ఫిబ్రవరి 14 పి జి వుడ్ హౌస్ వర్ధంతి సందర్భం గా

00010002000300040005000600070008

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గిడుగు రామ్మూర్తి పంతులు గారితో 36 గంటలు

gidugutho sree paada subrahmanya shastri gaaru-1 gidugutho sree paada subrahmanya shastri gaaru-2 gidugutho sree paada subrahmanya shastri gaaru-3gidugutho sree paada subrahmanya shastri gaaru-4

Posted in సేకరణలు | Tagged | Leave a comment

యువతరం రచయితలకు వంగూరి ఫౌండేషన్ వారి అహ్వానం!

ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు రాబోయే ఏప్రిల్ 4-11, 2013 నాడు హైదరాబాదు లో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న “మొట్టమొదటి యువ తరం సాహిత్య సమ్మేళనం” మహాసభలకి అందరూ ఆహ్వానితులే. కేవలం 18-35 సంవత్సరాల వయసు గల యువ  రచయితలు, సాహితీవేత్తలూ మాత్రమే  వేదికపై ప్రసంగించే ఈ సమ్మేళనం తెలుగు సాహిత్య చరిత్రలోనే…

001

002003004

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అనైతికతా పర్వం

anaithikathaa parvam

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆ స్థూపం రూపం కోల్పోతున్నది

shidhila shasanam

Posted in సేకరణలు | Tagged | 1 Comment

తనలో తాను

 తనలో తాను 

       ఒక విచిత్రమైన, కాని ఆలోచింపజేసిన, ఆలోచించాల్సిన అరుదైన సందర్భం. దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి విశాఖపట్నం వేంచేశారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తివారి ఆశ్రమానికి -వారి దర్శనార్థం వెళ్లాను. శివానందమూర్తిగారు నన్ను అందరిలోనూ పిలిపించారు. స్వామివారికి స్వయంగా పరిచయం చేశారు. స్వామివారు ముందుకు వంగి ఆసక్తిగా వింటున్నారు. నన్ను ఏమని పరిచయం చేస్తారు? ప్రముఖ రచయితననా? సినీనటుడిననా? రేడియో డైరెక్టరుగా రిటైరయాననా? టీవీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాననా? మంచి వక్తననా? వీటిలో ఏదయినా లేదా అన్నీ చెప్పవచ్చు. కాని రెండే మాటలు చెప్పారు -సద్గురువులు. అవి ఇవి: ”ఈయన గొల్లపూడి మారుతీరావు. మంచి సంస్కారం వుంది” అంతే! ఈ విశేషణాలలో ఏవో చెప్తారని ఊహించిన నేను ఈ పరిచయానికి ఆశ్చర్యపోయాను. ఆలోచించగా -కనువిప్పూ అయింది.
హిందూ మతానికి 36వ పీఠాధీశ్వరులయిన ఒక మహాస్వామి సమక్షంలో నా గురించిన ఏ పరిచయమూ నిలవదు. ఏదీ వారికి ఆసక్తిని కలిగించదు. లౌకికమయిన ఏ అర్హతా, ఏ విజయమూ పీఠాధీశ్వరుల సమక్షంలో ప్రతిభగా నిలిచేదికాదు. అయితే- ఏభై ఎనిమిది సంవత్సరాలు జీవన సరళినీ, కృషినీ, పరిశ్రమనీ క్రోడీకరించగల ఒక్క గుణం -అంతటి మహానుభావుల ‘ఎఱుక’లో రాణించేది ఉన్నదా? ఉన్నది. దానిపేరు -సంస్కారం.
ఓ జీవితకాలం పరిశ్రమలో -ఏ ప్రతిభా, ఏ వ్యుత్పత్తీ, ఏ ప్రాముఖ్యతా, ఏ కీర్తీ, ఏ పదవీ, ఏ సంపదా మనిషి ఔన్నత్యాన్ని మహానుభావులముందు నిలపదు. నిలిచేదిగా రాణించదు. ఒకే ఒక్కటి వీటన్నిటినీ తలదన్నేది ఉంది. ఇంకేమీ లేకపోయినా ఉండవలసింది ఉంది. వీటితో ప్రమేయం లేనిది ఉంది. పొరపాటు. ఎన్ని చేసినా, ఏం సాధించినా -ఆ సాధనకి లక్ష్యంగా, మూలధాతువుగా ఉండాల్సిన ఒకే ఒక్క గుణం ఉంది. దాని పేరు సంస్కారం.
అది ఒక దేశపు సంస్కృతీ, ఉద్ధతీ, సంప్రదాయ వైభవం, ఆలోచనా ధోరణీ, వ్యక్తి శీలత, పెద్దల వారసత్వంగా, అనూచానంగా వచ్చిన సంపదా -యిన్నీకలిస్తే -యిన్నిటిని కలిపి నిలిపేది ఒకటుంది. దానిపేరు సంస్కారం.
దీని వైభవం ఎంతటిదో, దీని విలువ ఎంత గొప్పదో -మన సమాజంలో నాయకత్వం వహించవలసిన నాయకులు, ఐయ్యేయస్సులూ, ఇతర మతాల పెద్దలూ, ఉద్యోగులూ ప్రతిరోజూ జైళ్లలో మాయమవుతూ చెప్పక చెప్తున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చెయ్యగానే -కొన్ని బస్సులు ధ్వంసమయాయి. కొన్ని దుకాణాల అద్దాలు పగిలాయి. ఆయన్ని జీపు ఎక్కించి నినాదాలు చేసే కార్యకర్తల మధ్య నుంచి ఆయన్ని తీసుకెళ్లలేకపోయారు. మనకి గుర్తుండే ఉంటుంది -ఒక తెల్లవారు ఝామున దేశం ఇంకా కళ్లిప్పకుండానే కంచి స్వామిని జైలుకి తరలించారు. కొందరిగుండె కలుక్కుమంది. కొందరు ఏడ్చారు. ఇతర మతాల పెద్దలూ బాధపడ్డారు. కాని ఏ విధ్వంసమూ జరగలేదు. ఎవరి అనుతాపమూ ఆవేశంగా తర్జుమా కాలేదు. అరాచకంగా కార్యరూపం దాల్చలేదు. అసదుద్దీన్‌ నేరం చేశాడని న్యాయస్థానం నిర్ణయిస్తోంది. శిక్ష వేస్తోంది. న్యాయాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కంచిస్వామి అరెస్టుకి కంటతడి పెట్టారు. అది అనివార్యమా? అది న్యాయస్థానం నిర్ణయం. అరాచకమా? అది వ్యవస్థ తేల్చుకోవలసిన విషయం. ఈ విచక్షణ పేరే సంస్కారం.
ఈ కాలమ్‌ మాట్లాడే విషయం -సంస్కారం. రాజకీయం కాదు. రోడ్డుమీద తన మిత్రుడితో వెళ్తున్న ఆడపిల్లని ఆరుగురు చెరిచి ఆమె చావుకి కారణమయారు. కొన్నిలక్షల కోట్లు దోచుకున్న ఓ నేరస్థుడు తను జైలునుంచి బయటికి రావడానికి ఒక న్యాయాధిపతి నీతికి ధర చెల్లించబోయాడు. ఒక కేంద్ర మంత్రిగారు టెలిఫోన్‌ శాఖని నిర్వహిస్తూ 320 లైన్ల టెలిఫోన్‌ ఎక్చ్సేంజీని తన వ్యక్తిగత ప్రయోజనాలకి -యింట్లోనే ఏర్పాటు చేయించుకున్నాడు. ప్రస్థుతం రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు -పండిత్‌ సుఖ్‌రాం, ఓం ప్రకాష్‌ చౌతాలా జైల్లో ఉన్నారు. ఆ మధ్య అరెస్టయిన ఓ వ్యభిచారి -తన ఇంటికి వచ్చిన నాయకులు, ఆఫీసర్ల జాబితాను బయటపెడతానని గర్వంగా బెదిరించింది.
ఇంత విస్తృతమైన అవినీతి, కుసంస్కారం నేపధ్యం -58 సంవత్సరాలు శ్రమించిన నా జీవనయాత్రలో అన్ని విజయాల వడపోతగా ‘సంస్కారి’ అన్న కితాబుని మూటగట్టుకోవడం ఎంత వైభవం?
ఒక పీఠాధిపతి ముందు -ఓ వ్యక్తి జీవిత సాఫల్యానికి యింత సంక్షిప్తమయిన కితాబు లభిస్తే -మరి భగవంతుడి సమక్షంలో నిలిచిన భక్తుడికి -ఆ స్థాయిలో అతని ఉనికి, అతని ఆస్థికత, ఆయన తపస్సు, ఆయన అనిష్టాన వైభవం -ఏవీ నిలవవు. స్వామి సమక్షంలో భక్తుడు పిపీలిక, నిర్వీర్యుడవుతాడు. అప్పటి అతని ఉనికికి వ్యుత్పత్తి లేదు. అర్థం లేదు. గుర్తింపు లేదు. ఆ స్థాయిలో అవసరమూ లేదు.
జీవిత సాఫల్యాన్ని కాచి వడబోస్తే -కళాప్రపూర్ణలూ, కేబినెట్‌ హోదాలూ, ఐయ్యేయస్సులూ, కోట్ల బ్యాంకు అకౌంట్లూ, ప్రపంచ ప్రఖ్యాతులూ, గానగంధర్వ బిరుదాలూ -అన్నీ అన్నీ అసందర్భాలు. అన్నిటికీ మించి వ్యక్తికి అవసరమైనదీ, నికార్సుగా నిలిచేదీ ఒక్కటి -ఒక్కటే ఒక్కటి ఉంది. వ్యక్తిగత సంస్కారం. దానిలోపం విశ్వరూపం దాల్చడాన్ని మనం ఏ రోజు పేపరు తెరిచినా అర్థమౌతుంది. ఆ ఒక్క సుగుణాన్నే ఫణంగా పెట్టి మిగతా ప్రపంచాన్ని జయించబోయిన ఎందరో మహనీయుల గోత్రాలు -ప్రతి రోజూ ఆవిష్కృతమౌతున్నాయి.
సంస్కారం ఒక్కటే ఉండి మరేది లేకపోయినా బాధలేదు. అది లేక మరేది ఉన్నా ప్రయోజనం లేదు. సద్గురువులు పీఠాధిపతుల సమక్షంలో నాకిచ్చిన కితాబు -60 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నది, మరెవరూ దూరం చేయలేనిదీను. ఒక తెరని సద్గురువులు తొలగించారు.

 గొల్లపూడి మారుతీరావు.
Posted in సేకరణలు | Tagged | 1 Comment

అన్నమయ్య పదం – విన్నకోట స్వరం – ఆలాపన గళం

You are cordially invited to attended this program  and make it success
Please promulgate this program info to all your friends and music lovers,

It is an honor and  the privilege to invite you to this event.

అన్నమయ్య పదం – విన్నకోట స్వరం – ఆలాపన గళం, Sunday 10-2-2013 at 06.00 pm
This will be held at N.T.R Kala Mandiram Telugu university,Hyderabad

This upcoming event is organized by AALAPANA
Hoping for your presence in the said event.
Respectfully Yours,
C Narasimha rao

9346 774 294

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కర్నూరు లో తెలుగు పాఠ‍శాలను కొనసాగించాలి

Hosuru Telugu School Sakshi 8 2  2013

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విహంగ వెబ్ మాస పత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చిన వ్యాసం -మహిళా విద్యా వేత్త కు ఎన్నెన్ని అడ్డంకులో ?

 

మహిళా విద్యా వేత్తకు ఎన్నెన్ని అడ్డంకులో ?

మనదేశం లోపూర్వ కాలం లో మహిళ విద్యకు ప్రాముఖ్యముండేది కాదని మనకు తెలిసిన విషయమే .మరి ఆ .మహిళ ఒక విద్యా వేత్తయే అయితే ,ఆమెకు ఎదురయ్యే ఆటంకాలు ఇన్నీ అన్నీ కావు .పోనీ ఇతర దేశాలలో ఆకాలం లో ఇంతకంటే భిన్నం గా ఏమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి .మరీ ఆధునికం, నాగరికతా నిలయం అని అనుకొన్న యూరప్ లోనూ ఇదే పరిస్థితి .ఒక సారి ఆ కథలూ, గాథలనూ తెలుసుకొందాం ..
సుమారు 350 ఏళ్ళ కిందట ఇటలీ లోని’’ పాడువా కెథడ్రిల్ యూనివర్సిటి’’ నుంచి అరిస్టాటిల్ మాండలికాల మీదప్రపంచం లోనే మొట్ట మొదటి డాక్టరేట్ ను పొందే నిమిత్తం పరీక్షకు హాజరయిన మహిళ ‘’హెలీనా కోర్నాటో పిసోపియ ‘’ ఉదంతాన్ని వింటే ఆశ్చర్యమేస్తుంది .
ఆమె వెనీస్ నగరం లోనే మహా ధనికుడైన ముప్ఫై రెండేళ్ళ వ్యక్తికి జన్మించిన ఏకైక కుమార్తె .చురుకైన తెలివి తేటలు గలవిద్యార్ధిని గా పేరుపొందింది .ఏడో సంవత్సరం నుంచే తత్వ వేత్త అరిస్టాటిల్ ను అధ్యయనం చేయటం ప్రారంభించింది .ఆమె విద్యా విషయం లో చూపే చొరవకు తండ్రి చాలా సంతోషించి అన్ని విధాలా తోడ్పడ్డాడు ..విశ్వ విద్యా లయం లో చేరక ముందే ఆమెకు అతి సమర్ధులైన ట్యూటర్లను నియమించి ఇంటి వద్దనే విద్య నేర్పించాడు .అప్పటికే ఆమెకు గ్రీకు ,ఫ్రెంచ్ ,ఇంగ్లీష్ ,స్పానిష్ హిబ్రు ,అరబిక్ ,చాల్దైక్ భాషలు పూర్తిగా అలవడ్డాయి .ఈ అసాదారణ ఏకైక మహిళా విద్యావేత్తను గురించి విన్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆమె ఎలా పరీక్షలలో జవాబులు చెబుతుందో ప్రత్యక్షం గా చూడాలనుకొని , కొన్ని వందలమంది జనం చేరుకొన్నారు .కనుక పరీక్ష వేదిక ను విశ్వ విద్యాలయ ప్రాంగణం నుంచి కెథడ్రిల్ కు మార్చాల్సి వచ్చింది
ఎలీనా ముందుగా . థియాలజీ లో డాక్టరేట్ కోసం దరఖాస్తు పెట్టుకోంది.థియాలజీ విభాగం చాన్సెలర్ ,ఆర్చిబిషప్ అయిన కార్డినల్ గ్రేగారియో బార్బెరిగో బిషప్ నిరాకరించాడు ‘’ఆడవాళ్ళు పిల్లల్ని కనటానికి మాత్రమే అర్హులు .చదువు సంధ్యలకు కాదు .’’అని అభిప్రాయ పడ్డాడు .ఈ విషయాన్నేఆయన ఫ్రెంచ్ కార్దినల్ కు చెబితే ఆయన పగల బడి నవ్వాడట .ఆమె పట్టుదలను చూసి బిషప్ ‘’కావాలంటే ఫిలాసఫీ ‘’లో డాక్టరేట్ కు పర్రీక్ష నివ్వచ్చు నని తేల్చి చెప్పాడు .దేనికైనా రెడీ అంది ఆమె. దానికే తయారైంది .పరీక్షాదికారులు ఆమె స్త్రీ అని ఏమాత్రం జాలి తలచకుండా కఠినం గా నే ప్రశ్నించాలని నిర్ణయించారు .లేక పోతే యూని వర్సిటి పరువు గంగలో కలుస్తుందని భావించారు .
ఎలీనా అత్యంత సమర్ధం గా ,బుద్ధి కుశలత తో అడిగిన వాటికన్నిటికీ లాటిన్ భాషలోనే సమాధానాలు చెప్పి,వారిని అప్రతిభులను చేసింది .ఒక అరగంట పరీక్ష లోనే ఆమె ప్రతిభ కు అబ్బుర పడి, ఆమెకు ఫిలాసఫీ లో డాక్టరేట్ ను ప్రదానం చేశారు ‘’డాక్టరల్ రింగ్’’ ను ఆమె వ్రేలికి తొడిగి అరుదైన గౌరవాన్ని కల్పించారు .అక్కడికి చేరిన అశేష జన సమూహం ఒక్క సారి గౌరవం గా లేచినిలబడి హర్ష ధ్వానాలు చేశారు .భగవంతుడిని స్తుతించే ‘’టే డ్యూమ్ ‘’.ఆలపించారు .ఆనందభాష్పాలు రాల్చారు .ఇదీ మొదటి మహిళా విద్యా వేత్త కు జరిగిన పరీక్ష ,ఆమె సాధించిన అపూర్వ విజయ గాధ .
శతాబ్దాలు మారినా పరిస్థితి లో మార్పేమీ పెద్ద గా రాలేదు .ఇక్కడే విద్యా వేత్తలు ,సామాజిక శాస్త్ర వేత్తలు స్త్రీ విద్య నేర్వటానికి నాలుగు ముఖ్య విషయాలు కావాలని సూచించారు .మొదటిది ఆమె జీవించటానికి తగిన ఆధారం ఉండాలి .పదిహేడవ శతాబ్దానికి మహిళా జీవిత కాలం 1750 లో ముప్ఫై రెండు మాత్రమే .పందొమ్మిదో శతాబ్దం లో ఇది నలభై రెండుకు చేరుకొన్నది .స్త్రీ కి వివాహంచేసుకోవటం ,సంతానం కనటం తో సరిపోయి, ఏదో వానా కాలం చదువే అబ్బేది .విద్యా వేత్త గా ఎదిగే అవకాశం తక్కువే .పైన చెప్పుకొన్న ఎలీనా పదకొండవ ఏటనే వివాహం ఆడరాదనే స్థిర ప్రతిజ్ఞ తీసుకొని నిలుపు కొంది .ఆమె జీవిత ధ్యేయం’’ బెనేడిక్తైన్ ఆర్డర్ ‘’లో ప్రవేశించటమే .
రెండవది – స్త్రీ విద్యా వంతు రాలు కావాలంటే ఆమెకు మౌలిక విద్య తెలియాలి అంటే చదవటం రాయటం తెలిసి ఉండాలి .1650 లో లండన్ నగరం లో ఉన్న మహిళల్లో పది శాతం మందికి మాత్రమె సంతకం చేయటం వచ్చు అని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది .మగవారు చర్చి ఉద్యోగాల్లో ,మిగిలిన ఉద్యోగాలలో పని చేస్తూ వంద శాతం అక్షరాస్యులుగా ఉండటం మరీ వింత..క్రింది తరగతి పురుష ఉద్యోగుల్లో మాత్రం పదిహేను శాతం మంది మాత్రమె అక్షరాస్యులు .1700 కాలం నాటికి మహిళల్లో సగం మంది సంతకాలు చెయ్యటం నేర్చారు .మిగిలిన ప్రాంతాలలో మహిళా అక్ష రాస్యత మరీ తక్కువ గానే ఉంది .
మూడవ విషయానికి వస్తే –స్త్రీ విద్యా వేత్త కావాలంటే ఆమె ఆర్ధిక పరిస్థితి బాగా ఉండాలనేది .ధన వంతుల కుటుంబాల్లో పుట్టిన వారికే ఈ అదృష్టం దక్కేది .వారికి ఇంట్లో స్వంత లైబ్రరి ఉండేది ,ప్రైవేట్ గా చదువు కోవటానికి ట్యూటర్లను పెట్టుకొనే సామర్ధ్యం ఉండేది .కాని బీదా బిక్కీ స్త్రీలకూ కనీస విద్య అంటే చదవటం రాయటం కూడా గగన కుసుమమే .చర్చిలు, క్రైస్ట్ హాస్పిటల్స్ లండన్ లో నిర్వహించే విద్యాలయాల్లో బాలురు మాత్రమె చేరే వారు .ధార్మిక విద్యాలయాలలో చదివే ఆడ పిల్లలు కుట్టు పని ,లేసుల అల్లికా ,మొదలైన ఇంటి పనుల్లో ఉపయోగ పడే విద్య నేర్చే వారు .
విద్యా వంతు రాలైన స్త్రీ కి కావలసిన నాలుగవ ముఖ్య విషయం –ఆమెచర్మంమందంగా ఉండాలట .ఆమె బహి రంగం గా వేదిక లేక్కాలంటే ధైర్యసాహసాలు ఉండాలి . .18 వ శతాబ్దపు ఇంగ్లాండ్ లో ప్రసిద్ధి చెందిన మహిళా రచయిత్రి’’ లేడీ మేరీ మాంటేగ్’’ రాస్తూ తన మనవరాలు ఒంటరిగా యే కుంటీ, గుడ్డీ గానో గడపాల్సి వస్తోందని అన్నది .ఇదీ ఆనాటి విద్యా వంతులయిన స్త్రీల దీన పరిస్థితి ..కొద్ది మంది మగ మేధావులు -పదహారో శతాబ్దపు ‘’రిచర్డ్ మాలిస్తర్ ‘’, పదిహేడో శతాబ్దానికి చెందిన ‘’పౌలియన్ డీ లా బారీ’’లు మహిళా విద్యనూ, విద్యా వేత్తలను ప్రోత్స హించారు .అలాగే ‘’బాస్త్యువా మెకిన్ ‘’,’’మేరీ వోల్లెన్ స్టోన్ క్రాఫ్ట్ ‘’వంటి మహిళాభ్యుదయ మహిళా రచయితలు మహిళల మేదావితనాన్ని గుర్తించి పూర్తి మద్దతు నిచ్చారు .చర్చి తో సహా అనేక వృత్తుల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని ఉద్యమించారు .గ్రామర్ స్కూళ్ళలో కూడా బాలికలకు ప్రవేశం కల్పించాలని ఒత్తిడి తెచ్చారు .మగ వారికి, దేనిలోనూ మహిళలు తక్కువ కాదని నిరూపించారు .విద్యా వేత్తలు అవటానికి మహిళలకు అన్ని రకాలా సామర్ధ్యం ,తెలివి తేటలు ఉన్నాయని ప్రపంచానికి ముక్త కంఠం తో చాటి చెప్పారు .మహిళా విద్యకు, ఆమె విద్యా నేతృ త్వానికి అడ్డు నిలిస్తే ఖబడ్దార్ అని ప్రకటించారు .మహిళ ఇప్పుడు వీటన్నిటినీ అధిగమించి అన్నిటా ముందుకు దూసుకొని వెళ్లటం శుభదాయకం ,సంఘానికి శ్రేయస్కరం .

–గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జెనెటిక్ కోడ్ వల్ల ఆధునిక ప్రయోజనాలు

 జెనెటిక్ కోడ్ వల్ల  ఆధునిక ప్రయోజనాలు

  ఒక శరీర భాగం లో నుంచి జీన్స్ ను వేరు చేసి వేరొక దాని లోకి మార్చటాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు .బదిలీ అయిన జీన్ ను ట్రాన్స్ జీన్ ఆర్గానిజం అని ,గ్రహించిన జీన్ ను ట్రాన్స్ జేనిక్ ఆర్గానిజం అని పిలుస్తారు .సాదా రణం గా ఏ.విటమిన్ ఆరోగ్యానికి ,కంటికి చాలా అవసరం.ఇది ఆహారం లో లోపిస్తే గుడ్డి తనం వస్తుంది .అందుకని శాస్త్రజ్ఞులు ‘’ట్రాన్స్ జేనిక్ రైస్ ‘’ అంటే ‘’గోల్డెన్ రైస్ ‘’తయారు చేశారు .దీనిలో బీటా కరోటీన్  ఎక్కువ గా ఉండటం వల్ల ఏ విటమిన్ స్థానాన్ని పొంది ఉపయోగ పడుతుంది .అంటే ఏ విటమిన్ సప్లిమెంట్ చేన్స్తోందన్న మాట .ఇందులో రెండు ట్రాన్స్ జీన్లుంటాయి .ఒక జీన్ సాయిల్ బాక్టీరియం నుండి ,రెండో దాన్ని డాఫోడిల్ లేక పోతే మొక్క జొన్న నుంచి గ్రహిస్తారు .ట్రాన్స్ జీన్లు ఎంజైములను ఎన్కోడ్ చేస్తాయి .దాని వల్ల అవి రెండు కలిసి పని చేసి ,బీటా కరోటీన్ లు  తయారు చేస్తాయి .దీనికి ఉన్న పసుపు పచ్చని నారింజ రంగు వల్లమామూలు బియ్యం కంటే ప్రత్యేకం గా ఉండి‘’బంగారు బియ్యం ‘’అని పించుకొన్నది ..

        అమెరికా లోని ఫిలడెల్ఫియా లో ఉన్న టెంపుల్  టన్ యూని వేర్సిటివారు ట్రాన్స్ జీన్ ను ఈస్ట్ కు ,ప్రేలుడు పదార్ధాలను గుర్తించటానికి ఉప యోగించారు .ట్రాన్స్ జీన్స్ ను ఎన్కోడ్ చేయగల జెల్లీ ఫిష్ నుంచి ఆకు పచ్చని ఫ్లో రోసేంట్ ప్రోటీన్ ను ,ఎలుకలకు ఉన్న వాసన పట్టే సహజ గుణం కలిగిన ప్రోటీన్లను కలిపి ఒక సజీవ డిటెక్టర్ ను తయారు చేశారు .ఇందులో ఎలుక ప్రోటీన్లు జే.యెన్.టి.ని చూసి ప్రతి స్పందిస్తాయి .దీనితో ఈస్ట్ సెలల్స్ అల్ట్రా వయొలెట్ కాంతిలో  స్పష్టం గా కనీ పించే  ఆకు పచ్చని ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ను తయారు చేయిస్తాయి .ఇంకా కొద్ది రిజుల్లో ఈ పరిశోధనా ఫలితాల వల్ల బాంబ్ డిటెక్టింగ్ ట్రాన్స్ జీనిక్ ఈస్ట్ ను కూడా శాస్త్ర వేత్తలు తయారు చేసే అవకాశాలెక్కువ గా ఉన్నాయి .అప్పుడున్న  బాంబ్ డిటెక్టింగ్ స్క్వాడ్ ల తో అవసరం ఉండక పోవచ్చు .

       ఇంకో అడుగు ముందుకు వేశారు సింగ పూర్ లో ఉన్న నేషనల్ యూని వెర్సిటి వారు .ట్రాన్స్ జేనిక్ జీబ్రా ఫిష్ ను నీటి కాలుష్యాన్ని గుర్తించటానికి కనీ పెట్టారు .ఇవి నీటిలోని కొన్ని రకాల కాలుష్యాలకు ఫ్లోరసేంట్ వెలుగు ను ప్రసరింప జేసి, గుర్తిస్తాయి .జీబ్రా ఫిష్ సాధారణం గా  నల్లగా ను వెండి రంగులో ను ఉంటాయి  కాని ట్రాన్స్ జేనిక్ జీబ్రా ఫిష్ .కు ఉన్న జీన్లు ఫ్లోరసేన్స్ ను ఉత్పాదం దం చేసే ప్రోటీన్లను డీ కోడ్ చేయ గలవు .మొదటి ట్రాన్స్ జేనేటిక్  ఫిష్ –జెల్లీ ఫిష్ నుంచి వేరు చేయ బడిన జీన్స్ ను వీటి లోపల ప్రవేశ పెట్టి నందు వల్ల,ఎరుపు ,లేక ఆకు పచ్చ రంగులను రేడియెట్ చేస్తాయి .ఈ పద్ధతి లో శాస్త్రజ్ఞులు అయిదు రకాల జీబ్రా ఫిష్ ను ఇప్పటికి తయారు చేశారు –కాదు కాదు సృష్టించారు .ఇవి ఒక్కొక్కటి ఒక్కో రంగులో నీటిలో ఉన్న కాలుష్య భేదాలను బట్టి ప్రకాశిస్తాయి .ఇప్పటికి గ్లోఫీష్ ,ఫ్లోరోసెంట్ ఫిష్ లు ఎరుపు ,ఆరంజ్ ,పసుపు ,ఆకుపచ్చ రంగుల్లో లభిస్తున్నాయి .తెల్లని కాంతి లో వీటి రంగుల ప్రకాశం బాగా ఎక్కువ గా ఉంటుంది .చీకటి లో వెలుతురు సప్లై చేస్తే ప్రకాశిస్తాయి .

              జెనెటిక్స్ ను ఉపయోగించి ప్రియాన్స్ అనే విపరీత భయంకర ప్రోటీన్ లను తయారు చేస్తున్నారు  .ప్రోటీ నేశషియాస్ ఇంఫెక్షస్ పార్టికల్ నే ప్రియాన్ అంటారు .దీన్ని కాలి ఫోర్నియా లోని స్తాన్స్లీ బి.ప్రూషినర్ శాస్త్రజ్ఞుడు 1982లో తయారు చేశాడు ..మొదట్లో అందరు దీన్ని అంతా బూటకం ‘’అబ్సర్డ్ ‘’అని కొట్టి పారేశారు .జంతువు లన్నిటిలో ప్రియాన్ ప్రోటీన్లు  అంటే prpc  పార్టికల్స్ (ప్రియాన్ ప్రోటీన్ సేల్లులర్ )ఉంటాయి .ఇవి మెదడు నరాల్లో ఉంటాయి .కణాల విధిని నిర్వహిస్తాయి .కాని కొన్ని క్రిటికల్ prpc ప్రోటాన్లు కార్క్ బిరడా తీసే స్క్రూ ఆకారం లో ఉంటాయి .అవి చదరం గా మారి నప్పుడు వాటిని ఆ సెల్ లో నుంచి బయటికి తీస్తారు .అసాధారణం గా ,భిన్నం గా ఉన్న ప్రియాన్ ను  prpscఅంటే ‘’ప్రియాన్ ప్రోటీన్ స్క్రేపర్ ‘’లను  .ఒక సారి  సెల్ లో నుంచి తొలగించు కో లేక పోతే వీటి  సంఖ్య గణ నీయం గా పెరిగి (లార్జ్ మాస్ )నాడీ కణాలను దెబ్బ తీస్తాయి .దాని వల్లబుర్ర పాడైపోతుంది అందే మెదడు దెబ్బతిన్తుందన్న మాట .prpsc పెరిగితే కండరాల పై నియంత్రణ సాధ్యం కాదు .ప్రియాన్ వ్యాధులోచ్చి చస్తారు .దీనికి ఉదాహరణే ఆ మధ్య ఇంగ్లాండ్ దేశం లో వచ్చిన ‘’mad cow ‘’జబ్బు .దీన్ని శత్రువులు తయారు చేసి వదిలితే ఖండాలకు ఖండాలే సఫా .వేరే బాంబులు ,యుద్ధాలు అక్కర్లేదు .సైన్సు ఎంత ప్రగతి సాదిస్తోందో అంతే విష సంస్కృతీ పెరిగి పోతోందని బుర్ర ఉన్న వాళ్ళందరూ గోల పెట్టడం దీనికే .

                  Rna ను వ్యాధుల చికిత్స లో బానే ఉప యోగిస్తున్నారు సియాటిల్ లోని విస్కాన్సిస్ యూని వెర్సిటికి  చెందినమహిళా శాస్త్ర వేత్త’’ షరాన్ డోతీ’’భూమి లోని విష పూరిత (టాక్సిక్ )సంయోగ పదార్ధాన్ని తొల గించే శక్తి కల పోప్లార్ ట్రీ ప్లాంట్స్’’ ను సృష్టించింది ..ఈ మొక్కల  లోని  కుందేలు జీన్స్ కాలేయం లో ఉన్న ఎంజైమ్ ను ఎన్కోడ్ చేసే శక్తి కలిగి ఉన్నాయట .ఇదీ జెనెటిక్ కోడ్ సాధిస్తున్న ఆధునిక ప్రగతి,అందిస్తున్న ప్రయోజనాలు

                మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ – 7-2-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రభాకరదీపిక

ప్రభాకరదీపిక

అరవయ్యేళ్ళ కిందటి వరకు తాళ్ళపాక అన్నమాచార్యులవారి గురించి సామాన్యులకే కాదు చాలామంది పండితులకు సైతం తెలియదు. చరిత్రపుటల్లో ఆయన పేరు చూడడమే తప్ప ఆయన సాహిత్య స్వరూపం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఆయన సంగీతం సంగతి అసలే తెలియదు – ఇప్పటికీ తెలియదు. అయినా, ఇప్పుడు ఆంధ్రదేశంలోనే కాదు దేశమంతటా, ప్రపంచమంతటా ఆయన పాటలు మారుమ్రోగుతున్నాయి. లక్షగళార్చనతో ఆయన ఖ్యాతి గిన్నిస్‌బుక్‌లోకి కూడా ఎక్కింది.
ఈ పరిణామ చరిత్రకు మూలపురుషుడు స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. అన్నమయ్య జీవిత విశేషాలను, ఆయన వాగ్గేయ సాహిత్యాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకు వచ్చినవారు శాస్త్రిగారే. ఒక్క అన్నమయ్య సాహిత్యమే కాదు- నన్నయ నాటి నుంచి మొన్నమొన్నటి దాకా దాదాపు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని శోధించి, మధించి, పరిష్కరించి, ప్రచురించి తెలుగు భాషకు, సంస్కృతికి మహోపకారం చేశారాయన. స్వర్గీయ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో నేడు (గురువారం) ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం.
1888లో కృష్ణాజిల్లాలోని పెదకళ్లేపల్లి గ్రామంలో ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించిన శాస్త్రిగారు పదహారేళ్ళ వయస్సులో బందరులో మహాకవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి వద్ద చేరి రెండేళ్ళు శిష్యరికం చేశారు. పదిహేడవయేట అష్టావధానం చేశారు. అప్పుడే రచనావ్యాసంగం ఆరంభించారు. పద్దెనిమిదేళ్ళ వయస్సులో ఉద్యోగం కోసం మద్రాసు చేరారు. 1910లో మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్కిప్ట్ లైబ్రరీలో కాపీయిస్ట్‌గా చేరారు. అప్పటినుంచి లెక్కలేనన్ని ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, వ్రాతప్రతులను సేకరించి, పరిశోధించి, ప్రచురింపజేశారు. 1939లో మద్రాసునుంచి తిరుపతికి వచ్చి స్థిరపడిన తర్వాత శాస్త్రిగారి సాహిత్య కృషి కొత్త మలుపు తిరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలోని ఒక నేల మాళిగలో నాలుగు శతాబ్దాలుగా దాగి ఉన్న తాళ్ళపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరే కులను గుర్తించి, బయటికి తీయించి 1948లో వాటిని దేవస్థానం చేత ప్రచురింపజేశారు. మొత్తం 29 సంపుటాలుగా వెలువడిన ఆ సాహిత్యంలో మొదటి ఐదు సంపుటాల ప్రచురణ ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా వాటిలో 11 వేల కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి. అన్నమయ్య మనవడు తాళ్ళపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరిత్రము’ గ్రంథాన్ని శాస్త్రిగారు తన సుదీర్ఘపీఠికతో ప్రకటించారు. ఆ గ్రంథం ద్వారానే అన్నమయ్య జీవితం గురించి, సాహిత్యం గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన కలిగింది.

రాగిరేకుల మీది సంకీర్తనలకు స్వరాలు లేవు. వాటికి రాగతాళాల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి. అయినా, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, శ్రీపాదపినాకపాణి, బాలమురళీకృష్ణ, మల్లిక్, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు ఆ కీర్తనలకు స్వరాలు కూర్చి పాడారు, పాడించారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు 1950 నుంచి ఆ పాటలకు విరివిగా ప్రచారం కల్పించాయి. రాగిరేకుల సంగతి ఇలా ఉండగా, తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద కొన్ని శతాబ్దాలుగా అజ్ఞాతంగా పడి ఉన్న రెండు పెద్ద రాతి బండలు 1949లో ప్రభాకరశాస్త్రిగారి దృష్టికి వచ్చాయి. వాటిపై కొన్ని స్వరసహిత సంకీర్తనలు చెక్కి ఉన్నాయి.

ఆ బండలు ఏడు అడుగుల పొడుగు, నాలుగు అడుగుల వెడల్పు, తొమ్మిది అంగుళాల మందం కలిగి ఉన్నాయి. ఒక బండపై 94 పంక్తులు, మరో బండపై 100 పంక్తులు చెక్కి ఉన్నాయి. శాస్త్రిగారి శిష్యుడు అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు మొదట యాదృచ్ఛికంగా ఆ బండలను చూసి వాటిని గురువు గారి దృష్టికి తెచ్చారు. అవి క్రీ. శ. 1500 ప్రాంతం నాటి తాళ్ళపాక వాగ్గేయకారుల రచనలై ఉంటాయనీ, బహుశా అన్నమయ్యవే కావచ్చుననీ శాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు యావత్ప్రపంచంలోనే ప్రప్రథమంగా లభించిన స్వరసహిత వాగ్గేయ రచనల శిలాలేఖములని కూడా ఆయన భావించారు. త్వరలో వాటిని నిశితంగా పరిశీలించి, పరిష్కరించి ప్రకటించాలని ఆయన సంకల్పించారు. కాని, ఆ పని జరిగేలోపునే – 1950లో – ఆయన దివంగతులైనారు.శాస్త్రిగారు మరణించేనాటికి ఆయన కుమారుడు ఆనందమూర్తిగారి వయస్సు ఇరవయ్యేళ్లే. అయినా, అప్పటినుంచే ఆయన తండ్రిగారి సంకల్పందిశగా కృషి చేస్తూ వచ్చారు. ఆయన కృషి ఫలితంగా 1990లలో దేవస్థానం రంగంలోకి దిగింది.

సాధారణంగా బండలపై అక్షరాలు చెక్కేవారు ముందుగా వాటిని నునుపు చేస్తారు. కాని, ఈ సంకీర్తనలు చెక్కిన బండలు నునుపుగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. వాటి మీది అక్షరాలను గుర్తించడం కష్టం. దేవస్థానం వారు ఆ బండలకు ఫోటోలు తీయించడం, లిపి శాస్త్రజ్ఞులు వాటిని నిశితంగా పరిశీలించి అక్షరాలను కాగితాల మీదికి ఎక్కించడం, కనిపించకుండా పోయిన భాగాలను మరొక తరహా పండితులు పూరించడం, సంగీత విద్వాంసులు స్వరసాహిత్య సమన్వయాన్ని సాధించడం, వీరంతా చర్చలు జరిపి గ్రంథాన్ని ప్రచురించడం – ఈ దశలన్నీ 1999 నాటికి పూర్తయినాయి.

అయినా, ‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’ అనే పేరుతో దేవస్థానం వెలువరించిన ఆ గ్రంథం ప్రతులు సంపాదక వర్గం వారికి, దేవస్థానం అధికారులలో కొందరికి లభించాయే గాని మార్కెట్లోకి రాలేదు. సంగీత సాహిత్య ప్రియులెవ్వరికీ అవి అందుబాటులోకి రాలేదు. దేశంలోని పెక్కు నగరాలలో గల బాలాజీ కళ్యాణ మండపాలలోని పుస్తక విక్రయశాలల్లో సైతం అవి కనిపించడం లేదు. అసలా పుస్తకాన్ని తాము ఎప్పడూ చూడలేదని దేవస్థానం వారి పుస్తక విక్రయశాలల వారే చెబుతున్నారు. ఏమైనాయి అవన్నీ?

* * * తిరుమలలో దొరికిన రెండు రాతిబండలలో ఒకదానిపై 11 రచనలు, మరొక దానిపై 10 రచనలు స్వరసహితంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మొదళ్ళు లేవు, మరికొన్నింటికి చివళ్ళు లేవు. ఇందుకు కారణం ఏమిటంటే, ఆ బండలు రెండూ వరుస సంఖ్యలు గల బండలు కావు. మొత్తం కనీసం ఐదు బండలు ఉండి ఉండాలనీ, వాటిలో రెండు, నాలుగు సంఖ్యలు గల బండలు మాత్రమే దొరికాయనీ, 1,3,5 నంబర్లు గల మిగిలిన మూడు ఇంకా దొరకాల్సి ఉందనీ సంగీత సాహిత్య పరిశోధకులు చెబుతున్నారు. రెండవ నంబరు బండలో గల దశావతార సూళాదిలో మొదటి రెండు అవతారాలకు సంబంధించిన రచనలు లేవు. మిగిలిన ఎనిమిది అవతారాల రచనలే ఉన్నాయి. వాటికి రాగనామాలు లేవు.

కాని, స్వరాల సంచారం అంతా నేటి ‘మాయామాళవగౌళ’ రాగానికి తగినట్లుగా ఉన్నట్లు సంగీత విద్వాన్ ఆకెళ్ల మల్లికార్జున శర్మగారు భావించారు. అన్నమయ్య కాలంలో ఆ రాగంపేరు ‘మాళవగౌళ’. కనుక ఆ పేరునే ఆయన నిర్ధారించారు. ఇక, దశావతార సూళాదిలో లోపించిన మొదటి రెండు అవతారాల సాహిత్యాన్ని మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు పూరించగా ఆ సాహిత్యానికి ఆకెళ్ళవారు స్వరరచన చేశారు. అలా ‘మాళవగౌళ’ రాగంలో దశావతార సూళాదికి పూర్తిరూపం ఏర్పడింది. ఈ సూళాదిలో లోపించిన మొదటి రెండు అవతారాల రచన దొరకకుండా పోయిన ఒకటవ నంబరు బండలో ఉండి ఉంటాయి. అలాగే, మొదళ్ళూ, చివళ్ళూ దొరకని మిగిలిన రచనల్లో కూడా లోపించిన భాగాలు దొరకని 1,3,5 బండల్లో ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

* * * కడచిన యాభై సంవత్సరాలలో తాళ్ళపాక వారి సాహిత్యంపై డజన్ల కొద్దీ సిద్ధాంత వ్యాసాలు వెలువడినాయి. ఎందరో డాక్టరేట్లు తీసుకున్నారు. కాని, ఒక్కరు కూడా అన్నమయ్య సంగీత పద్ధతి గురించి ఆలోచన చేయలేదు. అన్నమయ్య గేయకవి మాత్రమే కాదు. ఆయన వాగ్గేయకారుడు. అంటే తన గేయ సాహిత్యానికి తానే స్వర రచన చేసుకున్నవాడు. రాగి రేకుల మీద ఆయన సంకీర్తనలకు రాగతాళాలున్నాయి. కాని, ఆ రచనలు స్వరసహితంగా లభించకపోవడం వల్ల ఎవరికి తోచినట్లు వారు వరసలు కట్టి పాడుతున్నారు. చాలా వరసల్లో ఔచిత్య స్పృహ కనిపించడం లేదు. వరసలు కట్టుకోడానికి కొన్ని వేల అన్నమయ్య పాటలు అందుబాటులో ఉండడం మహాభాగ్యంగా భావించుకొంటున్నారు చాలామంది.

కొందరు డిప్లొమా కోర్సు పాసవగానే అన్నమయ్యపాటకు ట్యూన్లు కట్టడం మొదలుపెడుతున్నారు. రికార్డు షాపుల్లో కుప్పలు కుప్పలుగా అన్నమయ్య కేసెట్లు, సి.డిలు దర్శనమిస్తున్నాయి. శాస్త్రీయ సంగీత కచేరీల్లో చివర ‘తుకడాలు’గా అన్నమయ్య పాటలు వినిపిస్తున్నాయి. బ్యాండు మేళాల వాళ్ళు కూడా వాయిస్తున్నారు. అన్నమయ్య సినిమాతో ఆయన ‘ఖ్యాతి’ తారాస్థాయినందుకుంది. పాపులారిటీలో ఆయన త్యాగయ్యను మించిపోయాడు.

సంగీత ఉద్యోగాల పరీక్షాపత్రాల్లో ‘ఈ క్రింది అన్నమయ్య కీర్తనను స్వరపరచి పాడి వినిపించుడు’ అనేది ఒక ప్రశ్న. దానికి అరగంటో, ముప్పావుగంటో టైము. ఇది అతిశయోక్తి కాదు, వేళాకోళం కాదు. ‘అయ్యో అన్నమయ్యా.. ఇంత లోకువైపోయావా?’ అని బాధపడాలా? గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడని సంతోషించాలా?

‘త్యాగరాజకృతుల్లాగా అన్నమయ్య పాటలకు వర్ణమెట్టులు లేవు కదా, మరి ఏం చేస్తాం?’ అంటారు. కాని, లేకలేక స్వరసహితంగా అన్నమయ్య పాటలు కొన్ని రాతిబ�veturi -2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొమ్మల ,పదాల ఉలి నేర్పున్న” ఉల్చి ”

ulchi-1ulchi-2ulchi-3ulchi-4a

Posted in సేకరణలు | Tagged | Leave a comment

హాస్యం -మెదడు –కవన శర్మ

hasyam -kavana sharma -1hasyam -kavana sharma -2hasyam -kavana sharma -3

Posted in సేకరణలు | Tagged | 1 Comment

కదా గంధం -4(చివరి భాగం )

 కదా గంధం -4(చివరి భాగం )

   ప్రభుత్వ ఉద్యోగికి దేశం ముఖ్యం .ప్రజలు ,ప్రజావసరాలు ముఖ్యం అని ఉద్యోగ జీవితం అంటూ ఉద్యోగం ప్రారంభించిన నాడు స్వాతంత్ర సమార యోధు డైన తండ్రి ,జమ దగ్నికి బోధించిన ఆదర్శాన్ని ఉద్యోగం లో ఆచరించి కష్టాల పాలైన నిజాయితీ ఆఫీసర్ కధే ‘’మరపు ‘’.భర్త తనను గుర్తించాలని ,మనసు తెలుసు కోవాలని ప్రతి భార్య కోరుకొంటుంది .అది తీరితే తృప్తి లేకుంటే క్షోభ .ఉదాసీను డైన భర్త మనసుని మార్పించిన ‘’డాక్టర్ శ్యామల ‘’కదా ముచ్చట గా ఉంది .అందం ,ఆకర్షణ ,శరీరానికి కాదు ఆత్మకు ఉంటేనే పరమార్ధం .పై పైన కనీ పించే వాటి మొహాలకు భ్రమ పడవద్దని చెబుతూ స్నేహం ,ప్రేమ ,ఆత్మీయ మైనవి గా భావించాలని తెలియ జెప్పే ‘’అనూరాధ కధే ‘’మామ్మ’’మామ్మ అని అందరు వెక్కి రించినా నేను అమ్మనే ,ఆమె భావానికి ప్రతి రూపాన్ని అని చెప్పిన అనూరాధ వ్యక్తిత్వం గొప్ప గా ,ఆమె కు కళ్ళు లేక పోయినా ,లోకం ఆమె ను అర్ధం చేసుకో లేని కబోది గా ఉందని చాటే కమ్మని కద .    

      ఈ కదా లన్నిటిలో శ్రీ శర్మ గారి చేయి తిరిగిన నైపుణ్యం స్పష్ట మౌతుంది .ఎక్కడా అస్పష్టత ఉండదు .స్వచ్చ స్పటికం గా ఉంటాయి కధలన్నీ .ఆరంభ శూరత్వం,ముగింపు వైభోగం ఉండవు..పువ్వు మెల్లగా రేకులు విచ్చు కొన్నట్లు కద నెమ్మది గా మెత్తగా .గమ్మత్తు గా సాగుతుంది .ఇదే వీరి శిల్ప విన్నానం.’’మధురాంతకం రాజారాం‘’ లా  అంతా ఆయనే చెప్పేస్తారు పాఠ.కుడి ఆలోచనకేమీ మిగల్చారు .ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తారు .ఎవరి మీదా కోపం ద్వేషం ఉండవు .ఉద్రేకం ఉగ్రాలసలు కనీ పించవు .ఇదీ జీవితం –మీ ముందుంచు తున్నాను .ఇందులో తీపి ఆస్వాదించండి .అన్నట్లు గా ఉంటాయి కధలు .సంభాషణలు అవసరం మేర కే ఉంటాయి .అవీ అర్ధ గౌరవం తో కాంతు లీను తాయి .అచ్చమైన తెలుగుదనం ఉంటుంది         

               వ్యధా భరిత సమాజం లో ఉంటున్నాం మనం .అన్యాయం ,ఆక్రందనలు మన చుట్టూ ఉన్నాయి .చూస్తూ ఊరుకొంటే కౌరవ సభలోని భీష్మ ద్రోనాదుల్లాగా మనమూ అను భావించాల్సిందే .బాధిత తాడిత పీడిత వ్యదార్తులకు సహృదయం తో స్నేహ హస్తం చాచాలి అవి ప్రేమ దయ ,కరుణ ,వాత్సల్యం అనురాగం ,ఆత్మీయత లతో అందిస్తే ‘’అమృత హస్తాలు అయి ఊరట కల్గిస్తాయి .శాంతి ,సహనం ,సహవేదన అహింస మన మూలాలు ,పునాదులు .పునాదులు లేని సౌందర్య భవనం కూడా కూలి పోతుంది .తస్మాత జాగ్రత జాగ్రత .నిశిత లోక పరిశీలనా ,ఆవ గాహన ,చాతురీ విలసిత రచనా విధానం శ్రీ గంధం వెంకా స్వామి శర్మ గారివి .దీనికి మించి శర్మ గారిది ‘’అమృత హృదయం ‘’అందుకే అన్ని కధలు అమృత గుళికలు .’’గంధం ‘’వారి ఇంటి పేరు .దాని సుగంధం వ్యాపిస్తూనే ఉంటుంది .వీరి తమ్ముడే  ప్రఖ్యాత కధకు లు శ్రీ గంధం యాజ్ఞ వల్క్య శరం గారు వీరి కధలూ అపురూపాలే .ఆ పాదు లోని వారే కనుక శర్మ గారి కద లన్నీ సుగంధ బంధురాలు .

                 శ్రీ శర్మ గారితో నాకు పరిచయం 2002 లో మాత్రమె జరిగింది . ఆ తర్వాతా రెండేళ్లలో రెండే సార్లు సాహిత్య సభల్లో కలుసు కొన్నాము .నామీద వారికి ఎంతో ఆదరణ .ఈ కధలకు నన్ను ‘’’అభిప్రాయం ‘’రాయమని  జిరాక్స్ కాపీ పంపారు .నా కున్న అర్హత లేమిటో నాకు తెలీదు .కానీ పెద్దలు వారి మాట శిరసా వహించా .వారి ఆత్మీయతే నన్ను ఇంత రాయించింది .నా అభిప్రాయాల కు అర్హత కన్నా ,ఆత్మీయ వచనం గా భావించి రాశాను .వారి అమృత హస్తాలకు ,అమృత హృదయానికి క్రుతజ్ఞాతాంజలి ఘటిస్తున్నాను .

        ఇది రాసింది 22-6-2004 న .దీన్ని అమృత హస్తాలు పుస్తకం లో చేర్చారు .ఆ తర్వాత ఎన్నో సార్లు కలుసుకొన్నాం .మా దంపతులంటే వారికి వల్ల మాలిన అభిమానం శ్రీ శర్మ గారు ‘’సరస భారతి ‘’కార్య క్రమాలలో ఉత్సాహం గా పాల్గొనే వారు ప్రసంగాలు చేశారు కవితలు రాసి మా కవి సమ్మేళనాలలోపాల్గొన్నారు .వారు అకస్మాత్తు గా 20012 ఏప్రిల్ లో మరణించారు .గొప్ప ఆత్మీయుడిని కోల్పోయానని అని పిస్తుంది

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-2-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

రామప్ప కావ్యం ఆవిష్కరణ ఆహ్వానం

ramappa invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ కుమార్ (విజయవాడ )కవిత -నిశీధి స్వాతంత్రాని కి

sri kumar kavitha

Posted in కవితలు | Tagged | Leave a comment

చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

  చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

 1967 అక్టోబర్ తొమ్మిదిన చేగువేరా ను బొలీవియా లో అమెరికా సి.ఐ.ఏ .కాల్చి చంపింది .దీన్ని గర్హిస్తూ జీన్ పాల్ సాత్రే ‘’Che was the most complete human being of our age ‘’ అన్నాడు .క్యూబా లో కమ్యూనిస్ట్ పాలన ఫిడేల్ కాస్ట్రో నాయకత్వాన ఆవిర్భ వించ టానికి కారణ మైన విప్ల వీరుడు చేగువేరా .గెరిల్లా యుద్ధానికి ఆద్యుడైన వాడు .మిలిటరీ యుద్ధ వ్యూహ నిపుణుడు,సైన్యాధి పతి మీదు మిక్కిలి డాక్టరు, గొప్ప రచయితా.కూడా ..వందలాది పత్రికలకు పుంఖాను పున్ఖం గా వ్యాసాలూ రాశాడు జన చైతన్యం తెచ్చాడు .నిద్ర పోతున్న జాతిని జాగృతం చేశాడు .మంచి కవిత్వం రాసిన విప్లవ కవి .జీవిత కాలం లోనే చాలా పుస్తకాలు రాసి ప్రచురించాడు చేగువేరా .అతను గెరిల్లా యుద్ధ తంత్రం మీద రాసిన పుస్తకాన్ని మిలిటరీ ఎక్స్ పర్త్స్అధ్యనయనం చేస్తుంటారు ఇప్పటికీ . దీనికి తోడు అతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ..లాటిన్ అమెరికా దేశాలకు న్యూస్ రిపోర్టులు రాసి పంపేవాడు .తిరుగు లేని కమ్యూనిస్ట్ .కమ్యూనిజం నరా నరానా జీర్ణించుకొన్న వాడు .నిజం గా చెప్పా లంటే గొప్ప సోష ఫిలాసఫర్ .ఆయన్ను హేస్పానిక్ హీరో అని ,విప్లవ నాయకుడని చెప్పుకొని గర్విస్తారు అనుచరులు .

 

     క్యూబా ప్రభుత్వం లో ఉండి పూర్తీ కొత్త పాలనా విధాన్ని ప్రవేశ పెట్టిన ఆలోచనా పరుడు అమలు చేసిన వాడు .లాటిన్ అమెరికా ప్రజల ఆశా జ్యోతి చేగువేరా .చేగువేరా చాలా ఇష్టపడి చదివిన పుస్తకం సేర్వాన్ టేస్స్ రాసిన ‘’డాన్ క్విక్సోట్ ‘’నవల .క్విక్సోట్ స్పెయిన్ దేశమంతా బక్క చిక్కిన’’ రోసి నంటి’’అనే గుర్రాన్ని ఎక్కి తిరిగి అన్యాయాన్ని అక్రమాలనుంచి ప్రజల్ని రక్షించాలని పగటి కలలు కనే వాడు .తన బల్లెం రోసి నంటి కంటే బల మైంది అన్నాడు .       

 

 

    చేగువేరా 1928 జూన్ పద్నాలుగున అర్జెంటిన లోని రోసారియో లో జన్మించాడు .అసలు పేరు ‘’Ernesto Guvera de la serna ‘’హిస్పియానిక్ సంప్రదాయం లో తల్లి పేరు ను చివర పెట్టుకొని గౌరవించే విధానం  ఉంటుంది .తండ్రి ఎర్నేస్తో .తల్లి సెర్నా .సంపన్న కుటుంబమే వారిది .తండ్రి రియల్ ఎస్టేట్ చేసే వాడు బానే సంపాదించాడు .చిన్నప్పటి నుంచి చేగువేరా కు ఉబ్బసం జబ్బు ఉంది .చిన్న నాటి నుంచే విపరీతం గా పుస్తకాలు చదివేసే వాడు .అందులో సాహస గాధ లంటే చెవులు కోసుకొనే వాడు .ఇంజన్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా అంతా 2,680 మైళ్ళు ప్రయాణం చేసిన సాహసి ..హైస్కూల్ లోనే విప్లవ భావాలు అంకురించాయి .ఉబ్బసం ,కేన్సర్ వంటి వ్యాధుల పై రిసెర్చ్ చెయ్యాలనే ఆలోచన బలం గా ఉండేది .డాక్టర్ పాసైనాడు .

           ఎలేర్జి ఇన్స్తి institute  లో మేల్ నర్సు గా పని చేశాడు ముందుగా .ఎన్నో వ్యాపారాలు చేయాలనాను కొన్నాడు .బొద్దింకలను చంపే ‘’లోకష్టు ‘’తయారు చేయాలని ఆలోచించాడు .తన మోటారు సైకిల్ ను la ponderosaఅంటే శక్తి వంత మైంది అని పిల్చుకొన్నాడు .తొమ్మిది సార్లు సంచార యాత్ర దిగ్విజయం గా చేశాడు .ప్రజల పరిస్తితులను గమనించే వాడు .ఎక్కువ పని గంటలు ,పారి శుధ్యం లేని జీవితాలు ,కారు చీకట్లో నివాసాలు తో బతుకు దుర్భరం గా ఈడుస్తున్న కార్మికుల, సామాన్య ప్రజల ను చూసి కలత చెందాడు .డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే మళ్ళీ రైల్ లో మళ్ళీ యాత్ర చేశాడు .గ్వాటి మాలా వెళ్లి ‘’విజ్ఞాన సర్వస్వాలు ‘’అమ్మాడు .దాని ప్రెసిడెంట్ జాకబ్ ఆర్బెంజ్ అంటే విపరీత మైన మోజేర్పడింది .

         ఇంతకీ చే అంటే వాళ్ళ భాషలో ‘’బుడ్డాడు ‘’అని అర్ధం తలిదండ్రులు పిల్లల్ని పిలుచుకొనే ఆప్యాయపు పిలుపు అది .ఫిడేల్ కాస్ట్రో ఆ పేరు నే ఖాయం చేశాడు ..1950 లో చేగువేరా కాష్ట్రో ని కలిశాడు .ఆ మరుసటేడాది ప్రేమించిన హీల్డా గాదియా ను పెళ్ళాడాడు .బొద్దు గా లావుగా ఉన్న శరీరాన్ని తగ్గించుకోవ టానికి బ్రెడ్ ,పాస్త ,స్ట్రీక్ లు తినటం మనే శాడు .కాస్ట్రో అతన్ని చాల్కో ట్రైనింగ్ కు నాయకుడిని చేశాడు .అతనొక్కడే క్యూబా దేశానికి చెందినా వాడు కాదు అంటే నాన్ క్యూబన్ .ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ ని చేశాడు .అది అప్పుడు లెఫ్టి నెంట్ రాంక్ ..1956 లో నవంబర్ ఇరవై అయిదవ తేదీన గువేరా, కాస్ట్రో మరో 81 మంది యోధులు మెక్సికో నుంచి క్యూబా కు చేరారు .చేను ఆర్మీ కామ్బాట్ చేయ వద్దకని వారించాడు కాస్ట్రో .     

         1963 లో ‘’గెరిల్లా వార్ ఫేర్ ‘’అనే క్లాసిక్ పుస్తకాన్ని రాశాడు చేగువేరా .అప్పటి క్యూబా అధ్యక్షుడు బాటిస్థా క్రూర విధానాలతో ప్రజలు విసుగెత్తి పోయారు .1958 లో డిసెంబర్ ముప్ఫై న క్యూబా ను వశం చేసుకొన్నారు విప్లవ వీరులు .విజయం లభించిన తర్వాతా ‘’no-we have not  won the war .the revolution begins now ‘’అన్నాడు చేగువేరా .క్యూబా లో కమ్యూనిష్ట్ ప్రభుత్వం రావాలి అని కాష్ట్రో కు చెప్పాడు .1959 జనవరి రెండు న కాస్ట్రో గువేరా ను మిలిటరీ కమాండర్ ను చేశాడు .చీఫ్ ఎక్సి క్యూషనర్ అయిన కాష్ట్రో కు కమ్యూనిజాన్ని బోధించాడు .సైనికులకు చదువు చెప్పాడు .1959 ఫిబ్రవరి ఏడున కాష్ట్రో చేగువేరా కు పౌరసత్వం ప్రదానం చేశాడు .అంతే కాదు director of the national institute of agrarian reforms అనే పదవి నిచ్చాడు .ఆ తర్వాతా క్యూబా జాతీయ బాంక్ కు అధ్యక్షుడిని చేశాడు .వెంటనే తన మంత్రి వర్గం లో పరిశ్రమల మంత్రి గా తీసుకొన్నాడు .దీనితో బాటు క్యూబా ఆర్ధిక శాఖ కు ఇంచార్జి నీ చేశాడు .    

         క్యూబా లో చెరుకు బాగా పండుతుంది క్యూబా ను ‘’షుగర్ బౌల్ ‘’అంటారు .చెరకు మీదే క్యూబా ఆర్ధికం గా ఆధార పడింది .ఇది అదను గా చేసుకొని అమెరికా పెత్తనం చేస్తోండి .దేశం లో అమెరికా ధనంనం ఎక్కు వై ప్రభావం చూపిస్తోంది .అందుకని రష్యాతో ఒప్పందం కుదిర్చి రష్యాకు పంచ దార ను ఎగుమతి చేయించాడు .వాళ్ళ పెత్తనమూ ఎక్కు వై పోయింది .1959 జూన్ లో చేగువేరా చైనా కు డిప్లొమాటిక్ యాత్ర చేశాడు  ఆధికారికం గా .ఆసియా యూరప్ ,ఆఫ్రికా దేశాలలో పర్య టీంచాడు .1965 మార్చి పద్నాలుగున క్యూబా చేరి చాలా నెలలు జనానికి కనీ పించ కుండా అజ్ఞాత వాసం లో గడి పాడు ..

       క్యూబా వదిలి పెట్టి ఆఫ్రికా కు చేరాడు .అక్కడి విప్ల వానికి తన అవసరం ఉందని సాయం చేద్దామని అను కొన్నాడు .కాంగో లో అనుకూల పరిస్తితులేమీ చేగువేరా కు కంపించ లేదు .భార్య తో విడాకులు  పొందాడు .అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు .బొలీవియా లో విప్ల వానికి సాయం చేద్దామని ఉవ్విళ్ళూరి బొలీవియా వెళ్ళాడు .అక్కడి జనం ఇంకా విప్లవానికి సిద్ధం గా లేరని తెలుసు కొన్నాడు .అమెరికా అక్కడి పాలకులకు అండగా ఉంది .అనేక వేషాలు మార్చి అక్కడికి చేరుకొన్నాడు పాపం .

              1967 అక్టోబర్ లో కాల్పుల్లో దెబ్బ తిన్నాడు .ఒడి పోయాడు .ఒక గార్డు అతని పై ఉమ్మేశాడు .మళ్ళీ ఎదురు తిరిగి ఉమ్మేశాడు చేగువేరా .కట్టేశారు .’’I am thinking about the immortality of the revolution –so feared by those you serve ‘’అన్నాడు .చేగువేరా ను చంప వద్దని పై ఆధికారులు ఆదేశించినా  కింది వారి పెత్తనం, అమెరికా ఒత్తిడి తో ఉదయం ఒంటి గంటకు అమెరికన్ అధికారులు అక్కడికి చేరారు .అతని విప్లవం గురించి ప్రశ్నించాలని అనుకొన్నారు .కాని బోలీవియన్ అధికారులు ఒప్పు కో లేదు .మధ్యాహ్నం ఒకటి పది కి ఒక స్కూల్ లో బంధింప బడిన అతన్ని ,గాయాలతో విపరీతం గ బాధ పడుతున్న వాడిని ‘’టేరాన్’’అనే వాడు కాల్చి చంపేశాడు .39ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి పోయింది .’’I know that you are here to kill me .Shot coward.you are only killing a man ‘’అని తనను చంపినా విప్లవం ఆగి పోదని ధైర్యం గా చెప్పాడు .

       1997  లో అక్టోబర్ 17 న గువేరాను క్యూబా శాంతా క్లారా లో మళ్ళీ గౌరవం  గా సమాధి చేశారు  ఆ సందర్భం గా కాస్ట్రో మాట్లాడుతూ  .’’Che is fighting and winning more battles than ever ..thank you Che for your birth ,your life ,and your example .thank you for coming to re inforce us in difficult struggle in which  we are engaged to day to preserve the ideas for which you fought so hard ‘’అని ప్రశంసిం చాడు  కాస్ట్రో ‘అదీ ఆ విప్ల వీరుని త్యాగం, బుద్ధి కుశలత,ప్రజా భ్యుదయం ,సేవ

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 5-2-13-ఉయ్యూరు .

Posted in రచనలు | Tagged | Leave a comment

కథా గంధం –3

  కథా గంధం –3

    సేవా భావానికి మారు పేరు గా నిలిచిన నర్సు అమరేశ్వరి ‘’అమృతమ్మ ‘’గా అందరికి మాన్యమైంది .నేటి వికృత రాజ కీయానికీ ,ఆ విష సంస్కృతికి బలి అయి పోయిన ఒక అబలకన్నీటి వ్యధా భరిత కథే ‘’సింహావలోకనం ‘’అధికార బలం ,అంగబలం అర్ధబలం ఉన్న సీతా రామయ్య –అబలా ,అసహాయ ,సాదు శీలా అయిన సుశీల జీవితం తో చేల గాటమాడి క్రూరం గా పట్టి బంధించి ,అనుభవించి, చివరికి విధి వక్రించి ప్రమాదం లో కాలు పోగొట్టుకొని ఆస్పత్రి పాలై తన గతాన్ని ఓ సారి తలచుకొని సుశీల ఎదటే ప్రాణం విడుస్తాడు .ఈ జీవితం లో చేసిన పాపం ఇక్కడే అనుభ వించాలి అన్నదానికి ఉదాహరణ గా రాసినదిది .   

        నీటి వాగుల్లో ‘’బుడుగు ‘’లుంటాయి .జాగ్రత్త లేక పోతే ప్రమాదమే ప్రాణ నష్టం కూడా .వీటికి హెచ్చరిక బోర్డులుంటాయి కాని నిత్య జీవితం లో మనతోనే ఉంటూ ,అగాధానికి త్రోసే బుడుగు లను ఎలా తెలుసుకోగలం ?అదిగో అలాంటి వాడే ‘’మన్మధ రావు ‘’వాడి కథే ‘’బుడుగు లుం టాయ్ జాగ్రత్త ‘’’’మన్మధుని భార్య విద్యా వతి .ఆమె పేరుతో పరిశ్రమ స్తాపించి ,ఆమె ను డాక్టరేట్ చేయిస్తున్నాడు .విలాసం పెరిగి ‘’సుహాసిని ‘’ని మెట్టుగా వాడుకొని వ్యాపారం సాగిస్తూ ,అప్పుల పాలై ‘’గౌతమి ‘’తో జత కలిపినా నష్టాల ఊబిలో దిగి పోయాడు .డాక్టరేట్ పొందిన విద్యా వతి తన పరిశ్రమ ను చక్క దిద్ద టానికి పూను కొంది ..కోర్టు లో కేసు కు మృతు రాలి గా హాజరై తను రాసుకొన్న విజ్ఞాపనను కోర్టు కు వ్రాత పూర్వకం గా తెలిపింది .’’భార్యా భర్తల మధ్య ప్రేమ ,అనురాగం ఆత్మీయత ఉండాలి .డబ్బు కు దాసు డైన ఈ నాటి భర్తలకు భార్య అక్కర్లేదు..అవసరాలు ,కామం తీర్చే బానిస కావాలి అని కోరు కుంటారు అన్నది .ఆడ వాళ్ళ పేరిట వ్యాపారాలు పెట్టిన్చవద్దు .విశ్వాస ఘాతకుల్ని పెంచ వద్దు అని యువకులను హెచ్చ రించింది .కుక్కను పెంచితే అది స్నేహితుని లా ,అంగ రక్షకుని లా ఉంటుంది ,ఆనందాన్నీ ఇస్తుంది ‘’అని హితవు చెప్పింది .భార్యల్ని సోపానాలుగా వాడుకొని త్రోసి వేసే ఆధునిక భర్తలకు కను విప్పు కల్గించే కథబుడుగు .

           ‘’సత్యమేవ జయతే ‘’వల్ల లాభమేమీ లేదు ‘’అసత్య మేవ జయతే ‘’అంటే అన్నిటా లాభాల పోగులే .పేరడీ గా,సరదా గా  చెప్పిన కథ బాగుంది .కష్టపడి చదువులు చెప్పిస్తే కొడుకులు ఏ అమెరికా లోనో హాయిగా సంపాదించు కొంటు వీలైతే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తూ వృద్ధాప్యం లో తలిదండ్రుల అతీ గతీ పట్టించు కొని పరిస్తితి ఈ నాడు దేశ మంతా ఉంది .వృద్ధాప్యం శాపమై పోయింది .అందుకే అలాంటి వారినాద రించి కన్నీరు తుడిచి సేవ చేయ టానికి వ్రుద్దాశ్రమాలేర్పడ్డాయి .సంపాదించింది కన్నపిల్లల పాల్జేసి ,ఆలనా పాలనా లేకుండా ఉండటం కంటే ‘’రిటైరీలు ‘’ఇలాంటి ఆశ్రమాలు స్తాపించి ,ఒకరి కొకరు సాయం చేసుకొంటూ ఊరట కల్గిస్తూ ,పొందుతూ తృప్తినీ ,జీవన మాధుర్యాన్ని ,ప్రశాంతిని పొంద టానికి సహకరించు కొంటున్నారు .ఈ నేపధ్యం గా రాసిన కథలే ‘’మధురాశ్రయం ‘’,’’సుభద్రా –‘’,’’స్వర్గ ధామం ‘’’’వృద్ధాప్యాన్ని ఆద రించాలి ‘’కధలు .

     ‘’ప్రమాదో ధీమాత మపి ‘’ఎంతటి వారి కైనా సహజం .అందులోను అందాల రాశి భార్య గా ఉంటె భర్తకు అను మాన పిశాచం ఆవ హిస్తుంది .అందానికి మారు పేరు ‘’అక్కమ్మ ‘’.సూరయ్యభార్య .అతని అనుమానం ఆమెను ఆమెను అతడిని వదిలేసి వెళ్ళేదాకా వెళ్ళింది .సూరయ్య మళ్ళీ పెళ్లి చేసుకొన్నా ఆవిడా దక్కలేదు .ఒక కొడుకు నిచ్చి చని పోయింది .పుష్కరాలలో సూరయ్యా  అక్కమ్మా కలుసు కొంటారు .ఆమె అప్పటికే కాలు జారింది .తప్పునూ తెలుసు కొంది .పశ్చాత్తాప దగ్ధ అయి పునీత అయింది .అత్తారి ఊరు చేరి ,దేవాలయం లో ఉంటూ జీవితాన్ని భగవంతునికి అంకితం చేసుకొంటూ బతుకు తోంది .’’వృద్ధ నారీ పతివ్రత ‘’అని ఎక్కి రించారు ఆ ఊరి వాళ్ళు .పూజారి కూడా భ్రమ పడి ఆమెతో తప్పు చేయిద్దామని ప్రయత్నిస్తే ‘’అన్నయ్యా ‘’అనగానే ,అతని లోని చీకట్లు చెల్లా చేద రయి నాయి .జ్ఞానోదయమైంది .వైకుంఠఏకాదశి నాడు స్వామి సేవ చేస్తూ తనువు చాలించింది .ఆచార్లు ‘’మీ స్మరణ దలర్చు మానవులు సద్గతి చెందినా దెంత వింత ‘’అన్న దాశరధీ శతక పద్యాన్ని స్మరిస్తూ అక్క మహాదేవికి  భక్త్యాంజలి ఘటించాడు . .’’దమ్మక్క ‘’ను ఆమె లో దర్శించాడు .తన సర్వస్వాన్నివేణుగోపాల స్వామి కి అంకిత మిచ్చి ఆయన లో ఐక్యమై  జన్మ సాఫల్యం చేసుకోని ‘’నివేదిత ‘’అయింది అక్కమ్మ .మానవుని లోని అన్ని కోణాలను స్పృశించి రాసిన మా మంచి కథ ఇది .

          సశేషం

              మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –5-2-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కథా గంధం -2

క థా గంధం -2

ఈ రెండు కథల మధ్య లో ఉన్న వాటి గురించి ఇప్పుడు తెలుసు కొందాం .జీవితాంతం ప్రభుత్వ చాకిరీతో కండలరగదీసుకొని ,రిటైర్ అయిన నాటికి ఓ సొంత కొంప ఏర్పరచుకోవాలని కలలు గన్న సూపరింటెన్న్దేంట్ రామ క్రిష్నయ్య కు తన నీతి,నిజాయితీలు ఎందుకూ కొరగాకుండా పోయాయి .’’రెడ్ టేపిజం ‘’కు బలై అనారోగ్యం తో బల వంతపు ఉద్యోగ విరమణ చేయ వలసి వచ్చింది .ప్రావిడెంట్ ఫండ్ కోసం ఎదురు  చూశాడు .కొంత డబ్బు వస్తే స్థలం కొన్నాడు .మిగతా డబ్బు కోసం కళ్ళలో వత్తులేసుకొని ఎదురు చూసి చూసి విసుగెత్తి పోయాడు .చివరికి భార్య ద్వారా బిల్లు వచ్చిందన్న మాట విని ‘’పునాది కి ఉపయోగిస్తుంది అను కొన్నది సమాధి కి ఉపయోగిస్తుంది అ ను కోలేదు‘’అంటూ ప్రాణం విడిచాడు .సక్సేషన్ సర్టిఫికేట్ లేనిది బిల్లు పాస్ అవదని ఆఫీసులో కొర్రి వేశారు వెర్రి వెధవలు .భర్త ఉత్తర క్రియలకు చేసిన అప్పు తీర్చలేక ఆయన త్ర్తవ్వించిన నూతికి అర్పణ మైంది భార్య .ఉద్యోగస్తుల దయ నీయ పరిస్తితి రెడ్ టేపిజం కు ఇదొక దర్పణం .దాని ప్రభావం ఎంత బలం గా ఉంటుందో చెప్పే కథ .కన్నీటిని చిలకరింప జేసే వ్యధ .ప్రత్యక్షర సత్యం కన్పించే జీవిత గాధ .

             ‘’అమృత హస్తాలు ‘’అనే కథపేరే ఈ కథా సంపుటికి నామ దేయం ..ప్రాణం ఎవరి కైనా తీపే .అందులో మానవ ప్రాణం మరీను .’’తన యందు అఖిల భూతముల ను జూచే మనస్తత్వం ‘’మనది .వేదోప నిషత్తుల సారమూ ఇదే .భాగవత ధర్మం ,భారతోపదేశం ,రామాయణ సారమూ ఇదే .తన ‘’ఎల్లావు ‘’తన కళ్ళ ముందే చని పోతే ఏమీ చేయ లేని దైన్య స్తితి లో ఉన్న కృష్ణ మూర్తి పశు వైద్యం నేర్చుకొని చుట్టు ప్రక్కల గ్రామాలలో పశు వైద్య సేవ చేస్తూ అందరికి క్రిష్ణయ్య గా ఆత్మీయుడైనాడు. .క్రిష్నయ్య జ్వరం లో ఉన్నాడోక సారి .ఆయన ఆరోగ్యం ఏమవుతుందో నాన్న భయం తో కొడుకు పొరుగూరి నుంచి పశు వైద్యానికి రమ్మని వచ్చిన వాళ్ళని విసుక్కోన్నాడు .లోపల ఉన్న క్రిష్నయ్య ఇది విని జ్వరం తో నే వారి వెంట బయల్దేరి వెళ్ళాడు .కొడుకూ వెంట వెళ్ళాడు .ఆ ఊరు వెళ్లి ఎల్లావుకు వైద్యం చేసి అయిదే అయిదు నిమిషాల్లో ‘’గురక జబ్బు ‘’నయం చేశాడు .అందరు క్రిష్ణయ్యది ‘’అమృత హస్తం ‘’అన్నారు .దీన్ని ప్రత్యక్షం గా చూసిన కొడుకు ‘’క్షణం తీరిక లేదు –దమ్మిడీ సంపాదన లేదు ‘’అని ఇప్పటి దాకా తండ్రిని కసురుకొన్న వాడు ,ఆ భావం  నశించి తండ్రి  ఆరాధ్య దైవం అను కొన్నాడు .’’దేశం కోసం ,చుట్టూ ఉన్న సమాజం కోసం ఉదారం గా శ్రమిస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుంది భూతాల నరకం  నుండి విముక్త మవుతుంది ‘’అన్న స్వామి వివేకా నంద మాటలను ఆచరణ లో చూపించే కథ ఇది .దయా సానుభూతి సాహవేదన ,కరుణ ,ప్రేమ లేని జీవితం వ్యర్ధం .ఈ భావాలతో స్నేహ హస్తాలను సాచితే అవే అమృత హస్తాలై దుఖాశ్రువులను తొలగిస్తాయి మనో ధైర్యం నింపి మానవత ను వికశింప జేస్తాయి .మానవతా గంధం పరి మళాలను వ్యాప్తి చెందిన్చాలనే భావం తో స్పందించి ,.98 ఏళ్ళ వయసులో కూడా పశు వైద్యం చేస్తూ ‘’పశుపతి ‘’లా సేవ చేస్తున్న తమ పిన తండ్రి దిన చర్య నే కథ గా మలిచి ,ఆయనకే అంకితమిచ్చారు శర్మ గారు .కనుక కర్తవ్య బోధ చేసే ‘’అమృత హస్తాలు ‘’శీర్షిక కథకు ,సంపుటికి వన్నె తెచ్చి సార్ధక మయింది

            ‘’చెప్పేవి శ్రీ రంగ ఈతులు దూరేవి –‘’ఉదాహరణేనే రావూరి రంగయ్య కద .’’ఏ ఎండాకా గొడుగు పట్టే‘’తీరున్న వాడు .దీన్ని చాటి చెప్పేదే ‘’గాలి కోళ్ళు ‘కదా .కథనం చాలా బాగుంది .వ్యాసా రావు భార్య గృహిణి .భర్త కాలేజి కి వెళ్ళగానే ఆమె ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి ,సాయంత్రం భర్త ఇంటికి వచ్చే ముందు చేరుతుంది .ఇరుగు పొరుగు వారి మాటలు వాళ్ళ భార్యపై అతనికి అనుమానం వస్తుంది .ఒక రోజు స్త్రీ సమాజ ఉత్స వానికి ఆహ్వానం వస్తే వెళ్ళాడు .అక్కడ అ జరిగే అన్ని కార్య క్రమాలకు సహాయ సహకారాలన్దిస్తున్న ఓ స్త్రీ మూర్తిని అధ్యక్ష కార్య దర్శులు కృతజ్ఞత తో పొగిడి ,ఆమె ను సత్కరించ దలిచి సూర్యా రావు ను వేదిక పైకి ఆహ్వానిస్తారు ఎందుకో తెలీదు కాని ఎక్కాడు .ఆ స్త్రీ మూర్తి రాసిన జాబును కార్య దర్శి చదివింది .అందులో ఆమె తనకు చేయ దలచిన సత్కారాన్ని తన భర్త ద్వారా అందించ మని రాసి నట్లుంది .ఆయన ప్రోత్సాహమే తనకు ఆదర్శం అని చెప్పింది .వ్యాసా రావు ఆమె తన భార్య సరళ గా గుర్తించి ఉక్కిరి బిక్కిరి అయాడు .అవమానం ,పశ్చాత్తాపం ముంచెత్తాయి .అందరు అతన్ని పొగిడి ‘’ఆ అదర్శ మూర్తి ‘’ని తీర్చి దిద్దిన మహాను భావుడు అని పొగిడారు .ఏమీ పాలు పోక బహుమతిని అందుకొని ఇంటికి చేరాడు .’’అపార్ధం చేసుకొన్నాను క్షమించు ‘’అని ప్రాధేయ పడ్డాడు .ఆమె ‘’గాలి ఎటు నుంచి వస్తే అటు చూసే గాలి కోళ్ళు లను అతనికి చూపించింది .’’పురుషుల మనస్సుల్లాగానే అవి దిశను మారుస్తాయని మేళ మాడింది ‘’భార్యా భర్తల మధ్య మంచి అవగాహనా ,ఆత్మీయత ,నమ్మకం ఉంటేనే సంసారం స్వర్గం లేకుంటే నరకం ,మనో వ్యధ ‘’అని చెప్పే మంచి ఇతి వృత్తం తో రాసిన కథ .

                          సశేషం —మీ—గబ్బిట దుర్గా ప్రాసాద్ –4-1-13 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రణబ్‌తో ప్రయాణం

ప్రణబ్‌తో ప్రయాణం


ఎ.కృష్ణారావు

మన జాతీయ జెండాలో మూడు వర్ణాలు ఉంటాయి. రాష్ట్రపతి అయిన ప్రణబ్ లోపల కూడా ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒకరు విజ్ఞానవంతుడు. ఇంకొకరు రాజనీతిజ్ఞుడు. మరొకరు దేశభక్తిపరుడు. ఈ ముగ్గురి సమాహారమే.. ప్రణబ్‌ముఖర్జీ. దేశ అత్యున్నత పదవిని నిర్వహిస్తున్న ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనలను తెలుసుకునేందుకు.. ఇటీవల కొందరు పాత్రికేయులకు అరుదైన అవకాశం దొరికింది. ఆ పర్యటనలో పాల్గొన్న ఒక తెలుగు పాత్రికేయుని అనుభవాలే ఇవి.. 

రాష్ట్రపతీజీ.. ఒకప్పుడు మీరు ఇదే కాలేజీలో పాఠాలు చెప్పారు. ఆ రోజులు మీకు గుర్తుకొస్తున్నాయా? ఆ మధురానుభూతుల్ని ఎప్పుడైనా తలుచుకుంటుంటారా? మీకు రాజకీయాలు నచ్చాయా.. లేక అధ్యాపక వృత్తి నచ్చిందా? చెప్పండి.
జనవరి 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని విద్యానగర్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఆయనపై ఈ ప్రశ్నల వర్షం కురిపించారు.
అది చాలా వెనుకబడిన జిల్లా. సరైన రోడ్లు లేవు. అక్కడక్కడ మాత్రమే పక్కాభవనాలు ఉన్నాయి. రాష్ట్రపతి, ఆయన బృందం ప్రయాణించిన మూడు హెలికాప్టర్లు దిగడం కోసం వాయుసేన ఎన్నో రోజుల పాటు అక్కడ కష్టపడాల్సి వచ్చింది. ఆ హెలికాప్టర్లు దిగుతుంటే చూసేందుకు వందలాది జనం గుమిగూడారు. హెలికాప్టర్లు దిగుతున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు వచ్చే దుమ్మును వాళ్ళు సంతోషంగా భరించారు.

ఎందుకంటే.. తమ ఊరికి వచ్చింది భారత రాష్ట్రపతి. దేశానికి రాష్ట్రపతే అయినా వారికి ఆయన భూమి పుత్రుడు. బెంగాలీతనాన్ని నరనరాల్లో నింపుకున్న వారి బిడ్డడు. రాష్ట్రపతి హెలికాప్టర్ దిగుతుంటే, వారికోసం చేతులూపుతుంటే, కార్లలో వారి మధ్య నుంచి వేగంగా వెళుతుంటే వారి ఆనందం చెప్పనలవి కాదు. ‘ప్రణబ్‌దా.. ప్రణబ్ దా..’ అంటూ త్రివర్ణపతాకాలు ఊపుతూ ఆత్మీయ స్వాగతం చెప్పారు.

ఒకప్పటి మాస్టారు…
ప్రణబ్‌కు ఆ ఊరు అంటే ఎంతో ప్రేమ. విద్యానగర్ కాలేజీలో 1963-68 మధ్య చరిత్ర, రాజకీయ శాస్త్రం అయిదేళ్లు బోధించిన తర్వాతే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. పాఠాలు చెప్పడమంటే ఆయనకు చాలా ఆసక్తి ఉండేదట. ముప్పావుగంట క్లాసు తీసుకోవాల్సి వస్తే అది దాదాపు గంటన్నరకు పైగా గడిచేదట. ప్రణబ్ పాఠాలు చెబుతున్నంతసేపూ ఒక్క విద్యార్థీ క్లాసు నుంచి బయటకు కదిలేవారే కాదట. ఆయన తర్వాత పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు కూడా క్లాసు బయటే నుంచునేవారట. ప్రణబ్ ఆ కళాశాలకు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కావడమే కాదు, ఆయన మేధోసామర్థ్యం పట్ల వారికున్న అపార గౌరవం అది. కళాశాల అయిపోయాక అధ్యాపకులకు శిక్షణ నిచ్చే బాధ్యతను కూడా ఆయనే తీసుకునేవారు. “నాకున్న చెడ్డ అలవాట్లలో ఒకటి- ఏదైనా చెప్పేటప్పుడు సమయాన్ని అస్సలు పట్టించుకోకపోవడం. నేను చెప్పడం మొదలుపెడితే అవతలి వ్యక్తికి సమయం ఉందా? లేదా? అనేదే ఆలోచించను..” అని ప్రణబ్ ముఖర్జీ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మాతో అన్నారు.
జనవరి 17-20 తేదీల మధ్య ప్రణబ్‌తో కలిసి నాలుగురోజులు ప్రయాణించే అవకాశం అయిదుగురు ఢిల్లీ విలేఖరులకు దక్కింది. వారిలో నేనొకడ్ని. ఆయన వెళ్లిన చోటుకల్లా వాయుసేన విమానంలోనూ, హెలికాప్టర్లలోనూ తిరిగాం.

అలుపన్నదే ఎరుగరు…
తొలుత హైదరాబాద్ వెళ్లాం. అక్కడ గంట అయినా ఆగలేదు. వెంటనే కోల్‌కతా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఊపిరి సలపకుండా రకరకాల చోట్లకు తిప్పారు. మేమన్నా అలిసిపోయామేమో కాని 78 ఏళ్ల ఆ వృద్దుడి ముఖంలో అలసిన ఛాయలేవీ కనిపించలేదు. ఇంతకీ విద్యార్థులకు ప్రణబ్ ఏమి జవాబు చెప్పారనుకున్నారు?
“నాకు బాల్యం అంటే ఎంతో ఇష్టం. అయినా బాల్యం ఎవరికి ఇష్టం ఉండదు? కాని ఎవరైనా బాల్యంలో ఆగిపోతారా? ప్రవాహం ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగిపోతే అది మురికి కాలువగా మారుతుంది. మనం ఎప్పుడూ గతంలోనే ప్రయాణించలేం. గతంలోంచి వర్తమానంలోకి ప్రయాణిస్తూ భవిష్యత్తుపైదృష్టి సారించాలి… ” అని విద్యార్థులకు జవాబిచ్చాడు ప్రణబ్.

“రాజకీయాలు, బోధనారంగం ఇందులో మీకు ఏదంటే ఇష్టం అని మీరడిగితే ఏమి చెప్పను? రాజకీయాల్లో ప్రవేశించాలని, దేశానికి ఏమైనా చేయాలని మా అమ్మ చెబుతుండేది. మా కళాశాల సంస్థాపక అధ్యక్షుడు హరేంద్రనాథ్ మజుందార్ కూడా రాజకీయాల్లోకి వెళ్లమని నన్ను ప్రోత్సహించేవారు. అధ్యాపక వృత్తి వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు ఏది ఇష్టమో మీకు వేరే చెప్పాలా?” అని ఆయన నవ్వుతూ జవాబిచ్చారు.

విద్యార్థులు అంతటితో ఊరుకోలేదు. “మీరు ప్రధానమంత్రి కాలేకపోయారు కదా? రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక అయినా ఆ పదవిని చేపడతారా?” అంటూ మరొక ప్రశ్న వేశారు.
ప్రణబ్ ఏమాత్రం తడుముకోకుండా “నాకు వయసు మీద పడింది. నేను చదవాల్సిన పుస్తకాలు, రాయాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రపతి పదవి పూర్తయ్యాక అధ్యయనం, రచనా వ్యాసంగంపై దృష్టి కేంద్రీకరిస్తాను. ఎప్పుడూ వృద్ధులే అంటిపెట్టుకోకూడదు. కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలి..” అన్నారు.
రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర ఇలాంటి విషయాలే ప్రణబ్‌కు తెలుసనుకుంటాం కాని ఆయనకు కీట్స్, షెల్లీల రొమాంటిక్ పొయెట్రీ చాలా ఇష్టమని తెలిసింది. ఒక టీచర్ ఆయనను “మీరు కవితలు చదువుతుంటారా” అని అడిగినప్పుడు “నాకు కీట్స్,షెల్లీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, బుద్దదేవ్ బసు, శక్తి ఛటోపాధ్యాయ, సుధీంద్రనాథ్ దత్తా, విష్ణు డే కవితలు ఎంతో ఇష్టం. అయితే ఇప్పటి ఆధునిక కవిత్వం గురించి నాకంతగా తెలీదు” అని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

అన్నీ గుర్తుంటాయి..
ప్రణబ్ ముఖర్జీకున్న గొప్ప లక్షణాల్లో ఒకటి- ఆయనకున్న అసమాన జ్ఞాపకశక్తి. రాష్టపతి పదవికి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ అవసరమైంది. తన కుమారుడు ఈ సర్టిఫికెట్ ఎక్కడో పోగొట్టారట. దీంతో ఆయన స్కూల్ ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి క్లాసులో తన రోల్ నెంబర్, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ చెప్పి సర్టిఫికెట్‌ను సంపాదించడం సులభతరం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే విలేకర్లతో చెప్పి ఆశ్చర్యపరిచారు. చరిత్రలో జరిగిన అనేక కీలక ఘట్టాల్ని తేదీలతో సహా చెప్పగల దిట్ట ప్రణబ్. ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు.. ఈ విషయం అర్థమవుతుంది. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇందిరాగాంధీ మొదలైన జాతీయ నాయకులు ఏఏ తేదీల్లో ఏఏ నిర్ణయాలు తీసుకున్నారు? చరిత్ర ఏఏ తేదీల్లో మలుపు తిరిగింది? దేశ విభజన సమయంలో ఏ రోజు ఏమి జరిగింది? అవన్నీ ఆయన చెబుతుంటే నోళ్లు తెరుచుకుని విన్నాం మేమంతా. విద్యానగర్ కాలేజీలో తనతో పాటు పనిచేసిన అధ్యాపకుల పేర్లన్నీ ఆయనకు ఇప్పటికీ గుర్తున్నాయని.. ఆయన వారి గురించి ఆరా తీస్తుంటే తెలిసింది.

బిజీలోనూ పుస్తకాలు తిరగేస్తూ…
ఆయన మరో అద్భుత లక్షణం- పని రాక్షసుడు కావడం. సాధారణంగా రాష్ట్రపతితో పర్యటనకు వెళ్లడానికి విలేకరులు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రిలాగ రాష్ట్రపతి కార్యకలాపాల్లో హడావుడి ఉండదు. రోజుకు ఒకటి రెండు కార్యక్రమాలు ఉంటే మహా ఎక్కువ. ఆ తర్వాత విలేకరులు స్వేచ్ఛగా తిరిగేందుకు, మంచి మంచి ప్రదేశాలు చూసేందుకు అవకాశం దొరుకుతుంది. అయితే ప్రణబ్ అంతకు భిన్నమైన వ్యక్తి అని ఆ నాలుగు రోజుల్లోనే అర్థమైంది. ఉదయం తొమ్మిదింటికి కోల్‌కతా రాజ్‌భవన్ చేరుకుంటే రాత్రి ఎనిమిది వరకు ఆయనతో పాటు తిరగడమే పని. తిరిగొచ్చిన తర్వాత కూడా ప్రణబ్.. రాత్రి 12 గంటల వరకు న్యాయమూర్తులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో సహా ఎవర్నో ఒకర్ని రోజూ కలుస్తూనే ఉండేవారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరోజు రాత్రి 9 గంటలకు వచ్చి ప్రణబ్‌తో కలిసి విందు స్వీకరించి, దాదాపు రెండు గంటలుండి వెళ్లారు. ఈ నాలుగురోజుల్లో ఆయన కేంద్రం నుంచి వచ్చిన ఎన్నో ఫైళ్లపై తన అభిప్రాయాలు రాసి పంపించారు. కోల్‌కతాలో ఉన్నప్పుడే ఆయన జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇవి చాలవన్నట్లు ఏ మాత్రం వీలున్నా పుస్తకాలు తిరగేస్తూనే ఉన్నారు ప్రణబ్. సుభాష్ చంద్రబోస్‌పై సుగతాబోస్ రాసిన ‘హిస్ మెజిస్టీస్ అప్పోనెంట్’ అనే పుస్తకం గురించి చెబుతూ… “నేను ఈ పుస్తకాన్ని రెండురోజుల్లో చదివేశాను. చాలా ఆసక్తిగా ఉంటుంది. మీరు కూడా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది” అని ఆయన పాత్రికేయులకు సూచించారు.

చదువుకునే రోజుల్లో ప్రతి రోజూ గంటల తరబడి చరిత్ర, రాజనీతి, అర్ధ శాస్త్రం, ఆధునిక సంస్క­ృతి, నాగరికతకు సంబంధించిన పుస్తకాలతో పాటు కవితా సంపుటాలనుకూడా చదివే వారట. చదవడమే కాక, వాటన్నిటినీ కంప్యూటర్‌లా మెదడులో భద్రపరుచుకున్నారు. ఆ అలవాటును ఆయన ఇప్పటికీ మానుకోలేదు. ఇన్ని పనులు చేస్తున్న ఆయన ఎప్పుడు నిద్రిస్తారు? అని అడిగితే ప్రణబ్ రోజుకు ఐదు గంటలే నిద్రిస్తారని, చాలా స్వల్ప పరిమాణంలో ఆహారం తీసుకుంటారని ఆయన సహాయకులు చెప్పారు. ఆయన రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్ళాక తాము విశ్రాంతి తీసుకోవచ్చని భావించామని.. కాని ఆయన ఎక్కడైనా సరే పని చేయకుండా ఉండరన్న విషయం అర్థమైందని వారు చెప్పారు.

ప్రణబ్ ఆర్థికమంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగి ఉంటే జైపూర్‌లో జనవరి 18-20 తేదీల మధ్య జరిగిన పార్టీ మేధోమధన సదస్సులో కీలక పాత్ర పోషించి ఉండేవారు. పార్టీ చర్చించే పత్రాలను ఆయనే రూపొందించేవారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో కీలకపాత్ర పోషించారాయన. కాని ఈసారి ఈ మేధావి లేకుండానే ఆ సదస్సు జరిగింది. అదే సమయంలో ఆయన కోల్‌కతాలో తన ప్రజల మధ్య ఇన్నాళ్లూ తాను కోల్పోయిన సంబంధాలను వెతుక్కుంటూ, రాష్ట్రపతి హోదాను కూడా పట్టించుకోకుండా చిన్న చిన్న సమావేశాల్లో మాట్లాడుతూ, తనవారిని ఆప్యాయంగా పలకరిస్తూ గడిపేశారు. అయినాసరే, జైపూర్‌లో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ప్రకటించడంపై ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్‌లో కొత్త కాదు.. ఏ పరిణామమైనా ఇలాగే జరుగుతుంది” అంటూ మోతీలాల్ నెహ్రూ 1919లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ వారసత్వ చరిత్రను వివరించారు.

జాతీయవాది..

ప్రణబ్ ముఖర్జీ జాతీయవాది అని ఆయన సంభాషణల ద్వారా, అక్కడ ఆయన చేసిన ప్రసంగాల ద్వారా అర్థమవుతుంది. అది చిన్న కార్యక్రమమైనా సరే అందులో జాతీయ ప్రయోజనం ఉంటేనే అంగీకరిస్తారాయన. “నాకు జాతీయవాదం పట్ల అభిమానాన్ని ఏర్పరచింది వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లు” అని ఒకసారి చెప్పారు. తన రాజకీయ గురువు అజయ్ ముఖర్జీ’ అని ఆయనను కాంగ్రెస్ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడం చాలా బాధించిందని చెప్పారు. ఆరోజుల్లో జరిగిన విశేషాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. 1960 దశకంలోనే పశ్చిమబెంగాల్ రాజకీయాలు కాంగ్రెస్, కాంగ్రెసేత ర శిబిరాలుగా విడిపోయాయి. వామపక్షాలు ప్రవేశిస్తున్న రోజులవి. పదమూడేళ్లుగా కేబినెట్ మంత్రిగా ఉన్న అజయ్ ముఖర్జీ కాంగ్రెస్‌లో ప్రవేశిస్తున్న విలాసవంతమైన ధోరణులను తీవ్రంగా విమర్శించారు. ఆకలితో బాధపడుతున్న వేలాది మంది ప్రజలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు.

కాంగ్రెస్ డబ్బున్నవారికి దాసోహం అయిందన్నారు. దీనితో ఆయనను బయటకు పంపించారు. హుమయూన్ కబీర్, అరుణా అసఫ్ అలీ వంటి హేమాహేమీలు ఆయనతో గళం కలిపారు. యువ ప్రణబ్ ముఖర్జీ కూడా వెనుకాడలేదు. అజయ్ ముఖర్జీ ప్రారంభించిన బంగ్లా కాంగ్రెస్‌లో చేరారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో బెంగాల్‌లో దిగజారిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిపై ఆయన రాసిన పత్రాలు, తీర్మానాలు, కరపత్రాల వల్లనే గొప్ప రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. 1967లో బెంగాల్‌లో అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన మొట్టమొదటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కూడా ప్రణబ్ కీలకపాత్ర పోషించారు. ఈ యువ మేధావిని రాజ్యసభకు పంపించేందుకు అప్పుడు వామపక్షాలు సైతం సహకరించాయి.

ప్రణబ్ వాక్ప్రతిభ, రాజనీతిజ్ఞతే ఆయనను భూపేన్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా, మీనూ మసానీ, నంబూద్రిపాద్, కృపలానీ వంటి దిగ్గజాలకు సన్నిహితం చేసింది. ఇందిరాగాంధీ సంగతైతే చెప్పనక్కర్లేదు. కామరాజ్, మొరార్జీ వంటి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఇందిరాగాంధీ మళ్లీ అజయ్ ముఖర్జీని దరి చేర్చుకోవడంతో బంగ్లాకాంగ్రెస్ కాంగ్రెస్‌లో విలీనం కావడం, ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, 36 ఏళ్ల వయస్సులో కేంద్రంలో మంత్రిగా చేరడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచీ ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.

రాజీవ్ హయాంలో ఒకసారి కాంగ్రెస్‌ను వదిలిపెట్టాల్సి వచ్చింది కాని మళ్లీ కాంగ్రెస్‌కు ఆయన అవసరం కలిగింది. ప్రణబ్ రక్తంలో కాంగ్రెస్ వ్యతిరేకత నరనరాల్లో జీర్ణించుకుని ఉన్నదా అనిపిస్తుంది ఒక్కోసారి. కాంగ్రెస్‌లో ఏర్పడిన రుగ్మతలను ఆయన సహించలేకపోయేవారు. తర్వాత తర్వాత భరిస్తూ వచ్చారు. ఆయనలోని జాతీయవాది అలాగే ఉండిపోయారు. దేశ సమస్యలను జాతీయవాద దృష్టితో చూసే అరుదైన నాయకుల్లో ఒకరుగా ఉండిపోయారు. ఆయన మేధావిత్వమే ఆయనను ప్రధానమంత్రి పదవికి అనర్హుడిగా మార్చిందనేవారు కూడా ఉన్నారు.

వివేకానందుడంటే భక్తి..
కోల్‌కతా ప్రయాణంలో ప్రణబ్‌ముఖర్జీ పాల్గొన్న వాటిలో ఒకటి- వివేకానందుడి 150వ జయంతి వేడుకల కార్యక్రమం. జాతీయస్థాయిలో వివేకానంద జయంతి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. రాష్ట్రపతి కాకముందు వరకూ కమిటీకి ఆయనే చైర్మన్. ఇప్పుడు వెనకుండి కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ప్రణబ్‌తో పాటు వివేకానందుడు నివసించిన ఇల్లును సందర్శించే అవకాశం మాకు దక్కింది. దైవశక్తి కంటే మానవ శక్తి ఎంత గొప్పదో వివేకానందుడు చెప్పిన తీరును ప్రణబ్ అద్భుతంగా వివరించారు. ప్రాచీన సంస్కృతిని, విలువలను గౌరవిస్తూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లో పతనమవుతున్న విలువలను కాపాడుకోవాలని చెప్పారు. కోల్‌కతాకు 25 కిలోమీటర్ల దూరంలోని బారక్‌పూర్‌లోని రామకృష్ణ మిషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు రాష్ట్రపతి. బారక్‌పూర్‌లోనే 1857లో తొలిస్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్‌పాండే బ్రిటిష్ కమాండర్‌పై తిరుగుబాటు చేశారు.

పోరాటయోధులను మరిచిపోలేదు…
ప్రణబ్ పర్యటనలో మరో ప్రధాన ఘట్టం- స్వాతంత్య్ర సమరయోధులతో సంబంధం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం. తన గురువు అజయ్ ముఖర్జీ ఒకప్పుడు బ్రిటిష్ వారితో పోరాడి విముక్తం చేసిన తామ్రలిప్త (తమ్లుక్) ప్రాంతాన్ని సందర్శించారు. తూర్పు మిడ్నపూర్‌లోని తమ్లుక్‌లో ఉన్న నిమ్‌తౌరి వద్ద ఉన్న స్మృతి సౌధలో ఆయన అజయ్ ముఖర్జీతో పాటు మరో ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ స్మ­ృతిసౌధలో ఎక్కడ చూసినా వందలాది స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు కనిపిస్తాయి. వారి త్యాగాల చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో వారు జరిపిన పోరాట ఘట్టాలు గుర్తు చేసే అనేక స్మృతి చిహ్నాలు ఉన్నాయక్కడ. దీన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి.

నిజానికి బెంగాల్‌లో ఏ మూల పర్యటించినా దేశభక్తి, జాతీయవాదం, సాహిత్యం, సంగీతంపట్ల అభిరుచి గుబాళిస్తాయి. ఇదే ప్రణబ్‌ను తీర్చిదిద్దిందేమో అనిపిస్తుంది. ఏ ట్రాఫిక్ లైట్ వద్ద నైనా రవీంద్రుని సంగీతం మనకు వినిపిస్తుంది. మమతా బెనర్జీ కృషి ఫలితం ఇది. ప్రణబ్ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ రవీంద్ర సంగీతం, దేశ భక్తి గీతాలు వినబడి మనసును పరవశింప చేశాయి.

నేతాజీ జ్ఞాపకాలు..
కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివసించిన ఇల్లును కూడా ప్రణబ్ బృందంలో భాగంగా సందర్శించడం మరో సదవకాశం. ఇదే ఇంట్లో నేతాజీని బ్రిటిష్ వారు గృహ నిర్బంధంలో ఉంచారు. 1941లో ఆయన ఇక్కడి నుంచే మాయమై బెర్లిన్‌లో ప్రత్యక్షమయ్యారు. సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో చివరిసారి ప్రయాణించిన కారును కూడా ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు అక్కడ ఆయన కుటుంబీకులు ఒక రీసర్చ్‌బ్యూరోను నడుపుతున్నారు. బోస్ సోదరుడు శిశిర్ కుమార్ బోస్ కుమారుడైన ప్రముఖ చరిత్రకారుడు సుగతా బోస్ రచించిన ‘హిస్‌మెజిస్టీస్ అపోనెంట్ బెంగాలీ’ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ప్రణబ్ పాల్గొన్నారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు జర్మనీ నుంచి వచ్చిన నేతాజీ కూతురు అనితా పఫాఫ్, ఆమె జర్మనీ భర్త మార్టిన్‌ను చూడగలిగాము. ఆయన జర్మనీలో మాజీ ఎంపి. నేతాజీ వియన్నాలో ఉన్నప్పుడు తనకు కార్యదర్శిగా పనిచేసిన ఎమిలీ అనే ఆస్ట్రియన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి సంతానమే అనిత. తిరుగు ప్రయాణంలో ప్రణబ్ నేతాజీ కుటుంబం గురించి పుంఖానుపుంఖాలుగా తేదీలతో సహా చెప్పుకొచ్చారు. “వారిది జాతీయ భావాలుగల విద్యావంతుల కుటుంబం. నేతాజీదే కాదు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిదీ గొప్ప చరిత్ర..” అని చెప్పారు ఆయన.

మీడియా ఎలాంటిదంటే..
చాలా సమావేశాల్లో ప్రణబ్‌రాసుకున్న ఉపన్యాసాలను పక్కన పడేసి.. చరిత్రను అభివర్ణిస్తూ భావోద్వేగంతో ప్రసంగిస్తున్నప్పుడు వినితీరాల్సిందే! కోల్‌కతా ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ జర్నలిస్టు అసోసియేషన్ 90వ వార్షికోత్సవంలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏ కాగితమూ చూడకుండా ఏకధాటిగా ప్రసంగించారు. “పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం.. నీటికీ చేపలకూ ఉన్న సంబంధం లాంటి ది. మీడియా లేకుండా రాజకీయం ఎక్కడిది?” అని ఆయన చమత్కరించారు. “అదే సమయంలో మీ అభిప్రాయం స్వేచ్చగా చెప్పండి.. కాని వాస్తవాలను ఉన్నదున్నట్లు వివరించండి..” అని ఉద్బోధించారు.

చివరిగా ఢిల్లీ వచ్చే ముందు.. కోల్‌కతాలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్మించిన ‘సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ టెర్మినల్’ భవనాన్ని ప్రారంభించారు ప్రణబ్. బడా పారిశ్రామిక సంస్థలు వేలకోట్లు ఖర్చుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తున్న ఈ రోజుల్లో అంతకు ఏమాత్రం తీసిపోకుండా అత్యద్భుతమైన స్థాయిలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ దాన్ని నిర్మించడం చూసి ఆయన అచ్చెరువొందారు. దేశ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ప్రైవేట్ రంగాన్ని ఉపయోగించుకోవడం అవసరమే కాని ప్రభుత్వ రంగం కూడా తలుచుకుంటే అద్భుతాలు చేయగలదని వ్యాఖ్యా నించారాయన.

చివరగా ఒక్క మాట. ప్రణబ్‌తో ప్రయాణించడమంటే ఒక సజీవ చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు, మేధావితో ప్రయాణించడమే! ‘కలలు కనండి..’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సందేశమిస్తే ‘కాలే కడుపుకు కలలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన తొలి రిపబ్లిక్ డే సందేశంలో ప్రశ్నించారు. అదే ఆ ఇద్దరికీ తేడా.

ఎ.కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

“మా గోదారి జిల్లావాసులకి వెటకారం పాలు కాస్త ఎక్కువండి”అని మనందరికీ తెలిసిన విషయాన్నే ఆయన ముందుజాగ్రత్తగా, ఎంతో వినయంగా చెప్పారు. “కోపాన్ని కళ్లెర్రజేస్తూనే కాదు కామెడీగా కూడా ప్రదర్శించవచ్చు. అదెలా అంటే మా ఊరొస్తే తెలుస్తుంది. ఇప్పుడేముంది లెండి….గోదావరి యాసే పోయింది. నా చిన్నప్పటి ఊరు విశేషాల్ని గుర్తుచేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది” అని చెబుతున్న కృష్ణభగవాన్ తాను ఈత కొట్టిన రేవు నుంచి కోళ్లను ఎత్తుకుపోయే దొంగ కుక్కవరకూ తన ఊరి కబుర్లని ఓ కామెడీ సినిమా స్టోరీలా చెప్పుకొచ్చారు. ఆయన ఊరు ‘కైకవోలు’ విశేషాలే ఈవారం ‘మా ఊరు’ 
“నాకు ఆరేళ్ల వయసప్పుడు ఒకరోజు నాన్నతో పొలానికి వెళ్లాను. నాన్న పొలంలో కూలివాళ్లతో మాట్లాడుతుంటే నేను ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్న కాలవదగ్గరికి వెళ్లాను. కాలవపక్కన ఉన్న మట్టిగడ్డపై కూర్చుని జోరుగా పారుతున్న నీటిని చూస్తున్నాను. నేను కూర్చున్న మట్టిదిబ్బ బాగా నాని ఉంది. నేను కూర్చున్న ఐదునిమిషాలకి అది కూలి నేను నీళ్లలో పడిపోయాను. కొట్టుకుపోకుండా కాలవ ఒడ్డునున్న గడ్డిదుబ్బుని పట్టుకుని ఏడుస్తున్నాను.

ఆ దుబ్బుగాని చేతిలోకి ఊడొచ్చిందా అంతే సంగతి. ఇంతలో ఆ కాలవపక్కగా వెళుతున్న ఒకతను నీళ్లలో నన్ను చూసి ఎక్కడో పొలంలో ఉన్న మా నాన్నగారిని పిలవడం మొదలుపెట్టాడు. నాన్న పరిగెట్టుకుంటూ వచ్చి నీళ్లలో దిగి నన్ను పైకి తీసుకొచ్చారు. నిజానికి అతన్ని చూడగానే భయంతో వణికిపోతున్న నాకు ధైర్యమొచ్చింది. అతను వెంటనే కాలవలోకి దిగి నన్ను రక్షిస్తాడనుకున్నాను. కాని అతను రాలేదు.

మా నాన్నని పిలిచాడు. అతనలా ఎందుకు చేశాడని నాన్నని అడిగితే…’అతను దళితుడు కదా…నిన్నెలా ముట్టుకుంటాడు…’ అన్నాడు. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారీ నాకు చాలా భయమేస్తుంది. మనం సృష్టించుకున్న కులాలు మనకెంత చేటుచేస్తున్నాయో చూడండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం ‘కైకవోలు’ మా ఊరు. ఊరు చిన్నదే గాని నా జ్ఞాపకాలు చాలా పెద్దవి.

అమ్మమ్మ ఊరు…
మా అమ్మమ్మ(కాకర వీరాయమ్మ)కి 22 సంవత్సరాల వయసప్పుడే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లల పెంపకం, వ్యవసాయం అన్నీ తానే చేసుకుంది. కూతురికి ఇల్లరికపు అల్లుడ్ని తెచ్చుకోవాలని మా పక్కూరు చింతపల్లి నుంచి అల్లుడ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది. అప్పటి నుంచి నాన్న, మా మేనమామ వ్యవసాయం పనులు చూసుకునేవారు. మాకు ఇరవై ఎకరాల వరకూ ఉండేది. పాడి కూడా పుష్కలంగా ఉండేది. మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది.

ఓ పక్క సపోటా చెట్టు, వెనకవైపు నారింజచెట్టు, ఇంటి ముందు రేకమందారపువ్వు చెట్టు పక్కనే మామిడి చెట్టు ఉండేవి. మామిడి చెట్టు చూడ్డానికి చిన్నగా ఉన్నా లెక్కలేనన్ని కాయలు కాసేది. మాకు తెలియకపోయినా ఆ లెక్క నాన్నకి బాగా తెలిసేది. చెట్టుమీద ఎవడు చెయ్యివేసినా కనిపెట్టేసేవాడు. ఆ కొమ్మకి పాతికకాయలుండేవి. నాలుగు తగ్గాయి అనేవారు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నేను అందరికన్నా చిన్నవాడ్ని.

నాన్న వెటకారం…
గోదావరి జిల్లాలవారికి వెటకారం పాలు కాస్త ఎక్కువనే మాట. నిజమే…ఎంతటి కోపాన్నైనా హాస్యపూర్వకంగా వెక్కిరింతగా అవతలివాడి మనసు చివుక్కుమనేలా ప్రదర్శించడం మా వాళ్ల స్పెషాలిటి. మా నాన్న కుటుంబంలోవాళ్లకి ఈ వెటకారం మీర ఎక్కువగా ఉండేది. నాన్నైతే మరీను. ఒకరోజు పొలంలో పని ఎక్కువగా ఉన్న సమయంలో పట్టా వీరయ్య అనే పనివాడు డుమ్మా కొట్టాడు. ‘సరిగ్గా పని ఎక్కువగా ఉన్నప్పుడే ఎగ్గొట్టాడు…రానీ వాడి సంగతి చెబుతాను’ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు నాన్న.

ఇంతలో వీరయ్య వచ్చి ఇంటి ముందున్న మందార చెట్టుకింద కూర్చున్నాడు. ‘ఏరా…పట్టీరయ్యా నిన్న రాలేదే” అన్నారు నాన్న. “కాల్లో ముల్లు గుచ్చుకుందడయ్యా…” అన్నాడతను. మా చిన్నప్పుడు పల్లెలో ముల్లు గుచ్చుకోవడం అనేది సమస్యే కాదు. పని ఎగ్గొట్టేంత సమస్య అస్సలు కాదు. వెంటనే నాన్న “సర్లేగాని..ముందు ఆ చెట్టుకింద నుంచి లెగు…పువ్వుగాని మీద పడగలదు. మళ్లీ ఈ రోజు కూడా పనిలోకి రాడానికి ఉండదు” అన్నాడు. దాంతో వాడు తలదించుకుని పొలానికి వెళ్లిపోయాడు. మా చిన్నాన్న కూడా అంతే. నోరు తెరిస్తే వెటకారం.

సూర్యకాంతం ఇల్లు…
మా ఇంటిపక్కనే ప్రముఖనటి సూర్యకాంతం ఇల్లు ఉండేది. ఆమె, మా అమ్మమ్మ మంచి స్నేహితులుగా ఉండేవారట. మేం పుట్టేనాటికే ఆమె మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. సూర్యకాంతం గురించి అమ్మమ్మ చాలా విషయాలు చెప్పేది. “సూర్యకాంతం కోడలిగా మన ఊర్లో అడుగుపెట్టి ఒక్కనాడు కూడా సుఖపడలేదు. అత్తగారి వేధింపులు భరించలేక ఊరొదిలి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లకపోతే ఈరోజు ఓ గొప్ప నటిని కోల్పోయేవాళ్లం” అని మా అమ్మమ్మ చెప్పినమాటల్ని ఊళ్లోవాళ్లంతా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. మా అమ్మమ్మని నేను చిట్టెమ్మా అని పిలిచేవాడ్ని. ఆమె నన్ను కిట్టా అనేది. 92 ఏళ్లు బతికింది. చాలా కష్టజీవి. చనిపోయేచివరి నిమిషం వరకూ పనిచేస్తూనే ఉంది.

మూడిళ్ల బడి…
మా ఊళ్లో మొదటిబడి నూనిచిన్నకాపుగారింట్లో ఉండేది. వాళ్లింటి వరండానే మా తరగతి గదన్నమాట. కొన్నాళ్లకు సింహాద్రిరాజుగారింట్లోకి మారింది. ఆ తర్వాత మరో రాజుగారి ఇంట్లో ఉండేది. అత్తిలి వెంకటగోపాలాచారి మా హెడ్‌మాస్టార్. పెద్డింటి లక్ష్మణాచార్యులు మా మాస్టారు. బోళ్ల సత్యనారాయణ , దాట్ల రవిరాజు, గోపాలకృష్ణమాచారి…వీళ్లంతా నా స్నేహితులు. ఐదో తరగతి వరకూ మా ఊళ్లో చదువుకుని ఆరోతరగతి కోసం పక్కూరికి వెళ్లేవాళ్లం. అప్పటివరకూ బడికెళ్లడం అంటే ఏదో బాధగా ఉండేది. పక్కూళ్లో బడన్నకాడినుంచి మాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసేది. ఎందుకంటే ఆ ఊరికెళ్లాలంటే మా ఊరి రేవు దాటాలి. ఆ రేవు పేరు ‘ఆడదాని రేవు’. పూర్వం ఆ రేవు దగ్గర ఒక ఆడామె ఉండి అందరినీ బల్లకట్టు ఎక్కించుకుని రేవు దాటించేదట. అందుకే ఆ రేవుకి ఆ పేరొచ్చిందని మా పెద్దోళ్లు చెప్పేవారు.

రేవులో స్నానాలు…
స్కూలుకి వెళ్లేటప్పుడు అమ్మాయిలు బుద్ధిగా వంతెనమీద నుంచి వెళితే మేం నిక్కర్లు ఇప్పేసి ఈదుకుంటూ వెళ్లేవాళ్లం. ఎవడో ఒకడికి మా నిక్కర్లు ఇచ్చి వాడ్ని వంతెనమీద పంపేవాళ్లం. మాకు ఇష్టంలేని వాడి క్యారేజి రేవులో ముంచి తీసేవాళ్లం. ఒకడు ఎప్పుడు వాళ్లింట్లో తెలగపిండి, వెల్లుల్లి రేకల కూర వండినా క్యారేజి తీసుకొచ్చేవాడు. ఆ కూరంటే మాకెవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. అందుకే వాడి డబ్బాలాక్కుని రేవులో ముంచేవాళ్లం. ఒంటిపూట బడులొచ్చాయంటే పండగే పండగ. మధ్యాహ్నం స్కూలు నుంచి వస్తూ రేవులో దిగి ఈతకొట్టి వచ్చేవాళ్లం. ఇంటికి రాగానే నాన్న చెయ్యిచాపమని మోచేతినుంచి అరిచేతివరకూ గోరుతో గీరేవాడు. తెల్లగా మచ్చపడితే రేవులో స�

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కధాగంధం -1

     కధాగంధం -1
        సుమారు అర్ధ శతాబ్ది గా కదా ప్రస్తానం చేస్తూ ,తాను రచించి ,ప్రచురణ ,ప్రసారణ పొందిన ముచ్చటైన 28కధలను ”అమృత హస్తాలు ”అనే కదా సంపుటి గా చదువరుల అమృత హస్తాలను అలంకరింప జేశారు  స్వర్గీయ గంధం వేం కా స్వామి శర్మ గారు .వీరికి ”చైతన్య ”అని కలం పేరుంది .అందుకే ప్రతి కధలో చైతన్యం ఉన్న రచన కని  పిస్తుంది .వస్తు వైవిధ్యమూ ఉ న్నది  .జీవితం లో తాను చూసిన ,విన్నా ,ప్రేరణ పొందిన యదార్ధ ఘటనలకు తన దై న శైలి లో అద్భుతం గా కదా గానం చేశారు .ఆ విషయాలను ఆయా కధల చివరలో తెలియ జెప్పి ,ప్రేరణకు కారకు లైన తన బంధువులకు ,మిత్ర ,సహచరులకు కృతజ్ఞతలు తెలుపు కొన్నారు .జీవితం నుంచే ఈ కధలు పుట్టాయి కనుక సహజ సుందరం గా ఉన్నాయి .అవసర మైన చోట్ల చలువ పందిళ్ళు అల్లారు .రేడియో ఇంజినీర్ ఉద్యోగిత్వం వల్ల  సహస్రాధిక మహాను భావులతో పరిచయం  ,అందులోను రచయితల కళా కారుల తీరు తేన్నుల్ని పరిశీలించే నేర్పు అవకాశము కలిగాయి అందుకే నే ల విడిచి సాము చేయని రీతిలో కధలు రాశారు. రాసి మెప్పించారు .సహజ సుందర మైన హృదయం ఆర్ద్రత నిండిన మనసు ,పరోప కార పారాయణ త్వం ,అమృత తుల్యమైన మాట .విద్యుక్త ధర్మం లో తృప్తీ ఉన్న  వారు కనుక శ్రీ శర్మ గారు కధలన్నీ నిండుగా ,అమృత పానం గా  ,ఆనంద మయం గా ఉన్నాయి .ఈ కధలన్నీ సుగంధాన్ని వేద జల్లేవి కనుక నేను ఈ సమీక్షను గంధం వారి పేరు కూడా కలిసి వచ్చేట్లు ”కదా గంధం ”అనితొమ్మిదేళ్ళ క్రితం రాశాను .ఇందులో కొంత భాగాన్ని శర్మ గారు ఈ కదా సంపుటిలో చేర్చి ప్రచురించారు .
          amruta hastalu            శ్రీ పు రి పండా  అప్పల స్వామి గారు చిన్న కధను ”మిత్తవ ”అన్నారు .ఇందులో ఈ మిత్తవలు ఎక్కువగా ,  పెద్దకధలు  కొద్దిగా ఉన్నాయి .”గురువింద  నవ్వింది ”కద తో ప్రారంభించి ”జీవితం ”కద తో ముగించారు శర్మ గారు సంపుటిని .గురువింద కద లోకం పోకడకు అద్దం  పట్టింది .తనకున్నది కొద్ది పాటి కళం కమే .కాని తాను చూస్తున్న మనుష్యులు వారి ప్రవర్తన అంతా కారు  నలుపు, చీకటి, అజ్ఞానం .చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదు .కపటం ,భ్రష్టత నర నరాల్లో జీర్ణించుకొన్న మానవుల కంటే ,తాను చాలా నయం అను కొంటుంది గురి వింద .వారి కళంకం తో పోల్చుకొంటే తనది లెక్క లోకి రాదు అని ఆత్మ సంతృప్తి చెందింది తన ను ఆడి  పోసుకొనే హక్కు ఈ సమాజానికి లేదన్నది .జీవితం లోని నలుపు తెలుపు లను చూపించే మంచి చిన్న కద ఇది .చివరి కద జీవితం లో భార్య సత్య వతి కదా రచయిత అయిన భర్తకధకు మలుపు రాస్తుంది .భార్యను వదిలి ఇంకో ఆమె ను చేసుకొన్నట్లుగా రాసిన ”మలుపు ”అది .భర్త ఆశ్చర్య పోతాడు .ఆమె అతడిని పిల్లాడిగా లాలిస్తూ అంటుంది ”ప్రతి స్త్రీ తన భర్త ఓ మహా మనీషి అన్న నమ్మకం తోనే సంసార జీవితం గడుపుతుంది .అయినా అతడి దృష్టిలో తానూ ఒక ఒక గొప్ప వ్యక్తీ గా చలామణీ  కావాలనే కుతూహలం అంతర్గతం గా అనవతరం అంటి పెట్టు కొని ఉంటుంది .దాన్ని నిరూపించుకోవాలనే తపన ఆమెను అనుక్షణం ఆవ హించు కొని ఉంటుంది .తన ఆధిక్యతను తెలివి తేటలను నిరూపించు కోవాలన్నది ఆమె చిత్త  జాడ్యం .బ్రహ్మ రాతలను సరస్వతీ దేవి చదివి ఇలా సాగించారేమిటి /అలా రాస్తే బాగుండు కదా అని అన్నా బ్రహ్మ రాత మాత్రం మారదు . అది జీవితం గా సాగి పోతుంది .సరస్వతి దేవి చెప్పింది కద గానే మిగిలి పోతుంది .ఇదండీ కధకు జీవితానికి ఉన్న సంబంధం ”అంది భార్య సత్య వతి  భర్త అయిన కధకుడి తో మార్పు ను సమర్ధిస్తూ .కద చివర శర్మ గారు ”సత్య వతి రాసిన కదా కద గా మిగాలలేదు .అదే జీవిత గాధ  అయింది .మరి ఆవిడ సత్య వతి కదా .విధి రాత నే రాసి ఉంటుంది .”అంటూ ముగిస్తారు . .ప్రఖ్యాత కధకులు స్వర్గీయ వాకాటి పాండు రంగా రావు గారు మెచ్చి ,ప్రచురించిన కదఇది.పసందుగా ఉండకేం చేస్తుంది ?చిన్న కధకు చక్క్కని అర్ధ వంత మైన ముగింపు నగిషీ .జీవితాన్ని చక్కగా అధ్యయనం చేసిన శర్మ గారు చిన్న చిన్న మాటలతో గొప్పగా రాసిన కద ఇది .ఆ ధునిక తెలుగు కధకు వందేళ్ళు వచ్చిన సందర్భం గా విశాఖ పట్నం  వారు ఎంపిక చేసి ఉత్తమ కధలు గా ప్రచురించిన 100కధల సంకలనం లో శ్రీ శర్మ గారి కధకు చోటు దక్కటం  ఆయన రచనా పాట వానికి నిదర్శనం .amruta hastalu-back అంతే కాదు శర్మ గారి అమృత హస్తాలపై  ఒక అంధ విద్యార్ధి పరిశోధన చేసి పుస్తకం గా వెలువరించాడు .
                     సశేషం –మీ గబ్బిట  దుర్గా ప్రసాద్ –3-2-13 -ఉయ్యూరు 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

సీతమ్మ తలలో పేలు

  సీతమ్మ తలలో పేలు 
     ఉదయం కాఫీ టిఫిన్ అయింతర్వాత యదా ప్రకారం కంప్యుటర్ ముందు కూర్చుని కొట్టుకొంటు న్నాను ఇంతలో హడా విడి గా కుర్చీ తెచ్చు కొని నా పక్కన కూర్చుంది మా ఆవిడ .”ఏమండీ మీ గోల మీదేనా ఇంట్లో సంగతేమీ పట్టదా ?”అంది ఏదో జరిగి పోయినట్లు .”కూల్ ల్ బాబా కూ ల్ ..

అసలేం జరిగింది ?”అన్నాను .”ఏం జరగాలి ?మీ ”కంపూ ”మీ రాతలేనా ?ఏదో రాయటం ఆహా వాళ్ళు మెచ్చారు ఈహీ వీళ్ళు మెచ్చారు అని చంకలేగరేసుకొంటు అప్పుడప్పుడు మాకేదో కాస్త విని పిస్తూ, కని  పిస్తూ బక ధ్యానం లా ” మౌసు రుద్దు కుంటూ” ఉంటారు .ఇంట్లో ఒక రచయిత్రి ఉంది .అదేమైనా రాసిందేమో దాన్ని నెట్లో పెడదాం అనే ధ్యాసే లేదు మీకు ”అంది మళ్ళీ .”నీలో రచయిత ఉందని నాకు ఇంత వరకు తెలీలేదు .ఎప్పుడ య్యావు మహా రచయిత్రివి ?”అని అడిగాను .”మహాను భావా అందరు మీలాగా ఎగరేసుకొని డప్పాలు కొట్టుకోరు .మాలో ను ఉంటారు రాసే వాళ్ళు .కాసింత మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి .”అన్నది . ఇప్పటి దాకా తాను వెనక దాచుకొన్న కాగితాలు ముందుకు లాక్కుంది .”ఏమిటి ఏదైనా రాశావా ?”అన్నాను .”అవును .మొన్న ఆంద్ర జ్యోతి లో వీరప్ప మొయిలి గారి రామాయణం లో” గని కార్మికుల సమ్మె ”చదివి నేనూ రామాయణం లో ఒక సంఘటన గురించి రాయాలను కొని ,కార్య రంగం లోకి దూకి ఒక గంటలో గీకి పారేశా .”నీకు స్పీడ్ గా రాయటం రాదు కదా?”అన్నాను .”నిన్న మన మనవడు చరణ్ తో రాయించా .మీకు చదివి విని పించేదాకా ఎవరికి చెప్పద్దని ఒట్టు వేయించా .మీకు చూపిద్దామంటే   ,మీరో మొండి ఘటం .అది బాలేదు ఇది బాలేదని అందరికి వంకలు పెడతారు .ధైర్యం చాల లేదు చూపించటానికి .అయినా ఇవాళ ధైర్యం గా మీ ముందుకు వచ్చా.నేను రాసింది మీ బ్లాగ్ లో పెట్టక పోతే రేపటి నుంచి నేనే ఒక బ్లాగ్ పెట్టి నాకు తోచిందంతా రాసి ఎక్కిస్తాను .ఏదో తేల్చుకోండి .”అంది ఇక లాభం లేదని ఇంతకూ ఏం రాశావు ?అందులో కదా ఏమిటి విశేషమేమిటి ?”అని ప్రస్శ్నించా .”మీరు చదువుతారా ?నన్నే చదివి విని పించ మంటారా ?”అని అడిగింది ”నీ భావాలు నీ గొంతు లోనే వింటే పరి పక్వం గా ఉంటుంది కానీ ”అన్నాను .”సరే .అంతా చదవటం అయ్యే దాకా మీరు నోరు విప్ప రాదు .బాగున్నదాన్ని ”వహ్వా! భేష్ !ఆహా ఏమి రుచి ! /”అని గుటకలు మింగుతూ మెచ్చుకోవాలి .ఇవి కాక ఇంకే మాట మీ నోటంట వచ్చినా” కటీ ఫే ” అని బెదిరించి మొదలు పెట్టింది 
                   నేను రాసిన దానికి పేరు ”సీతమ్మ తలలో పేలు ”.రామ రావణ యుద్ధం అయిన తర్వాత లంక నుంచి సీతా రాముల తో సహా వానర ,రాక్షస సమూహమంతా భార్యా పిల్లలతో సహా అయోధ్యకు పుష్పక విమానం లో వచ్చారు .ఇంకో రెండు రోజుల్లో శ్రీ రాముని పట్టాభిషేకం జరుగ బోతోంది .అయోధ్య అంతా హడా విడి గా ఉంది .రాముడి ని చూడ టానికి ఎన్నో దేశాల నుంచి రాజులు ,రాజ ప్రముఖులు వచ్చి మాట్లాడటం   తో ఆయనకు ఒక్క క్షణం కూడా తీఎరు బాటు లేకుండా పోయింది .రోజుకు రెండు సార్లయినా సీతమ్మ వారిని చూడ టానికి వచ్చె వాడు అసలు రావటానికే వీలు కుదరటం లేదు .సంబరాలతో వీధి వీధి అదిరి పోతోంది .అలంకారాలతో అయోధ్య మరో స్వర్గం లా భాసిస్తోంది .ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తెలు తున్నారు .కాని సీతమ్మ వాకిలి మాత్రం బోసి పోతోంది .సీత గది దాటి బయటికి రావటం లేదు .ఎవరికి దర్శనం కూడా ఇవ్వటం లేదు .ఇది రహస్యం గా ఉంచారు అందరు .దీనికి పరిష్కారం ఏదో ఆలోచించే పనిని బాధ్యతను తారా ,రుమ ,విభీషణుడి భార్య మాత్రమె స్వీకరించారు .ఇంకెవ్వరికీ ఇది తెలియదు అయితే ఆంజనేయుడిని మాత్రం లోనికి రాని స్తూ అసలు విషయం   బయట పెట్ట నని   ప్రతిజ్ఞ చేయించారు అతడి నోటిలో మాట దాగదన్న భయం వాళ్ళది 
              ఈ ముగ్గురు స్త్రీలు సీతా దేవి రహస్య మందిరం లోనే ఉంటున్నారు .సమస్య బుర్ర బద్దలు చేస్తోంది .సీతమ్మ మహా చికాకుగా ఉంది .చేతులేప్పుడు తల మీదే ఉంటున్నాయి బరికి బరికి పెడుతోంది జుట్టును .కాని ఏమీ లాభం కని  పించటం లేదు .మహా విచారం గా ఉంది .అర గంట కోసారి తలా రా స్నానం చేయించి వీరు ఆమె కురులను దువ్వి జడ వేస్తున్నారు .దాసీలను కూడా లోపలి రానివ్వటం లేదు .దువ్వెన ల తో సీత తల దువ్వు తుంటే వేలాది పేలు రాలి కింద పడుతున్నాయి .వాటిని గోళ్ళమధ్య పెట్టి చంపేస్తున్నారు .కారిన పేలు గుట్టలు గుట్టలు గా ఉన్నాయి . వాటిని కాల్చి పారేస్తున్నారు .అయినా ప్రయోజనం కనీ పించలేదు .మళ్ళీ పది నిమిషాలలో జుట్టంతా పేలతో అట్ట  కడుతోంది . చేతులు నొప్పి పెడుతున్నాయి వీళ్ళకి .దిక్కు తోచటం లేదు .
                   ఈ కమిటీ కి పెద్ద తార .రుమ , విభీషణుడి భార్య సహాయకులు .తార ఆన్జనేయుడిని పిలి పించింది .”హనుమా !వెంటనే కిష్కింధకు వెళ్లి ఎవరికి ఏమీ చెప్పకుండా మా పరి చారకులను అడిగి మేము తల దువ్వుకొనే కొమ్ము దువ్వెనలు అత్యవసరం గా తీసుకొని రావాలి .ఇక్కడున్నట్లు రావాలి ”అని చెప్పింది .ఆఘ మేఘాల మీద హనుమ వెళ్లి కొమ్ము దువ్వెనలు తెచ్చి ఇచ్చాడు .ముగ్గురు కూర్చుని సీత జుట్టు దువ్వారు .పేలు రాలి పడి  పోయాయి .సంతోషం ఎక్కువ సేపు నిలవ లేదు .మళ్ళీ జుట్టు అంతా పెలతో జడ కట్టింది .వీళ్ళు తల పట్టు కు కూర్చున్నారు విచారం గా. తలంటి పోసినా పరిస్తితి లో మార్పు లేదు .ఒక అరగంట తర్వాతా మళ్ళీ ఆంజ నేయుడికి కబురు వెళ్ళింది .ఏమి కొంప మునిగిందో నని పరుగున వచ్చాడు .ఈ సారి విభీ ష నుడి  భార్య హనుమ చెవిలో ”లంకకు వెళ్లి బావ గారు రావణా సురులు సముద్రం నుంచి తీయించి పుష్పకాని కి వాడే ”రాతి నూనె ”ఒక డబ్బాతో తీసుకొని రా వాలి .నీకోసం వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తుంటాము .మధ్యలో ఎక్కడా కోతి పనులు చెయ్యకుండా ఇక్కడున్నట్లు రావాలి ”అంది ఇప్పుడే కిష్కింధకు వెళ్లి వచ్చాడు .కాళ్ళు పీకుతున్నాయి వెళ్ళనంటే ఏం కొంప మునుగుతుందో నని కిక్కురు మనకుండా కాళ్ళు పిసుక్కొంటూ గాలిలో ఎగిరాడు .అన్నట్లే వెంటనే తెచ్చాడు .రాతి నూనెను  సీత తలకు పట్టించి అరగంట ఆగి తలంటి పోసి  జడే శారు .రాలిన పపేలను చూసి మురిసి పోయారు .కాని అయిదు నిమిషాలలో జడంతా పేల  మయం .సమయం దగ్గర పడుతోంది  పట్టాభి షే కానికి .అసలు సీతకు పేలు ఎందుకు పడ్డాయి అని వితర్కించు కొన్నారు .తమతో విమానం లో సీత  ప్రయాణం చేయటం వల్ల లంకలో జుట్టు దువ్వుకోక పోయినందు వల్లా , జడలు కట్టటం వల్లా, పేలు చెలరేగి పోయాయని తమ తలలలో పేలే సీత తలలో చేరాయని తప్పంతా తమదే నని బాధ పడ్డారు .ఇక ఆలసించిన ఆశా భంగం .ఎలా గై నా దీన్ని శ్రీ రాముడికే నివేదించాలని నిర్ణయించి హనుమను రాముడి దగ్గరికి వెళ్లి వెంటనే రామనమని కబురు పంపారు .
                    తిరుగు టపాలో రాముడు పరిగెత్తుకొచ్చాడు సీతమ్మ రహస్య మందిరం లోకి .సీత  కనీ పించక దిగులు చెందాడు .ఈ ముగ్గురు స్త్రీలు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు .అప్పుడు నెమ్మదిగా తార రాముడిని సమీపించి ”స్వామీ !సీతమ్మ తలలో విపరీతం గా పేలు చేరాయి .మేము ఆమెతో లంక నుంచి రావటం వల్ల ఈ మహాపచారం జరిగింది .మా తలలలో ఒక్క పేను కూడా లేదు అన్నీ ఆమె తలలోనే ఉన్నాయి. ఎన్ని రకాలుగానో పేలు విరగడ అవటానికి ప్రయత్నించాం .అరగంట కో సారి  తలంటి పోస్తు ,దువ్వుతూ పేలు తీసేస్తున్నా మళ్ళీ వచ్చి పాతుకు పోతున్నాయి. కొయ్య దువ్వేనల్తో దువ్వాము . లంక నుంచి   రాతి తైలం కూడా తెప్పించి తలకు పట్టించాం .గుణం కని  పించలేదు స్వామీ .సీతమ్మ గది దాటి బయటికి రాలేక పోతోంది .దిక్కు తోచక ఇక నీవె  దిక్కు అని కబురు చేశాం .ఈ ఆపద నువ్వే బాపాలి పట్టాభి షే కానికి సీత ముఖం లో చిరు నవ్వు చూడాలి .”అని విన్న వించారు .రాముడు తాను సీత తో మా టలాడ వచ్చా అని అడిగితే ,ఆమె గది లో నుండే సమాధానం ఇస్తుందన్నారు .కారణమేమిటి అని అడిగాడు సీతను .ఆమె ముక్కు చీదు కొంటు, దగ్గుతూ, తుమ్ముతు రుద్ధ స్వరం తో తానీ బాధ భరించ లేకున్నానని , వెంటనే ఉపశమనం కలిగించే ఉపాయం ఆలోచించ మని చెప్పింది 
               శ్రీ రాముడు రుమ తో ”సీతమ్మ వాకిట్లో సిరి మల్లె పూస్తోందా ? /”అని అడిగాడు ”పూస్తోంది స్వామీ ! సీతమ్మ వచ్చినదగ్గర నుంచి  ప్రత్యెక శ్రద్ధ తీసుకొని పాదు  చేయించి ,నీరు పోస్తు  కంటికి రెప్పలా చూస్తోంది అందుకని విరగ పూసింది చెట్టు ”అంది ”అయినా పే లకూ సిరి మల్లెకూ సంబంధమేమిటి స్వామీ ?/మోకాలికి బట్ట తలకు  ముడి పెట్టి నట్లు “‘అని అందామను కొని మాటల్ని గొంతులోనే నోక్కేసు కొంది  .’మల్లె ప్పోలతో పేలు పెరుగుతాయని వింది ఇదేమి చోద్యం అను కొంది  .”అయితే బాగా విచ్చిన సిరి మల్లె పూలతో మంచి అందమైన దండ గుచ్చి అత్యవసరం గా తీసుకొని రండి ”అని ఆజ్ఞా పించారు ముగ్గురు గబ గబా వెళ్లి మంచి పూలు కోసి గొప్ప దండను గుచ్చి రాముడి కి ఇచ్చారు ”’ఇప్పుడు సీతను నా దగ్గరకు రమ్మనమని చెప్పండి ”అన్నాడు .వెంటనే ముఖం చెంగుతో కప్పుకొని సీత వచ్చ్చింది వెనక అడుగులు వేసుకొంటూ .రాముడు  సీతా దేవి దగ్గరకు వెళ్లి ఆమె కొప్పులో ”సిరి మల్లె పూల చెండు  తురిమాడు.అంతే క్షణాల మీద ఆమె తలలోని పే లన్నీరాలి నేల మీద  పడి  ఒక కుప్ప గా మారి దండు లాగా ఆకాశం లోకి యెగిరి పోయాయి .మళ్ళీ ఒక్క పే ను అంటే ఒక్క పేను సీతమ్మ తల లో కనీ పించలేదు అందరు ఊపిరి పీల్చుకొన్నారు .రాముడు మాత్రం నెత్తిన ఉత్తరీయం కప్పుకొని ఆ పేలు ఏమైనా తన తలకు ఎక్కు తా ఏమో నని  అక్కడి నుండి జారుకొన్నాడు .ఇదంతా సిరి మల్లె పూవు మహాత్మ్యం అని అందరు సంతోషించారు సీతమ్మ ముఖం లో చిరు నవ్వు వెలిగింది .ముఖం చంద్ర బింబమే అయింది ఆమె ఆనంద తాండవమే చేసింది పట్టాభి షే కానికి గంట కొట్టారు అందరు కదిలి వెళ్ళారు ”
                చదవటం ఆపింది మా ఆవిడ .”ఏమిటి స్వామీ మీ భాష్యం ?”ఇది నేను నెట్ లో పెడితే నెట్టును ,నా జుట్టును పీకేస్తారు నెటిజన్లు .ఆ సాహసం నేను చెయ్య లేను”అన్నాను ”మీకేమీ ఇబ్బంది ఉండదు -అందుకే నేను దీనికి తోక గా”నా రామాయణం  -నా ఇష్టం ”అని కేప్షన్ పెట్టాను .మీరు” రచయిత్రి ఇది స్వంత అభి ప్రాయం సంపాదకుడికి కాని,బ్లాగు కు కాని సంబంధం లేదు” .అనిరాసి  బ్లాగ్ లో దూర్చండి ”అని ఓ సలహా పారేసి వంటింట్లోకి దూరింది .”హా 1 హత విధీ !”అను కొంటు నా బుర్రలో చేరిన పేలను పీక్కుంటున్నాను .    
 
                       మీ–గబ్బిట  దుర్గా ప్రసాద్ -2-2-13-ఉయ్యూరు .
               
Posted in రచనలు | Tagged | 6 Comments

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )

   బ్రక్నర్ అనే సంగీత కారుడు బీథోవెన్ తొమ్మిదవ సింఫనీ విని తన్మయత్వమే చెందాడు .గుస్తేవ్ మాహ్లార్ బీథోవెన్ ప్రభావం తో రిసరేక్షన్ ను రెండు కోరస్ సిమ్ఫనీలను చేశాడు .1813-83 వాడు అయిన రిచార్డ్ వాగ్నర్ బీథోవెన్ తనత జీనియస్ కాదు పొమ్మన్నాడు .అయితే చాలా మంది తొమ్మిదవ సిమ్ఫనీని ‘’టోటల్ వర్క్  ఆఫ్ ఆర్ట్ ‘’అన్నారు .బీథోవెన్ లో రిథమిక్ ప్రిసిషన్ తో బాటు నృత్య శక్తి కూడా ఉండటం విశేషం గా భావిస్తారు .కొద్ది మంది బీథోవెన్ మార్గానికి కొంచెం భిన్నం గా వెళ్ళి నప్పటికీ ఇప్పటికీ అందరికీ బీథోవెన్ మాత్రమె అదర్శం ,మార్గ దర్శి .

అప్పటి నుంచి    ఈ నాటి తరం వరకు సంగీత సృజన కారులను ప్రభావితం చేస్తూ ప్రేరణ కలిగిస్తూ ఉత్తెజాన్నిస్తు,కదలిస్తున్న సంగీత కారుడు బీథోవెన్ ఒక్కడే అన్నది నిర్ద్వంద మైన విషయం ,విశేషం .చాలా కాలం బీథోవెన్ ను సాదికారంగా ‘’ఉత్తమోత్తమ సంగీత కారుడు ‘’అన్నారు .అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతా మొజార్ట్ ను భుజాని కెత్తుకొన్నారు కొందరు .1991 లో మొజార్ట్ ద్వి శత స్మృతి దినం గా ,గొప్ప మత ప్రదర్శన గా వియన్నా లోని బీథోవెన్ ప్రదర్శన వరకు నిర్వ హించారు .మొజార్ట్ కు ఏదైనా స్వరాలు అతి సులభం గా వచ్చేవి .బీథోవెన్ చాలా కష్ట పడాల్సి వచ్చేది .అయితే చివరి దశలో రావాల్సిన సంపూర్న త్వానికి  మొజార్ట్ కూడా చాలా కష్ట పడాల్సి వచ్చేది .

          ‘’Beethovenis the only one of of those that are today held to be the supreme great composers to have been consistently considered great by every generation since his death .His musical message has shown an extraordinary ability to adapt to needs of each age .’’అని బీథోవెన్ ప్రతిభకు పట్టాభి షేకం చేస్తారు .1980 మొదటికాలం లో సిమ్ఫనీలను ‘’చావు లకు ‘’వాయిన్చటానికిమాత్రమె  బాగా పాప్యులర్ అయ్యాయి .దీని తర్వాత ‘’పీరియడ్ ఇన్స్ట్రుమెంట్ ‘’ఉద్యమం వచ్చింది .మళ్ళీ బీథోవెన్ వైభవాన్ని వాయిద్యాలతో తీసుకొని రావాలనే కోరిక సంగీత కర్తలకు కలిగింది ఒక్క సారిగా సంగీతం ప్రాచుర్యం పొందటం కను మరుగైంది .చాలా ప్రశ్నలు ఉదయించాయి .చాలా మంది బీథోవెన్ రాతలన్నీ మళ్ళీ ప్రచురించి ప్రచారం లోకి తెచ్చారు .ఆయన చేసిన వాటి పై 19  శతాబ్దపు చరిత్ర కారులు చేసిన నగిషీలను అధ్యయనం చేశారు .బీథోవెన్ స్వంత భావాలను పునః ప్రతిష్ట చేసి ,పురా వైభవం సాధించి పెట్టారు ఆ సంగీత సృష్టి కర్తకు .బీథోవెన్ చేసినవే చాలా కుతూహలం గా ఉన్నాయని మధ్యలో వారు చేసిన మేరుగులేమీ బాగా లేవని అభి ప్రాయ పడ్డారు .ఇది చాలు ఆ మహాత్ముడి చిరంజీవిత్వానికి .

               జనం లో బీథోవెన్ పై ఉన్న అభిప్రాయాలలోను గణనీయ మైన మార్పులొచ్చాయి .తొమ్మిదవ సింఫనీ లో ఉన్న ‘’జాయ్ థీం.’’అన్నది  ‘’యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటి ‘’anthem ‘అంటే గీతం అయింది .ఇదే ‘’kiss of death for what was once bold new idea ‘’అని పించు కొంది .దీనితో పాత దాని పై మోజు పోయి repressive communist order కు స్వస్తి పలికారు .బెర్లిన్ గోడ పతనం చెందిన తర్వాత ఆనందపు ఉత్సాహ వేడుకల్లో ninth with Schiller’s original ‘’free heir ‘’(freedom )అనేది freede (joy )కి మారు పేరు అయింది ..అంటే ఆ స్తానాన్ని ఆక్రమిన్చిందన్న మాట .

              ‘’Beethoven ‘s greatest works were ‘’greater than they can be played ‘’-that no performance however sympathetic ,could embrace every thing .perhaps this also true in broader sense ‘’the music’s character and originality are so multi –faceted that there is always more than can be comprehended at any time ‘’అని బీథోవెన్ అమర సంగీతానికి ముగ్ధులై ప్రశంశా వర్షం కురిపించారు విజ్ఞులైన సంగీత వేత్తలు .

          1882 -1917 కాలపు ఇగోర్ స్త్రా విన్స్కి అనే కంపోసర్ బీథోవెన్ చేసిన Graffi Fuge ‘’ను నిత్య నూతనమే కాదు ఎప్పటికీ సమకాలీనం గా నే ఉంటుంది (Absolutely contemporary work that will be contemporary for ever )అని ప్రశంసించాడు .ఇదే విషయాన్ని ఆయన బీథోవెన్ చేసిన అన్ని విషయాలకు వర్తింప జేశాడు .ఆయనే బీథోవెన్ సర్వ సమర్ధతకు అంజలి ఘటిస్తూ ‘’For all his  emotive ,over wrought language ,Franz Grill Parzer could have been right ‘’Beethoven’s music may well ‘’live for all time ‘’.అని కీర్తి తోరణం కట్టాడు .బీథోవెన్ సంగీతం, ,ఆయన సింఫనీ అజరామరం, సార్వ కాలీనం, సార్వ జనీనం .

                 

            ఇందులో వచ్చిన సంగీత పదాలకు  వివరణ

1– Minuet –గొప్ప నృత్యం –చిన్న పియానో స్వరాలకు ఉపయోగించేది పెద్ద వాయిద్య బృందం లో ఒక గతి (మొమేంట్ )

2—scherze –జోక్ –నెమ్మది  నడక ఉన్న చిన్న భాగం ఇది బీథోవెన్ సంగీతం లో minuet బదులు దీనిని వాడాడు .

3-sonata –మూడు గతుల గీతం .రెండు లేక మూడు వాయిద్యాలకే పరిమిత మైంది .సాధారణం గా ఈ వాయిద్యాలు పియానో ,వయోలిన్ తో పియానో నాలుగు గతుల వరకు

4-symphony –సుశ్రావ్య మైన స్వర సమ్మేళనం –ఏక తాళత్వం –ఎన్నో వాయిద్యాల సమ్మేలనం తో ఉండేది .సాధారణం గా నాలుగు గతులుంటాయి .బీథోవెన్ ఆరవ సింఫనీ లో అయిదు గతులు వాడాడు .మొదటిది చివరిది చాలా వేగ వంతం .రెండవది నెమ్మదిగా నడుస్తుంది .మూడవ దానిలో minuet కాని scherzo (joke )కాని ఉంటుంది .ఒక్కోసారి స్లో మొవ్ మెంట్ మూడో స్థానం లో రావచ్చు .

 5- Concerto –ఒకే వాయిద్యానికి .ఆర్కెస్ట్రా కి రాసిన చిన్న విషయం .మూడు గతులుంటాయి వేగం ,నెమ్మది వేగం తో కూడి ఉండేది .సోలో వాయించే వారి టెక్నిక్ లను ఆవిష్కరించేది .సాధారణం గా ఇవి పియానో కు వయోలిన్ కు ఉంటాయి దీన్నే సంగీత సాధన విశేషం అనచ్చు

6 –chamber music –చిన్న,వివిధ సమూహ వాయిద్యాల స్వర గీతి .ప్రతి వాయిద్య కారుడు తన వాయిద్యాన్ని ప్రత్యేకం గా వాయించి ప్రతిభ ను నిరూపించుకొంటాడు .

7-trio –చేంబర్ సంగీతం లో ఒక భాగం మూడు వాయిద్యాలుంటాయి .పియానో త్రయో అంటే –పియానో ,వయోలిన్ ,సెల్లో

8 quartet –చేంబర్ సంగీతం లో నాలుగు వాయిద్యాలనుపయోగించే భాగం ఇందులో స్ట్రింగ్ క్వార్తేట్ అంటే –రెండు వయొలిన్లు ,వయోలా ,సెల్లో

9-quintet –చేంబర్ సంగీతం లో అయిదు వాద్యాలుపయోగించే భాగం

10-sixtet –‘’’’’’’’’’’’’’’’’’లో ఆరు ‘’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

11-septet –‘’’’’’’’’’’’’’’’’’’లో ఏడు ‘’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

12-octet –‘’’’’’’’’’’’’’’’’’’’లో ఎనిమిది ‘’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

13-variations –మార్పులు –పియానో భాగాలకు గతుల కోసం .అనేక విదానాలను  ఉపయోగించేది

14-opera –సంగీత నాటకం –అనేక రంగాలతో కూడి ఉంటుంది .ఫీడేలియో అనేది జర్మని భాష లో పాడటం ఆన వాయితీ .

15-mass – కేధలిక్ చర్చి లో సర్విస్ కోసం ఏర్పరచే సంగీతకూర్పు  విశేషం .లాటిన్ భాషలో చర్చి కోసం చేసేది

            ‘’సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ ‘’రచనకు-ఆధారం గా  ఉపయోగ పడిన పుస్తకాలు –  వెండీ థామ్సన్ రచించిన –లుడ్విగ్ వాన్ బీథోవెన్ , ఎడ్మండ్ మారిస్ రచించిన– బీథోవెన్,దినేస్ బాల్కరేజ్ రాసిన –లుడ్విగ్గ్  వాన్ బీ తోవెన్ ,జాన్ బాంక్ స్తాన్ రాసిన –  మొర్జాట్,, స్టీఫెన్ జాన్సన్ రచించిన – క్లాసిక్ ఎఫ్.ఏం.-లుడ్విగ్ వాన్ బీ థోవెన్ ,మరియు ఎన్ సైక్లో పీడియా బ్రిటానికా ,వివిధ పత్రికలలో వ్యాసాలూ  మొదలైనవి .

             సంపూర్ణం

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-2-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి – ఉయ్యూరు “త్యాగరాజ స్వామి 167 ఆరాధనోత్సవాల సందర్భం గా జరిగిన సమావేశం “

This gallery contains 32 photos.

Sarasa Bharathi 41 130131

More Galleries | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12 మహా మూజిక్

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12

                           మహా మూజిక్

   సంగీతాన్ని   హృదయాల్లోకి చొచ్చుకొని పోయే సంగీతం అందించాడు బీథోవెన్ .హేడెన్ ను మించి సంగీత రహస్యాలను ఆవిష్కరించాడని పొగిడారు .భౌతికం గా ఆయన లేకున్నా ఆయన విని పించిన సంగీతం ఇంకా సంగీత ప్రియులను ప్రభావితం చేస్తోంది ..ఆయనలోని ప్రతిభనంతా చుక్క మిగల్చ కుండా భావి తరాలకు సంగీత పెన్నిధి గా అందించాడు ..ఆయన ‘’Dressed in a jacket of some shaggy dark grey with trousers of the same material .The pitch black hair stood upon the head .His beard unshaven for several days ,blackened the lower part of his already dark complexened face .I also noticed at a glance ,as children often do ,that his ears were stuffed with cotton wool which seemed to have been dipped in some kind of yellow liquid’’అని బోహీమియన్ కంపోజర్ Vaclav Tomsek ఆయన రూపాన్ని అభి వర్ణించి బీథోవెన్ అమర సంగీతాన్ని మెచ్చుకొన్నాడు ..హృదయపు లోతుల్లోంచి వచ్చిన సంగీతం కనుక అంత చిర యశస్సు నార్జిన్చిన్దన్నాడు .మహా కవి వై.బి.యేట్సు రాసిన ఒక కవిత ని బీథోవెన్ రెండవ సింఫనీ లో వాడుకోన్నాడు .దేన్నీ ఎన్ను కోవాలో ఏది ప్రభావితం చేస్తుందో ఆయనకే తెలుసు .అదే ఆయన మేధస్సు .ఒక అలౌకిక స్వర్గాన్ని కనుల ముందు నిలుపుతాడు .ఒక అవ్యక్త మాధుర్యాన్ని అనుభవింప జేస్తాడు .అది వింటున్న సేపూ మనం ఒక రకమైన ట్రాన్స్ లో ఉండి పోతాం ..

             మహా రచయిత గోథేకు రాసిన ఉత్తరం లో బీథోవెన్ తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ప్రతిభను అభి నందించాడు ‘’I could see that I had only a romantic audience not an aristic one .I but from you Gothe ,I would not stand for this .You yourself must know how pleasant is it to be applauded by hands which one respects .if you donot recognize me and consider me as your equal who will?To what sort of a pace of rag muffians shall I turn for understanding ?’’అని తన మనో వేదనను తెలుపుకొన్నాడు .

                                        బీథోవెన్ ఆరాధన

          1902 నుండి బీథోవెన్ ఆరాధన ప్రారంభ మైంది .అప్పుడే బీథోవెన్ ప్రదర్శనను వియన్నాలో ఏర్పాటు చేశారు .max klinger అనే శిల్పి నిర్మించిన బీతోవెన్ పాల రాతి విగ్రహం ,దంత విగ్రహం ,విలువైన రాతి విగ్రహాలు ,బంగారు, కంచు విగ్రహాలను నెలకొల్పారు .అర్ధ నగ్నం గా క్లాసికల్ పోజ్ లోఒక సింహాసనం లో  కూర్చున్న భంగిమ లో శిల్పించారు దీనికి దేవ మాతల శిరస్సులు ఉండటం అయన దివ్యత్వానికి ప్రతీకలు ..gustav klimt అనే కళా కారుడు బీథోవెన్ సాధీంచిన అద్భుత విజయాల సారాన్ని ఒక ‘’ఫ్రీజ్ ‘’(కంబళి ) పై అత్యద్భుతం గా చిత్రించాడు .గుస్తేవ్ మాహ్లార్ అనేసంగీత కారుడు దీని ప్రారంభోత్సవ సమయం లో బీథోవెన్ తొమ్మిదవ సింఫనీ ని కొత్త తరహాలో మార్చి ,కూర్చి అదనపు బ్రాస్ బాండు లతో ,మాస్ కోరస్ తో నింపి నిండుదనం తెచ్చి ప్రదర్శించి స్వర నీరాజనం అందించాడు .

            రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రతి దేశంవారు  బీథోవెన్ ‘’మా వాడు అంటే మా వాడు’’ అని పోటీ పడ్డారు .రష్యా యుద్ధం తర్వాత’’ విప్లవ సంగీత సృష్టి కర్త’’ అని కూడా అని పించుకొన్నాడు .నాజీ జర్మని బీథోవెన్ ను గొప్ప జాతీయ కళా కారుడు అని హారతులు పట్టింది .హిట్లర్ మాత్రం అతని పై మక్కువేమీ ఎక్కువ గా చూప లేదు .హిట్లర్ కు రిచార్డ్ వాగ్నర్ సంగీతం  అంటే మక్కువ . ఇద్దరి అభిప్రాయాలు ఒకటే నంటాడు .జర్మని ఫ్రాన్స్ పై దాడి చేసినప్పుడు అయిదవ సింఫనీ లోని ప్రారంభ విషయమైన’’ v’’ అనే మార్సు కోడ్ ఫ్రాన్స్ ను నిలువరించే విజయానికి సంకేతం గా మారి పోయింది .బీథోవెన్ రచన ల పై విశ్లేషణా పెరిగి పోయింది .helligenstadt testament తర్వాతి దశాబ్దాన్ని బీథోవెన్ సాహస గాధా కాలం గా పరిగణించారు ..మిగిలినవి జనానికి ఆనలేదు .

         ఇరవై వ శతాబ్దం దాకా చివరి  అయిదు కష్టమైన స్ట్రింగ్ క్వార్టర్స్ అభి నందనలకు నోచు కోలేదు 1881 జూన్ లో జాన్ రస్కిన్ అనే ఆంగ్ల విమర్శకుడు బీథోవెన్ సంగీతాన్ని డబ్బాలో రాళ్ళు, రప్పలు, మేకులు, వేసి మోగించి నట్లు,ఇనప సుత్తి ని కింద పడేసి నట్లు ఉందనివిమర్శించాడు .అయితే ఈ శతాబ్దపు స్టీరియో మోత హడావిడి లో, కూడా బీథోవెన్ సంగీతానికి ప్రాచుర్యం ఏమీ తగ్గనే లేదు .ఆ తర్వాతి కంపోజర్ల పై ప్రభావం ఆకాశానికే హద్దు అని పించింది .1797-1828 మధ్య ఉన్న Schubert అనే సంగీత కారుడికి బీథోవెన్ మరణం కొంత వి చారకరం గా ,కొంత స్వేచ్చగ్తా అని పించింది .బీథోవెన్ సి మేజర్ లో చేసిన స్ట్రింగ్ క్వార్టర్ చాలా కాలం ఆయన ,జీవితానికి చెప్పిన వీడ్కోలు గా గుర్తుండిపోయింది .ఎక్కడ ఆయన వదిలేశాడో అక్కడి నుండి మళ్ళీ ప్రారంభించారు సంగీత కారులు .క్విన్తేట్ సి లో భాగం బీథోవెన్ చావు సమయం లోనిది .దీనినే Schubert తన జీవిత చరమాంకం లో 1828 లో చూశాడు .

         హెక్టార్ బెరలి యోజ్ అనే ఫ్రెంచ్ సంగీత కారుడికి బీథోవెన్ ‘’దేవత కంటే కొంచెం చిన్న వాడువిప్లవ భావానికి సాకారం ‘’(little short of adiety ,the incarnation of the spirit of revolution )‘’’అని పించాడు .  అయితే ఈయన సహచరుడు ‘’ఫెలిక్స్ మెండేల్ సన్’’ కు మాత్రం ‘’deeply rooted in the past ,that he faced both forward and backwards ‘’అని పించింది .1833-97  వాడిన జోహాన్నెస్ బ్రామ్స్ ,1824-96 .కు చెందిన అంతాన్ బ్రక్నర్ మాత్రం బీథోవెన్ ప్రభావం లో మునిగి పోయారు .బ్రామాస్ నలభై ఏళ్ళు వచ్చే దాకా మొదటి సింఫనీ నే చేయ లేక పోయాడు .’’you have no idea how difficult it can be –when such giant masters behind you ‘’అని తన అసమర్ధత ను ఒప్పుకొన్నాడు .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-13-ఉ

Posted in రచనలు | Tagged | Leave a comment

సినిమా పదకోండవ అవతారం

సినిమా పదకోండవ అవతారం

సినిమా మనిషిని ప్రభావితం చేయడమే కాదు… ఆలోచనల్ని సమూలంగా మార్చేస్తుంది అంటారు జె కె భారవి. ఆయన దృష్టిలో సినిమా11వ అవతారం. ‘చిటికెల పందిరి’ సినిమాకు దర్శకుడుగా సినీరంగంలోకి ప్రవేశించినా ఆ తర్వాత రచయితగా మారి ప్రఖ్యాతి గడించారు భారవి. ఆ క్రమంలో 24 కన్నడ సినిమాలకు రచన చేసినా ఆయన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది మాత్రం అన్నమయ్య సినిమా రచనతోనే. ఆ సినిమా సాధించిన అద్భుత విజయం ఆ త ర్వాత శ్రీ మంజునాథ, పాండురంగమహత్యం, శ్రీరామదాసు సినిమాలకు నాంది అయింది. యువతే లక్ష్యంగా ఆధ్యాత్మిక సినిమాను రూపొందించటం ఒక సాహసమే. స్వీయ రచన, దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో త్వరలో విడుదల కాబోతున్న ‘ఆదిశంకర’ ద్వారా ఆయన ఆ సాహసమే చేశారు. మూడు పదుల సినీ ప్రస్థానంలో భారవికి ఎదురైన అరుదైన సంఘటనలే ఈ వారం అనుభవం.
నాకప్పుడు పదేళ్లు. వరంగల్ జిల్లాలోని కోమటిపల్లి మా ఊరు. అక్కడ ఇస్తారి అనే ఓ వ్యక్తి మీద దొంగతనం చేశాడనే ఆరోపణ వచ్చింది. అతన్ని పిలిచి అడిగితే నేను ఆ దొంగతనం చేయలేదన్నాడు. నువ్వే చేశావు, నువ్వే చేశావంటూ ఎంత మంది అరిచినా తాను మాత్రం చేయలేదనే బదులిచ్చాడు. నిజం ఎలా తేలాలి? వెంటనే అతన్ని ఊరి చెరువు వద్దకు తీసుకువెళ్లారు. ఊరిజనమంతా అక్కడ గుమిగూడారు. చెరువు గట్టు దగ్గర రెండు బస్తాల బొగ్గులతో నిప్పు రాజేసి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. ఆరోపణకు గురనైన వ్యక్తి కాలుతున్న గడ్డపారను అరచేతులతో పట్టుకుని పైనుంచి కిందికి తుడవాలి. అలా మూడు సార్లు చేశాక చేతులు కాలితే ఆ ఆరోపణ నిజమని, కాలకపోతే అతడ్ని నిర్దోషి అని తే ల్చేస్తారు.

ఇస్తారి ఏదో దేవతను తలుచుకుంటూ మూడుసార్లు ఆ గడ్డపారను తుడిచాడు. అతని అరచేతులు నల్లగా మాడిపోయాయి. అవి చూసిన పెద్దలు అతడు దొంగతనం చేసింది నిజమేనంటూ తేల్చేసి, జరిమానాగా ఇంత డబ్బు చెల్లించాలంటూ తీర్మానించి చక్కావెళ్లిపోయారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. నాకు ఏడుపొచ్చేసింది. ఇస్తారి కేసి చూస్తే అతడు ఆ దొంగతనం చేయలేదనిపించింది. కానీ ఆ మాటను అతడు ఎంత అరచి చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ఎదిరించలేని నిస్సహాయతలో అతను ఎంతో హింసకు గురయ్యాడు. ఆ సంఘటన నా మనసులో బలంగా పాతుకుపోయింది. నన్ను వెంటాడుతూనే వచ్చింది.

తర్కం కోల్పోతే…
ఓ నాలుగైదేళ్లు గడిచిపోయాయి. అప్పటికే నా మీద కొంత సినిమాల ప్రభావం ఉండడం వల్ల ఆ సంఘటన ఆధారంగా నేనొక స్క్రిప్ట్ రాసిపెట్టుకున్నాను. అందరి దృష్టిలో దొంగగా మిగిలిపోయిన ఇస్తారి దుఃఖం తీరేదెలా? ఏ ఒక్కరికీ అతని పట్ల సానుభూతి లేదా? అందుకే క్లైమాక్స్‌లో అక్కడున్న దేవుని విగ్రహం కళ్లల్లోంచి నీళ్లు వచ్చినట్లు రాశాను. ఆ స్క్రిప్ట్‌ను మా టీచర్ జక్కా సత్యం గారు చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఆ స్కిప్టును ఆ రోజుల్లో నాటకరంగంలో కృషి చేస్తున్న డిఎస్ఎన్ మూర్తికి వినిపించాను. అంతా విని, ఆయన స్క్రిప్టులో ఒక మార్పును సూచించారు.

ఏ యుగంలో అయనా విగ్రహాల కళ్లలోంచి కన్నీళ్లు రావు. కాబట్టి స్క్రిప్టు నుంచి ఆ మాటను తీసేయమన్నారు. సాంఘిక రచనలైనా, పౌరాణిక రచనలైనా తార్కికతను, హేతుబద్ధతను కోల్పోతే అవి ప్రజల్ని ఏమాత్రం రంజింపచేయలేవు అనే గొప్ప సత్యాన్ని ఆయన మాటల ద్వారా నేను గ్రహించాను. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ, పాండురంగడు, కొత్తగా వస్తున్న శ్రీ జగద్గురు ఆదిశంకర ఇవన్నీ హేతుబద్ధంగా ఉండడానికి ఆనాటి ఆ సూచనే ఇప్పటికీ నాకు ఒక గైడ్‌గా పనిచేస్తోంది

వాస్తవాలే వస్తువుగా…
ఆచార్య ఆత్రేయ వద్ద నేను 11 ఏళ్లపాటు అసిస్టెంట్ రైటర్‌గా పనిచేశాను. ఆయనంటే నాకు అంతులేని ప్రేమ, గౌరవం. చాలాసార్లు నాకూ ఆయనకూ మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు సాగేవి. అలాంటి సమయాల్లో ఆత్రేయ నోట కొన్ని కొత్త సత్యాలు వెలువడుతూ ఉండేవి. అయితే పెద్దా చిన్నా అనే భావన లేకుండా ఒక్కోసారి పసిపిల్లాడిలా సరెండర్ అయిపోయే స్వభావం కూడా ఆయనలో ఉండేది. సినిమా కథకు పనికి వస్తుందనిపించి 1850 ఆ ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవిక సంఘటన ఆత్రేయ గారికి చెప్పాను. అదేమిటంటే, ఇంగ్లాండ్‌లో క్యారీనేషన్ అనే ఓ స్త్రీ ఉండేది.

తన భర్త విపరీతంగా మద్యం తాగి చనిపోవడంతో వాళ్ల కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దాంతో మద్యం అమ్మకాల మీద తిరుగుబాటుగా ఒక ఇనుప పనిముట్టు తీసుకుని కనిపించిన ప్రతి వైన్‌షాప్‌నూ ధ్వంసం చేయడం ప్రారంభిస్తుంది. ఆమెకు మద్దతుగా అక్కడి మహిళలంతా గుంపులు గుంపులుగా వచ్చి ఆమెతో చేతులు కలుపుతారు. ప్రభుత్వానికి అదో పెద్ద సమస్యగా మారుతుంది. చివరికి క్యారీనేషన్ పుట్టిన జిల్లా అంతా మద్యనిషేధం విధిస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ జిల్లాకు క్యారీనేషన్ పేరే పెడతారు.

ఈ సమస్యే ఇతివృత్తంతగా సినిమా తీస్తే గొప్పగా ఉంటుందనిపించింది. ఇదే విషయాన్ని ఆత్రేయ గారి ముందు ప్రస్తావిస్తే, “తాగుడు సమస్యేమిటి నాయనా… అసలది ఒక సమస్యే కాదు! ”అన్నారు. ఆయన అలా అనటం విని నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే “తాగడం సమస్య కాకపోతే, మీరు నా గురువే కాదు” అన్నాను. అందుకాయన “ప్రజలు మీరు అనుకుంటున్నట్లుగా లేరు” అన్నారు. వెంటనే నేను “మీరు ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నారు? మీకు తెలిసిందల్లా 1940 కాలం నాటి ప్రజలే. ఈ రోజునుంచి నేను మీకు శిష్యుడ్నే కాదు.” అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాను.

ఆ తర్వాత రెండ్రోజులకి ఆత్రేయ గారే స్వయంగా నాకోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. వస్తూనే, తప్పయింది నాయనా! నేను అలా మాట్లాడటం తప్పే. నువ్వనే ఆ ప్రజల గురించి నిజంగానే నాకేమీ తెలియదు. నిజమే. తాగుడు ఒక మహమ్మారి. నేను ఒప్పుకుంటున్నాను. వచ్చేయ్ నాయనా! నాతో వచ్చెయ్ అంటూ నా చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లారు.

నాకోసం ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన తక్కువేమీ అయిపోలేదు. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుని ఆయనే గొప్పవారయ్యారు. కాకపోతే, ఆయన ఎక్కడో ఒకచోట తగ్గినట్టే తగ్గి, హఠాత్తుగా ఒక పెద్ద ఆలోచనా ప్రవాహంలో పడి పెద్ద సముద్రమైపోయే వారు. ఆకాశం అయిపోయేవారు. అంతకు ముందు పసిపిల్లాడిలా విలవిల్లాడింది ఈయనేనా ?అని ఆశ్చర్యం వేసేది. ఎవరినైనా ఏదో ఒక కోణంలోనే చూసి అంచనా వేయడం ఎంత తప్పో ఆత్రేయను చూశాక తెలిసింది.

ఆదిశంకరతో ఒక ఆరంభం
సినిమాను మించి మానవాళిని ప్రభావితం చేసే మరో మాధ్యమం లేదనేది నాకున్న బలమైన అభిప్రాయం. నా దృష్టిలో అది 11వ అవతారం. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ వంటి ఇతివృత్తాల్ని సినిమాగా కాకుండా మరే మాధ్యమంలో చూపినా అంత ప్రయోజనం ఉండదు. భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో సీతమ్మ పర్ణశాల ఉంది. శ్రీ రామదాసు సినిమా విడుదల కావడానికి ముందు అక్కడికి రోజూ ఒక బస్సు, రెండు ఆటోలు మాత్రమే తిరుగుతూ ఉండేవి. రామదాసు విడుదలైన నాటి నుంచి రోజూ 50 బస్సులు, 200 ఆటోలు తిరుగుతున్నాయి.

ఇది సినిమా ప్రభావం ఎంత ఉధృతంగా ఉంటుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ. ఆలోచనాత్మకంగా చూసినా మనిషిని ప్రభావితం చేయడంలో మిగతా వాటికంటే సినిమా వెయ్యిరెట్లు అధికంగా ప్రభావితం చేయగలదని నా అభిప్రాయం. అలాగే ప్రపంచంలో ఏమార్పు అయినా యువతతోనే సాధ్యమవుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. గత అనుభవాలన్నీ వేదికగా చేసుకుని ఇప్పుడు ‘జగద్గురు ఆదిశంకర’ సినిమా తీశాను. ఒక యువకుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడని చెప్పడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

ఆదిశంకరుడు బతికింది కేవలం 32 ఏళ్లే అయినా అతడు జగద్గురువుగా ఎదిగాడు. ఆ కాలంలో 72 మతాలు ఉండేవి. పరస్పరం చంపుకునే ఒక మారణకాండ సాగుతున్న సమయంలో ప్రపంచానికి ఆదిశంకరుడు అద్వైతాన్ని బోధిస్తూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా నాలుగు సార్లు పాదయాత్ర చేశాడు. ఆ మహత్తర శక్తిసంపన్నుని జీవితాన్నే ఈ సినిమాలో చూపాను.

ఆధ్యాత్మిక పురుషుల సినిమాలంటే కేవలం పెద్ద వారికోసమేనా? కానే కాదు. అందుకే ఆది శంకర సినిమాకు ‘యువతకోసం’ అనే టాగ్ పెట్టాను. ఒక మంచి సినిమా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిసిన అనుభవమే నన్ను ఆదిశంకర సినిమా నిర్మాణానికి పురికొల్పింది. అనుభవాలు ఎప్పుడూ పునాదులు అవుతాయి.ఆ తర్వాత వచ్చే ఆలోచనలు భవంతులు అవుతాయి. ఇదే నా జీవితం నాకు నేర్పిన పాఠం.

బమ్మెర

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

 

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

బీథోవెన్ చేసిన తొమ్మిదవ సింఫనీ ని ఆ తర్వాతి సంగీత కర్తలు శిఖరాయమానం అన్నారు .ద్వోరాక్ ,బ్రక్నేర్ ,సిబిలియాస్ వాన్  విలియమ్స్ మొదలైన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై  ఆ సృజనకు నీరాజనాలు పల్కారు .వారందరూ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ఫనీలు చేయ లేక పోయారు బీథోవెన్ చేసిన తొమ్మిదో సింఫనీ లో నాలుగు గతులున్నాయి ,దానితో పాటు శక్తి వంత మైన స్కేర్జ్ అంటే జోక్ ను మిళితం చేసి రెండవ స్తానం లో చేర్చటం చివరి స్వర గతి’’ న భూతో న భవిష్యతి ‘’అని ఆ స్వర  మాంత్రి కునికి ప్రశంసాభి షెకమే చేశారు .

   ‘’not only is the orchestra boosted by a choir in the glorious rendering of the ‘’odeto joy ‘’with its ecstatic vision of all men as brothers ,but Beethoven suddenly interrupts it with  a  jaunty little Turkish  march accompanied by oriental sounding percussion instruments ‘’అని విశ్లేషకులు , ,అభిమానులు బ్రహ్మానందాన్ని అనుభవించారు .ఆ సృజన అనితర సాధ్యమన్నారు .ఇన్నేళ్ళు గడిచినా అతడే ఇప్పటికీ సిమ్ఫనీకు మకుటం లేని మహా రాజు అంటారు .

             తన సంగీతం ద్వారా బీథోవెన్ వియన్నా ప్రజలు ,సకల దేశాల వారికి స్నేహ హస్తాలు సాచి ఆహ్వానం పలుకుతున్నట్లు ,అందులో తమకుసంప్రాదాయ  శత్రు దేశమైన టర్కీ ని కూడా స్నేహితులు గా భావించటం వారి హృదయ వైశాల్యాని చాటు తోందని చెప్పకనే చెప్పాడు అదీ దేశ భక్తీ అని రుజువు చేశాడు ..బీథోవెన్ చేసిన ఈ సింఫనీ తర్వాత నుంచిబెర్లిన్ గోడను 1889లో కూల్చి వేసినప్పటి నుండి ఈ సింఫనీ  తూర్పు ,పశ్చిమ యూరప్ ల మధ్య  పునరాలోచన కల్గించిందని అందరు అంటారు .

           చివరి మూడేళ్లలో బీథోవెన్ జనాలకు దూరం గా ఉంది పోయాడు .ఎప్పుడో నడకకు బయటికి రావటం తప్ప అసలు ఇంట్లోంచి కదలటమే లేదు .మద్య పానం బాగా ఎక్కువై పోయింది .తిండీ ఎక్కువ గా తింటున్నాడు .కాఫీ అంటే మహా ప్రాణం బీథోవెన్ కు .వినికిడి పూర్తిగా పోయేసరికి టెంపర్  పెరిగి పోయింది .అసహనం ఎక్కువైంది .సంఘంలోని జనం తో ఆనందాన్ని పంచుకోలేని దురదృష్ట వంతుడై పోయాడు ..నివాసాన్ని చేంబర్ మ్యూజిక్ కు మార్చాడు .ఆయన చివరి రచనలైన ‘’స్ట్రింగ్ క్వార్టర్స్ ‘ఆ నాటి జనానికి మహా ఇష్టమై పోయాయి .ఆరాధనతో పరవశించే వారు అభిమానులు .దాదాపు పద్నాలుగేళ్ళ నుండి కొత్తగా ఏదీ రాయలేక పోయాడు .1822  లో కొత్త పెట్రాన్ అయిన రష్యా యువ రాజు నికోలాయ్ గోలిస్తీన్ తన కోసం మూడు క్వార్టర్స్ రాయమని కోరాడు .మొదటిది ఎట్లాగో ‘’ఈ.ఫ్లాట్ ‘’లో పూర్తీ చేశాడు .ఇది జనం లో అంతగా పేల లేదు .రెండోది ‘’ఏ –మైనర్ ‘’లో రాశాడు జబ్బులో ఉం డికూడా .(1825 ).ఇది చాలా నెమ్మది మీదుండే గతి లో రాశాడు .దీనికి ‘’Hymn of thanks giving to the divinity from a convalescent ‘’అని సార్ధక నామం పెట్టాడు .మూడవది o.p..130 ని బి ఫ్లాట్ లో చేశాడు .సుదీర్ఘమైనది .దీనిలో ఆరు గతులుంటాయి .అందులో చివరిది ‘’grosse fuge ‘’(grand fuge )అంటే మహా నిష్క్రమణ .వీడ్కోలు –అస్తిరం ఇక సెలవ్ .చివర రాసిన క్వార్టర్ లన్ని పాడే వారికి ,వాయించే చాలా కష్ట మైనవే .అయితే వాళ్ళు పూర్తీ సహకారం అందించ లేక పోయారు న్యాయం చేయ లేక పోయారు .దీన్ని కొంచెం మార్చి రాయ మని పబ్లిషర్ కోరితే అలానే చేస్తే , ముద్రింపబడింది .

            బీథోవెన్ చివరి రోజులు మరీ దారుణం గా గడిచాయి . .తమ్ముడి కొడుకుకారల్  ఇంట్లోంచి పారి పోయి ఆత్మ హత్య చేసుకొన్నాడు .ఇది ఆశని పాతం అయింది బీథోవెన్ కు .ఇతనే బీథోవెన్ కుటుంబం లో చివరి వాడు .అంటే బీథోవెన్ వంశం బీథోవెన్ తో అంతమైందన్న మాట .దురదృష్టం .ఆ మహా ను భావుని వంశం వారసులు లేకుండా పోవటం బాదే .అందరికి .

       1826 లో జోహాన్ దగ్గర పల్లె టూరిలో ఉన్నాడు బీథోవెన్ .ఉండలేక వియన్నా కు తిరిగి వచ్చేశాడు .జబ్బు తీవ్రమైంది .ఒళ్లంతా నీరు పట్టింది ..కాళ్ళు కదిలించ లేక పోతున్నాడు .లివర్ పూర్తిగా దెబ్బతిని పోయింది .లోపలి కి గొట్టాలు పంపి నీరు తోడారు .ఈయన దీన స్తితి చూసిన లండన్ లోని ‘’ఫిల్ హార్మానిక్ సోసైటీ’’సాయంగా 160 పౌండ్లు పంపింది .ఒక పబ్లిషర్ బీథోవెన్ కు ఇష్టమైన ‘’రై నిక్ వైన్ ‘’ఒక కేసు పంపించాడు .శుభ్రం గా తాగి ఆనందించాడు .నాలుగు నెలలు తీవ్రం గా బాధ పడ్డాడు .1827 లో తన చుట్టూ ఉన్న వారిని చూసి ‘’Applaud my friends ‘’అని లాటిన్ భాష లో అన్నాడు .’’The comedy is finished ‘’అని వీడ్కోలు చెప్పాడు .మర్నాడంతా కోమా లో ఉండి పోయాడు .ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు పెద్ద భయంకర మంచు తుఫాను ప్రారంభ మైంది .పెద్ద మెరుపు వచ్చింది .కళ్ళు తెరచి చూశాడు చివరి సరిగా బీథోవెన్ .కుడి చెయ్యి పైకి ఎత్తాడు .అంతే తల వాల్చేశాడు .అప్పటికే తన కున్న యావదాస్తి, నగదు అన్నీ తమ్ముడి కొడుకు కారల్ కు రాశేశాడు .అప్పటికి బాంక్ బాలన్స్ 7,441 ఫ్రాన్కులున్నాయి .తాను చేసిన బాకీ లన్నీ  ఈ డబ్బు తీర్చేయమని విల్లు లో రాశాడు .

                        మహా ప్రస్తానం

            జర్మన్ బాల సంగీత మేధావి అని పించుకొన్న మహా సంగీత విద్వంషుడు  మొజార్ట్ మరణిస్తే స్మశానకి పట్టు పని పది మందికూడా వెంట వెళ్ళ లేదు .అదే బీథోవెన్ పార్ధివ దేహాన్ని స్మశానికి తర లిస్తుంటే 20 ,000 మంది అభిమానజనం వెంట వెళ్లటం మహా నివాళి అని పించుకోంది ..రోడ్లన్నీ జనాలతో కిక్కిరిశాయి .ఆ సింఫనీ మాంత్రికుని కడ సారి దర్శనం కోసం .అదీ అభిమానం అంటే .తామేమిటో వియన్నా ప్రజలకు తెలియ జెప్పిన గొప్ప దేశ భక్తుడైన సంగీత సృష్టికర్త బీథోవెన్ .సెయింట్ స్టీఫెన్స్ కాతేద్రిల్ జన సముద్రమే అయింది .బీథోవెన్ ను wahring church ‘’లో సమాధి చేశారు .ఆ నాటి విషాదాంత నటుడు ‘’Henrich Anschutz ‘’ స్మశాన వాటిక లో సందేశం ఇస్తూ ‘’franz Grill Parzer ‘’అనే మహా కవి రాసిన కవితా భావాన్ని తన ప్రసంగం గా చెప్పాడు ‘’we ,the representatives of an entire nation ,come ,to mourn the passing of the gracious mouth by which music spoke ,the man who inherited and enriched the  immortal fame of Handel and Bach ,of Hyden ,and Mozart .He was an artist ,and who shall stand beside him ?because he shut himself off from the world ,they called him hostile and callous .He with drew from his fellow men after he had given them every thing and received nothing in return .But until his death ,he preserved a father’s heart for man kind..Thus he was ,thus he died ,thus he will live for the end of time ‘’అంటు బీథోవెన్ దేశానికి ఇచ్చిన దానికి ఏమీ ఇచ్చి  ఋణం తీర్చుకోలేమని, ఆయనకు దేశం ఇచ్చింది శూన్యమ అని ఆయన సంగీతం అజరామరం అని గోప్పగాశ్లాఘించాడు .ఆ తర్వాత వియన్నా లో బీథోవెన్ కు గొప్ప స్మృతి చిహ్నాన్ని నిర్మించి తమ కృతజ్ఞత చాటు కొన్నారు ..57 ఏళ్ళు మాత్రమె జీవించిన బీథోవెన్ ప్రపంచ సంగీతం లో అందులోను ముఖ్యం గా సింఫనీ లో చిరంజీవి .

                           సశేషం –

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-13-ఉయ్యూరు

        

Posted in రచనలు | Tagged | 1 Comment

సీత అయోధ్యకు తిరిగొచ్చాక…

సీత అయోధ్యకు తిరిగొచ్చాక…

రామాయణం మన అందరికీ కథగా తెలుసు. రామాయణంలో పాత్రలన్నిటినీ దేవుళ్లుగా కాకుండా మానవ కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ప్రముఖ రచయిత్రి వాయు నాయుడు చేసిన అటువంటి ప్రయత్నమే ‘సీతాస్ ఎసెంట్’. రామాయణంలోని ముఖ్యమైన పాత్రల రాగద్వేషాలు, భావోద్వేగాలు, ఇష్టాఇష్టాలను సున్నితంగా చిత్రీకరించిన ఈ నవలలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు.. 

(14 ఏళ్ల వనవాసం తర్వాత రావణ సంహారం జరిగి సీత అయోధ్యకు తిరిగి వస్తుంది. చెల్లి ఊర్మిళతో గతంలో మాదిరిగానే సన్నిహితంగా ఉంటుంది..)
14 సంవత్సరాల తర్వాత కలిసిన సీత, ఊర్మిళల మధ్య ఎటువంటి అమరికలు లేవు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగిన సాన్నిహిత్యం మళ్లీ వచ్చేసింది. సీత గర్భవతి కావటంతో- ఆమెకు కావాల్సిన ఆహారపదార్థాలన్నీ ఊర్మిళ వండించిపెడుతోంది. అయోధ్యలో గర్భిణులు కోరుకునేవాటికి- సీత కోరికలకు పొంతనే లేదు. ఒక రోజు సీత స్నానం చేసే ముందు నూనెతో తల మర్దనా చేయించుకోవటానికి జుట్టును విప్పుకుంటోంది.

ఆ సమయంలో సీత కోసం ఊర్మిళ ఒక గిన్నెలో నానపెట్టిన బాదం పప్పులను తీసుకువచ్చింది. సీత కడుపు కేసి చూసి- ‘నీకు పుట్టబోయే బిడ్డ విదేశీయుడిలా ఉంటాడనిపిస్తోంది’ అంది ఊర్మిళ. సీత తలెత్తి చూసింది. తాను అన్నమాటల్లో తప్పుడు అర్థం ధ్వనిస్తోందనే విషయం ఊర్మిళ వెంటనే గ్రహించింది. పొరపాటు జరిగిందన్నట్లుగా నాలుక కరుచుకుంది.

‘సీతా.. నా ఉద్దేశం అది కాదు…’ అని వివరణ ఇవ్వబోయింది. సీత ఫక్కున నవ్వింది. ‘నాకు తెలుసు..నీ మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం లేదని..’ అంది. ఊర్మిళ ఊపిరి పీల్చుకుంది. ‘మన మిథిలానగరంలో పుట్టే పిల్లలు ఎలా ఉంటారో.. నీ పిల్లలు కూడా అలా ఉంటారనేది నా ఉద్దేశం..’ అని ఊర్మిళ వివరణ ఇచ్చింది. అలా మాట్లాడుతూనే సీత తల మీద వెచ్చని నూనె పోసి మర్దనా చేయటం మొదలుపెట్టింది.

‘ఊర్మీ..కాలం గాయాలను ఎలా మాన్పుతుందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.. విదేశీయతను నేనింత తేలిగ్గా తీసుకుని నవ్వగలనని ఎప్పుడూ అనుకోలేదు. నేను అయోధ్యకు తిరిగి రావాలని కొందరు కోరుకున్నారు. మరి కొందరు నేను రావణుడి వశమయ్యానా? లేదా అని వెంటనే పరీక్షలు పెట్టారు..’ అంది సీత సాలోచనగా. ‘మనం జాగ్రత్తగా ఉండాలి సీత. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా, మనం ఇంకా అయోధ్యలో విదేశీయులమే..’ అంది ఊర్మిళ.

తమ మాటలు ఎవరూ వినటం లేదు కదా అన్నట్లు ఒకసారి తలుపు వంక చూసింది. మరణం తర్వాత కూడా రావణుడు వారిని వెంటాడుతూనే ఉన్నాడు. “పెళ్లయ్యాక ఆడవాళ్లందరూ భర్త తాలూకూ మనుషులే అయిపోతారనుకో” అంది తనే మళ్ళీ. ‘మన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో ఊర్మి! మిథిల నుంచి వచ్చినప్పుడు మనమేమీ అనాథలం కాదు. మన భర్తలే మనను వెతుక్కుంటూ వచ్చారు’ అంది సీత. ‘నిజానికి వారు మనని వెతుక్కుంటూ రాలేదు. నాన్న మన స్వయంవరాన్ని ప్రకటించారు. అందరిలాగానే వీరు వచ్చారు’ అంది ఊర్మిళ. సీత తలెత్తి ఊర్మిళ కేసి చూసింది.

‘దండకారణ్యంలో శాంతిని నెలకొల్పటానికి రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకువచ్చిన మాట నిజమే. అయినా ఎవరికి ఏం రాసి ఉందో ఎలా తెలుస్తుంది చెప్పు.. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే మన ఆలోచనా విధానం మారాలి. మన భర్తల కుటుంబాలలో మనం కలవలేదు. మనమే వారిని కలుపుకున్నాం..’ అంది సీత. ఆ మాటలు విని ఊర్మిళ సీత నుదుటిపై ముద్దు పెట్టింది. ‘ఆ ఆలోచనలను చెరిగిపోనివ్వకు. నీ కడుపులో బిడ్డ కూడా ఆ మాటలు విని, పెద్దయిన తర్వాత వాటినే ఆచరించాలి..’ అంది ఊర్మిళ.

ఊ ఊ ఊ
(ఊర్మిళతో లక్ష్మణుడు సన్నిహితంగా ఉండలేకపోవటానికి అనేక కారణాలున్నాయి.. వీటిని రచయిత్రి ఈ విధంగా వివరిస్తున్నారు) లక్ష్మణుడి జుట్టు తమ్మెల దగ్గర నెరిసింది. జట్టు నెరవటమే కాదు అడవులకు వెళ్లకముందు ఉండే కోపం కూడా ఇప్పుడు అతనిలో లేదు. పెళ్లి అయిన వెంటనే లక్ష్మణుడు ఊర్మిళను వదిలి అడవులకు వెళ్లిపోవాల్సి వచ్చింది. 14 ఏళ్లు దూరంగా ఉన్నాడు. వచ్చిన వెంటనే రాజ్యానికి సంబంధించిన బాధ్యతలు. వీటన్నింటితో సతమతమవుతున్న లక్ష్మణుడు పడక గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఊర్మిళ ఒక గ్లాసులో మజ్జిగను తీసుకొని గది లోపలికి వచ్చింది.

లక్ష్మణుడు ఆమె వచ్చిన విషయాన్ని పట్టించుకోలేదు. ఆమె వచ్చి లక్ష్మణుడి భుజంపై చేయి వేసింది. లక్ష్మణుడు ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో దైన్యం కనిపించింది. ‘ఇంకొద్ది కాలం పడుతుంది.. ఊర్మీ’ అన్నాడు. ఊర్మిళ మజ్జిగ గ్లాసును కింద పెట్టింది. లక్ష్మణుడి పక్కనే కూర్చుంది. ‘ఎంతకాలమైనా పట్టనీ ప్రియా! నువ్వు తిరిగి నా దగ్గరకు రావటం కన్నా ఇంకేం అక్కర లేదు..’ అంది. ఊర్మిళ లక్ష్మణుడి నుదురును నెమ్మదిగా మర్దనా చేయటం మొదలుపెట్టింది.

లక్ష్మణుడిని దగ్గరగా లాక్కుంది. ‘అవును. సమయం పడుతుంది. 14 ఏళ్లు నీకు అడవి తప్ప మరేం తెలియదు. నువ్వు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అడవిలో సీతారాములు ఒకరికొకరు ఉన్నారు. నేను నీ కోసం ఎంత తపించానో తెలుసా? ఇప్పటికి కూడా నువ్వు నా దగ్గరగా ఉన్నావని.. నిన్ను నేను దగ్గరగా తీసుకోగలుగుతున్నాననే నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ‘ అని ఊర్మిళ అతని చెవిలో గుసగుసలాడింది.

లక్ష్మణుడి కళ్ల నుంచి నీళ్లు బొటబొట రాలటం మొదలుపెట్టాయి. స్త్రీ సాన్నిహిత్యం అతనికి ఇంకా కొత్తగానే ఉంది. అయోధ్యకు తిరిగి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మణుడికి ప్రతి రోజు తలనెప్పి వస్తోంది. వనవాసం, ఆ తర్వాత రావణుడితో యుద్ధం- ఆ సమయంలో రాముడి భద్రత తప్పితే మరే విషయాన్ని అతను ఆలోచించలేదు. తన గురించి పూర్తిగా మర్చిపోయాడు. పట్టణ జీవితానికి, ఊర్మిళతో సాన్నిహిత్యానికి ఇంకా అతను అలవాటు పడలేకపోతున్నాడు. 14 ఏళ్ల బ్రహ్మచర్యం అతనిని ఊర్మిళకు దూరం చేసింది. తన కోసం ఎవరో వేచి చూస్తున్నారనే భావన అతనిని మళ్లీ మామూలు జీవితానికి దగ్గరగా తీసుకువస్తోంది. ఆమె కూడా తనలో ఒక భాగమనే భావన చాలా ముఖ్యమనే విషయం అతనికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కాని ఆ భావనే కొత్తగా ఉంది. భర్త పాత్రలో ఇంకా అతను ఇమడలేకపోతున్నారు.

తనకూ ఒక భార్య ఉందని, ఆమె కోసం తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయనే విషయాన్ని అతను ఇంకా అంగీకరించలేకపోతున్నాడు. తనకు కోపం రావటం లేదనే ఆలోచన వచ్చినప్పుడు అతనికి చాలా చిత్రంగా అనిపించింది. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం లక్ష్మణుడి వ్యక్తిత్వంలో ఒక భాగంగా ఉండేది. తన వ్యక్తిత్వం మారిపోయిందనే భావనే అతనికి చిత్రంగా అనిపించింది. లక్ష్మణుడి మనసులో జరుగుతున్న సంఘర్షణను ఊర్మిళ గ్రహించింది. రాముడికి సోదరుడిగా, రాజ్యానికి సలహాదారుగా- లక్ష్మణుడు రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఈ పాత్రలు అతనిని ఒక వ్యక్తిగా నిలబెట్టడానికి దోహదపడుతున్నాయి. అదే సమయంలో అతనిలో తీవ్రమైన సంఘర్షణను కూడా రేకెత్తిస్తున్నాయి.

“ఊర్మిళ ఒక గ్లాసులో మజ్జిగను తీసుకొని గది లోపలికి వచ్చింది. లక్ష్మణుడు ఆమె వచ్చిన విషయాన్ని పట్టించుకోలేదు. ఆమె వచ్చి లక్ష్మణుడి భుజంపై చేయి వేసింది. లక్ష్మణుడు ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో దైన్యం కనిపించింది. ‘ఇంకొద్ది కాలం పడుతుంది.. ఊర్మీ’ అన్నాడు. ఊర్మిళ మజ్జిగ గ్లాసును కింద పెట్టింది. లక్ష్మణుడి పక్కనే కూర్చుంది. ‘ఎంతకాలమైనా పట్టనీ ప్రియా! నువ్వు తిరిగి నా దగ్గరకు రావటం కన్నా ఇంకేం అక్కర లేదు..’ అంది. ఊర్మిళ లక్ష్మణుడి నుదురును నెమ్మదిగా మర్దనా చేయటం మొదలుపెట్టింది.

లక్ష్మణుడిని దగ్గరగా లాక్కుంది. ‘అవును. సమయం పడుతుంది. 14 ఏళ్లు నీకు అడవి తప్ప మరేం తెలియదు. నువ్వు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అడవిలో సీతారాములు ఒకరికొకరు ఉన్నారు. నేను నీ కోసం ఎంత తపించానో తెలుసా? ఇప్పటికి కూడా నువ్వు నా దగ్గరగా ఉన్నావని.. నిన్ను నేను దగ్గరగా తీసుకోగలుగుతున్నాననే నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ‘ అని ఊర్మిళ అతని చెవిలో గుసగుసలాడింది.”

ఆదికావ్యం రామాయణాన్ని వేలాదిమంది రచయితలు రకరకాల కోణాల నుంచి విశ్లేషిస్తూ వచ్చారు. తెలుగులోనే దాదాపు ఐదు వేల మంది రచయితలు రామాయణాన్ని రాసారంటే ఈ కావ్యానికి ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరో ఇద్దరు కూడా ఈ ప్రయత్నం చేసారు(ఒకరు కన్నడంలో, ఒకరు ఇంగ్లీషులో).

రామాయణం కాలం నాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులను లక్ష్మణుడి కోణం నుంచి ఆవిష్కరించే ప్రయత్నం కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చేస్తే.. రామాయణంలోని ముఖ్యపాత్రల మనో విశ్లేషణ చేయటానికి వాయు నాయుడు ప్రయత్నించారు. రామాయణాన్ని పురాణ, తాత్విక దృష్టిలో కాకుండా సామాజిక కోణం నుంచి చూడటానికి ప్రయత్నించిన ఈ రచనలలోని ఆసక్తికరమైన భాగాలు మీకు అందిస్తున్నాం..

రాముడికి గనికార్మికుల మొర

రామాయణాన్ని లక్ష్మణుడి దృష్టి కోణం నుంచి ఆవిష్కరించిన కావ్యం రామాయణ మహాన్వేషణం. కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు వీరప్ప మొయిలీ రాసిన ఈ కావ్యం తెలుగు అనువాదం ఇటీవలే హైదరాబాద్‌లో ఆవిష్కరింపబడింది. దాదాపు 50 వేల గేయకవితలు ఉన్న ఈ కావ్యం రామాయణం కాలంనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ సమయంలో కార్మిక , పాలక వర్గాలకు జరిగిన ఘర్షణలను కూడా ప్రస్తావిస్తుంది. అందులోని ఒక ఆసక్తికరమైన భాగం..

“ఎటనుండియో ఏతెంచిన
మాండకర్ణియు మునివరుడును సాధకుడునగు
కార్మికుల కష్టనష్టముల గని కనికరించె
వానర ఋక్షనిషాద శబరవర్గపు స్త్రీ
పురుషులు బాలురు వృద్ధ రోగులెల్ల
గనులలో నలిగిరి. అహోరాత్రములు సంపాదనయందు
కాయకష్టము చేసి బంధనమున చిక్కి
పనిదుర్భరమై ప్రతిఫలమల్పమయ్యె
భద్రతా సాధనములు లేక అపుడపుడు
భీకరదుర్ఘటనల సంభవించి కార్మికులు
కాలపీడితులైన అడుగువారలెవరు లేరు.

దైన్యమున దాస్యమున
అత్యాచారము నోర్చుచు, దెబ్బలతినుచు
అన్యమార్గము కనలేక శరణులైరి!
మాండకర్ణయు శ్రేష్ఠగురువై రక్షకుడై
హెచ్చరించె. కార్మికుల పిల్లలకు అక్షరముల
నేర్పించె. ఏకమై దౌష్ట్యమును ప్రతిఘటించుడని
ఉపదేశమిచ్చె, హక్కు స్వాతంత్య్రముల తెలియజెప్పి.

మాండకర్ణియు వారి ఆరాధ్య దైవమయ్యె
మాండకర్ణి వాక్కు వేదవాక్కయ్యె
మాండకర్ణి యుపదేశము అమృత సమానమయ్యె
మాండకర్ణి నామము మంత్రసమమయ్యుండ
మాండకర్ణియు వారి కులపతియయ్యె!

ఇటుల సాగుచుండ
ధరణి వడకెనొకమారు నెరియ క్రుంగె నొకమారు
గనిలోన శ్రమించు ద్విసహస్ర కార్మికులు
పాతాళగర్భమున సజీవ సమాధియై యుండిరి
అబలల వేదనల చూచువారల ప్రేగులు కదలె
కార్మికులు చెలరేగిరి పరిహారమర్థించిరి
అగ్నిమిత్రుని పాలన డోలాయమానమయ్యె.

అన్యమార్గము కానక
అగ్నిమిత్రుడు మాండకర్ణిపై సమ్మోహనము
విసరె. నయవినయ దైన్యమున
గౌరవమున సత్కరించి కానుకనిచ్చె
కార్మికులు సంతసించుడని వేడె
దూరదేశమునకు వారిని యాత్రగా గొనిపోయి
దివారాత్రములు వారి పాదసేవయందె మునిగెస
పంచాసరమనెడి నగరిలో ప్రత్యేక
భవనమును నిర్మించి ‘గురువ మీకర్పితము’ అని నుడివె.

భోగోల్లాసముల రుచియేమి, చవియేమి
అప్సరసలనుబోలు అంగనల సొగసేమి
ధనకనక వస్తు వాహనములు
మాండకర్ణి భోగసేవా సంభ్రమమేమి
విషయసుఖ సాగరమున మైమరచి మునిగె.

గుడిసెలందు అబలల
కన్నీరు గార్చిరి. ఆకలితో పసిగందులు
అలమటించిరి. ఆకసముకంటె ఆర్తరోదనము
కార్మికుల నాయకుల పాదములకు సంకెలల తొడగించి
వారిని గడిసెలందె కొట్టి గూటమునకు కట్టి
నిప్పుముట్టింప కాలి బూడిదైరి!
.. శ్రీరామయణ మహాన్వేషణము
రచయిత: ఎం. వీరప్ప మెయిలి
ప్రచురణ: ఎమెస్కో, ధర: 750
పేజీలు:1728, ప్రతులకు: సాహితి ప్రచురణలు

సీతాస్ ఎసెంట్
రచయిత్రి: వాయునాయుడు
ప్రచురణ: పెంగ్విన్,
ధర: రూ. 299,
పేజీలు: 185
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలోను లభిస్తుంది

Posted in సేకరణలు | Tagged | 1 Comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –10 చివరి రోజులు

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –10

                                  చివరి రోజులు

  నెపోలియన్ భూతం వదిలింది .పాపం సర్వ స్వతంత్ర నియంత జైలు పాలై ఒంటరిగా ఒక ద్వీపం లో ప్రవాస జీవితం అను భవిస్తున్నాడు .యుద్ధం భయం పోయినా ప్రయాణాలకు అనుమతులు ,రిజిస్ట్రేషన్లు సీక్రెట్ సర్విస్  వ్యవస్థ గూఢ చారులతో జనం బాధ పడుతూనే ఉన్నారు .రాజకీయం అంటే ఇష్టపడే బీథోవెన్ కు ఇదేమీ రుచించలేదు .అప్పటి నుండి అయిదేళ్ళు సృజన పండించ లేక పోయాడు .రెండు సెల్లో సోనాటాలు ,op112 ,the song cycle Andie Ferne Galiefbite ,(to the distant beloved )చేశాడు .లోబోనోస్కి యువరాజు కుఅంకితం  ఇచ్చిన చివరి పియానో సొనాట A ,op101 లు మాత్రమె చేయ గలిగాడు .అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్లు చేశాడు .అందులో March of the Vianna Artilary  ఒకటి .కొన్ని స్కాటిష్ ఫాల్క్ సాంగ్ సెట్టింగ్స్ చేశాడు .పుస్తకాల అమ్మకం పై డబ్బు బానే వస్తోంది .కాని చేతిలో డబ్బు నిలవ ఉండటం లేదు .

               తమ్ముడు కాస్పర్ కారల్ చని పోతు తన ఆస్తికి ,కొడుక్కి  అన్న బీథోవెన్ ను గార్డియన్ గా చేశాడు .భార్య దోహన్నో వద్ద పిల్లాడు ఉండేట్లు విల్ రాశాడు ఆమె అంటే బీథోవెన్ కు పడేది కాదు .పిల్లాడు చేడిపోతాడని భావించాడు .కోర్టుకు వెళ్ళి అతడిని స్వాధీనం చేసుకొనే ఆర్డర్ పొందాడు .అతని తల్లి ఇతని నుంచి వేరు చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది .ఇలా న్యాయ పోరాటం లో కొంత మానసిక స్తైర్యం దెబ్బతింది .1818 లో ‘’స్టోన్ డేఫ్’’అంటే ‘’పుట్ట చెవిటి’’ వాడయ్యాడు బీథోవెన్ .అప్పటిదాకా శబ్దాలను ‘’యియర్ ట్రంపెట్ ‘’తో వినే వాడు .ఇప్పుడు అదీ వీలు కావటం లేదు అందుకని ‘’convesational books ‘’లో రాస్తున్నాడు కొత్త పబ్లిషర్ కొరుకుడు పడటం లేదు .కొంత మాయ కూడా చేశాడీయన .పాత వాటినే కొత్తవి అని నమ్మించి ఇతర పబ్లిషర్ల కిచ్చి ప్రింట్ చేయించి వదిలాడు .

1817     లో లండన్ లోని phil harmonic society వారు బీథోవెన్ ను ఆహ్వానించారు .దీనికోసం రెండు కొత్త సిమ్ఫనీలు రాయాలి .ఇష్ట  పడలేదీయన .తానే స్వయం గా రెండు కొత్త పియానో సోనాటాలు రాశాడు .ఇంతకు ముందు రాసిన వాటికంటే పెద్దవి .ఇందులో ఒకటైన Hammer Klavier ను ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ కు అంకిత మిచ్చాడు .చర్చి వారు రుడాల్ఫ్ ను సన్మానించే సందర్భం ఇది .సన్మాన కార్య క్రమం లో new high mass ను రాసి ప్రదర్శించే ఏర్పాటు చేశాడు .Arch Bishop of Olymutz in Czechoslovakia ‘’చేశాడు .ఈ కార్య క్రమం లో పియానో వాయిస్తూ కొత్తదారి తొక్కాడు పాత విధానాలకు స్వస్తి చెప్పాడు .తన పద్ధతిలో బీథోవెన్ ‘’A set of 33 variations ‘’పూర్తీ చేశాడు .ఇదే పియానోకు రాసిన చివరి పుస్తకం .పియానో అంటే పంచ ప్రాణాలు బీథోవెన్ కు . 

                          Diabellie Variations అన్న పుస్తక రచనా ,తమ్ముడి కొడుకు విషయమై కోర్టు కేసులు ,అనారోగ్యం వల్ల కొత్త మాస్(మిస్సా సాలెంస్ ) ను సమయానికి  రాయ లేక పోయాడు .’’in fact his finest sacred work written from the heart to the heart was not finished until Autumn of 1822 .,and was never heard completely in vienna in Beethove’s life time ‘’ అని చరిత్ర కారుల కధనం .

             అదే ఏడాది మరో మూడు పియానో సోనాటాలు opp109-111  చేశాడు .ఇంకో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించాడు .అదే‘’ninth symphony ‘.ఇదే  ‘’ode of joy ‘’అనే నాటకాన్ని షిల్లర్ అనే జర్మని కవి రాసిన దానికి సంగీతం సమ కూర్చాడు .  ఇది చేయాలని ఎన్నో ఏళ్ళ నుండి తపిస్తున్నాడు బీథోవెన్ .1815 నుంచి దీని మీద ధ్యాస ఉంచాడు .దాన్ని’’ choral symphony with voices’’  గా సృష్టించాలని ఆరాటం .ఇటువంటివి మొజార్ట్ కు స్వర పరచటం ఊపిరి పీల్చి నంత తేలిక .కాని బీథోవెన్ కు జీవన్మరణ పోరాటం .స్వరం త్వరగా తట్టదు బీథోవెన్ కి .ఎన్నో ఊహలు ఊపిరి పోసుకొంటాయి వాటి నన్నిటిని కాగితం మీద రాస్తాడు .ప్రయత్నించి ,నచ్చక వదిలేస్తాడు .చివరికేప్పుడో అసలైనది బయట పడుతుంది ..అంటే ‘’గుండె గొంతుకలోన కోట్లాడ తాది, కూసుండ నీదురా కూసింత సేపు ‘’అన్న నాయని వారి లా బాధ పడతాడు ఈ విషయాన్న బెతోవెన్‘’I carry my ideas about with me for a long time before I write them down I change a great deal ,eliminate much ,and begin again ,until I am satisfied with the result .then the working out begins in my head ,and since I knew what I want ,I hear and see the work in my mind in its entity ‘’ అని తను పడే ఆరాటాన్ని ప్రయత్నాన్ని, ఫలితాన్ని, ఆత్మ సంతృప్తిని వివరించాడు .

            బీథోవెన్ స్కెచ్ పుస్తకాలను చూస్తె ,’’’turkish music and a vocal chorus ‘’లో కొత్త సింఫనీ పూర్తీ చేయాలని భావించి నట్లు తెలుస్తుంది .అదే అప్పటికి వియన్నాలో లేటెస్ట ఫాషన్ .అంతా టర్కిష్ సంగీతం పైనే ఆధారం

24-5-1824 లో తొమ్మిదో సింఫనీ’’kantnerthor ‘’ధియేటర్ లో ప్రదర్శించాడు .దీనిలో మిస్సా సోలెం లోని బిట్లు కూడా కలిపాడు .దీన్ని బీథోవెన్ నిర్వహించలేదు .ప్రక్కన కూర్చున్నాడు అంతే .దీన్ని డైరెక్ట్ చేశాడు .ప్రదర్శన చివర్లో జనం పిచ్చ ఆనందం తో ‘’టీపోలు’’ ఊపుతూ రెచ్చి పోయి ఆనందాన్ని ,సంతృప్తిని ప్రకటించారు .అప్పటి దాకా అక్కడేమి జరుగుతోందో బీథోవెన్ కు విని పించనే లేదు .ఎవరో ఆయన్ను జనం వైపు కు తిప్పారు .మహదానంద పడి పోయాడు సింఫనీ మంత్రికుడైన ఆ స్వర సామ్రాట్ . ఇది ఆయన జీవితం లో మధురాతి మధుర మైన ఘట్టం అన్నారు అందరు

               సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-13 –ఉయ్యూరు  

                                                 

Posted in రచనలు | Tagged | Leave a comment

షహజాన్ పూర్ శ్రీ రామ చంద్ర మహా రాజ్ – 2(చివరి భాగం )

 షహజాన్ పూర్ శ్రీ రామ చంద్ర మహా రాజ్ – 2(చివరి భాగం )

   పద హారేళ్ళవయసులోనే జాన్ స్టువార్ట్ మిల్ల రాసిన ‘’యుటిలిటేరినిజం ‘’పుస్తకం చదివి అర్ధం చేసుకొన్నాడు .అందులోని విషయాలు నచ్చి తన స్వంత ఫిలాసఫీ ని తయారు చేసుకొన్నాడు రామ చంద్ర .నమ్మకం అనేది సాధనకు ముఖ్యం అని ప్రవచించాడు .పనిలో నిజాయితీ తపనా ఉండాలన్నాడు .గురువు శిష్యుడికి తన వద్ద ఉన్న జనాన్ని అంతటిని దాచుకోకుండా సోదరునికి అందించి నట్లు అందజేయాలని తెలియ జేశాడు .ఒక సారి తోటి ఉద్యోగస్తుడు అదే కులానికి చెందిన వాడే అయినా రామ చంద్ర కు పనిలో మేలకువలు నేర్పకుండా చాలా హింసించి సాధించే వాడు .ఈ విషయాన్ని మున్సిఫ్ కు చెప్పి రాజీనామా చేస్తానన్నాడు .వద్దని వారించి ,ఆయనే మెళకువలు నేర్పాడు .రామ చంద్ర కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మరణించటం ప్రారంభించారు రామచంద్ర తనకుమారుడికి అక్కడే ఉద్యోగం ఇప్పించుకొన్నాడు .అతనూ మరణించి తీవ్ర దుఖాన్ని కలిగించాడు .sri ramachandra's photo

          ఈ ఆందోళనలతో ,కోర్టు ఉద్యోగం లో బిజీ గా ఉన్నా   ధ్యానాన్ని, యోగాన్ని మాత్రం వదలలేదు .సాధనలో ఉన్నప్పుడు అంతటా కాంతిని దర్శించే వాడు .మరో ఆరు నెలలకు హృదయం లో ఓంకారం విని పించింది .ఇదే ‘’అజపా ‘’.ఇదంతా తన గురువు అనుగ్రహం అని భావించాడు .గురువు పట్ల పూర్తీ విశ్వాసం ఉంటె ఆయన ఎక్కడ ఉన్నా ఇష్టసిద్ధి కల్గిస్తాడనితెలుసుకొన్నాడు.రామ చంద్ర పేకాట ఆడే వాడు .ఇది తన ధ్యానానికి ఇబ్బంది కలిగిస్తుందని గురువు చెప్పగానే మానేశాడు .అజపా జపాన్ని నిర్విఘ్నం గా కోన సాగించాడు .1924 లో ఒక గొప్ప వింత అనుభవం కలిగింది .సకల చరా చర సృష్టిలో అనిర్వచనీయమైన సర్వ వ్యాపక శక్తి ఉందని తెలి సింది ..పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆ దివ్య తేజస్సు ను దర్శించాడు .పగలు కూడా దృగ్గోచర మయ్యేది .ఇది ఇలా ఉండగా భార్య తెంపరితనం ఇంకా బాధిస్తూనే ఉంది .తట్టుకోలేక గురువుకు చెప్పుకొన్నాడు .క్రోధాన్ని నియంత్రిన్చుకోమని గురువు సలహా ఇచ్చాడు .

           ధ్యానానికి ప్రశాంతత కావాలి .గురువు పర్య వేక్షణ లో ధ్యానం కొనసాగించాడు .కంఠచక్రం వద్దకు ఆలోచన రాగానే కల వస్తున్నట్లు గమనించాడు .ఈకలు పగలు కూడా వస్తున్నాయి .అవదూతలకు ఇది సహజమే ..ఆయన 1928  ఏప్రిల్ లో పిండాడం లో బ్రహ్మాండ దర్సనం చేశారు . 1931 ఆగస్ట్ పది హీనున ఆయనకు లోపలా బయట గురువు అనుగ్రహం వల్ల అద్భుత కాంతి గోచరించింది ఆగస్ట్ 14 న గురు బ్రహ్మ మహాసమాధి చెందారు .అంటే గురువు శిష్యునిలో ఐక్యమై పోయి నట్లు .1932 అక్టోబర్ పన్నెండు న గురువు కలో కన్పించి మార్గ దర్శనం చేశారు .రెండు సార్లు పెద్ద శక్తి పాతాన్ని పొందారు రామ చంద్ర .తండ్రి మరణం తర్వాతా బాబాయి ఎస్టేట్ ను కుటిలోపాయాలతో ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు .ఈయనా తమ్ముడు వ్యతి రేకించారు .వీలైనప్పుడల్లా రామచంద్రకు ఆయన ద్రోహం చేస్తూనే ఉన్నాడు చని పోయేదాకా .ఎన్ని ఆటంకాలు ఎదురైనా కోర్టుకు ఈడ్చే ప్రయత్నం బాబాయి చేసినా ,అన్నిటినీ తట్టుకొని ,ఆత్మ స్తైర్యం తో ,ధ్యానానికి, సహనానికి భంగం కలుగ కుండా తన శాంత మార్గం లో సాగిపోయారు రామచంద్ర గురు .

          1944 ఏప్రిల్ లో గురువును తనకు దివ్య మార్గాన్ని దర్శింప జేయ మని  వేడుకొన్నారు శ్రీ రామ చంద్ర మహా రాజ్ .గురువు అనుగ్రహించారు .రామ చంద్ర శ్రీ కృష్ణుని తనకు అర్జునికి చూపించి నట్లే విశ్వ రూప దర్శనాన్ని అనుగ్రహించ మని కోరారు .1914 లో తనలో ఒక శూన్యం ఏర్పడిందని సకల విశ్వం తనలో ఇమిడి పోతున్న ఒక దివ్య అను భూతి కలిగింది .తనది అవతారం కాని అవతారం అని భావించాడు .ఆయనను అందరు రుషి గా భావించారు భారత సేవక సమాజ్ వారు ఆయన్ను గొప్ప మహాత్ముడిగా అభి వర్ణించారు .గృహస్త జీవితం సవ్యం గానే సాగి పోతోంది భార్య భగవతి  మరణిం చతమే మే కాక మగపిల్లలిద్దరు చనిపోయారు అన్నిటిని దిగ మింగి తన ధ్యానాన్ని కోన సాగిస్తూనే ఉన్నారు .

             1945 మార్చి 31 న ‘’శ్రీ రామ చంద్ర మిషన్ ‘’ను గురువు గారి గౌరవార్ధం ఏర్పాటు చేశారు రామ చంద్ర .రాజయోగాన్ని అనేక మార్పులు చేసి కొత్త విధా నాన్ని లోకం లో ప్రచారం చేశారు .’’దశాదేశములు ‘’(టెన్ కమాండ్ మెంట్స్ )ను ప్రవచించి వ్యాప్తిలోకి తెచ్చారు .రామ చంద్ర గారి దేవుడికి ఆకారం, పేరు,మెదడు,మనసు  ఉండవు .దేశం లోని మారు మూల ప్రాంతాలతో సహా దేశమంతా పర్య టించారు .ఇది భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశం అన్నారు .1974 లో శి ష్యుల కోరిక పై ఆత్మకధ రాశారు .అనేక గ్రంధాలను రచించి తన భావాలను నిక్షిప్తం చేశారు .దేశం లోని అనేక మంది విద్యా వేత్తలు మేధావులు శ్రీ రామ చంద్ర ను కలిసి అనుభూతి ని పొంది శిష్యులై వారి భావ వ్యాప్తికి తోడ్పడ్డారు .1965 లో సహజ మార్గ రిసెర్చ్ సెంటర్ ఏర్పడింది .దీనికి శ్రీ కే.సి.వి.వరదా చారి డైరెక్టర్ గా వ్యవహరించారు .తాను భౌతికం గా లేక పోయినా అందరికి మార్గ దర్శనం చేస్తానని ఆయన శిష్యులకు చెప్పారు .1983  ఏప్రిల్ 19 న ఎనభై నాలుగవ ఏట శ్రీ రామ చంద్ర జీ మహా రాజ్  మహా సమాధి చెందారు .ఆయన స్తాపించిన శ్రీ రామ చంద్ర మిషన్ దేశ వ్యాప్తం గా అనేక హాస్పిటల్స్ ను విద్యాలయాలయాలను ,సేవా సంస్థలను నిర్వహిస్తూ ప్రజలకు అతి చేరువ అయింది .ఎక్కడ సంకల్ప బలం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని వీరి చరిత్ర తెలియ జేస్తోంది .

                సంపూర్ణం

                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-1-13 ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -9

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -9

           1812 లో బీథోవెన్ కు మరిన్ని సంస్యలోచ్చి మీద పడ్డాయి .నెపోలియన్ రష్యా మీద దండ యాత్రకు వెళ్ళి దారుణం గా ఒడి పోయాడు అదే వాటర్ లూ యుద్ధం .తెప్లిజ్ ను వదిలి బీథోవెన్ లేన్జ్ కు చేరాడు .అక్కడ తమ్ముడు జోహాన్ అన్న చెప్పినా విన కుండా ఒకమ్మాయిని పెళ్ళాడాడు .ఆమె ఒక కొడుకును కని చని పోయింది .ఆమె తల్లి దగ్గర పిల్లాడిని ఉంచటం బీథోవెన్ కు ఇష్టం లేదు ..దీని పై న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది .డిప్రెషన్ కు లోనై  హత్యా ప్రయత్నమూ చేశాడు .అప్పటికే వియన్నా జీవితం దుర్భరమైనది .డబ్బు విలువ పడి పోయింది .రాబడీ పెద్దగా లేదు .ప్రిన్స్ కిన్స్లీ ప్రమాదం లో మరణించాడు .ఒక్క రుడాల్ఫ్ మాత్రమె నమ్మక మైన సపోర్టర్ గా మిగిలాడు .కాస్పర్ కారల్ అనే తమ్ముడూ అన్న అభిమతానికి వ్యతి రేకం గా ఒకమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు ..అతను అకస్మాత్తుగా చని పోయాడు .కొదుకును ,ఆస్తినీ బీథోవెన్ కు అప్పగించాడువాడు చెప్పిన మాట .వినే ఘటం కాదు .పెదనాన్న బీథోవెన్ ను చాలా ఇబ్బందులు పెట్టాడు .అయినా బీథోవెన్ అతన్ని అధిక ప్రేమతో చూసుకోన్నాడు.

            1813 జూన్ ఇరవై ఒకటిన ‘’బాటిల్ ఆఫ్ విట్తోరియా ‘’లో స్పెయిన్ దేశానికి చెందినవెల్లింగ్టన్ నేపోలియన్ను ఓడించాడు .ఆ ఉత్సాహ సంరంభం కోసం బీథోవెన్ ‘’బాటిల్ ‘’అనే సింఫనీ ని కూర్చాడు .దీన్ని డిసెంబర్ లో వియన్నా యూని వేర్సిటి లో ‘’న్యూ సెవెంత్ సింఫనీ ‘’గా ప్రదర్శించాడు .జనం పరవశించి ఆనంద తాండవమేచేశారు . నాలుగు వేల ఫ్రాంకులు వచ్చాయి .ఉత్సాహ పడ్డాడు .ఆ డబ్బును యుద్ధం లో గాయ పడ్డ ఆస్ట్రియ సైన్యానికి విరాళం గా ఇచ్చి తన దేశ భక్తిని చాటుడు .

               దీని తర్వాత ఎనిమిదవ సింఫనీ ఫిబ్రవరిలో చేశాడు .ఏడవ దానికి అంతగా పేరు రాలేదు 1814 ఏప్రిల్ లో మళ్ళీ పియానిస్ట్ గా స్టేజి ఎక్కాడు .ఆర్చ్ డ్యూక్ కోసరం .అది దారుణం గా విఫల మైంది .’’piano was badly out of tune ‘’అని పించింది .చెవుడు విపరీతమవ్వటం వల్ల బీథోవెన్ తాను వాయిన్చిన్దేమితో తానే  వినలేక పోయాడు .అది తీగలు తెగెట్లు ఉంది.జనం జేజేలు పలికారు .

తన ఫిడేలియో ను  సంస్కరించ మని .కోరారు .అలానే చేస్తే  విజయ దుందుభిని మోగించింది’’it is now considered one of the finest operas ever written ‘’  అని పేరొంది అజరామరమైన కీర్తి సాధించి పెట్టింది .

                1814 లో వియన్నా లో గ్రేట్ కాంగ్రెస్ జరిగింది .దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు .అంతా హంగామా గా ఉంది వాతా వరణం .లక్ష మంది సందర్శకులు వస్తారని అంచనా .అనేక మంది కవులు ,కళా కారులు ,రచయితలు రాజ కీయ ప్రముఖులు పాల్గొనే సమ్మేళనం అది .రష్యా సామ్రాజ్నికి బీథోవెన్ polanaisse  ను అంకిత మివ్వటం తో కార్య క్రమాలు రంగ రంగ వైభవం గా ముగుస్తాయి .తమ వియన్నా కు చెందిన మహోత్కృష్ట సంగీత స్రష్ట బీథోవెన్ ను వారందరికి పరిచయం చేసి ధన్యమవాలని వియన్నా ఆకాంక్షించింది .

                 సశేషం

                   మీ–బ్బిట దుర్గా ప్రసాద్ –30-1-13-ఉయ్యూరు 

 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

94ఏళ్ళ వయో,సంగీత జ్ఞాన వృద్దు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు విజయవాడలో నిన్న గడిపిన మధుర క్షణాలు

94 yella rajanikantha rao

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1920 – లో మహాత్మా గాంధీ ఉయ్యూరు రాక – ఆనాటి వార్తల్లో

Dasu Vamana Rao on Gandhi 1 10 1929 1Rmahatma-gandhimahatma gandhi vuyyuru-001RMahatma_Gandhi_in_Type_by_Dencii copyMahatma Kummamuru Vuyyuru 13 4 1929 RMahatma Kummamuru Vuyyuru 13 4 1929 R

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాత్మునితో మరపురాని క్షణాలు – ఎస్.వి. పంతులు

మహాత్మునితో మరపురాని క్షణాలు
– ఎస్.వి. పంతులు

 

గాంధీజీ మన మధ్యనుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఆయన ఉపదేశాల ఉపయుక్తత నేటికీ ఉంది; ఎప్పటికీ ఉంటుంది. వివిధ విచ్ఛిన్న ధోరణులతో అతలాకులతమవుతోన్న నేటి సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే మహాత్ముని బోధనలను పాటించడమే ఉత్తమోత్తమ మార్గం. 

గుంటూరు అరండల్ పేట్‌లోని మునిసిపాలిటీ వారి రేడియో కేంద్రం వద్ద ఆనాడు ఎన్నడూలేని విధంగా జనం గుమిగూడారు. తాజా సమాచారాన్ని వెన్వెంటనే తెలుసుకోవడానికి ఏకైక సాధనం రేడియోనే. అందరి ముఖాల్లోనూ విషాదం. కొంతమంది వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారన్న వార్త అందరినీ దిగ్భ్రా ంతి పరిచింది. ప్రార్థనా సమావేశానికి వెళతున్న మహాత్ముడిపై నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి చాలా సమీపం నుంచి కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే మరణించారు. మహాత్ముడు ఇటువంటి విషాదాంతానికి లోనుకావడాన్ని ఎవరూ విశ్వసించలేకపోయారు. అయితే అది కఠోర వాస్తవం. మరి నా మనఃస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మహాత్ముడితో నేను గడిపిన క్షణాలు నా మనస్సులో ఇంకా పచ్చగా ఉన్నాయి. గాడ్సే ఘాతుకానికి గాం ధీజీ బలికావడానికి ఐదు రోజుల ముందు నేను ఆయన్ని కలుసుకున్నాను. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. మహాత్ముడిని ప్రత్యక్షంగా చూడాలన్న నా చిరకాల ఆకాంక్ష అలా నెరవేరింది.

విపత్కర, కీలక సమయాల్లో విశ్వసనీయమైన వార్తల కోసం అందరూ ఆధారపడేది ‘ది హిందూ’ పైనే. ఈ ప్రతిష్ఠాత్మక ఆంగ్ల దినపత్రిక అప్పట్లో గుంటూరు పట్టణంలో 15 కాపీలు మాత్రమే అమ్ముడుపోయేది. పొరుగు పట్టణమైన తెనాలిలో ఆ దినపత్రిక సర్క్యులేషన్ ఆరు కాపీలు మాత్రమే. ‘మన జీవితాల నుంచి ఒక జ్యోతి నిష్క్రమించింది’ అంటూ మహాత్ముని మరణ వార్తను జవహర్‌లాల్ నెహ్రూ ప్రపంచానికి తెలియజేశారు.

మహాత్మా గాంధీ ఆశించిన స్వరాజ్యం సాధనకు నెహ్రూ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందా అనే విషయమై అప్పటికే దేశ ప్రజల్లో విస్తృతంగా చర్చ ప్రారంభమయింది. వలసపాలన నుంచి స్వాతంత్య్రం సాధించాలనే లక్ష్య పూర్తిని సాధించినందున కాంగ్రెస్ పార్టీ పేరును మార్చివేయాలని పలువురు డిమాండ్ చేయసాగారు. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ అప్పటికే సూచించారు. హత్య కావడానికి 24 గంటల ముందు అంటే 1948 జనవరి 29న చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. అప్పటికి నేను ఇంకా చిరుప్రాయంలోనే ఉన్నప్పటికీ స్వాతంత్య్రానంతర భారతదేశ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

మా కుటుంబ రాజకీయ నేపథ్యం ఆనాటి ఉద్దండ రాజకీయవేత్తలతో సాంగత్యానికి నాకు అవకాశం కల్పించింది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం, ఉపదేశాలను అర్థం చేసుకోవడంపై నేను చాలా శ్రద్ధ చూపాను. నేను స్వయంగా చూసిన గాంధీ, నేను ఊహించుకున్న దానికి, ఆయన గురించి నేను చదివిన దానికి కొంచెం భిన్నంగా కన్పించారు. నేను కలిసిన రోజు ఆయన ఏమంత సంతోషంగా ఉన్నట్టు నాకు కన్పించలేదు. ఆచార్య ఎన్.జి.రంగా నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వెళ్ళిన పదిమంది ప్రతినిధుల బృందంలో నేనూ ఒక సభ్యుణ్ణి. అందరిలోనూ నేనే చిన్న వాడిని. గాంధీజీతో ఆనాటి సమావేశం వివరాలను గుర్తుచేయడానికి మిగిలి ఉన్నది నేను ఒక్కణ్ణి మాత్రమే.

న్యూఢిల్లీలో చోటుచేసుకొంటున్న పరిణామాలను నేను చాలా సన్నిహితంగా పరిశీలించ సాగాను. మెట్రిక్యులేషన్ పరీక్షలకు హాజరుకావడానికి నాకు వయస్సు సరిపోనందున ఒక ఏడాది కాలంపాటు నా చదువుకు విరామం లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను చాలా ప్రదేశాలను సందర్శించాను. స్వతంత్ర భారతదేశ ఆవిర్భావానికి కృషిచేసిన పలువురు రాజకీయ నాయకులను కలుసుకున్నాను. వివిధ ఉద్యమాలను అధ్యయనం చేశాను.

ఆ రోజుల్లో (1948లో) గుంటూరు నుంచి న్యూఢిల్లీకి 36 గంటల రైలు ప్రయాణానికి చార్జీ కేవలం 32 రూపాయలు మాత్రమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి నేను చేసిన ప్రయాణం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకమున్నది. మరచిపోలేని ప్రయాణమది. ఆంధ్ర పీసీసీ ప్రతినిధులబృందంలో గౌతు లచ్చన్న వంటి పెద్దలు ఉన్నారు. జనవరి 25 ఉదయం 11 గంటలకు మహాత్ముడితో సమావేశమవ్వడానికి మాకు అనుమతి లభించింది.

నిజానికి గాంధీజీతో సమావేశానికి తొమ్మిది మంది సభ్యులకు మాత్రమే అనుమతి లభించింది. నేను అదనపు వ్యక్తిని. గాంధీజీని ప్రత్యక్షంగా చూడాలన్న నా ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని నాకు కూడా అనుమతిచ్చారు. గాంధీజీ అప్పుడు బిర్లా హౌజ్ (ఆయన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి.బిర్లా గృహమది)లో బస చేస్తున్నారు. ప్రతిరోజూ ఆయన ప్రార్థనా సమావేశాల్లో పసిపాపల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు ఎందరో పాల్గొనే వారు. తనను చూడడానికి వచ్చిన వారి పట్ల గౌరవంతో ముకుళిత హస్తాలతో మెల్లగా ప్రార్థనా స్థలికి గాంధీజీ నడిచి వచ్చేవారు. గాంధీజీ సదా సమయ పాలనను ఖచ్చితంగా పాటించేవారు. విదేశీ పాత్రికేయులతో సహా ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే గాంధీజీ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఉదయం పూట జరిగే సమావేశాలు చాలావరకు ధర్మ దర్శనాలేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం గాంధీజీ విధిగా తన అనుయాయులను కలుసుకొనే వారు.

ఈ ధర్మ దర్శనాల్లో నేనూ పాల్గొనేవాడిని. ప్రతిసారీ ఆశ్చర్యంతో కూడిన అభిమానంతో నా కళ్ళు ఆయన మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన నిరాడంబరత నన్ను ఎంతో ముగ్ధుడిని చేసేది. ఎవరిని చేయదు కనుక? అయితే ఎవరినీ, చివరకు ఎంత పెద్దనాయకుడయినాసరే తన వద్ద స్వేచ్ఛ తీసుకోవడానికి గాంధీజీ అంగీకరించేవారు కాదు. ఇందుకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కూడా మినహాయింపు కాదు సుమా! నిజానికి ఎవ్వరూ గాంధీజీ వద్ద అలా స్వేచ్ఛతీసుకోవడానికి ప్రయత్నించేవారు కాదు. అయితే సరోజినీనాయుడు మాత్రం భిన్నమైనవారు. గాంధీజీతో ఆమె చాలా చనువుగా మాట్లాడేవారు. ఆయన నిరాడంబరత మీద సరోజినీ దేవి చాలా హాస్యోక్తులు విసిరేవారు. అవన్నీ సుప్రసిద్ధమైనవే కదా.

ఆసేతు హిమాచలమూ ఉన్న గాంధీజీ అనుయాయులు ముఖ్యంగా స్వాతంత్య్ర సమరయోధులు ఆయన మాటను జవ దాటే వారు కాదు. ఆయనేమి చేయమంటే అదే చేసేవారు. అయినా గాంధీజీని ఏదో ఒక అసంతృప్తి ఆవహించింది. ఒక విధమైన విచారం ఆయన వదనంలో కన్పించేది. గాంధీజీ విశేషంగా అభిమానించిన నాయకులలో ఆచార్య రంగా ఒకరు. రంగాతో ఆయన చాలా సన్నిహితంగా మాట్లాడేవారు. తన మనస్సులోని విషయాలను రంగాజీకి చెప్పేవారు. ‘నా చుట్టూ అంతటా అంధకారమే కన్పిస్తుంది. ఇప్పుడు నా మాట ఎవరూ వినడం లేదు. నన్ను త్వరగా తీసుకువెళ్ళమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని గాంధీజీ ఆచార్య రంగా వద్ద వాపోయారు. ఇది రంగాజీని అంతులేని బాధకు గురిచేసింది. అప్పుడు ఆచార్య రంగా వయస్సు 47 సంవత్సరాలు. బాపూజీ విశ్వసనీయమైన శిష్యులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు. తరచూ బిర్లా హౌజ్‌కు వెళ్ళి గాంధీజీతో రంగా చర్చలు జరుపుతుండేవారు. గాంధీజీ సూచనల ప్రకారం ఆచార్య రంగా వివిధ ఉద్యమాలను నిర్వహించారు. గాంధీజీ సత్యాగ్రహ మహత్వాన్ని, అహింసా సందేశాన్ని ప్రపంచం నలు దిశలకూ చేరవేసిన వారిలో ఆచార్య రంగా ఒకరు. ఆంధ్ర దేశంలో గాంధీజీ తొలి అనుయాయుల్లో దేశ భక్త కొండా వెంకటప్పయ్య ఒకరు. గాంధీజీ ఆయన్ని తన దత్తపుత్రుడుగా భావించేవారు. గుంటూరులోని నల్ల చెరువు ఒడ్డున గాంధీజీ అంతిమ సంస్కారాలను వెంకటప్పయ్య నిర్వహించారు. చాలా రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నేనూ రోజూ పాల్గొనేవాడిని.

గాంధీజీ మన మధ్య నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అయితే ఆయన ఉపదేశాల ఉపయుక్తత నేటికీ ఉంది; ఎప్పటికీ ఉంటుంది. వివిధ విచ్ఛిన్న ధోరణులతో అతలాకులతమవుతోన్న నేటి సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే మహాత్ముని బోధనలను పాటించడమే ఉత్తమోత్తమ మార్గం.

– ఎస్.వి. పంతులు
వ్యాసకర్త సీనియర్ కాంగ్రెస్‌వాది
(నేడు గాంధీ వర్ధంతి)

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తెలుగుకు వెలుగు

తెలుగుకు వెలుగు

 

కొద్దిగా ఆలస్యమే అయినా, రాష్ట్ర పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముదావహమే. పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్‌లో, డిగ్రీ కళాశాలల్లో తెలుగు పేపర్‌ను నిర్బంధం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక తెలుగు భాషేతరులు కూడా తెలుగును రెండవ లేక మూడవ భాషగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, బీటెక్ వంటి డిగ్రీలను అందించే సంస్థలతో సహా ఇంటర్మీడియట్ కళాశాలలన్నిటిలో మూడవ భాషగా తెలుగు తీసుకోవడం అనివార్యమవుతుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సెకండరీ, ఉన్నత విద్యాశాఖాధికారులు నిర్దిష్ట నిబంధనలను రూపొందించడంలో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలల్లో తెలుగును నేర్చుకోవడం తప్పనిసరి కాదు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటి వరకూ తెలుగుకు బదులుగా స్పెషల్ ఇంగ్లీషును తీసుకునేందుకు వీలుండేది. కానీ, తాజా ప్రతిపాదనతో వారు తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని పాఠశాలలన్నిటిలోనూ తెలుగు, ఇంగ్లీషు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ నిబంధనల్లో సవరణలు తీసుకు రావడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఒకటి నుంచి పదవ తరగతి చదువుతున్న సుమారు 1.29 కోట్ల మంది విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ స్కూళ్లన్నిటికీ ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిస్తాయి. తెలుగును నేర్చుకోని పక్షంలో మార్కులు, ర్యాంకుల్లో కోత ఖాయం.

ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌తో సహా పలువురు పాఠశాల స్థాయిలో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను చేశారు. ఈ మేరకు చేసిన ఓ తీర్మానం సభ ఆమోదం పొందింది కూడా. ఆ తరువాత కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ముఖ్యమంత్రి అందుకు వెంటనే అంగీకరించారు. తెలుగును మృత భాషల జాబితాలో చేర్చాల్సిన ప్రమాదం ముంచుకొస్తోందంటూ కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తెలుగును మాట్లాడే యువతీ యువకులు, విద్యార్థుల సంఖ్య 27 శాతానికంటే తక్కువగా ఉన్న పక్షంలో ఈ భాష మృత భాషగా మారడానికి ఎంతో కాలం పట్టదని కూడా తెలిపింది. ఇక రాష్ట్రంలో 40 ఏళ్ల లోపువారిలో అధిక శాతం మంది తెలుగు మాట్లాడడానికి బిడియపడుతున్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సహజంగానే ఈ ధోరణి రాష్ట్రంలోని విద్యావేత్తలు, భాషాభిమానుల్లో ఆందోళన కలిగించింది.

వాస్తవానికి 2003 జూలైలో చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదవ తరగతి వరకూ తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించడం, రాష్ట్రంలో దీనికి మొదటి అధికార భాషగా గుర్తింపు లభించేలా చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని అప్పటి విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ప్రకటించారు. త్రిభాషా సూత్రం కింద ఉర్దూ మీడియం స్కూళ్లల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయడం జరుగుతుందని అప్పట్లో ఆయన తెలిపారు. అయితే, ఆ ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో తెలుగును విద్యాసంస్థల్లో తప్పనిసరి చేయడం హర్షణీయమైన పరిణామమే కానీ, ఇందులో కొన్ని సమస్యలు కూడా ఇమిడి ఉన్నట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉన్న పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఇతర రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు స్థానికంగా ఇబ్బందులు రావచ్చు. సరిహద్దు రాష్ట్రాలు ఇటువంటి నిర్ణయం పట్ల ఏవిధంగా స్పందిస్తాయన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ అమలు జరుగుతుందన్నది కూడా సందేహమే. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల మీద ప్రభుత్వానికి అదుపూ అజమాయిషీ లేదనేది నగ్నసత్యం. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ…’ అనే గీతాన్ని ఉదయం వేళ రాష్ట్ర గీతంగా గానం చేయాలనే ప్రభుత్వ నిబంధన ప్రైవేట్ పాఠశాలల్లో అమలు జరగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పాఠ ్య ప్రణాళిక దగ్గర నుంచి సెలవుల వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు సొంత నిర్ణయాలనే అమలు చేస్తుంటాయి. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పాఠశాలలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత వరకూ అమలు జరుగుతాయన్నది కూడా సందేహాస్పదమే.

అంతేకాక, కేంద్రీయ విద్యాలయాలు, సి.బి.ఎస్.ఇ, ఐ.సి.ఎస్.ఇ విద్యాసంస్థలలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే వర్తిస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. సెంట్రల్ బోర్డు కింద పనిచేసే పాఠశాలలు రాష్ట్రంలో 3,000 పైచిలుకే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి కాదు. ఇక్కడ ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలల్లో తెలుగు భాషా బోధన లేదు కూడా. కొన్ని సమస్యలున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతుల పునరుజ్జీవనానికి తెలుగు బోధనను తప్పనిసరి చేయడం, ఇళ్లల్లో తెలుగు మాట్లాడడం తప్ప గత్యంతరం లేదు. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఉత్తర్వులను అమలు చేయడం అవసరం.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

షాహాజన్ పూర్ – శ్రీ రామ చంద్ర మహా రాజ్ –1

 షాహాజన్ పూర్ – శ్రీ రామ చంద్ర మహా రాజ్ –1

   పూజ్య శ్రీ రామ చంద్ర మహారాజ్ విక్రమ నామ సంవత్సర  వైశాఖ శుద్ధ పంచమి నాడు 1899  ఏప్రిల్ 30 న ఉత్తర ప్రదేశ్ లోని శాహజాన్ పూర్ గ్రామం లో జన్మించారు .లోకం లో అధర్మం పెచ్చు పెరిగి ధర్మ నిర్వీర్య మై పోతున్నప్పుడు అవతార పురుషులు ఉద్భవించి ధర్మ సంరక్షణ చేస్తారని మనకు తెలిసిన విషయమే .ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభం లో ఇవే పరిస్తితులున్నాయి భారత దేశం లో .అప్పుడొక అవతార పురుషుని ప్రాదుర్భావం అవసర మైంది .ఆ మహా పురుషుడే శ్రీ రామచంద్ర గురు. శాహజాన్ పూర్ శ్రీ రామ చంద్రఅంటే అందరికి తప్పకుండా జ్ఞాపకం వచ్చేది వారు బోధించిన’’ జపం కాని జపం అంటే అజపా జపం ‘’…ఉయ్యూరు లో దాదాపు నలభై ఏళ్ళ క్రితం మా వంగల కృష్ణ దత్త శర్మ గారు శాహజాన్ పూర్ వెళ్ళి అజపా జపం నేర్చుకొని వస్తూండే వారు .వేసవిలో ఒకటి రెండు నెలలు అక్కడే ఉండి వారి ఆశ్రమం లో సాధన చేసి వస్తూండే వారు .ఆ విషయాలు మాకు చెబుతూ ఉండే వారు .వారి గురించిన పుస్తకాలు అజపా జప విధానం గురించి మాకు తెలియ జేశేవారు .అప్పుడు మాకంతా  వింతగా ఉండేది .ఆ తర్వాత నా శిష్యుడు డాక్టర్ వెంపటి కృష్ణ యాజి హైదరాబాద్ లోని విజయ నగర కాలనీ ఉన్న ‘’శ్రీ రామ చంద్ర సెంటినరి హాస్పిటల్’’ లో సేవా దృక్పధం తో డాక్టర్ వృత్తిలో తన జీవితాన్ని ఆదర్శ వంతం గా గడుపుతున్నాడు .అతని దగ్గరకు వైద్యం కోసం మా కుటుంబం అందరం వెళ్తున్నాం .ఇప్పుడు రెండవ సారి శ్రీ రామ చంద్ర గారి గురించి కొంత తెలుసుకోవటం జరిగింది .ఈ సేవా సంస్థ శ్రీ రామ చంద్ర గారి బోధనలపుస్తకాలను ఉచితం గా నాకు అందజేశారు .అందులో వారి జీవిత చరిత్ర  లేదు .కొంత సమాచారాన్ని సేకరించి వారి జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను అంద జేస్తున్నాను .

                             తగిన శిష్యుని కోసం గురువు నిరీక్షణ

     అప్పటికే 1873  ఫిబ్రవరి రెండు న  ఫతేగడ్ లో జన్మించిన ఆధ్యాత్మిక గురు వరేణ్యులుశ్రీలాలాజీ మహా రాజ ధర్మ సంస్తాపనకు తగిన వ్యక్తీ కోసం నిరీక్షిస్తున్నారు . శాహజాన్ పూర్ లోశ్రీ బదరీ ప్రసాద్ గారింట  శ్రీ రామ చంద్ర జన్మించాదారని తెలియ గానే ఆయన ఆనందానికి అంతులేదు . .అప్పటి నుంచి శ్రీ రామ చంద్ర శ్రీ లాలాజీ శిష్యుడైనారు .రామచంద్రను బాబాజీ మహా రాజ అనీ పిలుస్తారు .శ్రీ రామ చంద్ర చిన్నప్పటి నుంచి చాలా అసహనం గా ఏదో తెలుసుకోవాలనే కోరిక తో కన్పించే వారు ..చివరికి 1922 జూన్ మూడున శ్రీ లాలాజీ దర్శనం చేసుకొన్నారు లాలాజీ గురు శిక్షణ లో 1944 కు సంపూర్ణ వికాసం పొందిన ఆధ్యాత్మిక తేజో మూర్తి గా భాసించారు శ్రీ రామ చంద్ర .ప్రకృతి ధర్మాలను నిర్వహిస్తూ లక్షలాది దీన జనోద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు .

                       శ్రీ రామ చంద్రుల బాల్యం –విద్యాభ్యాసం

 

 

            శ్రీ రామ చంద్ర మహారాజ్ బాల్యం గురించి ఇప్పుడు తెలుసు కొందాం .చిన్నప్పుడే టైఫాయిడ్ తో బాధ పడ్డాడు దానితో చదివింది అంతా మరిచి పోయేవాడు ఇంటి దగ్గర ప్రైవేట్ మాస్టర్ ను ఏర్పాటు చేశాడు తండ్రి .లెక్కలు వచ్చేవి కావు .తప్పే వాడు తల్లి నీతి కధలు బోధించేది .ఆరవ ఏట తండ్రి గుర్రం కొనిస్తే దాన్ని లాఘవం గ స్వారి చేసే వాడు స్కూల్ లో చేర్పించారు హాకీ టీం కి కెప్టెన్ అయాడు .టీచర్లు శిక్షించే వారు .అది భరింప రానిది గా ఉండేది .అవతలి వ్యక్తీ ఉచ్చ్వాస నిస్స్వాసాలను బట్టి వారి ప్రవర్తనను అంచనా వేసే శక్తి రామ చంద్ర కు ఏర్పడింది ..ఏదో తీరని తపన తో అనుక్షణం గడిపే వాడు .14 వ ఏడు వచ్చేసరికి గురువు కోసం అన్వేషణ సాగించాడు ..తగిన గురువు లభిస్తే సర్వ సమర్పణ చేయటానికి సిద్ధ పడ్డాడు .ధ్యాస అంతా వేదాంతం మీదే ఉంది చదివి కొంతా ,స్వయం గా ఆలోచించి మిగిలినదీ నేర్చాడు .గృహస్తుని గా ఉంటూ ఆధాత్మిక జీవనం సాగించటం కష్టం అని భావించి సన్యాసి అవాలనే నిశ్చయానికి వచ్చాడు .మంత్రగాల్లను తాంత్రికులను నమ్మలేదు .

         ఆ సమయం లో స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్రిస్ అహమ్మద్ శూల నొప్పి  తోతీవ్రం గా  బాధ పడుతూ,ని ద్రలేకుండాగడుపు తున్నాడు .  రామచంద్ర సాయం కోరాడు .రామ చంద్ర ఆయన బొటన వ్రేలిని తన చేతులతో పట్టుకొని నెత్తి మీద పెట్టి ఒక నిమిషం అయిన తర్వాత ‘’నెప్పి తగ్గిందా ?’’అని అడిగాడు .ఇద్రిస్ గారు తగ్గి పోయిందని చెప్పి హాయిగా నిద్ర పోయాడు .అప్పటి నుండి బడిలో యే విద్యార్ధికి జబ్బు వచ్చినా రామ చంద్ర దగ్గరకు పంపిస్తుందే వాడు .ఈయన హస్త వాసి వల్ల అవి నయం అయేవి ఆయన మనో బలం అంత గొప్పది .ఇంగ్లిష్ మేష్టారు రామచంద్ర లోని ఆసక్తిని గమనించి వేదాంత పుస్తకాలు చదవటానికి ప్రోత్స హించాడు ఈయనకు ‘’డైనమిక్స్ ఆఫ్ మైండ్ ‘’అనేది చాలా అభిమాన విషయం .దాని పై ఎంతో కృషి చేశాడు రామ చంద్ర .మెదడు ఆలోచిస్తుందని హృదయం దానిని సరైన మార్గం లో పెడుతుందని తెలుసుకొన్నాడు .1918లో 19 వ ఏట శ్రీ కృష్ణుని జన్మ స్థల మైన మధుర లో వివాహం జరిగింది .భార్య భగవతి కి కోపం ఎక్కువ .దాన్నీ భరించి మహా సహనం అలవరచుకొన్నాడు రామ చంద్ర .

           1922 లో ఫతేగడ్ లోని గురు మహాత్ములైన శ్రీ రామ చంద్ర జీ తనకు మార్గ దర్శనం చేయగలరని భావించాడు .1922 జూన్ మూడు న ఆయన్ను దర్శించాడు .ఆయన దగ్గర కూర్చో బెట్టుకొని ధ్యానం చేయించాడు .అంతే అప్పటి నుండి చుట్టూ ఉన్న ప్రకృతిలో ఒక కొత్తదనం గమనించాడు .గురువు అనుగ్రహం తో రాజ యోగాన్ని అభ్యసించాడు .దీనితో ప్రేమ, ఆరాధనా, అంకిత భావం ఏర్పడి జీవితాంతం నిలిచి పోయాయి .ఇంటికి తిరిగి వచ్చాడు .మెట్రిక్ పరీక్ష పాస్ అయ్యాడు .శాహజాన్ పూర్ కోర్టు లో ఉద్యోగం లో చేరాడు తన ధ్యానాన్ని క్రమం తప్పకుండా కొన సాగిస్తున్నాడు తోటి ఉద్యోగులతో మర్యాదగా ప్రవర్తించే వాడు. కానీ సిగెరెట్ అలవాటైంది తండ్రి కోప్పడినా మానలేదు తండ్రికీ ఈ అలవాటు ఉండేది . తండ్రి సిగరేట్ తాగటం మానేసి కొడుక్కి హుక్కా కొనిచ్చాడు ఇది సిగరెట్  అంతహానికాదని హుక్కాలో నికోటిన్ అనే  విషం లేదని తండ్రి అభిప్రాయం .తాను పొగ పీల్చటం మనేయ్యాలా అని గురువును అడిగితే అక్కర్లేదు నీ ఇష్టం అన్నాడట

              సశేషం

                మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –..29-1-13 –ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

మూత పడిన తెలుగు పాఠశాల

Hosuru Telugu School

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

   1809 లో వియన్నా లో మళ్ళీ గందర గోళ పరిస్తితులేర్పడ్డాయి .మళ్ళీ వియన్నాపై విరుచుకు పడ్డాడు నెపోలియన్ .మే పదకొండున సిటీ అంతా బాంబుల దాడితో దద్దరిల్లి పోయింది .బులెట్లు ఇళ్లల్లోకి దూసుకోచ్చాయి .మర్నాడే సిటీ ని నెపోలియన్ ముట్టడించాడు .అప్పుడొక ఫ్రెంచ్ జెంటిల్మన్ బీథోవెన్ ను ఒక లాడ్జి లో చూశాడు .అతని ఆకారాన్ని ‘’A very ugly man ,visibly in bad temper ‘’అని వర్ణించాడు దిండ్ల ను  తల మీద పెట్టుకొని ధ్వని చెవుల్లో ప్రవేశించ కుండా కూర్చున్నాడట .ఎలాంటి హీన స్తితిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీత సృష్టి కర్త ఉంటున్నాడో ఆయన చూసి కలత చెందాడు .చిన్న గది ,వెలుతురు లేదు .మురికి కూపం .దుమ్ము పేరుకు పోయింది గది అంతా .ఎక్కడ పడితే అక్కడ నాచు ,పుట్టగొడుగులు పెరిగి పోయి ఉన్నాయి .మంచం కింద నీళ్ళు నింపని కుండ ,రాత్రిళ్ళు తినేసి వదిలేసినఎంగిలిపల్లాలు కుర్చీ చుట్టూ ఉన్నాయి .ఇదంతా చూసి ఆ జెంటిల్మన్ విచలితుదయ్యాడు .

               సంగీత వ్రుత్తి అంటే విసుగెత్తుకోచ్చింది బీథోవెన్ కి .పల్లెటూరికీ వెళ్ళలేక పోయాడు .ఫ్రెంచ్ ప్రభుత్వానికి ప్రజలంతా‘’క్రిప్ప్లింగ్ టాక్సులు’’ కట్టాల్సి వచ్చింది .ఒక ఏడాది గది చేసరికి పరిస్తితులు కొంత చక్క బడ్డాయి .చక్ర వర్తి కి ఉన్న 18 ఏళ్ళ కూతురు మేరీ లూసీ తొందర పడి ,అప్పటికే భార్య జోసేఫీన్ కు విడాకు లిచ్చేసిన నెపోలియన్ ను పెళ్ళాడింది .దానితో ఆస్ట్రియా ఫ్రెంచి  దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది .

            బీథోవెన్ తన అయిదవ పియానో కన్సేర్టో పూర్తి చేసి ,ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ కు అంకిత మిచ్చాడు .The harp string quartet మొదలైన అనేక పియానో సొనాటా లను ‘’ఫేర్ వెల్ ‘’ను చేశాడు .ఆర్చ్ డ్యూక్ దేశం వదిలి ప్రవాస జీవితం గడిపి మళ్ళీ 1810 జనవరిలో తిరిగి వచ్చాడు .అప్పుడే పైన చెప్పిన సంగీత కూర్పు అంతా చేశాడు బీథోవెన్ .

                తాను రాసిన చాలా వాటిని ముద్రించాడు .ఇందులో కొత్త సిమ్ఫనీలు చాలా ఉన్నాయి .ఇంకో సెల్లో సొనాటా ,పియానో త్రయో సెట్లు కూడా చేశాడు .ఆయనకు నమ్మకమైన ముగ్గురు పాట్రాన్ లు బీథోవెన్ నుండి ఇంకా విలువైన వాటిని ఆశిస్తున్నారు .

                         అమర ప్రేయసి –ప్రేమికుడు

           బీథోవెన్ కచేరీలపై పెట్రాన్ లకు నిరాశ గానే ఉంది .ఇంకా ఏదో చేయాలి అతను అని ఆదుర్దా గా ఉన్నారు .అప్పటికే బీథోవెన్ అలసి పోయాడు .డబ్బు పై చింత ఎక్కువైంది .ఇప్పటి నుండి దృష్టిని సంగీతం మీద కాక మిగిలిన విషయాల పై కేంద్రీకరించాల్సి వచ్చింది ఆయనకు .

             1809 లో జెర్మనీ ప్రముఖ కవి రచయిత నాటక కర్త ‘’గోథే’’రాసిన Egmont ‘’కు సంగీతం చేయమని ఆహ్వానం వచ్చింది బీథోవెన్ కు .ఇదొక ఫ్లేమిష్ జెనరల్ కధ .దేశాన్ని రక్షిస్తూ యుద్ధం లో మరణించిన వీర జవాన్ గాధ. .కధ చాలా ఉదాత్త మైంది .తను చేయ తగినది కూడా .ఆ కధ తన జీవితానికీ వర్తిస్తుందని తలచాడు .అందుకే ఆనందం గా ‘’I wrote purely out of love for the poet Gothe ‘’అను కొన్నాడు .దీనికి మూజిక్ చెయ్యటానికి తనకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదనీ చెప్పాడు .మొదటి ప్రదర్శన 15-6-1810 తర్వాత బీథోవెన్ కి ఇంకో సమస్య వచ్చిమీద పడింది . .తాను పియానో పీస్ రాసిన డాక్టర్ గారి మేన కోడలితో ప్రేమ లో పడ్డాడు .పాపం ఆమె తిరస్కరించింది .అప్పటికే ఈ సంగీత సామ్రాట్ కు 40 ఏళ్ళు వచ్చాయి .తాను వలచిన పెళ్ళి కూతురు దొరక లేదీ ముసలి పెళ్ళి కొడుక్కి .

              1811 లో బీథోవెన్ డాక్టర్ Bohemian spa of tepliz లోని నీటిని త్రాగమని సలహా నిచ్చాడు .అలా చేస్తూ అక్కడే king Stefen ,The ruins of Aethens అనే రెండు నాటకాలకు సంగీతం చేశాడు .వియన్నా తిరిగి వచ్చి మరో రెండు సిమ్ఫనీలు no.7 –A -minor ,లో no.8 F.లో చేశాడు .ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైనవి .మొదటిది సంబరాల పండగ –Joyous celebration –in dance rhythms , -రెండోదిచిన్నది క్లాసికల్ మోల్డ్ లో చేసింది .ఎనిమిదో సింఫనీ పై పని చేస్తుండగా ,మళ్ళీ టేప్లేజ్ వెళ్ళి వచ్చాడు .అక్కడే గోథే ను కలిసి సంబర పడ్డాడు .బీథోవెన్ పరిస్తితికి ఆ మహా కవీ,రచయితా జాలి పడ్డాడు .’’I have never seen a more energetic or intense artist ‘’అని మెచ్చుకొన్నాడు .I understand very well how strange he must seem to the world ‘’అన్నాడు గోథే .6-7-1812 –  బీథోవెన్ఒక అజ్ఞాత ప్రేయసికి అపూర్వ మైన ఒక ఉత్తరం రాశాడు .కాని దాన్ని పోస్ట్ చేయలేదు .దీన్ని’’ unfinished ,passionate declaration of love to an unknown woman whom Beethoven caalls ‘’the immortal beloved ‘’అన్నారు విశ్లేషకులు .ఇందులో ఆమెను చాలా కాలం నుండి ప్రేమించి ఆరాదిస్తున్నట్లు ,ఇద్దరు హాయిగా కలిసి కాపురం చేదామనే ఆలోచనా తెలియ జేశాడు .ఇంతకీ ఆ ఊహా  ప్రేయసి ఎవరో ఎవరికీ ఇంత వరకు తెలియ లేదు .అయితేAtonie Brentasno అనే వియన్నాకు చెందినా అరిష్తో క్రాటిక్ లేడి అయి ఉండవచ్చు అని బీథోవెన్ జీవిత చరిత్ర కారులు ఊహించారు .ఆమె 1809-12మధ్య’’ ఫ్ఫ్రాంక్ ఫర్ట్ ‘’లోని ఒక బిజినెస్ మాన్ ని వివాహం చేసుకొన్న ఆవిడ గా భావించారు .ఆమెను బీథోవెన్ మళ్ళీ చూడనేలేక పోయాడు .తన ప్రసిద్ధ పియానో కాన్సేర్ట్ లలో ఒక దాన్ని Diabelli Variations పేరఆమెకు అంకిత మిచ్చి తన అమర ప్రేమను చాటుకొన్నాడు .అందుకే వీరిద్దరూ అమర ప్రేయసి ప్రేమికులు లేక అజ్ఞాన ప్రేయసి ,సంగీత విజ్ఞాన సింధువు  అని పించుకొన్నారు .

                సశేషం

             మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-1-13-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒరియా రచయిత్రికి జ్ఞానపీఠ పురస్కారం

oriya rachayitha jnanapeetham (1)

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బా రామయ్య తో ఇంటర్ వ్యూ

peddibhotla -1peddibhotla -2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నారాయణ రెడ్డి కవితా సంకలనాలు -సమీక్ష

si.na.re.kavitha sankalanalu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య

సాహితీ కలహ భోజనాలు!
– మువ్వల సుబ్బరామయ్య

ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, రగడ ఎందెందు వెదకి తొంగి చూడగా.. పూర్వం పండిత ప్రకాండుల సాము గరిడీలకు సాహిత్య పత్రికలు తాలింఖానాలు అయినాయి. పరస్పర దూషణ సాహిత్య విమర్శగా చెలామణి కాసాగింది. నెల్లూరు మండలంలో తొలి తెలుగు పత్రిక పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత గ్రంథ చింతామణి’. రామకృష్ణయ్య ఒకవైపు పత్రికను నడుపుతూ, మరొకవైపు తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి పుస్తక ప్రచురణ చేస్తూ వచ్చారు. మిత్రావింద పరిణయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, వసుంధరా పరిణయము, యాదవ రాఘవ పాండవీయము మొదలైన ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, చక్కని పీఠికలు చేర్చి అచ్చువేశారు.

ఈ విధంగా అముద్రిత గ్రంథాలను ముద్రించడమనే తమ పత్రిక ప్రధానాశయాన్ని సార్థకం చేసుకున్నారు. రామకృష్ణయ్య చాటు పద్యాల సేకరణపై మంచి ఆసక్తి. వందకు పైగా చాటు పద్యాలు సేకరించి అముద్రిత గ్రంథ చింతామణిలో ప్రచురించారు. వాటిలో కొన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి సంకలనంలో కొన్ని దీపాల పిచ్చయ్యశాస్త్రి సంకలనంలో చోటుచేసుకున్నాయి. కాని పూండ్ల వారిని చాటు పద్య సంకలనకర్తగా ఇద్దరూ స్మరించలేదు.

అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక పేజీలలో మండపాక పార్వతీశ్వర కవి పద్య మాలికలు నాలుగోవంతు ఉండేవంటే అతిశయోక్తి కాదు. పార్వతీశ్వర కవికి, పూండ్ల వారికి తటవర్గ బిందు పూర్వక యతి విషయంలో అభిప్రాయ భేదం వచ్చి వారి మిత్రత్వానికి భంగం కలిగింది. కొక్కొండ వెంకటరత్నం ‘బిల్వేశ్వరీయాన్ని’ రామకృష్ణయ్య ఎంతో సహృదయంతో సమీక్షించినా, ముందుగానే తమకు కలిగిన సందేహాలను కొక్కొండ వారి సముఖంలో వినిపించగా, ఏ సమాధానం చెప్పక పరుషంగా ‘సంజీవని’ పత్రికలో కొక్కొండ వారు సమాధానం చెప్పడంతో అది పెద్ద యుద్ధంగా మారింది.

వేంకట రామకృష్ణ కవులు (జంటకవులు) ఓలేటి వెంకటరామశాస్త్రి, వారి మేనత్త కొడుకు వేదుల రామకృష్ణ. వీరిద్దరూ పిఠాపురం మహారాజా రావుసూర్యారావు ఆస్థాన కవులుగా ఉండేవారు. ఈ కవిద్వయం, తిరుపతి వేంకటకవులనే (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి) జంటకవులతో హోరాహోరి కవిత్వ యుద్ధం చేశారు. దాంతో కొంత సాహిత్యం వెలువడింది. తిరుపతి వేంకటకవులు- పాశుపతము, గీరతము, బిడాలోపాఖ్యానం అనే గ్రంథాలను; వేంకట రామకృష్ణ కవులు- కోకిలా కాకము, శృంగభంగము, శతఘ్ని అనువానిని వెలువరించారు.

తిరుపతి వేంకటకవులు ‘పాండవాశ్వమేధ’ నాటకం ప్రచురిస్తే, వేంకట రామకృష్ణ కవులు దానిలో నూరు తప్పులను చూపిస్తూ ‘శతఘ్ని’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. దాంతో యుద్ధం ముమ్మరమైంది. తిరుపతి వేంకటకవులు ‘పాశుపతం’ అనే సమాధానాన్ని ప్రయోగించారు. అలాగే ఖండన ముండనములు, మండన ముండనములు బయలుదేరాయి. ఈ సాహిత్య సమరాన్ని పాఠకులు ఆనందించారు. అయితే ఈ యుద్ధం లో ఎవ్వరూ ఓడనూ లేదు, గెలవనూ లేదు.

తిరుపతి వేంకట కవులు ‘శ్రవణానంద’, ‘పాణిగ్రహీత’ రచనలు చేయగా, వాటిని చదివి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘పాణి గ్రహీతా శ్రవణానంద శృంఖల’ అనే విమర్శ వ్రాసి ప్రకటించారు. అప్పుడు వారి గురువులు వేంకట రామకృష్ణ కవులు ‘వ్రాత ప్రతి అయినా చూపించకపోయావే’ అని కోప్పడ్డారు శ్రీపాదను. వేంకట రామకృష్ణ కవులే వ్రాసి, శిష్యుడి పేరు పెట్టారని సాహితీ లోకంలో ప్రచారమైంది. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి మీద ‘శృంఖలా తృణీకరణం’ అనే విమర్శ వదిలారు. శ్రీపాద దానిమీద ఖండన రాయడానికి పూనుకుని ‘గళహస్తిక’ రచించారు. గురువులిద్దరికీ చూపించారు.

రామకృష్ణశాస్త్రి పూర్తిగా చదివి, నిలువుగా రెండు చీలికలు చేశారు. ‘భేష్ మంచి పనిచేశా’వన్నారు వేంకట రామశాస్త్రి. ‘తిరుపతి వేంకటకవులు వయసులో మనకంటే చాలా పెద్దలు. మీరింకా చాలా రచించవలసి వుంది. మీకూ వారికీ కూడా ఇప్పుడిది హద్దు. మాది కలహం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంకుల సమరం. సత్యానికీ, భుక్తానికీ సంబంధించిందది. ఆక్రమణకూ ప్రతిఘటనకూ సన్నాహం ఇక్కడ. ఒక విధంగా మాకూ మాకూ జీవన్మరణ సమస్య ఇది. విమర్శతో ప్రారంభం కాలేదిది. విమర్శతో ఆగదు. విమర్శ ఇక్కడ ఒక ఆయుధం. అంతే. మీ సంగతి ఇలాంటిది కాదు’ అని నచ్చచెప్పారు శ్రీపాదకు.

కాకినాడలో శ్రీపాదకు తిరుపతిశాస్త్రి తటస్థపడి, ఫలానా అని తెలుసుకుని ‘అయితే మా శత్రుకోటి వారన్నమాట. కాదు, కాదు. మా పొరపాట్లు చూపించినవారు మిత్రకోటి వారవుతారుగాని, శత్రుకోటివారెలా అవుతార’ని హుందాగా అన్నారు. కాని రాజమండ్రిలో ఎదురైన చెళ్లపిళ్లవారు మాత్రం నోరు చేసుకున్నారట! శ్రీపాద మాటల్లో- “మీరేనా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారంటే?’ అంటూ ఎర్రవాలువా భుజాన వేసుకున్న వారెవరో వస్తున్నారు నాకేసి. ‘నేను చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిని లెండి’ అంటూ దగ్గరకి వచ్చారు. ‘నమస్కారం’ అన్నాన్నేను.

ఆశీర్వదించలేదు సరికదా, తిట్లకు లంకించుకున్నారు వెంకటశాస్త్రిగారు. తెల్లపోయా నేను. ఇంతలో చాలామంది చేరారక్కడ. అటూ ఇటూ రోడ్డున వెళ్లేవారున్నూ ఆగిపోయారు. అలా తిడుతూనే ఉన్నారు వెంకటశాస్త్రిగారు. మరోమాట లేదు. ఇక లాభం లేదని నేనూ ప్రారంభించాను. తిట్టుకు తిట్టు. ‘నా పుస్తకాలను విమర్శిస్తావా?’ అని వారి దబాయింపు. ‘ఆకాశం నుంచి వూడిపడ్డాయా నీ పుస్తకాలు, మహా..’ అంటూ నా బుకాయింపు.

‘సభ చేస్తాను వస్తావా?’ అనడిగారాయన. ‘మగతనం వుంటే చెయ్యవలసిన పని అదీ. ఈ తిట్లేమిటి క్షుద్రజాతి మనిషిలాగ?’ అని బదులడిగాన్నేను. ‘ఊరుకోండూరుకోం’డంటూనే వున్నారు అక్కడ చేరిన వారు ఇద్దర్నీ. ‘ఇదేమిటో చూశావా?’ అంటూ కాలెత్తి చూపించారు వెంకటశాస్త్రిగారు. ఎడమకాలి చెప్పులాగే మాట్లాడాన్నేను ‘సరదాగా వుంటే రా…’ అంటూ. అప్పటిదాకా చూస్తూ వింటూ వద్దు వద్దంటున్నవారల్లా అక్కడ మూగి వుండిన వారిలో కొందరాయన్నటూ, మరికొందరు నన్నిటూ లాగేశారు ‘తప్పు తప్పంటూ”… అని ‘అనుభవాలు-జ్ఞాపకాల్లో’ వివరించారు శ్రీపాద.

పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 1923లో మహాభారత చరిత్ర ప్రథమభాగం అనే విపుల పరిశోధన, విమర్శనాత్మక గ్రంథమును వ్రాసి, ప్రకటించారు. 1933లో ద్వితీయ ముద్రణ పొందింది. దీనిని వ్యతిరేకించినవారిలో ముఖ్యులు శ్రీపాద కృష్ణమూర్తి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి. కృష్ణమూర్తి, పెండ్యాల పత్రికలలో ఒకరిమీద ఒకరు ధూషణ వాక్యాలతో వ్యాసాలు వ్రాసి, చివరకు కోర్టుకెక్కారు. దీనిని విచారించిన రాజమండ్రి స్పెషల్ ఫస్ట్‌క్లాస్ మాజిస్ట్రేట్ చెరి ఇరవై రూపాయలు జరిమానా విధించారు. కందుకూరి వీరేశలింగం రచన ‘మహారాణ్య పురాధిపత్యము’ ఆక్షేపగర్భ నాటకము. పంచతంత్రములోని కథ దీనికి మూలాధారము. సంఘములోని వివిధ దురాచారాలను రూపుమాపించాలనే ముఖ్యోద్దేశంతో వీరేశలింగం వినోదకరంగా రచించారు. కాని ఇది తమని ఉద్దేశించి వ్రాశారని ఏలూరి లక్ష్మీనరసింహం ఆయనపై అభియోగం తెచ్చారు.

వీరేశలింగం వివిధ సందర్భాలలో ధర్మార్థ, నీతి సత్యం, అహింస, ఆత్మ మొదలైన వివిధ విషయాలపై వ్రాసిన వ్యాసాలను సంకలనం చేసి ‘ఉపన్యాస మంజరి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ‘ఉపన్యాస మంజరీ విమర్శనం’ అనే పేరుతో దుయ్యబట్టారు. సాంఘిక దురాచారాలను, మూఢవిశ్వాసాలను తూర్పారపట్టే ‘రాజశేఖర చరిత్ర’ను వీరేశలింగం రచిస్తే, ‘వివేక చంద్రికా విమర్శనం’ పేరుతో ఏడు వ్యాసాలలో బ్రహ్మయ్యశాస్త్రి విమర్శించారు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ‘లొడా రి బుచ్చిగాడు’ అని వ్రాసిన ప్రహసనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం మీద అని చెప్పుకుంటారు. వేదం వెంకటరాయశాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులుతో ఎంత హోరాహోరీ పోరు సలిపారో, అలాగే వ్యవహారిక వాదులపైన కూడా విరుచుకుపడ్డారు.

ఒకసారి సురవరం ప్రతాపరెడ్డి ‘జంగములు బ్రాహ్మణులు కారు’ అనే వ్యాసాన్ని వ్రాసి ‘గోలకొండ’ పత్రికను శిఖరానికెక్కించారు. దానిని చదివిన చిదిరెమఠం వీరభద్రశర్మ అరికాలి మంట నెత్తికెక్కింది. వాదోపవాదములు, ఖండన ముండనములు, తర్జన భర్జనలు చెలరేగినవి. రచన చేయగలిగిన దిగ్దంతులంతా తమ సునిశిత భావశరపరంపరలచే ప్రతికక్షుల వాదాంశాలను పూర్వపక్షం చేయడానికి కృతనిశ్చయులై రంగంలోకి దూకారు. అవి వాదోపవాద రూపంలో వికసించిన రసఝరులు, వక్రోక్తులు, వ్యంగ్యాలు, ధ్వనులు, ధ్వనాభ్యాసాలు. ఎన్నో ఛలోక్తులతో నిండిన ఆ వ్యాస పరంపరలు చదివి పాఠకుల హృదయాలు తన్మయత్వంలో తేలాయంటే అతిశయోక్తి కాదు. అలా వారాల తరబడి సాగిన వారి వాదోపవాదముల ఫలితంగా జంగములకు బ్రాహ్మణ శ్రేణి దొరికిందో లేదో కాని, ‘గోలకొండ’ ప్రాచుర్యం పెరిగింది.

గడియారం వెంకట శేషశాస్త్రి రచించిన ‘శివభారతం’ మహాకావ్యం యావదాంధ్రలో పేరెన్నిక గన్నది. ఆరు ముద్రణలకు నోచుకున్నది. ఆయనకు ఆర్థికంగా అనుకోని లబ్ది చేకూర్చింది. హైస్కూలులో హిస్టరీ మాస్టారు చెరుకుపల్లి సుందరరామయ్యకు శాస్త్రితో చాలా మైత్రి ఉండేది. ఆయన ‘శివాజీ చరిత్ర’ వ్రాయి, నేను ఇంగ్లీషు గ్రంథాలు చదివి కథను రాసి ఇస్తాను అని చెప్పారు. ఒక విధంగా ఇతివృత్తం సిద్ధమైంది. శాస్త్రి తన ఉద్యోగానికి సెలవుపెట్టి, స్వగ్రామం చేరుకున్నారు. తమ పొలంలో గుడిసె వేసుకుని అక్కడనే వుంటూ మహాకవిత్వ దీక్షను పట్టినారు. కావ్యం రసభరితంగా పూర్తి అయింది. దానికి ‘శివభారతం’ అని పేరు పెట్టారు.

వెలువడిన వెంటనే గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఈ కావ్యం మీద ప్రశంసావృష్టి కురిపించారు. వెంటవెంటనే నాలుగు ముద్రణలు పొందింది. కథను సమకూర్చినందుకు సుందరరామయ్యను శాస్త్రి శివభారతం అవతారికలో బాగా పొగిడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయనా సంతోషించారు. అయితే నాలుగు ముద్రణల తర్వాత ఆయనలో స్వార్థం చెలరేగింది. శివతాండవం కర్తృత్వంలో తనకూ భాగస్వామ్యం వుందని సుందరరామయ్య వాదం లేవనెత్తారు. అసూయాపరులు కొందరు ఆయనకు తోడైనారు. శివభారతం మీద దుమ్మెత్తి పోస్తూ పత్రికలలో వ్యాసాలు ఖండనలూ ప్రకటించబడినాయి. శాస్త్రి నిగ్రహించుకున్నారు. శాస్త్రి శిష్యులు వ్యాసాలను ఖండిస్తూ వ్రాశారు.

సుందరరామయ్య విశ్వనాథ దగ్గరికిపోయి ‘నాకు న్యాయం చేయండి’ అని అడిగారు. అందుకాయన ‘నేను ఒక కథ ఇస్తాను. దాన్ని కావ్యంగా రాస్తారా?’ అని అడిగారు. బదులు చెప్పలేక తిరిగివచ్చి, ఒక కవికి డబ్బిచ్చి శివభారతాన్ని నిరసిస్తూ ‘శివభారతోదయము’ అనే పేరుతో పద్యగ్రంథాన్ని రాయించి, పంచిపెట్టారు. శాస్త్రి శిష్యుడు సివి సుబ్బన్న శతావధాని దానిని ఖండిస్తూ ‘పరాస్త శివభారతోదయం’ అనే పద్య కృతిని ప్రకటించారు. కొంత రభస జరిగిన తరువాత ఆ వివాదం అంతమైంది.

ధనుంజయడు సంస్కృతంలో ‘దశరూపకసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. దానిని మల్లాది సూర్యనారాయణశాస్త్రి ‘ఆంధ్ర దశరూపకము’ అనే పేరుతో అనువదించారు. మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలు సంస్థానానికి వారు వెళ్లినప్పుడు ఆ గ్రంథాన్ని సంస్థాన విద్వాంసులైన వెల్లాల సదాశివశాస్త్రికి, అవధానం శేషశాస్త్రికి ఇచ్చి, తనను గొప్పగా పొగుడుకున్నారు.

వారు వెళ్లిన తరువాత సదాశివశాస్త్రి అందులోని దోషాలను ఎత్తి చూపుతూ ‘దశరూపక ఖండనము’ వ్రాసి, సూర్యనారాయణశాస్త్రికి పంపారు. దానికి ఆయన ‘ఖండనాభాసము’ వ్రాసి సదాశివశాస్త్రికి పంపారు. సదాశివశాస్త్రి ‘ఖండనాభాస నిరసనము’ వ్రాసి పంపడమే కాకుండా విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం మొదలైన సంస్థానాల పండితులకు ఉభయ వాద గ్రంథాలు పంపి, వారి అభిప్రాయాలు తెలియజేయమని కోరారు. ఆ పండితులందరూ సదాశివశాస్త్రి వాదనలను సమర్థిస్తూ, సూర్యనారాయణశాస్త్రివి దోషములే అంటూ తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు. వాటినన్నిటినీ కూర్చి ‘పండితాభిప్రాయ మణిమాలిక’ పేరుతో ప్రకటించారు. దాంతో ఆ వివాదం అంతమైంది.

దీపాల పిచ్చయ్యశాస్త్రి శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువులో 25 దోషాలను ఎత్తి చూపించారు. అది ఆ నిఘంటుకర్తలకు కోపం తెప్పించింది. పత్రికలలో దీపాలవారికి హెచ్చరికలు చేశారు. దాంతో దీపాలవారు అప్పటికి వెలువడిన నాలుగు సంపుటాల నిఘంటువును విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వచ్చింది. అందులో మచ్చుకు పాఠదోషాలు 60, అర్థ దోషాలు 55, శబ్ద దోషాలు 23 చూపించారు. అది అపరిశీలితముగా వేదం వెంకటరాయశాస్త్రి శబ్దార్థ పాఠాలను ఏ విధంగా స్వీకరించారో సోదాహరణముగా ఋజువు చేశారు. వేదం వారి వ్యాఖ్యలలోను, అనువాదాలలోను చెప్పిన దోషాలను చాలా చూపించారు. పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు.

తరువాత అవి ‘సాహిత్య సమీక్ష’ గ్రంథ రూపములో వెలువడింది. ఇలా సాహిత్య రగడలు చెప్పుకుంటూపోతే చేట భారతమే! ముట్నూరి కృష్ణారావుకు మద్దుకూరి చంద్రశేఖరరావుకు- విశ్వనాథకు, నార్ల వెంకటేశ్వరరావుకు- నార్ల వెంకటేశ్వరరావుకు, రాంభట్ల కృష్ణమూర్తికి- శ్రీశ్రీకి దాశరథికి- శ్రీశ్రీకి ఆరుద్రకి- రంగనాయకమ్మకు శ్రీశ్రీకి- నిమ్మగడ్డ వెంకటేశ్వరరావుకి రంగనాయకమ్మకి- తెన్నేటి హేమలతకు రంగనాయకమ్మకి- రంగనాయకమ్మకి ఓల్గాకు- రంగనాయకమ్మకి సి.వి (సి.వరహాలరావు)కి- ఇలా ఎన్నో! ఎన్నెనో!!

– మువ్వల సుబ్బరామయ్య, 89782 61496

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

 జన బాహుళ్యం కొసం’’ సి.’’లో మొదటి ప్రదర్శన ను రాజ సౌధం దగ్గర ఉన్న ఈసేన్ వీధి  చర్చి లో 1807సెప్టెంబర్ 13న చేశాడు .అయితే అంత సంతృప్తి నివ్వ లేదు ..తన పేట్రన్ లు దూషిస్తే సహించే గుణం మొజార్ట్ కూ లేదు బీథోవెన్ కు కూడా లేదు .వారు తమను సమాన హోదాలో చూడాలి అన్నదే ఇద్దరి అభిప్రాయం .సంగీత కారుల్ని సేవకుల్లాగా చూసే సంప్రదాయానికి ఇద్దరు వ్యతి రేకులే ..ఈ విషయం లో రాజు గారికి కోపం వచ్చి బీథోవెన్ ను రాజ ప్రాసాదాన్నించి ఖాళీ చేయించాడు .ఒక చీకటి గదిలో మిగిలిన వారితో ఉండేట్లు చేశాడు .కచేరీ అయిన తర్వాత యువరాజు జోక్ చేస్తూ ‘’నీ కచేరీ లో యేమేడ్చింది ?’’అన్నాడు .అది నిజమే .అందరు కూడా  భరింపరాని ,చెత్త ప్రోగ్రాం‘’అన్నారు .బీథోవెన్ కి విపరీతమైన కోపం వచ్చింది .అప్పటికే మత సంగీతం బాగా ప్రాచుర్యాన్ని కోల్పోయి ‘’ఔట్ ఆఫ్ ఫాషన్ ‘’అయింది .కాని బీథోవెన్ కు తన సామర్ధ్యం మీద గొప్ప నమ్మకం .తాను చేసిన కచేరి ‘’out standingly good ‘’అని పించింది .తరువాత అదే లాటిన్ నుంచి ,జెర్మని భాష లోకి అనువాదం పొంది గొప్ప పేరు పొందింది .జన రంజక మయింది .

           1808 క్రిస్మస్ ముందు వియన్నా ప్రజలు బీథోవెన్ చేసిన మరో అపూర్వ కచేరీ విన్నారు .ఇందులో రెండు కొత్త సిమ్ఫనీలు –నంబర్ 5 ,6 లనుf లో  పాష్టరల్ లో చేశాడు .ఇది చాలదన్నట్లు తన నాలుగవ పియానో కచేరీ కూడా చేశాడు .దీన్ని new choral Fantasia అని అన్నాడు .ఇందులో పియానో కోరస్ ,ఆర్కెస్ట్రా ఉన్నాయి .ఇవి కాక చిన్న చిన్న బిట్లున్నాయి .దీనికి అను బంధం గా సి సెక్షన్ లోని కొన్ని భాగాలనూ కూర్చాడు .అంతా కలిపి నాలుగు గంటల సుదీర్ఘ కచేరీ .విపరీత మైన చలి కాలం .అవగాహన లేని, సరిగ్గా ప్రాక్టీస్ చేయని ఆర్కెస్ట్రా తో పాడటానికి గాయకులకు కష్టమైనా రీతి లో దీన్ని చేశాడు .మిశ్రమ స్పందన వచ్చింది .బీథోవెన్ ఏది చేసినా ఆయనకు ఇష్టమైన ప్రాచుర్యంపొందిన అయిదవదైన సింఫనీ ఉండాల్సిందే .’’It carries the listener away irresistibly into wondrous spirit  world of infinite ‘’అని జెర్మనీ దేశపు మహా రచయితా, విశ్లేషకుడు E.T.A.Hoffman అన్నాడు .’’It is conceived with genius ,exilated with great thoughtfulness and express the romantic spirit in music in the highest degree ‘’అని ఆయనే కితాబిచ్చాడు . .

             బీథోవెన్ చేసిన అయిదవ సింఫనీ చాలా విప్ల వాత్మక మైంది .దీని నిర్మాణం ,ఆకృతి బహుదా ప్రశంశ నీయమైంది .ఆనాడు వాడుక లో ఉన్న పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త ఊహల్ని ,కొత్త స్వరాలను సృష్టించి దానికి ఒక చారిత్రాత్మక రూ పాన్ని తెచ్చి చిర స్తాయి తెచ్చాడు .అందుకే బీథోవెన్ అంటే సింఫనీ –సింఫనీ అంటే బీథోవెన్ అని పించుకోన్నాడు .ఇది విషాద స్వరం తో(సి మేజర్ ) ప్రారంభ మవుతుంది ,అంటే చీకటి నుండి వెలుగు లోనికి ప్రయాణానికి సంకేతం .అంతే కాదు ఈ సింఫనీ బీథోవెన్ ఓటమి ,నిరాశ లపై స్వీయ పోరాటాన్ని సూచిస్తుంది .ప్రసిద్ధ మైన four note motiff of the opening లో ‘’fate knocking on the door ‘’అని ఉంటుంది .ఇది ఇంకో రకం గా చెప్పాలి అంటే ఆనాడు మొర్సు శాస్త్రజ్ఞుడు కని పెట్టిన టెలిగ్రాఫ్ లోని’’ v’’కు సంకేతం అంటే విజయానికి గుర్తు .అని ఒక విశ్లేషకుడు అద్భుతం గా వ్యాఖ్యానించాడు .ఈ సంకేతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం లో allied forces విజయానికి సంకేతం గావాడారు .ఆతర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు రెండు వేళ్ళు చూపించి ఆనాడు వాడాడు .ఇప్పుడు అందరు దీన్నే వాడుతున్నారు విజయ చిహ్నం గా .

           ‘’పాష్టరల్ సింఫనీ ‘’చాలా విభిన్న మైంది .ఇందులో బీథోవెన్ సంగీత భాషను  అందులోను ముఖ్యం గా పల్లె టూరి సౌందర్యాన్ని ,ఉదయ ప్రశాంతతను ,పంట చేల అందాలను ,సెలయేళ్ళ మధుర నాదాన్ని ,పల్లె జనుల పండుగ ఉత్సాహాన్ని (మధ్యలో ఉరుము ,మెరుపు,తుఫానుల  ధ్వనుల అంత రాయాన్ని) కలబోసి ,చివరకు ,పశువుల కాపరుల అవ్యక్త మధుర సంగీతాన్ని ,వారి జానపద గీతాలను విని పిస్తాడు .తుఫాను తర్వాత ప్రశాంతత కు కృతజ్ఞత తో కూడిన అభి నందనలు విని పిస్తాడు .ఈ సిమ్ఫనీతో సంగీతం లో రొమాంటిక్ యుగం ప్రారంభమైంది .ఈ రొమాంటిక్ భావాలనే చిత్ర కళ లో ,లాండ్ అస్కేపులలో ,కధల్లో సంగీతంద్వారా ప్రచారం చేశారు .

          ఇలాంటి విప్లవాత్మక మైన ఆలోచనలు భావాలు మీకు ఎలా వస్తాయి? అని బీథోవెన్ ను ప్రశ్నిస్తే ‘’I can not tell you exactly I could grab them in my hands ,out in the open air ,in the woods ,out wlaking ,late at night ,early in the morning ,brought on my moods which the poet can put into words and I into sounds which whirl round me until I can get them down as notes on paper ‘’అని ‘’కాదేదీ సంగీతానికి అనర్హం’’ అంటు కవితాత్మకం గా వివరించాడు .

            ఈ భావాత్మక విప్లవం తో బీథోవెన్ సంగీతత్వం పియానో కచేరీలు చేసే వాడిగా పూర్తీ అయి పోయింది .ఇక ఈ ఆర్కెస్ట్రా తో వేగ లేనను కొన్నాడు .వాళ్ళు కూడా ఈ చెవిటి ఆయన తో భరించ లేక పోతున్నారు .వియన్నాను వదిలి పెట్టి వెళ్ళి పోవాలనే ఆలోచనలో ఉన్నాడు .ఇది తెలిసిన అతని అరిష్తోక్రాటిక్ స్నేహితులు ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ ,ప్రిన్స్ లోబోస్కిన్ ,ప్రిన్స్ ఫెర్డినాండ్ కిన్స్లి ,లు బీథోవెన్ ను వియన్నాలోనే ఉంచే ప్రయత్నాలు తీవ్రం చేశారు .ఒక కాంట్రాక్ట్ ను మంచి ఆదాయం వచ్చే ఏర్పాటుతో కుదుర్చుకొన్నారు .ఏడాదికి నాలుగు వేల ఫ్రాన్క్లిన్లు అందజేసే కాంట్రాక్ట్ అది .సరే నన్నాడు .వీన్  ధియేటర్ ను ఏడాదికో సారి ఉచితం గా ఉపయోగించుకొనే అవకాశమూ కల్పించారు  తాత్కాలికం గా ఆర్ధిక సమస్య పరిష్కారమైంది .మళ్ళీ పని ప్రారంభించాడు బీథోవెన్ .కొత్త పియానో కచేరి నంబర్ అయిదు ‘’the emperor ‘’.చేశాడు .

                   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-1-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

ఎడిటోరియల్ పేజి వ్యాసాలు »

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం
-డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

 

నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ డిగ్రీని పొందారు. అమెరికన్ నాటక రంగంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టాను స్వీకరించారు. తండ్రి వెంకటసుబ్రహ్మణ్యశర్మ ప్రోత్సాహంతో 8వ సంవత్సరంలోనే రంగస్థల ప్రవేశం చేశారు.

 


రాముని బుద్ధిమంత తనం అనే నాటక రచనతో రచయితగా మారిన మొదలి విద్యార్థి దశలోనే అన్వేషణ, విషాదాంతం, జంట పక్షులు, చిన్నలు పెద్దలు, రాజదండం, అడ్డదారి వంటి నాటికలను రచించి ప్రదర్శించారు. కొప్పరపు సుబ్బారావు ప్రోత్సాహంతో ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, నాటక రంగ శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేశారు. ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయంలో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన శాక్రిఫైస్, అరబాల్ రచించిన పిక్నిక్ ఆన్‌ది బ్యాటిల్‌ఫీల్డ్ అనే నాటకాలకు దర్శకత్వం వహించి నాటక రంగ ప్రముఖుల ప్రశంసలు పొందారు.

ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. విషాదాంతం, అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, రాజా ఈడిపస్, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, మన్మధుడు మళ్ళీ పుట్టాడు. కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్చానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లశాఖ ఆచార్యులుగా సుదీర్ఘకాలం వ్యవహరించిన మొదలి రంగస్థల కళల శాఖకు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు. కేంద్రీయ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల కళల శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం, తెలుగు నవలా వికాసం, రంగస్థల శాస్త్రం, నాటక కర్త చిలకమర్తి, నూరేళ్ళ తెలుగు నాటక రంగం, నాటక శిల్పం, తొలినాటి తెలుగు గ్రామఫోన్ గాయకులు నాటక రంగ పారిభాషిక పదకోశం వంటి గ్రంథాలను రచించారు. ఏటుకూరి ప్రసాద్‌తో కలిసి నూరేళ్ళ కన్యాశుల్కం అనే గ్రంథానికి సంపాదకులుగా వ్యవహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన చేసి 64 జానపద క ళారూపాలపై ఆంగ్లంలో గ్రంథాన్ని రచించారు. యక్షగానం, తూర్పు భాగవతం, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలపై పరిశోధన గ్రంథాలను రచించారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, రష్యా, గ్రీక్ దేశాలలో పర్యటించి తోలుబొమ్మలాట కళారూపాన్ని స్వయంగా ప్రదర్శించారు.

తెలుగు విశ్వ విద్యాలయ ప్రతిభామూర్తి పురస్కారం, లలిత కళాపరిషత్(అనంతపురం) బళ్ళారి రాఘవ పురస్కారం, తానా సంస్థ విశిష్ట నాటక పురస్కారం, జానపద కళాబ్రహ్మ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ విశ్వకవి ఠాగూర్ అకాడమీ రత్న పురస్కారాలను పొందారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, కేంద్ర సంగీత నాటక అకాడమి, పాలకవర్గ సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ సంస్కాృతిక శాఖ సభ్యులుగా వ్యవహరించారు. పలు పర్యాయాలు హైదరాబాదులో జాతీయ, అంతర్జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తెలుగు, పాశ్చాత్య నాటకరంగాలపై 20వేల పేజీలకుపైగా సమాచారాన్ని సేకరించారు. నడిచే నాటకరంగంగా పేరుపొందిన మొదలి నాటక రంగ సమాచారానికి నిఘంటువుగా నిలిచారు.

డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
తెలుగు అధ్యాపకులు, నాటక రంగపరిశోధకులు
(నేడు విజయనగరంలో నంది నాటకోత్సవ ముగింపు సభలో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment