నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర

 

నా దారి తీరు -57

నా మొదటి ఉత్తర దేశ యాత్ర

కాశీ యాత్ర

మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా  కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు .ఏ ట్రెయిన్ ఎక్కాలో ఎప్పుడు దిగాలో అక్కడి నుంచి అనుకొన్న ప్రదేశానికి ఎలా వెళ్ళాలో ,అక్కడ ఏమేమి ముఖ్యమైనవి చూడాలో ఆయన ఇదివరకే వాళ్ళ అమ్మగారిని నాన్న గారిని  మా అక్కయ్యా వాళ్ళని తిప్పి చూపించాడు కనుక అన్నీ కొట్టిన పిండే .రిజర్వేషన్ లేదు ఖాళీ చూసి రైల్ పెట్టెలో కూర్చోవటమే .మొదటకాశీ వెళ్ళిన జ్ఞాపకం .అక్కడ స్టేషన్ లో దిగగానే వందలాది ‘’పండా’’లు మూగి మనల్ని ఏమీ ఆలోచించుకో నీకుండా మా దగ్గరకు రమ్మంటే మా దగ్గరకు రమ్మని ఒత్తిడి చేయటం మొదటి సారి చూశా .బావ కు హిందీ బాగా వచ్చు కనుక వీళ్ళని తప్పించుకొని ‘’జోషీ’’ అనే పండా వాళ్ళ మనుష్యులను గుర్తు పెట్టుకొని వాళ్ళతో జోషీ పండా దగ్గరికి రిక్షాలోనో జట్కా లోనో తీసుకొని వెళ్ళాడు అక్కడ ముందే రూమ్ తీసుకొన్నాడు కనుక సామాను అక్కడ పడేసి కాల కృత్యాలు తీర్చుకొన్న తర్వాత పండా ఏర్పాటు చేసిన మనిషి తో గంగా ఘాట్ కు వెళ్లాం .అక్కడ మంత్రం పూర్వకం గా స్నాన విధి పూర్తీ చేసుకోన్నాం చని పోయిన మా పెద్దలకు  హిరణ్య శ్రార్ధం పెట్టాను .బానే చేయించాడు .వీళ్ళకు తెలుగు బాగానే వచ్చు చక్కగా మాట్లాడుతారు .భోజనం కూడా జోషీ వాళ్ళ దగ్గరే ఏం పెట్టాడో ఏం తిన్నామో గుర్తు లేదు ఏంటో మంది ఆయన ఇంటి వద్దే కాశీ సమారాధన చేసుకొంటారు .అందరూ బ్రాహ్మలనే పిలిపించి చేయగలదు ఒక పూట ఇలాంటి భోజనం చేశామను కొంతా ..సాయంత్రం శ్రీ విశ్వేశ్వర దర్శనం హాయిగా చేసుకోన్నాం అన్నపూర్ణా విశాలాక్షీ అమ్మవార్ల దర్శనమూ బాగా జరిగింది .కాల భైరవ దర్శనం కూడా టాంగావెళ్లి చేశాం .తరువాత కాశీ విశ్వ విద్యాలయానికి తీసుకొని వెళ్ళాడు బావ అదంతా తిరిగి చూశాం .మా చిన్న తనం లో మదన మోహన మాలవ్యా గారు ఈ విద్యాలయానికి చేసిన సేవ ,నిర్మాణానికి ఆర్ధిక వనరుల కోసం పడిన ఇబ్బందులూ ,అనుకోకుండా ఒక ఆంగ్లేయుడికి కూలీ గా మారిన వైనం అన్నీ గుర్తుకొచ్చాయి ఆ మహాను భావుడి త్యాగాన్ని మనసారా స్మరించుకోన్నాను యూని ని వర్సిటి లో ఆయన విగ్రహానికి మనసారా నమస్కరించాను .

ఒక రోజు సారనాద్ యాత్ర ఉదయం చేశాం అక్కడి బౌద్ధ సంస్కృతిని ,అశోక ధర్మ చక్రాన్ని,మనజాతీయ చిహ్నమైన మూడు సింహాలను .ఆరామాలను చైత్యాలను తిరిగి కనులారా చూశాం .అప్పుడు టాంగాలే అన్నిటికీ .సాయంత్రం పడవ లో ఉత్తర కాశి(వ్యాస కాశి ) వెళ్లి కాశీ రాజు కోట ,లాల్ బహదూర్ శాస్త్రి గారిల్లు మొదలైన వన్నీ సందర్శించం వీటన్నిటి వివరాలూ బావ మాకు చెబుతూనే ఉన్నాడు అప్పుడు గంగ మీద వ్యాసకాశికి బ్రిడ్జి లేదు .పడవలో అందరితో బాటు అన్ని ఘాట్లు చూసి నట్లు జ్ఞాపకం అప్పుడు ఆంధ్రాశ్రమమూ లేదనుకొంటా .కరివేన వారి

సత్రమూ  ఈ మధ్య వచ్చిందే .మణికర్ణికా ఘాట్ ,హరిశ్చంద్ర నారద ఘాట్ లలో స్నానిన్చాం .శవాలను కాల్చటం సగం కాలిన వాటిని గంగాలోకి తోసెయ్యటం గురించి కధలు విన్నా ఇప్పుడు స్వయం గా చూశా.కాశీలో మరణం ముక్తి హేతువే .కాశీలోని ఇరుకు సందులు ,ఆవులు రాసుకొంటూ వెళ్ళటం దారంతా ఆవుపేడ తో ఉండటం ,జ్ఞాపకం ఉన్నాయి .మీగడ (మలాయి ),స్వీట్లు కొని తినిపించేవాడు .చిక్కని పాలు తాగే వాళ్ళం .అలాగే చిన్న కుండల్లో తోడూ బెట్టిన పెరుగు కొని తినే వాళ్ళం తియ్యగా కమ్మగా ఉండేది రాత్రికి పూరీ కూర తినే వాళ్ళం అక్కడ అప్పటికి దక్షిణాది హోటల్లు పెద్దగా లేవు. ఏదో ఒకటి ఉన్నట్లు గుర్తు అక్కడ ఇడ్లీ తిని కాఫీ తాగామని జ్ఞాపకం .జోషీ పండా తెలుగు వాడే నంటారు అప్పుడు ఉన్నాడు. తెలుగు మాట్లాడాడు .అన్నీ చేయిస్తాడు. చాలా మంది ఆయన చేతిలో ఉంటారు .పచ్చగా దబ్బ పండు ఛాయా తో నుదుట పొడుగాటి బొట్టు తో పంచె లాల్చీతో ఉండేవాడు భారీ పర్సనాలిటి తాంబూలం బుగ్గన ఎప్పుడూ ఉండేది .ఉత్తర దేశం లో ఇది మామూలే దేవాలయం లో పూజార్లు చొక్కాలతో ఉండటం మొదట ఇక్కడే చూసి ఆశ్చర్య పోయాను .మెడలో రుద్రాక్షమాలలు గంధం బొట్టు తో పండాలు అట్రాక్షన్ తో ఉంటారు .ఆడవారికి భక్తీ ఎక్కువ ..విశ్వేశ్వరాలయం లో రద్దీ ఉండేదే కాదు ఎన్ని సార్లైనా దర్శనం చేసుకోవచ్చు స్వయం గా గంగా జలం తెచ్చి అభిషేకించ వచ్చు అలానే చేసే వాళ్ళం .గంగా జలం రాగి చెంబుల్లో సీల్ వేయించి తీసుకొన్నాం

ప్రయాగ యాత్ర

కాశీ నుంచి అలహా బాద్ అనే ప్రయాగ కు ఉదయానికల్లా చేరేట్లు వెళ్లాం .అక్కడ హరి జగన్నాధ శాస్త్రి గారింటికి వెళ్లాం ఆయనా ఆంద్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్తిర పడ్డ వాడే. మంచి తెలుగు మాట్లాడేవాడు .భార్య కూడా అందర్నీ పలకరించేది. అప్పటికి చిన్న ఇల్లు మాత్రమె ఉండేది ఆయన కుదిర్చిన పురోహితుడితో త్రివేణీ సంగమానికి వెళ్లాం .గంగా యమునా సరస్వతి నదుల సమ్మేళనం .మహాదానందమేసింది ఇప్పటి దాకా వినటమే .ఇప్పుడు ప్రత్యక్షం గా చూడటం ఏంటో సంతృప్తి నిచ్చింది భక్తీ తో త్రివేణీలకు నమస్కరించి స్నాన విధి మంత్రాలతో స్నానం చేశాం ఇక్కడ కూడా హిరణ్యం పెట్టాను .బాగా చేయించారు వీళ్ళ రేటు బావ మాట్లాడి ఉంచాడు కనుక ఆయన ఇవ్వ మన్నదే ఇచ్చాను కాశీ లోను ఇక్కడా కూడా .పడవ లో సాగర సంగమం కు వెళ్లి పడవను పట్టుకొని అక్కడ ఉన్న త్రాళ్ళ సహాయం తో స్నానం చేయాలి నల్లని నీరు యమునా వి తెల్లనివి గంగామ్మవి సరస్వతి అంతర్వాహిని .ఇక్కడా అప్పుడు.నీటి ప్రవాహం మహా వేగం గా ఉంది కాల్లు కిందనిలవలేదు .కొంతకంగారు కొంత ఆనందం కొంత ఆశ్చర్యం త్రివేణీ సంగమ మైంది నాకు  జనం తక్కువే .అన్నీ యధావిధిగా చేశారు .అక్కడినుండి కోట చూశాం.అందులో ప్రతిదీ మాకు దగ్గరుండి చెబుతూ చూపించాడు బావ .భరద్వాజ ఆశ్రమం ,నెహ్రూ గారి ఎస్టేట్ అన్నీ తిరిగి చూశాం .హోజనం హరి వారి ఇంట్లోనే  చేశామేమో ఆయనే టాం గా  మాట్లాడి ఇవన్నీ చూసే ఏర్పాటు చేశాడు అలహా బాద్ ను ఇక్కడ ‘’ఇలహా బాద్ ‘’అని హిందీలో రాస్తారు .అక్కడి నుంచి కాన్పూర్ కూడా వెళ్లాం కాన్పూర్ చెప్పులకు ప్రసిద్ధి ఊరికే రోడ్ల మీద తిరిగామని గుర్తు .

  గయా సందర్శనం

రాత్రి ట్రెయిన్ లో బయల్దేరి గయకు  ఉదయానికే చేరేట్లు వెళ్లాం అక్కడ కూడా పిత్రువిది చేశాను అశ్వత్థ వృక్షం గయ పాదాలు బాగున్నాయి ఇక్కడ జనం బాగానే ఉన్నారు .అన్నం అప్పటి కప్పుడు వండి శ్రార్ధం పెట్టించారు .విష్ణు మూర్తిని దర్షించాము .భోజనం చేసిన గుర్తు లేదు .మధ్యాహ్నం బయల్దేరి బుద్ధ గయ వెళ్లాం .దాదాపు పది కిలో మీటర్ల దూరం గాడ్పు బాగా కొట్టింది .మన లాగా ఇక్కడెక్కడా సోడాలు దొరకవు .దొరికిన చోట్ల మంచి నీళ్ళు తాగుతూ బుద్ధ గయ చేరాం  బుద్ధుడు  తపస్సు చేసిన చెట్టు అక్కడి ఆలయాలు బౌద్ధ సన్యాసులు బుద్ధ విగ్రహాలు చూడ ముచ్చట గా ఉన్నాయి. బుద్ధుని గురించి విన్నవీ చదివినవీ గుర్తుకొచ్చి బుద్ధ భగవానుడిని మనసారా స్మరించుకోన్నాను .బౌద్ధ సన్యాసులను చూడటం ఇదే మొదటి సారి .వాళ్ళ వస్త్ర ధారణ చదివే మంత్రాలు ధ్యానం వింత గొలిపాయి అక్కడ రాత్రికి బయల్దేరి మళ్ళీ ఉదయానికి జంతారా చేరుకొన్నాం .ఇదొక మినీ ట్రిప్ .ప్రశాంతం గా మొదటి సారిగా ఉత్తర దేశ పుణ్య క్షేత్ర సందర్శనం పూర్తయింది బావ చేదోడు వలన .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-13-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సరసభారతి 55వ ప్రత్యేక ధార్మిక సమావేశం 24-12-13 ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’

    సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

సరసభారతి  55వ ప్రత్యేక ధార్మిక సమావేశం  24-12-13-మంగళ వారం సాయంత్రం 6-30గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ని మహిత మందిరం లో జరుగును ధనుర్మాస సందర్భం గా ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’  పై శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీమతి శివలక్ష్మి దంపతులు ధార్మిక ప్రసంగం చేస్తారు .సాహిత్యాభిమానులు ,,ఆస్తిక మహా జనులు ఈ కార్య క్రమం లో పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .

నూతన ఆంగ్ల సంవత్సరాది 1-1-2014 శుభాకాంక్షలతో –

 

 

జోశ్యుల శ్యామలా దేవి          మాది రాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ          గౌరవాధ్యక్షులు            కార్య దర్శి                 కోశాధికారి

                          గబ్బిట దుర్గా ప్రసాద్

 

         అధ్యక్షులు –సరస భారతి

                         ఉయ్యూరు -20-12-13-

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి

 

ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, హైదరాబాద్‌పై సైనికచర్య చేసి, ముస్లింలను ఊచకోత కోయించాడు. నెహ్రూ లౌకికవాది; 1956లో హైదరాబాద్ సంస్కృతిని పునఃప్రతిష్ఠించ తలచినా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయలేకపోయాడు. భారతదేశంలోని 560 పైచిలుకు సంస్థానాల విలీనం చేసింది; పటేల్ కాదు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్’. వాస్తవాలను తెలుసుకుందాం.

నైజాం రాజధాని హైదరాబాద్ సంస్కృతి ఏమిటి? కేవలం పదిశాతం ఉన్న ముస్లింల ఉర్దూ రాజ భాష; 90 శాతం ప్రభుత్వోద్యోగాలు ముస్లింలకు; ప్రాథమిక స్థాయి నుంచి, విశ్వవిద్యాలయంలో కూడా విద్యాబోధనా మాధ్యమం ఉర్దూ; న్యాయస్థానాల్లోని భాష ఉర్దూ; హిందువులు వెట్టిచాకిరీ చేయాలి; ప్రజాప్రాతినిధ్యం, ఎన్నికలు, గ్రామం నుంచి; శాసనపరిషత్ వరకూ లేవు; ప్రజల భాషలైన తెలుగు, మరాఠీ, కన్నడాలకు ఆదరణ లేదు; ఈ మాధ్యమాలలో బోధించే ప్రభుత్వ పాశాలలు లేవు. మాన్యత పొందిన భాష, వేషం; భూషణాలు విదేశీయాలు. ముస్లింల పండుగల సమయాల్లో హిందువులు సామూహికంగా గానీ, బహిరంగంగా గానీ వేడుకలు జరుపుకోకూడదు. ఇదీ నైజాం రాజధాని హైదరాబాదీ సంస్కృతి.
ఇక రాజకీయంగా; నిజాం నవాబ్, తన సంస్థానాన్ని సార్వభౌమత్వంగల, స్వతంత్ర, ఇస్లామిక్ దేశంగా ఉంచదలచాడు; పాకిస్థాన్‌కు రూ.20 కోట్లు ఇచ్చాడు. రజాకార్లనే రౌడీ మూకలు విలీనం కోరుతున్న హిందువులపై అమానుష చర్యలు చేస్తున్నారు; భారతదేశం తన దేశంపై దురాక్రమణ చర్యలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి, నిజాం ఫిర్యాదు చేసి, ఇండియాపై ఆంక్షలు విధించాలని కోరుతూ ఒక ఫిర్యాదు, ప్రతినిధి మండలిని పంపాడు.

మౌంట్ బాటెన్ నిజాంకు, అనుకూలమైన సంధికై ప్రయత్నించినా, రజాకార్ల ఒత్తిడితో నిజాం ఏ శాశ్వత సంధికీ ఒప్పుకోవడం లేదు. ఎంతోమంది హిందువులు మానప్రాణ రక్షణకు సంస్థానం వదలి విజయవాడ, నాగపూర్ లాంటి ప్రదేశాలకు పోతున్నారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి, ముస్లింలను రప్పించి, ఆ జనాభాను పెంచుతున్నాడు. 1948, మార్చిలో కమ్యూనిస్టులు భారత్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ, నైజాం స్వతంత్ర దేశంగా ఉండాలనడంతో, నైజాం ఆ పార్టీపైన ఆంక్షను ఎత్తివేశాడు. రజాకార్లూ, కమ్యూనిస్టులూ, భారత్‌తో విలీనాన్ని వ్యతిరేకిస్తూ, సాయుధ దళాలను పెంచుతున్నారు. 1948 జూన్‌లో మౌంట్ బాటెన్ వెళ్లిపోయాడు. రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యారు. రజాకార్ల, కమ్యూనిస్టుల ఆగడాలు, నైజాం ధిక్కారం; హిందూ ప్రజల గోడూ ఎక్కువవడంతో, సైనిక చర్య తీసుకునే అంశం కేంద్ర మంత్రి వర్గం చర్చించసాగింది. సైనిక చర్య భారత్ శాంతికాముకతకు భిన్నం; తన ప్రతిష్ఠకు భంగం అని నెహ్రూ వాదన; గత్యంతరం లేదని వల్లభాయ్ పట్టు; ‘నీవు మతతత్వ వాది’వని నెహ్రూ పటేల్‌ను అనడం, పటేల్ కాగితాలు తీసుకొని వెళ్ళిపోవడం గమనించిన రాజాజీ, నెహ్రూ పటేల్ గార్లను తన కార్యాలయానికి పిలిచారు.

చర్చలు సాగుతుండగా, ’70 సంవత్సరాల క్రిస్టియన్ ూఠnట (పుణ్యస్త్రీలు) సామూహికంగా రజాకార్లచే అత్యాచారానికి గురయ్యారు. ఈ అమానుష చర్యపై మీ ప్రభుత్వం చర్య తీసుకోవాలని’ డిమాండ్ చేసిన బ్రిటిష్ హై కమిషనర్ పత్రాన్ని రాజాజీ, నెహ్రూ ముందుంచారు. దాంతో నెహ్రూ అగ్రహోదగ్రుడై, చర్చను ముగించి, తక్షణ సైనిక చర్య చేపట్టమన్నారు. భారతదేశపు సర్వ సైన్యాధ్యక్షుడు, జనరల్ బూకర్ బ్రిటిష్ వాడు. ‘మనం కాశ్మీర్‌లో చిక్కుకున్నాం, నిజాం వాయుసేనలు బొంబాయి, అహ్మదాబాద్‌లపై బాంబులు వేయడానికి సిద్ధంగా ఉన్నయ్. కనుక యుద్ధ చర్యను ఆపుదాం’ అన్నాడు పటేల్ గారితో. ‘లండన్ మీద బాంబులు వేసి జర్మన్లు ఆ పట్నాన్ని ధ్వంసం చేస్తుంటే మీ బ్రిటిష్ వాళ్లు భయపడి లొంగిపోయారా?’ అని పటేల్ బూకర్‌ను నోరు మూయించాడు. తిరిగి ‘జిన్నాగారు చనిపోయారు; పాకిస్థాన్ శోకంతో ఉంది.

హైదరాబాద్ మీద మనం యుద్ధం చేస్తే, పాకిస్థాన్, ముస్లింలూ బాధపడతారు’ అని బూకర్ అన్నాడు. ‘చాలు చాలు, మా ఆజ్ఞ ప్రకారం, సెప్టెంబర్ 12, ప్రాతఃకాలంలో భారత సైన్యం హైదరాబాద్‌లో ప్రవేశించాలి’ అని పటేల్ బూకర్‌ను శాసించారు. దరిమిలా ఏం జరిగిందో అందరికీ తెలుసుకానీ హైదరాబాద్‌పై సైనిక చర్య, ఆ సంస్థాన విలీనం తన ఘనకార్యాలన్నట్లు నెహ్రూ ముఖ్యమంత్రులందరికీ రాసిన లేఖలో పేర్కొన్నారు.
కొంతమంది ముస్లిం పెద్దలు భారత సైన్యం, నిర్హేతుకంగా లక్షల మంది నిరాయుధ, సామాన్య ముస్లింలను ఊచకోత చేసి చంపిందని నెహ్రూకు ఫిర్యాదు చేస్తే, ఆయన పండిత్ సుందర్‌లాల్ అనే కమ్యూనిస్టు సహచర ‘మేధావి’ని దర్యాప్తు చేయమన్నారు. అతగాడు రజాకార్ల దౌష్ట్యాల ఊసెత్తకుండా, సైన్యమూ, కాంగ్రెస్ హిందువులూ నిరపరాధులైన వేలమంది ముస్లింలను (ఎక్కువగా మరఠ్వాడ ప్రాంతంలో) చంపారని నివేదన ఇచ్చాడు. భారత ప్రభుత్వం, ఈ నివేదిక పక్షపాతంగా, ఆధార రహితంగా, నిరధికారంగా, స్వంత ఆలోచనలతో కూడిందని ప్రక్కన పెట్టేసింది.

పటేల్ సైనిక చర్య నిర్ణయం లేకపోయినట్లయితే, నెహ్రూ పుణ్యమా అని భారతదేశపు నడిబొడ్డున నిజాం రాజ్యాం, మూడవ పాకిస్థాన్‌గా తయారయ్యేది. అలా చేయనీయనందుకు వల్లభాయ్ పటేల్ మతతత్వవాదనీ, ముస్లిం ద్వేషి అని, ముస్లిం రచయితలు, వారి చిరకాల బంధువులైన కమ్యూనిస్టులూ; ముస్లిం ఓట్లకు గాలం వేసే ‘సెక్యులర్’ పార్టీలూ ప్రచారం చేస్తున్నాయి.
1947, డిసెంబర్ అనగా భారత విభజన, పాకిస్థాన్ సృష్టి తర్వాత లక్నోలో 70,000 మంది ముస్లింలు, మౌలానా ఆజాద్ సమక్షంలో ఒక సభ జరిపి, భయంకరమైన విభాజక, మతోన్మాద జనక ప్రసంగాలు చేశారు. నెహ్రూ ఆనుంగు మిత్రుడు, నేషనలిస్ట్ ముస్లిం నేత, డా. సయ్యద్ మహమ్మద్ (బీహార్) ‘హిందువులూ, సిక్కులూ వినండి! ఇండియాలో ముస్లింలు అంతమవవచ్చు. అలా అయితే, ఒక్క హిందువూ, ఒక్క సిక్కు కూడా బ్రతికి ఉండలేరు’. ఇలా అంటూ నెహ్రూను ప్రశంసించారు. ఆజాద్‌ను ఆకాశానికెత్తారు.

చివరిగా నూరానీ వంటి వారు ఎంత చరిత్ర హననం చేస్తున్నారు. 564 సంస్థానాల విలీనం మౌంట్ బాటెన్ చేయించాడా? చరిత్ర చదవని, ప్రచారకులు వ్రాసే మాటలివి. ఈ విషయంలో పటేల్ కృషిని, చాతుర్యాన్ని దృఢ సంకల్పాన్ని మౌంట్ బాటెనే కాదు; బ్రిటన్ ప్రధానమంత్రులు, విదేశీ చరిత్రకారులూ ప్రశంసించారు. రాజా, మహారాజా, నవాబుల సంస్థానాలను భారత్‌కు సంక్రమింపజేయడమే కాదు; పలు సంస్థానాలను రాష్ట్రాల్లో విలీనం చేసి; మరికొన్నింటిని సమాఖ్యలుగా చేసి ఆ అధిపతులకు కేవలం భరణాలను, బిరుదులను మాత్రమే ఇచ్చి; వాటన్నింటిని భారత భూభాగంలో సమ్మిళతం జేసి; దేశమంతా ఒకే శాసనాలతో పాలించిన ఘనత అల అశోకునికి గానీ, సముద్ర గుప్తునకుగానీ, అక్బరుకు గానీ, బ్రిటిష్ చక్రవర్తికి గానీ కలుగలేదు.

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కే దక్కింది. జమ్మూకాశ్మీర్ రావణకాష్టంగా ఉండటానికి, దాని వ్యవహారాన్ని, నెహ్రూ తన గుప్పెట్లో పెట్టుకోవడం వలనే. ఈ విషయంలో ఆశ్చర్య చకితుడైన సోవియట్ నాయకుడు నికిటా కృశ్చేవ్ ఇలా అన్నాడు : ‘మీ భారతీయులు అద్భుతమైన ప్రజలు, రాజులను హతమార్చకుండా రాజరికాన్ని ఎలా మాయం చేశారు?’ ఆ లీలను (ఆ నిరుపమాన) మహాద్భుతాన్ని నెరపిన మహావ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.

జవహర్‌లాల్ నెహ్రూకు పటేల్ అంటే గౌరవం, భయం కన్నా అసూయ ఎక్కువ. 1950 డిసెంబర్‌లో పటేల్ చనిపోయారు. 1954 వరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ పటేల్ ఫోటో లేదు. ఆ సంవత్సరం 1958లో మౌలానా ఆజాద్ చనిపోగానే, నెహ్రూ ఆజాద్ ఫోటోకై పార్లమెంట్ సభ్యులకు చందా కోసం రాయించారు. గ్వాలియర్ మహారాజా సింథియా నెహ్రూ ముస్లిం ప్రేమనూ, హిందువుల పట్ల నిర్లక్ష్య భావాన్ని గుర్తించి, తన సొంత ఖర్చుతో పటేల్ తైల చిత్రాన్ని తయారు చేయించి పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజేంద్రప్రసాద్ గారితో ఆవిష్కరింజేసారు.
– డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి

 

అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 గా నిలిచింది. 66 ఏళ్ల వయసులోనూ మొక్కవోని చైతన్యంతో సాగుతున్నారు. కొత్తగా ప్రజా జీవనంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న గాంధీ జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

ఒకప్పుడు ఒకటి, రెండు కోట్లకే పరిమితమై ఉన్న అవినీతి ఇప్పుడు వేల కోట్లు దాటి లక్షల కోట్లదాకా వెళ్లిపోయింది. ఈ స్థితిలో ఏ నేర నిరూపణ అయినా ఏపాటిది? ఈ విషయమై గురువుల్లాంటి కొంత మంది పెద్దవాళ్లను నేను కలిశాను. వారంతా “నేరుగా ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తే తప్ప సమాజంలో నువ్వనుకునే ఆ గణనీయమైన మార్పు తీసుకు రావడం అసాధ్యం” అన్నారు.

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు మా స్వగ్రామం. గాంధీ గారు చనిపోవడానికి ఆరు రోజుల ముందు నేను పుట్టానని అమ్మ నాకు ఆయన పేరు పెట్టిందట. పేరు పెట్టడమే కాదు, ” నువ్వు ఆ సమయంలో పుట్టావంటే నీ పుట్టుకకు ఒక కారణం ఉందిరా” అన్న మాటను ఆమె చాలా తరుచుగా అంటూ ఉంటుంది. ఆ కారణం ఉందో లేదో గానీ, ఆ మాటలు మాత్రం నా ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచాయి. నేను ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నంబర్ -1 స్థానంలో నిలబెట్టడానికి వెనుక ఆ స్ఫూర్తే పనిచేసింది. నేను రిటైర్ అయ్యేనాటికి రాష్ట్రంలోనే కాదు అది దేశంలోనే నంబర్-1 గా నిలబడింది. ఆ తరువాత ప్రపంచంలోనే ఒక ఉత్తమ ఫోరెన్సిక్ ల్యాబ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 అనే ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాను. అమ్మ మరో మాట కూడా అనేది. ” కొత్త ప్రమాణాల్ని నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేయాలి. ఆ ప్రమాణాలు అత్యధిక మానవాళికి మంచి జరిగేందుకు తోడ్పడాలి” అని. ఎప్పటికప్పుడు నన్ను మరో ఎత్తుకు తీసుకు వెళ్లడానికి ఆమె మాటలు ఎంతగానో తోడ్పడుతూ వ చ్చాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా యూనీ యాడ్స్, ఆపిల్ ల్యాబ్స్, ఆపిల్ అడ్వర్టయిజింగ్, మాస్టర్ గ్రాఫిక్స్ ఇలా కొన్ని వెంచర్లను స్నేహితుల కోసం ప్రారంభించడానికి అవే స్ఫూర్తిగా నిలిచాయి. ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలకు ఇలాంటి మాటలే చెప్పాలని మనసారా అనుకుంటాను.
అనుకోగానే కావుగా…
ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే సందర్భాల్లో కూడా ఎందులో అయితే, ప్రజలకు ఎక్కువ మంచి చే సే అవకాశం ఉంటుందా అని చూసే వాణ్ని. వేరే వేరే ఎన్ని వచ్చినా నేను పోలీస్ ఆఫీసర్ ఉద్యోగంలోనే చేరాను. ఎక్కువ మంది ప్రజలకు సేవచేయడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను ఇంటెలిజెన్స్ బ్యూరోలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరిపోయాను. నాకొచ్చిన మిగతా ఉద్యోగాల బేసిక్ వేతనంతో పోలిస్తే ఈ పోస్టులో వచ్చేది చాలా తక్కువ. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌నయ్యాను. కాని ఏ హోదాలోకి వెళ్లినా నేననుకున్నట్లు ఎక్కడా కొత్త ప్రమాణాలు సాధించే అవకాశం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రోత్సాహం గానీ, మద్దతు గానీ, గుర్తింపు గానీ ఏదీ రాలేదు. అందుకే నేను విదేశాలకు వె ళ్లిపోయాను. అక్కడ హ్యూమన్ జస్టిస్‌కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సులో ఫస్ట్ ర్యాంక్ రావడంతో న్యూయార్క్ సిటీ పోలీస్‌లో నాకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు తాను స్థాపించిన పోలీసు అకాడమీలో పనిచేయడానికి నన్ను రమ్మన్నారు. అందులో నేననుకున్నట్లు విభిన్నంగా, కొత్త ప్రమాణాలు సాధించే దిశగా పనిచేసే అవకాశం లభించింది. నేను ఉద్యోగ విరమణ చేసే నాటికి కొన్ని ఉన్నత ప్రమాణాలు నిలబెట్టడానికి వీలయ్యింది. దేశంలో కెల్లా అత్యంత ప్రామాణికమైన ఫోరెన్సిక్ ల్యాబ్‌ను స్థాపించడం అలా సాధ్యమయ్యిందే. అన్నిసార్లూ మనం అనుకున్నంత వేగంగా ఆశించిన పరిస్థితులు రాకపోవచ్చు. ఆ అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ భావజాలాన్ని అప్పటిదాకా మనసులో పదిలపరుచుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తాను. అదృష్టవశాత్తూ నేనలా నిలుపుకోగలిగాను.
భిన్నత్వాన్ని మన్నిస్తారు
నేను రిటైర్ అవడానికి అంటే 2007 కు కొద్ది రోజుల ముందే నేను ‘ట్రూత్ ల్యాబ్స్’ పేరిట ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ స్థాపనకు శ్రీకారం చుట్టాను. ట్రూత్స్ ల్యాబ్ అనే ఐడియా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కొత్తది. ఎక్కడా, ఎప్పుడూ ప్రభుత్వేతర వ్యక్తికి ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టడానికి అనుమతి ఇవ్వదు. అయినా నేను అందుకు దరఖాస్తు పెట్టుకున్నాను. ప్రజలకు తాము నేరుగా వెళ్లడానికి ఒక అవకాశం ఉండాలని కోరాను. ఇప్పటిదాకా ప్రైవే టు వ్యవస్థలేవీ లేవు కాబట్టి చాలా కొద్ది మంది కోర్టు ద్వారా పోలీస్ వ్యవస్థ వద్దకు వెళ్లి ఫోరెన్సిక్ తీసుకోగలుగుతున్నారు గానీ, అలా వెళ్లలేని వర్గానికి ఆ అవకాశాలే లేవని, అలాంటిది స్థాపించడానికి నాకు అనుమతి కావాలని అడిగాను. నా ప్రతిపాదనను గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, డిజిపిలు, సిబిఐ డైరెక్టర్లు, అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అందరూ ఆమోదాన్ని తెలిపారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఉన్నప్పటికీ నేర విచారణ సంస్థలు ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరాన్ని గుర్తించాయి. వాళ్లు తమ వద్దకు వచ్చిన కేసుల్లో క్లిష్టమైన వాటిని మా వద్దకు పంపుతున్నారు. మన దేశానివే కాకుండా, మలేషియా, సింగపూర్, యూ ఎస్, దుబాయి లాంటి దేశాలనుంచి కూడా మాకు కేసులు వస్తున్నాయి. ఆ కారణంగానే ల్యాబ్ ప్రారంభమైన అతి స్వల్ప కాలంలోనే దేశంలోనే నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వం గానీ, మరో వ్యవస్థ గానీ తన చుట్టూ కొన్ని పరిధులు గీసుకోవచ్చు. అందులో భాగంగా కొన్ని నియమాలు విధించవచ్చు. అయితే అప్పటిదాకా లేని కొన్ని కొత్త ప్రమాణాలు సాధించేందుకు ఎవరైనా అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటే ఆ వ్యవస్థలు పెద్దమనసుతో అందుకు అనుమతిస్తాయన్న సత్యాన్ని ఆ అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
మంచికి మహాబీజాలు
విదేశాలకు వెళ్లిన ఒక సందర్భంలో నా వాలెట్( పర్స్) పోయింది. నేను వెళ్లాల్సిన విమానం టికెట్ కూడా అందులోనే ఉంది. కనీసం రిజర్వేషన్‌ను కేన్సల్ చెయ్యమని చెబుదామని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. నేనింకా పెదవైనా విప్పకముదే.. బుకింగ్ ఆఫీసుకు సంబంధించిన అతను మీ వద్ద టికెట్ లేదనుకుంటాను? అన్నాడు. నేను తడబడుతూ “లేదు” అన్నాను. “మీ వద్ద మీ వాలెట్ కూడా లేదనుకుంటాను?” అన్నాడు. ” ఔను”అన్నాను. ” నిన్న మీరు బస్సులో వెళుతూ మీ వాలెట్ పోగొట్టుకున్నారు. మీ పక్క సీట్లో కూర్చున్న అతను దాన్ని తీసుకుని రాత్రంతా మీ ఆఫీసుకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం కావడం వల్ల ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రోజు మీరు ప్రయాణం చెయ్యాల్సి ఉంది కాబట్టి ఇక్కడికి మీరు తప్పకుండా వస్తారనుకుని అతడు మీ వాలెట్‌ను ఇక్కడ డిపాజిట్ చే సి, మీరు రాగానే తనకోసారి ఫోన్ చేయమని చెప్పారు” అన్నారు. ఆశ్చర్యపోయాను. ఆనందపడ్డాను. మంచితనం మీద మరింత నమ్మకం పెంచుకున్నాను.
తెలియకుండానే….
అది 2011. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఒక అమ్మాయినీ, దానికి కారుణమని వాళ్లు అనుమానిస్తున్న ఒక అబ్బాయినీ వెంటతీసుకుని ఒక ఊరు ఊరంతా మా ల్యాబ్‌కు కదలి వచ్చింది ఒక రోజు. ఆ అమ్మాయి గర్భం దాల్చిన ఏడు మాసాల దాకా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినా ఆ తరువాత అందరికీ తెలిసిపోయింది. కుల పెద్దలు ఆమెను నిలదీస్తే, మరో కులానికి చెందిన ఒక అబ్బాయి పేరు చెప్పింది. వివిధ కారణాల వల్ల ఈ రెండు కులాల మధ్య ఎన్నో ఏళ్లుగా రగులుతున్న అగ్నిలో ఈ పరిణామం ఒక ఆజ్యం పోసినట్లయ్యింది. గర్భస్రావం చేయించే గడువు దాటిపోయినందువల్ల ప్రసవం తరువాతే సమస్య పరిష్కారం గురించి ఆలోచిద్దామనుకుని పెద్దలు అప్పుడు విషయాన్ని వాయిదా వేశారు. రెండు మాసాల తర్వాత ఆమెకు బాబు పుట్టాడు. పుట్టిన కొద్ది రోజులకే నిజనిర్థారణ పరీక్షల కోసం మా దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి, అబ్బాయిల తల్లిదండ్రుల పరిస్థితి అయోమయంగా ఉంది. రెండు కులాల్లోని యువగణమంతా వీరావేశంతో రగిలిపోతుంటే, పెద్దవాళ్లు మాత్రం ఎన్ని ప్రాణాలు ఆహుతైపోతాయోనని తీవ్రమైన భయంతో వణికిపోతున్నారు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆలోచించే వాళ్లు పెద్దగా కనిపించలేదు గానీ, ఆ అబ్బాయే కారణమని తేలితే, అదే అదనుగా ఆ వర్గం మీద పగ తీర్చుకోవచ్చని ఈ అమ్మాయి తాలూకు వర్గం ఎదురుచూస్తోంది. ఇరువర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ. అయితే పుట్టిన బాబు డిఎన్ఏ పరీక్షల్లో ఆమె గర్భధారణకు అతడు కారణం కాదని తేలిపోయింది. అమ్మాయి వర్గం ఎప్పటి నుంచో పేర్చుకుంటూ వచ్చిన అగ్ని గుండం మీద కుండపోతగా వర్షం కురిసినట్లయింది. ఎన్నో హింసాత్మక ఘటనలకు తెరదీయబోయిన ఒక ఉదంతం అలా సుఖాంతమయ్యింది. శాస్త్రీయ పరీక్షలు లేని రోజుల్లో ఇలాంటి అపోహలతో ఎన్నెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉంటాయో అనిపించింది. డిఎన్ఏ విషయమే అని కాదు, నిజాలేవీ తెలియకుండా ఎంతటి అభియోగానికైనా సిద్ధపడే కొన్ని మనస్తత్వాల్ని చూస్తుంటే, మానవాళికి ఎంత పెద్ద విపత్తో కదా అనిపిస్తుంది. తెలియని వాటి విషయంలో తెలియనట్టే ఉండగలిగే సంస్కారం ఎప్పటికైనా వస్తే అది ఎంతో మేలు కదా అని నేను పలుమార్లు అనుకుంటాను.
పరిధి విస్తరించాలి
మొత్తంగా చూస్తే సమాజంలో నానాటికీ నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా కొంత మంది నేరస్తులు దొరికిపోతే మాత్రం ఏమవుతుంది? నిత్యం జరిగే నేరాల్లో పట్టుబడుతున్నవి పది లక్షల్లో ఒకటి కూడా కాదనుకుంటాను. అందుకే సమాజపరమైన మార్పు తేవడంలో వీటి పాత్ర చాలా స్వల్పమేనన్న అంతర్మ«థనం నాలో ఇటీవల పెరిగిపోతోంది. మోసాలు చేసే వాడు చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఒకటి రెండు కోట్లకే పరిమితమై ఉన్న అవినీతి ఇప్పుడు వేల కోట్లు దాటి లక్షల కోట్లదాకా వెళ్లిపోయింది. ఈ స్థితిలో ఏ నేర నిరూపణ అయినా ఏపాటిది? ఈ విషయమై గురువుల్లాంటి కొంత మంది పెద్దవాళ్లను నేను కలిశాను. వారంతా ” నేరుగా ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తే తప్ప సమాజంలో నువ్వనుకునే ఆ గణనీయమైన మార్పు తీసుకు రావడం అసాధ్యం” అన్నారు. అందుకే కొద్దికాలం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశాను. ఆ పార్టీ త్వరలోనే మన తెలుగు నేల మీదికి రాబోతోంది. విభిన్నంగా ఉండాలని , కొత్త ప్రమాణాలు సాధించాలని అప్పుడెప్పుడో బాల్యంలో అమ్మ చెప్పిన మాటలు నన్ను ఎటునుంచి ఎటు తీసుకు వెళుతున్నాయో కదా అనిపిస్తోంది.
– బమ్మెర

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఇంట హరి దాసు ఆగమనం .. సంక్రాంతి ముగ్గులు గొబ్బిళ్ళు – ప్రారంభం

This slideshow requires JavaScript.

101_0177 - Copy 101_0177 101_0178 - Copy 101_0178 101_0179 101_0180 101_0181

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

         నా దారి తీరు -56

మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

మా పెద్ద మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా ఇంట్లో ఉండి పడవ తరగతి వరకు చదువుకోన్నాడని చెప్పాను .ఒక సారి వేసవి సెలవల్లో మా చిన్నక్కయ్యా ,చిన్న మేనల్లుడు శాస్త్రి, ,మేనకోడలు పద్మ ఉయ్యూరు లో ఉండగా నన్ను మా బావ వివేకానందం గారు నాతొ అశోక్ ను తీసుకొని తాను  పని చేస్తున్న బీహార్ లోని జం తారా కు రమ్మని .ఉత్తరం రాశాడు .బహుశా 1966వేసవి అనుకొంటాను   .అప్పుడు హౌరా కు జనతా ఎక్స్ప్రెస్ కొత్తగా వచ్చింది మా అక్కయ్య ను మొదటి సారి దానిలో పంపాము .అది తెల్ల వారుఝామున ఉండేది .అందుకని రాత్రికే వచ్చి స్టేషన్ లో పడుకొనినేను మా అమ్మ మోహన్  ఆ బండీ ఎక్కించిన జ్ఞాపకం .మేము ఈ జనతాకే బయల్దేరాం ఇప్పుడది సాయంత్రం బయలు దేరినట్లు గుర్తు .కంపార్ట్ మెంట్ లన్నీ తమాషా కలర్ లో ఉండేవి .మా బావ మా పెళ్ళికి బహుమతి గా ఇచ్చిన కోడాక్ డబ్బా కెమెరా నే మాకు కెమెరా .ఆ రోజుల్లో కెమెరా ఉన్న కొద్ది మందిలో నేనొకడిని. మా ఊర్లో దానితో ఎన్నో ఫోటోలు తీశాను నేను అప్పటిదాకా పని చేసిన స్కూల్ లలో  ఫోటోలు దీనితోనే తీసే వాడిని .నేనూ అశోక్ రైల్ ఎక్కగానే ఫోటోలు తీసుకొన్నాం .దారిలో తినటానికి కావాల్సినవన్నీ అంటే అన్నం పూరీ కూర మధ్యలో నంజుడుకి పచ్చళ్ళు ,పెరుగు సమస్తం మా ఆవిడపాక్ చేసి ఇచ్చింది .అప్పుడు సూట్ కేసులు లేవు .రేకు డబ్బా పెట్టేలే .అవే తీసుకొని వెళ్లామని జ్ఞాపకం .

బహుశా రోజు పైనే ప్రయాణం .హౌరా స్టేషన్ లో దిగాం అక్కడికి బావ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొన్నాడు అక్కడి నుంచి ఢిల్లీ రైల్ ఎక్కి మొగల సరాయ్ స్టేషన్ లో దిగాం.ఇది పెద్ద జంక్షన్ . అక్కడి నుండి ‘’నేరో గేజ్ ‘’పై నడిచే ట్రెయిన్ ఎక్కి జమ్తారా స్టేషన్ లో దిగి ఇంటికి వెళ్లాం .మీటర్ గేజ్ కంటే తక్కువ వెడల్పున్న దే నేరోగేజ్ .దీన్ని మా వాళ్ళు ‘’డకలా డకిలీ ‘’అనే వాళ్ళు అందులో కూర్చుంటే ఉయ్యాల ఊగి నట్లుండేది అందుకా పేరు .ఇది గంగా నది ఒడ్డునే ఉన్న ఊరు.బావ   సెంట్రల్ వాటర్ వర్క్స్ లో సూపర్ వైసర్ .ఆ తర్వాత జూనియర్ ఇంజినీర్ ,సీనియర్ ఇంజినీర్ గా రిటైర్ అయ్యాడు .చాలా స్ట్రిక్ట్ మనిషి .ఎక్కడ ఎవరు సక్రమంగా పని చేయక పోయినా ‘’కాగితాలు తగిలించే వాడు ‘’ఇది పై అధికారులకు మంటగా ఉండేది .అందుకని ప్రమోషన్ చాలా ఏళ్ళు తొక్కి పట్టారు . అంతమాత్రం చేత నిరుత్సాహ పడలేదు .పోరాడి సాధిస్తూనే ఉనాడు .చీఫ్ ఇంజినీర్ ను ఆఖరికి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తెచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి తనకు అనుకూలం గా అన్నీ సాధించుకొన్న ‘’పట్టు వదలని విక్రమార్కుడు ‘’మా బావ వివేకా నందం .పనిలో దైవాన్ని చూసే వాడు ఇలా ఉండే వారు చాలా అరుదు అందుకే ఆయన మాటకు ,రాతకు విలువ ఉండేది .కాదని అనలేక పోయే వారు కాని ఆలస్యం గా స్పందించే వాళ్ళు.రోజూ గంగానది లోకి పడవ మీద వెళ్లి

నిర్ణీత సమయాలలో నీటి ప్రవాహం యెంత ఉంది యెంత నీరు ప్రవహిస్తోంది మొదలైన లెక్కలన్నీ అసిస్టంట్ సహాయం తో  .తీసి పై ఆఫీసర్ కు పంపే వాడు .దీనికి కావలసిన తెల్ల కాగితాలు కూడా ప్రభుత్వం సరిగ్గా ఇచ్చేది కాదు తానె కొని పంపిస్తూ బిల్ చేసే వాడు ఆలస్యం గా సాంక్షన్ అయ్యేవి దీనిప కూడా రోజూ పై అధికారులకు కంప్లైంట్ చేసేవాడు .ఒక రకం గా ఆయన నిత్యం పై అధికారులతో యుద్ధమే చేసేవాడు .కింద అధికారులను చాలా బాగా చూసే వాడు వాళ్లకు ఈయన అంటే దేవుడే .నౌకర్లు చాలా భయం తో పని చేసే వారు .వారిని ఏంతో ఆదరించేవాడు .వాళ్లకి జరిగిన అన్యాయాన్నీ పై వాళ్లకు తెలియ జేసి న్యాయం చేకూర్చే వాడు అందుకే ఆయన అంటే అంతఅభిమానం .జంతారా లో ఆయన దగ్గర ‘’ఓజా ‘’అనే ఒక బీహారీ బ్రాహ్మణుడు నౌకరు గా పని చేసే వాడు అతనికి మా బావ అంటే దేవుడి తో సమానం అతన్ని అంత బాగా చూసుకొనే వాడు బావ .ఇంట్లో అన్ని పనుల్లో సాయం చేసేవాడు అతని మాటలు నాకేమీ అర్ధంయ్యేవికావు బావకు హిందీ బాగా వచ్చు వాళ్లతో జమాయించి మాట్లాడే వాడు

జంతారా లో మా నిత్య కృత్యం .మా అంటే మా బావ నిత్య కృత్యం .పొద్దున్నే మాకు చిక్కని ఫిల్టర్ కాఫీ తయారు చేసిఇచ్చేవాడు .ఇడ్లీ వేసి పెట్టేవాడు లేక పొతే ఉప్మా చేసి పెట్టేవాడు అట్టు ఒక సారి .ఇలా వెరైటీ గా టిఫిన్లు చేసి మాతో తిని పించేవాడు .తర్వాత ఆఫీసు పని చూసుకొనే వాడు .ఇంటి నుంచే  పని కనుక హాయిగా ఉండేది వాటర్ సాంపిల్స్ కలెక్ట్ చేసి పైకి పంపే వాడు . .రివర్ సైట్ కు వెళ్లి పడవలో గంగా నది లో నీటి కొలతలు తీసేవాడు ఇవన్నీ రికార్డ్ చేసి ఇంటికి వచ్చి రిపోర్ట్ తయారు చేసి పంపేవాడు .అప్పుడు మధ్యాహ్న భోజనం వండే వాడు పప్పు కూరా పచ్చడి సాంబారు లేక చారు ,గడ్డ పెరుగు తో భోజనం .మేము తీసుకొని వెళ్ళిన ఊరగాయలు పనికొచ్చేవి అన్నీ మహా రుచికరం గా చేసే వాడు కడుపు నిండా తినే వాళ్ళం .ఆయనది లిమిటెడ్ భోజనమే .అప్పుడు కాలక్షేపానికి ఏమీ ఉండేవి కాదు .రేడియో మాత్రమె .అదీ బెంగాలీ బీహారీ ప్రోగ్రాములే .లేక పొతే శ్రీ లంక నుండి షార్ట్ వేవ్ లో వచ్చే బినాకా గీత మాలిక లే.

జంతారా రోడ్లు ఇరుకు మురికి .బియ్యం అంటే ఇక్కడ ఉప్పుడు బియ్యమే. అవి ఉడుకుతుంటే కడుపులో దేవి నట్లుండేది బావ సన్న బియ్యం మంచి వెరైటీ వి కొనే వాడు .అందుకని అన్నం పువ్వులాగా బాగా ఉండేది .బావ ఏది చేసినా స్పెషలే .అన్నిట్లోనూ ప్రత్యేకతే చూపే వాడు .మార్కెట్లోకి ఏ కొత్త వెరైటీ వచ్చినా కొనే వాడు డబ్బు చేతిలో లేక పొతే అప్పు చేసి దాన్ని కొని ఇంటికి తెవాల్సిందే లేక పొతే నిద్ర పట్టేది కాదాయనకు .జీతం రాగానే తీర్చక పోతెకూడా నిద్ర పట్టక పోవటం మా బావ ప్రత్యేకత .ఎక్కువ డబ్బు అయితే నెల సరి వాయిదాలలో తీర్చే వాడు .ఎవరూ ఆయన్ని డబ్బుకోసం ఒత్తిడి పెట్టె వారు కాదు అంత నమ్మకం ఆయన మీద ఉండేది దుకాణ దార్లకు ఈ నమ్మకాన్ని ఏంతో బాగా కాపాడు కొంటూ వచ్చేవాడు .

నేను మా మేనల్లుడు రోజు ఉదయమే  గంగా నది కి వెళ్లి స్నానం చేసివచ్చేవాళ్ళం .హాయిగా ఉండేది .సాయంత్రం మమ్మల్నిద్దర్నీ తీసుకొని ఏదైనా హిందీ  సినిమాకు తీసుకొని వెళ్ళే వాడు ‘’దస్ లాఖ్ ‘’సినిమా చూసిన జ్ఞాపకం .ఓం ప్రకాష్ నటించి దర్శకత్వం చేసిన సినిమా .బలే నవ్వు పుట్టించేది .ఎక్కడికీ వెళ్ళక పొతే బజారు లు తిప్పి చూపించేవాడు .స్నేహితుల ఇళ్ళకు తీసుకొని వెళ్ళేవాడు అక్కడ ఉద్యోగులందరూ బీహారీ లేక బెంగాలీలే .బ్రాహ్మణులు కూడా ‘’జల పుష్పాలు ‘’తినే వారు .ప్రతి ఇంటికి ఒక చిన్న చెరువు అందులో భక్ష్యాలనికి మత్సాలను పెంచటం జరిగేది .స్వీట్లు బాగా తినే వారు .బర్ఫీ ఇష్టం .రసగులా అంటే బెంగాల్ బీహార్ లలో మహా ప్రీతి ..వంట నూనె గా ఆవనూనె వాడే వారు .మా బావ మాత్రం వేరు సెనగ నూనె నే తెప్పించి వాడే వాడు పాలు చిక్కగా కాచి తోడూ పెట్టి చిలికి వెన్న తీసేవాడు నెయ్యి కాచేవాడు నెయ్యి భలే గా ఉండేది దాదాపు అందరూ ఆవుపాలే వాడేవారు గేదెలు అసలు లేవని అనలేం కాని చాలా తక్కువ .గోధుమ బాగా పండేదిక్కడ .వంకాయి లాంటివి అరుదుగా కనీ పించేవి బంగాళా దుంప పంట ఎక్కువ .బావ ఉయ్యూరు వస్తూంటే ఒకటో రెండో బంగాళా దుంప బస్తాలు తెచ్చే వాడు మనకు దొరికే దుంప కంటే అక్కడివి మహా టేస్టీ .నిలవ కూడా చాలా రోజులున్దేవి .

రాత్రి కి బావ పూరీ కాని చపాతీ కాని చేసే వాడు .దానిలో ఉల్లిపాయ తో బంగాళా దుంప కూర చేసే వాడు .రుచి అదుర్స్ గా ఉండేది .కూరతో కడుపు నిండా తినే వాళ్ళం మేనమామా మేనల్లుడులం .సాంబారు తో కొద్దిగా అన్నం తిని పెరుగు అన్నం తినే వాళ్ళం .కాలక్షేపం ఏమీ లేదుకనుక పెంద్రాలే నిద్ర పోయే వాళ్ళం .బహుశా ఇరవై రోజులు మేము జం తారా లో ఉన్నామనుకొంటా.బావ వంటా బామ్మర్ది కొడుకు తినటం బలే గా నే గడిచి పోయాయి రోజులు .మా బావ వివేకానందం ఏపని చేసినా పధ్ధతి ప్రకారమే చేస్తాడు మా ఇద్దర్ని చట్టు పక్కల ప్రదేశాలను చూపించటానికి పకడ్బందీ గా ప్లాన్ తయారు చేశాడు ఆ ప్లాన్ ప్రకారం ఏమీ తేడా లేకుండా గవర్నర్ ప్రోగ్రాం మాదిరిగా ఆయా ప్రదేశాలను మాకు వివరిస్తూ చూపించాడు బావ ఆ విశేషాలు ఈ సారి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం

శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం

మే నెలలో నాకు అకస్మాత్తుగా సుస్తీ చేసి నప్పుడు ,మా మనవడు ఛి భువన్ అంటే మా పెద్దబ్బాయి కొడుకు కు జబ్బు చేసినప్పుడు ,నెమ్మదిస్తే చిన్న తిరుపతికి వస్తామని మా శ్రీమతి మొక్కు కొండట .ఆ గండాలు గడిచిన తర్వాత చెప్పింది .అప్పటి నుంచీ అనుకొంటూనే ఉన్నాం ద్వారకా తిరుమల వాసుని దర్శనం చేసుకోవాలని .కాని కుదరక వాయిదాల మీద వాయిదాలు వేసుకొంటూ గడిపాం.ఏమైనా మార్గశిర మాసం లో మాధవ దర్శనం చేసుకు తీరాల్సిందే నని వారం ముందు అనుకొన్నాం .ధనుర్మాసం ప్రారంభానికి ముందే వెళ్లాలనీ భావించాం .మనం అనుకుంటే సరి పోతుందా ?భగవత్ అనుగ్రహమూ ఉండాలి కదా .ఇవాళ అంటే పద్దెనిమిదో తారీఖు బుధవారం న  కుదిరింది వెళ్ళ  టానికి .ఉదయమేతెల్లవారుఝామునే మూడుం బావుకు లేచి   ఇంట్లోపూజ చేసుకొని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి అయిదుపావుకు   వెళ్లాను .తిరుప్పావై చదివి ముకుందమాల పూర్తీ చేసి ,అక్కడ సహస్రనామార్చన పూజాదికాలు మంత్రపుష్ప తీర్ధ ప్రసాదాలు అయిన తర్వాతా సుందర కాండ పారాయణ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఏడుమ్బావయింది ..రామూ అనే మాకు తెలిసిన అతనితో చిన్నకారు ను ఎనిమిదింటికి రమ్మన్నాం .ఈ లోపు పూలు కోసుకొని టిఫిన్ తిని రెడీ అయ్యాం మాతో బాటు మా అబ్బాయి రమణ ,మా ఆవిడకు ఆప్తురాలు మాకు ఆడపడుచు లాంటి మల్లికాంబ గారు కూడా వచ్చారు .మల్లికాంబ గారింటికి వెళ్లి కారు ఎక్కిచ్చుకొని తొమ్మిదింటికి బయల్దేరాం .రాము కొత్త కారు కొన్నాడు దాన్ని మేమే మొదట ఎక్కాలని చిన్న తిరుపతికి దానిలోనే వెళ్లాలని చెప్పి తాను పాత కారు రిపేర్ లో ఉండటం వాళ్ళ తెలిసిన డ్రైవర్ ను పంపి మాకు అప్పగించాడు ..ఇదీ బాగుంది అతని నమ్మకం అతనిది .

తేలప్రోలు మీదుగా ఏలూర్ బై పాస్ ద్వారా భీమ డోలు మీదుగా శ్రీ ద్వారకా తిరుమల వెళ్ళే సరికి పదకొండున్నర అయింది .బుధ వారం కనుక భక్త సమ్మర్దం లేదు .ఫ్రీ దర్శనం వరుసగా రెండు సార్లు చేసుకోన్నాం .మా ఆవిడ మొక్కూ తీరింది అందరికి కనులారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభించింది. మనసు హాయిగా ఉంది .అప్పుడు మల్లికాంబ గారు ఈ రోజు ‘’శివ ముక్కోటి ‘’అని కనుక ఇక్కడే పైన ఉన్న శివాలయం కు కూడా వెళ్లి దర్శనం చేసుకొందామని అన్నారు .మేము ఇదివరకు చాలా సార్లు చిన్న తిరుపతి వెళ్లాం కాని పైన ఉన్న శివాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదు .ఆవిడ పుణ్యమా అని ‘’శివ ముక్కోటి ‘’నాడు శ్రీ భ్రమ రాంబా సమేత మల్లేశ్వర స్వామి ని  భక్తీ తో దర్శించాం .శివ ముక్కోటి అంటే శివుడికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రం మార్గశిర మాసం లో వచ్చిన రోజన్న మాట..ఆ రోజున మనం ముక్కోటి నాడు తెల్ల వారు ఝామున ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నట్లు శివాలయాలలో శివుడికి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. అదీ దీని ప్రత్యేకత . అలాంటి పవిత్రమైన రోజున శ్రీ మహా శివుని దర్శనం నయనాన్దకరం ,పుణ్య ప్రదం .మేము గుడికి చేరే సరికి ఉత్తర ద్వార దర్శనం పూజా అయిపోయి స్వామి వార్లను లోపలి తీసుకొని వెళ్ళారు .ఆలయాన్ని ఇరవై  నిమిషాలు మూసి మళ్ళీ దర్శనం ఏర్పాటు చేశారు .అప్పుడు స్వామి వార్లను చూశాం జన్మ చరితార్ధమయిందని భావించాం .అందుకనే ‘’శివ ముక్కోటి ‘’రోజు శివ ,కేశవులను దర్శించి సంతృప్తి చెందాం .ఈ శివాలయం బాలాజీ గుడి కి కొంచెం పై ఎత్తుమీద కొండ పై ఉంది .కారులోనే వెళ్లాం .

This slideshow requires JavaScript.

మల్లేశ్వర స్వామి ఆలయం లో మల్లికాంబ గారు ఉయ్యూరు లో తయారు చేసి తీసుకొచ్చిన  దద్ధోజనం కడుపు నిండా డ్రైవర్ తో సహా ఆరగించాం  చాలా బాగా చేశారామే .అరటి పళ్ళు కూడా తిన్నాం . దర్శనాలు పూర్తీ అవగానే కిందికి దిగి ఆలయం ముందుకొచ్చి పదిరూపాయలకు పాతిక పెద్ద నిమ్మకాయలున్న కారీ బాగ్ లను రెండు కొన్నాం పది రూపాయలకు మాంచి రుచికరమైన దోర జామి పండ్లను కొన్నాం .మేమెప్పుడు వెళ్ళినా తిరుగు ప్రయాణం లో మా స్వంత అగ్రహారం అయిన రామా రావు గూడెం అగ్రహారం మీదుగా దెందులూరు వెళ్లి హై వే లోకి ప్రవేశిస్తాం .ఈ సారికూడా అలానే చేసి మల్లికాంబ గారికి మా అగ్రహారాన్ని చూపించాలను కొన్నాం .పంగిడి గూడెం చెరువు గూడెం ,చిన చిన్తాల పూడి దాటినా తర్వాత రామా రావు గూడెం ఆగ్రహారానికి చేరుకొన్నాం .

మా స్వంత అగ్రహార సందర్శనం

రామా రావు గూడెం అగ్రహారం అంటే మా తాత గారి స్వంత ఊరు .అదంతా గబ్బిట వారి అగ్రహారమే .భూములన్నీ మావే .మా చిన్నప్పుడు మా నాన్న గారితో అక్కడికి వెళ్ళే వాడిని .అక్కడ మాకు ఒక పెంకుటిల్లు ఉండేది మోట బావి కూడా ఉండేది చిత చెట్టు ,వేప చెట్ట్టు జ్ఞాపకమున్నాయి చుట్టూ తడి చేట్లున్దేవి మాకు బందీ జత ఎడ్లు ఉండేవి .ఉయ్యూరు నుండే నాన్న ఇక్కడ వ్యవసాయం చేయించేవారు డిందు లూరు స్టేషన్ లో దిగితే మా కోసం ఇక్కడి నుండి బందీ వచ్చేది దానిలో ఇక్కడికి చేరే వాళ్ళం ఒక వేల నేనొక్కడినే రావాల్సి వస్తే దెందులూరు నుండి నడిచి వచ్చేవాడిని మూడు కిలో మీటర్ల దూరం .మా బంధువు చండూరు సుబ్బారావు మా వ్యవహారాలూ చూసే వాడు ఆయన్ను నేను బావా అని ఆయన భార్యను అక్కయ్యా అనీ పిలిచే వాడిని ఇవన్నేఎ ఇక్కడి కొచ్చిన తర్వాత అన్నీ ఒక్క సారి జ్ఞాపకం వచ్చాయి ఎప్పుడొచ్చిన అలానే వస్తాయి మా పిల్లలందరికీ ఏఎ ఊరు చూపించే వాడిని ఇటు వచ్చినప్పుడల్లా .మా నాన్న టైం లోనే అగ్రహారం పొలాలన్నీ అమ్మేశాం .మాకు ఇక్కడ ఏమీ లేదు .కానీ మాది అన్న ప్రేమ మాత్రం పోలేదు అందుకే ఇటు వచ్చినప్పుడు చూస్తూ వెళ్ళటం .

http://youtu.be/UPaIfpsvDYs

http://youtu.be/iZ8_JAMnVpk

http://youtu.be/rmC1ezXdtQo

http://youtu.be/F7LAni7-Gvg

రామా రావు గూడెం లో పంచాయితీ ఆఫీస్ కు వెళ్లాం అక్కడ ఎవరూ లేరు తాళం వేసింది .గుమాస్తా బయట బెంచీ మీద కూర్చుని మేమేవరమో ఎందుకొచ్చామో అడిగాడు చెప్పాం వాళ్ళందరికీ మా నాన్న పేరు ఈ పొలాలన్నీ గబ్బిట వారివే నాన్న విషయం పూర్తిగా తెలిసి నట్లు చెప్పాడు .అప్పుడు నేను మా పొలాలను కౌలుకు చేసిన రొక్కం కోటయ్య గురించి అడిగాను ఆయన ఎప్పుడో చని పోయాడని అతని తమ్ముదికొడుకు ఇక్కడే ఉన్నాడని పిలుస్తానని చెప్పి పిలిపించాడు అతనూ మమ్మల్ని చూసి ఏంతో సంతోష పడ్డాడు .అప్పుడు ఏసోబు అనే డెబ్భై ఏళ్ళ ఆయనవచ్చాడు మాటల్లో ఆయన మా నాన్న గారి భూములలో ఒక ఎకరం తనకు అమ్మారని చెప్పాడు .వీళ్ళందరూ కలిసి పూర్వంఉన్న మా ఇల్లున్న చోటుకు తీసుకొని వెళ్ళారు ఇప్పుడక్కడ ఇల్లు లేదు అది ఎప్పుడో శిధిలమైంది అక్కడ ఆయిల్ పాం చెట్లు సాగు చేస్తున్నారు అప్పుడు ఉన్న బావి ని పూడ్చేశారు .చండూరు సుబ్బారావు గారు

This slideshow requires JavaScript.

ఏలూరు లో ఉండేవారు ఆయన చని పోయాడు భార్య కూడా ఈమధ్యనే చని పోయిందని అక్కడికి వచ్చిన కందుల వెంకన్న చెప్పాడు ఆవిడ పోతూ ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉండేదని దానికి మాకు చెందినా ముప్ఫై సెంట్ల భూమి ఉందని అల్లుడు వర ప్రసాద్ కి చెప్పిందట .ఆతను ఈ మధ్యనే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి మందిరాన్ని చక్కగా నిర్మించాడు .ఆతను ఏలూరు లో ఉంటాడట  మా నాన్న ను అందరూ ‘’ముత్తయ్య దొర గారు ‘’అని పిలిచే వారని ఇక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకొన్నారు ఇవన్నీ ఉయ్యూరు వారి పొలాలే నని చెప్పారు .చండూరు బావ,అక్కయ్యా  మా నాన్న చనిపోయినప్పుడు వచ్చిన జ్ఞాపకం ఉంది .ఆతర్వాత చాలా కాలం ఉత్తరాలు రాస్తూందే వాడు .మాకు ఇంకా ఇక్కడ కొన్ని భూములు అన్యా క్రాన్తమై ఉన్నాయని కోర్టు లో కేసు వేద్దామని చాలా ఉత్తరాలు రాశాడు .నాకు దీని మీద ఇంటరెస్ట్ లేదని రాసే వాడిని .ఆ తర్వాత ఉత్తరాలు మానేశాడు .ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చినా దిగి ఇంత సేపు ఇక్కడ గడప లేదు. ఇవాళ అందరం ఏంతో ఆనందాన్ని అనుభవించాం .సంతృప్తి పొందాం మా స్వంత అగ్రహారం లో కొద్ది సేపైనా గడిపామని ఆనందించాం ఒక మధురాను భూతి ని మిగిల్చినఅనుభవం ఇది ఈ ఆనందానికి అవధులు లేవు .యెప్పుదొ దాదాపు అరవై ఏళ్ళ కిందట వెళ్లి అక్కడ ఉన్నాను మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ నాడు మా స్వంత గడ్డపై తిరుగాడాను నాతొ బాటు మా కుటుంబమూ  .తనివి తీరా ఫోటోలు తీశాం .మల్లికాంబ గారు మరీ మరీ ఆనదించారు .అందరి దగ్గర వీడ్కోలు పొంది దెందులూరు మీదుగా మెయిన్ రోడ్ కు చేరి నూజివీడు రోడ్డు మీదుగా చినకడియం కొప్పాక ,అంకన్న గూడెం ,మీదుగా మా మామ గారి ఊరు వేల్పు చర్ల చేరుకొన్నాం   కొప్పాక అవతల పెద కడియం అనే ఊరిలోనే మా ఉయ్యూరు వీరమ్మ తల్లి జన్మించింది .ఉయ్యూరు లో పారుపూడి చింతయ్య ను వివాహం చేసుకొని ఉయ్యూరు వారి కోడలైంది .కొప్పాక వరకు ప.గో.జి.-వేల్పు చర్ల మాత్రం కృష్ణా జిల్లా .

మా శ్రీమతి జన్మ భూమి సందర్శనం

మా ఆవిడ ప్రభావతి తల్లి దండ్రులు అంటే మా మామ గారి అత్త గారి స్వగ్రామం వేల్పు చర్ల ఇక్కడ స్వంత పెంకుటిల్లు ఉంది మా బావ మరది ఆనంద్ పదేళ్ళ క్రితం వరకు ఇక్కడే ఉండి  ఏలూరు స్టేట్  బ్యాంకి ఉద్యోగం చేస్తూ  హైదరాబాద్ చేరాడు .బయల్దేరే టప్పుదే తన ఊరు చూడాలని మా ఆవిడ అన్నది .అందుకని వచ్చాం .ఆనంద్ పొలాలను చూసే ‘’నిఖామాను’’ చంద్రం తో రమణ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడు .మేము మా మామ గారింటికి రాగానే చంద్రం వచ్చి మా వాడి దొడ్లో ఉన్న కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చాడు అందరం కమ్మగా తాగాం .కాయ చిన్నదే కాని బోలెడు నీళ్ళున్నాయి భలే రుచిగా, తీయగానూ ఉన్నాయి .నూరు వరహాలు పూలు కోసుకోంది. ప్రభావతి గోరింటాకు కూడా కోసుకొని ,విరజాజి అంట్లు తీసుకొన్నారు ప్రభా మల్లికాంబ గార్లు .ఇంట్లో అద్దె కున్న అమ్మాయి బాగా ఆదరించింది .ఫోటోలు తీసుకొన్నాము .

పక్క ఇల్లే పెద కర్ణం రామా రావు గారిది .మా  పెళ్లి వేల్పు చర్ల లోనే జరిగింది . .ఆ రామా రావు గారి ఇల్లే మా పెళ్ళికి విడిదిల్లు మా మామ గారికి మంచి మిత్రుడాయన భార్య కూడా చాలా మంచిది .బోలెడు పొలం గోడ్లూ,వ్యవసాయం ఉండేవి .ఇప్పుడు ఇద్దరూ లేరు .కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు ..కోడలు లక్ష్మి మా ఆవిడను ‘’అక్క య్యా అక్కయ్యా ‘’అంటూ ఆప్యాయం గా పిలిచింది ఇంటికి వెళ్లాం కమ్మని కాఫీ ఇచ్చింది .వీళ్ళకు జాకెట్లు పెట్టింది వాళ్ళ దొడ్లో కరి ఆవు ఉంది .దాని పేడ పాలేరుతో తెప్పించి కారీ బాగ్ లో ఉయ్యూరు కు తీసుకొనివెళ్ళ టానికి తయారు చేసింది .అక్కడి నుండి మా బావమరిది ఇంట్లో అద్దె కు ఉండి వ్యాపారం లో బాగా సంపాదించి అభి వృద్ధి లోకి వచ్చి ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తున్న ‘’సత్యం ‘’కు బై పాస్ సర్జరీ అయి కోలుకుంటున్నాడని తెలిసి వాళ్ళ స్వంత ఇంటికి కూడా వెళ్లాం .అందరికి మజా ఇచ్చాడు .ఆతను చాలా నీరసించి పోయాడు .అతనికి బెస్ట్ విషెస్ చెప్పి అతని వద్ద కాలీ ఫ్లవర్ పూలు రెండు తీసుకొని ,అందరికి గుడ్ బై చెప్పి ఇంటికి బయల్దేరాం ఆనంద్ మేము ఉయ్యూరు లో బయల్దేరిన ప్పటి నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నాడు ..మెయిన్ రోడ్ ఎక్కి వచ్చిన దారిలోనే జంక్షన్ చేరి ఆంజనేయ స్వామినిదర్శించి  ,తేలప్రోలు మీదుగా   ఉయ్యూరు కు సాయంత్రం ఆరున్నరకు చేరుకొన్నాం .మల్లికాంబ గారిని ఇంటి వద్ద దింపి మేము ఇంటికి చేరుకొన్నాం .ఇడ్లీ తెప్పించుకొని తిన్నాం భోజనం చేయాలని పించలేదు కారణం  మల్లికాంబ గారి పెరుగన్నం అంటే దద్ధోజనం కడుపు లో ‘’కాంక్రీట్ ‘’గా పడి ఉంది .ఆకలి వేయటం లేదు . ఇదీ ఈ ‘’శివ ముక్కోటి ‘’నాటి మా సఫల దైవ దర్శన ,జన్మ భూమి సందర్శన యాత్ర .

మీ –గబ్బిట దుర్గా పసాద్ – 18-12-13- ఉయ్యూరు        .. .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తానీషా యువ ఉత్సవాలు -కూచిపూడి

1tanisha yuva utsavalu 001 2tanisha yuva utsavalu 001 3tanisha yuva utsavalu 001 4tanishayuvajana utsavalu 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –

    నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –

శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ‘’పట్టు వదలని విక్రమార్కుల ‘’జాబితో చేరిన మరొకరు .తన సాహితీ సర్వస్వం గా ‘’ప్రమిద ‘’ను త్రైమాసిక పత్రిక గా మొదలు పెట్టి ,మధ్యలో కొంత ఉద్యోగ శాఖా చంక్రమణం చేసి ,మళ్ళీ మాసపత్రిక గా తన అభిమాన’’ మానస పుత్రిక ‘’గా తెస్తానని చెప్పి మళ్ళీ మూడు నెలలకో  సారి కనిపించేట్లు చేస్తూ  ,సాహితీ పిపాసులను అలరిస్తూ హాస్యం కుమ్మరిస్తూ ,కదా సంపుటాలూ, కవితా సంపుటాలు అచ్చేస్తూ విరామం లేని సాహితీ సేవ చేస్తున్నారు .దాదాపు దశాబ్దం గా నాకు పరిచితులు . బందరు నుండినిన్న వచ్చిఘంటసాలగారికి  (నాదయోగి )కు అంకితం చేసిన  అక్టోబర్ –డిసెంబర్ ,మరియు పొట్టి శ్రీరాములుగారికి   అంకితమిచ్చిన ,ఆగస్ట్- సెప్టెంబర్ ‘’ప్రమిద ‘’లు నా చేతిలో పెట్టారు . నాఅభిప్రాయం రాయమని కోరారు .నేను వారికి సరసభారతి ప్రచురించన నాలుగు పుస్తకాలు అందజేశాను .

ఘంట శాలను ‘’నాదయోగి ‘’గా సంభావించి చిట్టా వారు మంచి వ్యాసం రాశారు .అందులో  ‘నాభి స్థానం నుండి నాదం వస్తేనే జనరంజకం అవుతుందని పాట్రాయని సీతారామ శాస్త్రిగారు  ఘంటసాలకు చేసిన గురూప దేశం’’  గాయకు లందరికి వర్తిస్తుంది . ‘’మేస్టారి ప్రతి పాటా హిట్’’ అని సర్టిఫికేట్ ఇచ్చారు .’’సంగీతమే నా జీవితం .జీవిం చటానికే  పాడుతున్నా .పాడటం కోసమే జీవిస్తున్నా ‘’అన్న బడే గులాం మన  ఘంటసాలకు ఆదర్శం .త్యాగ రాజు పొందిన గౌరవమే ఈ గాన గంధర్వుడు పొందుతున్నాడని మురిశారు .ఆయన ఆత్మ సుస్వర సంగీత గానం ఉన్న ప్రతి చోటా ఉంటుందనడం మహా గొప్ప కితాబు .

వి.ఏ.కే రంగా రావు గారి ‘’రెండో ఆలాపన ‘’పుస్తకాన్ని ‘’అధిక చక్కని ఆలాపన ‘’గ బులుసు వారు సమీక్షించారు కాని అందులో రంగారావు గారి గురించే ఉంది కాని వారి ఆలాపన లేక పోవటం వెలితి .’’కీడు తలపెట్టక పోవటమే మడి .హితం కోరటమే ఆచారం .తోటివారికి తోడ్పడటమే తపస్సు .సమదృష్టి తో నడవటమే రుజు వర్తనం ‘’అన్న రంగా రావు గారి మాటలు అందరికి శిరోధార్యాలు .

మునిపల్లె రాజు గారి కల్లోల గౌతమి కద బాగా నడిచింది .క్లైమాక్స్ మనం ఊహించి నట్లే ఉంటుంది .ఈసంచిక కు హై లైట్ మలయ వాసిని ‘’విజయీ భవ .అమ్మ వారి తొమ్మిది అవతారాల ప్రాశస్త్యం ,విజయాన్నిచ్చే అపరాజితా దేవి వివరణ ,ఆ నాటి దేవతా విగ్రహాల కోలువే నేటి బొమ్మల కోలువవ్వటం ,రాయల కాలం లో క్రీడల ప్రోత్సాహం ,శివాజీ భవానీ పూజ ను వీరుల పూజగా నిర్వహించటం ,ఆయుధ పూజ ‘’ఉదాత్త క్రియా కలాపం ‘’అవటం మొదలైన ఎన్నో మనం మర్చిపోయిన విషయాలను తెలియ జెప్పిన తీరు బాగుంది .డాక్టర్ గారి ‘’పాల సంచీ ‘’కవిత భావ గర్భితం గా ఉంది ఈ సంచికకు మరో అలంకారం వేటూరి వారి గాంధీ స్మరణ .మహాత్ముడు ముట్నూరి వారికిచ్చిన అత్యున్నత గౌరవం ,తెలుగు వారి అమాయకత్వం తో బాటు’’ వెధవాయితనం’’ ,జాతి పిత మరణం పై ఆంద్ర ప్రభ ‘’భారతావనిలో గాడాంధకారం –స్వర్గధామం లో దివ్య ప్రభలు ‘’అనివిశిష్టం గా  స్పందించిన తీరు, తాను  నౌఖాళీ చితి మంటల్లో తిరుగుతున్నా  కూడా బాపూ తాను పంపిన రోగార్తుల ఆరోగ్యంఎలా ఉందొ ననికృష్ణం రాజు గారికి జాబు రాసి  కనుక్కోవటం చదివితే ‘’భూమి పై ఇలాంటి మానవుడు జీవిం చాడా ?’’అన్న అయిన్  స్టీన్ గుర్తుకొస్తాడు .వేటూరి మాత్రమె రాయగల వ్యాసం ఇది .విగ్రహ పంధా లో ‘’నమో సారూ ‘’అని నరేంద్ర మోడీ ని అనటం సరదాగా ఉంది పురాణం వారు వీరేశలింగం గారి జుట్టుముడి ,బీహార్ ‘’ కమ్మీ’’ లు కూడా పిలకలు పెంచటం’’ పైట’’ . అనే మాట’’ పైఠాన్’’మహా రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పిన కబుర్ల పురాణం హాయిగా ఉంది. పద్మా వతీ శ్రీనివాసం గార్లు  శీలం వారి వేద విద్యా శిరోమణిత్వాన్ని సూక్ష్మం లో మోక్షం గా విశదీకరించారు .సీతారావమ్మ గారి ‘’కొత్త యుగ బాట ‘’బులుసు వారి డైరీ అదనపు ఆకర్షణలుగా నిలిచి సంచిక మహా ముచ్చటగా ఉంది .

గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-13-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విజయీ భావ –కోలవెన్ను మలయా వాసిని -ప్రమిద మాస పత్రిక అక్టోబర్ -డిసెంబర్

1vijaya dashami 001 2vijayadasami 001 3vijaya dasami 001 4vijaya dasami 001 5vijayadasami 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మహాత్ముడు బయలు దేరగా -వేటూరి -ప్రమిద మాస పత్రిక -అక్టోబర్ -డిసెంబర్ సంచిక

1veturi on gandhi 001 2veturi on gandhi 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

నా దారి తీరు -54

ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’ తో ఆరు ,నుంచి తొమ్మిది వరకు క్లాసులకు వార్షిక పరీక్షలలో పాస్ మార్కులక్కర్లేదు .అంటే పదో తరగతివరకు లాకులు ఎత్తేశారు .అందరూ ఆ క్లాసులు చదివితే పాస్ అయినట్లే లెక్క .కాని మళ్ళీ ఏమను కొన్నారో మధ్యలో ఒక ‘’హర్డిల్ ‘’పెట్టారు అదే ఏడవ తరగతికి జిల్లా కామన్ పరీక్ష అది పాస్ అయితేనే ఎనిమిదిలోకి చేరాలి .దీనితో అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు వచ్చాయి అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్న స్కూళ్ళు ఆ పైవి హైస్కూళ్ళు .ఎనిమిది వనునది పది వరకు ఉన్నవి పదో తరగతిలో పబ్లిక్ పరీక్ష రాష్ట్రం మొత్తం ఒకే రోజుల్లో సెకండరీ బోర్డ్ ఆధ్వర్యం లో జరుగుతాయి .ఇది పాస్ అయితే కాలేజి లోకి ప్రవేశం .అందులో హైస్కూల్ నుండి ఇంటర్ వరకు ఉన్నవాటిని జూనియర్ కాలేజి లన్నారు మిగిలినవి డిగ్రీ కాలేజీలన్న మాట .ఇంటర్ కు మొదటి సంవత్సత్రం లో ఒక పరీక్ష రెండవ ఏడు ఫైనల్ పరీక్ష .ఈ రెండూ పాస్ అయితేనే ఇంటర్ గట్టెక్కి నట్లు .

అప్పర్ ప్రైమరీ లో ఏడవ తరగతి చదివిన వారికి దగ్గరున్న హైస్కూల్ల లో జిల్లా కామన్ పరీక్షలు మొదట్లో టెన్త్ పరీక్షలకు ముందే జరిగేవి తర్వాత మారింది టెన్త్ అయిన తర్వాత జరపటం మొదలైంది ఆరు ఎనిమిది తొమ్మిది క్లాసులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండో వారం లో మొదలై ఏప్రిల్ ఇరవై రెండుకు పూర్తీ అయ్యేవి ఇర్వి మూడు లాస్ట్ వర్కింగ్ డే..సెలవల్లో పేపర్లు దిద్ది జూన్ మొదటి వారం లో పరీక్షా ఫలితాలను వెల్లడించాలి .ప్రతి నేలా ఒక టెస్ట్ ఉండేది .మూడు నెలల పరీక్షలు అర్ధ సంవత్సరం పరీక్షలు చివరికి వార్శికాలు ఇదీ పధ్ధతి వీటికి పరిగానింపు లేక పోయినా మేస్తర్లకు చాకిరీ మామూలే అన్నీ దిద్దాలి మార్కుల రిజిస్టర్ లో పోస్ట్ చేయాలి .టెస్ట్ పరీక్షలను క్వార్టర్లీ హాఫ్ యియర్లీల మార్కులను కూడి యాభై మార్కులకు ఏవరేజ్ చెయ్యాలి వార్షిక పరీక్షల మార్కులను యాభై మార్కులకు కుదించాలి ఇందాకటి ఏవరేజ్ కు దీన్నికలిపి మొత్తం వంద మార్కులకు రిజిస్టర్ లో పోస్ట్ చేయాలి ప్రతి నేలా ప్రోగ్రెస్ కార్డులివ్వాలి .మొదట్లో ‘’క్యుములేటివ్ రికార్డు ‘’అని ఒక బరాటి పుస్తకం పెట్టారు ఇందులో విద్యార్ధుల చదువు తో బాటు ఎక్స్ ట్రా కర్రిక్యులర్ యాక్తివితీలనూ నమోదు చేయాలి .వాళ్ళ ఆప్టిట్యూడ్ లను యాతి త్యుడ్ లను నమోదు చేయాలి తలిదండ్రుల గురించి వివరాలు షేక రించాలి విద్యార్ధి కేస్ హిస్టరీ తయారు చేయాలి .టెన్త్ పరీక్షా సర్టిఫికేట్ తో బాటు ఈ క్యుములేటివ్ రికార్డ్ ను కూడా విద్యార్ధులకు ఇవ్వాలి .చివరికి ఈ రికార్డ్ పని అంటా తూ తూ మంత్రమై పోయి వేగాతూ వాసనా పుట్టి వదిలేశారు .ఇప్పుడు అవి లేనే లేవు .ఇవన్నీ ఎందుకయ్యా అంటే పరీక్షలు ఎట్టేశాం కదా వీళ్ళ అభివృద్ధిని క్షున్నం గా పరిశీలించటానికి అని ప్రభుత్వం చెప్పేది మేమూ అలానే చేసే వాళ్ళం చివరికి అందరికి కను విప్పు కలిగి వదిలిన్చుకోన్నాం ప్రాణం హాయిగా ఉంది

హైస్కూల్ లో ఏడవతరగతి కామన్ పరీక్షలు జరిగేవి అని చెప్పాను కదా .దీనిని నిర్వహించటానికి హెడ్ మాస్టారు తో బాటు ఒక అసిస్టంట్ ఉండేవాడు ఆయన హైస్కూల్ లో సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయ్డుగా ఉండాలి ఆయనే పరీక్షల నిర్వహణ లో హెడ్ మాస్టారుకు సహాయం చేసే వాడు .పరీక్ష పేపర్లు హెడ్ మాస్టారి అధీనం లో ఉండేవి .ఆయనా ఈయనా కలిసి జాగ్రత్త గా నిర్వహించాలని ప్రభుత్వ భావన .పరీక్షలకోసం ఇన్విజి లెటర్స్ ను మండల విద్యాధికారి నియమించేవాడు .దీనికోసం హై స్కూల్ నుండి లిస్టు పంపే వారు దాని పై అందులో కావాల్సిన వారిని నియమించే వారు .ఇదీ ‘’లాలూచీ కుస్తీ ‘’లాంటిది కాస్త చూసి చూడ నట్లుండె వారిని నియమించే వారు .దీనికి డబ్బులు కూడా ముత్తేవని చెవులు కోరుక్కొనే వారు .ఒకరిద్దరు ఎలిమెంటరీ తీచర్లనూ వీరితో కలిపి నియమించేవారు వీరు వారి విద్యార్ధులు రాసే రూమ్ లకు వాచార్ గా ఉండరాదనే నియమం .

పరీక్షలు ప్రహసనం గా మారాయి .పరీక్ష పేపర్ల లీకులు ,వాచర్ల కుంభకోణాలు ,పరీక్ష హాలు లో గదుల్లో మాస్ కాపీయింగు ,ఏదో రకం గా పరీక్షలు జరపటమే అయింది .పకడ్బందీ గా కొన్నేళ్ళు మాత్రమె జరిగాయి .ఆ తర్వాత అంటా డొల్ల తనమే మిగిలింది .

ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ వాళ్ళు హైస్కూల్ లో రాయటం ఏమిటి ?మేము పరీక్షలు నిర్వహించాలేమా ?అనే ప్రశ్న వచ్చింది ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ లో కూడా సెంటర్ లు ఎర్పాతైనాయి ఇదంతా ఒత్తిడి వల్ల.నే .అప్పర్ ప్రిమరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ను హైస్కూల్ మేస్తార్లలో ఒకర్ని వేసే వారు ఇదీ పైరవీలకు అతీతం కాకుండా పోయింది .ఒకటి రెండు సార్లు నన్ను ఆకునూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ కు డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా వేశారు .నేను వెడితే అక్కడ కాపీలు కుదరవని అందరికి తెలిసిన విషయమే అప్పుడు కే.సుబ్బారావు అనే మాతో పాటు ఉయ్యూరు హైస్కూల్ లో డ్రిల్ మేష్టారు పని చేసిన కే.సుబ్బారావు బి ఇ డి పాసై అక్కడ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు .నేనంటే మహా అభిమానం ణా సంగతి తెలిసిన వాడు .కనుక ఏమాత్రం నాపై ఒత్తిడి తేలేదు .నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు .ఎక్కడా కాపీ జరగా కుండా జాగ్రత్త గా పరీక్షలు నిర్వహించాము .ఆరు పరీక్షలు .హిందీ పరీక్ష చివర్లో ఉండేది .

ఈ ప్రహసనం ఇలా ఉంటె అరీక్షలు అయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ బందర్లో జరిగేది .ఇక్కడ ఏ స్కూల్ లో నైనా కాపీలకు స్కోప్ లేక పొతే స్పాట్ లో బాగానే మెయింటైన్ చేసి పాస్ మార్కులు వేయించుకొనే వారు .ఏ స్కూల్ యెంత శాతం పాస్ అయ్యారని జిల్లా లెవెల్ లో లెక్క ఉండేది అందుకని ఎవరి తంటాలు వాళ్ళు పడి ‘’పాస్ యే పరమా వధి ‘’గా జరిపిన పరీక్షలు ఇవి .ఉయ్యూరు హై స్కూల్ లో క్రిస్ద్నా రావు అనే సీనియర్ అసిస్టంట్ ఆ తర్వాత యాకమూరు నివాసి అయిన లెక్కల మేష్టారు పూర్ణ చంద్ర రావు ఈ లాలూచీ పరీక్షల్లో బాగా ఆరి తేరిన వారు ఇందులో సొమ్ము కూడా బానే వెనకేసుకోన్నారని అందరు చెవులు కొనుక్కొనే వారు నిజం దేవుడికేరుక .పరీక్షలు పూర్తీ అవగానేకొందరు పైరవీ గాళ్ళు జిల్లా నలు మూలల నుండీ  ఆయా స్కూల్ పిల్లల తలి దండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసి బందరు వెళ్లి మార్కులు వేయించుకొని పాస్ అయ్యేట్లు చూసుకొనే వారు ఇది జగ మెరిగిన సత్యమే .ఇవన్నీ భరిస్తూ కళ్ళు మూసుకొంటూ గడిపే వాళ్ళం మార్కుల లిస్టు లను డి ఇ వొ ఆఫీస్ లోఉండేవి .పరీక్ష సెంటర్లో కాకపోతే స్పాట్ సెంటర్లలో పైరవీలు కుదరక పొతే దియివో ఆఫీస్ లో ముడుపులు చెల్లించి మార్కులని తారు మారు చేసి పాస్ అయ్యేట్లు చేసే వారు అందుకని స్కూల్ నుంచి అయిదు కాపీల నామినల్ రోల్స్ తయారు చేసి పంపాల్సి వచ్చేది . మార్కులను ఇందులో పోస్ట్ చేయించి స్కూళ్ళకు పంపే వాళ్ళు అందులో పాస్ అని ప్రొమోషన్ అని రాసే వారు అందులో స్కూల్ మార్కులను కూడా మేము పోస్ట్ చేసి ముందే పంపే వాళ్ళం .కామాన్ పరీక్షల్లో పాస్ కాక పొతే ఈ స్కూల్ మార్కులనూ లెక్క లోకి తీసుకొనే వారు .

హైస్కూల్ లో ఏడవ తరగతి పరీక్షలు జరిగితే చుట్టూ పక్కల అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్ధులు హైస్కూల్ విద్యార్ధులతో పాటు వచ్చి పరీక్ష రాసే వారు .హెడ్ మాస్టారు చీఫ్ .పేపర్ సెంటర్లు దగ్గర గా ఉన్న పెద్ద హైస్కూల్ హెడ్ మాస్టర్ల వద్ద ఉండేవి .ఆయనే చుట్టూ ప్రక్కల సెంటర్ల హెడ్ మాస్టర్లు వస్తే పేపర్లు ఇచ్చేవారు పరీక్షలు అవగానే మళ్ళీ ఇక్కడే ఆన్సర్ బండిల్ ను అందజేయాలి .పైకి ఇది అంతా బ్రహ్మాండం అని పిస్తుంది .కాని ఎక్కడ పడితే అక్కడ బొక్కలు .చీమ దూరే సందు ఉంటె ఏనుగులు లను కూడా దూరుస్తారు .ఇదీ క్లాస్ పరీక్షల్లో గేట్లు ఎత్తేసిన తర్వాత జరిగిన ఏడవ (ఎదవ )తరగతి పరీక్షా విధానం .రెండేళ్ళ దాకా ఈ ప్రహసనం ఇలానే  కొనసాగింది .ఇప్పుడు ఆ తరగతికి కామన్ పరీక్షలు ఎత్తేసింది ప్రభుత్వం ఇన్నేళ్ళకు కళ్ళు తెరచి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-13-ఉయ్యూరు

.

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -6 ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ

సినీ గీతా మకరందం -6

 

ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ

1964లో విడుదలైన దేశ ద్రోహులు చిత్రం లో నాయికా నాయకులు దేవిక ,రామా రావు ల యుగళ గీతమే ఇది.స్వర రసాలూరు రాజేశ్వర రావు కమనీయ బాణీ లో విరిసిన మధుర మంజుల గీతం .దీనికి అభినయాన్ని మహా సోకుగా జోడించారు అందరూ .గీతాలలో తనదైన ముద్ర వేసిన ఆరుద్ర రచించిన పాట ఇది రాజేశ్వర రావు రాగం అంటేనే పూల మీద తెలియాడుతున్నట్లున్తుంది .సువాసనలు వెదజల్లుతున్నట్లున్తుంది .అంత లలితం గా ,శ్రావ్యం గా కమనీయం గా గీతానికి అన్ని హంగులూ అద్ది మనసుల్ని పరవషింప జేయటం రాజేశ్వర రావు ప్రత్యేకత .అది ఈ గీతం లో ప్రతి అంగుళం లోనూ దర్శన మిస్తుంది ఆరుద్ర భావ గీతం ఆహ్లాదాన్ని కలిగించి నిజం గానే ఈ జగం అంతా మారిందా అన్న తృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది .బోళ్ళ సుబ్బా  రావు దర్శకత్వం తో వచ్చిన చిత్రం ఇది .ఈ గీతాన్ని ఘంటసాలసోలో గా గొప్ప  అను భూతితో పాడారు     .ఈ సినిమాలో అందాల నటుడు శోభన్ బాబు అదనపు ఆకర్షణ .

పల్లవి –జగమే మారి నది మధురాముగా ఈవేళ –కలలూ కోరికలూ తీరినవీ మనసారా

చరణం –మనసాడెనే మయూరమయి –పావురములూ పాడే ,ఎలా పావురాములూ పాడే

అదే చేరెను గోరు వంక రామ చిలుక చెంత అది అందాలా జంట

నేనరూ కూరిమి ఈ నాడే పండెను –జీవితమంతా చిత్రామైన పులా కింత —జగమే

చరణం –విరజాజుల సువాసన –స్వాగతములు  పలుక ,సుస్వాగతములు పలుక –ఆ ఆ ఆ

తిరుగాడును తేనే టీగ- తీయదనము కోరి ,అనురాగాలా తేలి

కమ్మని భావమే కన్నీరై చిందెను  –ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి –జగమే

ఏంతో కాలం గా ప్రేమించుకొన్న ప్రేమ జంట మనసులోని కోరికలూ ఎన్నో ఏళ్ళుగా దాగి ఉన్న కోరికలూ ఈ రోజే తీరాయట .అది ఊరికే కాదు మనసారా తీరటం ,మరీ మధురం గా తీరటం ఆ జంట ఆనందానికి అవధులు లేవని పిస్తున్నాయి .అతడు తన మనసు మయూరం అయి ఆడిందని పొంగిపోతున్నాడు మగ నెమలె నాట్యం చేస్తుంది కనుక అతని భావం పక్వం గా పండి నిండింది .మరి పావురాలు పాడుతున్నాయి అవీ తమ లాగా లేత పావురాలు .పావురపు కూత లో మన్మధ బాధ బాగా ధ్వనిస్తుంది.వెంటనే దృశ్యం మారింది అందాల చిలుక చెంతకు గోరు వంక చేరుతోంది ఇది సహజమే .చిలుకా గోరు వంకలది ఆదర్శ దాంపత్యం గా మన కవులు అనాదిగా చెబుతున్న విషయం దాన్ని దృశ్యమానం చేసి తమకూ అన్వయించు కొన్నాడు హీరో  .అందుకే అది ఉత్త జంట కాదు అందాల జంట .ఆ రోజే వాళ్ళ ప్రేమ ,సఖ్యం పండాయి ఆనందం పరవళ్ళు తొక్కుతోంది .అప్పుడు జీవితం అంతా ఒక పులకింత అని పిస్తుంది మామూలు పులకింత కాదు అది చిత్రమైన పులకింత అన్నాడు మాటల నేర్పరి, కూర్పరి ఆరుద్ర .

మళ్ళీ సీను మార్చాడు .విరజాజులంటే ప్రేమకు గొప్ప సాంకేతికాలు. అవి సువాసనలను వెద జల్లుతున్నాయి .ఊరికే విరబోస్తే వాటి గొప్ప తనం ఏముంది?/ ఇలాంటి చక్కని చిత్రమైన జంటకు స్వాగతాలు పలుకుతున్నాయి జన్మ సాఫల్యం చేసుకోమ్మంటున్నాయి .పూలు వికసించి సువాసనలు విరజిమ్ముతుంటే గండు తుమ్మెదలు ఊరికే ఉంటాయా ?/వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మకరందాన్ని తనివి తీరా జుర్రుకొంటున్నాయి .అమితా నందాన్నీ, సంతృప్తిని పొందుతున్నాయి .ఇక్కడ ఈ జంటకూ ఒక హెచ్చరిక .అలానే తామూ  తమిదీర్చుకొని ఆనంద రసాస్వాదన చేసుకొని జీవిత పరి పూర్ణతను సాధించాలీ  అని నాయకుడి గాఢ మైన కోరిక ..యవ్వనాన్ని సఫలీ కృతం చేసుకావాలన్న ఆరాటం. మధురసాస్వాదన తో, మై మరచిపోవాలని సఖి కి అన్యాప దేశం గా తెలియ జేస్తున్నాడు   జాజులూ భ్రమరాలూ ఈ బోధనే చేస్తున్నాయని వివరించాడు ప్రేయసికి ..భ్రమరానికి తియ్యదనం కావాలి అది పూల లోనే దొరుకుతుంది .అతడికీ తీయదనం కావాలంటే ఆమె దగ్గరే లభిస్తుంది ఈ తీపి హాయి ని ఇద్దరం కలిసి అనుభ విస్తేనే మజా అని అతడి మధురోహ .

మరి ఈ భావం మదించిన దేమీ  కాదు అదొక కమ్మని భావం .ఆ భావాన్ని తలచుకొంటే పులకింత తో ఆనంద బాష్పాలు జారి పోతుంటాయి .అది బాధ తో కాదు మాధుర్యం తో వచ్చే కన్నీరు .దానికి వెల కట్ట లేం .వారి ప్రేమప్రియమైన చెలిమి .ఆ చెలిమి ఎలాంటిది ?సాటి లేని కలిమి లాంటిది .చెలిమి కలిమి మాటలను అత్యంత సమయోచితం గా సందర్భ శుద్ధిగా వాడి ప్రయోజనాన్ని రా బట్టాడు కవి ఆరుద్ర . ఆ కలిమి అంటే అదృష్టం, సౌభాగ్యం ,సంపద దేనికీ సాటి రానిది అని, ఉదాత్తమైనదని నాయకుడు కమకమ్మగా చక చక్కగా ఆలపించి చెప్పాడు

మయూరాలు ఆడటం పావురాలు పాడటం లో రెట్టించి ఆ స్వరాలను ఆల పింప జేయటం రాజేశ్వర రావు సాధించిన ఘన విజయం మాధుర్యం. లాలిత్యం కలబోసి పండిన గీతం ఇది .అందుకో ఈ గీతం గీతా మకరందం అని పిస్తుంది

మరో గీతం లో మాధుర్యం జుర్రుకుందాం

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-13-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -53 వేసంగి సరదా

         నా దారి తీరు -53

                                      వేసంగి సరదా

    మా పెద్దక్కయ్య వాళ్లకి వేసవి కాలం వస్తే మద్రాస్ లో నీళ్ళకు చాలా కరువుగా ఉండేది .వాడే నీళ్ళకూ ఇబ్బందే .అందుకని మేము వాళ్ళను వేసవి లో ఉయ్యూరు కు రమ్మని ఉత్తరం ముందే రాసే వాళ్ళం .రావటానికి కొంత మోహ మాట పడేది అక్కయ్య ..కాని బాగా ఎన్నో సార్లు చెబితే కుటుంబం తో వచ్చేది. .మా చిన్నక్కయ్య పెద్దబ్బాయి అంటే మా మేనల్లుడు అశోక్ ఉయ్యూరులోనే మా ఇంట్లో ఉండి చదువు కొనే వాడు .టెన్త్ వరకూ ఇక్కడే చదివాడు .వాడికే లోపం రాకుండా మా బావ వివేకా నంద గారు అన్ని జాగ్రత్తలూ తీసుకొనే వారు .చిన్నఉషా  ఫాన్ కొనిచ్చారు వాడికో మంచం ఉండేది .వాడు ఇక్కడ ఉన్నాడే కాని మా బాధ్యత వాడికి రెండు పూటలా భోజనం కాఫీ పాలూ మాపిల్లల తో బాటుఅందివ్వటమే ..మిగిలిన వన్నీ వాళ్ళ నాన్న చూసే వారు .మాకు ఏ విధమైన బరువూ ఉంచే వారు కాదు బావ .మేనళ్ళుడూ అంతే .మంచి కుర్రాడు బాగా చదివే వాడు చదువులో ఫస్ట్ వచ్చే వాడు .బుద్ధి మంతుడు .మా ఇంటిల్లి పాదికి వాడంటే మహా ఇష్టం. మా పిల్లలు ‘’అశోక్ బావా ‘’అని ఏంతో ఆత్మీయం గా పిలిచే వారు .ఇంతకీ వాడు ఇక్కడ చదవటానికి కారణం మా బావ బెంగాల్ లో ,బీహార్ లో పని చేయటం వల్లనే .అందుకని ఎప్పుడో తప్ప వేసవిలో వాడు ఇక్కడే ఉండేవాడు .

      మా పిల్లలకూ వేసవి సెలవలంటే మజా గా ఉండేది .మా పెద్దక్కయ్య కుటుంబమూ మా చిన్నక్కయ్య కుటుంబమూ వేసవిలో ఇక్కడికి వచ్చేవారు. ఇక పిల్లలకు సందడే సందడి .గేదెలు ,పాడి ,పాలేరు ఉన్నారు కనుక ఏ ఇబ్బందీ లేదు .అప్పుడు వేసవిలో కూరలు దొరకటం కష్టం గా ఉండేవి అందుకని ముందే కందా,పెండలం మణుగులకు మణుగులు కొని భోషాణం మీద దాచే వాళ్ళం .అవి వేసవి లో వాడుకొనే అలవాటు గా ఉండేది .ముందే పెసలు మినుములు కంది -బస్తాలు కొని నిలవ చేసే వాళ్ళం  .మిర్చి కూడా ఒక బస్తా కొనే వాళ్ళం. .అందుకని యెంత మంది వచ్చి ఉన్నా ఏ ఇబ్బందీ ఉండేది కాదు .కాని కావలసింది కొంత సంయమనం, అవగాహనా ,సర్దుకు పోవటం ఉంటె ఏంతో మజా గా ఉంటుంది .లేక పొతే ఇబ్బందే .

            మా అమ్మ అందరికిమధ్యాహ్నం  వంట చేసేది .రాత్రికి మా ఆవిడ చేసేది .ఊరగాయలు జాడీల నిండా ఉండేవి .కంద కూర లేక పెండలం వేపుడు తప్పని సరి .ముద్దపప్పు అంటే అందరికి ఇష్టం .దానిలో ఆవకాయ దట్టించి లాగించటం అందరూ చేసే పని. రాత్రికి కంది పచ్చడి ఉండేది .చింతపండు వేయకుండా ఒక సారి .వేసి ఒక సారి పచ్చడి చేసే వాళ్ళు .కంది పొడి మామూలే .చింతకాయ పచ్చ్చడి , గోంగూర పచ్చడి తప్పని సరి .పెసర పప్పు తో పచ్చడి చేసే వాళ్ళు దీన్ని నేను ‘’సందడి పచ్చడి ‘’అనే వాడిని తిన్న వాళ్ళు ‘’డుర్రూ డుర్రూ’’వేసే వాళ్ళు. అందుకని ఆ పేరు .మా

 అమ్మ పులుసు కాస్తే అదిరి పోయేది .మేము హిందూ పూర్ లో ఉండివచ్చాం కనుక రసం బాగా చేసేది ‘’బేడల చారు ‘’కు అమ్మ స్పెషల్ . వేపుడు కూరలకు అమ్మ పెట్టింది పేరు .వంకాయ పులుసు పచ్చడి ,మజ్జిగ పులుసు ,పెసర పప్పు పులుసు భలే గా చేసేది అమ్మ మా అక్కయ్యలు సాంబారు అదర గొట్టేట్లు చేసే వారు .సాయంత్రం టిఫిన్ అంటే బజ్జీలు పకోడీలే ఎక్కువ .పులుసు చారులను ‘’పెద్ద రాతి చిప్పలలో కాచే వారు వాటిని సింపుల్ గా ‘’రాచిప్పలు ‘’అనే వారు .పెద్ద రాచ్చిప్ప తో దోసకాయ పప్పు కాని మామ్దికాయ పప్పు కాని టమేటా అప్పు కాని చేస్తే ‘’ఊష్  కాకి ‘’అయి పోయేది .అలాగే పులుసైనా సామ్బారైనా రసమైనా యిట్టె యెగిరి పోయేది .మా ఇంట్లో ఉల్లిపాయ వాడకం తక్కువే సంబారు లో వేసే వాళ్ళు .బంగాళా దుప ఉడికించి చేసే దాని లో వాడే వారు .వంకాయ పచ్చి పులుసు అయినా రాచిప్పాడు చేయాల్సిందే .అదీ ఇంట్లోనే అయి పోయేది .అందరూ ఏంతో సంతృప్తి గా  తినే వాళ్ళం .మా అమ్మ వంకాయ కూర అదుర్స్ గా చేసేది కారబ్బొంకాయ కూర అంటే చీల్చి అందులో కావలసినవన్నీ కూరి వేయించేది బాగా .మా ఇంట్లో స్వీటు అంటే ‘’హోళిగ’’అంటే దాదాపు బొబ్బట్టు .పూర్ణం బూరెలు .అరిసెలు .గారెలు ,పెరుగు ఆవడలు తెగ నచ్చేవి .

             కంది పప్పు ను వేయించి పప్పు వండటం మా ఇంట్లో అలవాటు వేయిస్తే ఆ వాసన భలేగా ఉండేది .వేయిస్తున్నప్పుడే అడిగి పెట్టించుకొని తినే వాళ్ళం .అలాగే పెసర పప్పు వేయించినా అదే కమ్మని వాసనా రుచి .మాగాయా ముక్కలు తరగటం అందరం చేసే వారం మాగాయి ని పెరుగు లో కలిపి పచ్చడి గా తినటం అప్పుడూ ఇప్పుడూ మా అందరికే ఇష్టం .చలిమిడి అప్పుడప్పుడు చేసే వాళ్ళు .అదీ పిల్లలు తెగ లాగించే వారు .చిమ్మిరి కూడా బాగా ఇష్టం గా తినే వారు నంది కేషుడి నోములని చేసే వాళ్ళు బ్రాహ్మణుల ఇళ్ళల్లో .ఊర్లో బ్రాహ్మను లందరినీ పిలిచి పెట్టె వారు .పిల్లలు వెళ్లి బాగా తినే వారు .ఏ మాత్రం ఒదిలి పెట్టకుండా తినాలి .అలానే చేసే వారు .

   ఆ రోజుల్లో పొద్దున్న టిఫిన్లు లేవు. చద్ది అన్నం ,ఆవకాయ తో తినటమే .మేమూ అంతే మా పిల్లలూ అంతే.స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరిన పిల్ల.లందరికీ బయట ఉన్న ఖాళీ ప్రదేశం లో ఏదో ఒకటి ఆడుకొనే వారు .పాలేరు గుండిగల నిండా గంగాళాల నిండా ,సిమెంట్  కుండు లో నీళ్ళు పుష్కలం గా తోడి ఉంచేవాడు .వేసవి కనుక వేడి నీళ్ళు ఎవరికీ అక్కర్లేదు .మా దొడ్డి పూర్తిగా నున్నగా గచ్చు చేసి ఉండేది .కాలు వేస్తె జారి పోయేట్లు వాలుగా కూడా ఉండేది అందుకని పిల్లలు సాయం స్నానాలు ఈ గచ్చు మీదే. అందరూ గోచీలు పెట్టుకొని ,నీళ్ళు చిమ్ముకుంటూ ఒకళ్ళ వీపు ఇంకొరు రుద్దు కొంటు మొహమంతా సబ్బు నురగలతో బలే సరదాగా ఆడుకొనే వారు .మా అన్నయ్య గారి అబ్బాయి రాం బాబు, మా అన్నయ్య కూతురు  వేదం వల్లీ కూడా ఇక్కడే పెరిగారు. కనుక మాలో ఒకరే .ఒక గంట ‘’ఈ గోచీ జలకాలాట’’లో గడిపి హాయిగా కాలక్షేపం చేసే వారు .ఆ తర్వాత అన్నాలు తినే వారు.గడ్డ పెరుగు అంటే ఈ పిల్లలందరికీ ఇష్టం .మా అమ్మ పాలు బాగా కాచి చక్కగా పాళం గా తోడూ పెట్టి గడ్డ పెరుగు తయారు చేసేది .మహా రుచిగా ఉండేది .కవ్వం తో మజ్జిగ చిలికి వెన్న తీసి నెయ్యి కాచేది .ఆ నెయ్యి రుచే రుచి .పిల్లలందరికీ కుండ అడుగు గోకుడు మహా ప్రేమ గా తినే వారు .ఆవు ఈనినా గేదె ఈనినా జున్ను పాలు కాచి అందరం ఇష్టం గా తినే వాళ్ళం జున్నుకాచటం లో కూడా మా అమ్మ ఎక్స్ పర్టే..ఉట్టి మీద వెన్న దుత్తలున్దేవి .అందులోంచి వెన్న తీసుకొని దొంగ తనం గా తినటం నాకు అలవాటు . భోజనాల తర్వాత  చదువు కొనేవారు .మా మేనల్లుడు అశోక్ మాత్రం పార్ధి మాస్టారి  ట్యూషన్ కు వెళ్ళే వాడు .మా పిల్లలకు నేనే చెప్పే వాడిని .ఇంట్లో ట్యూషన్ పిల్లలేలాగో ఉండేవారు .వారి సరసన వీరుకూడా .మా చిన్నక్కయ్య రెండో వాడు అంటే మా చిన్న మేనల్లుడు శాస్త్రి ఒక ఏడాది ఇక్కడే మా ఇంట్లో ఉండి చదివాడు .వాడుకూడా పార్ధి గారి దగ్గరే ‘’పైయేటు ‘’చదివే వాడు .ఒక ఏడాది మా పెద్ద మేన కోడలు కళ కూడాఇక్కడ  సి బి.ఏం స్కూల్ లో చదివింది .మా అన్నయ్యగారి అబ్బాయి రాం బాబు కూడా పార్ధి గారి స్టూడెంటే. .వేదవల్లి మాత్రం నా దగ్గరే చదువుకొన్నది .

            పిల్లలందరూ చాపలు వేసుకొని ,దుప్పట్ల మీద పడుకొనే వారు .మా సావిడి అందరికీ సరి పోయేది. అక్కడ కొద్దిగా గట్టు ఉండేది .అక్కడ బైట ఉన్న ఆడవాళ్ళు పడుకొనే వారు .మా అమ్మ ఒక చిన్న నవ్వారు మంచం మీద పడమటి ఇంట్లో పడుకోనేది .మేము గదిలో పాడుకొనే వాళ్ళం .ఉక్క పోత ఎక్కువగా ఉండేది .అందుకని దొడ్లో పడుకొనే వాళ్ళం నవ్వారు మంచాలు నులక మంచాలు, నేల మీద, చాపల మీద అందరం గుర్రు పెట్టి నిద్ర పోయే వాళ్ళం .ఒక్కో సారి వాకిట్లో పడుకొనే వాళ్ళం .ఆ రోజుల్లో దొంగ తనాలూ ఎక్కువే .అందుకని చాలా జాగ్రత్త గా ఉండే వాళ్ళం .ఇద్దరు దొంగలు ఒక సారి వచ్చారు ఒకడు ణా దగ్గర నిల బడ్డాడు .రెండో వాడు మా ఆవిడా మెడలో ఉన్న  గొలుసు ను కత్తిరించి పారి పోతుండగా నాకు మెలకువ వచ్చి అరిచాను. కాని నా గొంతు నాకు వినిపించనే లేదు .అంటే మాట్లాడుతున్నాను .కానీ బయటికి విని పించటం లేదు . మొత్తం మీద నగ ఖాళీ .మా ఆవిడ చాలా పెనగు లాడింది .కాని లాభం లేక పోయింది .పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ దొరక లేదు .ఈ నగలకు ఒక ఫ్లాష్ బాక్ ఉంది నేను ట్యూషన్ మీద బానే సంపాదించాను .కాని ఉమ్మడి కుటుంబం కనుక మా శ్రీమతికి ఏ బంగారు నగా కొనలేక పోయాను .ఒక సారి పది వేలు జాగ్రత్త చేసి బంగారం నగలు చేయించాను .మా కుటుంబానికి సుబ్రహ్మణ్యం అనే నిక్కచ్చి నగలు చేసే ఆయన విశ్వ బ్రాహ్మణ బజారు లో ఉండేవాడు .ఆయన చని పోయాడు .అప్పుడు ‘’రామ భజన ‘’తో ఆ బజారు బజారు మోత మోగించే ఉమా పతి అనే ఆయన్ను పిలిచి బెజవాడలో కొనుక్కొచ్చిన అచ్చమైన బంగారం ఇచ్చి ఈవిడ కు కావాల్సిన నగలు చేయమని ఇచ్చాం .ఇచ్చిన దగ్గర నుంచీ తిరుగు తూనే ఉన్నాను .ఇదిగో రేపు ఎల్లుండి అంటూ కాలక్షేపం చేశాడు .ఒత్తిడి పెంచాను .ఎక్కడికో ఊరికి వెళ్ళాల్సి వచ్చి ఇంటికి వెళ్లి కూర్చున్నాను .ఊళ్ళో లేదన్నారు బెజవాడ వెళ్ళాడని వచ్చే టైం అయిందని .ఇంట్లో వాళ్ళు కూడా బొంకారు .చివరికి ఇంకో గంటకు ఊరికివెడతాం అనగా హడావిడి గా తీసుకొని వచ్చి ఇచ్చాడు .సరే నని ధరించి ఊరికి బయల్దేరింది .కాని అది చూడటానికి అసలు బంగారు లా అని పించనే లేదు. నెమ్మది మీద అర్ధమైంది .బంగారం నొక్కేసి కల్తీ నగలు బాగా ఎక్కువగా చేసి మోసం ఈ రామ భక్తుడు చేస్తున్నాడని తెలిసింది .మేమే కాదు చాలా మంది ‘’ఉమా పతి’’ కాటా దెబ్బ ‘’తిన్న వాళ్ళు. ఒకరొకరే బయట పడ్డారు .దొంగ బంగారం కేసులూ దొంగ నోట్ల సరఫరా కూడా బయట పడి జైలు పాలయ్యాడు .కాపురం బెజవాడకు ఎత్తేశాడు .ఆ నగలలో ఒకటి పోయిందన్న మాట .ఆ తర్వాత ఎప్పుడో మిగిలిన దాన్ని మద్రాస్ లో మా అక్కయ్య తో బాటు తంగ మాలిగ లో చూపిస్తే దానికి వచ్చిన డబ్బు అతి స్వల్పం .ఇదీ వేసవిలో ఒక విశేషం .

       దొంగ తనాలు ఎక్కువ అని ముందే చెప్పాను .రాత్రిళ్ళు అందరం వాకిళ్ళలో దత్తు గారి అరుగుల మీద చేరి కాపలాలు కాసే వాళ్ళం .చామల  లోకి వెళ్లి ఈత చెట్ల నీడ లో కూచుని దొంగలను పసి కట్టే వాళ్ళం బెల్లం కొండ వారింట్లో వరుసగా దొంగతనాలు జరిగాయి .ఏదీ  దొరక్క పొతే ఉన్న అన్నం ఆవకాయ తిని వెళ్ళే వాళ్ళు .ఒకటి రెండు సార్లు దొరికి నట్లే దొరికి పారి పోయే వారు .పగలల్లా ఎండలు, రాత్రి కంటికి నిద్ర లేని ఈ కాపలా తో బాగా అలసట గా ఉండేది .

    ఇక ఆడ పిల్లలు అంత్యాక్షరి ఆడుకొనే వాళ్ళు ..కళా, జయా ఇందులో ‘’ఫస్ట్ గా ఫాస్ట్ ‘’గా ఉండేవారు కళ. బాగా శ్రావ్యం గా పాడేది .ఆమె స్వరం అంటే అందరికి మహా ఇష్టం గా ఉండేది .జయ కొంచెం బిడియం తో ఉండేది .గవ్వలూ గచ్చకాయలు స్కిప్పింగ్ ,మొదలైన ఆటల్లో వాళ్ళు గడిపే వారు .వేసవి కనుక ముంజలు వచ్చే కాలం మా మామయ్యా గారి తోటలో తాడి చెట్లు బాగా ఉండేవి పాలేళ్ళు తాడి గెలలు దింపి బండీలో ఇంటికి తీసుకొచ్చే వారు సాయంత్రం ఇద్దరు పాలేళ్ళు కొడవలి తో కాయలు చెక్కి అందరికి ఇచ్చే వారు .తిన్న వాళ్లకు తిన్నన్ని .కడుపు నిండే దాకా పిల్లలూ

 పెద్దలూ తినే వారు .మా అమ్మ తినేది కాదు .ముంజలు అరగటానికి ఆవకాయ అన్నం బాగా పని చేసేది .సీమ చింతకాయలూ వచ్చే కాలం .అవీ అందరికి బాగా ఇష్టం .తమాషా రుచిగా ఉంటాయి .ఈతపళ్ళు వచ్చే కాలం అప్పుడు ఈత చెట్లు మా చేమల్లో విపరీతం .పండినప్పుడు వాటి వాసన భలేగా ఉండేది .గెలలు కోసి తినే వాళ్ళం. మంచి రుచికరం బియ్యం డబ్బాలో వేసి ఈత పళ్ళు పండించే వాళ్ళం ..గింజ మధ్యలో చీలి  తమాషా గా ఉండేది .తేగల కాలం లో పిల్లలు మహా ఇష్టం గా లాగించేవారు .

     వేసవి అంటే మామిడి పళ్ళు జ్ఞాపకం రాక మానదు .రసం మామిడి పళ్ళు అంటే మహా రుచిగా ఉంది అందరికి ఇష్టం .దజన్లకు డజన్లు కొనే వాళ్ళం .దగ్గర కావ వేస్తె వెళ్లి కొని తెచ్చే వాడిని .ఆరగా ఆరగా పిల్లలు తినే వారు .మజ్జిగా అన్నం లో రసం మామిడి పండుతినటం ఒక గొప్ప అనుభవం అను భూతి .మజ్జిగలో తింటే జబ్బు చేయదు అని నమ్మకం .తిన్న వాళ్లకు తిన్నానని పళ్ళు .కొసరి కొసరి తిని పించే వాళ్ళం .మా వేదవల్లి కొడుకు రవి హరి జనరేషన్

 కూడా వేసవి లో వచ్చి మామిడి పళ్ళు తినే వారు .కడుపు పట్టక హరి ‘’తాతయ్యా ఇంక నేను తినలేను తాతయ్యా ‘అనే వాడు .బంగిన పల్లి తక్కువ తినే వాళ్ళం .కాయ కోసి తినాలి దీని రుచి దీనిదే .వర్షం పడితే బంగిన పల్లి తినకూడదు .పురుగు వస్తుంది .కలెక్టర్ మామిడి అంటే తోతాపురి చివరికి వచ్చేవి ఇవీ కోసి తినాల్సినవే .పెద్దగా ఇష్టం ఎవరికీ ఉండేది కాదు .అందరికి ఊరగాయలు మా ఇంట్లోనే పెట్టె వాళ్ళం వెళ్ళేటప్పుడు మా అక్కయ్యలకు ఇచ్చి పంపే వాళ్ళం వీటికోసం భోశానాల్లాంటి జాడీలు కలపటానికి పెద్ద పెద్ద బేసిన్లు .కారాలు కొట్టించటం ఆవపిండి కొట్టించటం పెద్ద పనే .ఆఘాటు పడక పిల్లలు ఇబ్బంది పడే వాళ్ళు .

  జీడీలు ఆ రోజుల్లో అందరికి ఇష్టమైనవి .పిప్పరమెంటు బిళ్ళలూ అంతే .అల్లం మురబ్బా .తాటి బెల్లం రుచిగా పిల్లలు తినే వాళ్ళు .నిమ్మ తొనలు అనే బిళ్ళలు బాగుండేవి వాళ్లకు .మంగారం బిస్కెట్లు కిలోలకు కిలోలకు కొనే వాళ్ళం బాగా ఇష్టం గా అందరూ తినే వారు .రేగి పండ్లు వడ్లు పోసి కొనే వాళ్ళం అందరికీ ఇష్టం .రేగి పండ్ల తో వడియాలు కూడా పెట్టటం ఉండేది .వేసవిలో అందరూ కలిసి అప్పడాలు వత్తే వారు వడియాలు పెట్టె వారు .ఓడలు వేయించి అటుకులు కూడా ఇంట్లోనే కొట్టే వారు ఆ తర్వాత దమ్ములేక బయట పట్టించటం లేక కొనటం జరిగేది

   ఇదంతా ఒక ఎత్తు.వేసవి కనుక ఊరగాయలు పెట్టె టైం కూడా మా మామయ్యా గారి మామిడి తోటలో అనేక రకాల మామిడి చేట్లున్దేవి .పాలేల్లతో  చిక్కాలున్న కర్రలతో కోయించి  బండీ మీద ఇంటికి తెచ్చే వారు మంచి కాయలన్నీ మా మామయ్యా ఉంచుకొని ఒక మాదిరి కాయలు మా మొహాన పడేసే వాడు .ప్రత్యెక కత్తి పీటలు తీసుకొని కాయలు పచ్చాలు చేసే వారొక రైతే ముక్కలు తరిగే వారు మిగిలిన వారు .నీళ్ళలో నానేసిన కాయలు బయటికి తీయటం గుడ్డ తో తుడవటం జీడి తీయతం డొక్కులో ఉన్న పోరా ను డబ్బానాలతో తీయటం పిల్లల పని .భలే సరదాగా ఉండేది సీను. మా సావిడి లో ఇదొక పెద్ద ప్రదర్శన మా అక్కయ్యల్లో అమ్మా ఓదినా నేనూ కాయలు తరిగే వారం మా సీత పిన్ని వస్తే సాయం చేసేది మా కత్తి పీట కు మంచి పదునుండేది బెల్లం కొండ వారిదీ తెచ్చుకొనే వాళ్ళు .ఇల్లు అంతా ఊరగాయ సందడి తో మారు మోగేది .అవన్నీ తలుచుకొంటే ఏంతోఅను భూతి కలుగుతుంది అందరికి

   మా పిల్లలు ,మేన ల్లుళ్ళు’’గోఛీ స్నానం ‘’గురించి తెగ చెప్పుకొంటారు ఇప్పటికీ .మేనగోడళ్ళు ‘’పెద్ద మామయ్యా వాళ్ళింట్లో అన్నం తినాలంటే భలే సరదాగా ఉంటుంది ఎందుకంటె అదొక పెళ్లి ఇల్లు లాగా ఉండటమే .’’అంటారు ఎప్పుడు గుర్తుకొచ్చినా .కనుక నాకే కాదు వాళ్ళందరికీ ఒక మధురాను భూతి నిచ్చాయి వేసంగి సెలవులు .

    సశేషం

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-13-ఉయ్యూరు

            

              

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –కీర్తన రచన –వృషాద్రిపతి కవి

శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –రచన –వ్రుషాద్రిపతి కవి

నిన్న శ్రీ హనుమద్ వ్రతం సందర్భం గా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సాయంత్రం’’ శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా సోదరీమణులు అద్భుతం గా ,పరవశం గా కర్ణ పర్వం గా,భక్తీ భావ బంధురం గా  గానం చేసిన భజన లో ఈ కీర్తన ఏంతో బాగుందని అని పించి మీ అందరికి విష్ణు నామం రుచిని అందజేస్తున్నాను .

1-విష్ణునామము ,విష్ణు నామము –విశ్వ శుభదము -విష్ణు నామము

వైష్ణవాళికి  ప్రాణమీ నామం –శ్రీ విష్ణు నామం

2-యతి రాజ చంద్రుడు భూతలంబున వ్యాప్తి చేసిన -విష్ణు నామము

అతులితంబగు మోక్ష రాజ్యము నొసగు నీ నామం –శ్రీ విష్ణు నామం .

3-వ్యాస శుక వాల్మీక భవులకు హర్షదంబగు- విష్ణు నామము

భాసురంబై పరగు ఓంకారమీ నామం –శ్రీ విష్ణు నామం

4-దేవముని యగు నారడునికిట  తియ్యమొసగిన– విష్ణు నామము

సవ్య సాచికి రధము ద్రోలగ దలచే నీ నామం –శ్రీ విష్ణు నామం .

5-ఆంజనేయున కండ యయ్యని వెన్ను గాచిన –విష్ణు నామము

అన్జలించిన యంతుకీడుల నార్పు నీ నామం –శ్రీ విష్ణు నామం ..

6- సోమశేఖర శక్ర వందిత శోభదంబగు –విష్ణు నామము

నామ మాత్రము చేత వైరుల నణచె నీ నామం – విష్ణు నామము

7- భోగి భోగమణి విభూషిత పూజ నీయము -విష్ణు నామము

యోగ నిద్రా పరవశంబు నొప్పు నీ నామం –శ్రీ విష్ణు నామం

8-పాప పర్వత పాలి గూల్పగ వజ్ర నిభమగు –విష్ణు నామము

శ్రీ పురంద్రికి స్థానమై చెలువొందు నీ నామం-శ్రీ విష్ణు నామం

9- అఖిల జగముల బోజ్జయందున నమర దాల్చిన –విష్ణు నామము

శుభకరంబగు శోభనములకు మూల మీ నామం –శ్రీ విష్ణు నామం

-10- కఠిన రాక్షస కోటి గుండెల గాలమైనది –విష్ణు నామము

.-       శఠ  సమాజము గూల్చి జగముల సాకే  నీనామం –శ్రీ విష్ణు నామం .

11-ప్రళయ సాగరమందు ఆకున   పవ్వలించిన  –విష్ణు నామము

జలజ గర్భు నివాసమై యలరారే నీనామం –శ్రీ విష్ణు నామం .

12-వేద తస్కరుడైన సోమకు వెదకి చంపిన –విష్ణు నామము

మోదమున గిరి మూపు నిడి మోచె నీనామం –శ్రీ విష్ణు నామం

13-క్రోధ రూపము దాల్చి భూమిని కోర నిల్పిన –విష్ణు నామము

వేడు రక్కసి పాపనిం గాపాడే నీ నామం –శ్రీ విష్ణు నామం

14-పొట్టి రూపము దాల్చి దైవత కులము బ్రోచిన –విష్ణు నామము

పట్టి మానస పతి సమాజము వ్రచ్చె నీనామం –శ్రీ విష్ణు నామం .

15-పాద రజమున  రాతి నాతిగ ప్రబల జేసిన –విష్ణు నామము

వేదం విదులగు మౌని వరులకు వేద్యమీ నామం –శ్రీ విష్ణు నామం

16-ద్వాపరంబున కృష్ణు రూపము దాల్చి యొప్పిన –విష్ణు నామము

స్వాప రాధము లన్ని బాప సమర్ధ మీ నామం –శ్రీ విష్ణు నామం .

17-భక్తీ యోగి హ్రుదయాన్తరాంతర స్తానమైనది –విష్ణు నామము

భక్త మానస సారసాంతర భ్రమర మీ నామం –శ్రీ విష్ణు నామం

18 మంజులంబగు పుష్పకుంజము లందుమసలిన –విష్ణు నామము

సంజ వేళల రాధ యొడి  సల్లాప మీ నామం –శ్రీ విష్ణు నామం . –

19-ఇవ్వసుంధర వూరు వాడను నింపు గొల్పెడు –విష్ణు నామము

మొవ్వ వెంకట దాసు ముందుగ నిల్పే నీ నామం –శ్రీ విష్ణు నామం

20- కృష్ణ దాసు ముదంబు మీరగ పలుకు చున్నది –విష్ణు నామము

చిత్ర భంగుల నెల్ల లోకములేలు నీ. నామం –శ్రీ విష్ణు నామం .

21-విష్ణు దాస బుదోత్తములు నోరార చాటిన –విష్ణు నామము

విశ్వాంత రాళములందు  నిండిన దివ్య మీ నామం –శ్రీ విష్ణు నామం

22-కృష్ణ దాసు ముదంబు మీరగ పలుకుచున్నది –విష్ణు నామము

కెరలి మొవ్వ  కుటుంబ మెల్లను అలమె నీ నామం –శ్రీ విష్ణు నామం ‘

23-సతతంబు ‘’వృషాద్రి పతి’’నిల సాకు  చుండెడి-విష్ణు నామము

చింత లెల్లను  బాపి సంరక్షించు నీనామం –శ్రీ విష్ణు నామం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-13-ఉయ్యూరు

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విధాత తలపు బాపు – సాక్షి

 

D25839994D25839540

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లతపాటకు నిద్ర పోయిన తమ్ముడు –ఆంద్ర జ్యోతి

1lata pataku nidra 001 2latapatakunidra 001 venditerabangaram 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ఇంట్లో కులం అడుగు పెట్టదు -ఆంధ్రజ్యోతి

 

2kulam adugu pettani illu 001 3kulamadugupettani illu 001 4kulamadugupettani illu 0011kulam adugu pettani illu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊపిరున్నంత వరకూ ఊళ్లోనే అంటున్న సోమి రెడ్డి చంద్ర శేఖర రెడ్డి -ఆంద్ర జ్యోతి

 

‘మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు…’ అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరుకు సమీపంలో ఉండే అల్లీపురం ఆయన సొంతూరు. సోమిరెడ్డి చెబుతున్న సొంతూరు విశేషాలే నేటి ‘మా ఊరు’

“మా నాన్న వాళ్లు నలుగురు అన్నదమ్ములు. మా పెద్ద పెద్దనాన్న ఆదినారాయణరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్రం రాకముందే రెండుసార్లు జిల్లా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అప్పట్లోనే ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారాయన. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడేవారు. ప్రభుత్వం అయిదెకరాల భూమి ఇస్తే పేదలకిచ్చేశారు. రెండో పెద్దనాన్న చంద్రశేఖర్ రెడ్డి పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయ పనులు, ఇంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. మా నాన్న డిగ్రీ వరకు చదువుకున్నారు. ఇరవై అయిదేళ్లపాటు మా ఊరి సర్పంచ్‌గా పనిచేశారు. కొన్నాళ్లు జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మా బాబాయి రాధాకృష్ణారెడ్డి కూడా డిగ్రీ పూర్తిచేశారు. మా ఊరికి సమీపంలోని వరిగొండ మేజర్ పంచాయతీకి పద్దెనిమిదేళ్లు సర్పంచ్‌గా ఉన్నారు. అలా అల్లీపురం, వ రిగొండ.. రెండు మేజర్ పంచాయతీల బాధ్యత మా కుటుంబానిదే. నాకు ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో ఎప్పుడూ బోలెడుమంది ఉండేవాళ్లం.

సందడే సందడి
అల్లీపురం చుట్టుపక్కల గ్రామాల్లో నూటయాభై ఎకరాలకు పైగా భూములుండేవి మాకు. అవన్నీ నెల్లూరు చెరువు కింది భూములు. చెరువు నుంచి నె ల్లూరు నడిమధ్యగా కాలువ లుండేవి. నెల్లూరులో ఇళ్ల డ్రైనేజీ మొత్తం కాలువల్లోకి వదిలేవారు. ఆ నీరు మా పొలాలకి వస్తుండేది. అదంతా సత్తువగా ఉండేది. మేమసలు ఎరువులు వేసే పనే ఉండేది కాదు. ఏడాదికి మూడు పంటలు వరి పండించేవారు. ఒక్క పంట వెయ్యకపోయినా సత్తువ ఎక్కువయి ఇబ్బందిగా మారేది. కొన్ని భూముల్లో మామిడి, నిమ్మ తోటలు పెంచేవారు. పొలాల గట్లపై కొబ్బరిచెట్లు ఉండేవి. మా ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఒకటే సందడి. ఇల్లు చాలా పెద్దది. బయట ఓ వైపు గేదెలు, మరోవైపు ఎద్దులు, పెద్ద గడ్డివాములు, ఎద్దుల బండ్లు, నాగ ళ్లు ఉండేవి. ఇంటి నిండా మనుషులున్నా, ఎవరి పనుల్లో వారుండేవారు. వంటలు, మనుషుల రాకపోకలు అంతా కోలాహలంగా ఉండేది. ఏ రోజయినా నిద్ర లేచేసరికి ఇదే దృశ్యం. ఖాళీ దొరికితే చాలు, మా ఇంటి ముందుండే అరుగుల మీదకి జనం చేరేవారు. తాపీగా కూర్చొని ఊరి విషయాలు మొదలు దేశ రాజకీయాల వరకూ అన్నీ చర్చిస్తుండేవారు. ఇక ఊళ్లో ఏ తగువైనా దానికి పరిష్కారం మా కుటుంబమే చెప్పాలి. అంత గౌరవం. మొత్తానికి మా ఇల్లంతా ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది.

రోజూ చేపలకూరే
నా చదువంతా నెల్లూరులోనే సాగింది. నేనే కాదు, మా ఇంట్లో పిల్లలమంతా ఆర్.ఎస్.ఆర్ కాలేజీలోనే చదువుకున్నాం. నిద్రలేచిన వెంటనే పోటాపోటీగా సిద్ధమయ్యేవాళ్లం. ఇరవై మందికి పైగా ఉన్న మా అందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించేవారు. బడికి వెళ్లడానికి ఒక ఒంటెద్దు బండి, మరో ఎడ్ల బండిని మాకు కేటాయించేవారు. మధ్యాహ్నం అందరికీ భోజనాలు వచ్చేవి. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్. మాకోసం ఒక ఉపాధ్యాయుణ్ని ప్రత్యేకంగా నియమించారు. ఆయనకి మా ఇంటి పక్కనే ఓ గది కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వరకు చదువుకునేవాళ్లం. మా ఊళ్లో కాలువలు, నీటిగుంతలు ఎక్కువ.

సమీపంలోనే పెన్నానది ఉంది. దగ్గర్లోనే సముద్రతీర ప్రాంతం. దాంతో చేపలు ఎక్కువగా దొరికేవి. ఊళ్లోకి చేపల బుట్ట వచ్చిందంటే, ముందుగా మా ఇంట్లోనే దింపేవారు. అందుకే మా ఆహారంలో చేపలు, రొయ్యలకు ప్రత్యేక స్థానం ఉండేది. చింతచిగురు వేసి చేసే చేపల కూర అమోఘం. ఇక పెరట్లో, తోటల్లో ఎక్కడ చూసినా కోళ్లే. ఎప్పడంటే అప్పుడే వాటిని కోసి వండేసేవారు. పంటలు చేతికొచ్చే సమయంలో కౌజు పిట్టలు ఎక్కువ దొరికేవి. మా ఊరివాళ్లు కౌజు మాంసం బాగా తినేవారు. మా ఇంటిలో మాత్రం వండేవారు కాదు. శనివారం మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.

అల్లరే అల్లరి
ఇంట్లోని పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉండేవాళ్లం. ఎవరికి చిన్నగాయమైనా అందరం బాధపడేవాళ్లం. మా అల్లరికి హద్దే ఉండేది కాదు. మా రెండో పెదనాన్న అంటే మాకందరికీ భయం. ఓసారి వేసవి సెలవుల్లో పిల్లలమంతా జాఫర్ సాహె బ్ కాలవ వద్దకి వెళ్లాం. తాటిమాను మీద నడుస్తూ కాలవ దాటడం చూసినవాళ్లు పెదనాన్నకు చెప్పారు. అంతే – మా అందర్నీ ఆయన గంట పాటు గోడకుర్చీ వేయించారు. నాకు మంత్రి పదవి వచ్చిన తరువాత అక్కడ వంతెన నిర్మించేలా చేశా. చిన్నప్పుడు మేం బయటకెళ్లి ఏం చేసినా, నిమిషాలోన్లే ఇంట్లోవాళ్లకి తెలిసిపోయేది. గోడకుర్చీ, గుంజీలు వంటి శిక్షలు తప్పేవి కావు. అయినా మా అల్లరి మాత్రం ఆగేది కాదు. మా పెదనాన్న సిగరెట్లు, చుట్టలు ఒక గూట్లో పెట్టేవారు. ఒకసారి పిల్లలంతా కలిసి సిగరెట్లు తాగుదామని ప్రయత్నించాం. పొగతో ఉక్కిరిబిక్కిరైపోయిన నేను తర్వాతెప్పుడూ పొగ జోలికి పోలేదు.

మా సేద్యగాళ్లు కల్లు తెచ్చిస్తే మగపిల్లలంతా తాగేవాళ్లం. మా ఆటలన్నీ ఇంటి ఖాళీ స్థలంలోనే. అప్పుడప్పుడు ఇంటి వెనక్కు వెళ్లి మూడు ముక్కల పేకాట కూడా ఆడేవాళ్లంగాని కాస్త పెద్దయ్యాక మానేశాం. హైస్కూలు, కాలేజీ రోజుల్లో క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ. పండుగ, వేసవి సెలవుల్లో మా ఇద్దరు మేనత్తల పిల్లలు కూడా వచ్చేవాళ్లు. అప్పుడు మా అల్లరి రెట్టింపయ్యేది. మా అమ్మమ్మ వాళ్ల ఊరు కోట. కొన్నిసార్లు మేం అక్కడకకు వెళ్లేవాళ్లం. నాకు నలుగురు మేనమామలు. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవారు. మేమెంత అల్లరి చేసినా ఏమీ అనేవారు కాదు. మా తమ్ముడు హర్షవర్థన్ రెడ్డి అందరిలోకి బాగా అల్లరిచేసేవాడు.

ముక్కోటికి జాగారమే…
శ్రీ వెంకటేశ్వరస్వామి మా కుటుంబానికి ఆరాధ్య దైవం. ఇప్పుడు సాయిబాబాని కూడా పూజిస్తున్నాం. ఊళ్లో అన్ని పండుగలు బాగా చేసేవాళ్లు. ఇప్పుడూ చేస్తున్నారు. మా ఊళ్లోని పురాతన రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి అంగరంగ వైభవ ంగా నిర్వహించేవారు. మాకు ఉభయం ఉంది. దేవుడికి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహించేవారు. గ్రామమంతా భక్తి తన్మయత్వంలో మునిగితేలేది. ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకంలో వైకుంఠంలా అనిపించేది మా ఊరు. రాత్రంతా జాగారం చేసేందుకు, అప్పట్లోనే రాజమండ్రి నుంచి కళాకారులని పిలిపించి డ్యాన్సులు వేయించేవారు. డ్రామాలు ప్రదర్శించేవారు. సంగీత కచ్చేరీలు జరిగేవి. ఒక్క నిమిషం కూడా ఎవరూ నిద్రపోయేవారు కాదు. ఇప్పటికీ ముక్కోటి ఏకాదశి వస్తే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ గ్రామానికి వస్తారు. పండుగ చేసుకుని తిరిగి వెళుతుంటారు. అలాగే పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం చూడటానికి రెండు కళ్లూ చాలేవి కావు.

పెద్దరికం అలవడింది..
మా కుటుంబం మొద టి నుంచి రాజకీయాలపరంగా ఆనం కుటుంబానికి వ్యతిరేకం. నెల్లూరు నడిబొడ్డున మాకు శ్రీనివాసమహల్ ఉండేది. సాయంత్రమైతే చాలు, ఆనం వ్యతిరేకులంతా అక్కడికి వచ్చేవారు. పెద్దపెద్ద నాయకుల రాకపోకలు, రాజకీయ చర్చలు దగ్గరగా చూసిన నాకు అప్పట్లోనే అలా పెద్దరికంగా వ్యవహరించాలనిపించేది. నెల్లూరు కె.ఎ.సి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడే కళాశాల ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యా. అయినా వెనుకడుగు వేయలేదు. అప్పట్లోనే నా వెంట ఎప్పుడూ ఇరవై, ముప్పై మంది ఉండేవారు. మా తమ్ముడు ఓ బృందానికి నాయకత్వం వహిస్తుండేవాడు. ఒక్కోసారి శ్రీనివాసమహల్ లో మాకోసం వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అక్కడి కాలేజీల్లో రాజకీయాలు ఎక్కువ. తరచూ గొడవలు జరుగుతుండేవి. కళాశాలల ఎన్నికలప్పుడు అభ్యర్థుల కిడ్నాప్‌లూ జరుగుతుండేవి. మా తమ్ముడు గొడవలకు వెళుతుండేవాడు. నేను మాత్రం వాటిని సర్దుతూ ఉండేవాణ్ని. అలా, రాజకీయాల కారణంగా నా డిగ్రీ చదువు మధ్యలోనే ఆగిపోయిందిగాని, మంచి నాయకత్వ లక్షణాలు మాత్రం అలవడ్డాయి.

అంతులేని అభిమానం
మా ఊరివాళ్లంతా అప్పటికీ, ఇప్పటికీ మావాళ్లే. వారితో అనుబంధం మాటల్లో చెప్పలేను. నన్ను మొదటిసారి సింగిల్ విండో అధ్యక్షుడిని చేసింది వారే. ఆ పదవితోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవిని పొందగలిగా. 1960 నుంచి ఇప్పటి వరకు మా పంచాయతీ, సొసైటీ పదవులన్నీ మా కుటుంబసభ్యులకు లేదా మేము ఆమోదం తెలిపినవారికే కట్టబెడుతున్నారు. మా నాన్న పాతికేళ్లు, మా తమ్ముడు ఆరేళ్లు మా ఊరికి సర్పంచులుగా వ్యవహరించారు. ఇప్పటికీ మా కుటుంబమంటే ఊరి వాళ్లందరికీ అంతులేని అభిమానం. ఏ చిన్న సమస్య వచ్చినా మాకే చెబుతారు. నేను ఇక్కడున్నా, హైదరాబాదు, ఢిల్లీల్లో ఉన్నా సరే, నేరుగా ఫోన్ చేస్తారు. వెంటనే వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తుంటాను. విద్య, ఉపాధి, వైద్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తాను. మా ఊరు కులమతవర్గ విభేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటుంది. ఇప్పటికీ ఒకరినొకరు వరసలతో పిలుచుకుంటారు. నేను కనిపిస్తే ‘అబ్బయ్యా…’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఇంకెక్కడైనా వాళ్లకెవరైనా ఇబ్బంది కలిగిస్తే… ‘మా రెడ్డికి చెబుతాం’ అంటారు. మమ్మల్ని కొండంత అండగా భావిస్తారు. నేను రాజకీయంగా ఇంతగా ఎదగడానికి, మంత్రి పదవులు పొందడానికి కారణం వాళ్లే. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలే ను.

ఎంత చేసినా తక్కువే
మా కుటుంబం తరపున నవలాకులతోటలో పాఠశాలకు స్థలాన్ని ఇచ్చాం. అల్లీపురంలో పాఠశాలకురెండున్నర ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అర ఎకరా భూమిని నా సొంత డబ్బుతో కొనుగోలు చేసి వాటి ఏర్పాటుకు సహకరించాను. ప్రస్తుతం ఆ బడిలో ఆరొందల మంది పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. ఇప్పుడా భూముల విలువ కోట్ల రూపాయలకు చేరింది. ఓవర్ హెడ్ ట్యాంకు, పశువుల ఆసుపత్రి నిర్మించేలా చేశాను. గ్రామం నడిమధ్యన చెన్నకేశవ స్వామి ఆలయం, మా ఇంటికి సమీపంలో సాయిబాబా ఆలయం, ఉద్యానవనం నిర్మించా. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల కాలువలు, విద్యుత్తు దీపాలు వంటి కనీస వసతులన్నీ కల్పించా. మా ఊరికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకాఇంకా ఏదోఏదో చెయ్యాలనే అనిపిస్తుంది. నేనీ ఊళ్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఊపిరి ఉన్నంత వరకూ ఊళ్లోనే ఉంటాను. రాకపోకలకు, నివాసానికి సదుపాయమని ఎంతమంది చెప్పినా నెల్లూరులోనూ, హైదరాబాద్‌లోనూ నేను ఇళ్లు కట్టుకోలేదు. వేరే ఎక్కడా నివసించడం నాకిష్టం ఉండదు. ఎక్కడకెళ్లినా మా ఊరే గుర్తొస్త్తుంది. మరే ప్రాంతంలోనూ ఎక్కువ రోజులు ఉండబుద్ధి కాదు. ఇక్కడ ఉండే ప్రశాంతత మరెక్కడా లేదు.”
– కంచర్ల మహేశ్ బాబు, ఏబీఎన్ ప్రతినిధి, నెల్లూరు.
ఫొటోలు : పి. కృష్ణప్రసాద్

—————————————-

ఎన్.టి.ఆర్ మెచ్చిన ఊరు
ఎటుచూసినా పచ్చని పొలాలు.. ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల కిలకిలరావాలు.. గట్ల మీద కొబ్బరిచెట్లు.. కాలువలు, నీటిగుంతలు… ఇలా మా ఊరొక ప్రకృతి సోయగంలా కనిపిస్తుంది. 1994లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మా ఇంటికి వచ్చారు. ఒకరోజంతా ఇక్కడే ఉన్నారు. మేడమీది గదిలో బస చేశారు. మా ఊరి వాళ్లంతా వచ్చి ఆయన్ను చూశారు. ఎన్టీఆర్ తిరిగి వెళ్లేప్పుడు మా ఊరిని, మా వాళ్లను తెగ మెచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టి.డి.పి నేతలు, దివంగత ఎర్రంనాయుడు, లాల్‌జాన్ బాషాలాంటి ప్రముఖులు కూడా వచ్చారు. అందరూ ఊరి ప్రశాంతతని, అందాలను బాగా పొగిడారు.

పెద్ద బాధ అదే..
తాగుడు అలవాటు వల్ల కుటుంబాలు ఆర్థికంగా నాశనమైపోవడం, కల్తీ సారా వ ల్ల మరణాలు సంభవించడం ఇవన్నీ మా ఊళ్లో నేను చిన్నతనంలోనే చూశాను. దాన్ని తల్చుకుంటేనే బాధగా ఉంటుంది. మానెయ్యమని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆ ప్రభావం వల్లనే సారా ఉద్యమం మా నెల్లూరు జిల్లాలో ప్రారంభమయినప్పుడు నేను దానికి మద్దతునిస్తూ, మహిళలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాను.

అది మన బాధ్యత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం

ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రారంభమైంది .గంగప్ప గారి అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లున్నది .

ఇవాల్టి భాగం లో అన్ని రసాలు సమ పాళ్ళలో ఉన్నాయి .అరుంధతి ధర్మా రావు ల దాంపత్య మధురిమలు ఇంకో చిన్న ధర్మా రావు ఈ లోకం లోకి రావటం ఆనందదాయకం అయితే అరుంధతి అనారోగ్యం ఆందోళన కారి అయింది .పశుపతి అనసూయ ల వివాహం జరిగి వారికి పుట్టిన ఆడపిల్లకు అరుంధతి అని పేరు పెట్టటం చిన్న అరుంధతి రంగ ప్రవేశం చేసి నట్లు అయింది .కుమార స్వామి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాక పోవటం శ్యామలను ఆతను వివాహంచేసుకోవటానికి ఏర్పడ్డ ఇబ్బందులు దానికి ధర్మా రావు వేసిన ‘’ఠస్సా’’పని చేసి కొందరు పునరాలోచన లో పడటం కొంత వరకు కుమారస్వామికి లైన్ క్లియర్ అయినట్లు తోచింది .

హరప్ప నాయకుడు వివాహాలు చేయటం లో తాత గారి ఆంశ ను చూపించటం ,గిరిక భక్తీ ని అందరూ ప్రశంసించటం బాగుంది .వసిష్ట మహర్షి నూరుగురు పుత్రులను ముంచటానికి గంగానది  నూరు చీలికలై ‘’శతద్రు ‘’పేరు తో వ్యవహరిమ్పబడం అందరికీ తెలిసి ఉండక పోవచ్చు  .ఇలాంటివి విశ్వనాధ ఎన్నో చెప్పగల సమర్ధులు ఆయనే చెప్ప గల నేర్పరులు కూడా ..ధర్మం ,అగ్ని ,తస్కరుడు ,రాజు మనం చేసే తప్పులకు శిక్ష విదిస్తారన్నాడు..సుబ్బన్న పేట అగ్ని ప్రమాదం జరిగి  ఇళ్ళు తగల బడి పోవటం ,అందులో అతని ఇల్లూ ఉండటం అతని  విచారకరం .చిన్న అరుంధతి ని తెచ్చి ఇక్కడ ఉంచుకోవాలన్న అరుంధతి కోర్కె ను సున్నితం గా వాయిదా వేసిన ధర్మా రావు చాతుర్యం బాగుంది .

సంఘం లో అందరూ అరుంధతి వంటి పతివ్రతలు ఉండరని అందరూ ధర్మా రావు లుగా ఉండలేరని ,కొందరు యేవో కారణాల వల్ల  ధర్మానికి దూరం అవుతారని వారిని తేలిగ్గా చూడరాదని సానుభూతి వారిపై చూపటం మన ధర్మమని చెప్పిన ధర్మా రావు బోధ అందరికి అనుసరణీయం .ఇక్కడ మంగమ్మ అంటే  పంతులు జోశ్యులు భార్య క్రమంగా సంఘం లో మంచి పేరు తెచ్చుకోవటం ఆమె సమాజ సేవలో తరించటానికి చేసే ప్రయత్నాలు సమాజ అన్యాయానికి స్వీయ అనాలోచిత నిర్ణయానికి బలి అయిన మహిళమళ్ళీ జన జీవన స్రవంతి లోకి రావటం అందరు హర్షించే విషయం పతిత అలానే ఉండి పోరాదు. .మారి సార్ధక జీవి కావాలన్న విశ్వనాధ సంస్కార హృదయం మనకు ఆవిష్కారం అవుతుంది .ఈ విధం గా ఈ రోజు ఎపిసోడ్  కధలోను , జీవితం లోను  అనేక ‘’షేడ్స్’’. కనిపించి అన్నీ రసకందాయం లో పండాయని అని పించింది .

గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-13-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నా దారి తీరు – 52 మద్రాస్ దర్శన్

నా  దారి తీరు – 52

మద్రాస్ దర్శన్

ఉదయమే మా అక్కయ్య ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. స్నానం తర్వాత వేడి వేడి ఇడ్లీ సాంబార్ తయారు చేసి పెట్టేది బావ ఆఫీసుకు ,పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత భోజనాలు చేసే వాళ్ళం .మధ్యాహ్నం రెండుకు ఇంటి నుంచి బయల్దేరే వాళ్ళం. రోజూ ఏదో ఒక కొత్తత ప్రదేశానికి తీసుకొని వెళ్లి చూపించేది అప్పుడుఆటోలు  లేవు ఉన్నా ప్రయాణం చేయటానికి ఖర్చు ఎక్కువ అని భయం అందుకని సిటీ బస్ లలోనో, లోకల్ ట్రెయిన్ లోనో ప్రయాణం .

కాపాలేశ్వర స్వామి గుడి ,పార్ధ సారధి కోవెల చూడటానికి చాలా ముచ్చటగా ఉండేవి జన రద్దీ లేదు .అందుకని దర్శనం హాయి అని పించేది .ఈ రెండు దేవాలయాలు చూడ వలసినవే అందరూ.మైలాపూర్ బీచ్ మెరీనా బీచ్ లు కూడా చూసి పిల్లలు బాగా సంబర పడ్డారు అదే మొదటి సారి వాళ్ళు సముద్రాన్ని చూడటం బీచ్ లో నడవటం సముద్ర కెరటాలలో కాళ్ళు పెట్టి అలలు మీదకొస్తే వెనక్కి వెళ్ళటం సగం ఒళ్ళు తడవటం పిల్లలకు సరదాగా ఉండేది .ఒక రోజు లైట్ హౌస్ కు వెళ్లాం .మరో రోజు మీనంబాకం ఎయిర్ పోర్ట్ కు వెళ్లాం .బతికిన కాలేజికి ఒకరోజు చచ్చిన కాలేజికి ఒక రోజు వెళ్లి చూశాం .

మా అక్కయ్యా వాళ్ళ ఇంటి దగ్గరే అంటే షినాయ్ నగర్ కు దగ్గరలో అన్నా నగర్ లో షిర్డీ  సాయి బాబా మందిరం చాలా ప్రసిద్ధి చెందింది .గురు వారం విపరీతమైన రద్దీ ఉండేది .’’స్వామి కేశ్వయ్యజీ’’ దీన్ని బాగా తీర్చి దిద్దారు .ఆయన అంటే అందరికి మహా భక్తీ గౌరవం .ఉయ్యూరు లో కే.సి.పి.వారు ఫాక్టరీ దగ్గర ఒక సాయి బాబా మందిరాన్ని  కట్టి స్వామి కేశవయ్య గారిచేత ‘’బాబా చిత్రపటాన్ని ‘’ఆవిష్కరింప జేశారు .చాలా ఏళ్ళు’’ బాబా ఫోటో ‘’మాత్రమె ఉండేది దానికే పూజాదికాలు. ఆ తర్వాత ‘’బాబా విగ్రహాన్ని’’ ప్రతిష్టించారు .ఉయ్యూరులో దర్శనీయ స్తలాల్లో సాయి మందిరం ఒకటి .ధుని కూడా ఏర్పాటయింది .ప్రత్యెక పూజారి ఉంటారు

మద్రాస్ లో ఉన్న కేశవయ్య గారి సాయి మందిరానికి సినిమా నటులు నటీమణులు గాయనీ గాయకులూ తరచు వస్తారు .బాబాను దర్శించాటమే కాక స్వామి కేశవయ్యజీ గారి ఆశీస్సులను పొంది వెడతారు .ముఖ్యం గా గాయిని ఎస్.జానకి ప్రతి గురు వారం వచ్చి భక్తీ గీతాలు శ్రావ్యం గా గానం చేస్తారు .అలాగే మిగిలిన వారూను .జానకి గారు అందర్నీ బాగా పలకరించి మాట్లాడుతారని మా అక్కయ్య చెప్పేది .అందరికి జానకి అంటే గొప్ప అభిమానం ట..మేము కూడా గురువారం చూసిన జ్ఞాపకం .ప్రసాదాలు బాగా పెడతారు .ఆడ వాళ్లకు బాబా కు పూజ చేసిన పూలు వెళ్ళేటప్పుడు ఇస్తారు .ఈ పధ్ధతి బాగా ఉందని పించింది. బాబా  అంటే ఈ ప్రాంతం లో గొప్ప భక్తీ ఉండేది .

బావ జీతమే ఆధారం కనుక మేము ఉయ్యూరు నుంచి బియ్యం రైల్వే పార్సెల్ గా పంపేవాళ్ళం అది ‘’సాల్ట్ కోటార్ స్టేషన్ ‘’కు చేరేవి. అక్కడి నుండి ఇంటికి తెచ్చుకొనే వారు .అట్లాగే వాళ్ళు వేసవిలో మద్రాస్ లో ఉంటె బేజ వాడ నుంచి మామిడి పండ్లను బుట్టల్లో పార్సెల్ చేసి పంపేవాళ్ళం .అవి ఒక వారానికి అందేవి .కనుక దొరకాయలనే ఎంపిక చేసి పంపాల్సి వచ్చేది .ఇవి పంపటం ఒక పెద్ద ప్రహసనం .మార్కెట్లో మంచి కాయ చూడాలి .బేరం ఆడాలి .బుట్టల్లో పార్సెల్ చేయించాలి. దాని పైన ఆడ్రెస్ రాయించాలి .రిక్షా లో బెజవాడ స్టేషన్ కు తీసుకొని వెళ్లి బుక్ చేయాలి ..ఒక పూట పని .మా చిన్నక్కయ్యా వాళ్ళు బీహార్ లో జమ్తారా లో ఉంటె వాళ్ళకూ మామిడి పళ్ళు పార్సెల్ గా పంపే వాళ్ళం .మా తమ్ముడికిపూనా కు  కూడా .బియ్యం అయితే ఇంటి దగ్గరే బస్తాల్లో నింపి అడ్రస్ రాసి ,డబల్ సంచీ వాడి పాలేరు తో గట్టిగా దగ్గర గా కుట్టించి బస్ లో బేజ వాడకు తీసుకొని వెళ్లి నేనే రైల్వే  పార్సెల్ చేయిన్చేవాడిని. ఇలా చేస్తున్నందుకు మాకేమీ ఇబ్బంది అని పించేది కాదు. మాతో బాటు వాళ్ళు కూడా హాయిగా అనుభ విస్తున్నారు కదా అని ఆనందించే వాళ్ళం .గేదెలు ఈనితే జున్ను పాలలో వస్త్రాన్ని తడిపి ఆరిన తర్వాతపోస్ట్ లో మా ఇద్దరక్కయ్యలకూ ,మోహన్ కూ పంపేవాడిని .

మద్రాస్ లో మేమున్నప్పుడు  రెండు రోజుల కోసారి దగ్గర మార్కెట్ కు వెళ్లి కూరలు నేనే కొని ఇంటికి తీసుకొచ్చి అక్కయ్యకు అంద జేసే వాడిని. ’’ఎండుకురా ‘’ అనేది .కొంత ఖర్చు కలిసొస్తుంది కదా అని మేమను కొనే వాళ్ళం .మా బావ గారి బాబాయి శంకరం గారున్దేవారు ఆయన భార్య సుందరమ్మ  గారు .వాళ్ళంటే వీళ్ళకూ వీళ్ళంటే వాళ్లకు వల్ల  మాలిన అభిమానం ప్రేమా .అందుకని తరచుగా కలుసుకొంటూ ఉండేవారు . .వాళ్ళింటికి కూడా మమల్ని తీసుకెళ్ళేది అక్కయ్య. ఆవిడ దుర్గాబాయి దేశ ముఖ్ సంస్త ‘’తెలుగు మహిళా సంస్థ ‘’లో పని చేసేది .భర్త గవర్న మెంట్ ఉద్యోగి .ఆవిడ ఏంతో ఆప్యాయాన్ని చూపేది .ఇప్పుడు ఇద్దరూ లేరు గతించారు అయినా వారి పిల్లలతో మా వాళ్ళ అను బంధం ఏమీ తగ్గలేదు వస్తూ పోతూ ఉంటారు .

మా బావ పెదనాన్న గారు గాడేపల్లి పెద సూర్య నారాయణ గారు .మా బావ తండ్రి గారి పేరు కూడా సూర్యనారాయణ గారే .పెద సూర్యనారాయణ గారిని ‘’రేడియో బావ గారు ‘’అనేవారు అప్పుడు మద్రాస్ నుండి ‘’బావ గారి కబుర్లు ‘’ప్రసారం అయ్యేవి .ఈయన బావ గారుగా చక్కని విషయాలు చెప్పేవారు .ఎన్నో విషయాలు చర్చించి జనాలకు బోధ చేసే వారు .చాలా బాగా ఉండేవి .రాకకీయాల దగ్గర్నుంచి లోకాభిరామాయణం దాకా వాళ్ళిద్దరూ స్ప్రుసించని విషయం ఉండేది కాదు. అప్పుడు ఆ కబుర్లు వినటం ఒక పెద్ద క్రేజు .ఆయనతో బాటు ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ఉండే వారని జ్ఞాపకం .సూర్యం గారి మరణం తర్వాతా బావ గారి కబుర్లకు ప్రయాగ గారే ‘’పేటెంట్ ‘’అయ్యారు .

మా బావ తమ్ముడు కన్నయ్య అనే ఆతను సివిల్ ఇంజినీరు అడయార్ లో ఉండేవాడు .భార్య విజయవాడ అమ్మాయే .వీళ్ళ పెళ్ళికి పిలవటానికే మా అక్కయ్య ఉయ్యూరులో ఉంటె కాటూరి వెంకటేశ్వర రావు గారు దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ఉయ్యూరు మా ఇంటికి వచ్చారు .‘’ఆ సీను’’ నాకు మరుపు రాని మధురాను భూతి .అడయార్ దగ్గర పానగల్ పార్కు చూశాం. సినిమా కు చెందిన హేమా హేమీలందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే వారట .అక్కడే డాక్టర్ గాలి బాల సుందర రావు గారి ఇల్లు ,హాస్పటల్ ఉన్నాయి ఆయన సినీ నటుడు చంద్ర మోహన్ కు మామ గారు అయన కూతురు జలంధర చంద్ర మోహన్ భార్య .చంద్రమోహన్ మా ఉయ్యూరుకు దగ్గర పమిడి ముక్కల గ్రామం .ఇప్పటికీ అక్కడ ఇల్లు ఆస్తులు ఉన్నాయి అతని తమ్ముడు అక్కడే ఉంటాడు .’’గాలి గారు’’ ఆంద్ర పత్రిక వీక్లీ లో ఆరోగ్య విషయాల మీద సీరియల్ రాస్తూన్దేవారు .అది అందరికి బాగా నచ్చింది . .మా అక్కయ్య పిల్లలు ‘’కన్నా బాబాయి ‘’అని ఏంతో ఆప్యాయం గా పిలిచేవారు. అసలు పేరు ‘’గౌరాంగ మురళీధర్ ‘’కాని అందరూ  కన్న అనే పిలిచేవారు .ఆయనా భార్యా కూడా బంధు ప్రీతి బాగా ఉన్న వారు వాళ్ళ ఇంటికి వెడితే ఒకటి రెండు రోజులు ఉండే దాకా ఊరు కొనే వారు కారు .మంచిఅతిధ్యం ఇచ్చేవారు .మా అక్కయ్యను కన్నావొదినా,వొదినా ‘’ ‘’అని ఏంతో ఆప్యాయం గా పిలిచేవాడు. మా బావను ‘’అన్నాయ్ ‘’అని ప్రేమగా గౌరవం గా పిలిచేవాడు .ఆతను బాగానే సంపాదించే వాడు .పిల్లలూ బానే చదివి పైకొచ్చారు సెటిల్ అయ్యారు .వాళ్ళ పిల్లలకూ మా అక్కయ్య పిల్లలకూ ఇప్పటికీ  రాక పోకలున్నాయి .పెళ్ళీ ,పేరంటాలకు కలుస్తూనే ఉంటారు .కన్నాభార్య  ముందుగాను తర్వాత కొన్నేళ్ళకు కన్నా కూడా కను మూశారు ఆయన బొంబాయి లో సెటిల్ అయ్యాడు .అక్కడి నుండే మా వాళ్ళ ఇంట్లో వివాహాలకు వస్తూండేవాడు .ఇప్పుడు పిల్లలూ అంతే..బంధుత్వాలను ఎలా కాపాడుకోవాలో ఈ రెండు కుటుంబాలకు బాగా తెలుసు .ఈ తరం లో మళ్ళీ మా బావ మరది ఆనంద్ కూడా బంధుత్వాలను చక్కగా కాపాడుకొంటూ అందరి ఇళ్ళకూ వెడుతూ అందర్నీ తన ఇంటి కార్యాలకు పిలుస్తూ నిల బెట్టుకొంటున్నాడు .ఒక రకం గా ఈ తరం పిల్లకు ఆనంద్ ఒక ఆదర్శం గా ఉన్నాడని పిస్తుంది                ఒక ఇంట్లో సినీ నటుడు డాక్టర్ శివ రామ క్రిష్నయ్య వాలు కుర్చీలో కూర్చుని కనీ పించాడు లోకల్ ట్రెయిన్ లో నేను ఎక్కడికో వెళ్లి లోకల్ ట్రెయిన్ లో వస్తున్నప్పుడు    ..

నేను వీలైనప్పుడు సిటీ బస్ ఎక్కి అది యెంత దూరం వెడితే అంతదాకా వెళ్లి పట్నం అంతా చూస్తూ మళ్ళీ అదే బస్ లో తిరిగి ఇంటికి చేరే వాడిని .పిల్లల్ని పారిస్ బజార్ కు తీసుకొని వెళ్లాం. రిప్పన్ బిల్డింగ్ ,హై కోర్టు కూడా చూపించాం .రిప్పన్ బిల్డింగ్ దగ్గర పాత పుస్తకాల షాపులు విపరీతం గా ఉండేవి .అక్కడ దొరకని పుస్తకం ఉండేది కాదు అలాగే అక్కడ ఫాన్సీ వస్తువులు అమ్మే షాపులూ ఉండేవి .నేను వెళ్లి చూసి వచ్చే వాడిని మంచి పుస్తకాలు కొన్నాను .కాని గిట్టని  వాళ్ళేవరో పాత పుస్తకాల షాపులకు పాతికేళ్ళ నాడు తగల బెట్టారు అప్పటి నుంచీ వేరే చోటికి దీన్ని మార్చారు .

మద్రాస్ అంటే పూలు విపరీతం .అన్ని రకాల పూలు దొరుకు తాయి .అన్ని రకాల పూలతో కదంబం కట్టి అమ్ముతారు .సువాసన బాగా ఉంటుంది .వినాయక దేవాలయాలు మురుగన్ ఆలయాలు శివాలయాలు మద్రాస్ లో ఎక్కువ వీదికోటి ఉంటుంది .అరవవాళ్ళు సాంప్రదాయాన్ని బాగా పాటిస్తారని తెలిసింది .భక్తీ ఎక్కువ. సంగీతం మీద మోజూ ఎక్కువ .కచేరీలకు వెళ్ళటం చాలా సరదా .అక్కడ వినటం, తల బాగా ఊపటం వారికే చెల్లింది .విభూతి రేఖలు ప్రతి పెద్దాయన నోసటా కనీ పిస్తాయి .లుంగీ సరే .ఆడవారు సంప్రాదాయ చీర  లో పవిత్రత ఉట్టి పడేట్లుంటారు .వాళ్ళను చూడగానే ఏంతో గౌరవం కలుగుతుంది .

లేబర్ జనం దొడ్డికి వెళ్లి –కడుక్కోరనే అపవాదు ఉండేది నిజమో కాదో తెలీదు .అందుకే వాళ్ళు దగ్గర కొస్తే వాసన మాత్రం బాగా ఎక్కువగా  ఉండేది .కిళ్ళీ విపరీతం గా నమలటం అలవాటు .ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసే వాళ్ళు ..అది రోతగా ఉందేది .ఆ కాలం లో మద్రాస్ చాలా పరి శుభ్రం గా ఉండేది ఎక్కడా చెత్త ఉండేది కాదు .అందుకని మద్రాస్ అంటే గౌరవం గా,ఆదర్శం గా  ఉండేది .’’నీట్ నెస్’’’’ కు ప్రాధాన్యత ఉండేది .అలాగే సినిమాహాళ్ళ  ముందు బస్సులు  ఎక్కే టప్పుడు క్యూ పధ్ధతి పాటించటం మద్రాస్ నుండే అలవాటైంది .దీన్ని గురించి తెగ చెప్పుకొనే వాళ్ళం .ఇలా ఎన్నో అనుభవాలకు మా మద్రాస్ దర్శనం ఒక వేదిక అయింది సుమారు పది రోజులు ఉండి ఉయ్యూరు తిరిగి వచ్చాం .

సశేషం

శ్రీ హనుమద్ వ్రతం శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-13-ఉయ్యూరు

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2

1-రాం లాల్ దయతో నాడు అయ్యాడు సి.ఏం.నాదెండ్ల

   అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నేడు  నడిపిస్తున్నాడు కొడుకు నాదెండ్ల

2-  సీరియస్ లేకుండా ఏం మాట్లాడతాడో తెలీని  జే.సి దివాకర్

  అస్తిమితంగా  మాట్లాడే  మాటలు అవుతున్నాయ్ దివాలాకోర్ .

3-కొంప మునిగి నట్లు త్వరలో చర్చ ముగించాలన్న ‘’డిగ్గీ ‘’

 ఆషా మాషీ కాదని  సీమ నేతలు అగ్గీ -బుగ్గీ .

4-సుత్తి  మాటల కాంగీ ‘’పెసిడెంట్ ‘’సత్తి బాబు లు ‘’

  ‘’ఏటి సేత్తాడో’’ ?నని అర్ధం కాని ఊగిస వాదులు

5-పన్నెండు అని నోరు జారి పదికి కుదించి

  టక్కు టమార విద్యలో ఉంది అధిష్టానం మదించి .

6- నాలుగు ఎన్నికల్లో రాజ కీయ’’ శీలం ‘’పోగొట్టుకొన్న కాంగీ

   బుద్ధి తెచ్చుకోకుండా సిగ్గూ లజ్జా వదిలి  విడిచేసింది లుంగీ

7- కృష్ణ కమీషన్ గోవిందా –ఆంటోనీ మిషన్ హరిలో రంగ హరీ

  మనసు పెట్టక వేడెక్కిన బుర్ర పెడితే అవ్వదా రాచకీయం కిరికిరీ?

8- నా ఫాం  నాహౌస్ నా  ఇష్టం అని తెలంగాణా’’ చెంద్రెన్న’’

  నా భావం  నాఇష్టం సమతూకం నాదన్న సీమాంధ్ర ‘’చంద్రన్న’’

9-చంద్రులిద్దరికీ బహిరంగ చర్చ పెడతాడట ఆర్.కే

  రాచకీయ కోళ్ల సంవాదానికి  అందరూ అంటున్నారు ‘’ ఓ.కే.ఓకె’’

10- డిల్లీలో అందర్నీ ఎదిరించి రెండో స్థానం పొందిన  కేజ్రీ వాల్

   ‘’అన్నా హజం’’ అడ్డు రాక పొతే దూకేసే వాడు ఈజీ గా ఎలెక్షన్ వాల్  .

11-..హాట్రిక్ సాధించిన ఏం.పి.,చత్తీష్ ఘడ్ సి .ఏం.లు

      రాజకీయాల్లో మోడీకి సైదోడై నిలిచిన సమర్ధులైన దోస్తులు .

12-మాజీ ఇన్ఫోసిస్ ‘’నీలేకర్’ అంటించాడు అందరికి ‘’ఆధార్’’

  ‘’ రేపొచ్చే ఎన్నికల్లో కాంగీ కి  అవుతాడట పి.ఏం.గా ‘’‘’ఆధార్’’

13-చిత్త శుద్ధి ఉందని పించిన వరప్రసాదం మాణిక్యం డొక్కా

  రెండు పడవలపై కాళ్లు పెట్టి నోరు మూసి ఆడాడు రాజకీయం పక్కా .

14-మాజీ కాంగీ అధ్యక్షుడు డి.ఎస్.

    నోరు విప్పితే అమ్మ కోసం పలికేది ఓ.ఎస్.

15-రాజస్తాన్ ను నిన్నటి దాకా ఏలిన ’పైలెట్ ‘’

   సైలెంట్ అయి నయా  రాణీ గారికి చెయ్యాల్సొచ్చింది సాల్యూట్ ‘’.

   గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-13-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఎనభై ఏళ్ళ బాల బాపు

ఎనభై ఏళ్ళ బాల బాపు

 

బాపు కు ఎనభై ఏళ్ళు అంటే ‘’ఛీ పో’’ అంటారు .ఎందుకంటె ఆయన నవ్వు లో ముసి ముసి మిసిమి నవ్వలు లెప్పుడూ ఎనిమిదేళ్ళ బాలుడి వి గా ఉంటాయి .ఆరోగ్యం అయన చేతుల్లో లేక పోయినా ఉన్నదాన్ని కాపాడుకొనే తీరుంది .సతీ వియోగం కుంగ దీసినా ,అసలు ‘’బెటర్ హాఫ్ రమణ’’ పరలోకం చేరినా అన్నిటినీ తట్టుకొని నిలబడి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న బాపు చిత్రకారులకు బాపుయే .. .ఆదర్శాల హోరు ఉండదు నేల విడిచి సాము చెయ్యడు ..అందిన దాన్ని జార విరుచు కోడు .అందని దానికోసం ముంత వలక బోసి కోడు .ఆందీ అందని

Inline image 1 చేలాంచలములన్నట్లు తామరాకు పై నీటి బిందువులా ఉండటం ఆయన ప్రత్యేకం.ఆయనకే ప్రత్యేకం .ఇంటికి వెడితే అపూర్వ స్వాగతం పలికే విశాల హృదయం ఉంది .ఎండుకోచ్చార్రా బాబూ అనుకోని వీధి గుమ్మం వేపు మొహం పెట్టి మాట్లాడే బాపతుకాడు .చుట్టమైనా ,పక్క మైనా మరోడైనా బాపు దారి తీరు వేరే .అందరూ చూసి నేర్వాల్సిందే ..

పైకోకటీ లోనోకటీ టైప్ కాదు ఖచ్చితమైన మనిషి ,మనీషి .మనసున్న మరో బాపు .విశ్రాంతి ఎరుగని అవిశ్రాంత చిత్ర జీవి .సినిమా కే రంగులు అద్దిన రంగు ల హంగుకాడు.భేషజం లేని వాడు .అందరికీ అందు బాటు వాడు .కొండరాయన్ను అతిగా వాడుకొంటారుఆయనేమీ అనుకోడు .అది వారి ఖర్మ అను కొంటాడు .

 

 

 

 

 

మన ప్రాచీన సంపదకు ప్రాపు బాపు .వాటి ని నిత్య జీవితం లో అందునా సినీ జీవితం లో అమలు చేసిన చరిత్రకారుడు .ఏది తీసినా నీటుగా తీర్చి దిద్దే నీటు గాడు ఒక రకం గా పోటు గాడు .ఆ లెవెల్ కు చేరటానికి సాహసం చేయలేరెవరూ .రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చింది ఆ బాపు .సినీ లక్షణ శ్రుమ్ఖ శ్రుమ్ఖ లాలను  చేదించి చేటు భావాలను కూల్చి సాహసోపేత జాతి జన జీవితాలను ఆవిష్కరించాడు ఈ బాపు .ఆ బాపు చరిత్రకారుడు .ఈ బాపు చిత్ర చరిత్రకే మకుటాయమాన మైన వాడు .

ఆ అమాయక మనిషి లో స్వార్ధం లేదు .కపటం లేదు .కాని ఆయన పేరు చెప్పుకొని స్వార్ధం కోసం వాడుకొనే వారి మాటల్లో మాత్రం ఉంది స్వార్ధం .వీటికన్నిటికీ అతీతుడు బాపు .ఇప్పటికీ ఎనిమిదేళ్ళ పసి బాలుడే ‘’అన్నిటా టాపుబాపు’’ .అందుకే అందరికీ బాపురే బాప్ అయ్యాడు మరిన్ని ఏళ్ళు ఆరోగ్యం తో అందరి ముందు కదలాడాలని ఆశిస్తున్నాను .ఇది బాపు బాలునికో నూలు పోగు మాత్రమె .

గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-13-ఉయ్యూరు

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నా దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర

నా  దారి తీరు -51

సకుటుంబ తిరుపతి యాత్ర

బహుశా 1969 డిసెంబర్ లో మేము సకుటుంబం గా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాం. సకుటుంబం అంటే నేనూ  మా ఆవిడా ,మా పెద్దబ్బాయి శాస్త్రి ,రెండో వాడు శర్మ ,మూడో వాడు మూర్తి .,మా బావమరిది ఆనంద్ .మూర్తి చిన్నప్పుడు అన్నమాట .వాడి పుట్టి వెంట్రుకలు తిరుమలలో తీయాలని మొక్కు .ఆ మొక్కు తీర్చటానికి బయల్దేరాం .అప్పటికి మాకు ఇంకా రైల్ రిజర్వేషన్ గురించి పెద్దగా తెలీదు ..

మచిలీ పట్నం నుంచి అప్పుడు రోజూ ఒక ఎక్స్ప్రెస్ బస్ తిరుపతికి ఉండేది .అది సాయంత్రం అయిదింటికి ఉయ్యూరు వస్తుంది .మర్నాడు తెల్ల వారుజ్హామున అయిదింటికి తిరుపతి చేరుతుంది .దానికప్పుడు రిజర్వేషన్ లేదు సరాసరి ఎక్కటమే .అలానే అన్నీ సర్దుకొని కావాల్సిన వన్నీ తీసుకొని సర్దుకొని దారిలో తిండి తోసహా రెడీ అయి బస్ ఎక్కాం .

దారిలో తెచ్చుకొన్న అన్నం ,పులిహోర మొదలైనవి తిన్నాం .చలికాలం .చలికి తట్టుకొవటానికి అప్పుడు మా దగ్గర అంత పకడ్బందీ సరుకేమీ  లేవు ..స్వెట్టర్లు మాత్రం ఉన్నట్లు జ్ఞాపకం ఉంది .తిరుపతి లో బస్ స్టాండ్ లో దిగి తిరుమల బస్ ఎక్కి కొండపైకి వెళ్లాం అప్పుడు చాలా తక్కువ చార్జీ ఏ ఉండేది .సత్రం లో రూమ్ కూడా తీసుకోలేదు .డైరెక్ట్ గా మంగళ్లున్న చోటికి తీసుకొని వెళ్లాను .’’ఇది కాదను కొంటానండీ ‘’అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంది మా ఆవిడ .అక్కడే ఎక్కడో ఒక చోట స్నానాలు కూడా చేయించాను .ఇది అంతా నా స్వయం క్రుతాపరాధమే .అప్పుడు మా పక్కింటి బెల్లం కొండ సుబ్బయ్య గారి రెండో అబ్బాయి హనుమంతం కానీ పించాడు .ఆయన మమ్మల్ని చూసి ‘’ఏమిటీ /ఇక్కడ గుండు చేయిస్తున్నారు ?అక్కడ దేవస్తానం వారి కళ్యాణ కట్ట ఉండగా ?పుష్కరిణి ఉండగా? .తెలీక పొతే ఎవర్నయినా అడగాలి కాని మూసి వాయినం ముత్తైదు లాగా ?అన్నాడు .మాకు శ్రీనివాసుడు ఇక్కడే కనీ పించాడనుకోన్నాను .అప్పుడు ఆయన చెప్పిన దారిలో వెళ్లి కళ్యాణ కట్టలో మూర్తికి పుట్టు వెంట్రుకలు తీయించి నేనూ తిరు క్షౌరం చేయించుకొని పుష్కరిణి లో స్నానం చేశాము .

అప్పుడు రద్దీ తక్కువ గానే ఉంది .సరాసరి దేవాలయానికి వెళ్లి స్వామి దర్స్ద్ధనాన్ని తనివి తీరా చేసుకోన్నాం .అదొక మధురాను భూతి గా మిగిలింది .అప్పుడు టికెట్ల గొడవా లేదు క్యూలు లేవు .హాయిగా తనివి తీరా ఉచిత దర్శనమే ఉండేది .మా బావమరిది ఆనంద్ దేవుడిని చూసి పరవశం చెంది కళ్ళు మూసుకొని చాలా సేపు అలాగే నిల బడ్డాడు .అప్పుడు ప్రభావతి అడిగింది ‘’ఏమిట్రా తమ్ముడూ!ఇంత సేపు దేవుడిని చూస్తూ ఉన్నావు ?యేమని కోరుకోన్నావేమిటి ?అని అడిగింది దానికి వాడు ‘’అమ్మా ,నాన్న చాలా కాలం జీవించాలని కోరుకోన్నానక్కయ్యా ‘’అని చెప్పాడు .ఈవిడ ఆ మాటలకు ఏంతో పొంగిపోయింది తమ్ముడి ఆలోచనలకు .మాఅబ్బాయిలకు అంత సీన్ అప్పుడు లేదు .

 

గుడిలోంచి బయటికి రాగానే కాసేపు ఎక్కడో చెట్టు నీడలో కూర్చుని ఆ తర్వాత కిందికి తిరుపతి కి బస్ లో వచ్చి సత్రం లో రూమ్ తీసుకొన్నాం .అక్కడ నుంచి అలి వేలు మంగా పురానికి జట్కా బండీ లో వెళ్లాం .అప్పుడు రోడ్డు చాలా దారుణం గా ఉండేది ఎగుడూ దిగుడూ రోడ్లు .జట్కాలో కూసాలు కదిలేవి కూర్చున్న వాళ్లకు జట్కా వాడు చెప్పినట్లు వెనక్కీ ముందుకూ సర్దు కొంటూ వెళ్ళాల్సి వచ్చేది .పద్మావతీ అమ్మ వారి దర్శనమూ బానే జరిగింది .అక్కడి నుంచి శ్రీ కాళహస్తి వెళ్లాం..శ్రీ కాళ హస్తీశ్వర స్వామిని కనులారా దర్శించుకోన్నాం . అక్కడే కన్నప్ప స్వామిని దర్శించాడని చదువుకొన్నాం విన్నాం సినిమాలూ చూశాం కన్నప్ప కొండ ,ద్రౌపది గుడి మొదలైన వన్నీ చూశాం .ప్రసాదాలు ఇస్తే తిన్నాం .ఈ విధంగా మా తిరుపతి యాత్ర ఒక ప్రహసనమే అయింది .. మా ఆవిడ ఎప్పుడూ దీన్ని దెప్పుతూ ఉంటుంది .వెల్లతమె కాని తీసుకొని వెళ్ళటం చేతకాకపోవటం వలన వచ్చిన ఇబ్బంది ఇది . v.

కా ళహస్తి లో బస్ ఎక్కి మద్రాస్ కు వెళ్లాలని ప్లాన్ .బస్ ఎక్కడ ఆగుతుందో తెలీదు పిల్లల్ని ఆవిడనూ ఇటూ అటూ తిప్పి ఆవిడ సనుగుల్లు భరిస్తూ మొత్తం మీద ప్రైవేట్ బస్ ఎక్కం .మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎదురు చూస్తె సాయంత్రం అయిదింటికి వచ్చింది బస్సు .అదేక్కి నాలుగు  గంటల తర్వాత తొమ్మిదింటికి   మద్రాస్ చేరాం ..అప్పుడు బస్సులు పారిస్ లో ఆగేవి .అక్కడే ఎక్కాలి ఎక్కడికి వెళ్ళాలన్నా .. 15నంబర్ సిటీ బస్ ఎక్కిపూన మల్లి హై రోడ్ లో  ,అంజి కరై మీదుగా షినాయ్ నగర్ లో మా అక్కయ్యా వాళ్ళింటి దగ్గర దిగాం ..ముందుగా మేము మా అక్కయ్యా వాళ్లకు చెప్పామో లేదో జ్ఞాపకం లేదు .మాకు అందరికి వంట చేసి భోజనాలు పెట్టింది అక్కయ్య .అలసట లో నిద్ర బానే పోయాం .

మా బావ గారు గాడేపల్లి కృపానిధి గారు .మద్రాస్ కార్పోరేషన్ లో హెల్త్ డిపార్ట్ మెంట్ లో యు.డి.సి .ఉద్యోగి .కార్పోరేషన్ వారు ఇచ్చిన ఉచిత మేడ మా వాళ్ళది. మా వాళ్ళు పై అంతస్తులో ఉండేవారు కిందిది అద్దేకిచ్చారు బోలెడు స్తలం .కాని అక్కడి బోరింగ్ పంపుల్లో నీళ్ళు రావటం కష్టం .ఏంతో సేపు గట్టిగా కొడితేనే నీరు వచ్చేది .నీరు కూడా అంత బాగుండేది కాదు .నీళ్ళ తో చాలా ఇబ్బంది గా ఉండేది ఒక కిచెన్ హాలు ,బెడ్ రూమ్ .కొద్దిగా వరండా ఉండేది ఎదురుగా కార్పోరేషన్ పార్కు .అన్నా నగర్ చాలా దగ్గర .బస్ ఇంటి దగ్గరే ఆగుతుంది అక్కడే ఎక్కచ్చు కార్పోరేషన్ వారి ప్రాధమిక విద్యాలయం ఇంటికి దగ్గరే ఉంది తెలుగు చదువుకొనే వారి స్కూలు కూడా దగ్గరే .మంచి సెంటర్ లో ఉన్న బిల్డింగ్ .సౌకర్యం గా ఉంది అప్పుడు పాలు ఒక కేంద్రం నుంచి తెచ్చుకొనే వాళ్ళు చిన్న సీసాలలో  పట్టి ఇచ్చే వాళ్ళు ఆ తర్వాత పాకెట్ పాలు వచ్చాయి .సిటీ బస్ సౌకర్యం బాగా ఉండేది .మా అక్కయ్య బావా పెద్ద మేనకోడలు సత్యకళ,చిన్నమేనకోడలు జయా మేనల్లుడు శ్రీనివాస్ .అందరూ మేము వచ్చి నందుకు ఏంతో సంతోషించారు .మిగిలిన విషయాలు తర్వాత

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సరసభారతి 54వ సమా వేశము గీతా జయంతి

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం – ఫలాల తో పూజ మరియు గీతా జయంతి

 

గీతా జయంతి

శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా త్రయాహ్నికం గా జరిగే కార్య క్రమాలలో రెండవ రోజు’’వివిధ ఫలాల తో’’ శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి విశేష పూజ నిర్వహించాము .ఈ రోజు శ్రీ గీతా జయంతి కూడా .గీతా జయంతి ని పురస్కరించుకొని సరసభారతి 54వ సమా వేశాన్ని కూడా దేవాలయం లో నిర్వహించాం ..

ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు సడెన్ గ గీతా జయంతిని నిర్వహిస్తే బాగుంటుంది అని పించి ఎవర్ని పిలవాలో ఒక్క క్షణం ఆలోచించి మన కాలేజి దగ్గరున్న శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ‘’శ్రీ మధుసూదనం పిళ్లే’’గారికి ఫోన్ చేశాను .ఆయన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తూ వాళ్ళ స్కూల్ విద్యార్ధుల చేత రెండు అధ్యాయాలు గీత పఠనం చేస్తే బాగుంటుందని అన్నాను వెంటనే ఒప్పుకొన్నారు .ఏంతో ఆనందం వేసింది .అవ్యవధానం గా కార్యక్రమం ఖరారైంది .ఇలా చేసినందుకు ఆయనను ఏమీ అనుకోవద్దని చెప్పాను.అలాంటిదేమీ లేదని’’ మీరు నిర్వహిస్తున్నందున సంతోషం గా ఉందని మీరు  చెప్పిన టైం కే అంటే ఉదయం పదిన్నరకే విద్యార్ధులతో వస్తానని’’ చెప్పారు పిళ్లే.

This slideshow requires JavaScript.

నేను నా కార్య క్రమాలు పూర్తీ చేసుకొని ఉదయం తొమ్మిదిన్నర కు దేవాలయానికి చేరాను .అరటి పండ్లు కమలాలు యాపిల్ ,దానిమ్మ ద్రాక్ష ,ఉసిరి గుమ్మడి పళ్ళతోస్వామి వారలకు సహస్రనామ పూజ చేశాం .

పదిన్నరకు పిళ్లే గారు భార్య శ్రీమతి శాంతకుమారి తోనూ ఏడుగురు విద్యార్ధినుల తోనూ వచ్చారు .అక్కడ ఉన్న గీతా బోధన చిత్ర పటానికి అందరి చేత పుష్పాలు వేయించి మొదలు పెట్టాము .పిళ్లే గారిని ముఖ్య అతిధిగా ను,భార్య ను ‘’ గీతోపదేశం స్తుతి ‘’చేయమని ఆహ్వానించాను .పిళ్లే గారిని గురించి నేను మాట్లాడుతూ ‘’పిళ్లే గారితో ముప్ఫై ఏళ్ళుగా పరిచయం ఉందని ,విశ్వ హిందూ పరిషద్ ,ఆర్ ఎస్ ఎస్ చేబట్టే ప్రతికార్యక్రమాన్ని  ఆయన ఏంతో చిత్త శుద్ధిగా నిర్వహిస్తారని, గీతా పోటీలకు విద్యార్ధులను తయారు చేసి పంపి బహుమతులు సాధిస్తారని,నిరాడంబర జీవి అని ఎన్నో స్కూళ్ళు కొత్తగా వచ్చినా ఆ పోటీ లో నిలబడి శాంతి నికేతన్ ను కాపాడుకొంటూ,హాస్టల్ ను కూడా నడుపుతూ  కనీసం నాలుగు వందల మంది విద్యార్ధులతో నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని పొందారని .మలయాళీ అయినా మన తెలుగు పైణా  సంస్కృతీ పైనా విశేష మైన విశ్వాసం ఉన్నవారని ,అడగం గానే ఇవాళ కార్య క్రమానికి రావటంసంతోషం గా   ఉందని క్రుతజ్ఞాతలని ‘’చెప్పాను

పిళ్లే ‘’మేస్తారితో నాకు ఏంతో కాలం గా పరిచయం ఉంది వారు పిలిచినప్పుల్లా వెళ్లి పాలు పంచుకొంటాను .అలాగే ఇవాళ వచ్చాను .అన్నారు .నేను భగవద్ గీత లో ఉన్న కర్తవ్యమ్ గురించి ,ఫలా పేక్ష రహిత పనుల గురించి గీత బోధనకు నేపధ్యాన్ని గురించి చెప్పాను .శ్రీ మతి శాంతకుమారి గీతా స్తుతి శ్రావ్యం గా చేశారు .ఆ తర్వాత విద్యార్ధినులు భక్తీ యోగం ,పురుషోత్తమ ప్రాప్తి యోగాలను పఠనం చేశారు .ఇందులో మా మనవరాలు రమ్య కూడా పాల్గొంది .నేను ‘’మేము హిందూ పురం లో ఉన్నప్పుడు అంటే 1947-48.లో సుమారు ఎనిమిదేళ్ళ వయసులో అక్కడ జరిగిన భగవద్ గీత పోటీలలో భక్తీ యోగం లో నేను ,పురుషోత్తమ

ప్రాప్తి యోగం లో మా అక్కయ్య దుర్గా మొదటి బహుమతులు సాధించిన విషయం ఇప్పుడు మా మనవరాలు రమ్య పాల్గొంటున్న  సందర్భం గా గుర్తుకు వచ్చింది. అప్పుడు శ్లోకాలు వెనక నుంచి ముందుకు కూడా చదివితేనే బహుమతి ఉండేది .ఆప్పుడు బహుమతిగా ఇచ్చిన  భగవద్గీత పుస్తకాన్ని ఇప్పటికీ నేను రోజూ చదువుకొంటూ భద్రం గా ఉంచుకోన్నాను ‘’అని చెప్పాను . పిళ్లే దంపతులకు ఆలయ మర్యాదలతో సత్కారం చేసి ,సరసభారతి పుస్తకాలు ‘’సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ‘’రెండూ ఇచ్చి సత్కరించాను .పాల్గొన్న విద్యార్ధినులకు కూడా ఈ రెండు పుస్తకాలను గీతా జయంతి శుభా కాంక్షలతో అంద జేశాను .అనుకోకుండా మొదలు పెట్టిన ఈ కార్య క్రమంస్వామి కృప చేత  ఇలా విజయ వంతమైంది ..

మార్గ శిర శుద్ధ ఏకాదశి –శ్రీ గీతా జయంతి శుభా కాంక్షలతో

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-13-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చరిత్ర అక్షర మైతేనే శాశ్వతం -అవిశ్రాంత పరి శోధకులు వకుళాభరణం రామ కృష్ణ –

 

చరిత్ర పరిశోధన, చరిత్ర గ్రం«థ రచనే జీవిత లక్ష్యంగా సాగిపోతున్న వారు ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడిగా ఎన్నో గురుతరమైన బాధ్యతల్ని నిర్వహించిన వారాయన. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమగ్ర చరిత్ర గ్రంథాలేవీ లేవని ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా ఆ పనిమీదే ఉండిపోయారాయన. 200 మంది చరిత్రకారులను సమాయత్త పరిచి తాను ప్రధాన సంపాదకుడుగా ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి’ పేరుతో 8 సంపుటాలు ముద్రించే పనిలో ఉన్నారు ఆయన. ఇప్పటికే 5 సంపుటాలు విడుదలయ్యాయి. 75 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఆయనకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్పే అవకాశం రావడమే కాకుండా, ఎన్నో విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం కలిగింది. నా దృష్టి పదునెక్కింది. నా దృక్పథం విస్తరించింది. మనల్ని ఎదగకుండా చేసే బంధాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, వాటిని అధిగమిస్తే గానీ, ఆకాశం మన చేతికి రాదని ఆ పరిణామాలు నాకో పాఠం నేర్పాయి.

మా ఊరు పాకల. అప్పట్లో అది నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకాలో ఉండేది. ఇప్పుడది ప్రకాశం జిల్లాలో ఉంది. మా ఊరికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. చాలా ప్రశాంతమైన ఊరు. కందుకూరు తాలూకాలోని మిగతా గ్రామాలతో పోలిస్తే ఎక్కువ మంది చదువుకున్నది మా ఊరు వాళ్లే. అందుకే మా ఊరిని కొందరు సరస్వతీ గ్రామం అని పిలిచేవారు. నా మనసు చదువు మీదికి వెళ్లడానికి ఈ వాతావరణం ఎంతగానో దోహదం చేసింది.

మా కుటుంబం విషయానికి కొస్తే, జాతీయోద్యమంలో మా నాన్న ప్రత్యక్షంగా ఏమీ పాల్గొనలేదు గానీ, మా చిన్నాన్న పాల్గొన్నాడు. హరిద్వార్ కాంగ్రెస్ మహాసభకు వెళ్లి, గాంధీ మీద తిరుగుబాటు చేసిన సుభాష్ చంద్రబోసుకు ఓటు వేశాడు. నాకు 16 ఏళ్లు వచ్చేసరికి ఈ జాతీయోద్యమ భావజాల స్ఫూర్తి క్రమేపీ వామపక్ష భావజాలంగా మారిపోయింది. నాకు ఊహ తెలిసిన 50 వ దశకం, నా చదువు ఒక స్థాయికి చేరుకున్న 60 వ దశకం ఈ రెండు దశకాలు మన దేశ చరిత్రలో ఎంతో గొప్పవి. 1947 లో స్వాతంత్య్రం సాధించిన ఆ జాతీయోద్యమ స్పూర్తి, ఆ త్యాగనిరతి, నిబద్ధత మా పసిమనసులను అమితంగా ప్రభావితం చేశాయి. మా ఆలోచనల మీద ఒక బలమైన ముద్ర వేశాయి.

అయినా ప్రేమిస్తారు
కావలిలో బీఏ(చరిత్ర)చేస్తున్న నేను కొన్ని ఆర్థిక కారణాల వల్ల విజయవాడలోని సి.ఆర్.ఆర్, సి.వి.ఆర్ కాలేజ్‌లో చేరాను. అక్కడ విశ్వనాథ సత్యనారాయణగారు మాకు తెలుగు బోధించేవారు. ఆయనంతటి అద్భుతమైన టీచర్‌ను నా జీవితంలో ఎక్కడా చూడలేదు. తెలిసీ తెలియని వామపక్ష భావాలు అప్పటికే నాలో ఉండేవి. అప్పుడప్పుడు క్లాసులో ఆయన అడిగే ప్రశ్నలకు నేనిచ్చే సమాధానాల ద్వారా విశ్వనాథవారు ఆ విషయాన్ని పసిగట్టేశారు. ఒకరోజు క్లాసులో ఆయన నాకేదో ప్రశ్న వేశారు. నేను జవాబు చెప్పలేకపోయాను. వెంటనే ఆయన “ప్రజాశక్తి పాస్…పెద్ద బాలశిక్ష ఫెయిల్” అన్నారు. నాకు ఆ మాటల్లోని భావం వెంటనే స్ఫురించకపోయినా ఆ తర్వాత బోధపడింది. “కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాడివి కనుక ప్రజాశక్తి విషయాలు చెప్పగలవు గానీ, దానికి సంబంధం లేని పెద్ద బాలశిక్ష విషయాలు నువ్వు చెప్పలేకపోతున్నావు” అన్న అర్థం ఆ మాటల్లో నాకు వినిపించింది.

అప్పుడే కాదు ఆయన నోట ఎప్పుడూ కూడా అలాంటి భావగర్భితమైన మాటలే వచ్చేవి. నిజానికి తెలుగు భాష పట్ల నాలో ఒక మమకారం ఏర్పడటానికి, భాష పట్ల ఒక అభినివేశం పెంచుకోవాలన్న సంకల్పం నాలో నాటుకోవడానికి ఆయనే కారణం. కాకపోతే కావలిలో టీచర్లకు, స్టూడెంట్లకూ మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఇక్కడ కనిపించేది కాదు. ఈ కాలేజీ వాతావరణం నాకు నచ్చలేదు. పైగా మొదట్నించి నా దృష్టి చదువు మీద తక్కువ, ఇతర విద్యార్థి కార్యక్రమాలపై ఎక్కువ. ఈ కాలేజీ ఎందుకో నాకు అంత అనువైనదిగా అనిపించలేదు. ఏమైనా అక్కడ చేరిన 5 మాసాలకే నేను టీ సీ తీసుకుని తిరిగి కావలి కాలేజీలో చేరడానికి బయల్దేరాను. ఆ విషయం తెలిసిన విశ్వనా«థ వారు “ఏరా వెళ్లి పోతున్నావా? ఇక్కడే చదువుకోరా!” అన్నారు ఎంతో ఆ్రర్దంగా. నేనంటే ఆయనకు కోపం ఉంటుందనుకున్నానే గానీ, నా పట్ల ఆయనకు అంతటి ఆత్మీయ భావన ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పటికి ఇంకా జ్ఞానపీఠ అవార్డు రాలేదు కానీ, కవి సామ్రాట్టుగా ఆయన ఎంతో ప్రసిద్ధులే. అంతటి వ్యక్తి ఒక మామూలు విద్యార్థినైన నా మీద అంతటి మమకారం చూపడం నన్ను ఎంతో పులకింప చేసింది. నిజానికి విశ్వనాథ వారి భావజాలానికి పూర్తిగా భిన్నమైన భావజాలం నాది. అయినా ఆయన నన్ను ప్రేమించారు. మహానుభావులు వ్యక్తిగత భావజాలాలకు అతీతంగా ఉంటారేమోనని ఆ సంఘటన ద్వారా నాకు తెలిసొచ్చింది.

చరిత్ర అడుగులెంట….
వాల్తేరులో ఎం.ఏ పూర్తి కాగానే నేను డిగ్రీ చదువుకున్న కావలి కాలేజీలోనే నాకు నా 21వ ఏట లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఈలోగా పెళ్లయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. అలా 10 ఏళ్లు గడిచాయి. కానీ, పాఠాలు చెప్పడానికే పరిమితమైపోయిన నా జీవితం ఎక్కడో కుదించుకుపోతున్న భావన కలిగింది. చరిత్రకు సంబంధించిన ఏదైనా ఒక లోతైన అంశం మీద పరిశోధన చేయాలనిపించింది. అప్పుడు నాకు 33 ఏళ్లు ఉంటాయి. ఎం. ఫిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఢిల్లీలోని జెఎన్‌టీయూలో సీటు వచ్చింది. ఆ తరువాత పి.హెచ్.డిలో చేరాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి కుమారుడు సర్వేపల్లి గోపాల్ నాకు గైడ్‌గా ఉన్నారు. చారిత్రక సంఘటనల మధ్య ఉండే అంతస్సంబంధం ఏమిటి? చరిత్రలో ఏ చోదక శ క్తులు ఉన్నాయి? చరిత్ర ఎలా ఏర్పడుతుంది? ఎలా ముందుకు నడుస్తుంది?

సమాజంలోని అనేక వర్గాల ప్రజల మధ్య ఉండే సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఇవి భావజాల ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? ఆర్థిక ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? సామాజిక విషయాల ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? వీటిలో ఏది ముఖ్యమైన చోదక శక్తి? అనే విషయాల్ని తెలుసుకోవడానికి, చరిత్రకు సంబంధించిన నిజమైన జ్ఞాన స్పృహ కలగడానికి, నా కళ్లు తెరుచుకోవడానికి జెఎన్‌టీయూ ఎంతగానో దోహదం చేసింది. అదే ఆధునిక కాలంలో ఆంధ్రదేశ సామాజిక చరిత్ర మీద పరిశోధన చేయడానికి ప్రేరణ అయ్యింది. ఆ సిద్ధాంత గ్రంథమే “ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు” అనే పేరుతో తెలుగులోకి అనువాదమై ఇప్పటికి నాలుగు ముద్రణలు అయ్యింది. అది నాకు బాగా పేరు తెచ్చింది. చదువుకునే రోజుల్లో విద్యార్థి కార్యకలాపాలకే ఎక్కువ సమయం కేటాయించిన నాకు జెఎన్‌టీయూలో చేరాక నిజమైన విద్యార్థి భావన కలిగింది. గాలివాటంగా సాగిపోయే జీవితాలకు కూడా ఎప్పడో ఒకప్పుడు తనను తాను నిరూపించుకునే అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే గానీ, జీవితం సార్థకం కాదని నాకనిపిస్తుంది.

సందిగ్ధంలోంచి విముక్తమై….
పీహెచ్‌డీ పూర్తి కాగానే మళ్లీ కావలికి వెళ్లి పాతికేళ్లు అక్కడే పనిచేశాను. అందులో నాలుగేళ్లు ప్రిన్సిపాల్‌గా చేశాను. అయితే ప్రిన్సిపాల్‌గా చేస్తున్న కాలంలో నాలో ఒక తీవ్రమైన అంతర్మ«థనం మొదలయ్యింది. పరిపాలనా వ్యవహారాలు చూడటం మన పని కాదనిపించింది. అల్పమైన కారణాలకే జరిగే అతి పెద్ద గొడవలు, సమ్మెలు, ధర్నాలు, ఆత్యహత్యలు, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం, ప్రభుత్వం నుంచి సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందకపోతే అప్పుతెచ్చి ఆ హాస్టల్ బాకీలు చెల్లించడం ఇవ న్నీ నాకు చిరాకు కలిగించాయి. అంతకన్నా ఉన్నతమైన పని చేసే అవకాశం ఉండి కూడా వీటిలో పడి ఉండడం ఎంత మాత్రం ఉచితం కాదనిపించింది. ఏదైనా యూనివర్సిటీకి వెళ్లాలనిపించింది. ఆ మాటే కొందరితో అన్నాను కూడా. కానీ, ఆ ప్రాంతీయులంతా “అలా ఎలా వెళతారు? మీరు చదువుకున్న కాలేజీ కదా! ఇది మీ మాతృ సంస్థ. దీన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లే బాధ్యత మీకు లేదా?” అంటూ దాదాపు ఆరు మాసాల పాటు నా మీద ఒత్తిడి తెచ్చారు. నాలో కూడా ఒక సందిగ్ధావస్థ మొదలయ్యింది.

నిజంగానే నా మాతృసంస్థకు ద్రోహం చేస్తున్నానా? అంటూ ఒక డోలాయమానంలో పడిపోయాను. ఆ పరిణామాలు నన్ను తీవ్రమైన ఆత్మసంఘర్షణకు గురిచేశాయి. కానీ, అవతల పరిపాలనా విషయాల పట్ల ఆసక్తి ఉన్న ఎందరో ఉన్నారు. వారికి ఆసక్తి ఉన్న బాధ్యతల్ని వారికి అప్పగించకుండా నాకున్న వేరే ఆసక్తుల్ని చంపుకుని ఇక్కడ పడి ఉండడం ఎందుకు? అనిపించింది. చివరికి ఒకరి సహకారంతో కాలేజీ వ్యవస్థాపకుడ్ని ఒప్పించి యూనివర్సిటీ జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాబ్ రావడంతో నేను వెళ్లిపోయాను. ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్పే అవకాశం రావడమే కాకుండా, ఎన్నో విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం కలిగింది. నా దృష్టి పదునెక్కింది. నా దృక్పథం విస్తరించింది. మనల్ని ఎదగకుండా చేసే బంధాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, వాటిని అధిగమిస్తే గానీ, ఆకాశం మన చేతికి రాదని ఆ పరిణామాలు నాకో పాఠం నేర్పాయి.

నిర్ణయాలు వేళ్లూనుకుని
జెన్‌టీయూలో పిహెచ్‌డీ చేస్తున్న కాలంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. అప్పుడు మేము మత భావజాలానికి వ్యతిరేకంగా అక్కడ చాలా కార్యక్రమాలు చేశాం. అన్ని మతాలూ, అన్ని కులాలూ ఉన్న దేశం మనది. ఈ దేశానికి సంకీర్ణ సంస్కృతి ఒక్కటే మార్గం. అది పోగొట్టుకున్న నాడు ఈ దే శానికి ఒక వ్యక్తిత్వమే లేకుండా పోతుందని నేను బలంగా నమ్ముతాను. అయితే ఈ భావజాలానికి, నా వ్యక్తిగత నిర్ణయాలకూ మధ్య ఒకసారి ఘర్షణ వచ్చింది. నా కూతురు, ఆమె భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న రోజులవి. నా కూతురు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రంజాన్ రోజున అబ్బాయి పుట్టాడు. వాడికి ఏదైనా ఒక ముస్లిం పేరు పెట్టాలన్న ఆలోచన నాకు కలిగింది. ఈ విషయాన్నే నా కూతురు, అల్లుడి ముందు ప్రస్తావించాను. అయితే ఇది నా భావజాలాన్ని ఆ పిల్లాడి మీద రుద్దినట్టు అవుతుందేమో అని కూడా ఒకసారి ఆలోచించమని చెప్పాను. “అది చాలా గొప్ప ఆలోచన. మీ భావజాలాన్ని రుద్దినట్లు కాద”ని ఇద్దరూ అన్నారు. నేను కొంతమంది ముస్లిం సోదరుల సలహాతో వాడికి ఇర్ఫాన్ (వివేకవంతుడు) అనే పేరు పెట్టాను. ఆ తర్వాత ఒకసారి కొడుకుతో సహా ఢిల్లీ వెళుతున్న నా కూతురును హైదరాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఏపి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఇంటికి వచ్చాను.

అయితే, రైల్లో బాంబు పెట్టారన్న వదంతి కారణంగా మార్గ మధ్యంలో ఎక్కడో రైలు ఆపేశారని నా కూతురు ఫోన్ చేసింది. ప్యాసెంజర్ల లిస్టులో నా మనవడి పేరు చూసిన పోలీసులు నా కూతురు వద్దకు వచ్చి ఆ బాంబులు పెట్టింది ముస్లింలే అన్న భావనతో ‘ఇర్ఫాన్’ ఎవర ని అడిగారట. విషయం తెలిసిన మా అమ్మాయి “మేము హిందువులమే. నా పేరు విద్య” అని చెప్పింది. “మీరు హిందువులే అయితే మీ అబ్బాయికి ఇర్ఫాన్ అని ఎందుకు పెట్టారు?” అంటూ పోలీసులు నిలదీశారట. మా అమ్మాయి గట్టిగా సమాధానం చెప్పాక పోలీసులు వెళ్లిపోయారట. ఆ తర్వాత ఒకరోజు మా అల్లుడు, కూతురు సమక్షంలో మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చాను. ఇలాంటి సమస్యలు మునుముందు కూడా ఎన్నో రావచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అబ్బాయి పేరు మార్చుకోవచ్చు అన్నాను. సమస్యలు వచ్చినా సరే! ఆ పేరు మార్చే ప్రసక్తే లేదంటూ వారిద్దరూ కరాఖండిగా చెప్పేశారు. నా మనమడు ఇప్పటికీ ఆ పేరుతోనే కొనసాగుతున్నాడు. నిర్ణయాలంటూ తీసుకున్నాక వాటి తాలూకు కష్టనష్టాలకు సిద్ధం కాకపోతే ఏ నిర్ణయమైనా అమలు కావడం కష్టమే కదా అనిపిస్తుంది.

బమ్మెర
ఫోటోలు: ఎం. శివకుమార్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం

నా దారితీరు -50

హైదరా బాద్ సందర్శనం

అంతకు ముందు మేమెప్పుడూ హైదరాబాద్ చూడలేదు .దాన్ని గురించి కధలూ గాధలూ విన్నాం .బెజవాడ దాటం గానే నిజాం నాణాలలో డబ్బు చెల్లించాలని ,ఉద్యోగం కావాలంటే ముల్కీ ఉండాలని దానికోసం మన వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పుట్టించే వారని ,అక్కడి భాష మనకు అర్ధం కాదనిఉర్దూ తెలుగు లోమాట్లాడుతారని   ఆడా మగా అందరూ తమల పాకు కిళ్ళీలు వేసి ,ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారని ,కంపార్టు మెంట్లు ప్లాట్ ఫారాలు  అన్నీ  కిళ్ళీ ఉమ్మితోను రోతపుట్టిస్తాయని చెప్పుకొనే వారు .అంతేకాదు రైళ్ళు కూడా హైదరాబాద్ కు రోజుకోకటే ఉండేవని విన్నాను .క్రమం గా అన్నీ మారి పోయి ఇప్పుడు రాజ దాని అయి తెలుగుబాగా మాట్లాడే స్తితి వచ్చింది .ఈ స్తితిలో మేము హైదరాబాద్ యాత్ర చేశాం .

స్టేషన్ కు మా తోడల్లుడు వారణాసి దక్షిణా మూర్తి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని విజయ నగర్ కాలని లో ఉన్న ఎల్ ఐ.జి.కు చెందిన వాళ్ళ స్వంత ఇంటికితీసుకొని వెళ్ళాడు .అది ఆయన తండ్రివెంకటరామ శాస్త్రి  గారిది  .ఆయన హైదరాబాద్ మునిసిపాలిటి లో ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .ఆయన స్వయానా మా రేపల్లెల బాబాయి రాయ ప్రోలు శివ రామ దీక్షితులుగారి భార్య అంటే  మా  లక్ష్మీ కాంతం పిన్ని కి అన్నగారు .అంతేకాదు దక్షిణా మూర్తి అన్నకృష్ణ మూర్తి నాకు బెజవాడ కాలేజి లో ఇంటర్ లో క్లాస్ మేట్ .కనుక పూర్వ బంధుత్వమూ ఉంది .భారతి అంటే మా మరదలు దక్షిణా మూర్తి భార్య అత్త గారు మామ గారు ప్రక్కనే ఉంటారు .రెండు పోర్షన్ల ఇల్లు .ఒక పోర్షన్ లో వీళ్ళు రెండో దానిలో వాళ్ళు ఉంటారు .అతని ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అక్కడే ఉంటారు .శాస్త్రి గారు బాగానే మాట్లాడే వారు భార్య కూడా .వీళ్ళకి మా మామ గారి ఊరు వేలుపు చర్ల లో స్వంత పొలాలు బాగా ఉండేవి .మంచి స్తితి పరులు .పొలాల్లో పొగాకు బాగా పండి మంచి ఆదాయం వచ్చేది .

దక్షిణా మూర్తి ఉన్న భాగం చిన్నదే .ఒక బెడ్ రూమ్ ,వంటగది మాత్రమె .అక్కడే ఉన్నారు .దొడ్లో పెద్ద మామిడి చెట్టు ఉంది .కాయలు ఎక్కువేకాసేవి .అందరం అక్కడే సర్డుకొనే వాళ్ళం .దొడ్లో చిన్న రేకుల షెడ్ చెట్టు కింద ఉంది .పిల్లలు అక్కడే చదువుకొనే వాళ్ళు .పడక కూడా అక్కడే .ఇంత ఇరుకు ఇంట్లో ఉన్నా మా తోడల్లుడి హృదయం విశాల మైంది .అందకని ఆప్యాయతకు కొరత లేదు .మమ్మల్నందర్నీ ఏంతో అభిమానం గా చూశారు అందరూ .

పొద్దున్నే అందరికి ఇడ్లీ కాని లేక ఏదో టిఫిన్ కాని చేసి ,చిక్కటి  ఫిల్టర్ కాఫీ  ఇచ్చేవారు పిల్లలకు పాలు, లేక హార్లిక్స్ కలిపి ఇచ్చే వారు .మూర్తి- ప్రభుత్వ రంగ సంస్థ ఐ.డి.పి.ఎల్ .లో పని చేసేవాడు కంపెనీ బస్ లో వెళ్లి వచ్చేవాడు నైట్ షిఫ్ట్ లు కూడా ఉండేవి .వీటికి తోడూ ఆతను కొన్ని సినిమాలలో నటించాడు. కూడా పెద్ద నటులతో పరిచయమూ ఉండేది .గుంపులో గోవింద గా కొన్ని సినిమాల్లో, కొన్నిట్లో కాసేపు కనీ పించి తెరమరుగయ్యే  పాత్రలూ చేశాడు డైలాగ్ ఉన్న వి కూడా కొద్దిగా చేశాడు .మంచి పర్సనాలిటి .యెర్రని ఎరుపు కుది మట్టం గా ఉండేవాడు .వెడల్పైన ముఖం కోపం వస్తే ముఖం కంద గడ్డ అయ్యేది .చిరు బురు లాడినా భార్య భారతి అంటే విపరీత మైన ప్రేమ .భారతికీ అంతే .ఒకరకం గా ‘’ఓవర్ ప్రేమ ‘’వారిద్దరి మధ్యా ఉండేది .ఆతను మంచి మాటకారి హాస్య ప్రియత్వం ఎక్కువ .

భారతి పెందరాళే వంట పూర్తీ చేసి మా కందరికీ పెట్టి ,తానూ తిని ,మమ్మల్ని ‘’ఊరేగింపు ‘’గా అన్ని చోట్లకూ సిటీ బస్ మీద తీసుకొని వెళ్ళేది. మధ్యాహ్నం టిఫిన్ ఖర్చు కూడా లేకుండా దిబ్బరొట్టె కాని పూరీలు కాని చేసి మాతో బాటు తీసుకొచ్చేది .వీలైన చోట వాటిని

మాకిచ్చి తిని తానూ తినేది .వాళ్ళమగ  పిల్లలు మారుతీష్ భానులు . ఆడ పిల్లలు మాధవి ,పద్మజ. పిల్లల్ని స్కూలుకు పంపి మాతో వచ్చేది భారతి .ఒక రోజు గోల్కొండ కోట చూశాం ఒక రోజు హైకోర్టు .ఇంకో రోజు మ్యూజియం .మరో రోజు టాంక్ బండ్డ్ దగ్గర ఇందిరా పార్కు  .అన్నీ  చాలా చాకచక్యం గా నేర్పుగా చూపిస్తూ వివరించి చెప్పేది .చార్ మీనార్ కూడా ఎక్కాం .పిల్లలు సరదాగా ఎక్కారు .ఎక్కలేని వాళ్ళని చంకలో ఎత్తుకొని చూపించే వాళ్ళం .ఇలా సరదా గా రోజులు గడిచి పోయాయి .సాయంత్రం అయిదూ అయిదున్నరకు ఇంటికి చేరే వాళ్ళం మళ్ళీ  వంటా వడ్డింపు .ఇదేదో బాధ గా చేసే వాళ్ళు కాదు భార్యా భర్తలు .మన  వాళ్ళు ఒచ్చారు .వారు ఇవేవీ చూడలేదు చూపించాలి అని భావించి చేసింది భారతి .రాత్రి నిద్ర అందరం నేల మీదే .దగ్గర దగ్గర గా పడుకొనే వాళ్ళం తెల్ల వారి లేచి మళ్ళీ ఇంకో ప్రోగ్రాం .

ఇలా ఉండగా రాం గుండు దగ్గర ఉన్న మల్లాది రామచంద్రయ్య  గారింటికి ఒక రోజు వెళ్లాం .వాళ్ళు ఉయ్యూరు లో మా పెంకుటింట్లో అద్దెకు ఉండేవారు .మేష్టారు చాలా మంచి వారు భార్య వెంకట లక్ష్మమ్మ గారు .పిల్లలు నరసింహ శాస్త్రి ,రామ కృష్ణ, సత్యం ,వెంకటేశ్వర్లు .ఉయ్యూరు లో నే చదివి హైదరాబాద్ చేరారు పెద్దబ్బాయి శాస్త్రి ఏ.జి ఆఫీస్ లో పని చేసి పెద్ద ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు .రెండో వాడిని ఏం ఆర్.కే .అనే వాళ్ళం సరదా మనిషి .ముద్ద ముద్దగ మాట్లాడే వాడు మూడో వాడు సత్యం పెద్దాడైనా ఎప్పుడూ నోటిలో వేలు వేసుకొని చీకుతూ ఉండేవాడు .చివరి వాడు వెంకటేశ్వర్లు ను వెంకన్నా అని పిలిచే వాళ్ళం .అందరూ మంచి పిల్లలే అంతా మా ఇంట్లో పిల్లల్లాగా ఉండేవారు .భేషజాలు లేవు .మా అమ్మాయి విజ్జి అంటే మేస్టారికి, భార్యకీ మరీ ముద్దు’’విజ్జమ్మా విజ్జమ్మా ‘’అని ఏంతో ప్రేమ గా చూసే వారు

మేము మల్లాది వారింటికి వెళ్ళ గానే వాళ్ళు పొంగి పోయారు .వాళ్ళ స్వంత బంధువులు వచ్చినట్లు ఫీల్ అయ్యారు .నన్ను ఆయనా ఎప్పుడూ ‘’మేస్టారూ ‘’అనే పిలిచే వారు .నేనూ అలానే సంబోధించే వాడిని .వాళ్ళింట్లో పండగ సంబరమే అయింది మా రాక .లక్ష్మమ గారు అన్నీ వండి స్వీట్ చేసి మాకు విందు భోజనం పెట్టారు .అది మరచిపోలేం .నాలుగైదు రోజులు వాళ్ళింట్లో ఉండాలని బల వంతం చేశారు .

ఆ సాయంత్రం వెంకన్న మమ్మల్ని ‘’జూ’’కు తీసుకొని వెళ్ళాడు .అక్కడ తిరిగి అన్నీ బాగానే చూపించాడు. పిల్లలూ బాగానే ఎంజాయ్ చేశారు ‘’బతికిన కాలేజి లో ..ఇక అక్కడి నుండి మా తిప్పలు దేవుడికెరుక .దగ్గర దారి అని చెప్పి యెంత దూరం తిప్పాడో తెలీదు యెంత దూరం నడిచామో తెలీదు అప్పటికే రాత్రి తొమ్మిది అయింది .కాళ్ళీడ్చు కొంటూ ,ఒళ్ళు పులిసి పోయి బట్టలు దుమ్ము కొట్టుకు పోయి ,నీరసం గా అడుగు లో అడుగు వేస్తూ రాత్రి పది దాటిన తర్వాత మల్లాది వారింటికి చేరాం .వాళ్ళంతా ఒకటే కంగారు ఏమై పొయామో నని. .విషయం చెప్పి అందర్నీ కంగారు పోగొట్టాను .ఆ రాత్రి మళ్ళీ ఆప్యాయమైన భోజనం ఏర్పాటు చేశారు .

మర్నాడు ఉదయం అందరం వెంకటేశ్వర్లు సహాయం తో విజయ నగర్ కాలనీకి భారతి వాళ్ళ ఇంటికి చేరుకొన్నాం .వీళ్ళకు దగ్గర స్టాప్ ‘’వెల్ఫేర్ సెంటర్ ‘’అక్కడే సిటీ బస్ ఎక్కే వాళ్ళం దిగే వాళ్ళం వీళ్ళ ఇంటికి  లకడి కా పూల్ దగ్గర .అక్కడనుంచి అన్ని చోట్లకూ తిరిగే వాళ్ళం .బిర్లా మందిర్ సెక్రెటేరియట్,రవీంద్ర భారతి అన్నీ చూశాం అన్నీ దగ్గరుండి చూపించింది భారతి .దక్షిణా మూర్తి మగ పిల్లలుఇప్పుడు  మంచి ఉద్యోగాల్లో చేరి పెళ్ళిళ్ళు అయి పిల్లలతో బానే ఉన్నారు  ఇద్దరాడ పిల్లలకూ పెళ్ళిళ్ళు అయి పిల్లా పాప లతో సుఖం గా హైదరాబాద్ లో ఉన్నారు.

ఇలా సుమారు పది రోజులున్నామేమో హైదరా బాద్ లో. మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పని లేకుండా అన్నీ సందర్శించి ఆనందం పొందాం .పిల్లలంటే దక్షిణా మూర్తి మహా ప్రేమ వాళ్ళకోసం తాము చాలా కష్టపడ్డారు భార్యా భర్తా .స్వంత సుఖం వదులు కొని పిల్లల కేది కావాలంటే దాన్ని సమకూర్చారు .హేల్డీ ఫుడ్ .న్యూట్రి షస్  ఫుడ్ పిల్లకు పెట్టె వాళ్ళు .వాళ్ళ చదువు వాళ్లకు ముఖ్యం గా భావించి తీర్చి దిద్దుకొన్నారు  దక్షిణా మూర్తి ఆవేశ పరుడు ఆలోచన తక్కువ భారతి ఆచి తూచి అడుగేస్తుంది .బాగా స్పష్టం గా ఆలోచించ గలదు అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ముందే తెలుసు కొని పై ఎత్తు వేయగలదు .భర్త అమాయకత్వం వల్ల బావగారు, మరదులు, మామ గారూ ఎక్కడ మోసం చేస్తారో నని ఆస్తినీ ఇంటినీపోగొట్టుకోకుండా ముందు జాగ్రత్తగా కాపాడు కొంది .అన్నీ దక్కెట్లు చేసుకోంది.ఇదంతా ఆమె ప్రతిభా సామర్ధ్యమే అందుకే భారతి నాకు ‘’స్వయం సిద్ధ ‘’అని పిస్తుంది .

హాయిగా పిల్లలూ మేము హైదరాబాద్ ట్రిప్ ను ఆనందం గా పూర్తీ చేసుకొని ఉయ్యూరు కు తిరిగి వచ్చాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి

పువ్వు లాంటిది ఆడ దాని జీవితం –సాగిస్తుంది బతుకు పయనం

పువ్వు లాగా వికసిస్తుంది –సంస్కార వంతుడైన భర్త సంరక్షణ తో వికసించి సువాసన లీనుతుంది .

చదువు సంస్కారాలతో ,కీర్తి ప్రతిష్టలు పొందుతుంది

కొందరు సంఘ సంరక్షణ లో ముందు నిలుస్తారు

కొందరు మాత్రం సిగ లో మాలలుగా నే మిగిలి పోతారు

సంసార బాధ్యతల్లో బతుకు బండీభారంగా  ఈడుస్తూ

ఎదగని మనసులతో ,అనాలోచిత  ఆశలతో

తప్పటడుగు వేసి పడుపు జీవితం గడిపి గుర్తింపు లేకుండా పోతారు పాపం .

   2–పుస్తకం మన నేస్తం

   పుస్తకం మన నేస్తం –అది మన విజ్ఞాన నిధి

విజ్ఞాన వినోద పునర్వికాసాలనందిస్తుంది

కబుర్లు చెప్పి కతలు విప్పి సామేతలందించి వినోదం అందిస్తుంది

ఇతిహాసాలు పురాణాలు వేదం వాజ్మయం చరిత్రా ఒకటేమిటి

సర్వం దర్శించే గవాక్షం పుస్తకం –హస్త భూషణమే

స్త్రీ వికాసానికి ,అంతర్జాతీయ భావనకూ ,శాస్త్ర సాంకేతిక విషయాలకు

నిలయమే మన పుస్తకం చదువు చది వించు .

Posted in రచనలు | Tagged | Leave a comment

పరిశుభ్ర ప్రసవానికి ”జన్మ”కిట్లు -ఆంద్ర జ్యోతి

 

“పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము అందించేదే సామాన్యుల కోసం కాబట్టి అంత తక్కువ ధరను పెట్టాము”

పరిశుభ్రమైన చోట ప్రసవించే హక్కును కూడా కోల్పోతున్న దేశం మనది. కాన్పులు చేసేందుకు అవసరమయ్యే చిన్న చిన్న పరికరాలు లేక పురిటినొప్పులతో బాధపడే ఆస్పత్రులెన్నో ఉన్నాయి. అవన్నీ తన బాధలుగా తలపోసింది చెన్నైకు చెందిన జుబేదా. ఆరోగ్యకరమైన ప్రసవం కోసం ‘జన్మ’ అనే చౌకధర కిట్‌ను పేదలకు అందిస్తోంది..

“మన దేశంలో జరిగే శిశు మరణాలు మరెక్కడా జరగవు. ప్రసవ సమయంలో శుభ్రత లోపించడమే దీనికి ప్రధాన కారణం. అరకొర వైద్య సదుపాయాలున్న పల్లెల్లోనే ఈ సమస్య ఎక్కువ. ఇప్పటికీ చాలా ఆస్పత్రులలో పురుడు పోయడానికి తగిన పరికరాలే లేవు” అంటున్నారు 32 ఏళ్ల జుబేదా. ముస్లిం కుటుంబంలో ఎదురయ్యే అడ్డంకుల్ని దాటుకుని పెద్ద చదువులు చదివిన ఆమె సరికొత్త ఆవిష్కరణకు పూనుకుంది. ‘ఐజ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దాని ద్వారా కాన్పులు చేసేందుకు అవసరమయ్యే ‘జన్మ’ అనే కిట్‌ను సరఫరా చేస్తున్నది. “స్వీడన్‌లో ఇంజనీరింగ్ చేశాక హబీబ్‌ను పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగరీత్యా ఇద్దరం కెనడా వెళ్లాము. అక్కడ కొన్నాళ్లుండి సొంతూరైన చెన్నైకి తిరిగి వచ్చేశాము. ఇండియాకు వచ్చాక – మనం పుట్టి పెరిగిన సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఆరాటం మొదలైంది..” అన్నారామె.


చెన్నైకి రాగానే అక్కడున్న రూరల్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (ఆర్ఐఎన్)లో చేరారు జుబేదా. గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించే ఈ సంస్థ.. ఆమెకు తగిన మేథో సాయం అందించింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత కాన్పుల కోసం వైద్యపరికరాలను అందించే ఆలోచన వచ్చింది ఆమెకు. “ఒక మహిళ కష్టాన్ని మరో మహిళ మాత్రమే కచ్చితంగా అర్థం చేసుకోగలుగుతుంది. నా తొలి కాన్పుకు చాలా ప్రయాస పడ్డాను. ప్రసవం అయ్యాక శుభ్రత లేక బిడ్డకు ఇన్‌పెక్షన్లు వచ్చాయి. అది చూసి తల్లడిల్లిపోయాను” అని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం కూడా తన కొత్త ఆలోచనకు పనికొచ్చింది. వెంటనే స్త్రీల వైద్యులు, మిడ్‌వైఫ్‌లు, మంత్రసానులు, పల్లెల్లోని పెద్దలను కలిసి.. తన ఆలోచనను పంచుకున్నారు. కాన్పులప్పుడు ఎదురయ్యే సమస్యల్ని అర్థం చేసుకున్నారు. “గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలే శుభ్రత ఉండదు. దానికితోడు నిధుల కొరత ఒకటి. వాడిన పరికరాలనే మళ్లీ వాడి కాన్పులు చేస్తుంటారక్కడ. ఇలా చేయడం వల్ల తల్లికి, బిడ్డకు లేనిపోని సమస్యలు వస్తాయి.

ఒక్కోసారి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది..” అని చెప్పారు. తను నెలకొల్పిన సంస్థలో కొందరు మహిళలను తీసుకుని శిక్షణ అందించారు జుబేదా.”పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము అందించేదే సామాన్యుల కోసం కాబట్టి అంత తక్కువ ధరను పెట్టాము” అన్నారు సంస్థ సభ్యులు. ఈ కిట్‌ను గర్భిణులు కొనుక్కుని దగ్గర్లోని ప్రసవ కేంద్రాలకు వెళితే.. బిడ్డను తీసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి రావచ్చు అన్నది జుబేదా ఉద్దేశం. ఇప్పటివరకు యాభైవేల ‘జన్మ’ కిట్‌లను అమ్మినట్లు పేర్కొన్నారామె. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు కూడా ఆర్డుర్లు ఇచ్చి కిట్‌లను తెప్పించుకుంటున్నారు.

“కేవలం మన దేశంలోనే కాదు. వీటిని హైతీ, ఆఫ్ఘ్ఘనిస్తాన్, ఆఫ్రికా దేశాలలో కూడా విక్రయిస్తున్నాము. కిట్‌కు ప్రాచుర్యం లభించడంతో పలు వెనుకబడిన దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తున్నది” అంటున్నారు ఐజ వ్యవస్థాపకురాలు. ప్రసవానికి అవసరమయ్యే కిట్‌ను ప్రైవేటుగా కొనాలంటే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం వంద రూపాయలకు మాత్రమే ‘జన్మ’ కిట్‌ను అందిస్తున్న ఈ సంస్థకు.. మరింత బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుని విస్త్రృత ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు జుబేదా. ఇప్పటికే ఈ సంస్థ ప్రాచుర్యం పొందడమే కాకుండా.. పలు గుర్తింపు పొందిన సంస్థల అవార్డులను సైతం పొందింది. ప్రముఖ వరల్డ్ హెల్త్ కాంగ్రెస్ అవార్డు, ఇండెక్స్ అవార్డులతో పాటు క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ అవార్డులను సైతం గెలుచుకుంది.

ఫోన్ : 09176951290

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి

 

ఉజ్జయినిలో మహా కాళేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉందనీ, అక్కడ ఆయనను సందర్శించడం అనేది అనేక పాపాల్ని హరిస్తుందనీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు శర్మ వివరిస్తున్నారు.పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాళ్లి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ ్రగహిిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.

ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి- చెట్టు నుండి పండు పడిపోయినట్టు ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.

ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.
దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.

కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు. ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.

అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాదారి తీరు –49 పూనా ట్రిప్ -2

నాదారి తీరు –49

పూనా ట్రిప్ -2

మోహన్ బందర్లో బి.జెడ్ .సి లో హిందూకాలేజి నుండినుండి బి ఎస్ సి డిగ్రీ పొందాడు .తర్వాత ఎక్కడెక్కడో ప్రయత్నించి పూనా చేరి అక్కడ కిర్కీ ఆర్డి నేంస్ ఫాక్టరీ లో ఉద్యోగం సాధించాడు .నెమ్మదిగా స్తిరపడ్డాడు .మా అమ్మఅంటూ ఉండేది . ‘’అది మాయల మరాఠీ లోకం .జాగ్రత్త ‘’అని .అక్కడే తనతో బాటు పని చేసే సునీత ను ఇష్టపడి పెళ్ళాడాడు .ఆ విషయం మా క్క దుర్గ బావ వివేకానంద్ కు తప్ప మా కేవరికీ తెలీదు .మా బావ ఒక సారి వచ్చి ఈ విసహాయం  నన్ను పెద్ద వంతెన దాకా తీసుకొని వెళ్లి రహస్యం గా చెప్పాడు .మా అమ్మ యెంత బాధ పడుతుందో నని అందరం బాధ పడ్డాం .నెమ్మదిగా ఇంటికొచ్చి బావ అమ్మకు చెప్పాడు .ఆవిడ అగ్గి మీద గుగ్గిలమే అయింది .యెంత ఏడ్చిందో చెప్పలేం .పక్కనే మా మామయ్యా గారిల్లు .వాళ్లకు ఈ విషయం తెలిస్తే యెంత పల్చ బడుతామో నని ఆవిడ బాధ .ఈ విషయాన్ని జీర్ణించుకో లేక పోయింది .చెప్పా పెట్టకుండా ఈ పెళ్లి ఏమిటి?/అని ఆవిడ బాధ కొన్ని రోజుల దాకా ఆవిడ సమాధాన పడలేక పోయింది .మా బావ ఒక రోజు మోహన్ ని సునీతను ఉయ్యూరు తీసుకొని వచ్చాడు .ఏడ్చింది ,పేద బొబ్బలు పెట్టింది .సూటి మాటలంది .నాకు ఏమీ పెద్ద కొత్త అని పించలేదు .ఎవడి జీవితం వాడిది అనేది నావిధం .సునీత ఇంట్లో కలివిడిగా తిరిగి అందర్నీ మచ్చిక చేసుకోంది.చుట్టరికం బానే కలిపింది ..అల్లుకు పోయింది అమ్మ కూడా క్రమంగా మారింది .పెద్ద కోడలు కన్నా చిన్న కోడలు దగ్గరైనట్లు ప్రవర్తించేది .మెర మెచ్చు కబుర్లు చెప్పటం మా ఆవిడకు తెలీదు .ఆవిడా మనసు నిండా తోడి కోడల్ని ఆహ్వానించింది .

మోహన్ కూడా క్రమం గా దూరమై దగ్గరయ్యాడు .మా మామయ్యా నోరు మెదప లేక పోయాడు .వాడు ‘’పైరో టెక్నిక్ ‘’అంటే మందు గుండు శాస్త్రం లో ప్రైవేట్ గా పూనా వర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ సాధించాడు .పూనా లో తెలుగు అసోసియేషన్ స్తాపకులలో ఒకడై సెక్రెటరి గా పని చేసి ఎందరెందరో తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సన్మానం చేశాడు .అందులో వేదాంతం సత్య నారాయణ గారు లాంటి ఉన్నారని వాడు చెప్పగా తెలిసింది. ఫోటోలు పేపర్ కటింగు లూ చూపే వాడు .వీడితో పాటు ఉయ్యూరు లో విశ్వ బ్రాహ్మిన్ చేవూరి సుదర్శన్ అనే నా క్లాస్ మేట్ కూడా పూనా లో వీఎడితో బాటు పని చేసే వాడు .కొంతకాలం తర్వాత మానేసి ఇక్కడే బంగారం పని చేశాడు బ్యాంకికి లో బంగారం స్వచ్చతకు మధ్య వర్తిగా ఉన్నాడు.మంచి స్నేహితుడు. అతని మేనల్లుడు నాదగ్గర టెన్త్ క్లాస్ ట్యూషన్ చదివాడు

మా వాడు పూనా లో స్వచ్చందం గా రిటైర్ అయి హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో చేరాడు అక్కడ ‘’డిప్యూటీ జెనరల్ మేనేజర్ ‘’గా రిటైర్ అయ్యాడు .

.మా వాళ్ళకు  ఇదే మొదటి సారి హైదరాబాద్ వెళ్ళటం పూనా దాక వెళ్ళటం కూడా.నేనిది వరకే చెరుకు రైతు యాత్ర లో వెళ్ళిన సంగతి రాశాను .మా వాడి రెండో బావ మరిది పూనా మొత్తం చూసే ట్రిప్ లో బస్ లో నన్ను తీసుకొని వెళ్లి చూపించాడు .ఎరవాడ జైలు మొద్సలైన వన్నీ చూశాం .ఆతను చాలా హుషారైన మనిషి .చాలా మర్యాదగా ఉన్నాడు …మొత్తం మీద పూనా లో ఆరు రోజులే ఉన్నాం .అప్పటికే సునీత పధ్ధతి మారి ,ఇక ఉండలేక పోయాం .వెంటనే రిసేర్వేషన్ చేయించి ప్రయాణానికి సిద్ధం అయ్యాం. వసంత, నేను పూనా లో దొరక్క పొతే ఇంకో స్టేషన్ కు వెళ్లి రిసేర్వ్ చేయించాం .హైదరాబాద్ వరకే చేయించాం .అందరం హైదరాబాద్ చూడ లేదు పూర్తిగా అందుకని మా మరదలు భారతి వాళ్ళింట్లో ఉండి అన్నీ చూసి అప్పుడు ఉయ్యూరు రావాలని మా ఆలోచన. మేము పూనా వెళ్ళే ముందే భారతి మమ్మల్ని ఆహ్వానించింది దక్షిణా మూర్తికూడా .సరే నన్నాం .మోహన్ మామ గారింట్లో రోజూ ఇడ్లీ సాంబారు బాగుండేది ఉప్మా పెసరట్ కూడా బాగుండేది. సాయంత్రం పకోడీలు ,మొదలైన టిఫిన్లు టీ .కాఫీ బాగుండేది రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు ఇచ్చే వాళ్ళు .నేను కిర్కీ నుండి రెండు రోజుల కోసారి లోనా వాలా కు లోకల్ ట్రెయిన్ లో వెళ్లి సరదాగా తిరిగి వచ్చే వాడిని .ఒక సారి అందరం కళ్యాణ్ వరకు వెళ్ళిన గుర్తు ..

హైదరాబాద్ కబుర్లు తర్వాత

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.11-12-13-.ఉయ్యూరు ..

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శతమానం భవతి …. బాపు గారికి 80 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు – కృష్ణమోహన్

satamanam

0001 0002

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్

నా దారి తీరు -48

ఫామిలీ తో పూనా ట్రిప్

మా తమ్ముడుమోహన్  పెళ్లి చేసుకొన్న దగ్గర్నించీ మమ్మల్ని పూనా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు .ముందు అమ్మ ను తీసుకేళ్ళమనే వాడిని .ఆవిడ కు అంత ఇస్టమున్దేదికాడు .మమ్మల్నే వెళ్ళమనేది .ఇక కదలక తప్ప లేదు. అప్పుడు నేను పెనమ కూరు లో పని చేస్తున్నాను .1979 వేసవి సెల వుల్లో పూనా ప్రయాణం పెట్టుకోన్నాం .మా నాల్గో అబ్బాయి రమణ కు యేవో పరీక్షలుండటం మూలం గా వాడు రాలేదు మిగతా మా కుటుంబం అంటే నేను మా ఆవిడా ,రెండో వాడు శర్మ ,మూడు మూర్తి అమ్మాయి విజ్జి పూనా కు బయల్దేరాం అప్పటికి టేలి ఫోన్ లు లేవు ఉత్తరాలే .రిజర్వేషన్ బెజ వాడ లో చేసుకోవాలి .నేనే వెళ్లి చేయించాను .అప్పటికి సరాసరి ట్రెయిన్ లేదు అందుకని సికందరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బాంబే ఎక్స్ ప్రెస్ లో బొంబాయికి వెళ్ళాలి .బొంబాయికి ఇవతలే పూనా ఉంది.

మేము ఎక్కిన ట్రెయిన్ కృష్ణా express కి బాంబే ఎక్స్ ప్రెస్  లింక్. కృష్ణ మద్యాహ్నం 12 గంటకు విజయవాడలో బయలుదేరి  సికింద్రాబాద్   కు  కొంచెం ఆలస్యం గా చేరింది అప్పటికే బాంబే ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం మీదకోచ్చేసింది .కంగారు ,పిల్లా జెల్లా సామాన్లు .ఎల్లా అని ఒకటే ఇదై పోయాం .ఎలాగో అలా ట్రెయిన్ పట్టుకొని బెర్త్ర్ట్ ల లో చేరాం, మామూలు లగేజి కి తోడు బియ్యం తీసుకొని వెళ్ళాము .ట్రైన్ సికింద్రాబాద్ నుంచి నాంపల్లి కి వచ్చింది అక్కడ  తోడల్లుడు దక్షిణా మూర్తి భార్య భారతి స్టేషన్ కు వచ్చి మాకు అన్నం ,కూరలు చపాతీలు వగైరాలున్న పాకెట్లు అంద జేశారు .హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాం .మేమేక్కిన అయిదు నిమిషాల్లో బయల్దేరింది ట్రెయిన్ ..

ఒక గంట అయిన తర్వాత ఇచ్చినవీ  తెచ్చుకోన్నవీ తిన్నాం పిల్లలు హాయిగా బెర్తులు ఎక్కి నిద్ర పోయారు .నాకు నిజామా బాద్ స్టేషన్ గుర్తుంది. విశాఖమేడికల్ కాలేజి నుంచి నన్ను నిజా మా బాద్ పాలిటేక్నికి కు ట్రాన్స్ ఫర్ చేశారు మా నాన్న పోయిన కొత్తలో .జాయిన్ అవుదామని వచ్చాను .ఇక్కడి వాతావరం ఎందుకో నచ్చలేదు’’ఒళ్ళు బలుపు’’ కూడా ఒక కారణం కావచ్చు .ఉయ్యూరు విడిచి ఉండలేకపోవటం, అమ్మ దగ్గరెవరూ లేకుండా ఉండటం నచ్చక పోవటం ,కుటుంబానికి పెద్ద కొడుకు ను కనుక బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనా కారణాలుగా నేను నిజామా బాద్ లో చేరి వెంటనే ఓకే రోజుండి వచ్చేసి లీవ్ పెట్టాను .మంచి వాళ్ళు కనుక ఒక నెల జీత నష్టం మీద సెలవు ఇచ్చారు .మళ్ళీ పోడిగించాను ఇక ‘’వీడు చేరే ఘటం కాదను’’కొని ఉద్యోగం పీకేశారు .రోగీ ప్తచ్యమే కోరాడు డాక్టరూ చెప్పాడు అన్నట్లుంది .ఆక్కడే ‘’జాల్నా’’ ఉంది .మా అన్నయ్య అక్కడ మిలిటరిలో ఉద్యోగం చేశాడు .అదీ జ్ఞాపకం వచ్చింది .నిద్రపోయాము .

ఉదయం తొమ్మిదింటికి పూనా చేరాం .పూనా కు ముందే ‘’కిర్కీ స్టేషన్’’ లో దిగాలని మా తమ్ముడు చెప్పినట్లు అక్కడే దిగాం .మోహన్ వచ్చి ఆటోలో ఇంటికి తీసుకు వెళ్ళాడు .వాళ్ళు అప్పుడు మిలిటరీ క్వార్టర్స్ దగ్గర ఉండే ‘’సిపోరేక్స్ క్వార్టర్స్ ‘’లో ఉంటున్నారు .వాడి మామ గారు కూడా దగ్గరలో నే ఉన్నారు బావమరదులు మరదలు కూడా .మా మరదలు సునీత మాటల్లో ఏంతో ఆప్యాయం కన బరుస్తుంది .నాలుగైదు రోజులు ఏంతో బాగుందని పించింది. ఆ తర్వాతమొదట్లో ఉన్న ఉత్సాహం నెమ్మదిగా బై పాస్ అయింది .సాయంత్రం వేళల్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం .పెద్ద ఇల్లు అయిదారు గదులు అందరికీ అను కూలం గా ఉండేది.అక్కడ డిఫెన్స్ క్వార్టర్స్ లో సెక్యూరిటీ ని మొదటి సారి చూశాను .బొమ్మ లాగా తుపాకి పట్టుకొని కదల కుండా కను రెప్ప వేస్తాడో లేదో తెలీకుండా నిల బడే వాడు .అది వింత అని పించింది ప్రతి ఇంటి లో మామిడి చెట్టు ఉండేది .ఆర్డి నేంస్ ఫాక్టరీ లో పని చేసే కార్మికులకు అధిక వడ్డీ లకు డబ్బులు అప్పు ఇచ్చి ఒకటవ తేదీన గేటు  దగ్గర నిలబడి మార్వాడి లాగా బాకీలు వసూలు చేస్తారని మా వాళ్ళు చెప్పగా విన్నాం .నిజం గా ఒకటవ తేదీ న ఆసీన్ ని చూసి నిజమే నని నమ్మాను .డబ్బులన్నీ బాకీ వాడికి కట్టేస్తే వాళ్లకు మిగిలేది స్వల్పం .అందులో ఇల్లు గడవటం కష్టం .అందుకని తాగుడుకు బానిసలయ్యే  వాళ్ళు .అదీ చూశాం .

మహా రాష్ట్ర లో చెక్ డాం లు ఎక్కువ .అవి వ్యవసాయానికి బాగా ఉప యోగ పడేవి .పూనా క్లైమేట్ చాలా ఆహ్లాదం గా ఉండేది .నులి వెచ్చని వేడి మాత్రమె. సాయంత్రం అయితే వర్షం భీభత్సం గా పడేది ‘’టోరెంషియల్ రైన్ ‘’అంటారు అలా కురిసి వదిలేది .యెంత నీరు పడినా పది నిమిషాల్లో నీరంతా ద్ద్రేయినేజ్ లోకి పోయి చుక్క కూడా రోడ్డు మీద కనీ పించేది కాదు .మాకిది ఆశ్చర్యం గా ఉండేది .

మోహన్ మామ గారు గవర్న మెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు .ఆయన మంచి టెన్నిస్ ప్లేయర్.వెటరన్ క్రీడల్లో ఆయన పాల్గొని గెలిచే వాడు ఎన్నో కప్పులు సాధించాడు ఎన్నో బహుమతులన్డుకొన్నాడు ఇంగ్లాండ్ మొదలైన దేశాలకు వెళ్లి అక్కడా పాల్గొన్నాడు .ఆ వివరాలన్నీ ఒక డైరీ లో రాసుకొన్నాడు .అడిగితె వాయించేసే వాడు. ఉడికించటానికి నేను ‘’ఏమండీ ఆ ఊర్లో ఎలా గడిపారు ?’’అని అడిగే వాడిని .ఇంకే ముంది ‘’గుండ్రాలు ‘’తిప్పి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .వింటూ ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ గడిపే వాడిని ఆయన భార్య మంచిదే .పచ్చగా బాగుంటుంది ఈయన కస్తూరి శివ రావు లాగా ఉంటాడు ఆవిడ సినిమా నటి శాంతకుమారికి దగ్గర చుట్టం .మా వాడు ఆవిడ ద్వారా నన్ను సినిమాలలో మాటలూ పాటలూ రాయటానికి ఏర్పాటు చేస్తానని చెప్పే వాడు .నాకు అంత ఇంట రెస్ట్ ఏమీ లేదు వాడు మాట అంటం తప్ప అంగుళం ముందుకు వెయ్యలేదు ఇది వాడికి సహజమే .మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లి పెళ్లి అయిన తర్వాత అతనికి పూనా లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టాడు .నాతొ అనే వాడు ‘’రామ కృష్ణ లో మనకు మంచి అల్లుడు కనీ పిస్తాడు. అతనికి నేను ఉద్యోగం చూపిస్తాను ‘’కాని మేటీరియలైజ్ కాలేదు .కొందరి తీరు ఇంతే .మా వాడి బావ మరదులు వెంకట్ ,అతని తమ్ముడు వసంత్  చాలా మంచి కుర్రాళ్ళు . వాళ్లకి అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు నన్ను కూడా ‘’బావ గారూ బావ గారూ ‘’అంటూ  ఆప్యాయం గా పిలిచే వారు .రోజూ ఎక్కడికో అక్కడికి బైక్ మీద తీసుకొని వెళ్ళే వాళ్ళు .మోహన్ మరదలు కూడా ఉద్యోగం చేస్తూ ఉండేది అందరూ ఆర్డినెన్స్ ఫాక్టరీ లోనే సునీత కూడా తర్వాత చేరింది

ఒక రోజు మమ్మల్ని శివాజీ కోట కు తీసుకొని వెళ్ళింది .అక్కడ అమ్మ వారి దర్శనం అద్భుతం ఈ అమ్మ వారే శివాజీ మహా రాజ్ కు ప్రేరణ .ఇలా కొన్ని ప్రాంతాలకు సాయం వేళ వెళ్ళే వాళ్ళం .మోహన్ ఏం ఎస్ సి చేసిన పూనా యూని వర్సిటి చాలా పెద్దది .ఎన్నో ఎకరాలు అంతా చెట్లూ బిల్డింగులు చాలా ఆహ్లాదం గా ఉండేది .దాదాపు అంతా నడిచే తిరిగే వాళ్ళం .అవసరామైతేనే ఆటో లేక బస్ .పూనా బస్ సర్వీస్ బాగుండేది ఖచ్చితమైన సమయాన్ని పాటించే వారు .

మిగిలిన విషయాలు తర్వాత

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-12-13—ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

నాదారి తీరు -47

మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

బందరు స్పాట్ సాధారణం గా మార్చి చివర్లో జరిగేది ఆ రోజుల్లో పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పది నుండి ప్రారంభమై ఇరవై రెండు దాకా జరిగేవి ఆ తర్వాత రెండు మూడు రోజుల విశ్రాంతి ఈ లోపు స్పాట్ అప్పాయింట్ మెంట్లు .మార్చి ఇరవయ్యైదు నొ ఆరునొ స్పాట్ మొదలయ్యేది .ఆ తర్వాత పధ్ధతి మారింది .పరీక్షలు  కొంచెం ఆలస్యం గా ప్రారంభమవటంవల్ల స్పాట్ కూడా మారింది .ఏప్రిల్ ఒకటి నుంచి స్పాట్ ప్రారంభమయ్యేది .

ఒక్కో సారి ఉగాది స్పాట్ వాల్యుయేషన్ సమయం లోనే వచ్చేది .శలవు ఉండేదికాదు. పెందరాలే ఇంట్లో పూజచేసి  ఉగాది పచ్చడి  తిని భోజనం కూడా కానిచ్చి తోమ్మిదికే బస్ ఎక్కి బందరు వెళ్ళాల్సి వచ్చేది .అలాగే శ్రీ రామ నవమి కూడా అంతే..మా అమ్మ తద్దినం మార్చి మధ్య లేక చివర్లో వచ్చేది దానికీ సెలవు ఉండేది కాదు. పర్మిషన్ తీసుకొని ఉదయం తోమ్మిదికే కూర్చుని తద్దినం కానిచ్చి భోజనం చేసి, స్పాట్ కు

వెళ్ళాల్సి వచ్చేది .అప్పుడు మా చిలుకూరి వెంకటేశ్వర్లు గారుఉండే వారు కనుక ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వచ్చి మంత్రంచెప్పి , భోక్త గా ఉండి ఇంకో బ్రాహ్మణుడిని తన తో తెచ్చుకొని నా కంటే స్పీడ్ గా లాగించే వారు .నాకు ఇబ్బంది ఉండేది కాదు ఇలా అరుదుగా మాత్రమె జరిగేది .అక్టోబర్ లో జరిగే సప్లి మెంటరి పరీక్షలకు స్పాట్ కు వెళ్ళాసి వస్తే నవంబర్ లో మా నాన్న గారి ఆబ్దికం కార్తీక శుద్ధ ఏకాదశి కనుక స్పాట్ సమయం లో వచ్చేది .అప్పుడూ అంటే ఉరుకులు ,పరుగులు .ఇన్ని ఇబ్బందులు పడినా ,పండుగలు వచ్చినా స్పాట్ లో సరదాగానే ఉండేది .అంతా ఏంతోకలివిడిగా ఉండి నిర్వహించుకొనే వాళ్ళం .

మార్చి ,ఏప్రిల్ స్పాట్ సమయం లో వర్షాలు బాగా కురిసేవి .వర్షం పడితే బందరు పరిస్తితి చెప్పక్కర్లేదు బురదమయం కంపూ .దేవేంద్ర రావు నేను కొడాలికి చెందిన పి.వి.కృష్ణా రావు గారు స్పాట్ లో ఏదైనా సమస్య వస్తే డి.ఇ వొ .గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం సాధించే వాళ్ళం .స్పాట్ సమయం లో టీచర్స్ గిల్డ్ ఎక్సి క్యూటివ్ మీటింగ్ జరిగేది .వెళ్లి సలహాల నిచ్చే వాడినినా  సలహా కోసం అందరూ ఎదురు చూడటం

ఉండేది .నిష్కర్ష గా మాట్లాడుతానని నన్ను అభిమానించే వారు నాయకులూ కార్య కర్తలూ కూడా .

వీలైనప్పుడు కొల్లూరి ని వెళ్లి చూసే వాళ్ళం ఆయన మాతో బాగా మాట్లాడే వాడు .సంస్థా గత విషయాలు వ్యక్తిగత విషయాలు ఉద్యోగ విషయాలు తెలుగు విద్యార్ధి పత్రికా విశేషాలు కాంతారావు నేను ఆంజనేయ శాస్త్రి, జ్ఞాన సుందరం మాట్లాడే వాళ్ళం. ఆయన దగ్గర మాకు చనువు ఎక్కువ .మాకూ ఆయన విలవ నిచ్చే వాడు .అనేక సార్లు ఆయన అనారోగ్యం పాలైతే హాస్పిటల్ లో ఉంటె ఇంటెన్సివ్ కేర్ లో ఉంటె మేము తప్పక వెళ్లి చూసి వచ్చే వాళ్ళం .ఆయన ఆరోగ్యం బాగుపడి ఇంటికి చేరిన తర్వాత మళ్ళీ వెళ్లి పలకరించే వాళ్ళం అందుకే ఆయనకు మేమంటే అభిమానం .మా మాటకు విలువ కూడా .అలా సాగింది కొల్లూరితో మా స్నేహం .ఆయన ఏం ఎల్ సి అని మేము భావించే వాళ్ళం కాదు .మా ఆప్తుడు, మిత్రుడు గా భావించే వాళ్ళం .ఆయన దగ్గర ‘’పొట్టి శర్మ’’  శర్మ గారు అనే గవర్నమెంట్ స్కూల్ సోషల్ మేస్తారుండే వారు బందరు గిల్డ్ హోం పనులాయనే చూసే వాడు . నిక్కచ్చయిన మనిషి మాతో బాగా ఉండే వాడు  అలాగే రామ కృష్ణ అనే పెడన హైస్కూల్ సైన్స్ మేష్టారు కొల్లూరికి సన్నిహితం గా ఉండేవాడు .కొల్లూరిని బావ గారు అనే వాడు మేము అతన్ని ‘’రాజు గారి బామ్మరిది ‘’అనే వాళ్ళం సరదాగా తీసుకొనే వాడు డబ్బు ఖర్చు పెట్టి అందరికీ సాయమూ చేసేవాడు .అతని భార్య ఎల్ ఐ.సి లో ఉద్యోగి .అద్దేపల్లి రామ మోహన రావు గారి తండ్రి జానకి రామయ్య గారు కూడా కొల్లూరి గారి దగ్గర పని చేసే వారు అయన నాకు నేను హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటార్ గా పని చేసినప్పటి నుంచీ అంటే సుమారుగా1960 నుంచి తెలుసు అప్పుడాయన హిందూ కాలేజి లో గుమాస్తా గా ఉండే వారు .

ఒక సారి స్పాట్ జరుగుతుండగా టౌన్ హాల్ లో రాత్రి ఏడింటికి నారాయణ రెడ్డి, ఏం .వి.ఎల్ నరసింహా రావు ల సాహిత్య సభ ఉంటె ఉండి పోయి విన్నాను .నారాయణ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏం .వి.ఎల్ మాట్లాడాడు .ఆ సాహిత్య ఉపన్యాసం జన్మ లో మారవ లేనిది యెంత బాగా మాట్లాడాడో మాటల్లో వర్ణించ రానిది .నారాయణ రెడ్డి ఉపన్యాసం దీని ముందు చలా పేలవం గా ఉందని నేనే కాదు నాతొ పాటు అందరూ అనుకొన్నారు .అంత గొప్ప స్పీకర్ ఏం వి.ఎల్..ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత గా ,నూజి వీడు కాలేజి తెలుగు లెక్చరర్ గా ఆయన సుప్రసిద్ధుడు .నూజివీడులో ప్రతి నెలా సాహిత్య కార్య క్రమం నిర్వహించి ,విద్యార్ధులను ప్రోత్సహించేవాడు .వారితో రాయించే వాడు .రేడియో నాటకాల్లో అతని గొంతు వింటే పరవశం కలిగేది .ఇన్ని ఉండి కూడా తాగుడు వల్లతొందర గా చని పోవటం బాధాకరం .సినీ మాయలో పడి జీవితాన్ని అర్ర్దాంతరం గా ముగించుకొన్న అభాగ్యుడు ఏం వి.ఎల్.ఒక సారి నూజి వీడు నుంచి బెజ వాడ కు నేను వస్తుంటే  నాపక్క సీటు లో కూర్చున్నాడు . బెజవాడ వచ్చే దాకా ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ సాహితీ సుగతుడిని నేనెప్పుడూ మరచి పోలేను .

ఒక సారి బందరు లైబ్రరీలో రాత్రి పూటా ఆవంత్స సోమ సుందరం గారి ఉపన్యాసం దానికోసం నేనూ కాంతా రావు శాస్త్రి అక్కడే ఉంది విన్నాం అదే మొదటి సారి ఆయన్ను చూడటం లైబ్రరీలో ఇలాంటి వి నిర్వహించటం లో లైబ్రేరియన్  అయిన చంద్ర శేఖర రావు గారునిష్ణాతులు .ఆయన ఆతర్వాత సేక్రేఅతరి కూడా అయ్యారు అప్పుడు దొండ పాటి దేవదాసు అటెండర్ గా ఉండేవారు అప్పటికే మంచి కధకుడిగా ప్రసిద్ధి పొందాడు ఆయన్నీఅప్పుడే చూడటం అప్పటి నుంచి అయన చని పోయే దాకా మా సాహితీ స్నేహం కోన సాగింది

చెరుకు  రైతు యాత్ర

ఉయ్యూరు కే.సి.పి.వారు ప్రతి ఏడాది చెరుకు రైతుల్ని బస్ ల మీద తీస్కోని వెళ్లి రాష్ట్రం లో లేక ఇతర రాష్ట్రాలలో చెరుకు సాగు చెరుకు ఫాక్టరీ లను చూపించటం ఒక సంప్రదాయం గా ఉండేది .అది నాకు తెలియ లేదు చాలా కాలం నేనూ చెరుకు రైతునే .1971లో వాళ్ళు మహా రాష్ట్ర కు టూర్ ప్లాన్ చేశారు .ఈ విషయం మా మామయ్య గారి అబ్బాయి పద్మ నాభానికి తెలిసి ఈ సారి నన్ను వెళ్ళమన్నాడు దానికి కావలసిన

ఏర్పాట్లన్నీ తానూ చేస్తానన్నాడు అప్పుడు నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేస్తున్నాను సరే అన్నాను .రెండు బస్సులలో రైతులను తీసుకు వెళ్ళారు .నేనెక్కిన బస్ లో మా డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారు కూడా ఉన్నారు అలాగే తెలిసిన కుందేరు రైతులున్నారు టూర్ నిర్వహణ చేసే మీసాల రెడ్డి గారు , ,ఇంకో షుగర్ కెన్ ఆఫీసర్ గారూ ఉన్నారు

బస్ రాత్రి పూట బయల్దేరి ఉదయానికి హైదరా బాద్ చేరింది .అక్కడ కాకాని వెంకట రత్నం గారు మాకు ద్వారాకా హోటల్ లో బస ఏర్పాటు చేశారు ఆయన అప్పుడు వ్యవసాయ మంత్రి .మొహాలు కడిగి కాఫీ టిఫిన్ అయిన తర్వాత బస్సులు రెండు కాకాని గారి ఇంటికి వెళ్ళాయి .ఆయన మమ్మల్ని ఆప్యాయం గా సాదరం గా ఆహ్వానించారు .కాఫీ లిప్పించారు కోడలి చేత .అన్నీ చూసి జాగ్రత్త గా రండి అని హితవు చెప్పారు .బస్సులు బయల్దేరాయి .

మహా రాష్ట్ర లో షిర్డీ దగ్గర బోలేగాం అదేదో పేరున్న చోటికి చేరాయి అక్కడ ఫాక్టరీలో బస .వాళ్ళే టిఫిన్ భోజనం ఏర్పాటు చేశారు మర్నాడు చెరుకు తోటలకు తీసుకొని వెళ్ళారు మనకు పన్నెండు నెలల పంట చెరకు .వాళ్లకు పద్దెనిమిది నెలల పంట .మనలాగా ఎత్తుగా అక్కడ

చచెరుకు  పెరగదు .ఎత్తు తక్కువ ,లావు ఎక్కువ .మన చేరుక్కు ఆకుల తో ‘’జడ అల్లటం ‘’ఉంది .అది వాళ్లకు తెలీదు .మన రైతులు జడ అల్లి చూపిస్తే అక్కడి రైతులు ఆశ్చర్య పోయారు .జడ అల్లటం వల్ల చెరుకు గాలికి, వర్షాలకు పడి పోదు .అక్కడ రైతులకు ఎన్నో రాయితీలిస్తారు అధిక దిగుబడి నిచ్చే విత్తనం సప్ప్లై చేస్తారు .చెరుకు వేయటం దగ్గర్నుంచి ఫాక్టరికి తోలేదాకా వారు రైతులకు అండగా ఉండి అన్నీ ఉచితం గా సేవ లాండ జేస్తారు .ల మనకు ఇలా లేదు.ఏదో విత్తనం సబ్సిడీ ,ఎరువులు కొద్దిగా ఇవ్వటం తప్ప మిగిలిన ఉచిత సదుపాయాలూ మనకు లేవు .అక్కడున్నవి సహకార చక్కర కర్మా గారాలు .కనుక రైతులు అందులో భాగ స్వామ్యులు .అప్పటికి వై బి   చవాన్ ,శరద్ పవార్ సహకార పరిశ్రమలకు తిరుగు లేని నాయకులు .ఇలా రెండు మూడు వ్యవసాయ క్షేత్రాలు సందర్శిమ్చాము .

అక్కడి నుండి షిర్డీ వెళ్లాం .అప్పుడు జనం లేరు నీటి సదుపాయమూ లేదు ఆలయం దగ్గర పంపు నీళ్ళలో స్నానం చేసి హాయిగా దర్శనం చేసుకోన్నాం  భోజనం కూడా తక్కువ రేట్ కే పెట్టారు. భోజనం అంటే పూరీ కూర .అప్పుడు ద్వారకా మాయి కి హడావిడి లేదు. అంతా నిర్జన

ప్రదేశం గా ఉండి ఇదే నేను షిర్డీ సాయి బాబా ను మొదటి సారిగా చూడటం .ఆ తర్వాత అజంతా కు తీసుకు వెళ్ళారు బాగానే చూపించారు లైట్లు వేసి గుహలలో ఉన్న చిత్రాలను చూపించారు. అబ్బురం గా ఉన్నాయి .ఆ రంగుల మేళ వింపు .అక్కడి నుంచి బొంబాయి వెళ్లాం అక్కడ మన డ్రైవర్ బదులు మహా రాష్ట్ర డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోవాలి అలానే చేశారు .అక్కడ గెట్ వే ఆఫ్ ఇండియా చూశాం అద్భుతమని పిస్తుంది సాయంత్రం తాజ్ మహల్ హోటల్ కు వెళ్లాం ఆ రోజుల్లో అక్కడ టీ పది రూపాయలు. పాంట్ షార్ట్ ఉంటేనే లోపలి అనుమతి. మా రైతులు పంచా లుంగీలతో వెళ్ళే ప్రయత్నం చేస్తే రానీయ లేదు .నేనూ సుబ్బా రావు ఆరు వెళ్లి టీ తాగాం .అక్కడ మహా రాష్ట్ర ప్రభుత్వా స్టోర్స్ లో మఫ్లర్ స్వెట్టర్ రగ్గులు పాతిక రూపాయలకు ఒకటి చొప్పున కొన్నాం చాలా ఏళ్ళు మన్నాయి .

ఈ టూరు సంగతి మా తమ్ముడికి ముందే రాశాను. కనుక వాడు బొంబాయి వచ్చి నన్ను తనాతో  పూనా  తీసుకొని వెళ్ళాడు .అప్పుడు వాడు అక్కడ ఆర్డినెన్స్  ఫాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు .వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మర్నాడు నన్ను పండరీ పురం జ్ఞాన దేవుడి గ్రామం అలండి కి స్కూటర్ మీద తీసుకొని వెళ్లి చూపించి ఇంటికి తెసుకోచ్చాడు .అప్పుడు వాడు, మా మరదలు ఒక అపార్ట్ మెంట్ లో చిన్న రెండుగదుల ఫ్లాట్ లో ఉన్నాడు .నన్ను మళ్ళీ మా బృందానికి పూనా లో అప్పగించాడు .అక్కడి నుండి సరాసరి హైదరాబాద్ ఉయ్యూరు కు చేరుకొన్నాము .ఇలా చెరుకు రైతు యాత్రలో పాల్గొన్న అనుభూతి దక్కింది .ఖర్చులన్నీ కే.సి.పి వాళ్ళవే .ఇంటికి రాగానే నాకు ముప్పాళ ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలిసింది .ఆ వివరాలన్నీ ఇది వరకే రాశాను .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –10-12-13-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సాంచి స్తూపం విశేషాలు -బుద్ధ భూమి -డిసెంబర్

1sanchi stupam 001 2sanchi stupam 001 3sanchistupa 001 4sanchistupam 001 5sanchistupam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం

   సినీ గీతా మకరందం -5

అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం

చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల ఏం ఎస్.రామా రావు మొదలైన వారి దివ్య గాత్రం ,హరనాద్ సావిత్రి ల నటనా వైదుష్యం ఇందులో రాశీ భూత మైనాయి .ప్రభాకర రెడ్డి ని ,జయంతిని మొదటి సారిగా సినిమాలకు పరిచయం చేసిన సినిమా 1960లో విడుదల అయింది .అప్పుడు నేను బందరు హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటర్  గా పని చేస్తున్నాను .మా తమ్ముడు మోహన్ డిగ్రీ చదువుతున్నాడు  ఒక గది అద్దెకు తీసుకొని రామానాయుడు పేటలో ఉండేవాళ్ళం .అప్పుడు విఠల్ ,రామ కృష్ణఅనే ‘పొట్టి ‘’మాతో సన్నిహితం గా ఉండేవాళ్ళు .ముందు రామ కృష్ణ ఈ సినిమా చూసి ‘’బాబాయ్ !అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది .నేను చూసొచ్చాను తప్పకుండా వెళ్లి చూడండి ఎక్కువ రోజులు ఆడుతుందని గ్యారంటీ లేదు ‘’అన్నాడు .అలా ఆ సినిమా చూశాం .ఆ తర్వాత అది ఆడిన వారం రోజులూ రాత్రి సెకండ్ షోకు వెళ్లి చూశాం అంత బాగా నాకు నచ్చింది అందులో ఘంటసాల గానం చేసి,మల్లాది  రచించిన  ‘’సుధ వోల్ సుహాసినీ మధువోల్ విలాసినీ ఓహో కమనీ ‘’ ని రోజు కేనేన్ని  సార్లు హమ్మింగ్ చేస్తూ పాడుకోన్నామో గుర్తే లేదు. అలాగే మల్లాది  రాసిన ఏం ఎస్ రామా రావు పాడిన ‘’చెంగూనా అలమీద మిడిసి పోతది మీను ‘’అనే పాటమాకు అప్పుడు ఒక నిత్య పారాయణం .ఈ రెండో పాట గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం .

‘’ చెంగూన అలమీద మిడిసి పోతది మీను –చినవాడు ఎదరైతే మరచీ పోతవు మేనూ –కాదంటావా కాదంటావా – చిన్న దానా నువ్వు కాదంటావా?

వల్లా  మాలిన మమత కమ్మా  తెమ్మర లాగ –కమ్మకున్నది-నిన్నూ చిన్నదానా-చినదానా — కమ్మా నైన వాడు   సరసనే ఉన్నాడు వల్లకుం టావే –నీవు    చిన్న దాన -నీవు వల్లకుం టావే-

 

 

చినికిన చినుకెల్లా -మంచి ముత్యము కాదు -మెరసిన మెరుపులో లేత వెన్నెల లేదు-అందని చందమామా  కోసమని –ఆశాశ పడినావే =నీవు అల్లాడిపోయినావే- అల్లాడి  పోయినావే .

చివురంటీ వయసునా చిక్కనీ జీవితాన -చివరికి మిగిలింది చీకటేనా? –చివరికి మిగిలింది కారు చీకటేనా-కారు చీకటేనా ? ‘’

ప్రేమించిన వాడి మనసు తెలుసుకోలేని అమ్మాయి .కాని వాడు కనీ పిస్తే మేనే మరచి పోతున్దామే .ఆమె పరిస్తితి ఎలా ఉందంటే అలల మీద చెంగు చెంగున దూకే మీను అంటే చేప లా ఉంది వాడు .ఎదురైతే మేనే మరచి పోతుంది .ఇది కాదన గలవా అని అడుగుతున్నాడు కవి .ఆమె లో నిండి నిబిడీకృతమైన ప్రేమ వల్ల మాలినది .అది ఆమె ను కమ్మ తెమ్మెర లాగా కమ్ము కున్నది ఆమె కోరే ప్రియుడు చెంతనే ఉన్నాడు .కాని మనసు విప్పి పెదవి విప్పి ఆమె తన ప్రేమను వ్యక్తం చెయ్యలేక పోతోంది .మాట్లాడకుండా ఉండటమే ‘’పల్లకున్డటం అంటే పలక్కుండా ఉండటం .ఇక్కడొక జీవిత సత్యాన్ని ఆవిష్కరించాడు కవి –ప్రతి చినుకూ మంచి ముత్యం కాదని హెచ్చరించాడు .మెరుపు లో లేత వెన్నెల ఉండదని ,ఉంటుందని ఎదురు చూడటం భ్రమ మూర్ఖత్వమనీ చెప్పాడు

అందని చందమామ అయ్యాడు ప్రేమించిన వాడు .వాడికోసం ఆశ పడింది పాపం చివురాకు కనుక ఆ మెరుపుకు భయపడి అల్లాడి పోయింది ఆమె ఆమె మనసూ కూడా .మరి దీని పర్యవసానం ?.చిక్కని జీవితం లో చిగురంటి వయసులో ఇక చివరికి ‘’మిగిలేది చీకటే .అదీ భయంకరమైన కారు చీకటే అని వేదన తో ఆమె పై సాను భూతితో ,ఆవేదన తో అన్న మాటలు .ప్రతి మాట ను మల్లాది మేష్టారు సాన బట్టి వదిలారు ఇంత చిన్న పాటలో అనంత వేదనా, శోకమూ, నిరాశా సమయానికి తగిన విధం గా స్పందించక పొతే అనర్ధమూ తన స్వరం లో నిక్షిప్తం చేసి ఈ పాటకు జీవం పోశారు అభినవ రామ దాసు గా మారిన సుందర దాసు రామా రావు గారు .యెంత తేలికగా మాటల్ని పలికారో యెంత గా మనసులోకి చొచ్చుకు పోయేట్లు పాడారో ఆ పాట వింటే నే తెలుస్తుంది అనుభ విస్తేనే అర్ధమవుతుంది .ఇదొక మధు కణం .అందుకే నాకు గీతా మకరందమని పించింది .ఈ సన్నివేశం లో రామినీడు దర్శక ప్రతిభా సావిత్రి హిమోన్నత నటనా గరిమా, ఏం ఎస్ గారి  రాగ స్వర హేల మల్లాది వారి సాహిత్యంపసందు గా ఉంది  అయితే ఇది విషాదం లో చినికిన చినుకు .అలా అలా అలల మీద చేప తేలినట్లు రాగం, గీతం స్వరం తేలియాడుతూ ఆ అను భూతిని మిగిలిస్తాయి .అందరి గొప్ప పరిశ్రమ వల్లా ఇంత అందమైన మధు విషాద గీతం ఆవిర్భ వించింది .మనసుల్ని దేవేసే గీతం .ఆలాపనా అంతా ఒక అలౌకిక సృష్టి అందులో ఆనందం కనీ పిస్తుంది .

 

 

 

 

 

 

మరో మధు బిందువు కోసం ఎదురు చూద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-13-ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

రామ్ బంటు లక్ష్మణుడు -ఆంధ్ర జ్యోతి

 

 

 

1rambantu lakshmanudu 0012rambantulakshmanudu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం -ఆంధ్ర జ్యోతి -ఆదివారం

venditera bangaram 001

Posted in సినిమా | Tagged | Leave a comment

గుమ్మా సాంబశివరావు గారి సన్మాన సభ విజయవాడ

This gallery contains 14 photos.

గుమ్మా కు సమ్మానం నిన్న అంటే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండింటికి మిత్రుడు పూర్ణ చంద్ ఫోన్ చేసి బెజ వాడలో సాయంత్రం ఆరింటికి ప్రెస్ క్లబ్ లో గుమ్మా సాంబశివరావు కు సన్మానం ఉందని ,ఏ మాత్రం వీలున్నా రమ్మని చెప్పారు సరే నన్నాను .నాలుగింటికి మా శ్రీమతి చేసిన వేడి వేడి బజ్జీలు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

సినీ గీతా మకరందం -4

సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభు ఫిలిమ్స్ పేర 1960లో నిర్మించగా ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వం వహించగా ,రాజేశ్వర రావు మాస్టర్ వేణు ద్వంద్వ సంగీతం లో ,నాగేశ్వర రావు సావిత్రి రంగా రావు లు నటించిన చిత్రం ‘’నమ్మిన బంటు ‘’.ఇక్కడ రంగా రావు కు నమ్మిన బంటు నాగేశ్వర రావు మాత్రమె కాదు అతని ఆధ్వర్యం లో బండికి ఉన్న జోదేద్దులు కూడా .కొసరాజు సాహిత్యం పరవళ్ళు తొక్కింది .సుంకర సత్యనారాయణ మాటలు అల్లారు .ఇది అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రశంసలు పొందిన చిత్ర రాజం .

సావిత్రి ని ఆట పట్టించటానికి ఆమెను గిత్త తో పోల్చి ఆడుకున్న హాస్య పు పాట నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము .అందులోకి వెళ్దాం రండి .ఆ పొగరు బోతు పొట్ల గిత్త కన్నూ ,మిన్నూ కాన రానిదట .పట్టుకుంటే మాసి పోయే పారు పళ్ళ గిత్త .అటు సావిత్రికి ఇటు గిత్తకూ

సరి పోయే మాటల్ని చక్కగా పొదిగారు కొసరాజు .ఆమె పళ్ళను పార పళ్ళు అంటం ఎద్దేవాచేయటమే .ఎద్దు పళ్ళు కూడా పార పళ్ళు లానే ఉంటాయి . .ఆ గిత్త రూపమే బంగారం అవుతుందట .మీదకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుందిట .వెనక్కి వెళ్తే యెగిరి కాలు ఝాడిస్తుంది .విసురు కొంటు కసరుకొంటు అటూ ఇటూ ఇటూ అటూ గుప్పిళ్ళు పెడుతుంది ,కుప్పిగంతు  లేస్తుంది ఆ గిత్తా ,ఆ అమ్మడు సావిత్రి కూడా .ఇద్దరి స్వభావాలు ఒకటే .

అంతేనా –అదిలిస్తే రంకె వేసి బెదిరే గిత్త.కదిలిస్తే గంతులేసి కాండ్రు మనే గిత్త .దాని నడుము తీరు చూస్తె నవ్వు పుట్టుకొస్తుంది .మరి దాని నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తుంది .ఇంతకు మించి వన్నె చిన్నెల రాణి ఆటా అది .మంచి బోణీ ఇవ్వాలని కోరుకొంటున్నాడు నాయకుడు నాగేశ్వర రావు ,నమ్మిన బంటు .దాన్ని వదిలి పెడితే ఒట్టు అని ఒట్టెసుకొన్నాడు .ఇక దాని వగలను కట్టి బెట్టి లొంగి పొమ్మని అటు గిత్తనూ ఇటు గిత్త లాంటి అమ్మాయి సావిత్రిని హెచ్చ రించాడు .

జాన పద సాహిత్యం లో పండిన కొస రాజు రాఘ వయ్య చౌదరి రాసిన పల్లె పదాలతో ఎద్దుల భాష లో ,పల్లె టూరి వాతావరణం లో ,నాయకా నాయిక ల హృదయావిష్కరణ లో తన పై చేయిని చూపిస్తూ నాయకుడు ఆడిన నాటకం .పరవశం కలిగించే పాట ఘంట సాల అమర గానం తో ఈ గీతానికొక మహర్దశ ప్రాప్తించింది ఆ విరుపులు ,ఓంపులూ సొంపులూ ,పరితాపం ,ఆమె పై ప్రేమ ,ఆమె తనది కావాలన్న ఆరాటం అన్నీ ఇందులో కలిసి పోయి హాయి హాయి అని పించాయి కొంటె పాట అయినా కోటి రాగాలున్న పాటఅయింది .కోణంగి పాటైనది.కాలు ఝాడించటం ,గుప్పిళ్ళు పెట్టటం ,కుప్పి గంతులేయటం ,రంకె వేయటం ,కాండ్రు మానటం ,,బోణీ కొట్టటం వంటి పదాలు పల్లె జీవితానికి వేసిన పందిరి . గిత్తలను గంగి రెడ్డు వాళ్ళు బహు చక్కగా ఆడిస్తారు వాడు చెప్పినట్లు అది అన్ని పనులూ చేస్తుంది .వంగి దణ్ణం పెడుతుంది .తలూపి ఆడిస్తుంది తోక ఝాదిస్తుంది .గిట్టల పై గిత్త డాన్సు కూడా చేస్తుంది.అలా తన వశం కావాలని అన్యాపదేశం ఇందులో ఉంది .అందుకే నాకు ఈ గీతం మకరందమయ్యింది . .ఆ అమృతాన్ని మీకూ అందిస్తున్నాను .

మరో మకరంద బిందువు ను తర్వాత ఆస్వాదిద్దాం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్- -8-12-13-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

సఫల జీవి ‘’సేలేస్టీ’’-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -డిసెంబర్ -లో నా వ్యాసం

సఫల జీవి ‘’సేలేస్టీ’’

 ’చురుకైన యువతి గా సేలేస్టీ కి మంచి పేరుంది .1986లో స్కూల్ చదువు పూర్తీ చేసి స్కాలర్ షిప్  ల సాయం తో కాలేజి లోకి అడుగు పెట్టటానికి సిద్ధం గా ఉంది .తల్లికి గారాబు కూతురు గా,చేదోడు వాదోడు గా తెలివైన విద్యార్ధి గా ఆమె రుజువు చేసుకోంది . సమాజం కోసం ఏదో చేయాలనే తపన ఆమె లో ఉంది .ముఖ్యం గా రక్త సేకరణ ను ధ్యేయం గా ఆలోచించింది .కొన్ని నెలల లో ఆమె హెచ్ ఐ.వి.బాదితురాలిగా ఉన్నట్లు ఒక కాగితం పోస్ట్ లో అందింది .ఒక్క సారిగా షాకయ్యింది .సేలేస్టీ.

    తనకు ఈ జబ్బు ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల  వచ్చిందని ఆమె తెలుసు కొంది .ఇద్దరూ టీనేజెర్స్.అతనితో చాలా సన్నిహితం గా మెలిగేది .ఇద్దరు టెస్ట్ చేయిన్చుకొన్నారు .ద్రువీకరించుకొన్నారు .ఆ రోజుల్లో ఆ జబ్బు సోకితే మరణమే .దీన్ని అధిగమించటం యెట్లా అని ఆలోచించి ఇద్దరు .ఆమె  కాలేజి మానేసింది .బాయ్ ఫ్రెండ్ కు సపర్యలు చేసింది ..అతని ఆరోగ్యం రోజు రోజుకీ దెబ్బ తింటోందని గ్రహించింది .వెంటనే అతన్ని రక్షించుకోవాలనే బలీయ మైన కోరిక తో అతడిని 1987  జూలై

ఇరవై ఒకటిన పెళ్లి చేసుకోంది..దీని వల్ల  తనకున్న ‘’హెల్త్ ఇన్సూరెన్స్’’ అతనికి కూడా వర్తిస్తుందనే  ముందు చూపు ఆమెది .దురదృష్ట వశాత్తు ఆమె భర్త వెంటనే మరణించాడు .అప్పుడు సేలేస్టే వయసు కేవలం 19ఏళ్ళు మాత్రమే .

  సేలేస్టే స్నేహితురాళ్ళలో సగం ఆమె నుండి ఈ జబ్బు కారణం గా  ఆమెకు దూరమై పోయారు .కనీసం ఆమె స్నేహాన్ని కోల్పోతున్నామన్న బాధ కూడా వాళ్ళలో లేక పోవటం చూసి వ్యధ చెందింది . తన ఆశా సౌధం కూలి పోయిందని, దయనీయ పరిస్తితుల్లో తానున్నానని ఆమె చెప్పింది .ఇక తన చావు రోజుల్లోనే ఉందని నిశ్చయం చేసుకోంది.తనను గురించి ఆలోచించ నే లేదు  .కొన్నేళ్ళు ఇలా బాధ వ్యధలతో కుమిలి పోతూ ఉంది .తను తన కుటుంబం కోసం బతకటం లేదని ,ఆ మహమ్మారి వ్యాధికి వ్యతిరేకం గా పోరాడుతూ జీవిం చానని చెప్పుకొన్నది .

    నాలుగేళ్ళు ఇలా ఎదిరించి ,పోరాడి చివరికి తన జీవితం లో తప్పకుండా మార్పు రావాలని ,వచ్చేట్లు చేసుకోవాలని నిర్ణయించు కొంది.ఆమె  గాధ విన్న ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో మళ్ళీ చదువు ప్రారంభించింది.అంతేకాక ఎయిడ్స్ నిరోధం గురించి అన్ని సూచనలను

 పాటించింది .కొన్నేళ్ళు తను  ఏ డాక్టర్ దగ్గరకూ వెళ్లలేదని తన జబ్బు గురించి ఏ డాక్టర్ ని సంప్రదించలేదని ఎయిడ్స్ మందులువేసుకోవటానికి తాను  వ్యతి రికి నని అన్నదామె .డాక్టర్లన్నా నర్సులన్నా వాళ్ళ చికిత్సా విదానమన్నా తనకు ఏహ్య భావం అని చెప్పింది ..కాని 1994 లో తన CD4-కౌంట్ 500కు పడిపోయింది .అప్పుడు డాక్టర్ ఆమెను AZTట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తే ,అయిష్టం గా నే అంగీకరించింది .ఆ ట్రీట్ మెంట్ చేయించు కొంది.అది మంచి ఫలితాన్నిచ్చి ఆమె జీవితం లో ఆశా రేఖలు గోచరించాయి .

  సేలేస్టీ ఆరోగ్యం నెమ్మదిగా బాగు పడింది .ఉద్యోగం చేయాలనే సంకల్పమూ కలిగింది ,అవకాశమూ వచ్చింది .ఆమె ‘’ఎడ్మినిస్త్రేటివ్ అసిస్టంట్  ‘’గా ఉద్యోగం లో చేరి తనకున్న బుద్ధి బలం తో కార్య దీక్షతో సహనం తో మంచి స్వభావం తో కొద్దికాలం లోనే అందరి మన్ననలను అందు కొంది .

  తొమ్మిదేళ్ళ క్రితం సేలేస్టే ‘’సాశాఫ్రాన్సిస్కో’’ లోని ‘’ఎయిడ్స్ ఫౌండేషన్ సంస్థ ‘’లో వాలంటీర్ ఆ పని చేయాలని అనుకోని వారికి తెలియ జేసింది ఆమెను ఆ సంస్థ సాదరం గా ఆహ్వానించింది .తను గడిపిన చీకటి

రోజులుఆమెకు గుర్తున్నాయి .అలా ఎవరూ ఉండకూడదని భావించి కార్య రంగం లోకి దిగింది .అప్పటి దాకా తానూ ఏ సంస్తలో ను ఇమడలేక పోయానని ,కాని ఈ  సంస్థ తనకు ఆసరాగా నిలబడి తనలాంటి ఎయిడ్స్ బాధితులకు తన వంతుసహకారం అందించి వారి జీవితేచ్చను తీర్చటానికి తోడ్పడుతున్నందున తనకు ఏంతో సంతృప్తిగా ఉందని ఆనందం గా సేలేస్టే చెప్పు కొంది.తన లాంటి హెచ్ ఐ వి బాధితులకు ఈ సంస్థ’’ సంజీవిని’’ లాఉపయోగ పడుతోందని తన ఆరోగ్యం బాగు పడటమే కాక ఏంతో మందికి పునరారోగ్యం ఇచ్చే ఈ సంస్థ తన మాతృ సంస్థ అని, ఆ సంస్థతో తనజీవితం పెన వేసుకొని పోయిందని ఆ సంస్థే ఇప్పుడు తన కుటుంబం అని ,తన సమాజం అని, తన సర్వస్వం అని గర్వం గా చెప్పింది .ఈ మధ్యనే సేలేస్టే తన జీవిత రహస్యాలను బహిరంగ పరచటానికి ఒప్పుకొని అంతా చెప్పేసింది .తన లాగే ఈ వ్యాధి  బాధితులైన మహిళలు సిగ్గు పడకుండా ముందుకు వచ్చి మార్గ దర్శనం చేయాలని కోరింది . .

   ‘’ హెచ్ ఐ వి ఉందని తెలిశాక నా లాగా ఎవరూ దాచి పెట్టుకో కండి .ఇది దాచాల్సిన విషయం కాదు .పరీక్షలు చేయించుకొని పాజిటివ్ అని తేలితే చికిత్స ప్రారంభించండి .ఈ సంస్థ నన్ను భయపడకుండా చేసింది జీవించటం నేర్పింది మీరూ నాలాగానే లబ్ది పొందండి ‘’అని హితవు చెప్పింది .మూడు నెలలో కో సారి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించు కొంతున్నది . .హెచ్ ఐ వి ట్రీట్ మెంట్ లో లేటెస్ట్ గా వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చదివి కొత్తమార్గాలను అధ్యయనం చేస్తోంది .హెచ్ ఐ వి బాధిత మహిళల తో, గ్రూపులతో మాటలాడి వారికి ధైర్యాన్ని కల్గిస్తోంది .

   అక్రమ ద్విలింగ సంపర్కం వల్ల సంక్రమించే ఈ వ్యాధి దాచుకోవటం ప్రమాదకరమని దాని వల్ల  సమాజం లో అందర్నీ బాధితుల్ని చేస్తారని కనుక నిస్సంకోచం గా వ్యాధిని గురించి బహిరంగ పరచి చికిత్స చేసుకోవాలని సేలేస్టే  అందరికి చెబుతోంది .మహిళలు ముఖ్యం గా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరని ఇతరుల ఆరోగ్యాన్ని గురించే ఆలోచిస్తారని ఈ విధానం మంచిది కాదని ‘’ముందుగా  నీఆరోగ్యం, నీసెక్స్ హెల్త్ ‘’గురించి ఆలోచించు ‘’అని ఆమె మహిళలకు ఇచ్చిన ముఖ్య సందేశం .

   ఇప్పటికే సేలేస్టే జీవితం లో సగం హెచ్ ఐ వి తో నే గడచి పోయింది .ఇరవై ఆరేళ్ళ క్రితం ఈ వ్యాధిని గుర్తించి ,జాగ్రత్తలు తీసుకొంటూ ఆమె జీవిస్తూ ఉండటం అందరికి గర్వకారణం .తాను పొందిన జాగృతిని మిగిలిన వ్యాధి గ్రస్తులకూ కలిగిస్తూ ప్రజలలో మమైకం అవుతూ సఫల జీవితాన్ని సేలేస్టే గడుపుతూ మార్గ దర్శి గా నిలుస్తోంది .

  – గబ్బిట దుర్గా ప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’

తెలుగు సినీ వినీలాకాశం లో ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది అతి వేగం గా .మొన్న యాక్షన్ నటుడు శ్రీ హరి మరణించాడు .నిన్న హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పిన ఏ.వి.ఎస్ .మరణం హాస్యానికే పెద్ద దెబ్బ తగి లింది .ఇవాళ ‘’హాస్య ధర్మానికి వర ‘’మైన ‘’ఆనందో బ్రహ్మ ‘’అని పించిన సుబ్రహ్మణ్యం మరణం మరీ కలచి వేసింది హాస్య ప్రియులన్దరినీ .హాస్య నటులిద్దరూ సుమారు యాభై ఏళ్ళకే చని పోవటం దిగ్భ్రాంతి కలిగించే విషయం .ఇద్దరూ ఇద్దరే ఉద్దండులు .నెల ముందు తో అవ్వారి వెంకట .సుబ్రహ్మణ్యం చని పొతే ,ఇప్పుడీ ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ఆ దారినే పట్టటం విచారకరం

Inline image 1Inline image 2Inline image 3

 

 

 

ధర్మవరపు నాటక రంగం లో విశష అనుభవం ఉన్న వాడు బుల్లి తెరకు పరిచయమై ‘’ఆనందో బ్రహ్మ ‘’తో అందర్నీ ఆనంద పులకాంకితులను చేశాడు ..దూర దర్శన్ దిశనే మార్చి వేశాడుఆనందో బ్రహ్మ తో .దానితోనే దూర దర్శన్ కు కొత్త జవం ,జీవం ఇచ్చాడు .రొటీన్ గా కార్య క్రమాలు మొక్కు బడిగా సాగిస్తున్న దూర దర్శన్ కు ధర్మ వరపు రాక ఒక

ఉత్తేజాన్నిచ్చింది .,దూర దర్శన్ ప్రేక్షకుల సంఖ్య విపరీతం గా పెరిగింది .ఇది తిరుగు లేని నిజం . ఈ సీరియల్ ఎన్ని సార్లు వేసినా అన్ని సార్లూ ప్రేక్షకులు ఏంతోఇష్టపడిచూశారు అందులో ఎందరెందరో నటుల్ని పరిచయం చేశారు ఆయన .ఎపిసోడ్ ఎపిసోడ్ కు వైవిధ్యం చూపించి మెప్పించారు .ఆయన కీర్తి కిరీటం లో ఆనందో బ్రహ్మ ఒక సొగసైన వజ్రం .నవ్వుల వాన కురిపించి పొడై పోయిన హృదయాలలో ఆనందపు తడి చొప్పించారు .రసార్ద్ర హృదయుల్ని చేశారు .నిజం గా హాస్యం చెప్పి, చూపించి ,మెప్పించటం చాలా కష్టమైనదే .కానీ ఏంతో సుసాధ్యం చేశాడు సుబ్రహ్మణ్యం .అదొక తపస్సు గా ,దీక్ష గా కొన సాగించాడు .అందరికీ ఆనందామృతాన్ని పుష్టిగా పంచాడు .కాని తానూ నిమిత్త మాత్రుడు గా ఉండిపోయాడు .

ఈ స్తితిలో జంధ్యాల దృష్టిలో పడ్డాడు బాపు ను ఆకర్షించాడు వీరిద్దరి దర్శకత్వం లో వచ్చిన సినిమాలు ధర్మ వరాన్ని ,అతని హాస్య చాతుర్యాన్ని అభినయ కౌశలాన్ని డైలాగ్ డెలివరీ ని శిఖరాయ మానం చేశాయి .’’విచిత్ర ప్రేమ ‘’చిత్రం లో సుత్తి వీరభద్ర రావు మరణిస్తే మిగిలిన సీన్లలో ధర్మ వరం నటించి మొదటి సారిగా వెండి తెర కు పరిచయమయ్యాడు ఇక వెనక్కి తిరిగి చూడాల్సి రాలేదు. దాదాపు 300సినిమాలలో నటించి నవ్వుల పువ్వులు పూయించాడు చమత్కారపు చిచ్చు బుడ్లు వెలిగించాడు అమాయకపు కాకర పూవత్తులు వెలిగించాడు .సెటైర్ ఆటం బాంబులు పేల్చాడు .రిపార్టీ సీమ టపాకాయలు కాల్చాడు . అన్నిటా తాన దైన మార్కు వేశాడు .’’జయమ్ము నిశ్చయమ్ము రా ‘’తో ప్రారంభమైన ఈ సినీ జీవిత యాత్ర ఇప్పటిదాకా అవిచ్చిన్నం గా సాగింది .ఆయన లేక పొతే సినిమా చూడటం అనవసరం అని పించేలా చేయ గలిగాడు .పదే పదే ఆయన కావాలి అని క్రేజ్ గా జనం చూశారు ఆయన హాస్యాన్ని వ్యంగ్యాన్ని అభినయాన్ని అభిమానించారు .అంతటి ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకొన్నాడు ధర్మ వరపు .

ఆయన వేసిన లెక్చరర్ పాత్రలు కొంత పాత్రల ఔన్నత్యాన్ని దెబ్బ తీసినా ,ఆ పాత్ర కనీ పిస్తే ఈలలు వేసే వారు జనం .’’బాబూ !నేనూనీ  లా కాపీ కొడితే ప్రిన్సిపాల్ అయ్యే వాడిని అది చేతకాక లెక్చరర్ గా పడిఉన్నాను ‘’అంటాడొక సినిమాలో ఇందులోఎంత’’ బిట్వీన్ ది లైన్స్

‘’ఉందొ ఆలోచిస్తే నవ్వు తో బాటు లోక రీతి తెలుస్తుంది .’’మాకు తెలుసు బాబూ !అనే పదం అందరికి ఊత పదమే అయింది .అదేదో సినిమాలో ఒక మూగ పిళ్ళ మాట్లాడి ఏడిపించటం లో అతని హాస్యం సుపర్బ్ అని పిస్తుంది ‘’కాకా -కాకి ‘’అంటూ తిక మక లో పడటం నవ్వే నవ్వు .హాస్టల్ వార్డెన్ గా ,ఇంకో దానిలో యై విజయ భర్తగా ,మరో దానిలో బ్రహ్మానందం స్నేహితుడిగా అతను పండించిన హాస్యం చిరస్మరణీయం ..అన్నమయ్య లో ‘’ఏదీ !తొడ ఇటు పెట్టు ‘’అంటూ తొడపాసెం పెట్టె సీను మరవగలమా ?చొక్కా పైకెత్తి చేతి మీద అకౌంట్ లెక్కలు రాసుకొని ,నెమ్మది నెమ్మదిగా చూసు కొంటు ఏంతో కస్టపడి పోతున్నట్లు ఫీలై పోతూ బోర్డ్ మీద ఎక్కించే సీన్ మరో కడుపుబ్బా నవ్వించేది .’’బాగా చదవండి .లేక పొతే మా లాగా లెక్చరర్ అయితే ఇదిగో యెంత కష్ట పడుతున్నామో చూశారు కదా !’’అని బాధగా వ్యంగ్యం గా అంటాడు .

సినిమా నటన కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే మానేశాడు .సినిమాలలో సుస్తిర స్తానం సంపాదించుకొన్నాడు . ‘’సినీ హాస్య మార్గ దర్శి’’ అయ్యాడు అది చాలు అయన ధన్య జీవితానికి .పోలీసు ,ఇన్స్పెక్టర్ ,కాంట్రాక్టర్ ,సంగీతం నేర్పే మేష్టారు ,తమిళ గాయకుడు మొదలైన వెరైటీ వేషాలలో రాణించాడు ”ఎండి నా రొయ్యా ”అనే ఊతపదం తో ”కిక్కేక్కిస్తాదొక సినిమా లో

 

తన జీవితం లో యెన్.టి.రామా రావు తో నటించలేక పోయాననే బాధ ధర్మ వరపు కు ఉండేది .చివరికి రాజకీయాల్లో కూడా చేరి వైస్ .కు దగ్గరై,రవీంద్ర భారతి నిర్వహణ చేబట్టాడు .ఎన్నికలలో ప్రచారం చేశాడు .కాని రాజశేఖర మరణం తర్వాత కొడుకు పార్టీలో చేరటం అందరికి ఇబ్బంది కలిగించింది .అంత అంటకాగాల్సిన అవసరం లేదను కొన్నారు అభిమానులు .

ఏ.వి.ఎస్.లానే  సినిమా తీసి చేతులు కాల్చుకొన్నాడు ఈ సుబ్రహ్మణ్యం కూడా .’’తోక లేని పిట్ట ‘’తీసి నష్టపోయాడు .సంగీతమూ తానె చేశాడు .అయినా పిట్ట ఎగరలేదు చతికిల బడింది .’’తోక లేని పిట్ట తొంభై ఆమడలు పరిగెత్తింది ‘’అనే సామెత నిజం కాలేదు ఈయన కు .తొంభై రోజులు కాదుకదా ,అందులో సగం కాదుకదా ,అందులో సగం రోజులు కూడా ఆడకుండా దెబ్బ తీసింది .’’ఒక తుపాకీ మూడు పిట్టలు ‘’సినిమా లో నటిస్తుండగా ఈ మరణం కలిగింది .మా హితుడు సన్నిహితుడు,ఉత్తమ కధకుడు ,రిటైర్డ్ రేడియో ఇంజినీర్  అయిన స్వర్గీయ గంధం వెనకా స్వామి శర్మ గారు ధర్మ వారపు సుబ్రహ్మణ్యం తనకు చాలా దగ్గర బంధువు అని ”ఒరేయ్” అనే అంతటి చనువు ఉందని ,బంధుత్వానికి విలువ ఇస్తాడని ,ఆపదలో ఉన్న వారికి ఏంటో సహాయం చేసే గుణం ఉన్న వాడని నాతొ తరచుగా చెప్పే వారు .తాము తరచూ పెళ్ళిళ్ళలో కలుస్తూనే ఉంటామనీ అనే వారు .ఇప్పుదు ఇద్దరూ అమరలోకం లో ముచ్చటించు కొంటరేమో ?

ధర్మ వరపు –వెంకటేశ్వర భక్తీ చానెల్ లో సంగీత స్వరాల పై మంచి ఎపిసోడ్ల లో పాల్గొని తన స్వర ,రాగ పాండిత్యాన్ని అద్భుతం గా ఆవిష్కరించుకొన్నాడు .తెలుగు పద్యాన్ని ఏంతోహృద్యం గా పాడే వాడు ,వివరించే వాడు .అంటే అన్నీ తెలిసిన గొప్ప నటుడు .నటన ,ప్రొడక్షన్ రచన దర్శకత్వం సంగీత పాండిత్యం పుష్కలం గా ఉన్న గొప్ప నటుడు ధర్మ వరపు సుబ్రహ్మణ్యం .ఆయన హఠాన్మరణానికి సంతాపం ప్రకటిస్తూ,ఆత్మ శాంతి కలగాలని కోరు కొంటున్నాను .

‘’సుబ్రహ్మణ్య షష్టి’’ రోజున ఈ సుబ్రహ్మణ్య మరణం పై రాయటం బాధగా నే ఉంది .

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-13-ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

కార్తీక మాస విశిష్టత -సరసభారతి 53వ సమావేశం…

This gallery contains 25 photos.

More Galleries | Tagged | Leave a comment

‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు హఠాన్మరణం

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత
సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
రేపు అద్దంకి సమీపంలో అంత్యక్రియలు
తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో నవ్వుల తార రాలిపోయింది.
మొన్నటికి మొన్న ఏవీఎస్ మృతి మిగిల్చిన బాధ, ఆవేదన నుంచి
పూర్తిగా కోలుకోకముందే, ఆ కన్నీటి చారలు ఆరకముందే…
మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం (53) కన్నుమూశారు.

(హైదరాబాద్ – ఆంధ్రజ్యోతి) ధర్మవరపు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 10.30 గంటలకు ఆస్పత్రిలోనే తుదిశ్వాస వదిలారు. ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలోని స్వగృహంలో ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని వారి కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తారు. ధర్మవరపు సుబ్రమణ్యానికి భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు (సందీప్, రవితేజ) ఉన్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం స్వగ్రామం ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం. ఆయన 1960 ఆగస్టు 9న జన్మించారు.

ఆయన హఠాన్మరణంపట్ల సినీ, రాజకీయ, అధికార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ధర్మవరపు’ సినిమాలో ఉన్నారంటే… ప్రేక్షకులకు నవ్వుల వరం ప్రకటించినట్లే. నటనలో, డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేకమైన శైలి (మేనరిజం). ఆయన ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతి తెలుగు ఇంటికీ పరిచయమయ్యారు. సుత్తి వీరభద్రరావు మరణంతో ఆయనకు సినిమా అవకాశాలు లభించాయి. ఆయన… తొలిసారి వెండితెరపై కనిపించింది సుత్తి వీరభద్రరావు డూప్ పాత్రలో. ‘విచిత్ర ప్రేమ’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరభద్రరావు మరణించడంతో, ఆయనకు ధర్మవరపు డూప్‌లా నటించారు.

ఆయన తెలుగు తెరపై కనిపించిన తొలి చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఆ పాత్ర కూడా సుత్తి వీరభద్రరావు మరణంతో ధర్మవరపు సుబ్రమణ్యానికి లభించింది. ఆ తర్వాత ఆయనను దర్శకులు జంధ్యాల, బాపు బాగా ప్రోత్సహించారు. తేజతో సహా నవతరం దర్శకులు అనేకమంది ధర్మవరపుతో తమ చిత్రాల్లో నవ్వులు పండించారు. ధర్మవరపు 300లకుపైగా సినిమాల్లో నటించారు. ‘మిస్టర్ పెళ్లాం’లో ఏవీఎస్‌ను విపరీతంగా పొగిడే అసిస్టెంటుగా, ‘ఒక్కడు’లో సెల్‌ఫోన్ నెంబర్‌ను వింతైన మాడ్యులేషన్‌తో చెప్పే పాస్‌పోర్టు ఆఫీసర్‌గా, ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’లో నృత్య శిక్షకుడిగా, ‘మన్మథుడు’లో సీక్రెట్ మైకులు అమ్మే ఏజెంట్‌గా, ‘చిరుత’లో హీరోయిన్‌ను ‘పాపా… పాపా’ అంటూ ముద్దుచేసే సహాయకుడిగా… ఇలా ఒక్కటేమిటి! ధర్మవరపు సుబ్రమణ్యం పోషించిన ప్రతి పాత్రా నవ్వులకు చిరునామా! ‘నువ్వూ నేను’లో శోభన్‌బాబు జుట్టురింగుతో, గైడ్‌ను వాడుకునే లెక్చరర్‌గా ఆయన కడుపుబ్బ నవ్వించారు. ధర్మవరపు కేవలం నటుడు మాత్రమే కాదు. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. నరేశ్ హీరోగా నటించిన ‘తోకలేని పిట్ట’ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. సంగీతం కూడా అందించారు. ఆయన కథానాయకుడిగా ‘ఒక తుపాకీ.. మూడు పిట్టలు’ అనే సినిమా ప్రారంభమైనప్పటికీ, పూర్తికాలేదు. ఆయన… చివరిసారిగా ‘కెవ్వు కేక’ అనే సినిమాలో వెండితెరపై కనిపించారు. చివరిసారిగా ‘ప్రేమ గీమా జాన్తానై’ అనే సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ నడుస్తుండగానే, అస్వస్థతకు గురయ్యారు. ఆయన పాత్రను మరొకరికి అప్పగించారు.

నాటక రంగం నుంచి…
ధర్మవరపు సుబ్రమణ్యం చాలామందికి హాస్య నటుడిగానే తెలుసు. కానీ… ఆయనకు ప్రజానాట్య మండలితో నూ అనుబంధం ఉంది. నల్లూరి వెంకటేశ్వరరావు శిష్యుడిగా… ప్రజా సమస్యలపై కళాకారులతో కలిసి నాటకాలు వేసేవారు. పాఠశాలలో ఉండగానే నాటకాల ద్వారా ఉపాధ్యాయులను, స్నేహితులను అలరించారు. గ్రూప్-2కు ఎంపికై ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా నటుడు కావాలన్న లక్ష్యంతో అడుగులు వేశారు. మొదట రేడియోకు పరిచయమయ్యారు. ఆ తర్వాతే దూరదర్శన్‌లో కనిపించారు. దూరదర్శన్‌లో ఆయన ప్రస్థానం రచయితగా, నటుడిగా సుదీర్ఘకాలం సాగింది. డీడీలో ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ ‘అనగనగా ఒక శోభ’ రచయిత ధర్మవరపు సుబ్రమణ్యమే. దూరదర్శన్‌కు ఆయన ఐదు సీరియళ్లు అందించారు. ఇలా కళాకారుడిగా బిజీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. దూరదర్శన్‌ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న ధర్మవరపు సుబ్రమణ్యం దర్శకుడు జంధ్యాల దృష్టిలో పడ్డారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ అంటూ వెండితెరపై వెనుదిరిగి చూడకుండా ముందుకు కదిలారు. ‘నువ్వు నేను’తో ధర్మవరపు సుబ్రమణ్యం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం చివరి క్షణంలో చేజారడం, అన్నగారితో నటించలేకపోవడం తన సినీ జీవితంలో లోటు అని చెప్పుకునేవారు.

రాజకీయ ప్రస్థానం…
ధర్మవరపు సుబ్రమణ్యం తండ్రికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉండేది. ఆ తర్వాత ధర్మవరపు కూడా కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఆయనను రాష్ట్ర సాంస్కృతిక మండలి డైరెక్టర్‌గా వైఎస్ నియమించారు. ప్రస్తుతం ధర్మవరపు వైసీపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం గతంలో రెండుసార్లు మృత్యువు ముఖందాకా వెళ్లారు. ఊటీలో జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మరోసారి… తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ రెండుసార్లూ ఆయన మృత్యుంజయుడిగా నిలిచారు. ఇప్పుడు మాత్రం… మృత్యువు చేతిలో ఓడిపోయారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ

త్యాగయ్య ఆత్మ విచారాన్ని సవివరం గా అందించిన హాస్య బ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు తెలుగు పద్య నాటకాల్లో  పద్యం పాడటం పై తన అభిప్రాయాల్ని నిర్మోహ మాటం గా వివరిస్తూ ఒక గ్రంధమే రాశారు .తనకున్న పద్య పాటవాన్ని వ్యక్తీకరించారు .ఈ విషయాలపై రాసిన పుస్తకం ఒక సిద్ధాంత గ్రంధమే అయింది .అందర్నీ ఆలోచింప జేసింది .నూట నలభై పేజీల గ్రంధం ఇది .నాటకం లో పద్యం పాడటం పై ఎన్నో ఏళ్ళుగా ఆయనకు ప్రత్యెక భావనలున్నా ఈ పుస్తకం 1957 లోనే వెలువడింది .1924 లో ప్రారంభించి, దీక్షగా పదమూడేళ్ళు కృషి చేసి 1957లో వెలువరించారు .ఆ తపనకు జేజేలు .  దానికి ‘’ఆంద్రనాటక  పద్య పఠనం ‘’అని పేరు పెట్టారు  .పుస్తకాన్ని కూల్డ్రే దొరకు అంకిత మిచ్చారు .ఇది హాస్య బ్రహ్మ లో ప్రవేశించిన పద్య నాటక బ్రహ్మ అయింది ఆ విషయాలన్నీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు మేస్టారి పై రాసిన పుస్తకం లో పొందు పరచారు .ఆ విషయాలే మీ కోసం అందిస్తున్నాను

ఈ పుస్తకానికి ఒక నేపధ్యం ఉంది .ఒక సారి కూల్డ్రే గారు పాఠంబోధిస్తూ ,మాటల సందర్భం లో ‘’మీ ఆంద్ర కవిత్వం ఒక ప్రత్యెక కళ కాదు ‘’అన్నారట .వెంటనే మన మేష్టారు లేచి ‘’ఎందుకని ?’’అని అడిగారట .’’మీ సంగీతం రాగాన్నించి విడి వడి ప్రత్యేకత్వం సంపాదిన్చుకోలేదు కనుక ‘.రాగ మిళితం అయినప్పుడు తప్ప ,దానికి జన్మ ఉన్నట్లు మీరు ఒప్పుకోరు కనుక ‘’.అన్నారు .దానిపై ఆ తర్వాత తరచి తరచి అడిగి కూల్డ్రే గారి అభిప్రాయాలను తెలుసు కొన్నారు ఈయనకూ మనసులో మధనం ప్రారంభ మైంది .కొంతవిషయం మనసుకి చేరింది .అప్పుడు మేష్టారు దొర తో ‘’మా కవులు రాగాలు ముందు నేర్చు కోరు .అసలు చాలా మంది కవులకు రాగాలే రావు తెలియవు ..కూల్డ్రే ఆశ్చర్య పోయి తన పొరబాటు తెలుసుకొని ‘’అసలు అలా ఎందుకు పాడతారు ‘’అని అడిగారు .అంతే –ఆ క్షణం నుంచి సంగీతం గురించి,స్వర,రాగాల గురించి  కవిత్వం గురించీ అధ్యయనం ప్రారంభించారు .

అదే ఏడాది బందర్లో ‘’నట సారస్వత సభలు ‘’జరిగాయి .సారస్వత సభ కు శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,నట సభకు శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారు అధ్యక్షులు .పిలవక పోయినా మేష్టారు హాజరయ్యారు .కొందరు వక్తలు రాక పోవటం వల్ల ,మేస్టారికి ప్రసంగించే అవకాశం వచ్చింది .ఇలా ‘’నాటక పద్య గానం ‘’గురించి రెండు రోజులు మాట్లాడారు .ఆ ప్రసంగం అందర్నీ

ఆకర్షించింది .హరి నాగ భూషణం గారు ,కౌతా రామ శాస్త్రి గారు మేస్టారి వాదాన్ని గట్టిగా సమర్ధించారు .మేస్టారి ప్రసంగ పాఠం తమ ‘’శారద ‘’పత్రిక లో వేయ టానికి   ఇవ్వమని ‘’రామ శాస్త్రి గారు అడిగారు .నూట యాభై రూపాయల పారి తోషికం ఇస్తామని కూడా చెప్పారు .తన అసంపూర్తి రచన ఇవ్వటానికి  ఒప్పుకో లేదు .ఈ సభలో మేష్టారు ఒక చమత్కారం చేశారు .ముందుగా అయిదు నిమిషాలు ‘’భైరవి రాగం ‘’ఆలపించారు మేష్టారు .రాగం ఆపి ‘’విషయం అర్ధమయిందా ?’’అని అడిగారు జనాన్ని .అప్పుడు చెప్పారట .పద్యాన్ని చంపి ,రాగం తియ్యటం వల్ల అటు పద్యానికి ,ఇటు నాటకానికి అన్యాయం జరుగుతుందని .అప్పుడు మొదలెట్టి సోదాహరణం గా ఉపన్యాసం ప్రారంభించారట .మరి కాసేపాగి ‘’తోడి రాగం ‘’లో అర్జునుడి పద్యం ఎత్తుకొని రాగాలు తీయకుండా ను, తీస్తూనూ పద్యం చదివి విని పించి తను చెప్పదలచుకొన్నది సూటిగా మనస్సులకు ఎక్కించారు .అదీ మేస్టారి భణితి.

అలాగే ఒక పద్యం లో ‘’అనుగుం జేల్లెలివై ,ముకున్డునకు ,నా కర్ధాంగి వై ‘’అనే పద్యం చదువుతూ మాటలు కలిపి అర్ధం ధ్వంసం అయేట్లు

చదివినా ఆ తప్పు తెలుసుకోక నవ్వ లేక పోయారు శ్రోతలు .తిరుపతి శాస్త్రి గారు ‘’నవ్వరేం ?’’అని గద్దించినా ,అనౌచిత్యం వారికి తెలియ లేదు .మేస్టారి ఉపన్యాసం మాత్రం పట్టాభి ,చెరుకువాడ ,ముట్నూరి ,సూరి శాస్త్రి గార్లకు బాగా నచ్చింది .’’ఉమరాలీషా’’కవి గారికి మాత్రం ‘’పద్యాల్నీ రాగాల్నీ విడదీస్తే కవిత్వం దెబ్బతినటమే కాక తెలుగు ‘’నాటకప్పాకలు ‘’తగలడి పోతాయి .అని పించిందిట .

మేస్టారి ఆలోచనలో గేయం పాడుకొనేది .గద్యం చదువు కొనేది .పద్యం ఏకాంతం గా పాడుకున్నా తప్పు లేదు ‘’.19 వ శతాబ్దం లో సంగీత నాటకాలు లేక పద్య నాటకాలు పుట్టుకు రావడం తో పద్యానికి రాగం రూఢి అయి పోయింది ..ఏ దొడ్డి దార్నో సన్న సన్నగా వచ్చి చొర బడ్డ క్షుద్ర రాగం సంగతి’’ ఏకై వచ్చి ,మేకై కూర్చోవడం ‘’లా అయింది ‘’అని బాధ పడ్డారు .మనవాళ్ళకు ప్రత్యెక గమనాలున్తాయని తెలీదు .అందుకే పద్య కవిత్వాస్వాదన అనేది తెలుగు లో విరివిగా లేదు .కవిత్వం ఆలోచనా మృతం.అని ఒప్పుకొనే రసజ్ఞులు కూడా ‘’రాగం దూరం అయినపద్యం కూడా ‘’మ్రుతమే’’ ‘’అంటారు .అందుకే ముందు గా రాగం ,పద్యం అనే పదాలకు అర్ధం రూఢి చేసుకోవాలన్నారు మేష్టారు .

తెలుగు లో వాడే చందాల్ని మూడుగా విడదీశారు మేష్టారు .యదా తదం గా ఉన్న దాన్ని తాళం వెయ్యటానికి అనువుగా ఉన్నవి ,మాత్రల లెక్కన ఏదో ఒక తాళానికి సరి పుచ్చుకోవటానికి వీలైనవి ,ఏ తాళంకిందికీ రానివి .ఇవీ వారు చేసిన విభజన .అవసరం ఉన్నా లేక పోయినా అనేక విషయాల్ని పద్యాలలో పొందు పరచటం ఆయనకు రుచించ లేదు .ఇందులో ఆశీర్వచన పద్యాల్లాంటివి ఉన్నాయి .పద్యం కూడా సంస్కృత భూయిస్టమయిందని బాధ పడ్డారు .చెళ్ళ పిళ్ళ వారి  షష్టిపూర్తిర సభ బందర్లో జరిగితే అందరూ పద్యాల్లో ఆయన్ను గూర్చి బాకా లూదిన వారే కాని ఆయన సాహిత్యం గురించి వినాలని ఎవరికీ అనిపించక పోవటం మేస్టారిని కలచి వేసింది .చివరికి  శాస్త్రి గారికో   నమస్కారం చేసి వెళ్లి పోయారు .

మేస్టారి ఆలోచనలో ‘’రాగం ,నాదం అనేవి ప్రాణాగ్నుల సంయోగం .ఘర్షణ వల్లనే నాదం జనిస్తుంది .రెండు రాగాల మధ్య రంగం లో ఏర్పడే మజిలీలే ప్రత్యెక నాదాలు .వాటినే శ్రుతులన్నారు .సరిగమ పదనిస లనే సప్త స్వరాల స్వర విహరణేరాగం .ఏడు స్వరాల్లో విహరించటానికి 72రాగాలు అమరుతాయి .ఇవే మేళ కర్తలు .వీటిలో జనక రాగాలు ,జన్య

రాగాలు ఉన్నాయి .వీటికి ఆరోహణ ,ఆవ రోహాణా ఉన్నాయి .రాగానికి కనీసం అయిదు స్వరాలున్డాలి .వీటి సంఖ్య 34,848 .మనకు మూడు వేల రాగాలున్నాయి .త్యాగ రాజు దాదాపు రెండొందల రాగాలలో కీర్తనలు రాశారు .కచేరీలలో 150 దాకా రాగాలు పాడుతారు .గాయకులూ తాము పాడే రాగాలను గూర్చి చెప్పరు .వినే వాళ్లకు ఎలాగూ తెలీదు .సంగీతం విన టానికి ప్రిపరేషన్  ఉండటం లేదు ‘’అని మేష్టారు విచారించారు .

పద్యం -శబ్దార్దాల సమ్మేళనం .కనుక పద్యం గురించి ఒకరికొకరు ముచ్చ టించు కో వచ్చు .రాగ స్వరాలు అర్ధానికి అతీతం కనుక అది అసాధ్యమవుతుంది .రాగం గాయకుడి ప్రతిభ  మీదనే ఆధార పడుతుంది .రాగం ఒక స్వర ప్రవాహం కనుక అవిచ్చిన్నమైంది .’’అంటారు

‘’రసానికి అనుగుణం గా రాగాలున్నాయనడం పూర్తీ నిజం కాదు .కల్యాణి రాగం ఏడుపు లోను ,ముఖారి కోపం లోను ఒప్పించిన వారున్నారు .అందు చేత పద్య భావానికి చెందినా రసం ఆధారం గా ఏదో ఒక రాగం లో పద్యం పాడాలి అనడం సమంజసం కాదు .వెంకట ముఖి అనేరాజ మండ్రి సంగీత శాస్త్రజ్ఞుడు’’రస రాగ నిర్ణయం లో ఏ ఇద్దరి అభిప్రాయాలూ ఎకీభవించవు ‘’అన్నాడు ‘’అని గుర్తు చేశారు

‘’ఫలాని రాగం లో ఈ పద్యం పాడు ‘’అని ఏ కవీ రాయలేదంటారు మేష్టారు .సంగీత సాహిత్య ప్రవీణుడు రామ రాజ భూషణుడు కూడా తన కవిత్వాన్ని ఫలాని రాగం లో పాడాలని సూచించలేదు .ఏదో ఒక రాగం లో పాడుకోవటం దోషం కాదు .అది కేవలం వ్యక్తీ గతమైనది .దీన్ని జనం మీద రుద్దటం సహించ రానిది ‘’అన్నారు .

‘’కవనం యొక్క సూక్ష్మ ప్రమాణం శబ్దం .గానం యొక్క సూక్ష్మ ప్రమాణం  స్వరం .అర్ధ వంతమైన శబ్దానికి ,రస వంతమైన స్వర సంపుటి చేసి నవ్య కళ సృస్టిం చేడు కీర్తన కర్త ‘’‘’మేష్టారు ఉవాచ .పద్యం లో గానం చొర బడితే కవిత్వం ఆవిరై పోతుంది ‘’అని మేస్టారి నిశ్చయ భావం .’’మన నాటకాలలో నటుడికి హార్మోని స్టూ నాటక కర్త కు మించిన దైవం ..’’అని ఎద్దేవా చేశారు .భరతుడి నాట్య శాస్త్ర ప్రమాణాలే మేష్టారికీ ప్రమాణాలు .భరతుడు స్పష్టం గా వాచికాభినయం లో ఛందో విధానం పాటించాలని చెప్పాడు .శ్లోకాలను ,చరణ పదాల మాత్రల గురించి ఎలా జాగ్రత్త పడుతూ ఎలా చదవాలో నిర్దేశించాడు ‘’అని గుర్తు చేశారు మేష్టారు .ప్రదర్శనల్లో శ్లోకాలు చదివే వారు .’’స్త్రీలు పలక వలసిన చోట ‘మహా రాష్ట్ర లో పాడటం ఉండేది .కాని పద్యాన్ని మాత్రం .సౌర సేని లో పఠించే  వారు ‘’.అని ‘’సంస్కృత నాటకాల మీద అధ్యయనం చేసిన ‘’బెరిడేల్ కీత్ ‘’అన్నట్లు మాస్టారు గుర్తు చేశారు .19వ శతాబ్దిలో విజయనగరం ఆనంద గజ పతివారి ఆస్థానం లో నాటక ప్రదర్శనల్లో ముందు శ్లోకాలు చదివి తర్వాత పాడే వారు .వసు చరిత్ర కారుడు సంగీతానికి ,సాహిత్యానికి నాద విషయం లో ఉండిన మౌలిక భేదాన్ని ఒక పద్యం లో స్పష్టం చేశాడు .

‘’ఒకటి అక్షర విలసోల్లాసమున మించ –నొకటి తాళ ప్రౌఢిమ నుల్ల సిల్ల ‘’అంటాడు .ఆదికవి నన్నయ ఒక సందర్భం లో ‘’ఉచ్చారణ ‘’దక్షుడి ‘’వల్లనే ‘’శబ్దం ‘’ జీవిస్తుంది ‘’ఆన్నాడని జ్ఞాపకం చేశారు .’’ఆంద్ర నాటక పద్యాన్ని రాణించడం ,నాటకోద్దేశానికి ప్రతి బంధకం .’’అని బుర్ర పగిలేట్లు చెప్పారు భమిడి పాటిజీ .పద్యోచ్చారణ దక్షుడు చేయ వలసిన పని .గాయకుడిది కాదు .భావం గల పద్యాన్ని ప్రకటించ టానికి రాగం ఆటంకం .పద్య పఠనంలో ఛందో జ్ఞానం ఆశించాలి కాని రాగ జ్ఞానం కాదు .మంచి రాగాన్ని తీసుకొచ్చి పద్యానికి అమరిస్తే వినడానికి బాగుంటుంది .అంటే పద్యం పోయి రాగం మిగిలిందన్న మాట . పద్యం బాగా చదవటం లో ఉద్దేశ్యం పద్యం యొక్క అర్ధాన్ని ఎక్కువగా ప్రకటించడం .భావాన్ని

ప్రసారం చెయ్యటం తద్వారా ఒక సాహిత్యానందాన్ని కలగ జేయ్యటం చెవికి హాయిగా సుఖం గా ఉండటానికి కాదు ‘’అని నాటక పద్యం ఖూనీ అయిన తీరు పై మంది పడ్డారు .

ఈ గ్రంధం మొత్తాన్ని ప్రశ్న జవాబు రూపం లో రాశారు ..ఈ గ్రంధం పద్య నాటక కర్తలకూ ,నటులకూ ఒక పెద్ద బాల శిక్ష .ఔచిత్యం తెలిసినా కూడా చదువు కొన్న కొంత మంది పౌరాణిక నటులు కూడా ఈ గందర గోళం నుంచి బయట పడలేక పోయారని ఆవేదన చెందారు కామేశ్వరరావు  మేష్టారు .1950కి ముందే హాస్య బ్రహ్మ గారు కొన్ని పద్యాలను చదివి రికార్డు చేశారట ఆ రికార్డు భద్రం గా ఉందొ లేదో తెలియదు ..ఆ నాటి పౌరాణిక నాటక నటులలో స్వర్గీయ అద్దంకి శ్రీరామ మూర్తి గారు పద్యాలను చదివి భావం అర్ధమయ్యేట్లు చేశారని మనందరికీ తెలిసిన విషయమే .ఇలా హాస్య బ్రహ్మ లో’’సంగీత సరస్వతి’’ తో బాటు, ‘’పౌరాణిక పద్య కవి బ్రహ్మ’’ కూడా కలిసి ఒక ‘’విశిష్ట స్వర సాహిత్య బ్రహ్మ ‘’అయ్యారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-13-ఉయ్యూరు

.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment