యజ్న నర్తన సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ- శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ -1

 యజ్న నర్తన సృష్టి కర్త  నృత్య ప్రపూర్ణ-
శ్రీ  సప్పా దుర్గా ప్రసాద్ -1 

          నట రాజ రామ కృష్ణ అంటే ఆంద్ర నాట్యానికి నిలు వెత్తు మూర్తి అని భావిస్తాం .అలాంటి రామ కృష్ణ గారి ని గురువు గా స్వీకరించి ,అంతే వాసిగా వుండి ,ఆయనపై వీర అభిమానాన్ని మనస్సంతా నింపుకొని ,తన గురువు ”పేరిణి శివ తాండవాన్ని పునః సృష్టి చేస్తే ,గురువుకు తగ్గ శిష్యుడి గా  తాను ”యజ్న నర్తనం ”అనే ప్రక్రియను సృష్టించి ,నృత్య విద్యాలయాన్ని స్థాపించి ,ఎందరికో నేర్పి ,గురు ప్రశంసను పొందిన ఆంద్ర నాట్య కళా కారులు ,”నృత్య ప్రపూర్ణ ”బిరుదాంకితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గారు .వారి జీవితం ఎందరికో స్ఫూర్తి .వారి జీవిత విశేషాలను తెలుసు కొందాం .
 నట రాజు తో పరిచయం
నట రాజ రామ కృష్ణ గారు వీరికి మాతామహుల తాలూకు తాత వరుస .రాజ మండ్రి నివాసి అయిన నాట్యా చార్యులు సప్పా  సత్య నారాయణ గారి కుమారులు .తండ్రి గారు ”వెంకటరాయ నాట్య బృందం ”స్థాపించి ,ఎన్నో ప్రదర్శనలిచ్చి ,దేశం లోనే పేరెన్నిక గన్న సుప్రసిద్ధ నాట్యా చార్యులు .వీరికి కళా రసజ్న సేఖరు లైన నార్ని కేదారీశ్వరుడు  గారు సహచరులు .నట రాజు గారు రాజమండ్రి వచ్చినపుడల్లా వీరింటి లోనే ఆతిధ్యం .చిన్న తనం లోనే రామకృష్ణ గారిని చూసి ,వారి వైదుష్యానికి ముగ్ధులై నారు దుర్గా ప్రసాద్ గారు .తాను కూడా వారి వద్ద హైదరాబాద్ లో నాట్యం నేర్చుకోవాలన్న ఉబలాటం వుండేది .అది చాలా ఖర్చు తో కూడిన పని అని తండ్రి గారు ప్రోత్స హించ లేదు .అయినా కోరిక పెరిగిందే  కాని తగ్గ లేదు .
విశ్వ విఖ్యాతనాట్య పండితులు నట రాజ రామ కృష్ణ గారికి ”సువర్ణ మకుటాభిషేకం”  కాకి నాడ లో జరిగింది .ఆ కార్య క్రమాన్ని ”ఆంద్ర గోపి కృష్ణ ”గా గుర్తింపు పొంది ,నాట్య రంగం లో రాష్ట్ర పతి ప్రశంసలు పొందిన ,నృత్య కళా కారులైన  వీరి తండ్రి గారే అందరి సహకారం తో ఏర్పాటు చేశారు .కాని ఆ రోజూ ఆయన  అనారోగ్య కారణం వల్ల కాకి నాడ వెళ్ళ లేక పోయారు .కుమారుడైన దుర్గా ప్రసాద్ ను నట రాజ  ను పుష్ప మాల తో అలంకరించ మని పంపారు .అక్కడే  రామ కృష్ణ గారి ముఖ్య శిష్యుడు ”కళా కృష్ణ ”తో  తొలి పరిచయం జరిగింది .నట రాజు గారికి పుష్ప మాల సమర్పించే అరుదైన అదృష్టం తనకు కలిగి నందుకు దుర్గా ప్రసాద్ పొంగి పోయారు .నట రాజు గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన నాట్యా చార్యులుగా ,నృత్య అకాడెమి అధ్యక్షులుగా వుండే వారు .అప్పుడు తూర్పు గోదావరి జిల్లా పసల పూడి దగ్గరున్న ”కుతుకు లూరు ”లో ”జాన పద నృత్యోత్సవం” నిర్వ హించారు .ఎందరెందరో కళాకారులు ఎన్నో వైవిధ్య భరిత నృత్యాలు చేసి అందర్నీ ఆశ్చర్య పర చారు .అది చూసి నటరాజు పరవశం చెందారు .తానూ ఒకడిగా మారి ఊగి పోయారు .దుర్గా ప్రసాద్ గారు రామ కృష్ణ గారి లోని కళా తత్వాన్ని ఇక్కడే పూర్తిగా అర్ధం చేసుకొన్నారు .ఆ సభలో ప్రముఖ నాట్యాచార్యులు కోరాడ నరసింహా రావు గారు కూడా వుండి గొప్ప ప్రేరణ కలిగించారు .
ఆ తర్వాత నట రాజు గారు రాజ మండ్రి లో వీరింటికి వచ్చి  ఆతిధ్యం స్వీకరిస్తూ బాల దుర్గా ప్రసాద్ ను ఆత్మీయుని గా భావించి దగ్గరకు తీసుకొన్నారు .ప్రసాద్ తండ్రి ”క్రీస్తు చరిత్ర ”ను నృత్య నాటకం గా ప్రదర్శించాలనే సంకల్పం తో అకాడెమి నుంచి ఆర్ధిక సాయం కోరారు .ఆ నాటకాన్ని స్వయం గా పరిశీలించా టానికి రామ కృష్ణ గారు రాజ మండ్రి విచ్చేశారు .వారి సమక్షం లో ప్రదర్శన జరిగింది .ఆ నాటకం లో దుర్గా ప్రసాద్ నాలుగు పాత్రలు ధరించారు .ఆ రోజూ ఒక నటుడు రాక పొతే ఐదో పాత్ర కూడా చేశారు .చూసిన నట రాజు ఆనంద తాండవమే చేశారు .ప్రసాద్ నటన ను మెచ్చారు .ఆ కుర్రాడు తన స్నేహితుడు సత్య నారాయణ గారి కుమారుడే నని తెలుసు కోని మరీ ఆనంద పడి పోయారు .కుర్రాడికి ఉజ్వల భవిష్యత్తు వుందని ఆశీర్వ దించారు నట రాజు .ఇంటికి వెళ్ళిన తరువాత కుర్రాడిని తన శిష్యునిగా చేయమని తండ్రి ని కోరారు .తండ్రి ఒప్పు కోలేదు .ఆ తర్వాత రెండు మూడు సార్లు రామ కృష్ణ ఒత్తిడి కూడా చేశారు .టేలిగ్రాములిచ్చారు .దుర్గా ప్రసాద్ గారిలో ”వీరుని లక్షణాలు ”పుష్కలం గా వున్నాయని ,అతన్ని ఉత్తమ కళా కారునిగా తీర్చి దిద్దే బాధ్యత  తనకు అప్ప గించమని కోరారు .ప్రసాద్ గారు స్వయం గా నట రాజు గారిని కలిసి తమ కుటుంబం పెద్ద దని ,పెళ్లీడు ఆడ పిల్లలున్నారని , తండ్రి గారి ఆరోగ్యం బాగా లేదని పెద్ద కుమారిడిగా తన బాధ్యత పెద్దదని తాను రాజ మండ్రి పేపర్ మిల్లు లో పని చేస్తునానని తనకు నేర్చుకోవాలని వున్నా పరిస్తితుల వల్ల రాలేనని మర్యాదగా వినమ్రం గా వినయం గా తెలియ జేశారు .ఖిన్నుడైన నట రాజు మౌనం వహించి వెళ్లి పోయారు .
 నృత్య శిక్షణ 
నట రాజు గారు ప్రసాద్ ను పంపమని తండ్రి గారికి చెబుతూనే వున్నారు ,కుటుంబానికేమీ భయం వద్దని  ,ప్రసాద్ భవిష్యత్తు ను తన చేతి లో పెట్ట మని మరీ బల వంతం చేశారు .అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .రాజ మండ్రి ఆంద్ర పేపర్ మిల్లు కూలీల సమ్మె వల్ల మూసే శారు .ప్రసాద్ గారికి మంచి అనువైన సమయం .ఆలశ్యం చేయ కుండా తండ్రి గారితో హైదరాబాద్ చేరి నట రాజు గారి వద్ద చేరారు .వారింట్లోనే తిండి మకాం .నట రాజు పూజా సామగ్రి తానే తెచ్చి నాట్య శిక్షణ ప్రారంభించారు .కోరిన  విద్యార్ధిశిష్యుడి గా  లభిస్తే గురువు ఆనందానికి  అవధులు వుండవు .ఉదయం అయిదు గంటల నుంచి ఏడు గంటల వరకు గురు సమక్షం లో ,శిక్షణ తో నృత్యాభ్యాసం చేసే వారు .ఆ తర్వాత ఉదయం పద కొండు గంటల వరకు పేరిణి శివ తాండవం నేర్చుకొనే విద్యార్ధులకు ప్రసాద్ గారు ఆయన సహ నటులు వారికి శిక్షణ నిచ్చే వారు .త్యాగ రాజ గాన సభకు వెళ్లి వాద్యాల సహ క్రంతో సాధన చేసే వారు .
గురువు తో కలిసి వీలైనప్పుడల్లా రవీంద్ర భారతి లో వున్న ”కళా భవన్ ”కు వెళ్లి కార్య క్రమాలను వీక్షించే ఇలా ఆరు నెలలు గది చింది .నటరాజు గారి పుత్ర వాత్సల్యం ముగ్ధుణ్ణి చేసింది .ఆయన దీక్ష ,పట్టుదల ,సాధన కు అబ్బుర పడ్డారు .లాకౌట్ ఎత్తేయటం తో మళ్ళీ రాజ మండ్రి వెళ్లి ఉద్యోగం లో చేరారు .రెండు నెలలు నాట్యశిక్షణ   ,ఒక నెల ఉద్యోగం గా దీర్ఘ కాల సెలవులను పెట్టి సాదించుకొన్నారు . .చాలా కాలమ్ ఇలానే జరిగింది .ఉద్యోగం చేస్తూ శిక్షణ నేర్చారు .ఆంద్ర నాట్యం ,పేరిణి శివ తాండవం లలో మంచిశిక్షణ   లభించింది .గురువంత వాడు అయారు .పేరిణి శివ తండ వాణ్ని నట రాజు పునః సృష్టి చేస్తున సమయం లో దుర్గా ప్రసాద్ ”నట్టు వాంగం ”జతి పలుకుతూ ,అందులో దిట్ట అని పించుకొన్నారు .ఇది తన గురువు  పెట్టిన భిక్ష అనే వారు దుర్గా ప్రసాద్ .దుర్గా ప్రసాద్ జతి చెబుతుంటే ”వేద నాదం ”విని పిస్తున్నట్లు వుండేది అని నిష్ణాతులు మెచ్చుకొనే వారు .తరువాత వేదాధ్యనము చేసి అందులోని తీరు ను స్వయం గా దర్శించారు ..http://nrityaprapurnasappadurgaprasad.com/dance.html
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -02 -12 .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అవి ఇవి కొన్ని – వార్త పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –22 వల్లూరు సంస్థానం -2

  ఊసుల్లో ఉయ్యూరు –22

                                          వల్లూరు సంస్థానం -2
సంస్థాన విభజన
1875 లో ఏడవ ఎడ్వర్డ్ -ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశం వచ్చాడు .నాయుడు ఆయనకు నాలుగు జింకల తో లాగే బండీ  ని కానుక గా ఇచ్చాడు .ప్రిన్స్ తో మద్రాస్ గిండీ పార్క్ లో ముచ్చటైన ఆ జ్జింక సవారీ బండి లో  సవారి చేశాడట..ఆ జింకల బండీ ని ఇంగ్లాండ్ తీసుకొని వెళ్ళాడు యువ రాజు .నాయుడికి బంగారు పతకం ప్రదానం చేశాడు .నాయుడు రైతుల నుంచి శిస్తు ను నగదుగా వసూలు చేశాడు .ఆదాయం బాగా పెరిగింది .తాళాలు ,ఇనుప సామాను తయారు చేసే కర్మా గారం నెలకొల్పాడు ..పంగిడి గూడెం నుంచి ,ఏలూరు కాలువ మీదుగా ,భీమ డోలు దాకా స్వంత ఖర్చుతో ,ఇనుప దారి నిర్మించి ,ప్రయాణం సౌకర్య వంతం చేశాడు .కార్ఖానాలలో రైలు చక్రాలు తయారు చేయించాడు .సంస్థానం సాంకేతికం గా అభివృద్ధి జరగాలి అన్న ముందు చూపున్న వాడు .1895 లో నాయుడి తమ్ముళ్ళు ఎస్టేటు లో భాగం కోరారు .వ్యాజ్యాలు నడి చాయి .అయిదు తరాల వరకు అవి భక్తం గా వున్న జమీందారి ,ఆరవ తరం లో విభక్తమైంది 1900 లోఉత్తర ,దక్షిణ వల్లూరు సంస్థానాలుగా చీలి పోయింది .అన్న నరసింహ నాయుడికి ఉత్తర వల్లూరు ,తమ్ముడు భాష్య కార్లు నాయుడికి దక్షిణ వల్లూరు దక్కాయి . .బందరు ,గూడూరు పరగణాలు దక్షిణ వల్లూరు కు చేరాయి .ఉత్తర వల్లూరు కు రాజధాని పంగిడి గూడెం .దక్షణ వల్లూరు కు వల్లూరు రాజధాని . 1918 లో నరసింహ నాయుడు మరణించాడు .కొడుకులు నాగన్న నాయుడు వల్లూరు ప్రభువైనాడు .ఈయన సోదరుడే  వెంకట రాయలు నాయుడు .ఇతని కుమారుడు రాజా రామేశ్వర ప్రసాద్ బహాదర్ .
మూడవ జమీందార్ అయిన నాగన్న నాయుడు పాలన లో కోట లో ఏనుగులు ,చిరుత పులులు ,శివంగి ,100 గుర్రాలు ఉండేవి .వాటిని ఉత్స వాలాలో ఊరేగించే వారు .పెద్ద కత్తి తో ఒకే ఒక్క వేటుకు పది మేకల్ని చంపి ,ప్రజలకు అన్నదానం చేసే వాడు .ఉత్స వాల్లో నాట్యం చేయ టానికి అయిదు భోగం మేళాలు వచ్చేవి .తోటలో పెద్ద తొట్టె వుండేది .భోగం వాళ్ళ తో అందులో జలక్రీడలాడించి ,వినోదించే వాడు .మూడు వేల ఎకరాల జమీ ఇది .కోట గోడలపై చిన్న కార్లు తిరిగేవి .అంత విశాలం .మేము మా చిన్న తనం  లో కోట గోడ లెక్కి చూసే వాళ్ళం గుర్రాలు ,ఏనుగులను చూసి ముచ్చట పడే వాళ్ళం .శివ రాత్రి కి వెళ్లి ఈ  ముచ్చట  తీర్చుకొనే వాళ్ళం .అప్పటికే కోట శిధిలమైంది .
దక్షిణ వల్లూరు మొదటి జమీందారు భాష్య కార్లు నాయుడు .1906 లో చని పోయాడు .1897 లో పుట్టి ,1917  లో మరణించిన సత్యనారాయణ వర ప్రసాద్ ఈయన కుమారుడే . .కుక్కలను ఎక్కువ గా  పెంచి ,వాటి పెళ్ళిళ్ళు చేసి  హడావిడి చేయటం వల్ల ”కక్కల రాజా ”అని పిలిచే వారు .మాకు కొంత వినికిడి  వల్ల ఆయన గురించి తెలిసింది .అట్టహాసం గా ఆడంబరం గా కుక్కల పెళ్ళిళ్ళు చేసి డబ్బంతా మంచి నీళ్ళు లా ఖర్చు చేశాడు .చివరికి తిండి కూడా లేకుండా జీవించాడు .విజయ వాడ వీధి అరుగుల మీద  పడక శీను .తిండి తిప్పలు  లేవు . .తాగుడుకు బానిసై పోయాడు .ఎవ్వరు పట్టించుకోలేదు .కుక్కల రాజా చివరికి కుక్క చావు చచ్చాడు పాపం .
దాక్షిణ వల్లూరు మళ్ళీ రెండు గా విడి పోయింది  .ఒక భాగానికి ఇనుగంటి వారు ,రెండవ దానికి బొమ్మ దేవర వెంకట భాష్య కార్లు జమీందారు లైనారు .1953 తర్వాత ,నరసింహ నాయుడి మరణం తో కోట దిక్కు లేనిది పూర్తిగా శిధిల మైంది .
కూలి పోయి నామ రూపాలు లేకుండా పోయింది .వారసులు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసు కొన్నారు .ఒకప్పుడు కళకళ లాడిన తోటల వల్లూరు సంస్థానం ఇప్పుడు వెల వెల బోయింది .
వల్లూరు సంస్థానం లో సాహిత్య సేవ 
ఇమ్మడి నాగన్న నాయుడు కవి ,పండితులను పోషించాడు .జాతీయ కల లను ,క్రీడా లను ప్రోత్స హించాడు .మల్ల యుద్ధాలు జరిపించాడు .మతాతీత పరిపాలన చేశాడు .మంచి క్రీడా కారుడే గాక వేట కాదు .చిరుత పులి వేట మహా ఇష్టం .వావిళ్ళ రామ స్వామి శాస్త్రి గారికి పుస్తక ప్రచురణ లో ఆర్ధిక  సహాయం చేశాడు .ఈ ఆస్థాన విద్వాంసుడు మతుకు మల్లి నరసింహశాస్త్రి   .మలయాద్రి నరసింహ స్వామి భక్తుడు .1816 -1873 ప్రాంతం వాడు ..నాగన్న గారి ఆస్థాన కవి , పరీక్షాది కారి .శంకరాచార్య పీథ విద్వాంసులతో తర్క ,మీమాంస శాస్త్రాలలో వాదం చేసి గెలిచిన వాడు .ఆంద్ర మేఘ సందేశం ,ఆంద్ర సిద్ధాంత కౌముది ,ఇందుమతీ పరిణయం(,చేన్నపురీ విలాసం జ్యోతిశ్శాస్త్ర సంగ్రహం ,పుండ్ర నిర్ణయ చంద్రిక, భారత శాస్త్ర సర్వస్వం ,వేంకటాచల యాత్రా చరిత్ర ,సర్రే కృష్ణ జల  క్రీడా విలాస నాటకం ,శ్రీ లక్ష్మీ నృసింహ శతి, సహస్ర నామా వళి  ,సంగీత సార సంగ్రహం వంటి ఎన్నో గ్రంధాలు రాశాడు .విభిన్న ప్రక్రియలలో రచనలు చేసిన విద్వన్ మణి  మతుకు మిల్లి నరసింహ శాస్త్రి గారు .  .
నవద్వీప పండితుడు కురుగంటి అయ్యప్ప శాస్త్రులు ,పరిమి శివయ్య ,ప్రభల సుందర రామ మూర్తి లను పరీక్షించి రాజు గారిచే  తర్క శాస్త్ర బహుమతులిప్పించారు  మతుకు మిల్లి వారు .మంత్రవాది లక్ష్మీ నారాయణ శాస్త్రి ,కొమాండూరి రఘునాదా చార్యులను వ్యాకరణం లో పరీక్ష చేసి రాజు గారితో సన్మానం చేయించారు .ఎల్లే పెద్ది రాఘవ శాస్త్రులు ,వంక మామిడి ,రామ శాస్త్రులను వేదాంతం లో పరీక్షించి సన్మానించాడు .పండితులను పరీక్షించటం లో దిట్ట అని పించుకొన్నాడు జమీందారు గారికి వీరి మాట వేద వాక్కే .
 తిరుపతి కవులు
భాష్య కార్లు నాయుడి పట్టాభిషేకానికి తిరుపతి కవులు వచ్చి ,ఘన సన్మానం పొందారు .”బొమ్మ దేవర సద్వంశ వర్ధనుండు -ఘన గునాధ్యుండు -శ్రీ భాష్య కార నృపతి -పుత్రవతి సతి తన దరి బొలుపు దెలుప -శ్రీ ధవుని గ్రూప పట్టాభి  షిక్టు డయ్యె   ”  ”అని దీవించారు .కుక్కల రాజా సత్యనారాయణ వర ప్రసాద్ కూడా గోపాల స్వామి ఉత్స వాలకు శాస్త్ర చర్చలు ,కవితా గోష్టులు ,అవధానాలు ,నాటక ప్రదర్శనలు ,నాత్యోత్స వాలు ,సంగీత సభలు నిర్వ హించే వాడు .గారిక పార్టి కోటయ గారిని ఆస్థాన గాయకుని గా నియమించాడు .అశ్వ ధాటి రామ మూర్తి ,హరి నాగ భూషణం తరచుగా ఈ సంస్థానాన్ని దర్శించి సంగీత కచేరీలు చేసే వారు .”నాగ భూషణము బాడే నాణె మెసగ ”అని తిరుపతి కవులు మెచ్చారు .చాలా సార్లు రాజా వారి నుంచి నూట పద హార్లు కానుకలు అందుకోన్నట్లు తిరుపతి కవులు రాసుకొన్నారు .
  నాటక ,మల్ల యుద్ధ పోషణ
తోట నరసయ్య అనే మల్ల యుద్ధ యోధున్ని ఆదరించి ,ప్రజలకు వ్యాయామ శిక్షణ నిప్పించారు .చైనా పులి పాక ,బొద్ద పాడు గ్రామాలలో గ్రందాలయాలు నెల కోల్పారు .వేణు గోపాలస్వామి వీరి కుల దైవం .ఆయన పేర ”సరస గుణ జాల -సంగీత సామ లోల -తోట్ల వల్లూరి గోపాల తోయ జాక్ష ”అనే మకుటం తో శతకం లభించింది .కవి ఎవరో తెలీదు .రాయభట్టు వీర రాఘవ కవి ,శ్రీ దాసు శ్రీ రాములు స్వామి వారి పై పదాలు రాశారు .శ్రీ రాములు గారు తన 12 వ ఏటఅంటే 1858 లో
అష్టావధానం చేశి ఇమ్మడి నాగన్న బహద్దర్ నుండి బహుమతి పొందారు .దక్షిణ వల్లూరు నాటక సంఘాలను పోషించాడు .”ఇండియన్ డ్రమటిక్ కంపెనీ” తోట్ల వల్లూరు లో వర్ధిల్లింది .” రంగ భూషణ ”అన్న బిరుదు పొందిన  నిడుముక్కల సుబ్బారావు ను సంస్థానం సముచితం గా సత్కరించింది .
  వల్లూరు శివాలయం
ఇక్కడి శివాలయం మహిమాన్విత మైనది .శివలెంక  వారి ఆలయం ఇది .ఎన్నో ఎకరాల భూమి ని స్వామి వారి  కి రాసిచ్చారు .ఇక్కడి నదీశ్వరునికి ప్రత్యెక కధా వుంది .రాత్రి పూట చేలల్లో మేస్తుంటే ,కాలికి ఇనుప గొలుసులు వేసి నట్లు కధనం .శివ రాత్రికి వారం రోజులు ఉత్స వాలు నిర్వ హిస్తారు .శివ రాత్రి నాడు స్వామి కల్యాణాన్ని వైభవం గా శివ లెంక  వారు చేస్తారు .శివ లెంక బస వయ్య గారు గొప్ప ప్లీడరు విజయ వాడ లో వుండే వారు .వారు సకుటుంబం గా ఇక్కడ కు వచ్చి ఉత్స వాలు జరిపించేవారు .పెద్ద తాటాకు పందిళ్ళు వేసే వారు ఊరందరికీ వారం రోజులూ రెండు పూటలా భోజాలు పెట్టె వారు .రాష్ట్రం లోని ఏరు మోసిన సంగీత విద్వాంసులు ,హరి కధకులు ,ఉపన్యాసకులు ,ఈ కార్య రామాల్లో పాల్గొని జన్మ ధన్యమయి నట్లు భావించే వారు .వారందరికీ ఉచిత వసతి భోజనం కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసే వారు .శివరాత్రి విందు భోజనాలుఇక్కడికి వచ్చి కార్య క్రమం లో పాల్గొనటం అదృష్టం గా భావించటం నాకు బాగా తెలుసు .పౌరాణిక నాటకాలు వేయించే వారు .అందరికి అర్హతను బట్టి సత్కారం వుండేది .బసవయ్య గారి వాక్కు వేద వాక్కే .ఇక్కడే మేము మా చిన్న తనం లో శివ రాత్రి నాడు అబ్బూరి వరప్రసాద్ వేసిన శ్రీ కృష్ణ రాయ బార నాటకం తెల్ల వార్లూ చూశాం .సంగీత విద్వాంసులలో హరి వారు సుసర్ల వారు ,మృదంగ విద్వాంసుడు రామ మూర్తి ,హరికధకులలో  అమ్ముల ,ముడునురి   మొదలైన వారు పాల్గొనే వారు .అదొక తిరుణాల లాగా జరిగేది. సాయంత్రం మళ్ళీ అందరికి టిఫిను టీ ఉండేవి. రాత్రి భోజ నాలు ఉప వాసం ఉన్న వారికి ఫలహారాలు ,చక్కటి నాదస్వరం ,వీణా వాదనలు ,ఫిడేలు సోలోలు అంతా సందడే సందడి .బుర్రకధకులు కూడా కధ చెప్పే వారు .స్థానం నరసింహారావు ,అబ్బూరి ,బందా వంటి వారు రావటం అంటే ,వారిని రప్పించటం అంటే అదంతా బస వయ్య గారి ప్రతిభే .శివ రాత్రి కి సినీ నటి భాను మతి కూడా వచ్చేది .ఆమె బసవయ్య గారి బంధువే .బసవయ్య గారిని అందరు ”అయ్యా వారు ”అనే వారు .ఈ వారం రోజులు అభిషేకాలు పూజలు గొప్ప గా జరిగేవి. పూజారి గారు కూడా శివ లెంక వారే .ఇపటికీ బసవయ్య గారివంశీకుల ఆధ్వర్యం లోనే ఆలయం నడుస్తోంది .ఎకదేక్కడి నుంచో భక్తులుకృష్ణా   స్నానానికి వచ్చి స్నానం చేసి ఆలయాలను దర్శించి ,ఇక్కడి కార్య క్రమాలను చూసి తరించే వారు .శివరాత్రి నాడు రాత్రికి కల్యాణం జరిపి మర్నాడు స్వామి వార్లను రధం మీద ఊరేగిస్తారు .
వల్లూరు సంస్థానం కధ సమాప్తం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -02 -12 .ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.co

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం

ఊసుల్లో ఉయ్యూరు –21

                            లలిత కళల  ఇల్లు  –  వల్లూరు సంస్థానం
సంగీతం ,నృత్యం ,చిత్రకళా ,చారిత్రిక  కావ్యాలు,ప్రబంధ రచనకు నిలయమైన సంస్థానం వల్లూరు .దీన్నే ”తోట్ల వల్లూరు ”అంటారు . మా ఉయ్యూరు కు అయిదు కిలో మీటర్ల దూరం లో కృష్ణా నది ఒడ్డున వుంది .అరవై గ్రామాలతో విలసిల్లింది .మచిలీ పట్నం విజయవాడ తాలూకా ల లోను ,పశ్చిమ గోదావరి లోని ఏలూరు తాలూకా లోను ఈ జమీందారి విస్తరించి వుంది .పచ్చని పంటలకు నిలయం .ఈ సంస్థానానికి వల్లూరే  రాజధాని .కృష్ణ కు తూర్పు గట్టున వుంది .కొబ్బరి ,మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుండటం తో తోట్ల వల్లూరు అయింది .కొంత కాలమ్ నూజివీడు ,చల్లపల్లి జమీందారి లో వుంది .౧౯౦౦ లో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరు లు గా మారింది .పట్నాల వంశీకులైన బొమ్మ దేవర వంశం వారు వల్లూరు పాలకుఅలైనారు .200 ఏళ్ళు వీరి పాలన లో వుంది ఆ కాలమ్ లో నిర్మించ ఆడిన వేణు గోపాల స్వామి ఆలయం అప్పట్నించి ఇప్పటి వరకు భక్తులను ఆకర్షిస్తూనే వుంది .
సంస్థాన ఆవిర్భావం 
1750 లో బొమ్మదేవర నాగన ఆయుడు మొదటి జమీందార్ .ఈయన్ను ఎడ్ల నాగన్న అంటారు .వందలాది  జతల ఎడ్లున్దేవి .గోల్కొండ నవాబులకు అవసర మైన ఆహార పదార్ధాలను  ఎడ్ల బండ్ల మీద ,హైదరాబాద్ తీసుకొని వెళ్లి అంద జేసీ వాడు .నవాబుల ఆస్థానం లో వున ఉల్ల్లి పొట్టు నిలవ చేసే గదిలో బంగారం ,వజ్ర వైదూర్యాలు కనిపించాయి .ఈ విషయం నాగయ్య ,నవాబు దృష్టికి తీసుకొని వెళ్ళాడు. వాటి పై వ్యామోహం పడని నవాబు ,వాటిని నాగయ్యకే అందజేశాడు .ఆ అపార ధన రాశుల్ని ఎడ్ల బండ్ల మీదనే వల్లూరు తోలుకు వచ్చాడు   నాగయ్య .తొమ్మిది ఎకరాల స్థలం లో ఆ ధనం లో కొంత ఖర్చు చేసి కోట కట్టించాడు .
 బ్రిటిష్ వారి కాలమ్ లో కూడా   ,ఎడ్ల బండ్ల మీద నీరు సరఫరా చేశాడు .కలెక్టర్ ఇచ్చిన లీజు భూమి తవ్వు తుంటే బంగారం లభించింది .అది నాగయ్య కే చెందుతుందని కలెక్టర్ ప్రకటించాడు .దానితో పెద్ద జమీందార్ అయాడు నాగన్న .అతని సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం  ”బహదూర్” బిరుదు ప్రదానం చేసింది . జమ్మి చెట్టు వద్ద వున్న బావి లో వేణు గోపాల స్వామి విగ్రహం  లభించింది .నాగన్న నాయుడే దాన్ని ప్రతిష్టించాడని ,ఆలయం నిర్మించాడని తెలుస్తోంది .తర్వాత దక్షిణ దేశ యాత్ర చేసి ,అక్కడి గోపుర నిర్మాణానికి  ఆశ్చర్య పోయి, ఇక్కడ కూడా 90 అడుగుల ఎత్తున రాజ గోపురం ,ముఖ మండపం నిర్మించాడు .ఆళ్వారుల ప్రతిష్ట కూడా చేశాడు .అప్పటి నుంచి బొమ్మ దేవర వారి దే మొదటి పూజ .12 రోజులు కళ్యాణ ఉత్స వాలు నిర్వహింప జేశాడు .ఏనుగుఅంబారి   పై గోపాలస్వామి తో పాటు నాగన్న కూడా ఊరే గే వాడట .నాగన్న 1750 నుంచి 1808 వరకు వున్నాడు .1803 లో కోట కట్టించాడు .శ్రీ రంగ పట్నం యుద్ధం లో నాగన్న సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ”రాజా  ”బిరుదు నిచ్చింది .౧౮౦౮ లో ఖమ్మం నుంచి తిరిగి వస్తు జబ్బు పది దారిలోనే మరణించాడట . .
     నాగన్న నాల్గవ కుమారుడు వెంకట నరసింహ నాయుడు తండ్రి చని పోయే  నాటికి మైనరు .తల్లి శేషమాంబ అతని తరఫున వ్యవహారాలూ చూసేది .నరసింహ నాయుడు కూడా ,తండ్రి లాగ కంపెని వారికి అణుకువ గా వున్నాడు .జమీని అన్ని విధాల అభి వృద్ధి చేశాడు .భార్య రాజ్య లక్ష్మి అని విధాల సహకరించింది .1829 లో నాయుడు మరణించాడు .కొడుకు ఇమ్మడి నాగన్న అప్పటికి అయిదేళ్ళ వాడు .నరసింహుని సోదరుడు వెంకయ్య నాయుడి భార్య వెంకమ్మ వ్యవహారాలూ చూసింది .దీనికి కారణం అతని తల్లి అంతకు ముందే మరణించటం .
  ఇమ్మడి నాయుడు కూడా తాత నాగన లానే వ్యవహార దక్షుడు .గోదావరి మండలం లోని వసంత వాడ ,కొప్పాక ,నారాయణ పురం దుద్దే పూడి ,ఎస్టేట్లను కోని జమీ ని  విస్తరించాడు .కొప్పాక లో వేణు గోపాల స్వామి దేవాలయం కట్టించాడు .వసంత వాడ లో వేంకటేశ్వరాలయం నిర్మించాడు .1857  లో సిపాయి తిరుగు బాటుగా పిలువ బడ్డ మొదటి స్వతంత్ర సంగ్రామం లో చాకచక్యం గా యుద్ధ సామగ్రి చేరా వేశాడు .ఆ నాటి బ్రిటిష్ రాని రౌద్ర నామ సంవత్స రామ్ లో ”భాసుర స్వర్ణ మయ బాహు పురియు ,రమ్య కాశ్మీర పట్టాంబర ద్వయము ”బహుమతి గా అంద జేసినట్లు ”చెన్న పురీ విలాసం ”లో వుంది .వేణుగోపాల స్వామికి అయిదు అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు .స్వామికి భువసతి కల్పించాడు .1869 లో పెద్ద కొడుకు వెంకట నరసింహ నాయుడు రాజు అయాడు .ఇతను బ్రిటిష్ వారికి ఎడ్లను సరఫరా చేసి ”దిల్లీశ్వర ప్రసాద సమా సాదిత రాజ బహద్దర ”మొదలైన బిరుదులు పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం —6 శ్రీ శైల ద్వార దర్శనం -1

  శ్రీ శైల ద్వార దర్శనం  -1

       శ్రీ శైలానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ,నాలుగు మూలలా నాలుగు ఉపద్వారాలు వున్నాయి .ఇవి చారిత్రకం గా ,పౌరాణికం గా హాలా ప్రసిద్ధి చెందినవి .వీటిని గురించి వివరం గా తెలుసు కొందాం .
     తూర్పు ద్వారం -త్రిపురాంతకం 

          త్రిపురాంతకం విజయ వాడ ,శ్రీశైలం బస్ మార్గం లో ,శ్రీశైలానికి 80 కి. .మీ .దూరం లో వుంది .ఇక్కడ కుమార గిరి మీద త్రిపురాంతక స్వామి   వెలసి వున్నాడు .అమ్మ వారు ”చిదగ్ని కుండ   సంభూత అయిన” త్రిపుర సుందరి దేవి” .ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా లో వుంది .
  స్థల పురాణం 
మధువు ,కైటభుడు అనే రాక్షస సోదరులుండే వారు .మధు కొడుకు సింహ వక్త్రుడు ,,సింహ శీర్షుడు .కైటభుని కొడుకుసింహ దంతుడు .ఈ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పు పొంది  ఇనుము ,వెండి ,బంగారు నగరాలను నిర్మించుకొని బల గర్వం తో విజ్రుమ్భించారు .వీళ్ళే త్రిపురాసురులు .దేవతలంతా శివుడి తో మొర పెట్టు కొన్నారు .ఆ ముగ్గురిని చంప టానికి  c శివుడు వారికి అభయం ఇచ్చాడు .భూదేవిని రధం గా చేసుకొన్నాడు శివుడు .నాలుగు వేదాలను గుర్రాలుగా ,,మేరు పర్వతం ధనుస్సు గా ,ఆదిశేషుడు అల్లె త్రాడుగా ,క్షీర సాగరం అమ్ముల పొది గా చేసుకొన్నాడు .మన్మధుడు  బాణం గా ,దేవత లందర్నీ సైన్యం గా చేసుకొని వారిపై యుద్ధం చేశాడు .అర్ధరాత్రికల్లా త్రిపురాసుర సంహారం చేశాడు మహా దేవుడైన శివుడు .అందుకే త్రిపురాన్తకుడయాడు .అలసి పోయిన శివుడు ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొన్నాడు .భ్రమ రాంబ ఇక్కడ చిదగ్ని కుండం లో త్రిపురామ్బికా దేవిగా ఆవిర్భవించింది .    త్రిపురాంతక స్వామి శిరస్సు పై గంగా ,ఎడమ వైపు పార్వతీ దేవి ,వుంటారు .ఇక్కడి నుంచి కాశీకి శ్రీ శైలానికి సొరంగ మార్గాలున్నాయని అంటారు . స్కందుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేసింది కూడా ఇక్కడే .అందుకే ఇక్కడి కొండకు ”కుమార గిరి ”అనే పేరు వచ్చింది .

                          దక్షిణ ద్వారం -సిద్ధ వటం 
ఇది కడప జిల్లాలో తిరుపతికి వెళ్ళే మార్గం లో వుంది .దీనికి ”జ్యోతిస్సిద్ధ వటం ”అనే పేరుంది .మర్రి చెట్లతో కూడిన ప్రదేశం .తూర్పు పడమర లుగా 32 కి.మీ .ఉత్తర దక్షిణం గా 18 కి.మీ.వ్యాపించిన వట వ్రుక్షాలున్డటం తో ఆ పేరు వచ్చింది .సిద్ధులకు ప్రధాన కేంద్రం గా వుండేది .ఇక్కడ సిద్ధేశ్వరుడు ,కన్యా శిద్దేశ్వరుడు ,బాల శిద్దేశ్వరుడు ,ఘంటా సిద్ధేశ్వరుడు ,ఇష్టా సిద్ధేశ్వరుడు ,వ్యోమ సిద్ద్దేశ్వరుడు ,భస్మ సిద్ధేశ్వరుడు ,భిక్షా సిద్ధేశ్వరుడు ,బిల సిద్ధేశ్వరుడు ,పురా సిదేశ్వరుడు ,జల సిద్ధేశ్వరుడు ,దేను సిద్ధేశ్వరుడు మొదలైన పేర్లతో ప్రత్యెక శివ లింగాలున్నాయి .ఇక్కడ తపస్సు చేస్తే సర్వ సిద్ధులు కలుగు తాయని పురాణ ప్రసిద్ధి .అగస్త్యుడు ,అత్రి ,వసిష్టుడు మొదలైన మహర్షులు తపస్సు చేసిన పుణ్య భూమి ఇది .కపిలుడు మొదలైన సిద్ధ ఋషులు నివసించిన క్షేత్రం .జ్యోతిర్నిలయం గా ప్రసిద్ధి చెందింది .
ఇక్కడ అనేక వనాలు శిఖరాలు నదులు ,తీర్దాలు ,శివ లింగాలు ,అనేక దేవతా మూర్తులు వున్నట్లు ప్రతీతి ”.శ్రీ పర్వత ఖండం ” లో దీని ప్రశస్తి బాగా వర్ణించ బడింది .ఇక్కడ 15 రోజులు తపస్సు చేస్తే చాలు పునర్జన్మ ఉండదని అంటారు .కాశీ తో సమాన మైన క్షేత్రం .
ఇక్కడి ఆలయం పెన్నా నది ఒడ్డున వుంది .ఇక్కడ ”దివ్య సిద్ధ వటం” అనే విశాల మైన మర్రి చెట్టు వుంది .దీని కింద చిన్ముద్ర తో దక్షిణా మూర్తి వున్నాడు .మర్రి చెట్టు ను తాకితేనే సర్వ పాపాలు పోతాయనే నమ్మిక వుంది .
 పశ్చిమ ద్వారం -అలంపురం 
ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలు కు దగ్గర లో తుంగ భద్ర నదీ తీరం లో వుంది . .ఇక్కడి అమ్మ వారు ”జోగులాంబ ”,యోగంబ ,యోగీశ్వారి యోగినీశ్వారి ,జోగాంబ ,జోగీశ్వారి పేర్లతో పిలువ బడే శక్తి స్వరూపిణి 18 శక్తి పీతాలలో ప్రసిద్ధ మైంది . .
   బాలబ్రహ్మ ,కుమార బ్రహ్మ ,అర్క బ్రహ్మ ,వీర బ్రహ్మ ,విశ్వ బ్రహ్మ ,తారక బ్రహ్మ ,గరుడ బ్రహ్మ ,స్వర్గ బ్రహ్మ ,పద్మ బ్రహ్మ అనే తొమ్మిది బ్రాహ్మల ఆలయాలున్నాయి .బాల బ్రహ్మేశ్వరాలయం లో ఆగ్నేయ మూల ”శ్రీ జోగులాంబా దేవి ”నెల కోని వుంది .అష్టాదశ శక్తి పీతాలలో అందరి అమ్మ వారాలు ప్రత్యెక దేవాలయాలుంటే ,ఇక్కడ జాగు లంబ కు ప్రత్యెక ఆలయం లేక పోవటం విచిత్రం .నిత్యనాద సిద్ధుడు అనే ఆయన రాసిన ”రస రత్నాకరం ”లోను ,భైరవ కవి రాసిన ”ఆనంద కంథము ”అనే గ్రంధం లోను బ్రహ్మేశ్వరాలాయానికి నైరుతి దిక్కున చింత చెట్ల మధ్య కుండం లో” జోగు లాంబ ”వుందని చెప్పబడి వుంది .పురా వస్తు త్రవ్వ కాలలో అక్కడ శిధిల మైన ఆలయం వున్నట్లు కనుగొన్నారు .శ్రీ శైలం డాం కట్టి నప్పుడు అలంపురం జోగులాంబ ఆలయం మునిగి పోకుండా ఎత్తైన గోడ కట్టారు .ఈ క్షేత్రాన్ని బాగా అభి వృద్ధి చేసిన వారిలో స్వర్గీయ గడియారం రామ కృష్ణ గారు అతి ముఖ్యులు .వారు వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద చిరివాడ లో వారింట్లో వుండి విద్య నేర్చారు .తన జీవిత  చరిత్ర ను  రాసుకొన్నారు .
    జోగులాంబ స్వరూపం 
              జోగులాంబా దేవి శవం ఆసనం గా కలిగి ,వ్రేలాడే స్తనాలతో ,వికృత మైన భయంకరమైన కన్నులతో ,నాలుగు చేతులతో ,మెడలో కపాల మాలతో ,దిగంబరం గా ,ఊర్ధ్వ కేశాలతో ,తల మీద  బల్లి కపాలం ,గుడ్లగూబ ,మండ్ర గబ్బ కలిగి అతి భయంకరం గా కనిపిస్తుంది .అందుకనే సూటిగా చూడకుండా ,ప్రక్కల నుంచి ఆమెను దర్శిస్తారు .శరన్నవ రాత్రి ఉత్స వాలు బాగా జరుగు తాయి .
  సృష్టికిపూర్వం   బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేశాడు .ఆయన అనుగ్రహం తో ”బాల బ్రహ్మేశ్వరుడు ”అయాడు .బ్రహ్మేశ్వరుడిని పూజిస్తే బ్రహ్మ పదం లభిస్తుందని కధ .జమదగ్ని ,పరశు రాముడు ఇక్కడ తపస్సు చేసినట్లుంది .ఇక్కడి ఆలయాలను ‘రస సిద్ధుడు ”అనే అతను కట్టించాడు .ఆతడు శివుని అనుగ్రహం వల్ల జన్మించాడు .అలంపురం లో తపస్సు చేసి సిద్ధి పొంది ,జోగులాంబ ,బ్రహ్మేశారుడు ,పార్వతి గణపతి ,భైరవ దేవత లను పూజించి రస సిద్ధిపొంది ,  ,”పరుస వేది ని సాధించాడు .నవబ్రహ్మాలయాలను ,వీరభద్ర ,జోగులాంబ ,కలకలేశ్వర ,భైరవ ,దుర్గా ది ఆలయాలు నిర్మించాడు .
విలసతుడు అనే రాజు ఇతని వద్ద వున్న పరుస వేది ని పొందాలన్న ఆశతో ఇతనిపైకి దండెత్తాడు .రససిద్ధుడు బాల బ్రహ్మేశ్వరుని  లో లీనమైనాడు .విలసతుడు రాజ్య భ్రస్తుడై ,తిండిలేక అడవుల వెంట తిరుగుతూ లేడిని వేటాడి మాంసం తెమ్మని ఒక భిల్లున్ని పంపాడు .ఒక లేడి కనిపించింది .దాని మీద బాణం వేయబోతుంటే ,తన బిడ్డకు పాలిచ్చి వచ్చే దాకా ఆగమని కోరింది .పిల్లకు పాలు ఇచ్చి వచ్చి మాట నిలుపు కొంది లేడి .రాజు ఇంతలో అక్కడికి వచ్చాడు .ఆలయాలను ధ్వంసం చేసినందుకు లేడి అతన్ని నిందించింది .రాజు తనకు ప్రాయశ్చిత్తం చెప్పమని దాన్ని ప్రాధేయ పడ్డాడు .బాల బ్రహ్మేశ్వర ఆలయం స్తంభాల మీద ,రస సిద్ధుని కధ ,తన కధ ,విలసతుని కధ చిత్రిస్తే పాపం నుండి విముక్తి కల్గు తుందని లేడి చెప్పింది .రాజు అలాగే చేసి విముక్తుడయాడు .
ఈ క్షేత్రాన్ని దర్శించి అభివృద్ధి చేసిన వారిలో ఇక్ష్వాకు రాజు రుద్ర పురుష దత్తుడు ,బాదామి చాళుక్యులు ,రెండవ పులకేసి ,విజయాదిత్య చాళుక్య సార్వ భౌముడు ,రాష్ట్ర కూటులు ,కళ్యాణ చాలక్యులు ,త్రిభువన మల్ల విక్ర మాదిత్యుడు రాణి మల్లా దేవి ,ఆహవ మల్లుడు ,కాకతి ప్రతాప రుద్రుడు ,కృష్ణ దేవ రాయలు మొదలైన వారున్నారు 
నవ బ్రహ్మాలయం శిల్ప కళా విరాజితం .అన్ని కాలాల శిల్ప కళా దర్శనం ఇస్తున్దిక్కడ .ఇక్కడ  జమదగ్ని మహర్షి భార్య ,పరశురాముని తల్లి అయిన ”రేణుకా దేవి ”విగ్రహం కూడా పూజలు అందు కొంటోంది ..
  ఉత్తర ద్వారం -ఉమామహేశ్వరం 
శ్రీ శైలం నుంచిహైదరాబాద్  వెళ్ళే దారిలో వుంది .మహబూబ్ నగర్ అచ్చంపేట లో వున్న క్షేత్రం .నల్లమల కొండల్లో ఒక కొండ పై వుంది .బస్సు సదుపాయం లేదు .మెట్ల దారి వుంది .స్కాంద పురాణం లో దీని వివరణ వుంది .ఇక్కడి రుద్ర ధార లో స్నానం చేసి ఉమా మహేశ్వర స్వామి ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని శ్రీ శైల ఖండం లో వుంది .ఇక్కడ అయిదు తీర్దాలున్నాయి కనుక మహా తీర్ధం అనే పేరు వచ్చింది .అవి రుద్ర ధార ,విష్ణుదార ,బ్రహ్మ ధార ఇంద్ర ధార ,దేవ ధార .పాల్కురికి సోమనాధుడు పండితా రాధ్య చరిత్ర లో  ఇక్కడ మహేశ్వరం ,గుప్త మహేశ్వరం ,చరుకేశ్వరం ,సంధ్యేశ్వరం ,గరుదేశ్వరం ,కాలహ్రదేశ్వరం ,పాపవినాశం ,గనేశ్వరం ,దేవహ్రదేశ్వరం ,సిద్దేశ్వరం,నీలహ్రదం అనే పద కొండు తీర్దాలున్నట్లు రాశాడు .కొండ  పై నుంచి దూకే జల ధారలను రుద్ర దార ,భస్మ ధార ,గౌరీ కుండం ,పాప నాశనం  గా చెప్పాడు .
ఉమామహేశ్వర స్వామి 


 ఉమామహేశ్వరలింగం స్వయంభు లింగం .కింది నుండి ,సుమారు 500 అడుగుల ఎత్తున కొండ చివర ఒక మహా శీలా బయటికి వచ్చింది .దానికిందనే ఉమా మహేశ్వరుడు వెలిశాడు .ఆ తర్వాత ఆ మహా శిలనే పై కప్పు గా చేసి ఆలయం నిర్మించారు .గర్భాలయాన్ని ఆనుకొని ఉమాదేవి  ఆలయం వుంది .దేవతా మూర్తుల ముందు శిలతో నిర్మించిన ”శ్రీ చక్రం ”వుండటం విశేషం.మహిషాసుర మర్దిని నందీశ్వర విగ్రహాలున్నాయి ,సంక్రాంతికి మూడు రోజుల బ్రహ్మోత్స వాలు జరుగు తాయి 
ఇప్పుడు మూలలో వున్న ద్వారాల దగ్గరకు వెళ్దాం 

  ఆగ్నేయ ద్వారం -సోమశిల 

దీనికి ”స్కంద సోమేశ్వరం ”అని కూడా  పేరు .నెల్లూరు ,కడప మధ్య నల్లమల లో పెన్నా తీర్సం లో వుంది .స్కందుడు అనే రుషి ఇక్కడ తపస్సు చేసి పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని తెచ్చి సోమ గుండం గట్టున పెట్టి స్నానం చేయటానికి సోమ తీర్ధం లో దిగాడు .సోమేశ్వరుడు ప్రత్యక్షమై ,నాడు .ఆ లింగం అక్కడే ప్రతిస్టించాడు .అమ్మ వారు కామాక్షీ దేవి

 నైరుతి ద్వారం -పుష్ప గిరి 

దీనికి’ ప్రసూనా చలం” అనే పేరు .కడప జిల్లా లో ఉత్తర పినాకినీ నదీ తీరాన వున్న క్షేత్రం .గరుత్మంతుడు అమృత భాండం తెస్తుంటే ,అందులోంచి ఒక బిందువు పుష్ప గిరి లోని సరస్సు లో పడింది .ఆ నీరు  తాగిన వారందరికీ చావు ,పుట్టుక లేకుండా సుఖ సంతోషాలతో వున్నారు .త్రిమూర్తులకు తెలిసి ఈ సరస్సును పూడ్చేయమని దేవతలను ఆజ్ఞా పించారు .వాయుదేవుడు ఎన్ని కొండ రాళ్ళను తెచ్చి అందులో వేసినా ,పూడి పోలేదు .చివరికి హను మంతుడు   లక్ష్మీ దేవి ని పూజించి ,ఒక పెద్ద కొండను అందులోకి విసిరేశాడు .

అది కూడా మునగ కుండా పువ్వు లాగా తేలింది .అది చూసినా పున్దరీకుడనే రాజు దానికి ”పుష్ప గిరి ”అని పేరు పెట్టాడు .హరి హరుడు కొండను తొక్కి పడితే అది నిలిచింది .
   ఈ కొండ పై ఆదికేశవ స్వామి ,సంతాన మల్లేశ్వరుడు ,లక్ష్మీదేవి ,తోక లేని హనుమంతుడు విగ్రహాలున్నాయి ఉమా మహేశ్వర ,నంది విగ్రహాలు దర్శనీయం.ఇక్కదిదేవతా విగ్రహాలను జనమేజయుడు ప్రతిష్టించినట్లు ఇతిహ్యం .
    మనకున్న పీఠాలలో పుష్ప గిరి పీఠం ఒక్కటే” అసలు సిసలు తెలుగు పీఠం ”.

వాయువ్య ద్వారం -సంగమేశ్వరం 


ఇక్కడ కృష్ణా నది అతి విశాలం గా సముద్రం లా గా కనిపిస్తుంది .కర్నూలు జిల్లా నది కొట్కూరు కు దగ్గరలో వున్న క్షేత్రం .దీనికి ”నివృత్తి సంగమేశ్వరం ”అని పేరు .కృష్ణ ,వేణి ,తుంగ, భద్ర ,భీమ ,రది  ,,మాల  భవ  నాశిని అనే ఏడు నదులు ఈ క్షేత్ర నాధుడైన సంగామేశ్వరున్ని సేవిన్కాతానికి ఇక్కడికి చేరాయట .ఇక్కడే దక్ష యజ్ఞం సందర్భం గా తండ్రి చేత అవమానం పొందిన దాక్షాయిని తన శరీరాన్ని నివృత్తి చేసుకోవా టం వల్ల నివృత్తి సంగ మేశ్వరం అనే పేరొచ్చింది .
గ్రహణం రోజున సప్త సాగరాలు అన్ని తీర్దాలు ఇక్కడికి చేరుతాయని ,అప్పుడు ఏఎ సప్త సింధు లో  స్నానం చేస్తే సర్వ తీర్ద్ సర్వసాగర స్నాన ఫలితం లభిస్తుందని నమ్మకం .
వసిష్ఠ మహర్షి శాపం వల్ల ”కల్మాష పాడుదు ”అనే రాజు ,రాక్షస రూపం పొందాడు .అతడు వసిష్టుని వంద మంది కొడుకుల్ని చంపి బ్రహ్మ హత్యా పాతకం తెచ్చుకొన్నాడు .విశ్వామిత్రుడు అతనిపాపాలన్ని    పోగొట్టి ,తాను ఆ పాపాలకు   బలి అయాడు .ఎంత ప్రయత్నించినా లాభం  లేక పోయింది .ఇక్కడికి వచ్చి సంగమేశ్వరం లో స్నానం చేసి గాయత్రి జపం చేసి శివుడిని ప్రతిష్ఠిస్తే పాపాలు పోయాయట .విశ్వామిత్ర గుహ ఇక్కడ వుంది .శాండిల్య మహర్షి ఇక్కడే  తపస్సు చేసి అంగ వైకల్యాన్ని పోగొట్టు కొన్నాడు .విశ్వామిత్ర గుహకు దగ్గరలో వసిష్టుడు ప్రతిష్టించిన నృసింహ స్వామి విగ్రహంవుంది .సప్త సోమేశ్వరులున్నారు .కపిల మహర్షి ప్రతిష్టించిన శివ లింగం వుంది .ధర్మా రాజు భీముడు ప్రతిష్టించిన లింగాలు వున్నాయి .
 అయితె ఇదంతా పూర్వ  వైభవమే .శ్రీశైలం డాం కట్టటం వల్ల ఇదంతా మునిగి పోయింది .సంగామేశ్వరాలయాన్ని ఇక్కడి నుంచి తర లించి అలంపురం లో నిర్మించారు

 ఈశాన్య ద్వారం -ఏలేశ్వరం 

మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఏలేశ్వర క్షేత్రం  వుంది .ఒకప్పుడు మహా పట్టణం .అనేక దండయాత్రల వల్ల నిర్జనం  అయింది నాగార్జున సాగర్ ముంపు వల్ల ఆనవాలు కోల్పోయింది .ఏలేశ్వర స్వామి కాత్యాయినీ ,హాటకేశ్వారి దేవేరులతో విలసిల్లె  క్షేత్రం . అష్ట భైరవ ,నవ దుర్గ ,నవ నార సింహ ప్రతిమలున్నాయి . .నదికి ఎడమ వైపు వున్న మల్లికార్జున గుట్ట పై రెండుఆలయాలున్నాయి .ఇక్కడి గుహలో ఇప్పటకీ సిద్ధులు వున్నారని నమ్మకం వుంది .  ఈ ఆలయాన్ని కూడా సాగర్ దగ్గర స్తూపం వద్దకు  తరలించి అక్కడ పునర్నిర్మించారు  . .

  పంచ  మఠాలు 

శ్రీశైలం లో ఆలయానికి వాయువ్యం గా 100 మీటర్ల దూరం లో,”ఘంటా మఠం ”వుంది .ఇదే బ్రహ్మం గారి మఠం .ఆయన ఇక్కడ తపస్సు చేశారని కధనం.దీని పక్కనే ఆరుముఖాలున్న విగ్రహం వుంది .ముందు మూడు ,వెనుక మూడు ముఖాలున్డటం ప్రత్యేకత .ఇది గాయత్రీ దేవి విగ్రహం గా బావిస్తారు .దీనికి ముందు ఎప్పుడూ నీరు ఊరే ఘంటా తీర్ధంవున్సి ఇక్కడి కుండం ,దానిపై వేలాడే గంటా వున్నాయి .షణ్ముఖ కుమారస్వామి విగ్రహం ముచ్చట గా వుంటుంది .     
దీనికి కొంచెం దూరం లో నల్ల రాయి మీద బీజాక్షరాలు రాసి వున్న యంత్రం వుంది .శాంతి మల్లయ్య అనే అతను ఇక్కడ  మఠం లో వుంటూవిభూతి   తయారు చేసి భక్తులకు ఉచితం గా ఇచ్చే వాడు .అందుకే ఆపేరు .ఇప్పుడిది లేదు
దీనికి దగ్గరలో రుద్రాక్ష మఠం వుంది .ఇక్కడి శివలింగానికి రుద్రాక్ష లతో పూజించటంవల్ల   ఆపేరు వచ్చి ఉండచ్చు .మల్లి శంకరస్వామి అనే మహనీయుడు మేలి రకం రుద్రాక్షలు  తెప్పించి భక్తులకిచ్చి ,ఆశీర్వ దించే వాడట .
దీనికి పైన ఎత్తున పది అడుగుల పుట్ట,అందులో.పదకొండు అడుగుల సర్పం వుంది .అనాదిగా ఇది ఇక్కడే వుంది .
ఇక్కడే వున్న” శివలింగానికి జటా జూటం ,రుద్రాక్ష మాల” వుండటం విశేషం .
దీనికి దగర లో సారంగధర మఠం వుంది  దీనికి చుట్టూ ఎత్తైన ప్రాకారం వుంది ..కుడి వైపున నేలలో పెద్ద గుహ వుంది .తపస్సు కు అనుకూలం ..సారంగేశ్వరుడు అనే మహర్షి  దీన్ని నిర్మించాడు .నందీశ్వర శివ లింగాలు నల్ల రాతి తో చెక్క బడి నాయి .
ఈ మఠానికి ఎదురుగా కపాల భైరవ స్వామి ఆలయం వుంది .
ఇవి శ్రీశైల ద్వార ,మఠా విశేషాలు
శ్రీ శైల యాత్ర సర్వం సంపూర్ణం

                ”సంధ్యా రంభ  విజ్రుమ్భితం  శృతి శిరస్థానాంత  రా  దిష్టితం 
                        సప్రేమ భ్రమ రాభి రామ   మసక్రుత్సద్వాసనా శోభితం 
                        భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం ,గుణా విష్క్రుతం 
                        సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ”.( శ్రీ శంకారాచార్య విరచిత- ”శివానంద లహరి”) 


మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .

శ్రీ శైల సందర్శనం —5

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

నవ్వుల పువ్వుల్లో పేలిన – అంకుల్ డయనమేట్ – నవ్య వీక్లి లో..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం —5

 శ్రీ శైల సందర్శనం —5

                                 నాగ లూటి వీర భద్రుడు 
భీముని కోలనుకు ఇరవై కి.మీ.దూరం  లో నాగలూటి వస్తుంది .ఇక్కడ పెద్ద చెరువు వుంది .కర్నాట యాత్రికులు ఇటే ప్రయాణం చేస్తారు .కొంత దూరం వెడితే ,’వీర  భద్ర విగ్రహం ”చాలా ఎత్తు గా  భయంకరం గా కన్పిస్తుంది .

  అక్క మహాదేవి గుహలు 
శ్రీ శైలం లో చుక్కల పర్వ తానికి సుమారు ఇరవై కి.మీ.లో వాయవ్యం గా  ఆరు గుహలున్నాయి .ఇందులో మధ్య గుహే అక్క మహా దేవి గుహ .ఆమె 12 వ శతాబ్ది ”శివ శరణుల ”లో పేరున్న మహా భక్తు రాలు.ఇక్కడే నివశించి ,ఒక గుహ లోని సహజ శివ లింగాన్ని పూజించింది .ఇక్కడికి రావా లంటే ,పాతాళ గంగ నుంచి , నీటిపై తేలే బుట్ట లలో చేరాలి .

ఇష్ట కామేశ్వరి 
శ్రీ శైల శిఖ రానికి కొంచెం దూరం లో వెలసిన అమ్మ వారే ఇష్ట కామేశ్వరి .కోరిన కోర్కెలు తీర్చే దేవి గా ప్రసిద్ధం .
 కదళీ వనం 
అక్క మహా దేవి గుహ నుండి అవతలి ఒడ్డు కు వెళ్లి ,పది కిలోమీటర్లు నడిస్తే కదళీ వనం చేర వచ్చు .ఇక్కడే అక్క మహా దేవి తపస్సు చేసింది./ఇక్కడ సుమారు 2000 మంది కూర్చుని తపస్సు చేసుకోవా టానికి వీలుగా ,కొండ సహజం గా ఏర్పడిన మండపం .ప్రక్కనే సన్నని నీటి వాలుంది .అందులోని నీరు సహజ మధురం గా వుండటం విశేషం .సాధకులకు తప్ప మిగిలిన వారికి ఈ కదళీ వనం కన పడదు అని శేష నాధుడు  రాసిన ”శ్రీ పర్వత పురాణం ”లో వుంది .
 దత్తాత్రేయ పాదుకలు 
కదళీ వనం సమీపం లో ,ఎడమ వైపు లోయ అంచు భాగం లో దత్తా త్రేయ పాదుకలు కని పిస్తాయి .దత్తాత్రేయ స్వామి శ్రీ శైలం రాక ముందు ,కర్నాటక లోని ,నర్సోబా వాడి ,ఔడుమ్బరం ,గంగా పురం ,మొదలైన క్షేత్ర సందర్శనం చేశారు .ఇక్కడ అరటి పత్రాల దొన్నె లో కృష్ణా నది దాటి శ్రీ శైలం వచ్చారు .కదళీ వనం లో తపస్సు చేసి మల్లికార్జున స్వామిని దర్శించి నట్లు ఆధారాలున్నాయి .
దత్తాత్రేయుడు అత్రి మహర్షి కుమారుడు .కలియుగం లో ,గోదావరి తీరం లో పిథా పురం లో శ్రీ పాద వల్లభుడు అనే పేరు తో జన్మించారు .కృష్ణా నదీ తీరం లో ”కురు గడ్డ ”దీవి లో భక్తులకు మోక్ష మార్గం ఉప దేశిస్తూ ,,తరువాత మహా రాష్ట్ర లోని ”కారంజ నగరం ”లో ”నృసింహ సరస్వతి ”గా జన్మించి ,శ్రీ శైలం  చేరారు .ఇక్కడ కదళీ వనం లో తపస్సు చేసినట్లు సంస్కృత మరాఠీ భాషల్లో రాసిన ”నరసింహ సరస్వ్త్యుపాఖ్యానం ”లో వుంది .
ఇప్పటి వరకు శ్రీ శైలం దగ్గర ఉన్న అన్ని ముఖ్య ప్రదేశాలను తనివి తీర చూశాం కదా .ఇప్పుడు స్వామి సేవలో తరించిన మహా రాజుల గురించి తెలుసు కొందాం
 మల్లికార్జున స్వామి సేవలో మహా రాజులు 
చారిత్రిక ఆధారాలను బట్టి శ్రీ శైలం క్రీ.శకం ఒకటవ శతాబ్ది నుండే  ప్రాభవం లో వుంది .శాత వాహన రాజులు దీని ”సిరిదాన్ ”అని పిలిచారు .క్రీ.శ.102 నుండి 130 వక్రకు దక్కను పీథ భూమిని పాలించిన శాత వాహన రాజు ”పులమావి ”
గోదావరి ఒడ్డున ఉన్న ”నాసిక్ ”లో గుహలో చెక్కిన శాసనం లో సిరిదాన్ పేరు కని పిస్తుంది .
ఇక్ష్వాకు మహా రాజులు క్రీ.శ.మూడవ శతాబ్ది లో ఈ ప్రాంతాన్ని పాలించారు .దీని శ్రీ పర్వతం అన్నారు .ఇక్ష్వాకులకు ”శ్రీ పార్వ తీయులు ”ఆనే పేరుంది .”వశిష్ట పుత్ర క్షాంత మాల ”ఈ ప్రాంతాని పాలించాడు .ఇతని ఏలుబడిలో పాక నాడు ,నుండి గుండ్ల కమ్మ మీదుగా ,బంగాళా ఖాతం వరకు పరి పాలించాడు .ఇతడు కుమార స్వామి భక్తుడు .శ్రీ శైలాన్ని విశేషం గా అభి వృద్ధి పరిచాడు .

పల్లవ రాజు సింహ వర్మ తన రాజ్యం లో దీన్ని కలుపుకొన్నాడు .త్రిలోచన పల్లవుడు ,ఇక్కడి అడవినికొంత  కొట్టించి ,నివాస యోగ్యం చేశాడు .ఇతన్ని ఓడించి పాలించిన కరి కాల చోళుడు ఆగి పోయిన పని పూర్తీ చేశాడు .
నాల్గవ శతాబ్దం లో విష్ణు కుండినుల యేలు బడి లోకి వచ్చింది తమ శాసనాల్లో తమను ”శ్రీ పర్వత స్వామి పాద ధ్యాతలు ”గా చెప్పుకొన్నారు .వీరు తూర్పు కనుమల లోని ”వాకాటకులు ”తో ,వివాహ సంబంధం కలుపు కోవటం వల్ల  వీరిద్దరి పాలన లోకివచ్చింది .
ఆరవ శతాబ్ది లో పల్లవరాజు మహేంద్ర వర్మ ,ఈ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడు .ఆరవ శతాబ్ది లోనే బాదామి చాళక్యులు కర్నాటక ను పాలించారు .అప్పుడే కరి కాల చోళుడు ,అతని సంతతి ఈ ప్రాంత రాజులైనారు .వారిలో రేనాటి చోళులు శ్రీ శైల పాలకులయారు .రాష్ట్ర కూట రాజు  దంటి దుర్గ బాదామి చాళుక్యులను ఓడించి,తెలుగు చోలులను కూడా జయించి నందు వల్ల రాష్ట్ర కూటుల అధీనం లోకి శ్రీ శైలం వెళ్ళింది .క్రీ.శ.973 లో మళ్ళీ చాళుక్యుల వశమైంది .తర్వాతా చాళుక్య చోళుల ఏలుబడి కి వచ్చింది .
 కాకతీయ రాజులు
కాకతి రాజు ప్రోలయ ఈ ప్రాంతాన్ని జయించి పాలించాడు 1162 నాటికి ఇది పూర్తిగా కాకతీయుల పాలన లోకి వచ్చేసింది .
1313 లో ప్రతాప రుద్రుడు ఇక్కడి అడవిని నరికించి ,వాస యోగ్యం చేశాడు .సతీ సమేతం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి తులాభారం తూగి స్వామికి కానుకలు సమర్పించాడు .అతని మంత్రి ”వేపేటి కొమ్మయ ”కమ్మ నాడు లో కొంత భాగాన్ని స్వామి మధ్యాహ్న అర్చనకు దానం చేశాడు .ఇక్కడ వేర్వేరు వ్యక్తుల చేతుల్లో వున గ్రామాలను ”ఈశ్వర శివా చార్యులు ”స్వాధీన పరచు కొని  వాటిని చక్క గా పర్య వేక్షించాడు .1323 వరకు ఇది కాకతి రాజుల పాలన లోనే వుంది .
 కొండ వీటి రెడ్డి రాజులు
అద్దంకి ప్రభువు వేమా రెడ్డి రాజ్యాన్ని శ్రీ శైలం నుండి ,కృష్ణా నది కి దక్షిణం గా తూర్పు  తీరం వరకు వ్యాపింప జేశాడు .
రాజధాని ని అడంకి నుంచి కొండ వీడు కు మార్చటం తో వీరిని కొండ వీటి రెడ్డి రాజులన్నారు .ప్రోలయ వేమా రెడ్డి తానూ శ్రీమల్లికార్జున స్వామి పాద సమారాధకుడి గా చెప్పు కొన్నాడు .ఇతనే మెట్లు కట్టిచి యాత్ర చేయ టానికి వీలు కల్పించాడు .తరువాతి రెడ్డి రాజులు పాతాల గంగ కు మెట్లు కట్టించారు .అనపోతా రెడ్డి కుమారుడు అన వేమా రెడ్డి మళ్ళీ స్వాధీనం లోకి తెచ్చుకొన్నారు .పిన తండ్రి అన్నయ రెడ్డికి పుణ్యం కోసం వీర శిరో మండపాన్ని కట్టించాడని చెప్పుకొన్నాం .1387 -1407 మధ్య కాలపు రాజు కుమార గిరి రెడ్డి శ్రీ శైల శిఖా రానికి మెట్లు కట్టించాడు .
  విజయ నగర రాజులు 
౧౩౯౩-౯౪ లో విజయ నగక్ర రాజు రెండవ హరి హర రాయల భార్య వితలాంబ పాతాల గంగకు మేట్లుకట్టించింది .వీటినే భక్తులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు .హరి హర రాయలు ముఖ మంద పాన్ని దక్షిణ గోపురాన్ని నిర్మించాడు .పేద కోమటి వేమా భూపాలుడు ఇతన్ని ఓడించి ,మళ్ళీ శ్రీ శైలాని వశం చేసుకొన్నాడు .రెడ్డి రాజ్యం అంట రించిన తరువాత మొదటి దేవ రాయలు శ్రీశైలం స్వాధీనం లోకి తెచ్చుకొన్నాడు .1456 లో సాలువ తిరుమలయ్య గుడికి చానా దానాలు చేశాడు .ప్రౌఢ దేవ రాయల  పరి చారిక కూడా చాలా దానాలు చేసింది .వీర నరసింహ రాయల వంశం వాడు మహా మంద లేశ పర్వ త్య భూములు ,తోటలు కట్టడాలు దానం చేశాడు .కృష్ణ దేవ రాయలు తోరపు గోపు రానికి ఎదురుగా ఉన్న రాధా వీధిలో రెండు ప్రక్కలా మండపాలు కట్టించాడు .రాయల సేవకుడు మల్లప్ప కానుకలేనో సమర్పించాడు .చంద్ర శేఖరా మాత్యుడు 1529 లో కళ్యాణ మండపం కట్టించాడు .గర్భాలయ ద్వారాలకు బంగారు రేకులు తాపటం కృష్ణ దేవ రాయ ,తిమరుసుల విగ్రహాలను పెట్టించాడు .ఆలయ విమానానికి కొంత వరకు బంగారం పూయించాడు . చేయించాడు .
   శివాజీ మహా రాజు
1674 లో శివాజీశ్రీ శైలాన్న్ని దర్శించి ఉత్తర గోపురాని న్ర్మించాడు .ఆలయ రక్షణ కోసం మరాఠీ సైనికులను  కాపలా గా ఉంచాడు . ”రోహిల్లా ”దండు ఆలయం పైకి దండెత్తి వచ్చినపుడు మరాఠీ సైనికులలో ఆఖరి సైనికుడు చనిపోయ వరకు వీర పోరాటం చేసి ఆలయాన్ని రక్షించు కోవటానికి శతధా  ప్రయత్నించారట .
 నవాబులు 
మొఘల్ చక్ర వర్తి ఔరంగా జీబు ఈ ప్రాంతాన్ని జయించి ”రాజా భీమ సింగ్ ”ను గవర్నరు ను చేశాడు .సేనాని దావూద్ ఖాన్ కు దీన్ని జాగీరు గా ఇచ్చాడు .తరువాత అతడి తమ్ముడు ఇబ్రహీం కు ఇది దక్కింది .అతడు 1712  నాటి దాస్తా వేజుల ప్రకారం ,శ్రీ శైలం దేవాలయం కింద భూము లన్నీ పట్టాలిచ్చి స్వాధీనం చేసే శాడు .మొగలాయి పాలన తరువాత హైదరాబాద్    నవాబుల కాలం లో  ” ఆసఫ్జ్హా” 1782 లో శ్రీశైల దేవ స్థాన నిర్వ హణ బాధ్యతను పుష్ప గిరి పీఠానికి దఖలు పరచాడు .
  పుష్ప గిరి పీఠం
బ్రిటిష్ వారు కూడా 1840 లో  ఆలయ బాధ్యతలను పుష్పగిరి పీఠానికే అప్ప గించారు .సుమారు 100 సంవత్స రాలు ఈ పీఠం అధీనం లో ఆలయం వుంది .అయితే పీఠం నిర్వహణ ఏ మాత్రం బాగా వుండేది కాదు .భక్తులా సౌకర్యాలను పట్టించుకొనే వారు కాదు .ప్రభుత్వం కొంతకాలం జిల్లా కోర్ట్ ఆదీనం లో ఉంచింది .తర్వాత పాణ్యం రామయ్య అనే వారి అధ్యక్షతన మేనేజి మెంట్ బోర్డు ను ఏర్పర చింది .1949 లో దేవాదాయ ధర్మా దయ శాఖ అధీనం లోకి ప్రభుత్వం శ్రీ శైల దేవాలయాన్నితెచ్చింది .అప్పటినుంచి ,మంచి అభివృద్ద కార్య క్రమాలు రవాణా సౌకర్యాలు  సత్రాల నిర్మాణం చేబట్టి ప్రజల ఆద రాభిమానాన్ని పొందింది . ఇక్కడితో శ్రీ శైల దేవాలయ సందర్శనం పూర్తి అయింది .ఇక మిగిలింది నాలుగు ద్వారాల విశేషాలు ,నాలుగు మూలల విశేషాలు న్నాయి . .వాటిని గురించి ఈ సారి తెలియ జేస్తాను  .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -02 -12 .

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 3 Comments

హర హర మహా దేవ శంభో శివ .. వార్త పత్రికల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

 శ్రీ శైల సందర్శనం –4

                                            చూడ దగిన ప్రదేశాలు
   శ్రీ శైల మల్లికార్జున ,భ్రమ రాంబా దేవుల దివ్య దర్శనం తారు వాత సమీపం లోని విశేషాలు తెలుసు కొన్నాం .ఇప్పుడు కొంచెం దూరం గా వున్న దర్శనీయ స్థలాల గురించి తీలుసుకొందాం .
అంకాలమ్మ గుడి -ప్రసంనాన్జనేయస్వామి -పాతాళఈశ్వర    -వితలేస్వర (vithalesvara )   -సాక్షి గణ పతులు
మల్లికార్జున గుడికి ఎదురు రోడ్డులో చివర ,కుడివైపు చెట్టు తొర్రలో వ్యాపించిన గుడినే అంకాలమ్మ గుడి అంటారు .
పాతాల గంగ రోడ్డు లో ,మెట్లకు ఎడమ వైపు శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం వుంది .ఇది 1460 నాటికే ఉండేదని ”అనాసినీ కిచెన్ ”అనే రష్యన్ రచయిత రాసిన గ్రంధం లో వుంది .స్శిదిల మై పోగా మళ్ళీ ఆలయాన్ని నిర్మించారు .
ఈ ఆలయానికి ఎదురు గా ,”పాతాలేశ్వర ఆలయం ”వుంది .
రెండవ హరి హర రాయల భార్య వితలాంబ , 1393 -94 లో పాతాళ గంగ కు మెట్లు నిర్మించి ,మార్గ మద్యం లో వితలేశ్వర ఆలయం కట్టించింది .శ్రీ శైలం ఆనకట్ట నిర్మించే టప్పుడు ముంపుకు గురికాకుండా ,ఆలయాన్ని మెట్లకు పైభాగాన కట్టారు శిల్ప సంపద కళ్ళకు దిగ్భ్రాంతి కల్గిస్తుంది .
భక్తులు స్నానం చేయటానికి వీలుగా ,మెట్లను పునరుద్ధ రించారు .త్రేలిగ్గా కృష్ణ లో స్నానం చేసి బిందెతో జలాన్ని తీసుకొని వెళ్లి మల్లికార్జున స్వామికి అభిషేకం చేసు కొంటారు .
  సిద్ది రామప్ప కొలను 
కర్ణాటక కు చెందిన ఆరేళ్ళ సిద్ది రామప్ప అనే శివ భక్తుడు ,మల్లేశ్వర స్వామిని ,వెతుక్కుంటూ ,వచ్చి కనపడక పొతే ,జీవితం వ్యర్ధం అని భావించి ,లోయలోకి డూకాడట . .  .అప్పుడు మలన్న ప్రత్యక్షమై ,చేయి పట్ట్టు కోని కాపాడిన ప్రదేశాన్ని సిద్ది రామప్ప కొలను అంటారు . అందుకే శ్రీ శైలం వెళ్ళే భక్తులు భక్తిగా ”ఆదుకో మల్లన్న ఆదు కోవయ్యా -చేదుకో మల్లన్న చేదు కోవయ్యా ”అంటూ నడిచి వెళ్తుంటారు .
  సాక్షి గణ పతి 
మల్లికార్జున ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరం లో సాక్షి గణ పతి ఆలయం వుంది .భక్తులు శ్రీ శైలాన్ని సందర్శించి నట్లు  ఈ గణ పతి ,కైలాసం లో సాక్ష్యం చేబుతాదట .
అందుకే ఆ పేరు .భక్తులు ఇక్కడ గణపతిని దర్శించి ,తమ గోత్ర ఆమాలు చెప్పు కొంటారు .ఆయన వీరి పేర్లను రాసుకొంటునట్లు విగ్రహం వుంటుంది .
నల్ల రాయి విగ్రహం .”సాక్షి గణ పతి కన్న తల్లివి -సద్గుణా వతి శాంభవీ ”అని స్త్రీలు పాటలు పాడుకొనే వారు పూర్వం .
  హాథ(hatha ) కేశ్వరాలయం 
ఇది పాల ధార ,పంచ ధార లకు ఎదురు గా వుంది .     కుమ్మరి వాడైన భక్త కేశప్ప కు శివుడు అటిక (కుండ పెంకు )లో బంగారు లింగ రూపం లో దర్శనం ఇచ్చిన ప్రదేశమే ఇది .అందుకే అటికేశ్వర ఆలయం  అనీ అంటారు .మండపానికి ముందున్న పందిరి కి పక్క వున్న తూము లో ”తెల్లని నాగు పాము ” ఎన్నో ఏళ్ళు గా నివశిస్తోంది .దేవతా సర్పం గా అందరు భావిస్తారు .అందరు తప్పక దర్శిస్తారు .. .
  పాల ధార -పంచ ధారలు 
సాక్షి గణ పతి ఆలయానికి కిలో మీటరు దూరం లో వున్నాయి .ఇక్కడే ఆది శంకారా చార్యులు తపస్సు చేశారని,ఇక్కడే ;;శివా నంద లహరి ”రాశారనిప్రతీతి .  ..ఇక్కడి గుహ లోనే స్వామి వుండే వారట .కంచి పీఠాది పతి వారు ఇక్కడే ఆది  శంకరులు తపస్సు  చేశారని యోగ దృష్టి తో చూసి చెప్పారట .అందుకే ఆది శంకరుల పాల రాతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు .కిందికి దిగ టానికి మెట్లున్నాయి .మెట్లకు ఎడమ వైపు ,ఒక నీటి ధార ,పక్కనే అయిదు నీటి ధారలు కన్పిస్తాయి .మొదటి దాన్ని పాల ధార అంటే శివుని ”ఫాల భాగం ”నున్చివచ్చిన ధార అని .మగిలినవి శివుని పంచ ముఖాల నుండి ఉద్భవించిన ధార లని స్థానికులు చెబుతారు .పాల ధార తెల్లగా వుంటుంది .మిగిలిన అయిదు ధారలు తియ్య గా వుంటాయి .అందుకే ఆ పేర్లు వచ్చాయి .ఈ ధారలు నిరంతరం ప్రవహిస్తూనే వుంటాయి . .ఎక్కడి నుంచి నీటి ధారలు వస్తున్నాయో ,ఎక్కడికి ఆ నీరు ప్రవ హిస్తుందో మిస్టరీ .పక్క నున్న లోయ లో కాని ,చుట్టూ ప్రక్కల ఎక్కడా నీళ్ళు కన పడవు .ఇక్కడే కన్పించటం విశేషం .ఈ నీరు ”భోగ వతి ”అనే పేరు తో పాతాళ గంగ అయిన కృష్ణా నది లో కలుస్తుందని ”శ్రీ శైల ఖండం ”లో వుంది .
  శిఖరేశ్వరం  
             శ్రీ శైల పర్వత శిఖా రాలలో ఇది అతి ఎత్తైన పర్వ త శిఖరం .సంముద్ర మట్టానికి 2830 అడుగులు వుంటుంది .శ్రీ శైలం నడిచి వెళ్ళటం చాలా కష్టం గా వుండేది .ఇక్కడికి చేరిన భక్తులు శ్రీ శైల శిఖరాన్ని ఇక్కడి నుంచే దర్శించి ,వెనక్కి ఇరిగి వెళ్ళే వారట ”అందుకే ”శ్రీ శైల శ్కిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్య తే ”అని లోకోక్తి వచ్చింది .శిఖర దర్శనం చేస్తే పండిన దోస కాయ -తొడిమ నుండి విడి పోయినట్లు మన పాపాలన్నీ ,విడి పోతాయట .శ్రీ రాముడు కూడా శిఖర దర్శనం చేశాడని వుంది .ఇక్కడే ”వీర శంకర స్వామి ”ఆలయం వుంది .ఆలయం పైన పెద్ద రోలు ,దానికి వున్న పొత్రం పై నండీ వుంటాయి .ఒకప్పుడు భక్తులు రోట్లో నువ్వులు పోసి ,పోత్రాన్ని తిప్పే వారు .నువ్వులు నలిగి ,నూనెకింద  వున్న వీర శంకర స్వామి లింగం పై అభిషేకం గా పడుతుండేది .కాలక్రమం లో రోలు అరిగి పోయింది .ఆలయం బాగు చెస్తున్నప్పుడు పైన వున్న రంధ్రం పూడి పోయింది .అయినా  ఇప్పటికి భక్తులు అక్కడే అమ్మే నువ్వులు ,బియ్యం కోని ర్రోట్లో వేసి తిప్పటం వుంది .నంది కొమ్ముల మధ్య నుంచి శ్రీ శైల శిఖరం చూసి తరిస్తారు .ఇది శ్రీ  శైలానికి ఎనిమిది కి.మీ .లో వుంది .
                             భీముని కొలను
  పాండవులు శ్రీ శైలం దర్శించి నపుడు ఒక సారి ద్రౌపదికి దాహం వేసింది .ఎక్కడా నీరు లేదు .భీముడికి కొం వచ్చి గద తో కొండను కొట్టాడు .కొండ రెండు గా చీలి ,నీరు ఉబికింది .ఇక్కడి నుంచి నీరు ప్రవహించి పాతాళ గంగ లో కలుస్తుంది .ఇదే భీముని కొలను .ఇక్కడే భీమేశ్వరాలయం వుంది .కర్ణాటక శివ భక్తులు ఉగాది పండుగకు ,నాగ లూటి ,పెద్ద చెరువు మీదుగా ,ఇక్కడికి చేరి ,ఇక్కడ నుండి  ,కైలాస ద్వారం హట కేశవరం ద్వారా శ్రీ శైలం చేరటం అల వాటు .
మిగిలిన విశేషాలు మరో సారి

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీ శైల సందర్శనం –3 శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం

  శ్రీ శైల సందర్శనం –3

                                         శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం
 మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన వేదిక మీద భ్రమరాంబా దేవి ఆలయం వుంది .మెట్లు ఎక్కి వెళ్ళాలి .మెట్లకు ఎడమ వైపు ,సిద్ది వినాయకుని విగ్రహం ,ద్వాపర యుగం లో ద్రౌపదీ దేవి ప్రతిష్టించిన పంచ లింగేశ్వరుడు వుండే వారు .ఆలయ పునరుద్ధరణ లో వీటిని తొల గించారు .కొన్ని మెట్లు యెక్క గానే ,అమ్మ వారి ఆలయ ధ్వజ స్తంభం ,సింహ మండపం ,వున్నాయి .మండపం లోని సింహం భయం కల్గిన్చేట్లున్తుంది .
మరి కొన్ని మెట్లు యెక్క గానే ,ముఖ ద్వారానికి ఎదుట త్రేతా యుగం లో సీతా దేవి ప్రతిష్టించిన ”సహస్ర లింగేశావర స్వామి ”వున్నాడు .
పూర్తి గా మెట్లు యెక్క గానే భ్రమ రామబా దేవి ఆలయం దర్శన మిస్తుంది .నిర్మాణ వివ రాలు తెలీవు .అయితె 1964 లో ప్రదక్షిణ మండపం కట్టారు .సుమారు 2000 సంవత్స రాల క్రితం ఇక్కడ ”వామా చారం ”బలీయం గా వుండేది .నిరంతరం జంతు బలి జరిగేది .శ్రీ శంకరా చార్యుల వారు ఇక్కడ అమ్మ వారి ఎదురు గా శ్రీ చక్రాన్ని ప్రతిష్టితం చేసిన తర్వాత ,”దక్షిణా చార సంప్ర దాయం” అమలైంది .1982 వరకు అమ్మ వారికి బయటే జంతు బలి ఇచ్చే వారు .ఇప్పుడు లేదు .
 అమ్మ వారి ఆవిర్భావం 
అరునాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ను గురించి తపస్సు చేసి ,రెండుకాళ్ళ జీవులు ,నాలుగు కాళ్ళ జీవులు వల్ల తనకు మరణం రాకుండా వరం పొందాడు .బరి తెగించిన ఆ దానవుడు అందర్నీ భయ పెట్టి ,లోకాలకు కంటకుడు గా మారాడు .దేవతలు అందరు తమ శక్తులన్నీ,ఆది పరాశాక్తికి అందించి ,వాడిని చంపమని వేడారు .ఆమె అరునాసురుని తో యుద్ధానికి తల పడింది .వేలాది తుమ్మెదలను వాడి సంహారానికి పూరి గొల్పింది .ఆరు కాళ్ళు జీవులైన అవి ,వాణ్ని ఒక్క సారిగా కుట్టి బాధించి సంహరించాయి .దేవతల కోరిక పై ఆది శక్తి ఇక్కడ ”భ్రమ రాంబా దేవి ”గా అవత రించింది .ఇప్పటికి ,ఆలయం వెనుక గోడల నుండి భ్రమర జ్ఝాన్కారం విని పిస్తుంది .నిల బడి వుండే అమ్మ వారు అలంకారం వల్ల కూర్చున్నట్లు దర్శన మిస్తుంది .18 శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ శైల పీఠం అధిష్టించిన ”భ్రామరీ శక్తి ”భక్తుల మనో భీష్టాలను తీర్చటం లో పేరు పొందింది .
  లోపాముద్ర -శిల్ప మండపం -రుధిర గుండం -యాగ  శాల 
అమ్మ వారి ఆలయం దక్షిణాన అగస్త్య మహర్షి అర్ధాంగి ”లోపాముద్ర ”విగ్రహం వుంది .ఆ దంపతులు శ్రీ శైలం సందర్శించి నట్లు క్షేత్ర మహాత్మ్యం లో వుంది .లోపాముద్ర  విగ్రహాలు ఇంకెక్కడా వున్నట్లు కనిపించదు .
ప్రదక్షిణ శిల్ప మండపం లో స్తంభాల పై శిల్పాలు సుందరం గా వుంటాయి .తొమ్మిది మంది స్త్రీలు ఏనుగు ఆకారం లో వున్న ”నవ నారీ కుంజరం ”,భద్ర కాళి ,శివ,విష్ణు ,నట రాజ మూర్తి శిల్పాలు ఆకర్ష ణీయం .
రుధిరం అంటే రక్తం .వామా చారం లో రక్తానికి ప్రాముఖ్యత ఎక్కువ .ఇక్కడ వేలాది జంతువుల బలి వల్ల ,ప్రక్క నున్న గుండం లో నీరు యెర్ర బడింది .అందుకే రధిర గుండం అనే పేరు .ఉత్త రాణ వున్న ఈ గుండం లోని నీటిని అమ్మ  వారి అభిషేకానికి వాడు తున్నారు .
ఆలయానికి ఈశాన్యం లో 16 స్తంభాల యాగ శాల వుంది .ప్రతి పూర్ణిమా ,నాడు ,దసరా ఉత్స వాలు , ,నిత్య చండీ యాగం  ఈ యాగ శాల లోనే జరుగు తాయి .
మల్లికార్జున ఆలయానికి నైరుతి లో సాల మండ పాలలో మెట్లు కని పిస్తాయి .మెట్ల పై భాగాన నట రాజ మూర్తి ,వున్నాడు .మెట్ల పైకి వెళ్తే ,నాగావళి తోట ,అందులో నిత్య కళ్యాణ మండపం వున్నాయి .ఆర్జిత నిత్య కళ్యాణాలు ఇక్కడే జరుగు తాయి .కళ్యాణ మండ పానికి చుట్టూ వున్న నాగా వళి తోట లో శివ భక్తు రాలు ”చంద్రా వతి ”మళ్లి కార్జున స్వామి కి మల్లె మాల వేస్తున్న దృశ్యం ,చత్ర పతి శివాజీ మహా రాజ్ కు  భ్రమ రాంబా దేవి ఖడ్గాన్ని ప్రసాదించే దృశ్యం నయన మనోహరం .అసలు అర్జున చెట్టు కు అంటే తెల్ల దిరిసెన చెట్టు కు మల్లె తీగలు అల్లు కోని అమల్లికార్జున స్వామి లింగం పైన అభిషేకం గా పడే వట .అందుకీ స్వామికి–” మల్లిక -అర్జునుడు అంటే మల్లికార్జునుడు ”  అనే పేరు వచ్చింది .కళ్యాణ మండపం మెట్ల కిరు వైపులా హరి హర మూర్తి ,అర్ధ నారీశ్వరుల శిల్పాలున్నాయి .
  శ్రీ అన్న పూర్ణ
స్వామి వారి ఆలయానికి ఈశాన్యం లో అన్న పూర్నా దేవి మందిరం వుంది .అక్కడ స్వామి వారికి నివేదనలు ,భోగాలు తయారు చేస్తారు .అన్నదానం ఇక్కడే జరుగు తుంది .
ఇప్పటి వరకు ఆలయాల లోపలి విశేషాలు చూసి తెలుసు కున్నాం .ఇప్పుడు ,ప్రాకారం బయట వున్న విశేషాలు చూద్దాం .
   శంకర మఠం -ఆరామ వీరేశ్వరం -గంగాధర మండపం -శారదా మఠం -నందుల మఠం 
రధ వీధి లో ఎడమ వైపు శ్రీ కంచికామ కోటి వారి శంకర మఠం వుంది .ఒకప్పుడు ఇక్కడ వారి వేద పాట్హ శాల వుండేది .
సాల మండ పాలకు ఎడమ వైపు ,దారిలో వెడితే వీర భద్ర స్వామి ఆలయం అంటే ఆరామ వీరేశ్వరాలయం వుంది శ్రీ నాధుడు ఈ దేవుణ్ణి విప రీతం గా వర్ణించాడు .
మెయిన్ గేటు వద్ద గంగాధర విగ్రహం ,శివుని శిరసు నుండి ,గంగ వెలువడే దృశ్యం ఇది .దీని దగ్గర శృంగేరి శారదా మఠం వారి శారదా దేవి విగ్రహం ,ఆదిశంకరుల పాల రాతి విగ్ర హాలు ముగ్ధ మోహనం .
వాయువ్యాన  ”నందుల మఠం ”వుంది .గుహలతో చూడ ముచ్చట గా వుంది .
 మల్లమ్మ కన్నీరు -గిరిజా శంకర -వరాహ తీర్ధం -పశు పతి నాద లింగం ,గోగర్భం
నందుల మఠం ను ఆనుకొనే మల్లమ్మ ఆవుల దొడ్డి ,ఆమె విగ్రహం వున్నాయి .విగ్రహం దగ్గర చిన్న గుంత నుండి నిరంతరం ప్రవిహిస్తుంది .దీన్నే ”మల్లమ్మ కన్నీరు ”అంటారు భక్తులు .స్కాంద పురాణం లో దీన్ని ”బిందు తీర్ధం ”అన్నారు .
బిందు తీర్దానికి దగ్గర లో మహా భక్తు రాలు  మల్లమ్మ పూజించిన గిరిజా శంకర ఆలయం వుంది .
దీనికి ఎదురుగా వరాహ తీర్ధం వుంది .తాగటానికి యోగ్య మైన నీరుండి .స్కాంద పురాణం లో దీన్ని వరాహ కుండం అని వుంది .
దీనికి ఎదు రుగా పశు పతి నాద లింగం, దానికి నాలుగు వైపుఅలా నాలుగు   ముఖాలు వుండటం తో దీన్ని ”పంచ ముఖ లింగం ”అంటారు .
దీని కి దగ్గరలో చెవి ఆకారం లో వున్న తీర్ధాన్ని గోకర్ణ లేక గోఅర్భ  తీర్ధం అంటారు .గోకర్ణ రుషి ఇక్కడ తపస్సు చేసి  నట్లు  చెబుతారు .
ఆలయానికి ఆగ్నేయం లో ”బయలు వీర భద్రుడు ”వున్నాడు .ఈ క్షేత్రాన్ని కాలి కాస్తాడు కనుక ”కావాలి వీర బహాద్రుడు ”అనీ అంటారు .ఈ మండ పానికి పై కప్పు వుండదు .కారణం -ఎండా ,వాన అని చూడ కుండా క్షేత్ర పాలకుడి లా అనుక్షణం  కాపలా కాయాలి కనుక .
  శివాజీ స్ఫూర్తి కేంద్రం 
శివాజీ మహా రాజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి,కోత కాలమ్ ఇక్కడ వున్నాడు .ఆలయానికి ఉత్త రాణ శివాజీ గౌరానికి ఎదురు గా పూర్వం శివాజీ నివశించిన భవనం వుండేది .దీన్నే శివాజీ ధ్యాన మందిరం గా భావించే వారు .ఇది శిదిలయం అయింది .ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి స్ఫూర్తి మందిరం ,అందులో ఎత్తైన శివాజీ విగ్రహం నిర్మిస్తున్నారు .
దీనికి ఉత్త రాన చంద్ర కుండం  వుంది .దీన్ని ఇప్పుడు పూడ్చే శారు .ఇక్కడే . పెద్ద గుహ ఉండేదట .ఎక్కడికి దారి తీసేదో తెలీదు అని పెద్దలు చెబుతారు .దీన్ని గురించి స్కాంద పురాణం లో వివరం గా వుంది .
ఇప్పటి వరకు మల్లికార్జున ఆలయానికి సమీపం లో వున్న దేవాలయాలను, విశేషాలనుతెలుసు కున్నాం .
మిగిలిన విశేషాలు   మరో సారి
శ్రీ శైల సందర్శనం –1
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .
Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం

 శ్రీ శైల సందర్శనం –2 

                                            మల్లికార్జున మహా లింగం 
    సుమారు మూడు లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీ శైల స్వామి ఆలయం చుట్టూ ,2121 అడుగుల పొడవు ,20 అడుగుల ఎత్తు వున్న ఎత్తైన గోడ కోట గోడ లా వుంది .ఈ ప్రాకారం లో 3153 శిలలున్నాయి .వీటి అన్నిటి పైన బైట అంచులో శిల్పాలు చెక్క  బడి వున్నాయి .ఎనిమిది దిక్కుల ,అష్ట భైరవ స్వాములు ప్రతిష్టింప బడి వుంటారు .ప్రాకారానికున్న నాలుగు వైపులా గోడ లపై ,కింది వరుసలో ఏనుగులు ,గుర్రాలు వివిధ భంగి మలలలో చెక్కి వున్నాయి .తూర్పు గోడ మీద పార్వతీ కల్యాణం ,కిరాతార్జు నీయం ,గజాసుర సంహారం ,శివ తాండవం ,మార్కేండేయ కధ ,శిబి చక్ర వర్తి కధ ,క్షీర సాగర మధనం ,శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యం ,,భక్త కన్నప్ప ,తారకాసుర సంహారం త్రిపురాసుర సంహారం ,మహా లింగోద్భవం ,శివ తపోభంగం ,వీర శైవుల ఆత్మార్పణ ,గణేశుడు మల్లికార్జున స్వామిని అర్చించటం ,మొదలైన చిత్రాలు కళ్ళకు విందు చేస్తాయి  .దక్షిణం లో వున్న గోడ పై ,దక్ష యజ్ఞం ,పార్వతీ కల్యాణం కు అష్ట దిక్పాలకుల సన్నాహం ,కన్నప్ప, ,శివుడి భిక్షాటనం ,గణపతి నాట్యం ,చేస్తుంటే ,హనుమ వేణువు ను ఊదే దృశ్యం ,నాగ బంధం మహిషాసుర మర్దిని ,గండ భేరుండం అత్యద్భుత శైలి లో చిత్రాలుగా మలచ బడి నాయి .ఉత్తర గోడపైన శివ తాండవం ,గంధర్వ స్త్రీల నృత్యం ,యమధర్మ రాజు ,గండ భేరుండం ,భ్రున్గీశ్వరుని నాట్యం ,శివుని విశ్వ రూపం ,మనోహరం గా వుంటాయి .పడమటి వైపు పది భుజాల గణ పతి అరుదైన దృశ్యం .
ఈ ఆలయానికి ఆలుగు వైపులా గోపు రాలున్నాయి .తూర్పు గోపురాన్ని కృష్ణ దేవ రాయ గోపురం అంటారు .దీన్ని 15 వ శతాబ్ది లో కట్టించాడు రాయలు .1516 లో ఆ గోపు రానికి ఎదురు గా వున్న రధ వీధిలో రెండు వైపులా రెండు మండ పాలను కూడా కట్టించాడు .దక్షిణ గోపురాన్ని 1405 లోరెండవ హరి హర రాయలు నిర్మించాడు .ఇదే హరిహర రాయల గోపురం .ఉత్తర గోపురమే చత్ర పతి  శివాజీ మహా రాజు గోపురం .1677 లో ఆయనే కట్టించాడు .పడమటి గోపురం ను ౧౯౬౫ లో దేవస్థానమే కట్టించింది .దీన్ని బ్రహ్మా నంద గోపురం అంటారు .
      ఈ నాలుగు గోపురాల మధ్య బంగారు శిఖా రాలతో కనిపించే ప్రధాన ఆలయ విమాన గోపురాన్ని 1230 లో కాకతియ  గణ పతి దేవ  చక్ర వర్తి   సోదరి మైలమ దేవి నిర్మించింది .ఇవి దాటి గర్భాలయం లోకి ప్రవేశిద్దాం
మల్లికార్జున ఆలయం లోని గర్భాలయం చాలా చిన్నది .లింగము చిన్నదే .అందుకే ”మూర్తి చిన్నది ,కీర్తి గొప్పది ”అనే పేరు వచ్చింది .ఇది రెండవ జ్యోతిర్లింగం .మన శిరస్సును స్వామి లింగానికి ఆనించి మొక్కటం ఇక్కడి సాంప్రదాయం .ఇప్పుడు రద్దీ ఎక్కువ అవటం తో ఆ ఆవ కాశం లేదు .
    ఆలయానికి ముందు రంగ మండపం వుంది .దీనికి తూర్పు,దక్షిణ ,ఉత్తర దిశల్లో ద్వారాలు ,వాటి ముందు స్తంభాలతో వసారాలు గల ముఖ మండపాలు వున్నాయి .రెండు వైపులా వున అరుగు ల పై శాసనాలు చాలా వున్నాయి .మండపాన్ని విజయ నగరచక్ర వర్తి రెండవ హరి హర రాయలు 1405 లో నిర్మించాడు .ఈ మండపం లోపల ఒక వైపు రత్న గణ పతి ,రెండవ వైపు హద్ర కాళి ,వీర భద్ర విగ్రహాలున్నాయి ..
రంగ మండ పానికి ముందున మండపమే” వీర శిరో మండపం ”రెడ్డి రాజు అన వేమా రెడ్డి తండ్రి అన్నయ్య రెడ్డి పుణ్యం  కోసం 1378 లో దీన్నికట్టించాడు .ఈ మండపం లోనే ఎంతో మంది వీర శైవ భక్తులు తమ నాలుకలను ,చేతులు ,కాళ్ళను ,శిరస్సులను ఖండించుకొని శివునికి అర్పించే వారని  ఇక్కడి శాసనం తెలియ జేస్తోంది .38 స్తంభాలతో వుండేది ..ప్రస్తుతం 16 మాత్రమే వున్నాయి .  .
   వీర మండ పానికి ముందు నంది మండపం వుంది .కాకతియ  ప్రతాప రుద్ర చక్ర వర్తి కట్టించినట్లు కధనం .ఇదే బసవన్న మండ పం .కన్నడం లో బసవన్నను ‘చెన్ను కళ్ళు బస వన్న ”అనే వారు .ఇప్పుడు కూడా గంగి రెడ్డు ల వాళ్ళు గంగి రెడ్డు ను నంది అవతారం గా భావించి ”బసవన్న ”అని పిలుస్తున్డటం మనకు తెలుసు .డూ డూ బసవన్న అనే పేరు తెలుగులో జాతీయం అయింది కదా .చెన్ను కళ్ళు బస వన్న కాళ క్రమం లో ”సెనగల బస వన్న ”అయాడు .ఈ బస వంనకు సెనగలు ప్రీతి .శనగలు మొక్కుకొని ,ఆయనకు నివేదన గా అందిస్తారు .మల్లికార్జున స్వామి లాగే ఈయనా భక్త సులభుడే .గిద్దెడు సెనగలు బసవన్న మూతికి కడితే భక్తుల కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం .ఈ మండ పానికి మూడు వైపులా మండపాలున్నాయని చెప్పుకొన్నాం .పై భాగం లో దక్షిణా మూర్తి ,లోపల అష్ట దిక్పాలకుల శిల్పాలు ఆకట్టు కుంటాయి .
  సప్త మాతృకలు
ఆలయానికి ఉత్తర ,దక్షిణ భాగాలలో సాల మండపాలున్నాయి .దక్షిణ సాల మండ పానికి ఆనుకొని బ్రాహ్మీ ,మాహేశ్వరీ ,కౌమారీ ,వైష్ణవీ ,వారాహీ ,ఇంద్రాణీ ,చాముండీ ,అనే సప్త మాత్రుకల విగ్రహాలున్నాయి .చైత్ర పున్నమి  తారు వాత అమ్మ వారి కుంభోత్సవం జరుగు తుంది .అప్పుడు ,ముందుగా ఈ సప్త మాత్రుకలకు నైవేద్యం పెట్టిన పదార్ధాన్నే ,భ్రమ రాంబా దేవికి తీసుకొని వెళ్లి నైవేద్యం పెడ తారు .మిగతా కాలమ్ లో వీటికి ఏ రక మైన ప్రాధాన్యతా లేదు .
         మనోహర గుండం 
సప్త మాత్రుకలకు ముందు ,మండపం లా కని పించే పై కప్పు ఒకటి వుంది .దీనికి కిందికి దిగ టానికి మెట్లు వున్నాయి .ఇందులో నీళ్ళు తియ్య గా మనోహరం గా వుంటాయి .ఇలాంటివి ఆలయ ఆవరణ లో 100 దాకా ఉండేవని చెబుతారు .పూర్వ కాలమ్ యాత్రికులకు ఈ జలమే ఆధారం .ఇప్పుడు కృష్ణ నీరు కొండ పైకి గొట్టాల ద్వారా వస్తోంది కనుక దాదాపు అన్నిటినీ పూడ్చేశారు .
 బ్రహ్మ గుండం -విష్ణు గుండం
మల్లికార్జునాలయానికి ఆనుకొని దక్షిణ దిశ లో బ్రహ్మ గుండం వుంది .సప్త మాత్రుకలను ఆనుకొని పడమర వైపు విష్ణు కుండం వుంది .దిగటానికి మెట్లున్నాయి దీన్ని ”పాతాల బావి ”అంటారు .
 నవ బ్రహ్మాలయాలు 
  దేవాలయానికి పడమటి వాయువ్యం లో తొమ్మిది ఆలయాలున్నాయి .శివ దేవుని అష్ట మూర్తు లైన భవ మూర్తి ,సర్వ మూర్తి ,ఈశాన మూర్తి ,పశు పతి మూర్తి ,రుద్ర మూర్తి ,ఉగ్ర మూర్తి ,భీమ మూర్తి మహాదేవ మూర్తి ,ఆలయాలు ఇవి .ఇవి వరుసగా జల లింగ ,భూలింగ ,సూర్య లింగ యాజమాన లింగ ,అగ్ని లింగ ,వాయు లింగ ,ఆకాశ లింగ ,చంద్ర లింగాలు .ఈ పేరు ఎందుకు వచ్చిందో ఎవరు చెప్పలేదు .వీటికి ఆనుకొని కుమారస్వామి ఆలయం లో షణ్ముఖుడు గా అద్భుత మూర్తి తో స్కందుడు విరాజిల్లు తున్నాడు .దీనికి ఆనుకునే ”ఆస్థాన మండపం ”వుంది .పూర్వం మల్లికార్జున దర్శనానికి వచ్చే రాజులు ఇక్కడే కొలువు తీరే వారు .ఇక్కడే ఉత్సవ మూర్తులకు అలంకరణ చేసే వారు .అందుకే ”అలంకార మండపం ”అనీ అంటారు .
                              మల్లమ్మ -అక్క మహా దేవి
ఆస్థాన మండపానికి లోపల ఒక గదిలో మళ్లి కార్జున భక్తు రాళ్ళు అయిన హేమా రెడ్డి మల్లమ్మ ,అక్క మహా దేవి విగ్రహాలున్నాయి
   ఉమామహేశ్వర స్వామి 
ఉత్తర సాల మండపం ఆలయాలలో పార్వతీ దేవిని తన వాఆంకం మీద కోర్చో పెట్టు కొన్న ఉమా మహేశ్వర స్వామి వున్నాడు .మనోహర మైన శిల్పం .దీనినే  ”పంచ నందీశ్వరుడు ”అంటారు .
 అద్దాల మండపం
ఉత్తర సాల మండపం చివర అద్దాల మండపం వుంది .దీన్ని 1529 లో చంద్ర సేఖరామాత్యుడు కట్టినట్లు శాసనం వుంది .స్వామి వార్ల కల్యాణం ఇక్కడే జరిగేది భక్తుల సంఖ్య పేర గతం తో ను ,నిత్య కళ్యాణాలు జరుగు తున్డటం తోనూ పెద్ద కళ్యాణ మండ పాన్ని దేవాలయం కట్టించింది .ఇప్పుడు పాథ దాన్ని ”అద్దాల మండపం ”గా తీర్చి దిద్దారు .స్వామి వార్ల పవ లింపు సేవ ఇప్పటికీ ఇక్కడే జరుగుతుంది .అంటే కాదు -మహా శివ రాత్రి నాడు జరిగే భ్రమ రాంబా మళ్లి కార్జున స్వామి వార్ల కల్యాణం ,సంప్రదాయ బద్ధం గా ఈ అద్దాల మందిరం లోనే జరగటం విశేషం .దీనికి ప్రక్కనే శ్రీ రాజా రాజేశ్వరి ఆలయం వుంది .
  అర్ధ నారేశ్వర -పాండవ లింగాలు –వీర భద్ర స్వామి 
గర్భాలయానికి ఉత్తరం వైపు అర్ధనారీశ్వర ఆలయం వుంది .దీనికి ఉత్త రాణ ద్వాపర యుగం లో పాండవులు ప్రతిష్టించిన అయిదు లింగాలు ,వాటికి ఆలయాలు వున్నాయి .వీటికి ఉత్త రాన వీరభద్ర స్వామి ఆలయం వుంది .ఆయుధం ధరించి భీకరం గా కనిపిస్తాడు .ప్రాకారం పైన ,బయటా అనేక వీర భాద్రులున్నారు .వీర శైవ సంప్రదాయానికి ఇవి ప్రతీకలు .
 మల్లికా గుండం -బలి పీఠం -వృద్ధ మల్లికార్జునుడు
    వీర భాద్రాలయానికి తూర్పున మల్లికా గుండం వుంది .దీనిలో ఆలయ శిఖరం కని పిస్తుంది .గుండం మధ్య చిన్న మండపం లో తెప్పోత్సవం జరుపే వారు .ఇప్పడు అభిషేకానికే ఈ జలాన్ని ఉపయోగిస్తున్నారు .ఆలయం లో అంతర్వాహిని గా ”సరస్వతీ నది ”ప్రవహిస్తూ వుండటం వల్ల .ఈ గుండం లో సరస్వతీ నదీ జలం,ఎప్పుడు చేరుతూ ఒకే స్థాయిలో నీతి మట్టం వుండటం విశేషం .ఈ జలం వ్యాధులకు దివ్యౌషధం గా ప్రసిద్ధి .
ఈ గుండానికి తూర్పున ముఖ మండ పానికి ఉత్తర ద్వారానికి ఎదురుగా ,అండ మైన అలీ పీఠం వుంది .అష్ట దిక్పాలక విగ్రహాలతో రెండస్త్రుల విమానం వుంది పీఠం పై భాగాన లింగము ,నంది ముచ్చట గా వుంటాయి 1235 లో రాజ మండ్రి కి చెందిన గంగ మల్లి శెట్టి బలి పీఠం నిర్మించినట్లు తెలుగులో వుంది .
బలి పీఠానికి తోర్పున ”వృద్ధ మల్లికార్జున స్వామి ”ఆలయం వుంది .మల్లి కార్జున స్వామి వారికంటే ప్రాచీన విగ్రహం గా గా భావిస్తారు .ఎత్తు పల్లాలతో వున్న పెద్ద లింగం అతి ప్రాచీనం గా వృద్ధ లింగం గా వుంటుంది . .చంద్ర గుప్త మహా రాజు కుమార్తె ,ఈ స్వామినే అర్చించి నట్లు కధ ప్రచారం లో వుంది .
                రామ ప్రతిష్టిత సహస్ర లింగం
వృద్ధ మల్లి కార్జున స్వామి వెనుక వైపు త్రేతాయుగం లో శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన ”సహస్ర లింగం ”,ఆలయం వున్నాయి .నల్ల రాతి లింగం .కాకతీయ కట్టడం గా ఆలయం వుంది . .
 త్రిఫల వృక్షం 
వృద్ధ మల్లి ఆర్జునుని తూర్పున మేడి ,రావి ,జువ్వి చెట్లు ఒకా దానికొకటి పెన వేసు ఆని పేరిగినా వృక్షమే ”త్రిఫల వృక్షం ”దత్తాత్రేయ మహర్షి ,సిద్ధ నాగార్జునుడు మొదలైన వారెందరోదీని కింద తపస్సు చేసి మనోఫల సిద్ధి పొంది అట్లు ప్రతీతి .3000 సంవత్స రాల కంటే ఎక్కువ వయసు వున్న వృక్ష రాజం ఇది .త్రిఫల చూర్ణం ఆయుర్వేదం లో గొప్ప మందు .అయితే ఇందులోని మూడు -ఫలాలు -ఉసిరిక ,కరక్కాయి ,తాడి నే త్రిఫలాలు అంటారు మరి త్రిఫల వృక్షం అని ఎందుకు పిలుస్తున్నారో తెలీదు .సంతానం కోసం దీని చట్టు ప్రదక్షిణాలు చేస్తారు .
భ్రమ రాంబా దేవి దర్శనం తారు వాత చేద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —  16 -02 -12శ్రీ శైల సందర్శనం –1


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

అంబరాన్నంటిన శిడిబండి సంబరం

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం –1

 శ్రీ శైల సందర్శనం –1 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ లోని సోమనాధుడు అయితె రెండవది ఆంద్ర దేశం లోని శ్రీ శైలం లోని మల్లి కార్జునుడు . శ్రీ శైల శిఖరం చూస్తేనే పునర్జనం వుండదు అని మన పురాణాలు చెబుతున్నాయి .అంతటి ముక్తి క్షేత్రం .ఈ శివ రాత్రి పర్వ దిన సందర్భం గా (20 -02 -12 -సోమ వారం )ఈ ప్రత్యెక వ్యాస పరంపర .

శ్రీ శైలం కర్నూలు జిల్లా లో ,ఆత్మ కుర్ తాలూకా లో ,నల్లమల అడవుల్లో.ప్రకృతి  రామణీయకత మధ్య వున్న దివ్య క్షేత్రం .ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని గా ప్రవహిస్తుంది .ఇక్కడ ఈ నదిని” పాతాళ గంగ” అని పిలుస్తారు .ఇక్కడి అమ్మ వారు భ్రమ రాంబా దేవి .18 శక్తి పీఠాలలో  ఒకటి .అమ్మ వారి ఆలయం లోపల నిత్యం భ్రమరాల ధ్వని అంటే తుమ్మెద ఝాంకారాం విని పించేదట .అందుకని ఆ పేరు .ఇప్పుడు జన సమ్మర్దం బాగా ఎక్కువైనందు వల్ల వినిపించటం తగ్గింది .చెవులు గోడకు ఆనించి ,గర్భ గుడి లో వింటే బ్రమర నాదం చెవులకు ఇంపు గా విని పిస్తుందని కధనం .భ్రమ రాంబా ,మల్లి కార్జున నిలయ మైన ఈ క్షేత్రం -వేదాలకు,.సకల సంపదలకు నిలయం .ఎనిమిది శృంగాలతో ,44 నదులతో ,60 కోట్ల తీర్ధాలతో ,పరాశర ,భారద్వాజాది మహర్షుల తపోవనాలతో ,వర్ధిల్లిన క్షేత్రం .ఇక్కడ చంద్ర గుండ ,సూర్య గుండ పుష్కరినులు న్దేవి .స్పర్శ వేది మొదలైన లత లతో వున్న అరణ్య ప్రాంతం . .లెక్క లేనన్ని ఓషదులున్న దివ్య భూమి .


ఈ క్క్షేత్రం విజయ వాడకు 230 కి.మీ.దూరం లో ,హైదరాబాద్ కు 220 కి.మీ.దూరం లో వుంది .ఇక్కడ అన్ని కులాల వారికి ఉచిత భోజన సత్రాలు వున్నాయి . .ముందుగా ”కరివెన వారి బ్రాహ్మణ  నిత్యాన్న దాన సత్రం ”ఏర్పడి 110 సంవత్స రాలయింది .దీనికి కాశీ ,షిరిడీ ప్రయాగ లోను బ్రాంచీలు వున్నాయి .వసతి కోసం సత్రాలు బానే ఉన్నాయిక్కడ .దీవస్థానం కాటేజీలు ,గదులు వున్నాయి .దేవస్థానం ఉచిత భోజన సౌకర్యం కల్గిస్తోంది .


శ్రీ శైలానికి  ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం తూర్పు ద్వారం .కడప జిల్లా లోని సిద్ధ వటం దక్షిణ ద్వారం .మహబూబ్ నగర్ లోని అలంపురం పశ్చిమ ద్వారం ఉమా మహేశ్వరం ఉత్తర ద్వారం గా వున్నాయని పురాణాలు చెప్పాయి .అలాగే నాలుగు మూలలా నాలుగు   ఉప ద్వారాలున్నాయి .ఆగ్నేయం గా పుష్ప గిరి ,నైరుతి లో సోమ శిల ,వాయువ్యం లో సంగ మేశ్వరం ,ఈశాన్యం లో ఏలేశ్వరం వున్నాయి .
ఈ క్షేత్రం  కృత యుగం లో హిరణ్య కశిపుని కి పూజా మందిరం గా,అహోబిల క్షేత్రం సభా మండపం గా  ఉండేదని , త్రేతా యుగం లో శ్రీ రాముడు అరణ్య వాసం చేస్తూ ఇక్కడ సీతా దేవి తో కలిసి మల్లి కార్జున స్వామిని దర్శించి ”సహస్ర  లింగాన్ని” ప్రతిష్టించాడని ,ద్వాపర యుగం లో పాండ వులు .ద్రౌపదీ సమేతం గా ఈ క్షేత్రాన్ని దర్శించి ,”సద్యోజాత లింగాన్ని ప్రతిష్టించారని పురాణ కధనం .ఇప్పుడు కూడా ఇక్కడ రామ సహస్రలింగం ,సీతా సహస్ర లింగం ,పాండవ సద్యోజాత లింగం నిత్యం భక్తుల పూజలు అందు కొంటున్నాయి . .
శ్రీ శైలం భూమికి నాభి స్థానం .భారతీయుల నిత్య పూజా విధానం లో సంకల్పం చెప్పే టప్పుడు  ”శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే ”అని మనం చెప్పు కొంటాం .మన లాగే అందరు కూడా .శ్రీ శైలానికి ఏ దిక్కున వున్న వారు ,ఆ దిక్కు పేరు చెప్పి పూజించటం అలవాటు .అంతటి ప్రాచుర్యం పొందిన క్షేత్రం . .దక్షిణ కైలాసం గా శ్రీ శైలం ప్రసిద్ధి చెందింది .ఇక్కడ మల్లి కార్జున మహా లింగాన్ని ,యాత్రికులు ,కాళ్ళు కూడా కడుక్కో కుండా సరాసరి గుడి లోకి వెళ్లి స్వయం గా లింగాన్ని తాకి ,శిరస్సును లింగానికి ఆనించి పూజించి అభిషేకం చేసు కుంటారు .దీన్ని ”ధూళి దర్శనం ”అంటారు .ఇలా ,ఇంకెక్కడా వుండదు .కాశీ లో మాత్రం ఈ అవకాశం వుంది .
కృష్ణా నది ఇక్కడికి వచ్చే ముందు ,బ్రహ్మ గిరి ,విష్ణు గిరి ,రుద్ర గిరి అనే మూడు పర్వతాలను చుట్టి వస్తుంది .స్కాంద పురాణం లో ఏకం గా ”శ్రీ శైల ఖండం  ”వుంది .18 పురాణాలలో భారత ,రామాయనాలలో ,అన్ని భాషల గ్రంధాలలో శ్రీ శైల ప్రస్తావన వుంది .ఇక్కడే శంకర భగవత్పాదులు .మల్లి కార్జున భ్రమ రాంబా దర్శనం చేసి ,ఇక్కడ తపస్సు చేసి ”శివానంద లహరి ”రాశారు ”సేవే శ్రీ గిరి మల్లికార్జున మహా లింగం     శివా లింగితం ” అని చెప్పుకొన్నారు .ఇక్కడి ప్రశాంత వాతా వరనానికి ముగ్ధులై శ్రీ శంకరులు ” యోగ తారావళి” అనే గ్రంధం లో” శ్రీ శైల పర్వత గుహలలో సిద్ధిని పొందాలి అని కోరు కోవటం ఈ క్షేత్రం గొప్ప తనం ”అని ప్రశంశించారు .
శ్రీ శైల క్షేత్రం తో శిలాద మహర్షి , గుప్త వంశానికి చెందిన చంద్ర వతి, కుమార స్వామి ,వసుమతి ,అక్క మహా దేవి ,మహా శివ భక్తురాలు హేమా రెడ్డి మల్లమ్మ ,సిద్ధ రామప్ప ,కుమ్మరి కేశప్ప ,ఉబ్బలి బసవన్న ,వృద్ధ మల్లికార్జునుడు ,మొదలైన వారి కధలన్నీ ముడి పడి వున్నాయి .
స్కాంద పురాణం లో 64 అధ్యాయాల ”శ్రీ శైల ఖండం ”వుంది .మహా భారతం లోని అరణ్య పర్వం లో ,హరి వంశం ల౪౦ వ అధ్యాయం లో ,పద్మ పురాణం లో 20 వ అధ్యాయం లో ,మార్కండేయ పురాణం లో 11 వ అధ్యాయం లో ,శివ పురాణం లో రుద్ర సంహిత లో ఆరవ అధ్యాయం లో ,భాగవత దశమ స్కంధం లో 80 వ అధ్యాయం లో ,ఆదిత్య పురాణం లో ,సూత సంహిత లో ,శ్రీ శైల క్షేత్ర విశేషాలన్నీ వివరం గా ఉల్లేఖింప బడి వున్నాయి .సిద్ధ నాధుడు రచించిన ”రస రత్నాకరం ”అనే గ్రంధం లో శ్రీ శైలం లో దొరికే వనమూలికల గురించి ,ఇక్కడి వివ్య విభూతి గురించి వివరణ వుంది .సోమేశ్వరుని ”కధా సరిత్సాగరం ”లో,భవభూతి రాసిన ”మాలతీ మాధవం ”లో ,బట్టభానుని ;;కాదంబరి ”లో ,శ్రీ హర్షుని ‘రత్నా వళి ”నాటకం ”
లో శ్రీ శైల ప్రస్తావన వుంది .
     నన్నయ గారు అర్జుని తీర్ధ యాత్ర సందర్భం గా శ్రీ శైలానికి రప్పించారు .పాల్కురికి సోమన బసవ పురాణం లో శ్రీ శైలాన్ని అద్భతం గా వర్ణించి తన వీర శైవాన్ని చాటు కొన్నాడు .”శ్రీ పర్వత ప్రకరణం ”లో శ్రీ శైల మహిమలు వర్ణించాడు .పండితా రాదయ చరిత్ర ,”ప్రభు లింగ లీల ”లో దీన్ని బాగా వివరించాడు . .త్రిపురాంతకుడు రాసిన ”త్రిపురాన్తకోదాహరణం ”లోను ,శ్రీ నాధుని ”హర విలాసం ”లోను ఈ క్షేత్ర ప్రాధాన్యత వుంది .నాగ లూటి శేష నాధుడు తన ”శ్రీ పర్వత పురాణం ”లో ,శ్రీ నాధుని ‘పల నాటి వీర చరిత్ర ”లో ”,శివరాత్రి మహాత్మ్యం’ లో ,పోతన గారి భాగవతం లో గౌరన ” నవ నాధ చరిత్ర లో తాళ్ళ పాక తిమ్మక్క రాసిన ”సుభద్రా కల్యాణం ”లో ,పింగళి సూరన ;”కళా పూర్ణోదయం  ”లో ధూర్జటి ”కాళ హస్తీశ్వర శతకం ”లో ,మల్లన రచించిన ”రుక్మాంగద చరిత్ర ”లో ,చేమ కూర వెంకట   కవి ”విజయ విలాసం ”లో శ్రీ శైల ప్రసక్తి వుంది .రఘునాధ నాయకుని ”వాల్మీకి చరిత్ర ”,లోను దీని ప్రాశస్త్యం వర్ణింప బడింది .ఇలా సంస్కృత ,తెలుగు  గ్రంధా లలోనే కాక అనేక బార తీయ భాషల్లో ముఖ్యం గా కన్నడ ,తమిళ ,మరాఠీ భాషల్లో శ్రీ శైల ప్రస్తా వన వుంది .శ్రీ శైల పర్వ తాన్ని  ”శ్రీ పర్వతం ”అంటారు .మరిన్ని విశేషాలు మరో మారు .
సశేషం
మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -02 -12 .

