామన్ అండర్ స్టాండింగ్ తో పని చేస్తే దేశానికి ఏంతో మేలు జరుగుతుంది. మీ అభిప్రాయ  భేదాలను పక్కన పెట్టండి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మీ రెండు పార్టీలుకలిసి పని చేయాల్సిన చారిత్రిక అవసరం ఏర్పడింది .ఎవడో ఒక అనామకుడు రాసిన ఉత్తరం అని తీసి పారెయ్యకండి ,ఇది ప్రజలందరి మనసులోని మాట .పార్టీలు కొన్ని కలిసి పని చేయాల్సిన సమయం దేశానికి ఇప్పుడు అవసరం వచ్చింది కాదన కండి. మీ ప్రయత్నం మీరు చేయండి .కమ్యూనిస్టులతో స్నేహ హస్తం చాచండి .కలుపుకొని పొండి.దేశానికి మంచి చేయండి ‘’అని రాశాను ఈ జాబును’’ శ్రీ అటల్ బిహారీ వాజపేయి -పార్ల మెంట్ మెంబర్ ,ఇండియన్ పార్లమెంట్ -న్యు ధిల్లీ ‘’ అనే అడ్రస్ కు పంపాను అది అందిందో లేదో తెలీదు నాకెటు వంటి సమాధానం అటల్ నుంచి రాలేదు .కొంత అసంతృప్తి కలిగింది .అయినా నా భావాలు నేను చెప్పాను అయన నాలా ఆలోచించాలని రూల్ ఏమీ లేదుకదా అని సమాధానపడ్డాను .ఇలా ఇద్దరు రాజకీయ ప్రముఖులకు నా మనసులో ని భావాలు తెలియ జేశాననే ఆత్మ సంతృప్తి నాకు మిగిలింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-22-12-13- ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అన్నం కాక ఆటపాటల తో బతికిన కవి గోరటి వెంకన్న -ఆంద్ర జ్యోతి

 

‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా ఊరు’

మాది మహబూబ్‌నగర్ జిల్లా అని చెప్పగానే, పొట్ట చేతబట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస పోయే కూలినాలి జనాల దృశ్యమే కళ్ల ముందు మెదులుతుంది అందరికీ. కాని మా ఊరి చిత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఊరి చుట్టూ తోటలు, పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఊరి ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎందుకంటే మా ఊళ్లో దళితులు మొదలుకొని అగ్రహారీకుల వరకూ అందరికీ తక్కువలో తక్కువ ఐదెకరాల భూమి ఉంది. అందరూ మధ్యతరగతి రైతులే. మిగిలిన ఊళ్లలో పశుసంపద తగ్గిపోతోందని వింటాంగానీ, మా ఊళ్లో ఇప్పటికీ పశువులు ఎక్కువే. వీటన్నిటితో స్వయంపోషకంగా ఉండే మా ఊరికి నేనే కాదు, ఎవరూ ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు.
ఎంత గొప్పో
మా మండల కేంద్రం తెలకపల్లి ‘తెలకడు’ అనే దళిత శివయోగి పేరు మీద ఏర్పడింది. ఇక మా ఊరు శ్రీశైలానికి వతన్. అంటే పంట నుంచి కొంత భాగం ఆ దేవాలయానికి పంపుతామన్న మాట. ఊరికి పడమరగా ‘ప్రమీలార్జునీయం’ రాసిన రాఘవశర్మ పూర్వీకులు ఉంటారు. తూర్పున ఒక వేదపాఠశాల ఉండేదని పరిశోధనల్లో తేలింది. మా ఊళ్లో నర్సింహావధాని అని దేశంలోనే గొప్ప తర్క పండితుడు ఉండేవారట. ఈశాన్యాన మేలబాయి, తూర్పున ఏనుగోళ్ల కంచెం, వాయవ్యానికి జైన గుట్ట (దీన్ని ఇప్పుడు అందరూ జన్నాయిగుట్ట అంటున్నారు) ఉత్తరానికి రామగిరిగుట్ట, దుందుభి నది ఉన్నాయి. తాపీ ధర్మారావు రాసిన ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు’ పుస్తకం మీద శిల్పం బొమ్మ ఉంటుంది కదా, అది మాకు సమీపంలోని మామిళ్లపల్లిలోని దేవాలయం మీద ఉండే శిల్పమే. మాది చాలా విశిష్టమైన ఊరు. కలహం అనేది మా ఊళ్లో ‘ఏక్ దిన్‌కా సుల్తాన్’. అంటే ఇలా వచ్చి అలా పోయేదే తప్ప, కర్రలెత్తి మా ఊరివాళ్లు కొట్టుకోవడం మాకు తెలియనే తెలియదు.
కాసుల్లేకున్నా కష్టం తెలియదు
తెలంగాణలోని చాలా గ్రామాల్లో దొరల పెత్తనం ఉండేది కాని మా ఊళ్లో అలాంటివేం లేవు. మా ఊరిపెద్ద బాల్‌రెడ్డి గాంధేయవాది. మద్యమాంసాలకు దూరం. గ్రామస్థులు మద్యపానం జోలికి పోకూడదని, పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకోవాలని ప్రోత్సహించేవారాయన. మా నాన్న పేరు నర్సింహ. శుచి, శుభ్రత, శ్రమ, సత్యసంధత వంటి ఎన్నో మంచి లక్షణాలతో శ్రీరామచంద్రుడికి మారుపేరుగా ఉండేవారు. అవే మాకూ నేర్పించారు. మా అమ్మ ఈరమ్మదీ మా ఊరే. నేను పుట్టేనాటికి మా నాన్నకు రెండెకరాల భూమి ఉండేదట. మా తల్లిదండ్రులిద్దరూ శ్రమించి దాన్ని ఎనిమిది ఎకరాలు చేశారు. మా ఇంట్లో కుండల్లో జొన్నలు, రాగులు.. గింజలన్నీ ఉండేవి. మా పొలంలోనే కూరగాయలు పండేవి. ఇంటి వెనక పెరట్లో చిక్కుడులాంటి తీగ జాతి, పాడి ఉండేది. దాంతో మేం అన్నవస్త్రాలకు లోటు లేకుండా జీవించేవాళ్లం. కడుపు నిండా తినడానికి కటకటపడేంత పేద కుటుంబమేం కాదు. అలాగని చేతిలో కాసులాడేవి కాదుగాని, మమ్మల్ని కష్టం తెలియకుండా పెంచాలని తపన పడేవారు మా అమ్మానాన్నా. నాకొక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.
ఇల్లే గుడి
చెన్నదాసు అనే యోగి మా ప్రాంతంలో తిరుగుతూ మా నాన్న తరంలో సాలె, మాల, మాదిగలందరికీ అష్టాక్షరి మంత్రోపదేశం చేశారట. దానివల్ల ఎక్కువమందికి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఉదయాన్నే స్నానం చేసి పూజ చెయ్యడం అన్నీ అలవడ్డాయి. ఎవరి ఇల్లే వారికి ఆలయమయ్యింది గనక ఊళ్లోని ఇతర దేవాలయాలకు వెళ్లే అవసరం పడలేదు మాకు. చేతి నిండా ఎవరి పని వారికున్నప్పుడు కులంతో పనేముంది? కులం పేరుతో ఎక్కువతక్కువలు మా ఊళ్లో ఎప్పుడూ లేవు. ‘ఏం రెడ్డీ..’ ‘ఏం వెంకన్నా’ అనుకోవడమే తప్ప, ఎవరూ ఎవర్నీ ‘అరే, ఒరే’ అనడం లేదు. పైగా అందరూ వరసలతో పిలుచుకునేవారు.
ఆ వారసత్వమే
కొంత ఎర్రనేల, మరికొంత రేగడి భూమి – వీటితో వైవిధ్యంగా ఉండే నేల మాది. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతంలాగా పంటలు పండే ఊరు గౌరారం. అందువల్ల చిన్నప్పట్నుంచీ నేను పెద్దయ్యాక మంచి వ్యవసాయదారుణ్ని అవాలనుకునేవాణ్ని. భవిష్యత్తు అంటే పంచె కట్టి, ములుగర్ర చేత పట్టి ఎడ్లబండిని అదిలించుకుంటూ పొలానికెళ్లే దృశ్యమే నా కళ్లముందు మెదిలేది. మా నాన్న మాత్రం మేం బాగా చదువుకోవాలనుకునేవాడు. అందుకే నాకు పొలం పనులేవీ చెప్పేవాడు కాదు. నిజానికి జీతగాడిగా పెట్టేస్తే రోజుకు కుండెడు వడ్లు వచ్చేవి. కాని అలా చెయ్యకుండా, ఎదురు ఖర్చు పెట్టి బిడ్డలను చదివించాడు. అప్పుడప్పుడు మేకలు కాయడం తప్పితే నేనేమీ చేసేవాణ్ని కాదు. మా నాన్నకు పది యక్షగానాలు, కనీసం ఐదు శతకాలు, ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపద గేయాలు – అవన్నీ నోటికి వచ్చు. ఏదైనా ఒకసారి వింటే చాలు, ఆయనకు నోటికి వచ్చేసేది. మా అమ్మానాన్నలు ఏ మాట చెప్పాలన్నా దాన్ని ఒక సామెతగానో, పద్యంగానో… చాలా కవితాత్మకంగా చెప్పేవారు. రోజువారీ మామూలు సంభాషణల్లో సైతం ఎంతో సంస్కృతి, కవిత్వం ఉట్టిపడుతూ ఉండేవి. వాళ్ల నుంచే పాట నాకు వారసత్వంగా వచ్చింది.
ఊరంటే బెంగ
మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న రఘురాంపల్లి గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోయేవాణ్ని. గోడలు, పక్కబట్టల నుంచి వచ్చే ముక్కవాసనకు భరించలేక పోయేవాణ్ని. దానికి తోడు కొట్టితిట్టి పని చేయించే మాస్టర్ల వల్ల చదువంటే విరక్తి కలిగింది. గడ్డివాముల్లో దాక్కునేవాణ్ని. దెయ్యం పట్టిందని ఊగిపోతూ బడికెళ్లడాన్ని తప్పించుకునేవాణ్ని. హాస్టల్లో ఉన్నప్పుడు వానాకాలంలో పొంగే వాగును చూస్తే మా ఊరికి వెళ్లలేమనే బెంగ కలిగేది. ముఖ్యంగా సాయంత్రం పూట వాన కురుస్తున్నప్పుడు ఊరి మీద బెంగ ఇంకా ఎక్కువయి ఏడ్చేసేవాణ్ని. కొట్టితిట్టినవాళ్లే కాదు, నా జీవితాన్ని ప్రభావితం చేసి, చదువు పట్ల ఆసక్తిని కలిగించిన మాస్టార్లూ మా పల్లెలోనే ఎదురయ్యారు నాకు. వెంకటరెడ్డి, గోవర్థనరెడ్డి వంటి ఉపాధ్యాయులు గ్రామీణ విద్యార్థుల పట్ల పెట్టిన శ్రద్ధను మాటల్లో చెప్పలే ను.
ఎన్ని స్వరాలో…
ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి – ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు – ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. సాంస్కృతికంగా ఇంత బలమైన ప్రభావాలు ఉండటం వల్ల చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా ‘వీరాంజనేయ యుద్ధం’ అని గుర్తు.
పొలాలు అమ్మనివ్వరు
ప్రస్తుతం మా ఊళ్లో రెండువేల జనాభా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ పొలం అమ్మడానికి ఒప్పుకోరు ఎవ్వరూ. ఎవరైనా పొలం అమ్ముతున్నారని, లేదా కొంటున్నారని తెలిస్తే దాన్ని ఆపడానికి పోటీలు పడి రేటు అమాంతం పెంచేస్తారు! ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. పండుగపబ్బాలన్నీ కలిసే చేసుకుంటాం. మా ఊళ్లో మొట్టమొదటి పీజీ నేనే. నేను చదవడం చూసి స్ఫూర్తి పొంది తర్వాత మా ఊరి నుంచి చాలామంది పిల్లలు చదువుకున్నారు. పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే నేను మా ఊరికి చేసిన మేలు.
తోటలు, పండగలు
మా ఊరి చుట్టూ తోటలే. జామ, మామిడి… వంటి పళ్ల తోటల్లో పడి తిరగడమే మా పని. ఆ పళ్లన్నీ తినడం కాకుండా, ఊరి సమీపంలో ఉన్న గుట్టలన్నీ ఎక్కి అక్కడ దొరికే రేగు, కలిమి, బలుసు పళ్లు కూడా ఏరుకుని తినేవాళ్లం. వాగులో చేపలు పట్టి కాల్చుకుని తినేవాళ్లం. పండగల్లో సంక్రాంతి అంటే ఇష్టంగా ఉండేది. ఆ సమయంలో ఎడ్ల బళ్లకు రంగులద్ది, అలంకరించి ఊరేగించేవారు. దసరా వచ్చినప్పుడు జమ్మిచెట్టును చూడటానికి ఊరు బయటకు వెళ్లటం… అదంతా సరదాగా అనిపించేది. ఇక మృగశిర కార్తెల్లో, ఉగాదినాడు ‘ఆగిది’ చేసేవారు. అంటే వ్యవసాయప్పనులకు అది ప్రారంభం అన్నమాట. మా చిన్నప్పుడు వినాయకచవితి మరీ అంత గొప్పగా చేసేవాళ్లం కాదు.

అలా చూసి ఏడ్చాను..
ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక హైదరాబాద్‌లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.
– అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్, ఎండి యూసఫ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం – కాంచన

kanchana -vendi tera bangaram 001

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం

నా దారి తీరు -58

కలకత్తా కాళీ మాత దర్శనం

ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో  తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను .పెట్టె పైనే అందరూ నిద్ర పోయే వాళ్ళు .కంపార్ట్ మెంట్ లోకి ఎక్కి ఎల్లాగో అలా నక్కి కుక్కుకొని కూర్చున్నాం .ఉదయానే హౌరా చేరాం .విక్టోరియా సెంటర్ కు వెళ్లాం .అక్కడే పళ్ళు తోముకోన్నాం కాఫీ దొరకదు కనుక ‘’చాయ్ ‘’లాగించాం .ఆ హాల్ అంతా కలయ తిరిగి చూశాం .విక్టోరియా మహా రాణి పట్టాభి షేకం సందర్భం గా కట్టిన హాల్ అనుకొంటా .బ్రిటిష్ స్టైల్ లో సుందరం గా ఉంది అక్కడి నుంచే ఎక్కడి కైనా ట్రామ్ లో నే వెళ్ళాలి  ట్రాములు రోడ్డు మీద ట్రాక్ పైనే నడుస్తాయి మొదటి సారి ట్రాము ఎక్కాం..మజాగా ఉంది ..

తరువాత హౌరా బ్రిడ్జి ని నడిచి చూశాం సస్పెన్షన్ బ్రిడ్జి .మన దేశం లో ఇదే మొదటి దని చదివిన గుర్తు .నడుస్తే ఊగుతూ ఉంది సరదాగా ఉంటుంది .అక్కడి నుండి సిటి బస్ ఎక్కి కాళీ ఘాట్ లో శ్రీ కాళీ మాత ను దర్శనం చేసుకోన్నాం  .చాలా భయంకర రూపం .భయమేస్తుంది దగ్గరగా చూస్తె .జంతు బలి ఎక్కువ గా  ఉంటుంది. రష్ లేదు దర్శనం తేలికగా సంతృప్తిగా ఉంది వాళ్ళ మంత్రాలు లాగి నట్లు తమాషా గా చదువుతారు .వంగ భూమిలో కాలు పెట్టినందుకు గర్వం ఆ ఉంది. ఎందరెందరో మహాత్ములు జన్మించిన పుణ్య భూమి దేశానికి అంతటికి ఆదర్శ భూమి .రామ కృష్ణ పరమ హంస వివేకా నందులు శారదా మాత ,అరవింద్ ఘోష్ శుభాష్ చంద్ర బోసు,రవీంద్ర నాద టాగూర్ ,శరత్ చంద్ర చటర్జీ ,ప్రేమ చంద్ ,బి సి రే ,రాజా రామ మోహన రాయ్ ,వందే మాతరం రాసి దేశ భక్తీ ని ప్రబోధించిన ఆనంద మఠం నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ సినిమాలకు కొత్త రూపూ ఊపు ప్రయోజనం తెచ్చిన సత్యజిత్ రాయ్ ,ఆంధ్రుల కోడలు బెంగాలీ ఆడపడుచు సరోజినీ దేవి ,మొదలైన ప్రాతస్మరణీ యులకు జన్మ నిచ్చిన రాష్ట్రం .అక్కడి నుంచి దక్షినేశ్వర్ వెళ్లాం ఇక్కడే శ్రీ రామ కృష్ణ పరమ హంస అమ్మవారి పూజలో ,దర్శనం లో చరితార్దులైనారు ఇక్కడే వివేకానంద ఆయన శిష్యులై భగవత్ సాక్షాత్కారం పొంది ,ఆర్ష ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి గురు అరణం తర్వాత రామ కృష్ణా మిషన్ ఏర్పాటు చేసి ఎన్నో ధార్మిక సాంఘిక సేవాకార్యక్రామాలకు శ్రీ కారం చుట్టారు .ఇవన్నీ తాలచుకొంటే మనసు పులకించి పోయింది ఆ మహాను భావులు నడయాడిన నేల మీద నేనూ ఇప్పుడు నడుస్తున్నందుకు జీవితం ధన్యమైందన్న భావన కలిగింది .అలాగే అంతకు ముందు కాశీ ,ప్రయాగ గయా లలో నొ ఇదే అనుభూతికి లోనయ్యాను .ఏ జన్మ లో చేసుకొన్న పుణ్యమో ఈ అదృష్టాన్ని చ్చింది .దక్షినేశ్వర్ లో అమ్మ వారి దర్శనం చేసుకొని పరమ హంస ఉన్న గదులను వాడిన వస్తువులను చూసి ఆనందించం అలాగే ‘’కా నంద్ ‘’అంటే వివేకా నంద తిరుగాడిన గదులనూ చూసి ధన్యత చెందాం .పక్కనే గంగా నది మహా ప్రవాహం ముచ్చటగా ఉంది టూరిస్ట్ స్పాట్ గా మంచి పేరొచ్చింది .బేలూర్ మఠంకూడా చూశాం .

రాత్రికి మా బావ పై అధికారి ,తెలుగు వాడు అయిన అసిస్టంట్ ఇంజినీర్ గారింటికి వెళ్లాం .ఆయన మాకు ఆతిధ్యమిచ్చి మంచి తెలుగు భోజనం ఏర్పాటు చేశారు .వారి దగ్గర సెలవు తీసుకొని చిత్త రంజన్ కు చేరుకొన్నాం .కాళ్ళు అరిగే లాగా ఆ ప్రదేశాలన్నీ చూశాం .అక్కడ నుండి మరో ప్రసిద్ధ శివాలయం చూసిన గుర్తు పేరు జ్ఞాపకం లేదు మధ్యాహ్నం ఎక్కడో సోడా దొరికితే తాగిన జ్ఞాపకం ఉంది .

ఇంకో సారి రవీంద్రుని విశ్వ భారతి ని సందర్శించాం .పచ్చని వృక్షాల మధ్య ఈ విద్యా దేవాలయం ఉంది ఇక్కడ చిత్రలేఖనం ,సంగీతం సాహిత్యం మొదలైన లలిత కళలు నేర్త్పుతారు .విశ్వ విద్యాల స్తాయి కోర్సులుంటాయి రవి కవి విగ్రహం ఆయన ప్రసిద్ధ చిత్రాలు ప్రత్యెక గదుల్లో ప్రదర్శనకు ఉంచారు అన్నీ తీరికగా చూశాం .మన జాతీయ గీతం రాసిన మహా కవి గీతాంజలి కి నోబుల్ పురస్కారం పొంది తనకు మన దేశానికి కీరి ప్రతిష్టలు తెచ్చాడు ఆయన ప్రత్యెక బాణీ  లో ‘’రవీంద్ర సంగీతం ‘’ఉద్భవించింది  ఇప్పటికీ అందరూ దాన్ని సాధన చేస్తూ ప్రదర్శిస్తూనే ఉన్నారు .ఆయన కీర్తికి వన్నెలు తెస్తూనే ఉన్నారు  .రవీంద్రుడు తిరిగిన ప్రదేశం లో తిరుగుతున్నందుకు చెప్ప లేని సంతృప్తి కలిగింది .ఇక్కడే రాయప్రోలు సుబ్బారావు , బెజవాడ గోపాల రెడ్డి మొదలైన్ తెలుగు ప్రముఖులు చదువుకొని ప్రసిద్ధులయ్యారు .

ఒక ఆదివారం ఫరక్కాకు దగ్గర ఊరికి వెళ్లి చూశాం  ఇది మనకూ బంగ్లా దేశ్ కు సరిహద్దు ప్రాంత నిత్యం రైళ్ళలో దొంగ చాటుగా బియ్యం రవాణా జరుగుతుందని బావ చెప్పాడు ..కలకత్తాలో రసగుల్లాలు వీలైనప్పుడల్లా తిన్నాం .ఆ రుచి గొప్పది .తమాషా గా ఉంటుంది .దీనికే కలకత్తా ప్రసిద్ధి బెంగాల్ లో ఎక్కడ చూసినా ఈ దుకాణాలే కని పిస్తాయి .పల్లె జనం మరీ అనాగారకం గా ఉంటారు .బాగా వెనక బడిన ప్రాంతాలేక్కువ బెంగాల్ లో చీకటి కూపాలే పల్లెలన్నీ కరెంటు లేని గ్రామాలు బాగా ఎక్కువ .తిండికి మొహం వాచీ ఉంటారు .ఆకలీ దరిద్రం ఎక్కడ కెళ్ళినా కనీ పించి అయ్యో అని పిస్తుంది .మన విజయనగరం శ్రీకాకుళం ప్రాంతం ఆడవాళ్ళ లాగా ఇక్కడా  బీహార్ ఒరిస్సా లలో జాకెట్ తోడగని వారే ఎక్కువ .

మధ్య తరగతి ఉన్నత కుటుంబాలలో స్త్రీ పురుషులు మహా అందం గా ఉంటారు మగ వారి పంచ కట్టే విధానం భలేగా ఉంటుంది వల్లే వాటుగా శాలువా కప్పుకోవటం తో వారికి ఒక హుందా గౌరవం కలుగుతుంది స్త్రీలు చాలా అందం గా ఉంటారు మగ వారి అనడమూ గొప్పగానే ఉంటుంది అందుకే ‘’బెంగాలీ బాబు లు ‘’అంటారు .వీరి పేర్లు ఏంటో ప్రత్యేకం గా ఉంటాయి మన పురాణాలలో వేదాలలో ఉన్న పేర్లనే ఎక్కువ మంది పెట్టుకొంటారు .నాకొక్క సారిఅని పిస్తుంది అష్ట వసువులు బెంగాల్ లోనే జన్మించారని అంత గొప్ప వారు ఇక్కడ జన్మించారు. దేశానికి దిశా నిర్దేశం చేశారు స్వాతంత్ర్య సమరం లో సాంఘిక సంస్కరణల్లో మత సంస్కరణల్లో రాజ కీయ ముందు చూపులో బెంగాలీలే మార్గ దర్శులయ్యారు . ఇలా మేము బీహార్ లోని జమ్తారా లో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసి మా బావ మాకు చూడాల్సిన ప్రదేశాలన్నీ చూపించి కొత్త లోకాలను చూసిన అనుభూతిని కలిగించాడు .సుమారు ఒక ఇరవై రోజులున్నామేమో జంతారా లో ఆ తర్వాత అశోక్ ను నన్ను హౌరాదాకా వచ్చి ట్రెయిన్ ఎక్కించాడు బావ .ఆ మధురాను భూతులను మనస్సుల నిండా నింపుకొని ఉయ్యూరు తిరిగి వచ్చాం ఎన్నో రోజులు ఇంట్లో వారితోనూ స్కూల్ వారితోనూ స్నేహితులతోనూ ఈ యాత్రా ముచ్చట్లు చెప్పుకొంటూనే ఉండేవాడిని .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-13-.ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి

 

ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి.

తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్నారు. తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన ప్రతిభాశాలురు అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమంతటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయాలూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము.

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్తాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరం ఢిల్లీ వచ్చి ‘డెయిలీ టెలిగ్రాఫ్’ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944లో పత్రికా రంగంలో చేరారు. తొలుత తెలంగాణ పత్రికలో పనిచేశారు. తర్వాత ‘మీజాన్’లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు. ఆ రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిస్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. ‘భారతి’ మాస పత్రిక ఇన్‌చార్జ్ ఎడిటర్‌గా పనిచేసిన కాలంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన బేధాభిప్రాయాలలో రాజీనామా చేశారు. నార్లతో విభేదించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నారు.

‘డైలీ టెలిగ్రాఫ్’లో చేరిన వెంటనే దాని సంపాదకులు వెంకట్రామన్, రామచంద్ర గారికి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ప్రక్యాత పరిశోధకుడు, బహుభాషావేత్త అయిన రాహుల్ సాంకృత్యాయన్ ఉపన్యాసాన్ని కవర్ చేయడం. తర్వాత హైదరాబాద్‌లో సంగెం లక్ష్మీబాయిని కలిసి తెలుగు పత్రికా జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి పత్రికా రంగంలోనే స్థిరంగా వున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్ నుంచే అప్పుడే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు విలేఖత్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకున్నారు. లక్ష్మణ్ స్వరూప్, కె.పి. జయస్వాల్ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

ఆత్మకథ ‘హంపి నుంచి హరప్పా దాకా’లో ‘ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు, నేను సామాన్య మానవుడ్ని, కానీ నాలో వైచిత్రం, వైవిధ్యం తప్పదు’ అని తిరుమల రామచంద్ర రాసుకున్నారు. పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానవల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశభక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. ‘హైదరాబాద్ నోట్‌బుక్’ వంటి 15 శీర్షికలు నిర్వహించారు. ‘సత్యాగ్రహ విజయం’ నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు. ‘మన లిపి – పుట్టు పూర్వోత్తరాలు’ అన్న రామచంద్ర రచన భాషా చరిత్రకే తలమానికమంటూ ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదన్న విశ్వాసాన్ని ‘ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు’ ప్రకటించడం రామచంద్ర అలుపెరుగని పరిశోధకుడు అనడానికి నిదర్శనం. ప్రచారానికి ఆయన ఏనాడు అంగలార్చిన వాడు కాదు. నిరాడంబరత, నిండు మనసు, ఓరిమి వారి వ్యక్తిత్వంలో ఇమిడిపోయాయి.

తిరుమల రామచంద్ర లాహోర్‌లో మూడేళ్ళున్నారు. ఇక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్ కేటలాగర్)గా పనిచేశారు. లాహోర్ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథాలకు తను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తున్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు. హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు.

ఆ తర్వాత లక్నోలో కొద్ది కాలం హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యాంలో హవల్దార్ క్లర్క్‌గా పనిచేసినప్పుడు, సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు. దేశ విభజన జరిగి లాహోర్ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళిక బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాంతమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుంబాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామచంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం. ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నాననీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగునాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

తిరుమల రామచంద్ర జీవితంలో వైవిధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు.

బ్రిటిష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్ళల్లో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు, అచ్చర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిరీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన రామచంద్ర మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామవిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమస్తాగా, కాన్పూర్‌లో మరికొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు.

మూడు ‘వాజ్మయ శిఖరాలు’ అనే గొప్ప-సాహితీవేత్తల-జీవిత చరిత్రలు కూర్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రాఘవపల్లెలో జన్మించిన రామచంద్ర తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ హిందీలో ప్రభాకర పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు. ఆయన నిత్య పాత్రికేయుడు, రచయిత, అధ్యయన శీలి, విద్యార్థి కూడా…
– నందిరాజు రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్టు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం

         వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం

సుబ్బన్న పేట కు పురావైభావం

ఈ రోజుఉదయం  (21-12-13  న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది  .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత లక్ష్మి గారి అభి భాషణం కొత్తదనం గా ఉంది .విశ్వ నాద సాహితీ మూర్తిని పూజించటానికి పూసిన కల్ప వృక్షం ఆయన రాసిన రామాయణం అన్నారామె .మార్పు రావాల్సిందే కాని అది మంచికి దోహదం చేసేది అవ్వాలి ధర్మ చ్యుతికి సహకరించ రాదనీ విశ్వనాధ చెప్పారన్నారు .ఆయన సృష్టించిన పాత్రలన్నీ ఆ నాటి కాలం వారేనని ఎంకి పాటల ప్రాచుర్యాన్ని చెప్పారంటే సాటి రచయితల పట్ల ఆయనకున్న గౌరవం తెలుస్తుందని తెలుగు నాట వచ్చిన అన్ని ఉద్యమాలను స్ప్రుశిం చారని ,లెద్ , బీటర్ అనీబి సెంట్ జిడ్డు కృష్ణ మూర్తి గార్ల భావాలను కూడా పొందు పరచారని కీర్తించారు .

 

రంగా రావు జబ్బుకు ఆయుర్వేద వైద్యం చేయించటం లో హరప్పా చొరవ,అందుకు  తండ్రిని ఒప్పించటం దివాణం మళ్ళీ గాడిలో పడుతున్నట్లు తెలుస్తుంది .పసరిక ను గార్డేనర్ దొర కొనటానికి బేరానికి ధర్మా రావు దగ్గరకు పంపటం ,వింత అయిన ప్రతి దాన్ని జంతు ప్రదర్శన శాలలో పెట్టెడబ్బు చేసుకోవటం అన్న  విధానం పై ఏవగింపు కనిపిస్తుంది .వ్యాధి ఏమిటో తెలీని అరుంధతి రోజు రోజుకూ చిక్కి పోతూ రాజశేఖర శాస్త్రి కోసం కబురు పంపమంటే చేతిలో చిల్లి గవ్వలేదని ధర్మా రావు బాధ పడటం తనకొత్త చీర నగా రంగా పురం నుంచి  తెమ్మని ఆమె చెప్పి తన పరిస్తితి’’ గంగి రెద్దు మీది బొంత’’ లాఉందని  అనటం  కన్నీరు తెప్పించే మాటలు .అలాగే సుబ్బన్న పేట లో తాము ఉండటం ఎంత అదృష్టమో అని పొంగిపోయినపుడు ఆనందమూ కలుగుతుంది

హరప్ప గురువుగారైన ధర్మా రావు తో శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసి పలికిన ప్రతిమాటా అనుభూతికి పరాకాష్ట గా కన్పిస్తుంది .తల్లి మరణం వల్ల  వచ్చిన అశౌచం అయి పోయి మొదటి సారి దేవాలయానికి వచ్చాడు ఏడాది కాలం పాటు వీటికి దూరమై తాను ఏమి కోల్పోయాడో తెలుసుకొని బాధపడటం అతని సంస్కారానికి వన్నె తెచ్చింది ,గోవిందుని మనసారా స్మరించిన తీరు భక్తీ పులకాం కితం గా ఉంది

వైద్యుడు రాజశేఖర శాస్త్రి అరుంధతి నాడి చూసి ఆమెకు ‘’రాజ యక్ష్మ ‘’జబ్బు వచ్చిందని అది మహా రాజులకు రాణులకు రావాల్సిన జబ్బని ఆమె మంచం మీదే విశ్రాంతి తీసుకోవాలని మడి,దడిఅని తడి గుడ్డలతో ఉండరాదని బరువు మోయరాదని  చెబుతున్నప్పుడు అయ్యో పాపం అని పించింది .    డబ్బేమీ ఇవ్వక్కర్లేదని ,రంగా రావుఇచ్చిన డబ్బుతో నే ఈమెకూ వైద్యం సాగిస్తానని చెప్పి ఇద్దరికీ ఊరట కల్గించాడు  .గోవులలో ప్రాణం పరమాత్మ కు దగ్గర లో ఉంటుందని ధర్మ తో విశ్వ నాద చెప్పించాడు .హరప్ప గాంభీర్యం ఏ భావాన్ని బయట పెట్టడన్నాడు .తల్లిపై అతనికున్న ఆరాధన మాటలకందనిదని చెప్పాడు ఆస్తాన దివాన్ రాజీనామా చేయగా ఆ పదవినిని ధర్మ ను తీసుకోమంటాడు హరప్ప ‘’నేను మీ చిన్నప్పటి నుంచీ ‘’ మీ దివానునే ‘’అని చమత్కారం గా అన్నాడు  . స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు పూర్ణమి నుండి ప్రారంభ మయ్యాయి కూచి పూడి వారి కలాపాలు గిరిక భక్తీ భావం తో అంకిత భావం తో చేసిన మాట్శ్యావతార నృత్యం రసో వై సహః అన్నట్లు ఉంది .మర్నాడు కూర్మావతార నృత్యాన్ని చేయటానికి మనసంతా కూర్మ నాదునిపై లగ్నం చేయమని ధర్మ గిరికకు బోధించి కర్తవ్య పరాయణురాలీని గా చేయటం అతాని పెద్దరికాన్ని తెలియ జేస్తుంది .రంగా రావు కు చిన్న రామేశ్వర శాస్త్రి కనిపిస్తే అతనిలో పెద్దాయన కనీ పించి తాను యా కుటుంబాన్ని  దూరం చేసుకొన్నందుకు పశ్చాత్తాప పడ్డాడు .కోప్పదతాదనుకొన్న రంగారావు బాగా మాట్లాడటం చూసి చిన్న శాస్త్రి కూడా సంతోషించటం అతని ప్రవర్తన ,ఆలోచనలలో మార్పుకు మరో ఆకు తొడిగి నట్లే .ఇదీ పునర్వైభావానికి మరొక ఆకు ..స్వామి కల్యాణాని కి బంధుజనం అంతా ధర్మా రావు ఇంటికి వస్తే ఇదే పెళ్లి ఇల్లుగా అని పించి ఏంతో మురిసిపోయారు భార్య భర్తలు ..ఆ రోజుల్లో దేవుడి పెళ్ళికి ఊరంతా వైభోగం అన్నా మాట రుజువైంది అరుంధతి తెమ్మన్న చీర గొప్పతనాన్ని ఆమె వర్ణిస్తున్నప్పుడు ఆమె కూడా కావ్య సృష్టి చేసే సత్తా కలిగి ఉందని ప్రసంషించాడుభర్త . .కుమారస్వామి ధర్మ తో సలిపిన సంభాషణం సందర్భోచితం రంగారావు లేవలేక పోయినా కల్యాణానికి ఇస్తున్న చేయూతను ధర్మ కొని యాడిఅతనిలో ధర్మం మళ్ళీ పాదుకొంటున్నందుకు అందరం ఆనందిస్తాం .ఈ మార్పే విశ్వనాధ కోరింది అందుకే ఈ నవల రాసింది కూడా .మరో సారి హైదరాబాద్ ఆకాశ వాణి.  వారిని ,ఈ నాటకం ఇంత రసవత్తరం గా తీర్చి దిద్దిన వారందరినీ మనసారా అభినందిస్తున్నాను

గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-13-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి

 

మాయనై మనునవడ మదరైమైన్దనై
తూయ పెరునీర్ యమునైత్తు రైవనై
ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై
తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై
తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్
తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!!

ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఒకచోట చేరారు. అయిదు లక్షల గృహాలలో ఉండే గోపికలంతా అక్కడ చేరేసరికి ఆండాళ్ తల్లి ఆనందానికి అంతులేదు. ఈ మహా వ్రతం చేయడంలో ఎటువంటి ఆటంకాలూ ఎదురు కావని ఆమె ఘంటా పథంగా చెబుతోంది. నిజానికి అందులో ఒక గోపికకు ఓ సందేహం కలిగింది. “ఇంత పెద్దయెత్తున వ్రతం చేస్తున్నాం. దీనికి ఆటంకాలేవీ తలెత్తకుండా, చివరి వరకూ సజావుగా కొనసాగుతుందా” అని. ఆండాళ్ మాత్రం ఎటువంటి విఘ్నాలూ కలగవని గట్టి నమ్మకంతో ఉంది. ఈ మహా వ్రతం చేయడంలో ఎటువంటి ఆటంకాలూ రావని ఆమె అందరికీ అభయమిచ్చింది.
“శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞకు భంగం కలిగినా సరే, ఆశ్రితుల ప్రతిజ్ఞ నెరవేర్చే కల్యాణ గుణాలు కలవాడట. అందుకే కదా, మహాభారత యుద్ధంలో తాను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి, తనతో ఆయుధం పట్టిస్తానన్న భీష్మాచార్యుడి ప్రతిజ్ఞ నెరవేరడానికి చక్రాయుధం పట్టాడు! ఆయన మన కోసం మధురా నగరంలో జన్మించాడు. సర్వజగత్ కారణమైనవాడు, సర్వజగత్ వ్యాపకమైనవాడు, గోప వంశంలో ప్రకాశించే మణి దీపం వంటివాడు. ఆయననే నమ్ముకుని ఆయన తిరునామ సంకీర్తనతో ఈ వ్రతాన్ని చేస్తే, ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలన్నీ నిప్పులో పడ్డ దూదిపింజల్లాగా నశించిపోతాయి. కనుక మీకు ఇక ఎటువంటి సందేహమూ అక్కర లేదు. పరమాత్మ సంకీర్తన చేస్తూ వ్రతం చేద్దాం రండి!” అని ఆండాళ్ తల్లి గోపికలందరినీ ఆహ్వానిస్తోంది.
ఆశ్చర్యకరమైన కల్యాణ గుణాలు కలవాడట పరమాత్మ. యశోదమ్మ బిడ్డడై, సర్వసులభుడై ఉండడమే కాకుండా, వెన్నె దొంగలించి, ఆ దొంగతనంతో పట్టుబడిపోయి, రోలుకు బందీ అయి, దామోదరుడయ్యాడు. అంతేకాక, కీర్తిగల మధురానగర నాయకుడట. ఉత్తర దిక్కులో ఉన్న మధురా నగర కీర్తి ఏమిటంటే, కృత యుగంలో వామనుడుగా అవతరించడం వల్ల, త్రేతాయుగంలో లవణాసురుడిని సంహరించిన శత్రుఘ్నుడు పరిపాలించడం వల్ల, ద్వాపర యుగంలో సాక్షాత్ కృష్ణ భగవానుడు అవతరించడం వల్ల, ఇక ప్రతి యుగంలోనూ ఈ నగరానికి భగవత్ సంబంధం ఉండడం వల్ల మధురకు ఈ విశిష్టత కలిగిందట.
అంతేకాక, పరిశుద్ధమైన జలంతో నిండిన యమునా నది ఒడ్డున విహరించే శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిద్దాం రండని కూడా ఆండాళ్ పిలుస్తోంది. యమునా నదికి ఉండే పరిశుద్ధత ఏమిటంటే, వానాకాలంలో ఉధృతంగా ప్రవహించే యమునా నది చిన్ని కృష్ణుడిని తీసుకుని పోతున్న వసుదేవుడికి మోకాటి లోతు దారి ఇచ్చిన పరిశుద్ధమైన నది అట. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి యుమునా నదిలో జల క్రీడలాడడం వల్ల (అంటే భగవత్, భాగవతోత్తముల సంబంధం అన్న మాట) యమునా నది పవిత్రమైందట. మనమంతా పరిశుద్ధమైన మనసుతో, ప్రతిఫలం ఆశించకుండా పుష్పాలతో పూజించి, భగవంతుడి దివ్య మంగళ విగ్రహాన్ని మనసులో నిలుపుకొని, ఆయన నామ సంకీర్తనం చేద్దాం రండని కూడా ఆండాళ్ ఆహ్వానిస్తోంది. ఆటంకాలు కలుగుతాయనే సందేహం అక్కర లేదని ఆండాళ్ ఈ అయిదవ రోజున గోపికలకు మరీ మరీ చెబుతోంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -7

సినీ గీతా మకరందం -7

‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం

ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది .నాగేశ్వర రావు సావిత్రి ,కృష్ణ కుమారి ,రేలంగి గుమ్మడి తారలు తళుకు లీనారు .నేత్ర పర్వం గా సినిమా నడిచి ఆనందాన్నిస్తుంది .’’విని పించని రాగాలే ‘’అన్న పాట అందరూ మెచ్చుకోన్నదే .మిగిలిన గీతాలు హాయి చేకూర్చేవే .అయినా నాకు బాగా నచ్చిన గీతం ‘’కిల కిల నవ్వులు చిలికిన ‘’.ఆ గీత సౌభాగ్యం ఇదుగో –

‘’కిలకిల నవ్వులు చిలికిన –పలుకును నాలో బంగారు వీణ

కరిగిన కలలే నిలిచిన –నింపెను నాలో మందార మాల

రమ్మని మురళీ రవళులు పిలిచే –ఆణువణువూ బృందావని లో నిలిచే

తళతళ లాడే తరగల పైన –ఆందీ అందని అందాలు మెరిసే

నీ ఉన్న వేరే సింగారములేల? –మమతలు  నీ పాద ధూళి సిందూరము కాదా ?

మమతలు చూసి ,మాయలు చేసి-గళమున నిలిచిన కళ్యాణి నీవే

నీ కురులే నను సోకిన వేళ –హాయిగా రగిలెను తీయని జ్వాల

గలగల పారే వలపుల లోన –సాగెను జీవన రాగాల నావ

ఇద్దరు –కిల కిల నవ్వులు చిలికిన –పలుకును నాలో అన్గారు వీణ

అతడు నవ్వుల్నీ కిల కిలా చిలికిస్తే  –  ఆమే మదిలో బంగారు వీణ పలుకుతుందిట కిలకిల అన్న మాటల్లో నవ్వును అద్భుతం గా పలికించాడు సినారె .ఆ నవ్వుల్నీ అంత అందం గానూ చిలికించాడు రస బ్రహ్మ సాలూరి .ఇద్దరి కలయికతో మహా ఆనంద మందిరం వెలసిన్దిక్కడ .కలలు కరిగి నిలిచాయట .అప్పుడామే కు మందారా మాల మేడలో నిమ్పినట్లయింది .మందార మాల అనటం లో వివాహం అవబోతుందనే చక్కని ధ్వని ఉంది   మందార మాల వివాహ

చిహ్నం గా కవులు భావించారు రాశారు .రారమ్మని మురళీ స్వనాలు పిలిస్తే శరీరం లోని ప్రతి అణువు బృందావనం లో నిలిచినట్లు ఉందట .బృందావనం రాస క్రీడకు బహు చక్కని ప్రదేశం .రాదా మాధవ దివ్య ప్రేమకువిహార భూమి అదే .అలాంటి ప్రేమనే వారిద్దరూ కోరుకున్నారు .నీటి తరగలు తళ తళ లాడుతుంటే అంది నట్లు కనీ పించి అందకుండా పోతున్న అందాలు మేరిశాయట.ఆమె మరీ మురిపెం గా ఆతను ఉంటె వేరే నుదుట సిందూరం ఎండుకన్నది .ఆతని పాద ధూళే సిందూరం అవుతుందని ఏంతో సంతృప్తి గా సంతోషం గా అన్నది .పాద ధూళి సిందూరం గా భావించటం ఈ నాటి ఆడపిల్లలకు రుచిన్చాదేమో కాని 1963 లో వచ్చిన ఆ కాలం లో ఇంకా ఆభావం పూర్తిగా స్త్రీలలో ఉంది .

మమతలు చూసి మాయలు చేసి ఆమె తన గళం లో కల్యాణి గా నిలిచింది .కల్యాణి రాగం గా మారిందని భావ గర్భితమైన మాటను నారాయణ రెడ్డి అనటం ఆయన పాండిత్య ప్రకర్ష కు గీటు రాయి గా నిలిచింది .ఆమె కురులు అతన్ని తాకినసమయం లో ఆతనిలో తీయని జ్వాల రగిలింది .ప్రేమ జ్వాల గావర్ణించటం  మాత్రమే  కాదు దాన్ని తీయని జ్వాల అనటం సి నా రే ప్రత్యేకం   జ్వాలకు తియ్యదనం ఆపాదించటం ఆయన గొప్ప పలుకు బడి వంపుల్లో గల గలా సాగుతుంటే జీవన రాగాల వాన విరుస్తోంది .ఇద్దరూ కలిసి హాయిగా ఆనందం గా నవ్వులు చిలికారు .వలపు బంగారు వీణ ను మీటుకొని మురిశారు .మై మరచారు .హద్దులు దాటని ఆత్మీయత .చదువుకొన్న అమ్మాయి మనసులో పలికిన భావ వీణ ,అతని ముందు కరిగిన ఆమె హృదయ వీణ .

ఘంట సాలమేస్టారు   సుశీల పాడిన అతి కమ్మని పాట.అధిక చక్కని తెలుగుదనం ,హృదయాలను కరిగించే రాగాలు .సు స్వరాలు . అందమైనబృందావనం లో విహరించిన అను భూతి ,సెలయేటి అందాల గలగలలు ,కలబోసి పండించిన ఆదుర్తి దార్శనికత కు జేజేలు పలకాలని పిస్తుంది . వీణ సొగసులు ఏటి గలగలలు ,తరంగాలపై తళుకులు సావిత్రీ అక్కినేని లు  అందాలు ఆరబోశారు అన్నీ అనుభవైక వేద్యం చేసిన అన్న పూర్నా బృందం అభి నంద నీయం .అందుకే గీతా మకరందం అయింది .

మరో మకరంద బిందువు ను తర్వాత ఆస్వాదిద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-13-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర

 

నా దారి తీరు -57

నా మొదటి ఉత్తర దేశ యాత్ర

కాశీ యాత్ర

మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా  కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు .ఏ ట్రెయిన్ ఎక్కాలో ఎప్పుడు దిగాలో అక్కడి నుంచి అనుకొన్న ప్రదేశానికి ఎలా వెళ్ళాలో ,అక్కడ ఏమేమి ముఖ్యమైనవి చూడాలో ఆయన ఇదివరకే వాళ్ళ అమ్మగారిని నాన్న గారిని  మా అక్కయ్యా వాళ్ళని తిప్పి చూపించాడు కనుక అన్నీ కొట్టిన పిండే .రిజర్వేషన్ లేదు ఖాళీ చూసి రైల్ పెట్టెలో కూర్చోవటమే .మొదటకాశీ వెళ్ళిన జ్ఞాపకం .అక్కడ స్టేషన్ లో దిగగానే వందలాది ‘’పండా’’లు మూగి మనల్ని ఏమీ ఆలోచించుకో నీకుండా మా దగ్గరకు రమ్మంటే మా దగ్గరకు రమ్మని ఒత్తిడి చేయటం మొదటి సారి చూశా .బావ కు హిందీ బాగా వచ్చు కనుక వీళ్ళని తప్పించుకొని ‘’జోషీ’’ అనే పండా వాళ్ళ మనుష్యులను గుర్తు పెట్టుకొని వాళ్ళతో జోషీ పండా దగ్గరికి రిక్షాలోనో జట్కా లోనో తీసుకొని వెళ్ళాడు అక్కడ ముందే రూమ్ తీసుకొన్నాడు కనుక సామాను అక్కడ పడేసి కాల కృత్యాలు తీర్చుకొన్న తర్వాత పండా ఏర్పాటు చేసిన మనిషి తో గంగా ఘాట్ కు వెళ్లాం .అక్కడ మంత్రం పూర్వకం గా స్నాన విధి పూర్తీ చేసుకోన్నాం చని పోయిన మా పెద్దలకు  హిరణ్య శ్రార్ధం పెట్టాను .బానే చేయించాడు .వీళ్ళకు తెలుగు బాగానే వచ్చు చక్కగా మాట్లాడుతారు .భోజనం కూడా జోషీ వాళ్ళ దగ్గరే ఏం పెట్టాడో ఏం తిన్నామో గుర్తు లేదు ఏంటో మంది ఆయన ఇంటి వద్దే కాశీ సమారాధన చేసుకొంటారు .అందరూ బ్రాహ్మలనే పిలిపించి చేయగలదు ఒక పూట ఇలాంటి భోజనం చేశామను కొంతా ..సాయంత్రం శ్రీ విశ్వేశ్వర దర్శనం హాయిగా చేసుకోన్నాం అన్నపూర్ణా విశాలాక్షీ అమ్మవార్ల దర్శనమూ బాగా జరిగింది .కాల భైరవ దర్శనం కూడా టాంగావెళ్లి చేశాం .తరువాత కాశీ విశ్వ విద్యాలయానికి తీసుకొని వెళ్ళాడు బావ అదంతా తిరిగి చూశాం .మా చిన్న తనం లో మదన మోహన మాలవ్యా గారు ఈ విద్యాలయానికి చేసిన సేవ ,నిర్మాణానికి ఆర్ధిక వనరుల కోసం పడిన ఇబ్బందులూ ,అనుకోకుండా ఒక ఆంగ్లేయుడికి కూలీ గా మారిన వైనం అన్నీ గుర్తుకొచ్చాయి ఆ మహాను భావుడి త్యాగాన్ని మనసారా స్మరించుకోన్నాను యూని ని వర్సిటి లో ఆయన విగ్రహానికి మనసారా నమస్కరించాను .

ఒక రోజు సారనాద్ యాత్ర ఉదయం చేశాం అక్కడి బౌద్ధ సంస్కృతిని ,అశోక ధర్మ చక్రాన్ని,మనజాతీయ చిహ్నమైన మూడు సింహాలను .ఆరామాలను చైత్యాలను తిరిగి కనులారా చూశాం .అప్పుడు టాంగాలే అన్నిటికీ .సాయంత్రం పడవ లో ఉత్తర కాశి(వ్యాస కాశి ) వెళ్లి కాశీ రాజు కోట ,లాల్ బహదూర్ శాస్త్రి గారిల్లు మొదలైన వన్నీ సందర్శించం వీటన్నిటి వివరాలూ బావ మాకు చెబుతూనే ఉన్నాడు అప్పుడు గంగ మీద వ్యాసకాశికి బ్రిడ్జి లేదు .పడవలో అందరితో బాటు అన్ని ఘాట్లు చూసి నట్లు జ్ఞాపకం అప్పుడు ఆంధ్రాశ్రమమూ లేదనుకొంటా .కరివేన వారి

సత్రమూ  ఈ మధ్య వచ్చిందే .మణికర్ణికా ఘాట్ ,హరిశ్చంద్ర నారద ఘాట్ లలో స్నానిన్చాం .శవాలను కాల్చటం సగం కాలిన వాటిని గంగాలోకి తోసెయ్యటం గురించి కధలు విన్నా ఇప్పుడు స్వయం గా చూశా.కాశీలో మరణం ముక్తి హేతువే .కాశీలోని ఇరుకు సందులు ,ఆవులు రాసుకొంటూ వెళ్ళటం దారంతా ఆవుపేడ తో ఉండటం ,జ్ఞాపకం ఉన్నాయి .మీగడ (మలాయి ),స్వీట్లు కొని తినిపించేవాడు .చిక్కని పాలు తాగే వాళ్ళం .అలాగే చిన్న కుండల్లో తోడూ బెట్టిన పెరుగు కొని తినే వాళ్ళం తియ్యగా కమ్మగా ఉండేది రాత్రికి పూరీ కూర తినే వాళ్ళం అక్కడ అప్పటికి దక్షిణాది హోటల్లు పెద్దగా లేవు. ఏదో ఒకటి ఉన్నట్లు గుర్తు అక్కడ ఇడ్లీ తిని కాఫీ తాగామని జ్ఞాపకం .జోషీ పండా తెలుగు వాడే నంటారు అప్పుడు ఉన్నాడు. తెలుగు మాట్లాడాడు .అన్నీ చేయిస్తాడు. చాలా మంది ఆయన చేతిలో ఉంటారు .పచ్చగా దబ్బ పండు ఛాయా తో నుదుట పొడుగాటి బొట్టు తో పంచె లాల్చీతో ఉండేవాడు భారీ పర్సనాలిటి తాంబూలం బుగ్గన ఎప్పుడూ ఉండేది .ఉత్తర దేశం లో ఇది మామూలే దేవాలయం లో పూజార్లు చొక్కాలతో ఉండటం మొదట ఇక్కడే చూసి ఆశ్చర్య పోయాను .మెడలో రుద్రాక్షమాలలు గంధం బొట్టు తో పండాలు అట్రాక్షన్ తో ఉంటారు .ఆడవారికి భక్తీ ఎక్కువ ..విశ్వేశ్వరాలయం లో రద్దీ ఉండేదే కాదు ఎన్ని సార్లైనా దర్శనం చేసుకోవచ్చు స్వయం గా గంగా జలం తెచ్చి అభిషేకించ వచ్చు అలానే చేసే వాళ్ళం .గంగా జలం రాగి చెంబుల్లో సీల్ వేయించి తీసుకొన్నాం

ప్రయాగ యాత్ర

కాశీ నుంచి అలహా బాద్ అనే ప్రయాగ కు ఉదయానికల్లా చేరేట్లు వెళ్లాం .అక్కడ హరి జగన్నాధ శాస్త్రి గారింటికి వెళ్లాం ఆయనా ఆంద్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్తిర పడ్డ వాడే. మంచి తెలుగు మాట్లాడేవాడు .భార్య కూడా అందర్నీ పలకరించేది. అప్పటికి చిన్న ఇల్లు మాత్రమె ఉండేది ఆయన కుదిర్చిన పురోహితుడితో త్రివేణీ సంగమానికి వెళ్లాం .గంగా యమునా సరస్వతి నదుల సమ్మేళనం .మహాదానందమేసింది ఇప్పటి దాకా వినటమే .ఇప్పుడు ప్రత్యక్షం గా చూడటం ఏంటో సంతృప్తి నిచ్చింది భక్తీ తో త్రివేణీలకు నమస్కరించి స్నాన విధి మంత్రాలతో స్నానం చేశాం ఇక్కడ కూడా హిరణ్యం పెట్టాను .బాగా చేయించారు వీళ్ళ రేటు బావ మాట్లాడి ఉంచాడు కనుక ఆయన ఇవ్వ మన్నదే ఇచ్చాను కాశీ లోను ఇక్కడా కూడా .పడవ లో సాగర సంగమం కు వెళ్లి పడవను పట్టుకొని అక్కడ ఉన్న త్రాళ్ళ సహాయం తో స్నానం చేయాలి నల్లని నీరు యమునా వి తెల్లనివి గంగామ్మవి సరస్వతి అంతర్వాహిని .ఇక్కడా అప్పుడు.నీటి ప్రవాహం మహా వేగం గా ఉంది కాల్లు కిందనిలవలేదు .కొంతకంగారు కొంత ఆనందం కొంత ఆశ్చర్యం త్రివేణీ సంగమ మైంది నాకు  జనం తక్కువే .అన్నీ యధావిధిగా చేశారు .అక్కడినుండి కోట చూశాం.అందులో ప్రతిదీ మాకు దగ్గరుండి చెబుతూ చూపించాడు బావ .భరద్వాజ ఆశ్రమం ,నెహ్రూ గారి ఎస్టేట్ అన్నీ తిరిగి చూశాం .హోజనం హరి వారి ఇంట్లోనే  చేశామేమో ఆయనే టాం గా  మాట్లాడి ఇవన్నీ చూసే ఏర్పాటు చేశాడు అలహా బాద్ ను ఇక్కడ ‘’ఇలహా బాద్ ‘’అని హిందీలో రాస్తారు .అక్కడి నుంచి కాన్పూర్ కూడా వెళ్లాం కాన్పూర్ చెప్పులకు ప్రసిద్ధి ఊరికే రోడ్ల మీద తిరిగామని గుర్తు .

  గయా సందర్శనం

రాత్రి ట్రెయిన్ లో బయల్దేరి గయకు  ఉదయానికే చేరేట్లు వెళ్లాం అక్కడ కూడా పిత్రువిది చేశాను అశ్వత్థ వృక్షం గయ పాదాలు బాగున్నాయి ఇక్కడ జనం బాగానే ఉన్నారు .అన్నం అప్పటి కప్పుడు వండి శ్రార్ధం పెట్టించారు .విష్ణు మూర్తిని దర్షించాము .భోజనం చేసిన గుర్తు లేదు .మధ్యాహ్నం బయల్దేరి బుద్ధ గయ వెళ్లాం .దాదాపు పది కిలో మీటర్ల దూరం గాడ్పు బాగా కొట్టింది .మన లాగా ఇక్కడెక్కడా సోడాలు దొరకవు .దొరికిన చోట్ల మంచి నీళ్ళు తాగుతూ బుద్ధ గయ చేరాం  బుద్ధుడు  తపస్సు చేసిన చెట్టు అక్కడి ఆలయాలు బౌద్ధ సన్యాసులు బుద్ధ విగ్రహాలు చూడ ముచ్చట గా ఉన్నాయి. బుద్ధుని గురించి విన్నవీ చదివినవీ గుర్తుకొచ్చి బుద్ధ భగవానుడిని మనసారా స్మరించుకోన్నాను .బౌద్ధ సన్యాసులను చూడటం ఇదే మొదటి సారి .వాళ్ళ వస్త్ర ధారణ చదివే మంత్రాలు ధ్యానం వింత గొలిపాయి అక్కడ రాత్రికి బయల్దేరి మళ్ళీ ఉదయానికి జంతారా చేరుకొన్నాం .ఇదొక మినీ ట్రిప్ .ప్రశాంతం గా మొదటి సారిగా ఉత్తర దేశ పుణ్య క్షేత్ర సందర్శనం పూర్తయింది బావ చేదోడు వలన .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-13-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment