కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కలుగోడు గ్రామం లో -శ్రీ అశ్వత్ధ రావు కరణం 1901లో జన్మించారు .71 ఏళ్ళు మాత్రమె జీవించి 1972లో మరణించారు .తల్లి వెంకోబ రావు తల్లి లక్ష్మాంబ .వీరి మాతృభాష కన్నడం.
కన్నడిగుడైనా తెలుగులో అద్భుత రచనలు చేశారు శ్రీ అశ్వత్ధ రావు కరణం.తెలుగులో మయూరధ్వజనాటకం ,అనుభవామృతం ,గీతా దండకం ,ఆశ్వత్దేజ త్రిశతి ,ఆశ్వత్ధభారతం ,అక్కమహా దేవి ,కంద పద్య రామాయణం గదాయుద్ధం ,మొదలైన రచనలు చేశారు .
కన్నడం లో ‘’భాగవత గీతిగళు ‘’,’’శృంగార వరూధిని ‘’రచించారు .ఇది పెద్దనామత్యుని మనుచరిత్ర ప్రబంధానికి కన్నడ అనువాదం .కన్నడం లో’’ రన్న కవి ‘’రాసిస’’సాహస భీమ విజయం ‘’ను తెలుగులో ‘’గదాయుద్ధం ‘’గా అనువాదం చేశారు .తెలుగులో ఎక్కువగా ప్రచారం లేని త్రిపది ఛందస్సులు ,సర్వజ్ఞాని వచనాలు అనువదించారు .
వావిళ్ళ వారు వీరి ‘’రామాయణ దండకం ‘’ప్రచురించారు .ఆంధ్ర ఆంగ్లేయ విద్యా విశారదులు శ్రీ ఏం వి లక్ష్మీపతి బి ఎ..గారు తనను రాయదుర్గం ఆహ్వానించి స్వగృహంలో కవిమిత్రుల సమక్షం లో ‘’దండక రామాయణం ‘’కవిగారిచే చదివించి ఆనంద పరవశులై ప్రచురణ నిమిత్తం నూటపదహారు రూపాయలు అందించారని కవిగారు ముందుమాట లో రాసుకొన్నారు .నవరాత్రులలో మిత్రులు శ్రీ కోదండ రామాచార్యులు తమ స్వగృహం లో శ్రీరామ సప్తాహం జరుపుతూ ఆహ్వానించి రామాయనదండకం చదివించి ముద్రణకు ఇరవై రూపాయలు ఇచ్చారని చెప్పుకొన్నారు .ఆంధ్రాంగ్ల భాషా కోవిదులు శ్రీ ఎన్ శేషాద్రి గారు తమ తాతగారు శ్రీమాన్ శేషాచార్యుల గారిపేరిట శతమానం శాయించారు .మేనల్లుడు నరసింగరావు వంద అందించారు .చాలామంది దాతలు ముద్రణకు ఆర్ధిక సాయం అందించారని ,దానిని దండకరామాయణం, అనుభావామృతం ముద్రణకు వినియోగిస్తానని వావిళ్ళ వారు ప్రచురించిన ‘’శ్రీ దండక రామాయణం ‘’ లో వారందరిపెర్లు విరాల వివరాలు కవి గారు విజ్ఞాపనలో25-6-1949 తెలియజేశారు .
శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు కవిగారిని ఆశీర్వదించి దండకం పరిచయం చేశారు .కట్టమంచి, చెళ్ళపిళ్ళ ,శ్రీపాద ,చిలుకూరి నారాయణరావు ,శ్రీమాన్ కాశీ కృష్ణాచార్య ,కవిసామ్రాట్ విశ్వనాథ,ఆంధ్రవాల్మీకి శ్రీ జనమంచి శేషాద్రి శర్మ ,వేటూరి ,గడియారం ,శ్రీ దుర్భారజశేఖరశతావధాని ,కావ్యతీర్ధ శ్రీ రావాడ వెంకట రామ శాస్త్రులు ,కవిభూషణ శ్రీ కప్పగల్లు సంజీవమూర్తి ,అభినవ భట్ట నారాయణ శ్రీ పాతాలభేది సుబ్రహ్మణ్య కవి మొదలైన ప్రముఖులు ఆశీర్వదించి అభినందించారు .
ఆధారం -డా.శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం మరియు కవిగారి రామాయణ దండకం
ప్రముఖ డోలు విద్వాంసుడు,’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలు చక్రవర్తి’ -శ్రీ ఈమని రాఘవయ్య
ప్రకాశం జిల్లా మద్దిపాడు లో ఈమని వెంకట స్వామి కనకమ్మ దంపతులకు శ్రీఈమని రాఘవయ్య 2-10-1914 జన్మించారు .ఉప్పు గుండూరు కు చెందిన పేరాల వే౦క సుబ్బయ్య ,అమృతలూరు కు చెందిన మోదుకూరి బాలకోటయ్య గార్ల వద్ద డోలు విద్య నేర్చి విద్వా౦సులయ్యారు .తంజావూరు బాణీ కోసం నీడా మంగళం ఎన్. టి.ఎం. మీనాక్షి సుందరం గారి వద్ద విద్యాభ్యాసం చేశారు .
సున్నితమైన తిరుగుళ్ళతో ,కీర్తనకు అనుకూలంగా ఈమని వారి డోలు వాద్యం సాగేది .వేగంగా డోలు వాయించటం వీరితోనే ఆంధ్ర దేశం లో ప్రారంభమైంది .చిలకలూరి పేట చిన పీరు సాహెబ్ ,కృష్ణాజిల్లా దాలిపర్తి పిచ్చిహరి ,షేక్ ఆదం సాహెబ్ ,షేక్ చిన మౌలానా వంటి ప్రసిద్ధ నాదస్వర విద్వాంసు లందరికి సహకార వాయిద్యంగా డోలు వాయించారు .’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలుచక్రవర్తి ‘’బిరుదులు పొ౦దారు .దొడ్డవరం త్యాగరాజ ఆరాధనోత్సవం లో గండ పెండేరం , ఒంగోలులో కవి పాదుషా జాషువా అధ్యక్షతన వెండి డోలు కవచం ,పోతవరం లో స్వర్ణ సింహ తలాటం అందుకొన్న మహా విద్వాంసులు రాఘవయ్య ఆంధ్ర ప్రదేశ్ .సంగీత నాటక అకాడెమీ ఘనంగా సన్మానించింది.స్వగ్రామం మద్ది పాడు లో నటరాజ కళా సమితి విశిష్టస్తాయిలో సత్కరించి బంగారు కంఠ హారం బహూకరించింది .
