విపరీత వింత ప్రతిజ్న అనే పారడి

— ఆంధ్ర దేశం నా మాతృ భూమి కాదు .ఆంధ్రులంతా నా సోదరులు అసలే కాదు గాక కాదు
నేను నన్నే ప్రేమిస్తాను .సుసంపన్న మయిన ,బహు విధ మయిన నా వార సత్వ సంపద నాకు చిరాకు ,కంపరం అగౌరవం
దీని నుంచి దూరం కావటానికే నేను సర్వదాసర్వదా  నా సర్వ శక్తులు ధార పోస్తాను ప్రతి దానికి అనర్హత పొందటానికి నేను సర్వదా కృషి చేస్తాను
నా తాత ముత్తాతల్ని, తలి దండ్రుల్ని పెద్దల్ని వారి వారసత్వ సంపదాన్ని సర్వనాసనం చేస్తాను ,వారి ఆనవాళ్ళు మిగలకుండా జాగ్రత్తపడతాను

నా దేశం పట్ల నా ప్రజలపట్ల అనుక్షణం అవమానం కనపరుస్తూ ,అసహ్యించుకుంటూ కాకి బతుకు బతుకు తాను
వారి నాశనం ,సర్వ సంహారమే నా ఆనందానికి మూలము, మూల శంక కూడా
దెయ్యమా, రక్షించు నన్ను నా వింత ఆలోచలని ,నావిపరీత వైఖరిని
Posted in సమయం - సందర్భం | Leave a comment

””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’

””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’

నేను నా దేశాన్ని మాత్ర మే ప్రేమించటం లేదు ప్రపంచం అంత నా కు కావాలి నా ప్రేమ పంచాలి
నా దేశ వార సత్వ సంపద నాకు గర్వ కారణం అలాగే ప్రపంచ దేశీయుల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను ఎవరి వారసత్వం వారికి గొప్ప అని భావిస్తాను
వారసత్వ సంపదకు అర్హులవటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ నా దృఢ విశ్వాసం
నా తలిదండ్రుల్ని ,ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని,మంచి చెప్పే వారెవరయిన వారినందర్నీ గౌరవించి పూజిస్తాను
ప్రతి వారితోనూ మర్యాదగా ప్రవర్తించి నా సంస్కారాన్ని చాటు కుంటాను
నా దేశం పట్ల విశ్వ ప్రజల పట్ల సేవా నిరతికలిగి  l కివారికి సేవ చేయటం నా అదృష్టం గా భావించి మర్యాద పద్ధతిని పాటించి అందరికి దగ్గర అవుతాను
నేను ప్రపంచ పౌరుడనని గర్విస్తాను సంకుచితత్వాన్ని వదలి విశాల దృక్పధంతో సంచరిస్తాను
విశ్వ జనుల శ్రేయోభి వృద్ధులే నా ఆనందానికి మూలం నా సర్వస్వం .ఇంత కంటే నేనేమి కోరు కొను ””
తాతయ్య నన్ను క్షమించు    నీ మనవడు బుడ్డి
నేనూ ఇంటికి వచ్చ్చేసరికి నా మనవడు పదేళ్ళ బుడ్డి గాడు రాసిన కవిత్వం అది చదివి నేనే నోరు వెల్ల బెట్టాను నా పేరడీ కవిత్వాన్ని చదివి మంచి కవిత్వం రాస్తానని శపధం చేసి రాసినకవిత ట    అది సందేశం వుండాలి తిట్టుతూ రాస్తే మనుష్యులు మారారు అని నాకే నీతులు చెప్పి ఈ తాతకు దగ్గులు నేర్పిన మనవడు మా బుడ్డి గాడు కవిత్వం చదివి చెడి పోకూడదు బాగు పదాలని నాకే నీతులు నేర్పాడు అందుకే వాడు రాసినట్లుగా నే చెప్పిన ఈ కవితా మీ కోసం
మీ .దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహా భారతం

–ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరాకతను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస మహా భారతం .మానవుని భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవిత మంతా అందులో ప్రతిబింబించింది .నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతిలను వ్యక్తం చేసేది సాహిత్యం కధ లో ఉదాత్తత ,అద్ఫ్హ్యత్మిక విషయ ప్రాధాన్యం వల్ల భారతం విశిష్ట మయింది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్య సత్యాలకు ,ధర్మ ధర్మాలకు దైవ రాక్షస భావాలకు జరిగే సంఘర్షానే దీని లోని ఇతివృత్తం. అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాదించ బడింది .అందుకే ,వేదతుల్య మయింది .పంచమ వేద మయింది .వేదం లో శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ  ప్రాధాన్యం కలది .అసలు భారత కధను ఆధారం  గా చేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని విధి ప్రభావాన్ని లోకులకు తెలియ జేయటమే సత్యాన్ని ధర్మాన్ని లోకం లో ప్రతిస్తిన్చా తమే భారతం ఆశయం .
వేదసారం వుండటం, ధర్మం ,నీతి సులభం గా వివరించటంవల్ల bhqaratam స్మ్రుతి గ్రంధం అయింది .పురాణ లక్షణాలన్ని పూర్తిగా వుండటం చేత పురాణం అయింది .ఉపనిషత్తుల సారం వుండటం తో వేదాంత గ్రంధం అని పించుకుంది .రాసిం వాడు ”వ్యాసో నారాయణో హరిహి ”అని పిలువబడే విష్ణు అంశానికి చెందినా భగవాన్ వ్యాసుడు .ఆయన మహర్షి విజ్ఞాన వేత్త్స అవటం తో ఉదాత్తత కల్గింది .మహాభారత కాలం నాటికీ ఆర్య అనార్య సమ్మేళనం జరిగింది .అనేక వ్యవహారాలు కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ప్రాపంచిక విషయలపాయి అక్సక్తి పెరిగి ఆముష్మిక భావం తగ్గింది .దానితో సంఘం లో న్యాయం ,ధర్మం తగ్గాయి అధర్మ పరిణామమే భారత యుద్ధం .సంఘాన్ని వేదమాత సూత్రాలకు అనుసంధించి ,ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలముందు న్చాలని వ్యాసుని సంకల్పం .భారత కధ 24000 శ్లోకాలే తన ఆశయం నెరవేర్చా టానికి లక్ష శ్లోకాలతో విస్తుతం చేయాల్సి వచ్చ్చింది .ఇందులో కొందరు మధ్యలో కొంత చేర్చి వుండ వచ్చ్చు కూడా .అందుకే సంహిత అయింది .

భారత ఆంధ్రీకరణం కూడా లోక హితం కోసమే.రాజరాజు కాలం నాటికీ మతకల్లోలం ఎక్కువ గా వుండేది .చార్వాక మతం పెరిగింది .నిరీస్వారవడం పెరిగి .ఐకమత్యం దెబ్బ తిన్నది .అప్పుడు కుమరిల భట్టు పూర్వ మీమాంస రాసి ప్రచారం తెచ్చ్చాడు .మళ్లి యజ్న యాగాలకు మళ్లి ప్రభావం కలిగింది .అర్యమతనికి ఆదరణ కల్గింది అప్పుడే రాజ రాజు నన్నయను భర తన్ద్రీకరణకు ప్రేరే పించాడు కనుక ఇక్కడ కూడా లోక సంగ్ర్హనేచచ్చ కారణ మయింది
తిక్కన కాలం లో జైనం పెర్గివుంది .సోమనాధుని వల్ల వీర శైవం విజ్రుమ్భించింది మతకలహాలు పెరిగాయి .శైవ వైష్ణవాల వల్ల కొత్త సమస్యలు ఏర్పడ్డాయి కవుల మధ్య పోట్లాటలు పెరిగాయి ఈ క్లిష్ట పరిస్థితిలో తిక్కన మహా కవి రంగ ప్రవేశం చేసాడు .మార్గదర్శి అయాడు .సంఘ సంస్కరణకు పూనుకున్నాడు .బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ అంశాలుగా వారు చేసే సృష్టి స్థితి ,లయలు పరబ్రహ్మ లీలలు గా తెలియ జెప్పాడు .హరిహర మూర్తిని ఇష్ట దైవం గా భావించి శివ కేశవులు అభిన్నులు అని వివరించాడు .తిక్కన తర్వాత నాచన సోముడు ,కేతన ఇదే మార్గం అనుసరించారు .తరువాత వచ్చ్చిన్ asaiva వైష్ణవ కవులు పరదుషణ తగ్గించి సహనం చూపారు .అద్వైతాన్ని బోధించి జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చాటారు .ఏకమాత సూత్రాన్ని అల్లారు అద్వైతానికి పట్టాభిషేకం చేసారు /.ప్రజల తెలుగు అయిన జానూ తెనుగుకు పట్టాభిషేకం చేసారు .ఎర్రన కూడా ఇదే మార్గం లో నడిచాడు పంచమవేదం అక్నబడే ధర్మ శాస్త్రం అని పిలువబడే భారతాన్ని రుషివంటి నన్నయ .తిక్కన ఎర్రన అనే కవిత్రయం లభించటం ఆంధ్రుల అదృష్టం .
”ఘోర సంసార విజ్రుమ్భాణము బాపి ”అని నన్నయ అంటె ”జన్మాంతర ద్కాముల్ తొలగు నట్లు జేసి సుఖాత్ము జేయవే అని ”తిక్కన వ్యాసున్ని ప్రార్ధించారు .”భారతామృతాన్ని కర్ణపుటంబుల నారా గ్రోలి ఆంధ్రావళి మొదమున్బోరయునట్లుగా జేటు ”అని తిక్కన వ్రాసాడు ఇక్కడ అమృత సదం పర బ్రహ్మాన్ని సూచించేదే .భారతమ్రుతం అంతే పరబ్రహ్మకు భారతానికి భేదం లేదని చెప్పటమే .భారతం వింటే ఆనందం లభిస్తుంది ఆనందం ఇచ్చ్చే వాడు కూడా పరబ్రహ్మమే కదా .విద్య వల్లనే నీతి శ్రేయస్సు ,పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుందని కవి బ్రహ్మ తెలియ జేశాడు .యజ్ఞం చేసి సోమయాజి అయాడు భారతం చదివి యోగి అయాడు అందుకే గొప్ప సంయమనం కల్గింది ఆయనకు మనకు కల్గించాడు .ఇంతగా లోక హితం కోరిన కవి తర్వాతి కాలం లో లేడు అందుకే తిక్కన భారతంవ్యాస భారతం కంటే గొప్పది అని పేరు వచ్చ్చింది సంస్కృతం లో వాల్మీకి రామాయణాన్ని మించింది లెదూ తెలుగు భారతాన్ని మించింది కనిపించదు .లోక కళ్యాణం కోసం చేసిన రచన కానుక అది ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వం అయింది .ఆంధ్రుల జాతీయ సర్వస్వం తెలుగు భారతం .డాంటే రాసిన divine కామెడీ italiyanlaku హోమేర్ రాసిన iliad grrkulaku మిల్టన్ రాసిన paradise లాస్ట్ ఆంగ్లేయులకు వారి వారి జాతీయ జీవిత సర్వస్వాలు అందరు భావిస్తారు .వుత్క్రుస్తమయిన సారస్వతాన్ని నిర్మించి స్వార్ధ రహితులయి విజ్ఞాన వ్యాప్తి చేసి లోక హితం చేసిన మహా మహులే నిజమయిన జాతీయ నాయకులని అందరి విశ్వాసం
అలాంటి సారస్వత మూర్తులకు వందనం అభివందనం                                                                          బుధజన విధేయుడు     మీ   దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

కీచకవధ ;తిక్కన నేర్పు

— విరాట పర్వం లోని కీచక వధ వ్రుత్తంతంలో తిక్కన అద్భుత కవితా శిల్పాన్ని చూపాడు అతని కామా వృత్తికి అనుగుణంగా వనం లోని పక్షుల విహారాన్ని అతి సుకుమారం గా పోషించాడు .అతను కాముకుడు కానుక ప్రకృతి అంత కాముక వ్రుత్తి లో వున్నట్లు కన్పించింది .అతని లోని భావాలూ ఉద్రేక పరచటానికి ప్రకృతి బాగా తోడ్పడింది. అందుకే ”తనువు లింద్రియములు .మనము ద్రుతియు దన వశంబు గాక తల్లడ పడి సింహ బలుడు విషమ బణు బారి బారే ”అన్నాడు తిక్కన .ఇట్లా రోజంతా కామా ఉద్రేకం తో దహింప బడ్డాడు .సైరంధ్రి చేసిన సంకేతం కూడా గ్రహించ లేక పోయాడు .ముధత్వం ఆవహించి బుర్ర పనిచెయ్య లేదు .అనుమానం అనేది మనసులో రాలేదు అహంకారం ఒళ్ళంతా ఆవహించింది వివేకం కోల్పోయాడు .కాముకునికి లజ్జ ,భయలుండవు కదా .ఇలా ఒక కామంధుని మనో ప్రవృత్తిని మనముందు నిలబెట్టాడు తిక్కన మహా కవి .వివసుడాయి నృత్య మందిరం చేరాడు

దీనికి పూర్తిగా విరుద్ధం గా భీముడు రంగ ప్రవేశం చేసాడు .”గమకము వీక వేరొక వికారము పుట్టక సంగారోత్శావో —ద్యమ రాభసతి రేకముల్ బయల్పడుటిన్చుక లేక రోష సం –భ్రమ మొక యింత యైన బర భావ నిరుప్యమూ గాక ద్రౌపదీ —రమణుడు వోయి విక్రమ దురంధరతం దగ నాట్య శాలకున్ ”దీని భావం  తెలుసుకుందాం .జాగ్రత్తగా అన్ని వైపులు పరికిస్తూ తన తన బహు బల దర్పాన్ని ప్రదర్శిస్తూ ,మదించిన భద్ర గజం ఆంటే ఏనుగు లాగా ప్రవేశించాడు భీముడు .ఇక్కడ కీచక ,భీముల ప్రవర్తన లో వైరుధ్యం స్పష్టం గా చూపిస్తాడు మహా కవి మదందుడై అనుమానం  లేకుండా

అహంకారమే ఆయుధం గా కీచకుడు ప్రవేశించాడు నిర్వికారం గా గంభీర్యం తో ఆత్మ నిగ్రహం కోల్పోకుండా తన బహ బాల దర్పమే ఆయుధం గా భీముడు ప్రవేశించాడు అనుమానం లేకుండా కీచకుడు ప్రవేశిస్తే ,పరిసరాల్ని పరికిస్తూ భీముడు ప్రవేశించాడు ఇదే కవి ప్రతిభ .పాండవ రహస్యం బట్ట బయ లావు తుందేమో నని భీముడి భయం ,అనుమానం .ఇలా పాత్ర పోషణలో తిక్కన అసామాన్య శిల్పం ప్రదర్శించాడు .
రతి అనేది ఒక శృంగార భావం రెండు వైపులా ఉంటేనే శృంగారం గా మార్పు చెందుతుంది ఇప్పుడిక్కడ ఇది one వే traffic అందుకే భీభాచ్చ్చమయింది .వీరరసనికి ఉత్షాహం కావాలి అందుకే కీచక వధ తర్వాత్ భీముడిని ”మన వారిలోన నొక్కని నైన బిల్వక వుత్శాహంబు తో చేసిన సాహసాన్ని ”ప్రసంసించింది వుత్శాహాన్ని వీరం గా మార్చింది ఆమె .కీచకుణ్ణి అతిభీకరం గా చంపాడు భీముడు పేరు సార్ధకం చేసుకున్నాడు ద్రౌపది పరాభవాన్ని స్వయం గా చూసాడు కానుక రౌద్రం విజ్రుమ్భించింది .తన భార్య పట్ల కామంతో ప్రవర్తించి నందుకు వాడి కళ్ళను ,అతిగా వాగినందుకు ముఖాన్ని పతివ్రతను వెంటాడి జుట్టు పట్టుకున్నందుకు కాళ్ళు .చేతుల్ని యింక ఎందుకు పనికి రాని స్థితిలో,ఇతరులు చూడటానికి భయం గొలిపే టట్లు రూపం చెడె టట్లు శరీరం లోకి తోసి కుక్కి కీచక దేహాన్ని ఒక మాంసపు ముద్దగా చేసాడు గండర గండడు అయిన భీమ సేనుడు .ఇది ఆధునిక కాలం లో కీచకులు గా ప్రవర్తించె వారందరికి రాక్షస సందేసమే  మే ఇది .” తి క్కనా నీకు మొక్కనా నా ఋణం తీర్చుకోనా”
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

భ .రా. గో ..గారి హాస్యం

భ కా రా ఆంటే భమిడి పాటి కామేశ్వర రావు గారు హాస్య బ్రహ్మ బిరుదాంకితులు .వారి హాస్యం కోనసీమ కొబ్బరి కాయంత రుచి ఆ నీటికి జవం ,జీవం స్వచ్చ్హత ఉన్నట్లే వారి హాస్యానికి అవే లక్షణాలు అబ్బాయి మాటల చర్నకోలుతో ఒళ్ళు ఝల్లని పిస్తారు .హెచ్చ్చారిస్తారు .ఏడిపిస్తారు .అస్తిత్వాన్ని తెలియ జేస్తారు .moliar నాటకాలను తెలుగు లో మంచి దినుసుతో వండి వడ్డించారు .తిన్న కొద్దీ రుచి .శబ్దం లో హాస్యం సృష్టించిన ఘనాపాటి .మేస్టారి చేస్తూ వర్షికోత్చావా సభల్లో మాట్లడుతూ వాటి కోసం హాస్య నాటికలు రాసి ప్రదర్శింప జేస్తూ రావు గారు సృష్టించిన హాస్యం బస్తీ మే సవాల్
పరీక్షలు ఎలా ప్రారంభ మయినాయో ఒక చోట చెప్పుతున్నారు చూడండి ”కృష్ణుడి చేత క్షేమమం గా చూడబడ్డ pareekhittu మహారాజు పరీక్షల్ని సృష్టించాడు .అంతకు పూర్వమే చండ మార్కుల వారు ”మార్కుల ”విషయం కనిపెట్టారు .ఇదో వ్యంగ్య వైభవం .ముసి ముసి గా నవ్వు కున్నం కదా ?ఆయనే ఇంకో చోట ”అసలు దేశం లో బలం వుంటే కానీ ఉపదేశం లో బలం ఉండదని చమత్కరిస్తారు .తెలుగు లో ఎన్నో పదాలు వచ్చ్చి చేరాయని చెబుతూ ”తెలుగు యొక్క మెత్త  దనం వల్లే ఇన్ని న్ని భాషల పదాలు బానాళ్ళ ,హృదయం నాటేలా తెలుగులో గుచ్చ్చుకు పోయాయి .తెలుగు శరీరం వాటిని నిల్చి ఉండనిస్తే అవి సేలలు వేసి ప్రాణం తీస్తాయి కొందరు బయటికి లాగి పారేస్తే వెంటనే ప్రనంపోకడ అనికొందరు అంటారని తెలుగు తనం తగ్గి పోతోందని హాస్యం మిళాయించి వాయించారు ప్రస్తుతం గొప్ప తెలుగు వాళ్ళ పట్ల పనికి మాలినది ల వున్న భాష తెలుగు అని ఆవేదన చెందారు
భమిడి పాటి వారి hasyam ””” దసరుపకం ”అనే చిత్ర మయిన రచనలో అనేక వంపులు సొంపులు పోయింది .పుస్తక విమర్శ ఎలా చేస్తారో ,వ్యక్తిగత ద్వేషం ఎలా చొచ్చ్చుకు పోతుందో అసలు చదవకున్దంర్ విమర్శలు ఎలా రాస్తారో ఇందులో చాల అద్భుతం గా చూపారు అందరు చదివి తీరాల్సిన రచన .అందులో మహా అద్భుతమయిన కొస మెరుపు ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది చూద్దాం రండి
గోపి నాధం రసరాట్టు గారికి ఒక వుత్తరం రాస్తాడు ఆయన గోపీనాధం రచనను సమీక్షిస్తూ ”పాండిత్యం లో లోతుకి కధ లోని నీటుకి వూర్జే సరిపోయింది .మొదలు ఎలా వుందో చివర అంతె .”అని రాసి పడేస్తాడు .గోపి నాదం మళ్లి రాస్తూ అది తన రచన కాదని ,తనది తన జేబులోనే వుందని ,చాకలికి వెళ్లిందని ,వచ్చ్చేసిందని దాన్నే పంపిస్తున్నానని మళ్లి తీరిగ్గా సమీక్షించ మని కోరాడు .రసరాట్టు తెలివిగా ”మరొకరికి పంపాల్సింది నీకు పంపాను అని ప్రారంభించి ”ఈ కవి సుప్రసిద్ధ పండిత పుత్రుడు .వున్న తప్పులు కుర్ర తప్పులు కనుక క్షమించ వచ్చ్చు .పాండిత్యం లో వుండే లోటు కూడా క్రమం గా అదే సర్దుకుంటుంది ”అని పూర్వపు సమీక్షంకు దిద్దు బాటు చేస్తాడు గోపి నాదం దీనికి సమాధానం గా ”ఆ రచన నాది కాదు సలాం .మా నాన్న గారిది ”అనిరాసి పంపాడు రసరాట్టు తెలివిగా ”రచన మిక్కిలి వుత్క్రుస్టం ఫక్తు చేవ గుంజు .మారుమూల పదాల కాణాచి నవీన విగ్జ్ఞానం కూడా వుంది .పూచి నాది ”అని భక్తీ నటిస్తూ రాసి పంపించాడు
మళ్లి గోపీనాధం ”అయ్యా /ఆ రచన ఒక బియ్యే గారిదిట ”అని చల్లగా బయట పెట్టాడు .వెంటనే ఈయన సమాధానం గా ”ఇంగ్లీషులో చదూకున్నదన్త పొట్టి గ్రాఫు దింపాడు సరుకు దిగుమతి ఎక్కడ్నించో చెప్ప లేదు రచనంత యింగ్లీషు కంపే .భాష మాత్రం ఆంధ్రన్గ్లద్రవిడవంగా దప్పళం ”అని తేల్చేసి lite తీస్కోమని రాసి పారేసాడు గోపీనాధ సమాధానంగా ”ఆ రచన ఘంట రావు దిట ఆయన మొన్న మీ ఎన్నికల్లో మీకు పని చెసాట్ట కదా/ అని రాసాడు రసరాట్టు నాలిక కరచుకొని ”ఈ రచనలో రసం ఆవకాయ వుఉట లాగా వూరి పోవటమే కాదు ,సముద్రపు పోటు లాగా ఉబ్బి మీద పడుతుంది మాట మధురం శైలి మనోహరం ”అని ములగ కొమ్మ ఎక్కించాడు .అవకాశా వాదాని కి పరా kasta .ఈ సారి గోపి నాదం ”యిది కేతయ్య గారి రచనట మీ యిద్దరికీ పడదట kaqda ? ”అని ముక్తాయింపు ఇస్తాడు .దీనికి దీటుగా రసరాట్టు ”యిదంతా daridragottu రచన ఇంత దారిద్ర రచన భూమి పయి కానీ అంగారక గ్రహం పయి కానీ లేదు .బుద్ధి గల వదేవడుచదవాడు ఇందులో అర్ధంవ్యర్ధం భావం అభావం .రసం నీరసం .స్య స్య కొయ్య ధార నార .నుడికారం సుడిలో పడింది కారకం మారకం  అయింది ఇది ఎవరయినా చదివితే పెద్ద వొట్టు ”అని కేతయ్య పై తన పగ తీర్చుకున్నాడు ఎవరు రాసారో వారి గురించి పొగడ్తో ,తెగడ్తో తప్ప అసలు రచన చదివి సమీక్ష చేసే సహృదయత లేని విమర్శక రంధ్రన్వేషకుడు రస రాట్టు .
మళ్లి గోపీనాధం ”ఇది శ్రీనాధుడి రచనట నాన్న గారు చెప్పారు ”అని చావు కబురు చల్లగా చెప్పాడు రాతలో రసరాట్టు తక్కువ తినలేదు ”ఈ రచనలో రస స్ఫూర్తి పద సౌష్టవం ,భావ విశేషం గుర్రపు నడక భాష మేళనం వుంది ”అని నెత్తి కెత్తు కున్నాడు .ఇదంతా వూసర వెల్లి రంగులు మార్చి నట్లు వుంది కదూ ?పట్టు వదలని గోపి నధఆ మఖరి అస్త్రం గా ”మీ పేర నేనూ రచన పుష్కరం కిందట మీరు రాసిందే నట అది మీ రచనల్లో చాల గోప్పదట నాన్న గారు స్వహస్తాలతో రాసి దాచి ఉంచు కున్నారట .నేనూ మీకు పంపింది అదేనేమో ”అని దిమ్మ తిరిగేట్లు రాసాడు పట్టు వదలని రస రట్టు ”నేనూ అసలు వూల్లొ లేను నీకు రాసిన జాబులన్నీ మా అమ్మాయి రాసినవే ఆ విమర్శా లన్ని మీ నాన్న గారివే విమర్శా నమునా ఎలవుండలో రాసి అట్టే పెట్టు కున్న మీ నాన్న గారి కాగితాలే అవి ,.పొరపాటన నీ మొదటి వుత్తరం లోనే ఇక్కడికి వచ్చ్చాయి నా రచన నిరుడే కుమ్భాయ్య గికి మీ నాన్న ఇచ్చ్చారు .అయిందేదో అయింది ఇంతకీ నీకు పెళ్లి అయిందా ?”అని ముగిస్తాడు .తగిన వరుడు తన కూతురికి దొరికడన్నా సంబరం తో అతని కంటే ఘనుడు ఆ చంట మల్లన్న సామెత రుజువు చేసే భ కా రా మేస్టారి రచన యెంత సృజనాత్మకం గా వుందో చూసారా /?

ఉత్తరాలతో ఆడుకున్నారు మాటలతో బాదారు వినోదాన్ని ఉల్లాసాన్ని పంచారు ఇద్దరి హృదయాల్లోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుత హాస్య సృష్టి చేసిన హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కమేస్వారారో మేస్టారు .సిద్ధాన్నం గా హాస్యం వండి వడ్డించారు గడుసు దనం చమత్కారం ఈ ”దసరుపకం ”లో దశ రుపాలయి మనిషి లోని dasavataralni ఆవిష్కరించారు hatsoff   మేస్టారు   మీ హాస్యపు జడి వానలో తడిసి ముప్పందమయిన మీ శిష్యుడు

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

“హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత   ఖదోపెతంబు ,నానా రాసాభ్యుదయోల్లస్సి విరాటపర్వము”  అని తిక్కన విరాట పర్వ ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్నీ ముందే చెప్పాడు.  ఇందులోని కధ మన జీవితానికి చాల దగ్గర. వీర, శృంగార రస పోషణకు వీలు .అందుకే హృదయాహ్లాది అయింది .అనేక సన్నీ వేసాల్లో ,వ్యక్తుల ప్రవర్తన ,నిజ స్వరూపం ,శీలం ,స్వభావం ఇందులో బాగా వ్యక్తమవుతాయి .లౌకిక జీవితం సంపూర్ణంగా ప్రతిబింబించింది .కీచక వధ ,ఉత్తర గోగ్రహణం అభిమన్యు వివాహం దీనిలో ముఖ్య ఘట్టాలు .మొదటి దానిలో వీర, రౌద్రాలు ,రెండవ దానిలో వీర,హాస్యాలు చివరిలో లలిత   శృంగారం  వర్ణించాడు .   .
కీచక వధను ప్రబంధం గా తిక్కన రాసాడు .అసహాయ స్థితిలోని స్త్రీకి జరిగే అవమానం ,శీల రక్షణ కై ఆమె చేసే ప్రయత్నం దాని ద్వార వివిధ పరిణామాలు లోక సామాన్యమయినవి కనుక ఇతివృత్తం సహజ ఆకర్షణ పొందింది .పరులను ఆశ్రయించటం ,రాజాశ్రయం లోని కష్టాలు పాండవుల విరాట్ నగర జీవితానికి నిలువు అద్దం పట్టాయి .విరాటుని వినోదం కోసం భీముడు మల్లుల తోనే కాక ,సింహలతోను పోరాడ వలసి రావటం దాసి కనుక రాణి సుధేష్ణ చెప్పినట్లు చేయ వలసిన  దీన స్థితి లో  ద్రౌపది వుండటం ,తన అభిప్రాయాన్ని కాదన్నాడని ధర్మ రాజుని విరాటరాజు పాచికలతో కొట్టి అవమానించటం ,పాండవుల మీద మనకు సానుభూతి కలుగుతుంది ,.దీనికి అంతటికి కారణం ధర్మరాజు  జ్యుతం దాని ఫలితంగా పొందిన దాస్యం .అందుకే బలవంతులయిన పాండవులకు నిస్సహాయ స్థితి కల్గింది .సామాన్య మానవా జీవితం లో కనిపించే స్త్రీ లోలత కీచాకునిలో ప్రతిబింబించాయి .యుక్తాయుక్త విజ్ఞత లోపిస్తే కలిగే పరిణామం ఇదే నని మనందరికీ హెచ్చ్చారిక
కామా,క్రోధాలు కీచక వృత్తంత విషయం కానుక తిక్కన దీన్ని ప్రబంధ విధానం గా నడిపి మనస్సులను ఆకర్షించాడు .ఉద్యానవన ,సూర్యోదయ అస్తమయ వర్ణనలు తరు వాత వచ్చ్చే ప్రబంధ యుగానికి తోలి మెట్లు .,మార్గదర్శకం కూడా .వీటిని ఎర్రన ,నాచనా సోమన గ్రహించారు.   శ్రీనాధుడు స్వీకరించి పోషించారు .కృష్ణ దేవరాయల కాలం లో పరిపక్వ స్థితి పొందింది.


”నిరజాకరములు నిష్టమై   జేసిన భవ్య తపంబు ఫలమనంగా –  దివస ముఖాభినండిత చక్ర యుగ్మకంబుల యను రాగంపు బ్రోవనంగా – హరిహరబ్రహ్మ మహానుభావంబు లోక్కటిగాగా గరగిన గుటికా యనగ – నటుల వేదత్రయ లతికాచయము పెను పొంద బుట్టెడు ములకందమనగా  – నఖిల జగముల  కన్దేర యగుచు జనస – మాజా  కరపుట హృదయ సరోజ ములకు – ముకులనంబును ,జ్రుభనం మునునోనర్చి   భాను బింభము పుర్వాద్రిపై  వెలింగె”  అన్న  ఈ పద్యంలో  తిక్కన ప్రతిభ  అసామాన్యము.  భవ్య తపస్సు, పరంజ్యోతి స్వరూపం, విశుద్ధ  ప్రేమ ఒక క్రమ పరిణామం.  హరి హర బ్రహ్మైక్య జ్ఞాన మూర్తి మూడు వేదాలకు కారణమైన పరబ్రహ్మ స్వరూపం.   లోకాతీతమైన అలౌకిక ఉపమానాలతో వర్ణన చేయటం వలన ఉదాత్తట కలిగింది. మనోహరంగా ఉంది. సూర్యుణ్ణి పరబ్రహ్మగా చెప్పటంలో  వేద ధర్మాన్ని నిరూపించాడు తిక్కన.  సూర్య భగవానుడు చైతన్య ధాత అని, జ్ఞాన ప్రదాత అని “కందేర” అనే మాటలో నిక్షిమ్ప్తం చేసాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన సూర్య దర్శనం హృదయ వికాసం కలిగిస్తుంది. ఉపమానాలు పవిత్రమైనవి అవటంతో ఉదాత కవితా తత్త్వం ఆవిష్కార  మైంది. ఇలాగె సూర్యాస్తమయాన్ని కుడా భావనా చమత్కారంతో రాసాడు.  సూర్యుడు పచ్చిమ దిశకు చేరగా అది సంధ్య అరుణ రంజితం అయినాడట.   భర్త వస్తే భార్యకు రాగ రంజితమే కదా.  ఆ పద్య వైభవం చూడండి.
” ఇనుడు తన కడకు నేతెంచిన రాగము బొండు తడి యుచిత మనగా – గెంపున మెరసి పచిమసాం – గన జన సంభావనముల గారవ మండెన్”
ఇనుడు అంతే సూర్యుడు & భర్త అని అర్ధం.  రాగం అంతే ఎరుపు & అనురాగం అని భావము.   అర్థ శ్లేషతో గొప్ప చమత్కార వైభవం గల పద్యం ఇది.  భర్త విరహంలో ఉన్న పశ్చిమ దిశా అనే స్త్రీ కి భర్త అనే సూర్యుని సమాగమం కలిగింది అందువల్ల ఆమె లోక సంభావ నియురాలు అయింది.   కులకాంత గౌరవం దక్కింది.   ఈవిధంగా ప్రకృతి వర్ణనతో సహజ అలంకారం చమత్కారం చూపి హృదయానికి వికాసం కలిపిస్తాడు కవి బ్రహ్మ తిక్కన.

ఈ భావాలూ మీకు నచ్చితే  వరసగా తరువాత మరి కొన్ని తిక్కన మహా కవిస్వరుని భావాలను ఆవిష్కరిస్తాను.

మీ…………..
దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభ ఉపన్యాసం

మా కుటుంబ ఆయుర్వేద డాక్టర్ చిన్మయ గారు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక బ్రాంచ్ నీ ప్రారంభిస్తూ ఆ సభకు నన్ను అధ్యక్షులుగా చేసారు అందులో మాట్లాడిన విశేషాలు అందరి కోసం   మీ .దు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

”డింగరి కి అప్పుడే అరవయి ఎ’ళ్ళా” ?

పాతాళ భైరవి సినిమా కు అరవయి ఏళ్ళు వచ్చిన సందర్భం గా నా అనుభూతిని మీతో పంచు కుంటున్నాను ”డింగరి కి  అప్పుడే అరవయి ఎ’ళ్ళా”  అన్నా వ్యాసం తో

మీ దు .

Posted in సమయం - సందర్భం | 3 Comments

శాస్వతానందం -ఆలోచనాలోచితం

ఇవ్వాళ (15.03.2011) ఆకాశవాణి  విజయవాడ లో ప్రసారమైన వ్యాసం మీ కోసం

Posted in రేడియో లో | 1 Comment

అన్నపరెడ్డి గారి సన్మాన సభ వార్తా పత్రికలలో

13.03.2011 జరిగిన సన్మాన సభ వివరాలు వార్తా పత్రికలలో ప్రచురితమైనవి మీ కోసం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

అన్నప రెడ్డి గారి సన్మాన సభ – 13.03.2011 సరసభారతి ఉయ్యూరు

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

 

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

“మా అక్కయ్య” అనురాగ కవి సమ్మేళనం- మార్చ్ 27 న- ఆహ్వానం

అందరికి ముందుగ కసరి ఖర నమ సంవత్శర ఉగాది శుభా కాంక్షలు సరస భారతి మార్చ్ నెల 27  వ తేది ఆదివారం మా అక్కయ్య శీర్షిక తో అనురాగ కవి సమ్మేళనం నిర్వహిస్తోంది 80  మంది కవులు పాల్గొనే ఈ మెగా కవి సమ్మేళనానికి మీరు అందరు ఆహ్వానితులే        మీ దుర్గా ప్రసాద్

 

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

కాముని పున్నమి – “హొలీ”

గూటిలోని గువ్వలకు   హోలీ గురించిన విషయాలు. అందరికి హొలీ శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | 5 Comments

బండ్ మీద బొంద పెట్టారు- రామారావు కీ ఏమి చెప్పాలి

బండ్ మీద బొంద పెట్టారు
— ట్యాంక్ బండ్ బొంద పెట్టారు
మహామహుల విగ్రహాల్ని
ఆగ్రహం నిగ్రహం లో లేకుంటే అంత మహా స్మసానమే
కూల్చింది విగ్రహాల్ని కాదు జాతి పరువు ప్రతిస్టల్ని
మన సంస్కారాన్ని ,సంస్కృతిని
జాతి గౌరవం సాగర్ లో కలిసిన వేళ
ఆ నీళ్ళఅంత  అయింది మన జాతి ,,నీతి
మహాను భావులు వాళ్ళకేమి లోపం కాదు
మనకే చుట్టుకుంటుంది ఆ పాపం అదే అవుతుంది శాపం
విచక్షణ లేని జాతికి వినాసనమే మిగుల్తుంది
దుర్యోధన రాజ్యం లో నోరు మెదపని కురు పెద్దల లాగా వుంటే
మిగిలేది ఆత్మ వినాసనమే ,రోదనమే ,సంక్షోభమే
ఎవరు కుల్చారన్నది కాదు ఎందుకు ఎందుకిల ప్రవర్తించారని
వారంతా మన జాతి జీవన సర్వస్వం ,మన తండ్రి,తాత ,అమ్మా అక్క చెల్లి సోదరులు కదా
మన వాళ్ళను మనమే తగల పెట్టు కునే వార సత్వమామనది .
సంయమనం పాటిద్దాం గోరి కట్టిన పరువును బయటకు తీసి తలెత్తుకు తిరుగుదాం
ప్రపంచం మనకేసిచూసి  సిగ్గుతో తలవంచు కుంది
కూల్చటం లో  చేసిన తప్పును నిర్మించి ఒప్పిద్దాం
హుస్సేన్ సాగర్ మురికి లోకి  జారిన పరువుని పైకి తెద్దాం

వాటిని కాపాడుకోలేదని ఫై నున్న రామారావు కీ ఏమి చెప్పాలి ?
ఈ కళా ప్రాంగణం భవిష్యత్ రాష్ట్ర వికాస వైభవాలకు ఐక్యతకు అవగాహనకు ప్రగతికి దివ్య సజీవ సంకేత క్షేత్రం కావలి!
యన్. టి. రామారావు.  1-11 -1986

తెలుగు వెలుగుల  మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం ప్రారంభోత్సవ సందర్భంగా

ఆవిష్కరణ మీకోసం

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఇం’కోతి’ “రవణ”

అందరికి నమస్తే మైనేని గోపాల కృష్ణ గారు ఆదరం తో పంపిన ముళ్ళపూడి రమణ గారి ”ఇంకోతి కోమ్మచ్చి’చదివి వెంటనే ఆయన మాటలతోనే ఆయనకు ఆంటే రమణ గారికి అర్పించిన అక్షర అశ్రు నివాళి ,ప్రశంస, పొగడ్త,గట్ర         ఈ కోతి గాడి కోమ్మచ్చి ఆట చూడండి   నచ్చితే ఆడుకోండి ,లేకుంటే కొమ్మ మీద విసిరేయండి     ఇంకో ఇంకోతి  దుర్గా ప్రసాద్

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

సత్యమేవ జయతే

వూసుల గూటి(బ్లాగ్) లోని తోటి వారికి  ఇంకో గువ్వను(పోస్ట్) చేరుస్తున్నా. పదిలంగా వుంచండి    ఇది ప్రతి మంగళవారం ఆకసవని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ఆలోచనా లోచనం లో ఈ ఉదయమే ప్రసారమయిన లో చూపును వెలిగించే చిరు దివ్వె ”సత్యమేవ జయతే”   మీ అందరి కోసం    మీ దుర్గా ప్రసాద్

Posted in రేడియో లో | Leave a comment

ముదితల్ నేర్వర గా రాని విద్య గలదే ? జయహో మహిళా !!! అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు

అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు .

అయినా మహిళా లఫై అనాదరం పెరిగిందే కానీ తగ్గలేదు .వారికి రావల్సిన
భాగ స్వామ్యం ఇవ్వటానికి పురుష పుంగవులు తాత్స్చారం చేస్తూనే వున్నారు .వారికీ పదవులు వచ్చినా బ్యాక్ డ్రైవింగ్
చేస్తుండటం సిగ్గు చేటు వారు సమర్దులే ఏ పనినయిన నిర్వ హించ గల సామర్ధ్యం మహిళలకు వుంది. మన సంకుచిత
భావాలూ వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నాయి

శ్రీ చిలకమర్తి వారు ప్రసన్న యాదవ నాటకం లో చెప్పిన పద్యం హృద్యం
శిరో ధార్యం అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు కూడా ”

చాడువన్నేర్తురు పుఉరుషుల్ఆంటళ్ళూ  బలే నే సాస్రంబుల్ పతిని మెమ్పించుచో………   ;
నదమన్నేర్తురు సత్రుసేనల ధనుర్ వ్యపారముల్ నేర్పుచో   నుదితో త్చాహ ము
తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిస్టించుచో . ముదితల్ నేర్వర గా రాణి విద్య గలదే ముద్దార నేర్పించినన్ ,”

ఆంటే ఆడ వాళ్ళు పురుషుల లాగా చక్కగా చదవగలరు ,శత్రువుల్ని చేల్చి చెందాడ గలరు ,ప్రపంచాన్ని పరి పాలించ
తగిన సామర్ధ్య వున్న వాళ్ళు ప్రోత్చ హిస్తే మహిళలు చేయ లేని పని ఏది లేదు అని చిలక మర్తి చెప్పారు

స్త్రీ పురుష సమానత్వం గురించి ఇంకా మాట్లాడు కున్తున్నామంటే మనం ఇంకా ఏ దశ లో ఉన్నామో ఆలోచించాలి
జీవన సమరం ఆటు పోటు ఇంకా ఎదుర్కొంటోంది బతుకు బండి యీడ్వటం కష్టం గానే వుంది .సమాజము ఇంకా
చిన్న చూపే చూస్తోంది అన్నిటికి ఆడది కావాలి కానీ ఆమెకు గౌరవం ఇవ్వటం లో వెనక బడి వున్నాం

చదువుల్లో ముందున్నారు ,అన్ని పోటీల్లో నెగ్గు కోస్తున్నారు క్రీడల్లో కీర్తి తెస్తున్నారు అత్యున్నత పదవి కూడా పొందుతున్నారు
కానీ ఇంకా అభద్రతా భావంలో నే వుండటం శోచనీయం. వేధింపు లెక్కు వాయినాయి ,వేదనలు పెరిగాయి ,చట్టాల వలన
భయం లేదు చట్ట సభల్లో వాణి వినిపించుకోరు.గ్రామీణ స్త్రీantలు వున్నత విద్య లో దూసుకు పోవాలి వారికి ఇచ్చిన
సౌకర్యాలను వినియోగించు కోవాలి ఉపాధి విద్యలలో రానించాలి స్వయం ఉపాధి పధకాలను సార్ధక చేసుకోవాలి

వికృతమయిన పోకడలున్న సమాజం మనది దారి తప్పటానికి అవకాశాలెక్కువ సంయమనం వహిస్తూ వివేకం తో
ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి పాకుడు రాళ్ళ మీద నడవ రాదు .

ఈనాటి సమాజంలో మహిళా ఉనికి కాపాడు కోవాలంటే ఆత్మ స్థైర్యంమ్ ,ధైర్యం తప్పని సరి .సాహసం లేక పొతే అడుగు
ముందుకు వెయ లేరు .సేవా భావం వారికి పుట్టుక తోనే వుంటుంది దాన్ని మరింత సార్ధకం చేసుకోవాలి సమస్యలను
చూసి బెదిరి పోకుండా పోరాటం తో విజయం సాధించాలి వంట ఇంటికి మాత్రమే పరిమితం కారాదు

.దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలి తెలుగు లో మాట్లాడి ,పిల్లలకు తెలుగు నేర్పించాలి
తల్లి మొదటి గురువు అన్నది మర్చిపోరాదు .సంఘటిత మహిళా శక్తి దేనినయిన సాధిస్తుంది అని తెలుసు కోవాలి
.తానూ విద్యనేర్చి తన కుటుంబానికి విద్య నందించాలి విద్య లేని తల్లి ఇవాల్టి సమాజం లో నిలదొక్కుకోవటం కష్టం

.మహిళా ఆంటే శ్రమైక జీవన సౌందర్యం ఆత్మా విశ్వాసమే మహిళకు పెట్టని ఆభరణం.

అందుకే  వో మహిళా మేలుకో ,ఏలుకో ,తల ఎత్తుకొని జీవించు తలపోగరు వాళ్ళ తలలు వంచు రుద్రమ దేవి ఝాన్సీరాణి
,శారద మాత ,మదర్ తెరెసా దుర్గాబాయి నీకు స్ఫూర్తి

వందనం అభివందనం అభినందన చందనం                  దుర్గా ప్రసాద్  ,

Posted in సమయం - సందర్భం | 1 Comment

పాలపిట్ట ఫెబ్రవరి – 2011 — అన్నపరెడ్డి గారి సన్మాన ఆహ్వానం

శ్రీ అన్నపరెడ్డి గారికి సన్మానం

అందరూ ఆహ్వానితులే

అన్నపరెడ్డి గారి గురించి పాలపిట్ట ఫెబ్రవరి సంచిక నుండి

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Leave a comment

తెలుగు బ్లాగు కి పర్యాయ పదం

ఉసుల గూదు

http://groups.google.com/group/telugublog/browse_thread/thread/17676e4eef786d33

నా పదం : ఉసుల గూదు

Posted in సమయం - సందర్భం | 2 Comments

బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత

ఉసూల గూడు  లోని తోటి వారికి   బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత అనే అంశం మీద చేసిన radio ప్రసంగాన్ని మీ ముందుంచుతున్నాను .

Posted in రేడియో లో | Leave a comment

ఆలోచనాలోచనం సమయాన్ని సార్దకం చేసుకోవటం ఎలా

 

Posted in రేడియో లో | Tagged | 1 Comment

ఆలోచనాలోచనం పశ్చాత్తాపం పాపశమనం

అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కీర్తి శేషులు వాకాటి పాండురంగ రావు గారి భావ ధార

అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం

Posted in రేడియో లో | Leave a comment

ఓంకార నిజ దర్శనం

మిత్రులకు నమస్తే .ఓంకారం నిజడర్సనాన్ని మీ ముందు ఉంచుతున్నాను చదివి ఆనందించండి

అది దేశలకతీతం అని అని గుర్తించండి శివరాత్రి శుభాకాంక్షలతో    మీ    దుర్గాప్రసాద్

ఓంకార నిజ దర్శనం

ఓంకార నిజ దర్శనం -౨

Posted in సమయం - సందర్భం | 2 Comments

అనుమాన శిష్యుడు అనే శంక లెంక

అనుమాన శిష్యుడు అనే శంక లెంక

మొన్న బాపు రమణలకు డబ్బా బాగా కొట్టారు అని మిమ్మల్ని అంటున్నారు గురువు గారు అన్నాడు నా శిష్యుడు .

ఆ మాట అన్న వాడు తెలుగు చదివి వుండదు .పాపం కాన్వెంట్ చదువుల వాడు అయి వుంటాడు  తెలుగు పుస్తకం
అసలు చూసాడో లేదో అన్నాను

.ఢంకా బాగానే బజాయిస్తున్నారు  అంత గోప్పెమిటో చెప్పచ్చుగా అన్నాడు మళ్లి

సరే విను అన్నాను .

బాపు తీసిన సీత కళ్యాణం సినిమా లండన్ స్కూల్ అఫ్  ఆర్ట్స్   లో   అధ్యయనం కోసం ఉంచారని నీకు తెలియదు దానికి
రమణే మాటకారి అని నీకు అస్సలు తెలియదు .తెలుసుకో నాయన  అన్నాను

.రమణ గారి ముందు హాస్యం లేదా అంత కు ముందు  అంతా శూన్యమేనా సన్నాయి నొక్కులు నొక్కాడు మళ్ళి నా శిష్యుడు

.ప్రతి దానికి కాలం సమయం,సమాజం, ఆధారం రా  బాబు అన్నాను .మనకు హాస్య రచయితలూ తక్కువే .ఆధునిక కాలంలో మరీని అన్నా.

వీరేశలింగం గారు ,చిలకమర్తి పానుగంటి హాస్య రచనలు చేసారు. మొదటి ఇద్దరు ప్రహసనాలు రాసారు
చిలకమర్తి  రాసిన గణపతి నవల హాస్యమే,.అయితె అందులో కొంత మొరటు హాస్యంవుండి మరీ చెవులు పిండి నవ్వించి నట్లుంటుంది

పానుగంటిసాక్షి  వ్యాసాలు సమాజం మీద గొప్ప చురకలే,మరకలే .హాస్యం దేప్పిపోడుపులతో సూటి పోటి మాటలతో కర్కశంగా వుంటుంది .

తర్వాత గురజాడ కన్యాశుల్కం చెప్పు కోవాలి సమాజం లోని దురాచారాన్ని హాస్యం ,వ్యంగ్యం పూత పూసి మందుగా ఇచ్చారాయన
సంఘ సంస్కరణం అందులో అంతర్భుతం

.నాటి సమాజంలోని మనుష్యుల బలహీనతల్ని ఆవిష్కరించిన నాటకం అది అంతా గొప్ప నాటకం మళ్లి రాలేదని చెప్పుకుంటాం.

ఆ తర్వాత వేదం వెంకట రాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకం ఇందులో రాజకీయానికి హాస్యం అనుపానం తురక భాషలో
అస్తవ్యస్తం గా మాట్లాడటం ,చాకలి వాని .కులసంబంధమయిన భాషా నవ్వును తెప్పిస్తాయి

తర్వాత మొక్కపాటి వారి బారిష్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం లో వున్న చిక్కులు ,ఈ దేశం లోని అలవాట్లు ,అక్కడ
ఇమడలేక పోయిన పరిస్తితులు హాస్యానికి మూలాలు తప్పుల తడక తో చిప్పిల్లిన హాస్యం అది .అతని ప్రవర్తనమీద కలిగే ige
సాను భూతి లోంచి వచ్చిన  నవ్వు అది.

ఆ తర్వాత ఎవరు లే రా అన్నాడు లెంక శంకతో

భమిడి పాటి కామేశ్వరరావు గారు ,మునిమాణిక్యం నరసింహారావు గారిని వదిలితే చరిత్ర క్షమించ దు రా   అన్నాను

భమిడి పాటి కామేశ్వరరావు గారు మేస్టారు గారు కనుక లోక పరిశీలన పరిశోధనతో అన్ని కోణాల్లో హాస్యం పండించారు .ఆయనలో ఆలోచన పాలు ఎక్కువ
.ఒడిదుడుకులను,సుక్ష్మంగా పరిశీలించి,హాస్యం వండి వడ్డించారు .హాస్యబ్రహ్మ బిరుదు వారికీ వచ్చింది. నౌకరు పాత్రను ఆయన నడిపినంత
పకడ్బందిగా ఎవరు నడపలేదు. ఆయన పాత్ర లన్ని జీవితం లోనుంచి వచ్చినవే .ఆయనకు భాషా ఒక ప్రవాహం పదాలు అచ్చంగా అలాగా
ఉంటేనే బాగుంతయన్నంత గొప్పగా రాసారు .సమాజం మీద చెణుకులు.,మోలిఅర్ ప్రభావం ఆయన నాటికల్లో బాగా కన్పీస్తున్ది .ముద్ర రాక్షసం
నాటకాన్ని అచ్చ తెనుగు నాటకం గా మలిచి ,అంతా seriousness లోను సరదాగా నవ్వించారు .

మునిమాణిక్యం భార్యభార్తలలోని అనుబంధాన్ని భర్త అమాయకత్వాన్ని ,భార్య గడుసుదనాన్ని తెలివి తేటల్నిచూపిస్తూ నవ్విస్తారు నవ్వు మీద ఒక పుస్తకం కూడా రాసారు

అసలు విషయం వదిలి చాల దూరం వచ్చారు గురువుగారు  అన్నాడు

ఇదంతా తెలిస్తే అసలు విహాయం తెలుస్తుంది అన్నా .

.చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో,ఎలా మాట్లాడుతారో ఇంతవరకు ఎవరు రాయలేదు ఆపన్నీ రమణగారు చేసారు .మాట్లాడే భాషకు రూపం కట్టారు
.సుత్తితో కొట్టి నట్లు కాకా ,గిలిగింతలు పెట్టె మాటలతో చురకలంటించారు .అలాంటి తెలుగు మాటల్ని ఇంతవరకు ఎవరు అంతకు ముందు రాయలేదు
.కొత్త పాత్రలూ వచ్చాయి మనిషిలోని మనిషిని ఆవిష్కరించాడు .డొల్లతనాన్ని ,డాబు దర్పాన్ని అతి సున్నితమయిన భాషలో వెటకారంగా చెప్పి
ఎవడి గురించి చెప్పారో వాడె చదివితే వాడయిన నవ్వుకొని చావాల్సిందే .పరకాయ ప్రవేశం చేస్తాడు అది అందమయిన తెలుగు జీవం వున్న తెలుగు .నభూతో
గా వున్న తెలుగు కండగల తెలుగు .భక్తిని ,హాస్యాన్ని మాధుర్యాన్ని తెలుగుకు” కానుక ”గా ఇచ్చాడు .ఆ పదబంధాలు ఇదివరకు విననివి .ఆ వర్ణనలు ఎవరు చేయనివి
.ఆ పోకడే వేరు సమీక్ష రాసిన కధ రాసిన ,పొగిడిన తెగడిన అది అపూర్వం అనుత్తరం గా వుంటుంది .ఆ impactveru .తెలుగు జనజీవితాన్ని,భారతీయ సంస్కృతిని
ఆవిష్కరించిన జంట బాపు రమణ ఆ జంట పంట రత్నాల రాసి అన్నాను

చాలు గురువుగారు సత్యం తెలిసింది అరచేతితో సూర్యుణ్ణి ఆపలేం ఆపాలనుకుంటే అవివేకం అని శంక తీరి లెంక వెళ్ళాడు

మీ దుర్గాప్రసాద్.

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

శివరాత్రి విందు భోజనాలు

రచన : గబ్బిట కృష్ణ మోహన్
ప్రచురణ : సరసభారతి

ఉయ్యూరు ఉసులలో

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

శివరాత్రి మహత్యం

బ్లాగు మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

ముళ్ళపూడి వెంకట రమణకు సరసభారతి ఉయ్యూరు నివాళి

సరసభారతి ఉయ్యూరు

ఈమెయిలు మరియౌ బ్లాగ్ మిత్రులకు

తేది : 26-02-2011

సమయం : 5 గంటల కు సాయంత్రం

ప్రదేశం : ఉయ్యూరు గ్రంధాలయం

మాకు ఈమెయిలు మరియు బ్లాగ్ జవాబులు రాసిన వారి అందరి పేర్లు కూడా నివాళి లో చేర్చబడినది

సరసభారతి ఉయ్యూరు గ్రంధాలయం

సరసభారతి ఉయ్యూరు గ్రంధాలయం

పుస్తకాలే నేస్తాలు ఫోటో పెట్టడం ఎవారికి ఎస్తం లేక

ఫోటో పెట్టడం మా సభికులు ఇషం లేదు అందుకు అయన పుస్తకాలకే దండలు

దుర్గా ప్రసాద్ గారి అధ్యక్షులు

అనర్గళంగా మాట్లాడిన

విద్యార్ధి లోక ప్రతినిధి

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు

“బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు గురువు గారు?” అడిగాడు నా శిష్యుడు .

తెలిసి అడుగుతున్నావా తెలియాక అడుగుతున్నావా?  ఎరా :-  ముక్కుమూసుకుని  కళాసేవ చేస్తే ఎవరు గుర్తిస్తార్ర్ర ? అన్నాను. సభలు సమావేశాలకి రారు. ,
పదవిలో వున్నా వాళ్ళకి  కనబడరు .వాళ్ళ జేబులో బొమ్మగా వుండరు .చెప్పిన ప్రతి దాన్నికి తలూపరు.వ్యంగి బాణాలు,
కార్టూన్లతో బాదుతారు

ఫైగా. ప్రతిభ ను గుర్తించే అంతటి ఓపిక తీరిక ఎవరికున్నాయి .కంట్లో నానుతూ కళ్ళకు కనిపిస్తూ ,వుంటేనే దిక్కు లేదు. వీళ్ళ నెవరు పట్టించు కుంటరా ?అన్నాను.
మీరు ఏదీ సూటిగా చెప్పారు. డొంక  కదిలిస్తారు. మీతో గొప్ప చిక్కు అన్నాడు వాడు .

అది కాదు గురువు గారు ఈమధ్య గొల్లపూడి మరుతి రావు గారు కూడా వీళ్ళను గుర్తిచాలేదని బాధ పడ్డారు అందుకని అడిగా  అన్నాడు. మళ్ల్లి
ఏరా వాళ్ళకు పద్మాలు ఇవ్వక పోయినందుకు రేకంమేండ్ చేయ లేక పోయ్నందుకు రాష్ట్ర కేంద్రాలు సిగ్గు పడాలి .కానీ మన కేందుకురా బాధ?అన్నాను.

మనసులో కెలుకుతూ వున్నాకూడా,వాణ్ణి సమాధాన పరచటానికి .ఇంతేనా గురుజీ మనం చేతులు ముడుచుకు కుర్చోవల్సిన్దేనా? పట్టు వదలని విక్ర మర్కుడిలా
.ఒర్ని నీకో విషయం చెప్తాను విను జాగ్రత్తగా అన్నాను .

చెప్పండి స్వామి అన్నాడు.

ఒరి  నాయన ,సహస్రదళ పద్మం ల బాపు రమణల బుద్ధి వికసించి ,పరిణతి చెంది మార్గదర్సులుగా,మనల్ని ప్రభావితం చేస్తున్నారు వారి రచనలే గీతలే సిరి అంటే శ్రీ .కనుక వారె పద్మ శ్రీలు తెలిసిందా.

భలే చెప్పారు గురువు గారు అన్నాడు వాడు.అయ్యా అదేదో భోషానాలున్నయిగా వాటి సంగతేమిటి అన్నాడు నసుగుతూ. ఒర్ని నిదుంపతెగా అవి భోషణలు కాదు భూషణ్‌లు అన్నాను

.ఏదో నండి నాలిక జారింది అన్నాడు

సరే అదీ విను వారిద్దరు  రచనతో సౌందర్య చిత్ర రచనలో,నిర్మాణ,దర్సకత్వాలతో భూషణలయారు .కనుక వారిఇంటినిండా కళా భోషణాలు చాల వున్నాయి.
వారిద్దరూ  గీత రాతల పద్మభుషనులె. మరి ,మరి అని నసిగాడు మళ్ల్లి

నీ సందేహం అర్ధమయింది. విభుషనం సంగతేగా దానికే వస్తున్నా. విశిష్ట పురస్కారాలతో ,జన హృదయ అభినందన చందనంతో ,సత్కారాలతో ఎప్పుడో విభుషనులయారు .,
విశిష్ట భుషనులూ అయ్యరు .ఒరేయ్ పద్మమ్ వికసనా,నికి విస్ఫుర్తికి చిహ్నం తెలుసా?అన్నాను .

ఇక చివరి దానికి వస్తున్నా .వారు గీసినది తీసినది రాసినది అంతా భారతీయ సంస్కృతీ విభావమే .,అచ్చ తెనుగు తనమే తెలుగు వైభవమే .
ఆ రత్నాలను పండించి దోసిళ్ళ కొద్ది పంచి పెట్టిన జాతి వైభవ రత్నాలు వారు .అందుకని వారె భారత రత్నాలు  అన్నాను.

నోరు వెల్ల బెట్టాడు ఇప్పుడుతెలిసింది అన్నాడు .ఇన్ని గొప్ప గణాలుంటే వరికేందుకిస్తారండి అవి అన్నాడు జ్ఞానోదయం అయిన వాడిలాగా. .

ముక్తాయింపుగా,పాలకులు గుర్తించక పోయిన,గౌరవించక పోయిన ఎం పర్లేదు  .అది వారి నైజం .ప్రజలు వారి హృదయ లలో గుడి కట్టుకు పూజిస్తున్నారు.

చివరిగా ఒక మాట కబోది పెబువులు  మచ్చరంతో ఇచ్చే బిరుదులూ,పురస్కారాలు వారికీ అక్కర్లేదు .వారు వెంపర్లడరు  .వారి నీతి నిజాయతి కళా సేవ కళామతల్లి గుర్తిన్చింది  వారె వల్లే కొత్త అందాలూ సంతరించాయని ,కొత్త వెలుగు తనకు వచ్చిందని ఆ తల్లి గుర్తించింది అది చాలు.

ఆంధ్ర జనులు జయ గీతాలు పాడు కుంటున్నారు  అన్నాను .

నా బుర్ర ప్రక్షాళన చేసారు పాత బూజు అంతా వదిలించారు చాల సంతోషం గురువుగారు  .ఇప్పుడు రవన లేడుకనుక ప్రభువులు కళ్ళుతెరుస్తారెమో అంటూ వస్తా   అని ఆనందంతో పులకించి వెళ్లి పోయాడు

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in ముళ్ళపూడి & బాపు | 11 Comments

మరికొన్ని ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం -2


నమస్తే  గోపాల కృష్ణ  గారు

ముళ్ళపూడి జ్ఞాపకాలు ఇంకా తొలుస్తూనే వున్నాయి .
2008 డిసెంబర్ లో బాపు రమణలను మద్రాస్ లో వారింట్లో చూసినపుడు వారిద్దరూ మా ఇంటి పేరు తెలుసుకొని గబ్బిట వెంకట రావు గారు మీకు బంధువు లేనా  అని అడిగారు మాకు వున్న,తెలిసిన ఒకే ఒక్క జ్ఞాతి ఆయన అని చెప్పాను .ఆయనభార్య చెల్లెల్ని వుయ్యూరు లో వుండే మా మేనమామ గుండు గంగయ్య గారి పెద్దబ్బాయి పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేసారని వుయ్యూరు వచ్చినపుడల్లా మాయింటికి వచ్చేవారని ,ఆ పెళ్ళికి అగిరిపల్లి లో మేము మొదటిసారిగా చూసామని చెప్పాను.
వెంకట రావు గారు తమ రామాంజనేయ యుద్ధం సినిమా కు రాసారని గొప్ప కవి అని పద్యం ఆయనంత బాగా ఎవరు రాయలేరని మెచ్చారు .ఆయనతో మళ్లి ఒక సినిమాకు రాయిన్చాలను కుంటున్నామని చెప్పారు రావు గారు చని పోయి రెండేళ్ళయిందని చెప్పా తమకు తెలియదని,ఆశ్చర్య పోయరిద్దరూ .అవతలి వాడి ప్రతిభను గుర్తించే సహృదయం వారిద్దరిది ఆ మర్నాడు మద్రాస్ లో వున్న రావు గారి అబ్బాయిని చూడటానికి వెళ్తున్నామని చెబితే ఆ కుటుంబానికి తమ సంతాపం, సానుభూతి తెలియజేయమని చెప్పిన సంస్కారం వారిది
.బాపు గారు ,వారి భార్య అతి నిరాడంబరం గా వుండటం ఆశ్చర్యం కల్గించింది .నేత చీరెతో ఆమె,గళ్ళ లుంగి పొట్టి చొక్కాతో ఆయన .అంతా పేరు ప్రతిష్ట వున్న అంతటి సామాన్య జీవనం .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో ,నడవడికలో చూపుతున్న మార్గదర్శి గా అనిపించారు .
ఇక రమణ గారు తెల్లని బట్టలు ,తెల్ల జుట్టు ,భార్య సాదా  సీదా ఆకూ పచ్చ నేత చీర తో పార్వతి పరమేశ్వరులు అనిపించారు ఆమె నండూరి రామ మోహన రావు గారి చెల్లెలే.అరుగొలను వారిది . కారణ  జనములు అనిపించారు ఆ జంట జంటలు.
మా ఆవిడా మురిసి పోయింది వాళ్ళను చూసి ,వాళ్ళ ఆప్యాయతలు , పలకరింపులు ,మర్యాదలకు  ముగ్ధులం అయ్యాం.
మైనేనీ  గారి గురించి మాట   వచ్చినపుడల్లా ఇద్దరు  ఎంతో పొంగిపోయారు. ఎన్నో  పుస్తకాలూ  అరుదయినవి  సేకరించి  అమెరికా నుండి  ఆయన  పంపుతారని, ఆయన  స్నేహం మరువలేనిదని  అన్నారు  .గోపాలకృష్ణగారు  కూడా  బాపు గారు ఎన్నో  విలువయిన  పైంతింగ్స్  తనకు  పంపించారని  అమెరికాలో   మే ము వున్నప్పుడు  నాకు   ఫోన్
లో చెప్పేవారు.  అంతటి జిగినిదోస్తి వారిముగ్గురిది.
నాలుగు   ఏళ్ళ  క్రితం  ఆంధ్రజ్యోతి  దిన   పత్రిక లో  బాపు రమణల   ”sirinomu’ లోని   భాగాలను ధనుర్మాసం  సందర్భంగా  రోజు     వేస్తుంటే  చదివి  అద్భుతం   అనిపించి ఒక కార్డు  రాసాను.  అందులో వుయ్యుర్లో  మాకు  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం   వుందని , ధనుర్మాసంలో  రోజు  నేను  ఆలయంలో తెల్ల వారు  ఝామున  అయిదు  గంటలకే  వెళ్లి  తిరుప్పావై  రోజు  చదువుతానని ,నేను వంస పారంపర్య ధర్మ కర్తనని    భోగినాడు  కళ్యాణం   కుడా  చేస్తామని,   హనుమ్మజ్జయంతి  కి కుడా శ్రీ  సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం    చేస్తమని, హనుమద్  వ్రతం  కూడా  చేస్తామని  కోతపోకదాలతో   సిరినోము  వుందని, రసభరితంగా ఉందని రాసాను.   ఆ  విషయం మర్చిపోయాను.
వారం తర్వాత  200 రూపాయల విలువకలిగిన  ఆ పుస్తకాన్ని  registerd post లో నాకు  అందేటట్లు పంపారు.  ఆశ్చర్యపోయాను.  వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను.  మరునాడు ఉదయం ఆ పుస్తకాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచి రోజు అందులోని విశేషాలను తెలియ చేసే వాడిని.  కళ్యాణం  అయింతర్వాత  వారిద్దరికీ  స్వామి  వారి ఫోటోలు  ,ప్రసాదం, కళ్యాణ   అక్షింతల్  పోస్ట్‌లో  లో పంపాను .
ఇది అనుకోని సంఘటన.   అంతటి భక్తీ ప్రపత్తులు వారికి ఉన్నాయని తెలియ్స చేయటానికి ఇది రాసాను.   ఇది మద్రాస్‌లో వారిని కలిసినపుడు గుర్తు చేస్తే ముసి ముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు అది వారి మనస్తత్వం.
— క్రౌంచ  మిధునం  విడిపోయినపుడు  వాల్మీకి   శోకం   శ్లోకంగా,   అది ఆది  కావ్యం   ఆరంభం అయింది .  అలాగే  ఉంది ఇప్పటి  స్థితి.
చిన్నపిల్లలను  శ్రీరామ రక్ష అని  తెలుగు వారు దీవిస్తారు.  తెలుగు తరం కొత్త హాస్యానికి ‘శ్రీ రమణ రక్ష’ అని అనిపిస్తుంది.
ఇందులో  రెండు   విశేషాలు ఉండటం  గమనించి    వుంటారు.  ఒకటి ముళ్ళపూడి  వెంకట రమణ  రక్ష  అని,  ముళ్ళపూడి తర్వాత  ఆ రకo హాస్యాన్ని వండి  పండించిన ఆ  వారసత్వాన్ని   తీసుకుని  ముందుకు సాగుతున్న శ్రీ రమణ అని అర్ధం.
అప్పు (నీరు), ఆకాశం ఉన్నతవరకు ముళ్ళపూడి వెంకట రమణ చిరంజీవే.

— నమస్సులతో …………….       మీ ………….

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం తో

మైనేని గోపాల కృష్ణ (USA)

బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే.

తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట  ఏళ్ళకు పయిగా ఆ జంట కాపరం చేసి బంగారపు పంట పండించారు .

మీ వల్ల బాపు ,ramanalanu చూసే భాగ్యం కలిగింది .ఇవన్ని ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి .2oo8 december  21  న వుయ్యూరు లో ప్రముఖ ఆర్ధిక వేత్త ఆరికపుడి ప్రేమ చంద్గారి సన్మాన సభ వుయ్యురులో మీ సహకారంతో ఏర్పాటు చేసినప్పుడు

నేను మా శ్రీమతి ప్రభావతి మద్రాస్ వెళ్తున్నట్లు మీకు తెలిసి బాపు రమణ గార్లను చూసే,మాట్లాడే అవకాసం మీరే కల్పించారు .ముందుగ వారిద్దరి తో మాట్లాడి వారిని కలిసే సమయాన్ని ఫిక్స్ చేసారు .మీ బంధువు రోజా గార్ని స్టేషన్ కు వచ్చేట్లు చేసి అ.చ.(ఏ.సి )కారులో మమ్మల్ని మా మేనల్లుడి ఇంటి దగ్గర కు చేర్చే ఏర్పాటు చేసారు మీరు .ఆ సాయంత్రం రోజా గారు మమ్మల్ని బాపు రమణల ఇంటికి తీసుకు వెళ్లారు.

మా కోసం ఎదురు చూస్తూ బాపు గారు వీధి లోకి వచ్చి మమ్మల్ని లోపలి ఆహ్వానించి తీసుకు వెళ్లారు .కమ్మని కాఫీ వారి శ్రీమతి గారు కలిపి ఇచ్చారు .అప్పుడు మా ఆవిడ బాపు గారి చిత్రం గొప్పద,ఈ కాఫీ గొప్పద ఆంటే చెప్పలేం అన్నది ముసిముసి నవ్వులు నవ్వారు బాపు .

బాపు రమణలు

బాపు రమణలు

అప్పటికే ఆయన సంతకాలతో .వున్న పుస్తకాలూ న్న ద్వార వుయ్యూరు లైబ్రరీ కి కానుకగా ఇవ్వమని ఇచ్చారు .తన స్టూడియో అంతా దగ్గరుండి చూపించారు ఫోటో లు తీసుకున్నాం ;

వుయ్యూరు లైబ్రరీ కి కానుక

”మీకు కార్టూనిస్ట్ గానే గుర్తింపు వచ్చింది చిత్రకారునిగా ఎందుకు గుర్తింపు రాలేదని అడిగాను .నాకు .అక్కడే సందేహం అని నవ్వారు .

అక్కడినుంచి పయి అంతస్తు కు మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్లి రమణ గారిని పరిచయం చేసారు .అక్కడ అందరం కలిసి ఫోటోలు తీసు కున్నం.మేము వెళ్లేసరికి రమణగారు చేతులకు excercise.చేస్తున్నారు.

ప్రభావతి (నా భార్య)

ప్రభావతి (నా భార్య)

మైనేని గోపాల కృష్ణ గారు మేము అమెరికా లో వుండగా మీ కోతి కొమ్మచ్చి పోస్ట్ లో పంపితే చదివానని,తెలుగు జనంతో కోతి కొమ్మచ్చు లాడే గడసరి మీరు ఆంటే నవ్వారు రమణ.తన భార్య కృష్ణ జిల్లాకు చెందినా వారె నని పరిచయం చేసారు ఆమె మా జిల్లా ఆడపడుచేనని అన్నా.అంతా నవ్వుకున్నాం .

ఆయన గది అంతా తిప్పి చూపించారు.వారిద్దరిని జీవితం లో చూడగలమ అనుకొన్నాం మీ వల్ల ఆ కల సాక్షత్కారం అయింది .బాపు,రమణను చూస్తే వారి కుటుంబాలను చూస్తే స్వంత బంధువులను chusinatanipinchindi .

బాపు రమణలు సొంత అన్నదమ్ముల కంటే ఆప్యాయం గా వున్నారు వారి స్నేహ షష్టి పూర్తిని చిట్టెన్ రాజు హైదరాబాద్ లో చేస్తే చూసాను ఇద్దరు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు ఫోటోలు తీయించుకున్నారు .ఇద్దరు దంపతుల పాదాలకు వెళ్ళిన వాల్లమందరం వొంగి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాం .

 దుర్గా ప్రసాద్

దుర్గా ప్రసాద్

గొప్ప అనుభూతి అది మాటల్లో కొద్దిగానే చెప్పగలిగాను.హృదయమంత వారి సౌహార్దం నిండిపోయింది .ఆ బంధం ఆ ఋణం తీర్చుకోలేనిది .మళ్లి రండి .వస్తుందండీ అని ఆ దంపతులు శాశ్వత ఆహ్వానాన్ని అందిచారు

ఉప్పొంగిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము మొన్న పొద్దునే మైనేని వారు చెప్పగా బాపు గారు నాకు పంపిన గుటాల కృష్ణముర్తి గారు compile చేసిన అతి విలువయిన టంగుటూరి సూర్యకుమారి పుస్తకం అందింది వెంటనే బాపు గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పా చాల సంతోషించారు.ఇంతలోనే ఆయనకు ఈ విషాదం.జీవిక జీవులు గా మెలగిన జంట .స్నేహానికి నిర్వచనం ,ఆదర్శం బాపు ,రమణ

బాపు గారితో

బాపు గారితో

దుర్గా ప్రసాద్

http://picasaweb.google.com/lh/sredir?uname=gabbita.prasad&target=ALBUM&id=5279505038801918305&authkey=rjNf2rW0hsU&feat=email

—
Gabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street
Vuyyuru

9989066375

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

రవణ ఆసం

ముళ్ళపూడి వెంకట రమణ

ముళ్ళపూడి వెంకట రమణ

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

తెలుగు భాష చైతన్య సమితి సత్కారం

 

తెలుగు భాష చైతన్య సమితి సత్కారం

21.02.2011
విజయవాడ
ముఖ్య అతిధి గబ్బిట దుర్గా ప్రసాద్

 

https://picasaweb.google.com/sarasabharathi.vuyyuru/TeluguBhashaChaitanyaSamithi110221?authkey=Gv1sRgCLSinfnCiNK7OQ&feat=email#

Posted in సభలు సమావేశాలు | Leave a comment

రక్తపోటును తగ్గించే పుచ్చకాయ

 

రక్తపోటును తగ్గించే పుచ్చకాయ

Posted in ఆరోగ్యం | Leave a comment

బుద్ధ ఘోషా శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి సన్మాన సభ

సరసభారతి  21 వ సమావేశం

శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి సన్మాన సభ

అందరికి ఇదే మా ఆహ్వానం

Sarasa Bharathi 21 110313_0001

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు 252 వ సమావేశం

సాహితి మండలి ఉయ్యూరు 252 వ సమావేశం

అందరికి ఇదే మా ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మొవ్వ వేణు గోపాల స్వామి ఆలయం క్షేత్రయ్య

క్షేత్రయ్య

Posted in సభలు సమావేశాలు | 1 Comment

చిరంజీవి నేను సైతం ఆనాడు – ఈనాడు

”’;;”””నేను సైతం ప్రపంచాగ్ని కి  సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”   ఆనాడు

” నేను సైతం సోనియగ్నికి సమిధనై ఆహుతవుతున్నాను ” ఈనాడు నేను సైతం హస్త రేఖ గా మారి పోయి ;;కొత్త పాత్రలో ఒదిగి పోతాను ”ఈనాడు’

‘ నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్ల విస్టాను” ఆ నాడు
నేనుసైతం ఇటాలి అమ్మ కొప్పులో పువ్వు నై వాడి పోతాను”   –ఈనాడు

”విజేత ,ఆపద్భాందవుడు రాక్షసుడు ఆనాడు

”  పరాజితుడు ఆపత్తు బాధితుడు ,మే మే  మేక ఈనాడు ,

”చిరు అయినామెగా గా ఎదిగి నాడు   మెగా నుంచి చిరు (చిన్న)కు కుదించుకు పోయాడు పాపం .

ఇదీ చిరు విలాసం,(అడ్రస్)నేడు .

కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చాడని ఆరోపణ ఆనాడు .

అయ్యో పాపం నెల నెల దిల్లికి కోట్లు కప్పం కట్టాల్సి వస్తుందని జాలి చూపుతున్నారు ఈ నాడు

జనం నాలికకు నరం లేదేమో నని సామాన్యుడి సణుగుడు .లాంగ్ live చిరంజీవి

 

Posted in రాజకీయం | 1 Comment

సరసభారతి వుయ్యూరు 18 వ సమావేశం వీక్షించండి

అందరికి నమస్కారం

సరసభారతి వుయ్యూరు 18 వ సమావేశం వీక్షించండి

 

 

సరసభారతి వుయ్యూరు 18  వ సమావేశం వీక్షించండి

 

https://picasaweb.google.com/sarasabharathi.vuyyuru/Sarasabharathi20110208?authkey=Gv1sRgCOPE5bbz9ZLCOA&feat=email#సరసభారతి వుయ్యూరు 18 వ సమావేశం వీక్షించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మూడేళ్ళ క్రితం ప్రజా రాజ్యం మానియా ఇప్పుడేమో సోనియా మానియా

మూడేళ్ళ క్రితం ప్రజా రాజ్యం మానియా    ఇప్పుడేమో సోనియా మానియా        అందర్నీ పేస్ తుర్నిగిచ్చుకోమన్నవాడు   ఇక తనే తురనిగిచ్చుకోని fadeoutout అయాడు
అట్టహాసంగా మండే సూర్యుణ్ణి తెచ్చి ఇప్పుడేమో అస్త(హస్త)గతం చేసాడు
–ఇప్పటిదాకా చిరు హాసం,దరహాసం   ఇప్పుడిక అంతా చిర్రు బుర్రు వేషం
ఆనాడు ఫులేకి గులాబీ పూలు ఇవాళ జనం చెవిలో cabbage పూలు
మాస్టర్   ప్రజా రాజ్యం కోసం నాడు పోరాటం    నేడు ఇటాలి రాజ్యం కోసం ఆరాటం.

Posted in రాజకీయం | Leave a comment

రధసప్తమి శ్లోకం

అందరికి నమస్కారం

రధసప్తమి శ్లోకం
రధసప్తమి శ్లోకం

రధసప్తమి శ్లోకం

Posted in సమయం - సందర్భం | 1 Comment

వుయ్యురా ? ఉయ్యురా ? ఉయ్యురు ఊసులు

వుయ్యురా ? ఉయ్యురా ?

 
మరి  ఉయ్యురు ఉసులు చదవి తెలుసుకొనండి

ఉయ్యురు ఉసులు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

sarasabharati 20th meeting invitation

అందరికి నమస్కారాం

సరభారతి 20 వ సమవెసం కు  అందరు అహ్వనితులె

 

sarasabharati 20th meeting invitation

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సరసభారతి వుయ్యూరు 18 వ సమావేశం

సరసభారతి
ఆందరికీ ణమస్కారం

సరసభారతి 18 వ సమావేశం లో త్యాగరాజ ఆరాధనోత్సవం ఈ నెల 25 , 26 తేదిలలో వుయ్యూరు నిర్వహించడం జరిగింది .

http://picasaweb.google.com/sarasabharathi.vuyyuru/SarasaBharathi19110125?authkey=Gv1sRgCMapyPbnrN_QbQ&feat=email#slideshow/5566401512896458850

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment