విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22

అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు

ఖజురహో మొదటి శతాబ్ది చివరలో మధ్య భారతాన్ని పాలించిన ‘’చందేల ‘’రాజ వంశం ‘’వారు ఆర్ష ,బౌద్ధ ,జైన ధర్మాల మీద భక్తీ విశ్వాసాలతో విస్తృత కళా విలాసాలతో కొత్త శైలి లో దేవాలయాల సముదాయం నిర్మించారు  .అవే ఖజురాహో శిల్పాలని పించుకోన్నాయి .

ఖజురాహో ఆలయాలు మధ్య ప్రదేశ్ లో చమతా పూర్ జిల్లాలో  బుందేల్ ఖండ్ ప్రాంతం లో ఉన్నాయి .అప్సరసల అందెల మోతతో ,యక్షిణుల విరహ గీతాలతో ఖజురహో ప్రతిధ్వనిస్తుంది .నాయికా నాయికల శృంగార భంగిమలు స్వర్గాన్ని గుర్తు చేస్తాయి .జంతువుల్ని ,పక్షులను వైవిధ్య భరితం గా సృష్టించారు .ఎత్తైన గోపురాల మీదా ప్రాకారాల మీద ప్రాచీన శిల్ప కళా వైభవం కానీ పిస్తుంది .    హిందూ ,బౌద్ధ ,జైన ధర్మాలకు చెందిన 80.పైగా ఖజురాహో ఆలయాలు నిర్మింప బడ్డాయి .క్రీ.శ.900-1000మధ్య కాలం లో చందేల ల రాజులు కట్టించిన ఈదేవాలయాలు ఎక్కువ భాగం నేలమట్టం అయ్యాయి ఇప్పుడు ఈ ఆలయాలలో అశ్లీలాలనే అందరు చూసి రోట్టలు వేస్తున్నారు .

ఈ ఖజురాహోలో  ఇవాళ కేవలం మూడు వేల లోపు జనాభా మాత్రమె ఉంది .601భారత్ వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ సందర్శించిన తర్వాత విదేశీ యాత్రికులు ,హిందూ జైన బౌద్ధ ఆచార్యులు ,సిద్ధులు ,యోగులు ,తాన్త్రికో పాసకులు ఖజురాహో లో విడిది చేసి నట్లు ఆధారాలున్నాయి .1839లో ఈస్ట్ ఇండియా కంపెని సైనికాధి కారి టి.ఎస్.బర్ట్ర్ట్  ఖజురాహో ను చూసి ప్రపంచానికి ఎరుక పరిచాడు

Inline image 1   Inline image 1Inline image 1Inline image 1Inline image 1

.

ఆ తర్వాత యందరో వచ్చి పరిశోధించారు .రొమిల్లా దాపర్ ,,పురాతత్వ శాస్త్ర వేత్తల కృషి తో’’డివైన్ ఎక్స్తసి’’పేర ఖజురాహో మీద పుస్తకం తెచ్చారు .భారతీయ జ్ఞాన పీఠ అనేక పుస్తకాలు ప్రచురించింది . 1996లో రెండు కొత్త సిద్ధాంతాలు వచ్చాయి .హిందూ ఆగమ శాస్త్ర విజ్ఞానం ఆధారం గా ఇవి నిర్మింప బడి నాయని తెలిపారు .

హంపి బేలూర్,అజంతా ఎల్లోరా,కోణార్క్   శిల్ప కళా వైభవం ప్రత్యేకించి ఎవరూ చెప్పక్కర లేదు .

కిరాడూ శిల్ప వైభవం

రాజస్తాన్ చాద్ మెర్ నుంచి ముప్ఫై రెండు కిలో మీటర్ల దూరం లో ‘’బూడిద రంగు రాళ్ళు ‘’తోఉన్న కొండ లోయల్లో ‘’కిరాజ్ –కూప్ ‘’నేడు కిరాడూ అని పిలువ బడే ప్రాచీన నగరం ఉంది. అక్కడ ఎత్తైన శిఖరాలతో ఉన్న మందిరాలున్నాయి .పన్నెండు వ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు దీని కీర్తి దశ దిశలా వ్యాపించింది .అక్కడి శిల్పాలు నైపుణ్యం కళ్ళు జిగేల్ మంటా.యి ఇప్పుడు భగ్న శిల్పాలతో వికృతం గా ఉంది .ఇక్కడ ఏ రాయి మామూలుగా కనీ పించదు ఎనిమిది వందల ఏళ్ళ కిందట రూపు దాల్చిన శిల్పాలు ప్రక్రుతి వైపు రీత్యాలకు తట్టుకొని ,కాల పరీక్షలో నిలబడటం ఆశ్చర్యకరం .పూల రేకుల మీద గీసిన రేఖలు ఇప్పటికీ స్పష్టం గా కనీ పించి వింత గొలుపుతాయి .అదీ మన ప్రాచీన శిల్ప శాస్త్ర వైభవం .

India, Rajasthan, Kiradu, monument in front of mountains photo

సశేషం -మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -23-111-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర ‘సాహితి’

 

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాహితి. ఎనిమిదో తరగతి చదువుతోంది. బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే, బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ బోలెడు బహుమతులు గెలుచుకుంటోంది. ‘ఆటలాడేందుకు టైం లేదని అప్పుడప్పుడు బాధ పడినా, నాకొచ్చిన బహుమతుల్ని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది’ అంటున్న ఆ చిన్నారి చెప్పిన కబుర్లే ఇవి…

“హైదరాబాద్, బోయనపల్లిలోని ‘బేగంపేట కేంద్రీయ విద్యాలయం’లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. ‘కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ’ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పెయింటింగ్ కాంపిటిషన్‌లో మొదటి బహుమతి గెలుచుకున్నాను. ‘శక్తి వినియోగం’ (Energy Conservation), ‘నీటి నిల్వలు అడుగంటకముందే కాపాడుకుందాం’ (Care for water before it becomes Rare) అనే రెండు అంశాలపై పెయింటింగ్‌లు వేయాలి. నీటికి సంబంధించిన అంశాన్ని అక్కడికక్కడే చెప్పి రెండు గంటల్లో వేయమన్నారు. మొదట చాలా భయంగా అనిపించినా పెయింటింగ్ బాగానే పూర్తి చేయగలిగాను. శక్తి వినియోగం అనే అంశాన్ని ముందుగానే చెప్పారు. అందుకని ఇంటి దగ్గర ప్రాక్టీసు చేసుకుని వెళ్లాను. కాని దానికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. అక్కడికక్కడ వేసిన అంశానికే మొదటి బహుమతి రావడం ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఈ పోటీలో గెలిచిన వాళ్లను జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. అలా నేను డిసెంబర్ 27న ఢిల్లీలో జరిగే పోటీలకు వెళ్లబోతున్నాను.

మాస్టారు గుర్తించారు
నేను పెయింటింగ్ బాగా వేస్తాననే విషయాన్ని మా డ్రాయింగ్ మాస్టారు బి. శశిభూషణ్ రావు గారు గుర్తించారు. ‘బాగా వేస్తున్నావని’ నన్ను మెచ్చుకోవడమే కాకుండా, అదే విషయాన్ని మా నాన్నతో కూడా చెప్పారు. దాంతో పెయింటింగ్స్ వేసేందుకు ప్రోత్సహించారు నాన్న. 2011లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కాంపిటీషన్ నా మొట్టమొదటి పోటీ. అప్పుడు ‘ఎనీ లేక్ వ్యూయర్ పార్క్’ అనే అంశం మీద పెయింటింగ్ వేశాను. రెండు వందల మంది పాల్గొన్నారు ఆ పోటీలో. అప్పుడు కూడా నాకు కన్సొలేషన్ బహుమతి వచ్చింది. 2012లో యాక్సిస్ బ్యాంక్ ‘నీటి వినియోగం’ అనే అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి అందుకున్నాను.

హిందు పత్రిక, ‘యంగ్ వరల్డ్’ వాళ్లు ‘ఉమ్మడి కుటుంబం’ అనే అంశం మీద ఈ ఏడాది నిర్వహించిన పోటీలో కూడా పాల్గొన్నాను. అలాగే కేరళలో ‘మ్యాజిక్ ఆఫ్ హ్యాండ్స్’ పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నాను. ఈ పోటీ దేశ వ్యాప్తంగా జరిగింది. ఒక్కో స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేస్తే అందులో పోటీకి ఒకరిని తీసుకున్నారు వాళ్లు. ఎంపిక చేసుకున్న వాళ్లందరికీ కలిపి పోటీ పెట్టారు. ఈ పోటీలో 50 మంది పాల్గొంటే మన రాష్ట్రం తరపున నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ బహుమతులే కాకుండా కొన్ని అవార్డులు కూడా వచ్చాయి నాకు. 2011లో రసమయి ఉగాది పురస్కారం, 2013లో ‘నిపుణ ఎక్స్‌లెన్సీ’, ‘ఇన్‌క్రెడిబుల్ గర్ల్ చైల్డ్’, ‘అభినందన’ మొదలైన అవార్డులొచ్చాయి.

ఇంటికి రాగానే ప్రాక్టీస్
పెయింటింగ్ పోటీల్లో పడి చదువుకోవడం లేదనుకుంటారేమో… కాంపిటీషన్లు లేని రోజుల్లో వీకెండ్స్‌లో మాత్రమే పెయింటింగ్ ప్రాక్టీసు చేస్తాను. మిగతా రోజులన్నీ చదువుకే. కాంపిటీషన్ ఉందంటే మాత్రం స్కూల్ నుంచి నాలుగ్గంటలకి ఇంటికి రాగానే ప్రాక్టీసు మొదలుపెట్టి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు వేస్తాను. సీనరీస్, కరెంట్ ఇష్యూస్ పైన పెయింటింగ్‌లు వేయడమంటే చాలా ఇష్టం. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఒక పెయింటింగ్ వేశాను. ఇప్పటివరకు దాదాపుగా పోస్టర్ కలర్స్ 500, పెన్సిల్ స్కెచ్‌లు 250 వరకు వేశాను. ఇంటర్మీడియెట్ చదివాక బిఎఫ్ఎ, తరువాత ఎమ్ఎఫ్ఎ చేయాలనుకుంటున్నాను. ఐఎఎస్ కావాలనేది నా కోరిక. పెయింటింగ్‌ని మాత్రం వదిలిపెట్టేది లేదు. నాకు అవార్డులు, బహుమతులు వస్తున్నాయంటే మా స్కూల్ ప్రిన్సిపాల్ ఇజ్రాయిల్ గారు, అమ్మానాన్నల ప్రోత్సాహమే అందుకు కారణం”
ఫోటోలు: హరిప్రేమ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకంలో శివ విష్ణు తత్వం!

 

సాధారణంగా శివాలయాలలో జరిపే పండగలు వేరు. విష్ణాలయాలలో జరిపే పండగలు వేరు. కానీ కార్తీక మాసంలో మాత్రం ఈ భేదం కనిపించదు. అన్ని ఆలయాలలోను ఒకే రకంగా వేడుకలు జరుగుతాయి. దీని వెనకున్న విశేషాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.

కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే, శివాలయాలలో మారేడు దళాలతో, విష్ణాలయాలలో తులసి దళాలతో పూజలు జరుగుతాయి. ఈ శివ కేశవులకు తేడా ఏమిటి? శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు- పరమశివుడు వామదేవుడు, శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని చెప్పేవారు. ఇద్దరికీ ఒకటే అక్షరం తేడా. ఈయనకి ్‌మ* ఉంది ఆయనకి ్‌సు* ఉంది. ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది. ఈ రెండు అక్షరాలు కలిస్తే- సు+ మ= సుమ అవుతుంది. సుమం అంటే పువ్వు. అంటే ఇద్దరూ ఇచ్చేది పువ్వే. ఇక్కడ పువ్వు అంటే జ్ఞానం. పరమాత్మ ఒక్కడే అనే పరమ తూనికతో ఈశ్వరుణ్ణి చూసి పరవశించిపోగలిగిన హృదయం ఉంటే ఆ ఆనందం లభ్యమవుతుంది. లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవించలేరు.

ఈశ్వరాన్రుగహాన్ని అన్నిచోట్లా ఒక్కలా అనుభవించగలిగిన మనఃస్థితి అంకురించదు. అందుకనే మహాత్ములైనవారు పరమేశ్వరుని స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఆ ఈశ్వర స్వరూపాన్ని ఒకటిగానే చెబుతారు. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన గారు, కృష్ణుడిని చూస్తుంటే శివుడిని చూసినట్లుందని అంటారు. పోతనగారికి చిన్నికృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే, ఆ« ధూళి పరమశివుడు రాసుకున్న విభూతిలా ఉంటుంది. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పువేసి ముత్యాలసరాలు చుడితే, తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నట్టి పరమశివుని కొప్పులా ఉందని వర్ణిస్తారు. యశోద చిన్ని కృష్ణుడికి మెడలో హారం వేస్తే ఆ నీలమణి కాంతిలో తనకు నీలకంఠుడైన పరమశివుడు కనబడుతున్నాడంటారు. పోతన అంత ఆనందాన్ని, అనుభూతిని పొంది భాగవతాన్ని రాశారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన కూడా తన కలలో నాభి కమలంలోకి చూస్తే శ్రీమహావిష్ణువు, తల మీదికి చూస్తే చంద్రవంకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం, ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్కచూస్తే తెల్లటి గంగానది, ఒక పక్క చూస్తే నల్లటి యమునానది. రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి దర్శనమిచ్చారని రాసుకున్నారు. శంకరాచార్యులవారి జీవితంలో మొట్టమొదటి శ్లోకం కనకధార. అప్పుడు సన్యాసం తీసుకోలేదు. ఇంకా పిల్లవాడే. వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవవలసి వస్తే

శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
సృష్టిస్థితి ప్రలయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై అన్నారు.
అమ్మా ! గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, శాకంబరీతి శశిశేఖర వల్లభేతి అని ముగ్గురు అమ్మలకు స్తోత్రం చేశారు. ఆ ముగ్గురు మూర్తుల శక్తి స్వరూపాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకం చెప్పిన వెంటనే లక్ష్మీదేవి పలికి కనకధారలు కురిపించింది. ఈ విధంగా ఈ ప్రపంచం శక్తిమయం కాబట్టి కార్తీకంలో శివకేశవుల భేదం లేకుండా ఉత్సవాలు జరుగుతాయి.

గరికెందుకు ముఖ్యం?
మన శాస్త్రాలలో గరికకు చాలా ప్రాముఖ్యం ఉంది. ముఖ్యమైన పూజలలో కూడా దీనిని వాడతారు. గరికను ముట్టుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతాయి. అందుకే గణపతికి గడ్డిపరకలతో పూజ చేస్తారు. సుందరకాండలో సీతమ్మ తల్లి- “తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మితా నివర్తయమనోమత్తః స్వజనే..” అంటుంది. అని గడ్డిపరకను ముట్టుకుంటుంది. సీతమ్మ గడ్డిపరకను ఎందుకు ముట్టుకుంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. భర్త పక్కన లేనప్పుడు కామవాంఛతో తనవంక చూస్తున్న రావణుడికి సీత జవాబు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అంటిన పాపం పోవడానికి సీత గరికను ముట్టుకుంటుంది. అంటే ఆ గరరికకు అంత విశిష్టత ఉందని అర్థం.

పరమేశ్వరుడెవ్వడు?
పరమేశ్వరుడెవరు? నిజంగా విభూతి రాసుకొనే ఉంటాడా?- ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు కొందరికి ఉదయిస్తూ ఉంటారు. వేదంలో పరమేశ్వరుడిని “సర్వభూతాధివాసః” అని నిర్వచిస్తారు. అంటే సర్వభూతాలలోనూ ఉండేవాడు ఈశ్వరుడని అర్థం. “సర్వభూతం తదాత్మా కర్మసాక్షీ కేవలోపతిర్గుణశ్చా” అని చెబతారు. అంటే ఆయన నిర్గుణుడు. అన్ని కర్మలకూ సాక్షి. దీనిని మరొక ఉదాహరణతో కూడా చెప్పవచ్చు. పాలలో వెన్న ఎక్కడ ఉందండీ అని అడిగారనుకుందాం. వెన్న ఎక్కడ ఉందని చెప్పగలం? పాలంతటా వెన్న ఉంటుంది. కానీ పైకి కనబడదు. ఎవరైతే పాలను తోడు పెట్టి, దానిని చిలికి బయటకు తీస్తారో వారికి మాత్రమే లభ్యమవుతుంది. ఈశ్వరుడు కూడా అంతే!
 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21

       అలనాటి మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు

     ప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’  ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది .అందులోని విషయాలు ఈ నాటికీ అనుసర ణీయాలుగా ఉన్నాయి .భారత దేశం లో తప్ప ప్రపంచం మొత్తం మీద ఏ నాగరక దేశమూ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్ర పరిశోధనకు ఉపయోగించ లేదు .మనకు ఖగోళ శాస్త్రాధ్యయనం అతి పరిణతి చెందిన కాలం లో ఇంకా ఆయా దేశాల వారు అందులో తప్పటడుగులు వేస్తూ ప్రాధమిక దశలోనే ఉన్నారు .ఆ దేశాలలో ఋతుపవన ప్రభావం పెద్ద గా లేక పోవటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు ‘’ కృషి పరాశర ‘’ లో ఈ నాటి ఆధునిక సాగు అయిన ‘’శ్రీ వరి ‘’.పద్ధతుల వంటి అనేక వ్యవసాయ యాజ మాన్య పద్ధతులు ,సేంద్రియ వ్యవసాయ విధానాలూ ఉన్నాయి

       విత్తనాల సేకరణ ,నిల్వ పద్ధతులూ ఉన్నాయి .వరాహ మిహిరుడు రాసిన ‘’బృహత్ సంహిత ‘’లో వ్యవసాయ సాగు విధానాలు ,ఋతు పవనాల రాకను లెక్కగాట్టే పద్ధతులు ఉన్నాయి .సుశ్రుతుడు వైద్య శాస్త్ర పితామహుడని పించుకోన్నప్పటికి ‘’బాస్మతి ‘’వంటి సుగంధ పరిమళాలను వెదం జల్లే  వరి ధాన్యపు రకాలను ప్రస్తావించాడు .కశ్యప మహర్షికూడా తన గ్రంధం లో వ్యవ సాయ అమ్శాలేన్నిటినో వివరించాడు .ఈ రోజు మనం చెప్పుకొనే ‘’గోల్డెన్ రైస్ ‘’బియ్యపు రకం ,ద్రుష్టి లోపాలను సవరించే బియ్యం ,జీర్ణ శక్తిని పెంచే బియ్యం రకాల వర్ణన కూడా ఉంది ఈయనా రాసిన ‘’కాశ్యపేయ కృషి సూక్తి ‘’ఈ నాటికీ మార్గ దర్శనం చేస్తోంది .

    1900లో ‘’ఆయుర్వేద భిషాగ్రణి’’బిరుదు పొందిన ‘’సురపాలుడు ‘’’’వ్రుక్షాయుర్వేదం ‘’అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో వరి నాటటం దగ్గర్నుంచి దిగుబడి వరకు అన్నిటి వివరం ఉంది .విత్తన శుద్ధి ,దుక్కి ,వివిధ సాగు పద్ధతులు ,సాగు నీటి క్రమం భూ గర్భ జల వినియోగం ,చీడ పీడలకు వేప విత్తనాల వాడకం పెంటపోగు (కంపోస్ట్ ఎరువు

)తయారీ లను కూడా చర్చించిన గ్రంధం ఇది .దీనిలో పర్యా వరణ పరి రక్షణ కూడా ఉండటం ఇప్పటి వారికి ఆశ్చర్యం కలిగించే విషయం .

  ప్రాచీన వ్యవ సాయ పరి శోధకులలో ‘’చక్ర పాణి మిశ్రా ‘’పేరొందిన వాడు .ఈయన మహా రాణా ప్రతాప్ ఆస్తాన శాస్త్ర వేత్త .వ్యవసాయ పరిశోధనా గ్రంధం రాసిన శేస్ట పరిశోధకుడు  భూగర్భ జల వాడకం పై ద్రుష్టి ఎక్కువ గా పెట్టాడు .వ్యవసాయ బావులు ,చెరువుల నిర్మాణ విధానాలు వివరించాడు .భూగర్భ జలాలను ఏ విధం గా అన్వేషించి కనుగొని ఉపయోగించాలో స్పష్టం గా రాశాడు .ఈయన గ్రంధం ఇంగ్లీష్ లోకి అనువాదమైన్దికూడా .ఎన్నో మన ప్రాచీన వ్యవసాయ శాస్త్ర గ్రంధాలు శిధిలమై పోవటమో విదేశాలకు తరలింప బడతమో జరిగి వాటి విలువ మనకు తెలియ కుండా పోయింది .

                      వరి పంట

  భారత దేశం లో  15,000 సంవత్సరాల నుండి వరి సాగు ప్రధానమైన పంట .ఆ కాలం లో 30 ,000పైగా వరి ధాన్యపు రకాలున్దేవి .వరి పంట

 13కోట్ల సంవత్స రాల కిందటే ఉందని అంచనా .ఈ రోజు ప్రపంచం మొతం మీద రెండు లక్షల వరి రకాలున్నాయని అంటున్నారు .250కోట్ల జనాభా కు వరి ఆహారం గా ఉంది ఆసియా లో 92శాతం ప్రజలకు ఆహారం వరి యే. ప్రపంచ వరి ఉత్పత్తిలో 97 శాతం ఆసియాలో నే ఉత్పత్తి అవుతోంది .ఇప్పటికీ పది హీను కోట్ల హేక్తారులలో వరి సాగు చేస్తున్నారు .

                వర్షాన్ని కొలిచే విధానం

కృషి పరాశర లో ‘’శత యోజన విస్తీర్ణం త్రిమ్శాద్యోజన ముచ్చ్రితం

‘’అఢ’’కస్య ‘’భవే న్మానం మునిభిహ్ పరి కీర్తితమ్ ‘’

వంద యోజనాల విస్తీర్ణాన్ని ‘’ఆడకం ‘’అంటారు మూడు వందల యోజనాల ఎత్తులో ఉండే నీటి మొత్తం యెంత అని చెప్పే శ్లోకం ఇది .ఇక్కడ యోజనం అంటే దూరం తో సంబంధం ఉన్నదికాడు –‘’చూపుడు వేలు పొడవుతో సమాన మైనది ‘’అని అర్ధం .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో వర్షాన్ని కొలిచే పధ్ధతి చెప్పాడు .ద్రోణ అంటే 6.4సెంటి మీటర్లు .వర్ష పాతాన్ని కొలిచే కొలత నాలుగు ఆఢకాలు .

               సంఖ్యలకు అక్షరాలే సంకేతకాలు

   ఆర్య భట్ రాసిన ‘’ఆర్య భట్టీయం ‘’మొదటి ప్రకరణం లో అంకెలను సంఖ్యలను అక్షరాల రూపం లో కుదించి యెంత భారీ సంఖ్య నైనా ఒక చిన్న పదం గ చెప్పేందుకు మార్గ దర్శనం  చేశాడు .అందరికి అర్ధం కాక అది దూరమైంది .ఆర్య భట సాంకేతిక విషయం తెలుసు కొందాం .

అ=1,ఆ=100,ఉ =100,ఋ=1000,ఇ=10000,ఏ =1,00000,ఐ=1,000000,ఔ=1,0000000,ఒ=1,00000000

అలాగే హల్లులకు విలువలిచ్చాడు క=1,ఖ=2,గ=3—ద=19,న=20 —-మ=25,య=30,ర=40 ల=50,వ=60,శ=70,ష=80,స=90,హ=100

సూర్యుడి భ్రమణాల సంఖ్య ను వివరించటానికి ఆర్య భట ‘’ఖ్యుఘ్రు’’అనే మాటన వాడాడు .ఆయన దీని పై ఒక శ్లోకం చెప్పాడు ఇందులో పదాలను విడగొడితే ఖ +ఉ+య+ఘ+ఋ.వీటిని  పైన చెప్పిన సంకేతాల సంఖ్యకు అను వర్తింప జేస్తే 43,20 ,000అవుతుంది ఈ సంఖ్యయే సూర్య భ్రమణాల సంఖ్యగా ఆర్య భట తెలియ జేశాడు .ఇదీ మన ప్రాచీన విజ్ఞానం

.

   సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-13-ఉయ్యూరు 

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తణుకు -నన్నయ భట్టారక పీఠం లో ”రామాయణ మహా భారతాలలో మానవ విలువలు”పై ప్రసంగానికి ఆహ్వానం -26-11-13-మంగళ వారం

2nannaya bhattaraka peetham -tanuku 0011nannaya bhattaraka peetham -tanuku 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్

 

తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, శ్రావణి వంటి ఎన్నో చారిత్రక నవలలు సాంఘిక నవలలకు సరిసమానంగా పాఠకుల్ని అలరించి.. ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. రావూరి భరద్వాజకు అంకితంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘వంశధార’ అనే ఆయన నవలను పాకుడురాళ్లు-2 అనుకోవచ్చు. ‘చారిత్రక నవలా చ క్రవర్తి’గా ప్రసిద్దులైన ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ సాహితీ జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

“సముద్రానికీ సాహిత్యానికీ ఏమైనా సంబంధం ఉందా? అంటే ఉందనే చెబుతాను. నేను జన్మించింది ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆకులల్లూరు గ్రామంలో. మానవ సంబంధ, బాంధవ్యాల గురించి ఏమీ తెలియని ఆ వయసులో నాకు తెలిసిందల్లా మనసుతో సముద్రానికి ఉన్న అనుబంధమే. ఆ తరువాత నేను పెరిగింది మా తండ్రి గారి ఊరు తాడికొండలో. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరు భరద్వాజ గారి ఊరు కూడా అదే. నాకంటే ఆయన 15 ఏళ్లు పెద్దవాడే అయినా ఆయనతో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఆ తరువాత్తరువాత నేనూ, ఆయనా హైదరాబాద్‌కే రావడం వల్ల మా బంధం ఆయన జీవితకాలమంతా కొనసాగుతూనే వచ్చింది. అది నన్ను ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలకు మరో భాగం అనిపించే ‘వంశధార’ నవల రాసే దాకా నడిపించింది.

పాకుడు రాళ్లు-2
అది 1960ల ప్రాంతం. కృష్ణాపత్రికలో రావూరి భరద్వాజ నవల ‘పాకుడు రాళ్లు’ సీరియల్‌గా వస్తున్నప్పుడు నేను ఆ పత్రికలోనే పనిచేస్తున్నాను. సుబ్రహ్మణ్య శర్మగారు దానికి ఎడిటర్‌గా ఉంటే డెస్క్ వర్క్ అంతా నేనే చూసేవాణ్ని. ఆ నవలకు గాను ఆయనకు మేము ఇచ్చిన పారితోషికం వారానికి 10 రూపాయలే. న్యాయానికి ‘వంశధార’ అన్న నవలను భరద్వాజ గారే రాయాలి. ఆ విషయమే ఆయనతో అంటే “ఇప్పుడది నాతో కాని పని, నువ్వే రాయి” అన్నారు. ‘వంశధార’ కూడా పాకుడు రాళ్లు నవలలాగే సినిమా రంగానికి సంబం«ధించిన జీవితాల్నే చిత్రిస్తుంది. ఇదీ పాకుడు రాళ్లు నవల చెప్పే జీవిత సత్యానికి సారూప్యమైనదే కానీ మరో రకంగా చూస్తే పూర్తిగా భిన్నమైనది. భరద్వాజ ‘పాకుడు రాళ్లు’ ఒక సినీ కథానాయిక ఉత్థాన పతనాల గురించి చెబితే, ‘వంశధార’ ఒక సినీరచయిత ఉత్థాన పతనాల గురించి చెబుతుంది.

భరద్వాజ ఈ పుస్తకానికి ముందుమాట కూడా రాశారు. పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగానే విడుదల చేయాలనుకున్నాను. ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాను. కానీ, ఈ లోగానే ఆయన వెళ్లిపోయారు. ప్రత్యక్షంగా ఆయన బాధలు నా బాధలు కాకపోయినా, పరోక్షంగా ఆయన బాధ లు నన్నూ కలచివేసేవి. ఆకలితో అలమటించిన రోజులు ఆయన జీవితంలో లెక్కలేనన్ని. భరద్వాజ గారి అర్థాంగి కాంతమ్మ గారు ఎంతో కాలం దాకా ఏ పేరంటానికీ రాలేదు. దానికి కారణం ఆమెకు మరో జత బట్టలు లేకపోవడమే. అంతటి గర్భదరిద్రం అనుభవించాడాయన. అయినా పేదరికం గురించి, దారిద్య్రం గురించి భరద్వాజ వ్యాఖ్యలు భిన్నంగా ఉండేవి. “దరిద్రం అంటే తిండి, బట్ట, గూడూ లేకపోవడ ం కాదు. దరిద్రం అంటే సమాజంలో తాను ప్రేమించే వారెవరూ లేకపోవడం, తనను ప్రేమించే వారు లేకపోవడం’ అనేవారు. ఇవే మాటల్ని పాకుడు రాళ్లు నవలలోని చివరి సన్నివేశంలో మంజరి చేత అనిపిస్తాడు. జీవితాన్ని కాచి వడబోసిన మహానుభావుడాయన. అలాంటి అనుభవజ్ఞుల సాన్నిహిత్యం లభించడానికి మించిన సంపద జీవితంలో మరొకటి లేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ సాంగత్యమే పాకుడు రాళ్లు-2 అనిపించే వంశధార నవల రాయడానికి తోడ్పడింది. అందుకే మన పిల్లా పాపలకు ఏం దక్కినా దక్కకపోయినా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక దశలో పెద్దవాళ్ల సాంగత్యమైతే దక్కాలని నాకనిపిస్తుంది.

మలిచే వాడు మందలించడా?
1959లో కొంతకాలం సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూలో ్లటీచర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఒక ధనవంతుల అబ్బాయి మా స్కూల్లో 8 వ తరగతి చదివేవాడు. ఆ అబ్బాయి బొత్తిగా చదవడం లేదని ఒకసారి వాళ్ల క్లాస్ టీచర్ గట్టిగా మందలించాడు. ఆ విషయం తెలియగానే ఆ అబ్బాయి తండ్రి ఆగమేఘాల మీద మా స్కూలుకు వచ్చి ఆ టీచర్ మీద ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అందరి ముందు ఆ టీచర్ తమ పిల్లాడికి క్షమాపణ చెప్పాలన్నాడు. మా ప్రిన్సిపాల్ మరేమీ మాట్లాడకుండా, అతడు చెప్పిన ట్టే స్కూల్లోని మొత్తం విద్యార్థులను, మొత్తం టీచర్లందరినీ ఒక చోట చేర్చి వాళ్లందరి ముందు ఆ టీచర్‌తో ఆ కుర్రాడికి క్షమాపణ చెప్పించాడు. ఆ వెంటనే ఆ టీచర్ తన రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వడం నేను చూశాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. జీవితాల్ని మలిచే వాడికి మందలించే హక్కు ఉండదా? ఆ పిల్లాడు ధనవంతుల బిడ్డ అయినంత మాత్రాన వాళ్ల కొమ్ము కాయాలా? మా టీచర్ చేసిన తప్పేమిటని మేనేజ్‌మెంట్ మాట వరసకైనా ఒక మాట అడగలేదు. విద్యా వ్యవస్థలు పూర్తిగా వ్యాపారాత్మకం అయిపోతే ఏమవుతుందో నాకా సంఘటన బలంగా చెప్పింది. ఆ స్కూలును వదిలేశాక లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా 35 ఏళ్లు అధ్యాపక వృత్తిలోనే కొనసాగినా ఆ చేదు అనుభవం నన్ను వెంటాడుతూనే వ చ్చింది. ఇప్పటికి 50 ఏళ్లు గడి చినా ఆ సంఘటన నా కళ్లల్లో మెదులుతూనే ఉంది.

ఫలితానికి పలుముఖాలు
రాఘవేంద్రరావుగారు అన్నమయ్య తీయడానికి పదేళ్ల ముందే జంధ్యాల గారు సినిమా తీస్తానంటే అన్నమాచార్య మీద స్క్రిప్ట్ తయారు చేశాను. దానికి సంబంధించిన పాటలన్నీ రికార్డు అయ్యాయి. కానీ, ఆర్థిక పరిస్థితులేవీ అనుకూలించకపోవడంతో నిర్మాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. నా మనసులో ఒక మహా స్వప్నంగా ఆవరించిన ఆ సినిమా ఊహ ఒక్కసారిగా గాజుమేడలా కూలిపోయింది. చాలాకాలం దాకా నేను ఆ దిగులు నుంచి బయటపడలేదు. పదేళ్ల పాటు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఆ స్క్రిప్టు నిరుపయోగంగా ఉండిపోవడం ఎందుకని భావించి చివరికి ఆ సినిమా స్క్రిప్టును ‘శ్రీ పదార్చన’ నవలగా మలిచాను. దాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు ఆ ఏటి ఉత్తమ నవలగా ఎంపిక చే శారు. సినిమా తీయలేనప్పుడు ఆ స్క్రిప్టు ఎందుకులే అనుకుని ఉంటే అది చెత్త బుట్ట పాలయ్యేది. దాన్ని నవలగా మలిచిన ఫలితంగా అది ఒక పురస్కారానికి పాత్రమయ్యింది. ఏ వస్తువుకైనా, ఏ కళా సృజనకైనా ఒకే ఒక్క ప్రయోజనం అంటూ ఉండదు. దాని మిగతా ప్రయోజనాలేమిటో తెలుసుకుంటే మరో రూపంలో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావచ్చు. దానికోసం పడ్డ శ్రమను సార్ధకం చేసుకోవచ్చు అనిపించింది.

పునాదులు పదిలంగా
‘భువన విజయం’ పద్యనాటక ప్రదర్శనకోసం మా గురువు ఆచార్య దివాక ర్ల వెంకటావధానితో కలిసి ఎన్నో దేశాలు తిరిగాను. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ ఇలా దాదాపు 20 చోట్ల భువన విజయం పద్యనాటక ప్రదర్శనలిచ్చాం. అందులో నాది తిమ్మరుసు పాత్ర. మన దేశంలో మాత్రం ‘వీళ్లకు ఇదో పిచ్చి- ఈ చాదస్తం జీవితాంతం వీళ్లను వదలదేమో’ అంటూ వెటకారంగా మాట్లాడిన వాళ్లే ఎక్కువ. అయినా మేమెప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒకరోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇచ్చిన నాటక ప్రదర్శనకు తెలుగు వారే కాదు, అమెరికన్లు కూడా పెద్దసంఖ్యలో వచ్చారు. పద్యం ఎత్తుకున్న ప్రతిసారీ వారు ఊగిపోవడం మమ్మల్ని తన్మయానికి గురిచేసింది. ప్రదర్శన అయిపోగానే తమ హర్షాతిరేకాన్ని 45 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… అంటే సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ద్వారా వ్యక్తం చేశారు. ఇది ఆ దేశంలో వాళ్లు తెలిపే అతి పెద్ద అభినందనకు చిహ్నం. పుట్టిన చోట పునాదులు కదిలిపోతున్న ప్రక్రియకు మరో చోట ఎక్కడో నీరాజనాలు లభించడం చూస్తే ఆశ్చర్యం వేసింది.. మనసు ఆ్రర్దమైపోయింది. స్వదేశంలో పద్యం అనగానే పెదవి విరిచే పరిస్థితుల్లో ఉంటే దేశం కాని దేశంలో పద్యానికి అంత స్పందన రావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కడో ఏ దేశంలోనో మన పద్యానికి ఆదరణ ఉందని తెలిస్తే గానీ, మనమేమిటో మనకు తెలిసిరాదా? ఆలోచిస్తే ఒక్కోసారి మనల్ని మనం ఎక్కడో జారవిడుచుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. మన పునాదుల్ని మనమే పాతాళంలోకి వదిలేసి ఆ తర్వాతెప్పుడో నెత్తీ నోరు కొట్టుకుంటే ఒరిగేదేమీ ఉండదని నేననుకుంటాను.

కల్పన-సత్యం కలగలిస్తే….
ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ సి. కనకాంబరరాజు గారు ఒకసారి నాతో “గురువు గారూ. ఒక నవల రాసిస్తారా?” అన్నారు. “తప్పకుండా ఇస్తాను” అన్నాను. “యండమూరి వీరేంధ్రనాథ్ రాసిన ‘తులసీ దళం’ న వల త్వరలో ముగియబోతోంది. మళ్లీ ఆ స్థాయిలో సంచలనం సృష్టించే నవల ఏదైనా ఇవ్వండి” అన్నారు. వెంటనే నేను “చారిత్రక నవల రాసిస్తా” అన్నాను. దానికి ఆయన “చారిత్రక నవల ఎవ రు చదువుతారండీ, మంచి మంత్ర తంత్రాలతో ఉండే ఒక థ్రిల్లర్ నవల ఏదైనా ఇవ్వండి” అన్నారు. నేను మొండికేశాను. “నేను చారిత్రక నవలే రాస్తా. ఆ నవల ‘తులసీ దళం’ కన్నా పది కాపీలు ఎక్కువ అమ్ముడుపోయేదిగా ఉంటుంది” అన్నాను. చివరికి ఆయన “సరే” అన్నారు. చేసిన వాగ్దానం మేరకు ఒక సవాలుగా తీసుకుని ‘శ్రావణి’ అనే నవల రాశాను. ఆ నవలకు ఆశించిన దానికి మించి పాఠకుల ఆదరణ లభించింది. అదే స్పూర్తితో రాసిన ‘తంజావూరు విజయం’ నవల మూడు లక్షల కాపీలు అమ్ముడు పోయి అది నన్ను అన్ని రకాలుగా నిలబెట్టింది. ‘ట్రూత్ యీజ్ మోర్ స్ట్రాంగర్ ద్యాన్ ఫిక్షన్’ అనే మాట మనం ఎప్పుడూ వింటున్నదే. ఏ రకంగా చూసినా కల్పన కన్నా వాస్తవికతే ఎక్కువ బలమైనది. అయితే ఈ చారిత్రక నవల అన్నది ట్రూత్‌నే ఫిక్షన్‌గా రాసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో రెండూ ఉన్నాయి. అందుకే దానికి జనాలను అలరించే శక్తి మిగతా ప్రక్రియలకన్నా ఎక్కువ.. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. నేను రాసిన పలు నవలలతో ఇది రుజువయ్యింది కూడా.
చారిత్రక నవలలు చదివితే ఏమొస్తుంది? అంటూ కొందరు అడుగుతూ ఉంటారు. చారిత్రక నవలలు చదవడం అంటే వేల సంవత్సరాల నాటి కాలమాన పరిస్థితుల్లోకి మనం పయనించడమే. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. ”
– బమ్మెర
ఫోటోలు: హరిప్రేమ్

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20

మహా మహుడు మనువు

భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో   ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో వచ్చిన మార్పుల వల్ల అది ‘’బ్రాహ్మణులు బ్రాహ్మణులకోసం ‘’రాసుకోన్నదని,స్త్రీ కి చాలా అన్యాయం చేసిందనే పెడ వాదాలు వచ్చినా అదే ఇప్పటికి సర్వోత్క్రుస్టం అని ప్రపంచమంతా భావించి గౌరవిస్తోంది .ఒక నాటి పంజాబ్  హర్యానా  ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏం.రామజొయ్స్ మనుస్మృతి పై ఒక సాధికార గ్రంధం రాశాడు .భారత రాజ్యంగ స్పూర్తికి అనుకూలం గా ఉన్న అనేక అంశాలను ఆయన ఇందులో ఉన్నాయని వివరించాడు. మత విషయాలున్నా అవి  పెద్దగా అవరోదాలుకావన్న వారే అనేకులు .సంస్కృత మను స్మృతిని 1913 1920 లలో పి హెచ్ పాండ్య  ,జి ఆర్ ఘర్పూరే లు ఎడిట్ చేశారు తర్వాత దీన్ని ఇంగ్లీష్ లోకి 1974లో అనువదించిన వాడు సర్ విలియం జోన్స్    ,

 

    Inline image 1 Inline image 2Inline image 3

.

స్మృతులు అంటే భిన్న కాలాలకు చెందిన సామాజిక ,రాజ కీయ రాజ్యామ్గాలని అర్ధం .శాత వాహనులకాలం నాటి నాణాలు ఈ రోజు చెల్లు బడికావు .కానీ వాటిని కరగింఛి  ఉపయోగించుకో వచ్చు . అమ్ముకుంటే వాటి విలువా ఎక్కువే .ఇలానే మను స్మ్రుతి అనేక శతాబ్దాల పాటు అమలు అయింది ఇది తిరుగు లేని సత్యం .’’మనువు ‘’శబ్దం నుంచి మనిషి వచ్చింది మనిషి మనీషిగా ఉన్నతం అవటానికి కావలసిన సకల విషయాలు ఉన్న శాస్త్రం మను స్మ్రుతి .

అందరు అనుకొంటున్నట్లు మనువు బ్రాహ్మణుడు కానే కాదు .ఋగ్వేదం లో ‘’మనుర్భవః ‘’అనే మాట ఉంది .అంటే ‘’ముందుగా మనిషిగా రూపొందు ‘’అని అర్ధం .’’సర్వ జీవ  రాశిని కాపాడటానికి ఉపయోగ పడే విధం గా ,ధర్మ స్వరూపం గా ఉంచేందుకు బ్రహ్మ తేజస్సు కల వాడినిగా చేయటానికి రాజుకు ‘దండము ‘’ఏర్పడింది .ఆ దండం మీద భయం తో  సకల ప్రాణాలు సుఖాన్ని పొందటమే కాక తమ తమ ధర్మాలను అనుసరిస్తాయి’’ అనేదే మను స్మ్రుతి సారం . దండం ను అమలు పరిస్తేనే ప్రజలు సక్రమ వర్తన కలిగి ఉంటారు .కేవల స్వభావం వల్ల  నడవడిక ఉండదు .దండానికి భయ పడే లోకం సుఖం గా ఉంటుంది’’అని రాజ దండానికి ఉన్న ప్రాధాన్యత ను తెలిపాడు మనువు అదే’’ దండం దశ గుణం భవేత్  ‘’గా లోకం లో మారింది .

మనువు చెప్పిన ‘’దండ నీతి  శాస్త్రం ‘’లో కొన్ని మార్పులు చేసి చాణక్యుడు అర్ధ శాస్త్రం లో ఇమిడ్చాడు .దండం అంటే కర్ర పెత్తనం అనే భయం లోకం లో వ్యాపించింది ఈ భయం పోగొట్ట టానికి స్వర్గీయ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారు ‘’కౌటిల్యుని అర్ధ శాస్త్రం ‘’రాసి సామాన్యులకూ అందులో ఉన్న విశేషాలను అర్ధం చేసుకోవటానికి వీలు కల్పించారు .తన లక్ష్యాన్ని మనువు వివరించాడు –

‘’యో దద్యా జ్ఞాన మజ్ఞానం కూద్యాద్వా ధర్మ దర్శనం –

సక్రుత్స్నాం పృధివీం దద్యాత్ తేన తుల్యం సతద్భవేత్ ‘’

దీని అర్ధం –అజ్ఞానుల ముంగిటికి జ్ఞానాన్ని తీసుకొని పోవటం ,వారికి సన్మార్గాన్ని బోధించటం కు మించిన దానం లేదు .సమస్త భూ మండలాన్ని ధారా దత్తం చేసినా కూడా అది దీనికి సమానం కానే కాదు ..   స్త్రీ హితం కోసం చెప్పిన విషయాలు

మనం అందరం వల్లే వేసి చెప్పే ‘’యాత్ర నార్యస్తు పూజ్యం తే –రమయతే

యత్రై తాంతున  పూజ్యతే –సర్వాన్తత్రా ఫలాః క్రియాః ‘’

అంటే ఏ ఇంట్లో స్త్రీలు వస్త్ర ,అలంకార, మంచి భోజనాలతో సంతోషింప బడుతారో ,ఆ ఇంట దేవతలు ప్రసన్ను లౌతారు .ఎక్కడ స్త్రీ కి గౌరవం ఉండదో ,మనస్తాపం కలిగిస్తారో ఆ ఇంటి యజమాని చేసే ధర్మ కార్యాలన్నీ నిష్ప్రయోజనమే .

అలాగే ఇంట్లో దంపతుల తో పోషింప బడే కుమార్తెలు,కోడళ్ళు  మొదలైన వారి పట్ల మర్యాద లేక పొతే ఆ ఇల్లు అతి త్వరగా నశిస్తుంది .ఏ ఇంట్లో వారు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ ఇల్లు వృద్ధి చెంది ఇంకా వృద్ధి చెందు తూనే ఉంటుంది .

స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం తో ధనం ఆరు రకాల వస్తుంది .మొదటగా వివాహ సమయం లో అగ్ని హోత్రం ఎదుట తలి దండ్రులు , బుట్టువులు ఇతర బంధువులు ఇచ్చి న దానం ,దీనినే ‘’అధ్యగ్ని ‘’అంటారు .రెండవది ‘’ధ్యా వాహనికం ‘’అంటే కూతురు అత్త వారింటికి వెళ్ళే టప్పుడు తలిదండ్రులు అరణం గా ఇచ్చే డబ్బు వగైరా .మూడవది ‘’దత్త ‘’అంటే స్త్రీకి భర్త సంతోషం తో ఇచ్చేది. శోభన సమయం లో భార్య

కొంగుకు ముడి వేసిన ఆభరణాలు ధనం మొదలైనవికూడా దత్త కిందకే వస్తాయి ..నాల్గవది అన్న దమ్ములు ఇచ్చేది దీన్ని ‘’భ్రాత్రు దత్త ‘’అంటారు .అయిదవది తల్లి ఇచ్చేది ఇదే ‘’మాత్రు దత్త ‘’.ఆరవది తండ్రి ఇచ్చేది ‘’పితృ ప్రాప్త  ‘’.స్త్రీ స్వయం గా సంపాదించు కోన్నదాన్ని ‘’ఆనవా ధ్యేయం ‘’అంటారు .దీని పై భర్తకు ,బంధువులకు ఏ విధమైన అధికారం హక్కూ ఉండదు .భర్త బ్రతికి ఉండగా భార్య చనిపోతే ఆమె పేర ఉన్నది సంతానానికే చెందుతుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-13-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లక్షన్నర వీక్షకుల నీరాజనం

సాహితీ బంధువులకు శుభ కామనలు-ఈ రోజు అంటే 22-11-13- శుక్రవారం ఉదయం సరిగ్గా పద కొండున్నర గంటలకు సరస భారతి వీక్షకుల  సంఖ్య లక్షన్నర కు చేరి(అక్షరాల 1,50 020 ,) మహదానందాన్ని కలిగించింది  .ఈ విజయం మీది ,మాది, మనందరిది .ఇంతటి  ఘన విజయాన్ని సరస భారతికి అందించిన వీక్షక దేవుళ్ళకు అక్షరాంజలి ఘటించటం తప్ప ఏమివ్వ గలం  ?ఈ స్పూర్తిని ఇలా నే కోన సాగించాలని ,మరిన్ని ఆసక్తికర, సంతృప్తికర ప్రయోజనాత్మక విషయాలను సరస భారతి అందిస్తూనే ఉండి  మీ అభిమానాన్ని చూర గొంటుందని ఆశిస్తూ ,సవినయం గా మరో సారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియ జేసు కొంటున్నాను -మీ –దుర్గా ప్రసాద్

మీ కోసం కొన్ని

సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు More stats 1,296
మహాత్మా గాంధి ప్రభావం More stats 1,109
మహాభారతం లో యక్ష ప్రశ్నలు More stats 1,091
ఊసుల్లో ఉయ్యూరు –2 పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని More stats 1,067
సృష్టి రహస్యాలు More stats 891
శ్రీ రమణ కద – మిధునం More stats 706
వింత ఆలయాలు -విచిత్ర విషయాలు -1 More stats 640
ఊసుల్లో ఉయ్యూరు –48 సాయానికి మరో పేరు సీత పిన్ని More stats 562
శ్రీ శైల సందర్శనం —6 శ్రీ శైల ద్వార దర్శనం -1 More stats 495
సిద్ధ యోగి పుంగవులు —17 బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి More stats 481
హాస్య కవి సమ్మేళనం కవితలు -1 More stats 429
సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం More stats 426
అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ More stats 368
నేను చదివిన – ఓ మధుర జ్ఞాపకం More stats 361
శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం More stats 359
అరుణాచలం లో అనాధ చలం – ఆంధ్రజ్యోతి లో ఇవ్వాళ ఆర్టికిల్ More stats 351
కాపు –రెడ్డి More stats 335
దివ్య యోగి అక్క మహాదేవి More stats 326
వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు శివుడు రాజ్యమేలిన మదురై More stats 315
శ్రీ శైల సందర్శనం –1 More stats 312
“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పాలగుమ్మి విశ్వనాధం గారు ఆకాశవాణి కోసం స్వర పరచిన ఒరిజినల్ పాట More stats 305
మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు More stats 303
సంపూర్ణ ఆహారం -అవిశ More stats 294
– వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’ More stats 293
వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –13 అనంత పద్మ నాభ క్షేత్రం –తిరువనంత పురం More stats 289
సీతమ్మ తలలో పేలు More stats 287
నాన్న నేను – వర ముళ్ళపూడి More stats 280
సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ More stats 273
గాంధీతాతా నువ్వే చెప్పు! – కంచ ఐలయ్య More stats 273
ప్రాచీన కాశీ నగరం –2 గంగా మాత More stats 268
ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం More stats 266
బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో ‘’వెళ్ళా . More stats 265
సిద్ధ యోగి పుంగవులు — 07 వాసిష్ట గణపతి ముని –03 More stats 265
బండ్ మీద బొంద పెట్టారు- రామారావు కీ ఏమి చెప్పాలి More stats 263
మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మా ఫామిలీ More stats 254
హిమాలయ యోగుల దివ్య భావనలు More stats 247
“బొచ్చు” హాస్య కవిత More stats 244
ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టినది ఈయనే – శ్రీ పాగ పుల్లారెడ్డి More stats 241
వింత ఆలయాలు -విచిత్త్ర విషయాలు -2 More stats 240
మా మామయ్య More stats 237

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తలలేకుండా ఏడాదిన్నర జీవించిన కోడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకం లో నాగాతత్వం -చాగంటి

nagatatvam 001

nagatatvam 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర పై కూడా హాస్యాన్ని చిందించి తనదైన ముద్ర ను వేశాడు రేలంగి నరసింహా రావు .దాసరికి శిష్యుడైనా ఆ పైత్య ప్రకోపానికి లోను కాని డైరెక్టర్ నరసింహా రావు .నరసింహుడి లో నరత్వం, సింహత్వం ఎలా విడ దీయరాకుండా ఉంటాయో అలాగే ఈ రేలంగి లో కూడా హాస్యం ,సెంటి మెంటు కలిసి హృదయానికి చక్కిలి గింతలు పెట్టటమే కాదు ,మానవీయ విలువలను కూడా ‘’అండర్ కరెంటు ‘’గా ఆవిష్కరించి’’ హేపీ ముగింపుతో ‘’సరస సంభాషణల తోఅందర్నీ పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వించిన ఘనత రేలంగిది .ఇందుకోసం హాస్యం లో పండిన దిగ్దంతులైన రచయితలను వెండి తెరకు పరి చయం చేసి హాస్యపు పంటలు పండింప జేశారు .మూస తరహా గా సినిమాలు తీయ కుండా వైవిధ్యాన్ని చూపాడు .

కొత్త రచయితలైన దివాకర్ బాబు ,శంకర మంచి పార్ధ సారధులను పరిచయం చేసి వారి సమర్ధత ను అతిగోప్పగా ఉపయోగించి హాస్యాన్ని చిలికింప జేశాడు స్వతహాగా నరసింహా రావు మంచి హాస్య రచయిత కూడా .అయన సుమన్ ,రేవతి కిన్నెరఅనే నటులను సినీ రంగానికి పరిచయం చేసి వారి ప్రతిభకు పట్టం కట్టించాడు .

Inline image 1Inline image 2  Inline image 3  Inline image 4 Inline image 5Inline image 6   Inline image 7

రేలంగి నరసింహా  రావు దర్శ కత్వం వహించిన హాస్య రస చిత్రాలలో ‘’ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ,ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ,పోలీస్ భార్య ,చిన్నోడు పెద్దోడు డబ్బెవరికి చేదు?  కొంటె కాపురం ,గుండమ్మ గారి కృష్ణుడు ,సంసారం , మామ అల్లుడు’’ అందరు మెచ్చిన చిత్రాలే .నటుడు చంద్ర మోహన్ ను రాజేంద్ర ప్రసాద్ ను హీరో లు గా పెట్టి అద్భుత సినిమాలు తీశాడు .వీరిద్దరూ రేలంగి దర్శకత్వం లో ఆరోగ్య కరమైన హాస్యాన్ని పండించారు వండిం చారు వడ్డించారు తృప్తిగా తిని పించారు .

రేలంగి తమిళం లో ఒక చిత్రానికి  కన్నడం లో కొన్ని సినిమాలకు డైరెక్షన్ చేశాడు .’’సుందరీ సుబ్బారావు ‘’అనే .ఫిలిం కు నంది

అవార్డు పొందాడు .1951లో సెప్టెంబర్ ముప్ఫై న జన్మించిన నరసింహా రావు ప్రస్తుతం సినీ ప్రస్తానం లో ‘’కామా ‘’లో ఉన్నాడు కాని ‘’ఫుల్ స్టాప్ ‘’పెట్టలేదు .

నరసింహా రావు మొట్టట మొదటి సారిగా 1971లో బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘’మహమ్మద్ బీన్ తుఘ్లక్ ‘’తెలుగు సినిమాకి అసిస్టంట్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు .తర్వాత మరుసటి ఏడాది కే.ఎస్.ఆర్ దాస్ డైరెక్ట్ చేసిన ‘’ఊరికి ఉపకారి ‘’కి పని చేశాడు .’’సంసారం సాగరం ‘’సినిమాకి దాసరి దగ్గర పని చేశాడు .1980వరకు దాసరి శిష్యరికం లోనే అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేశాడు .ఆ తర్వాతే స్వంతం గా దర్శకత్వం వహించాడు .

‘’ చందమామ’’ అనే హాస్య సినిమాకు 1980లో దర్శకత్వం చేబట్టాడు దురదృష్ట వశాత్తు ఆ సినిమా 1982వరకు విడుదల కాలేదు .. ‘’నేను మా ఆవిడా ‘’,ఏమండోయ్ శ్రీ వారూ ‘’ఇల్లంతా సందడి ‘’,సినిమాలను డైరెక్ట్ చేశాడు .చంద్ర మోహన్ రేలంగికి దొరికిన అపూర్వ వరం .చంద్ర మోహన్ తో రేలంగి 18సినిమాలను డైరెక్టర్ చేశాడు. తక్కువ బడ్జెట్ లో అందరికి నచ్చిన సినిమాలను తీశాడు అందరికి సంతృప్తి కలిగించాడు .

అక్కినేని తో ‘’దాగుడు మూతల దాంపత్యం ‘’,శోభన్ బాబు తో ‘’సంసారం ‘’కృష్ణం రాజు తో ‘’యమ ధర్మ రాజు ‘’తీశాడు .

1991లో నరసింహా రావు తీసిన ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీసు ,ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ‘’సినిమాలు హాస్య చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించి రేలంగి దర్శకత్వానికి గీటు రాయి గా నిలిచాయి .దీంతో ఆయన కన్నడ రంగానికి దారి ఏర్పడింది .ఈ రెండిటిని శశికుమార్ తో కన్నడం లో తీసి హిట్లు కొట్టాడు .కన్నడ రాజ కుమార్ కుమారుడి తో తీసిన సినిమాలూ బాగా ఆడాయి . నవ్వుల పూలు పూయించాయి .మొత్తం ఏడు కన్నడ హాస్యాలు తీశాడు .ఇంటికంటే గుడి పదిలం అని పించుకొన్నాడు .తమిళ హాస్య నటుడు నగేష్ కొడుకు ఆనంద బాబు తో ఒక తమిళ సినిమా తీసి గట్టెక్కించాడు .

రేలంగి నరసింహా రావు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో 32 హాస్య చిత్రాలు తీశాడు .దాదాపు అన్నీ హిట్లు సూపర్ హిట్లే .హాస్య రచయిత   ఆది విష్ణుతో సంయుక్తం గా సుందరి సుబ్బారావు కు బెస్ట్ స్క్రీన్ ప్లె కు నంది బహుమతి నందుకొన్నాడు . ఈ సినిమాలో చంద్ర మోహన్ వైజయంతి నటించగా ప్రొడ్యూసర్  రామోజీ రావు ఉషా కిరణ్ బానర్ పై నిర్మించాడు

డిల్లీ తెలుగు అకాడెమి వారు ‘’బెస్ట్ లో బడ్జెట్ డైరెక్టర్ ‘’అవార్డ్ నిచ్చి 1991లో సత్కరించారు .2007లో ‘’పదిహేనవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్స వానికి ఏషియన్ పనోరమా జూరీ మెంబర్ ‘’గా గౌరవం పొందాడు .2005-6నందీ అవార్డుల కమిటీలో జూరీ చైర్మన్ గా వ్యవహరించాడు మన రేలంగి . ‘’ బుజ్జి బుజ్జి బాబు ‘’అనే టి.వి ఫిలిం ను ఈ.టివి.కి తీశాడు .సాయి లక్ష్మిని పరిణయ మాడిఇద్దరు మగపిల్లలు కిరణ్, సతీష్ లకు తండ్రి అయ్యాడు రేలంగి నరసింహా రావు .

రేలంగి తీసిన డెబ్భై సినిమాలలో అన్నీ హాస్య గుళికలే .నాకు మాత్రం ‘’కొంటె కాపురం ‘’సినిమా పిచ్చ పిచ్చగా నచ్చింది .అందులో నూతన్ ప్రసాద్ ,వై విజయ దంపతుల మధ్య హాస్యం భలే రుచికరం గా ఉంది. చంద్రమోహన్ కూడా ఉన్నాడు నిర్మలమ్మ కూడా బాగా కద ను నడిపించింది. ఇందులో హాస్యమే కాదు పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతను కూడా నొప్పించకుండా తీశాడు నరసింహా రావు .నేను ఈ సినిమాను కనీసం పాతిక సార్లు చూసి ఉంటాను .ఇవాళ  టివి.లో ఉదయం ‘’ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ‘’సినిమా చూసి ఆ ఆనందంతో    రాసిన విషయాలివి .

అయితే రేలంగి నరసింహా రావు కు రావలసినంత పేరు ,ప్రచారం రాలేదు .అందుకే బాధ పడుతూ ఈ వ్యాసం రాస్తూ అతని ప్రతిభ ను మరో సారి గుర్తుకు తెచ్చి నా బాధ్యతా నేర వేర్చానని సంతృప్తి గా ఉంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13-ఉయ్యూరు

 

 

Posted in సినిమా | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్

      విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19

ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్

సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే భారతీయులు ,చైనా వారు ,ఈజిప్షియన్లు గ్రీకులు చెప్పారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఖగోళ విజ్ఞానం అభి వృద్ధి లోకి రాక ముందే ,ఏ యూని వర్సిటి విద్య లేకుండా ,టెలిస్కోపులు కూడా లేని కాలం లో చేతి పరికరాల సాయం తో పరిశీలన చేసి గణన చేసి ఖచ్చితమైన విలువలను రాబట్టిన ‘’పటాని సామంత్ ‘’అనే ఖగోళ శాస్త్ర వేత్త ను అందరం మర్చి పోయాం .ఆయన పరిశోధనా ఫలితాలు ఈ నాటి వారిని అత్యాశ్చర్యం లో ముంచెత్తాయి ఈ మహాను భావుని పూర్తీ పేరు’’ మహా మహోపాధ్యాయ చంద్ర శేఖర సింగ్ హరి చందన మహా పాత్ర సమంత్.’’.1835డిసెంబర్ పద మూడు న ఒరిస్సా లో ‘’ఖండాపర ‘’ప్రాంతం లో జన్మించాడు .

 

Image

 

patani samant planetarium

చిన్న నాటి నుంచే విశ్వం ఖగోళం ,రాశులు మొదలైన వాటిపై ఆసక్తి ఉండేది .వీటిపై సంస్కృత గ్రంధాలు విస్తృతం గా చదివాడు .ప్రాచీన విజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు .ప్రయోగ శీలిగా పరి వర్తన చెందాడు .సామాన్య కళ్ళ  తో చూడలేని ‘’దనూ రాశి ‘’ని ఆరు శతాబ్దాల కిందటే భారతీయులు కానీ పెట్టారు .మిగిలిన రాశులను ఏ శాస్త్రీయ పరిజ్ఞానం తో గుర్తించారో ఈ రోజుకీ ఎవరికీ అంటూ బట్టటం లేదు .సూర్యుడు రాప్తాశ్వ రధా రూఢుడు అని మన వాళ్ళు వేలాది ఏళ్ళ క్రితమే గుర్తించి ఆయన లో ఏడు రంగులున్నాయని చెప్పగలిగారు

ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త ‘’నేకల్స్హన్ మెర్లే ‘’కి కొన్ని వందల సంవత్స రాలకు పూర్వమే శ్రీ నాద మహా కవి ‘’కాశీ ఖండం ‘’లో కాంతి వేగాన్ని ఎలా చెప్పగలిగాడో ఎవరికీ తెలియలేదు .అప్పటికి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్నే కవి చెప్పి ఉంటాడు .అలాగే ‘’సమంత్’’గారి పరిశీలనలకు గణన లకు మూలాధార మేమిటో తెలుసుకో లేక పోతున్నారు .ఖగోళ విజ్ఞానాన్ని భూకేంద్ర సిద్ధాంతం ,సూర్య కేంద్ర సిద్ధాంతాల ద్వారా తెలుసుకొనే వీలుంది .ఖగోళం లో జరిగే అపురూప సంఘటనలనుఆధారం గా చేసుకొని గణించే అవకాశం ఉంది ఫలితాలను సమీక్షించుకో వచ్చు కూడా .సంప్రదాయ పండితుడైన సమంత్ 1874 లో జరుగ బోయే ‘’శుక్ర గ్రహ సంక్రమణం ‘’అంటే శుక్ర గ్రహ ప్రయాణ మార్గం (ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ )గురించి చాలాకాలం ముందే ప్రకటించాడు .

Inline image 1   Inline image 2   Inline image 3

సమంత్ పరి శీలనకు జ్ఞానానికి కోపర్నికస్ తెచ్చిన ఖగోళ విప్లవం గురించి పరిచయం తెలియనే తెలియదు .అయినా 1874డిసెంబర్ తొమ్మిది నసంభ వించిన శుక్ర గ్రహ సంక్రమణం ఆయన చెప్పిన తేదీననే ఖచ్చితం గా జరిగింది .ఇది మన భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుత పరిశోధనా మిగిలి పోయింది సువర్నాధ్యాయమై వెలిగి పోతోంది .ఈ సంఘటన వ్యవధి సమయం ఆధారం గా భూమి –సూర్యుడి మధ్య దూరాన్ని గణన చేయటం ఏంతో ఆసక్తికర విషయం .ఆ నాటి బ్రిటిష్ పాలకులు కూడా ఈ పరిశోధనా ఫలితాన్ని ఆశ్చర్యం తో గమనించారు .ప్రభుత్వ ఆధ్వర్యం లో ‘’అబ్సర్వేటరి సెంటర్లు ‘’ప్రారంభ మైనాయి అంటే ఇది సమంత్ కృషి ఫలితమే అని గుర్తించుకోవాలి  పటాని సమంత గణించి ,నిర్ధారించిన ఖగోళ సంఘటన మళ్ళీ 2004జూన్ఎనిమిది న జరిగింది .ఈ రెండు సంఘటన పరిశీలనలు లెక్కలు పాశ్చాత్య శాస్త్ర వేత్తల కృషి కి ఏ మాత్రం తీసి పోవేమీ కాదు .ఇలా తనకున్న స్వంత చిన్న పరికరాలతో అమూల్య ఫలితాలను తెలియ జేశాడు .తన కృషిని అంతటిని ‘’సిద్ధాంత దర్పణ’’సంస్కృతంలో పొందు పరచాడు .ఇది ఒరియా లిపి లో తాళ పత్రాల మీద రాయగా కలకత్తా యూని వర్సిటీ వారు  1899 లో ప్రచురించారు .ఇందులో మొత్తం 2,500శ్లోకాలున్నాయి .

ఈ సిద్దాన్తగ్రంధం లో అనేక అద్భత అంశాలున్నాయి .సూర్య ,శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32అని లెక్క చెప్పాడు ఇది 31నిమిషాల ,31సెకనులు గా లెక్కించి చెప్పటం మరింత గొప్ప విషయం .ఈ పుస్తకం లో కొన్ని ముఖ్య భాగాలను అరుణ కుమార్ ఉపాధ్యాయ ఇంగ్లీష్ లోకి అనువదించారు .శుక్ర గ్రహణ సంక్రమణం సమంత్  ఇంట ఖచ్చితం గా ఎలా చెప్పా గలిగాడో ఎవరికీ అంటూ బట్టటం లేదు .పటాని సమంత్ 1904లో మరణించాడు భారతీయ పురాణాలలో ,సంస్కృత గ్రంధాలలో మంత్రాలు శ్లోకాలరూపాలలో అనేక శాస్త్రీయ విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి

.ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు మెచ్చి ధ్రువ నక్షత్రం ఏర్పరచి ‘’నువ్వు ఆకాశం లో అత్యున్నత స్తానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 2,600 ఏళ్ళ కోసారి ప్రదక్షిణాలు చేస్తారు ‘’అని భాగవతం లో ఉంది . ఈ విషయాన్ని క్రీ.పూ..’’హిపార్చస్ ‘’అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు దీనిని ఎన్నో వేల ఏళ్ళ క్రితమే మన భాగవత కర్త వ్యాసుడు చెప్పటం అత్యాశ్చర్యం కరం .మన సమంత డాక్టరేట్లు సైన్సు పట్టాలు లేకుండా నే ఖగోళ అద్భుత రహస్యాలను కను గోన్నాడు కేంద్ర ప్రభుత్వం 11-6-2001న సమంత్ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి గౌరవించింది .’’హాట్స్ ఆఫ్ టు సమంత్’’.

3000 ఏళ్ళ క్రితమే దక్షిణ భారత దేశానికిజల మార్గం – 2006 ఫిబ్రవరి పన్నెండున పంజాబ్ లోని చండీ ఘడ్ నుంచి వెలువడిన ఒక వార్తా ప్రకారం ఆసియాకు ,దక్షిణ భారత దేశానికి  సముద్ర వర్తకం మూడు వేల ఏళ్ళ క్రితమే జరిగిందని తెలుస్తోంది .ఈ విషయాన్ని భారతీయ పురా తత్వ అరుణ్ మాలిక్ చెప్పాడు. బయట పడ్డ ఎముకలు కపాలాలు పరిశీలించి చెప్పిన విషయం ఇది .తమిళ్ నాడు లో తూట్టికోరియాన్ ప్రాంతం లో త్రవ్వకాలలో లభించిన నూట అరవై కళాశాలలో ఈ విషయం ధృవీకరణ జరిగిందని మాలిక్ చెప్పాడు .వీటిని బట్టి మూడు వేల సంవత్స రాలకు పూర్వమే దక్షిణ భారతం ఆసియా ల మధ్య సముద్ర వర్తకం జరిగినదని ప్రజల రాక పోకలు జరిగాయని తెలుస్తోందని .మాలిక్ ఉవాచ .ఇంత ప్రాచీన విజ్ఞానం మనది అని తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18

మహా మేధావి ఆర్య  చాణక్యుడు  ( కౌటిల్యుడు )

చాణక్యుడు పేరు వినగానే మౌర్య సామ్రాజ్య స్తాపకుడు చంద్ర గుప్తుడిని మగధ రాజ సింహాసనం పై తన చాణక్య ప్రతిజ్నతో చక్ర వర్తి గా ప్రతిష్టించి ,క్రూర నంద వంశ సర్వ నిర్మూలనం చేసి ,తన ప్రత్యర్ధి ,నంద రాజ మహా మంత్రి ఆర్య రాక్షసామాత్యుడిని చంద్ర గుప్త మౌర్యునికి మహా మంత్రిగా నియమింప జేసి హాయిగా చరమ జీవితాన్ని సాగించి రాజ్య పాలన, శిక్షా ,సంస్క్రుతులకోసం నేర విచారణ నిమిత్తం ‘’కౌటిల్యం ‘’రాసిన మహా ప్రజ్ఞాని ,రాజకీయ శాస్త్రాజ్నుదు జ్ఞాపకం వచ్చి మనస్సు కై మోడ్పు లర్పిస్తుంది .చాణక్య చంద్ర గుప్తుల అను బంధం చిరస్మరణీయం .చాణక్యుడు 370 b.c.లో జన్మించి 280 b.c. లో మరణించాడు

Chanakya artistic depiction.jpg    Inline image 1Inline image 2

 

వేదం సారాన్ని వంట బట్టించుకొన్న చాణక్యుడు’’అర్ధ శాస్త్రం ‘’పేర  రాజ నీతి శాస్త్రాన్ని   కరదీపికగా తీర్చి దిద్దాడు .గద్యలో రాసినా అందులో380శ్లోకాలున్నాయి .ధర్మార్ధ కామ మొక్షాలలో రెండవది అయిన అర్ధానికి విశేష ప్రాచుర్యం కల్పించాడు .జాతికి రాజు ,ప్రజలు

యెంత బాధ్యతలో ప్రవర్తించాలో తెలియ జెప్పిన శాస్త్రంఇది .చాణక్య అనుభవ, మేధో  జనితం .

అర్ధ శాస్త్రం లో పది భాగాలున్నాయి . .సమస్త పరిపాలనామ్శాలను ఇందు పొందు పరచాడు .కఠినంగా అత్యత స్పష్టం గా ప్రతి విషయాన్నీ వివ రించాడు .చాణక్య ఉచ్చిస్టం  కాని అంశం ఏదీ లేదని మహా రాజనీతి శాస్త్రజ్ఞుల చే పొగడ్త లందుకొన్న గ్రంధం . అందరికి అవసరమైన కొన్ని విషయాలను అతి సూక్ష్మంగా తెలుసు కొని ఆయన ప్రతిభ కు జోహారు లర్పిద్దాం .

స్వంత వారి పట్ల ఎలా మెలగాలి అనే దానిపై చెబుతూ –ఎప్పుడూ హద్దులు దాట  రాదనీ క్రూరురాలైనా తల్లిని క్షమించాలి ,విషం తో ఇబ్బంది కలిగించిన వాడి ఒక చెయ్యి ఖండించాలి .

ఉత్సుకత గురించి వివరిస్తూ ఉత్సాహ వంతుడికి శత్రువు కూడా అభిమాని అవుతాడు .బద్ధకస్తుడికి ఈ లోకం లోను ,పరలోకం లోను స్తానం ఉండదు .శత్రువు కొట్టరాని చోట గాయం చేసినచొ వారిని దూరంగా  పెట్టాలి .

కార్య సాధన విషయం లో –పని చేయని వాడి ఆశ్రితులను కూడా దూరం గా ఉంచాలి ప్రత్యక్ష ,పరోక్ష అనుమాన పరీక్షలు చేసి ఏదైనా నిర్ధారించాలి సుస్టుగా అన్నార్తులకు భోజనం పెట్టి  శేషాన్ని తానూ తిని సంతృప్తి చెందాలి .

ప్రవర్తన విషయం లో బలహీనుడు బల వంతుడిని ఆశ్రయించాలి .రాజుకు వ్యతిరేకం గా ప్రవర్తించ రాదు .చతురంగ బలాలున్నా ఇంద్రియ నిగ్రహం లేని వాడు విజేత కాలేడు .

వ్యవహారం లో మనల్ని ఆపదలోను అంటి పెట్టుకొని ఉన్న వారిని నమ్మి ప్రోత్సహించాలి .మన అధీనం లో లేని దాని పై ఆశ -బద్దకస్తుల పనే .శక్తితో సాధించి మాత్రమె రాజ్య పాలన చేయాలి .

పునాదులు ఎలా ఉండాలో వివరిస్తూ అర్ధానికి ధర్మం ప్రాతి పదిక కావాలి .వృద్ధుల సేవ నీతులలో ముఖ్యమైనది .జ్ఞానం పొందిన వాడు ఆత్మను జయించిన వాడవుతాడు .

విధానాలు నాలు వ్యూహాల గురించి చెబుతూ –అన్ని పనులకు ఆలోచనే మూలం గా ఉండాలి .మంచి ఆలోచన లేని మంత్రాంగం వ్యర్ధమే అవుతుంది విజయం చేకూర్చదు

అవసరమైన ,అర్ధ వంతమైన ఆలోచనలు చెప్పి, కార్య శూరత కు ప్రోత్సహించే వారే నిజ మైన మంత్రులు .

సంబంధాలు ఎలా ఉండాలి ?శక్తి సామర్ధ్యాలే అవతలి వారితో మంత్రాన్గానికి అర్హతలు .బల వంతుడి తో యుద్ధం ఏనుగు మీద కూర్చున్న వాడితో పాద చారి చేసే యుద్ధం లాటిది .విపత్కర స్తితిలో కూడా ధైర్యం కోల్పోరాదు.

కార్య నిర్వహణాధికారి –పని చేయటం లో సామర్ధ్యం మెలకువ ఉన్న వారినే ఆ పనిలో నెల కోల్పాలి .సరైన ఇంగిత జ్ఞానం ఉన్న వాడు కష్ట సమయం లోను సమర్ధం గా పని చేసి కార్య సాధకుడవుతాడు .చేతకాని చవటకు ఏ బాధ్యతలూ ఇవ్వద్దు .

పని చేయటం లో –ఉపాయం తో చేసే ఏ పనీ వ్యర్ధం కాదు .కార్యాన్ని పురుష కార్యం తోనే సాధించాలి .ముందే ఆలోచించి పని ప్రారంభించాలి .

నైతికత –దుర్జన ,దురాశా పరులు రాజు లైతే ప్రజా పీడకులౌతారు .న్యాయ ధర్మాలతో పాలించే వాడిని ప్రజలు తమ తల్లి గా పూజ్య భావం  తోపూజిస్తారు .అధర్మ బుద్ధి ఆత్మ వినాశకుడే అవుతాడు .

