ఫ్రాంజ్ కాఫ్కా

         ఫ్రాంజ్ కాఫ్కా

           కాఫ్కా 1883 లో జులై మూడు న ప్రేగ్ లో పుట్టాడు .అతనిది మాంసం నరికే బుచర్ ఫామిలీ .చిన్నప్పుడే ముగ్గురు చెల్లెళ్ళ మరణం . . 1901-06 వరకు ‘’లా ‘’చదివాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు . శానిటోరియం లో చేరి ట్రీట్ మెంట్ పొందాడు . 1910 లో ‘’మెడిటేషన్’’రాయటం ప్రారంభించాడు . అనుకున్న అమ్మాయి పెళ్ళికి తిరస్కరించింది .జర్మనీ కి వెళ్ళాడు .1915 లో ‘’ది మెటా మార్ఫిస్ ‘’రాసి ప్రచురించాడు . తిరస్కరించిన అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు .జర్మన్ భాషలో కధలు ,నవలలు రాశాడు ఇరవయ్యవ శతాబ్దిలో అత్యంత ప్రభావం చూపిన  కాఫ్కా తలిదండ్రుల మధ్య ఉన్న వ్యతి రేక ధోరణి ని రచనల్లో చూపాడు . జర్మని హాష మాట్లాడే యూదు కుటుంబం అతనిది .  కుటుంబ సభ్యులకు స్త్రీ స్నేహితులకు వందలాది ఉత్తరాలు రాశాడు ఉత్తరం రాయటం అతనికి ఏంతో ఇష్టం తండ్రి తో ఉన్న విభేదాలనే రచనల్లో చూపించాడు ”జ్యు”అవటం వాళ్ళ వచ్చిన విభేదాలను గురించి బాధ పడే వాడు . అయితే అవే అతని రచనకు ఆధారంయ్యాయి కూడా .  ఆయన జీవిత కాలం లో ”కామ్లేన్తెషణ్ ”ఒక్కటే ప్రచురింప బడింది 

ఏ హంగర్ ఆర్టిస్ట్ అనే కదా సంకలం ముద్రణకు ఇచ్చినా ప్రింట్ కాలేదు చని పోయే టప్పటికి .చని పోయిన తర్వాతే అన్నీ ప్రచురితమయ్యాయి .  . 

 

కాఫ్కా ప్రభావం తో రచనలు చేసిన వారిలో ఆల్బర్ట్ కామస్ ,జేమ్స్ జాయిస్ ముఖ్యులు . కాఫ్కా రచనల ప్రభావం వాళ్ళ ”కాఫ్కాస్కి ”అనే మాట డిక్షన రీ లోకి చేరింది . 

 

      టి.బి. వ్యాధి తీవ్రం అవటం వల్ల ఉద్యోగం మానేశాడు . 1921ఇన్సురెన్స్ కంపని లో ఉద్యోగం చేశాడు . 1922 లో‘’దికాజిల్ ‘’నవల రాశాడు . బార్యకు విడాకు లిచ్చి మళ్ళీ కొత్తత పెళ్లి కొడుకు అయాడు . 1924 లో మళ్ళీ ప్రేగ్ కు తిరిగి వచ్చాడు . నలభై ఒక్క ఏళ్ళకే మరణించాడు .ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ‘’death is the return of the organic for the inorganic supposedly our earlier state of being ‘’అనే దాని పై నమ్మకం ఉన్న వాడు కాఫ్కా . కాఫ్కాకు‘’నేగటివిజం ‘’అంటే బాగా ఇష్టం . అదే అతని ‘’జూడాయిజం ‘’. I am a memory come alone ‘’అంటాడు .అందుకే కాఫ్కా ను ‘’రెలిజియస్ హ్యూమ నిస్ట్ ‘’అన్నారు .కాఫ్కా ను” ఇరవయ్యవ శతాబ్దపు డాంటే” అంటారు విశ్లేషకులు . బ్యూరోక్రసి మీద వ్యతిరేకతను కూడా రచనల్లో పొందు పరచాడు అతని న్యాయ పరిజ్ఞానం కూడా రచనల్లో కానీ పిస్తుంది . కాఫ్కా రచనలు అనేక భాషల్లోకి తర్జుమా పొందాయి . ప్రేగ్ లో కాఫ్కా మ్యూజియం ను ఏర్పరచి గౌరవం కల్గించారు . అనేక మంది కాఫ్కా పై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు చేశారు చేస్తారు కూడా అతని రచనలను ఉదాహరించని ఏ ఇరవయ్యవ శతాబ్దపు రచయితాలేడుఅంటే అతిశయోక్తి కాదు .సర్రియలిజం మీద ఏంటో కొంత పరిజ్ఞానం ఉంటేనే అర్ధమయ్యే రచనలు కాఫ్కా వి .      

           18-9-2002 బుధ వారం నాటి నా అమెరికా డైరీ నుండి

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-7-13- ఉయ్యూరు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సి.నారె.కవిత -విశ్వనాధ పై కవిత మరియు ఆచార్య యెస్.విరామా రావు పై వ్యాసం -మూసి జూలై

jai javan jala pralayamacharya s.v1 acharya s.v12 c.na.re.-visvanadha

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జ్ఞాన పీఠపురస్కార గ్రహీత -రావూరి భరద్వాజ పై రమ్య భారతి త్రై మాస పత్రిక -మే-జులై లో నా వ్యాసం

bharadvaja in ramya bharati -1 bharadvaja in ramya bharati -2 bharadvaja in ramya bharati -3

Posted in రచనలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -పెద్ది భొట్ల సుబ్బా రామయ్య పై రమ్య భారతి -త్రై మాస పత్రిక మే-జులై లో నా వ్యాసం

peddi bhotla in ramya bharati -1 peddi bhotla in ramya bharati -2 peddi bhotla in ramya bharati -3

Posted in రచనలు | Tagged | Leave a comment

డాస్తోవిస్కి -2

         డాస్తోవిస్కి -2

       సోదరులిద్దరూ ప్రారంభించిన టైంజర్నల్ ను నిషేధించారు . వ్యాకులం టో పారిస్ వెళ్ళాడు అక్కడ జూదం ఆడి డబ్బంతా పోగొట్టుకొన్నాడు . అన్న దమ్ములిద్దరు ‘’ఈపోక్ జర్నల్ ‘’ను ప్రారంభించారు . ఇంతలో మైకేల్ చని పోయాడు . పత్రిక మూత పడింది . ఆ నాడు ‘’chirnovisky ‘’అనే రైటిస్ట్ భావాలున్నవాడు ఇతని భాసవాలను మనవాడు ఎండ గట్టె వాడు . 1865 లో క్రైం అండ్ పనిష్మెంట్ ‘’పూర్తీ చేశాడు . జర్మనీ వెళ్లి గాంబ్లింగ్ లో తిరు క్షౌరవం చేయించు కొచ్చాడు . ‘’the drunkard ‘’రాశాడు . తర్వాత గాంబ్లింగ్ జోలికి వెళ్లనని శపథం చేశాడు . ఈ స్పూర్తితో ‘’the gambler ‘’రాసి పారేశాడు .

            అన్నా అనే అమ్మాయి ని రెండో పెళ్లి చేసుకొన్నాడు .కొత్త జంట జర్మనీ వెళ్ళింది .అక్కడ మళ్ళీ జూడ వ్యసనం లో చిక్కుకొని పూర్తిగా దివాలా తీశాడు . అప్పుడే ‘’ the idiot ‘’నవల రాశాడు . ఇటలి వెళ్ళాడు . అక్కడి స్పిరిత్యువాలిటి ,వైవిధ్యం బాగా నచ్చాయి . ‘’the eternal husband ‘’ను 1870 లో రాశాడు . ‘’రోల్ ఆఫ్ సీక్రెట్ పోలీస్‘’ను ‘’డైరీ ఆఫ్ ఎరైటర్ ‘’లో రాశాడు . కొడుకు పుట్టాడు ఎపిలేప్సి జబ్బు వచ్చింది . ‘’the brothers karamazov‘’ను కొడుకు చావు పై రాశాడు .

 250px-Dostoyevsky's_funeral Naiman_Commentary_336746h Dostoyevsky_in_prison

 

                                          ఖైదీ గా బహూక రింప బడిన న్యు టెస్ట్ మెంట్ 

         1880లో పుష్కిన్ స్మ్రుతి చిహ్నాన్ని ఆవిశాక్రిస్తూ గొప్ప ప్రేరణ కలిగించే ఉపన్యాసం ఇచ్చాడు దాస్తో విస్కీ . ఆ సమయం లోనే ‘’emphysema ‘’అని వింత జబ్బు వచ్చింది .1881 లో సెప్టెంబర్ రెండు న 59 ఏళ్ళ వయసులో దాన్తో విస్కీ మహా రచయిత మరణించాడు .

    ఉత్తర అమెరికా లో ”ఇంటర్నేషనల్ దాస్తోవిస్కి సొసైటి ”ఏర్పడింది అక్కడ అయన పై గొప్ప అధ్యయనం సాగుతోంది .ఆయన రచనలను 170 భాషల్లోకి అనువదింప బడ్డాయి . ఆయన రచనలు 15 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి . దాస్తోవిస్కి ప్రభావం టో రచనలు చేసిన ప్రసిద్ధ రచయితా లెందరో ఉన్నారు వారిలో అంటోన్ చెకోవ్ ,జేమ్స్ జాయిస్ ,ఎర్నెస్ట్ హెమింగ్ వే ,జీన్ పాల్ సాత్రే లు ముఖ్యులు 1862లో దాస్తో విస్కీ లండన్ కు వెళ్లి నప్పుడు ప్రముఖ రచయితా చార్లెస్ డికెన్స్ ను కలిసి మాట్లాడాడు ఆ మహా నవలా రచయితల సమా వేషం చారిత్రాత్మక మైనది గా భావిస్తారు .

 

“By the time Dostoyevsky met Dickens, the latter’s father was dead, his wife had been abandoned, his older children were adults, and all but two of his novels had been written and published to great acclaim, but Dostoyevsky’s reminiscence of Dickens’s words indicates that, even after two decades, some sort of conflict of feeling regarding family obligations was still vivid in Dickens’s memory.”

 

   .1881 జనవరి ఇరవై అయిదు న రష్యా రెండవ జార్ చక్ర వర్తిని హత్య చేసిన టెర్ర రిస్ట్ ళ కోసం రష్యా సీక్రెట్ సర్విస్ పోలీసులు వెతుకుతున్నారు . దాస్తో విస్కీ అనుచరుడు ,పక్క ఇంటి వాడిపై సెర్చ్ వారంట్ జారీ అయింది గాలిస్తున్నారు . ఆ మర్నాడే దాస్తో విస్కీ కి pulmonary  haemorrhrage వచ్చ్చింది వెంటనే రెందొడి మూడోది స్ట్రోక్లు  కూడా వచ్చాయి .చని పోయేటప్పుడు ఆయన నోట బైబిల్ లోని మాథ్యూ అన్న వాక్యాలు బయటికి వచ్చాయి .అంటే మరణించాడు రష్యా పధ్ధతి ప్రకారం శవాన్ని ఒక టేబుల్ మీద ఉంచారు . ఆయన శవ యాత్రలో లక్షకు పైగా అభిమానులు హాజ రాయి నట్లు అంచనా . తిక్విన్ సేమేతరి లో ఖననం చేసి అశ్రుతర్పణం చేశారందరూ . ” .Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.

— Jesus, from John 12:24”అన్న యేసు క్రీస్తు మాటలను పదేపదే  దాస్తో విస్కీ వల్లె వేస్తూందే వాడు ..

 

 

           నార్త్ అమెరికా లోని ఇంటర్నశానల్ దాస్తో విస్కీ సొసైటీ భవనం                                     శవ యాత్ర 

 

              16-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-13-ఉయ్యూరు

             సాహితీ బంధువులకు నేడు ‘’తోలి ఏకాదశి ‘’శుభా కాంక్షలు . 

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డాస్తోవిస్కీ-1

     డాస్తోవిస్కీ-1

        డాస్తో విస్కీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నవల ‘’క్రైం అండ్ పనిష్ మెంట్ ‘’అంటే ‘’నేరము-శిక్ష ‘’విశ్వనాద్ ఈ పేరుతొ సినిమా తీశాడు .పూర్తిగా ఆ నవలలో కధకాకపోయినా ఆ ఛాయ కనీ పిస్తుంది .ఏం .బాలయ్య సినిమా అది . దాస్తో విస్కీ నవలా కారుడు కధకుడు వ్యాస మూర్తి కూడా .అన్నిటిలో సైకల్లాజికల్ అప్ప్రోచ్ ఉంటుంది అదే ఆయన ప్రత్యేకత . ఈయన రచనలు క్లాసిక్ లని పించుకోన్నాయి .కధనం అత్యద్భుతం గా నిర్వహిస్తాడు . పందొమ్మిదో శతాబ్దం లో రాసిన నేరమూ శిక్షా చాలా ఆధునికం గా అని పిస్తుంది . ‘’study of psychic within a character ‘’ఆయన ప్రత్యేకత . ఆయకున్న  ‘’మెంటల్ ఇల్ నేస్’’కూడా రచనకు తోడ్పడింది .అతని భాషా ,వేదాంత భావనలు అబ్బుర పరుస్తాయి . అతనిలో మతం పాత్ర ఉంది . ఆధునిక కాలానికి సరి పోయే రచన నేరమూ శిక్ష .

                                                                                                       manuscript of the writer 

        1821 నవంబర్ పదకొండున లో మాస్కో లో జన్మించాడు . .పూర్తిపేరు ” Fyo dor             Michallovich Dostoyvsky ” ఈయన కాలం లోనే రష్యాలో బోల్షవిక్ రివల్యూషన్ ,రష్యా విప్లవాలు జరిగాయి ..సోదరుడు మైఖేల్ ఈయన ఆ జన్మాంతం తోడూ గా ఉన్నాడు . దాస్తో విస్కీ కి చిన్నప్పటి నుంచి ఏదో ఒక జబ్బు పీడిన్చిది . తల్లి చాలా మంచి స్త్రీ .ఆమెపై అమిత గౌరవం . 1837 ‘’daravoe ‘’లో తల్లీ కొడుకు ఉన్నారు . అక్కడ ఒక ‘’ఫాం హౌస్ ‘’కొన్నారు . అక్కడున్నప్పుడే రైతు సమస్యలు తెలిశాయి .కష్టం  ఎలా ఉంటుందో అర్ధమైంది . సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువు కొన్నాడు .మిలిటరీ ఇంజినీరింగ్ లో చేరాడు .క్షయ వ్యాధి సోకింది .తల్లి అదే జబ్బుతో చని పోయింది . పుష్కిన్ కూడా అప్పుడే మరణించాడు . తండ్రి ఏదీ పట్టించుకో కుండా బాధ్యతా రాహిత్యం గా ఉండే వాడు . తండ్రి మానసికం గా కుంగి పోయి బలవన్మరణం చెందాడు .

           బాల్జాక్ ,జార్జి సాండ పుస్తకాలను అనువాదం చేశాడు . మొదటి స్వంత రచన ‘’పూర్ ఫోక్ ‘’.అందరు మెచ్చుకొన్నారు . అప్పటికి గోగోల్ రచనలు ‘’రొమాంటిక్ ‘’గా ఉండేవి . తర్వాత తీవ్రవాద భావ జాలం అతనిలో ప్రవేశించింది . ..1848 లో రష్యా పాలకుడు మొదటి నికోలస్ రాజు రష్యాలో కూడా జర్మనీ లో వచ్చిన తిరుగు బాటు వస్తుందేమో నని భయపడి రాడికల్స్ ను అరెస్ట్ చేయించాడు . అరెస్ట్ ఐన వారిలో దాస్తో విస్కీ కూడా ఉన్నాడు . విచారణ జరిగి మరణ శిక్ష విధించారు ఈయనకు . చావటానికి సిద్ధ పడ్డాడు . ఉరి తీయటానికి సైబీరియా లేబర్ కాంప్ కు తరలించారు . గడ్డ కట్టే విపరీతమైన చలిలో పెరేడ్ చేయించారు .వరుసగా నిల బెట్టి ఉరి తీయటం ప్రారంభించారు .ఆరుగురిని అప్పుడే ఉరి తీయాలి ఆ రోజున .మొదటి వరుసలో ముగ్గురు ,రెండో వరుసలో ఉన్న ముగ్గురి లో దాస్తో విస్కీ కూడా ఉన్నాడు . ఆ సంఘటన గురించి ఆయన వర్ణించిన మాటలు ‘’to day December 22 ,we were taken to semyonov square .there were all read the death sentence ,allowed to kiss the cross ,had sobers broken over our heads ,and our pre death attire put on . then three people were stood against the stakes for the carrying out the execution . I was sixth in the line. People were summoned by threes ,consequently . I was in the second row and had no more than a minute left to live. I remembered you brother Michail and all of your family .at the last moment . .you only you were in my mind ,only then did I realize how much I love you ,my dear brother . finally a retreat was sounded ,the ones tied to the stake were led back and it was announced that His Imperial majesty was granting us our lives ‘’ఇలా మరణం అంచు నుంచి మళ్ళీ జీవితం లోకి వచ్చాడు మన కధకుడు . అంతఉత్కంత భరిత సన్నీ వేశం అది . దీని టో కొందరికి మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక ,ఫ్రస్ట్రేషన్ అనుభవించలేక మతి స్తిమితం తప్పింది . మన వాడు హాయిగా బయట పడి పోయి ‘’ఇడియట్‘’నవల రాశాడు . .

           తరువాత ఈ ఖైదీలందరినీ సైబీరియా లోని ‘’omsk ‘’కు తరలించారు . వీరందరికీ ఒక పూర్వ ఖైదీ భార్య ‘’ new testament ‘’ను బహూకరించింది . ఆ పుస్తకమే తన జీవితాన్ని మార్చేసిందని మన వాడన్నాడు . నాలుగు ఏళ్ళు జైలు జీవితం అనుభవించాడు ‘’–40.సెంటి గ్రేడ్ గడ్డ కట్టే మంచు మీద ఒక రోజు నాలుగు గంటలు పని చేయించారు . మంచు తన పాదాలను కోరికేసిందని రాసుకొన్నాడు .అందర్నీ ఒక కుప్ప లాగా ఒకే చోట ఉంచే వారు . ఈ జీవితమే అనేక నవలలకు కధలకు ప్లాట్స్ గా మారాయి . అప్పుడే ‘’క్రైంఅండ్ పనిష్మెంట్ ‘’రాయటం ప్రారంభించాడు .‘’ఎపిలేప్సి ‘’వ్యాధి సోకింది . జైలు నుండి విడుదల అయ్యాడు కాని పూర్తీ స్వేచ్చ లేదు . ‘’మార్య‘’అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళాడాడు . 1859లో మిలిటరీ కి రాజీ నామా చేశాడు .

         ‘’ the village of stepanchikovo and its inhabitants ‘’కదా రాశాడు సోదరుడి తో కలిసి ‘’టైం’’(వేర్మ్య )జర్నల్ ను ప్రారంభించాడు . అందులో ‘’the insulted and the injuries ‘’ను ధారా వాహికం గా రాశాడు . నెమ్మదిగా ‘’కన్సర్వేటివ్ ‘’మనస్తత్వం వచ్చేసింది . భార్యా భర్తల మధ్య మన్స్పర్ధలోచ్చాయి . యూరప్ ట్రిప్ వెళ్ళాడు .’’winter notes and summer impressions ‘’పత్రిక లో తన యాత్రను గురించి రాశాడు . 1883 లో ‘’టైం బూమ్‘’రాశాడు .పదకొండు నవలలు మూడు నవలికలు ఇరవై ఏడు చిన్న నవలలు అనేక ఇతర రచనలు చేశాడు ”he is considered one of the geatest and most prominent sychologist in world literature ”గా  ని భావిస్తారు 

               సశేషం

         16-9-2002 సోమవారం నాటి నా అమెరికా డైరీ నుండి

           మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –19-7-13 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

The oxford dictionary of Humorous quotations

 The oxford dictionary of Humorous 
                           quotations 
                actors and acting 
1 -on the stage he was natural ,simple ,affecting .it was only that when he was acting .(goldsmith )
2-daddy is reading Shakespere to the blind and mummy is playing shakespere to to the lepers (anne )
3-she is the great lady of thE  American stage .her voice is so beautiful that you  want to understand a word she says (patric campbell )
4 -Acting is merely the art of keeping a large group of people from coughing (ralph richardson )
5-shakspere is so tiring .you never get a chance to sit down unless you are a king (j.hull )
                          advertising 
 1–Advertising may be described as the science of arresting human intelligence long enough to get money from it .(lea lock )
  2–Society drives people crazy with lust and call it advartising .(john lahr ) 
                                 alcohol 
1–best while  you have it use ,your breath .then there is no drinking after death .(j.fletcher )
 2-it is my opinion sir ,that this meeting is drunk sir (lori dickens )
 3- we drink one another’s healths and spoil our own ”(shaw )
 4-  gin was mother’s milk to her ( shaw )
 5–often daddy satup very late working on a case of scotch (r.denchely )
 6-candy is dandy . but liquor is quicker (g.nash )
 7-on being told that the particular drink he was consuming was slow poison so who is hurry ? 
 8–i have taken more out of alcohol ,than alcohol has taken out of me (churchil )
 9–i have got some wine very nice .i wonder how they got the cat to sit on the bottle (s.fry )
                        america’s cans 
 1-A merica is amodel of force and freedom and moderation with allthe coarseness and rudeness of its people (byron )
  2-father’s name was Hezikiah .-mother;s name is anna Meria .yanks through and through -red ,white and blue (cohan  —

  3-i could come back to america to  die -but never never to live (henry james )
  4-in the u.s. there is more space where nobody is than ,where every body is .that is what makes america (agate )
  5-every american woman has the souls to call her own ,the other being her husband ‘s(agate )
  6-california is a fine place to live -if you happen to be an orange (fred allen 0
  7–in America any boy may  become president and i suppose it is just one of the risks he takes (stevnson )
  8–the thing that impresses me most about america is the way parents obey their children (edward 8 ) 
  9–if i had to give a definition of capitalism i would say the process where american girls turn into women (c.humpton )
  10–america is great conspiracy to make you happy ,(john updike )
   11–never criticise americans .they have the best taste that money can buy .(m.kington )
   12– god is republican . santa cruz is democratic for americans 
                                       anger 
 anger makes dull men witty but keeps them poor (bacon )
                          Art 
 1-all that i desire to point out is the general principle that life imitates art far more than art imitates life ”(oscar wilde )                 
2-all the artists in america are gigantic racket run by unscrupulous men for un healthy women (buchman )
3–portrait painters tend to regard faces as not very still lives (a.bennet )
 
                 from my american dairy on 6-8-2002
                 mee –gabbita durga prasad -18-7-13- camp-hyderabad
 
Posted in English | Tagged | Leave a comment

రాబర్ట్ బ్రౌనింగ్- 2 బ్రౌనింగ్ కవితా ప్రతిభ

 రాబర్ట్ బ్రౌనింగ్- 2
                                      బ్రౌనింగ్ కవితా ప్రతిభ 
             రాబర్ట్ బ్రౌనింగ్ కు ఇటాలియన్ రేని సెన్స్ మీద ,విజువల్ ఆర్ట్ మీద అభిరుచి ఎక్కువ . అతని కవిత లో వ్యక్తీ సైకాలజీ ని గొప్పగా సంపూర్ణం గా ఆవిష్కరిస్తాడు . పాత్రలను తేలికగా అర్ధం చేసుకోవటం కష్టం . ”చైల్డ్ ” లో  ఎక్కువ గా ఉంది . అది ఒక అలసిన యుద్ధ వీరుడిది . అతని ప్రయాణం ఎప్పుడూ ”వెస్ట్ లాండ్ ”వైపే . శాకాహారి గా జీవించాడు . బ్రౌనింగ్ రచన ”ఆండ్రియా డెల్  సార్తో ‘ను క్లాసిక్ అంటారు . అందులో అసంపూర్ణ మానవుని లోని ఆశ కానీ పిస్తుంది .”’some hope may be based on deficiency itself ”అని పిస్తుంది . ఖచ్చితమైన ఆశ అమరాత్వానికే అని అయన భావిస్తాడు . hope that lies in the imperfection of god .”sorrow and self deniel though they  are burden ,are also his previlege .if the creator had not been crucified ,he would not have been as great as thousands of eretched fanatics among his own creatures ” .
                 కవితా నిర్మాణం లో ”టీం ఎలిమెంట్ ”కు అధిక ప్రాధాన్యత నిస్తాడు . ”కాలి బాన్ అపాన్ సేటి బాస్ ”రచన 1859 నాటి డార్విన్ సిద్ధాంతానికి మేధో మాధనమే . అదే నేచురల్ తియాలజి . ”the world of nature affords evidence of god’s designs and intelligence . cavilism taught that while humans possess free will ,they are at the same time pre distined in accordance with god’s purposes ”అని అంటాడు . 
                బ్రౌనింగ్ ”mind in difficulties ”మీదనే ద్రుష్టి కేంద్రీకరించి కవిత్వం రాశాడు . కష్టాల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది . .తెలుసుకొవాలనె తపన అప్పుడే ఎక్కువ అవుతుంది . అసత్యాలే ముందుగా కన్పించినా చివరికి సత్య దర్శనమే అవుతుందని ఆయన నమ్మ్మాడు అదే చెప్పాడు .  బ్రౌనింగ్ దృష్టిలో జీవితం అనేది ఒక అడ్వెంచర్ ఽన్తె కాని అదొక విధానం అంటే డిసిప్లిన్ కాదు . శక్తి వినియోగం చివరికి మంచే చేస్తుంది . ఈ మధ్యలో విపత్కర విపరీత పరిస్తులు ఎదురైనా సత్య తీరాన్ని చేరుతాడు మానవుడు . అయితే ఇవన్నీ పూర్తిగా బార్బెనిజమ్ యొక్క సూత్రాలే  అన్న వారూ ఉన్నారు . 
                దేవుడి వ్యక్తిత్వం మన మీద ప్రభావం చూపించాతానికి మనం అంగీకరిస్తే ,అప్పుడు సృష్టింప బడినది కృత్రిమం ,మోసపూరితం అవుతుందని యదార్ధానికి మరో పార్శ్వం అవుతుందని అంటారు . ఇది బ్రౌనింగ్ భావాలకు ”పారడాక్స్ ”అయి ఇబ్బంది కలిగిస్తుంది . కనుక”true art and in this sense the most deeply personal -must be impersonal ” తేల్చారు . 
              ”setebos”కవిత మీద పరిశోధించిన ”కాలి బాన్ ”బ్రౌనింగ్ మనల్ని ”ఆరిగిన్ ఆఫ్ థి యాలజి ”లోకి తీసుకు వ్ల్టాడని చెప్పాడు . ”such transition is inherent in any genetic interpretation . when essence is located in origin ,origin itself becomes part of that un ending process which is all that is left of essence and is there by subverted . there is an origin or ancestral point at the start of human existence from which all of mankind has evolved . yet ,this origin is itself only a missing link ,a mediator between our selves and some thing even more ancient .even a primitive man or representative human origins ”calibon ” is already caught up in a process which exceeds and preceeds him as it is beyond his own control ”అంటూకొంతవివరణనిచ్చాడు. 
               ” కవిత్వంరాయటంఅంటేముసుగులోఆత్మకదనురాయటం’అంటూజె్‌ఎచ్మిల్లర్ దీని మీద వ్యాఖ్యానించాడు  మనం ఉన్నాము అంటే స్వర్గం లో అప్పటికే ఉన్నామని అర్ధం . అదే గతి శక్తితో మనం ఉంటున్నట్లే . మనకంటే అతీతం గా ఇక్కడ లాగే అక్కడా ఉన్నట్లే .అంటున్నాడు ” though the god is not temperal  the deriving motion of time is a perfect image of his explosive eternity ”అని బ్రౌనింగ్ సిద్ధాంతం ఇదే నని చెప్పాడు .ఇదన్తా అర్ధమవటం మనకు కష్టమని పించ వచ్చు అందుకే బ్రౌన్ ను యః పిండ కవి అని ముందే చెప్పాను .బుద్ధి బలం ఉండి  ఆ ఇనుప గుండును పగల గొట్టుకొని లోపలి ప్రవేశిస్తే అద్భుతాలను దర్శించ వచ్చు నెమో . 
                 15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి –
                    మీ –గబ్బిత దుర్గా ప్రసాద్ –18-7-13- కాంప్–హైదరాబాద్ 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాబర్ట్ బ్రౌనింగ్ -1

 

                                      రాబర్ట్ బ్రౌనింగ్ -1
   యేవో కొద్ది పద్యాలు మాత్రమె సామాన్యులకు కొరుకుడు పదనివి అన్న వాటిని రాసిన విశ్వ నాద ను ”పాషాణ పాక ప్రభూ ”అని జోక్ చేశాడు జరుక్ శాస్త్రి . ఆంగ్ల కవిత్వం లో అర్ధం కాని కవి అని ”అ యః పిండ కవి ”అని పించుకొన్న వాడు రాబర్ట్ బ్రౌనింగ్ . మనకాశీ ఖండానికి ,నైష ధా నికి ఆ పేరుంది .  బ్రౌనింగ్ ను అందరు తక్కువగా అంచనా వేసిన ఆంగ్ల సాహిత్య మహా కవి అనీ బ్లూమ్ అనే విమర్శకుడు తేల్చాడు . బ్రౌనింగ్ ను పాశ్చాత్య యోని వేర్సితీ లలో పూర్తిగా మర్చి పోయారని బాధ పడ్డాడు అంటే బ్రౌనింగ్ కవిత్వం మీద వాటిలో బోధనా ,అధ్యయనం పూర్తిగా నెగ్లెక్ట్ చేశారన్న మాట . ఆ కాలం లో టెన్నిసన్ మహా కవి బ్రౌనింగ్ కు ప్రత్యర్ధి కవి . బ్రౌనింగ్ లో”nihilistic self deception ” ఉందని భావించారు . 
              1812 may 7న బ్రౌనింగ్ లండన్ దగ్గరున్న ”కాంప్ బెల్ ”లో జన్మించాడు . తల్లికి మాట విశ్వాసం అధికం . తండ్రి వద్ద పెద్ద గొప్ప లైబ్రరి ఉంది . పదమూడేళ్ళ వయసులోనే”ఇంకాండిట ”పేరుతొ  కవిత్వం రాశాడు బ్రౌనింగ్ . కాని ప్రచురించలేదు . అప్పటికే వోల్టైర్ ,షెల్లీ లను క్షున్నం గా చదివాడు . అది ”spiritual questioning time ”.తండ్రి లాటిన్ గ్రీక్ భాషలను నేర్పాడు .షెల్లీ  అంటే వీరాభిమానం కలిగింది . సంగీతం కూడా నేర్చాడు . లండన్ యోని వర్సిటి లో చేరినా కవిత్వం రాయాలనే ఉద్దేశం తో మధ్యలోనే గంట కొట్టేశాడు . 1833లో ”పాలిన్  ” రాసి మేనత్త సహకారం తో అచ్చు వేశాడు . ఏమీ ప్రోత్సాహం రాలేదు .  ”స్టూవార్ట్ మిల్ ”ఇచ్చిన సలహా తో ”dramatic  monologue poet ”గా మారాడు . 1835లో రష్యా వెళ్లి వచ్చి ” paracelsus”రాశాడు . మంచి గుర్తింపే వచ్చింది . మేధావి వర్గం బాగా మెచ్చింది . కాని దాని వాళ్ళ ఆర్ధికం గా ఏమీ లాభం రాలేదు పాపం . 
 
     Sordello (1840)    Robert and Elizabeth Barrett Browning      
                                                                                                  భార్యా భర్తలూ 
                అప్పుడు కవిత్వం నుంచి తన పాత్రను డ్రామాకు మార్చుకొన్నాడు . ఈ ఊపులో ”stafford ”నాటకం రాశాడు . దాన్ని అయిదు సార్లు మాత్రమె ప్రదర్శించటం తో నీరు కారిపోయాడు .  1840లో  ”sordella” రాసి పబ్లిష్ చేశాడు . అప్పుడు ” a poet of conflicted thought ”  అన్నారు .           అప్పటి దాకా కాస్తో కూస్తో ఉన్న పేరు  కాస్తా ఊడి పోయింది .1840వరకు పద్య నాటకాలు రాశాడు .” డ్రమాటిక్ లిరిక్స్” రాశాడు .1838 లో ఇటలి సందర్శించాడు . ఎలిజే బెత్ బార్రేట్ అనే ఆమె ఈయన కవిత్వాన్ని అభిమానించింది . 1846 లో ఇద్దరు పెళ్లి చేసుకొని పారిస్ వెళ్ళారు . ట్రాలోప్  ,టెన్నిసన్ లతో గాఢ పరిచయమేర్పడింది . 1850 బ్రౌనింగ్ భార్యకు కవిత్వం లో విశేష మైన ప్రాచుర్యం కలిగి గొప్ప పేరొచ్చింది . ఆమె రాసిన ”  sonnets from the portugese ”  అనే కవిత ఉర్రూత లూగించింది . అప్పుడామే ”one of the foremost English poets of that time ”  అని గుర్తింప బడింది . బ్రౌనింగ్ రాసిన ”క్రిస్మస్ ఈవ్ ,ఈస్తర్ డే’అనే దీర్ఘ ‘కవితలు తుస్సుమన్నాయి .1855 లో బ్రౌనింగ్ రాసిన ”మెన్ అండ్ విమెన్ ”కవితకు గొప్ప పేరే వచ్చింది .ఇత్లా అదృష్టం ఆయన్ను కిందికీ పైకి ఉయ్యాల లూపుతోంది .1861 లో భార్య బారెట్ మరణించింది .
                    1864 లో”dramatic personae ”   ను బ్రౌనింగ్ రాస్తే మంచి రికగ్నిషన్ వచ్చింది .  ” తర్వాత” the ring and the book ” అనే ”epic length ”poem ”రాస్తే  ఉత్తమ ఆంగ్ల కవుల సరసన స్తానం లభించింది .  ”notable socialite ” అని పేరొచ్చింది .సమాజమ్ లో గౌరవం  పెరిగింది . ”లూయిసా ”అనే అమ్మాయిని ప్రేమిస్తే ,ఆమె తిరస్కరించింది . అప్పటికి సృజనాత్మక కవి గా లాబ్ద ప్రతిస్టుడయ్యాడు  బ్రౌనింగ్ .1889  లో చివరి రచన  ”asolando ” పూర్తీ చేశాడు ఆయన శిష్యులు ,అభిమానులు అందరు కలిసి ”బ్రౌనింగ్ సొసైటీ ”ని1881 లో  స్తాపించారు .  అది ఆయన” స్టేటస్ కు సింబల్ ”   నిలిచి పోయింది . ఆక్స్ ఫర్డ్ ,కేం బ్రిడ్జ్ యోని వేర్సితీలు ఇప్పుడు పోటీ పది బ్రౌనింగ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసి సత్కరించి గౌరవించాయి ”అసోలాండో  ”పబ్లిష్ అయ్యాన సంవత్సరమే 77వ ఏట  1889 december 12  న రాబర్ట్ బ్రౌనింగ్ మహా కవి మరణించాడు . ఆయనను గౌరవ పురస్కారాం గా ”పోఎట్స్ కార్నర్ ”లో ఖననం చేసి అభిమానాన్ని చూపించారు . 
                 బ్రౌనింగ్ కవితా విశేషాలు   ఇంకో సారి 
      15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి 
                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-7-13-కాంప్ –హైదరాబాద్ 
 
 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముచ్చట గా మూడు చెకోవ్ కధలు

ముచ్చట గా మూడు చెకోవ్ కధలు 
                                           ముచ్చటైన మూడవ కద” -ది లేడి విత్ ది డాగ్ ” 
              చెకోవ్ 1899 december లో రాసిన గోప్పకదే” ది లేడి విత్ ది డాగ్” . గురోవ్ అనే వాడు ఆ నాడున్న బద్ధక జీవితాన్ని గురించి ,సాహస కార్యాల నుంచీ ఎప్పుడూ ఆలోచిస్తూంటాడు . వాడికి నలభై ఏళ్ళు . పన్నెండేళ్ళ కూతురు భార్య ఉన్న వాడు . భార్య అంటే ”ది ఉ మాన్ హు ”థింక్స్ అని భావిస్తాడు . భార్య చూపుల గుర్రం కాదని మేపుల గుర్రమని ,అల్ప స్వభావం కలదని వాడనుకొంటాడు . వాడి భాషలో ఆమె ”low breed ”.వీలైనప్పుడల్లా అమ్మాయిల చుట్తో తిరుగుతూ ఉంటాడు . కొన్ని రోజులకు బోర్ అని పించి మానేస్తాడు మళ్ళీ వేట మొదలెడుతాడు . 
                   ఒక సారి ఒక హోటల్లో తనకెదురు గాకుక్క తో ఉన్న  ఒకమ్మాయి కనీ పిస్తుంది . ఆమె పేరు అన్నా సేర్జీనా ”.పిత్స్ బర్గ్ లో ఉంటున్దామే . పెళ్లి అయి ”s”అనే చోట ఉంటోంది . మళ్ళీ వీళ్ళిద్దరికీ ఒక వారం తర్వాత పరిచయ మేర్పడుతుంది . ఆమె ఓడ లో ప్రయాణానికి బయల్దేరు తుంది ఎక్కడికి అని వీడు అడిగితె బదులు చెప్పలేదు .వీదు అడ్వాంటేజ్ తీసుకొని చటుక్కున ముద్దు పెట్టు కొంటా డా మె ను .ఎవరైనా చూస్తున్నారేమో నని కంగారు కూడా పడతాడు . ఆమెఉన్న హోటల్ గది లోనే వీళ్ళు ప్రేమాయణం సాగిస్తారు . ఆమె ” fallen woman ”. ఆమె మీద వీడికి గౌరవం కలగలేదు . ఆమె ఒక సారి ఏడుస్తూ కూర్చుంటే ఆ అరగంట సేపు వీడు పుచ్చకాయ తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు . ఇద్దరూ కలిసి ”  యాల్టా” లో సముద్రపు ఒడ్డున కూర్చుంటారు . ఇద్దరికీ ” eternal sleep awaiting us ”
అని పిస్తుంది . ఆకులు కూడా కదలంతా  నిశ్శబ్దం . 
                   కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఊరు వెళ్లి పోతుంది . వీడూ కొంపకు చేరుకొంటాడు . మళ్ళీ వీడు భార్యా పిల్లలు కొంపా గోడూ ల తో హడా విడి . అయినా ఆ లేడీ ని మరవ లేక పోతాడు .  ఇంటిమీద ,పెళ్ళాం ,పిల్లల మీద విసుగు వస్తుంది బోర్డం ఫీల్ అవుతాడు మన కొత్త వేటగాడు . చాలా” డ ల్ ”అని పిస్తుంది జీవితం . ఆ లేడీ ని వెతుక్కొంటూ  ఆమె కోసం వెడతాడు ఽఅమె ఉన్న ”ఎస్” అనే ఊరుకు వెళ్లి ఒక హోటల్ రూం లో ఉంటాడు . ఆమె ఇంటిని వెతుక్కొంటూ వెళ్తాడు . ఆమె కుక్క వేడిని అసలు గుర్తించదు . ఒక సినిమా దియేటర్ లో ఆమెను కలుసు కొంటాడు . ”ఇంటర్ మిషన్ ”లో అంటే విరామ సమయం లో లో ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడి తనతో మాస్కో రమ్మంటాడు . ఆమె ఒక మధ్య వర్తి ద్వారా అతనికి సమాచారం పంపుతుంది . ”ఇద్దరం రెండు జీవితాలు గడుపుతున్నాం . ఒకటి ఫాల్స్ అంటే బయటికి కానీ పించేది ,ముఖ్య మైనది . రెండోది ”రహస్యమైనది ”.ఇద్దరో కలుస్తారు ఽఅమె ఏడుస్తుంది . దీనికి కారణం ఆమె  ”bitter consciousness of the sadness of their life ”. ఆమె ను ఓదారుస్తాడు వాడు . అడ్డం లో వాడు తన ముఖాన్ని చూసు కొంటాడు . జుట్టు నెరసి నట్లు అప్పుడు తెలుసు కొంటాడు . వయసు మీద పడుతోందని గ్రహిస్తాడు . ఇద్దరు కూర్చుని ఈ జీవితం లోంచి ఎలా బయట పడాలో ఆలోచిస్తారు . అప్పుడే వారికి జ్ఞానోదయం అయినట్లని పించింది ”they feel they are just at the beginning ”అని అంటాడు  చెకోవ్ . 
                      ఈ కదా మీద చాలా విశ్లేషణ జరిపారు . వాళ్ళిద్దరి భావాలు మానసిక మైన వె కాని శారీరక మైనవి కావు . ప్రేమ శక్తి వీరిని బలహీన పరుస్తోంది . వీరి అస్పష్ట భవిష్యత్తు కు పరిష్కారం లేదు . ప్రేమే వీరిద్దరిని కాస్త   ఊరట కల్గించి మెరుగు పరచింది .   తర్వాత మంచి కొత్త  దారి  చూపింది . చివర గా ”changed them both for the better -had changed them ”అని ముగిస్తూ నీతిని చెప్పకుండా వదిలేస్తాడు అదే చేకోవియన్ స్టైల్ . . ఈ కధలో ”isolation of human beings and the impossibility of understanding each other ”ఉంది .  అందుకే చెకోవ్ వ్యక్తుఅలకు స్వంత వ్యక్తిత్వాలున్దావ్ అన్నారు . ఆయన పాత్రలు టాల్ స్టాయ్ ,దాస్తో విస్కీ పాత్రల లాగా గుర్తింప బడరు . పాత్రల భాష అంటా చేకోవియన్ భాషే . అందరు ఒకటి గానే ఉంటారు . ఒకే పదార్ధం నుండి తయారు కాబడిన పాత్రలే అని పిస్తాయి. మానవ సామాన్య మైన విషయాలే ఇవి . ఈ విషయం లో చెకోవ్ చాలా డెమోక్రటిక్ గా వ్యవ హరిస్తాడు . పైన  రెండు పాత్రలు తమను విధి దగ్గరకు చేర్చిందని భావిస్తారు . 
               ”he conjuctered that every one under the veil of secrecy as uunder the veil of night has his real life the most interesting one .every individual existence is held together by a secret and perhaps ,this is partly why educated people make such intense efforts to see that personal secrets are respected ”అని అంటాడు అంటోన్ చెకోవ్ .          
            చెకోవ్ జీవిత సిద్ధాంతం ఏమిటి అంటే ”routine is death and turbulance -the unknown is life ”
            మంచి కధకుడైన చెకోవ్ రాసిన ముచ్చటైన మూడు కధలను గురించి చదివిన ఆనందం అనుభవించాను నేను దానిలో మీకో పాలు పంచుదామనే ఈ ప్రయత్నం చేశాను మొత్తం మీద 201 కధలు ,పదకొండు నాటకాలు చెకోవ్ రాశాడు . 
 
[Anton Chekhov photo]
 
                సమాప్తం 
                 అందరికి కర్కాటక సంక్రమణ (దక్షిణాయణ  )శుభాకాంక్షలు -ఈ రోజే దక్షిణాయణం  ప్రారంభం . 
            15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి –
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-13-కాంప్–హైదరాబాద్ 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముచ్చటగా మూడు చెకోవ్ కధలు – రెండవ కద -దిదార్లింగ్

      ముచ్చటగా  మూడు చెకోవ్ కధలు –
                                              రెండవ కద  -దిదార్లింగ్ 
              చెకోవ్ దీనిని1899 లో రాశాడు . ఇది ”డిపెండెంట్ వుమన్ మీద మాకరి ”. ఇందులో  ”ఒలేంకా ”అనే ఆవిడను స్త్రీత్వానికి ప్రతి రూపం గా తీర్చి దిద్దాడు” .అని టాల్ స్టాయ్ అన్నాడు . ఆయనే ”  the soul of darling with her capacity for devoting herself with her whole being to one she loves ,is not ridiculous but wonderful and holy ”అని మెచ్చాడు . అయితే ఈ కధను గోర్కీ ఇష్టపడలేదు . ఈ కధకు రష్యన్ భాషలో పేరు ”duschechka ”అంటే ”soul ”ani” అని అర్ధం . ఇక కదా లోకి వద్దాం 
        ”ఒలేంకా ”అనే ఆవిడ ఒక ఓపెన్ ఎయిర్ దియేటర్ లో ”కుంకిన్ ”అనే మేనేజర్ దగ్గర కూర్చుని ఉంటుంది . వాడు వాతావరణం గురించి మాట్లాడుతుంటాడు . దియేటర్ నడవ లేని స్తితి . ఇవి ఆమె కు కలిసి ఒస్తాయి . వాడిలో డిప్రెషన్ గమనిస్తుంది ఽఅమె లో ని మృదు స్వభావం ప్రశాంత చిత్తం అతన్ని ఆకర్షిచాయి . ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకొంటారు . . ఇప్పుడు దియేటర్ బాగానే నడుస్తోంది . ఇద్దరు కలిసి సమర్ధం గా నిర్వ హిస్తూన్తారు . ఆమె కు పెళ్లి వాళ్ళ సంతృప్తి లభిస్తుంది .వీదికి నష్టం వాళ్ళ బాధ ఉంటాయి . వాడు ఏదో పని మీద మాస్కో వెళ్లి అక్కడే చని పోతాడు .              
          మూడు నెలలు ఆఅమె వాడి జ్ఞాపకాల తో ఏడుస్తూనే ఉంది . ఒక రోజు చర్చి కి వెళ్తుంటే ”pustovalov ”అనేత టి మ్బర్ ,మ ర్చంట్ తో పరిచయ మేర్పడుతుంది . ఇద్దరు పెళ్లి చేసుకొంటారు . ఆరు ఏళ్ళు సుఖం గా నే ఉంటారు . భర్త కున్న అభిరుచులతో ఏకీభావం తో పని చేస్తుంది . వాడు బిజినెస్ ట్రిప్ మీద దూర దేశాలకు పోతాడు . అప్పుడు భార్యను వదిలేసి ,ఒక పిల్లాడున్న ”spirnin ”అనే వాడు పరిచయ మవుతాడు . ఇంతలో పుస్కలోవ్ చని పోతాడు . ఒక ”నన్” జీవితాన్ని సాగిస్తోంది . మళ్ళీ మామూలు స్త్రీ అయింది . మూడో మొగుడు సైబీరియా వెళ్ళాడు . మళ్ళీ ఒంటరి తనం ,దిగులు .  ”emotional emptiness ”తో బాధ పడుతుంది . ఇలా కొన్నేళ్ళు గడిచి పోతాయి . మూడో భర్త ”సిమ్రిన్ ”మరో పెళ్లి చేసుకొని పెళ్ళాం ఆమెకు పుట్టిన పిల్లాడితో దిగుతాడు . ఒలేంకా ఏ విధమైన స్వార్ధాన్ని చూప కుండా నిష్కళంక మనస్సు తో వారిని ఆహ్వానించింది . 
                      కొద్ది కాలం తర్వాత వాడి కొత్త భార్య వేడిని వదిలి వెళ్లి పోతుంది . సిర్మిన్ కూడా కొన్ని నెలల తర్వాత కొడుకు ను ఒలేంకా వద్ద వదిలి ఎటో వెళ్లి పోతాడు . ఇప్పుడామె కు ఆ చిన్నారె ప్రపంచం . వాడితోనే ఆడుతోని ,పాడుతోంది ముద్దు ముచ్చట తీరుస్తోంది పాతవి అన్నీ మార్చే పోయింది . ”she loved her three husbands expecting nothing in return .”అని టాల్ స్టాయ్ ఆమె పాత్రను మెచ్చాడు . ఆయనే ”intended to damn but the god of poetry forbade him to do so ordered him to bless and he blessed unwillingly clothed this dear creature ,such wondrous light that it for ever will remain an example of what a woman can be in order to be happy and to make happy those with whom fate brings her ” అని చెబుతూ ”this story is so excellent because it came out unconsciously ”అని తీరు నిచ్చాడు . బహుసా ఇలాంటి కధలు మన వాళ్ళు చాలా  మన కుటుంబాలలో ఈ సంఘటనలు జరిగి ఉండక పోవచ్చు రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకొన్నా స్త్రీలు భర్తకు పుట్టిన సంతానాన్ని ఈ విధం గా నే ప్రేమించిన విధానం ఉంది . అది పాశ్చాత్య దేశం కనుక        ఆఅమె కు నచ్చిన వాడిని పెళ్ళాడింది పరిస్తితుల ప్రాబల్యమ్ వల్ల .               
               ఈ కదా మీద టాల్ స్టాయ్ మాట్లాడుతూ చెకోవ్  మొదట్లో ఒక స్త్రీ ఎలా ఉండ రాదో అనే విషయం మీద రాయాలను కొన్నాడు ఽయితె రాస్తున్న కొద్దీ ఆయన దాన్ని ఒక ఉదాహరణ గా నిలిచే మహిళ గా మార్చాడు . స్త్రీ కి తనకున్న వ్యక్తిత్వాన్ని ,మనసును ,బుద్ధిని ప్రదర్శించే స్త్రీ ని గురించి రాశాడు చివరికి . అందుకే విమర్శకులు ఒలేంకా ను ”merry woman ”అని తేల్చారు . 
   తన ప్రేమను అంతటిని తనను ,తన మనసును ,సర్వస్వాన్ని కరగించి  భర్తకు అందించాలనే తాపత్రం ఉంది . దాని వల్ల ”that could give her ideas and an object in life and would warm her old blood ”గా భావించింది ఒలేంకా . ఇందులో  ”love is grace proceeding from the lover’s fulness of heart ,not from the beloved’s attractive qualities or high desires ”అనేది ముఖ్య మైన  పాయింట్ . చెకోవ్ సృజన ఉన్న  కధకుడు . శూన్యం లోంచి శూన్యం లోకి వెళ్ళటం అనేది అతని ఫిలాసఫీ . సాదా సీదా గా ఉన్న వాళ్ళు యెంత ఉన్నతం గా ఆలోచిస్తారో జీవిస్తారో  ఒక్కలేంకో లో చూపించాడు . అందమైన ప్రపంచాన్ని ఎలా సృస్తిన్చుకొంటారో తెలిపాడు కూడా . 
                          కొంగ్తమంది ఒలేంకా ప్రేమ గుడ్డిది అన్నారు ఽన్దులొనె ఉంది పోవాలను కొనే తత్త్వం అన్నారు . కాని ఆమెలో మనకు ఒక స్త్రీత్వపు సంపూర్ణ లక్షణాలు ఒక మాత్రు మూర్తి పూర్తీ స్వరూపం కానీ పిస్తుంది . అది ఆమె తిరుగు లేని ,ప్రశ్నింప రాణి ప్రేమకు నిష్కలంక ప్రేమకు గొప్ప ఉదాహరణ గా అందరు చెప్పారు . ప్రేమ కు హడ్డులున్దవని ఆమె తన భర్త ఎక్కడో కన్నా కొడుకును తన వాడుగా స్వీకరించటం మహోన్నత ఆదర్శం .”she devotes herself with boundless love to future man (son ),the school boy in the big cap ”అని చెకోవ్ ముగిస్తాడు . 
         ”ఒలేంకా ఒక ప్రపోజిషన్ ”కు మూర్తి మత్వం .కాని నిజ జీవితం లోని పాత్ర కాదన్నాడు ఒక విమర్శకుడు . అయితే రోనాల్డ్ రాయ్ ఫీల్డ్ ”death is less fearsome than a wasted life . happiness lies in grasping opportunities in acting on desire ,in letting the individual blossom to the full ,before it has to fade ”అని ఈ కదా మీద గొప్ప తీర్పు నిచ్చాడు . 
              ముచ్చటైన మూడో కద ఇంకో సారి 
     15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి 
                         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-13- ఉయ్యూరు 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముచ్చటగా మూడు చెకోవ్ కధలు

   ముచ్చటగా మూడు చెకోవ్ కధలు 
            నాకు నచ్చిన మూడు చెకోవ్ కధలను మీకోసం అందిస్తున్నాను . మొదటి కద”Rodhtschild’s fiddle ”. యాకోవ్ అనే వాడు శవపేటికలను ఒక్కడే ఏంతో బాగా,గట్టిగా  చేసే వాడు . ”కస్టమర్ ”ల కొలతలను జాగ్రత్త గా తీసుకొంటాడు . చిన్న పిల్లలకు శవ పేటికలను తయారు చేయటానికి అంగీకరించడు .కారనమ్ చిన్నప్పుడే చని పోయిన తన పిల్ల వాడు జ్ఞాపకాలు అతన్ని బాధిస్తాయి . డబ్బులు పెద్ద గా వచ్చే వ్రుత్తి కాదు . జనం ఎక్కువ మంది చస్తే బేరాలు ఎక్కువగా వస్తాయని ఆశ పడుతూ ఉంటాడు . భార్య మోర్తా ను సరిగ్గా పట్టించుకోడు . .”jewist’s archestra ” లో ”ఫ్లూట్ ”కూడా వాయించేవాడు . కాని ”జ్యూస్ ”అంటే అయిష్టం .కాని పొట్టకూటి కోసం తప్పదు . అందులో” రొత్స్  చైల్డ్  ”అనే ఫ్లూట్ వాయించే వాడంటే మరీ మంట . ఒక సారి పిచ్చ కోపం తో వాడిని కొట్టి నంత పని చేశాడు . అందుకని ఆ బృందం వాళ్ళు యాకోవ్ ను వాయించటానికి పిలవటం తగ్గించేశారు . 
                     భార్య కు జబ్బు చేసి చివరి దశలో ఉంది . ఆమె ముఖం లో ఎందుకో ఆనందం కన్పిస్తోంది . చావు తన భార్యకు కస్తాల నుంచి ఊరట నిస్తుందని భావించాడు . ఆస్పత్రికి తీసుకు వెళ్తాడు డబ్బు ఇవ్వనిదే డాక్టరు మందు ఇవ్వనంటాడు . ”she has lived a long life ”అనుకొంటాడు . చేతిలో చిల్లి గవ్వలేదు .చెసెది లేక ఆమె ను ఇంటికి తీసుకు వస్తాడు . ఆమె కొంతకాలం అలానే బతుకు ఈదుస్తున్ది . త్వరలో ”రెలిజియస్ హాలిడే ”వస్తోంది . కనుక ఆ రోజు పని చెయ్య రాదు . కనుక భార్య చని పోక ముందే ఆమె కు శవ పేటిక తయారు చేయాలని నిర్ణయించాడు ఽఅమె కొలతలు తీసుకొన్నాడు . ఒక పుస్తకం లో అతను జామా ఖర్చులు రాయతసం అలవాటు . భార్య చావు వాళ్ళ తన ఆదాయం లో నష్టం అని ”loss”లో చూపిస్తాడు . అయితే ఆ చావు వాళ్ళ తనకు లాభం కూడా ఉందట ఽది శవ పేటిక కొనక్కర్లేదు-అంటే ఖర్చు లేదు  తానె తయారు చేస్తున్నాడు కనుక . ”the gain is his loss (he pays out of his own money )-the cirlcle is complete ”అంటాడు కధకుడు చెకోవ్ .  
          భార్య అడుగుతుంది ”చని పోయిన కొడుకు జ్ఞాపకం ఉన్నాడా >” అని . అది జరిగి యాభై ఏళ్ళు దాటింది ఽఅ రోజుల్లో అందరు నది ఒడ్డున చెట్టు కింద కూర్చుని సరదాగా మాట్లాడుకొనే వాళ్ళు . భార్య కొడుకు జ్ఞాపకాలతో దరిద్రం తో మందులు తీసుకొనే అవకాశం లేక మరణించింది . యాకోవ్ తీవ్ర బాధ లో ఉంటాడు కుంగి పోతాడు . ఒక సారి వీడికి ”రొత్స్  చైల్డ్ ”కానీ పిస్తాడు .కొట్టాలని ప్రయత్నిస్తాడు వాడు పారి పోతుంటే కుక్క కరుస్తుంది .యెదుస్తున్తాదు . యాకోవ్ నది ఒడ్డుకు చేరి పాత రోజులు జ్ఞాపకానికి తెచ్చుకొంటాడు . తానూ చేసిన దంతా సినిమా రీల్ లాగా తిరుగుతుంది . తానూ ఎందుకు అందరి మీద పోట్లాడుతున్నాడో తెలియలేదు .యోదులు అంటే ఎందుకు అసహ్య పడుతున్నాడో అర్ధం కావటం లేదు . ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు .యె నష్టం తన తో ఇంతపని చేయిస్తోంది అని విచారిస్తాడు .  ” 

yakov adds his own unloved life to his book of losses ”అని జమ ఖర్చుల పుస్తకం లో రాసుకోన్నట్లు చెకోవ్ రాస్తాడు . 
                     భార్యకు వచ్చిన జబ్బే యాకోవ్ కో వచ్చి మరణ శయ్య మీద ఉంటాడు . తన వయొలిన్ తీసుకొని ఒంటరిగా వాయించుకొంటూ ఉంటాడు . ఇంతలో ఒక రోజు రొట్స్ చైల్డ్ వచ్చి ఒక పెద్ద బేరం వచ్చిందని సంతోషం గా చెప్పాడు . బాగా గిట్టుబాటు అవుతుందనీ చెప్పాడు . వచ్చి వాయిస్తావా అని ఆ కుర్రాడు యాకోవ్ ను అడుగుతాడు . అతనిలో మార్పు వచ్చి నట్లు గమనిస్తాడు . ‘come on do’t be afraid ”’అని దగ్గరకు పిలుస్తాడు . తను చని పోయే స్తితిలో ఉన్నానై ,తన జ్ఞాపక చిహ్నం గా తన ఫిడేల్ ను వాడికి ఇవ్వాలని అనుకొంటాడు . వాడు దాన్ని తీసుకొని చాలా విషాదం గా వాయిస్తాడు . ఊరి వారంతా వాడి ని మెచ్చుకొని ఆదరిస్తారు . యాకోవ్ చని పోతాడు . ఆ పిల్లాడిలో తన చని పోయిన పిల్లాడిని చూసుకొన్నాడు కనుక వీడికి మనసులో సంతృప్తి ,ప్రేమ ,ఆప్యాయత కలిగి హాయిగా మరణిస్తాడు . ద్వేషం కంటే ప్రేమ ఆదరణ మనిషికి శాంతిని ప్రశాంతిని కలిగిస్తాయని చెప్పకనే చెపుతాడు చెకోవ్ . 
 ”chekov’s heroes have no life ,there is only the daily eoutine without any event or with only one event ,the end of being .daily routine and death are two fixed poles of chekov’s world ”అని చెకోవ్ కధను విశ్లేషిస్తారు విమర్శకులు . 
        ఈ కధలో”the life of one man was in short a loss and only his death  a profit ” అంటాడు కధకుడు చెకోవ్ . రొత్స్ చైల్డ్ పాడిన పాత కూడా అద్భుతం గా ఉందట .దాన్ని వర్ణిస్తూ ”so pleases every one in the town that wealthy traders and officials never find to engage Roths chaild for their social gatherings and even force him to play as many as ten times ”అని కధను ముగిస్తాడు మహా కధకుడు చెకోవ్ .చని పోయిన వాడికీ తృప్తి ,ఈ కుర్రాడికీ రాబడి ఇబ్బడి ముబ్బడి అయి ఏంటో సంతృప్తి వాడి పాటా వాదనా విధానం అందరికీ మానసిక సంతృప్తి నిచ్చింది . 
                మరో కద మరో మారు 
      
      15-9-2002 ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి      
                   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-7-13 -కాంప్-హైదరాబాద్ 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి – 40వ సమా వేశం —–ఆహ్వానం

 సరస భారతి –
                      -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు 
                     40వ సమా వేశం —–ఆహ్వానం -6-30
            శ్రీ వ్యాస పూర్ణిమ సందర్భం గా సరస భారతి 40 వ సమావేశం -23-7-13 మంగళ వారం సాయంత్రం 6-30 గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి ఆలయం లో జరుగుతుంది . శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ గారు ”శ్రీ వ్యాస మహర్షి జీవితం -విశిష్ట రచనా వైభవం ”పై ముఖ్య అతిధిగా పాల్గొని ధార్మిక ప్రసంగం చేస్తారు ఆ స్తిక మహాశయులు ,సాహిత్యాభిమానులు అందరు పాల్గొని కార్య క్రమాన్ని విజయ వంతం చేయ గోరు చున్నాము . .  

–జోశ్యుల శ్యామలా దేవి                 మాది రాజు శివ లక్ష్మి          గబ్బిట  వెంకట రమణ                 గబ్బిట  దుర్గా ప్రసాద్ 

   గౌరవాధ్యక్షులు                              కార్య దర్శి                           కోశాధికారి                               అధ్యక్షులు 
                                                                                                                                      సరసభారతి–ఉయ్యూరు  
                                                                                                                                        9989066375
                                                                                                                                         08676-232797
                                                                                                                                      
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చక్కని కధకుడు చెకోవ్ –1

 చక్కని కధకుడు చెకోవ్ –1
    అరుదైన  ప్రపంచ కదా రచయితా లలో అంటోన్ చెకోవ్ ఒకడు . చిన్న కదా రచయితలలో అ త్యధిక ప్రభావం కలిగించిన వాడాయన . ఆయన పద్ధతికి వ్యతిరేకి కాఫ్కా అయితే బోర్గేస్ ఈ విధానాన్ని అభి వృద్ధి పరచాడు . ఆయనది అతి సున్నితమైన సరళ విధానం .నిజాలకు దగ్గరగా ,దాదాపు తనను గురించే ఉన్నట్లు ఉంటుంది .చెకొవ్ ను గురించి రష్యా ప్రముఖ   ‘ఆనదర్ హోలీ సోల్ ”అని  అంటూ . ప్రముఖ రష్యా రచయితా టాల్ స్టాయ్ ”వచన పుష్కిన్ ”అని కీర్తించాడు .చెకోవ్ చిత్రించిన పాత్ర ”ఒలేంకా ”విశ్వజనీన మైనది అని మెచ్చాడు . 
                 1860 january  17న చెకోవ్ పుట్టాడు అ సలు పేరు అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ ”. .కుతుమ్బమ్ మాస్కో చేరింది .కుతుమ్బ బాంధవ్యం బాగా ఉన్న వాడు చెకోవ్ . ఇరవై నాల్గవ ఏట వైద్య విద్య పూర్తీ చేశాడు . 1884 ,1886 లలో రెండు కదా సంకాఆఆలనాలను వేలువర్చాడు . గ్రిగారో విచ్ అనే రష్యన్ నవలా కారుడు ”the real  talent in you sets you far above other writers of the younger generation ”అని చెకోవ్ బుజం తట్టి అభినందించాడు . 
 
 
    The Seagull (1895)     The Lady with the Dog (1899)                   
 
       1887 లో ”ఇవనోవ్ ”అనే నాటకం రాశాడు . అదే ఏడాది పెద్దకద గా ”ది స్టెప్పీ  ” రాసి పేరు పొందాడు .దీనికి పుష్కిన్ అవార్డ్ వచ్చింది . కొంతకాలానికి క్షయ వ్యాధి వచ్చింది జైల్లు అన్నీ తిరిగి చూశాడు . వాటి నిర్వహణ పై తన అభిప్రాయాలను ”sakhalin island 1891 ”గా రాశాడు . కరువు నివారణ పనుల్లో తన వంతు పాత్ర కూడా నిర్వహించాడు . 1894 లో ఎన్నో అత్యద్భుతమైన కధలు రాశాడు .”అంకుల్ వాన్యో ”నాటకం రాశాడు కాని క్లిక్ అవలేదు .  1898 లో ”సీ గల్  ”  నాటకం రాసి ప్రదర్శిస్తే బ్రహ్మాన మైన విజయం లభించింది . ఽఅరొగ్యమ్ తగ్గి పోవటం వాళ్ళ ”ఎల్తా హెల్త్ రిసార్ట్ ”లో చేరాడు . అక్కడే టా ల్ స్టాయ్ ,మాక్సిం గోర్క్రీ లతో పరిచయం ఏర్పడింది . ”medicine is my lawful wife and literature is my mistres ” అని చెప్పి రెండిటిని సమర్ధ వంతం గా జీవితాంతం నిర్వహించాడు ”.chekov offers theatre mood and a submerged life in the text ”అతని నాటకాలున్దేవి . సి గల నాటకం పరాజయం పొందిన తర్వాతా దియేటర్ కు సలాం కొట్టేశాడు కాని మాస్కో ఆర్ట్ దియేటర్ లో మళ్ళీ ప్రదర్శించిన తర్వాత ఊపిరి పీల్చుకొని న్ప్లేస్ రాయటం కోన సాగించాడు .
            చెకోవ్ మొదట్లో డబ్బు కోసమే కధలు రాసినా క్రమం గాసృజనాత్మక శైలి తో  ఆధునిక కదా కు బీజం వేసిన రచయితా అయ్యాడు .” చైతన్య స్రవంతి ” టెక్నిక్ విదాన్నాన్ని ప్రారంభించిన వాడుకూడా చేకోవే . ఆ తర్వతే జేమ్స్ జాయిస్ వగైరాలు కోన సాగించారు . కధకుడు ప్రశ్నించి వదిలి పెట్టాలె కాని సమాధానం చెప్పరాదని చెకోవ్ అంటాడు తన రీడర్స్ తో .  
            1901 లో ఓల్గా నిప్పర్ ”అనే నటి ని  పెళ్లి చేసుకొన్నాడు . తర్వాత ”ది లేడి ఆఫ్ ది డాగ్”, ది డార్లింగ్”కధలు రాశాడు . 1991లో” ది డార్లింగ్  ”అనే నాటకం రాశాడు .నలభాఇ నాలుగు ఏళ్ళు మాత్రమె జీవించి 1904 july 2  న జెర్మని హాస్పిటల్ లో  అంటోన్చెకోవ్ ” అస్తమించాడు . 
   చెకోవ్ చాలా సహజ వాతావరణం లో కధలను చెబుతాడు అంటే నేచురాలిటి  ఎక్కువ .  ఒకడు ఇంకొకడితో సంభాషిస్తూ చెబుతున్నట్లు గా కదా రాస్తాడు . అదీ ”చేకోవియన్ వె ఆఫ్ స్టోరి టే ల్లింగ్ ”అని పిలుస్తారు . పాత్రలు నిండుగా ఉంటాయి జీవమ్ తో తోనికిస లాడతాయి . ప్రత్యెక మైన నీటి ఏదీ కధలో కానీ పించాడు చెప్పాడు కూడా . ప్రత్యెక మైన  సందేశమూ  ఉండదు ఽలలలు అలలుగా కదా సంవిధానం జరిగి పోతుంది . మానసిక పరిస్తితి ని బట్టి కదా నడుస్తుంది ఽన్తె మూడ్ ను బట్టి కదా విధానం ఉంటుంది . అంతర్గత హాస్యం తో కవితాత్మకం గా అక్కడక్కడ ప్రాజ్ ను నడిపిస్తాడు . కదా కు నిజమైన ముగింపు నివ్వదు .దీనికి కారణం మానవులు ఉన్నంత వరకు ,వారి కస్టాలు ,ఇబ్బందులు క లలు ,ఆశలుఉన్నంత వరకు   స్పష్టమైన ఆఖరు సన్ని  వేశం  కాని  ,ముగింపు కాని ఉండదని చెకోవ్ అభిప్రాయం . ఒకరికొకరు కదా చెప్పే విధానం ఉన్నందు వాళ్ళ ఇద్దరు వ్యక్తుల భిన్న స్వభావాలు నటన మనకు కధలో కానీ పించి బహు తమాషా గా ఉంటుంది . 
                       15-9-2002  ఆదివారం నాటి నా అమెరికా డైరీ నుండి 
                మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –16-7-13-ఉయ్యూరు 
 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జేమ్స్ బాస్వేల్

   జేమ్స్ బాస్వేల్ 
              గురు శిష్య సంబంధాన్ని పాస్చాత్య్లు చెప్పటానికి సామ్యుఎల్ జాన్సన్ ను జేమ్స్ బాస్వేల్ ను పేర్కొంటారు అంట విడదీయ రాణి సంబంధం వారిద్దరిది జాన్సన్ సాహితీ మేరువు . నిఘంటు నిర్మాత . జాన్సన్ 1709 లో సెప్టెంబర్ ఏడు న ఇంగ్లాండ్ లోని లిచ్ ఫీల్డ్ లో జన్మించాడు . 1736 లో ”irene”రాశాడు .  ఇది జెంట్లే మానస్ మాగజైన్ అనే లండన్ మాగాజ్సిన్ లో ప్రచురితమైంది . శిష్యుడైన బాస్వేల్1740లో అక్టోబర్29 న ఇంగ్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో పుట్టాడు . జాన్సాన్ ” the vanity of human wishes ”1749 లో రాశాడు .1755లో జాన్సన్  dictionary  రాయటానికి ప్రారంభించాడు . షేక్స్ పియర్ పై పరిస్శోధనా గ్రంధాన్ని జాన్సన్ రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు . 
 
 
    Samuel Johnson    The Life of Samuel Johnson, Volume VI - Part II: Index (L-Z), Dicta Philosophi (Dodo Press)         Boswell's London journal, 1762-1763             
                                   johnson 
                   బాస్వేల్ తన గురువు జాన్సన్ ను 1763 లో మొదటి సారిగా కలుసుకొన్నాడు . జాన్సన్ 1777 లో ”the lives of the poets ”రాయటం ప్రారంభించి1781లో ఆరు వాల్యూములను పూర్తీ చేశాడు . 1784 లో డెబ్భై అయిదేళ్లకు జాన్సాన్ మాఅహాశయుదు మరణించాడు .  1791 లో బాస్వేల్ తన గురువు జాన్సన్ పై రాసిన పుస్తకాన్ని ప్రచురించాడు . బాస్వేల్1795లో యాభై అయిదేల్లకే చని పోయాడు . 
              నేను ఇంటర్ లో ”జ్బాస్వేల్స్ లైఫ్ ఆఫ్ జాన్సన్ ”అనే ప్రాజ్ లెసన్ చదువుకొన్నది జ్ఞాపకం వచ్చింది  . 
”boswell and Gibbon in England have constructed factual narratives which stand as literary master pieces of the very first rank ”అని పేరొందాడు బాస్వేల్ . అలాగే ఆటను రాసిన పుస్తకాలు అంటేనే సాహిత్యం అయినాయి ఽతను ఎమోషనల్ రచయితా . విశ్వ వ్యాప్తమైన యధార్ధాలను రచనలో పొందు పరచాడు . నిజాలాకే ప్రాధాన్యత నిచ్చాడు .  కనుక అంతకు ముందు రాసిన వారి కంటే భిన్న దృక్కోణం బాస్వేల్ కున్నది అదే బాస్వేల్ ప్రత్యేకత ఽన్దుకె అతని రచనలు ఒరిపిడి రాయి లని పించుకోన్నాయి . బాస్వేల్ రాసిన జాన్సన్ జీవిత్స్ చరిత్ర ఆయన చరిత్ర మాత్రమె కాదు ఆయన వ్యాక్తిత్వానికి దర్పణం కూడా .  అదే బాస్వేల్ సృజనాత్మక కళ కు ఆయువు పట్టు .ఆ రచనను ” magnificient literary symbiosis ”అని కీర్తించారు జీవిత చరిత్రలు రాయాలి అంటే బాస్వేల్ లాగా రాయాలి అని అంటారు ంఆర్గ దర్శి అని పించుకొన్నాడు . అందులో బాస్వేల్ మేధావి తనం  (జీనియస్ )కానీ పిస్తుంది .బాస్వెల్ స్వయం సిద్ధమైన జ్ఞాపక శక్తి ఉన్న రచయితా . జాన్సాన్ లో ఉన్న అంతర్గత గొప్ప తనాన్ని గొప్ప గా ఆవిష్క రించాడు . అందుకేboswell’s life of Samuel Johnson ” అనే జీవిత చరిత్ర ” the greatest biography ever written ”అని పించుకోంది  బెర్నార్డ్ షా ”Boswell is the dramatist who invented Johnson .it is a judicious and fruitful narrative ”
అని మెచ్చుకొన్నాడు . 
                18-9-2002 బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి –
               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-13-కాంప్–హైదరాబాద్ 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హోమర్

 
 
 
 
  హోమర్ 
 
            గ్రీకు సాహిత్యానికే కాదు పాశ్చాత్య సాహిత్యానికి ఆద్యుడు హోమర్ హోమర్ అనగానే అయన రాసిన ”ఇలియడ్”ముందుగాను  తర్వాత ”ఒడిస్సీ ”జ్ఞాపకానికి వస్తాయి ఈన్ రెండు గ్రీకుల ఇతిహాసాలు ఽఅ నాటి చరిత్రా సంస్కృతీ నాగరకత అ వైభవం యుద్ధాలు దేవతలు వారి శాపాలు అనుగ్రహాలతో మానవులు పొందిన కస్టాలు సుఖాలు ,సాహస యాత్రలు ,అన్నిటిని వాటిలో నిక్షిప్తం చేశాడు హోమర్ . ఆయన పాటలుగా ఈ ఇతిహాసాన్ని పాడాడు .వాతిని శిష్యులు కుటుంబ సభ్యులు విని మౌఖికం గా తతతరాలకు అందించారు . కనుక ఇది మౌఖిక సాహిత్యం అయింది మన వేదాలను క్రమం ,జట మొదలైన వాటితో ”సంత ‘లు చెప్పుకొని పారం పర్యం గా మనకు అందజేసినట్లే ఈ గ్రీకు ఇతిహాసాలను కూడా ఆజాటికి అందజేసుకొన్నారు . 
            ”the fire of intellect can put out the eye of brute nature ”అని దీని వెనక ఉన్న సిద్ధాంతం . ఇదంతా ఒక గ్రీకు గాధ . ఇది నోటి ద్వారా తర తరాలుగా నిక్షిప్తమై తర తరాలకు చేరింది . ఆ నాడు రాత లేదు . వీటినే హోమరే రాశాడా అని ఒక పెద్ద ప్రశ్న ను లేవదీశారు .దీనినె ”Homeric question ‘అంటారు . ‘కాని అనేక విచారణల వల్ల  ఇది హోమర్ మేధో జనిత కృషి ఏ అని తీర్మానించారు ఎన్నో తరాలు మారాయి కనుక మధ్యలో ఎవరైనా వారికిస్ట  మై నవి చేర్చి ఉండ వచ్చు అంటే ”ప్రక్షిప్తాలు ”ఉండ వచ్చు .  హోమర్ రచన పై సందేహించే  వారిలో  ”unitarions ,analysts ,seperatists ”ఉన్నారు . మనదేశం లోనే కాకుండా ఇలాంటి ”ఓరల్ ట్ర డి షన్” ”యుగోస్లేవియా ”దేశం లో కూడా ఉందని తేల్చారు . 
 
      Iliad (1812)      The Iliad ; and, the Odyssey    Triumph of Odysseus       
 
 
                 ఇలియడ్ 24పుస్తకాలుగా విభజింప బడింది . 12,000కవితా పంక్తులున్న ఎపిక్ కావ్యం . హోమర్ చిత్రించిన హీరో లందరూ బాగా కడుపు నిండా తినగలిగిన వాళ్ళే కాక తాగు బాతులు కూడా . హోమర్ కు ఒక గొప్ప ప్రతిభ వుంది .వ్యక్తుల మనస్తత్వాన్ని ఒక్క మాట ద్వారా ఆవిష్కరిస్తాడు . ఇలియడ్ ,ఒడిస్సీ లు పాశ్చాత్య దేశాల క్లాసిక్స్  .వీతికి ఆది కవి హోమర్ .  హోమర్ పురాతన గ్రీకు కధలు రాసిన వారిలో అగ్రేసరుడు . ఈ రెండు పాశ్చాత్య సాహిత్యం లో తోలి రచనలు అని ముందే చెప్పుకొన్నాం . హోమర్ ప్రభావం ఆయన రచనల ప్రభావం ఎన్నో తరాల వారిని  ఉత్తేజ పరచింది . 
               హోమర్ కాలానికి సంబంధించిన వివాదం ఉంది .”హెరడో టస్”చరిత్ర కారుడు హోమర్ కవి తనకంటే 400 ఏళ్ళ ముందరి వాడు ఽని చెప్పాడు 850b.c. కాలం వాడని భావించారు . కొందరు ట్రోజన్ వార్ కాలం వాడు కనుక ఆయుద్ధాన్ని స్వయం గా చూసి ఉంటాడు కనుక అంట బాగా వర్ణించ గలిగాడు అని ఊహించారు . అంటే 12.B.C. వాడుగా అనుకొన్నారు . కాని ఆధునిక చరిత్రకారులు హోమర్ ను 7-8 B.C. కాలం వాడుగా నిర్ణయిస్తున్నారు . 
            గ్రీకులను అత్యంత ప్రభావితం చేసిన వాడు హోమర్ . ”గ్రీకుల గురువు ”గా ఆరాధించారు . హోమర్ రచనలలో యాభై శాతం ”ఉపన్యాసాలే ”అంటే స్పీచెస్ గ్రీకు దేశం లో ”పాపిరాస్ ”పై రాయటం తో హోమర్ రచనలు రాత పూర్వకం గా మొదట లభించాయి .  హోమర్తన కవిత్వం లో వాడింది ”అయానిక్ గ్రీక్ మాండలికం ”.ఇన్దులొ ”ఎయోలిక్ గ్రీక్ ”మాండలికం కూడా కలిసి పోయింది . చివరికి ఇది ”ఎపిక్ గ్రీక్ ”అని పించు కొన్నది . ఆయన ఉపయోగించిన ఛందస్సు ”dactylic Hexameter ”.దీని వాళ్ళ తానూ చెప్పదలచుకోన్నదాన్ని అతి సరళం గా స్పష్టం గా వేగా వంతం గా చెప్పా గలిగాడు . ఇదే హోమేరిక్ పోయెట్రి ముఖ్య లక్షణం . ఫ్రెంచ్ మొదలైన వారి కవిత్వం కంటే చాలా సాదు స్వభావం హోమర్ కవిత్వం లో ఉందని విశ్లేషకుల అభి ప్రాయం . 
 
       
 
 
              ఇలియడ్ ఇతిహాసం లో ”ఎచిల్లాస్ ”ముఖ్య నాయకుడు .ఇతదు దక్షిణ ”తేస్సలి ”వాడు .కాని అతని యుద్ధాలన్నీ ”పెలొపొనిస్ ”తో సంబంధం కలిగి ఉన్నాయి . ఒక రకం గా ఆ నాటి ”ట్రైబల్ ”వాన్దేరేర్ . ఆ కాలాన్ని ‘Hellenistic period ”’. అంటారు హీరో ఆరాధన ఎక్కువ గా ఉన్న కాలం అన్న మాట . హోమర్ రాసిన పద్ధతిని ”హోమేరిక్ హైమ్స్   ”గా చెబుతారు . 
                ఇలియడ్ లో ఇలియాన్ అంటే ట్రాయ్ నగర ముట్టడి ముఖ్యమైన కదా వస్తువు . అదే ట్రోజన్ వార్ . ఇలియడ్ అంటే -ఇలియన్ ”అంటే ట్రాయ్ కు సంబంధించినది అని  అర్ధం . ఇది ట్రాయ్ రాష్ట్రం లో ఒక సిటి . 
 
               
 
          ఒడిస్సీ లో ఓడియాస్ అనే వీరుడు పదేళ్ళ కాలం ట్రాయ్ నుండి ఇథాకా నగరానికి ప్రయాణానికి సంబంధించిన కదా ఉంటుంది . ఇందులో ట్రాయ్ పతనం ముఖ్యమైంది . ఇతని కుటుంబం ఇతాకా లో ఇతను లేని పదేళ్ళలో పడిన కస్టాలు అనుభవించిన అన్వమానాలతో బాటు భార్య ”పెనెలొప్ ”ను పెళ్లి చేసుకోమని భర్త ఇక తిరిగి రాదనీ ఎందరో యువకులు ఇంటిలో చేరి ఇబ్బందులు పెట్టటం కొడుకు ”తెలిమాకాస్ ”ను పెళ్లి చేసుకోమని ఎందరో కన్యలు బాల వంట పెట్టటం అన్నీ వివరిస్తాడు హోమర్ . 
             14-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి –
        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-13- కాంప్-హైదరాబాద్ 
 
 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డాంటే

   డాంటే 
          డాంటే అనగానే మనకు గుర్తు వచ్చేది ఆయన రాసిన ”Divine comedy ” . డాంటే ను పిల్గ్రిం లేక యాత్రికుడు అంటారు .సాధికారమైన” ప్రాఫెట్ ”అని పేరు పొందాడు . షేక్స్ పియర్ సత్యాన్ని చెబితే , డాంటే ఆ సత్యం తో మనల్ని ప్రకాశమానమ్ గా చేస్తాడు ,ప్రభావంతో ఉత్తేజితులను చేస్తాడు . అతనిలో ఈసా ,జోయాచిన్ అనే ఫ్లోరా కు చెందినా తత్వ వేత్తల ,జ్ఞానుల సంయుక్త దృక్పధం ఉంది . క్రైస్తవ మతానికి పద్య రూప గ్రంధాన్ని అందించాడు . ఎనభై ఒక్క ఏళ్ళు బతికి చరితార్దుదయ్యాడు 
 
 
 
                                Paradiso
రేవేన్నా లో డాంటే సమాధి                                                                                                  డాంటే,బీత్రిస్ లు పికార్దో తో మాట్లాడటం (చిత్రం )
.
                    డాంటే ”ఇంఫరెంసేస్ ”అనే వాటిని యవ్వనం లోనే రాశాడు . జీవిత మధ్యకాలం లో ”పర్గెటియా” ‘రాశాడు ంఉసలి తనం లో ”పారడైజ్ ”రాశాడు .ఒక రకం గా చెప్పాలంటే డాంటే కవి ,ప్రాఫెట్ ,యాత్రికుడు మాత్రమె కాదు షేక్స్ పియర్ కు వ్యతిరేక భావాలున్న వాడు . అందుకే డాంటే ను ”యాంటి షేక్స్ పియర్ ”అంటారు . 
             1265 లో ఇటలీ లోని ఫ్లారెన్స్ లో డాంటే జన్మించాడు . పూర్తీ పేరు ”డాంటే అలగె రి ”. వీరి వంశం వాళ్ళే రొం నగర నిర్మాణం లో బాధ్యత వహించారు . ”జేమ్మా జొనాటి” అనే ఆవిడను వివాహం చేసుకొన్నాడు . ”vita Nuova”ను పద్య గద్యాత్మకం గా అంటే మనాఆఆఆమ్ చెప్పుకొనే ”మణి  ప్రవాళ” శైలి లో రాశాడు .దీనినె డాంటే ”poem ”అని పిలుచుకొన్నాడు . ”Beatrice Portrinari” అనే” నారి ”ని చిన్నప్పటి నుండి ప్రేమించాడు .ఆమె పై తనకున్న ప్రేమను ” platonic devotion ”అని చెప్పుకొన్నాడు . ఇటాలి సివిల్ వార్ లో చేరి పని చేశాడు . మరణ శిక్ష విధించారు .ఇల్లు వదిలి పారిపోయాడు . మళ్ళీ ఫ్లారెంస్ లో   కాలు పెట్టలేదు . 
             ”Dante had learned ”how salt is taste of another man’s bread and how hard is is the way up and down another man’s stairs ” అంటే అన్నీ ప్రాక్టికల్ గా చేసి చూసి తెలుసుకొన్నాడు .తన  ప్రసిద్ధ రచన ”డివైన్ కామెడి ”ని 1307నలభై రెండేళ్ళ వయసులో రాశాడు . ఇక అప్పటి నుండి ఫిలాస ఫర్ అయి పోయాడు. ఆ లానె జీవించాడు . రేవేన్నా లో స్తిరపడి పోయాడు . భార్య ముఖంను  మళ్ళీ చూడనే లేదు .  ఆయనాఆ ఏం ?చెప్పాడు ” Dante personally reveals himself in the penances of pride ,wrath ,and lust ”these were the areas where he felt he had sinned most in his life . ” 
             1321 లో మలేరియా తో మరణించాడు డాంటే . దంటే గొప్ప రాజకీయ ఆలోచనా పరుడు ,వేదాంతి ,గొప్ప కవి . ప్రపంచ ప్రసిద్ధి చెందినా కవులలో డాంటే  ఒకడు గా గా పేర్కొంటారు . ఆయన రాసిన ”వీటా నోవా ”లో ప్రేమ అనుభవాలున్నాయి .” love of a lady far from disrupting the christian faith ,could in fact  lead to the love of God .no question of paradise without his love Beautrice .his lady was herself ”the beautitude which is the goal of desire ”అంటే -”కామి గాక మోక్ష కామి కాడు”  అని మన వాళ్ళు చెప్పిన దానికి దంటే కూడా వత్తాసు  పలికాడన్న మాట . చలం కు రజనీష్ కు కూడా మార్గ దర్స్ది డాంటేనెమో నని పిస్తుంది . దంటే భాష లో ” salute”అంటే ”salvation ”అని కూడా అర్ధం అంటే  విముక్తి ,మోక్షం అని భావం . మన ”ముక్త పద గ్రస్తాన్ని ”  డాంటే  తన కవిత్వం లో ప్రయోగించాడు . ”Dante is nothing but power ,passion and self will .his power is in com
 
 
డాంటే మౌంట్ పారదో వైపు తీక్షనం గా చూడటం (చిత్రం )
 
               divine comedy ఒక ప్రపంచ ప్రసిద్ధ ఎపిక్ పోయెం .  పశ్చిమ దేశాలలో చర్చి లలో మధ్య య్గపు ఆలోచనలకు ప్రతి బింబం ఊహాత్మకం గా అలి గరి  తో విలసిల్లిన కావ్యం . ఇందులో దంటే నరకలోక యాత్ర వర్ణించాడు .ఇది పైకి కనిపించే విషయమే ఽన్తరార్ధమ్ గా మానవుని ఆత్మా భగవంతుని చేరే ప్రయాణం .ఉన్తున్ది ఇదంతా నర్మ గర్భితం .  లోపలి ప్రవేశించిన కొద్దీ మధ్యయుగపు ”తోమిస్తిక్ వేదాంతం ”ఉంటుంది . దీనితో బాటు థామస్ ఆక్వినాస్ సిద్ధాంత వివరణ నిండి ఉంటుంది . దీనికి అందుకనే ”సమ్మా ఇన్ వేర్స్ ”అంటారు . మొదట దీని పేరు ”కమడియా ”.తర్వాత జియోవాన్ బోకాశియో ”డివైన” అని పేరు పెట్టాడు . అప్పటి నుండి ”డివైన్ కామెడి ”అయింది . 1555లో దీన్ని గేబ్రియల్  జియోలిట్ ఫెరారీ మొదటి సారిగా ముద్రించి లోకానికి తెలియ జేశాడు 
            ” పర్గ  టో రియా” లో దేవ దూతలు క్రిస్టియన్ ఆత్మలను సంరక్షిస్తూ తీసుకొని వెళ్ళటం ఉంది దీన్ని ఈగిప్త్ నుండి గ్రహించి నట్లు కానీ పిస్తుంది . . 
  ”పరాడి సో” లో డాంటే అనేక మంది క్రిస్తియాన్ మశాత్ములను దర్శించటం వారితో మాట్లాడటం కానీ పిస్తుంది అలాంటి వారిలో సెయింట్ జాన్ సెయింట్ పీటర్ ,థామస్ ఆక్వినాస్ లాంటి సెయింట్స్ ఉన్నారు . డివైన్ కామెడి లో చివర గా డాంటే పరమాత్మ నిజ దర్శనం  పొందుతాడు అతని ఆత్మా పరమాత్మ లో ఏకీభవించి ముక్తి పొందుతుంది . 

”But already my desire and my will
were being turned like a wheel, all at one speed,
by the Love which moves the sun and the other stars.[25]

       అని పరవశించి ప్రభువు ను కీర్తిస్తాడు జన్మ  సార్ధకం చేసుకొంటాడు డాంటే అలిఘేరి మహా కవి . 

     14-9-2002 శనివారం నాటి నా అమెరికా డైరీ నుండి 

                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్-హైదరాబాద్ 

 

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

                           నా దారి తీరు -39
                                     దివిసీమ ఉప్పెన 
            నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ ఉప్పెన మహోత్పాతమే . 1977 నవంబర్ 19 శని వారం రాత్రి జలప్రళ యమేర్పడి దివి తాలూకాను అస్తవ్యస్తం చేసింది పది వేలకు పైగా జనం ఉప్పెనకుబలి అయ్యారు .ఈ రోజే ఇందిరా గాంధి పుట్టిన రోజు కూడా  . నాటి  నుండి ఆమె ప్రతి పుట్టిన రోజుకీ జనం లో భయం ఉండేది ఏ ప్రమాదం వస్తుందో నని . అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు   రేడియో ఏ ఆధారం ప్రమాద హెచ్చరికలు ఇరవై  నాలుగు గంటలూ మోగుతూనే ఉన్నాయి .శని వారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు .  స్కూల్ ఉంటుందేమో నని నేను సైకిల్ వేసుకొని పెనమకూరు కు వెళ్లాను హెడ్ మాస్టారు కానీ పించి సెలవు ప్రకటించామని చెప్పారు వెంటనే ఇంటికి తిరిగి వచ్చ్చే శా ను ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా  కమ్ముకొని దాదాపు  గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో సముద్రం వైపు ప్రయాణించటం చూశాం .వర్షం , గాలి జో రైంది . 
                     అప్పుడు మా ఇంటి పరిస్తితి ఒక సారి జ్ఞాపకం చేసుకొంటున్నాను . మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లి మగ పిల్లాడిని రవి ని ప్రసవించి ఇంటిలో ఉంది . సావిట్లో ఆమెకు వర్షం పడకుండా ఉన్న  ఒక చోట మంచం వేసి పిల్లాడితోపడుకో బెట్టాం  నడుం కట్టుతో ఉంది .  భోజనాలు సాయంత్రం పెండ్రాలే చేసేశాం . మా తోడల్లుడు గారి అబ్బాయి ”సూర్యం ”మమ్మల్ని చూద్దామని ఆ ఉదయమే ఖమ్మం నుంచి వచ్చాడు .కదలి వెళ్ళటానికి వీలు లేక మా ఇంట్లోనేఉండీ  పోయాడు .  మేమందరం పదమ టిం ట్లో మంచాలేసుకొని పడుకోన్నాం.  అమ్మ ఆమెకున్న చిన్న నవ్వారు మంచం లో సావిట్లో మనవరాలికి తోడుగా పడు కొంది పెంకుటిల్లు కనుక వర్షం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడుతోంది వీలైన చోట్ల తప్పాలాలు బకెట్లు చెంబులు ,గిన్నెలు పెట్టాము   వాటిలో పడటానికి . నిండగానే తూము లో పారబోస్తున్నాం . బయటికి తలుపులు తీయటానికి సాహసించలేక పోయాం . విపరీతమైన గాలి వాన  తో ముంచెత్తుతోంది . గుండె దిటవు చేసుకొని రేడియో పెట్టుకొని వార్తలను హెచ్చరికలను వింటున్నాం .  
                          రాత్రి పది దాటిన తర్వాత  తుఫాను భీభత్సం పెరిగింది మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీభచ్చం గా వర్షం కురుస్తోంది . ప్రళయం ముంచు కొచ్చిందని భయ పడ్డాం . ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నాం ప్రతి క్షణాన్ని . భీకర మైన శబ్దాలు విని పిస్తున్నాయి . ఆకాశం బద్దలై పోతున్నట్లని పించింది ఎక్కడో మంటలు చేల రేగుతున్నట్లు అని పించింది .పాపమ్ రేడియో వాళ్ళు కమ్యూని కేషన్లు తెగ నంతవరకు చెప్పాల్సింది చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు దివి సీమ లో తుఫాను కేంద్రీక రించిందని బందరు అవని గడ్డ ప్రాంతాలలో జల ప్రలయమేర్పడి నట్లు వార్తలు చెప్పుతున్నారు అర్ధ రాత్రి దాటిన తర్వాతా రేడియో పని చేయలేదు . తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియ లేదు .కుమ్భ వృష్టి కురుస్తూనే ఉంది ,గాలి వృక్షాలను ఇళ్ళ కప్పుల్ని కూల్చే వేగం తో వీస్తోంది మె రుపులు ఉరుములతో ఆకాశం  యము ఘంటి కలను మోగిస్తోంది . సరే ఎవరికి నిద్ర లేదు కళ్ళల్లో ఒత్తులేసుకొని బాలింత రాలీని చూసుకొంటూ ఇల్లు కూలి పోతుందేమో నని  నని భయ పడుతూ ,తలుపులు తీయకుండా గాలికి విరిగి పోకుండా అన్నీ రోళ్ళు రోకళ్ళు రాళ్ళు అడ్డాం  పెడుతూ  ఆ కా ళ  రాత్రి ని గడిపాం . తెల్లారే సరికి అంటా ప్రశాంతం గా ఉంది .వాకిల్లలొ రోడ్ల మీద మొల లోతు  నీళ్ళు బయటికి వెళ్ళే వీలే లేదు మర్నాటి వరకు .  కరెంటు ఎప్పుడో పోయింది రా వటా నికి వారం పైగా పట్టింది వైర్లు తెగాయి స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్లు కూలి పోయాయి . అప్పటికి మాకు టెలిఫోన్ లేదు . పేపర్ వస్తేనే వార్తలు తెలిసేది .. రవాణా వ్యవస్థ దెబ్బ తిండి రోడ్లుమీడున్న చెట్లు కూలి పోయి ప్రయాణానికి ఆటంకం కలిగించాయి . 
                          బయటికి వచ్చి రోడ్డు మీద  చూస్తె పరిస్తితి హృదయ విదారకం గా ఉంది . రేకుల షెడ్లు యెగిరి పోయాయి గడ్డి వాముల అడ్రస్ లు లేవు . పూరిల్లు ఎక్కడున్నాయో తెలియ లేదు సావిట్లో కట్టేసిన గొడ్లు చలికి వర్షానికి చచ్చి పడి ఉన్నాయి ఎన్ని కోళ్ళు చని పోయాయో లెక్క లేదు ఒక్క ఉయ్యూరు లోనే ఇట్లా ఉంటె మిగిలిన చోట్ల ఎలా ఉందొ నని అందరు భయ పడుతున్నారు . బస్సులు నడవటం పత్రికలూ రావటం రేడియో పని చేయటం  వల్ల  జరిగిన భీభత్సం క్రమం గా తెలుస్తోంది .దివి సీమ లో చెప్పలేనంత నష్టం జరిగిందని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ,సముద్రం లో బడబాగ్ని పుట్టి ఊహించని నష్టాన్ని కలిగించిందని సముద్రం విరుచుకు పడి ఊళ్లకు ఊళ్ళను  తనలో కలుపుకోందని కెరటాలు కరెంటు స్తంభాల ఎత్తుకు వచ్చాయని ఇంత ఎత్తు  కెరటాలు రావటం ఇంత   వరకు ఎన్నడూ చూడలేదని ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలు గుట్టలు గా పడి  ఉన్నాయని జంతు కలేబరాలకు లెక్కే లేదని గడ్డి మోపులు కరెంటు స్తంభాల మీద కానీ పించాయని వార్తలోచ్చాయి .  జరుగ రాని  ఘోరం జరిగి పోయింది దివి సీమ లో బందరు కూడా బాగా దెబ్బ తిందని తెలిసింది .  
                          ఉప్పెన వచ్చిన మర్నాటి నుంచే మండలి కృష్ణా రావు గారు స్వయం గా బయల్దేరి దెబ్బ తిన్న ప్రాంతాలైన భావ దేవర పల్లి ,నాగాయలంకా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఇబ్బంది పడే జనాలను ఓదార్చి మిగిలిన వారిని అవని గడ్డ లోని గాంధీ క్షేత్రానికి ,స్కూలు భవనాలకు తరలించి భోజన సౌకర్యాలు కలిగించారు ఆయన ఈ ఉప్పెన చూసి చలించి పోయారు ముఖ్య మంత్రి వెంగల రావు వస్తే కావలించుకొని ఏడ్చేశారు కా వలసిసహాయం అందినచమని అర్ధించారు .  స్వచ్చంద సంస్తలు అయిన ఆర్.యెస్.యెస్  వంటివి,సైన్యం  చాలా చొరవతో ముందుకు వచ్చి పునరావాస కార్యక్రమాలు చేబట్టాయి .     .శవాలను కాలువల్లోంచి బయటికి తీయటం పెద్ద సమస్య అయింది .శవాలకు అంత్య క్రియలు చేయటం పెద్ద సమస్య .వీలైనన్త వరకు బంధువులతో గుర్తింప జేశారు సామూహిక శవ దహనాలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది . అక్కడ అంటూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం పెద్ద సమస్య . కలెక్టర్ a.v.s.reddi అని జ్ఞాపకం . చాలా శ్రమించాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పని చేయించాడు . 
                                ఈ ఉప్పెన మహోత్పాతాన్ని స్వయం గా చూడాలని పించింది .ఒక ఆదివారం మధ్యాహ్నం భోంచేసి బస్ లో అవని గడ్డ వెళ్లాను అక్కడి నుండి ఎక్కడికీ బస్సులు తిరగటం లేదు . జీపులు కార్లలోనే వెళ్ళాలి అలానే భావ దేవర పల్లి వెళ్లాను.  దారి పొడుగునా శవాలు కానీ పించాయి వాసన భీభత్సం గా ఉంది D.D.T.చల్లారు కాని ఆగటం లేదు ఆడా  మగా శిశువుల శవాలు చూసి గుండె జారిపోయింది పశువుల కలేబరాలకు లెక్కే లేదు . అవని గడ్డ లో స్వంచంద సంస్తల సేవలు చూసి కళ్ళు చెమర్చాయి .వాల్ల సేవకు ప్రతి ఫలం ఇవ్వలేము . ముక్కుకు కర్చీఫ్ పెట్టుకొనే తిరిగాను . గాంధీ క్షేత్రానికి వెళ్లి చూశాను భావ దేవర పల్లి లో ఉప్పెన నీరు హైస్కూల్ భవనం పై అంతస్తుకు చేరిందట  . ఉయ్యూరు  నుండి ఇక్కడికి వచ్చ్చిన  వచ్చిన సీతాపతి రావు హెడ్మాస్టారు పై అంతస్తు ఎక్కి ప్రాణాలు ఉగ్గాబట్ట్టుకోన్నారట అక్కడి లైబెరియన్ నాన్చారయ్య  కుటుంబం కూడా  అంతే తర్వాత ఉయ్యూరు కు బదిలీ అయ్యాడు .  అవని గడ్డకు మళ్ళీ చేరి బందరుకు బస్ లో వెళ్లాను .ఆన్ని  చోట్లా పంటలన్నీ నాశనం ఉప్పురిసి పోయాయి పొలాలన్నీ . రెండు మూడేళ్ళ దాకా పొలాలలో పంట పండదు .బందరు వైపూ  వైపునా ఇలాగే కానీ పించింది బందరు నుండి రాత్రికి ఉయ్యూరు చేరాను . 
                     ఉయ్యూరు లో మేమందరం యార్ ఎస్ ఎస్ . వాళ్ళ కింద పని చేసి ఇంటింటికి తిరిగి బట్టలు డబ్బు పోగు చేశాం  మండావీరభద్ర రావు  మాకు నాయకుడు మాధవాచారి సహాయకుడు . వీటిని కార్లలో సేవా కేంద్రాలకు పంపి వారితో అందరికి అందజేయిన్చాం . ప్రతి స్కూల్ నుండి నిధులు వసూలు చేసి ఎవరికి వారు స్వచ్చందసం గా డ బ్బు వసూలు చేసిముఖ్య మంత్రి సహాయ నిధికి పంపారు దేశం ,ప్రపంచం అంతా  బాసటగా నిలిచింది మందులు పంపారు కొందరు దుప్పట్లు రగ్గులు చొక్కాలు చిన్న పిల్లల డ్రెస్ లు పంపారు ఇంకొందరు . మా తమ్ముడు మోహన్ మరదలు సునీత పూనా నుంచి చూడ టానికి వచ్చారు కూడా బట్టలు తెచ్చారు మళ్ళీ వాళ్ళతో వెళ్లి అక్కడ పంచి పెట్టాము . ఇదంతా  గుండె బరువేక్కువయ్యే సన్నీ వేషాలే .  ఆ సంఘటనపై  ”శని రాత్రి ”అనే దీర్ఘ కవితరాశాను . 
                         ఈ విధం గా పెనమకూరు అంటే దివి ఉప్పెనే ముఖ్యం గా జ్ఞాపకం వస్తుంది . మా చల పతి  కి ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు వద్దే శోభనాద్రి .వాగ్దానం చేసిన  నాలుగు రోజులకే నన్ను పెనమకూరు నుండి ఉయ్యూరు కు ట్రాన్స్ ఫర్ చేయించాడు . 17-8-79 సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి మర్నాడు అంటే 18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను ఇది  నా తొమ్మిదవ బదిలీ ఉయ్యూరు రావటం నాలుగో సారి . పెనమకూరు లో మంచి వీడ్కోలు విందు ఇచ్చారు హెడ్ మాస్టారు ఆప్యాయం గా మాట్లాడారు .స్టాఫ్ అంతా  మెచ్చుకొన్నారు .  
                   సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్ -హైదరాబాద్ . 
                          
Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

ఆమెరికా ఆత్మ వాల్ట్ విట్మన్ కవి

   ఆమెరికా ఆత్మ వాల్ట్ విట్మన్ కవి 
              అతి తక్కువ స్తాయిలో జీవితం ప్రారంభించి , గొప్ప జర్న లిస్టు గా మారి ,అమెరికా ఆత్మా ను ”లీవ్స్ ఆఫ్ గ్రాస్ ”కవితా సంపుటిలో ప్రదర్శించిన గొప్ప కవి వాల్ట్ విట్మన్ . అతని జీవితం లో ప్రతి ఘట్టం అతన్ని గొప్ప కవి గా చేయటానికి తోడ్పడింది . చివరి జీవితం అత్యంత దుర్భరం గా గడపాల్సి వచ్చింది . ఎమర్సన్ , మెల్ విల్లీ మహా రచయితలూ మెచ్చిన కవి విట్మన్ . మానవత్వం మూర్తీభవించిన మహా కవి .యెన్నొ దేశాలకు ఆదర్స్ద ప్రాయమైన కవి . ఒక వడ్రంగి కొడుకు అమెరికన్ కవిత్వానికి ఆత్యంత వైభవోపేతమైన మెరుగులు పెట్టి తీర్చి దిద్దటం ఆశ్చర్యమేస్తుంది ఽప్పతిదాకా అమెరికా కవిత్వం అంటే ఇంగ్లాడ్ కవిత్వానికి నకలు గా ఉండేది అమెరికా మనుసుల ,మనుషుల మనో భావాలకు స్తానం ఉండేది కాదు .ఇక్కది తాడిత ,పీడిత జనం గురించి ,ప్రక్రుతి గురించి వస్తువు గా తీసుకొని రాసి అమెరికా యొక్క గ్రేటెస్ట్ పోయేట్ అని పించుకొన్నాడు  శ్రీ శ్రీ లాంటి వారికి ప్రేరణ నిచ్చాడు . అమెరికా లోని న్యు యార్క్ లో31-5-1819 లో జన్మించాడు .  73ఏళ్ళు జీవించి  26-3-1892 లో న్యుజెర్సి లోని కాండెన్ లో మరణించాడు . 
     అమెరికా సివిల్ వార్ లో నర్స్ గా పని చేశాడు . తన లీస్ ఆఫ్ గ్రస్స్ కవితా సంకలాన్ని స్వంత ఖర్చులతో ముద్రించాడు . ఇది అమెరికన్ ఎపిక్ అని సామాన్య మానవుడి చిత్రణ ఉందని మెచ్చుకొన్నారు అతని ఆల్బం ఉంది ,పాటల సంకలనానికి సాంగ్ ఆఫ్ అమెరికా ఫ్రమ్  గాడ్ అని పేరు పెట్టాడు అతని సోదరులందరికి అమెరికా ప్రేసిదేన్ట్లైన వాషింగ్టన్ విట్మన్ ,జఫర్సన్ విట్మన్ పేర్లను గౌరవం గా 
 
 
 
    
                  
 
 
                        తండ్రిఆరుగురు  సంతానం లో రెండవ వాడు విట్మన్ . తండ్రి ఇల్లు కట్టి అమ్మేస్తూ చాలా నష్టపోయాడు . చిన్న తమ్ముడు మెంటల్ .పెద్దన్న తీవ్ర స్వభావం కల వాడు మెంటల్ హాస్పిటల్ లో చేర్పిస్తే అక్కడే చని పోయాడు . మూడవ వాడు గొంతులో క్షయ తో మరణించాడు . భార్య ”ప్రాస్టిట్యూట్ ”గా మారింది . సోదరి ”హైపో కాన్ద్రియా ”తో బాధ పడింది . చిన్న తమ్ముడికి డిప్రెషన్ . ఇంట దుర్భర పరిస్తితుల నేపధ్యం లో విట్మన్ పెరిగాడు జీవించాడు .వీతినన్నితిని తట్టుకొని మహోన్నత మానవతా వాడి గా మారి మహోన్నత కవిత్వాన్ని రాశాడు అమెరికా ఆత్మను నిజం గా ఆవిష్కరించిన కవి విట్మన్ . 
              విట్మ ”సెల్ఫ్ క్రిటికల్ ఆర్టిస్ట్ ”అంటారు . ఆయన జీవితం కవిత్వం ఒక దానితో ఒకటి పెనవేసుకు పోయాయి . అమెరికా లో అమలు జరుగుతున్నా నీగ్రో బానిసత్వాన్ని పూర్తిగా వ్యతి రేకించాడు . ప్రజా స్వామ్యం పై అమిత విశ్వాసం . అమెరికా రాజకీయాలను తన కవితా దృక్పధం ద్వారా ప్రభావితం చేసిన ఆదర్శ కవి మార్గ దర్శి విట్మన్ .  ”prudence (cautious )is the right arm of independence ”అని భావించాడు . అమెరికా అంటా తిరిగి ప్రజల విభిన్న జీవన పరిస్తితులను అధ్యయనం చేశాడు .వారి దుర్భర జీవితాలను కళ్ళతో చూసి స్పందించాడు వారి ఉన్నతికి కృషి చేయమని కవితల్లో ఉద్బోధించాడు ప్రభుత్వాలకు .వాల్లె దేశాన్ని మోసే బోయీలన్నాడు .  ఎన్నో పత్రికలకు ఎడిటర్ గా పని చేశాడు . బ్రూక్లిన్ ,న్యు యార్క్ లలో పత్రికలకు పని చేశాడు . అతన్ని ”common man incarnate ,collossal human figure ”గా కీర్తిస్తారు మానవత్వానికి ఎత్తిన పతాక విట్మన్ . 
 
                             
 
 
              వాల్ట్ విట్మన్ తన కవిత్వం లో ఎవరి కొటేషన్లు ఉండ రాదనీ ,అత్యద్భుత మైన పద్యాలను రాయాలని నేటివ్ కవిత్వానికి స్తానం ఇవ్వాలని తీర్మానించుకొని అలానే చేసి చూపించాడు . ”a mighty pain to love it is -and yet a pain that love to miss -but of all pain ,the greatest pain -it is to love but love in vain ”అనే కవితా పంక్తుల్ని ఎప్పుడూ మననం చేస్తూండే వాడు . తన కవిత్వానికి ”song of my self ”అని పేరు పెట్టు కొన్నాడు .
”my voice goes after what my eyes cannot reach -with the twirl of my tongue i encompass worlds and volumes of words -”అని ఎవరూ చూడనివి ఎవరూ రాయనివి తనకవిత్వం లో చూపించాడు .
    6-9-2002  శుక్రవారం అమెరికా డైరీ నుండి 
                –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్–హైదరాబాద్ 
                    
 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

” సాహసం” శాయ (కు )రా

”  సాహసం” శాయ (కు )రా 
             చెవుల్లో సీసం పోసుకొని చెవులపై కాబేజీ పూలేట్టుకొని ,కళ్ళకు గంత లు కట్టుకొని ,వివేకానికి ,విచక్షణకు ఇనప తెర వేసుకొని  గుండె,ఊపిరి  బిగ పట్టుకొని ,డబ్బు పొతే పోయిందని ”సాహసం” చేసి చూడాల్సిన సినిమా సాహసం . తాప్సీఆరబోసిన ”టాప్”  అందాలు ,లడక్  ప్రాంతపు  ఎత్తుపల్లాలు శక్తి కపూర్ సమర్ధ  వంతమైన నటనా” ,శ్రీ ”ఇచ్చిన అవసరమైన నేపద్ధ్యస్సంగీతం ,పెర్సనాలిటి  పెద్దగా లేకున్నా పావు గంటకొక పాతిక మందిని చావ గొట్టే గోపీ సాహస చాతుర్య  నటనా ,రాసుకొన్న స్క్రీన్ ప్లే ని అత్యంత సమర్ధ వంతం గా ఆసాంతం నడిపిన దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ప్రతిభ కు ,తీసిన సాహసానికి హాట్స్ ఆఫ్ .  
               పాపం చాలా రోజులకుమంచి నటుడు  ”నారాయణ రావు ”ను చిన్న పాత్రలో నైనా చూపించి నందుకు నాకు మహదానందం గా ఉంది .సుమన్ కనీ పించీ కనీ పించకుండానే కధను నడిపిస్తాడు .గోపీ చాంద్ ”పోకిరి ”మహేష్ బాబు లా మంచి ఈజ్ తో ,పోజ్ తో పరి గేత్తాడు  .పురాతన పరిశోధకప్రొఫెసర్  పాత్ర వేసిన ఆయన నిజం గానే పాత్రలో జీవించాడు . ఆలీ హాస్యం పండకుండా ,మధ్యలోనేపాకిస్తాన్ ఎడారి లో  ఎండి, కను మరుగైంది పాపం . సినిమాలో గోపీ చంద్  ఒక నీతి ని పదే   పదే  వల్లిస్తాడు అది ”నాది కానిది కోటి రూపాయలైనా నాకు అక్కర్లేదు .  నాది అయింది  అర్ధ రూపాయైనా నేను వదిలి పెట్టను ”ఇది ముఖ్య సూత్రం గా కద నడుస్తుంది  .ఇది గొప్ప ఆదర్శమే .దొరికిన నిధి పాకిస్తాన్ కు అప్పగించి తన తాత వజ్రాలను మాత్రమె తీసుకొని ఇండియా కు  చేరుకొంటాడు పెషావర్ నుండి హీరో,హీరోయిన్ తో .  . గుర్రాల చేసింగ్ ,కార్ల రాలీయింగ్ ,క్షణ క్షణం భీభత్సం  గా నే ఉంటుంది.  మొదట్లో కొంచెం స్లో గా నడిచినా తర్వాత ఊపు అందుకుంది సినిమా . అయితే చివరి అరగంటా ”ప్రేక్షకుల సహనానికి ”పెద్ద పరీక్షే పెట్టాడు దర్శకుడు . 
                     పూర్వం చందమామ కద కు ఆధునికత జోడించి తీసిన చిత్రం ఇది . రెండే రెండు పాటలతో సినిమా ను లాగించటం కూడా వెరైటీ గా ఉంది . సినిమా మొత్తం మీద పాత్రలు కూడా తక్కువే అవటం ఒక గొప్ప విషయం కూడా . చిన్నపిల్లలకు సర్ప్రైసింగ్ అని పించ వచ్చు . పెద్దోల్లకు బోర్ గా ఉండచ్చు .యువత కు ఇన్స్పైరింగ్ గా ఉండే సన్నీ వేశాలేవీ కనీ పించవు . కాని సినిమా అతి వేగం గా గోపీచంద్ లా పరిగెడుతూ ఉంటుంది .గోపీ విలన్ చెప్పి నట్టు అల్లా చేయటం వాడిని దాదాపు బూతుల్లాంటి వి తిట్టటం ,కొంచెం ఇబ్బందిగానే ఉంది .  బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క సీ ను గుర్తుండదు .కారణం  మనసుకు పట్టే విషయాలేవీ లేకపోవటం  .కర్రల వంతెనలు వాటి మీద నడవటా లు ,నూతిలో మెట్లు ఎక్కి దిగటా లు ,మాయా తాళం చెవులు అవి తిప్పితే ద్వారాలు  తెరుచుకోవటా లు అన్నీ కత్తి వీరుడు  కాంతా రావు సిని మా ఫక్కీ . 
                 హైదరాబాద్ లో విడుదల అయిన రెండో రోజునే అంటే నిన్ననే  నాచారం లో ఉన్న వైజయంతి సినిమా హాల్ లో మొదటి ఆటకు వెళ్లాం ఏడు శాల్తీలం . దియేటర్ ఫుల్ అయింది . ఇంటికి వచ్చిన తర్వాత ఈ సినిమా చూడ టానికి ఇంతటి ”సాహసం ”చేయాలా ?”అని పించింది అంతే.  గొపీ చంద్  సూక్తిని ”నీ డబ్బు కాక పొతే ఈ సినిమా చూడు .నీ డబ్బు అయితే  ”సాహసం  శాయ (కు ) రా డింగరీ ”అని మారిస్తే యెట్లా ఉంటుంది?  అని పించింది . 
                            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ – 14-7-13-ఉయ్యూరు 
 
 
 
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

జీన్ పాల్ సాత్రే

     జీన్ పాల్ సాత్రే 
          జీన్ పాల్ సాత్రే అంటే తెలియని వారు లేరు .విశ్వ వ్యాప్తమైన పేరు అది . ఆయన సిద్ధాంతం కొరుకుడు పడక పోవచ్చు కాని వానవత్వ విషయాలపై ఎక్కడా దాడి జరిగినా ప్రతిఘటించే మనస్తత్వం ఉన్న వాడు . 1905 june 21న పారిస్ లో జన్మించాడు . చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు .తల్లి తరఫు వారి దగ్గర పెరిగాడు .బాల్యమ్ లోనే ”leucoma”అనే కంటి జబ్బు వచ్చింది . తర్వాత క్రమం గా నయమి పోయింది . సాత్రే చదువు తాతను సంతృప్తి పరచలేదు . తల్లి మరోకదిని పెళ్లి చేసుకొన్నది . కుటుంబం అంతా ”లా రోచేల్లా ”కు చేరింది .
 
 
 
No Exit (1944)Being and NothingnessLes Mains Sales
 
 
           1929 లో ఫిలాసఫీ లో  డాక్టరేట్ సంపాదించాడు .  ‘lece -leharve లో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా పని చేశాడు తర్వాత జర్మని లోని బెర్లిన్ లోను ప్రొఫెసర్ గా పని చేశాడు . అప్పటికే ”L- imagination ”గ్రంధాన్ని రాశాడు . అ తర్వాత ఎన్నో పుస్తకాలు రాసి ప్రచురించాడు . సాత్రే ”la nasse ”అనే నాటకాన్ని కూడా రాశాడు . ఫ్రాన్సు దేశం తరఫున యుద్ధం లో పోరాడాడు . జర్మనీ ఫ్రాన్స్ ను ఓడించింది . జైలు పాలైనాడు . 1941లో జైలు నుండి పరారైనాడు .1944లో ఉద్యోగం మానేశాడు . రచనే ధ్యేయం గా గడిపాడు . సాత్రే రాసిన వాననీ అన్ని భాషల్లోకి అనువదింప బడ్డాయి . రాసిన వాటిల్లో చాలా వాటిని  సినిమాలు గా తీశారు .
      1948 లో అమెరికా ,ఆల్గీరియా దేశాలను సందర్స్ధించాడు ఽప్పతికె ప్రపంచ మేధావులలో ఒకడిగా గుర్తింపు పొందాడు .1950  లో ”సోవియట్ లేబర్ కాంప్ ”లను నిరషించాడు . భార్య”bevour ” తో చైనా వెళ్ళాడు . సాత్రే రాసిన ”kean ”ను సినిమా గా తీశారు . మానవ హక్కుల మీద ఎన్నో పత్రికా సమావేశాలను నిర్వహించాడు . అల్జీరియా యుద్ధం పై నిరసన వ్యక్తం చేశాడు . క్యూబా సందర్శించి దాని పై పుస్తకం రాశాడు . ”huis -clos ”రచన ను అల్గీరియా వాళ్ళు సినిమా తీశారు . .
                 1964 లో జీన్ పాల్ సాత్రే కు నోబెల్ బహుమతి ని ప్రకటీం చారు .  వెంటనే దాన్ని తిరస్కరించాడు . దానికి కారణాన్ని ఇలా చెప్పాడు ”it will undermine my influences as a writer ,and to protest it being awarded only to western writers and soviet dissidents ”అని చెప్పాడు . 1966లో రష్యా ,జపాన్ దేశాలను పర్య తించాడు . సాత్రే రాసిన ” le-mur ”ను సినిమా తీశారు . 1976లో హీబ్రు యోని వేర్సితి ఇచ్చిన గౌరవ డాక్టరేట్ ను స్వీకరించాడు  1980 లో 75వ ఏట సాత్రే ఫిలాసఫర్ పారిస్ లో మరణించాడు . ఎక్షిస్తెన్శలిజమ్ కు పురుడు పోసి పెంచిన తత్వ వేత్త సాత్రే . దీని సారాంశం
Our only way to escape self-deception is authenticity, that is, choosing in a way which reveals the existence of the for-itself as both factual and transcendent. For Sartre, my proper exercise of freedom creates values that any other human being placed in my situation could experience, therefore each authentic project expresses a universal dimension in the singularity of a human life.
           సాత్రే ” being and nothingness ”1943లో రాశాడు . అందులో మానవ పరిస్తితులను ,మానవుల చింతనను గురించి రాశాడు . అప్పుడే ”no exit ”రాస్తే జనం విపరీతం గా  ఆదరించారు . ఇందులో -ముగ్గురు నరకానికి వెళ్తారు .ఒకల్లను ఒకళ్ళు మానవ తప్పిదాలను ,అపజయాలను చెప్పుకొని బాధ పడతారు .చివరికి అందరూ అసలు విషయాలను తెలుసు కొంటారు .దానినె ” fundamental existentialtruth .hell is other people ”అని గ్రహిస్తారు .
   సాత్రే ను రాజకీయ రుషి అని ,నైతిక విలువలున్న మనిషని గుర్తింపు పొందాడు . 1950-60 మధ్య గొప్ప విజయాలు సాధించి ఆ దశాబ్దపు మనీషి అని పించుకొన్నాడు . సాత్రే గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే ”satre ‘s special talent is social diagnosis and psycho analysis ,-he is at his most brilliant when he dissects some deformed life and lays it out for our inspections ”అంటే కాదు కాలానికి తగిన శైలి ని ని రచనల లో నింపాడు . అదే ”the urge toward ”self co incidence ‘which is the key of our being ”
    11-9-2002బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి
    మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14-7-13- కాంప్–హైదరాబాద్
 
 
 
 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -38 పెనమకూరు కాపురం -ట్యూషన్ ప్రహసనం

      నా దారి తీరు -38 
                             పెనమకూరు కాపురం -ట్యూషన్ ప్రహసనం 
              స్కూల్ లో హెడ్ మాస్టారి దగ్గర ట్యూషన్ చదివే వాళ్లకు ఎందుకో అంట నచలేదు ముఖ్యం గా పొరుగూరి విద్యార్ధులకు .వాల్లు నన్ను కలిసి రోజూ మా ఊరు రండి ట్యూషన్ చెప్పండి అని అడిగే వారు . మనకేం గిట్టు బాటు అవుతుంది అని కొంతకాలం తాత్సారం చేశాను ంఅరీ దేవరపల్లి పిల్లల ఒత్తిడి ఎక్కు వింది . చలపతి అనే కోమట్ల కుర్రాడు ,రెడ్ల పిల్లలు సాంబి రెడ్డి  ,ప్రసాద రెడ్డి మొదలైన వారు విశ్వనాధ వెంకటేశ్వర రావు అనే బ్రాహ్మల కుర్రాడు ,కళ్ళం వారి పాలెం అబ్బాయి ప్రభాకర రెడ్డి రోజూ బతిమి లాడే వారు . ముందుగా ఎక్కడ చెప్పాలి అనే ప్రశ్న వచ్చింది కనుకు పెనమకూరు లో ఒక కమ్మ వారింట్లో ఒక చిన్న పోర్షన్ చూశాను వంటకు ,పడకకు గదులు హాలు ఉంది పక్కనే ఇంటి ఓనర్లు ఉన్నారు .ఒక విధవావిడా ,ఆవిడ విధవ కూతురు ఈమెకొడుకు ఉంటారు ఆ ఇంట్లో అబ్బాయి స్కూల్ లో తొమ్మిది చదువుతున్నాడు చడువేమీ అబ్బెదికాడు .కనుక నేను వాళ్ళ ఇంట్లో ఉంటె వాడిని బాగా చదివిస్తానని వాళ్ళ నమ్మకం సరే నని ఒక రోజు కొద్ది సామానుతో పెనమ కోరు లో కాపురం పెట్టాను వంట చేసుకో కుండా రోజూ ఉయ్యూరు నుండి పాలేరుతో స్కూల్ సమయానికి ముందే నాకు కారియర్ పంపేవాళ్ళు ఽదితిని స్కూల్ కు వెళ్ళేవాడిని . సాయంత్రం మళ్ళీ పాలేరు కారీర్ తెచ్చేవాడు .కాఫీ ఇంటి మామ్మ గారిచ్చేవారని గుర్తు . అక్కడ ప్రైవేట్ ప్రారంభించాను .పెద్దగా ఎవరూ ఎక్కలేదు ఽప్పుదు దేవరపల్లి లో ట్యూషన్ చెబితే ఎలా ఉంటుంది అని పించి రెండు మూడు రోజులు సాయంత్రం పూట అక్కడికి వెళ్లి పరిస్తితులను గమనించాను .నెను వెళ్లి నప్పుడల్లా ,విశ్వనాధ వెంకటేశ్వర రావు ఇంట్లోనే భోజనం చెయ్యనిది వదిలే వారుకాదు ఆ దంపతులు ఆయన ఎలిమెంటరి మాస్టారు గా చేసి రిటైర్ అయ్యారు ఆవిడ ఉయ్యూరు లో ప్రఖ్య వారి ఆడపడుచు అని గుర్తు మంచి ఆప్యాయతా ఆదరం చూపే వారు నాకేమీ లోపం రానిచ్చే వారు కాదు . 
                విశ్వనాధ వారబ్బాయిలు స్కూల్ లో చదువుతున్నారు వారికీ ఉపయోగం అక్కడ ప్రైవేట్ పెడితే .ఒకతి రెండు రెడ్ల కుటుంబాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఏదీ ఎందుకో నచ్చలేదు ఒకటి రెండు రోజులు చూసి ఆ ప్రయత్నం విరమించాను కళ్ళం వారి పాలెం లోను చూశాను అదీ నచ్చలేదు . పాపం వాళ్ళు చాలా నిరాశ చెందారు . పెనమ కోరు కాపురానికి ఒక వారం ప్రభావతి పిల్లలతో సహా వచ్చింది . ఇక్కడ ఉండటం కష్టమని పించి వెళ్ళింది . నేనూ ఒక నీలో రెండు నెలలో పెనమకూరు లో కాపురం ఉంది మళ్ళీ ఉయ్యూరు కు వెళ్ళిపోయాను .య్యూరు నుంచే సైకిల్ మీద రోజు స్కూల్ కు వచ్చి వెళ్ళే వాడిని . నా లాగే డ్రాయింగ్ ,డ్రిల్ మేస్టార్లు సైకిల్ మీద వచ్చేవారు .వారి భార్యలు రిక్షాలో వచ్చేవారు . పాపం సాయంత్రం వాళ్ళు ఇంటికి రావాలంటే బస్ లేట్ గా వచ్చి చీకటి పాడేది ఱిక్షాలు దొరిక్క ఇబ్బంది పడేవారు మేము సైకిల్ల మీద కనుక త్వరగా అరగంటలో ఇంటికి చేరుకొనే వాళ్ళం .న్ రోజూ సైకిల్ తొక్కటం వాళ్ళ ఆ తర్వాతా నాకు ”పైల్స్ కంప్లైంట్ ”వచ్చింది వేడి చేసి . కుమారస్వామి డాక్టరు గారు ”పైలేక్స్ ”టాబ్లెట్స్ వాదించారు ,క్రీమ్ కూడా రాసుకోమన్నారు వీటితో పూర్తిగా తగ్గిపోయింది . సీజన్ మారినప్పుడల్లా నా జాగ్రత్త నేను పడుతూ ఆ మాత్రలు వేసుకొంటూ మళ్ళీ రాకుండా చేసుకొన్నాను . 
                                                      విశ్వనాధ వారి అబ్బాయిలు  
 
                      విశ్వనాధ వారి అపెద్దబ్బాయి వెంకటేశ్వర రావు నాకు ముఖ్య శిష్యుడైనాడు అతని తమ్ముళ్ళు కూడా అక్కడే చదివే వారు ఒకతను తర్వాత కరెంట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం పొందాడు .ఇంకొదు తిరుపతి లో ఒరిఎంతల్ కాలేజి లో చదివి యెమ్.యె.పాసై లెక్చరర్ అయ్యాడు పాపం వెంకటేశ్వర రావు టెన్త్ పాస్ అవగానే ఉద్యోగం రాక యేవో చిల్లర ఉద్యోగాలు చేసే వాడు వ్యాపారాలు చేశాడు ఉయ్యూరుసెంటర్ లో ”పెన్నులు అమ్మే షాప్ ”పెట్టాడు నాతొ దాన్ని ప్రారంభోత్సవం చేయించాడు కాని ఎక్కువ రోజులు వ్యాపారం సాగలేదు ”నా చేతి వైభవం ”అలాంటిదాన్న మాట అనుకొన్నాను షాప్ ఎత్తేశాడు . అప్పుడప్పుడు ఇంటికి వచ్చి కనపడే వాడు నేనంటే పరమ భక్తిగా ఉండేవాడు . న కాలం కలిసి రాలేదు అతనికి . ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చ్తెచ్చేవాడు సేన్తర్లోనో బెజవాదలోనో కనిపిస్తే కాఫీ హోటల్ కు తీసుకొని వెళ్లి టిఫిన్ పెట్టించి కాఫీ తాగించాకుండా వదిలే వాడు కాదు .దురద్రుస్త వంతుడు దేనిలోనూ రాణించలేక పోయాడు పెళ్లి అయి పిల్లలను కూడా తీసుకొచ్చి చూపించాడు తల్లీ తండ్రీ  చని పోయారు అతని సమాచారం తెలిసి దాదాపు ఇరవై ఏళ్ళయింది . నేనంటే ఇంట వెర్రి అభిమానం ఉన్న శిష్యుడు ఇతనొక్కడే అని పిస్తాడు . 
                            పెనమకూరు విద్యార్ధులు 
                  కనక వల్లి శిష్ట్లా వారి అగ్రహారం . వారినే అగ్రహారీకులు అంటారు ంఒతు బారి రైతులు మంచి పొలాలు వ్యవసాయం ఉన్న వారు డాబా ఇల్లున్దేవి సోమయాజులు గారు అందులో కాంగ్రెస్  రాజకీయాల్లో చొరవ ఉన్న వాడు అయన తర్వాత ఇక్కడి నుండి కాపురం ఉయ్యూరు కు మార్చాడు అప్పుడు వాళ్ళ అమ్మాయి నా దగ్గర ఉయ్యూరులో ట్యూషన్ చదివింది .విశాల అని జ్ఞాపకం .నెనప్పుదు రామా రావు అభిమానిని ఽఅ అమ్మాయి నేను మాట్లాడే దంతా ఇంట్లో తండ్రికి చెప్పేది ఉడుకు మోటు పిల్లగా ఉండేది ఆయన ట్యూషన్ ఫీజు తేలిగ్గా పంపే వాడు కాదు ”మనల్ని అడిగే మొనగాడేవాడు ‘/అనే తత్త్వం నేను రోజూ ఆ అమ్మాయితో కబురు చేస్తూనే ఉండే వాడిని . 
                      వెంపటి వారు కూడా కనక వల్లి లో ఉండే వారు వెంపటియాజులు గారు అనే వారి కుటుంబం స్కూల్ కు వెళ్ళే దారి లో రోడ్డు మీదనే ఉండేది వ్యవస్దాయ దారులు అన్నదమ్ములు అయిదుగురు దాకా ఉండేవారు ఆయన ఉయ్యూరులో ”నీలగిరి కాఫీ స్టోర్స్ ”ను మసీదు దగ్గర కోటలో నడిపే వారు మా కాఫీ పొడి వారి దగ్గరే కొనే వాళ్ళం .  పెళ్లిళ్లకు ,పేరంటాలకు వారి కాఫీ పాడే వాడే వాళ్ళం మహా కమ్మని వాసనతో ఉండేది అది తప్ప ఇంకో పొడి తో కాఫీ తాగలేక పోయే వాళ్ళం ఽఅయన రోజూ కనక వల్లి నుండి ఉయ్యూరు కు వచ్చి కాఫీ పొడి షాప్ నిర్వహించేవారు గింజలు వేయించి పొడి చేసే మేశీన్లున్నాయి ంఆకు పట్టి తాజా పొడి ఇచ్చేవారు ఽఅయన కూతుళ్ళు పెనమ కోరు స్కూల్ లో చదివినవారు . అయన పెద్ద తమ్ముడే మాతో పాటు పని చేస్తున్న వేర్మ్పతి లక్ష్మీ నరసింహ శర్మ గారు అనే తెలుగు పండిట్ ఽఅయన మేము వేమూరు శివరామ క్రిష్నయ్య గారి వద్ద ప్రైవేట్ చదువు తున్నప్పుడు మా మాస్టారి దగ్గర సంస్కృతం నేర్చుకొని తెలుగు పండిట్ కోర్సు చదివారు . ఇంకో తమ్ముడు సుబ్రహ్మణ్యం నాకు ఉయ్యూరు లో సహాధ్యాయి .ఇంకొ తమ్ముడు కుమారా స్వామి డాక్టర్ కోర్సు చదివి ఉయ్యూరు లో ప్రాక్టీస్ పెట్టారు ఆయనే మా ఫ్యామిలి డాక్టర్ . మా అమ్మ కు అయన అంటేనే అభిమానం ఇంకో డాక్టర్ దగ్గరకు తీసుకు వేల్తామన్నా వద్దనేది . పొతే ఆయన చేతిలోనే పోతాను అనేటంత నమ్మకం . ఇతని కుమారుడే వెంపటి కృష్ణ యాజీ ప్రస్తుతం మాకు ఆపద్బాన్ధవుడైన ఫామిలీ డాక్టర్ ్‌ఐదరా బాద్ లో శ్రీ రామ చంద్రా హాస్పిటల్ లో డాక్టర్ గా ఉన్నాడు ంఎము అక్కడికి వెళ్లి నప్పుడల్లా అతస్న్ని కలిసి ఆరోగ్యం చెక్ చేయిన్చుకొంటాం కుమారా స్వామి ఉయ్యూరు లో కొబ్బరి తోటలో మంచి డాబా కట్టుకొన్నాడు కాని మధ్య వయస్సులో అకస్మాత్తు గా మరణించాడు . కుమారస్వామి మా తమ్ముడు కు క్లాస్ మేట ఱొజు వాళ్ళందరూ కనక వల్లి నుండి ఉయ్యూరు వచ్చి స్కూల్ లో చదివే వారు ంఅధ్యాహన్ భోజనం తెచ్చుకొని మా ఇంట్లో తినే వారని జ్ఞాపకం . 
                     మారేపల్లి చలపతి అని నాకు ఎస్ ఎస్ ఎల్ సి వరకు సహాధ్యాయి కనక వల్లి నివాసి అతని కూతురు నేను పని చేసినప్పుడు పెనమ కోరు స్కూల్ లో పదవ తరగతి చదివింది .విశ్ను భొట్ల సోమయాజులు కూడా అ ఊరి వాడే స్తితి మంతుడు నాకు ఉయ్యూరు లో క్లాస్మేట్ ఽతని అన్నకొడుకు ,కూతురు ఇక్కడే చదివారు . అలాగేర్ ఇంకొన్ని ఫామిలీల పిల్లలు కూడా చదివారు . నేను చెప్పిన వారు తప్ప మిగిలిన పిల్లలేవ్వరూ చదువు లో ముందుకు వెల్ల లేక పోయారు .
                                   అమ్మ అనారోగ్యం –
                       అప్పటికే మా అమ్మ బి.పి. తో అయిదారేళ్ళ నుండి బాధ పడుతోంది . డాక్టర్ కుమారస్వామి అప్పటికి కొన్ని ఏళ్ళ క్రితమే ప్రాక్టీస్ పెట్టాడు . బ్రాహ్మల డాక్టరు కనుక ఊళ్ళోని బ్రాహ్మను లందరూ ఆయన దగ్గరకే వెళ్ళే వాళ్ళం . మా అమ్మను ఆయనకే చూపించాం ఽప్పతి నుండి ఆయనే ఆమెకు డాక్టర్ ..విశయాలను వివరం గా చెప్పేవాడు . మా అమ్మ అన్నా మా కుటుంబం అన్నా అభిమానం గా ఉండేవాడు . అమ్మను చాలా శ్రద్ధగా చూసే వాడు .  ఖరీదైన మందులు వాడి త్వరలోనే తగ్గించేవాడు . మా పిల్లలకు మా ఇద్దరికీ ఆయనే డాక్టర్ . ఆయన ప్రాక్టీస్ బాగా పుంజు కొంది . 
 
                                 బదిలీ ప్రయత్నాలు 
                          మళ్ళీ ఉయ్యూరు మీద ధ్యాస  పెరిగింది . బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాను . నాకు వెన్ను దన్నుగా మా వర్డు మెంబర్ కోలా చాల చలపతి మా మేన మామ గారి అబ్బాయి పద్మనాభం ఉన్నారు పద్మనాభం అప్పటికే యెమ్.యెల్.యెఽయిన వద్దే శోభనాద్రీశ్వర రావు కు క్లాస్ మెట్  . మాకు హైస్కూల్ లో జూనియర్ . అతని దగరకు వెళ్లి నన్ను ఉయ్యూరుకు ట్రాన్స్ ఫర్ చేయించమని పద్మనాభం చాల పాటి నాలుగైదు సార్లు చెప్పారు . చేద్దాం చేద్దాం అని తాత్సారం చేశాడు . పని జరగలేదు . యె.వి.సుబ్బా రావు అనే అద్రిల్ మేష్టారు ట్రాన్స్ ఫర్ అయితే వెంటనే మళ్ళీ ఉయ్యూరు కు తీసుకొచ్చాడు శోభనాద్రి   .ఇది చూసిన మా చాల  పతికి ”ఎక్కడో కాళింది . ” మర్నాడే నన్ను శోభనాద్రి దగ్గరకు తీసుకొని వెళ్లి  ”ఏం పెద్ద మనిషి వయ్యా1 మా వాడి ట్రాన్స్ ఫర్    గురించి   నీ దగ్గరస్కు ఎన్నో సార్లు  తిరిగాను . నిన్న కాక మొన్న ట్రాన్స్ ఫర్ అయిన డ్రిల్ మేస్తార్ని ”మీ కమ్మారు” అని వెంటనే ఉయ్యూరు తీసుకోచ్చావ్.  ”మా బాప నాళ్ళు” అంటే అంట అలుసా .ఇదె లాస్ట్ వార్నింగ్.  వారం లోపు మా దుర్గా ప్రసాద్ ను ఉయ్యూరు బదిలీ చేయించక పోయావో   పరిస్తితులు చాలా తీవ్రం గా ఉంటాయి జాగ్రత్త మంచి తనానికి కూడా హద్దుంటుం ది .  నీ  దగ్గరికి రాము మాకు ఎలా చేయించుకోవాలో  తెలుసు నీ వల్ల   అయితే నీకు గౌరవం అని వచ్చాం ఆ మర్యాద నిలుపుకో ”అని దులిపేశాడు .కంగు తిన్న శోభనాద్రి ” ”చలపతి రావు !గారూ  వారం కాదు నాలుగు రోజుల్లో ప్రసాద్ గారిని ఉయ్యూరు తీసుకొస్తాను ఇదే హామీ ””అన్నాడు సరే నని ఇంటికి తిరిగి వచ్చాం .
                    సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ — 13-7-13- కాంప్–హైదరాబాద్

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కధక చక్ర వర్తి ఒ. హెన్ర్ర్రి -2 కధా కధన సామర్ధ్యం

   కధక చక్ర వర్తి ఒ. హెన్ర్ర్రి  -2
                                   కధా  కధన సామర్ధ్యం 
          అమెరికా బహుముఖ రచయితా అల్లెన్ పో ను ”రేర్ రైటర్ ”అంటారు . హేన్ర్రి చని పోయి వందేళ్ళు దాటినా ఇంకా పో ను, హెన్రీ ని జనం చదువుతున్నారు . ”millions of readers still fascinate defying scholars and critics alike to explain or evaluate unequivocably the source and quality of their literary achievement as well as its enduring popular appeal .”అదీ ఆ యిద్దరి రచనా సామర్ధ్యం .ఇద్దరినీ ఆరాదిస్తూనే ఉన్నారు . హెన్రి ని అమెరికా చిన్న కదా మార్గ దర్శి గా ,షార్ట్ స్టోరీ విలువను నిర్ణయించే ”టచ్ స్టోన్” ఒరిపిడి రాయిగా భావిస్తారు . కొందరు అతన్ని హతారన్ తో పోలిస్తే మరికొందరు రుడ్యార్డ్ కిప్లింగ్ ,కంకార్డ్ ,జేమ్స్,మపాసా ,వార్టన్ ల తో పోల్చటం ఉంది . అయితే వీళ్ళందరినీ మించి పోయాడు వాళ్ళను ”ఓవర్ షాడో ”చేశాడు .” ఒ. హెన్రి స్మారక అవార్డ్ ప్రైజ్ స్టోరీస్”వస్తున్నాయి అంటే ఎంత ప్రాచుర్యం పొందాడో అర్ధమవుతోంది . చిన్న కధకు గౌరవాన్నే కాక ,దానికి కళా విలువను తెచ్చిన ఘనత హెన్రీ దే . కధల్లో ఎక్కడా నీతిని బోధించలేదు .  . కధల్లో జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించాడు అందుకే ఎవరికి అంద  రానంత ఎత్తులో ఉన్నాడు . ”  abounding verve ,intelligence ,armed with irony ,he dominates his characters rather than suffering them ” అని తీర్పు చెప్పారు విశ్లేషకులు . 
                   అమెరికా లోని మాన్ హట్టన్ వేష భాషలే కాకుండా ,అమెరికా లోని అన్ని ప్రాంతాల వారి కధలను తన కధల్లో చెప్పాడు . అందులో టెక్సాస్ లో ఉండే చట్టవ్యతిరేకులను ,స్వార్ధపరులను ,న్యాయానికి ,చట్టానికి దొరక్కుండా పారి పోయే వారిని గురించి రాశాడు . అతని కధలు నమ్మ శక్యం కానివి అని తెలిసినా ,చదువుతూ ఉంటె ,ఆ రచనా ప్రవాహం లో అలా కొట్టుకొని పోతాం . హెన్రి రాసిన ”ransom of red chief ”కద  టెక్సాస్ కు చెందినదే .దీన్ని మన పదవ తరగతి ఇంగ్లీష్ పుస్తకం లో చేర్చారు చాలా ఏళ్ళు దీన్ని లెసన్  గా చెప్పాను . అలాగే ”the gift of Maggy ”ని తొమ్మిదవ తరగతి లెసన్ గా వేశారు . దాన్నీ బోధించాము . హెన్రి కధలలో ”irony and pathos ”ను అద్భుతం గా పండించాడు .అతను  టెక్సాస్ లో ఉండగానే కదా రచనకు మంచి బీజం పడింది . అది మొలిచి మహా వృక్షమై కాయలు కాసి మధుర ఫలాలను అంద జేసింది . హెన్రి కధల్లొ ”చేకోవియన్ సెన్స్ ”ఉందంటారు . 
                     హెన్రి దగ్గర ఎప్పుడూ ”webster’s dictionary ”వెంట ఉండేది . ఆయన చివర రాసిన కద”let me feel your pulse ”. ఇది ”delightfully ironic little allegory based on his own painful search for relief ”. చివరిరోజుల్లో న్యుయార్క్  వదిలి నార్త్ కెరొలినాకు ఆరోగ్యం కోసం  చేరాడు .  అతను  రాసిన ” alias Jimmy valentine ”  నాటకం బాక్సాఫీస్ బద్దలు ”కొట్టి స్మాషింగ్  హిట్ ”  అయింది . అమెరికా ,,ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ స్పెయిన్ దేశాలలో ఒకే ఒక్క వారం లో నిర్వాహకులకు లక్ష డాలర్ల ఆదాయాన్ని చేకూర్చింది .  క్రేజ్ వచ్చింది తెచ్చింది హెన్రి రాసిన నాటకం .
               టెక్సాస్ లోని ఆస్టిన్ ,హూస్టన్ లలో తిరిగి ,అనేక ఉద్యోగాలు చేసి ,కదా ప్రపంచం లో ధ్రువ తారగా నిలిచాడు హెన్రి .  అతను  తిరిగి చూసిన ప్రదేశాలు ,మనుషులు వారి ప్రవృత్తులను కధల్లో పోదిగాడు  మట్టి మనుషులేవారన్దరూ . .  దివి నుండి భువికి దిగి వచ్చిన పాత్రలు కావు అవి . వాటిని మలచిన తీరు మహా ముచ్చటగా ఉంటుంది . తన కధల పై హెన్రి చివరి రోజుల్లో ”no-they do not satisfy me .it depresses me to have people point me out or introduce me as ”celebrated author ”అంటూ ఇంత  రాసినా ,ఇంత ప్రసిద్ధి చెందినా తన రచనల పై అసంతృప్తి వ్యక్త పరచిన పరిణత కధకుడు హెన్రి . ఆత ను” ఒక కదా ”పోర్టర్ ,రిపోర్టర్ ,ఓహో హో హెన్రి అని పించుకొన్న వాడు .   
         13-9-2002  శుక్రవారం అమెరికా డైరీ నుండి 
                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 13-7-13- కాంప్–హైదరాబాద్ 
      
       
             
 
                  
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కధక చక్ర వర్తి ఓ హెన్రి

 

                                                               కధక చక్ర వర్తి ఓ హెన్రి 
 అద్భుతమైన కధలను రాసి రాసిలోనూ ,వాసిలోను అద్వితీ యడ ని పించుకోన్నవాడు ,కదను అంతం చేయటం లో ప్రత్యెక శైలిని ప్రదర్శించిన వాడు అమెరికా కు చెందిన ఓ హెన్ర్ర్ర్రిఅ సలు పేరు”విలియం  సిడ్నీ పోర్టర్ ”.. నార్త్ కెరొలినా లో 1862  లో పుట్టాడు . చిన్నప్పుడే తల్లి చని పోవటం తో తండ్రీ తమ్ముడితో మేనత్త దగ్గ్గ్సరకు చేరాడు . అయిదేళ్ళ వయసు నుండే కధలు రాయటం ప్రారంభించాడు . ”లినా ”అనే ప్రైవేట్ టీచర్ ఇతనికి కధలు చెప్పటం అలవాటు చేసింది . . .ద్రగ్గిస్త్  గా ఫార్మసిస్ట్ గా పని చేశాడు .  1882-84 మధ్య బంధువుల ఇళ్ళల్లో ,స్నేహితుల దగ్గరా గడిపాడు . కార్టూనిస్ట్ గా ,హాస్య రచయిత గా పని చేశాడు . 1884-86మధ్య కాలం లో టెక్సాస్ రాష్ట్రం లోని ఆస్టిన్ లో చిన్న ఉద్యోగం చేశాడు .కధలు రాస్తూనే ఉన్నాడు . 
 
William Sydney Porter by doubleday.jpg
                                             ఆస్టిన్ లో యువకుడిగా పోర్టర్                                                                                   ఒ. హేన్ర్రి చిత్రం (portrait)
 
                  1887-89  కాలం లో ”Athol Estes ”అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు . టెక్సాస్ లోని లాండ్ ఆఫీస్ లో ఉద్యోగించాడు . కొడుకు పుట్టి పోయాడు . కూతురు మార్గరెట్ పుట్టింది . భార్య అనారోగ్యం తో బాధ పడింది . ఉద్యోగం ఊడింది . ఆస్టిన్ లోని ఫస్ట్ నేషనల్ బాంక్ లో ఉద్యోగం వస్తే చేశాడు . బాంక్ లో టే ల్లార్ గా పని చేస్తూ కధలు రాశాడు ,ప్రచురించాడు . ”the rolling stone ” అనే వార పత్రిక నిర్వహించాడు . బాంక్ ఖాతాలలో తేడాలు రావటం వల్ల  ఉద్యోగం హుష్ కాకి అయింది . దీనికి కారణం బాంక్ ఉద్యోగం చేస్తూ కధలు రాస్తూ పని పై శ్రద్ధ చూపక పోవటమే . మనిషి చాలా నిజాయితీ పరుడు ,మంచి వాడు ..కొర్తు కేసుల్లో తిరగాల్సి వచ్చేది దీనికోసం . 
                      తర్వాత హూస్టన్ వచ్చాడు . ”హూస్టన్ పోస్ట్ ”అనే పత్రికకు ఎడిటర్ అయ్యాడు .1896లో న్యు ఆర్లియాన్స్ కు చేరాడు . అక్కడి నుండి ”హోండూరస్ ”కు వెళ్ళాడు . బాంకి  కేసు ను ముందు మూసేశారు .తరువాత మళ్ళీ తిరుగ దొడారు .  అపరాధి అని తేల్చారు ఇతను అప్పీల్ కు వెడితే తిరస్కరించారు .  1898-1900  మధ్య ఒహాయో జైలు లో ప్రిజనర్ నంబర్ 30664 గా ఉన్నాడు . జైలు లోనే పన్నెండు కధలు రాశాడు . పిట్స్ బర్గ్ చేరుకొన్నాడు . 1902 లో తన కధలను ”ఓ హెన్రి ”పేరుతొ రాశాడు సిడ్నీ పోర్టర్.  అప్పటి  నుంచి ఆ పేరే స్తిరపడి పోయింది . 1903 లో న్యు యార్క్ లోని  ”sunday world weekly ”కి 100కధలకు పైగా ఒ్‌ఎన్రి పేరుతొ రాశాడు . గొప్ప పేరు వచ్చింది . రా సిన వన్నీ మాణి క్యాలే అని పించాయి . 
              1904 లో ”కాబెజేస్ అండ్ కింగ్స్ ”అనే కదా సంపుటిని వెలువరించాడు . 1906 లో ”the four million ”అనే ఇరవై అయిదు కధల సంపుటి ని ప్రచురించాడు . వీటితో ప్రపంచ ప్రఖ్యాత కదా రచయితా అయిపోయాడు .కధక చక్ర వర్తి అని పించుకొన్నాడు . 1907 లో తన బాల్య స్నేహితురాలు ”సారా లిండ్ సే కోల్మన్ ”అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు . భార్య ,కూతురు తానూ   జీవనం  సాగించారు . అనారోగ్యం తో బాధ పడుతున్నా ఏడు కదా సంకలనాలు ప్రచురించాడు . 48 సంవత్సరాలే బ్రతికి 1910  జూన్ ఐదో తేదీన ఈ మహా కధకుడు తీవ్ర అనారోగ్యం తో మహా ప్రస్తానం చెందాడు . మొత్తం మీద 300 కధలు రాశాడు .ప్రపంచ ప్రసిద్ధ మహా కధకుల సరసన స్తానం సంపాదించు కొన్న డు  ఒ. హెన్ర్ర్ర్రి చని పోయిన తర్వాత కూడా హెన్రి కధలు ,ఇతర రచనలు  అయిదు సంపుటాలు గా వేలు వడ్డాయి . ”o.Henri was one of the world’s most popular writers of short fiction ” కనుకనే ఒ. హెన్రి -”ఓహో హెన్రి ”అని పించుకొన్నాడు . 
                     సశేషం — 
                     13-9-2002 శుక్రవారం నాటి అమెరికా డైరీ నుండి 
                మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13-7-13-ఉయ్యూరు 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు – 37 పెనమకూరు స్కూలు అభి వృద్ధి లో పాత్ర

    నా దారి తీరు –  37
                             పెనమకూరు స్కూలు అభి వృద్ధి లో పాత్ర 
           పెనమ కూ రు హైస్కూల్ లో మంచి నీటి సరఫరా సరిగ్గా లేదు విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు సరైన లెట్రిన్  వసతి కూడా లేదు . దీని మీద ఒక సారి హెడ్ మాస్టారు ఏర్పాటు చేసిన స్టాఫ్ మీటింగ్ లో విషయం చర్చించాము .యెమి చెయ్యాలి అని ఆలోచించాము.  కొందరుఊ ళ్లోకి వెళ్లి చందాలు వసూలు చేద్దామన్నారు . నేను అప్పుడు ఊ ళ్లోకి వెడితే వాళ్ళు ”మీ స్కూలు వాళ్ళు యెంత ఇచ్చారు ?”అని అడుగుతారు అ ప్పుదు మనం తల దిన్చుకోవాల్సి వస్తుంది కనుక బోర్ వేసి ,షెడ్ కట్టించటా నికి యెంత అవుతుందో ముందుగా ఒక అంచనా వేయిద్దాం. మనం  స్టాఫ్ మేమ్బర్లం ఎవరికి తోచింది వారు చందాలు వేసుకొందాం .ఇన్దులొ బలవంతం ఉండరాదు . అందరు యదా శక్తి గా సహకరిస్తారని అనుకొంటాను .. ఆ డబ్బు ఏంతో తెలిసిన తర్వాత ఊరి లోని పెద్దలను కలుద్దాం అవసరమైతే మన స్కూల్ కు ఏయే ఊళ్ళ నుండి విద్యార్ధులు వస్తారో ఆ ఊళ్లకు కూడా వెళ్లి అడుగుదాం .దాన్ని సేకరించి ఉంచుదాం .మ నకు రక్షిత మంచి నీటి సరఫరా అవసరం .టాంకు  కట్టి నీళ్ళు నిలవచేసి పంపుల ద్వారా నీటిని విద్యార్ధులకు అందిద్దాం . ఆ  నీటినే వ్యవసాయానికీ వాడుకొందాం .చెరుకు పండించవచ్చు మంచి ఆదాయం వస్తుంది .ఫైవ్ హెచ్.పి. మొటారు బిగిద్దాం .ఇవి నా సూచనలు మాత్రమె .దీని పై అందరం కలిసి నిర్ణయిద్దాం ”అన్నాను .  ఒ.కె. అన్నారు  హెడ్ మాస్టారు తో సహా అందరం ఎవరికి తోచిన చందా వారు వేశారు .  . యెంత వచ్చిందో జ్ఞాపకం లేదు . జీతాలలో ఆ డబ్బు వసూలు చేయమని హెడ్ గారికి చెప్పాం . అలానే చేశారు ..                      
                    తరువాత ఊరిలో ఏయే పెద్దలను కలవాలో హెడ్ మాస్టారు ఆలోచించి లిస్టు తయారు చేయమని చెప్పాం . అయనా ,స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారు కలిసి స్తోమత గల వారి పేర్లను రాశారు . రోజూ స్కూల్ అవగానే కొంతమంది టీచర్లు హెడ్ మాస్తారితో కలిసి ఊరి పెద్దల ఇళ్ళకు వెళ్లి విషయం తెలిపాం .ఇన్త మంచి పని జరుగుతున్నందుకు అందరు సంతోషించారు తోచింది ఇచ్చి ప్రోత్సహించారు .తరువాత   పొరుగూరికి కూడా సైకిళ్ళ  మీద వెళ్లి అడిగాం .యెవ్వరూ ఎదురు చెప్పలేదు అందరూ ఉత్సాహం గా చందాలు ఇచ్చి సహకరించారు . విద్యార్ధులు కూడా యదా శక్తి డబ్బులిచ్చారు . మాతో కలిసి తిరిగారు . ఈ లోపే వెంకట నారాయణ రావు గారు ,హెడ్ మాస్టారు కలిసి కె.సి.పి.వారి ని కలిసి విషయం వివరించారు .వాళ్ళు  కూడా ముందుకు వచ్చారు .వాల్ల కున్న యంత్ర్తాలతో బోరు వేసి మోటారు బిగించి పైపులు ,కులాయిలు బిగించి షెడ్ కట్టి ఇస్తామన్న్నారు అందరికి మంచి ఊపు వచ్చింది . కెసీపి వాళ్ళు మేమిచ్చిన డబ్బు కు ఎన్నో రెట్లు డబ్బు వేసి స్వచ్చందం గా స్కూల్ లో రక్షిత మంచి నీటి సరఫరా ను ఏర్పాటు చేసి విద్యార్ధులకు మే లు  చేశారు . ఆడ  పిల్లలకు మరుగు దొడ్డి సదుపాయమూ ఏర్పాటైంది . ఇదంతా స్టాఫ్ సహకారం గ్రామస్తుల ,పొరుగూరి వాళ్ళ వదాన్యత వల్లనే సాధ్యమయింది .ఒక అయిడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కాని ఇక్కడ అందరికి ఉపయోగ పడే పని జరిగింది . 
                                    స్కూలు వార్షికోత్సవం 
                 హెడ్ గారు చాలా రిసేర్వేడ్ గా ఉంటారు .మ నసు విప్పి మాట్లాడే స్వభావం లేదు . వార్షి కొత్సవస్సం భారీగా జరపాలని అనుకొన్నారు .దానికి కూడా సంప్రదించలేదు  మళ్ళీ  స్టాఫ్ మీటింగ్ లో ఇవన్నీ  చర్చించాం .స్కూల్  గోడలు బోసిగా ఉన్నాయని ఎవరైనా వచ్చి చూస్తె స్కూల్ అప్పియరెన్స్ బాగా లేదని తెల్ల సున్నం వేయించి దాని పై  డ్రాయింగ్ మాస్టారు భాద్రాచారి గారితో కొన్ని ఆకర్షణీయ మైన బొమ్మలు వేయిస్తే బాగుంటుంది అని సలహా చెప్పాను సరే నన్నారు ఆయనకు క్కొంత డబ్బు కేటాయించి పని మొదలు పెట్టించారు . అయనా తన కళా ప్రావీణ్యాన్ని చూపించే అవకాశం వచ్చిందని రెచ్చి పోయి చక్కని చిత్రాలు వేసి అట్రాక్షన్ తెచ్చారు స్కూల్ కి .   
                               వార్షికోత్సవానికి ఏమేమి నాటికలు వేయాలో అంతా  హెడ్గారి హెడ్ మాత్రమె  నిర్ణయించటం ,తానె ప్రాక్టీస్ ఇవ్వటం చేశారు ఽఅయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికి ఉండేది కాదు .నెను ఒక నాటిక ను విద్యార్ధులతో నా సైన్సు రూం లో ఆయనకు తెలియ కుండా ప్రాక్టీస్ చేయించాను .యెదైనా అయన ఒప్పుకుంటేనే స్టేజి మీద ప్రదర్శన ఉంటుంది లేక పొతే లేదు . వార్షికోత్సవం దగ్గర పడుతుండగా పిల్లల ద్వారా నా నాటకం బాగుందని పూర్తిగా నవ్వు పుట్టిన్చేదని ఆయనకు తెలిసింది ఒక రోజు ఆయనే వచ్చి చూశారు ముసి ముసి నవ్వులతో బాగుందని మెచ్చారు .బహుశా  ఆ నాటిక బి.వి రమణా రావు రాసిన ”భర్త మార్కండేయ ”అని జ్ఞాపకం . వార్షి కొత్సవం  రోజున నాగమణి గారు మొదలైన్ వారు వచ్చి లంబాడి డాన్సు ,దేశ భక్తీ గీతాలు చేయించారు ప్రసాద రావు అనే కుర్రాడితో శ్రీ కృష్ణ రాయ బారం పద్యాలు పాదించాను. సాయన్త్రమ్ ఆరింటికి మొదలైన కార్యక్రమం రాత్రి పదిన్నరకు ముగిసింది అందరూ బాగా చేశారు . హెడ్ మాస్టారు మేము ఇంటికి ఉయ్యూరు వెల్ల బోతుంటే అందరికి తన ఇంటి వద్ద భోజనం ఏర్పాటు చేసి నట్లు చెప్పారు సరే నని అక్కడే భోజనం చేశాం ఽఅయన భార్య గారు దగ్గర ఉండి  మాకు అందరికి వడ్డించారు మొత్తం మీద వార్షికోత్సవం గ్రాండ్ సక్సెస్ . అందరికి తృప్తిని సంతోషాన్ని ఇచ్చింది .  మా కృషికి హెడ్ గారు ఏంతో  సంతోషించారు . అప్పుడు ఆయన ముఖం మీద పెద్ద నవ్వును చూశాం . స్టేజి మీద కార్య క్రమం నిర్వహణ అంటా నాకే అప్పగించారు . నా నిర్వహణ బాగుందన్నారు . 
                                        ప్యూన్ బదిలీ -టీపార్టీ- వీడ్కోలు 
               అర్జును డు అనే ప్యూన్ ఇప్పటి భాషలో అటెండర్ ఉండేవాడు ఆతను  పంచ కట్టి తెల్ల చొక్కా వేసి బొట్టు పెట్టుకొని వచ్చేవాడు చాలా నిదానస్తుడు మంచి పలుకు బడి ఉన్న వాడు నాల్గవ తరగతి ఉద్యోగస్తులకు ఆ మండలం లో ప్రెసిడెంట్ కూడా . చాలా శ్రద్ధగా విధి నిర్వహణ చేసే వాడు .  తలలో నాలుక లాగా ఉండే వాడు .కాని హెడ్ గారికేందుకో అతని మీద చిన్న చూపు .వంగి వంగి దండాలు పెట్టె రకం కాదు . డ్యూటీ మైండెడ్ . కమ్యూనిస్ట్  భావాలున్న హెడ్ మాస్టారు ఇత  సంకుచితం గా ఆలోచిస్తాడని నేను ఊహించలేదు .అతను మాతో అందరితో చాలా బాగా ఉండేవాడు అతని పధ్ధతి ఆదర్శ ప్రాయం గా ఉండేది . అతనికి వల్లూరు ట్రాన్స్ ఫర్ అయింది . హెడ్ మాస్టారు అతనికి వీడ్కోలు పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు లేదు మళ్ళీ నేనూ, జగన్మోహన రావు  అనే డ్రిల్ మాస్టారు వెళ్లి హెడ్ తో మాట్లాడాం .నెను ఆయన తో ”అర్జునుడు మనలో ఒక్కడు ప్యూన్ అయి నంత మాత్రం చేత అతనికి వీడ్కోలు సభ ఏర్పాటు చేయకుండా ,టీ  పార్టీ ఇవ్వకుండా పంపటం మంచిది కాదు స్టాఫ్ అంటా దీ ని పై చాలా పట్టుదల గా ఉన్నారు అతనికి వీడ్కోలు సభ పెట్టి సత్కరించి పంపించాల్సిందే ”అని ఖచ్చితం గా చెప్పాను . చాలా సేపు వాద న తర్వాత ఆయన ఒప్పుకొన్నారు ప్యూన్ అర్జునుడికి వీడ్కోలు సన్మానం చేయాలని నిర్ణయించారు . ఆ సభలో నేను అర్జునుడి  మంచితనాని డ్యూటీ చేసే విధానాన్ని ,అందరికి ఇష్టమైన వాడుగా ప్రవర్తించిన తీరు ను గురించి మాట్లాడాను . అతనూ ఏంతో  కృతజ్ఞత తెలియ జేశాడు ఇలా సన్మానం పొందుతానని తానూ ఊహించలేదని ఇదంతా దుర్గా ప్రసాద్ గారి చొరవతో జరిగిందే నని సంతోషం గా చెప్పాడు ప్యూను కూడా స్టాఫ్ లో భాగమే నని మిగతా స్టాఫ్ కూడా చెప్పారు హెడ్ గారు యేవో నాలుగు పొడి మాటలు మాట్లాడిన గుర్తు . 
                           అప్పటి నుంచి అర్జును డు ఎక్కడ కనీ పించినా సైకిల్ దిగి నమస్కరించి ఏంతో ఆప్యాయం గా మాట్లాడి వెళ్ళే వాడు తన వీడ్కోలు సభను గురించి జ్ఞాపకం చేసుకొనే వాడు దాన్ని జీవితం  లో మరిచి పోలేనని అనే వాడు . మా శ్రీ సువర్చలన్జనేయ స్వామి వారల  స్వామి ప్రతిష్టకు కూడా వచ్చాడుఽఆ ర్జునుని ఎపిసోడ్ అందరికి ఒక  హెచ్చరికే అయింది . ఆ తర్వాత అతను  త ను కృష్ణా జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల ప్రెసిడెంట్ అయ్యాడు అవగానే మా ఇంటికి వచ్చి సంతోషం గా ఆ వార్త చెప్పాడు అభినందించాను మనస్పూర్తిగా . మానికొండలో రాఘవరావు ,పెనమకూరు  లో అర్జను డు నా మనస్సు లో ఎప్పుడూ మెదుల్తూనే ఉంటారు . అర్జుంది చిరు నవ్వు ఎప్పుడూ గుర్తు ఉంటుంది.  అ తను అయిదారేళ్ళ కిందట చని పోయాడని తెలిసి విచారించాను . 
                             సశేషం 
                             మీ–గబ్బిటదుర్గా ప్రసాద్ — 12-7-13 –కాంప్–హైదరాబాద్ 
 
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఫిట్జెరాల్డ్ -2 రచనా విశేషాలు

     ఫిట్జెరాల్డ్ -2
                                          రచనా విశేషాలు 
     1920నాటి అమెరికాను ”రోరింగ్ ట్వం టేస్   ” అంటారు అప్పుడు   అమెరికా ”ఇకారస్ ”లా ఉందని చెబుతారు . అప్పుడు అమెరికా లో ”ప్రొహిబిషన్ ”అమలు లో ఉంది . అకాలాన్ని ”ది గ్రేట్ క్రాష్ ”అంటారు . రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం అది . ఆ ఆర్ధిక వినాశనం కాలం లో జీవించిన వాడు  ఫిట్జరాల్ద్ .  ఆ  పరిస్తితులను తన రచనల్లో చూపించాడు . అతని పరిశీలనం నిశితం గా ఉండి ,దాంతో చాలా సంక్షిప్తం గా ఆ నాడు అమెరికా ఎదుర్కొన్న పరిస్తితులను రచనల్లో వివరించాడు . తన దేశం లో మారుతున్న పరిస్తితులకు అద్దం  పట్టే లా రోజు వారి వార్తా కధనాలు లాగా  రాశాడు . 
                      ఫిట్జెరాల్డ్ కు కధలు ,నవలలు అంటే మంచి వినోదం గ ఉండేవి . ఆ నాటి యువతలో  దుర్భర పరిస్తితులను చూసి రక్తం ఉడికి పోయేది . ఇరవై నాటి పట్టించు కోని పరిస్తితుల  గురించి చర్చించాడు . మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అనుభవించిన లోటు ఆర్ధిక పరిస్తితులను ,మద్య నిషేధం ఇంకా అమలు పరచటం పై రాశాడు . పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ విజయ వంతం గా అమలు కాక పోవటం కూడా ఒక విషమ పరిస్తితిని తెచ్చింది . ఈ నిషేధం 1919-1929వరకు కోన సాగించారు అమెరికా లో .  1929 october 23 న అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలయింది . దీనినే ”గ్రేట్ డిప్రెషన్ ”అంటారు .దీనికె ఫిట్జెరాల్డ్ ”జాజ్ ఏజ్ ”అని పేరు పెట్టాడు . 
 
 
The Great Gatsby (1925)Tender Is the Night (1934)The Beautiful and Damned (1922)The Great Gatsby
 
             స్కాట్ జీవితం ఒక గొప్ప కదాంశం  అయింది ఆ కాలానికి అతని బతుకే ఆ నాటి పరిస్తితుల కద అందుకే అది ”లిజెండ్ ”అయింది . అందుకే అతని కద నేటివ్ కద ,అతను దానికి బాధితుడు అయాడు . అతని  వృత్తులు కూడా దీనికి అద్దంపట్టాయి . అతని కధలకు ఇవే ముఖ్య కదా వస్తువయింది . ఆ నాటి అమెరికా యువకుడిని ” . a king of king of our American youth ”అన్నారు . అందువల్లనే ఆ నాటి యువత సాధికార నవలా రచయితా స్కాట్ ఫిట్జెరాల్డ్ అని అందరు అంటారు .  ఆటను బాధా తప్త యువతకు ప్రతినిధి ,వారిమనో భావాలను వివరించే  గొంతు కూడాఅతనే అయాడు .  . 
         ”the great gatsby ”నవలను ”a miniature of involvement and understanding reaches an extraordinary balance .”అని భావిస్తారు అది అది వాస్తవిక నవల అన్నారు . ”our finest most exemplary American parable of romantic trajic failure is Fitjarald ”అంటారు . ఆ నాటి కాలం  ”పిచ్చ్చ పార్టీలతో తాగిన హాంగోవర్ ”ఉండటం ఒక లక్షణం . ఈ విధం గా 1920-30మధ్య కాలం లో ఉన్న అమెరికా ను తన కాళ్ళ తో ప్రత్యక్షం గా చూసి ,అందులో తానూ ఒకడిగా జీవించి ,ఆ జీవితాన్ని తన కలం తో ప్రత్యక్షం గా ప్రత్యక్షరం గా రాసిన వాడు ఫిత్జరల్ద్ . అంటే ఒక దశాబ్దపు అమెరికా జన జీవితాన్ని కళ్ళకు కట్టి నట్లు చూపాడు . అంధకారం నుండి ,కాంతి వైపు కు ప్రయాణం చేయాలనే తపనా బోదా ఆ రచనల్లో ఉన్నాయి . 
              11-9-2002 బుధవారం నాటినా అమెరికా  డైరీ నుండి 
              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-7-13 –కాంప్–హైదరాబాద్ 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఫిట్జెరాల్డ్

  ఫిట్జెరాల్డ్ 
                 అసలు పేరు ఫ్రాన్సిస్ స్కోట్ కీ ఫిట్జెరాల్డ్ . అమెరికా లోని మిన్నెసోటా లో 1896 september 24 న జన్మించాడు . ఆయన్ను కాలం కాని కాలం లో పుట్టిన రచయిత అంటారు . కారణం ఆయన 18 వ శతాబ్దపు అంతరంగం ఉంది ఇరవయ్యవ శతాబ్దిలో జీవించాడు . తండ్రి ఇంగ్లాండ్ కు తల్లి ఐరిష్ దేశానికి చెందినా వారు .చాలా బీద కుటుంబం . అతను  ఉన్న టౌన్ ధనికులకు ఆవాసం .ధనిక కుటుంబాల  మధ్య ఈ నిరు పేద జీవించాల్సిన పరిస్తితి . అలాగే ”అ పూర్  బాయ్ ఇన్ ఏ రిచ్ బాయ్స్ స్కూల్ ”లా చదువు సాగింది . తల్లి చాలా పొగరు బోతు ,అందగత్తె . ఒక పోరుగింతావిడ భర్త చని పోయి ఏడుస్తుంటే ఆమె దగ్గరకు వెళ్లి సాను భూతి ప్రకటించటానికి బదులు ”నువ్వు ఏడుస్తుంటే నీ ముఖం ఎలా ఉంటుందో చూడ తాని కి వచ్చాను ”అన్న స్వభావం ఆమెది . 
                స్కాట్ సోదరిలు చిన్నప్పుడే చని పోయారు . తల్లి కొడుకును తనలాగే తయారు చెయ్యాలని సంకల్పించింది .ఇది నచ్చక స్కాట్ తల్లికి దూరమయ్యాడు . ఫిట్జెరాల్డ్ ఆ తర్వాతా ఎప్పుడో తన కూతురుకు ఉత్తరం రాస్తూ ”నాకు జీవితం లో నేను తప్ప ఎవరూ లేని ఒంటరి వాడిని ,అదే నాకు జీవితం లో పెను శాపం అయింది ”అని బాధ పడ్డాడు . తండ్రి అనేక వ్యాపారాలు చేసి దివాలా తీశాడు . కుటుంబం ”బఫెలో ”కి మార్చారు . స్కాట్ పుట్టిన రోజు ఘనం గా నిర్వహించాలని అందర్నీ పిలిస్తే విపరీతం గా వర్స్ధం కురిసి గెస్ట్ లెవరో రాక పోవటం తో తీవ్ర నిరాశ చెందాడు . దీనికి తగ్గట్టు తల్లి పుట్టిన రోజు న కోసే కేక్ అంతటినీ అతనినే తినెసెయ్య మందిట   ఆపసి హృదయం యెంత క్షోభించిందో చెప్పలేం . 
 
 
 
               స్కాట్ కు   కధలు చెప్పటం అలవాటు . స్కూల్ లో చదువు లో ముందుకు వెళ్ళలేక పోయాడు .ప్రిన్స్ టన్  యోని వర్సిటి లో చేరినా అకాడెమిక్ గా ఎదగ లేక పోయాడు . ”క్లోసేడ్ అండ్ కన్సేర్వేటివ్ ”  ఇక్కడ కూడా ”పూర్ బాయ్ ఇన్ రిచ్ ఎన్విరాన్ మెంట్  గా మారిపోయాడు . అవమానాలు అనుభవించాడు దీనితో డిప్రెషన్ కు లోనైనాడు . అక్కడ ఉన్న ట్రయాంగిల్ క్లబ్ లో చేరాడు . ఒక సారి కాలేజి కి లేట్ గా వెడితే ప్రొఫెసర్ కోప్పడితే ”.sir!it is absurd to expect me to be on time ”.i am a genius ” అన్నాడట స్కాట్ . 
              ఇది చాలదన్నట్లు జినేర్వా అనే అమ్మాయితో లవ్ అఫైర్స్ . ఆమె ఇతని ప్రేమను తిరస్కరించి ఇతను రాసిన వందలాది ప్రేమ లేఖలను తగల బెట్టేసింది దీనితో మరీ కుంగి పోయాడు . బీద పిల్లలు ధనిక ఆడపిల్లల్ని  ప్రేమించ కూడదు ”అనే జీవిత సత్యాన్ని తెలుసుకోన్నానని చెప్పాడు . ”నాసువా లిట్ ” అనే మేగజైన్ కు కదా రాశాడు ఽన్దులొ ఒక గొప్ప వాడు స్వార్ధ పరురాలైన అమ్మాయి చేతిలో ఎలా నాశన మైనదీ వివరించాడు అంటే అదే అతని తల్లి జీవిత కదా . మలేరియా తో బాధ పడ్డాడు .              ఫిట్జెరాల్డ్ ఆర్మీ లో చేరాడు . అప్పుడు దానికి కెప్టెన్ ”ఐసన్  హోవర్  ” .ఈయనే తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయాడు . ఇందులో ఉండగానే ”స్మాల్ ప్రాబ్లెమ్స్ ఫర్ ఇన్ ఫాన్ట్రి  ”రాశాడు .ఫ్రాన్స్ కు యుద్ధం కోసం బయల్దేరిన సైన్యం లో స్కాట్ కూడా ఉన్నాడు .ఇన్తలొ యుద్ధం ఆగిపోయిందని కబురొచ్చింది .తీవ్ర నిరాశ చెందాడు ఇలా విధి అతనితో దోబూచు లాడింది . ఒక రకం గా అతని కింద పని చేసిన సైనికులు అదృష్ట వంతులు . స్కాట్ కంట్రోల్ లో ఉన్న ఆయుధ సామగ్రిని శత్రువులు దోచుకు పోయారు ఇంకేముంది ఉద్యోగం గోవిందా అయింది ఇదీ నిరాశను మరీ పెంచింది . 
                 1919 లో అలబామా రాష్ట్ర రాజధాని మాంట్ గోమారి ”కి మకాం మార్చాడు ఽక్కద ”జేల్డా సిర్ ” తో ప్రేమాయణం . ఆమె చాలా ముదురు .వెర్రి వేశాలేక్కువ . అందర్నీ ఆకర్షించి వెంట తిప్పుకొనే వన్నెల విసన కర్ర .  ” she used to challenge young men to kiss her botttom ”.సౌత్ కు చెందినా వనితే ఆమె . అయితే సౌత్ కు చెందినా ఆడ్స్ వాళ్ళెవరూ ఇలా బారి తెగించారు ఈమె ప్రత్యేకం . ఆమెకు దగ్గరవుతూ దూరమయ్యే వాడు పాపం స్కాట్ . ఆమెను పొందాలని తాపత్రయం ఽన్దువల్ల ”డిగ్గీ ”అయ్యాడు . ”డి హైడ్ ఆఫ్ పార దైజ్ ”రాశాదిప్పుడే . అప్పుడు ఆమె ఇతనితో పెళ్ళికి ఒప్పుకొంది . కాని అంతవరాక్ ”సిస్టర్ -బ్రదర్ ”లా ప్రవర్తించారు ఇదో  విపరీతం . ఆమెకు ”schiz ophernia”ఉందని తర్వాతా తెలిసింది ఈ పూర్ క్రీచర్ స్కాట్ కు . పెళ్లి అయింది కాని విడాకులు తీసుకోలేదు .   
                    తర్వాతా ”beautiful and damned ”రాశాడు ఽఅ పిమ్మట ”టేల్స్ ఆఫ్ జాజ్ ఏజ్ ”రాశాడు . దంపతులు యూరప్ యాత్రకు వెళ్ళారు .స్కాత్ ”గాస్బి ”నవల రాస్తుండగా భార్య ఇంకోడితో ప్రేమ వ్యవహారాలూ చేస్తుంటే ఒప్పుకోలేదు . ఇంకేముంది వాడితో పరార్ .  1925 గాస్బీ నవల ప్రచురించాడు మంచి పేరే వచ్చింది .తాగుడెక్కు వైంది .ప్రముఖ నవలా కారుడు ఎడ్వర్డ్ హెమింగ్ వె కు స్కాట్ సమకాలికుడు . హెమింగ్వే సాదికారికం గా విజయ పరంపర కొనసాగిస్తుంటే స్కాట్ సాదికారికం గా అపజయాల పాలౌతున్నాడు ంఆతల్లొ అతనిది విజయ దరహాసం స్కాట్ డి అపజయ నిట్టూర్పు . 
     ” tender is the night ”1934 .లో రాశాడు .స్కాత్ ను గురించి ”  .scott outlived the time ,out of step ,a bit old fashioned ” అనుకొన్నారు జెల్దా కు తీవ్రం గా జబ్బు చేసింది ంఎన్తల్ హాస్పిటల్ కు చేర్చటం మళ్ళీ తీసుకు రావటం మళ్ళీ చేర్చటం గా గడుస్తోంది ఱచనలెవీ విజయాలు సాధించలేదు .దీనితొ మానసిక అశాంతి . 1937 లో” ఏం జి.యెమ్ ”సినిమా వాళ్లకు రచన చేశాడు సరిగ్గా రాయక పొతే తీసేశారు మనసులో ఏమీ బాధ పడలేదు .” ది  లాస్ట్ టైకూన్” రాశాడు .1939లో క్యూబా వెళ్ళాడు . తప్ప తాగి రోడ్డున పడే వాడు . అక్కడ ”కాక్  ఫైట్లు ”  జరుగుతుంటే ఆప బోయి తన్నులు కూడా తిన్నాడు మన ప్రబుద్ధుడు . 1940 డిసెంబర్ ఇరవై ఒకటి న ఫిట్జెరాల్డ్ చని పోయాడు .చని పోయే ముందు ఆయన పుస్తకాల పై వచ్చిన రాయల్తి కేవాలం 13.13 డాలర్లు మాత్రమె . భార్య హాస్పిటల్ లో ఉండగా అగ్ని ప్రమాదం లో చని పోయింది ఇదీ శాప గ్రస్తుడైన స్కాట్ ఫిట్జెరాల్డ్ విషాద గాద  .అతని రచనా విశేషాలు ఇంకో సారి 
         11-9-2002 బుధ వారం అమెరికా డైరీ నుండి 
             మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-7-13- కాంప్-హైదరాబాద్ 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కదంబ వన విహారం

మా రెండో అబ్బాయి వాళ్ళింట కదంబ పూల చెట్టు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాబర్ట్ ఫ్రాస్ట్ -3 కవితా ప్రాభవం

  రాబర్ట్ ఫ్రాస్ట్ -3
                                       కవితా ప్రాభవం 
             ” కవిత్వం ప్రపంచాన్ని పరి పాలిస్తుంది ”అనే వాడెప్పుడూ రాబర్ట్ ఫ్రాస్ట్ . ఆడవాళ్ళు మగవాళ్ళకు రాయబారులని ,”poetry is an extravagance of grief ”అనీ ,”grievences are something that can be remidied and griefs are irremediable అని అభిప్రాయ పడ్డాడు . తను విశ్వాన్ని ఒంటరి ని చేశానని తలచాడు . 
          ఆయన రాసిన ”the woods are lonely dark and deep -but i have promises to keep -and miles to go before i sleep -and miles to go before i go to sleep ”అన్న కవితను అందరూ మెచ్చుకొన్నారు నెహ్రు దీన్ని తన ఆఫీస్ రూం లో రాయించి స్పూర్తి పొందేవాడని చెప్పగా విన్నాను . ఈ కవిత చావును గురించి చెప్పినదే అని ఫ్రాస్ట్ ఒక టి .వి. ఇంటర్ వ్యూ లో తర్వాతెప్పుడో చెప్పుకొన్నాడు . తాను ఎంచుకొన్న మార్గాన్ని గురించి సుస్పష్టం గా ఇలా తెలియ జేశాడు -”i shall be telling this with a sigh -somewhere ages and ages hence -two roads diverged in a wood and i –i took one less travelled by -and that has made all the difference ”అని తన దారే వేరని అందుకే మిగిలిన వారి కంటే తానూ భిన్నం గా ఉన్నానని చెప్పాడు . ఫ్రాస్ట్ కవితలు శక్తి పాఠాలు ,తీవ్రమైనవి ,విట్టీ గా ఉండేవి . ఫ్రాస్ట్ కున్న గౌరవం అమెరికా లో ప్రముఖ క్రీడాకారునికి ,ప్రసిద్ధ సినీ హీరో కు ఉన్నంత గౌరవం .అంతటి అభిమానం ,ఆకర్షణ ఫ్రాస్ట్ కున్నాయి . అందుకే ”Frost himself is the biggest metaphor ”అని కీర్తిస్తారు . 
                ఫ్రాస్ట్ కవిత్వాన్ని చక్కగా నిర్వ చించాడు ఆయన దృష్టిలో ”poetry is that which lost from prose and verse in translation ”
‘F’rost’s country is the country of human source of experience ,of imagination ,and thought . his poems start at home .-end up every where as the only best poems do ” అని విమర్శకాభిప్రాయం. 
 1963 లో అక్టోబర్26 నాడు ”remarks at Amherst college ” అనే చిరస్మరణీయ స్పీచ్ లో ఫ్రాస్ట్ ను అత్యద్భుతం గా స్తుతించాడు –”at bottom  Frost had a deep faith in the spirit of man .he coupled poetry and power for he saw poetry as the means of saving power from itself .when power leads men towards arrogance poetry reminds him of his limitations .when power narrows the areas of man’s concern ,poetry reminds him of the richness and diversity of his existence . when power corrupts poetry cleans .for art 
establishes the basic human truth which must serve as the touch stone of our judjement”.బహుశా ఇంత గొప్ప పొగడ్త ఏ అమెరికా ప్రెసిడెంట్ ఏ అమెరికన్ కవికీ ఇచ్చి నట్లు కనీ పించదు  .
              ” డెసర్ట్ ప్లేసెస్ ” అనే కవిత లో గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాడు ఫ్రాస్ట్ . ” they can not scare me with their empty spaces -between stars and stars where no human race is -i have it in me so much nearer home -to scare my self with my own desert places ”.
 అమెరికా జన జీవితం విషాదం గా ఉంటె అమెరికంల్ జన్మ లో ఆశను ,ఆలోచనలను నింపిన పాస్తోరాల్ కవి అని అభిప్రాయ పడ్డారు . సామ్యుఎల్ జాన్సన్ చెప్పి నట్లు రచన పరమార్ధం ”the only end of writing is to enable the readers better to enjoy life or better to endure it ”అన్నది తన రచనలో చేసి చూపించాడు ఫ్రాస్ట్ . ”the improvement will not be a progression ,but a widening circumstances ”అని ఫ్రాస్ట్ విశ్వ సించాడు .
 ఫ్రాస్ట్ ఏ మనుష్యులను గురించి రాశాడో వాళ్ళు ప్రదేశం లోనే కాక కాలం లోను ఒంటరి వాళ్ళే .\అమెరికా వాళ్ళ మనస్తత్వాన్ని గొప్పగా చెప్పాడు ఫ్రాస్ట్ .”an american believes in independence because he has to -life is too mobile and circumstances change too fast for him to be supported by any fixed frame of family or social relations .in a crisis he will help his neighbour who ever may be ,but he will regard some one who is always coming for help as abad neighbour and disapproves of all set pity and nostalgic regret .all these qualities find their expressions in Frost’s poetry ”.
   ఫ్రాస్ట్ తండ్రి కొడుకు కు ”good fences make good neighbours ”అని చెప్పిన సూక్తి ని గుర్తుంచుకోన్నాడు .దానిపై ”మిడ్ నైట్ వాల్ ”కవిత రాశాడు కూడా . అలాగే చేయి తెగి పోయిన ఒక పని కుర్రాడిని గురించి ”అవుట్ అవుట్ ”కవిత రాశాడు -”but the hand -the boy’s first artery was rueful laugh -as he swung toward them holding up the hand -half in appeal ,but half as if to keep -the life from spoiling .then the boy saw all -since he was old enough to know big boy doing man’s work though a a child at heart -he saw all spoiled ”.అంటూ ఆ అవిటి వాడి ఆవేదన ను కళ్ళకు కట్టించాడు . ”frost valued impulsive over reason ,transcedental truth over logic ”.
                       ఫ్రాస్ట్ పద్నాలుగు లైన్లు ఉండే” సానెట్స్ ” కూడా రాశాడు . ఈ విధం గా తన శైలి లో ,మీటర్ లో ,ఉదాత్త భావాలతో మంచి సింబాలిజం తో గొప్ప కవిత్వం రాశాడు ఫ్రాస్ట్ .”నేటివ్ పోయేట్ ” అని పించుకొన్నాడు . మన కవులతో ఎవరి తో పోల్చాలో నాకు తెలియటం లేదు .కానీ కాలాతీటకవి ,తాత్వికుడు ,భావుకుడు రాబర్ట్ ఫ్రాస్ట్ అని అనుకొన్నాను . అమెరికా దేశ ”క్రాంత దర్శి ”,ఆఅలొచనా శీలి ,ఆర్ష వాడి ,నిరంతర చైతన్య స్రవంతి ,ఫ్రాస్ట్ ఽన్దర్నీ అలరించి ,అందర్నీ అభిమానించి అందరి చేత గౌరవింప బడి ఆదరణ పొందిన విశ్వ కవి ఫ్రాస్ట్ . సహజకవి మన పోతన లాగా . అంధత్వ  మూఢ త్వాలనే ”ఫ్రాస్ట్ అంటే మంచు తో ”కప్ప బడని విశ్వ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ .
       8-9-2002 ఆదివారం అమెరికా డైరీ నుండి
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-13-కాంప్-హైదరాబాద్
 
 
 
 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాబర్ట్ ఫ్రాస్ట్ -2

      రాబర్ట్ ఫ్రాస్ట్ -2
   రాబర్ట్ ఫ్రాస్ట్ కు ,భార్యకు డిప్రెషన్ వచ్చింది.  ఆ యనకు చెస్ట్న్ పెయిన్ అధికం .ఇంగ్లాండ్ వెళ్ళాడు అక్కద   ఎజ్రా పౌండ్ ,యిలిఎట్ ,,ఈట్స్  కవులతో మంచి పరిచయమేర్పడింది . ముగ్గురు ఫ్రాస్ట్ ను బాగా ప్రోత్సహించారు .  ” a boy’s will ”అనే పేరుతో ఫ్రాస్ట్ రాసిన కవితను పౌండ్ బాగా అభిమానించి అమెరికా లోని తన మిత్రులకు సిఫార్సు ఉత్తరం రాసిచ్చాడు . 1914 లో ”నార్త్ ఆఫ్ బోస్టన్ ”రాసి ప్రచురించాడు . అది బాగా క్లిక్ అయింది . వేల కాపీలు అమ్మడ యాయి. గొప్ప పేరు ,డబ్బూ వచ్చ్చాయి .  యూరప్ లో యుద్ధం వల్ల  అమెరికా కు తిరిగి వచ్చాడు . అమెరికాలో ఘన స్వాగతం లభించింది . 
 
                                          
 
 
 
                   న్యు ఇంగ్లాండ్ కాలేజి లో ఇంగ్లిష్ టీచర్ గా పని చేశాడు . రెండేళ్లకు ”మౌంటేన్ ఇంటర్వెల్ ”రాసి అచ్చు వేశాడు . వెర్మాంట్ ,హాంప్ షైర్  లలో ఉన్నాడు . ”న్యు హాంప్ షైర్ ” పుస్తకానికి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది . 1930 లో రాసిన వన్నీ గొప్ప సక్సెస్ . అయినా పెర్సనల్ గా చాలా లాస్ .కూ తురు చని పోయింది .భార్య తీవ్ర అనారోగ్యం తో బాధ పడి మరణించింది . ”the unspoken half of every thing ,i ever wrote ”అని భార్యను గురించి బాధ పడ్డాడు . 
              కాతలీన్ మారిసాన్ అనే అమ్మాయి సెక్రెటరి గా ఫ్రాస్ట్ వద్ద పని చేసింది . ఆమె ప్రశాంత చిత్తం ,శ్రద్ధా ,దయా, సానుభూతి తో బాధనుండి ఉపశమనం పొందాడు మళ్ళీ మానసిక స్వాస్త్యాన్ని పొందాడు . కొడుకు మెంటల్ డిప్రెషన్ తో ఆత్మ హత్య చేసుకొని మళ్ళీ మానసిక బాధ కల్గించాడు . క్రమం గా చీకటి రోజులు కను మరుగై నాయి .వెలుగులలొకి ప్రస్తానం ప్రారంభమైంది . నాలుగు పులిట్జర్ బహుమతులన్డుకోన్నకవి గా గౌరవం పొందాడు . అడిగిన చోట్లకు వెళ్లి ఉపన్యాసా లిస్తూండే  వాడు .”honourary consultant in the humanities at the Liberty angels ” అయ్యాడు ఫ్రాస్ట్ . ఇలియట్ ,హెమింగ్ వె ,ఫాక్నర్ లతో మంచి పరిచయం కలిగింది .వాళ్ళ  శకం అయి పోయి ఖాళీ గా కూర్చుంటే ,ఫ్రాస్ట్ 80వ ఏట కూడా ఇంకా రాసి,కదిలిస్తూ , మెప్పిస్తూనే ఉన్నాడు అదీ ఫ్రాస్ట్ ప్రత్యేకత . ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యోని వర్సిటీలు గౌరవ డాక్త రేట్లను ప్రదానం చేశాయి . అప్పటికే ”విశ్వ కవి ”(యూనివేర్సల్ పోయేట్ ) గా గుర్తింపు వచ్చింది . ప్రెసిడెంట్ కెన్నెడి తో పర్సనలల్  సంబంధాలను కోన సాగించాడు . ఒక మీటింగ్ లో కేనేడి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని ఒక ఏడాది ముందే ప్రకటించాడు ఫ్రాస్ట్ . కెనడి ప్రెసిడెంట్ గా గెలిచి1961 లో ప్రమాణ స్వీకారం చేస్ద్దినప్పుడు తన మిత్రుడు ఫ్రాస్ట్ ను సాదరం గా ఆహ్వానించి ఒక కవిత చదవమని కోరాడు . అదొక చారిత్రాత్మక సంఘటన అయింది . ” it is the first time that an artist had been recognized in such a special event ” . అప్పటికే చూపు మందగించింది . కేనేడి కోరిక పై వేదిక పైకి వెళ్లి ”the gift out right ”అనే సందర్భోచిత కవిత రాసి చదివి జనాన్ని మరింత సంతోష పెట్టాడు . ”the debt owed to America and to the earth itself ”అని అందులో తగిన పద బంధం తో హృద్యమైన కవిత రాసి హృదయాలకు తాకేట్లు చేశాడు . 
              ప్రెసిడెంట్ కేనేడి ప్రతి మీటింగ్ లోను ఫ్రాస్ట్ కవితలను ఉదాహరించేవాడు . ”the young president is a bridge to the young and old ”అని పించేది  ”పొలిటీశియను ,పోయేట్ ”కలిసి పని చేయ గలరు అని నిరూ పించారు వారిద్దరూ . రష్యా ప్రెసిడెంట్ కృశ్చెవ్ ఫ్రాస్ట్ కవితల్ని తెగ చదివి మెచ్చుకొనే వాడు.  తన దేశానికి ఫ్రాస్ట్ ను ఆహ్వానించి సత్కరించి గౌరవించాడు . ”mending wall ”అనే కవితను రష్యా అమెరికా సంబంధాల మెరుగు దల  పై సందర్భానికి తగి నట్లు రాసి రష్యా ,అమెరికా ప్రజలను మెప్పించాడు . 1962 లో ”ఇన్ ది క్లియరింగ్ ”రాసి ప్రచురించాడు . 89 ఏళ్ళ వృద్ధాప్యం లో ఆ” అమెరికా కవి దిగ్గజం ”1963 లో జనవరి 29 న పరమ పదిం చాడు . అశేష  సాహితీ ప్రియులను విషాదం లో ముంచి అమరుడైనాడు ఫ్రాస్ట్ . 
                   సశేషం 
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-13-ఉయ్యూరు 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాబర్ట్ ఫ్రాస్ట్ -1

 రాబర్ట్ ఫ్రాస్ట్ -1
      అమెరికా లో ఎక్కువ మంది ,ఎక్కువ సార్లు ఉదహరించే కవి రాబర్ట్ ఫ్రాస్ట్ . వాళ్ళ ప్రేమాభిమానాలు పుష్కలం గా పొందిన కవికూడా .ఽమెరికా ఆస్థాన కవి . ఆయన తీసుకొనే వస్తువు దాన్ని కవితాత్మకం గ చెప్పే తీరు చిరస్మరణీయం ఽఅయన రచనలకు ఆమెరికా ప్రెసిడెంట్ కేంనేది రష్యా అధ్యక్షుడు కృశ్చెవ్ లు లు అమితం గా అభిమానించారు .ఒక రకం గా అమెరికా మట్టి మనిషి ,మట్టి కవి ఫ్రాస్ట్ . అందరికి అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పి అందరికి దగ్గరైన కవి . ఆయన కవిత్వం లో ”some thing catching ”ఉంటుంది . అదే మనసుకు పట్టి వీరభిమనుల్ని చేస్తుంది . ఛందస్సు లేకుండా (మీటర్) రాయతానని నెట్ లేకుండా టెన్నిస్ ఆడటం లా గా ఉంటుంది అన్నాడు ఫ్రాస్ట్ . చాలా సాదా సీదా గా భావ గర్భితం గా ,స్పష్టంగా ,సంభాశానాయుతం గా రాయటం ఫ్రాస్ట్ ప్రత్యేకత . ఆయన్ను న్యూ ఇంగ్లాండ్ పోయేట్ అన్నారు ఽన్దులొ వికసించిన వజ్రం ఫ్రాస్ట్ . మాసా చూసేత్స్ ,మెయిన్ ,కనెక్టికట్ ,తో సహా ఎనిమిది రాష్ట్రాలను న్యు ఇంగ్లాండ్ అంటారు . ఇంగ్లీష్ వాళ్ళు మొదటి సారిగా ఇక్కడికే వలస రావటం వలల న్యు ఇంగ్లాండ్ అనే పేరొచ్చింది . ఆయన్ను ”he is the strongest ,lonliiest ,frendliest ,poet ”అని ఆప్యాయం గా పిలుచు కొంటారు . 
                   ఫ్రాస్ట్ కున్న పేరు ప్రఖ్యాతులు చాలా విలువైనవి .యెన్దరొ ప్రేసిదేన్ట్లతో రాజులతో ఆయన విందులు స్వీకరించాడు . తన విద్యార్ధులను అమితం గా ప్రేమించాడు . ”most landed American poet of all time at home and abroad ”.యెన్తొ విషాదకర జీవితాన్ని అనుభవించాడు ఫ్రాస్ట్ ఽన్ని సమయాలలోనూ ప్రజలు ఆయన్ను అభిమానించి ఆరాధించారు . ఫ్రాస్ట్ చని పోయి యాభై ఏళ్ళు దాటినా ”best known ,best loved poet of the twenieth century ”
               రాబర్ట్ ఫ్రాస్ట్ 1874 మార్చి26 న కాలిఫోర్నియా లో జన్మించాడు . చిన్నప్పుడే ”సెకండ్ సైట్ ”అంటే ”extrarordinary perception ఉండేది అంటే అందరికంటే భిన్నమైన చూపు వస్తుపరిశీలనా ఉండేదాన్న మాట . తల్లికి ఫ్రాస్ట్ మీద పిచ్చి ప్రేమ .థన్ద్రి మాత్రం పిచ్చ తాగుబోతు . తండ్రి చని పోగానే అమ్మతో తాత గారింటికి మసా చూసేత్స్ కు చేరాడు . తండ్రికి కోపం జాస్తి ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పక పోయినా క్షమించమని అనకపోయినా పిచ్చ కొట్టుడు కొట్టే వాడు చినారి ఫ్రాస్ట్ ను . తల్లి టీచరే కాక కవిత్వం రాసేది ఫ్రాస్ట్ ఎప్పుడూ మద్యం ముట్టలేదు ఽమెరికన్ కవులలో తాగని వారు దాదాపు లేరు అందుకు భిన్నం ఫ్రాస్ట్ . తండ్రి ఉన్నదంతా హారతి కర్పూరం చేసి” బాల్చీ తన్నేశాడు” . అందుకని తాత  వాళ్ళు తల్లిని చిన్న చూపు చూస్తూ ఫ్రాస్ట్ ను ఆదరించే వారు కాదు . హైస్కూల్ లో చదివే తప్పుదే కవిత్వం రాసేవాడు . 
                  న్యు హాంప్ షిర్ అడవుల్లో ఒంటరిగా తిరిగే వాడు ఫ్రాస్ట్ . సోదరులు తాగి తందానాలడుతుంటే ఇతను షికారుకు వెళ్తూ ఉండే వాడు .ఉన్ని మిల్లు లో పని చేశాడు . వ్యవసాయ క్షేత్రాలలో వ్యవసాయ పనులు చేసే వాడు . హార్వర్డ్ యోని వర్సిటీ లో చేరాడు కాని పూర్తీ చేయలేక పోయాడు . తల్లికి అనా రోగ్యం . భార్య పిల్లల్ని కనటం ,చదువుకు పూర్తిగా స్వస్తి చెప్పాడు . రెండు సార్లు ”డ్రాపౌట్ ”అయ్యాడు . ఫ్రాస్ట్ కూతురు ఇలియట్ మూడేళ్లకే ”ఇంతేస్తినల్ ఫ్లూ ”తో చని పోయింది .న్యు హాంప్ షిర్ లోని దేర్రి హౌస్ లో కాపురమున్నాడు . రచనలు చేస్తూండేవాడు వ్యవసాయం చేస్తూ మన పోతనా మాత్యుడు  లాగా . తల్లి చని పోయింది .పిల్లల్ని కంటూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా . అందులో అతి చిన్న పిల్ల మరణించింది ఽప్పుదు కొంచెం జ్ఞానోదయమైంది ”life is precious and tried to make life sweet for his surviving children ”అని భావించాడు . అప్పుడే పుట్టుక ,జీవించటం మరణం ల పై ధ్యాస పెరిగింది .వాతి పై తెగ ఆలోచించాడు . 
                కింగ్ ఆర్ధర్ కధలు బాగా చదివాడు . పొద్దున్నే రాసుకోవాలని అర్ధ రాత్రే పాలు పితికే వాడు . దేర్రి లోని పింకేర్తాన్ అకాడెమి లో టీచర్ గా పని చేశాడు . ఫ్రాస్ట్ అంటే విద్యార్ధులు తెగ ఇష్టపడే వారు . అన్నిటిని బట్టీ పట్టే వాడు . కుటుంబాన్ని పోషించా తగిన సంపాదన ఉండేది కాదు . తన కవిత్వం పోట్ట గడవతానిక్  ఉపయోగ పడలేదు . 
    సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 10-7-13- -కాంప్-హైదరాబాద్ 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రిచర్డ్ రైట్

     రిచర్డ్ రైట్
                రిచర్డ్ రైట్ అనే నల్ల జాతి రచయితా ,హక్కుల పోరాట యోధుడు ”నేటివ్ సన్ ”అనే పుస్తకాన్ని రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు  అతను 1908 సెప్టెంబర్ నాలుగున మిసిసిపి లో పుట్టాడు . తండ్రి ఇతన్ని దూరం చేశాడు ఽఅయన ఇంకో అమ్మాయిని పెళ్ళాడాడు . ఆకలి బాధలతో బాల్యం గడిచింది తల్లే ఇతని బాధ్యతా తీసుకోండి . ఇంట రొట్టె కొద్దిగా టీ తో ఎన్నో రోజులు గడిపాడు తల్లితో .తల్లికి జబ్బు చెసిన్ది.ఫ్రస్త్రెశన్ లో తాగుడుకు అలవాటు పడ్డాడు . జాక్సన్ కు వెళ్ళాడు ఽమ్మమ్మ మత స్వభావం ఇతనికి నచ్చలేదు . వెస్ట్ హెలీనా కు పారి పోయాడు . తల్లికి గుండె పోతూ తో పక్షవాతం వచ్చింది .తల్లికొసమ్ తిరిగి వచ్చాడు .నిద్రలొ నడక అలవాటయింది . తాత గారింట్లో అందరి మధ్య ఇమడ లేక పోయాడు . అనేక చిన్న ఉద్యోగాలు చేసి పొట్ట పోసుకొన్నాడు .ఇల్లన్థా పస్తులతో అలమటించే వారు . ఇంటింటికి తిరిగి పేపర్లు వేసే వాడు . 
               అయితే విపరీతం గా పుస్తకాలు చదివాడు . మానవత్వాన్ని చిదిమేసే సంఘటన ల ను చూసి చలించి పోయే వాడు . జాతి ద్వేషాన్ని జీర్ణించుకో లేక పోయాడు . తన నల్ల జాతి వాళ్ళు పడుతున్న దుర్భర దారిద్ర్యాన్ని ,అణచి వెతను చూసి బాధ తో పాటు కోపం వచ్చేది వారి అసహాయత కు జాలి పడే వాడు వారు ఎదిరించక పోవటాన్ని భరించలేక పోయాడు . తెల్ల వాల్లపకి కసి పెరిగింది .వాల్ల మానవతా రాహిత్యం పై ద్వేషం ప్రబలింది . ”bare bleak pool of black life ”ను చూసి జాలి పడే వాడు . తానేమైనా తన జాతి వారికి చేయాలనే కోరిక గాదం గా ఉండేది . 
            1922  లో ”the voodoo of hell’s half acre ”అనే చిన్న కదా రాశాడు .యెవరో మెచ్చలేదు ంఎమ్ఫిస్ కు ఒంటరి గా ప్రయాణం చేశాడు . సంపాదించిన దానిలో కొంత తల్లికి పంపేవాడు . అక్క్కడ కొందరు తెల్ల వాళ్ళు మంచి వారు గా అని పించారు ఽక్కది లైబ్రరి లో నల్ల వాళ్లకు ప్రవేశం నిషిద్ధం . 1927లో చికాగో చేరాడు
పూర్ న్యూట్రిషన్ తో చాలా బాధ పడ్డాడు . సంపాదస్నే ధ్యేయం గా ఎంచుకొన్నాడు . పోస్టల్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ంఅంచి శారీరక స్తితి లేనందు వాళ్ళ సెలెక్ట్ కాలేదు . అప్పుడే స్టాక్ మార్కెట్ ఘోరం గా పతన మైంది . ఎక్కడా ఉద్యోగాలు లేవు . ”లాడ్ టు డే ”కదా రాశాడు . 1930 లో పోస్టల్ ఉద్యోగం వచ్చింది . ”సూపరిష్టిషన్ ” అనే కద రాశాడు .  ”  . అది బ్లాక్ జర్నల్ లో ప్రచురిత మైంది . 
 
 
 
 
                 కమ్యూనిస్ట్ పార్టీ మీద మోజు పుట్టి చేరాడు . సరైన ఉద్యోగాలు రాక సేల్స్ మాన్ గా ,వీధులు ఊడ్చే వాడిగా పని చేశాడు . ఆటను రాసినవి న్యు మాస్టర్ ,లెఫ్ట్ ఫ్రంట్ జర్నల్స్  లో పడేవి .చికాగొ లో కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరి గా పని చేశాడు . 1935 లో ”American writer’s congres ”స్తాపన జరిగింది తరువాతి ఏడు ”national negro congress ”ఇతని అధ్యక్షతానఏర్పడింది . ”బిగ్ బాయ్ లీవెస్ హొమ్ ”కదా రాస్తే తెల్ల వాళ్ళు కూడా మెచ్చారు . టైం  ,ట్రిబ్యూన్ మాగజైన్లు పోగిడాయి . కవిత్వం కూడా రాసి మెప్పించాడు క్రమం గా ”కమ్మీ ”లకు దూరమైనాడు . ”అంకుల్ టామ్స్ చిల్ద్రెన్ ”అనే నవలిక రాశాడు .
                ధీమా అనే అమ్మాయి తో పెళ్లి . కొద్దికాలానికే విడాకులు .  1940 ”నేటివ్ సన్ ”నవల ప్రచురణ . ఇరవై అయిదు వేల కాపీలు అమ్ముడయింది . గొప్ప గుర్తింపు లభించింది . ” the first best selling black author of America ”గా గుర్తింపు పొందాడు . రేడియో కు అనేక మేగాజైన్ల్ కు రచనలు రాస్తే హాట్ హాట్ గా ప్రచురించారు .  నల్ల జాతి వాళ్ళపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించాడు ఆ దౌర్జన్యాలను ”blacks were shot ,hanged ,maimed ,lynched ,and generally handed until they were either dead or their spirits were broken ”అని ప్రపంచానికి కళ్ళకు కట్టించాడు . 
      ”a black history of the negro in the U.S.A.”,”12 million black voices ”పుస్తకాలు రాసి విపరీతమైన పేరు డబ్బూ,ప్రఖ్యాతి పొందాడు . నేటివ్ సన్నాటకం నూట పది హీను సార్లు ప్రదర్శింప బడింది . ఎలెన్ ను పెళ్ళాడాడు . ” i tried to be a communist ”రాశాడు .స్వీయ జీవిత చరిత్ర రాసుకొన్నాడు .బ్లాక్ బాయ్ నవల రాశాడు .ఇది బెస్ట్ సెల్లార్ అయింది .ఫ్రెంచ్ గవర్న మెంట్ ఆహ్వానం పై పారిస్ సందర్శించాడు .యోరప్ లో పర్యటించి అనుభూతి పొందాడు . తనకు అక్కడ హాయిగా ఉందని అలాంటి ఆనందం తనకు అమెరికా లో లభించలేదని అన్నాడు .యోరప్ దేశస్తులు గొప్ప సంస్కారం ఉన్న వారని ఇంటర్ రేసియల్ కపుల్స్ ను అంగీకరించి గౌరవిస్తారని మెచ్చాడు . నేటివ్ సన్ నవల ను నాటకం గా మార్చాడు దానినే సినిమా గా తీశారు .”the out sider ”  .రాశాడు . 
   ఎన్నో దేశాలను పర్య తించాడు .   అంతర్జాతీయ ఖ్యాతి  పొందాడు . అతని పుస్తకాలను స్కూళ్ళలో బోధించటానికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకొన్నది చఒప్పుకొన్నది  ప కమ్యూనిస్ట్ అయినందువల్ల కొంతాకాలం ప్రభుత్వం అతన్ని నిఘాలో ఉంచింది . తల్లి చని పోయింది ంఅల్లీ కస్తాల కాలం ప్రారంభ మైంది . పుస్తకాలపై రాయాల్తి రావటం లేదు .  నిరుత్సాహాఆమ్ లో మునిగాడు . 800 .హైకూలు రాస్తే చని పోయిన తర్వాతా ప్రచురింప బడ్డాయి . లాంగ్ డ్రీం అనే నవల రాశాడు . 1960 నవంబర్ 30 న నల్ల జాతి రచనా సూర్యుడు మరణించాడు తన జాతిని మేల్కొల్పిన మహా ఘనుడిగా గుర్తింపు పొందాడు .   
             5-9-2002 గురువారం నాటి అమెరికా డైరీ నుండి 
                     మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-13-కాంప్-హైదరాబాద్ 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -36 హెడ్ మాస్టారికి చెక్

 నా దారి తీరు -36
                                  హెడ్ మాస్టారికి చెక్  
             మంచి వారే కాని మా హెడ్ మాస్టారు ,ఒక చిన్న దుర్గుణం ఆయనకు ఇబ్బంది కలిగించింది .. ఆయన కనీ పించాగానే నమస్కారం చేయాలి .లెక పోతే గుర్తు పెట్టుకొని ,పెట్టని వాడిని అదో రకం గా ద్వేషం తో చూస్తారు . సాధారణం గా హెడ్ మాస్తా రు  మంచి వాడైనా కాకపోయినా ”ఆ సీటు ”కు విలువ నిచ్చి ప్రతి వారు నమస్కరించటం అనూచానం గా వస్తున్నా సత్ సంప్రదాయం . దీన్ని ఎవరూ కాదనలేదు ,కాదనరు కూడా హెడ్   చూడగానే మన చేతులు ఆటోమాటిక్ గా నమస్కారం పోజు పెట్టేస్తాయి ఇది అందరికి అనుభవైక విషయమే . ఒకటి రెండు స్దార్లు సరాసరి క్లాస్ లోకి వెళ్ళడం ,ఆయన్ను ఆఫీసులో కలిసే అవకాశం  లేక పోవటం ఎవరికైనా ఉండచ్చు . అప్పుడు నమస్కారం చెయ్యక పొతే ,అది జ్ఞాపకం ఉండక పోవచ్చు ఱొటీ న్  లో అదొక భాగం  ముఖ్యమ్   కాదు .ఇలా కొందరు మేస్తర్లకు ఆయనతో ఇబ్బంది ఏర్పడింది . ఒకటి రెండు సార్లు ఆయనే ”నాకు ఇవాళ మీరు విష్ చెయ్య లేదు ”అని చెప్పిన సందర్భాలు వచ్చాయి . స్టాఫ్ రూం లో ఈ విషయాలు మా తో ఆ టీచర్లు చెప్పే వారు . అలా విష్ చేయని వారి పై ఆయనకు ఒక రకమైన కోపం సూటి పోటి మాటలనటం మాకు అందరికి బాధ కలిగించాయి కొంతకాలం మాస్టర్లు వీటిని బయటకు చెప్పుకో లేదు . కాని నన్ను ,జగన్ మోహన రావు ను చూసిన వారు మాత్రం మాతో బాధగా చెప్పారు . ఏం చేయాలో మాకూ అర్ధం కాలేదు ఈ ఒక్క విషయం తప్ప ఆయన లో మిగిలినవన్నీ అందరూ మెచ్చుకోనేవే . 
               మురళీధర రావు అనే తెలుగు పండిట్ కు ,డ్రాయింగ్ మాస్టారు భాద్రాచారి కి వెంట ప్పయ్యకూ ఈ బాధ తప్పలేదు . ఇక ఉపేక్షించి ఊరుకుంటే రేపు మిగిలిన వారి గతీ ఇంతే కదా అనుకొన్నాం . అప్పుడు నేను ,జగన్మోహన రావు ,ఒక రోజున ఆలోచించి హెడ్ మాస్టారు ఆఫీసులో ఖాళీ గా ఉన్న సమయం లో వెళ్లి ఆయన దగ్గర కూర్చున్నాం .వష యమ్ ఏమిటని ఆయన అడిగారు. అప్పుడు   నేనే ”మాస్టారూ !మీరంటే మా అందరికి పరమ గౌరవం ఉంది . మేము స్కూల్ కు రాగానే మీ ఆఫీసుకు వచ్చి మీకు విష్ చేయటం మా ధర్మము , బాధ్యత .మి మ్మల్ని గౌరవించటం మా విధి కా ని ఏదైనా పని తొందర్లోనో అర్జెంట్ గా క్లాస్ కు వెల్ల వలసి వచ్చినప్పుడో మీ రూం లోకి వచ్చి విష్ చేయటం కుదరక పోవచ్చు . అంత  మాత్రాన మిమ్మల్ని అగౌరవ పరచాలని కాదు . అ లా జరిగిన సందర్భ్జం లో మీరు కూడా పెద్ద మనసు తో అర్ధం చేసుకోవాలి ఽదొక నేరం అని భావించరాదు ంఆ సహచర ఉపాధ్యాయులు ఈ విషయమై చాలా ఆందోళన చెందుతున్నారు . హెడ్ మాస్టార్ని చూదాం గానే ఎవరికైనా చేతులు జోడింప బుద్ధి వేస్తుంది ఆస్తనాం విలువ అది .  అలా చేయలేని వారిపై వేరే భావం తో మీరు ఉంటున్నట్లు వారు మాకు చెప్పుకొన్నారు వారందరి తరఫున మేమిద్దరం వచ్చాం . నమస్కారం అడిగితే పెట్టేది కాదు ఽఅతొమాతిక్ గా జరిగే వ్యవహారం కనుక ఇక నుంచి  అలాంటివి మా తరఫున జరగవని హామీ ఇస్తూ మీరు కూడా ఉదారం గా ఉన్నతం గా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఇంతటి తో మర్చి పోదాం ”అన్నాను .ఒక కమ్యూనిస్ట్ నాయకుడి కి ఈ విషయం మేము చెప్పాల్సి రావటం మాకు ఇబ్బంది గానే ఉంది కాని తప్పలేదు ఽఅయన నిస్చేస్తులయ్యారు . ఏమీ అనలేక ”సరే మాస్టారూ ! ఇక నుండి మనం అందరం స్నేహితులం గా నే ఉందాం .ఇతు వంటి చిన్న విషయాల్ని నేనూ దృష్టిలో పెట్టుకోను ”అన్నారు అందరం ఊపిరి పీల్చుకొన్నాం .ఈ విషయం అందరికి చెప్పాం . తీచార్లందరూ సంతోషించారు ఊరట లభించింది . ఇలా ఆయన కు చెక్ పెట్టాల్సి వచ్చింది తప్పలేదు ఽప్పతి నుంచి మళ్ళీ స్టాఫ్ కు హెడ్ కు పోర పోచ్చాలు రాలేదు . ఆయనా సరదాగానే ఉన్నారు . 
                     పెనమ కూరు రు స్పెషల్  .
          పెనమ కోరు లో నే” భోజ రాజీయం ”   రాసిన అనంత మాత్య్డు దు జన్మించాడు . ఆయనే ”అనంతుని  ఛం ధం  ”రాశాడని మనకు తెలుసు .అంతేకాదు ప్రఖ్యాత పౌరాణిక నాటక నటుడు అబ్బూరి వరప్రసాద రావు పుట్టిన గ్రామం పుట్ట్టిన ఊరు పెనమకూరు .. కృష్ణ రాయా బారం లో శ్రీ కృష్ణుని పాత్ర న భూతో గా నటించాడు అబ్బూరి ఆయన పద్యం ఎత్తుకొంటే ఒడో లోకం లో విహరిస్తాము . ఆలాపనా ,గాంభీర్యం ,స్పష్త త ,శ్రావ్యత  కు మారు పేరు గా నిలిచాడు . నేను వల్లూరు లో నా చిన్నప్పుడు అబ్బూరి నాటకం చూసిన అదృష్ట వన్తుడిని . ఈ రెండు విషయాలు అంటే ఈ ఇద్దరు ప్రముఖులు  పెనమకూరు లో పుట్టారన్న సంగతి ఆ నగరామ ప్రజలకు ఎవరికీ తెలియదు . ఆ విషయాలను నేను వీలైనప్పుడల్లా విద్యార్ధులకు ,ఊరి వారికి తెలియ జేసి సంతృప్తి పొందే వాడిని . ఇంకో విషయం నేను పని చేస్తున్నప్పుడే అక్కడ మా స్కూల్ లో ప్రసాద రావు అనే ఎనిమిదవ తరగతి విద్యార్ధి ఉండేవాడు .దళితుడు  అయినా ,అద్భుత గాత్ర సౌలభ్యం ఉన్న వాడు వాడిని ప్రోత్సహించి నాటక పద్యాలను ప్రాక్టీసు చేయించి స్కూల్ ఫంక్షన్స్ లో పాడించే వాడిని అబ్బూరి ని మరిపించే వాడు అందుకని వాడిని ”అపర అబ్బూరి ”అని పిలిచే వాళ్ళం . స్కూలు వార్షి   కొత్సవానికి అతని తో పాడి స్తే ఊరి వారందరూ మెచ్చి ఎంతో డబ్బు ,బహుమతులు అతనికి అందజేశారు . 
అలా ఒక గాయకుడిని అందులోను అబ్బూరి ని తలపించే గాయకుడి ని కానీ పెట్టి ,ప్రోత్సహించి నందుకు నాకు మహా ఆనందం గా ఉంది గర్వం గానూ ఉంది . అతడు ఉయ్యూరు కాలేజి లో కూడా చేరి తన గాన ప్రతిభ తో అందర్నీ మెప్పించి ఆదరాభిమానాలు పొందిన అదృష్ట వంతుడు . 
 
         సశేషం 
                  మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-13 -ఉయ్యూరు 
 
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -35 పెనమకూరు లో ఉద్యోగం

 నా దారి తీరు -35
               పెనమకూరు లో ఉద్యోగం 
        ఉయ్యూరు నుంచి పెనమ కూ రు  ఆరు కిలో మీటర్లు . ఉదయం తోమ్మిదిమ్బావు కు ఒక బస్ ఉండేది దానిఒలొ చిన్న వంతెన దగ్గర ఎక్కి వెళ్ళే వాళ్ళం .నాథొ బాటు ఉయ్యూరు నుంచి డ్రిల్ మాస్టారు యలమంచి జగన్మోహన రావు ,ఆయన భార్య  సోషల్  టీచర్ అయిన భ్రమరాంబ గారు ,హిందీ పండిట్ రామ తారకం గారు ,ఆమె భర్త డ్రిల్ మేష్టారు నరసింహా రావు కలిసి వెళ్ళే వాళ్ళం .ఒక్కొసరి బస్ ఆలస్యమై మొదటి పీరియడ్ ప్రారంభమైన పది నిమిషాలకో ,పావు గంటకో చేరే వాళ్ళం .ఇది మాకే ఇబ్బంది అని పించేది . ఱిక్షా దొరికితే ఎక్కి వెళ్ళే వాళ్ళం . హెడ్ మాస్టారు వేముల పల్లి కృష్ణ మూర్తి గారు .భారీ పర్సనాలిటి తెల్లని గ్లాస్కో పంచ తెల్లని చొక్కా తో గంభీరం గా ఉండే వారు . అయన పెనమకూరు లోనే స్కూలు దగ్గర స్కూల్ ప్రెసిడెంట్ గారు వెంకట నారాయణ గారింట్లో కాపురం ఉండే వారు .ఈ ఇద్దరు అన్న దమ్ముల్లా గా కనీ పించేవారు వేష భాషల్లో .నారాయన గారి రైట్ కమ్యూనిస్ట్ .కృష్ణ  మూర్తి గారివీ వామ పక్ష భావాలే .ఇద్దరికి మంచి సయోధ్యత ఉండేది ..వెంకట  నారాయణ గారు ఆ తర్వాతెప్పుడో కంకిపాడు మండలాధ్యక్షుని గా ఎన్నికై నారు .ఒకసారి జిల్లా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఒడి పోయారు.పెనమ కోరు ప్రెసిడెంట్ గా చాలా కాలం చేశారు . అ స్కూల్ లో ఆయన అనుకొన్న వారే ఉండాలి ఆయనకు అక్కరలేని వారు వెళ్లి పోవాలి . అలా తన పెత్తనం సాగించేవారు అయితే అలా ఉన్నట్లు కనపడే వారు కాదు . . స్కూలు లో ఏది జరిగినా ఏది చేయాలన్నా అయన అనుమతి ఉండాల్సిందే . ఇక్కడ జరిగిన వన్నీ ఆయనకు వెంటనే చేరిపోతాయి . 
                                        ఐరన్ డిసిప్లిన్ 
       హెడ్ మాస్టారు కృష్ణ మూర్తి గారు కస్టపడి ఇంగ్లీష్ లెక్కలు చెప్పేవారు .లెక్కల మాస్టారు గా ఆయనకు మంచి పేరుండేది .స్కూల్  లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు .భార్య కూడా సహకరించేది .  విద్యార్ధులు పాస్ పీరియడ్ లో బయటికి లైన్ లో వెళ్లి పాస్ పోసుకొని రావాలి . మ ధ్యలొ ఎవరూ మాట్లాడే వారు కాదు .యూ నిఫార్మ్ తప్పక వేసుకొని . రావాలి రోజు అసెంబ్లీ ఉండేది ఽన్నీ క్రమ పద్ధతిలో క్రమ శిక్షణ తో జరిగేవి నా బోటి వాడికి ఇది ఐరన్ డిసిప్లిన్ అని పించేది . స్కూల్ అంతా నిశ్శబ్దం తండ వించేది . ఆటలు ఆడాలన్నా ఎక్కడా అరుపులు కేకలు ఉండేవి కావు ఆ డ పిల్లలో బాగానే గేమ్స్ ఆడే వాళ్ళు .చిన్న లాబ్ ఉంది అందులోనే క్లాస్ లు తీసుకొనే వాడిని . సుబ్రహ్మన్యే శ్వర రావు అనే అతను నేచురల్ సైన్స్ చెప్పే వాడు . తెలుగు మాస్టారు వెంపటి శర్మ గారు జూనియర్ తెలుగు  నరసా రెడ్డి ,రంగా వజ్జల మురళీ ధర రావు .ఇథను మంచి కావ్య జ్ఞానం ఉన్న వాడు .కనక వల్లి లో కాపురం . భార్య ఎలిమెంట రితీచర్.    . కొద్దికాలానికి నరసా రెడ్డి బదిలీ అయి ఒక సాయిబు గారుఇస్మాయిల్  వచ్చాడు .ఇప్పుడతను ను తోట్ల  వల్లూర్ హెడ్ మాస్తారయ్యాడు . హిందీకి  కు షరీఫ్ అని అమీనా పురం ఆయన ఉండేవాడు . చిన్న క్లాసులకు చెప్పే వాడు.మం చి  మాటకారి . వాల్లబ్బాయిలు  స్కూల్ లో చదువుతున్నారు .వాల్లకో సమ్ చాలా తాపత్రయం పడే వాడు పరీక్షల్లో మరీ . 
                  లెక్కలకు సుంకర రాధాకృష్ణ  ఉండేవాడు పదవ తరగతి నుండి అన్ని తరగతుల వాళ్ళు అతని దగ్గరే ట్యూషన్ . పెన్నులు న్నోటు బుక్కుల వ్యాపారం కూడా చేసే వాడు డబ్బు బాగానే సంపాదించాడు మేస్తర్లకు అప్పు కావాలంటే అతని దగ్గరే దొరికేది.  జతమ్ రాగానే బదులు తీర్చే వారు . సహాయ కారి . నన్ను ”గురూ ”అని పిలిచే వాడు .వాల్లబ్బాయిలు స్కూల్ లో చదివే వారు . వెంకటప్పయ్య ,సౌదామిని అనే దంపతులు సెకండరి గ్రేడ్ టీచర్లు మంచి దంపతులు నాకు వెంకటప్పయ్య మంచి మిత్రడయ్యాడు .తరచుగా ఇంటి దగ్గర పార్టీలు మాకు ఇచ్చేవాడు . వెంకతప్పయ్యా ,సౌదామిని భార్యా భార్తస్లు సెకండరి టీచర్లు . అతను  ఇంగ్లిష్ లో ధారాళం గా మాట్లాడే వాడు రాసే వాడు.ఆ నాడు మేస్తార్లలో అంత ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వారు అరుదు ఏడవ తరగతికి ట్యూషన్ చెప్పేవాడు . బాగా బోధించి మంచి పేరు పొందాడు .వాల్ల అబ్బాయిలిద్దరూ మావిద్యార్ధులే . అందులో హర్ష నే వాడు అమాయకం గా ఉండే వాడు . . 
                     భద్రాచారి అని డ్రాయింగ్ మేష్టారు గన్నవరం నుండి వచ్చాడు ఈయనా ఉయ్యూరులో కాపురం . సాంబశివరావు అనే గుమాస్తా ఉయ్యూరు నుండి వచ్చేవాడు అక్కడ మాతో పని చేసిన సెకండరి టీచర్ నాగమణి గారి భర్త . .వెంకటే శ్వర రావు అనే క్రాఫ్ట్ మాస్టారు తాడంకి నుండి వచ్చేవాడు . భలే సరదా అయిన వాడు అతన్ని బాగా ఉడికించే వాళ్ళం .ఏ మీ అనుకొనే వాడు కాదు . రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాని ఎన్నికకు పోటీ చెయ్యమని రెచ్చగొట్టే వాళ్ళం .నిజమె నను క్లోని రెచ్చి పోయేవాడు తాను ఎన్నిక అయితే దేశాన్ని బ్రహ్మాండం గా బాగుచేస్తానని దస్ప్పాలు కొట్టే వాడు . ఇక్కడ క్రాఫ్ట్ అంటే గార్డెన్ పని . అరఎకరం పొలం లో చెరుకు సాగు చేసే వారు స్కూలు ఆవరణ చుట్టూ కొబ్బరి చేట్లున్దేవి మంచి ఫలసాయం స్కూల్ కు వచ్చేది . పూజార్లాయన ఒకాయన కపిలేశ్వరపురం నుండి వచ్చేవాడు సెకండరి టీచర్ . మురళీ ధర రావు బోధనా సామర్ధ్యం బాగా ఉండేది మాం చి రచయిత కూడా ఽఅ తర్వాతా బెజవాడ మునిసిపల్ స్కూల్ లో తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు ఇప్పటికి ఇద్దరం ఫోన్లు చేసుకొంటూ మాట్లాడుకుంటాం అతను రాసిన పుస్తకాలు నాకు పంపుతాడు మన సరస్భారతి పుస్తకాలన్నీ అతనికి పంపాను అలా  ఆ స్నేహం కోన సాగుతోంది . 
                 రామా రావు గారు అనే సెకండరి మాస్టారు ఆస్కోల్ లోనే ఉద్యోగం ప్రారంభించి అక్కడే కోన సాగుతున్నారు మంచి మనిషి భార్య కూడా ఎలిమెంటరి టీచర్ .పద్ధతి ఉన్న టీ చర్.యెక్కువ తక్కువలు మాట్లాడారు నాకు చాల ఇష్టమైన వ్యక్తీ అయ్యారాయన .లెఫ్త్ భావాలున్న వారు ఽయినా మా మధ్య గొప్ప స్నేహమే ఉండేది జగన్మొహన రావు మేడూరు నుండి వచ్చాడు . భార్య సోషల్ . ఈయన మంచి వాలీబాల్ బాడ్ మింటన్ ప్లేయర్ మాతో సాయంత్రాలు ఆడించేవాడు మంచి తర్ఫీదు ను పిల్లలకు ఇచ్చేవాడు . గ్రిగ్ లో వాళ్ళు మేము గెలిచేట్లు ఆడించేవాడు నరసింహా రావు ఈయన కు గొప్ప తోడ్పాటు . నేను బాద్ మింటన్ వాలీ బాలాడే వాణ్ని ..ద్రాయింగ్ మాస్టారు మంచి కారంస్ ప్లేయర్ మేమందరం ఇంటర్వల్ లో బయటికి వెళ్లి అక్కడున్న చిన్న హోటల్ లో ఏదో చెత్త తిని తీ తాగి వచ్చే వాళ్ళం . వచ్చి మొదటి గంట కొట్టే దాకా కారంస్ ఆడే వాళ్ళం . పందాలేసుకొని ఆడటం సరదాగా ఉండేది . పెనమకూరు కు రావాలంటే ఉయ్యూరు  నుంచి , గరిక పర్రు ,కనక వల్లి మీద నుంచి లేక కుమ్మమూరు ,కనక వల్లి నుండి వెళ్ళాలి తారు రోడ్డు గథుకుల మాయం వర్షం వస్తే బు రద . మి గిలిన కాలం లో దుమ్ము రేగేది . .
                    పెనమ కూ రు ఊరు ముందు ఒక చిన్న ఎత్తైన వంతెన ఉండేది .  ఎక్కటం కష్టం .ఊ ర్లొ బ్రాహ్మణ కుటుంబాలు రెండో మూడో ఉన్నాయి .దీనికి దగ్గరే దేవర పల్లి లో బ్రాహ్మన్ కుటుంబాలు కనక వల్లి లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి కనక వల్లి అగ్రహారం . అక్కడ మా మామయ్యా వాళ్ళు కట్టించిన శివాలయం ఉంది దాన్ని దాటుకుంటూ పెనమ కోరు చేరాలి ఇక్కడ అంతా బి.సి.లు ఎక్కువ .చదువు కూడా స్కూల్ లో తక్కువ గా ఉండేది . పదవతరగతి ఉత్తీర్ణతా శాతం కూడా తక్కువే .కాని కృష్ణ మూర్తి గారి స్పూన్ ఫీడింగ్ వాళ్ళ మంచి ఫలితాలోచ్చాయి . సుమారు మూడొందల మంది విద్యార్దులుందే వారు . పి.విజి.క్రిష్ణ  మూర్తి అని సోషల్ మాస్టారు పునాదిపాడు నుండి వచ్చేవాడు భలే సరదా అయిన మనిషి వ్యంగ్యం చతురత ఆయన మాటల్లో గోచరించేవి నాకు ఆత్మీయుడే అయ్యాడు ఆయన అన్న హెడ్ మాస్టారు జిల్లా లో పేరున్న వాడు . పి. శ్రీరామ మూర్తి గారి మన్సుష్యులిద్దరు ..కొన్థ కాలానికి పి.వెంకటే శ్వర రావు అనే లెక్కల మాస్టారు గిరిరెడ్డి  అనే సైన్సు మేష్టారు ఇక్కడికి చేరారు .  
              సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ – 8-7-13-  ఉయ్యూరు 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

భగవద్గీతకు స్వరాభిషేకం

భగవద్గీతకు స్వరాభిషేకం

July 04, 2013

ఘంటశాల గానమాధుర్యాన్ని, ఎంఎస్ గొంతులో లాలిత్యాన్ని, ఏసుదాసు స్వర సౌందర్యాన్ని అందరం ఆస్వాదిస్తూ ఉంటాం. కాని వారి గొంతులను గ్రామఫోనులలో రికార్డు చేసి భద్రపరిచిన వారి గురించి ఎప్పుడూ మనం పట్టించుకోం. వారి శ్రమ ఎలాంటిదో మనకు తెలియదు. ఘంటశాలతో భగవద్గీత, నమో వెంకటేశ వంటి అపురూప గీతాలు, ఏసుదేసుతో అయ్యప్ప స్వామి గీతాలు రికార్డు చేసి తెలుగు శ్రోతలకు అందించిన వ్యక్తి పుట్టా మంగపతి. హెచ్ఎంవీలో పనిచేస్తున్న సమయం నుంచి సొంత రికార్డింగ్ కంపెనీ ‘విజయశ్రీ’ స్థాపించేదాకా ఆయన అనుభవాల సమాహారమే ‘స్వరసేవ’. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం..
ఘంటసాలగారు చాలా బిజీ ఆర్టిస్టు. అందుచేత ఆయన ప్రైవేటు రికార్డింగులు అనుకున్నంత మాత్రాన జరిపించడానికి వీలుండేది కాదు. ఆయన డేట్స్ గురించి వేచి ఉండేవాణ్ణి. 1970లో హెచ్ఎంవి బొంబాయి బ్రాంచి వారు లతా మంగేష్కర్ గారితో సంస్కృత భగవద్గీత శ్లోకాలు పాడించి మగ గొంతుకతో ఇంగ్లీషులో వ్యాఖ్యానం చెప్పించి రికార్డు రిలీజు చేశారు. నేను ఘంటసాల గారి చేత తెలుగులో చేయించడానికి పూనుకున్నాను.
నేను ఏ రికార్డింగ్ తల పెట్టినా ముందుగా మా బ్రాంచి సీనియర్ సేల్స్ మేనేజర్ (తర్వాత బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోట్ అయ్యారు) ఆల్‌ఫ్రెడ్ తంగయ్యగారితో సేల్స్ గురించి సంప్రదించేవాడ్ని. లతామంగేష్కర్ చేత భగవద్గీతను బొంబాయి బ్రాంచి వారు రికార్డు చేసి రిలీజ్ చేసి ఉన్న విషయం చెప్పి ‘ఇక్కడ ఘంటసాలగారి చేత రికార్డింగ్ చేయాలని ఉంది’ అని చెప్పాను.

అందుకు ఆయన ‘ఘంటసాల మన హెచ్ఎంవి లేబుల్‌కు అతి ముఖ్యమైన ఆర్టిస్టు. కాని ఒక చిన్న అనుమానం – బొంబాయిలో లతా మంగేష్కర్ పాడారు గనుక ఇక్కడ కూడా అదేవిధంగా ఆడవారి చేత అంటే యం.యస్.సుబ్బులక్ష్మిగారి చేత పాడించవచ్చు గదా” అన్నారు.
దానితో నా తలపైన పెద్ద గుండు పడ్డట్లు అయింది. నేను వెంటనే తేరుకుని “ఈ రికార్డింగ్ ప్రత్యేకంగా తెలుగు జనానికి ఉద్దేశించినది. సంస్కృతంలో ఉన్న భగవద్గీత శ్లోకాలకు తెలుగులో అక్కడక్కడ అర్థం చెప్పుతూ ఘంటసాల పాడతారు. ఘంటసాల గారు పాడగా, మధ్యలో వచ్చే వచనం కూడా తెలుగులో ఉంటుంది. తెలుగు ఆర్టిస్టులైతేనే బాగుంటుంది. తెలుగువారందరికీ పరిచితమైన వాయిస్ ఘంటసాలది. అందుకనే నేను ఘంటసాల గారిని కోరుకున్నాను” అన్నాను. ఇది విన్నాక తంగయ్య గారు నాతో ఏకీభవించారు.
వెంటనే ఘంటసాల గారి వద్ద కెళ్లి “భగవద్గీత శ్లోకాలు మీరు పాడితే రికార్డు రిలీజ్ చేయాలని అనుకుంటున్నామ”ని చెప్పాను. అందుకు ఆయన తక్షణం స్పందించి “మంచి ఆలోచన మంగపతి గారూ తప్పక చేద్దాం. లతా మంగేష్కర్ పాడిన భగవద్గీత రికార్డు హైదరాబాద్‌లో ఆమె తండ్రిగారి సంస్మరణ సభలో విన్నాను. చాలా బాగుంది” అన్నారు.
అప్పుడు నేను “ఆమె పాడిన శ్లోకాలన్నిటి తర్వాత, చివరగా ఇంగ్లీష్‌లో మగ వాయిస్‌లో వ్యాఖ్యానం రికార్డు చేసి ఉన్నారు. కానీ మీరు పాడబోయే భగవద్గీతలో తెలుగు వారికందరకు అర్థమయ్యేలా శ్లోకాల మధ్య తెలుగు తాత్పర్యం ఉంటుంది. ఇది మీరు తెలుగు వారి కోసం పాడబోయే ఒక మహత్తరమైన రికార్డు అవుతుంది” అన్నాను.
తాత్పర్యం గురించి వినగానే ఆయన “ఔనౌను, తెలుగులో అర్థం చెప్పితే బాగుంటుంది. అలాగే చేద్దాం” అన్నారు. శ్లోకాలు తాను పాడినా కృష్ణార్జునుల సంభాషణా తాత్పర్యం డైలాగులుగా మాట్లాడడానికి ఎవరైనా సినీయాక్టర్ల చేత మాట్లాడిస్తే బాగుంటుందేమోనని ఆలోచించి నాగయ్య గారి పేరు చెప్తే “బాగానే ఉంటుంది. అలాగే చేద్దాం” అన్నారు.
వెంటనే నేను నాగయ్య గారి ఇంటికి వెళ్లాను. కానీ ఆయనకు చాలా జబ్బు చేసి డా. రంగభాష్యం గారి నర్సింగ్‌హోంలో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. వెళ్లి చూశాను. ఆయన తీవ్రమైన నొప్పితో కడుపు పట్టుకుని బాధపడుతూ మూలుగుతూ ఉండటం నేను చూడలేకపోయాను. అలాంటి కష్ట సమయంలో నేను వెళ్లిన పని గురించి ఏమని చెప్పను? స్తంభించి నిలబడి నమస్కారమని మాత్రం అనగలిగాను.
నాగయ్యగారు కళ్లు తెరిచి చూసి “ఏం నాయనా మంగపతీ వచ్చావా, చూశావా నా పరిస్థితి…” అని నన్ను గుర్తుపట్టి గద్గద స్వరంతో పలకరించారు. “మీరు ఈ నర్సింగ్‌హోంలో అస్వస్థతగా ఉన్నట్లు తెలిసి మిమ్ములను చూడటానికి వచ్చానండి. మీరు త్వరగా బాగై మీ ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానండి” అని వచ్చిన పని చెప్పడానికి సంకోచిస్తూ ఉండగా, ఆయనే “ఏమిటి మంగపతీ, ఆలోచిస్తున్నావ్?” అని అడిగారు.
“ఏమీ లేదండి. ఒక మంచి విషయం మీతో ముచ్చటిద్దాం అని వచ్చానండి” అనగానే “ఏమిటదీ? చెప్పు పర్వాలేదు” అన్నారు. అప్పుడు “ఘంటసాల గారి చేత భగవద్గీత శ్లోకాలు రికార్డు చేయించి, అందులో మధ్యలో వచ్చే తెలుగు తాత్పర్యము మీ చేత మాట్లాడించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాం” అని చెప్పాను.
ఆ మాట వినగానే ఆయనకు ఎక్కడలేని ఆనందమూ, ఉత్సాహమూ పుట్టుకొచ్చి తన బాధను మర్చిపోయారు. కడుపుపై పెట్టుకున్న రెండు చేతులూ పైకెత్తి “ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు నాయనా! భగవద్గీత పాడటానికి ఘంటసాల గొంతే తగినది. తప్పక ఆయన చేతనే రికార్డింగ్ చేయించండి. నేను వచ్చి వచనం మాట్లాడుతాను” అని చెప్పి నా చేతులు పట్టుకొని “నేను ఒకప్పుడు హెచ్ఎంవి బెంగుళూరు రికార్డింగ్ సెషన్సు జరుగుతుంటే పాడాను, రెంటచింతల సత్యనారాయణలాంటి చాలామంది ఆర్టిస్టుల చేత తెలుగు డ్రామా సెట్టు రికార్డింగులు చేయించాను కూడా” అని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించి ఆయన వద్ద సెలవు తీసుకుని వచ్చాను.

రోజులు గడుస్తూ ఉన్నాయి గానీ ఆయన ఆరోగ్యం మాత్రం త్వరలో కుదురుకునే పరిస్థితిలో లేదని తెలిసింది. చాలా బాధపడ్డాం. ఘంటసాలగారు తాను మద్రాసుకు వచ్చిన తొలుదొలుత నాగయ్యగారు తనకు ఎంతో సహాయం చేశారని, అది ఎన్నడూ మరువలేననీ చెప్పుకుని ఆయన ఆరోగ్యపరిస్థితిపై విచారించారు. త్వరగా రికార్డింగు చేయాలని ఆదుర్దా పడుతున్నారు. పద్యనాటకాలను ఆంధ్రప్రజలకు శ్రీకృష్ణరాయబార విజయముల రచనతో రుచి చూపినవారు మహానుభావులు తిరుపతి వేంకటకవులని చెప్పక తప్పదు. ఈ ప్రభావంతోనే భగవద్గీతలో కృష్ణార్జునుల సంభాషణలో నిస్పృహ, నివర్తి వివరణలో నాటకీయత ఉందని గ్రహించాను.
అది మనసులో పెట్టుకుని “శ్లోకాల మధ్య వచ్చే వచనం ప్రవచనాల్లా కాకుండా కృష్ణార్జున సంవాదంగా, నాటక సంభాషణారూపంలో నడుస్తుంది గనుక నాగయ్య గారు రాలేని పక్షంలో ఎవరైనా స్టేజి నటుల చేత డైలాగుల రూపంలో చెప్పిస్తే బాగుంటుంది కదా” అన్నాను ఘంటసాల గారితో.
అందుకు ఆయన కొంతసేపు ఆలోచించి “అన్నట్లు నేనూ ఒకప్పుడు స్టేజి యాక్టర్నే. నాటకాల్లో నటించి డైలాగులు బాగా మాట్లాడే అనుభవం నాకూ ఉంది. ‘సక్కుబాయి’లో యోగిగా, ‘చింతామణి’ నాటకంలో బిళ్వమంగళుడుగా వేషాలు వేసి ఉన్నాను” అన్నారు.

ఇది వినగానే నాకూ చాలా సంతోషమేసి “ఇక ఆలస్యమెందుకు? కృష్ణార్జునుల డైలాగులు రెండూ మీరే మాట్లాడండి. ఎందుకంటే మీ పాటా మాటా ఒకే శ్రుతిలో, ఒకే గాత్రంలో గాంభీర్యంతో మాట్లాడినప్పుడు ఒక దృశ్యనాటక అనుభూతి కలుగుతుంది” అన్నాను.
ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. అన్ని సందేహాలు తీరాయి. రికార్డింగుకు సన్నాహమయ్యాము. నా ఆత్మీయ సోదరులు శ్రీ కోట సత్యరంగయ్య గారి చేత వ్యాఖ్యానం వ్రాయించాము. ఘంటసాల గారు అతి జాగ్రత్తగా శంకరమఠం, రామకృష్ణామఠం వారి భగవద్గీత పుస్తకముల నుంచి 108 శ్లోకాలు ఏరుకుని వాటికి సంగీతం సమకూర్చుకోవటం ప్రారంభించారు. శ్లోకాలకు ట్యూన్స్ కట్టడానికి దాదాపు ఆరు మాసాలు పట్టింది.

భగవద్గీత శ్లోకాలను వివిధ రాగాల్లో కంపోజ్ చేస్తున్న సమయాల్లో ఘంటసాల గారి సతీమణి సావిత్రిగారు అక్కడే ఉన్నారు. ఆమె బాగున్నదని సూచన ఇస్తే ముందుకు వెళ్లేవారు. లేదంటే ఆమెకు నచ్చేవరకు ఇంకో రాగం సమకూర్చుతూ పోయేవారు. ఈ పద్ధతి ఆయన ప్రైవేటు పాటలకే గాక సినిమా పాటలకు కూడా ఉండేది. ఈమె దాన్ని భగవద్గీత రికార్డింగప్పుడూ కన్పరచింది. సావిత్రమ్మగారు తానే స్వయంగా ఉతికి, ఆరబెట్టి ఇస్త్రీ చేయించిన కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆయన అతి భక్తిగా, నిష్ఠగా స్టూడియోకి వచ్చి పాడేవారు. ఈ విధంగా భగవద్గీత రికార్డింగ్‌కు ఘంటసాల గారితో పాలుపంచుకున్న సావిత్రమ్మ గారికి నా మనఃపూర్వక వందనములు.
* * *
వీరందరి సహకారంతో భగవద్గీత రికార్డింగ్ 1973 ఆఖరుకి జయప్రదంగా ముగిసింది. కానీ అతి విచారకరమైన విషయం ఏమిటంటే – రికార్డ్సు స్లీవ్స్ (కవర్లు) ప్రింటింగులోనూ, రికార్డుల ప్రాసెసింగ్‌లోనూ అనివార్య జాప్యం వల్ల ఘంటసాల బ్రతికి ఉండగా రికార్డులు విడుదల చేయలేకపోయాం. దానికి నేను ఇంకా ఎంతో బాధపడుతూనే ఉంటాను. ఘంటసాలగారు స్వర్గస్తులైన రెండు నెలలకు 21-4-74 న విజయవాడ దుర్గా కళామందిరంలో కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ, కరుణశ్రీ, ఆకాశవాణి (విజయవాడ) డైరెక్టర్ రజనీకాంతరావు లాంటి ప్రముఖుల సమక్షంలో శ్రీ ఎన్.టి.రామారావు గారి చేతుల మీదుగా భగవద్గీత రికార్డులు విడుదలయినవి. మొదటి రికార్డును విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేశారు రామారావు గారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నతానియల్ హతార్న్ -2 రచనా పాటవం

        నతానియల్ హతార్న్ -2 
                         రచనా పాటవం 
       తన జీవిత గమ్యమేమిటోహతార్న్ ఇలా తెలియ జేశాడు ” i do not want to be a doctor live by men’s diseases ,nor a minister to live by their sins ,nor a lawyer and live by their quarrels .so i do not see that there is  any thing left for me ,but to be an author ”

రచయితకావాలనిఅంతతపించి పోయాడు. చెడు లోనిసమస్యలనుచర్చించాడు. పాపంఅసలురూపంఏమిటోచెప్పాడుగర్వానికి, మానవత్వానికి మధ్యఉన్నవైరుధ్యాన్ని వివరించాడు. . ఊహకుఉన్నశక్తినినిరూపించాడు. . భౌతికంగాఆలోచించేవారి మనస్సులనుఆధ్యాత్మికతవైపుమళ్ళించాడు 
              నతానియల్ను”largest brain with largest heart ”అనిప్రశంసిస్తారు  ఆయనసాహిత్యపరిజ్ఞానంప్రధమశ్రేణికిచెందినదిగాకీర్తిస్తారు.  అమెరికాసాహితీ వేత్తలలోఫస్ట్గ్రేడ్రచయితఅని పించుకొన్నాడు వారిలోమొదటి స్తానంలోఉన్నవాడుకూడా .  ఆయన్ను”the obstruest man of letters in America ”అనిగొప్పగా చెప్పుకొంటారు  
               ఆయనలోసృజన,కొత్తద నానికి అన్వేషణ,ఊహ, స్వీయభావసంపదా, పుష్కలం. . అందుకే a man of rare genius ”అంటారు. . అంతేకాదు”finer than Emerson ”అని పెద్దపీట  వేశారు . ఆయనకున్నవిజన్ఎవరికిలేదని, తనకున్నభావాలనుఅంతప్రస్పుటంగాసాహిత్యంద్వారావెలిబుచ్చినరచయితాకూడాలేడ నిఅని పించుకొన్నాడు. . ఆయన్నుఅనుకరించటంఅసాధ్యమనీ భావిస్తారు. . ”hawtharne is one of the new and far better generations of our times ”గా భావిస్తారు. ఆయన ‘allegory లో జీవించాడు.  సాహితీవిరాట్ స్వరూపుడుగాఆయన్నుకొలుస్తారు. . ”he showed 22 colours of images in his literature ”.  ఆయనరాసిన స్కార్లెట్లెటర్స్లో  ప్యూరిటన్ భావాలను ,ప్యూరిటన్ జీవన  విధానాన్నినిక్షిప్తం చేశాడు. 
           5-9-2002 గురువారం అమెరికా డైరీ నుండి 
      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-13-ఉయ్యూరు  
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నతానియల్ హతార్న్ -1

  నతానియల్   హతార్న్ -1
                            నతానియాల్ హతార్న్ 1804జులై నాలుగున మేసాచూసేత్స్ లోని సేలం లో జన్మించాడు . తలిదండ్రులు కలోనియల్ తరం వారు . నాలుగేళ్ళకే తండ్రి ఎల్లో ఫీవర్ తో  మరణించాడు . ఆయన ఎక్స్ కెప్టెన్ .తల్లి కుటుంబాన్ని తన తండ్రి ఇంటికి మార్చింది . మళ్ళీ మైమ్   కు వెళ్ళారు . అడవుల్లో తిరగటం ,నదుల్లో ఈదటం ,ప్రకృతిని చూసి ఆనందించటం ఇష్టం . లార్డ్ బన్యన్ రాసిన పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్ ,తో బాటు సైన్సు పుస్తకాలూ చదివాడు . ఏడవ  ఏటనే రచయిత కావాలని అనుకొన్నాడు . కవి లాంగ్ ఫెలో ,అమెరికా ప్రెసిడెంట్ గా పని చేసిన పియర్స్ ఇతని క్లాస్ మెట్లు . 1825-37మధ్య ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు . దొరికిన పుస్తకాలన్నీ తెగ చదివేశాడు . ప్యూరిటన్ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోన్నాట్లు గా మధించాడు . చిన్న కదలు  రాసినా ఎవరూ ప్రచురించటానికి ముందుకు రాలేదు . కోపం వచ్చి దాన్ని తగలేశాడు . 1828 లో ఫాన్ షో నవల రాశాడు . ఎవరూ పట్టించుకోలేదు . ఇవాళ అది ”one of the rarest and valuable titles in American literature ”అయింది . సేలం గజెట్ అనే దానిలో ”ది హాలో ఆఫ్ త్రీ హిల్స్ ”ప్రచురించాడు జనమ్ లో చలనం లేదు . గూద్రియాన్ అనే అతను ఆ కధలను ”టోకెన్ పేపర్ ”లో సీరియల్ గా ప్రచురించాడు . తరువాత హాతరన్ ఎడిటర్ అయ్యాడు . ”ట్వైస్ టోల్డ్ టేల్స్”ప్రచురిస్తే మంచి ప్రోత్సాహమే లభించింది .1838లో ప్రెసిడెంట్ జాక్సన్ ను కలిశాడు . స్పందన కనీ పించలేదు . Front Cover
 
         న్యు ఇంగ్లాండ్ వెళ్లి గుర్రాల వ్యాపారం చేశాడు . తరువాత ఒంటరి జీవితం గడిపాడు  .ఎంతో  చదవటం వల్ల  చేయి తిరిగిన రచయిత గా మారాడు . మానవ మనస్తత్వ పరిశీలన అబ్బింది . తన భావిశ్యత్ రొమాన్స్  రచనలకు ఎన్నో వస్తు సామగ్రి దొరికింది. తన కధలను ”రొమాన్సేస్ ”అన్నాడు . వీటిలో ఊహ ,స్వీయ స్వతంత్రం ఉన్నాయి . మాసా చూసేత్స్ కు వెళ్ళాడు . అక్కడ సోఫియా పీ బాడ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు . బోస్టన్ కస్టమ్స్ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది . కొద్దికాలమే చేసి రాజీ నామ చేశాడు . బ్రూక్ ఫాం లో నివాసమున్నాడు . అక్కడి కాపురం వలల  శారీరక మానసిక బౌద్ధిక,నైతిక విద్యాభి వృద్ధిదీకోసం వెయ్యి డాలర్లు ఖర్చు చేశాడు .  విసుగెత్తింది ” it is my opinion that a man’s soul may be buried under a dung heap or in a furrow of the field just aswell as under a pile of money ”. అని బాధ పడ్డాడు . 
    1846 లో మోసెస్ ఫ్రం అన్ ఓల్డ్ మాన్సె రాశాడు .ఇవన్నీ కధలే 1838-45 మధ్య ఇరవై రెండు కధలు రాశాడు . మళ్ళీ స్లమ్స్ కస్టమ్స్ లో చేరాడు కొన్ని నెలలకే ఖాళీ 1849 లో ”కస్టమ్స్ హౌస్ ”రాసి ప్రచురించాడు . .1850 అతని ప్రసిద్ధ రచన ”స్కార్లెట్ లెటర్ ”రాశాడు . అప్పుడే  లేనాక్స్ లో కాపురమున్నాడు. mobi dick  నవలా రచయిత హెర్మన్ మెల్ విల్లీ తో పరిచయమేర్పడింది .ఇద్దరు తరచూ కలుసుకొనే వారు మె ల్విల్లీ మోబీ డిక్ ను హాతార్న్ కు అంకిత మిచ్చాడు మిత్రత్వానికి చిహ్నం గా . తర్వాతా ” .the house of 7 gables ,”a wonder book of girls and boys ” .రాశాడు రెండవది  గ్రీకు కధల సంపుటి . 
                       కాపురం కంకార్డ్ కు మార్చాడు . తోరో గారి వాల్దేన్ పాండ్ కు వెళ్ళాడు నచ్చక తిరిగి వచ్చాడు ”the blithedale romances ”. ప్రచురించాడు .ప్రెసిడెంట్  పియర్స్ కు రాజకీయ ఉపన్యాసాలు రాసి అందించేవాడు హాతార్న్ . ”tangle wood tales ”  రాశాడు .ఇంగ్లాన్ద్ వెళ్లి అక్కడి విశేషాలు రాశాడు రొం లో విహరించాడు .  1860లో  ట్రాన్స్ ఫర్మేషన్ రాసి అచ్చేశాడు. మూడేళ్ళ  తరువాత ”అవర్ ఓల్డ్ హొమ్ ”రాశాడు . 1864 జులై నాలుగున  అరవయ్యవ ఏట నతానియాల్ హతర్న్ మరణించాడు .
                      ఆయన రచనా విశేషాలు ఈ సారి    
                        మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -.7-7-13-  కాంప్-హైదరాబాద్
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డేనియల్ కీస్

  డేనియల్ కీస్

    పాట్రిక్ కాసేడి అనే ఆవిడ డేనియల్ కీస్ అనే అతని పై ‘’flowers for Algernon ‘’అనే పుస్తకం రాసింది .ఈ పుస్తకం మానవాళికి గొప్ప సందేశం అన్నారు .అలాంటి మనుష్యులు మనకెక్కడా కనీ పించరు .ఇలాంటి వారు మనల్ని జాగృతం చేస్తారు ,ఆశ్చర్యం కల్గించి ,మనకు తెలియనిదేదో తెలియ జెప్తారు .మన హృదయాలను విశాలం చేస్తారు .మన సోదరులు అని పించి సన్నిహితులవుతారు .దీన్ని ఒక కద గా చెప్పింది రచయిత్రి .

       చార్లీ ఒక బేకరీ లో పని చేస్తూ తాను చాలా డల్  గా ఉన్నానని భావిస్తుంటాడు .తాను స్మార్ట్ గా అవ్వాలని కలలు కంటాడు .అందరు తనను అభిమానం గా చూడాలని కోరుకొంటాడు .అలా అవటానికి ప్రపంచం లో  సైంటిస్టులు చేసే ప్రయోగాలను గురించి తెలుసు కొంటూ ఉంటాడు .అంతకు ముందే ఆల్జీర్నాన్ అనే నర్సు కు ఆపరేషన్ చేసి ఇంటలిజెన్స్ పెంచి నట్లు చదివాడు . .అలాగే మన చార్లీకి కూడా ఆపరేషన్ చేశారు అతని కోరిక మీద .ఇంటలిజెన్స్ పెరిగింది కాని ఎవరు ప్రేమ గా చూడలేదతన్ని .’’యారో గంట్ ‘’గా మారి ఒంటరి వాడై పోయాడు .అతని తల్లి కూడా కొడుకు లో ఏమార్పు రాలేదని గ్రహించింది .తండ్రికి ఇదే అభిప్రాయం .ఆలిస్ అనే టీచర్ తన ఆపరేషన్ కు కారణం అని చార్లీ తెలుసుకొన్నాడు .ఆమె నూ ప్రేమ కు ఒప్పించ లేక పోయాడు .చివరికి మెంటల్ రిటార్దేషన్ వచ్చేస్తుంది .అల్లెర్గాన్ చని పోతుంది .ఈ కదనే ‘’చార్లీ ‘’పేరు తో హాలీవుడ్ సినిమా తీశారు .ఇదొక సైంటిఫిక్ ఫిక్షన్ .బాక్సాఫీస్ హిట్ కొట్టింది .

           ఇందులో మనిషి తన శక్తి కి మించి ఏదైనా కోరి సాధించాలను కోవటం ప్రమాదకరం అని తెలియ జేస్తారు .సైన్సును  ఇలాంటి వాటి కోసం ఉపయోగింటమూ సరైన పధ్ధతి కాదు అని అర్ధమవుతుంది  .

         కీస్ అనే ఆయన 1927 ఆగస్ట్ తొమ్మిది న అమెరికా లోని బ్రూక్లిన్స్ లో పుట్టాడు .చిన్నప్పటి నుంచి కధలు వినటం చదవటం ఇష్టం .బాగా కధలు చెప్పగలిగే వాడుకూడా .రచయిత కావాలని కోరుకొంటాడు .చాలా కష్టపడే . తెగ చదివే వాడు .కంటికి కొంచెం మసక .నెమ్మదిగా రచనలు చేయటం ప్రారంభించాడు .1950 లో సైకాలజీ లో డిగ్రీ పొందాడు .ఒక పేపర్ కు అసోసియేట్ ఫిక్షన్ ఎడిటర్ గా పని చేశాడు .1952-58 వరకు సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీస్ చాలా రాశాడు .ఒక రకం గా చెప్పా లంటే టన్నుల కొద్దీ ఫాంటసి కామిక్స్ రాశాడు .ఒక సారి అతని మనసులో ‘’మానవుడు తన ఇంటలిజెన్స్ ను పెంచుకో గలిగితే ఏమౌతుంది ?’’అని ప్రశ్న వేసుకొన్నాడు .దాని పై ఒక కద రాశాడు .అది 1959 లో ప్రచురితమయింది .’’క్లాసిక్ రచన ‘’అనే పేరొచ్చింది .దానికి  ‘’సైంటిఫిక్ ఫిక్షన్ ‘’బహుమతికూడా లభించింది .

 

 

 

      తరువాత   కీస్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు .అదే కధను నవల గా మార్చాడు .అది గొప్ప సంచలనం రేపింది .నెబ్యులా అవార్డ్ వచ్చింది .కీస్ కు ‘’impact of scientific advance on human beings ‘’అంటే బాగా ఇష్టం .1968 లో ‘’the touch ‘’ను ,1960 లో’’ ది ఫిఫ్త్ సాలీ ‘’ని రాశాడు..’’పెర్సనాలిటి డిసార్దర్ ‘’ ను ఫిక్షన్ గా రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఇందులో మానవ మెదడు లోని  కాంప్లెక్సిటీ  గురించి రాశాడు .1981 లో ‘’ది  మైండ్స్ అఫ్ బిల్లీ మాలిగాం ‘’రాశాడు .ఇది బిల్లీ అనే వాడి కధే .నిజం గానే జరిగిన కద .మూడు హత్యలూ ,రేపులు చేసిన వాడి మానసిక ప్రవ్రుత్తి వివరణ ఇందులో చూపించాడు .వాడికి శిక్ష పడలేదు .’’he was aquitted of his crimes by reason of insanity caused by multiple personality –the first such decision in history ‘’అని కోర్టు తీర్పు నిచ్చి విడిచి పెట్టింది .

        కీస్ కు మిస్టరి రైటర్ గా మంచి పేరు వచ్చింది .’’schizophernia ‘’అనే మానసిక వ్యాధి ఉన్న ఒకడి కధనుunveiling Claudia –a true story of a serial murder’’గా రాస్తే గొప్ప ప్రశంశాలోచ్చాయి .దీన్ని మల్టిపుల్ పెర్సానాలిటి పై గొప్ప పరిశోధన గా భావించారు .తర్వాత తన జీవిత చరిత్ర ను రాసుకొన్నాడు .దానికి Allegernon Charlie and I –A writer’s journey ‘’అని పేరు పెట్టాడు .ఇది 1999 లో ప్రచురితమైంది .కీస్ రాసిన ఫిక్షన్ లు అన్నీ నేడు జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా సుసాధ్యంయ్యాయి .అంతటి ముందు చూపున్న సైంటిఫిక్ ఫిక్షన్ రచయిత డేనియల్  కీస్ .

            5-9-2002 గురువారం నా  అమెరికా (హూస్టన్ ) డైరీ నుండి

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-13- ఉయ్యూరు

   

          

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంటార్కిటికా

    అంటార్కిటికా

     మేరిలిన్ జే.లాందిస్ అనే ఆమె  అంటార్కిటికా లేక exploration of the extreme 400 years of adventure ‘’అనే పుస్తకం రాసింది అందులో ఎన్నో అపూర్వ విషయాలను తెలిపింది క్రీ.పూ.600-300 లో గ్రీకు  తత్వ వేత్తలు భూమి గుండ్రం గా ఉందని చెప్పారు .దానిపై  క్లై మేట్ జోన్ ,నార్త్ జోన్ సౌత్ జోన్ ,పోలార్ జోన్ లున్నాయని తెలిపారు .క్రీ శ.150 లో టాలెమీ శాస్త్ర వేత్త ‘’గైడ్ టు జాగ్రఫీ ‘’పుస్తకం రాశాడు .519-529 (a.d. ) నౌకలో ప్రపంచాన్ని చుట్టి రావటానికి మాజిలాన్ బయల్దేరాడు మాజిలాన్ జల సంధి అతని పేర వచ్చిందే .1768 -71 లో కెప్టెన్ కూక్ ‘’terra del fuezo ‘’చూశాడు .ఇలా అనేక దేశాల వాళ్ళు ,వివిధ పరిశోధకులు సముద్ర జీవులైన సీల్లను వేల్స్ లను వేటాడి సొమ్ము చేసుకొన్నారు .అందుకని వీరి బారి నుండి ఈ జీవుల్ని రక్షించటానికి 1991 లో ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ను ఏర్పాటు చేశారు ఇంతకీ టెర్రా డెల్ ఫ్యూజియా అంటే ఏమిటి ?అగ్ని దేశం లాండ్ ఆఫ్  ఫైర్అని అర్ధం .అప్పుడు ఆస్ట్రేలియా ను న్యు హాలండ్ అనే వారు .                             అంటార్కిటికా  ను గొంద్వానా పీఠ భూమి కి చెందినది గా భావించే వారు .సీళ్లు వేల్సు ,పోలార్ ఎలిఫెంటు లు  ,పెంగ్విన్లు ,క్రిల్ పక్షులు  ఇక్కడ ఎక్కువ .

      వేల్స్ అంటే తిమింగిలాలు అనేక రకాలున్నాయి .అందులో’’ స్పెర్మ్ వేల్స్ ‘’చాలా ప్రసిద్ధ మైనవి వీటి మీదనే హీర్మాన్ మెల్ విల్లీ ‘’మోబీ ‘’ అనే అద్భుత మైన నవల రాశాడని మనకు తెలుసు .దీని శరీరం 30-60 అడుగుల పొడవుంటుంది .అందులో20 అడుగుల’’ తల’’ చతురస్రాకారం గా ఉంటుంది .ఒక్కసారిగా రైల్ ఇంజన్ లో నుంచి స్టీం బయటికి పెద్ద శబ్దం తో వచ్చినట్లు దీని తల పైన ఉన్న పెద్ద బొక్క లో నుండి గాలి బయటికి వస్తుంది .దీన్ని’’ వాట్’’ అంటారు .చర్మం ముడుతలు గా ఉంటుంది .

images (15) images (14) images (13)          దీని వంపు తలకాయ   అంత పెద్దగా ఉండటానికి కారణం అందులో ‘’స్పెర్మ సెటి ద్రవం’’ నిండి ఉండటమే .అది పార దర్శకం గా ఉండే ద్రవ మైనం లాగా ఉంటుంది .ఇది తీవ్రమైన శబ్ద తరంగాలను సృస్టించటానికి సహక రిస్తుంది .ఎదురైనా జంతువూ ను ఈ భీకర శబ్దం తో(సోనిక్ బ్లాస్ట్)  భయ భ్రాంతులను చేస్తుంది .దానితో దీనికి ఆహారంయ్యే జీవి నిస్చేస్టత పొంది కదలలేక పోతుంది .ఎర గా మిగిలి పోతుంది .ఆహారమై పోతుంది .

        స్పెర్మసేటి అనే దీని ద్రవం ప్రత్యుత్పత్తికి ఉపయోగ పడుతుంది. అంతే కాదు ఇళ్ళలోనూ సముద్ర నావల్లోను దీపాలు వెలిగించాటానికీ ఉపయోగ పడుతుంది .ఏ ఇతర తిమింగిలానికి లేని ప్రత్యెక లక్షణం ఈ స్పెరం వెల్ కు ఉంది అదీ దీని ప్రత్యేకత .అందుకే సృష్టికి ,స్తితికి సముద్ర జీవులను నౌకలను తోక తో ఒక్క దెబ్బ తో తిరగ బడేట్లు చేసి, అంతులేని వినాశనాన్ని కలిగించటానికి ఈ వేల్స్ ఉపయోగ పడతాయి .వాటిని అందుకే మత్చావతారం గా మెల్ విల్లీ భావించాడు .సృష్టికి నాశనానికి దీన్ని సింబల్ గా భావించాడు మెల్ విల్లీ .

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13 –కాంప్ –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జోనాధన్ స్విఫ్ట్ –

    జోనాధన్ స్విఫ్ట్ –

                   గలివర్స్ ట్రావెల్స్ అనే నవల మా తరం చదువరులకు చిర పరిచయమే .ఈ తరం వారి మాట నాకు తెలియదు .అది చదివి కడుపుబ్బా నవ్వుకొనే వాళ్ళం .అయితే ‘’యాహూ ‘’ను ఇవాళ అందరం ఉపయోగిస్తున్నాం .ఆ  నవలా రచయిత ఎవరో ఈ యాహూ పదాన్ని సృష్టించిన వారెవరో పెద్ద గా ఎవరికి తెలీదు .ఈ రెంటిని సృష్టించిన రచయిత జోనాధన్ స్విఫ్ట్ .యాహూ లిలీపుట్, ,బ్రాబ్దింగ్ నాగ్ పదాలను డిక్షనరీ లో చేర్చిన్వాడు పద సృష్టి కర్త స్విఫ్ట్ .

          1667 లోనవంబర్ ముప్ఫై న  ఐర్లాండ్ లోని డబ్లిన్ దగ్గర స్విఫ్ట్ జన్మించాడు .తండ్రి బాల్యం లోనే చని పోయాడు .తల్లి నర్సు గా పని చేసేది .చిన్నప్పటి నుండి బైబుల్ అంటే ఇష్టం .అంకుల్ గాడ్విన్న్ ఇతన్ని తీర్చి దిద్దాడు .ఐర్లాండ్ లో పుట్టినా తాను ఇంగ్లాండ్ వాడినే నంటాడు స్విఫ్ట్ .కవిత్వం ,చరిత్ర నేర్చాడు .1686 లో ట్రినిటి కాలేజి ఇతనికి డిగ్రీ ని ఇస్తూ స్విఫ్ట్ యదార్ధం గా డిగ్రీ ని సాధించలేదని ,కాని స్కూలు దయ వాళ్ళ డిగ్రీ ని ప్రదానం చేస్తున్నామని తెలిపింది .

        1688 లో’’a tale of tub ‘’రాశాడు .ఇది బ్రిటన్ లోని మత పరిస్తితులను అల్లిగారికల్ గా ఎత్తి చూపింది .అప్పుడే ఇంగ్లాండ్ లో రాచరిక వ్యవస్తలో మార్పులు ,వచ్చాయి మత ప్రవర్తకుల పెత్తనం పెరిగింది .అంతా ఫ్లూయిడ్ గా ఉన్నాయి పరిస్తితులు .కాధలిక్ ,ప్రోతెస్తంట్ల మధ్య తీవ్ర తగాదాలు ,కుట్రలు ,కుతంత్రాలతో అస్తవ్యస్తం గా ఉంది .లో స్విఫ్ట్  గిడ్డి నేస్అంటే నాసియా వచ్చింది దీని వల్ల తలనెప్పి తో జీవితాంతం బాధ పడే వాడు .మేన్నేరి అనే వ్యాధి కూడా వచ్చింది .దీని వల్ల  చెవిలోని ‘’virtigo ‘’విపరీతం గా చలించేది అందువల్ల శబ్దాలు వినిపించక ,అంతా రణ గోణ ధ్వని గా ఉండేది పాపం 

 images (12) images (11) images (10)

            1691 లో ‘’ode to the Athenian society ‘’రాశాడు .టెంపుల్ అనే వాడు స్విఫ్ట్ ను బాగా ప్రోత్సహించేవాడు బ్రిటన్ రాజు మూడవ విలియం ను త్వరగా ఎన్నికలు నిర్వహించమని అతని ప్రోద్బలం తో జాబు రాశాడు .స్విఫ్ట్ ను వేరినా ,స్టెల్లా అనే ఇద్దరు ముద్దుగుమ్మలు వలచారు .విపరీత ధోరణలు దేనిలో ఉన్నా ఎడా పెడా వాయించేసే వాడు రచనల్లో .అవగాహన లేని పాఠ

 కుల్ని ,ఆ నాటి చదువుల్నీ ఎవర్నీ వదలలేదు .1701 లో రాసిన నాలుగు పుస్తకాలు బాగా అమ్ముడై మంచి ప్రచారం తెచ్చాయి .

            ఆ రోజుల్లో జాన్ పాట్ రిడ్జ్ అనే ఆయన జాతకాలు రాసి ,జ్యోతిష్యం చెప్పేవాడు .వాటిని పేపర్లలో ప్రచురించేవారు .అది చూసి స్విఫ్ట్ సరదాగా ‘’predictions for the year 1708 రాసి ప్రచురించాడు .జనం విపరీతం గా మోజు పడి కొని చదివారు .అందులో పాట్ రిడ్జ్ అనే జ్యోతిష్కుడు ఫలానా రోజు రాత్రి జ్వరం వచ్చి చని పోతాడు అని రాశాడు .జనం నిజమే నని నమ్మి ఆయనకు సానుభూతి సందేశాలు పంపారు .సంతాప సభలు నిర్వహించారు ఈ విషయం తెలుసుకొన్న పాట్ రిడ్జ్ ‘’ఒరే!నేను చావలేదురా బాబూ! బతికే ఉన్నాన్రా నాయనోయ్ ‘’అని పేపర్ ప్రకటన ఇచ్చుకొన్నాడు .అంటే సెటైర్ కు ఎంత ప్రాధాన్యత తెచ్చాడో స్విఫ్ట్ అర్ధమవుతుంది .ప్రెస్ వాళ్ళు కూడా దీనికి సహకరించారని చెవులు కొరుక్కున్నారు .

       1711 లో ‘’ది ఎక్సామినర్ ‘’రాశాడు .1711 లో ‘’అన్నే ‘’బ్రిటన్ రాణి అయి మూడేళ్లకే చని పోయింది .స్విఫ్ట్ కు ఆనాటి మేటి కవి ‘’అలేక్సాండర్ పోప్’’ తో మంచి పరిచయం కలిగింది .ప్రియురాలు స్టెల్లా కోసం’’ ది జర్నల్ టు స్టెల్లా ‘’రాశాడు .తన రచనల్లో వ్యంగ్యంపాలేక్కువ ఆవటం వల్ల  స్విఫ్ట్ ను చాలా మంది ద్వేషించారు .1716 లో స్టెల్లా ను పెళ్ళాడాడు. అయినా హేస్తేర్ అనే అమ్మాయి తో సల్లాపాలు సాగించాడు .చర్చి ప్రీస్ట్ హోదాను స్విఫ్ట్ పొందాడు

         1721 లో ది గలివర్స్ ట్రావెల్స్ రాశాడు .స్విఫ్ట్ .బ్రహ్మాండ మైన విజయం సాధించాడు తెగ బడి చదివి నవ్వుకొన్నారు అందులోని వ్యంగ్యం అర్ధం కాక చాలా మంది బుర్రలు పగల కొట్టుకొన్నారు జుట్టు పీక్కున్నారు .’’ఐరిష్ హీరో ‘’అయి పోయాడు ఒక్క సారిగా .గలివర్స్ ట్రావెల్స్ లో ప్రభుత్వాల అసమర్ధత ,నిస్చేస్టత ,మతాధికారుల కంపు రాజకీయాలు ,రాజకీయ అస్తిరత్వం ,శాస్త్రీయ విపరీత ధోరణులు ,sexual ambiguities ,తో బాటు మిగిలిన మానవ తప్పిదాలనన్నిటి ని దూది ఏకి నట్లు ఏకి పారేశాడు .తాను చూసినవి అనుభవించినవి అన్నీ ప్రతీకాత్మకం గా వ్యంగ్య వైభవం గా తీర్చి దిద్దాడు దాన్ని .1728 లో భార్య స్టెల్లా ,ప్రేమికురాలు వానేస్సా మరణించారు

       స్విఫ్ట్ సమకాలికుడైన కవి పోప్ మరణించి స్విఫ్ట్ ను ఒంటరి వాడిని చేశాడు .ఆప్తు లందరూ చని పోవటం తో కృంగిపోయాడు .తాను ఇంకా పదమూడేళ్ళ కు చని పోతాడు డు అనగా ‘’verses on the death of dr.Swift ‘’రాసుకొన్నాడు .అందులో

‘’perhaps I may allow the dean –had too much satyr in his heaven

  And seemed determined not to starve  it –because no age could more deserve it

  Yet malice never was his aim –he lashed the vice ,but spared the name

  NO Individual could resent –Where thousands were equally meant ‘’ఒకటి

          స్విఫ్ట్ జబ్బు బాగా తిరగ బెట్టింది .తనకు బంధువులు మిత్రులు అందరు పోయారు .విచారం తో కుమిలి పోయాడు అంతటి హాస్య రచయితా .1742 లో మెడికల్ కమిషన్ ‘’Swift was unsound mind and memory ‘’అని ప్రకటించింది .కొంత మంది విమర్శకులు ఈ జబ్బు వల్లే పిచ్చ పిచ్చగా రాసి పారేశాడు స్విఫ్ట్ అన్నారు ‘’mad man ‘’అని ముద్ర వేశారు .1745 అక్టోబర్ 19 న స్విఫ్ట్ ఎనభై అయిదవ ఏట భౌతికం గా మరణించాడు .తనను గురించి ‘’he gave the little wealth he had –to build a house for fools and mad

And showed by one satiric touch –No nation wanted it so much ‘’ అని ముందుగానే రాసుకొన్నాడు .తన వీలు నామాలో తన యావదాస్తిని తన లాంటి జబ్బు తో బాధ పడే వారికి ఆస్పత్రి కట్టించి సేవ చేయటానికి ఉపయోగించాలి అని చని పోవటానికి అయిదేళ్ళ ముందే తన కజిన్ మార్తా వైట్ వేకు ఉత్తరం రాశాడు .స్విఫ్ట్ మరణానికి స్పందించిన ఈట్స్ కవి ‘’Swift sleeps under the greatest epitah of history ‘’అని కితాబిచ్చాడు .స్విఫ్ట్ తన సమాధి మీద ఈ క్రింది వాక్యాలు రాయించమని ముందే ఆదేశం ఇచ్చాడు .

‘’here lies the body of Jonathan swift doctor of divinity ,dean of the cathedral church ,where savage indignation can not longer lacerate his heart

Go traveler and imitate if you can –one who with all his mighty championed human liberty ‘’

     అదీ చరిత్రను రచనను ట్విస్ట్ చేసి షిఫ్ట్ చేసి,ఆ మలుపులో మహోన్నతం గా నిలిచిన వ్యంగ్య రచనా దురంధరుడు జోనాధన్ స్విఫ్ట్ కద .ఒక చెవిటి వాడి అరణ్య రోదన .నాటి రాజకీయ ,మత నాయకులను వెర్రి వేషాలేసే ప్రతి వెంగలప్పను సటైర్ తో ఫెడీ మని కొట్టి బుద్ధి చెప్పిన రచయిత స్విఫ్ట్ వ్యంగ్యాత్మకత కు పెద్ద పీట వేశాడు .

           నిజం గా  స్విఫ్ట్ ఐర్లాండు   ,ఇంగ్లాండ్ లను దాటి ఎక్కడికి వెల్ల లేదు .అయినా ఊహాత్మకం గా ,వ్యూహాత్మకం గా త్రావేలోగ్ రాశాడు .అందులో ప్రజలు ఎలా జీవిన్చారో చెబుతూ ఎలా జీవించాలో ఎరుక పరచాడు .యాత్రా రచన లో వ్యంగ్యాత్మకత ను ప్రవేశ పెట్టిన వాడు స్విఫ్ట్ .ఆయనకు మాస్ మనిషి అంటే అయిష్టం .ప్రత్యెక వ్యక్తులంటే వీరాభిమానం .అందుకే అన్ని రకాల ప్రత్యేకతలు గల పాత్రలను సృష్టించాడు పొట్టి మనుషులు ,పొడుగాటి వారు ,రాజుకు సలహాల నిచ్చే పనికి రాని వెధవాయిలు అందరు ఆ నవలలో ప్రాణం పోసుకొన్నారు .ఎవరి ప్రత్యేకత వారిదే .ఈ పుస్తకం రాసి ‘’I have finished my travels .they are admirable things will wonderfully mend the world ‘’అని విశ్వసించాడు స్విఫ్ట్ .

           జార్జి ఆర్వెల్ అనే మహా రచయిత ‘’ప్రపంచం అంతా నాశనం అయి పోతే’’ ఆరు ‘’పుస్తకాలు నేను దాచుకొంటాను .అందులో గలివర్స్ ట్రావెల్స్ ఒకటి ‘’అని మహా గొప్ప గా మెచ్చుకొన్నాడు ..స్విఫ్ట్ ,విమర్శకుడు ,రాజకీయ దురంధరుడు ,ప్రచార సాధకుడు ,మతాదికారి , వ్యంగ్యాత్మక రచయిత .ఈట్స్ కవి ‘’swift haunts me ‘’అని పొగిడాడు .అంతే కాదు ‘’the greatest writer of English prose ,and the greatest man who has ever written great English prose ‘’అని ఎస్టిమేట్ చేశాడు .

          స్విఫ్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్ ను తెలుగు లోకి అనువాదం చేసింది జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి ‘’గారుఅని నాకు జ్ఞాపకం .కరెక్ట్ అని నేను చెప్పలేను .

          ఇది నా అమెరిక డైరీ 8-9-2002 నాటిది .

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13-  కాంప్ –హైదరా బాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ‘’నాసా’’ సందర్శనం

మా ‘’నాసా’’ సందర్శనం

       17-9-2002 మంగళ వారం మధ్యాహ్నం హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దరిని ,మా మనవడు ఆరు నెలల శ్రీకేత్ ను కారు లో నాసా కేంద్రానికి మా అమ్మాయి విజ్జి తీసుకొని వెళ్ళింది .మా అల్లుడు అవధాని రెండు  వారాల క్రితం తమ్ముడి పెళ్ళికోసం ఇండియా వెళ్ళాడు .విజ్జికి జ్వరం దగ్గు ఉన్నా బయల్దేర దీసింది .కితం రాత్రి సుజాత అనే ఒక తెలిసిన ఆవిడ ఇంటి నుండి ‘’నాసా ‘’కు వెళ్ళటానికి కన్సెషన్ కూపన్లు తీసుకొన్నాం .ఈ సుజాత కూతురికే నేను అన్నప్రాసన చేయించాను .బెజవాడ అమ్మాయి,వైశ్యులు .భర్త మంచి వాడు .అతనే ఆఫీస్ నుండి కూపన్లు తెచ్చి ఫోన్ చేసి చెప్పాడు .

           మధ్యాహ్నం 12-30 అయింది బయల్దేరే సరికి .వీళ్ళ ఇంటి నుండి 40 మైళ్ళు .హైవే మీద ఒక గంట ప్రయాణం .ఇంతకూ మునుపు ఎప్పుడూ విజ్జి హైవే మీద కారు నడప లేదు .ఇదే మొదలు .అయినా హాయిగా ధైర్యం గా డ్రైవ్ చేసింది .కంగారు అసలు పడలేదు .టికెట్ ఖరీదు మామూలుగా అయితే 20 డాలర్లు ఒక్కొక్కరికి .అంటే మా ఇద్దరం సీనియర్లు కనుక 18 డాలర్లు ఒక్కోరికి .మాకు ఇచ్చినవి ‘’హాఫ్ చార్జి కూపన్స్ ‘’అంటే మా ముగ్గురికి కలిపి 20డాలర్లే అయింది .ఇదే మామూలుగా కొంటె 60 డాలర్లు  అయ్యేది .

 nsbri_bg_466 72437998

 

 

 

         నాసాకు మధ్యాహ్నం ఒంటి గంటన్నర కు చేరాం .సెక్యూరిటి చెకప్ బానే స్ట్రిక్ట్ గా చేశారు అందర్నీ .లోపల బిల్డింగ్ లో వ్యోమ గాముల దుస్తులు ,మోడల్స్ ప్రదర్శన గా ఉంచారు .అక్కడున్న యంత్రాల దగ్గర కూర్చుని ఆపరేట్ చేసి ఎదురుగా ఉన్న టి.వి స్క్రీన్ మీద చూస్తె  మనం నిజం గానే స్పేస్ లోకి వెళ్ళిన అనుభూతి కనీ పిస్తుంది .భలేగా ఉంటుంది .అక్కడి నుండి మొత్తం సైట్ చూడటానికి నాలుగు కంపార్ట్ మెంట్స్ ఉన్న’’ ట్రెయిన్ కార్’’ ఉంది .టైర్ చక్రాలమీద రోడ్డుపై నడుస్తుంది .అందులో ఎక్కే ముందు అందరికి కూపన్లు ఇస్తారు .వాటిని తిరిగి వచ్చిన తర్వాతా రిటర్న్ చేయాలి .ట్రైన్ ఎక్కేటప్పుడు మెటల్ డిటెక్టర్ర్ తో తనిఖీ చేశారు .ఎక్కేముందు మనకు కావాలంటే ఫోటో తీస్తారు .తిరిగి వచ్చిన తర్వాతా దాన్ని మనం కలెక్ట్ చేసుకో వచ్చు .మూడు ఫోటోలలో రెండు పెద్దవి ,ఒకటి లామినేషన్ తో రెండు వైపులా కనీ పించేట్లు ఫోటో పెట్టి ,ఒక కీ చైన్న్ తో సహా అంద జేస్తారు .దీనికి కొంత డబ్బు తీసుకొంటారు . .వీటికి వెనకాల  ఆస్ట్రో నాట్ బొమ్మ ,  స్పేస్ షిప్ ఉంటాయి .

           ట్రైన్ లో విషయాలు వివ రించి చెప్పే కామేన్టేటర్ ఉంటాడు .ట్రైన్ రెండు గంటలకు బయల్దేరింది .మొత్తం 1600ఎకరాల సువిశాల మైన స్తలం .ఈ సెంటర్ లో 14000 మంది ఉద్యోగులు పని చేస్తూంటారు .ఇదే national aeronautical space administration అంటే N.A.S.A.ఇక్కడ దీని పేరు లిండన్ బి.జాన్సన్ స్పేస్ సెంటర్ .ఇలాంటిదే ఫ్లారిడా రాష్ట్రం లో ఇంకోటి ఉంది దాన్ని జాన్ ఎఫ్ కేన్నేడిస్పేస్ సెంటర్ అంటారు .ఇక్కడ వ్యోమగాములకు శిక్షణ నిస్తారు .అక్కడ నుండి అంత రిక్షం లోకి స్పేస్ షిప్ ను పంపుతారు .అదీ తేడా .కేనేడీ ప్రెసిడెంట్ అయినప్పుడు జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ .కేన్నేడి మరణం తర్వాత జాన్సన్ ప్రెసిడెంట్ అయాడు .టెక్సాస్ వాడు కూడా .గురు శిష్య సంబంధం వీరిద్దరిది .

            లిక్విడ్ నైట్రోజెన్ ను -320 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద నిలువ ఉంచే టాంకులను ,వీటిని కంట్రోల్ చేసే బిల్దిన్గులను చూపించారు .కామేన్ టేటార్ అనుభవం ఉన్న వాడేకాని ముసలాయన .దమ్ము చాలలేదు అని పించింది .పదిహేడో నంబర్ బిల్డింగ్ అంతా పూర్వం కంట్రోల్ బిల్డింగే నట .అక్కడ సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంది .ముందు మెషీన్లుదాని తరువాత గ్లాస్ వెనక సీట్లు .ముందు వరుసలో రిసేర్వేడ్ సీట్లున్తాయి .అందులోనే ప్రెసిడెంట్ జాన్సన్ ,జిమ్మీ కార్టర్ ,క్లింటన్లు  కూర్చుని కంట్రోలింగ్ ను చూసే వారట .ఇప్పుడు మేము వాళ్ళు కూర్చున్న సీట్లలో కూర్చుని చూశాము .అదొక గొప్ప అనుభూతి గా ఫీల్ అయ్యాం .

             ఇక్కడి నుండి స్పేస్ షిప్ ను నిర్మించే బిల్డింగ్లో  వ్యోమ గాములకు శిక్షణ నివ్వటం అంతా జరుగుతుంది .కొంతమంది  ఆస్ట్రో నాట్స్  ట్రైనింగ్ పొందుతూ కనీ పించారు .ఫోటోలు తీశాము .మమ్మల్ని చూసి వాళ్ళూ చేతులూపారు ఆనందం గా .వాళ్ళు కింద చేంబర్ లో ఉంటారు .మనం పైన బాల్కని లో ఉండి వాళ్ళను గ్లాస్ లో నుంచి చూస్తాం. మధ్యలో అంతా ఫైబర్ గ్లాస్ తేర.ఎవరికి ఇబ్బంది ఉండదు .ఎవరి పని వాళ్ళు చేసుకో వచ్చు .ఇక్కడి నుండి తిరిగి వచ్చేసరికి 3-45 అయింది .దారిలో పూర్వం అంత రిక్షం లోకి పంపిన స్పేస్ షిప్ ల మోడల్స్ చూశాం .వీటినీ ఫోటోలు తీశాం .

             మాతో చూసిన వాళ్ళలోహైదరాబాద్ కు చెందిన  ఒక తెలుగు బావా ,బామ్మర్దీ కనీ పించారు .బావ మెడికల్ ఆఫీసర్ .కొడుకులు డల్లాస్ లో ఉన్నారట .బామ్మర్ది హూస్టన్ లో సాఫ్ట్ వేర్ లో ఉద్యోగి . ఆయన భద్రాచలం వాడు .విజయవాడ కు తరచూ వస్తూ ఉంటాడట.ఇద్దరం ఒకరికొకరం ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళం అని పించింది .అదీ తమాషా .పరాయి దేశం లో మనోళ్ళు కన్పిస్తే అంత పరవశం అన్న మాట .4-45 కు ఒక పెద్ద హాల్ లో పెద్ద స్క్రీన్ మీద‘’to be an astronaut ‘’అనే సినిమా చూపించారు .ఇందులో ట్రెయినింగ్  ,కంట్రోల్ వగైరా విశేషాలన్నీ తెలియ జేశారు .అందులో ఉత్సాహం ఉన్న వారికి స్పూర్తి దాయకం గా ఉంది .పూర్వం మేము గుజరాత్ లో స్వామి నారాయణ టెంపుల్ లో కూడా ఆయన జీవిత చరిత్ర ను ఇలానే చూశాం అని జ్ఞాపకం వచ్చింది .

            సాయంత్రం 5-45 కి బయల్దేరి 6-45 కు ఇంటికి చేరాం .

              15-9-2002 ఆదివారం అమెరికా డైరీ నుండి

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-13- కాంప్ –హైదరాబాద్ 

 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా లో కూచిపూడి అరంగేట్రం

       అమెరికా లో కూచిపూడి అరంగేట్రం

       హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి  మధ్యాహ్నం నాలుగింటికి బయల్దేరి పోస్ట్ ఓక్ లోని వావిలాల వారమ్మాయి ‘’ఏమెండా ‘’ఇంటికిమా అమ్మాయి విజ్జి మమ్మల్ని తీసుకొని వెళ్లి దింపింది .  .అక్కడి నుంచి వావిలాల లక్ష్మి గారు వాళ్ళ కారు లో నన్ను ,మా ఆవిడ ను రైస్ యూని వేర్సిటి కి దాదాపు ఇరవై నిమిషాలు డ్రైవ్ చేసి తీసుకొని వెళ్ళింది .అక్కడ పచ్చని చెట్లూ వాతా వరణం చాలా బాగుంది .మన ఆంధ్రా యూని వేర్సిటి లా కనీ పించింది అయితే ఇక్కడ ‘’సముద్రం బాక్ డ్రాప్’’ గా లేదు అంతే తేడ  .ఈ ప్రాంతం లో స్తలాలన్ని చాలా ఖరీదైనవి .మంచి బిజీ సెంటర్ .

 

 

 

doctor Rice 

         అక్కడ Hamman hall   ఆది టోరియం లో సాయంత్రం ఆరు గంటలకు పుచ్చా రమ్య శ్రీ అనే అమ్మాయి చేత‘’రంగ ప్రవేశ కార్య క్రమం ‘’ఉంది .అప్పటికే రమ్య భారత నాట్యం లో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించింది .ఇప్పుడు కూచి పూడి నాట్యం చేసి రంగప్రవేశం ఈ రోజు న చేస్తోంది .వచ్చ్చిన వారందరికీ అనేక రకాలైన స్నాక్స్  ,సమోసాలు ,వడ ,స్వీట్లు ,దాదాపు పది రకాలు పెట్టారు .అందరికి కోక్ ఇచ్చారు .అందరూ తెలుగు వాళ్ళే .అంతా మన తెలుగు వాతా వరణమే కనీ పించింది .అందరు మంచి తెలుగునే మాట్లాడుతున్నారు .ముచ్చటేసింది .ఆడవాళ్ళంతా చీర ,బొట్టు లతో అమ్మతల్లుల్లా,ఆడపడుచుల్లా  వచ్చారు .ఇంతమంది తెలుగు దేశపు ఆచార వ్యవహారాలతో వచ్చినందుకు ముచ్చట తో బాటు ఆశ్చర్యం వేసింది .హాలు పై అంతస్తులో ఉన్నది చిన్న హాలె .అందరికీ రుమాళ్ళను సెంటు లో తడిపి ఇచ్చారు .ఆడవాళ్ళకు ‘’చిన్న పూర్ణ కుంభం ‘’,రుమాలు ,జీడిపప్పు కిస్మిస్ పాకెట్ ,సుపారి పాక్ చేసి అందించారు .

          పుస్తకాలను పెట్టి అందులో అందరి చేత శుభా కాంక్షలు రాయించారు .అక్కడే రమ్య నాట్య భంగిమతో ఉన్న ఒక పెద్ద ఫోటో ను పాలెట్ పై ఉంచారు .దాని పై ప్రత్యెక పెన్ను తో అందరి చేతా శుభా కాంక్షలు రాయించారు .నల్లని ఆ బార్డర్ పై ఆ ప్రత్యెక పెన్ను తో రాస్తే అక్షరాలూ తెల్లగా కనీ పించి ఆశ్చర్యమేస్తుంది .నేను ‘’రమ్య –రస రమ్యం గా నాట్యం చేసి ,ప్రేక్షక హృదయాలను రసప్లావితం చేయాలి –గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి -713-784-434అని అభి నందించాను .నన్ను చూసి ఇంకొకాయన ‘’శుభా కాంక్షలు ‘’అని తెలుగు లో రాశాడు .మిగిలిన వాళ్ళంతా ఇంగ్లీష్ లోనే రాశారు .ఆరు గంటలకు  టంచన్ గా కార్యక్రమం ప్రారంభ మైంది .

         రమ్య గురువు’’ రత్న పాప’’ అని అందరికి పరిచయమైన ‘’రత్న కుమార్ ‘’.ఈమె  ప్రసిద్ధ జాన పద గాయిని వింజమూరి  అనసూయా దేవి (ఇప్పుడు అవసరాల ) దేవి కూతురు .సీతా అనసూయలు కృష్ణ శాస్త్రి గారి మేన కోడళ్ళు .ఆయన పాటలను, జానపద గేయాలను ఆంద్ర దేశమంతా తిరిగి గొప్ప ప్రచారం కల్పించిన గాయినీ మణులు ఆ సోదరిలిద్దరు .27 ఏళ్ళ క్రితం రత్న పాప మద్రాస్  నుండి అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ నగరానికి వచ్చి స్తిర పడింది .మొదట్లో ‘’ డల్ ‘’గా ఉన్నా క్రమేపీ పుంజు కొంది .’’అంజలి ‘’అనే డాన్స్ స్కూల్ పెట్టి అందరికి నాట్యం నేర్పిస్తోంది వెంపటి చిన సత్యం గారి వద్ద మద్రాస్ లో శిక్షణ పొంది ఆయన ముఖ్య శిష్యురాలిగా రత్న పాప గుర్తింపు పొందింది .మా పెద్దక్కయ్యా వాళ్ళు ఈమెను గురించి చెబుతూండే వారు .ఐప్పటికిఇక్కడ  అయిదు వందల మందికి పైగా రత్న పాప వద్ద నాట్యం అభ్యశించి పేరు తెచ్చుకొన్నారు .

          కార్యక్రమం అయిన తర్వాత అనసూయ గారి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకోన్నాం .’’నేను గాడేపల్లి కృపానిధి గారి బావ మరిదిని .మా అక్క లోపా ముద్ర .ఆవిడ మామ గారు పండిట్ రావు ‘’అని చెప్పాను .ఆవిడ వెంటనే‘’మీరందరూ మా బంధువు లండీ .మిమ్మల్నిఇక్కడ   చూసి నందుకు చాల సంతోషం గా ఉంది .’’అని అనసూయ గారు ఆప్యాయత ఒలక బోశారు .వావిలాల లక్ష్మి గారు కూడా తమకు బంధువే నని అనసూయ గారు చెప్పారు .మాటలలో కృష్ణ శాస్త్రి గారి భార్య ‘’రాజ హంస ‘’గారు మరణించి నట్లు చెప్పారామే .’’మీకు తెలుసా “’అని అడిగారు తెలుసు నని చెప్పాం. ఆమెను ఈవిడ ‘’రాజత్తయ్య ‘’అని  ఆత్మీ యం గా పిలిచింది తరువాత వాళ్ళమ్మాయి రత్న పాప ఫోన్ నంబర్ ఇచ్చి తరచూ మాట్లాడుకొందాము అని చెప్పారు .ఆవిడా

 కొడుకు ,కోడలు హూస్టన్ లోనే ఉన్నారని చెప్పింది .రత్న పాప చక్కని ఇంగ్లీష్ లో కార్యక్రమాన్ని ప్రెసెంట్ చేసింది అందరి మన్ననలు పొందింది .అనసూయ గారి అబ్బాయి ఫోటోగ్రాఫర్ .రత్న పాప కూడా మేము బంధువులం అని తెలిసి ఎంతో గౌరవాన్ని చూపి మాట్లాడింది .

         రమ్య తల్లి ,తండ్రి ‘’నాసా ‘’ లో పెద్ద  సైంటిస్ట్ లు . లు .రత్న పాప తో మొదటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు .ఇదే స్టేజి మీద రమ్య పదేళ్ళక్రితం భారత నాట్యం లో అరంగేట్రం చేసిందట .ఇప్పుడు ఊచి పూడి .చికాగో యూని వర్సిటి లో ‘’మ్యూజిక్ అండ్ డాన్స్ ‘’లో డిగ్రీ చేస్తోంది .రమ్య టీచర్ ఆఫ్రో అమెరికన్ మహిళఈమె కూడా శిష్యురాలి అరంగేట్రం చూడ టానకి వచ్చింది  .మ్యూజిక్ అండ్ డాన్స్ లోప్రోఫేసర్ ఒకాయన వాషింగ్టన్  నుంచి ప్రత్యేకం గా వచ్చాడు చూడ టానికి .రమ్య సినిమా స్టార్ దివ్య వాణి ,టి.వి.ఆంకర్ ఉదయభాను లకలగలుపు గా ఉందని పించింది .

             నాసా లో పని చేసే తెలుగు వారంతా తరలి వచ్చారట .వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులే .బందరు లోని డాక్టర్ మోచర్ల పద్మనాభ రావు గారి అమ్మాయట ఒకావిడ,భర్తా  పరిచయమైనారు .బెజవాడ లక్ష్మీ జనరల్ వస్త్ర వ్యాపారి శిష్ట్లా లక్ష్మీపతి శాస్రి గారి అమ్మాయి కూడా పరిచయమైంది .పుచ్చా ,కొండముది ,రాచకొండా ,ఐనంపూడి ఇలా చాలా కుటుంబాల వారు వచ్చారు .రమ్య అమ్మమ్మ మన పూర్వకాల స్త్రీలా గా కనీ పించింది .తెలుగుదనం అమెరికాలో అందునా హూస్టన్ లో ప్రతి ఫలించి నందుకు ఆనందం గా ఉంది .

            రమ్య నాట్యానికి నేపధ్య గానం జే.రమేష్ –చాలా బాగా పాడాడు .భావం స్పుటంగా ఉంది .గాత్రమూ బాగుంది .ఏన్ .కే.కేశవన్  .మృదంగం’’ వాయించి ‘’వదిలాడు .చక్కని ధృతి ,శబ్ద మాధుర్యం ,.మృదంగాన్ని  మైనం లాగా మలచి ఏ షేప్ కావాలంటే ఆషేప్ తెప్పించిన ఘనుడు కేశవన్ .ముత్తుకుమార్ ఫ్లూట్ శ్రావ్యం గా ఉంది .సావిత్రి సత్యమూర్తి అనే సంగీతం మేస్టారు వయోలిన్ వాయించింది .ఆమె కుమార్తె అనూరాధా సుబ్రహ్మణ్యం గాత్రం తో సహకారం అందించింది .నట్టువాంగం రత్న పాప చేసింది వీళ్ళంతా మేచూరేడ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లే . ఎన్నో ప్రదర్శనలిచ్చి పేరు పొందిన వారె .మంచి కాంబినేషన్ తో రమ్య నాట్యానికి ఎంతో బాగా తోడ్పడ్డారు .

               పుచ్చా రమ్య గణేశ ప్రార్ధన తో కార్యక్రమాన్ని ప్రారంభించింది .తరువాత మాండూక శబ్దం ,తరంగం ,జావళీ ,మోహినీ ,శివ పంచాక్షరి ,తిల్లానాలు చేసి మంగళం తో కూచిపూడి ని పూర్తీ చేసింది .మంచి ఫీచర్లు భావ ప్రకటనా సౌలభ్యం తో ,తేలికగా  ప్రదర్శించింది .అయితే ‘’శివ పంచాక్షరి ‘’లో కదలికలు చాలా’’ డల్’’గా ఉన్నట్లు అని పించాయి .ఇంకా వేగం, వెరైటీ ఉంటె ఇంకా బాగా రక్తి కట్టి న్డేది .అల్లాగే తిల్లానా లో వోకల్ మాడ్యులేషన్ కొంచెం మారిస్తే రమేష్ గాత్రం మరింత వన్నె తెచ్చేది .ఏమైనా మూడు గంటల పాటు ఏదో రస  లోక విహారం చేసిన అనుభూతి పొందాం .కార్యక్రమం ఖచ్చితం గా రాత్రి తొమ్మిదింటికి పూర్తీ అయింది .మనది కాని దేశం లో మనదైన సంప్రదాయం తో‘’రసరమ్య ‘లోక విహారం చేయించారు అందరూ .కూచి పూడికి ఇక్కడ చక్కని గుడి కట్టారని పించారు .మోహిని నాట్యం లో కృష్ణ శాస్త్రి గారి పాట మధుర మధుర మంజుల గానమే అయింది .దానికి రమ్య సలిపిన మనోహర నాట్యం హృదయం మీద చెరగని ముద్ర వేసింది .వర్షం తో వచ్చిన ఈ  సాయంత్రం సంగీత సరిగమ చినుకులు ,నాట్యపు పులకరరింపుల తో ఇంపు గా సోంపు గా ఉన్న్నాయి .దీనిని ఏర్పాటు చేసి గోప్ప అతిధ్యాన్నిచ్చిన రమ్య తలిదండ్రులు ,నాట్యం చేసిన రమ్యా ,మాకు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూపించిన మా ‘’అప్పన కొండ మామయ్యా ‘’కూతురు వావిలాల లక్ష్మి గారికి అభినందనలు .

       15-9-2002 ఆదివారం నాటి అమెరికా లోని టెక్సాస్  రాష్ట్రం  లో ఉన్న హూస్టన్ లో నేను రాసుకొన్న డైరీ నుండి

             మీ –గబ్బిట దర్గా ప్రసాద్ –6-7-13- కాంప్-హైదరాబాద్

           

 
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2 రచనా విశేషాలు

జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2

              రచనా విశేషాలు

 స్టెయిన్ బెక్ పాత్రలన్నీ వ్యక్తీ గతమైనవి .అంతరంగాలలో అవి పూర్తీ స్వేచ్చను పొంది ,విభిన్న స్వభావాలతో కనీ పిస్తాయి హాస్యం తో అందరితో మంచి సంబంధాలను కలిగి ఉంటాయి .అమెరికా లోని నేచరిస్టులు రెండు రకాలు .మొదటి రకం హృదయ వాదం అనేవారు ,రెండోరకం బుద్ధివాదులు .ఇందులో హృదయ వాదులలో బెక్ స్తానం ఉంది .అతని ‘’కానరీ రో ‘’లో విషయాలకున్న డిమాండ్ కు ,హృయానికున్న డిమాండ్ కు ఉన్న స్పర్ధ వ్యతిరేకత చిత్రీకరించాడు .పెరల్ నవల సీరియస్ ‘’పారబుల్ ‘’అన్నారు ఇందులో కినో అనే చేపల వాడికి నాగరక జీవుల విషయం తెలీదు వారు తన లాంటి వారి ఉనికికే ప్రమాదం అనీ గుర్తించలేని వాడు అతని అభిప్రాయం లో జ్ఞానమే శక్తి వంతమైనది ,అంతేకాక ఈ భౌతిక ప్రపంచం పై నియంత్రణ శక్తి కలిగి ఉండటం చాలా మంచిది .

        కానరీ రో లో అమెరికా బాలురను ఉదాహరణ గా తీసుకొని రాశాడు బెక్ .అందులో విషయ వాంచల కున్న డిమాండ్ కు ,ఆత్మ శక్తికి మధ్య ఉన్న సంఘర్షణ కనీ పిస్తుంది . సైన్సు ను పరిష్కారం సూచిక మైనదాని గా  భావించి రాశాడు . .అతడు స్తానికుల చేత బహిష్కరింప బడ్డ వాడు అయినా అతని విజ్ఞాన తృష్ణ కు అంతులేదు దానితో అందరిని ఆకట్టుకొంటాడు ..వ్యక్తీ గతం గా మనిషి  దూర ద్రుస్టాన్ని ,మానవ హృదయం లో ఉన్న దోషాలను అతను కదిలించేట్లు రాశాడు .

     బెక్ రాసిన ఏడు రచనలలో అరవై మంది మెక్సికన్ల పాత్రలను సృష్టించాడు .అతని రెద్ పోనీ  నవల బెక్ యొక్క‘’సెమి ఆటోబయాగ్రఫీ .’’ఇందులో’’సాలినాస్ రాంచ్’వాలీ ’’’ప్రజల జీవన విధానాలను వివరించాడు .ఈ నవలలో కాల ,స్థల ,విషయ ఐక్యతను సాధించాడు .ఇందులో జీవన మరణ చక్ర భ్రమణం చిత్రీక రించాడు ..మానవుడు మరణించినా కొత్త జీవితానికి అది నాంది అవుతుందని తెలిపాడు అన్ని జీవరాసులలో ఒకే విశ్వ చైతన్యం ఉందని తెలియ జేశాడు .మనకు తెలియనిది ఎంతో ఉంది అని కూడా బెక్ అభిప్రాయ పడ్డాడు .

    పెరల్ నవలలో కినో శక్తి వంతమైన సంఘం చేత తిరస్కరింప బడి  అణగ దొక్కబడ్డ వాడు అతన్ని నిమ్న జాతి జంతువుతో సింబాలిక్ గా వర్ణించాడు .కిమో లో  ప్రిమిటివ్ లక్షణాలున్నాయని సాంఘిక శాస్త్ర వేత్తలు అన్నారు .అయితే‘’బెక్ దృష్టిలో కినో అంటే వేరెవరో కాదు నువ్వు నేను ,మనం అందరం ‘’.అందులో ఆత్మ శక్తిని నిద్రలేపి ,ఉద్దీపనం చేయాలనే భావం ఉంది .అతను వర్ణించిన చీకటి ‘’ఆత్మ ‘’కు సింబల్ …మానవుని అసహాయత ,నిస్సహాయత ఈ నవలలో శిఖరాయమానం గా వర్ణించాడు బెక్ .

      తెలుగు లో రావి శాస్త్రి నవలలు ,కధలు లాగానే జాన్ స్టెయిన్ బెక్ నవలలన్నీ  ‘’ప్రోలిటేరియన్’’మనుషుల కధలే  .గ్రేప్స్ ఆఫ్ రాత్ లో’’ మా ‘’పాత్ర ముందు చూపున్న మహిళ గా పడమటి ప్రాంతానికి మెరుగైన జీవనానికి తన కుటుంబాన్ని తీసుకొని వెడుతుంది .ఇక్కడ మా అంటే ఒక రకం గా ‘’భూ దేవి ‘’.ఆమె తన కుటుంబాన్నే కాక బయటి వారినీ  పెంచి పోషిస్తుంది .ఆమె గౌరవాన్ని పొందుతుంది దానితో బాటు తనను నమ్ముకొని తన నాయకత్వాన్ని అంగీకరించిన వారికి  తన శక్తిసామర్ధ్యాలను రుజువు చేసి చూపిస్తుంది .

        ‘’బన్యన్ ‘’ రాసిన దానిలో లాగా ఆవాసం లేక ,దుర్భర జీవితాలను గడిపే వారి పాలిటి ఆత్మ ప్రబోధ శక్తి గా బెక్ రచనలుంటాయి ..’’the problem of restoring to world’s original and eternal beauty is solved by the redemption of the soul ‘’జాన్ బెక్ రచనలు ఉంటాయి బెక్ కు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాతమాత్రమె మీడియా బాగా గుర్తించి ‘’common man’s every day life ‘’గురించి రాసిన మహా రచయిత అని మెచ్చింది .కొద్ది మంది పత్రికా రచయితలు పెదవి విరిచారు .1935 కు ముందు బెక్ రాసిన రచన లను దృష్టిలో పెట్టుకొనే నోబెల్ ఇచ్చారని ఈసడించారు కూడా .

         నోబెల్ బహుమతి పురస్కార డిన్నర్ లో బెక్ ‘’literature comes out of life .it is as old as speech .a writer who does not passionately believe in the perfectability of man ,hqas no dedication nor any membership in literature ‘’అని చెబుతూనోబెల్ బహుమతి గురించి ప్రస్తావిస్తూ ‘’nobel kept my belief in the human mind and the human spirit .Man’s power for good and evil is so awesome that he has usurped many of the powers we once ascribed to God .now it is in man’s hands to determine the life and death of all living things .The test of his perfeetability is at his hand ‘’అని తనకు మానవుల మీద మానవత్వం మీద ఉన్న అపార గౌరవాన్ని నమ్మకాన్ని ఆవిష్కరించాడు .తనకు నోబెల్ రావటం ఆశ్చర్యకరం అన్నాడుకూడా .న్యు యార్క్ టైం మాగజైన్ మాత్రం బెక్ ను గొప్పగా సమర్ధించింది .’’Beck is a dated writer .His sentimental books about the poor had given him a special place in the hearts of adults growing up in the depression ‘’అని కీర్తించింది ..

          బెక్ చని పోయిన పాతిక ఏళ్ళ తరువాత విమర్శకులు ,పర్యా వరణవేత్తలు బెక్ ఎంతటి ముందు చూపున్న రచయితో ,యెంత పర్యావరణ ప్రేమికుడో ,మానవ తప్పిదాలను ఆనాడే తెలియ జెప్పి జీవ వైవిధ్యానికి భంగం కలిగించ వద్దని మోర పెట్టుకోన్నాడో అతని రచనల్లో వీటన్నిటిని ఎలా ప్రతి ఫలింప జేశాడో తెలుసుకొని చెంప లేసుకొన్నారు ఇప్పుడు అమెరికా అంతా బెక్ అవగాహనా సదస్సులు నిర్వ హిస్తున్నారు అతనిపేర ఒక అధ్యయన సంస్తను నెల కోల్పారు ఆయన పుస్తకాలన్నీ ఇంటింటా చదివే ఏర్పాట్లు చేస్తున్నారు ఫెలోషిప్పులు స్కాలర్షిప్పులు ఆయన పేరు మీద ఇస్తున్నారు .ఒక మాగజైన్ను  కూడా నిర్వహిస్తూ అతన్ని అమరుడిని చేస్తూ తమ అజ్నానాన్ని  పారద్రోలిన జ్ఞాన జ్యోతి గా జాన్ స్టెయిన్ బెక్ ను ఔరవిస్తున్నారు

      ఈ వారం లో ముగ్గురు నోబెల్ బహుమతి పొందిన రచయితల గురించి చదివి తెలుసుకొన్నందుకు మహా సంతోషం గా ఉంది .వీరందరి బాధ ఒక్కటే .’’మెటీరియలిస్టిక్ మైండెడ్ నుంచి దూరం కండి .మనిషి ని మనిషి గా చూడండి ,ప్రజల భాషలో రాయండి ,చెప్పండి ‘’అని అర్ధమవుతుంది .ఇవేవీ ఇజాలకు సంబంధిన మాటలు కావు .నిజాలకు సంబంధించినవి అందరం అనుసరించ దగినవి మాత్రమె .

        3-9-2002 మంగళ వారం నాటి నా అమెరికా డైరీ నుండి –

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -3-7-13- ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

               

 మదర్ కాబ్రినిమదర్ కాబ్రిని

  మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తారు .తాము చేస్తున్నది దైవ కార్యమనే భావించి చేస్తారు గొప్ప తనాన్ని తమకు ఆపాదించుకోరు .తమను నడిపించి, చేయిస్తున్న దైవానికే ఆ కృతజ్ఞతలు ,ప్రసంశలు దక్కాలని అనుకొంటారు .వారి సేవకు ఒక దేశం పరిమితం కాదు .ప్రపంచమంతా విస్తరించి ప్రజా హృదయాలను గెలుచుకొంటారు తాము భగవంతుని పరికరాలమే నని వారి భావన .అలాంటి మానవ సేవా తత్పరురాలు ఇటలీ దేశానికి చెందినమదర్ ఫ్రాన్సెస్ కాబ్రిని .ఆమె గురించే మనం ఇప్పుడు తెలుసుకొంటున్నాం .

మేరియా ఫ్రాన్సెస్ కాబ్రిని 1850 లో జులై 15 న ఇటలీ దేశం లోని మిలన్ కు దగ్గర లో డీజియానో లో జన్మించింది .తండ్రి  అగస్తినో .తల్లి స్టెల్లా కాబ్రిని .పదకొండు మంది సంతానం లో ఏడుగురు చిన్న తనం లోనే చని పోయారు .తల్లికి 41 ఏళ్ళ వయసులో కాబ్రినిగర్భస్థ సమయం కంటే రెండు నెలలు ముందుగానే బలహీనం గా . పుట్టింది .ఆమె ను ఎంతో జాగ్రత్తగా ఆ దంపతులు పెంచారు కుటుంబం అంతా కాధలిక్  మతానికి అంకిత మైనదే ..ఇంటి పనులన్నీ కాబ్రినే చేసి తల్లికి సాయ పాడేది .అందుకని చదువు అంతగా అబ్బలేదు ఆట పాటలూ ఒంట బట్టలేదు .అర్భకు రాలు .      ఆ నాటు ఉన్న సాంప్రదాయం ప్రకారం ఈమెకు ఏడవ ఏటనే కాథలిక్ మత దీక్ష నిచ్చారు .ఆ దీక్షా సమయం లో ఆమెలో గొప్ప అనుభవం కలిగింది .దానిని మాటలలో చెప్పలేక పోయింది .ఆ నాడు ఇటలీ అంతా సమైక్య మవటానికి సిద్ధమవుతోంది .ఈమెను  పదమూడవ ఏట మిలన్ కు పడమర ఉన్న’’డాటర్స్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్స్ ‘’నిర్వహిస్తున్న  కాన్వెంట్ స్కూల్ కు పంపారు .ఆమెను చేర్చుకోవటానికి సుపీరియర్ తిరస్కరించాడు దానికి ఆమె అనారోగ్యం ఒకకారణం .రెండోది ఈమె కొన్ని ఏళ్ళలో స్వంతం గా ఒక మత సంస్థను ఎర్పరుస్తుందేమో ననే అనుమానం .

ముందు  తండ్రి ,ఆ తర్వాత తల్లీ మరణించారు .ఆదరించే బాబాయి కూడా చనిపోయాడు .అనాధగా మిగిలి పోయింది .ఈ బాధలన్నీ మరిచి పోవటానికి నిరంతరం దైవ సాన్నిధ్యం లో గడపటం ప్రారంభించింది కాబ్రిని .స్కూలు పిల్లలకు నీతి, మతధర్మాలను బోధించేది .బాధలతో ఉన్న వారిపై సాను భూతి చూపింది .ఊరికి దూరం గా ఉంటూ ఎవరూ పట్టించుకోని ఒక కేన్సర్ బాధితుడికి సేవ చేసి నయం చేసింది .మసూచికంఆ ప్రాంతం లో  విజ్రుమ్భించిన సమయం లో దాని బారిన పడిన వందలాది మందికి సేవలందించి తానూ ఆ వ్యాధికి గురైంది .ఆమె కు తోడుగా ఉన్న రోసా సేవలతో మళ్ళీ మామూలు మనిషి అయింది .అసలే అనారోగ్యం .దీనికి తోడూ ఈ వ్యాధి సోకి తగ్గింది అందుకని ఏ స్కూల్ లోను ఆమె ను చేర్చుకోలేదు ..దీనికి కారణం ఆ నగర మేయర్ ను కాథలిక్ మతం లోకి మార్చటం .కాబ్రినికి క్రమంగా మిషనరీ’’ నన్’’ గా మారాలనే సంకల్పం బలీయ మైంది ..హౌస్ ఆఫ్ ప్రావిడెన్స్ లో చేరి’’ సిస్టర్ సేవేరియా కాబ్రిని ‘’ అయింది .అక్కడ రెండవ స్తానం పొందింది .ఆమె కు అనాధలకు విద్య ,నేర్పటం మత దీక్ష నివ్వటం అప్పగించారు

బిషప్ జేల్మిని ఈమె లోని దీక్ష కు ,సేవా తత్పరతకు అబ్బుర పడి కాబ్రిని ని 1877‘లో ’మదర్ సుపీరియర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ప్రావిడెన్స్ ‘’అనే అత్యంత గౌరవనీయమైన పదవిని ఇచ్చాడు .కొద్ది మందికి ఇది అసూయ కు కారణం అయింది  .ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు కూడా .అప్పటికి ఆ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కు మాత్రమె పరిమిత మైంది .దాని నిర్వాహకుడు  ‘’తొండిని’’సంస్థ నిధులన్నీ స్వాహా చేశాడు .ఈ పరిస్తితులలో మదర్ కాబ్రిని తన స్వంత సంస్థను తన సేవా ధర్మాలకు అనుగుణం గా ఏర్పాటు చేయాల్సిన పరిస్తితి కలిగింది .వెంటనే ‘’’’సేలేశియన్ మిషనరీస్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ‘’ను స్తాపించింది .దీనినే అ తర్వాతా ‘’ది మిషనరీ సిస్టర్స్  ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ ‘’గా మార్చింది .

ఫ్రాన్సెస్ కాబ్రిని కి ‘’మదర్ మేరీ ‘’అనుక్షణం స్పూర్తి నిస్తూండేది .1887 లో  రోమ్ నగరానికి  వెళ్లి అక్కడ ఒక సంస్థ ను ఏర్పాటు చేయటానికి పాప్ గారి అనుమతి పొందింది .ఆమెను ఎన్నో సంస్తలు ప్రోత్సహించి ఆమె సేవా సంస్థలను దేశామంతావిస్తరిల్ల జేయమని అభ్యర్ధించాయి అప్పటికి ఆమె సంస్థ చర్చి ఒప్పుకొన్న మహిళా సంస్థలలో రెండవది అయింది ..ఆ కాలం లో ఆడవారు క్రిస్టియన్ మత ప్రచారానికి తగిన వారు కారనే అభిప్రాయం బలం గా ఉండేది .ఆ  అభిప్రాయాన్ని కాబ్రిని తప్పు అని రుజువు చేసింది మగవారు నిర్వహించే కార్యక్రమాల కంటే మహిళలు నిర్వహించేవే ఉత్తమోత్తమ మైనవని రుజువు చేసింది .ఇది ఆమెకు ఒక సవాలు గా నిలిచింది ఎన్ని అడ్డంకులెదురైనా తన పని తాను దైవ కృప తో చేసుకొని ముందుకు సాగింది .ఎన్నో మత సంస్తలు ఆమెకు బాసటగా నిలబడ్డాయి అవసరమైన డబ్బు ,పరికరాలు స్తలం అన్నీ సమకూర్చినాయి . ఆమె సేవకు తామూ తోడ్పడ్డాయి .కొద్ది రోజులకే అక్కడి కార్డినల్ బీద పిల్లలకు ఒక స్కూల్ ను ,దాంతో బాటు ఒక  కిండర్  గార్టెన్ స్కూల్ ను ప్రారంభించమని కోరాడు ఆమె ఆ పని దిగ్విజయం గా నిర్వహించి అందరి అభిమానం సంపాదించింది ..క్రమంగా మదర్  కార్య క్రమాలకు విశేష స్పందన విశ్వ వ్యాప్తం గా లభించింది

అమెరికా ,యూరప్ దేశాల వారు తమ దేశాలలో ఆమెను చారిటబుల్ సంస్థలను నెలకొల్ప మని అభ్యర్ధించాయి ఆమె మనసులో చాలా కాలం నుండి చైనా లో ఏర్పాటు చేయాలని అనుకొన్నది కాని దేవేచ్చ ..అమెరికా లో తన సేవా కార్యక్రమాలను విస్తరించటానికి నిర్ణయించుకోంది ..అప్పటికే ఆమె విపరీతం గా పని చేసి అలసి పోయింది ఆరోగ్యమూ బాగాలేదు .అమెరికా లోని న్యూ యార్క్ సిటీ దాని పరిసరాలలో ఇటాలియన్ ఇమ్మిగ్రెంట్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు .సరైన విద్యా వైద్య సౌకర్యాలు వారికి లేవు .వారికి సేవలందించాలన్న ధ్యేయం తో కాబ్రిని 1889 లో అమెరికా కు కొద్ది మంది సిస్టర్స్ తో చేరుకొన్నది .ఆహ్వానించిన వారే మొహం చాటేశారు అంతా కొత్త .కాని ఆమె అధైర్య పడలేదు తన పని తాను ప్రారంభించింది నెమ్మదిగా అక్కడి సంస్థలు సహకారం అందించటం ప్రారంభించాయి .పోప్ లియో కూడా ఆమెకు బాసట గా నిలిచాడు .

సిస్టర్స్ వీధిలో తిరిగి అడుక్కొంటూ సాయం రాబట్టారు .వీరిని చూసి మిగిలిన వారు ముందుకొచ్చారు. ఒక చోట మంచి  వాతా వరణంలో సంస్తనేర్పరచారు .ఉదయం  అయిదింటికే కార్యక్రమాలు మొదలు .ఆ తర్వాత ప్రార్ధన ..తర్వాతా విద్యా బోధనా ,ఆరోగ్య సూత్రాలు తెలియజేయటం .ఇటాలియన్ ఇమ్మిగ్రంత్స్ కు గొప్ప ఊరట కలిగింది .కొద్ది కొద్ది మొత్తాలను ఆహార పదార్ధాలను సేకరించేవారు .

తరువాత ఆమె అనాధాశ్రమం స్తాపించింది .అది అనాధలకే కాక బాధితులకు, అసహాయులకు ,అండగా నిలిచింది .సెయింట్ జోచిమ్స్  చర్చి ద్వారా రెండు వందల మంది పిల్లలకు సేవలందించింది ..ఆ తర్వాతా బ్రూక్లిన్ లో స్కూల్ పెట్టింది .స్తానికులకు దేనిలోనూ ఇటాలియన్లు తీసి పోరని రుజువు చేయించింది .న్యూ ఆర్లియాన్స్ ,డెన్వర్ ,లాస్ ఆంజెల్స్ ,ఫిలడెల్ఫియా ,న్యూ వార్క్ ,సియాటిల్ లలో ఉచిత విద్యాలయాలను నెలకొల్పింది .విద్యతో బాటు వైద్యం, ఆధ్యాత్మిక చింతనలను అందించింది .ఆదివారం బడులు నిర్వహించింది .వృత్తి విద్యాలయాలను నెలకొల్పింది ,.యువజన విద్యా ,నేర గాళ్ళకు విద్యా బోధనా కూడా ఆమె నిర్వహించిన వాటిలో ముఖ్యమైనవి .ఆమె సేవా సంస్థలకు అనూహ్యం గా దాతలు భూరి విరాళాలను సమర్పించి జన్మ ధన్యం చేసుకొనే వారు .డబ్బు కొరత అనేది మదర్ సంస్థలకు ఎప్పుడూ కలగలేదు అవసరమైతే సిస్టర్స్ వీధుల్లో బిచ్చం ఎత్తి విరాళాలు సేకరించేవారు .

మదర్  కాబ్రిని నికారుగ్వా ,పనామా ,బ్యూనస్ ఐర్స్ ,అర్జంటినా ,లలో స్నేహ యాత్ర జరిపింది కంచర గాడిదల పై ఆండీస్ పర్వతాల లో సంచరించింది .వెళ్ళిన ప్రతి చోటా అవసర మైన కేంద్రాలను స్తాపించి సాయ పడింది .ప్రపంచం అంతా ఆమెను ‘’లా మదర్ ‘’అంటే ‘’మాతృదేవత ‘’ అని ఆప్యాయం గా పిలుచుకొనే వారు ..అందరిపై అపారమైన కరుణా, ప్రేమా ఆమె చూపేది .బాధితులకు సానుభూతి ఆమె నైజం .సకల ప్రాణుల మీద ఆమెకు అపారమైన కరుణ ఉండేది .తన కార్యక్రమాలను ‘’హృదయానికి చేసే విద్య ‘’గా భావించేది .విద్య అంటే ప్రేమను కురిపించటమే అనేది ఆమె .

బ్రజిల్ దేశం లో పర్య టించి నపుడు మదర్ కు మలేరియా సోకి చాలా కాలం బాధ పడింది 1912 లో మళ్ళీ సేవాకార్యక్రమాలకోసం అమెరికా వెళ్ళింది మొదటి ప్రపంచయుద్ధ సమయం లో అమెరికా నుంచి బయటి దేశాలకు వెళ్ళే అవకాశం ఆమెకు లభించలేదు .1938 లోనే ఆమె కు ‘’beatified ‘’(declared sacred )లభించింది .1946 జులై 7 న మదర్ కాబ్రిని  ని అమెరికా కు మొదటి పౌరురాలు గా రోమన్ కాధలిక్ చర్చ్ ‘’సెయింట్ ‘’హోదా నిచ్చింది .1917 డిసెంబర్ 22 న 67 వ ఏట మదర్ కాబ్రిని తుది శ్వాస విడిచింది .చని పోయిన తర్వాతా కూడా ఆమె ప్రభావం ఇసుమంత కూడా తగ్గలేదు .ఆమె పేరా ఎన్నో హైస్జ్కూళ్లు,ఆస్పత్రులు వెలిశాయి .చర్చిలను కూడా ఆమె పేర పెట్టి గౌరవించారు .ఆమెను మదర్  ఫ్రాన్సెస్ క్సేవియర్ గాబ్రిని అని ఆత్మీయం గా ప్రపంచమంతా పిలుచుకొంటారు .ఎందరికో ఆమె సేవా తత్పరత ఆడర్శనీయమైంది .

ప్రేమ కంటే ఏ త్యాగము గొప్పది కాదని కాబ్రిని భావించింది .భగవంతుడే మన చేత అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు అని చెప్పేది .

 

                – గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

– See more at: http://vihanga.com/?p=9255#sthash.sUzFdIsm.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

జాన్ స్టెయిన్ బెక్ -1

జాన్ స్టెయిన్ బెక్ -1

      అసలు పేరు జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ .27-2-1902 లో అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం లో సాలినాస్అనే చోట జన్మించాడు .అదొక గొప్ప షిప్పింగ్ కేంద్రం .తండ్రి సంతానం లో మూడవ వాడు బెక్ .చిన్నప్పటి నుండి చాలా తెలివి తేటలున్న కుర్రాడిగా కనిపించే వాడు .అతని ద్రుష్టి వ్యాపారస్తుని లక్షణాల లాగా ఉంటాయని అనే వారు .మాటల శబ్దాలన్నా ,లయ అన్నా బెక్ కు చాలా ఇష్టం . 1906 లో కాలిఫోర్నియా లో భూకంపం వచ్చింది .అందరూ భయ పడ్డారు .1919 లో యూనివెర్సిటి ఆర్ట్స్ లో చేరాడు .డిగ్రీ పూర్తీ కాలేదు .లేబరర్ గా పని చేశాడు .గంటకు ముప్ఫై రెండున్నర సెంట్ల జీతం .ఫామిలి కాటేజ్ అని పిలువ బడే ‘’పసిఫిక్ గ్రోవ్ ‘’లో నివాసం ఉన్నాడు .అప్పుడే ‘’ఏ పాట్ ఆఫ్ గోల్డ్ ‘’రాశాడు .న్యూయార్క్ వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాడు .తర్వాత ‘’అమెరికన్ ‘’అనే పేపర్ కి వారానికి ఇరవై అయిదు డాలర్ల కు పని చేశాడు .1927 లో అంటే పాతికేళ్ళకు ‘’స్మోకర్స్ కంపానియన్ ‘’ప్రచురించాడు .1929 లో సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లి ఎర్నెస్ట్ హెమింగ్ వే ,హెన్రి డేవిడ్ తోరో ,వాల్ట్ విట్మన్ వంటి లబ్ధ ప్రతిసస్టులైన అమెరికన్ రచయితల, కవులపుస్తకాలన్నీ చదివి ప్రభావితుడయ్యాడు . ‘’అయిడియలిజం ‘’అంటే ఊహా లోక ద్రుష్టి మీద మనసు పడ్డాడు .

      కరోల్ అనే ఆమెతో ప్రేమ లో పడి పెళ్ళాడాడు .బెక్ ఏది రాసి పేపర్లకు పంపినా తిరుగు టపాలో తిరిగి వచ్చేవి .ఏ పేపరూ ప్రచురించేది కాదు. చాలా బాధ పడే వాడు ..రికెట్స్ అనే అతని తో మంచి స్నేహం ఏర్పడింది .అతను ‘’మెరైన్ బయాలజిస్ట్ ‘’ సముద్ర జీవుల పై ఎంతో పరిశోధన చేశాడు కొత్త జీవులను కనుగొన్నాడు .1932 లో ఆర్ధిక మాంద్యం ఏర్పడి జీవితాలు దెబ్బతిన్నాయి .అప్పుడే ‘’pastures of Heaven ‘’అనే కధ రాశాడు .తర్వాత ‘’to a god unknown ‘’నవల రాశాడు ..1932 లో గుండె పోటు వచ్చి ఆస్పత్రిలో చేరాడు .’’the red pony ‘’,’’toitella flat ‘’కధలు రాసి ప్రచురించాడు .అతను రాసిన’’ దిమర్డరర్ ‘’ కధకు ప్రఖ్యాత కధకుడైన ‘’వో.హెన్రి ‘’బహుమతి లభించింది .1934 లో తల్లి మరణించింది .

     నేచురలిజం మీద మోజు హెచ్చింది .మరుసటేడు తండ్రీ పోయాడు .1936 లో రాసిన ‘’మైస్ అండ్ మెన్ ‘’పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడయింది .దాన్ని నాటకం గా మార్చి ప్రదర్శించారు .1937 లో ఈ నాటకానికి ‘’drama city award ‘’లభించింది .భార్య తో తగాదా పడ్డాడు .’’ the grapes of wrath’’ అనే సీరియస్ నవల రాశాడు బెక్ రాసిన మిస్ ,రెడ్ పోనీ లను సినిమాలుగా తీశారు .1940 లో మెక్సికో వెళ్ళాడు .అక్కడ ఎన్నో కధలను విని తెలుసుకొని ‘’పెరల్ ‘’నవల రాశాడు .ది.గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘’కు  పులిట్జర్ బహుమతి వచ్చింది .తర్వాత ‘’సి ఆఫ్  కార్టే జ్‘’నవల పూర్తీ చేశాడు .1940 సి నిమాలకు రాశాడు.అందులో ‘’the forgotten village .’’ఒకటి .భయానక సినిమాల సృష్టికర్త ‘’ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్’’ తో ‘’లైఫ్ బోట్’’ సినిమా చేశాడు .భార్య కరోల్ ఈయన్ని వదిలేస్తే గాప్ లేకుండా ‘’గ్వెన్‘’ను జీవితం లోకి ఆహ్వానించి పెళ్లి చేసుకొన్నాడు .ఇదే సమయం లో అతని ముఖ్య స్నేహితుడు బయో శాస్త్ర వేత్త‘’రికెట్స్ ‘’మరణించాడు .అప్పటికే బెక్ రికెట్స్ పై ఎక్కువ గా ఆధార పది ఉండటం రెండో పెళ్ళాం గ్వెన్ కు నచ్చేదికాదు .పెళ్లి పెటాకులే అయింది’’ .the moon is down ‘’కద రచించాడు అందులో నాజీ దండయాత్రను గురించి వివరించాడు .1943లో లండన్ వెళ్ళాడు .తర్వాతా ఉత్తర ఆఫ్రికా వెళ్లి సఫారి చేశాడు . 1945 లో ‘’the cannery row ‘’నవల రాసి ప్రచురించాడు .మరో నాలుగేళ్ళకు’’ the wayward bus ‘’కద రాశాడు .ఎలాన్ స్కాట్ తో మూడో వివాహం . .1951నుండి బెక్ ప్రభావం తగ్గింది .జీవిత కాలం లో మొత్తం పాతిక పుస్తకాలు రాశాడు .అందులో పదహారు నవలలు , తొమ్మిది నాన్ ఫిక్షన్ రచనలు ,ఎన్నో కధలు రాశాడు . అతను ఎన్నో సముద్ర జీవులను కను గోన్నాడు  .కొన్ని అతని పేర పిలువ బడ్డాయి . 

 

 

 

స్టెయిన్ బెక్ భవంతి                        సమాధి 

 

      1962 లో స్టెయిన్ బెక్ కు నోబెల్ సాహితీ పురస్కారం లభించింది .అప్పటికి ఆరుగురు అమెరికన్ రచయితలకు ఈ అవార్డ్ వచ్చింది బెక్ ఏడవ వాడు .రాజకీయాలపై ఆసక్తి పెరిగి అందులో చేరాడు .జాన్ ఎఫ్ కేన్నేడి ,లిండన్ జాన్సన్ లతో గాఢ పరిచయమేర్పడింది .66 ఏళ్ళ వయసులో1968 డిసెంబర్ ఇరవై న మహా రచయిత స్టెయిన్ బెక్ మరణించాడు .

       బెక్ రచనా ప్రాభవం గురించి ఈ సారి

       సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-7-13- ఉయ్యూరు

    

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment