నాదారి తీరు –49
పూనా ట్రిప్ -2
మోహన్ బందర్లో బి.జెడ్ .సి లో హిందూకాలేజి నుండినుండి బి ఎస్ సి డిగ్రీ పొందాడు .తర్వాత ఎక్కడెక్కడో ప్రయత్నించి పూనా చేరి అక్కడ కిర్కీ ఆర్డి నేంస్ ఫాక్టరీ లో ఉద్యోగం సాధించాడు .నెమ్మదిగా స్తిరపడ్డాడు .మా అమ్మఅంటూ ఉండేది . ‘’అది మాయల మరాఠీ లోకం .జాగ్రత్త ‘’అని .అక్కడే తనతో బాటు పని చేసే సునీత ను ఇష్టపడి పెళ్ళాడాడు .ఆ విషయం మా క్క దుర్గ బావ వివేకానంద్ కు తప్ప మా కేవరికీ తెలీదు .మా బావ ఒక సారి వచ్చి ఈ విసహాయం నన్ను పెద్ద వంతెన దాకా తీసుకొని వెళ్లి రహస్యం గా చెప్పాడు .మా అమ్మ యెంత బాధ పడుతుందో నని అందరం బాధ పడ్డాం .నెమ్మదిగా ఇంటికొచ్చి బావ అమ్మకు చెప్పాడు .ఆవిడ అగ్గి మీద గుగ్గిలమే అయింది .యెంత ఏడ్చిందో చెప్పలేం .పక్కనే మా మామయ్యా గారిల్లు .వాళ్లకు ఈ విషయం తెలిస్తే యెంత పల్చ బడుతామో నని ఆవిడ బాధ .ఈ విషయాన్ని జీర్ణించుకో లేక పోయింది .చెప్పా పెట్టకుండా ఈ పెళ్లి ఏమిటి?/అని ఆవిడ బాధ కొన్ని రోజుల దాకా ఆవిడ సమాధాన పడలేక పోయింది .మా బావ ఒక రోజు మోహన్ ని సునీతను ఉయ్యూరు తీసుకొని వచ్చాడు .ఏడ్చింది ,పేద బొబ్బలు పెట్టింది .సూటి మాటలంది .నాకు ఏమీ పెద్ద కొత్త అని పించలేదు .ఎవడి జీవితం వాడిది అనేది నావిధం .సునీత ఇంట్లో కలివిడిగా తిరిగి అందర్నీ మచ్చిక చేసుకోంది.చుట్టరికం బానే కలిపింది ..అల్లుకు పోయింది అమ్మ కూడా క్రమంగా మారింది .పెద్ద కోడలు కన్నా చిన్న కోడలు దగ్గరైనట్లు ప్రవర్తించేది .మెర మెచ్చు కబుర్లు చెప్పటం మా ఆవిడకు తెలీదు .ఆవిడా మనసు నిండా తోడి కోడల్ని ఆహ్వానించింది .
మోహన్ కూడా క్రమం గా దూరమై దగ్గరయ్యాడు .మా మామయ్యా నోరు మెదప లేక పోయాడు .వాడు ‘’పైరో టెక్నిక్ ‘’అంటే మందు గుండు శాస్త్రం లో ప్రైవేట్ గా పూనా వర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ సాధించాడు .పూనా లో తెలుగు అసోసియేషన్ స్తాపకులలో ఒకడై సెక్రెటరి గా పని చేసి ఎందరెందరో తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సన్మానం చేశాడు .అందులో వేదాంతం సత్య నారాయణ గారు లాంటి ఉన్నారని వాడు చెప్పగా తెలిసింది. ఫోటోలు పేపర్ కటింగు లూ చూపే వాడు .వీడితో పాటు ఉయ్యూరు లో విశ్వ బ్రాహ్మిన్ చేవూరి సుదర్శన్ అనే నా క్లాస్ మేట్ కూడా పూనా లో వీఎడితో బాటు పని చేసే వాడు .కొంతకాలం తర్వాత మానేసి ఇక్కడే బంగారం పని చేశాడు బ్యాంకికి లో బంగారం స్వచ్చతకు మధ్య వర్తిగా ఉన్నాడు.మంచి స్నేహితుడు. అతని మేనల్లుడు నాదగ్గర టెన్త్ క్లాస్ ట్యూషన్ చదివాడు
మా వాడు పూనా లో స్వచ్చందం గా రిటైర్ అయి హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో చేరాడు అక్కడ ‘’డిప్యూటీ జెనరల్ మేనేజర్ ‘’గా రిటైర్ అయ్యాడు .
.మా వాళ్ళకు ఇదే మొదటి సారి హైదరాబాద్ వెళ్ళటం పూనా దాక వెళ్ళటం కూడా.నేనిది వరకే చెరుకు రైతు యాత్ర లో వెళ్ళిన సంగతి రాశాను .మా వాడి రెండో బావ మరిది పూనా మొత్తం చూసే ట్రిప్ లో బస్ లో నన్ను తీసుకొని వెళ్లి చూపించాడు .ఎరవాడ జైలు మొద్సలైన వన్నీ చూశాం .ఆతను చాలా హుషారైన మనిషి .చాలా మర్యాదగా ఉన్నాడు …మొత్తం మీద పూనా లో ఆరు రోజులే ఉన్నాం .అప్పటికే సునీత పధ్ధతి మారి ,ఇక ఉండలేక పోయాం .వెంటనే రిసేర్వేషన్ చేయించి ప్రయాణానికి సిద్ధం అయ్యాం. వసంత, నేను పూనా లో దొరక్క పొతే ఇంకో స్టేషన్ కు వెళ్లి రిసేర్వ్ చేయించాం .హైదరాబాద్ వరకే చేయించాం .అందరం హైదరాబాద్ చూడ లేదు పూర్తిగా అందుకని మా మరదలు భారతి వాళ్ళింట్లో ఉండి అన్నీ చూసి అప్పుడు ఉయ్యూరు రావాలని మా ఆలోచన. మేము పూనా వెళ్ళే ముందే భారతి మమ్మల్ని ఆహ్వానించింది దక్షిణా మూర్తికూడా .సరే నన్నాం .మోహన్ మామ గారింట్లో రోజూ ఇడ్లీ సాంబారు బాగుండేది ఉప్మా పెసరట్ కూడా బాగుండేది. సాయంత్రం పకోడీలు ,మొదలైన టిఫిన్లు టీ .కాఫీ బాగుండేది రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు ఇచ్చే వాళ్ళు .నేను కిర్కీ నుండి రెండు రోజుల కోసారి లోనా వాలా కు లోకల్ ట్రెయిన్ లో వెళ్లి సరదాగా తిరిగి వచ్చే వాడిని .ఒక సారి అందరం కళ్యాణ్ వరకు వెళ్ళిన గుర్తు ..
హైదరాబాద్ కబుర్లు తర్వాత
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.11-12-13-.ఉయ్యూరు ..