చాణక్యుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న రావల్ పిండి దగ్గర ఉన్న తక్ష శిలా విశ్వ విద్యాలయం లో విద్యార్ధిగా చదివి అక్కడే ఆచార్య పదవి పొంది ,ఆర్య చాణ క్యుడని పించుకొన్నాడు .తరువాత కాశీ విశ్వ కళా పరిషత్ లో దేశం లో వివిధ ప్రాంతాల నుండి  వచ్చిన ఉద్దండ పండితులను ఓడించి ,అఖండ మతి మంతుడిగా మన్ననలు పొందాడు …మాత్రుదేశమైన భారత దేశాన్ని సంరక్షించ టానికి గ్రీకు దండ యాత్రలను ఎదుర్కో వటానికి నంద రాజ వంశాన్ని సమూలం గా నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్తాపించి శిష్యుడైన చంద్ర గుప్తుని చక్ర వర్తిని చేశాడు .చివరికాలం పాటలీ పుత్రం లో గడిపాడు .ఈయన గోత్రం ‘’కుటిల ‘’అని అందుకే కౌటిల్యుడు అయ్యాడని కొందరు అన్నారు .తండ్రి పేరు చణకుడు కనుక చాణక్యుడు అయ్యాడని కొందరి వాదన .గ్రీకుల ఆకాంక్ష ను మొగ్గ లోనే తున్చేసిన ఘనత చాణ క్యుడిదే .

చాణక్యుడు ఆంధ్ర సామ్రాజ్యం లో శాతవాహనుల కాలం లో ఉన్నాడని అప్పుడే ‘’కామ సూత్రాలు ‘’రాశాడని ఆ గ్రంధం లో రాసుకొన్నాడు .శృంగారం పై ప్రపంచం మొత్తం మీద వచ్చిన గ్రంధం ఇదే .ఇవే

‘’వాత్సాయన కామ సూత్రాలు’’ అని పిలువ బడుతున్నాయి .అయితే దీన్ని మన చరిత్రకారులు అంగీకరించలేదు .

కౌటిల్యుని అర్ధ శాస్త్రం అనేక దేశ విదేశీ భాషల్లోకి అనువాదం పొందింది .1909లో ‘’శ్యామ శాస్త్రి’’ అనే పండితుడు అర్ధ శాస్త్రానికి వ్యాఖ్యానం రాసి వెలుగు లోకి తెచ్చే దాకా మన వాళ్లకు దీని గురించి పెద్దగా తెలియ లేదు .జర్మని విశ్వ విద్యాలయాలలో అర్ధ శాస్త్రం లోని ‘’విదేశీ సంబంధాలు ‘’బోధనాంశాలుగా బోధిస్తున్నారు .’’అర్ధ శాస్త్రం లోని సూత్రాలు అన్ని కాలాలలో మానవ జాతికి దైనందిన ఆచరణ లో ఆచరణ యోగ్య మైనవి ‘’అని జర్మనీ యూని వర్సిటి ప్రొఫెసర్లు ప్రస్తుతించారు .

ఎప్పుడో క్రీ.పూ.321-185నాటి మౌర్య సామ్రాజ్య పాలనా ,ఆ నాటి సామాజిక స్తితులు ప్రతి బిమ్బింప జేసే గ్రంధ రాజం కౌటిల్యం .అర్ధ న్యాయ ,నీతి,ధర్మ ,శిక్ష ,దండన ,పాలన వ్యూహాలా వంటి వివిధ అంశాలను కూలం కషం గా చర్చించి అందరికి మార్గ దర్శ కం గా ఈ నాటికీ ఉపయోగం లో ఉన్న రాజ నీతి శాస్త్రం చాణక్యుల వారి ‘’అర్ధ శాస్త్రం.’ ‘

Inline image 3  Inline image 1    Inline image 2

mourya chandra gupta      chaanakya shapadham

 

‘’మనుష్యుల జీవితాలకు మూలం అర్ధం అంటే ధనం లేదా మనుష్యులతో కూడిన భూమియే ‘’అర్ధం ‘’.అలాంటి భూమిని సంపాదించే ఉపాయాలు ,పరి పాలించే ఉపాయాలు కు సంబంధించిన శాస్త్రమే అర్ధ శాస్త్రం ‘’అని చాణక్యుడే వివరణ ఇచ్చాడు .’.ఇందులో 15అధికరణాలు 149,అధ్యాయాలు ,180 ప్రకరణాలు ఉన్నాయి .గ్రీకు తత్వ వేత్తలు రాజ నీతి ని అభి వృద్ధి చేస్తే ,మన అర్ధ శాస్త్రం రాజ నీతి శాస్త్ర ప్రాముఖ్యతను తెలియ జేసింది .దైనందిన పరిపాలన లో రాజు తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంత వివరం గా తెలియ జేసినశాస్త్రం ప్రపంచం లో ఎక్కడా లేదు .గూఢ చార యంత్రాంగం, అవినీతి అంతం చేసే విధానాలు చాణక్యుడు వివరించాడు .ఉద్యోగుల నియామకం వారి అర్హతలు ,నాణాల పరీక్ష ధనా గార నిర్వహణ ,కింది ఉద్యోగుల పై  పర్య వేక్షణ ,ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న30 శాఖలు వాటి అధిపతులు వారి బాధ్యతలు  అకౌంటెంట్ ల బాధ్యతలు ఒకటేమిటి సమస్తం చాణక్యుడు స్పృశించాడు .’’ఇన్ఫోసిస్ ‘’కు అధినేత నారాయణ మూర్తి ‘’అర్ధ శాస్త్రం ‘’లోని వివిధ అంశాలు ఈ నాటి ఆధునిక సాంకేతిక రంగం లో  ఎలా తోడ్పడుతున్నాయో సవివరం గా ప్రతి ఆదివారం ఆంద్ర జ్యోతి లో సీరియల్ గా రాస్తున్నారు .అంటే కౌటిల్యుని అర్ధ శాస్త్రానికి కాల దోషం పట్టా లేదన్న మాట

ఆయన చెప్పిన రెండు హితోపదేశాలు సార్వ కాలిక మైనవి –అవి

1-‘’ప్రజా సుఖే సుఖం రాజః ప్రజానాం చ హితే సుఖం

నాత్మ ప్రియం హితం రాజః ప్రజానాం తు ప్రియం హితం ‘’

అంటే ప్రజల సుఖమే పాలకుడైన రాజు సుఖం .వారి సంక్షేమం లోనే ఆయన సంక్షేమం ఇమిడి ఉంటుంది .తనకు నచ్చింది చేసి, మంచి అనుకోరాదు .ప్రజలకు మేలు చేకూర్చేది, హితమైనది మాత్రమె రాజును తృప్తి పరచేదిగా ఉండాలి .

2—‘’కోహి భారః సమర్దానాం –కిం దూరం వ్యవ సాయినాం

కో విదేశః విద్యానాం కః –పరః ప్రియ వాదినాం’’

అంటే-సమర్ధులకు ఏదీ భారం గా అని పించదు.వర్తకులకు దూర దేశం అనేదే లేదు .చదువుకొనే వారికి విదేశం అంటూ ఏదీ ఉండదు .ప్రియమైన మాటలు చెప్పే వారికి పరాయి వారు ఉండరు .సమర్ధులు దేని నైనా సాధిస్తారు .వారికి అసాధ్యం అనేది ఉండదు ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13- .ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

 

కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. మోక్షం అనేది ఎవరికివారే సాధించుకునేది. దేహానంతరం కలిగే ఈ మోక్షానికి భక్తిని సాధనంగా చెప్పారు రుషులు. తొమ్మిది రూపాలుగా ఉన్న ఈ భక్తిలో శ్రవణం వల్లనే ద్వాపరాంతంలో మరణమాసన్నమయినపుడు పరీక్షిత్తు మహారాజు హరికథలను వినగోరుట, శుకమహర్షి ప్రవచనం చేయుట జరిగిందని పురాణాల వలన మనకు తెలుస్తోంది. భగవత్తత్వాన్ని తెలిపే ఆ ప్రవచకులను హరిదాసులని, భాగవతులని పిలుస్తారు. రుషులు పలు చోట్ల లోకక్షేమం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించడం, వాటికి మహాజనం రావడం ఆ సమయాన సూతమహర్షివంటి మహా ప్రవక్తలచే భక్తులకు హరికథా శ్రవణం చేయించడం జరిగేదని పురాణేతిహాసాలు తెలుపుతున్నాయ. ఆ విధంగా ప్రారంభమైన హరికథా శ్రవణం కథ హరిదైనా హరునిదైనా ముల్లోకాలలో ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేస్తూ సామాజిక రుగ్మతలు, దోషాలు వాటి నివారణ మార్గాలు చెప్పినటువంటి నారదమహర్షి దృవచరిత్రను మొట్టమొదటిగా హరికథా రూపంలో గానం చేశాడని పెద్దలు అంటారు. ఆనాటి రామాయణ, భారత, భాగవతాలు మన హరికథలకు వస్తువులయ్యాయ. కాలక్రమంలో ఈ హరికథ దేశ భాషల్లోకి వచ్చాయి. తెలుగులో యక్షగానాలు అనే ఒక ప్రబంధశైలి వచ్చింది. పాటలు, పద్యాలు, ద్విపదలు, చూర్ణికలు, వచనములన్నింటి సంకలనం యక్షగానం. నేటి హరికథా రూపానికి ఇది మాతృక అని చెప్పుకోవచ్చు. ఈ హరికథలో సంగీత, సాహిత్య, నృత్య, లయలతో పాటు కొంత సమయస్ఫూర్తితో కూడిన చక్కని ఎవరినీ నొప్పించని సునిశితమైన హాస్యం కూడా ఉంటుంది. అందుకే దీనిని సకల కళాసమాహారంగా పేర్కొంటారు. కాలికి గజ్జెకట్టి, చేత చిడతలు ధరించి భక్తజనులచే గోవిందనామ స్మరణ చేయిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ఎన్నో విషయాలు చెపుతూ జాతీయ భావాలూ పూరించి సమాజాన్ని సన్మార్గంలో పెట్టటానికి స్వతంత్రంగా చెప్పగలిగేదే ఈ హరికథా కళ. కథకుడు సంగీత సాహిత్యాలందు ఆరితేరినవాడై వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, భగవద్గీత, పురాణాది బహుగ్రంథ పఠనం తప్పనిసరిగా ఉండాలి. బాగేపల్లి అనంతరామ భాగవతార్ మొదలయినటువంటి హరిదాసులు వున్నా 20వ శతాబ్దంలో శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాసును ముఖ్యంగా మననం చేసుకోవాలి. హరికథల రచనల్లోగాని, చెప్పడంలోగాని ఒక ప్రత్యేక స్థానాన్ని సమకూర్చుకుని హరికథకు, హరికథకులకు విశిష్ట గౌరవాన్ని తెచ్చిన సహజ సంగీత సాహిత్య కోవిదులు, మహాకవి సార్వభౌములు, హరికథా గాన వాగమశాసనులు, భాగవతా శిఖామణులు, కాత్యాయినీ కటాక్ష లబ్ధి విభవజ్ఞానధనులు అయిన ఆదిభట్టాన్వయానికి హరికథా పితామహ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రథమ ప్రధానాచార్యులుగా వ్యవహరించారు. అటువంటి మహనీయుని శిలావిగ్రహాన్ని వారి శిష్య ప్రియశిష్యులు నగరంలోని సత్యనారాయణపురం కాశీవిశే్వశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఆదిభట్టాన్వాయుని 6వ వర్ధంతి ఉత్సవంలో ప్రతిష్టించారు. అంతటి ప్రాచీన కళ అయిన ఈ హరికథలను ఘంటసాలవేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల రామాయణం, భాగవతం, భారతాలను మొత్తం కథకులు ఆ కళాశాలలోని కళా వేదికపై శ్రోతలకు గానం చేసి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమి, సంగీత అకాడమీలు దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం యువతను ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా కళాప్రదర్శనలు వారిచే ఇప్పించి ప్రోత్సహించేవి.
సమాజహితం హరికథకుల అభిమతంగా కొనసాగాలని హరికథా కాలక్షేపం అనుకునే విధంగా కొనసాగకూడదని భక్తిజ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకగా హరికథలను వౌలిక ధర్మాలు పాటిస్తూ చెప్పగలిగితేనే ఈ హరికథకు తరాలు మారినా విలువలు తరగవని పలువురు పెద్దలన్నారు. హరికథ అనగానే ఒక కథ కాదు దాని వెనుక ఒక ధార్మిక ఆథ్యాత్మిక తత్వలక్షణాలను కలిగి వుండేది. దానిని తెలుపుటమే ఆచరించమని చెప్పటమే కథకులు గుర్తెరిగి పట్టుబట్ట కట్టుకుని ఏం అందించాలని శ్రోతలు అభిప్రాయపడ్డారు. ఆ కథకులపై వ్యాఖ్యలు విన్న పలువురు

ఫోటో… 1951వ సంవత్సరంలో విజయవాడలో ప్రతిష్ఠించిన ఆదిభట్ల నారాయణదాసు శిలావిగ్రహం (పక్కన) హరికథా గానం చేస్తున్న ఓ భాగవతార్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాగం.. తానం.. పల్లవి… రమ

 

సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తునుంచి పొందిన విదుషీమణి ఆమె. ఈ పరిశోధన గ్రంథం ముద్రణకూ నోచుకున్నది.
డా రమగారిది సంగీత కళాకారుల వంశం. వీరి వంశంలో కవులూ, జ్యోతిష శాస్తజ్ఞ్రులూ అనేకులున్నారు. వీరి తల్లిగారయిన పద్మావతిగారు వైణిక. సంగీతం ప్రాథమికంగా వీరు తమ తండ్రిగారయిన శ్రీ పంతుల గోపాలరావుగారి వద్ద అభ్యసించింది. గోపాలరావుగారు ‘సంగీత సాగర’ బిరుదాంకితులయిన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావుగారికి ముఖ్య శిష్యులు. (విజయేశ్వరరావుగారిపై ఈ గ్రంథంలో ఒక అధ్యాయం వుంది). వీరి భర్తగారు శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారు. వారూ వాయులీన విద్వాంసులు.
గాత్ర సంగీతంలో రమగారిని ఆకాశవాణి ‘ఎ-టాప్ గ్రేడ్’ ఇచ్చి వీరి ప్రతిభను గుర్తించింది. గాత్రంతోపాటుగా వీరు వయొలిన్, వయోలా వాద్యాలలో ‘బి-హై’గ్రేడ్‌ని తమ ప్రతిభతో సాధించుకొన్నారు.
తమ 8వ ఏటనే కచ్చేరీ చేసిన ఈమె 1906లో మద్రాస్ సంగీత ఎకాడెమీ నుంచి ‘అవుట్‌స్టాండింగ్ లేడీ వోకలిస్టు’గా అవార్డునీ, 2008లో ఇదే అకాడెమీ నుంచి అత్యుత్తమ పల్లవి అవార్డునీ పొందగల్గింది. అట్లాగే అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఆరాధన సమితి నుంచి 2010లో రాగం తానం పల్లవికి అవార్డుని పొందింది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి 1992-94లకు సీనియర్ స్కాలర్‌షిప్‌నీ, అత్యుత్తమ సంగీతజ్ఞురాలిగా 96-97లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచీ అవార్డునీ పొందింది. పల్లవి పాడడంలో ప్రథమ బహుమతిని 1993లోనే మద్రాసు సంగీత అకాడెమీ నుంచి పొందింది.
ఇట్లా అనేక బహుమతులనూ, స్వర్ణపతకాలనూ పొందిన డా.రమగారు ఇవేళ అగ్రశ్రేణి గాయకురాలిగా స్థిరపడింది. రాగం తానం పల్లవి విద్యలోనూ, స్వరకల్పనలోనూ తన మధుర కంఠస్వరంతో సభను రక్తి కట్టించడంలో వీరు సిద్ధహస్తులు. మద్రాస్ సంగీత ఎకాడమీ నుంచి కూడా వీరి రాగం తానం పల్లవి విద్యకు గుర్తింపు అవార్డు రూపంలో రావడం తెలుగువారందరికీ గర్వకారణం.
కళాకారులలో చాలామందికి లభించని ఒక అదృష్టం వీరికి ప్రత్యేకంగా ఉంది. అది వీరి భర్తగారు అయిన శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారుకూడా, వీరితో సమానమయిన ప్రజ్ఞా పాటవాలు కల్గిన వయొలిన్ వాద్యకారుడు కావడం. ఇట్లా సంగీత క్షేత్రంలో దంపతులిద్దరూ అగ్రశ్రేణి కళాకారులు కావడమన్నది మన రాష్రంలో ఎంతో అరుదయిన విషయం. ఈ అదృష్టం ఈ దంపతులకు దక్కింది. నిరంతర సంగీత సాధనకు, కచ్చేరీలకూ వీలు కల్గించాడు భగవంతుడు. ఇద్దరూ కలిసీ విడిగానూ దేశదేశాలు తిరిగి తమ సంగీత విద్యను ప్రదర్శించారు. సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా వంటి అనేక దేశాలలో డారమ కచ్చేరీలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక సంగీత సభలలో వీరు కచ్చేరీలు చేసి ఖ్యాతి గడించారు. ముంబాయి, ఢిల్లీలలోని షణ్ముఖానంద సభ, మద్రాస్ సంగీత అకాడమీ, నారద గానసభ, శార్వాణి సంగీత సభ, నాదోపాసన, హంసధ్వని, ఉ, కృష్ణగానసభ, టి.టి.డి, సరస్వతీ వాగ్గేయకార ట్రస్ట్, కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, కాపాలి ఫైన్ ఆర్ట్స్, నాద ఇంబమ్ (చెన్నై), త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ (తిరుపతి), కళాంగన్ (్ఢల్లీ) సంగీత విద్వద్పరిషత్ (బెంగుళూరు) వంటి అనేక సంగీత సభలలో వీరు అగ్రశ్రేణి గాయనిగా పాల్గొన్నారు. వర్షాలు కురవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహించిన ‘వర్షిణి’ అన్న కార్యక్రమంలో పాడారు.
వీరు గాయత్రీ సంగీత విద్వన్మణి, నాదవల్లభ, ఇశై పెరోలి బిరుద ప్రదానాల చేత సత్కరింపబడ్డారు. మైసూరు దత్తపీఠం మహాపురుషులైన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి చేత ఆశీర్వదింపబడ్డారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వామి అవతరణ చాలించాక వారి సన్నిధిలో వీరు సుమధుర గాన కచ్చేరి చేశారు. ఆకాశవాణి వైజాగ్ స్థానిక ఆకాశవాణిలో ఆడిషన్ కమిటీలో వీరొకరు. ICCR (Indian Council for Cultural Relation)లో వీరు కళాకారిణిగా తీసికొనబడ్డారు.
శ్యామశాస్త్రుల సంగీత ఔన్నత్యాన్ని గురించి వీరు సోదాహరణ ప్రసంగాలనేకం చేశారు. ‘కర్ణాట సంగీత సాధన’ మీదా, రాగం తానం పల్లవి మొదలైన విద్యాంశాలమీద వీరనేక సోదాహరణ పూర్వక ఉపన్యాసాలిచ్చారు. దక్షిణాది సంగీతంపై 2000ల సం.లో జరిగిన జాతీయ గోష్ఠికి ‘విశేష ప్రయోగాలపై గాఢ అధ్యయన’ అన్న అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ‘నవరసమాలిక’ అన్న శీర్షికతో త్యాగరాజస్వామివారి రచనలలో నవరసాలను ఎత్తిచూపారు. ఇట్లాగే త్యాగబ్రహ్మముల ‘నౌకాచరితా’న్ని సంగీత రూపకంగా నిర్వహించారు. వీరిట్లా మంచి ఎకడమిషియన్‌గా సృజనాత్మక కళాకారిణిగా ఏకవేళలో రాణిస్తున్న కళాకారిణి. సంగీత క్షేత్రంపై వీరి అభిప్రాయాలను గమనించాల్సి ఉన్నది.
సంగీత కళాశాలలు తమ వంతు కృషి తాము చేస్తున్నవనీ, ఐతే సమయం నిర్దేశం, సిలబస్సూ ఉండడంవల్ల మంచి ప్రదర్శన కళాకారులు తయారవడం కష్టమవుతున్నదంటారు వీరు. బోధనా పద్ధతులలో కూడా మరింత మార్పు కోరుతున్నారు వీరు. భర్తగారుకూడా అగ్రశ్రేణి కళాకారుడు కావడం చేత ఇద్దరూ ఒకరికొకరు అన్నివిధాలా సహకరించుకుంటామనీ, అట్లాంటి అవకాశం తమకు లభించడం గొప్ప వరమనీ వీరన్నారు.
చివరగా ఒక విశేష విషయం…!
ఒకమారు వయొలిన్ విద్వాంసుడైన వీరి భర్త శ్రీ ఎం.ఎస్.ఎన్.మూర్తిగారు నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మ్యూజిక్‌లో గాత్ర కచ్చేరి చేయగా డా రమగారు వారికి వయొలిన్ సహకారం అందించారు! ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? ఎనె్నన్నో సి.డిలు, రికార్డ్‌లూ, టి.విలోనూ, రేడియోలోనూ కచ్చేరీలు చేసిన వీరికి ఇట్లా పాత్రలు అటు ఇటూ మారిపోయి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించగల్గడం నిజంగా గొప్ప వరమూ, భగవదనుగ్రహ సూచన కూడాను. ఈ తరంలోని ఇలాంటి విద్వత్కళాకారులు ఎందరెందరికో ఆదర్శంగా నిలవగల్గుతారు. మన సంగీత కళకూ, విద్యకూ వారి ప్రజ్ఞావైభవం గొప్ప అలంకారమూ, ప్రాణమూ కూడా!

 

 

నృత్యోత్సవం.. సమ్మోహనం

 

అంతర్జాతీయస్థాయి నృత్యోత్సవం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు కనుల విందుగా సాగింది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ పురస్కార గ్రహీత, నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి సారథి బత్తిన విక్రమ్‌గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. తొలిరోజు నాలుగు నృత్యరీతులు నృత్య ప్రియులను ఆకట్టుకున్నాయి.
ముందుగా బ్రహ్మాంజలి గ్రూప్ కూచిపూడి నృత్యానికి లాలిత్ కుమార్ గుప్తా, గురురాజ్, డాక్టర్ ఎం.మదన్‌మోహన్, వివిఎస్ జగన్నాథరావు, పిఎ సాయికుమార్ తమ నాట్య ప్రతిభతో అంశాన్ని రక్తి కట్టించారు. తర్వాత మణిపురి నృత్యరీతిలో దశావతారాల్ని వౌసం నంది హావ, భావ, పద భంగిమలతో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. వరుసగా ఒడిస్సీ నాట్యాన్ని రస్మిరంజిన్ బారిక్, కూచిపూడి అంశాన్ని వివిఎస్ జగన్నాథరావు, గురురాజ్ మదన్‌మోహన్ వ్యక్తిగతంగా ప్రదర్శించి, తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
కృతులలోని భావాన్ని అభినయం ద్వారా వీక్షకులకు అందించడమే రసోత్పత్తి, అది పురుషులకి ఎంతో సులభమని ప్రారంభోత్సవంలో పాల్గొన్న నృత్య విశే్లషకుడు విఎకె రంగారావు అన్నారు. అనంతరం డాక్టర్ విఎస్ కళాదీక్షితులు దంపతులను నిర్వాహకులు కళాసేవా పురస్కారంతో సత్కరించారు.
నాట్య కళాకారులు తమ ప్రతిభతో వీక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు. జాతీయస్థాయిలో రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో సాగిన పురుషుల శాస్ర్తియ నృత్య యజ్ఞంలో ముందుగా నగరానికి చెందిన డాక్టర్ లాలిత్ కుమార్ గుప్త కూచిపూడి నృత్య గురు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్యపరికల్పనలో అలవోకగా ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
భావకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అసంపూర్ణ రచనకు బాలాంత్రపు రజనీకాంతరావు కొనసాగింపుగా కొలువైతివా రంగసారుూ… అనే ఈ కీర్తన సాగడం విశేషం. తర్వాత విప్రనారాయణ చిత్రం నుంచి దేవ దేవి… అనే రంగనాథ పూజ అంశం కూడా నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమానికే శిఖరాయమానం అనదగ్గ ఒడిస్సీ నృత్య ప్రదర్శన భువనేశ్వర్ వాసి బికాస్ నాయక్ అందించి అందరి హృదయాలను దోచుకున్నారు. గురు బి.చిత్రానంద స్వయన కొరియోగ్రఫీలో జోషా బరారే… పల్లివిలో ఆరంభమైన అవినయ తొలి అంశంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనందభైరవి రాగంలో సాగిన ఈ నృత్తాంశం సుమారు అర్ధగంట పాటు ప్రేక్షకుల ఊపిరిని స్తంభింపజేసిందని చెప్పొచ్చు.
ఆంధ్రనాట్యాన్ని సంజయ్ వాడపల్లి(హైదరాబాద్) త్రిపురాసుర సంహారంతో ఆరంభించింది. ఈ క్రతువులో విష్ణువు బాణంగా, ధరణి రథంగా, మంధరగిరి చాపంగా మారిన వైనాన్ని వివరించారు. మునిపల్లె సుబ్రహ్మణ్యం రచించిన పరశురామ గర్వభంగం అంశంలో సంజయ్ పద భంగిమలు అద్భుతంగా నిలిచాయి.
తర్వాత నాట్యాచార్య వివిఎస్ జగన్నాథరావు(జగన్) కూచిపూడి నృత్యశైలిలో శివస్తుతి అంశం నాటరాజుకు అంజలి ఘటించడంతో ప్రారంభమైంది. ద్వితీయ అంశంగా సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన నారాయణీయం బాలకృష్ణుని లీలల్ని కళ్ళకు కట్టింది. పేరిణి శివతాండవంతో సి.పవన్‌కుమార్ ఆకట్టుకున్నారు. పల్లవ జతులు, సమీకరణ, సమయతి విన్యాసాలు నృత్యకేళిలో వరదలెత్తాయి. చివరి అంశంగా భరత నాట్యాన్ని పవిత్ర కృష్ణ్భట్(ముంబాయి) శ్రీ కృష్ణ కమలనాథో… పల్లవితో ప్రారంభించారు. మా రమణ… ఉమా రమణ కీర్తన శివ కేశవ బేధాల్ని తెలియజెప్పింది.
ఈ కార్యక్రమం సందర్భంగా సంగీత శాస్తజ్ఞ్రలు, సాహితీమూర్తి బాలాంత్రపు రజనీకాంతరావుకు ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమారుడు శరత్‌కు నిర్వాహకులు అందించారు.

ఫోటో… ఒడిస్సీ నృత్యాభినయాన్ని చేస్తున్న బికాస్ నాయక్

 

వైష్ణవి గానం.. మృదుమధుర్తం

 

ఏడనున్నావయ్యా ఏడుకొండలయ్య.. అనే జానపద గేయాన్ని వినసొంపైన జానపద సంప్రదాయ బాణీలో ఆలపించి బహుభాషా గాయకుడు, గానగంధర్వ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అభిమానాన్ని చూరగొన్నారు కోయిల లాంటి కంఠస్వరాన్ని జన్మతహాః సొంతం చేసుకున్న యువ గాయనీమణి ఎన్ వైష్ణవి. గుంటూరు నగరానికి చెందిన నరహరశెట్టి వైష్ణవి నేడు మన రాష్ట్రంలో మధురంగా, సులలితంగా వాగ్గేయకారుల కృతి సాహిత్యాన్నైనా, సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమయ్య కీర్తనలైనా, శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని పొందిన మహా భక్తురాలు మీరాబాయి భజనలైనా, జయ పతాకములెత్తరా దిగ్విజయ శంఖాన్ని పూరించరా అంటూ దేశభక్తి గీతాలను కూడా ఆలపించడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ఎన్ త్రిపుర సుందరరావు, మీనాదేవిల ముద్దుబిడ్డైన వైష్ణవి తొలుత విద్వాంసురాలు కె సుశీల వద్ద ప్రాథమిక శిక్షణ పొంది అనంతరం మున్నంగి అన్నపూర్ణ, పెరవలి నందకుమార్ వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను కొనసాగించారు. బిఎస్‌సి (ఐటి)లో ప్రతిభావంతంగా పట్టాను పుచ్చుకుని, ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
రాష్టవ్య్రాప్తంగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు, కళావేదికలు, వివిధ విద్యాసంస్థలు నిర్వహించిన కళోత్సవాల్లో తన గాన మాధుర్యాన్ని ప్రవహింపజేసి లెక్కకు మిక్కిలిగా అవార్డులు, అదే స్థాయిలో ప్రశంసలు పొందారు వైష్ణవి. తన గురువైన మున్నంగి అన్నపూర్ణతో కలిసి పలువురు విద్వాంసుల సమక్షంలో కృష్ణలీలా తరంగాల సృష్టికర్త సద్గురు శ్రీ నారాయణతీర్థ యతీంద్రుల తరంగాలను తమిళనాడులోని తిరుపొందుర్తిలో వేలాది మంది సంగీతాభిమానుల ఎదుట గానం చేసి శెహభాష్ అనిపించుకున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని ప్రఖ్యాత టెలివిజన్ చానల్స్‌లో వివిధ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో బహుమతులను అందుకున్నారు.అనేక టివీ చానల్స్‌లో తన కోకిల గానాన్ని వినిపించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా పద్మవిభూషణ్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ పర్యవేక్షణలో ఎస్‌వి భక్తిచానల్ ప్రసారం చేసిన ‘సునాద వినోదిని’ కార్యక్రమంలో వెంకటేశ్వరస్వామిపై పలు కీర్తనలను గానం చేసి ప్రశంసలందుకున్నారు.
మాయామాళవగౌళ, కళావతి, సురటి, అభేరి, అమృతవాహిని, శివరంజని, షణ్ముఖప్రియ, శుభ పంతువరాళి, భూపాలం, రాజాజీరాగమాలిక, బిళహరి రాగాల్లో అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, జయదేవ్, ఊత్తుకాడి వెంకట సుబ్బయ్య, నారాయణతీర్థుల సాహిత్యాన్ని మృదుమధురంగా ఆలపించే అసమాన ప్రతిభామూర్తి వైష్ణవి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కచ్చేరీలు నిర్వహించిన వైష్ణవి, మీరాబాయి కృష్ణయ్యను కీర్తించిన ఆయే గిరిధర్‌ద్వారే అనే భజన సంకీర్తనలను ఆలపించి హిందుస్థానీ సంగీత సంప్రదాయంలో కొత్త ఒరవడిని సృష్టింపజేశారు.
నేటి యువ గాయనీమణుల్లో మొదటి శ్రేణికి చెందిన కళాకారిణిగా అనేక మంది ప్రముఖ గాయకుల అభినందనలు అందుకున్న వైష్ణవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా ‘కళ’తో వైష్ణవి మాట్లాడుతూ నుడికారం మీద సాధికారత కలిగి, భావాన్ని అర్థం చేసుకుని అనుకరణకు అవకాశం ఇవ్వకుండా ఆర్ద్రతతో కీర్తనలు గానం చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుందన్నారు. ఆ విశ్వాసంతోనే తాను కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆమె వివరించారు.

పోటో… ఎస్.పి. శైల అభినందనల అందుకుంటున్న వైష్ణవి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లింగాభిషేకం

 

కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.

“బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి భాగమేమో హిమగిరి దుహితా-అంటే హిమవంతుడి కుమార్తె పార్వతి. ఆమె కూడా చల్లని తల్లే. వీటిన్నింటికీ తోడు తెల్లవారు ఝామున అభిషేకం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఈ జగమంతా సుభిక్షంగా ఉండటానికి. ఈ బ్రహ్మండమంతా అండాకారంలో ఉంటుంది. శివుడి తలపై చంద్రబింబం ఉంటుంది. అందుకే చంద్రబింబాకారంలో ఉన్న పాత్ర నుంచి ఎప్పుడూ అమృతధార పడుతూ ఉండాలి. ఆ నీళ్లు పడుతున్న సమయంలో శివలింగాన్ని ముట్టుకుంటే- అది చల్లగా ఉండాలి. అప్పుడు ఈ లోకమంతా చల్లగా ఉంటుంది. దీనికోక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. మనసు కోరికల తాపం వల్ల వేడెక్కుతుంది. దీనిని చల్లబరిచే ప్రయత్నం చేయగలిగిన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే ఎటువంటి బాధలు, కోరికలు ఉన్నా అభిషేకం చేయమని చెబుతారు. ఈ అభిషేకం చేసే పంచామృతాలకు కూడా విశిష్టత ఉంది. ఈ పంచామృతాలు- మన అంతర్మాతను శుద్ధి చేస్తాయి. వీటిలో ఒకో దానికో ఒకో విశిష్టత ఉంది.

పంచామృతాలలో మొదటగా ఆవుపాల గురించి తెలుసుకుందాం. ఆవుపాలు సమీకృత ఆహారం. అన్ని వయస్సుల వారు వీటిని తాగుతారు. వేదాంతంలో జ్ఞానాన్ని పాలతో పోలుస్తారు. మానవులకు జ్ఞానం- ఆవుపాల అభిషేకం వల్ల సిద్ధిస్తుంది. ఈ పాలతో అభిషేకం చేస్తూ- ” ఈశ్వరా! ఈ ఆవుపాల అభిషేకము చేస్తున్నాను.. నాకు జ్ఞానం ప్రసాదించు తండ్రి..” అని భక్తుడు కోరుకుంటాడు. రెండోది తేనె. తేనె ఆపాతమధురం. తియ్యగా వుండే తేనె ఎటువంటిదో విషయములయందు వుండే అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అలాగే విషయాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు. తేనెతో అభిషేకం చేస్తూ- “ఈశ్వరా! నాకు ఈ విషయములయందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అదీ వైరాగ్యసుఖం! దానిని నాకు ప్రసాదించు..” అని భక్తుడు ప్రార్థిస్తాడు. మూడోది పంచదార. ఇది గరుగ్గా ఉంటుంది. కానీ తీయగా ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చాలా గొప్పవాడినని అహంతో విర్రవీగుతూ ఉంటాడు. కాని అది ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉం టుంది. అందుకే పంచదారతో అభిషేకం చేస్తూ- “నాకు అవినయాన్ని తీసేసి, నాకు వినయాన్ని కృప చేయి” అని భక్తుడు శివుడిని ప్రార్థిసా ్తడు. ఆ తర్వాత ఆవునేతితో అభిషేకం చేస్తారు. ఆవునేయికి పాపాలను దహించే శక్తి ఉంది. అందుకే “నా పూర్వజన్మములోను, ఈ జన్మములోను తెలియక చేసిన పాపాలేవైనా ఉంటే వాటిని నీ కృప చేత కాల్చే యి..” అని ప్రార్థిస్తూ ఆవునేతితో అభిషేకం చేస్తారు. కార్తికమాసం ఉపాసనకాలం కాబట్టి పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఫలితం లభిస్తుంది.

బిల్వార్చన రహస్యం!
ఈశ్వరుడికి పూజచేసే మారేడు దళాలకు కూడా చాలా విశిష్టత ఉంది. మారేడుదళాన్ని చూడకుండా వేసినప్పుడు- ఆ ఆకు వెనకున్న ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు. మారేడుదళం బోర్లాపడితే జ్ఞానకటాక్షం లభిస్తుందంటారు. అంటే ఆకు ఎటువైపు తగిలినా కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతే కాదు.. లక్షల ఆకులతో ఈశ్వరుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు. ‘ఏకబిల్వం శివార్పణం..’ అనుకొని ఒక్క మారేడుదళాన్ని సమర్పిస్తే చాలు! ఒక సారి భగవాన్ రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వెళ్లి- “సహస్ర బిల్వార్చన చేద్దామనుకుంటున్నాను. ఓ వంద బిల్వాలు తక్కువైనాయి. ఏం చేయమంటారు?” అని అడిగిందట. ఆయన వెంటనే ‘నీ ఒళ్లు గీరుకో..’ అన్నారట. ఈ మాటలకు ఆవిడ ఆవాక్కయింది. అప్పు డు మహర్షి- “పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు పీక్కొచ్చేయటమేగా ? వంద తక్కువయిందని చెట్టు గిల్లుతుంటావు? అంతకన్నా బుద్ధేం నిలబెడుతుంది? వందమాట్లు చెట్టును గిల్లటం బదులుగా నిన్ను నువ్వే గిల్లుకుంటే సరిపోతుంది కదా.. ।” అన్నారట. అంటే పూజ చేసేటప్పుడు దానిపై బుద్ధి నిలపటం ప్రధానం. అంతే తప్ప లెక్కలు కట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.