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

 శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు – 

                                        జ్ఞాపకాల దొంతర మల్లెలు –8 (చివరి భాగం )

పండిత దీవి గోపాలా చార్యుల  వారు మీ ముద్రిత ప్రతిని అందుకొన్నప్పుడు ,చదివి ”మీ రచన లో జీవం వుంది ,నన్ను యేడి పించింది ,కనుకనే తర్వాత నన్ను ఆనంద పెట్టింది ,శ్మశాన వాటిక లాంటి నవలలు ఇంకా రాయండి ”అని ఇచ్చిన ప్రోత్సాహం -మీకు గొప్ప ప్రేరణ గా నిలి చింది .ఆ నాటి ఆంద్ర దేశం లోని లబ్ధ ప్రతిష్టులైన రచయిత లందర్నీ తమరు దర్శించి ,వారి లోని మంచిని గ్రహించారు .ఎవర్నీ అనుసరించలేదు .మీ పంధా మీదే గా ఒంటరి పయనం సాగించారు .
అయితె అన్న గారూ !మా వడిన ”సీతమ్మ ”గారి గురించి సకృత్తు గా మాత్రమే తెలియ జేశారు .ఆమె మీకు అర్ధాంగి ,సహధర్మ చారిని .మీ కష్టాల నన్నిటినీ భరించి వెన్ను తట్టిన స్త్రీ రాజం .ఉత్తమా ఇల్లాలు ,త్యాగ మూర్తి .పైగా ప్రేమించి పెళ్లి చేసుకొన్నా రాయెను .కాని ఏం మిగిలిందా యమ్మకు ?ఉమ్మడి కుటుంబం లో -ఆకులో ఆకునై అన్నాట్లు ఒదిగి పడి వుంది .ఆ  దొడ్డ ఇల్లాలి పెద్డా మనస్సు మీకు శ్రీ రామ రక్ష .సీతా  కస్టాలు ,పీత కస్టాలు అనుభవించిన భూ పుత్రిక ,.మూన్నాళ్ళ కో సారి  మీరు దేశాలు పట్టి తిరుగు తుంటే ,ఒంటరి గా ఇంట్లో యెంత వేదన అనుభావిన్సిందో ఆ తల్లి .బహుశా తన కష్ట  సుఖాలేవీ వీ మీకు నివేదిన్చుకోనేది కాదేమో మహా ఇల్లాలు .మీరు వూరు విడిచి వన వాసం చేస్తే ,సీతా దేవి లా మీ వెంట బడి ఆ క్లేశాలు అనుభ వించక పోయినా ఇంట్లోనే వన వాసం గడిపిన సీతమ్మ తల్లి ఆమె .ఎప్పుడైనా గుప్పెడు పూలు పట్టు కోని వెళ్లి ,ఒదిన గారి కొప్పున తురిమారా అన్న గారూ !మీ ”అనుభవాలు -జ్ఞాప కాలు ”లో ఆమె పాత్రను చాలా కుదించి పారేసి అన్యాయం చేశారేమో నని పించింది .మీరు ఒంటెత్తు పోకడలతో కొత్త మార్గాల్లో నిర్భయం గా సాంచ రిస్తుంటే కాదని వారించక పోవటం ఆమె సౌజన్యం కాదా .నెలల తరబడి ,ఆమెను ఒదిలేసి ,రికామీ గా తిరుగుతూ ,చడువంతు ,సంధ్య అంతు ,దేశ ద్రిమ్మరిగా ,బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించిన మీకు ఆమె ఎప్పుడు ఎదురు కూడా చెప్పి వుండరు .నిజం గా ఈ సంపుటాలన్నీ ఆ తేజో మూర్తికి ,ఆ త్యాగ మయికి అంకిత మిచ్చి వుండాల్సింది మీరు .ఆ దొడ్డ ఇల్లాలి అణకువకు ,త్యాగ మయ జీవితానికి జోహార్లు .తరువాత సంపుటాల్లో ఆమె గురించి వ్రాస్తారను కోవటం వృధా .ఇవి అర్ధంతరం గా ఆగి పోయాయి కదా .
”నెల కూలీ చాకిరీ ”కి ఒల్లని ,మీ స్వేచ్చా మనస్తత్వం ఆదర్శ ప్రాయమే కాని అందరు అలా ఉండ గలరా మహాను భావా !”పాతకునికీ ,ద్రష్టకీ రసాను బంధం కలిగించి ,తన సందేశం స్ఫుటం గా ,విని పించాలంటే నాటకమే శరణ్యం ”అన్న మీ మాట శిరో దార్యమే .అందుకే అభిజ్ఞాన శాకుంతలం ,కన్యా శుల్కం అంతా ప్రాభవం పొందాయి .”కలం పోటు ”నాటిక మీకు ఇష్టమైంది అని చెప్పు కొన్నారు .వార కాంత ,ప్రేమ పాశం ,నిగల బంధనం ,రాజ రాజు నాటకాలు రాసినా వేసినా అవి రంగస్థలం యెక్క లేదని మీ బాధ అర్ధం చేసుకోన్నాం .
”అత్త-అల్లుడు ”,అలం కృతి ,అభిసారిక ,బాలిక -తాత ,ఖండ కావ్య నిర్మాతలు మీరు .”మిధున రాగం ,ఇరువుర మొక్క చోటికే పోదాము ,అనేవి గ్రాంధికం గానే చేశారు .ఆ తర్వాత వచ్చిన మార్పే అసదృశం .వీర పూజ కూడా పాత బాటలోనే నడి చింది .అయితె శైలీ సౌభాగ్యం ,విలువ కలది .శ్మశాన వాటిక ,రక్షా బంధనం నవ లలు ప్రజల్లోకి చొచ్చుకు పోయాయి .సహజత్వానికి నిలు వెత్తు ఉదాహరణలు అవి .
”ప్రబుద్ధాంధ్ర ”పత్రిక ను గీర్వాణ ,ఆంద్ర భాషల్లో వెలువరించిన ఘన త మీది .మీ ఉద్దేశాలన్నీ ఖరా ఖండీ గా అందరికి చెప్పి ,అందర్నీ ఎది రించి తొమ్మిదేళ్ళు నడి పారు అంటే మీ సర్వ గ్రంధ రచనా ఒక ఎత్తు ,ఈ పత్రిక భారం ఒక ఎత్తు .
పద్యం రాశారు ,సంగీతం నేర్చారు ,నాటకం ఆడారు .స్త్రీ పురుష పాత్ర ధారణా చేశారు .మెప్పూ పొందారు .సంగీత సాహిత్య సభలు జరిపి ,కవులను ,కళా కారులను గౌర వించి ,ఆదర్శం గా నిలి చారు .
మీ ”చిన్న కధలు ”జాతి గర్వించ దగిన మిన్న యైన కధలు .తెనుగు దానానికి మచ్చు తునకలు .ఈగడ తారకల్ .పాత్రల మాటల్లో వ్యక్తుల తీరు భంగిమ స్పష్టం గా చూపించే నేర్పు అనన్య సామాన్యం .సజీవ చైతన్య శ్రవంతి మీ వాక్య విన్యాసం .విన్నాణమే .
స్నేహాన్ని మహా మేరువు గా అభి వర్ణించారు మీరు .పురి పండ అప్పల స్వామి  గారి తో ఈ స్నేహం చిరస్మర ణీయం .మీ చివరి ఉత్తరం లో ఆ ఆవేదన అంతా కురిపించే శారు .”నా కుటుంబం చెట్టు కింద వుంది ”అన్నారు . ఆ జాబులో .గుండెలు పిండేసే మాటే అది .ఎంత కుంగి పోయి అలా బయట పడ్డారో ?ఇంత చేసి ,ఇంత సాధించి చివరికి మిగిలిందేమిటి చిన్నబ్బాయి గారు !శ్రీ నాధుని మహా ప్రస్తానం జ్ఞాపకం వస్తుంది .”దివిజ కవి వరుల గుండియాల్ దిగ్గు రనగ ”అనట్లుంది మీ పరిస్తితి .ఆ వుత్తరం లోనే ”నా కేమీ విచారం లేదు నా భార్య నన్ననేక విధాల కాపాడింది .చిన్నప్పటి నుంచీ దాన్ని కష్ట పెట్టాను గాని సుఖ పెట్ట లేదు ఇప్పుడిక ఆ ఊసే లేదు కదా !”అని మీ బాధ వెళ్ళ గ్రక్కుకున్నారు .చేసిన అన్యాయాన్ని స్మరించుకొని ,పశ్చాత్తాపం తో ,ప్రాయశ్చిత్తం చేసు కొన్నారు .ఎంత హృదయ విదారక పరిస్థితి అండీ .ఏ రచయితకు ఆ స్థితి రా కూడదు .మీ స్థితికి సానుభూతి చూప టమేగా మేం చెయ్య గలిగింది .
1891 ఏప్రిల్ 23 న జన్మించి 25 -02 -1961   లో 70 వ ఏట  భువి నుంచి దివికి చేరారు తాత గారూ !.  !అవును -నేను నా మాతామఃహ , ,పితా మహులను చూడనే లేదు .ఆ తృప్తిని ఈ పిలుపు తో తీర్చు కున్నాను .అప్పుడే మీకు శాతాధికాయుస్సు వచ్చేసిందా ?తెలుగు కధకు అడ్డం గా ,నిలువునా విరాడ్రూపం కల్పించి ,విశ్వ కధా  విపంచి లో మూర్చనలు పల్కించిన మీరు ధన్యు లండీ .తెలుగు వెళ్ళు పాదుకు పోయిన అంతర్జాతీయ కధక చక్ర వర్తి ,కధా సార్వ భౌములును .అందుకే ఏ కధ కుడికి దక్కని ”కనకాభి షేకం ”తమరే దక్కించుకొన్నారు .జాతి ఋణం తీర్చుకొని ధన్య మైంది .
మీ అనుభవాలు జ్ఞాప కాలు వంటి విలక్షణ గ్రంధం ”భారతీయ భాష లో లేదు ”అని పూరి పండా వారు అన్నారంటే స్వభావోక్తే .”ఆ నాటి తెలుగు పల్లె తూళ్లలో జీవితము  ,ఆచారాలు ,శ్రౌతుల శోభ ,ఆ సంస్కృతి ,సర్వము రమణీయం గా దర్శింప జేశారు ””సత్య ప్రఖ్యాపన కు తార్కాణా  గా నిలిచిన ,సజీవ సాహిత్య సంపుటం ”అన్న ఏటుకూరి వారి మాట ,పుట్హం పెట్టిన బంగారు మూట ..కధగా ,కవిత్వం గా ,స్వీయ చరిత్ర గా ,సమకాలీన చరిత్ర గా ,తేదీలు లేని డైరీ గా ,బల్ పసందు గా మలచిన ,,పోహళించిన ,వచన చరితా కధా సరిత్సాగరం .మీ పుస్తకం .సరస్వతీ దేవికి హస్త భూషణం .తెలుగు వారికి శిరో భూషణం .
తెనుగు వచన రచనకు చేవ ,పదును తెచ్చింది మీరు ,మల్లాది రామ కృష్ణ శాస్త్రీ, చలంగార్లు .అందుకే నా ద్రుష్టి లో మీరు ”వచన రచయిత త్రయం ”అందులో మీది సర్వ స్వతంత్ర మైన గంగా ప్రవాహం .గౌతమీ దఘ్నం  .సప్త గోదావరుల పావిత్ర్యం .జన జీవ నానికినిత్యం ఉప యోగ పడే” సహకారం” .మీ వచన గమన వైఖరి లో ”రాయంచ నడకలు ”వున్నాయ్..
ఏ ముహూర్తాన మీ పేరు నా చెవిన పడిందో ,ఏ శుభ లగ్నం లో మీ రచన చదివానో ,ఏ శుభ వేళ ,మీ భావ జాలాన్ని ఔదల దాల్చానో ,అప్పటినుంచీ ,మనసులో ,హృదయపు లోతుల్లో ,బుద్ధి లో ,శుద్ధాంత రంగం లో అంతటా మీరే నిండి పోయారు అన్న గారూ !అందుకే ఈ చిరు కానుక .చదివి ,చదివి ,ఆర్ద్ర మైన గుండె తో అర్పిస్తున్న నివేదన .బ్రాహ్మీ మూర్తు లైన మీకు ఈ అక్షరాభి షేకం .అక్షర లక్షల కనకాభి షేకం .నా జన్మ  ధన్యం ,చరితార్ధం కావ టానికి చేసిన చిరు యత్నం .అంతర్ముఖు లైన మీరు నిండు మనసు తో  మీరు, మా ఒదిన గారుసీతమ్మ తల్లి అక్కడి నుంచే ఆశీర్వ దిస్తారని ఆశ .
”విశ్వామిత్ర ,అఘ మర్షణ ,కౌశిక త్రయార్శేయ ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భావస్య శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిహ్ ,భ్రాత్రు వత్సలః ”ఇదం ప్రణామం .
ఈ వ్యాస పరంపరను శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి గారికి ,వారి శ్రీమతి  సీతమ్మ గారికి  ,భక్తి ప్రపత్తులతో అంకితం .
సర్వం సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

కళాకారులకు కోపమొచ్చింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –7

 శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు 

                                         జ్ఞాపకాల దొంతర మల్లెలు –7

— తెలుగు లో తీపిదనం ఏ ప్రాంతానిది ,ఆ ప్రాంతానికి గొప్ప అని ”ఒక్కొక్క సీమ లో ఒక్కొక్క జీవ కణం వుంది తెలుగు రక్తం లో ,అన్నీ ఒక్క చోట చేర్చ గల -అన్నీ ఒక్క తెలుగు వాడి రక్తం లో నిక్షే పించ గల మొన గాడు పుట్టుకు రావాలి ”అన్న మీ భావం ఆశావహమైనదే .  .అది utopia అని అనిపిస్తుంది నాకు .మన భాషను ”తెనుగు ”అనే మీరు సంబోధిస్తారు ”.”లు” లో లేని తీయదనం ,మాధుర్యం” ను” లో వుందని అన్నారు .”నా తెలుగు భాష శాస్త్రీయం ”,తాటా బూటం” కాదు .సరస్వతికే తేనే చినుకు లందించింది .గాని ,నిరు చప్పనిది కాదు .నా తెనుగు ”అని కీర్తి కిరీటం పెట్టారు .”తెనుగు భాష స్వతంత్రం గా బతగ్గలది .కాని ,కృత్రిమ ప్రాణ వాయువు కూర్చుకోవలసింది కాదు” .భాష పై మీ కున్న మమకారం శ్లాఘ నీయం .మీరు నిర్వహిచాల్సిన పాత్ర ను గురించి మీరే ”యావద్భారతం లోను ,ఈ విశాల విశ్వం లోను ,కూడా ,తెనుగు వాణ్ని గా ,”నేనే ”నిర్వ హించాల్సిన కార్యక్రమం కొంత వుంది .నా ధృఢ విశ్వాసం ఇది ”అన్నారు .ఆ బాధ్యత బుజానికెత్తు కోని సంతృప్తిగా నెర వేర్చి ,అన్న మాట నిల బెట్టు కొన్నారు .
మే నెలలో ఎండ ఖమ్మం లో ఎలా వుందో మీ మాటల్లోనే చెప్తాను ”చివాడ కాల్చిన ఇనుప గుండు లాగ ,వూరి మధ్య గా ,నున్న గా చెక్కేసిన పే -ద్ద  కొండ ను గోప్ప్హ గా వర్ణించి,ఆ అనుభవం మాకు కల్పించారు . ఉదారుని మనస్తత్వం చాలా ఉదాత్తం గా వర్ణించారు .మీ నేత్రావదాన్ని చూసి ముగ్ధుడై న బూకింగ్ క్లార్క్ మీకు మీ సత్య నారాయణ గారికి బెజవాడ దాకా టికెట్లు కోని ,చేతిలో పెట్టి నమస్కారం చేసినపుడు ,ఆ సాహితీ మిత్రునికి మాటల ”లాల్ సలాం ”చేశారుమీరు . .”కోట్లు డబ్బిచ్చి నా ,అలాంటి తృప్తి కలుగదు .కళా కారులకు ”అన్న మీ మెచ్చి కోలు మీ దొడ్డ మనసుది .”బహు సామాన్యుడు ఎంతెంత మహోన్నత శిఖరాలు అందు కో వచ్చో చూపించాడాయన  ”అని ఆయన హృదయం ”రస బంధురం ”అన్నారు .”అమ్మకం అయిన ఆ బడుగు దేహాన ,అదిగో -పరి పూర్ణ మాన వత్వం స్వస్వరూపం తో ,తేజ రిల్లు తోంది .అమరం అదీ -ద్వంద్వాతీతం ,జగజ్జ్యోతి ”అని కృతజ్న తాంజలి ఘటించారు .”లోభి బతుక్కి ,గడ్డి పరచ కూడా అక్కర్లేదు తూచ టానికి.ఉదారుడు అటుక్కి ,బంగారు కొండ అయినా చాలదు ”అని మీరు పర్వతం ఎక్కించారు .ఆ దృశ్యాన్ని విశ్వ నాద్ సినిమా లా ఆర్ద్రత తో తడిపెశారండీ అన్న గారు.
మీ ”వీర పూజ   ”మీ వచన రచనకే వీర పూజ .”తెనుగు లో అపూర్వ రచన .అంతకు ముందే కాదు ,తర్వాత కూడా అలాంటి రచన పుట్ట లేదు మన వచన వాగ్మయం లో ”అని భేషైన పొగడ్త చేశారు .”చెడు -దేశం అంతా పాకి పోతుంది .మంచి పుస్తకం ను ఇంకా ఆద రించటం లేదానాడు  ”అని నిర్వేదం చెందారు ,జన హృదయం లోకి పాకి పోనందుకు .”వర్త మానం అంటే ,ముందు వెనుకల కలయిక ”అని నిర్వచించి ఉదాహరణ గా నీలి చారు మీరు .
”కోటి పల్లి భాగవతి హరి  శాస్త్రి ”గారి ఉదంతాన్ని ,ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారండీ మీరు .తపస్సు ,వేద పాథ ప్రవచనము మాత్రమే జీవనం గా గల ,వ్యాకరణ వేత్తలు వారు .ఊరు దాటని అంటే ”ఆపురి బాయకుండు ”బాపన స్వామి .పితా పురం రాజా వారిని కలవాతానికి వెడితే ,ఆ బ్రాహ్మణ ప్రభువు దారిలోనే దర్శనం ఇచ్చి ఆనందం కల్గించారు .రేవులో స్నానం చేసి వస్తున్న హరి శాస్త్రి సాక్షాతూ శుద్ధ సాత్విక మూర్తి యైన శివుని లా వుంటే ,పట్టు బట్టలు కట్టు కోని ,ఊర్ధ్వ పుండ్ర ధారణం తో ప్రభువు తేజస్సు తో ,రాజసం తో ,దేవేంద్ర ప్రభ గా వెలిగి పోతున్నారు అంటారు మీరు .రాజేంద్ర ,భూసురేంద్ర సమాగమ నాన్ని మనోజ్ఞం గా వర్ణించారు .నమస్కరించిన రాజు కానుక లిస్తా నంటే గ్రామ దేవత గుడి శిధిలమై పోతోందని జనం ఆందోళన చెందు తున్నారని ,దాన్ని తక్షణమేబాగు   చేయించ మని ధనాన్ని తృణ ప్రాయం గా  భావించి ,శాశించిన .ఆ తేజో మూర్తి ఉదంతం ఆదర్శ వంతం కాదా ?”మహా రాజ్యం వా పాలఏన్మహా భాష్యం వా పాట్హ ఎత్ ”–అంటే చేత నైతే  రాజ్యం పాలించు .లేదా మహా భాష్యం పాఠం చెప్పు అన్న పతంజలి మహర్షి వాక్యం ను సార్ధకం చేసిన బ్రాహ్మీ మూర్తి శాస్త్రి గారు .
వదాన్యులు దేశోద్ధారకులు ,విశ్వ దాత కాశీ నాధుని నాగేశ్వ ర  రావు పంతులు గారి ఆహ్వానం పై మీ పుస్తకం అచ్చు వేసే ప్రయత్నం లో చెన్న పట్నం చేరిన సంఘటనా రామ ణీయమే . .”పొలమూరు చెరువు లా స్తంభించి పొతే ,రాజా మండ్రి గోదావరి ప్రవాహం లా వుంటే ,ప్రగమ శీల యితే ,మద్రాసు సముద్రం లా ,అల్ల కల్లోలం గా వుంది -ఉత్సాహమే కాదు ఉద్వేగము వుంది అక్కడ ”అని చిన్న మాటలతో నగర గందర గోలాన్ని వర్ణించారు .నగర మాయా మోహ జాలాన్ని వర్ణించి ”మద్రాస్ తుఫాన్ ”అన్నట్లు గా వుంది అన్నారు .”ఆంద్ర పత్రిక బతుకు అమృతాంజనం   గుప్పిట వుంది ”అన్న చిదంబర రహశ్యాన్ని బయట పెట్టె శారు మీరు .
గాంధీ మీద ,ఖద్దరు మీద ,హిందీ మీద మీకు సదభి ప్రాయం లేనే లేదు .మరి ఎలా నెగ్గు కొచ్చారో ఆ నాడు .”గాంధి గారు కొత్త గా దక్షిణ ఆఫ్రికా నుంచి అప్పుడే వచ్చారు .దేశం బాగు పడుతుంది ఆయన నాయకత్వం లో ”అని రాయ ప్రోలు వారు అంటే ”-ఠాట్”కొత్త దారి పెడ దారి అవుతుందని అని అంటారా పెడసరం గామీరు హన్నా !ఎన్ని గుండెలండీ మీకు ?మీది వైదిక సంస్కారము ,గాంధీ గారిది జైన సంస్కారము అని తేల్చేశారు మీరు . ”రామ మోహన రాయి పరధర్మం వరవడి లో ,మరో కొత్త మతం స్థాపిస్తే ,దయానంద సరస్వతీ ఆర్య సమాజం ఏర్పరిస్తే ,ఇంత కంటే బలం గా ”జాతీయత కు కూకటి వేరు పురుగు పుట్టింది ”అని ఆందోళన చెంది ”ఇది అపాయకరం అని గుర్తించింది వివేకా నంద  స్వామి ”ఒక్ఖడే ”అని ఘంటా పధం గా చెప్పింది మీరే .ఆ స్వామి ఆవిర్భవించక పొతే ,మన ధర్మం ,నీతి ఏమి పోయేవో ?ఆయన అవతార పురుషుడే సందేహం లేదు .                అమృతాంజనం పంతులు గారి ”ఈవి ”ని -”అడిగిన వాడికి లేదన కుండా ఇవ్వడం జీవితాధిక మైన వ్రతం వారికి ”అని ప్రస్తు తించారు .మీ రచనల్లో ప్రభుత్వాన్ని ధిక్కరించిన మాట లేకున్నా ,చాణక్య మతంవిషయం   లో మీరు పంతులు గారితో .చెన్నా  ప్రగడ భాను మూర్తి గారితో ,పడిన మధన ,మీ  ఆత్మీయతకు ,  ,ఆదర్శానికి ,స్వతంత్ర త కు అద్దం పట్టింది .
చారిత్రాత్మక మహా పరి శోధకులు కొమర్రాజు లక్ష్మణ రావు గారి దర్శనం మీకు మహద్భాగ్యమే అయింది .”చారిత్రాత్మ కం గా వారి మాటే వేద వాక్యం మన జాతికి -నా రచన నేనే చదివి విని పించాలి ఆయనకీ –అదే పెద్ద మనన ‘అంటూ ,”హిమవత్పర్వత సానువుల్లో వొక చలి చీమ వంటి వాణ్ని ”అని వారి మహోత్క్రుష్టతను అంత ఎత్తు న నిలి పారు .దాదాపు సమాన ప్రతిభ మీది .అయినా ఒద్దిక గా ,వినయం గా ,అల్ప జీవి తో మిమ్మల్ని మీరు పోల్చుకొన్నారు .ఈ వినయ విదేయతలకు తల వంచుతున్నాను స్వామీ !వారి నివాసమే ‘వేద విలాసం ”తమాషా గా పవిత్రం గా వుంది మా బోంట్లకు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు -జ్ఞాపకాల దొంతర మల్లెలు –6

 శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –

                                                 జ్ఞాపకాల దొంతర మల్లెలు –6
 మూడో తరగతి తోనే ముగిసిన మీ చదువు ,ఆ పిమ్మట చదువు కున్న వారికే చదువు నేర్పే తంట పెరిగింది .కదా అన్న గారు !”కుల విద్యలు పనికి రాని” మిమ్మల్ని ”ప్లీడరు గుమాస్తా చేయాలను కొన్న మీ నాన్న గారి పంతం నెగ్గింది .అయితె అదీ మీకు నచ్చ లేదు .,అచ్చీ రాలేదు .”కుల విద్యల కంటే లక్ష రెట్లు వెగటు ”అని పించిందని ”ఖాచ్చితం ”గాతేల్చి   చెప్పే శారుకాసింత రుచి చూడంగానే .మీ ధ్యాసా ,వ్యాసంగం ,వ్యావ్రుత్తీ ,,మనసు ,దీక్ష ,మరో చోట లగ్న మైతే ,ఇదెలా నప్పు తుందండీ .బ్రాహ్మణ స్త్రీలు తమ కిష్టం లేని వారిని పీడించ టానికి విస్తరి ముందు ,తినటానికి కూచో గానే ,తిట్ల దండకం లంకిన్చుకునే వారని ,మీ అక్క గారూ ,అందులో ఏమీ తీసి పోలేదని ,పక్ష పాత రహితం గా చెప్పే శారు  కాదా ?ఈ సందర్భం లోనే ఓగొప్ప జీవిత సత్యం కూడా చెప్పారుగా .”కోర్టుకు వెళ్ళేది న్యాయము కాదు ,అన్యాయము కాదు -రాగము ,ద్వేషమును .కోర్టు నుంచి బయటకు వచ్చే వన్నీ ,ధర్మమూ కాదు ,అధర్మము  కాదు -దుఃఖము ,దారిద్రమును ”ఎంతటి అనుభవ మైన మాట సెలవిచ్చా రండీ .ఇప్పటికీ ,ఎప్పటికీ అది అంతే .చిల్లర తగాదాలు ,కోర్టు ప్రదక్షిణాలు  నున్ను .
మీ మార్గాన్ని సుగమం చేసి ,మీ తండ్రి గారిని ఏది రించీ ,మీ మనోభావాన్ని ఆయనకు ఎరుక పరిచి ,శ్రీపాద వారి అబ్బాయి అంటే ఆటలు కాదు అని టకాయించి ”గొప్ప వాడి వయి పోవాలి -సగం సగం అయితె ఒప్పుకోను సుమా ” అని గదమా యించి ,మీకు ఉల్లాసం ,ఉత్సాహం ,ఉద్రేకం ,ఉద్వేగం కల్పించిన తట వర్తి వెంకట రాజు గారు మీ తెలుగు వచనా రధ సారధి గాక మరేమీ టండీ ?మీ ప్రవ్రుత్తి లో ఎంతో మార్పు వచ్చింది .”ఒక్క పద్యం కడితే చాలదూ ,వంద రూపాయిలేందుకు ”?అన్న భావం నుంచి ”ఒక్క వాక్యం చాలదూ ,వెయ్యి రూపాయలేందుకు ”అన్న దాకా మారి పోయి ,మీ కే ఆశ్చర్యం వేసిందేమో ?ఇది అన్నం పెట్టక పోయినా ,ఇది కల్గించే ఆనందం ఎన్ని కోట్ల డబ్బు అయినా కల్గించా గలదా ”అన్న మీ విచికిత్చ అర్ధ వంత మైనది .డబ్బు భౌతిక మైతే ,ఆనందమో ఆధ్యాత్మిక మైనది .అని తేల్చి చెప్పేశారు మీరు .ఆ ఆనందం లభిస్తుంటే ,భౌతికం తరుణ ప్రాయం .ఆ స్థితికి వచ్చిన స్థిత ప్రాజ్ఞులు మీరు .ఇంకొంచెం సాధన తో ”తురీయం ”అందుకొనే దశ .మంచి పాకాన పడింది మీ శ్రమా ,పరిశ్రమా .సార్ధకము అయింది .విలువా హెచ్చింది ”ఇక్కడే మీరు కృష్ణ శాస్త్రి గారి ”దిగి రాను దిగి రాను దివి నుండి భువికి ”అన్న భావానికి ఎంత గొప్ప భాష్యం చెప్పా రండీ అన్న గారూ ! కృ శాస్త్రి గార్ని  మీరే అన్న గారు అన్నారు .నేను కృష్ణ శాస్త్రి గారి దర్శనం పలు మార్లు చేసు కొన్న అదృష్ట వంతున్ని ..సంత్రుప్తున్ని కూడా .
”రుషి మూసుకునేవి కళ్ళు .అంటే చర్మ చక్షువులు .కవికీ రుశికీ అంతర్ ద్రుష్టి వుంటుంది .బహు నిశిత మైంది .ఆ అంతర్ ద్రుష్టి తో చూస్తారు వారు .అదే క్రాంత దర్శనం .లోకాలన్నీ దాని పరిధి లోనే -అంటే సత్యం శివం ,సుందరం అయినవి చూడ గలిగిన వాడికి .అందుకే ఆ పరిధి లో నుంచి ,దిగి రాను అన్నది ”మల్లి నాద సూరి వ్యాఖ్య లా పరిశుద్ధం గా ,పరమ పవిత్రం గా వుంది .ఆయన అంతర్ద్రుస్తే కాదు ,టమా ఆంతర్యము బోధ పడింది .”సమాధి లో వున్నప్పుడు డబ్బు చెడె కాదు విషమున్ను ”ఎంతటి సత్య శోధన అన్న గారూ !జిందాబాద్
మీ మొదటి నాటకం అచ్చేసి సత్తి రెడ్డి గారు మీ చ్తిలో పెట్టి ,”మీరు కవీశ్వరులు ”అని ముమ్మారు అన్న సత్తి రెడ్డి గారు ముమ్మారు గా మీకు అత్యంత శ్రేయోభి లాశులే .మీ చైతన్యానికి పూనికా ,వూనికా కూడా వారు .ఎంత ఆత్మా పరిశోధన చేసు కొంతా రండీ మీరు ?”రక రకాల తప్పులకే నా నాటకం ఉదా ఆరన ”అని బేరీజు వేసు కొని ,నిగ్గు తేల్చుకున్నారు .మీ విషయం లో మీరే నిష్పాక్ష పాత విమర్శకులు .”కవిత కలిగిన రాజ్యాధికార మేళ ?”అని బిగియార కౌగలించిన కమ్మ ప్రభువు ఔదార్యం యెంత గోప్పదండీ .ఆయనే మీ తండ్రి గారి తో ”కవి కావడం పూర్వ జనం లో మహర్షి అయి ఉంటేనే ”అని మీ తరఫున పూర్వ పక్షం చేసి ”త్రినేత్రుడు -కవి ”అని నిర్వచనము చెప్పి ,”మీ పూర్వుల తపస్సంతా ఫలించిందని ”ఉత్సాహ పరిచి ,కవి అవటం నేరం కాదని మహా అదృష్టం అని ,”మహాద్రస్తత్వం ”అనీ నచ్చ చెప్పి ,”అతని పేరు శాశ్వతం అవుతుంది ,అతని శుక్తులు వేద వాక్కులు గా మననం చేసుకుంటుంది లోకం ”అంటూ ,మీ కవితా వ్యాసంగానికి ”పూర్వ రచన ”చేసి ,తానూ తరించి ,మిమ్మల్ని తరింప జేశారు .కులం ఏదయితేనేం గుణం ప్రధానం .చౌదరి గారిది వశ్య వాక్కు .నిజ్హం గానే అలానే జరిగింది కదా అన్నా గారూ .మీ మాటలు అన్నీ వేద పనసలంత పవిత్రం గా ,మేమంతా భావించటం లేదా ?శ్రోదార్యం చేసుకోవటం లేదా ఆంద్ర దేశం అంతా ?ఎంతటి అదృష్ట వంతులన్నయ్యా మీరు ?”నాకు వెర్రి సంబరం పుట్టుకోచ్చిన్దిరా అబాయీ ”అని మీ తల్లి గారు ,”కవిత్వాన్నైనా ,కూలంకాశం గా తెలుసుకొని ,నలుగురు మెచ్చే రచనలు చెయ్యి ”అని మీ నాన్న గారి మాటలు వేదాశీర్వచానాలు అయినా యి మీకు .ఇంకా తిరుగేముండీ ?అంతా ముందడుగే .పదండి ముందుకు పదండి పైపైకి ..
స్టేషన్ మాస్టారు ”పిళ్లే ”గారు ,మీకు ”లక్ష్మీ నారాయణం ”ఇచ్చి ,”పద పారాయణం ”చేయించారు .ఆ మాటలనీ ,మీ జిహ్వాగ్రాన కూర్చున్నాయి పీఠం వేసి .మళ్ళీ  ఆయన  నెల్లూరు లో కనబడి మిమ్మల్ని’ ‘కవి గారు ”అన్నప్పుడు ,మీ ఆనందం అలౌకికం .”హృదయం ద్రవించి ,కంఠం రుద్ధమయింది ”అన్నారు తమరు .అందరిలా ”మెయిలు కుదుపు తో కాక ”ఆనంద డోలికల్లో ఊగి పోయాన్నేను ‘అని జ్ఞాపకం చేసుకొని ,ఆనంద బాష్పాలతో స్నేహ రుణమూ తీర్చుకున్నారు .”వారి హృదయం అంత స్నిగ్ధం కావ టానికి సన్నీ కృష్టి  కారణం ,నా అదృష్టము విప్ర కృష్ట కారణం ,ఈశ్వ రేచ్చా ను ”అని ఆయన అనురాగాన్ని ,స్నేహ సుగంధాన్ని ,మమతను ,మనోహరం గా ,చిత్రించారు .కృతజ్ఞత కు పరా కాష్ట గా వుంది మీ అభి భాషణం .ఇది అందరికి ఆదర్శ ప్రాయం .మీ హృదయం విప్పారు .ఆ సంఘటనను హృదయపు లోతుల్లో భద్ర పరచు కున్నారు .మీరిద్దరూ ధన్య జీవులే .
నాటక కరతలే కాక ,మీరు నాటక ప్రయోక్తలు కూడా అయి ,కలారాధనా చేసి ,అక్కడా గౌరవ స్థానమే పొందారు .”మండ పేట ” నాటకం పేరు గా మారిందా నాడు .”నాటకం లో ఫిడేలు గోకారు ”అని చక్కగా సెల విచ్చారు పెద్ద బావ గారూ !అవును మా పెద్ద బావ గారు గాదె పల్లి కృపానిధి గారు ,ఆయన తండ్రి గారు ”పండిట్ రావు ”గారు గోపా నాటక కళా కారులు .వింధ్య రాణి ,చంద్ర గుప్త వంటి హిందీ నాటకాలు ఆడారు .పండిట్ రావు గారు సి .ఎస్ ఆర్ .గారు నటించిన ”వెంకటేశ్వర మహాత్మ్యం ”లో భ్రుగు మహర్షిగా,ప్రతిజ్ఞా సినిమాలోను నటించారు .మా బావ గారు కాలంక్ చేసి చాలా కాలమయింది .అందుకే బావ గారూఅని పిల్చుకున్నాను మిమ్ము .నాటక పిచ్చి ,వ్యామోహము మీకు ”అంక పొంకాల మీద పట్టింది ”అని అని అన్నారు .అంతే -నేను వేషాలు వేశాను .”భ;కా.రా.మేస్టారి ”అంతా ఇంతే ”నాటకం వేషం.చిన్నప్పుడు మా ఇంట్లో ‘తిక్కన గారి పద్యాల ”కృష్ణ రాయ బారం ‘ఆడం .నేను కృష్ణుడి వేషం వేశాను .దర్శకుడినీ నేనే .పాత రోజులు గుర్తుకొచ్చాయి పెద్ద ఆవ గారు .
నాటకాలలో మార్పులు తెచ్చారు మీరు పద్యాలు తగిన్చేశారు .పాటలూ కుదిన్చేశారు .ఇక్కడా ప్రయోగమే .”మొదటి వరుస లో క్కోర్చుని ,నాటకం చూస్తూ ,కాగితం పెన్సిలు పుచ్చుకొని ,ఎవరేక్కదేక్కడ బాగా చేశారో ,చెయ్య లేదో వ్రాసి ,తర్వాతచాడివి వినిపించి ,బాగా నటించటానికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు మేరు నటులకు .మీరు వేషాలు వేసి మెప్పించిన వారు కదా .డబ్బు సంపాదించారు -ఖర్చూ చేశారు .ఆ బుల పాటము తీర్చుకున్నారు .చేయి కదిగేసుకొన్నారు .మళ్ళీ కొత్త గెటప్ లోకి రావాలి
”ప్రయత్నం ,పౌరుషమనీ ,పర్యవసానం దైవిక మనీ”మొత్తం మీద తెలుసు కొన్నారు తాండ్ర పాపా రాయుడిగా ,విజయ రామ రాజు గా ,రా రాజు గా నటించిన అనుభవం మీది .ఇప్పటికి మీ వయస్సేమీ మీద పడింది కాదు .ఇవన్నీ మీ ”అనుభవాలు -జ్ఞాప కాలు ”మొదటి భాగం లో గుడి గుచ్చినవే .ఇప్పుడు మూడో సంపుట పుటల్లోకి అడుగేడు తున్నాం .
కవిత్వ రచనా విషయం లో మీ నిష్ఠ -పరాకాష్ట ..”రుశిత్వం జాగృతం ఆయె చోట  భాసించేది ఇక్యాను సంధానము ,కవిత్వం జాగృతం ఆయె చోట భాసించేది రస నిష్టా జరుగు తుంది .ఇదే సృష్టి ‘అని చక్కని వివేచనే చేశారు మీరు .ఈ విషయం మీకు స్ఫురించి నపుదల్లా ఆర్ద్రమ అయి పోతారు మీరు .ఒక సమాధి స్తితి లో వుంది ,బోధించే మహర్షి మహా వాక్యాలు లా వుతాయి మీ మాటలు .మీ ప్రయత్నాన్ని ”సాధన ”గా వర్ణించి ఉత్క్రుష్టత ను ఆపాదించారు .అదీ చాలదని ఏకం గా ”తపస్సు ”అన్నారు .అందుకే తమరు వచన ఋషులు .
జంట కవిత్వం అంటే మీకు అంత ఇష్టమైంది కాదు .ఆ దురదృష్టం పట్టక పోయి నందుకు చాలా ఆనందించారు కూడా .”మొల లోటు దుకం లో మోకాలి లోటు సంతోషం ;;గా పోల్చారు దాన్ని .”నేత్రావధానం ””కళ్ళతో కొడతారు ”అన్నారు తమాషాగా .అష్టావధానం మీదా మీకు మోజు లేదు .”కాగితప్పూలు అవి ‘అనిఈసడించారు . అవధానప్పద్యాలను ఎకి పారేశారు మీరు .వాటి కోసమే పామరులు ఎగబడే వారని ,అన్నారు .అయినా అందులోను ప్రవేశించి ,లోతులు తరచి సుభాష్ అని పించుకున్నారు . .HE DID NOT TOUCH WHICH HE DID NOT ADORN ”అన్నది మీ పట్ల నూటికి రెండొందల శాతం నిజ్హం .”అవధానం తో డబ్బు సులువు గా డొల్లు కో వచ్చు .”అన్న తేలిక భావం మీది .”అవధానికి అదే పారాయణం ”అని సాటి అవధానులను చూసి విని అని వుంటారు .అప్పుడు మీకు ధన మూలమిదం జగత కాదు కదా .”అష్టావధాని కుక్షిమ్భారి అనీ ,పెంట పాటి బైరాగి అనీ ‘ఖచ్చితం గ తేల్చేశారు .తప్పుచేస్తూ కూడా నిక్కచ్చిగా చెప్పారండీ అవధాని గారు .”అష్టావధానం చేయాల్సి రావటం ఒక దుర్దశ ఒకజీవితానికి అంతకు అని నిట్టుర్చారు .వేదనా వాసు దేవులే అయారు . ”
అయితే మీ సాధన వాళ్ళ అష్టావధానం మీకు వశీకరం అయింది .బంతి ఆటే ఆడుకోనారు దానితో .”ఒక్క దూకున సభలోకి వెళ్లి ,నిస్సంకోచం గా కూచో వచ్చు ధీమాగానే ప్రారంభించ వచ్చు అవధానం -ఇది అప్పటి కీడు లో నాకు ఒక మేలు ”ఎంత ధీమా మీది ?యెంత సపస్సిద్ధి గా గడిపారు కవితా జీవితం ?ఆ కల ను మీరు వినోదం గానే చూశారు .సభా గౌరవం గా భావించ లేదు .మీ అష్టావధానం మొదటి సారిగా విజయ అంతం అయిన రోజున మీ నాన్న గారు ”కవిత్వ పరం గా నన్న  గుర్తించటం ,తాము ఆన్నదిన్చాతము మొదటి సారిగా చేశారు ”అని సంబర పది పోయారు మీరు .ఏ తండ్రి అయినా కుమారుని గౌరం ,అభి వృద్ధే కదా కోరేది ?పైకి కానీ పించని వాత్సల్యం మీ పట్ల వుంది మీ తండ్రి గారికి ..అందుకే మిమ్మల్ని అంత ఆరడి పెట్టారు .మా తండ్రి గారు అంటే -ఆ విజయాల పట్ల నా నిష్ఠ పట్ల ,నా ప్రవర్తన పట్ల లోపల్లోపల సంతోషిస్తూనే ,పైకి మాత్రం గంభీరం గా కన్పించే వారు .ఇందులో మీ జనకులు ,ఆ జనకులు ఒక్కటే .అయితే ముసి ముసి నవ్వులు నవి మా నాన్న గారు కొంత ఊరట కల్గించే వారు .కర్తవ్య నిష్ఠ గల తండ్రులు అంటా అంతే నేమో ?
”నేత్రావధానం ”ను రెండు రోజుల్లో సాధించిన మీ దీక్షా దక్సహత బహుదా ప్రశంస నీయం .నిలకడ గా ఉన్న నీరు పాచి పడుతుంది .ఒక చోట ఉన్న డబ్బూ అంతే .దానికైనా దీని కైనా ప్రవాహం ఉండాలంటారు మీరు .అప్పుడే దాని విలువ ఆన్నారు ”యుక్త రీతి గా చేతులు ఆరి తేనే లోక ప్రవ్రుత్తి ”అని మీ మనో వృత్తినీ ఏరి గించారు .వినోదం చూస్తె కొందరి మస్తిష్కం పొంగి ,డబ్బు విడుపు తారని .కావ్య ప్రక్రియల్లాంటి వాటికి ”సీత్ -స్వయంపాక వైనా ఇవ్వరు ”అని లోక రీతిని చమత్కారం గా ,కారంగా చెప్పారు .”హృదయానికి బదులు ,వారి  డబ్బుకు మాత్రమే చలనం కల్గిస్తాయి వినోదాలు ”అని నిర్మోహ మాటం గా సెలవిచ్చారు అన్న గారూ !
సశేషం
                         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -02 -12 .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –జ్ఞాప కాల దొంతర మల్లెలు 5

  శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు —

                                  జ్ఞాప కాల దొంతర మల్లెలు –౫
 ఏలూరు లో వేద పండితులను ”పంతులు గారు ”సత్కరించిన సన్నివేశం నన్ను బాగా ఆకట్టు కుంది గురూగారూ !వింత సంబోధన కాదు .మీ లాంటి రహ్మన్యులను సంబోధించాల్సిన పద్ధ తే అది .నేను మీకు మానసిక అంతే వాసుణ్ణి .
వందల మంది ”వేద పండులు ”ఏలూరు వెళ్లి పంతులు గారికి కనిపించరు .కటిక నెల మీద కూర్చున్న పంతులు గారు ముగ్గు వంటి తలలతో ,మేడలో సూత్రం మాత్రమే వున్న ఆయన ఇల్లాలు ,-దరిద్రం లోను దాన ధర్మ వ్రుత్తి -తలో రూపాయి సంభావన .”చీర మడిచి ”అందరికి” రెడ్ కార్పెట్ ”వెల్కం చెప్పారా దంపతులు .”దయ చెయ్యండి ”అని దోసిలి ఒగ్గి ,ఆహ్వానిస్తున్నారు .చెమ్మగిలిన కళ్ళ తో అవధానులంతా ,మ్రాన్పడి పోయారు -ఆ వినయ విదేయతలకు అబ్బుర పడి .
మీ కంఠం ఒనికి ,కళ్ళు చెమ్మ గిల్లాయి అన్నారు .సహృదయులు ఎవరి కైనా అంతే .అప్పుడు మీ గురు దేవులు బ్రాహ్మణ్యాన్ని అంతటినీ ఆ దంపతులను ఆశీర్వ దించమని శాశించారు .”ముందు జన్మ లో పంతులు గారు దేవేంద్ర వైభవం అనుభవించాలి అ”అని నిండు మనసు తో ”ఎనభై శంఖాలు ఉరిమాయి .వేద మంత్ర స్మరణ తో .”ఉచ్చారణ తో .ప్రాకృత వాతావరణం  దాటి పోయారు అవధాను లందరూ .సామ గానం మీరు చేస్తుంటే ,ఎనభై వీనేలు ఒక్క మాటుగా పలికాయి .సామగానం తో ఆకశం ముఖరితమైంది .”యెంత గొప్ప వర్ణన అండీ .కవులు ,పండితులు ,వేద విశారదులు ,విద్వాంసులు ,సంగీతా శాస్త్ర పారంగతులు అయిన మీరు మీరు మాత్రమే చూప గల భావ చిత్రం అది .విచిత్రం అది .భళారే చిత్రం .ఈ ఘట్టం నాకుసంతత ధారా పాతాన్నితెస్తోంది నా నయన అభ్రాల నుండి .చిత్తం నిశ్చలమైంది . భావోద్వేగం  కుదిపేసింది .”ఆ రాజర్షి దంపతులు ”మీరు వెళ్లి పోయే వరకు అలానే దోసిలి ఒగ్గి నిలబడే ,మోకరించే వున్నారు .ఈ మాట చదివి చలించి పోని హృదయం వుండదు గాక ఉండదు .ఎంతటి రస బంధురం గా గుండెల లోని తేమను బయటికి రప్పించేట్లు చెప్పా రండీ .ఎంతటి ఉదాత్తత ను   ఆపాదిన్చారండీ ..దాత .ప్రతి గ్రహీత  పూర్తీ గా ధన్యులైన సన్ని వేషం ఇది .పవిత్ర దృశ్యం .అసదృశం .
ఇలాగే మా ఇంటికీ వేద విద్వాంశులు వస్తూందే వారు అన్న గారూ !నాన్న గారు వారి విద్వత్ ను పరీక్షించి ,తగిన బహుమానమిచ్చి సత్కరించే వారు .వారు వచ్చి చదివిన వేద పనస లను విని నాకు కొంత ఆ ధోరణి పట్టు బడింది .అందులో కొంత కృషీ చేయ గలిగాను .అప్పటి నుంచి ,ఇప్పటి వరకు అలా సంభావన ఇస్తూనే వున్నాను .నాన్న గారు చూపిన మార్గం అది .అమ్మ కు కూడా వేదం అంటే విపరీత మైన ఆసక్తి .నాన్న గారి మరణం తర్వాతా అమ్మే ,ఆ వచ్చిన వారి సామర్ధ్యాలను గుర్తించి ,బేరీజు వేసి ,నాతో తగినంత ఇప్పించేది .ఇది అనూచానం గా వస్తూనే వుంది ఇప్పటివరకు .ఆమె కూడా గతించిన   తర్వాతా నేనే ,నా బుద్ధికి తోచినట్లు సమర్పిస్తున్నాను .వచ్చిన వారు వేదోక్తం గా ఆశీస్సులు అండ జేస్తూనే వున్నారు .ఇదో తృప్తి అన్న గారూ !
”నాట కాంతం కవిత్వం ”అన్న ఆలంకారికుల మాటనే వ్యత్యస్తం చేశారు మీరు తాత గారూ !అవును అసలు తాతయ్య ఎలా ఉంటాడో తెలీని వాణ్ని .ఆ బుల పాతం కూడా ఇలా తీర్చు కుంటున్నాను .”నాటకాద్యం  కవిత్వం ”గా మార్చేసి .మళ్ళీ మార్గ దర్శనం చేశారు .
”గ్రంధాలు చదివి భాష నేర్చాను .స్త్రీలనాశ్రయించి ,నేర్చుకున్నాన్నేను తెలుగు భాష .ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీ ల వల్లనే అలవడింది నాకు .చదివింది పద్య వాగ్మయం అయినా ,రచిస్తోంది వచన వాగ్మయం .స్త్రీల భాష లో మాధుర్యం హృదయాలను పట్టి వేసే జాతీయతా కనబడింది నాకు ”అని ,మిమ్మల్ని ప్రబోధ పరచిన స్త్రీ మూర్తుల కు ఘన మైన నివాళులు  అంద జేశారుమీరు . ”కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసింది కాళికా దేవి .అలాగే ,నా చెవిలో ,ఆ మాత్రు దేవతల బీజాక్షరాలు ,కుమ్మరించారు .ఇవాళ నేను రాస్తున్న భాష ,వారు అనుగ్రహించిన దాన్లో ,సహశ్రామ్షమూ లేదు” . అనడం,మీ గొప్ప తనానికి నిదర్శనం .వారి పట్ల మీ గౌర వానికి ,చిహ్నం .నేర్చుకొనే మీ చిత్త వృత్తికి దర్పణం .”జాతీయ మైన తెలుగు భాష కావాలంటే ,స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి .మర్యాద గల తెలుగు భాష కావాలంటే ,మళ్ళీ క్షత్రియ రమణుల దగ్గరే నేర్చుకోవాలి .మరో దారి లేదు .”ఎంత నిక్కచ్చి గా చెప్పారండీ మీరు .?
”  నిజ్హం గా” మీ గాడ్ ఫాదర్ ”మల్లిడి సత్తి రెడ్డి గారే కదా అన్న గారూ   !”కీలక నామ సంవత్సర పంచాంగం అచ్చుపని మీ రచనా వ్యాసంగం పరా కాష్ట కు చేర టానికి” కీలక” మైంది .వారూ ,మీరూ చూసుకొన్న తోలి చూపులు హృదయం లోతులను పరి శీలించాయని ,ప్రవ్రుత్తి ని పరి శోదిన్చాయనీ ”అద్భుతం గా అన్నారు మీరు .అక్కడి” పుస్తకాల పోగు”మీకు ”వరహాల గుట్ట” లా కన పడిందని వరహాల మాట అన్నారు .నవ నిదుల్నీ తిరస్కరించి ,ఆ సరస్వతీ సామ్రాజ్యాన్ని ,అందుకోవాలను కొన్న మీ  ఆలోచన -నవ్య మైనదీ ,సవ్యమైన్దీ , మీకు బహు ఇష్ట మైన దీను ..అవన్నీ నూరుకొని ఒక్క మాటుగా తాగేద్దామన్నంత ”ఆబ ”మాత్రం పుట్టుక వచ్చిందన్నారు .యెంత ఉబ లాటం అండీ .ఆ పుస్తకాలు మీ కిచ్చి ,చదువు కొమంటే ,”పొంగి పోతూ ,”యేఘిరి” పోతూ ,” ఆనందం పొందారు మీరు .బ్రహ్మా నందం ,సహజా నందం ,మీ నడక ”నెమిలి పిట్ట తుర్రు ”మన్నట్లు ఉందా ?భలే ప్రయోగం అండీ .బుద్ధి స్థిమితంగా వుంటే రాత వెళ్ళ దనీ    ,అలజడి ,ఆందోళన లో భావం చిలక రింప బడుతుందని చెప్పారు -ఏ కవికైనా ,రచయిత కైనా అనుభవమే ఇది .
”భారతీ తిలక ముద్ర శాల ”మీ పట్ల సరస్వతీ పీతమే అయింది .రెడ్డి గారు దేశికులు,ఉపదేశికులు ,ఊతా ,మార్గ దర్శీ ,ప్రాతస్మరనీయుడే కాక ,సచివుడు ,స్నేహితుడు కూడా .అది మీకు పట్టిన అదృష్టం .మీరు కోరుకొన్న వరం .మీ సాధనకు ప్రేరణ ,బలం .సరి అయిన సమయం లో నే మీకు పెన్నిధి దొరికింది .మీ కోరిక తీర్చింది .మీ భావా వేషానికి ,ద్వారాలు తెరిచింది ,కూలంకష అయింది .తెనుగు జాతికి వర ప్రసాదం అయింది .నిండుగా ఉన్న తెలుగుదనం దర్శనం ఇప్పించిన ,తిరు మంత్రం అయింది .తిరు పతే అయింది .తిరుమలా అయి ,కలియుగ వైకున్తమే అయింది .తెలుగు ప్రజల మనో వాంచితా సాఫల్యం కల్గింది .”ప్రాప్తవ్య మర్ధం లభతే ,మనుష్యః ”-మనిషి కి రావాల్సింది రానే వస్తుంది అప్రయత్నం గా . .అలాగే జరిగింది మీ కూనూ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -02 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు జ్ఞాపకాల దొంతర మల్లెలు –4

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు 

                                           జ్ఞాపకాల దొంతర మల్లెలు –4

—          ”తెలుగులో కవిత్వం చెయ్య కూడదని ,అది అప్రతిష్టాకరం అని ,పతనం అనీ ”మీ వాళ్ల నమ్మకాన్ని ,ఎంత కమ్మగా వమ్ము చేశారండీ తరువాత్తరు వాత .ఇంగ్లీష్ ను భాష గా గుర్తించిన వారు ,”తెలుగు మాత్రం కాదు ”అన్న అపోహను ,ఎంత గొప్పగా తొలగించారండీ !ఈ నిరసన భావం మీలో ప్రతీకారం గా మారి ,వైదికాచారాల పట్ల వైముఖ్యం కల్గించా టమే  కాదు ,చివరికి సంధ్యా వందనానికీ ”వందనం -అంటే గుడ్బై చెప్పేసింది  ”అని నిర్మోహ మాటం గా చెప్పేశారు .ఆ తరువాత బాధ పడి పోయారు ఉత్తర కాలాన .పశ్చాత్తాపానికి మించిన్చిన్దేముంది అన్న గారూ !నిజ్హం గా మిమ్మల్ని అన్నగారు అనే సంబోదిస్తున్నాను .మా అన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ గారు నా 27 వ ఏట పరమ పదించారు .ఇంగ్లీష్ మాట్లాడటం లో ,రాయటం లో ఇంగ్లీష్ పుస్తకాలను మంచినీళ్ళ ప్రవాహం గా చదివి పారేయటం లో, కొని దాచటం లో ఆయనకు ఆయనే సాటి ..అందులో కొన్ని నా దగ్గర ఇప్పటికీ దాచుకోన్నవి వున్నాయి .అందులో మాక్సిం గోర్కి జీవిత చరిత్ర ముఖ్యం గా నేను చదివాను .ఆ నాటి మా అన్న గారి సహ పాటకులు ఎవరికీ ,అంతటి ఆంగ్ల పరిజ్ఞానం వుండేది కాదని ,వారి మిత్రులే నాకు చెప్పే వారు .ఆయన తాడంకి స్కూల్ విద్యార్ధి .అక్కడి ఆంగ్ల వ్యాస ,వక్క్ర్తుత్వ పోటీల్లో ఎప్పుడు ఆయనదే ప్రధమ బహుమతి అని చెప్పారు హోస్పేట లో రైల్ వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హటాత్తు  గా     గుండె పోటు తో 1957 లో మర ణించారు . .నాకు ,నా మిత్రులకు ,మా తోమ్మదవ తరగతి లో గాంధీ గారిపై సి ఎఫ్.ఆండ్రూస్ రాసిన ఆంగ్ల పాఠం బోధించటం ఇంకా నేను గుర్తుంచుకోన్నాను .అందులో” స్మోకింగ్ ను బాడ్ హాబిట్ గా” చెప్పిన మాటలు చెబుతూ సిగ్గు పడి పోయారు మా అన్న గారు .కారణం తాను చైన్ స్మోకేర్ అవటమే .మేమూ ఆ పాఠం వింటూ ముసి ముసినవ్వులు   నవ్వుకొనే వాళ్ళం .అసలు ఆ పాఠం ఆయనతో చెప్పించటం  నా గడుసు ప్రయత్నమే .ఆ ఘట్టం ఇంకా కళ్ళ ముందు దృశ్యమానం అవుతోంది . .
”ఘోషాల వల్ల స్త్రీకి పర పురుష ప్రీతి పెరిగి నట్లు ”మీకూ ,మీ వాళ్ల నిర్బంధం అనే ఘోషా వల్ల ”తెలుగు పురుషోత్తమ కాంక్ష ”పెరిగింది .అక్కడ స్వైర వృత్తి అయితె ,ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం .ధన్య జీవులండీ !మీ తెలుగు ”వీర పూజ ”సద్యోఫలితాన్నిచ్చి ,మీకు ఊరట కల్గించింది .”ప్రచ్చన్న బ్రహ్మ సమాజి కుంణీ అయి పోయాను ”అని మీరు బాధ పడి పోయారు .మీ వాళ్ల తీరు తెన్నూ చూసి విసిగి పోయి మీ దారి మీరు చూసుకున్నారు .మీరేం చేస్తారు అంతా కాల ప్రభావం ,కర్మ ఫలితమూను ..
మీ పిత్రువంశాన్ని ఎంత ఘనం గా పొగిడి ,పొగడ పూజ చేశారండీ అన్న గారూ !మీ పితామహులు ”శివ రామ సిద్ధాంతి దీక్షితులు ”గారు ,యజ్ఞం చేయక పోయినా ,”రాజర్షి ”గా ప్రసిద్ధులు .మేధా దక్షిణా మూర్తిఉపాసకులు .మీ కుటుంబానికి వచ్చిన ప్రజ్న అంతా ,ఆ ఉపాసనా ఫలిత్సమే .మీ మేధా ,ప్రజ్ఞకు అదే కారణం .అదే మీకు ఆగ్రహాల పెట్టు .మీ తండ్రి గారు లక్ష్మీ పతి సోమయాజులు గారు ”వేదం ఆశీతిద్వాయము ,శ్రౌతం ,కాండ త్రయం ,జ్యోతిషం స్కంద త్రయం క్షుణ్ణం గా అభ్యసించిన పుణ్యులు .స్మార్తం లో ఆపస్తంభులే.ధర్మ శాస్త్ర పారంగతులు కూడా .మంత్ర శాస్త్రం లో ”పాడుకాంత దీక్షా పరులు ”మీదు మిక్కిలి దక్షిణా మూర్తి ధ్యాన మూర్తి కూడా . .
అదీ మీకు కల్ప వృక్షమే అయింది .,కామదేనువూయింది .ఏది నేర్చినా ”ఇతిశ్రీ ”గా నేర్చి ,అవలోడనం చేశారు .”సంగ్రహీనా వసీదతి ”తత్వజ్ఞులు .సభల్లో సింహ సద్రుశులు .మరి ఆ సింహం కదుపున పిల్లి పిల్ల ఎలా పుడుతున్దండీ .అందుకే కిషోర ప్రాయం నుంచే తాము ”యువ కిశోరాలు ”అయి విజ్రుమ్భించారు .ఆ” జీన్” అలాంటిది .కుల విద్యలన్నీ మీకు దాదాపు అబ్బినా ,ఎవరు తొక్కని మార్గాలు తొక్కి ,కొత్త దార్లు వేసి ,మార్గ దర్శకులని పించుకునారు .అదే మీ ప్రత్యేకత .ఆ ఠీవీ అబ్బిన వారు మీరు .”వైదికా చారాల మీద ఇప్పటికీ కొంత అశ్రద్ధ వుంది నిజమే .కాని ,వేదం వినడం మాత్రం పరమ ప్రీతీ ”అని నిండుగా చెప్పారు అన్న గారూ మీరు .అలాంటిదే నా ప్రవ్రుత్తీ కూడా.మా తండ్రి గారు మృత్యుంజయ శాస్త్రి గారు అపర శివావతారమే .మా తల్లి గారు సాక్షాత్తు ఆ ”భావానమ్మే ”.వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులే .వాగార్దాల్లా మెలిగిన పుణ్య జంట .విభూతి పెట్టు కొని ,పంచె కట్టు కట్టి ,మా నాన్న గారు వుంటే మాకు” శివానంద లహరే” .పచ్చని బంగారం లాంటి మా అమ్మగారు అన్న పూర్నా దేవే .సౌందర్య లహరే మాకు . వైదికం ఘనం గా నేర్చిన వారు మా తండ్రి గారు .శ్రౌత ,స్మార్తాలలో దిగ్దంతులని పేరు .వాటిల్లో ఏ తప్పు వచ్చినా ,సరి దిద్ద గలిగే ప్రతిభా ,పాండిత్యం ఉన్న వారు .సంస్కృత కావ్యాలనీ అధ్యనం చేశి పాతం చెప్పా గల సర్వ సమర్ధులు .మిత భాషి .ముక్కు మీద కోపం .ఇదీ చాల దన్నట్లు మద్రాస్ లో తెలుగు విద్వాన్ పట్టం సాధించారు .విద్వాన్ అంటే అక్షరాలా విద్వాంసులే .కృష్ణా జిల్లాలో మా నాన్న గారంతటి పాండిత్యం ఉన్న వారు లేరని మా కాలం లో చెప్పుకొనే వారు .ఆయన సహచరులే ఆ మాట చెప్పే వారు .ఆబ్దిక మంత్రాలను సుస్వరం గా చెప్పటం లో ఆరి తేరిన వారనీ ,ఆ భాగం నిష్ణాతులు ,మా ఇంటి పురోహితులు నాతొ చాలా సార్లుచెప్పారు . .మా నాన్న గారు వుంటే తామంతా ఒళ్లుదగ్గర పెట్టు కొని ఉండాల్సిందే నని అనే వారు .వేసవి సెలవుల్లో మాకు మా మిత్ర బృందానికి సంస్కృతం  నేర్పే వారు .శబ్ద మంజరి KANTHO పాఠం చెయ్యాల్సిందే .అందులో బాల రామాయణం బాగా  వచ్చు మాకు .ఆ తర్వాత కాళిదాసు గారి రఘు  వంశ ,కుమార సంభావ కావ్యాలు చెప్పారు .తప్పని సరిగా సంత వేయాల్సిందే .అలసత్వం పనికి రాదు .మర్నాడు అప్పగించాల్సిందే .వారి చూపు లోనే ”నియంత ”లక్షణం కని పించేది .ఎదుట పడి మాట్లాడ టానికె భయం .నాకు మరీని .
అనంతపురం జిల్లా హిందూ పురం లోని యి.సి.ఏం ..హై స్కూల్ లో22 ఏళ్ళు సేనియర్   తెలుగు పండితులు గా పని చేసి చేశారు .ఆ సర్వీసు తోనే ,కృష్ణా జిల్లా కు బదిలీ అయి ,జగ్గయ్య పేట ,వుయ్యూరు ఉన్నత పాథ శాలలో పని చేసి వుయ్యూరు లో నే పదవీ విరమణ చేశారు తెలుగు . పాఠం చెప్పటం లో అందె వేసిన చెయ్యి గా ప్రసిద్ధులు .ఎందరో కవులు ,విద్వాంసులు కవిత్వం రాసుకొని వచ్చి మా నాన్న గారితో సరి దిద్దిన్చుకొనే వారు .ఇదంతా జ్ఞాపకం వచ్చింది మీ  వంశ చరిత్ర చదువు తుంటే .అక్షర బద్ధం చెయ్య కుండా ఉండ లేక పోయాను .నేనూ ఉడతా భక్తీ ని ప్రకటించాలి అనే తపన వున్నా వాణ్ని .నాకూ  మీ లాగే కొత్త దనం ఇష్టమే .కొత్త పోకడలు ఇష్టమే ”.ఆధారం ఆర్షమై ,కొత్త నిర్మాణాలు చేయాలి” అన్నది నా ఉబలాటం .అందుకే మీ రచనలు అంటే అంత ఇష్టం .మీరంటే మరీ ఇష్టం .మీ పోకడ ఇష్టం .మీ మార్గం మరీ మరీ ఇష్టం .మీ నీతి నిజాయితీ లంటే చెప్పలేనంత ఇష్టం .మీ కవిత్వం ,మీ పాండిత్యం ,మీ ప్రతిబా త్రివేణీ సంగమమే. మీ అంతఃకరణ అందుకే అంత పవిత్రం .అలా వుండాలని నేనూ అనుకొనే వాడినే .కానీ వుంటున్నానా ?ఉండాలన్న ఆశ.మీ రచన  లపై మక్కువకు కారణం అయింది .మీ రచన లోని చదివించే శక్తి నన్ను అతిగా ఆకర్షించింది అన్నయ్య గారూ  !
సశేషం


మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -02 -12

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అంబరాన్నంటిన శిడిబండి సంబరం

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాప కాల దొంతర మల్లెలు –౩

  శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –

                                            జ్ఞాప కాల దొంతర మల్లెలు –౩
 మీ జ్యోతిష్యాస్త్ర గరిమ ఎన్నదగినది ”మామయ్య గారూ ”!.సంబోధన మార్చాను -గమనించే వుంటారు .మా మేన మామ గుండు గంగాధర శాస్త్రి గారు మచి జ్యోతిశ్శాస్త్ర పండితులు -అందుకనే అలా పిలిచా.పదారేళ్ళ పడుచు ప్రాయం లోనే ,ముహూర్త నిర్ణయం లో సర్వ స్వతంత్రు లైన మీ ప్రజ్ఞకు ,,ప్రతిభ కు జోహార్లు .వంశగతం గా వచ్చిన విద్యను ,కరతలామలకం చేసుకొన్న సరస్వతీ పుత్రులు కదా మామ గారూ!దివ్య జ్యోతిషాన్ని భువికి దింపి ,ప్రశ్నలకు ఫలప్రద మైన జవాబులు చెప్పి ,అన్దరి మన్నల్ని మీరు అందుకొన్న వారు కదా .
”దొడ్డంపేట ”జమీన్ దారిణి  ”రంగ నాయకమ్మ”మహోన్నత వ్యక్తిత్వం మీరు చక్కగా ఆవిష్కరించారు .ఆమె అంటే ”దిశలు తెల్ల వారేవి ”అన్న  మీ మాట ,ఆమె ”దశా ,దిశ నిర్దేశనం ”చేసింది .”ఆ వూళ్ళో అన్ని శాఖల వారికి ఇళ్ళల్లో వంటలు లేవని ,ఆబాల గోపాలం  ,దివాణం లో భోజనం చేయ వలసిన్దేనని -అదీ రెండు పూట్లానని ”అని ,ఆమె ఔదార్యాన్ని ,చక్కని ”అక్షరు గుడి ”కట్టి చూపించారు .
”బైరాగి శాస్త్రి ”గారి అధ్యాపనానికి కీర్తి కిరీటం పెట్టారు మీరు .అంతేవాసులు ఆ భక్త్యంజలి ఘంటించారు .వారి వద్ద అన్నీ చదవ లేక పోయానే అనే మీ తీరని  బాధ అర్ధ మైంది .మీ వినయం అంత ఉత్కృష్ట మైంది .వారు చెప్పిన దాని కంటే ,మీరు సాధించు కొన్నదే ఎక్కువ అని నా భావం.మీ వినమ్రతకు ముగ్ధుణ్ణి .
మీరు తెలుగు గ్రంధాలు చదవాలి అణు కొన్నప్పుడు ,అప్పటి దాకా అడ్డు పడ్డ మీ పెద్దన్న గారు ”శివ రామ సిద్ధాంతి   దీక్షితులు ”గారు ,ఇష్టా పార్టి గా ”సంయే ”అన్నారని ,యెంత పొంగి పోయారండీ ?అల్ప సంతోషిత్వం అంటే ఇదే నేమో /
నన్నయా గారి భారతం ఎన్నో సార్లు చదివానని ముచ్చట పడ్డారు తమరు .నన్నయ కవి ఊహా చిత్రాన్ని ,ఎంత అండం గా చిత్రిన్చారండీ మీరు అన్న గారూ !”ఉభయ పింజల తోనూ ,నీరు కావి ధోవతి కట్టుకొని ,అలాంటిదే ఉత్త రీయం కప్పుకొని ,,ఎడమ భుజాన జలతారు ఆకు పచ్చ శాలువా మడతా ,మొగాన స్ఫుటం గా గందాక్షతలు ,మొలలో బంగారు గోవ తాడూ ,చేతులకు సింహ తలాటం ,మురుగులు ,కుడి చేతి అనామిక కు దర్భ ముళ్ళ రత్న అంగుళీయకం  ,చెవులకు కెంపులు పొదివిన మకర కుండా లాలు ధరించి ,,రాజాది రాజులను పాదా క్రాంతులను చేసుకొనే చూపులతో ,బక్క పలుచని నన్నయ భట్టారకుడు ,రాజ రాజు నిండోల గాన ,అగ్రాసనం అలంకరించి సాక్షాత్కరిస్తాడు నాకు ”. ” తన కుల బ్రాహ్మణుడు” ”అన్న పద్యం చదివాప్పటికి అని మీరు అక్షర రమ్యతను అద్దం లో చూపి ,మూర్తీభ వించిన   ,పుంభావ సరస్వతీ ,వాగను శాసనుడు అయిన ఆ విరాన్మూర్తి ని మా మనో ఫలా కాలపై ప్రత్యక్షత్కరించారు .శ్రోత్రియ బ్రాహ్మణ్య మూర్తుల దివ్య స్వరూపాలకే ,మంగళ మూర్తి అయిన ,భారత రత్న దారీ ,సూత్రా దారీ ,అయిన ,కవి ,పండిత స్వరూపులు అయిన భట్టారకులను .ఆ తేజో మూర్తికీ ,ఈ అక్షర శిల్ప మూర్తి కీ ,నమస్కరించ కుండా ఉండ గలమా ?అదృష్ట వంతు లండీ అన్న గారూ !మాకూ ,ఆద్రుష్టాన్ని పట్టించారు .”నన్నయ ఆవ తారిక మాత్రం ”స్వయమ్భువుహ్ ”అద్వితీయం ,అనన్య సాధ్యము -;”హరి ఓంమనే”  టప్పటి కే  ,రసాను భవం కల్గించే ,అవతారిక తెలుగు లో నన్నయది ఒక్కటే -దానికి సాటి కాళిదాసు రఘువంశావ తారిక ఒక్కటే ” ”అన్న మీ మీ కితాబు -మతాబు లా వెలుగులు చూసింది .తేజోమయం చేసింది .”చిక్కని కవిత్వం -అమృతం ”అన్నారు మీరు పెద్దాయన కవిత్వాన్ని విశ్లేషిస్తూ .అంటూనే ,”పర్వాను క్రమానిక ”ను ,’సర్వ సంగ్ర హాన్ని ”తడి మారు .దీనితో పాటు ,వీరేశ లింగం గారి ”కవుల చరిత్ర ”నిత్య నూతనమే గా మీకు ?
ఓ ఇంగ్లీష్ రచయిత ,నవలా దొంతర ”మూరెడు ఎత్తు  ”వుందని ఒకాయన మీతో  అంటే,”మనం గజం ఎత్తు పుస్త కాలు రచించాలి ”అని ,మీరు తీసు కొన్న నిర్ణయం,అమలు జరిగిన తీరు ఆశ్చర్య కారం .మీకు అది మంచి సమయం లో వచ్చిన గొప్ప ప్రేరణ కదండీ !పదు నైన క్షేత్రం లో పడ్డ జీవ వంత మైన విత్తనం ,అది నిజం గానే మొల కెత్తి ,అక్షయ అక్షర వట వృక్షమే అయింది . నీడ నిచ్చి ,వ్రేల్లూనుకొని  ,తర తరాలకు ఆశ్రయం, ఆదర్శం  అయింది .
ఎంత సున్నిత మనస్కు లండీ బాబాయి గారూ !అవును నాకు స్వంత బాబాయి లేడు .అందుకని ,ఆ లోటును ఇలా పిల్చుకొని తీర్చు కొన్నాను .మా శివ రామ దీక్షితులు బాబాయి అంటే మా నాయనమ్మ గారి అప్ప గారి కుమారులు మీలా సున్నితంగా ,కోమలం గా ,బంగారు రంగుతో ,,వుండే వారు .అయితె పిట్టంత మనిషే .మీ భారి విగ్రహం లేడు వారికి .మిత భాషి .అనుష్టానం ,ధ్యానం తో కాల క్షేపం చేసే వారు .రేపల్లె లో మోతు బరి ఆసామి .ఉయ్యాల మంచం ,వెండి కంచం లో భోజనం ,డాబా ఇల్లు ,పొలం ,పుట్రా నగాస నట్రా ,మాలో మహాదైశ్వార్య వంతులు .అందుకే ఆయన జ్ఞాపకం వచ్చారు .అంతే .      భీముడు దుర్యోధనుణ్ణి రెచ్చ గొట్టటం వల్ల మీరు కౌరవ పక్ష పాతి గా మారా రా?వింతగా ,విడ్డూరం గా వుంది .లేత మనసు పై పడ్డ ముద్ర చెరిగి పోదని ,మానసిక తత్వ వేట్టాలు అంటున్న మాట .మీ ఎడలా నిజమే నేమో ?”కౌరవ పక్ష పాతం తప్పు అని పించే సన్ని వేశం నా కెక్కడా కంపించ లేదు భారతం -ఇప్పటికీ ”అని మీరు ,మీ తీరు మార్చుకోలేదన్న మాట .అందుకే ”రాజ రాజు ”నాటకం రాసి ,కూరు సార్వ భౌముడు కి ,అక్షర పట్టాభిషేకం చేశారు .భలే గడుసు వారండీ మీరు !మీ కంటే మీ గురువుల ”కురు ”పక్ష పాతంమరీ ఎక్కువై ,”కౌరవ గౌరవం ”రాసి ,సుయోధనుడికి కొమ్ము కాశారన్న మాట .అయితె మహర్షి వ్యాసుని భావం ,అంతటి కవి రుషి ,ఆది కవి నన్నయ గారి ఆలోచనా పెడ దారి పట్టాయనా -చిన్నాయనా ?అయ్యో ఎంత ధర్మ సంకటం తెచ్చారండీ .!ధర్మం చిరంజీవి అన్న మాట మరిచి పోయారా ?మీ భావం చూస్తె బాదేస్తోందండి బాబూ !పంచమ వెద మైన భారతాన్ని ఎందుకలా మీరు అపార్ధం చేసు కొన్నారు ?అదో పీడ కల అనుకొంటాన్నేను . ఏమిటీ వింత పోకడ మహాత్మా !సర్వజ్ఞులు మీరు .ధర్మ దీపం వెలిగించాల్సిన ”రామ కృష్ణ కవులు ”అంధకారం లోంచి బయటకు రాలేక పోయారా !సరే  పోనీండి .ఏం చేద్దాం .విపులాచ పృధ్వీ అన్నారు అందుకనే నేమో ?

సశేషం ———మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –14 -02  -12 .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తెలుగు భాష లో తెగులు సీరియళ్ళు

కవిత పూర్తిగా

pdf ఫైల్ లో కవిత వున్నది  కవి పేరు భమిడిపాటి  బాలా త్రిపుర సుందరి

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు – జ్ఞాపకాల దొంతర మల్లెలు –2

శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –
 జ్ఞాపకాల దొంతర మల్లెలు –2

      పెద్దన్న గరూ !పెద్దన్న కవి ప్రబంధాలకు ఒరవడి పెడితే ,తమరు ,జాతీయ మైన వచనానికి నడవడి నేర్పారు .వచనాన్ని వాచో విదేయం చేసి ,పద్యాల్లా ,జనం నాలుక పై నర్తింప జేశారు .అందుకే పెద్దన్న అన్నాను .”నిఝాం ‘ గా అంతే నండీ .
ఎంతటి భక్తీ ప్రపత్తులండీ మీకు .?మీ మాతామహ ,పితామహ వంశోద్ధారకు లందరినీ పేరు పేరు నా స్మరించారు .వారి వృత్తినీ ,ప్రవృత్తినీ ,ప్రతిభా పాటవాలను ,ఎరిగించారు .కాదు ఊరేగించారు .వారికి మీఅక్షరాలూ  ”తిలాంజలి ”అయింది .అలా పిత్రూణం తీర్చుకొని ,ధన్యులైనారు .అంతేనా ?ఎరిగిన ప్రతి కుటుంబాన్ని ,సంబంధం వున్నప్రతి  ఆత్మీయుడినీ ,సహకరించిన ప్రతి యోగ్యున్నీ ,మనసా ,వాచా ,కర్మణా మీరు శ్లాఘించి ,క్రుతజ్ఞాతాంజలి ఘటించారు .మీ పెద్ద మనసు త్యాగయ్య గారు అన్నట్లు మీ ”దినుసే ”.మీ అక్షర సేవనం వారికిచ్చిన ” ధర్మోదకం  ”.ఇలా ఆత్మ జ్ఞాతు లైన వారందరికీ మీరు ఋణం తీర్చు కున్నారు .రుణ బంధ విమోచనులు అయారు .ఎంత ధన్యులండీ అన్న గారూ !
మీరు ఆడి ,పాడి ,కూడిన గ్రామాలన్నిటిని గుర్తుంచుకొని ,నివేదించారు . ఆ  అనుబంధాలను వీలైనప్పు డల్లా విష్పస్టం చేశారు .మీ జీవిత చరిత్ర పటం లో ,వాటికి సముచిత స్థానం ఏర్పర చారు .ఆ గ్రామాల నామాలు మీ వల్ల భగవత్ సేవ లో విని పించే అష్టోత్తర ,శత నామాల పావిత్ర్యం కల్పించారు .ఇక్కడ అవి ధన్య మైనాయి మీ స్మరణ వల్లా ,సంపర్కం వల్లా ,..ఇలా చరా చరాలన్నిటికి ,మీరు అక్షరాభి షేకం చేశారు ,అర్చించారు ,అక్షర నైవేద్యం చూపి ,నీరాజనాలు అందించారు .సర్వ  ప్రపంచం తోనూ ,విశ్వ కర్త వ్యాప్తుడై వున్నా డన్న వేదోప నిశాత్తుల రహశ్యాలను శోధించి ,తెలుసు కోని ,చూసి ,ఆచరించి ,తరించారు . .”సో-హం ”,”అహం బ్రహ్మాస్మి ”లకు అనుష్టాన ప్రాక్రియత తో ,తాదాత్మ్యం చెందారు .ధన్యత చెందారు .శ్లాఘనీయం మీ వర్ధనం , ,ప్రవర్తనం .
దీపావళి టపాకాయల తయారీ  విశేషాలు ,ఆ కళ లోనిష్ణాతుడ నైన  నాకు బాగా నచ్చాయి .మేమూ అవ్వాయి చువ్వాయిల్తో వీధుల్లో” లడాయి” కి దిగే వాళ్ళం .ఆ ఆనందం వర్ణ నా తీతం .గోగు దీపాలు ,జిల్లీలు ,కూరినచిచ్చు బుడ్డ్లుకట్టిన మతాబులు  ,తయారు చేయటం లో కష్టం గా వున్నా ,అవి కాలుతూ వెలుగులు జిమ్ముతూ ,పెద్ద ధ్వనులతో పేలుతూ వుంటే సంతృప్తి గా వుండేది .ఒక నెల అంతా సరదాయే .దసరా వెళ్ళ గానే ఈ సరదా ప్రారంభం .
సంస్కృత ,తెలుగు కావ్యాలపై తమకు ఎంత శ్రద్ధా ఆసక్తీ అండీ అన్న గారూ !”వాసు ”అంతే మీకు నిజం గా బంగారమే .ఆ పసిడి వెలుగులు చూసిన వారందరికీ ,అంతే నండి .భట్టు కవి ప్రతిభా పెటికే కదండీ వసు చరిత్ర .”సాహిత్య వేత్తలకు అవి నిషకాలు ”అన్న మీ మాటలు అక్షర సత్యాలే .మునిగితే కదా లోతు,ఆంతర్యం  తెలి సేది ?ఒడ్డున కూర్చుంటే వినోదం ఎక్కడిది /కవిత్వం ,పాండిత్యం భిన్న శక్తులు అని ,ఆ రెండునిండు   వున్న వాడు రామ రాజ భూషణుడు అని మీరు చెప్పారు .కాదు అనేందుకు ఏమి వుందండి ?అనుభవ సారం .
”మదన కామ రాజు ”కధల పుస్తకం బామ్మ గారిచ్చి చదవమన్నప్పుడు మీరు పొందిన ఆనందం ,సీతాదేవి లంకలో చూసిన హనుమ ఆనందం లా వుంది అని పించారు .”కధలు చెబుతున్నా ,వింటున్నా ,అల్లుతున్నా ,అలాంటి పుస్తకం ఓటి వుంది అని మొత్త మొదటి సారిగా చూసిన మీ ఆశ్చర్యం ,ఆనందం మీకే అనుభవైక వేద్యం .”ఈ కధల మాధుర్యాల ముందు పటిక బెల్లం తీపి ,ఏమూలకి ?”అనుకోని ,ఎంత సంబర పడ్డా రండీ మీరు ?దాని వల్లే ”కదాభిరుచి ”కలిగిందని ఎంత నిజాయితీ గా చెప్పారు ?
మీ ”పలమూరు ”దగ్గర వున్న” తుల్యా సాగర సంగమం ”తీరు మీరు వర్ణిస్తూంటే ,ఎప్పుడు వెళ్లి అక్కడ మునిగి ,పవిత్ర వంతం అవుదామా అని పిస్తుంది .”సంతాన కాంక్ష కల వారికి సప్త సాగర యాత్ర ,పౌష్య బహుళ అమా వాస్య నాడు ”అక్కడే ప్రారంభం అవుతుందా ?మీ తీర వాసులు ధన్యులు అండీ .”ఉత్తర వాహినీ -పశ్చిమ లింగము ”వున్న స్థలం గొప్ప క్షేత్రం అవుతుందని తెలియ జేశారు .అందుకే కాశీ కి సమాన మైంది మీ ”పోల మూరు ”.అది పొలమూరు కాదేమో అన్న గారూ !”పుణ్యములు- ఊరు ”స్థల మేమో నండీ.
బ్రాహ్మణ అగ్రహారాలు ,వాటి తీరు తెన్నులు ,బ్రహ్మణ్యు లైన,విప్రోత్తముల జీవన సరళీ ,వైదిక ధార్మిక శాస్త్ర ,వ్యాకరణ ,జ్యోతిశాలన్ని ఆపోసన పట్టిన అపర అగస్త్యులు అయిన రుషి జీవితం గడిపిన వారి ప్రవర్తనా విధానం ,వర్ణించి మీరు చెబుతుంటే ,”భూ-సుర ”’లోకం లో ఉన్నామేమో నని పిస్తుంది .వాళ్ళ ఆవేశ కావేశాలు ,బంధు ప్రీతి ,మీరు ఏంటో మెచ్చారు .వాళ్ళ మూర్ఖపు పోకడలు ,ఛందో బద్ధ మైన చాందసం , ,కట్టు బాట్లు ,అవి ఎలా ప్రగతికి ప్రతి బంధకాలు అవుతున్నాయో కూడా కళ్ళకు కట్టించారు .రాగ ద్వేషాలు లేని మీ సమవర్తిత్వం బహుదా ప్రశంస నీయం . మీకు పరకాయ ప్రవేశ విద్య చిన్న నాడే అబ్బిందా  అన్న గారు !లేక పొతే ఎలా చెప్ప గల రండీ /అందర్లోనూ మీరే కన్పిస్తారు నాకు . అందర్నీ” అంత్హ ”.ఎత్తున నిల బెడ తారు .వారి తప్పులనీ మన్నిస్తారు .సానుభూతి మీకు నిత్య విభూతి ధారణా ?మనుషుల పోకడల్ని ఫోటో తీసి చూపిస్తారు .ఎలా అబ్బింది చిన్నబ్బాయి గారూ !నిసర్గ రమణీయం ఆ చిత్రాలు .కలర్ ఫోటో ఆ నాడే తీసే నేర్పు అలవడి నట్లుంది .ఎంత నిశిత  పరి శీలనా శీలురండీ మీరు ?చీకట్లో కూడా వెలుగు నింపే ,ఫ్లాష్ లైట్లు మీ కళ్ళు .అవి ,కలల లోగిళ్ళే కాదు ,కాంతి ప్రసరణ సాద నాలు .దివ్య చంద్రికలు .రవి ,చంద్రులు నిజం గా ,మీ కళ్ళల్లో కాపురం వున్నారు అంటాను .”ఒత్హిది ”అంటారు మీరు .కాదంటాను  నేను .,
సశేషం -మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

This slideshow requires JavaScript.

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ పాద వారి అనుభ వాల జుంటి తేనే – జ్ఞాప కాల దొంతర మల్లెలు 1

 శ్రీ పాద వారి అనుభ వాల జుంటి తేనే –

                                      జ్ఞాప కాల దొంతర మల్లెలు     1

—  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే నాకు పరవశం .ఆయన ధవళ  వస్త్ర ధారణ ,పంచె కట్టు ,శాలువా వేసే విధానం ,తెలుగు భాష ,ఆణి ముత్యాల్లాంటి కధలు ,నడవడి నడక తీరు ,మల్లె మనసు ,ఆయన అనుభవాలు ,జ్ఞాపకాలు అన్నీ మరీ మరీ ఇష్టం .ఎన్నో సార్లు చదివినా మళ్ళీ చదివించే ఆప్యాయత వారి సొత్తు .1999 లో మళ్ళీ వారి” అనుభ వాలు -జ్ఞాపకాలు ”చదివా .ఆ ఆనందం లో ”అనుభవాల జుంటి తేనే పుచ్చు కొని ,జ్ఞాపకాల దొంతర మల్లెల సువాసన అనుభవించాక ” అని నాకోసం 01 -02 -1999 న రాసు కొన్న నిక్షిప్త నిధి ఇది .పన్నెండేళ్ళు మాగిన దివ్య ఫలం .ఇప్పుడు మీ కోసం .
అన్న గారూ !శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ !ఆంగీరస ,అయాస్య ,గౌతమ త్రయార్ర్శేయ  ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భావస్య   కృష్ణ యజుస్సాఖాధ్యాయీ దుర్గా ప్రసాద శర్మన్ అహం భో అభి వాద యేత్ –
బ్రహ్మణ్యులు   మీరు -సుబ్రహ్మణ్యు లు  యదార్ధం గా -అసలు సిసలు తెలుగు వచనానికి శ్రీ పాదులు తమరు .మీ అనుభవాలు ,మా బోంట్లకు అననుభవాలు .మీ జ్ఞాప  కాలు మీకు తీపి గుర్తులైతే ,మాకు తేనెల ఊటలు. జాతికి అందిన అమూల్య రత్నాభరణాలు .వచన రచనకే కీర్తి తోరణాలు .భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసిన ,నిధి నిక్షే పాలు .మీ అనుభవ సారాలు మాకు మా” నూజివీడు చిన్న రసాలు” .విజాతి వ్యామోహ పైత్య కారులకు మాదీ ఫల రసాయనాలు ,పైత్యాంత కాలూను .
శుద్ధ వైదిక కుటుంబం లో పుట్టి ,ఆర్షేయ ,పౌరుషేయాలకు ఆల వాల మైన వాతావరణం లో పెరిగి ,శల్య గతః వాటిని జీర్ణించుకొని ,ఆ బాటలో మీ తండ్రీ ,సహోదరుల కు  ఏమాత్రం తీసి పోని ,ప్రజ్ఞా పాటవాలు చూపించి ,మీ మార్గం లోంచి ,మిమ్మల్ని మల్లిన్చాలన్న వాళ్ల తీవ్ర ప్రయత్నాలకు ,పట్టుదల వదలని విక్రమార్కుని లా మీరే  పంతం నెగ్గించు కొంటు ,సాధ్య మైనంత వరకు వారిని నొప్పింపక ,వారే తప్పనిసరి యై ,మీ దారి లోకి వచ్చే ట్లు చేసిన ,మీ సానుకూల ప్రయత్నాలు ధన్య తరాలు .మీ మనో శక్తి ముందు ,ఏదీ ఆగ లేక పోయింది .నిత్య విజేతలై ,అనుకున్నది సాధించి ,మీరు మీరే అన్న ప్రమాణం నెల కోల్పారు .అమోఘ మైన మీ ఆత్మ శక్తికీ ,బాధ్యతల బరువును కొండం త  గా మోస్తున్నా ,చలించని మీ ధైర్యం ,సాహసమే ఊపిరిగా సాగిన మీ జీవితం జాతికి ఎంతో స్ఫూర్తి నిచ్చింది .ఎప్పుడో ఒక సారి చదివినా ,ఆ అనుభవాల తేగల  పాతర ,నిత్యం ఊరిస్తూనే వుంది .అందుకే వీలైన ప్పుడల్లా  చది వాను .చదువుతున్నాను ,చదువు తాను కూడా .ఏదో రస ప్రవాహం లో పూర్తిగా మునిగి పోయినంత  ఆనందం .అందు లోంచి ,బయటకు రాలేని వైనం .ఇంత చదివీ నేర్చుకొని ఆచరించేది అతి స్వలప్పమే అని తెలిసినా ,మీ వచన ప్రవచన ప్రవాహం లో కొట్టుకు పోవడమే ఎప్పుడూ .పుస్తకం పుచ్చుకుంటే ,ఆసాంతం చదివితే కాని వదలని పట్టు ,మీ శైలి సొత్తు .నగిషీలు చెక్కిన మాటల అందాలు ,నిజాయితీకి నిలువెత్తు అద్దాలు  మీ జ్ఞాపకానుభాలూనూ. అదో రస లోకం .ప్రాపంచిక స్ఫూర్తి ఏమవు  తుందో ,తెలీని అలౌకికానందం ..ఆ అందపు అనుభవ సారమే ఈ మాటల విరి దండలుగా మీకు సమర్పిస్తున్నాను .
శ్రీ విద్యా ఉపాసన ఫలితం గా వచ్చిన” బిరుదు ”మీ ఇంటి పేరై ,సార్ధక నామం అయింది .ఇదంతా మీ పూర్వీకుల తపో ఫలమే .”మునుల కూడలి ”అయిన ”ముని కొడవలి ”గ్రామం ,మీ వంశాన్కురాల వల్ల పవిత్ర మైంది .మీ పూర్వీకు లంతా ,స్మార్త ,ధర్మ శాస్త్ర పారంగతు లై ,మంత్ర శాస్త్ర పాదుకాంత దీక్షా పరులై ,మీకు దివ్యాశీస్సు లంద జేసి ,అభ్యుదయ పరం పర గా దీవించారు .ఆ బ్రహ్మాశీస్సులే అక్షయం అయాయి .
అన్న గారూ !ఉపనయనానికి ఎంతటి అర్ధం చెప్పా రండీ మీరు ?మొదటి భాగం లో అదొక సంస్కారం అని ,ధార్మిక జీవ నానికి నాంది అనీ ,పూర్ణ పురుషత్వానికి తొలి మెట్టు అని ,”నడవడికకు తొలి అడుగు ఒడుగు” అని ,విధి ,నిషేధ ,పరిజ్ఞానానికి ప్రారంభం అని విన్న వించారు తమరు .అవన్నీ అర్ధం చేసు కోలేని వారికి ,దాని విలువ తెలీదు అని బాధా పడ్డారు .శీలం అలవడ్డానికి బ్రహ్మ చర్య దీక్శే   అవసరం అని ఘంటా పధం గా చెప్పారు .వివేకమూ కలిగించారు .
మీ అమ్మ గారి ప్రభావం మీ మీద చాలా వుంది కదూ అన్న గారూ !అందరు బాధలో” అమ్మోయ్ ”అంటే ,మీతల్లి    గారు  ఆమె ,తండ్రి గారి మీద వున్న గౌరవాభి మానాలతో”నాన్నోయ్ ”అని  అందరి కంటే భిన్నం గా ,అనే వారు అంటే ,మీరు అవలంబించే కొత్త దారులకు ఆమె ఆ రకం గా మార్గ దర్శి అయారన్న మాట .ఊపిరి పోశారన్న మాట  .ఆ ఉగ్గు పాల మహాత్మ్యమే మిమ్మల్ని అందరి లాంటి వారు గా కాక ,నూత్న పద వర్తి గా మార్చిందని నా నమ్మకం సుమండీ .అందుకే మీకు ,మీ కుటుంబం లో,అందరి పై కంటే ,ఆమె పైనే భక్తీ ప్రపత్తులు ఎక్కువ. .మీ మాతృశ్రీ మీ కిచ్చిన దీవెన ఫలితమే మీ కొత్త పుంతలు ,వింతలూ,విశేషాలూ .
”తలిదండ్రులు మొదటినుంచి సరి అయిన శిక్షణ నిస్తే ,పిల్లలకు అసభ్య ప్రవర్తన రాదు ”అనీ ,మీ తండ్రి గారి పెంపకం లో మీరు మొదట శోత్రియం గానే కాలక్షేపం చేసి ,తండ్రికి తగ్గ వారు అని పించు కొన్నారు .”జాతిని పెంచేది పశు వ్రుత్తి అయితె ,సరిదిద్డేది మానవ ప్రవృత్తి ”అన్న కఠోర సత్యాన్ని అందించారు మీరు మాకు .
”మాధుకర వ్రుత్తి ”ని రుషి వాటికల లోని బాలకులు అవలంబించిన మహోత్తమ వ్రుత్తి గా ,తమరు భావించారు .అన్నం పెట్టె తల్లిని ”అన్న పూర్ణమ్మ ” గా పూజించారు .వారం ఇవ్వని కుటుంబీకులపై మీరు ద్వేషం పెంచు కోలేదు .అడ్జస్టు మెంటాలిటి కి మీరు విలువ నచ్చినా ,మీ గౌరవ భంగం అయిన చోట ”ఎక్ఖడా ”రాజీ పడ లేదు .
ఎవరి నుంచి ఏది నేర్చు కోవతానికైనా ,వెనుదీయని మీరు ”కళ్ళు తాగు తారు -పానకం పుచ్చు కుంటారు ”అని దివాకర రాజు గారు చెప్పే దాకా ,మీకు తెలియదు .మీరు చెప్పే దాకా మాకూ తెలీదు .ఈ విష్యం లో మీ ఆవేదన వివరించిన తీరు బాగుంది .”జాతికి పట్టు కొని  వుండే విషయాలకు సమ్బంధించిన వచన వాజ్మయం లేక పోయింది ”అని విచారించారు .ముమ్మాటికీ ఇది నిజం .శ్రీ దాట్ల వారి కుటుంబం తో నిత్య సాహచర్యం వుండటం ,నిజం గా సరస్వతీ దేవి సాక్షాత్కరించి ,కాళిదాస మహా కవికి నాలుక మీద రాసి నట్లు వుంది ”అన్న మాట నిజాయితీ మూట .అంతరంగం లో నుంచి పెల్లుబికిన సత్యపు ఊట .ఆ నిజాయితీకే నా జోహార్లు .ఇలాంటి సందర్భం లో మీ మాటలు చదువు తుంటే కళ్ళ వెంట బాష్ప ధార నిరంతరం గా ప్రవహిస్తుంది నాకు .చిత్తం ఆర్ద్రం అవుతుంది .ఆ అనుభూతి విలువ మాటలతో చెప్ప రానిది .అనుభవైక వేద్యమే .ఇది నాకు మాత్రమే ప్రత్యేకమా ?కాదేమో ?అందరిదీ అదే తీరేనేమో ?ఏమో ?అవునేమో ?కాదేమో ?
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –20 ఉయ్యూరు సంస్థానం –3

  ఊసుల్లో ఉయ్యూరు –20

                                       ఉయ్యూరు సంస్థానం –3

ఉయ్యూరు  ఇప్పటికి నూజివీడు రెవిన్యు డివిజన్  లోనే వుంది .కనుక నుజి వీడు   సంస్థానం చరిత్ర తో ఉయ్యూరు కు మొదటి నుంచి అనుబంధం ఉన్నట్లే .అక్కడి సాహితీ ,కళా వికాసం అంతా దీనితో పెన వేసు కోని వుంది .అందుకని అక్కడి సాహితీ సేవ గురించి ఇప్పుడు తెలియ జేస్తాను .
నూజివీడు జమీందార్లు కృతి భర్తలే  కాక ,కృతి కర్తలు కూడా .కళా సాహిత్యం సంగీతాలను విశేషం గా ఆద రించారు .నూజివీడు కవులు గా కుమార  ధూర్జటి ,ఆణి వీళ్ళ వెంకట శాస్త్రి ,నారాయణ శాస్త్రి ,దిట్టకవి రాజమ యోగి ,రామ చంద్ర కవి ,మాడ భూషి నర సింహా చార్యులు ,వెంకటా చార్యులు ప్రసిద్ధులు .బుక్క పట్నం రాఘ వా చార్యులు ,తిరుపతి వెంకట కవులు ,కాశీ కృష్ణా చార్యులు ,చిలక మర్తి వారు ,మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గార్లు ,నూజివీడు లో సన్మానం   పొందారు .
 కుమార ధూర్జటి ”ఇందుమతీ పరిణయం ”,రాసి నృసింహ అప్పా రావు బహదూర్ కు అంకితం ఇచ్చాడు .చిన్న వయసు లోనే రాసిన కావ్యం అది .దీనికే ”పిల్ల వసు చరిత్ర ”అని పేరు .చిత్ర ,బంధ కవిత్వం తో బాగా వుంటుంది .నారయ్యప్పా రావు సోదరులు దీన్ని ప్రచు రించారు .తిరు పతి కవులు ఉత్తమ మైన ఉపోద్ఘాతం రాసి  పరిష్క రించారు .కాకర పర్తి వాసి ,ఆని వెళ్ళ వెంకట శాస్త్రి ”అప్పా రాయ యషస్చంద్రీయం ”అనే అలంకార శాస్త్రాన్ని రాసి ,నరసింహ అప్పా రావు గారికే అంకితమిచ్చారు .మెచ్చిన కృతి భర్త ,కృతి కర్తకు 1745 లో ”వల్లూరు మల్లి ”అగ్ర హారాన్ని రాసి ఇచ్చారు .వెంకట శాస్త్రి ”అలంకార సుధా సింధు ”,”మహేశ్వర మహాత్మ్యం ”,రుక్మిణీ పరిణయం ,భాస్కర ప్రశస్తి   మొద లైన వి రాశారు .ఈ యన కుమారుడే నారాయణ శాస్త్రి ;;సాహిత్య కల్ప ద్రుమం ”రాశాడు .
నారాయణ అప్ప రావు గారి ఆస్థాన కవి దిట్ట కవి రామ యోగి .ఇంటి పేరు లో నే దిట్ట మైన కవి గా ఉన్నపండిత కవి .కంచికి వెళ్లి ,అక్కడి మహా పండితులతో ,వ్యాకరణం లో పోటీ పడి ,గెలిచి ,సన్మానం పొందిన వైయాకరనుడు .అనేక సంస్కృత గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాశాడు .ఇవేవీ దొరకటం లేవు .జమీందార్ మీద చెప్పిన చాటువులు మాత్రం ప్రచారం లో వున్నాయి .రుక్మిణీ పతి శతకం మాత్రం ముద్రిత మైంది .ఆస్థాన పౌరాణికులు కూడా వుండే వారు .రామ యోగి కి బంధువు దిట్ట కవి రామ చంద్ర కవి శాపానుగ్రహ సమర్ధుడు .
”దిట్ట కవి రామ చంద్రుడు -దిట్టిన ,రాయైన బగులు -దీవించిన బెట్టిన చిగురు వేట్టును -గట్టిగ -దోల్లింటి ,భీమ కవి కా బోలున్ ”అన్న చాటువు వల్ల   ఆయన శక్తి ఏమిటో తెలుస్తోంది .ఈయనే గొట్టు ముక్కాలా రాజ గోపాల శతకం ,మహిషాసుర మర్దినీ శతకం ,రఘు కుల తిలక శతకం ,హేలావతీ దండకం  రాశాడు .వుయ్యూరు  దగ్గర లోని పేద మద్దాలి గ్రామం లో కొంత కాలం వున్నాడు .పుట్టింది నంది గామ దగ్గర గొట్టు ముక్కల .ఉద్దండ రాయ శతకంకూడా  రాశాడు .
మాడ భూషి నర సింహా చార్యులు గారు ఆగిరి పల్లి శోభనా చాల నర సింహ స్వామి కి అంకితం గా ”మదన గోపాల చరిత్ర ”కావ్యం  రాశారు .”వల్లకీ పల్ల వోల్లాసం ”అనే ప్రబందాన్నీ రాశారు .
గాంగేయ సూరి అనే కవి శోభ నాద్రి అప్పా రావు గారి సమ కాలీనుడు .అసలు పేరుగాన్గేస్శ్వరేశ్వర   సూరి .”సాత్రాజితీయం ”అనే సంస్కృత చంపూ ప్రబంధం రాశాడు .
మాడ భూషి వెంకటా చార్యులు అనే మహా విద్వాంస కవి కి ”అభినవ పండిత రాయలు ”అనే బిరుదు వుంది .1835 -95 నాటి వాడు .తెలుగు లో ”అవధాన విద్యకుఆద్యుడు ”.అనేక రాజ ఆస్థానాలు సందర్శించి ,ఆశు కవిత్వం తోమెప్పింఛి  ఘన సత్కారాలు అందుకొన్నారు .నారయ్యప్పా రావు బహద్దూర్ గారి ఆస్థాన కవి .రాజు గారి అధ్యక్షతన ,నరస రావు పేట ,పిథా(PITHAA PURAM ) పురం జమీందారుల సమక్షం లో ,ఆస్థాన విద్వత్ కవులందరూ కొలువై వుండగా ,వీరు ”శతావ దానం ”చేసి చరిత్ర సృష్టించారు .తెలుగు తోలి శతావ దాని గా గణన కెక్కారు ఆద్భుత మైన ,ఆ శతావధాన ,ఆశు కవిత్వానికి మెచ్చి ,”స్వర్ణ కవచం ”,పండిత శాలువా ,1116 రూపాయలు బహూక రించి,జమీందారు గారు వీరిని సత్క రించారు .ఆ సమయం లోనే పితా పురం రాజా రావు వెంకట మహీ పతి గంగా ధర రామా రావు గారు వీరికి ”అభినవ పండిత రాయలు ”అనే బిరుదును కర తాల ధ్వనుల మధ్య ప్రదానం చేశారు .కవి గారు -భారతాభ్యుదయం ,పుష్ప బాణ విలాసం ,రామా వధూటీ తారా వళీ గ్రంధాలు రాశారు .మాడ భూషి వారి ఆశు కవిత్వ పంధానే ,తామూ అనుసరిమ్చాము అని తిరుపతి కవులు చెప్పు కొన్నారు .మొదట ఒక పాదం చెప్పటం ,ఆవర్తనం ఆవ గానే రెండో పాదం చెప్పటం ,తరు వాత మూడో పాదం పూరించటం అని శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారు గుర్తు చేసు కొని ,ఆచార్యుల వారి కవితా ధారా   చాలా శుద్ధ మైనదని ,అపార మైనదని ప్రశంశించారు .షట్ దర్శనాలను , అవ లోడనం  చేశారు .విశిష్టా ద్వైతి అయినా  ,ద్వైతా అద్వైతాలలో అపార పాండిత్యం ఉన్న వారు ఆచార్యులు .”శత దూషిని ”మీద ఖండనం చెప్పిన మేధావి .ఏక సంతా గ్రాహి ”మాడ భూషికి నిది తోడి వేద మయ్యే ,తిరు పతి కవుల జేరే ”అని తిరుపతి కవులు మాడ భూషి వారి వైదుష్యాన్ని   మెచ్చు కొన్నారు ”.మాడ భూషి వారి కి  ఉన్న పాండిత్యం  తిరు పతి కవు లకు లేదు” అని పండిత లోకం అంటుంది .చాలా సంవత్స రాల తరు వాతఅంటే ప్రబంధ యుగం తర్వాతా  మళ్ళీ శతావ దాన ప్రక్రియ ను వెలుగు లోకి తెచ్చి ,మిగిలిన అవధానులకు మార్గ దర్శకులు అయారు మాఢ భూషి వెంకటా చార్యుల వారు .
 బుక్క పట్నం రాఘ వా చార్యులు గారు -1880 ప్రాంతం వారు .సంస్కృత ,ఆంద్ర ”ఆంగ్లం ”లలో అవధానాలు చేసిన ఆశుకవి .ఆంగ్లం లో అవధానం చేసిన  మొదటి అవధాని గా పేరు పొందారు .కువలయాశ్వ చరిత్ర ,అనే ప్రబంధం రాశారు .ఆంద్ర దేశ చరిత్ర రాశారు .
ఇప్పటి వరకు నూజివీడు అసంస్తాన కృతి కర్తల గురిచి తెలుసు కొన్నాం .ఇప్పుడు జమీందారులు చేస్సిన సాహితీ కృషి గురించి తెలుసు కొందాం .
 రాజా రంగయ్యప్పా రావు –సంస్కృతాంధ్ర ,పార శీక భాష లలో గొప్ప పాండిత్యం ఉన్న వారు .”షానామా ”అనే పారశీక కావ్యాని తెనిగించారు .”పారశీక ధరా దీశ చరిత్ర ”అనే చారిత్రిక కావ్యాన్ని ,లక్ష్మణా చార్యుల చే రాయించారు .ఆస్థాన విద్వాంసు లైన గోపాల కృష్ణా చార్యుల తో ”శోభనాద్రీశ్వర వైభవం ”అనే సంస్కృత చంపూ ప్రబంధ రచన చేయించారు .ఇది రామాయణా త్మక మైనది . అముద్రితం గా ఎన్నో గ్రంధాలను వెలుగు లోకి తెచ్చిన ఘనత వీరిది .నిత్య సాహితీ పోషకులు .ఆస్థాన విద్వాంసు లైన నల్లాన్ చక్ర వర్తుల సంపత్కుమార లక్ష్మీ నర సింహా చార్యులు వివిధ సందర్భాలలో పూరించిన ”సమస్యా పూరణ పద్యాలను ”ముద్రించారు .చర్ల భాష్య కార శాస్త్రి ”మేకాదీశ  శబ్దార్ధ  శత కోటి ”అనే సంస్కృత కృతి రచించారు .ఈ జమీందారు గారి కాలం లోనే విజయ వాడ లో రాజా రంగయ్యప్పా రావు, చుండూరు వెంకట రెడ్డి కళా శాల ఏర్పడింది .ఇదే  S.R.R.ANDC.V.R.COLLEGE గా ప్రసిద్ధమైంది .
 రాజా  వెంకటాద్రి అప్పా రావు బహద్దర్ —రాజా రంగయ్యప్పా రావు గారి దత్త పుత్రుడే వెంకటాద్రి అప్పా రావు .కావ్య ,సాహిత్య కళ లలో నిష్ణాతులు .కళా పోషణ చేసిన సరస హృదయులు .1927 లో కాకి నాడ లో జరి గిన ”ఆంద్ర సారస్వత పరిషత్ ”సభ కు అధ్యక్షత వహించారు .రామ దాసు ,జ్యోతిర్లీల ,గోవర్ధనోద్ధారణం ,నాట కాలు రాశారు .ఆంద్ర గీత గోవిందం ,ఆంధ్రాష్ట పదులు శోభనా చల మహాత్మ్యం కావ్యాలు రాశారు .”జ్యోతిర్లీల ”అనే అయిదు  అంకాల నాటకం రాశారు .కృతి కర్త పేరు లేకుండా ,పూర్వ కావ్య స్తుతి చేశి కొత్త దారి తొక్కారు .  .జ్యోతిష్ శాస్త్ర విషయాలను దృశ్య మానం చేసిన నాటకం ఇది .త్రిభంగి ,ధ్వని ,చంద్ర వర్మ ,నారి ,స్త్రీ ,శ్రీ ,మ్రుణీ ,పంక్తి ,సామాని మొద లైన ” అప్పూర్వ  వృత్త పద్యాలు ”రాశారు తిరుపతి కవులు వీరిని దర్శించి ,సత్కారం పొందారు .”నానా రాజ సందర్శనం ”లో ఈ జంట కవులు రాజా గారి రాజ రికాన్ని  రమ ణీయం నీయం గా వర్ణించారు .. ,
నారయ్యప్పా రావు గారు శనివారప్పేట జమీందారు .తిరుపతి కవులను పిలి పించి సత్కరించిన సంస్కారి .
రామ చంద్ర అప్పా రావు –ముసునూరు పాలకులు .సంస్కృతాంధ్ర పారశీక భాషల్లో లోతైన పాండిత్యం ఉన్న వారు .కాశీ కృష్ణా చార్యులు ,తిరు పతి కవులు ,విశ్వ నాద సత్య నారాయణ వంటి లబ్ధ ప్రతిష్టు లైన కవి పండితులను ఆహ్వానించి కవితా గోస్ష్టులు నిర్వ హించి ,సత్క రించే వారు .కవులకు వార్షికాలు అంద జేశారు .వీరు మరణించినపుదు  తిరు పతి కవులు చెప్పిన పద్యం గుండెలను పిండేసింది .వీరికే విశ్వ నాద ”అనార్కలి ‘నాటకం అంకితం   ఇచ్చారు .
 వీరి కుమారులు సింహాద్రి అప్పా రావు ,రాజ గోపాల అప్పా రావుబహాద్దర్లు   కవి పోషకులే .”ప్రతిజ్ఞా శాంత నవం ”మొద లైన కృతులు వీరి కాలం లోనే వెలువడి నాయి .వీరు ధర్మ అప్పా రావు గారి వంశీకులు అయి ,వంశ గౌర వాన్ని కాపా డారు .
  రాజా రంగయ్యప్పా రావు బహద్దర్ (ఏం .ఆర్ .అప్పా రావు )—వుయ్యూరు కుమారా రాజా గా ప్రసిద్ధులు .పేదల పాటి పెన్నిధి .ఏం.ఆర్ అని అందరు ఆప్యాయం గా పిలిచే వారు .1915 మార్చ్ 21 న రాజా మేకా వెంకటాద్రి అప్పా రావు ,రాణి రామాయమ్మా రావు దంపతులకు జన్మించారు .నూజివీడు లో ఉన్నత విద్య పూర్తి చేసి ,మద్రాస్ ,మచిలీ పట్నా లలో కాలేజి విద్య నేర్చారు .వేలాది ఏక రాలను దాన చేసిన వితరణ శీలి .వీరిని పేదలు ఆత్మ బంధువు గా కొలుస్తారు .1950 నుండి 1978  వరకు 28 సంవత్స రాలురాష్ట్ర శాసన సభకు ఎన్నిక అవతు ,తన ప్రజాభిమానాన్ని నిరూపించు కొన్నారు .రహదార్లు ,మంచినీటి సౌకర్యాలు కల్గించారు .1974 -80 ల మధ్య  రెండు సార్లు ఆంద్ర విశ్వ విద్యాలయం కు ఉపాధ్యక్షులు గా పని చేశారు .శ్రీ కాకుళం ,కాకినాడ ,నూజివీడు లలో ఫై.జి.సెంటర్లు ఆయన కృషి వల్లనే ఏర్పడ్డాయి .1937 లో తండ్రి తో కలిసి ,విజయ వాడ లో ఎస్.ఆర్.ఆర్ కాలేజి ని ,1966 లో నూజివీడు లో  ధర్మ అప్పా రావు కళాశాల ను స్థాపించారు .1976 లో ఫై.జి.కేంద్రం తెప్పించారు .
ఏం.ఆర్.మంచి పుస్తక ప్రియులు .స్వత హాగా రచయిత .తెలుగు ,ఇంగ్లీష్ లలో గొప్ప రచనలు చేశారు .”ఉమర్ ఖయ్యాం ”ను తెని గించారు . వారు రాసిన ‘‘dEMOCRATIC SOCIALISM ” ,”ఆంధ్రుల చరిత్ర ”అనే పుస్తకాలు రెఫెరెన్స్ పుస్తకాలుగా మంచి పేరు పొందాయి .’ జయదేవ మహా కవి రచించిన ”గీత గోవిందం ”ను ఆంగ్లం లోకి అనువ దించారు .
RURAL  DEVELOPMENT OF ADULT EDUCATION ”రచించారు .ఆయన మంచి టెన్నిస్ క్రీడా కారులు .ఫుట్ బాల్ ఆట బాగా ఇష్టం .ఎన్నో రాజ కీయ ,ఆర్ధిక వ్యాసాలూ రాసి సమాజపు పోకడను చూపారు . రాష్ట్ర స్థాయి  ఎడ్ల పందాలు ,చెడు గుడు పోటీలు నూజివీడు లో సమర్ధ వంతం గా  నిర్వ హించారు .వీటితో నూజివీడు కు మంచి  పేరు వచ్చింది .”కీర్తి తప్ప సర్వస్వం దానం చేసి ,అల నాటి దధీచి సరసన నిలిచారు ”అని ఏం .ఆర్.గురించి అందరు చెప్పు కుంటారు .ప్రజల మనిషి .ప్రజలే బంధువులు ఆయనకు . జమీ లోని అందర్నీగుర్తుంచుకొని  ఆత్మీయం గా   పలకరించి,అభిమానం పొందిన మహాను భావుడు మా వుయ్యూరు కుమారా రాజా .పార్ధివ శరీరాన్ని 31 -01 -2003 లో వదిలి శాశ్వ తం గా దూర మయినా వారి స్మ్రుతిప్రజల మనసులో చెరిగి పోలేదు .
వెంకట రామా చార్యులు రాసిన ”అనార్కలి ”పద్య కృతిని ,ఎర్రోజు మాధ వాచార్యులు రచించిన ”మాఘ వలయం ”కృతులను అందుకొన్న కృతి భర్త ఏం,ఆర్. ”
వుయ్యూరు గ్రామ లో రాజా శోభనాద్రి అప్పా రావు వేణు గోపాల స్వామి ,పంచ పట్టాభి రామ స్వామి ఆలయాలకు (విష్ణాలయం ) ఈనాములు ఇచ్చి పోషించారు .ఈ ఆలయం శ్రీ కృష్ణ దేవ రాయల నాటికి ముందే వున్నట్లు తెలుస్తోంది .ఇక్కడ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి ఆలయం 12 వ శతాబ్ది లోనూజివీడు రాజ వంశీకులు కట్టించారు .రాజా వెంకటాద్రి అప్పా రావు గారు ఈనాము భూము లిచ్చి పోషించారు .ఇప్పటికీ ఈ రెండు దేవాలయాలలో విప్పర్ల గోత్రోద్భావు లైన మేకా వారి పేరు తోనే ప్రధమ అర్చన జరుగు తుంది .
ఇంతటి తో వుయ్యూరు సంస్థానం కధ సమాప్తం .
వీలు ని బట్టి మిగిలిన” కృష్ణా జిల్లా సంస్థానాల చరిత్ర” ను మీకు తరువాత అంద జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

ఊసుల్లో ఉయ్యూరు –19

                                            ఉయ్యూరు సంస్థానం-2

—                                          కృష్ణా జిల్లా సంస్థానాలు 


కృష్ణా జిల్లా సంస్థానాల్లో అతి ప్రాముఖ్యత సంతరించు కొన్నవి నూజి వీడు ,చల్ల పల్లి ,వల్లూరు ,ముక్త్యాల ,మైల వరం .వీటి తో పాటు ఈ జిల్లా లో  మొత్తం 37 సంస్తానాలున్నట్లు ఆరుద్ర వివ రించారు .అవి -చింతల పాటి ,వెంట్ర ప్రగడ ,(నుజి వీడు ),ఉయ్యూరు ,మీర్జా పురం ,కపిలేశ్వర పురం ,తేలప్రోలు ,మేడూరు ,దేవర కోట (చల్ల పల్లి )చెవేంద్ర ,చను బండ ,మైల వరం ,ముఠా పుల్లూరు ,మైల వరం ముఠా 17 గ్రామాలు ,మైల వరం ముఠా ,ఊటుకూరు ,తిరువూరు లో సగం ,గంపల గూడెం లో పడమటి భాగం ,మున గాల పర గణా ,వల్లూరు సముతు ,గూడూరు పరగణా ,పిన గూడూరు లంకా ,కృత్తి వెంటి సమతు ,రాయవరం ,బల్లి పర్రు ,కూచిపూడి ,నరసయ్య గూడెం ,తిరువూరు ముఠా లో సగం, కలగర ,పుట్రేల ,కొండూరు ,కంభం పాడు ,కొకిలంపాడు ,పెనుగొలను ,మును కుళ్ల ,కొమిరె ,లింగ గిరి ,దేవర పల్లి ,చిన గొల్ల పాలెం ,చిట్టి గూడూరు ,.ఇందులో చల్ల పల్లి ని దేవర కొండ గా చెప్పారు .ఇంత మంది జమీందార్ల అధీనం లో వున్న జిల్లా కృష్ణా జిల్లా .వారి రాజకీయ పాలన ప్రజాభ్యుదయం , పై వారి ద్రుష్టి ,,ప్రజా సేవ లో వారి రాణింపు ,సాహిత్యాది కళా పోషణ మొద లైన విషయాలు తెలుసు కొందాం .
 సాహితీ సమర ప్రాంగణం ”నూజి వీడు సంస్థానం ”
కృష్ణా జిల్లా లో వున్న జమీందార్ల లో నూజివీడు జమీందార్లకు ప్రత్యేకత వుంది .పౌరుష ,పరాక్రమాలలో ,కవితా రచన లో ,కళారాధన లో ,దేవాలయ స్థాపనల లో నుజి వీడు సంస్థానాధీశులు అగ్ర గామి గా వున్నారు .జమీందారి పాలనకు నూజివీడు పేరు పొందింది .నుజ్వీడు రాజులు రస హృదయులు .,సరసులు కావ టానికి కారణం ఇక్కడ పండే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ”రసం మామిడి పండు ”అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు .స్వాతంత్ర్య సమర యోధులను అందించిన వీర గడ్డ నూజివీడు .ఎందరో దేశ భక్తులు మాత్రు దేశ బానిస సంకెళ్ళను త్రుంచ టానికి పోరు బాట పట్టారు .ఆంగ్ల సామ్రాజ్యం పై ,భారత దేశం లోనే మొత్త మొదట ,సమర శంఖారావం పూరించింది నూజివీడు లోనే .ఆ తిరుగు బాటు వీరుడే నారాయణ అప్పా రావు .కృష్ణా ,గోదావరి నదుల మధ్య వున్న భూ భాగాన్ని 18 పరగణాలు గా ఏర్పరచి ,నూజివీడు ను రాజ దాని గా చేసు కోని ,”మేకా వంశానికి ”చెందిన పద్మ నాయక జమీందార్లు పరి పాలించారు .ఎన్నో దేవాలయాలను నిర్మించారు . .నిత్య పూజాదికాలకు వేలాది ఎకరాలు రాసిచ్చారు .ఆకిరి పల్లి శోభనాచల దేవా లయం ,గొల్ల పల్లి రఘునాధ దేవాలయం ,హనుమాన్  జంక్షన్  లోని అభయ ఆంజనేయ దేవాలయం ,ద్వారకా తిరుమల లో వేంకటేశ్వర దేవాలయం నిర్మించింది వీరే .ఎన్నో క్షేత్రాలను అభి వృద్ధి చేసి ,భక్త జనులకు సౌకర్యాలు కల్పించారు .వీరందరూ ”వెలమ దొరలు ”.
 మేకా వంశం ఏర్పడిన విధం 
మేకా వంశానికి మూల పురుషుడు ”విప్పర్ల బసవ దండ నాధుడు ”.ఈయన 12 వ శతాబ్ది కాకతీయ సామ్రాజ్య ప్రఖ్యాత దండ నాయకుల మలో  ఒకరు ”.రాణి రుద్రమ దేవి ”కి అంగ రక్షకుని గా వ్యవ అరించారు .ఈయన తర్వాత ఏడవ తరం లో జన్మించిన ”విజయ అప్పా రావు” (అప్పన్న )నూజివీడు ను నిర్మించారు .అందుకని ఆయనకు ఘన నివాళిగా అప్పటి నుంచి మేకా వంశీకులు తామ పేరు చివర ”అప్పా రావు ”అని గౌరవ బిరుదు ను చేర్చు కున్నారు .అలా ఆయన్ను చిరస్మర నీయుడిని చేశారు .
నూజివీడు లో కోట నిర్మించ టానికి ఒక కధ వుంది .మేకా విజయ అప్పా రావు అనే బిరుదు పొందిన అప్పన్న గారు ,16 వ శతాబ్దం లో ,నూజివీడు మండలానికి చెందిన గొల్ల పల్లి దుర్గం నుండి ఒక రోజు  వేటకు బయల్దేరారు .దుర్గమ మైన అరణ్యం లో నుంచి వెడు తుంటే ,”నువ్వు చేల గట్టు” మీద ఆకులు మేసే మేకను ,తోడేలు చంప బోవటం చూశాడు .మేక ధైర్యం తో ఎది రించి ,తోడేలుతో భీకరం గా పోరాడింది .ఆశ్చర్య పడ్డ అప్పన్న ,మేక పౌరుషానికి మెచ్చి ,ఆ ప్రదేశం పౌరుషానికి నిలయమైన గడ్డ గా భావించి ఆ ప్రాంతం లోనే కోట కట్టా లని నిర్ణ యించాడు .నువ్వుల చేను బీడు వద్ద ఈ సంఘటన జరగటం తో ఆ ప్రాంతమే ”నువ్వుల జేలు బీడు ”గా మారి ,చివరికి ”నూజివీడు ”అయిందని స్థానికుల కధనం .అలాంటి పౌరుషపు గడ్డ నూజివీడు ,నూజివీడు నిర్మాత విజయ అప్పా రావు .వీరిది ”విప్పర్ల గోత్రం ”.
 నూజివీడు కోట నిర్మాణం
క్రీ.శ.1565 -70 ల మధ్య 30 ఎకరాల స్థలం లో  కోటను ,చుట్టూ నగరము వుండే టట్లు నూజివీడు సంస్థానం ఏర్పడింది .తోడేలును చూసి పారి పోవాల్సిన మేక ధైర్యం గా ఎది రించి ,పోరాట పటిమను చూపింది కనుక తమ ఇంటి పేరు ను అప్పటి నుంచి ,ఆ వంశీకులు ”మేకా ”గా మార్చుకొని ,పౌరుషానికి చిహ్నం గా ,ఆ పేరు ను భావించారని తెలుస్తోంది .మేక పోరాటం చేసిన చోట త్రవ్వగా బయల్పడిన శ్రీ రాజ గోపాల స్వామి విగ్రహాన్ని ,అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ట చేశారు .ఆ స్వామే వారి ఇల వేలుపు . విజయ అప్పా రావు కుమారుడు వెంకటాద్రి అప్పా రావు కోటను బాగా వృద్ధి చేశారు .కోటకు ,వూరికి నీటి వసతి కల్పించ టానికి చెరువు త్రవ్వించారు .రాజ గోపాల స్వామి దేవాలయం నుంచి ,”రహస్య  భూ మార్గం ”ఏర్పాటు చేశారు .
ఆ తర్వాత 14 వ తరానికి చెందిన వెంకట నర సింహ అప్పా రావు   (శని వారప్పేట )ను ,ధర్మ అప్పా రావు అనే వారు .చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేయటం తో ,ఆ పేరు సార్ధకమయింది .ఏలూరు సంతాన వేణు గోపాల స్వామి ,నందమూరి వేణు గోపాల స్వామి ,పెండ్యాల సకలేశ్వర స్వామి ,మంద పాక ఎల్లారమ్మ దేవాలయాలను ,భక్తీ శ్రద్ధ ల తో నిర్మించి ,,నిత్య ధూప  దీప నైవేద్యాలకు ”ఈనాములు” ఇచ్చారు .కాశీ ,రామేశ్వర మార్గాలలో ,యాత్రికులకు సౌకర్యాలు కల్పించారు .ధర్మ అప్పా రావు గారిది మెత్తని మనసు .రాత్రి పూట కుక్కలు అరుస్తుంటే ,విని ,ఎందుకు అరుస్తున్నాయో  సేవకులను అడిగి తెలుసు కోని ,చలికి తాళ లేక అరుస్తున్నాయని వారు  చెప్పారట .ఒక ధర్మ నిధి ని ఏర్పాటు చేసి ,కుక్కలకు గోమ్గల్లు ” ‘గొం గళ్ళు  ”కోని పించి ,కప్పించిన భూత దయా పరుడు .గొప్ప సంస్క్రుత్త పండితుడు కూడా .

 బ్రిటిష్ వారిపై సంధించిన అస్త్రం నారాయణ అప్పా రావు(రెబెల్ అప్పా రావు )


ఈ వంశం లో రెబెల్ అప్పా రావు గా నారాయణ అప్పా రావు గారిని భావిస్తారు .బ్రిటిష్ వారితో ”,గెరిల్లా పోరాటం ”చేసి ,వారిని లొంగ దీసుకొన్న ధీరుడు ,వీరుడు .”కప్పం చెల్లించను ”అని ఎదురు తిరిగి ,తన మాటే నేగ్గించుకొన్న ఆత్మాభి మాని .”దండెం గార్డెన్స్ ”అనే చోట ,ఫిరంగుల యుద్ధం జరిగింది .ఆ పేరు తోనే ఆ ప్రాంతాన్ని పిలుస్తారు .స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న మరో వీరుడు నూజివీడుకు చెందిన ”తానంకి యేసు రత్నం ”,”చలసాని రాజ గోపాల రావు లు .14 వ ఏట ‘లూధియానా కమిషన్ ”ను ఏది రించి న ధీరులు .బ్రిటిష్ సైనికులకు వ్యతి రేకం గా ,విజయ వాడ రైల్వే సెషన్ లో దూది బేళ్ళ మధ్య దాక్కొని ,,ఒక్క సారి గా బయట పడి ,వ్యతి రేక నినాదాలు చేసిన సాహస బాలుడు .అతన్ని కాల్చి చంప వద్దు అని సైనికులకు ”లూధియానా ”హెచ్చరిక చేసి నట్లు స్థానిక కధనం . .
1814 లో రామ చంద్ర అప్పా రావు మరణించారు .ఆయన కుమారుడే శోభనాద్రి అప్పా రావు .1830 లో పసి తనం లోనే నూజివీడు ప్రభువు అయారు .ఈయనకు ఏడుగురు కొడుకులు .నారయ్య ,రంగయ్య ,వెంకట జగన్నాధ ,వెంకట నర సింహ ,వెంకటాద్రి సింహాద్రి ,వెంకట రామయ్య లు .వీరి లో వీరికి వ్యాజ్యాలు నడి చాయి .ప్రీవీ కౌన్సిల్ దాకా పోయారు .1871 లో,నూజివీడు సంస్థానం ఆరు వాటాలు అయింది .నారయకు వెంట్ర ప్రగడ ,రంగయ్యకు ఉయ్యూరు ,వెంకట నర సింహానికి ,మీర్జా పురం ,వెంకటాద్రి కి కపిలేశ్వర పురం ,సింహాద్రికి తేల ప్రోలు ,వెంకట రామయ్య కు మేడూరు ఎస్టేట్లు దక్కాయి .వెంట్ర ప్రగడ చీలి ,గన్నవరం ముసునూరు ,వెంట్ర ప్రగడ జమీ లు గా మారింది .గన్నవరం వరద రాజ యా రావు కు వెళ్ళింది .
 ఉయ్యూరు రాజా
ఉయ్యూరు రాజా గా మేకా రంగయ్యప్పా రావు గారు  నూజివీడు కేంద్రం గా చక్కగా పరి పాలించారు .1906 లో ఈయనకు ”రాజా ”బిరుదు వచ్చింది .ఈయన కుమార్తె లక్ష్మీ వెంకయ్యమ్మ ను ,నరస రావు పేట జమీందారు కు ఇచ్చి వివాహం చేశారు .రంగయ్యప్పా రావు గారి దత్త పుత్రుడు వెంకటాద్రి అప్పా రావు .వీరి పై జాతీయోద్యమ ప్రభావం బాగా పడింది .మహాత్మా గాంధీ ని నూజివీడు ఆహ్వానించి ,,జమీందారి బట్టలు వది లేసి ,ఖద్దరు ధరించి ,గాంధీజీ కి స్వాగతం పలికిన సంస్కారి .స్వాతంత్రోద్యమానికి నిధులు సేకరించి సమర్పించిన దేశ భక్తుడు .వీరి కుమారుడే ”కుమార రాజా ‘అని పిలువ బడే రాజా రంగయ్యప్పా రావు బహద్దర్ .1894 లో జన్మించారు .తండ్రి తరు వాత రాజ్య పాలన చేశారు .సంస్కృతాంధ్రాలలో మహా గొప్ప పండితుడు .ఆంద్ర  రాష్ట్ర మంత్రి వర్గం లో చేరి విద్యా శాఖా మాత్యులు గా ఎన లేని కృషి చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయ వైస్ చాన్సెలర్ గా వ్యవహరించారు .
ఈ విధం గా మేకా వారి వంశం తర తరాలుగా అభివృద్ధి చెంది ,పాలనకు ,వదాన్యతకు పౌరుషానికి ,విద్వత్తు కు ,నిలయమైంది .ఎందరో కవి పండితులకు ఆలవాలం నూజి వీడు సంస్థానం .నూజివీడు ”వీణలు ”తయారు  చేసే ముఖ్య కేంద్రం .నాణ్య మైన వీణలకు నూజివీడు ప్రసిద్ధి .మిగిలిన సంస్థానాల కంటే ఇక్కడే సాహిత్య పోషణ ,కళా పోషణ ఎక్కువ గా జరిగింది .మంచి సంస్కారం తో నూజివీడు జమీందార్లు ప్రజాభి మానాన్ని పొందారు .ప్రజల హృదయం లో సుస్తిర స్తానం సంపాదించు కొన్నారు .
నుజి వీడు సంస్థానం లో జరిగిన కళా సాహిత్య సేవ గురించి తరు వాత తెలియ జేస్తాను

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -02 -12 .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

డోకు రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

సక్సస్ మంత్ర – ఆత్మీయ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

 ఊసుల్లో ఉయ్యూరు –18 

                                            ఉయ్యూరు సంస్థానం–1

ఉయ్యూరు ఒకప్పుడు నూజి వీడుసంస్థానం లోవుండేది .ఆ తర్వాత , ఆ రాజుల పంపకాలలో ఉయ్యూరు సంస్థానం వేరు పడింది ,ఆ వివ రాలన్నీ నేను ”కృష్ణా జిల్లా సంస్థానాలు -సాహిత్య సేవ ”అనే పెద్ద వ్యాసం లో  20 -01 -2007  న రాశాను .ఇది ”కృష్ణా జిల్లా సర్వస్వం ” లో చోటు చేసు కొంది .అందులో వున్నప్రధాన  విషయాలు మీ ముందు ఉంచు తున్నాను .ముందుగా అసలు సంస్థానాలు ఎందుకేర్పడ్డాయి అని తెలుసు కోని ,ఆ తర్వాత ,నూజి వీడు సంస్థానం ఏర్పడిన విధానం అందు లోంచి ఉయ్యూరు సంస్తానంఎర్పడిన వైనం తెలుసు కొందాం .

 సంస్థానాల ఆవిర్భావం

              విజయ నగర రాజ్య పతనం తర్వాత ఆంద్ర దేశం గోలు కొండ ,బీజా పూర్ సుల్తానుల యేలు బడి లోకి వచ్చింది .1686 లో మొగలాయీలు గోల్కొండను వశం చేసు కొన్నారు . తమ అధీనం లో ”దక్కన్ సుబా ”గా మార్చారు .మొగలు సామ్రాజ్యం పతన దశ కు చేరి నపుడు 1713 లో ”కమ రుద్దీన్ అసఫ్ జా  ”ను”నిజాం ఉల్ ముల్క్ ”బిరుదును ఇచ్చి ,దక్కను సుబెదారుని గా చేశారు .ధిల్లీ కి విశ్వాస పాత్రుడు గా వుంటూ ,చివరికి ,వారినే  ఎది రించే ధైర్యం తెచ్చు కోని ,హైదరాబాద్ సుబెదారీ ని స్వతంత్రం గా పరి పాలించాడు .మహా రాష్ట్రు లతో స్నేహమూ చేశాడు .1748 లోఆసఫ్జా చని పోయాడు .సుబా పై పట్టు కోసం ,కొడుకులు పోటీ పడ్డారు .ఇదే అదనుగా ఈస్ట్ ఇండియా కంపెని వారు ,పరాసు వారు ,కొడుకులను చేరా దీశారు .విభజించి ,పాలించే నైజాన్ని నిరూపించారు .1757 నుంచి 1857 వరకు ”కుంఫిని యుగం ”గా భావిస్తారు .ఉత్తర సర్కారు నవాబు ,ఆర్కాటు నవాబు ,హైదరాబాద్ సుబేదారు కు  లోబడి పోయారు .అవసరం అయినపుడు ,నిజాముకు సేనలు పంపటం ,,సంవత్స రానికి తొమ్మిది లక్షల రూపాయలు  నిజాం కు చెల్లించే ఒడంబడిక చేసు కొన్నారు .కుమ్ఫినీ వారి దుబాసి ”కాండ్రేగుల జోగి పంతులు ”నిజాం కు ,కంపెని కి మచిలీ పట్నం లో ఒడంబడిక కుదిర్చాడు .1768 ,1779 లలో సర్కారు జిల్లా ల పై కూడా ,కంపెని అధికారం పొందింది .1788 లో ”మూర్తి జోన్నగరు  ”(గుంటూరు జిల్లా )కూడా ,వారి స్వాధీనమై పోయింది .భూస్వాములు బల వంతు లై ,కంపెనీ వారి దాక్షిణ్యం తో జమీందారి భోగాలను అనుభ వించారు .పన్నులు వసూలు చేయటం ,స్థానికం గా వుండే వీరి వల్లే సాధ్యం అని గ్రహించి ,1793 అప్పటి గవర్నర్ ”కారన్ వాలీసు ”–”శాశ్వత భూమి శిస్తు విధానం ”తెచ్చి ,జమీందార్లకు భూమి పై వంశ పారం పర్య హక్కు కల్పించాడు .వీరి ద్వారా శిస్తు వసూలు చేయించాడు .ఆస్తి హక్కు ఇస్తూనే ,వారి ప్రాబల్యం తగ్గించే జాగ్రత్తలు కంపెనీ ప్రభుత్వం తీసు కొన్నది .1802 లో దక్షిణ దేశం లో ”శాశ్వత శిస్తునిర్ణయ విధానం ”అమలు లోకి వచ్చింది .శిస్తు బకాయి కట్టక పొతే ,జమీందారు ను తొల గించి ,జమీ ని లాకునే వారు .సర్కారు భూములను ,తామే స్వయం గా రైతులకు ఇచ్చి సాగు చేయించే వారు .ఈ సమయం లోనే జమీందార్ల రాజా రికం ఖాయం చేస్తూ ,”హవేలీ ”భూముల్ని బహిరంగం గా  వేలం పాట పెట్టె ”రెవెన్యు సెటిల్   మెంట్ ”చేశారు .రెండొంతులు కంపెనీకి ,ఒక వంతు జమీందార్లకు చెడె ఒడంబడిక ఇది .1938  .నాటికి ఆంద్ర జిల్లాలలో జమీందారీ ల సంఖ్య 448 . అరవైశాతం గ్రామాలు జమీందార్ల అధీనం లోనే ఉండేవి .రైత్వారీ గ్రామాలు ముప్ఫై మూడు శాతమే నని ఆచార్య తూమాటి దోణప్ప తేల్చి చెప్పారు .

  జమీందారి యుగం 

1887 నుంచి జమీందారి యుగం ప్రారంభమైంది అంటారు చారిత్రిక పరి శోధకులు ఆరుద్ర .జమీన్ అంటే భూమి .దార్ అంటే అది పతి .వీళ్ళనే పాశ్చాత్య దేశాల్లో ”ఫ్యూడ లిస్టులు” అన్నారు . ఈ భాగాలను ”సంస్థానాలు ”అని కూడా పిలుస్తారు .సంస్థ అంటే ఉనికి అని అర్ధం .సంస్థానం అంటే ఆకృతి ,సన్ని వేశం ,గుర్తు అని నిఘంటువు చెబుతోంది .అంటే ,ఆయా ప్రదేశాల ఆకృతిని చెప్పేవి సంస్థానాలు .వాటి ఉనికికి ,ప్రజల మనికి కి తోడ్పడేవి .వారి పరి పాలనకు ,పోషణకు ,రాజా కీయ చతురత కు ,న్యాయ నిబద్ద ట కు గుర్తు గా ,నిలి చేవి అని భావించాలి .సంస్థానాల పాలకులను సంస్తానా దీశులుగా భావిస్తాం .సంస్తానా దీశుల్లో కవులు ,రచయితలు సంగీత జ్ఞులు వున్నారు . వ్యాస నాలతో ,ఆడంబరాలతో డబ్బును ,మంచినీళ్ళ ప్రవాహం గా ఖర్చు చేసి ,జమీ లోని ప్రజల గోడు పట్టించు కోని వారూ వున్నారు .కళా పోషణ చేసి ,చరితార్దు లయిన వారూ వున్నారు .స్త్రీలు కూడా జమీన్దారినులు గా వుండి ,సుపరి పాలన అందించారు .ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకొన్న వారు కొంద రైతే ,పనులతో నడ్డి విరగ కొట్టిన వారు కొందరు .ఇలాంటి వారి పై చిలక మర్తి లక్ష్మీ నరసింహం గారు ”నేల దున్నుద మన్న ,
జాల తరము పన్ను ,-నీరు గావలె నన్న నీటి పన్ను ” అన్న పద్యం లో చక్కగా ఎండ గట్టారు .రాబడి పన్ను ,సంత పన్ను ,మున్సిపల్ పన్ను ,హాసిల్ పన్ను ,స్టాంపు పన్ను వగైరా లతో ప్రజల్ని పీల్చి ,పిప్పి చేసే వైనాన్ని వివ రించారు .పంట పండించే వారికి గడ్డి మాత్రమే మిగులు తోందని ,రైతుల బాధలను కళ్ళకు కట్టించారు .పాను గంటి వారు కూడా సాక్షి వ్యాసాల్లో జమీందారీ అది కారాన్ని తూర్పార  బట్టారు .
  జమీందారీ రద్దు 
జమీందారీ దౌష్ట్యాన్ని సహించ లేని ప్రజల్లో క్రమం గా ఆలోచన పెరిగి ,సంఘటితం అయారు .1915 లో కృష్ణా జిల్లా రైతు సంఘం ఏర్పడి ,మిగతా జిల్లాలకు ఆదర్శ ప్రాయం ఆయనది .కమ్యూనిస్టులు ,సోషలిస్టులు ,చేయూత నిచ్చారు .ఉద్యమాలకు వెన్ను దన్ను గా నిలిచారు .1936 లో ”అఖిల భారత కిసాన్ సభ ”జరిగింది .ఆంద్ర రాష్ట్ర రైతు రక్షణ  యాత్ర 1937 లో జూలై  మూడు న ఇచ్చాపురం లో ప్రారంభం అయింది .1532 మైళ్ళు ,కాలి నడకన ,మిగిలిన దూరాన్ని బస్సుల్లో పర్య టించి ,1938 మార్చ్ 27 న మద్రాస్ చేరింది .మద్రాస్ అసెంబ్లీ స్పీకర్ బులుసు సాంబ మూర్తి గారికి ,రాజాజీ జి కి వినతి పత్రాలు సమర్పించి ,వేలాది మంది కిసానులు ఆదు కోమని కోరారు .జమీందారి రద్దు కు సిఫార్సు చేయ మన్నారు .చివరికి రాయీ గా భూమికి యజ మాని రైతే నని ,జమీందారు ఏజెంట్ మాత్రమే నని ,అడవులు వగైరా ప్రజలవే నని ,రాజాజీ ప్రభుత్వం ప్రకటించింది .1940 లో గొట్టి పాటి బ్రహ్మయ్య గారు మునగాల జమీ లోని అక్రమాలను అధ్యయనం చేసి ,రిపోర్ట్ ఇచ్చారు .దీన్నే ”బ్రహ్మయ్య అవార్డ్ ”అంటారు .చివరికి ప్రభుత్వం దిగి వచ్చి సంస్థానాలను ,జమీనులను రద్దు చేసి ,రైతులకు ,ప్రజలకు శాశ్వతం గా మేలు చే కూర్చింది .
దీని తర్వాత” నూజి వీడు సంస్థానం ఆవిర్భావం ” గురించి తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

విశిష్టతను సంతరించుకొన్న అవధాని

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

“సుసర్ల” స్మరణలో

కొన్ని సుసర్ల పాటలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –17

                                  సంగీతం టీచర్ పద్మావతి గారు 

మేం ఉయ్యూరు వచ్చే సరికి (1951 )మా మామయ్య గుండు గంగయ్య గారి అమ్మాయి రాజ్య లక్ష్మి ఒక సంగీత టీచర్ దగ్గర సంగీతం నేర్చు కొంటోంది .ఆవిడ విష్ణాలయం దగ్గర ఇళ్ళల్లో ఎక్కడో అద్దెకు ఉండే  వారు .ఆమెకు ఒక అబ్బాయి కూడా వున్నట్లు గుర్తు .మా పెద్దక్కయ్య లోపా ముద్ర  ,చిన్నక్కయ్య దుర్గ అప్పటికే కొంత సంగీతాన్ని హిందూ పుర లో ఉండగానే నేర్చు కొన్నారు .చిన్నక్కయ్య కుఅక్కడి గరల్స్ స్కూల్ లో సంగీత విద్య బానే అబ్బింది .అందుకని ఆ సాధన కొన సాగించాలని , ఇక్కడ మళ్ళీ  ఆ టీచర్ గారి దగ్గర సంగీతం నేర్చు కోవాలనుకున్నారు .అమ్మా ,నాన్న ,అంగీకారం తో సాధన మొద లైంది .
సంగీతం టీచర్ గారి పేరు పద్మావతి .అప్పటికి సుమారు 45 ఏళ్ళ వయసు వుంటుంది .చామన చాయగా ,పొట్టిగా బొద్దు గా వుండే వారు .చీర కుచ్చెళ్ల దగ్గర హాండ్ కర్చీఫ్ పెట్టు కోని వచ్చే వారు .మామయ్య కూతుర్ని మేము ”దాచ్చి ”అనే వాళ్ళం .మా ఇద్దరు అక్కయ్యలు, దాచ్చి, మా వాకిటి వరండాలో సంగీతం నేర్చుకొనే వారు. టీ చర్  గారు సరిగ్గా అయిదింటికి వచ్చే వారు .ఒక గంట పైనే సంగీతం నేర్పే వారు .నేర్పిన దాన్ని వీళ్ళు మళ్ళీ సాధన చేసి ,మర్నాటికి రెడి గా తయారయే వారు .ముందుగా స,రి ,గ ,మలు నేర్పే వారు .తర్వాత స్వరాలు ,ఆ తర్వాత జంట స్వరాలు ,తర్వాత కృతులు వరుస గా నేర్పేవారు .మా వాళ్ళు రోజూ ”లంబోదర లకు మికరా -అంబా సుత అమర వినుత -లంబోదర లకు మికరా ‘అనేది నిత్య సాధన గా చేసే వాళ్ళు .అది మాకూ నోటికి వచ్చేసింది .వాళ్ల తో పాటు మేమూ పాడే వాళ్ళం .టీచర్ గారు తాళం వేయటం బాగా గుర్తుంది .చాలా తేలిగ్గా ,శబ్దం రాకుండా వేసే వారని జ్ఞాపకం .ఆమె గొంతు స్పష్టం గా వుండేది .స్వరాలు  ,కీర్తనలు బాగా పాడే వారు .ఆమె శిక్షణ చాలా నిర్దుష్టం గా ఉండేదని చిన్నక్కయ్య చెప్పింది . వారి నుంచి ,తాము ముగ్గురం ఎంతో నేర్చు కున్నానమని ,ఆమె ను మరువ లేమని చెప్పింది .కనీసం పది సంవత్స రాలు ఆ టీచర్ గారి వద్ద సంగీతం నేర్చారు .అప్పుడు ఇంటికి అచ్చి సంగీతం నేర్పటమే వుండేది .ఒకటి రెండు సార్లు ఆమె ,వైఖానస ఉత్స వాలాలో  విష్ణాలయం,అవతలి వైపు మెట్ల కింద ఖాళీ స్థలం లో పందిరి కింద కచేరీ చేసి ,అందర్నీ మెప్పించారని చిన్నక్క దుర్గ అన్నది .భేషజం లేకుండా ,చాలా సామాన్యం గా ,ఎంతో బీడిం గా వుండే వారామే .తల వంచుకొని నడి చే వారు .గర్వం లేదు .మ ఇంటిలోనే కాక ,మా బంధువు లైన సూరి శ్రీ రామ మూర్తి గారింటికి కూడా వెళ్లి వారి అమ్మ్మాయి కమల కు కూడా సంగీతం నేర్పేవారు .వీరి తో పాటు ,ఆది రాజు నరసింహా రావు గారింట్లో వారమ్మాయి సుందరికి ,చోడ వరపు చంద్ర శేఖర రావు గారింట్లో వారి కూతురు తేజ  కు ఇళ్ళకు వెళ్లి నేర్పే వారు  .అంతే– ఇంకేవరింటికి వెళ్లినేర్పి నట్లు చూడ లేదు .ఆ రోజుల్లో ఒక్కొక్కరికి నెల కు  పది రూపాయల కంటే ఎక్కువ ఇచ్చే వారు కాదను కొంటాను .ఆ డబ్బుతో మరి సంసారం ఎలా గడిపే వారో ఆశ్చర్యమే .అదీ చాలా గుంభన గా వుండే ఆ టీచర్ .ఇప్పటికి అరవై ఏళ్ళు దాటినా ఇంకా మనసు లో మెదులుతూ  వున్నారు .మా చిన్నక్కయ్య కు బానే వచ్చేది సంగీతం .పెద్దక్కకు ఎక్కువ సాధన చేస్తే కాని వచ్చేది కాదు .మా మామయ్య గారి అమ్మాయి” దాచ్చికి” అసలు సాధన సాగేది కాదు .అయినా ,విసుక్కో కుండా అందర్నీ సమానం గా చూసే వారు ఆమె .మా ఇళ్ళల్ల లో పెళ్ళీ ,పేరంటాలకు ఈ ముగ్గురి సంగీతమే హై లైట్ .మంగళ హారతి పాటలు వీళ్ళే పాడే వారు .మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో నైనా వీరిదే పెద్దరికం .
ఇంతకీ సంగీతం టీచర్ గారి భర్త వున్నారా ,లేదా అని ప్రశ్న గా వుండేది .ఎప్పుడు ఆయన్ను చూసినట్లు లేదు .బహుశా కారణాంత రాల వల్ల వేరు గా వుండే వారని తెలిసింది.అబ్బాయి తో మాత్రం మాకు బాగా పరిచయం వుంది .టీచర్ గారు ఎప్పుడు వారి తండ్రి గారు” గరిక పర్తి  కోటయ్య’ ‘ గారిని జ్ఞాపకం చేసు కొనే వారు .తండ్రి గొప్ప సంగీత విద్వాంసులని చెప్పే వారు .అప్పుడు కోటయ్య దేవర గారి గురించి ,నాకు ఏమీ తెలీదు .ఆ తర్వాత వారి కీర్తి సంపద గురించి బాగా తెలిసింది .అంతటి మహా విద్వాంసుడి కుమార్తె కు ,సంగీత సరస్వతికి ,ఈ బాధ లేమిటో ఆ భగ వంతునికే తెలియాలి .ఇప్పుడు తలచు కొంటె జాలి వేస్తుంది .ఇన్ని బాధలను భరిస్తూ ,సంగీతం నేర్పుతూ ,తండ్రి వారసత్వాన్ని కొన సాగించిన ఆ సంగీతమ్మ కు నివాళులు అర్పిస్తున్నాను .ఒక్క సారి గరిక పర్తి  కోటయ్య దేవర గారి సంగీత వైభవాన్ని ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి చూద్దాం . .

 గరిక పర్తి  కోటయ్య దేవర 

రస జగత్తును ‘ఊయల’ ఊపిన గరికపర్తి కోటయ్య దేవర – తనికెళ్ళ భరణి

ఆంధ్ర గాయక పితామహులు గా కీర్తి పొందిన గరిక పర్తి కోటయ్య దేవర ,చల్ల పల్లి ఆస్థాన సంగీత విద్వాంసులు .వీరి చిన్న తనం గురించి ఒక కధ వుంది .1864 బందరు ఉప్పెన లో పసి పిల్లాడు గా వున్న కోటయ్య ,ఉయ్యాల తో సహా ,నీటిలో కొట్టుకు పోయి ,ఒక కుంకుడు చెట్టు కు చిక్కు కున్నాడు .పిల్లాడు క్షేమం .తర్వాత ,చిన్న తనం లోనే ,”కొబ్బరి చిప్పకు గుర్రపు వెంట్రుక కట్టి ,కమాను తో సంగీతం   వాయించే వాడు .ఏ గురువు అవసరం లేకుండా సంగీతం అబ్బిన ధన్య జీవి .తండ్రి శిక్షణ లో ,విద్వాంసులై ,వాయులీనం లో ప్రతిభ సంపాదించారు కోటయ్య దేవర .ఒక సారి హైదరా బాద లో తన్మయుడై గానం చేస్తూ ,వాయులీనం తో సాధన చేస్తుంటే ,అప్పటి ప్రభువు’ ‘సాలార్   జంగ్ బహద్దర్ ”గమనించి ,ముచ్చట పడి ,”చిన్నన్న ”అనే సంగీత   విద్వాంసుని కి అప్ప గించి సంగీతం నేర్పించాడు .ఆయన ప్రతిభా పాటవాలకు అబ్బుర పడి ,  తన” సంస్థాన సంగీత విద్వాంసుని” గా ,నియమించాడు .తన ప్రతిభ ను గుర్తించిన ”రాజ గోపాలా చారి ”అనే వారిపై వర్ణం రాసి ,భక్తి చాటు కొన్నారు .మంచి సంగీత  విద్వాంసుని గా ,ప్రఖ్యాతి వచ్చింది .తంజావూరు మహా రాజు ”ఆస్తాన  సంగీత విద్వాంస పదవి ”కి ఆహ్వానిస్తే ,మర్యాదగా తిరస్కరించారు కోటయ్య దేవర .
బందరు చేరు కోని సంగీత పాథ(paatha ) శాల ఏర్పరిచి ,ఉచితం గా భోజనం పెట్టి ,విద్యార్ధులకు నేర్పించి నట్లు  ప్రముఖ రచయిత ,నటుడు శ్రీ తనికెళ్ళ భరణి తమ ”ఎందరో మహాను భావులు ”గ్రంధం లో రాశారు.ఆ కాలమ్ లో వీరిని అందరు ”జంగం కోటయ్య ”అనే పిలిచే వారు .ఆ పేరు తోనే వారు సుపరిచితు లయారు .గీతాలు ,వర్ణాలు ,స్వర జతులు ,కీర్తనలు రాసిన” వాగ్గేయ కారులు ” కోటయ్య దేవర .తోటల వల్లూరు సంస్థాన జమీందారు ”భాష్య కార్లు నాయుడు ”గారి పట్టాభి షేకానికి ,తిరుపతి కవులను ఆహ్వానించి సత్కరిస్తే,ఆ తర్వాత వచ్చిన జమీందార్ సత్య నారాయణ ప్రసాద్ గోపాల స్వామి ఉత్స వాలు ఘనం గా నిర్వ హించే వారు .శాస్త్ర చర్చలు ,అవధానాలు ,నాటక ప్రదర్శనలు నిర్వహించారు .నాట్యోత్స వాలను ,సంగీత సభలను నిర్వ హించారు .గరిక పాటి కోటయ్య దేవర గారిని”వల్లూరు సంస్థాన సంగీత విద్వాంసుని” గా చేసి ,సంగీత సరస్వతీ సమార్చనం చేశారు .
ఇంతటి మహా విద్వాంసుని కూతురు జీవిక కోసం  సంగీత పాఠాలు చెప్పటం బాధా కరమే .విధి వ్రాత ఎవరు తప్పించ లేరు . సంగీతం టీచర్   పద్మావతి గారు ,సంగీతాన్నే నమ్ముకొని దానినే తండ్రి లాగా అందరి కి బోధిస్తూ ,గౌరవం గా జీవించారు .అది చాలు వారిది ధన్య జీవనం అని తెలప టానికి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 3 Comments

వ్యాస ,వాల్మీకి హృదయ కళా మర్మజ్ఞులు

వ్యాస ,వాల్మీకి  హృదయ కళా మర్మజ్ఞులు
శ్రీ కాళూరి వ్యాస మూర్తి గారు 

           కాళూరి వ్యాస మూర్తి గారు మేము ఉయ్యూరు లో 1964 లో వంగల కృష్ణ దత్త శర్మ గారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ”నన్నయ కళా సమితి ”సభా కార్య క్రమం లో పాల్గొన్నారు .కార్యక్రమం విష్ణా లయం లో జరిపాం .రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వారు వారం రోజులు వాల్మీకి రామాయణం మీద అద్భుత ప్రసంగాలు చేశారు .అంతకు ముందెప్పుడూ మేము విని ఉండని  ,రామాయణ రహస్యాలను వెలికి తీసి తెలియ జేశారు .ఎక్కువ మంది జనం రాక పోయినా ,అదో మధురాను భాతి గా మాకు మిగిలి పోయింది .పంచ ,లాల్చి తో చామన ఛాయా గా ,పొడుగ్గా వుండే వారు .ఒక రకం గా చెప్పా లంటే ,స్వర్గీయ ముళ్ళ పూడి హర్స్చంద్ర ప్రసాద్ గారి లా గా వుంటారు .చాలా నెమ్మది గా మాట్లాడే వారు .కాని సంస్కృత శ్లోకాలు ,వాటికి వారి వివరణ చాలా ఆకట్టు కొన్నాయి నన్ను .ఆ లోతులను యెంత బాగా ఆవిష్కరించే వారే జ్ఞాపకం చేసు కొంటుంటే పులకరింత గా వుంది .దత్తు గారింట్లోనే వారి భోజనం ,పడక .సాయంత్రం సభ .సీతంరాజు సత్యనారాయణ గారు ,ముత్తయ్య మేష్టారు దత్తు గారు నేను మా తమ్ముడు ,రామా చార్యులు గారు ,కొందరు ఆడ వారు తప్పని సారిగా హాజ రాయే వాళ్ళం .మా అమ్మ కూడా వచ్చేది .అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలు రాశారు .అవి దత్తు గారు కొన్నారు .వాటిని మేము చదివాం .
వారు భారతం లోని ప్రతి పర్వం మీద ,తిక్కన రచనా వైభవాన్ని తేలిక మాటలతో ,అర్ధ గాంభీర్యం తో వివ రిస్తూ పుస్తకాలు రాశారు .అవి నేను పదేళ్ళ క్రితం చది వాను .వారు గొప్ప పండితులు .తెలుగు  గీర్వాణం ఆంగ్లం   లో మంచి పాండిత్య ప్రకర్ష వున్న వారు .బహుశా విశాఖ పట్నం వారి నివాసం అను  కుంటా .వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరణ చేస్తూ ,వ్యాస మూర్తి గారు ” రామ రాజ్యం  కుశ లవులు ”అనే పుస్తకం రాశారు .ఇంకా చాలానే రాసి వుంటారు .వారు రాసిన ”కుశ లవులు ”లోని కొన్ని అమూల్య విశేషాలను మీకు అందించే ప్రయత్నం చేస్తూ ,ఆ మహాను భావుడిని స్మరించే అవకాశం కల్గి నందుకు ఆనంద పడుతున్నాను .
 పాయస భక్షణ 
దశరధుడు యజ్న పాయాసాన్ని ,అర భాగం కౌసల్యకు ,నాలుగో వంతు సుమిత్రకు ,ఎనిమిదో వంతు కైకకు ఇచ్చాడు .సుమిత్రకు మిగిలిన ఎనిమిదో వంతు మళ్ళీ ఇచ్చాడు .కనుక చివరగా శత్రుఘ్నుడు ఆమె కడుపున  పడ్డాడు .లక్ష్మణుడు మొట్ట మొదటి సారే ,గర్భస్తు  డైనాడు .శత్రుఘ్నుడు పుట్టే వరకు ,లక్ష్మణుడు   గర్భం లోనే వున్నాడు .జననం రీత్యా  లక్ష్మణుడు చివరి వాడు .గర్భస్థ రీత్యా రెండవ వాడు .కైకేయి  గర్భం కంటే ,ముందుగా సుమిత్ర గర్భం లో లక్ష్మణుడు పడ్డాడు .అందుకే శత్రుఘ్నుడి కంటే పెద్ద వాడు .అంటే భరతుని కంటే కూడా పెద్ద వాడు సుమిత్రానందనుడు .అందుకే శ్రీ రాముని తర్వాత లక్ష్మణునికి వివాహం అయింది .రాముడు కూడా లక్ష్మణుడి  కే  యువ రాజ్యాభిషేకం చేస్తానన్నాడు .
  వాలి -రావణ మిత్రత్వం 

  వాలి రావణుడి తో సంధి చేసుకొన్నాడు  .ఇది ”అవిభక్త సంధి ”భార్య ,పిల్లలు ,పురం ,రాష్ట్రం ,భోగం ,ఆచ్చాదనం ,,భోజనం అంతా ,అవిభక్తం గా నే అనుభ వించాలి .అగ్నితో భ్రాత్రుత్వాన్ని పొంది ,సంధి చేసు కొన్నాడు వాలి .రావణుడు కిష్కింద లో నెల రోజులు వున్నాడు .రావణ మంత్రులు వచ్చి ,రావణున్ని ,బలవంతం గా తీసుకొని వెళ్ళారు .
” దారా పుత్రః ,పురం ,రాష్ట్రం ,భోగాచ్చాదన భోజనం -సర్వ మేవావిభక్తం,నౌ భవిష్యతి హరీశ్వరః ”(ఉత్తర రామాయణం )  దీనితో వాలి చరిత్ర వక్ర గతిన నడి చింది .కార్త వీర్యార్జునితో ,వోడి పోయి ,రావణుడు ”అద్రోహం ”అనే సంధి చేసు కొన్నాడు .కార్తుడు పరశు రాముని చేతిలో మరణించాడు .అందు వల్ల వధార్హుడైన రావణుని సంబంధం తో కార్త వీర్యార్జునుడు ,వాలి కూడా వధార్హు లై నారు .
 అంగద పట్టాభిషేకం 
వాలి మాయావి అయిన స్త్రీ రాక్షసి తో పోట్లాడుతూ ,గుహ లోనే వున్నాడు .గుహ బయట కాపలా వున్న సుగ్రీవుడు చూసి చూసి ,విసుగుతో కిష్కింధకు వచ్చాడు .మార్గం తప్పిన వాడు ,అర్హత లేని వాడు ,రావణునితో భ్రాత్రుత్వం పొందిన వాడు ,అమలు జరగని సంధి క్రమం కల వాడు ,వాలి .అందుకే మంత్రులు వాలిని తప్పించి ,సుగ్రీవుని పట్టాభి షిక్తున్ని చేశారు .అంగదుడు పుట్టక ముందే ,సుగ్రీవ పట్టాభి షేకం జరిగింది .
రామ ,భరతులు ధర్మ నిరతులు .వాలి సుగ్రీవులు అలా కాదు .జ్యేష్టు డైన  రామునికి భరతుని వల్ల రాజ్యం సంక్ర మిస్తే ,ధర్మ మార్గం వదిలి ,సుగ్రీవుని రాజ్యాన్ని వాలి అపహరించాడు .అందుకే వాలి వదార్హుడైనాడు .కనుక తండ్రి రాజ్యానికి వారసునిగా యవ్వ రాజ్య పట్టాభి షేకం చేయించాడు రాముడు .వాలి భార్య తార కూడా ఇదే కోరింది రాముణ్ణి .
 వాలి వధ -సమర్ధ నీయత 
వానరులలో సహజ లక్షణంవిలక్షణం   అనే రెండు లక్ష ణాలు  వున్నాయి .విలక్షణం లో మానవులను అనుసరించారు .ఉపనయనాలు చేసుకున్నారు .వివాహ సంస్కారం వాళ్లకు లేదు .వానర .జాతికి ఉపనయనం విలక్షణమే .వివాహం ”విరోధం ”అవు తుంది వారిలో .వానర జాతికి తాత్కాలిక దాంపత్యమే కాని స్థిర దాంపత్యం లేదు .బుద్ధి మంతు లైన వానరులు జీవితాంతం ”ఇది నా భార్య ”అనే వ్యవస్థ ను కొన సాగించారు .కారణ జన్ము లైన వానరు లలో ,’వివాహం సంస్కార యుక్తం కాదు ”కనుక వాలి భార్యను సుగ్రీవుడు ,సుగ్రీవుని భార్యను వాలి అనుభ వించారు .వీళ్ళ కు అగ్ని పరీక్ష అక్కర్లేదు .
సుగ్రీవుడు జీవించి వుండగా ,వెడల గొట్టి ,అతని భార్య ”రుమ ”ను అనుభ వించాడు వాలి .కనుక వాలి చని పొతే కాని సుగ్రీవుడు రుమను  ను అనుభ వించ లేడు .దీనికి వాలి మృతియె  ”సంస్కారం ”.
రావణుడు సీతా దేవి ని అపహరించి నందు వల్ల ”అవి భక్త సంధి ”ప్రకారం వాలి కూడా రావణుడు వంటి నేర స్తుడే .
మృగాన్ని వేటాడటం రాజ ధర్మం .సుగ్రీవుడే ”మృగాన్ని ఎర ”వేసి ,రాముడు వాలిని మృగం లా చంపాడు .ఇది వేట లో భాగమే .
  సీత అగ్ని ప్రవేశం 
అగ్ని ప్రవేశ సందర్భం లో ,”సీత ను నా దగ్గరకు తీసుకొని రా ”అన కుండా ”సీత నా సమీపానికి రావలసినది ”అని విభీషణుడి తో చెప్పి పంపాడు రాముడు .”హర్షం దైన్యం ,రోషం ‘రాముడు పొందాడు” అన లెదు వాల్మీకి ఈ మూడూ ఆవహించాయి అన్నాడు .జరిగిన దానికి హర్షం ,సీత కష్టానికి దైన్యం ,పర పురుషుని పురం లో వుండడం వల్ల రోషం ,మూగే వానరుల్ని చూసి ”దాక్షిణ్య ,అమర్షాలు ”పొందాడు రాముడు .వానరులను చూసి దాక్షిణ్యం ,సీత ను చూసి రోషం ..
అగ్ని దేవుడు సీతా దేవిని ”నిజామ్కం ”మీద కూర్చో బెట్టు కోని ,శ్రీ రామునికి ఇచ్చి ”పరిగ్రహించు ”అన్నాడు .”ఇదినా ఆజ్న ”అని కూడా హెచ్చరిక గా  అన్నాడు .
”అంకె నాదాయ వైదేహీ ,ముట్ప పాథ విభా వసువుహ్ –విశుద్ధ భావం నిష్పాపాం ,ప్రతి గృహ్ణీష్వ రాఘవ –న కించి దభిదాతవ్య మహా మాజ్ఞాపయామి తే  ”ఇది వాల్మీకి అగ్ని హోత్రుడి తో చెప్పించిన మాట .
బ్రహ్మాదులు లక్ష్మీ నారాయణు లను స్తుతించారు అది బ్రహ్మ వచనం .మనుష్యు లైన సీతా రామ దాంపత్యం అమోఘం గా సాగ టానికే వైదిక సాంప్రదాయం ఇప్పుదేర్పడింది .శృతి వాక్యం ఇలా వుంది .
”సోమః ప్రధమో వివిదే ,గంధర్వో వివిడుత్తరః –త్రుతీయోగ్నిష్టే ,పతిస్తురీయస్తే మానుష్యజః
సోమోదదద్గంధర్వాయ ,గంధర్వోదదగ్నయే -రాయించి పుత్రగీస్చా దా దాగని ర్నఃయ మధో ఇమాం ‘
దీని భావం ఏమిటి అంటే ”కన్య కు సోముడు ప్రధముడు ,గంధర్వుడు తర్వాత పతులు .మూడవ పతి అగ్ని .నాల్గవ వాడు మనిషి .సోముడు గంధర్వుడికి ,గంధర్వుడు అగ్నికి ఇచ్చారు .ధనం ,పుత్రులు ,ప్రయోజన మైన ఈ కన్యకు నాకు అగ్ని హోత్రుడు ఇచ్చు కొన్నాడు .”అని వరుడు వివాహం లోని ”ప్రధాన హోమం ‘ దగ్గర ‘ అంటాడు .ఈ వైదిక సంస్కారమే ఇప్పుడు చెలా మణి లో వుంది .దేవత అయిన అగ్ని ,మనుష్యుడైన రాముడికి ”ఆజ్న చేసి ”సీతా సాధ్విని ఇచ్చాడు అని మనం తెలుసు కోవాలి .
 వాతావరణం 

పుణ్యాత్ముల ,పాపాత్ముల వల్ల వాతా వరణం లో మార్పులు వస్తాయి .ఈ విషయం  రామాయణం లో స్పష్టం గా చూపించాడు వాల్మీకి మహర్షి .తాటక చని పొతే ,”ఘోర సంకాశమై ,దారుణం గా వున్న వనం ,ముక్త శాపమై ,కుబేరుని చైత్ర రధం లా రమణీయం గా ప్రకాశించిందట ”ఇంద్ర జిత్తు చచ్చి పొతే జలాలు ,దిశలు శుద్ధ మైనా యట .(శుద్ధ ఆపో దిశస్చైవ)
రావణాసురు దు మరణిస్తే మరుద్గానాలు శాంతించాయి .దిక్కులు విక శించాయి .భూమి నిశ్చల మైంది .గాలి చల్లగా వీచింది .స్థిర ప్రభ గా భాస్కరుడు ప్రకాశించాడు .అలాగే భరతుని హృదయం స్పష్టం అయే వరకు పట్టాభి షేకం  విషయం  స్పష్టం కాలేదు .కనుక రాముడు ”గంభీరం ”గానే వున్నాడు .
 శ్రీ లంక 
రావణుడి లంక శాపోప  హతం .లంక లోని ఏనుగులు కూడా పర హింస చేసేవట (కులీనాన్ రూప సంపన్నాన్ ,గజాన్పర గజాను జాన్ ).లంక వాసులు బుద్ధి కుశలురు .బుద్ధి ప్రధానులు కూడా .ఎవరి బుద్ధి వారికే ప్రధానం కూడా ”.స్వైర గతి ”వాళ్ళది .స్త్రీలు అంతా మద వతులు .అందుకే లంక ఎప్పుడు ఆరని అగ్ని జ్వాల లా ,రావణా కాష్టం గా వుంటుంది .

— సంపూర్ణం
ఇవన్నీ అభినవ వ్యాసు లైన ,అభినవ వాల్మీకు లైన స్వర్గీయ కాళూరి వ్యాస మూర్తి గారి వాల్మీకి  రామాయణ సుధా సాగర అంతర్గతనిధి నిక్షేపాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విద్య విజ్ఞానిక ప్రదర్సన

gajallu – m d syamala

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం –7 (చివరి భాగం )

సరస్వతీ పుత్రుని శివ తాండవం –7 (చివరి భాగం )

                                               శివా లాస్యం 

  శివ తాండవం పూర్తి అయింది .పార్వతీ దేవి చెలి కత్తె ”విజయ ”ప్రార్ధన గీతం పాడు తుంది .ఇది సంస్కృత రచన ..లల్తంలలితం గా సాగి   ,శివా లాస్యానికి మార్గం సుగమం చేస్తుంది .గిరి కన్నె లాస్యం ,లలిత లలత పదాలతో ,మనోహరం గా వర్ణించారు సరస్వతీ పుత్రులు .శివ తాండవం తిలకించిన పార్వతి ఎంత చక్కగా నవ్విందో చూడండి .
”ఫక్కు మని నవ్వినది జక్కవల పెక్కు వల -జక్కడుచు ,చను దోయి ,నిక్క బార్వతి యపుడు
నిక్కు చను దోయితో ,నిబిడ రోమోద్గరము -దిక్కు దిక్కుల నెల్ల ,నేత్రోత్సవము ”
గిరికన్నే పార్వతి అలస మారుతం లాగా ఆడింది .సెలకన్నె   ఫకాలున నవ్వి నట్లు పాడినది .శరదబ్జ ధూళి పింజరితముల చక్రముల సరి దూగు ,లావణ్య భరిత కుచయుగమ్ములు చను కట్టు నెగ మీటి ,మిను దాకునో యనగా పైపైని వ్రుక్షమ్ము విరియించి ఆడినదట పార్వతి దేవి .
”ప్రతి పదము లో శివుడు పరవశత దూగంగా -సతి చంద్ర మకుటంబు ,సారెకు  జలిమ్పంగా
ప్రతతి దూగాడి నట్లు వాత దూతం బౌను -శత పత్రమది ముక్తసరి విచ్చి కొన్నట్లు -ఆడినది గిరి కన్నె”
గగన వనం లో విచ్చి కొన్న జలదం వలె ,వనం లో పారాడే వాత పొతం వలె గిరి కన్నె సంచలించింది ,సంచలనం కల్గించింది .
శివా లాస్యానికి శివుడు ఆనంద పరవశు డైనాడు .చేతులు కలిపి నాట్యం చేయ ప్రారంభించాడు ప్రకృతి ,పురుషుల విలాసం జరిగింది .అర్ధనారీత్వం సార్ధకత చెందింది .
”తన లాస్యమును మెచ్చి ,తరుణ చంద్రా భరణుడు –అను మోదమున జేతులను కలిపి యాడంగ
శివ శక్తు లొక్కటి గ జేరి నంతనే -మౌను లవి క్రుతేన్ద్రియు తోమ్మటంచు జాటిమ్పంగా -గిరి కన్నె ఆడినది .”
అప్పుడు దేవత లు అందరు, చరిత కంత(kantha )ములతో శివ శక్తులు  మంగళ గీత ములతో ,గీతా లాపన చేశారు .సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌభాగ్య వంత మై ,సమాప్తం చెందింది .
ఇంత గొప్ప కావ్యాన్ని ,”మధుర మనోహరం ”గా రచించిన సరస్వతీ పుత్రులు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ధన్యులు .చదివిన మనము ధన్యులం అవటానికే వారీ ప్రయత్నం చేశారు .
”జయన్తితే రస సిద్ధాః కవీశ్వరాః -నాస్తి తేషాం-యశః కాయే –జరా మరణజం భయం ”
సంపూర్ణం
”సరస్వతీ పుత్రుని శివ తాండవం ”అన శీర్షికతో దీన్ని 1973 మే నెలలో రాశాను .ఇది అదే నెలలో ”ఆంద్ర ప్రభ -సాహితీ  గవాక్షం ” లో ప్రచురిత మైంది .అంటే సుమారు 39 సంవత్స రాల నాటిది అన్న మాట .దీన్ని మార్పులు చేర్పులు చేసి 29 -09 -1990  న ఉయ్యూరు కు సమీపం లోని గరిక పర్రు శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం లో విజయ దశమి పర్వ దినాన ఉపన్యాసం చేశాను .అదీ ఇరవై ఏళ్ళ కిందటి మాట .ఇప్పుడు మీ కోసం అందించాను .
ఈ వ్యాస పరంపరను సరస్వతీ పుత్రులు స్వర్గీయ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికే సభక్తి కంగా అంకితమిస్తున్నాను .
”ఆప్యాయంతు మమాన్గాని ,వాక్ ప్రాణ శ్చ చక్శుహ్ శ్రోత్ర మధో బల మిన్ద్రియాని ,సర్వం బ్రహ్మో పనిష దం ,మాహం బ్రహ్మా ,నిరాకుర్యా మామా బ్రహ్మ నిరాకరో ,దనిరాకరణ మస్తు ,అనిరాకరణ మస్తు ,తదాత్మ నిరతే ,య ఉపనిషత్సు ధర్మాస్తే -మనంతుతే మయి సమ ”
ఓం శాంతి శాంతి శాన్థిహ్
సర్వం సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం —6

సరస్వతీ పుత్రుని శివ తాండవం —6

                                          శివా శివులు –2

భగవద్గీత లో కూడా ,గీతా చార్యుడు శ్రీ కృష్ణుడు ‘అనన్యాస్చింత యంతోమాం ,ఏ జనాః పర్యు పాసతే –తేషాం నిత్యాభి యుక్తానాం -యోగ క్షేమం వహామ్యహం ‘.శివా నంద లహరి లో భగవత్పాదులు శ్రీ శైల మళ్లి కార్జున ,భ్రమ రాంబా లను ఎలా దర్శించారో చూడండి .

”సంధ్యా రంభ విజ్రుమ్భితం శృతి శిర స్తానానంత రాదిష్టితాం
సప్రేమ భ్రమ రాభి రామ ,మసక్రుత్ సద్వాసనా శోభితం
భోగీన్ద్రాభరణం -సమస్త సుమనః పూజ్యం గుణా విష్క్రుతం
సేవే శ్రీ గిరి మళ్లి కార్జున మహా లింగం శివా లింగితం .”

నల్లని మేఘాన్ని చూస్తె ,నెమలి నాట్యం చేస్తుంది .అలాగే ఉమా దేవి ని చూసిన శివుడు నాట్యం చేస్తున్నాడని శ్రీ శంకరులు –

”ఆకాశేన శిఖీ ,సమస్త ఫణి నాం,నేతా కలాపీ నతా
నుగ్రహే ప్రనవోప దేశ నినదైహ్ కేకీతి యోగీయతే
శ్యామం శైల సముద్భువాం ,ఘన రుచిం ,దృష్ట్యా నటంతం ,ముదా          వేదాన్తోప వనే విహార రసికం తం నీల  కంఠం భజే ”

          తాండవం చేసే శివా శివులగు సాంబ సదా శివుని నేను సేవిస్తాను అంటూ ,శివానంద లహరి లో
    ”సంధ్యా ఘర్మ దివాత్యయో హరి కరా ఘాత ప్రభూ తానక
     ధ్వానో వారిద గర్జితం ,దివిషదాం ,దృష్టి చ్చటా చంచలా
     భక్తానాం ,పరి తోష బాష్ప వితతి ,ర్వ్యుష్టి ర్మయూరీ శివా
     యస్మిన్నుజ్వల ,తాండవం ,విజయతే ,తం నీల కంఠం భజే ”
              విష్ణువు ”ఆనకం ”అనే తప్పెట వాయిస్తున్నాడు .దేవతలు భక్తి పార వశ్యం తో వున్నారు .సాంబ శివుని తాండవం ,లోకోత్తర మైనది .శివ ప్రదమే కాదు మంగళ ప్రదం .మయూరి అంటే ఆడ నెమలి .అది నాట్యం చేయదు .మయూరమే  అంటే మగ నెమలి మాత్రమే నాట్యం ఆడు తుంది ..శివా శివులు మయూరీ మయూరాల వలె నాట్యమాడు తున్నారు .
      హిమ పర్వతపు శిలల పై శివ తాండవం జరుగు తోంది .ఆయన పాదాలు కంది పోతాయేమో నని ,భగవత్పాదులు భావిస్తూ ,మెత్త నైన తన హృదయం పై నాట్యం చేయమని అర్ధిస్తున్నారు .
  ”ఎష్యత్సేషజనిం ,మనోస్య కఠినం ,తస్మిన్నతా నీతి మ
   ద్రాక్షాయై ,గిరి శీమ్ని ,కోమల పద న్యాసః పురాభ్యాసితః
   నోచే ద్దివ్య గృహాంత రేషు ,సుమస్తల్పేషు ,వెద్యాదిశుహ్
   ప్రాయస్సత్సు శిలా తలేషు ,నటనం ,శంభో కిమర్దం తవః ”
          విష్ణువుకి ,శివునికి ఎంత దగ్గర సంబంధం వుందో ,శ్రీ శంకరులు చెప్పారు .త్రిపురా సుర సంహారం లో ,విష్ణువు ,శివుని వింటికి బాణం అయాడు .నంది రూపాన్ని పొంది ,వాహనం అయాడు .అంబ రూపం భార్య అయాడు .శివ పాద సేవ కోసం వరాహ రూపం పొందాడు .(కిరాతార్జు నీయం ).జగన్మోహినీ రూపం పొంది శివునికి ప్రీతి కల్గించాడు .తాండవ సమయం లో విష్ణువు మృదంగం వాయిస్తాడు .హివుడిని సహస్ర కమ లాలతో అర్చించేందుకు తక్కు వైన ఒక్క కమ లాన్ని తన నయన కమలం తో ,అర్చించాడు (కన్నప్ప  ).అందుకే శివ కేశవు లకు భేదం లేదు .
   ”బాణత్వం ,వ్రుషభాత్వ మర్ధ వపుషా ,భార్యాత్వ మార్యా పతే
    ఘోణిత్వం ,సఖితా ,మృదంగ వాహతా చేత్యా ది టాపం దధే
    త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ ,త్వద్దేహ భాగో హరిహ్
    పూజ్యా త్పూజ్య తరస్య ,ఏవ ,హిన చేత్కోవా త దన్యోదికః ”
                ఈ శివ విష్ణు అభేదాన్ని తన శివ తాండవం లో చూపిన తర్వాత ,శ్రీ పుట్ట పర్తి వారు ,ముగింపు ను కడు రమ్యం గా చూపించారు .శోకం ,సంతోషం ,ఏకం అయి నాయట .నర ,నాకములు ,అనంతా కాశం ,పరిమిత భూమి ,కలిసి పోయాయి ఆ ఆనంద లహరి లో .పరమ ఋషులు ,అజ్ఞానులు ,తరులు ,బీజములు ,విరులు ,మొగ్గలు  అద్వైతం , అద్వైతం అని ”అద్వయం ”గా అఖిల లోకాలు యెలు గెత్తి  చాటి , నట్లు ,ఒత్తి పలికారట .ఆ భావం ,ఆ అనుభూతి ,అలోకిక ఆనందాన్ని కల్గించటం మనం ప్రత్యక్షం గా చూస్తున్నాం .ఒడలు పులక రిస్తాయి .రస సాక్షాత్కారం కల్గింది .అమోఘ కవితా సృష్టి కి నీరాజన పుష్ప వృష్టి .
        నాట్యావ సాన కాలమ్ లో ,హరుడు కూడా హరిని ,స్తుతిస్తాడు .తాండవ కేళి విరమిస్తాడు .ఇది పరమ పావనమై ,సకల లోక వాసు లకు భక్తి పార వశ్యాన్ని కల్గించిన అమోఘ రచనా పాటవం .ఏవేవో ఊహా లోకాల్లో విహారం చేస్తాం .
    ”పద్మ మనోజ ,యావక పుష్ప శరీర –పద్మ సుందర నేత్ర బావాంబరా తీత
     మాయా సతీ భుజా ,మధు పరి రంభా -విషయ వివేక ,వ్రుషీక ,సంచయోది ష్టాత
     శౌరి ,నీ తేజమే ,సంక్ర మించెను నన్ను -బూరించే ,దాన్డవము బూర్ణ చిత్కళల తోడ
నని ,నిటలము  నందు ,హస్తములు మొగిచి –వినతుడై శంకరుడు ,విష్ణువును నుతించి
ఆడే నమ్మా శివుడు -ఆడే నమ్మా భవుడు ”
ఇప్పటి దాకా ” శివ తాండవం” చూశాం కదా ,ఇక” శివా లాస్యం” చూద్దాం -అయితె తర్వాత మాత్రమే .
                        సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -02 -12 .గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

దివ్య యోగి అక్క మహాదేవి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తొలినాటి పాటల పుస్తకాలు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం -5

సరస్వతీ పుత్రుని శివ తాండవం -5

                                                   అద్వైత సౌరభం 

ఒకప్పుడు శుక మహర్షి తన తండ్రివ్యాస భగ వానులను ,శివ కేశవులను గురించి ,లక్ష్మీ నారాయనులను గురించి కొన్ని ప్రశ్నలు అది గాడు .వాటికి సమాధానం గా ,సాక్షాత్తు పర మేశ్వరుడే శుక మహర్షికి వివ రాలు తెలి పాడు .”బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు ఒక్కరే .వారి భార్య లైన సరస్వతి ,లక్ష్మి ,పార్వతులు ఒక్కరే .మన దృష్టి లోనే వేరుగా కని పిస్తారు .ఉన్నాత స్తానాల్లో వున్న వారికి అంతా ఒక్కారు గానే కని పిస్తారు .

”ఏ నమశ్యంతి గోవిందం ,తే నమశ్యంతి శంకరం -ఏ యర్చయింతి హరిం భక్త్యా ,తే అరచ యంతి వృష ధ్వజం
ఏ రుద్రం నాభి జాయంతి ,తేన జాయంతి కేశవం -రుద్రత్ప్రవర్తతే బీజం -బీజయోని ర్జనార్దనా
యో రుద్ర స్వయం బ్రహ్మా ,యో బ్రహ్మ సహుతాశానః -బ్రహ్మ ,విష్ణు ,మాయో రుద్రా
అగ్ని స్టోమా త్మకం    జగత్ ”.    అని చెపుతూ ,
”పుల్లింగ సర్వ మీశాన ,స్త్రీ లింగ భవత్సుమా –ఉమా రుద్రాత్మకా సర్వాఃప్రజా స్థావర జంగామాః
వ్యక్తం సర్వ ముమా రూపం -అవ్యక్తం తూ మహేశ్వరః
ఉమా శంకర యోర్యోగః సయోగో విష్ణు రుచ్యతే
యస్తు తస్మై నమస్కారం ,కుర్యాద్భక్తి సమన్వితః         అని వివ రిస్తూ ,ఎవరు శివ భక్తులో ,వారు విష్ణు భక్తులు కూడా అని తెలియ జెప్పాడు వ్యాస ముని .
”అంత రాత్మా భవేత్ బ్రహ్మా -పరమాత్మా మహేశ్వరః
సర్వేషా మేవ భూతానాం -విష్ణు రాత్మా సనాతన
అస్య త్రైలోక్య వృక్షస్య -భూమౌ విటపి శాఖిననః
అగ్రం ,మద్యం ,తదా మూలం -బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరః
కార్యం విష్ణు హ్  ,క్రియా బ్రహ్మా – కారణం తు   మహేశ్వరః
ధర్మో రుద్రో ,జగద్శ్ విష్ణు హ్ -సర్వం జ్ఞానం పితామహః
శ్రీ బ్రహ్మ ,రుద్రేతి -యంతం బ్రయా ద్విచ క్షణః
కీర్తి నా త్సర్వ దేవస్య -సర్వ పాపైహ్ ప్రముచ్యతే ”           అని వివరిస్తూ
”రుద్రో నర-ఉమా నారీ -తస్మై తస్మై నమో నమః
రుద్రో బ్రహ్మా ,ఉమా వాణీ  తస్మై తస్మై నమో నమః
రుద్రో విష్ణు ,ఉమా లక్ష్మీ  తస్మై తస్మై నమో నమః ”
ఈ రక మైన అద్వైతాన్ని ,సర్వ దేవతా సమ భావాన్ని ,ఆచార్యుల వారు తమ శివ తాండవం లో ఎంత గొప్ప గా చూపించారో గమనించాం . వారు  త్రికాలాలకు ,త్రిమతాలకు ,అతీతం గా ఆలో చించి ,అందించిన సందేశం సందేశం అది .ధన్య జీవి ,పుణ్య మూర్తి పుట్ట పర్తి వారు .

         శివా శివులు 

” నమశివాభయం  ,నవ యౌవనాభాం -పరస్పరా క్లిష్ట ,వపుర్ధరాభ్యాం
నాగేంద్ర కన్యా ,వృష కేత నాభ్యాం –నమో నమః శంకర  పార్వ తీభ్యాం
అని ఆది శంకరా చార్యులు ప్రార్ధించారు .దీనికి దీటుగా  భీమ ఖండం లో శ్రీ నాద మహా కవి సార్వ భౌముడు ,ఎంత అద్భుతం గా వర్ణించాడో చూడండి .ఇది వ్యాస భగ వానునికి కాశీ లో కని పించిన విశ్వనాదాన్న పూర్ణ ల ఆకృతి .
”చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి –నీల కుంతల ఫాల -నీల గళుడు
ధవళా యతేక్షణ ,-ధవళా ఖిలాంగుడు -మదన సంజీవని -మదన హరుడు
నాగేంద్ర నిభయాన -నాగ కుండల ధారి -భువన మోహన గాత్ర -భువన కర్త
గిరి రాజ కన్యకా ,గిరి రాజ నిలయుండు ,సర్వాంగ  సుందరి  సర్వ గురుడు
గౌరి ,శ్రీ విశ్వ నాధుండు -కనక రత్న మెట్టి చట్టలు బట్టు కొనుచు
యేగు దెంచిరి వొయ్యార మెసగ ,మెసగ -విహరణ క్రీడ ,మా యున్న వేది కపుడు ”
అద్వైత మాతా చార్యులు ఆది శంకరులు ”శివ -శివా ”ద్వంద్వానికి చేర్చి ”సాంబ సదా శివుని ”అంటే అంబ తో కూడిన శివుని ఆరాధించారు .దాని పై ”సౌందర్య లహరి ”చెప్పారు .మొదటి శ్లోకం లోనే ”శివా శివులు ”కు నమస్కారం చేస్తూ ఇలా అంటారు .”కలాభ్యాం చూడాలంకృత  శశి కలాభ్యాం నిజ తపః -ఫలాభ్యాం -భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవ తుమే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భావాభ్యాం -ఆనంద స్ఫూర దనుభావాభ్యాం నతి రియం ”

సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు – “తెలుగు భాషా వికాసము “

ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం –4

 సరస్వతీ పుత్రుని శివ తాండవం –4

                                         రంగ వైభోగం –2

— నాట్యానికి అవసర మైన సర్వ లక్షణా లను వివరిస్తూ ,అవి ఒక దానితో ఒకటి కలిసి యెట్లా రసోత్పత్తి చేస్తున్నాయో వివ తీస్తారు పుట్ట పర్తి  వారు .
”కర ముద్రికల తోనే -గనుల చూపులు దిరుగ
దిరుగు చూపుల తోనే ,బరువెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంట ,గదిసి కొన భావమ్ము
కుదిసి భావము తోనే ,కుదురు కోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము ,పేరురము ,హస్త యుగమ్ము
సరిగాగ మలచి ,గండరువు నిల్పి న యట్లు
తారకలు జలియింప ,దారకలు నటియింప
గోరకములై ,గుబురు కొన్న జూటము నందు
నురగాలి ,నలి రేగి ,చొక్కి వీచిన యట్లు
పరపులై పడ గల్ప పాద పంబుల బూవు
లాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఘల్లు ఘల్లు న శివుని కాళ్ళ గజ్జెలు మ్రోగగా ,నాట్యాన్ని తిలకిస్తూ ,సకల భువనాలకు కల్గిన ఆనందాన్ని వర్ణిస్తూ ,ఆ ఆనందం ఎంత స్వచ్చ మైనదో తెలియ జేయ టానికి ,సృష్టి లోని తెల్లని వస్తువుల నన్నిటినీ వర్ణిస్తారు .
”తేలి బూదే తెట్టులు కట్టి నట్లు ,చలి కొండ మంచు కుప్పలు పేర్చి నట్లు ,ముత్తెపు సౌరులు   పోహళించిన యట్లు ,అమృతమును ఆమతించి నట్లు ,ఘన సారాన్ని ,కల్లాపి చల్లి నట్లు ,మనసు లోని సంతోషం కనుల కని పించి నట్లు ”ఆనందం తాండ వించింది ఎల్లెడలా” .ఇందులో తెలుపు స్వచ్చత వినిర్మలత ,చల్లదనం అన్నీ కల గలిపి వున్నాయి .
పైన చెప్పిన దానికి పూర్తిగా   విభిన్న మైన విషయం తో ”,నీల గళుని ”నాట్యం చే కల్పింప బడిన నీలిమ వ్యాప్తి చెంద టాన్ని ,కడు చమత్కారం గా వర్ణిస్తారు .
”మబ్బుగములు లుబ్బి కోని ప్రబ్బి కొన్న విధాన
నబ్బురపు నీలిములు  లిబ్బి సేరు విధాన
నల్ల గలువలు దిక్కు లేల్లె విచ్చు విధాన
వగలు కాటుక కొండ పగిలి చెదరు విధాన
దగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన
దన లోని తామసము కనుల జారు విధాన
గులుకు నీలపు గండ్ల ,దళుకు చూపులు బూయ
ఘల్లు ఘల్లు మని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ
ఆడేనమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
నాట్య వేగాన్ని ఉధృత గతిలో వ్యక్త పరుస్తూ ,విన్యాస ,విలాసాలను చక్కగా చూపించారు ,శివ కవి శ్రేస్తులు  ఆచార్యుల వారు .
”హంసాస్యమును హంసభాగానికి ఆనించి ,కలికి చూపుల చంపకములు పై జల్లి ,పక్కకు కాంతాన్ని మెలకువ గా నాడించి    ,గ్రుడ్లు చక్రాల్లా తిప్పి ,కను బొమలను ధనువుల్లా వంచి ,భూమిపై నొక కాలు ,దివి పై నొక కాలు వుంచి ,శివుడు నాట్యం చేస్తుంటే ,ఇలలో చెలువు (సౌందర్యం )రూపై నిల్చి నట్లున్నాడట .దేవతలు భక్తీ తో స్తోత్రాలు చేస్తున్నారు కనులు భావాలు ఏ విధం గా  ఎగ  జిమ్మాయో వివరిస్తున్నారు .
”ఒక సారి దిరములై ,యుండి కాంతులు
ఒక్క సారి గంట వేసి కోని ఫూత్క్రుతి జిమ్ము
నొక్క సారి మను బిళ్ళ యోజ చెంగుల దాటు
నొక సారి వ్రేలు వాడిన పూల రేకులై
యొక సారి దుసికిళ్ళు వోవు చిరు చేపలై
యొక సారి ధనువు లై యుబ్బు కన్నుల బొమ్మలు ”
హస్త విన్యాసం అమోఘం గా సాగింది .అవి స్థంభ యుగమో ,నీప శాఖా ద్వయమో ,తెలియటం లేదు .కుంభి కర కాండములలో గోన బైన తీగలో అర్ధం కావటం లేదు .సుమ దామమా ?శిరీషములే నిల్చెనా ,అన్నట్లున్నవి .ఇవేవీ కాక తటిత్ ప్రభా తాండవమా ?అని పిస్తోంది .మంద గతి లో కది లేటప్పుడు ,చేతులు కంపిస్తున్నాయి .శీఘ్ర గతి లో ,కాన రావటం లేదు .ఎంత అనుభవ సారం  రంగ రించారో తెలుస్తుంది .
మయూరా లాపన శివ తాండవం లో ,షడ్జమం గా వుంది .చికిలి గొంతుకతో కూసే కపి స్వరం సకలేశ్వ రుని ,శృతి స్థాయికి ,పంచమం వాయు పూరిత  వేణు వర్గం తాండ వానికి ,తార షడ్జ మాన్ని అందు కొంది .సహజ సిద్ధ మైన ,వాణిని ,సరిగ్గా ,నాట్య విధానాలకు ,జత చేసి ,చూపిన అద్భుత సన్ని వేశం .
 శాస్త్ర విధానం -స్వేచ్చ
  ఈ విధం గా సాగిన శివ తాండ వాన్ని ,తిల కించిన వారి లో కలిగిన మార్పులను ,పుట్ట పర్తి వారు చక్క గా చూపారు .
”సరి గాగ ,రూపించి షడ్జమ ము పట్టంగ
శర జన్ము తేజీ పించము విప్పి నర్తింప
ఋషభ స్వరంబు కుల్కించి పాడిన నంది
వృష భంబు చేల రేగి నియతి మై లంఘింప
నందంబు గా దైవతా లాప నము సేయ
గంధర్వ లోకంపు గనుల బూవులు బూయ
బని బూనుచు నిషాద స్వరము రక్తి కి దేగ
వెనకయ్య బృంహితము   ,వెనుక దరుము క రాగ ”
నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఇందులో ,జంతువులకు వానికి ఇష్టమైన  రాగాలను జత కూర్చటం లో కవి నేర్పు కనిపిస్తుంది .భరత శాస్త్ర విధానాన్ని అనుసరించి ,నాట్యము సాగు తున్నా ,కళ కు స్వేచ్చ కావాలని కోరు తారు ఆచార్యుల వారు .
”శాస్త్రములను దాటి ,తన స్వాతంత్ర్యమును బూని
శాస్త్ర కారుల యూహ సాగు మార్గము  జూపి
భావ రాగ మూల సంబంధంబు ,రాగ లీ
లా విశేషంబు నుల్లాసంబు గది యింప
భావమే శివుడు గా బ్రమరి చుట్టెడి భంగి
తానే తాండవ మౌనో ,!తాండవమే తానౌనో
ఏ నిర్ణయము దనకే బూని చేయగ రాక

 డా మరచి ,మర పించి ,తన్ను జేరిన వారి
గామునిని ,దన మూడు ,గన్ను లను సృష్టించి ”
ఆడి ,పాడాడు శివుడు .కామునికి పునర్జన్మ కల్పించి ,అతనికి ఆనందాన్ని కల్పింప జేశాడు శివుడు .అపూర్వ కవితా సృష్టి .
”ఒక యడుగు జననంబు ,నొక యడుగు మరణంబు
నొక భాగమున సృస్ష్టి ,,యొక వైపు బ్రళ యంబు
గను పింప దిగ కన్ను గొనలు మిన్నుల నంట
ముని జననంబుల హృదయములు ,దత్పదంబంత
యాడే నమ్మా శివుడు బాడే నమ్మా భవుడు
నాట్యం పరా కాష్ట కు వచ్చింది .ఇక్కడే కవి ,నేర్పుగా ,అద్వైతాన్ని మేళ వించి ,అద్భుత రస సృష్టి చేసి ధన్యులై నారు .పరిణత చెందిన వారి మేధస్సు కిది మంచి ఉదాహరణ.
”హరియే హరుడై ,లచ్చి యగ జాత యై ,సరికి
సరి ,దాన్డవము లాడ ,సమ్మోద రూషితులు
హరుని లో హరి జూసి ,హరి యందు హరు జూచి
నేర వేగ దేవతలు విస్మితులు ,మును లెల్ల
రది గతానంద భావా వేశ చేతస్కు
లేద విచ్చి ,ఉప్పొంగి ,యెగిరి స్తోత్రము సేయ
భేద వాదము లెల్ల బ్రదలి పోవగ
మేదినియు ,నద్వైతమే బ్రతి ధ్వను లీన
నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఈ అద్వైత సిద్ధాంత ప్రతి పాదన కు మెచ్చి కదా జగద్గురు శంకరులు కంచి కామ కోటి పీతాదిపతులు ”శివ తాండవం ”ను తమ నిత్య పారాయణ లో భాగం గా చేశారు .నిజం గా శివ కేశవులకు భేదమే లేదు కదా ..దీనికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి .వాటి విషయం తరు వాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రెండు విశేషాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం –3

 సరస్వతీ పుత్రుని శివ తాండవం –3

                                                 రంగ వైభోగం  

  ఆధునికాంధ్ర కవిత్వం పలు పోకడలు పోయే సందర్భం లో సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు భారతీయతను ప్రతి బిమ్బించే ”పద ఛందస్సు ”ను స్వీకరించి ,తెలుగు జిగిని వెలయించి ,”శివ తాండవం ”చేశారు .ఆ తాండవం శరీరం గగుర్పొడిచే విధం గా ,వివిధ గతుల నడకల తో ,పోకడల తో ,సాహితీ రంగ స్థలాన అభినయించి చూపారు .
పరమశివుని తాండవం అత్యాశ్చర్యం గా చూపిస్తూ ,అది అలౌకికానన్దమని తెలియ జేశారు .
”ఏమానందము -భూమీ తలమున -శివ తండ వ మట  -శివ లాశ్యం బట  ” అని రంగాన్ని సిద్ధం చేసి ,ఆ రంగ వైభవాన్ని వర్ణిస్తున్నారు .”అలలై బంగరు కలలై -పగడపు బులుగుల వలె-మబ్బులు విరిసినయవి ”.ఈ ఆనందం మానవులకే కాదు ,పక్షులు ,పుష్పాలు కూడా ఆనందా బ్ది లో   ఓల లాడు తున్నాయి .”పలికెడు నవే ప-క్షులు ప్రా బలుకులో -కల హైమవతీ -విలసన్నూపుర –నినాదములకు -న్నను కరణం బులో  ”  రాలిన ప్రతి పుష్పం హైమవతీ కుసుమా లంకారం లో తాను కూడా ఒకటి అని సంబర పడిందట .”రాలిన ప్రతి సుమా -మేలా నవ్వును -హైమవతీ కుసు -మాలంకారము  -లందున దానొక  – టౌదు  నటంచునో ”
లలిత మైన హైమవతీ శరీరం పూవులు ,కాయల తాకిడికి వసి వాడునని ”లలితా మృదు -మంజుల మగు కాయము -బూవుల తాకుల -బో వసి వాడేదో?అని అతి సున్నితం గా అంటారు .
పార్వతీ దేవికి గీర్వాణి ,వాణి అయిన భారతి అలంకారం చేస్తోంది .శివునికి చతురాననుడు అయిన బ్రహ్మ ,సర్వ భూష నాలు సవ ద  రిస్తున్నాడు .
”తకజ్హం ,తకజ్హం ,తక దిరి కిట నాదమ్ము లతో ”లోకేశుడైన శివుడు నాట్యం చేసే సందర్భం లో ,”భ్రుమ్గంములు గొంతులు సవ ద  రించును -సెల కన్నెలు కుచ్చులు లెల్లా విచ్చల విడి గా ,దుసికిల్లాడగా బరుగుడును ”.
”ఓహో ,హాహా -యూహా తీతం  –బీ యానందం -బిలా తలంబున ”అంటూ
”ఆడునట నా –ర్యా ప్రాణే శ్వరు -డో ,దిన మణి నిలు   -రా ,దిన మంతయు -బడమటి దేశపు -వారల కీ కధ -నేరిగించుటకై -బరి వేత్తేదవో ”?అని సూర్య గమనపు తొందరను ప్రశ్నించాడు కవి ,పడమటి దేశ వాసులకు శివ తాండవ విశేషాలను తెలియ జెప్ప టానికో అన్నట్లుగా సూర్యుడు పశ్చిమాన మునిగి పోతున్నాడట .
విశ్వేశ్వరుని అడుగులు కడగ టానికి ,సమర్పించే పాద్యమో అన్నట్లు గా ,ఆవుల మంద కన్నుల నుండి బాష్పాలు విడుస్తున్నాయి .ఈ భావా లన్ని ,అపూర్వ మైన ఆనంద చిహ్నాలు .ప్రకృతి అంతా శివ తండ వాన్ని ఆలోకిస్తూ ,మై మరచి ,వుండే తీరు మనకు కళ్ళ ముందు దృశ్యమానం చేశారు పుట్ట పర్తి వారు .ఈ విధం గా నాట్య రంగం సిద్ధ మైంది .నందీశ్వరుని తో ,నాందీ వాచా కాన్ని నాగర భాష లో ఔచితీ యుతం గా పకికిస్తారు ఆచార్యులు .భాష పై వారికున్న సాది కారత  తెలుస్తుంది. చివరలో తెలుగు ను చొప్పించి ,శివుని తో నందీశ్వరుడు ఇలా అంటాడు –
”నీ నృత్తంములో ,నఖిల వాజ్మయము -తానము మరియు ,గానము గాగను -తాండ వింప గా దరుణం బైనది –
ఖండెన్ దు  ధరా ,గదలుము నెమ్మది ”అని ఆహ్వానిస్తున్నాడు .
  తాండవ కేళీ విలాసం 
శివుని తాండవ నృత్యాన్ని ,తన ప్రజ్ఞా వైభవం తో శ్రీ పుట్ట పర్తి భావ స్ఫూర్తి కల్గించే విధం గా ఇలా వర్ణిస్తారు .
”తలపైని జదలేటి  యలలు తాండవ మాడ –నలల త్రోపుదుల గ్రోన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలము పైన ,ముంగురులు చేర లాడ -గను బొమ్మ లో మధుర గమనములు నడ యాడ
గను పాప లో గౌరి ,కసి నవ్వు చిందింప ,–గను చూపులను తరుణ కౌతుకము జుమ్బింప
గడగి మూడవ కంట ,కటి నిప్పులు రాల -గడు నేర్చి పెదవి పై ,గటిక నవ్వులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరి ద్గిరి గర్భములు తూగ -నమిత సంరంభ హాహా కారములు రేగ
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ”
ఈ విధం గా మొద లైన తాండవం క్రమంగా వేగాన్ని పుంజు కొంది .”కిసలయ జటా చ్చటలు   ముసురు కోని వ్రేలగా ,బుసలు కోని తల చుట్టూ భుజగములు బారాడగా ,మకర కుండల ,చకా చకలు చెక్కుల బాయగా ,నకళంక కంత(kantha ) హారాళి ,నృత్యము సేయ ”శివుడు నాట్యం చేస్తున్నాడు .మొత్తం దృశ్యం అంతా మన కళ్ళ ముందు కనిపించేట్లు చేశారు .మనం కైలాసం లో శివుని సమీ పం లో వుండి చూస్తున్న అనుభూతి కలిగించారు .ఒడలు గగుర్పొడుస్తుంది .ఆచార్యుల వారి ఊహా పద సంచారం తాండ వాన్నిప్రత్యక్ష అనుభవం  చేశారు .తాను అనుభూతి పొంది ,మనకూ ,ఆ అనుభవాన్ని అందించారు .రచించి వారు ,చదివి మనము తరిస్తున్నాం .
”మొలక మీసపు గట్టు –ముందు చందురు బొట్టు
పులి తోలు హోమ్బట్టు -జిలుగు వెన్నెల పట్టు
నేన్నడుమునకు చుట్టు -క్రోన్నాగు మొల కట్టు
గురియు మంటల రట్టు -సిక పైన నల్ప కల్పకపు పుష్ప జాతి
కల్పపు పుష్ప జాతి బెర్లాడు మధుర వాసనలు
బింబా రుణము కదలించు దాంబూలము
తాంబూల వాసనల దగులు భ్రుంగ గణంబు
గనుల పండువు సేయ ,మనసు నిండుగ బూయ
ధన ధన ధ్వని దిశా తతి పిచ్చ లింపంగా
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ”
నాట్య విధానాన్ని విపులంగా వివ రించారు ఆచార్యుల వారు .”సకల భువనములు ఆంగికం గా సకల వాజ్మయం వాచికం గా సకల నక్షత్రాలు కలాపముగా సర్వము తన ఎడద ,సాత్వికం గా ,చతుర్విదాభినయ రతితో ,నాట్య గరిమాన్ని ,తన లోనే తాను వలచి నృత్య ,నృత్త ,భేదాలుచూపే   ,లాస్య ,తాండవ భేదాన్ని చూపుతూ ,సకల దిక్పాలకులకు పార వశ్యం కలిగిస్తూ పరమ శివుడు తాండవ కేళీ విలోలుడై నట్లు వర్ణించటం” ఆచార్యుల వారి వైదుష్యానికి ఆన వాలు .
తాండవ విశేషాలు మరో సారి –
సశేషం                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -02 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం –2

 సరస్వతీ పుత్రుని శివ తాండవం –2

      ”వేదాద్రి నరసింహ  విపుల వక్షస్ఫీత -కమనీయ కల్హార గంధ లహరి
ఏడు కొండల రాయడే పూట కాపూట -భోగించు పచ్చ కప్పురపు విడెము
భ్రమ రామ్బికా సమర్చ్య కుమ్కుమోన్మిశ్రీ -పుష్ప చంద్ర కితంము బొలుచు చెలువు
శ్రీ కాళ హస్తీశ   శివతాతి రూపు రేఖా -స్నిగ్ధ నైగ నిగముల ముంపు
కవిత గా ,గానముగా ,చిత్ర కళ గ -నాట్య కళ యుగ ,బ్రతి ఇంట సాక్షాత్కరించి
ఆంద్ర రాష్ట్రమ్ము  మన భాష నలవరించి -ఎదుగు గావుత సంతతాభ్యుదయ మహిమ ”
అని పుట్ట పార్టి వారు సకల దేవతలను ఆవాహనం చేశారు .ఆంధ్రమంతా కవితా గాన ,చిత్రలేఖన ,నాత్యాడులతో ,వర్ధిల్లాలి అని కోరిన మహా కవి .విశ్వనాధ వారి ”ఏకవీర ”నవలను స్వయం గా మళయాళ భాష లోకి అనువదించిన విద్వాద్ వరేన్యులు ..మరాఠీ భాషలో ”భక్తాం చే గాదే ”రాశారు .ఇంగ్లీష్ భాష లో leaves in the wind  ను ,సంస్కృతం లో ”శివ సహశ్రం ”రాశారు .ఇవన్నీ వారి భాషా పాండిత్యానికి వన్నెలు ,చిన్నెలు .ఇన్ని భాషలు నేర్చి,నేర్చిన భాష లన్నిటి లో కవిత్వం చెప్పిన కవులు ఈ భోమి మీద పూర్వం కాని ,నేడు కాని లేరు .తెనుగు గడ్డ పై పుట్టి నందు వల్ల నే పుట్ట పర్తి వారికి రావలసినంత ,రా దగినంత కీర్తి రాలేదనటం ముమ్మాటికీ నిజం .ఇదే ఇంకో భాషా కవి అయితె నెత్తిన పెట్టు కోని ఊరేగించే వారు .
సరస్వతీ పుత్రులైన శ్రీ ఆచార్యుల వారు సంగీతం , ,సాహిత్యం ,నాట్యం నేర్చారు నేర్పించారు .ఇదీ అపూర్వమే .ఇలాంటి కవి రవీంద్రుడు తప్ప భారత దేశం లో ఇంకెవరు లేరు .ఆశు కవిత్వం చెప్పారు .అవధానాలు చేశారు .మేఘ దూతం ,గాంధి ప్రస్తానం ,అగ్ని వీణా ,జనప్రియ రామాయణం ,రామ కధా లహరి ,పండరీ భాగవతం ,వారి ఇతర ముఖ్య కృతులు . తిరు పతి దేవస్తానం వారు తలపెట్టిన భాగవత గ్రంధానికి విపుల మైన పీఠికల తో వ్యాఖ్యానం రాశారు అందులో వారి పాండితీ గరిమకు ఆశ్చర్య పోతాం .అరుదైన మహా కవి శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులు .
 శివ తాండవం 
శ్రీ పుట్ట పర్తి వారి ”శివ తాండవం ”కావ్యాన్ని చదివి ,విని ప్రముఖ హిందీ రచయిత ”దినకర్ ”,మళయాళ కవులు పులకించి పోయారు .అందులోని శబ్ద మాధుర్యానికి విశేషం గా ఆకర్షితు లయారు .శివ తండ వాన్ని ,ఆచార్యుల వారు తమ స్వంత గొంతు తో వినిపిస్తుంటే ,మన మనో నేత్రం ముందు ,ఆ పరమ శివుని తాండవ నృత్య కేళీ వినోదం సాక్షాత్కా రిస్తుంది .అంతటి ధన్య జీవి వారు .శివ తాండవం సమస్త జీవ కోటికీ ,పరమానందాన్ని సమ కూర్చేది .”తపశ్వి ”అయిన కవి మాత్రమే రాయ గలిగిందీ అనుభవించి ,అనుభవింప జేయ గలిగిందీ .”నాన్ రుషి హ్ కురుతే కావ్యం ”   ”అన్నది ఈ సరస్వతీ పుత్రులకు చక్కగా అన్వ యిస్తుంది .వారి మనో గొచరం కాని విష్యం లేదు .అందుకే ఆ కావ్యం మహోన్నత మైంది .అగస్త్యేశ్వర  స్వామి ని ఉపాసించి ,తాపసి లక్షణాన్ని అద్భుత కావ్య సృష్టి చేశారు .శివ కేశవులకు భేదం లేదని చూపారు .శివా లాస్యమే గిరిజా దేవి .-పార్వతీ మాత .అర్ధ నారీశ్వరి .తాండవ శివుని శరీరం లో ఆమె అర్ధ భాగం .
”వాగార్దా వివ సంపృక్తౌ ,వాగర్ధ ప్రతి పత్తయే –జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ”అని కవి కుల గురువు కాళిదాసు వర్ణనను అనుసరించి ,ఈ కావ్యం లో ఆచార్యుల వారు ,అర్ధనారీశ్వర తత్వాన్ని చక్కగా    ఆవిష్కరించారు .అందుకే కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు తమ నిత్య పారాయణం లో భాగం గా  ”శివ తాండవం ”ను గ్రహించారు .ఎంతటి అదృష్టం ఆచార్యుల వారికి -ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది .అంతటి విశిష్ట కావ్య మరీ మళాలను మీకు అందించే కృషి నే నేను చేస్తున్నాను .ఆ తాండవ లీలా వినోదం లో మనం అందరం భాగ స్వామ్యులం అవుదాం .ఆ కేళీ విలాసం లో లీన మవుదాం .ఆ అద్భుత రాసా వేశాన్ని పొందుదాం .అలౌకిక ఆనంద పారవశ్యాన్ని అనుభ విద్దాం .పద ఛందస్సు లో సరస్వతీ దేవి పాద పద్మాలకు సమర్పించిన ఆ సరస్వతీ పుత్రుని ,సాహితీ మహత్తును రుచి చూద్దాం .
      తాండవ ప్రత్యేకత 
 
 శ్రీ పర మేశ్వరుడు నట రాజు అవతారం దాల్చి ,నృత్యం చేస్తుంటే ,అఖిల భువనమే ఒక రంగస్తలం గా మారి పోతుంది .అర్ధాంగి పార్వతి ఆనంద పారవశ్యం తో వీక్షిస్తుంది .ధమరుకం చేతిలో మోగుతూ వుంటే ,గంధర్వులు గంధర్వ గానం ఆల పిస్తుంటారు .చర్మ వసన దారి అయిన శివుని మెడలో సర్ప హారాలు అందుకు తగిన విధం గా ఊగుతూ నర్తిస్తాయి .పాదాలు వ్యత్యస్తం గా ,నర్తించే ఆ భంగిమ ప్రపంచ కళా జగత్తు లో మరెక్కడా లేదు .నట రాజ మూర్తి భార తీయ శిల్ప కళ కే శిరో భూషణం .ఆ నృత్య భంగిమకు పాశ్చాత్య పండితులే అబ్బుర పది పోయారు .ఆ నట రాజ స్వామిని గురించి డాక్టర్ జార్జి అరండేల్ ” when shall I see thou  o lord ?When shall thou deem me worthy to have vision Thy holy daance /o thou who are the lord of universe ,who art clothed witha infinite space who holdeth very infinity itself within thy grasp who art the lord of dance of universe and of worlds who art very bliss of life ?”అని పొంగి పోతారు .
భారతీయ నృత్యం దైవాన్ని ఆశ్ర యించింది .ఒక నృత్యమేమిటి ?సకల కళలు అంతే .ఆత్మ ప్రబోధం చేసి ,అంతర్ముఖ సౌందర్యం తో ,ఆముష్మికాలై ,బ్రహ్మానందాన్ని కల్గిస్తుంది నాట్యం .భారత దేశం లో నృత్యానికి ,నాట్యానికి దగ్గర సంబంధం వుంది .ఒక భావాన్ని స్పష్టం చేయ టానికి గానం తోనూ ,వాద్య సమ్మేళనం తోనూ ,చేసేది నృత్యం .దీనిలో ఆహార్యం ,ఆంగికం ,వాచికం ,సాత్వికం అనే నాలుగు విధాల అభినయాలున్నాయి .భారతీయ నృత్యం లో పురుషులు   చేసే నృత్యాన్ని ”తాండవం ‘అంటారు .ఇది చాలా ఉద్ధృతం గా ,పటిష్టం గా వుంటుంది .స్త్రీలు చేసేదాన్ని ”లాస్యం ”అంటారు .ఇది లలితం గా ,కోమలం గా వుంటుంది .
వైదిక కాలమ్ నుంచి నృత్యాలు మనకు సంప్రదాయం గా వస్తూనే వున్నాయి .వర్షాల కోసం ,అశ్వ మేధ యాగం సందర్భం గా ,నెట్టి ఈద నీళ్ళ బిందెలు పెట్టు కోని ,కన్యలు ”ఇదం అమృతం ”అంతు పాడుతూ నృత్యం చేసే వారు .వివాహాల్లో కూడా నృత్యాలు చేసిన ఆధారాలు కని పిస్తాయి .ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళే ముందు నృత్యం చేసే వాడట .
అయితె వీటి నన్నిటినీ మించింది -నాట్య పోషకుడు ,విశ్వ నటుడు ,అయిన పరమ శివుడు చేసే తాండవం .దాని ప్రాముఖ్యత దేనికీ లేదు .”అభినయ దర్పణం ”లో
”ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాజ్మయం -ఆహార్యం చంద్ర తారార్కం తం నమః సాత్వికం శివం ”  అనే శ్లోకం అందరికి పరిచయ మైనదే .దీని అర్ధం ఒక సారి చూదాం ”ఎవరి ఆంగిక విన్యాసం ,ప్రపంచ క్రమమో ,ఎవని వాక్కు ,సర్వ గ్రందాల సారమో ,ఎవని అలంకరణ  చంద్రుడు ,, ,నక్షత్రాలో ,అట్టి సాత్విక భావ స్వరూపు డైన ”శివునికి ”అంటే ,మంగళ ప్రదం చేసే వానికి నమస్కారం .” తాండవానికి రంగా లంకరణ ఎలా ఎర్పాటయిందో తరువాతి భాగం లో తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment