వీక్షకులు
- 1,204,065 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచసూక్తాలు.7 వ భాగం.18.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం.33 వ భాగం 18.10.26
- రొమాంటిక్ ఉద్యమ హీరో లార్డ్ బైరన్ జీవిత చరిత్ర -2
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.32 వ భాగం.17.10.26
- మానవుని అన్వేషణ ఏకత్వం మరియు పరిపూర్ణత కోసం:(ప్రబుద్ధభారత్ జూన్ 2026)
- రొమాంటిక్ ఉద్యమ హీరో లార్డ్ బైరన్ జీవిత చరిత్ర -1
- విద్యకు సంబంధించిన శాశ్వత సూత్రాలు మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలు(ప్రబుద్ధ భారత మాగజైన్ జనవరి20 26 వ్యాసానికి నాఅనువాదం )
- అలంకార శాస్త్రవేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.5 వ భాగం.15.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం. విశ్వనాథ వేయిపడగలు.58 వ భాగం.15.10.26
- పంచ సూక్తా లు.4 వభాగం.15.10.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,583)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
కొల్లేరు -అవినీతి వ్యాసాలు
రవీంద్ర నాథ్ గారు నమస్తే పంపిన అవినీతి పై ఆర్టికల్ ,ఇవాల్టి జ్యోతి లోని కొల్లేరు వ్యాసం రెండు చదివాను .దొంగ ఎక్కడో వుండదు .మనమధ్యే వుంటాడు .వాడు మనలాగే దొంగ అని కేకలు పెట్టి తప్పించుకుంటాడు న.వ్యవస్థ భ్రస్టు పట్టింది కొత్త కాలు,కీలు పెట్టాల్సిందే overhaul చేసే పరిస్థితి రావాలి హజారే తో ఎవరో ఒకరిద్దరు అవినీతి పరులు కలిసి నంత మాత్రాన వారి మీదే మీడియా ద్రుష్టి పెట్టి అసలు సమస్యను ఆయన వ్యక్తిత్వాని మరిచింది .ఆ మాత కొస్తే గాంధి గారి స్వతంత్ర పోరాటం లో ఆయనా వెంట వున్న వాళ్ళందరూ సచ్చీలురేన ?బడా పారిశ్రామిక వేత్తలు లేరా ?అంతమాత్రాన ఉద్యమం నీళ్ళు కారిండా .లేని పోనీ వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం ,గంపల కొద్ది న్యూస్ కుమ్మరించటం మానియా అయింది ఇందు లోంచి బయట పడాలి కొనే ,అమ్మే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి రావాల్సిన tax అక్కడి కక్కడే వసూలు అవ్వాలి ఇది నాకు తెలిసినంత వరకు నేను మూడు సార్లు అమెరికా వెళ్లి చూసినా మేరకు అక్కడ తక్ష్ సూటిగా ప్రభుత్వానికి చేరుతుంది బిల్లు లేకుండా వస్తు విక్రయం జరగదు అందుకే తక్ష్ రూపం లో వాళ్ళు చాల లాభ పడుతున్నారు .మనకున్న చట్టాలన్నీ లోసుగులే చెయ్యి తడిపితే అంతా హుష్ కాకి .ప్రభుత్వానికి బొక్క అధికార్ల కు పక్క పండగ .దీనిపై స్పష్టమైన విధానం వుండాలి .ఎవరి డబ్బో దోచి వేరెవరికో పెట్టి సంఘ సేవ పేరు చెప్పి ,బడా బాబుళను ఆడుకొని ఎంగిలి మెతుకులు మిగిలిన వారికి విదిల్చి పోజు కొత్తటటం గత ఆరేడు ఏళ్ళుగా విచ్చల విడి అయింది .అదేమని ప్రస్నిన్చినవాడు ప్రగతి నిరోధకు దయ్యాడు ఆ భ్రమ ఇంకా వదల లేదు పార్టీలు అన్ని కుర్చుని చక్కని చర్చ చేసి దేశానికి ఏది హితం ,ఏది అహితం అని నిబంధనలు చేసుకొని ,స్వయం నియంత్రణ చేసుకోవాలి అరవైయేళ్ళు దాటి స్వాతంత్రం పొందినా మన విధానం ,జన విధానం అంటూ లేదు అమెరికా ను నెత్తికెత్తుకున్న వాళ్ళు,చైనా ,రష్యా లను మోస్తున్న వారు గానే మిగిలి పోయారు కాని మన కు ఏమి కావాలో ఆలోచి నిర్ణయాలు చేయ లేని అసమర్దుల మయాం స్వార్ధం నారా నరాల జీర్నించింది ముద్రలు వేయటం ఫాషిన్ అయింది
ఇక కొల్లేరు విషయానికి వస్తే అక్కడి కొంగలకు కాళ్ళు ,రెక్కలు వున్నాయో లేదో కాని ,అక్కడి భూములకు రెక్కలు వచ్చి యెగిరి పోతున్నాయి అక్కడ రాజ కీయమే .పర్యావరణ స్పృహ నశించింది ప్రకృతి తో మానవుడు సహ గమనం చేయాలి దాని భద్రతా తనదిగా భావించాలి లేక పొతే అదే మనల్ని కబలిస్తుందన్న సత్యాన్ని అందరు గ్రహించాలి ఇది మనకు సంబంధించింది కాదు అని మనమెవరమూ తప్పించుకోరాడు విషయాలు ప్రజలకు తెలియ జెప్పాలి వాళ్ళ కు అర్ధ మాయే రీతిలో అప్పుడు కొంత అయిన చలనం వస్తుంది ప్రభుత్వాని నడిపే వారి లో చిట్టా సుద్ధి లోపించటం,చెంచ గాళ్ళ ప్రయోజనాలు కాపాడటం తో సమసి ఇంత కాలం పెరిగి పెద్దదయింది స్పృహ వస్తున్నా సమయం లో ఏదో సంక్షోభం ,అలజడి .సమస్యను పక్క దారి పట్టిస్తున్నాయి నిజాయితీ లేని నాయకుల వల్ల జరుగు తున్న అనర్ధం ఇది
. అందర్నీ ఆలోచిమ్పజేస్తూ స్పృహ కలిగిస్తూ ,వివరాలు అందిస్తూ ,విశ్లేషిస్తూ మీరు రాస్తున్న aartcles సమాజ హితమైనవి .నిరంతరం రాయండి జన చైతన్యం తెండి
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
pun పసంద్
pun పసంద్౧–
01 – హైదరాబాద్ సాగరం లో ”యధా తధాగతుడు ”
02 -జన్మ భూమి లోనే” రాముని ఖైదు ”
03 -ఆది కవిత్వావిర్భావం ”వల్మీకం ”తోనే
04 – వేద”వ్యాసం ”లోనే వేదాంత’న్యాసం ‘
05 వోట్ల (ఔట్ల) బా (బాంబ్ )బులతోనే కట్ట కడప ఫలితం
06 – రాజ కీయ పులివిం (వెం) దుల ప్రహసనం లో జనార ణ్యం –
07 – క్రికెట్ లో కుడా మన వీరుల” షా –ర్జా””
08 -సిని స్టార్లకు అభీ డిల్లి దూర్ నహీ
09 -” చే ”నేతలతో చేనేత వెతలు
10 – naxalaitla క్రీడా ”వరం’ గల్లు మార్గం
11 – ధర” వరులపై ” మన్మోహనాస్త్రం .
12 -పులులకు” ప్రేమ దాసు ” ని పై భక్తీ
13 -హాస్యం వెర్రిలో ”జంధ్యాలు ” తెమ్పుకుంటున్న సినిమా లోకం
14 -మానవత లోనే రాణిస్తుంది నవత
15 -” వే” గుంట కవిత్వం లో” మో”’మెల్లా చిందులే
16 -వేయి పడగల క్రీడా వినోది ”విశ్వనాధుడే ” ”
17 – ”సం ”పన్నుల నేఁ చేస్తాయి పన్నులు ?అవి అనాధ ఆపన్నుల పాటి ”పిన్నులు ‘
18 -maarx జుట్టుకు ,అరవిందుని గడ్డానికి ముడి వేసే ”శేషేంద్ర ”జాలం
19 – సినీ వాలీ కి రోజు పెరుగుతున్న” రౌడీ ”భయం
20 -ఉగ్ర వాదుల బంధం లో రుమేనియా రాయ బారి ”రాడూ”
గబ్బిట దుర్గా ప్రసాద్
04 – 11 – 1991 న అప్పటి రాజకీయ సామాజిక సాహిత్య అంశాలపై స్పందించి రాసిన ,చేసిన సరదా ఫీట్లు
Posted in సమయం - సందర్భం
1 Comment
తిక్కన పద్య సౌరభం
తిక్కన పద్య సౌరభం
”శ్రీ యన గౌరి నా బరగు చెల్వకు జిత్తము పల్లవింప ,భ
ద్రాయిత మూర్తి యై ,హరిహరంబగు రూపము దాల్చి ,విష్ణు రూ
పాయ నమ్హస్సివాయయని పల్కెడు భక్త జనంబు ,వైదిక
ధ్యాయితకిచ్చ మచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ ”
ఇది కవి బ్రహ్మ తిక్కన గారి పద్యం మహా భారతం లోది .భారతం పూర్తి చేయటానికి సంకల్పించాడు తిక్కయజ్వ .అందుకే సకల బ్రహ్మ ప్రార్ధన చేసాడు .హరి ,హర మైన రూపము ,సగుణ బ్రహ్మం దానినే సకల బ్రహ్మం అంటారు .ఆంటే కలా సహిత బ్రహ్మం .కల ఆంటే మూల ప్రకృతి .,మాయ అని అర్ధం .ఆమెతో కూడిన బ్రహ్మం సకల బ్రహ్మం .ఆమెకు శ్రీ అని ,గౌరి అనీ పేర్లున్నాయి .ఆమె చిత్తం పల్లవించే టట్లు పరతత్వం హరి హర మైన రూపం దాల్చింది .ఆ రూపం భద్రాయిత మూర్తి .ఆంటే కళ్యాణ మూర్తి .,శృంగార మూర్తి అన్న మాట .సృష్టికి మూల మయిన ప్రకృతి పురుషుల దాంపత్యశృంగారం ఈ పద్యం లో కన్పించటం విశేషం .
నిర్గుణ బ్రహ్మ మనకు అందరానిది .మన కోర్కెలు తీర్చేది కూడా కాదు .అందుకే కోర్కెలు తీర్చే సగుణ బ్రహ్మను కవి భావించాడు .శ్రీ తో వున్న గౌరి హరి ,హర సకల బ్రహ్మను అందుకే ఆరాధించాడు .హరిగా భావిస్తే హరి యేనమః అని హరునిగా భావిస్తే హరాయనమః అని లోకం లో ధ్యానించటం సంప్రదాయం గా వున్నది .”విష్ణు రూపాయ నమ్హ శివాయ ”అని తాత్వికు లైన సాత్విక భక్తులు ధ్యానిస్తారు .ఇలా చేయటం” వైదిక ధ్యాయిత ”అంటారు .దీనివల్ల కోర్కెలు తీరతాయి .
తిక్కన ముఖ్యం గా శివ భక్తుడు .అందుకే విష్ణు రూపాయ నమ్హ శివాయ అన్న దానిలో చమత్కారం చూపించాడు .నమః శబ్దం మధ్యలో వుండటం వల్ల విష్ణురుపాయనమః ,అనీ ,నమ్హ శివాయ అనీ అన్వయం వస్తుంది .నమశ్శివాయ అన్నది శివ పంచాక్షరి మంత్రం ..విష్ణు రుపాయనమ్హ అనేది అస్తాక్షరీ మంత్రం కాదు ఇదీ కవి చమత్కారం .అసలు పర తత్త్వం శివుడే విష్ణు తత్త్వం ఆయన గుణం .అని చెప్పకుండా చెప్పాడు ఉభయ కవిమిత్రుడైన తిక్కన .ఆయన ”చిత్త నిత్యస్థిత శివుడు ”.అందుకే ఆయన నిత్యం జపించే పంచాక్షరి అలా అద్భుతం గా మార్పు చెందింది అని విశ్లేషించారు డాక్టర్ పాటి బండ్ల మాధవ రామ శర్మ .
శివ కేశవుల భేదం జగత్తుకు ప్రమాదం .అందుకే జగత్కల్యానానికి హరి హర రూపం అవసర మైంది .సర్వ దేవతలు సమానమే సర్వ ధర్మాలు సమానమే .అని ఆంద్ర జాతికి బోధించ టానికి ,సుస్థిర శాంతిని స్థాపించా టానికి ఆ హరి హరున్ని కళ్యాణ మూర్తి గా భావించి పంచమ వేదమయిన మహా భారతాన్ని తెలుగు చేయటానికి ప్రారంభం చేసాడు మహాక్ కవి ,సోమయాజి,కవి బ్రహ్మ,ఉభయ కవి మిత్రుడు అయిన తిక్కనామాత్యుడు .ప్రారంభం లోనే కవితా శిల్పం అత్యద్భుతం గా చూపి తన ప్రతిభా పాండిత్యాన్ని,వేదోపనిషత్తుల మర్మాన్ని ప్రదర్శించి మలచిన తొలి పద్య రాజం ఇది .అజరామరమై ఆంధ్రదేశ జనం నాలుకల మీద నిత్యం నాట్యం చేసి పరవశుల్ని చేస్తూ ,మూల రహస్యాన్ని తెలియ జేస్తోంది
తిక్కన మహా కవి తనను ””అమలోదాత్త మనీష మైననుభయ కావ్య ప్రౌధి పాటించు శిల్పమునన్ బారగుడాన్ కళావిదుడ” అని చెప్పు కున్నాడు .మనీష ఆంటే కవి రచనా శక్తి యొక్క గొప్పదనం అని పండితుల భావన . ప్రౌది(proudhi ) ఆంటే రసమయం సిద్ధింప జేసే నైపుణ్యం అని విబుధులు విశ్లేషించారు .ఈ రెండు కలిస్తే కావ్య శిల్పం అది తిక్కన లో పుష్కలం అందుకే ఆయనకు సలాం
గబ్బిట దుర్గా ప్రసాద్
ఇలా తెలుగు లో ఎన్నో పద్యాలు హృద్యం గా ,రసస్ఫోరకం గా వున్నాయి తవ్విన కొద్దీ టన్నుల కొద్దీ బంగారం లభిస్తుంది ఆ శేముషీ దురంధరులకు నమో వాకాలు .ఎందేరందరో విశ్లేషకులు అద్భుతమైన విశ్లేషణ చేసిఆవిష్కరణ చేసి మరుగున పడిన బంగారాన్నివెలికి తీసి అందించారు దాన్ని మన స్వంతం చేసు కునే ప్రయత్నం లో ఇదో భాగం .
Posted in సమయం - సందర్భం
1 Comment
పద్య విత్తనంలో దాగివున్న భావ వృక్షం
పద్య విత్తనంలో దాగివున్న భావ వృక్షం
”తన జనకుడగు స్థాణువు
జనని అపర్నాఖ్య ,డా ,విసాఖున్దనగా
దనరియు ,నభిమత ఫలముల
జనులకు ,దయ నొసగు చుండు షణ్ముఖు గొలుతున్ ”
విత్తనంబున మర్రి వ్రుక్షమ్ము దాగదా అన్నాడు జన కవి వేమన .అలాగే చిన్న కంద పద్యంఇది నన్నే చోడ మహారాజ కవి రచించిన కుమార సంభవం కావ్యం లోని పద్యం ఇది .ఆయన కన్నడ దేశ సరిహద్దులో వున్న ఒరయురుకు అధిపతి అయిన రాజు .1160 ప్రాంతపు వాడు .ఆయనకు తెన్కనాదిత్యుడు ,వివేక బ్రహ్మ బిరుదులున్నాయి . సుర్యవంస రాజు .గురువు జంగమ మల్లికార్జునుడు .ఈ కావ్యాన్ని గురువుకే అంకితం చేసాడు .ఇష్ట దేవతాస్తుతి ,కుకవి నిందా ,shashtyantaalu ఆశ్వాసం చివర పద్యాలు ,గద్యాలు మొట్ట మొదటగా ప్రవేశ పెట్టిన కవి .వరేన్యుడు ప్రబంధ రచనకు ఇవి మార్గం చూపటం వల్ల ప్రబంధ రచనకు మార్గ దర్శిఅయాడు .ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనవచ్చు .నవ రసాలు ,దశ కావ్య గుణాలు ,ashtaadasa వర్ణనలు ఈ కావ్యం లో వున్నాయి కాళిదాస మహాకవి రాసిన కుమార సంభవం కావ్యం ,వుద్భాటుని కుమార సంభవం ఆధారంగా రాసిన కావ్యమే నన్నే చోడుని కుమార సంభవం ఇష్టదేవతా స్తుతిలో మన్మధుడిని స్తుతి చేసిన మొదటి కవి తర్వాత కేతన దశకుమార చరిత్రలో చేసాడు .చిత్రబంధ కవిత్వం ,మొదటి సారిగా ప్రవేశ పెట్టిన వాడు .గజ ,ధను ,సంగీత ,చిత్రకళల్లో గొప్ప జ్ఞాని .తెలుగులో నన్నే చోడుని కుమార సంభవమే మొదటి ప్రబంధం ఒకరకంగా ప్రబంధ పరమేశ్వరుడు..జాను తెనుగు కవిత్వానికి ఆద్యుడు .మార్గ దేశి కవిత్వాలలో సవ్య సాచి .తిక్కన కవి పై నన్నే చోడుని ప్రభావం చాలా ఎక్కువ .పాల్కురికి సోమనాధుడు నాన్నే చోడుని అనుసరించాడు .చోదకవి రాజు కన్నడ ,తమిళ సాంప్రదాయాలను తెలుగు కవిత్వం లో ప్రవేశ పెట్టిన ఘనుడు .అన్నిటికి ఆద్యుడు నన్నే కవి
ఇప్పుడు అసలు పద్యం లో ప్రవేశించి స్వారస్యాన్ని జుర్రుకున్దాము ..ఇది కుమార స్వామిని వర్ణించే పద్యం .ఆయన్ను స్కందుడు అనీ అంటారు స్కంద కు వికృతి కంద .అందుకే కంద పద్యం లో స్కందున్ని వర్ణించి ఔచిత్య ప్రదర్సన చేసాడు .తండ్రి శివుడు స్థాణువు .ఆంటే మోడు వారిన చెట్టు అని కుడా అర్ధం .తల్లి పార్వతి అపర్ణ ఆంటే ఆకులు లేనిది .అయితె కుమార స్వామి మాత్రం విశాఖుడు .
ఆంటే కొమ్మలు లేనివాడు .అయినా ఫలాలను ఇస్తాడట కుమార స్వామి .మ్రోడై ఆకులు ,శాఖలు లేని చెట్టు ఫలాలను ఇవ్వటం ఏమిటి ?అని మనకు అనుమానం కదా అదే కవి చమత్కారం .శబ్ద శ్లేష తో శివ పార్వతులకు ,కుమార స్వామికి వున్న సహజ మైన పేర్లతో చమత్కరించాడు .
కొంచెం లోతుగా పరిశీలిద్దాం .స్థాణువు ఆంటే ప్రళయ కాలం లో కూడా చలించ కుండా నిలిచి వుండే వాడు ఆంటే కాలాతీతుడు,కాలమే తాను అయిన మహా శివుడు అని అర్ధం .అపర్ణ ఆంటే ఆకులు కుడా తినకుండా శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి దేవి .విశాఖుడు ఆంటే విశాఖా నక్షత్రం లో పుట్టిన వాడు శన్ముఖుడైన కుమార స్వామి ..విశాఖ ఆంటే నెమలి వాహనం గల వాడు అనీ అర్ధం అనేక చేతులు ఆంటే పన్నెండు చేతులున్న వాడు అనీ ఇంకో అర్ధం ఇంకా లోతుగా విచారిస్తే వేద శాఖలు తెలిసిన వాడుఅని విశేషార్ధం .ఇన్ని విశిష్ట లక్షణాలు వున్న కుమార స్వామినే స్ఖంధుడు అంటారు .పద్యాన్ని i కందం లో చెప్పటం అందం గా వుంది ,అర్ధవంతం గాను ఔచిత్యం గాను వుంది .కవి కోరిక తీరింది అభీప్సిత ఫలము లభించింది అందుకే నన్నే చోడ కవి రాజుని ”కవిరాజ శిఖామణి ”అనారు నిజాం గా తగిన పేరు .స్కంధం క్యనేది ప్రాకృత కవిత్వపు ఛందస్సు లో వుంది దాని లోంచి వచ్చిందే తెలుగు కంద పద్యం .చెప్పే విషయము ,దాని చెప్పా తకనికి ఎంచు కున్న పద్యము ఒకటే అయితె ”ముద్ర”అలంకారం అంటారు .దీన్నీ మొదట ప్రవేశ పెట్టిన వాడు కుడా నన్నే చోడ కవి రాజే నంటే అమితాస్చర్యం గా వుంటుంది .ఈ కావ్యం ఇంకో గొప్ప తనం వుంది కుమారస్వామి పుట్టకకు ముందు ,ఆయన అన్నా గారైన వినాయక జననము రాసి అగ్రజునికి అగ్రతామ్బులం ఇవ్వటం విశేషం సంస్కృతం లో కాళిదాసు కానీ ఉద్భటుడు కాని ఆ జోలికి పోలేదు . .చిన్న పద్యం లో ఎన్ని మనోహర భావాలు నిఖిప్తం చేసాడో మహాకవి అందుకే దీన్ని పద్య విత్తనం లో దాగిన భావ వృక్షం అన్నాను .ఇలాంటి హృద్య మైన పద్యాల్ని అప్పుడప్పుడు ఆస్వాదిద్దాం ఆ మహా కవులను స్మరించి ఋణం తీర్చుకుందాం
గబ్బిట దుర్గా ప్రసాద్
ఎందరో మహాను భావులు చెప్పిన భావావిష్కరణమే దీనికి ఆధారం .
Posted in సభలు సమావేశాలు
Leave a comment
ఆలోచనా లోచనం ” పూజను బట్టి పురుషార్ధం ”
ఆలోచనా లోచనం లో ఈ రోజు ఆంటే 19 -04 -11 న ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది
ఆలోచనా లోచనం
” పూజను బట్టి పురుషార్ధం ”
మనం చేసే పూజను బట్టి ఫలితం ఉంటుందని ధర్మ శాస్త్రాలు వుద్గో ఘోషిస్తున్నాయి .ఎంపిక చేసుకున్న.ఆ దైవం ఏ రూపం లో పూజిస్తే ,పుర్నానుగ్రహం తో మన కోర్కెలను నెరవేరుస్తాడో ముందే గ్రహించాలి . దైవం పట్ల నిష్ఠ వుండాలి .ఆ విధి విధానాన్ని ఆచరించి మనోభీస్తాన్ని నెరవేర్చు కోవాలి ఇది తెలిసి అర్జునుడు శ్రీ కృష్ణుడు శివుణ్ణి అర్చించి విశేష ఫలితం పొందితే అది తెలియక వేరొక విధానం లో పరమేస్వరున్ని పూజించి ఫలితం పొందలేక పోయాడు అశ్వథామ .ఈ వివరాలు మహాభారతం లో ద్రోణ పర్వం లోని చిన్న కధ వివరం గా తెలిపింది
మహా భారతయుద్ధం భీభత్చం గా జరుగుతోంది .ద్రోనసుతుడు ,మహా శస్త్రాస్త్ర నిపుణుడు అస్వస్తామ ,కృష్ణార్జునుల్ని తీవ్ర శరాఘాతం తో చీల్చి చెందాడు తున్నాడు .శరీరాలు గాయాలై రక్తం వరదగా పారుతోందికృష్ణార్జునులకు .అర్జునుడు ఇవేమీ లెక్క చేయకుండా అస్వస్తామ ను తీవ్ర బాణాలతో బాధిస్తూనే వున్నాడు .వీరిద్దరిని ఇంక ఏమి చేయ లేనని తేర్మ్కానిన్చు కున్నాడు .కోపం ,పరాభవం తో చెలరేగి పోయాడు .పరిస్థితి చెయ్యి దాటి పోతోందన్న ఆవేశము తోడైంది .చివరి ప్రయత్నం గా నారాయనాస్త్రాన్ని ప్రయోగించాడు మంత్ర పూతం గా .ఈ దెబ్బ తో వారిద్దరి పని సరి అనుకోని ఆనందించాడు .మహా మహిమాన్వితమైన ఆ నారాయణాస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేక పోయింది .చిరునవ్వు వీరిడైతే చిరాకు అతనిదయింది .ఎందుకు తన అస్త్రం విఫలమయిందో తెలియటం లేదు ద్రోణ సుతుడికి .తీవ్రం గా విచారించాడు .ఆవిశాయమేదో చేల్చుకోవాలని వ్యాసమహర్శిని ధ్యానించాడు .ఆయన ప్రత్యక్షమైనాడు .నమస్కరించి ”ఇది ఏమి మాయో తెలియటం లేదు స్వామీ దేవ గంధర్వాది జాతులను కూడా బాదిన్చాగాలిగిన దివ్యాస్త్రమైన నారాయణాస్త్రం కేవలం మనుష్యులైన కృష్ణార్జునులను దహించ లేదు కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం గా వుంది తెలియ జేయండి ”అన్నాడు అస్వస్తామ .అప్పుడు వ్యాసమహర్షి నవ్వి ”ఎవరు చేసుకున్న పుజాఫలితం వారికి లభిస్తుంది .నువ్వు పరమేస్వరున్ని ప్రతిమా రూపం లో అర్చిన్చావు .వాళ్ళిద్దరూ లింగరూపం లో వున్న శివుడిని ఆరాధించారు .పూర్వజన్మలో మీరు చేసుకున్న పూజాఫలితమే ఇప్పుడు ఆ రూపం లో ఫలితం గా కన్పిస్తుంది .లింగార్చన చేసిన వారిని శివుడు మెచ్చి రక్షిస్తాడు .అందుకే కృష్ణార్జునులను నీ నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది .”అని సవివరం గా తెలియ జేశాడు మహర్షి వ్యాసుడు .అసలు రహస్యం అప్పుడు తెలిసింది అతనికి .శివుణ్ణి లింగ రూపం లో ,అభిషేకం చేసి పూజ చేస్తేనే ఆయన సంతోషించి అభీస్త సిద్ధినిస్తాడని .కనుక శివ ప్రతిమను పూజించటం కంటే ,శివలింగాన్ని పూజిస్తే అధిక ఫలితం ఈ విషయాన్ని ఆనుసాసనిక పర్వం లో కూడా శ్రీ కృష్ణుని చేత ధర్మరాజు కు చెప్పించాడు వ్యాస మహర్షి శివలింగ సన్నిధానం లో చేసే ప్రతి పని ఆయురారోగ్య ఇస్వర్యాలనిస్తుందని తెలియ జేసారు .
ఇంతకీ లింగం ఆంటే ఏమిటి ?సమ్యక్ జ్ఞానమే లింగం .అని శైవ ఆగమాలు బోధిస్తున్నాయి .శివ లింగమే పరబ్రహ్మమని చెప్పాయి .ఓంకారమే లింగం .శివపురాణం లో లింగమే తన రూపు అని శివుడే చెప్పాడు . లింగాన్నే అర్చించమని కుడా చెప్పాడు .శివలింగం ఆంటే శివుని యొక్క లింగం అని మాత్రమే కాదు శివుడే లింగం అని శైవ ప్రకాశిక లో వుంది .పద్మపురాణం కూడా లింగానికే శివార్చన చేయాలని బోధించింది .త్రికాల శివలింగార్చనశ్రేస్తామని ఉపనిషత్తు వుద్ఘోషించింది .కనుక సాధకుడు ఇందులోని రహస్యం గ్రహించి ,తన కోర్కెలను తీర్చుకోవటానికి తన ఇష్టదైవం ఏ రూపం లో అర్చించితే ,ధ్యానిస్తే భక్త సులభుడై వరదానం చేస్తాడో ,ఆపదల నుంచి రక్షిస్తాడో ,తెలుసుకొని పూజించి అభీష్ట సిద్ధిని పొందాలి .ఇదే ఈ కధలోని ధర్మ సూక్ష్మం .ఆ ధర్మ సూక్ష్మం తెలిసి శ్రీకృషుడు ,అర్జునుడు శివలింగార్చనచేసారు అందుకే అస్వత్తామ ప్రయోగించిన నారాయణాస్త్రం శివుని అనుగ్రహం వల్ల వారిని ఏమీ చేయ లేక పోయింది .ఇది తెలియక అస్వత్తామ శివప్రతిమనే పూజించి ,నారాయాన్నాస్త్ర ప్రయోగ ఫలితాన్ని పొందలేక పోయాడు .కనుక పూజను బట్టే పురుషార్ధం లభిస్తుందని తెలుసుకోవాలి .
గబ్బిట దుర్గా ప్రసాద్
నవ్వుల పువ్వులు
నవ్వుల పువ్వులు
”నవ్వవు జంతువుల్ ,నరుడు నవ్వును నవ్వులు చిత్తవ్రుత్తికిన్
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు ,కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వులు వోలె ప్రేమ రసముల్ వెలిగ్రక్కు ,విశుద్ధ మైన ,లే
నవ్వులు ,సర్వ సుఖ దమనంబులు,వ్యాధులకున్ మహౌశాధముల్
అని జాషువా గారు నవ్వు కు నిర్వచనం చెప్పారు .నవ్వును గురించి ,నవ్వు ఉద్యమాన్ని గురించి కొన్ని విశేషాలు .హుమార్ అనే హాస్య త్రైమాసిక పత్రిక ఇరవైఎల్లకు పైబడిగా అమెరికా నుంచి వెలువడు తోంది .humor ఆంటే ఆర్ద్రత ,తడి ,తేమ ,ద్రవం అని అర్ధలున్నా న్నయిటహాస్యకారుని ఖ్యాతి వినే వారి చెవుల్లో వుంటుంది కాని చెప్పే వారి నోట్లో ఉండదని తేల్చేసాడు shakespeare .”స్వేచ్చ హాస్యాన్ని ఉత్పత్తి చేస్తే ,హాష్యం స్వేచ్చను ఉత్పత్తి చేస్తుంది ”అంటాడు జీన్ పాఉల్ సాత్రే .ప్రతి జంటకు వివాహం చేసే మారు వేషం లో వున్న పురోహితుడే హాష్యం అన్నాదిన్కోడు .హాస్య భావన లేని ఏ మనస్సు చక్కగా సంఘటితం కాదు అన్నాడు colridge మహాశయుడు దేశం నాగరికతకు అత్యుత్తమ పరీక్ష హాశ్యాం .చావటం తేలిక హాస్యమాడటం కష్టం అని తేల్చాడు ఇంకో ఆయన. చిరు నవ్వే విజయ సాధనం అన్నాడు ఒక మహానుభావుడు .మనిషికి దైవం ప్రసాదించిన వరం హాష్యం చివరిగా ”విస్వశ్రేయః హాష్యం .”
ఇప్పుడు కొన్ని హాస్య గుళికలు మింగుదాం .”నువ్విచ్చిన చెక్ బౌన్సు అయింది”అన్నాడు డాక్టర్ పేషెంట్ తో .”నా జ్వరం మళ్ళీ వచ్చింది .దేనికేమంటారు? ”పేషెంట్ గడుసు సమాధానం .
ఒక నౌకరు యజమానికి తన భార్య రాసిన వుత్తరం చదివి పెట్టమన్నాడు .చదవటం మొదలెట్టేసాడుయజమాని వెంటనే యజమాని చెవులు ముసేసాడు నౌకరు ఎందుకురా ఆంటే ”మొగుడు పెళ్ళాల విషయం కదా మీరు వినకూడదని అన్నాడు వాడు .
ఒక గోరి మీద ఇలా రాసి ఉందట ”ఇతను అతి బద్ధకిష్టు ఒకరోజు గాలి కుడా పీల్చటం మానేసాడు ”.”నన్ను మొట్టమొదట ‘అచ్చేసి ‘దేశం మీదకు వదిలింది పురిపండా గారు అన్నాడు శ్లేషతో శ్రీ శ్రీ
”మనం ముసలి వాల్ల మయామని ఎప్పుదనిపిస్తుంది ఒక ముసలి ఇంకో ముసలితో ”బర్త్ డే కేకు ఖర్చు కన్నాcandles ఖర్చు ఎక్కువైనపుడు అన్నా డురెండో ముసలి
”బాపు ! భూమ్మీద నడుస్తుంట్ ఎన్నో జీవులు చని పోతున్నయి అని వాపోయాడు ఒకడు గాంధీ దగ్గర .అక్కడే వున్న పటేల్ అంత వర్రీ వద్దు నాయనా బుర్రకింద పెట్టి కాళ్ళు పైకెత్తి నడు ”అని వాయిన్చాదట
”నేను తెలివి తక్కువ వాన్నని నీకు అనుమానమా ”అన్నాడు మునిమాణిక్యం ”చా నాకా అనుమానం లేసమైన లేదు ”అంది భార్య కాంతం .
దువ్వురి వెంకట రమణ శాస్త్రి గారు గొప్ప వ్యాకరణ పండితుడు ఆయన అంత్య దశలో చూడటానికి వచ్చిన ఆయన ఎలావుంది అని అడిగాడు ”ఏముందీ అచ్చుకో ప్రయత్నం ,హల్లు కో ప్రయత్నం లా వుంది ”అన్నాడు వ్యాకరణ భాషలో
”పనైందా పిన్ని గారు ? అని అడిగింది పక్కింటి ఇల్లాలు ”లేదమ్మా ఇంకా ఆయన ఇంటికి రాలేదుగా వస్తే కాని పూర్తీ చేయలేరు కదా? అంది అమాయకం గా పిన్ని
”ఎప్పుడు డబ్బు ,డబ్బు ,అంటావు బుద్ధి జ్ఞానం కావాలి”అన్నాడు భర్త ”అవి ఎట్లాగు మీ దగ్గర లేవు గా అందుకే డబ్బు కావాలి ”గడుసు పెళ్ళాం చమత్కారం
నవ్వుల్లో రకాలు చెప్పారు భమిడిపాటి కామేశ్వర రావు గారు అందులో మచ్చుకు కొన్ని తుపాకీ నవ్వు ,కోతి నవ్వు ,దగ్గు నవ్వు ,విషపు నవ్వు కొనాఊ పిరి నవ్వు
చివరగా ”హాసం జనజీవన విలాసం -హాసం మానవ హృదయ లాస్యం -హాష్యం ,లాస్యం లేని ఆస్యం (మొగం )విషాదానికి దాస్యం -కావాలి హాష్యం అందరకు వుపాస్యం ” ఇదంతా నా స్వంతం కాదు సేకరణ గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in అనువాదాలు
2 Comments
తెలుగు నాటక దినోత్సవం సందర్బం గా
.ఇవాళ తెలుగు నాటక రంగ దినోత్షవం .ఆ కదా ,కమా మీషు న తెలియ జేస్తున్నాను .ఆధునిక నాటకం కన్యాశుల్కం 1882august ప్రదర్శనతో ప్రారంభం .అది పుస్తకం గా వచ్చింది 1897lone .ఒకసారి విహంగ వీక్షణం గా తెలుగు నాటకాలను నటులను ,రచయితలను జ్ఞాపకం చేసుకొని అంజలి ఘటించటం మన కనీస కర్తవ్యమ్ .1860 లోkoraaada raama మ చంద్ర శాస్త్రి ”మంజరీ మధు కరీయం ”నాటకం రాసారు .ధార్వాడ నాటక సమాజం ప్రేరణతో 1860 లో వీరేశలింగం గారు ”వ్యవహార ధర్మ బోధిని ”రాసారు .
అందులో న్యాయవాదుల లంచగొండి తనాన్ని ఎండకట్టారు .విద్యార్ధులతో ప్రదర్శించారు .1880 లో రాజమండ్రికి చెందిన వావిలాల వాసుదేవ శాస్త్రి ”నందక రాజ్యం ”రాసారు .ఇందులో నియోగి, వైదీకి తగాదాలను చూపారు .ఇదే మొదటి స్వతంత్ర తెలుగు సాంఘిక నాటకం ..కొండుభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి 31 సాంఘిక నాటకాలు రాసారు. గుంటూరు లో ”హిందూ నాటక సమాజం ”స్థాపించి ఆంధ్రదేశం అంత ప్రదర్సనలు ఇచ్చి నాటక వ్యాప్తికి విశేష కృషి చేసారు .ఇవి పౌరాణిక నాటకాలు అవటం విశేషం .వేణీ సంహారం నాటకాన్ని వడ్డాది సుబ్బరాయ కవి రాసి ప్రదర్సనలు ఇచ్చారు .”హిందూ నాటకోజ్జీవ సమాజం ”స్థాపించి నాటక సేవ చేసారు .బందర్లో నాదెళ్ళ పురుషోత్తమ కవి నేషనల్ theotrical సొసైటీ పెట్టి తెలుగు హిందీ లలో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు .1887 లో ధర్మవరం రామ క్రిషమా చార్యులు బళ్ళారి లో ”సరసవినోదిని”నాటక సమాజాన్ని పెట్టి నాటక ఉద్యమం నడిపారు .విషాద నాటకాలకుఆద్యుడు వీటిలో పాటలు కుడా వుండటం ప్రత్యేకత .ఆంధ్రదేశం అంతా నాటక వ్యాప్తి చేసారు ధర్మవరం వారు .దీనితో వచన నాటకాలు తగ్గాయి .సంగీత నాటకాల జోరు పెరిగింది .చిలకమర్తి ”గయోపాఖ్యానం ”తిరుపతి వెంకట కవుల ”ఉద్యోగ విజయాలు”ప్రదర్సింపని వూరు వుండేది కాదు .తెలుగు నాటకం అంత ప్రాచుర్యం పొందింది .పద్య నాటకానికి పట్టాభిషేకం జరిగింది .
క్రమం గా వ్యాపార పధ్ధతి ప్రవేశించింది .చాలా నాటక సమాజాలు ఏర్పడ్డాయి .పోటీలు పెరిగాయి .పాత్రోచిత భాష ప్రాధాన్యత పెరిగింది .ఈ నేపధ్యం లో వేదం వెంకట రాయ శాస్త్రి గారి ”ప్రతాప రుద్రీయం ”నాటకం వచ్చి పాత్రోచిత భాషకు విలువ పెరిగింది .స్వతంత్ర ఉద్యమం లో చ్చారిత్రక నాటకాలకు ప్రాచుర్యం కలిగింది .ఉద్యమ స్ఫూర్తికి చాల దోహదం చేసాయి ch.నాటక నిర్వహణలో ప్రయో galu చేసారు .వైవిధ్యం కోసం పరితపించారు .డబ్బు విపరేతం గా ఖర్చు పెట్టి మోయలేని బరువుతో దివాలా తీసాయి కూడా .హార్మోనియానికి ప్రాధాన్యత పెరిగింది .సంగేత దర్శకులకు గిరాకి పెరిగింది .పద్యం,పాట ,హార్మోనియం కలిసి చెవి తుప్పు వదిలించాయి కొండవీటి చాంతాడు లాంటి రాగాలు జిలేబి చుట్టల లాంటి రాగ విన్యాసాలు పుట్టుకొచ్చి భయం కూడా కల్గించాయి .
బందర్లో”ఆంద్ర నాటక ప్రోత్సాహక సంఘం ”ఏర్పడి ధర్మవరం వారి ”చిత్ర నలీయం ”నాటకానికి పోటీలు నిర్వహించింది .తర్వాత చిలకమర్తి వారి ”ప్రసన్న యాదవం ”శ్రీపాద వారి ”బొబ్బిలి యుద్ధం ”నాటకాలకు పోటీలు నిర్వహించారు .ఉత్తమ నటులకు ,ఉత్తమ ప్రదర్శనకు బహుమతులిచ్చారు .దీనితో నాటక విమర్శ కూడా మొదలయిందని చెప్పవచ్చు .మల్లాది రామ కృష్ణ శాస్తి అరిగారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు ఆనాటి ప్రఖ్యాత నాటక విమర్శకులు గా గుర్తింపు పొందారు .
నాటక రంగం లో ప్రసిద్ధి చెందిన ఆనాటి నటుల్లో ముందుగ పేర్కొన తగిన వారు తాడిపత్రి రాఘవాచార్యులు ఆయనే బళ్ళారి రాఘవ ధర్మ వారం వారి మేనల్లుడు .ధర్మవరం వారిని”ఆంధ్ర నాటక పితామహుడు ”అని గౌరవం గా పిలుస్తారు .రాఘవ తెలుగు ఇంగ్లీష్ ,కన్నడ ,నాటకాలలోచిర స్మరనీయ నటన ప్రదర్శించి జేజేలు అందుకున్న మహోత్తమ నటుడు .సంస్కారి .ఆధునికతనను ప్రవేశ పెట్టిన వాడు .పాశ్చాత్య దేశాల నటులందరి తో ఆయనకు పరిచయాలున్దేవి vi .ఆ ప్రభావాన్ని తెలుగు నాటకం మీద తెచ్చాడు .స్థానం నరసింహారావు స్త్రే పాత్రలు ధరించి మంత్ర ముగ్ధుల్ని చేసారు సత్యభామ పాత్ర నభూతో గా నటించారు .గోవింద రాజు సుబ్బారావు ,వేమూరి గగ్గయ్య ,పీసపాటి అద్దంకి శ్రీరామ మూర్తి ,అద్దేపల్లి అఘురామయ్య ,సూరిబాబు తిలకం కన్నాంబ వరలక్ష్మి ది.వి ,సుబ్బారావు అబ్బూరి .బందా కనక లింగేశ్వర రావు
gabbita durga prasad
16-4-11 తెలుగు నాటక రంగ దినోత్షవం sandarbham గా pratyeka rachana
Posted in సమయం - సందర్భం
Leave a comment
గొల్లపూడి మారుతీరావు జన్మదిన సందర్భం గా ఒక కధ
గొల్లపూడి మారుతీరావు గార్కి జన్మదిన శుభాకాంక్షలు
“నేను”
పెద్దమేడ ముందు వీళ్ళ కుటుంబం . మేడ మీది కుటుంబం వీళ్ళకు ఆశ్రయం . నిజo చెప్పాలంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించే ఆ మేడ మీద కుటుంబం వుంది .”ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ .” ఆంటే బాగుంటుంది .తరతరాల స్నేహం అది .తరగని గని వంటిది .మేడ వారింట్లో ప్రతి పండక్కీ వీళ్ళకూ పండగే .వీళ్ళ ఆనందమే మేడ కుటంబం ఆనందం .ఏ పండగ వచ్చినా వాళ్ళు వీళ్ళు కలిసి మెలిసి వుంటారు .ఆనందిస్తారు .అన్ని తరాల్లోను రెండు కుటుంబాలు పాటించాయి .ఆ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు ,బదిలీలు ,చదువు సంధ్యల వివరాలన్నీ వీళ్ళ ఎదుట మాట్లాడాల్సిందే .అంత చల్లని మనసున్నవాళ్ళు . మేడ ఇంటి వారి పెద్దబ్బాయి పెళ్లి జరిగింది .కుందనపు బొమ్మ లాంటి కోడలు కాపరానికి వచ్చింది .వాళ్ళ అమ్మ అన్నీచూడమని అంటుంది. .ఏదీ చెప్పదు . తెలుసుకోవటమే తమ పని అంటుంది . అడిగితె అన్నిటికి ముభావమే . ఇవ్వడమే కాని పుచ్చుకోవటం తెలీని కుటుంబం వీళ్ళది .తల్లి ఔన్నత్యమే ఈ పిల్లల్ని అంత వాళ్ళను చేసింది .
వేసవి లో సందడే సందడి రెండు ఇళ్ళకు హడావిడే హడావిడి . మేడ కుటుంబం పిల్లలు , ఈ పిల్లల పై ఒక కన్నేసి ఉంటారు. ఎప్పుడు వీళ్ళు చిరునవ్వు తో ఆహ్వానిస్తారు .ఇంటిల్లి పాదికి తియ్యటి మామిడి పళ్ళు ఇస్తుంది వీళ్ళ అమ్మ .అప్పుడు ఆమె ముఖం లో ఎంతో గర్వం తొంగి చూస్తుంది .ఈ ఉగాది మేడ కుటుంబం పిల్లలంతా ఇంటివారయ్యారు .వీళ్ళ అమ్మకు ఆనంద పారవశ్యం కల్గింది .ఆప్యాయత సానుభూతి ఎక్కడివా అని ఈమె ఆశ్చర్య పోయింది .మేడ పెద్దదయింది .ఈమె కూడా పెద్దదయింది .ఆ ఇంట్లోకి వెళ్ళాలని వుబలాటం .వాళ్ళు పిలిస్తేనే లోపలి వెళ్ళాలని నియమం .ఆ ఇంటి అమ్మ గారు ఆప్యాయంగా ఈ పిల్లను లోపలి తీసుకు వెళ్లి అలంకరించింది .ఆ ఇంట్లో ఈమె కూడా ఒకటి అయింది .ఆ ఇంట్లోని వైభోగం కళ్ళారా చూసింది పిల్ల .సాయంకాలానికి సోమ్మసిలింది .ఎండకి వడలి పోయింది .అమ్మ వెన్ను తట్టింది .తమకు అక్కడ స్థానం కల్పించిన వారికి అలా చేయటం తమ కుటుంబ బాధ్యత అంది తల్లి .ఇవ్వగలగటమే తమ పని అదే తమ శక్తి అని తమకు బాధ్యతలే ఉంటాయని అన్నది .ఇవ్వడం లో వున్న హాయి చాల గొప్పది అంది .ఆ మాటలకు పిల్ల పులకించింది .ఆ మాత్రుత్వపు పరిపూర్ణతకు ఉద్వేగం తో చలించి పోయింది పిల్ల .తాను చేసిన మంచి పనికి తృప్తి పొందింది. పిల్లముఖం లో వెలుగు చూసింది తల్లి .అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోయింది.మేలుకొనే ద్రుష్టి, కోరికా దానికి లేవు .
ఇంతకీ ఈమె ఎవరు?”మామిడికొమ్మ” పరోపకారమే ఊపిరిగా పెంచిన ఆ పెద్దముత్తయిదువు, ఆ పూచిన మామిడి చెట్టే ఆ అమ్మ .ఆమె శరీరం లో అంతర్భాగమే ,ఆమె ఒడిలో అందంగా పేరిగినా మామిడి కొమ్మ అదే ”నేను ”. ఇదంతా మామిడి కొమ్మ స్వగతం . ఇంత గొప్పగా ,అందం గా చిత్రించారు గొల్ల పూడి మారుతీ రావు . దాని ఆన్తర్యాన్ని, మాత్రుత్వపు మహిమను దాత్రుత్వపు గొప్పను ప్రతి ఫలాపేక్ష లేక పోవటము అద్భుతంగా చిత్రించారు .ఆయన ఏది రాసిన జీవం పోసుకుంటుంది. మనసును తట్టి లేపుతుంది. ఆలోచింప జేస్తుంది . కర్తవ్య బోధ వుంటుంది. వాక్యం రసాత్మకం అంటె మారుతీ రావు మంచి ఉదాహరణ . సుమారు అర్ధ శతాబ్దం క్రితం ఆయన కధలను ”రోమన్ హాలిడే ” పేర సంకలనం గా తెచ్చారు అందు లోని చివరి అతి చిన్న కధకు సంక్షిప్త రూపం ఇది. ఆయన 73 వ పుట్టిన రోజు కానుకగా మీకు నేను అందించాను. ”మారుతి ” లాగ ఆయనా ఆయన కధలు చిరంజీవి గా వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఆలోచనా లోచనం తల్లికి పిల్లలపై సమాన ప్రేమ వుండాలి
ఆలోచనా లోచనం
తల్లికి పిల్లలపై సమాన ప్రేమ వుండాలి
తల్లి ప్రేమను మించింది లోకం లో లేదు .ఆమెకు ఎంతమంది సంతాన మయినా అందరి పైన ఒకే రకంగా ,సమనం గా ఆప్యాయతను ,ప్రేమను కురిపిస్తుంది .అందరు సమానం గా అభివృద్ధి చెందాలని ఆ కాంక్షిస్తుంది .ఇది లోక సహజం .ఇలా కాక దీనికి విపర్యం గా ప్రవర్తించిన వారు ,కొందరి పై అధిక ప్రేమ చూపించిన వారు చరిత్ర లో నిందార్హు లైన వారెందరో వున్నారు .ఇది మనుష్యుల విషయం లోనే కాదు పశు పక్ష్యాదుల విషయం లోను అంతే. వేదం లో సురభి అనే ఆవు తన కున్న సంతానం పై ఒకే రక మయిన ప్రేమ వుందని తెలియ జేసే కధ ఒకటి వుంది విందాం రండి .
గో జాతికి తల్లి సురభి అనే గో మాత ఆమె ఒక సారి కన్నీరు కారుస్తూ దేవేంద్రుని సరను జోచ్చింది .ఆయన వచ్చిన కారణ మేమిటో తెలియ జేయ మన్నాడు .సురభి గద్గడ స్వరం తో ”దేవరాజ 1nee రక్షణలో త్రిభువనాలు సుఖసంతోషాలతో వున్నాయి .ఒక్క నా గో సంతానానికి మాత్రమే ఎక్కడ లేని కస్తాలువచ్చాయి ”అంది .కారణం ఏమిటని సురెంద్రుడు అడిగాడు .సురభి ”లోకం లో బలమైన పశువుల తో బాటు బలహీన మయిన పశువులను కట్టి మనుష్యులు నాగలి దున్నుతున్నారు .ఆ పని భారం తట్టు కో లేక బక్క చిక్కిన పశువులు నెమ్మదిగా అడగులు వేస్తుంటే ములు కర్ర తో కొట్టి పొడిచి హింసిస్తున్నారు .అది చూడ లేకుండవున్నాను .”అని వెక్కి వెక్కి ఏడ్చింది .దేవేంద్రుడు ఓదారుస్తూ ”నీకు అధిక సంతానం కదా అన్నిటికి ఈ బాధ లేదు కదా ?కొన్ని పశువులకే గా ఈ కష్టం ఇది లోకం తీరే కదా ?”అన్నాడు .అప్పుడు సురభి ”నిజమే .తల్లికి పిల్లలంతా సమానమే .కొందరి మీద ఇష్టం ,మరి కొందరి మీద అయిష్టం ఏ తల్లికి వుండదు .బిడ్డలు ఎందరున్నా తల్లి అందరు సమానం గానే సుఖం గానే వుండాలని కోరుకుంటుంది .గాయ పాడిన వారిని ,బాధ పదే వారిని ,తల్లి ఎంతో ప్రేమతో చూస్తుందని నీకు తెలుసు .కనుక పనిచేయలేని ,బలహీనం గా వున్న నా సంతానాన్ని కనికరించి రక్షించు ”అని ప్రాధేయ పడింది సురభిగోమాత .ఇంద్రుడు ఆమె పిచ్చి ప్రేమకు సంతోసించి పరమానంద భరితుడై ,నాడు .సురభి పై విపరీతంగా జాలి కలిగింది .వెంటనే సంకల్ప బలం తో ఆ ప్రాంతమంతా పెద్ద వర్షం కురిపించాడు .భూము లన్ని గుల్ల బారి గడ్డి ,తృణధాన్యాలు బాగా పండాయి .పశుగ్రాసం పుష్కలంగా లభించటం తో పశువులు ఇష్టం గా మేసి బలం పుంజుకున్నాయి .పసువులలోనే ఇంత ఆపేక్ష వుంటే మనుష్యులలో వుండటం ఆశ్చర్యం కాదు .
వేదం లోని ఈ కధను ద్రుత రాస్త్రునికి వ్యాస మహర్షి హిత బోధ గా చెప్పాడు .దుర్యోధనుని పై వున్న అధిక పుత్రా ప్రేమను వదిలించు కోలేక తన మనసు లోని మాటను వ్యాసునికి చెప్పాడు .కర్తవ్యమ్ బోధించ మన్నాడు .అప్పుడు మహర్షి పుత్ర మొహం లోకం లో సామాన్యమైనది మైనది కాదని కౌరవులని ప్రేమించి నట్లే పాండవులను ప్రేమించమని కురు పాండవులిరువురు ఆయనకు రెండు కళ్ళు గా భావించాలని ,ఏ కంటికి నెప్పి వచ్చినా బాధ గానే ఉంటుందని ఈ విషయం లో సురభి అనే గోమాతను ఆదర్శం గా తీసుకో మని ధర్మ బోధ చేసాడు .సరి అయిన సమయం లో చెడు మార్గాన నడుస్తున్న కొడుకు దుర్యోధనుడిని మందలించి సన్మార్గం వైపు త్రిప్పక పొతే విపరీత పరిణామం సంభవిస్తుందని హెచ్చరించాడు .అప్పుడు ఆ కొడుకు అలవి కాని వాడై ,విసృంఖలం గా ప్రవర్తించి వంశానికి ,కులానికి రాజ్యానికి చేటు తెస్తాడు .సంఘం దుర్నీతి మయం అయి ,ప్రజలు కష్టాల పాలు అవుతారు .అందుకే అందరు సురభి లాగ సమ బుద్ధిని కలిగి ప్రవర్తించాలి .గుడ్డి ప్రేమే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమై కురు వంశ నాశనానికి హేతు వైందని అందరు గుర్తించాలి
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనంశీర్షికలో సే ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 12 -04 -11 నా prasaramayi
—
మా ఊళ్ళో (ఉయ్యూరు) మా గుళ్ళో (సువర్చల సహిత ఆంజనేయస్వామి ) జరిగిన సీతారామ కళ్యాణం
మా ఊళ్ళో (ఉయ్యూరు)
మా గుళ్ళో (సువర్చల సహిత ఆంజనేయస్వామి ) జరిగిన సీతారామ కళ్యాణం
మీ కోసం
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఆంధ్ర సారస్వత సమితి ఉగాది పురస్కారాలు మచిలీపట్నం 08-05-2011 ఆహ్వానం
Posted in సభలు సమావేశాలు
Leave a comment
గాంధీ స్మృతి శాంతి యాత్ర ఉయ్యూరు విశేషాలు
ఇవాళ గాంధీ స్మృతి శాంతి యాత్ర బాగా జరిగింది .వందలాది విద్యార్ధులు స్వచ్చంద సంస్థలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వారు ,వర్గాల వారు పాల్గొన్నారు రాజేంద్ర ప్రసాద్ నాయ కత్వం లో బాగా జరిగింది .వీరమ్మ గుడినుంచి యాత్ర బయల్దేరి లక్ష్మి talkies దగ్గర గాంధీ బొమ్మను చేరి ఆయనకు పూలమాలలు వేసి ,బంగాళా లో మీటింగ్ జరిపాము .నేను మాట్లాడాను గాంధీ 1921
లో మహాత్ముడు కస్తుర్బా తో పట్టాభి తో విజయ వాడ నుంచి బందరు వెళ్తూ ఏప్రిల్ఐదవ తేది న వుయ్యూరు వచ్చారు వెయ్యి మంది పురజనులుబంగాళా ల దగ్గర ఆయనకు స్వాగతం పలికారు .ఆయన ఆగి పది నిముషాలు మాట్లాడారు ప్రతి ఇంట రాట్నం వుండాలని ,స్వదేశి ఉద్యమాన్ని బాల పరచమని ప్రజల్ని కోరారు .అప్పటికి అప్పుడు ఒక వంద రూపాయలు స్వచ్చందం గా వసూలు చేసారు గాంది గారు అప్పుడు లోక మాన్య బాల గంగాధర తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు నినాదానికి ధన సహాయం కోసం దేశం లో తిరిగారు ఈ వంద రూపాయల నిధిని స్వరాజ్య నిధికి జమ చేసారు ఇక్కడినుంచి పామర్రు మీదుగా బందరు వెళ్లారు .అక్కడ పుర సన్మానం జరిగింది
రెండవ సారి గాంధీ ఖద్దరు నిధి కోసం ఆంధ్ర వచ్చారు 1929 ఏప్రిల్ లో .హైదరాబాద్ లో బయల్దేరి జగ్గయ్య పేట,నందిగామ నూజివీడు మీదుగా విజయవాడ 11 వ తేదిన వచ్చి అక్కడినుండి రాత్రి ఎనిమిది గంటలకు వుయ్యూరు రహదారి బంగాళా చేరారు .ఆ రోజు రాత్రి బంగాళా లోనే బస ,నిద్ర ఆయనతో వచ్చిన వారందరికి మా ఇంటికి ఎదురుగా వుండే సూరి శోభనాచలపతి గారు వాళ్ళ దొడ్డిలో వంట చేయించి తరతమ భేదం లేకుండా ఒకే పంక్తి లో భోజనాలు పెట్టి అందరికి ఆశ్చర్యం కలిగించారని మా అమ్మ గారు చెప్పారు .గాంధీ గారు ఆయన విశాల దృక్పధాన్ని మెచ్చారట మర్నాడు ఆంటే ఏప్రిల్ 1 2 వ తేది ఉదయం ఆరు గంటలకే కుమ్మమూరు వెళ్లారట .అక్కడ మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి గారు మిగిలిన పెద్దలు అపూర్వ స్వాగతం చెప్పి ఖద్దరు నిధికి గాంధీ గారికి 400 రూపాయలు సమర్పించారట .కొందరు నగలు కూడా సమర్పించారట అక్కడ బయల్దేరి వుయ్యురుకు ఉదయం ఏడున్నరకు వచ్చారు గాంధీ వెంట పట్టాభి సీతా రామయ్య గారు అయ్యదేవర కాలేస్వర రావు గారు వున్నారు వుయ్యూరు cbm స్కూల్ లో గాంధీ గారి సభా జరిగింది వుయ్యుర్ పంచాయితీ బోర్డుఇతర మిత్ర పుర్సాప్రముఖులు ఘనం హనం గా సత్కరించారు మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు సన్మాన పత్రం రాసి చదివి సమర్పించారు అప్పుడు ఆయన సిబియం స్కూల్ లో తెలుగు పండితులు గాయత్రి అనంత రామయ్య గారు మొదలయిన పుర ప్రముఖులు పాల్గొన్నారు .ఖద్దరు నిధికి 667 రూపాయలు ఒక\\\బంగారు ఉంగరం కొన్ని నిజాం నాణాలు గాంధీజీకి సమర్పించారు గాంధీనివిశ్వశాంతి v nti ప్రదాతగా సుహృద్భావ సంపన్నుని గా వర్ణించారు సన్మాన పత్రం లో అంతే కాదు గాంధీ అహింస సిద్ధాంతం వల్ల ప్రపంచం లో భారత దేశం అత్యన్నత స్థితికి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు మహాత్ముడు చాల సంతోషించి గొప్ప సందేశం ఇచ్చారు .అందరు ఖద్దరు ధరించాలి అన్నారు .బాల్యవివాహాలు చేయరాదని జాతీయ పునర్నిర్మాణానికి సంఘ సంస్కరణ అవసరం అని ఉద్బోధించారు .పంజాబు రాష్ట్రం తప్ప మిగిలిన రాష్ట్రాలలో ఆంధ్ర దేశం ఖద్దరు ఉత్పత్తిలో ముందు వుంది అని శ్లాఘించారు మహాత్ముడి ni పాద ధూళితో పునీతమై ఆయన బస తో ధన్యమైన ఈ రహదారి బంగాలను ఇక నుంచి ”మహాత్మా గాంధీ రహ దారి బంగాళా ”అని పిలవాలని దానికి తగ్గట్టు పంచాయితీ ,మండల పరిషత్ ,mlc లు స్పందించి వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని చెప్పాను వేలాది ప్రజలు నా ప్రతిపాదనకు మిన్ను ముట్టే హర్ష ధ్వానాలు చేసారు . ఆనందం తో తన్మయున్నయాను వెంటనే వుయ్యురుసర్పంచ్ శ్రీ అంగడాల వెంకటేశ్వర రావు ,మండలాధ్యక్షురాలు శ్రీమతి సోర్నల సంతోష కుమారి రేపే తీర్మానాలు రాసి ఆమోదిమ్పజేసి ప్రభుత్వానికి పంపుతమన్నారు రాజేంద్ర ప్రసాద్ తన వంతు కృషి చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తెప్పిస్తానని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు చివరిగా నేను గాంధీ గారి సందర్శనం చూపిన ప్రభావాన్ని గురించి చెప్పాను కుమ్మమూరు లో మైనేని గోపాల కృష్ణ గారి అక్క గారు అన్న పూర్ణమ్మ గారు గాంధీ రాక తో పులకించి ఆయన సందేశానికి ఆమోదం గా ఆరోజు నుంచి ఖద్దరు వస్త్రాలు కట్టటం ప్రారంభించారని ఇప్పటికి 85 ఏళ్ళ వయసు దాటినా ఖద్దరు కట్టుతున్నారని అనగానే జనం చాప్పట్లతోన్ ఆమెను అభినందించారు .అంతే కాదు గాంధీ గారి ఇంకో ఆదర్శం కులాంతర వివాహాన్ని ఆమె ఆచరించి మార్గదర్శి గా వున్నారని చెప్పాను ఆమె కమ్మ వారికులంలో పుట్టారు ఆమెతో పాటు గుంటూరు మెడికల్ కాలేజీ లో చదువుతున్న బ్రాహ్మల కులానికి చెందిన రాచకొండ నరసింహ శర్మ గారిని ప్రేమించి ,పెద్దల అంగీకారం తో వివాహం చేసుకొని చరితార్దు లయారు .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో చూపిన విదుషీమణి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు ఇప్పటికి ఆ వృద్ధ దంపతులు విశాఖ పట్నం లో ఎంతో అన్యోన్యం గా పిల్ల పాపలతో మనుమలు ,మనుమా రాళ్ళతో హాయిగా వున్నారని చెప్పాను .మళ్ళీ ఆనంద తరంగాలు వెలువడినాయి .తర్వాత రాజేంద్రుని కృషి దీక్ష ఈ కార్య క్రమన్న్ని విజయ వంతం చేసాయని స్లాఘించాను అందరి సహకారం తోడ్పాటు వుంటే ఏదైనా దిగ్విజయం అవుతుందని చెప్పాను ”ఆంధ్ర ప్రదేశ్ లో గాంధీజీ ”అనే పుస్తకాన్ని స్వతంత్రసమర యోధుడు ,విద్వాంసుడు విశ్వనాధ సత్య నారాయణ గారి తో జంట కవిత్వం చెప్పిన కృష్ణా జిల్లా కొడాలి వాస్తవ్యులు కొడాలి ఆంజనేయులు ఇగారు రాసారని అందరు చదివి తెలుసుకో దగినవి అందులో చాల వున్నాయని తెలియ జేశాను చివరిగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ”భారత భాగ్య విధాత ”అన్న పేరుతొ రాసిన రెండు పద్యాలూ చదివి మహాత్మునికి నివాళు లర్పించాను ఈ చారిత్రాత్మక ఘట్టం లో పాలు పంచుకున్నందుకు ఆనందం గా గర్వం గా వుంది . . .
‘యుగ పురుషుమ్దవంచు ,పురుషోత్తమ మూర్తి వటంచు,ముర్తిమ
జ్జగాదనరాగ శాంతిమయ సాత్విక శక్తి వటంచు ,వేనవేల్
మొగముల ప్రస్తుతించెను ,ప్రమోదముతో ,జగమెల్ల నిన్ను ,ఏ
మగుదురు నీకు తొల్లి మహమ్మదు ,క్రీస్తును ,బుద్ధ దేవుడున్ ”
”నిండు మనస్వి ,విశ్రుత వినీత పునీత యశస్వి
సాత్వికాఖండ తపస్వి —-సత్య సహకారము చిటారు కొమ్మ పై పండిన పండు ,
బ్రహ్మ రుషి భారత భాగ్య విధాత గాంధీజీ ”
Posted in సమయం - సందర్భం
1 Comment
శ్లేష క్రీడలు
శ్లేష క్రీడలు
——————————
”వేయిపదగల విశ్వనాధుడు వరలక్ష్మికి భర్తా ?
ఆరుద్రునికీ శ్రీరంగం శ్రీనివాసునికి వైరమా”త్వమేవాహం ”కాదా /
పోజీవుడా ఆంటే రాజీవుడా అంటున్దేమిటి పెంజీకటి లోకం ?
అది వాని కర్మ ఫలమే రామ జన్మ భూమిలో పుట్టిన ఆద్వానికి
అయస్ ‘కాంతం’ తో ఆకర్షింప బడ్డ ముని మాణిక్యం
శ్రీ శ్రీ లు ఎన్ని పెట్టుకున్నా శ్రీ శ్రీ సాటి ఎవ్వరు గువ్వల చెన్నా ?
జ్ఞాన పీఠం మీద కూర్చున్నా రోజుకో గేయమైన
రాయ టానికి సినారాయన రెడీ
ఫామేదా ”పామెలా బోర్డు ”పై
అన్నీ సెక్సు రాతలే కూతలె .
సెక్షులిరిజమ్ మోతాదు మించి నందుకే
ప్రజా స్వామ్యం లో రేపులు ,మాపులు మందిరాలలో ,మసీదుల్లో
”అమృతం కురిసిన రాత్రి (ధాత్రి )కి శోభా ”తిలకం ”
విశ్వ కుటుంబ భవనం పై ఎగరేసిన మానవీయ కేతనం
”చివరికి మిగిలిందేమిటి ”బుచ్చిబాబు
”కోమలి”న మైనా పంకజ మైన సర్డుకున్తవుగా ప్రేమ పిచ్చి బాబు
”అసమర్ధుని జీవన యాత్రా ”కంటక మార్గం పై చాందినీ పరచిన గోపీ
”చీకటిగదులలో ”రాస్తున్నాడు ”పరమేశ్వరుని వీలు నామా ”
” కుశా ”గ్రబుద్ధి కృష్ణ శాస్త్రి విరహ వేదనాగ్ని లో
బాష్ప సమిధలు వ్రేల్చి -యజ్న ఫలం ”పొందు ”ఊర్వసి ప్రేయసి .
‘దా”శరధి ‘మధనం లో జనించింది” అగ్ని ధార ”’
— నిజాం నిరంకుశ వైఖరిఅపై నినదించిన” రుద్ర వీణ ”
వ్యవ హారిక భాష పై ఆడు ”గిడుగు” రామ మూర్తి
గ్రాంధిక తప్త అహల్యా శాప విమోచన కారుణ్య మూర్తి
దేవునితో వైరమా ?రామ సామీ ?
సూత పురాణ త్రిపుర నేమీ (నేనీ )
గబ్బిట దుర్గా ప్రసాద్
18 -02 – 1991 న ” జనత ”పత్రిక లో ప్రచురితం
Posted in సమయం - సందర్భం
Leave a comment
మరో జయ ప్రకాష్ నారాయణ – అన్నాహజారే
మరో జయ ప్రకాష్ (లోక్ నాయక్)
అవినీతి హజం తో మత్తెక్కిన అధికార మత్త గజానికి
అంకుశం అయారు అన్నా హజారే
మెడలు వంచి ప్రజా బలం ఏమిటో
మెడలు వంచి ప్రజా బలం ఏమిటో
ప్రభుతకు నేర్పిన తరుణం
ఆశావహ వాతావరణం ఆవిష్కరింప బడిన
ఈ రోజు చరిత్ర లో మహత్తరం –
హజారాల వత్చారాలు జీవించాలి అన్నా హజారే
హజారాల వత్చారాలు జీవించాలి అన్నా హజారే
అతడు మన ముందున్న మరో జయ ప్రకాష్ నారాయణ
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
1 Comment
సత్యం శివం సుందరం
Satyam,sivam,sundaram
Men,women ,women and men everywhere
People of all walks of life here and there
The cream of intelligence
Drenched in the ocean of sorrow and suffering
lost faith in life with faces tears rolling
Seeking solace ,compassion and blessing
Empty hearts minds and souls
Poor creatures in the abode of God
Oh what a bleaming light around
What a sparkling lotus eyes
What a fragrance of serinityand sanctity
What an illumination from full moon
Oh,oh What a holy spirit before
An incarnation of God
An angel on earth
And an avatar of Bhagavan
With a touch ,smile ,and word
With a spoon of holy water And a few particles of vibhuti
With a small amount of holy offering Souls cleansed ,sorrows removed
New vistas of Horizon comes down
New thoughts full of devotion and dedication
New life in every poor soul
New birth for every one stood before
He is the guide ,philosopher ,and the master of your destiny
He is the doctor to cure your earthly disease
He is an actor to show the role of Almighty
He is a pleader to argue your case before Him
He is the leader to lead unto Him
He is not a man but a super man
He is not a saint but a Holy spirit
He is not Satya Sai
But an embodiment of Truth
Really ,really He is Satyam Sivam Sundaram
The three significant f actors of life
That lead ,guide and elevate you
To the altars of immortal happiness
Trust ,believe and follow
If that much you do
Rest assured all that he would do .
Gabbita Durga Prasad
Written on 5-12-1976
Posted in సమయం - సందర్భం
Leave a comment
భార జలం
భార జలం
శతాబ్దాలుగా వెనుక పాడిన సీమ
నాడు రత్నాలు పండినా -నేడు రాళ్ళమయం
— దశాబ్దాలుగా పంటకు వంటకే కాదు
— దశాబ్దాలుగా పంటకు వంటకే కాదు
అనంత శక్తిని పండించే మానవ అణు రియాక్టర్ క
భార జలం లాంటి ప్రాణ జలానికి నోచు కోక
శాప గ్రస్తులైన ప్రజల దాహార్తిని తీర్చే యత్నం
ప్రజల ప్రభుత్వాల చేత కాని తనం తో
దాహార్తులు అనుక్షణం నింగి కేసి ఆశగా చూస్తుంటే
మానవ సేవా తత్పరతతో కాదన్నది ఔననిపించి
అసాధ్యమన్నది సుసాధ్యం చేసి గడువుకు ముందే
అనంత poor ను అత్యంత pure జలంతో అభిషేకించి
సుజల ,సుఫల వరదానం చేసిన bhaabhaa బాబా
సత్య శివ సుందర విలసితం
ప్రేమ ,త్యాగ సేవా త్రివేణి సంగమం
అపర భగీరదులు ,అనంత కరుణా సంపన్నులు
మతత్రయానికి భాష్య కారులు
అఖిల ప్రపంచాన్ని సనాతన ధర్మ భూమి వైపుకు
ఆకర్షించిన సమదర్శి ,సనాతన సారధి
దైవమె అయిన మానవ ప్రయత్నం శక్తి తో
కృషి చేయాల్సిందే నని తెలియ జెప్పిన అవతార మూర్తి
శ్రీ సత్య సాయి బాబా మానవత్వం మూర్తీభ వించిన కారుణ్య మూర్తి
గబ్బిట దుర్గా ప్రసాద్
24 -11 -1995 న సాందీపని మాసపత్రికకు రాసిన కవిత
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఆలోచనా లోచనం మాలిన శరీరానికి తపస్సే సంస్కారం
ఆలోచనా లోచనం
మాలిన శరీరానికి తపస్సే సంస్కారం
—————————————–
ధర్మ్సాధనకు వుద్దేసిమ్పబడింది మానవ శరీరం .ఆ విషయాన్నీ మరచి పోయి దాన్ని మన చేష్టలతో ,ఆలోచనలతో మలినం చేస్తుంటాం .మంచి శరీరానికి మంచి మనసు అవసరం .ఈ రెండు దారి తప్పితే వ్యధా భరిత జీవితం అనుభవించాల్సిందే .తన దుశ్చర్య వల్ల దురాలోచన వల్ల జరిగిన అనర్ధాన్ని చిట్టచివరకు కానీ తెలుసుకో లేక పోయాడు ద్రుత రాస్త్రుడు .కన్నులే కాదు ,మనసు హృదయం కూడా గుడ్డివే అయాయి ఆయనకు .అప్పటిదాకా గుర్తుకు రాని పరలోక ధ్యాస ఇప్పుడు కలిగింది అందుకే తపస్సు తో తన శరీర మాలిన్యాని దగ్ధం చేసుకోవాలని అనుకున్నాడు .దీన్ని వివరించే మహా భారత కధను తెలుసు కుందాం. .
ఒక రోజు రాజు అయిన ధర్మ రాజు ను బంధువుల్ని తన సమక్షం లోకి పిలుచుకున్నాడు ద్రుత రాస్త్రుడు ..చాల కాలం ప్రాపంచిక విషయాలతోమలినమయిన p తన శరీరాన్ని ,మనసును
తపస్సు తో సంస్కరించుకోవాలని అనుకుంటున్నానని తెలియ జేసి అనుమతి కోరాడు .విదుర ,సంజయ ,గాంధారి కుంతిలతో కలిసి ఆయన హస్తిన వదలి కురుక్షేత్రం చేరాడు .అక్కడ ఆశ్రమం లో తీవ్ర తపస్సు చేసాడు .ఇక్కడ ధర్మ రాజడులు వారి వివరాలేమీ తెలియక బాధ పడ్డారు .ఎట్టకేలకు ధర్మ రాజు అనుజులతో ,,బంధు గణం తో బయల్దేరి ద్రుత రాష్ట్ర మహర్షి ఆశ్రమం చేరారు .తల్లికి ,గాంధారి ,ద్రుత రాస్త్రునికి నమస్కరించారు వారంతా .అయితె వారికి అక్కడ ధర్మస్వరూపుడు నీతి విశారదు అయిన విదురుడు కనిపించ లేదు .చాలదిగులు ల చెందారు ధర్మ రాజాదులు .ఆ విషయమై ప్రశ్నించారు పెడతంద్రిని .దానికి ఆయన ”విదురుడు మహా జ్ఞాని అధికారం లో వుండగా అతను చెప్పిన నీతి బోధలు న్నా తలకు ఎక్కలేదు .పెడచెవిని పెట్టి కురువంశ నాసనాన్ని నా చేతుల మీదుగా తెచ్చుకున్నాను ..ఇప్పుడు నా మనసు నా వశం లో వుంది .స్థిర చిత్తం తో తపస్సు చేసు చేసుకుంటున్నాను .శరీరాన్ని ,మనసును పరిశుద్ధం చేసుకున్నాను .కాని విదురుడు నా నీడ కూడా తనపై పడకూడదని ఏమో ఎక్కడో దూరం గా పోయి తపస్సు చేసు కుంటున్నట్లు తెలిసింది ఒంటరి గానే వున్నాడు .సర్వాన్ని త్యజించాడు విదురుడు .కొన్ని రోజులు నీరు ,గాలి మాత్రమే ఆహరం గా స్వీకరించి తపస్సు చేసాడట.ఆ తర్వాత అదీ మానేశాడట అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటాడు ”అని చెప్పాడు
ధర్మ రాజడులు విదురుని కోసం వెదికారు .దూరం గా ఎక్కడో విదురుడు కన్పించాడు ,తాను ధర్మ రాజు నని ఆయన దర్సనం కోసమే వచ్చానని ,యుదిస్టిరుడు బిగ్గరగా అరుస్తూ చెప్పాడు ,యివేమీ పట్టించు కోకుండా నీతి కోవిదుడు ,మహా తపస్సంపంనుడు ,జితేంద్రియుడు అయిన విదురుడు పొదల చాటుకు వెళ్లి పోయాడు .ధర్మ రాజు అతికష్టం మీద ఆయన వున్న పొద దగ్గరికి చేరాడు .అర్ధనిమీలిత నేత్రాలతో మౌనం గా నిలిచి పోయాడు విదురుడు .విదురుని తల అంతా జడలు కట్టింది .శరీరానికి ఆచ్చాదన లేదు .ధూళి దు దుసర గ్రస్త మయింది .ఎవరిని గుర్తు పట్టే స్థితిలో లేదు .తాను ధర్మరజునని తెలియ చెప్పినా ,ఆయనకేమీ పట్డులేదు .పరమహంస స్థితి పొందాడు .చివరికి కనురెప్పలు ఎత్తి చూసాడు .వెంటనే యోగమార్గం లో శరీరం త్యజించాడు .ఆయన దివ్య తేజస్సు ధర్మరాజు శరీరం లోకి చేరింది .దీనితో ధర్మరాజుకు నూతన శక్తి తేజం కలిగాయి .బుద్ధి బలము హెచ్చింది .విదురుని శరీరం చెట్టుకు చేరబడి నిద్రపోతున్నట్లుగా కన్పించింది .ఆయన మృతదేహానికి అగ్నికార్యం చేయాలనీ సంకల్పించాడు ఇంతలో అశరీర వాణి విదురుడు యతిఆ యాడని ,అగ్ని సంస్కారం చేయ కూడదని హితవు చెప్పింది .యోగాగ్నితో పునీతుడై పరమ హంసయై ,యతి అయి న మహా పురుషుడు ,పుణ్యముర్తి విడురదేవుడు .ధ్రుతరాస్త్ర ,దుర్యోధనుల రాజ్యం లో తాను చెప్పిన నీతి బోధలు వారి చెవికి యెక్క లేదు .తాను ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితి లో వుండి పోవాల్సి వచ్చింది .అదే ఆయన్ను బాధించి తీవ్ర తపస్సమాదికి ప్రోత్చాహించింది .మాలిన్య రహితుడై పునీతుడయాడు .తపస్సుకు యోగానికి అంతటి శక్తి వుందని ఈ కధ మనకు అందించిన సందేశం.
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షికతో ధారా వాహికంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి 05 -04 -2011 న ప్రసారమయిన రచన .
శ్రీ ఖర ఉగాది కవిత ——–అభినవ రాముడెవరో రావాలి
04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత
శ్రీ ఖర ఉగాది కవిత ——–అభినవ రాముడెవరో రావాలి
కాలకేయాది దానవులతో పాటు
సహోదరి సుర్పనఖ భర్తనూ చంపి
ఆమె అఘోరిస్తే యుద్ధం లో బందుత్వాలుండవు
ఆని రావణ నీతి బోధించాడు లంకాధిపతి
ఆమె నిస్టురాలకు చలించి
సోదర తుల్యుడైన ఖరుణ్ణి
దండకారన్యాది పతిని చేసి
పద్నాలుగు వేల రాక్షస సైన్యానికి
సోదరుదూ డుషనుడిని సైన్యాధి పతిని చేసి
ఆమెకు తోడుగా జన స్థానానికి పంపాడు
ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా
\ సాగవచ్చునని అభయ ప్రదానమూ చేసాడు
పెచ్చురేగిన ఆ మూక ఆకృత్యాలకు ఆంటే లేదు
అడ్డు ఆపు అసలే లేదు
సాధారణ జన జీవితం ,మునిగణ జీవితం
ప్రమాదపు అంచున పడింది
మునిజనుల కోర్కెపై వారికి అభయ ప్రదానం చేసి
ఆ ఖరాది దానవ సంహారం చేసి వీర విహారం సృష్టించాడు శ్రీ రాముడు
మళ్లి ఆ ఖరుడే ఈ ఏడు రాజ్యం యేలు తాడట
ఏ బీభాత్చాలు సృస్తిస్తాడో వున్న వాటికీ తోడూ
అసలే మనమున్నది కారుణ్యం ,దయ ,సానుభూతి లేని జన దండకారణ్యం
అడుగడుగునా , గాంధారి కొడుకులు ప్రబలు తున్న విపత్కర స్థితి
హింస ,దౌర్జన్యం ,అవినీతి ముప్పేటగా వురి బిగిస్తోంది
సెజ్ లు నాన్ వెజ్ లుగా పీక్కు తింటున్న రాబందులు
కుంభ కోణాలు spectrum గా వింత రంగులీనుతున్న సమయం
విచ్చలవిడి తనం పెచ్చరిల్లు తున్న దినాలు
అందుకే జనస్థాన వృత్తాంతం పునరావ్రుత్తమవాలి
అభినవ శ్రిరాముడెవరో రావాలి
ఖరాది దానవ సంహారం చేయాలి
అప్పుడే శ్రీ ఖర శ్రీకరమై శుభ కరమై ,సౌభాగ్య, సంతోష సంపత్కరమవుతుంది
ఆ తర్వాత వచ్చే” నందన ”కు ఆనందాన్ని అందించే పునాది అవుతుంది .
దుర్గా ప్రసాద్
04 – 04 -20011 న మొవ్వలో ”శ్రీ క్షేత్రయ్య పదకవితా సమాఖ్య ” నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం లో నేను చదివిన కవిత
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఉగాది కానుక
ఉగాది కానుక
రెండు రోజుల ముందే వచ్చింది ఉగాది యావత్ భారతదేశానికి
అమావాస్యనాడు విజయం వెన్నెల పంచేసింది
అంబరాలు దాటే సంబరాన్ని ముంగిట్లోకి తెచ్చేసింది
ఊరించి ఊరించి ఉగాది కానుక నిచ్చేసింది
యవత్ప్రపంచం ఉత్కంత తో ఎదురు చూసిన వేళ
క్రికెట్ క్రెడిట్ దక్కించుకుంది సాహసం తో పోరాడి సాధించింది
ఆట ”గంభీరమై ”యువరాజ విరాజిత ”మైన వేళ
”సింహ”సద్రుసమైన పోరుతో ధనా ”ధోనీ ”(ధ్వని) యంగా
మహేంద్రుడు విజ్రుమ్భించిన వేళ
మాస్టర్ బ్లాస్టర్ చెయ్యక పోయినా
మాస్టర్ బ్లాస్టర్ చెయ్యక పోయినా
సేహ్వాగు పరుగుల వాగు పారించక పోయినా
ప్రపంచ జగజ్జెట్టి లంకను వుఫ్ఫ్ మని లంకకు నెట్టేసి
ప్రపంచపు పై కప్పు గా కప్పును సాధించిన వేళ
వాంఖేడే వాళ్ళకు ఖేదం మనకు మోదం అయినవేళ
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదించింది
నాడు ”కపిలుడు ”దేవుడైతే నేడు ”మహేంద్రుడు ”మహిమాన్వితుడు అయాడు
ఈ విజయం సచిన్ సచ్చీలనికి నిరంతర శ్రమకు సేవకు
కానుక గా చేయటం ధోని సేన వినమ్రతకు నిదర్శనం
చారిత్రాత్మక ఔచిత్యం గర్వకారణం
మేరా భారత్ మహాన్ జయహో జయహో .
గబ్బిట దుర్గా ప్రసాద్
03 – 04 -2011
Posted in సమయం - సందర్భం
Leave a comment
ఊయల సేవ ప్రాముఖ్యత
ఊయల సేవ
— ఆలయ వుత్శవ సంప్రదాయం లో ప్రభాతసేవ అర్చన కళ్యాణం కైంకర్యం నీరాజనం ఊరేగింపు ఊయల సేవ ముఖ్య మైనవి ఇవన్ని ఈ నెల రోజులు జరుపు కున్నం చివరిదైన ఊయల సేవలో ధన్య మవుదంనిత్యం మనల్ని కంటికి రెప్ప ల కాపాడుతున్న ఆ దేవ దేవునికి కొంచెం విశ్రాంతి నివ్వాలనే తలంపు మానవునికి కల్గి ఇలా సేవలో ధన్యత చెందుతున్నాడు .
”ఎటులైన భక్తీ వచ్చుటకే ప్రయత్నమూ సేయవే మానస ”అనేది త్యాగరాజ సూక్తి .అందుకే ఆయన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గుడి ఆ గుడిలో కావ్య గన సరస్వతి కనిపిస్తుంది .ఆధ్యాత్మిక భావం తో సంగీతం ,కవిత్వం, త్యగరాజ కీర్తనలలో ధాన్యం చెందాయి .వేదాంత సారం తో బ్రహ్మానంద రసానందాన్ని పొందిన మహాను భవుడు .భక్తియే జీవన్ముక్తి సదనం గ భావించి తరించాడు .దర్శనాలు అనేకం అయిన దైవం ఒకడే నని భావించి గణ వేదం తో శ్రీరామా పరబ్రహ్మాన్ని అర్చించి స్మరించి గానం చేసి ధన్యుదయాడు .మనము కూడా ఇక్కడ ఈ సువర్చలన్జనేయ స్వామి వారి సన్నిధి లోవరిలోనే సర్వ దేవత దర్సనం చేసి ఆ సంగీత సరస్వతిని అర్చించి నీరాజనలిద్దాం .
”ANY KIND OF SOUND IS ENERGY ” అన్నారు .మనసు నిర్మలం చేసుకొని భక్తితోఈస్వరార్పణం చేసే సంగీతమే రాణిస్తుంది .”ఎవరని నిన్ను కీర్తించా వలనయ్యసివుదివో మాధవుదివో కమలభావుడవో పరబ్రహ్మవో ”అని అందర్నీ ఒక్కరి లోనే చూస్తాడు త్యాగయ్య .”సీత,గౌరీ ,వా వగేస్వరియును స్త్రీ రూపము లంద ,లోక కోటు లంద ”అని అడుగుతాడు .నాదం పరబ్రహ్మ స్వరూపం .దాన్ని ఉపాసించి TARINCHARAYANA .నాదం అనేది యోగాభాషలో ”అనాహతం ”అక్కడే స్వాతీ నక్షత్రం వుంటుంది .వాయు సంబంది .మన దేవుడు వాయు పుత్రుడిగా .సప్త స్వరాలు ఇక్కడే పుడతాయి స్వాతీ నక్షత్రం లోనే మకర సంక్రమణం అయింది ఈ ఏడు .అపూర్వ మైన పుణ్య సమయం .అద్భుత భక్తీ భావం తో స్వామిని సేవించి తరిద్దాం .”అందుకే స్వాదు ఫల ప్రద సప్తస్వర రాగ నిచయ సహిత హరిహరాత్మక భు,సుర శరజన్మ గానేసాదులు ”వుపసించి తరించారట .”సరగున పదములకు స్వాంతమను సరోజమును సమర్పించిన వా అరెందరో మహాను భావులు” ”హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులయి ముదంబున యశము గల వారెందరో మహాను భావులు ”అని పొగిడారు త్యాగరాజు .
”బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విద్రుత శరజాల సుభద కరుణాలవాల ఘన నీల నవమల్లికాభారణ ఏలా దయ రాదు?” పరాకు చేసేవేల సమయము కాదు ”అని ప్రాధేయ పడ్డాడు ఆ భక్త కవి ”పదము త్యాగరాజ నుతుని పై గానిది పడితే నేమి ఎడ్చితే నేమి ”అని భక్తిని ప్రదర్సిస్తాడు .”సకల భూతము లందు నీవై యుండగా మది లేక బోయిన చిరుత ప్రాయము నాడే భజనామృత రస హీన కుతర్కుడైన పరధనముల కొరకు నొరుల మది కరగబల్కి కడుపు నిండ తిరిగినట్టిదుడుకుగల నిన్నే ద్దుకుదొరకొడుకు బ్రోచురా అని తన తప్పు లన్ని విన్న విన్చుకున్నాడు నీవే తప్ప వేరే దిక్కు లేరని మొర పెట్టు కున్నాడు భక్త త్యాగయ్య ?”
”మరుగేలరా ఓ రాఘవ చరాచర రూప పరాత్పర ,సూర్య సుధారాకర లోచన అన్ని నీవనుచు అంతరంగమున ,తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య నిన్నే గని మది నెన్న జాల నొరుల ,నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ వినుత ”అని అన్నీ E ఆయనే అంటాడు ..నాదోపాసన ఒక్కటే తరించే మార్గం అందుకే ”శోభిల్లు సప్తస్వర సుందరుల భాజిన్చవే మనసా”అన్నాడు ”తలచితే మేనెల్ల పులకరించేని రామకనుగొన్న ననడమ I కన్నీరు నిన్దేదిని ఆలసించు వేల జగమంతా తరుణ మయ్యేని -చెంతనుండ నాడు చింతలు తొలగేని ”అని విశ్వాసం ప్రకటించాడు .
సద్భాక్తిలో జనులున్డటం చూసి యముడు చిన్తిస్తున్నాడట ”సతతము సుజను లెల్ల సద్భజన చేయుట చూచి చిన్తిన్చుచున్నాడు యముడు ”అని భక్తీ గొప్ప తనం చాటాడు .భక్తునికి భగవంతునికి భేదం లేదు .”నీవే నేనైనా నీవాడు గాక త్యాగరాజు వేరా //”అని ధైర్యం తో జ్ఞానం తో చెప్పాడు .”నీదు పలుకు పలుకురా నీదు కులుకే కులుకురా ,నీదు తళుకే తళుకురా ”అని మధుర ప్రేమతో ఆ రాధించాడు . త్యాగరాజ పంచరత్న కీర్తనలు జగత్ప్రసిద్ధం .అందులో మొదటిది ”జగదానంద కరక ”రెండోది ;”దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ”మూడవది సాధించెనే మనసా ”నాల్గవది ”కాన కాన రుచిరా ” అయిదవది ఎందరో మహాను భావులు ”వరుసగా అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ విజ్ఞానమయ ,ఆనందమయ కొసలకు ప్రతీకలు గ పండితాభిప్రాయం .అంటే అయిదు మెట్లుగా బ్రహ్మానందాన్ని పొందే ప్రయత్నం అన్న మాట ఇంతకీ ఆంజనేయుడికి సంగీతానికి ఏమిటి సంబంధం ?సంగీతం రెండు రకాలు ఉత్తరాది సంగీతం దక్షిణాది సంగీతం మొదటి దాన్ని హిందూ స్తాని అంటారు దీనికి ఆద్యుడు హనుమంతుడు అందుకే దాన్ని హనుమద్గానం అని కూడా అంటారు రెండవదాన్ని కర్ణాటక సంగీతం అంటారు దీనికి నారదుడు మూల పురుషుడు కనుక నారద గానం అంటారు
తుంబుర నారద హానుమలు గొప్పసంగీత వేత్తలు ,విద్వాంసులు .అందుకే హనుమ సన్నిధి లో ఈ సంగీత రస లహరి .
గబ్బిట దుర్గా ప్రసాద్
15 -01 -1996 నశ్రీ SUVARCHALANJANEYA స్వామి ఆలయం లో ధనుర్మాసం సందర్భం గ జరిగిన పవళింపు సేవ లో మాట్లాడిన మాటలివి.
Posted in సమయం - సందర్భం
Leave a comment
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”
నేపధ్య సంగీతం :
శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత óá ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .
శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శ౦కర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విశ్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్తాఫలం.
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడు
అసలు ఆ పాత్ర ఏమి చెప్పడు .అంతా మనం వూహించు కోవలసిందే . ఉహా సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను. నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ పాత్రనును విశ్లేషిస్తుంది. తులసి రైలు ఎక్కేటప్పుడు మైసూర్ లో పరాభవం జరిగినప్పుడు ఎక్కడ తొణకడు బెణకడు. ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తొట్రుపడడు .
తన కూతురి పెళ్లి కూడా ”అపస్వర౦’తో ఆగిపోయినా విచారించడు. అంతా పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీరమ్ వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కార చేతన. అది కట్టుబాట్లకు ఆచార వ్యవహారాలకు అ౦దనిది, అంతు బట్టనిది. హృదయ గత మైనది. .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారా౦శం .శిష్టాచార పరాయణుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాషాభేదం లేదని ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు. మాట్లాడిన నాలుగు మాటలు majestic గా ఒక కలెక్టర్ హుందాతనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,ద్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి
కూతురు వెన్న రాస్తుంటే సజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశ౦ .అక్కడ ఆర్ద్రత వర్షించింది. అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుడయాడు
చివరి సీను లో ”దొరకునా ఇటువంటి సేవ ”పాటకు ముందు”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ అజ్ఞాత దాతకు ,నా నమోవాకాలు ఆ కళాభిజ్ఞాతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది. మనసు లో ఆనంద జ్యోతి వెలుగుతుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధరించరా ,విని తరించరా ”అని అనిపించిన ఆ పాత్ర. తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విశ్వనాద్ కళా విశ్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా విశ్వనాద్ సృష్టికర్తగా కళా నీరా జనాలందుకున్నారు. ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృష్టింప బడుతు౦దొ తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించిన మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలాసం చేసే కళా మూర్తి వుందని ఎవరు ఊహించలేదు .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో కాసేపే నాట్యం చేసినా బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విశ్వనాద్ చేతిలో మనోజ్ఞ మనోహర శిల్పమూర్తి గా మలచబడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .వున్నా చాల పొడుపు .అంత సాత్వికాభినయమే . వూహాలోక సంచారమే .ఏదో తెలీని పిచ్చి ఆరాధనా తత్త్వం .ఒక devotion dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకాలకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు శ౦కర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంటగట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించు కోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శ౦కర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్రాలు గా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చత సాక్షాత్కరించింది .ఆ హావ భావాలు పరమ మనోహరాలు. శ౦కర శాస్త్రికి సన్మానం జరిగే టప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది
”బ్రోచే వారెవరురా ”పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి, సాధించాలనుకున్న గమ్యం చేరువవుతున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆన౦దమ్ తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శ౦కర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన చూపుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె ఆత్మానందానికి ప్రతీక .
జమీందారును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరాధనాకృతిగా నిలబడాలన్న తపన అది. .తనమూలం గా శ౦కరశాస్త్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక మూగ వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగాexplore expose చేసిన కళా తపస్వి విశ్వనాద్ పరిశీలనా దృష్టికి హట్స్ ఆఫ్
అల్లు రామ లింగయ్య :
శివునిహృదయం మాధవునికి మాధవుని మనసు శ౦కరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన
పరీక్షలకు తట్టు కొని నిలబడుతుంది. ఆ స్నేహబంధం పవిత్ర మయినపుడు వీడదు. వాడదు. శ౦కర మాధవులు దేవతాస్వరూపులు స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శ౦కర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవంను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రదారికి కూడా గర్వ కారణం .అల్లు రామలింగయ్య లోని కళాజీవి ధన్యుదయాడు ”వాడెంత నేను గట్టిగా కన్నెర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”అని శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు చెప్పి కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కాపోతాడు .
ఇలా యెంత చెప్పిన తరగనిగని గని శంకరాభరణం . చూసి పులకి౦న్చాల్సి౦దే. చెప్పి మెప్పించలేము.
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24-03-99 న స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి కృష్ణా జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లెపల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజున చూపించాను. చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం చేయటం నా అదృష్టం.
Posted in సమయం - సందర్భం
2 Comments
బాపు గీత ఉపదేశం
బాపు
గీత ఉపదేశం
రాత రమణీయం
రేఖ లావణ్య రసరేఖ
కుంచె రాయంచ నడక వయారం
బొమ్మ బ్రహ్మ శ్రీ చెలువు సింగారం
చిత్రం విచిత్ర విశ్వ సందర్శనం
భావమ్ m ఉపనిషత్ సుధారసం
జోకు పిడిబాకు అయినా తీయని హాయి
ఆంతర్యం నిర్మల స్ఫటిక సదృశం
ఆలోచనా సదా వున్నతోన్నతం
మూర్తి ముర్తిమత్వ కళా సంపద
నవీన శిష్ట చతుష్టయం
బాపు,రమణ ,మామా ఆరుద్రల్లో అగ్రేసరుడు
ఆరుపదుల బుడుగే ఎప్పుడు
శ్రీ జ్ఞాన ప్రసూనా పరిమలాఘ్రాత నిత్య పరవశుడు
బామ్మ కు జన్మ నిచ్చి తెలుగు కొమ్మకు అందాలూ నేర్పిన వాడు
కొంటె తనం ,వెక్కిరింపు ,గడుసుదనం తో పాటు
అంతకు మించిన తెలుగు దనం ధనం అతని సొమ్ము
ఆ ”బాపు ”జాతిపిత అయితె
ఈ బాపు సకల కళా జాతి పిత
కళా సరస్వతికి నిత్యం లక్ష పత్ర కుసుమార్చకుడు .
గబ్బిట దుర్గా ప్రసాద్
19 -12 – 93 న రాసిన కవిత
Posted in ముళ్ళపూడి & బాపు
Leave a comment
సౌందర నందం
సౌందర నందం
—
సుందరి నందుల కధను సౌందర నందం కావ్యం గా మలిచి సుందర సురుచిర పరిమళాలను ఆంధ్ర లోకానికి అందించిన ఘనత శ్రీ పింగళి లక్ష్మి కాంతం శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు ద్వయానికి దక్కింది .ఇద్దరు కృష్ణా జిల్లా వాసులే కావటం చారిత్రాత్మక సంఘటనే .
రామాయణం లోని సుందర కాండ అంతా సుందరమయం అయినట్లే సౌందరనందం కూడా సర్వాంగ సర్వ మోహన సుందర బంధురం గా వెలసింది .అదొక రసవత్కావ్యం గా వాసికెక్కింది .మందార మకరందం లాంటి పదాలకు కర్పూరపు సౌరభం అబ్బినట్లు న్న కావ్యం .ఆధునిక కాలం లో ఇంతటి రసమయ కావ్యం రాలేదని అభిజ్నుల భావన. ఆ కావ్య పథనం మనసుకు వసంతోదయమే .
బుద్ధ భగవానుని దివ్య బోధల ప్రభావం యెంత గాదం గా హృదయాలకు హత్తుకొని ప్రేమైక జీవులు గా మెలగిన వారి జీవితం లో వున్నత భావ సిఖరారోహనం యెంత గొప్పగా జరిగిందో తెలియ జెప్పిన మృదు మధుర కావ్యం .
లేత తమల పాకు లాంటి పింగళి ఘాటు పొగాకు వంటి కాటూరి కలిస్తే ఏదో కిక్కు ఇచ్చే కారా కిల్లి కాకుండా మానసిక పరిపక్వతను ముగ్ధ మనోహర శైలీ విన్యాసాన్ని రంగరించి ఫస్ట్ నైట్ కిల్లి ల తయారు చేసి ఆహా ఏమి మధురం అద్భుతం అనిపించారు .పరవశత్వం కలిగించే విన్నాణపు సొగసు ,సోయగం తో మెత్తని పూల సెజ్జ పై పరున్న అనుభూతి కల్గించారు .లక్ష్మి kantude వేంకటేశ్వరుడు అవటం వారి జంటకు ఒక పవిత్రత కలిగి ఆకర్షణీయ మైంది .జాతీయోద్యమ స్ఫూర్తి ,అస్పృస్యత విముక్తి గాధం గా మనస్సులో నింపుకున్న ఆ జంట అధునాతన భావాలకు ఆలవాలం .చమత్కారం ,ధిషణ ,భావ దీప్తి ప్రాచీన అర్వాచీన కవిత్వాల పై పట్టు ప్రపంచ సాహిత్య మధనం వారి చిత్తాలను రసార్ద్రం గా మార్చి rasapushkarini లాంటి కావ్యాన్ని అందించారు
”ఆత్మాశ్రయమైన కవిత్వం కంటే విలక్షణ మైన శైలిని కవితలో వ్యక్తీకరించటం భావాన్ని ఉద్వేగాన్ని కవిత్వం లో చొప్పించటం కంటే వర్ణించే అంశం మీద భావ సబలత తో కూడినపా ఆపారవస్యాన్ని ప్రదర్శించటం అంతగా వస్తువు లేని దాన్ని ఎన్నుకొని అందులోని విషాద ,గంభీర భావాలకు ప్రాధాన్యత కల్గించటం దాని వల్ల పాఠకుల సానుభూతితో కూడిన సమ స్పందన కల్గిన్చేట్లు రచించటం ,సాహిత్య భావ పోషణకు ప్రధాన్యాన్నివ్వటం ,పద్య రూపానికి ప్రజా దరణ పొందే రీతి కల్పించటం ,అన్ని మానసిక స్థితులకు అవకాశాలు కల్పించటం ,స్వేచ్చగా స్వీయ అభిమానం కల రంగాలలో కవిత్వం రాయటం ,లఘు కావ్యం గా తీర్చి దిద్దటం sani ని వేసాన్ని బట్టి చెప్పదలచు కున్న దాన్ని వ్యంగ్యం గా చెప్పటం ,చదివిన పాఠకుడికి వర్ణించిన అంశానికి సంబంధించిన వాస్తవ అంశాలు భావన రామణీయకం గా స్ఫురించి ఒక కళాత్మక అనుభ సిద్ధి ఏర్పడటం సౌందర నందం ప్రత్యేకత ”అన్నారు డాక్టర్ జి.వి సుబ్రహ్మణ్యం గారు .
విషాద ,గంభీర భావాలూ స్వల్పంగా కన్పించి ఆలోచనలో ముంచటం సానుభూతితో కూడిన ఉద్వేగాన్ని కలిగించి aristotle చెప్పిన catharsis సృష్టించిన కావ్యం గా దీన్ని దేని విమర్శకులు పేర్కొన్నారు .నవ్య సాంప్రదాయ కవులైన పింగళి ,కాటూరి జంట అభినవ కావ్యను భూతిని తమ ఖండ కావ్యం ద్వారా సాధించారు .అందుకే సాహిత్య చరిత్ర లో ”సౌందరనందం ”ను విషాద గంభీర కవిత గా గుర్తిస్తారని ఈ జంటను విషాద గంభీర కవులు అని జి/వి .అంటారు .మహాకావ్యాన్ని మినీ కావ్యం లో దర్శింప జేసిన ఘనత వీరిద్దరిది .ప్రయోగం లో parinatilo పద్య సరళిలో పరి పూర్ణ కావ్య దర్సనం చేయించిన ఘనత వీరిది అన్న సుబ్రహ్మణ్యం గారి మాట అక్షర సత్యం .ధర్మ వీరాన్ని రసం గా ప్రతిష్టించారు రాసోవై సహా అని స్పూర్తిని పొందిన కవులు వీరు .
ఆ జంటకు పూసిన పూవే సౌన్డరానంద నందివర్ధనం నిండుగా వొత్తుగా మెత్తగా తెల్లగా స్వచ్చంగా స్ఫటిక సదృశం గా రామణీయకం గా మానసిక ఒత్తిడులకు మందుగా వెలసిన సాహితీ చింతామణి సౌందరనందం పంచదార కన్నా కలకండ పానకంరుచికరం ఆరోగ్య కరం ద్రాక్షా పానకం సరేసరి ఈ రెంటికి తేనే కలిపితే మధురం అతి మధురం ,మధురాతిమధురం మరి దానికి సుగంధం కలిస్తే మరువ లేని మహదానందం ,బ్రహ్మానందం అదే సౌందరనందం .
గబ్బిట దుర్గా ప్రసాద్
30 – 07 – 98 నా వుయ్యూరు సాహితీ మండలి లో నేను చేసిన ప్రసంగం
Posted in సభలు సమావేశాలు
Leave a comment
ఉగాది విశేషాలు
ఉగాది విశేషాలు
రాబోయే సంవత్షరం పేరు ఖర నామ సంవత్షరం .ప్రభావ నుంచి ఇరవై ఒకటో సంవత్షరం .రాజు చంద్రుడు మంత్రి ,సైన్యాధిపతి గురుడు .సస్యాధిపతి,నీరసాధిపతిరవి . ధాన్యాధిపతి శుక్రుడు .అర్ఘ్యాధిపతి ,మేఘాధిపతి బుధుడు .రసాధిపతి కుజుడు. తొమ్మిది గ్రహాలలో ఆరుగురు సుభులు ముగ్గురు పాపులు కనుక మంచి ఎక్కువ జరుగుతుంది .రాజకీయం గా మార్పులు ఎక్కువ .కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాసం వుంది .ఆర్ధిక చిక్కులు ఎక్కువ .పలక పక్షం లో వర్గ పోరు వుంటుంది .నిధులు విడుదల ఆలస్యం .వర్షాలు బాగా పడతాయి .వరదలు ముంపులు మాములే.పంటలు బాగా పండుతాయి .ధరలు ఎక్కువే .అంతుబట్టని రోగాలు జనాన్ని పీడిస్తాయి తుఫానులూ ఎక్కువే .ప్రమాదాలు జాస్తి .బంగారం వెండి ధరలు మండుతాయి .08 -o5 -11vaisakha సుద్ధ షష్టి ఆదివారం గురుడు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు మేష రాసి లో ప్రవేసిస్తాడు అప్పుడు గంగానది పుష్కరాలు ప్రారంభం ఇరవయ్యో తేదీతో పూర్తీ .జూలై పది నుంచి శుక్ర మౌధ్యామి సెప్టెంబర్ ఇరవై తో పూర్తీ 20012 జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి .జూన్ పదిహేనవ తేది డిసెంబర్ పడవ తేదీలలో చంద్ర గ్రహణం
ఈ సంవత్షరం మిధున ,సింహ ,ధను ,మకర రాసుల వారికి బాగా వుంటుంది .మేష వృషభ ,కర్కాటక ,వృశ్చిక రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కన్య, ల వారికి అంతగా బాగుండదు .కుంభ రాసి వారికి సామాన్యం గా వుంటుంది వచ్చే జనవరి లోసిమ్హరసిలో కుజ స్తంభాన దేశానికీ కీడు భూకంపాలు వస్తాయి
ఇప్పుడు ఉగాది అంతే ఏమిటో తెలుసుకుందాము .వుగా అంతే నక్షత్ర గమనం ప్రారంభమయిన రోజు అంతే సృష్టి ప్రారంభమైన రోజు .సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద వుంటాడు .చంద్ర గమనం కూడా అదే రోజు అశ్విని నక్షత్రం తో ప్రారంభం అవుతుంది .ఈ రెండు కలిసిన రోజే యుగ దినం ప్రారంభం అవుతుంది .యుగం అంతే జంట కాలం భగవంతుని చేతనం కదా .సంవత్షరం వల్లనే సప్త తంతు యజ్ఞం జరుగు తుంది .సూర్య మండలం అనే వినేల్క ఆకాశం నుంచి ఉచ్చారణ లాగా వ్యక్తం చేసే పరా ప్రకృతి ఆవు .సూర్యుడు దాని పొదుగు .సంవత్షరం లోని నాలుగు భాగాలూ దాని స్థానాలు .ఘర్మం అంతే ఎండ వేడి దాని క్షీరం .సంవత్షరం దాని దూడ మేఘాలే వర్షించే ధేనువులు ఆంటే ఆవులు 368 అంగిరసులు అనే dhenuvulu గుంపులై సంవత్షరం అనే దూడ కోసం పాలు ఇస్తాయి ఆంటే ఎండ రూపం లో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయి అని మహా భారతం లో వుంది .సంవత్షరం వయసు గల దూడను బష్కం అంటారుఆంటే సత్యాన్ని సూర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది . .ఈరలర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది అని భావం .అందుకే ఉగాది మహత్తర మయిన రోజు .
ఉగాది నాడు ఏమి చెయ్యాలి ?తలంటి కొత్త బట్టలు మామూలే .ఉగాది పచ్చడి తినాలి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు చెరుకు ముక్కలు మిరియం పొడి పటికబెల్లం సైంధవ లవణం ఆంటే రాక్ సాల్ట్ వెండి గిన్నెలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి తినాలి ఇందులోని ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు వగరు తీపి ఆరోగ్యానికే కాక జీవితంలోని కష్టాలు ,సుఖాలు మొదలయినవి ఉంటాయి జాగ్రత్తగా నడచు కోవాలని అర్ధం .వసంత ఋతువు ప్రరంభామయే రోజు కోయిల పాటలతో మత్తెక్కించి కొసరు రోజు సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు అది వింటే శత్రు సంహారం జరుగుతుందని ,చెడ్డ కలలు రావని,గంగా స్నానం చేసినంత ఫలితం అని గోదానం తో సమాన మని ఆయుర్వృద్ధి కలుగుతుందని సుభకరమని మంచి సంతానము లభిస్తుందని మంచి పనులు చేయటానికి సాధనం అనిపెద్దలు చెప్పారు ఆదాయం యెంత వ్యయం యెంత పూజ్యం యెంత అవమానం యెంత తెలుస్తుంది ప్రమాదాలను హెచ్చరిస్తుంది తప్పుడు మార్గం లోకి జార కుండా కాపాడ్తుంది భవిష్యత్తు పై ఆస కల్గిస్తుంది నిరాశ తాత్కాలికమే నని సూచిస్తుంది కష్టాలను ఎదుర్కోవటానికి ఏమి చెయ్యాలో పంచాంగం చెబుతుంది .
ఈవిదం గా శుభాశుభాలకు చిహ్నమే మన ఉగాది పర్వదినం తెలుగు సంవత్చరాది .ఆంధ్రులకు గొప్ప పండగ .శ్రీ ఖర నామ సంవత్షరం శుభకరం శ్రీకరం సంతోషకరం సౌభాగ్యకరం కావాలనిఆశిస్తూ శుభాకాంక్షలతో సెలవు
మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ
శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ
”వేదాంత విద్యేషు సదా రమంతో -భిక్షాన్న మాత్రేన చతుస్తిమంతః -అశోక మంతః కరనే చరంతః -కౌపీన వంతః ఖాలు భాగ్య వంతః ” భక్తీ జనన వైరాగ్యాలనే త్రివేణి సంగమ స్థానమై నిత్య పరితప్త జనులను తమ అనుగ్రహ భాషణం తో వోదర్చుతూ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ దేశిక వరెంయులై తపోనిస్తులై యోగిపున్గావులై నడిచే దైవం గా భాసించే శ్రీపడులు పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యరు స్వామీజీ.
శ్రీ పూజ్య పాదులు 1956 లో దీపావళి అమావాస్య నాడు లోకానికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించి అజ్ఞాన తిమిరాన్ని నశింప జేయటానికి ఉద్భవించారు .వేదాంత విద్యను శ్రీ పెద జియ్యరు స్వామి వద్ద నేర్చారు .వేద వేదాంగ శాస్త్ర విజ్ఞానాన సాగరాన్ని అతి పిన్న వయసులో చులికీకృతం చేసిన వేద వేద్యులు వారు .1981 లో జీయరు పీఠాన్ని అధిస్టించి దానికి ఔన్నత్యాన్ని వన్నెను తెచ్చారు .వేద ధర్మ వ్యాప్తి చేయటానికి 1984 లో విజయవాడ వద్ద వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.దానిద్వారా నిరంతరం వేద ధర్మ వ్యాప్తి చేస్తున్నారు .భూత భవిష్యత్ వర్తమానాలన్నీ వేదాన్ని అనుసరించే జర్గు తుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం .”క్రిన్వంతు విశ్వం ఆర్యం ”అనేది మన సిద్ధాంతం .ఈ విస్వాన్నంత విజ్ఞాన మయం చేయటమే భారతీయ దార్సనికుల మహా సంకల్పం .1990 లో జగ్గయ్యపేట వద్ద బాలురకు వేద విద్య నేర్పటానికి వేద పాఠశాలా స్థాపించారు .వేదోద్ధారణ వారి జీవిత పరమావధి
\ 1985 నుండి 88 వరకు మన రాష్ట్రము వర్షాభావం తో అతలాకుతల మయింది ప్రజల బాధలను అర్ధం చేసుకున్నా స్వామీజీ హైదరాబాద్ లోతొమ్మిది రోజులు వారున యజ్ఞాన్ని అత్యంత నిస్త గరిస్తాలతో నిర్వహించారు .పుర్నహుతి నాడు భుమ్యకసలు ఎకమయినట్లుగా బ్రహ్మాండ మైన కుంభ వృష్టి కురిసింది భూమాత పులకించింది సద్యో ఫలితం లభించింది అంతటి అకున్తిత దీక్ష శ్రీ వారిది భారత దేశ ప్రగతికి ,ప్రజా సౌఖ్యానికి ,విస్వసంటికి సౌభ్రాతృత్వానికి వసుధైవ కుటుంబానికి గాను శ్రీ పాదులు 1994 లో 1008 కలసలతో స్నపన జరిపి మూడు లక్షల మందికి అన్నదానం నిర్వహించారు ఇదంతా గుంటూరు జిల్లా పిట్లవని పాలెం లో జరిగింది .వీరు ఆళ్వారుల పరంపరకు చెందిన వారు .these saints are truely citizens of theworld they belongtothe entire mankind మహాత్ములు విశ్వ పౌరులు వారు సకల మానవ కోటికి చెందుతారు అని అర్ధం .అందుకనే హాంకాంగ్ సింగపూర్ అమెరికా లలో విశ్వ శ్రేయస్సు కోసం వివిధ యజ్ఞాలు చేసారు .అనేక దేవాలయాలు నిర్మించారు .జీర్ణ దేవాలయాలను వుద్ధరించారు .భారతీయ సంప్రదాయాన్ని ,ఆర్ష ధర్మాన్ని ,వేద ,ఆగమ విజ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేసారు .
రామాయణం భాగవతం గోదాచారితం ఉపనిషత్తులు సర్వ సామాన్య జనులకు సులభం గా అర్ధ మయ్యే రీతిలో వారు ప్రసంగించే తీరు నిరుపమానం .అదొక భక్తీ గంగా లహరి .అంతా అందులో మునిగి పునీతు లు అవవలసిందే .అదొక అలౌకికానందం .నిత్యం నరుకుల వేట లో హింస దౌర్జన్యాలతో terrarism ఉక్కి పిడికిలి లో asantito నలి గిపోతున్న పంజాబు ప్రజల మానసిక శాంతికి ,మనో నిబ్బరానికి గాను తమ శిష్యులచే ఆ ప్రాంతం లో అఖండ వేద pathanam చేయించి శాంతి స్థాపనకు మార్గ దర్సనం చేసారు .ఈ విషయం లో తమ పరంపరకు ఆ ఆద్యులయిన శ్రీ భగవద్రామానుజుల అపర అవతారమే శ్రీ చిన జీయర్ అని పించారు .సంసార లంపటం లో మునిగి తేలుతున్న జనులకు ఉప సమనం గా భక్తీ తోనే rఅన్నీ సాధించ a వచ్చ్చుననే భావంతో లక్షలాది భక్తుల చేత శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేయిస్తూ అదొక అద్భుత ప్రక్రియ గా మలుస్తున్నారు .పెడ దారి పడుతున్న నేటి యువతను సన్మార్గం లో నడిపించటానికి ,వారి బంగారు భవిష్యత్తుకు ”వికాస తరంగిణి ”కార్యక్రమం చే బట్టారు .సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అణగారిన అణచబడ్డ బడుగు వర్గాల శ్రేయస్సుకు అనాధ ,వికలాంగులకు యేన లేని సేవా లందిస్తున్నారు పీతాదిపాటు లు అందరు సమాజం లో భాగస్వంయులే నని నిరుపిస్తున్న సాధు వరెంయులు స్వామీజీ .
సమస్త మానవాళిని సన్మార్గం లో నడిపించటానికి ఉపయుక్తమయిన అనేక గ్రంధాలను స్వయంగా రాసి ముద్రించారు .అతి తక్కువ ధరకు వాటిని అందిస్తున్నారు అదొక విద్య యజ్ఞం .సస్త్రభాశ్యం లో వారు మరల అవతరించిన రామనుజులే అని పిస్తారు .పుమ్భావసరస్వటీ స్వరూపులు శ్రీ వారు .”education isthe థ్ tranmission of civilization ”అన్న భావాన్ని చక్కగా వ్యాప్తి చేస్తున్న పరివ్రాజక వరెంయులి వారు .వారొక వ్యక్తీ కాదు శక్తి సమస్తి రూపం .ఒక వ్యవస్థ .శ్రీపడులు ”శ్రీ గోడ దివ్య వచస్సుధ రాశా ధుని ”.గోపంగానా పంగ ,విద్యదర్పద్భుట నీలమోహనా దయ దాక్షిణ్య భావావధి .వేదాంతద్వాయ సంప్రవర్తన కల వేడి .ప్రేమ స్వరూపి .దయముర్తి దాక్షిణ్య స్వరూపి ముముక్షు వరెంయులు వేద విజ్ఞాన భండారం .వేద విజ్ఞాన సర్వస్వం .
”గృహేషు పంచేంద్రియ నిగ్రహస్తాపః ”నివ్రుత్త రాగస్య గృహం తపోవనం ”గృహస్త ధర్మాన్ని నిర్వహిస్తూ రాగద్వేషాలను అదుపు లో ఉంచుకుంటూ వున్న వారికి ఇల్లే తపోవనం అని ఆ శ్లోక తాత్పర్యం .మనసు చంచలమయింది కనుక వీలున్నప్పుడల్లా మహాత్ముల హితవచనాలు వింటుండాలి battery ని re charge చేసుకోవాలి అయితె వీటిని బోధించే అర్హత ఎవరికి వుంది ?”వుద్యంతు సతమాదిత్యః వుద్యంతు సతమైన్దవ్హ నా విన విదుశం -వాక్యైర్నస్యత్యభ్యంతరం ”అంతే సూర్య చంద్రులు ఇవ్వలేని ప్రకాశం జ్ఞానుల హితవక్యం వల్ల కలుగుతుంది అజ్ననంధకరం నశిస్తుంది ఇంతటి మహనీయ వ్యక్తిత్వం గల పుర్నపురుషులు శ్రీ స్వామీజీ .వారి అభి భాషణం ఇప్పుడు విని అనుభూతి పొంది ఆచరించి ధన్యులం అవుదాం ”ది object of spiritual seeking isto find out what is
eternally ట్రూ ,not what istrueintime . స్వామి వారి దివ్యసీస్సులు అందరికి లభించాలని కోరుతూ సెలవ్ మీ దుర్గా ప్రసాద్
ఇది 21 07 — 96 తేదీన విజయవాడ మాంటిస్సొరి ti స్కూల్ లో కృష్ణా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుల పునశ్చరణ తరగతుల ప్రా ప్రరంభోత్షవానికి విచ్చేసిన శ్రీ చినజీయర్ jeeyar స్వామికి నేను పలికిన స్వాగతం
Posted in సభలు సమావేశాలు
1 Comment
ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే
— ఆలోచనా లోచనం
దేవుడి సొత్తు తింటే విపత్తే
దేవుని ఇల్లునే దేవాలయం అంటాం దేవాలయాలు సమాజం అనే ఆత్మకు స్థానం .జన జీవన విధానానికి కేంద్ర బిందువు .సంస్కృతీ వైభవానికి ప్రతీక .కళలకు పుట్టినిల్లు .దేవాలయం విశ్వ విద్యాలయ భావనతో పవిత్రం గా చూడాలి .న్యాయానికి ధర్మానికి ఆలయాలు ఆటపట్టు .అందుకే రాజులూ ,దాతలు తమ ధనాన్ని ఆలయ నిర్మాణానికి అధికం గా వెచ్చించారు .వాటి నిర్వహణకు భూములు దానం చేసారు వాటిని నిర్వహించే వారు కూడా అంతా పవిత్రం గా భావించి పని చేయాలి .దేవుడు చూడదు కదా అని ఆలయ ధనాన్నిస్వార్ధం స్వ్ర్ధం కోసం వాడుకున్నవారు పాప ఫలం అనుభ విన్చాల్సిందే .దైవ ద్రోహం చాల పెద్ద నేరం .అలాంటి ఒక దేవాలయం లో కాపలా వుద్యోగం చేస్తూ ఆలయం సొమ్మునే అపహరించిన వాడు కుక్కగా పుట్టిన కధ ఉత్తర రామాయణం లో వుంది ఆ కుక్క పేరు భిక్షు తాడిత .ఇక కధలోకి వెళ్దాం
అవి శ్రీరాముడు రావణ వధ తర్వాత అయోధ్యలో పట్టాభి షిక్తుడై జనరంజకం గా పాలిస్తున్న రోజులు .ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారు .రామరాజ్యం అని ప్రజలంతా ఆనందాన్ని అనుభ విస్తున్న రోజులవి .రాముడు కొలువై వున్నప్పుడు ప్రజలేవరైనా ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వచ్చి చెప్పు కోవటానికి వీలు కల్పించాడు .బయట ద్వారం వద్ద తమ్ముడు లక్ష్మణున్ని కాపలా గా ఉంచాడు .ఫిర్యాది వస్తే ముందుగ వివరం తెలుసు కొని రాముని వద్దకు పంపటం అతని కర్తవ్యమ్ .ఒక రోజున ఒక బిచ్చగాడు తనకు దారిలోఆ డ్డం గా వచ్చిందని ఒక కుక్కను విపరీతం గా కొట్టాడు .దాని తల పగిలి రక్తం కారి పోతోంది తనకు న్యాయం చేయ గల వాడు రాజైన రామచంద్రుడోక్కడే నని భావించి కొలువు వాకిట చేరి నిలబడింది .దాని దీనావస్థ చూసినా లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్లి ”గాయంతో రక్తం కారుతూ న్న శునకం మీ దర్సనానికి వచ్చింది దాని బాధ ఏమిటో తెలుసుకని న్యాయం చేయ మని దాని ఉద్దేశ్యం ల వుంది ”అని విన్న వించాడు .రాముడు క్షణం కూడా ఆలస్యం చేయ కుండా కుక్కను రాజాస్థానం లోకి ప్రవేశ పెట్టించ మన్నాడు .రక్తం కారుతూ వున్న కుక్కకు మర్యాద ,మన్నన తెలుసు అందు వల్ల ”నాయనా లక్ష్మణా రాజులూ ,మునులు ,సజ్జనులు వుండే సభా ప్రాంగణానికి నా బోటి క్షుద్ర జంతువులూ ప్రవేశించటం తగని పని .భూత దయ గల రాజా రాముడు నన్ను రమ్మన్నా నేనూ రావటం అభిలషణీయం కాదు ”అంది మర్యాదగా .లక్ష్మణుడు వెంటనే ఈ విషయం రాముడికి చెప్పాడు .ప్రజా రంజకుడు ,ధర్మ పక్ష పాతి అయిన రాముడు వెంటనే తనే బయటకు వచ్చాడు ”ఎవరు నువ్వు ?:ఎందుకు వచ్చావు ?వంటినిండా రక్తం ఏమిటి ఎవరైనా నిన్ను కొట్టార?కొట్టిన వాడెవడో చెప్పు ”అని అడిగాడు దానికి ఆ శునకం అక్కడే వున్న భిక్ష గాన్ని చూపి అతడే తనను అనవసరం గా కొట్టాడని విన్నవించింది భిక్ష గాన్ని పిలిపించి ”ఎందుకు కుక్కను కొట్టావు ?”అని అడిగాడు /దానికి వాడు ”మహా రాజ నేనూ భిక్షాటన చేసి పోట్టపోసుకున్తున్నాను నేనూ తెచ్చుకున్న దాన్ని ఈ పాడు కుక్క దారి కి అడ్డం
గా నిలబడి నన్ను భయ పెట్టి నా ద్రవ్యాన్ని అపహరిస్తోంది నాకు కోపం వచ్చి కొట్టాను నేనూ తప్పు చేస్తే నన్ను దండించండి ”అని మనవి చేసాడు
శ్రీరామునికి గొప్పచిక్కే e వచ్చింది ఎవరిని ఎలా దండిఇంచాలోతేలి యటం లేదు దీర్ఘం గా ఆలోచిస్తున్నాడున్యాయబద్ధం గా తీర్పు ఇవ్వటానికి .ఇంతలో ఆ sunakame కల్పించు కొని ”ధర్మ ప్రభువులు మీకు తెలియని న్యాయం లేదు .ఇలాంటి వాడికి తగిన శిక్ష ఒకటి వుంది చెప్తాను వినండి .కాలన్జనం అనే కొండ వుంది దానిమీద ఒక దేవాలయం వుంది దాన్ని పాలించటానికి నన్ను కొట్టిన ఈ భిక్షువును పంపండి .అంతకు మించిన శిక్ష లేదు ”అని అతి వినయం గా ధర్మసూక్ష్మం గా చెప్పింది .రాముడికి ఆశ్చర్యం కల్గింది .తప్పు చేసిన వాడికి దేవాలయాన్ని పాలించే అధికారిగా చేయటమా అని వితర్కిస్తున్నాడు .”ఇది తగిన శిక్షే అని నువ్వు నమ్ముతున్నావా ?”అని సందేహ నివృత్తి కోసం ఆ కుక్కనే అడిగాడు .అప్పుడా కుక్క ”రాజా నేను పూర్వ జన్మలో ఆ దేవాలయం కు కాపలా కాస్తూ దేవ బ్రాహ్మణులధనాన్నిన్ని అపహరించాను .అందుకే నాకు ఈ కుక్క జన్మ వచ్చింది ఇంతకంటే భిక్ష గాడికి గొప్ప శిక్ష ఏమి లేదు ప్రభూ ”అంది .రాజారాముడు నవ్వి అది చెప్పినట్లే భిక్ష గాడికి శిక్ష విధించాడు .కనుక దైవ ధనం అపహరిస్తే ,వాడుకుంటే ,మింగేస్తే ఎలాంటి జన్మ వస్తుందో భిక్షుతాడిత అనే కుక్క కధ వింటే తెలుస్తోంది కదా /కనుక ఆలయ పాలకులు ఈ ధర్మాన్ని గ్రహించి ఆలయ నిర్వహణలో జాగ్రత్తగా వుంటూ దైవధనాని పవిత్రం గా కాపాడాలి అప్పుడే ఆలయాలు నిజమయిన కోవెలలు అవుతాయి
ఆలోచనా లోచనం శీర్షికలో 29 -౩ -11 నా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయింది
గబ్బిట దుర్గా ప్రసాద్
సరసభారతి జరిపిన ఉగాది 2011 ఉయ్యూరు విశేషాలు వార్త పత్రికలలో
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
ఆరుద్ర సినీ ముద్ర
ఆరుద్ర సినీ ముద్ర
ఆరుద్ర అని పిలవబడే భాగవతుల శంకర శాస్త్రి దాదాపు 500 సినిమా లకు 5000 పైగా పాటలు రాసాడు ఇంకెవరు అధిగమించ లేని లక్ష్యం గా చేసాడు .డబ్బింగ్ సినిమా లకు శ్రీశ్రీ praanapratista చేస్తే ఆరుద్ర జవం ,జీవం కల్పించ్చి పుస్టినిచ్చాడు ఆన్ అనే హిందీ చిత్రాన్ని ప్రేమలేఖలు గా డబ్ చేసి అందులో ”పందిట్లో పెల్లవుతున్నది కను విందౌ తున్నది”అనేపాట రాసి ఆ రోజుల్లో ప్రతి పెళ్లి పందిట్లో ఆ పాట ను పెట్టు కొనే టట్లు popularise చేసాడు .ట్యూన్ బట్టి అద్భుతం గా పాట రాసే వాడు బావ మరదళ్ళు లో”నీలిమేఘాలలో గాలి కెరటాలలో”పాట mla సినిమా లో ”నీ ఆస అది యాస లంబాడోళ్ళ రామ దాసా ”గుండెల్లో గునపాలు గుచ్చ్చారే నీ వాళ్ళు ”అని రాసి అందర్నీ ఏడ్పించాడు గుండెల్లో గునపం అప్పటికి కొత్త మాట .అత్తా ఒక ఇంటి కోడలే లో ”జోడు గుళ్ల పిస్తోలు ఠానేనూ ఆడి తప్పని వాణ్ణి జీహ ”బావామరదళ్ళు లోనే ”ఇండియాకు రాజధాని దిల్లి నా గుండెల్లో ప్రేమరాణి లిల్లి”ఆంధ్ర కేసరి లో ”వేదం ల ప్రవహించే గోదావరి అమర ధామం ల భాసించే రాజ మహేన్ద్రి ”అనగల సంస్కారం వున్న వాడు .చెంచులక్ష్మి ,బాలభారతం ,సంపూర్ణ రామాయణం లాంటి పౌరనికాలలోను అద్భుత మయిన పాటలు రాసి ఏ పాట అయిన హిట్ చేసాడు పెంకి పెళ్ళాం లో ”పడుచు దనం రైలు బండి పోతున్నది వయసు వారి కందులో చోటున్నది ”అని కుర్ర కారుకు హుషా రెక్కించాడు .అందాల రాముడు లో ”ఎదగ danikenduku ర తొందర ఎదర బతుకంతా చిందర వందర ”అన్న జీవిత సత్యాన్ని ఆవిష్కరించాడు ఈ పాటలన్నీ ”కొండ గాలి తిరిగింది”అనే పేరుతొ సంకలనం గా వచ్చ్చాయి .పూర్వం పౌరాణికాలలో సంస్కృతం లో పాటలు పాడించే వాళ్ళు చెంచు లక్ష్మి లో ”కరుణాల వాల ఇది నీదు లీల ”అని కొత్త తరహ పాట రాసి కధ విధానక్న్ని అందులో పోదిగాడు ఈ రక మయిన పాటలకు బోణీ చేసాడు .ఇంద్రుణ్ణి ”పర స్త్రీ లను లోబరచుకొనే పశువు ”అన గల చేవ గలవాడు ఆరుద్ర .విష్ణువుకు లక్ష్మి దేవికి అతి సుందర మయిన పాట ను యుగళ గీతం గా రాసి ఔచిత్యాన్ని సంస్కారాన్ని చాటాడు ఇల్లరికం సినిమా లో హాస్యపు జల్లు అంతా ఆరుద్ర చిలక రించిందే .వీరకంకణం సినిమా లో దేసాడ్రోహి అయిన జగ్గయ్యను అతని భార్య జమున చేత చంపించి దేశ భక్తిని పెంపొందించాడు ఇందులో ప్రతి మాట పాట అణిముత్యమే ”.ఖుషి ఖుషీ” నవ్వించే మంత్రగాడు ఈ గడ్డాల బాబాయి .”ధనమేర అనితికి మూలం”,జోరుగా హుషారుగా అ’ న్న ”టాటా వీడికోలు ””హైలెస హైలెస అన్న ””రాయి నయినా కాక పోతిని ఆ”అన్నా ఆరుద్రే అనగలాడు న్న
ప్రాసకు ,అంత్యప్రాసకు అన్న ప్రాసన చేయటమే కాదు శాద్రసోపేతమయిన సహితీ భోజనం అందించిన పాటల వంట మేస్త్రి ఆరుద్ర .అనుపమ త్రయం లో ఆరుద్ర ,పెండ్యాల కే .బి తిలక్ అందించినవి ఆణిముత్యాలు .నిజంగానే ఉపమానం లేని అనుపమానమయినవి .ఆరుద్ర రమణ బాపు మామ మహదేవన్ లు సుప్రసిద్ధ సినీ ఇష్ట చతుష్టయం .చాల గొప్ప చిత్రాలు తీసి ప్రేక్షకులకు ఆరాధ్యు లాయరు .”ఆ ర బా మా ”అంతే బాగుంటుందని పించింది ఈ టి వి వారు తీసిన భాగవతం సీరియల్ లో సుందరకాండ పై చివరి పాట రాసారట
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ,కళా ప్రపూర్ణ బిరుదు పొందారు ఆరుద్ర రాజ మండ్రి సంస్కృతీ సంప్రదాయాలకు పులకించి పోయేవాడు అందుకే ఆయన 70 వ జన్మ దినాన్ని రాజమండ్రి లోని సాహితీ సంఘాలన్నీ కలిసి 15 రోజుల పాటు ఘనం గా నిర్వహంచి ఆ సాహితీ విరాన్ముర్తికి ఋణం తీర్చుకుంది ఆంధ్ర దేశం అయిన ఆరుద్రకు ఇవ్వాల్సినంత గౌరవం ,స్థాయి ఇవ్వలేదన్నది కా danarani సత్యం
ఆరుద్ర భావాలు
”ఎప్పటికయినా మానవ పదికుడు చేరుకునే విశ్రాంత మందిరం కవిత ”.కల నిజ పరచటం కాదు kavitvam నిజాన్ని కలగనటమే దాని తత్త్వం ””మంచిరచన చదివాకా బా ga భోంచేసి నట్లుండాలి కొంచెం బాధ పడాలి మనసుకు జ్వరం రావాలి ఒళ్ళు తిరగాలి ఈ బాధ లోంచి తేరుకొని బాగు a పడాలి ””నీవు యెక్క దలచుకున్న రైలు ఆ జీవిత కాలం latu ”కవి ta iకోసంపుట్టాను కాంతి కోసం కలం పట్టాను ””జీవితం radio సెట్టుకు భర్త ఏరియల్ భార్య ఎర్తు.”మన స్వతంత్రం మేడి పండు మన చరిత్ర రాచ పుండు ”రాసిందేమో రాసాము తీసికొనుము తోచినంత తీపో చేదో ””తరానికో వంద కవులు తయారవుతరెప్పుడు వంద లోను మంద లోను మిగిలేది ఒక్కడే ”ఆఖరికి నరుడు వాక్యమై నిండును ఆమెన్ ”అని మనిషి చిరంజీవి అంటాడుమృత్యువు చిరంజీవి మానవుడు ఒక్కరే అదే త్వమేవాహం ”
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in మహానుభావులు
1 Comment
అనురాగ కవి సమ్మేళనంలో నా కవిత
మా పెద్దక్కయ్య
నిత్యం కష్టాల కడలి దాటుతూ బాధల మున్నీటిలో మునుగుతూ
వేదనల సుది గుండాలను మొక్కవోని ధైర్యం తో ఎదురీది
”అనాఘ్రాత పుష్పం వంటి కధలు ,కవితలు అల్లి
బాగుందని ‘బాల పత్రిక ‘మెచ్చ్చిన సాహితీ మూర్తి
హిందీని ఆపోసన బట్టిన వేద్యురాలు
నాన్నకు ఆప్యాయపు ”చెల్లాయ్”
మా అందరికి మామంచి అక్కాయ్
అస్తిమితత్వపు అంచు పై అను నిత్యం వుంటున్నా
మద్రాస్ లో కుటుంబానికి కొండంత అండగా నిలిచి
దేశం కానీ దేశం లో భాష కానీ భాషనూ జీర్ణించుకొని
అపసవ్యాలను తెలివి వివేకం సమర్ధత తో సవ్యం గా మార్చి
ఒంటరి పోరాటం తోఅలు కుపెరుగని శ్రమ చేస్తూ నడి సంద్రపు కుటుంబ నావను
ధైర్యం తో ఒడ్డుకు చేర్చిన స్థిర చిత్తురాలు నిత్య చైతన్య శీలి స్వయం సిద్ధమా అక్క
బావ గారి ఇంటికి దీపం ఆ మహా ఇల్లాలు
ఎవ్వరికీ ఏ లోపం రాకుండా మమతాను రాగల తో పాటు
ఆర్దికాన్నీ హార్దికాన్నీ పంచిన ఆర్ధిక వేత్త
మమతాను రాగాలకు సత్య ధర్మాలకు నిలయం
కించిత్ కోపం వున్నా భూదేవి అంతా సహనం వుండేది
అన్ని అందరికి అమర్చి తాను అనుభవించింది కొద్ది కాలమే
రెండేళ్ళ క్రితం మమ్మల్ని వీడి వెళ్లి పోయింది
ఆనాటి అగస్త్య సతి లోపాముద్రకు సాటి
మా కుటుంబం పై వేసిన అనురాగ ముద్ర
మా పెద్దక్కయ్య లోపాముద్ర
చిన్నక్కయ్య
వయసులో మాకు పెద్ద తేడా లేదు
హితురాలిగా స్నేహితు రాలుగా వుంటుంది
జీవితం కాచి వాడ పోసిన అనుభవం
నవ్వు ముఖం ఆమెకు సహజ ఆభరణం
బంధుత్వం లో అందర్నీ ఆదరించి పెంచి పెద్ద చేసిన పెద్దరికం ఆమెది
నాన్న అమ్మ ల పై అతి ప్రేమ తమ్ముడి పై అతి పరమ వాత్చాల్యం
కొడుకుల్ని కూతుర్ని తీర్చి దిద్దిన దొడ్డ ఇల్లాలు
ఎన్నో సార్లు అమెరికా చుట్టి వచ్చ్చిన జంట మా బావ అక్క
బావ తో నిత్యం పజిల్ చిక్కు ముడులు విప్పే నేర్పు అక్కయ్యది
మా ఇంటిల్లి పాదికి బజ్జక్క మా బుజ్జక్క
మా చిన్నక్కయ్య దుర్గమ్మ
నిజం గా నిత్యం మా ముందుండే ఆ బెజవాడ కనక దుర్గమ్మ
—
Posted in సమయం - సందర్భం
1 Comment
తెలివైన వోటరు
తెలివైన వోటరు
నేడు దేశం లో వోటరు మహా తెలివి గలాడు
ఎవరేమి చెప్పిన ఓపికగా వింటాడు
ఎవరి సభల కైనా లారీల్లో వెళ్తాడు
ఎవరేమిచ్చ్చిన గుట్టుగా పుచ్చుకుంటాడు
ఎవరికి వోతేసేది మాత్రం బ్రహ్మ రహస్యం గా వుంచుతాడు
బరిలో ఎన్ని వందల మందున్నా
కంగారు పడని ధీరోదాత్తుడు
నిశ్చయంగా మనసు లోనిది గుద్ది
మరీ బుద్ధి చెబుతాడు
హవాలకు దివాలకు సెజ్ లకు పలకదు వులకడు
కరెంటు లేకున్నా ఎరువు కరువైన మాట్లాడాడు
పవర్ కట్ చేయటం లో
మహా మాంత్రికుడు మాయగాడు వోటరు
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
1 Comment
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”
చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
“శంకరాభరణం“
|
నేపధ్య సంగీతం :
శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రస స్ఫోరక కలభిజ్నత ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం . శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పడాల సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలభిజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే కంటన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో సంకరభారణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాత ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం సంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విస్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్త ఫలాం
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి తీ వి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం సంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుండా డ తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడు
అసలు ఆ పాత్ర ఏమి చెప్పాడు .అంత మనం వుహించు కోవలసిందే .వుహ సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపాద ను నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేస్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ charector ను విశ్లేషిస్తుంది తులసి రైల్ ఎక్కేటప్పుడు మైసూర్ లోపర ప్రభావం జరిగినప్పుడు ఎక్కడ తొణకదు బెనకడు ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తోత్రుపడదు .
తనాకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయిన విచారించాడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీయం వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర వహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కర చేతనా అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు అన్దనిది అంటూ న్తుబత్తనిది .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారంశం .సిష్టాచార పరాయనుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాష భేదం లేదని ఆ ననాద దబ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic గా ఒక కలెక్టర్ హుండా డ తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి కుఉతురువెన్న రాస్తుంటే ట్రుసజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయినా హృదయం ,తేలిక పాడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన సిఖరరోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేసం .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవతా మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుదయాడు
చివరి సీన్ లో ”దొరకున ఇటువంటి సేవా ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత టకు ,నా నమోవాకాలు ఆ కలభిజ్ఞాతతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లా ప్లవితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసు .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధారించర,విని తరించార ”అని అనిపించినా పాత్ర అది .తెలూ చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విస్వనాద్ కళా విస్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా విస్వనాద్ సృష్టికర్తగా కళా నీరజనలన్డుకున్నారు ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతునో తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి నా మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుండనిఎవారు ఊహించలేదు .ప్రెసిడెంట్ పెపేరమ్మ రంమలో కాసేపే నాట్యం చేసిన బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విస్వనాద్ చేతిలో మనోజ్ఞా మనోహర సిల్పముర్తి గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలోగులు లేవు .వున్న చాల పొడుపు .అంత సా సత్వికభినయమే .వుహలోక సంచారం .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకలకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు సంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట త గట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ వ వార్నిన్చుకోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .సంకర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్ర్లుగా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలుపరమ మనోహరాలు సంకర శాస్త్రికి సన్మానం జరిగే తప్పుడు ఆమె కాళ్ళు కృతజ్ఞత భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మావుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది
”బ్రోచే వారెవరురా ”పాత పడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆననం తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంత్రుస్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే సంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగినా పంచె లోంచి flashback లగినపుడు అతని గత జీవిత వైభవం యెంత ఒప్పదో ఆమె చూపిన చ్పుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె అత్మనండానికి ప్రతీక .
జమీన్దరును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరధనాకృతి నక్రుతి గా నిలబడాలన్న తపన అది .తనములం గా సంకరశాస్త్రికి సశ్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక ముఉగగా ముగా వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose చేసిన కళా తపస్వి విస్వనాద్ పరిశీలన దృష్టికిహట్స్ ఆఫ్
అల్లు రామ లింగయ్య :
సి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు సంకరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన పరిక్షలకు తట్టు కొని nilabadu తుంది .ఆ స్నేహ బంధం పవ్త్ర మయినపుడు వీడడు.వాడాడు సంకర మాధవులు దేవత స్వ్రుపులుగా స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా సంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్ర దరికి కూడా గర్వ కారణం .అల్లు రామలింగయ్య లోని కళా జీవి ధన్యుదయాడు ”వాడెంత ?నేనూ గట్టిగ కన్నీర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”ఐ శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కాళ్ళు నెలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్క పోతాడు .
ఇలా యెంత చెప్పిన తరగనిగని ఘని శంకరాభరణం . చూసి పులకిన్చాల్సిదే చెప్పి మెప్పించలేము.
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03 99 న స్వర్గీయ వేటూరి కృష్ణ జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లె పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నా చూపించాను చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం
|
|
Posted in మహానుభావులు
2 Comments
శ్రీ అరవిందులు
శ్రీ అరవిందులు
అరవిందం ఆంటే పద్మం .భారతీయ సాహిత్యం లో అర్విన్దానికి ఒక ప్రత్యేకత వుంది .అది వికసనానికి చిహ్నం .మనసు పరిపక్వ మైతే హృదయపద్మం వికసించింది అంటాం .వికసించటం వల్ల దానిలోని తేజస్సు ప్రపంచానికి తెలుస్తుంది .వికసిత పద్మం చూడటానికి ఎంతో ఆకర్షనీయం గా వుంటుంది .అందులోనుండి కమ్మని వాసనలు వెలువడతాయి అవి ఘ్రాణ ఇంద్రియాలక్ను మత్తెక్కిస్తాయి .మకరందం వుంటుంది పద్మం లో దానికోసం తుమ్మెదలు చేరతాయి ఆంటే ఒకరకమయిన ఆకర్షణ శక్తి అందులో ఉందన్న మాట.ఆ ఆకర్షణకు సంమొహితులమవుతం మకరంద సదృశ ఆనందమే సచ్చ్చిదానందం .దాని ప్రభావం మానవ మానసాన్ని తన వైపు కు లాగేస్తుంది .అంతటి ప్రభావం పద్మానికి వుంది .మనసనే పద్మం మొగ్గగా వుంటే క్రిందికి తిరిగి వుంటుంది ఆ.అది వికసించితే వూర్ధ్వ ముఖం అవుతుంది .మనసు చీకటి నుంచి వెలుగు లోకి ప్రస్థానం చేస్తోంది ఇదే ఏ జీవి అయినా కోరుకునేది
కళ్ళను పద్మానికున్న. రేకులతో పోలుస్తారు .అందులోని రేకులు అనేకం విజ్ఞానం కూడా సహస్రదల పద్మం ల వికసించాలి .అప్పుడే దాని ఉనికి ,వ్యాప్తి తెలుస్తుంది .శ్రీ లక్ష్మి ,సరస్వతులు పద్మాసనం లో వుంటారు .జేవితం లో ప్రేయసులు పద్మపరాగం లాగా వ్యాపిస్తాయి ప్రేయస్సు నుంచి శ్రేయస్సుకు మానవ ప్రయాణం .సృష్టి చేసే బ్రహ్మ కూడా పద్మ సంభావుడే .నారాయణ స్వరూపుడైన పరమాత్మా నభిలో పద్మం వుంది అందుకే పద్మానికి అంత పవ్త్రత ,ప్రాధాన్యం .ఆంటే కాదు పద్మాన్ని ఆవరించి వుండే ఆకులు ఇవేవి తనకు పట్టనట్లు ,ఈ విషయ వాంఛ లేవి తనకు సోకనట్లు దేనినీ అంటూ కోడు .తామరాకుపై నీటిబొట్టు అందుకే అంత స్వచ్చ్చం గా ముత్యం ల ప్రకాశిస్తుంది .తామరతూడు లోని రంధ్రాలు నవనడుల్ల అనిపిస్తాయి .అందుకే ఈ జీవితం మనం జీవిస్తున్న ,మనకు ఏ వాసన లేకుండా లేకుండా జీవించాలని పద్మం మనకిస్తున్న సందేఅసం .తాను బురదలో వున్న పైకి పెరిగి దానితో సంబంధం లేకుండా వూర్ధ్వ ముఖం గా ప్రయాణిస్తుంది పద్మం మనం కూడా అలా వుండాలని అలా స్పందించాలని పద్మ సందేశం అదే అరవింద సందేశం .
— తెలిసి పెట్టారో ,తెలియక పెట్టారో కానీ శ్రీ అరవిన్డులకు తలిదండ్రులు అరవింద నామం చక్కగా కుదిరింది .అంతకు పూర్వం చరిత్రలో ఎవరికి అరవింద నామం వున్నట్లు కనిపించదు .అరవిన్డానికి ఇప్పటి దాక మనం చెప్పు కున్న లక్షణాలు వున్న మనీషి అరవిందులు మాటలో విందులు భావనలో విందులు నడకలో నడతలో అన్నీ విన్దులే ఆనందపు చిందులే .అందుకే మహర్షి ,యోగి అయారు .తాను వికసించి తన వికసనాన్ని ప్రకృతికి పులకింత గా చేసారు .ప్రకృతి లోని జీవ చైతన్యాన్ని తన వైపుకు ఆకర్షించారు .తన భావ వ్యాప్తికి చిహ్నం గా నీటి పై తేలే పద్మాన్నే ఎంచుకున్నారు .అంతటి అవినాభావ సంబంధం ఏర్పడింది అరవిన్దునికి ,అరవిన్దానికి .తత్వ బోధ చేసారు తాను తరించి లోకాన్ని తరింప జేస్తున్నారు
ఇప్పుడు శ్రీ అరవిందుల భావనా మకరందాన్నిగ్రోలుదం సచ్చ్చిదానంద మైన ఒక తత్త్వం విజ్ఞానం గా మనస్సు గా ప్రాణం గా జడం గా అవతరించింది మళ్లి ఆ జడం నుంచి ప్రాణానికి ప్రాణం నంచి మనస్సుకు ఆరోహించి అక్కడే ఆగిపోయింది .అదే ఇప్పుడు మనకు కనిపించే ప్రపంచం ఆ మనోమయ లోకం నుంచి విజ్ఞానం గా వికసించ టానికి ఆ తత్త్వం నిరంతరం గా పని చేస్తోంది .ఈ విజ్ఞానన్నే అరవిందులు supermind అన్నారు అరవిందుల ఈ దర్సనం వల్ల బ్రహ్మకు ,బ్రహ్మాండానికి ప్రయోజనం కలుగుతుంది .
అరవిన్డ్ని భావనలో జడం కూడా సత్యమే.అది ఏక కాలం లో నానాత్వాన్ని ,నానాత్వం లో ఏకత్వాన్ని ఏక కాలం లో చూస్తుంది .ఆంటే ఈ ప్రపంచం లో ఈసవరున్ని ఏకకాల అవిచ్చ్చేదం గా చూస్తుందని అర్ధం .దీనికి యోగ ఉత్పత్తి క్రమం లో వివరణ వుంది చిత్ ,జీవులు వేరు కానట్లే జీవ ,చిత్ లు వేరు కావు .జీవుడు ,చిత్తం వేరు కానట్లే దేహ కర్మలకు వేరు అవటం వుండదు .జీవుడే ఈశ్వరుడు .చిట్ అనేది ఆత్మయే .ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే శివుడే .
భగవద్గీత జ్ఞానాన్ని అలవారుచుకోమని చెప్తుంది .జ్ఞానం ద్వారా బ్రహ్మత్వం పొందచ్చ్చు .అయితె అది అందరికి సాధ్యమా ?ఆ స్థితి వచ్చ్చే దాక కర్మలు చేస్తుండు అనిచేప్పేవారు ,భక్తీ యోగమే గొప్పదని చెప్పే వారు వున్నారు .ఈ విషయం లో శ్రీ అరవిందుల భావన ఇలా వుంది .జగత్తు అపర ప్రకృతి చేసింది కాదు అది ఒక జడ యంత్రం.దేనికి పునాది పర ప్రకృతి అదే సచ్చ్చిదనందమయిన చిచ్చ్చక్తి ..కానుక జగత్తు జడం కాదు ఆనంద మయమే .ఆనందం చేతనే సృష్టి జరుగు తుంది ఆనందం నుంచి ఆనందం లోకి దీని నడక .అపర ప్రకృతి మనలోని భగవంతున్ని ఆవరించి వుంటుంది .ఈ అపర ప్రకృతి పొరను తొలగించు కొని పర ప్రకృతిలో ఆనంద మయ జీవితాన్ని పొందటమే మానవుని లక్ష్యం .ఆంటే జీవ ,పరప్రక్రుతులు ఒక్కటే .గీత ప్రకారం పర ప్రకృతి జీవాభుతమే జీవాత్మ కాదు .అరవిందుని ఆలోచనా ప్రకారం పర ప్రకృతియే జీవులందరి స్వభావం .ఇది అనంత మైంది ,అదే ఈ జగతికి మూలం .అదే జగన్మాత .లేక ఆద్యాసక్తి .అంతే కాదు పర ప్రకృతి పురుషుడు ఒక్కటే .అతని అంశ కూడా .””మమైవంసః” .జగత్తంత అతని లోని అంశమే జీవులంతా భగవంతుని బహు రూపాలే .జీవుడు తన లోని మూల సత్ చత దేవుడు ప్రకృతి చేత భగవంతుని పర ప్రకృతిలో అంశం .
ఇలా ఉన్నప్పటికీ మానవుడు ఇంక తనకంటే తక్కువ అయినా ప్రకృతి స్థితి లోనే వున్నాడు .కనుక ప్రతి మానవుడు తనస్వరుపాన్ని వికసింప జేసుకుని తన భగవత్ ధర్మాన్ని divinelife
ను ఆంటే భాగవత ప్రకృతిని పొందాలి ఈ ప్రపంచం లోనే దివ్య జన్మను పొంది దివ్యమైన పనులు చేసి అపరిపుర్ణతను దాటి ఈ విస్వలీలలో అనంతమైన ఆనందాన్ని పొందాలని అరవింద హర్దయం .సుఖ దుఖలనే ద్వంద్వాలను దాటి అన్న ,ప్రాణ ,మన,కొసలకు వికాసం కలిగించుకొని పరప్రక్రుతి నుంచి జీవ లాభం పొందాలి .ఈసా వాస్య వుపనిసట్ లో ”అవిద్యాయ మృత్యుం తీర్త్వా విద్యాయ అమృత మస్నుటే ”అని చెప్పా బడింది .
చివరగా ఈ ప్రపంచం ఏర్పడటానికి theory అఫ్ ఛాన్స్ రెండు theory అఫ్ mechanical necessity కారణాలు అని చెప్తారు .కానీ వీటికి మించి ఈ విశ్వం వెనుక అనంతమయిన అచేతనం nescience వుంది .శాస్తవేత్తలు కూడా జడం ఇక జడం కాదు అదీ చేతనా స్వరూపమే అంటున్నారు ”all phenomina behaves under similarly under similar circumstances అనేది జడత్వానికి పునాది ఇవాళ అది మారి పోయింది జడం సుప్తమయిన చైతన్యమే ”అని ఒప్పుకున్నారు దీనినే ”conceiled ”consciousness ” అన్నారు .ఆంటే పదార్ధం జడం గా కనిపించినా అందులో చైతన్యం సుప్తం గా వుంటుంది .ఆంటే ఇప్పుడు జడం చేతనా ఒక్కటే అన్నది నిర్ధారిత మయింది .ఈ విషయాన్నీ మన మహర్షులు ఏ నాదో మనసుతో కను గోన్నారు కానుక శాస్త్రీయ దృక్పధాన్ని ఆలోచనా పరిధి దాటి వేరొక మార్గం లో ఆంటే ఆత్మ శక్తి తో ఈ విషయాలు నిరూపించా టానికి ఎక్కువగా వీలుందని తెలుస్తోంది .సాస్తాజ్ఞుల హద్దులు ,గీతలు ఇంక పనికి రావు
మీ దుర్గాప్రసాద్
Posted in మహానుభావులు
Leave a comment
అద్భుత శాంతి ( amazing peace)
కవి పరిచయం
మాయ ఏంజెలో అమెరికా లోని అర్కంసన్ లోని స్టంప్స్ లో జన్మించింది ఆమె కవయిత్రి ,రచయిత్రి , టీచర్, డైరెక్టర్, performer. ఇప్పుడు సాన ఫ్రాన్సిస్కో లో వుంది. తన జీవిత చరిత్ర రాసుకుంది. “I .know why the caged bird sings” వంటి అయిదు కవితా సంపుటాలు వెలువరించింది. .బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా పదవి ప్రమాణం చేసినపుడు ఆమెను ఆహ్వానించి కవితా సందేసం నిప్పించాడు. అప్పుడామె on the pulse of the morning కవిత రాసి జాతికి సందేసమిచ్చ్చింది ఆమె ప్రపంచ శాంతి కోసం రాస్తుంది అన్ని మతాల వాళ్ళు ఆమె కవిత్వాన్ని చదివి ఆనందిస్తారు సకల మానవాళికి ఆమె కవిత్వం ఆదర్శం. అద్భుత శాంతి అనే ఆమె కవిత మీ కోసం :
మనం ఆనందంగా వున్నా వేళ –ఒక చిన్న గుస గుస విని పిస్తుంది
మొదట్లో అది చాల మెల్లగా నేమ్మదిగావుంది –తర్వాత సగం వినిపిస్తుంది.
దాని బలం పెరిగిన కొలడి ఇంకా జాగ్రత్తగా వినాలని పిస్తుంది
అందులో అద్భుతం మాధుర్యం విన్పిస్తుంది –శాంతి అనే మాట చేరితే
ఇప్పుడది బిగ్గరగా విన్పిస్తుంది –బాంబుల విస్ఫోటనం కంటే పెద్దది గ అనిపిస్తుంది
ఆ శబ్దానికి కంపించి పోతం –దాని సాక్షాత్కారానికి నిస్చేస్తుల మవుతం
అదే మనం ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూసేది –దానికే అర్రులు చాస్తున్నాం
యుద్ధం కనుమరుగావటం మాత్రమె చాలదు –సంపూర్ణ శాంతి కావాలి
ఆధ్యాత్మిక సమభావం రావాలి –మన్నన మర్యాద కలిసిన సౌఖ్యం కావాలి
మన భవిష్యత్తరాలకు –వారి ఆత్మీయులకు సంపూర్ణ రక్షణ కావాలి
ఇది క్రిస్మస్ వేళ –పగ ప్రతీకారం స్వస్తి పలికే సమయం
ఈ శాంతి వేదిక పైన –మనం కొట్టగా ఒక భాషనే సృష్టించాలి
మనం మనకోసమే కాకా –ఒకరికొకరి కోసం మార్పు చెందాలి
ఈ పవిత్ర సమయం లో –పావన జీసెస్ జన్మ దిన వేడుకల్లో
శాంతి వాగ్దానోత్శావవేడుకలను –అప్యాయం గ ఆనందం గ జరుపు కొనే వేళ
భూమి పైన వున్నా సకల జాతులు –వాటి సహజ భాషలను గొంతులను వదులు కోవాలి.
ఆంగ్లమూలము : Maya angelo
తెలుగు అనువాదం : గబ్బిట దుర్గా ప్రసాద్
అనువదించిన తేది : 11-04-2008
Posted in అనువాదాలు
Leave a comment






























