108 ఎందుకు?
పూజలలోను, అష్టోత్తర శతనామావళిలలో తొమ్మిది సంఖ్య కనిపిస్తూ ఉంటుంది. శ్రీమహావిష్ణువుకు 108 తులసిదళాలతో పూజ చేస్తారు. అష్టోత్తర శతనామావళి అని నూట ఎనిమిది నామాలు చదువుతారు. దీనికి కూడా ఒక అర్థముంది. ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రాలలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి నాలుగుపాదాలు ఉంటాయి. దీనికి గుర్తుగా 108 నామాలను చెబుతారు. ఈ 108 నక్షత్ర పాదాలలోను పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసీదళాలు, 108 నామాలతో ఈశ్వరునికి పాదార్చన చేస్తారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మన ‘ఏడు తరాలు’

 

“ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసే బోయీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రతి సామ్రాజ్య చరిత్రలోను కూలీల శ్రమ ఎవరికీ కనిపించని ఒక చీకటి కోణం. వీరి చరిత్ర ఎవరికీ తెలియదు. ఎక్కడా రికార్డు కాదు. గాయత్ర బహదూర్ ముత్తమ్మమ్మ సుజారియా 1903లో భారత్ నుంచి గయానాకు కూలీగా వెళ్లింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత గాయత్ర- తన ముత్తమ్మమ్మ ప్రయాణాన్ని, ఆ నాటి పరిస్థితులను తెలుసుకోవటానికి భారత్ నుంచి బ్రిటన్ దాకా అనేక ప్రాంతాలు తిరిగింది. లండన్ నుంచి అమెరికా దాకా అనేక పట్టణాలలో ఉన్న లైబ్రరీలను వెతికింది. చివరకు ఆ నాటి పరిస్థితులను వెలికితీయగలిగింది. హేచట్ పబ్లికేషన్స్ విడుదల చేసిన కూలీ ఉమెన్ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

1850లలో భారత్‌లో పరిస్థితులు బాగా క్షీణించాయి. సామాజికంగా, ఆర్థికంగా దుర్భర పరిస్థితులు నెలకొనడంతో చాలా మంది ప్రజలు తమ గ్రామాలను విడిచి వలసవెళ్లటం ప్రారంభించారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం వీరికి ఉపాధి లేకుండా చేసింది. కానీ ఇదే విధానం వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటానికి వీలైన మార్గాలను కల్పించింది. 1882లో మా ముత్తమ్మమ్మ సుజారియా అయోధ్య నుంచి గయానాకు కూలీగా వెళ్లటానికి తన పేరును నమోదు చేయించుకుంది. అయితే ఆమె సముద్రం దాటి గయానాకు వెళ్లిన సంవత్సరమే బ్రిటిష్ ఇండియాలో వివాహిత మహిళలు వలస వెళ్లకుండా నిరోధించటానికి ఒక చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం- ఏ మహిళా తన భర్త అనుమతి లేకుండా వలస వెళ్లటానికి వీలు లేదు.

ఒక వేళ ఆమె తాను అవివాహితనని గాని, విడాకులు తీసుకున్నాననిగాని, వితంతువుననిగాని చెబితే దానికి తగిన ఆధారాలు సమర్పించాలి. ఆమె అబద్ధం చెబుతోందని అధికారులు భావిస్తే-ఆమెను పది రోజులు కస్టడీలో పెడతారు. ఈ లోపులో ఆమె చెప్పిన సమాచారం నిజమా? కాదా? అనే విషయంపై దర్యాప్తు చేస్తారు. ఆ సమయంలో గయానాకు వలస ప్రజలను పంపటానికి ఉద్దేశించిన విభాగాధిపతి రాబర్ట్ మిట్‌చిల్- ఈ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారని ఫిర్యాదు చేయటం మొదలుపెట్టాడు. గ్రామీణ ప్రాంతాల్లో మెజిస్ట్రేట్లు ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నారని.. దీని వల్ల తనకు మహిళలు దొరకటం లేదని బ్రిటిష్ అధికారులకు లేఖలు రాశాడు. అతనికి కోపం రావటానికి ఒక కారణముంది. అమలులో ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి నౌకలోను 100 మంది పురుషులకు 40 మంది మహిళలు ఉండాలి. లేకపోతే నౌకలు తీరాన్ని విడిచివెళ్లకూడదు. దీనితో మిట్‌చెల్ నౌకలు కలకత్తాలోనే ఉండిపోయేవి..

నౌకలలో ఎక్కించే ముందు వీరిని కలకత్తాలోని నవాబుగారి పాత కోటలో ఉంచేవారు. అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. అంటువ్యాధులు ప్రబలేవి. వందల మంది చనిపోతూ ఉండేవారు. చాలా సార్లు అసాంఘిక శక్తుల కోసం పోలీసులు ఈ ప్రాంతాల్లో గాలిస్తూ ఉండేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది కనిపించకుండా పోయిన బంధువుల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు. వలసదారులను తీసుకు వచ్చిన వెంటనే వారికి యూనిఫాం ఇచ్చేవారు. స్నానం చేయటానికి ఒక సబ్బు కూడా ఇచ్చేవారు. వారందరినీ హుగ్లి నది ఒడ్డుకు తీసుకువెళ్లి స్నానం చేయించేవారు. ఈ స్నానం విషయంలో ఎటువంటి కులవివక్ష ఉండేది కాదు. బ్రాహ్మణుల దగ్గర నుంచి హరిజనుల దాకా అందరూ పక్కపక్కనే నిలబడి స్నానం చేయాల్సిందే! వాస్తవానికి చాలా మంది బ్రాహ్మణులు తమ జంధ్యాలను స్నానానికి ముందే తీసేసేవారు. దీనికి కూడా ఒక కారణముంది.

గయానాలో తోటల యజమానులు బ్రాహ్మణులు ఎక్కువ శ్రమ చెయ్యలేరని భావించేవారు. అందువల్ల వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి ముందుకు వచ్చేవారు కాదు. బ్రిటిష్ అధికారులైతే బ్రాహ్మణులలో తిరుగుబాటు ధోరణి ఎక్కువ ఉందని భావించేవారు. అందువల్ల వారిపై ఒక కన్నేసి ఉంచేవారు. దీనితో చాలా మంది బ్రాహ్మణులు జంధ్యం వేసుకోవటానికి ఇష్టపడేవారు కాదు. స్నానం అయిన తర్వాత వారు వెళ్తున్న ప్రదేశాలకు అనువైన బట్టలు ఇచ్చేవారు. గయానాకు వెళ్లే కూలీలకు కాటన్ బట్టలు ఇస్తే- వెస్ట్ఇండీస్‌కు వెళ్లే కూలీలకు ఊలు దుస్తులు ఇచ్చేవారు. ఆడ కూలీలకు రెండు ఊలు జాకెట్లు, ఒక ఊలు లంగా, ఒక చీర, కాలికి మేజోళ్లు ఇచ్చేవారు. పురుషులకైతే పంట్లాం, షర్టు, క్యాప్ ఇచ్చేవారు. ఒక గ్రూపులో ఉన్నవారికి ఒకే విధమైన బట్టలు ఇచ్చేవారు.

మా ముత్తమ్మమ్మ ప్రయాణించిన ది క్లైడ్ నౌక 1903 నవంబర్ 4వ తేదీన గయానాలోని డిమిరిరా నౌకాశ్రయానికి చేరుకుంది. డిమిరిరా ప్రాంతాన్ని 19వ శతాబ్దం తొలి రోజుల్లో బ్రిటిష్ పాలకులు డచ్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 19వ శతాబ్దం ముందు దాకా ఈ ప్రాంతంలో అపారమైన బంగారు గనులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తూ ఉండేవి. అయితే బ్రిటిష్ వారికి ఈ బంగారు గనులు దొరకలేదు కానీ చెరుకును పండించటానికి వీలైన నల్ల రేగడి భూమి లభించింది. ఈ సమయంలో బ్రిటిష్ కాలనీలన్నింటికీ ఇక్కడి నుంచే పంచదార ఎగుమతి అయ్యేది. అయితే అప్పటికే ఫ్రాన్స్, జర్మనీలు చక్కెర ఎగుమతులు ప్రారంభించి- గయానాతో పోటీ పడటం మొదలుపెట్టాయి. దీనితో అక్కడున్న చెరుకు ఉత్పత్తిదారులు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవటం మొదలుపెట్టారు. బ్రిటన్‌కు చెందిన అనేక కాలనీలలో అప్పటికే బానిసత్వాన్ని రద్దు చేశారు. అయితే తమకు తక్కువ ధరకు కూలీలు దొరకకపోతే సర్వనాశనం అయిపోతామని వారందరూ బ్రిటిష్ అధికారులకు మొర పెట్టుకున్నారు. అంతేకాకుండా తమ లాభాలు తగ్గకుండా చూడాలంటే- వారికి అతి తక్కువ కూలికి పనిచేసే మనుషులు కావాలి. దీనికి తోడు ఉత్పత్తిదారులకు మరొక సమస్య ఎదురయింది. అప్పటికే వారి దగ్గర కూలీలుగా పనిచేస్తున్న వారు తమకు ఎక్కువ వేతనాలు కావాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. దీనితో వారు భారత్‌పై దృష్టి పెట్టారు. బ్రిటన్ కూడా తమ లాభాల కోసం భారత్ నుంచి కూలీలను పంపటం మొదలుపెట్టింది.

కూలీ ఉమన్
గాయత్ర బహదూర్
ప్రచురణ: హేచట్
ధర: రూ. 599
పేజీలు: 274
అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాల్లో లభిస్తాయి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17 పతంజలి మహర్షి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17

పతంజలి మహర్షి

సుఖం ,సంతోషం ,ఆనందం మన జీవితానికి ఆలంబన .శరీరానికి లభించే సంతృప్తి ని ‘’సుఖం ‘’అంటాము .మానసిక సంత్రుప్తియే సంతోషం .ఈ రెండిటికి సంతృప్తి కలిగించేది ఆత్మనందం .ఇది ఉత్తమమైనది .దీన్ని సాధించటానికి ఉపయోగ పడేదే ‘’యోగ ‘’

యోగ అంటే సంపూర్ణ స్తాయిలో ఆధ్యాత్మిక పరి భాష కు చెందింది యోగ .మనసు వేరు ఆత్మా వేరు .ఆత్మా కు సంబంధించిన అన్వేషణ మార్గం ఆధ్యాత్మిక చింతన ,ఆధ్యాత్మిక సాధకులను ‘’యోగులు ‘’అంటారు

యోగికి భౌతిక ,మానసిక అవస్తల మీద సాధికారత లభిస్తుంది .మేధావులు ,జ్ఞానులు కంటే యోగి ని ఉన్నతుడుగా భావిస్తారు .ఆధ్యాత్మిక వేత్త యోగి ఒక్కడే .మన ప్రాచీన రుషి పుంగవులు అందించిన యోగ విద్య ను ‘’పతంజలి మహర్షి ‘’అభి వృద్ధి చేసి సామాన్య జనానికి అందు బాటు లోకి తెచ్చారు .యోగ  సాధన వల్ల మన శరీరం లోని ..నిరోటోనిన్ ‘’ధాతువు వృద్ధి చెంది మెదడు లోని ‘’న్యూరో ట్రాన్స్ మిషన్ ‘’ను క్రమ బద్దీకరణ చేస్తుంది అని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు కూడా ధ్రువీకరించారు .శరీరం లో సమ తుల్యత సాధిస్తుందని చెప్పారు.

 

ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల్లో విస్తృత స్తాయి లో శిక్షణ నిస్తున్నారు .జీవశక్తికి మూల భూతమైన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక  పతంజలి యోగ.అధర్వ వేదం లో యోగాభ్యాస సూత్రాలున్నాయి .వీటిని శాస్త్రీయం గా ,సమర్ధ వంతం గా విశ్లేషించిన ఘనత పతంజలి మహర్షిదే .పతంజలి ,ఆశ్వలాయన మహర్షితో కలిసి క్రీ .పూ.1300లోనే ధ్రువ నక్షత్రాన్ని గుర్తించి ఖగోళ శాస్త్ర అభి వృద్ధికి తోడ్పడ్డాడు క్రీ.పూ184లో మగధను ఏలిన ‘’పుష్య మిత్ర ‘కాలం వారే పతంజలి ,ఆశ్వ లాయనులు .పుష్య మిత్ర చేసిన ‘’ఆశ్వ మేధయాగం ‘’కు పతంజలి సాక్షీ భూతుడు పతంజలిని ఆది శేషుని అవతారం గా భావిస్తారు .

Inline image 1

 

patanjali as an avataar of shesha

పతంజలి బీహార్ రాష్ట్రం పాట్నా కు దగ్గర లోని గోవర్ధన నగరం లో జన్మించాడు .పుష్యమిత్రుని ఆస్తాన శాస్త్ర వేత్తగా ,వ్యాకరణ పండితుడుగా పతంజలి వ్యవహ రించాడు .రాజ్య పాలనకు సహకరించాడు .పాణిని వ్యాకరణ సూత్రాలను సరళీకరణం చేసి ‘’చూర్నిక ‘’పేరు తో భాష్యం రాశాడు .అందుకే పతంజలిని ‘’చూర్నికా కారుడు ‘’అంటారు .పాణిని ,కాత్యాయనుల తర్వాత వ్యాకరణ శాస్త్రం లో చివరి వాడు పతంజలి .

‘’యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్య కేన

యో పాఠ కోత్తమ పవరం మునీనాం పతన్జలిం ప్రాంజలి రానతో’’

అంటే మనస్సు ,వాక్కు ,శరీరాలను మూడింటిని స్పటికం లాగా తేటగా శుద్ధి గా పోషించుకోవాలని అర్ధం .పతంజలి యోగ శాస్త్రాన్ని ,వైద్య శాస్త్రాన్ని ,శబ్దశాస్త్రాన్ని క్రోడీకరించాడు .వీటిలో యోగ శాస్త్రానికే ప్రామాణికత లభించింది .ప్రపంచమంతా వ్యాపించింది .ఆయన యోగ సూత్రాలు గొప్ప కీర్తి సాధించాయి .

జగత్తుకు మూలం ప్రక్రుతి శక్తి మాత్రమె నని ,ధ్యాన యోగాన్ని ఆశ్ర యించి అంతర్ముఖాన్ని పొంది ఆంతరంగిక ప్రకృతిని ఏకం చేసిన వారే ప్రకృతిలో

మమేకం అవుతారని పతంజలి చెప్పాడు .మన శరీరం లో ఉన్న నాడీ స్థానాలే చక్ర స్తానాలు .

యమ ,నియమ ,ఆసన ,ప్రాణాయామ ,ప్రత్యాహార ,ధారణ ,ధ్యాన ,సమాధి అనే ఎనిమిది రకాల యోగా భ్యాసాల ద్వారా మనిషి ప్రక్రుతి శక్తి ఏమిటో తెలుసుకో వచ్చునని పతంజలి చెప్పాడు

Inline image 2   Inline image 3

.   .పతంజలి యోగం  ఆధారం గా అనేక గ్రంధాలు వచ్చాయి .యోగా చారి .కే.ఎస్.అయ్యంగార్ ఇందులో ప్రధములు .డెబ్భై రెండేళ్ళు ఈయన యోగా లో గడిపారు ‘’లైట్ ఆన్ యోగా ‘’,’’లైట్ ఆన్ లైఫ్ ‘’రచించారు ఇందులో మొదటిది పది హేడు భాషల్లోకి అనువాదం పొందింది .

యోగ శాస్త్రం ‘’మీద మొట్ట మొదటి సూత్రా గ్రంధాన్ని రాసిన వాడు పతంజలి .’’ప్రాణం ‘’సర్వ వ్యాప్త చైతన్యం గా నిరూపిస్తూ ,స్పందనా శక్తిని పెంచే యోగ సూత్రాలను ప్రపంచానికి అందించిన పతంజలి  మహర్షి యావత్  మాన వాళికీ ఆరాధ్యుడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-13-ఉయ్యూరు

 

.

Posted in సైన్స్ | Tagged | 1 Comment

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు– 53వ సమావేశం –ఆహ్వానం

అక్షరం లోక రక్షకం

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

  పవిత్ర కార్తీక మాస సందర్భం గా ధార్మిక ప్రసంగం

వేదిక  –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –మహిత మందిరం

తేది సమయం —30-11-13-శనివారం –సాయంత్రం -6-30గం .లకు

ప్రసంగ విషయం –‘’పవిత్రం –కార్తీకం –కమనీయం ‘’

ముఖ్య అతిధి ,ప్రధాన వక్త –‘’వ్యాఖ్యాన చక్ర వర్తి ‘’-

శ్రీ అగ్ని హోత్రం శ్రీరామ చక్ర వర్తి –కూచి పూడి

సహ వక్తలు –శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శివలక్ష్మి దంపతులు

 

కార్తీక మాసం లో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర ధార్మిక కార్య క్రమం లో పాల్గొని,విని తరించ వలసిందిగా ఆస్తిక మహా జనులను, సాహితీ ప్రియులను  ఆహ్వానిస్తున్నాం

గబ్బిట దుర్గా ప్రసాద్

సరసభారతి అధ్యక్షులు  -9989066375-08676-232797

జోశ్యుల శ్యామలాదేవి –మాదిరాజు శివలక్ష్మి –గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి                 కోశాధి కారి

తెలుగు లో మాట్లాడటం మన జన్మ హక్కు.

ఉయ్యూరు – 20-11-13-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16

     విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16

—ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు

ఒరిస్సా ముఖ్య పట్టణం  భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ నిర్మాణాలు .ఇవి చూసి ఈ నాటి శాస్త్ర వేత్తలు అలనాటి మన వాళ్ళ వైదుష్యానికి ముక్కున వేలేసుకొంటున్నారు .

The dome of the Parasurameswar TempleSix armed Mahisamardini Durga image on the tower

 

 

.పరాసు రామ దేవాలయం                                             శిఖరం

భువనేశ్వర్ లోని ప్రాచీన ‘’పరశురామాలయం ‘’నిర్మాణం పై దీపక్ భట్టా చార్య 2010లో పరిశోధన చేసి ఎన్నో విషయాలను లోకానికి చాటి చెప్పాడు .ఈ ఆలయ నిర్మాణం మామూలు నిర్మాణ శైలి లో కాకుండా భిన్నం గా ఉందని ముందు గుర్తించాడు .దీనికీ ఖగోళ సంబంధం ఉందని భావించాడు .అతరిక్షం లో నక్షత్రాలు వేర్వేరు దూరాలలో పరచుకొని ఉన్న రీతిలో ఆలయం లోని కొన్ని ముఖ్యమైన కళా రూపాలు కూడా భిన్న భిన్న కోణాలలో ,దిశలలో అమరి ఉండటం చూసి పరమాశ్చర్య పడ్డాడు .తనకున్న పరిజ్ఞానం చాలక ,మరింత లోతుగా అధ్యయనం చేయటం ప్రారంభించాడు .ఈయనకు ప్రహ్లాద చంద్ర నాయక సహకరించాడు .అంతరిక్ష గణితం లో దిట్ట అయిన ప్రహ్లాద కూడా ఏంతో జిజ్ఞాసతో కృషి చేశాడు .చివరికి అంతరిక్షం లో ‘’తారకల అమరిక’’ నే భువనేశ్వర్ లోని ఆలయ నిర్మాణాలలో కూడా ఏర్పరచారని ఇద్దరు తేల్చారు .

 

భువనేశ్వర్ పాత బస్తీ లో ‘’ఏకామ్ర క్షేత్రం ‘’పరిధిలో సముద్ర మట్టానికి భిన్న మైన ఎత్తు లో ఉండే మూడు ప్రదేశాలున్నాయి .ఒక్కో ప్రదేశం లో తొమ్మిది చొప్పున ఇరవై ఏడు ప్రాచీన నిర్మాణాలున్నాయి .ఇవి నక్షత్రాలకు ప్రాతి నిధ్యం వాహించేవే అని వీరిద్దరి పరి శోధన లో తేలింది .ప్రకాశ వంతమైన నక్షత్రాలను ఒక జాబితా గా రూపొందించే ‘’అంతర్జాతీయ ఏల్ కేటలాగ్ ‘’లో ఉన్న 27నక్షత్రాలకు ,ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలు ప్రాతి నిధ్యం వహిస్తున్నాయని ఎత్తూ ,దూరాల విషయం లో వాటి పరస్పర సంబంధాలు కూడా ఇక్కడా ప్రతి బిమ్బిస్తున్నాయని నిర్ధారించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన ఈ నిర్ధారణ కు ‘’కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్’’ (క్యాడ్ )సాఫ్ట్ వేర్ ను వినియోగించుకొన్నారు .

 

అంతరిక్షం లో ఉన్న నక్షత్ర మండలాలకు ,భూమి మీద ఉన్న ఈ నిర్మాణాలకు ఉన్న సంబంధాన్ని తులనాత్మకం గా అధ్యయనం చేసిన తర్వాత మన ప్రాచీనులు తారా మండలాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపిక చేసిన ప్రత్యెక ప్రదేశాలలో ఈ నిర్మాణాలు చేశారని స్పష్టం చేశారు .భువనేశ్వర్ లో ‘’బారంగ ఘడ్ ,శిశుపాల్ ఘడ్ మొదలైన శివారు ప్రాంతాల్లో చతురస్రాకా రాలలో ఉన్న కోటలను అంత రిక్షం లోని ‘’పిగాసన్ స్క్వేర్ ,క్రేటర్ నక్షత్ర మండలాలకు ప్రతి నిధులుగా నిర్ణయించారు .అలాగే రెండు త్రిభుజా కారాల్లో రూపొందించి నట్లు కనీ పించే ‘’సెటస్’’నక్షత్ర మండలం ‘’ఖంద గిరి,ఉదయ గిరి ప్రాంతాలను ,’’వేలా ‘’నక్షత్ర మండలం భువనేశ్వర్ తూర్పు తీరం లోని ఓడ రేవునూ సూచిన్చేట్లు ఉండటం విశేషమైన విషయం .

భట్టా చార్య ,ప్రహ్లాదలు 2000  మే నెలలో ఒక సదస్సు జరిపి తమ పరిశోధనలు  ఊహా  గానాలు కావని సభా ముఖం గా బహిర్గతం చేశారు

. వీరి ఖగోళ గణితం ప్రకారం  విడి విడిగాను,సంయుక్తం గాను కనీ పించే  33 నక్షత్రాలకు కేంద్రం గా భావించే ‘’బేబెల్ గూస్ ‘’ అంత రిక్ష స్థానం ,వీరి ఖగోళ గణితం ప్రకారం భువనేశ్వర్ లోని ‘’పరశు రామాలయం ‘’ప్రాంతాన్నే సూచిస్తోంది .ప్రకాశ వంతమైన ఎరుపు రంగు లో ఉండే ‘’బెటల్ గూస్ ‘’నక్షత్రాన్ని ఋగ్వేదం తెలియ జేస్తోంది .పరశురామేశ్వరం లో శివ లింగం మామూలుకు భిన్నంగా ప్రకాశ వంతమైన ఎరుపు రంగులో ఉండటం ఇక్కడి విశేషం .దీన్ని కేంద్రం గా తీసుకొని ఊహా రేఖలను  గీస్తే అంతరిక్షాన్ని60 డిగ్రీల కోణం లో ఆక్రమిస్తూ ఏర్పడే మహా నక్షత్రం ‘’తారక ‘’ఆకారం కూడా ‘’ఏకామ్ర క్షేత్ర ఆలయ ‘’లక్షణాలతో సరిగ్గా సరి పోవటం  మరీ విశేషం .’’ఆరియస్ ,కాసియోపియా ,హైడ్రా ‘’‘’మొదలైన అనేక నక్షత్రాల జాడలను కూడా ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలలో ప్రతి బిమ్బింప జేసిన ఘనత,  మేధా శక్తి మన ఆలయ  స్తపతులకు ఉండటం ఏంతో ఆశ్చర్య జనక విషయం .అందుకే ఖగోళాన్ని భూగోళం పై దింపారు అలనాటి మన శిల్ప స్రష్టలు అని ముందే చెప్పాను

.

ఇక్కడ ఇంకో ఆశ్చర్య కరమైన విషయం కూడా ఉంది .నక్షత్రాల ప్రాతి నిధ్యం వహించే ఈ భువనేశ్వర్లయాల నిర్మాణం లో ఆలయాల అభి వృద్ధికి ,పతనానికి కూడా ఆయా నక్షత్రాల గమనంతో  సంబంధం ఉందని పరిశోధకులు చెప్పారు .’’సిగ్నస్’’నక్షత్ర మండలం ను ఒరియా భాషలో ‘’చాయా లేక అగ్ని ‘’అని అంటారు .అది తన ప్రదేశాన్ని మార్చుకోన్నప్పుడు భూమి మీద అది ప్రాతి నిధ్యం వహించే నిర్మాణాలు ,ఆలయాలు శిధిలం గా మారటాన్ని ఇందుకు రుజువుగా సూచించారు .పూరీ భువనేశ్వర్ ‘’ప్రాచీ లోయ ‘’లోని ‘’కోణార్క్ ‘’లలో ఉన్న ఈ నాడు కనీ పించే శిధిలాలు ఇవే .

భువనేశ్వర్ లో అతి భారీ స్తాయి ఆలయం ‘’లింగ రాజు ‘’ఆలయం  పై భాగం మామూలు ఆలయాలకు భిన్నం గా ‘’పినాక ధనువు ‘’పేరుతొ ఒక విల్లు ఆకారం లో ఉండటం విశేషం .శాస్త్ర వేత్తల లెక్క ప్రకారం ఇది ‘’రేజేల్ ‘’నక్షత్ర మండలానికి ప్రతీక .ఆ నక్షత్ర మండలం ధనుస్సు ఆకారం లోనే ఉంటుంది .ఈ విధం గానే ఈ ఆలయ శిఖరం కూడా అలా ఉండేట్లు నిర్మించారన్న మాటకనుక మన ప్రాచీనుల శాస్త్ర అవగాహనయెంత విశాలమైనదో, లోతైనదో అర్ధం అవుతోంది .ఖగోళ శాస్త్రమే కాదు వైద్య శాస్త్రం లోను ఇప్పుడు ఆలయ నిర్మాణ శాస్త్రం లోను మన వారి ప్రతిభ అంతరిక్షాన్ని ముట్టిందని అర్ధమవుతోంది కదా .

  Inline image 1

లింగ రాజ దేవాలయం                  లింగరాజ ఆలయ విమానం

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-13-ఉయ్యూరు

 

 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

షష్టిపూర్తి..లేడీస్ ఓన్లీ

హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థినులు వీళ్లు. మరి ఇప్పుడేంటి ఫోటోకు పోజు పెట్టారంటారా? వీళ్లంతా కలిసి తమ అరవయ్యో పుట్టినరోజును ఒక రిసార్టులో సంబరంగా చేసుకున్నారు. అసలు తామంతా ఎలా కలిశారు, కలిసి చేసిన పనులేంటి, బాల్య స్నేహితుల కలయిక తమపై చూపించిన ప్రభావం ఎలాంటిది – ఇవన్నీ సరదాగా చెబుతున్నారు వాళ్లు…

“హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో 1969 – 70 లో పదో తరగతి పూర్తి చేసిన బ్యాచ్ మాది. మాలో కొందరైతే ఏకంగా ఒకటో తరగతి నుంచి క్లాస్‌మేట్స్. ఆ తర్వాత బియ్యే, బీకామ్, మెడిసిన్, ఇంజనీరింగ్ – ఇలా ఎవరికి తోచిన పైచదువులకు వాళ్లు వెళ్లిపోయాం. అటుపైన పెళ్ళిళ్లు, పిల్లలు సంసారాలు… అవన్నీ మామూలే. ‘నాతో పాటు చదువుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో’ అన్న ఆలోచన మా అందరిలోనూ మెదిలేదిగాని ఎలా కనుక్కోవాలో తెలియక ఊరుకున్నారు ఎవరికివారు.

కలిస్తేనే కలదు సుఖం
సమాచార సాధనాలు పెరిగి సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లు ఇంతగా విస్తరించాక కూడా స్నేహితుల జాడ కనిపెట్టలేకపోవడం ఏమిటి అనుకుంది మా నేస్తం అమరిపు రామశేషు. అమెరికాలో స్థిరపడిన ఆమె కొన్నాళ్లు శ్రమించి అక్కడే ఉంటున్న మరో పదిమంది చిరునామాలు, ఫోన్ నెంబర్లు సంపాదించింది. అలా ఎన్నో ఏళ్ల తర్వాత మేం కలిశాం. ఒకర్నొకరు పలకరించుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక ప్రణాళిక వేసుకుని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న సరస్వతి ఇంట్లో 2007లో పద్నాలుగు మంది కలుసుకున్నాం. మా చిన్నప్పటి కబుర్లు, బడి విశేషాలు… అన్నీ కలబోసుకుంటుంటే ఆ భావన ఎంతో అద్భుతంగా ఉన్నట్టనిపించింది. దాని తర్వాత ఏడాదికి ఒకరి ఇంట్లో కలిసేలా ప్లాన్లు వేసుకున్నాం.

కలవడం అంటే ఉదయాన్నే వచ్చి సాయంత్రానికి ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లేలా కాదు. ఇంట్లోని మగవాళ్లను బయటకు పంపేసి రెండు మూడు రోజుల పాటు పూర్తిగా మేమంతా కలిసి ఉండేలా వండుకుని తినడం, సరదాగా ఎటైనా బైటకెళ్లడం వంటివి చేసేవాళ్లం. దీనికి భర్తాపిల్లలు కూడా సహకరించేవారు. అలా కలిసినప్పుడే ఇండియాలో ఉన్న వాళ్ల ప్రస్తావన వచ్చేది. వాళ్లేం చేస్తున్నారో, ఎలా ఉన్నారోనన్న బెంగ మాలో కలిగేది. నెమ్మదిగా ఇక్కడున్న కొందరి ఫోన్ నెంబర్లు కూడా సంపాదించాం. ఇక్కడివారు అక్కడికొచ్చినా, అక్కడివారు ఇక్కడికొచ్చినా మిగిలిన అందరినీ కలిసి వెళ్లడం నియమంగా పెట్టుకున్నాం. మేం అక్కడ కలిసినప్పటి కబుర్లు, ఫోటోలు అందరితో పంచుకునేవాళ్లం. మా స్ఫూర్తితో ఇండియాలో ఉన్న మిత్రులు కూడా ఏడాదిలో ఒకటి రెండు సార్లు కలవడం మొదలుపెట్టారు.

అంతరాల్లేని ఆప్యాయత
‘వాళ్లు మనకన్నా బాగా చదువుకున్నారు. అమెరికాలో ఉంటున్నారు. ఆర్థికంగా బాగున్నారు. వాళ్లు మనతో ఎలా ఉంటారో ఏమిటో’ అని సంకోచించారు ఇక్కడున్న మా స్నేహబృందంలోని ఇద్దరుముగ్గురు. ఒకసారి కలుసుకున్నాక అవన్నీ అకారణ భ యాలే అని అర్థమయ్యాయి వారికి. బడి పిల్లలుగా ఏ భేదాలూ లేకుండా ఒక్కటిగా మెలిగినవాళ్లమే కదా. పెద్దయ్యాక ఎవరి సంసారాలు వాళ్లవి. చదువులు వేర్వేరు అయినట్టే అంతస్తుల్లో అంతరాలు బోలెడు. ఎవరికుండే కష్టసుఖాలు వారికున్నాయి. అందరం కలిసినప్పుడు వీటన్నిటినీ మర్చిపోతాం. మనసు విప్పి మాట్లాడుకుంటాం. ఆటాపాటాతో సరదాగా గడిపే మాట నిజమే. కాని కేవలం వాటికే పరిమితమైపోతే పెద్ద వయసులో స్నేహితులంతా కలిసిన ప్రయోజనం ఏముంటుంది? అదీ ఆలోచించాం.

అందుకే మేమంతా ఒకరికొకరు అండగా ఉండాలన్న ప్రయత్నం చేస్తుంటాం. యోగక్షేమాలు కనుక్కొని సమస్యలకు పరిష్కారాలు అందిస్తాం. అందరమూ అరవ య్యో పడిలోకి వచ్చినవాళ్లమే గనక ఆరోగ్యాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఒకరికొకరు చెప్పుకుంటాం. ‘మనమంతా ఏడాదికోసారి ఇలా కలుస్తుంటే ఒంట్లోకి కొత్త బలం వచ్చినట్టుందే. నాకు ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి ఇంతమంది బ్రహ్మాండమైన స్నేహితులున్నారన్న భావన ఎంత ధైర్యాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.

అరవై కాదు, డె బ్భై వచ్చినా నాకే జబ్బూ రాదు ఇకపై….’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది మా స్నేహితురాలు ఒకామె. మాలో విజయ పాటలు స్వయంగా రాసి పాడుతుంది. ఆమె వేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ ఆ్రర్దంగా పాడిన పాటలు విని మా అందరికీ కళ్లు చెమర్చాయి. ఇలాంటి ఎన్నో ఆనందానుభూతులను మూటగట్టుకుని అమెరికా వెళ్తున్నాను. మళ్లీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న ఆరాటం మా అందరిలోనూ ఉంది.” అని చెప్పారు ఈ స్నేహితులు… సులోచన, విజయ, జయశ్రీ, గీత, శివకుమారి, జయ, రామశేషు, గిరిజ, సులోచన, స్వర్ణ సుందరి, సీత, భారతి.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ –

నిన్న అంటే పద్దెనిమిదో తేది రాత్రి తొమ్మిదింటికి మిత్రుడు జి.వి.పూర్ణ చంద్ ఫోన్ చేసి గుత్తి కొండ సుబ్బా రావు గారి భార్య గారికి సుస్తీ చేయటం వల్ల ఆమెను విజయ వాడ మ్యూజియం వెనుక ఉన్న ‘’హెల్ప్ హాస్పిటల్ ‘’లో చేర్చి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో ఉంచారని తెలియ జేశారు .మొన్న కంగారుగా ఉందని ఇవాళ కొంతనయం అని అన్నారు నేను వెంటనే సుబ్బా రావు గారికి ఫోన్ చేసి మాట్లాడాను .ఆయన’’ఆమె  బాడీ మందులకు  రెస్పాండ్ కావటానికి ఒకటి రెండు రోజులు పట్ట వచ్చునని ,అప్పటి దాకా డాక్టర్లు ఏమీ చెప్పలేమన్నారు ‘’అని చెప్పారు .సరే నేను రేపు వస్తానని చెప్పగా ‘’అంత శ్రమ పడి రావద్దన్నారు .కాని వాళ్ళందరూ నన్ను తమ ఆత్మీయులుగా భావించే వారు కనుక నేను ఒక సారి వెళ్లి చూసి రావటం నాధర్మం అనుకొన్నాను.

ఇవాళ ఉదయం నేను ఇంట్లో పూజ ,అభిషేకం చేసుకొని టిఫిన్ తిని కాఫీ తాగి తొమ్మిదిన్నరకు బయల్దేరి బేజ వాడ హెల్ప్ ఆస్పత్రికి వెళ్లాను .అక్కడ కే .వెంకట రావు ,సుబ్బారావు గారి తమ్ముడు కనీ పించారు .వెంకటరావు నన్ను బయట కాఫీ తాగుతున్నసుబ్బారావు గారి దగ్గరకు

తీసుకొని వెళ్ళాడు .అక్కడ అప్పటికే పువ్వాడ తిక్కన సోమయాజి గారున్నారు . నాకు కాఫీ ఇస్తే తాగాను .కాసేపు అక్కడే ఉండి అందరం లోపలి వెళ్లాం.సుబ్బారావు గారి భార్య ఐ.సి.లోనే ఉన్నారని ఇవాళ ఉదయం డాక్టర్ వచ్చి చూసి ఆమె బాగా రెస్పాండ్ అవుతున్నారని చెప్పారని సుబ్బారావు గారు చెప్పారు .ఈ మధ్య దాకా ఆమె ను హైదరాబాద్ లో వైద్యం చేయించి ఈ మధ్యనే బందరు తీసుకొచ్చామని ఇంట్లో యాభై రెండు వేలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ డాక్టర్ సలహా పై కొని ఆక్సిజన్ అందిస్తున్నామని కాని ఊపిరి పీల్చటం ఈ మధ్య మరీ కష్టం అయి నందున మళ్ళీ బందర్లోనే హాస్పిటల్ లో చేర్చామని కాని మరీ శనివారం ఊపిరి పీల్చటం చాలా ఇబ్బంది చేయటం వల్ల  డాక్టర్ సలహాపై ఇక్కడి హెల్ప్ హాస్పిటల్ కు  అంబులెన్స్ లో తీసుకొని వచ్చి శనివారం చేర్చామని ,డాక్టర్లు ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారని కంగారులో పెద్దమ్మాయిఅమెరికా నుంచి  వచ్చేసిందని,చిన్నమ్మాయి కాలిఫోర్నియా నుంచి ఉదయమే హైదరాబాద్ చేరిందని మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరి ఇక్కడికి వస్తుందని మూడో అమ్మాయి ఇరవై నాలుగో తేదీకి వస్తుందని చెప్పారు .

ఇంతలో పెనమకూరు లో నా శిష్యుడు, మా ఇంట్లో ఈ మధ్య దాకా అద్దెకున్న హనుమంతరావు తండ్రిపూర్వ తెలుగు పండిట్  రామేశ్వర శర్మకనిపించాడు మాటల సందర్భం లో ఆతను ‘’లక్షలు పోయాయి ,ఆవిడా పోయింది ‘’అన్నాడు .ఎవరి గురించి ఏమిటి అన్నాను .అప్పుడు చెప్పాడు తన భార్య ను ఇక్కడే అడ్మిట్ చేశానని కాని లక్షలు ఖర్చు పెట్టినా దక్కలేదని దరిద్ర గొట్టు  హాస్పిటల్కు తీసుకోచ్చానని  ఇప్పుడు బాధ పడుతున్నానై వెళ్ళ బోసుకొన్నాడు .ఇప్పుడు ఎందుకోచ్చావని అడిగితె ‘’పిల్ల పోయినా పీతికంపు వదల నట్లు యేవో మెడికల్ బిల్ల్స్ ‘’కోసం వచ్చానని చెప్పాడు .మీ అబ్బాయి హనుమంత రావు ఎలా ఉన్నాడని అడిగితె ‘’వాడినీ ఇక్కడే చేర్చారు .బాగైంది డ్యూటీలో చేరి పని చేస్తున్నాడు ‘’అన్నాడు .అంటే ఇక్కడ బాగుపడటం లేక పోవటం ఆసు  పత్రీ తప్పుకాదు మన అదృష్టం కూడా అని మేము అనుకొన్నాం .