దక్షిణ భారత దేశం లోని అన్ని ముఖ్యమైన ఆకాశ వాణి కేంద్రాలలో తమ డోలు వాద్య వైదుష్యం ప్రకటించారు .అనేక మందికి విద్యాదానం చేసిన విద్యాదాత రాఘవయ్య గారు .వీరి ముఖ్య శిష్యులు భూసురపల్లి ఆది శేషయ్య ,పుసులూరి గురవయ్య ,నిడమానూరి లక్ష్మీ నారాయణ వంటి లబ్ధ ప్రతిష్టితులైన డోలు విద్వాంసులున్నారు .23-12-1994 న 80 సంవత్సరాల వయసులో శ్రీ ఈమని రాఘవయ్య పరమపదించారు .
హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-2
అన్ని జీవాల పుట్టుకకు కర్త కర్మ కాలమే .మనం ఉన్నా లేకున్నా కాలం ఉంటుంది .అదే కాల రహస్యం .మనకు కారణం చెప్పాల్సిన అవసరం కాలానికిలేదు .కాయ కష్టం చేసే వారి జోలికి కరోనా రాలేదు .రామ లక్ష్మణులపై మేఘనాధుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ,దాన్ని తట్టుకోటం తమ వల్లకాదని విల్లు అ౦బులు వదిలేసి దండం పెడితే అది తన దారిన తాను పోయింది .అంటే నిలబడి యుద్ధం చేయలేని వాళ్ళ జోలికి వెళ్ళలేదు .భారతం లో అశ్వత్ధామ నారాయణాస్త్రం వేస్తె స్త్ కృష్ణుడి మాటవిని పాండవ సైన్యం అంతా కత్తులు కటార్లు పారేసి రధాలు దిగి చేతులు కట్టుకొని నిలబడితే అది ‘’పీచే మూడ్’’ అయింది .వైరస్ కూడా ఆస్త్రాలమాదిరే .దానితోపోరాడి బలికాకుండా’’ కామ్’’ గా ఇండ్లలో ఉంటే దానిదారి అదే పోతది . దాని చేతిలో చిక్కటం ఏల చావటం ఏల ?అన్నాడు జ్ఞాన బుద్ధితో అన్న.దీపం చీకట్లనుకాల్చినట్లు ,జనమంతా ఒకటై దీపాలు వెలిగిస్తే వంటరి దిగులుపోయి ఐక్యవెలుగు కాపాడుతుంది .మతం కన్నా మనిషి మనిషికన్నా మానవత గొప్పవి .అప్పుడే ‘’దేవుడే జీవుడై ,జీవుడే దేవుడైతనకు తానుగా వచ్చి చేరతాడు .దేవుడు ఉండేది జీవుడిలో .దాన్నికాపాడాల్సింది జీవుడే ..మనుషులంతా ఒగటే అనే ‘’ఎన్నం ‘’అంటే మనసు అందరికి రావాలి.కర్షక కార్మిక కష్టాలకు కొలమానం కనిపెట్టాలి .అప్పుడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది .
సంకుచిత బుద్ధి (సన్నబుద్ధి )ప్రాణం తీస్తే , దొడ్దబుద్ధి దొడ్డ కళాచారం(సంస్కృతీ )సన్న బుద్ధి ని చంపి వెలుగు చూడాలి .కాలం విలువ ఎలా తెలుసుకోవచ్చు అన్న ప్రశ్న కు ‘’చచ్చే వాడి ప్రాణం పోకుండా రవంత ఆపగలిగితే కాలం విలువ తెలుస్తుందని బజ్జన్న ఉవాచ ..మనిషి పోయినబుడే వాడి గురించి చాలాకాలం చెప్పుకొనే వాడిదే బతుకు అన్న తాత మాటకు అవ్వ ‘’బతకాలంటే గతకాల (తినాలి)ఆనగా కిసుక్కున నవ్వాడు కాకన్న అవ్వాతాతల సరసానికి .తెల్లరాజు(తెల్లోడు ) ఎన్ని మాయోపాయాలు చేసినా భారత దేశం బెదరలేదు కారణం కుల వృత్తులు .ఈ రహస్యం తెలిసి కుల వృత్తుల్ని కూలగొట్టి .దొరలపని చేసేట్లు చేసి వారి కుల మతాచారాలను అడ్డం పెట్టుకొని నాటకాలాడి వ్యవస్థలను కూలగొట్టి ,తనమాట చెల్లించుకొని రెండు వందల ఏళ్ళు రాజ్యమేలాడు .
ప్రకృతి సహజ బతుకు పండగలాంటి బతుకు .ప్రపంచానికే ‘’కళాచారం ‘అంటే సంస్కృతీ ’పాఠాలు చెప్పిన గొప్ప దేశం మనది .మనం బతుకుతూ పక్కవాళ్ళ ను కూడా బతకనిస్తే అదే జీవిత పరమార్ధం అప్పుడే మనిషి బతుకు ధన్యం అన్నాడు బుద్ధ భగవానుడు. మిగిలిన విషయాల ‘’తంటకీ ‘’(జోలికి )పోలేదు ఆమహానుభావుడు .మనిషికి కుసింత’’ తా౦త౦’’ ( శాంతం )ఉండాల .గుంతలోనుంచి వచ్చిన మడిసి మళ్ళా ఆ గుంత లోకే పోతాడు అనేది జీవిత సత్యం .దేవుడైనా జీవుడైనా ప్రకృతమ్మ బిడ్డలే .అమ్మ వొడిలో పుట్టి పెరిగి వొరిగి పోవాల్సిందే .మానవుడే ప్రకృతిని పుట్టించాడు అనే వారంతా ప్రకృతిని ఎదిర్చి ఎందుకు కలకాలం బతకలేదు ?ఆని మిలియన్ డాలర్ల ప్రశ్న సంధించాడు తెలివరి .ఏమీ లేనిదే శూన్యం .అందరం శూన్యం లోకి చేరుకోవాల్సిందే ఒకరి వెనుక ఒకరు .ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగుతామో ఆ తావు (చోటు )లోనే పోతాం ఆని తావు రహస్యం చెప్పాడు అన్న.
హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’
ఆతను సాహిత్య రాక్షసుడు ,ప్రాణాలు నిలబెట్టే భిషగ్వరుడు , మా౦డలిక భాస్కరుడు ,తెలుగును బతికించాలని అనుక్షణం పరితపించే భాషా వనౌషధి, అతడే డాక్టర్ అగరం వసంత్.అందుకే అతడు సాహిత్య నిత్య వసంతుడు .కృష్ణ గిరి సాహితీ రసాయనానికి మూల ఘటిక . ఇన్ని మాటలెందుకు ?అతడు మాండలిక భాషా చిరంజీవి .భాషా సంజీవి .అతని పలుకులలో ‘’ఆ తావు పలుకుల పల్లకి ‘’ .2000 జనవరి 5నుంచి ఏడాదిన్నర కాలం లో తాను రాసిన 101 చిటిపోటి కతలను ‘’మాటల మూట ‘’గా కట్టి ఈ మార్చి నెలలో మనకు ఆ విలువైన సంపదను అందించాడు . .ఈ సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉన్నది . ఇది అదృష్ట సంఖ్య, కోడ్ , ప్రధాన సంఖ్య. ప్రేమ, ఆధ్యాత్మికత మరియు సాంకేతికత వంటి రంగాలలో దీనికి నిర్దిష్ట అర్థాలు ఉన్నాయని సంఖ్యా శాస్త్రం అంటోంది . హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’ఇదీ.ఆక్షర లక్షలు చేసే సాహిత్యనిధి .కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తించి గౌరవి౦చాల్సిన రచయిత వసంత్ అనిపిస్తాడు .ఈపదాల మూటకు సాహిత్య అకాడెమీ విలువైన గుర్తింపు నివ్వాలని అనిపిస్తుంది .పుస్తకం నాకు అతడు పంపి దాదాపు నెలన్నర దాటినా నిన్నా ఇవాళ మాత్రమె చదివే అవకాశం దొరికి, ప్రతి అక్షరం చదివి స్పందిస్తున్నా .శీర్షికల పేర్లు అవసరము౦టేనే ప్రస్తావిస్తూ ,లోని భావ ధారామృతాన్నిమీకు పంచుతాను .అందరం సాహితీ చిరంజీవుల మవుదాం . ఇందులోని వన్నీ డైలాగులే .ఒకప్పుడు గ్రీకు దేశం లో ప్లేటో వంటి వారు ,మనదేశంలో మహర్షులు మార్గదర్శులు, వేదోపనిషత్ పురాణ విషయాలతోపాటు చెప్పిన అనుదిన వైజ్ఞానిక మూల సూత్రాలే ,సత్య ప్రియాలే .తెలుసుకోదగిన ప్రశ్నలు ,వాటికి అనుభవం, లోకజ్ఞాన సమాధానాలతో దారి చూపిన దీపాల సమాహారమే .
కానుగ మాను చీట్లాట ,చి౦తపిక్కలాట గవ్వలాట లకు మాత్రమె కాదు ‘’సత్య శోధనకు మార్గం చూపే తావు .దేవుడూ దేయ్యమూ సత్యం కాదు .అవి సత్యసాధనకు పనికి రావు .దారి చూపమని సాములోరిని అడిగితె ‘’ఒకరు చూపిస్తే కనబడేది దోవ కాదు .మనకు మనం గా కనుక్కోనేదే దారి .భూగోళం సత్యం .ఆనిఎరుక చెబితే ఆక్షణం కానుగమాను ‘’బోధి వృక్షమైంది .అన్నం ముద్దను చేతి వేళ్ళతో పిసికి చారులో కలిపితింటే దాని మజా బాగుంటాది .’’ఇస్పూన్ల తో తి౦ టే రుచీ తెల్వద్, మజా ఉండద్’’.పసిపాపలు బుజాన కేజీల కొద్దీ బరువుగల సంచులు మోసుకు౦టూ ఇస్కూల్ కు వెడుతూ ఉంటే వాళ్ళు కూలోళ్ళు కాదు. వాళ్ళు దేశాన్ని దాటిపోయే ,దేశ దేశాలు తిరిగే కూలోళ్ళు.తనకొడుకు కూడా అలా అవాలంటే ఎంజేయాలని అడిగితె ‘’ఇస్కూలు కు పంపీయాలి ‘’ఆని అబ్బిగాని సమాధానం .పాకెట్ ఫుడ్ హాని కరమే .అయినా తప్పులో కాలేస్తున్నారు ‘’విద్యలు , బుద్దులు ఏనాడో సంకరం అయ్యాయని ఇక చేసేది లేదని చేతులెత్తేసిన సాములోరు .రోజుకు పది లీటర్లకు పైగా డైరీకి పోసే ఇల్లాలు పాలుతోడు(ఎప్పు ) కోసం పొరుగమ్మ ఇంటికి వెడితే ఆమె నువ్వు ఇంటికి రాణి అంటే ,గోడకు చెవులుంటాయి నెమ్మదిగా అనక్కా .లేకుంటే నాకాపురానికే ఎప్పు పెట్టిస్తుందిపక్కింటి గౌరీ ఆని అంటూ తోడుకు మజ్జిగ తీసుకు వెడుతుంది .ఆ కాశ మంత ఎదిగిన చెట్టు ఒకే దెబ్బకి ఒరిగి కింద పడుతుంది ఆని మిడిసి పోతున్న ఒక గర్వపోతుకు ఒక పెద్దాయన కొట్టిన సమాధానం చెంప దెబ్బ .తారలు గ్రహాలూ ,మనుషులు జంతువులూ చెట్లు పక్షులు కొండలు పర్వతాలు నదులు సంద్రాలు అన్నీ వేరే వేరే .కాని దేవుడు మాత్రం ఒకడే .ఈ అర్ధంతోనే మన పెద్దలు ‘’మన్నునీ మానునీ దేవుడు ‘’ఆని కొలిచారు .మన౦దరిపెద్దతనం గాతము (లోతు ) ప్రకృతిదే. గతాన్ని గలీజు చేయద్దు .అన్నాడు తాత .
నాగరికతలు అన్నీ గతం గతః ఎందుకు ఆని అడిగితె అది మనిషి కత ఆని ,మడిసి దశనుంచి దశకు ,దిశనుంచి దిశకు పరిణామం చెందాడు ఆని చెప్పే గుర్తులవి .ఇప్పటి కంప్యూటర్ ఎలెక్ట్రానిక్స్ ఎ.వి. కూడా పరిణామం లో భాగమే ,యాదృచ్చికమే .ఇవి జరగటానికి లెక్క .లేనన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడొక అన్న .మనం పుట్టకముందు లేకుండా పుట్టి, చచ్చాక లేకుండా పోతామా ? ఆని అడిగితె ఇక్కడే శిలేసుకొని ఉందామనా ?ఆని అడిగి ‘’కాదప్పా ముందు ,ఎనకాలనాదే అన్నట్లుందిరా నాయాలా అంటే బలేకాదు ‘’బాళే నాయాల్ని ‘’అంటే అలాఉంటేనే ‘’బాళే’’కి అంటే బతకటానికి వీలు అన్నాడు ‘’అనా (అన్న ).ఉత్త మాటలతో విశ్వాన్ని కొలుస్తారా ?ఆని అడిగిన మిడిమిడి జ్ఞానికి జ్ఞానం కలిగించే ఒక గొప్ప బుక్ ఇస్తే , ‘’మనిషిని మనిషిగా చూడని మీరా సృష్టి రహస్యం చెప్పేది ‘’ఆని విసురుగా దాన్ని చి౦చి పారేస్తే ,ఆకాకితాలు గాలికి ఎగిరి పక్కపక్కల చేరి ‘’జరాసంధుడై ‘’తిరిగొచ్చాయి ‘’
ఇవాళ 18-5-25 ఆదివారం పెనమకూరు హైస్కూల్ లో ఆ స్కూల్ లో 1983-84పదవ తరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం జరిగింది .సుమారు వారం క్రితం అక్కడి ఒక విద్యార్ధి ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ,తప్పక రమ్మన్నాడు .నేను అప్పుడు లేను కదా అన్నాను .ఉన్నారన్నాడు .నాకు తెలిసినంతరకు నేను పెనమకూరులో 1976 అక్టోబర్ లో చేరి ,1979ఆగస్ట్ లో ట్రాన్సఫర్ అయి ఉయ్యూరులో చేరాను .మూడు రోజుల క్రితం సోమరాజు అనే విద్యార్ధి ఫోన్ చేసి నన్ను తప్పక రావాలన్నాడు .పై విషయం అతనికి కూడా చెప్పాను .కాదండి మాకు తెలుసు .మీరున్నారు అన్నాడు .సరే అన్నాను .నాకు 86 ఏళ్ళు ఆ రోడ్డుమీద ఆటోలో రిక్షాలో రావటం కష్టం .ఎవరైనా వచ్చి తీసుకు వెడితే వస్తాను అన్నాను .అలాగే ఏర్పాటు చేస్తాను అన్నాడు .అలాగే ఇవాళ ఉదయం ఆవూరి ఆడపడుచు శ్రీమతితులశమ్మ గారు , సెకండరి గ్రేడ్ టీచర్, ఆమె భర్త అంటే ఆవూరి అల్లుడు,డ్రిల్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గార్లను బెజవాడ నించి ఎక్కి౦చు కోచ్చిన కారు లో నన్ను ఉయ్యూరులో పిక్ అప్ చేసుకొని వెళ్లారు .నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦,సిద్ధ యోగి పుంగవులు పుస్తకాలు రెండు బండిల్స్ సుమారు 85 పుస్తకాలు నాతో కారులో తీసుకు వెళ్లాను .మేము సుమారు 11గం లకు చేరాం అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు .సోమరాజు గుర్తుపట్టి పలకరించగా మిగిలిన వారు అతన్ని అనుసరించారు .ఆడపిల్లల్లో-పిల్లలేమిటి దాదాపు యాభై ఏళ్ల వాళ్ళు శ్రీమతి కొల్లి లక్ష్మి , శారద ,విద్యార్ధులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు .ముందుగా జంటకు సన్మానం చేసి తర్వాత నాకు ,తర్వాత రిటైర్ద్ అటెండర్ జశ్వంత రావు లకు శాలువా పుష్ఫహారం ,నూతన వస్త్రాలతో సన్మానించారు .తర్వాత ఈ కార్యక్రమ రూపకల్పన లో పాల్గొన్నవారికి సన్మానం .ఆతర్వాత పాల్గొన్న ఆబాచ్ విద్యార్ధుల పరిచయం ,ఆతర్వాత ఒంటి గంటకు విందు వెజ్ ,నాన్ వెజ్ వేరువేరుగా అందించారు .తర్వాత మళ్లీ కొన్ని పరిచయాలు అయ్యాక తులశమ్మ గారు మాట్లాడారు .నన్ను మాట్లాడమని అడగలేదు. నెత్తిన పాలు పోసినట్లయింది .మధ్యమధ్యలో ఆడ మగ యా౦కర్ల పాటలు చెవులు చిల్లు పడేసౌండ్ బాక్స్ లు ఇబ్బంది కలిగించాయి . , నా పుస్తకాలు ఒక సెట్ దంపతులకు ,మరోసేట్ తులసమ్మ గారి అన్న దంపతులకు అందించి,మిగిలిన అన్ని పుస్తకాలను రాజు, లక్ష్మి లకుఅప్పగించి అందరికి అందజేయమని మేముపావు తక్కువ మూడుకు బయల్దేరి వచ్చేశాం . నన్ను మాట్లాడమని అంటే ఈ కింది విషయాలు చెబుదామనుకొన్నాను .
‘’పెనమకూరు కు చెందిన1435కాలపు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’కావ్యం రాశాడు ఇందులో అందరికి తెలిసిన ‘’ఆవు -పులి ‘’కథ ఉంది.సత్య సంధతకు హరిశ్చంద్రుడిని చెబుతాం కాని ఒక జంతువు అయిన ఆవు తనను చంపబోయిన పులికి ఇచ్చిన మాటప్రకారం ఇటికి వెళ్ళి లేగకు పాలిచ్చి మంచిమాటలు చెప్పి .తిరిగి రాగా దాని సత్య సంధత కు మెచ్చిన పులి ఆవును చంపకుండా వెనక్కి పంపేస్తుంది .అనంతామాత్యుడు అహోబిల నరసింహస్వామి భక్తుడు .ఆయనే ‘’అనంతుని ఛందస్సు ‘’అనేఅలంకార శాస్త్రం రాశాడు .
అలాగే పౌరాణిక నాటకాలలో శ్రీ కృష్ణ పాత్ర ధరించిన శ్రీ అబ్బూరి వరప్రసాద రావు పెనమకూరు వాస్తవ్యుడే .పద్యం పాడటం లో ఆయనను మించిన వారు లేరు .నేను పని చేసిన కాలం లో ఒక హరిజన విద్యార్ధి ప్రసాద రావు ఉండేవాడు అద్భుతంగా పద్యాలు పాడే వాడు .అతన్ని జూనియర్ ఘంటసాల అనే వాళ్ళం .అతనిని బాగా ప్రోత్సహించాను. అతని తండ్రి కూడా ఉయ్యూరులో నా శిష్యుడు .ప్రసాద్ ఉయ్యూరు కాలేజిలో లో కూడా పాటలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు బహుమతులు పొందాడు .
అక్కడే దగ్గరలో ఉన్న కనకవల్లిలో ‘’కవి గారు ‘’గా ప్రసిద్ధి చెందినశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి గారు జన్మించారు .ఆయన ఆతర్వాత విశాఖ పట్నం చేరి దాదాపు వంద గ్రంధాలు రాశారు .సంఘ సంస్కరణలో పాల్గొన్నారు నాటక సమాజం పెట్టి నాటకాలు రాసి ఆడించారు ..కవిగారి జయంతిని 2024 సెప్టెంబర్ 5ఉపాధ్యాయ దినోత్సవం నాదు మాసువర్చలా ఆంజనేయస్వామి దేవాలయం లో నిర్వహించాం .’’బంగారు తీగ ‘’అంటే కనకవల్లి లో శ్రీ వెంపటి రాదా కృష్ణ ‘’కన్యకాపరమేశ్వరి ‘’నాటకం రాసి రేడియో లో సినిమాలో నటించి ప్రముఖులయ్యారు .మల్లాది సూర్యనారాయణ గొప్పపౌరాణిక నటులు హరిశ్చంద్ర ఫేం .అయన కుమార్తె మల్లాది వసుంధర సప్తపర్ని నవలారచయిత్రి .ఆయన తమ్ముడు మల్లాది శివరామ శాస్త్రిగారు గొప్ప అవధాని స్వాతంత్ర్య సమర యోధులు .వీరందరితో నాకు పరిచయం ఉంది.కనకవల్లి శివాలయం మా మేనమామ శ్రీ గుండు గంగాధర శాస్త్రిగారు మహాలక్షమ్మ దంపతులు 1953 లో వారం రోజులు ప్రతిష్టా మహోత్సవం జరిపారు .ఊరందరికీ రెండుపూటలా భోజనాలు టిఫిన్లు .కనకవల్లి కి చెందిన ఉయ్యూరు హైస్కూల్ నాక్లాస్ మేట్స్ మారేపల్లి చలపతి ,వెంపటి సుబ్రహ్మణ్యం వగైరాలు .
నేను పెనమకూరు లో చేరినప్పుడు హెడ్ మాస్టర్ శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తి గారు .అంతకుముందు మేడూరు లో లెక్కల మాస్టారు .స్కూల్ డిసిప్లిన్ గొప్పగా ఉండేది .పాస్ బెల్ కు పిల్లలంతా క్యూ లోవెళ్ళి క్యూలో వచ్చేవారు .అయితే ఆయనకు ఎవారైనా బడికి రాగానే టీచర్ నమస్కారం చెయ్యకపోతే గుర్తుపెట్టుకొని బాధించేవారు .అప్పుడు స్కూల్ లో స్టాఫ్ యూనియన్ లేదు ట్రాన్స్ ఫర్ వెళ్ళినా కొత్తగా వచ్చి చేరినా టీ పార్టీ లులేవు .అప్పుడు నేను ,డ్రిల్ మాస్టర్ వై జగనమోహన రావు ఆయన భార్య భ్రమరాంబ సోషల్ టీచర్ హిందీ టీచర్ రామరత్నం గారు భర్త డ్రిల్ మాస్టర్ నరసింహారావు , సెకండరి గ్రేడ్ టీచర్ నాగమణి గారు భర్త రికార్డ్ అసిస్టెంట్ సా౦బశివరావు,తెలుగు మాస్టార్ వెంపటి శర్మగారు ఉయ్యూరు నుంచే బస్ లో వచ్చేవాళ్ళం .ఒక్కో సారి లేట్ అయేది .పాపం హెడ్ గారు ఏమీ అనే వారు కాదు .అప్పుడు మేమంతా ఇక నుంచి లేట్ గా రాకూడదని నిర్ణయించుకొని మగవాళ్ళం సైకిళ్ళ మీద ఆడవారు రిక్షాలో చాలా ముందుగానే వచ్చేవాళ్ళం .క్రాఫ్ట్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు తాడంకి నుంచి ,చిన్న తెలుగుమేస్టార్ నౌలూరి సూర్యనారాయణ గారు కపిలేశ్వరపురం నుంచి ,డ్రాయింగ్ మాస్టర్ భద్రాచారిగారి గారు గన్నవరం నుంచి ,మరో సోషల్ పిజికే పునాది పాడు నుంచి వచ్చేవారు .ఎస్ ఆర్ కె అనే లెక్కల మేష్టారు ,వెంకటప్పయ్య సౌదామని దంపతులు సెకండరి గ్రేడ్ లు. వెంకటప్పయ్యగారికి గొప్ప ఇంగ్లీష్ పాండిత్యం ఉండేది .నేచురల్ సైన్స్కు మరో రాధాకృష్ణ భార్య తెలుగు పండిట్ .హిందీ కి షరీఫ్ గారు .మారో సెకండరి గ్రే డ్ శ్రీ రామారావు గారు నిక్కచ్చి మనిషి .
నేను జగన్మోహన రావు ఆలోచించి స్టాఫ్ సెక్రెటరి ని ఎన్నకోవాలని అనుకొని,అందర్నీ చెప్పి , హెచ్ ఏం గారిని ఒప్పించి ఏర్పాటు చేశాం నేనేసేక్రేటరి అనుకొంటా .జగన్మోహన్ ,భద్రచారి జాయింట్ సెక్రెటరి గా ఎన్నికై బాగా పని చేశాం .ఒకసారి మురళీధర రావు గారు విష్ చేయలేదని హెచ్ ఏం ఇబ్బంది పెడుతుంటే మేమిద్దరం హెడ్ నుకలిసి నచ్చచెప్పి నమస్కరించటం మా కనీస బాధ్యత ఒక వేళ పొరబాటున మర్చిపోతే మనస్సులో పెట్టుకోవద్దని , మురళితో సారీ చెప్పించి , హెడ్ ను కన్విన్స్ చేశా౦.ఆప్పటి నుంచి హాయిగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాం . పిల్లలకు మంచి నీటి సౌకర్యం లేదు .కనుక రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాటు చేయాలని స్టాఫ్ మీటింగ్ లో నిర్ణయం చేసి టీచర్స్ జీతాన్ని బట్టి చందాఇవ్వాలని ఆడబ్బు జీతాల్లో కట్ చేసుకోవాలని చెప్పి ,ఊరి పెద్దలను పొరుగూరి పెద్దలను స్కూల్ అయ్యాక సైకిళ్ళ మీద హెడ్ గారితో సహా వెళ్ళి చందాలు వసూలు చేసి కెసిపి వారితో బోర్ వేయించి మోటార్ బిగించి ,పిల్లలు త్రాగటానికి పంపులు ఏర్పాటు చేశాం. ఇదొక రికార్డ్ . ఆ ఏడు వార్షికోత్సవం ఘనంగా జరిపాం .విద్యార్దులచేత నాటక నాటికలు ,పాటలు పద్యాలు విచిత్ర వేషాలు తో హోరేత్తించాం .ఆరోజు రాత్రి మాస్టాఫ్ అందరికి హెడ్ మాస్టా రింట్లోనే కమ్మని విందు భోజనం .
పెనమకూరు సర్వీస్ అంటే దివి తుఫాను తప్పక గుర్తుకొస్తుంది .ఇందిరాగాంధీ పుట్టిన రోజు నవంబర్ 19శనివారం దివి సీమ ఉప్పెన భయంకరంగా వచ్చి వేలాది మందిని పశువులను పొట్టబెట్టుకున్నది .18ఉదయం నుంచే వాతావరణం మార్పు కనిపించింది .ఉదయం తొమ్మిదికి సైకిల్ పై స్కూల్ కు వెళ్ళాం .కలెక్టర్ గారి ఆజ్ఞమేరకు సెలవు ప్రకటించినట్లు హెడ్ గారు చెప్పగా తిరిగి వచ్చేశాం .అర్జునుడు అనే అటెండర్ రిటైర్ అయితే సన్మానం చేయాలని అనుకొన్నాం .హెడ్ గారు వామభావాల మనిషి అయినా ఒప్పుకోలేదు .చివరికి ఒప్పించి సన్మానం చేశాం .అర్జునుడు చాలా ఆనందించాడు .ఆతను క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సేక్రేటరికూడా .నేనుఉయ్యూరు బదిలీయిఅనప్పుడు ఘనం గా స్టాఫ్ పార్టీ ఇచ్చింది హెడ్ గారు నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు .ఇన్ని జ్ఞాపకాలు తరుముఒంటూ వచ్చి చేరాయి .
శ్లోం -‘’సువర్చలాదిష్టిత వామభాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం
భానుప్రభం రాఘవ కార్య దీక్షం -అస్మత్కులేశం శ్రీ హానూమంత మీడే’’.
స్వస్తిశ్రీ చాంద్రమాన వైశాఖ మాస బహుళ దశమి 22-5-25 గురువారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు లొ శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లొ 20-5-25మంగళ వారం నుంచి 22-5-25 గురువారం వరకు త్రయహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం జరురుతుంది .భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని సేవించి తరించ ప్రార్ధన .
కార్యక్రమమ వివరం
20-5-25 -మంగళవారం -వైశాఖ బహుళ అష్టమి -ఉదయం6గం .లకు
1-తొలి లక్షణ గ్రంథం ‘’కావ్యాలంకార చూడామణి ‘’ రాసిన -విన్నకోట పెద్దన
విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు కావ్యాలంకారమనే లక్షణగ్రంధాన్ని రచించాడు. ఇతడు కౌశిక గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు. తండ్రి గోవిందరాజు. నివాస స్థానము రాజమహేంద్రవరము. తాను రచించిన కావ్యాలంకారచూడామణి అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను. ఈ విశ్వేశ్వరుడు రాజరాజ నరేంద్రునకు ఏడవ మనుమడు అని,15వ శతాబ్దానికి చెందిన వాడని భావన.
విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. తొమ్మిది ఉల్లాసాలుగా విభజించి విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.
విన్నకోట పెద్దన, ప్రద్యుమ్నచరిత్ర అనే మరో గ్రంథాన్ని రచించెనని శ్రీ మానవల్లి రామకృష్ణ కవి తన కుమారసంభవము టిప్పణిలో పేర్కొనెను. పెద్దన రాజమహేంద్రవనాన్ని వర్ణించినట్లు ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది
నాగనాథ కవి శాసన ప్రమాణాల ప్రకారం ఇతను సా.శ.1369 కాలం నాటి వాడు. ఇతని తండ్రి గారు పశుపతి. అందుకే ఆయనను పశుపతి నాగనాథ కవిగా వ్యవహరిస్తారు. ఇతను అనపోతనాయకుని ఆస్థాన కవి. అనపోతనాయకుడు పద్మ నాయకులలో ఆరవ వాడు. ఇతని గురువు విశ్వేశ్వర కవి చంద్రుడు. గురువు గారు చమత్కార చంద్రిక అనే కావ్యాలంకార గ్రంథం వ్రాసాడు. ఇందులో కావ్య గుణ దోషాల గురించి విపులమైన చర్చ జరిపాడు. ఇదియే కాక విశ్వస్వర కవి చమత్కార చంద్రిక, కందర్ప సంభవం, కరుణాకందళం, వీర భద్ర విభ్రున్జనం వంటి పెక్కు రచనలు చేసాడు. అతని శిష్యుడైన నాగ నాథ కవి సంస్కృత, తెలుగు భాషాల్లో పండితుడు.
నాగనాథ కవి రచనలు
మదన విలాసం అనే భాణం వ్రాసినట్లు విష్ణు పురాణాన్ని తెనిగించినట్లు శాసన ప్రమాణాల ద్వారా తెలియవస్తున్నది గానీ ఇవి రెండూ అలభ్యాలు. మదన విలాసం గురించి నిడదవోలు వెంకట రావు గారు, చాగంటి శేషయ్య గారు పరిశోధనలు చేసారు. సా.శ. 1530-1550 మధ్యన వెన్నెలకంటి సూరన కుడా విష్ణు పురాణాన్ని తెనిగించాడు. నాగనాథ కవి ముఖ్యంగా శాసన లేఖకుడు. చారిత్రాత్మకమైన ఐనవోలు శాసనం సా.శ. 1369 నాటిది. దీని లేఖకుడు నాగనాథ కవి.
ఇతనిని కొరవి గోప రాజు పూర్వ కవిగా స్తుతించాడు. కొరవి గోప రాజు పెద తండ్రులు అనపోతనాయిని గారి కుమారుడైన సింగమనాయినమంవారి ఆస్థానంలో మంత్రులు. అందుచేత అప్పటికి పద్మ నాయిక ఆస్థానంలో ప్రముఖుడైన పశుపతి నాగ నాథ కవిని స్తుతించి ఉండవచ్చు.
3–ప్రథమాంధ్ర వచన నిర్మాత ,’’సింహగిరి వచనాలు ‘’రచించిన -శ్రీ కాంత కృష్ణమాచార్యులు
శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్యలేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం కచ్చితంగా తెలియవు. కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములు అనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావు, తిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో ప్రచురించిన వ్యాసాల ప్రకారం ఈయన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని (1295-1323) కాలానికి చెందినవాడిగా భావించారు.
కృష్ణమయ్య ను గురించి కొన్ని సంగతులు
సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తుడు, అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు. వారికంటే ప్రాచీనుడు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పద కవితాచార్యుడు. భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన వైష్ణవపండితుడు.
పుట్టుక సంగతులు
కృష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు సా.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర ‘సిద్దేశ్వర చరిత్ర’తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన’ లో తాను `తారణ’ నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ, తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ, ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు .. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని’గా కొనియాడబడినట్టు చెపుతారు.
కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట. వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడనేదిద కృష్ణమయ్య విషయంలోనూ నిజమే నని తేలింది.ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు.
ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు.
యశస్సు
ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం, మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం, దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ, భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం, నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం, చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ, ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ, దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని, సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ, భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో, సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలనీ, ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత, నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా, భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను, భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.
“
దేవా!విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.
”
సాహితీ సేవ
ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి, భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. కృష్ణమయ్య సింహగిరినరహరి ఆదేశంతో, అనుగ్రహంతో స్వామిని స్తుతిస్తూ `సింహగిరి వచనాలు’అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
“
దేవా!గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి……….ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా గంటికనకపీతాంబర ప్రభావమ్ము గంటి
”
మకుటం
పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ ।దేవా* అనే సంబోధనతో మొదలై, ।సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ* అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు* అని.
ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. ‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు. ‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది…. ….నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’ అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు…అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!
“
దేవా…! పెద్దతనంబు చేసి మిము మెప్పించెదనంటినా … జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బుద్ధినినే మెప్పించెదనంటినా … విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బంటుదనంబు సేసి మిము మెప్పించెదనంటినా … యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే …! దేవా..! తీర్థంబులాడి మిము మెప్పించెదనంటినా … గంగా భవాని మీ యంగుష్ఠంబు నందే ఉద్భవించి యున్నదే …! దేవా…! ప్రదక్షిణములుచేసి మిము మెప్పించెదనంటినా … సూర్యచంద్రాదులు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! వేదవేద్యుండనై మిము మెప్పించెదనంటినా … బ్రహ్మ మీ నాభి కమలమం దుద్భవించి యున్నాడే ..! దేవా…! గీతప్రబన్ధములచేత మిము మెప్పించెదనంటినా … కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక సనందన సనత్కుమార పరమ భాగవతులు.., నారదాదులు మీ సన్నిథినే యున్నారే ..! దేవా…! సత్యంబులచేత మిము మెప్పించెదనంటినా … సత్యహరిశ్చంద్రుడు మీ సన్నిథినే యున్నాడే ..! దేవా…! ధనదాన్యంబులచేత మిమ్ము మెప్పించెద నంటినా … శ్రీ మహాలక్ష్మి మీ యుదరమందే యున్నదే …! దేవా…! శాంత శమదమాది గుణంబులచేత నోర్పు గలిగి యుండెద నంటినా … భూదేవి మీ సన్నిథినే యున్నదే …! దేవా…! విందులు పెట్టి మిమ్ము మెప్పించెద నంటినా … విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెద నంటినా … రుక్మాంగదుండు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! భక్తివైరాగ్యంబుల జేసి మిమ్ము మెప్పించెద నంటినా … ప్రహ్లాదుడు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! వాహనరూపుండనై భరింతు నంటినా … గరుత్మంతుండు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! మీ పాద పద్మంబులు నా కన్నుల జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా … ద్వారపాలకులు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! నేనా మిమ్ము నుతించగలవాడను …!!?? ఎనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువులలో నేనొక నరజీవుండనే … ! దేవా…! మిమ్ము …, వేయి శిరస్సులు..,రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతె గాక ..!!! యతిరామానుజా …! అనాథపతీ ..! స్వామీ …! సింహగిరి నరహరీ …! నమో నమో దయానిథీ …!!”
”
అబ్బురమనిపించే జీవిత కథనం
ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూండగా, స్వామి బాలకుని రూపంలో వచ్చి, వారి తొడ మీద కూర్చుని, ఆ వచనాలను తాళపత్రం మీద గంటంతో రాయసాగాడుట. అంతవరకూ ఆశువుగా, ఎప్పటికప్పుడు భావావేశంతో గానం చేస్తున్న ఆచార్యుల వారికి, ఈ సంఘటన తర్వాత, తన వచన సంకీర్తనలను అక్షర బద్ధం చేయాలన్న ఆదేశంగా తోచిందట. అప్పటినుంచీ అలాగే చేస్తూ వచ్చాడు.
కృష్ణమాచార్యుని వచనాలు నాలుగైదు లక్షల పైమాటేనని విశ్వసిస్తున్నా, ఇప్పటి వరకూ లభించినవి 60 మాత్రమే. వీరి వచనాలిలా అదృశ్యం కావటానికొక రమ్యమైన గాథ బహుళ ప్రచారంలో ఉంది. రామానుజాచార్యులవారు సింహాచలం విచ్చేసి, ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు. వారిని కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు. తన భక్తి తరంగాలతో సాక్షాత్తూ నృసింహునే పరవశింప జేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం. ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. పరమాచార్యులైన రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు.
తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమా చార్యులు పరమానందంతో దీనికంగీక రించాడు. ఆ రోజు తన గాన నృత్య కలాపం ముగిసిన తర్వాత, రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు. ఆ పరమాత్ముడాశ్చర్యం నటిస్తూ, తాను రామానుజునికి ముక్తి ప్రసాదించటమేమిటి? ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడన్నాడు. కృష్ణమాచార్యులకిది గట్టిగా తగిలింది. నిర్విణ్నుడైపోయాడు.
ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత, నిన్నగాక మొన్న వచ్చి, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా? తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు॥పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా?** అని.
॥నీకైనా ముక్తిని ప్రసాదించగలవాడు రామానుజుడే** అని సమాధానం. కృష్ణమాచార్యుడిక నిగ్రహించుకోలేక పోయాడు. ఎవరినైతే తానిన్నాళ్లూ నిరాద రించాడో, తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా? తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది? క్రోధావేశం తన్నుకు వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. స్వామి కూడా మొహమాటమేమీ లేకుండా నిష్కర్షగానే ఉన్నాడు.
॥ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు రుణపడిలేను. నీవు సంకీర్తనతో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది** అని శపించాడు.
ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది! ప్రతీకారేచ్ఛ రగులుతూంటే, ॥నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది** అని ప్రతి శాపమిచ్చాడు. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి
శ్రీకాంత కృష్ణమాచ్చర్యులవారి సాహిత్యం పై పరిశోధన చేసిన విశాఖపట్నంకి చెందిన సంగీతవేత్త, స్వరకర్త, సాంస్కృతిక విలేకరి శ్రీ వినుకొండ. మురళీమోహన్ 1983 ప్రాంతంలో ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలలో వ్యాసాలు ప్రచురించారు .ఆయన వారి వచన సంకీర్తనలని అందరూ పాడుకునేందుకు వీలుగా పల్లవి, చరణాలతో కూడిన కీర్తనలుగా పరిష్కరించి స్వరబద్ధం చేసి తొలిసారిగా 2009జులై మాసంలో శ్రీకాంత కృష్ణమాచారులవారి వర్ధంతి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో గానం చేశారు.
తదుపరి అదే రోజున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త గౌరవనీయులుశ్రీ ఆనంద గజపతి గారి అధ్యక్షతన కృష్ణమయ్య ప్రాజెక్ట్ స్థాపించారు