బిల్ పోర్టర్
ఆ దర్శ జీవితం గడిపి మార్గ దర్శి అయిన బిల్ పోర్టర్ అనే ఆయన గురించి అతని ఏజెంట్ షెల్లీ బ్రాడి రాసిన జీవిత చరిత్ర ఇది . బిల్ పోర్టర్ అమెరికా లోని ఒరిగాన్ రాష్ట్రం లో పోర్ట్ లాండ్ లో జన్మించాడు . బిల్ పోర్టర్ పుట్టుక తోనే ‘’సెరిబ్రల్ పాస్సి ‘’అనే జబ్బుతో పుట్ట్టాడు .తల్లి పురిటి నొప్పులు పడుతుండగా కడుపు లో ఉన్న బిల్ అడ్డం తిరిగాడు .’’ఫోర్సేప్స్ ‘’ఉపయోగించి బిడ్డ ను బయటికి తీయటం వల్ల మెదడు దెబ్బ తింది .మాటలు సరిగా రాలేదు .కండరాలు సహక రించలేదు బిల్ పోర్టర్ కు .అందుకని మామూలు స్కూల్ లో కాకుండా ఇలాంటి వారికోసం ఉన్న ప్రత్యెక స్కూల్ లో చేర్పించారు .
బిల్ తల్లి తండ్రి అక్క కూడా అక్కడే ఉద్యోగం లో చేరారు అతనికి సాయం గా ఉండటం కోసం ..చదువు పూర్తీ అవగానే ఉద్యోగం చూసుకోమన్నాడు తండ్రి .చాలా ఇంటర్వ్యు లకు వెళ్ళాడు పోర్టర్ .చివరికి సేల్స్ మాన్ గా ట్రయల్ బేసిస్ మీద ఉద్యోగం వచ్చింది .డిటర్జెంట్ వగైరాలు అమ్మే పని లో చేరాడు .ఒక సూట్ కేసు లో వాటిని తీసుకొని ఇంటింటికీ తిరిగి రోజుకు వంద ఇళ్ళ తలుపు తట్టే వాడు .చాలా మంది తమకు వద్దు అనే వాళ్ళు .కోప తాపాలు లేకుండా విసుక్కో కుండా చిరు నవ్వే సమాధానం గా వెళ్లి పోయే వాడు .చివరికి అతని మంచితనం మీద అందరికి గౌరవం ఏర్పడి కస్టమర్స్ ఏర్పడ్డారు .ఎక్కడికి వెళ్ళినా ఎన్నిఇళ్ళు తిరిగినా అంతా నడక తోనే చేరే వాడు .తెల్ల వారు జామున నాలుగు గంటలకు లేచి తన కార్య క్రమాలన్నీ పూర్తీ చేసుకొని ఎనిమిదింటికి ఇంటి నుంచి బయల్దేరే వాడు .తన సరుకును ఎవరు కొన్నా ,కొనక పోయినా అతనికి చింత ఉండేది కాదు .రొటీన్ మార్చలేదు .ఇలానే జీవితం సాగించాడు పట్టువదలని విక్రమార్కుడి లా చివరికి అనుకొన్నది సాధించాడు ‘’బెస్ట్ సేల్స్ మాన్ అవార్డ్ ‘’పొందాడు .షెల్లీ ని ఉద్యోగం లో పెట్టుకొని తిరిగే వాడు .కొంతకాలానికి అమెరికా లోనే సెలబ్రేటేడ్ పెర్సన్ అయ్యాడు బిల్ పోర్టర్ .ఎన్నో టి.వి.ఇంటర్వ్యు లు చేస్సిన్ది షెల్లీ.అతని జీవితాన్ని సినిమా గా కూడా తీశారు .
వాషింగ్ టన్ డి.సి. లో జే.ఎఫ్ కే సెంటర్ లో బిల్ పోర్టర్ 66వ జన్మ దినోత్సవాన్ని ఆ కంపెనీ వారు ఏర్పాటు చేశారు సేల్స్ మెన్ అందరూ అశేష సంఖ్య లో హాజరై గౌరవ పూర్వకం గా నిలబడి చప్పట్లు చరిచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు .తరువాత సాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ఇలానే జరిపారు . .ఆ తర్వాతఫోన్ ద్వారా కస్టమర్ లకు ఆర్డర్ తీసుకొని అందజేయటం మొదలు పెట్టి వ్యాపారం పెంచాడు .పోర్టర్ జీవితాన్నుంచి తాను ‘’టెన్ కమాండ్ మెంట్స్ ‘’తీసుకొన్నానని ఏజెంట్ అయిన షెల్లీ చెప్పింది .అవే ‘’faith ,divine nature ,individual worth ,knowledge ,choice and accountability ,good works ,integrity ,family values ‘’
పోర్టర్ జీవితాన్ని గురించి తెలుసు కొని చాలా మంది అభిమానం తో ఉత్తరాలు రాశారు .తమ జీవితాలను తీర్చి దిద్దు కొన్నారు .పోర్టర్ జీవితం ‘’is a sterling example that each of us can overcome any adversity set back or handicap. Bill is inspirational to every one ‘’అని పూర్తీ చేస్తుంది బిల్ పోర్టర్ చరిత్రను అతని ఏజెంట్ అయిన షెల్లీ బ్రాడి.
బిల్ పోర్టర్ కున్న టెన్ కమాండ్ మెంట్స్ ఏమిటో తెలుసు కొందాం
1-follow your passion -2-it does not matter how you got here only where you are going 3-mother knows best 4-persistence pys off 5-do not take ‘’no’’for an answer 6-know your limits and reach beyond them 7-be a team player 8-if it is not broken do not fix it 9-there are no obstacles 10-live your values .’’
3-10-2002బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి
2014 నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-13-ఉయ్యూరు