కాసేపటికి కే.ఎల్ శర్మ గారు కూడా అక్కడికి వచ్చారు . మాటల సందర్భం లో సుబ్బారావు గారు ఈ మధ్య బుద్ధ ప్రసాద్ గారు చాలా తీవ్ర స్వరం లో మాట్లాడుతున్నారని ఆ మధ్య అవని గడ్డ్డలో మాట్లాడుతూ ‘’ఈ ఇరిగేషన్ వాళ్ళు కనిపిస్తే కర్రలు తీసుకొని వెంట పడి  తరమండి .మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే .నేను చూసుకొంటాను ‘’అన్నారని అజాత శత్రువు గా ఉండే వాడు ఇంత కోపం గా మాట్లాడటం ఇప్పుడే నని అన్నారు .అలాగే సమైక్యాంధ్ర మీద మాట్లాడుతూ ‘’పైన ధిల్లీ లో ఒక పిశాచం ఉందని, దాని చుట్టూ ఆయా రాష్ట్రాలలో చెల్లని దెయ్యాలు దీని చుట్టూ చేరి అందర్నీ పీక్కు తింటున్నాయని ,ఈ రాష్ట్రం ఈ భాష ,సంస్కృతీ గురించి ఆ పిశాచానికి కాని పిల్ల పిశాచానికి కాని తెలియవని ఇదీ మన దురద్రుస్టమని ‘’అన్నారని చెప్పారు .అప్పుడు నేను ‘’నిజమే.ఇంత తీవ్ర స్వరం తో ఈ నెలలోనే బుద్ధప్రసాద్ మాట్లాడారు సహనం నశించి ,ఓర్పు  ఎలాస్టిక్ లిమిట్ దాటి ఆవేశం ,ఆవేదన తోమాట్లాడిన తీరు అని ‘’అన్నాను .నిజమే నన్నారు .

నేను వెళ్ళిన ఒక అరగంట కు పూర్ణ చంద్ గారు కారీర్ తీసుకొని వచ్చారు .సుబ్బారావు గారి భార్య కోసం ఇంటి దగ్గర మెత్తగా అన్నం వండించి పప్పు కూర ,పెరుగు తో తెచ్చిన కారియర్ అది .సుబ్బారావుగారి తమ్ముడు లోపలి తీసుకు వెళ్ళారు .అప్పుడు సుబ్బారావు గారు ‘’పూర్ణ చంద్ శని వారం నుంచి ఇక్కడ నాతోనే ఉన్నాడు .పళ్ళుతోముకోవటానికో ఇలా కారీయర్ తేవటానికో తప్ప మిగతా సమయ మంతా నాతోనే ఉన్నాడు నాకు కొండంత బలం గా ఆసరాగాఉన్నాడు ‘’అన్నారు ‘’అదేమిటి సుబ్బారావు !మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన వాళ్ళం .నా ధర్మం నేను చేస్తున్నాను ‘’అన్నాడు .నిజం గానే వాళ్ళిద్దరూ ‘’జీవికా జీవులు ‘’.స్నేహం కంటే ఆత్మీయ మైన వాళ్ళు .

కాసేపు మా సంభాషణ రాజకీయం పై మళ్ళింది రాష్ట్రం విడి పోవటం ,కోర్టు కేసులు ,విడి పొతే వచ్చే నష్టాలు గురించి మాట్లాడుకొన్నాం .పూర్ణ కొన్ని చారిత్రిక సత్యాలను చెప్పాడు .1750లో బందరు జిల్లా అటు కొవ్వూరు వరకు ,ఇటు ఒంగోలు వరకు విస్తరించి ఉండేదని , అప్పుడు మచిలీ పట్నం పెద్ద ఓడ రేవు కేంద్రం అని ,ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వస్త్రాలు ఎగుమతి అయ్యేవని గొప్ప వాణిజ్య నౌకా కేంద్రం గా మచిలీ ఓడరేవు వెలిగి పోయిందని ,కాని ఇక్కడి ఈస్ట్ ఇండియా కంపెని వాళ్ళు ‘’న్యూ ఈస్ట్ ఇండియా కంపెని ‘పేరుతో  పాలన సాగించి ఇక్కడి చేనేత వస్త్రాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఇక్కడి నేత గాళ్ళదగ్గర  అప్పులు చేసి సరుకు కొని ఎగుమతి చేసి విపరీత లాభాలు సంపాదించారని చివరికి నేతన్నలకు డబ్బు ఎగ్గొట్టి మున్చేశారని ,ఇక్కడ లాభం లేదనుకొని ,బందరు రేవుపట్నాన్ని  పాడు పెట్టి ,మద్రాస్ చెక్కే శారు  అక్కడ వ్యాపారం చేస్తూ అక్కడి రేవును అభి వృద్ధి చేశారని చెప్పారు .దీనితో బందరు జీవితం సగం దెబ్బతిని పోయి కళా విహీన మైనదని అన్నారు .ఆ తర్వాత 1920లో గుంటూరు జిల్లా వేరై పోవటం తో బందరుకు మిగతా కళ తప్పి పోయిందని ,ఆ తర్వాత గోదావరి జిల్లాలు వేరై పోవటం వల్ల  బందరు శూన్యం అయి పోయిందని ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు దేనికీ ప్రాధాన్యత లేకుండా పోయిందని పూర్ణ అన్నాడు

రాష్ట్ర విభజన ఆపమంటూ మన వాళ్ళు కొందరు  హైకోర్టుకు ,సుప్రీం కోర్టుకు వెళ్ళారని కాని న్యాయాధిపతులు ‘’ప్రి మేచూర్’’అని కేసులు స్వీకరించలేదని అంత మాత్రం చేత ‘’తిరస్కరించటం ‘’కాదని చెప్పారని కాని కేంద్రం అసెంబ్లీ కి బిల్లు పంపక పోయినా ,పార్ల మెంటు లో సజావుగా చర్చ జరగక పోయినా తమను ఆశ్రయించ వచ్చునని అది

సరైన సమయం అని అప్పుడు మా తడాఖా చూ పిస్తాము .’’అని హామీ ఇవ్వటం దేశ చరిత్రలో గమనించ దగ్గ విషయమని కోర్టులు ఇంత గొప్పగా స్పందించటం ప్రజా విజయమే నని కనుక కేంద్రం కాని ఎవరైనా అన్యాయం గా ఏ విధమైన ‘’బై పాస్ ‘’చేసినా కోర్టు కొరడా ఝాళిపిస్తుందని చెప్పాడు పూర్ణ .

తర్వాత మా సంభాషణ ఒక వేళవిభజన జరిగితే హైదరా బాద్’’ ‘’బాధ’’ ఏమిటి అన్న అంశం మీదకు మళ్ళింది .అప్పుడు మళ్ళీ పూర్ణ’’ఇప్పటికే చత్తీస్ ఘడ్ లో తెలంగాణా వారే  నక్సలైట్లుగా చాలా మంది ఉన్నారని ఇంటెలి జేంస్ వర్గాల భోగట్టా ఇచ్చిందని శ్రీ కృష్ణ కమిటి విభజన  విషయమై ఏంతో లోతుగా ప్రతి సూక్ష్మ విషయాన్నీ చర్చించి సూచనలు చేసిందని దాన్ని పక్కన పెట్టి ఏ కొద్ది మందో ఈ రాష్ట్రం అంటే ముక్కూ మొహం తెలియని ముఠా విభజన నిర్ణయం చేయటం బాధాకరమని ,విభజన జరిగితే హైదరాబాద్ నుంచి కోస్త ఆంద్ర వారికి సీమ వారికి ఏ రకమైన ఇంటరెస్ట్ హైదరాఆద్ మీద ఉండదని ,అంత దూరం ఉన్న శంషా బాద్ ఎయిర్ పోర్ట్ కెందుకు? హాయిగా మద్రాస్ కే వెళ్లిఊరి మధ్యలో ఉన్న ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలని అని పిస్తుందని ,ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టి యెన్తొఅభివ్రుద్ధి చేసిన సీమాన్ద్రులకు ఇక ఇక్కడి అభి వృద్ధిపై మోజు ఉండదని ఇక్కడ పెట్టుబడి పెట్టె సాహసం చేయరని ఇది మార్వాడీలకు మహారాస్త్రీయులకు ఒక వరం అయి మొత్తం వాణిజ్యం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్లి పోతుందని ఇప్పటికే హైదరాబాద్ మిలిటెంట్ల కు అండర్ గ్రౌండ్ గా ఉందని ఇక కేంద్ర బిందువే అయి పోతుందని ,హైదరాబాద్ ప్రాభవం మనం అందరు వదిలి పెట్టి వెళ్తే కోల్పోయి కళా విహీనమై, బందరుకు పట్టిన గతే పడుతుందని చెప్పాడు పూర్ణ చంద్ .ఈ విషయాలను ఈ మధ్య బుద్ధ ప్రసాద్ కు చెబితే ‘’మంచి పాయింటు చెప్పావు పూర్నా !బాగుంది .వీటి మీద మనం అవాగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం ‘’అన్నాడని చెప్పాడు పూర్ణ .ఈ రకం గా దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలో ‘’నిలువు కాళ్ళ మీద ‘’నిలుచునే మాట్లాడుకొన్నాం మంచి విషయాలనే చర్చిన్చుకోన్నాం .మధ్యాహ్నం ఒంటి గంటకు వారందరికీ వీడ్కోలు చెప్పి ,బస్ ఎక్కి రెండింటికి ఉయ్యూరు చేరుకొని భోజనం చేశాను .నన్ను వారితో బాటు హోటల్ కు రమ్మని అక్కడ భోజనం చేద్దామని సుబ్బారావు, పూర్ణ అంటే మా ఇంటికి రమ్మని సోమయాజి గారు ఆహ్వానిస్తే మర్యాదగా ఒద్దని చెప్పి ఇంటికి వచ్చేశాను

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-13-ఉయ్యూరు

.

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్

1konakalla 001 2konakalla 001 3konakalla 001

కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేదమంత్రాలు శతకాలకు భూమికలు -మూసి నవంబర్

1vedamantraalato shatakalu 001 2veda mantralato shatakalu 001 3vedamantralato shatakalu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కళా దర్పణం మరియు దాశారదికి నివాళి (కవిత )-మూసి -నవంబర్

dasaradhi pai kavitha 001 pracheena kalaa darpanam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15

కొందరు అలనాటి వైద్య శాస్త్రజ్ఞులు -2

అరుణ దత్త

పన్నెండవ శతాబ్దికి చెందిన బెంగాలీ వైద్య శాస్త్ర వేత్త .వ్యాఖ్యాన కర్త గా మంచి పేరు .వాగ్భాతుని ‘’అష్టాంగా హృదయ ‘’మీద వ్యాఖ్యానం గా ‘’సర్వాంగ –సుందర ‘’రాశాడు .సుశ్రుత సంహిత మీద కూడా వ్యాఖ్యానం రాశాడు .కాని లభ్యం కావటం లేదు .భూగర్భ శాస్త్రం ,భావన నిర్మాణ శాస్త్రం మీద’’మనుప్యాలాయ చంద్రిక ‘’రచించాడు .

ఆత్రేయ పునర్వసు

ఎనిమిదో శతాబ్దపు వైద్య వేత్త .వసిష్ట మహర్షికి కుమారుడు .హిందూ వైద్య శాస్త్రానికి మొదటి క్రమానుగత అధ్యాపకుడు. భారద్వాజ మహర్షి శిష్యుడు .బ్రహ్మ ప్రజాపతి మొదలైన ఆరుగురు శిష్యులు –అగ్ని వేశ ,జాతుకర్ణ ,భేళ ,హరిత క్షార పాణి ,పరాశరులు సంయుక్తం గా ‘’కాయ చికిత్స ‘’మీద రాసిన వాటిని క్రోడీకరించాడు .వ్యాదుల్ని సాధ్య, అసాధ్య, య్హాప్య అనే వర్గాలుగా విభ జించాడు .’’ఆత్రేయ సంహిత ‘’అనే ఆయన

సంపుటీకరణ  గ్రంధం మన దేశం లో అతి ప్రాచీన వైద్య గ్రంధం .ఇందులో 4,65,ooo శ్లోకాలున్నాయి .

మోరేశ్వర

పది హేడవ శతాబ్దికి చెందిన వాడు .తండ్రి మాణిక భట్టు సుప్రసిద్ధ వైద్యుడు .’’నిదాన సిద్ధి ,వైద్యామృత ‘’గ్రంధాలు రాసి అందులో ఎన్నో రోగాల చికిత్సలను వివరించాడు .

మిల్హణ

పదమూడో శతాబ్దం లో త్రిభువన గిరి లో పుట్టాడు .తండ్రి కులోద్ధార .’’చికిత్సా మిత ‘’సంస్కృత గ్రంధాన్ని రాశాడు .నాలుగు వేల శ్లోకాలున్న గ్రంధం ఇది

సారంగధర

1363లో లో జన్మించాడు .యితడు రాసిన ‘’సారంగధర సంహిత ‘’వైద్య సిద్ధాంత గ్రంధం .రెండో పుస్తకం ‘’సారంగధర పధ్ధతి ‘’నీతి విషయాల సంకలనం .ఇతని గ్రంధాలు గొప్ప పేరు పొందాయి .

శివ దాస సేన

1448 లో భీర్భం  లో పావన జిల్లాలో ఉండే వాడు .బార్బరాషా రాజు ఆస్తాన వైద్యుడు గా ఉన్నాడు .’’తత్వ ప్రదీపిక ,తవ బోధ వ్యాఖ్య టీకా ,ద్రవ్య గుణ సంగ్రహ ‘’అనే వ్యాఖ్యాన గ్రంధాలు రాశాడు .

శోధల

పన్నెండవ శతాబ్ది లో గుజరాత్ లో జన్మించాడు .విద్యా నందన కి కుమారుడు .’’బాధ నిగ్రహ ,గుణ సంగ్రహ ‘’అనే రెండు వైద్య గ్రంధాలు రాశాడు .’’భేషజకల్పన’’ లో ఎనిమిది విభాగాలలో వైద్యం లోని సార సంగ్రహాన్ని రాశాడు .ఇది ఒక నిఘంటువు గా గుర్తింపు పొందింది .మూడు వందల ఔషధ గుణాలను వివరించిన పుస్తకం .

భారద్వాజ

ఏడవ శతాబ్దికి చెందిన వైద్య శాస్త్రజ్ఞుడు .బృహస్పతి కుమారుడు .భారతీయ ఆయుర్వేదానికి కృషి చేసిన మొదటి శ్రేణిలోని వాడు .మంచి పరిశోధకుదని కీర్తి పొందాడు .ఈయన వాచా చెప్పిన విషయాలే

 

‘’సామాన్య –విశేష –గుణ –ద్రవ్య –కర్మ –సమన్వయ ‘’గ్రంధం గా రూపు దాల్చింది .మూత్ర సంబంధ వ్యాధులకు ‘’భారద్వాజీయం ‘’రాశాడు .ఔషధాల తయారీ కి ‘’భేషజ కల్ప ‘’రాశాడు .

నరహరి భట్టు

పధ్నాలుగో శతాబ్ది లో భట్ట సుదేవకు జన్మించాడు .వాగ్భటుని ‘’అష్టాంగ హృదయ ‘’కు విద్యాధరుడు రాసిన దుర్ వ్యాఖ్యానాలకు ప్రతిగా ‘’వాగ్భట ఖండన మండనం ‘’రాశాడు .చరక సుశ్రుత సంహితల నుంచి అనేక విశేషాలను సేకరించి తన దైన శైలిలో వ్యాఖ్యాన గ్రంధం గా రాసి ఘన కీర్తి సాధించాడు .

ఇలా ఎందరో వైద్య శాస్త్ర మహాను భావులు –అందరికి వందనాలు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-మరియు ”నిర్వచనాలు ”

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-

 
 
ఫేస్ బుక్ లో ఎవరో చచ్చారని పోస్ట్ లైక్ చేసే ”పింజారీ”!
ఫేస్ బుక్ లో త్విత్తర్ కోసం వెదికే దరిద్రపు సన్నాసీ !
ప్రొఫైల్ పిక్చర్లు హాక్ చేసే నికృష్ట దుస్టాత్ముడా ! 
పొద్దున్నే లేచి పాచి మొహం తో స్మైల్ పోస్ట్ చేసే సోంబేరీ! 
మొబైల్ లో ఆటోమాటిక్ వాయిస్ లకు రిప్లై ఇచ్చే ఏబ్రాసీ !
ఒసామా బిన్ లాడెన్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపే బల్లి మొహం బుద్దాడా !
ఏ కామెంట్ కైనా లైక్ కొట్టే భ్రస్ట్రాతి భ్రస్టా! 
బ్యాంక్ మెసేజ్ ల కోసం ఫేస్ బుక్ ఐ.డి.ఇచ్చే శుంఠా!
ఇంట్లో దువ్వెన పొతే గూగుల్ లో వెతికే గుంట నక్కా !
కామెంటు కోసం ఎదురు చూసే అంకు పక్షీ !
నీ గ్రూపులో ఒకటే ఒక్క మెంబరు  ఉండే ఏకాకీ !
పోతావురా !పోతావు .ఫేస్ బుక్ లో అకౌంటు కూడా లేకుండా పోతావు .
               నిర్వచనాలు
school-a place where parents pay and children play
lifeinsurance –a contract that keeps you poor all your life so that you cam die rich
nurse -a person who wakes you up to give sleeping pills
marriage -it is an agreement in which a man loses his bachelor degree and a woman gains her masters
conference -the confusion of one man multiplied by the number present
father -a banker provided by nature .
boss -some one who is early when you are late and late when you are early .
criminal -a person no different from the rest .except he or she caught .
politician -one who shakes your hand before elections and your confidence there after .
doctor -a person who holds your ills by pills and kills you by pills .
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14

కొందరు సంప్రదాయ వైద్య శాస్త్రజ్ఞుల

అగస్త్య మహర్షి

అగస్త్య క్రీ.పూ.ఎనిమిదో శతాబ్దానికి చెందిన రుషి భరద్వాజ మహర్షి శిష్యుడు .దక్షిణ భారతం లో స్థిర పడ్డాడు .ద్రావిడ సాహిత్యానికి శాస్త్రాలకు ఆద్యుడు .సిద్ధ వైద్యానికి ఏంతోప్రచారం తెచ్చాడు .తిరునల్వేలి జిల్లాలో ‘’సిద్ధకుట’’కొండమీద వైద్య చికిత్సా కేంద్రం స్తాపించాడు .సిద్ధ వైద్యం లో అనేక పరిశోధనలు చేసి ప్రయోగాలు నిర్వహించాడు .’’అగత్తీయ చరక్కు ,ద్వైదని నాయ ,రుదాంది కల్ప’’ అనే మంత్రాలు రచించి నట్లు ఋగ్వేదం లో ఉంది .

Inline image 1   Inline image 2  Inline image 3

 

అగ్ని వేశ

క్రీ..పూ.ఏడవ శతాబ్ది వాడు అగ్ని రుషి కుమారుడు .ఆత్రేయ పునర్వసు వద్ద వైద్య శాస్త్రం నేర్చి గురువు ఉపదేశించిన వైద్య విధానాన్ని ప్రచారం చేశాడు .అనేక వైద్య సిద్ధాంతాలను ప్రతిపాదించాడు .’’అగ్ని వేశ తంత్ర ,అంజనా నిదాన ‘’అనే వైద్య గ్రంధాలు రాశాడు .అగ్ని వేశ తంత్ర నే సంస్కరించి ‘’చరక సంహిత ‘’గా మార్చాడు .ఆత్రేయుని శిష్యులలో మహా మేధావి అని పించుకొన్నాడు కాయ చికిత్స లో అసాధారణ ప్రజ్ఞ కల వాడు .

Inline image 4   Inline image 5

భావ మిశ్రుడు

క్రీ.శ. పదిహేనవ శతాబ్ది వాడు .బనారస్ లో జన్మించాడు 1558.లో రాసిన ‘’భావ ప్రకాశిక ‘’ప్రాచీన వైద్య పాఠ్య గ్రంధం గా పేరొందింది .ఇందులో కారణం ,చిహ్నం ,చికిత్స అని మూడు భాగాలున్నాయి .వీటికే పూర్వ ఖండ ,మధ్య ఖండ ,ఉత్తర ఖండాలని పేరు .ఔషధాల పుట్టుక ,తయారీ ,పరిణామం ,భ్రూణ శాస్త్రం (ఎమ్బ్రియాలజి ),శిశు రోగ చికిత్సా (పీడియాత్రిక్స్ )శరీర నిర్మాణ శరీర ధర్మ శాస్త్రం (ఫిజియాలజీ )ప్రత్యెక వ్యాధుల నివారణ వాటి లక్షణాలు మొదలైన ఎన్నో విషయాలు భావ ప్రకాశిక లో ఉన్నాయి .

 

హరిశ్చంద్ర భట్ట

క్రీ.శ.నాలుగైదు శతాబ్దాల వాడు .’’సహసంక ‘’ రాజు ఆస్తాన వైద్యుడు .వైద్య ,సాహిత్యాలలో మేటి .చరక సంహిత మీద విపుల వ్యాఖ్యానం గా

 

‘’చరక న్యాస ‘’రాశాడు . చరకం మీద వచ్చిన మొదటి వ్యాఖ్యాన గ్రంధం ఇదే .’’ఖర నాద సంహిత ‘’కూడా రాశాడు అని అంటారు  కాని అలభ్యం

కేశవ మిశ్ర

న్యాయ శాస్త్ర వేత్త .పదమూడవ శతాబ్ది చివరి వాడు వైశేషిక సిద్ధాంతప్రభావితుడు.కార్య కారణ సంబంధ సిద్ధాంతాలకు ,వర్గీకరణాలకు ‘’తర్క భాష ‘’గ్రంధం రాశాడు న్యాయ శాస్త్ర దార్శనికుడు గా పేరు .

హేమాద్రి

పదమూడవ శతాబ్దం లో ‘’దేవగిరి ‘’లో పుట్టాడు .అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టాడు .భావన నిర్మాణ శాస్త్రాన్ని మహా రాష్ట్ర భాషలో రాశాడు ఇదే ‘’చతుర్వర్గ చింతామణి ‘’వైద్యం లో ‘’ఆయుర్వేద రసాయనం ‘’అనే సిద్ధాంతాన్ని అసంపూర్తిగా రాశాడు .వాగ్భాటుని ‘’అష్టాంగ హృదయ ‘’గ్రంధానికి ఇది ప్రేరణ అయింది .

హిరణ్య కష

జీవితకాలం తెలియదు .చరక సంహితను స్వంత శిలిలో అభివృద్ధి చేశాడు .’’వ్యాఖ్య –మధు –కోశ ‘’అనే సాధారణ వ్యాధుల పుట్టు పూర్వోత్తరాలు రకరకాల రుచులు మీద విలువైన అభిప్రాయాలు చెప్పాడు.  సాంఖ్య సాంప్రదాయం వాడు .

కేశవ

పదమూడో శతాబ్ది వాడు .వేదాపురం లో పుట్టాడు .తండ్రి మహా దేవుడు .సంస్కృతం లో ‘’సిద్ధ మంత్రం ‘’అనే వస్తు గుణ దీపిక రాశాడు కొడుకు ‘’వోప దేవా ‘’ఈ గ్రంధం పై ‘’సిద్ధ మంత్రం ప్రక్ష  ‘’అనే వ్యాఖ్యాన గ్రంధం రచించాడు .

బాదిస .

శరీర నిర్మాణం పై లోతైన అధ్యనాలు చేశాడు .శరీరం లో అష్ట వ్యస్తలను రూపు మాపేందుకు ముఖ్యంగా వాతాన్ని పోగొట్టేందుకు అనేక చికిత్సలు చెప్పాడు రుచులను ఎనిమిది రకాలుగా వర్గీక రించాడు .గర్భస్థ పిండం ఎదుగు  దలలో ఎదురయ్యే సమస్యలకు మంచి పరిష్కార మారగాలు చూపాడు .ఈతని గురించి మిగిలిన వారు చెప్పటమేకాని అతని వివరాలు మాత్రం తెలియ లేదు

నీల కంఠ బసవ రాజు

పద్నాలుగో శతాబ్ది వైద్య శాస్త్ర వేత్త .కర్నాటక లో దార్వార్ జిల్లా ‘’కొట్ట్ట్టురు నిధే ‘’గ్రామం లో జన్మించాడు .ఆయన రాసిన ‘’బసవ రాజీయం ‘’ప్రముఖ వైద్య గ్రంధం గా ప్రచారం అయింది .దీనిని ‘’వైద్య శాస్త్ర నిఘంటువు ‘’గా ప్రామాణిక మైనదిగా కీర్తిస్తారు .ఇరవై అయిదు అద్యాయాలతో 6,400శ్లోకాలతో అనేక వైద్యామ్శాల కూడలిగా నిర్మించాడు .హిందూ వైద్య శాస్త్ర గ్రంధాలకు బసవ రాజీయం కర దీపిక అయింది .చివరి అధ్యాయ లో ‘’రసఔషధాలు గురించి వివరాలు బాగా ఉన్నాయి రస ఔషధాలు మన రాష్ట్రం లో ,కర్నాటక లో బాగా ప్రసిద్ధి చెందాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-13- ఉయ్యూరు

 

Posted in సైన్స్ | Tagged | 1 Comment

కార్తిక పౌర్ణమి – వ్రతం

This gallery contains 70 photos.

More Galleries | Tagged | Leave a comment

వన భోజనం ఎందుకు? కార్తీక స్నానం ఎలా చేయాలి?

 

కార్తీక మాస వన భోజనాల ప్రాశస్త్యం గురించి, వీటికి పౌరాణికంగానే కాక, సామాజికంగా కూడా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు.

కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో వన భోజనానికి ఎందుకు వెళ్లాలి? దీని వెనక ఒక పరమార్థం ఉంది. అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. వాన ప్రస్థంలో అందరూ అరణ్యంలోనే గడుపు తారు. అరణ్యంలో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక ఆశ్రమం కట్టుకొని, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారు. దానికి సాధనే వనభోజనం. అందుకే వనభోజనానికి పవిత్రమైన హృదయంతో వెళ్లాలి. ఏ ప్రకృతిలో ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఆరోగ్యాన్నిచ్చే ఉసిరి చెట్లు, తులసి చెట్లు, మామిడి చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి.

ఉసిరి, తులసిల గురించి మనకు తెలుసు. మరి మామిడి విశిష్టత ఏమిటి?. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలం అని పేరు. పరమేశ్వరుని పేరు ఉన్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరే ఏ ఇతర వ్రతం గానీ చేయాలి. విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం- ఇవన్నీ సాయంత్రం దాకా చదవాలి. పొద్దు పొడిచిన తరువాత మహా నైవేద్యం పెట్టి భోజనం చేయాలి.

కృష్ణుడి వన భోజనం!
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు, ఇతర స్నేహితులతో- “ఓరేయ్, రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా!” అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎందుకు? ఎందుకంటే- వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా..! అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.. అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలోు ఏ అరమరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.

 

ఙకార్తీక మాస నదీ స్నానానికి ఒక విశేషముంది. ఆ విశేషాలతో పాటు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను కూడా తెలుసుకోవాల్సి ఉంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ విశేషాలను వివరిస్తున్నారు.

కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.

శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్న మాట.

అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్త్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. “నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? ” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే -“గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే ” అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి.

అమ్మవారి రూపాలు
ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో, కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింటాయి. దీని వల్ల వాటి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.

నదీ స్నానం ఎవరు చేయకూడదు?
శ్రావణ మాసంలో నదులు విశేషమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహంలో చాలా సార్లు పాములు కొట్టుకొస్తూ ఉంటాయి. అందువల్ల శ్రావణమాసం నదీ స్నానం చేయవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. శాస్త్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి. అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టుకు వచ్చి కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పురుషులను శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోను నదీ స్నానం చేయవద్దని చెబుతారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ

 

చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, రెండు కవిత్వ శుద్ధి.

‘ఒక వీరుడు మరణిస్తే
వేలకొలది ప్రభవింతురు!
ఒక నెత్తుటి బొట్టులోనె
ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు!’
అని నినదించిన ‘వజ్రాయుధ’ కవి,
‘తెలంగాణ! తెలంగాణ!!
ధీరులకు మొగసాల;
తెలంగాణ! తెలంగాణ!!
విప్లవోజ్వల గాథ’

అంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించిన కవి డా.ఆవంత్స సోమసుందర్ సుమారు ఏడు దశాబ్దుల నుంచి కవిగా, కథకునిగా, విమర్శకునిగా, అనువాదకునిగా నిరవధిక సాహిత్య సృజన అనన్య సాధ్యమైనది. ఇవాళ 90వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆయనతో ముఖాముఖి…

మీరు రచయితగా మారడానికి నేపథ్యం?
– నా కన్న తల్లికి చెల్లెలు (పినతల్లి కూతురు) నన్ను పెంచుకుంది. ఆమె పోతన భాగవతం బాగా చదువుకుంది. ఆమెకు కృష్ణ శతకం కంఠస్థం. ఆమె నన్ను నా నాల్గవ ఏట మా అమ్మ నుంచి తెచ్చుకుని పెంచుకుంది. నా నాల్గవ ఏట నుంచీ ఆ పద్యాలు చెప్పి కంఠతా పట్టించేది. తెలుగు కవిత్వంతో నా మొదటి పరిచయం అదే. బహుశా ఆ తొలి పరిచయమే నన్ను కవిత్వంలో నిమగ్నం చేసింది. తర్వాత పోతన భాగవతం, శ్రీకృష్ణ లీలలు, రుక్మిణీ కళ్యాణం, గజేంద్రమోక్షం వంటి ఘట్టాలను క్షుణ్ణంగా నా చేత చదివించేది. ఇదే నా కవిత్వ రచనకు బలవర్థకమయినది. నా పదమూడో ఏటి నుంచీ కవిత్వ రచన చేస్తూ వచ్చాను. 1942లో గాంధీజీ వగైరాల అరెస్టుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ దారిలో పయనిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ యాక్టివిస్టునై కమ్యూనిస్టు పార్టీలో చేరాను. 1942 నుంచే నా కవిత్వ వైఖరిని మార్చుకొని అభ్యుదయ కవిత్వం రాయడం మొదలెట్టాను. నా తొలి కవితలు గ్రంథస్థం చెయ్యలేదు. తొలి కవితలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ కవితలలో ‘కాశ్మీరం మేల్కొంది’, ‘తారతమ్యం’ వగైరా ముఖ్యమైనవి.

కమ్యూనిస్టు భావజాల పూర్వాపరాలు?
– 1942 నుంచీ సిద్ధాంతమూ, ఆచరణా నాలో జంటగా సాగాయి. ఈ సాధన 1942 నుంచి 1954 వరకూ పార్టీ కార్యకర్తగా ఉన్న పదేళ్లూ పెంపొందింది. తర్వాత కేవలం సాహిత్య కృషికి ఎక్కువ మగ్నమై పార్టీ కార్యకర్తగా ఉండడం విరమించాను. ఈ మార్పు నాలో సమస్త సాహిత్యాభివృద్ధికీ దోహదం చేసింది.

మీ తొలి రచన- నాటి విమర్శకుల ప్రతిస్పందనలు?
– ప్రచురితమైన నా తొలి రచన ‘వజ్రాయుధమే’. 1950 వరకూ దానిపై సమీక్షలు, చర్చలూ కొనసాగాయి. వాద ప్రతివాదాల మీదికి ఇప్పుడు దృష్టి మరల్చలేం. కాని వజ్రాయుధానికి 62వ వార్షికోత్సవంగా ఆరవ ముద్రణ పాకెట్ సైజ్‌లో ముద్రించాం. అందులో ఈ వాద ప్రతివాదాలపై సమీక్ష ఉంది. 1950 ఫిబ్రవరి 6న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ‘వజ్రాయుధా’న్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. నవ్యకావ్యాల్లో విశ్వనాథ ‘ఆంధ్రదర్శనం’, గరిమెళ్ల వారి పాటలు అప్పుడు నిషేధానికి గురయ్యాయి.
తెలంగాణ సాయుధ పోరాటం గూర్చి అప్పుడు మీకున్న సమాచారం?
– కమ్యూనిస్టు కార్యకర్తగా కార్యాచరణతోపాటు అధ్యయనం విధిగా జరుపుతున్న 1945-47 మధ్యకాలంలో తెలంగాణ సాయుధ పోరాట ప్రతి సన్నివేశమూ నా సమాచారంలో ఉండేది. అదే నన్ను ఉత్సాహపరిచి కవిత్వం రాయించింది. 1946 అక్టోబర్ 26న విస్నూరు దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ తన మనుషుల చేత ఊరేగింపు సాగిస్తున్న రైతులపై తుపాకులు కాల్పించింది. దొడ్డి కొమురయ్య అనే యువవీరుడు హతుడయ్యాడు. ఆ వీరుని మరణం నన్ను చాలా కలచివేసింది. ఆ రాత్రే ‘ఖబడ్దార్’ గీతం రాశాను. ప్రస్తుతం మలేషియా, సింగపూర్‌లను ‘మలయా’ అని పిలిచేవారు. అక్కడి ప్రజల్లో భారతీయులు దాదాపు చెరిసగం ఉండేవారు. అక్కడ మెక్‌డొనాల్డ్ అనే పరిపాలకుడు జనాన్ని హత్య చేస్తుంటే అక్కడ కమ్యూనిస్టులు కూడా తిరగబడ్డారు. తదుపరి ఆ దేశపు రూపురేఖలు మారి మలేషియాగా రూపొందింది. అప్పుడు రాసిందే ‘ప్రళయ ప్రభంజనం’ కవిత.

‘కళాకేళి’ నడపడానికి కారణాలు – కష్టనష్టాలు?
– రాచమల్లు రామచంద్రారెడ్డి కడప నుంచి ‘సంవేదన’ పత్రిక పెట్టిన తర్వాత ఆధునిక సాహిత్యం గురించి చర్చ, జిజ్ఞాస బయల్దేరాయి. వరవరరావు ‘సృజన’ పెట్టడానికి నిశ్చయించుకున్నారు. నేనూ, మా మిత్రులు ‘కళాకేళి’ పెట్టడానికి నిశ్చయించుకున్నాం. 1968 నుంచి 1975 దాకా నడిపి వచ్చిన నష్టంతో సరిపెట్టుకుంటూ విరమించాం. అది కలిగించిన సాహిత్య సంచలనం మాత్రం అమేయం.

ఆంగ్ల కవిత్వం మీద, సాహిత్య విమర్శ మీద పట్టు ఎలా సాధించగలిగారు?
– దాదాపు అదే రోజుల నుంచి రోజుకు కనీసం రెండు గంటలు ఆంగ్ల విమర్శ గ్రంథాలూ, కవిత్వమూ చదివేవాణ్ణి. ఈ విధంగా చాలాకాలం జరిగింది. ‘శేషేంద్రజాలం’తో నా అభివ్యక్తి ప్రారంభమైంది.
మీపైన కృష్ణశాస్త్రి ప్రభావమెలాంటిది?
– నా మీద కృష్ణశాస్త్రి ప్రభావమే ఉంది. ఆ ప్రభావాన్ని అణచుకుందుకే నా ప్రయత్నమంతా!

వ్యక్తిగత జీవితంలో కమ్యూనిస్టుగా జీవించగలిగారా?
– కమ్యూనిస్టు పార్టీలో నా పద్దెనిమిదవ యేట చేరాను. 1945 ప్రాంతం నుంచి సార్వకాలిక కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశాను. 1947 నుంచి తుని సబ్ జైలులో వివిధ కేసులలో ముద్దాయిగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపాను. కేసులన్నీ పోయిన తర్వాత హౌస్ అరెస్టులో ఆరునెలలున్నాను. బయట కమ్యూనిస్టులు భయంకరమైన హింసలకు గురయ్యారు. చాలా సంఘర్షణలు ఎదుర్కోవలసివచ్చింది.
విశ్వనాథతో మీ సాహిత్య సంబంధాలు ఎలా ఉండేవి?
– విశ్వనాథకు నా అభిప్రాయాల గురించి తెలుసు. నా ‘వజ్రాయుధం’ చదివారు. ఆయన ఎప్పుడూ కోప్పడలేదు. పైగా ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ నాటకంలో హరిగిరి సంభాషణలో నన్ను మెచ్చుకున్నారు కూడా.
శ్రీశ్రీ, నారాయణబాబుల కవిత్వాలలో ఎవరిది విశిష్టమైనదని భావిస్తారు?
– శ్రీశ్రీ కవిత్వం స్పష్టంగా విప్పి చెబుతుంది. నారాయణబాబు కవిత్వం కొంత కప్పి చెబుతుంది.

