అమెరికా ఆది వాసీలు –చేరోకీలు

  అమెరికా ఆది  వాసీలు –చేరోకీలు

     1492 లో కొలబాస్ రాక కు ముందు ఇక్కడి స్థానిక అమెరికన్ల సంఖ్య 25 మిలియన్లు ఉండేదట .వారికి మూడొందలకు పైగా భాషలున్దేవి .క్రమంగా ఆ జనాభా అంతా వ్యాధులు ,ప్రకృతి వైపరీత్యాలుయుద్ధాలు   ,ఆకలి చావులతో  ఇప్పుడు 567తెగలతో రెండు మిలియన్లు మాత్రమే మిగిలి ఉన్నారు .వీరిని అమెరికా రాజ్యాంగం గుర్తించి హక్కుల్ని కల్పించింది .ప్రభుత్వం తో వాళ్ళు కొన్ని ఒప్పందాలను చేసుకొన్నారు .అందువల్ల వీరు తమ స్వాధీనం లో ఉన్న   మిలియన్ల కొద్దీ ఎకరాల   భూభాగాన్ని ప్రభుత్వానికి స్వాధీనం  చేశారు .ప్రభుత్వం వారి ఆరోగ్యం ,చదువు మత స్వేచ్ఛ లను కాపాడుతోంది .వారితో ప్రభుత్వం 377 ఒడంబడికలు చేసుకొన్నా దాదాపు అన్నిటినీ తున్గలో తొక్కేసింది .అయితే అవి ఒప్పందాలు చట్టాలే నని సుప్రీం తీర్పు ..వందేళ్ళ క్రితం చేసుకొన్నా ఒడంబడికలకు చట్ట భద్రత కల్పించాలని స్పష్టం ..వనవాసుల సార్వ భౌమత్వాన్ని ధ్రువీకరించింది ..ప్రభుత్వాల మద్య సంబంధాలనుద్రుధంచేసుకొన్నారు .  గిరిజన తెగలను ‘’స్థానిక ఆధార రాజ్యాలు ‘’గా గుర్తింపు నిచ్చారు .తమ హక్కుల్ని కాపాడు కోవా టానికి అటార్నీ లను నియమించుకొన్నారు .పిల్లల చదువు ,వనవాసీ బడు లు ,కాలేజీలు ఏర్పాటు చేసుకొనే హక్కు సంపాదించారు ..వారి మతాలను ,నియమాలను పాటించు కొనే వెసులు బాటు పొందారు ..వారి పూర్వీకుల’’ ఆస్తులన(ఎముకలు )పొంది జాగ్రత్త చేసుకొన్నారు .వారి జీవన ప్రమాణాన్ని వృద్ధి చేసుకొంటున్నారు .అమెరికా ప్రజల్లో తామూ భాగా స్వాములమనే ధీమా వారికి వచ్చిన్దిప్పుడు .

                                                 చేరోకీల సంస్కృతి –సంప్రదాయాలు

 
      చేరోకీలు  అని పిలువబడే వీరంతా ఎత్తైన పర్వత ప్రాంత వాసులు .తామే ముఖ్యమైన పౌరులం అని ,నిజమైన జనం అని అంటారు వాళ్ళు .వారి భాషలో దాన్నే ani-yun-wiya’’అంటారు .వీరంతా ఎత్తైన పర్వత ప్రాంత జనులే .వారి భూభాగమే ప్రపంచానికి నాభి లేక మధ్యభాగం అని వీరి నమ్మకం ..వారి దృష్టిలో భూమి నాలుగు త్రాళ్ళతో ఆకాశం నుండి వేలాడుతోంది .ఈ భూమి ఏర్పడటానికి ముందు అందరు ఆకాశం లో పెద్ద శిల మీద  ఉండే వాళ్ళు .జనాభాతో కిక్కిరిసి పోతే నీరు భూమి కిందకు చేరింది .ఆ తర్వాత మట్టి అడుసు తో భూమి ఏర్పడి క్రమంగా గట్టి పడింది ..తర్వాత నీరు మళ్ళీ ఆకాశం చేరింది .భూమి మీద క్రమంగా జీవ రాశి ఆవిర్భావం చెందింది .

      వారి జాతి లో మొదటి మానవుని పేరు కనాతి ,మొదటి స్త్రీ సేలు ..వారికి ఒకే ఒక మొగ సంతానం ..అతన్ని ‘’వైల్డ్ బాయ్’’అంటారు .వీరి సంతానం క్రమంగా పెరిగిందని అభిప్రాయం .చేరోకీలు నార్త్ కరోలినా ,కాన్సాస్ పర్వత ప్రాంతాలలో ,అపలేశియన్ పర్వత ప్రాంతాలలో దట్టం  గా ఉన్నారు .వీరు చిన్న గ్రామాల్లో ఉంటారు ..అక్కడ ఒక సమావేశ మందిరం ఉంటుంది .అక్కడ ప్రార్ధన ,ఆరాధనా చేసుకొంటారు .దానికి చుట్టూ వారి ఇల్లుంటాయి ..ఒక్కో ఇంట్లో అనేక తరాల వారు ఉంటారు .అందరు కలిసి జీవించటం వీరి ప్రత్యేకత ..చలి కాలం లో ‘’అసి ‘’అనే వెచ్చని ఇళ్ళల్లో నివశిస్తారు .వేసవి ఇల్లు విశాల మైన చ దీర్ఘ చతురశ్రకార .క్లాప్ బోర్డ్ తో చేసిన ఇళ్ళల్లో ఉంటారు .సీతాకాలపు ఇల్లు చిన్నవి ,ఒకే దర్వాజా ఉంది ,మధ్యలో నిత్యం మండే పొయ్యి ఉంది వెచ్చదనాన్నిస్తుంది ..నిలవ చేసుకొనే గదులుంటాయి .

        వ్యవసాయం ,వేట ,చేపలు పట్టటం వ్రుత్తి .ఎక్కువ గా జలాధారం ఉన్న నదీ తీర ప్రాంతాలే వారి ఆవాస భూములు .సారవంత మైన నేలలను చూసుకొని మొక్క జొన్న పండిస్తారు .దానితో పాటు బీన్స్ కూడా పండిస్తారు .బీన్స్ మొక్కల వేళ్ళల్లో నత్రజని స్తాపక శూక్ష్మ జీవులున్డటం వల్ల మొక్క జోన్నకు బలం చేకూరుతుంది .ఆడవారు కాయ గూరలు పండిస్తారు .ముసలి స్త్రీలు పొలాల్లో ఓడిసేలా రాళ్ళతో పక్షులను పారద్రోలుతూ పంట చేలను కాపాడుతూ ఉంటారు .చిరోకీలు పిల్లలను అతి చనువు గా చూస్తారు .దండిన్చాల్సి వస్తే చిన్న ముళ్ళు తో  గిచ్చటం తప్ప పెద్ద గా శ్క్షించారు .ఆడవారు అడవుల్లోకి వెళ్లి వంట చెరుకు తెస్తారు ..నీరు మోసుకొని వస్తారు ..అందరికి వంట చేయటం వారి విధి .వెన్న వాడకం తెలీదు ..ఇళ్లను అందం గా అలంకరించటం ఆడవాళ్ళ పని .వెదురు తో ,లేక నదీ తీరం లో దొరికే ఒక రకమైన చెట్టు  భాగాలతో బుట్టలు అల్లుతారు .దాన్ని’’ రివర్ కేన్ ‘’అంటారు .మన పేము లాంటిది .స్థానికం గా దొరికే మట్టితో కుండలు చేస్తారు .వాటిని ఆరబెట్టటం ,కాల్చటం నగిషీలు చెక్కటం చేస్తారు .జింక చర్మంతో మగ వాళ్ల బట్టలు కుడతారు .ఎముకల తో చేసిన సూదులను కుట్ట టానికి ఉపయోగిస్తారు .సాధారణం గా వారికి చాలా తక్కువ బట్టలే ఉంటాయి .చలికాలం లో వింటర్ హౌస్ లోనే అందరు గడుపుతారు .పిల్లలు  బట్టలు వేసుకోరు .ఆడ వాళ్ళు మగ వారి లానే డ్రెస్ వేసుకొంటారు .

           మగ వారు వేటాడి ఆహారం తెస్తారు .ఆడవారు దానితో వండి వడ్డిస్తారు .జింక ,ఎలుగు బంటి  లను ఎక్కువగా వేటాడి తెస్తారు .వేటకోసం మిస్సి సిపి నది ని కూడా దాటి చాలా దూరం పోతారు .వారికిజింక చాలా ఇష్టమైన జంతవు  .కల్ప వృక్షం లా అది వారి పాలిటి కల్ప ధేనువు .దాని శరీరం లో అన్ని భాగాలను ఉపయోగించు కొంటారు .వాటి ఎముకలతో పని ముట్లు అలంకరణ సామాను ,చర్మాన్ని ధరించ టానికి ,వాటి నరాలను దారాలుగా,వాటి మెదడు ను ఔషధాలు తయారు చేయటానికి ఉపయోగిస్తారు .వాటి మాసం తో స్నాయువులతో జిగురు తయారు చేసు కొంటారు .దాని శరీరం లో ప్రతిది వారికి ఉపకరించేదే ..అలాగే ఎలుగు బంటీ అంతే .వాటి చర్మం ఫర్  కోట్లకు ,వాటి కొవ్వు ను గ్రీజు తయారు చేయటానికి వాడుతారు .టర్కీ కోడి వారికి బాగా ఇష్టం .ఎలుగు గోళ్ళతో ,దంతాలతో ఆభరణాలు చేస్తారు .పక్షుల ఈకలతో అలంకరించు కొంటారు ..మాటు పెట్టి వేటాడి బొరియలు  పెట్టి జంతువులను చం పుతారు .చేపలు పట్టటానికి గాలం ,వల, వెదురు ముక్కల ‘’మావు ‘’లు ఉపయోగిస్తారు .నీటి ప్రవాహం ఉన్న చోట చిన్న డాం కడతారు అడ్డం గా .అక్కడ  చెస్ట్నట్ నుంచి తీసిన విషాన్ని  ప్రవాహపునీటి  లో కలుపు తా రు ..అది చేపల నరాలపై దెబ్బతీస్తుంది ..ఆ చేపలను తింటే మనుష్యులకు ప్రమాదం ఉండదు .కాని చేపలను అచేతనం గా మారుస్తుంది ..చేపల్ని పట్టిన తర్వాతా ఆడ్డు తీసేస్తారు ..విషం ప్రభావం తగ్గి మళ్ళీ మామూలవుతుంది .

      వారి ఆటలు సరదా గా ఉంటాయి .ఆరోగ్యానికి ఆటలు ముఖ్యం అని భావిస్తారు .బాణాల ఆట ,రాయిని బంతిగా చేసి ఆట ఆడటం వారికి ఇష్టం .దీన్ని రోలింగ్ రాక్ అంటారు .    

                                    .  మాతృస్వామ్య వ్యవస్థ

          వారి కుటుంబ వ్యవస్థ అంతా తల్లి మీద ఆధారం గా ఉంటుంది .సంతానాని తల్లిని బట్టే తప్ప తండ్రిని బట్టి గుర్తించరు ..తల్లి సంతానం గానే పిల్లల్ని భావిస్తారు .వీరికి ప్రాచీన తర స్త్రీల నుండి ఇది వచ్చింది .తల్లి తరఫు వారే అసలైన బంధువులు ..తల్లి ,అమ్మమ్మ ,అక్క చెల్లెళ్ళు ,వాళ్ల సంతానం ,బంధువులు గా భావిస్తారు .అమ్మ సోదరులు వాళ్ల పిల్లలకు బంధుత్వం లేదు .తండ్రి ,నాయనమ్మ ఆయన ,అక్కచెల్లెళ్ళు ,సోదరుల రక్తాన్ని బట్టి కాక తల్లి తరఫున రక్తాన్ని బట్టి మాత్రమే నిర్ణ యిస్తారు .కుటుంబం  తల్లి దగ్గరే ఉంటుంది .భర్త కూడా ఆమెతో ఉంటాడు ..ఆ కుటుంబం అంటే భార్యా ,భర్తా ,పిల్లలు భార్య తల్లి ,భార్య అక్కచెల్లెళ్ళు ,,వాళ్ల సంతానం ,వాళ్ల భర్తలు ,ఆమె కున్న పెళ్లి కాని సోదరులు ..భార్యా భర్తా విడి పోతే భర్త భార్యను వదిలి వేరే వెళ్లి పోవాలిసిందే. ..సాధారణం గా విడాకులు ఉండవు ..అప్పుడు భర్త  తన తల్లి చెల్లీ అక్క ల దగ్గరకు చేరాలి .పిల్లలు మాత్రం తల్లి తోనే ఉంటారు .కారణం వాళ్ళు తండ్రి వంశం వారు గా పరిగణింప బడరు కనుక ..అయితే పిల్లలకు తండ్రి ఎవరో తెలుస్తుంది .వేటకు తండ్రి శిక్షణ నివ్వడు .మేనమామ శిక్షణ నిస్తాడు .అతన్నే గురువు గా భావిస్తాడు ..మొత్తం మీద తేలేది ఏమిటంటే తల్లి తరం వారే సంతానం మీద పెత్తనం కలిగి ఉంటారు ..తగాదాలు గ్రామ సభల్లో పరిష్కరించు కొంటారు .

                                                                హత్య- నేరం

     చిరోకీ లలో హత్య ను తీవ్ర నేరం గా భావిస్తారు .శత్రువు కాని ,లేక వేరొక తెగ వారు కాని ఒక చెరోకీ ని  చంపితే వారి పై పగ తీర్చుకొని వాడిని చంపే స్తారు .వీటినే ‘’వార్ పార్టీలు ‘’అంటారు .ఇందులో వందమంది వరకు సభ్యులుంటారు .హత్య చేసిన వాడిని చంపక పోతే హత్య గావింప బడ్డ వాడు ఉన్నత లోకాలకు వెళ్ళలేడు  అని వీరి సిద్ధాంతం .లెక్కలు బాలన్సు తప్పుతాయట .కనుక బద్లా తప్పదు .అప్పుడే సామరస్యం ,సమతూకం ఉంటుందని నమ్మకం .

      వీరు  ప్రకృతిని ఆరాధిస్తారు .ఒక జింకను చంపాలను కొంటె ఒక ప్రత్యెక విధి చేసి , తనకు తన కుటుంబానికి  ఆహారం అవసర మవటం వల్ల చంప వలసి వస్తోందని  దాని జీవుడిని వేడు కొని వేటాడి చంపుతారు .విలాసం కోసం వేట ఆడరు .పవిత్రమైన భావనలను అతిక్రమిస్తే ఉపద్రవాలు కలుగుతాయని నమ్మకం వారిది .జంతు వధ వల్ల మారణ వ్యాధులు కల్గుతాయని నమ్ముతారు .దీనితో జీవావరణం సమతుల్యత దెబ్బ తింటుందిఅనే గొప్ప సిద్ధాంతం ఉంది .

      చిరోకీల మతం కూడా సామరస్య జీవనాన్నే బోధిస్తుంది .’’గ్రీన్ ఆర్డర్ సేరిమని ‘’అనే కొత్త సంవత్సరం పండుగ జరుపుతా రు .ఆరోజున పాత తప్పిదాల నన్నిటిని మన్నించి కొత్త జీవితం లోకి అడుగు పెట్ట టానికి అవకాశం కల్గిస్తారు ..వివాహాలు విచ్చిన్నం అయితే వాటినీ క్షమించి  మళ్ళీ దగ్గరవటానికి దారి ఏర్పరుస్తారు .హంతకుడిని మాత్రం క్షమిచరు .అతిధులను గౌరవించి మంచి ఆతిధ్యం ఇచ్చే సాంప్రదాయం వారిది  వీరిలో ఏడు తెగలున్నాయి .తమ జాతి మూల పురుషుడు స్త్రీ అయిన ‘’కనాతి ‘’,;;సేలు ‘’’’ల పవిత్ర వారసులం అని గర్వం గా చెప్పు కొంటారు .వారి జీవితాలను పరికిస్తే ఎంత నిబద్ధత గా వారు జీవనం సాగిస్తున్నారో మనకు తెలుస్తోంది .ఆధునికులం, నాగరకులం  అని మిడిసి పడుతున్న మనం అనాగరికులు అని వారిని భావించటం  మన అనాగారకత ను తెలియ జేస్తోంది .సామరస్యం ,సహజీవనం ,ప్రక్రుతి ఆరాధనం ,హింసను విడనాడటం వారి నుంచి మనం నేర్చు కోవాలి .

 

              మీ–  గబ్బిట దుర్గా ప్రసాద్ —6-6-12.—కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

స్వరగంగా ప్రవాహం మల్లాది సంసారం – ఆంధ్ర భూమి

మల్లాది వారి కుటుంబం సంపూర్ణంగా సంగీత కుటుంబం. వంశ పారంపర్యంగా వీరి వంశంలో సంగీత గంగ ప్రవహిస్తోంది. సూరిబాబుగారి తండ్రిగారు శ్రీరామమూర్తిగారు (1913-2012). సంగీతంలో లెక్కకువచ్చే వైదుష్యం వారిది. అలనాటి మహాకళాకారులూ, విద్వాంసులూ ఆయన మహారాజపురం విశ్వనాథ అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, మధురై సోము, రాజరత్నం పిళ్లై, మహాలింగం వంటి వారి వైదుష్యాన్ని ఆకళింపుచేసికొని, తన సంగీత ప్రవృత్తిలో దాన్నంతా కలుపుకొని గొప్ప సంగీత సంస్కారాన్ని పొందిన మహాకారులు శ్రీ మల్లాది రామమూర్తిగారు. దీనికితోడుగా ఆదిభట్ల నారాయణదాసుగారు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు వీరిపై ప్రభావం వేయడం వల్లనూ, దీక్షిత దాసుగారు గురుత్వం వహించడంవల్లనూ, ముసునూరి సూర్యనారాణ భాగవతార్‌గారి సాహచర్యం వల్లనూ, శ్రీరామమూర్తిగారి గానం సంప్రదాయ బలాన్నీ, గమక పుష్టినీ, నిఖార్సయిన శాస్త్ర బద్ధతను పుణికిపుచ్చుకొంది.
శ్రీరామమూర్తిగారు శాస్ర్తియ సంగీతాన్నీ, హరికథాగానాన్నీ మద్రాసు ఆకాశవాణి కేంద్రం 1945 నుంచి 1953 దాకా ప్రసారం చేస్తూ ఉండింది. ఆ తర్వాత అంటే 1953 నుంచి 1998 సం. దాకా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోవీరు హరికథా భాగవతార్‌గా సుప్రసిద్ధులు.
శ్రీరామమూర్తిగారి కుమారులు మల్లాది సూరిబాబుగారు. 1945లో వీరి జననం. సూరిబాబుగారికి తండ్రి నుంచి గొప్ప సంగీత సంస్కారం ఆనువంశికంగానే వచ్చింది. దీనికితోడుగా శ్రీ సూరిబాబుగారి కంఠధ్వని గాంభీర్య మాధుర్యాలతో ఉండడం వారికి భగవంతుడిచ్చిన ఒక వరం. ఈ విశిష్ట కంఠధ్వని కారణంగా 1971లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వారికి ఎనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చింది. తండ్రి శ్రీరామమూర్తిగారివల్ల వచ్చిన సంగీత సంస్కారం, అభిరుచి, అప్పటికే ఆకాశవాణిలో ఉన్న శ్రీ ఓలేటి వేంకటేశ్వర్లగారి గురుత్వంవల్ల మొగ్గ పుష్పంగా విచ్చుకొని, సంగీత పరిమళాలను దేశమంతటా ప్రసరించడం మొదలుపెట్టింది. విజయవాడ కేంద్రంనుంచి ప్రసారమయ్యే సంగీత శిక్షణ కార్యక్రమంలో ఓలేటివారు గురువుగా కీర్తనా పాఠాన్నీ బోధిస్తుంటే, సూరిబాబుగారు విద్యార్థిగా నేర్చుకొంటూండేవారు. సూరిబాబుగారి గంభీరకంఠం ఓలేటి వారి శిక్షణతో విద్వత్తుని రంగరించుకొని అగ్రశ్రేణి కళాకారునిగా నిల్పింది. లలిత సంగీతాన్నికూడా శాస్ర్తియ సంగీతానికి జోడించి చక్కని ప్రయోగాలు సూరిబాబుగారు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అందించారు. ఓలేటివారి వద్దనే కాక సూరిబాబుగారు శ్రీపాద పినాకపాణిగారి వద్ద కూడా సంగీత అభ్యాసంచేసి తన తర్వాతి తరానికి పునాదిగా నిలిచారు సూరిబాబుగారు. దేశ విదేశాలలో అనేక కచ్చేరీలు చేశారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 6 నెలల పాటు అక్కడి విద్యార్థులకు గురుత్వం వహించారు.
శ్రుతిమీద విశేష దృష్టి ఉన్నవారవడం చేత సూరిబాబు అన్ని శ్రుతులకూ తంబూరా శ్రుతి చేసి సి.డిలు వెలువరించారు. నారాయణతీర్థులూ, రామదాసూ, సదాశివ బ్రహ్మేంద్రులూ, అన్నమయ్య, కైవారం నారాయణ, ఆదిభట్ల నారాయణదాసుల కీర్తనలకు స్వరరచన చేసి సంగీత చరిత్రలో ఉచిత స్థానాన్ని పొందారు. వీరు ఆకాశవాణిలో టాప్ రాంక్‌పొందిన కళాకారులు.
సూరిబాబుగారి పుత్రులే మల్లాది సోదరులని ప్రఖ్యాతి వహించిన శ్రీరామప్రసాద్, రవికుమార్‌గారలు. తల్లి అయిన సుకన్య గారూ సంగీతజ్ఞులే. తాత, తండ్రి, తల్లి- ఇందరి సంగీత పెన్నిధిని రక్తనిష్ఠం చేసికొని జన్మించిన వాళ్లీ సోదర ద్వయం. దీనికి తోడుగా 1991 నుంచి మహా విద్వాంసులయిన సంగీత కళానిధీ, సంగీత విద్యానిధీ అయిన నేదునూరి కృష్ణమూర్తిగారి వద్ద శిష్యరికం పూవికి తావి అబ్బేటట్లు చేసింది. ఇంకా విశేషం ఏమిటంటే ఓలేటివారికీ, సూరిబాబుగారికీ, నేదునూరివారికీ కూడా గురుత్వం వహించిన డా.శ్రీపాద పినాకిపాణిగారివద్దకూడా వీరు ఇప్పటికీ శిష్యరికం చేస్తూ సంగీత విద్యనూ, సంగీత సంస్కారాన్నీ కొల్లగొట్టుతున్నారు. మల్లాది సోదరులగానంలో నేదునూరి వారి విద్వత్తు, ముఖ్యంగా స్వరరచనలోని నిర్దుష్టత, శాస్తబ్రద్ధమయిన రాగ భావ వ్యక్తీకరణ, గమకమూ రవ సంగతుల మేళవింపు, నెరవులో సాహిత్య విస్తరణలో అనౌచిత్యం లేకుండా సంగీత మాధుర్యాన్ని సాధించడం వీరి తమ సొంతం చేసికొని గురువుకు తగ్గ శిష్యులుగా కీర్తి పొందుతున్నారు. ‘‘మా బలం అంతా మా గురువుల బలమే’’ అని వినమ్రతతో వీరు చెప్తారు. శ్రీపాద పినాకపాణిగారు తమిళ దేశంలోని రంగరామానుజ అయ్యంగారితో కృతులూ, కీర్తనలూ, పదాలూ, జావళీలకు సంప్రదాయంలో ఉన్న గాన రీతిని స్వరపరిచి ఎవ్వరూ చేయని ఒక గొప్ప సంగీత యజ్ఞాన్ని చేశారు. అలాంటి శ్రీపాద వారి కృతిపాఠం వందలాదిగా వీరు కర్నూలుకి వెళ్లి నేర్చుకొని వచ్చి శాస్ర్తియ కర్ణాటక సంగీతానికి అసలు సిసలయిన సమర్థులయిన వారసులుగా, తల్లిదండ్రుల కడుపు చల్లగా పుట్టిన సుపుత్రులు ఈ సహోదరులు. ‘‘బాగుగ వింత రాగములు ఆలాపము చేయగ మేను పులకరింపుగ’’ వీరు వేలకు వేలు కచ్చేరీలు ప్రపంచమంతటా చేస్తున్నారు. 1993 నుంచి రెండు దశాబ్దాలుగా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ, ఆంధ్ర దేశం అంతటా, అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్.. ఇత్యాది దేశాలలో కచ్చేరీలు చేసి కీర్తిపొందడమే కాక, శాస్ర్తియ సంగీత సంప్రదాయాన్నీ, విద్యనూ నిల్పుతున్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి చరణ సన్నిధిలో వీరు అనేక కచ్చేరీలను వారి ఆజ్ఞమేరకు చేశారు. ఒక కచేరీలో పంతువరాళిలోని ‘శివశివయనరాదా’ అన్న కృతిలో వీరు చేసినస్వర కల్పన ఆనాటి శ్రోతలు కాని ఎన్నడూ జీవితంలో మరువలేనిది. ఆవేశమూ, సంయమనూ, హృదయమూ, మనస్సులను తగుపాళ్ళలో వ్యక్తీకరించడంలో వీరికి వీరే సాటి. ఈ చిరుప్రాయపు యువకులిద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో ఎం.ఏ. పట్టాను పొందడమేకాక, ప్రస్తుతం పిహెచ్‌డి కోసం పరిశోధన వ్యాసంగంలో ఉన్నారు. వీరిద్దరూ గణపతి సచ్చిదానందస్వాముల ‘హృదయస్థాన’ విద్వాంసులుగా ఉండటమే కాక అనేకానేక సత్కారాలను, బిరుదులను, అత్యున్నత స్థారుూ యోగ్యతలను కూడా పొందారు. వాటిల్లో కొన్ని
– *ఆకాశవాణిలో ఎ గ్రేడ్ టాప్ ర్యాంకింగ్ *‘నాదభూషణ్’ బిరుదు ఢిల్లీ షణ్ముఖానంద సభచే *‘సంగీత నాదమణి’- కంచి పీఠంచే *‘ఇశై పెరోలీ- కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై *యువ పురస్కార్- కేంద్ర సంగీత నాటక ఎకాడమీ- ఢిల్లీ ఇట్లా అనేక గౌరవాలు పొంది మేటి కళాకారులుగా సుప్రతిష్ఠితులయిన ఈ జంట గాయకులు సంగీత విద్యా కళలను గురించి క్రోడీకరించిన వారి అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1.సంగీతాభ్యాసకులు శిక్షణాకాలం ప్రారంభదశలో గాత్ర ధర్మాన్ని అనుసరిస్తూ 4, 5 గంటలు సాధన చేస్తే శ్రుతి శుద్ధత, స్వరజ్ఞానం అలవడతాయి. తర్వాత పెద్ద కళాకారుల సంగీతం వింటూ ఉండాలి. నిరంతరం తనలో తాను పాడుకుంటూ ఉంటే నిర్దిష్ట కాలం అని ఏర్పాటు చేసికొని పాడే అవసరం లేదు.
2.బాహ్య వాతావరణ పరిస్థితులను బట్టి గాత్రాలను కాపాడుకుంటూ ఉండాలి. గొంతు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనోసాధనే ముఖ్యంగా ఉంటూ వౌనంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంగీతకారుల మన కర్తవ్యం ఏమిటన్న ప్రశ్నకు (అ) కళాశాలల్లో పేరున్న విద్వాంసుల చేత విరివిగా వర్క్‌షాప్స్ నిర్వహించాలి. (ఆ)దేవాలయాలలో విధిగా సంగీత కచేరీలు ఏర్పాటు చేయించాలి. (ఇ) టి.వి చానళ్లలో ప్రతిరోజూ ఓ గంట శాస్ర్తియ సంగీతం ఉండాలి. వాగ్గేయకారుల వైభవం తెలియచెప్పాలి. (ఈ) ప్రతి జిల్లాలోనూ సంగీతోత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి. శాస్ర్తియ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. (ఉ) ఆకాశవాణి శాస్ర్తియ సంగీతానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. (ఊ) సంగీత శిక్షణ కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా ప్రసారం చేయాలి. (ఎ) జావళీలకు బదులుగా కచేర్చీలలో సదాశివ బ్రహ్మేంద్రం, కీర్తనలు, తరంగాలూ, అన్నమాచార్య ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ పాడవచ్చును. జావళీల సాహిత్య భావం కారణంగా ఈ సూచన చేస్తున్నాం. (ఏ) ‘నెరవు’ విషయంగా మీ అభిప్రాయం ఇట్లా ఉన్నది. ‘‘నెరవు రాగానికీ, కీర్తనలో ముఖ్య ప్రాణమైన ఒక సాహిత్య భావాన్ని మరింత విస్తరింపజేసే ప్రక్రియ. అర్థవంతమైన వాక్యాన్ని కీర్తనలోంచి గ్రహించి, విరుపులూ, సాహిత్యపు మాటలను అంతంగా రాగంలో ఇమిడింపజేస్తూ లయ విన్యాసంతోఒక నామాన్ని కానీ, ఒక సందేశాన్ని కానీ, ప్రధానీకరించే ప్రకియగా దీన్ని భావించాలి.
1.అనువైన కీర్తనలను ఎన్నుకోవడం 2.రాగాల ఎంపిక 3.తాళాల వైవిధ్యం 4.పక్కవాద్యాల సమర్థతను బట్టి కృతులను మార్చుకోవడం 5.మైకులూ, ఏకోయిస్టిక్స్‌లను బట్టి, శ్రోతల స్థాయిని బట్టి ఆయా పరిస్థితులకు అనుకూలంగా కచేరీ ప్రణాళికను తక్షణం మార్చుకోవడం లాంటివాటివల్ల కచేరీ రక్తి కట్టుతుందంటారు వీరు. అంతేకాక‘సంగీతాన్ని కళగా కంటే కూడా దాన్ని శాస్త్రంగా, విద్యగా భావించా’అన్నది వీరి అభిప్రాయం.

ఫోటో… మల్లాది సోదరులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు —4 పూర్ణ యోగి సంత్ జ్ఞానేశ్వర్ .

సిద్ధ యోగి పుంగవులు —4

                                                                    పూర్ణ యోగి సంత్ జ్ఞానేశ్వర్ .

      మాహాత్ముల మహిమలను మనం అర్ధం చేసుకోవటం కష్టం .దున్న పోతు తో వేదాన్ని పలికించిన మహా యోగి పుంగవుడు జ్ఞానేశ్వరుడు .వారిని గురించి తెలుసు కోవటం మన అదృష్టం .

    భారత దేశం భక్తులకు పుట్టినిల్లు .అందులో మహారాష్ట్ర దేశం లో అనన్య భక్తీ సామ్రాట్టులున్నారు ..జ్ఞానదేవుడు ,నామ దేవుడు ,పుండరీకుడు మొదలైన భక్తు లంతా తమ భక్తీ వైభవం తో పండరి నాధుడైన పాండు  రంగ విథ లుని సన్నిధి లో మెలగి ,సాక్షాత్కారం పొంది ఆయన్ను చేరిన వారే ..వీరందరి లో జ్ఞాన దేవుడు మిన్న అంటారు .సుమారు 740 సంవత్సరాల క్రిందటి వాడు సంత జ్ఞానేశ్వర్ .పైథాన్ ప్రాంతం లోని గోదావరి నది ఒడ్డున ‘’ఆపే గాం ‘’నివాసి ..చిన్నతనం లోనే వేద శాస్త్రాలను క్షున్నంగా అభ్య శించి మహా జ్ఞాని గా పేరు పొందాడు .అతని అన్న నివృత్తి నాధుడు ,తమ్ముడు సోపాన దేవుడు ,చెల్లెలు ముక్తా బాయి .వీరి తండ్రి గారు వీరి పేర్లను ముక్తికి కి మార్గం గా వరుస క్రమం లో పెట్టటం విశేషం ..వీరందరూ అలానే జీవించి ,నామ సార్ధకత ను సాధించారు .

     జ్ఞాన దేవుని గురువు అన్న గారైన నివృత్తి నాధుడే ..ఆయన అనుగ్రహం తో నే పది హేనేల్ల వయసుకే భగవద్గీత కు అద్భుత మైన   ‘’జ్ఞానేశ్వారీ గీత ‘’అనే  వ్యాఖ్యానం రాశాడు జ్ఞాన దేవుడు .దానికి సాటి ఇప్పటి వరకు ఇంకొకటి లేదు అని పేరు వచ్చింది ..కుల మత భేదాలకు అతీతం గా ఉండాలని బోధించాడు ..ఈశ్వర భక్తీ వల్లనే శుద్ధ జ్ఞానం కలుగు తుందని గట్టిగా ప్రవచించాడు .మానవునికి మోక్ష మార్గం బోధించ గలిగేది గీత మాత్రమే నని ధంకా బజాయించి చెప్పాడు ..గీత ను యే భేదం లేకుండా అందరు చదవ వచ్చు నని ,తెలియ జేశాడు .జ్ఞాన దేవుడు ,ఆయన సోదరులిద్దరూ, సోదరి అందరు బ్రహ్మ చర్య జీవితాన్నేగడపటం ఆశ్చర్యమేస్తుంది ..దేశం లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలన్నీ వీరు సందర్శించారు .

                   ‘’నేను జ్ఞాన దేవుడిని .అన్ని ఆగమాలు తెలిసిన వాడిని ‘’అని జ్ఞాన దేవుడు చెప్పు కొన్నాడు .అది గర్వం కాదు .ఆతని దిషణఅంత గొప్పది .వైష్ణవ మతాన్ని మహారాష్ట్ర దేశమంతా వ్యాపించ జేసిన కుటుంబం వారిది .’’అమ్రుతానుభావం ‘’అనే గ్రంధాన్ని ,యోగవాశిష్టానికి మరాఠీ భాష లో అర్ధ తాత్పర్యాలను రాసిన వాడు జ్ఞానేశ్వరుడు .’’అభంగాలు ‘’అనే పేరు తో వందలాది పద్యాలను అలవోక గా చెప్పాడు .అవన్నీ జనం నోళ్ళలో నాని ,సార్ధక మయాయి .అవి ముక్తి మార్గ సోపానాలుగా ,భక్తీ మార్గ స్ఫోరకాలుగా ఉంటాయి .

         జ్ఞాన దేవుని మహిమలను తెలియ జేసే అనేక కధలు వ్యాప్తి లో ఉన్నాయి .ఒక సారి జ్ఞాన దేవుడు ఒక సభలో మాట్లాడుతున్నాడు ..సభకు బయట ఒక దున్న పోతు మేస్తోంది .ఒక తుంటరి వేళాకోళం గా ‘’ఆ దున్న పోతు   పేరు కూడా జ్ఞాన దేవుడే ‘’అని ఎద్దేవా చేశాడు .’’నిజమే ,దానికి నాకు ఎలాంటి భేదము లేదు .దానిలోనూ ,నాలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే ‘’అని సుస్పష్టం గా చెప్పాడు ..ఆవ్యక్తి దున్న పోతు ను కొరడా తో కొట్టాడు ..అదే సమయం లో జ్ఞాన దేవుని వీపు మీద కూడా కొరడా దెబ్బలు కన్పింఛి ,రక్తం కారటం అందరు చూశారు ..ఆయన మహిమాన్విత జీవితానికి అక్కడున్న వారందరూ చేతు లెత్తి నమస్కరించారు .

                    మరోసారి జ్ఞాన దేవుడితోదున్న పోతు తో వేదం పలికించమని పరీక్ష పెట్టారు .అప్పుడాయన దాని తలమీద చేతులు ఉంచారు .వెంటనే దున్న పోతు నాలుగు వేదాలను స్వరం ,ఉచ్చారణ లతో సహా నిర్దుష్టం గా ,అవిశ్రాంతం గా పలికింది ..అప్పుడు జ్ఞాన దేవుడిని ‘’విష్ణువు అవతారం ‘’గా అందరు భావించారు .ఇంకోసారి జ్ఞాన దేవుడు ఒక బ్రాహ్మణుని ఇంటికి ఆబ్దీకానికి అంటే తద్ది నానికి ఆహ్వానిస్తే  వెళ్లాడు . పితృదేవతలను మంత్ర పూర్వకం గా ఆహ్వానించాడు జ్ఞానదేవుడు .అందరు సాక్షాత్కారమై వచ్చి ,పిత్రువధీ ని సంతృప్తి కరం గా పొందారు ..అంతటి యోగం ,సిద్ధి ఆ మహానుభావుడికి ఉండేవి .

           చాంగ్ దేవుడు అనే యోగి ,పెద్ద పులి పై స్వారీ చేస్తూ ,త్రాచు పామును కొరడా గా చేత్తో పట్టుకొని జ్ఞానేశ్వరుని దగ్గరకు వచ్చాడు ..అప్పుడు జ్ఞాన దేవుడు విరిగిన గోడపై సోదరులతో కూర్చుని ఉన్నాడు ..అప్పుడు ఆ మొండి గోడ కదలటం ప్రారంభించింది ..వచ్చిన యోగి ఇది చూసి సిగ్గు పడి  ,జ్ఞానేశ్వరుని పాదాలు పట్ట్టు కొని జ్ఞాన భిక్ష ప్రసాదించమని వేడు కొన్నాడు ..దానికి ఆయన తన సోదరి ముక్తా బాయి ని వేడుకొని జ్ఞానం సంపాదించు కోమని హితవు చెప్పాడు ..ఆమె చిన్న బాలికే అప్పుడు .అంత చిన్న పిల్ల దగ్గర ,ఏమీ తెలీని పసి పిల్ల వద్ద  ఎలా నేర్చు కొంటాను అని భావించి ,ఆమె పెట్టిన పరీక్షలకు తట్టు కొని ,ఆమె వద్దశుశ్రూష చేసి  జ్ఞానం పొందాడు ..

                   ‘’సంత్  జ్ఞానేశ్వర్ ‘’గా అందరి చేత అపిలువ బడే జ్ఞాన దేవుడు  భక్త శిఖా మణి గా ,,జ్ఞానేశ్వర మహా రాజు గా ప్రసిద్ధుడు .పూర్ణ యోగి గా జ్ఞానేశ్వరుడిని భావిస్తారు .నిత్యం పాండురంగ విభుని తో మాట్లాడుతూ ,ఆయన తో తిరుగుతూ ఉండేవాడు .పూనా దగ్గర ‘’అలంది ‘’లో ఆయన చూపిన అద్భుతాలన్నీ ఇవాళ మనకు చిత్రాలుగా ప్రత్యక్షం అవుతాయి .నేను వెళ్లి వాటిని చూసి ఆనందించాను .అదొక మధురానుభవం .’’సచ్చిదానందుడు ‘’అనే గృహస్తు చని పోతే ,అతన్ని బ్రతికించిన ప్రాణ దాత జ్ఞానేశ్వరుడు ..అతడు ఆ తర్వాతా ‘’సచ్చిదానంద బాబా ‘’గా జ్ఞాన దేవుని శిష్యుడై ,ఆయన భావ వ్యాప్తికి తోడ్పడ్డాడు ..జ్ఞాన దేవుడు జీవించింద.ఖచ్చితం గా 21 సంవత్స రాల 3నెలల 5రోజులు మాత్రమే .క్రీ.శ.1296మార్గశిర బహుళ త్రయోదశి గురువారం జ్ఞాన దేవుని జ్ఞానజ్యోతి అఖండ చైతన్య జ్యోతి లో విలీనం అయింది .జ్ఞానదేవులకు తన అన్న నివృత్తి నాధులు అంటే ప్రేమ ,భక్తీ ,గౌరవం ఎక్కువ ..సాంప్రదాయాలకు అతీతం గా ఆయన రాసిన ‘’జ్ఞానేశ్వరి గీత ‘’ఇప్పటికీ శిరోధార్యమే .

 మరో యోగి పున్గవుని గురించి మరోసారి తెలుసు కొందాం

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —5-6-12—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వింత ఆలయాలు –వి చిత్ర విశేషాలు –13 రంగ రంగ వైభవం –శ్రీ రంగం

 వింత ఆలయాలు –వి చిత్ర విశేషాలు –13

                                                             రంగ రంగ వైభవం –శ్రీ రంగం

            మహా రాష్ట్రులకు పాండురంగడు అంటే ఎంత భక్తీ యో ,తమిళ నాడు లో శ్రీ రంగ నాధుడు అంటే అంత ఆరాధన .’’విప్రనారాయణ ‘’కధ కు కేంద్రం కూడా .తిరుచినా పల్లికి దగ్గర లో ఉన్న శ్రీ వైష్ణవ క్షేత్రం .కావేరి ,కోలనూర్నదుల మద్య ఉన్న ద్వీపం .రాన్గానాదాలయం కావేరి నది మద్య లో ఉంటుంది .చాలా ఎత్తైన ప్రాకారాలతో ,పెద్ద ఊరంతా ఆలయం ఇది .శిల్ప సక్మ్పడకు ఆయువు పట్టు .శ్రీ మహా విష్ణువు శేష తల్పం పై శయనించి ఉన్న విగ్రహం శ్రీ రంగ నాదునిది ..ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు .శ్రీ వైకుంఠం ఇక్కడే ఉందా అని పిస్తుంది కనుకనే అపర వైకుంఠం గా ప్రశిద్ధి .

                               స్థల పురాణం

     బ్రహ్మ లోకం లో బ్రహ్మ దేవుడు రంగానాదుడిని నిత్యం పూజించే వాడు ..తరువాత ఈ విగ్రహాన్ని ఇక్ష్వాకు రాజులకు ఇచ్చేశాడు ..అందుకే ఇక్ష్వాకులైన రఘు వంశ రాజులు తమ ఇలా వేల్పుగా శ్రీ రంగానాదుడిని పూజించే వారు ..రామాయణ కల్ప వృక్షం లో ఈ విషయాన్ని శ్రీ విశ్వనాధ తెలియ జేశారు ..శ్రీ రామునికీ శ్రీ రంగనాధుడు ఆరాధ్య దైవమె ..రావణ వధ తర్వాతా ,పట్టాభిషేకానికి శ్రీ రాముడు సీతా సమేతం గా అయోధ్యకు వస్తుంటే ,విభీశానాదులు వెంట వచ్చారు ..శ్రీ రాముడు అనుగ్రహం తో విభీషణుడికి శ్రీ రంగ నాద విగ్రహాన్ని కానుక గా ఇచ్చాడు ..నేల మీద తగిలించ కుండా లంకకు చేరి అక్కడ ప్రతిష్టించమని హెచ్చరించాడు రాముడు .విధి బలీయం .శ్రీ రంగం దగ్గరకు వచ్చే సరికి ,ఆ విగ్రహం మోయ లేనంత భారమైంది .చేసేది లేక నెలకు దిన్చేశాడు విగ్రహాన్ని .ఇక స్వామి కొలువు శ్రీ రంగమే అయింది .శ్రీ లంకకు దక్కాల్సిన అదృష్టం శ్రీ రంగానికి దక్కింది ,మనకందరికీ దక్కింది .వైష్ణవ ధర్మ ప్రచారకులైన ఆళ్వారులు అందరు శ్రీ రంగ వాసులే ..శ్రీ మద్రామానుజుల వారు తమ విశిష్టాద్వైత మతాన్ని లోకానికి ఇక్కడి నుంచే చాటారు ..కనుక వైష్ణవానికిది రాజ దాని అయింది .తిరుపతి తర్వాతా అంత సంపన్నమైన ఆలయం శ్రీ రంగం .ఆలయ శిఖరం ‘’ఓంకార రూపం ‘’గా ఉండటం ఇక్కడి విశేషం .అయితే ఎంత దూరం నుంచి చూసినా ,ఆలయ శిఖరం కణి పించదు .ఇది . మరో విచిత్రం ..గర్భ గుడి కి ఎదురు వైపున ఉన్న ఒక మండపం లో ఒక ప్రత్యెక స్థలం దగ్గర నుంచొని చూస్తె నే ఓంకార శిఖరం కన్పించి ,తన్మయులను చేస్తుంది .

                                      జమ్బుకేశ్వరాలయం

    రంగం లో నే ‘’జంబుకేశ్వరం ‘’ఉంది .పంచ భూతాత్మక మైన ‘’జల లింగం ‘’జమ్బుకేహ్వార లింగం .లింగం కింద పాను వత్తం లో నుంచి ఎప్పుడు నీరు బోట్లు బోట్లు గా ఊరతం ఇక్కడి చిత్రాలలో విచిత్రం ..పాను వత్తం చుట్టూ బట్ట చుట్టి ఉంచుతారు ..అది తడిసి పోగానే తీసి ,పిండి  ,మళ్ళీ పరవటం ఆనవాయితీ .ఈ ఆలయం రంగానాదాలయం కంటే ప్రాచీన మైనది గా భావిస్తారు .చాలా విశాల మైంది కూడా .జంబు వ్రుక్షాలేక్కువ కనుక ఆ పేరు వచ్చింది .ఆడి శంకరులు దర్శించిన దివ్య ధామం ఇది .అమ్మవారు ‘’అఖిలాండేశ్వరి ‘’.ఉగ్రమూర్తి గా అమ్మ వారు కన్పించటం ఇంకో వింత ..ఆ భయంకర మూర్తి ణి చూడ టానికి భక్తులు భయపడుతుంటే శంకరాచార్యుల వారు ఇక్కడ ఉంది తపస్సు చేసి ,అమ్మను ప్రసన్నం చేసుకొని ,ఉగ్ర రూపాన్ని ఉపసంహరింప జేషి శాంత మూర్తి గా మార్చారట .అదో విశేషం ..విలువైన నవ రత్న నిర్మిత శ్రీ చక్రాన్ని ఆడి శంకరులు ఇక్కడ ప్రతిష్టించారు .

                           రాక్ టెంపుల్

                   శ్రీ రంగం నిజం గా ఒక దీవి ..కొబ్బరి తోటలతో ,కన్నుల పండువ గా కన్పిస్తుంది ,ఒక చిన్న కొండ మీద వినాయకుని ఆలయం ఉంది .చాలా పెద్ద వినాయక విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది ..తీరని కోర్కెలను తీరుస్తాడని నమ్మకం .కొండ మీద ఉంది కనుక రాక్ టెంపుల్ అన్టారు .

 శ్రీ రంగ నాధ సేవలో యామునా చార్యులు ,పెర్యాల్వార్ అనబడే విష్ణు చిట్టులవారు అంటే గోదా దేవి పెంపుడు తండ్రి ,స్శ్రీ పాదాన్ఘ్రి రేణువు అని పిలి పించు కొనే విప్రనారాయణ స్వామి ,’’చూడి కొడుట్ట నాచియార్ ‘’అంటే ఆముక్త మాల్యద అయిన తిరుప్పావై రచించి సాక్షాత్తు శ్రీ రంగ నాదుదినే భర్త గా పొందిన న  గోదా దేవి  తరించి భక్తీ మార్గానికి దర్శకు లైనారు .శ్రీ రంగ నాధుని దర్శనం సర్వ పాప వినాశనం ,ముక్తి దాయకం .

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –11

  వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –11

                                                                   సైకత లింగ రామేశ్వరుడు

                               ఐతిహాసికత ,చారిత్రిక ప్రాధాన్యం ఉన్న క్షేత్రం రామేశ్వరం .కాశీ ,ప్రయాగ క్షేత్రాల లో గంగా స్నానం చేసి ,ఆ పవిత్ర గంగా జలాన్ని కలశం లో నింపు కొని ,,విశ్వేశ్వర లింగా నికి అభిషేకం చేసి పులకించి ,సీలు చేసిన  చెంబుల్లో గంగా జలాన్ని భద్రపరచి వెంట తెచ్చు కొని రామేశ్వరం లో సముద్ర స్నానం చేసి ,ఆ గంగా జాలం తో  రామేశ్వర లింగానికి అభి షేకం చేసి సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందటం భారత దేశం లో ఒక సంప్రదాయం .ఇది తరతరాలుగుఆ అవిచ్చిన్నం గా సాగి పోతున్న చరిత్ర ..ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరానికి గొప్ప ప్రాదాన్య త ఉంది ..     

            తమిళ నాడు లో మదురై నగరానికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం లో ,రామనాధ పురం జిల్లాలో వున్న ద్వీపం రామేశ్వరం. చుట్టూ సముద్రం ..రామేశ్వరం విష్ణు మూర్తి యొక్క శంకు ఆకారం లో ఉండటం విశేషం ..ఇక్కడ నూనె గానుగలు కుండలు చేయటం ఉండవు .కారణం రామేశ్వర లింగం సైకత అంటే ఇసుక లింగం ..బోలుగా ఉంటుంది .కాశీ యాత్రా ఫలం దీనికి దగ్గర్లో ఉన్న ధనుష్కోటి లో అంటే సేతువు లో స్నానం చేసిన తర్వాతా లభిస్తుంది ..బంగాళాఖాతం ,హిందూ మహా సముద్రం ,కలిసే చోటునే సేతు అంటారు .అంటే వారధి అని అర్ధం ..ఇక్కడే శ్రీ రాముడు లంకకు చేర టానికి వారధి కట్టాడు .ఇప్పటికి శ్రీ రామ వారధి చిహ్నాలు ఇక్కడ కని పించటం మరో విశేషం .

     రావణ వధ తర్వాతా బ్రహ్మ హత్యా దోష నివారణ కోసం శ్రీ రాముడు శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి దోష విముక్తుదవాలని భావించాడు ..ఇక్కడ ప్రతిష్టించే లింగాన్ని కాశీ వెళ్లి తీసుకొని రావలసినది గా అంజ నేయుడికి చెప్పాడు .అనుకొన్న ముహూర్తానికి హనుమ రాక పోతే సీఎతా దేవి ఇసుక తో లింగం చేసి ఇస్తే ,మహర్షుల ఆజ్న ప్రకారం శ్రీ రాముడు ఆ సైకత లింగాన్ని ప్రతిష్టించాడు ..హను మంతుడు కాశీ నుంచి లింగం తెచ్చి ,జరిగిన విషయం తెలుసు కొని ,ఇసుక లింగాన్ని తోక తో  పేక లించటా నికి విశ్వ ప్రయత్నం చేశాడు ..విఫలుడుఅయాడు ..హనుమ ను అనున యించి ,సైకత లింగం ప్రక్కనే హనుమ తెచ్చిన కాశీ లింగాన్ని రాముడు ప్రతిష్ట చేసి హనుమ ను శాంతింప జేశాడు ..భక్తులు ముందుగా హనుమ తెచ్చిన లింగానికి పూజ చేసి ,ఆ తర్వాతే సైకత లింగాన్ని పూజించాలని శ్రీ రాముడు విధి విధానాన్ని ప్రకటించాడు .అప్పటి నుండి అలానే జరుగు తోంది ..హనుమ తెచ్చినలింగాన్ని ‘’విశ్వ లింగం ‘’అని ,సీత చేసిన ఇసుక లింగాన్ని ‘’రామ లింగం ‘’అని పిలుస్తారు .

         ఆలయానికి మూడు మండ పాలు ,వాటి పై అద్భుత శిల్ప సంపద ఉంటుంది ఆలయం 865అడుగుల పొడవు ,657అడుగుల వెడల్పు ఉంటుంది ..పైకప్పును 49 అడుగుల పొడవైన రాతి దూలం మోస్తుంది ..మొత్తం దేవాలయం విస్తీర్ణం 4000చదరపు అడుగులు .ప్రపంచపు అద్భుతాలలో రామేశ్వరాలయం ఒకటి ..తూర్పు ,పడమరల ఎత్తైన గోపురాలున్నాయి .పన్నెండవ శతాబ్దం లో ఉదయాన్ సేతు పతి అనే రామ నాద పురం పాలకుడు ఈ ఆలయాన్ని కట్టించాడు ..గర్భ గుడి లో శ్రీ రామ లింగేశ్వర లింగం ఉంటుంది .దేవేరి ‘’పర్వత వర్ధని ‘’అమ్మవారు స్వామికి కుడి వైపు ఉంటుంది ..శ్రీ చక్రం ఉన్న ఆలయం ఇది .ఈ ఆలయానికి ఉత్తరం గా ‘’విశ్వలింగ ‘’దేవాలయం ఉంది .అమ్మవారి పేరు ‘’విశాలాక్షి ‘’..ఈశాన్యం లో నట రాజ స్వామి ఆలయం ఉంది ..తూర్పు గోపుర ద్వారానికి ,కుడి వైపు ఎరుపు రంగు కలిగి ,దక్షిణ ముఖం గా ఉన్న ఆంజనేయ విగ్రహం పరమ ఆకర్షణీయం గా ఉంటుంది ..ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం లో స్వామి వారల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహ్స్తారు .ధ్వజస్తంభం నందీశ్వరుని వెనుక ఉండటం ఇక్కడ మరో వింత ..దేవాలయ ముఖ ద్వారం సముద్రాభి ముఖం గా ఉంటుంది .గుడికి సముద్రం చాలా దగ్గరే ..ఇక్కడి సముద్ర జలానికి ‘’అగ్ని తీర్ధం ‘’అని పేరు .దేవాలయం ఆవరణ లో 22నూతులున్నాయి ..సముద్ర స్నానం చేసి వచ్చి ,ఈ బావుల్లోని నీటిని బొక్కెన లతో తోడుకొని లేక పోయించుకొని స్నానం చేయాలి ..నీరు తోడి పోయటానికి మనుష్యులు బొక్కెన లతో రెడీ గా ఉంటారు ..బేరం ఆడి వారిని నియమించుకోవాలి ..బావుల్లో స్నానం చేయటానికి సుమారు ఇరవై రూపాయల టికెట్ కొనుక్కో వాలి .ఇరవై రెండు బావులకు వేరు వేరు పేర్లున్నాయి .అవన్నీ పవిత్ర తీర్ధ జలాల్ని విశ్వాసం ..ఆ నీటి లో స్నానం చేస్తే ,శారీరక  మానశిక ఆనందం లభిస్తుంది .కారణం ఆ జలాల్లో ఓషధీ ధర్మాలున్డటమే .అదికాక సముద్రపు ఒడ్డున ఉన్నా ఆబావుల్లో నీరు  ఉప్పగా ఉండక పోవటం చిత్రాతి చిత్రం .ఒక్కో బావికి ఒక్కో మహర్షి పేరుంటుంది .

        రామేశ్వరానికి రెండు కిలో మీటర్ల దూరం లో కోదండ రామ స్వామి దేవాలయం ఉంది .ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణునికి శ్రీ రాముడు శరణా గతిని ఇచ్చాడు ..ధనుష్కోటికి వెళ్ళే దారి లో ‘’జటా తీ ర్ధం ‘’ఉంది .శ్రీ రాముడు రావణ వధ ,రామ లింగ ప్రతిష్ట తర్వాతా,తన జటలను ఈ తీర్ధం లో తడుపు కొన్నాడట ..అందుకే ఆపేరు వచ్చింది .

 రామనాధ పురానికి పదిహేను కి.మీ.దూరం లో ‘’దేవీ పట్నం ;’’ఉంది .ఇక్కడ శ్రీ రాముడు తొమ్మిది శిలలను ప్రతిష్ఠించటం చేత ‘’నవ పాషాణం ‘’అని పిలుస్తారు ..ఇవే నవగ్రహాలు .

      రామేశ్వరం లో శ్రీ రాముని పాదుకలు ఉన్న చోట పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉంటాయి .వీటిని నీటి లో వేస్తె తెలిపోవటం మహిమా ,విశేషం .సేతువు ను ఇలాంటి ఇటుకలతో నే నిర్మించారని భావిస్తారు ..రామేశ్వరం శివ వైష్ణవ సమ దర్శన క్షేత్రం .ముక్తి క్షేత్రం ..దివ్య క్షేత్రం

                      మరో వింత ఆలయం సంగతి ఇంకో సారి –

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —4-6-12.—కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్

   అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్

           ఈ వారం మొదట్లో కొంత నీరసం గానే గడిచింది .కాని ఆదివారం మాత్రం సంగీత పుష్కరిణీ స్నానం చేసి పవిత్రులమయ్యాం .ఆ విశేషాలు త ర్వాత రాస్తాను .ఈ వారం లో లైబ్రరి నుండి తెచ్చిన వాటిల్లో కిందటి వారం చదవగా మిగిలినవి చదివేశాను .అందులో కన్ఫుశియాస్ ,బీఉల్ఫ్ ,యే న్సేంట్ గ్రీక్స్ ,ది  కమింగ్ అనార్ఖి పుస్తకాలు అద్భుతం .మిగిలినవి తిరగేశానంతె. ..మంగళ వారం రాత్రి సుబ్బు ఇంట్లో భజన కు వెళ్ళాం .అంతే .శనివారం నేను ,నా మనవడు పీయుష్ లైబ్రరి కి వెళ్లి 21 పుస్తకాలు తిరిగి ఇచ్చేసి 22పుస్తకాలు తెచ్చు కొన్నాను .అందులో వెంటనే జిం బౌయీ ,జానే ఎయిర్ పుస్తకాలు రెండు చదివేశాను .మా పక్క ఇంటి ఆవిడ గాయత్రి ‘’ఆంద్ర యోగులు ‘’అనే బిరుద రాజు రామ రాజు గారు రాసిన పుస్తకం ఒకటి మూడో భాగాలు ఇచ్చింది .మొదటి భాగం చదివేశాను .అందులో ము గ్గురు మహాను భావుల గురించి ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’శీర్షికతో సరస భారతి కి నెట్ లో  రాశాను .నేను ‘’విహంగ ‘’అనే నెట్ మాగజైన్ కు రాసిన ‘’ఆడదై  పుట్టటమే ఆమె నేరం ‘’అన్న వ్యాసాన్ని రాసిన వారం లోనే  జూన్ సంచిక లో ప్రచురించారు .మద్య యుగ  గ్రీకు మహిళ ,బీ ఉల్ఫ్ ,అలెక్షాన్ద్రియా లైబ్రరి ,కన్ఫుశియాస్ ,సిల్వియా పాత్ .కాతేరింన్ మానస్ ఫీల్డ్ అనే రచయిత్రుల పై నోట్స్ రాసుకోన్నాను .వాటిని వ్యాస రూపం లో తరువాత రాయాలి .ఇలా శని వారం వరకు గడి ఛి పోయిది .ఆది వారం మాత్రం’’ ఫోర్ ఇన్ వన్ ‘’గా మహదానందం గా గడిచి పోయింది .ఆ విశేషాలే ‘’విజిల్ విజార్డ్ వీక్ ‘’

                                                               గళ మురళి –శివ ప్రసాద్

               మూడవ తేది  ఆదివారం  ఉదయం పది గంటలకు ఇక్కడి సత్య సాయి సెంటర్ వాళ్ళు సెంటర్ లో ఈల పాట శివ ప్రసాద్ గారిని ఆహ్వానించి కచ్చేరి చేయించారు .దానికి అందరం వెళ్ళాం .ఆయన దాదాపు110000 ఈల పాట కచేరీలు చేసి రికార్డు సృష్టించిన మహా సంగీత విద్వాంసు డు .కృష్ణా జిల్లా పామర్రు దగ్గర గుడివాడ రోడ్డు లో ఉన్న కొమర వోలు వారి అసలు ఊరు .అక్కడ గాంధీ ఆశ్రమం కూడా ఉండేది .సెకండరి గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్ కూడా ఉండేది .నేను హెడ్ మాస్టర్ గా పని చేసిన  అడ్డాడ  ప్రక్క గ్రామమే అది .అక్కడి నుంచి వీరి పూర్వీకులు బాపట్ల చేరి అక్కడే నివాసం ఉన్నారు .కనుక కొమరవోలుతో ఈయన కేమీ సంబంధం లేదు .హైదరాబాద్ రవీంద్ర భారతి లో దాదాపు ఇరవై ఆరు ఏళ్లు ఉద్యోగం చేసి స్వచ్చందం గా పదవీ విరమణ చేసి సంగీతానికే జీవితాన్ని అంకితం చేస్తున్నారు .గొప్ప సంస్కారం ఉన్నవారు . సత్య సాయి బాబా సమక్షం లో ఈల కచ్చేరి చేసి ఆయన కు దగ్గరై ,ఆయన ఆశీర్వచనం, ఆదేశం పై ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తున్నారు .సేవ ,ప్రేమ లను ప్రచారం చేస్తూ సాయి సెంటర్ల ను దర్శించి భజనలను ఈల పాట తో చేసి ఆనడం కలిగిస్తున్నారు .సత్య సాయి వీరికి రెండు సార్లు బంగారు గొలుసు బహుమతి గా ఇచ్చారు . దాదాపు రెండు గంటల సేపు భజన సంగీతాన్ని విని పించి ముగ్ధులను చేశారు .  .అమెరికా రావటం ఇది అయిదవ సారి .సత్య సాయి తో తన పరిచయాన్ని వివ రించారు .కంచి ,శృంగేరి జియ్యర్ దత్తస్వామి సమక్షం లో కచేరీలు చేశారు .బాల మురళి కృష్ణ ఆయన్ను శిష్యునిగా స్వీకరించి పెద్దలకు పరిచయం చేసి ఆయన ఉన్నతికి తోడ్పద్దారని ఎంతో కృతజ్ఞత భావం గా చెప్పారు .సత్య సాయి తో పరిచయం తర్వాతే తనకు పేరు ప్రఖ్యాతి ఆర్ధిక వెసులు బాటు బాగా కలిగాయని చెప్పారు .బాబా మీద 123దేశాలలో ని భక్తులకు అచంచల విశ్వాసం ఉండటం తాను ప్రత్యక్షం గా చూసి ఆశ్చర్య పోతునానని అన్నారు .రష్యా దేశం లో రెండు వందల మంది రష్యన్లు భజన లో పాల్గొనటం వింత అన్నారు .దీనికి కారణం ఆయన ప్రవచించిన సేవా ,ప్రేమ అని పిస్తున్నాయని అన్నారు .సెంటర్ వారు నన్ను ఆహ్వానించి నాతో శివ ప్రసాద్ గారికి సత్కారం చేయించి శాలువా కప్పించారు .అ గౌరవం నాకు ఇవ్వటం నాకు ఎంతో త్రిల్ అని పించింది .ఇప్పటికి మూడు ఆల్బమ్స్ సత్య సాయి భజనల్ మీద ఇచ్చానని చెప్పారు .నాలుగోధా నికి స్పాన్సర్ చేస్తామని ఇక్కడి జగదీశ్ లక్ష్మి దంపతులు వాగ్దానం చేశారు .దానికి మూడు వేల డాలర్లు అవుతుందట .అంటే సుమారు రెండు లక్షల రూపాయలు .వారికి సాయి మీద ఎంత నమ్మకమో అర్ధమయింది .మా అమ్మాయి పనస తొనలు ,రాంకీ ఉషల పులిహోర అందరికి పెట్టారు .

                                               తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లేట్ యేరియా

       ఈ రో జున షా  ర్లేట్ లోని తెలుగు వారంతా ఒక పార్క్ లో పిక్నిక్ ఏర్పాటు చేసుకొన్నారు .దానికి మేమూ వెళ్ళాం .పిల్లలు ఆడు కోవటానికి చిన్న గేమ్స్ ,పెద్దలు వాలీ బాల ఆడారు .మేము సెంటర్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చాం .అప్పటికే దాదాపు అందరి భోజ నాలు అయి పోయాయి .నాగమణి ,గాయత్రి సహాయం చేస్తున్నారు .మేమందరం భోజనాలు చేశాం .పులిహోర ,పెరుగన్నం ,అన్నం సాంబారు ,చట్ని వెజిటబుల్ బిర్యాని  పుచ్చ ముక్కలు ఐస్క్రీం ,కోలా .పెట్టారు .ఒక అరగంట అక్కడ ఉన్నాము .వాళ్ల జెనరల్ బాడీ మీటింగ్ జరుగు తోంది .వాళ్ల కార్య వర్గం లో ఉన్న జ్యోతి అనే అమ్మాయి సరసభారతి వ్యాసాలూ చదువు తుండటం వల్ల నా ఫోటో చూసి నన్ను గుర్తు పట్టింది .ఆమె ,పవన్ భార్య రాదా పిల్లలకు ఆదివారాల్లో తెలుగు నేర్పుతున్నారిక్కడ .అక్కడి నుంచి బయల్దేరి మూడింటికి ఇంటికి చేరాం .

                                                         ఈల లీలా లోల –గళ వంశీ –విజిల్ వజీర్ సుల్తాన్

         ఇక్కడి హిందూ సెంటర్ వాళ్ళు ,సాయి సెంటర్ వాళ్ల ఆధ్వర్యం లో వెంకటేశ్వర ఆలయం కు అను సంధానం గా ఉన్న ‘’గాంధీ భవన ‘’లో శివ ప్రసాద్ గారి కచేరి ఏర్పాటు చేశారు ..మేము నాలుగున్నరకు అక్కడికి చేరు కొన్నాం .ఐదున్నరకు కచేరి ప్రారంభ మైంది .చుట్టూ ప్రక్కల ఉన్న కళాకారులు ప్రక్క వాయిద్యాలు వాయించారు .మంజు నాద అనే ఇక్కడి ఆయన మృదంగం ,ఒకామె హార్మని ,ఒకాయన  తబల ,ఒకాయన ఫిడేల్  లతో సహకరించారు .శివ ప్రసాద్ ‘’వాతాపి గణ పతిం భజే తో ప్రారంభించి ,త్యాగరాజు గారి ఎందరో మహానుభావులు ఆ తర్వాత పురందర దాస ,అన్న మాచార్య కీర్తనలలు మొదలైనవే కాక ,రాగ ప్రస్తారమూ చేసి ఆనంద పారవశాత్వం కల్గించారు .ఎంతో అలవోకగా పాడటం అద్భుతం అని పించింది .నాన్ స్టాప్ గా పాడటం మరీ అబ్బుర పరచింది .గమకాలు చమక్కులు వివిధ స్తాయీ భేదాలు స్పష్టత ,వేగం అంకిత భావం తో  అసలు జనాలకు  బాహ్య స్పృహే లేకుండా చేశారు .గంధర్వ లోకాలలో విహరింప జేశారు .వాద్య సహాకారక్మూ వన్నె తెచ్చింది ..రస గంగా ప్రవాహం లో తడిసి ముద్దా అయ్యాం అందరం .చివరికి రెండు భజనలు పాడారు . .గాంధీ భవనం లో జరుగుతున్నందున గాంధి గారికి ఇష్టమైన ‘’వైష్ణవ జనతో ‘’పాడి రక్తి కట్టించారు .శివ ప్రసాద్ ను హిందూ సెంటర్ వారిఉ శాలువతో జ్ఞాపిక తో సత్కరించారు .ఆయన కృతజ్ఞత చెప్పారు .కచేరి ప్రారంభానికి ముందు నేను ‘’సత్య ‘’ తో శివ ప్రసాద్ కు ఒక బిరుదు ఇద్దాం అని సూచన చేశాను ‘’మీరు ఏది సూచిస్తే అది ఇద్దాం ‘’అన్నాడు సత్య .సరే నన్ను వేదిక మీదికి సత్య ఆహ్వానించాడు

    నేను ముందు తెలుగు లో ,ఆ తర్వాతా దాన్నే ఇంగ్లీష లో చెప్పాను ‘’శివ ప్రసాద్ గారికి ముందే ఆంద్ర దేశం లో ఈల పాటకు గొప్ప ప్రచారం తెచ్చి లిజేండ్ గా నిలిచిన మహాను భావుడు న్నాడు .ఆయనే కే.రఘు రామయ్య .పౌరాణిక నాటకాలలో నారద ,శ్రీ కృష్ణ ,బిల్వమంగలుడు వంటి వేషాలు వేసి సినిమాలలోను నారద ,శ్రీ కృష్ణ పాత్రలను పోషించిన నటుడాయన .ఆ కాంత  స్వర గంగా ఝరీ ప్రవాహం .ఆయన ఈల పాట బాగా పాడే వాడు .ఆయన్ను ఈల పాట రఘు  రామయ్య అనే వారు .ఈల పాటకు స్టేజి మీద పాడే అర్హత తెచ్చి దానికి ఒక హోదా ,గౌరవం తెచ్చిన మహా గాయకుడు రఘు రామయ్య .ముందు ఆయన్ను స్మరించాలి .ఈ తరం వారికి తెలియని గాయకుడు  .ఆ తర్వాతా ఎవరు దాని జోలికి పోయింది లేదు .మళ్ళీ శివ ప్రసాద్ గారు దాన్ని సాధన చేసి ఈల పాటకు ఉన్న గౌరవాన్ని అంతర్జాతీయ స్తాయి లోకి తీసుకు వెళ్లి తెలుగు వాడి కీర్తి ని అంతర్జాతీయం గా ప్రతిష్టించి లెజెండ్ అయ్యారు మళ్ళీ .ఆయన రఘు రాముడు –ఈయన శివుడు .ఇద్దరికీ అభేదమే .వీరు మరింత ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాను .ఇక్కడి శార్లేట్ ప్రజల తర ఫున శివ ప్రసాద్ గారికి తెలుగు లో ‘’ఈల లీలా లోల ‘’అనే బిరుదు నిస్తున్నాం .అంతే  కాదు అందరికి అర్ధం కావాలని మరో బిరుదు ‘’గళ  వంశీ ‘’కూడా ఇస్తున్నాం వంశీ అంటే మురళి,వేణువు . కృష్ణుడు వంశీ లోలుడు .ఆయనది మోహాన   వంశీ . శివ ప్రసాద్ ఈలలో అనేక లీలలు చూపిస్తూ తన్మయుయులై మనల్ని కూడా తన్మ యులను చేస్తున్నారు .అందుకే’’ ఈలలీలా లోల’’ .మురళీ లోల అంటాం కృష్ణుడిని ‘’అని నేను అనగానే జనం చప్పట్లు విపరీతం గా చరిచారు .చాలా బాగా మాట్లాడానని అందరు నన్ను మెచ్చారు .శివ ప్రసాద్ గారు స్టేజి మీద అభివందనం చేసి ,నత మస్తకులైనారు .చాలా ఆనందం వేసింది .ప్రక్కనే ఉన్న బాలాజీ దేవాలయాన్ని దర్శించి ఇంటికి వచ్చే సరికి రాత్రి తోమ్మిదయింది .

                                                             శివప్రసాద్ పరిచయం

                    రాత్రి మా అమ్మాయి వాళ్ళింటికి శివ ప్రసాద్ గారు భోజనానికి వచ్చారు .వచ్చేసరికే పది అయింది .మా అమ్మాయి విజ్జి ,నాగమణి సుబ్బు భార్య సీత కలిసి చపాతీలు ,వంకాయ కూరాచేశారు .సాంబారు ,టమేటా చట్నీ ,ఆవకాయ ,పెరుగు టో భోజనం పెట్టారు .ఆయన నేను కలిసి తిన్నాం .నాగమణి భర్త గారు కూడా ఇక్కడే హోజనం చేశారు .ఆ తర్వాతా సుబ్బు వాళ్ళు వచ్చి భోజనం చేశారు .భోజనం అయినతర్వాత మేడ పైకి తీసుకొని వెళ్లి కాసేపు ఆయనతో మాట్లాడాను .చాలా విషయాలు చెప్పారు .అవన్నీ తెలియ జేస్తున్నాను .

           సత్య ప్రసాద్ గారు వారి బాబాయి నుండి ప్రేరణ పొందారు .చిన్నప్పటి నుంచి ఈల వేయటం అలవాటు గంటల తరబడి పాడే వారు .అందరు ఆనందించే వారు .తర్వాతా కర్నాటక ,హిందుస్తాని శాస్త్రీయ సంగీతాలలో ప్రావీణ్యం సంపాదించారు .అమెరికా ,ఆస్ట్రేలియా ,జపాన్ ,బ్రిటన్ ,మారిషస్ ,సింగపూర్ ,మలేషియా ,బాంకాక్ ,బెహ్రాన్ ,ఖతార్ మొదలైన చోట్ల పర్య టించి ఈల కచేరీలు ఇచ్చారు .

           విజిల్ విజార్డ్ ,అంటే ‘’ఈల మహేంద్రజాల’’,మానవ మురళి ,గళ  మురళి ,ఆంధ్రా నైటింగేల్ ,కళా సరస్వతి ,ముఖ మురళి ,శ్వాస మురళి ,ప్రక్రుతి మురళి ,సంగీత కళా సాగర్ వంటి ఎన్నో బిరుదులూ పొందారు .విజిల్ వజీర్ సుల్తాన్ అంటే ఇంకా బాగుంటుందేమో /

     త్యాగరాజు ,దీక్షితార్ ,అన్నమయ్య ,లపై కేసెట్లు సిడి లు తెచ్చారు .గత ముప్ఫై ఏళ్లుగా ఈల పాటకు అంకితమై ఉన్నారు .ఇప్పటికి 11000 ప్రదర్శనలిచ్చారు .

           2002 ,2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాల నిచ్చింది .అమెరికా లోని కాన్సాస్ లో జీవన సాఫల్య పురస్కారం పొందారు .2010 లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు వీరికి లైఫ్  అచీవ్మెంట్ పురస్కారాన్ని ,స్వర్ణ కంకణాన్ని అందించారు .మహతి అవార్డు ,రసమయి పురస్కారం అందుకున్నారు .రఘురామయ్య గారు భా రత మొదటి ప్రధాని జవహర్లాల్ సమక్షం లో ఈల కచేరి చేస్తే ,శివ ప్రసాద్ ఆయన కుమార్తె ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె ఎదుట కచేరి చేశారు .ప్రపంచం మొత్తం మీద ఈ ఈల అనే కళ మన ఆంద్ర దేశానికి దక్కిన కళ .అవధానం తెలుగు వారికే స్వంతం అయి నట్లు .అంతర్జాతీయం గా ఇప్పుడున్న ఈల కళా కేకారుడు శివ ప్రసాద్ ఒక్కరే .         1988 లో పి.వి.నరసింహా రావు గారి తో మాస్కో ఫెస్టివల్ కు వెళ్లారు .ఈల మీద మొదటి ఎల్.పి. రికార్డ్ ఇచ్చి నందుకు 1991 లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు .మారిషస్ దేశం లో వారి 150 వ స్వాతంత్ర దినోత్స వం లో పాల్గొన టా నికి  చంద్ర బాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తర ఫున స్పెషల్ ఆర్టిస్ట్ గా పంపబడిన అరుదైన కళా కారుడు శివ ప్రసాద్ .అమెరికా లోని బ్రిడ్జి వాటర్ లోని బాలాజీ దేవాలయ మహా కుంభాభి శేకానికి ఆహ్వానిమ్పబడి కచేరి చేశారు .

           ఇప్పటికి పది క్లాసికల్ విజిల్ మ్యూజిక్ ఆడియో సిడి లను ఇచ్చిన ఏకైక వ్యక్తీ ఈల కళాకారుడు శివ ప్రసాద్ .శంకరాభరణం ,మోహన రాగాలను ఫూజన్ చేశి ఈల లో విని పించారు .జి ..వి.అయ్యర్ దర్శకత్వం చేసి సంస్కృతం లో  నిర్మించిన ‘’ఆది శంకరా చార్య ‘’చిత్రానికి  బాల మురళీ కృష్ణ సంగీత దర్శకత్వం వహించగా ,ఆయన శిష్యుడైన శివ ప్రసాద్  ఈల పాట తో బాక్ గ్రౌండ్ మ్యూజిక్ నిచ్చి నిండుదనం తెచ్చారు .ఇరవై ఏళ్ళ క్రితం వాగ్గేయ కారుడు బాల మురళి కృష్ణ తో  ఏర్పడిన  గురు శిష్య సంబంధం అవిచ్చిన్నం గా కొన సాగుతోంది .తనను తీర్చి దిద్దింది బాల మురళే  నని గళ  మురళి అనే బిరుదు ఆయన ఇచ్చిన్దేనని పొంగి పోతు చెప్పారు శివ ప్రసాద్ .రేపు శివ ప్రసాద్ గారికి మా ఇంట్లో విందు .రేపు వారితో లైవ్ రేడియో ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నాం .

 ఇలా ఈ ఆది వారం’’ ఫోర్ ఇన్ వన్ ‘’ గా గడిచింది ,..నాలుగు సార్లు అమెరికా వచ్చినా తెలుగు సంఘం తో కలవటం ఇదే మొదటి సారి ..’’ఇదో తుత్తి ‘’.

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —4-6-12 —కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు శివుడు రాజ్యమేలిన మదురై

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు

                                                      శివుడు రాజ్యమేలిన మదురై

 

                    నిజమా ఇది ?అవును నిజమే .అని స్టల పురాణం చెబుతోంది ..తమిళ నాడు ను పాండ్య రాజులు పాలించే ట ప్పుడు కుల శేఖర పాండ్యన్ కుమారుడు మలయధ్వజుడు పరి పాలిస్తున్న సమయం లో జరిగిన విషయమే ఇది .అయన భార్య కాంచన మాల .సంతతి కోసం దంపతులు యజ్ఞం చేశారు ..యజ్న కుండం నుంచి వింత శిశువు ఆవిర్భవించింది .ఆపిల్లకు మూడు కుచాలు ఉన్నాయి .వ్యాకుల పడిన దంపతులకు అశరీర వాణి విని పించింది ‘’తగిన వరుడు ఈ బాలికకు లభించ గానే మూడవ రొమ్ము మాయం అవుతుంది ‘’అని చెప్పింది .ఆమెను రాజ కుమారుడి లాగా పెంచారు ..యుద్ధ విద్యలన్నీ నేర్పారు .తండ్రి తర్వాతాఆమె రాజ్యాధికారం పొంది అనేక రాజ్యాలను జయించి ,రాజ్య విస్తరణ చేసి కైలాసానికి చేరింది .శివుడు కంపించ గానే ఆమె మూడవ కుచం మాయ మై పోయింది .శివుడే తన భర్త అని గ్రహించింది .శివుడు ఆమె తో మదురై పట్టణం వచ్చేశాడు ..వారిద్దరి వివాహం దివ్యం గా జరిగింది .వారిద్దరుకలిసి మదురై నగరాన్ని పాలించారు .వారికి కుమారస్వామి అవతారం గా ఉగ్ర పాండ్యన్ జన్మించాడు .అతన్ని రాజ్యానికి పాలకుడిని చేసి శివ పార్వతులిద్దరు సుందరేశ ,మీనాక్షి దేవి గా  రూపాంతరం చెందారు . ..పాండ్య రాజైన కులశేఖరుడు మడురైను ముఖ్య పట్నం గా చేసుకొని నగరాన్ని దివ్యం గా తీర్చి దిద్ది ,మీనాక్షి సుందరేశు ల ఆలయాన్ని అత్యద్భుతం గా నిర్మించాడు

         మీనాక్షి అమ్మ వారి విగ్రహం సర్వతో భద్రం గా సుందర వదనార విందం  గా కన్నుల పండువు గా కన్పించి భక్తులను తన్మయులను చేస్తుంది ..ఆలయానికి బంగారు ధ్వజ స్తంభం ఉంది .ఒక చేతి లో రామ చిలుక ,రెండో చేతిలో పూల చెండు ధరించి ,భక్తులను ఆద రించే చేప కన్నుల వంటి కనులతో ,ప్రసన్న వదనం తో ,దయా దాక్షిణ్యం కలిగించే చల్లని చూపులతో అమ్మ వారు దర్శనమిస్తుంది ..చేతి లోని చిలుక భక్తుల కోరికలను విని అమ్మవారికి నివేదించి సాఫల్యం చెం దేట్లు చేస్తుందని భక్తులు భావిస్తారు .

        సుందరేశునికి పన్నెండు అడుగుల ఎత్తున్న ద్వార పాలకులు ఇరు వైపులా కాపలా ఉన్న విగ్రహాలు కని పిస్తాయి ..లోపల ‘’చొక్క నాధుడు ‘’అని పిలువ బడే సుందరేశ్వర లింగం మనకు సకల పాప హరం గా కని పిస్తుంది .’’హర హర మహా దేవశంభో శంకర ‘’నినాదాలతో భక్తులు నినదిస్తుంటే ,ఒళ్ళు పులకరించి కైలాసం లో ఉన్నామేమో నన్న అను భూతి కలుగు తుంది ..స్వామి సన్నిధి లో అరవైమూడు మంది నాయనార్లు ,ఉత్సవ మూర్తి ,కాశీ విశ్వేశ్వరుడు ,భిక్షాట నర్ ,సిద్ధార్ ,దుర్గ విగ్రహాలు అలరిస్తాయి .కదంబ వృక్షం ,,బంగారు సభ ,యాగ శాల కూడా ఉన్నాయి .తర్వాతి ప్రాకారం లో ‘’నటరాజ స్వామి ఆలయం ‘’ఉంది ..కుడికాలు పైకెత్తి ,తాండవ మాడే  నాట్య భంగిమ లో స్వామి దర్శనమిస్తాడు ..ఆవరణకు కాపలాగా64భూత గణాలు ,ఎనిమిది ఏనుగులు ,32సింహ విగ్రహాలు ఉన్నాయి .స్వామి దర్శనం చేసిన తర్వాతా ‘’వేయి స్తంభాల గుడి ‘’లోకి ప్రవేశిస్తాం ..పైకప్పు మీద 60 తమిళ సంవత్స రాలు ఉన్న చక్రం వర్ణనా తీత సౌందర్యం తో అబ్బుర పరుస్తుంది ..ఈ మండపం లో 985 శిలా స్తంభాలు ,వాటికి ఉన్న కళా సంపద చూడటానికి రెండు కళ్ళు చాలవు అని పిస్తుంది .’’కంబత్తడి మండపం ‘’లో అగ్ని ,వీర భద్ర ,అఘోర వీరభద్ర ,విగ్రహాలు భయం కల్గిస్తాయి .ఇదంతా ఒక కళా ప్రదర్శన శాల అని పిస్తుంది .

                       మీనాక్షి మందిరానికి ఉత్తరం అంచున దక్షిణ ముఖం గా ‘’ముక్కురుని వినాయక విగ్రహం ‘’చూపరులను ఆకర్షిస్తుంది .’’కిలిక్కిట్టు మండపం ‘’లో మీనాక్షి దేవి వివాహ ఘట్టం ,పట్టాభిషేక ఘట్టం వర్ణ చిత్రాలు వర్ణనా తీతం గా కన్పిస్తాయి .కప్పు పై దేవతా చిత్రాల పని తనం ముక్కున వేలేసు కోనేట్లు చేస్తుంది ..మీనాక్షి సుందరేశ్వరుల మండపానికి బయట ‘’స్వర్ణ కమల తటాకం ‘’ఉంది .దీని సమీపం లో ‘’ఊయల మండపం ‘’ఉంది .శుక్రవారం స్వామి వారలకు ‘’ఊంజల్ సేవ ‘’జరుగు తుంది .ఉత్తర గోపురం వైపు అయిదు సంగీత స్తంభాలున్నాయి .ఒక్కో దాన్ని ఆనుకొని ,ఒకే రాతి తో చెక్క బడిన 22చిన్న స్తంభాలున్నాయి . .ఇవి నయనన్దాన్నిస్తాయి .వీటిని తట్టితే ‘’మధుర’’ సంగీత స్వరాలు విని పించి తన్మయులను చేస్తాయి .ఇదో విచిత్రానుభూతి .మదురై కాదు మధుర అని పిస్తుంది .తూర్పు గోపురానికి దగ్గర్లో పుదు(కొత్త )మండపాన్ని తిరుమల నాయకుడు కట్టించాదట .ఇది మీనాక్షి సుందరేశ్వరుల వేసవి విడిది ..ఆలయానికి నాలుగు వైపులా నాలుగు పెద్ద ప్రాకారాలు  నాలుగు చిన్న ప్రాకారాలు ఉండటం విశేషం .తూర్పు ప్రాకారం ద్వారా ఆలయం లోనికి ప్రవేశించి ముందుగా మీనాక్షి  అమ్మ వారిని దర్శించి ,ఆ తర్వాతే సుందరేశ్వరుని దర్శించటం సంప్రదాయం .

                మదురై ప్రాచీన తమిళ సంస్కృతికి పుట్టి నిల్లు .వైగై నది అమ్మ వారి సేవలో తరించి నట్లు ఉంటుంది .ఇక్కడే మూక కవి ‘’మూక పంచ శతి ‘’రాశారు అది మీనాక్షి అమ్మ వారి అనుగ్రహమే .మూగ వాడికి మాటలు అమ్మ తాంబూలం రసం తి ని పిస్తే కవిత పెల్లుబికింది .ఆయనే తర్వాత కంచి పీఠాధీ  పతి అయారు .అద్భుత మైన సంస్కృత శ్లోకాలవి ‘అందులో ‘’ఆర్యా శతకం ‘’విశేష ప్రాచుర్యం పొందింది .కవి  సామ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ గారి’’ నవల ‘’ఏకవీర’’జరిగిన ప్రదేశం ఇదే .ఆ కధంతా ఈ  నది, అమ్మ వారి చుట్టూ తిరుగు తుంది .

        మదురై చేనేత పరిశ్రమకు నిలయం .ఈ నగరాన్ని ‘’ఆలయ నగరం ‘’అని పిలుస్తారు .చిత్రి ,ఆవని ,తై మాసాలలో ఉత్సవాలు రంగ రంగ వైభవం గా అజరుగు తాయి .అందుకే మదురై కి ‘’ఉత్సవ పట్టణం ‘’అనే పేరు వచ్చింది .చైత్ర పౌర్ణమి నాడు ‘’మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణమహోత్సవం ‘’అత్యంత సుందరం గా వైభవం గా అట్టహాసం గా నిర్వ హిస్తారు .వైగై నది లో తెప్పోత్సవం దివ్యం గా ఉంటుంది .లక్షలాది ప్రజలు దర్శించి తరిస్తారు ..వాస్తు ,శిల్ప కళలకు నిలయం మదురై .చూస్తె చాలు మనస్సు ఆనంద మధుర మై పోతుంది ,జన్మ చరితార్ధం అని పిస్తుంది .

    మరిన్ని దేవాలయాల గురించి మరోసారి –

  మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-6-12.—కాంప్ –అమెరికా

Posted in సేకరణలు | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –3 కుంభక యోగి –త్రైలింగ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు –3
కుంభక యోగి –త్రైలింగ స్వామి
                  పుట్టింది తెలుగు దేశం లో అయినా ,ఆయన గడిపిన కాలమంతా కాశీ లోనే .ఆయన చూపించిన మహిమలు అపారం .వారు పొందిన సిద్దులనేకం .వారి దివ్య విభూతి అనంతం .ఆయనే త్రైలింగ స్వామి .అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం  19 -12 -1607   తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుంచి ఐహిక వాంచల మీద కోరిక లేదు .నలభై ఏళ్ళకు తండ్రి ,యాభై రెండో ఏట తల్లి చని పోయారు .శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి ,అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు .
        స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో బస్తుర్ చేరాడు ..అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళాడు .ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు .అప్పటికి అయ్యగారి వయస్సు డెబ్భై ఎనిమిది .గురు సమక్షం లో పదేళ్ళ సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు .గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు ..అక్కడ స్వంత   ఊరి వారు కని పించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళ లేదు ..రామేశ్వరం లో ఒక బ్రాహ్మణ బాలుడు చని పోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే ,గుండె కరిగి కమండలం లోని నీరు వాడి మీద చల్లాడు .వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్య పరచాడు ..ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీ రామ లింగేశ్వరుడే గణ పతి స్వామి అనుకోన్నారందరూ .అక్కడి నుండి నేపాల్ చేరాడు .అక్కడ అడవి లో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయన కు ఎదురు గుండా కదల కుండా కూచుని పోయింది .రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడై నాడు పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు  .ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు .నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుక లిస్తే తీసుకో కుండా జంతు హింస చేయ వద్దని హితవు చెప్పాడు స్వామి .అక్కడి నుంచి టిబెట్ ,తరువాత మానస సరోవరం సందర్శించి ,దారిలో ఎన్నోఅద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలమ్ తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు ..ఒక రోజూ తెల్ల వారు జామున నర్మదా నది లో పాలు ప్రవహిస్తున్నట్లు ,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూశారు .గణపతి లోని మహిమేమిటో గ్రహించారు .విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు .
              1733 లో . ప్రయాగ చేరారు .తపో నిష్టలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పదవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు .అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే  .దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు .శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడి లోను మహాశక్తులు అజ్ఞాతం గా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు .
                  1737 లో కాశీ చేరారు దిగంబర గణ పతి స్వామి .అప్పటికి ఆయనకు 130  ఏళ్ళు  .కాశీ లో 150  ఏళ్ళు గడి పాడు  .ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం .గడ్డాలు ,మీసాలు పెరిగి దీర్ఘ శరీరం తో దిశ మొలతో .మెడ లో పెద్ద రుద్రాక్ష మాల తో ,పెద్ద బాన పొట్ట తో కాశీ నగర వీధుల్లో సంచ రించే వాడు .గంటల సేపు గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు .అలాగే గంటల కొద్దీ కాలమ్ నదీ గర్భం లో మునిగి ఉండే వాడు .అంటే కుంభక విద్య లో అద్భుత మైన నేర్పు ఆయనకు ఉండేదాన్న మాట ..కుష్టు రోగులకు సేవ చేసి వారి ని ఆదరించాడు బాబా .వెద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతా నాద బంద్యో పాద్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి ,హనుమాన్ ఘాట్ చేరాడు .ఒక మహారాష్ట్ర స్త్రీ రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజూ చూస్తూ ఏవగించు కొనేది .ఆమె భర్త కు రాచ పుండు .ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించ మని కోరారు .కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళ టానికి సందేహించింది .చివరికి వెళ్లి కాళ్ళ మీద పడింది .ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది
                  కాశే మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గా ఉన్నారు .వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు .ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టారు .తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా .అప్పటి నుంచి ఆ పేరే స్థిర పడి పోయింది .1800  లో తన మకాం ను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవం కు మార్చారు .
ఎప్పుడూ మౌనమే   ,ధ్యానమే ,తపస్సు యోగ సమాధే .అనుకే ఆయన్ను ”మౌన బాబా ”అన్నారు .కాశీ రాజు వీరిని తన పడవ లోకి  ఆహ్వానిస్తే వెళ్ళారు .రాజు బ్రిటిష్ వారు బహుమతి గా ఇచ్చిన కత్తి ని స్వామి చూడాలని ముచ్చట పడితే ఇచ్చారు .అది పొరపాటున గంగలో జారి పడి పోయింది .రాజుకు కోపం వచ్చి తిట్టాడు .స్వామి తన చెయ్యి గంగా నది లో పెట్టి ఒకే రకం గా ఉండే రెండు కత్తులను తీసి అందు లో రాజుదేదో గుర్తించి తీసుకో మన్నాడు .రాజు గుర్తించ లేక పోతే తానె గుర్తించి చెప్పి ఇచ్చాడు .రెండో దాన్ని గంగలోకి విసిరేశారు స్వామి .
           దిగంబరం గా తిరగటం కొంత మందికి నచ్చక కేసు పెట్టారు .కోర్టు లో కేసు నడి చింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేశాడు .అలాగే తెచ్చారు .ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివ రించారు .ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు .స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు .వెంటనే తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు .మతి పోయింది మేజిస్ట్రేట్ కు .అయితే సుగంధ పరి మళం కోర్టు అంతా వ్యాపించింది .స్వామి మహిమ తెలిసి దిగంబరం గా తిరిగే  హక్కు ఇచ్చాడు .
ఒక సారి ఒక ఆకతాయి ఆయన బజారు లో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు .అది కొన్ని గజాలు సాగింది .వాడు భయ పడి పారి పోయాడు ..దుండగులు కొందరు సున్న పు తేట ఇచ్చి పాలు అని చెప్పారు .శుభ్రం గా తాగేశాడు స్వామి . .వెంటనే మూత్ర రూపం లో దాన్ని అంతట్ని విసర్జించాడు .
                      శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయ నాద్ తో కలిసి మౌన  స్వామిని దర్శించారు .ఆయనకు బాబా నశ్యం వేసు కొనే కాయ కానుక గా ఇచ్చారు .స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పారట పరమ హంస ..ఇంకో సారి అర్ధ మణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించారట .పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పారు స్వామి .పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరు మహా పురుషులే .పరమ హంసలే .ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంత గా గౌర విన్చా రంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది ..ఒక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికికేదార్ ఘాట్ లో ఉన్న మన స్వామి దగ్గరకు  వచ్చారు .ఇద్దరు గాడ్హం గా ఆలింగనం చేసుకొన్నారు .కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరు మాయమైనారు .అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు .తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు .
                 పంచ గంగా ఘట్టం లో చిన్న భూ గృహం నిర్మింప జేసుకొని  32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని ,భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధి లో ఉంది ,తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి ,బ్రహ్మ రంధ్రాన్ని చేస్దించుకొని 26 -12 -1887
న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలారు .ఆ రోజూ నుండి ఈ రోజూ వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగు తాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషం .పతంజలి యోగం లో విభూతి పాదం లో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు ,కుంభక యోగం లో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు .ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో రాశారు .కాని మన తెలుగు వారి ద్రుష్టి ఇంకా దాని పై పడక పోవటం విచారకరం అంటారు బాధతో రామ రాజు గారు .280 సంవత్సరాలు జీవించి ,స్వచ్చంద మరణాన్ని పొంది ,యోగ సిద్దులలో త్రివిక్రములై  ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన  ముద్రాలన్కారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించ టానికి .
 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్–02 -06 -12 –కాంప్ –అమెరికా
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –9

  వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –9

                                                          కుంభ కోణం లో కుండ మూతి లింగం

  తమిళ నాడు లోని కుంభకోణం లో వెలసిన ‘’కుమ్భేశ్వర స్వామి ‘’లింగం కుండా మూతి లాగా ఉండటం తో ఆ పేరు వచ్చింది .ఇక్కడ మహా మాఘం అనే కొలను ఉంది .పన్నెందేల్లకు వచ్చే పర్వ దినమే మహా మాఘం ..ఆ సమయం లో ఆ కొలను లో ‘’గంగా జలం ‘’పుడుతుందని భక్తుల విశ్వాసం .ఇదీ ఇక్కడి వింత ,విశేషం . మహా మాఘం లో ఉత్సవం అమోఘం గా జరుగుతుంది .

                            వ్రేలి ముద్రలు కని పించే సైకత లింగం 

             కర్నూలు జిల్లా ప్రొద్దుటూరు కు దగ్గర్లో ముక్తి రామేశ్వరం ఉంది ..ఇక్కడి లింగం ఇసుక తో చేసింది .సైకత లింగం అంటారు ..లింగం అయిదు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం విచిత్రం .ఈ లింగం పై ఇసుకను అదిమి పెట్టిన చేతి వ్రేలి ముద్రలు ఇప్పటికీ కని పించటం విశేషం .

                             ఉత్సవాలు లేని కోటి పల్లి లింగం

 తూర్పు గోదావరి జిల్లా కాకి నాద కు దగ్గర్లో గోదావరి ఒడ్డున కోటి పల్లి దివ్య క్షేత్రం .దేవేంద్రుడు నిర్మించిన స్వంభూ శివలింగం ,ఆలయం ఉన్నాయిక్కడ .పాతాళం నుంచి ఈ లింగం ఉద్భవించినదని పురాణ కధనం .ఇది ‘’యోగా లింగం ‘’అవటం వల్ల ఉత్స వాలు ఉండవు .ఈ కోటేశ్వర స్వామికి చైత్ర మాసం నుండి అయిదు నెలలు కోటి తీర్ధం లో ఉంటాడు .మిగతా ఏడు నెలలు కోటి తీర్ధ జాలం నేల మట్టం వరకు వుండి ,భక్తులకు దర్శనం ఇస్తూ ,ఆనందం మాత్రమే కల్గించటం విశేషం .

                                     కన్నీరు కార్చే గరుడుడు

                  నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట కు రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మన్నారు పోలూరు ‘’గ్రామం పురాణ ప్రసిద్ధి చెందింది ..ఇక్కడే జాంబ వంతునికి ,శ్రీ కృష్ణుడికి యుద్ధం జరిగిందని అంటారు .ఇక్కడున్న ‘’అలఘు మల్లామ్క్రిష్ణ ‘’దేవాలయం చాలా పురాతన మైనది ..చాళుక్య రాజులు కట్టిన దివ్య దేవాలయం ఇది ..ఇక్కడ సుగ్రీవ ,జాతాయు ,జాంబవంత ,గరుత్మంతుల భారీ విగ్రహాలు అందర్ని ఆకర్షిస్తాయి .స్వామి భక్తు లంతా కొలువు దీరి నట్లు ఉంటుంది ..దీన్ని మని కాంత క్షేత్రం అని కూడా పిలుస్తారు ..స్వామి గర్భాలయానికి దక్షిణం గా ‘’సౌందర్య వల్లి ‘’అమ్మ వారు ఉంటారు .స్వామికి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున గరుత్మంతుని విగ్రహం సమ్మోహన పరుస్తుంది .గరుడుని కంటి నుంచి కన్నీరు ఒలుకు తున్నట్లు శిల్పి విగ్రహాన్ని మహాద్భుతం గా మలిచాడు ..శమంతక మని ని శ్రీ కృష్ణుడు ఇక్కడే జాంబవంతుని దగ్గర నుండి పొందాడని ఐతిహ్యం .సత్య .జాంబవతీ సమేత శ్రీ కృష్ణ స్వామి దర్శనం సర్వ శుభ ప్రదం ..ఇక్కడే సత్య భామ కు గర్వ భంగం అయిందట ..ఈ ప్రదేశం లోనే ఆంజనేయుని చేత గర్వ భంగం అయింది .తనకు జరిగిన అవమానాన్ని దుఃఖిస్తూ ,తన స్వామికి మొర పెట్టు కొనే సన్నీ వేష రూప కల్పనే గరుడుని కన్నీరు గాధ .ఇప్పటికి ఆ కన్నీరు గాధను మనం చూడ వచ్చు .అద్భుత మైన వింత ఇది .ఇక్కడి శిల్ప సౌందర్యం చిత్రాతి చిత్రం గా ఉంది మనసులను ఆకర్షిస్తుంది .

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –2

   సిద్ధ యోగి పుంగవులు –2

                                                                అవధూత దొంతులమ్మ

        ఏరుల పుట్టుక ,యోగుల పుట్టుక ఎవరికి తెలియదని సామెత .ఆమెనర్మదా నదీ తీరాన ఉండే  బంజారా మహిళా .ఎలా వచ్చిందో కృష్ణా జిల్లా మచిలీ పట్నం చేరింది అరవై ఏళ్ళ వయసు తో  .ఆమె నెత్తి మీద నీళ్ళ కుండల్ని దొంతరలు గా పెట్టు కొని మోస్తుండేది .అందుకని ఆమె ను’’ దొంతు లమ్మ’’ అన్నారు బందరు జనం .అదే ఆమె పేరు అయి పోయింది .ఒక యోగి ఆమెకు దర్శనం ఇచ్చి సంసార బంధాలను వదిలెయ మని ఆదేశిస్తే ,భర్త అనుమతి తో ఇల్లు వదిలి వచ్చేసింది . దీక్ష నిచ్చి పంపాడు యోగి .ఆమె అవధూత గా మారి ఏంతో  దూరం నడిచి శ్రీ శైలం చేరింది .దిగంబరం గా తిరిగేది .బాహ్య స్పృహ ఉండేది కాదు .నిరంతరం సమాధి స్తితి లో ఉండేది .

              నెమ్మదిగా బందరు చేరి ,మొదట కుమ్మరి వీధిలో తర్వాత జగన్నాధ పురం లో ఉన్నది .ఆమెను కర్రతో కొట్ట  బోయిన వాడి చేయి చచ్చు బడింది .ఆమె కాళ్ళ మీద పడితే అనుగ్రహం తో  చేయి మళ్ళీ పని చేసింది .ఒక సారి ఒక లాయర్ గారి వీధి అరుగు పై కూర్చొని ఉండగా ,ఆయన పిచ్చి కోపం తో ఆమె దగ్గరుండే బట్టల  మూటను కాలితో తన్నాడు .ఆమె నవ్వుతు వెళ్లి పోయింది .ఆ లాయర్ కాలు మంటలు పోట్లకు గురై గిల గిల లాడాడు .ఇలా క్రమంగా ఆమె మహిమలు వ్యాప్తి చెందాయి .ఇంకో సారి చల్ల పల్లి కి చెందిన ముగ్గురు ఆడ వాళ్ళు  బట్టల వ్యాపారం కోసం బందరు వచ్చి బెజవాడ రోడ్డు పక్క ఉన్న వీధి అరుగు మీద కూర్చున్నారు .ఆ పక్కనే దొంతులమ్మ పిచ్చి గుడ్డల మూట తో  కూర్చుని ఉంది .అర్ధ రాత్రి సమయం .ఆమె తమను ఏమి చేస్తుందో నని వారు భయ పడ్డారు .ఇంతలో ఆమె కళ్ళ నుండి సూర్య కిరణాల లాగా మెరుపులు వచ్చాయి ..ఆ ముగ్గురికి ఆశ్చర్యం కలిగి భక్తీ తో  ఆమె శిష్యులయారు .ఆమె వారిని దగ్గరకు పిల్చి కారం ముద్ద తీసి వారి నోటికి అందించింది అది తీపి పదార్ధం గా మారి మధురం గా ఉందట ..బందరు వచ్చి నప్పుడల్లా తనను కలిసి వెళ్ళ మని చెప్పి పంపింది .

     గుంటూరు జిల్లా మంగళ గిరి నుంచి బందరు లో స్తిర పడ్డ వలివేటి పేరయ్య ఆమె మహిమలను గమనించాడు .ఆమె మిరపకాలయలు ,ఉల్లి పాయలు ,ఉప్పు తన గోనే సంచి కింద  దాచి ప్రసాదం గా పెట్టేది .అవి అతి మధురాలయ్యేవి .ఆమె యే కొట్టు దగ్గర నిలబడితే ఆ కొట్టు ఆ రోజు విపరీతం గా లాభాలు గడించటం అందరికి అనుభవం .బ్రతి మాలి రప్పించు కొనే వారు .సర్కిల్ పేట లో చోడవరపు సుబ్బమ్మ అనే వితంతువు దత్త పుత్రుడు అమ్మ చెప్పి నట్లే చని పోయాడు .ఈ విషయం ఆమె కు చెప్ప టానికి  వెళ్తే అమ్మ మండ్ర  గబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి చకితు రాలై  ఆమె మహిమ అపరిమితం అని గ్రహించింది .ఆమె కు దత్త పుత్రుని మరణం తో  పరీక్షించి  వైరాగ్యం బోధించి శిష్యురాలిని చేసుకొన్నది .వేమూరి అచ్చయ్య అనే ఆయన టో ఉపదేశం ఇప్పించింది .

          ఒకాయన ఉపదేశం కోసం వస్తే అర్ధ రాత్రి శ్మశానానికి రమ్మన్నది .అతడు అలానే వెళ్లాడు .ఆమె పెద్ద పులి రూపం లో కని పించి భయ పెట్టింది .ఆయన పారి పోయాడని తెలుస్తోంది .పరీక్షించ కుండా ఎవరికి దీక్షనిచ్చేది కాదు చెరుకూరి పద్మ నాభ ప్రసాద్ బహాద్దర్ పక్ష వాతం తో కుడికాలు చచ్చు పడింది .ఆ కుటుంబం అమ్మ దగ్గరకు వచ్చి శరణు వేడింది .అమ్మ తన కాలును ఆతని కాలుతో గుడ్డ పే లిక తో  కట్టింది .కాసేపు అయిన తర్వాత ఆయన పక్షవాతం మాయ మైంది .అప్పట్నించి ఆ కుటుంబానికి ఆమె రక్ష .వాళ్లకు ఒక కూతురుండేది .ఆమె ను అమ్మ ‘’రాణీ ‘’అని సంబోధించేది .ఆమెను చల్ల పల్లి జమీందార్ యార్ల గడ్డ శివ రామ ప్రసాద్ బహాద్దర్  గారికి ఇచ్చి వివాహం చేయాలని పద్మ నాభ ప్రసాద్ గారు భావించారు .కాని రాజా గారికి చేసుకోవటం ఇష్టం లేదు .కాని అమ్మ ధైర్యం చెప్పింది .ఈ పిల్లను మర్నాడే  ముక్త్యాల జమీందార్ దత్తత తీసుకొని చల్ల పల్లి రాజా గారికిచ్చి వివాహం చేశారు .చల్ల పల్లి కోటలో దొంతులమ్మ అమ్మ వారికి ఘన సన్మానం చేశారు .

        కారు మూరి కృష్ణ మూర్తి అనే ఆయన అమ్మ దగ్గర దీక్ష కోసం వచ్చాడు .ఆయన రామ తారక మంత్రాన్ని25 లక్షల సార్లు ,బాల మంత్రాన్ని ఏడు లక్షల సార్లు ,ప్రసన్నాంజనేయ మంత్రాన్ని నాలుగు లక్షల సార్లు జపించిన మహా పురుషుడు .అనేక సమారాధనలు ,అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి ..చీమల కోసం అయిదు మణుగుల పంచదార ను పోసిన భూత దయా పరుడు .అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై   ఆమె తల పెట్టిన అనే సత్కార్యాలు నిర్వహించిన ఘనుడు కృష్ణ మూర్తి .బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధ రాత్రి దాకా తత్వ విచారణ చేసే వాడు .జొన్న విత్తుల శేష గిరి రావు అనే సంగీత కళా కారుడు నటుడు గురువు దండిస్తాడని భయ పడి  అమ్మ పంచ చేరాడు .ఆమె అతన్ని మహా విద్వామ్శుడిని చేసింది .కుర్తాళం సిద్దేశ్వర పీఠానికి అది పతి అయిన కాను కొల్లు త్రివిక్రమ రావు గారు అమ్మ వద్ద జ్ఞాన భిక్ష పొంది ,ఆ తర్వాత సన్య సించి ఆ పీఠ ది పతి అయారు .ఆయనే విశ్వనాధ గారికి గురువు కూడా .మనశ్శాంతి లేని వారు అమ్మను దర్శిస్తే ,చల్లని చూపు తో  మానసిక ప్రశాంతత నిచ్చేది అని గ్రంధాలు తెలియ జేస్తున్నాయి .ఆమె ఎప్పుడు ‘’వికల్ప సమాధి ‘’లో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే  మనస్సునకు ఆత్మ శక్తి స్వరూప అవస్థ కలగటం చేత సమాధి స్తితి లో –వికల్పాలు నష్టపోకుండా ,చిత్తాన్ని బ్రహ్మ లో లయం చేసి కేవల పర బ్రహ్మ లో నిలిపి ఉంచటం అన్న మాట .

                       దొంతులమ్మ అనుగ్రహాన్ని పొందిన వారిలో దాలి పర్తి పిచ్చిహరి ,యడవల్లి నాగేశ్వర రావు ,క్రోవి సత్యనారాయణ ,కోకా అహోబల రావు ,మొదలైన ప్రముఖులున్నారు .ఆమె 9-2-1932  రాత్రి పదకొండున్నరకు దేహాన్ని చాలించింది .  ఆమె జననం1807  గా భావిస్తారు .దొంతులమ్మ ఉత్స వాలు బందరు లో ఘనం గా నిర్వహిస్తారు .మాఘ మాసం లో పద కొండు రోజులు ఆరాధ నా  ఉత్సవాలు ఘనం గా జరుగు తాయి .ఆమె విగ్రహం లంబాడి దుస్తులతో అలంకరించి ఉంటుంది ..జీవితం చాలించినా సమాధి నుండి భక్తుల కోర్కెలు తీరుస్తుంద నే నమ్మకం ఉంది .—ఇంకో సారి మరో యోగి కధ –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-6-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –1

 సిద్ధ యోగి పుంగవులు –1

                                                                  ఖండ యోగి – మస్తాన్ వలి

‘’సిద్ధ యోగి పుంగవులు ‘’అనే శీర్షిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులో ఎందరో మహాను భావులున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలియ జేయట మే నా ఉద్దేశ్యం .ముందుగా మస్తాన్ వలీ గారిని గురించి తెలియ జేస్తాను . దీనికి ఆధారం స్వర్గీయ ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి ”ఆంద్ర యోగులు ”

      మస్తాన్ అంటే ఎప్పుడు దైవ చింతన లో ఉండే వాడు .ఒక రకం గా దైవ మత్తుడు .అలాంటి వారిలో నల్ల మస్తాన్ అనే గుంటూరు జిల్లాకు చెందిన ఈయన ప్రసిద్ధుడు .ఆయన ఒక చోట ఎప్పుడు స్తిరం గా ఉండే వాడు కాదు .గుంటూరు జిల్లా లో సంగడి గుంత లో ఒకరు చిన్న పాక కట్టించి ఆయనకు ఇచ్చారు .ఆయన నడుము వాల్చి ఎన్నడూ పడుకొని ఉండటం ఎవరు చూడలేదు .అనుక్షణ సంచారి .ఒక సారి ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది .ఆయన దగ్గర ఎప్పుడు ఉండే మేక దూరం గా ఉంది .ఆయన ఒక చిన్న మునగ చెట్టు కింద ఉన్నాడు .ఆయన కూర్చున్న చోట తప్ప వర్షానికి తడవని ప్రదేశం లేదట .ఆయన మేక చచ్చి పడింది .దాని దగ్గరకు వెళ్లి భగవంతున్ని ధ్యానించి ‘’లే’’అన్నాడు .అంతే లేచి కూర్చున్నది .ఈ మహిమ అందరికి పాకింది .వేరొక సారి ఆయన దగ్గరుండే కోడి ని ఒకామె ఎత్తుకు పోయి చంపి కూర వండుకుని తిన బోతోంది .దివ్య ద్రుష్టి తో ఆయన చూసి వాళ్ల  ఇంటికి వెళ్లి మాంసపు ముద్దా గా ఉన్న ఆ కోడిని ‘’బోబో’’అని పిలిచాడు .అది కోడి రూపం దాలిస్తే ఆయన ఒళ్ళోకి తీసుకొని నిమిరారు .ఆమె కాళ్ళా వెళ్ళా పడి బతిమి లాడింది కనికరించి  శిష్యురాలిని చేసుకొన్నాడు .

                      వలీ గారు’’ ఖండ యోగ సిద్ధి’’ తెలిసిన వారు .అంటే ముక్కలు ముక్కలుగా ఉన్న శరీర భాగాల్ని సిద్ధి తో  మళ్ళీ యదా రూపం లోకి తేవటం .ఈ విద్య షిర్డీ సాయిబాబాకు ,ఈయనకు ,వాడరేవు లలితానంద సరస్వతి ,మౌన స్వామి ,చీరాల ,కడప అవదూతలకు మాత్రమే ఉండేదట .ఒక సారి ఆయన యోగనిద్రలో ఉన్నారు .గ్రామ సమీపం లో ఒక పొలం లో ఆయన తల ,మొండెం కాళ్ళు ,చేతులు చిన్నా భిన్నమై పడి  ఉండటం రైతు గమనించి గ్రామం లో అందరికి ఏడుస్తూ చెప్పాడు .వాళ్ళంతా అక్కడికి  చేరే సరికి వలీ గారు పూర్తీ రూపం పొంది చిదానందం గా ఉన్నారు .ఇంకోసారి ఒక వ్యాపారి కొట్టు ముందు కూర్చుని ఉన్నాడు వాలీ .కొట్టు వాడికి విసుగెత్తి ఎన్ని సార్లు పొమ్మన్నా పోలేదు .వాడు కోపం తో  ఊగి పోతూ కర్ర పెట్టి ఆయన్ను బాది పారేశాడు .ఆయన శరీరం ముక్కలు ముక్కలై చెల్లా చెదరు గా పడి పోయింది . వ్యాపారే చంపాడని పోలేసులకు చెబితే అతన్ని అరెస్ట్ చేశారు .వలీ గారి శరీర భాగాలను అన్నీ కలిపి ఆకృతి తెచ్చి స్మశానానికి తీసుకు పోతుంటే ఆయన లేచి కూర్చుని అందర్ని ఆశ్చర్యం లో ముంచేశాడు .వ్యాపారి తప్పేమీ లేదని ఓదిలించాడు .

       వాలీ గారికి సర్వజ్ఞత ఉంది .గుంటూరు లో ఆయన ఉన్నప్పుడు పాప రాజు అనే జ్ఞాన యోగి శిష్యుడు ఉన్నావ నందయ్య గురువు ఆజ్న పై ఈయన ఉండే చోటుకు వచ్చాడు .ఆయన ధ్యానం లో ఉన్నాడు ఒక పేద వాడు వలీ గారు ఏదైనా డబ్బు ఇస్తాడేమో నని అక్కడికి వచ్చాడు .నందయ్యను చూసి అతని జేబులో ఉన్న పావలాను బిచ్చ గాడికిమ్మన్నాడు .నందయ్య నోరు తెరిచాడు అంతే ఉంది అతని జేబులో ..అతన్ని పాప రాజు పంపాడు కదా అని అడిగాడు .అవునన్నాడు .అప్పుడు పాప రాజు గొప్ప తనాన్ని వలీ గారు చెప్పారు .పాప రాజు గారింట్లో తండ్రి తద్దినం రోజున భోక్తలు తినక ముందే తనకు అన్న పెట్టి నసంస్కారి అన్నారు .గుంటూరు వాడొకడు కాశీ వెళ్లి గంగా స్నానం విశ్వనాధ సందర్శనం చేసి ఒక పెద్ద మసీదు దగ్గరకు వచ్చాడు అక్కడ ఉన్న ముసలాయన అతనిది గుంటూరు కదా అని అడిగి ఆశ్చర్య పరచాడు .గుంటూరు లోని తన మిత్రుడు వలీ బాగున్నాడా అని అడిగాడు .వలీ ని చూసి రెండు వందల  ఏళ్లు అయిన్దనిచేప్పాడు .ఇంటికి తిరిగి వచ్చి వలీ గారికి ఈ విషయం చెప్పాడు ఆ యాత్రికుడు .కాశీలో తన మిత్రుడు కన్పించాడా అని అడిగారు వలీ .అని అతడు చూశాను అన్నాడు అతన్ని చూసి రెండు వందల ఏళ్లు అయిందన్నారు వలీ .వారిద్దరి సర్వజ్ఞాత్వానికి యాత్రికుడు ఆశ్చర్య పోయి కాళ్ళ మీద పడ్డాడు .

      వలీ గారు నిగ్రహం ,అనుగ్రహం కల వారు .ఒక ముస్లిం యువకుడు ఈయన పోకడ ను పిచ్చి గా భావించి పిచ్చోడు పిచ్చోడు అంటూ గేలి చేసే వాడు .ఈయన నవ్వు కొనే వాడు .కొంత కాలానికి ఆకుర్రాడే పిచ్చి వాడయి పోయాడు .తలిదండ్రులు వాడిని తీసుకొచ్చి ఈయన కాళ్ళ మీద పడేశారు .దయ టో అతని తల నిమిరారు .అంతే .మామూలు మనిషి అయాడు వాడు .ఒక సారి బెజవాడ లో కొందరు ముస్లిం పెద్దలు మాట్లాడు కొంటుఉండగా  వలీ గారు అక్కడికి వచ్చి తన చేతి లో ఉన్న బుట్ట ను అక్కడ పెట్టి తాను మక్కా వెళ్లి తిరిగి వచ్చేదాకా దాన్ని చుస్తున్దమని చెప్పి వెళ్లి పోయారు .వారు పిచ్చేమో అను కొన్నారు .రెండు గంటల తర్వాతా వచ్చి మక్కా విశేషా  లన్ని చెప్పి తన దారి పట్టారు .ఇదంతా గాస్ అను కొని .అక్కడ మక్కా లో ఉన్న తమ వారికి తంతి పంపారు .వారు యాత్ర బానే జరిగిందని వాలీ గారు కూడా వచ్చివేళ్ళారని చెప్పారట .అప్పుడు ఆయన మహమ్మద్ ప్రవక్త అవతారం అని అందరు గ్రహించారట .

       వినుకొండ మహిళా ఒకామె సంతానం కోసం వలీ గారిని ప్రార్ధించింది మగ బిడ్డ పుడతాడని చెప్పి పంపాడు .మగ బిడ్డను కని రెండు నెలల తర్వాతా వలీ గారి ఆశీర్వాదం కోసం బయల్దేరింది వినుకొండ రైలు  స్టేషన్ లోనే వలీ గారి దర్శనం అయింది .ఆమె కృతజ్ఞతలు చెప్పు కొంది .వాలీ గారు ఆమెను గుంటూరు వెళ్ళమని అక్కడ పెద్ద ఉత్సవం జరుగు తోందని చెప్పి పంపారు .గుంటూరు చేరే సరికే ఆ ఉదయమే మస్తాన్ వలీ గారు చని పోయిన  వార్త విన్నది .రెండు గంటలక్రితం తాను సజీవ మస్తాన్ వలీ ని చూసింది .అప్పుడు అర్ధమయింది ఆమెకు చని పోయిన తర్వాతా కూడా  భక్తులకు ఇతర చోట్ల  దర్శనం ఇస్తున్నారని .ఆయన తాను చని పోయే రోజు ను ముందుగా నే ప్రకటించి తన శిష్యుడు మదారు సాహెబ్ కాళ్ళు పిసుకు తుండగా అనుకున్న సమయానికి దేహ యాత్ర చాలించారు .వేలాది జనం చేరారు .ఆయణ తన ఖననాన్ని పిచ్చయ్య గారిచ్చిన స్థలం లో  చేసే ఏర్పాటు కూడా చేసుకొన్నారు .ఆరోగ్య అధికారి నగరం లో సమాధి చేయ టానికి ఒప్పు కోలేదు .సాయంత్రం అవుతోంది .అంత్యక్రియలు చూసి ఇళ్లకు వెళ్లాలని అందరి ఆత్రం ..ఇంతలో ఆ అది కారికి తీవ్ర మైన కడుపు నొప్పి వచ్చి గిల గిల తనను కొంటున్నాడు .జ్ఞానోదయమైంది .వెంటనే ఒప్పు కొన్నాడు .కడుపు నొప్పి తగ్గింది .ఆయన సమాధి హిందూ ముస్లిం లందరికి పవిత్ర దర్గా యే .

          ఆయన ప్రాచుర్యం ఎంత గొప్ప ది అంటే గుంటూరు జిల్లాలో హిందువులు తమ పిల్లలకు మస్తానయ్య ,మస్తానమ్మ అని పేరు పెట్టు కొంటారు .వాలీ గారు సుమారు 1685 ప్రాంతం లో జన్మించి నట్లు భావిస్తారు .మరణం మాత్రం 23-5-1895 అంటే సుమారు రెండు వందల పది సంవత్స రాలు జీవించారని భావన .ఆయన్ను గుంటూరు లో మొదట చూసిన వారందరికి ఎనభై ఏళ్ళ వాడు గా నే కన్పించటం విశేషం .అలాగే చివరి దాకా ఉన్నారు ..ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సిద్ధులు పొంది అప్పుడు గుంటూరు వచ్చారన్న మాట .

 ఇంకో యోగి గురించి ఇంకో సారి తెలియ జేస్తాను .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-6-12—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )

చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )

            రవీంద్ర నాద టాగూర్ ‘’literature is really not reflections of social process ,but the essence ,the abrifgement and summary of history ‘’అన్నాడు .కనుకనే సంఘ సంస్కరణా పేక్ష తో స్త్రీ పునర్వివాహం ,కన్యా శుల్కం ,పాశ్చాత్య వ్యామోహం పై నిరసన ,భారతీయ సంస్కృతీ పునరుద్ధరణ ,స్త్రీ స్వాతంత్రం ,,సామ్య వాదం మొదలైన విషయాల పై కందుకూరి ,గురజాడ ,పానుగంటి ,చిలక మార్తి ,,చలం ,విశ్వనాధ ,శ్రీ శ్రీ లు విస్తృతం గా రాశారు .చైతన్యం తగ్గి నిద్ర పోతున్న సమాజాన్ని జాగృతం చేశారు .వైతాళికులు అని పించు కొన్నారు .art  not only reproduces life ,but also shapes it ‘’అన్నారు .’’అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజా పథిహ్ –యధాస్మై రోచతే విశ్వం –తదే దం పరి వర్తతే ‘’అన్నాడు ఆనంద వర్ధనుడు అనే ఆలన్కారికుడు .అంటే సాహిత్య జగత్తు లో కవే బ్రహ్మ .ఈ విశ్వాన్ని తనకు ఎలా కావాలో అలా మలచు కుంటాడు .విలియం బ్లేక్ కూడా he sees a world in a grain of sand and heaven in a wild flower –holds infinity in a palm of your hand and eternity in an hour ‘’అన్నాడు .కవికి ఉన్న ప్రతిభ అనంతం .అతని ప్రభావం కూడా గొప్పదే .మనం చరిత్ర ,సాహిత్యం గురించి కదా మాట్లాడు కొనేది—అందుకే ప్లేటో అంటాడు ‘’poetry comes nearer to vital truth than history ‘’ఉన్న విషయాన్ని చరిత్ర కారుడు వివరిస్తాడు .అందులోని పరమార్ధాన్ని నిరూపిస్తాడు కళా కారుడు .

                     శ్రీ కృష్ణ దేవ రాయలు దక్షిణ భారత దేశాన్ని సమైక్యం గా ఉంచాడు .ఈ భావ వ్యాప్తికే ఆముక్త మాల్యద రాశాడు ..తంజావూరు పాలకులు మహారాష్ట్రులు ,మైసూరు రాజులు ద్రావిడ భాషా సాహిత్యం తో తెలుగు భాష సన్నిహితం గా మేలగేట్లు చేశారు .జాతీయ సమైక్యత కావాలంటే భాషా సమైక్యత అవసరం .దీని వల్ల భావ సమైక్యతా వస్తుంది .ఇది అన్ని సమైక్యత ల కంటే గొప్పది .అదే మనకు కరువైన్దిప్పుడు .అలాగే యాత్రసాహిత్యాన్ని రాసి భారతీయ సాంఘిక ,సాంస్కృతిక ,సాంప్రదాయ స్తితి గతుల్ని ప్రజలకు అందించారు ఏనుగుల వీరాస్వామి తన ‘’కాశీ యాత్ర’’అనే త్రావేలోగ్ లో .’’నీలగిరి యాత్ర లో ‘’కోలాచల శేషాచల కవి ,కాశీ మజిలీ కధలు ,జానపద కధలు ఆనాటి వైభవాలను అద్దం  లో చూపాయి .

                అక్షరం మన ఆయుధం .దాని ప్రతాపం తోనే వీరేశ లింగం గారుమూఢ ,చాందస ఆచారాలను ఎండ గట్టారు .తెలుగు లోని అన్ని ఆధునిక ప్రక్రియలకు ఆయనే ఆద్యుడు .అయితే మన జీవన మూలాను మరువ రాదు .మన వేళ్ళను విచ్చేదం  చేసుకో రాదు .అమెరికా లోని నీగ్రో ల దయనీయ స్తితుల్ని చూసి తన జాతి వ్రేళ్ళు ఎక్కడ ఉన్నాయో పరిశోధన చేసి నల్ల జాతిని మేల్కొల్ప టానికి ‘’ది రూట్స్ ‘’అనే పుస్తకం రాశాడు నల్ల జాతీయుడు .రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగా లో చారిత్రకాదారంగా పూర్వపు మన నాగారకతా ప్రయాణం అంతా వివ రించాడు .కవులు ,కళా కారులు మన సాంస్కృతిక రాయ బారులు .పూర్వం నన్నయ ,తిక్కన ఈ పనే చేసి తమ రాజ్యాలను ,రాజులను ఆపదల నుండి కాపాడు కొన్నారు .భారతీయ సంస్కృతీ పై పాశ్చాత్య ప్రభావం పెరిగి మనమేవరమో ,మన పూర్వ చరిత్ర ఏమిటో మరిచి పోయే సమయం లో విశ్వ నాద వేయి పడగలు నవల ,రామాయణ కల్ప వృక్షం మన జాతీయ జీవ నానికి మహా భాష్యం గా రాశాడు .తరతరాల భారతీయ సంస్కృతికి సమైక్యతా కు అవి చిహ్నాలు

                 అయితే విజ్ఞాన శాస్త్రం తెస్తున్న విప్లవం మర్చి పోరాడు .దాన్ని వినాశనాన్ని గుర్తుంచు కోవాలి .జూల్స్ వేర్న్స్ ,హక్సిలీ విశ్వాంతర ప్రయాణాలను గురించి ఊహించి సైంటిఫిక్ ఫిక్షన్ రాశారు .అవి ఆ తర్వాతా నిజమే అయ్యాయి .అందుకే కవిని క్రాంత దర్శి అన్నారు.ఎంత శాస్త్ర వేత్త అయినా హృదయ వాది  కావాలి .అందుకే డార్విన్ ,తిన్దాల్ డేవీ లు పరిశోధనల్లో ఎంత మునిగి ఉన్నా టెన్నిసన్ ,షేక్స్ పియర్  మిల్టన్ ,షెల్లీ ల కవితలు చదివారు ,ఆనందించారు .టా లమి ,ఉమర్ ఖయ్యాం లు గొప్ప ఖగోళ శాస్త్ర వేత్తలు కూడా .గొప్ప కవిత్వమూ రాసి మెప్పించారు .మలేరియా పై పరిశోధన చేసిన రోనాల్డ్ రాస్  గొప్ప కవే.తన డైరీ ని పద్యాలలో రాశాడు .వ్వ్యక్తి ,సమాజం ,జాతి మానసిక స్తితి లను చక్క దిడ్డ టానికి సైకాలజీ సాహిత్యమూ వచ్చింది .

            ఏది చెప్పినా హితం గా ,మితం గా కమ్మగా చంమగా ,చమత్కారం గా చెప్పాలి ..ఎన్నో వాదాలు ఇతర దేశాల్లో వ్యాపించి తర్వాతా మనకు చేరాయి .claassism ,neo clascism ,romaantism ,naturalism ,futurism ,sarrialism ,symbolism ,impressionism ,imagism ,daadaaism వగైరా ఎన్నో వాదాలు అక్కడ పురుడు పోసుకొని ఇక్కడికి చేరాయి ఇవన్నీ ఎక్కువగా ఫ్రాన్స్ దేశం లోనే ఆరంభ మైనాయి .ప్రాచీనుల్లో నవ్యుడు ,నవ్యుల్లో ప్రాచీనుడు విశ్వనాధ క్లాసికల్ ,రోమాన్తిజం కవిత్వం రాసి భేష అని పించుకొన్నాడు .కృష్ణ శాస్త్రి ,రాయప్రోలు కూడా ఈ మార్గాలను సు సంపన్నం చేశారు .కృష్ణ శాస్త్రిని ఆంధ్రా షెల్లీ అన్నారు .

                 ఛందస్సు సంకెళ్ళు తెంచు కొని పఠాభి రాశాడు .నిఘంటువుల్ని విసిరేయ మన్నాడు .కాల్పనిక సాహిత్యం లో ‘’లిరిక్ ‘’కు ప్రాధాన్యం వచ్చింది .ఛందస్సు లో మార్పు వచ్చింది .ఆట వెలది తేట గీతి ప్రాచుర్యం పొందాయి .ఎంకి పాటలు వచ్చాయి .అయితే అంతా ఊహల్లో తేలి పోయారు .జనం సంగతి మరిచారు .అప్పుడు వీళ్ళను చూసి ‘’పరుగెత్తే మబ్బుల్లారా !ప్రపంచామిది  గమనిస్తారా ‘’అని శ్రీ శ్రీ వాళ్ల దృష్టిని భూమి మీదికి మరల్చాడు .తానూ అభ్యుదయ కవిత్వం రాశాడు .కవిత్వానికి కొత్త నిర్వచనం చెప్పాడు .’’కాదేది కవితకనర్హం ‘’అన్నాడు .శ్రామిక జీవుల శ్రమైక సౌందర్యానికి విలువ నిచ్చాడు .తాజమహల్ కట్టించింది ఎవరో కాదు ,దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు /అని ప్రశ్నించాడు .తారీఖులు ,దస్తావేజులు చరిత్ర కాదన్నాడు .మానవత కు విలువ నిమ్మన్నాడు .కవితను భూ మార్గం పట్టించాడు .శక్తి ఖలేజా ఉన్న వాళ్లనే రమ్మన్నాడు .లేకుంటే జగన్నాధ రాధా చక్రాల కింద నలిగి పోతారని హెచ్చ రించాడు .’’మీ కోసమే ఈ సమస్తం ‘’అని సామాన్యులకు అండ గా నిలిచాడు శ్రీ శ్రీ .ఆకలి రాజ్యం సినిమా లో కమల హాసన్ చేత శ్రీ శ్రీ కవితలు ఎన్నో విని పించారు .టాగూర్ సినిమా లో ‘’నేను సైతం ,నేను సైతం ప్రపంజాబ్జపు తెల్ల రేకై పల్ల విస్తాను –నేను సైతం ప్రపంచాగ్ని లో సమిధ నౌతాను ‘’లాంటి కవితలు పెట్టి ప్రేరణ కలిగించారు .

                ఈ విధం గా సమాజం వ్యక్తీ అవినా భావ సంబంధాన్ని కలిగి నడిచి అభ్యుదయాన్ని సాధించాలి .చరిత్ర ముందుంటే సాహిత్యం తరువాత ,సాహిత్యం ముందు ఉంటె చరిత్ర తర్వాతా ,కొన్ని సందర్భాలలో రెండు కలిసి నడుస్తాయి

            సమాప్తం

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 1-6-12—కాంప్—అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —31 కొలచ (త )ల శ్రీ రామ మూర్తి మామయ్య

 ఊసుల్లో ఉయ్యూరు —31

                                                      కొలచ (త )ల శ్రీ రామ మూర్తి మామయ్య

      ఆయన భూమికి అయిదే అడుగుల ఎత్తుంటాడుటాడు .పిలక ,గోచీ పోసి నలగని శుభ్రమైన తెల్ల గ్లాస్కో  పంచె పైన తెల్ల చేతుల నేత బనీను ,గుండు ,పిలకా ,యెర్రని కళ్ళు ,ఎప్పుడూ ఉండే సూక్ష్మ పరిశీలనా ద్రుష్టి , వేగం గా మాట్లాడే స్వభావం ,ఆత్మీయత ,ఆదరణ ,కొంచెం గడుసు కొంచెం పొగరు ,మాట కరుకు ,ఆలోచన అపర చాణక్యం అన్నీ కలిస్తే మా శ్రీరామ మూర్తి మామయ్య .ఇంటి పేరు కొలచల .అయితే అన్నీ లెక్కలే ఆయనకు .కొలతల్లో దిట్ట .అందుకని ‘’కొలతల మామయ్యా’’ అంటాన్నేను .మా బంధు గణానికినికి ఆయన ‘’ఇంజనీరు గారు ‘’.ఆయనేమీ పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజినీరింగ్ చదవ లేదు .కాని ఆయన కలప కొలత వేసినా ,ఇల్లు నిర్మాణానికి  కోల తలు చెప్పినా నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమే .ఇంజినీర్లు కూడా అంత ఖచ్చితం గా చెప్పలేరు అనే వారు అందరు .మా అందరికి యే పని వచ్చినా వెంట ఉండి   నిర్మాణం చేసే వాడు .మనకు దిగులుండేది కాదు .ఎంత డబ్బు అవుతుందో ,ఎంత కలప కావాలో ,ఎన్ని ఇటుకలు పడ తాయో ,ఎంత సిమెంటు ,ఇసకా అవసరమో ,కూలి ఎంతవుతుందో అంతా ముందే ఖచ్చితం గా చెప్పి పనిలోకి దిగమంటాడు .అందుకని ఆయన అంటే మా కుటుంబాలలో మహా క్రేజు .

                    కాలేజి కి వెళ్ళే దారిలో కుడి వైపు అప్పుడు ఆఖరి ఇల్లు శ్రీ రామ మూర్తి మమయ్యదే  .వాకిట్లోకి నీళ్ళు పోవటానికి డ్రైనేజి కాలువ మొదటే కట్టించు కొన్నాడు .ఇంట్లో కావాల్సిన అన్ని ఆధునిక సామాను అంటే రేడియో కుర్చీ లు అన్నీ చక్కగా అమర్చుకొన్నాడు .ఇల్లు ఎప్పుడు అతి పరిశుభ్రం గా ఉండేది .శుభ్రత అంటే ,శుచి అంటే ఆయన ఇంట్లోనే .ఇంకెక్కడా అది కని పించేది కాదు .మడి బట్టలకు దండాలు ,గొడ్ల పాక ,పాలేరు ,ధాన్యం పోసు కోవటానికి కొట్టు ,అన్ని వసతులతో వంట గది ,వాకిట్లో విశాల మైన అరుగు .బయట రోడ్డు మీద కూర్చొనే చిన్న అరుగు ఇలా అన్నీ పకడ్బందీ గా ఉన్న ఇల్లు ఆయనది .పడక గది  లో’’ చిలకల పందిరి’ మంచం ‘’,మెత్తని పరుపు ,దిండ్లు ,నలగనితెల్లని పక్క దుప్పట్లు .ఇల్లంతా గచ్చు ,నల్లని నాప రాళ్ళు .భోజనాల గది  ..అంతా ఒక ప్రత్యెక తరహాయే మామయ్యది .అందరికి ఆయన ఇల్లు ,ఒళ్ళు ,పని తీరు ఆదర్శం .ఆయన పడక గదిలో ఆకాలం లో ప్రసిద్ధి చెందినా’’ నేషనల్  ఎకో’’పెద్ద  రేడియో .కర్నాటక సంగీతం అంటే మహా మోజు .రేడియో లో ఎప్పుడు మద్రాస నుంచి వచ్చే కచేరీలు వింటుండే వాడు .

           శ్రీ రామ మూర్తి గారి తండ్రి అంతర్వేది గారు .వేదం బాగా చదువు కొన్న వాడు .నిత్య వ్యవహారాల్లో ఆరి తేరిన వాడు .చాలా సరదాగా మాట్లాడే వాడు .రాజమండ్రి నుంచి పడవల్లో కలప తెప్పించి వ్యాపారం చేసే వాడట కూర గాయాల వ్యాపారము చేశాడని అంటారు . .వ్యవహార దక్షుడిగా పేరు .అందరికి తలలో నాలుక గా వ్యవ హరించే వాడు .నాకు ఆయన బానే గుర్తు .మేము హిందూ పురం నుంచి వచ్చిన కొత్త .ఆయన ఒక సారి మా ఇంటికి వచ్చాడు .నా పేరు ఏమిటి అని అడిగాడు .నేను తల బిరుసుగా ‘’పెసర కాయ ‘’అన్నాను .’’ఆరి భడవా ఖానా  అంత పొగరా ?నేను ఇక నిన్ను ‘’పెసర కాయి ‘’అనే పిలుస్తాను ‘’అని నవ్వుతు అన్నాడు .కాని చాలా ఆప్యాయం గా అలకరించే వాడు .ఆయన మరణం నాకు గుర్తుంది .ఆ పన్నెండు రోజులు మా అందరికి అక్కడే భోజ నాలు .మమ్మల్ని చాలా దగ్గర బంధువులు గా చూసే వారు .మా నాన్న గారంటే విప రీత మైన గౌరవం .మామయ్య నాన్నగారిని ‘’బావ గారూ ‘’అని అమ్మను ‘’భవానక్కాయ్ ‘’అని పిలిచే వాడు .నన్ను దుర్గా పతీ అనే వాడు .ఆయన భార్య పేరు రావమ్మ .మేము అత్తయ్యా అని పిలిచే వాళ్ళం .వాళ్ల పెద్దమ్మాయి సుబ్బమ్మ సూరి బుచ్చి రామయ్య గారి పెద్ద కోడలు .ఆమె మాకు అయిదవ క్లాస్ లో సహాధ్యాయి .ఆమె భర్త మా  స్నేహితుడు నరసింహానికి  పెద్ద అన్న .రెండో కూతురు కామేశ్వరి మా కజిన్ అయిన సూరి రాదా కృష్ణ మూర్తి భార్య .మూడో అమ్మాయి భర్త ప్రభుత్వ ఉద్యోగి .కొడుకు దీక్షితులు మాకు జూనియర్ .

           శ్రీ రామ మూర్తిగా రికి పెద్ద వంతెన దగ్గర  ఎడమ వైపు సైడు కాలవ ను ఆనుకొని చాలా స్థలం ఉంది .అందులో కలప అడితి ఉండేది .సత్యం గారి అడి తీ అని పేరు .మామయ్య ఆయనకు అద్దె కిచ్చాడు దాన్ని .అందులో ఆయన పెద్దల్లుడు గుమాస్తా గా ఉండే వాడు రామ కకృష్ణ శాస్త్రి  అతని పేరు .సత్యం గారి కుటుంబం నరసింహం  కుటుంబం , ,శ్రీ రామ మూర్తి గారి కుటుంబం చాలా సఖ్యత గా  ఉంటారు .అక్కడ కులాలేమీ అడ్డు రాలేదు .సత్యం గారు కమ్మ వారు .ఆయనకు ఇంకో భాగా స్వామి కూడా ఉండే వారు .మంచి కలప దొరికేది .రెట్లు కొంచెం ఎక్కువే .అప్పుడు కలప కొత్త మిషన్లు లేవు .రంపపు కోతే .మాకు కలప కావాలంటే అక్కడే కొనే వాళ్ళం .

   శ్రీ రామ మూర్తి గారి పెద్దమ్మాయి పెళ్లి అయిదు రోజులు చేసి ఊరంతా భోజనాలు పెట్టాడు మామయ్య .దీక్షితులు ఒడుగు నాలుగు రోజులు చేసి అందరినీ పిలిచాడు .అట్లాగే రెండో అమ్మాయి మూడో అమ్మాయి పెళ్ళిళ్ళు అన్నీ విధి విధానం గా చేశాడు .ఆత్మీయత రంగ రించే వాడు .మేము వాళ్ళింట్లో వి.ఐ.పి .లమే .మాకు అంత గౌరవం . ఆ రోజుల్లో ఇళ్లకు వచ్చి బొట్టు పెట్టి భోజనాలకు పిలిచే వారు .భోజనం రెడీ అవగానే ప్రతి ఇంటికి వెళ్లి రమ్మని కబురు చేసే వారు .రెండు పూటలా భోజనాలే .టిఫిన్లు కూడా అక్కడే .మామయ్య అన్నీ ప్రత్యేకం గా దగ్గరుండి  చూసుకొనే వాడు .ఆయనకు  తోడు మా మేన మామ గంగయ్య గారు .ఇద్దరు స్వంత అన్నదమ్ముల్లా మెలిగారు చివరి దాకా .అన్నయ్య మాట తమ్ముడికి వేదం .తమ్ముడి సూచన అన్నకు శిరో దార్యం ‘’గంగన్నయ్యా ‘’అని ఆప్యాయం గా పిలిచే వాడు .మా మామయ్యా మాత్రం శ్రీ రామ్మూర్తీ అనే వాడు .ఏరా  అని చనువుగా పిలుచుకొనే వారు .కుటుంబాలు అంత సన్నిహితం గా ఉండేవి

       రాదా కృష్ణ మూర్తి మాబుల్లి మామ్మ మనవడు .వాడికి శ్రీ రామ మూర్తి మామయ్య రెండో కూతురు కామేశ్వరి తో  వివాహం అయింది .కారణాలు తెలీదు కాని చాలా కాలం వారిద్దరికి కార్యం జరగ లేదు .మామయ్యా టెన్షన్ పడి పోతున్నాడు .ఎవరు చెప్పినా మా వాడు వినటం లేదు .ససేమిరా అంటున్నాడు .మామ్మ కూడా బాధ పడుతోంది .వాళ్ల ఇంట్లో బెజవాడ లో నేను ఇంటర్ చదివాను .చిన్నప్పటి నుంచి వాడికి నాకు చాలా స్నేహం బందుత్వాన్ని మించిన స్నేహం అది .నేను వాణ్ని అన్నయ్యా అని పిలిచే వాణ్ని కాదు ‘’గురూ ‘’అనే వాడిని .వాడు నన్ను పేరు పెట్టి పిలిచే వాడు . గురువు గారి సమస్య శిష్యుడే తీర్చాలి అనే వాళ్ళు అందరు .వాడి సమస్య నాకు వదిలి పెట్టారందరూ అమ్మా నాన్న తో  సహా .ఒక సారి ఏదో శుభ సందర్భం లో మా బంధు గణం ,రాధుడు మామ్మ అందరు మా ఇంటికి వచ్చారు .నేను ఇంటర్ పూర్తీ చ్చేశాను .అప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాను .అందర్ని ఎకామ్బరేశ్వారా పిక్చర్ పాలస్ కు సినిమా కు తీసుకొని వెళ్ళాము .అమ్మా నాన్న ,చిన్నక్క బావ ,రాదా ,కామేశ్వరి నేను మా తమ్ముడు మోహన్ .నేను ముందే జాగ్రత్త పడి  వారిద్దరికి పక్క పక్క సీట్లు ఎర్పాట యేట్లు చేశా .మేము కొంచెం దూరం గా కూర్చున్నాం .వారిద్దరూ ఏమి మాట్లాడు కున్నారో తెలీదు .కాని ఇంటర్వల్ లో ఇద్దరు కలిసి సోడా తాగారు బయటకు వెళ్లి …అమ్మయ్య అనుకొన్నాం .దీన్ని సాధించి నందుకు నన్ను అందరు అభినందించారు .మర్నాడు మళ్ళీ రికార్డు పెట్టాను .ముందు ససేమిరా అన్నాడు .గట్టిగా వాయిస్తే కార్యానికి ఒప్పు కొన్నాడు .మా ఓదిన కామేశ్వరి ఏమి మంత్రం వేసిందో భలే గా పారింది .మా అందరి గుండెల మీది బరువు తీరి నట్లయింది .అప్పటి దాకా వాడు ఉయ్యుర్లో మామగారింటికి వెళ్లి రెండేళ్లు అయింది .కార్యం మా ఇంట్లోనే జరగాలని షరతు పెట్టాడు మా వాడు .’’థాట్ కాదన్నాడు ‘’మావ .చివరికి అందర్ని సమాధాన పరచి మా ఇంట్లోనే ఏర్పాటు చేశాం .ఆ తర్వాతా మామ ఇంటిని వదల్లేదు వాడు .మామ అల్లం పెళ్ళాం తా రు డబ్బా అన్న వాడు మామ బెల్లం పెళ్ళాం తరగని గనియింది మామ్మ  ను క్రమంగా దూరం చేసుకొన్నాడు ఆ తర్వాతా ఎప్పుడో .ఇంత పని నా వల్లే సాధ్యం అయిందని శ్రీ రామ మూర్తి మామయ్యా ఏంతో  మెచ్చాడు నన్ను .మా ఇంటిల్లి పాదికి బట్టలు పెట్టాడు .అప్పటి నుంచి నేను వాళ్ల దృష్టిలో వి.ఐ.పి.అయాను .

                 ఇంజినీర్ మామయ్య బయటి ఊరికి వెళ్తే తెల్లని లాల్చీ వేసుకొని వెళ్ళే వాడు .ఊళ్ళో ఉంటె ,ఏదైనా పని సూపర్వైజ్ చేయాల్సి వస్తే పంచె ,పైన యెర్రని  కాశీ తువ్వాల  తో వచ్చే వాడు .నల్లని కిర్రు చెప్పులు ఆయన ప్రత్యేకత .బాగుండేవి ముచ్చటగా .ఉదయం పని ప్రారంభం అవటానికి ముందు వచ్చి సూచనలు చేసే వాడు మధ్యలో పదకొండింటికి ఒక సారి వచ్చి చూసే వాడు .మధ్యాహ్నం మూడింటికి వచ్చి దాదాపు ఆరోజు పని ఆయె వరకు ఉండి మర్నాడు ఏమేమి కావాలో చెప్పి ,తెప్పించే ఏర్పాటు చేసే వాడు .యే కట్టుడికి ఎన్ని పాళ్ళు సిమెంట్ వేయాలో ఎంత ఇసక వేయాలో చెప్పే వాడు .అది సరిగ్గా కలపక పోతే తిట్టే వాడు తాపీ మేస్త్రీని .సీతా రామయ్య అనే తాపీ మేస్త్రి పెద్ద వంతెన దగ్గర ఉండే వాడు .అతనే మా దొడ్డి గోడలు గోడల పాక  నీటి తొట్టె గిలక బావి కత్తాడు .ఆ తర్వాతా భిక్షాలు .వడ్రంగి ఫరీదు సాహేబు .భలే పని వాడు .నల్లగా బారుగా ఉండే వాడు .చక్కని నగిషీ పని .మా గదిలో చువ్వల దర్వాజా ,వంటిట్లో మడి అలమార్లు సామాను అలమార్లు అతనే చేశాడు .మామయకు తురకం బాగా వచ్చు .వాళ్ళతో బాగా మాట్లాడే వాడు ..మా గొడ్ల  దొడ్లో సిమెంటు రాయిని  ని యాకమూరు రామయ్య అనే ఆయనతో దగ్గరుండి తీయించాడు .చాలా పెద్ద అచ్చు .దాదాపు అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదర కుండా ఇంకా అవి ద్రుధాం గా ఉన్నాయి .కలప నాణ్యత ఆయనకు బాగా తెలుసు .రంపపు కొత్త మిల్లులు వచ్చింతర్వాత అవసరమైతే మా వెంట ఉండి  కొత్త కోయించే వాడు .ముక్క వృధా కాకుండా చాలా జాగ్రత్త పడే వాడు .రిక్షా మీద వెళ్లి వచ్చే వాడు .పని అంటే దైవం అని ఆయన భావన .

     మా మేన మామ గంగయ్య గారికి గానుగ సున్నం తారస రాయి టేకు బద్దీల తో  ఆయనే డాబా కట్టించించాడు దగ్గరుండి .నన్ను చాలా సార్లు ‘’ఒరే  పది వేలు చేత్తో పట్టు కోరా .నేను నీకూ డాబా వేయించి పేద తాను ‘’అనే వాడు .అంత డబ్బు అప్పుడు మా దగ్గర ఉండేది కాదు .కాని ఆ అభిమానానికి జోహార్లు .

    హిందీ టి వి.సీరియల్ ‘’చాణక్య ‘’అందరు చూసే ఉంటారు .అద్భుతం గాఉండేది . .అందులో చాణక్య పాత్రధారి దర్శకుడు ద్వివేది అనుకుంటా .అచ్చం గా మా శ్రీ రామ మూర్తి మామయ్యా అదే వేషం  ,అదే పోజు టో ఉండే వాడు .ఈన్ని చూస్తె ఆయన్ను చూడక్కర లేదు .మామయ్యా చిక్కని ఫిల్టర్ కాఫీ నే తాగే వాడు .మా ఇంట్లోను ఫిల్టర్ కాఫీ యే .ఆయన వస్తే కాఫీ ఇవ్వటం మామూలు .గ్లాసులు ఏంతో  పరిశుభ్రం గా ఉండాలి .మనుష్యుల్ని పూసు కోవటం ,రాసుకోవటం ఆయనకు ఇష్టం లేదు .క్రమశిక్షణ కు పెద్ద పీట వేసే వాడు .ఆ చూపు నుండి తప్పించు కోవటం ఎవరి వల్లా కాదు .అదో ప్రత్యెక శైలి .మా కుటుంబాలే కాదు .ఆయన సలహా సంప్రదింపులు పొందని కుటుంబం ఆ నాడు మా ఉయ్యుర్లో లేనే లేదని చెప్ప వచ్చు .ప్రతి ఫలాపేక్ష లేకుండా అలా చేయటం ఎందరికి సాధ్యం ?అది ఆయనకే సాధ్యమయింది .ఆలోచనలో ,వ్యూహ రచనలో అపర చణ క్యుదని అని పించుకొన్నాడు .మేము కూడా  చాటున ‘’చాణక్యుడు ‘’అనే వాళ్ళం .నవ్వు కంటే సీరియస్ గా ఉండటం ఆయన తరహా .నవ్వాడు అంటే ఏదో ఉంది అనే భావం .

         మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ,ఒడుగులకు ఆయన దగ్గరుండి అన్నీ పర్య వేక్షించి జరిపించే వాడు .మా నాన్న గారు చని పోయినపుడు మా కుటుంబానికి ఎంతో అడ దండ గా ఉన్నాడు .మా అమ్మ చని పోయి నపుడు అంతా తానే అయి జరి పించాడు .ఆయన మా దగ్గర ఉంటె వెనక్కి తిరిగి చూసు కొ నక్కర లేదనే దిలాసా మాకు కల్పించాడు ఆయన .మా మేన మామ తర్వాతా ఆయనే మాకు అతి దగ్గర చుట్టం అని పించుకొన్నాడు .ఆయన మూడు కాలాల్లో సంధ్యా వందనం చేసే వాడు .వేదం బాగా చదివు కొన్నాడు .పెళ్ళిళ్ళలో పురుహోతిడుడు ఎక్కడైనా పోరపడితే చక్క దిద్దే వాడు .ఆయన ఇంటికి అతిధులు ఎక్కువ గా వచ్చే వారు .కమ్మని భోజనం పెట్టి తగిన సత్కారం చేసే వాడు .మడి వంట .వేదం చదువు కొన్న వారిని పరీక్షించే చక చక్యం ఉన్నవాడు .మా మేన మామ నిర్వహించే వేద సభలకు హాజరై దగ్గరుండి ఏర్పాట్లు చూసే వాడు .

         ఒక రకం గా మా కుటుంబాలకు సారధి మంత్రి ,సచివుడు ,స్నేహితుడు ,నీతి కోవిదుడు ,అపర చాణక్యుడు ,ఇంజినీరు  మా కొలతల సారీ కొలచల శ్రీ రామ మూర్తి మామయ్య .ఇన్నాళ్ళకు ఆయన్ను తలచుకోవటం నా అదృష్టం గా భావిస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —31-5-12—కాంప్ —అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 4 Comments

చరిత్ర-సాహిత్యం — 4

 చరిత్ర-సాహిత్యం — 4       

             పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రోది చేశాయి .సాంఘిక దురాచారాలను ఎండ గట్టాయి .

   వీటన్నిటికి మించి కధ సామాన్యులను బాగా పలకరించింది .పెద్ద ప్రభావమే కల్గించింది .ఆధునిక తెలుగు కధ కు ఆద్యుడు గురజాడ .ఆయన కధ ‘’దిద్దు బాటు ‘’మొదటి ఆధునిక కధానిక .విశ్వనాధ ,వేలూరి ,శ్రీ పాద ,మల్లాది మా గోఖలే ,బుచ్చి బాబు ,,గోపీ చాంద్ ,చిన్తాదీక్షితులు పద్మ రాజు ,చా.సో.,తిలక్ వగైరా మంచి కధలు రాసి మంచి ప్రభావం చూపారు .కాలాన్ని బట్టి శైలి మారింది .భాష కూడా మారింది .ఏదైనా ప్రజలకు దగ్గరయ్యే ఉపాయం వెదుక్కోందిసాహిత్యం ..రేడియో ,టి.వి. ల ప్రభావం మాటలతో చెప్పక్కర లేదు .మినీ కధ ,కాలం కధ లు వచ్చాయి .మినీ ,హైకూ కవితలు రాజ్యమేలుతున్నాయి .కొందరు కవులు తాము చూసిన విషయాలను చాటువులు గా అందించారు .కంప్యుటర్ వచ్చి మొత్తం అంతా మార్చేసింది .యువత దాని లో కొట్టుకు పోతోంది .అది అవసరమే అయినా అనవసర విధానాలు జనాన్ని పేడ దారి పట్టిస్తున్నాయి .కొత్తరచనలు బ్లాగులు సాహితీ సేవ చేస్తున్నాయి .ఖగోళ రహస్యాలు తెలుస్తున్నాయి .వ్యావహారిక భాష అవసరాన్ని గిడుగు వారు బహుళ వ్యాప్తి లోకి తెచ్చారు .పాత్రోచిత భాష ను కన్యా శుల్కం లోను ,ప్రతాప రుద్రీయం లో ను గురజాడ వేదం వారు ప్రవేశ పెట్టి మార్గ దర్శనం చేశారు .మాండలికం లో కధలు ,కవితలు వచ్చి ఉత్తేజితుల్ని చేస్తున్నాయి .రాయలసీమ తెలంగాణా ,ఉత్తరాన్ద్ర్ర రచయితలు దూసుకు పోతున్నారు .

       ఒక దేశం లో జరిగిన సంఘటనలు ,చరిత్ర ఇతర దేశాల పై అక్కడి రాజకీయ ,ఆర్ధిక ,సామాజిక స్తితుల పై ,సాహిత్యం పై ప్రభావం చూపిస్తాయి .బయల్దేరింది ఒక దేశం లో నైనా ,దాని ప్రభావం మీడియా ద్వారా విశ్వ వ్యాపితమవుతుంది .స్పెయిన్ దేశపు నాటక కర్త ‘’లోప దివేగా ‘’1800 లో నాటకాలు రాశాడు .షేక్స్ పియర్ చాలా తస్క్కువే నాటకాలు రాశాడు .కాని ప్రపంచ దేశాల పై అనంత ప్రభావం చూపాడు .రాసింది రసానందం గా ఉండటమే దీనికి కారణం .విశ్వ శ్రేయస్సు ను కల్గించాలి .’’నిన్నటి మహా భారతం పద్దెనిమిది పర్వాలు అయితే నేటి కావ్యం పద్దెనిమిది పంక్తులే ‘’అన్నాడు శ్రీ శ్రీ .తక్కువలో ఎక్కువ ప్రభావం కలిగించేదే ఉత్తమ రచన .అంత కూడా భరించలేం –‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’అనేశారు .స్పూర్తి ,చైతన్యం కల్గించే ఒక్క వాక్యం చాలు అదే కావ్యం అని అర్ధం .అంటే భిన్నత్వం లో ఏకత్వం సాధించేది ,శాంతిని బోధించేది ,సారవంతం అయింది అయిదే గొప్ప రచన ..తన అనుభూతి ని జనం అనుభూతిగా చేసేదే .అదే కల కాలం నిలుస్తుంది .

                      literature is the immortaalityof the human speech’’అన్నారు .గ్రీకు దేశానికి స్వాతంత్ర ప్రబోధం చేసి  ,తానూ స్వయం గా యుద్ధ రంగం లో దూకి తన జాతికి స్వాతంత్రం తెచ్చాడు ‘’బైరాన్ ‘’మహా కవి ..అలాగే ఫ్రెంచి విప్ల వాన్ని  ప్రేరే పించి ,విప్లవ గీతాలు ,కావ్యాలు రాసి రూసో అనే రచయిత తన దేశానికి స్వేచ్ఛ కల్గించాడు .ఈయనకు వాల్టర్ అనే మరో రచయిత తోడూ అయాడు .రష్యా లో గోర్కి ,తాల్ స్టాయ్ ,రచనలు జనాలను చైతన్య పరచాయి .ఇక్కడ విప్లవాలు ,ఉద్యమాలు ,సాహిత్యం ఒక దానికొకటి తోడ పడి జమిలిగా సాగాయి .

       literature is the critisism of life ‘’అని ఆర్నోల్డ్ అంటే ,it is an expression of society అని ఇంకోరు అన్నారు .literature is the comprehensive essence of the intellectual life of a nation ‘’అని వేరొకరు వ్యాఖ్యానించారు .అన్నీ నిజాలే .తెనాలి రామ లింగని ‘’పాండురంగ మహాత్మ్యం ‘’లో నిగమ శర్మకధ ఆనాడు విశృంఖలం గా తిరిగిన యువకుడి కధ .గౌరన రాసిన ‘’హరిస్చంద్రో పాఖ్యాన్నం ‘’లో నక్షత్రకుని పాత్ర ,పెద్దన గారి మను చరిత్ర లో వరూధిని ,ప్రవరుడు ,ముక్కు తిమ్మన గారి సత్య భామ ,కళాపూర్ణోదయం లోని కల భాషిణి ,అందరు ఆయా కాలాల్ లోని విలక్షణ వ్యక్తులే .హాయిగా భార్యా పిల్లల టో కాల క్షేపం చేయకుండా దూరం గా పారి పోవాలని భావించే వారిని మళ్ళీ గృహసత ఆశ్రమం  వైపు కు రప్పించే ప్రయత్నాలే మను ,పాండు కావ్యాలు ..మహమ్మదీయ దండ యాత్రల ఫలితం గా ఆంధ్రజాతి నిర్వీర్యమైంది ..విజయ నగర రాజులు ఆంధ్రుల ప్రాభవాన్ని నిల బెట్టారు .అందుకే రాయల వారి ఆముక్త మాల్యద లో సామాజిక స్పృహ ,మాలదాసరి కధ లో భక్తికి కుల మత భేదాలు లేవని చెప్పటం ,రాజనీతి ,వగైరాలు నిక్షిప్తమైనాయి ..తెలుగు జాతి ఆచార వ్యవహారాలను నాగరకత ,విశ్వాసాలు ,పండుగలు ,పబ్బాలు క్రీడాభి రామం లో శ్రీ నాధుడు చూపాడు .వీటిని ఆధారం చేసుకొని శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’ఆంధ్రుల సాంఘిక చరిత్ర ‘’రాశారు .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —31-5-12.—కాం

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర—సాహిత్యం –3

చరిత్ర—సాహిత్యం –3

          అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పోరు శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పోతున్న నైతిక విలువలు .జరిగిన ,జరుగుతున్నా ,జరుగ బోయే విషయాలను గ్రంధస్తం చేయాల్సిన అవసరం కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా వాటిని అందించాల్సిన అవసరం వచ్చింది .మానసిక స్తితి ని ప్రేరేపించాల్సిన అవసరం .కర్తవ్య పరాయనులను చేయాల్సిన సమయం ..అందుకే వ్యాస మహర్షి మహా భారత రచన చేసి దానికి ‘’పంచమ వేదం ‘’అనే స్తాయి కల్పించాడు .అందులో లేని విషయం లేదు ..వేద విభజన చేశాడు .బ్రహ్మ సూత్రాలు రాశాడు .అయినా భక్తీ మార్గాన్ని అందించ లేక పోయానని బాధ పడ్డాడు సామాన్యుడికి అందు బాటు లో ఉండేది భక్తీ మాత్రమే అని భావించి భాగవతం రాశాడు .భగవంతుని విభూతి ని అనేక రూపాల్లో వివ రించాడు ..అందులో భగవంతుని కధలే కాదు భక్తుల కధలూ ఉన్నాయి .భక్తితో ధ్యానం టో చివరికి ద్వేషం తో  కూడా భగ వంతుని చేర వచ్చు నని చూపాడు .సాటి మనిషికి సాయం చేస్తేనే దేవుడు ఆడరిస్తాడనే విషయమూ తెలిపాడు .ఈ విషయాలను ప్రహ్లాద ,రంతి దేవుల చరిత్ర లలో స్పష్టం చేశాడు ..తర్వాతా చారిత్రాత్మక విషయాలన్నీ వివ రించ టానికి సృష్టి ఎలా ప్రారంభమైందో ,చెప్పటానికి పద్దెనిమిది పురాణాలు రాశాడు .పురాణం అంటే పురా నవం .అంటే పూర్వం జరిగింది అయినా వినటానికి కొత్త గా ఉంటుందని .భారత యుద్ధం తరువాత ,పాండవుల పాలన తర్వాతా భవిష్యత్తు లో ఏయే రాజ వంశాలు పరి పాలించ  బోతున్నాయో యే రాజు ఎంత కాలం పాలన చేస్తాడో అన్ని వివరాలు వ్యాసుడు భవిష్యత్తు పురాణం లో అందించాడు .అందుకే కవి ని క్రాంత దర్శి అన్నారు .కవి ద్రష్ట ,స్రష్టా కూడా .కనుక ఇక్కడ సాహిత్యం ముందు పుట్టి చరిత్ర తరువాత జరిగింది అని తెలుసు కోవాలి .కనుక చరిత్ర ,సాహిత్యం పరస్పర ఆశ్రయాలు .రెండూ ,మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయి .అలాంటి సందర్భం భారత దేశం లోదేశ స్వాతంత్ర్య సంగ్రామ కాలం లో కన్పిస్తుంది .ధర్మానికి హాని కల్గినపుడే నన్నయ ,తిక్కనలు భారత రచనలు చేశారు .

               ఆంగ్ల కవి టెన్నిసన్ THERE IS NOT THE REASON ,THERE IS BUT TO DO OR DIE ‘’అన్నాడు ఒక కవిత లో .దాన్ని గాంధీ గారు ‘’విజయమో –వీర స్వర్గమో ‘’తేల్చు కొండి అని ఆగస్ట్ ఎనిమిది నదేశ ప్రజల్ని ఉత్తేజ పరిచాడు .అదే ఆగస్ట్ విప్లవానికి నాంది అయింది .విజయ సాధనకు మార్గమేర్పడింది .దేశ విముక్తికి కారణం అయింది .బంకిం చంద్ర చటర్జీ ‘’వందే మాతరం ‘’గీతం దేశ ప్రజల పై గొప్ప ప్ర భావం కల్గించింది .ప్రేమ్చంద్ ,టాగూర్ రచనలు దేశ భక్తిని చాటి చెప్పాయి .చేస్తున్న ఉద్యోగాలు వదిలేయమని అరవింద ఘోష్ లాంటి వాళ్ళు బోధించారు .’’లాల్ బాల్  పాల్  త్రయం ‘’దేశమంతా తిరిగి చైతన్యం కల్గించారు .ఆ సమయం లో ఆంద్ర దేశం లో పర్య తించాడు బిపిన్ చంద్ర పాల్  ..రాజమాండ్రిడ్రిసభలో చిలక మార్తి లక్ష్మీ నర సింహం గారు ‘’భారత దేశంబు చక్కని పాడియావు –హిందువులను లేగా దూడ లేద్చు చుండ –తెల్ల వారను గడసరి గొల్ల వారు –పితుకు చున్నారు మూతులు బిగియ గట్టి ‘’అనీ పాడారు ఆ తర్వాతా ఆ పద్యం తారక మంత్రమే అయింది .గరిమేళ్ళ సత్య నారాయణ గారు ‘’మాకొద్దీ తెల్ల దొరతం ‘’అనే పాట టో ప్రజలంతా ఉర్రూత లూగి పోయారు .భారతీయ సమైక్యతకు ఎందరో నాయకులు ,రచయితలు ,కళా కారులు తమ వంతు పాత్ర నిర్వ హించారు .దీనితో ఉప్పు సత్యాగ్రహం ,విదేశీ వస్త్ర బహిష్కరణ ,,హరిజనోద్ధరణ ,రాష్ట్రభావన ,హిందీ ఉద్యమం పెన వేసుకొని నడి  చాయి .స్వంత భాష పై భక్తీ పెరిగింది .’’యే దేశ మేగినా ఎందు  కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ‘’అని ఎలుగెత్తి చాటాడు రాయ ప్రోలు  సుబ్బారావు .ఫ్రెంచి విప్ల వానికి రూసో ,రష్యా విప్లవానికి మార్క్స్ ,తాల్స్తాయి రచనలు తోడ్పడ్డాయి .రాజా రామ మోహన రాయ్ ,దయానంద సరస్వతి స్వాతంత్ర యుద్ధానికి కొత్త భాష్యం చెప్పారు కే.ఆంద్ర దేశం లో గురజాడ ,చిలక మార్తి ,రాయ ప్రోలు ,,విశ్వనాధ ,తుమ్మల ,కృష్ణ శాస్త్రి వగైరాలుకధాలు ,కావ్యాలు రాసి ప్రజల్ని కత్రవ్యం వైపు కు మరల్చారు .అల్లూరి దేశభక్తి ,కన్నె గంటి హనుమంతు శౌర్యం గానం చేసి దేశ భక్తీ రగిల్చారు .అహింసా వ్రతం గొప్ప తనాన్ని సౌందర నందం కావ్యం లో పింగళి ,కాటూరి గొప్ప గా చెప్పారు .గాంధే తన సేవాదళాన్ని ‘’శాంతి దళం ‘’అన్నాడు .గాంధి జీవిత చరిత్రను తుమ్మల తెలుగు పద్య కావ్యం గా రాశాడు .రాణా ప్రతాపుని దేశ భక్తీ ,జ్ఞాపకం చేయటానికి దుర్భాక రాజ శేఖర శతావధాని ‘’రాణా ప్రతాప చరిత్ర;;కావ్యం రాశారు .తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన వాడు రాణా  .ఆ స్పూర్తి కలగాలని ఆయన సందేశం ‘’.నా స్వాతంత్రం నా ఊపిరి ‘’అన్న శివాజీ చరిత్ర ప్రభావితం చేసింది .పరమత సహనం ఆ కాలం లో వ్యాప్తి కావాల్సిన అవసరాన్ని తీర్చిందీ కావ్యం   .అందుకే అది శివ భారతం గా గడియారం వారు గంట కొట్టి నట్లు కాలానికి తగ్గ ఉద్బోధ చేశారు .

                 ‘’దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘’అన్నాడు గురజాడ .జాషువా జాతీయ నాయకులందరి పైనా కమ్మని పద్యాలను చెప్పి వారిని చిరస్మరనీయుల్ని చేశాడు .ఖద్దరు గొప్పతనం చాటాడు .’’అంట రాని తనంబు నంటి భారత జాతి భువన సభ్యత గోలు పోయే ‘’అని బాధ పడ్డాడు .మహాత్ముని సత్యాగ్రహ యజ్ఞం లో ‘’స్వరాజ్య బాల ‘’జన్మిస్తుందని కరుణశ్రీ కల గన్నాడు .’’లాఠీ పోతులు పూల చెండ్లు –చేరసాలల్ పెండ్లి వారిల్లు –యే కాఠిన్యం బైనన్ ,సుఖానుభావమే –గాంధీ కళా శాలలో ‘’అన్నాడు పాపయ్య శాస్త్రి .గాంధీని కృష్ణునిగా ,జహ్వారు ని అర్జుని గా ఊహించారాయన .ఆయన రాసిన ‘’విజయ శ్రీ ‘’భారత స్వాతంత్ర ఉద్యమ స్పూర్తి దాయకం గా ఉంటుంది .అహింస గొప్ప తనాన్ని ఆయన ‘’కరుణశ్రీ ‘’లో చిందించారు .

       అటు తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్ర మైంది .దాశరధి ‘’అగ్ని వీణ ‘’మీటా డు .’’నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘’అన్నాడు .ఆ నాటి నవాబు ను ‘’తర తరల బూజు ‘’అన్నాడు .తానూ ఉద్యమలో చేరి ముందున్నాడు జైలుకెళ్లాడు కవి దాశరధి

‘’వీర గంధంగంధము తెచ్చి నారము వీరు లేవ్వరో తెల్పుడీ ‘’అని తెలుగు వాళ్ళను హెచ్చరిక చేశాడు రామ స్వామి చౌదరి .’’కొల్లాయి గట్టి తె నేమి ,మా గాంధి కోమటి పుట్టి తె నేమి “’అని బసవ రాజు అప్పారావు ,గేయం జనాన్ని ఉర్రూత లూగించింది .కృష్ణ శాస్త్రి ‘’కమ్మగా బతికితే గాన్దీయుగం –మనిషి కడుపు నిండా తింటే గాంధీ జపం ‘’,’’నారాయణ నారాయణ అల్లా అల్లా –మా పాలిటి తండ్రీ నీ పిల్లల మేమేల్లా ‘’అని సర్వ మానవ సౌభ్రాతృత్వం బోధించాడు .కవితలు ,పాటలు కావ్యాలే కాదు దేశ భక్తీ బోధించే నాటకాలూ వచ్చాయి తిలక్ మహారాజు నాటకం ,కాంగ్రెస్వా లా ,పాలేరు నాటకాల్లో గ్రామ పునర్నిర్మాణం ,అస్పృశ్యతా నివారణ ,మద్య పాన నిషేధం ,గురించి చర్చించారు .ఆత్రేయ ‘’ఈనాడు ‘’నాటకం లో ఐకమత్యమే బలం అని చాటాడు .పౌరాణికాలలో ‘’ఉద్యోగ విజయాలు ‘’లో ధర్మ రాజు పై కృష్ణుడు చేపిన పద్యం ‘’అలుగుట యే ఎరుంగని మహా మహితాత్ముదజాత శత్రువే అలిగిన నాడు ‘’గాంధీ మహాత్మునికి అన్వయిన్చేట్లే చెప్పార.బ్రిటీష వారికి హెచ్చరిక గా ..

      ఉద్యమ వ్యాప్తి కి జన సామాన్యం కావాలి .వారికి అర్ధమయ్యే భాష కావాలి .ఆహ్లాద పరుస్తూ సందేశం ఇవ్వాలి .అన్డుకేం ‘’నవల ‘’అవసర మైంది .ఉన్నావ వారి ‘’మాల పల్లి ‘’నవలలో సంస్కారం ,సహజీవనం ,నవ జీవన నిర్మాణం ,,హరిజనాభ్యుదయం కన్పిస్తాయి .విశ్వనాధ ‘’వేయి పడగలు ‘’నవలలో ఆ నాడు సాంఘిక స్తితి ఎలా దిగజారి పోయిందో ,ధర్మం ఎలా పతనం చెందిందో తెల్పింది .బుచ్చి బాబు ‘’చివరకు మిగిలేది ‘’లో స్వాతంత్రా వసరాన్ని , ,నిత్య జీవిత సంఘర్షణ కన్పిస్తాయి .కొడవటి గంటి ‘’’చదువు ‘’లో ఉప్పు సత్యాగ్రహం ,వ్యక్తీ వికాసం చోటు చేసుకొన్నాయి .’’కొల్లాయి గట్టితే నేమి ‘’అన్న మహీధర రామ్మోహన రావు నవల అస్పృశ్యత ఎలా రూపు మాసిందో చూపించారు .ముప్పాళ్ళ రంగ నాయకమ్మ ‘’బలి పీఠం ‘’లో వర్ణాంతర వివాహ సమస్యను పరిష్కరించారు .పోలా ప్రగడ సత్య నారాయణ ‘’కౌసల్య’’నవలలో సత్యాగ్రహాలు భార్యా పిల్లల్ని కూడా  వదిలి స్వతంత్రం  కోసం పాటు పడిన వారి విషయం వివ రించారు .

      ఆత్మ కధలు గొప్ప ప్రభావమే కల్గించాయి గాంధి ఆత్మకధ ,తిలక్ ది ప్రకాశం గారిది వీరేశ లింగం గారిది ఉత్తేజితుల్ని చేశాయి .పట్టాభి రాసిన కాంగ్రెస్ చరిత్ర భారతీయ ఆత్మ ను మేల్కొల్పింది .రాష్ట్ర పతి  కలాం గారి ఆత్మ కధ యువతకు గొప్ప ప్రేరణ గా నిలిచింది .

సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-5-12—కాంప్–

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

చరిత్ర-సాహిత్యం –2

 చరిత్ర-సాహిత్యం –2

     ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రుతి కి అనుకరణలే ‘’అన్నాడు అరిస్టాటిల్ (art imitates nature ).ఏది చేస్తుందో అదే ప్రక్రుతి అన్నారు ..ఈ ప్రపంచం యేర్పడ టానికి మూల కారణం ప్రక్రుతి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రాలు ,చెట్లు ,అరణ్యాలు ,చంద్రుడు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ .ఇవన్నీ మనకు ఏదో ఒక ఆదర్శాన్ని అందించేవే ..లాభా పెక్షా ,ప్రతిఫలా పెక్షా లేకుండా నే మేలు చేస్తాయి .మానసిక వికాసం కల్గిస్తాయి .అందుకే మన మొట్ట మొదటి సాహిత్యం అయిన వేదాలలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ..నదీ సూక్తం ,పర్జన్య సూక్తం ,పృధ్వీ సూక్తం అన్నీ వీటికి సంబంధించి నవే . .ఇదంతా ప్రకృతి ఆరాధనా విధానమే .మనం పొందే ప్రేరణ కూడా ఉంటుంది .మనకు అపాయం కల్గించే వాటి నుండి రక్షించ మని దేవత లను వేడు కోవటమే .మన కుటుంబం ,సమాజం ,దేశం అభి వృద్ధి కి దోహదం చేయమని ,ప్రక్రుతి శక్తుల్ని ప్రార్ధించటం ఉంది ..అన్నిటినీ దేవతలు గా భావించే మనస్తత్వం మనది ..ఇదంతా పైకి కన్పించేది .మరి మనకు మనసు ఉంటుంది కదా .ఇది లోపలి భావాలను గురించి ఆలోచించేది .దీన్నే అంతఃకరణ అంటారు .ఇది కూడా సాహిత్యం లో ప్రతి ఫలించింది .దీని వల్లనే కాళిదాసాది కవులు ,మిల్టన్ షేక్స్ పియర్  ,షెల్లీ కవిత్రయం మొదలైన వారంతా కావ్యాలు రాశారు .మానవ మనో ప్రవ్రుత్తి ని తమ రచన ల లో అద్భుతం గా ఆవిష్కరించారు ..ఇక్కడ కల్పనా ,చమత్కారం ,సౌందర్య దృష్టి ,మానసిక ఆనందం అన్నీ లభిస్తాయి ..ప్రక్రుతి శక్తులను వశం చేసు కోవా టానికి ,మానవ శ్రేయస్సు కు యజ్ఞాలు ,యాగాలు చేయాల్సి వచ్చింది .వాటి కోసమే మంత్రాలు అవే రుక్కులు ..మానవుడికి ,పశు పక్షాడులకు శారీరక ,మానసిక వ్యాధులు వస్తే నివారించాలి .దీని కోసం మంత్ర తంత్రాలు .

                      మానసిక ఆనందం రావటానికి రాగ సంగీతం అవసరం ..పాట లో వశీకరణ శక్తి ఉంది .ఇలా అనతం గా వేదాలు పెరిగి పోయాయి వేదాలు .అందుకే వేద విభజన చేయ వలసి వచ్చింది .వేద వ్యాసుడు ఈ పని చేసి  నాలుగు వెదాలుగక విభజించాడు .దేవతా స్తుతి అంతా ఋగ్వేదం ,యజ్న యాగాలకు యజుర్వేదం ,ఆరోగ్యానికి అధర్వ వేదం ,సంగీతానికి సామ వేదం ..వేదాలను ఎవరు రాయ లేదనే మన నమ్మకం .మనసు ను జయించిన ఋషుల మనో నేత్రాలతో చూసి వాటిని దర్శించారు .కనుక వారు ద్రష్టలైనారు .వారు స్రష్టలు  కారు .ఇలా వేద విజ్ఞానం అంతా వచ్చింది .యజ్న యాగాదులతో కాల క్షేపం జరిగి పోతోంది .అదే చివరికి రొటీన్ అయి పోయింది .సంతృప్తి తగ్గింది .కనుక ప్రశాంతం గా జీవించాలి అనే భావం వచ్చి అరణ్యాలకు వెళ్లారు .తపస్సు చేశారు .నిశ్చల మైన మనస్సు ఉంటె అంతా మనస్సు అనే స్క్రీన్ మీద భూత భవిష్యత్ వార్త మానాలు తెలుస్తాయి అనే భావం  పొందారు .దాని వల్ల ఉపనిషత్తులు వచ్చాయి .అవి వందకు పైనే ఉన్నాయి .అందులో పది మాత్రమే ప్రాముఖ్యత చెందాయి .వేదాలలో ఏమున్నదో అందరు చదివి తెలుసు కొ లేరు .కనుక వాటి సారాన్ని ఉపనిషత్ ల లో నిక్షిప్తం చేశారు .వీటిని వేదాంత సాహిత్యం అన్నారు .వీటి వల్ల భగవంతుని సమీపం చేరే మార్గం సులభ మైంది .అయితే ఇవన్నీ వ్యక్తీ గతాలు .ఎవరి దారి వారిదే అయింది .,అంటే ఇప్పుడు సమాజం లో రెండు మార్గాలు ఏర్పడ్డాయి .ఒకటి –వేదాలలో చెప్పినట్లు యజ్న యాగాదులు చేయటం ,,లేదా రెండో మార్గ మైన వ్యక్తీ గత పధ్ధతి లో మోక్షాన్ని పొందటంఅందుకోసం వంటరి తనం గా అరణ్యాలలో జీవించటం .ఈ రెండు మార్గాలు కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే సాధ్య మైనవి ..మరి సామాన్య జనం సంగతేమిటి ? అందరు యజ్న యాగాల్లో నో ముక్కు మూసుకొని అరణ్యాల్లో నో ఉంటె ప్రజా జీవితం ఎలా /రాజ్యం ఎవరు నడ పాళీ ? రక్షణ ఎవరు చేయాలి ? న్యాయం ఎవరు చెప్పాలి ?.చదువు సంస్కారం లేని వారికి ముక్తి రాదా ?వాళ్ళను తరింప జేసే మార్గం లేదా ?.అప్పుడే వారి కోసం భగవద్గీత ఆవిర్భ వించింది

          తన్ను నమ్ముకొన్న సామాన్య జనుల కోసం ముఖ్యం గా గోపికలు గోపాలురు అయిన చదువు రాని  వారి కోసం శ్రీ కృష్ణుడు మహా భారత యుద్ధం లో ‘’గీత ‘’ ను ఉపదేశించాడు .’’అనన్యాస్చింత యంతోమాన్ ,మామేకం ,శరణం వ్రజ ‘’అన్నాడు .అంటే నన్ను నమ్మండి .నేనే మీకు శరణు అన్నాడు .మీ సంసార జీవనం మీర్రు చేసు కొంది .యే పని లో ఉన్నా ,ఆ పని లో శ్రద్ధ చూపండి .’’కార్యం కర్మ సు కౌశలం ‘’నైపుణ్యం తో చేసే ప్రతి పని ,భగవంతున్ని మెప్పిస్తుంది .duty is god ‘’పనికి గౌరవం ఇవ్వండి .అన్ని పనులు దైవ సమానమే .యే దేవుణ్ణి అయినా కొలవండి .కాని నిశ్చల భక్తీ అవసరం .అని చెప్పాల్సిన ఆవ సరం ఆ నాడు కృష్ణుడికి కల్గింది .ఇదంతా ఆనాటి కాల ప్రభావమే .అందుకే ప్రపంచం లో భగవద్గీత కున్న విలువ యే గ్రంధానికి లేదు .బైబిల్ తర్వాతా ప్రపంచం లో అందరు చదివే పుస్తకం గీత .వేద ,ఉపనిషత్ ,వేద శాస్త్ర విషయాలన్నీ అందులో ఉన్నాయి .

      ఆదర్శ మానవున్ని ఆవిష్కరించాల్సిన అవసరం ,తన కాళ్ళ టో తాను ఆ ధర్మాలు ,లక్షణాలు ఉన్న శ్రీ రాముడిని దర్శించటం వాల్మీకి మహర్షి చేసుకొన్నా పుణ్యం .జంట పక్షుల విరహాన్ని చూసి ,శోకం లో అనుకో కుండా అనుష్టుప్ ఛందస్సు లో శ్లోకం నోటి వెంట వచ్చింది .శ్రీ మద్రామాయణం రాసి ఆది కవి అని పించు  కొన్నాడు .అది ఆదికావ్యం అయింది ..అందులో అన్ని రకాల వ్యక్తుల మనో భావాలు ప్రతి ఫలించాయి .రాజనీతి ,యుద్ధ నీతి కర్తవ్య పాలన ,స్నేహ ధర్మం ,ఆశ్రిత రక్షణ ,పితృవాక్య పాలన ,భ్రాత్రు ధర్మం ,మాత్రుధర్మం శత్రువు లోని మంచిని గుర్తించటం ,పశు పక్షాదుల పై స్నేహ భావం ,ధర్మ రక్షణ మొదలైన వన్నీ రామాయణం లో రాముని నడక ,నడత వల్లమార్గ దర్శకం గా చూపించాడు కవి వాల్మీకి .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-5-12.—

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ విహార యాత్రా వారం

 అమెరికా డైరీ

                                                                        విహార యాత్రా వారం

    కిందటి వారం మొదట్లో  అంతా కొంచెం నీరసం గా గడిచినా ,చివర్లో ఊపు అందుకోంది  .లైబ్రరి లోతెచ్చిన వాటి లో  పదకొండు పుస్తకాలు చదివాను .దాదాపు అన్నీ బాగున్నాయి .వాటిలో కొన్ని టి పై ఆర్టికల్స్ రాశాను కూడా .అ మేరికా లోని రీజియన్ మూడు లో ఉన్న సాయి సర్విస్ సెంటర్లు అన్నీ కలిసి ఇక్కడికి సుమారు నూట ఇరవై మైళ్ళ దూరం లో ఉన్న అప్పలేచియాన్ పర్వతాల సమీపం లో బ్లూ రిద్జి మౌంటైన్ అనే చోట y.m.c.a.హాల్ లో ఈ నేల 26 –28 మద్య మూడు రోజులు’’retreat’’ కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారు .దానిలో విహార యాత్ర లాగా మేమందరం పాల్గొన్నాం .ఆ విశేషాలు –

                                                                             ఏర్పాట్లు

     మూడు రోజులు ఉండాలి కనుక ,వాళ్ళు పెట్టేది అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ,లంచ్ ,డిన్నర్ కనుక మేము తిన గలమో లేమో నని మా అమ్మాయి విజ్జి ముందు జాగ్రత్త పడి మా కోసం  మూడు కూరలు ,రెండు పచ్చళ్ళు , ,పెరుగు ముందే రెడీ చేసింది .అక్కడికి సుమారు మూడు వందల మంది వస్తారని అంచనా .వీరికి అక్కడ శనివారం ,ఆదివారం ,సోమ వారం ఉదయంటిఫిన్ మాత్రమే  అక్కడ వాళ్ళు పేడ తారట.. .అందుకని శార్లేట్ లోని సాయి సెంటర్ వాళ్ళు వాలంట రి  రీగా కొన్ని కుటుంబాలను కొంత తినటానికి ఏదైనా తయారు చేయమని చెప్పారు .మా అమ్మాయి అంత మందికి రెండు పచ్చళ్ళు తయారు చేసింది .ఒకటి టమేటా పచ్చడి ,రెండోది దోస ఆవ కాయ . పెరుగు పులిహోర ,పెరుగన్నం కూడా తీసుకొని వెళ్ళింది .శుక్రవారం రాత్రికే అంటే ఇరవై అయిదు రాత్రికే చేరే వారికి ,సోమవారం లంచ్ చేసే వారికి ఈ ఏర్పాట్లు .మా కుటుంబానికి వేరే అన్నం ,వగైరా .ఇవన్నీ మూడు రోజుల నుంచి తయారు చేసి రెడి చేసింది .ఇంకో ఆవిడ చపాతీలు ఇందరికి  .కొందరు పళ్ళు .కొందరు పేపర్ ప్లేట్లు కప్పులు ,కాఫీ పొడి టీ పొడి ఇలా ఎవరికి వీలైంది వాళ్ళు స్వచ్చందం గా తెసుకొని వెళ్లారు .ఇక్కడ డబ్బు వసూలు చేయరు .ఇలానే యే కార్య క్రమం అయినా నిర్వ హించటం వీరి ప్రత్యేకత .పిల్లలకు బిస్కట్లు ,పాలు యోగాట్లు జూసులు కాన్డీలు షరా మామూలే .

                                                                     అపలేశియన్ పర్వత పాదాల చెంత

      అపలేచియన్ పర్వతాలు 480 మిలియన్ల సంవత్సరాల నాడు ఏర్పడి నట్లు భావిస్తారు .అమెరికా తూర్పు .పడమర భాగాలను ఇవి వేరు చేస్తాయి .సుమారు నాలుగు వందల కిలో మీటర్లు వ్యాపించాయి .కెనడా వరకు ఉన్నాయి .నార్త్ కేరోలీనా లోని మౌంట్ మిచెల్ శిఖరం వీటిలో పెద్దది .దీని ఎత్తు 6,684 అడుగులు .దీనిపై పైన ,హార్డ్ వుడ్  అడవులు దట్టం గా ఉన్నాయి . 1528 .లో నార్సేజ్ అనే అతని నాయకటం లో ఒక బృందం పరిశోధనకు వచ్చింది .వీరికి ఇప్పటి ఫ్లారిడా లోని తల్లా హస్సీ అనే చోట ఒక నేటివ్ అమెరికన్ గ్రామం కని పించింది .వాళ్ళు తమ రికార్డులో దాన్ని ‘’అపలేచియన్’’ గ్రామం అని రాసు కొన్నారు .అప్పటి నుంచి ఆపేరుతో ఈ పర్వతాలు పిలువా బడుతున్నాయి .స్పానిష్ వాళ్ళు దీన్ని’’అపలేచి’’ అన్నారు .’’అలిఘని పర్వతాలనీ ‘’వీటిని పిలుస్తారు .

      మేము శుక్రవారం సాయంత్రం నాలుగింటికి కార్ లో బయల్దేరాం .వీకెండ్ కనుక బాగా ట్రాఫిక్ ఉంది .బలు రిద్జి చేరే సరికి రాత్రి ఏడున్నర అయింది .మాకు మంచి రూమే ఇచ్చారు .రెండు మంచాలు న్నది .వెంటనే డిన్నర్ మన వాళ్ళు తయారు చేసింది –పులిహోర ,పెరుగన్నం అరటి ఆపిల్ పళ్ళు పెట్టారు .కడుపు నిండా తిన్నాం .అప్పటికే సగం పైగా జనం వచ్చారు .రాత్రి పన్నెండు వరకు వస్తూనే ఉన్నారు .వీరందరికీ బాడ్జీలు ఒక్కో రూం కు నాలుగు తాళం చెవులు ,జరిగే కార్య క్రమాల వివరాల కాగితం కవర్ లో పెట్టి ఇచ్చారు .ఆ రాత్రి పనేమీ లేదు .కొత్త చోటు కనుక నిద్ర పట్టా లేదు .మర్నాడు ఉదయం నుంచి కార్య క్రమాలు మొదలు

  26 శని వారం ఉదయం అయిదున్నర గంటల నుంచి ,సోమవారం ఉదయం పది గంటల వరకు వివిధ కార్య క్రమాలు .మూడు రోజులు ఉదయమే ప్రభాత భేరి .అందరు లేచి కార్యక్రమాలకు తయారవటం .అయిదున్నర నుండవేద పనసలు చదువుతూ నగర సంకీర్తన .ఆరున్నరకుభజన .ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్ .ఎనిమిదిన్నార నుండి ఉపన్యాసాలు మధ్యాహ్నం పన్నెండు వరకు .ఆ తర్వాతా గంట లంచ్ బ్రేక్ .మధ్యలో కాఫీలు .మధ్యాహనం రెండు నుంచి అయిదు వరకు వివిధ వర్క్ షాపులు .ఐదున్నరకు భజన సాయంత్రం ఆరునుంచి ఏడు వరకు డిన్నర్ .ఏడున్నరకు ప్రత్యెక కార్య క్రమం .ఇదీ షెడ్యూలు .

 శని వారం బ్రేక్ ఫాస్ట్ కు వెళ్ళాం .ఆకులు అలమలు కోడిగుడ్డు అట్టువగైరాలున్నాయి .మేము యోగాత్ ,సీరియల్స్ టిని కాఫీ కలుపు కొని త్రాగం .ప్రభావతి సభలకు రాలేనంది  .మేము వెళ్ళాం .ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ‘’సామరస్యం ‘’.ఇది వ్యక్తిలో ,కుటుంబం లో సమాజం లో ఎలా సాధించాలి అన్న దాని పై ప్రసంగాలు వ్యక్తిలో సామరస్యం విషయం పై ఫ్లారిడా లో ఉండే జ్ఞాన భాస్కర్ తెనాలి ప్రసంగించారు .పోతన పద్యాలు ,వేదం భగవద్గీత ల నుండి ఉదాహరిస్తూ మాట్లాడారు .తర్వాతా రీట మరియు భర్త రాబర్ట్ బ్రూస్ గార్లు కుటుంబం లో హార్మని గురించి ప్రసంగించారు .వీరిద్దరూ సాయి బాబా శిష్యులై ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రచారం చేస్తున్నారట .ఆ తర్వాతా ట్రినిడాడ్ కు చెందినా ఫైజ్ మొహమ్మద్ చక్కని ఉపన్యాసం సమాజం లో సామరస్యం పై చేశారు .నాకు ఆయన ప్రసంగం బాగా నచ్చింది .

               మధ్యాహ్న  భోజనాల తరువాత మూడు చోట్ల వర్క్ షాప్ లు జరిగాయి .ఎవరికి వీలున్న చోట వారు పాల్గొన వచ్చు .నేను సుందర అయ్యర్ మాట్లాడిన యోగా క్లాసుకి ,గమేజ్ అనే ఆయన మాట్లాడిన కోపం జయించటం ఎలా అనేదానికి వెళ్లాను  తెనాలి గారు’’ రుద్రం’’పాడి అందరితో అని పించి అర్ధం చెప్పారు  .భజన ను ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు చేశారు .డిన్నర్ తర్వాతా ఆరు బయట చెట్ల కింద కొయ్య బెంచీలు ఏర్పాటు ఉన్న చోట  bon fire ‘’అంటే భోగి లేక చలి మంట ఏర్పాటు చేశారు .దానికి ముందు సుందరయ్యర్ పుట్ట పర్తి లో తన అనుభవాలను చెప్పారు .’’శంకరాచార్య్ల వారు రచించిన ‘’శివోహం శివోహం ‘’ఆ శ్లోకాలను చాలా బాగా పాడి అర్ధం చెప్పారు .దీనికి వ హారమణి మృదంగ సహా కారం కూడా ఉంది .ఒక గంట ప్రసంగం తర్వాతా కట్టెలు కాల్చి భోగి మంట వేశారు .అందరు పిల్లా జెల్లా సరదాగా చూశారు రాత్రి తొమ్మిదింటికి రూం కు చేరాం .రావటానికి ,పోవటానికి నడవ లేని వారికి కా ర్టులు ఏర్పాటు చేశారు .రాత్రి మా భోజనం రూం లోనే మేము వండుకొన్న పదార్దాలతోనే తృప్తిగా తిన్నాం .మధ్యాహ్నం లంచ్ కూడా మేము తినేట్లు లేదు .మధ్యాహ్న భోజనమూ మాదే .ఇలా మొదటి రోజు జరిగింది ‘

    రెండో రోజు ఆదివారం స భలల్లో inter faith మీద ప్రసంగాలు .క్రిస్తియానిటి  కి పాస్టర్ స్టీల్ ట్రినిడా నుంచి ,హిందూ మతానికి తెనాలిగారు ముస్లిం మతానికి ఫైజ్ గారు ప్రతినిధులు గా మాట్లాడారు .ఫైజ్ గారి ప్రసంగమే అన్నిటా బాగుంది ..అంతకు ముందు రీటా దంపతులు సత్య సాయి సేవా కార్య క్రమాల గురించి ప్రసంగించారు .రీటా గారు చీర కట్టు కొని వచ్చారు .మతాల మీద మాట్లాడినప్పుడు కన్వీనర్ అక్షిత్ వారిని కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టారు  .అవి ఒకటి రెండు వాక్యాలలో మీ మతం ఏమి చెప్పిందిచెప్పమని ,మతాన్ని మీరేవిధం గ పాటిస్తారు .మీ మతం లో ఉన్న దోషాలేమిటి .జననం ,మరణం ,పునర్జనం ల విషయం లో  మీ మతం లో ఉన్న గొప్ప దోషం లేక ఇతరులకు కని పించే దోషం ఏమిటి మొదలైన ప్ప్రశ్న లకు ముగ్గురు సమాధానాలు బానే చెప్పారు .అందరి కంటే ఫైజ్ గారి వివరణలు చాలా సూటిగా ,సూక్ష్మం గా ఉన్నాయి మనసుకు పట్టాయి . ఆయన జీహాద్ గురించి చక్కగా వ్వరించారు .జీహాద్ అంటే అంతస్శాత్రువులను అంతం చెయ్యమని తప్ప బయటి వారిని హత మార్చమని కాదని ఒకాయన్ పుర్రెకు పుట్టిన బుద్ధితో తమ మతం అపర తిష్ట పాలైందని చెప్పారు .అందరు చప్పట్లు చరిచారు .అందుకనే అది అవగానే ఆయన దగ్గరకు వెళ్లి ‘’ఇవాల్టి ముగ్గురి లో మీరే హీరో’’అని చెప్పి అభినందించి ,ఫోటో తీయిన్చుకోన్నాను పాస్టర్ గారు హిందూ మతం లో కులాల సమస్య ను ఎత్తితే ఒక ప్రేక్షకుడు దానిపై సమాధానం చెప్పమని తెనాలి గారిని కోరితే ఆయన మంచి వివరణే చేశారు .నాయనారులు తక్కువ జాతి వారైనా వారిని అందరు గౌర విస్తున్నారని పూజ చేస్తున్నారుఅనీ చెప్పారు ..వారేమి చెప్పారు అని ముఖ్యం కాని వారి కులానికి ప్రాధాన్యత లేదని వివ రించారు .అప్పుడు నేను లేచి తెనాలి ని సమర్ధిస్తూ ‘’ఉపనిషత్తు లను రాసింది ఎక్కువ భాగం బ్రాహ్మణే తరులే నని  ఆవి మనకు శిరోదార్యాలని ‘’చెప్పాను .ఔనని తెనాలి తల పంకించారు ..

                మధ్యాహ్న భోజనం కూడా రూం లోనే మా భోజనమే చేశాం .మధ్యాహ్నం  రీజినల్ ప్రెసిడెంట్ల సమావేశం ,వచ్చ్చే సంవత్సరానికి ప్రణాళిక మాట్లాడు కొన్నారు .ఫైజ్ గారి వర్క షాప్ .అయ్యర్ గారి దానికి వెళ్లి కాసేపు కూర్చున్నాం .సాయంత్రం ఐదున్నరకు పవన్ మమల్నిద్దర్ని కార్ట మీద చుట్టూ పక్కల అంతా తిప్పాడు .ఆరింటికి డిన్నర్ మా రూం లోనే మేము  తెచ్చుకొన్నది విజ్జి వండిన రైస్  కుక్కర్ భోజనం చేశాం .రాత్రి ఏడున్నరకు శార్లేట్ సాయి సెంటర్ కు చెందినా చిన్న పిల్లలు ఒక నాటిక వేశారు . మా మనవళ్ళు శ్రీకేత్ అశుతోష్ ,పీయూష్ లు కూడా వేషాలు కట్టారు .అందులో సారాంశం సాయి బాబా తెలిపిన విశ్వ ప్రేమ ..పిల్లలు బానే నటించారు .ఇదే హై లైట్ అని అందరు అన్నారు .అ తర్వాతా గ్రీన్స్ బోరో లోని యువకులు సాయి బాబా ప్రేరణ విశ్వజనీనత పై మంచి నాటకం వేశారు .దీన్ని రికార్డు చేసి నటించారు .బాగుంది .ఇది అయేసరికి దాదాపు తొమ్మిదిన్నర అయింది .పదింటికి మా అల్లుడు శార్లేట్ నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళ టానికి వచ్చాడు .పదిన్నరకు రాత్రి బయల్దేరి అర్ధ రాత్రి పన్నెండున్నరకు రెండు గంటల్లో ఇంటికి చేరి పడు కొన్నాం .మర్నాడు కార్య క్రమానికి డుమ్మా .

      పది రాష్ట్రాల నుంచి ఇరవై సెంటర్ల నుంచి మూడు వందల యాభై మంది రిట్రీట్ కార్య క్రమం లో పాల్గొన్నారు .అందరు ఉత్సాహం గ వున్నారు .అన్ని మతాల ,భాషల వాళ్ళు వచ్చారు .సాయి బాబా మీద అంతటి విశ్వాసం వాళ్లకు ఉండటం చాలా ఆశ్చర్యం వేస్తుంది . సర్విస్ ,ప్రేమ అనేవే వీరందరికీ ప్రేరణ .ఈ కార్య క్రమాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని సమయ పాలన తో  చాలా అద్భుతం గా నిర్వహించిన వారు మన తెలుగు వారే అయిన సత్తి రాజు సర్వేష్ అనే ప్రముఖ వైద్యుడు .ఈ విధం గా ఈ వారం విహార యాత్రా వారం గా తమాషా గా గడిచి పోయింది .

  మే ఇరవై ఎనిమిది అమెరికా లో మృత వీరుల సంస్మరణ దినోత్సవం .దీన్ని కూడా రిట్రీట్ లో ప్రసంగించిన వారంతా ఈ  దేశ ,ఇతర దేశ మృత వీరులకు నివాళులు అర్పించి సంప్రదాయాన్ని కాపాడారు .దీన్ని ఇక్కడ ‘’మెమోరియల్ డే ‘’అంటారు .ప్రభుత్వ సెలవు దినం కూడా .దీంతో కలుపు కొని శని ఆదివారాలతో మూడు సెలవులు .కనుక వీళ్ళు లాంగ్  వీకెండ్ అంటారు .ఇక్కడ కూర్చుని చూస్తె పర్వత సౌందర్యం నాయనానదకరం గా కని పించింది .విశాల మైన మోడళ్ళు కల వృక్షాలు చాలా ఎత్తు లో ఉన్నవి కని పించాయి .చాల కొత్త మిషన్లు ఇక్కడ ఉన్నాయి .ఇళ్లకు పనికి వచ్చే కలప అంతా ఈ ప్రాంతం నుండే వస్తుందేమో .ఇక్కడ వందేళ్ళ క్రితం కట్టినy.m.c.a. భవనం చెక్కు చెదరకుండా అందం గా ఉంది .దీన్ని ప్రభుత్వం నేషనల్ మాన్యు మెంట్ గా రక్షిస్తోంది .ఇక్కడ ఉన్న వరండాలో కుర్చీల లో కూర్చుని అపలేశియన్ పర్వత సౌందర్యాన్ని అందరు దర్శిస్తారు .

     ఈవారం లోచదివిన పద కొండు పుస్తకాలు –chinook nation ,destruction of books ,mightier thaan svord ,the lost world of troy ,naat turner ,the spark ,funny things in the white house ,tolkeen ,alaan turing ,man is not alone ,and re –readings

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -5-12.—కాంప్ అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

చరిత్ర –సాహిత్యం –1

          చరిత్ర   –సాహిత్యం –1

          భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ విద్యార్ధులకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే చదివి పాస్ అవుదాం ఆన్న ఆలోచన ల లోంచి బయట పడి  ,జీవితం  ఏమిటి ?మన కర్తవ్యం ఏమిటి ?మన చుట్టూ ఏమి జరుగు తోంది ?మనం దేశ భవిష్యత్తు లో మన పాత్ర ఏమిటి ?మనల్ని వదిలేస్తే ప్రగతి ఉంటుందా ?మన సంప్రదాయం ఏమిటి ?సంస్కృతీ ఏమిటి ?ఈ చదువుల పరమార్ధం ఏమిటి /విద్య లక్ష్యం ఏమిటి ?పరి పూర్ణ వ్యక్తిత్వ వికాసానాన్ని ఎలా సాధించాలి అనే ప్రశ్న లతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,ఒక మార్గాన్ని ,లక్ష్యాన్ని ఏర్పరచు కోవాలన్న ధ్యేయం తో  ,రొటీన్ కు భిన్నం గా ,ఆలోచించాలన్న సంకల్పం తో  మీరు చేబట్టిన ఈ ‘’ఇన్నోవేటివ్ ప్రోగ్రాం ‘’విని చాలా సంతోషించాను .జీవిత విలువలను తెలుసు కోవాలన్న మీ ఆరాటం ఆదర్శ నీయం .ఆ దిశ లో సాగుతున్న మీ ప్రయాణం అభినంద నీయం .’’శక్తులు నిండే ,నెత్తురు మండే ‘’మీ లాంటి యువత తో కాసేపు ముచ్చ్చ టి న్చాలని  మీరు కోరినపుడు ఆనందం తో అంగీకా రించాను ..ఇక్కడ నేనేదో చెప్తానని ,మీరేదో వింటారని రనీ ,కాదు మనం పరస్పరం అభిప్రాయాలను అంద జేసుకొందామని వచ్చాను ..నాకు ఈ అవకాశాన్ని అందించిన మీ కాలేజీ యాజమాన్యానికి ,ఇలాంటి కార్య క్రమం చె బట్టి ,రూప కల్పనా చేసి ,మీ విద్యార్ధి నాయకులకు ,మార్గ దర్శకులైన మీ అధ్యాపకులకు ,ముఖ్యం గా ఈ కార్య క్రమాన్ని నా ఉపన్యాసం తో ప్రారంభింప జేయాలని కోరిన ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి కృతజ్ఞతలు .కొత్త ఆలోచన కొత్త మార్గాలను వేస్తుంది .ఏదో వినూత్నం గా చేయాలన్న సంకల్పం ఉంటె తప్పక దారి కన్పిస్తుంది .నీరు పారకుండా ఉంటె మలినం అవుతుంది .అలానే యువ శక్తి ప్రక్వహిస్తేనే సమాజానికి ఉపయోగ పడుతుంది .ప్రేరణ పొందాలనే మీ ఆలోచనకు అభినందనలు .ఇది శుభ సూచకం .—ఇక ప్రస్తుతానికి వద్దాం

                            ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం మీద డిగ్రీ విద్యార్ధులకు ఉపన్యాసం ఇవ్వమని కోరారు .చాలా సంతోషం .నిజం గా ఈ రోజు మీ కాలేజి చరిత్ర లో ఒక చారిత్రాత్మక సంఘటనే .దీని లో నేను మీతో ముఖాముఖి జరపటం ముఖ్య మైన సంఘటనే .ఈ సందర్భం గా మీరు మీ మనోభావాలను గేయాలుగా వ్యాసాలుగా వ్రాసి లిఖిత పత్రిక తయారు చేయటం –అంటే అప్పుడే సాహితీ ప్రభావం ఈ సంఘటన పై చారిత్రిక అంశం గా   ప్రభావం పడింది అన్న మాట .ఇలాంటి విషయాలు ఎన్నో మన నిత్య జీవితం లో ,జాతి జీవితం లో జరుగుతూ ఉంటాయి .వాటన్నిటి ప్రభావం ఎలా వుంటుంది ?అన్న దాని పై మనం మాట్లాడు కొంటున్నాం .కొంత మూల విషయాల లోకి వెళ్లి చూద్దాం .

          సాహిత్యం అంటే ఏమిటో తెలియాలి కదా ముందు .హితేన సహితం సాహిత్యం .అంటే మేలు చేసేది సాహిత్యం .ఆ మేలు వ్యక్తిగతం ,సమాజ గతం ,జాతి గతం కావచ్చు .అయితే ఈ చెప్పే విషయం సత్యం తో నిండి ఉండాలి .సుందరం గా ఉండాలి .దాని వల్ల ఆనందం రావాలి .అదే సాహిత్యం .దీననే సత్య శివ సుందరం అన్నారు .ఇక చరిత్ర అంటే ఏమిటో తెలుసు కొందాం .సంఘటనల పరంపర నే వ్రాసి ఉంచితే దాన్ని చరిత్ర అన్నారు .దీన్నే’’ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ ‘’అంటారు .చరిత్ర జరిగిన తర్వాత సాహిత్యం ఆ చరిత్ర ను చిత్రించ వచ్చు .మరి చరిత్ర లేనప్పుడో ?దాన్నీ చరిత్రాతీతం లేక చరిత్ర పూర్వం అన్నారు .చరిత్ర ,సాహిత్యం పరస్పరం ప్రేరణ పొందుతాయి .అనుకొని సంఘటన జరిగినపుడు  జాతి జీవన విధానం లో మార్పు వచ్చినపుడు ,,ఏదైనా ఉద్యమం జరిగి నపుడు జాతీయ జీవనం లో మార్పు జరిగి నపుడు ,విదేశ దండయాత్ర జరిగి నపుడు ప్రజల మానశిక స్థితి పై దెబ్బ తగిలినప్పుడు ,,మత విద్వేషాలు చేల రేగి నప్పుడు ,భాశోద్యమాలు వచ్చినప్పుడు ,,భాషా ,సంస్కృతీ ,నాగర కథ ల పై పరాయి పెత్తనం వచ్చి నప్పుడు ,జీవిత విధానం లో అనుకొని మార్పులు జరిగి నపుడు భావాలు మానశిక అంశాలు పై దెబ్బ పడినపుడు   ,జనన ,మరణ ,కరువు ,పాడి పంట ,ధర్మ సంకటం వస్తే యువత దారి తప్పి నప్పుడు ,జాతి జీవనం లో విద్యార్ధులను పాల్గొనే టట్లు చేయ నప్పుడు ,వ్యవస్థ చిన్నా భిన్న మైనపుడు ,జాతికి విలువైన విషయాల పై దాడి జరిగి నపుడు  ,సంచలనం కలిగించే యే సంఘటన అయినా జరిగి నపుడు కవులు ,రచయితలు స్పందిస్తారు .వాటికి కళా రూప మైన ఆకృతి ని కల్పిస్తారు .జాతికి సందేశం ఇవ్వాల్సిన సమయం లో ఉత్తేజం కల్గించాల్సిన సందర్భాలలో ప్రేరణ కల్గించి ,జాతిని చైతన్య వంతం చేయటం ,కోసం సాహిత్యం అవసరం .సుస్తిర పరిపాలన అందించ టానికి ,సువ్యవస్థ ఏర్పర చాతానికి ,ప్రజల మనో భీష్టాలను నేర వేర్చ టానికి ,విద్యా వికాసం కల్పించ టానికి రాజకీయ పరమైన రచనలు వస్తాయి .న్యాయ నిర్వహణ కోసం శాస్త్రాలు వస్తాయి .ప్రజా రక్షణ కోసం శాస్ర రచనలు వస్తాయి .ప్రజల మానసిక ఆనందం చాలా ముఖ్యం .దీని కోసం కళలు ,సాంస్కృతిక కార్య క్రమాలు కావాలి .వీటి తో ఆనందం కలగటమే కాదు ఒక గమ్యం కూడా ఏర్పడుతుంది .ఇలాంటి వన్నీ అందించాల్సిన బాధ్యత రచయిత లది .ప్రజల మానసిక స్తితులన్నీ ఒకే రకం గా ఉండవు .పండితుల స్తాయి ఒకతిదే సామాన్యుల కోసం ఇంకోటి .వీరికి పాటలు ,నాటకాలు ,గేయాలు త్వరగా అందుతాయి .దీనితోఆనందం పొందుతారు .అవే జాన పదాలు .ఒక రకం గా జ్ఞాన పదాలు .మార్గాలు వేరు అయినా ఆనందం పొందే తీరు ఒక్కటే .ఆనందమే అందరి పరమావధి ..ఇదంతా స్తూలం గా చెప్పే విషయం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేద్దాం .

  సశేషం —-

 మనవి –ఈ రచనకు దాదాపు తొమ్మిదేళ్ళు .ఉయ్యూరు యే..జి.ఎస్.జి సిద్దార్ధ డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.రాయుడు గారు నాకు  2003 నవంబర్ మొదటి వారం లో  ఫోన్ చేసి తమ కాలేజి లో ఆ సంవత్సరం డిగ్రీ విద్యార్ధులకు ‘’ఇన్నోవేటివ్ ప్రోగ్రాం ‘’అనే కొత్త కార్య క్రమాన్ని చేబట్టు తున్నామని ,అది విద్యార్ధులను పోటీ పరీక్షలకు తయారు చేయటానికి ,సాహిత్య సాంస్కృతిక వికాసానికి చరిత్రాధ్యయనానికి తోడ్పదాలాన్నదే ధ్యేయమని చెబుతూ ,ఆ కార్య క్రమాన్ని నాతో ప్రారంభింప జేయా లన్నదే తన మనో భావం అని ,అందరు దాన్ని అభి నందిన్చారని కనుక నవంబర్ ఇరవై అయిదవ తేది తమ కళా శాలలో సాయంత్రం మూడు గంటలకు ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం ‘’మీద కనీసం ఒక గంట సేపు గెస్ట్ లెక్చర్  ఇవ్వాలని  కోరారు .నేను ఏమీ సందేహించ కుండా వెంటనే అంగీకా రించాను .వారితో నాకు చాలా ఏళ్లు గా పరిచయం ఉంది .డిగ్రీ విద్యార్ధులతో కాసేపు మాట్లాడే అరుదైన వకాశమే కాక ,అది ప్రబోదకం గా ,ప్రేరణ కల్గిన్చించేది గా ఉండాలని భావించాను .తగిన సమయం ఉన్దికనుక కావలసిన విషయ సేకరణ చేసి దాన్ని రాసుకోన్నాను .ఆరోజు న కనెను చేసిన ప్రసంగ విషయమే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .ఆ తర్వాతా వరుసగా మూడేళ్ళు నాతో రాయుడు గారు అనేక మైన అంశాల పై గెస్ట్ లేక్చార్లను  ఇప్పించారు .ఆదేశం గా భావించి నా కర్తవ్యాన్ని నేర వేర్చాను .ఈ ప్రోగ్రాం వల్ల ఏంతో  మేలు చేకూరిందని వారు కలిసి నప్పుదలా చెప్పే వారు .ముఖ్యం గా నా ప్రసంగాలకు విద్యార్ధులు ఎంతో ఆసక్తి కణ పరిచారని .కళా శాల విద్యార్ధులు ఎన్నో పోటీలలో బహుమతులు పొద  టానికి దోహద పడ్డానని చెప్పే వారు .అది వారి సహృదయత  .అనే నేను భావించాను .ఇదీ ఈ వ్యాసానికి నేపధ్యం .

   మీ—గబ్బిట.దుర్గా ప్రసాద్ —28-5-12.—కాంప్—అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు

  నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు

    ఇటలి  నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు  రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను నియమించాడు .రోమన్ ఎక్స్ప్రెస్ ఒక సారి పద్నాలుగు నిమిషాలు ఆలస్యం గా చేర్చి నందుకు డ్రైవర్ ను వెంటనే తొలగించాడు ..రైల్వే లలో దోపిడీలు ,దౌర్జన్యాలను అరి కట్ట టానికి స్పెషల్ రైల్వే పోర్స్ శాఖ ను ఏర్పాటు చేశాడు .అధికార గణం అనే చేంబర్ కాదు ప్రజల్ని పాలించేది ప్రభుత్వమే ప్రజల్ని పరి పాలిస్తుందని ప్రజలకు తెలియ జెప్పాడు .ప్రజా పాలన చేయటం ప్రారంభించాడు .1922 నవంబర్ పదహారున ప్రధానిగా బాధ్యతలు చేబట్టాడు .1926 అధికారాలనాన్ని హస్తగతం చేసుకొని అధికార కేంద్రం గా ,నియంత గా మారాడు .

   అతని పార్టి ఫాసిస్ట్ పార్టి .ఫాసిస్ట్ ఇటలి ని గ్రేట్ పవర్స్ లో ఒకటి గా చేయాలన్నదే ముసోలిని మనోగతం ..ప్రజలందరికి ‘’ఐడెంటిటి కార్డ్ లు ‘’ఇచ్చిన ఘనత ముస్సోలినీదే .1930 లో వచ్చిన ప్రపంచ వ్యాప్త డిప్రెషన్ నుండి ఇటలీని ఒడ్డుకు చేర్చేందుకు ,సంక్షోభ నివారణకు  the battle of the lire ‘’కార్యక్రమాన్ని చె బట్టాడు .లైర్అనేది ఇటాలి నాణెం .దీనితో ఇటలి లీరా విలువ తగ్గ కుండా కాపాడాడు ..వస్తువుల ధరలను తగ్గించాడు .సబ్సిడీలను పెంచాడు .అందువల్ల మద్య ,పేద తరగతుల వారు బతికే అవకాశం బాగా కలిగింది .ముసోలిని పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగింది .

            ఆర్ధిక సంక్షోభం దిగుమతులపై ప్రభావం చూపిస్తుంది .దీనికి విరుగుడు గా ‘’the battle of wheat ‘’కార్యక్రమం మొదలు పెట్టాడు .అధికోత్పత్తి దీని ధ్యేయం .తాను కూడా రైతు వేషం వేసుకొని పోలాల లోకి వెళ్లి రైతుల్ని ప్రోత్సహించి కష్ట  పడి పని చేయించి దిగుబడి అధికం చేయించాడు .దున్నాడు ,విత్తనం వేశాడు కోతలు కూడా కోశాడు .ప్రపంచం అంతా ఆర్ధిక సంక్షోభం లో కొట్టు మిట్టాడు తుంటే ఇటలి ప్రజలు హాయిగా నిమ్మకు నీరెత్తి నట్లు ఉన్నారు .పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండాయి .ప్రపంచ దేశా లన్నీ ఇటలి వైపు కు ఆశ్చర్యం గా చూశాయి .ఈ గోధుమ యుద్ధం అత్యంత విజయ వంతమయింది .1933నాటికి దిగుమతులు రెండు లక్షల ఇరవై  వేలనుండి  ఒక్క సారిగా పదిహేను వందల టన్నులకు చేరింది .ఇంత గొప్ప మార్పు ఆ కాలం లో యే దేశం లోను రాలేదు .ఇటలీ హీరో అయాడు ముసోలిని .

           చిత్తడి నే లలు ఎందుకు పనికి రాకుండా ఉండేవి .వాటికి నీటి సౌకర్యం కల్గించాడు .తొమ్మిది మిలియన్ల ఎకరాలను అదనం గా సాగు లోకి తెచ్చిన ఘనత ముస్సోలినిదే .రొమ్ కు తెర్రసినామధ్య ఉన్న మలేరియా వ్యాధి విపరీతం గా వ్యాపించి ఉండే ఒక లక్ష యాభై వేల ఎకరాల చిత్తడి నే లల్ని పంట పొలాలుగా మార్చి మలేరియా ను నిర్మూలించట మే కాక ,సాగు భూమి విస్తీర్ణాన్ని పెంచటం సాహసో పెత మైన చర్య .వాటిల్లో దేశం మొత్తం మీద ఉన్న దేబ్భై వేల  కుటుంబాలకు నివాసం కల్పించాడు .ఆరు కొత్త పట్టణాలను నిర్మించాడు ‘’.il duce’’అంటే ‘’మహానాయకుడు’’అని పించు కొన్నాడు .

     ఇటాలి జనాభా పెంచాలి అనే ఉద్దేశ్యం తో ‘’battle of the people ‘’ అనే జనాభా పెంచే కార్య క్రమం చేబట్టాడు .ఇటాలి జనాభాను నాలుగు కోట్ల నుండి ఆరు కోట్లకు పెంచగాలిగాడు ..ఇలా చేస్తే తప్ప పురాతన రోమన్ సామ్రాజ్యానికి ఉన్న ఘనత సాధించలేమని అతని ఉద్దేశ్యం .అదే అతని కల కూడా .ఉన్న జనం లో సగమైనా పెరగాలని భావించాడు .ఖచ్చితం గా అలానే జరిగింది .మహిళలకు పిల్లల్ని కన  టానికి ప్రోత్సాహాలు ఇచ్చాడు .పెళ్లి చేసుకొని బ్రహ్మ చారులకు పన్ను విధించాడు .ఎక్కువ సంతానం కన్నా సంతాన లక్ష్ములు కు బహుమతులు అంద జేశాడు .93 మంది మహిళలు 1300 మంది పిల్లల్ని కన్నారు .వారందరినీ పిలిచి ఘన సత్కారం చేశాడు .ఆరోగ్యం ,మాత్రు సంరక్షణ ,పసి పిల్లల మరణాలను తగ్గించటం వంటి ఎన్నో పనులు చేశాడు ..దీనికి కొంత రాజకీయ కారణం కూడా ఉంది .ఇటాలి లో రాజ కీయ సంక్షోభం పెరిగి జనం ఇతర దేశాలకు వలస పోవటం జరిగింది .

            అమెరికా ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ,ఇంగ్లాండ్ ప్రధాని చామర్లేన్ ,లు ముసోలిని అంటే వీర అభిమానం పెంచు కొన్నారు .గాంధీ మహాత్ముడు ముసోలిని ని ‘’సూపర్ మాన్  ‘’అన్నాడు .కాంటర్ బేరి చర్చి ఆర్చి బిషప్ ‘’యూరపు లీడర్ల లో ముసోలిని అత్యున్నతుడు ‘’అన్నాడు .greatest genius of modern times ‘  ’ అన్నాడు థామస్ ఎడిసన్ ‘అన్నిటా చితికి పోయిన ఇటాలి దేశాన్ని పేదరికం నుండి ఒద్దే క్కించిన మహానాయకుడు అన్నాడు అమెరికన్ బాంకర్ ఆటో కాం.. ‘’చర్చిల్ కు  ముసోలిని ముందు  చుట్ట కాల్చే  ధైర్యం లేక పోయింది .అతను ముసోలిని సంతకం చేసిన ఫోటో తనకు ఇమ్మని కోరితే తిరస్కరించాడు ముసోలిని .హిట్లర్ కు ముసోలిని అంటే వీరాభి మానం .ముసోలిని తనకు దేశ విదేశాలనుండి రెండు మిలియన్ల ప్రజలు ఉత్తరాలు రాస్తే అందరికి సమాధానం రాసి హృదయాలను గెల్చు కొన్నాడు .ప్రపంచం మొత్తం మీద35 వేళ గ్రీటింగ్ కార్డులను క్రిస్మస్ పండుగ రోజు అందు కొన్న ఏకైక నాయకుడని పించు కొన్నాడు .1920-30 కాలం లో ప్రపంచం మొత్తం మీద ‘’సర్వోత్తమ నాయకుడు’’ అని పించు కొన్నాడు ముసోలిని .

                          వెనిస్ ను దేశం ప్రధాన వాహిని కి కలిపే బృహత్తర కృషి చేశాడు .నాలుగు వేళ మైళ్ళ రోడ్ల నిర్మాణం చేశాడు .అనేక ఆక్విడేక్ట్ లు కట్టించాడు .అపూలియా భూములకు నీటి పారుదల సౌకర్యం కల్పించాడు ..నాలుగు వందల బ్రిడ్జి లను నిర్మింప జేశాడు .సకాలం లో రైళ్ళు నడిచే టట్లు చేశాడు .టెలిఫోన్ వ్యవస్థను ఆధునీ కరణం చేశాడు .పోస్టాఫీసులు ,గవర్న మెంట్ ఆఫీసులకు లెక్కే లేదు .అయిదేళ్ళలో రోమన్ సామ్రాజ్యం ‘’marvel  to nations of the world ‘’అవాలని ముసోలిని ధృఢ వాంచ.అదే అతని నినాదం .పూర్వపు ఆగస్టస్ సామ్రాజ్యం లా అతి విశాల ,క్రమశిక్షణ గల శక్తి వంత మైన సామ్రాజ్య నిర్మాణమే తన ధ్యేయం అని పదే పదే  ముసోలిని చెప్పే వాడు .ప్రజలను జాగృతం చేసి ప్రేరణ కల్గించే వాడు .దీని కోసం తనకు సర్వాధి కారాలు కావాలను కొన్నాడు .పొందాడు .దాని తర్వాతే ఇటలీ పునర్నిర్మాణం ప్రారంభించి విజయం సాధించాడు

        ముసోలిని కి ముందున్న పార్ల మెంట రి ప్రభుత్వం మాఫియా గ్రూపులను అదుపు లో పెట్ట లేక పోయింది .ముసోలిని కాలం లో హత్యలు 278 నుండి కేవలం ఇరవై అయిదు కు తగ్గాయి అంటే ఎంత కఠినం గా రౌడీ షీటర్ల విషయం లో వ్యవహరించాడో తెలుస్తోంది .ముసోలిని తర్వాతా మళ్ళీ ఎవరు వాళ్ళను నియంత్రించ లేక పోవటం వల్ల మాఫియా గాంగ్ చేల రేగి పోయింది .1వేల ప్రభుత్వ ప్రాధమిక విద్యాలయాలు నేల కోల్పాడు ముసోలిని .నగరాలలో ని పిల్లలకు ‘’సమ్మర్ కాంప్ పు ‘’లు ఏర్పాటు చేశాడు . 1930 నాటికి ఇటాలి ప్రజలు అత్యంత సంపన్నులయారు .ఇరవై వ శతాబ్దం లో ఇటాలి ప్రజల జీవితం అన్ని విధాల మెరుగైంది .ఆ కాలాన్ని ‘’the halcyon years ‘’ అంటే మన భాష లో స్వర్ణ యుగం అని ప్రపంచం  అంతా భావించింది .

        పార్లమెంటరి సాంప్రదాయం లేక పోయేసరికి ,ఏక వ్యక్తీ పాలన రావటం వల్ల హింసా కాండ తగ్గ్గింది .ముసోలిని ప్రపంచ ప్రసిద్ధ రాజ కీయ వేత్తగా ప్రశంసలు పొందాడు .ఇతర దేశాల నుండి నాయకులు ఇటలీ వచ్చి ,ఇక్కడి అభి వృద్ధి చూసి మెచ్చు కొన్నారు .కాని ముసోలిని యే ఇతర దేశాన్ని ఇంత వరకు సందర్శించక పోవటం ఆశ్చర్యం .mussolini  does not want advice-he only wants applause  ‘’అని ఒక అందర్ సెక్రెటరి అన్నది .అదీ ముస్సోలిని అంటే .ముసోలిని మహా వేగం గా కారు నడపటం అంటే ఇష్టం .ఆ నాడు ప్రతి స్కూల్ లో ప్రతి క్లాస్ రూం లో ముస్సోలిని ఫోటో లున్దేవి .ఉదయం జరిగే స్కూల్ ప్రార్ధన లో ముందు ముసోలిని ,ఆ తర్వాతే జీసస్ ప్రార్ధన పిల్లలు చేసే వారట .

   ఇంత గొప్ప ప్రజా పాలకుడు అయిన ముసోలిని రెండవ ప్రపంచ యుద్ధం లో అనవసరం గా ఇటలి ని యుద్ధం లో దూర్చి ఓడి పోయి ప్రజా పరాభవం పొంది ,నిర్దాక్షిణ్యం గా కొత్త గా అధికారం లోకి వచ్చిన సోషలిస్టుల చేత కాల్చి చంప బడటం విధి లీల.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-5-12.   కాంప్—అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

మేము ఉంటున్న నార్త్ కెరొలిన

మేము ఉంటున్న నార్త్ కెరొలిన

     క్రీ.శ..200 లో ఇక్కడ ఇటుకలు మట్టి బొమ్మలు  తయారు చేసేవారు .వాటి ని ఉత్సవాలకు వాడే వారు .క్రీ.శ. 1000 లో పు రాతన మిసిసిపి సంస్కృతీ ఇక్కడికి వచ్చింది .పెద్ద నగరాల నిర్మాణం జరిగింది .వ్యాపారవాణిజ్యాలు బాగా ఉండేవి .ఇక్కడి ఆదిమ జాతులు carolino .angloquian , భాషలు మాట్లాడే చౌనోక్ ,రోనోక్ మొదలైన జాతుల వాళ్ళు .వీరిని మొదటిసారిగా బ్రిటిషర్లు ఎదిరించారు .ఇక్కడికి వచ్చిన మొదటి యురోపియన్లలో ఇంగ్లీష వారే ప్రధములు .1580 లో సర వాల్టర్ రాలీ ఇక్కడ రెండు సెటిల్మెంట్లు ఏర్పాటు చేశాడు .తరువాత వాళ్ల కాలనీలు ఏమయ్యాయో మిస్టరీ .1640 లో వర్జీనియా నుంచి ఆంగ్లేయులు ఇక్కడికి వలస వచ్చారు .1663బ్రిటన్ రాజు ఇక్కడ కారోలీనా కాలనీ ఏర్పాటుకు అంగీక రించాడు .

             పద్దెనిమిదవ శతాబ్దానికి ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి .1765 లో బ్రిటిషవాళ్ల అధిక పన్నులకు ,పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేక పోవటానికి నిరసన ప్రారంభ మైంది .అమెరికా విప్లవం లో ఇది దేశ భక్తీ ప్రాంతం అయింది .దీని ఫలితం గా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందే అవకాశం ఇక్కడి డెలిగేట్ల కు లభించింది .కాని బ్రిటీష వారి భక్తులు కొందరు దాన్ని అమలు కాకుండా అడ్డు పుల్ల  వేశారు .

         19 వ శతాబ్డం  ప్రారంభం లో ఇది రూరల్ స్టేట్ గా ఉంది .సిటీలు లేవు .కొన్ని పల్లెలు మాత్రమే ఉన్నాయి .బానిసల సాయం తో  పత్తి బాగా పండించే వారు .పత్తికి అనువైన భూమి ఎక్కువ ఉంది .ప్రజాస్వామ్య భావాలు మొదటి నుంచి ఎక్కువ గా ఉన్న రాష్ట్రం .బానిసలపై కూడా దయా దాక్షిణ్యం చూపించే వారు .దక్షణాది వారు యునియన్ నుంచి విడి పోదామని ప్రయత్నిస్తే వీళ్ళు అంతగా సహకరించలేదు .ఇక్కడి ఎన్నికల్లో తూర్పు ప్రాంతం డెమోక్రాట్లకు ,పడమటి ప్రాంతం విగ్గు లకు తీవ్ర పోటీ ఉండేది .1861ఏప్రిల్ లో ఫోర్ట్ సెంటర్ లో కాల్పులు జరిగాయి .యూనియన్ నుంచి నార్త్ కెరొలిన విడి పోయింది .కాన్ఫెడరేషన్ లో చేరింది .అమెరికన్ సివిల్ వార లో వేర్పాటు వాదులకు మద్దతు నిచ్చిందీ రాష్ట్రం .రి కన్స్ట్రక్షన్ కాలం లో బానిస విమోచన జరిగింది .1950-60 మధ్య జరిగిన సివిల్ రైట్స్ ఉద్యమం లో ఈ రాష్ట్రానికి పెద్ద పాత్ర ఉంది .’’సిట్ ఇన్ ప్రొటెస్ట్ ‘’ను గ్రీన్ బరో సిటి లో నిర్వహించాడు మార్టిన్ లూధర్ కింగ్ .ఇది ఉద్యమ కేంద్రమే అయింది .’’student non violent co-ordination committee ‘’ ఇక్కడే అంటే రాలీ లో sha university’ లో  ఏర్పడింది .1973 లో రాలీ మేయర్ గా క్లారంస్ లైటనేర్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికైనాడు .నార్త్ కరోలీన రాజ దాని రాలీ ..పెద్ద నగరం మాత్రం శార్లేట్

     ఇక్కడ అపలేచియన్ పర్వతాలున్నాయి .తీరప్రాంతాలు ,పంట భూములు ఉన్నాయి .పొగాకు పంటలో అమెరికా లో మొదటి స్తానం .అలాగే చిలగడ దుంప కూడా అత్యధికం గా పండుతు నంబర్ వన్ స్తానం పొందింది  క్రిస్మస్ ట్రీలు  అంటే పైన చెట్లకు రెండో స్తానం .కుకుంబర్ అంటే దోస పంట  కు మూడో స్థానం .స్త్రా బెర్రి ,ప్రత్తి పంటకు నాలుగో స్తానం .సోయా బీన్స్ ,మొక్క జొన్న ,గోధుమ ,వేరుసెనగ ,బ్లూ  బెర్రిస్ , బంగాళా దుంప ,టమేటో మొదలైన పంటలు పండే రాష్ట్రం .

  కోళ్ళు ,ట ర్కీలు ,పందుల పెంపకం ఎక్కువ .బ్రాయిలర్ కోళ్ళకు మొదటి స్థానం .అలాగే ఆపిల్స్ కు కూడాపీచు లు ,పశు పెంపకం హాగ్ పెంపకము ఎక్కువే .

              వస్త్ర పరిశ్రమ ,సిగరెట్లు ,టొబాకో లకు నంబర్ వన్ .పందుల పెంపకం లో రెండో స్తానం .సిన్తేతిక్ ఫైబర్ ,ఫార్మా స్యూటి కల్స్ ,కు ఇది కేంద్రం .కంప్యుటర్ ,ఎలక్ట్రానిక్ వస్తువులు ,కమ్యునికేషన్ సామగ్రి ఉత్పత్తికి జాతీయం గా మూడో స్తానం లో నార్త్ కెరొలినా ఉంది .

నార్త్ కెరొలినా లో గ్రానైట్ గనులు అపారం గా ఉన్నాయి .సున్నపు రాయి నిక్షేపాలు అధికమే .ఫాస్ఫాల్తిక్ రాక్ ,లిదియం గనులున్నాయి .మైకో ,మార్బుల్ లకు కేంద్రమైంది .

 బ్లుక్రాబ్స్ ,ష్రిమ్ప్ చేపలకు ప్రసిద్ధి ,ఆక్వా కల్చర్ ఉంది .కాట్  ఫిష్ ఇక్కడి ప్రత్యేకత .

 నార్త్ కెరొలినా కు ‘’ .the tar hill state ‘’,’’turpentine state ‘’ అని మారు పేర్లున్నాయి .

                                                                  charlotte (షార్లేట్ )

     అమెరికా లో ఛ ను షా గా పలకటం ఫాషన్ .చికాగో ను  షికాగో అంటారు .చార్లేట్ ను షార్లేట్ అంటారు .ఇది ఈ రాష్ట్రం లో పెద్ద సిటి ..మెక్లీన్ బర్ఘ్ కౌంటి దీని దగ్గరే ఉంది .పదిహేడవ పెద్ద నగరం .న్యూయార్క్ తర్వాత ఇక్కడే బాంకింగ్ ఎక్కువ గా జరుఫు తుంది .మూడు ప్రధాన బంకులకు కేంద్రం శార్లేట్ .charles macklien burgh అనే బ్రిటీష రాజు మూడవ జార్జి భార్య పేరు మీద ఈ సిటి ఎర్పడింది .అమెరికన్ రివల్యుషనరి వార్ కు కేంద్రం గా నిలిచింది .జనరల్ కారన్ వాలీస్ ను తరిమి కొట్టిన ప్రాంతం .hornest nest అని దీనికి నిక్ నేం.తూర్పున catawba,ఆగ్నేయం లో లేక నార్మన్ సరస్సు ఉన్నాయి .ఇది మాన వ నిర్మిత అతి పెద్ద మంచినీటి సరస్సు .

  షార్లేట్ డెమొక్రాటిక్ పార్టీకి  మెజారిటీ అభిమానం ఉన్న సిటి .ఇంతవరకు యే ప్రెసిడెంట్ ఎన్నికలకు అభ్యర్ధిని నిర్ణయించే సమావేశం ఇక్కడ జరగలేదు .ఈ సంవత్సరం సెప్టెంబర్ లో డెమొక్రాటిక్ అభ్యర్ధిని ప్రకటించే పెద్ద సదస్సు షార్లేట్ లో జరుగ బోతోంది .చరిత్రను సృష్టిస్తుంది .

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-5-12.కాంప్ –అమెరికా .

Posted in అమెరికా లో | Tagged | 2 Comments

ఆడదై పుట్టటమే నేరమైంది

 ఆడదై పుట్టటమే నేరమైంది

    ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి  బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య గావింప బడ్డ మొదటి మహిళా  హిపాటియా.

          హిపాటియా తండ్రి తియాన్ .ఆయన అలెగ్జాండ్రియా  లోని అతి పెద్ద మ్యూజియం లో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు .అది గ్రీకు మేధావులకు గొప్ప కేంద్రం .సాంస్కృతిక కేంద్రం కూడా .మేధావులైన విద్యా వేత్తలకు నిలయం .తియాన్ ను అత్యంత సమర్ధుడైన వేదాంతి గా ఆ కాలం లో భావించే వారు .మ్యుజియం అధికార సంఘం లో సభ్యుడు .ఖగోళం ,జామెట్రీ ,సంగీతం ,పై గొప్ప పరిశోధనలు చేసి వ్యాఖ్యానాలు రాశాడు ‘’.టా లమీ టాబ్లెట్స్’’ పై వ్యాఖ్యానానికి పెట్టింది పేరు .యూక్లిడ్ మూల సిద్ధాంతాలను బోధించే వాడు .బైజానటనులు     న్లు కూడా అతని మార్గదర్శకత్వం లో నడిచే వారు .అంత మంచి పేరున్న వాడు ‘’.కాస్మిక్ కే యాస్’’ పై కవిత రాశాడు ‘’టా లమీ ప్రపంచం’’ పై కూడా వ్యాఖ్యానం రాసి మెప్పు పొందాడు .ఆయన్ను  గొప్ప ఖగోళ శాస్త్ర వేత్తగా మజీశియన్ గా  చరిత్ర పేర్కొంది .

              అలాంటి గొప్ప తండ్రికి కి    హిపాటియా .క్రీ.శ..355 లో గొప్ప కుమార్తె గా  జన్మించింది .తండ్రి వద్దే విద్యనూ నేర్చింది .కొద్ది కాలం లోనే తండ్రిని మించిన కూతురు అని పించు కొంది .ద యా ఫాన్దిస్ రాసిన ‘’అరిత్ మాటి కా ‘’పై మంచి వ్యాఖ్యానం రాసి సెబాస్ అని పించు కొంది .అలాగే అపోలినయాస్ రాసిన ‘’కొనిక్స్ ‘’పైనా రాసింది .తండ్రి మొదలు పెట్టిన ‘’అలమాజిస్ట్ ‘’పుస్తకాన్ని సంపూర్ణం గా రాసి ప్రశంశలను పొందింది .ఇతర నగరాల లోని మేధావి వర్గం తో  నిరంతరం సంప్ర దింపులు జరిపేది .ఆమె అలెగ్జాండ్రియా  మ్యుజియం లో నియో ప్లతానిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ  లో ప్రొఫెసర్ గా క్రీ.శ.400లో   పని చేసింది .ఖగోళం ,గణితం ,గ్రహాల కదలిక పై పుస్తకాలు రాసి పేరు తెచ్చు కొంది .ఆమె క్లాస్ లో కూర్చొని ఆమె బోధన వినాలని చాలా మంది విద్యార్ధులు ఆమె ను వేడు కొనే వారు .సామ్రాజ్యం లో చాలా ప్రదేశాల నుంచి విద్యార్ధులు వచ్చి అక్కడ చదివే వారు .రాజకీయం గా కూడా మంచి పలుకు బడి ఉండేది ..ఆమె పై ప్లాటో ,ప్లోటి నస్ ప్రభావం ఎక్కువ గా ఉండేది .నిసియా అనే ఆమె స్నేహితుడు తాను రాసిన ‘’ఆన్ డ్రీమ్స్ ‘’పుస్తకాన్ని ఈమెకు పంపి అభిప్రాయం కోరాడు .ఆ సబ్జెక్ట్ లో ఆమెకే తగిన పాండిత్యం ఉందని అతని నమ్మకం .ప్లూటా ర్క్ కూడా ఆమె కు సహాధ్యాయి .సాధారణ స్త్రీలు ఆ రోజుల్లో కట్టు కొనే సాంప్రదాయ దుస్తులను ధరించేది కాదు .ఉపాధ్యాయులు వేసుకొనే బట్టలనే ధరించి బోధించేది .తన రధాన్ని తానే నడుపు కొనేది .

             ఆమె శాస్త్ర వేత్త కూడా .plane astrolobe ,graaduated glaas hydrometer ,hydroscope లను నిర్మించింది .

          హిపాటియా   క్రిస్టియన్ కాదు .ఆ నాటి బిషప్ ‘’సిరిల్’’యూదులను   తరిమి వేస్తుండే వాడు .దీన్ని ఆమె ,ఆమె తో  పాటు అలేగ్జాన్ద్రియా  గవర్నర్ ‘’ఒరేస్తేస్ ‘’కూడా వ్యతిరేకించాడు .అతను కూడా ఈమె లాగే నాన్ క్రిస్టియన్ (పాగాన్ ).ఇవన్నీ బిషప్ కు నచ్చలేదు .ద్వేషం టో గవర్నర్ ఆరేస్తాస్ ను చంపించాడు .హిపాటియా మగ వారి లా దుస్తులు ధరించటం ,లెక్కలు బోధించటం ,సైన్స్ ప్రయోగాలు చేయటం బిషప్ సిరిల్ సహించ లేక పోయాడు .అతని లో అసూయ నర నరానా  వ్యాపించి పోయింది ,.వివేకం కోల్పోయాడు .ఆమె హద్దు మీరి ప్రవర్తిస్తోందని అందరి వద్దా వాపోయే వాడు .ఎవరు అతన్ని పట్టించు కోలేదు .దుష్ట పన్నాగం పన్నాడు .

      క్రీ.శ. 415లో బిషప్ సిరిల్  పీటర్ అనే కిరాతక అనుచరుడిని ఈమెను చంపటానికి ఏర్పాటు చేశాడు .హిపాటి స్ క్లాస్ లో గణితం బోధిస్తుండగా ,కిరాయి మూక క్లాస్ లోకి ప్రవేశించి ,వివస్త్ర ను చేసి ,మంత్ర గత్తే  అని నింద మోపి ,’’సేసారియన్ చర్చి ‘’ ‘’వరకూ ఈడ్చుకొని వెళ్లారు ..ఆమె సహాయం కోసం ఎంత అరిచినా ప్రయోజనం లేక పోయింది .ఎవరూ ముందుకు రాలేదు .మూగ రోదనే అయింది .అందరు చూస్తుండగా ఆమె కళ్ళు పీకేశారు .నాలుక కోసే శారు .ఆమె విల విల లాడుతూ చని పోతుంటే రాక్షసం గా నవ్వారు .చని పోగానే అక్కసు ఇంకా తీరక ఆమె శవాన్ని ‘’సినారాస్ ‘’అనే చోటికి తీసుకొని వెళ్లి ముక్కలు ముక్కలుగా నరికారు ఆ నరరూప రాక్షసులు .అయినా వారికి తృప్తి కలగ లేదు .ఆమె శరీరం లోపలి భాగాలన్నీ  ,ఎముకల తో  సహా బయటికి తీసి ,వాటినీ, ఆమెను తగుల బెట్టారు .అంటే, ఆమె ఆడది అని గుర్తింపు నిచ్చే దేన్నీ వాళ్ళు మిగలకుండా తగల బెట్టారు .ఇలా ఒక మహిళా  శాస్త్ర వేత్త హత్య గావిమ్పబడం చరిత్ర లో ఇదే మొదటిది అని చరిత్ర కారులు పేర్కొన్నారు .’’తియోఫిలాస్ ‘’అనే చారిత్రకుడు రాసిన ‘’లైఫ్ ఆఫ్ ఇంసై డోర్‘’’’అనే పుస్తకం లో సిరిల్ చాలా అసూయతో హిహిపాటి యా వల్ల క్రిస్టియన్ మతానికి ఏదో ఉపద్రవంక లుగు తుందని ద్వేషం తో  ఒక శాస్త్ర విజ్ఞాని అయిన మహిళను చంపటం అతి కిరాతకం ‘’అని రాశాడు .

                క్రీ.శ.  642 లో ఆరబ్బులు అలెగ్జాండ్రియా ను వశం చేసుకొనే వరకు ‘’నియో ప్లటా నిక్ ‘’విద్య కొన సాగింది .ఆరబ్బులు అలెగ్జాండ్రియా లోని అతి గొప్ప మ్యుజియం గా ఉన్న లైబ్రరీ ని తగుల బెట్టారు .లక్షలాది పుస్తకాలు ద్వంసమయ యి .అందులో హిపాటియా రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి .అయితే ఆమె గురించి ఆమె శిష్యులు ,స్నేహితులు చెప్పిన రాసిన  దాన్ని బట్టే ఆమే చరిత్ర కొంత తెలిసింది .ఇంతకీహిపాటియా చేసిన నేరం- ఆడదిగా  పుట్టటమే .

      గబ్బిట దుర్గా ప్రసాద్ —24-5-12—కాంప్—శార్లేట్ –నార్త్ కెరొలినా –యు.ఎస్.యే.

Posted in రచనలు | Tagged | 4 Comments

సంస్కృతి అంటే ?

        సంస్కృతి అంటే ?

        సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా ,సంస్కృతీ విహీనులు గా భావింప బడటం లోక రివాజు .సంస్కృతీ పై మంచి అవగాహన కలిగి ఉండాలి .సామాజికం గా ఐక్యతా ఉండాలి .ఈ రెండు ఉంటె దేశ ఐక్యత సాధ్యం .సమాజం లో ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాల వల్ల కలిగేది సంస్కృతి .దీనికోసం నిరంతరం చర్చలు జరుగు తూనే  ఉంటాయి .ఈ చర్చల మొత్తం సారాంశమే సంస్కృతి .నాగరకత నుంచి వచ్చేది విద్య .ప్రతి జాతికి ,దేశానికి సంబంధించిన సంస్కృతి ఉంటుంది .

                   సంస్కృతీ ని అనేకులు అనేక రకాలుగా నిర్వ చించ టానికి ప్రయత్నించారు .అంత తేలికగా నిర్వ చింప బడని పదం .’’ఎవరైతే ,తన ప్రవర్తన లో నాగరకత  చూపిస్తారో ,వారు సంస్కతి  ఉన్న వ్యక్తులు ;;అంటారు .ఇంకొంచెం ఆలోచిస్తే ,’’ఒక నియమిత సమాజం లో ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి ‘’అన వచ్చు .రాతి కాలం నుండి నేటి వరకు మనిషి సుఖం గా ,ఆనందం గా ఉండటానికి ,సంతృప్తి గల జీవనాన్ని ఇచ్చేదీ సంస్కృతి ..చట్టానికి లోబడి ,మానవ ప్రశాంత జీవ నానికి ,సామాజిక ప్రవర్తనకు ,పొందిన జ్ఞానం తో ,పెరిగే విలువలు ,ప్రమాణాలతో జీవనం సాగించట మే సంస్కృతి .సంస్కృతీ టో పాటు ,నాగరకత పదమూ అవినా భావ సంబంధం కలిగి ఉంది .ఒక్కో సారి ఒక దాని కొకటి కలిపి వాడుతూ ఉంటాం .నాగరకత అనేది –సంస్కృతీ కి ఉన్న బాహ్య రూపం .అంటే –మనం ఉపయోగించే వస్తువులు ,యంత్రాలు వగైరా .ఆంతరిక మైనది సంస్కృతీ .నాగరకత శరీరం అయితే ,సంస్కృతీ ఆత్మ .నాగరకత అనేది సంస్కృతీ లో ని భౌతిక పార్శ్వం ..లేదా భౌతిక సంస్కృతి .సామాజిక జీవన వ్యవస్థలు ,కట్టు బాట్లు ,ఆచారాలు ,విలువలు ,కళలు ,సాహిత్యం ,,సంగీతం ,సమాజం లోని వ్యక్తుల పరస్పర చర్యలు ,సంబంధాలలో పొందే  అభి వృద్ధి వీటన్నిటిని కలిపి ‘’అభౌతిక సంస్కృతీ ‘’అంటారు .ఈ పార్శ్వాన్నే విస్త్రుతార్ధం లో సంస్కృతీ అంటాం .అంటే సంస్కృతికి ,భౌతిక ,అభౌతిక పార్శ్వాలున్నట్లు గా తెలుస్తోంది ..మనుష్యులు దేన్నీ కలిగి ఉన్నారో అది నాగరకత అని ,మనుష్యులు అంటే ఏమిటో చెప్పేది సంస్కృతీ అని ‘’మకైవార్ ‘’అనే విశ్లేషకుడు సూక్ష్మం గా చెప్పాడు .భౌతిక సంస్కృతీ తేలి కగా మారి పోతుంది .అభౌతి కం అంత తేలిగ్గా మారదు .

                                                సంస్కృతీ లక్షణాలేమిటి

    ఏయే లక్షణాలు ఉంటె సంస్కృతీ అనాలి ?సమాజం లో ని వ్యక్తుల ప్రవర్తనా ఫలితం గా ఏర్పడిందే సంస్కృతీ .అంటే సంస్కృతీ సమాజ ఫలితం గా ఏర్పడు తుంది .సంస్కృతి  మానవ నిర్మిత మైనదే .అందుకే మనిషి ,అతను చేసే పనులే సంస్కృతీ అన్నారు .కొత్త తరం వారికి అవసర మైనవన్నీ అందించేది సంస్కృతి . .సంస్కృతీ పరిణామ శీలం కలిగి ఉంటుంది .సమాజ అవసరాలను బట్టి మారుతుంది .సంస్కృతి అభ్యాసనం   వల్ల అంటే నేర్చు కోవటం వల్ల ఏర్పడుతుంది .భాషా ,కళలు మొదలైనవి నేర్చు కొంటె నే వస్తాయి .తనకు అవసర మైన హోదా,గౌరవం ,తిండి ,బట్టలు ,పొంది సంతృప్తినిస్తుంది .అందుకే సంతృప్తి దాయక మైనదిగా సంస్కృతీ ని భావిస్తారు ..భిన్న సంస్కృతుల మధ్య ఆదాన ప్రదానాలుంటాయి .అనుకరణ అనేది ఆదరణ లకు నిలయమై పంచు కొ బడేది గా ఉంటుంది .నిరంతరం మారుతూ ఉండటం దాని లక్షణం ..ఆలోచన ,భావం అనేవి దాని లక్షణాలే కనుక సంస్కృతీ మారుతూ ,గతిశీలం గా ఉంటుంది .సంస్కతి  విస్తృతం గా పెరిగి పోతే ,విడి పోవటమూ జరుగు తుంది .ఒకే విధ మైన సంస్కృతీ ఉన్న వేర్వేరు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని సంస్కృతీ ఏర్పరుస్తుంది .అందుకని ,సంస్కృతి  భిన్న మైనా ,సమగ్రం గా ఉంటుంది .సంస్కృతీ సమాజం లోని పరి వార్తన ,సామాజిక ప్రమాణాలను,నియంత్రిస్తుంది .కనుక వ్యక్తులు విలువలను ఆచరణ లో పెట్టాలి

             సంస్కృతికి పునాది కుటుంబం .ఆర్ధిక స్తితి ,ప్రభుత్వం ,విద్య ,మతం అనే సంస్థలే .ప్రతి వ్యక్తీ పైనా అది కారం ,అనుమతుల ప్రభావం ,ఎక్కువగా ఉంటుంది .ఎవరి సంస్కృతీ వాళ్లకు గొప్పే .ఇతర సంస్కృతుల్ని కూడా ఆద  రించే ఉదార భావం అలవాడాలి .’’సంస్కృతీ బహుళత్వం ‘’అనే భావన ఈ రోజు విశ్వ వ్యాపితం గా ఉంది .తరాల మధ్య వ్యత్యాసం ఏర్పడు తుంది .కొన్ని అంశాలలో అభివృద్ధి బానే ఉంటె ,కొన్నిటి విషయాలలో నెమ్మది గా ఉంటుంది .దీన్నే ‘’సంస్కృతిక విలంబన ‘’(కల్చరల్ లాగ్ )అన్నారు విశ్లేషకులు .భిన్న సంస్క్రుతులున్న సమాజాలు కాని ,వ్యక్తులు కాని తారస పడ్డప్పుడు కలిగే ఫలితం ,ప్రభావం ‘’సాంస్కృతిక విఘాతం ‘’అంటారు .ఒత్తిడి వల్ల ఒకరి భావాలపై వేరొకరి భావం పడి ఘర్షణ కలుగు తుంది .

           హేబెర్ట్ స్పెన్సర్ ‘’సంస్క్రుతిభౌతికము కాదు ,అభౌతిక ము కాదు .ఈ రెంటికీ భిన్న మైన అర్ధాన్నిస్తుంది ‘’అన్నాడు .కనుక సంస్కృతీ ‘’సూపర్ ఆర్గానిక్ ‘’లక్షణం కలదని భావిస్తున్నారు .సంస్కృతీ ఆదర్శ ప్రాయ మైనదే .’’విసరణ (దిఫ్యూజన్ ) ద్వారా అది చొచ్చు కొని పోతుంది .అందుకే ఈ బాధ భరించ లేక ‘’అనుభవాల ప్రోగు ‘’అని సంస్కృతిని నిర్వ చించారు .ప్రస్తుతం ఉన్న విజ్ఞానాన్ని ,భవిష్యత్తు కు ఉపయోగ పడ టా న్ని ‘’కల్పన ‘’అన్నారు .కల్పన పెరిగితే ,విజ్ఞానం పెరుగు తుంది .ఆధునీ కరణ ,,సమాజ అవసరాల్లో ఒకటి .ఉన్న విషయాలను కనుక్కోవటం ఆవిష్కరణ .ఖండాలు కనుక్కోవటం మొదలైనవి ఆవిష్కరణలు (డిస్కవరి) అన్నారు .సర్దు బాటు కూడా ఒక భాగమే .రెండు సంస్కృతుల మధ్య ఫలదీకరణం జరిగి సంస్కృతీ శక్తిని ,జీవనాన్ని నిలబెట్టు కొంటుంది .ఒక సమూహం నుంచి వేరొక దానికి సాంస్కృతిక అంశాలు వ్యాప్తి చెందటమే సంస్కృతీకరణ .ఒక్కో సారి భిన్న సంస్కృతులు చాలా కాలం కలిసి ఉండటం వల్ల భేదాలు అంతరించి విలీనీ కరణం జరుగుతుంది అని దీని పై ఆలోచించిన జ్ఞానులు పరిశోధనా పూర్వకం గా తెలియ జేశారు .

             ‘’ఒక సమాజపు సాంస్కృతిక సాంప్రదాయాలను ,అది సంపాదించే ప్రక్రియను సంస్కృతీ స్వీకరణం గా వీరు నిర్వ చించారు .సంస్కృతిని సక్రమింప జేయటాన్ని  ,స్వీకరణ లేక’’ en culturation ‘’అంటారని దీని మీద సాధికారం గల mary godman ‘’అనే ఆయన చెప్పాడు .ఈ విధానమే భారతీయ సంస్కృతి  భిన్న దేశాలకు వ్యాపించటా నికి కారణం అయింది అని ఆయన సూటిగా నిష్కర్ష గా చెప్పాడు .

        మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ —24-5-12.-కాంప్—అమెరికా .

Posted in రచనలు | Tagged | 1 Comment

ట్రాయ్ పై కొత్త కోణం

    ట్రాయ్ పై కొత్త కోణం  

          ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్  పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం మొద లైనవి అసలు ఉండేవా /లేక హోమర్ కల్పించి రాశాడా /ఉంటె ఆ అమూల్య ధన రాసులేమైనాయి ?అసలు ట్రాయ్ నగరం కంచు యుగానికి చెందితే దాని అవసేషా లేక్కడ కన్పిస్తాయి?గ్రీకులు లక్ష మంది సైనికులతో వెయ్యి నౌకలతో  ట్రాయ్ మీద దండెత్తారని హోమర్ రాసింది ఎంత వరకు నిజం /అనే ప్రశ్నలు రెండు శతాబ్దాలుగా పరిశోధకులను వేధిస్తున్నాయి .వాటి పై సమగ్ర విశ్లేషణం చేయాలని చాలా మంది ప్రయత్నించారు .వారు ఇటీవలి కాలం వరకు కొత్త కోణం లో వెలిబుచ్చిన విశేషాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .ఆనాటి ట్రాయ్ నే నేడు టర్కీ అంటున్నారు

                    ట్రోజన్ వార్  అయిన నాల్గుగు వందల సంవత్సరాలకు హోమర్ రాశాడు గ్రీక్ పురాణాలను .హోమర్ రాసి అప్పుడే 2800సంవత్స రాలైంది ఒకప్పుడు బాబిలోనియా ప్రముఖ వర్తక కేంద్రం .ఇదే ఇవాల్టి ఇరాక్ .మధ్య ప్రాచ్యం లో గొప్ప సామ్రాజ్యం .రెండు వేళ ఏళ్లు వర్తకానినికి కేంద్రం గా ఉంది .ఆ నాడు మెసపొటేమియా అనే ప్రాంతం నుండి ట్రాయ్ కు చేరే వారు .మెసపొటేమియా అంటే రెండు నదుల మధ్య భూమి వర్తకానికి హిత్తిట్టేతెస్ మీదుగా వెళ్ళేవారు .ఈ జాతి వాళ్ళు రహస్యాలను బాగా జ్జాగ్రత్త  గ కాపాడే వారుగా ప్రసిద్ధి .ఇక్కడి దేవతలు బాబి లోనియా దేవతల కంటే భిన్నం గా ఉంటారు .’’ తుఫాను దేవత ‘’ను ఎక్కువగా పూజించే వారు .ఇక్కడి ప్రజల్ని విలూసా ప్రజలంటారు .అయితే వీరే  ట్రో జన్లు  అనే అభిప్రాయం కూడా ఉంది .విలూసా యే ట్రాయ్ అని .వైన్ డార్క్ సి అని హోమర్ పిలిచిన ఆజియాన్ సముద్రం లో మూడు వేళ ఏళ్ళ కిందటి సముద్రం లో మునిగి .లేక ముక్కలైన నావలు కని పించాయి .అందులో సారాయి నిలవ చేసే సా ధనాలు దొరికాయి .ఇవి గ్రీకులవి ,త్రోజన్లవి కావచ్చు .ఇద్దరు సారా సరసులే మర్మరా సముద్రం పక్కన ఉన్ననగరమెబాష్పోరస్ నే ఇస్తాంబుల్ అని ఇప్పుడు అంటున్నారు ..

          క్రీ.పూ.1627 లో పెద్ద అగ్ని పర్వతం బ్రద్దలైంది .అప్పుడు తెర అనే చోట కొన్నికుడ్య చిత్రాలు బయల్పడ్డాయి .అవి చెక్కు చెదర లేదు .అందులోని స్త్రీలు కంచు యుగానికి చెందిన వారు గా గుర్తించారు .ఇవాల్టి ఆధునిక దుస్తులు ఆనాడే ఆడవాళ్ళూ ధరించిన దాఖలాలు కని పించాయి .గ్రీకులకు చేపలు పట్టే పని ఎక్కువగా ఉండేదని అంటారు .’’hali carnassus అనే పట్టణం లో హోమర్ జన్మించి నట్లు భావన .అతడు క్రీ.ప్పూ.850 కాలం వాడు .వైన్ డార్క్ సి కి ఇరువైపులా గ్రీకుల పట్టనాలున్దేవి .ఆసియా మైనర్ లో వారికి కావాల్సిన ముడి పదార్దాలున్దేవి .వాటిని సాధించటమే ధ్యేయం గా ఉండే వారు .వాణిజ్య సామ్రాజ్యానికి ఆద్యులని పించుకొన్నారు .హిట్టితే సామ్రాజ్యం క్రీ.పూ.1150 కే కూలి పోయింది .క్రీ.పూ..480 లో అశేష సేనా వాహినితో పర్షియా నుంచి xerxes దండెత్తి వచ్చాడు .అతని చూపు ట్రాయ్ మీద పడింది .అక్కడ వెయ్యి నల్ల ఎద్దులను బలి ఇచ్చాడు .ఒకప్పుడు గ్రీకుల స్వాధీనం లో ఉన్న ట్రాయ్ ను వశ పరచుకొన్నాడు .అతని పేరుకు అర్ధమే ‘’రాజాది రాజు ‘’అని .అప్పుడు సముద్రాలు దాటటానికి పడవల బ్రిడ్జి లుండేవి .

                 ట్రాయ్ గురించి త్రావ్వాకాలు జరపాలనని Heinrich Schliemannఅనే పరిశోధకుడు వ్యాపారం లో డబ్బు బాగా సంపాదించి ,భార్య తో సహా  1873 లో హోమర్ రాసిన దాని ఆధారం గా ట్రాయ్ చేరి  హిస్సార్లిక్ అనే చోట తవ్వకం  మొదలు పెట్టాడు .అంతులేని ధన రాసులు కిరీటం బంగారు నగలు దొరికాయి .వాటిని జర్మని కి తరలించాడు .ఆ తర్వాతా అవి రష్యా చేరి సెయింట్ పీటర్ బర్ఘ్ మ్యూజియం కు చేరాయి .అతనికి అగమినన్ ముఖానికి తోడుక్కొనే బంగారు మాస్క్ దొరికింది మైసీనియా లో కూడా తవ్వకం సాగించి సమాదుల్ని కను గోన్నాడు ..ఆర్ధర్ ఇవాన్స్ అనే అతను క్రీట్ లో  చేసిన తవ్వకాలలో బాగా అలంకరించ బడిన ఒక గది  అందులో గోడలక రంగుల చిత్రాలు  వ్రాత ఫలకాలు కనిపించాయి .బెల్జేన్ అనే పరిశొధకునికి ట్రాయ్ లో  మట్టి ,రాతి ఫలకాలు లభించాయి .1963 లో ఎట్ట కేలకు బెల్జేన్ పురాతన ట్రాయ్ నగరాన్ని ,అందులోని సౌధాలను కనుక్కొన్నాడు .కోర్ఫ్మాన్ అనే పరిశోధకుడు కూడా తవ్వకాలు సాగించి కంచు యుగం నాటి ట్రాయ్ బెల్జిన్ కనుక్కొన్న దానికంటే పది హేను  రెట్లు పెద్దదిగా ఉంటుందని తేల్చాడు .అప్పుడు జనాభా ట్రాయ్ లో ఏడు వేల మంది మాత్రమే ఉండ వచ్చు నని ,హోమర్ కవి చెప్పి నట్లుగా లక్ష మంది గ్రీకులు ట్రాయ్ మీదకు  దండెత్తి వచ్చే  అవకాశం లేదని వెయ్యి నౌకలతో వచ్చారని చెప్పటం కూడా అతిశయోక్తి అని చెప్పాడు .కంచు యుగం లోని ట్రాయ్ పైన ఎనిమిది సార్లు నిర్మాణం జరిగి మొత్తం తొమ్మిది ట్రాయ్ నగరాలు భూమి లో ఉన్నాయని చెప్పారు అందరు .ప్రియాం రాజు సంపద అంతా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా రష్యా చేరింది .ఎలా చేరింది  అన్నది మిస్టరీ గానే ఉంది .

        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23-5-12.–కాంప్–అమెరికా
Posted in రచనలు | Tagged | 1 Comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )

                                                                  కదిరీ పతి –ఆయ్యల రాజు  నారాయణా మాత్యుడు

        కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్తతి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు ‘’.రంకును’’ చివరిదాకా వర్ణించి చెప్పి ,దాని జోలి కి వెళ్ళ వద్దని చివర్లో నీతి బోధించారు .అయితే ఆనాటి ఆచార వ్యవ హారాలు ,వృత్తులు ,వాటి విశేషాలు ,వేష భాషలు ఇందులో వర్ణించటం తో’’ క్రానలాజికల్ సమా చారాన్ని’’’’ ఇచ్చేవిగా ,అంటే సాంఘిక చరిత్రకు సంబంధించి నవి గా ప్రత్యేకించి వీటిని పేర్కొంటారు ‘’.కధా కావ్యాలను ‘’విజ్ఞాన సర్వస్వం ‘’గా మార్చి కొత్త దారి చూపించటం వీరి ప్రత్యేకత.’’అన్నారు కోవెల సంపత్కుమారాచార్యుల వారు .

                                                                        పిల్లల మర్రి పిన వీర భద్రుడు

            సరస్వతీ దేవి ని కావ్యారంభం లో స్తుతించి అనుగ్రహం పొందిన వాళ్ళే మన కవులంతా .కానీ ‘’వాణి నా రాణి’’అని మీసం మెలేసి ,రొమ్ము చర్చు కొని చెప్పిన వాడు పిన వీర భద్రుడు .ఇదే ఇతని కొత్తదోరణి.రాణి అంటే ‘’రాజ్ని‘’అనే అర్ధం కొందరు దీనికి చెప్పారు .మరీ అంత మోటుగా అంటాడా అని వారి సందేహం .’’వాణీ సహస్రం ‘’లో’’ రాణి’’అనే మాట ఉందట .అందుకే సరస్వతి దేవి తన’’సాహిత్య సామ్రాజ్ఞి ‘’ అన్నాడు అని భావించారు .ఆయన వాగ్దేవీ మంత్రో పాసకుడట .అందుకే అన గలిగాడు .ఆమె అనుగ్రహ ప్రసాదం లభించింది .తెలుగు లో మొదటి కవిత్రయం నన్నయ ,తిక్కన ,ఎర్రన –రెండవ త్రయం –జక్కన ,శ్రీ నాధుడు ,పిన వీర భద్రుడు .మూడవ కవి త్రయం పెద్దన ,రామ లింగడు ,రామ రాజ భూషణుడు అని గుంటూరు శేషేంద్ర శర్మ ఒక చక్కని విభజన చేశారు .పిన వీరన జైమిని భారతం ,శృంగార శాకుంతలం కూడా రాశాడు .సంస్కృతం ,తెలుగు పదాలతో పద్యాలను సవారీ చేయించాడు .మన్మోహనం గా పిల్లల మర్రి రచనలు హాయిగా మర్రి వృక్షపు నీడ లో సేద దీర్చి నట్లుంటాయి .

                                                                           జక్కన

    ‘’చక్కన నీవై దుష్య ము ,-చక్కన నీ కావ్య రచన చాతుర్యంబుల్ –చక్కన నీ  వాగ్వైఖరి –చక్కన నీ  వంశ మహిమ –జక్కన సుకవీ ‘’అని తనను తన విక్ర మార్క చరిత్ర కావ్యాన్ని అంకితం తీసు కొన్న సందర్భం లో ‘జన్నయ సిద్ధ మంత్రి ‘’ అన్నట్లుగా జక్కనే రాసుకొన్నాడు .’’వక్రత’’లేకుండా రుజుమార్గం లో కవిత చెప్పటం ఇతని ప్రత్యేకత .’’నవ ‘’అనే శబ్దం జక్కనకు చాలా ఇష్టం .అందుకే ‘’నవ శబ్దార్ధ రసాను బంధ పదవిన్యాస క్రియా లంకార శ్రవణా నంద కధా సుధా మయ ,మహా సారస్వతాంబోధి లో రసజ్ఞులు అవలీల గా విహరిస్తారు ‘’అని చెప్పాడు .ఆయనకు ప్రేరణ భారవి కవి చెప్పిన ‘’క్షణే క్షణే యన్నవతా ముపైతి ‘’అంటారు పండితులు .ఉపమా ,ఉత్ప్రేక్ష లతో కవిత్వాన్ని చాలా మంది కవులు అలంకరిస్తే ,స్వభావోక్తి కి పట్టం కట్టి  నవ్యత్వాన్ని నిరూపించాడు జక్కన ‘’ప్రతి పద్యం లోను ,ఏదో ఒక చోద్యం’’ ఉండాలని ఆరాట పడ్డాడు .‘’ఆ బాట పట్టాడు .తన ఆలోచన లోని నవ్యత ను తాను’’ సీస పద్యాన్ని సంస్కృతం లో రాసి ‘’మరీ చూపించాడు .అందుకే జక్కన కవిత చిక్క న ,చక్కన నవ్య భావనా విలసిత మైంది .

                                                                                    కొరవి గోపరాజు

                ‘’సింహాసన ద్వాత్రింశిక ‘’కధా కావ్యాన్ని రాసిన కొరవి గోప రాజు కవి ,పండితుడు,వీటికి మించి శాస్త్రజ్ఞుడు .నాట్యం ,శకునం ,కామం ,యోగం ,స్వప్నం మొదలైన శాస్త్రాలను లోతుగా అధ్యనం చేసి లోతు పాతు  లను తెలుసు కొన్న వాడు .శాస్త్ర సిద్ధాంతాలను సమర్ధ వంతం గా కావ్యాలలో రాసిన మొదటి కవి గోప రాజు .తన కావ్యాన్ని ‘’హరి హర నాధుడు ‘’కు అంకితం చేసిన చివరి కవి కూడా అవటం ఒక విశేషం .పురోహితులను ,చింత కాయలను కూడా కవిత్వం లో బంధించాడు ‘’.సామెతలఆమెతలు’’ పుష్కలం .సూక్తులు ,పలుకు బడులు దట్టించి తెలుగు ను పరి పుష్టం చేశాడు .వినూత్న కొరవి చేత ధరించి వెలుగు ప్రసాదించాడు .

                                                               నంది మల్లయ  -ఘంట సింగన

           ఇప్పటి వరకు మనం చూసిన తెలుగు  సాహిత్య రంగం లో తొలి జంట కవులు నంది మల్లయ్య ,ఘంట సింగన ..అదేవీరి నవ్యతా ,నాణ్యత .వీరిద్దరూ ‘’శరీరం ,ప్రాణం ‘’లాగా ఉన్నారని.ప్రతి పద్యాన్ని ‘’చారు ఫణితి ‘’లో చెప్పగలరని ,వీరిద్దరూ కలిసి రాసిన ‘’వరాహ పురాణాన్ని ‘’అంకితం పొందిన సాళువ నరస రాజు అన్నాడట .వ్యర్ధ పదాలు (జల్లులు )లేకుండా అల్పాక్షరాలతో ,అనల్పార్ధం గా రచించారని ఈ జంట కు పేరుంది .ఈ జంట  అరాసిన మరో కావ్యం ‘’జ్ఞానం అనే చంద్రుని ఉదయం ‘’అయిన ‘’ప్రబోధ చంద్రోదయం ‘’అనే నాటకం .ఇది ‘’విశ్వ సాహిత్యం లోనే అపురూప నాటకం ‘’గా పరిగణింప బడింది .జీవన వేదాంతానికి చెందిన అతి సులభ ,సరళ రచన ‘’.వేదాంత రస పాకాన్ని గ్రోలిన వారెవరూ ,మళ్ళీ తల్లి పాలు గ్రోలరు –కోరరు ‘’అన్నారు విజ్ఞులు .అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు అని నిశ్చితాభి ప్రాయం .అద్వైత సిద్ధాంత బోధకం గా ఉన్న నాటకం ఇది .’.దీన్ని ‘’ప్రబంధం ‘’లా రాసి నవ్యత ను ,నాణ్యత ను సాధించారు వీరు .కనుకనే వారిద్దరిని స్మరిస్తున్నాం .సంస్కృతం లో ‘’కృష్ణ మిశ్రుడు ‘’రాసిన  ఈ నాట కాన్ని ప్రబంధం గా మార్చి నూత్న వరవడి సృష్టించిన తొలి  జంట కవులు వీరు .వ్యక్తులు వేరైనా ,కవిత్వం మాత్రం ఒక్కరే రచించి నట్లు రాయటం మహా గొప్ప విషయం .నవతను కవిత లో సృష్టించారు .జంట కవిత్వానికి ఆద్యులై వంద నీయు లైనారు .వీరి రచన లో ‘’సూక్తి వైచిత్రి ‘’అధికం ..ఉదాత్త మైన రచనను  సముదాత్తం  గా పోషించారు .ఈ జంట కవుల రచన ‘’సూక్తి భాండారం ‘’అన్నారు మహా పండితులు శ్రీ మల్లం పల్లి శరభేశ్వరార్యుల వారు ..ఇలా నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు ఎందరో కవులు తెలుగు సాహిత్యం  లో ఎన్నో నవ్య రీతులను వెలయింప జేసి , మలుపులు తిప్పి ,అభ్యుదయ మార్గం లో ప్రయాణం చేసి మహా గౌరవాన్ని పొందారు .తాము ధన్యులై .మనల్నీ ధన్యులను చేశారు .ఎప్పటికప్పుడు తెలుగు సాహిత్య సరస్వతి కి నూతన అలంకారాలను సంత రించి వినూత్న శోభ ను చేకూర్చారు .’’జయంతి తె సుక్రుతినో  రస సిద్ధాః కవీశ్వరః ‘’.

సమాప్తం —-మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23-5-12 —కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –వేడుకల వారం -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నల్ల వజ్రం –నిక్కి గివాని

  నల్ల వజ్రం –నిక్కి గివాని

            అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న  మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం  తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ పరిచింది .నల్ల జాతి విముక్తి పోరాటానికి నడుం బిగించింది .సాంఘిక దురన్యాయాలకు నెమ్మదిగా నిరసన తెలుపుతూ ,క్రమంగా జాతి వివక్షత కు వ్యతిరేకం గా నిలిచి పోరాడింది .రెండవ నల్ల జాతి రచయిత ల సామావేశం 1967 లో పాల్గొని ,ఆనాటి నేత అమిరీ బరాకా ప్రభావానికి లోనైంది .నల్ల జాతి వారు విడిగా కొత్త సాహిత్యాన్ని .సర్వ స్వతంత్రం గా నిర్మించాలని నినదించింది .అప్పటి వరకు ఉన్న అమెరికన్ ఇంగ్లీష ,యురోపియన్ సాహిత్య సంప్రదాయ పద్ధతులు శాశించే దారి వదిలి కొత్త దారి తొక్కాలని ఆలోచన చేసింది

                                                                      బాల్యం –చదువు

             ఆమె పూర్తీ  పేరు’’ యోలాందే గివాని జూనియర్’’ .1943 జూన్  ఏడున అమెరికా లో టేన్నిసి రాష్ట్రం లోని నాక్స్ విల్లి లో జన్మించింది .బాల్యం సిన్సినాటి లో గడిచింది .మళ్ళీ నాక్స్ విల్లి చేరి తాతయ్య ఇంట్లో ఉంది. ఫిస్క్ స్కూల్ లో చేరింది .అనుమతి లేకుండా స్కూల్ మానేసి నందుకు మొదటి సెమిస్టర్ కు అనుమతించ లేదు ..సిన్సియాటి చేరి ,అక్కడి యునివేర్సిటి లో రాత్రి తరగతులలో చేరింది ..మళ్ళీ ఫిస్క్ కు వచ్చి ,సోషల్ సబ్జెక్ట్ తీసుకొని చదివింది .ఒక వర్క్ షాప్ లో బ్లాక్ ఆర్ట్ ఉద్యమ కారులైన బరాకా  ,జోన్స్ లను చూసింది .అప్పటికే పౌరహక్కుల ఉద్యమం ఉధృతంగా  నడుస్తోంది ..నిషేధింప బడ్డ’’ స్టూడెంట్ నాన్ వయలెంట్ కొ ఆర్డినేషన్ కమిటీ ‘’ ,ని పునరుద్ద రించింది .1967  లో ఆనర్స్ డిగ్రీ తీసుకొని సిన్సినాటి కి వచ్చింది ..1968 ఏప్రిల్ నాలుగున పౌరహక్కుల నాయకుడు అమెరికన్ గాంధి మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ హత్య జరిగింది .గివాని హతాశు రాలై అట్లాంటా లో జరిగిన ఆయన అంత్య క్రియలకు హాజరైంది .న్యూయార్క్ లోని కొలంబియా లో ఉన్న స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరింది .’’సృజనాత్మక రచన ‘’కోర్సు తీసు కొన్నది .కాని రాయ లేమో నని భావించి  డిగ్రీ తీసుకో కుండానే మానేసింది .

                                                            ఉద్యోగం –రచనలు

        ఆనర్స్ డిగ్రీ పొంద  గానే ‘’బ్లాక్ ఫీలింగ్ ,బ్లాక్ టాక్’’ కవితా సంపుటు లను స్వయం గా ప్రచురించింది .విప్లవ జర్నల్ అయిన ‘’కన్సేర్వేషన్‘’పత్రిక సంపాదకు రాలైంది  .సిన్సియాటి లో మొట్ట మొదటి ‘’బ్లాక్ ఆర్ట్స్ ఫెస్టివల్ ‘’నిర్వహించింది .దేలావార్ కు మకాం మార్చి సెటిల్ మెంట్ హౌస్ లో పని చేస్తుండగా ,పెన్సిల్వేనియా వర్సిటి స్కూల్ ఆఫ్  సోషల్ వర్క్ లో ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్ వస్తే చేరింది .కొంత కాలం చదివి మానేసింది .’’బ్లాక్ జడ్జిమెంట్ ‘’అనే పుస్తకం రాయటం లో నిమగ్న మైంది . తర్వాత క్వీన్స్ కాలేజి లో విద్యా బోధనా చేసింది .పుస్తకాలను స్వయం గా ముద్రించాలని ఆమె భావించింది .బర్డ్ లాండ్ లోని జాజ్ క్లబ్  లో కవిత్వం విని పిస్తుంటే వందలాది మంది విని ఆనందించి ప్రోత్స హించే వారు .ఈ కధనం అంతా స్థానిక పత్రికల లో వస్తే పదివేల కాపీలు అమ్ముడయి రికార్డ్ సృష్టించింది .1970 ‘’బ్లాక్ జడ్జిమెంట్ ‘’పుస్తకాన్ని విడుదల చేసింది .చాలా మంది చదివి మెచ్చారు .పెళ్లి చేసుకొని ఒక కొడుకు ను కన్నది .

                                               కవితా పథనం  –పాటల ఆల్బం

                1970  లో గివాని నికితాం ప్రెస్ ద్వారా నల్ల కవితలను మొదటి ‘’ఆంత్రోపాలజీ ‘’ గా ,’’night comes softly’’ పేరప్రచురించి ,తను ఎన్నాళ్ళ నుంచో అనుకొన్న కోరిక తీర్చు కొంది .తరువాత ‘’సోల్ ‘’అనే టి.వి.ప్రోగ్రాం చేసింది .హార్లెం లో ప్రేక్షక సమూహాలకు కవితలను చదివి విని పించి మెప్పు పొందింది .’’స్పిన్ యే సాఫ్ట్ బ్లాక్ సాంగ్ ‘’ను ముద్రించి ,రికార్డ్ చేసి మొదటి ఆల్బం ‘’ట్రూత్ ఇస్ ఆన్ ఇట్స్ వే ‘’పేర విడుదల చేసింది .దానికి మంచి ఆదరణ లభించింది .లండన్ లో గివాని జేమేస్ బాల్డ్విన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ  స్క్రిప్ట్ ను 1971 లో ప్రచురించి ప్రాచుర్యం పొందింది .1972 లో ఆమె రాసిన ‘’ట్రూత్ ‘’పాటల ఆల్బం ‘’బెస్ట్ స్పోకెన్  వర్డ్ ఆల్బం ‘’గా రికార్డు ,రివార్డు పొందింది .’’మై హౌస్ ‘’అనే ఆమె పుస్తకం 1973  అమెరికన్ లైబ్రరి అసోషియేషన్ వారి  ఉత్తమ పుస్తకాల జాబితా లో చేరింది .ఆదర్శ కవి మార్గ రేట్ వాకర్ తో ‘టేపేడ్ డయలాగ్ ‘’ను ఇచ్చింది .’’లేడీస్ హోం జర్నల్ ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’అవార్డ్ నిచ్చి సత్కరించింది ముప్ఫై వ జనం దినాన్ని న్యూయార్క్ లోని లింకన్ సెంటర్ లో కవిత్వం చదివి గడి పింది  .ప్రభుత్వ ఆహ్వానం పై ఘనా ,టాంజానియా ,జాంబియా దేశాల్లో పర్య టించి ఉపన్యాసాలనిచ్చింది .’’ego tripping and other poems for young readers  ‘’ను ప్రచురించింది .’’ల్like a ripple on a pond’’ ‘’ఆల్బం విడుదల చేసింది .

                                                                 గౌరవాలు

           కవిత్వం పై ఉదాహరణ ల తో మాట్లాడటం అంటే గివాని కి చాలా ఇష్టం .ప్రత్యక్ష ప్రసారాలు ,రికార్డింగులు అంటే మరీ ఇష్టం .అదే ఆమె వ్యాపకం అయింది .ప్రతి మాటను అర్ధ వంతం గా ప్రయోగించటం ,ప్రయోగాత్మకం గా ,ప్రబోదాత్మకం గా రాయటం ఆమె ప్రత్యేకత .ఇంగ్లీష భాష భావ వ్యక్తీకరణకు సరి పోదు ‘’అని ఆమె నిశ్చితాభి ప్రాయం .’’ఇంగ్లీష లో అందరు మాట్లాడుతారు కాని ,ఇంగ్లీష మాట్లాడరు ‘’అంటుంది .మరి తనకు సరైన భాష ఏది అని అడిగితే ‘’ఆఫ్రికా లో మాట్లాడే భాష ‘’అంటుంది .(african  oral tradition ).నల్ల జాతి స్త్రీలు అంటే అత్యంత అభిమానం .మగవారిని ‘’బ్యూటిఫుల్ బ్లాక్ మెన్ ‘’అని అన్నా ,వారి భావాలన్నా ,మొరటు ప్రవర్తన అన్నా ఆమెకు కోపం .వారికి నల్ల జాతి స్త్రీలంటే ఇష్టం ఉండదు అని గట్టిగా చెప్పింది ..అందుకే ‘’ఉమెన్ ‘’అనే కవిత లో it is a sex object if you are pretty –and no love –or no love and no sex if you are fat –get back fat black women be a mother –grand mother strong thing but no women ‘’అని నిర్భయం గా మన్ల మగవారి ఆంతర్యాన్ని ఆవిష్కరించింది .

          1970-80  కాలం లో రెండు వందల కవిత్వపు రీడింగులు ,ఉపన్యాసాలు ప్రతి సంవత్సరం ఇచ్చింది .సంవత్సరానికో పుస్తకం ,ఒక ఆల్బం విడుదల చేసింది .ఎన్నో సంస్థలు ,కమీషన్లు ,ప్రజా సంబంధ శాఖలు ఆమెను ఆహ్వానించాయి .అయినా విద్యా బోధన మాన లేదు .ఒహాయో ,మిన్నిసోటా ,వర్జీనియా విశ్వ విద్యా ల యాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసి గౌరవం పొందింది .1989 లో ‘’బ్లాక్ స్టడీస్ ‘’లో ఇంగ్లీష ప్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ చేసింది .

            90 వ దశకం లో డజన్ల కొద్దీ డాక్టరేట్లు ఆమెను వరించాయి .ఎన్నో సాహిత్య ,పౌర సంస్థలు ఆమెకు అవార్డు లిచ్చి సత్కరించారు .ఒక డజన్ నగరాల తాళం చెవులను (కీస్ )లను ఇచ్చి అత్యధిక గౌరవం చూపారు .ఒహాయో ఉమెన్స్ హాల్ఆఫీస్ కు ఎన్నుకో బడింది .తెన్నిసి రాష్ట్రం రాష్ట్ర ప్రముఖ మహిళా పురస్కారం ప్రదానం చేసింది .’’రోజా పార్క్ ఉమెన్ ఆఫ్ కరేజ్ ‘’అవార్డు పొందింది .ఎబని ,మాడే  మోసిల్లి ,ఎసెన్స్ పత్రికలూ ఆమె ను ‘’ఉమన్ ఆఫ్ ది యియర్ ‘’గ ప్రకటించి గౌరవించాయి ..N.A.A.P.అవార్డ్ ను మూడు సార్లు దక్కించుకొన్న అరుదైన  నల్ల జాతి సాహితీ మూర్తి ఆమె .ఎన్నో పిలలల పుస్తకాలు రాసింది .స్వీయ చరిత్రను రాసుకోన్నది .అది ఒక రకం గా నల్ల జాతి వారి చరిత్రే .నేషనల్ బుక్ అవార్డ్ కు నామినేట్ అయింది .ఆమె వ్యాసాలను ‘’సేక్రెడ్ కౌస్ అండ్ ఆదర ఎడిబుల్స్ ‘’గా ప్రచురించింది .’ లంగ్ కేన్సర్  వ్యాధికి గురి అయిణా  విజయ వంత మైన ఆపరేషన్ తో  జీవించింది . 2005 లో  staan ford తో కలిసి ‘’బ్రేకింగ్ ది సైలెన్స్ ,’’ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఆఫ్ బ్లాక్ కాన్సర్ సర్వైవర్స్’’ ‘’పుస్తకాలను సంపాదకత్వం వహించి విడుదల చేసింది .

                నల్ల జాతి అని పిలువ బడే ఆఫ్రో అమెరికన్లు సామాజికం గా ,ఆర్ధికం గా ,రాజకీయం గా చైతన్య వంతులు కావాలని ,వారిలో ఈ భావ దీప్తి ప్రజ్వ లించాలని అహరహం శ్రమించిన అలుపెరగని పోరాట యోధురాలు గివాని .అందు కోసం కొత్త ఆలోచనలను ,కొత్త పోకడలను ఆహ్వానించింది ,అమలు జరిపింది .మాటలు కాక చేతల్లో సత్తా చూపించింది .నల్ల వారి శక్తి ని నిరూపించింది .నలుపు లో అందం ఉందని తెలియ జెప్పింది .నల్లవారినందర్నీ ఎకోన్ముఖులను  చేసి బ్లాక్ పాన్ధర్స్ ను ఏర్పాటు చేసి తమ అస్తిత్వాలను మేల్కొల్పింది .తమ జాతి లోని వారి త్యాగాలను ,కష్టాలను ,అంకిత భావాన్ని వెలుగు లోకి తెచ్చే రచనలు చేసి జాగృతి నింపింది .మాండలికాన్ని ప్రోత్సహించి ,తానూ ఆ బాటలో నడిచి ఆదర్శ వంతు రాలై ‘’ నల్ల వజ్రం’’ గా వెలిగింది నిక్కి  గివాని .

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-5-12—camp-charlotte –north carolina .u.s.a.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5

  నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5

                                                                           పోతనా మాత్యుడు

       తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన పరవశం తో పెంచి రాసేయట మే .పోతన సహజ పాండిత్యం ఉన్న కవి అవట మూ నూతన విషయమే .తెలుగు లో ఎన్నో కావ్యాలున్నా పోతన భాగవతమే పండిత ,పామర రంజక మైంది .కరతలా మలకమూ అయింది .దీనికి కారణం భక్తీ ,ఆర్ద్రత .అంత్య ప్రాసలకు అన్నప్రాసన చేసింది పోతనే .వైష్ణవ భక్తీ సాంప్రదాయానికి ప్రతీక గా పోతన భాగవతం నిలిచింది .అన్నమయ్య మొదలైన తద  నంతర  వైష్ణవ భక్తులకు పోతన్నీ దారి చూపించాడు .మందార మకరంద తున్దిలం గా పద్యాలను చెప్ప టం తో తెలుగింట పోతన పద్యాలు అందరి నోట నినదించాయి .రుక్మిణీ కళ్యాణం ,గజేంద్ర మోక్షం ,నిత్య పారాయణీయ మయ్యాయి .ఇంత బాగా జనసామాన్యాన్ని అలరించిన కవి పోతన ఒక్కడే అవటం విశేషం .అంత వరకు భాగవతం జోలికి పోక పోవటమూ పోతన్నకు బాగా కలిసొచ్చింది .

                                                       అన్న మాచార్యులు

    అన్నమయ్య గా తెలుగింట సుపరిచితుడు అన్నమా చార్యులు .జాన పదులు పాడు కొనే అనేక రకాల పదాలను భక్తీ వైభవం టో ఊరేగించిన వాడు తాళ్లపాక అన్నమాచార్యులు .శృంగారాన్ని భగవత్ ఉద్దేశం గా పరిణతి చెందించాడు .తిరుమలేశుని దివ్య సన్నీ దానం లో ఆస్థాన కవి అని పించు కొన్నాడు .పద  కవితకు తెలుగు లో పితామహుడు అని పించు కొన్నాడు .సంకీర్తనలకు ఆచార్యుడే కాదు ,ప్రాగాచార్యుడు కూడా .జాన పదుడు కాని కవి రాసిన జానపద గీతాలు అన్నమయ్యవి .ఇదీ ఇక్కడ విశేషం .ముప్పై రెండు వేల  పదాలను  ఎంతో వైవిధ్య భరితం గా రాశాడు . వాటిలో దక్కింది పద్నాలుగు వేలు మాత్రమే .అందులో ఆధ్యాత్మికాలు ,శృంగార కీర్తనలూ ఉన్నాయి .’’జో అచ్యుతానంద ,జోజో ముకుందా ‘’అన్న జోల పాట పోతన్న గారి పద్యాల తర్వాతా బహుళ ప్రచారం పొందింది తెలుగు నేల మీద .జాన పద శైలితో భక్తిని ,మేళవించి ,వైష్ణవ సంప్రదాయానికి అద్భుత ప్రచారం కల్పించి ,కొత్త బాట వేసిన వాడు అన్నమయ్య .

                                                                జక్కన –అనంతామాత్యుడు

            తెలుగు లో కేతన రాసిన ‘’దశ కుమారచరిత్ర ‘’,మంచన రాసిన ‘’కేయూర బాహు చరిత్ర ‘’కధా కావ్యాలకు సంస్కృతం లో దండి రాసిన ‘’దశ కుమారాచరిత్ర ‘’,రాజ శేఖరుడు రాసిన ‘’విద్ద సాల భంజిక ‘’ఆధారాలు .కాని స్వతంత్రం గాకదా కావ్యాలు రాసి తోలి ప్రయత్నం తోనే శిఖా రాగ్రాలు చేరిన వారుజక్కన ,అనంతయ్య.జక్కన ‘’విక్రమారక చరిత్ర ‘’,అనంతా మాత్యుని ‘’భోజ రాజీయం ‘’తోలి తెలుగు స్వతంత్ర కావ్యాలు .ఇలా ఇద్దరు ఒకే సారి కొత్త మార్గాలు చూపటం ఒక వింత .పశువులు ,పక్షులు ,క్రింది తరగతి మనుష్యులకు కావ్యం లో స్తానం కల్పించి ,పాత్రలను చేయటం కొత్త ఒరవడి .ఇంతే కాదు వీరిద్దరూ తమ కావ్యాలను’’నవ్య కావ్యాలు ‘’అని తామే చెప్పు కోవటం గుర్తుంచు కొదగిన విషయం .విక్రమార్కుని పేర ప్రచారం లో ఉన్న అనేక కధలను గుది  గుచ్చి జక్కన రాస్తే ,చారిత్రిక పురుషుడు కాని భోజ రాజు ను ఆధారం గా చేసుకొని నీతి ,భక్తీ వగైరా సామాజికామ్శాలను కధలను రాశాడు అనంతయ్య .అనంతుడుఛందో దర్పణం  కూడా రాశాడు .అది ఆయన పేర చలా మణిఅయింది .

  సశేషం ———మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -05 -12 -కాంప్–అమెరికా .
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్

   కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్

        ది హాబిట్ ,ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే రెండు రచనల తో ప్రపంచం లో లక్షలాది మందిని  ని ఆకర్షించిన బ్రిటీష రచయిత ,ఇంగ్లీష ప్రోఫెస్సర్ ,భాషా ధ్యన వేత్త , కవి  జే.ఆర్.ఆర్.టో ల్కిన్ .జర్మన్ భాష లో ఆయన పేరు కు అర్ధం –తెలివి తక్కువ ధైర్యశాలి అని ,బుద్ధిలేని తెలివి గలవాడని అర్ధం ..చిన్నప్పుడే గ్రీక్ ,లాటిన్ భాషల్లో అసమాన పాండిత్యం చూపాడు .గోతిక్ ఫిన్నిష్ ,మొదలైన మరుగున పడ్డ భాషలను అధ్యనం చేశాడు .తన స్వంత భాషల్లో వాటిని మళ్ళీ జీవింప జేశాడు .ఇది సరదా కోసమే మొదట చేశాడు .కాని తర్వాతా అదే ధ్యాస ,శ్వాస గా జీవించాడు .క్లాసిక్స్ అని పిలువ్ బడే లాటిన్ ,గ్రీకు భాషల్లోనూ ,భాషా శాస్త్రాల లోను తగి నన్ని మార్కులు సంపాదించ లేక పోయాడు .దీనితో లాభం లేదని ఇంగ్లీష భాషా సాహిత్యాల పై దృష్టి నిలిపాడు .1915 డిగ్రీ పొందాడు .ఫిన్నిష్ భాషా ప్రభావం తో ‘’quenya’’భాషను సృష్టించాడు .సైనికుడు గా చేరి లంకా షిర్ లో సెకండ్ లెఫ్టినెంట్ అయాడు .తరువాత్ ఏడాది లో ఎదిత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .వేస్త్రెన్ ఫ్రంట్ లో యుద్ధానికి వెళ్లాడు .ట్రెంచ్ లలో ఉండి యుద్ధం చేయటం తో ‘’ట్రెంచ్ ఫీవర్ ‘’తో బాధ పడి  తిరిగి వచ్చే శాడు .యుద్ద్ధ అనుభవాలు ,చూసిన భీభాత్సాలపై రాయాలనే సంకల్పం కలిగింది అవే ఆ తర్వాతా‘’book of lost tales ‘’గా వచ్చింది

                   ఒక సారి భార్య అతని కోసం హేమ్లాక్ అడవుల్లో డాన్స్ చేసింది .ఇది మనసు లో పడి  berene and luthern తమ కు మారు పేరుగా సృష్టించాడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష నిఘంటువు నిర్మాణం లో సహాయ లేక్సికోగ్రాఫర్ గా నియమింప బడ్డాడు ..ఎక్కువ కాలం ఉండలేక లీడ్స్ వర్సిటి లో రీడర్ గా చేరాడు ..ఆ తర్వాతా ఆక్స్ఫర్డ్ లో ఇంగ్లీష ప్రొఫెసర్ అయాడు .అప్పుడే మైత లాజికల్ కధలెన్నో రాశాడు .హాబిట , ,ది లార్డ్ అఫ్ రింగ్స్ అప్పుడే రాశాడు .1959 లో రిటైర్ అయాడు .

                గ్రీక్ సాహస వీరుల ,పురాణ నాయకుల అద్భుత వీరోచిత కధలను ,ఆ నాటి సంస్కృతి ల పై తీవ్ర పరిశోధనలు చేశాడు ‘’.మిడిల్ ఎర్త్ ‘’అనే కొత్త లోకాన్ని సృష్టించి ,పాత్రలను తయారు చేసి ఆ నాటి భాష లో వాళ్ళు మాట్లాడి నట్లు కొత్త భాషలను సృష్టించిన మేధావి టోల్కీన్ .అతను సృష్టించిన పాత్ర లన్నీ చెడు పై పోరాటం చేసేవే .చివరికి మంచే చెడు పై విజయం సాధిస్తుందని సందేశం ఉంటుంది ఆయన ఏది రాసినా .

                  ఓల్డ్ ఇంగ్లీష అని పిలువ బడే ఆంగ్లో సాక్సన్ ఇసిలాన్దిక్ ,భాషలను బోధించాడు .గ్రీక్ ,వెల్ష్ ,ఫిన్నిష్ ,స్కాండినేవియా ,భాషలకు వ్యాకరణం ,పద జాలాన్ని సృష్టించాడు .ఆంగ్లో సాక్సన్ క్రానికల్ ఆధారం గా ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు .భాషా శాస్త్రం అంటే ఆరో ప్రాణం .మిడిల్ ఇంగ్లీష నాటి  sir gowain and the green knight ‘’అనే దీర్ఘ కవిత ను ఎడిట్ చేసి ప్రచురించాడు .దాన్నే ఆధునిక ఇంగ్లీష భాష లో కవిత్వం గా మార్చి ప్రచురించాడు .తోక్లీన్ రాసిన ‘’the monster and the critic ‘’వ్యాసానికి చాలా పెద్ద పేరు వచ్చింది .అలాగే పాత ఇంగ్లీష కవిత ‘’beowulf’’లో వీర ధీర శూరులు చాలా మంది వ్యక్తులను చంపుతారు .ఆ కవిత ఆంగ్ల భాషా ధ్య  య నానికి ,ఆవిర్భావానికి తోడ్పడు తుందని భావించాడు .ఇప్పటికీ అతని sir gawain ‘’యునివేర్సిటి లో బోధనా విషయం గా ఉంది .ఆర్దూరియాన్ ,ఎల్ష్ ,నార్స్ ,ఐస్లాండ్ భాషల్లోని పూర్వ  కధలన్నీ అతను రాసిన కధలకు ప్రేరణ .టోల్కీన్ కు ఫిన్నిష్ భాష అంటే మహా ఇష్టం .దాని లోని kalevala ‘’అనే అతి ప్రాచీన కవిత అంటే మహా ప్రాణం .ఇలాంటి భాషలను ఎన్నిటి నో కనుక్కొని ,వాటిల్లో కవితలు రాసి తన ప్రతిభ ను చాటి చెప్పాడు .’’కలేవల’’ కవితకు సాటి కవిత ఆంగ్ల సాహిత్యం లో లేనే లేదు అని ఆయన నిశ్చితాభిప్రాయం .అతను  సృష్టించిన చిన పాత్రలు elves ,drowrves ,trolls ,gobins hobbit.విమర్శకులు అతని రచనలను కాలానికి తగ్గట్లు లేవు అని విమర్శించినా అసంఖ్యాకం గా ప్రపంచ వ్యాప్తం గా ప్రజలు చదివి ఆదరించటం విశేషం .

                     1960 లో జీవావరాన ,పర్యావరణం పై దృష్టి పెట్టాడు .1997 లో టి.వి.ల సర్వే లో టోల్కీన్  నంబర్ వన్ స్థానం పొందాడు .అతని రచనల్లో పక్షులు ,వృక్షాలు కూడా మాట్లాడుతాయి .చెట్లు కూడా మానవులతోసమానం అన్నాడు .ప్రజలకు ,ప్రకృతి కి మధ్య మంచి అవగాహన ,సంబంధాలు ఉండాలని తన రచన లలో తెలిపాడు .మానవ అభివృద్ధి కృత్రిమం గా కాక స్వాభావికం గా ఉండాలన్న ప్రోబోధం ఆయనది .జీవావరణ ,లాండ్ స్కేప్ లకు ప్రాధాన్యం ఇచ్చాడు .జీవావరణం మీద ఆలోచించిన మొదటి తరం రచయిత టోల్కీన్ .ఆయన వాషింగ్ మషీన్ ,టి.వి .లు కూడా అసలు వాడ లేదు .పల్లెల్లో నివ సించాలని బోధించినా పట్నాల సరి హద్దు లో నివ శించాడు .

     టోల్కీన్ రచన లో హాబిట్ కధ ఒక ఆస మర్ధుని జీవిత యాత్ర .చివరికి రింగ్ ఆఫ్ పవర్ సంపాదిస్తాడు .దుష్ట సంహారం జరిగి మంచికి పట్టాభి షేకం జరగట మే కధ సారాంశం .the silma rillion అనే నవల ఆయన చని పోయిన తర్వాతా ప్రచురిత మైంది .దానిలో చాందస మధ్య యుగ ఆవిర్భావం ,ఉంది .మిడిల్ ఎర్త్ లోని మొదటి యుగం తో ప్రారంభించి తర్వాతా రెండు యుగాల కధ ఇందులో ఉంది .ఇది చాలా సంక్లిష్టం గా ఉంది ఎక్కువ మందిని ఆకర్షించ లేదు .

        టోల్కీన్  పాత ,కొత్త తరాలకు చెందిన రచయిత గా ఇంగ్లాండ్ లో గుర్తింప బడ లేదు .భాషా విషయ పరి శోధకుని గా గౌరవించారు .మిడిల్ ఎర్త్ లో మగాళ్ళ దాస్తీకానికి బలి పోయే అమాయిక స్త్రీలు ,పిల్లల దయ నీయ గాధ ఉంది .అదంతా నేటి మన ఆధునిక  కాలానికి చెందిందే నని విశ్లేషకుల అభి ప్రాయం .మగాళ్ళు హింసా ,తీవ్ర వాదం వల్ల అధికారాలు సాధిస్తారు .వారి మధ్య ఆడ వారు ,,పిల్లలు నలిగి పోతారు .ఒక రకం గా నవీన ప్రపంచానికి అది దర్పణమే .లార్డ్ ఆఫ్ రింగ్స్ ను’’peaceful political anarchy’’అన్నారు .అరణ్య సంరక్షణ అవసరాన్ని గట్టిగా చెప్పాడు .’’ప్రపంచాన్ని మార్చక పోయినా ఫరవా లేదు కాని ఉన్నదాన్ని చెడ గొట్ట వద్దు ‘’అని ఆయన అందరికి సందేశం ఇచ్చాడు

       సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-5-12.—కాంప్—అమెరికా

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్

     మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్

          ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ  నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు  మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా  గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే ఇంగ్లాండ్ కు చెందిన అలాన్ టూరింగ్ అనే గణిత శాస్త్ర వేత్త .ఈ సంవత్సరం ఆయన శత జయంతి గా ప్రపంచం అంతా జరుపుకొంటోంది .అలాంటి వాడిని గురించి మనం తెలుసు కొని తలచు కొందాం .

                రక్షిత వార్తా సమాచారాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు .అంటే పంపిన వాడికి ,పంపబడే వాడికి తప్ప ఆ కోడ్ఇంకెవరికి తెలీదు .దాన్ని అవతలి వాడు డీ కోడ్ చేసుకొని తెలుసు కొంటాడు .ఇది యుద్ధాలలో చాలా ప్రయోజన కరం .దానికి ఎంతో బుర్ర ఉండాలి .అలాంటి అరుదైన మేధావి టూరింగ్ .1912 జూన్ 23 న ఇంగ్లాండ్ లో  ని లండన్ లో జన్మించాడు .తల్లి వైపు ,తండ్రి వైపు వారందరూ మహా తెలివి గల వారే .ఇతను చిన్నప్పటి నుండి స్వతంత్రమైన ఆలోచనలున్నవాడు .పదేళ్ళ వయసు లో హాజేల్ హర్స్ట్ స్కూల్ లో చేరాడు .అతను మేధావి అని టీచర్స్ గ్రహించారు .బేసిక్స్ గురించి ఎక్కువ గా ఆలోచించే వాడు .తర్వాతా శేర్బార్న్ స్కూల్ లో చేరాడు .అక్కడ క్లాసిక్స్ అని పిలువ బడే గ్రీక్ ,లాటిన్ చదివాడు.పద్నాలుగు ఏళ్ళ కే చేమిస్త్రి లో మహా ప్రతిభా వంతుదని పించుకొన్నాడు .అతని లోని గణిత మేధావి కవిత్వం రూపం లో బయట పడ్డాడు ‘’the maths brain liesawake in his bed –doing logs to ten places and trig in his head .అని కవిత రాశాడు .అతని ముఖ్య స్నేహితుడు ,సహాధ్యాయిమార్కాం అకస్మాత్తుగా చని పోతే తల్లడిల్లి పోయాడు .

            కేంబ్రిడ్జి లోని కింగ్స్ కాలేజి లో స్కాలర్షిప్ తో చేరాడు .హిట్లర్ జర్మనీ నియంత గా అధికారం లో నిలబడ్డాడు .మాస్టర్ డిగ్రీని గణితం లో సాధించాడు 1934 లో .తరువాతి ఏడు కింగ్స్ కాలేజికి ఫెలోషిప్ పొందాడు on computable numbers  అనే పేపర్ ప్రకటించాడు .కొన్ని గణిత  భావాలను రుజువు చేయలేము అని తెలియ జేశాడు .దీంతో యూని వేర్సాల్ కంప్యుటర్ ‘’భావనకు బీజం పడింది .తర్వాతా ప్రీస్టన్ యూని వర్సిటి లో అడ్వాన్సెడ్ స్టుడి కి చేరాడు ..గణితం లో పి.హెచ్.డి.సాధించాడు .మళ్ళీ కింగ్స్ కాలేజి లో ‘’ కోడ్ అండ్ సైఫెర్ స్కూల్ లో ‘’చేరాడు . mathematical logic అంటే మహా ఇష్టం .దాన్ని mathematics of mathematics అంటారు .ప్రాబబిలిటి  అనేది గణితం ప్రకారం కంప్యూట బిలిటి  కి సమానం .

             క్రీ.పూ.4000 లకే ఆరకాల జిస్టులు లెక్కలు తేలిగ్గా చేసే’’ అబాకస్’’ అనేది ఉందని గుర్తించారు .అదొక డిజిటల్ కంప్యూటర్ వంటిది .టూరింగ్ దృష్టి అలాంటిది తయారు చేయాలని యునివేర్సాల్ మషీన్ కోసం ప్రయత్నాలు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధం లో జర్మన్లు’’high security top secret communications    వ్యవస్థ రూపొందించారు .అదే’’cipher machine ‘’ దాన్ని వాళ్ళు’’ ఎనిగ్మా’’ అని పేరు పెట్టారు .cipher   అంటే వార్తను కోడ్ మెసేజెస్ గా ప్రతి అక్షరానికి వివిధ అక్షరాలను సమ కూర్చిపంపటం .దీన్ని తెలుసు కోవటం బ్రహ్మ ప్రళయమే అవుతుంది .1938 లో డీ కోడ్ చేయటానికి అతి కష్టమైనా కోడ్ ను జర్మన్లు కని పెట్టారు . 1939 లో జర్మని పోలాండ్ మీద దాడి చేసింది .బ్రిటన్ ,ఫ్రాన్స్ లు నాజీ వ్యతిరేక పోరాటం చేయాలని నిర్ణయించారు .బ్లేత్చారి పార్క్ లో ని  పరిశోధనా సంస్థ లో టూరింగ్  యుద్ద్ధ కాలం అంతా పని చేశాడు .అతని పరిశోధన సఫలమైంది .నాజీ ల ఎనిగ్మా కోడ్ ను డీ కోడ్ చేసి వాళ్ల యుద్ధ తంత్రాన్ని పసిగట్టి బ్రిటీష ప్రభుత్వానికి తెలియ జేశాడు .దీంతో కొత్త కోడ్ బ్రేకింగ్ టెక్నిక్ ప్రారంభమైంది .దీన్ని సాధించిన మేదావే టూరింగ్  .అదే జర్మని పతనానికి దారి చూపింది .యుద్ధం లో తుడిచి పెట్టుకు పోయింది .ప్రపంచాన్ని  నాజీ భూతం నుండి కాపాడిన మేధావి గా టూ రింగ్  గుర్తింపు పొందాదు   ,1942 లో అమెరికా వెళ్లి అక్కడి నావికా దళం తో  పని చేసి కోడ్ బ్రేకింగ్ లో సలహాలనిచ్చాడు .అక్కడి ఒహాయో లో ఉన్న గ్రాహం బెల్ లాబ్ లో ఎంక్రిప్తింగ్ స్పీచ్ పరికరాలను తయారు చేయటం లో సాయం చేశాడు .colossas’’అనే కొత్త మెషీన్ తయారు చేశాడు .1945 లో’’ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష ఎంపైర్’’ పురస్కారం అందుకొన్నాడు కంప్యుటర్ కు ఆద్యుడై ,మానవ మెదడు ను కృత్రిమం గా తయారు చేసే ఆలోచన లో పడ్డాడు .యంత్రానికి ఉన్న అన్ని సామర్ధ్యాలను వాడి ఆలోచన ,తెలివి తేటలు తో  పనిచేసే సాధనాన్ని తయారు చేసే ఆలోచన కు వచ్చాడు దీన్నే ‘’ బిల్డింగ్ ది  బ్రెయిన్ ‘’అంటారు .’’కంప్యూటర్లకు విషయ జ్ఞానం ,అనుభవం ఉండదన్న భావన తప్పు అని చెప్పాడు .అది కూడా మానవుడి లాగే అన్ని రకాల ప్రజ్ఞా ,జ్ఞానం అనుభవాలను చూపుతుంది అని తెలియ జేశాడు .ఇదేartificial intelligence ‘’  కు దారి చూపింది .

         ‘’ సెల్ఫ్ ఆర్గ నైజింగ్ సిస్టం’’ తయారు చేశాడు దాన్నే’’ సెల్యులర్ ఆటోమా ‘’ అని గణితజ్ఞులు పిలిచారు .తర్వాతనేషనల్ ఫిజికల్ లాబ్ కు వెళ్లి’’ pilot aautomaatic computing engine ‘’‘’(a.c.e.)కోసం పని చేశాడు ఆ నాటి కంప్యూటర్స్ కు అవసర మైన సెట్స్ ,ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ,రోటీ న్స్ ను తయారు చేశాడు ..అయితే అక్కడ పని చాలా నెమ్మదిగా జరుగుతుంటే మాంచెస్టర్ యుని వేర్సిటి  కి వెళ్లి అక్కడ వారు తయారు చేస్తున్న కంప్యుటర్ కు సాయం చేశాడు ‘’.కంప్యుటర్ చేస్’’ కు  ప్రోగ్రాములు రాశాడు .’ 1950 లో ‘’computing machinery and intelligence’’ అనే దాని మీద అతి విలువైన పత్రాన్ని రూపొందించాడు .ఇదే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు మార్గం చూపింది .అవతల మాట్లాడేది మనిషా కంప్యుటారా అనే దాన్ని గుర్తించే test తయారు చేశాడు .దాన్ని అతని పేర పిలుస్తున్నారు .1951 లో’’బ్రిటన్ రాయల సొసైటీ ఫెలో ‘’ గా అత్యున్నత గౌరవం ప్రభుత్వం ఇచ్చింది .1952 లో the chemical basis for morphogenesis ‘’అనేపేపర్  ప్రెసెంట్ చేశాడు .మానవ శరీర భాగాల్లో అభివృద్ధి కారక మైన తేడాల వివరణ దీనితో సాధ్యం అయింది

      పాపం ఆ కాలం లో ఉన్న హోమో సెక్స్ కు బానిసై ఒకడిని చేర దీసి చాలా నష్ట పోయాడు ఇంట్లో డబ్బు ఎత్తుకు పోయాడు వాడు .అనవసరం గా వాడి మీద కేసు పెట్టి దెబ్బ తిన్న దురదృష్ట వంతుడు టూరింగ్  .నిజం ఒప్పు కొ నందుకు టూరింగ్  కు శిక్ష పడింది .దానిని తప్పించు కోవటానికి  ఫిమేల్  హార్మోన్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు .దానిని తప్పించుకోలేక ,మనసు లో బాధ చెప్పుకోలేక ఒంటరి తనం అనుభవించాడు .ఫ్రాన్స్ కు వెళ్తానని బ్రిటీష ప్రభుత్వాన్ని కోరితే తిరస్కరించింది .చివరికి 1954 జూన్ ఎనిమిది న తన గడి లో ఆత్మా హత్య చేసుకొని చని పోయి నట్లు గా గుర్తించారు . ఆపిల్ పండు లో సైనైడ్ చేర్చితిన్నాడని భావించారు అయితే దీన్ని చాల మంది నమ్మ లేదు .రష్యా గూఢ  చారి వ్యవస్థ హత్యకు కారణం అని కొందరు భావించారు .ఈ నాటి వరకు అతని హత్య మిస్టరీ విడి పోలేదు .ప్రభుత్వం అతని పట్ల చాలా ఉదా సీనం గా వ్యవహరించిందని ప్రజలు ,మేధావులు తప్పు పట్టారు .నిరసన ప్రదర్శనలు చేశారు                        
కంప్యుటర్ మా నవుని లా ఎదిగే అతి ఉత్కృష్ట సమయం లో అతని చావు ను ప్రపంచ దేశాలు జీర్ణించుకో లేక పోయాయి .అతని మరణం తర్వాత యాభై ఏళ్ళ కు జనం చైతన్యులయారు  2009 లో  ప్రజలు అతని విలువను అర్ధం చేసుకొని .ప్రభుత్వ అసమర్ధతను దుయ్య బడుతూ భారీ ప్రదర్శనలు చేశారు .ప్రధాని గార్డన్ బ్రౌన్ వారిని సముదాయిస్తూ ‘’టూరింగ్ పట్ల అతి దారుణం గా ప్రభుత్వం ప్రవర్తిన్చిందన్న మాట నిజమేనని ,అది తప్పే నని ,ఆయన్ను అనవసరం గా ఫిమేల్ ఇంజేక్షన్లను చేయించుకొనే పరిస్తితి కల్పించటం విషాద కరం  అనీ ,అతను ఫాసిజాన్ని అంతం చేయ టానికి చేసిన కృషి మాన వాళి   మరచి పోలేదని ,అందుకే తాను ప్రధాన మంత్రిగా ,జాతికి క్షమాపణ చెబుతున్నానని మహా మేధావి టూరింగ్  సేవలు చిరస్మరణీయం  గొప్పగా శ్లా ఘించాడు .

                         ఇవాళ టూరింగ్  పై అనేక నాటికలు ,కవితలు వ్యాసాలూ వస్తున్నాయి .అతన్ని జాతీయ నాయకుడని కీర్తిస్తున్నారు .2002 లో అతని పై ఒక జాతీయ సదస్సు నిర్వ హించారు ఆరోజు ను ‘’టూరింగ్ డే ‘’ అన్నారు ‘’.యుని వరసల్ మషిన్’’ లో ఇవాళ మనం అందరం భాగా స్వామ్యులం అవటానికి ఆనాడు అలాన్ టూరింగ్ చేసిన ,అందించిన సేవలే కారణం .ఇప్పుడు2012 సంవత్సరం అలాన్ టూరింగ్  శత జయంతి  సంవత్సరం .మనం మరచి పోయిన మేధావిని మళ్ళీ గుర్తు చేసుకొని భావి తరాలకు ప్రేరణను అందిద్దాం .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 21-5-12 —కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తెలుగు విద్యార్ధి మాస పత్రిక లో మే నెలలో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

                                                                    గోన బుద్దా రెడ్డి

           తెలుగు లో  ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది .
                                                                                 
                                                                                                    గౌరన
                   గౌరన నవనాధ చరిత్ర ను ,హరిశ్చంద్ర చరిత్రను ద్విపద కావ్యాలుగా రాశాడు .తెలుగు దేశం లో హరిశ్చంద్ర కధ గౌరన రాసిన కధ ను బట్టే ప్రచారం లోకి వచ్చింది ..కరుణ రస ప్రధానం గా సాగింది .
                                                                          తాళ్ళ పాక కవులు 
                   అన్నమయ్య అని పిలువ బడే అన్నమాచార్యులు ”శృంగార మంజరి ”అనే ద్విపద కావ్యం రాశాడు .ఈయన కుమారుడు చిన్నన్న మాత్రం ద్విపద కవుల్లో అందులోను శ్రీ వైష్ణవ సంప్రదాయ కవుల్లో పేరు పొందాడు .పరమ యోగి విలాసం ,అష్ట మహిషీ కల్యాణం ,ఉషా కల్యాణం చిన్నన్న గారి పెద్ద రచనలు .అన్నమయ్య చరిత్ర ను ద్విపద కావ్యం గా రాశాడు .అందుకే” చిన్నన్న ద్విపద కేరుగును ”అనే పేరు వచ్చింది .అన్నమయ్య పడ కవితలు రాసి పడ కవితా పితామహు డైనాడు .తెలుగు లో పడ కవితలకు ఆద్యుడు అన్నమయ్య .
                                                                          ద్విపద కవిత్రయం 
            ఆది పర్వం నుండి ద్రోణ పర్వం దాకా ,(సభా పర్వం లేకుండా )ఆరు పర్వాల భారతాన్ని బట్టే పాటి తిమ్మన ,సభా పర్వాన్ని బాల సరస్వతి ,కర్ణ పర్వం నుంచి స్వర్గా రోహణ పర్వం వరకు ఆత్కూరి సోమన అనే కవిత్రయం రచించటం కొత్త మార్గమే అయినా ,అది” ఆది కవిత్రయాన్ని ”ఆదర్శం గా గ్రహించటమే అవుతుంది .ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది .తిమ్మన అరణ్య పర్వాన్ని సంగ్రహం గారాస్తే ,సోమన ఆ పర్వాన్ని సంపూర్ణం గా రాయటం విశేషం .భారత అరణ్య పర్వాన్ని నన్నయ్య గారు కొంత రాసి వదిలేస్తే ఎర్రా ప్రగడ పూర్తి చేసి నట్లు ఇక్కడ సోమన ఆపని చేయటం తమాషా .అక్కడా ఇద్దరే ,ఇక్కడా ఇద్దరే ..అదీ అరణ్య పర్వ విషయం లోనే అలా జరగటం తమాషా గా వింతగా ఉంది .ఎర్రన చేసింది పూరణం .ఇది సర్వ సమగ్రత్వం ..ఒకే పర్వాన్ని ఇద్దరు రాయటం మనకు కన్పించే నవ్యత్వం .తరిగొండ వెంగమాంబ ”రాజ యోగ సారం ”అనే ద్విపద కావ్యం రాసి ,మహిళా కవులకు ప్రోత్సాహాన్నిచ్చింది ..బసవ పురాణం నుంచి ఇప్పటి దాకా ద్విపద ధార అవిచ్చిన్నం గా కొన సాగింది ..
                                                                             శ్రీ నాద కవి సార్వ భౌముడు 
        కనకాభి షేకం తో పాటు పడ రాని కష్టాలలు పడ్డ కవి శ్రీ నాధుడు .”చాటువు ”కు ప్రాణం పోశాడు .ప్రియమైన అందమైన మాటే చాటువు ..ఎన్నో చాటువులు ఆయన పేరు మీద చలామణి లో ఉన్నాయి .”పద ప్రసిద్ధ ధారా ధుని ”అని పించు కొన్నాడు .ఆయనది ప్రవాహ లక్షణ కవిత్వం .చాలా కావ్యాలను ,చాలా రకాలుగా రాసి వైవిధ్యం లో కొత్త దారి తొక్కాడు శ్రీ నాధుడు .మంజరీ ద్విపద లో ”పల్నాటి వీర చరిత్ర ”రాశాడు .చాలా క్షేత్రాలను స్వయం గా దర్శించి ,ఆయా క్షేత్రమహాత్మ్యాలను కావ్యాలుగా రాశాడు .”క్షేత్ర మాహాత్మ్యం ”అనే కొత్త కావ్య శాఖను ఆరంభించాడు ..ప్రఖ్యాత ఆలన్కారికుడు కుంతకుడు చెప్పిన ”వక్రోక్తి ”ని తెలుగు లో అద్భుతం గా పండించిన వాడు శ్రీ నాధుడు .ఇంతకీ వక్రత అంటే వక్ర మార్గం కాదు .విషయాన్ని చెప్పటం లో ,పద ప్రయోగం లో ,సమాస కూర్పు లో ,అలంకారాలను కూర్చటం లో ,భావ చిత్రణ లో ,,చమత్కారం గా ఎవరూ చెప్పని కొత్త విధానం లో అందం గా చెప్పటమే వక్రతఅననిర్వచించారు పెద్దలు .శివుని శిరస్సు పైనున్న చంద్ర వంక ,చండికా దేవి బిగువైన స్తన ద్వయం ,సరసత్వం గల కావ్యాలే చిరకాలం జీవిస్తాయని శ్రీనాధుని నమ్మకం .తనది ”కర్నాట భాష ”అన్నాడు .అంటే చెవికి ఇంపైన భాష అని అర్ధం .ఈ మాటను కూడా కొత్తగా ,మొదటి సారిగా వాడిన కవి శ్రీనాదుడే .ఉక్తి చమత్కారం ఉంటేనే కావ్యానందం లభిస్తుంది .శివుని పై కాశీ ఖండం , ,,భీమ ఖండం ,హర విలాసం ,వంటివి రాసిన పరమ మాహేశ్వర భక్తుడు .పేరు లో శ్రీ మహా విష్ణువు ఉన్నా .ఆ విధం గా హరిహరాద్వైతి అనవచ్చు .ఆయన శివుని తో తిరగాడే చేలికానిగా ,కన్పిస్తాడు .దైవం గా శివున్ని దూరం గా ఉంచలేదు .అనేక క్షేత్రాలు తిరగటం వల్ల అఖండత్వానికి ,సమైక్యత కు స్పూర్తి గా నిలిచాడు .ఇదీ అప్పటికి కొత్త సంగతే .రామ రాజా భూషణుడి మాటల్లో చెప్పా లంటే ”వాగను శాసనుడు అనే బ్రహ్మ యే నన్నయ -ఆది శేషుడు తిక్కన -సిరికి హరి అయిన విష్ణు మూర్తే శ్రీ నాధుడు .-సోముడు చంద్రుడు ,భాస్కరుడు ఆదిత్యుడైన కవి భాస్కరుడు ,”తెలుగు లో కావ్యాన్ని నన్నయ సృష్టిస్తే ,తిక్కన నిల బెడితే ,శ్రీనాధుడు కాచి రక్షించాడని భట్టు మూర్తి గారి భావన .వీరితో పాటు సోమన ,భాస్కరుడు చంద్ర సూర్యుల్లా ప్రకాశింప జేశారట .”శ్రీనాదుడిని -యుగ కర్త ”అన్నారు .ఏ యుగం ?అని ప్రశ్నిస్తే ”కావ్య యుగం ”అని సమాధానం .ఇదే ప్రబంధ పూర్వ యుగం కూడా .ఇక్కడి నుంచే కవిత్వం అనువాద బాట వదిలి ప్రబంధ రచనకు మార్గం చూపించింది ..ఎంతో మంది కవులకు శ్రీ నాధుడు ఆదర్శం .హర్షుడు రాసిన నైషద కావ్యాన్ని తెలుగు లో ”హర్ష నైషధం  ”గా తన ప్రతిభా పాటవాలతో రాశాడు .దీని లో శ్రీనాధుడు కవితా విశ్వ రూపం దర్శనమవుతుంది .గౌడ డిండిమ భట్టు కంచు దక్క ను కూడా పగుల కొట్టి రికార్డు సృష్టించాడు .కనకాభి షేకం చేయించుకొన్న తొలి తెలుగు కవి .స్వీయ వ్యక్తిత్వాన్ని కవిత్వం లో సీస పద్య నిర్మాణం లో చూపించాడు .సీసం అంటే శ్రీనాదుడే అనే ముద్ర పడింది .దానిపై సాధికారికత తో పాటు ”సరి లేరు నా కెవ్వరూ”అని పించు కొన్నాడు కవి సార్వ భౌ ముడైన శ్రీ నాధుడు .

సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -05 -12 .—కాంప్-అమెరికా 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –వేడుకల వారం

అమెరికా డైరీ –వేడుకల వారం

      అమెరికా వచ్చి మండలం రోజులు అంటే నలభై రోజు లయింది .కిందటి వారం కన్నా ఈ వారం సందడి గా గడిచింది .వేడుకలతో నిండింది .పదమూడవ తేదీ ఆది  వారం ఉయ్యూరు లో శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి (హనుమజ్జయంతి 13,14,15 జరిగిన విశేషాలు)ఆలయం లో ఉదయం అభిషేకం తో  ప్రారంభమైంది .గంధ సిందూరం పూజ .మధ్యాహ్నం  . పన్నెండుకు సరస భారతి ఆధ్వర్యం లో ‘’ఆదిత్య హృదయం ‘’పుస్తకావిష్కరణ జరిగింది (ఆదిత్య హృదయం – ఆవిష్కరణ).రాత్రి చిన్న పిల్లలు నృత్య ప్రదర్శన చేశారు .మర్నాడు సోమ వారం ఉదయం మామిడి పండ్ల తో(హనుమజ్జయంతి – మామిడి ఫల -పూజ దర్శనం )  పూజ .చాలా ఖరీదు గా ఉన్నా ,ప్రతి సంవత్సరం లానే జరిగింది .రాత్రి మల్లీ నృత్య  ప్రదర్శన .పదిహేనవ తేదీ మంగళ వారం శ్రీ హనుమజ్జయంతి .ఉదయం ఆరు నుండి తమల పాకులతో పూజ నాన్ స్టాప్ గా పదింటి వరకు .పదిన్నరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల శాంతి కళ్యాణం .మేము అక్కడ లేక పోయినా మా అబ్బాయి రమణ దగ్గర ఉండి అన్ని కార్య క్రమాలు చేసి ,వాళ్ళిద్దరూ దంపతులు పీట ల మీద కూర్చుని కళ్యాణం జరి పించారు .ఆ రాత్రి కే.సి.పి.కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా నలభై సార్లు చేశారు . న్యూస్ పేపర్ కవరీజ్ బాగానే వచ్చింది దినపత్రికలలో వచ్చిన హనుమత్జ్జయంతి వార్తలు

                        ఇక్కడ హనుమజ్జయంతి నాడు నేను సహస్ర నామ పూజ చేశాను .నేను వెంట తెచ్చు కొన్న ‘’కళ్యాణం చేయించే పుస్తకం ‘’తో యదా విధిగా అన్ని మంత్రాలతో తంత్రం లేకుండా కళ్యాణం చేశాను .మా దేవాలయం లోని సువర్చలాన్జనేయ స్వాముల ఫోటోలు ఇక్కడ మా అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నాయి .విష్వక్సేన పూజ ,పుణ్యః వాచనం ,నవగ్రహ ,ఆష్ట దిక్పాలక పూజ కన్యా వరణం ,మధు పర్కం ,ప్రవర ,మహా సంకల్పం ,చూర్నికా ,లగ్నాష్టకాలు అన్నీ యధావిధి గా చదివి కళ్యాణ అక్షింతలు అందరికి వేశాను .కొబ్బరి కాయ కొట్టాం .పంపర పనస ,మామిడి పళ్ళు ఆపిల్స్ నైవేద్యం .విజ్జి ఉదయమే స్నానం చేసి అప్పాలు ,పులి హోర చేసింది .వాటినీ ని వేద్యం పెట్టాను .ఇలా అమెరికా లోను కళ్యాణం జరిపి నట్లే .

  మా అమ్మాయి విజ్జి –మా మనవడు చదివే స్కూల్ లో వాడి వార్షిక పరీక్షలకు అయిదు రోజులు ఉదయమే ఏడింటికే వెళ్ళింది సోమ నుంచి శుక్ర వరకు .పేరెంట్స్ ను ఇక్కడ వాలంటరీ గా ఇంవిజిలేషన్ చేస్తారు .  .పరిక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరుగు తాయట . .ఒకే పుస్తకం లో మూడు రోజుల ప్రశ్నా పత్రాలు ఉన్నా ఎవరూ రేపటి పరీక్ష ఆపేర్ లో ఏమి ఉన్నాయో చూడక పోవటం ఇక్కడి విశేషం అని చెప్పింది .అన్నీ ఆబ్జెక్తివ్  ప్రశ్నలే .ముందు రాసేసినా, చివరి వాడు రాసే వరకు ఎవ్వరు కదల రాదట .వాడు రాయ లేక పొతే మళ్ళీ టైం పెంచుతారట .అందరు రాయటం అయిపోతేనే బయటికి వెళ్లటం  వాలంటరీ కి రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తారు .వార్షిక పరీక్షలను’’ ఎండ్ఆఫ్  గ్రేడ్’’అంటారు

                బుధవారం –ఒక బీహారీ వాళ్ళ ఇంట్లో భజనకు వెళ్ళాం .ఇరవై మంది ఉన్నారు . స్వీటు అరటి పండు అందరికి ఇచ్చారు .విజ్జి, మా మనవడు శ్రీ కెత్ కూడా పాడారు .మర్నాడు గురువారం పవన్ అనే మా బంధువుల అబ్బాయి ఇంటి దగ్గర సునీత అనే వాళ్ళ ఇంట్లో భజన .ముప్ఫై  మంది హాజరు .రెండు స్వీట్లు ,పులిహోర ప్రసాదం .శని వారం లైబ్రరి కి నేను మనవడు పీయూష్ వెళ్లి పుస్తాలు ఇచ్చి నేను ఇరవై ఒక్క పుస్తకాలు తెచ్చు కొన్నాను .కిందటి వారం లో చివర చదివిన ముస్సోలిన్-సామ్రాజ్యం చాలా బాగుంది .ఇన్స్పైరింగ్ .దాని మీద పన్నెండు పేజీల నోట్స్ రాసు కొన్నాను .అలానే హౌస్ ఆఫ్ లింకన్ కూడా బాగున్నాయి .మిగిలినవి బొమ్మల పుస్తకాలే .తెచ్చిన వాటిలో నిన్నా ,ఇవాళ షార్ప్, అనేది అలాన్ టూనర్ పుస్తకాలు చదివేశాను .

                                                          షష్టిపూర్తీ –శ్రీ వెంకటేశ్వర కళ్యాణం

      నిన్న అంటే పందొమ్మిదవ తేది శని వారం సాయంత్రం ఇండెపెండెన్స్ రోడ్ లో ఉన్న ‘’హిందూ సెంటర్ ‘’అనే శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి అనీతా ,కిరణ్ అనే వారు పిలువగా వెళ్ళాం .ఇదే మొదలు దేవాలయ దర్శనం చేయటం ఇక్కడ .అనీతా వాళ్ళ నాన్న గారికి షష్టి పూర్తీ జరిపారు ఆ దేవాలయం లో .అందుకని వాళ్ల అమ్మా ,నాన్న పీట ల మీద కూర్చుని శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చేశారు .సాయంత్రం అయిదున్నర కు ప్రారంభమై ,రాత్రి ఏడున్నరకు పూర్తీ అయిన్చ్ది .వాళ్ళు పిలుచుకొన్న వారందరూ వచ్చారు .అనీతా వాళ్ళు హైదరాబాద్ కు చెందినా తెలుగు వాళ్ళు .పూజారులు కల్యాణాన్ని బానే చేయించారు .అన్నీ యదా విధిగా .కాని తలంబ్రాలు పోయించలేదు ఎందుకనో .పరవాన్నం రవ్వ కేసరి ,పులిహోర ప్రసాదాలు. అక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు .అంటే కాంప్లెక్స్ .మా తోను కన్యా దానం ఇప్పించారు .వెంకటేశ్వర కళ్యాణం లో కన్యాదానం చెయ్యటం ఇదే మొదలు .ఆ తర్వాతా ప్రక్కనున్న విశాల మైన హాల్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు అనీత కిరణ్ లు .రసగుల్లా ,మిరప కాయ బజ్జి ,వడ ,పప్పు ,చపాతి రెండు కూరలు వంకాయ కూర అప్పడాలు చట్నీ ,సాంబారు పెరుగు టో భోజనం బాగా ఉంది .అంతా వాళ్ళే తయారు చేసి తెచ్చారు .హాలు చాలా అందం గా ఉంది అందు లోని దొమ్ లైట్లు అద్భుతం .షష్టి పూర్తీ దంపతులు కళ్యాణం అవగానే మా ఇద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి ఆశీ స్సులు పొంది అక్షంతలు వేయించు కొన్నారు .ఆ తర్వాతా అనీతా వాళ్ళ నాన్న గారితో కేక్ కట్చేయించి అందరికి పంచారు .అంతా ఆయె సరికి రాత్రి పది అయింది .అప్పుడు బయల్దేరి ఇంటికి పదిన్నర కు చేరాం .

                                                                 వైశాఖ వన భోజనం

      ఇవాళ ఆదివారం నాడు విజ్జి అవధాని గార్లు మూడు కుటుంబాలను మధ్యాహ్నం భోజ నానికి పిలిచారు .ఒకటి రాంకీ ఉషా కుటుంబం ,రెండు బెల్లంకొండ రవి ఉషా కుటుంబం ,మూడోది పవన్ వాళ్ళ కుటుంబం .పిల్లా జెల్ల కలిపి ఇరవై మంది .పవన్ అత్తా గారు మామ గారూ కూడా వచ్చారు .బి.రవి కి .పవన్ కు మన శ్రీ హనుమ కధా నిది పుస్తకాలు ఇచ్చాను .టమేట పప్పు ,కాబేజీ కూర ,బంగాళా దుంప కూర ,వడియాలు ఆవకాయ .చారు ,పెరుగు .పుచ్చకాయ ముక్కలు పనస తొనలు అందరు కమ్మగా తిన్నారు .అందరు బయట  చెట్ల కింద పట్టాల మీద ప్రక్రుతి లో కూర్చుని హాయిగా భోజనం చేశారు .ఉసిరి గింజలు మొలిచి మొక్కలు వస్తున్నాయి .కనుక దీన్ని వైశాఖ వన భోజనం అన్నాం.అన్నీ విజ్జే చేసింది .ఈ కుటుంబాలన్నీ చాలా మంచి కుటుంబాలు .సంస్కారం ఉన్న వి .స్నేహ పాత్ర మైనవి .

                 ముత్తేవి రవీంద్ర నాద గారు వారానికో సారి ఫోన్ చేసి మాట్లాడు తున్నారు .మధుసూదన రావు గారు రెండు సార్లు మాట్లాడారు ఆయనే ఫోన్ చేసి .మెయిల్ పెడితే మొన్న ఫోన్ చేశారు గోపాల కృష్ణ గారు .ఇలా ఈ వారం అంతా వేడుకల వారం గా గడిచింది .ఇవాళ మధ్యాహ్నం పాత’’ లవ కుశ ‘’సినిమా జెమిని లో చూశాం . .కళ్ళకు ,మనసుకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది. రామ రాజ్యం చూసిన దోషం పోయిందని ఊరట కలిగింది .అందులో కుశుడు వేసిన నాగ రాజు రామోజీ స్టుడియో లో రెండేళ్ళ క్రితం  ‘’వరుడు ‘’సినీ షూటింగ్ లో కలిశాడు .అరవై ఎల్లువచ్చాయి .పలకరిస్తే చక్కగా మాట్లాడాడు .ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు .అప్పుడప్పుడు ఉయ్యూరు వస్తూ ఉంటానని చెప్పాడు .ఊరగాయ కావాలంటే మా అమ్మాయి మాగాయ ఇచ్చింది .చాలా బాగుందని హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా ఫోన్ చేశాడు .మా మనవడు హర్ష వరుడు లో అల్లు అర్జున్ కు తోడి పెళ్లి కొడుకు గా నటించాడు .మేమందరం కూడా అందులో పాల్గొన్నాం .ఎక్కడో వెతుక్కుంటే కని పించ వచ్చు .సినిమా అటకెక్కింది పాపం .ఇప్పుడే మేనల్లుడు శాస్త్రి కాళి ఫోర్నియా నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు .తప్పకుండా వారానికి రెండు సార్లైనా మాట్లాడుతుంటాడు .ఆంద్ర లో ఎండలు మండుతున్నాయత .’’సూర్య భగ భగ వానుడు ‘’గా ఉన్నాడని ఈనాడు రాసింది .ప్రకాశం జిల్లాలో యాభై కి వచ్చి జనం అల్లల్లాడి పోతున్నారట .ఇవాళ కాళి ఫోర్నియా లో సంపూర్ణ చంద్ర గ్రహణం అనీ ఇప్పుడే మొదలైందని మేనల్లుడు చెప్పాడు .ఇవీ ఈ వారం విశేషాలు .ఫోటోలు తర్వాతా పేడ తాము .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-5-12.—కాంప్ –అమెరికా .

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

  నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

                                                                                          నన్నే  చోడుడు  

                                                నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ .   కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి కవి .అంతే కాదు మొదటి’’ రాజ కవి’’ కూడా .’’ప్రబంధం ‘’అనే పేరు ను చాలా సార్లు వాడాడు .’’బంధ కవిత్వాన్ని ‘’కవిత్వం లోకి దించిన మొదటి కవి కూడా .పద్యాలను సజీవ చిత్రాలుగా మలిచాడు .కావ్యం అంతా దేశీయ వాసన గుబాళిస్తుంది .శివభక్తుడే కాని ,శైవ మత ప్రచారం చేయని వాడు .పరమత నింధా  చేయని సంస్కారి కూడా . జాను తెనుగు తో బాటు ,’’వస్తు కవిత ‘’లేక ‘’వస్తు కావ్యం ‘’అనే అంశాన్ని మొట్ట మొదట ప్రయోగించాడు .కావ్యానికి అవసర మైన సూక్తులు ,వర్ణనలు ,గుణాలు ,రసాలు ,మొదలైన విషయ సామగ్రి నే ‘’వస్తువు ‘’అన్నాడని విశ్లేషకుల భావన .’’మృదు రీతి సూక్తులిమ్పొంద   ‘’అన్న పద్యం దీనికి ఆధారం .చోడుని పద్ధతిని ‘’కావ్య పద్ధతి ‘’అన్నారు .నన్నయది ఇతిహాస మార్గ మైతే ,నన్నే చోడు నిది కావ్య మార్గం .ఈ రెండూ ఒకే సారి తెలుగు సాహిత్యం లో ప్రారంభమయి నట్లు భావిస్తున్నారు .

                                                                                        కేతన

          మూల ఘటిక కేతన సంస్కృతం లో దండి మహా కవి రచించిన ‘’దశ కుమార చరిత్ర ‘’అనే కావ్యాన్ని తెలుగు లో ‘’దశ కుమార  చరిత్ర ‘’గా రాశాడు .తిక్కన గారికి దీన్ని అంకితం చేశాడు .ఇలా తెలుగు లో ఒక కవి ఇంకో కవి కి అంకితం ఇవ్వటం కేతన తో  ప్రారంభమైంది .కొత్తదారి తొక్కి మార్గ దర్శి గా నిలిచాడు .స్వతంత్ర కేతనం ఎగుర వేశాడు .’’అభినవ దండి ‘’అని పించు కొన్నాడు .నానుడులు ,సామెతలు కుమ్మరించాడు .’’కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప –నరిది బ్రహ్మ కైనా ‘’అని తన కావ్యాన్ని కవి బ్రహ్మ తిక్కన మెచ్చి నట్లు చెప్పు కొన్న ఘటికుడు .’’విజ్ఞానీశ్వ రీయం ‘’అనే ధర్మశాస్త్ర గ్రంధాన్ని కూడా రాసి ,శాస్త్ర రచనకు శ్రీ కారం చుట్టాడు .కధా కావ్యానికి ఆద్యుడు కేతన అని పించు కొన్నాడు .

                                                                                         మారన

       తెలుగు లో పురాణ రచన చేసిన మొదటి కవి మారన  .’’మార్కండేయ పురాణం ‘’ఇతని కావ్యం .ఈయనా తిక్కన గారి శిష్యుడే .కవిత్వ రచన లో తిక్కన ను అనుసరించాడు .అల్లసాని పెద్దనా మాత్యుని ‘’మను చరిత్ర’’కు ప్రేరణ –మారన  గారి మార్కందేయమే .ఈ పురాణం నుంచే పెద్దన ‘’స్వారోచిష మనువు ‘’కధ ను స్వీకరించాడు .పెద్దన కవిత్వం మారన మార్గాన్నే అనుసరించింది.పురాణం అయినా ఆహ్లాదం గా చెప్పగలిగాడు .పురాణ రచనకు ఆద్యుడై ,తరువాతి వారికి మార్గ దర్శి అయాడు మారన  .కవిత్రయం సరసన నిలవ గలిగిన సంస్కారి .నిగర్వి .’’అఖిల విబుధ సభా పర్వమై ,జగజ్జనాలికి గర్వ పర్వ మై ,యధిక పుణ్య యోగి హ్రుచ్చాంతి పర్వ మై యొప్పు దాని ,హరగునో జ్వల మణి అయిన దాని ’’గా మార్కందేయాన్ని రచించానని బుధ జన విధేయం గా చెప్పు కొన్నాడు .శ్లేష తో పర్వాన్ని పురాణాలకు అన్వయించాడు .సుకుమారత్వం ,సూక్ష్మ రీతి మారన  ప్రత్యేకత .సాత్విక గుణ పరి పూర్నుడిగా మారన కవి ప్రశంశ నేయుడు .

                                                                                హుళక్కి భాస్కరుడు

           రంగ నాద రామాయణం ద్విపద రామాయణం అయితే ,భాస్కర రామాయణం చంపూ రామాయణం .కవి పేరు మీదే ఈ రామాయణం వర్దిల్లటం కొత్త దనం .భారతాన్ని కవిత్రయం తెనిగించి నట్లే భాస్కర రామాయణమూ బహు కృతం అయింది .బాల ,కిష్కింద ,సుందర కాండాలను కుమారుడు మల్లికార్జున భట్టు ,అయోధ్య కాండ ను భాస్కరుని శిష్యుడు రుద్ర దేవుడు ,అరణ్య ,యుద్ధ కాండాలలో ఎక్కువ భాగం భాస్కరుడు రాశారు .యుద్ధ కాండ చివరి భాగాన్ని ,భాస్కరుని స్నేహితుడు అయ్యలార్యుడు రాశాడు .కవి చతుష్టయం దీన్ని పూర్తీ చేయటం కొత్తదనం .భారతం ,రామాయణం తెలుగు లో బహుక్రుతం అవటం యాదృచ్చిక చారిత్రార్మక సంఘట నం .నలుగురు రాసినా ,అందు లో భాస్కరుని వంతు స్వల్పమే అయినా ,కావ్యం భాస్కరుని పేరు మీదే ఉండటం కొత్తగానూ ,వింత గానూ వుంది .నన్నయ ,తిక్కన లకు దీటైన కవి అని భాస్కరుడు కీర్తి పొందాడు వాల్మీకానికి చాలా దగ్గరగా ఉండేట్లు ,ఔచిత్య వంతం గా ఉండేట్లు రచన సాగింది .ఇంకో కొత్త విషయం ఏమి టంటే శ్రీ రాముని ఒక మహా మానవుని గా చిత్రించి నూత్న పోకడలు పోయాడు భాస్కరుడు .ప్రౌధత్వం తో పాటు ,వ్యంగ్య వైభవాన్నీ రుచి చూపించాడు .’’బహులాన్ద్రోక్తి మయ ప్రపంచం ‘’అని భాస్కరున్ని  నాచన సోమన సరసన కూర్చో బెట్టాడు ‘’వసు కారుడు ‘’రామ రాజ భూషణ భట్టుమూర్తి  కవి .

      సశేషం —మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –20-5-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2

                                                                       దేశి కవిత్వం

           నన్నే చోడ   మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా ఛందస్సు దీనికి ముఖ్యం .’’జాను తెనుగు ‘’అన్నాడు నన్నే చోడుడు .ఇదే అచ్చ తెలుగు ,అందమైన తెలుగు అని భావం .ఈ రకమైన కవిత్వాన్ని శివ కవులు బాగా ప్రచారం చేశారు .కవిత్వం తన ‘’మార్గం ‘’వదిలి దేశీయమైంది ఇక్కడి నుంచే .మల్లికార్జున పండితా రాధ్యుడు శివ తత్వ సారం అనే గ్రంధాన్ని దేశీ ఛందస్సు లో రాశాడు .ఆశువు గా చెప్పిన వైన వన్నీ  గ్రంధస్తం అయాయి .ఇదే వేమన కూ ఆదర్శ మైంది ‘’.కంద’’ను పద్యాల్లో చక్కగా వండి వడ్డించాడుపండితుడు  శైవ మత ప్రచారానికి ఈ కవిత్వం ఆలంబన మైంది ఇక్కడి నుంచే .ఇదో వరవడి .

            తర్వాత వచ్చిన వాడు పాల్కురికి సోమ నాధుడు .శైవ మతం పై దీర్ఘ నిష్ఠ ,ప్రత్యెక వ్యక్తిత్వం ,అద్భుత పాండిత్యం తో ,అనన్య కవితా శక్తి తో ,ఒక ‘’స్రష్ట ‘’గా నిలిచి పోయాడు .మొదట్లో నన్నయ గారి మార్గం లో ప్రయాణం సాగించినా ,తర్వాతా ఆ దారి వదలి ,’’ద్విపద ‘’తో సంప్రదాయ కవిగా నిలిచి గెలిచాడు .ఎనిమిది భాషలు ,అనేక శాస్త్రాలు నేర్చిన మహావిద్వాం సు డు పాల్కురికి .కవిత్వం  కూడా ఉరుకులూ ,పరుగులే .’’ఉదాహరణ ‘’కావ్యానికి నాంది పలికాడు .ఇది ‘’విభక్తి విధానం ‘’పై సాగే రచన .ఎనిమిది విభాక్తులతో రచన ఉండటం దీని ప్రత్యేకత .ఒక్కో విభక్తి కి మూడేసి పద్యాలు,ఆది  లోను ,అంతం లోను ,ప్రాస .మొదటిది వృత్త పద్యం .తరువాత రగడ అనే కలిక .మూడోది ఉత్కలిక .అన్ని విభక్తు లతో ఇరవై నాలుగు పద్యాలు .చివరగా ఇరవై అయిదవ పద్యం సర్వ విభక్తులతో ఒక వృత్తం .చివరికి అన్కితాంత పద్యం లో కవి పేరు ఉండటం దీని లక్షణం .మొదట తెలుగు లోను .తర్వాతా సంస్కృతం లోను బసవేశ్వరుని గురించి ,ఉదాహరణ కావ్యాలు రాసి చరిత్ర సృష్టించాడుసోమన .దీని రహస్యాన్ని విప్పి చెప్పుతూ కవి సామ్రాట్ విశ్వ నాద ,’’ప్రపంచం అంతా క్రియా రూపం ,అన్ని క్రియలు పరమేశ్వరుడిని చేరతాయి .ధాతువు విభక్తి ని ఆశ్ర యించే  ఎప్పుడూ ఉంటున్ది.విభక్తి తో సంబంధం లేని క్రియ లేదు .అన్ని విభక్తు లతో పరమేశ్వరుడిని గురించి చెబితే ఆయన సర్వ క్రియలకు ఆధార భూతుడు అని చెప్పినట్లే ‘’అని గొప్ప విశ్లేషణ చేషారు .ఇదో కావ్య తత్త్వం . సాహిత్యం లో ఇదొక నూతన పరికల్పన .తరువాత వర్ధిల్లిన ఉదాహరణ కావ్యాలకు మార్గ దర్శనాన్ని దేశీయం గా చేసినది సోమన  ‘’బసవ ఉదాహరణ ‘’  కావ్యమే .సోమ నాధుడే ‘’బసవా ! బసవా ! బసవా !వ్రుషాదిపా!’’అన్న తోలి శతకాన్ని కూడా రాసి తెలుగు లో శతక సాహిత్యానికి ఆద్యుడు అయాడు .

              అచ్చ తెలుగు ఛందస్సు ‘’ద్విపద ‘’ను ఎన్ను కొని ‘’బసవ పురాణం’’ రాశాడు .ద్విపద ఐహికానికి ,ఆముష్మికానికి కారణం అన్నాడు .పాట లాగా పాడు కొనేందుకు వీలుగా ఉండటం వల్ల జనసామాన్యానికి తన భావనలు అందుతాయని భావించాడు .నన్నయ మొదలు పెట్టిన ‘’చంపూ ‘’పద్ధతికి పోటీగా ఒకే పద్య పద్ధతిని అంటే ద్విపద పద్ధతినిప్రవేశ పెట్టి ,సేహబాస్ అని పించుకొన్నాడు .స్వాభావిక మైన రచనకుప్రాణం  పోశాడు .భక్తిని ,ఆవేశాన్ని కవిత్వం లో పాదు  కోల్పాడు .చారిత్రాత్మక మైన విషయాలనువిషయాలను వస్తువు గా తీసుకొన్న మొదటి కవి పాల్కురికి సోమనార్యుడే .బసవడు ,పండితా రాధ్యుడు చారిత్రాత్మక మహా పురుషులు .వారికి కావ్య గౌరవం కల్పించిన చారిత్రిక కవి . అంతే కాదు – క్రింది కులాల వారికి అగ్రాసనం కల్పించిన మొదటి కవిగా ,నూతన మార్గానికి దేశికునిగా నిలిచి పోయాడు . ఈయన తర్వాతా చాలా మంది కవులు భక్తుల చరిత్రలను కావ్యాలుగా రాశారు .శైవ మతానికి అధిక ప్రచారాన్ని కల్పించిన వాడు కూడా సోమనే .పలుకు బడు లకు ,జాతీయాలకు ,సామెత లకు ఆయన కవిత్వం నెలవు .,,కొలువు .లాక్షి ణి కులతో భేదించి ,స్వంత ప్రయోగాలు చేశాడు .కిన్నెర బ్రహ్మయ్య మరణం తో బసవేశ్వరుడు పొందిన తీవ్ర దుఖాన్ని అద్భుతం గా 14 పాదాలలో రాసి ,జాన పదులకు ఇష్టమైన ‘’బుర్ర కధ ‘’కు బీజం వేశాడు .ఆయన కవితా ధార మహావేగం .సుళ్ళు తిరుగుతూ ప్రవహించి మనల్ని లాక్కు పోతుంది .ఏమి చెప్పాడన్నా ఆలోచన కంటే ఎలా గొప్పగా చెప్పాడా అని ఆశ్చర్య పోతు ఆయన కవిత్వం వెంట పరుగో పరుగు .అందులో కొట్టు కు పోవాల్స్సిందే .ముంచి తేలుస్తాడు .అడ్డూ ఆపు లేని ఉధృత ధృతి ఆ కవిత్వం .ఇదే పాల్కురికి సోమన ప్రత్యేకత .

            సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-5-12.—కాంప్—అమెరికా .

Posted in అనువాదాలు, మహానుభావులు | Tagged | Leave a comment

నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1

        ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే  మనకు ఆది  కవి అంటున్నాం .గాసట బీసట  గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో మహా భారతాన్ని దర్శించాడు నన్నయ భట్టారకుడు .వ్యాస భారతం తెలుగు దేశాన సుప్రతిష్ఠితం ఆయె ఉంది .దేవాలయాలలో పురాణ ప్రవచనం జరుగుతూనే ఉంది .తెలుగు వారికి భారత కధలు కొత్తవి కూడా కావు .అయితే తన కధా కదన నైపుణ్యం తో ,నవ్యత తెచ్చాడు నన్నయ .పాత కధే ,కాని కొత్తగా వింటున్న అను భూతి కల్గించాడు .వ్యాస కధ కు సమగ్రత కల్గించాడు .మనిషి ప్రవ్రుత్తి లో మార్పు తెప్పించటా నికి ,దోహద పడ్డాడు .’’ప్రసన్న కధా కలితార్ధ యుక్తి ,అక్షర రమ్యత ,నానా రుచిరార్ధ సూక్తి నిదిత్వం ,’’తన రచన లో ఉంటుందని తెలిపి అలానే పరిపుష్టి కల్గించాడు .అందుకే ‘’రుషి వంటి నన్నయ –జన వాల్మీకి ‘’అన్నాడు విశ్వనాధ .ఔచిత్యం ఆయన రచన లో ప్రధానాంశం .ఆయన వాక్యం ‘’హితం ,మితం ,సత్యం ‘’.సంభాషణల్లో ‘’కాకువు ‘’ను చక్కగా ప్రవేశ పెట్టి ,తెలుగుదనం అద్దాడు .ఏదైనా కొత్త విషయాన్ని చెప్పటానికి కొత్త ఛందస్సును వాడాడు .సందర్భోచితం గా సంస్కృతం ,తెలుగు పదాలను ప్రయోగించాడు .జాన పద  బాణీలకు దగ్గర గా ఉండే విశేష వృత్తా లైన లయగ్రాహి ,తరళం ,మత్త కోకిల పద్యాలను అత్యంత ప్రతిభావంతం గా వీనులకు విందుగా ప్రయోగించాడు .ఇలా నన్నయ నవ్యత కు నాంది పలికాడు .అవసరం అని పించిన చోట వచనమూ రాసి చంపువు గా మలిచాడు . .కవిత్రయం లో మొదటి వాడు నన్నయ్య .

               కవిత్రయ ద్వితీయుడు ,అద్వితీయుడు తిక్కన .’’ఉత్తర రామాయణం ‘’ను రాసి లోకం లో దాన్ని ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’గా ప్రసిద్ధి చెందించాడు .ఇందులో అన్నీ పద్యాలే .వచనాలు లేక పోవటం కొత్త దానమే .ఈ కావ్యం లో పద్యాల వైవిధ్యం బాగా చూపాడు .వచనం లేకుండా రాయటం ,ఆనాటికి ఒక గొప్ప లక్షణమే .దాన్నే ‘’ప్రౌ డత ’’అన్నారు .భారతం లో మాత్రం చంపూ పద్ధతి పాటించాడు .అయినా పాత వాసన పోనీక ‘’మౌసల పర్వం ‘’ను వచనం లేకుండా ,నిర్వచనం గా రాశాడు .నన్నయ టో మొగ్గ తొడిగిన నాటకీయత ,తిక్కన లో పుష్పమై వికసించి గుబాళిం చింది .సంభాషణా శైలి లో భారతాన్ని జనరంజనం చేశాడు తిక్క యజ్వ. తెలుగుపద్య రచనా శిల్పం తిక్కన తో పరి పుష్టమైంది .’’ప్రౌడి పాటించు శిల్పమునన్ బారగుడ ‘’అని చెప్పుకొన్న సోమయాజి అపార శిల్ప పారంగాతుదయాడు .’’హరిహరాద్వైత భావన ‘’కు దారి చూపించాడు .అదో ఉపాసనా మార్గం గా భావించాడు ..’’ఆయన ఉభయ కవి మిత్రుడే కాదు ,ఉభయ తత్వ మిత్రుడు ‘’అన్న కోవెల సంపత్కుమారాచార్యుల వారి మాట అక్షర సత్యం .ఈ భావన తిక్కనా చార్యుని సృష్టే .అందుకే ఎర్రన ‘’తను కావించిన సృష్టి తక్కోరుల చేతం గాదు నాన్ ‘’అని కీర్తించాడు .నన్నయ తన భారతాన్ని రాజ రాజ నరేంద్ర మహా రాజుకు అంకితం ఇస్తే ,తిక్కన ‘’హరిహరాద్వైత మూర్తి ‘’కి నైవేద్యం గా సమర్పించాడు .అంకిత విషయం  లో కొత్తదారీ చూపాడు తిక్కనా మాత్యుడు .

             కవిత్రయం లో చివరి వాడు ఎర్రన .హరివంశం ,భారత అరణ్య పర్వ పూరణ ,నృసింహ పురాణం రాశాడు .తన రచనలను నరాన్కిత మూ  చేశాడు .నరసిమ్హాన్కిథమూ చేసి పై ఇద్దరి మార్గాలను అనుసరించాడు .’’హరి వంశం ‘’భారతానికి ఖిల పర్వం .అందుకే ముందు దీన్ని రాసి ,తర్వాతభారతం పూర్తీ చేశాడు .ఎర్రనకు నన్నయ ,తిక్కనలు ‘’అబ్జాసన కల్పులు ‘’అనే భక్తీ భావం ఉంది .సాక్షాత్తు సృష్టి కర్త లైన నన్నయ ,తిక్కన ల కవితా ముద్ర ను తన పై వేసుకొని ‘’ప్రబంధ పరమేశ్వరుడు ‘’అయాడు .ఈ పరమేశ్వర పదం ఎర్రన కవితా శ్రేష్టతను తెలియ జేసేది మాత్రమే .ఎర్రన తో క్కిన కొత్త మార్గం ‘’సూక్తి వైచిత్రి ‘’అని కవి సార్వ భౌముడైన శ్రీ నాధుడే కీర్తించాడు .ఎర్రన శైలి వర్ణనాత్మకం ..నృసింహ పురాణం అంతా వర్ణనా మయమే .అందుకే దాన్ని ‘’ప్రబంధం ‘’అన్నాడు ఆయన .అదే తర్వాత వారికి మార్గ దర్శకం అయింది .భావుకులైన వారు మెచ్చే కవిత్వం అది . ‘’సర్వమార్గేచ్చా విదాత్రువు ‘’అని కవి సామ్రాట్ విశ్వనాధ ఎర్రనకు కీర్తి కిరీటం పెట్టాడు .ఇతి హాస ,పురాణ ,ప్రబంధ రచనా విధానాలకు  దారి చూపించిన ‘’జ్ఞాత శిల్పి ‘’ఎర్రన .ఇప్పటి దాకా వచ్చిన కవిత్వాన్ని’’మార్గ కవిత్వం’’ అన్నారు

            సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —  18-5-12.   –కాంప్—అమెరికా  

 
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

ఆది వాసుల వాణి –జూడిత్ రైట్

   ఆది వాసుల వాణి –జూడిత్ రైట్ — 
”ఆమె కవి గా గొప్ప సేవ చేసింది .నీతికి నిబద్ధు రాలైన  నాయకు రాలు .విలువలను చెప్పింది ,విలువైన   జీవితాన్ని గడి పింది.భూ బకాసురుల నుండి భూమిని నమ్ముకున్న వారిని కాపాడింది .ప్రజల కష్టాలను ,నష్టాలను ,కన్నీటి గాధలను కళ్ళకు కట్టించింది . ”అన్నాడు ఆస్ట్రేలియా కవి రాబర్ గ్రీ– జూడిత్ -రైట్  గురించి .కెవిన్ హార్ట్ అనే గొప్ప విమర్శకుడు ”ఆమె కు తెలుసో లేదో కాని ,ఆమె కవితల్లో మనం జీవిస్తున్నాం ”.అని ప్రశంసించాడు .అంతటి మహా రచయిత ,ఆస్ట్రేలియా దేశ ఆదిమ సంతతి కి వాణి గా ,ప్రతి నిదిగా కీర్తి ప్రతిష్టలు పొందినది జూడిత్ .
అసలు పేరు జూడిత్ అరండేల్ రైట్ ..1915 మే 31 న న్యు సౌత్ వేల్స్ లోని ఆర్మిడేల్ దగ్గర ”తల గారా” లో జన్మించింది .పశువుల పెంపకం దారుల కుమార్తె .చిన్నప్పటి నుంచే పొలం ,పుట్రా పశువులు   ,పాడి పంట ,పూలు పళ్ళు ,గుర్రాలు ,పోనీలు అంటే అభిమానం .ఇంటి వద్దే  చదువు కొంది .తల్లి చిన్నప్పుడే చని పోయింది .మేనత్త దగ్గర పెరిగింది .ఆర్మిడేల్ లోని న్యూ ఇంగ్లాండ్ గర్ల్స్  స్కూల్ లో చేరింది .ఆ వాతావరణం చూసి ”తాను తప్పక కవిని అవుతాను ”అని అనుకొన్నది .తర్వాత ఇంగ్లీష్ ,ఫిలాసఫీ లను సిడ్ని యూని వేర్సిటి లో  చది వింది .25 ఏళ్ళకే మొదటి కవిత ప్రచురితమైంది .
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తండ్రికి సాయం చేయ టానికి స్వగ్రామం చేరింది .తరువాత క్వీన్స్ లాండ్ వర్సిటి లో రిసెర్చ్ ఆఫీసర్ అయింది .అప్పుడే మేంజిన్ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకు రాలైంది .  1946  లో ”the moving  image  ”అనే మొదటి కవితా సంకలనాన్ని తెచ్చింది .ఆ తర్వాత ఆపు లేకుండా దాదాపు యాభై పుస్తకాలను రాసి ప్రచురించింది ..అందు లో 15 కవితా సంకలనాలున్నాయి . మిగిలినవి సాహిత్య విమర్శలు ,జీవిత చరిత్రలు ,.చరిత్రలు ,వ్యాసాలు ,పర్యావరణ విషయాలు ఉన్నాయి  .సాంప్రదాయ ఆస్ట్రేలియా మహిళ గా ఉండటానికి ఇష్టపడేది కాదు .1950 లో నవలా రచయిత ,ఫిలాసఫర్ అయిన జాక్ మేకన్నీ తో బ్రిస్ బెన్ నుంచి  దేశం అంతా పర్యావరణ పరిశీలన కోసం తిరిగింది . కూతురు పుట్టింది .వారిద్దరికీ 1962 వరకు పెళ్లి కాలేదు .భర్త 1966 లో మరణించాడు .
యాభై దశకం లో యూడిత్  సాహితీ ,సాంఘిక యాత్ర ఆపు లేకుండా సాగింది .ఆమె ప్రజా కవిగా మారింది .the morning image  తో ప్రారంభించి ఆస్ట్రేలియా అంద చందాలను ,ప్రకృతిని పర్వతాలను లోయలను పంటలను పుష్ప జాతులను కవిత్వం లో దిమ్పెసింది .ఆమె కు ప్రకృతి ని చూస్తె పరవశమే . తన” మదర్ ఇంగ్లాండ్ ”ను అందులోని నిగూడ్హత  ,తవ్వి తీసింది .అక్కడి విభిన్న జాతుల స్వరూప స్వభావాలను ,వారి సంస్కృతులను ,కవిత్వీకరించింది ..వాటి ప్రభావాన్ని చాటి చెప్పింది ”south of my days ,”metho drinker ,country town కవితల్లో వీటిని పొందు పరచింది
1949 లో వచ్చిన woman to man ”అనే రెండవ కవితా సంపుటి లో స్త్రీల సెక్స్ విషయాలు ,కోరికలు గురించి రాసింది వారిలో అవగాహన కల్పించింది .సెక్స్ లోని పరమార్ధాన్ని ,ఆధ్యాత్మిక అనుభూతినీ  వివ రించింది వీటి ని ప్రభుత్వం పాఠ్య గ్రంధాలలో  చేర్చిందంటే ఆమె రచనా ప్రభావం ఏమిటో తెలుస్తోంది .ఆ తర్వాతి కవితలన్నీ లాండ్ స్కేప్ ల పై రాసింది .”  .the true fires
”” సంకలనం లో ఇంగ్లీష్ వారు ఆదిమ జాతులను anagaa ర్చిన  విధానం ,వారి సంస్కృతికి జరిగిన అన్యాయం ,,ఆంగ్లేయుల మానసిక స్తితి గతులను లను గొప్పగా చూపించింది ”.బోరా రింగ్ ”సంకలనం లో ఆదిమ వాసుల సంస్కృతికి అద్దం పట్టింది .
             వన్య ప్రాణు లపై  ఉన్న అభిమానాన్ని ”astreliyan birds” లో నిక్షిప్తం చేసింది .వీటి ప్రభావం ఆస్ట్రేలియా వాసుల పై బాగా పడింది .భూమిని ,పర్యా వర ణాన్ని అరుదైన జాతుల్ని సంరక్షించు కోవాలన్న ధృఢ మైన అభి ప్రాయం వారిలో కల్గించింది .న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లను ,వాటి వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజా దృష్టికి తీసుకొని వెళ్ళింది .ప్రభుత్వం ,బడా పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై పర్యావరణాన్ని కబలిస్తున్నారని యేలు గెత్తి చాటింది .
క్కై నారని ఎలుగెత్తి చాటింది .ఆస్ట్రేలియా వాసుల గుండె చప్పుడు గా ,వారి భావి భాగ్య విధాత గా ఆమెను అందరు భావించారు .సాహిత్యం ,పర్యావరణం ,సాంఘిక రంగాలల్తో ఆమె త్రివేణీ సంగమం గా సాగింది .జాతీయ రాజ కీయాలను ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో ఆమె ఒక్కరుగా నిలిచింది .కవిత్వం ,ఇతర రచనల ద్వారా ఆస్ట్రేలియా    దేశ సరి హద్దుల్ని ,అక్కడి వన్య ప్రాణులను ,ఆదిమ మానవ జాతి ని ,వారి చరిత్రను సరి దిద్దింది ”.గ్రేట్ బారియర్ రీఫ్’ ను ఆయిల్ డ్రిల్లింగ్ నుండి రక్షించ గలిగింది ”.ఫ్రీజర్ ఐలాండ్” ను కాపాడింది .వాటి అస్తిత్వాలను శాశ్వతం చేయ గలిగింది ..అప్పటి వరకు మగ వారి గురించి ,గుర్రాలు ,భూ పోరాటాల కే పరిమిత మైన ఆస్ట్రేలియా సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి కొత్త పుంతల్ని తోక్కించింది జూడిత్ .స్తీ పురుష సంబంధాలను కొత్త కోణం లో తెలియ జెప్పింది .ఆడవారికి సెక్స్ విషయాలపై మంచి ఆవ గాహన కల్పించింది .ఒక రకం గా జాతిని జాగృతం చేసినదని చెప్ప వచ్చు . వయసు మీద పడుతున్నా కవితా వ్యాసంగం తగ్గ లేదు .1963  లో  five senses
అనే కవితా సంపుటి తెచింది .వర్షాధార అడవులు వినాశనం అవటాన్ని చూస్తూ ఊరు కో లేక ప్రతిఘటించా టానికి wild life society for queens land ఏర్పరచి అద్యక్షు రాలైంది .
ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల సాధనకు నడుం బిగించి ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళింది .ఇంత చేస్తున్నా కవిత్వ ధార ఇంకి పోలేదు .శ్రోతస్విని లా ప్రవహిస్తూనే ఉంది .
”the other half ,”-”Alive poems ,”human pattern ;;మొదలైన పుస్తకాలను ముద్రించింది వీటికి తోడూ ఏడు పుస్తకాలుగా సాహిత్య చరిత్ర ,విమర్శ గ్రంధాలను కూడా వెలువరించింది .
”              వన్య ప్రాణి సంరక్షణ  కాకుండా  national park association of New south vels ,”south coast coservation council ”amnesty internation ,Aastreliyan society of authors .
వంటి అనేక సంస్థలలో సభ్యురాలుగా ఎన్ని కైంది .1975  లో ఆస్త్రేలియన్ నేషనల్ వర్సిటి కౌన్సిల్ కు ఎన్నికైన మొదటి మహిళ గా రికార్డు సృష్టించింది .ఆదివాసుల కు జరిగిన అన్యాయాలను సరి దిద్ద టానికి
aborginal treaty council  కు మెంబర్ అయింది .1981  లో నేటివ్ ప్రజల హక్కుల్ని క్వీన్ లాండ్ సెటిలర్స్ కాల రాస్తుంటే ఆ విషయాలన్నీ the cry of the dead లో ,వివరించి 1985  లో
we call for a treaty లో అన్నీ ఏకరువు పెట్టింది .ఎంతో కాలమ్ ఉపన్యాసాలు ,కవిత్వాన్ని చదివి విని పించటం తో గడిపింది .లెక్క లేనన్ని బహుమతులు ,పురస్కారాలు పొందింది .ఆమెను సన్మానించని సంస్థ లేదంటే ఆశ్చర్యం లేదు ..1992  లో ఆమె కవిత్వానికి అత్యుత్తమ మైన” క్వీన్స్ గోల్డ్ మెడల్” లభించింది .చని పోవ టానికి ఒక నెల ముందు కాన్ బెర్రా నగరం లో” రి కన్సిలిఎషణ్ మార్చ్” లో పాల్గొని దాదాపు తుది శ్వాస దాకా ప్రజా వాణిని విని పిస్తూనే ఉన్న మహా రచయిత .2000  జూన్ 25  న జూడిత్ రైట్  మరణించింది .ఆమె జీవిత చరిత్ర ను వేరోనికా బ్రాడీ రాశాడు .అందులో ఆమె స్వీయ చరిత్ర ను కూడా చేర్చారు ..కారణ జన్ము రాలు ,మార్గ దర్శి ,ఉద్యమ సారధి ,ఆదివాసుల వాణి జూడిత్  రైట్ ..

గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -05 -12
క్యాంపు–షార్లెట్ –నార్త్  కరోలిన -యు.ఎస్ .ఏ.
             ఫోన్ –001 –248 -212 -03 -66 .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

(248) 786-8594 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వత్సవాయి ఉన్నత పాటశాల ‘ఆత్మీయ కలయక ‘ శుభా కాంక్షలు

            శుభా  కాంక్షలు

ప్రియ మైన చిరంజీవులకు శుభాశీ స్సులు .మీరందరూ కలిసి ఒక చారిత్రాత్మక మైన పూర్వ విద్యార్ధుల సమా వేశాన్ని నిర్వహించటం చాలా ఆనందం గా ఉంది .సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం వత్సవాయి ఉన్నత   పాటశాలను వదిలిన మీరు మళ్ళీ ఆత్మీయత ,అనురాగాలను మేళవించుకొని మాత్రు సంస్థ ఆవరణ లో కలుసుకొని ,మీ అనుభూతులను నెమరు వేసుకొని ,మీరు ఆ విద్యాలయానికి ఏరూపం గా మీ సేవలు అందించి దాన్ని అన్ని విధాలా అభివృద్ధి పధం లోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలో అని ఆలోచించ టానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావిస్తాను .మీ ఆశయానికి నా మనస్పూర్తి అభినందనలు ,మీ అందరికి శుభా కాంక్షలు .నేను మొదటి సారిగా ఆ విద్యాలయం లో పదోన్నతి  ని పొంది ,ప్రదానో పాద్యాయునిగా 1987 -88 .లో పని చేశాను .అన్ని వసతులు ఉన్నా విద్యలో వెనుక బడి ఉండటం బాధ వేసింది .మీరందరినిఉత్సాహ పరచి ,ప్రత్యెక తరగతులను నిర్వ హించి ,హాస్టల్ విద్యార్దులకు కూడా ప్రత్యెక క్లాసులు నిర్వ హించి మీలో ప్రేరణ కల్గించాను .దీనికి నాకు విద్యాలయం లో అందరు ఉపాధ్యాయుల సహకారం మీ సహకారం  లభించింది అక్కడ ఏమైనా మంచి జరిగితే అది ఆ విద్యా కుటుంబం యొక్క గొప్పతనమే .వ్యక్తిది కాదు .సమర్ధులైన ఉపాధ్యాయులు నేను పని చేసిన కాలమ్ ఉండటం నా అదృష్టం .విద్యాలయం చేసుకొన్న అదృష్టం ..అది మరువలేని విషయం .విద్యార్దులుగా మీరు ఆ నాడు కొంచెం అలసత్వం చూపినా మంచి ని చెప్పే వారిని గౌరవించటం మరువ లేనిది .మీరందరూ జీవితం లో ఏదో ఒక సంతృప్తి కరమైన వ్రుత్తి లో స్థిర పడి ఉంటారని ఆశిస్తున్నాను .మాతృదేశం ,మాత్రు సంస్థ లతో మన అనుబంధం శాశ్వత మైనవి .వాటిని కంటికి రెప్ప లాగా కాపాడు కోవాలి .వాటి అభివృద్ధి లో మనం పాలు పంచుకోవాలి.గురువులను గౌరవించటం అందు లో ఒక భాగం .ఈ శుభ సందర్భం లో మీరు మీ గురువులను సత్కరిస్తున్నారని తెలిసి ఆనందం గా ఉంది .ఇటీవలే ప్రారంభమైన ”బాక్ టు స్కూల్
” కార్య క్రమాన్ని పూర్వ విద్యార్ధులందరూ తమ గ్రామాల్లో తాము చదువు కొన్న విద్యాలయాలలో జరుపు కొంటు ,ఆ విద్యాలయ అభి వృద్ధికి తమ వంతు సేవ లందించటం చాల శుభ పరిణామం..ఈ ప్రేరణ నిలవాలి .మీరు భవిష్యత్ తరాలకు ఆదర్శం అవాలి .వీలైనప్పుడల్లా కలుసు కొంటు ,,స్పూర్తిని పొందుతూ ,మీ తరువాతి తరానికి ప్రేరణ నిస్తూ ముందుకు కదలాలని ఆకాంక్షిస్తున్నాను .నాకోసం మీరు పనిగట్టు కోని వచ్చి ఆహ్వానాన్ని మా ఇంట్లో అందించటం నాకు మహదానందం గా ఉంది .ఉయ్యూరు లో ఉంటె తప్పక వచ్చి మీ ఆనందం లో భాగస్వామిని ఆయె వాడిని .సుదూరం లో ఉండటం వల్ల మీకు నా శుభాకాంక్షలను మెయిల్ ద్వారా పంప వలసి వచ్చింది .నేను తప్పక రాసి పంపాలని మీరందరూ కోరటం మీ సహృదయతకు నిదర్శనం .మీ అందరికి మరో సారి అభి నందనాలు .కార్య క్రమం అందరి సహకారం తో వైభవో పేతం గా ,ఉత్సాహ భరితం గా విజయ వంతం గా జరగాలని మనస్పూర్తి గా కోరు కుంటు, జరుగు తుందని నమ్ముతున్నాను ..—మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -05 -12 .
కాంప్–షార్లెట్ -నార్త్  కెరొలినా –యు.ఎస్..ఏ.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

 కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

                                                         సీతా సాధ్వి –

      యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. శ్రీ రామునికి ఏమీ కాదు అనే ధైర్యం లోనే ఉంది .ఆమె విశ్వాసానికి రావణుడు ఆశ్చర్య పోతాడు .

‘’అతని యందీమెకు గల ప్రత్యయంబు  లోతునకు ,సముద్రములు చాలవు ..ఎత్తు న కు పర్వతములు చాలవు .వేగమున నదులు చాలవు .ఇంత ప్రశ్రయము విస్హ్లాదీకరింప శివుడో  క్కడే దయ చూడ వలె ‘’అను కొంటాడు . రాముని క్షేమాన్ని స్వయం గా చూసిన సీత ,లోకం లోని స్త్రీలు సహజం గా ,ఆపద సమయం లో మొక్కే మొక్కులను మొక్కు కుంది నాధుని క్షేమం కోరి .

‘’రాఘవుండు ఆపద దాటినం ,త్రిదశ వంద్యున కాహుతి యౌదు నగ్నికిన్ ‘’.అని తనకు ఆ ఊహ కల్గించిన రావణుని గురువు గా స్వీకరించి ,ఆతనికి నమస్కారం చేస్తాను అంటుంది .దీనికి రావణుని స్పందన కూడా తమాషా గా ఉంటుంది .’’సుదతీ ఇంక నతండు నీకు బతి యంచు గూరు చుంటే ని ,దాన ది యుండెం గద, వాని వంటి పతి చే నగ్ని ప్రవేశం బు తప్పదు ‘’ .ఇద్ద్దరి మాటల్లో ను భవిష్యత్’’ చితి ప్రవేశం’’ కన్పిస్తుంది .ఆయన మాటల ఈటెల కైనా నీకు అగ్ని ప్రవేశం తప్పదు అని రావణుని భావం .ఆమెది మొక్కు .దీన్ని ఇతని మాటలతో తమాషాగా కలిపాడు కవి .

               అగ్ని ప్రవేశం చేయ బోతూ సీత నాదునితో ‘’ఇరువురము నొక్క వెలుగున –చెరి సగమును ,దీని నెరుగు శివుడోకరుండే-పురుషుడ వైతివి –నే  గరిత ను గా నైతి ‘’అని అంటుంది .అదే ఆమె చెప్పిన చివరి రహస్యం .ఆ రహస్యం విప్పట మే రామాయణ కల్ప వృక్ష శాఖా చంక్రమణం .అదే సాధించి చూపించాడు విశ్వ నాద .రసజ్ఞాతకు ,భావుకత కు ,అలంకార ప్రశస్తి కి ,వివిధ సందర్భోచిత వృత్త ప్రయోగ చాతుర్యానికి ,,భావా విష్కరణకు ,శిల్ప మర్మజ్నత కు ,ఊహా వైభవానికి ,,దివి ,భువుల సంగమానికి ,కల్ప వృక్షం సాక్షీ భూతం .ఎంత చివరికి ఎక్కితే అంత అమృత ఫల సిద్ధి .అక్కడ నుండే ఊర్ధ్వమూలం ,అధశ్శ ఖా తత్వ విచారణ .సీతా రాముల దాంపత్యం అనంతం .వారి ప్రేమా అనంతమే .ఆది  దంపతు లైన లక్ష్మీ నారాయణులే వారిద్దరూ .చివరగా విశ్వ నాద మాటలతోనే నమస్కారం –

‘’సీతయు ,రామ చంద్రుడును ,జేతము లందు యుగాలు గల్పము

నాతియు ,బూరుషుండు గ ,ననంతర దంపతి భావ,యాపనా

వ్యాతత ,సంస్కృతి ప్రధము లైన టు లాత్మ దలంచు చుందు ,రా

సీతకు ,రామ చంద్రునకు ,జేతము లంద లి ప్రేమ ఎట్టిదో ?’’

   సమాప్తం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-5-12.—కాంప్—అమెరికా .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 1 Comment

కల్ప వృక్షపు స్త్రీలు –3


                        కల్ప వృక్షపు స్త్రీలు –3

                                                                 సీతా సాధ్వి

                                  రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా గొప్పవి ,ఉత్తమోత్తమ మైనవి అని ఫణి హారం  ‘’వల్లభా చార్య ‘’అనే ప్రముఖ విమర్శకుడు ,రచయిత అన్నారు .అందులో ఒకటి విశ్వనాధ అద్భుత జ్ఞాన జ్యోతి –

‘’నిగమ నిగమార్ధముల్ జగము నిండెను ,తన్నిగమాంత వైఖరుల్

నిగమ చయమ్ము కన్నహవళించెను,తన్నిగమాంత చూడమై  

తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము ,బ్రహ్మము మౌళి ,సీత ,కేం

జిగురు గోటి రుచి కే రుచిమంత మదెంత చిత్రమో /’’

 రెండవ పద్యం అనుభూతి కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ రాసిన ‘’అద్వైత మాన్మదం’’ లోనిది .

‘’ఏ శరదిందు రేఖ స్ప్రుశియిం పగనవ్వినా సన్న జాజి ,ఆ

శా శికతా  తలాల ,చిరు సవ్వడి ,దొర్లేడి పాల నూర్వు ,,యే

మూసినకొండ కొన కోన మ్రోగిన వేకువ వెల్గు మువ్వ ,నీ

తో సరి రావుగా ,వికసితోత్పల నేత్ర మైధిలీ ‘’

అలాంటి ముని అయిన రామునితో సీత అను బంధం అద్వైత మాన్మధమే .ఆడి దంపతులే కదా వారిద్దరూ .రామత్వం మూర్తీ భావించిన సీత ను సుందర కాండలో విశ్వనాధ ‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రుతి ‘’అని వర్ణించే పద్యం నభూతో నభవిష్యతి .ఆ దర్శనం ఆత్మా యోగి అయిన విశ్వ నాధకే సాదయం .అంతటి ఆత్మా యోగి ,మనస్స న్యాసి విశ్వనాధ .

అత్రి మహర్షి బార్య అనసూయా దేవి సీత ను కన్నా బిడ్డ లా చూస్తుంది .లంకలో తనను రాముడు అన్న మాటలను ఆమె తో చెబుతుంది సీతా దేవి .ఆమెకు కోపం వచ్చి రామున్ని కోపం తో నిండిన కాళ్ళ తో చూస్తుంది .ముని పత్ని శ్రీ రాముడిని శాపిస్తుందేమో నని సీత అంతలోనే భయ పడి పోతుంది ..మళ్ళీ అందరు పుష్పక విమానం ఎక్కి వెళ్లి పోతున్నప్పుడు అనసూయ చేతి లో’’ రెండు ఫలాలు’’ ఉంచి ఆశ్రమం లోనికి వెళ్లి పోతుంది .సీతకు అభయం –భర్త రాముడు చూప లేని అనురాగం మాత్రు భక్తితో బిడ్డలు తీరుస్తారని అభయం .కవలలు జన్మిస్తారని సూచనా .సుకుమార సన్నీ వేశం .పరమ సూ క్ష్మ మైన శిల్పం .విశ్వనాధ
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2

          దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే భావి  భావన సూచిస్తాడు .అదీ విశ్వనాదీయం .

‘’కౌసల్యా ముక్తి కంతా సమానాకార ,నలి సుమిత్ర యుపాసనా స్వరూప –విజయ రమా కార వినయామ్బుధి బుద్ధి సుమిత్ర

కైకేయి మధు సామ గాన మూర్తి ,-కౌసల్య నవ శరత్కాల మందాకినీ –సిత పుండరీకంబు  శ్రీ సుమిత్ర

మందార పుష్పంబు మహిళా మణిసుమిత్ర –కైకేయి నును నల్ల కల్వ పువ్వు ‘’

కౌసల్య రాముని తల్లి .ముక్తి కాంతా సమాన మైన ఆకారం కలది .లక్ష్మణుడు ఉపాసనా స్వరూపుడు .శత్రుఘ్నుడు విజయానికీ ,వినయానికీ ప్రతీక .భరతుడు పరమ భాగవత శ్రేష్టుడు .అందుకని కైక ను ‘’సామ గాన మూర్తి’’ అన్నాడు విశ్వనాధ .శరత్కాల మందాకినీ కౌసల్య .-అంటే స్వచ్చమైనది .,శాంత మైనది .ఆమె తో  ఉన్న సుమిత్ర సిత పుండరీకం .అంటే తెల్ల తామర .మరి కైకేయి ?నల్ల కలువ పువ్వు .రాజులకు అత్యంత ప్రీతీ పాత్ర మైంది .ఉద్రేకి అని నిగూఢ భావం .ఆమె తో ఉన్న సుమిత్ర మాత్రం యెర్ర మందారం .గుణాలకు ప్రతీక లుగా వీరిని తన అసమాన పతిభతో తీర్చి దిద్దాడు కవి సమ్రాట్ .

            రాముని చాప విద్యా గురువు కైక .అస్త్ర విద్యా గురువు విశ్వా మిత్రుడు .సీతా రాముల కళ్యాణం తో విశ్వామిత్రుడు తన పని ముగించు కొని వెళ్లి పోతాడు .కాని శ్రీ రాముడు అడవికి వేడితేనె, కాని, అసలు రామాయణం మొదలు కాదు కదా .ఆ పనికి ప్రేర ణ కైక . .ఆమె కూడా శ్రీ రాముని ప్రేరణ తోనే చేసింది . ‘’ .రాముని ఉపనయన సమయం లో కైక ‘’వజ్ర పుంఖిత వాలు టమ్ము ‘’ భిక్ష గా పెట్టింది .ఇది ఒక వింత భిక్ష .వెంటనే రాముడు ఉప్పొంగి పోయాడు .తనకు తగిన భిక్ష అని ఆనంద పారవశ్యం చెందాడు .రాముడి భవిష్యత్తు ‘’దైత్య సంహార గాదా పాండిత్య సముద్ర మూర్తి ‘’కాగలదు అనీ కైక భావన ,ఆశ .’’మొగమున నింత యై ,మురిసి పోయెను రాముడు ,కైక కన్నులన్దిగము మరింత ఇంత యయి ,,ఏళ్లులు  వారే ,–తద న్తరస్థగిత  రఘూద్వాహ ప్రవిల సచ్చిశు  మూర్తి మరింత ఇంతయై ,జగములు పట్ట రాని యొక సాహస దీర్ఘ తనుత్వమొ ప్పగన్ ‘’’

            అహల్య విషయం లో కవి చాలా లోక మర్యాదను పాటించి ధర్మోప దేశం చేశాడు .స్త్రీ ,పురుషులు సంగమం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరనేది లోక విదిత మైన విషయమే .ఉంటె వాంఛ  పెరుగుతుంది .తీరే మార్గం లేక పోతే తప్పటడుగులే .పతనం ప్రారంభమే .ధర్మ చ్యుతి జరిగి పోతుంది .అందుకే అహల్యను ‘’మంజూషికా రత్నం ‘’ అని ఎవ్వరూఅనని మాట ను అన్నాడు విశ్వనాధ .రత్నం పెట్టె లోనే ఉంది .వాడకం లేదు .గౌతమ మహర్షి వెయ్యి సంవత్స రాల దీర్ఘ తపస్సు లో మునిగాడు .భార్య యవ్వనాన్ని ,సౌందర్యాన్ని గురించిన చింత లేదాయనకు .మరి అహల్య లావణ్యం అంతా పోత పోసి సృష్టింప బడిన ‘’జగదేక సుందరి ‘’.సంసార సౌఖ్యం పొందని రుషి భార్య .అందుకే ఆమె లో ‘’లౌల్యం ‘’ప్రవేశించింది..ఆమెను ప్రేమిస్తూ తపిస్తూ , చాలా కాలం నుండి ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు .ఆ సందర్భం లో అతని మనస్సు లోని మాట ను కవి ఆవిష్కరిస్తాడు –

‘’ఇది నీకై యది ఎన్ని యేండ్లు దిగులయ్యె  నాకహల్యా ‘’అని ఒకే ఒక్క వాక్యం లో తన కోరిక తెలిపాడు .రహస్యం గా కలవాలి .సమయమా లేదు .త్వర లోనే తన కోర్కె తీరాలనే తపనతో ‘’అతి తక్కువ మాటలతో ‘’ తన మనో భావం వ్యక్తం చేశాడు .పని కావాలి ముందు .మాటలకు సమయం కాదు .అదీ ఇంద్రుడి ఆత్రం .సంక్షిప్తత కు అద్దం  పట్టే సన్నివే శం .

          అహల్య ‘’ఇది ఆదనా!కోడి కూసింధా ?’’అన్నది .  అంటే కోడి కూస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లే .అని భావించి వచ్చేశాడు .ఆమె మాటలు పదే ,పదే  తలచు కొన్నాడు దేవేంద్రుడు .ఆమె సొందర్యాన్ని కళ్ళారా చూడ టానికి రెండు కళ్ళు చాలటం లేదా కామోద్రేకికి .ఆమె శృంగార రసాభిజ్ఞాతకు పరవ శించాడు . బుద్ధి మహా వేగం గా ప్రవహిస్తోంది దేవ రాజు కు ..ఆ ప్రవాహానికి’’ కన్నులు చిదిసి వేయి ముక్క లు ‘’ అయాయట .ఇది గౌతముడు ఇవ్వ బోయే శాపానికి సూచన .అంత సూక్ష్మం గా ఆలోచించి చెప్పగలడు  విశ్వనాధ . ఈ కధ చెప్పటం లో విశ్వనాధ ఆంతర్యం ‘’నీతి చెప్పటానికి ,ధర్మ బోధకు జారత్వం ధన మదాంధుల చెడు లక్షణం అని చాట టా నికే ‘’.అంటాడు ఆయనే .శ్రీ రామ కధా భాష్యం జారత్వం కూడదు అనే సందేశమే అంటాడు ..అహల్య మహా పతివ్రత .కానీ’’ కా మునికీ ,కాలానికీ ‘’లొంగింది ‘’పాపపు పని చేయక పోయినా ,రుషి పత్నిని కామ వాంచ బాధించింది .శాపగ్రస్త అయింది .తపస్సు చేసి పునీతు రాలింది .అందుకే శ్రీ రామునికిస్వయం గా వండి ,వడ్డించి ‘’రామ ,రఘు రామ ,దశరధ రామ ,యో యయోధ్యా రామ ,జానకీ రామ ,యోయి తండ్రీ ,అసుర సంహార రామ ,,పట్టాభి రామ ‘’అని విందుకు ఆహ్వానం గా సంబోధించింది అహల్యా దేవి .ఈ  సంబోధనలన్నీ భవిష్యత్తు లో జరిగే కధా సూచనలే .ఆమె మహా తపస్విని కనుక అలా సంబోధించటం లో ఔచిత్యం ఉందని కవి విశ్వనాధ సమర్ధించు కొన్నాడు .

           అహల్య కు పంచేద్రియ జ్ఞానం కలిగే సన్నీ వేశం లో విశ్వనాధ చెప్పిన పద్యం పంచేద్రియాలతో చేసే మహా భక్తీ పూర్వక ఉపాసనా క్రమం .అద్భుత మైన పద్య మాణిక్యం .ఏ కవికీ ఇలాంటి భావనే రాలేదు .రాయలేదు కూడా .అందుకే అది విశ్వనాదోప జ్నకం .విశ్వనాధైక మార్గం .అహల్య పాదాలకు శ్రీ రాముడు నమస్కరించాడు .ఇదీ విశేషమే .ధర్మ రక్షకుడుకనుక ,తపో మూర్తి కనుక ,ఆమె తపస్విని కనుక రాముడు అలా చేయటం మర్యాదా పూర్వకమే .ఒక తపః పుంజం లో ఒక భాగం ఇంకో భాగాన్ని గౌరవించటం అనే వేదాంత భావన ఇమిడి ఉందని విశ్వనాధ సత్య నారాయణ గారే స్వయం గా చెప్పారు .మిగిలిన విషయాలు మరో సారి –

   సశేషం –

                     మీ –గబ్బిట   దుర్గా ప్రసాద్ —17-5-12 —కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –1


                               కల్ప వృక్షపు స్త్రీలు –1

             అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ .

  ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో

   హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ న్నట్ట్టి ,యా వ్యోమ పే—శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళపిళ వంశస్వామికున్నట్లుగన్ ‘’

అంతటి దిషణా  హం కారం ఉన్న కవి విశ్వ నాధ ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ ,,పిక కన్యకా నూనవ్యాహృతి మాదు పంచమ మంచిన్డున్ ,దయో నవాభః కణశ్రీ నృత్యంబు ,చూపు మత్కవిత ‘’అని తనను  తానే ఆవిష్కరించు కొన్న విద్వత్ కవి .’’ణా కవితాన్ ,విశాల జఘనా !ఒక ఔచితి లేదు ,భాషలేదాక్రుతి లేదు ,–ఊరక రసాత్మక తనే ,ప్రవహించి ,పోవుదున్ ‘’  .అని తన రాసాత్మతను తెలియ జేస్తాడు .ఇంకొంచెం గడుసుగా ‘’నన్నయ్యయు ,తిక్కన్నయు ,నన్నావేశించిరి ,పరిణా హ మనస్సంచంన్నత  వారలు పోయిన –తెన్నున మెరుగుల ను దీర్చి ,దిద్డుచు పోవుదు న్ ‘’ అంటాడు .అలానే చేసి చూపించాడు .అందుకే విశ్వనాధ శారద ‘’సకలార్ధ దాయిని ‘’.ఆయన కల్ప వృక్షం ‘’సకలోహ వైభవ సనాధం ‘’.

              కల్ప వృక్షం లో అద్వైత తాత్విక దర్శనం ప్రధానం గా చూపారు విశ్వనాధ .వాల్మీకి మహర్షి సుందర కాండ లో ‘’సుందర హనుమంమంత్రాన్ని’’ నిక్షే పిస్తే ,విశ్వనాధ ‘’ఆపదుద్ధార హనుమంమంత్రాన్ని ‘’ప్రతిష్టించారు .సీతా దేవి పరాశక్తి ,శ్రీ రాముడు శ్రీ విద్యో పాసకుడు .రాముడు అరణ్యవాసానికి వెళ్ళే సందర్భం లో వర్ణించిన పద్యాలలో ,’’సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం ‘’ఉందని విశ్లేషకులు గమనించారు .

              శూర్పణఖ లో కామం కాయమంతా వ్యాపించి కళ్ళు మూసుకు పోయాయి .’’లింగ సంబంది కామంబు –లే దు దితిజ ,మనుజ యన్న భేదమ్ము,యౌవనము ,వార్ధకంబున ,దశా ప్రబెధముల్ ,కామ సహిత భావమే దివ్యం ‘’అంటుంది .రావణ డు మొదలైన వాళ్ళు నాగరకత కల వారే అయినా ,వారి కామ దృష్టి ఇంతే .అని పించాడు .ఇది ఆధునిక సమాజానికి ప్రతి బిమ్బమే .అయితే సీతా సాధ్వి దృష్టి లో ‘’చేతో మోహ కుల్యా  నదే మర్యాదాక్రుతి తీర్చు యోగం ‘’ అదీ వారిద్దరి తర తమ భేదం .ఇంత సూక్ష్మ పరిశీలనా దృష్టి ఆయనది .కల్ప వృక్షం లో ముని పత్నులు ,రాక్షస స్త్రీలు అందరు లౌకిక వ్యవహారాలలో మన నిత్య జీవితం లో కని పించే మనుష్యుల్లాగానే ప్రవర్తిస్తారు .

                   కల్ప వృక్షం లో కైక కు పెద్ద పీట వేశాడు విశ్వనాధ .రామ కధ అంతా ‘’కైకేయీ సముపజ్నం ‘’అంటాడు .’’కైకేయీ సముపజ్ఞమియ్యది ,జగత్కల్యాణ  గాదా ప్రవాహాకారంబయి పొల్చు రామ కధ ‘’అని భరతునితో ,ఆంజనేయుని తో  అని పిస్తారు విశ్వనాధ .’’కైక కోరక మహా ప్రభు నీవని రాక లేదు –నీ యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేదు –యా యాడు ది లేక, లేదు జగమంచు –నిదంతయు నేనా చేసితిన్ ‘’అని సీతా  సాధ్వి అగ్ని ప్రవేశం ముందు అంటుంది .రాముడు శుద్ధ సత్య స్వరూపం .ఆయన క్రియా ప్రవృత్తిని స్పందింప జేసింది కైక ..ఆ స్పందనను ఫల వంతం చేసింది సీత .అయోధ్యకు తిరిగి వచ్చిన సీతను కౌగలించు కొని కైక –

‘’ఓసి యనుంగ ! నీవుగా గైకొని ,,ఈ వనీ చయ నికామ నివాస –భరంబదేల్లనున్ —లోకము నన్ను దిట్టుట తలోదరి !మార్చితి –కైక పంపనే గాక ,దశాననాది వధ కల్గునె ,యన్న ప్రశంశ లోనికిన్ –‘’ అని సంబర పడి  పోయింది కైకేయీ.కార్య సాధనకు అంతటి అంతర్మధనం చెందింది కైక .నిశ్చ యాత్మకం గా సీత ప్రవర్తించింది .అంత రంగాల్లో అంతటి భేదం .బాల కాండ నుండి ,యుద్ధ కాండ దాకా ,కైకేయీ స్పురణ రాకుండా కల్ప వృక్ష కావ్యం సాగదు .శ్రీ రాముడు చేసే ప్రతి యుద్ధం లోను కైక ప్రసక్తి తప్పక ఉంటుంది .ఆమె స్థానం అంత ఉన్నత మైనది గా విశ్వనాధ తీర్చి దిద్దాడు .

  సశేషం —                     మిగిలిన విషయాలు మళ్ళీ తెలియ జేస్తాను –

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-5-12.—కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా లో బౌద్ధం

     అమెరికా లో బౌద్ధం

          క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు .అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డారు .1800 లో బౌద్ధం అమెరికా లో ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధం లాటిన్ భాష లో ఉంది .అందుకని దాన్ని అమెరికా వారు స్త్రెంజ్ రెలిజియన్ అని పిలిచారు .1844 లో బాగా వేళ్ళూను కొంది .the d col అనే మేగజైన్ మొదటి సారిగా ఆంగ్లం లో బౌద్ధ గ్రంధాన్ని ప్రచురించింది .1875 లో ఏర్పడిన థియాసాఫికల్ సొసైటీ బౌద్ధ ధర్మానికి ఆకర్షితం అయింది .కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఇక్కడ బౌద్ధ పతాకను ఎగర వేసి ,ప్రాచుర్యం కల్పించాడు .ఆ సొసైటీ స్థాపకులలో రెండవాడీ యన .

              1893 లో చికాగో లో ప్రపంచ మత మహాసభలు జరిగి నప్పుడు ఈ మతాధి పతులు పా ల్గోన్నారు .బౌద్ధం ఆదర్శ వంత మైనదని అట్లాంటిక్ మంత్లీ లో ఒక మెథడిస్ట్ రాశాడు .దానితో చాలా మంది బౌద్ధాన్ని ఆదరించి ,ప్రవేశం కల్పించారు .చికాగో న్యూయార్క్ ,సాన్ ఫ్రాన్సిస్కో లలో మహా బోధి శాఖలేర్పడ్డాయి .1897 లో సాన్  ఫ్రాన్సిస్కో లో ధర్మ సంఘం ఏర్పడింది .అమెరికన్లకు జెన్ శిక్షణ నిచ్చారు . చైనా నుండి మొదటి సారిగా బౌద్ధులు అమెరికా చేరారు 1840-1900 మధ్య రెండున్నర మిలియన్ చైనీయులు  అక్కడి కల్లోల రాజకీయ పరిస్తితులకు భయ పడిదేశాన్ని వదిలి పెట్టి వెళ్లారు . చాలా మంది హవాయి ద్వీపం లో చెరుకు ప్లాంటేషన్ లో చేరారు .ఆ తర్వాతా హవాయి దేశాన్నిఅమెరికా తనలో కలుపు కొంది .కొందరు చైనీయులు కాలి ఫోర్నియా వచ్చారు .దాన్ని వాళ్ళ భాష లో ‘’gam-san  ‘’ .అన్నారు .అంటే ‘’బంగారు పర్వతం ‘’అప్పుడు అక్కడ గోల్డ్ రష్ ఉండేది .అక్కడి సియర్ర నెవాడా లో కొండల కింద బంగారం లభించింది .ఇక్కడికి చేరిన వారు తమ వాళ్ళను పిలిచి రప్పించు కొన్నారు .

          1949 లో కాలిఫోర్నియా లో చైనీయుల సంఖ్యా 55 మాత్రమే .అయిదేళ్ళలో 40,000 అయారు .మొదట్లో మగ వారు మాత్రమే వచ్చారు ..ఆ తర్వాతా కుటుంబాలను తర లించారు .కాలిఫోర్నియా వీరిని బాగా ఆద  రించింది . 1852 లో కాలి ఫోర్నియ లెజిస్లేటర్ గవర్నర్’’ చైనీయులు ఉత్తమ జాతి వారని  ‘’ పేర్కొన్నాడు .అయితే కొన్ని నెలలకే వారి మీద ఆంక్షలు పెరిగాయి .వారికి పౌరసత్వ హక్కులు ఇవ్వం అన్నారు .1882 వచ్చే సరికి చైనీయుల పై అంటి సెంటి మెంట్ పెరిగి పోయింది . 1892 .లో బహిష్కరణ చట్టాన్ని తెచ్చారు .వారిని దేశం లోకి అనుమతించ లేదు .1910లో వలస వారి బంధన సెంటర్లు ఏర్పడ్డాయి . 1920 లో ఇతర దేశాలలోని అమెరికన్లకు ప్రవేశం కల్పించారు .1924 లో ఏడాదికి వంద మందినే అనుమతించారు .అదీ ఐరోపా దేశాస్తులకే .ఇక్కడ పుట్టిన వా తెల్ల వారికే అమెరికా పౌరసత్వం అని తేల్చి చెప్పారు .

             శాన్ ఫ్రానిస్కో  లో మొదటి చైనా దేవాలయం ‘’కాంగ్ చు టెంపుల్ ‘’అనే పేరు తో చైనా టౌన్ లో  ఏర్పడింది .1906 భూకంపం లో దెబ్బతింటే కూల్చేశారు ‘’.kuan tie ‘’అనేఅనే దేవుని విగ్రహాన్ని మాత్రం కాపాడు కొన్నారు .1909 ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి కొత్త దేవాలయం కట్టారు .శాన్ఫ్రాన్సిస్కో కు వంద మైళ్ళ దూరం లో సియార్ర నెవాడా కొండల కింద ‘’ఆరో విల్లి ‘’లో వేలాది చైనీయులు చేరారు .గుడిని ముందు కర్రతో  తర్వాతా రాతి తో కట్టు కున్నారు . దాని ప్రవేశ ద్వారం ‘’పూర్ణ చంద్రుని ఆకారం ‘’లో ఉండటం వల్ల ‘’మూన్ టెంపుల్ ‘’అంటారు .బంగారు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు .

               జపాన్ వారు 1865-1912 మధ్య వలస వచ్చారు .ఈ కాలాన్ని జపనీయులు ‘’మీజి కాలం ‘’అంటారు .1870 లో యాభై మంది మాత్రమే ఉంటె 1992 కి లక్ష మంది జపానీయులు అయ్యారు .వ్యవసాయం చేశారు .వీళ్ళ పైనా ఆంక్షలు వచ్చాయి .కోర్టుల దాకా వెళ్లారు .అయినా పౌరసత్వం ఇవ్వ లేదు .జోడో శింశు అనే బౌద్ధ దేవాలయానికి చెందిన స్కూలు ఇమ్మిగ్రంట్స్ పక్షాన నిలిచింది .’’యంగ్మెన్ బుద్ధిస్ట్ అసోసియేషన్’’ ఏర్పడింది .చైనా వారిలా కాకుండా జప్స్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొన్నారు .ఇక్కడి తమ భర్తల కోసం వేలాది మంది భార్యలు అమెరికా చేరి వారి ఫోటోల సాయం తో  గుర్తించి కుటుంబాలను ఏర్పరచు కొన్నారు .అందుకే 1908-21కాలాన్ని ‘’picture bride era’’అని పిలుస్తారు .

           ఇమ్మిగ్రంట్స్  బాగా పెరిగి పోవటం తో b.m.n.a.సేవా కార్య క్రమాలను చే బట్టింది .ఇక్కడి బౌద్ధ ఆలయాలను బుద్ధిస్ట్ చర్చ  అని పిలిచే వారు .1960 కాలాన్ని’’zen decade for america’’అన్నారు .. 1950  నుండి జెన్ బూం బాగా వచ్చింది .ఈ కాలం లో ‘’బీట్ జెనెరేషన్ ‘’వాళ్ళు జెన్ బుద్ధిజం వైపుకు వెళ్లారు .ప్రసిద్ధ సాహితీ వేత్తలు దీనిలో చేరే సరికి గొప్ప ఆకర్షణ గా నిలిచింది .వారి భావన లో ‘’ఏదో ఒక రోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా వైట్ హౌస్ లో ఒక గదిలో కూర్చుని ధ్యానం చేస్తాడు ‘’ అని నమ్మారు .1990 లో బీట్ జెనెరేషన్ లో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చింది జెన్ . wake up ‘’అనే బుద్ధుని చరిత్ర హాండ్ బుక్ గా వచ్చింది

           shunryu suziki అనే జెన్ గురువు సాన ఫ్రానిస్కో కు వచ్చి బౌద్ధాలయం లో ప్రీస్ట్ అయాడు .అతని ప్రభావంతో 1960,.జెన్ మౌంటేన్ సెంటర్ ఏర్పడింది tassa jaraa hot springs వద్ద .దీని ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిల్స్ .1965-2000 కాలం లో మూడవ ఫేజ్ బుద్ధిజం అమెరికా చేరింది .అమెరికన్లు జెన్ మతం  వైపుకు బాగా ఆకర్షింప బడ్డారు .1965-1990 మధ్య చైనా అమెరికన్లు నాలుగు రెట్లు పె రిగారు .తైవాన్ వారు లాస ఏంజెల్స్ లో అత్యంత సుందర ,విశాల బౌద్ధ  ఆలయాన్ని’’ Hsi lai ‘’అంటే coming to west పేరిట halsinda  heights  లో ౩౦ మిలియన్ డాలర్ల తో  నిర్మించారు .దీన్ని వైస్ ప్రెసిడెంట్ అల్గోరే సందర్శించాడు .ఇక్కడ గురువులకు ఆశ్రమాలున్నాయి .ఇవన్నీ బౌద్ధ సంస్కృతిని ,చైనా ,జపాన్ సంస్క్రుతులను కాపాడు కోవటానికి సహక రిస్తున్నాయి .

   ఇక్కడి నూట యాభై బౌద్ధ ఆలయాలలో శ్రీ లంక ,థాయిలాండ్  ,లావోస్ ,కంబోడియా దేశాల నుండి వ్యాపించిన ‘’తెరవాడా ‘’పధ్ధతి లో పూజాదికాలను నిర్వ హిస్తున్నారు .లంక లో ఉన్న బౌద్ధ విహారం’’ధర్మ వజ్ర ‘’పేరుతొ 1980 లో బుద్ధ పౌర్ణమి నాడు నిర్మించారు .వేలాది బౌద్ధులు ,మత గురువులు హాజరైనారు .

            ‘’  you will always be an asian ,always an out sider ,not an american ‘’అని కిమ్మకొనే సిహరత్ అనే గురువు బోధించాడు .ఇప్పటి బుద్ధిజం పై నిరసనలు విని పిస్తున్నా ,అది అప్రతి హతం గా ముందుకు సాగి పోతూనే ఉంది .1993 లో ‘’world parliament of religions ‘’శత వార్షి కోత్స వానికి చికాగో నగ రానికి వేలాది ఏషియన్ అమెరికంలుతరలి వచ్చి అనుభూతి పొందారు .ఇరవైవ శతాబ్దం లో అమెరికా లోని బౌద్ధుల సంఖ్య మూడు మిలియన్లను దాటింది .

                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15-5-12 –కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం


                             ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం  

హిమాలయాల తర్వాతఎత్తైన పర్వతా లు ఆండీస్ పర్వ తాలు .అగ్ని పర్వతాలు అక్కడ ఉన్నాయి .అవి ‘’పె రు దేశం ‘’నుంచి వ్యాపించాయి .పెరు లో ని పురాతన  ‘ఇంకా ‘’ప్రజలన జీవన విధానం ,దాన్ని పరి పాలించిన చక్రవర్తుల పరి పాలన గురించి తెలుసు కొందాం .అక్కడ సూర్య దేవుణ్ణి విరకోచ అంటారు .(మన –విరోచానుడికి దగ్గర గా ఉందా?)ఆయనే   వారి దైవం .ఒక సారి విరోచ కు ప్రజల మీద దయకలిగి ,ఆకాశం నుండి కొంచెం కిందికి వచ్చి చూశాడు .అక్కడి వారంతా అడవి జంతువుల్లా బతుకు తుండటం చూసి బాధ పడ్డాడు .తన కొడుకు ‘’మాన్కొక పాక్ ‘’కూతురు ‘’మామా ఒకలా’’లను భూమి పైకి పంపి ,ప్రజలకు ఇల్లు ,పట్టణాలు నిర్మించ టానికి  వ్యవససాయం కు సాయం  చేయ మన్నాడు .చివర రెండుగా చీలిన రెండు పొడవైన లావు బంగారు కడ్డీలను వారికిచ్చి ,వాటితో పొలాలు దున్నామని చెప్పాడు .అవి ఎక్కడ లోతుగా భూమి లోకి దిగి పోతాయో అదే గొప్ప పట్టణం అవుతుందని చెప్పి పంపాడు .తండ్రి మాట ప్రకారం వారిద్దరూ భూమికి చేరారు .ప్రదేశాలను గాలిస్తూ సారవంత మైన భూమి కోసం ఒక లోయ చేరారు ..ఒక రోజు ఉదయం మాంకో కాపాక్ తానే మెరిసి పోయే దేవుడిగా భావించాడు .బంగారు కాడి  నేల మీద లోతుగా దిగిన చోటు నుండి ,మైళ్ళ కొద్దీ భూమిని దున్నారు .అప్పుడు సూర్యుని కుమారుడిని తానే అని ప్రకటించు కొన్నాడు .అతనినే ‘’ఇంకా ‘’అంటారు .అక్కడే స్తానికుల సహాయం టో పెద్ద నగరాన్ని నిర్మించాడు .సోదరి కూడా సహాయం చేసింది .ఆ నగరాన్ని’’ కూజో ‘’అని పిలిచారు అంటే ‘’భూమికి నాభి ‘’అని పేరు .ఆ తర్వాతా ఇంకా  పాలన లో అది దక్షిణ అమెరికా లో గొప్ప నాగరక కేంద్రం అయింది .ఇదంతా ఇంకా ప్రజలు తార తరాలుగా చెప్పు  కొంటున్న కధ

                అయితే చారిత్రిక కధనం వేరుగా ఉంది .వారి దృష్టి లో మాన్కోకపాక్ మామూలు మనుష్యుడే .క్రీ.ష1200  లో దక్షిణ అమెరికా నేటివ్ ఇండియన్ల ప్రభువైనాడు .వారి భాష ‘’.quechua ‘’ఆ సామ్రాజ్యమే ఇంకా సామ్రాజ్యం .చక్రవర్తి కి మాత్రమే ఇంకా అనే పేరు ఉండేది .13  మంది ఇంకా చక్ర వర్తులు ఆ సామ్రాజ్యాన్ని స్పెయిన్ వారు 1532  లో ఆక్ర మించే వరకు పాలించారు .సామ్రాజ్యాన్ని రెండు వేళ   అయిదు వందల మైళ్ళు విస్తీర్ణం తో ఉత్తరాన ఈ నాటి కొత్త కొలంబియా నుండి ,దక్షిణ మధ్య చిలి వరకు వ్యాపించి ఉండేది .దక్షిణ అమెరికా పడమటి భాగం ఆండీస్ పర్వతాల పుట్టి నిల్లు .ఇరవై వేల అడుగుల ఎత్తున్న ఈ పర్వతాల పై ఇంకా సామ్రాజ్యం వ్యాపించి ఉంది .

                                                         హైటెక్ సొసైటీ    

          ఇంకా సామ్రాజ్యం లో పటిష్ట మైన కమ్యునికేషన్,రవాణా ,సమర్ధ వంత మైన పాలనా ఉండేవి .రెండు పర్వతాల మధ్య ఖాళీ ప్రదేశాన్ని దాట  టానికి ‘’ఎగేవ్ ‘’అనే మొక్కల పీచు ను తాల్లుగా పేని వేలాడే వంతెనలను నిర్మించారు .14000 మైళ్ళ రోడ్లను నిర్మించారు .మంచు గడ్డలు జారి పడే చోట రాతి గోడలు కట్టి పడ కుండా చేశారు .ఎడారులలో ఇసుక తుఫాన్లు తట్టుకొనే విశ్రాంతి మందిరాలు నిర్మించారు .వీటిని ‘’ఎడోబ్ ‘’ అంటారు .స్పానిష్ పత్రిక’’ పెడ్రో డీ కూజా ‘’రాసిన దాని ప్రకారం ప్రపంచం లోనే ఇంకా వారు నిర్మించిన రోడ్లు చాలా నాన్య మైనవనీ ,గొప్ప వని తెలుస్తోంది .లోతైన లోయల్లో ,ఎత్తైన పర్వతాల మీద ,టన్నెల్స్ లో ,మంచు గట్ల మీద ,జారే మంచులో  మెట్లతో ,రక్షణ ప్రదేశాల తో రోడ్ల నిర్మాణం చేశారు .దారి లో పరిశుభ్రత ,విడిది గదులు ,సూర్య దేవాలయాలు ,స్టోర్ హౌసులు ,అన్ని సౌకర్యాలతో నిర్మించి మనకే ఆశ్చర్యం కలిగించేట్లు చేశారు .

                                                           వార్తా హరులు

     ఇంత విశాల సామ్రాజ్యం లో వార్తల్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకు చేర వేయటం కష్టం .దీని కోసం వేలాది ‘’పోస్ట్ రున్నేర్స్ ‘’ను ఏర్పాటు చేశారు .పది హేను రోజుల షిఫ్ట్ డ్యూటి తో వాళ్ళు పని చేసే వారు .డ్యూటి అవగానే విశ్రాంతి గదుల్లో ఉండే వారు .కంచుశంఖ ధ్వని విని వార్తా హరులు వస్తున్నారని తెలుసు కొనే వారు .వార్తాహరుల్ని chasquis అంటారు .ఎలాంటి భయంకర వాతావరణం లో నైనా వీరు రెండు మైళ్ళ దూరం సునాయాసం గా వెళ్ళ గలరు .రాత్రి ,పగలు లెక్కే లేదు .దారి అంత సుపరిచితం గా వుండేది వీరికి .వ్యాపారం ,కాని  వార్త కాని రోజుకు దాదాపు రెండు వందల మైళ్ళు చేరేవి .

                                                              వ్యవసాయం

  ఇంకా ల ముఖ్య వ్రుత్తి వ్యవ సాయం .ప్రతి కూల వాతావరణం లో కూడా ల్యాండ్ స్కేప్ ల  పై పంటలు పండించే వారు .రాళ్ళతో మెట్లు మెట్లు గా కట్టి  మధ్యఖాళీలు ఉండేట్లు  చేసి ,ఆ మధ్య భాగాన పంటలు పండించే వారు .మనకు తేయాకు తోటలున్నట్లు .ఇప్పటికీ అదే తరహా వ్యవ సాయమే కోన సాగిస్తున్నారు .పర్వతాల మీద ఈ వ్యవసాయ ఏర్పాట్లు పెద్ద’’ స్టేయిర్ కేసులు’’ ల్లా కన్పించి కను విందు చేస్తాయి ఎడారులలోనూ ప్రత్యెక నీటి వసతులు కల్పించి ,నీటి పారుదల సౌకర్యాలేర్పరచి పంటలు పండించారు .వారిచే సస్య శ్యామలం కాని భూమి వుండేది కాదు .స్క్వాష్ ,చిలగడ దుంప ,పత్తి ,యామ్స్ ,ఔషధ మొక్కలు ,బీన్స్ ,మిర్చి ,కోకా ,క్వినోవా లను పండిస్తారు .మొక్క జొన్నతో రొట్టెలు ,కేకులు ‘’ఛి చా’’. వంటి తినే పదార్ధాలను తయారు చేసే వారు .నీరు లేకుండా గడ్డ కట్టించిన బంగాళా దుంప ను ‘’చునొ ‘’(staples )అంటారు .

                                                                   కుటుంబం

          చక్ర వర్తి ప్రతి ఇంటి పెద్ద కు వ్యవ సాయం కోసం కొంత భూమి ని ఇస్తాడు .దీన్ని ‘’తూపు  ‘’ అంటారు .అందులో వంద పౌండ్ల పంట పండించాలి .మూడో వంతు ఫలసాయం రాజుకు ,ఆయన కుటుంబానికి ,అధికారులకు ,మత గురువులకు ఇవ్వాలి .ఇంకో వంతు సైనికులకు ముసలి వారికి జబ్బు పడ్డ వారికి అందించాలి .మిగిలిన మూడో వంతు కుటుంబానికి .పది మంది రైతుల గ్రూప్ కు ఒక మేనేజర్ ,పది గ్రూపులకు ఇంకో అధికారి ,యాభై గ్రూపులకు పర్య వేక్షకుడు ఉంటా రు .పది వేల  మందికి ఒక నాయకుడుంటాడు .వాడిని’’ బిగ్ యియర్స్’’ అంటారు .వాడి చెవులకు చేట  లంత బంగారు చక్రాలున్డటం వల్ల ఆ పేరొచ్చింది .వయసు ప్రాతి పదిక మీద ఆడ ,మగా గ్రూపులుంటాయి .పదిహేను ఇరవై ఏళ్ళ మధ్య మగాళ్ళు సైన్యం లో చేరటం తప్పని సరి .దాని తర్వాత వారికి మంచి పదవి లభిస్తుంది .సైనికుల భార్యలు ఊలు వడికి ,బట్టలు నేయాలి .ఫాషన్ బట్టలు కుట్టాలి .ముసలి మహిళలు పిల్లల సంరక్షణ చూసు కొంటె చాలు .

              అయిదు ఏళ్ళ లోపు పిల్లలు తలిదంద్రులతో పాటు ఇంట్లోనే ఉంటారు .తొమ్మిదేళ్ళ వరకు వడకాలి .చెడు ప్రవర్తనకు తీవ్ర దండన ఉంది .తొమ్మిది పన్నెండేళ్ళ మధ్య పిల్లలు చేలల్లో పంటలను కాపలా కాయాలి .ఆడ పిల్లలు వంట ,వడకటం ఛి చా అనే ఆహారాన్ని తయారు చేయాలి .పన్నెండు ముప్ఫై మధ్య స్త్రీలు ఇల్లాళ్ళు గా  ఉండాలి .వీరందరికీ ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుంది .

                                                                    పరి పాలన

      ఇంకా అది కారులు ప్రజల్ని కట్టు బాటు లో ఉంచు తా రు .తక్కువ నేరం చేస్తే అందరి ముందు అవమాన పరుస్తారు .లేక పోతే కోకా ప్లాంటేషన్ కు పంపేస్తారు .తీవ్ర నేరం చేస్తే రాళ్ళ టో కొట్టి చంపేస్తారు .లేక పోతే చచ్చే దాకా తలకిందుగా వేలాడ  దీస్తారు .ఒక్కో సారి వీపు మీద మోయలేనంత బండలను పెడతారు .ఇవన్నీ మనకు భయంకరం గా కన్పించినా ,పరి పాలన చాలా ఆదర్శ వంతం గా ఉండేది .ప్రజలు సుఖ సంతోషాలతో తృప్తి గా జీవించే వారు .

                                                                  చక్ర వర్తి

            చక్ర వర్తి అంటే సూర్య కుమారుడే అని వారి భావం .బంగారు సింహాసనం మీద కూర్చుని పరి పాలించే వాడు ..చుట్టూ మందీ మార్బలం .ఒక సారి వేసుకొన్న దుస్తులు మళ్ళీ వేసు కొనే వాడు కాదు .వాటిని కుటుంబం లోని వారికిచ్చి వేసే వాడు .ఇంకా ప్రభువు మర ణిస్తే బిగ్ యియర్స్ అనే పెద్దలు రాజ కుటుంబం లో సమర్దున్ని ఎంపిక చేసి వారసుని గా ప్రకటిస్తారు .అతడు తండ్రి నివ శించిన భవనం లో ఉండడు  .వేరే ప్రత్యెక భవంతి ని నిర్మించుకొని అందులో ఉంటాడు .బంగారం ,వెండి అధికం గా లభించేవి. ఇంటి గోడలకు బంగారు వెండి రేకులను తాపడం చేసే వారు . స చక్ర వర్తి తన పాలన ఎలా ఉందొ చూడాలని కుజ్కో నుండి బయల్దేరి ఊరేగింపు గా ,వైభవం గా  అది కారు  లంతా వెంట ఉండగా ,బరాబరులు చేస్తుండగా నగర సందర్శనం చేసే వాడు .ప్రజలు దారులకు ఇరు వైపులా చేరి ఆనందంగా పూల వర్షం కురి పించే వారు .ఆయనంటే దేవుడే .ఆయన చని పోతే భరించ లేక కొందరు ఆత్మా హత్య చేసుకొనే వారు .లేక పొతే నోటిలో ఆకులు కుక్కు కొని ,లేక ముక్కు బిగించి శ్వాస ఆడ కుండా చేసుకొని ఆత్మా హత్య చేసుకోవటం వారికి మామూలే .

                                                              ప్రకృతే దైవం

     పర్వతాలను ప్రజలు దేవుని గా పూజించే వారు .పర్వత దేవుళ్ళ కరుణా కటాక్షాల కోసం ‘’కాపా కోచా ‘’అనే వేడుక చేసే వారు .చక్ర వర్తి చని పోతేనో ,ప్రక్రుతి వైప రీత్యాలు జరిగితేనో ఈ ఉత్సవం చేసే వారు .దేవుని ప్రసన్నం చేసుకోవటానికి ,పర్వత దేవుణ్ణి సంతృప్తి పరచటా నికే ఈ ఉత్స వాలు .అందుకోసం ఏంతో  కష్ట పడి పర్వతాగ్రం చేరు కొనే వారు .అవన్నీ మంచు పర్వ తాలు .తమకున్న విలువైన వాటిని కానుకగా అక్కడ సమర్పించే వారు .ఆహారం ,పానీయం ,బంగారు విగ్ర హాలు ,ఒక్కో సారి పది హేనేల్ల ఆడ మగ పిల్లల్ని కూడా బలిదానం చేసే వారు. .ఈ పిల్లలు పెద్ద అధికారి లేక గ్రామ పెద్ద ల  పిల్లలే అయి ఉండాలనే నియమం ..వారి అవయవాలన్నీ బాగా ఉండాలి అది ఇంకో నియమం .వీరిని బలి ఇస్తే సంక్షోభాలు రావని ఇంకా ప్రజల నమ్మకం .వారిని ఊరేగింపు గా తెసుకొని వెళ్తారు .ఆ పిల్లలు కూడా తామొక పవిత్ర కార్యానికి ఉప యోగ పడుతున్నామని సంబర పడతారట .వారిని బాగా అలంకరించి సకలాభరణాలతో ,పర్వతాగ్రానికి త్తీసుకొని వెళ్లి అక్కడ వదిలేసి రావటమే బలి అంటే .అక్కడ మంచు, గాలి, వర్షాలకు వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చస్తారు .

                                                                          మమ్మీలు

             ఇటీవలి పరిశోధన లో ఆండీస్ పర్వతాల మీద మంచులో పిల్లలు మమ్మీ లు గా కని పించారు .వీరందరూ బలి ఇవ్వ బడ్డ పిల్లలే నని తేలింది .ఒక ఎనిమిదేళ్ళ పిల్ల ,అయిదు వందల సంవత్సరాల మమ్మీ కని పించింది .ఇంకో పద కొండు ఏళ్ళ  అబ్బాయిది అయిదు వేల సంవత్స రాల మమ్మీ .దొరికింది .హిమ ఘాతానికి చని పోయారని తేల్చారు .శరీరాలేమీ పాడు కాలేదు .అమ్మాయి శరీరం పై కప్పిన శాలువా ,దానికి పెట్టిన బంగారు పిన్ను అలానే ఉన్నాయి .తాగే పాత్రలు మెరుపులకు కొంత కాలి పోయి వారి పక్కన కని పించాయి .

                                                               స్పెయిన్ వశం లో ఇంకా

      1532 లో ఇంకా ప్రాంతాన్ని అతి తక్కువ మంది సైనికులతో స్పెయిన్ ఆర్మీ దాడి చేసి వశ పరచు కొన్నది .ఇరవై నాలుగు టన్నుల విలువైన సంపదను దోచుకొని స్పెయిన్ రాజు కు కానుక గా సమర్పించారు .ఇక్కడి ఆదిమ ఇండియన్లు ,ఇప్పటికీ పర్వ తాలను దైవ స్వరూపం గా తండ్రులు గా  ఆరాదిస్తూనే ఉన్నారు .అక్కడ కరగ బెర్రిన హిమ జలాన్ని జబ్బులు తగ్గ టానికి ఉప యోగిస్తున్నారు .ఇంకా చక్ర వర్తులు మహాసామ్రాజయాన్ని  ప్రజల ను సుఖ సంతోషాలతో పాలించి చరిత్ర సృష్టించారు .మనకు వారి పాలనా సామార్ధ్యాని గురించి నేర్చు కావాల్సింది చాలా ఉంది .

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15-5-12.—కాంప్ –అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అనువాదాలు | Tagged | 1 Comment

కల్లోల కెరటం డొరోతి పార్కర్

  కల్లోల కెరటం డొరోతి   పార్కర్
 ఉరక లెత్తే కవితా ప్రవాహం ,ఆవేశం ,దానికి తగ్గ ఆలోచన ,కొత్త పదాల సృష్టి ,విశృంఖలత ,వీర విహారం ,సెక్సు ,కలహాల కాపురం ,వ్యసన పంకిలం ,విపరీత మైన తాగుడు ,ఆందోళన ,డిప్రెషన్ ,అలజడి ,అస్తిత్వ నిరూపణ ల తో ఒక కల్లోల కెరటం గా , జాతి వజ్రం లా మెరిసే రచయిత డొరోతి పార్కర్ .వ్యక్తిగా స్నేహ శీలి ,పదునైన మేధస్సు ,హాస్యం ,రిపార్టీ ,ఆమె కవితాభర ణాలు   .1920 -30 కాలం లో ఆమె యువకుల ఆశాజ్యోతి ,ఐకాన్.ఎంత అభిమానాన్ని పొందిందో ,అంత నిరాశా చవి చూసింది .ఆమె తరం కవుల్లో స్వయం విచ్చేదకకవి అయింది .పడి లేచే ఉత్తుంగ తరంగం పార్కర్ .ఎంతఘాటుగా చెప్పినా,కవిత్వాన్ని ఆదరించటం విశేషం .కధలు ,సమీక్షలు ,దశాబ్దాల పాటు రాసి అక్షరాలకు వన్నె తెచ్చింది .
అక్షరాలకు వన్నె తెచ్చింది .ఒక రకం గా కలం కింద పెట్టని రచయిత .ఆమె కవితా పంక్తులు తీర్చి దిద్ది నట్లున్ది ,పలకరించి పులక రింప జేస్తాయి
               డొరోతి  రోశీల్ద్ పార్కర్ 1893 ఆగస్ట్ 22 న అమెరికా లో న్యుజేర్సి రాష్ట్రం ,లాంగ్ బ్రాంచ్ లో జన్మించింది .సాంప్రదాయకం గా ధనికులైన ఆ కుటుంబానికి ఆ గ్రామం వేసవి విడిది. మాన్  హట్టన్ లో పెరిగింది .పుట్టిన అయిదేళ్లకే తల్లి చని పోయింది .తండ్రి దుస్తుల ఉత్పత్తి దారు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .పార్కర్ కు సవతి తల్లి మీద అయిష్టం .ఇరవై ఏళ్ళకే తండ్రీ పోయాడు .జ్యూ అయినా ఆమె కేథలిక్ గ్రామర్ స్కూల్ లో చేరింది .అప్పటికే మంచి కవితలు రాసి పేరు తెచ్చుకొంది . పియానో బాగా వాయించేది .”టీనేజి లోనే టీజ్ చేసే ”హాస్యం రాసింది .అది పండి పేరు వచ్చింది .oge    ,వానిటి ఫెయిర్ పత్రికలు ఆమె కవితలను ప్రచు రించి ఉత్సాహ పరిచాయి .ఆ రెండు పత్రికలు ఆమె ను సంపాదకత్వ బాధ్యత తీసుకోమని కోరాయి .స్టాఫ్ రైటర్ గా వానిటి ఫెయిర్ లో చేరి   డ్రామా క్రిటిక్ అయింది .మాగ జైన ను స్పాన్సర్ చేసే వారి నాటకాలనే చీల్చి చెండాడేది .తప్పక ఉద్వాసన పలికారు .ఎడ్విన్ పాండ్ పార్కర్ ను వివాహం చేసుకొన్నది .అతను గ్రేట్ వార్ లో పాల్గొన టానికి వెళ్ళాడు .విపరీత మైన తాగుడు తో ,ఆక్సిడెంట్ చేసి ,మార్ఫీన్ కు అలవాటు పడి ,కొంపకు చేరాడు .విడాకులు  తీసుకున్నారు .అయినా ఈమె zew  సాంప్రదాయం ప్రకారం పార్కర్ ట్యాగ్ ను వదల కుండా అట్టే పెట్టు కొంది .
                          1919 లో dramatist  అయిన రాబర్ట్ shervud  ,హాస్యనటుడు రాబర్ట్ బెరాచ్ లీ లతో కలిసి ”రౌండ్ టేబుల్   ”అనే ప్రసిద్ధ సంస్థను న్యూయార్క్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసింది .గిట్టని వాళ్ళు దీన్ని విష వలయం  (విషస్ సర్కిల్ )అన్నారు .కామిక్ రచయిత జేమ్స్ తర్బార్ ,సినీ రచయిత రింగ్ లార్దేనర్ మొదలైన వారినీ దీని లో సభ్యులను గా చేర్చింది .ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే తో ,స్కాట్ ఫిట్జెరాల్డ్ తో ప్రేమాయణం సాగించింది .1925  లో న్యూయార్కర్ పత్రిక స్థాపన దగ్గర్నుంచి ౩౦ ఏళ్ళ దాకా అందు లో పని చేసి తనకు ,పత్రికకు పేరు తెచ్చింది .ఎన్నో విలువైన కవితలు ,కధలు ,రివ్యూలు రాసింది ఆ కాలమ్ లో .1927  లో మొదటి కవితా సంకలనం  ”enough rope” వచ్చ్చింది .అది బెస్ట్ సెల్లార్ గా నిరూపించు కొంది .తర్వాత సన్సెట్ గన్ ,డెత్ అండ్ టాక్సెస్ రాసి అంతే పేరు పొందింది .లామేంట్ ఫర్ ది లివింగ్ ,ఆఫ్టర్ సచ్ ప్లెజర్ ,హియర్ లైస్- ఫిక్షన్ పుస్తకాలతో విశేష ప్రాచుర్యం పొందింది .”పార్కర్ రచనలన్నీ నిక్షిప్త స్వీయ చరిత్రలు ”అన్నాడు ప్రముఖ విమర్శకుడు బ్రిన్దాన్ గిల్ .పేరు ,ప్రఖ్యాతి డబ్బు వచ్చి మీద పడుతున్నాయి .తాగుడు కు బానిసై డిప్రెషన్ కు గురైంది .ఈ జబ్బు ఆతరం రచయిత లందరికీ సర్వ సాధారణం గా ఉన్నదే .ఎంత విశృంఖలత జీవితం లో ఉన్నా ,సాహిత్యం లో మాత్రం చెలియలి కట్ట దాటకుండా రాసిన సంస్కారి .నగ్న సత్యాలతో ,గుండెల్లో గునపాల్లా గుచ్చే మాటలతో ,,అత్యంత సంక్షిప్తత తో ,ఆమె కవిత్వం సాగి పోతుంది .
              న్యూయార్కర్ రచయిత లందరూ హాలీ వుడ్ గుమ్మం తొక్కి బాగు పడ్డ వాళ్ళే .పార్కర్ కూడా హాలీ వుడ్ సినిమాలకు పని చేసింది .ఎన్నో సినిమాలకు రాసినా పేరేమీ రాలేదు .అలాన్ కాంప్ బెల్ అనే నటుడిని పెళ్ళాడింది .ఇద్దరు కలిసి చాలా సినిమాలకు స్క్రిప్ట్ రాశారు .అందులో ”ఏ స్టార్ ఈజ్ బార్న్”అనే సినిమా వీరిద్దరి సృష్టి  .అకాడెమి అవార్డ్ కు 1937  లో నామినేట్ అయింది . పెళ్లి మళ్ళీ పెటాకు లైంది . .అమెరికా వ్యతి రేక కార్య క్రమాలు చేస్తోంది అన్న ఆరోపణ లతో ఆమె విచారణ కు గురైంది .ఆ కాలమ్ లో ఇది రచయితలకు మామూలే .సినీ జగత్తు లో   ఆమె పేరు ను బ్లాక్ లిస్టు లో పెట్టారు .స్క్రీన్ రైటర్స్ గిల్డ్ ఏర్పాటుకు సాయ పడింది .ఈ సందర్భం గా ఆమె  ఒక సారి ”un empoloyment office ”కు వెళ్ళింది .ఆమెను వందలాది మహిళలు ఆనందం తో చుట్టూ ముట్టి ఆమె రాసిన కప్లేట్ ” men seldom make passes –at girls who wear glasses” అనే కవితను అందరు పాడి ఆమె కు అభి నందనాలు తెలిపారు .
              సినీ రచయిత గా చేతులారా సంపాదించింది .కాని తన రంగం అయిన ఫ్రీ లాన్స్ జర్న లిజం కు మళ్ళీ వచ్చింది ”.esquire ”పత్రిక కు సినీ సమీక్షలు రాసింది .తాగుడు విపరీతం అయింది .అడపా ,దడపా కవితలు రాస్తూనే ఉంది .మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్ కు మళ్ళింది .ఇంత అస్తవ్యస్తం గా జీవితం ఉన్నా ,పార్కర్ కు 1959  లో అమెరికన్ ఎకాడేమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ కు ఎంపికైంది .అది తీసుకొని మళ్ళీ న్యూయార్క్ చేరింది .1967  జూన్ ఆరు న తీవ్ర గుండె పోటు తో న్యూయార్క్ హోటల్ లో మరణించింది . ప్రఖ్యాత ”పార్కర్ అనే కలం ;;ఆగి పోయింది   .ఆమె అస్తికలను కావాలని అడిగిన వారెవ్వరూ లేక పోవటం బాధాకరం .   ”excuse my dust ”అనేది ఆమె తరచూ వాడే మాట .అలానే జరిగింది .తన సాహితీ సర్వస్వాన్ని  మార్టిన్ లూధర్ కింగ్ కు చెందేట్లు చేశారు .కింగ్ ఈమె మరణం తర్వాత పది నెలలకు హత్య గావింప బడ్డాడు .
ఆమె రచనలు చాలా సార్లు పునర్ముద్రణ పొందాయి .ఎంతో మంది ఆమె జీవిత చరిత్ర రాశారు .ఎందరెందరో ఆమె కవితా వాక్యాలను పాటలలో నాటకాల్లో టి.వి.ప్రోగ్రామ్స్ లో తరచు వాడుతూనే ఉంటారు .అంటే ఆమె కవిత్వం సజీవం గా ఉంది. ప్రజల నాలుక మీద నాట్యం చేస్తూనే ఉందన్న మాట .1995 లో ,mrs .parker   and the vicious circle ”చిత్రాన్ని తీశారు .పార్కర్ పాత్ర ను జెన్నిఫర్ జేసన్ లీ అద్భుతం గా పోషించింది .పార్కర్ మన పార్కర్ పెన్ను లా విలువైన సాహితీ వేత్త .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -05 -12 —కాంప్-అమెరికా .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in సేకరణలు | Tagged | Leave a comment