వీక్షకులు
- 1,203,750 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.32 వ భాగం.17.10.26
- మానవుని అన్వేషణ ఏకత్వం మరియు పరిపూర్ణత కోసం:(ప్రబుద్ధభారత్ జూన్ 2026)
- రొమాంటిక్ ఉద్యమ హీరో లార్డ్ బైరన్ జీవిత చరిత్ర -1
- విద్యకు సంబంధించిన శాశ్వత సూత్రాలు మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలు(ప్రబుద్ధ భారత మాగజైన్ జనవరి20 26 వ్యాసానికి నాఅనువాదం )
- అలంకార శాస్త్రవేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.5 వ భాగం.15.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం. విశ్వనాథ వేయిపడగలు.58 వ భాగం.15.10.26
- పంచ సూక్తా లు.4 వభాగం.15.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.30 వ భాగం.,15.10.26
- అలంకార శాస్త్ర వేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.4 వ భాగం.14.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.57 వ భాగం.14.10.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,580)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
ఊసుల్లో ఉయ్యూరు –48 సాయానికి మరో పేరు సీత పిన్ని
ఊసుల్లో ఉయ్యూరు –48
సాయానికి మరో పేరు సీత పిన్ని
మా నాన్న కు స్వంత అన్న దమ్ములు లేరు .అందుకని మాకు స్వంత పెదనాన్న ,స్వంత బాబాయిలు లేరు ఈ లోటు మమ్మల్ని బాధీంచేది .మా నాయనమ్మ గారి అక్క గారు మహాలక్ష్మమ్మ గారికి ఒకడే కొడుకు .ఆయన పేరు రాయప్రోలు శివరామ దీక్షితులు .వాళ్ళది రేపల్లె అందుకని ఆవిడను రేపల్లె మామ్మ అని ఆయన్ను రేపల్లె బాబాయి అని అనే వాళ్ళం .మా కుటుం బానికి వాళ్ళ కుటుంబానికి రాక పోకలు బాగా ఉండేవి .మా బాబాయ్ మా నాన్నను ‘’అన్నాయ్‘’అని చాలా గౌరవం గా పిలిచే వాడు .మా నాన్న కూడా ‘’ఒరె తమ్ముడూ అని లేక దీక్షితులూ ‘’అని ఆప్యాయం గా పిలిచే వాడు .స్వంత అన్న దమ్ములు కాక పోయినా అంత అనుబంధం గా ఉండే వారు .మా బాబాయి భార్య లక్ష్మీ కాంతం .ఆమెను లక్ష్మీ కాంతం పిన్నీ అనే వాళ్ళం .మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యాలకు మేము వెళ్లటం రివాజు .బాబాయి వాళ్ళు మంచి స్తితి పరులు .పొలం పుట్రా,నగ నట్రా ఉన్న వాడు .అప్పటికే డాబా ఇల్లు పట్టే మంచం ,తూగుడు ఉయ్యాల .మహా రాజసం గా ఉండే వాడు .బాబాయి పిట్టంత మనిషి ఎర్రగా ఉండే వాడు నుదుట విభూతి కుంకుమ .రోజు సంధ్య ,పూజా యదా విధి గోచీ పోసి గ్లాస్కో పంచె కట్టే వాడు .గ్లాస్కో లాల్చీ .తెల్లని తెలుపు తో ఉండేవి మా మా అమ్మను పిన్ని ‘’అక్కయ్యా ‘’అ మహా ప్రేమ గా పిలిస్తే అమ్మకూడా ‘’కాంతం ‘’అని ఆదరించేది .మా పెద్ద మామ్మ మాత్రం కోపిష్టి .ఆవిడతో మాట్లాడటానికి భయ పడే వాళ్ళం .కంటి చూపుతో శాసించేది
ఇక మా అమ్మ విషయానికి వస్తే అమ్మకు అక్కలు చెల్లెళ్ళు లేరు ఒకే చెల్లి వెంకాయమ్మ ఉండేది.చతుర్వేదుల వెంకటప్పయ్య గారితో పెళ్ళయి,ఒక పిల్లను ,పిల్లాడిని కన్న తర్వాతా చని పోయింది .ఇదంతా మేం పుట్టక ముందరి సంగతి .కనుక మాకు స్వంత అమ్మక్కయ్య అంటే పెద్దమ్మ కాని పిన్ని కాని లేరు .ఆ లోటుకూ బాధపడ్డాం .మా మామ్మ చెల్లెళ్ళ కోడల్లె మాకు పిన్ని లు .వారినే ఆప్యాయం గా పిన్నీ అని పిలిచే వాళ్ళం .అందులో మాకు బాగా ఇష్టమైన పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని‘’మా పాపాయి పిన్ని ‘’గురించి ఊసుల్లో ఇదివరకే రాసేశాను .ఆమె మా చిన్న మామ్మ కల్యాణమ్మ గారి కోడలు .ఒక కొడుకు ను కని భర్త ను కోల్పోయి విధవ గా జీవించింది
ఇప్పుడు నేను రాస్తున్న ‘’సీత పిన్ని ‘’మా బుల్లి మామ్మ గారి కోడలు .బుల్లి మామ్మ అంటే మా మామ్మ చివరి చెల్లెలు .బుల్లి మామ్మ అనే పిలవటం మాకు ఇష్టం ఆవిడకీ అంతే. అసలు పేరు సౌభాగ్యమ్మ .గుండు వారి ఆడ పడుచు .సూరి వారికోడలు ఉయ్యురే .మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాత పశువులాస్పత్రి దగ్గర సూరి వారి బజారు లో వాళ్లకు స్వంత ఇల్లూ పొలం ఉన్నాయి మా మామ్మ లందరూ మాకు గ్రాహకం తెలిసే సరికే విధవలు .వారి కోడళ్ళూ అంతే . అదే వాళ్ళందరి దౌర్భాగ్యం .సీత పిన్ని భర్త అంటే మా బాబాయ్ కూడా పెళ్ళి అయిన కొద్ది రోజులకే చని పోవటం విచారకరం ఈమెకు సంతానం కూడా లేదు .ఈవిడ రేపల్లెలో రామడుగు వారి ఆడ బడుచు చాలా కాలం పుట్టిన ఇంట్లో ఉండేది .బుల్లి మామ్మ ఇంకో కొడుకు రామ మూర్తి ఒక కొడుకు కూతురు లను కన్న తర్వాత చని పోయాడు .మా పిన్ని పేరు సరస్వతి .వీరి కొడుకు కూతుళ్ళే రాదా కృష్ణ మూర్తి సరోజినీ ఉయ్యూరులో నే ఉండి తర్వాతా బెజ వాడ చదువులకు చేరారు .రాదా కృష్ణ మూర్తి పెద్ద వాడిన తర్వాత మా సీత పిన్ని అత్తగారి దగ్గర ఉండేది .పిల్లల ఆలనా పాలనా చూస్తూ .
సీత పిన్ని కొంచెం పళ్ళు ఎత్తు తో ఉండేది .పొడగరి .కోల ముఖం నవ్వు ముఖం .మహా నవ్వించేది మాటలతో అందర్నీ ఆట పట్టించేది .మా ఇళ్ళల్లో పెళ్ళీ ,పేరంటాలు జరిగితే వారం రోజులు ముందుగానే రమ్మని ఉత్తరం రాస్తే రెక్కలు కట్టుకొని వాలేది .తెల్ల చీరే కాశా పోశిగా కట్టేది .జుట్టు మాత్రం ఉండేది తీయించలేదు .ఆవిడ వచ్చింది అంటే సందడే సందడి .మా మామ్మను, బుల్లి మామ్మను, చిన్న మామ్మను మాటలతో ఒక పట్టు పట్టేది .మా అమ్మకు ఆవిడ వస్తే మహదానందం అన్నిట్లోనూ సాయం చేసేది .కూరలు తరగటం మజ్జిగ చిలకటం పిల్లలకు చద్దేన్నాలు పెట్టటం పాలేర్ల తిండీ సమస్తం మహా వేగం గా చేసేది .కార్యాలు అయి పోయినా మా అమ్మ ఆవిడను వెళ్ళ నిచ్చేది కాదు .పదహారు రోజుల పండుగ వెళ్ళాలి ,కనీసం నెల అన్నా ఉంటె కాని మాకు తృప్తి గా ఉండేది కాదు .పని దగ్గర బద్ధకం లేదు యమా స్పీడు .చెప్పే పని ఉండేదికాదు .అమ్మకు తలలో నాలుకే .అందుకని అమ్మ ఆవిడను వదల్లేక పోయేది .’పిండి వంటలు చేయడం లో ఎక్స్పెర్ట్
మా నాన్న చని పోయినప్పుడు ,అంతకు ముందు మా అన్నయ్య చని పోయినప్పుడు సీత పిన్ని వచ్చి అమ్మ దుఖాన్ని పోగొట్టి అమ్మకు చేదోడు వాదోడు గా ఉండి మమ్మల్ని కంటికి రెప్ప లాకాపాడింది .మా అక్కయ్యలకు జడలేయటం పూలు కట్టటం ఒకటేమిటి ఆవిడ చెయ్యని పని ఉండేది కాదు .మడి కట్టుకొని అందరికి వడ్డించేది .ఒక రకం గా మా ఇంట్లో ఒకరై పోయింది సీత పిన్ని .ఆవిడ మాటలు వింటుంటే కడుపు చేక్కలవ్వాల్సిందే .గణగణాఘంట కొట్టి నట్లు మాట్లాడేది చక చకా నడిచేది .మనుష్యుల పోకడలన్నీ పసి కట్టేది అందర్నీ ఇమిటేట్ చేసి మాట్లాడేది వాళ్ళు నడిచి నట్లు నడిచేది వాళ్ళ హావ భావాలన్నీ చూపించేది .అందుకని సీత పిన్ని చుట్టూ జనం ఎప్పుడూ చేరే వాళ్ళు పిల్లల కోడి అని పించేది .అంత చొరవ ,మర్యాదా ఆప్యాయతా ప్రేమ సహాయం ,సానుభూతి ఉన్న మనిషి మాకు ఎవ్వరూ కనిపించ లేదు .అందుకే సీత పిన్ని అంటే మా అందరికి మహా భిమానం .ఆవిడ కొంగు పట్టుకొని తిరిగే వాళ్ళం ఆవిడ ఉయ్యూరు లో మా ఇంట్లో ఉన్నంత కాలం .ఆవిడ రేపల్లె వెళ్లి పోతే చాలా రోజులు ఇల్లంతా శూన్యమే అని పించేది .మా నాన్న అంటే మహా గౌరవం ‘’బావ గారు బావ గారు ‘’అని గౌరవం గా అనేది .ఆయన ఎదురు పడి మాట్లాడటం ఎప్పుడూ మేము చూడలేదు ..అయితే నాన్న స్కూల్ కు వెళ్లినప్పుడో బజారు వెళ్ళి నప్పుడో ఆయన చూపించే కోపాన్ని చమత్కారం గా చూపించి మమ్మల్ని నవ్వించేది .ఆయన ఇంట్లోకి వస్తే గ్యప్ చిప్ అంతే .
దాదాపు మాఇంట్లో అన్ని పెళ్ళిళ్ళకు ఉపనయనాలకు ,సీమంతాలకు ,పురుల్లకు బంతులకు ,కాశీ సమారాధనలకు బాలసార,వగైరా ఆన్ని సందర్భాలలో సీత పిన్ని లేకుండా యే దీ జరగలేదు .ఎన్ని కార్యాలైనా ఆవిడకు అలుపు సొలుపు ఉండేది కాదు .మా మేన మామ గంగయ్య గారు మా సీత పిన్ని చేరితే చాలు నవ్వుల పువ్వులు రాలేవి .పొట్ట చేక్కలయ్యేవి .తాను నవ్వకుండా అందర్నీ నవ్వించే నేర్పు ఆవిడది .నవ్వించటం ఆవిడకున్న మహా సుగుణం .అదే అందరి కి ఆమె ను దగ్గర చేసింది .రేపల్లె లో తమ్ముడి దగ్గర ఉండేది .అప్పుడు ఫోన్ లు లేవు ఉత్తరాలే. ఉత్తరం అందిందంటే వచ్చి వాలేది పిన్ని .ఆమె ఉంది అంటే అమ్మకుభలే భరోసా .ఇలా మా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సంతోషం లో మాతో పాలు పంచుకోన్నది .ఏమీ ఆశించేది కాదు .చాలా సాదా సీదా గా ఉండేది .రాత్రి పూట పిండి తినేది .అందులోకి వంకాయ పులుసు పచ్చడి అద్భుతం గా చేసేది మాకు పెట్ట కుండా తినేది కాదు .అమ్మను‘’భావానక్కాయ్ ‘’అని పిల్చేది .అమ్మ ఆవిడను ‘’ఒసే రాముడూ ‘’’అనేది ఆవిడ పూర్తీ పేరు సీతా రావమ్మ.
.1975 తర్వాత ఆవిడ ఆరోగ్యమూ దెబ్బతింది .తమ్ముడి ఆర్ధిక స్తితి తగ్గింది అందుకని రేపల్లె వదిలి వచ్చేది కాదు .ఆమె చని పోతే రాదా కృష్ణ మూర్తి తో దగ్గరుండి కర్మ కాండలు జరిపించాం .ఇలా మేము మా కుటుంబం ఒక గొప్ప అండ ను కోల్పోయాం .కనీసం ఆవిడను ఈ విధం గా నైనా జ్ఞాపకం పెట్టుకోవటం నా కనీస కర్తవ్యమ్ గా భావించి మా సీత పిన్ని గురించి రాసి అక్షరాలతో ఋణం తీర్చుకొంటున్నాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం –42 తిది యాత్ర
కాశీ ఖండం –42
తిది యాత్ర
ప్రతి నెలాశుక్లపక్షం లో తదియ నాడు నవ గౌరీ యాత్ర చేయాలి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది .మంగళ వారం తదియా కలిస్తే ఇంకా మంచిది
గాయ ఘాట్ పై ఉన్న గోపెక్ష తీర్ధాన్ని సందర్శించి పూజించాలి .జ్యేష్ఠ వాణీ తీర్ధం లో జ్యేష్ఠా గౌరీ దేవిని దర్శించాలి. ప్రస్తుతం ఇది లేదు. జ్ఞాన వాపీ తీర్ధం దగ్గార సౌభాగ్య గౌరీ దేవిని చూడాలి .ఇక్కడే ఉన్న శృంగార గౌరీ దేవినీ దర్శించాలి మీర్ ఘాట్ వద్ద ఉన్న విశాలాక్శే గౌరీనిచూడాలి లలితా ఘాట్ దగ్గరున్న లలితా గౌరీని దర్శించాలి .భవానీ తీర్ధం లో భవానీ గౌరిని చూడాలి బిందు తీర్ధం లో మంగళ గౌరిని సందర్శించాలి .లక్ష్మీ కుండం లో మహా లక్ష్మీ గౌరీ ని దర్శిస్తే నవ గౌరీ యాత్ర పూర్తీ అవుతుంది . చప్పన్ వినాయక యాత్ర
ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్ధి నాడు 56మంది వినాయకులను దర్శించటమే చప్పన్ యాత్ర .ఇందులో ఏడు ఆవరణలుంటాయి ఒక్కో ఆవరణ లో ఎనిమిది మంది వినాయకులు .ఏడు ఆవరణల్లో కలిపి యాభై ఆరు మంది అవుతారు
మొదటి ఆవరణ లో –లోలార్క కుండం లోనీ అర్క వినాయకుడు ,దుర్గా కుండం లో దుర్గా వినాయకుడు ,భీమ చండి లో భీమ చండీ వినాయకుడు ,ప్రసిద్ధమ్ లో ఉన్న దేహలీ వినాయకుడు ,భుయిలీ లో ఉద్దండ వినాయకుడు ,సదర్ బజార లో పాశ పాణి వినాయకుడు ,వరుణా సంగమం దగ్గరున్న ఖర్వ వినాయకుడు ,మణి కర్ణికా ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రధమ ఆవరణం పూర్తీ అయినట్లు
రెండవ ఆవరణలో –కేదార్ ఘాట్ వద్ద లంబోదర వినాయకుడు ,కుమి కుండ మహల్ దగ్గర కూట దంత వినాయకుడు ,మాడు అమేహ్ వద్ద కాల కూటవినాయకుడు ,ఫుల్ వరియా లో కూష్మాండ వినాయకుడు ,వారాణసీ దేవి మందిరం లో ముండ వినాయకుడు ,ధూప చండీ దేవి వెనుక వికట దంత వినాయకుడు ,పులుహీ కోటలో రాజ పుత్ర వినాయకుడు ,త్రిలోచనా ఘాట్ లో ప్రణవ వినయ దర్శనం తో ద్వితీయ ఆవరణం పూర్తీ .
మూడవ ఆవరణం –చోసట్టీ ఘాట్ లో వక్ర తుండ లేక సరస్వతీ వినాయకుడు ,బంగాలీ బోలా వద్ద ఏక దంత వినాయకుడు ,సిగిరావార్ లో త్రిముఖ వినాయకుడు (వానర ,సింహ ,ఏనుగు ముఖాల తో )పిశాచ మోచన తాలాబ్ పై పంచాస్య వినాయకుడు ,హేరంబ వినాయకుడు ,చిత్ర కూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ,ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ,ఆది దేవ మందిరం లో మోదక ప్రియ వినాయకుడు ల దర్శనం తో తృతీయ ఆవరణం సంపూర్ణం
నాలుగవ ఆవరణం –శూల కన్తేశ్వర స్వామి ఆలయం లోనీ అభయద వినాయకుడు ,బాల ముకుంద చౌహట్టా లో సింహ తుండ వినాయకుడు ,లక్ష్మీ కుండం పై కూణితాక్ష వినాయకుడు ,పితృ కుండం పై క్షిప్ర ప్రసాదన వినాయకుడు ,ఇసర్ గంగీ పై చింతా మణి వినాయకుడు బడా గణేష్ ఆవరణ లోనీ దంత హస్త వినాయకుడు ,ప్రహ్లాద ఘాట్ లో పిచండిలా వినాయకుడు ,వారాణసీ దేవి మందిరం లోనీ ఉద్దండ ముండ వినాయకుని దర్శిస్తే చతుర్ధ ఆవరణం పూర్తీ .
అయిదవ ఆవరణం –మాన్ మందిర్ ఘాట్ లో స్తూల దంత వినాయకుడు ,సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు ,ధవేశ్వర్ మందిరం లో చతుర్దంత వినాయకుడు ,సూర్య కుండం దగ్గర ద్విదంత వినాయకుడు ,మహల్ కాశీ పురా లో జ్యేష్ట వినాయకుడు ,మిక్చర్ ఘట్టా లో గజ వినాయకుడు ,రాం ఘాట్ లో కాల వినాయకుడు ,ఘోసలా ఘాట్ లో నాగేశ వినాయకులను చూస్తె పంచమ ఆవరణం అయినట్లు
ఆరవ ఆవరణం –మణి కర్ణిక వద్ద మణి కర్ణ వినాయకుడు ,మీర్ ఘాట్ లో ఆశా వినాయకుడు ,కాళికా గల్లీ లో సృష్టి వినాయకుడు ,డుండి రాజు వద్ద యక్ష వినాయకుడు ,బాన్స్ ఫాఠక్ వద్ద గజకర్ణ వినాయకుడు ,చాందినీ చౌక్ లో చిత్ర ఘంట వినాయకుడు ,పంచ గనఘా ఘాట్ వద్ద స్థూల జంఘ వినాయకుల దర్శనం తో షష్ఠ ఆ వరణం పూర్తీ
ఏడవ ఆవరణం –జ్ఞాన వాపి వద్ద మోద వినాయకుడు ,విశ్వనాధ కచాహరి లో ప్రమోద వినాయకుడు ,సముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గజ నాద వినాయకుడు ,జ్ఞాన వాపీ దగ్గర జ్ఞాన వినాయకుడు విశ్వనాధ ద్వారం వద్ద ద్వార వినాయకుడు అవి ముక్తేశ్వరుడి వద్ద అవి ముక్త వినాయకులను దర్శిస్తే సప్తమ ఆవరణ తో పాటు చప్పన్ వినాయక దర్శనం పరి పూర్తీ అయి నట్లే
ఈ వినాయక దర్శనం లో కనీసం ఇరవై ఒక్క గరికల తో పూజించటం శ్రేష్టం ఓపిక ఉంటె ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించ వచ్చు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-12-12—ఉయ్యూరు
ఊసుల్లో ఉయ్యూరు -47 ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు
ఊసుల్లో ఉయ్యూరు -47
ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు
మా ఉయ్యూరు లో కొన్ని సంస్థలు అద్భుత ఆశయాలతో ప్రారంభమైనాయి .గొ ప్ప సేవ చేసి తమ లక్ష్యాలను సాధించాయి .కాని కాల క్రమం లో జరిగిన అనేక విషయాల వల్ల అస్తిత్వాన్ని కోల్పోయి కనీసం ఆన వాళ్ళు కూడా మిగిల్చ కుండా కాల గర్భం లో కలిసి పోయి కను మరుగైనాయి .మనకు వ్యధను మిగిల్చాయి .అలాంటి వాటిని కోల్పోయిన దౌర్భాగ్యులం మేము అని పించుకోన్నాం మా ఉయ్యూరు జనం ..
ఉయ్యూరు సోషల్ క్లబ్
ఎన్నో మహత్తర ఆశయాల తో ఏర్పడిన ఈ సంస్థ దాదాపు యాభై ఏళ్ళు చక్కగా పని చేసి ఈ ప్రాంత విద్యా సాంస్కృతిక ,క్రీడా వికాసాలకు దోహదం చేసింది .చాలా మందిసభ్యులను ఆకర్షించింది .నిర్దుష్టం గా కార్య వర్గం పని చేసింది .అందరి ప్రశంశలను పొందింది .స్వయం సమృద్ది ని సాధించింది .ఎన్నోఆశలను రేకెత్తించింది .కాని కాల ప్రవాహం ఎప్పుడు ఒకే రీతి గా ఉండదుకదా .ఎన్నో ఒడి దుడుకు లేడుర్కొని నిల బడ్డా చివరికి విధి చేతిలో తల వంచక తప్పని పరిస్తితి ఏర్పడి నిస్తేజమై ఆ సంస్థా దీపం ఆరి పోయింది .ఆ సంస్థ జన్మించి 2008 కి వందేళ్ళు పూర్తీ అయిన సందర్భాన్ని మాకు కుమ్మ మూరు నివాసి ప్రస్తుతం మదన పల్లి వాస్తవ్యులు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు గారు గుర్తు చేశారు ..ఆ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి న ప్రపంచ ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త ,ప్రపంచ బ్యాంక్ లో ముప్ఫై ఏళ్లకు పైగా పని చేసిన వారు ,అనేక దేశాలకు ఆర్ధిక సలహా దారు గా ఉన్న వారు ఉయ్యూరు నివాసి ,ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారికి ఉయ్యూరు నివాసి ప్రస్తుతం అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం తో సాహితీ మండలి ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఉయ్యూరు సోషల్ క్లబ్ శత జయంతి ని కూడా కలిపి చేశాం ..
నెత్తురు కలం
మన్నే శివ రావు అంటే ఒక సింహ స్వప్నం .ఆయన కు ఎదురు పడ టానికి అవినీతి పరులు జంకే వారు .ఆయన ‘’నెత్తురు కలం ‘’అనేవార పత్రిక కు సంపాదకులు ..అందులో అవినీతి పరులను చీల్చ్చి చెండాడే వారు .ఎవరి పేరు యేవారం వస్తుందో ,ఎవర్ని దూది ఎకి నట్లు ఎకి పారేస్తాడో నని ఆందోళన పడే వారు తప్పు చేసిన వారు .శివ రావు సోషలిస్ట్ నాయకులు .మంచి స్నేహ శీలి .మందూ భాయ్ కూడా .కళ్ళు నెత్తురు ముద్దల్లా ఉండేవి .నేనంటే గొప్ప అభిమానం ఉండేది .ఆయన ఆధ్వర్యం లో అనేక సాహిత్య కార్య క్రమాలు నిర్వహించారు ..అక్కినేని ,జగ్గయ్య ,సావిత్రి రామా రావు వంటి నటులను ఆహ్వానించి సత్కరించే వారు .జార్జి ఫెర్నాండెజ్ మధులిమాయె ,రాజ నారాయణ్ ల తో ప్రత్యక్ష సంబంధాలుండేవి .అయన సంపాదకీయాలు బాంబులే, బుల్లెట్లే .ఖద్దరు పైజమా ఖద్దర్ లాల్చీ తో ఉండే వారు .ఇందిరా గాంధిని రాజ నారాయణ్ ఓడించి నప్పుడు ఆయన్ను ఉయ్యూరులో ఊరేగించి గొప్ప సభ క్జరిపి మాట్లాడించారు .కొంతకాలం ఐరన్ సేఫ్ వ్యాపారం కూడా చేశారు .చివరికి పేపర్ ను వదిలేశారు .నడిచే వచ్చే వారు గండిగుంట నివాసం .ఆయనకు సాహిత్య సభల్లో చేదోడుగా స్వర్గీయ వల్లభనేని రామ కృష్ణా రావు ,స్వర్గీయ డాక్టర్ పిన్నమ నేని రంగా రావు గారు ,,శ్రీ అన్నే పిచ్చి బాబు ఉండే వారు .ఇలా సాహితీ సంస్థా జ్యోతి కూడా ఆరిపోయింది .
పాలిటెక్నిక్ కాలేజి
ఉయ్యూరు ,పరిసర ప్రాంతాలకు సాంకేతిక విద్యా సౌకర్యాలను కలగ జేసింది ఉయ్యూరు పాలిటెక్నిక్ .ఎస్.ఎస్.ఎల్.సి.పాస్ అయితే చాలు ప్రవేశం లభించేది .ఆ సంస్థలో వేలాది విద్యార్ధులు చదివి ఉత్తీర్ణులై గొప్ప ఉద్యోగాలు సంపాదించారు .దీనికి అను బంధం గా ఐ.టి.ఐ.ఉండేది .ఐదో తరగతి అర్హత లో ప్రవేశం లభించేది ..అలాంటిది స్వార్ధ పర రాజ కీయ నాయకుల సంకుచిత స్వభావం వల్ల ఈ కళాశాల ఉయ్యూరు లో అస్తిత్వం కోల్పోయి బెజ వాడ కు వెళ్లి పోయింది .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు మా ఉయ్యూరు జనం ఆ తర్వాత లబో దిబో అన్నారు .ధర్నాలు ఉద్యమాలు చేశారు .నిరాహార దీక్షలు చేశారు శ్రీ కొల్లి రామ కుమార వర్మ గారు దాదాపు నలభై రోజులు నిరాహార దీక్ష చేసినా ఏ ఫలితమూ కలగా లేదు .నక్క పోయిన తర్వాతా బొక్క కొట్టు కున్నట్లయింది మా పని .ఇదొక దౌర్భాగ్యం మా ఊరికి విద్యా సంస్థా దీపం వెలిగి గొప్ప కాంతుల్ని ప్రసరించి ఆరిపోయింది .అయితే ఆ కాంతుల్ని విజయ వాడలో ప్రసరింప జేస్తున్నందుకు కొద్ది ఆనందం .
సరస్వతీ ట్యుటోరియల్ కాలేజి
శ్రీ పుచ్చా శివయ్య గారు అనే రిటైరేడ్ హెడ్ మాస్టర్ ఏర్పరచిన సంస్థ ఇది .దీనికి వెన్నెముక గా నిలబడ్డ వారు గణితం లో అగణితం ప్రతిభ ఉన్న శ్రీ అన్నేహను మంత రావు గారు .బండలు ,గేడి కొంగలు ,ఎందుకు పనికి రానిముదుర్లు ఇందులో చదివి మెట్రిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణు లయ్యారు .కొన్ని వేల మందికి విద్యా దానం చేసిన సంస్థ .మా నాన్న గారు స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు తెలుగు పండితులు గా ఇందులో పని చేశారు .అలాగే శ్రీఆది రాజు పున్నయ్య మేష్టారు వగైరాలు పని చేసి దాన్ని కీర్తి వైభవాన్ని ఆంద్ర దేశం లో చాటారు సరస్వతీ తట్యుటోరియల్ కాలేజి ఆంద్ర దేశం లో ఒక సంచలనం సృష్టించింది .దాని తర్వాతే బెజవాడ లో,ఇలాంటివి వెలిశాయి .ఈ సంస్తాజ్యోతి కూడా క్రమంగా ప్రాభవం కోల్పోయి ,కోడి గట్టి ఆరిపోయింది .
శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ
ఉయ్యూరు లాంటి ప్రాంతం లో ఆస్తికత కు ఏమీ కొదువ లేదు .అయితే ఎవరికి వారు వ్యక్తీ గతం గా కార్యక్రమాలు నిర్వ హించే వారు .విష్ణ్వాలయం లో భాగవత ,రామాయణ సప్తాహాలు చేసే వారు ఆది రాజు చంద్ర మౌళీశ్వర రావు గారి ఓదిన గారు .ఆమె ఒక్కరే నిర్వహించే వారు .చివరి రోజున అందరికి భోజనాలు ఏర్పాటు చేసే వారు .వేద పండితులు వార్శికాలకు వచ్చే వారు మా మామయ్య గారింటికి, మా ఇంటికి, వారణాసి సదాశివ రావు గారింటికి, చోడవరపు చంద్ర శేఖర రావు గారింటికి వచ్చి వార్శికాలు పొందే వారు .అయితే దీనికోసం ఒక ప్రత్యెక సంస్థ లేని లోటు గమనించాడు మా మామయ్యగంగయ్య గారు .చోడవరపు చంద్ర శేఖర రావు గారి పెద్దబ్బాయి ఆర్ధిక సహాయం తో వారింటి దగ్గరే ఒక తాటాకుల పాక వేసి అందులో’’ శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’ను ఏర్పాటు చేశారు .ప్రతి రోజు కార్య క్రమాలు నిర్వ హించే వారు ,మామయ్యా భుజస్కంధాలపై ఆ కార్య క్రాన్ని వేశారు చోడ వరపు వారు .దానికి నూట పద హారు రూపాయలు సభ్యత్వం ఏర్పాటు చేసి మామయ్యఆర్ధిక పుష్టి కల్గించాడు .చాలా మంది సభ్యులైనారు .ఎవరింట్లో అయినా పెండ్లి ,ఒడుగు అయితే వారు స్వచ్చందం గా ఈ సంస్థకు విరాళా లిచ్చే వారు .రాసీదుఇచ్చే సంప్రదాయం కూడా చేశాడు మామయ్యా.అక్కడ కార్తీక మాసం లో అభిషేకాలు ,పురాణాలు ,ధార్మిక ఉపన్యాసాలు ,తో బాటు వేద సభలను నిర్వ హించాడు మామయ్య..కనీసం యాభై మందికి పైగా పండితులు వచ్చే వారు .వారి అర్హతలను బట్టి పారితోషికాలు అంద జేసే వారు .భోజనాలు ఘనం గా పెట్టె వారు .వారిలో మహా వక్తల తో వేద ప్రాశస్త్యాన్ని చెప్పించి ఉత్తేజితం చేసే వారు .మహా వైభవం గా కార్య క్రమాలు జరిగేవి .ఇదీ క్రమం గా వైభవం కోల్పోయింది .మామయ్య కూడా ఏమీ చేయ లేక పోయాడు .చివరికి సభలు కూడా జరిపే అవకాశాలు కూడా లేకుండా పోయాయి .దాని కీర్తి ప్రకాశం క్రమంగా కను మరుగవుతూ ఆరి పోయింది. ,మరో సంస్థా దీపం ఆరి పోయి నిరాశనే మిగిల్చింది .మామయ్యమరణం తో అంతా అయి పోయింది దాన్ని భుజాల మీద వేసుకొనే వారులేక పోవటం దురదృష్టం .
హిందీ ప్రేమీ మండలి
వదాన్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారి దాతృత్వం తో శ్రీ మార్తి గంగాధర శాస్త్రి అనే హిందీ పండితుడు ,ప్రేమికుడు ఉయ్యూరులో గాయత్రి అనంత రామయ్య గారి తోటలో ఉన్న స్థలం భవనాలలో ఈ ప్రాంత వాసుల హిందీ అభిమానానికి తీపి గుర్తుగా హిందీ పరీక్షలు రాయించి పాస్ చేయిస్తూ వారికి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశారు .రెసిడెన్షియల్ కాలేజి గా నడిపారు .చాలా మంది మహిళలు చేరి శిక్షణ పొందారు .అందులో పని చేసిన హిందీ పండితులలో ప్రఖ్యాత అనువాదకులు ఆలూరి భుజంగ రావు గారు కూడా ఉన్నారు .ఒక పదేళ్లు ఒక వెలుగు వెలిగింది .చాలా మంది లాభ పడ్డారు .రెసిడెన్షియల్ అయేసరికి,ఆడ వాళ్ళు ఎక్కువై పోవటం తోటి అనేక ఇబ్బందులేర్పడి నమ్మకం పోయింది.క్రమం గా ప్రాభవం కోల్పోయి రద్దయింది .ఒక సారి భారత తొలి రాష్ట్ర పతి రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతికి నన్ను ఆహ్వానిస్తే వెళ్లి మాట్లాడి నట్లు గుర్తు .దీనితో ఇంకో విద్యా సంస్థా దీపం ఆరిపోయింది .భుజంగరావు గారు సి.బి.ఏం.స్కూల్లో ,ఆ తర్వాతా గుడివాడ టౌన్ హై స్కూల్ లో పని చేసి అక్కడే రిటైర్ అయారు .కర్నాటక లో వారి అబ్బాయి దగ్గర కొద్ది కాలం ఉండి గుంటూరు చేరారు .అప్పుడు మాకు మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు కొంతకాలం జరిగాయి సుమారు అయిదేళ్ళుగా కమ్యూనికేషన్ లేదు .కులాసా గా నే ఉన్నట్లు ఈ మధ్య ఎక్కడో టి.వి.ప్రోగ్రాం ద్వారా తెలిసింది .మార్తి వారు బెజ వాడ వెళ్లి అక్కడ స్కూల్ లో హిందీ పండితులై రిటైర్ పోయారు .ఆయన చాలా సార్లు కలిశారు ..
నన్నయ కళా సమితి
దీనికీ ప్రేరకులు మా దత్తు గారే .ఖాళీ ఉన్నప్పుడల్లా వారింట్లో చేరే వాళ్ళం .అక్కడ ముదునూరు వెంకటేశ్వర రావు గారు నిర్వ హించే బాల భారతి లో ఉత్సాహం గా పాల్గొనే వాళ్ళం .ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాతా మేము ఇక్కడ ఒక సాహిత్య సంస్థ లేక పోవటం బాగా లేదని భావించి ఆయన ప్రోత్సాహం తో ‘’నన్నయ కళా సమితి ‘’అనేది ప్రారంభించాం .ఆ పేరు నేను పెట్టిందే .దానికి దత్తు గారు పోషకులు .మేము ఉత్సాహం గా పని చేసే సభ్యులం సీతం రాజు సత్య నారాయణ గారు మాకు సాంకేతిక సహకారం అందించే వారు .వారికి ఉన్న ‘’ఆంధ్రా టైప్ ఇన్స్టిట్యూట్ ‘’లో కర పత్రాలు ఉచితం గా ముద్రించి ఇచ్చే వారు .అప్పుడు తెలుగు టైప్ లేదు ఇంగ్లీష్ లోనే ఉండేవి కర పత్రాలు .ఇళ్లకు తిరిగి పంచె వాళ్ళం నేను మా తమ్ముడు మోహన్..విష్ణ్వాలయం లో సభలు నిర్వహించే వాళ్ళం .ప్రముఖ వీణ విద్వాంసులు శ్రీ కల్లూరి సుబ్బారావు గారి వీణావాదన కార్యక్రమం చేబట్టాము . .జనం లేక తుస్సు మంది .రెండో సారి ఆయన కోరిక పై పెడితే ,గ్రాండ్సక్సెస్ . మహా పండితుడు ,గ్రంధకర్త భారత ,రామాయణాల పై అధారిటీ అయిన బ్రహ్మశ్రీ ఆకొండి వ్యాస మూర్తి గారి రామాయణ ఉపన్యాసాలను నేల రోజులు విష్ణ్వా లయం లో నిర్వహించాం .ఆయన ఎంతో పరిశోధన ,పరిశీలనా చేసి చెప్పిన ఉపన్యాసాలు ఎన్నో కొత్త వెలుగులను ప్రాస రించాయి నాకు మహదానందం గా ఉండేది చాలా శ్రద్ధ గా వినే వాడిని .ఆ తర్వాత మా ఉద్యోగ ధర్మాలు ,లోకల్ గా ప్రోత్సాహం లేక పోవటం వల్లఅది విజయ వంతం గా కోన సాగలేక పోయింది .మళ్ళీ ఓ సాహిత్య సంస్థా దీపం ఆరి పోయి కాల గర్భం లో చేరి పోయింది .
సైన్స్ రూం లో సాహితీ సభలు
ఉయ్యూరు హై స్కూల్ లోనేను సైన్స్ అసిస్టంట్ గా పని చేసినప్పుడు నాతో బాటు ప్రఖ్యాత విమర్శకులు ,వక్తా స్వర్గీయ టి .ఎల్.కాంతా రావు సైన్స్ టీచ ర్ గా పని చేశారు .శ్రీ వల్లభనేని రామ కృష్ణా రావు ,అన్నే ప్పిచ్చిబాబు పసుమర్తి ఆంజనేయ శాస్త్రి ,ఏం.జ్ఞాన సుందరం ,మహంకాళి సుబ్బరామయ్య మేష్టారు ,కాంతయ్య మేష్టారు ,రామ శేషయ్య బాబాయి మేష్టారు ,హిందీ మేష్టారు కొడాలి రామా రావు గారు అందరం కలిసి ప్రతి నేల ఒక సాహిత్య కార్యక్రమాన్ని సైన్స్ రూం లో నిర్వహించే వారం .దాని బాధ్యత అంతా నాదే .కాంతా రావు వ్యక్తుల్ని సూచించే వాడు మొదట్లో మాలో ఎవరో ఒకరం మాట్లాడటం మిగిలిన వారు వినటం జరిగేది .ఆ తర్వాతా బయటి వారిని ఆహ్వా నించి వారితో ఉపన్యాసాలిప్పించాం .ఇదీ స్కూల్ సమయం అయి పోయిన తర్వాతే .శ్రీ రెంత చింతల వారు ,సుబ్బ రామ శాస్త్రి గారు ఆకునూరు కాలేజి లో తెలుగు పండితులు వారితో విశ్వనాధ రామాయణం పై మాట్లాడించాం..వేమన త్రిశతి జయంతి ని ఘనం గా జరిపాం .డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారిని ,ఇంద్ర గంటి శ్రీ కాంత శర్మను ఆహ్వానించి ఆకార్య క్రమం నిర్వహించాం .కృష్ణా రావు గారి ఉపన్యాసం చాలా స్పూర్తి దాయకం గా ఉంది .ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు .శ్రీ కాంత శర్మ తో ఒక రోజు రాత్రి అంతా మాట్లాడుతూ గడిపాం కృష్ణా రావు గారికి గొప్ప సన్మానమే చేశాం .వారిని ఎజవాడ నుండి కారులో నేను ,కాంతా రావు తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ దింపి వచ్చాం .ఆయన తో మాట్లాడటం నాకు ఒక గొ ప్ప అను భూతి .అలాగే ప్రఖ్యాత కవి విమర్శకుడు శ్రీ శ్రీ కి అంతే వాసి శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు గారు కాంతా రావు కు గురువు .తరచు ఉయ్యూరు వచ్చే వారు .ఆయన తో సాహితీ ఉపన్యాసాలిప్పించాం .ఉగాది,సంక్రాంతిరోజున సాయంరం హైస్కూల్ లో ఆరు బయట కవి సమ్మేళనం నిర్వహించే వాళ్ళం .మునసబు కోటేశ్వర రావు ,కే.సి.పి.లో సైంటిస్ట్ టి.వి.సత్యనారాయణ ,ఆలూరి భుజంగ రావు గారు వగైరా లు వచ్చి పాల్గొని జయ ప్రదం చేసే వారు .
ఆ కాలం లో ఒక తమాషా చేశానేను .పెద్ది భోట్ల సుబ్బ రామయ్య గారు దాసరధి రంగా చార్యులు గారు రాసిన’’చిల్లర దేవుళ్ళు ‘’ నవల పై మాట్లాడుతారు అనే కర పత్రం చూశాను .తమాషా చేయాలని పించింది .మా సుబ్బ రామయ్య మేష్టార్ని ఎప్పుడు మాట్లాడ మన్నా వాయిదా వేసే వారు .నేను ఆ కర పత్రం లో పెద్ది భోట్ల అనే దాని బదులు‘’మహంకాళి ‘’అని మార్చి పోస్ట్ మాన్ ని బ్రతిమి లాడి ఆయనకు ఎక్స్ప్రెస్ డెలివరి మేమే రాసి ఇప్పించాం .ఆయన వెంటనే చదివి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు నేను ఆయన ముఖ్య శిష్యుడిని’’ .ఇదేమిటి ప్రసాదూ ఏం చేయాలి “ అన్నారు దానికి తప్పకుండా వెళ్ళమని ఆ పుస్తకం మన లైబ్రరీలో ఉందని, చదివి ప్రిపేర్ అవమని చెప్పా .ఆయన ఏక దీక్ష గా చదివి కాగితం మీద రాసుకొని గొప్ప గా తయారై ,నాకు చూ పించారు .అప్పుడు ‘’మేస్టారూ !బెజ వాడ సమావేశం లో ఏమి మాట్లాడుతారో మన వాళ్ళందరికీ తెలిసేట్లు ఇక్కడ మన సైన్స్ రూం లో ముందు మాట్లాడండి ‘’అని చెప్పి ఈ రహస్యాన్ని ఎవరు లీక్ చేయద్దని అన్నాను .సభ ఏర్పాటు చేశాం .గంట సేపు అనర్గళం గా మాట్లాడారు మహంకాళి సుబ్బరామయ్య మేష్టారు .చప్పట్లు మోగించేశాం .చివరికి నేను లేచి ‘’మాస్టారూ నన్ను క్షమించండి మీ తో మాట్లాడించటానికి మేమందరం పన్నిన పన్నాగం ఇది ‘’అన్నాను .ముఖం లో నెత్తురు చుక్క లేదు గురువు గారికి .కాని అందర్ని క్షమించారు .దానికి తీ పార్టీ కూడా ఏర్పాటు చేశాం .ఇలా మేమందరం అక్కడ పని చేసిన కాలమంతా జరిగింది ఆ తర్వాత ఈ సాహితీ జ్యోతి కూడా ఆరి పోయింది .
ఈ విధం గా మా ఉయ్యూర్లో వివిధ సంస్థా దీపాలు ఓ వెలుగు వెలిగి ఆరిపోయాయి .తలుచుకొంటె బాధే మరి. కాల ప్రభావానికి ఎవరూ ఏమీ చేయలేమని సరి పుచ్చుకోవటమే .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-12-ఉయ్యూరు
ఊసుల్లో ఉయ్యూరు -46 మా పద్మావతక్క (త్త )య్య
ఊసుల్లో ఉయ్యూరు -46
మా పద్మావతక్క (త్త )య్య
పద్మావతక్కయ్య అంటే నాకు సాక్షాత్తు అత్త గారే .అంటే మా ఆవిడ ప్రభావతికి తల్లి ..అంతే కాదు మా అమ్మ భవానమ్మ గారికి చెల్లెలి కూతురు .అంటే మా శ్రీ మతి మా అమ్మకు స్వయానా చెల్లెలయిన వెంకాయమ్మ గారి మనుమ రాలన్న మాట .తండ్రి పేరు వెంకటప్పయ్య గారు ఎలిమెంటరి స్కూల్ మేస్టారు అక్కయ్య మూడేళ్ళ వయసు లో లోనే తల్లిని కోల్పోయిన దురదృష్ట వంతురాలు .ఆవిడను తమ్ముడు పూర్ణా నందం లను పిన తండ్రి సదా శివ మూర్తి దంపతులే పెంచి పెద్ద వాళ్ళను చేశారు .సదాశివ మూర్తి గారు కృష్ణా జిల్లా బోర్డు హైస్కూల్ హెడ్ మాస్టర్ ..వేళ్ళ మీద లెక్కింప దగ్గ గొప్ప హెడ్ మాస్తార్లలో ఒకరు .అక్కయ్యా వాళ్ళదిఏలూర్ దగ్గర వేల్పు చర్ల గ్రామం .కృష్ణా జిల్లానే .అయితే మా బావ తూటు పల్లి ప్రకాశ శాస్త్రిగారు ప్లీడర్ గుమాస్తాగా బెజవాడ లో చాలా కాలం పని చేశాడు .ఆయన పొట్టిగా ఎర్రగా ఉంటె అక్కయ్య నల్లగా నక్కకు నాగలోకానికి అన్నట్లు కొంచెం పొడుగ్గానే ఉండేది .వెడల్పు
నవ్వు ముఖం .పెద్ద బొట్టు తో లక్ష్మీ దేవిలా ఉండేది .పూర్వతరం వాళ్ళు కట్టినట్లు చీర ను కాశా పోశి గా కట్టేది .మా బావ ముఖం ఇంట్లో మాడు ముఖం బైట చిద్విలాసం .అయితే బంధువులతో బాగా ఉండే వాడు .ప్లీడర్ గుమాస్తాగా బానే సంపాదించే వాడట..అయితే ప్లీడర్ కే లా పాయింట్లు తెలిపే నేర్పున్న వాడు .అందుకని యే ప్లీడర్ దగ్గరా ఎక్కువ కాలం పని చెయ్య లేక పోయాడని అంటారు లీగల్ బుర్ర ఆయనది .లా సూక్ష్మాలన్ని కొట్టిన పిండే .ఎప్పుడూ ఏదో కేసు వేస్తూ గెలుస్తూ కోర్టు గుమ్మాలలోనే తరచు దర్శనం ఇస్తుండేవాడు . హైకోర్టు సుప్రీం కోర్టు లలో కేసులు కూడా గెలిచే వాడు ప్రభుత్వం పై కేసులు వేసి హక్కులు సంపాదించిన బుర్ర అది . .బెజ వాడ లో ఉన్న కారణం గా మేము వాల్ల ఇంటికే వెళ్ళే వాళ్ళం .మా అక్కయ్య మమ్మల్ని సినిమాలకు తీసుకొని వెళ్ళేది అవి దాదాపు రాత్రి రెండో ఆటలే ..మైరావణ చంద్ర లేఖ సినిమాలు అక్కడ చూసి నట్లు నాకు జ్ఞాపకం .అప్పుడు మా ఆవిడ తో పరిచయం లేదు .వాళ్లకు అయిదుగురు ఆడ సంతానం .మా ఆవిడా మూడో ఆడ పిల్ల .చివరికి మగ సంతానం వంశోద్దారకుడు బ్రహ్మా నంద శాస్త్రి అనే ఆనంద్ పుట్టాడు .అందుకని అక్కలకు వాడంటే వల్ల మాలిన అభిమానం .వాడికీ అక్క లంటే వీరాభి మానం .
నాకు మా మేన మామ గుండు గంగాధర శాస్త్రి గారు తన కూతురుదుర్గ ను ఇచ్చి పెళ్ళి చేయాలను కొన్నాడు . కాని ఆ అమ్మాయి చిన్న తనం లోనే తేలు కుట్టి చని పోయింది . తర్వాత ఆ అమ్మాయి చెల్లెలు లక్ష్మీ నరుసు అనే ‘’పాపి ‘’నిచ్చి చేయాలను కొన్నాడు మామయ్యా ..ఆయన ఏమి చెప్పితే అదే చేయటానికి నేను అప్పుడు సిద్ధం .కాని ఈ అమ్మాయికి తీవ్ర అనారోగ్యం కలిగింది .ఎంతో వైద్య సహాయం ఇచ్చినా కోలుకో లేదు .మామయ్యకు నేనంటే ప్రాణం .అలాంటి జబ్బు పిల్లను నాకు అంట కట్టటం న్యాయం కాదని ఆయనే భావించాడు .నేను ఆయన వాళ్ళమ్మాయిని చేసుకో మని అంటే చేసుకోవటానికి సిద్ధమే కారణం మామయ్యా మా కుటుంబానికి చేసిన ,చేస్తున్న సహాయం మద్దతు .కాని ఆయనే ఆ పని చేయ లేక మా అమ్మతో చెప్పేశాడు ‘’అక్కయ్యా !నా పిల్లను ఈ పరిస్తితుల్లో దుర్గా పతికి ఇవ్వటం నాకే మాత్రం ఇష్టం లేదు చూస్తూ చూస్తూ వాడి గొంత కోయ లేను .మీరు వేరే ఏదైనా ప్రయత్నాలు చేసుకోండి ‘’అన్నాడు .అమ్మ అవాక్కే అయింది ‘’ఒరె గంగయ్యా !ఇందులో నేను చేయ గలిగిందేమీ లేదు .మీ బావ పోయి రెండేల్లవుతోంది నువ్వే మంచి సంబంధం వెతికి నీ చేతి మీ దే పెళ్ళి జరిపించు వాడికి ‘’అంది .పాపం ఇంత బాధ లోను మామయ్యతన కర్తవ్యాన్ని వదల్లేదు .ఆలోచనలో పడ్డాడు ఎప్పుడో ఒక సారి మా పద్మా వతక్కయ్య ‘’మామయ్యా !మా ప్రభావతికి ఏదైనా మంచి సంబంధం ఉంటె చూడు ‘’అని చెప్పిందిట .ఇంకేం ఎవరో ఎందుకు దాన్నే ఇచ్చి చేస్తే బాగుంటుందని మా అమ్మకు చెప్పాడు .మా అమ్మ నన్ను అడిగింది మీ ఇష్టం అన్నాను .సరే ఆయనే మంచి రోజు చూసి నన్ను ,మా బావ వివే కా నందం గారిని వేల్పు చర్ల తీసుకొని వెళ్లాడు పెళ్ళి చూపులకు .అప్పుడు మా ప్రకాశశాస్త్రి గారు జంప్ జిలానీ .ఎక్కడికో వెళ్లాడు .ఆ ఊరు దారి ఎవరికీ సరిగ్గా తెలీదు .కొప్పాక దిగి లెఫ్ట్ ,రైట్ కొట్టు కొంటూ యెర్ర మట్టిలో కొండలు దాటుతూ చేరుకున్నాం .మా వివేకానందం బావ సణుగుతూనే ఉన్నాడు .సరే ఇంటికి చేరాం .వాళ్ళ నాన్నను వెతుక్కు రమ్మని మా కా బోయే మరదలు దుర్గ ని పంపారు .ఆ అమ్మాయి వెతికి ఆయన్ను పట్టుకొని వచ్చింది .ఆ నాడు కమ్యూనికేషన్ సౌకర్యం లేదు ఫోన్లు లేవు .ఉత్తరం రాస్తే అందిందో లేదో ?/సరే ఏదో టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చారు .పెళ్ళి చూపులు జరిగాయి .అదే నేను ప్రభావతిని చూడటం .అంతకు ముందు చూసి ఉన్నా నాకు జ్ఞాపకం ఏమీ లేదు .ఏదో పాట పాడింది .పాటా అమ్మాయి రెండు బానే ఉన్నాయి సరే అభిప్రాయం అడగను లేదు నేను చెప్పనూ లేదు .బావ మాత్రం ‘’గంగయ్యా ! రెండు కుటుంబాలని కలిపే బాధ్యత నీదే ‘’అన్నట్లు జ్ఞాపకం .
రాత్రికి ముగ్గురం ఉయ్యూరు వచ్చాం .మా అమ్మకు ఏమి చెప్పాడో మామయ్యా .నా అభి ప్రాయం అడిగింది నాకు నచ్చింది అని చెప్పాను .మామయ్యే కధ నడి పించాడు .జాతకాలు చూశాడు బాగా కుదిరాయి అన్నాడు .శాస్త్రి గారి తో మాట్లాడి ఖాయం చేశాడు .అప్పుడు మా దగ్గరా డబ్బు పెద్ద గాలేదు వాల్ల పరిస్తితి అంతే .మామయ్యే అన్నీ ఇద్దరికీ .నేను అప్పటికే బి ఇ.డి.ట్రైనింగ్ పూర్తీ చేసి మోపిదేవి జిల్లా పరిషత్హైస్కూల్ లో సైన్స్ మేస్టేర్ గా పని చేస్తున్నాను .1964 ఫిబ్రవరి ఇరవై ఒకటి న నాకు ఛి సౌ .ప్రభావతికి వేల్పు చర్ల లో వివాహం అయింది .అప్పటి నుంచి పద్మావతక్కయ్య అత్తయ్య అయింది .అప్పటి దాకా నన్ను ‘’తమ్ముడూ అనీ లేక దుర్గా పతీ ‘’అని పిలిచే ఆవిడ ‘’దుర్గా ప్రసాదూ ‘’అనటం మొదలు పెట్టింది .నేనూ ‘’అక్కయ్యా అక్కయ్యా ‘’అని వెంట పడి తిరుగుతూ మాట్లాడే వాడిని ఈ కొత్త బంధుత్వం తోకొంచెం ఇబ్బంది పడి అంత చనువు గా ఉండ లేక పోయాను .ఎందుకో ఏమో నేను ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యం వేసేది ఇప్పటికి .
మా ‘’అక్కయ్యత్త్తయ్య ‘’నన్ను చాలా మర్యాద గా చూసేది .యే లోటు రాకుండా చూసేది .అత్త గారి మర్యాదలేకీమీ లోపం లేదు అయితే మా మామ గారికి మాత్రం కొంపా గోడు పట్టేది కాదు అన్నీ ఈవిడే చూసుకోవాల్సి వచ్చింది .ఇప్పటికే ముగ్గురు అల్లుళ్ళు .యే అల్లుడు ఇంటికి వచ్చినా అందరికి మర్యాద లు బానే చేసేది .నన్ను అంత చొరవగా పలకరించక పోయినా ఆవిడ అంటే లోపల లోపల ఆ ఆప్యాయతా అక్కయ్యదనం మర్చి పోలేదు .ఎందుకు ఏర్పడిందో ఒక సరి హద్దు ఏర్పడింది నాకు మర్యాద నివ్వటానికి అయి ఉంటుంది . అక్కయ్య మా అమ్మను ‘’అమ్మక్కయ్యా ‘’అని ప్రేమగా పిల్చేది
అమ్మకూడా చెల్లెలి కూతురని చాలా ఆప్యాయం గా ఉండేది .తరచు ఉయ్యూరు వస్తుండే వాళ్ళు పద్మా వతక్కయ్యకు ఒక తమ్ముడు ఉండే వాడు పేరు పూర్ణానందం .వేల్పు చర్ల కు దగ్గర ఎర్రం పల్లి లో ఉండే వాడు పోస్ట్ మాస్టారు కం ఆర్ ఏం .పి .వైద్యం అక్కడ వాళ్ళ నాన్నవెంకటప్పయ్య వేసిన ఇరవై ఎకరాల మామిడి తోట ఉండేది .అక్కయ్య పద్మావతమ్మ అంటే అభిమానమే .ఆయన అన్నా మాకు అందరికి భలే ఇష్టం. సరదా గా మాట్లాడే వాడు నవ్వుతు ఉండే వాడు .బానే సంపాదించాడు .పూర్ణానందం అన్నయ్యా అంటూ వెంబడి పడే వాళ్ళం .
వాళ్ళ ఇంటి పరిస్తితి ఇక్కడ చెప్పాలి .పచ్చి కట్టెలు తెచ్చి పడేసే వాడు మా మామగారైన బావ గారు .అవి మండేవి కాదు కట్టెల పొయ్యి మీదే వంట ఆ నాడు అందరిల్లల్లోను అదే పరిస్తితి ..అన్నీ యదా విధి గా జరగాల్సిందే .పొయ్యి ఊదలేక ఆవిడ కాళ్ళ నిండా ధూళి పోగతో చూస్తె చాలా బాధ గా ఉండేది .నూతి నీళ్ళే అన్నిటికి గతి నీళ్ళు చాలా లోతుగా ఉండేవి తోడాలంటే రెక్కలు పడి పోయేవి .
పాపం అన్ని పనులు ఆవిడే చేసుకో వాలి. .కావలసిన సరుకులు తెచ్చే వాడు కాదు ఆయన .వాటికీ ఈవిడే బాధ పడాలి గేదె పాలు పాలు తీసుకోవటం గచ్చుఇల్లు పెంకుల కప్పు .ఒకే గది .
ఎప్పటిదో డెబ్భై ఏళ్ళ నాటి మంచం పరుపు .అల్లుడు వస్తే ఆ గదిలోనే ఒక్క అల్లుడికే చాన్సు మిగతా వాళ్ళు హాల్లోనే . .
మా మామ గారు ముప్ఫై ఏళ్ళ కిందట చని పోయాడు .తెలిసీ తెలియని వయస్సులో తండ్రి కర్మ కాన్దలన్నీ యదా విధి గా నేర వేర్చాడు ..ఆ తండ్రికి కొడుకంటే వల్ల మాలిన ప్రేమ కొడుకు చేతుల్లోనే ఆయన ప్సంత్రుప్తిగా ప్రాణం వదిలాడు అప్పటికి మా బామ్మర్ది ఆనంద్ సుమారు ఇరవై ఏళ్ళు .కొంత పొలం ఉంది మామిడి తోట ఉంది మాగాణి కూడా కొంచెం ఉండేది . .వాడివిషయం లో నాకు బాధ్యత అప్పగించాడని చని పోయే ముందు చెప్పాడని అన్నారు పోయిన తర్వాతే మే ము వెళ్ళాం .మేము వాళ్లకు చేసిన సాయం ఏమీ లేదు .ఇచ్చిన చేయూతా ఏమీ లేదు .ఆనంద్ స్వంతం గా స్వయం సిద్దుడుగా తనను తాను తీర్చి దిద్దు కొన్నాడు .డిగ్రీ చదివి బాంక్ పరీక్షలు రాసి స్టేట్ బాంక్ లో ఉద్యోగం సంపాదించాడు .పొలం నుజాగ్రత్త చేసుకొన్నాడు .తండ్రి చేసిన అప్పులు తీర్చేశాడు .అప్పటికే అక్కల పెళ్ళిళ్ళు అయి బాధ్యత లేమీ లేవు ..స్పందన అనే ఆడ పిల్ల ,వంశీ అనే కొడుకు .భార్య రుక్మిణి అతని రెండో అక్కయ్య కూతురే .పిల్లలిద్దరికీ బి.టేక్ .చెప్పించాడు పల్లె టూరి లో చదువు కష్టం అని హైదరా బాద్ లో స్థలం కొని డాబా వేసి కుటుంబాన్ని అక్కడికి మార్చాడు .పిల్లల చదువులు నిర్విఘ్నం గా సాగాయి .మా పద్మావతి అక్కయ్య అనారోగ్యానికి గురైంది .ఆమె కోసం ప్రొమోషన్ వదులు కొన్నాడు .ఆవిడ కు సేవ చేశాడు భార్య ,పిల్లలతో చేయించాడు .ఆవిడకూ వీల్లందరంటే విప రీత మైన ప్రేమ .కొడుకు ప్రయోజకుడైనాడని ఆమె ఆనందం .బంధువు లందరికి ఆనంద్ అంటే మహా భి మానం .వాడికి అందరితో బందుత్వాన్ని నిలుపు కోవాలనే ఆరాటం ..వాళ్ళమ్మ మంచం పట్టి లేవ లేక పోతే దగ్గరలో ఉండే బ్రాంచికి బదిలీ చేయించుకొని సేవ చేశాడు .ఆవిడ కూడా వీడి ని అంత గా ఆద రించేది .తిట్టి అయినా చేయించేది .ఆ తిట్టు ప్రేమ తోనే .
జన్మ జన్మా లకు వాడే కొడుకు ,తానే తల్లి అనేది .కూతుల్లందరితో బాగా ఉండేది .ఏ కూతురైనా కొంచెం మితి మీరితేమాటల చురకలు వేసేది .నేను నా భార్య వీలైనప్పుడల్లా వెళ్లి చూసి వస్తుండేవాళ్ళం .మనవడు వంశీ ఒడుగు చెయ్యమని బల వంతం చేసేది కొడుకుని .అలాగే చేసి ఆవిడ కోరిక తీర్చాడు .ఎంతో సంతోషించింది .అప్పటికి ఆవిడ వయస్సు దాదాపు తొంభై .ఆ వడుగు లోనే ఆమె తొంభై వ జన్మ దినోత్స వాన్ని చేశారు అందరు కలిసి .ఆమె జ్ఞాపక శక్తి అప్పటికీ అమోఘం పాత చరిత్ర
అంతాపూసగుచ్చి నట్లు చెప్పేది ఎక్కడా లింకు తెగేది కాదు .ఎవరెవరు ఎవరిపిల్లలో వాళ్ళ పేర్లు వాళ్ళ సంతానం అంతా ఆవిడకు గుర్తే .అందర్ని గుర్తు పట్టి మాట్లాడేది ..కదలలేక పోయినా అన్నీ కావాల్సినవి చేయించుకోవటం గొప్ప విషయం .అను క్షణం రామనామం తో గడిపేది .వచ్చిన వారిని నామ జపం చేయ్యమనేది శ్వాస విడిచే దాకా పూర్తీ స్పృహ లోనే ఉంది .’’నారాయణా నారాయణా ‘’అంటూ నామం జపిస్తూ నే మరణించింది .మా బావ మరది ఆనంద్ ఈ కాలం లో చెప్పుకో దగిన వాడు .ఆ సేవ అనితర సాధ్యం అని పించాడు .ఆమె కర్మ లను అత్యంత శ్రద్ధ గా నిర్వహించాడు .ఏడవ మాసికాన్ని కాశీలో పెట్టి అక్కడే అస్తికలను కలిపి ప్రయాగ లో కూడా పితృ విధి నిర్వ హించాడు .మా ఇద్దరినీ వాళ్ళ కుటుంబం తో పాటు తీసుకొని వెళ్లాడు .
పద్మావతక్కయ్య రెండేళ్ళ క్రితం మరణించింది .ఆమె మరణం తర్వాత ఆనంద్ కూతురు స్పందన వివాహం కూడా చేసి ఆ పుణ్యాన్నీ వాళ్ళమ్మకు కల్గించాడు ..జీవితం లో ఎంతో కష్టపడ్డ అక్కయ్య చివరికాలం లోకొడుకు కల్పించిన అన్ని సుఖాలుఅనుభవించి చని పోయింది .
ఆవిడను వాడు ‘’పువ్వుల్లో పెట్టి పూజించి నట్లు ‘’సేవ లందించటం ఈతరం కొడుకులకు గొప్ప ఆదర్స్ధం .తల్లి సేవలో ధన్యుడయాడు .ఆ తల్లి వాడి సేవలో సంతృప్తి పొందింది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం –41 విశేష యాత్రలు
కాశీ ఖండం –41
విశేష యాత్రలు
ఏ ఆలయానికి వెళ్ళినా ముందు శిఖర దర్శనం చేయాలి .తర్వాత ధ్వజ స్తంభం ,స్వామి వాహన దర్శనం చేయాలి .వారి అనుజ్న తో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతా అమ్మ వారి దర్శనం ఇతర దేవతా దర్శనం చేయాలి .గంగా స్నానం చేసిన వారు గంగ నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళ వచ్చు .కాని గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెబుతోంది ..కాశీ మహాష్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధం అయి ఉంటుంది .మణి కర్ణిక ఘాట్ కో రోజు మధ్యాహ్నం 12-1గంటల మధ్య విధిగా స్నానం చేయాలి ఆ సమయం లో సకల దేవతలు ఆ ఘాట్ లో ఉంటారని పురాణ వచనం .పితృకార్యం చేసే టప్పుడు శిరో మున్దనం మగ వారికి తప్పని సరి .ప్రయాగ క్షేత్రం లో ముత్తైదువులు మాత్రమె వేణీ దానం చేయాలి అంటే ఒక్క మూడంగులాల జుట్టు మాత్రమె తీయించు కోవాలి .ఎన్ని సార్లు వెళ్ళినా ఒక్క సరి మాత్రమె వేణీ దానం చేయాలి .అన్ని సార్లు చేయ రాదు .
ఆయతన యాత్ర
నంది పురాణం లో ఈ యాత్ర గురించి ఉంది.మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి పూజించాలి మళ్ళీ మణికర్ణిక లోనే ఉన్న చక్ర తీర్ధం లో అంటే మణి కర్ణికా కుండం లో స్నానం చేయాలి .మళ్ళీ విశ్వనాధ దర్శనం చేయటాన్ని ఆయతన యాత్ర అంటారు ఇలా చేస్తే బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది .ద్వి ఆయతన ప్రాప్తి అంటే పైన చెప్పినవి రెండేసి సార్లు చెయ్యటమే
త్రిరాయతన,చతురాయతన ,పంచాయతన యాత్ర
అవి ముక్తేశ్వర ,స్వర్లీనేశ్వర ,మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి పూజించటమే ఈ యాత్ర .శైలేశ్వర ,సంగమేశ్వర ,స్వర్లీనేశ్వర మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే అది ఈ రెండు యాత్రాల్ని లింగ పురాణం చెప్పింది .కృత్తి వాశేశ్వర మధ్యమేశ్వర ,ఓంకారేశ్వర ,కపర్దీశ్వర ,విశ్వేశ్వర లింగ దర్శనమే పంచాయతన యాత్ర .ఈ యాత్రాలన్నీ సర్వ సిద్ధి ప్రదం .
రుతు యాత్ర రుతు యాత్ర
వసంత రుతువు అంటే చైత్ర వైశాఖ మాసాలలో చౌక్ ఘాట్ లో ఉన్న మధురా పురి యాత్ర చేయాలి దీన్నే అలయర్ పురా అంటారు .ఇది ఉత్తరార్క్ నుండి వరుణా తీరం మార్గం లో ఉంది
గ్రీష్మ రుతువు లో అంటే జ్యేష్ట ,ఆషాఢ మాసాలలో అయోధ్యా పూరీ యాత్ర చేయాలి పంచ క్రోశ యాత్రలో కని పించే రామేశ్వరమే ఇది
వర్ష రుతువు లో అంటే శ్రావణ ,భాద్ర పద మాసాలలో సంఖూ దారా వద్ద ఉన్న ద్వారకా పూరీ యాత్ర చేయాలి
శరదృతువు –లో అంటే ఆశ్వయుజ కార్తిక మాసాలలో –పంచ గంగా ప్రాంతం లోనీ పంచ గంగా స్నానం చేయటాన్ని కాంచీ పూరీ యాత్ర అంటారు
హేమంత రుతువు అంటే మార్గ శిర ,పుష్య మాసాలలో అవంతికా పుర యాత్ర చేయాలి .ఇది వృద్ధ కాళేశ్వరం నుండి కృత్తి వాసేశ్వరుని వరకు ప్రయాణం చేసి దర్శించటమే .
శిశిర రుతువు –అంటే మాఘ ఫాల్గుణ మాసాలలో మాయా పూరీ యాత్ర చేయాలి ఇది అస్సీ సంగమం లో ఉంది
చివరలో లలితా ఘాట్ లో స్నానం అంటే ఒకే ఏడాది లో ఈ రుతు దర్శనాన్ని ముగించాలి దీనికే ‘’సప్తరి యాత్ర ‘’అని కూడా అంటారు
మాస యాత్ర
చైత్రమాసం లో కామకుండం లో స్నానించి కామేశ్వర పూజ చేయాలి ఇప్పుడిది లేదు వైశాఖం లో విమలకుండస్నానం విమలేశ్వర పూజా .ఇదీ ఇప్పుడు అలభ్యం .జ్యేష్టం లో రుద్రా వాస తీర్ధ స్నానం రుద్రా వాసేశ్వర పూజ ,రుద్రా వాసేశ్వరుడిని దశాశ్వ మేధ ఘాట్ లో దర్శించ వచ్చు .ఈ మూడు నెలల్లో ముప్పది మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని పురాణ లిఖితం ఆషాఢంలో లక్ష్మీ కుండ స్నానం లక్ష్మీ దేవి దర్శనం గంధర్వులు పడదే పదే చేసే యాత్ర ఇది .శ్రావణం లో కామాక్షీ కుండస్నానం కామాక్షీ దేవి దర్శనం .భాద్ర పదం లో కపాల విమోచన తీర్ధ స్నానం కుల స్తంభ దర్శనం .ఇది కిన్నరులు ఎక్కువ గా ఇష్టపడే యాత్ర .ఆశ్వయుజ మాసం లో మార్కండేయ తీర్ధ స్నానం మార్కండేయేశ్వర దర్శనం .జ్ఞాన వాపి దగ్గర ఉంది .కార్తీకం లో పంచ గంగా ఘాట్ స్నానం బిందు మాధవ దర్శనం .మార్గ శిరం లో పిశాచ విమోచన తీర్ధ స్నానం కపర్దీశ్వర స్వామి దర్శనం .విద్యాధరులకీ యాత్ర మహా ప్రీతీ .పుష్యం లో దనద కుండస్నానం ధనదేశ్వర దర్శనం దేవతలకు ఇష్టమైన యాత్ర ఇది ఇప్పుడీ కుండం లేదు ధనదేశ్వరుడు అన్నపూర్ణా మందిరం లో ఒక మూల ఉంటాడు .మాఘం లో కోటి తీర్ధ స్నానం కోటీశ్వర స్వామి సందర్శనం ఈ తీర్ధం గుప్తం .సాఖీ వినాయక స్తానం లో ఉందని అంటారు ఫాల్గుణ మాసం లో గోకర్ణం లో స్నానం గోకర్నేశ్వర స్వామి దర్శనం చేస్తే మాస యాత్ర పూర్తీ అయి నట్లే .
మరి కొన్ని విశేషాలు
జ్యేష్ట శుక్ల పక్షం లో దశాశ్వ మేధ ఘాట్ లో స్నానం విశేష ఫలం ఇస్తుంది .శ్రావణం లో శుక్ల పక్షం పది హేను రోజుల్లో దుర్గా కుండా స్నానం దుర్గా దేవి దర్శనం విశేషం .ఆశ్వయుజం లో కృష్ణ పక్షం లో గంగాజీ ఘాట్ లో తర్పణ శ్రాద్ధాలు విశేష ఫలితాలనిస్తాయి .కార్తీకం లో పూర్ణిమ వరకు ఆది మంగళ వారాలు కాక మిగిలిన రోజుల్లో కాశి లో ఉసిరి చెట్టు ను పూజించాలి .దానాలు భోజనాలు శ్రేష్టం .మాఘం లో శుక్ల పక్షం లో వ్యాస పురిలోని వేద వ్యాస ;లింగ దర్శనం అతి ముఖ్యం .భాద్ర పదం లో కృష్ణ పక్షం లో దశాశ్వ మేధ ఘాట్ లో పిండ ప్రదానం ,తర్పణాలు విశేష ఫలప్రదం
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-12-ఉయ్యూరు
ఊసుల్లో ఉయ్యూరు –45 ఇద్దరు గ్రంధ సాంగులు
ఊసుల్లో ఉయ్యూరు –45
ఇద్దరు గ్రంధ సాంగులు
మా చిన్న తనం లోనే మాకు గ్రంధాలయా లపై మక్కువ కల్గించి మాతో మంచి పుస్తకాలను చదివించి ,ఎంతో ప్రోత్సహించి ,మాకు కావాల్సిన పుస్తకాలను ఇంటికి ఇస్తూ ప్రోత్సహించిన ఇద్దురు గ్రంధాలయ నిర్వాహకులు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తారు సరదాకి వారిని ‘’గ్రంధ సాం గులు ‘’అన్నాను .ఇందులో దురుద్దేశామేమీ లేదు పై గా మిక్కిలి గౌరవం ఉంది వారిద్దరే జాన్ భాయ్ ,సత్యనారాయణ గార్లు
జాన్ భాయ్
నల్లగా ,ఎత్తుగా రివట లా పాంటు ,షర్టు వేసి పంచాయితీ లైబ్రరి కి గ్రంధాలయానికి అధికారిగా ఉన్న ఉండే వాడు మా జాన్ భాయ్ ..అతను క్రిస్టియన్ . అసలాయన కు పంచాయితీ లో గుమాస్తా ఉద్యోగం .కాని మా చిన్నప్పుడు పంచాయితీ గ్రంధాలయం ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఎదురు గా ఉన్న బిల్డింగ్ లో ఉండేది .అక్కడ దాదాపు ఏడెనిమిది చెక్క బీరువాల్లో పుస్తకాలు ఉండేవి. ..దిన, వార్తా, మాస పత్రికలు ఉండేవి . .సాయంత్రం స్కూల్ అయిన తర్వాతా కాసేపు ఆడుకొని మా మిత్ర బృందం తో లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం .అక్కడి పత్రికలూ చదివే వాళ్ళం .మేము రాగానే మాకు స్వాగతం పలికే వాడు జాన్ భాయ్ .’’పంతులు గారూ రండి’’ అని ఆహ్వానించే వాడు .అక్కడి బీరువాలు తెరిచి ఉంచే వాడు .ఫలానా పుస్తకం బాగుంటుంది చద వండి అని ప్రోత్స హించే వాడు .అక్కడే కూర్చుని చదివే వాళ్ళం .అవసరం వచ్చి తీసుకొని వెళ్ళాలని పిస్తే నాపేర పుస్తకం లో రాసుకొని ఇంటికి ఇచ్చే వాడు .జాన్ మా నాన్న గారికి సి.బి.ఏం.స్కూల్ లో శిష్యుడట .అతనే చెప్పాడు .అందుకని ఆ గౌరవం తో ,నమ్మకం తో పుస్తకాలు ఇంటికి ఇచ్చే వాడు .నేనూ అంత బాధ్యత గానే దాన్ని తీసుకొచ్చి చదివి ,అందులోని విషయాలకు మిత్రు లందరకు చెప్పి ఇచ్చే వాడిని .అతను సూచించిన పుస్తకాలన్నీ దాదాపు అక్కడ చదివాం .చాలా మంచి పుస్తకాలు ఉండేవి . .డికేన్సు రాసిన ‘’రెండు మహానగరాలు ‘’టాల్ స్టాయ్ రాసిన పుస్తకాలు ,కరుణశ్రీ పద్యాలు ,జాషువా రచనలు ,కృష్ణా పత్రిక సంపాదకీయాలు వగైరాలెన్నో మా తో చది వించాడు జాన్ భాయ్ .మాకు గ్రందాలయాభినివేశం కల్పించిన జాన్ భాయ్ ఔదార్యం ,ప్రోత్సాహం మరువ లేనిది .ఇప్పటికి గ్రందా లయం అంటే ఆరాధన భావం ఏర్పర టానికి అతడే కారణుడని నిర్ద్వంద్వం గా చెప్ప గలను .
తర్వాత ఈ పంచాయితీ గ్రంధాలయం సి.బి.ఏం.ఆసు పత్రీ కి ప్రక్క ఉన్న బ్రాహ్మణుల సత్రం లో కి మారింది .ఇది రెండస్తుల బిల్డింగు.కింద లైబ్రరి పైన పంచాయితీ ఆఫీసు ఉండేది .అక్కడికి వచ్చిన లైబ్రరి జనానికి దూరం అవటం వల్ల జనానికి పట్టేది కాదు .జాన్ కు ఆఫీసు పను లూ ఎక్కువ గా ఉండేవి .ఆఫీసు పని మీద ఎక్కడికో అక్కడికి వెళ్ళ వలసి వచ్చేది .కనుక లైబ్రరి లో ఉండే కాలం తక్కువ గా ఉండేది .అయినా మేము వెళ్తే అదే ఆప్యాయం తో ఆదరించే వాడు .అయితే అక్కడ విద్యుత్ సౌకర్యం లేక పోవటం వల్ల పెంద్రాళే దుకాణం కట్టేయాల్సి వచ్చేది .బాగా చీకటి పడే దాకా ఉండి ,పుస్తకాలు వెలుగు లో ఉంచుకొని చదువుకొనే వాళ్ళం .కొంచెం పెద్ద వాళ్ళ మయిన తర్వాతహిందూ ,ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లు కూడా చదివే వాళ్ళం .పాపం జాన్ భాయ్ పనుల వత్తిడి లో చిక్కి శల్యం అయి నట్లు ,నీరసించి నట్లు కన్పించే వాడు .ఎప్పుడు చిన్న ఫ్లాస్క్ తీసుకొని అధికార్లకోసమో ,ప్రజా ప్రతి నిదులకోసమో కాఫీ కోసం సైకిల్ వేసుకొని తిరగటం నిత్య గంట కృత్యం గా కని పించేది .’’పంతులు గారూ అనే పలకరింపు పోయి మాస్టారూ ‘’అనే వాడు .యే మైనా మాకు గ్రంధ భిక్ష పెట్టిన వాడు మాత్రం జాన్ భాయ్ .అతను నవ్వుతు ఎప్పుడూ పలకరిస్తున్డటం ఇంకా స్పష్టం గా జ్ఞాపకం ఉంది .అయితే సుమారు ఇరవై ఏళ్ళ కింద జాన్ భాయ్ మరణించాడని విన్నాను .మా ఉయ్యూరు పంచాయితీ గ్రంధాలయం నిర్వహరణాదికారి నాకెప్పుడు ప్రాతస్మరనీయుడే .ఆతని తర్వాతఆ లైబ్రరి ని పట్టించుకొనే వారు లేక పోయారు .లైబ్రరి ని తీసే వారే కరువై క్రమం గా అది కను మరుగై పోయింది .దాని అభి వృద్ధి కోసం ఆకాలం లో సర్పంచ్ గా ఉన్న నా శిష్యుడు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు శ్రీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ కు తరచు చెప్పుతూ ఉండే వాడిని .అది బధిర శంఖా రావం అయింది ..అరుదైన పుస్తకాలున్న ఆ గొప్ప గ్రంధాలయంఇలా కాల గర్భం లో కలిసి పోవటం చాలా విచారం గా ఉంది .ఆ పుస్తకాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు .
చిన్న వాడైన సత్య నారాయణ .
సుమారు యాభై ఏళ్ళ క్రితం మా ఉయ్యూరు లో జిల్లా గ్రంధాలయ సంస్థ ఒక శాఖ నుఏర్పాటు చేసింది .అది మా బజారులోనే సీతం రాజు సత్య నారాయణ గారి రోడ్డు మీదే ఉన్న పెంకు టింట్లో ఉండేది .ఎర్రగా పొట్టి గా ఖద్దరు లాల్చీ ,పైజమా వేసి ముఖాన యెర్రని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొనే సత్య నారాయణ అనే చిన్న వాడు అధికారి గా ఉండే వాడు మంచి వాడు బ్రాహ్మణుడు .నిదానస్తుడు కొంచెం కీచు గొంతు తో మాటలాడే వాడు .అప్పుడే తెలుగు స్వతంత్ర ,ప్రకాశం గారి దిన పత్రిక ,ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రిక ,భారతి ,ప్రజా మిత్ర మొదలైనపత్రికలూ చదివే వాళ్ళం .లైబ్రరి పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళ టానికి చందా అయిదు రూపాయలే అది కట్టిచందా దారులు గా చేరాం .కావాల్సిన పుస్తకాలు తీసుకొని వెళ్లి చదివే వాళ్ళం .అతను మంచి పుస్తకాలు ఎంపిక చేసి మాకు ఇచ్చే వాడు స్దత్య నారాయణ .మాకు ఆత్మీయుడి గా ఉండే వాడు .ఇక్కడే మేము చాలా పుస్తకాలు చదివాం .శ్రీ దేవి కాలా తీత వ్యక్తులు , నవలా ,కొమ్మూరి వారి నవలలు ,చలం పుస్తకాలు ,విశ్వనాధ ,బాపి రాజు ,కరుణశ్రీ రచనలు ,గోరా శాస్త్రి రచనలు చదివే అరుదైన అవకాశం పొందాం .రాజ కీయాలు చదివాం .వైవిధ్యం ఉన్న రచనలు చదివే అదృష్టం కూడా లభించింది ..అతను చాలా ఓర్పుగా ,నేర్పుగా నిర్వహించే వాడు .అయిదు రూపాయల సభ్యత్వం చాలా ఏళ్ళు కోన సాగింది .ఆ తర్వాతా పది రూపాయలు ,తర్వాతా ఏభై ,ఇప్పుడు వంద రూపాయలు అయింది .లైబ్రరి ఇక్కడి నుంచి కాపుల వీధి రామాలయం దగ్గరకు చేరింది .అక్కడ చాలా ఏళ్ళు ఉంది .వర్షానికి పుస్తకాలు దెబ్బ తినేవి .లైబ్రేరియన్లు ఎందరో మారారు .నాంచారయ్య మొదలైన వారు అభి వృద్ధికి దోహదం చేశారు .మేము తెలుగు ఏం యే .చేసే టప్పుడునాకు,మిత్రుడు స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కురిఫెరెన్సు పుస్తకాలు ఇంటికి తీసుకొనే అవకాశం కల్పించారు అవి మా చదువు కు ఎంతో దోహదం చేశాయి . ఆ తర్వాత ఒకాయన ఇక్కడ పని చేశారు .ఆయన పదవిలో ఉండే, ఆకస్మికం గా మృతి చెందారు .దాదాపు ఐదారేళ్ళు గ్రందాలయాదికారే లేరు .ఆ నాటి శాసన సభ సభ్యులు స్వర్గీయ అన్నే బాబూ రావు గారికి అనేక సార్లు చెప్పాను .రాజేంద్ర ప్రసాద్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లాను .కాని ఏమీ లాభం లేక పోయింది .ఆ తర్వాతఇన్చార్జి లను వేయటం ఆ తర్వాతా సుజాత గారిని లైబ్రేరియన్ గా వేశారు .ఆమె బాగా పని చేశారు .అప్పుడే జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ గొర్రె పాటి గోపీ చంద్ ,రాజేంద్ర ప్రసాద్ గార్ల కృషి వల్ల శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి భారీ ఆర్ధిక సాయం(అయిదు లక్షల రూపాయలు ) వల్ల హైస్కూల్ కు సమీపం లో ,పశువుల ఆస్పత్రికి దగ్గర్లో యే.సి.గ్రంధాలయం ఏర్పడింది ..దాని నిర్మాణ కమిటీ లో రాజేంద్ర ప్రసాద్ నన్ను కన్వీనర్ ను చేశాడు .ఆరు నెలల్లో దాన్ని సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దాం ఆ నాటి ముఖ్య మంత్రి శ్రీ చంద్ర బాబు దక్షిణ దేశం లోనే మొదటి యే.సి.లైబ్రరి అయిన .ఈ లైబ్రరి ని తన చేతులతో ఆవిష్కరించాలని ఉవ్విల్లూరారు .కాని ఎన్నికలలో ఓటమి పాలైనందు వల్ల 2004 జూలై ఎనిమిది న కొత్త మంత్రు లైన కోనేరు రంగా రావు ,స్వర్గీయ జక్కం పూడి రామ మోహన రావు వగైరామంత్రులు శాసన సభ్యులు ,రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది .సుమారు లక్ష రూపాయల విలువ గల అరుదైనరిఫెరెన్స్ పుస్తకాలను లైబ్రరీకి అందించారు గోపాల కృష్ణ గారు .కుటుంబ సమేతం గా అమెరికా నుంచి వచ్చి ప్రారంభోత్సవ సమా వేశానికి గోపాల కృష్ణ గారు హాజరయ్యారు .ఇంకో లక్ష ఖర్చు పెట్టి సభా కార్యక్రమాలు నిర్వ హించారు .సాహిత్య సభలు అక్కడే నిర్వ హిస్తున్నాం ..చిన్న వాడైన సత్య నారాయణ నాటిన గ్రంధాలయ బీజం మహా వృక్షమై ఫల పుష్పాలతో వర్ధిల్లుతోంది .కనుక సత్యనారాయణ కృషికి జోహార్లు .ఇలా ఇద్దరు గ్రందాలయాదికారులు జాన్ భాయ్ ,సత్యనారాయణలు చిరస్మరణీయ గ్రంధాలయ సేవ చేసి మా ఆదర పాత్రులయారు .వారిని స్మరించి నేను ధన్యుడి నయ్యాను .అందుకే వారు గ్రంధ సాంగులన్నాను
సశేషం —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—28-12-12-ఉయ్యూరు
‘ఆయనే.. శంకరంబాడి!’
‘ఆయనే.. శంకరంబాడి!’
తెలుగుతల్లికి ‘మల్లెపూదండ’ వేసి సత్కరించిన మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు. ప్రతి తెలుగు వాచకం మొదటిపేజీలో కనిపించే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం పాడని తెలుగు విద్యార్థి ఉండడు. తెలుగుతల్లి గొప్పదనాన్ని ఒక్క గేయంతో ప్రపంచమంతటా చాటిన శంకరంబాడి గురించి సి. పూర్ణచంద్ అనే లెక్చరర్ తన జ్ఞాపకాన్ని నవ్యతో పంచుకున్నారు.
మేం తిరుపతిలో డిగ్రీ చదువుకొనే రోజులవి. సినిమాలు బాగా చూసేవాళ్ళం. వారంలో రెండు, మూడు చూసినా మళ్లీ ఆదివారం కూడా కచ్చితంగా సినిమా హాల్లో ఉండేవాళ్లం. నేను తిరుపతి కర్రాలవీధిలో ఉండేవాడిని. మా వెనకింట్లో ఉన్న మిత్రుడూ, మా వెనకవీధిలో (కస్తూరిబాయి సందు) ఉన్న మరో మిత్రుడూ కలిసి ఆదివారం సాయంత్రం మొదటిఆట సినిమాకు బయలుదేరాం. కర్నాలవీధి చివర్లో రైల్వేస్టేషన్కు అతి దగ్గరలో ఈస్ట్పోలీస్స్టేషన్ ఉండేది. మేము ముగ్గురం నడుచుకుంటూ పోలీస్స్టేషన్ దగ్గరికి చేరుకున్నాం. ఇంతలో ఒకతను పొట్టిగా, పెద్ద పొట్ట, బట్టతల, చిరిగి..బాగా మాసిన తెల్ల జుబ్బా, పటాపటి డ్రాయరు ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు.
మమ్మల్ని అడ్డుకుని ‘ట్వంటీ ఫైవ్ పైస్ ప్లీజ్’ అని రెండు చేతులు చాపి అడిగాడు. మేం స్పందించకపోయే సరికి మళ్లీ అడిగాడు. అతని దగ్గర గుప్పుమంటూ సారా వాసన వస్తోంది. గురుడు అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ‘దేనికి నీకు ట్వంటీ ఫైవ్ పైస్’ అని అడిగాం మేం. ‘టీ తాగాలి’ అన్నాడు. అంతలోనే స్టేషన్ముందున్న కానిస్టేబుల్ వచ్చి అతనికి డబ్బులివ్వకండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఎందుకని అడిగితే…’ఆ డబ్బుతో ఎదురుగా ఉన్న సారాకొట్టుకెళ్ళి సారా తాగేస్తాడు. ఇప్పటికే ఎక్కువై ఒంటిమీద గుడ్డలు నిలవడం లేదు’ అని దూరంగా పడిఉన్న ఆ పెద్దాయన పంచెను చూపించాడు. అప్పుడు మా మిత్రుల్లో ఒకడు ‘మన తెలుగువాచకం మొదటిపేజీలో మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గేయం రాసిందాయనే’ అని చెప్పాడు. మిగతా ఇద్దరం నోరెళ్లబెట్టాం.
ఆశ్చర్యం, ఆనందం, ఆవేదన, బాధ…అవన్నీ ఒకేసారి తన్నుకొచ్చాయి. శంకరంబాడి కొంతకాలం మా మిత్రుడుండే వీధి చివరలో నివాసం ఉండడం వలన అతనికి ఆయన గురించి తెలుసునట. ఆ షాక్ నుంచి మేం తేరుకోక ముందే శంకరంబాడి ‘అదలా ఉండనీగానీ..ట్వంటీఫైవ్ పైస్ ఇవ్వండి’ అని మరోసారి అన్నాడు. వెంటనే చొక్కా, ప్యాంటు జేబులు వెతికాం. కస్తూరిబాయి సందు మిత్రుని దగ్గర ఒక్కపైసా కూడా లేదు. నా దగ్గర ఇద్దరికి సినిమా టిక్కెట్లకు సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. మరో మిత్రుని దగ్గర సినిమాఖర్చులకు పోను ఐదురూపాయల నోటు ఉంది. మా మిత్రుడు ఆ ఐదు రూపాయలనోటుని ఆ పెద్దాయన చేతిలో పెట్టగానే ఆయన ముఖం వెలిగిపోయింది. ఆయన ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. నేను హిస్టరీ లెక్చరర్ అయ్యాక ఆ సంఘటన గుర్తొచ్చినప్పుల్లా మరింత బాధ కలిగేది. అది మర్చిపోలేకనే ఆ జ్ఞాపకాన్ని అందరితో ఇలా పంచుకొంటున్నాను.
తెలుగుతల్లి గేయాన్ని మొదటగా కొప్పరపు సుబ్బారావు తీసిన ‘రైతుబిడ్డ'(పాతది) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి చేత పాడించారు. అదే పాటను కొంచెం రీమిక్స్చేసి ‘లీడర్’ సినిమాలో శేఖర్ కమ్ముల వాడారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుల్లెట్’ సినిమా కోసం ఎస్.పి బాలసుబ్రమణ్యం కూడా పాడారు. ఈ గేయాన్ని పల్లె పల్లెలో ప్రాచుర్యం తెచ్చింది మాత్రం తెలుగుకు వెలుగుతెచ్చిన నందమూరి తారకరామారావుగారే. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక సుశీలతో పాడించి.. గేయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా మార్మోగింపజేశాడు.
శంకరంబాడిని తాగుబోతుగా చూపించడం కోసం నేనిది రాయలేదు. ఆ వయసులో ఆ మహనీయున్ని చూసిన నా హృదయానందాన్ని మీతో పంచుకోవడం కోసమే నేనీ వ్యాసాన్ని రాశాను. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరితోపాటు శంకరంబాడికి కూడా ఓ జ్ఞాపికనిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత తిరుపతి తెలుగు భాషోద్యమ నాయకుల కృషి ఫలితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి శంకరంబాడి సర్కిల్ అని పేరు పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అయితే ఇప్పటికీ శంకరంబాడి ఎవరని అడిగేవాళ్లు ఉండడం బాధనిపిస్తుంది.
– డాక్టర్. సి. పూర్ణచంద్
బి. టి కాలేజి, మదన్పల్లి
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )
రుక్మిణీ కృష్ణ పరిణయం
శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు‘’సకలా రాతి చమూ సమూహ కలశా కూపార ,మందానమై ,పటు రుక్మిన్య బాలా వివాహ కలనా ప్రారంభ సందానమై‘’బయల్దేరాడు కుండిన నగరానికి .
చతుర్ధా శ్వాసం లో రుక్మిణి తాను పంపిన రాయ బారి కోసం ఎదురు చూడటం వెళ్ళాడో లేదో నని సందేహించటం తన సందేశం చెప్పాడో లేదో నని పోతన గారి రుక్మిణి లా సందేహించటం ఇక్కడా ఉంది.తర్వాత విరహం ,ఉప చర్యలు ‘’చక్కని దాన నంచు నేల జవ్వని నంచు సఖీ జనావళి ‘’అన్న పద్యం ముక్కు తిమ్మన గారి సత్య భామ పద్యం లా ఉంటుంది .ఆమె విరహాన్ని భరించలేక ‘’భైరవ కామ సుమాస్త్ర వేదనా శాలినిజంగ జాల గని హస్తాద్రికి చేరాడు .చంద్రోదయ వర్ణన కూడా సందర్భోచితం గా చేశాడు .’’ఆగ మిష్య త్శ్రిత య యామినీ నిటలాగ్ర దీపిత చందన తిలక మనగ ‘’లా ఉన్నాడు చంద్రుడు .రుక్మిణి పూర్ణ చంద్రుని పూజించి ‘’సిత భాసురాయ పూత వివిధ సుపరవిక పుణ్య దాయ దివ్య తారక మూర్తయే తే నమోస్తు ‘’అని సంస్కృత పదభూయిష్ట్సం గా స్తుతిస్తుంది .తర్వాత‘’పాపి ‘’అనే అదే రేంజి లో తెలుగు లో తిట్టి పోయింది .
తర్వాత భానూదయం –‘’రుక్మిణీ కన్యకా వివాహ పూర్వ పరి ప్రేష్య వర చిరతర దీప్య మాన రత్నాకార దీపమనగా ‘’అన్నట్లు సూర్యుడు ఉదయించాడు .శ్రీ కృష్ణ భాగవానుడూ ఉదయించాడు .బ్రాహ్మణ ,సుదర్శన యోగమూ కలిగింది .వివరాలు తెలుసుకొని సంబర పడింది .గుండె దిటవు చేసుకొన్నది ..ప్రత్యుపకారం గా ‘’అంజలి ‘’ఘటించటం తప్ప ఏమీ చేయలేని అశక్తు రాలనని చెప్పి దీవన పొందింది .
శ్రీ కృష్ణుడు ఒంటరి గానే బయల్దేరాడు .తర్వాత ససైన్యం గా అన్న బలరాముడు వచ్చాడు .పోతన గారి లాగానే ‘’జతయా చక్రి విదర్భ రాజ సుతకున్ ,సత్యంబు వైదర్భియున్ జత ఈ చక్రికి నింత లెస్స యగునే ‘’అని పుర జానులనుకొన్నారు .భవానీ దేవిని దర్శించి ‘’మతి లో నమ్మితి నేసనాతనుల నమ్మా ,మిమ్ము బ్రోచిన దంపతులుగా ‘’అని పోతన గారి రుక్మిణి ‘’నమ్మితి ణా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్ ‘’అన్న పద్యాన్ని ప్రేరణ గా చెప్పాడు సంజీవ కవి .రుక్మిణిని అశ్వం పై చేర్చిన కృష్ణుడు ద్వారకకు చేరటం శిశుపాలుడు ఎదిర్చినా ఫలితం లేక పోవటం రుక్మి ఎదిరించి శ్రుంగ భంగ మవటం మనకు తెలిసిందే
ద్వారక లో గార్గ పురోహితుడు శుభ లగ్నం లో వివాహం జరిపించాడు .’’వృష రాశి జాత ,యాదవ వ్రుషభుడు రుక్మినీంద్రు తులయన్మిష చేత భార్గవి యయ్యెను ద్రుశానే కాది పతయ మేసంగే నుభయతన్ ‘’అని చెప్పి కవి తన జ్యోతిష పాండిత్యాన్ని చక్క గా జోడించాడు .తులా వృష భాలకు రాశి నాయకుడు ఒక్కడే అవటం భార్గవుడైన హరికి ,భార్గవి అయిన రుక్మిణి అని చమత్కరించాడు .’’హరి పతి యగు చుండగా మరి ,హరిణీ నామము ఘటిల్లి నది‘’అన్నాడు .హరి ది గోరాశి .రుక్మిణిది తుల .షష్టా ష్టకం .న్యాయం గా పనికి రాదు పొత్తు కుదరదు .కాని ‘’ఉభయైక స్వామికత్వం ‘’వల్ల దోషం లేదని తేల్చాడు .మానుష రూపం దాల్చిన కృష్ణుడు మాయి మూర్తి .మాయ లేనిది రుక్మిణి జగన్మాత .వారిద్దరి పరిణయం చేయటం తనకు పూర్వ పుణ్య ఫలమని గర్గుడు భావించాడు .వివాహం మన పద్ధతి లోనే జరిపించాడు .’’జానక్యః కమలాంజలి ‘’అన్న ప్రసిద్ధ శ్లోకం లోనీ భావాన్ని ‘’రుక్మిణి పోసే ముత్యాలు కెంపు లై హరి శిరం పై పడి శుద్దాలై శరీరం నుండి జారుతూ నీలాలై తలంబ్రాలు శోభించాయట .వధూ వరులు పేర్లు చెప్పుకోవటం ,పరమాన్నం తినటం పానుపు మీద తాంబూలాలు కొరకటం ,నాక బలి వగైరాలు పూర్తీ చేశారు .తర్వాతా గర్భా దానమూ చేయించాడు కవి .రుక్మిణీ కళ్యాణం ఈ విధం గా ఫలప్రదం అయింది .ఈ కధ వ్రాసినా ,విన్నా ,చెప్పినా శ్రీ కైవల్యం తప్పదని సంజీవ రాయ కవి భరోసా ఇచ్చాడు .ఇలా పోతన గారి పోకడా ,భట్టు మూర్తి అల్లికా ,వేంకటకవి చాతుర్యం త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన కావ్యం ఇది .కవి సంజీవ రాయలకు ,మనకు ఈ దివ్య సంజీవినిని అందించిన వారి వారసుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారికి అంజలి ఘటిస్తున్నాను .రుక్మిణీ పరిణయ కావ్యం భవ్యం దివ్యం–శుభం భూయాత్
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం -40 పంచ క్రోశ యాత్ర –రెండో రోజు
కాశీ ఖండం -40
పంచ క్రోశ యాత్ర –రెండో రోజు
దారిలో కని పించే గ్రామాలలోని దేవుళ్ళను దర్శించి వీలుని బట్టి పూజించాలి
అమరాగ్రామం –నాగనాధుడు –ఆవడేగ్రామం –చాముండేశ్వరి ,కరుణేశ్వరుడు ,మొక్షేశ్వరుడు ,దేలాహన గ్రామం–వీరభద్రేశ్వరుడు ,వికట దుర్గా దేవి ,దేవురా గ్రామం –ఉన్మత్త భైరవుడు ,నీల గణుడు చక్క మాతల్ దేర గ్రామం–యజ్నేశ్వరుడు ,ప్రయాగ పుర గ్రామం –విమలేశ్వరుడు ,మొక్షేశ్వరుడు ,జ్ఞాన దేశ్వరుడు ,అసవారీ గ్రామం–అమ్రుతేశ్వరుడు ,భీమ చండీ గ్రామం –గాంధర్వ సాగర ,భీమ చండీ దేవి ,భీమ చండీ వినాయకుడు ,రవి రక్తాక్ష గంధర్వుడు ,నరకార్నవ తారణుడు ,,కాలకూట గణుడు ,విమలా దుర్గా దేవి ,మహాదేవ మందిరం ,నందికేశ్వరుడు భ్రుం గ రీటి గణుడు,గానప్రియుడు ,గౌరాగ్రామం –విరూపాక్షుడు , –రెండో రోజు ఇక్కడే ఉండి పోవాలి ‘’భీమ చండీ ప్రచండాని మమ విఘ్నాన్ వినాశాయ –నమస్తేస్తు గమిష్యామి పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించాలి .
మూడవ రోజు
ఈ క్రింది గ్రామాలలో వేంచేసి యున్న దేవతా దర్శనం చేసి పూజించాలి
కచానార్ గ్రామం –ఏక పాద నాధుడు –హారికా తాల్ గ్రామం –మహా భీముడు ,హరసోస్ గ్రామం –భైరవ నాద ,భైరవీ దేవి ,దీన దాస పుర –భూత నాదేశ్వార్ ,సింధు సాగర పోఖర్ (ప్రసిద్ధం )-సింధు రోదన తీర్ధం ,జనసా –కపర్దీశ్వరుడు ,కాలనాధుడు ,చౌఖండీ గ్రామం –కామేశ్వరుడు ,గణేశ్వరుడు ,వీరభద్ర గణుడు ,చారు ముఖ గణుడు ,భటౌలీ గ్రామం–గాననాదేశ్వరుడు ,ప్రసిద్ధం –దేహలీ వినాయకుడు
ఏడు రోజుల యాత్ర చేసే వారు ఇక్కడే నివాసం ఉంటారు .సత్తు పిండి ,లడ్డు నివేదన చేస్తారు
దేవదియా –షోడశ వినాయకుడు ,భుయిలీ గావ –ఉద్దండ వినాయకుడు ,హీరాం పుర –ఉత్కలేశ్వరుడు ,రుద్రానీ దేవి తపోభూమి వరనా నది –ఈ నది లో స్నానం చేయాలి పెద్దలకు తర్పణ వదలాలి
ప్రసిద్ధం –రామేశ్వరుడు –ఇక్కడ తెల్ల పప్పులు బిల్వ దళాల తో పూజ చేయాలి
రామేశ్వరం –సోమేశ్వరుడు ,భారతేశ్వరుడు ,లక్ష్మనేశ్వరుడు ,శత్రుఘ్నేశ్వరుడు ,ద్వావా భూమేశ్వరుడు ,నహుషేశ్వరుడు –ఇక్కడే మూడో రోజు ఉండి పోవాలి రామేశ్వరుని ‘’రామేశ్వర ,రామేణ పూజితస్త్వం ఆజ్నం దేహి మహాదేవ పునర్దర్శన మస్తుతే ‘’అని నమస్కరించి నాలుగో రోజు యాత్ర ప్రారంభించాలి
నాలుగవ రోజు
వరుణా నది అవతల –అసంఖ్యాత తీర్ధ లింగం ,కరోమా గ్రామం –దేవ సంఘేశ్వరుడు ,సదర్ బజార –పాశ పాణి గణేశుడు ,ఖుజరీ గ్రామం –ప్రుదివీశ్వరుడు ,పిసన్ హరియా –స్వర్గ భూమి ,దీన దయాళ్ పురం –యూప సరోవర తీర్ధం ,కపిల దారా గ్రామం –కపిల దారా తీర్ధం ,వ్రుషభధ్వజేశ్వరుడు –ఇక్కడ ఆగి పోయి వ్రుషబధ్వజేశుని పూజించాలి‘’వృషభధ్వజ దేవేశ పిత్రూనాం ముక్తి దాయక –ఆజ్ఞాం దేహి మహా దేవ పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించాలి
అయిదవ రోజు
కాతెవాన్ రామం –జ్వాలా నృసింహుడు ,పుతహా గ్రామం –వరుణా సంగమం ,ఆది కేశవుడు ,సంగామేస్ధ్వరుడు ఖర్వ వినాయకుడు ,ప్రహ్లాద ఘాట్ –ప్రహ్లాదేశ్వరుడు ,త్రిలోచనా ఘాట్ –త్రిలోచన మహాదేవుడు ,పంచ గంగా ఘాట్ –పంచ గంగా తీర్ధం ,వేణీ మాధవుడు ,లక్ష్మణ బాలా ఘాట్ –గాభాస్తేశ్వరుడు ,ప్రసిద్ధం –మంగళ గౌరీ సంకట ఘాట్–వసిష్టేశ్వరుడు ,వామ దేవేశ్వరుడు ,ఆత్మా పురేశ్వార్ –పర్వతేశ్వరుడు ,మణికర్ణికా ఘాట్ –మహేశ్వరుడు ,సిద్ధి వినాయకుడు ,బ్రహ్మ నాళం –సప్తావరణ వినాయకుడు ,ప్రయాగ పుర గ్రామం –మొక్షేశ్వరుడు ,మణి కర్ణికా మహా తీర్ధం లో స్నానం చేయాలి .దీంతో కాశీ యాత్రా ,పంచాక్రోశ యాత్రా పూర్తీ అవుతుంది .
‘’జయ విశ్వేశ విశ్వాత్మన్ కాశీనాధ జగద్గురో త్వత్ప్రసాదాత్ మహాదేవ కృత క్షేత్ర ప్రదక్షిణా
అనేక జన్మ పాపాని కృతాని మామ శంకర గతాని పంచ క్రోశాత్మ లింగ స్యాస్య ప్రదక్షినాత్
త్వద్భాక్తి కాశీ వాసాభ్యాం సహివా పాప కర్మణా సత్సంగా శ్రవనాదైస్చ కాలో గచ్చతు న స్సదా
హర శంభో మహాదేవ సర్వజన సుఖ దాయక ప్రాయశ్చిత్తం సువివృత్తంపాపానాం త్వ్కత్ప్రసాదథథహ్
పునఃపాప ర తిస్మాస్తూ ధర్మ బుద్ధి స్సదాస్తుమే –పంచ క్రోశాస్య యాత్రేయాం యదా వద్వామయాక్రుతా
న్యూనం సంపూర్నతాం యా తు త్వత్ప్రసాదాత్ ఉమా పతే –హర హర మహా దేవ శంభో –కాశీ విశ్వ నాదా గంగా ‘’అని పదకొండు సార్లు సంకీర్తన చేసి నమస్కరించాలి
నమః పార్వతీ పతయేనమః హరహర మహా దేవ శంభో –కాశీ విశ్వ నాద భగవతే జయ –అన్నపూర్ణా మాతా జయజయ –గంగా మాత జయ జయ –దుమ్దీ రాజ జయజయ –కాల భైరవ జయజయ –హర హర మహాదేవ –అని గట్టిగా అరవాలి
పంచాక్రోశ యాత్రను ఈ విధం గా పూర్తీ చేసి నివాసం చేరి అయిదు లేక పద కొండు మంది బ్రాహ్మణ దంపతులకు భోజనం ఏర్పాటు చేసి తాంబూలం దక్షిణా ఇచ్చి నమస్కరించాలి ఆశీర్వాదాలు పొందాలి
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-12-ఉయ్యూరు
తెలుగు కవితా ”జాలం ”
తెలుగు కవితా ”జాలం ”
సాహితీ బంధువులకు -తెలుగు తీపి శుభా కాంక్షలు -తిరుమలేశుని సన్నిధి లో జరుగుతున్న తెలుగు సభల సందర్భం గా మనం కూడా అంతర్జాలం లో”తెలుగు కవితా ”జాలం ”పేర కవి సమ్మేళనం నిర్వ హిద్దాం .ఉత్సాహ వంతులైన కవులు ,పండితులు తమ కలాలకు పదును పెట్టి ఈ శీర్షిక లో పాల్గొని మీ” మూషికానికి ”పని చెప్పండి .హృద్యమైన కవితలు పద్యమైనా వచన కవిత్వమైనా పాటైనా రాసి తెలుగు తల్లిని పూజించండి .తెలుగు భాషా వైభవం, సంస్కృతీ విలసనం చారిత్రిక మహౌన్నత్యం పై చక్కగా
స్పందించి వేదిక ను జయప్రదం చేయండి .నేను కొందరు మహాను భావుల కవిత లను ఇక్కడ ముందుగా ఉదహరిస్తున్నాను .
ఆరుద్ర
1- తేనె కన్నా మధురం రా తెలుగు ,ఆ –తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగు గడ్డ పోతు గడ్డ ఎంత పచ్చన ,మా –తెలుగు గుండెలో స్నేహము ఎంత వెచ్చన !
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన ,మన
తరతరాల కధను పాడు గుండె ఝల్లన –పాటు పడిన వాళ్ళకే లోటు లేదని
చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి -లలిత కళలు సంగీతం సాహిత్యం
తెలుగుతల్లి జీవితాన దిన క్రుత్యాలు
గత చక్రిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి !-గర్వించదగ్గ జాతి తెలుగు జాతి
అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం –ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం ”
2– నండూరి రామ కృష్ణ మాచార్యులు
తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగు -పునుగు జవ్వాజి ఆమని పూల వలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు -కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష
3– కుందుర్తి
తీరి బంగారు పందేడు తెలుగు నేల -తేట నీటితో ప్రవహించు తెలుగు నదులు
తెలుగు వాసిని ప్రకటించు తెలుగు గిరులు -తలచు కొన్నంత నా మేను పులకరించు
4– త్యాగ రాజు
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి ధర్మామ్బికే !
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి !ధర్మామ్బికే
కనకాంగి !రమా పతి సోదరి -కావవే నను కాత్యాయినీ !
నను గన్న తల్లి !నా భాగ్యమా -నారాయణి !ధర్మామ్బికే
కావు కావు మణి నే మొర బెట్టగా -కమల లోచన !కరగు చుండగా
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు ?స -దా వరం బోసగు త్యాగ రాజ నుతే
నన్ను గన్న తల్లి ! నా భాగ్యమా !నారాయణీ!-ధర్మామ్బికే
5– శ్రీ శ్రీ
పదవోయి తెలుగు వాడా –అదే నీతెలుగు మేడా –సంకెళ్ళు లేని నేల–సంతోష చంద్ర శాల
6– దాశరధి
తెలుగు పులుగు చేరని దేశం లేదు –తెలుగు వెలుగు దూర లేని కోశం లేదు
7— గురజాడ రాఘవ శర్మ
తెలుగు దేశమేనాయది ,తెలుగు వాడ –తెలుగు తల్లి యనుమ్గు చేతులను బెరిగి
తెలివి గొంటిని ,మంటని ,తెలుగు తల్లి –పేరు నిలుపుటే యాశ యూపిరి జెలంగ
8– రాయప్రోలు సుబ్బా రావు
పాల క్రోమ్మీగడల్ పచ్చి వెన్నయు నిచ్చి –తీయని నును పూసా లాయెనేమో
కమ్మని మకరంద కణములు స్నేహించి -చిన్నారి పలుకులి చిక్కే నేమో
పూల లావణ్యంబుపొంగి చక్కదనాల –పిందేలై రుచి లెక్కి పెరిగే నేమో
సెల ఏటి యుయ్యాల కులుకు టోయ్యారముల్ -ముద్దు ముచ్చట లయి
పాటకును ,పద్యమునకును నబ్రముగా నొదిగి -చవికి చాతుర్యమునకు ,సాజముగా సాగి
పోరునకు ,పోత్తు నకు జాతి పొంది పొసగు –మా తెలుగు తల్లి మెడ కిదే మల్లె దండ .
9– వేముల పల్లి శ్రీ కృష్ణ
చేయెత్తి జైకొట్టు తెలుగోడా -గత మెంతో ఘనకీర్తి కల వాడా
సాటి లేని జాతి -ఓట మెరుగని కోట -నివురు గప్పె నేడు –నిదుర పోతుం డాది-
-జే కొట్టి మేల్కొలుపు తెలుగోడా–గత మెంతో ఘన కీర్తి కల వాడా
10– త్రిపురనేని రామ స్వామి చౌదరి
తేట మాటల దెలియ జెప్పుము –దిక్కు లన్నియు మారు మ్రోగిన
తెలుగు వారల పేరు పెంపును -దెలియ కుండగ నుండ బోకుము
తెలుగు బాలుడ !ఇంపు నింపుము –తెలుగు బాలుడ !పేరు పెంపుము
శ్రీ ద్రోణ వల్లి రామ మోహన రావు (అమెరికా ) సంకలం చేసిన ”దేశ భాష లందు తెలుగు లెస్స ”నుండి సేకరణ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-12-12-ఉయ్యూరు
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4 బాపని రాయబారం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4
బాపని రాయబారం
తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషాలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దేల్ప బుదేన్ద్రా ‘’అన్నది .తన మనసంతా హరి పై చిక్కు కున్నదని సింహముపాలి సొమ్ము గోమాయువు హరిన్చేట్లు గా శిశుపాలుడున్నాడని పోతన శైలిలోనే చెప్పింది కాదు చెప్పించాడు సంజీవ రాయ కవి –
‘’కారము చేయునగ్రాజు వికారము దూరముగా భవచ్చమ –త్కారము జూపి ,నాదగు ప్రకారము శౌరికి విన్న వించి ,స
త్కారము సేయనిన యుపకారము కై ప్రతీకారమే నమ-సకారము నేయు చుండుదు చొ కారాముగా హరి దెచ్చు నంతకున్ ‘’అంటూ ‘’కారం ‘’తో చమత్కారం చేస్తాడు కవి ..
బాపడు ద్వారకా నగరం చేరి అక్కడి పట్టణవిశేషాలన్నీ తిలకిస్తాడు .పుర వర్ణన లో అద్భుత మైన పద్యాలున్నాయి .తన రాక ను ద్వార పాలకుని ద్వారా ద్వారకా కాన్తునికి చెప్పిస్తాడు .ఆయన విని ,’’భీష్మ కరాట నయా ,గతి దెల్పగా వచ్చిన వాడ’’నితెలిసి హృష్ట చిత్తుడౌతాడు కన్నయ్య .అంతటి పరేంగితావగాహి .బ్రాహ్మణునికి ఎదురేగి పూజించి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .ఇక్కడ శ్రీ కృష్ణుని దివ్య సుందర విగ్రహాన్ని చూసి నోరారా ప్రస్తుతిస్తాడు రాయబారి బాపడు .ఎన్ని పద్యాలు చెప్పి వర్ణించినా కవి కౌతుకం తీరలేదు .ఓ దండకం దండ వేసి ,దంచేస్తాడు .అదీ సంతృప్తి నివ్వదు .బహు విధ కందాలలో అర వింద దళాయతేక్షణుడిని వర్ణిస్తాడు .పాద భ్రమర ,క్షురికా బంధ , ఆర్ద భ్రమర ,గుడి ఏకాక్షర ,తల కట్టు ,శ్రుంగ కందాలలో అందాన్ని కలం యేతాముతో తోడేస్తాడు .ఇది చాలక గుణితం లో గుణిస్తాడు .సాప్తిక ,ఆంద్ర సప్తిక విభక్తికం గా భక్త్యంజలి ఘటిస్తాడు ..చక్ర బంధ ,నాగ బంధ అనుప్రాస సీస ,ఆంద్ర గీర్వాణ భాశిక్య పద్యాలతో ఆనంద పులకామ్కితం గా చక్ర వర్ణన చేస్తాడు .రుక్మిణీ సందేశాన్ని అప్పుడు విని పిస్తాడు .అలాగే రుక్మిణి అందాలణు రుక్మిణీ కాన్తునికి విన్న విస్తాడు .ఇదంతా ఒక రసమయ లోకం లా ఉంటుంది .ఇక్కడ ఒక పద్యం హృద్యం గా రాస్తాడు
‘’అభ్ర విభ్రమము మధ్యమమునందే కాదు -పొందిన వేనలి యందు గలదు
హరి మనోహరిత్వ మాస్యమ్బునందే కా—దనిశము పాలకుల యందు గలదు ‘’ అంటూ ‘’ముందు శ్రీత్వంబు భావంబు నందే కాదు –కర్ణముల యందు గలదు ‘’అంటూ ‘’ ఆ వరారోహ యాఖ్య చేత నె కాదు దేహ విభూతి నలరు‘’అని ముక్తాయింపు నిస్తాడు .
ఆమె పలకులు ‘’కున్డంములు పలు కుదురున ,కుండంము లటంచు బల్కు గోన నౌ జేలికిన్ ‘’అని చెప్పుతూ‘’కం దమ్ములు లు ఘన శోభా –కం దమ్ములు మారుని నంత గందమ్ములగున్ ‘’అన్న మాటలు ఆయన కంద పద్యాలకు అన్వ యించ వచ్చని పిస్తుంది .అందమైన కందం ,మా కందం ,మధుర నిష్యందం ,ఆనంద రస నిక్షేపం .
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-12-12-ఉయ్యూ
కాశీ ఖండం -39 పంచ క్రోశ యాత్ర
కాశీ ఖండం -39
పంచ క్రోశ యాత్ర
శాస్త్ర విధానం లో కాశీ యాత్ర చేసిన వారు ఇప్పటికి ముగ్గురు మాత్రమె ఉన్నారు వారు గణేశుడు ,భైరవుడు ,నందీశ్వరుడు ..ఈ ముగ్గురి తో కలిసి బ్రహ్మా విష్ణు మొదలైన దేవ గణమంతా కలిసి యాత్ర ప్రారంభించి ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసి భీమ చండి కి చేరుకొన్నారు ..తమ విధులను వదిలి ఇంతకాలం బయట ఉన్నందుకు ఇబ్బంది పడ్డారు ..తిరిగి వారి లోకాలకు వెళ్లి పోయారు .దేవతలకే అసాధ్యమైతే సామాన్య మానవులమానవుల సంగతేమిటి ?
‘’కాశీ ప్రదక్షిణా యేన కృతా కృతా త్రైలోక్య పావనీ –సప్త ద్వీపా శాబ్ది శిలా క్రుతాతేన ప్రదక్షిణా ‘’అని నారదీయ సూక్తం లో ఉంది .కాశీ ప్రదక్షిణం చేస్తే సముద్రాలు ,పర్వతాలు కలిగిన ఏడు ద్వీపాల భూమండలాన్ని చుట్టి వచ్చిన ఫలితం కల్గుతుంది .
‘’యదా కధంచ్చిద్దేవేశి –పంచ క్రోశ ప్రదక్షిణం –కుర్యా దేవన మాసాది –చింత ఎద్ధర్మ కోవిదః
స ఎవ శుభదః కాలో –యస్మిన్ శ్రద్ధో దయోభావేత్ ‘’అన్న దాని బట్టి ఒక రోజు నుండి అయిదు రోజులు లేక ఏడు రోజులు వరకు ఎవరి శక్తిని బట్టి కాశీ యాత్ర చేయ వచ్చును .
‘’దక్షిణే చోత్తరే చైవ హ్యయనే సర్వ దామయా –క్రియతే క్షేత్ర దాక్షిణ్యం –భైర వస్య భయాదపి ‘’అని పార్వతీ దేవితో పరమ శివుడన్నాడు .జనం భైరవుడికి భయ పడి కాశీ యాత్ర చేస్తున్నారు .మకర సంక్రాంతి నుండి ఆరు నెలలు ఉత్తరాయణం ,తర్వాతా ఆశాఢ మాస తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం తో కూడిన సంవత్సరం లో ఎప్పుడైనా పంచ క్రోశ యాత్ర చేయ.వచ్చు.కాని చాలా మంది మార్గశిర ,ఫాల్గుణ ,అధిక మాసాలలో చేస్తారు .శివుని మాట ప్రకారం ఎప్పుడైనా చేయ వచ్చు .
బ్రహ్మ చర్యం,సత్య వాక్కు ,క్రోధ రాహిత్యం ,ఏక భుక్తం ,ప్రేమ భావం ,పరోపకారం అనే ఆరింటిని పాటిస్తూ చేసే పంచాక్రోశయాత్ర మాత్రమె సత్ఫలితాలనిస్తుంది .యాత్ర కు ముందు రోజున గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి హవిష్యాన్న భోజనం చేయాలి .అన్నం చప్పటి పప్పు ,ఆవు నెయ్యి ,పెరుగు మాత్రమె తీసుకోవాలి .పచ్చి కొబ్బరి తిన వచ్చు .
పంచాక్రోశయాత్ర లో మొదటి రోజు న స్నాన ,సంధ్యా చేసి జ్ఞాన వాపి దగ్గరకు వెళ్లి సంకల్పం చెప్పుకొని‘’విశ్వనాధ అన్నపూర్ణ విశాలాక్షీ డుంఢి రాజ ,లక్ష్మీ నారాయణ యాభై ఆరు వినాయకులు ,ద్వాదశాదిత్యులు ,నృశింహ ,కేశవత్రయ ,రామ కృష్ణ ,కూర్మ మత్స్య మొదలైన పంచ క్రోశాత్మక పరి పూర్ణ కాశీ యాతరం కరిష్యే ‘’అని అక్షతలు ,నీరు వదిలి పెట్టాలి .తర్వాతా ‘’పంచ క్రోశాస్య యాత్రం వై –కరిష్యే విధి పూర్వకం –ప్రీత్యర్ధం తవ దేవేశ –సర్వా ఘౌఘ ప్రశాన్తాయే ‘’అని ప్రార్ధన చేయాలి తర్వాతా విశ్వేశ దర్శనం మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి సాష్టాంగ వందనం చేయాలి .మోదుడు మొదలైన పంచ వినాయకులను ,దండ పాణిని ,కాల భైత్రవుని యదా శక్తి గ పూజించాలి .ఇంత వరకు మౌనాన్ని పాటించాలి .స్నానం తర్వాతా మౌనం వదిలి పంచాక్రోశ యాత్ర ప్రారంభించాలి .మార్గ మధ్యమం లో వచ్చిన దేవతలన్దర్నీ పూజించాలి .దారిలో వచ్చే దేవతలు ,ఎక్కడ దర్శనమిస్తారో చూద్దాం
మణికర్ణికా ఘాట్ లో –మణి కర్నేశ్వరుడు ,సిద్ధి వినాయకుడు –లలితాఘాట్ లో గంగా కేశవుడు ,లలితా దేవి –మీర్ఘాట్ లో జరాసందేశ్వరుడు –మాన్ మందిర్ ఘాట్ లో –సోమనాధుడు దాలభ్య్ శ్వరుడు –దశాశ్వమేధ ఘాట్ లో శూల కం ఠేశ్వరుడు ,ఆది వరాహరేశ్వరుడు దశాశ్వ మేదేశ్వరుడు ( శీతలా దేవి మందిరం లో )-ప్రయాగేశ్వర మందిరం లో బందీ దేవి –పాండే ఘాట్ లో సర్వేశ్వరుడు –కేదార్ ఘాట్ లో కేదారేశ్వరుడు –హనుమాన్ ఘాట్ లో హనుమదీశ్వరుడు–అస్సీ సంగమం లో సంగమేశ్వరుడు –లోలార్కుడి వద్ద ఉన్న అర్క వినాయకుడు –బదినీ లో లోలార్కుడు –ప్రసిద్ధి లో దుర్గా కుండం –దుర్గా కుండం సమీపం లో దుర్గా వినాయకుడు –ప్రసిద్ధం లో ఉన్న దుర్గా దేవి
పాయసం ,లడ్డు లను బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి నమస్కరించి –‘’జయ దుర్గే మహాదేవి –జయ కాశి నివాశిని–క్షేత్ర విఘ్న హరే దేవి పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించి నమస్కరించాలి .
కరమై తాపుర గ్రామం లో విష్వక్సేనుడు ,కందవా గ్రామం లో కర్నమేశ్వరుడు –లకు పండ్లు ,నువ్వులు సమర్పించాలి .కారడం తీర్ధం లో స్నానం చేయాలి కర్దమ కూపం నీటిలో ముఖం చూసుకోవాలి .కర్ణ మేశ్వర ప్రార్ధన చేయాలి కర్డ మేశమహాదేవ ,కాశీ వాస జనప్రియ త్వత్పూజనాత్ మహాదేవ పునర్దర్శన మస్తుతే ‘’అని ప్రార్ధించాలి
కందవా గ్రామం లో సోమనాధుడు –కందవా లోనే ఉన్న విరూపాక్షుడు ,నీల కంఠేశ్వరుడు లను మొదటి రోజున దర్శించి మొదటి రోజు పంచాక్క్రోశ యాత్రను పూర్తీ చేయాలి కందవా గ్రామం లో రాత్రి నివాసం చేయాలి ‘
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-12-12-ఉయ్యూరు
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి
హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి
తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ బడ్డ తెలుగు వారి ఘోష విని వారికి న్యాయం చేసి ,వారి ఉసురు తగల కుండా చూసుకో వలసిన బాధ్యత నిర్వాహకు లైన ఆంద్ర ప్రభుత్వం మీద ఉంది .ఆ బాధ్యత ను ఈ సభలు సక్రమం గా నిర్వ హించే ఆలోచన చేయక పోతే వారి ని ఓదార్చటం కష్టం .వారికి న్యాయంకల్గించక పోతే తెలుగుకే కాదు తెలుగు ప్రజలకు తెలుగు సంస్కృతికి తీరని అన్యాయం చేసి నట్లే .కనుక సభలు వారికి బాసట గా నిలవాలి .వారికి కావలసిన వన్నీ నెర వేర్చాలి .క్రితం ఏడాది నేను హోసూర్ వెళ్లి అక్కడి తెలుగు భాషోద్యమ నాయకులైన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ,యెన్.ఏం.కృష్ణప్ప ,డాక్టర్ శ్రీ వసంత్ ,శ్రీ కే.మునిరాజ్ శ్రీ ఆర్ .రఘునాధ రెడ్డి గార్లను కలిసి వారి ఘోష విన్నాను .చలించి పోయాను .వారి పోరాట పటిమకు ధన్యవాదాలు అందించాను .మాత్రు భాష పట్ల వారికి ఉన్న మమకారం అర్ధం చేసుకొని అభి నందించాను .అందులో నారాయణ రెడ్డి గారి పాత్ర గణనీయం ..వారితో రెండు గంటలకు పైగా జరిపిన సంభాషణ లో మీ అందరికోసం కొన్ని విషయాలన్దిస్తున్నాను .
. 1970 వరకు సేలం వరకు తెలుగు బోధనా ఉండేది .డి.ఏం.కే.అది కారానికి వచ్చిన తర్వాత తమిళాన్ని నెత్తిన రుద్దాడు కరుణానిధి ముఖ్య మంత్రి .తమిళ భాష దెబ్బతింటుందని హిందీ వ్యతి రేకోద్యమాన్ని నిర్వహించిన ఆ పార్టి తెలుగును కాల రాచటానికి చెయ్యని ప్రయత్నం లేదు .’’తెలుగు ఒళిగ’’అంటే ‘’క్విట్ తెలుగు ‘’ఉద్యమం చేపట్టింది ఆపార్టీ.తెలుగు స్కూళ్ళు అప్పటి వరకు వందకు పైగా ఉండేవి .జనాభా ఒక లక్ష .జనాభాలో తెలుగు వారి శాతం 60%ఉండేది .ఇప్పటికి అంతే కాని విద్యాలయాలు తీసేశారు .హోసూర్ కర్నాటకకు సరి హద్దు కు ఎనిమిది కిలోమీటర్లలో ఉంది .అయితే తమిళ నాడులో ఉన్నది .పూర్వం దీన్ని ‘’హసవూర్ ‘’అనే వారు .హోయసల రాజుల కాలం లో ఉన్న నగరం .1956 లో సర్వే చేసిన పటాస్కర్ కమిటీ ఇచ్చ్చిన నివేదిక ప్రకారం హోసూర్ వాళ్ళ ఇష్టప్రకారం యే రాష్ట్రం లో నైనా చేర వచ్చు అన్నాడు . .తెలుగు రాష్ట్రం సాధించే టప్పుడు అందరు హోసూర్ ను మర్చి పోయారు ..వారి ఘోష విని పించుకో కుండా నిర్ణయాలు తీసుకొన్నారు .
తమిళం ముందు చాప కింద నీరు లా చేరిపోయింది .ఇక్కడ తెలుగు సంఘం యాభై ఏళ్ళ పై నుంచే పని చేస్తోంది .తన భావాలను విష్పస్తం గా చెబుతూనే ఉంది .తెలుగు వాడే అయిన కోదండ రామయ్య గారు ఏం .ఎల్.సి.గా ఉండి పోరాటం చేశారు తమిళ నాడు లో తెలుగు భాషోద్యమాన్ని నిర్వహించారు .’’జై తెలుగు తల్లి ‘’నినాదం తో దేశం అంతా దద్దరిల్ల జేశారు .ఇక్కడి‘’మిత్ర బృందం ‘’బోస్ బజార లో మొదటి సారిగా ఉద్యమాన్ని చే బట్టింది .ఘంటసాల మిత్ర బృందం ఉగాది వేడుకలు ఘంటసాల పాటలు నిర్వహిస్తారు ..’’నడుస్తున్న చరిత్ర ‘’సంపాదకులు శ్రీ సామల రమేష్ బాబు వీరికి గొప్ప ప్రేరణ .వీరితో కలిసి పని చేస్తూ ప్రోత్సహిస్తున్న వారు ప్రముఖ కధకులు ,సామాజిక కార్య కర్త శ్రీ సా.వేం.రమేష్ అంటే వీరందరి దైవ సమానం .స్వర్గీయ కైవారం తాతయ్య ఆధ్యాత్మిక ఆశ్రమం ఎంతో ప్రోత్సహిస్తుంది తాతయ్య గారి ని ,వారి సేవలను నిత్యం వీరు స్మరిస్తారు . తాతయ్య గారు‘’దూషించు వారి –నయ భాషించి ప్రేమతో భూషించవ మనసా ‘’అని ఉద్బోధించే వారు . .
కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం 2001లో ఏర్పడింది .ప్రతి నెల మొదటి ఆది వారంకోదండ రామయ్య ఆంద్ర సాంస్కృతిక సంఘం భవనం లో సమావేశమైకవితలు రచనలు చదివి విని పిస్తారు నెలలో మిగిలిన వారాలలో సభ్యులు ప్రాంతాలన్నీ తిరిగి సమస్యలను తెలుసు కొంటారు .తెలుగు బడుల్లో విద్యార్ధులను చేరుస్తున్నారు .మూడేళ్ళు గా కొంత అభి వృద్ధి సాధించారు తమిళ బడులు తెలుగు బడులు గా మారుస్తున్నారు .ప్రతి ఫిబ్రవరి ఇరవై ఒక్కటి రోజున ‘’మాత్రు భాషా దినోత్సవం ‘’నిర్వహిస్తున్నారు .మే నెలలో గిడుగు జయంతిని ,ఉగాది కవి సమ్మేళనాలను నిర్వహించి కవితలను పుస్తక రూపం లో తెస్తున్నారు .బ్రౌన్ ,వేమన జయన్తులను జరుపుతారు . 2004 లో ‘’తెలుగు వాణి ‘’స్తాపించి తెలుగు బోధనా పై శ్రద్ధ చూపుతున్నారు . .’’తల్లి భాష ‘’మాస పత్రిక ఏర్పరచి మంచి సాహితీ సేవ చేస్తున్నారు . రాయ వెల్లూర్ నుండి తెలుగు నేర్చుకోవటానికి హోసూర్ వస్తున్నారు .అజంతా వాచకం తయారు చేసుకొన్నారు కుప్పం వర్సిటి లో రిసోర్సు పెర్సన్ లకు శిక్షణ నిప్పిస్తున్నారు .శిక్షణ నిచ్చిన వారిలో శ్రీ పరిమి రామ నరసింహం గారు గొప్ప కృషి చేస్తున్నారు నూట ఇరవై గ్రామాల నుండి గ్రామానికి సుమారు యాభై మంది దాకా వచ్చి నేర్చుకొన్నారు .స్రీలు కూడా చాలా ఉత్సాహం గా పాల్గొనటం విశేషం .
ఆ ప్రేరణ తో తమిళ విద్యార్ధులు కూడా తెలుగు లో కవిత్వాలు రాశారు .హోసూర్ లో ‘’పల్లె కళల పరస (పండుగ )2007లో రెండు రోజులు నిర్వహించారు .శ్రీ ఆర్ వి .ఎస్ సుందరం ,శ్రీమతి నాయని కృష్ణ కుమారి ,దేవ పుత్రా మొదలగు హేమా హేమీలందరూ వచ్చారు .తెలుగు కధలపై ‘’వర్క్ షాప్ ‘’నిర్వ హించారు .సా.వేం .రమేష్ ఆధ్వర్యం లో ‘’తిరుచి ‘’లో 2008 లో అయిదు రాష్ట్రాల ‘’పల్లె కళల పరస ‘’నిర్వహించి గొప్ప ప్రేరణ కల్పించారు .అక్కడ ఉన్న పద్నాలుగు తెలుగు జాతుల వారిని ఏకం చేశారు .తిరుచి లో అందరు దాదాపు రెడ్లె వాసవీ మహల్ లో తిరుచి కోట ఆకారం లో వేదిక ఏర్పరచి అక్కడ సభు నిర్వహించారు .కేంద్ర ,రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు .’’దక్షిణ భారత పల్లె కళల పండుగ ‘’అనే బాన్నర్ కట్టుకొన్నారు ‘’మా తెలుగు తల్లికి ‘’పాటతో సభలు ప్రారంభించారు .వచ్చిన అతిధులు అంతా తెలుగు అభి వృద్ధికి హామీ లిచ్చారు .అక్కడ అందరు తెలుగు వారే తర్వాత తమిలులయారు .ఇప్పుడు హోసూర్ ఏం .ఎల్.యే.శ్రీ గోపీనాద్ తెలుగు వాడే మంచి తెలుగు మాట్లాడుతాడు .కూచి పూడి నాట్యం చూసి అంతా అప్రతిభులైనారు .’’తెలుగు ఇంత మధురమా ,తెలుగుకు ఇంత ప్రమాదం వచ్చిందా ‘’అని అందరు ఆశ్చర్య పోయారు .నాలుగు వందల మంది కలా కారులు రెండు రోజులు నిర్వహంచిన వివిధ కార్యక్రమాలను అందరి మనస్సుల్ని ఆకర్షించాయి .తల్లి భాష తెలుగు పట్ల అందరికి పూజ్య భావం ఏర్పడింది .ఇదంతా రమేష్ గారి చలువే అంటారు వీరు .ఈ స్పూర్తితో ప్రతి జిల్లా వారు తామూ ఇలా నిర్వహిస్తామని ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు
కరుణా నిది అది కారానికి వచ్చిన తర్వాతా తెలుగు వారిని తమిళులు గా’’ జన గణన ‘’లో మార్చి రాసి ద్రోహం చేస్తున్నారు ..తెలుగు అనేది ఇక నుంచి విని పించ రాదనీ కరుణానిధి కూతురు కని మొలి చెప్పి,తండ్రికంటే నాలుగాకులేక్కువే చదివానని పించింది .దీనితో నిరసన పెరిగింది .ఆందోళనలు ఉద్యమాలు చేశారు .మద్రాస్ నగర వీధుల్లో తెలుగు వాణిని వినిపించారు .ఒత్తిడి పెరిగి కరుణ నిర్బంధ తమిళ చట్టాన్ని రద్దు చేసుకొన్నాడు .అసలు ‘’ఎంగుం తమిళం ఎడియం తమిళం‘’అంటే ఎక్కడైనా, ఎందులో నైనా తమిళం అనేది కరుణ నినాదం కాని వెనక్కి తగ్గాడు .ఓటర్ల లిస్టు లో తెలుగు పేర్లుంటాయి ఊరి పేర్లు మాత్రం తమిళం లో ఉంటాయి .ఆ నాటి ముఖ్య మంత్రులు ఎడ్యూరప్ప ,అచ్యుతా నందన్,రోశయ్య కరుణ ను బానే హెచ్చ రించారు .బెంగళూర్ లో వేలాది మంది నిరసన స్వరం అట్టిగా విని పించారు .తెలుగు కన్నడ సంఘాలుకలిసి కట్టు గా పని చేసి జన జాగృతి చేశాఇ . .ఈ బాధ భరించలేక ఎన్నికల ముందు నిది గారు విధి గా తమిళం నేర్చుకోవాలి అన్న పట్టుదల సవరించుకొని ‘’ఎవరి భాష వాళ్ళు నేర్చుకో వచ్చు’’అని ప్రకటింఛి ఉత్తర్వు ను ఇచ్చాడు .అప్పటికే ఆలస్యం జరిగి తెలుగు వారంతా కరుణా నిది పార్టీకి వ్యతి రేకం గా ఓటేసి మట్టి కరిపించి జయ లలితకు పట్టం కట్టారు .ఇప్పటికీ తెలుగు అంటే ఈ ప్రాంతం లోనీ వారికి ప్రాణం .దాన్ని నిల బెట్టుకోవా టానికి యే త్యాగానికైనా సిద్ధమే .దేనికీ భయ పడే తత్త్వం లేని నిజాయితీ పరులు .మన రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఆసరా గా నిలబాది తమిళ నాడు ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి న్యాయం చే కూర్చాలి ఇప్పటికీ ఈప్రాంత గ్రామాల్లో తమిళం మాట్లాడితే ‘’దిగువ సీమ వాళ్ళు వచ్చారు ‘’ అని ఈసడించుకొంటారు .దిగువ జాతుల వారే తమిళం మాట్లాడే వారట ..
ఇదీ హోసూర్ ముఖ చిత్రం .కనుక వారికి అన్ని కోణాల్లోనూ న్యాయం జరిపించాల్సిన బాధ్యత తెలుగు సభలు జరిపే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రముఖం గా ఉంది .తెలుగు ప్రజల మీదా ఉన్నాడని మర్చి పోరాదు అని గుర్తు చేయటానికే ఇదంతా రాశాను .వారి ఘోష మనకు ఉసురు కాకూడదు ..వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు .మన వెన్ను దన్ను కూడా అవసరం .ఇప్పటి దాకా తాత్సారం చేసిన ప్రభుత్వం ఇక అలానే ఉపేక్ష గా ఉంటె తెలుగు వారు సహించరు అనేది గమనించాలి .హోసూర్ తెలుగు సోదర సోదరీ మణులకు మనం అందరం అండ గా నిలవాలి .జై తెలుగు జై జై తెలుగు తల్లి .
నాల్గవ తెలుగు ప్రపంచ సభల సందర్భం గా అందరికి శుభా కాంక్షలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12- ఉయ్యూరు
పద్యాల చిన్నయసూరి
పద్యాల చిన్నయసూరి
పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి తరాలకు అందించాలనే నా తపన” అంటున్నారు విశాఖపట్నానికి చెందిన పరవస్తు ఫణిశయన సూరి. ‘వారం వారం పద్య విహారం’ పేరిట ఆయన చేస్తున్న ప్రయత్నానికి బాలల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
పరవస్తు ఫణిశయన సూరి. ‘పేరెక్కడో విన్నట్టుగా ఉంది’ అన్నారంటే మీకు తెలుగు గురించి కొంచెం తెలిసినట్టే. ‘పరవస్తు చిన్నయసూరికి ఈయన ఏమవుతారు’ అని అడిగారనుకోండి, అప్పుడు మీకు భాష గురించి బాగా తెలిసినట్టు. తెలుగు భాషకు వ్యాకరణ కిరీటాన్ని పెట్టిన పరవస్తు చిన్నయసూరికి ఈ ఫణిశయన సూరి ఐదో తరం మనవడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న మనుషులున్న ఈరోజుల్లో కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును తెలుగు పద్యాల వ్యాప్తికి ఖర్చు చేస్తానంటున్న ‘అ’సామాన్యుడాయన.
కోటిచ్చినా నోటికొస్తుందా…
పూర్వం అక్షరాభ్యాసానికి పూర్వమే పిల్లలకు పద్యాలు నోటికొచ్చేవి. ఉదయాన్నే లేచి పనిచేసుకుంటూ పద్యాలను వల్లించుకునే బామ్మల నుంచో, రాత్రి పూట పద్యపఠనం చెయ్యకుండా పడుకోలేని తాతల నుంచో వినీవినీ వారికి అవి ఒంటపట్టేవి. ‘శ్రీరాముని దయచేతను….’ ‘నీ పాద కమలసేవయు…’ ‘ఉప్పుకప్పురంబు….’ ఒకటారెండా, ఒకటో తరగతిలో చేరేనాటికి తక్కువలో తక్కువ పాతిక పద్యాలయినా కంఠస్థమయి ఉండేవి చిన్నారులకు. ఇప్పుడా పరిస్థితి లేదు. “అలాగని తెలుగు పద్యాలను మరిచిపోతామా చెప్పండి? అపూర్వమైన నిధి కదండీ మన పద్యాలంటే? వాటిని పిల్లలకు నేర్పించకపోతే ఎలా?” అంటూ ఆ పనికి తానే ముందడుగేశారు.
‘వారం వారం పద్య విహారం’ అనే శీర్షికతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పౌర గ్రంధాలయం వేదిక అయింది. ‘పద్యం నేర్చుకోండి, పది రూపాయలు అందుకోండి’ అన్న నినాదంతో మొన్న వేసవి నుంచి ఆయన చేపట్టిన ప్రచారం చిన్నారుల్లో మంచి ఉత్సాహాన్నే నింపింది. ఏప్రిల్లో మొదలైన ఈ కార్యక్రమానికి దాదాపు 550 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా… 300 మంది వివిధ వయసుల విద్యార్థులు ఒక్కొక్కరూ పాతిక నుంచి రెండొందల వరకూ పద్యాలను నేర్చుకున్నారు! వాళ్లకు సుమారు యాభై వేల రూపాయలను బహుమతులుగా ఇచ్చారు ఫణిశయన సూరి. అలాగని ఇది డబ్బు కుమ్మరిస్తే అయిపోయే పని కాదు. కోటి రూపాయలు పోసినా నోటికో పద్యం రావాలంటే చాలా తతంగం ఉంది.
‘పద్య విహారం’ కార్యక్రమం విజయవంతం కావడానికి సూరి చాలా పరిశ్రమించారు. “మా తెలుగు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో ముందుగా తె లుగు సాహిత్యంలో అపూర్వ వజ్రాల వంటి పద్యాలను ఎంపిక చేసే పనిలో పడ్డాం. దేనికదే అపురూపంగా ఉండేది. ప్రతి పద్యాన్నీ చదువుతున్నప్పుడు దాన్ని పిల్లలకు ఎలాగైనా నేర్పించాలనిపించేది. ఏ కవినీ వదిలెయ్యాలనిపించేది కాదు. అబ్బో, అదొక విచిత్రమైన అవస్థ …’ అంటున్న సూరి మొత్తానికి తొలిమెట్టుగా ఒక ఐదు వందల పద్యాలను పోగుచేశారు. పిల్లలకు అర్థమయ్యేలా విడివిడి కాగితాల మీద రాసి నకలు తీయించారు.
తెలుగులో చదవలేని ఇంగ్లీష్ మీడియమ్ వారికైతే ఇంగ్లీష్లోనే రాసిచ్చారు. అర్థం చెబుతూ పద్యాన్ని చదవడంలో శిక్షణనిచ్చారు బాలలకు. “వేసవి శిబిరం బాగా నడుస్తుందా లేదా అని ఆందోళనగా ఉండేది. మొదట్లో తల్లిదండ్రులు బలవంతపెడితే, కొద్ది మందొచ్చేవారు. నెమ్మదిగా వాళ్లంతటవాళ్లుగా రావడం పెరిగింది. వేసవి శిబిరం తర్వాత ఆపేద్దామనుకున్న మేం ఇప్పుడు పద్య విహారాన్ని వారం వారం హాయిగా కొనసాగిస్తున్నామంటే బాలల్లోని ఆదరణే దానికి కారణం” అంటున్నారు సూరి.
అపర భువన విజయం
ఎల్కేజీ నుంచి పదో తరగతి దాకా – వివిధ వయసుల బాలలు పూర్వ కవుల పద్యాలను గడగడా చదువుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది. “చిన్నారులు తప్పుల్లేకుండా భావయుక్తంగా పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను…” అంటున్న ఫణిశయన సూరిలో ఆ ఆనందామృతాన్ని పదిమందికీ రుచి చూపించాలనే ఆలోచన కలిగింది. తన శిక్షణలో బాలలు సొంతం చేసుకున్న పద్య సంపదను పదిమందిలోనూ ప్రదర్శిస్తూ ‘తెలుగు పద్య విజయం’, ‘తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం’ అన్న శీర్షికలతో ఇప్పటికీ రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించారు.
రెండిటిలోనూ నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన , మొల్ల… వంటి మహామహుల రూపాలను ధరించిన పిల్లలు… సాక్షాత్తూ ఆ కవులు భువికి దిగి వచ్చారా అన్నంత ధారణతో పద్యాలను చదువుతుంటే సభాసదులు పులకరించిపోయారు. ఇవన్నీ చేస్తున్నారు కదాని సూరి ఏమీ ఆగర్భశ్రీమంతుడు కాదు.
వివాహాది శుభకార్యాల్లో పువ్వుల అలంకరణ చేసే వృత్తికి తోడు అప్పుడప్పుడు ఆర్ట్ డైరెక్టర్గా సినిమాలకూ పనిచేస్తుంటారు. పద్య విహారం కనీసం రెండేళ్ల పాటు నిర్విఘ్నంగా జరగడానికి ఐదు లక్షల రూపాయల నిధిని సొంతంగా సమకూర్చుకున్నాకే తొలి అడుగు వేశారాయన. “ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చమని నేనుగా ఎవరినీ అడగదల్చుకోలేదు.. పద్యం పట్ల అభిమానంతో ఎవరైనా ఇస్తే కాదనను” అంటున్న సూరి ప్రయత్నం ఎంతోమందికి మార్గదర్శకం.
మన తెలుగు పద్యాల గొప్పదనాన్నీ, వాటి అందచందాలనూ ఈ తరానికి తెలియజెప్పే శీర్షికలు కొన్ని పత్రికల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఈమాట’ వెబ్ మ్యాగజిన్లో విజయవాడవాసి చీమలమర్రి బృందావనరావు చక్కటి పద్యాలను ఏర్చి కూర్చి కొన్నేళ్లుగా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. అటువంటిదే మరో ప్రయత్నం గుంటూరుకు చెందిన రచయిత పాపినేని శివశంకర్ చేశారు.
అమెరికాలో వెలువడే ‘తెలుగునాడి’ మాస పత్రిక పాఠకుల కోసం ఆయన పరిచయం చేసిన అనర్ఘ రత్నాల వంటి పద్యాలు, వాటి వివరణలనూ ఒకచోట చేర్చి ‘తల్లీ నిన్నుదలంచి’ అన్న పుస్తకాన్ని ఈమధ్యే విడుదల చేశారు. “ప్రాచీన సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాకా అందరికీ జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి…” అని తెలుగు పద్య నిధిని తలుచుకొని మురిసిపోతున్నారు పాపినేని శివశంకర్.ఫణిశయన సూరి : 9440682323
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3
రుక్మిణీ దేవి సర్వ దేహ వర్ణన ను చమత్కారం గావర్నించాడు ‘’సువర్ణా’’లతో .యుక్త వయస్సు వచ్చింది .ఆమెకు తగిన వరుడు శ్రీ కృష్ణుడే నని ఊహించి చక్కని పద్యం చెప్పాడు .
‘’హరి యమ్శం బున బుట్టె గ్రుష్ణు డిలపై ,నద్దేవుని గూర్ప ,వా
గ్వరుడూహించి విచిత్ర కల్పనముగా ,బద్మాంగి నీలాల కో
త్కరంగ ,నీ సుదతిన్ సృజించి ,జఘన స్థానంబు గాజేసేనో
ధరణిన్ ,దత్తరుణీత్రయంశాక్రుతి ,దత్తాద్దేతువై కన్పడన్ ‘’
కృష్ణుని లోనీ అంశాలన్నీ ఆవిడ శరీరం లో ఉన్నట్లు చెప్పటం భావుకతకు పట్టం కట్టటమే .ఆమె మోవికి మామిడి చిగురు ,మంకెన పువ్వు ,యెర్ర తామరా వగైరాలేవీ సరి పోవటం లేదనటం చిత్రం గా ఉంది..పరిణతి లో సారూప్య స్తితి తో వర వర్ణిని గా పేరు పొందింది .కృష్ణుడు కూడా ఆమె రూప లావణ్యాలను తెలిసి కొని ,’’తనకుం జాయగా జే కొందు ననుచు శౌరి దలచేన్ ‘’అని పిస్తాడు .’’మేడ్ ఫర్ఈచ్ అదర్’’అన్నట్లున్నా రన్న మాట .
కూతురి పెళ్ళి చేయాలని తండ్రి భీష్మకుడు భావించి ,మంత్రులతో ,పెద్దలతో తగిన వరుడేవారు అని అడుగుతాడు .తనకు కాబోయే అల్లుడు తలిదండ్రులు బల వంతులైన బంధు గణం గురు పురోహిత హితులు ,సిరి సంపదా ,కళా ,సాహస ఔదార్యం ,పరాక్రమం గుణ విరాజం ఉన్న రాజ కుమారుడై ఉండాలని అన్నాడు .కమల వంటి కుమార్తెకు హరిని బోలిన అల్లుడు దొరికితే మహదానందం అన్నాడు .
‘’కన్యాం రూప గునాన్వితాం మమ సుతాం ,క్ష్మాపాల బాలైక మూ
ర్ధన్యాం కాంచన రత్న భూషణ యుతం దాస్యామి తే విష్ణవే
ధన్యోహం హి గృహాణ ‘’యంచు హరి పాదద్వంబు న్వార్చి ,ఈ
కన్యాం దానము సేయగలగు ఘన భాగ్యం బెన్న దిన్కబ్బున్ ‘’
ఇలా సంస్కృతం లో తెలుగులో పద్యాన్ని ,కన్యాదానాన్ని వివరించాడు విచిత్ర కవి .
మంత్రు లంతా ఏకాంత మందిరం లో సంప్రదించుకొని ఏక వాక్యం గా శ్రీ కృష్ణుడే తగిన వరుడని అతని పుర విశేశాలు ,ఆయన గుణ శీలాదు లన్నిటిని సవివరం గా చెప్పారు .శ్రీ కృష్ణుని కలిమి ముందు ఇంద్ర ,కుబేర సముద్ర ,ఈశ్వర విభూతు లేవీ చాల వన్నాడు .అతని శరీరం లోనీ ప్రతి భాగాన్ని అద్భుత మైన పద్యాలతో వర్ణించాడు .ఆయనే రుక్మిణీ పతి కాగలిగిన వాడని చెప్పారు .
అన్న రుక్మి అక్కడే ఉన్నాడు .వీళ్ళ తీరు నచ్చలేదు .అతని మనసులో శిశు పాలుడున్నాడు .ఇచ్చకపు మాటలతో రాజును ప్రక్క దోవ పట్టిస్తున్నారని ‘’అనర్ఘ్య రత్నాన్ని ఆర ఊతంబు తోదవున అతకటం లాఉంటుంది రుక్మిణిని కృష్ణునికిస్తే’’ అన్నాడు .కృష్ణుని చేష్టల్ని తన వక్య చాతుర్యం తో గేలి చేశాడు .’’నిలువెల్లా మాయ ,కులం ,గుణం లేవు .ఎన్నో చోట్లు మార్చాడు .గుణం లేని వారి స్నేహం రూప రేఖాదులు లేని వాడు ‘’అంటూ నిందా స్తుతి చేశాడు .కవి సామర్ధ్యం ఇక్కడ ప్రస్పుటం గా కన్పిస్తుంది .మరి శిశుపాలుడు ‘’మహిత కనక కుదర చాప మంత్ర జపుడు ,భరిత పరమ కృపుడు ‘’అని మెచ్చాడు .రుక్మిణి భరించలేక పోయింది .రాచ కన్య ఏమీ చేసే స్తితి లో లేదు .అక్కణ్ణించి వెళ్లి పోయింది .ఎక్కడికి వెళ్ళిందో ,ఏమి చేసిందో చూద్ద్దాం
‘’కాంత ఏకాంత కాంత నిశాంత శయ్య –వాన్తగతి నొప్పె తాం త లతాం తమై
దంతరిత పూర్వ జోదితో దంత చింత –సంత సంతాప దంతురి తాం త రామమున ‘’
అంతటి బాధను ఇంతటి అందమైన పద్యం లో బంధించాడు కవి .ఆమె వెంట మనమూ వెళ్తున్న భ్రాంతి కల్గించాడు .ఆమె బాధ ‘’గోరు చుట్టూ పై రోకటి పోతూ ‘’లా ఉన్నదాని మంచి జాతీయం ప్రయోగించాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం -38 నవదినా లలో రెండవ రోజు కార్య క్రమం
కాశీ ఖండం -38
నవదినా లలో రెండవ రోజు కార్య క్రమం
రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి .మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి .తీర్ధ శ్రాద్ధం చేయాలి వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి .గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమః ‘’అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి .మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .
మూడో రోజు కార్యక్రమం
తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి .తర్వాతా దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరుకూడా ఉంది .ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి .వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి .పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి ‘’కిరణ ,దూత పాపాచ –పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునాచైవ –పంచ నద్యోత్ర కీర్తితః ‘’అని స్మరిస్తూ స్నానం చేయాలి .తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి .మణి కర్నేశుని ,సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి .అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి .రాత్రికి పాలు ,పండ్లు మాత్రమె స్వీకరించాలి .
నాల్గవ రోజు
ఉదయమే గంగా స్నానం విశ్వేశు దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని ,పూజించాలి కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి ‘’ఓం కాశ్యైనమః ‘’అని 36సార్లు అనుకోవాలి తర్వాతా బిందు మాధవుని దర్శించాలి .గుహను ,భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజం చేయాలి .రాత్రి నామ స్మరణ పాలు ,పండ్లు ఆహారం .అంటే ఈరోజు పది దర్శనాలన్న మాట
అయిదవ రోజు
ప్రాతహ్ కాలమే గంగా స్నానం చేసి ,కేదారేశ్వరుని దర్శించి ,అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి .తర్వాతా తిలా భాన్దేశ్వర ,చింతా మణి గణపతి నిసందర్శనం చేయాలి .దుర్గా దేవిని చూసి ,ఒడి బియ్యం దక్షిణా సమర్పించి ,గవ్వలమ్మ ను చేరి అదే విధం గా పూజ చేయాలి .ఈమెనే కౌడీబాయి అంటారు .అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి ,భోజనం చేసి రాత్రి పాలు ,పండ్లు తీసుకోవాలి
ఆరవ రోజు
సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ,వైధవ్యం ఎన్ని జన్మ లకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి ,బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి .వ్యాస కాశీ చేరి వ్యాసుని రామ లింగేశ్వరుని శ్రీ శుకులను దర్శించి ,కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి .తర్వాత భోజనం చేయాలి .రాత్రి సంకీర్తన తో కాల క్షేపం చేసి పాలు పండ్లను స్వీకరించాలి
ఏడవ రోజు
గంగాస్నానం ,నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి .దొరక్క పోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి .ఇరవై ఒక్క ఉన్ద్రాల్లను ,నూట ఎనిమిఎనిమిది యెర్ర పూలతో పూజించాలి . .ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తామ్బూలాలివ్వాలి . డుంది వినాయకుడిని అర్చించి ,అన్నపూర్నాలయం లో కుంకుమ పూజ చేయించాలి .అమ్మవారికి చీరా జాకెట్టు ,ఒడి బియ్యం ,గాజులు సమర్పించాలి .ఇలాగే విశాలాక్షి కీ చేయాలి .విశ్వేశునికి అభిషేకం చేయాలి .సహస్ర పుష్పార్చన ,సహస్ర బిల్వార్చన ,హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి .హర సాంబ హర సాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి .
ఎనిమిదో రాజు
గంగాస్నానం నిత్యపూజా తర్వాతకాల భైరవుడిని దర్శించి వడలు ,పాయసం నివేదించాలి .ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి .ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి .అయిదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి దక్షిణా తాంబూలం సమర్పించాలి భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ నిద్ర పోవాలి
తొమ్మిదో రోజు
గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్నాదేవిని దర్శించి పూజించి ,నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి .జ్ఞానులైన దంపతులను ఊజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి ఆశీస్సులు పొందాలి .రాత్రి అన్నపూర్నాష్టం చేసి నిద్ర పోవాలి .
పదవ రోజు కార్య క్రమం
నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి ,అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను గురు దంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ‘
సశేషం –మీ— గబ్బిటదుర్గా ప్రసాద్ 26-12-12-ఉయ్యూరు
మచిలీ పట్నం హిందూ కళాశాల హిస్టరీ లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర రావు గారి ”భారత దేశం ప్రపంచాలకిచ్చిన ఆధ్యాత్మిక విభూతి ”ఉపన్యాసం
ఇవాళ ఉదయం గంధ సింధూరం ,అరటి పళ్ళతో పూజ సాయంత్రం -మచిలీ పట్నం హిందూ కళాశాల హిస్టరీ లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర రావు గారి ”భారత దేశం ప్రపంచాలకిచ్చిన ఆధ్యాత్మిక విభూతి ”ఉపన్యాసం ఫోటోలు
మన తెలుగు టైప్ రైటర్
మన తెలుగు టైప్ రైటర్
1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి దిడుగు వెంకట నరసింహ రావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశాడు.
తరువాత అదే సంవత్సరం డిసంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక
పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని నిజాం రాజ్యంలోని భువనగిరి దగ్గర గ్రామమైన కొండగడప నుంచి ఆచార్య అనే
ఆ తరువాత 13 సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులోనికి తెలుగు టైపు రైటర్ 1935లో ‘చిన్నమాంబాంధ్ర ముద్రలేఖిని’
రూపంలో వచ్చింది.
ఇది పానగల్ రాజ గారి కృషి వల్ల తయారయ్యింది.
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని- 2 దౌహిత్రుని తాపత్రయం
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని– 2
దౌహిత్రుని తాపత్రయం
సంజీవ రాయ కవి కవి కధకులు రితైరేడ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహా స్తానం లోనీ వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి వారసుడౌతాడు అనేది లోక రీతి .శర్మ గారు ఆరోతరానికి చెందినా వారు కనుక సాహితీ వారసత్వపు హక్కు లభించింది .అది తన తాత ,ముత్తాతల నే కాక ముందు తరాల వారికీ ఋణం తీర్చు కొనే హక్కు ,బాధ్యతగా భావించి తాను పది హేనవ ఏట చూసిన సంజీవ రాయ కృత రుక్మిణీ పరిణయ కావ్యం లోనీ చిత్రాలను సేకరించే ప్రయత్నం లో ఉన్నారు .ఇప్పుడీ కావ్యాన్ని పరి శుద్ధ పరచి తానే‘’ప్రకాశకులు ‘’అయి ,దాన్ని సాహితీ ప్రకాశ మానం చేస్తూ తర తరాలరుణాన్ని సభక్తికం గా తీర్చుకొన్నారు .ఎందరికో ఆదర్శమాను లయారు .ఇలా ప్రచు రించటం లో అమితానందాన్ని పొంది ,ఆ ఆనందపు అను భూతిని సాహితీ ప్రియులకు అందజేసి ధన్యులవుతున్నారు .,ప్రశంశ నీయులయారు .తప్పులు జల్లెడ పట్టి ,అభిప్రాయం రాయమని నన్ను ఆదేశించారు .వారి పై ఆదరాభిమానాలతో ఔదల దాల్చాను .కావ్యం చదువుతూంటే ,చెమ కూర వేంకటకవి ,రామ రాజభూషణ కవి,పోతన కవి ల కవిత్వాలు కలిపి ‘’మిక్సీ పడితే’’ ఎలాంటి కవిత్వం వస్తుందో అలాంటి కవిత్వం ఈ కవి రాశారని అని పించింది .మంచి పండితునితో అర్ధ తాత్పర్యాలను విశేషాలను వ్రాయిస్తే మరీ శోభ తో కావ్యం ప్రకాశిస్తుందని శర్మ గారికి సూచించాను .వారు వెంటనే ‘’మంచి సూచన చేశారు ప్రసాద్ గారూ ,నేను ఆ ప్రయత్నం చేసి మీరు చెప్పింది త్వరలోనే ఆచరణ లోకి తెస్తాను .అర్ధ తాత్పర్యాలు విశేషాల తో మళ్ళీ ఈ పుస్తకాన్ని ముద్రిస్తాను.మీ వ్యాఖ్యానాన్ని అక్షరం వదల కుండా అందులో ముద్రిస్తాను ‘’అని చెప్పారు .ఆ ప్రయత్నం తీవ్రం గా నే చేశారు .రాసే వారు దొరికారని ,పని జరుగుతోందని త్వరలోనే పూర్తీ అవుతుందని కని పించినప్పుడల్లా చెప్పే వారు .అయితే అకస్మాత్తు గా శ్రీ శర్మ గారు ఈ ఏడాది మే నెలలో ఆ పని పూర్తీ కాకుండానే మరణించటం సాహితీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది .శర్మ గారు సమర్ధులైన కధా రచయిత .గొప్ప సంస్కారి .’’అమృత హస్తాలు‘’,’’నాయనమ్మ కధలు ‘’మొదలైన అద్భుత సంకలాను తెచ్చారు .ఇప్పుడు కావ్య విశిష్టత ను తెలుసు కొందాం
కావ్య విశిష్టత
శ్రీ రుక్మిణీ పరిణయ కావ్యం అనేక ప్రయోగాలకు నిలయం కావ్యానికి కావలసిన సకల హంగులూ ఉన్నాయి .తన ఇష్ట దైవం సంజీవ పర్వతోద్ధారి అయిన శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి ,కొండపల్లి మండలం లో కృష్ణా నదికి ఉత్తరాన గల కోడూరు లో తాను వెలసి ఉన్నానని ,అక్కడ మదన గోపాలుని ఆలయాన్ని నిర్మించి ,స్వామిని ప్రతిష్టించి ,రుక్మిణీ పరిణయ కావ్యం రాసి ధన్యుడైనాడు .జన్మ సార్ధకత చేసుకొన్నాడు .అలానే చిత్తాను వృత్తిగా ప్రవర్తించి ,కావ్యం రాసి సార్ధకత పొందాడు .ఈ కావ్యానికి ‘’మదన గోపాల చరిత్ర ‘’అనే పేరూ వచ్చింది .అయిదు ఆశ్వాసాల కావ్యం ఇది .
శ్రీ మద్భాగవత దశమ స్కంధం లోనీ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పఠించిన కన్యకలకు వివాహం త్వరలోనే జరుగుతుందని మన దేశం లో నమ్మకం బాగా ఉంది .అలాచేసి సఫలీ కృతు లైన వారెందరో ఉన్నారు .ఆ కధకే కాయ కల్ప చికిత్స చేశారు సంజీవ రాయ కవి .తనకు ముందు తరాల వారైన పోతన ,భట్టు మూర్తి ,చేమకూర వెంకట కవుల బాణిని ,వాణిని స్వంతం చేసుకొన్నాడు .వారు పోయిన ఫక్కీ లన్ని అనుసరించాడు .,అనుక రించాడు కూడా .ముఖ్యం గా కధా వివరణ లో పోతన గారు ఏయే సందర్భాలలో ఎలా పద్యాలు చెప్పి పారాయణ చేయటానికి రాశారో అలానే ఈ కవీ పద్యాలు రాశాడు .అయితే అంత తాదాత్మ్యకత చూపలేక ,కల్పించలేక పోయారు .వర్ణనల విషయం లో యమకాలు ,చమక్కులు ,బంధ కవిత్వాలతో మిగిలిన ఇద్దర్నీ అనుసరించారు .కావ్య స్తితికి కావలసిన మసాలా అంతా దట్టించాడు .
కధ అంతా తెలుగు లోగిళ్ళు లోనే జరిగి నట్లు చేయటం తమాషా గా ఉంది .రుక్మిణి తెలుగింటి ఆడపడుచు లాగ కన్పిస్తుంది .ఆమె తల్లి గర్భవతి అయినప్పుడు జరిగే సీమంతం ,రుక్మిణి బాలసార ,ఆట ,పాట అన్నీ తెలుగు వారు జరుపుకొనే రీతి లోనే చూపారు .కవిత్వం చాలా చక్కగా ,వయ్యారం గా నడుస్తుంది .’’పద్మేశు కధలు –మధు మాధురీ నాద స్తిత కున్మేలై ,కాగిన మీగడ పాలై విన ,గ్రొత్త సేయు ‘’రీతిగా ఉంతాయట. .రుక్మిణి తల్లికి కలలో లక్ష్మీ దేవి కన్పించటం ఆమె అందాన్ని ,లావణ్య దీదితిని చూసి ముచ్చట పడి తనకు కూతురు గా జన్మించమని కోరటం కవి చేసిన భలే కల్పన .ఆ సందర్భం లో‘’పుష్ప వత్సవ మహా రాజ భాగమునకు రాజు వెంచేసే నొక రేయి రాజసమున ‘’అని శ్లేషను ప్రయోగించి సందర్భ శుద్ధి గా చెప్పాడు .ఆమె గర్భవతి గా ఉన్నప్పుడు ,శారీరకం గా వచ్చిన మార్పులను సాంప్రదాయ పద్ధతులలో వర్ణించి చెప్పాడు .రుక్మిణి జన్మించింది ..పీటలపై దంపతులు కూర్చుని ,స్వస్తి పుణ్యః వాచనం చేసి’’ బాలికా మణి దేహ శోభా విభూతి రుక్మ కాంతి (బంగారు కాంతి )విలాసైక రూఢిదగుట వల్ల ‘’రుక్మిణి అని పేరు పెట్టారట .అద్భుతం అని పిస్తుంది .ఆమెను చూడ టానికి వచ్చిన పురజనులు రుక్మిణి తన పిన తల్లి పోలిక అని ఒకరంటే ,తల్లి పోలిక అని ఇంకోరు ,అమ్మమ్మ పోలిక అని వేరొకరు అనటం లో మన తెలుగింటి అమ్మలక్కల తీరు ప్రతి బిమ్బిస్తుంది .చివరకు ‘’అగన్య పుణ్య జన నిశ్శేష భువన పోషణ ,సువత్సతల విభూషిన్మతల్లి యైన బాలికా మణి ‘’అని సాక్షాత్తు లక్ష్మీ దేవి యే ఆమె అని నిర్ధారించింది ఒక పేరంటాలు .రుక్మిణి దిన దిన ప్రవర్ధ మానమవుతూ ఉంది .ఆమెను ఉయ్యాల్లో వేశారు .ముత్తైదువులు ‘’ఉయ్యాలో జంపాలో ‘’అని తెలుగింట్లో లాగా ఉయ్యాలా లూపారు .బాల రుక్మిణి తల్లి పాలు తాగే విధానమూ వర్ణించాడు కవి .మనోహరం గా .’’ఒక చన్నా నుచు ,నొక చన్ను బుడుకుచు ,మార్చి మార్చి ‘’పాలు కుడుస్తోందిట .ఇది అందరు పిల్లలు చేసే విధానమే .బొమ్మ కట్టి మన ముందుంచాడు .బాలిక కు బేసి నెలలో అన్న ప్రాసనా చేయటం మన రివాజు .రుక్మిణికి అయిదవ నెలలో ‘’అయిదవదౌ నెల యందు నైదువల్ ‘’చేశారని వర్ణించాడు .తోటి పిల్లలతో ఆమె ఆటలాడింది .’’జగదుద్ధారర మోహనా కార వర్తి యై ‘’విల సిల్లు తోంది .’’చలువ జాజిగి మించు చలువ వలువలు ధరించింది ‘’రవిక లోపల రవిక తోడిగిందట .అని చమత్కారం గా చెప్పాడు కవి .అంటే ఇప్పుడు స్త్రీలు వేసే ‘’బాడీ ‘’వేసిందన్న మాట ఆనాడే రుక్మిణి .ఇంతకూ రుక్మిణి తండ్రి పాలించిన విష్ణు కుండిన నగరం మన కొండ వీడు దగ్గరే నని చరిత్ర కారులు చెబుతారు .ఆది దృష్టిలో పెట్టుకొని కవి ఇంతటి తెలుగు వాతావరణాన్ని తెలుగింటి శోభను తెచ్చాడని పిస్తుంది .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –24-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం .-37 నవ దిన కాశీ యాత్ర
కాశీ ఖండం .-37
నవ దిన కాశీ యాత్ర
మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలిఅని చెప్పాడు . .అయితే కలికాలం లో ఇంత శ్రద్ధ తో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమనిసామాన్యులు కోరారు .దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు .అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు .మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి ?విశ్వేశ్వర నామ స్మరణ ,దానాలు చేయటం ,ధర్మ ప్రసంగాలు వినటం , ,ఏక భుక్తం ,ప్రాతఃకాల స్నానం ,ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం ,కోపం లేకుండా ఉండటం ,అబద్ధమాడకున్డటం ,అనే ఎనిమిది అంశాలు ఖచ్చితం గాఅమలు చేయాలి
మొదటి రోజు కార్యక్రమం
‘’ఆగత్య మణి కర్న్యామ్తు –స్నాత్వా దత్పధనంబహు –
వపనం కారయిత్వాతు –స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః
సచేల మభి మజద్యా ధ–కృతా సంధ్యాధిక క్రియాహ్
సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –కుశ గంధ తిలొదకైహ్’’
మొదటిగా మనసులో ముప్పది మోడు కోట్ల దేవతలు,తీర్ధాలతో సర్వ పరివారం తో సేవింప బడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్న !అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి .దీనికే చక్ర తీర్ధం అంటారు .సాక్షాత్తు శ్రీమన్నారాయనుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు శివుడికి పార్వతి తర్వాతా ఇష్టమైన వాడు విష్ణువే .అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు .విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణి కర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు .
యాత్రీకులు మణి కర్ణిక లో స్నానం చేయాలి .బ్రాహ్మణులకు దానాలు చేయాలి .కేశ ఖండనం చేసుకొని ,మళ్ళీ స్నానం చేయాలి .మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి.రుద్రాక్ష మాల ధరించి ఈకింది శ్లోకం చదువు కోవాలి
‘’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం –మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః
అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి
చరా చరేషు సర్వేషు-యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే –మణి కర్నీజతే మలే ‘’
‘’ఆ గంగా కేశవస్చైవ –ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –ఆ మద్ధ్యా ద్దేవ సరితః స్వర్ద్వారా న్మణికర్ణికా నమస్తే నమస్తే నమః‘’అని నమస్కరించి అక్కడ నుండి డుంది వినాయకుడిని దర్శించి ఇరవవై ఒక్క గరికలను ,ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ,ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణ గా సమర్పించాలి
‘’దున్దీ రాజ గణేశాన –మహా విఘ్నౌఘనాశన –నవాఖ్యాదిన యాత్రార్ధం –దేహ్యాజ్ఞానం కృపయా విభో’’అని ప్రార్ధించాలి .తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి ఆ తర్వాతా విశాలాక్షి ,జ్ఞాన వాపి ,సాక్షి గణపతులను చూడాలి .ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి ఫలాలు పాలు ఆహారం గా గ్రహించాలి
‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర
మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’
అంటూ పద కొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి .
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-12-12-ఉయ్యూరు
బస్… బహుత్ హోగయా !…. సాక్షి లో భరణి
|
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1 కవికధా కమామీషు
శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1
కవికధా కమామీషు
రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .యే కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ కవి అయినా ,తామూ ఆ కోవకు చెందిన వారమే నని కొప్పర్తి నరసాఖ్యుడు ముందు ప్రకటించగా ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు తామే పరిష్కరించి ప్రకటించి నట్లు చెప్పారు .అంటే అసలు తండ్రే కాక ,మరో ఇద్దరి ముద్దుల పుత్రిక అయింది ఈ కావ్య కన్యక .అయితే ,సాహితీ లోకం వీరిద్దరిని గుర్తించ లేదు .అసలు తండ్రి సంజీవ రాయ కవి యే అని పరిశీలకులు ,పరి శోధకులు నిర్ణ యించారు .,ధ్రువీకరించారు .కనుక కర్తృత్వం పై వాదం సమసి పోయింది .ఈ కావ్య కన్యక కు ఇప్పుడు 280 ఏళ్ళ వయసు వచ్చింది .
సంజీవ రాయ కవి వరంగల్లు జిల్లా కొలను పాక అనే గ్రామం లో జన్మించి నట్లు ఆది జైన పుణ్య క్షేత్రమని అక్కడ వీర నారాయణ స్వామి దేవాలయం ఉందని ఆరుద్ర తెలిపారు .అక్కడ గోపరాజు రాయప్ప గొప్ప శ్రీమంతుడు .ఆయన స్వామిపై శతకం రాయమని ఈ కవిని పిలిపించి ,సత్కరించి ,వేడుకొన్నాడు .’’కొలను పాక వీర నారాయణ ముకుంద విశ్వ కుంద‘’అనే మకుటం తొ సీస పద్య శతకం రాశాడు .వీటిని ‘’గునుగు సీసాలు ‘’అన్నారు దశావతార వర్ణన ,శ్రీ కృష్ణ లీలలను కూడా కవి వర్నిం ఛాడట .సంజీవయ్య తండ్రి గురవయ్య కూడా కవి గా ప్రసిద్ధుడే .కొండ వీటిలో ఉండే వాడు .ఆయన్ను ‘’కొండ వీటి పేద రావు గురవయ్య ‘’అనే వారట .మొదట తెలంగాణా వారే .తర్వాత తెనాలి దగ్గర రావూరు చేరటం వల్ల ఇంటి పేరు రావూరి గా మారింది .’’అనుమ కొండలు ‘’అనే ఉప శాఖ ఉన్న ప్రధమ శాఖ లో భాగమట..ఈ శాఖ బ్రాహ్మణులు ఓరుగల్లు దగ్గర ఉండటం వల్ల వీరి పూర్వీకులు ఇక్కడి వారే నంటారు ఆరుద్ర .కవి సంజీవయ్య చదువు తెలంగాణాలోనే సాగింది .రాత్రి పూట శ్మశానం లో శవాల వెలుగు లో చదువు కొనే వాడట.అంతటి దుర్భర దారిద్ర్య స్తితిలో కుటుంబం ఉండేదన్న మాట .తర్వాత పెద్ద వాడై,సంపాదనా పరుడై వీర నారాయణ స్వామి ఆలయాన్ని అభి వృద్ధి చేశాడట .’’కృష్ణ హరీ వాసుదేవ నందన ‘’శతకం రాశాడు .ఆ శతకం లో తనను ‘’సుధా రస తుల్య కవిత్వ కల్పనా స్రావిని –కొండ వీటి పేద రావు గుర్వ తనూజు సంజీవిని ‘’అని చెప్పుకోన్నాడట .జాతక సిద్దాంతగ్రంధాలు చదివి వంట పట్టించుకోన్నాడు .వీర నారాయణ శతకాన్ని 1731లో రాశాడట .రుక్మిణీ పరిణయ కావ్యాన్ని1787 లో రాశాడు .పద్యాలు క్లిష్టం గా ఉండటం ,జనాలకు అర్ధం కాక పోవటం వల్ల సంస్కృతం లో వివరణలూ రాసుకొన్నాడు కవి .ఈ వివరాలన్నీ ఆరుద్ర సమగ్ర ఆంద్ర సాహిత్యం ‘’లో పొందు పరచాడు .
బులుసు వెంకట రమణయ్య గారు ‘’ఆంద్ర కవి సప్త శతి ‘’లో సంజీవ రాయ కవి కవితా త్రివిక్రమవిలాసం ,భాగవతం లోని ఏకాదశ ,ద్వాదశ ఖండాలు కూడా పద్య కావ్యాలుగా చెప్పి నట్లు వ్రాశారు .ఈ విషయాలను ఆరుద్ర చెప్ప లేదు .దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు కూడా సంజీవ రాయ కవి గురించి చెప్పారు .కవి ప్రత్యేకత వల్ల సాహితీ లోకం లో నిలబడి ,ఎన్ని తంత్రాలు జరిగినా ‘’చిరంజీవి ‘’గా సంజీవ రాయ కవి నామ సార్ధకాన్ని సాధించారు .ఆంజనేయ స్వామి పేరును సార్ధకం చేసుకొన్నారు .
సశేషం
శ్రీ ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం –36 పంచ గంగా (పంచ నదీ )తీర్ధం
కాశీ ఖండం –36
పంచ గంగా (పంచ నదీ )తీర్ధం
పూర్వం వేద శిరుడు అనే బ్రాహ్మనుడుండే వాడు .పేరు కు తగ్గట్టే వేదం లో దిట్ట ప్రతి క్షణం దైవ ధ్యానం లో గడిపే వాడు .తపస్సమాధీ లో చాలా కాలం గడిపాడు .దేవేంద్రుడు తపో భంగానికి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ‘’శుచి ‘’అనే అప్సరస ను ఆయన దగ్గరకు పంపాడు .ఆమె తన రూప యవ్వన లావణ్యాభినయాల తొ ఆయన మనస్సు దోచింది ఆమెను చూడగానే రేతస్ఖలనం జరిగింది .ఇది తెలిసిన అప్సరస తన తప్పేమీ లేదని ఇంద్రుడు పంపగా వచ్చానని శపించ వద్దని ప్రాధేయ పడింది .వేద శిరుడు ఆమె కు భయం అక్కర లేదని చెప్ప్పి తన వీర్యాన్ని గ్రహించ మనికోరాడు .ఆమె స్వీకరించింది .
శుచికి సుందర రూపి అయిన కుమార్తె పుట్టగా ,పిల్లను ఆయన వద్ద వదిలి స్వర్గానికి వెళ్లి పోతుంది .ఆమె కు ‘’దూత పాపా ‘’అనే పేరు పెట్టి పెంచుతాడు .అంటే ఆమె పేరు ఉచ్చ రించ గానే పాపాలన్నీ ధ్వంసమై పోతాయని పేరులో ఉన్న అర్ధం .ఆమెకు యుక్త వయసు వచ్చింది .తండ్రి పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు .ఈ విషయం తెలిసిన కూతురు ‘’నాకు అతి పవిత్రుడు ,అందరి చే నమస్కరింప బడే వాడు ,అందరి మనోరదాలను తీర్చే వాడు ,పేరు తలచి నంత మాత్రం చేత బాధోపశమనం చేసే వాడు అయిన వరుడిని వెతికి వివాహం చెయ్యండి ‘’అని తండ్రికి చెప్పింది .ఆమె మనో భీష్ఠం సఫల మవుతుందని తండ్రి అభయ మిచ్చాడు .
దూత పాపా తీవ్ర తపస్సు చేసింది .బ్రహ్మ ప్రత్యక్ష మై వరం కోరుకో మంటే ‘’ప్రపంచం లో పవిత్రులలో నన్ను ఉత్తమ పవిత్రు రాలిని చేయండి ‘’అని అడిగింది బ్రహ్మ తధాస్తు అంటూ మూడున్నర కోట్ల తీర్ధాలు దేవ ,మానవు లందర్నీ పవిత్రం చేస్తున్నాయని ఆరోజు నుండి వాటన్నిటి పవిత్రత ఆమె శరీరం లో అణువు అణువు లోను నిండి ఉంటుందని ఆమె అతి పవిత్రు రాలవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు .ఆమె తండ్రి వేద శిర మహామునీ తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందాడు . ,తండ్రీ ,కూతురు ఆనందం గా ఉన్నారు .ఒక రోజు తండ్రి వూరిలో లేని సమయం లో ధర్ముడు అనే వాడు ఆకాశ మార్గం లో సంచరిస్తూ ఈమెను చూసి ఆశ్చర్య పడ్డాడు .ఆమె ఎదుట నిలిచాడు .ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది .ఆమె ను గాంధర్వ వివాహం చేసుకొంటానన్నాడు ఆమె భయ పడుతుంది దూర్తుదేమో నని శంకిస్తుంది కోపం వచ్చి అతన్ని జలధార గా మారిపొమ్మని శపిస్తుంది .అతడు నిర్ఘాంత పోయి తనను అర్ధం చేసుకో కుండా తొందర పడి శపించి నందుకు కలత చెంది ,స్త్రీ అయి ఉండి కూడా కఠినం గా ప్రవర్తించావు కనుక కఠిన పాషాణం గా మారి పొమ్మని ప్రతి శాపం ఇస్తాడు .ఇంతలో తండ్రి తిరిగి వచ్చి విషయం తెలిసి బాధ పడతాడు .ఇద్దరు తొందర పడ్డారని చెపుతాడు .ఇదంతా శివాజ్న అని శిరసా వహిస్తారు అవి ముక్త క్షేత్రం అయిన కాశి లో విశ్వ నాధుని చరణ సేవలో ‘’ధర్మ నదమై ‘’ప్రఖ్యాతి చెండుతావని ధర్మునికి, ,నిర్ధూత దూత పాప చంద్ర కాంత శిల గా ఎప్పుడు అతన్ని అంటి ఉంటుందని ఆమె కు తెలియ జేశాడు .వారిద్దరూ దంపతులై లోక కళ్యాణ కారకు లౌతారని దీవిస్తాడు .
సూర్య దేవుడు లింగ ప్రతిష్ట చేసి చాలా కాలం తపస్సు చేశాడు . ఆతని చెమట ద్రవం గా వెలువడి కొలను గా మారి ‘’కిరణ తీర్ధం ‘’అనే పేరు తెచ్చు కొంది .ఆ జలం సర్వ పాప ద్వంసీ .దూత పాప మిశ్రిత ధర్మ నదం లో కలుస్తుంది .అలాగే భాగీరధీ గంగా తీర్ధం ,యమునా తీర్ధం సరస్వతీ తీర్ధం వాటిలో కలిసి పోతాయి ఆమెను ఆశ్రయించిన కిరణ ,ధర్మా ,గంగా ,యమునా ,సరస్వతులు పంచ నదీ తీర్ధం గా వర్ధిల్లు తుందని చెప్పాడు కలి యుగం లో చంద్ర కాంతా శిల రూపం లో ఈ అయిదు నదులకు మాత్రమె దూత పాప కని పిస్తుందని తెలిపాడు అందర్ని ఆకర్షించి పుణ్యాన్ని నిస్తుందని వరమిచ్చాడు కూతురికి .పంచ నదీ స్నానం సర్వ తీర్ధ ఫలదం .పంచ నదీ స్నానం చేస్తూ ఒక ఏడాది మంగళ గౌరీ పూజ చేస్తే గుణ వంతు లైన పుత్రులు జన్మిస్తారు .కృత యుగం లో ధర్మ నద తీర్ధం గా ,త్రేతా యుగం లో దూత పాప తీర్ధం గా ,ద్వాపరం లో బిందు తీర్ధం గ ,కలి యుగం లో పంచనద తీర్ధం గా ప్రఖ్యాతి చెందింది .
పంచ నదీ తీర్ధం లో స్నానం చేసి నపుడు ఈ కింది శ్లోకాన్ని పఠించాలీ
‘’కిరానా దూత పాపేచ ,పుణ్య తోయా సరస్వతీ –గంగాచ యమునా చైవ ,పంచ నద్యోత్ర కీర్తితాః
అతః పంచనదం నామ తీర్ధం త్రైలోక్య విశ్రుతం –దేవ నద్యార్ధ భాగాచ్చ –పంచ గంగేశ్వారా వధి
కిరణ శ్రోతాస స్తద్వాత్ –దూతా పాపెశ్వరా వధి ‘’
సశేషం
వైకుంఠఏకాదశి శుభా కాంక్షల తొ
–మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-12-12- ఉయ్యూరు
ఆంధ్రజ్యోతి చందమామ
ఆంధ్రజ్యోతి చందమామ
ఆంద్రజ్యోతి మాసపత్రిక 1936 సంవత్సరంలో మద్రాస్ నుంచి బైసాని నరసింహులు గుప్తా ప్రారంభించగా
తరువాతి కాలంలో నాగిరెడ్డి చక్రపాణిల ద్వారా ప్రకటించబడింది. వీరిద్దరూ ఈ పత్రికకు సంపాదకులుగా
వ్యవహరించారు. తెలుగు మరి ఆరు భారతీయ భాషలలో చందమామ ప్రారంభించిన తరువాత మరికొన్ని
ఇతర భాషలలో కూడా చందమామ ప్రారంభించడానికిగాను ఆంధ్రజ్యోతి ప్రచురణ నిలిపివేయడమయినది.
పత్రికల ప్రారంభానికి మాత్రం ప్రకటనలు చేసే విధానం ఉంది. కాని ఈ పత్రిక నిలిపివేయడానికి పాటకుల నుంచి
శలవు తీసుకొంది!
గొల్లపూడి కధా మారుతం -24(చివరి భాగం ) ముగింపు ముక్తా ఇంపు
గొల్లపూడి కధా మారుతం -24(చివరి భాగం )
ముగింపు ముక్తా ఇంపు
మారుతీ రావు భావాలను వెలికి దీసే దిట్ట .మృదువైన సంభాషణా చతురుడు .ఆశయాల ఊదర ఉండదు .ఆవిష్కరణ లో విలక్షణత ఉన్న వాడు .అందం గా చెప్పటం బాగా నేర్చిన వాడు .దాదాపు ఈ కధ లన్నిటికి తానే నాయకుడు .ఉత్తమ పురుష లో సాగే ఉత్తమ విధానం .ఆడ వాళ్ళ’’ వానిటి ‘’అతడిని ఆకర్షించి దాన్ని అనలైజ్ చేశాడు .వానిటి లో ఎదుటి వాడిని ధిక్కరించే స్వభావం ఉంటుంది .ఎదుటి వారికి విలువ నివ్వరు .మానవత్వం పై మారుతీ రావు కు అమితాను రాగం .పరోపకారం మరో గొప్ప సుగుణం .ఇవ్వడం మాత్రమె తెలుసుకొని ,సేవ చేసే బాధ్యత తెలుసు కోవాలనే ఉద్బోధ ఉంటుంది .ఇవ్వటం లో ఉన్న ఆనందం గొప్పది అనే తత్త్వం ఉన్న వాడు .అతని కధలు మనల్ని శాశిం చవు .నువ్వు ఇలా ఉంటె నువ్వు బాగుండవా అనే ఓ సూచన ఉంటుంది .జీవితం లో అన్ని దశల్లో స్త్రీ ప్రత్యేకత చూపిస్తుంది అనే భావం ఆయనకు ఉన్నది .ఆ ప్రత్యేకత కు పేరు పెట్టడు .ఆదివ్యక్తిత్వ వికసనమే .ఫెమినిజం ఆశించే వీలు ఉండదు .అయితే సత్యభామ విషయం లో అతను ప్రత్యేకత చూపాడు .
మట్టి లోంచే బంగారం వస్తుందని తెలిపే సత్యాలున్నాయి .అరవై నాలుగు కళల్లో దొంగ తనానికి ఒక ప్రత్యెక స్తానం ఉంది .దానిలో ఆరి తేరిన వాడి జీవితాన్నీ ఆవిష్కరించాడు .అయితే వాడూ లోకోప కార బుద్ధి ఉన్న వాడే .గుర్రబ్బడ్డీ వాడి జీవితానికి ఓ సార్ధకత ఉంటుంది .un heard melodies are sweeter than heard ones అనే భావాన్ని బాగా పోషించాడు .చైనా లో ఒక సామెత ఉంది ‘’ఆహారానికి ఇచ్చ్చే విలువ సౌందర్యానికీ ఇవ్వాలి ‘’మనదేశం లో అంతస్సౌన్దర్యానికి విలువ ఎక్కువ .Ethical beauty is being worshipped in this land అని మనకు గౌరవం ఆపాదిస్తారు .అందుకే అందమైన జీవితం పై కధ వచ్చింది .’’కల ను ఆనందించటం అంటే స్వీయ ఆత్మ ను సందర్శించటమే ‘’అన్న సూక్తి ని మారుతీ రావు బాగా ఉపయోగించాడు .అందుకే నాకు ఆ కధలు చాలా ఇష్టం అని పించాయి .అంతే కాదు యే రచన చేసినా ఎంతో తపన తొ, తపస్సు తొ ,లోక పరి శీలాన చేసి దాన్ని పూర్తిగా జీర్ణించుకొని ,,తనదైన భాషలో ,భావం తొ చెప్పాడు .అందుకే ముగ్ధ మనోహరం గా ఉంటాయి మారుతి కధలు .అంత ఓర్పు ,నేర్పు ఉన్న వాడు గొల్ల పూడి .Each man poet ,philosopher or writer inhales much before exhales ‘’ఆ పట్టూ తెలిసిన వాడు .అతను చూపించిన పాత్రలు ,స్వభావాలు ఫోటో చిత్రాలుగా ఉంటాయి .అయితే అదీ ఒక కళ అంటారు Good photograph is not to photograph a beautiful thing ,but to beautifully photograph a thing ‘’అని సంజీఎవ దేవ్ ఎక్కడో ఎప్పుడో అన్న మాట మారుతి రావు కు బాగా అన్వ యిస్తుంది .
మారుతీ రావు కధలను,ఆ సౌందర్యపు నిధుల్ని అందించే ప్రయత్నం చేశాను .నేనూ ఓ తపస్సులా ,ఓ సాధన లా ఎనిమిది రోజులు ఏక బిగిన వీటిని 27-2-1987 న ప్రారంభించి పూర్తీ చేశాను .ఆ ఎనిమిది రోజుల్లో నా మనసంతా అతనే ఆక్రమించుకొని కూచున్నాడు .ఆ కధలే కళ్ళు మూసినా తెరచినా నా ముందు ప్రత్యక్ష మయ్యాయి .నా చెప్పడం లో అతని కధా కధనం తొ మేళ వించాను .దాదాపు అతని భాషలోనే చెప్పాను .అతని హృదయం తేలియా లని .నా విశ్లేషణ అవసర మనుకొంటే జోడించాను .అంత అవసరం లేకుండానే అతని భావము, భాష between the lines చెప్పేస్తుంది .నా పరకాయ ప్రవేశమూ కొంత చేరింది .అతని రచనా ,నాపైత్యమూ పడుగు పెకల్లా అల్లుకు పోయాయి .కధ చెప్పటం తొ బాటు ,కదన సౌందర్యాన్ని విస్పష్టం చేశాను .అందుకే ఇంత లావైంది .అయితే ఇది వాపా ,బలుపా ?అనే సందేహమూ వచ్చింది .నాకు బలుపె అని పించింది .ఇంతగా ఆకర్షించిన కధలు నాకు అప్పుడు కని పించలేదు .ఆ ఒరవడిలో అలాఅలా కొట్టుకు పోతు ఒడ్డుకు ఇప్పుడు చేరా .ఆ మునక లో ఆనందం ఉంది.అందమైన అను భూతి ఉంది .రస రమ్యత ఉంది గొప్ప అనుభవమూ ఉంది .ఇది గొల్ల పూడి మారుతీ రావు కు చేసే ‘’ కధాక్షరాల ఏకాదశ రుద్రం ‘’—ఆనందో బ్రహ్మా .
గొల్ల పూడి తో పరిచయం
మారుతీ రావు లో ఏదో తెలీని ఆకర్షణ ఉంది .చాలా ఏళ్ళ క్రితమే ఆతని ప్రభావానిఆకర్షితుడనయ్యాను.అతని మాట ,నటన ,కధ నవల ,నాటకం డైలాగ్ డెలివరి నన్ను లాగేస్తుంది .ప్రతి దానిలో తనదైన ముద్ర వేస్తాడు .చాల పిన్న వయసులోనే కధా రచన చేసిన అతి కొద్ది మందిలో గొల్ల పూడి ఛిన్న వాడు ఒకడు .అవి జనం పై మంచి ప్రభావమే చూపాయి .అలాగే మంచి నాటకాలు ‘’రాగ రాగిణి ‘’వంటివి రాసి వస్తువులో ,ప్రదర్శనలో కొత్తదనాన్ని ప్రవేశ పెట్టాడు .ఆకాశ వాణి లో పని చేసిన కాలం లో ఎంతో లబ్ధ ప్రతిష్టత ఉన్న ఆ నాటి కవులను రచయితలను ,కళా కారులను ప్రోత్స హించి రాయించి ,ప్రసారం చేసి వారికీ, దానికీ కీర్తి తెచ్చాడు .ఆ నాటకాలలో తాను నటించి గొప్ప గుర్తింపు పొందాడు .ముఖ్యం గా అతని డైలాగ్ డెలివరి ఓ ప్రత్యేకత సంత రించు కొంది .మాటకు వేషం కట్టి మన్నింపు తెచ్చిన డెలివరి ఆది .నాటక రంగానుభవం తొ సినీ వినీ లా కాశం లోను ఉజ్వలం గా వెలిగాడు .మంచి రచయిత గా నిలబడి మంచి కేరక్టర్ నటుడయ్యాడు .సరసం గా సందర్భోచితం గా ,రాసి సన్నీ వేశాన్ని పండించే వాడు .పాటవ మైన మాటలకు అతను ప్రత్యేకం .కరుణ రసాన్ని అద్భుతం గా కురిపించ గల నేర్పరి .నటునిగా తనదైన బాణీకి రూపు కట్టాడు .శాడిస్ట్ భర్తగా ,బాధ్యత లేని భర్త గా తండ్రిగా ,మునిగి పోతున్నా తనదే విజయం అని పించే వాడిగా అతను నటించిన పాత్రలన్నీ చిరస్మరణీయాలే .అందుకే యే మూసలో పోసినా బయటికి వచ్చేది అద్భుత సౌందర్య ప్రతిమ .దానికి వగలు ,వయ్యారాలు ,దర్పం ,ఉద్రేకం మేళ వించి జనాన్ని ఆకర్షించేది అతని కలమైనా ,గళ మైనా ఆహార్య మైనా, దర్శకత్వమైనా ..అన్నిటా ప్రత్యేకతే .అదీ అతని విజయ రహస్యం .
ఒక సారి మా ఉయ్యురుకు లక్ష్మీ టాకీస్ వాళ్ళు తీసే సినిమాకు రచన చేయ టానికి 1970 లో వచ్చి అప్పటి శాసన సభ్యుడు శ్రీ వడ్డే శోభ నాద్రీశ్వర రావు గారింటికి వచ్చాడు .శోభ నాడ్రి హై స్కూల్ లో మాకు జూనియర్ .ఆయన మా అందరకు కబురు చేశాడు .నేను స్వర్గీయ కాంతా రావు ,ఆంజనేయ శాస్త్రి వగైరాలం కలిసి వెళ్ళాం .ఒక గంట సేపు చాల విషయాలు మాట్లాడాడు .ఎక్కడా భేషజం ,గర్వం ,చిన్న చూపు లేకుండా ఉండి మమ్మల్ని ఆకర్షించాడు .అదే మొదటి పరిచయం .నాటక సినీ రంగాల ను నిశితం గా పరిశీలించిన అనుభవం తొ voluminous మాట్లాడే నేర్పున్న వాడు.
వీటికి మించి అతని లోని సామాజిక స్పృహ నన్ను ముగ్దుడిని చేసింది ముఖ్యం గా ఆంద్ర జ్యోతి దిన పత్రిక లోప్రతి శని వరం రాసే ‘’జీవన కాలం ‘’నన్ను బాగా ఆకర్షించింది .అందులో అతను త్రవ్వి తీయని జీవన సత్యం లేదు అంటే అతిశయోక్తి కాదు .ఎవర్నైనా ,ఎంతటి వాడి నైనా సునిశితం గా ,వ్యంగ్యం గా చురక వేసే రచన చేసి తన శైలికి జీవం పోశాడు .ఒక రకం గా ఉతికి ఆరేశాడు .ఎందరో మహానుభావుల వ్యక్తిత్వాలను మహోన్నతం గా ఆవిష్కరించాడు .ముఖ్యం గా ఎన్టీఆర్ లోనీ విచక్షతను ,విలక్షణత ను ఎవ్వరు చెప్పా లేనంత గొప్పగా చెప్పాడు .అందుకే గొల్ల పూడి అయస్కాంతానికి ఆకర్షింప బడ్డ ఇనుప ముక్కను అయాను .నాటక రంగానికి ఇంకా సేవ ఎంతో చేయాలనే తపన ఉన్న వాడు చేయ లేక పోతున్నానే అనే బాధ ఉన్న వాడు .తాను చూసిన ఏడు పాశ్చాత్య నాటకాలను మంచి నేర్పుతో తెలుగు ప్రజలకు మంచి విశ్లేషణ తొ తెలియ జేసినమహా గొప్ప విమర్ద్షకుడు .తెలుగు నాటక రంగం కల కాలం జీవించా టానికి ప్రక్రియా పరం గానే కాకుండా ,ప్రదర్శన పరం గా కూడా చాలా మార్పులు రావాలని ఆశిస్తాడు .ఇంగ్లాడ్ లో లాగా ఇక్కడా నాటకాలు సంవత్స రాల తర బడి ఆడాలని,ప్రేక్షకాదరణ పొందాలని నిండుగా కోరుకొనే కలలు కనే వాడు .ఆ కల నిజం కావాలని ఆశిద్దాం .అందుకే అతనంటే నాకు వీరాభిమానం
ఆంద్ర విశ్వ విద్యా లయం లో చదివే రోజుల్లోనే ‘’చీకట్లో చీలికలు ‘’నవల రాశాడు .అప్పుడే దాన్ని చదివి ఇంత చిన్న వయసు లో ఇంతటి భావ పరి పక్వతా అని ఆశ్చర్య పోయాను .అక్కడ కత్తుల వెంకటేశ్వర రావు అనే నటుడు ,ప్రయోక్త కు శిష్యుడై నటనలోనూ గొప్ప స్తానం పొందాడు .తన డైలాగ్ డెలివరి ని ఆయన నేతృత్వం లో అద్భుతం గా మోల్ద్ చేసుకొన్నాడు .’’పెర్ఫెక్ట్ జెంటిల్మన్ ‘’గానే కాకుండా ,పెర్ఫెక్ట్ రోగ్ గా’’ డీసెంట్ విలన్ ‘’గా తడి గుడ్డలతో గొంతు కోసే కర్కోటకుడిగా అతని నటన పరాకాష్ట చెందటానికి ఈ అనుభవమే తోడ్పడింది .అందుకే మారుతీ రావు అంటే నాకు తెగని మోజు .
మనసు లోపలి అతి సున్నిత పు పొరలకు అతి సున్నితం గా తాకే మాటల నగిషీ చెక్క గలడు .సన్నీ వేశాలని చక్కగా అల్లగలడు .ఆ నాటి ప్రముఖ దర్శకులు అతనితో అంత గొప్ప పని చేయించారని ఆ దర్శకుల ప్రభావమే తనను ఇంతటి వాడిని చేసిందని వినయం గా చెప్పాడు .ఆ నాటి వారికి ఏం కావాలో తెలుసు నని ,ఎలా రా బట్టాలో పూర్తీ అవగాహన ఉన్న వారని అన్నాడు .చేంతాడు లాంటి భారీ డైలాగుల కంటే చిరు మాటలు హృదయాన్ని తాకి మార్పు తెప్పిస్తాయని అతని దృఢ విశ్వాసం .ఒక్క డైలాగు కూడా లేకుండా సన్నీ వేశాన్ని రక్తి కట్టిస్తే ఆడి ఉత్తమ ‘’స్క్రీన్ ప్లే‘’అవుతుంది అన్నాడు .మొత్తం మీద స్క్రీన్ ప్లే కి ప్లే చేయ వలసింది చాలా ఉందిఅని అభిప్రాయ పడ్డాడు . .ఇతర బాషా చిత్రాలలో స్క్రీన్ ప్లే రచయితలే ఉంటారు కాని డైలాగ్ రచయితలుండరు అని చెప్పాడు .ఏం చెప్పినా నిష్కర్ష గా కర్కశం గా చెబుతాడు .అందుకే అతనంటే నాకు’’ ఇది ‘’.
ఎప్పుడో అంటే 1995లో అతని ‘’రోమన్ హాలిడే ‘’కధా సంపుటి చదివాను .రెండు మూడు సార్లు ఏకాగ్రత తొ చదివాను .అందులో అతడు కదలని చాలా గొప్ప గా చెప్పాడని పించింది .దాన్ని బయటికి లాగి, జనానికి తెలియ జేయాలని పించింది ఆనాడే .కాని చేయ లేక పోయాను .అయితే రాయాలనే కాంక్ష బలీయం గా నాలో ఉంది.ఎన్నో ఇతర పుస్తకాలు చాలా చదివినా ఒక మూల ఆ కధలు మనసు పొరల్లో దాగే ఉన్నాయి .ఆ రెండేళ్లలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలూ చదివాను .ఆ పోకడ లో వ్యాసాలూ రాశాను .వేదిక ల పై మ్ట్లాడాను కూడా .సాహితీ పరం గా చాలానే చదివాను .,వ్రాశాను .,ప్రసంగించాను .మధురాంతకం రాజా రం గారంటే నాకు వల్ల మాలిన అభిమానం .ఆయన కధా విశ్లేషణ చేసి మాట్లాడాను .అయినా గొల్ల పూడికి అన్యాయం చేస్తున్నానేమో అనే భావం మనసు లో గూడు కట్టుకు పోయింది .అందుకని మళ్ళీ ఒక సారి ఆ కధలు చదివాను .ప్రతి కధను ఆకలింపు చేసుకోవ టానికి ప్రయత్నించాను .గొల్ల పూడి లోనీ కధా రచయిత ను ఆవిష్క రించాలనే నిశ్చయానికి వచ్చాను .ఆ కార్య క్రమానికి శ్రీకారం చుట్టి ఎనిమిది రోజులు రాశాను .న్యాయం చేయగలనని నమ్మకం కలిగింది .ఆ కధ లన్నీ వివిధ పత్రిక లలో ప్రచురింప బడినవే .అయితే ఈకాలం వారికి వాటి సొగసు తెలియ జేయాలని తీవ్రం గా తపించాను .ఇందులోని ప్రతి కధా ప్రత్యేకత సంత రించు కొన్నదే .ప్రతి కధ లో మారుతీ రావు లోనీ ప్రఖ్యాత కధకుడు కన్పిస్తాడు .రచనలో అద్భుత మైన లోక పరిశీలన ఉంది.చెప్పేది సూటిగా గుండెకు తాకెట్లు చెప్ప గల నేర్పున్న కధకుడు మారుతీ రావు..యాభై రెండు పేజీలలో ఈ కధా కదన విశ్లేషణ చేశాను .ఆది నా దగ్గరే నిక్షేపం గా ఇంత కాలం ఉంది .
రెండేళ్ళ క్రితం అంటే 2010 లో మా రెండో కోడలు అంటే మా శర్మ భార్య శ్రీమతి ఇందిర చిన్న తాత గారు శ్రీ నోరి రామకృష్ణయ్య గారు ఏదో సందర్భం లో ఫోన్ లో మాట్లాడుతూ మారుతీ రావు తమ ఇంటికి దగ్గరే చెన్నై లో ఉంటున్నారని రోజు తామిద్దరం మార్నింగ్ వాక్ లో కలుస్తూ ఉంటామని చెప్పారు .అప్పుడు నాకు నేను రాసినది మారుతీ రావు కు పంపితే ఎలా ఉంటుంది /?అని పించింది .దాన్ని ఫోటోస్టాట్ తీసి రామ క్రిష్నయ్య గారికి కొరియర్ చేస్తూ అందులో ఇది చదివి తమకు బాగుంది అని పిస్తే మారుతీ రావు గారికి ఇవ్వమని ,నచ్చక పోతే తమ వద్దే చెత్త బుట్టలో వేసేసుకోమని రాశాను .ఆయనకు అంది చదివి నాకు వెంటనే ఫోన్ చేశారు .చాలా బాగుందని మారుతీ రావు గారికి అందజేశానని ,ఆయన చదివి ఫోన్ స్వయం గా చేస్తారని చెప్పారు .ఆనందించాను ..ఆది మరువక ముందే ఒక రోజు ఉదయం మారుతీ రావు ఫోన్ చేసి నాతో మాట్లాడారు .నేనిది ఊహించలేదు .చాలా బాగా ఉందని చెప్పి, నా వివరాలు అడిగి తెలుసుకొన్నారు .నా భార్య ప్రభావతి నా ప్రక్కనే ఉన్నారా అని అడిగి ఆమె తొ మాట్లాడుతానంటే ఫోన్ ఆమె కు ఇచ్చాను /’’.అమ్మా ‘’అని సంబోధించి కుటుంబ నేపధ్యం, పిల్లల వివరాలు అన్నీ అడిగి తెలుసుకొని సంతోషించారు .తన సెల్ నంబర్ అదే నని అప్పుడప్పుడు మాట్లాడు కుందామని అన్నారు .ఆమె తనకు మారుతీ రావు నటన, సంభాషణా శైలి చాలా ఇష్టం అని చెప్పింది .ఇదీ ఫోన్ పరిచయం .నేనెప్పుడు చొరవ తీసుకొని ఫోన్ చేయలేదు ఆయనా అంతే .
కృష్ణా జిల్లా రచయితల సంఘం రెండవ ప్రపంచ రచయితల సభలు విజయ వాడలో నిర్వ హించి నపుడు మారుతీ రావు గారు వచ్చి మాట్లాడారు .నేను ఆయన ప్రక్కనే కూర్చుండి నా పేరు చెప్పాను .’’అలానా ‘’అని అన్నారు కాని ప్రాధాన్యత ఆమాటలో కని పించలేదు ..విజయ వాడ ఆకాశ వాణిసంచాలకులు ఆ మూడు రోజుల కార్య క్రమాలను నన్ను సమీక్ష గా రాయ మణి చెప్పి దానిని రేడియో లో నాతోనే చది వించారు .దాన్ని పూర్తీ వ్యాసాలుగా రాసి శ్రీ రామ క్రిష్నయ్య గారి కోరిక పై పంపాను .ఆయన చదివి మారుతీ రావు గారికి అందించారట .దాన్ని చదివి మారుతీ రావు ఒక మెయిల్ రాశారు .అందులో తన ప్రసంగం ను సి.డి.ని పంపమని కోరారు .దురదృష్ట వశాత్తు ఆయన మాట్లాడి నప్పుడు నా వాయిస్ రికార్డర్ చార్జి అయి పోయి రికార్డు కాలేదు మిగిలిన వన్నీ రికార్డయ్యాయి ఆ సంగతి వారికి తెలియ జేశాను మెయిల్.లో .
ఇప్పుడు సాహితీ బంధువుఅల కోసం ‘’గొల్ల పూడి కధా మారుతం ‘’మొదలు పెట్టి మొదటి రెండు ఎపి సోడులులు మారుతీ రావు గారికి మెయిల్ చేశాను .వెంటనే ఆయన ఆంగ్లంలో ‘’thanks for your clinical analysis ‘’అని రాశారు .మళ్ళీ రెండు ఎపిసోడ్లను పంపాను .దానికి ఆయన బదులుగా మెయిల్ రాస్తూ ‘’very interesting .please continue .after finishing your reviews please make a c.d of it and send it to me as I am not well versed in telugu coputer knowledge అని రాశారు .ఇదీ గొల్ల పూడి తొ నాకున్న పరిచయం .అదే మీకు తెలియ జేశాను .స్వస్తి
సంపూర్ణం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –22-12-12- ఉయ్యూరు
మిధునం పై మధనం
సాహితీ బంధువులకు నమస్సులు .తెలుగు కదానికలలో మణి పూస అని పించుకొన్న శ్రీ శ్రీ రమణ కధ ”మిధునం ”అని అందరు ఏకీ భావిస్తారు .ఆ కధ చలన చిత్రం గా రూపు దాల్చింది .ప్రయోగాలకు నిలయమైన భరణి దర్శకత్వం వహించి ,నిర్మాత సాహసం తొ పెట్టు బడి పెట్టిన డబ్బు తొ తీసిన సినిమా ఇది .పత్రికలలో మంచి ప్రకటనల తొ ”మన అమ్మా నాన్నల కధ ” అన్నటాగ్ తొ వచ్చింది .నాకు శ్రీ మధు సూదన రావు గారు A.B.N ఆంద్ర జ్యోతి వారి ఇంటర్వ్యు ను పంపారు (క్రింద లింక్ క్లిక్ చెయ్యండి ) .చూశాను .దానిలో ప్రేక్షకులు సినిమా చూసి కన్నీరు కారుస్తూ బయటికి వచ్చారు అని బాలు అంటే ,”దర్శకుడి నైన నేను నిర్మాత కూడా కన్నీళ్ళ తొ నేబయటికివచ్చాం ”అని ముక్తా ఇంపు నిచ్చాడు భరణి .అంటే సినిమా నిర్మాతకు నష్టాన్ని దర్శకుడికి నిరాశను మిగిల్చింది అని తెలిసింది .ఇరవై మంది మిత్రుల తొ తాము సినిమా ని చూశామని కధ చదివిన వారికి నిరాశే కలిగిసిన్చిందని ,చదవ కుండా చూసిన వారికి నచ్చ వచ్చు అని అన్నారుమధు సూదన రావు గారు . .కధలో చాలా మార్పులు చేశారని దానితో చాలా నిరుత్సాహ పడ్డామని రాశారు .అంతే కాక ”two long hours ”అనే మాట ను వారు వాడారు .అంటే కొంత బోర్ కొట్టిందని తెలుస్తోంది .నేను ఇవాళ ఆంద్ర జ్యోతి చానెల్ లో ఇంటర్ వ్యూ చూశా నని ముందే చెప్పాను కదా.అందులో కొన్ని సీన్లు చూపించారు .దాన్ని బట్టి నాకు అర్ధం అయింది ఏమి టంటే అందులో మిధునం గా ఉన్న బాలు ,లక్ష్మి ల ను చూస్తె బాలు కంటే లక్ష్మి ఆ పాత్రకు మాత్రం వెయ్యి రెట్ల న్యాయం చేసిందని పించింది .అచ్చ తెలుగు వృద్ధ మహిళ అని పించింది జేజేలు కొట్టిన్చుకోనేట్లు ఉందని పించింది .కాని బాలు మాత్రం ”తమిళ ముసలాయన” అని పించాడని అనుకొన్నాను .కళ్ళల్లో భావాలు బాగా అతి అని పించించాయి . .ఆ పాత్ర కు న్యాయం లేశమైనా చేశాడా అని అనిపించింది .ఇవి కొన్ని సీన్లుమాత్రమె చూస్తె కలిగిన భావన.జేసు దాసు పాటలు చాలా అర్ధ వంతం గా ఉన్నాయని తోచింది పాడే విధానం, రచనా కూడా .భరణి విషయం లో అసలు సందేహించాల్సిన అవసరం ఉండదు .ఎందుకంటె అతను గొప్ప వ్యూహం తో ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టు కొని తీసే చాలెంజి దర్శకుడు .శ్రీ రమణ కధకు భరణి చాలా సరైన దర్శకుడు అని అభి ప్రాయం .ముసలాయన పాత్రకు” మిశ్రో ”అయితే అద్భుతం గా ఉండేదని నా భావన . సాత్వికత జీవం పోసుకో వాల్సిన పాత్ర .మాట మెత్తన చూపు గొప్పదనం ఉండాలి .అవి లేవేమో నని నేను అనుకొంటున్నాను .మా ఉయ్యూరు దియేటర్ కు ఆ సినిమా వచ్చి ఆడే అవకాశాలు ఉన్నాయో లేవో తెలీదు కనుక ఇప్పటికే ఆ మిధునం చూసిన వారు ఇదే వేదిక గా స్పందించండి ..తెలుగు సభల లో చలన చిత్రాల ప్రదర్శన మిధునం సినిమా తో ప్రారంభం అవుతోందని భరణి చెప్పాడు .చాలా ఆనందించ దగిన ,అభి నందించ దగిన విషయం . .తెలుగు వారు గర్వించ దగిన విషయం కూడా .కనుక సాహితీ బంధువులు ”మిధునం పై మధనం ”లో మీ పాత్రను నిర్వహించి మరింత వెలుగు ను మిధునం పై ప్రసరింప జేయ వలసినది గా ప్రార్ధన .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-12-12-ఉయ్యూరు
From: Madhusudana Rao Devineni <mdevineni@gmail.com>
Date: Sat, Dec 22, 2012 at 6:43 AM
Subject: SP Balu & Thanikella Bharani On MidhunamThanks Ramakoteswara Rao Garu for Forwarding ABN interview with SP Balu and Tanikella Bharani.Last night we went to Movie with 20 people together, all are in their 60s and above. Dr Chowdary and his wife Aruna was also there with us. Most of the audiences are senior citizens and they all enjoyed like all young like the first day movie of their favorite young Hero. It is great experience.
Date: Sat, Dec 22, 2012 at 6:43 AM
Subject: SP Balu & Thanikella Bharani On MidhunamThanks Ramakoteswara Rao Garu for Forwarding ABN interview with SP Balu and Tanikella Bharani.Last night we went to Movie with 20 people together, all are in their 60s and above. Dr Chowdary and his wife Aruna was also there with us. Most of the audiences are senior citizens and they all enjoyed like all young like the first day movie of their favorite young Hero. It is great experience.
Though lot of changes are made from the original story, which you might have read, but main theme of the movie about the relations of the couple is maintained. If we compare with original story, we get disappointed. People seeing this Movie without reading the original story they may lime it. Though it is two long hours, it is all fun and emotional.
I hope you will have the opportunity of seeing this movie in Chicago.
Kind Regards
Madhusudana Rao
Sent from my iPad
On Dec 22, 2012, at 3:49 AM, Ramakoteswara Rao Katragadda <ramkraok@hotmail.com> wrote:
> http://www.youtube.com/watch?list=UU_2irx_BQR7RsBKmUV9fePQ&feature=endscreen&v=IpsPHP5MxfU&NR=1
కాశీ ఖండం -35 దివోదాసు కైవల్య ప్రాప్తి
కాశీ ఖండం -35
దివోదాసు కైవల్య ప్రాప్తి
పుణ్య కీర్తి ,వినయ కీర్తి ,విజ్ఞాన కౌముదులు కాశీ చేరి పంచ నదీ తీర్ధం లో స్నానం విశ్వనాధ దర్శనం చేశారు .వీరి రాక తొ గంగ పులకించింది .ఆకాశ గంగ కన్నా కాశీ గంగ గొప్పది అనుకొన్నారు వాళ్ళు .ఇంతలో అగ్ని బిందు అనే మహా ముని సాక్షాత్తుత్తు శ్రీ మహావిష్ణువే పుణ్య కీర్తి అని గుర్తించి సాగిల పడి నమస్కరించాడు . విష్ణువు సంతోషించి వరం కోరుకో మంటే ఈ పంచ నది క్షేత్రం లో వెలిసి ఉండమని కోరాడు .సరే నన్నాడు .విష్ణువు కాశీ మహాత్మ్యాన్ని మహర్షికి వివ రిస్తూ ‘’ప్రళయేనపి నాశోస్యః –శివ శూలాగ్ర సుస్తితే ‘’అంటే ప్రళయ కాలం లో అన్నీ నశించినా ,కాసి శివుని శూలాగ్రం పై నిలిచి ఉంటుంది .’’అని చెప్పి తాను బిందు మాధవుని గా పంచ నదీ తీర్ధం లో వెలిశాడు .త్రేతాయుగం లో అనంత మాధవుడిగా ,ద్వాపరం లో శ్రీ మాధవుడిగా ,కలియుగం లో బిందు మాధవుడిగా ఇక్కడ ఉన్నాడు .
దివో దాసు గంగ పశ్చిమ తీరం లో ఆలయం నిర్మించి ‘’దివోదాసేశ్వర లింగం ‘’ను ప్రతిష్టించి శివుడిని అర్చించాడు భార్యా సమేతం గా .పుణ్య కీర్తి చెప్పిన ఏడు రోజుల గడువు పూర్తవుతోంది .శివుని ‘’వందే శంభు ముమా పతిం సుర గురుం వందే జగాత్కారణం
వందే పన్నగ భూషణం ,మ్రుగధరం ,వందే పశూనాం పతిం –వందే సూర్య శశాంక వహ్ని నయనం ,వందే ముకుంద ప్రియం –వందే భక్త జనాశ్రయం చ వరదం ,వందే శివం శంకరం ‘’అని స్తోత్రం చేశాడు .అకార ,ఉకార ,మకార ,నాద ,బిందు అనే అయి దింటి కలయిక అయిన ఓంకార స్వరూపుడా ,అ కారం పురుష వాచకం ,ఉకార ,మకారములు ప్రకృతి స్వరూపమైన స్త్రీ వాచకం అయిన ఉమ గా ,అర్ధ నారీశ్వరుడ వైన శివా అని స్తుతించాడు .’’లీయతే గమ్యతే యాత్ర తల్లిన్గమితి గీయతే ‘’అంటే లీనం ,గమ్యం ఈ రెండు శక్తులను స్వంతం చేసుకొన్న మీ నిర్గుణత్వానికి ప్రతీక లింగం మైన వాడా ,తక్షక ,వాసుకి అనే సర్పాలను ఆభరణం గా ధరించి,వారి వల్ల జానికి భయం లేకుండా చేసిన వాడా జింకను చేతిలో చిక్కిన్చుకొన్న స్వామీ నీ మహిమ వర్ణించ గలమా ?/
ఒక సారి మీ సంకల్పం తొ మీ నుండి జన్మించి పంచముఖుడై ,అసత్య వాది యై ఒక శిరస్సును పోగొట్టుకొని చతుర్ముఖ బ్రహ్మ అయినా మళ్ళీ అజ్ఞానం లో చిక్కుకొని ,తన సంకల్పం తొ మహా సౌందర్య రాశిని సృష్టించి ఆమె అందానికి తానే ముగ్ధుడై వెంట పడితే ఆమె పారి పోతు లేడి పిల్ల గా మారి తానూ లేడి గా మారి తరుము తాడు .తనకు దిక్కెవ్వరు అని ఆ లేడి పిల్ల క్క్షోభ పడితే నీవు ఆ మగలేడిని చేతి తొ పట్టుకొని ఆమెను కాపాడి నీ చేతుల్లో, జిన్కగా ఉన్న బ్రహ్మను పట్టుకొని గిల గిల లాడేట్టు చేస్తే దాసోహం అని బ్రహ్మ అంటే,కనికరించి ఆ చేతిలోని లేడి రూపం తోనే సదా భక్తులకు సాక్షాత్కరించ మని వేడుకొంటే అలానే కని పిస్తున్న మృగ పాణీ నీ లీలలు ఎన్ని అని పొగడ గలను ?
నువ్వు పశు పతివి .అంటే పశువులకు పతివి అనికాదు అర్ధం ‘’ఏతా వంతో వై పశవః ద్విపద శ్చతుష్పదః‘’అంటే సృష్టి లోనీ ప్రతి ప్రాణీ పశువే .వీటన్నిటికి నువ్వు నాదుడివి అని అర్ధం .భూమి ,నీరు ,అగ్ని ,జలం ,ఆకాశం గాలి అనే పంచ భూతాల ను కల్పించి రక రకాల ప్రాణులలో ఇమిడ్చి ఆ ప్రాణాలకు అన్గాలుగా ఈ పంచ భూతాలనే శక్తులు గా మార్చి పాంచ భౌతిక శరీరాన్ని ఏర్పరచి వీటికి కర్త గా ఉన్న పంచ ముఖేశ్వరా !సూర్య చంద్రులు కాలాన్ని శాసించి పగలు రాత్రులను పంచుకొని వెలుగుతున్నారు .నువ్వ్వు మహా కాలుడి గా మారి వారిని శాసిస్తున్నావు .నీ నేత్రాలు సూర్య ,చంద్ర శక్తికి ఆధారం .దయామయుడిగా నీ రెండు కళ్ళ తొ అమృత వర్షాన్ని కురిపిస్తూ ,మితి మీరినపుడు నీ నుదుట ఉన్న అగ్ని నేత్రమైన మూడవ కన్ను తెరిచి దుష్ట శిక్షణ చేస్తావు .అని దివోదాసు కీర్తించాడు .
దివోదాసు భార్య లీలా వతి ‘’శాంతం ,పద్మా సనస్తం ,శశిధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం
శూలం ,వజ్రం చ ,ఖడ్గం ,పరశు ,మభయదం ,దక్ష భాగే వహంతం
నాగం ,పాశం చ ఘంటం ,ప్రళయ హుత వహం ,సామ్కుశం ,వామ భాగే
నానాలంకార యుక్తం ,స్పటిక మణి నిభం ,పార్వతీశం నమామి ‘’అని స్తోత్రం చేసింది .వేద వేద్యుడివి .సద్యోజాత ,వామ దేవ ,అఘోర ,తత్పురుష ,ఈశాన అనే పేర్ల తొ పంచముఖుడు గా ప్రసిద్ధుడవు .శూలం ,వజ్రాయుధం ,కరవాలం ,గండ్ర గొడ్డలి నాగం ,పాశం ,ఘంటా ,ప్రళయాగ్ని అమ్కుశాలను చేతులతో ధరించి ,అభయ హస్తం తొ నిన్ను నమ్మిన వారికీ భయమేమీ లేదని తెలియ జెప్పుతూ దాక్షాయిణీ విరహ వేదనను మనస్సు లోనే అణచుకొని హిమాలయాలలో పద్మాసనం వేసుకొని నీలో నువ్వే రమిచే పరమేశా నమో నమః
‘’ప్రాతః కాళే శివం దృష్ట్యా –నిశి పాపం వినశ్యతి –ఆ జన్మ కృత మధ్యాహ్నే –సాయాహ్నే సప్త జన్మ సు –మెరొహ్ కాం చన దత్తానాం –గవాం కోటి శతైరపి –పంచ కోటి తురంగానాం –తత్ఫలం శివ దర్శనం ‘’అని నుతించింది
ఇద్దరు కలిసి ‘’ఆత్మాత్వం .గిరిజా మథిహ్ సహచరః ప్రాణాహ్ ,శరీరం గృహం
పూజాతే విషయోప భోగ రచనా ,నిద్రా సమాధిస్తిథిహ్
సంచారః పదయొహ్ ప్రదక్షిణ విధిహ్ స్తోత్రాని సర్వా గిరాః
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో శివా రాధానం ‘’
‘’కర చరణ కృతం వా ,కర్మ వాకక్కాయజం వా –శ్రవణ నయనజం వా ,మానసం వా పరాధం
విహిత మహితం వా ,సర్వ మేతత్ క్షమస్వ –శివ ! శివ !కరుణాబ్దే ! శ్రీ మహాదేవ ! శంభో !’’
‘’కాయేన ,వాచా, మనసేంద్రియైర్వా ,బుద్ధ్యాత్మ నావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ శకలం పరస్మై –నమః శివాయేతి సమర్ప యామి ‘’
అని ఆర్తిగా అర్చించారు .తాము చేసిన వన్నీ శివుని పాదాల ముందు ధార పోశారు .ఆ భక్తీపార వశ్యం లో ప్రాణాలను వదిలారు .రెండు దివ్య జ్యోతులు వారి శరీరాల నుండి వెలువడి లింగ రూపం గా విరాజిల్లే దివోదాశేశ్వర లింగ భవ్య కాంతి లో లీనంయ్యాయి .
ముప్పది మూడు కోట్ల దేవతలు మహా నంద భరితులయారు .అప్పుడు పార్వతీ సహిత పర మేశ్వరుడు కాశి లో ప్రత్యక్ష మై నాడు .దివోదాస దంపతులకు జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించారు .దేవత లందరికి విముక్తి ప్రసాదించారు .దుండి వినాయకుడు తండ్రికోరిక పై ప్రత్యక్ష మయాడు .తమ కుమారుడు గణేశ్వరుని వల్ల కాశి లో ఒక మహాద్భుతం జరిగిందని తాము కాశి లో స్తిర నివాసమేర్పరచుకోవటానికి తగిన వాతా వరణాన్ని వినాయకుడు కల్పించి నందుకు అభి నందించారు .మణికర్ణికా, డుంది వినాయక విశ్వేశ్వర దర్శనం తొ జనులు చరితార్దులవుతారని అభయ మిచ్చారు .కాశీ లోనీ సర్వ తీర్ధాలు ముక్తినిస్తాయని వరదానం చేశారు .
సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –22-12-12-ఉయ్యూరు
గొల్ల పూడి కధా మారుతం -23 చివరి ( 11)కధ –నేను
గొల్ల పూడి కధా మారుతం -23
చివరి ( 11)కధ –నేను
పెద్ద మేడ ముందు వీళ్ళ కుటుంబం .మేడ లోనీ కుటుంబం వీళ్ళకు ఆశ్రయం ,ఆధారం .నిజం చెప్పా లంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించుకొనే ఆ మేడ కుటుంబం ఉంది ‘’ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ ‘’అంటే బాగుంటుంది .తర తరాల స్నేహం అది .తరగనిది గని లాంటిది .మేడ వారింట్లో ప్రతి పండక్కీ వీల్లకూ పండగే .వీరి ఆనందమే మేడ కుటుంబం వారి ఆనందం .యే పండగ వచ్చినా వాళ్ళూ వీళ్ళూ కలిసి మెలిసి ఉంటారు .అన్ని తరాల్లోను ఆ సఖ్యత రెండు కుటుంబాలు పాటించాయి .ఆ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు ,బదిలీలు చదువు సంధ్యలు అన్నీ వీళ్ళ ఎదుట మాట్లాదాల్సిందే .అంత చల్లని మనసు వీళ్ళది .మేడ ఇంటి వారి పెద్దబ్బాయి పెళ్ళిజరిగి కుందనపు బొమ్మ లాంటి పిల్ల కోడలుగా ఇక్కడికి వచ్చింది ఉగాదినాడే దిగారు కొత్త దంపతులు .వీళ్ళ అమ్మ అన్నీ చూడ మంటుంది ఏదీ చెప్పదు .తెలుసుకోవటమే తమ పని అంటుంది .ఏదైనా ఆడిగితే అన్నిటికీ ముభావమే .ఇవ్వడమే కాని పుచ్చుకోడం తెలీని కుటుంబం వీళ్ళది .తల్లి ఔన్నత్యమే పిల్లల్ని అంత వాళ్ళను చేసింది .
వేసవిలో సందడే సందడి .రెండిళ్ళకు హడావిడే .మేడ కుటుమ్బం పిల్లలు .ఈ పిల్లలపై ఓ కన్నేసి ఉంటారేప్పుడూ .వీళ్ళు చిరు నవ్వుతో ఆహ్వానిస్తారు .ఇంటిల్లి పాదికి తియ్యని మామిడి పళ్ళు ఇస్తుంది వీళ్ళమ్మ .అప్పుడామే ముఖం లో ఎంతో గర్వం తొంగి చూస్తుంది .ఈ ఉగాదికి ఆ మేడ కుటుంబం వాళ్ళ పిల్ల లంతా ఓ ఇంటి వారయ్యారు .వీళ్ళమ్మకు ఆనంద పారవశ్యం కలిగింది .ఆ ఆప్యాయతా అను భూతి ఎక్కడివా అని ఆశ్చర్య పోయింది ఈమె కూడా పెద్ద దైపోయింది .ఆ ఇంట్లోకి వెళ్లాలని ఉబలాటం వాళ్ళు పిలిస్తేనే లోపలి వెళ్లాలని తల్లి హిత బోధ .ఆ ఇంటి అమ్మగారు ఆప్యాయం గా ఈపిల్లను లోనికి తీసికెళ్ళి అలంకరించింది .ఆ ఇంట్లో ఈమె కూడా ఒకటైంది .ఆ ఇంటి వైభోగం కళ్ళారా చూసింది సాయంకాలానికి సోమ్మసిల్లింది ఆ ఉత్సాహం లో ఎండకి ఒడిలి పోయింది అమ్మ వెన్ను తట్టింది .తమ కక్కడ స్తానం కల్పించిన వారికి అలా చేయటం తమ ధర్మ మన్నది .ఇవ్వగలగడమే తమ శక్తి అని తమకు బాధ్యతలే ఉంటాయని తెలియ జెప్పింది .ఇవ్వడం లో ఉన్న హాయి ,ఆనందం గోప్పవి అని హితవు చెప్పింది .ఆ మాటకు పిల్ల పులకించింది .ఆ మాతృత్వపు పరి పూర్నతకు ఉద్వేగం తొ చలించి పోయింది తాను చేసిన మంచి పని కి తృప్తి పొందింది పిల్ల .ఆ ముఖం లో వెలుగు చూసింది తల్లి .అమ్మ ఒడిలో ప్రతి ఫలం అశించ కుండా నిద్ర పోయింది .మేలు కొనే దృష్టీ, కోరికా లేవు.
ఇంతకీ ఈమె ఎవరు ?’’మామిడి కొమ్మ ‘’పరహితమే ఊపిరిగా పెంచిన ఆ పెద్ద ముత్తైదువ అంటే ఆ పూచిన మామిడి చెట్టే మా అమ్మ.ఆమె శరీరం లో అంతర్భాగమే ,ఆమె ఒడిలో అందం గా పెరిగి న మామిడి కొమ్మను అదే‘’నేను ‘’ .అని కధను ముగిస్తాడు మారుతీ రావు .ఇదంతా మామిడి కొమ్మ స్వగతం .అందం గా సస్పెన్సు తొ చిత్రించాడు .దాని ఆంతర్యాన్ని ,మాతృత్వపు మహిమను మనుషుల్లోనే కాకుండా మానుల్లో కూడా చూప గలగటం, ఆరి తేరిన రచయిత చేసే పని అదే గొల్ల పూడి చేసి ,చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడుమారుతీ రావు
ఈ విధం గా పదకొండు కధల్లో కధకుని మార్కు స్పష్టం గా కన బడుతుంది .వస్తువు ఏదైనా వినూత్నం గా చెప్పే విధానం గోచరిస్తుంది .ఆ భాషే వేరు .అదంతా జీవితాన్ని కాచి వడ బోసిన చిక్కని భాష .అందమైన పదాలతో’’ కోటబుల్ కోట్స్’’ .చెక్కటం అతనికే సరి .’’ఇజం ‘’మత్తు ఉండదు .నిజం మాత్రమే ఉంటుంది .అంతా ఆయన భావ జాలమే .ఆ పాత్ర లన్ని ఈ నేల మీద తిరుగుతూ మన మధ్య నివ సిం చే వే .ఈ గాలీ ఈ నీరు ఈ వెలుతురు పీల్చినవే .ఆకాశం లోంచి హఠాత్తుగా ఊడిపదినవికావు .యే పాత్రకాపాత్రే ప్రత్యేకత .ఓ నిండుదనం ,పరి పూర్ణత్వ ప్రతి పాత్ర లోను ఒక వెలుగు నింపటం గొల్ల పొడి ప్రత్యేకత .పాత్రల నిజాలను బాగా విశ్లేషించి చెప్పే నేర్పున్నవాడు .అవి సజీవం గా చైతన్యం తొ తిరిగేవే .ఈ మట్టి కున్న ప్రత్యేకతను సంత రించు కొన్న పాత్రలే అవి .యే విదేశీ దిగు మతికాదు .కాలం విసిరే సవాళ్ళను ఎదుర్కొని ఎదురు నిల్చేవి కొన్ని ,ఓటమి పాలైనా పిరికి తనం లేకుండా యే అఘాయిత్యం చేయకుండా ఎదిగే పాత్రలు కొన్ని .త్రీ డై మెన్షన్ ల లోను స్పుటంగా కన్పిస్తాయి ఈ పదకొండు కధలు మారుతీ రావు ‘’రోమన్ హాలిడే ‘’పేరిట వెలువరించాడు .
ముగింపు ఈ సారి
‘’ఇవాళే యుగాంతం అని భయ పడుతున్న వేళ మారుతీ రావు కధలే మనకు యే భయం లేకుండా అభయం ఇస్తాయి ‘’అని తెలియ జేస్తూ
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –21-12-12- –ఉయ్యూరు .
కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం
కాశీ ఖండం -34
పుణ్య కీర్తి అవతారం
‘’వామాన్గా ధ్రువ తొ విష్ణుహ్’’అనే ప్రమాణం వల్ల అర్ధ నారీశ్వర స్వరూప మానుడైన పరమాత్మ సగుణా నికి సాకారం లో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూప మైన శక్తి తత్వాన్ని మూర్తీభావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయ జేశాడు .ఆ శక్తి పరమేశ్వరానుగ్రహం తొ దుష్ట శిక్షణ చేసే విష్ణు రూపం అయింది అమృత మధనం లో ఆవిర్భవించిన సౌందర్య రాశి లక్ష్మిని వివాహం చేసుకొన్నాడు .ఆమె హిమాలయాల్లో పార్ధివ లింగ పూజా నియమాన్ని స్వీకరించి రోజు వెయ్యి మామిడి పళ్ళ తొ‘’వేద సార శివ సహస్ర నామా వల ‘’ని పఠిస్తూ శివార్పణం చేస్తోంది ఆమె తీవ్ర తపస్సులో తన రెండు స్తనాలను కత్తితో కోసుకొని శివ లింగం పై ఉంచి అర్చించింది ,దానితో ఆమె శరీరాకృతి ఇది వర కంటే ద్విగుణీకృత సౌందర్యం తొ విరాజిల్లింది .తన తపస్సు ఫలితాన్ని శివునికే అర్పించింది ఆ సంకల్ప జలం నాలుగు దిక్కులకు వెద జల్లింది .ఆ బిందువులు పడిన చోట్ల వృక్షాలు మొలిచాయి .
శివుడు సంతోషించి ‘’విష్ణు పత్నీ !నువ్వు ఇప్పటి నుండి ఐశ్వర్య శక్తికి దేవతవవుతావు .పూర్వం నీ భర్త విష్ణువు నన్ను కమలాల తొ అర్చించి చివరకు నీ లాగానే తన కళ్ళను పెకలించి పూజించి నాకు ప్రీతీ పాత్రుడయాడు అప్పుడు నేను అతనికి‘’చక్రం ‘’అనే అతి గొప్ప ఆయుధాన్ని ప్రదానం చేశాను .నీ సహస్ర ఫల పూజా ఫలితం గా వృక్ష సంతతి అభి వృద్ధి చెందింది .అంతే కాక నీ పూజా ఫలితం బిల్వ వృక్షం గా ప్రసిద్ధి పొందుతుంది .అది నాకు చాలా ప్రీతికరం . అభిషేకం, భస్మం తొ పాటు బిల్వ దళం కూడా ఇక నుంచి మాకు ప్రీతికరమవుతుంది .జగన్మాత యొక్క హిరణ్మయీ శక్తి ని నీలో నిక్షిప్తం చేస్తున్నాను .శ్రీ సూక్తం నీ పూజలో ముఖ్య భాగం అవుతుంది .దీని పఠనం విశేష ఫలప్రదం .బిల్వార్చన ,శివ పూ జల్లో శ్రీ సూక్త పఠనం అత్యంత కైవల్య దాయకం .యజ్ఞాలలో శ్రీ సూక్తం చెబుతూ బిల్వ దళాలను పంచాక్షరి మంత్ర యుతం గా సమర్పించే వారు ఆఖండడ ఐశ్వర్యం పొందుతారు .’’వ్రుక్షోజ బిల్వః తస్య ఫలాని తపసాను దంతి మయాతరసయాస్చ బాహ్యా అ లక్ష్మీహ్’’తన భార్య లక్ష్మీ దేవి శివుడిని మెప్పించి నందుకు విష్ణు మూర్తి పొంగి పోతాడు .
లక్ష్మీ నారాయనులిద్దరు ఆ తర్వాత కైలాసం చేరి శివుని ముందునిలబడి నమస్కరిస్తారు ‘’హరీ ! నా మాట ప్రకారం గణేశుడు కాశీ చేరి డుమ్ది రూపం పొంది అనుకున్న కార్యాన్ని దివ్యం గా నేర వేర్చాడు దివోదాసు మోక్ష ప్రాప్తికి సమయం దగ్గర పడింది .సకల దేవతా గణం తొ మీరందరూ వారణాసికి తరలి వెళ్ళండి .’’అని ఆదేశించాడు .శ్రీ దేవి జ్ఞాన బోధకు రాలిన తపశ్విని వేషం లో ‘’విజ్ఞాన కౌముది ‘’అనే పేరుతో అక్కడ అవతరించింది .గరుత్మంతుడు సాదు వేషం లో వినయ కీర్తి అనే శిష్యుడు అయాడు వీరి గురువు ధర్మా చార్యులు పుణ్య కీ ర్తి పేరుతో శ్రీ మహా విష్ణువు కాశీ చేరాడు . ఈ బృందం అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించింది .పద్దేనిమీదో రోజున పుణ్య కీ ర్తి దివోదాస చక్ర వర్తి దగ్గరకు చేర తాడు ఆయన అర్ఘ్య పాద్యాదుల తొ సత్కరించాడు స్వామితో చక్ర వర్తి తనకు ఆరోజు మహా పవిత్ర మైనదని అదే తగిన ముహూర్తం అని పూర్వం డుంధీ చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకొన్నాడు .స్వామితో తన మనసులోని మాటలు చెప్పుకొన్నాడు ‘’దైవీ శక్తిని కాదని నేను ఇంత వరకు స్వతంత్రించి పాలించాను స్వార్ధ రహిత ధర్మ శక్తి గొప్పది అని రుజువు చేయటానికే ఇంత పని చేశాను ఇక ఈ జీవితం పై విరక్తి కల్గింది వేరే మార్గామేమితో సెలవివ్వండి ‘’అని విన్న వించాడు .
అప్పుడు పుణ్య కీ ర్తి రూపం లో ఉన్న విష్ణువు ‘మా ఉపదేశాలకు తాగి నట్లే మీరు నడుచుకొన్నారు .మా దృష్టిలో నాలుగు దానాలు ముఖ్య మైనవి .అవి భయం తొ ఉన్న వారి భయం పో గొట్టి అభయ హస్తాన్ని చ్చి ఆదువటం మొదటిది .రెండోది –రోగం తొ బాధ పడే వారికి తగిన సమయం లో మందులు అందించి ఆదు కోవటం మూడవది విద్యార్ధులకు విద్య కు ఆటంకం కలుగ కుండా శక్తికొలది విద్య నేర్పించి సాయపడటం నాల్గవది ఆకలి తొ ఉన్న వారికి కడుపు నిండా అన్నాన్ని పెట్టించటం అన్ని ధర్మాలలో ‘’అహింసా పరమో ధర్మః ‘’అనేది ఉత్రుష్టమైనది .నా మాటలను జాగ్రత్త గా అర్ధం చేసుకొని వెంటనే ఆచరణ లో పెట్టండి .సృష్టిలో ఎవరి హద్దు వారికి ఉంటుంది .మీ ఆలోచన మీ అంత రాత్మ వరకు పరమ సత్యమే .కాని పరమాత్మ దృష్టిలో మీరు దోషులు .సృష్టి నియమాలకు అతీతం గా మీరు వ్యవహరించారు .అందుకే ‘’నేను ఎందుకిక్కడ ?నా కేమి పని ఉంది ?’’అని విశ్వేశ్వరుడు కాశీ వదిలి మందరాచలం వెళ్లి పోయాడు ఆయన లేని కాశి నిర్వీర్యమైంది .పరమాత్మ దృష్టిలో మీరు చేసింది మహా పరాధం .ఆ పాప శాంతికి ఒక ఉపాయం ఉంది అదే ‘’లింగ ప్రతిష్ట ‘ఒక లింగ ప్రతిష్ట తొ ప్రపంచ ప్రతిష్ట కలుగుతుంది .ఈ రోజు నుంచి మొదలు పెట్టి ఏడు రోజుల్లో ప్రతిష్ట పూర్తీ అవ్వాలి .ఇది శివాజ్న ‘’అని చెప్పి పుణ్య కీ ర్తి రూపం లోనీ విష్ణు మూర్తి అంతర్ధానమయ్యాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-12-12-ఉయ్యూరు
కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3 నిత్య శంకితులు
కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3
నిత్య శంకితులు
అన్నీ అను మానాలే నిత్య శంకితుడికి .అణు మానం పెను భూతం అని అన్నారు మన వాళ్ళు .ఏపని మొదలూ పెట్టడు ,పెట్టినా మధ్యలోనే ఆపేస్తాడు .అంగుళం ముందుకు కదలలేడు..వాడికి సందేహ నివృత్తి చేయటం కుక్క తోకను సవ రించటమే .ఎప్పటి కప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది కధ .కనుక వాణ్ణి దూరం చేసుకో వాలి .సందేహం రావటం దేహానికి సహజం .కాని ఆ సందేహం తన అస్తిత్వాన్నే దెబ్బ తీసేది అయితే ప్రగతి లేదు .గురువులో, తెలిసిన పెద్దలో అనుమానాలను తీరుస్తారు .అవి మటు మాయ మయ్యే ట్లుచేస్తారు . వాడు కూడా కొంత ముందడుగు వేయాలి .చరిత్రలో ఎంతో మంది ఇలా సందేహ నివృత్తి చేసుకొని గురు అనుగ్రహం తొ ముందుకు వెళ్ళిన వారే .ఒక మెట్టు అన్నా ఎక్కాలి .చతికిల పడితే ఎప్పుడు అదే స్తితి లోనే ఉంటాడు .
ఈ సందేహాలు పరమాత్మ ను తెలుసు కోవటం లో మరీ జటిలం గా ఉంటాయి పరమాత్మే సందేహం అయితే ఇంకా సందేహించేది ఎవరిని /అని ప్రశ్నిస్తారు వేదాంతులు .సందేహించే వాడే మన లోపల ఉన్నప్పుడు వాడిని సందేహించటం అసాధ్యం .కనుక సందేహించ గల శక్తి గా నిలిచినా వాడిని సందేహించటం కుదరదు అని గురు బోధ .ఇక్కడో తమాషా కధ చెబుతారు .ముల్లా నజీరుద్దీన్ చుట్టూ ఎప్పుడు భజన పరులు చేరి ఆయన్ను ఉబ్బెస్తూ వాళ్ళింట్లో చేరి భోజనాలు లాగిస్తుఉండే వారు .ఇలా ఒక సారి నలభై మంది చేరారు .వీళ్ళందర్నీ ఆ ‘’ఉబ్బు మైకం ‘’లో భోజనానికి రమ్మని ఇంటికి వెంట బెట్టు కెళ్ళాడు ..తీరా ఇంటికి వెళ్లి చూస్తె ఇల్లు ‘’అయ్య వారి నట్టిల్లు ‘’గా ఉంది .ఒక్క సరుకూ లేదు .ఉపాయం ఆలో చించి భార్య తొ తాను ఇంట్లో లేనని చెప్ప మన్నాడు .ఆమె అలానే చెప్పింది .తమ తొ పాటే లోపలి వచ్చాడని ఎక్కడికి పోతాడని వాళ్ళు ప్రశ్నిం చారు .అప్పుడు తెలివిగా నజీరుద్దీన్ లోపలి గుమ్మం తేర చాటు నుంచి తల బయటికి పెట్టి నజీరుద్దీన్ దొడ్డి దారి నుండి వెళ్లి పోయాడు .ఇక కనపడడు అని వాళ్ళతో చెప్పాడు .పాపం మోస గించటం కూడా తెలీని అమాయకుడు వాళ్ళ చేతికి దొరికి పోయాడు .
సందేహం ఒక విషం .లాగా మనం చేసే పనిని కబళించి ముందుకు అడుగు వెయ్య నివ్వదు .మరి అత్యంత శిఖర సమాన మై,ఉత్కృష్ట మై ధ్యానం విషయం లో సందేహం తొ ఏ పనీ చేయక పోతే అసలు ప్రగతి సాధ్యం కాదని స్వామి మధు సూదన సరస్వతి అంటారు .భౌతిక వాది పదార్ధాల అస్తిత్వాన్నే నమ్మ నప్పుడు పరమాత్మను అసలు నమ్మ లేడు .పదార్ధాన్ని తెలుసు కోవటం కష్టం పరమాత్మను తెలుసు కోవటం సులభం అంటారు స్వామి .పదార్ధం బయట ఉంటె ,పరమాత్మ లోపలే ఉంటాడు .పదార్ధం దూరం గా ఉంటుంది .పరమాత్మ దగ్గర గా ఉంటాడు .మనమే పరమాత్మ అయినప్పుడు పదార్ధం అనాత్మ లేక సంసారం అవుతుంది అంటారు సరస్వతీ స్వాములు .పరమాత్మ ఒక వస్తువు కాదు తెలుసు కోవా టానికి .ఆయన తెలుసు కో బడే పదార్ధంకూడా కాదు సందేహించే మనమే చైతన్య స్వరూపలం అయిన పరమాత్మ స్వరూపాలం అంటారు మధు సూదనులు .
నిత్య శంకితుడు ఒకడు ఇల్లు గడవక సైన్యం లో చేరాడట .కమాండర్ కుడి వైపుకు తిరగామాన్నా ,ఎడమ వైపుకు తిరగ మన్నా తిరక్క పోతే ఏం అని అలానే నిలబడి పోయే వాడట .ఇది గమనించిన ఇతడు డ్రిల్ కు పనికి రాడని భావించి, కమాండర్ అతడిని వంటింట్లో బటానీలు ఏరే కార్య క్రమం అప్పగించి చిన్నవి,పెద్దవి గింజల్ని వేరు చెయ్య మన్నాడు .కాసేపాగి వచ్చి చూస్తె వాడేమీ పని మొదలే పెట్టనే లేదట .ఎందుకు యేర లేక పోయావని అడిగితే చిన్న గింజలు ,పెద్ద గింజలు మాట చెప్పారు కాని మధ్య రకం గా ఉన్న గింజల సంగతి మీరు చెప్పలేదు కదా అందుకని నేను చూస్తూ కూర్చున్నానని చెప్పాడట . కనుక నిత్య శంకితుడు ఏమీ ముందడుగు వెయ్య లేడని చెప్పారు స్వామి .
మరో విషయం తొ మళ్ళీ కబుర్లు చెప్పు కొందాం .
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు
కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల
కాశీ ఖండం –33
ద్వితీయ భాగం –డుండివినాయక లీల
‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం
వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా –కాశీ వాస ఫలాప్తయే’’
‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం
నమామి భైరవం దేవం –దండ పాణిం తు మాధవం –గంగాం మలాప గంగా దివ్యాం,భవానీం మణి కర్ణికాం
త్రయ త్రింశత్కోటి దేవ పూజితం లింగ రూపిణం-విశ్వేశ్వరం శివం వందే ,గ్రంధ లేఖన సిద్ధయే
పద్దెనిమిదిపురాణాలలో పెద్దది స్కాంద పురాణం .యాభై ఖండాల తొ ఒక లక్ష శ్లోకాల తొ ఉన్న గ్రంధం . స్కందుడు చెప్పిన పురాణం కనుక స్కాంద పురాణం అయింది .కాశీ క్షేత్రాన్ని గురించి చెప్పిన భాగ మంతా ‘’కాశీ ఖండం ‘’అనే పేరు తొ ఉంది .కాశి అంటే ప్రకాశ సంబంధ మైన స్వయం ప్రకాశ మాన మైంది .నమ్మి తనను సేవించే వారికి ప్రకాశింప జేసేది అని భావం .దీనికే వారణాసి అని కూడా పేరుంది .గంగా నదికి ఉన్న అనేక ఘాట్ లలో వరుణా ఘాట్ నుండి అసీ ఘాట్ వరకు ఉనన్న అందులో అయిదు క్రోసులు వైశాల్యం ఉన్న ప్రాంతం మాత్రమె చాలా పూర్తీ మహిమ కలిగింది .అందుకే వారణాసి అనే పేరు సార్ధక మయింది .
దివోదాస చక్ర వర్తి ధర్మ పత్ని లీలా వతి తొ అత్యంత ధర్మ శక్తి తొ ,సమస్త దేవతలను పాదా క్రాన్తులను చేసుకొని ప్రపంచమంతా ఏక చ్చత్రాది పత్యం గా పాలిస్తున్నాడు .తనకు అత్యంత భక్తులైన ఆ దంపతులకు సాయుజ్యాన్ని, దేవతా గణానికి స్వేచ్చను ప్రసాదించే ఆలోచన తొ విశ్వనాధుడు డుమ్ది వినాయకుని సృష్టించి కాశి లో ప్రవేశ పెట్టాడు
‘’ఆదాయ శాసనం మూర్ది –గణాధీశోధ ధూర్జటీ –ప్రతస్థే త్వరితః కాశీం –స్తితిజ్ఞ్సః స్తితి హేతవే
మందరాచల శిఖరం పై ధ్యాన మగ్నుడైన సదాశివుణి సమస్త దేవతలు సేవిస్తున్నారు .వారితో పరమ శివుడు ‘’భూలోకం లో కైలాసం లాంటి నా నివాసం ఒకటి ఉంది .ఎవరి చేతా ప్రతిష్టింప బడ కుండా నా అంతట నేనే పరబ్రహ్మ స్వరూపమైన లింగరూపం గా అక్కడ వేలిశాను .ఆ లింగం లో శివ శక్తి జ్యొథిహ్ ప్రకాశరూపం లో ప్రక్షిప్త మై ఉంది .అత్యంత శక్తి వంత మైనజ్యోతిర్లింగం ఇది .దీనికి అయిదు క్రోసుల పరిసర ప్రాంతం అంతా పరమ పవిత్ర మైనది గా నేను వరం ఇస్తున్నాను .పాపపు చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఇచ్చి మోక్షమిచ్చే లింగం ఇది .సగుణ రూప సాకార పూజ కంటే నిర్గుణ రూప నిరాకార లింగ పూజే శ్రేష్టం .,నాకు ఇష్టం కూడా .సర్వం లింగమయం .అని అర్ధం చేసు కోవాలి .
‘’దివోదాస చక్ర వర్తి భక్తీ పాశం తొ భాగ వంతుడిని కట్టి పడేసి నవగ్రహ ,దిక్పాలశక్తిని ,తపశ్శక్తిని లొంగ దీసుకొని సర్వం తానే అయి వెలిగి పోతున్నాడు .కాశీ లో అందరు విశ్వనాదుడే స్వయం గా కాశీలో ఉండి అన్నీ చక్క బరచ కూడదా అని ఆలోచిస్తున్నారు ‘’అని చెప్పి తన దివ్య శక్తి తొ వినాయక సృష్టి చేసి ఆయన తొ ‘’నా బహిప్రాణం అయిన కాశీ చేరు అక్కడి పరిస్తితులను చక్క బెట్టు .’’అనగానే ఆయన శివాజ్న అంటూ కాశీకి వెళ్లి పోయాడు .
అద్భుత మైన కాంతి పుంజం తొ ఒంటి నిండా విభూతి రేఖలు ,సిందూరం రంగు పట్టు బట్ట ,ఎర్రటి శాలువా ,లావు శరీరం తొ పొట్టి వాడైనా గట్టి వాడే నని పించాడు వినాయకుడు తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని ఆకర్షించాడు .రాజ మర్యాదలు చేస్తున్నారు .కోరికలు తీర్చుకొంటున్నారు .జరిగిందీ జరుగుతున్నది జరుగ బోఏదీ అన్నీ ఖచ్చిథం గా చెప్పి అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు .మనుషులకు ఎలాంటి కలలోస్తాయో చెప్పటం, వారికొచ్చిన కల విశేషాలనను తెలియ జేయటం తొ అందరి ద్రుష్టి లోను పడ్డాడు రాజాస్తానికి కూడా ఈయమ్న మహిమలు చేరాయి .రాణి కోరిక పై రాజు దివోదాసు ఆయన్ను ఊరేగింపు గా ఆస్థానానికి గౌరవం గా రప్పిస్తాడు .వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాల, సకల శాస్త్రా పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు
ఒక ఏకాంత ప్రదేశం లో డుమ్దితొ చక్ర వర్తి ‘’మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా .ఏదైనా ఉంటె ఆజ్ఞా పిస్తే చేస్తాను ‘’అన్నాడు డుమ్ది ‘’మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు .మీ లాగా ఇంతకు ముందేవరు ధర్మ బద్ధం గా న్యాయ బద్ధం గా ,ప్రజాహితం గా పరిపాలన చేయలేదు .భవిష్యత్తు లో కూడా చేయ బోరు అన్ని శక్తులను లోబరచుకొని అన్నీ మీరే అయి పాలించారు .వచ్చే రోజులు మంచివి కావు .మీరు కొత్త దృష్టి తొ జీవించాలి .నేటికి పద్దెనిమిదో రోజు నమీ జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది .ఒక తేజో రాశి బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం కోరుతాడు .ఆయన చెప్పి నట్లు నడుచు కొండి .మీ జన్మ చరితార్ధ మయ్యే రోజు ఆ రోజే .అని చెప్పి డుమ్ది తన ఆశ్రమానికి వెళ్లి పోయాడు
సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు






















































