శేషేంద్రతో కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు కదా! ఆ తర్వాత దూరమైనట్టున్నారు!
– శేషేంద్ర కవిత్వం రాయకముందు, రాశాక కూడా ఆయనతో సన్నిహితంగానే ఉండేవాణ్ణి. అయితే వారి ప్యాలెస్‌కు వెళ్లడం మానేశాను.
శేషేంద్రది విప్లవ కవిత్వమే నంటారా?
– మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గొరిల్లా ఈ మూడు కావ్యాలూ విప్లవాత్మకమైనవే, సందేహం లేదు. తర్వాత కొంత కంగాళీ ఉంది.
ఇస్మాయిల్‌ని గూర్చి….
– ఎవళ్లేనా, ఏ వస్తువు మీదనైనా ఎలాగైనా కవి త్వం రాయవచ్చు. కానీ, ఇదే కవిత్వం అన్యం కాదని చెప్పే ధోరణికి దిగాడు. అతడు విద్యార్థి దశ నుంచీ (1944) నాకు సన్నిహిత మిత్రుడు. అతని ‘చెట్టు నా ఆదర్శం’ అనే కవితా సంపుటికి 27 పేజీల ముందుమాట రాశాను. తర్వాత అతని ధోరణులు మితిమీరి, నా ముందుమాట తీసేసి ప్రచురించాడు. నేనూ కలగజేసుకోలేదు.

పోస్ట్ మోడర్నిజమ్ గురించి…?
– పోస్ట్ మోడర్నిజమ్ అనేది శుద్ధ పొరపాటు వాదమని యూరప్ అమెరికాలలోని వేత్తలంటున్నారు. వారి వాదనలపై ‘ఆంధ్రజ్యోతి’లో పాపినేని శివశంకర్ ఇటీవల ఒక వ్యాసం రాశాడు. చదువదగినది. నా మటుకు నేను ‘శతాబ్దం మారినా ఆధునికత్వమే కొనసాగుతోంది’ అంటాను.
శ్రీశ్రీ ‘అనంతం’ గూర్చి….
– శ్రీశ్రీ గొప్ప కవి. కానీ జేమ్స్ జాయిస్ మొదలైనవారి విపరీత ప్రభావం, ఆయన కృషిని సందేహాస్పదం చేసింది. దానివల్లనే ‘అనంతం’ పెడమార్గం తొక్కింది.

స్త్రీ, దళిత, మైనారిటీ వాదాల మీద మీ అభిప్రాయం?
– ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, రెండు కవిత్వ శుద్ధి.
మీ సమకాలికులలో మీకు అత్యంత ఆత్మీయులు ఎవరు? ఎందుకు?
– నాకు ఆత్మీయులు ఎందరో ఉన్నారు. అందరూ ఒకే కారణం వల్ల కాదు. అందరూ తలో కారణం వల్ల. శివారెడ్డి అంటే నాకు ప్రేమ. తన చిత్తశుద్ధిని మెచ్చుకుంటాను. అయితే ‘అ’ నుంచి ‘క్ష’ వరకూ అతన్ని బలపరుస్తానని కాదు. వరవర అంటే నాకు ఇష్టం. అయితే ఆయన రాజకీయ సిద్ధాంతాలతో నేను ఏకీభవించను. సాహిత్య రంగంలో మరీ కొత్త రచయితలు తప్ప, నా కందరూ ఆత్మీయులే. సమకాలికులు అన్నప్పుడు, సమవయస్కులని మాత్రమే అర్థం కాదు కదా!
కవిగా, విమర్శకునిగా మీకు రావలసినంత గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా?

– రావలసిన గుర్తింపు కొలమానాలుండవు. నన్నందరూ గుర్తించారు. కొందరు గుర్తించకపోయినా నాకు ప్రమేయం లేదు. చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.
ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్యాలలో మీకు తిరిగి తిరిగి చదవాలనిపించేవి ఏవి?
– ప్రాచీన కావ్యాల్లో భారత భాగవతాల్లో కొన్ని ఘట్టాలైనా ప్రతివాడూ చదవాలి! అలాగే శ్రీనాధుడిని చదవడం తప్పనిసరి. నాచన సోముడిని కూడా చదవవచ్చు. పెద్దన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణులు ముగ్గురూ చాలా కవిత్వాన్ని నిక్షిప్తం చేసుకున్నారు. ఏనుగు లక్ష్మణ కవిని విస్మరించకూడదు. సంస్కృత కావ్యాలలో నేను పెద్ద కృషి చెయ్యలేదు. చాలా కావ్యాలు కొద్దికొద్దిగా చదివాను. ఒక్క కాళిదాసు ‘మేఘసందేశం’ మాత్రం ఆద్యంతం చదివాను. ‘మృచ్ఛకటికం’ గురించి పెద్దలు చాలా చెబుతుంటారు. నాకంత గొప్పతనం కనబడలేదు అందులో.

‘కలలు – కన్నీళ్ళు’ అనే ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే బాగుండేదని నాకనిపించింది. మీరేమంటారు?
– మీరనుకోవడం న్యాయమే. మరికొందరు విజ్ఞులు కూడా ఇలాగే అనుకున్నారు. కొందరు ఉత్తరాలు కూడా రాశారు. అంతే, అకాడమీ వారి నుంచి మాత్రం ఏమీ వినలేదు. ఒకసారి- నా రచనలు రెండు పుస్తకాలు ఆరేసి కాపీలు పంపమన్నారు. పంపాను. డబ్బులు పంపారు. దానితో కథ కంచికి.
కొత్త తరం కవులు మంచి కవిత్వం రాయడానికి చదువవలసిన గ్రంథాలు?
– సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఎంతో కొంత భారతాన్ని చదవాలి. తిక్కననీ, శ్రీనాథుణ్ణీ, పెద్దనను చదవాలి. ఆముక్త మాల్యదను చాలా జాగ్రత్తగా సన్నిహితంగా చదివాను. కానీ అందరూ చదువలేరు. ఏ పనీ లేనివాణ్ణి కనుక ఆ కావ్యంతో దినాలు గడిపాను. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.
మీ వచన రచనలలో భావ కవిత్వ భాష ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంటుందని కొందరి అభిప్రాయం…

– నేనేమీ అనను. నా భాష నాది. నా శైలి నా రక్త నిష్ఠం.
మీరు రాయాలనుకొని రాయలేకపోయిన రచనలేమైనా ఉన్నాయా?
– ఉంటాయి, తప్పకుండా ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను. సాఫీగా నడవడం మానేసి కాలం అప్పుడప్పుడు దుముకుతూంటుంది.
చూపు ఆనని, స్వంతంగా రాయలేని స్థితిలో కూడా ఎడతెగకుండా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి?
– నా స్ఫూర్తి పై నుంచి వచ్చినది కాదు. అది నా వ్యక్తిత్వంలోంచి బయటపడ్డది. ఏదో ఆశించి చేస్తున్నదీ కాదు. నేను రాస్తున్న క్షణాలు నేను బతుకుతున్న క్షణాలనిపిస్తుంది. ఒక రచన చేస్తే ఎంత హాయిగా ఉంటానో మా వాళ్లందరికీ తెలుసు. ఆ హాయి గురించే రాస్తున్నానేమో. చదవడంలో, రాయడంలో నాకు సహకరిస్తున్న అమ్మాయి చిరంజీవిని యర్రమిల్లి ఉషాకుమారి.
ఆంగ్ల మాధ్యమం వల్ల తెలుగు చదవడం, రాయడం రాని తరాలు వస్తున్న క్రమంలో తెలుగు సాహిత్యం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు?

– ఆంగ్ల భాష మనకు ఒక పారిశుధ్యం కలిగించింది. మనసులను సివిలైజ్ చేసింది. చైనా, వగైరా దేశాలు ఆంగ్ల భాషను పూర్తిగా విసర్జించాయి. అవేమీ వెనుకబడిపోలేదు. కనుక నా మటుకు నేను ఇలా ఏమీ ఆలోచించలేకపోతున్నాను.
‘తెలంగాణ’ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తున్నది. మీ ప్రతిస్పందన?
– తెలంగాణ ఉద్యమం ఆ రోజులలోనే ఆరంభమైంది. ‘కళాకేళి’ ఉగాది సంచిక 1969 మార్చిలో సంపాదకీయం రాస్తూ-  ‘Who first seduced them to that foul revolt’అనే మిల్టన్ కవి మాటలతో ప్రారంభించి, ‘తెలంగాణ ప్రజలు కోరుతున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం బేషరతుగా ఇవ్వవలసిందే!’ అని రాశాం. మా అ.ర.సం. నాయకుడు తుమ్మల వెంకట్రామయ్య దానిని ‘విశాలాంధ్ర’లో చెడామడా ఖండించాడు. అయినా నా అభిప్రాయం మార్చుకోలేదు.
కొత్త తరం కవులు నిశితంగా ఆలోచిస్తున్నారు. అనేక ప్రక్రియలలో రచనలు చేస్తున్నారు. అందరి అభివృద్ధి కోరుతూ శుభాకాంక్ష లందజేస్తున్నాను.
ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ
94404 37200

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా

 

విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో ఆమె గొంతు కంచు కంఠమై మోగుతోంది. విమలక్క సొంతూరైన నల్లగొండ జిల్లాలోని ఆలేరు విశేషాలే ఈ వారం మా ఊరు.

నేను పుట్టేనాటికి(1964) మా వూరు ఆలేరుగా మారింది. అంతకుముందు దాని పేరు ఆవులేరట. ఆవులేరని ఎందుకన్నారో తెలియదు కానీ, అది వాగులు ఎక్కువగా ఉన్న ఊరని మాత్రం చెప్పాలి. మా ఊరికి రెండు వైపులా రెండు వాగులుంటాయి. ఒకటి రత్నాలవాగు, ఇంకోటి పెద్దవాగు…అదే ఆలేరువాగు. అది నిండుగా ప్రవహిస్తే ఆ ఏడాది ఫుల్లుగా వర్షాలు పడినట్టు లెక్క. అది ఉప్పొంగితే కరువు పోయినట్టు లెక్క. ఆ వాగుతో ఆలేరు బిడ్డగా నా అనుబంధం మాటల్లో చెప్పలేను. అసలది వాగులా భావించలేదు నేనెప్పుడూ. నాకో ఫ్రెండ్ అనుకునేదాన్ని. ఆదివారం వస్తే వాగులో ఇసుక ఆటలు ఆడుకునేవాళ్లం. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు (1978) ఆ ఏడాది పడిన వర్షాలకు పెద్దవాగు నిండటమే కాదు ఉప్పొంగింది. ఆ నీళ్లన్నీ చిక్కటి చాయ్‌లాగా రోడ్లమీద పరుగులు తీస్తుంటే ఊరి జనం తండోపతండాలుగా వచ్చి చూశారు. ఆ రోజు నేను జ్వరంతో ఉన్నా. అది వినాయక చవితి పండగ సమయం. సన్నగా వర్షం పడుతోంది. మా అమ్మ బయటికెళ్లొద్దని నాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అప్పటికే. కానీ నా మనసంతా వాగు పరవళ్లను చూడాలని ఉవ్విళ్లూరుతోంది. దాంతో అమ్మకు తెలియకుండా వెళ్లి చూశాను. అది నీటి ఉ«ధృతే కావచ్చు కానీ, కంటికి ఇంపుగా కనిపించింది. అరగంట పాటు కళ్లనిండుగా చూస్తూ కూర్చున్నాను. నాకు అదొక అద్భుతమైన అనుభవం.

ఆ ఏడాది తరువాత చాన్నాళ్లు మా ఊరికి కరువు అన్నది తెలియలేదు. అప్పుడు నిండుగా ప్రవహించిన వాగు, ఆ తర్వాత 35ఏళ్ల వరకు కనీసం నిండలేదు. ఈ ఏడాది…అంటే మొన్న కురిసిన వర్షాలకు ఉప్పొంగలేదు కానీ, నిండుగా పారింది. మా అన్న ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆరాటపడ్డాను. వెళ్లకపోతే ఏదో ఆత్మీయబంధాన్ని కోల్పోతామన్న ఫీలింగ్ కలిగింది. ఎంత ఆరాటపడినా ఇక్కడున్న బాధ్యతల వల్ల వెళ్లలేకపోయాను. మొదటిసారి అమ్మ వద్దని చెప్పినా వాగు చూడటానికి వెళ్లాను కానీ, ఈ రోజు నాకలా చెప్పడానికి అమ్మ లేదు. అయినా వెళ్లలేక పోయాను. అమ్మ గుర్తు రాగానే ఆ వాగు ఉప్పొంగినట్టే నా కన్నీళ్లూ ఉప్పొంగాయి. రెండేళ్ల క్రితం చనిపోయిన మా అమ్మను దహనం చేసింది కూడా ఆ వాగులోనే!

బాల్యమంతా…ఆటాపాటా
చిన్నప్పటి నుంచీ ఇంట్లోనైనా, ఊళ్లోనైనా నేను స్పెషలే. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. మాకు ఇద్దరు అన్నలు. మొత్తం ఐదుగురికీ.. అమ్మే అన్నీ. కడుపులో పెట్టి సాదుకుంది. అమ్మ నర్సమ్మ కష్టజీవి. నాన్నెప్పుడూ ఉద్యమాలు అంటూ బిజీగా ఉండేవాడు.
నేను చిన్నదాన్ని కదా.. నచ్చినట్టు ఉండేదాన్ని. స్కూల్ అయిపోయిన వెంటనే ఎప్పుడూ నేరుగా ఇంటికి వెళ్లలేదు. గ్రౌండ్‌లో ఆడుకొని ఆడుకొని అలిసిపోయాక మెల్లగా ఇంటికి వెళ్లేదాన్ని. అన్ని ఆటలూ ఆడేదాన్ని. ఖోఖో, టెన్నికాయిట్, గోటీలు, చిర్రగోనె… బొంగరాలాట కూడా. మొన్నీమధ్య మా పిల్లాడికి బొంగరం కొనిచ్చి, ఎలా ఆడాలో చూపించాను. ‘భలే తిరుగుతుందమ్మా’ అని వాడెంత ఆశ్చర్యపోయాడో! నిజంగా అప్పటి నా ఆటపాటలు, అనుభవాలు తియ్యని అనుభూతులు. ఊళ్లో పీరీల పండక్కి దూల ఆడటం, తుమ్మకాయలు కాళ్లకు గజ్జెలుగా కట్టుకుని పరిగెత్తడం, ఇంటిముందున్న కాలువలో నీళ్లు లేనప్పుడు అంగడి ఆటలు ఆడుకోవడం…ఎన్నని చెప్పగలం? కోళ్లు, దూడపిల్లలు, దుడ్డెపిల్లలతో కూడా ఆటలే. అవి కంటున్నప్పడూ చూసేవాళ్లం. ఒకవేళ పుట్టిన బిడ్డ చనిపోతే ఆ పశువుల కంటి నుంచి కారే కన్నీటి ధార కూడా ఇంకా గుర్తుంది నాకు.

సంక్రాంతి పండగొస్తే పుట్టమట్టితో పెద్ద బొమ్మరిల్లు కట్టేదాన్ని. పుసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించేదాన్ని. దోస్తులను, మా అన్నయ్యలను పిలిచి భోజనం, పాశం(పాయసం) వండి పెట్టేదాన్ని. ఓ ఆడపిల్లగా, ఇంట్లో చిన్న పిల్లగా నాకెన్నో స్వీట్ మెమొరీస్! ఆంక్షలు లేని బాల్యం నాది. చదువులో నేను యావరేజి స్టూడెంట్‌నే కాబట్టి నా సమయమంతా ఆటపాటలకే. టెన్త్ వరకు ఆలేరులోనే చదివాను. ఇంటర్, డిగ్రీ భువనగిరిలో. ఆ ఐదేళ్లు కూడా ట్రెయిన్‌లో అప్ అండ్ డౌన్ చేశాను.

ఇంటినిండా జనమే ఉండేవారు
మాకు 14 ఎకరాల వరకు భూమి ఉండేది. వరి, గోధుముల, జొన్నలు, పొగాకు పండేది. వ్యవసాయం కోసం ఇద్దరు పనివాళ్లు ఉండేది. వండినప్పుడు తప్ప ఎప్పుడూ అన్నం కుండగా నిండుగా ఉండేది కాదు. ఎవరో ఒకరు వచ్చి తింటూ ఉండేవారు. అప్పట్లో ఎంతోమంది విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చి, అన్నంపెట్టిన ఇల్లు మాది. సుందరయ్య, చండ్రపుల్లా రెడ్డి, పైలా వాసుదేవరావు, చంద్రన్న వంటిఎంతో మంది నాయకులకు ఆశ్రయమిచ్చింది. టాన్యా అక్క(చంద్రన్న భార్య) మా ఇంట్లోనే అరెస్టు అయ్యింది. వాళ్లది ఆంధ్ర కదా.. ఆమె భాష, యాస వల్లనే దొరికిపోయింది. నేను మా పెద్దమ్మ కూతురు అని చెప్పినా పోలీసులకు నమ్మకం కలగలేదు. నాన్న బండ్రు నర్సింహ్మయ్య రైతుకూలీ సంఘంలో పనిచేయడం వల్ల పోలీసులు ఏదో ఓ కారణం చేత మా ఇంటిమీదికి రైడింగ్ వచ్చేవారు. కొన్నిసార్లయితే మా అమ్మ నర్సమ్మ విసుగుతో పోలీసులను తిట్టిన సందర్భాలున్నాయి. నిజంగా ఆమె భయం తెలియని మనిషి. ఎప్పుడూ పోలీసులతో గొడవపడుతూ ఉండేది. నాన్న రైతుకూలీ సంఘం నాయకుడిగా జిల్లా బాధ్యతలు చూసుకునేవాడు. ఫస్ట్ మా ఇంట్లోనే రేట్లు పెంచి గిట్టుబాటు ధరల కోసం పోరాడేవాడు. మా ఇంటికి, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరమే కావడం వల్ల నాన్న జీవితం అండర్‌గ్రౌండ్, జైలు, రైతు కూలీసంఘం..ఇలా గడిచింది. మా అక్కలు, అన్నల పెళ్లిళ్ల్లకు కూడా నాన్న పెరోల్ మీద వచ్చి వెళ్లేవాడు.

గంప నింపుకోవాలనుకున్నా
పొలం పనులు పూర్తయి, కల్లం లేసిన తరువాత ఇంటి ఆడబిడ్డలు గంప నింపుకుంటారు. అంటే వడ్లను ఓ గంపలో నిండుగా నింపుకుని తీసుకుంటారు. అది వాళ్లకే ప్రత్యేకం. అయితే అది ఇంటికి పెద్దవాళ్లెవరో వాళ్లే తీసుకుంటారు. కానీ ఓసారి నాకూ కావాలని పట్టుబట్టాను. ‘నువ్ చిన్న పిల్లవు. నీకవసరం లేద’ని నాన్న చెప్పినా వినలేదు. దాంతో ‘గంప నింపుకో. కాని దానితో పాటు చిన్న దొయ్యలో నాటేసి పంట పండించుకో’ అన్నాడు. సరే అన్నా. నాటేసే టైమ్ వచ్చింది నా దొయ్యలో నేనే నాటువేస్తున్నా. గర్వంగా ఉంది నాకు. సగం అయిపోయిన తర్వాత ఆ బురదలో చేతికి రాయి తగిలి సగం గోరు లేచిపోయింది. వేలు తెగి రక్తం కారుతుంటే ఏడుస్తూ బయటకొచ్చాను. ‘కష్టం ఏమిటో అర్థమైందా? గంప నింపుకోవడం అంటే వడ్లు తీసుకోవడం కాదు బిడ్డా. కష్టాన్ని ఇష్టపడటం’ అని చెప్పాడు నాన్న. ఆయన ఉన్నతంగా ఆలోచించేవాడు. వస్తు వ్యామోహం ఉండొద్దని చెప్పేవాడు. అందుకే ఇంటర్మీడియెట్‌లో కూడా నేను రెండు జతల బట్టలతోనే సర్దుకోవాల్సి వచ్చింది.

పండగంటే బతుకమ్మే
మా ఇల్లు, వాకిలి, వరండా పెద్దగా ఉండేవి. వాకిట్లో సంక్రాంతికి ముగ్గులేయాలంటే నాలుగైదు గంటల సమయం పట్టేది. నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడి చేసిన పనుల్లో ముగ్గులేయడం కూడా ఒకటి. పండగల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సింది బతుకమ్మ గురించి. బతుకమ్మ కోసం ప్రతి పనినీ చాలా ఇష్టంగా చేసేదాన్ని. మా ఊరికి మూడు కి.మీ.దూరంలో మా చెలుక ఉండేది. పువ్వుల కోసం అక్కడిదాకా వెళ్లేదాన్ని. వారం ముందు నుంచే గునుగు పువ్వు, ముత్యాలపువ్వులు సేకరించేదాన్ని. ఇంట్లో దాచుకుని వాటిమీద తడిగుడ్డ వేసి కాపాడుకునేదాన్ని. నా చిన్నప్పుడు ఒకసారి నా ఎత్తు బతకమ్మను పేర్చింది అమ్మ. అందుకే మా ఊళ్లో అందరి కంటే పెద్ద బతుకమ్మ మాదే ఉండాలని నా కోరిక. అప్పుడు రంగులు కూడా సహజమైనవే. బ్రహ్మజెముడు కాయల గుజ్జును పిసికితే మెరూన్ కలర్ రంగు వచ్చేది. ఆ రంగునే వాడేవాళ్లం. తంగేడు పూవు, బ్రహ్మజెముడు కాయల కోసం తెగ తిరిగేవాళ్లం. అది ఆడపిల్లల పండుగ కదా. పెద్దక్క అరుణ, చిన్నక్క జయక్క ఇద్దరినీ వాళ్ల అత్తగారింటి నుంచి పండక్కి నేనే తీసుకొచ్చేదాన్ని. ఒక్కోసారి వాళ్లు రాకపోతే ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేదాన్ని. ఏమైనా సరే బతుకమ్మ పండగకు మా అక్కలు మా ఇంట్లో ఉండాలనుకునేదాన్ని. మా కురుమ వాడలో ఆడే బతుకమ్మ ఆటే మా ఊరందరికీ హైలైట్. ఎగ్గిడి బీరమ్మ అని ఒక పెద్దావిడ చాలా బాగా పాటలు పాడేది. తర్వాత నేను పాడేదాన్ని.

పాట కోసం
చిన్నప్పుడు పొలం గట్లపై కూర్చుండి కూలీలు నాటేస్తూ పాటలు పాడుతుంటే వినేదాన్ని. మనసుకు ఎంతో హాయిగా ఉండేది. అయితే వాళ్లు నాటు వేస్తూ వేస్తూ గట్టుకు దూరమైపోతుంటే నాకు పాట సరిగా వినబడదనే ఆతృతతో నేను కూడా పొలంలోకి దిగి వాళ్లతో పాటు నాటువేస్తూ పాటలు వినేదాన్ని. అలా చాలాసార్లు చేయడం వల్ల నాటు వేయడం కూడా పూర్తిగా వచ్చేసింది. మా ఊరే నాకు మనోబలాన్ని, జన బలాన్ని ఇచ్చింది. ఈ నిర్బంధాలు, పోలీసు దాడులు, ఉద్యమాలు అన్నీ ఊళ్లో ఉన్నప్పటి నుంచే పరిచయం. నా ఫస్టు పాట మొదలైంది కూడా ఆలేరులోనే. ఇప్పుడు ఆ ఊరు నాకేమిచ్చింది అనే కంటే నా ఊరికి నేనేమి ఇవ్వగలను అని ఆలోచిస్తున్నా. నాకు ఏది సాధ్యమైతదో, నేనేం చేయగలనో వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తా! ఈ మధ్య జరిగిన మా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 70 మందిమి కలిశాం. ఆ వేడుకకు నా జీవన సహచరుడు అమర్‌ను కూడా తీసుకెళ్లాను. మా ఊరు గురించి, అక్కడున్న విద్యావంతుల గురించి తెలిశాక అసలిది అలేరు కాదు…అ ఆ ల ఏరు అని ఉద్వేగంగా మాట్లాడాడు. అదే వేడుకలో మా ఊరు కోసం ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఊరుకు దూరంగా ఎవరు, ఎక్కడున్నా వాళ్లు సొంతూరు గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన పునాదులు, ఆటలు, పాటలు, జీవితం మొదలైంది అక్కడే కదా.

ఊరి విషాదం

ఆ కాలంలో తెలంగాణలో చాలా చోట్ల ఉన్నట్టే దొరల పెత్తనం, రెడ్డి దౌర్జన్యాలు మా ఊళ్లో కూడా ఉండేవి. ఓ టైమ్‌లో ఊళ్లో భూమి కోసం పోరాడుతున్న ఓ ముస్లిం ఫ్యామిలీ మొత్తం హత్యకు గురైంది. వాళ్లతో నాది మంచి అనుబంధం ఉండేది. అయితే ఆ శవాలను చూసే పరిస్థితి కూడా లేకుండే. అయినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి చూసొచ్చాను. నాకు ఎన్నో తీపిగుర్తులు పంచిన మా ఊరు అలాంటి ఒక విషాదాన్ని కూడా ఇచ్చింది.

అందరూ చుట్టాలే

ఊరంతా వరసలతో పిలుచుకునేవాళ్లం. గౌడ్స్‌తో మాకు ఎక్కువ అనుబంధం. వాళ్లంతా తాతలు, మామలు మాకు. నన్ను ‘ఇమ్లవ్వా..’ అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పటికీ నేను ఊరెళితే అదే ఆప్యాయత, అదే పలకరింపు. నేనూ అంతే దగ్గరకెళ్లి వాళ్లతో పాటు అరుగు మీద కూర్చుండి కాసేపు మాట్లాడి వస్తాను. నిజానికి మనం ఎలాంటి స్థాయిలో ఉన్నా సొంతూళ్లో, మనవాళ్ల మధ్య అరుగు మీద కూర్చుండి ముచ్చట్లు పెట్టుకోవడంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా దొరకదేమో!

మా ఇంటిముందున్న స్థూపం అమరుల గుర్తు..
1948 నవంబర్ 28న రజాకార్లకు వ్యతిరేకంగా రైతుకూలీలందరూ ఊరేగింపుగా రావాలని ఓ పిలుపు ఇచ్చారట. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో 13మంది అమరులయ్యారు. వాళ్ల జ్ఞాపకార్థం మా వాకిట్లో స్థూపం కట్టించాడు నాన్న. ఇప్పటికీ ఉందది.

-మయన్న

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13

 

శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో పోటీపడి, విలక్షణమైన లేడీ కమెడియన్‌గా ఐదొందల సినిమాల్లో నటించిన ఆమెతో సంభాషించారు ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూ సమాహారం మీ కోసం…

ఆర్కే : తెలుగు ప్రేక్షకులకు మీరు నవ్వులు పూయించి చాలా రోజులు అయింది. మీకుగా మీరు తీసుకున్న విరామమా ? లేక అవకాశాలు రాకనా?
శ్రీలక్ష్మి : లేదండీ! నాకు నేనుగా తీసుకున్న గ్యాపే ఇది. జీవితాంతం సినిమాలే జీవితం కాదు కదా. నాకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉండటంతో నటించడం లేదు. అప్పట్లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వడం ఎందుకు అని మద్రాసులోనే ఉండిపోయాను. ప్రస్తుతం కమిట్‌మెంట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. కొన్ని సీరియల్స్, మరికొన్ని సినిమాల్లో చేస్తున్నానిప్పుడు. ఆ కళామతల్లి నన్ను అంటిపెట్టుకుని ఉన్నంత కాలం మేకప్ వేసుకుంటూనే ఉంటాను.
ఆర్కే : ఇరవై ఏళ్లపాటు మరమనిషిలా చేస్తూ పోయారు కదా! ఎన్ని సినిమాలు చేశారో, ఎంత వచ్చిందో ఇవేవీ తెలియకుండా చేసుకుంటూ పోయారా..?
శ్రీలక్ష్మి : అప్పట్లో సినిమాకు అయిదువేలు, పదివేలు..అదీ మూడుదఫాలుగా ఇచ్చేవారు. రోజుకు మూడు సినిమాల చొప్పున చేసేదాన్ని కాబట్టి.. చేతికి కొంత మొత్తంగా వచ్చేది. అదంతా ఫ్యామిలీకే సరిపోయేది. స్థలాలు కొనడం, దాచుకోవడం వంటివేవీ చేయలేదు నేను.

ఆర్కే : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి..?
శ్రీలక్ష్మి : మా నాన్నగారు అమరనాథ్ అప్పట్లో పెద్ద హీరో. ఎన్‌టిఆర్, ఎఎన్ఆర్‌లకు సమకాలికుడు. ‘బైజుబావరా’ అనే హిందీ సినిమాను తెలుగులో ‘అమరసందేశం’ పేరుతో ఆయన్నే ్ట హీరోగా పెట్టి తీశారు. ఎంజిఆర్ తమిళ సినిమా ‘ఎన్‌తంగె’ౖను తెలుగులో ‘నా చెల్లెలు’ పేరుతో చేశారు నాన్నగారు. ఇలా వందకు పైగా సినిమాలు చేసిన నటుడు ఆయన. మాకు ఊహ వచ్చే నాటికే రిటైర్ అయ్యారు. మేము చిన్నపిల్లలప్పుడే హైదరాబాద్ వచ్చేశారు. వచ్చాక సినిమాలు లేవు. లేవని ఎవర్నీ అడగరు. ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు మా అమ్మగారు “ఏవండీ ఇప్పుడు అందరూ అన్ని వేషాలూ వేస్తున్నారు. మీరు తండ్రి పాత్రలులాంటివి వేయొచ్చు కదా” అనేవారు. కాని ఆయన “లేదు లేదు నేను హీరోగానే చేశాను. హీరోగానే చచ్చిపోతాను తప్ప చిన్న చిన్న వేషాలు వేయను గాక వేయను” అనేవారు. ఆ రోజుల్లో ఒకసారి హీరోగా వేషం వేసిన వారు ఆ తర్వాత చిన్న పాత్రలు చేసేవారు కాదు. ఇప్పుడైతే అలాంటి నామోషీలేవీ లేవు. అందరూ అన్నీ చేస్తున్నారు. నాన్నగారు చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే ‘మగవారి మాయలు’ అనే సినిమా తీశారు. కృష్ణకుమారి, రాజశ్రీ, గీతాంజలి, చలం అందులో నటులు. ఆ పిక్చరు ఎలా పోయిందో తెలియదు. అదే సినిమాలో కృష్ణకుమారికి బిడ్డగా నేనొక చిన్న పాత్ర చేశాను.

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?
శ్రీలక్ష్మి : అలా సినిమాలు తీయడం, పోవడం జరుగుతుండేవి. నాన్నగారు ‘అమరజ్యోతి’ అనే సినిమా తీస్తున్నప్పుడు చెన్నైకి వెళ్లాం. అమరజ్యోతిలో నాన్న హీరో, విజయనిర్మల హీరోయిన్. ఎస్వీ రంగారావు, ఛాయాదేవి ప్రధానపాత్రధారులు. ‘ఫైనాన్సర్లు అక్కర్లేదని సొంతంగానే తీస్తున్నారు’ అని కొందరు పుకార్లు పుట్టించారు. షూటింగ్ పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయిందది. ఆ తర్వాత కలర్ సినిమాల ట్రెండు వచ్చింది. సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న బాధతో నాన్నగారు మానసికంగా కుంగిపోయారు. చెప్పుకుంటూపోతే అదొక పెద్ద స్టోరీ. పిల్లల్లో ఇద్దరం పెళ్లీడు కొచ్చాం. మాకు ఎలా పెళ్లి చేయాలోనన్న ఆందోళన కూడా ఆయనను పట్టుకుంది. ఇంతలో జాండీస్ వచ్చి చనిపోయారు.

ఆర్కే : మరి, మీరే ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తీసుకున్నారా?
శ్రీలక్ష్మి : అవునండీ. మా పెద్దక్క తీసుకోలేదు. నేనే బాధ్యత తీసుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు. కొన్ని అడ్డంకులు ఎదురైనాయి. మేము ఎనిమిది మంది పిల్లలం అయితే చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. నేను హైదరాబాద్‌లో ఐదు నుంచి ఏడవ తరగతి వరకు మాడపాటి హనుమంతరావు పాఠశాలలో చదివాను. మళ్లీ ప్రైవేటుగా ప్లస్‌టూ పూర్తి చేశాను. మావేమీ పెద్ద చదువులు కాదు. వానాకాలం చదువులు. అదీ తెలుగుమీడియంలో చదువుకున్నాను.

ఆర్కే : సినిమాల్లో అవకాశాలు ఎవరిచ్చారు..?
శ్రీలక్ష్మి : పూలు అమ్ముకునే చోట కట్టెలు అమ్ముకోకూడదు అనే ఇక్కడికి వచ్చాము. మళ్లీ చెన్నయికి వెళ్లాము. భవిష్యత్తు ఏంటి అనుకునే టైమ్‌కు – మా ఇంట్లో కొద్దోగొప్పో ఒడ్డూపొడుగూ కనిపించే మనిషిని నేనొక్కదాన్నే. ఒక రోజు అమ్మ- “నువ్వొక్కదానివి చేస్తే మన కుటుంబం బతుకుతుంది. లేకపోతే నాన్నగారు పోయినట్లే మనమంతా పోతాం” అంది. “ఆయనంటే అనారోగ్యంతో మరణించారు. మనమంతా ఆరోగ్యంగా ఉన్నాం కదా. అమ్మ ఇలా అంటుందేమిటి?” అనుకుని భయపడ్డాను.
అప్పుడు నేను “సరేలే అమ్మా నేను డేర్ చేస్తాను..” అని రంగంలోకి దిగాను. మా నాన్న బతికుండగానే విశ్వనాథ్‌గారు ఏదో సినిమా తీస్తున్నారు ఫోటోలు పంపించమని ఎవరో చెబితే అప్పటికప్పుడు పిచ్చి పిచ్చి ఫోటోలు పంపించాను. విశ్వనాథ్‌గారు వాటిని చూసి అమ్మాయిని పిలిపించమన్నారు. మద్రాసు వెళ్లాం. ఆ టైమ్‌లో మా నాన్నకు ఎంత కోపమంటే అంత కోపం. నేను సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థికసంక్షోభం, వాటికితోడు పిల్లలకు ఏదైనా చెబితే వినడం లేదన్న బాధ.. అన్నీ మనసులో పెట్టుకునేవాడు. “అమ్మా వద్దమ్మా, ఇండస్ట్రీ లోటుపాట్లు మీకు తెలీదు. నాకన్నీ తెలుసు. మీరు ఆడపిల్లలు. అక్కడ బతకడం కష్టం. నాకు చాతకావడం లేదనే కదా మీరు నా మాట వినకుండా వెళుతున్నారు” అన్నారు. “నాన్నా ఏదో ఒక రాయి వేద్దామని వెళుతున్నాను. వద్దనకండి” అని నేను అన్నాను. ఆయన కోపంగా “సరే పో” అని వదిలేశారు.

ఆర్కే : అది తొలి ప్రయత్నం. ఆ తర్వాత..?
శ్రీలక్ష్మి : అక్కడ ‘శంకరాభరణం’ కోసం స్క్రీన్‌టెస్ట్ చేస్తున్నారు. అది లాస్ట్ సీన్. మంజుభార్గవి రైలులో నుంచి దిగే సీన్. నన్ను విశ్వనా«థ్‌గారి వద్దకు తీసుకెళ్లాక.. మేకప్ టెస్ట్ చేశారు. రైలు ఎక్కమ్మా అన్నారు. రైల్లో నుంచి దిగుతున్నట్లు, మనల్ని రిసీవ్ చేసుకునేందుకు ఎవరైనా వచ్చారేమో చూస్తున్నట్లు చేయాలి. వాళ్లు చెప్పినట్లే అన్నీ చేశాను. ఓకే అన్నారు.
ఆ తర్వాత ‘శుభోదయం’లో నాకు హీరోయిన్ అవకాశం వచ్చింది. చంద్రమోహన్ హీరో. సినిమా మొదలు పెట్టేందుకు కొబ్బరికాయ కూడా కొట్టాము. అయితే అదే టైమ్‌లో నాన్నగారు చనిపోయారన్న వార్త వచ్చింది. ఆదరాబాదరా హైదరాబాద్ వచ్చేశాను నేను. అలా హీరోయిన్ ఛాన్స్ పోయింది.
బాపుగారు ‘వంశవృక్షం’ సినిమా తీస్తున్నారప్పుడు. అందులో కూడా హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. మళ్లీ చెన్నయి వెళ్లిపోయాను. చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టాను.
‘బావామరదళ్లు’, ‘నివురుగప్పిన నిప్పు’సినిమాలలో చేశాను. ఆ టైమ్‌లో నటించడానికి నేను భయపడుతుంటే బాపు గారు ఏం చెప్పారంటే – “ఇది కామెడీ వేషం. భయపడొద్దు. ఆర్టిస్టు అంటే అన్ని పాత్రలు చేయగలగాలి. ధైర్యంగా చేయండి” అన్నారు. నాది నగేష్ సరసన నటించే పాత్ర. గిరిజ, అల్ల్లురామలింగయ్యల కూతురుగా నటించాలి. ఆ సినిమాలో నగేష్ నాకు లైన్ వేస్తుంటాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న పారితోషికం రెండువేలు.

ఆర్కే : కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసినట్లున్నారు?
శ్రీలక్ష్మి : మలయాళంలో ‘జంబులింగ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేశానండీ. అందులో ప్రేమ్‌నజీర్ పెద్ద హీరో. దేవదాసు కనకాల తీసిన ‘పుణ్యభూమి కళ్లు తెరచింది’లో గుమ్మడిగారి అబ్బాయి హీరోగా, నేను హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అయిదు తమిళ సినిమాలు కూడా చేశాను. ‘జిగుజిగురైలు’, ‘స్పరిశం’ అనే సినిమాలు చేశాను. అయినా ఫలితం లేదు. హీరోయిన్‌గా ఫిట్ అవ్వలేదు.

ఆర్కే : ఏ సినిమాతో బ్రేక్ వచ్చింది మీకు..?
శ్రీలక్ష్మి : మా తమ్ముడు రాజేష్, నేను, మా అమ్మ తొలినాళ్లలో భానుచందర్ వాళ్ల ఇంట్లో ఉండేవాళ్లం. మా నాన్నగారికి జాండీస్ వచ్చినప్పుడు భానుచందర్ వాళ్ల అమ్మగారు మందు ఇచ్చేవారు. ఆమె అలా పరిచయం. మా నుంచి కొంత అడ్వాన్సు తీసుకుని ఇంటిమీద గుడిసెలోనే కొన్ని నెలలపాటు ఉంచింది ఆమె. అప్పట్లో రూ.250 అద్దె. మేము ముందస్తుగా 5 వేలు ఇచ్చాం. రెండు నెలలైనా అదే గుడిసెలో పెట్టింది. భానుచందర్, సుమన్ జాగింగ్‌కు వెళ్లేవారు. అప్పట్లో వాళ్లు పెద్ద హీరోలు. రాత్రిళ్లు హాల్లోనే పడుకునేవాళ్లం. వంటంతా ఆవిడే చేసిపెట్టేది. కొన్ని రోజులకు ఇల్లు ఇచ్చింది. అదే సమయంలో – జంధ్యాల గారి వద్ద కెమెరామాన్‌గా చేస్తున్న గోపాల్‌రెడ్డి గారు భానుచందర్ వాళ్ల అమ్మ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవారు. “వీళ్లు బాగా బతికిచెడినోళ్లురా. రాజేష్‌కు ఏదైనా అవకాశం ఉంటే చూడరాదూ” అని గోపాల్‌రెడ్డితో చేప్పేది ఆమె. అలా మా తమ్ముడికి ‘నెలవంక’ అనే సినిమాలో హీరోగా నటించేందుకు అవకాశం చిక్కింది. ‘రెండుజళ్ల సీత’ కోసం జయకృష్టగారు మా తమ్ముడిని బుక్ చేశారు. అందులో నాక్కూడా ఒక అవకాశం వచ్చింది. అందులో తమాషా పాత్ర నాది. సుత్తివేలు, నేను ఒక అద్దె ఇంట్లో దిగుతాము. ఆ ఇంట్లోకి మరో అందమైన అమ్మాయి వస్తే లైను వేయడానికి బాగుంటుందని హీరోతోపాటు మరో నలుగురు కుర్రాళ్లు ప్రయత్నిస్తుంటారు. మమ్మల్ని ఖాళీ చేయించడమే వారి ప్రధాన కర్తవ్యం.

మొదట్లో చాలా చిన్న దృశ్యంగా తీయాలనుకున్న జంధ్యాల.. నా నటన చూసి సీన్లను పొడిగించారు. ఆయనకు దేవుడు పూనాడేమో అనిపిస్తుంది. లేకపోతే నాకు అంత అదృష్టం దక్కేది కాదు. విషయం తెలుసుకున్న నా తమ్ముడు “నువ్వు వచ్చింది ఒక రోజు వేషానికి. నేను ఇందులో హీరో. నువ్విక వెళ్లిపో”అన్నాడు. “అదేంట్రా.. అందరం కష్టపడితేనే కదా కుటుంబం నడిచేది” అన్నాను నేను. “నీకు ఇష్టముంటే ఉండు లేకపోతే నువ్వే పో” అని వాడితో దెబ్బలాడాను. ఆ సినిమా బాగా ఆడింది. కమెడియన్‌గా నా జీవితం మొదలైంది. ఆ తర్వాత జంధ్యాలగారి అన్ని సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి.

ఆర్కే : ఆ హిట్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదన్న మాట?
శ్రీలక్ష్మి : లేదండీ. దేవుడి దయవల్ల ‘రెండు జళ్ల సీత’కు కళాసాగర్ అవార్డు వచ్చింది. అప్పటికి అవార్డు అంటే ఏమిటో నాకు తెలీదు. ఇండస్ట్రీలో నేను బ్రిలియంట్‌ను కాదు. సినిమాల్లో వేసిన అమాయక పాత్రల వంటిదే నా మనస్తత్వం. అందుకే నేనెక్కడా నటించలేదు. నా అసలు స్వభావమే నా పాత్రలకు అతికినట్లు సరిపోయింది.
ఆర్కే : మీరింత అమాయకురాలు. మరి, ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదా? ఎలా నెట్టుకొచ్చారు?
శ్రీలక్ష్మి : మా అమ్మ అమరనాథ్‌గారి భార్య కాబట్టి.. ఆమెకు అన్నీ తెలుసు. మెడలో గంటలు కట్టడం, అగ్రిమెంట్లు రాయించుకోవడం వంటి వాటికి అమ్మ ఒప్పుకునేది కాదు. అమ్మ వల్లే అన్నింటినీ ఈదుకుని ఒడ్డుకు చేరాము.

ఆర్కే : ఐదొందల సినిమాల్లో నటించారు. ఏమైనా వెనకేసుకున్నారా?
శ్రీలక్ష్మి : వెనకేసుకున్నది ఏమీ లేదు. ప్రేక్షకుల అభిమానం, ప్రేమ తప్ప. చెన్నయిలో ఒక ఇల్లు ఉంది. మొన్ననే కోవైసరళను కలిసినప్పుడు “ఇండస్ట్రీకి వచ్చి ఏమీ దాచుకోలేదా ఛీపో” అని విసుక్కుంది. సంపాదనంతా ఫ్యామిలీకే సరిపోయేది.
ఆర్కే : ఈ బాధలు చుట్టుముట్టినప్పుడు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయా?
శ్రీలక్ష్మి : ఏడవనోళ్లు ఎవరుంటారు. నేను కూడా ఏడ్చాను. ఇంటికొచ్చి మా అమ్మతో ఒక ఆర్టిస్టు ఇలా అంటున్నాడు అని కన్నీళ్లు పెట్టేదాన్ని. అప్పుడు అమ్మ “అన్నీ మంచికే, అవన్నీ ఎదుర్కోవాలి” అని ధైర్యం నూరిపోసేది.
సిల్క్‌స్మితలాంటి డ్యాన్సులు చేయవచ్చు కదా. బోలెడంత డబ్బు వస్తుంది అన్నారు కొందరు. ఇప్పుడు చేస్తున్న పాత్రలు చేస్తే చాలు. అలాంటి పాత్రలు మా అమ్మాయికి వద్దు.. అంటూ అమ్మ ఒప్పుకోలేదు.

ఆర్కే : కమెడియన్‌గా మంచి సంతృప్తి నిచ్చిన సినిమా ఏది?
శ్రీలక్ష్మి : ఆ రోజుల్లో సిల్క్‌స్మిత ఉంటే సినిమా హిట్ అయినట్లు.. అలాగే నేను కమెడియన్‌గా చేస్తే ఆ సినిమా కూడా హిట్ అవుతుందన్నంత క్రేజ్ వచ్చింది నాకు. ‘స్వర్ణకమలం’, ‘శుభోదయం’, ‘సూత్రధారులు’.. ఇలా ఏ సినిమా అని చెప్పేది. అన్ని సినిమాల్లో నాకు మంచి పాత్రలే వచ్చాయి. వ్యక్తిగతంగా అయితే ‘శ్రీవారికి ప్రేమలేఖలు’ నచ్చింది. అందులో సినిమా కథలు చెప్పే పాత్ర నాది. ‘చంటబ్బాయి’లో పొట్టిప్రసాద్‌తో కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. రచయితను కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా అనే డైలాగులు మంచి పేరు తెచ్చాయి. ఇక, ‘జంబలకిడిపంబ’లో బ్రహ్మానందానికి తాళి కట్టే సీను నచ్చింది.
ఆర్కే : ఇప్పటివరకు ఆర్థికంగా మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేదా?
శ్రీలక్ష్మి : నేను మోసపోయేంత సంపాదించలేదు. కాని మరొక రకం మోసం జరిగేది. ఇస్తామని చెప్పినంత రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు. చెల్లని చెక్కులు ఎక్కువగా ఇచ్చేవారు.

ఆర్కే : కొందరికి చిట్టీలకు హామీలిచ్చి మోసపోయారట కదా?
శ్రీలక్ష్మి : అవును. అలా చేసి.. చాలా దెబ్బతిన్నాను. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారే అలా. అందుకే దేవుడు “నువ్వు ఉన్నదంతా దానం చేస్తావు. కాబట్టి నీకు కావాలనుకున్నప్పుడే ఇస్తాను” అని అవసరమైనప్పుడే ఇస్తున్నాడు.
ఆర్కే: చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏదైనా ఉందా?
శ్రీలక్ష్మి : ‘ఓ సీత కథ’లో రమాప్రభ చేసిన పాత్రలాంటిది చేయాలన్న కోరిక ఉండేది. రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన ‘పూలరంగడు’లో నూతన్‌ప్రసాద్ భార్యగా చేశాను. అది ఇన్నోసెంట్ పాత్ర.

ఆర్కే : ఇప్పుడేమైనా మళ్లీ సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నారా?
శ్రీలక్ష్మి : ప్రయత్నించడం లేదు. నాకు పిల్లలు లేరు. బాదరబందీలేవీ లేవు. హైదరాబాద్ వచ్చాక.. ఉగాది ఉత్సవాలకు తెలుగువాళ్లు పిలిస్తే.. అమెరికాకు వెళ్లొచ్చాను. గతంలో ‘చిన్నికృష్ణుడు’ అనే సినిమా షూటింగ్ కోసం వెళ్లానంతే. స్టార్‌నైట్‌లకు పిలిచినా వెళ్లలేదు.
ఆర్కే : మీ తమ్ముడు అలాగే రైజ్ అయ్యుంటే బాగుండేది కదా!
శ్రీలక్ష్మి : వాడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తాగుడుకు అలవాటు పడి చనిపోయాడు. ఆర్టిస్టు అంటే వాడే. నాకంటే వాడే మంచి నటుడు. నేను పరిస్థితుల వల్ల నటి అయ్యాను. చిన్న వయసుకే పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్లలో ఒకబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు తన స్నేహితుడితో కలిసి మితిమీరిన వేగంతో కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించాడు. మరొకడు ప్రస్తుతం కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఐశ్వర్య తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.
మా తమ్ముడి జీవితం 38 ఏళ్లకే పూర్తయింది. సరిదిద్దుకోరా అని ఎంత బతిమాలినా వినలేదు. “లేదు లేదు నేను చేయరాని తప్పు చేశాను. ఇది నా ఖర్మ” అని వాడు బాధపడేవాడు. సలీం మాస్టర్ అసిస్టెంట్, డ్యాన్సర్ అయిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు మా తమ్ముడు. అది అమ్మకు ఇష్టం లేదు.

ఆర్కే : ఈ జనరేషన్‌ను చూసి నేర్చుకోవాల్సినవి ఏమీ లేవా?
శ్రీలక్ష్మి : వాళ్ల ట్రెండ్‌కు తగ్గట్టు మనం పోవాలి. అందరితో స్పోర్టివ్‌గా మాట్లాడటం నేర్చుకోవాలి. “ఇలా చేయడం మంచిపద్దతి కాదు..” అనకూడదు. అలా అంటే “వాట్ నాన్సెన్స్”, “యు నో దట్” అంటారు వాళ్లు. ఎందుకొచ్చిన గొడవ. మనం వాళ్లతో ఎక్కువ వాదోపవాదాలు చేయకూడదు.

ఆర్కే : మీ కాలంలో సినిమారంగంలో గౌరవమర్యాదలు ఎలా ఉండేవి?
శ్రీలక్ష్మి : రామారావు, నాగేశ్వరరావుగారు వస్తున్నారంటే లేచి నిల్చునేవారం. ఇప్పుడు అలాంటి పెద్దలు వస్తున్నారంటే “వస్తే ఏంటి? ఎందుకు లేవాలి?” అంటున్నారు. ఆ జనరేషన్‌లో సీనియారిటీకి గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి గౌరవాలేవీ లేవు.

ఆర్కే : ఎంతోమంది హాస్య నటుల సరసన చేశారు కదా..? ఎవరితో మీకు బాగా కంఫర్టబుల్‌గా అనిపించేది..?
శ్రీలక్ష్మి : నేను యాభైమంది నటుల కాంబినేషన్‌తో చేశాను. అందరికంటే సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందంలతో కాంబినేషన్ బాగా కుదిరేది. సన్నివేశాలు సహజంగా పండేవి. సత్యనారాయణగారంటేనేమో కాస్త భయం. ఎందుకంటే ఆయన పెద్దనటుడు, సీనియర్ కాబట్టి. ఆయనతో ‘బృందావనం’, ‘ఆడవాళ్లా మజాకా’ అనే సినిమాలు చేశాను. రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తున్నప్పుడు మాత్రం.. చాలా స్వేచ్ఛ దొరికేది. ‘పెళ్లిసందడి’, ‘చాణక్య శపథం’, ‘పట్టాభిషేకం’ మరిచిపోలేని సినిమాలు.

ఆర్కే : ‘అబ్బ, దబ్బ, జబ్బ’ అనే మూడు మాటలతో ఒక సినిమాలో బాగా నవ్వించారు కదా..!
శ్రీలక్ష్మి : అది ‘శుభలగ్నం’. అందులో నాది మాటలు లేని పాత్ర. శోభనం రోజున కూడా ఓ పాట పాడమంటే ‘అబ్బబ్బా దబ్బబ్బా జబ్బ’ అనే పాడతాను. అది అప్పట్లో బాగా పేలింది.

ఆర్కే : ఒక సినిమాలో ఈల వేసి నవ్వించారు..
శ్రీలక్ష్మి : ‘ఆనందభైరవి’లో వేశాను. ఆ సినిమా కోసం ఈల ప్రాక్టీస్ చేశాను. థియేటర్లకు వెళ్లినప్పుడు ఈల వేయమని ప్రేక్షకులంతా గోల చేసేవారు. ఎంత ప్రయత్నించినా ఈల వేయడం వచ్చేది కాదు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13
                                  కణాదుడు
ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే చిన్న కణాలుగా విభజించటం కుదరదని చెప్పాడు .వీటినే అణువులు అన్నాడు గ్రీకు లో ఆటోమాస్ అంటే విభజించాతానికి వీలుకానిది అని అర్ధం .అనువులున్నాయని నిరూపించా లేక పోయాడు
కఠోపనిషత్తు లో ప్రపంచ పరిణామానికి జడ పదార్దమే కారణం అని ఉంది దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారం గా తీసుకొని మన వాళ్ళు వేరే మార్గం లో పయనించారు కపిల ,కణాదుల భౌతిక సిద్ధాంతం తర్వాత బౌద్ధం వచ్చింది తర్వాత జైనమతం హేతు వాదం తో వృద్ధి చెందింది .బౌద్ధ ,జైన శాస్త్ర వేత్తలు కనాడ కపిలులనే ఆధారం గా తీసుకొన్నారు .దేమోక్రాతిస్ కు ముందే కణాదుడు జన్మించాడు వైశేషిక దర్శనం లో ”అన్విక విశిష్టత ”ఉంది .వైషేశికం లో ఆధునిక శాస్త్ర వేత్త ”ఔలూక్యుడు ”.ఈ నాడు మనం చెప్పే శాస్త్ర వేత్త ,పరిశోధకుడు అనే పేర్లు ఆయనకే సరి పోతాయి ఆయనే కణాదుడు .డేమోక్రాటిస్ కు నాలుగు వందల ఏళ్ళ క్రితమే కణాదుడు పుట్టాడు .

                  

”ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం ”నూతన అధ్యాయానికి దారి తీసింది .”అణు భక్షకుడు ”అని కణాదుడు పేరు పొందాడు .కణాదుడు అంటే కణాలు తినే వాడని అర్ధం .”అణుస్ ”అనే సంస్క్రుత్సపడమే ఆటం అయింది ఇంగ్లీషులో .సూదులను అయస్కాంతం ఆకర్షించటం ,మొక్కలలో జల ప్రసరణ జడం అనేది ఈధర్ లేక అయస్కాంతం లో ప్రసారం చేయటానికి ఆధారమవటం ,అన్ని రకాల వేడికి సూర్యుడు ,అగ్నియె కారణం ,భూమి అనువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనం కోన సాగటం అను విచ్చ్చ్చేడం ద్వారా విశ్వ ప్రళయం ,ఉష్ణ ,కాంతి కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించటం వల్లనే కణాలు అనూహ్య వేగం తో అన్ని వైపులకు దూసుకు పోతాయి (విశ్వ కిరానా సిద్ధాంతం ),దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటిని కణాదుడు స్స్పస్తం గా చెప్పాడు .
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణం అవుతుంది ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది .అనువుల్లో అంతర్భాగం గా ఉన్న సహజ భౌతిక శక్తి ,బహిర్గాతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు .ప్రపంచ సృష్టికి అణువులే కారణం .అణువులు గుండ్రగా ఉంటాయి .అణువులు ఒకదానినుంచి ఒకటి వేరైనప్పుడు కాని ,కదలిక లేనప్పుడు కాని ఏ పనీ జరుగదు అన్నాడు .అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణ మౌతాయి .కణాలు ఏర్పడటానికి అందులోని అణువులే కారణం .అణువులు ఎప్పుడూ చేతనా స్తితి లో ఉంటాయని కణాదుడు ఊహించ లేక పోయాడు .డిమొక్రటిస్ సిద్ధాంతాల కంటే కనాడ సిద్ధాంతాలు భౌతిక వాదాన్ని బాగా బల పరుస్తాయి .
”పరిమిటి గల పదార్ధం అనంత కోటి వస్తువులకు పదార్ధం కాజాలదు”అన్న వైషేశికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్ధం అనువు అనే నిర్ధారించింది .
కణాడునికి ఔలూఖ్య ,కాశ్యప అనే పేర్లున్నాయి క్రీ పూ ఆరవ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు .ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ జిల్లా పభోస ప్రాంతం లో ప్రభాస లో కణాదుడు జీవించాడు ఆయనది ”పావురం జీవితం ”అన్నారు కొందరు .అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని తిని బతికాడని అర్ధం .చిన్న చిన్న రేణువులు అంటే కణా దులు మీద ఆధార పడిజీవించాడు కనుక ”కణాదుడు ”అని పించుకొన్నాడు .ఆయనకు ”కణ  ”,కణ భూకర్ ,కణ భక్ష ”పేర్లు కూడా ఉన్నాయి ఈయన సోమ శర్మకు శిష్యుడు .”సూర్య కారణ సంబంధం ”అనే సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన వాడు కనాడుడే .”వైశేషిక సూత్రా ”రచయితా .ఇది పది గ్రందాల సంపుటి .ప్రతి గ్రంధం లో రెండేసి అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం లో అనేక సూత్రాలు ఉన్నాయి ప్రతి గ్రంధంలో కనీసం 370సూత్రాలుంటాయి .పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని వాటిని మళ్ళీ విభజించినా ఆ తర్వాత విభజించటం సాధ్యం కాదు అని చెప్పాడు
కణాద సిద్ధాతం ప్రకారం ఈ విశ్వం ఆరు స్తితులలో ఉంది ద్రవ్య ,గుణ ,కర్మ ,సామాన్య ,విశేష ,సమవాయ స్తితులు .పదార్ధాలు తొమ్మిది అస్తిత్వాలను కలిగి ఉంటాయి భూమి జాలం ,అగ్ని ,తేజ ,వాయు ఏఎధర్ ,కాలం ,అంట రిక్షం మనస్సు ,ఆత్మా ..కణాదుడు నిరీశ్వర వాదిడ చని పోయే ముందైన దేవుడిని ప్రార్ధించమని శిష్యులు కోరితే ”పీలవః ”అని అన్నాడట .అంటే ”పరమాణువు ,పరమాణువు ”.అని అర్ధం .ఈయన భావనలో మనస్సు ఆత్మా రెండు ద్రవ్యాలే .ప్రతి ద్రవ్యం అణురూపం లోనే ఉంటుంది .స్పేస్ అండ్ టైంకూడా ద్రవ్యా లేనివని ఐ న్ స్టీన్ కాలాని కంటే ముందే  కణాద మహర్షి చెప్పాడు నిరీశ్వర వాదికావటం  వల్ల తగినంత ప్రచారం పొందలేక పోయాడు .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-13-కాంప్-హైదరాబాద్

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -12

               చరక మహర్షి
మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు ,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం  లో అధర్వ వేదం లో ఉన్నాయి .వాటిని క్రోడీకరించి స్వీయ అనుభవాన్ని జోడించి చికిత్సా విధానం రాశాడు .

చరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన ,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన  ,కల్పస్థాన  ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను  ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త ,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త  ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి ,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై  ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి ,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 16-11-13- కాంప్-హైదరాబాద్  –

Posted in సైన్స్ | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11

సుశ్రుతుడు

నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర  అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .

సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు

 

 

 

.

సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .

ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .

సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే ‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు

పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క  సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .

అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .

గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్ ‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .

మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-16-11-13-కాంప్-హైదరాబాద్

Posted in సైన్స్ | Tagged | Leave a comment

కీసరగుట్ట ప్రయాణం

This gallery contains 46 photos.

More Galleries | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10

    ధన్వంతరి ఆచార్య

ఆయుర్వేద పితామహుడని కీర్తి పొందిన వాడు ఆచార్య ధన్వనతరి .జబ్బు ఎలా చేస్తుంది ,దాని నివారణ ఏమిటి ,ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలను గురించి సవివరం గా తెలియ జేసిన వాడు ఈ మహనీయుడు .ఆరోగ్యాన్నిచ్చి ఆయుస్సును పెంచేదే ఆయుర్వేదం అని దానికొక వేదం గౌరవాన్ని కల్గించాడు సుమారు రెండు వందల యాభై వన మూలికలను ,ఖనిజాలను ఔషధాలుగా ఉపయోగించి వైద్యానికి మహోన్నత స్తానం కల్పించాడు ఎప్పటి వాడో ఖచ్చితం గా చెప్పలేము .కాని క్రీ శ .అయిదవ శతాబ్దికి చెందిన ఆచార్య వాగ్భటుడు ధన్వంతరిని ‘’ఆయుర్వేద పితామహుడు ‘’అని కీర్తించాడు .కాశీ రాజు దివోదాసుడికి ,ఆచార్య సుశ్రుతుడికి వైద్యాన్ని బోధించాడని ,‘’దివోదాసు ‘’ధన్వంతరి గా మారాడని చరిత్రకారులు రాశారు .మన ప్రాచీన గ్రందాల వల్ల ధన్వంతరి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన వాడని తెలుస్తోంది .ప్రపంచ వైద్య చరిత్రకు శ్రీ కారం చుట్టింది మాత్రం ‘’ధన్వంతరి ‘’యే నన్నది సుస్పష్టం .విక్రామాదిత్యుని నవరత్నాలలో ధన్వంతరి పేరు ఉంది ‘అయితే వీరేవ్వరు అసలు ధన్వంతరి కాదు కాశీ రాజు దివోదాసే ధన్వంతరి అని నిర్ధారణ  అయింది .ధన్వంతరి సాక్షాత్తు భగ వంతుడే నని మన వారి విశ్వాసం .

 

సంప్రదాయ ఆయుర్వేదాన్ని మొదటగా సుశ్రుతుడు మొదలైన శిష్యులకు ధన్వంతరి బోధించాడు .మన దేహం పంచ భూత అంశాలతో నిర్మిత మైనదని ,దేహం లోని ఈ మూలకాల మధ్య సమ తౌల్యం కాపాడటమే ఆయుర్వ్యుద్ధికి కీలకం అని ఆయుర్వేదం చెబుతోంది .వ్యాధి లక్షణాలను క్రోడీకరించి వర్ణించి ,ఓషధుల వివరాలను తెల్పి ,మానసిక చింతన ను కూడా జోడించి తనదైన శైలిలో సశాస్త్రీయ సంప్రదాయ వైద్యాన్ని వృద్ధి పరచాడు .ఇదే ‘’ఆయుర్వేదం పేరుతొ చలా మణిఅయింది .ధన్వంతరి ‘’ఆయుర్వేద సృష్టి కర్త’’అయ్యాడు .సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యులలో ధన్వంతరికూడా ఒకడనిఅంటారు .క్షీర సాగర మధనం లో పుట్టిన వారిలో ధన్వంతరి కూడా ఒకదాని నమ్ముతారు .

 

 

ధన్వంతరి రూప కల్పన చేసిన సంప్రదాయ వైద్యం లో ఎనిమిది భాగాలున్నాయి .

1-కాయ చికిత్స –ఇది శరీర భాగాలన్నితికి చేసే సంపూర్ణ చికిత్స .కడుపు లోకి తీసుకొనేవాటిగురించి తెలియ జేస్తుంది .

2-బాల చికిత్స –శిశు రోగాలకు సంబంధించిన అనేక విషయాలు ,చికిత్సా విధానాలు తెలియ జేస్తుంది .బాలారిస్టాలకు సున్నిత చికిత్స ఇందులో ఉంది .

3—గ్రహ చికిత్స –మానసిక వైద్యానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తుంది .మనో విశ్లేషణ చేసి మనస్తత్వాలను బేరీజు వేసి చికిత్స చేసే విధానం వివరించారు .

4-శల్యాక తంత్ర –శరీరం లో వివిధ భాగాలకు సంబంధించిన రోగాలను గురించి చెబుతుంది కన్ను ముక్కు చెవి మొదలైన వాటి రోగాలలు నివారణ తెలియ జేస్తుంది .

5—శల్య తంత్ర –చిన్నా ,పెద్ద శాస్త్ర చికిత్సల వివరాలున్నాయి .ఏ సూత్రాలు పాటించాలో వివరాలూ ఉన్నాయి .

6-విష తంత్ర –అశ్వినీ కుమారుడు రాసిన విష శాస్త్రం లోని విషయాలు క్రోడీకరించి ఇందులో చెప్పాడు .ప్రాక్రుతిలో లభించే విషాలు ,అందులో లాభం కలిగించేవి నష్టం కలిగించేవి తెలిపాడు .ఆధునిక ‘’టాక్సీ కాలజి ‘’ఇది ఎంతో ఉపయోగించింది .

7-రసాయన తంత్ర –వన మూలికల తో రూపొందించిన రసాయనాలను ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయ వచ్చో చెప్పుతుంది .

8-వాజీ కారణం –నపుంసక లక్షణాన్ని పోగొట్ట టానికి ,పుంసత్వాన్ని పెంపొందించ టానికి చికిత్సా వివరాలున్నాయి .ఇదే ఆధునిక వైద్య శాస్త్రానికి మూలాధారం అయింది

ఇలా ఎనిమిది రకాల విధానం తో సమగ్ర వైద్య శాస్త్రాన్ని రూపొందించాడు ధన్వంతరి ఆచార్య .

నేటి అనాటమీ ,ఎమ్బ్రియాలజి ,ఫిజియాలజీ ,పాదాలజి ,పాదో జేనేసిస్ ,ఫార్మకాలజీ మొదలైన అనేక వైద్య విభాగాలకు బీజం వేసిన వాడు ధన్వంతరి .అంటే ఏదో కేవలం ఆయన్ను వైద్య శాస్త్ర పితామహుడు అని గుడి కట్టి పూజించటం కాదు ఇన్ని విభాగాలలో నిష్ణాతుడు, రూప శిల్పి అని లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-13-ఉయ్యూరు

 

Posted in సైన్స్ | Tagged | 2 Comments

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు
మనం ఆంగ్లం అనటం మరిచి ఇన్గ్లేహ్ అనటం ప్రారంభించి చాలా కాలమై పోయింది .అలాగే ఎన్నో ఇన్గ్లేఎశ్ పదాలు ఉకారాన్తమై తెలుగు పడాలి విడదీయ రాణి బంధాన్ని పెన వేసుకు పోయాయి ఇవి ఆంగ్ల పదాలు అంటే అంటే ఇప్పుడు మనం ఆశ్చర్య పోయేంత పరిస్తితి వచ్చింది .ఆ వైనం తెలియ జేయటమే నాఉద్దేశ్యం .
రాత్రి నిద్ర నుంచి మనం కావాల్సిన సమయానికి లేవాలంటే ”అలారం ”పెట్టుకోవటం తో దిన చర్యలో ఈ పదాలు భాగమై పోతాయి .సరే నిద్ర లేచాం వెంటనే మనకు కావలసింది ”బ్రష్షు ”,పేస్టూ ”.తర్వాత ”బాత్ రూమ్ ” ,లెట్రిన్ ”ను .స్నానం చేయటానికి ”టవల్ ”,ఒళ్ళు రుద్దుకోవటానికి ”సోపు” ,తలంటికి ”షాంపూ”,అవసరం తర్వాత ”టిఫిన్ ”చేస్తాం ”.కాఫీ ” తాగుతాం.తీరిక ఉంటె ”పేపర్ ”చదువుతాం .అందులో ”పజిల్స్ ”చూస్తాం వాటిని చేతనైతే ”సాల్వు ”చేస్తాం .ఇష్టముంటే ”వీక్లీ ”తిరగేస్తాం .ఇష్టమైన ”కాలం ”చదువుతాం .
కూరగాయలు కొనటానికి ”మార్కెట్ ”కు వెళ్తాం .అక్కడ అవసరమైనవి ”కేజీ ”లలో కొంటాం .వెళ్ళటానికి ”బస్సు ”కాని ”ఆటో ”కాని ”స్కూటర్ ”కాని ”మోపెడ్ ”కాని ఉపయోగిస్తాం .మరి వాటికి ”పెట్రోల్ ”కొట్టిన్చుకొంటాం” బంకు” ”లో  .మధ్యలో ”స్పీడ్ బ్రేకర్లు ”జాగ్రత్త గా దాటుతాం .కాలక్షేపానికి ”లైబ్రరి ”కి వెడతాం .ఎవరి తో నైనా మాట్లాడాలంటే ”ఫోను”లేక ”సెల్లు ”వాడుతాం .వాటికీ నెల నేలా ”బిల్లు ”కడతాం” రీ చార్జి ”చేయిస్తాం .సెల్ లో ”సిం కార్డ్ ”వేయిన్చుకొంటాం
ఇక వంట చేసుకోవటానికి ”గాస్ స్టవ్ ”కావలి కదా .దాన్ని వెలిగించే ”లైటర్ ”అవసరం కదా .”గ్యాస్ సిలిండర్ ”ను ”బుక్ ” చేసుకోవాలికడా .అయిపోగానే ”ఏజెంట్ ”వద్ద బుక్ చేసుకొంటాం.స్టవ్ కు ”బర్నర్ ”లు ఉంటాయి .వాటికి” స్విచ్చులు ”ఉంటాయి కదా తక్కువ మంట కావాలంటే ”సిం ”లో పెట్టాలికడా .అన్నం వండుకోవటానికి ”రైస్ కుక్కరు ”కావలి కదా
ఉండటానికి ఒక ”ఫ్లాట్”కాని ”ప్లాట్”కాని ఏదో ఒక ”కాలనీ”లోనో ”ఎన్క్లేవ్ ”లోనో తీసుకోవాలికడా .దానికి ”లిఫ్ట్”ఉండాలి ,”అప్రోచ్ రోడ్లు”కావాలి .”వాటర్ ,కరెంట్”ఉండాలి .అది పక్కా ”వెంచర్”గా ఉండాలి .” లేఔట్లు ,పార్కింగ్ ,పార్కు ,స్విమ్మింగ్ పూల్ ,కమ్మ్యూనిటి హాల్ ”ఉండాలి ”వెంటిలేషన్ ”,కిచెన్ ,బాల్కని ,బస్ సౌకర్యం ”ఉంటేనే” ప్రేఫర్ ”చేస్తాం.
పిల్లల్ని చది విన్చుకోవటానికి” స్కూల్ లేక కాన్వెంట్ ,కాలేజీ ”అవసరం వాళ్ళ ”అడ్మిషన్స్ ,ఫీజులు బాగులు ,యూనిఫారములు ,టై ,బెల్టు,షూసు,వాటికి లేసులు ,”తడిసి మోపెడు ”.అన్నట్లు వీళ్ళు ఆడపిల్లలైతే ”మోపెడ్లు,స్కూటీ”లు కొనాలి .మగావాల్llaలకి” టు వీలర్స్”ఇవ్వాలి ‘స్కూటరు, ,బైకు,”’కొనివ్వాలి ఇవి కుదరక పొతే ”షేర్ ఆటో ”లోనో ”స్కూల్ బస్ ”లోనో పంపాలి
ప్రత్యెక ”కోర్సులు ”అయిన ”పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్ బి.టెక్ .మెడిసిన్ ,ఇటిఐ,,ఐ ఐ టిఎంబీయే ,”వగైరాలు చదివించాలంటే ”రేసిడేన్షియల్   ”కాలేజీలను ఎంచుకొంటాం అక్కడ ”హాస్టలు ”సౌకర్యం ”వార్డెన్ ”మంచివాడా కాదా అని ఆలోచిస్తాం .”వీకెండ్” ఎలాగాడుపుటారో నని ”వేకేషన్లు అనుకూలం గా ఉంటాయో లేదో నని చూస్తాం .”సమ్మర్ హాలిడేస్ వింటర్ హాలిడేస్ ”ఎక్కువగా ఉన్నాయా లేదో ట్లుసుకొంటాం .ఇక” మేస్టర్”అవాలంటే” బియిడ్’త్రేయింగ్ కాలేజి ”గురించి ఆలోచిస్తాం .
ప్రయాణ సౌకర్యాలలోకి వస్తే హాయిన ప్రయాణానికి ”రిజర్వేషన్ ”చేయిస్తాం ”స్లీపర్ కోచ్” లో ”లోవర్ బెర్త్””ప్రేఫర్ ”చేస్తాం ఇప్పుడు అంటా ”ఆన్ లైన్ రిజేర్వేష న్లె ” హాయిగా ”కంప్యూటర్ తోనో ,లాప్ టాప్ తోనో ఐపాడ్ ”తోనో రిజేర్వ్ చేసుకొంటాం .ఒక వేల తక్కువ అమయం లో టికెట్ కావాలంటే ”వైటింగ్ లిస్టు ”లో మన ”నంబర్”ఎంతో చూసుకొని వస్తుందో రాదో తెలుసుకొంటాం ”ఆర్ ఏ.సి ”గురించి ఆలో చిస్తాం ,, ”ఈసేవ మీ సేవ ”ద్వారాకూడా”ట్రై”చేస్తాం ”.కంపార్ట్మెంట్ ”నంబర్ తెలుసుకొని అక్కడికి చేరి ఎక్కుతాం ”టికెట్ కలెక్టర్ ”కు చూపించి ”కన్ఫర్మ్ ”చేసుకొంటాం” ఐడెంటిటి  కార్డు ”చూపిస్తాం .అవసరమైతే ”అలారం చైన్”లాగుతాం .
ప్రయాణాలకు ”ఫాస్ట్ ,సూపర్ ఫాస్ట్ .ఎక్స్ప్రెస్ ,మెయిల్ ,”ప్రయాణాలే కోరుకుంటాం .”లిమిటెడ్ హాల్త్స్ ”కోరుతాం .కాలక్షేపానికి ”లైబ్రరి ”కి వెడతాం .అక్కడ ”డిపాజిట్ ”కట్టి పుస్తకాలు తెచ్చుకొంటాం .మేగజైన్లు ”తిరగేస్తాం .
నెల నేలా ”కరెంట్ బిల్లులు ”వస్తాయి .వాటిని కట్టేస్తాం .బిల్లులిచ్చే వాడు ”మీటర్ ”చూసి ”రీడింగ్ ”తీసి బిల్లు ఇస్తాడు .”దిఫాల్టర్ లిస్టు”లో పడకుండా చూసుకొంటాం .
ఎవరికైనా ఏదైనా విషయం రాయాలంటే ”కార్డు ,కవరు ఇన్ లాండ్ లెటర్ ”ఉపయోగిస్తాం అత్యవసరం అయితే ఇప్పటిదాకా ఉన్న ”టెలిగ్రాం ”వాడే వాళ్ళం .ఇప్పుడు ”యి మెయిల్ ”లో అన్నీ పంపిస్తున్నాం .”బ్లాగులు ”..పెట్టి మన సత్తా చాటుకొంటున్నాం .”మౌసు ”మన ఆరాధ్య దైవం అయింది .”చాటల కొద్దీ  ”చాట్ ”చేస్తాం
డబ్బు దాచుకోవటానికి ”పోస్టాఫీసు ,బ్యాంకు ”లను ఉపయో గించుతాం ..’అక్కడ ”అకౌంట్లు ;;వోపెన్ ”చేస్తాం .డబ్బు ”డిపాజిట్ ”చేస్తాం దానికి ”డిపాజిట్ ఫారము విత్ ద్రాయాల్ ఫారాలు ”వాడుతాం .అవసరమైతే” ఆన్ లైన్ .ట్రాన్స్ ఫర్ ”చేస్తాం .”మని ఆర్డర్ ,మని గ్రామ్,వెస్తెర్న్ మని ట్రాన్స్ ఫర్ ”లు ఉపయోగిస్తాం .ఎక్కువ డబ్బుంటే ”ఫిక్సెడ్ డిపాజిట్ ”చేస్తాం .ఎక్కువ ”ఇంట్రెస్ట్ ”ఎలా వస్తుందో ఆలోచిస్తాం ”.టర్మ్ డిపాజిట్ ,ఆరి.డి.”,లలో డబ్బు దాస్తాం .”సేవింగ్స్ ఎకౌంట్ కరెంట్ లలలో డబ్బు వాడుకొంటాం .వీటికి ”పాస్ బుక్ ”ఇస్తారు కదా .ఇప్పుడు ”ఏ.టి.ఏం ”సౌకర్యం కూడా ఉంది .డబ్బు తీయటానికి వెయ్యటానికి ”ఏ.టి .ఏం కార్డు ”ఇస్తారుకదా.
వ్రుద్దులకోసం ”ఒల్దేజి హోములు ”ఉన్నాయి .వాళ్ళకు ”మెడికల్ ఫెసిలిటి ”ఉంటుంది .”హెల్త్ చెకప్ ”తప్పని సరి .
ఉద్యోగస్తులకు జీతాలు ”డి.ఏ.లు టి.ఏ.లు, పేఫిక్సేషను ,ఇంటరిమ్ రిలీఫ్ ,వెయిటేజీ ,ఏనా మలీసు విషయాలలో పదేల్లకో అయిదేళ్లకు సవరణ ఉంటుంది .వీటికి ఉద్యోగ సంఘాల ”డిమాండులు ”ముందుగానే ఇస్తారు .
జబ్బుల విషయానికొస్తే ”కలరా.టైఫాయిడు  .బి.పి.సుగరు టి.బి.బర్డ్ ఫ్లూ స్వైన్న్ ఫ్లూ,కౌ ఫీవర్ ,చికెన్ గున్యా ,ఆంత్రాక్స్ ,మొదలైనవి తెలుగై పోయాయి వీటికోసం ”బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు ”అవసరం ఇవి చేసే ”క్లినిక్కులు ”ఉన్నాయి రోగ నిర్ధారణకు ”యాన్జియోగ్రాము ,ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ,బైపాస్ సర్జరీ, స్టంటు, వెంటి లెటర్లు,బై పాస్ సర్జరీ ,బ్బ్రేయిన్ ట్యూమర్ ,అన్నీ మనవైపోయాయి ”స్పెషలిస్టు డాక్టర్లు ”,అవసరమయ్యారు .
పిల్లలకు అవసరమైన ”బుక్సు, పెన్సిళ్ళు ,పెన్నులు ,జామెట్రీ బాక్సులు ,ఇరేజర్లు ,బాల్ పాయింటు పెన్నులు ,కవర్లు ,నేఁమ్ కూపన్లు” తెలుగైపోయాయి .
వినోదం కోసం ”సినిమా ,వీడియో ,కేసెట్లు సిడి.లు ,టివి.లు ,సిడి ప్లేయర్లు,దియేటర్లు ఐ మాక్సులు ,త్రీడి లు ఫోర్ డి ”లు మనవి కాక ఇంకేవరివి ?”కేబుల్ ,సెట్ ఆఫ్ బాక్సులు ,యాంటెన్నాలు ,కేబుల్ వైర్ ”అన్నీ మనవే .
ఇంట్లో ”స్విచ్ బోర్డులు ,లైట్లు ట్యూబ్ లైట్లు ,ప్లగ్గులు ,స్విచ్చులు ,మోటార్లు ,బోరింగులు ,పైపు లైన్లు ,వీటిని చూసే ”ప్లంబర్లు ,కార్పెంటర్లు ,మెకానిక్కులు ,అందరు అవసరమే .
స్కూల్ లో” ఫీజులు ,పే బిల్లులు ,మంత్లీ రిటర్నులు  ,మార్కులు మార్కు షీట్లులు మార్కు రిజిస్టర్లు ,ఎద్మిషన్ రిజిస్టర్లు ,మంత్లీ టెస్టులు ,వీక్లీ టెస్టులు ,క్వార్తర్లి ,హాఫియర్లీ ,యాన్యుయల్ పరీక్షలు ,ప్రమోషన్లు ,రిజల్ట్సు ,కంప్యూట రైజేడ్ మార్కు లిస్టులు, ,టి.సి.లు ,అడ్మిషన్లు ,క్లాసు రూములు ,లేబరేటరి ,స్టాఫ్ రూములు ,రీడింగు రూము ,హాస్టలు అన్నీ తెలుగై పోయాయి
పొద్దున్నే లేస్తే ”గుడ్ మార్నిగ్ ”,తర్వాతా” గుడ్ ఈవెనింగ్ ”చివరికి ”గుడ్ నైట్ ”తో దిన చర్య పూర్తీ
ముఖ్యమైన  రోజు ”కు హేపీ బర్త్ డే ,హేపీ మేరేజి డే ,ఫాదర్స్ డే, మదర్స్ డే,వాలంటైన్ డే ”మొదలైన వన్నీ” టేలుగైజ్ అయిన  ఇంగ్లీషు ముక్కలే ”
ఇంతటితో ”గుడ్ బై ‘–”’సారీ– ”వీడుకోలు”చివరిది తప్ప ముందు రెండూ తెలుగైపోయినవే  ,’
నేను ”లాపు టాపు ”ముందు కూర్చుని ఒక గంటలో రాసిన దీనిలో నాకు సద్యో స్పురణకు వచ్చిన మాటలే ఇవి ఇవి కాక ఎన్నో నా ద్రుష్టి నుంచి తప్పించుకొని పోయి ఉంటాయి .వాటినీ ఏర్చి కూర్చి దీనికి ”సప్ప్లి మెంట్ ”చేయ వలసినదిగా సాహితీ బంధువులను కోరుత్న్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-13-కాంప్–హైదరాబాద్

Posted in రచనలు | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9 వేదాలలో ఉన్న విజ్ఞానం

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9
         వేదాలలో ఉన్న విజ్ఞానం
ఋగ్వేదం లోని ఇరవై ఒక్క శాఖలలో నేటి కాలానికి ఉపయోగ పడే శాఖలు రెండు మాత్రమె అవే -విశాకల ,భాష్య శాఖలు .వీటిలో వ్యవసాయ ,వాణిజ్య ,ప్రయాణ ,ఓడల విమానాల తయారీ ,మొదలైన వివరణలున్నాయి .తైత్తిరీయ యజుర్వేదం లో మూడు ప్రకరణాలైన సంహిత ,ఆరణ్యకం ,బ్రాహ్మణం లలో ఆధునికులకు ఉపయోగపడేది ఒక్క సంహిత మాత్ర్తమే .ఇందులో ఏడు కందకాలున్నాయి .44ప్రపాఠకాలున్నాయి 2196..పనసలున్నాయి .ఇవన్నీ ఆధునిక విజ్ఞాన విశేష భాండా గారాలే .వీటిలో విశ్వావిర్భావం ,గణిత ,ఆరోగ్య శాస్త్రాలు ,అంతరిక్ష శాస్త్రం ,లకు చెందినా పరిశోధనా ఫలితాలున్నాయి .కృష్ణ యజుర్వేదంలో ఆపస్తంభ మహర్షి ప్రతిపాదించిన ”శుల్బ సూత్రాలు ”ఈ నాటి గణితానికి ఎంతో ఉపయోగపడేవి .సామ వేదం కాల భ్రస్టత కు చెందింది. అధర్వ వేదం లో భౌతిక విజ్ఞాన శాస్త్ర మూలాలు అనేకమున్నాయి .ప్రాచీన మహర్షులే అనేక విజ్ఞాన శాస్త్రాలకు పునాదులు వేశారని వీటి వల్ల మనకు తెలుస్తోంది .ఆశ్వలాయన ,సామ్ఖ్యాయనుల సూత్రాలు ఋగ్వేదం లో ను కృష్ణ ,యజుర్వేదం లో ఆపస్తంభ ,మానవ ,వైఖానస ,హిరణ్య కేశీల సూత్రాలు,శుక్ల యజుర్వేదం లో   కాత్యాయన ,పారస్కర సూత్రాలు ,అధర్వ వేదం లో కౌశిక సూత్రాలు విజ్ఞాన గ నులే .,
       భూర్జర పత్రాలు
కాగితం రాక ముందు రాత అంతా తాళ పత్రాల మీద భూర్జ పత్రాల మీదే జరిగేది .భూర్జ వృక్షాలు హిమాలయ సానువుల్లో పెరిగే పొడవాటి వృక్షాలు మన ప్రాచీనులకు వీటిబెరడే   రచన కు తోడ్పడేవి .ఈ చెట్లు సముద్ర  మట్టానికి పది వేల నుంచి పద్నాలుగు వేల అడుగు ఎత్తున్న ప్రదేశాలలోనే జీవిస్తాయి .వీటికి భోజ వృక్షాలు అనే పేరు కూడా ఉంది .ఇవి నెమ్మదిగా పెరిగే చెట్లు.ఆరు అడుగుల చుట్టుకొలత తో ఎనభై అడుగుల ఎత్తు దాకా పెరుగుతాయి .ఇలా పెరగటానికి వందేళ్ళు పడుతుంది .ఇవి ఏటా ఆకులు రాలుస్తాయి .బెరడు మెరిసే తెల్ల రంగులో ఉంటుంది .ఇది కాగితం లాంటి పదార్ధం తో తయారై ఉంటుంది .మన ప్రాచీనులు ఈ బెరడును చుట్టలుగా చుట్టి దాని పై రాసుకొనే వారు .ఈ చెట్టులో ప్రతిదీ ఉపయోగ పదేదే .అందనంత ఎత్తు  పెరగటం వల్ల ప్రత్యామ్నాయాం వెతుక్కోవాల్సి వచ్చింది అప్పుడు జంతు చర్మాలపై లేఖనం సాగించారు
మొదటి శవ పరీక్ష చేసిన ప్రొఫెసర్ మధుసూదన గుప్త
ఆ రోజుల్లో శవాన్ని తాకాలంటే భయం సందేహం .అలాంటిది  1835జనవరి28న కలకత్తా లో ఏర్పాటైన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ పండిట్ మధు సూదన గుప్తా విద్యార్ధులకు శరీరం లో ఉన్న వివిధ భాగాలను పరీక్షించి తెలియ జేసే నిమిత్తం రహస్యం గా కాలేజికి దగ్గరలో ఒక పాడుబడిన ఇంటికి తీసుకొని వెళ్లి మానవ కళేబరం మీద శవ పరీక్ష చేసి అందులోని భాగాలన్నీ విడమర్చి చూపించివిద్యార్ధులకు అవగాహన కలిగించారు .ఇదే ఆధునిక కాలం లోమనదేశం లో జరిగిన  మొదటి శవపరీక్ష గా చరిత్రకు ఎక్కింది .
భారతీయ విజ్ఞానాన్ని ఉపయోగించుకొన్న జర్మని
మన భరద్వాజ మహర్షి ”విమాన శాస్త్రం ”రాశారని అందరు చెప్పిన విషయమే కాని అందులో ఉన్న మర్మాలను మన వాళ్లకు తెలుసుకొనే తీరిక ఓపిక లేక పోయాయి ప్రోత్సహించే వారూకరువయ్యారు. జర్మన్లు ఈ విమాన శాస్త్రాన్ని గురించి విని ఆ గ్రంధాన్ని సంపాదించి భారతీయ సంస్క్రుతపండితుల్ని జర్మనీకి రహస్యం గా తీసుకొని వెళ్లి వారితో అందులోని విషయాలన్నీ  విశద పరచుకొని జర్మని లో మొదటి సారిగా విమానాన్ని తయారు చేశారు అన్నది తరువాత బహి రంగమైన సత్యం .
భారతీయ శాస్త్ర వేత్తలు ఇద్దరు కర్ణాటాక కు చెందినా వారొకరు మహా రాష్ట్ర కు చెందినా వారొకరు కలిసి మొదటి సారిగా భరద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి మొదటి విమానాన్ని తయారు చేసి రైట్ బ్రదర్స్ కంటే ముందే బొంబాయిలో ఎగిరించారు .ఈ విషయం బయట పడితే తమ పరువు పోతుందని ఆ నాటి పత్రికలూ ఈ వార్తను ప్రచురించకుండా బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు .కాని సత్యం దాగదుకడా .కొన్ని నెలల తర్వాత తిలక్ గారి ”కేసరి ”పత్రిక లో భారతీయులు ఎగుర వేసిన మొదటి విమానం విషయాలన్నీ ప్రచురించి లోకానికి మొదటి సారిగా తెలియ జేసింది దీన్ని కక్కా లేక మింగా లేక పోయారు తెల్ల దొరలూ .ఈ విషయాలన్నీ పూజ్యులు శ్రీ జాను మద్ది హనుమత్ శాస్త్రి గారు విపుల మైన ఒక వ్యాసం లో వివరించారు దీన్ని ఆధారం గా చేసుకొని నేను కూడా ”మొదటి విమానాన్ని ఎగరేసింది మనమే ”శీర్షిక తో సరసభారతి లో ఏడాది క్రితం ఒక వ్యాసం రాశాను చదివే ఉంటారు మీరందరూ .
జర్మని నియంత హిట్లర్ మరింత ముందుకు వెళ్లి మన ప్రాచీన విజ్ఞాన రహస్యాలను సంగ్రహించిన ఉదంతాన్ని ఇప్పుడు తెలియ జేస్తాను .హిట్లర్ ఆయుధ నిర్మాణం లో యెంత ముందుకు వెడుతున్నా శాస్త్రాలలో ఉన్న యుద్ధ పరికరాలు ,ఆయుధ నిర్మాణం లోని రహస్యాలను జర్మనీ వారు చేదించ లేక పోతున్నారు .అప్పుడు యజుర్వేద కర్మ కాండ పరంగా ,తాంత్రిక విద్యా పరంగా ,ఆధ్యాత్మ ,వైజ్ఞానిక పరం గా భావాన్ని అర్ధాన్ని విశదీకరించి చెప్పగల సామర్ధ్యం ఉన్న పండితులకోసం  రహస్యం గాతెలుసుకొనే నిమిత్త్తం ఒక బృందాన్ని పంపాడు .అప్పుడు ఆ రహస్య గూద చారులకు తూర్పు గోదావరి జిల్లా రాజ మండ్రికి చెందిన ”దండి భట్ట విశ్వ నాద శాస్త్రి” అనే బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి తెలిసింది ఈ ముఠా ఆయన్ను రహస్యం గా అనుసరిస్తూ విశాఖ పట్నం కొత్త వలసకు వెళ్లి తిరిగి వస్తున్నా శాస్త్రి గారిని దాదాపు కిడ్నాప్ చేసి విశాఖ రేవు పట్నం గుండా జర్మనీకి తీసుకొని వెళ్ళారు .
అప్పటికే హిట్లర్ ఆదేశాలతో బాంబుల తయారీ లో నిమగ్న మై ఉన్న జర్మని శాస్త్ర వేత్తలకు వాటిని రాశులు రాశులుగా నిల్వ చేస్తున్నప్పుడు ఒత్తిడికి పేలి పోవటం చాలా చికాకు కలిగిస్తూ బుర్ర బద్దలు కొట్టుకొంటున్నారు ఈ గండం నుంచి యెట్లా బయట పడాలో అని .దీన్ని గమనించిన శాస్త్రిగారు యజుర్వేదసం లో ఉన్న ఒక శ్లోకానికి వైజ్ఞానిక పరమైన అంతరార్ధాన్ని విడమర్చి చెప్పారట .దాని ప్రకారం చేస్తే బాంబులు ఒరిపిడికి పేల కుండా ఉంటాయని తెలియ జేశారట .అయన చెప్పినట్లే చేసి బాంబులు నిలవ చేయగలిగారని చరిత్ర చెబుతోంది .
విశ్వ నాద శాస్త్రి గారు జర్మనీ లో భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని అంతా విశదపరిచారట .జర్మనీలో శాస్త్రి గారు అత్యంత ఆడరనణీయ మైన వ్యక్తిగా నిలిచారు మనకు ఈ విషయం ఇటీవలి కాలం వరకు తెలియనే తెలియదు .ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో కేంద్ర ప్రభుత్వ భారత దేశ రాయ బారి జర్మనీ వెళ్ళాడు .అక్కడ ప్రభుత్వ కార్యాలయం లో ఒక చిత్ర పటాన్ని ఆయనకు చూపిస్తూ ఆయన ఎవరో తెలుసా అని అడిగారట .ఆయన నోరు వెల్ల బెట్టి తెలియదని నిజాయితీగా చెప్పాడట .అప్పుడు జర్మనీ అధికారులు ”వీరి పేరు విశ్వనాధ శాస్త్రి .వీరు వేదాలలో ఉన్న  ఎంతో శాస్త్రీయ విజ్ఞానాన్నిమాకు అంద జేసిన మహనీయులు . అందుకే ఈ స్మ్రుతి చిహ్నం మేము కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకోన్నాం ”అని చెప్పారట .ఆయన గురించి మనకు అసంపూర్తిగానే తెలుసు .కాని జర్మన్లకు ఆరాధ్యులైనారు దండి భట్ట విశ్వనాధ శాస్త్రి .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ – .14-11-13-కాంప్-హైదరాబాద్

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8 అలనాటి మన విద్యా విధానం

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8
అలనాటి మన విద్యా విధానం
రామాయణం లో మహర్షి వాల్మీకి హనుమంతుడు సంజీవిని తెచ్చి లక్ష్మణ మూర్చ నుంచి ,గాయ పడ్డ వానర సైన్య చికిత్సకు ఉపయోగించిన సంగతి మనకు తెలుసు .మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -గ్వాలియర్ శాస్త్ర వేత్త కే.షా బృందం సంజీవిని బయో యాక్టివ్ కాంపౌండ్ ను పొంద వచ్చునని ,దీనితో వైద్య చికిత్స లో అద్భుతాలు చేయచ్చునని తెలియ జేశారు .ఈ బృందం లో దర్భంగా సి.ఏం.కాలేజి, ,హైదరాబాద్ డి.యెన్.ఏ.ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్ కు చెందిన పరి శోధకులు కూడా ఉన్నారు .అమితమైన అల్ట్రా వయొలెట్ రేడియేషన్ మూలం గా శరీరం లోని కణాలు నిర్జీవమైనప్పుడు సంజీవిని మూలిక ఉపయోగిస్తే కణాలు తిరిగి జీవం పోసుకొంతాయని నిరూపించారు .ప్రసవ సమయం లో బలహీన పడ్డ స్త్రీలకూ ,ఋతు క్రమం సరిగా లేని వారికి ,కామెర్ల వారికి సంజీవిని చూర్ణం అద్వితీయం గా ప్రయోజనం సిద్ధింప జేస్తుందని వీరి పరిశోధన లో తేలింది .
అలాగే ఉసురు అంటే ప్రాణం ను నిలిపే కాయ ”ఉసురు కాయ” అంటే ఉసిరికాయ .చ్యవన ప్రాస ,త్రిఫల చూర్నాలలో ఇదిదీని ప్రాధాన్యత ఉంది .దీనిలో సి విటమిన్ అధికం .రెండవ ప్రపంచ యుద్ధం లో స్కర్వీ వ్యాధి నుంచి భారత సైనికులను రక్షించింది ఉసిరి పండ్ల తో చేసిన కాండీ లను తిని పించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు .అలాగే కల బంద ,వెల్లుల్లి ,తులసి ప్రక్రుతి సిద్ధ ఆరోగ్యాభి వృద్ధి కారకాలు .
క్రీ.పూ.వాడైన కశ్యప ముని కుమారుడు ఇంద్ర వనమూలికా సారం తో ”సోమ రసం ”తయారు చేయటం కనీ పెట్టాడు .ఇది ప్రాణ శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుందిఅని ఋగ్వేదం చెప్పింది .ఈ రసాన్ని తాగితే శారీరక ,మానసిక బలం పెరుగుతుందని ఇంద్ర స్వయం గా చెప్పాడు . దీని విశేషాలను వివరిస్తూ ఋగ్వేదం లో నూట ఇరవై మంత్రాలున్నాయి .కంటి చూపు ,చర్మ వ్యాధులు ,మానసిక అస్వస్తత ,గర్భస్త సంరక్షణ మొదలైన వాటికి ఎంతో ప్రయోజన కారి .”ఇంద్ర రసాయనం ”పేరా ఓక టానిక్ కూడా చేశాడు ఇంద్ర .ఇది బాల వార్ధక ఔషధం .సోమ మొక్క ను గూర్చి అనేక పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి .
సీల్; వేయటానికి  ఉప యోగించే లక్కను మొదట తయారు చేసింది కూడా భారతీయులే .లక్క ఒక సూక్ష్మ కీటకం నుండి స్రవించే  ద్రవం .దీని పొడవురెండున్నర   సెంటి మీటర్లు  .ఉత్తర భారతం దే లాండ్ ,చైనా లో ప్రత్యెక చెట్ల మీదనే ఇది పెరుగుతుంది .మనదేశం లో దాక్ ,బేర్ ,కుసుమ్,చెట్ల మీద బాగా జీవించే కీటకం ఇది .పాండవులను నిర్మూలించటానికి దుర్యోధనుడు నిర్మింప జేసిన లక్క ఇల్లు ఉత్తర ప్రదేశ్ లో బాగ్ పట్ లో ఉంది అని కేంద్ర త్రవ్వకాల  ,పరిశోధన చేసిన శాఖ వారు నిర్ధారించారు .దీన్ని మీరట్ జిల్లాలో 2004లో జరిపిన త్రవ్వకాలలో త్రవ్వి కనుగొన్నారు .ఈ  నాటికీ ప్రపంచ లక్క ఉత్పత్తిలో భారత దేశం యాభై శాతం ఉత్పత్తి చేస్తోంది .ఇప్పుడు లక్క ఇన్సులేట ర్ గా .శిలల మీద రాసే సిరాగా ,అద్దకం రంగుగా ,పెయింట్లు వార్నీష్ ,లెదర్ దుస్తులలో టాబ్లెట్స్ పై పూటగా నమూనా తయారీ లో ,సౌందర్య సాధనం గా ,ఫుడ్ కలర్స్ గా చాక్లెట్స్ తయారీలో  ,పేకముక్కలు ,బొమ్మలు పాలిష్ చేయ టానికి ఎన్నికలలో సీల్ వేయటానికి ఉత్త్సరాల సీఎల్ కు మరెన్నో రకాలుగా ఉపయోగ పడుతోంది. దీన్ని మొదట కనీ పెట్టింది మన వాళ్ళే అని గర్వం గా చెప్పుకో వచ్చు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-13-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -7

విజ్ఞులైన  అలనాటి మన  శాస్త్రజ్ఞులు -7
వైద్య శాస్త్రం లో మన భాగ స్వామ్యం
ప్రాచీన భారతం లో ”సిద్ధ వైద్యం ”ప్రచారం లో ఉండేది .చరకుడు ప్రస్తావించిన వాటిల్లో ఇది కూడా ఒకటి .లోహాలను మందులతో మిశ్రమం చేసే ప్రక్రియే సిద్ధ వైద్యం ..శతాబ్దాల బాటు ఇది ఎంతో మందికి ఉపయోగ పడింది .ఈ వైద్యం లో మానవ శరీరాన్ని అయిదు భాగాలుగా పరిగణించారు .అంటే మానవ శరీర నిర్మాణం గురించి అప్పటికే వారికి పూర్తీ అవగాహన ఉందన్న మాట .దీని పుట్టుకలో మూడు సిద్ధాంతాలు ముఖ్యమైనవి .ఒకటి ”మెమోరియల్ కాంటి నెంటల్,రెండవది మెడిటేరెనియన్ ,మూడోది ”సౌత్ ఇండియన్ ”.
వేమోరియన్ గా పిలువ బడే హిందూ మహా సముద్రం లో ఒక ద్వీపం కాల గతిలో సముద్రం లో కలిసి పోయింది .మానవత్వ భావన మానవుడిలో ఏర్పడి యెంత ప్రాచీనమిందో అంత పాతది ఈ వైద్యం .దీనినే ”హీలింగ్ శాస్త్రం ”అంటారు .అంటే స్పర్శ ద్వారా రోగ నిర్ధారణ చేయటం అన్న మాట ..మానవ తోలి పుట్టుక ఈ ద్వీపం లోనే అని ఈ సిద్ధాంతం చెబుతోంది .
మెడిటరేనియన్ సిద్ధాంతం లో ద్రావిడులు ఇక్కడి వారే .ఆర్యుల బాధ పడలేక దక్షిణ భారతం చేరారు .వీరి ద్రుష్టి లోహ శాస్త్రం పై కేంద్రీకరించారు .దీనిద్వారా సిద్ధ వైద్యం ప్రచారమైంది .
సౌత్ ఇండియన్ సిద్ధాంతం -తమిళులు దక్షిణ భారతం లోనే  ఆవిర్భ వించారు .సిద్ధ వైద్యం ఇక్కడే పుట్టిందని చెబుతారు .ఈ వైద్యం ఇప్పటికి బ్రహ్మ పుత్రా లోయ లో ,తుంగ భద్ర లోయలో తమిళ నాడులో అమల్లో ఉంది దీన్ని ”సిద్దా మెడికల్ సైన్స్ ” అంటారు .
సిద్ధ వైద్యం ఒక గొప్ప సంస్కారవైద్యం .మానవత్వ వికాస వైద్యం .రోగుల్ని ఆత్మీయులు గా భావించే వైద్య విధానం .నాడి ని పరీక్షించి రోగ నిర్ధారణ చేయటం ఇందులో విశేషం .మణి కట్టు కు అంగుళం కింద నాడి ఉంటుంది ఆ భాగం లో మెత్తగా నొక్కితే మూడు నాడుల స్పందన తెలుస్తుంది మొదటి నాడిని వాత నాడి అని రెండో దాన్ని పిత్త నాడి అని ,మూడవ దాన్ని కఫ నాడి అంటారు .ఈ నాడులు 4;2;1నిష్పత్తి లో పని చేస్తాయి .వీటి కదలికలను బట్టి వ్యాధి నిర్ధారణ చేస్తారు .
ఈ సిద్ధాంతం ప్రకారం లోకం లో 4,448రోగాలున్నాయి .అందులో నాలుగు వేల వరకు మనుష్యుల ద్వారా వ్యాపించేవే .సిద్ధ వైద్యం లో అనేక శ్రేణులు ,రకాలు ఉన్నాయి .కూరగాయలు ,ఆకు కూరలు ,నుంచి 1008రకాల మందులు ,విష పదార్ధాల నుంచి 64మందులు ,అనేక లవణాల నుంచి 28,లోహాల నుండి9, సేంద్రియ సమ్మేళనాల నుంచి 12,రకాల మందులు ,ఇతర పదార్ధాల నుండి మరి కొన్ని మందులు తయారు చేస్తారు .
శైవ మతం విజ్రుమ్భించటం వల్ల సిద్ధ వైద్యం తెరా మరుగైంది .యా వైద్యం లో ఎన్నో మర్మ సిద్ధాంతాలు ,క్లిష్ట పదజాలం ఉన్నందున అందరికి అర్ధం కాదు .ఈ నాడు సిద్ధ వైద్య ప్రచార కర్త గా ప్రాచుర్యం పొందిన వారు డాక్టర్ చిదంబర నాద పిళ్లే.44తరాలుగా ఈ వైద్యం చేస్తున్న కుటుంబం వాడు .4-3-1934లో కన్యా కుమారి జిల్లాలో ఎరినిఅల్ గ్రామం లో జన్మించిన ఈయన సిద్ధ వైద్యం మీద నాలుగు దశాబ్దాల పాటు పరి శోధన చేశారు .మద్రాస్ లో ”సిద్దా మెడికల్ లిటరేచర్ రి సెర్చ్ సెంటర్ ”ను 1955లో స్తాపించారు .మైసూర్ ,మద్రాస్ ,పూనా యూని వర్సిటీలలో ”ధానూలజి  ”లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్స్ ఏర్పాటు చేయించారు .”వర్మం ”(దానూలజి )మీద 32సిద్ధాంతాలను పిళ్లే
ప్రతి పాదించారు .”దానూ ఫౌండేషన్ ”స్తాపించి సిద్ధ వైద్యానికి గొప్ప ప్రచారం చేస్తున్నారు .
నాగరకత కు చిహ్నం చక్రం
మానవ నాగరకత ను వేగ వంతం చేసిన ”చక్రం ”రూప కల్పన ప్రాచీన భారత దేశం లోనే జరిగింది .కాని పాశ్చాత్యులు మెసపొటేమియా లో చక్రం రూపు దాల్చిందని అంటారు .మన విష్ణుదేవుని ఆయుధం ”చక్రం ”అన్న మాట అందరు మరచిపోయారు .అలాగే ఆయన చేతిలో ఉండే శంఖం శ్రమ శక్తి కి  ఆలంబనం .జన జాగృతినిచేసి కార్యోన్ముఖులను చేసేది శంఖం . శంఖమే ”సైరన్ ”గా మారిందేమో ?మానవ జాతికి చక్రం రూపాన్ని సైరన్ ను అందించింది భారతీయులే అని అర్ధమవుతోంది .
బ్రహ్మ వర్చస్సు పెంచే ”యజ్నోపతి ”
ప్రాచీన భారతీయ వైద్య విధానాల సమ్మిళిత మైనదే  ”యజ్నోపతి ”.హరిద్వార్ లో శాంతి కుంజ్ లో ”బ్రహ్మ వర్చస్సు ”పరి శోధనాసంస్త  ”యజ్నోపతి ”ని ఆవిష్కరించింది ,ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గా యజ్నోపతి ప్రచారమైంది .
వ్యాధి నివారణకు మూలికాలను ఇస్తారు .మందులే వాడకుండా ఆరోగ్యవిధానం చెప్పే ఆహారపు అలవాట్లను అలవాటు చేయటం లో ఇందులో భాగం .”డ్రగ్ లెస్ తెరపి ”ఇందులో భాగమే .యోగా ,ప్రక్రుతి వైద్యం ,సిద్ధ వైద్యం ,ద్రవ ఘన మందులు అవసరమైతే వాడుతారు .వాయురూపం లో మందులు ఇస్తే వ్యాధులు ఇంకా త్వరగా నయమవుతాయని భావించి ఆ విధానాన్ని ఉపయోగిస్తున్నారు .
యజ్ఞాలలో వాడే ”హవానా ద్రవ్యాలు ”వల్ల వచ్చే పొగ ,మంత్రోచ్చారణ వల్ల శబ్ద వాయు తరంగ కాలుష్యం నివారింప బడుతుంది .హిమాలయ ప్రాంతం లో అనేక ప్రక్రుతి సిద్ధ వన మూలికలున్నాయి .అవి ఎన్నో వ్యాధులకు ఉపయోగ పడతాయి .బ్రహ్మ వర్చస్సు పరిశోధనా  సంస్తదీన్ని నిరూపించింది .మందు వాయు రూపం లో ఊపిరి తిత్తుల ద్వారా చర్మం ద్వారా శరీరం లోకి ప్రవేశించి మానసిక శారీరక రుగ్మతలను నివారిస్తుంది .’
అగ్ని హోత్రమే ఒక ప్రాధమిక చికిత్సా విధానం .”వాతావరణానికి చికిత్స జరిగితే అది మిమ్మల్ని స్వస్త పరుస్తుంది ”అనేది యజ్నోపతి ప్రధాన సూత్రం .వాతావరం, ప్రాణం ,,మనస్సుఒక దాని మీద ఒకటి ఆధార పది ఉంటుంది . రహ్మవర్చస్సు ” లో 450 రకాల ఔషధాలు ,మూలికలు ఉన్నాయి .ఒక ప్రయోగ శాలలో ఒక గాజు గదిలో ”హవాన కుండ ”ను ఏర్పాటు చేశారు దానికి కలుపుతూ ,ఒక వాయు విశ్లేషణ విభాగం ఉంచారు .యజ్ఞం లో ఉత్పత్తి అయిన వాయువులను సేకరించి విశ్లేషణ చేస్స్సస్యతానికి ఇది ఏర్పాటైంది .రక్తం లో వివిధ భాగాలు ,రకారకాల్ గ్రంధులు వాటి పని తీరు యజ్ఞానికి ముందు ,యజ్ఞం తర్వాత విశ్లేషించారు .సత్ఫ్సలితాలు వచ్చాయి .మనుషుల మీదే కాక పశు పక్ష్యాదుల మీద కూడా వృక్షాల మీద కూడా ప్రయోగాలు చేయటం గమనార్హం .అందుకే యజ్ఞాలు చేయమని వీరు హితవు చెబుతారు .సామూహికం గా చేస్తే ”యజ్ఞం ”అవుతుంది .వ్యక్తీ గతం గా చేస్తే ”అగ్ని హోత్రం ”అవుతుంది .ప్రతి ఇంట్లో వీటిని చేసుకొంటే ఇంటి వాతావరణం శుభ్రపడి అందరి ఆరోగ్యాలు బాగు పడి  వాతావరణ కాలుష్యమూ నిర్మూల మవుతుంది ఇదీ ప్రాచీన కాలం లో మన వాళ్ళు చేసిన యజ్న సూక్షం ..
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ –12-11-13- కాంప్- హైదరాబాద్

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గ్రేట్ మాస్టర్స్ – ఉడ్ హౌస్ ఒకడు- సాక్షి లో – గబ్బిట కృష్ణమోహన్

D25392424

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక వన భోజనాలు -ఉయ్యూరు

100_9591 100_9592 100_9594 100_9595 100_9596 100_9597 100_9598 100_9599 100_9600 100_9601 100_9602

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నృసింహ సిద్ధాంతికి అపూర్వ సన్మానం

 

వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యా త్మికవేత్త పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 91 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక తమ సంచిక నవమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జీవన సాఫల్య పుర స్కారం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం చేస్తోంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, భూ పరిపాలన శాఖ కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కె.వి.రమణచారి, రిటైర్డ్ డీజీపీ అరవిందర్ రావు, పేర్వా రం రాములు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం తదితరులు హాజరు కానున్నారు.

1925 జూలై 20న జన్మించిన నృసింగరామ సిద్ధాంతికి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. ఆయన కు తెలుగు, హిందీ, సంస్కతం భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన ఇప్పటి వరకు 2400 ఆలయాల ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించడమే కాక, బొండ్రాయి ప్రతిష్ఠాపనతో సహా అనేక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనకు వైదిక విద్య, జ్యోతిష్యాలతో కూడా ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం ఆయన కొంత కాలంగా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక సేవలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య సుభద్రాదేవి మూడేళ్ల క్రితం అనారోగ్యం మృతి చెందారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడైన గౌతమి శర్మ బయోమెడికల్ కంపెనీ ఉద్యోగం వదులుకొని తన వెంట ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్నారు. నిత్యపారా యణ పద్ధతి, శ్రీ విద్య సాఫల్య, శ్రీ విద్య లఘుచక్రపూజ, శ్రీ విద్య నిత్యాహ్నికం, రుద్ర స్వాహాకారం గ్రంథాలను రచించిన నృసింహ రామ సిద్ధాంతి రాష్ట్రంలోనే కాక, ఉజ్జయని, కాశీ, వేలు ప్రాంతాల్లో నవచండీ హోమం నిర్వహించారు. దీపావళి, దసరా ఇతర పండుగ తేదీల్లో వ్యత్యాసం వస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తు న్న సిద్ధాంతి, వాస్తవానికి ఈ రకమైన వ్యత్యాసం రాకూ డదని చెప్పారు. కొంత మంది ప్రాచీన గణితం, మరికొంత మంది ధృ గ్గణితం ఆచారిస్తుండడం వల్ల ఈ రకమైన తేడాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. దేవుడి పేరిట పలు సంస్థలు, కొందరు వ్యక్తులు వ్యాపారం చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, దేశంలో దేవా లయాల నిర్మాణం పెర గడం ఆధ్యాత్మిక చింతనను పెంచుతోందని, ప్రజల్లో భక్తి భావం ఇనుమడించడం హర్షణీయమేనని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉగాది పర్వదినం రోజున విశిష్టమైన వ్యక్తిగా ఆయనను సన్మానించడం జరిగింది. తెలంగాణ భవన్ నిర్మాణ సమయంలో చండీ హోమం నిర్వహిం చిన సందర్భంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గతంలో దివంగత మాజీ మంత్రి ఎన్. యతిరాజారావు అనేక సార్లు సిద్ధాంతిని సత్కరించారు. మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో ఆయన దాతల సహాయంతో, యోగ లింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో విశిష్టమైన వినాయక విగ్రహాలతో పాటు రాజరాజేశ్వరి విగ్రహాలను నెలకొల్పి నిత్యం పూజలు కొనసాగిస్తూ ప్రజల్లో భక్తి భావం వ్యాపించడం కోసం కృషి చేస్తున్నారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment