ముద్ద ముద్ద కు నారాయణ – ఆంధ్ర జ్యోతి లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్యారంటీ నవ్వుల వారంటీ

అంకుల్ డయనమేట్ – ఎమెస్కో – పుస్తక ఆవిష్కరణ

The book review that appeared in Andhra Bhoomi dated 05 Feb is enclosed

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాత్మా గాంధి ప్రభావం

మహాత్మా గాంధి ప్రభావం  

            ” బాపూజీ తపమ్ము పంటగా మన మిపుడు ఎత్తి తిమి  శిరంము ఎల్ల దెసల
నీ మహత్త నిలువ నిట్టి భాష్యముల -బతింప(bathimpa ) వలయు ,నాదరింప వలయు ”
అన్నారు తెనుగు లెంక  తుమ్మల సీతా రామ మూర్తి గారు
”Agreat teacher appears once in a while .Several centuries may pass by withouut the advent of such one ”
అని సర్వే పల్లి పండితుని అభిప్రాయం .దశావతారాలు ఎత్తిన విష్ణువే గాంధి అన్నారింకొక మహాను భావుడు .
gandhi sought to prepare us for life in a disaarmed world ”అంటాడు రాదా కృష్ణన్ .గాంధియన్ ఫిలాసఫీ వాడుక లో కి వచ్చింది .గాంధి ఇజం అవసరమైంది నేడు .
He lifted us up ,from dust and made men out of us అని గాంధికి అసలైన వారసుడు మొరార్జీ దేశాయ్ అన్నారు .
గాంధీ కి సత్యం ,అహింస ,రెండు కళ్ళు .వాటికి ప్రధాన ఆశయాలు తొమ్మిది వున్నాయి .దొంగ తనం చేయక పోవటం ,ఉచితం గా తీసుకోక పోవటం ,బ్రహ్మ చర్యం ,జిహ్వను నియంత్రించటం ,శరీర శ్రమ ,భయం లేకుండా వుండటం ,స్వదేశీ భావన ,అస్పృశ్యతా నివారణ ,సర్వ ధర్మ సమభావం .మహాత్ముడి దృష్టిలో సత్యమే దైవం .అహింస పై ఆయన అభిప్రాయం
The greatest and thae most active force in the world .It is more positive than electricity more powerful than ether ,a force superior to all the forces .truth is my god .non violence is the means of realising him .the full and proper meaning of brahma charya is search of Brahmam .We are all sparks of the same fire ,the chidren of the same god .Gandhi was first in human history to extend the principle of non violence from the idi vidual to the social and plitical plane అని సర్వేపల్లి పండితుడు రాజ కీయ రంగం పై గాంధీజీ ప్రభావం పై స్పందించారు .
1905 లో నార్వే -స్వీడెన్ యుద్ధం అహింసా సిద్ధాంతం వల్లనే ఆగి పోయింది .
1920 -36 లో న్యూజిలాండ్ ప్రభుత్వానికి వ్యతి రేకంగా జరిగిన ఉద్యమం కూడా అహింసా పధ్ధతి లోనే సాగింది . 1960 లో అమెరకా గాంధి అని పిలువా బడే మార్టిన్ లూధర్ కింగ్ కూడా నీగ్రో జాతి ప్రాజల ,ఆర్ధిక సామాజిక రాజకీయ సమశ్యలనుఅహింసా విధానం లోనే పరిష్కరించు కున్నారు .
౧౯౧౭ లో బీహార్ లోని చామ రాన్ రైతుల ఉద్యమం ,౧౯౨౮ లో గుజరాత్ లోని బారదోలి లో ఆర్ధిక సమశ్యలు అహింసా విధాన ఆచరణ వల్లే పరిష్కారం పొందాయి
27 -01 -1915 లో గుజరాత్ లోని గొండాల్ నగరం లో గాంధీజీ ని సన్మానించి ”కాళిదాస శాస్త్ర ”అనే వైద్య విద్వాన్ ”మహాత్మా ”అనే బిరుదు ను ఇచ్చారు .
గాంధి ఆలోచనల ఫలితమే బసిక్ విద్య ,పనిద్వారా విద్యా ,స్త్రీలకూ విద్య ఆచరణ లోకి వచ్చాయి .
”దేశాభి మానమ్ము దీపింప జేయు మంత్రంబు వందే మాత రమ్ము ”అని జాతీయ కవి శేఖరులు మంగి పూడి వెంకటేశ్వ ర శర్మ గారు తెలిపారు .”తానా దేశామునందాభి మానం లేని జనంబు ,జగతి నశించు వెసన్ ”అన్నారు కవులు .గాంధి యుగం అనేది 1905 నుంచి 1947 ఆగస్ట్ పది హేనవ తారీకు వరకు వుంది .
”నాడు జాతి ,నా దేశము ,నాడు భాష అను అహంకార దశానమందు మంద్ర ”అని గాంధి ప్రభావం తో రాయప్రోలు వారు ఎలుగెత్తి చాటారు .గాంధీని పొగుడుతూ ”సింహమును జూలుతో లాగితివి -పొదుగు లోని కవుర   -పాల్ద్రావి ,వర్ధిల్లు మని మహాత్మా ”అన్నారు .
జాషువా మహా కవి ”నీచపు దాశ్య వ్రుత్తి మన నేరని శూరత ,మాత్రు దేశ సే
వా చరణమ్ము ,నందసువు లర్పణ జేసినా వారి పార్ధివ
శ్రీ ,చెలువారు చోట ,తడశ్రు గ్రుచులన్ ,వికశించి వాసనల్
వీచుచు రాలి పోవగా వలెం ,దాడుదాట్ట ”సమాధి మ్రుట్టికన్ ” అని అంజలి ఘటించారు
కరుణశ్రీ తక్కువ వాడా–”ప్రేయసి ప్రేమ లోన కానీ పించేది తీయని స్వర్గ మొక్కటే
ధ్యేయము కాదు ,హీనులాటి దీనులు ,మ్లాన తనుల్ ,దారిద్ర ,నా
రాయను లేద్చు చుండిరి ,తడశ్రువుల్ ,దుడువగా బొమ్ము ,,నీ
ప్రేయసి తోడ ,నీకచట లభించును ,కోట్ల కొలంది స్వర్గ ముల్ ”అని ప్రబోధించారు .
”చెల్లరే ,విల్లు విరుచు నే ”నల్లని వాడు ‘-పది పదారెండ్ల ఏలా రాచ పడుచు వాడు
సిగ్గు సిగ్గంచు లేచి ,గర్జించి నారు -కనులు గుత్తిన తెల్ల మొగాల వారు ”అని అన్యాప దేశం గా నల్లని వాడు గాంధి అని ,తెల్ల మొగాల వారు బ్రిటిష్ వారు అని భలేగా చెప్పారు” ధనుర్భంగం ”అనే ఖండ కావ్యం లో కరుణశ్రీ .
”రాటంబు ,చక్రంబు ,రహి మీరగా -సుదర్శన మౌచు కుడి హస్తమున వెలుంగ
నవతరించే ,సత్యాహింస లాత్మ గాగ -శాంత రూఆన నిల ,గర్మ (కరంచంద్ ) చంద్రుదగుచు ”అని ఆవేశం తో చెప్పారు అభినవ పోతన వానమామలై వరదాచార్యుల వారు .
”రాష్ట్ర సిద్ధి కొరకు రక్తమ్ము గార్చిన కవిని నేను -గాంధి కవిని నేను ”అని గాంధీ చరిత్రను కావ్యం గా రాసిన తుమ్మల గాంధీ ఆస్థాన కవి గా పేరు పొందారు .
”బుద్దు దలనాడు జననం పొందకున్న ,-గాంధి ఇంతటి వాదౌత కాని మాట
” పలికెడిది గాంధి కధ యట ,పలికిన్చేడు వారు తెలుగు ప్రజలాట

బలికిన నూరట యౌనట ,-పలికెడ నిక నొందు మరచి బాపు చరిత్రన్ ”అని ఉప్పొంగి అంటారు తుమ్మల .
”గాంధీ అవతార పురుషుడు -కనుక ఆయన చరిత్రను స్కందాలుగా రాశాను ”అంటారు ఆత్మా కూరి గోవిందా చార్యులు గారు .
”ఆతడజాత శత్రుడు   ,-మహాత్ముడు ,శాంత తపశ్వి -విశ్వ విఖ్యాతుడు
ఆతని ఆత్మా శక్తికి లేవసాధ్యముల్ ”అంటారు ”విజయిశ్రీ ”కావ్యం లో ధర్మ రాజు ను పొగిడే నెపం తో గాంధీని పొగుడుతూ కరుణ శ్రీ .
”ఆహవంమిది ,స్వేచ్చా మహాహవంము ,నీవు హోత -ఉపద్రష్ట నేను -స్రువము గాండీ వమ్ము విరోధి మూకలు హవిస్సు -యజ్న ఫలము స్వరాజ్య సంప్రాప్తి పార్ధ ”అని స్వతంత్ర సంగ్రామాన్ని ,కురుక్షేత్ర యుద్ధాన్ని కలిపి జాతీయ భావాన్ రేకెత్తించిన దేశ భక్త కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి .
”పౌసస్త్య హృదయం ”లో కాటూరి వెంకటేశ్వర రావు గా ఋ కూడా గాండీ తత్వాన్ని రావా నుడికి ఆపాదించారు .సమకాలీన సత్యాలను సార్వ కాలీనం చేశారు .
GOD;S GRACE AND REVELATION ,ARE THE MONO PPOLY OF NO RACE ,OR NATION -THOUGH WE KNOW HIM BYA  THOUSAND NAMES .GOD IS ONE AND THE SAME .TO ALL US ALL.

”మాలలు మాలలా ,భారత మాత్రు గలస్త చిరత్న రత్న ,సం
లాలిత మాలలు ,ఆంద్ర మహిళా కచ కల్పిత ,నవ్య మల్లికా
మాలలు ,అనార్య సంతతి ,విమాన శిరోగ్ర లసత్పతాకినీ
మాలలు గాని ,వట్టి ,కను మాలపు ఆలలు గారు ,కారు ,ఇలన్ ”
అని గాంధీ ప్రభావం తో బ్రహ్మా భట్ల పట్టాభి రామ శర్మ గారు అంటారు .
”సిరివి నీవే -ఇంటి సిన్గారంమున్నీవే -శక్తి నీవే ,లోక జనని నీవే
విద్య నీవే ,విమల జ్ఞాన నిధి నీవే -మహిళా నిన్ను మించి మహిమ గలదే ”అని శర్మ గారే అన్నారు .

ఆహాత్ముని ప్రభావమే ఇదంతా .
SVADESHEE WITHOUT KHADDAR is like body without life ”అన్నాడు గాంధి
social service is best performed when the left hand knoweth not ,what the right hand is doing ”
అని మహాత్ముడు ఎప్పుడు అంటుండే వాడు
”వండే మాథరమన్చూ ,మండే రాజ్యంబతంచు మరి మందలుపన్ -సందేహ మింత లేదని ,ముందే పూరి గొల్పి నత్తి ముర హరి గాంధీ ”అంతు కీర్తించారు గాంధి శతకం లో గో.ఛి .మల్లికార్జున రావు గారు .
”ఒక్క స్వరాజ్య దీక్ష గొని ,దేహమ్మోడ్చి -నూల్పోగుతో
నవలీలన్  ,జగ మెల్ల గట్టితి వాట్య గాంధి దేవ ప్రభో ‘;అని కీర్తించారు విశ్వ నాద శాస్త్రి
”గాంధి నామమే మంత్రము ,-గాంధియ వేడంబానగా  గాన్తువు గాంధీ ”అన్నాడు వడ్ల మూడి గోపాల క్రిష్నయ్య .
”నా బ్రతు కెల్ల దారమై -కందులు గట్టి ,నీడు చరఖా పయి నేనొక చేరుమాలనై
ఉండెద మెత్త గా ,పెదవు లోత్తుచు ,”అని అసలైన గాంధి శిష్యునిగా భక్తీ తో అంటారు కరుణశ్రీ .
శక్తి సంపన్నుల ఆయుధమే అహింసా వ్రతం అని తేల్చి చెప్పాడు మహాత్ముడు ..
ఒకరిపై చూపే ప్రేమతోకూడిన సేవే నిజ మైన ఆరాధన అన్నారు గాంధి
”నీవు పలికిన పలుకు నిగమ భాష యగుచు ,నినదించు చుండును ,మహాను భావ”అంటారు నండూరి రామ కృష్ణ మా చార్యుల వారు .
”కలియుగంబున దైవమె గాంధి తాత ”అన్నారు కృత్తి వెంటి వెంకటేశ్వ ర రావు .
”కొల్లాయి గట్టి తే నేమి ,మా గాంధి కోమటి పుట్టి తే నేమి -వెన్న పూసా మనసు -కన్న తల్లీ ప్రేమపండంటి మోము పై బ్రహ్మ తేజస్సు ”అనారు బసవ రాజు అప్పా రావు గారు .ఇదో మంత్రం లా ఆంద్ర దేశ జనులంతా పాడుకొన్నారు . .
”మనిషి శివుడవుటయే గాంధి యుగం -బాపు ననుసరిస్తే చాలు మన మందరం ”అని కృష్ణ శాస్త్రి కితాబు .
మహాత్ముని జీవనం -జాతికి ఉజ్జీవనం (inspiration )అన్నారు పాపయ్య శాస్త్రి .
”హిమాలయం మా హృదయ భారం -గంగా నది మా కన్నీరు ”అని ఎవరు చెప్పానంత గొప్ప గా శ్రీ శ్రీ అన్నాడు .
మనం మాత్రం గాంధి ని   మరిచి  బ్రాందీ ని పూజిస్తున్నాం .
”మహాత్ముడు ఒక అద్భుతం .ఇలాంటి వ్యక్తీ భూమి పై జన్మించాడు అంటే ,భవిష్యత్తు లో జనం నమ్మరేమో ”అన్నాడు మహావిజ్ఞాని శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ .
మహాత్ముని అహింస ,సహనాన్ని సాహసోపేతం గా అనుసరించి వుంటే -ప్రపంచం లో ఇంత సంక్షోభం వుండేది కాదు .కాశ్మీర్ యుద్ధం ,ఆతంబామ్బులతో పనీ వుండేది కాదు  అన్నాడు ”tom alter  అనే బొంబాయి లో స్తిర పడ్డ కళా కారుడు .
”గాంధీ ని భారతీయులు మర్చి పోయారు .గాంధి లాంటి మనిషి అంతకు ముందు లేరు .తర్వాత రారు ”అన్నారు ప్రఖ్యాత నర్తకి మృణాళినీ సారా భాయ్ .
”మిమ్మల్ని నిరాడంబరం గా ఉంచ టానికి ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది ”అని మహాత్ముడితో మేల మాడింది తెలుగింటి కోడలు సరోజినీ దేవి .
గాంధీ దేవాలయాన్ని ఆంద్ర దేశం లో కడప లో మేదర కులస్తుడు సుబారావు 1957  లో బెజవాడ గోపాల రెడ్డి గారితో ఆవిష్కరింప  జేశాడు .
గడ్డి పరక లా పచ్చ గా నిత్య నూతనం గా వుండాలి ”అన్న గురు ఆనక్ సూక్తిని రెండవ ప్రధాని ,గాంధీ అంటే వాసి లాల్ బహదూర్ శాస్త్రి గారు  ఎప్పుడు జ్ఞాపకం చేస్తుండే వారు .
జనవరి 30 న మహాత్మా గాంధీ వర్ధంతి అమర వీరుల సంస్మరణ దినం .ఆరు రోజులు ఆలశ్యం గా నైనా ఆ మహాత్ముని ప్రభావాన్ని ఒక్క సారి గుర్తు చేసుకొందామని ఈ ప్రయత్నం .

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 4 Comments

అలరించిన హాస్య కవి సమ్మేళనం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

సరస్వతీ పుత్రుని శివ తాండవం -1 ఆచార్య శ్రీ

  సరస్వతీ పుత్రుని  శివ తాండవం -1

                                            ఆచార్య శ్రీ 
    
 సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘శివ తాండవం ”అనే అద్భుత కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల   గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ”పెనుగొండ లక్ష్మి ‘అనే కావ్యాన్ని రాశారు .వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ”పాఠ్య గ్రంధం ”గా వుంది .అదొక ఆశ్చర్య కర మైన సంఘటన.”ఒక కవి తాను రాసిన పుస్తకం పై తానే పరీక్ష లో జాబు రాయటం” ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం ఆచార్యుల వారికే దక్కింది .వీరి  సంస్క్రుతాన్ద్రాన్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు వీరికి ”సరస్వతీ పుత్ర ‘బిరుదు ను ప్రదానం చేశారు .’భావ కవి చక్ర వర్తి ”బిరుదునూ పొందారు .100 కు పైగా గ్రంధాలు రాశారు .15 భాష లలో అనర్గళం గా మాట్లాడ గలిగిన దిట్ట  పుట్ట పర్తి వారు .ఆయా భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28   న అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ”పెయ్యేడు ” లో జన్మించారు .
          14 ఏళ్ళ వయసు లోనే కవితా లతాంగితో సయ్యాటలాడారు .బాల్యం లోనే ”ప్రహ్లాద చరిత్ర ”ను హరికధ గా చెప్పి న బాల కిశోరం .చిల్లర మల్లర గా తిరిగి ఇల్లు వదిలి వెళ్లి పోయి ,లక్ష్మీ ప్రసన్నం చేసు కోని ,మళ్ళీ గృహ ప్రవేశం చేయటం ఒక అలవాటైంది .జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు చేరారు .అక్కడ స్వామి ”శివానందుల ”వారి అనుగ్రహం పొందారు .అదొక మధురాతి మధురమైన క్షణం .ఆచార్యుల వారి జీవితమే మారి పోయింది .అమోఘ పాండితీ ప్రకర్ష ఏర్పడింది .పండితుల మెప్పు లబించింది .నిజం గానే సరస్వతీ పుత్రులని పించు కొన్నారు .
        తిరుపతి సంస్కృత కళాశాల లో ప్రవేశం కోసం వెళ్ళారు .ఆదరణ కంటే ,నిరాదరణకు గురైనారు .ఆవేశం కట్టక్లు తెంచు కొంది .ఆశువు గా కవితా గంగాలహరి జాలు వారింది. అందులో ,ఆత్మాభిమానం అంతర్వాహిని గా ప్రవహించింది .ఇది విన్న ప్రిన్సిపాల్ కు ”మైండ్ బ్లాక్” అయి ఆయన పాండితీ గరిమకు పులకించి ప్రవేశార్హత కల్పించాడు .అయితె తాను అనుకొన్న తరగతి లో ప్రవేశం ఇవ్వలేదు .మళ్ళీ ఆశువు లంకిన్చుకొన్నారు .అంతే- కోరిన తరగతి లో చేర్చుకొన్నారు .అదీ ఆచార్యుల   వారి పట్టుదల ,ప్రావీణ్యం ,ప్రతిభ ,సామర్ధ్యం .రామ రాజ భూషణుడి వసు చరిత్ర ప్రభావం తో ”ఇందుమతీ పరిణయం ”రాశారు .కాని సంతృప్తి చెంద లేదు .అమిత ధారణా దురంధరులు పిన్న నాటి నుంచే .ప్రఖ్యాత ఆంగ్ల కవుల కవిత్వం అంతా ,నాలుక పై నర్తించేదట .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలను మదించి ,సారం పిండేశారు .అంతా స్వయం కృషే .రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ  గారు వీరికి స్వయానా మేన మామే. .ఆ వైపు నుంచి కవిత్వం ,పాండిత్యం రస వాహిని గా చేరింది .ప్రాకృత భాష నేర్చారు .మాగధి ,శౌర సేని ,పైశాచీ భాషల పీచ మడచారు . 
                                పెండ్లి -పెటాకులు 
          19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రోజుల తర్వాత భార్యబాల్చీ తన్నేసింది .”పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ”అని అంత విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు ,వ్యాకరణం పూర్తి చేసిన విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది .వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్టమైన మృష్టాన్న భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్తర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ .సర్వజ్ఞుడు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు .ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధులవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.
                              లౌకికం తెలీని మేధావి 

ఇంతగా సాహితీ వ్యాసంగం లో మునిగి తేలుతున్నా వారికి ఆనందోప లబ్ది కాలేదు .అష్టాక్షరీ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి    మహా సిద్ధి సాధించారు .తులసీ రామాయణం kantho paathame .అష్టాక్షరి ఆయన శ్వాస .త్రిమతాలు కరతలామలకాలు .తాంత్రిక విద్యలో అసాధా రణులు అయారు . .షిర్డీ సాయి బాబా వారిని అనుక్షణం ఆవేశించి వుండే వారట .సాయి నామం తో నిరంతర పునీతు లయ వారు .ఇంత చేస్తున్నా ,మనసు లో ఏదో వెలితి వారిని అశాంతికి గురి చేస్తోంది ”.జిల్లెల్ల మూడి అమ్మ”ను దర్శిన్చిఆమె లోని ”అమ్మ తనం ”బిడ్డ లాగా అనుభ వించారు .కంచి పెద్ద స్వామి ”చంద్ర శేఖర సరస్వతి ”సన్ని దానం ఈ సరస్వతీ పుత్రుడైన  పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికి  అనుకంప గా వుండేది . శ్రీ మద్రామాయణం ప్రవచనం గా నాలుగు సంవత్స రాలు .గంగా ఝరీ సదృశ్యం గా చెప్పి ,లోతులను తరచి భక్తులను ఆనంద రాసామ్రుతం లో   ఓల లాడించి ,తరింప జేసే వారు .
          పుట్ట పర్తి వారు ”లోకం తెలియని మేధావి ”.బాల హృదయులు .”వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడు ;;అని అందుకే అన్నారు సి.నా.రే .ఎట్ట కేలకు  1972 లో ప్రభుత్వం ”పద్మశ్రీ ”నిచ్చి గోరవించింది .జ్ఞాన peetha స్థానానికి వారు అన్ని విధాలా అర్హులే .అది వారికి దక్క నివ్వలేదు .  .అందుకే వికల మనస్కు లయారు .నాట్యం కూడా చేసి విద్యార్ధులకు నేర్పించే నాట్య విశారదులు కూడా .సకల శాస్త్రాలు వారికి వాచో విదేయాలు .సంస్కృత సాహిత్యం లో భవ భూతి ,,మురారి ,అశ్వ ఘోషుడు వారి అభిమాన కవులు .ప్రాకృత కవుల్లో పుష్ప దంతుడు ,వాక్పతి అభిమానులు .ఆంగ్ల కవి జాన్ మిల్టన్ ఆరాధ్యుడు .”షెల్లీ ”అంటే ”ఆనంద వల్లే” . రవీంద్రుడు అంటే రవి ప్రకాశం తో విరసిన అరవిన్డమే అవుతుంది వారి హృదయం .తులసీ ,సూరదాస్ లను ”తులసీ దళం ”అంత పవిత్రం గాభావిస్తారు .”జన ప్రియ రామాయణం ”ను మాత్రా ఛందస్సు లో రాసి ,భక్త జనాలకు చేరువ చేశారు .హిమాలయ సదృశ బహు భాషా చతురాననుడు ,సరస్వతి పుత్రుడు పుట్ట పర్తి  నారాయణా చార్యుల వారు  01 — 09 -1990  న బ్రహ్మైక్యం చెందారు .
                           
     ఆనంద శివ తాండవం 
నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం  కల్గించింది వారి ”శివ తాండవం ”అనే కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు  ఆ  కృతి పట్టాభి షేకమైంది .దీన్ని వారు ”ప్రొద్దుటూరు ”అగస్త్యేశ్వర ఆలయం  ” లో శివునికి ,రోజూ  ,108 ప్రదక్షిణాలు చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ”పుట్టు వైష్ణవుడు -బట్టకట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన కృతి చెప్పటం ”.
           శివ తాండవం లోని విశేషాలను తెలుసు కోవటానికి వేచి ఉండాల్సిందే 
              సశేషం 
                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -02 -12 .
 
 

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఎకైక అమెరికన్

Posted in రచనలు | Tagged | 1 Comment

నలుని కధ లో భారత కధ

 నలుని కధ లో భారత కధ 

           మహా భారతం కధలో నల కధ ఒక ఉపాఖ్యానం .అరణ్య పర్వం లో ధర్మ రాజు ”బృహదశ్వ మహర్షి ”ని సందర్శించి ,”మా లాగానే ,రాజ్యం ,సంపదా పోగొట్టు కోని ,కస్టాలు పడ్డ  వాళ్ళెవ రైనా వున్నారా “?అని ప్రశ్నించాడు .దానికి మహర్షి ”నువ్వు పరివారం తో సహా అరణ్య వాసం చేస్తున్నావు .వన వాసం అన్న మాటే కాని ,రాజ్యం లో ఉన్నట్లే అన్నీ అనుభావిస్తున్నావు .నీ కష్టం ఒక లెక్కా ?నల మహా రాజు కస్టాల  ముందు  నీ కస్టాలు ఎంత ” ?అన్నాడు .ఆ కధ చెప్పమంటే ,మహర్షి వివరించాడు 
         నలుడి కధ లోనే భారత కధ  బీజం లో మర్రి చెట్టు లాగా వుంది .పాండవులు ,నలుడు చంద్ర వంశ పు రాజులే .పాండవుల లక్షణాలన్నీ నలుడి లోను వున్నాయి .ధర్మ బుద్ధి తో పాటు జ్యూద  వ్యసనం కూడా .బాహుబలం లో నలుడు భీముడే ,వంట వండే వందే నేర్పు తో సహా .అందుకే నల బ్భీమ పాకం అనే పేరు వచ్చింది .పరాక్రమం లో అర్జునుడే .బృహన్నల -రూప భేదం తో బాహుకుడు .నకులుడి లోని అందం ,అశ్వ హృదయ వేదిత్వం సహదేవుడి లోని వివేకము వున్నవాడు నల మహా రాజు .
                ద్రౌపదిది స్వయం వరం కాదు .మత్స్య యంత్రం కొట్టే షరతు .దమయంతిది సాక్షాతూ స్వయం వరమే .స్వయం వరం తోనే నలుడి కస్టాలు ప్రారంభం అయాయి .ఇంద్రాదులకు ఈర్ష్య కలుగ లేదు .పైపెచ్చు నలుని దౌత్యానికి సంతోషించి వరాలు  ఇచ్చారు .ఇక్కడ దుర్యోధనుడు కలి అంశ తో పుట్టాడు .నల కధ లో కలి ప్రధాన పాత్ర పోషించాడు .”ఆచారం నుండే ధర్మం పుదు తుంది -ఏమరు పాటు వల్ల ఆచారం చెడితే ,సందు చేసుకొని ,కలి మనసు లో ప్రవేశిస్తుంది” .అలానే ధర్మ మూర్తి అయిన నలుని లో కలి ప్రవేశించాడు .ద్వాపర  యుగాన్ని ‘పాచికలలో ”ప్రవేశించ మని అంటాడు .
         కలి పట్ట్టిన నలుడు రాహుగ్రస్త చంద్రబింబం  లాంటి వాడు .కురు పాండవులకు, నలునికి, జ్ఞాతివైరమే  దెబ్బ కొట్టింది .పుష్కరుడు నలుడి పిన తండ్రి కొడుకు .మొదటి సారి జూదం లో ద్వాపరం ప్రవేశించటం వల్ల ,నలుడు ఓడిపోయాడు .మహా భారత కధ లో ద్రౌపది centre of activity అవుతుంది .రాజ్యం కంటే ,ద్రౌపదీ పరాభవమే కురుక్షేత్రా యుద్ధానికి కారణం అయింది .దమయంతికి పరాభవ ప్రశ్న లేదు .నల కధ లో దమయంతి centre of activity .రెండు సార్లు నలుడిని గుర్తించింది దమయంతి .ద్రౌపది కంటే దమయంతి విదుషీ మణి .మహిమ కలది కూడా .అడవిలో ద్రౌపది చూపులతోనే కిరాతకున్ని భస్మం చేసింది .భారత కధ లో ద్రౌపదికి జరిగిన పరాభ వ్కానికి భీముడు ప్రతీకారం చేయాల్సి వచ్చింది .
          రెండు కధల్లోనూ ,వనవాసం ,అజ్ఞాత వాసం వున్నాయి .నల కధ లో వీటికి కాల పరి మితి  లేదు .నలుడు ఋతు పర్నుని కొలువు లో ఆశ్వాధ్యక్షుడు గా వున్నాడు .దమయంతి ,తన పిన తల్లి వద్దే  చేది రాజ అంతఃపురం లో వుంది ..పాపం సైరంధ్రి ది అజ్ఞాత వాసం .ఊర్వశి శాపం అర్జునుడికి అజ్ఞాత వాసం లో ఉపయోగ పడింది .అలాగే ,కార్చిచ్చు లో చిక్కు కున్న కర్కోట కుడు అనే సర్పాన్ని  నలుడు కాపాడి రక్షిస్తే ,ఆ పామే కాటు వేసింది .పాముకు పాలు పోసి చేటుతెచ్చుకున్నట్లయింది నలుడి పని .నలుడి రూపమే విక్క్రుతం గా మారి పోయింది .అందాల నలమహా రాజు నల్లని  బొగ్గు రూపం లో భయంకరం గా మారి పోయాడు .బాహుకుడి లా మారి ,అజ్ఞాతం గా జీవించాడు .
          ఋతు పర్ణుడు విరాట రాజు లాంటి వాడు .మంచి వాడే కాని దూర ద్రుష్టి ,వివేకం లేవు .అజ్ఞాత వాసానికి అటు వంటి వాడే బాగా ఉపయోగ పడు తాడు .దమయంతి ద్వితీయ స్వయం వారానికి వెళ్లి భంగ పడ్డాడు .ఉత్తర కుమారుడే, గోగ్రహణ సమయం లో కౌరవులను గెలిచాడని విరాట మహా రాజు భావించాడు .ఆ మాట నమ్మి ,అది నిజం కాదు అని చెప్పిన కంకుభట్టు (ధర్మ రాజు )ను ,జూదపు పలక తో కొట్టి ,దయనీయ మైన స్తితి తెచ్చుకొన్న అజ్ఞాని విరాటుడు .
          నలుని కధా మళ్ళీ జూదం తోనే ముగుస్తుంది .ధర్మ రాజు లాగా ,నలుడూ భార్యను జూదం లో పణం గా ఒడ్డాడు .నలుడు గెల్చాడు .ధర్మ రాజు ఓడాడు .అందుకని భారత కధలో రక్తం యేరు లై ప్రవహించింది .నలుడి కధ  లో రక్తం  బిందువు కూడా చింద లేదు .
        కష్టాల్లో ఉన్న వాళ్లకు ,తన కంటే ,ఎక్కువ కస్టాలు అనుభవించిన వారిని గురించి ,చెప్తే ఊరట కలుగు తుంది ,అందుకే ”బృహదశ్వ మహర్షి ”నలుని కధ సవివరం గా తెలియ జేశాడు .అంతే కాదు బారత కదాంశాలన్నీ ,నలుడి కధ  లోనే వుండటం మరీ విచిత్రం .ఆలోచనలను రేకెత్తించేది కూడా .చివరిగా కలి దోషాన్ని పోగొట్టే కధ  నలుడిది .నలుడు పుణ్య శ్లోకుడు .పాండవు లందరి సమాహార స్వరూపమే నలుడు .నలుని అనుభవం అనే సముద్రం లో ,పాండవులు బిందువులు .నల కధ కృత యుగం నాటిది .భారతం ద్వాపర యుగాన్తానికి  చెందినది .భారత యుద్ధం అంటే ద్వాపర యుగాంత ప్రళయమే నన్న మాట .
        కాలం అనంతం .చక్ర భ్రమణం .పూర్వం జరిగినవే ,మరో యుగం లో ,కొంచెం మార్పులతో మళ్ళీ జరుగు తాయి .ఇదే సృష్టి రహశ్యం .అందుకే సృష్టి రహశ్యానికి ,నిదర్శనం గా ,భారత కదా లో నల కధను ,నిబంధించాడు మహర్షి వేద వ్యాసులు వారు . ఇదే తెలుగు లో ”నన్నయ గారి ప్రసన్న కదా కలితార్ధ యుక్తి ”.నల కధ  తర్వాత శ్రీ రామావ తార కధను వివ రిస్తాడు ధర్మ రాజుకు బృహదశ్వ మహర్షి .రామ కధ త్రేతాయుగానికి  చెందినది . ఆయన  కస్టాలు వర్ణనా తీతమే కదా .ఇందరి కస్టాలు విన్న ధర్మ రాజు హృదయం కొంచెం శాంతించింది .తన కంటే కష్టాల కడలి లో మునిగి తేలిన వారు ఎందరో వున్నారు అనే ఎరుక కలిగింది .స్థిత ప్రజ్ఞతఏర్పడింది . .ఆ తర్వాత వచ్చే కదాంశమే ”యక్ష ప్రశ్నలు .”.ఇందులో యుదిస్తిరుని  వివేకం ,లోక జ్ఞానం అనుభవం ,ఆదిభౌతికత ,ఆధ్యాత్మిక వైభవం  వైభవం ,అతీంద్రియ జ్ఞానం ,విశ్వ రూపం గా కని పిస్తాయి .
          ఈ విషయాలన్నీ నేను సాహితీ మండలి లో 19 -03 -2002 లో ప్రసంగించినవి .వీటి నన్నిటిని అప్పుడు నేనెక్కడో చదివి రాసు కొన్నవీ దాచు కొన్నవీ .  .ఆ రచయిత పేరు  నాకు జ్ఞాపకం రావటం లేదు .మహత్తర మైన వ్యాసం చదివాను అనే ఆనందం లో ఆ ప్రసంగం చేశాను .ఆ అజ్ఞాత రచయితకు శిరసు వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను .చాలా గొప్ప స్పూర్తిని కల్గించిన వ్యాసం అది ఇది వారికే అంకితం . 
                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -02 -12 .

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | 2 Comments

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు –4

  విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు –4

                                           శరభయ్య గారి శేముషీ వైభవం 

 శ్రీ శరభయ్య  గారు శ్రీ నాధుని ”కాశీ ఖండానికి ”విపుల మైన అర్ధ తాత్పర్యాలతో వ్యాఖ్యానం రాశారు .అది వారి శేముషికి పట్టం కట్టింది .శ్రీనాధుని కవితా వైభవాన్ని తెలుగు వారికి సాక్షాత్కరింప జేశారు .వారు ఉత్తమ భావుకులు కూడా .”హరివంశం ”పైన” సంవ్రుతి మాధురి” అనే శీర్షికన రాస్తూ కావ్యానుభావం గురించి ,కావ్య విమర్శ తో జోడించి ,చెప్పిన తీరు రమణీయం గా వుందని అందరు ప్రశంశించారు . వాస్త వాన్ని  దాచ కుండా చెప్ప గల సమ వర్తి గా పేరు పొందిన విమర్శకులు .శైవ మతావ లంబనం నర నరాన జీర్ణించుకొన్న పరమ మాహేశ్వారులు .మంత్ర ద్రష్టలు .అను క్షణ అనుస్టాన పరులు .అయినా వీర శైవం ఎందుకు క్షీణించింది ?అన్న ప్రశ్న వేసుకొని ,”పాల్కురికి సోమనఅక్రుతక   మాధుర్యం ”అనే వ్యాసం లో విపులం గా చర్చించారు .వారి మాటల్లోనే అందు లోని నిజాలు చూద్దాం –
”బసవేశ్వరుని మతం లో ,సంస్కారులు ,అసంస్కారులు ,అధికారులు ,అనాది కారులు ,వేల కొద్దీ చేరారు .బసవని ధర్మం ఆశిదారా వ్రతం లాగా ఆచరించాల్సిన  ధర్మం .అది  బసవేశ్వరుని వంటి  మహా  వ్యక్తులకే సాధ్యం .అది ఎప్పుడైతే సంఘ ధర్మం గా మారిందో ,కలుషిత మైంది .పూర్వ వైభవం కోల్పోయి ,క్షీణించింది .భక్తీ వ్యక్తీ నిష్టం .అది రాజా కీయ వాదం కాదు ”అని చక్క గా విశ్లేషించారు .అంటే వ్యక్తీ నిష్ఠ లో ఉండ వలసిన భక్తీ ,మతం ,విశ్వాసం సమాజానికి వర్తింప జేయాలను కొన్నారు .అది సంక్షోభం లోకి నెట్టింది .అయితె ,పాల్కురికి సోమ నాధుడు వీర శైవు డైనా ,ఇప్పటికీ ఆయన రచనలను ఎందుకు చదువు తున్నాం అంటే -కారణం ఆయన వాడిన జాను  తెలుగు భాష యొక్క నిసర్గ రామ ణీయకం  -మాధుర్య మైన పలుకుబడి .కావ్య ,శిల్పాల రీత్యా ,ఏనాటికీ ,చదవదగ్గ రచనే అని తేల్చి చెప్పారు .
ఆయన కావ్యం పై వెలువరించిన భావాలు మణి  దీపాలు .”తాను పొందిన అనుభవాన్ని ,పాతకునిలో (paathakuni )వ్యక్తీకరించేందుకు ,వాక్కు రూపం గా చేసే ప్రయత్నమే కావ్యం .శ్రీ శరభయ్య గారు తాను పొందిన అనుభవాన్ని పాతకుని (paathakuni ) లో వ్యక్తీకరించేందుకు కావ్యాన్ని మీడియం గా తీసుకొని వ్యక్తీక రిస్తారు .
విశ్వ కవి రవీంద్ర నాద్ టాగూర్ లాంటి కావ్య మర్మము తెలిసిన వారు ఇచ్చే శిక్షణ నేటి యువ సమాజానికి అవసరం అంటారు శరభయ్య గారు .సారస్వతం యొక్క పరమ ప్రయోజనం అప్పుడే లభిస్తుందని వారి విశ్వాసం .రవీంద్రుడు భారత దేశ ఆత్మ ను అందుకొన్న వాడుఅని గర్వం గా చెప్పారు .దాని సంస్కార సర్వస్వాన్ని అవగాహన చేసుకొన్నా వాడు రవి కవి అన్నారు .ఆ ద్రుష్టి తోనే కాలిదాసాదుల కావ్యాలను పరిశీలించి వివరించాడని అంటారు .అందుచేత ఆయన చేసిన సాహితీ విమర్శ ఆ కవుల కావ్యాల కంటే గొప్పది గా వుంది అని శరభయ్య గారి భాష్యం .
దాదాపు తొంభై సంవత్స రాల వయసు లోను వారు నిత్య యవ్వనులు గ సాహితీ సమా వేశాలకు  వెళ్ళే వారు .వారి దర్శనం రెండు మూడు సార్లు చేసిన ధన్యుడిని నేను .వారి కుమారుదు దుర్గయ్య గారు  తండ్రికి తగ్గ  గొప్ప పండితులు .
శరభయ్య గారికి ఆత్మీయుడు శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారు .కృష్ణా జిల్లా ప్రాంతం వారే ,నూజివీడు లో వుండే వారు .ఈయనా విశ్వ నాద అంతే వాసి.ఈ  .ఇద్దరికీ కవితా వేశం ఎక్కువే. కలిసే పద్యాలు రాసే వారు ,పాడే వారు .ఇద్దరు బ్లాక్ డైమండ్స్ .విశ్వనాధ దగ్గర చదివే వారు .చదవటం అంటే ,ఆయన తో కలిసి తిరగటమే .ఒక్క రోజూ పుస్తకం ముట్టిన పాపాన పోలేదట .ఈ మాట శరభయ్య గారు చెప్పిందే.వీరిద్దరికీ గురువు విశ్వ నాద చెప్పిన పద్యాలు వల్లే వేయటం తోనే ,కవిత్వం ,పాండిత్యం వచ్చేశాయి .అభ్యాసం చేసి సాధించినవి కావు .”జీవితం లో ,ఇంకో వ్యాసంగానికి పనికి రాకుండా విశ్వనాధ మహానుభావుడు ,మమ్మల్నందర్నీ ఇలా తయారు చేసి వదిలారు ”అని ఆనందం గా చెప్పారు శరభయ్య గారు .వీరితో పాటు తుమ్మపూడి వారు ,పాటిబండ్ల మాద వ శర్మ ,ధూళిపాల శ్రీ రామ మూర్తి ,పేరాల భారత శర్మ ,పొట్ల పల్లి సీతా రామ రావు ,మహంకాళి సుబ్బా రామయ్య ,గొర్తి జానకి రామ శర్మ ,జువ్వాది గౌతమేశ్వర రావు వున్నారు .,కాటూరి వెంకటేశ్వర రావు గారు విశ్వ నాద ను ”మంత్రమయ వాణీ -సత్యనారాయణా ”అని అత్యంత పవిత్ర భావం తో అన్నారు .ఆ మంత్ర మయ వాణే  తమల్నందర్నీ విశ్వ నాద దగ్గరకు చేర్చింది అంటారు శరభయ్యాజీ .
జమదగ్ని శర్మ బందరు లో వుంటూ ”చిలకా -గోరింక ”అనే మొదటి కధ రాశారు .భారతి లో ఆయన కధలు వస్తుండేవి నేనూచాలా సార్లు ఆయన్ని చూశాను .కాలేజి లెక్చరర్ గా చాలా చోట్ల పని చేశారు .స్వగ్రామం నూజివీడు .”మహోదయం ”అనే గేయ సంపుటి 1957 లో వెలువరించారు .తన పద్యం లో శిల్పం లేదని ఆయన చెప్పు కొనే వారు .అయితె ”గ్రాంధిక శైలి లో కొబ్బరి నీళ్ళ వలె సాగే రచన ”అని మల్లంపల్లి వారు కితాబు ఇచ్చారు .”జమదగ్ని అన్నయ్యకు శరభయ్య తమ్ముడు” అని తమ  సాన్నిహిత్యాన్ని  వివరించారు  శరభయ్య చాలా గొప్ప ఆత్మీయులు .జమదగ్ని ”దక్షిణ కైలాస గిరి ప్రదక్షిణ ”కావ్యం రాశారు . గారు .
జమ దగ్ని   గొప్ప ఆతిదేయుడు అంటారు శరభయ్య గారు .విశ్వనాధ వీరిద్దరితో సరదాగా ”జమదగ్ని గృహస్తు నీవు – సన్యాసివి ”అని ఆట పట్టించే వారట .వీరంతా ఎప్పుడు నూజివీడు లోనే జమదగ్నికి ఆతిదేయులే .జమదగ్ని ప్రతి రోజూ తండ్రి గారి సంధ్యావందనాన్ని ముందు చేసి ,తారు వాత తనసంధ్యా వందనం చేసే వారని మల్లం పల్లి వారు చెప్పారు .ఇలా త్రికాలాల్లోనూ చేసే వారట .అంతటి నిష్టా  పరులు. జమదగ్ని .పేరు ను సార్ధకంచేసుకున్న పుణ్య మూర్తి .”సాకారమైన గృహస్థ ధర్మం జమదగ్నిది .ఆయన ఇంట్లో భోజనం చేయటం అంటే ”,యజ్ఞం లో పురోడాశనం సేవించటమే ‘అంటారు . దానికి అత్యంత పవిత్రతను కల్పిస్తూ .అన్న జమదగ్ని,తమ్ముడు శరభయ్య గారి మీద  ఒక మాంచి పద్యం రాశారు
”ఆత్మ రతు  డయి   ,నిశ్చలధ్యాన  యోగ మౌని –నీ  ఎద లోన గాపున్న  శివుని
దలచి ,యోడలెల్ల పులకలై ,జలద రింప ”అని శరభయ్య గారి లోని పరమ శివ లక్షణాన్ని దర్శించిన మహా భావుక కవి జమ దగ్ని …స్నేహం అంటే అదీ .
తాను రాసిన పుస్తకానికి ”సహ్రుదయాభి శరణం ‘అని పేరు పెట్ట టం లోనే శరభయ్య గారి లోచూపు వుంది . .సహృదయులైన వారి వైపు తిరగటం ,అంటే వారి ఆకర్షణకు లోనవటం ..కొన్ని మొక్కలు సూర్యుడు ఏ వైపుంటే ఆవైపుకు తిరుగుతాయి .మొక్కల భాష లో దీన్ని ”సూర్యాభి శరణం ”అంటారు .ముఖ్యం గాపొద్దు  తిరుగుడు పువ్వు దీనికి ఉదాహరణ సంస్కార వంతులైన సహృదయుల వైపుకు చేరటం సంస్కార లక్షణం .ఆ సల్లక్షణం పూర్తి గా నిండి వున్న వారు బ్రహ్మశ్రీ మల్లం పల్లి శరభేశ్వర   శర్మ గారు .
ఈ విషయాలన్నీ నేను 19 -03 -2002 లో ఉయ్యూరు లో ”సాహితీ మండలి ”సమావేశం లో ఉపన్యాసం గా విని పించాను .దీన్ని శ్రీ మల్లమపల్లి వారికి అంకితమిస్తూ ,ధూర్జటి రాసిన ”కాళ హస్తీశ్వర శతకం ”లో,మకుటం అయిన” శ్రీ కాళ హస్తీశ్వరా ” అనే దానికి బదులు” శ్రీ మల్లంపల్లీశ్వరా ”అని మార్చి నా సహ్రుదయాభిసరణం తెలియ జేసు కొంటు,సెలవు తీసు కొంటున్నాను  .
”జలకంబుల్ ,రసముల్ ,ప్రసూనములు ,వాచా బంధముల్ ,వాద్యముల్
కల శబ్ద ధ్వను ,లంచిత ,మలంకారంబు దీప్తుల్ ,మెరుం
గులు నైవేద్యము ,మాధురీ మహిమ గా ,గొల్తున్ నినున్ ,భక్తి రం
జిల ,దివ్యార్చన గూర్చి ,నేర్చిన క్రియన్ శ్రీ మల్లంపల్లీశ్వరా ”.
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02 -12 .
Posted in మహానుభావులు | Tagged | 2 Comments

అసమాన జాతీయ కవి శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ

 అసమాన జాతీయ కవి శ్రీ మంగిపూడి వెంకటేశ్వర శర్మ 

         ”అందారు పుట్టీరి హిందమ్మ తల్లికి -అందారు ఒక్కటై వుందారి సక్కంగా
ఎట్టాగు ఎక్కువా బ్యామ్మర్లు మాకంటే -ఎట్టాగు ఎక్కువా ఎవరైనా మాకంటే ”
అని 1910 లోనే కృష్ణా పత్రిక లో ”మాల వాన్ద్ర పాట ”పాట రాసిన మొదటి దళిత గీత కర్త శ్రీ మంగి పూడి వెంకటేశ్వర శర్మ .పితా పురం రాజా వారు సన్మానం చేస్తా నంటే ”నేనుబ్రాహ్మన్ని .బ్రాహ్మడు అత్యాశా పరుడు కారాదు ”అని తిరస్కరించిన అభిమాని .”మీరు  ఏదైనా శాశ్వత ఉపకారం   అంటే స్కాలర్ షిప్ పొందితే  బాగుంటుంది కదా ”అని రాజు గారి దివాన్ అంటే ”ఈ అమాయకత్వాన్ని దూరం చేసుకొంటే కవి గా నేను చచ్చి పోతాను ”అని నిక్కచ్చి గా చెప్పిన మహా మనీషి .
శ్రీ మాడ పాటి హనుమంత రావు గారికి మంగి పూడి వారు రాసిన ”నిరుద్ధ భారతం ”అంకితం ఇస్తే ,మూడు వేల రూపాయలు  కానుక గా ఇప్పిస్తాను” అన్నారు విశ్వ దాత శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు .దానికి శర్మ గారి సమాధానం ”ఇంత పెద్ద మొత్తం నేనెప్పుడు చూడ లేదు .ఆ డబ్బు నా దగ్గర  నిలవదు .మనిషికి కృతి ఇచ్చాననే మచ్చ మాత్రం శాశ్వతం గా నిలిచి పోతుంది ”అని తిరస్కరించిన ఆధునిక పోతన .
మునగాల రాజా గారు ఇంటికి పిలిచి ,ఆతిధ్యం ఇచ్చి ,ఒక కవరు చేతిలో పెట్టి ,”రైలు ఎక్కినతరువాత అందులో ఏముందో చూడండి ”అన్నారు .అలాగే చూస్తె కవర్ లో 100 రూపాయల నోటు వుంది.తొమ్మిదేళ్ళ పాటు ,ఆ మహా రాజు గారి ముఖం చూడ లేదు వెంకటేశ్వర శర్మ గారు .అంతటి అభిమాని ,అన్న మాటకు కట్టు బడి వుండే మనిషి .మళ్ళీ ఒక సారి రాజా గారే బ్రతిమి లాడి ధనం ఇవ్వ బోతే ,”జీవితాంతం మీ ముఖం చూడను ”చూడ కుండా వుండాలి అంటే ఆపని చేయండి ”అని నిష్కర్ష గా చెప్పిన అపర భీష్ముడు .
మంగిపూడి వారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని ”పిప్పర ”గ్రామం .ఆ గ్రామ కరణం వీరి స్తితి చూసి గవర్న మెంట్ పోరంబోకు స్తలాన్ని ఇప్పిస్తాను  అంటే ”ప్రభుత్వం ముందు చేతులు జాపి మీరు ఇచ్చేభూమి  పట్టా తీసుకోవటం నాకు నిజం గా అవసరమే .కానీ నాలో వున్న కవి ఒప్పుకోడు ”అని నిజాయితీ గా చెప్పిన అసలైన దేశ భక్తుడు శర్మ గారు .
చరిత్ర ను మలుపు తిప్పే ఎన్నో గీతాలు రాశారు .18882 జనవరి తొమ్మిదిన జన్మించి అరవై తొమ్మిదేళ్ళు జీవించి 1951 లో మరణించారు .1907 లోనే ”వందేమాతరం ”అనే జాతీయ కావ్యం రాశారు .మాదిగ  వారితో కలిసివున్నందుకు  కులం నుంచి  వెలి కూడా అయారు శర్మ గారు .1915 లో ”నిరుద్ధ భారతం ”అనే కావ్యం రాశారు .అందులో ”పంచమ కులం ”అనేది లేదని స్పష్టం గా చెప్పారు .దళిత కులాన్ని ,పై కులాల వారునిర్మూలించాలి  అని ప్రబోధించారు .
1908 లో ”బాల వితంతు విలాపం ”రాశారు .వీరేశ లింగం గారి ఉద్యమాన్ని సమర్ధించే రచన ఇది .99 సీస పద్యాల్లోబాల వితంతువుల దుస్థితి ని కళ్ళకు కట్టి నట్లు రాశారు .శర్మ గారు 1910 నుంచి ,35 వరకు వందలాది రచనలు చేశారు .30 గ్రంధాలు రాసి ప్రచురించారు .
”స్త్రీ విద్యా పంచ రత్నాలు ”అనే పేరు తో వ్రాసిన అయిదు పద్యాలను ,ప్రతి ఉపన్యాసం లోను ,చదివి విని పించే వారు .అవి అంటే అంత అభిమానం .స్త్రీ విద్య కు అంత ప్రాధాన్యం ఇచ్చే వారు .ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ,తన స్వీయ వ్యక్తిత్వం తో ,ఎదురు నిలిచిన ధీరుడు మంగిన పూడి .ఉన్నతుడైన ఉత్తమ జాతీయ కవి .దేశ భక్తీ ని వివిధ సాహిత్య ప్రక్రియ ల ద్వారా జాతికి  అంద జేసిన వైతాళికుడు వెంకటేశ్వర శర్మ గారు .
తాను నమ్మిన సిద్ధాంతాలను చివరి దాకా అనుసరించిన ఆదర్శ వ్య్కక్తి .ఎన్ని సభల్లో పాల్గొన్నా ఒక్క సన్మాన మైనా స్వీకరించని ఆదర్శ దేశ భక్తుడు .ఆత్మ గౌరవం నిలువెల్లా మూర్తీభ వించిన విశిష్ట వ్యక్తిత్వం వారిది .
ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని ఎద్దేవా చేస్తూ ”జోల పాట ”అనే గేయం కృష్ణా పత్రిక లో రాశారు .ఆ నాటి హేమా హేమేలైన ,పట్టాభి ,కొండా ,మొదలైన వారంతా చదివి గంగ వేర్రు లేత్తా రట . .ఆత్మాన్వేషణ లో పడేట్లు చేయ గలిగారన్న మాట శర్మ గారు .గురజాడ అప్పా రావు గారు ఆ గేయం చదివి ,”ఆంద్ర దేశం లో ఎవరో మహా కవి పుట్టి వుంటాడు ”అని కీర్తిన్చారట .చరిత్ర ను మలుపు తిప్పే ఎన్నో గేయాలు రాసి ప్రచురించారు .అచ్చ మైన ప్రజా కవిగా ,ఏ ప్రలోభాలకు లొంగని వ్యక్తీ గా ,జాతీయత మూర్తీభవించిన మనిషి గా సంఘ సంస్క్రరణను మాటల్లో నే కాదు చేతలోను ఆచా రించి చూపిన ఆదర్శ పురుషుడి గా ,వ్యక్తిత్వానికి ఒక హిమాలయ పర్వతం గా ,నిలిచిన సాహితీ విరాన్మూర్తి శ్రీ మంగి పూడి వెంకటేశ్వ ర శర్మ గారు .అవి నీతి ,ఆశ్రిత పక్ష పాతం కుంభకోణాలు ,మర్యాదాతిక్రమానాలు ,బాద్య రాహిత్యం విచ్చల విడి అయి విజ్రుమ్భిస్తున్న ఈ కాలమ్ లో ,శర్మ గారి చరిత్ర వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది .ప్రముఖ శాస్త్ర వేత్త ఐన్స్టీన్ గాంధీ  గారి గురించి ”ఈ నెల మీద గాంధి లాంటి వ్యక్తీ నడయాడాడు అంటే భవిష్యత్తు తరాలు నమ్మ లేవేమో ?”అన్న మాట గాంధీజీ కంటే శర్మ గారికి ఇంకా ఎక్కువ గా అన్వయిస్తుందని పిస్తుంది .అందుకే మనం ఆ ఆదర్శ మూర్తుల్ని జయన్తులకో ,వర్ధన్తులకో జ్ఞాపకం చేసుకొని ,ఆ తర్వాత హాయిగా మరిచి పోతుంటాం .లాంగ్ లివ్ ఇండియా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3

విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3

                                         విశ్వ నాద విరాణ్  మూర్తిమత్వం
 విశ్వ నాద గారి కల్పవృక్షం పేరెట్టి తే చాలు శరభయ్య గారు పులకరించి పోతారు .ఆయన అంటారు ‘సీతా రాములకు అయోధ్య దగ్గర లో వున్న గంగా నది కంటే ,తెలుగు దేశం లోని గోదావరి నది ఆత్మీయం అని పిస్తుంది .సీతా రాముల ఏకాంత వాసానికీ ,వనవాస లీలా మాధుర్య విలాసానికి ,ప్రణయపు లోతులకు ,ఎడబాసి ఉండలేని ,ఆ దుఖానికి సాక్షి గోదా వరే .ఇవన్నీ గోదా వరికీ తెలిసినంత ఆత్మీయం గా ,గంగమ్మకు తెలియవు .అందుకే ,సంయోగ వియోగ మైన తమ ప్రణయ జీవిత రహశ్యానికి సఖిలా వున్న గోదావరి ని విడిచి ఉండ లేక ,ఆ నది ఒడ్డునే ,భద్ర గిరి మీద ,నెలకొని ,తెలుగు ప్రజల హృదయం లో ,సీతా రాములు శాశ్వతం గా నిలిచి పోయారు .అసలు ,వారు వనవాసం నుంచి ,అయోధ్యకు వెళ్ళ లేదేమో నని పిస్తుంది నాకు .వారిద్దరి కళ్యాణ ,పట్టాభి షెకాలు ఈ రాష్ట్రం లోనే ,వార్షికం గా ,భక్తీ శ్రద్ధ లతో జనం చేసి తరిస్తున్నారు .ఇలా యుగ యుగాలుగా ,తన ప్రేమ బలం చేత సీతారాముల్ని గోదావరీ మాత ,తెలుగు నేల మీద తన ఒడ్డునే ,నిలిపి వేసు కొంది ”అని భక్తీ ప్రపత్తు లతో అంజలి ఘటిస్తారు
శ్రీ విశ్వానాధ కల్ప వృక్షమూ ఇన్ని విధాలు గానే కన్పిస్తుందట శరభయ్య గారికి .వాల్మీకి చిత్రించిన భూదేవి వర్ణ చిత్రమే కల్ప వృక్షం లో దర్శన మిస్తుందట .అందులోని సుకుమార ,రస భావనలే ,తేనే తో కలిసిన కేసరాలు ,రేకులు -ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పువ్వు .ఒక్కొక్క ఖండం ఒక్కొక్క చెట్టు .ఒక్కొక్క కాండం ఒక్కొక్క కొండ .అలాంటి ప్రకృతి రామ నీయకత కల్ప వృక్షం లో వుంది .బ్రాహ్మీమయ మూర్తి అయిన విశ్వ నాద నిర్మించిన కల్ప వృక్షం , ,భావుక హృదయా రామం లో ,స్థిర ప్రస్టిత మైంది అంటారు ఆనంద బాష్పాలు రాలుస్తూ మహా మహోపాధ్యాయులు శరభయ్య గారు .కాళిదాస కావ్యాలకు మల్లి నాద సూరి గారి సంజీవనీ వ్యాఖ్య ఎలాంటిదో ,విశ్వ నాద రచనలకు శరభేశ్వర శర్మ గారి వ్యాఖ్యానం అలాంటిది .అంత నిర్దుష్ట మైనదీ ,సాధికార మైన్దీను .
”మనం అందరం వాడే శబ్దాన్నే ,మంత్రించి ,విశ్వ నాద ప్రయోగిస్తాడు .ఆ శబ్దం లోంచే రస జగత్తులు తొంగి చూస్తాయి .”అంటారు గురువు విశ్వ నాధను గురించి అంతే వాసి శరభయ్య గారు .నాలుకకు ఓషధీ రుచి తెలిస్తే ,మనసుకు వాక్కు లోని రసాలు తెలుస్తాయి దీనిపై గొప్ప వ్యాఖ్యానం చేశారు చూడండి .
”జ్ఞానేన్ద్రియమైన రసనకు ,కర్మేంద్రియ మైన వాక్కుకు ,జిహ్వాయే అధిష్టానం .నాలుక ఆరు రుచులను గ్రహిస్తుంది .అలాగే తొమ్మిది రసాలకు ఆలంబన మైనా వాక్కును సృష్టిస్తుంది .జ్ఞానేంద్రియ మైన నాలుకకు వరుణుడు ,కర్మేంద్రియ మైన వాక్కు కు అగ్ని అధిష్టాన దేవ తలు .మొదటిది ఆరు రుచులతో అనుభ వింప జేసేది .రెండోది ,తొమ్మిది రసాలతో ఎదుటి వారి చేత అనుభవింప జేసేది .తాత్కాలిక మైన ఇంద్రియ సుఖం రుచి .శాశ్వత మైన అనుభూతి రసం .అలాంటి రసానికి ,ఆశ్రయ మైన వాక్కు ,అగ్ని లో నుంచి పుడు తుంది .కనుక పరమ పవిత్రం .అందుకే అది ”వాగగ్ని ”అయింది” .ఇంత గొప్ప గా విశ్వక్ నాద కవితా విరాట్ రూపాన్ని ఆవిష్కరించిన వారు లేరు .
తపోలక్షనాలు కల విశ్వ నాద అగ్ని లోంచి పుట్టే వాక్కును తన దహరాకాశం లో సంధ్యా దేవత వలె ,ఆవిర్భావింప జేసుకొని ,శబ్ద బ్రహ్మాన్ని సాక్షాత్కరింప జేసుకొన్నారు .”అస్మదీయ కన్తమున యండాడు చుండే -నొక ఏదో గీతి -బయత్కుబికి రాదు -చొచ్చుకొని లోనికిం బోదు -వ్రచ్చి పోయే -నా హృదయ మీ మహా ప్రయత్నా ము నందు ”అంటారు విశ్వ నాద .అంటే కాదు
”ఆ మహా సంధ్య లో ,శారద మయూరి -రమ్య కింకిణి ,కిణి  ,కిణి  ,రభస ,పాద
మంజుల విలాస నృత్య సామ్రాజ్య లక్ష్మి -యగుచు కచ్చపీ మృదు గీతుల ననుసరించు ”
అలాంటి అంతర్మధనం నుంచే ,మాదుర్యామృతం జనిస్తుంది .మనసు ఆర్ద్ర మవుతుంది .ద్రవీభావించిన ఆత్మ ,లక్షణమే మాధుర్యం .సృష్టికీ ,కావ్య సృష్టికీ ,అదే మొదటి దశ ”ఇంతటి నిగూఢ బావాన్ని ఇంత రసరమ్యంగా చెప్ప గల నేర్పు మల్లం పల్లి వారిది .
”విశ్వ నాద శబ్దాన్ని యేరు కోడు .ఆయన సృష్టి లో ఔచిత్యం ,భాష ,ఆకృతి అన్నీ రస మిలితాలై ,తమంతట తామే ,యధోచితం గా సరి పోతాయి .ఆయన చైతన్యం చాలా వేగ వంట మైంది .దేనిలో సంకల్ప మాత్రం చేత ,ప్రతి శూక్ష్మంశము యధా తదం గా అమరి వుంటుందో ,అదే సృష్టి .కావ్య సృష్టి అయినా ,జగత్ సృష్టి అయినా .”ఇచ్చామాత్రం విభొహ్ సృస్త్”అన్నారు అందుకే ”అని రాసా వేశం తో విశ్వ నాద మహా వ్యక్తిత్వాన్ని ఆవిష్క రిస్తారు .  శరబయ్య గారి దృష్టిలో ”సర్వ కవితా విశ్వనాధుడు -విశ్వ నాద ”.
  విశ్వ నాద మహా ప్రస్తానం 
విశ్వ నాద సత్యనారాయణ గారు మరణిస్తే ,శిష్య గణం అంతా రోదించింది .అందరిదీ మూగ వేదనే .కాని శ్రీ తుమ్మ పూడి కోటేశ్వర రావు -విశ్వనాధ పై ,”చితా భస్మం ”అనే కావ్యాన్ని విశ్వనాధ మరణానంతరం  రచించారు .దీనిపై స్పందిస్తూ మల్లంపల్లి వారు ”మాలో పసివాడు కాబట్టి ,కోటేశ్వర రావు స్పందించాడు .ఎవరిని గూర్చి ?గురువు గారిని గురించి కాదట .తనకు ప్రాణ ప్రద మైన ఈ తెలుగు నేలపై వివిధ దేవతల ఆకారాలుగా బుగ్గ పొడిచిన ,కాలా తీత మైన  నిత్య చైతన్యం సోమ్మ సిలి నందుకట .-ఇదేం అన్యాయం ?అని అందర్నీ అడిగాడు ఆ దుఖం లో ”అని అతి భావుక మైన ఆత్మీయ స్పర్శను ,ప్రశంసను ,గురు భక్తిని తెలియ జేశారు .తుమ్మ పూడి వారి రస రామ్యాలైన రెండు పద్యాలు
”భద్ర గిరి పొంత వాగుగా పారి పోను -పోను ,సువిశాలమై మహామ్బుధిని గలిసె
నెట సరస్వతీ రసధుని -అచట ,”ముండు” పలుక -నచికేతు డగుచు తత్వములు వింటి (ముండు అంటే ముండక ఉపనిషత్ కోటేశ్వర రావు గారికి కల్గిన దర్శనం ఎలా వుందంటే
”త్రిగుణ ముల్  ,పంచ భూతములుల్ -బ్రుమ్హితమ్ము –సకల త్రైలోక్యమున్ -ప్రాణ సంచయములు
యన్మహః ప్రభా భావమై అందే సుడియ –తన్మహా కాల మూర్తి పాదములకు
అన్మహా మూర్తి ,తాన్డవోద్యన్మహోద్ధ -తాంఘ్రి ,సంరంభ ,సంఘాత మంది ,ఉరలి
స్ఫుట నిటల ,వహ్నిచ్చటా ,త్రుటిత ,మవని –తన్మహా స్మశాన విహార తత్పరుడు
ప్రభు తనూ లిప్తి కిది చితా భస్మ మగుత ”
        అని తన గురువైన విశ్వ నాధను ,ఆయన విరాణ్ మూర్తి ని విశ్వం లో దర్శించారు -అణువణువునా మంత్ర ద్రష్ట, వేత్త అయిన శ్రీ తుమ్మ పూడి కోటేశ్వ ర రావు గారు .వారు శంకర భగవత్పాదుల వారి ”సౌందర్య లహరి ”కి వ్రాసిన విశ్లేషాత్మక మైన వ్యాఖ్య తరచిన లోతులు  చదివి తీర వలసిందే .తుమ్మ పూడి వారుకృష్ణా  జిల్లా గుడి వాడ వారే .
               సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02  -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.కం

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లం పల్లి శరభయ్య గారు -2

 విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లం  పల్లి శరభయ్య గారు -2    

                            విశ్వనాధ  సాక్షాత్కారం 

మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు అంటే అందరు ఆప్యాయం గా పిల్చే శరభయ్య గారు  విశ్వ నాద వారిని దర్శించ టానికి విజయ వాడ బయల్దేరారు .అప్పటి ఆయన అవతారం ఎలా వుందంటే -మాసిన లాగు ,పొట్టి చేతుల చొక్కా ,మెడలో రుద్రాక్షలు ,యెర్రని కళ్ళు ,నల్లని రూపం దానికి తోడూ నత్తి -తనను విశ్వ నాద ఆడరిస్తాడా అని లోపల అనుమానం .అయితే అప్పుడు తనకున్న దంతా ,తన హృదయమొక్కటే  నంటారు శరభయ్య గారు .అప్పుడు ఎస్.ఆర్.ఆర్ .కాలేజి గవర్నర్పేట   లో వుండేది .కాలేజి వదిలి పెట్టే సమయమైంది .ఇంతలో ఒక మహత్తర వ్యక్తి ప్రత్యక్ష మైనాడు .ఎలా ఉన్నాడాయన ?”ఎత్తైన పడగ తో తోక పై నిలిచి ,ముందుకు తూగి వచ్చే ,మహా నాగం లాగా వున్నాడు .ఆయన లోలోపల ఏదేదో పాడు  కొంటు వస్తున్నాడు .” ఈయన ,ఆయన్ను చూసి నిశ్చేస్తుడైనాడు . .”విశ్వనాధ వీరేనా ?అని గేటుకాపరిని  అడి గారు .అవునన్నాడు అతడు .ఇక ఆ ఆనందాన్ని ఎలా వర్ణించారో ఆయన మాటల లోనే విందాం .
”భూమి అంతా నా కైవశం అయినది .కైలాస శిఖరదర్శనం అయినట్లైంది .. .రాశీభూత మైన పూర్వాంధ్ర ప్రతిభ అంతా సాకారమై నడుస్తున్నట్లుంది .కాలిదాస భవభూతి ,దిగ్నాగుల లోని ,భావుకత లోని పరమ సుకుమార మైన ముద్ర వేసి నట్లుంది .త్రిలింగ దేశాల ను ,భూమిని ,వాయువు ను ,అరణ్య పర్వతాలను ,మహా నదులను ,యుగ యుగాలుగా ఆవరించుకొన్న ఆత్మా ఏదో ,ఆకృతి దాల్చి ప్రసన్నమై, దర్శన మిచ్చినట్లుంది .నేను దానిలో లీనమై పోయినట్లు తోచింది .అలా తెలీని ఒచేతనా చేతనా స్తితి లో పడి పోయి ,ఆయన వెంట ఆయన ఇంటికి అనుసరించి వెళ్లాను .విశ్వ నాద నాకు అలా ప్రత్యక్ష మై ,సాక్షాత్కరించారు ”అని ఉప్పొంగి పోయి చెప్పారు శరభయ్య శర్మ గారు ఇంటికి చేర గానే ,విశ్వనాధ వారి పాదాల మీద పడి పోయారు .ఎవరో కుర్రాడు భిక్ష కై వచ్చాడను కొని ,”ఛీ.ఛీ.నన్ను ముట్టు కుంటావెం ?కావాల్సిన్దేదో దూరం గా వుండి ,అడగచ్చు కదా ”?అని చీద రించుకొన్నారు .
శరభయ్య గారి నవ నాడులు కుంగి పోయాయి .కంఠం రుద్ధ మైంది కొన్ని ఛందోమయ ,అక్షరాలూ ,స్పస్తా స్పష్టం గా ,నోటి నుండి ,బయట పడ్డాయి .ఇంక వశం కాక ,ఏడుపు తన్ను కొచ్చింది .అందులో ఆనందం ,దుఖం ,మిళిత మై నాయి .ఆశ్చర్య పోయాడు విశ్వ నాద .ఆ కుర్రాణ్ణి దగ్గరకు తీసుకొని ,ఆలింగనం చేసి వివరాలు అడిగారు .మల్లంపల్లి వారు చెప్పిన సమాధానం విని ,నిలువునా నీరై పోయాడు విశ్వ నాద .”ఇంకెప్పుడు గోత్ర నామాలు చెప్ప కుండా ,ఎవరి కాళ్ళ మీద పడ వద్దు ”అని సలహా నిచ్చారు .విశ్వనాధ కళ్ళ నిండా నీరు నిండి పోయింది .కంఠం వణికింది .దగ్గుత్తికతో ”ఏవ మవిజ్ఞాతాని దైవతాన్య ప్యవదూయన్తే ”అని తనలో తాను గొణు క్కున్నారు ..
విశ్వ నాద వ్రాసిన గ్రంధాలపై  ఇద్దరు చక్క గా మాట్లాడు కొన్నారు .వానలో తడిసిన అడవి లాగా ,కన్నీరు ఓడ్చి ,ఆయన హృదయం తేలిక పడింది అంటారు మహామహో పాద్యాయులు  మల్లం  పల్లి వారు .ఒక ప్రహ్లాద భావం తనలో కల్గిందట .ఆతర్వాత ,వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ,ఈ మొదటి అనుభూతినే నెమరు వేసుకొనే వారట .విశ్వనాధ కంటికి శరభయ్య గారేప్పుడు  ,12 ఏళ్ళ పిల్లాడు గానే కన్పించే వారట .ఆ ప్రేమ బలం తన వయోజ్ఞానాన్ని కూడా , స్తంభింపజేసింది   అంటారుమల్లం   పల్లి వారు .ఆ నాడు వృష నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి .సుమారు 70 ఏళ్ళ  కిందటి ముచ్చట ఇది .విశ్వ నాద తన ఇంట్లో నే ఆకుర్రాడికి భోజనం పెట్టి ,తెల్ల వార్లూ కవితా చర్చ చేశారు .విశ్వ నాద కు తాను రాసిన దేవీస్తుతులను మల్లం పల్లి వారు చదివి విని పించారు అమ్మ వారి పై . తనకూ భక్తీ ఉందనీ చెప్పి తను రాసిన పద్యాన్ని విశ్వ నాద చదివి విని పించారు .
”నిగమ మహార్ధముల్ జగము నిండెను -తన్నిగామాంత  వైఖరుల్
నిగము చయమ్ము కన్న హవాలించెను -తన్నిగమాంత చూడమై
తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము -బ్రహ్మము మౌళి ,తల్లి ,క్రొం
జిగురు పదమ్ము ,గోటి రుచి చే ,రుచిమంత మిదేంత చిత్రమో !
విశ్వ నాద కంత (KANTHA ) సీమ లో తేనెలు ప్రవహించినా యట . .మేఘ గర్జనలున్నా యట . .కోయిల పంచమ స్వరం విని పించిందని మురిసి పోయారు .ఆయన చూపిన కారుణ్యం వల్ల ,విశ్వ మంతా ,దేదీప్యమానం గా వెలిగిందట .విశ్వనాధ సూర్యుని వైపు నిరంతరాభి సరణం చేసిన కవి ,పండిత ,విమర్శకులైన పొద్దు తిరుగుడు పువ్వు శ్రీ శరబెశ్వ ర శర్మ గారు .
విశ్వ నాద రామాయణ కల్ప వృక్ష రహస్యాలను ,ఆంద్ర దేశం నలు మూలలా ,తన ఉపన్యాసాలతో త్రవ్వి తలకెత్తారు మల్లంపల్లి వారు .మల్లం పల్లి వారు కృష్ణా జిల్లా లోని బందరు దగ్గర ఉన్న ,చిట్టి గూడూరు ఓరియంటల్ కాలేజి లో చదివారు .తెలుగు పండితులు గా ,బందరు ,రాజమండ్రి ,మద్రాస్ లలో పని చేశారు .చివ రికి రాజ మండ్రి శారదా కాలేజి ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు శరభయ్యాచార్య  వర్యులు .ఎన్నో కావ్యాలకు అత్యద్భుత విమర్శలు రాశారు .ఆయన విమర్శ కత్తి లాంటిది .దానికి రెండు వైపులా  పదును వుంటుంది .ఒక వైపు పాఠకుడి అనుభవానికి దోహదం చేస్తూనే ,రెండో వైపు గుణ దోషాలను పరామర్శిస్తుంది .ఈ రెంటినీ సమం గా నిర్వ హించటం కష్టమే .దాన్ని సుసాధ్యం చేసిన విమర్శక శిఖామణి అని పించుకొన్నారు .విశ్వ నాద ఏది రాసినా ,మల్లం పల్లి వారు మెచ్చితేనే అది శంఖం లో పోసిన తీర్ధం అవుతుంది .అంతటి నిశిత పరిశీలన మల్లం పల్లి శరభయ్య గారిది .మల్లంపల్లి వారిపై మరిన్ని వివరాలు మరో మారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

“బొచ్చు” హాస్య కవిత

   బొచ్చు హాస్య  కవిత

                                       కవి -గంధం వేంకా స్వామి శర్మ 


మరి సరసభారతి కార్యక్రమం కదా
సరసంగా హాస్య కవిత రాయండి
అని దుర్గా ప్రసాద్ గారి ఆదేశం
అందులోనే ఇమిడి పోయింది కదా
అయినా రాద్దామంటే ,బుర్రను
ఎంతో గోక్కోవాల్సి వచ్చింది
ఆ దెబ్బ తో తలమీదున్న
నాల్గు  పరకల్లో రెండు ఊడి వచ్చాయి
వీటి మీద రాసుకోమనే సందేశం  తో
కాదేదీ కవిత కనర్హం అన్నాడు కదా మహా కవి ?
అందుకని వాటినే ఆశ్రయించాను
నల్లని నలుపుల్లో ఎన్నెన్ని హొయలు !
తెల్లని వైనా అలా వుంటే అదో రమణీయం
అన్నీ రాలి పోయి తల” చలిమిడి ముద్ద” అయింది
నెత్తి గోక్కుంటే ,ఎర్రటి చాళ్ళు పడి మండి పోతోంది
హా వెంట్రుక లారా !పుట్టుకతో నాతొ పుట్టి ,
దువ్వెన కెంతో పని కల్పించి
అదో ప్రత్యెక అందం తో నిగ నిగ లాది
నాకన్నా ముందే పొతే ఏమనా బాగుందా ?
” బట్ట తల అని బాధ అక్కర్లేదు
మళ్ళీ మేము నాట్లు వేస్తాం
మిమ్మల్ని పాతికేళ్ళనాటి తలగా
నవ యువకుల్ని చేస్తాం
ఖర్చు ఆట్టే కాదు -వెంట్రుక కోక రూపాయే
మళ్ళీ పాపాయి లా విలాసం చూపించచ్చు
ఎన్ని నాటమంటే అన్నే నాటుతాం అది మీ ఇష్టం ”
అన్న ప్రకటన చూసి ,ఆశ పుట్టి
ఎందుకైనా మంచిదని,మా ఆవిడను సంప్ర దించా
”మీరు పాతి కెళ్ల వాళ్ళైతే అవుతారేమో కాని
నేను మాత్రం ఇరవై   ఏళ్ళ దానిని కాను
కాలేను కూడా -నాకీ వృద్ధాప్యమే హాయిగా  వుంది
అంత డబ్బు   పోసి ” ఈ బొచ్చు” ఖర్చెందుకు  ?
అలాగే ఉండ నీయండి-నాకు అద్దం  లో
చూసు కొనే” మీ గుండే”  ముద్దు గా బావుంది ”అంది
శ్రీమతి” మాట” శిరోధార్యం అయిన” మూటే” కదా .
” అయితే వాయస్ ,వో.కే.”అని గుండు తడుముకుంటూ కూర్చున్నా .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

విశ్వ నాద ”జాన్సన్ ”కు” బాస్వేల్” శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు -1

విశ్వ నాద ”జాన్సన్ ”కు” బాస్వేల్” శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు -1

         మహా మహోపాధ్యాయ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు గొప్ప విద్వాద్ వరేన్యులు    .వారు విశ్వనాధ సత్య నారాయణ గారికి అతి ముఖ్య మైన శిష్యులు .విశ్వ నాద కవితా హృదయం బాగా తెలిసిన వారు .విశ్వనాధ రామా యణ కల్ప వృక్షానికి అత్యద్భుత వ్యాఖ్యానం చెప్ప గల మహా విశ్లేషకులు .ఒక రకం గా విశ్వ నాద ను ఆవిష్కరించిన దేశికులు .నా దృష్టిలో విశ్వ నాద అనే” జాన్సన్ ”కు ”బాస్వేల్ ”వంటి వారు శ్రీ మల్లం పల్లి శరభేశ్వర శర్మ గారు .ఆయన తన జీవితం లోని కొన్ని,విశేషాలను ”సహ్రుదయాభి సరణం ”పేర  పుస్తకం రాశారు దాన్ని ఆధారం గా నే ఈ వ్యాసం దాదాపు ఆయన భాష లోనే చెబుతున్నాను . ఆ  మాటలు మంత్ర పూతం గా వుంటాయి .అందుకే  ఆ మాటల్లోనే చెబితే మహత్తు వుంటుంది .
విశ్వ నాద అనే హిమాలయానికి శరభయ్య గారు శిష్యుడనే మహా మేరు పర్వతం .A great disciple of a great master.మహా గొప్ప పండితులు విద్వద్వంశం లో జన్మించారు .తండ్రి మల్లికార్జునా రాధ్యుల వారు .కవిత్వ ,పాండిత్యాలలో సాక్షాత్తు అపర మల్లికార్జున పండితా రాధ్యులే .కుమారుడు శరభయ్య గారికి 12 ఏళ్ళు    నిండక ముందే ,కావ్య ,నాటకా లంకారాలలో ,సాహిత్య విద్య నేర్పారు . అప్పటికే శరభయ్య     గారికి కవిత్వం కరతలా మలకం అయింది .శ్రీ చెళ్ళ పిళ్ళ వారికి ఏక లవ్య శిష్యులైనారు .హృదయం చెళ్ళ పిళ్ళ సూర్యునికి ”అభిసరణం ”అయింది .సంస్కృతాంధ్రాలలో కొన్ని వేల శ్లోకాలు ,పద్యాలు వారికి కాంతస్తాలు (kanthasthaalu ) .కనుక తాను కవి అవటం లో ఆశ్చర్యం లేదని అంటారాయన .అంటే సహజ కవి అన్న మాట .అప్పటికింకా శాస్త్ర పరిచయం యేర్పడ లేదు .
 విశ్వ  నాద సాహిత్య పరిచయం 
  ఒక సారి మల్లం పల్లి వారు కృష్ణా జిల్లా కైకలుర్  దగ్గర లో వున్న శోభ నాద్రి పురం వెళ్ళారు .అక్కడ వీరి మేనల్లుడు ,అతని బంధువు వుండే వారు .వారిద్దరూ అప్పటికే విశ్వ నాద సాహిత్యం చదివి ,వాటి విషయమై చర్చిన్చుకొంటు వుండే వారు .చెళ్ళ పిళ్ళ వారి పద్యాలను అలవోక గా చదువుతుండే వారు .విశ్వ నాద పద్యాలను మల్లం పల్లి వారికి చదివి విని పిస్తుండే వారు .అప్పటికి శర్మ గారికి విశ్వ నాద తో పరిచయం లేదు .అంటే ఆ సాహిత్యం తో కూడా  పరిచయమే లేదు .విశ్వనాధ పేరు ప్రక్కనఏం .ఏ. .వుండటం తో వీరికి ,ఆయన విద్వత్తు పై గౌరవం కలగ లేదట .విశ్వ నాద కు సంస్కృతం అసలేమీ రాదు అను కొన్నారట .అప్పటికింకా మల్లం పల్లి వారి హృదయం అంతా కాళిదాస ,భవ భూతులే ఆక్ర మిన్చుకొన్నారు .నన్నయ ,తిక్కన ,శ్రీ నాధులు కొలువై వున్నారు .ఇంకెవరికీ చోటు లేదని పించింది .తన మేనల్లుడు పదే పదే విశ్వ నాద కవిత్వాన్ని విని పిస్తుంటే ,తన మేనల్లుడికి ఇంత గొప్ప గా నచ్చిన విశ్వనాధ కవితా ప్రతిభ తనకెందుకు తెలియలేదు అని కొంత మధన పడ్డారు .మేనల్లుడు దగ్గరున్న విశ్వనాధ పుస్తకాలను అడిగి తీసుకొని మెల్ల గా చదవటం ప్రారంభించారు .
 విశ్వనాధ రచనా పరీమళ ఆఘ్రాణం
మొదట ”కిన్నర సాని ”చదివారు .కవిత్వం  లోని మనోధర్మం సజాతీయం అని తెలిసింది .తెలుగు పాట లో ఎంత తీయదనం వుందో ,అనుభవం అయింది .తెలుగు నేల లోని నదులు ,కొండల అడవుల ,ముగ్ధ సౌందర్యం అర్ధ మైంది .రసాకృతి చెందిన ఆ వాగులో తాదాత్మ్యం చెంది నట్లని పించింది .తన వెనుకటి జన్మ కు ,ఆ నది పూర్వ జన్మ కు ఏదో సంబంధం వుందని పించింది .ఓమదుర కవితా ఝరిలో మునిగి తేలిన అనుభవం కలిగింది .
తర్వాత ”అనార్కలి ”నాటకం చది వారు .అందులోని పాటలు సెలయేటి సంగీతం అని పించింది .”మా స్వామి ”చదివారు .శ్రీ నాద కవి సార్వ భౌముడి తర్వాత ,అంత ఆహ్లాద మైన ,స్నిగ్ధ మైన ,గంభీర మైన ఆంద్ర శారద దర్శనం ,శబ్ద మాధుర్యం ,మళ్ళీ విశ్వ నాద లో కన్పించింది .”నర్తన శాల ”లో ప్రవేశించారు .భాసమహా కవి ,తెలుగు లో నాటకం రాసినట్లు అని పించింది .”ఆంద్ర ప్రశస్తి ”చదివారు .ఒక అతీంద్రియ శక్తి తనలో వికశించినట్లు అయింది .”ఎన్ని జన్మ లుగా -ఈ తనువునన్ బ్రవహించునో ఆంద్ర రక్తముల్ ”అన్న అనుభూతి కి లోనైనారు .
”వేన రాజు ”చదివారు .”శుక్ల పక్షం లో అష్టమి నాడు ,చంద్ర కాంతి నిండు నది లా ప్రవహిస్తున్నట్లు ,ఒక మహా వైణిక విద్వాంసుని ,నాద వాహిని లో చేతనా చేతనా మైన సృష్టి అంతా ,తడిసి ముద్ద అయి నట్లు అని పించింది .”ఏక వీర ”నవల చదివి తాదాత్మ్య స్తితిని పొందారు .సంస్కృత నాటక కర్తలు తీర్చి దిద్దిన నాయికలు ,       ,పరమ భావుకతా లక్ష ణాలు ,చారు దత్త కవి లోని జాతీ కుసుమ పరిమళం లాగా ,మనసంతా ఆవరించింది .చివరకు ”వేయి పడగలు ”చదివారు .తెలుగు దేశం ఆత్మ సాక్షాత్కరించింది .కొన్ని కొన్ని అధ్యాయాలన్నీ ,ఆనందపు కన్నీ టి లో పూర్తిగా తడిసి పోయినాయట .ఒక్క నెల రోజులు దాన్నే చదివి ,ఆసాంతం జీర్ణం చేసు కొన్నారట .తన   మనో ధర్మమే పూర్తిగా మారి పోయినట్లని పించిందట .భూమి ,ఆకాశం ,గాలి కొత్త గా వున్నట్లు అని పించింది .ఏదో కొత్త జన్మ ఎత్తిన అనుభూతి కల్గింది .
ఇంత అనుభూతినిచ్చిన కవి తన కాలమ్ లో ,ఈ భూమి మీద ,జీవించి ఈ గాలి పీలుస్తూ ,ఈ నీరు తాగుతూ ,తనతో పాటు జీవిస్తున్నాడు కదా అని పించింది .ప్రాణాదికు డైన కవిని చూచి తరించాలని పించింది .ఎవరి ప్రమేయం లేకుండానే ,విశ్వనాధ ను దర్శించాలని మనసు నిండా భావించారు ..ఆ మహా కవికి ,ఏ కోరికా లేకుండా ,రస ముగ్ధ మైన ,సహ్రుదయాభి శరణం అనిపించింది శరభేశ్వర శర్మ గారికి .కాళిదాసాది మహా కవులకు ,తన వలె ,ఏ అజ్ఞాత వ్యక్తీ అయినా ,ఇలా సహ్రుదయాభి శరణం చేశాడా అని పించింది .పురూరవునికై ,ఊర్వశి చేసిన దాని కన్న ,తన ఆకర్షణ ,దివ్యమూ , ,ఇహలోక సంబంధమూ అని పించింది .విశ్వ నాద దర్శనం తో శరభయ్య గారు ఎలా పునీతు లయారో తారు వాత  తెలుసు    కొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .
Posted in మహానుభావులు, రచనలు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

 ఊసుల్లో   ఉయ్యూరు –16      వీరమ్మ తల్లి తిరునాళ్ళు

                                  వీరమ్మ తల్లి చరిత్ర

పుట్టి నింటి నుంచి మెట్టి నింటికి 

తిరునాళ్ళు 2

వీరమ్మ తల్లి కి అయిదు వందల చరిత్ర వుంది .ఆ కాలమ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర  పెద కడియం అనే గ్రామం లో యాదవ కులానికి చెందిన ”బొడ్డు ”వారి ఆడ పడుచు గా ఆమె జన్మించింది .తండ్రి పరశురామయ్య ,తల్లి పార్వతమ్మ .పరమేశ్వర వర ప్రసాదం గా జన్మించి నందున ”వీర శివమ్మ ”అని పేరు పెట్టారు .చిన్న తనం నుంచి భక్తీ శ్రద్ధ లతో ,దైవ చింతన తో పెరిగింది .ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య ,చెల్లమ్మ ల పెద్ద కుమారుడు చింతయ్య తో ,ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు ,పెదకడియం లో ఆమెకు వివాహం చేశారు .కొంత కాలమ్ పుట్టింట్లో నే వుంది ,యుక్త వయసు రాగానే ఉయ్యూరు లోని మెట్టి నింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించ టానికి పుట్టి నింటి వారు పంపారు .అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ,ఆదరాన్ని పొందింది వీరమ్మ .తన సేవా తత్పరత తో అత్త గారైన మేనత్తను ,మామయ్యను మెప్పించింది .మరది భోగయ్య ను బిడ్డ లాగ చూసింది .చుట్టు పక్కల వారికే కాక బంధు గణానికీ అంతటికీ ఆమె ”ఉత్తమా ఇల్లాలు ”అయింది .భర్త సేవలో జీవితం ధన్యం చేసుకోంది .కాలమ్ ప్రశాంతం గా గడిచి పోతోంది .ఇంతలో కుటుంబం లో ఒక అలజడి రేగింది .మరది భోగయ్యకు అచ్చమ్మ తో వివాహ మైంది .ఆమె గర్విష్టి ,విద్యా హీన .ఆమెకు వీరమ్మ మీద అసూయా పెరిగింది .ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చు కోవటం ఆమె కు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది .అయితె సాధ్వి వీరమ్మ ,అత్త మామలకు ,మరిదికి నచ్చ చెప్పి ,తోడి కోడల్ని ,మళ్ళీ అత్త వారిల్లు చేరేట్లు చేసింది .ఆమె మనసు లోని అసూయా తొలగి పోయి ,తోడికోడళ్ళు అన్యోన్యం గా వుంటూ ,వూరి వారికి ఆదర్శ మైనారు .

                           భర్త మరణం -సహగమనం     

ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ .అతని కళ్ళు సాధ్వీ మణి వీరమ్మ పై పడ్డాయి .లోబరుచు కోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు .దగ్గర లో వున్న” గురజాడ ”గ్రామం లోని తన బావ మరిది ”సీతయ్య ”ను తనకు సాయం చేయమని బ్రతిమి లాడాడు .అతడు రావణాసురుడికి మారీచుడు చేసి నట్లు హిత బోధ చేశాడు .చెవి కెక్క లేదు .ఎంతైనా బావ గారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్య కు   పట్టు కొంది .మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్త బడి చివరికి సాయం చేయ టానికి ఒప్పు కున్నాడు .మేకల ,గొర్రెల మేత కోసం చింతయ్య ,భోగయ్య సోదరులు వాటిని తోలు కోని ఉత్త రాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్ళారు .ఇదే అదునైన సమయం అని బావమరిది సీతయ్య ను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య .సీతయ్య ప్లాన్ వేశాడు .తన నౌకరుకు విషం పూసిన సొర ముల్లు ఇచ్చి ,చింతయ్య పై రహశ్యం గా ప్రయోగించమని చెప్పి పంపాడు .ముస్తాబాద్ లో గొర్రెల మందల దగ్గర నిద్ర పోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం వున్న ఆ సొర ముల్లు తో  పొడిచి హత్య చేశాడు . .చింతయ్య బాధ భరించ లేక చని పోయాడు .తమ్ముడు భోగయ్య అన్న  శవాన్ని ఉయ్యూరు చేరుస్తాడు . ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది .తాను గాడం గా ప్రేమించిన భర్త తో సహ గమనం చేయాలని నిస్చ యించుకొంది .తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసు కోని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బల వంత పెట్టారు .ఆమె కు కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది  .
సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు .వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయట పడుతూ ,ఆమె అంటే అందరి లో భక్తీ ఏర్పడింది . చింతయ్య కు  చితి ఏర్పాటు చేయించారు .వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది .గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే ,మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది .ముత్తైదువులు పసుపు దంచుతుంటే ,రోలు పగిలింది .వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోతూ వేసింది .ముత్తైదువులకు పసుపు ,కుంకుమ లు పంచి పెట్టింది .ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది .చింతయ్య చితికి తమ్ముడు   భోగయ్య నిప్పు అంటించాడు .వేలాది ప్రజలు భోరున విల పిస్తుండగా ,అత్తా మామలు ,బంధు గణం శోక సముద్రం లో మునిగి ఉండ గా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలి తో ,”పారెళ్ళు ”పెట్టించుకొని ,పెళ్లి కూతురు లా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించు కోని ,సాధ్వీమ తల్లి ,పతివ్రతా శిరోమణి ,వీరమ్మ తల్లి ,భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి ,భగ భగ మండే ఆ మంటలో తానూ ,భర్త చితి పై చేరి అగ్ని గుండం లో సహ గమనం చేసింది .ఆదర్శ మహిళ గా ,మహిమ గల తల్లి గా ఆ నాటి  నుంచి ,ఈ నాటి  వరకు ప్రజల నీరాజనాలు అందు కొంటోంది
రాజ ప్రతినిధి  ”జిన్నా సాహెబ్’ వీరమ్మ నమస్కారం చేసి ,ఇంటికి వెళ్లి నిద్ర పోయాడు .ఆ రాత్రి నిద్ర లో వీరమ్మ భర్త చింతయ్య తో సహా మహా తేజో వంతం గా ,సర్వాలంకార శోభ తో ,కన్పించింది .స్త్రీలు పూజలు చేస్తున్నట్లు ,వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు ,గండ దీపాల కాంతి లో అమ్మ తల్లి ,ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ  ఉయ్యాల  ఊగు  తున్నట్లు  గుడి   పక్కనే  పెద్ద తటాకం  వున్నట్లు  ,అందులో  వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కల లో కన్పించిందట .ఉదయం లేచి జమీందారు ను పిలి పించారు .జమీందార్ కు కూడా అలాంటి స్వప్నమే వచ్చి నట్లు చెప్పారట     చింతయ్య మరణానికి కారకు లెవరో తెలుసు కోవ టానికి వేగుల్ని పంపారు .సుబ్బయ్యే కారణం అని అమ్మ వారి సహ గమనం రోజే తీవ్ర మైన బాధ తో అతడు మరణిం చాడని  తెలుసు కున్నారు  .సుబ్బయ్య వంశం సర్వ నాశనమై చివరికి వారసులెవరు లేకుండా నిర్వంశం అయింది .

ఆలయ నిర్మాణం -తిరునాళ్ళఏర్పాట్లు

అందరూ ఆలోచించి ,వీరమ్మ అత్త మామ ల తో సంప్రదించి ,గ్రామస్తులతో సమా వేశం జరిపి ,సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు .చెరువు తవ్వించారు .వీరమ్మ ,చింతయ్య లవిగ్రహాలను   ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు .జిన్నా గారు ,జమీందారు గార్ల సమక్షం లో భక్త జన సందోహం మధ్య వైభవం గా ప్రతిష్ట జరిగింది .ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నా గారే పెట్టు కొన్నారు .చెరువును తవ్వించిన ఖర్చు ,ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజులు పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు .
ఆ నాటి నుంచి ముందుగా మెట్టి నింటి వారు తర్వాత జిన్నా గారు రాజు గారు తర్వాత గ్రామస్తులు అమ్మ వారి ఉత్స వాలను ప్రారంభించి కొన సాగించారు .పారు పూడి వంశం వారినీ ,జమీందారు గారినీ ,ప్రభుత్వాధి కారులని ధర్మ కర్తలు గా జిన్నా గారు నియమించారు .అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరం గా నిర్వ హించే ఏర్పాటు చేశారన్న మాట .అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారే లతో సంబరాలు ప్రారంభ మవటం ఆన వాయితీ గా వస్తోంది .
అమ్మ వారు ఉయ్యాల ఊగే ప్రదేశం లో ఏ కట్టడమూ వుండదు .తన భర్తనూ హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్య ను కాలితో తన్ని,చిరు నవ్వు చిన్దిస్తున్నట్లు ఉయ్యాల ఊగటం లో అంత రార్ధం .ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్స వాలు ప్రారంబించటం జరుగు తోంది . చరిత్ర కాల గర్భం లో కలిసినా ,వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం .నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ .తిరునాళ్ళు  పదిహేను రోజుల్లో  ను ,ఉయ్యూరు లో ఏ  ఇంట్లోను    పసుపు దంచరు   ,కుంకుమ తయారు చేయరు  .ముందే  సిద్ధం  చేసు  కొంటారు  .కారం కూడా కొట్టరు .ఇవి స్వచ్చందం గా అందరు పాటించే నియమాలే .తిరునాళ్ళ లో అమ్మ వారికి సాధారణం గా   అందరు చీరే పసుపు కుంకుమ పెట్టటం అలా వాటు .అంతే కాక ఆ తర్వాత ఎవరింట్లో నైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చి నప్పుడు కూడా చీరా సారే పెడుతుంటారు మెట్టి నింట్లో వున్న అమ్మ వారికి  ”.అమ్మ వారి చీరలు” అని ప్రత్యేకం గా అందరికి అందు బాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణం లో ను లభిస్తాయి .ఆమె పవిత్రత ను ఇలా తర తరాలుగా పాటిస్తూ ,నేటికీ నిల  బెట్టు కొంటు న్నారు ఉయ్యూరు ,పరిసర గ్రామాల వారు .అమ్మ వారి ఊరేగింపులో జనరేటర్ తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టు కొంటుంది .యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు .పెళ్లి అయిన వాళ్ళు కూడా ,ఆ పవిత్ర దినాలలో బ్రహ్మ చర్యం పాటించి ,వంశ ప్రతిష్ట ను నిల బెట్టు కొంటారు .బంధువులను పిల్చుకొని విందు భోజ నాలు ఏర్పాటు చేసు కొంటారు .అంతా పెళ్లి శోభ లాగా వుంటుంది .ఇప్పటికీ పారు పొడి వంశాస్తులే ఆలయ పూజార్లు .ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలున్నాయి .అవన్నీ పూజారులే అనుభవిస్తారు . .   .ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర .ఇప్పుడు అమ్మ వారి చరిత్ర పై మంచి పాటల  కేసెట్లు సి.డి లు వచ్చి అందరికి అందు బాటు లో వున్నాయి

.–
సమాప్తం
21 -09 -1995 లో రాసిన ఈపరంపరను  ”ఊసుల్లో ఉయ్యూరు ”లో ఇప్పుడు చేర్చి   ఆవీరమ్మ  తల్లి కే భక్తీ తో  అంకితం చేస్తున్నాను  .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –15 వీరమ్మ తల్లి తిరునాళ్ళు 2 సంతానం కోసం ప్రాణా చారాలు

ఊసుల్లో ఉయ్యూరు –15

                                    వీరమ్మ  తల్లి తిరునాళ్ళు  2
 సంతానం కోసం ప్రాణా చారాలు 
సంతానం లేని మహిళలు  ,ఆలయం ప్రక్కనే వున్న చెరువు లో స్నానం చేసి ,మెడ లో ఒక్క మంగళ సూత్రం తప్ప ,ఏ ఆభరణాలు దరించ కుండా ,తడి బట్ట లతో ,వీరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు .అంటే బోర్లా పడుకొంటారు .ఒళ్లంతా తడిగా వుండటం వల్ల ,కొద్ది సేపటికి మగత వస్తుందని ,అమ్మ వారు కలలో కన్పించి ,కాయ కాని ,పండు కాని ,చేతిలో పెట్టి నట్లు కల వస్తుందని ,అలా వస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం తో చేస్తారు .ఇలా జరగటానికి కొన్ని గంటలు పట్ట వచ్చు ,లేక రోజులూ పట్ట వచ్చు .అది వారి పూర్వ జన్మ సుకృతం పై ఆధార పడి ఉంటుందని నమ్మకం .అమ్మ వారి అనుగ్రహం దొరకక పొతే కల రాదు .ప్రయత్నం ఫలించలేదని తెలుసు కుంటారు .వచ్చే ఏడాదికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు .ఈ ప్రాణాచారాలు ,అమ్మ వారు ఆలయం ప్రవేశించిన రోజూ నుండి ,పౌర్ణమి దాకా చేస్తారు .పౌర్ణమి ,ఆ ముందు రోజూ గరిష్టం గా ప్రాణాచారాలు చేసే వారు కన్పిస్తారు .ఇదంతా ,తర తరాలుగా వస్తున్న ఆచారం .ప్రాణాచారం పడుకొన్న వారికి తోడుగా ,వారి కుటుంబ స్త్రీలు సహాయం గా వుంటారు .
  సిడిబండి   
అమ్మ వారి తిరునాళ్ళు ప్రారంభ మైన పదకొండవ రోజూ న ”సిడిబండి ”వేడుక జరుగుతుంది .ఈ సంబరాన్ని చూడ టానికి ,ప్రజలు తండోప తండాలు గా వస్తారు .స్థానికం గా ఉయ్యూరు శివాలయం వీధిలో వాటర్ టాంక్ దగ్గర ,కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్లా బత్తులు– ప్రకాశ రావు  గారి కుటుంబం ,సిడిబండి చేస్తారు .ఇది చింత చెట్టు చక్రాల బండి .దానికి పొడవైన తాడి చెట్టు వుంటుంది .దాన్ని మధ్యలో చీల్చి తయారు చేస్తారు .ఇదే సిడి బండి అంటే .సుడి వేసే బండి ,అదే సిడి బండి .ప్రతి ఏడూ ఏ తాటి చెట్టు కొట్టాలో అమ్మ వారు వారికికలల కన్పించి చెబుతుందని ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తా రని అంటారు .చక్రాలు పాతవే.. తాడి మానె  కొత్త .వివిధ గ్రామాల నుండీ కోలాటం బృందాలు ,భజన  బృందాలు వచ్చి పాల్గొంటాయి .తమ శక్తి సామర్ధ్యాలను ,కళ లను ప్రదర్శించ టానికి పోటీ పడతారు .పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుణ్ణి సిడిబండి రెండో చివర కట్టిన బుట్టలో కోర్చోబెట్టి ఊరేగిస్తారు .అతని పై ప్రజలంతా ,అరటి పళ్ళు ,పొగాకు కాడలు విసురు తారు .గుమ్మడి కాయలూ విసిరేస్తారు .చెరుకు సీజన్ కనుక చెరుకు ముక్కలూ విసిరేస్తారు .మంచి గుమ్మడి కాయలతో బండిని అలంకరిస్తారు .ఇళ్ళ దగ్గర వార పోసి ,కానుకలు కొబ్బరికాయలు ,సమర్పించి ,హారతి ఇస్తారు .గుమ్మడి కాయలు సమర్పిస్తారు .సిడి బండి వాటర్ టాంక్ దగ్గర సాయం కాలమ్ బయల్దేరి ,రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆలయం దగ్గరకు చేర్తుంది .మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది .మొక్కు వున్న వారు బండిలో ని తొట్టె లో కూచుని గుడి చుట్టూ తిరుగు తారు .సిడి బండి రోజున స్కూళ్ళు ,కాలేజీలు   ఒకే పూటఅంటే ఉదయం మాత్రమే  పని చేస్తాయి .డప్పుల హోరు ఈ తిరునాళ్ళ ప్రత్యేకత .ఇసకేస్తే రాలనంత జనం .ఉయ్యూరు ఉప్పొంగి పోతుంది ఆ రోజు .

This slideshow requires JavaScript.

 మళ్ళీ మెట్టినింటికి చేరటం 
అంబరాన్ని అంటే సంబరాలు పదిహేను రోజులు జరుగు తాయి .ప్రతి ఇంటి వారు మట్టి ప్రమిదలలో  గులాం చల్లు కుంటు ఊరేగింపు గా వెళ్తారు .మొక్కులు చెల్లిస్తారు .కోళ్ళు బాగాతెగుతాయి . .మేకలు తెగుతాయి ,గొర్రె పొట్టేళ్ల వధకు అంతుండదు .ప్రతి రోజూ గుడి దగర ,అమ్మ వారి చరిత్ర ను హరికధా,బుర్ర కధ చెప్తారు .నాటకాలు వేయిస్తారు .విద్యుద దీపాలంకరణ కు కళ్ళు జిగేల్ మంటాయి .తిను బండారాలకొట్లు ,గాజుల కోట్లు ఖర్జూరపు కోట్లు ,కొబ్బరికాయల కోట్లు వేలం పాడి కొనుక్కొంటారు .ఫాన్సీ సామాల కొట్లు కూడా ఎక్కువే .ఆడ వారు అమ్మ వారిని దర్శించి తప్పకుండా గాజులు కొనుక్కొని వేసుకొంటారు .అలాగే పసుపు కుంకుమ కొంటారు .పిల్లలకు బలే సరదా .పసుపు కుంకుమ కలిపినా దాన్ని ”బండారు ”అంటారు .దర్శనం తర్వాత అందరు  బండారు ధరిస్తారు .పశువులకూ పెడ తారు .ఈ పదిహేను రోజుల్లో ”భండారు ”పెట్టు కోని వారు వుండరు .బలి ని ఇచ్చే జంతువులకు కూడా పెడతారు .దాన్ని రక్ష గా భావిస్తారు .సర్కసులు జెయంట్ వీల్,గారడీలు ,చిన్న జంతు ప్రదర్శన శాలలు బాగా ఆకర్షిస్తాయి .పూర్వం” చర్ బొప్పాయ్ గుండు” అనే ఆట ఆడేవాళ్ళం . ఒక గాజు తో చేసిన పెట్టె వుండేది .దానిలో రంగుల గుంటలున్దేవి .ఆ రంగుల గడులు బయట రబ్బరు షీట్ మీద ఉండేవి .రంగుల మీద డబ్బు కాయాలి .ప్లాస్టిక్ బాల్ తీసుకొని గాజు గోడకు కొడితే అది అటు ఇటు తిరిగి ఏదో గుంట మీద నిలుస్తుంది .ఆ రంగు మీడ్ద కాసిన వాడికి రెట్టింపు డబ్బు ఇస్తారు .బలే సరదాగా ఆడే వాళ్ళం .అలాగే ఒక చక్రం దానిలో సెక్టార్ల ఆకారం లో గదులు ,దాన్ని తాకుతూ ఒక ప్లాస్టిక్ నాలుక బద్ధ లాంటిది ఒకటి వుంటుంది .చక్రాన్ని తిప్పి వదిలేయాలి నాలుక బద్ద ఎక్కడ ఆగితే దాని మీద వున్న జంతువూ ల మీద పందెం కాసిన వారికి రెట్టింపు డబ్బు ఇస్తారు .పూర్వం మూడు ముక్కలాట కూడా వుండేది .ఇప్పుడు ఇలాంటి జూదాలన్నీ నిషేధించారు .మా చిన్నప్పుడు బడి ఎగ గొట్టి తిరణాల లో తిరిగే వాళ్ళు చాలా మంది వుండే వారు .మేము మాత్రం సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళం .రబ్బర్ బంతులు ఇనప సామాన్లు సత్తు గిన్నెలు బెలూన్లు కు గిరాకి ఎక్కువ .దొరకనివస్తువంటూ వుండదు .ప్రక్కనే జిల్లా పరిషద్ స్కూల్.  ఆ పదిహేను రోజులు స్కూల్ హాజరు బాగా తక్కువ గా వుంటుంది .పూర్వం గుండ్రటి చెక్కలతో వుండే నుయ్యి లాంటిది ఒకటి వుండేది .దాన్లో మోటారు సైకిల్ మీద అడుగు నుంచి పైకి వచ్చే వారు చుట్టూ తిరుగుతూ .చూడ టానికి టికెట్ వుండేది . రంగుల రాట్నం పిల్లలకు ఎక్కి తిరగటం సరదా.బూరలు ,పిల్లన గ్రోవులు ”,డమ డమాల బండ్లు’ కోని లాగుతుంటే ఆ చప్పుడు భలేగా వుండేది .వెదురు పుల్లలతో చేసిన బండ్లకు రంగు కాగితాలతో అలంకరించి అమ్ముతారు .అందరు ఖర్జూర పండు కొనుక్కుంటారు .ఇప్పుడు గుడి లో రోజూ ప్రసాదం గా పులిహోర లేక సెనగలు పెడుతున్నారు .ప్రతి ఇంటి వారు తప్పక వచ్చి దర్శనం చేసు కొంటారు .ఉయ్యూరు అ చుట్టూ ప్రక్కల వున్న వారు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో వుంటే తప్పక పిల్లా జెల్లా    తో తిరు నాళకు వచ్చి చూసి వెద తారు .పిల్లలకు పండగే పండగ .
ఇక్కడ తిరునాళ్ళు పూర్తి అయింతర్వాత దగరలో కృష్ణా నది ఒడ్డున వున్న అయిలురు లో జరిగే తిరునాలకు వెళ్లి అక్కడ కోట్లు పెట్టు కొంటారు .అక్కడ రెండు రోజుల తిరునాళ్ళు జరుగు తాయి ..తిరునాళ్ళు లో పదిహేనవ నాటి రాత్రి అంటే బహుళ ఏకాదశి నాడు అమ్మవారినీ ,అయ్య వారినీ గుడి నుంచి ,మేళ తాళాలతో బయల్దేర దీస్తారు .కొన్ని బజార్ల గుండా ఊరేగించి మెట్టి నింటికి చేరుస్తారు .దారిలో ప్రజలు హారతులిస్తారు వార పోస్తారు కొబ్బరికాయలు కొడతారు .అయితె అంతగా జనం వుండరు .కొమ్ము బుర్ర ల వాళ్ళు ఎక్కువ గా కని పిస్తారు .రుంజ వాయించే వారూ  ఉంటారు .అయితే అమ్మ వారు సరాసరి గుడి లో ప్రవేశించారు . .శివ రాత్రి నాడు ఉదయం కొమ్ము బూరలు ఊదు కొంటు అత్తారింటి నుంచి ,అయిలూరు తీసుకొని వెళ్లి కృష్ణా నది లో స్నానం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చిమెట్టి   నింటి దేవాలయం లో ప్రవేశ పెడతారు .యాదవకులానికి చెందిన వారే అమ్మ వారి అర్చకులు .అమ్మ వారు యాదవ కులానికి చెందినా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అత్యంత భక్తీ శ్రద్ధ లతో వీరమ్మ తల్లిని కొలిచి కోర్కెలను తీర్చుకొంటారు .భక్త జనానికి కొంగు బంగారం వీరమ్మ తల్లి .ముద్దు గా ;;జేజమ్మ తల్లి ”అని పిల్చు కుంటారు .వీరమ్మ పేరంటాలు అనికూడా పిలుస్తారు .ఇంత మహిమ గల వీరమ్మ అమ్మ వారి చరిత్ర తెలుసుకోవాలని ఉందా !వచ్చే ఎపిసోడు దాకా ఆగండి మరి .
క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –14 వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –1

ఊసుల్లో ఉయ్యూరు –14

                                       వీరమ్మ తల్లి (జేజమ్మపేరంటాలు )తిరునాళ్ళు –౧

 ఉయ్యూరు గ్రామం లో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ఏకాదశి వరకు పదిహేను రోజుల పాటు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగు తాయి .ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేది శుక్ర వారం నుండి పదిహేడవ తేది శుక్ర వారం వరకు ఈ సంబరాలు జరుగు తున్నాయి .అందుకని ,అందరికీ తల్లి అయిన వీరమ్మ  పేరంటాలు తిరునాళ్ళు ,ఆ జేజితల్లి దివ్య చరిత్రను ఊస్సుల్లో ఉయ్యూరు లో ధారా వాహికం గా మీందరి కోసం అందిస్తున్న్నాను .అసలు గ్రామ దేవతల ప్రత్యేకత ను గురించి ముందు తెలుసు కోవాలి  .
 గ్రామ దేవతలు      
స్త్రీలు ప్రకృతి స్వరూపాలు .ప్రకృతి అంటే ప్రకృష్టమైన దాన్ని సృష్టించటం -అంటే -ఏదైనా సృష్టి చేయటం లో ,పరమ ప్రవీణు రాలైన వారిని ప్రకృతి అంటారు .సత్వ గుణానికి ”ప్ర”అనీ ,రాజోగునాన్ని ”కృ”అనీ ,తమో గుణాన్ని ”తి”అనీ అంటారు .అంటే ,త్రిగుణాత్మకమై ,సర్వ శక్తి సంపన్నమై సృష్టి లోని అన్ని కార్యాలకు ప్రదాను రాలే ప్రకృతి .అందుకే ఆమెను ”ప్రధానం ‘లేక ప్రకృతి అంటారు .ఇంకో రకం గా ఆలోచిస్తే ”ప్ర”అంటే ప్రధమం .”కృ”అంటే సృష్టి .అంటే సమస్త మైన శక్తికీ ,మొదటి కారణ స్వరూపిణి అని అర్ధం .సృష్టి కోసం పరబ్రహ్మ తనతకు తానే రెండు రూపాలుగా ,విభాక్తుడైనాడు .ఆ స్వరూపాలే మనం చెప్పుకొనే ప్రకృతి ,పురుషుడు .శరీరం లోని కుడి భాగం పురుషుడు ,ఎడమ భాగం ప్రకృతి అంటే స్త్రీ .ఆ ప్రకృతి అంశ తో జగత్తు ను పాలించే సకల దేవతలూ ఎర్పడుతున్నారు .అలాంటి దేవతలలో ఉయ్యూరు వీరమ్మ తల్లి ,పెద్దింటి నాంచారమ్మ ,పెనుగంచిప్రోలు తిరుపతమ్మ,,అంకాలమ్మ,సమ్మక్క సారక్క  మొదలైన దేవతలను గ్రామ దేవతలు అంటారు .ఈ దేవతల ప్రభావం జానపదుల మీదే కాక సామాన్య జను లందరి పైనా వుంది .వారు సర్వ జనుల మనోభీస్టాలను నెర వెరచే సర్వ సమర్ధులు గా ప్రసిద్ధి కెక్కారు .ఒక్కొక్క గ్రామ దేవతకు ఒక్కొక్క మహిమ వుంటుంది .వీరికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేక పోయినా ప్రత్యెక సందర్భాలలో సంబరాలు ,తిరునాళ్ళు జరుగు తాయి .ఆ రోజుల్లో పల్లెల్లో సందడే సందడి .సాధారణం గా మాఘ మాసం నుంచి వరుస గా ఈ దేవతలకు తిరునాళ్ళు జరుగుతూ వుంటాయి .
  మాఘం లో వీరమ్మ తల్లి తిరునాళ్ళు అమోఘం 

మాఘ శుద్ధ ఏకాదశి నుంచి ,పదిహేను రోజులు ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు ఘనం గా ,అమోఘం గా జరుగు తాయి .తిరునాళ్ళు అంటే తిరు అంటే పవిత్రమైన నాడులు అంటే రోజులు .ఆ మాటే తిరునాళ్ళు గా మారింది .అంటే మంచి రోజులని మొత్తం మీద అర్ధం .కృష్ణా జిల్లా లోనే అత్యంత ప్రాముఖ్యం కలవి వీరమ్మ తిరునాళ్ళు .జిల్లా లోని అన్ని ప్రాంతాల నుంచే కాక ,రాష్ట్రం లో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి ,వీరమ్మ తల్లిని దర్శించు కోని ,మొక్కులు చెల్లించుకొని సేవిస్తారు .ఇక్కడ గొప్పతనం ఏమిటంటే హిందువులే కాదు ముస్లిములు ,క్రిస్తియన్లు అందరు భక్తీ తో అమ్మ వారిని కొలవటం .అందరు ”వీరమ్మ తల్లి ”అని నోరారా పిలుస్తుంటే ,ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఏ మతం వాడైనా ”వీరమ్మ ”అని ఏక వచనం తో పిలవనే పిలవరు .అందుకే వీరమ అందరికీ తల్లి అయింది .అందరి కోర్కెలను తీర్చే దేవతగా ప్రసిద్ధి కెక్కింది .మతసామ రాశ్యానికి  వీరమ్మ తల్లి తిరునాళ్ళు గొప్ప ఉదాహరణ .లక్ష లాది భక్తులు అమ్మ వారిని దర్శించి ,పూజించి కానుకలు సమర్పించుకొంటారు .
  ఆలయ ప్రవేశం 

ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి రాత్రి అమ్మ వారు ఉయ్యూరు లో రావి చెట్టు దగ్గర లో వున్న ,అత్త వారింటి నుంచి ,మేళ తాళాలతో అట్టహాసం గా బయల్దేరు తుంది ”.గండ దీపాలు ”అంటే మట్టి ప్రమిదలలో నూనె తో లేక ఆవునేతి తో వెలిగించిన ఒత్తులను చేతి తో పట్టు కోని ,అవి కాల కుండా జాగ్రత్త వహిస్తూ ,మనసు లోని కోర్కెలను తీర్చు కోవటానికి ,వేలాది మంది స్త్రీలు పిల్లలు,మగవారు  అమ్మ  వారి వెంట నడుస్తారు కాళ్ళకు చెప్పులుండవు .ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన పల్లకి లాంటి దానిలో ,పీఠం మీద ,వీరమ్మ అమ్మ వారినీ ,భర్త చింతయ్య ల కొయ్య విగ్రహాలను చక్క గా కూర్చోబెట్టి ,మనుష్యులు మాత్రమే మోస్తూ ,అందులో ముఖ్యం గా ఆలయ పూజారులు భక్తీ శ్రర్ధ లతో మోస్తూ ,ఊరేగింపు చేస్తారు .దీన్నే అమ్మ వారు గుళ్ళోకి వెళ్ళటం అంటారు .అత్త వారిల్లైన గుడి నుంచి బయల్దేరే ముందు ,ఉయ్యూరు టౌన్ పోలిస్స్టేషన్ అధికారి -ఇన్స్పెక్టర్ అమ్మ వారికి పసుపు ,కుంకుమ నూతన వస్త్రాలు సమర్పించటం ఆన వాయితీ గా వస్తోంది .స్టేషన్  నుంచి వీటిని ఊరేగింపు గా మేళ తాళాలతో తీసుకొని వచ్చి ,అమ్మ వారికి సమర్పిస్తారు .లక్షలాది భక్తులు ఈ ఆలయ ప్రవేశాన్ని ,కన్నులారా చూసి పులకిస్తారు .గ్రామ వీధుల గుండా ఈ ఉత్సవం సాగుతుంది .ప్రతి ఇంటి దగ్గర పసుపు ,కుంకుమ తో కలిపినా నీటిని ,అమ్మ వారు రాగానే ‘వార’లాగా పోస్తారు .కొబ్బరికాయ ,హారతి ఇస్తారు .భక్తులంతా ”వాలా ,వాలా ”అనే నినాదం చేస్తుండగా ఉత్సాహం గా ఊరేగింపు సాగుతుంది .కోలాటాలు ,భజనలు ,బాండ్ మేళాలతో ,రోడ్లన్నీ ప్రతిధ్వనిస్తాయి .కిక్కిరిసిన జనం తో , కోలాహలం గా వుంటాయి రోడ్లన్నీ .గండ దీపం పట్టు కోని ముఖానికి  పెద్ద కుంకుమ బొట్టు పెట్టు కోని ,కాళ్ళకు పసుపు రాసుకొని ,మహిళా మతల్లులు   అమ్మ వారి వెంట నడుస్తుంటే,ప్రతి స్త్రీ వీరమ్మ తల్లి లాగే కని పిస్తుంది .మెయిన్ రోడ్డు చేరిన అమ్మ వారు ఉయ్యాల స్తంభాల దగ్గర ఉయ్యాల లూగుతుంది .ఇక్కడ జంతు బలి వుంటుంది .తర్వాత మళ్ళీ బయల్దేరి ,తాను అగ్ని ప్రవేశం చేసిన చోట ,కట్టిన ఆలయంలో ప్రవేశిస్తుంది .ఇక్కడ పదిహేను రోజులుంది ,భక్తులను అనుగ్రహిస్తుంది .పశువులను చక్క గా కడిగి ,సింగారించి ,రైతులు తోలుకు వచ్చి ,గుడి చుట్టూ తిప్పుతారు .ఎడ్ల బండ్లను ,వాహనాలను ,ఆలయం చుట్టూ తిప్పి ,రక్ష గా భావిస్తారు అత్త వారింటి నుంచి బయల్దేరిన వీరమ్మ తల్లికి ,ఆలయం చేరా టానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతుంది .అంటే  మర్నాడు రాత్రికి కాని ఆలయ ప్రవేశం చేయలేదు .కొత్త బట్టలతో ,బోనాలతో ప్రతి ఇంటా పండగ వాతావరణమే .బంధు మిత్రుల రాక తో ఇళ్ళన్నీ పెళ్లి కళ ను సంత  రించుకోని శోభిస్తాయి .  .

This slideshow requires JavaScript.

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -01 -12 .

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం

కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం 

                                           దూర్వాస శాపం 
          
 కాళిదాసు రాసిన అభిజ్ఞాన  శాకుంతల నాటకం లో నాల్గవ  అంకానికి పరమ ప్రాముఖ్యత వుంది .ఈ అంకం లోను ప్రియంవద వ్యక్తిత్వావిష్కరణ జరిగింది .తాత పాదులు అంటే కణ్వ మహర్షి వస్తే ,ఆయనకు శకుంతలా దుష్యంతుల గాంధర్వం తెలిస్తే కోపగించు కొంటారేమో   నని సందేహిస్తుంది అనసూయ .ఇక్కడే అనసూయకు ,ప్రియంవడకు వున్న తేడా మళ్ళీ మనం గమనిస్తాం .తాత్కాలిక విషయాలలో ప్రియంవద బుద్ధి పాదరసం లా పని చేస్తుంది .చిట్కాలు చెప్పి అపాయాలు తప్పించ గలదు .అయితె దూర దృష్టి తక్కువ .అనసూయకు ఎక్కువ -పెద్దది కూడా కనుక సహజం .అందుకే కాష్యపుల విషయం లో ఒక స్థిర నిర్ణ యానికి రాలేక సందేహించింది .ప్రియంవద మాత్రం గౌతముడు ఒప్పు కుంటారని చెప్పింది .
         దూర్వాస మహర్షి శాప విధానం కూడా తమాషా గానే వుంటుంది .శకుంతలకుతెలియని   స్థితి లో ,మన్మదావస్థ  లో వున్నప్పుడు ముని ,ఆమెను శపిస్తాడు .ప్రియంవదకు శాప వృత్తాంతం తెలిసి ప్రధమ తప్పిదం కనుక చెలిని మన్నించ మని వేడింది .అంతటి కోపిస్టి మహర్షి చేతనే శాప విమోచనాన్ని చెప్పించిన నేర్పరి ఆమె .ఇక్కడ మనకే కాదు ,కాలిదాసుకు కూడా ప్రియంవద పైనే మక్కువ ఎక్కువని తెలుస్తుంది .ఆమె వ్యక్తిత్వాన్ని ఈ విధం గా పెంచి పోషించాడు కవి .దుర్వాసుని వద్దకు ప్రియంవడనే పంపటం శాప నివారణోపాయాన్ని ముని చేతనే చెప్పించటం ,ఆమె సమర్ధ త కు నిదర్శనం .శాపిష్టిమౌని ఎదుట nishkaapatyam గా ప్రవర్తించే సమర్ధత ఆమె కే వుంది అని నిరూపించాడు కవి .
                                 తాత పాదుల ఆగమనం 
        కణ్వ మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు .ఆయన శాకుంత లను దీవించిన విషయాన్ని ,కాళిదాసు ప్రియంవద చేతనే  చెప్పిస్తాడు .అయితే ,ఈ విషయం తమ ముగ్గురికే తెలుసు .మహర్షికి ,ఎవరు చెప్పారని అనసూయ  కు  అనుమానం వస్తుంది .అప్పుడు ప్రియంవద చెప్పిన సమాధానం అద్భుతం గా వుంది చూడండి -‘ఛందోమయ మైన వెద వాక్కు అతి పవిత్రమైన హోమ గుండం వద్ద పలుక బడింది ”.అంటుంది .ఛందోమయ మైన వాక్కు కు ,మహాత్మ్యం వుంటుంది .అది తిరుగు లేని సత్యం .పుట్ట బోయే  చక్ర వర్తి,గుణాతి శయం సూచింప బడింది . ఇంతకీ ఛందో వాక్యం ఏమంటోంది ?
 ”దుష్యన్తే నాహితం తేజో దధానం భూతయే భువః –అవేహి ,తనయాం ,బ్రహ్మన్నగ్ని గర్భాం శమీ మివ ”
            శకుంతల గర్భం లో ,సకల లోకాభ్యుదయం కోసం ,దుష్యంత వీర్యం -జమ్మి చెట్టు లో అగ్ని దాగి వున్నట్లు,వున్నది అని ఈ శ్లోక తాత్పర్యం .జమ్మి ,అగ్ని అనటం లో ఆ గర్భ ధారణ లోని ,పరమ పవిత్రతను గోచరింప జేశాడు కవి .ఆ తేజో వీర్యం తో జనించిన మహాపురుషుడు ,లోకారాద్యుడని  ,తెలుస్తుంది .సన్నివేశానికి తగిన ఔచిత్యం .ఔచిత్యానికి పరాకాష్ట కాళిదాసు కవిత్వం .పోలికలలో పవిత్రత ,చెప్పిన విషయం ఛందో బద్ధమై వుండటం అంటే Most scientific .దానిని  అశరీర వాణి ,పవిత్ర హోమ గుండం వద్ద పలకటం  కవికుల గురువు ప్రతిభకు పట్టాభిషేకం .భారతీయ జీవన విధానం లోని పరమ పవిత్రతను ,ఉదాత్త భావాలను అత్యంత ఉదాత్తం గా చెప్పవలసిన విధానాన్ని ,కాళిదాసు చక్కగా గుర్తించి ,ఆచరించి మార్గ దర్శి అయాడు .ప్రియంవద కణ్వ మహర్షి వద్ద ఉన్నప్పుడే ఆ ఛందో వాక్యం విని పించింది .ఆ వాక్యాన్ని ఆమె అలాగే భద్ర పరచుకొని ,తు.చ.తప్ప కుండా మిగిలిన వారందరికీ చెప్పింది .ఇక్కడ కూడా కవి ,ప్రియంవద కే అగ్రాసనం ఇచ్చాడు .
                                 వియోగ సన్నివేశం 
          శకుంతల అత్త వారింటికి ప్రయాణం అయింది .శకుంతలకు ,కణ్వాశ్రమ వనానికి వున్న అన్యోన్యాను రక్తి ని కాళిదాస మహా కవి ,ప్రియంవద చేతనే చెప్పించాడు .”శకుంతల వియోగం చేత లేళ్ళు ,దుఖం తో దర్భలను నోటి నుండి జార విడుస్తున్నాయి నెమళ్లు నృత్యం చేయటం మానే శాయి .లతలన్నీ ఎడుస్తున్నాయా అనట్లు పండు టాకులను రాలుస్తున్నాయి .వియోగ  దుఖాన్ని వనం లోని ,ప్రతి ప్రాణి యెట్లా అనుభావిన్చిందో ప్రియంవద కళ్ళకు కట్టి నట్లు వర్ణించింది -కాదు ,కాదు కాళిదాస మహా కవి ఊహించి ,వాచ్యం చేయించాడు ఆమెతో .ఇది అపూర్వ సన్ని వేశం .అన్యోన్యాను రాగ వర్ణనం కాలిదాసైక సాధ్యం అని పిస్తుంది 
          ఈ విధం గా కాళిదాస మహాకవి ప్రియంవద ను ప్రియాన్నే చెప్పేదానిగా ,శకుంతలకు కూర్మి చెలి కట్టే గా ఆమె మనోధర్మాన్ని గ్రహించి ,సందర్భోచిత సలహాలనిచ్చే నేర్పరిగా ,వ్యవహర్త గా ,అభిజ్ఞాన శాకుంతల మహా నాటకం లో సుప్రతిస్తితం చేశాడు .జీవత్వం తో తోన్కిస లాడిన పాత్ర గా ఆమె ను తీర్చి దిద్దాడు .
           ఇంత ప్రతిభా ,ఉత్పత్తులతో ఈనాటకాన్ని   రాశాడు కనుకనే ,జర్మన్ పండితుడు ,రచయిత ,కవి నాటక రచయిత ,విశ్లేషకుడు గోథె మహాను భావుడు ఈ నాటకాన్ని చదివి” ‘దివి భువి లను ఏకం చేసిన నాటకం ”అని ఆనందం పట్ట లేక నాట్యం చేశాడట .అలాంటి మహా నాటకం లో ఒక చిన్న పాత్రను నేను నా కు తెలిసిన మేరకు ఆవిష్కరించాను .
       మా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా నాన్న గారు స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు మాకు కాళిదాసు గారి రఘువంశ ,కుమార సంభావ కావ్యాలను అర్ధ తాత్పర్యాలతో సంత వేయించి నేర్పించారు .అందుకే వారికి ఈ వ్యాసాన్ని పిత్రూణం గా సభాక్తికం గా అంకిత మిస్తున్నాను .
               సంపూర్ణం 
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -01 -12 .


— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళిదాసు శకుంతల –4

 కాళిదాసు శకుంతల –4

                                             మన్మధ విజ్రుం భణ 
నాటకం  తృతీయాంకం లో శకుంతల విరహ వేదనను కవి వర్ణిస్తాడు .అందులో ప్రియంవద చిత్త వ్రుత్తి ని వెల్లడి చేసే సందర్భాలు అనేకం సృష్టించాడు కాళిదాస  మహా కవి . ఆమె శకుంతల హృదయాన్ని పసి కట్టే సింది . .వారిద్దరి చూపుల తూపుల లక్ష్యాలను ఎరిగి వుంది .అందుకే ,శకుంతల విరహం లో వుండగా ,అనసూయతో అన్నది ”రాజ ప్రధమ దర్శనం నుంచి ,మన చెలియ ఏమేమో అయి పోయింది .ఎందుకోసం ఇలా మనస్సుని కష్ట పెట్టు కొంటోంది ?”ఇక్కడ ప్రధమ దర్శనం అనే మాట వారి ఆంతర్యాన్ని మొదటి నుండీ తాను గమనించినట్లు స్పష్టం అవుతోంది .అప్పటి నుంచే ,వారిద్దరి ప్రవర్తన ను   ,తాను నిశితం గా పరిశీలించినట్లు తెలుస్తుంది .
అనసూయ బోళా శాంకరి .సఖినే అడిగి తెలుసుకొందాం అంది .చేలువురిరువురిలో ప్రియంవద చిన్నదే అయినా చెలికి ఇష్టురాలు .ఈ మన్మధా వస్థ ల సంగతి ఆమె కు తెలుసు .ప్రబంధ పథనం వల్లో ,పెద్దల వినికిడి వల్లో ఆమెకు తెలిసి వుంటుంది .చెలి వద్ద ఆమెకు చనువు బాగా ఎక్కువే .అందుకనే అంటోంది ”రోజురోజుకీ నీ అవయవ సౌందర్యం తగ్గు తోంది .లావణ్యం మాత్రం ఛాయా లాగా విడవ కుండా వుంది ”.అంటే ఇంకా మనసు లోని మాటను దాచటం దేనికీ ?హృదయం విప్పి ,మా వల్ల లభించే సాయాన్ని పొందు అని అర్ధం .శకుంతల ”మీతో కాక ఇంకెవరికి చెప్పుకోను ”?అంది .అప్పుడు వారిద్దరూ ”స్నిగ్ధ సంవిభక్తుం ఖలు దుఖం -సహ్య వేదనం భవతి ”అని వూరడిస్తారు
 మదన లేఖ 
అప్పుడు శకుంతల ,తన మనోభావాన్ని ,ఆవిష్కరిస్తుంది .రాజైన దుష్యంతుని వనాగమనం ,తన మనసులో వలపుల తొలి చిగురు వేసిందని తెలిపింది .నర్మ గర్భ అయిన ప్రియంవద కు ఉపాయాలూ ,మార్గాలు తెలుసు .అందుకే అనసూయతో ”ఇక -మన్మదావస్థ ను తొలగించాల్సిన సమయం వచ్చింది .రాజు అనురూప గుణాల చేత ,అభిలషనీయుడు  ”అంటుంది .దానికి సమాధానం గా అనసూయ ”సఖీ !నీ అనురాగం సార్ధకం .మహానది ,సముద్రాన్నే చేరుతుంది కదా !”ఇదంతా స్వభావ సిద్ధ మైన చర్య గా ఆమె భావించి అలా అన్నది .ఆమెకు అంతే తెలుసు .ప్రియంవద ఇలాటివి కాచి వడ పోసింది .ఆలన్కారికం గా ఆమెతో మహా కవి ఇలా అని పిస్తాడు ”కోవేదానీం సహకార మంతరే ణాతి  ముక్త లతాం పల్లవితా మర్హతి ”అంటే సర్వాంగ సుందరం గా చిగిర్చి,పుష్పించ నున్న పుష్పలత కు ,సహకార వృక్షం కాక వేరొకటి సరి పోతుందా ?”
అని భావం .తీయ మామిడి లోని గొప్పతనం ,ముక్త లత లోని సౌందర్య విలసనం ఒక దానికొకటి ఎంత చక్క గా సరిపోయాయో ,అలాగే ప్రియమైన మాటలతో కాళిదాసు గారి ప్రియంవద సాహితీ పిపాసు లకు తృప్తిని కల్గించే మాటలు అని పించాడు .
ఇలాంటి సందర్భాలలో చేయాల్సిన కార్య క్రమాలన్నీ ,పూర్వానుభవం వున్న ఆరిందా లాగా ప్రియంవద సిద్ధం చేసింది .శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి ,దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది .ఇందులో ఆమె నేర్పరితనం మనకు తెలుస్తుంది .భగవత్ ప్రసాదం గా ఇస్తే ,రాజు దాన్ని తిరస్క రించడు కదా కార్య సాధనకు అనువైన పధకం అది .చెలి మనో వేదనను తొలగించే మార్గం ,ఆ వ్యధను తెలియ జేసేందుకు చక్కని అవకాశం కల్పించింది ప్రియంవద .”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి  .”అని సూచించింది .అసలే సుకుమార మైన విషయం .అందుకే అత్యంతసుకుమార మైన  పద బంధమే ఔచిత్యం .అయినా శకుంతల సందేహించింది .ప్రియుడు అవధీరణం చేస్తాడేమో నని భయ పడింది .
మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు    ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది .ఇంత గాడ్హం గ మనసు లగ్నం అయినప్పుడే ,ఆమె హృదయ గత భావం కమ్మని గీతం గ వెలువడుతుంది అని ప్రియంవద యోచన .
మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన  పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప్రసాదాన్ని వుంచి ,పొట్లం లాగా మడిచి రాజుకు ఇవ్వ వచ్చు అని చెప్పింది .రాజు అక్కడికే వస్తాడు .ప్రియంవద నెమ్మది గా అంటుంది ”మీ ఇరువురి అన్యోన్య అను రాగం ప్రత్యక్షం అయాయి .అయినా మాచేలి యందలి ఆత్మీయత చేత నేను మళ్ళీ చెబుతున్నాను ”అని రాజ ధర్మాన్ని ,ఆయనకు గుర్తు చేసింది .ఆర్తి లో వున్న వారి ఆర్తి పోగొట్టటం రాజ ధర్మమే కదా అని భావం ”మా ప్రియ సఖి మన్మధ బారి పడింది .ఆమె ప్రాణం నిలప టానికి మీరే అర్హులు ”చాలా చిన్న చిన్న మాటలే .అందులో దుష్యంతుని పై శాకున్తలకున్న అవ్యాజ మైన ప్రేమను వ్యక్త పరుస్తూ మనమ్ధుని పీడా నుంచి ఆమెను కాపాడమనీ ,ఆమె చాలా కృశించి పోయి ఉందనీ ,ప్రాణాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ జ్ఞాపకం చేసిందన్న మాట .ఆమె ప్రాణం కాపాడటానికి అతడే సమర్ధుడు అని నిర్ద్వంద్వం గా చెప్పేసింది .ఇక్కడే ప్రియంవద నేర్పరి తనం మరో సారి కాళిదాసు మనకు వ్యక్తం చేశాడు .
ముందుగా శకుంతల కొంత తొందర పడ్డా ,తారు వాత సంయమనం చూపించింది .రాజుకు అనేక మంది భార్యలు ఉంటారనీ ,వినే వుంటుంది కనుక ,అంతఃపుర స్త్రీ లలో అంటే జనానా లో తన స్థానం ఏమిటో తెలుసు కోమని ప్రియంవద ను కోరింది .రాజు ,అవసరానికి తగిన వాగ్దానాలు చేశాడు .మిగిలిన కార్య క్రమం అంతా పూర్తి చేశారు చెలులు .ఇక అక్కడ తమ అవసరం లేదని గ్రహించారు .వారిద్దరినీ ఏకాంతం గా వుంచటం భావ్యం అని ప్రియంవద భావించింది ..అందుకే అటూ,ఇటూ ద్రుష్టి సారించి ”పర్యుత్సుకో మృగ పాతకో మాతర  మన్వేషతే ”అని అంటూ ,అక్కడినుంచీ జారుకున్నారు .ఇందులో భావం -తల్లి కోసం మగ లేడి పిల్ల బెంగ పెట్టు కొంది అని అర్ధం .భవిష్యత్తు లో భరతుడి జననాన్ని ,సూచించాడు .ఆతని కోసం వెదికే పరిస్థితి తెలిపాడు .గాంధర్వ వివాహం ఫలితం గా భరత వంశ శ్రేష్టుడు ఉద్భావిస్తాడని సూచ్యార్ధ సూచన చేశాడు కాళి దాసు .శకుంతలా దుష్యంతుల కోర్కె లీడేరి పుత్రోదయం జరుగు తుందని కవి కుల గురువు కాళిదాసు గారి కమ నీయ కవితా ప్రవచనం అది .ఆయన ప్రతిభ కు ప్రబల ఉదాహరణం గా ఈ వాక్యాన్ని విశ్లేషకులు ఉదహరిస్తారు .
సశేషం
Posted in రచనలు | Tagged | Leave a comment

వృద్ధాప్యం వచ్చినట్లే …

Posted in కవితలు, సేకరణలు | Tagged | Leave a comment

ఇక ఏ జన్మ కైనా ఇలాగే .. ఆంధ్ర జ్యోతి లో….

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జిందాబాద్ స.జ.స.–కవిత

జిందాబాద్ స.జ.స.–కవిత 

                                 కవి -ఏ.ఏం.ఏం.కుమార్
 అతని పేరు సదానందం -అవుతూంటాడు సమశ్యలతో సతమతం
అతని భార్యకు బి.పీ.షుగర్,ఓబీసిటి –సీరియల్స్ చూస్తుండగానే సస్పెన్సులో  ఆపేయటం
–        పిండి రుబ్బటానికి గ్రైన్దర్, పొడులకు మిక్సీ  –మాసిన బట్టలకు వాషింగ్ మషీన్
శారీరక శ్రమ లోపించటం -నిర్ధారించారు డాక్టర్లు సవా లక్ష టెస్టులు చేసి
ఇక ,పుత్రరత్నం స్కూల్ వదిలి ఇంటికి రాగానే -హోమ్వర్క్ ఎగ్గొట్టి కార్టూన్ నెట్ వర్క్
పుత్రికా మణి ,సౌందర్యాన్ని పెంపొందించే చానెళ్ళు -ఏం తింటున్నారో ,ఎంత తింటున్నారో తెలీకుండా
టి.వి.ముందు కూర్చొనే భోజన కార్యక్రమాలు -బద్ధ కానికి మరో పేరు ఆ భీమ ,భామలు
కొన్ని రోజులుగా సంతోషం గా చలాకీగా -సదానందం లో చెప్పలేని మార్పు
రెండు చార్జి లైట్లు కొన్నాడు -ఆయన భార్యకు బి.పీ.షుగర్ నార్మల్ కొచ్చింది
రుబ్బు రోలు రుబ్బటం తో ,బట్టలు స్వయం గా వుతుక్కోవటం తో
పని మనిషి చీకట్లో అంట్లు  తోమనని భీష్మించింది
ఆమెకిప్పుడు శారీరక శ్రమానందం తెలిసింది
పిల్లలకు టి.వి.బంద్,–చార్జి లైట్ వేలుగులూనే
పాపం హోమ వర్క్ సాగిస్తున్నారు ఇంటికి రాంగానే
అందరు కలిసి కబుర్లాడుతూ డైనింగ్ టేబుల్
భోజనాలతో మితం గా హితం గ  తింటున్నారు .
పెందరాలే నిద్రకుపక్రమిస్తున్నారు

     మాయో ,మంత్రమో వేసినట్లు స్మార్ట్ గా తయారయారు
ఇంతకీ వీటన్నిటికీ కారణం కరెంటు కోత
జేబు చిల్లు పడ కుండా బిల్లు కూడా చిక్కి పోయింది
కోత ఇబ్బంది పెట్టినా ,అందరికీ లాభాలే చేకూరాయ్
ఇన్ని లాభాలుంటే ,నిరసన దేనికన్నాడు సదానందం
అందుకే కొత్త పల్లవి ఎత్తు కొన్నాడు జిందాబాద్ కరెంటు కొతా
జిందాబాద్ స.జ.స.-స.జ.స.,స.జ.స.అంటూ వీరంగం వేశాడు .
ఇంతకీ దీని భావమేమి తిరుమలేశా అంటే సకల జనుల సమ్మె
అని సన్నాయి నొక్కులు నొక్కాడు సదానందం,చిదానందం గా .

Posted in కవితలు | Tagged | Leave a comment

కాళిదాసు ప్రియంవద –3

 కాళిదాసు ప్రియంవద –3

                                              బాకీనెపం 

 దేనికైనా తగిన సమాధానం చెప్పటానికి ప్రియంవదే   ముందుంటుంది .నేర్పుగా ”ఆర్య ధర్మ చరోపి -పరవశం జనహ్గురొహ్ పునరేతస్యా అనురూప వర ప్రదానే సంకల్పః ”అన్నది .”మా చెలి అస్వతంత్ర -తండ్రి కాష్యపులు తగిన వరుని చూసి ,వివాహం చేయాలను కొంటున్నారు ”అని చెప్పింది .దుష్యంతుడికి కావలసిన సమాధానం లభించింది .అనురూప వరుడు తానే అనీ నిశ్చయం కల్గింది .ఆమెది క్షత్రియ జన్మే అని రూధి   అయింది .కనుక ప్రయత్నం చేస్తే తప్పేముంది అను కొన్నాడు .అయితే శకుంతలకు మాత్రం ,తన వివాహ విషయ ప్రశంస చేయటం ,అందులో అపరిచితుడి తో చేయటం నచ్చ లేదు .రోషం కూడా వచ్చేసింది .”గౌతమి తో చెప్తాను ‘అంటూ  ,వెళ్ళటానికి బయల్దేర బోయింది . అతిధులను వదిలి అలా వెళ్ళటం ఆశ్రమ వాసులకు ధర్మం కాదని ప్రియంవద వారించింది .వినకుండా మళ్ళీవెళ్ళ బోతే   ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తూ వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది .”ఎందుకు ?”అని ఆమె ప్రశ్నిస్తే ,”వృక్ష సేచనే ద్వేమే దారయాసి తస్మా దేహి –తావదాత్మానం మోచయిత్వా తతో గమిష్యతి ” –వనం లో చెట్లకు నీరు పోసే కార్యక్రమం లో ,ఎవరి వంతు వారు నీరు పోయాలి కాని శకుంతల రవిక సవరించేతప్పుడు ,వనజ్యోత్స్న ను పరవశం తో చూసే సందర్భం లో ,నీరు పోయటం లో వెనకబడింది ఆ సంగతి గ్రహించిన ప్రియంవద కు ఇప్పుడు గుర్తు చేసి ,”ఆ రెండు చెట్లకు నేను నీళ్ళు పోశాను నా బాకీ తీర్చి వెళ్ళు ”అన్నది .రాజు ఈ మాట విని కరిగి పోయాడు .లతా లాగా కోమలం గా వున్న శకుంతల కండి పోతుందని బాధ పడ్డాడు .”ఇప్పటికే ఆమె ఘతోదకం మోసి ,మోసి అలసి పోయింది ఇదిగో ఈ బహుమానాలన్నీ తీసుకొని ,ఆమెను పరిశ్రమ నుంచి విముక్తి కల్గించండి ”అంటూ ,ఆ తొందరలో ,తన వెలి ఉంగరాన్ని ఇవ్వ బోయాడు .అంతకు ముందే అతను తనను తాను పరిచయం చేసుకొన్నా విధానం మర్చిపోయాడు .పారవశ్యం లో పది పోయాడు .తన స్తితి ని మర్చి పోయాడు .ఘటికులైన చెలులు ఉంగరం పై వున్న దుష్యంతుని పేరు చూసే శారు ఈలోగానే .ఇద్దరు అసలు విషయం పసి గట్టె శారు .
  వచ్చిన వాడు సాక్షాత్తు మహా రాజే నని తెలిసి తమ చెలి భాగ్యం పండింది అని సంబర పడ్డారు .ఇప్పుడు అవస్థ దుష్యన్తుదిడైంది .కంగారు లో ”నన్ను రాజుగా భావించ వద్దు .రాజాజ్న ను నెర వేర్చ టానికి వచ్చిన వాడినే కాని రాజును కాను” అని నొక్కివక్కాకించాడు .బొంకాడు  అని అర్ధమైంది వీరికి .వీళ్ళ వద్ద ఆతని కబుర్లేమీ పని చేయలేదు .ఆవలిస్తే పేగులు లెక్కే సే రకం చెలులు .దీనికి సమాధానం గా ప్రియంవద తో కాళిదాసు చెప్పించిన సమాధానం చూడండి —
”తేనహి నార్హత్యేతదంగులీయకం అంగుళీ వియోగ మార్యస్య –తవ వచనే నైవ -అనృనా నామైషా సఖీ సకున్తలే -మోచితాన్యను కంపి నార్యేన -అదివా మహా రాజెన గచ్చాదానీం ”సొగసు అంతా ఈ వాక్యం లోనే నిక్షిప్తమై వుంది .మహా రాజు గుట్టు రట్టయింది .బొంకేందుకు ఇంక అతనికి అవకాశం ,వ్యవధి ఇవ్వ కూడదని నిశ్చయించు కొంది .అయ్యా ”అంగుళీయకం తమ అంగుళి నుండి ,వియోగం చెంద వలసిన పని లేదు .తిరిగి స్వీకరించండి ‘అంటూ ,శకుంతలతో ”అనుకంప వల్ల విడిచి బెట్ట బద్దావ్.పోనీ మహారాజు దయ వల్లే ననుకో ”అంటుంది .”ఆర్యేన అని సంబోధించి ,”మహారాజేన ”అని అనటం తో రాజు బొంకి నట్లు ,తాను నిజాన్ని గ్రహించి నట్లు తెలుస్తుంది అందరికి .రాజు చేత విడువ బడ్డావు అనటం లో ,అంగుళీయక వియోగం అనటం లోను భావి కధా సూచన  తెలియ జేసే చక్కని పదాలను ఎన్నిక చేసి వాడాడు కాళి దాస మహా కవి .
         ఈ విధం గా ,కదాగామనానికీ ,భావి సూచనకు ప్రియంవద ను తీర్చి దిద్దాడు కవికుల గురువు .రాజు గా గుర్తించినందుకు శకుంతల ఆత్మ గతం గా సంతోషించింది .ఊరికే తమాషా గా ఊరడింపు గా ,”నన్ను విడి పించ టానికీ ,కట్టెయ్య టానికీ నువ్వేరవు  ”? అని అంటుంది .’దీని భావం రాజు దుష్యన్తునికే ,ఆ సామర్ధ్యం వుంది,మధ్యలో మీ రెవరు ?అని అర్ధం . మిగిలినవి ఈ సారి .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .

Posted in రచనలు | Tagged | 1 Comment

కాళి దాసు ప్రియంవద –2

    కాళి దాసు ప్రియంవద –2

                                         బంభర విజ్రుం  భణ  
ఇంతలో తుమ్మెద మూగింది .అందులోను ,గండు తుమ్మెద .శకుంతలను అల్లరి పెట్టటం ప్రారంభించింది .”రక్షించండి ,రక్షించండి ‘అని ఆమె ఆర్తి తో ఎలుగెత్తి అరిచింది .అప్పుడు చెలికత్తె లిద్దరూ ,యెగతాళి పట్టించారు .”కే ఆవాం పరిత్రాయం దుష్యంత మాక్రందస్వ ,రాజం రక్షితవ్యాని తపోవనాని నామ ”అన్నారు .ఆమెకు భయం .వీరికి ఎగతాళి .మనసులో ఊహించుకొంటే ,ఆ ఘట్టం భలే  మజా గా వుంటుంది .అక్కడ దుష్యంత మహా రాజుకు తననే స్మరిస్తున్నారనే ధీమా .దాని వల్ల లోలోపల ఆనందం .ఈ రెంటినీ మేళవించి   కాళిదాసు తన ప్రజ్న ను చూపించాడు .ఇంతకీ చెలికత్తె లేమన్నారు ?”ఎవరు రక్షిస్తా రమ్మా !దుష్యంతుని పిలువు .తపోవనాన్ని రక్షించేది మహా రాజే కదా !”.సమయం చూసి దుష్యంతుడు బయట పడే మంచి సన్ని వేశం .కవి నేర్పు నిరుప మానం అని పిస్తుంది .గేలి చేస్తూ యెగతాళి గా అన్న మాటలు నిజమే అయాయి .ఈ చిన్న పాత్రల ద్వారా తాను సాధించి చూపించ వలసిన్దంతా అభి వ్యక్తీకరించాడు .హాశ్యం తోనే ,అంతులేని నాటక కళా మర్మాన్ని విశదీకరించిన మహా భావ కవి కాళిదాసు .
మహా రాజు పొద చాటు నుండి బయట పడ్డాడు .పౌరుష    వచనాలు పల్కుతు ,తుమ్మేదను పార దోల్తాడు .ఎవరో రాజ పురుషుడు వచ్చాడని శకుంతలా ,సఖులు ఆయనకు స్వాగతం చెప్పారు .విషయాలన్నీ వివరం గా మాట్లాడు కోవ టానికి అనువైన స్థలం కావాలి కదా .ఇక్కడే మాట్లాడటం సందర్భోచితం కాదు .
    సప్తపర్ణి  ఛాయల్లో 
ప్రియంవద ,తెలివిగా ,ఏడాకుల అరటి ”సప్తపర్ణి”చెట్టు కింద కూర్చొని ,మాట్లాడు కోవచ్చునని సూచించింది .బడలికా తీరుతుందీ ,నీడా వుంటుంది ,సవివరంగా సంభాషించుకోనూ వచ్చు .”తేనహి అస్సాం ప్రచ్చాయ శీతలాయాం ,-సప్తపర్ణ వేదికాయాం ఆర్య ఉపవిశ్య.-పరిశ్రమ వినోదం కరోతు ”అన్నది సాభిప్రాయం గా .అసలే వేసవి .రాజు ఎండకు బడలిక చెందాడు.కనుక దట్టమైన నీడ  కావాలి .ఆ ప్రదేశమే సప్తపర్ణి చెట్టు కింద అరుగు .ఆ చెట్టు సౌరభం ,చల్లదనం ,మానసిక గ్లాని లను దూరం చేస్తాయి .ఆహ్లాదం కల్గుతుంది .వీటన్నిటినీ ద్రుష్టి లో వుంచుకొనే ప్రియంవద ఆ మాట అన్నది .ఆమె చాతుర్యానికి అబ్బుర పడుతాం . .కవి చాకచక్యానికి జోహార్ అంటాం .
ప్రియంవద చాలా లోకజ్ఞానం కలది .అనుమానం వచ్చి ,అనసూయను ప్రక్కకు పిలిచి ,వచ్చిన వాడు రాజ బంధువు గా కని పించటం లేదు సాక్షాత్తు దుష్యంత మహా రాజు గారే వచ్చారు అని తెలిపింది .త్వరగానే ,తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది .ఏదీ దాచుకొనే స్వభావం కాదామెది .వెంటనే అన్నది ”చతుర గంభీరాకృతి ర్మధురం -ప్రియ మాలపన్ప్రభురివ దృశ్యతే ”ఆకారం ,మాట ,రాజు అనే అనుమానాన్ని నిరూపిస్తున్నాయి .అనసూయ ఆయనతో తనను తాను  పరిచయం చేసుకోమని ,ఆయన్ను కోరింది .మహా రాజు తాను మహా రాజు తరఫున ,ఆశ్రమ ధర్మ నిర్వహణ విషయమై ,పరిశీలనకు వచ్చిన వాడిని అని చెప్పు కొంటాడు .అప్పుడు అనసూయ అన్నది ”స నాదా ఇదానీం ధర్మ చారిణః ”అంటే -ధర్మ చారిణులకు తగిన సమయం లో సనాదుడ వైనావు .అంటే ఆపద లో వున్న అబలలకు సహాయం చేశావనీ ,నీకు కాబోయే సహ ధర్మ చారిణి  లేవయ్యా నీవే నాదుడివి కూడా అని ద్వంద్వార్ధం గా చెప్పింది .కొంత వయసులో ప్రియంవద కంటే పెద్దది కనుక జాణ తనం చూపింది .ఆమె అన్న మాటలన్నీ సాభిప్రాయాలే .దుష్యంతుని కోరిక తీరు తుందని సూచ్యార్ధ సూచన . గంభీర మైన అర్ధాన్ని ,ఆ మాటల్లో జ్యోతకం చేయించాడు కవి .
     వలపు తేట 
అనసూయ ,ప్రియంవద లు ఒకరికి మించిన వారిన్కొకరు .శకుంతల లజ్జావనత మైంది .శకుంతలా దుష్యంతుల ఆకార వికారాలను త్రుటి లో గ్రహించారు వారిద్దరూ .వలపు ల జ్వాల రగుల్తోందని తెలుసు కొన్నారు .శకుంతల తో వారు ”సఖీ శకున్తలే !యద్యత్రా దయ తాతః సన్నిహితో భవేత్ ”అన్నారు .”నాన్న గారే వుంటే ఏం చేసే వారో ఇప్పుడు ”ఇది కదాగామనాన్ని వేగం చేసే మాట .అంటే తండ్రి గారు చేయాల్సిన పని నువ్వే చేయాలి అని చెప్పకుండా చెప్పటం .ఆమె లోపలి భావాన్ని వ్యక్తీకరించా టానికి తగిన మాట కూడా .ఇద్దరి హృదయ భావాలను  వెలికి తీసి,వలపు ను నాటి ,ప్రోది చేసే మాట .శకుంతల కు చిరు కోపం వచ్చింది .”వుంటే ఏం చేసే వారు “?అంది బుంగ మూతి పెట్టి .సఖులు దేవాంతకులు కదా వెంటనే అందుకొన్నారు .’ఇదం జీవిత సర్వస్వేనా వ్యతి దారో క్రుతార్దీ కరిష్యతి ”అన్నారు .స్త్రీ సహజ మైన మాటలు ఇవి శకుంతలకు వచ్చిన కోపానికి ”మేమేం చేశామమ్మా అంత కోపం ”అన్నట్లు వుంది.ఇంతకీ వాళ్ళ మాటల్లోని అర్ధం తెలుసోవాలి  .”నాన్న  గారే వుంటే ,తమ జీవిత సర్వస్వాన్ని -అంటే శకుంతలను అతిధి కి సమర్పించి వుండే వారు ”అని భావం .ఆమెనే సమర్పించి  వుండే వారు అని .లోని  అర్ధం .ఈ మాట ఆమె మనసు లోని కోరిక తీరే మాట .ఆమె చెవులకు ఇంపైన మాట .కర్ణ రసాయనం ప్రేయసీ ప్రియుల మనో గతాలను అతి స్వల్ప కాలం లో అవగతం చేసుకొన్న ఇష్ట సఖియలు వారిద్దరూ .సార్ధక నామ దేయులైనారు .
శకుంతల మళ్ళీ కోపాన్ని అభినయిస్తూ ”మీ మనసు లో ఏదో భావం వుంచుకొని ,మాట్లాడు తారు ”అన్నది .రాజు మనోభావాన్ని ప్రియంవద తక్కున(THAKKUNA ) గ్రహించింది .శకుంతల ముఖ కవళికలను గ్రహించింది .వలపు చిగురు తొడిగిందని అర్ధమయింది .రాజుతో నర్మ గర్భం గా”మళ్ళీ ఏదో చెప్పు బోతున్నారు “‘అంది అర్దోక్తిగా అతన్ని బయట పడేసింది .శకుంతల కోపం తో అంగుళీయకం తో బెదిరిస్తోంది .ఇక చాలు కట్టి పెట్టండి అనే భావం తో .
శకుంతలా జన్మ వృత్తాంతాన్ని దుష్యంతుడు వీరి వల్ల విని ఆమె సచ్చరిత్ర ”పారాయణం ”లా వుంది అన్నాడు .ఆమెను గురించి ఇంకా ఏదైనా అడగ వచ్చా అని అంటూనే ”మీ చెలి మన్మధ వ్యాపారాన్ని విసర్జించే తపస్సు వివాహం వరకే చేస్తుందా ?లేక -ఆజన్మ బ్రహ్మ చారిణి లా వుంది ,లేడి పిల్లతో వన వాసం లోనే ఉంటుందా ?అన్నాడు .వారి వలపు ఎలా పండిందో తరు వాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .
Posted in రచనలు | Tagged | Leave a comment

మూసీ లో కీర్తి శేషు పి. వి

డిసెంబర్ లో విజయ వాడ లో  కవయిత్రి, కధా రచయిత్రి శ్రీ మతి కోపురి పుష్పా దేవి గారు ,తన పుస్తకావిష్కరణ సందర్భం గా చేసిన సత్కారం .ఇందులోని ప్రముఖులు -ఎడమనుంచి శ్రీ నండూరి రాజా గోపాల్ -చినుకు మాస పత్రిక సంపాదకులు- ,శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు ప్రముఖ కవి ,విమర్శకులు -,శ్రీ విహారి ,xప్రసిద్ధ కవి కధా రచయిత ,విమర్శకులు -శ్రీ కొల్లూరి,

క్ష్రయ్పత్రిక సంపాదకులు -పుష్పాదేవి కుమారుడు -పుష్పా దేవి ,ఆమె భర్త ,వారి కుమారుడు
Posted in సేకరణలు | Tagged | 1 Comment

కాళి దాసు ప్రియంవద -1

కాళి దాసు ప్రియంవద -1 

కవికుల గురువు కాళిదాసు ”అభిజ్ఞాన శాకుంతలం ”నాటకం లో తన అమృత కవితా  సంపదను నిక్షిప్తం చేశాడు .కవిత్వం పలు పోకడలు పోయి ,దివి భువులను ఏకం చేస్తుంది .భారతీయ జీవన విధానం యొక్క ఉత్రుష్టతను చాటి చెప్పిన నాటకం .ప్రేమైక జీవులు ప్రేమ మైకం లో పడి ,బాధ్యతలను ,గృహస్తాశ్రమ ధర్మాలను  విస్మరించ రాదనీ యెలు గెత్తి చెప్పాడు మహా కవి .ఇందులో ఆయన చిత్రించిన నాయికా నాయకులు ,శకుంతలా దుష్యంతులు సాహిత్యా కాశం లో చిర కాలమ్ ప్రకాశించే ధ్రువ తారలు గా నీలి చారు .ప్రధాన పాత్రల విషయం లోనే కాదు ,అతి సామాన్య పాత్రలను కూడా ,వ్యక్తిత్వం తో నిండి వున్నట్లు ,అతి శ్రద్ధగా పోషించారు .ప్రతి పాత్రను ,ఔచితీ యుతం గా  ,నిర్దుష్టం గా మలిచిన మహా శిల్పి కాళి దాసు .ప్రస్తుతం శాకుంతల నాటకం లో శకుంతల చెలి కత్తె ”ప్రియంవద ”పాత్ర నిర్వహణ లో కాళిదాసు చూపిన ప్రతిభా పాటవాన్ని వివరించటమే ఈ వ్యాసం ధ్యేయం .ఎవరి దృష్టీ సోకని పాత్ర ప్రియం వద  .1974 లో వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు విద్యార్ధి ”మాస పత్రిక లో ప్రచురిత మైంది .ఇప్పుడు మీ కోసం .

 వల్కలా శిధిలం 

నాటకం మొదటి అంకం లో దుష్యంత మహా  రాజు కణ్వా శ్రమం ప్రవేశించి ,ఆశ్రమ వాస విశిష్టతను అభినుతిస్తూ న్న సమయం లో శకుంతల ,తన ప్రియ చెలి కత్తెలు అనసూయ ,ప్రియంవద లతో ,చెట్లకునీళ్ళు  పోయటానికి రాగా వారిని చెట్టు చాటు నుండి చూస్తాడు .శాకున్తక్ల స్తన వల్కలం శిధిల మైంది .మళ్ళీ ముడి వెయ్య మని ప్రియంవద ను కోరింది .ఇద్దరు చెలికత్తె లలో చిన్నదీ ,చిలిపిదీ అయిన ప్రియంవద ”అత్ర పయోధర విస్తారయిత్రు మాత్మనో ,యౌవన ముపాలభస్వ.మాం కిం ఉపాలభసే ” అంటుంది .అంటే ,ఇంతకు ముందే నీ స్తన వల్కలం బిగించాను .ఇంతలోనే పాలిండ్లు పొంగాయా ?”అని మేల మాడింది .ఇక్కడ ఆమె రాజును చూడక పోయినా ,ఒక ప్రియా కర్షణ శకుంతలను ఉత్తేజితం చేసినందు వల్ల ,వల్కలం ముడి జారి పోయిందని  పరోక్షం గా మనం గ్రహించాలి .

      లతాసనాధం 

ప్రియంవద ,శకుంతలను పొగడ వృక్షం కింద కూర్చోమని చెప్పింది .ఆమె అలాగే కూర్చుంది .వెంటనే ప్రియంవద ”త్వయా ఉపగతాయా లతాసనాద ఇవ ,అయం కేసర వృక్షః ప్రతి భాతి ”అని  నవ్వుతు అంది .దీని అర్ధం ”నువ్వు దగ్గర వుండటం వల్ల ,తీగేతో కూడిన దాని లాగా ,ఈ పొగడ చెట్టు ప్రకాశిస్తోంది ”అని .ఇక్కడ మహా కవి ”లతాసనాద”అనే శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించాడు .ముందు జరుగ పోయే ఘట్టానికి తగిన మాట ఇది .ఒక సూచన ,ఒక చిహ్నం .భావి శుభ సూచన ఇక్కడ ధ్వనిస్తోంది తీగకు చెట్టు ఆసరా అంతే కాదు ,ఆ రెంటి కూర్పునేత్రానందం   కూడా .”లతా ”అంటే తీగ ను స్త్రీ మేను తో పోల్చటం కవులకు ఆచారం .అదో ప్రతీక .ఈ మాట విన్న శకుంతల ”అందుకే నువ్వు ప్రియంవద వై నావు ”అంటుంది ఈమె కూడా నర్మ గర్భం గా .అంటే ఆమెకూ ఈ మాట ఆనంద దాయకం గానే ఉందన్న మాట .కళ్యాణ ఘడియ దగ్గర పడిందని ,మనకూ సూచన కూడా .చెలికి ఇష్టమైన  ప్రియాన్ని మాట్లాడు తుంది కనుక ఆమె ప్రియంవద అయింది .శకుంతల కు   ఈ మాట ”సౌభాగ్య ప్రశంస ”గా వుంది .దుష్యంతుడు చెట్టు చాటునే వుండి అంతా గమనిస్తూనే వున్నాడు .”ప్రియంవద నిజమే చెప్పింది ”అని మురిసి పోయాడు .ఆయన మనసు లో వున్న కోరికను కూడా కవి మనకు తెలియ బర్చినట్లే .

  వనజ్యోత్స్న 

ఆ వనం లో ”వనజ్యోత్స్న ”అనే లతను శకుంతల చాలా మురిపెం గా పెంచు కొంటోంది .ఆ మాట అర్ధం వనాకినే వెన్నెల .ఆ లత ,బాల సహకార శాఖను ఆలంబనం గా చేసుకొని ,వనానికి నిజం గానే వెన్నెల పూయిస్తోంది .ఆ లత అంటే శకుంతలకు ప్రాణం .అదే ఆమె బహిప్రాణం .తన కళ్ళ రెప్పల్ని చూసుకున్తున్నాంత జాగ్రత్త గా దాన్ని చూసు కుంటుంది .ఇప్పుడు తదేక ధ్యానం తో రెప్పలార్ప కుండా ,ఆ లతను వీక్షిస్తోంది .ఈ విషయాన్ని ప్రియంవద వెంటనే పసి కట్టేసింది .ఇంకో చెలి కత్తె అనసూయతో ”సఖీ అనసూయే -ఆపి జానాపి కిన్నిమిత్తం -శకుంతలా వనజ్యోత్స్నం -అతి మాత్రం పశ్యతి ?”అని మేల మాడింది .అనసూయ ఈమె కంటే పెద్ద దైనా ,మాయా మర్మం తెలీంది .”నాకేం తెలీదు .నువ్వే చెప్పు ”అంది అమాయకం గా .మంచి చాన్సు లభించింది ప్రియంవద కు చాలా నేర్పుతో సందర్భోచితం గా ”యధా వన జ్యోత్స్నా అను రూపేణ ,పాదపెన సంగతా ,ఆపి నామైవ మహామపి ఆత్మనో ,రూపం వరం లభేయ మితి ”అంది కొంటె కోణంగి ప్రియంవద .ఇందులోని భావం ”వనజ్యోత్స్న కు ఎలా అనురూప మైన ఆధారం లభించిందో ,తనకు కూడా అలాగే లభిస్తుంది కదా “‘.ఇది పుంభావ సరస్వతి కాళిదాస మహాకవి కావ్య సృష్టి లో అద్భుత ,అపూర్వ ఘట్టం .ఆ మాటలు దుష్యంత మహా రాజు వింటూనే వున్నాడు కదా .అతని హృదయం లోను కళ్యాణ ఘంట మోగింది .శాకున్తలకూ మిక్కిలి ప్రియం గానూ వుంది .గుండె లోతుల్లోని కోర్కె కొంటెగా బయట పడింది .ఆమె నాయిక కదా .అంత తేలిగా బయట పడదు .అందుకని సిగ్గు తో మాట వరుసకి శకుంతల ఆమె తో ”ఆ!అది నీ మనసు లోని కోరిక ,అనవసరం గా నాకు అంట గడు తున్నావు ”.అంది .అందరు ఆ మాటకు కడుపారా నవ్వు కున్నారు .నిజం గా శకున్తలే ఆ వనానికి ”జ్యోత్స్న ”.ఇదీ కాళి దాసు గారి మహా నాటక నిర్వహణ .మరిన్ని విషయాలు మరోసారి .

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ధీర వనిత రాణిమా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పద్య పుష్పకం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శుభా కాంక్షలు —పద్య కవిత

శుభా కాంక్షలు —పద్య కవిత —

                                         కవి -శ్రీ ఓగిరాల వెంకట సుబ్రహ్మణ్యం 

—  01 -”సరస భారతి ”సాహిత్య షడ్రుచులను 
           పిండి ,వడబోసి ,నోళ్లకు దండి గాను 
           అంది ఇచ్చేడు హంగుల పాత్ర యనుచు 
           నెల్ల రుప్పొంగి పొగడ వర్ధిల్లు గాత .
   02 –  చెవులకు నింపు గొల్పెడి 
           కువులున్దిరివ్యాస ,గీత ,కధలన్ 
           నవ రసముల యశమును 
           భవితను ఉయ్యూరు పురము భాసిలు గాతన్ 
  03 –   శ్రీ కార మైన భారతికి శ్రేయమోసంగును తెల్గుభాష ,ఏ 
           వాకున విన్ననున్ ,మొగలి వాసన వోలె భ్రమింప జేయుగా 
           ప్రాకట మైన మీ ”సరస భారతి ”వెల్గులు జిమ్మ ,నవ్వియే 
           సోకినా నెల్ల వారలకు శోభలు దేచ్చును సుప్రభాతమై .
 04 –    అజ్ఞానము పోనడచుచు 
           విజ్ఞానము పెంపు జేయు విధముగా ,విషయాల్ 
           విజ్ఞత జది వెడి వారల ,
           కు ,జ్ఞానము నందు గాత ,కొంగున పసిడై 
  05 –   విద్య ,విజ్ఞాన సంస్థలు వెల్లి విరియు 
           ఇక్షురస మాధురీ వృక్ష కక్ష్య లోన 
           వెలసే యంత్రము ,నందు లోన వేల ప్రజలు 
           విధులు నెర వేర్చి ,బ్రతుకులు వెళ్ళ బుచ్చ 
           నట్టి పుర మౌర !ఉయ్యూరు గట్టి తనము 
   06 –  తెలుగున పెక్కు సంచికలు ధీర తనంబున వెల్వరించు 
           వెలుగు నొసంగ గల్గుదురు విద్యలు నేర్చేడి బాల కోటికిన్ 
           లలితములైన భావముల లబ్ధిని గోరి,నూతన  వత్సర 
           మ్మిల సుఖ శాంతుల న్నిడేడు  రీతిని నెల్లరు స్వాగతిన్చుడీ .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

బ్రిటన్ లో తెలుగు బ్రౌన్ – గూటాల కృష్ణ మూర్తి

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తెలుగు కధ సజీవం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం -కవితలు -3 (చివరిది )

     హాస్య కవి సమ్మేళనం -కవితలు -3 (చివరిది ) 

                               నేను సైతం –రచన –మాది రాజు శ్రీని వాస శర్మ 

కవిత చెప్ప మంటారా?-చెప్పక చస్తానా
 కవిత హృదయం ఒకటి ఎడ్చిన్డిగా -ఓయబ్బో
నీ మనసు సున్నితమా ?నీ మనసు మత్తెక్కిన మదపు టేనుగని గుర్తించు
వెంటనే -భక్తీ ,వైరాగ్యం అనే తాళ్ళతో నారాయణుడి పాదాలకు కట్టి పడేయ్
ఇంతటి తో నీ పని అయి పోయిందని సంబర పడకు
మనసు లోకి చెడు తత్త్వం దోస కాయ లోకి ఈరు చేరి నట్లు చేరు తుంది
కూర్చోటానికి చోటిస్తే -పాడుకోటానికి చోటు చూసు కోని కాపురం పెడ తాయి
అందుకే -జీవితాంతం జాగ్రత్త అవ సరం -దైవ సాన్నిధ్యమే నీ కు తగిన మందు ,విందు
దాంతోనే పొందు సుఖం ,మానసిక శాంతీ .
    వెంగలాయ్  –రచన -మాది రాజు శివ లక్ష్మి 
నాపేరు ఆంజనేయ వెంగలాయ్ -అమ్మ సుమిత్రా వెంగలాయ్
మా నాన్న వెంగలాయ్ -ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు
నేను ప్రేమించిన అమ్మాయి -ఇంకొన్ని ప్రేమించానంటే
వాడికే ఇచ్చి పెళ్లి చేసిన వెంగలాయ్ నేను
పని మనిషి బల వంతం పెట్టిందని
తాళి కట్టి ఇంటికి తెచ్చిన వెంగలాయ్ నేను
పని మనిషి కదా అని ఇటేడు పని చేస్తున్డను కొంటె

    సోఫాలో కూర్చొని పురమాయిస్తోంది
కొడుకు వెంగలాయ్ ఆ వెర్రి వెంగలాయ్  ని పెళ్ళాడి
ఇంటికి తెస్తే కంపరం తో తల దించు కొన్న నేను వెంగలాయ్ నే

       ధన్య జీవి బొద్దింక -రచన –మైనే పల్లి సుబ్రహ్మణ్యం 

బొద్దింకా బొద్దింకా -సుర కత్తి లాంటి నెర జాణ
నీ లోని చురుకుదనం ఎక్కడుందో
చీకటి సాక్మ్రాజ్యానికి నీవే రా రాజువి రా రాణివి
నీ పాదమే రోగాలకు రస గుళిక
పచారి కొట్లో నువ్వు మహా లక్ష్మివి
నీ చురుకు దనం నీ ఖర్మ కాలుస్తుంది
బల్లి నీ పాలిటి యమ పాశం
ఎందరు కవులున్నా  నిన్ను పట్టించుకోలేదు
నేను నిన్ను స్మరించి ధన్యుడి నయానను కొంటా .

              కాబోయే వదిన గారి అందం 
                పద్య రచన -ముది గొండ సీతా రావమ్మ 

స్టీలు కంచము బోలు సీమంతి నీ ముఖం -ఆలు చిప్ప బోలు ,అక్షులేన్న
దొప్ప చెవులు జూడ గొప్పగా కని పించు -ముక్కు సొగసు నెన్న బొర్ర ముక్కు
పలు వరుస యన రాదు పరగ రంపపు పళ్ళు -సూది గాలి వరవడినేర్పు నేర్పు
యెర్ర బారిన జుట్టు ,ఏనుగు నీ నడుమును -గలము సొగసు విన్న ఖరము చచ్చు
రోకళ్ళు పోలిన జోకైన చేతులు -చాకి బానాను బోలు చాన కడుపు
పగలు కాంచిన నిడేది రాత్రి కనము -తాటకా శూర్పణఖలు
లేకమై పుట్టి నట్లుండు లీల తెలుప -ఆహాహా కాబోవు వదిన గారందము నను .

 దొంగ 
సైకి లెక్కి యొకడు సరదాగా పోవుచు -నగలు దోచు కొనియె
మరల తిరిగి వచ్చి మంచివి కొన లేవ -అనుచు కొట్టే ,సాగే ఆగ కుండ
మందు 
వైద్య శేఖరు దరి కేగి వనిత యోర్తు –   ఏది కాంచిన వాంతులు -ఇంపు లేదు
వంట చేసేది వారెవ్వ రింటి లోన -అనగా తానంచు పలుకంగ అందు కాతడు
వంట నీ పతి చేయంగ వాంతి తగ్గు -అదియే రోగంమునకు మందు అనుచు బల్కె
 ఎగస్ట్రా క్వాలిఫీ కేషన్
రూప వతియు ,సతియు  రూధి(ROODHI )   విద్యావతి
సహన వతి యు ,సాధ్వి సప్త పదికి –కోరే వరుడోకండు
గుణము లన్నియు గలవు -మిగుల గర్భ వతియు దగును నీకు
అటంచు పల్కే బ్రోకరతిశయము గ .

హాస్య కవి సమ్మేళనం కవితలు ఇంతటి తో సమాప్తం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం -కవితలు –2

   హాస్య కవి సమ్మేళనం -కవితలు –2

                                 చమక్కులు –రచన -వేలూరి కౌండిన్య 

 మషాలా వడ -మినప గారే -పానీ పూరీ -నీచం గా చూడకు దేన్నీ -కడుపు నింపునోయ్ అన్నీ
ఉల్లి పెసర ,ఇడ్లీ సాంబార్ -కారా కిళ్ళీ -నీ కడుపు కేసి చూస్తూ ఉంటాయ్ -తమ పని పట్ట మంటాయ్
చిల్లి గారే -చికెన్ పీసులు -మటన్ కుర్మాలు -కాదేదీ ఆకలికనర్హం -అదంతా అద్భుత పాక శాస్త్రం
ఉండాలోయ్ తిండి పుష్టి -తినాలోయ్ కడుపు నిండా –దొరకాలన్తే ఉడిపీ హోటల్
కడు పంటూ వుంటే -వండే రీతి వండితే -అయ్యరు హోటల్ కడుపుకు విందు -జిహ్వ చాపల్యం భలే పసందు .

 కొల వెరీ -రచన –ఛి.మాది రాజు బిందు వెంకట దత్త శ్రీ 

కొల వెరీ కొల వెరీ -ఇదో వెర్రి అయి పోయింది -ఏమి పాటలో ఏమి ఆటలో ?
మా కాలమ్ లో ఇలా కాదమ్మా ,హాయిగా కృష్ణా రామా అనుకొనే వాళ్ళం
మరిప్పుడో -మహేష్ ,ప్రభాస్ ,త్రిషా తాపసీ అంటున్నారు చోద్యం అన్తోందొక బామ్మ గారు
కాసే పటికి -పొలం వెళ్ళిన తాతయ్య ఇంట్లోకి వస్తు ,అవాక్కయ్యాడు
ధనుష్ లా  ఫీలై అద్దం ముందు కూచుని -కొల వెరీ కొల వెరీ కొల వెరీ
అంటూ ,కూని రాగాలు తీస్తున్న బామ్మ ను చూసి
తల తిప్పే సరికి  అప్పుడే వచ్చిన తాతయ్య
ఏమిట్రా ఈ గోలా అంటూ అరిచే బామ్మే–కొల వెరీ అని కొస వెర్రి తో కులుకు తుంటే
చుట్టూ చేరి చప్పట్లతో చిందు లేస్తున్న చిన్నారులు -అవ్వా !అవ్వ కు కూడా పట్టింది ఆ వెర్రి

        అప్పుల లోకం –రచన -విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ 

అప్పు అడుగ రాదు -అన్న బోర్డు చూసినప్పు దల్లా
నాకు వళ్ళు మండి పోతుంది -అప్పు చేయటం సరదానా -లేక
అప్పు చేయటం ఏదైనా హాబీనా ?అస్సలు అప్పు చేయని వాడెవ్వడు ?
అప్పు చేసి పప్పు కూడు తిన మన్నారు పెద్దలు -పప్పు కూడు తిందా మంటే
పప్పు ధరలు నింగిలో -మరి అప్పు చెయ్యక చస్తామా ?
అప్పు చేసినీ నిప్పు లాంటి సారా -తాగమన్నారు కొందరు సారా గ్రేసరులు
ఈ లోకం లో అప్పు చేయని వాణ్ని ఒక్కడ్నైనా చూపించండి
కారు కొనుక్కోవటానికి లోను ,ఇల్లు కొనటానికి లోను
చదువు కోటానికీ ,,పెళ్లి చేసు కోటానికీ లోన్లె లోన్లు
అడక్కుండా నే ఇస్తున్నాయి బాంకులు వెంట పడి మరీ
ఇస్తున్నప్పుడు తీసుకో కుంటే -బాధ పాడరా బాంకో ళ్ళు  ?
అందుకే అప్పు చేస్తున్నా -అప్పు తీర్చమని అడిగితె ,మరో లోన్ తీసు కొంటా
ఇలా అప్పుల్లో బతకటం ఎంత హాయో ఎంత  వీజీయో ?
ఈ విషయం తెలిసే బాలాజీ స్వామి అప్పు చేసే పెళ్లి చేసుకొని మనకు ఆరాధ్య మైనాడు
అప్పట్నించి ఇప్పటి దాకా వడ్డీ కడుతూ ,మనల్నీ ఫాలోఆన్ అంటున్నాడు .
కావున అప్పు సోదరు లారా !చిల్లర కొట్టు దగ్గర్నుంచి
ప్రపంచ బాంకు దాకా ,అందినంత అప్పు చేసి -ఆనందం గా జీవించండి
మన జీవితం లోను మయం చేసు కోండి -అప్పు దాతా సుఖీ భవా
అప్పు ,అప్పుడే ”శ్రీ రామ రక్ష ”అయి మనకు హాయినిస్తుంది -అప్పూ జిందా బాద్

  నాలుగు నష్టాలు —  పాట -రచన వడ్డాది లక్ష్మీ సుభద్ర 

తెల్లని కాష్టం కాల్చారంటే -నోరు గోల చేస్తుంది -కాన్సర్ బారిన పడ తారండీ –తెల్లని –
సురా పానం చేశా రంటే -లివర్ క్యావ్ క్యావ్ మన్తున్దండీ -ఆపైన బాల్చీ తంతా రండీ –తెల్లని —
మగువల వెంటా పడ్డా రంటే -పైలోకాలకు వెళ్ళ లేరండీ -ఎయిడ్స్ వ్యాధి బంధువై బాదిస్తున్దండీ –తెల్లని-
చతుర్ముఖ పారాయణం చేశా రంటే -ఇల్లూ,వొళ్ళూగుల్లే నండీ -ఇల్లాలు ,పిల్లలు అల్లాడి పోతారండీ –తెల్లని —

  తెలుసు కోండి –రచన -వి.శ్రీ ఉమా మహేశ్వరి 


              రండి బాబు రండి -రంగు రంగుల రాజ కీయ అట్లు -పుల్లా పుల్లని అట్లు
తియ్యా తియ్యని అట్లు -అలకల అట్లు -ఎదురు చూపుల అట్లు
లోక్ పాల్ బిల్లు పై -మంత్రి నీతి చూశాక -బీర కాయ లోని నెయ్యి జ్ఞాపకం వచ్చింది
విస్తరణ విస్తరణ అంటూ -రణ రంగాన్ని వాయిదా వేస్తూ
తీగ పాకం లాగా సాగ దీస్తూ నోర్రోరిస్తున్న అరిసె లాంటి మంత్రి పదవి
సామాజిక న్యాయం ,మార్పు అంటూ గొంతు చించుకొని
డైలాగులు వల్లించిన హీరో గారు -చివరికి తానె మారారు పార్టీ
ఊకలా యెగిరి ,మూడు రంగుల్లో కలిసి పోయారు
నిన్న గాక మొన్న ఒచ్చిన పిల్ల కాకి గోల భరించ లేక
వృద్ధ జమ్బుకాలన్నీ ఒక్కటై -స్వపక్ష ,ప్రతి పక్ష ,మిత్ర పక్ష
భేదాలన్నీ మరిచి,ఏక పక్షం గా అవిశ్వాసం పెట్టి
తమ విశ్వాసాన్ని నిరూపించి ,ఉండేలు దెబ్బ రుచి చూపించాయి
తెలంగాణా ముసుగు లో గుడ్డు లాడు కొంటున్న –
గోడ మీది పిల్లు లన్నీ విశ్వాసానికి గట్టి మద్ద తిచ్చి
తమ అసలు రంగు బైట వేసుకోన్నాయ్
ఏదో చేస్తేనే పెరోస్తుండానే భ్రమలు పోయి –
ఏమీ చేయ లేక పోయినా పేరు సంపాదిన్చేసిన
మొన గాడే సారధి అవచ్చు ఆశ్చర్యం లేదు
ప్రజా బలం లేకున్నా -బలమైన చాడీలు చెప్పే విద్య వుంటే
ఏకం గాపెద్ద గద్దె నే ఎక్కి కూర్చో వచ్చు  .
ఎవరు ఎవరిని ఒడారుస్తున్నారో అర్ధం కాని ఓదార్పు (ఓతార్పు )యాత్ర
హైటెక్ రాగాలాపన మాని కాడి భుజానేసుకొన్న మాజీ
హై కమాండ్ కను సన్న లేకుంటే దాడి కి గురు నని తెలిసింది కదా
ఈ సత్యాలు ఎరికయితే ,రాజకీయం నల్లేరు పై బండే నండీ .

 అత్త గారు -అప్ప డాల కర్రా--రచన -వేలూరి సుధా రాణి  

ఏడు వారాల నగలతో అండం గా అలంకరించి పంపారు
ఆమె వెనకే అరవై ఏళ్ళ అత్త గారూ -ఆవిదేప్పుడో -గం .భా.స.
వంట చెయ్య లేకో -తిన లేకో -మామ దేశాలు పట్టాడని వినికిడి
సంబారాలూ చీని  చీనాంబరాలూ -మేకప్పు సామాన్లు పట్టే మంచాలు
ఆ కర్ష  నీయం గా ఓరంగుల పెట్టె   సీమకు టికెట్తో గ్రహాంతర వాసమో
వజ్రా వుంగరమో ,కట్నం తాలూకు సోమ్మో
మిలియన్ డాలర్ల ప్రశ్న -ఆ రాత్రంతా కలత నిద్రే
మెరుగు కాగితం చింపు తోంది -శ్రీ మతి
అపు రూప మైన వస్తువు -మామ గారు దేశాంతరం పట్ట టానికి కారణ మైన వస్తు రాజం
మెరుస్తోంది తళ ,తళా –తళ తడుము కోన్నా -అది –అది అది–
తల తడుముకోండి –బొప్పి కట్టిన తలే చెబుతుంది ఏమిటో ?

మరో సారి మరిన్ని కవితలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

హాస్య కవి సమ్మేళనం కవితలు -1

     హాస్య కవి సమ్మేళనం కవితలు -1

                                   తున్టరీలు —రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ 
01 -కాలెండర్లు మారి పోతున్నా -సెంచరీల సెంచరీని
మిస్ గానే ఉంచుతూ వున్న మాస్టర్ బ్లాస్టర్
మిసెస్ గా చేసుకొనే భాగ్య మేన్నదో ?
02 -మొదట్లో” దూకుడే” -పోను పోను పాపం పాకుడే
రంగులు మార్చే ”ఊసర వెల్లి ”ని జనం నమ్మ లేదు
రాజా కీయం గా రోజూ చూస్తున్నదే నని” లైట్” తీసుకొన్నారు
03 -”రాజ్యం లో” రాముడు నీలి రంగు పులుము కోన్నా
పాలనా నిర్వహణా ,భావము ,సర్వం పూజ్యం కావటం తో
దిక్కు లేని పక్షుల్లా చూస్తున్నారు చోద్యం
04 -ఉపాధ్యాయులకు ”టెట్ ”అని ప్రభుత్వం అంటే
” ఠాట్ ”పొమ్మంటున్నారు వీళ్ళు
05 ”-ద్రోణా చార్య” ప్రయోగం”-‘క్షేత్రం ” లో ఉసురు తీస్తే
”అద్దం లో దెయ్యమై ”-”వీడింతే”నంటాడు ”డాన్ ”-”రాతి నిర్వేదం” తో (సినిమా పేర్లతో చేసిన తమాషా )
06 -” రాజ్యం” వీర భోజ్యం అంటూ వీరంగం వేసి
మూడు రంగుల్లో” సూర్యుణ్ని” ముంచి
గుడ్డ లో పీలికై ,తేలికై ,ఆశతో అర్రులు చాస్తున్ననిన్నటి ” తెర వేలుపు ”
07 -నలభై మూడేళ్ళ సుదీర్ఘ” లోక పాల్” గర్భాన్ని మోసి
పాపం మృత శిశువుని కన్నది” లోక శోక సభ” .
08 -”దానే ”తుఫాను తనకు తానే -తరలి పోయింది తమిళ నాడుకు
అనుకుంటే -పాప వత్సరపు ,పాపం వదల నట్లు ,చివరి రోజూ
ఈడ్చి తనని ,ప్రభావాన్ని చూపించింది
ఈ వర్షం హర్షం కాదు నిండా ముంచేసింది
హాష్య కవిత్వం ను అపహాశ్యం చేసింది
09 -”కొల వెరి కొల వెరి” అంటూ వేలం వెర్రి
కొస వెర్రి తో పూనకం తో   అరుపులు ,కేకలూ .
10 -పురుగులు చాలా చవక -అర కిలో అర్ధ రూపాయే
అయితె ,రూపాయి పెట్టి కొనాలి కిలో బియ్యం .
11 -పారడీ గారడీ వాడు -H2o-ఫార్ములా వాడు
” రుక్కాయ్” కి   ”(జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి )
ఈ నవ్వుల గిలి గింతలు -చంద్రునికో నూలు పోగు .

    నేను ఎవరిని ?    రచన -పొన్నాడ సత్య ప్రకాశ రావు 

నాకు చప్పట్లు కొట్టక పొతే ”అడ్డం గా నరుకుతా ”–నేనొక తెలుగు సినిమా మాటల రచయితని
”నేనేత ఎదవనో నాకీ తెలీదు ”-నేనొక తెలుగు సినిమా హీరో ని
”నీ—–ఎంకమ్మ ”-నేనొక హాశ్య(అపహాశ్య )నటుడిని
”ఎసేఎండ్రా ”-నేనొక విలన్ని
”బాత్  రూం సీన్ లో నగ్నం గా స్నానిస్తా -నేనొక సహజ నటిని
తెలుగు పాటంటే పాడి పాడి చస్తా –నేను తెలుగు లోను” సింగు” తాను
మూడు dyuyatlu ,ఆరు ఫైట్లు ,కావెడు భీభత్సం ,కడివెడు రక్తం –నేనొక” తెలుగు సినిమాని ”
”నాలుక కోస్తా ”-నేనొక ఉద్యమ నాయకుణ్ణి
గర్భాలయ మైనా ,గర్భాదాన గదైనా నాకు అడ్డు లేదు –నేను సెల్ ఫోన్ ని
”నేను మెక్కింది వంద కోట్లే ”నువ్వు దొబ్బింది వెయ్యి కోట్లు’ -నేనొక రాజకీయ నాయకుడిని
”ప్రేమిస్తావా ?పీక కొయ్య మంటావా ?-నేనొక ”ప్రేమికుడిని ‘
దవడ కండరం బిగుసు కొంది -నేనొక థ్రిల్లర్ రచయితని
” i PROFOUNDLY THANK YOU ALL,FOR THE OPPORTUNITY ”–నేనొక తెలుగు వాడిని
”రామా కృష్ణా అను కోవాల్సిన వయసులో -అందమైన కవితల వెంట బడే -నేను గబ్బిట దుర్గా ప్రసాద్ ని .
మరిన్ని కవితలు మళ్ళీ
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .

 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged | Leave a comment

కళ కు రిటైర్మెంట్ లెదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –14 (చివరిది

                     సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –14 (చివరిది )

                                     భక్తి శరణా గతి ఆర్తి –౩

 ”మహిత రీతి నన్ను మన్నించిన ,నీడు మహిమ కేమి తక్కువ ?అని నిష్టురం వేస్తాడు రాముడి మీద .”సమయానికి తగు మాట లాడు తాడు రంగేశుడు ”అంటాడు త్యాగయ్య .అంటే పూల రంగడు అని ఎద్దేవా చేయటమే ”.సద్గంగా జనకుడు ,సంగీత సంప్ర  దాయకుడు ,.గోపీ మనో రధ మొసగ లేకనే గేలి చేసే వాడు .వనితలను సదా సొక్కు చేస్తాడు మ్రొక్క జేస్తాడు.”అదీ ఆ దేవుడి సత్తా.యశోద తనయుడు అని ముద్దు పెట్టు కొంటె లీల గా నవ్వు తాడు .ఆయనే రామ ,కృష్ణ ,రంగానాదుల త్రి మూర్తి మత్వం .”హరే రామ చంద్ర ,రఘు కులేష ,మృదు భాష ,శేష శయన ,పర నారీ సోదరారాజ విరాజుడు ”
తాను భక్తుడు అన టానికి సాక్ష్యాన్ని తన ఇష్ట దైవం అయిన శ్రీ రాముడికి తెల్పుకొంటాడు .పూర్వపు వారంతా మహా భక్తు లానే నమ్మకం వుంది తన స్వామికి .తన దగ్గర కు వచ్చే సరికి చెలగాటం ,సాచి వెత ,తాత్సారం .అందుకే బాధ పడతాడు .
”కామించి ప్రేమ మీర ,కరముల నీడు ,పాద కమ లముల  బట్టు కొను వాడు సాక్షి
రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి -మరీ –నారద ,శుక శౌనక ,పురందర ,నాగ జాధర ముఖ్యులు సాక్షి ”
అని ,ఇతిహాసాలఞానాన్ని తినీ ఒక చోటే చేర్చాడు రామ నామ రసికుడు త్యాగ రాజు .కవితా శిల్పం లో ”పైకి ”తీసుకొని వెళ్ళే నేర్పు త్యాగయ్యది .
అందరు భక్తి పారు లైతే ఇంక యమ ధర్మ రాజు కు పనేమీ వుంటుంది ?పెడ మార్గం పట్టి అయినా బక్తి తో ముక్తి పొందు తాము అంటే ”యముడికి ”వ్యాధే కదా .?మంచి కవితా రీతి తో సాగిన ఆ సంగీత దేశికుని భావనా బలానికి మరో ఉదాహరణ .”చిన్తిస్తున్నాడే యముడు ,సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూసి
శూల పాశ ధర భట జాలము జూచి -మరి మా ,కోలాహలములు  డిగే  ,కాల మాయెనే యమునికి
దారి తెలియ లేక ,తిరిగే వార లైన ,చాలు నంటే సారమని తాగ రాజు సంకీర్తనము పాడే రనుచు ”.
భక్తి విశ్వాసానికి ఇది పరా కాష్ట .”మద మ్మాత్సర్యమనే తెర దీస్తే ”అంతా ,జ్ఞాన ప్రకాశమే నంటాడు త్యాగయ్య .త్రిగునాత్మక మైన ఆత్మ ఆవరణ లను  చేదించి చూస్తె ,నిర్మల మనసు నిలి పితే ,జ్ఞాన చక్షువు ను తెరిస్తే ,నిశ్చలానందమేకదా. అదే ఎవరు కోరుకొన్నా.
”భజన పరులకు ,దండ పాణి భయం లేదు ”అని అభయ మిస్తాడు ఈ ”వేదండ పాలు దాసుడు ”దండ పాణి ని ఎదిరించా టానికి ,కోదండ పాణి వున్నా డని భావం .ధర్మ సంస్థాపన కోసం ”సరస సామ దాన భేద దండ చతురుడు -సాటి దైవ మెవరే  బ్రోవవే ”అని కీర్తిస్తాడు .”పరమ శామ్భావాగ్రేసరున్దనుచు ,పల్కు రావణుడు తెలియ లేక పోయే –
హితము మాట లెంతో ,బాగా బల్కితివి -సతతము గా అయోధ్య నిచ్చే నంటివి
నాథ సహోదరుని రాజు  జేసి ,రాక హతము చేసితివి ”అని అన్న పై పగ వున్నా తమ్ముడికి రాజ్యం ఇచ్చాడు .అందుకే శ్రీ రాముని దయ కావాలి అంటాడు .అది లేకుంటే యేఎ పని జరుగదు .
”నీ కటాక్షం చాలు ,దానం లంకను దయ చూసి నట్లు -దినము దురాశ దీరిన యట్లు
బ్రహ్మేంద్ర పట్టాను భవ మందిన యట్లు -నాలు గొక్క పది భువన మేలి నట్లు
కలుగు కులము లెల్ల కదా తేరి నట్లు -రాజీవ భవ నుత ,రమణీయ చరిత
రాజిల్లు త్యాగ రాజ వినుత ”అని పొంగి పోతాడు అల్ప సంతోషి త్యాగయ్య.రాముని దయతో సకల కోర్కెలు తీరు తాయి .ఇహ ,పర భాగ్య లక్ష్మి చే పట్టి నంతటి  విశ్వాసం త్యాగయ్య గారికి .
భ్కక్తికి ,సేవకు ,శరనాగాతికి చివరి మెట్టు స్వామిలో లీనం ఆవ తామే .ఈ తపన అంతా దాని కోసమే .సాయుజ్యం కంటే వేరే కోరిక ఏ భక్తునికీ వుండదు .ఆ భక్తి తో తన ఆత్మకు ,విశ్వాత్మకు అభేదం .అదే అద్వైతం .ఆ దివ్య సన్ని దానాన్ని ,మనసు లో కల్పించు కోని ,స్వామి లో లీన మై పోతూ ,జీవన్ముక్తు డైన ,గాన బ్రహ్మ ,నాద బ్రహ్మ ,కవి బ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ ,బ్రహ్మొహం అంతు పాడిన చివరి కృతి ధనాసి రాగం లో ”శ్యామ సుంద రాంగ ”అనే కృతి .ఎదురు గా పర మాత్మ తో మాట్లాడుతూ తనువు చాలించిన ధన్యుడు .ఆ దివ్య పురుషుని దివ్యాను భూతిని పంచ కొందాం .ఇదే ఆయన చరమ గీతం .–swan song  .తాను ధన్యుడు అయినందుకు సరైన ధన్యాసి రాగం లో కృతి ని చేయటం ఔచిత్యానికి పరా కాష్ట .
”హంస ఎలా ఆడుతూ ,పాడుతూ ,ప్రాణాలు విడుస్తుందో ,”త్యాగ రాజ హంస ‘కూడా ,పరమ హంస యై ,గాన జ్ఞానం తో పాంచ భౌతిక శరీరాన్ని వదిలి ,నిత్యా సత్య ,శాస్వతా నందాని పొందారు .అదొక అలౌకిక శోభాన్విత మైన వూహ .
”శ్యామ సుంద రాంగ ,సకల శక్తియును నీవెరా -తామస రహిత ,గుణ సాంద్ర ,
ధరను వెలయు శ్రీ రామ చంద్ర ,-దుష్ట దనుజ విహార -ఇష్త దైవమును నీవెరా -ఇలను త్యాగ రాజు వేరా ”
ఆధ్యాత్మిక జ్యోతి ,పరంజ్యోతి లో లీన మైంది .వాగ్గేయ కారునిగా ,నాద బ్రహ్మో పాసకుడు శ్రీ కాకర్ల త్యాగ బ్రహ్మ మనందరికీ నిత్య ప్రాతస్మర ణీయులు .
  త్యాగ రాజ మంగళా ష్టకం —     రచన —శ్రీ వాలాజ పేట వెంకట రమణ భాగ వతార్ 
01 -రామ బ్రహ్మ సుపుత్రాయ ,రామ నామ సుఖాత్మనే -రామ చంద్ర స్వరూపాయ త్యాగ రాజయ మంగళం
02 -శ్రీ కాకర్ల వంశాబ్ధి చంద్రాయామిత తేజసే –పూర్నాయ పుణ్య రూపాయ త్యాగ రాజయ మంగళం
03 -నారదా చార్య కరుణా పాత్రాయాద్భుట కీర్తయే -ధీరాయ నిర్వి కారాయ త్యాగ రాజయ మంగళం
04 -కావేరీ తీర వాసాయ కారున్యామృత ,వర్షినే  -అవీసుర రాజాయ త్యాగ రాజాయ మంగళం
05 -శ్రీ కారుణ్య సముద్రాయ లోకానుగ్రహ కారిణే –సాకేతాదిప భక్తాయ ,త్యాగ రాజాయ మంగళం
06 -యోగి పుంగవ మిత్రాయ ,యోగానంద స్వరూపినే -రాగ లోభ విముక్తాయ త్యాగ రాజాయ మంగళం
07 -గాన శాస్త్ర ప్రవీనాయ ,కలి కల్మష నాశినే -శరణా గత పోషాయ త్యాగ రాజాయ మంగళం
08 -దీన మానవ పోషాయ ,దివ్య నామ సంబోదినే –జ్ఞాన భక్తి ప్రదానాయ త్యాగ రాజాయ మంగళం .
  త్యాగ రాజ ప్రశంశ — పద్య  రచన —  శతావధాని ఎస్.రాజన్న కవి
01 –     ”అలకలు నుదిటి పై ,నలవోకగా తూగు -నొరపుల బాలు  డొక్కొక సారి
కోదండ ,తనకార ఘూర్నితాంభో రాశి  -హుమ్కార కాంతు(kanthu ) దొక్కొక్క సారి
జానకీ స్మిత మధు శ్యండి మాలా రోచి -రుత్సిక్త హృదయు డొక్కొక్క సారి
పావన నందన భక్తి బాష్ప దారాప్లవ -నోత్సుఖ చరణు డొక్కొక్క సారి
ఎన్ని రూపుల దర్శనం బిదేనో నీకు -రామ చంద్రుండు ముని జన ప్రణయ మూర్తి
లలిత వీణా కలస్వాన తులిత మొర్తి –త్యాగ రాజ గృహీత లీలావతార.
02 -”నాద సుధా రసంబే దళి తేంద్రనీలమ్ము ,పానమ్ము దేహమ్ము చేసి
సకల లోకా నంద సంధాయి దివ్య రాగంమునే ,చేతి చాపంము జేసి
వివిధ భావా వేష ,విజ్ఞాత్రు స్వర కన్య కాలనే చాపమ్ము ,గంటలుగ జేసి
చిర తపస్సంజాత శీతలా లాపనా ద్రవమునే వింటి శరమ్ము జేసి
ఎంత చక్కని రాముని సృష్టించు కొంటి -వయ్య ,జప యోగ కూలంకశా వ తార
గాన మందార ,స్వర కన్యకా విహార –తత్పదాదీన హృదయ -ఓ  త్యాగ రాయ ”.
 సర్వం సంపూర్ణం 
”త్యాగ రాజు కృతులలో సామాజిక ఆకృతులు” అనేశీర్షిక తో రాసిన  నాలుగు వ్యాసాలు ,’సంగీత సద్గ్రు శ్రీ త్యాగ రాజ స్వామి ”శీర్షిక తో రాసిన పద్నాలుగు వ్యాసాలు ,వెరసి 18  వ్యాసాల పరంపరను ”శ్రీ త్యాగ రాజ ఆత్మ విచారం ”   అనే పుస్తకం రాసి , అందులో కొత్త కోణం లో  త్యాగయ్యను ఆవిష్కరించిన” హాస్య  బ్రహ్మ ”  స్వర్గీయ భమిడి పాటికామేశ్వర రావు  (భ’కా’రా’)మాస్టారు గారికి సవినయం గా ,సభక్తి కం గా  అంకితమిస్తున్నాను .              
ఈ వ్యాస పరంపర కు ముఖ్య ఆధారం శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారి ”త్యాగ రాజు భక్తి సుదార్ణవం ”అనే ఉద్గ్రందం .దీనితో పాటు తిరుపతి దేవస్థానం ,తెలుగు అకాడెమి వారు త్యాగయ్య పై  ప్రచురించిన చిరు పుస్తకాలు ,అనేక పత్రికలలో నేను చదివిన వ్యాసాలు ఆధారం .
ఈ వ్యాసాలను నేను 01 -05 -93 న మొదలు పెట్టి ,05 -05 -93  వరకు  నాకోసం రాసుకొని పూర్తి చేశాను .అంటే  దాదాపు 18   సంవత్సరాల క్రితం రాసినవి అన్న  మాట . ఇప్పుడు మీ కోసం వెలుగు చూశాయి .ఇదంతా ఆ త్యాగ బ్రహ్మ అనుగ్రహమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —13

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —13

                                కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –2

    ”భక్తి లేని కవి జాల వారెన్యులు ,భావ మెరుగ లేరు ,కనుక భక్తి ,ముక్తి కల్గునని కీర్తనముల బోధించి తి ”అని చెప్పు కొన్నాడు త్యాగయ్య ”.మేను మోసం చేస్తుంది .హీన మైన ,మల మూత్ర రక్తముల కిరవు.మాయ మయం”కనుక నమ్మ వద్దు అంటాడు .సరసాంగి రాగం లో” అంగ  భూత శరీరం పై మొహం వదులు కో” అని అంటే ,మోహన రాగం లో ”మోహము నీపై మొనసి యున్నది రా ”అని రాముని స్తుతిస్తాడు .సందర్భోచితం గా ఆ రాగాలను ఎన్ను కోని ,కృతులను చెప్పటం ఎంతో ఔచిత్యం ,ప్రత్యేకత ..

జయంతి శ్రీ రాగం లో ”మరు గేలరా ఓరాఘవా ”అని సంబోధిస్తూ —
”మరుగేల ,చరాచర రూప పరాత్పర ,సూర్య సుధాకర లోచన –అన్ని నీవనుచు ,అంత రంగమున
తిన్నగా వెదకి తెలిసి కొంటి నయ్య -నిన్నె గాని మదినేన్న జాల నొరుల -నన్ను బ్రోవు మయ్య ,త్యాగ రాజ నుత ”

అంతర్ముఖుడైన ఒక మహా భక్తుడు శోధించిన సత్యాన్ని ,ప్రకాశింప జేసే మహాద్భుత మైన సంఘటన .అండ మైన పదాల పొందు ,వీనులకు విందు .భాష ,దానికి తగ్గట్టు భావం సుందరాతి సుందరం గా జత కూడిన అపూర్వ రాగ భావ సమ్మీలనం .
జగన్మోహిని రాగం లో జగన్మొహనం గా సంగీత మహాత్మ్యాన్ని తెలు పుటూ ,భక్తి సంగీతందైవాంశం అని   జ్ఞప్తికి తెస్తాడు .నాడో పాసనే తరించే మార్గమని సూచించిన ధన్య పురుషుడు త్యాగ రాజు .ఆ కీర్తనా వైభవం చూడండి –

”శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనసా –నాభి హృ త్కంత(kantha )    ,రసన ,నాసాదుల యందు
ధర ,రుక్సామాదులలో ,వర గాయత్రీ హృదయమున -సుర భూసురుల మానసమున,శుభ త్యాగ రాజా దులతో -శోభిల్లు”
గాయత్రి ఉపాసన రుక్ ఛందస్సు లలో ఒకటి అందుకే అదీ” త్రయి” లాగే అత్యంత పవిత్రమైనది అని చెప్పాడు .
”నీవె దైవ మని నమ్మి నాను దేవ ,-నీకు నాదు మేనమ్మినాను
మానము నీదే సుమ్ము ,అభిమానము నేలు కొమ్ము -చక్కని నీ రూపమును గని సోక్కితి ,నా హృదయమున ”

అని ,తన దేహం ,ఆ శ్రీ రాముని సొమ్మే అంటాడు .ఇదే ప్రతి పత్తి స్వరూపం అన్నారు పెద్దలు ,భక్తి విదులు .
రాదా దేవి ,ఎలా మధుర భక్తి తో ఆరాదిస్తుందో ,అలాగే తానూ రాముణ్ణి ,ఆరాధిస్తాడు .తన సేవాను భూతి ని చూపిస్తూ పులకలన్దిస్తాడు చూడండి ఆ భక్తి సామ్రాజ్య వైభోగం

”సత తంబు పదముల నర్పింతు ,-ఏకాంతమున నిన్నారాదింతు సీతా రామా !
తనివి దీర నిన్ను కౌగిలింతు ,దాహ మెల్ల దీర్చ సేవింతు
కనుల చల్ల గాను ,నిన్ను గందు ,-నాదు ,తనువు పులకరించ మెచ్చు కొందు
అడుగులకును మడుగు లం దిత్తు   -నిన్నస  రించి ,మెల్ల బల్క నిత్తు”
అని తనకు ,శ్రీ రాముడికి భేదం లేదని అంటున్నాడు .” నీవే  నేనైన నీ వాడు గాక త్యాగ రాజు వేరా ”

అన గల సత్తా దమ్ము అద్వైతి కి మాత్రమే   సాధ్యం .అలాటి వాడే త్యాగయ్య .తనలో పరమాత్మను ,పరబ్రహ్మం లో తనను చూసు కొన్న ,భక్తి వైరాగ్య ,సాధనా  ,శరణాగతి ,ఆర్తి  లను కల బోసు కోని పండిన త్యాగ జీవి .భగ వంతుని కి భక్త త్యాగ రాజు ”పరచిన red carpet welcome ”అన్నారు విద్వాద్వ రేన్యులు .”నీదు పలుకే పలుకురా ,నీదు కులుకే కులుకురా -నీదు తళుకే తళుకు రా ”అని మధుర ప్రేమ తో ఆరాట పడుతాడు

త్యాగయ్య .ఒక్క క్షణం కూడా ఆ రామున్ని విడిచి ఉండలేని పచ్చి  భక్తి .
భక్తి తో త్యాగయ్య కు

”తలచి తే మేనెల్ల పులకరించేని రామ -కను గొన్న నందమై కన్నీరు నిన్దేడిని       ఆలసించు వేళ జగ మంత తరుణ మయ్యేని -చరణ కౌగిలి వేళ చేలగమై మర చేని    చెంత నుండ గ నాదు చింతలు తొల గేని -‘

‘అని అనటం లో త్యాగ్యా కున్న అత్యంత విశ్వాసం జ్యోతకం ఆవు తుంది .ఉన్మత్తు డై తేనే భక్తి కి పరా కాస్త .ఒక రామ కృష్ణ పరమ హంస లా ,స్సదా శివ బ్రహ్మేన్ద్రుని లా కని పిస్తాడు .పరమ హంసత్వం పూర్తి గా పొందిన దివ్య పురుషుడు గా త్యాగ్యా మనకు కన్పిస్తాడు .ఆ తనమయత్వం చైతన్య ప్రభువు ను జ్ఞాపకం చేస్తుంది .ఈ కృతి లో కవితా సౌభాగ్యం ,శోభ ,శ్రీ రామ రూప సౌందర్య చిద్విలాసం దర్శనమిస్తుంది .”ఇంద్రియాలకు ఆహ్లాదం ఇచ్చే రూపం -నెమ్మది లేని జనన మరణమ్ముల తొల గించే నట రాజ వినతుడిని దర్శించి మనకూ ,ఆ భాగ్యాన్ని కల్పించాడు త్యాగయ్య .

సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అంకుల్ డయనమేట్ – ఎమెస్కో – పుస్తక ఆవిష్కరణ

This slideshow requires JavaScript.

Posted in సభలు సమావేశాలు | Tagged , | Leave a comment

సరస భారతి -33 వ సమా వేశం ” హాస్య కవి సమ్మె ళనం ”

2012 కొత్త సంవత్సరం  21 వ తేది శని వారం సాయంత్రం నాలు గింటికి ఫ్లోరా హై స్కూల్ లో నిర్వహం .సరస భారతి గౌరవాధ్యక్షులు ,ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామ లాడేవి గారు ,వాళ్ళ స్కూల్ లో నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించటం తో వేదికను అక్కడికి మార్చాం .అందరికీ మళ్ళీ ఫోన్లు చేయటం నలభైకార్డులు   రాసి వివరాలు తెలపటం మీడియా వారికి తెలియ జేసి పేపర్ కవరేజ్ ఇప్పించటం కూడా చేశాం .అంటే అందరికి వాయిదా పడి నట్లు ,21 వ తేది జరుగు తున్నట్లు తెలియ జేశాం అన్న మాట .మొత్తం మీద జరిగింది అని పించాం .ఆ వివ రాలే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .క్లిక్

క్లిక్

 

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –12 కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –1

          సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –12

                                   కృతుల్లో భక్తి ,శరణా గతి ,ఆర్తి –1 
నవ విధ భక్తిని తన కవితా కృతుల్లో వికశింప జేశాడు త్యాగ రాజు .తన ఆరాధ్య మూర్తి రామ మూర్తి కి ఆర్తి గా విన్న విన్చుకొంటాడు .సర్వ సమర్పణ   భావం తో శరణా  గతు డౌతాడు .సామీప్య ,సాన్నిధ్యాలతో సాయుజ్యం పొందే మహోన్నత ఆత్మ పరతత్వ వేడి ఆయన .ఆలోకం లో ఆనంద సామ్రాజ్యం ఎలి ,మనల్ని కూడా ఆ విందు లో పాలు పంచు కోనేట్లు చేస్తాడు .ఆత్మ వేది త్యాగ బ్రహ్మ .
”యెంతని రాల్తు కన్నీరు ?జాలి ఎవరితో తెలిపితే తీరు ?అని ఆవేదన తెల్పి ,”పూలమ్మ బతికిన వారు రామా ,పుల్ల లమ్మ బిల్వ రాదు -ఆ చులకన నీకు కాదా ?అంటాడు ఆ రామున్నే .”భక్తి వేలుగుచే ,వెతలు తీరు ననే విశ్వాసం జ్ఞాన తేజం కలి గిస్తాడు .పరమ సుందరు డైన స్వామిని సేవించే వారి లక్షణాలేవో తాను సాధించి ,తెల్పే రచన చూద్దాం .
”అనృతంబాడాడు ,అల్పుల వేడడు ,సునృపుల గోలవడు ,సూర్యుని మరువడు -మాంసము ముట్టడు ,మధువును త్రాగడు ,పర హింస చేయడు ,ఎరుకను మరు వడు ”అని ,ఉత్తమ భక్తు దిన తన లక్షణాలను ఏకరువు పెడ తాడు .మూడు ఈషనాలను వాడనని ,వంచన చేయ నని ,బొంకనని ,చంచల చిత్తుడై  ,సౌఖ్యాన్ని వదలనని వేడు కొంటాడు .అంటే భక్తికి శీలం ఎంత ముఖ్యమో అందరికి తెలియ జేస్తాడు .”ఎందెందు జూచిన అందందే కలదు హరి ”అని ప్రహ్లాదునితో పోతన్న గా ఋ చెప్పించి నట్లు త్యాగయ్య గారు ‘నీకే తెలియక పొతే నేనేమి సేయుదురా ?లోకాదారుదవై ,నాలోని ప్రజ్వ లించే జాలి నీ కే తెలియక పొతే ”–”ఎందెందు చూచినా ,బలికిన ,సేవించిన ,పూజించిన ,అందందు నీవు అని తోచే తందరు
,నీ పాడార విన్దమును ,ధ్యానించిన డిందు కానీ ?/అని ప్రశ్నిస్తాడు .జాలి తన లో ప్రజ్వ లిస్తోందని ,అనటం కొత్త ప్రయోగం .అది కాల్చి తపన చేస్తోందని భావన .
ఆహ్లాద కర మైన భావాలతో ,తనపై మోపిన నింద శ్రీ పతి పద చిన్తనమే నట .తమాషా అయిన నింద ఇది .
”వారిజ నాయన ,నీ వాడను నేను ,వారము నను బ్రోవు -స్వల్ప ఫలదు లగు వేల్పుల ఏచిన అల్పు దనుచు నన్నందరూ బల్కిన ”కాస్త మైనా ,ఇస్తా మైనా దుస్తు దాని దూరినా పాపులు నాపై మోపిన నేరము -శ్రీ పతీ నీ పద చిన్తనమే ”ఇతర దేవతలు క్షుద్ర ఫలితాల నిస్తారు సజ్జనుల బలం అలాంటిది .
క్షమా భిక్ష వెడుతూ ,అనుతాపం గా గీతాన్ని పాడుతాడు .పశ్చాత్తాపం పొందిన అశ్రు జాల ముచేత హృదయాన్ని క్షాలనం చేసి హృదయం పవిత్రం ఆవు తుందని అంటాడు త్యాగయ్య .అందుకే తానా పూర్వ లోపాలన్నీ ,వరుసగా వివరిస్తాడు .  ”సకల భూతము లందు నీవై యుండ గా ,మది లేక బోయినా -చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కుతర్కు డైన , -పర ధనము కొరకు ,నొరుల మది కరగబల్కి ,-కడుపు నింపి తిరిగి నత్తి ,దుడుకు గలా నన్నే దొర కొడుకు బ్రోచురా
అంటూ ,మానవతకు దుర్లభ మనుచు ,నెంచి ,పరమానందమొండ లేక ,-మద మత్సర,కామ లోభ ,మోహములకు ,దాసుడై మోస బోతిని ”అని పశ్చాత్తాప హృదయం తో ఆత్మ క్షాళన చేసు కొంటాడు .
‘సతులకు కొన్నాళ్ళు ,ఆస్తికి ,సుతులకై కొన్నాళ్ళు ,ధన తతు లకి తిరిగితి నయ్యా -”ఇదీ త్యాగ రాజు ఆత్మా విచారం .నిజాయితీ .”పాప గణ ములన్నియు ,పురుషుని రూప మై ,బాధించి నాయత .అంటే పురుషుడైన తన రూపం లో .అంటే ఇదంతా ,స్వయం క్రుతాప రాదం .చక్కని ప్రయోగం ”పురుషుని రూపం ”అనటం .
”ఎటుల బ్రోతువో తెలియ  -ఏకాంత రామయ్య ”అని తన చరిత్ర అంతా కర్ణ కథోరం అని చెపు కొచ్చాడు
” వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి ,పుట్టు లోభుల నెల్ల పొట్ట కై పోగిడితి ,-దుస్టు లతో గూడి ,దుష్కృత్యములు సల్పి రట్టు జేసిన  త్యాగ రాజు ని దయతో ‘అని సిగ్గు విడిచి చెప్పే స్తాడు .తన గుట్టు రట్టు చేసు కొన్నాడు .ఈ ఆర్తి ని ఏకాంత రాముడే తీర్చాలని విశ్వాసం .
”సిగ్గు మాలి ,నా వలె ధర నెవ్వరు ,తిరుగ జాలరయ్య ముగ్గురి లో మేలైన రామ –మా ముఖాబ్జ దిన రమణ రామా -”వ్యర్ధం గా ఒక్క అక్షరం కూడా ప్రయో గిన్చడు  త్యాగయ్య .ఇక్కడ కూడా తన సిగ్గు మాలిన పను లన్నీ నిస్సిగ్గు గా బట్ట బయలు చేశాడు .
”ముందర దయతో బల్కిన దింక ముందు రాక పోయే -దద్ద నాలతో దినములు గడిపే దారి తెలిసి పోయే
అందరి చేతను న బ్రతుకు అపుడు నిందల కెడ మాయే–మందరధర ,నా జీవుడు జీవ మిందు సేయ నాయె అని దెలిసి ” ఈ కీర్తాన్ లో అన్న జపేశం పెట్టిన బాధలు ధ్వనిస్తాయి .ఆశ వుంది .జీవ ,పరమాత్మల ఇక్యతే సర్వ అనీన ప్రేమ .సర్వ యాతనలకు దివ్యౌషధం ,సద్ధర్మ పధం .”
”కన్నా తండ్రి త్యాగ రాజు నింక -కరుణ జూడ లేదు అని తెలిసి ”అందుకే మనశ్శాంతి అవసరం .అది ఇహ పర సాధనం కూడా .”సామ రాగం ”లో సామ వేద సారాన్ని ఈ కృతి లో అద్భుతం గా నిక్షిప్తం చేశాడు .ఆ రహశ్యం చూద్దాం .
”శాంతము లేక సౌఖ్యము లేదు -సారస దళ నయానా
దాన్తుని కైనా ,వేదాంతుని కైనా –దార సుతులు ధన ధాన్యము లుండిన
సారెకు ,జప తప సంపద కల్గిన – యాగాది  కర్మము లన్నియు చేసిన
బాగుగా సకల హృద్భావము తెలిసిన -ఆగమ శాస్త్రము లన్నియు జదివిన
భాగ వతులనుచు ,బాగుగా పేరైన -శాంతము లేక సౌఖ్యము లేదు ”
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాహితీ మిత్రులు మచిలీ పట్నం

సాహితీ మిత్రులు అనే మచిలీ పట్నం లో ని  సాహిత్య సంస్థ 31 వ వార్షి కోత్స వాన్ని ఈ రోజూ 22 -01 -12 ఉదయం నుంచి సాయంత్రం దాకా ”మహతి కళా వేదిక ”పై నిర్వ హిస్తోంది శ్రీ కిల పర్తి దాలి నాయుడు రాసిన ”సూది మొనలు ”అనే మినీ కవితా సంకలనాన్ని , శ్రీ మతి ఓలేటి ఉమా సరస్వతి సంపాదకత్వం లో వెలువడిన  ”పద్య పుష్పకం ‘అనే గ్రంధాలను ఆవిష్కరిస్తున్నారు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టు లైన  అయిదుగురు ప్రముఖులను సత్కరిస్తున్నారు .వారి వివ రాలే మీరు చూస్తున్నది

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరస భారతి -33 వ సమా వేశం ” హాస్య కవి సమ్మె ళనం ”సమీక్ష

సరస భారతి -33 వ సమా వేశం

                                          ” హాస్య కవి  సమ్మె ళనం ”సమీక్ష
2012 కొత్త సంవత్సరం వస్తోంది కదా ,ప్రతి సంవత్సరం ,మా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఆరోజు  ధనుర్మాసంలో  ప్రతి సంవత్సరం , తెల్ల వారు ఝామున లడ్డు లతో స్వామి వారలకు పూజ చేసి అందరికి ప్రసాదం గా పంచుతాము కదా ,ఆ రోజు సాయంత్రం ”హాస్య  కవి సమ్మేళనం” ”,ఆలయం లో నిర్వహించి ,అందరికి స్వామి వారి దర్శనం కల్గించి ,అతిధులకు ,కవి మిత్రులకు స్వామి వారి ప్రసాదం లడ్డు ను ఇస్తే బాగున్టింది కదా అని అంతా ప్లాన్ చేసి సిద్ధం చేస్తే ”తానే ”అనే తుఫాన ముంచు కొచ్చి విపరీత మైనవర్షాలతో  అల్ల కల్లోలం చేసింది  .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడు అనటానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేముంటుంది ?తప్పని సరి అయిన పరిస్తితు లలో అందరికీ చెప్పి వాయిదా వేసి 21 వ తేది శని వారం సాయంత్రం నాలు గింటికి ఫ్లోరా హై స్కూల్ లో నిర్వహం .సరస భారతి గౌరవాధ్యక్షులు ,ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామ లాడేవి గారు ,వాళ్ళ స్కూల్ లో నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించటం తో వేదికను అక్కడికి మార్చాం .అందరికీ మళ్ళీ ఫోన్లు చేయటం నలభైకార్డులు   రాసి వివరాలు తెలపటం మీడియా వారికి తెలియ జేసి పేపర్ కవరేజ్ ఇప్పించటం కూడా చేశాం .అంటే అందరికి వాయిదా పడి నట్లు ,21 వ తేది జరుగు తున్నట్లు తెలియ జేశాం అన్న మాట .మొత్తం మీద జరిగింది అని పించాం .ఆ వివ రాలే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .
సాయంత్రం అయిదున్నర కు సభ ప్రారంభించాం .ముద్దు ముద్దు గా గంటన్నర ఆలా శ్యాం తో .అతిధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు స్కూల్ వాళ్ళు .సభాధ్యక్షతను శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారు స్వీకరించారు .వాయిదా పడిన కవి సమ్మె ల నాన్ని పట్టు వదలని విక్ర మార్కులు గా నిర్వ హించటం సంతోషం అన్నారు .సభా సంచాలనం చేసిన నేను మాట్లాడుతూ ,వాయిదా పడిన వివ రాలన్నీ వివరించాను .ఇది 33 వ సమా వేశం అనీ ,ఈ వేదికను” పేరడీ చక్ర వర్తి స్వర్గీయ జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి” వేదిక గా భావిస్తున్నామని ,ఈ ‘హాస్హ్య కవి సమ్మె లనాన్ని ”అందరి చేత ”జరుక్ శాస్త్రి ”అని పిలువా బడే రుక్మిమీ నాద శాస్త్రి గారికి అంకితం ఇస్తునామని చెప్పాను .హర్ష ధ్వానాలు మిన్ను ముట్టాయి .ఆయన మన కృష్ణా జిల్లా నివాసే నని ”మా పూర్వీకులే వాటర్ ఫార్ముల H20nu కని పెట్టారు .అందుకే మా ఇంటి పేరు ”జల సూత్రం ”అయిందని ఆయన సరదా గా అనే వారని ,కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ విశ్వ నాద వగైరా మహాకవులకవిత్వాలకు   అద్భుత మైన పేరడీలు ఆయన రాశాడనీ విశ్వ నాద ను ”పాషాణ  పాక ప్రభో ”అని అనే వాడనీ జ్ఞాపకం  చేశాను .ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్నిప్రముఖ కవి ,సంగీతజ్ఞుడు ,బహు భాషా వేత్త  అయిన శ్రీ సామల సదాశివ గారికి ఇవ్వటం అందరు సంతోషించా దగిన విషయమనీ ,దానికి మనం హర్ష ధ్వానాలు చేయాలని చెప్పి అందరితో కార తాళ ధ్వనులతో సంతోషాన్ని వెలి బుచ్చాం . .తర్వాత ఈ మధ్య దివంగతు లైన ప్రముఖ కధా రచయితా ,గణిత శాస్త పుస్తక రచయిత ,ఆంగ్ల అధ్యాపకులు అయిన అవసరాల రామ కృష్ణా రావు గారి మృతికి ,భారతీయ ఆధ్యాత్మిక భావ ధారను ఖండ ఖండంత రాలకు వ్యాపింప జేసిన అనేక గ్రందాల రచయిత  ఇల  పావులూరి పాండు రంగ రావు గారికి ,ప్రసిద్ధ కవి” మల్లె మాల రామాయణ ”రచయిత,సినీ కవి  మల్లె మాల సుందర రామ రెడ్డి గారికి ,గొప్ప సంభాషణా రచయిత అల్లూరి సీతా రామ రాజు సిని మా కధా ,మాటల రచయిత మహా రది గార్లకు  సంతాపం ప్రకటిస్తూ రెండు నిముషాలు లేచి నిలబడి అందరం మౌనం పాటించి సాహితీ ఋణం తీర్చు కొన్నాం .          ముఖ్య అతిధి గా విచ్చేసిన డాక్టర్ రావి రంగా రావు మాట్లాడుతూ హాశ్యాన్ని పండించటం చాలా కష్టం అనీ తాను పూర్వంహాస్య   కవితల సంకలనాన్ని తెస్తే అందులో నాలుగు తప్ప ఏవీ హాస్యాన్నికూరి  పించ లేక పోయాయనీ  ,ఇక్కడ మంచి ప్రయత్నం చేసి హాస్యం  మీద కవి సమ్మె ళనం నిర్వ హించటం బాగుందని ప్రశంచించారు .మచిలీ పట్నం లోని ‘హాస్య లహరి ”అధ్యక్షులు డాక్టర్ బృందావనం ధన్వంతరీ ఆచార్య హాశ్యం మనసుకు ,బుద్ధికి ,శరీరానికి చాలా అవసరం అన్నారు .హాస్యాన్ని  వృద్ధి చేస్తే అది మన ఆయుస్సును పెంచుతుంది అని సూచించారు .ప్రముఖ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమ యాజీ ఆత్మీయ అతిధి గా మాట్లాడుతూ ఉయ్యూరు అంటే తనకు చాలాఇష్టం అనీ ,  ,ఇక్కడి కవి సమ్మె లనా లన్ని టికి తాను హాజరవు తున్నానని ,మంచి అభి రుచి వున్న సంస్థ గా సరస భారతి పేరు తెచ్చుకోన్నాడని ,చెప్పిహాస్య   స్పోరకమ్ గా తాను రాసిన పద్యాన్ని వినిపించారు .ఆత్మీయ అతిధి గా విచ్చేసిన మరో ముఖ్యులు శ్రీ కోసూరి ఆది నారాయణ రావు .పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేసి ,కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కు కార్య దర్శి గా పని చేసిన వారు .వారుత ప్రసంగం లో తాను తరచుగా ఇక్కడి సాహితీ కార్య క్రమాలకు వస్తున్తానని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి కార్య క్రమాలున్డటం ఆనందం గా వుందని అన్నారు .మరో ఆత్మీయ అతిధి retired  హెడ్ మాస్టర్ శ్రీ పీ.ఆంజనేయ శాస్త్రి గారు తాను చాలా కాలమ్ తర్వాతఇటు వంటి   కవి సమ్మేళనం లో పాల్గొన్నానని  1960 -70   కాలమ్ లో ఉయ్యూరు హై స్కూల్ లో తాను దుర్గా ప్రసాదు ,స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు ,అనే పిచ్చి బాబు ,జ్ఞాన సుందరం ,మహంకాళి సుబ్బా రామయ్య ,వల్లభనేని రామ కృష్ణా రావు కలిసి పని చేసి నప్పుడు దుర్గా ప్రసాద్ ,కాంతా రావు లు ప్రతి నేలా సైన్సు రూం నే సాహితీ వేదిక చేసి మమ్మలన్నదర్నీ పిలిచికార్య క్రమాలను నిర్వ హించే వారనీ ,సంక్రాంతికి ,ఉగాదికి అక్కడే కవి సమ్మె లనాలను నిర్వ హించి తమకందరికి ఉత్సాహాన్ని కల్గించే వారని గుర్తు చేసు కొన్నారు ,.మళ్ళీ ఇన్నేళ్ళకు ఇక్కడికి వచ్చి ,పాల్గొనటం మహదానందం గా వుంది అన్నారు .సభా వేదిక పైకి అతిధులను కార్య దర్శి శ్రీ మతి శివ లక్ష్మి ఆహ్వానించగా ,గౌరవా ధ్యక్షు రాలు   శ్రీ మతి శ్యామల దేవి కమ్మని ప్రార్ధన తో సభ ప్రారంభం చేశారు .అతిదు లందరికి ”గురజాడ అప్పా రావు ”గారిఫోటో ను జ్ఞాపిక గా అంద  జేశాం .

ఆ తర్వాత ,స్థానిక శ్రీని వాస విద్యా లయం లో రెండవ తరగతి చదువుతున్న ఛి .గణేష్ అనే చిరంజీవి 150 దేశాల పేర్లు ,వాటి రాజ దానులను ధారణ చేశి అందరినీ ఆశ్చర్య పరిచాడు .అతనికి జ్ఞాపిక అందజేసి కర  తాళ ధ్వనులతో అభినందనల ను తెలియ జేశాం .
ఆ తర్వాత అసలు కార్య క్రమం ”హాస్య కవి సమ్మేళనం ”ను ప్రముఖ కవి కధా రచయిత ,విమర్శకులు ,ఆంద్ర భూమి లో కాలమ్ రచయిత అయిన శ్రీ వేలూరి కౌండిన్య గారు ,ప్రముఖ మినీ కవిత్వ ,హైకూ కవిత్వ రచయిత ,ఆంద్ర బాంక్ ఉద్యోగి శ్రీ వసుధ బస వెశ్వ ర రావు గారు ,ప్రసిద్ధ కవ యిత్రి విశ్లేష కు రాలు ,తెలుగు పండిట్ ,వక్త అయిన శ్రీమతి కే.కనక దుర్గా గార్ల సంయుక్త ఆధ్వర్యం లో దాదాపు గంటన్నర జరిగింది .మధ్య మధ్య లో జోకుల బాకు లు విసురుతూ ,కవుల కవితలను విశ్లేషిస్తూ ,నవ్విస్తూ ,కవ్విస్తూ ఆద్యంతంహాస్యాన్ని   వడ్డీ వడ్డించారు కవి మిత్రులు ,నిర్వాహకులు .సుమారు తొంభై మంది వీక్షకులు దర్శించిన ఈ కవి సమ్మేళనం ఒక రకం గా విజయ వంతమే .ఇంకో రకం గా కాదు .ఎందుకు అంటే అడిగిఆహ్వానం లో యాభై మంది పేర్లు వేస్తె వచ్చిన కవి మిత్రులు పది హీను మంది మాత్రమే . శని వారం కావటం కొంత ,,,ప్రభుత్వ పాథ శాలలకు ఆ రోజే సంక్రాంతి సెలవుల తర్వాత ,ప్రారంభమైన రోజూ కావటం కొంత అసౌకర్యానికి గురి చేసి వారు రావటానికి ఇబ్బంది కలిగింది .ఇది ఊరట మాత్రమే .హాస్యానికి ఒక రకం గా ‘అప హాస్యమే  ”జరిగిందని నా భావన .అంతే  కాక వచ్చిన కవితల్లో ను సామాజిక చైతన్యంహాస్య స్పోర కత్వం   లేక పోవటం నాకు బాగా నిరాశ కల్గించింది .సరే అన్నీ మనం అనుకున్నంత హిట్లు కావు .కొన్నిఫట్లూ ఉంటాయనీ ,అంతా మన ప్రయోజకత్వమే కాదు ,కాలమ్ కూడా కలిసి రావాలని తెలియ జెప్పిన సమ్మేళనం ఇది .అతిధులకు ,నిర్వాహకులకు కవి మిత్రులకు కన్యాశుల్క   నాటకం లో చక్కని హాస్యాన్ని  పండించి ,తెలుగు జాతిని జాగృతం చేసిన వైతాళికుడు గురజాడ అప్పా రావు గారి ముచ్చ టైన  కలర్ ఫోటో లను జ్జ్ఞాపికలు గా అంద జేశాం .  .అందరు దాన్ని అద్భుతం గా వుందని మెచ్చుకోవటమే మాకు మిగిలిన ఆనందం .కవితలను పుస్తకం గా తేవాలని ముందుభావించినా   విర మించు కొన్నాం . .ఆ కవితలను మీ అందరి కోసం వరుసగా నెట్ లో త్వరలో అంద  జేస్తాం .ఫోటోలు త్వరలో నెట్ లో పెడతాం.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద చిత్ర రామాయణం – విహారి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —11

    సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —11

                              కృతులలో వ్యాజ నిందలు నిందా స్తుతులు అధిక్షేపణ 

 తాను నమ్మిన దైవాన్నో ,రాజునో ,ఇష్టమైన వాడినో ,తిడుతూ పొగడటటం ,పొగడుతూ తిట్టటం ,అధిక్షే పించటం ఒక రకమైన కవితా మర్యాద. చనువున్న కవి చేసే విచిత్ర ప్రక్రియ .భగ వంతుని లో ,ఆనందామృతం పంచుకొనే వారు చేసే రస రమ్య వినోదం .ఇందు లోను ,త్యాగయ్య ది పెద్ద పీటే .”నాకు ఇతర మతాలు తెలీవు .మది కరిగెట్లు భజన చేశాను .నేను భువిని మాని –నీవు కనికరం లేని హీనుడని పించుకోవటం మర్యాదా ?”అంటారు త్యాగ రాజ స్వామి రామ స్వామి తో .నింద  మోపి ,భయ పెడ్తున్నాడు .
శ్రీ రాముడు చేసిన వింత పనులకు గుట్టు తెలిసి కోని ,మంచి ఉద్దేశ్యం తోనే కీర్తిని ఆపాదిస్తాడు .కొత్త పోకడ ,సోంపు తో వున ఈ కృతిని తిలకించండి .
”నిరు పేద భక్తుల ,కారి కోత బడ  లేక గిరి పై ఎక్కావా ?రాలేరు అని శ్రీ రంగం లో దాగావా ?ఎప్పుడో వచ్చే ,జీర్ణ కుచేలుడి కోసం ,గోపీ వస్త్రాపహరణం చేశావా ?//అని ఎద్దేవా చేస్తాడు భక్త త్యాగయ్య.”నిన్ను ఆశ్రయిస్తే ,అన్నీ కష్టాలే .ఎవరేం బావుకొన్నారు ?”అని అధిక్షే పిస్తూ ప్రతి చోట ,ఒక కధకు ఊహ కల్పిస్తాడు .రసికత గల ఈ కృతి చూడండి –
”అడిగి ,సుఖము లెవరు అనుభవించిరి రా ,ఆది మూలమా రామా
ఆశ్రయించి ,వరమడిగిన ,సీత అడివికి బోనాయె –
ఆశ హరణా ,రక్కసి ఇష్ట మడగ ,అపుడే ముక్కు పోయేగా రామా
వాసిగా నారదముని ,వర మడుగ ,వనిత రూపు డాయే
ఆశించి దుర్వాసు డన్న మడుగ ,అపుడే మంద మాయే (కడుపు నిండి పోయింది )
సుతుని వేడుక జూడ దేవకి ,యడుగ ,యశోద సూడ నాయె
సతు లెల్ల ”రతి భిక్ష ”మడుగ ,వారి ,వారి పతుల వీడ నాయె ఓరామా
నీకే దయ బుట్టి ,బ్రోతువో ,బ్రోవవో నీ గుట్టు బయ లాయే
సాకేత ధామ ,శ్రీ త్యాగ రాజ నుత స్వామి -ఏటి ఈ మాయ ఓరామా  ”
”ఈ కృతి లో లలిత ,నిశిత అధిక్షే పణ వుంది ”అన్న విశ్లేషకుల మాట అక్షర సత్యం .అడిగిన వారికి ‘ఎగ నామం పెడ తావు నువ్వు ”అని శ్రీ రామునికే నామాలు పెట్టాడు గడుసు త్యాగయ్య.గురువుకే పంగ నామం అంటే ఇలాంటిదేనే మో ?
భక్తి పుట్టించిన అలౌకిక శక్తి తో త్యాగయ్య ”ఎన్నాల్లూరకే వుందువో  చూతాము .ఎవరడిగే వారు లేరా శ్రీ రామా ?”అని వాడుక భాష లోనే బెదిరిస్తాడు .ఇలాంటి దాన్ని ”ఉపద్రవ భక్తి ”అన్నారు .అంతే కాదు ,”అన్నీ ,తానను మార్గమునను ,చనితే ,నన్ను వీడెను ?అంటావు ,భార మంటావు .”అని నిందిస్తాడు .”తన్ను బ్రోవరా సదా అంటె ,ద్వైతుడనేవు ?”అని దిగ్భ్రమ చెందు తాడు .”ఏ దారి సంచ రించ మంటావు ?నువ్వే చెప్పు ?”అని నిల దీస్తాడు .ఇందులో ఆత్మానందం ,తన్మ యత్వం ,ఆత్మ విశ్వాసం ,అకలంక భక్తి వినమ్ర, వినీత ప్రార్ధన కన్పిస్తాయి త్యాగయ్య లో .
”దేహ బుధ్యాతు దాసోహం ,జీవి బుద్ధ్యా తు త్వదంశః   -ఆత్మ బుద్ధ్యాత్వమే వాహం ”అన్న శంకరా ద్వైతాన్ని ,భక్తి పూర్వక నిర్వచనం  ఇస్తాడు త్యాగ య్య భక్త శిఖామణి .
”నన్ను దగ్గరకు తీయ వద్దని ,నీ పరి వారం లో ఏవ రైనా అన్నారా నీతో ?లేక గరుత్మంతుడు ”సమ్మె చేశాడా “”/అని స్మిత పూర్వాభి లాషి (నవ్వి ,మాట్లాడే వాడు )మందస్మిత వదనారవిన్దుడు అయిన   రామ ప్రభువును ,అవహేళన చేస్తాడు ,ఆర్తి గా .”నగు మోము గన లేని ,నా జాలి తెలిసి ,నను బ్రోవగ రాదా శ్రీ రఘు వర -నీ నగు మోము
నగ రాజ ధర ,నీడు పరి వారు లెల్ల ,-ఒగి బోధ న చేసే వారలు గారే -ఇటులున్డుదురా ?
ఖగ రాజు నీ యానతి విని వేగ చానా లేదో ?గగనానికి ఇలకు బహుదూరంబని నాడో ?
జగ మేలే పర మాత్మా !ఎవరితో మొర లిడుదు -వగ జూపకు ,తాళను ,నన్నేలు కోరా -త్యాగ రాజ నుత” –
ఒక వేళ లంచాలేమైనా పని చేశాయా ?ఇకా ఎక్కువ ఎవరైనా ముట్ట జెప్పారా ?”అంటూ పాత కధలు మనోజ్ఞం గా జ్ఞాపకం చేశారు త్యాగయ్య .
”ఇభ రాజేంద్రుడు ఎక్కు వైన లంచమిచ్చినా డేమిరా ?-సభలో మానము బో సమయంబున సతి ఎమిచ్చేనురా ?
భాగవతాగ్రేసర ,రాసికావన ,జాగ రూకుండని  పేరే ?–రాగ స్వర యుత ,ప్రేమ భక్త ,జన రక్షక ,త్యాగ రాజ పండిత ”
భక్తుడిని ,ఉపెక్షిస్తుంటే నిల దీసే భక్తి ,శక్తి ,యుక్తి ,అను రక్తి వున్న వాడు త్యాగయ్య .అందుకే అంత ఘాటు మాటల పోట్లు పొడిచాడు తన రామయ్యను .సంగీత భక్తుల యెడ ,శ్రీ రామునికి పక్ష పాఠం వుందని ,పాత భక్తి  సంగీత సార్వ భౌముల కధలు ,గాధలు విన్న వాడు ,వారి వ్యధలన్నీ తెలిసిన వాడు అయిన త్యాగయ్య .
భక్తుడు దీనా వస్తా లో వుంటే దేవి తో సరస సల్లాపాలా ?అని ”కోలా హల ”రాగం లో కోలా హలం ,హల్చల్ సృష్టించాడు .లలిత నిందా స్తుతి తో ,తళుకు బెళుకు తో మనసును ఆకర్షిస్తాడు .అవతారాలు పది వున్నా ,అందులో ”రామా వతారమే ,రామ వేషమే మిన్న ”అని ఉబ్బి పోయే ఉబ్బు లింగం త్యాగ బ్రహ్మం .
”పది వేసములలో ,రామ వేసమే -బహు బాగనుచు గోరు నన్ను ,బ్రోవ
ఇట్టి వేళ నీ కెట్లు తోచు నని ,-ఇల్లాలితో ముచ్చట లాడేదు ?
రట్టు నీ మనసు కెట్టు తోచెనో ,రక్షించుటకు ,శ్రీ త్యాగ రాజ నుత
మది లో యోచన పుట్ట లేదా ?మహా రాజ రాజేశ్వరా ?”
ఇటు కాక పొతే ,అటు నుంచి నరుక్కు రామ్మన్నారన్న నానుడి త్యాగయ్య కూ తెలుసు .అందుకే అయ్య వారిని వదిలి అమ్మ వారి శీలాన్ని పొగడటం ప్రారంభించాడు ..సీతమ్మ ను పెండ్లాడ బట్టే నీ వైభోగం అంటాడు కాంభోజి రాగ కృతిలో
”మా జానకి,చట్ట బెట్టగా ,మహా రాజు వైతివి -రాజ రాజ వర రాజీవాక్ష విను
రావా నారి యని రాజిల్లు కీర్తియు ,కాన కేగి యాజ్న మీరక
మాయా కారమునిచే ,శిఖి చెంతనే యుండి -దానవుని వెంట చని అశోక తరు మూల నుండి
వాని మాటలకు కోపగించి ,-కంట ,వధి ఇమ్పక నే యుండి
శ్రీ నాయక ,యశము ,నీకే కలగా -జేయ లేదా ?త్యాగ రాజ నుత ”
అక్క యైన శ్రీ మహా లక్ష్మి భర్త శ్రీ రాముని ,బావగా భావించి పెడు తున్న చీవాట్లు ,ఎత్తి పొడుపుల్లో చాతుర్యం ,మంచి పాకం లో సాగుతాయి ”.వైకున్థం లో వున్నా ,నా దగ్గరకు వచ్చి ,నా హృదయ పీఠం అధివ శించి  ,నన్ను సంతోషింప జేస్తున్నావు .మారు పలకవు .నేనేమైనా జార ,చొర భజన చేశానా” ?అని నిందా,స్తుతి అధిక్షేపణ పెన వేసి నిల దీస్తాడు .ఆ హక్కు తనకే వున్నట్లు భావితాడు .నిజం గా జారుడు చోరుడే కదా శ్రీ కృష్ణుడు .”తులసీ దాస సంప్రదాయం” లో శ్రీ కృష్ణ భజన చేయరట .శుద్దాత్వైతం లో అంటె” వల్లభా చార్యుల మతం” లో రామ భజన చేయరట .ఇదో వింత భక్తి .

” ప్రాప్తి గల్గు చోట ఫల మిచ్చు దైవంబు-ప్రాప్తి లేని చోట ఫలము లేదు
ప్రాప్తి లేక పసిడి ,పరమాత్ము డిచ్చునా ?”అన్నాడు ప్రజా కవి వేమన .అలాగే త్యాగయ్య కూడా
”రానిది రాదు ,సురాసురులకైనా ,-పోనిది పోదు భూసురలకైనా ”అంటూనే
దేవేంద్రునికి సుదేహము ,పూర్వ దేవుళ్ళకు అమృతం అభావం కాలేదా ?”అంటాడు .
”ఆ వన చర బాధలు ఆ మునులకే గానీ ,”అన్న మాట సర్వ జీవులకు ఆనవా యించే సూత్రమే .రాక్షసులను ” పూర్వ  దేవుళ్ళు ”అనటం సరదా అయిన మాట .వాళ్ళూ ఒకప్పుడు  దేవుళ్ళే నని గుర్తు చేయటమే .మునులకు అరణ్య వాసం పాపం వారి నుదిటి వ్రాత గా అభి వర్ణించటం తమాషా .దీన్ని ఎవరు తప్పించ లేరు అని ధ్వని .విధి బలీయం అనటాన్ని సమర్ధించటం ..
దొంగ దారు లు తొక్క కుండా ,మాట మీద నిల బడ మని ఘాటుగా నిందా స్తుతి చేస్తాడుతమాషాగా .”ఇల్లు బంగారం అయిందా ?”అనీ ,”రంగాడా విభీషణునికి ,పంగ నామ మిడిన రీతిని ”పూర్వ కధ గా అభి వర్ణిస్తాడు .విభీషణుని తో లంకకు వస్తానని ఎగ గొట్టిన రాముడి మాట ను ఇక్కడ గుర్తు చేశాడన్న మాట .
”వెన్న తా   భుజించి ,గోప కన్య ముఖమున -తిన్న  గా నలది నట్లు ;”అన్న కృతి లో ఆలా కృష్ణ లీలలు వర్ణిస్తూ చెప్పటం గొప్ప గా వుంది .ఇందు లో శ్లేష ను కూడా జోడించి చెప్పాడు .విభీష నుడి రాజ్యానికి  పోవ టానికి ఇష్ట పడని రాముడు ”సహ్యజ ”తీరం లో కొల్లడం ,కావేరి నదులు గా చీలిన అంతర్వేది తోనే తృప్తి పడ్డా డని  చమత్కారం .

”సారమౌ కవితల ,విని వెర్రి వాడు -సంతోష పడి ఏమి పడ కేమి ?
చేరెడేసి గుడ్డి కనులు  బాగా ,తెరచి ఏమి తెరవ కున్న వేమి ?
ఎదను శ్రీ రామ భక్తియు లేని ,నర జన్మ   -మెత్తి ఏమి ,మృగ మైతే నేమి ?
పదము ,త్యాగ రాజ నుతు ని పై ,గానిది -పాడితే ఏమి ?ఏడ్చి తే నేమి ”?

అని రసవత్తరం గా అధిక్షే పించే సత్తా త్యాగయ్య భక్తునిది .త్యాగ రాజ వినతుని ,కడిగి ఎందేయ గల సామర్ధ్యం చాతుర్యం ,చేవ ఆయనకే వుందని పిస్తాడు .ఎగ తాళి చేసినా ,సమయం తెలిసి పుణ్యాన్ని ,ఆర్జించాలని త్యాగయ్య హావం .సొంపైన నడ వాది ,మనసుకు పట్టే లోకోక్తులు ,లోక రీతి ,కాల గతి ,చూపిస్తాడు త్యాగయ్య .శ్రీ రామ భక్తి ఏ పరమ తారకం అనే పూర్తి విశ్వాసం తో వున్న భక్త శిరోమణి ,రామ పాద సేవా దురంధరుడు త్యాగ బ్రహ్మ .
వ్యాజ నిన్దాస్తుతులు ,అధిక్షేపణ లకు ఇంతటి తో స్వస్తి పలుకు దాం .
త్యాగ రాజ కృతుల్లో” భక్తి ,శరణా గతి ”గురించి తరువాత వివరంగా తెలుసు కొందాం
సశేషం
మీ –గబిత దుర్గా ప్రసాద్ –20 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –10

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –10

                                         పద చిత్రాలు –2
ఇంకొన్ని పద చిత్రాల సోంపు చూద్దాం .శ్రీ రామునికి ఇరు వైపులా సీతమ్మ ,లక్ష్మణుడు నిల బడి సేవ చేస్తున్న వైనాన్ని , ,ఖర హరుడైన శ్రీ రామునికి ”ఖర హర ప్రియ ”రాగం లో ,త్యాగయ్య ఔచితీ వంతం గా చేసిన రచన తిల కించండి . .
”ప్రక్కనా నిలబడి ,కొలిచే ముచ్చట  బాగా తెలప రాదా –చుక్కల రాయని ,గేరు మోము గల ,
సుదతి సీతమ్మ ,సౌమిత్రియు ,ఇరు ప్రక్కలా నిలబడి —
తనువు చే వందన మొనరించు చున్న -రాచనవున,, రామ కీర్తన చేయు చున్న రా
మనసున దలచి ,మై మరచి వున్న ,-రా నేనరుంచి ,త్యాగ రాజుని తో హరి హరి ,మీ కిరు  ప్రక్కలా ” ,
ఇదొక అలౌకిక చిత్రం .మాటల చిత్రం ,మనసు కు పట్టే చిత్రం .ఆ దృశ్యం ,మనో వీధి లో చూచి ,మై మరపించే పులకింపు .తానూ ,మైమరుపు తో  సేవిస్తున్న భావన .విశ్వాస  పూర్వక మైన ఆకాంక్ష.
త్యాగయ్య శ్రీ రాముడు కేళీ వినోదుడు .తెలుగు వారి ”ఓమన గుంటలు ”ఆడతాడు .విశ్వ రూపుని కేళీ విన్యాసం .ఆది దంపతుల మధుర ప్రణయ లీలను దివ్య చిత్రం గా మలుస్తాడు .పద బంధం తో ప్రేమ జ్యోత్న పరుస్తాడు .పోతన్న గారు ”అల వై కుమ్థ  పురంబు లో ”,అన్న పద్యానికి అనుకరణ ,చాతుర్యం చూపిస్తాడు త్యాగయ్య .
”మధుర మైన పల్కులసీతా రమణి తో ,”ఓమన గుంట గెలుచుట ” ” ,
చేత ,నొకరి నొకరు చూచుచు ,సాకేతాధిప ,నిజ మగు ప్రేమతో ,
బల్కు కొన్న ముచ్చట ,వాతాత్మజ ,భరతులు విన్నతుల .త్యాగ రాజ సన్నుత
విన నాస గోన్నానురా ,విశ్వ రూపు డనే ,మనసార ,వీనుల విందుగా ”
లలిత లావణ్య మూర్తి శ్రీ రాముని ముద్దు లోలికే మోము ను భక్తి మీర త్యాగ రాజు వర్ణిస్తాడు .సౌందర్యో పాసన తో ఆ స్వామి తను వంతా ,సౌందర్య సుకు మారం గా ,కాంతి వంతంగా ,కన్పిస్తుంది మనో వీధిలో
”సొగసు చూడ తరమా ?నీ సొగసు చూడ తరమా ?
నిగ నిగ మనుచు ,కపోల యుగము చే మెరయు మోము –అమరార్చిత పదయుగామో ,
కమ నీయ ,తను ,నిందిత కామ ,కామ రిపు నుత ,నీ -సొగసు చూడ తరమా ?
వర బింబ సమాధరమో ,వకుళ సురంబుల యుగమో–కర ద్రుత శర కోదండ ,మరక తాంగ వర మైన
చిరు నవ్వు ,ముంగురు లతో ,మరి కన్ను ల తెటో -వర త్యాగ రాజార్చిత ,వంద నీయ -ఇటు వంటి -సొగసు చూడ తరమా”
పంచ నదీ తీరం లో త్యాగయ్య స్వయం గా ,జరి పించిన నిత్య భజనో త్సవంకన్నుల   ముందు నిల బెట్టు తాడు .సుందర పద బంధాలు తాళ నృత్య గతులతో వెంట నర్తిస్తాయి .అదీ త్యాగయ్య కృతి వైభవం .
”హరి దాసులు వెడలె -ముచ్చట ఆనంద మాయే -దయాళో
హరి గోవింద ,నరహరి ,రామ కృష్ణ యని ,వరుసగ నామము కరుణ తో జేయుచు
సంగతి గాను ,,మృదంగ ఘోష ములచే ,పొంగుచు ,వీధుల కేగుచు ,మెరయుచు
         చక్కని హరి చే జిక్కితి మని ,మది సొక్కుచు నామమే ,దిక్కని పొగడుచు –హరి గోవింద
          దిట్ట ముగా నడు కట్టు తో నడుగులు ,బెట్టు చు ,తాళ ముల్  బట్టి,గల్ గల్లన
జ్ఞాన ముతో ,రామ ధ్యానముతో ,మంచి గానము తో ,’మేను దాన” మొస గుచు
రాజ ,రాజుని పై ,జాజులు ,చల్లుచు ,రాజిల్లుచు త్యాగ రాజు ని తో గూడి –హరి ,గోవింద” —
భక్తుల ఆనంద పార వశ్యం నృత్య గాన భంగి మలు ,మనో ఫలకం పై ,ముద్ర వేసి నట్లు గా పదాల పరుగు ,నాట్యం చేసి నట్లుండే నడక ,మనో హర పద బంధం .అర్ధ వంతం ,మధుర శబ్ద ప్రయోగం .వారందరికీ శ్రీ రామ నామమే దిక్కు .”మేను దానం ”అనటం లో శరణా గత తత్పరత కని పిస్తుంది . ఈ విధం గా తాను మనసు లో ఊహించుకొన ,తాను సమాధి స్తితి లో దర్శించిన ,శ్రీ రామ కుటుంబ సపరి వార చిత్రాలను చక్కని పద బంధాలతో మృదు మధుర పద సౌందర్యం తో వర్ణ చిత్రాలు గా వేసి ,చూసి తరించ మని తెలియ జేశాడు త్యాగ రాజ మహా పద చిత్ర కారుడు .
దీని తర్వాత ”కృతుల లో -వ్యాజ నిందా స్తుతి ,అధిక్షేపణ ”లను తారు వాతి భాగాలలో  తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –9

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –9

                                       కృతులలో పద చిత్రాలు 
పరమ భక్తాగ్రేసరుడు త్యాగయ్య శ్రీ రాముని కొలువు సన్నిధానం గా చేసుకొని, చూసి ,పాడి ,తన్మయుడై  ,ఒక దృశ్య చిత్రం లా మన ముందు వుంచుతాడు .,
”పాహి రామ యనుచు ,భజన సేయవే -మనసు రంజిల్ల బల్కె మదన జనకుడు
కలువల రేకుల ను గేరు కనుల జూచెను -భారతుడా వేళ కరిగి కరిగి నిలవగా
కరము బట్టి కౌగిలించే వరదు డప్పుడు -మనసు దెలిసి ,కలిసి హనుమంతు డుండగా
చనువు మాట లాడు ,చుండే సార్వ భౌముడు ”
ఊహలో అద్భుత పదచిత్రం గీశాడు .మనసుకు హత్తు కొనే హృద్య మైన రచన ఆ భావుక కవి కి వరం గా లభించింది .
అలాగే ”సౌరాష్ట్ర రాగం ”లో ”వినయము కౌశికు వెంట జను ,నంఘ్రులను ,చూచే దెన్నటికో ”అంటూరామ కధా విధానాన్ని రూపు కట్టిస్తాడు .చిత్ర కారుడిగా మన ముందు నిలుస్తాడు . ,
”ఘన మైన ,పుష్పక మున ,రాజిల్లిన సొగసును -చూచే దెన్నటికో
భరతుని గని చేయి బట్టు కోని ,వచ్చిన వేడుక ను చూచే దెన్నటికో
కనక సింహాసనమున ,నెల కొన్న ఠీవి ని ,చూచే దెన్నటికో ”        అని శ్రీ రామ పట్టాభిషేక మహోత్స వాణ్ని ,కళ్ళ ముందు ప్రదర్శిస్తాడు .హృదయాలను ,ఆర్ద్రం గా మారుస్తాడు .ఇక్కడ త్యాగయ్య లోని భక్తుడు ,కవి ,చిత్రకారుడు ,కొత్త రీతుల్లో కని పిస్తారు .ఆలన్కారికం గా రచన అందం పొందింది .అవయవాలకు ,ఉదాత్త మహిమ కల్పిస్తాడు
”వెనుక ,రాతిని ,నాతి చేసిన చరణము చూసే దెన్నటికో
ఘనమైన శివుని చాపము ను ,ద్రుంచిన ,పాదమును చూచే దెన్నటికో
ఆగమ నుతుని ,ఆనంద కందుని ,బాగ చూచే దెన్నడో
పరమ భాగవత ప్రియుని ,నిర్వి కారు ,నిరాకారుని  రాగ చూచే దెన్నడో ”ఈ కీర్తన లో ,బావం ,భాష ,కల  కండ పలుకే .
పలుకు పలుకున తేనే అంటే ఇదే .ఒక్కొక్క సంఘటన ఒక ”రవి వర్మ చిత్రమే నని పిస్తుంది”అన్న విజ్ఞుల భావన నూటికి నూరు శాతం నిజం .
ఈ చిత్రాలు ,విచిత్రాలే కాదు ,కళా మర్మాలకు ఆల  వాలు . త్యాగయ్య కీర్తనలు రస నిష్యంద నాలు .సౌందర్య స్ఫోరకాలు .గాన కవితా చాతుర్యాలు .
మారీచుని మదం అణచే వేళ ,శివుని ధనువు విరిచే వేళ ,శ్రీ రాముని ముంగురుల కదలిక ఆయనకు ,విశ్వా మిత్రునికి అద్భుత ఆనందాన్ని ,గగుర్పాటును కలుగ జేశా యట  .ఆ శిరో సౌందర్యం ఏమిటో  మనమూ దర్శిద్దాం .
”అలక లల్లలాడగ  ,,గని ,ఆ రాణ్ముని ఎటు పొంగెనో ?

—    చెలువు మారగను ,మారీచుని మద మణి చే వేళ
ముని సైగ దెలిసి ,శివ ధనువును విరిచే ,
సమయమున ,త్యాగ రాజ వినతుని ,మోమున రంజిల్ల  –అలకలల్ల లాడ
త్యాగ రాజ సత్కవి కి అంతా సుందరం ,శివం .
శ్రీ రాముని కొలువు లో ,త్యాగయ్య ప్రతి క్షణం తన్మయ స్తితి లో ఉంటాడు .గోష్టి ,సంకీర్తన ,సేవింపు ,మేలు కొలుపు ,పవ ళింపు దిన చర్య .
”చనవున ,పన్నీట స్నానము గావించి ,-ఘను నికి ,దివ్య భోజనమును ,బెట్టి
కమ్మని విడే మొసగుచు ,మరవక సేవించే –భాగవతులు ,బాగుగా ,ఘన ,నయ రాగ ములచే ,దీపా రాదన మొన రించి
వేగమే ,శ్రీ హరి విరుల పై ,పవళించి ,జోకొట్టి ,-త్యాగ రాజు సుముఖుని లేపే -”
ఇది సంపూర్ణ పరిచర్య స్వరూపం .కళ్ళకు కట్టి నట్లు వ్యక్తీకరించటం త్యాగయ నేర్పు .
శ్రీ రాముని కొలువులో ,వార కాంత ల ,రమణీయ లాశ్య విన్యాసం చూసి పక్కనున్న త్యాగయ్య తో రామయ్య  మెచ్చు కోలు మాటలు చెప్పి నట్లు భావిస్తాడు .ఆ దివ్య దృశ్యం మన కళ్ళ కు కట్టి నట్లు వర్ణిస్తాడు ,కాదు ,కాదు చిత్రిస్తాడు మహా భక్తాగ్ర గణ్యు డైన  త్యాగరాజ  కవి చిత్ర కారుడు .
”సుర కామినీ ,మణుల గాన -మాదరణ నాల కిన్చుచు
శృంగార ,రస యుక్త ,వారమ ణుల ల జూచి ,సరస త్యాగ రాజ వరుని తో బొగ డే
పలుకు కండ చక్కర ను గేరునే -పణ తు  లార చూడరే ”పటిక బెల్లం పలుకు మెల్ల ,మెల్ల గా కరుగు తూ రుచి నిస్తుంది .అంటే ఆ వాక్యాల మాధుర్యం క్షణికం కాదు ,శాశ్వతం ,ఆత్మాను భవం ,దివ్యాను భవం కవిత్వానికే ప్రాణం .
ఇంకొన్ని పద చిత్రాలు మరో సారి చూద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment