మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

కృష్ణా జిల్లా చిరివాడలో జన్మించి ,పెద్ద చదువులు చదివి ఎదిగి మధ్యప్రదేశ్ భోపాల్ లో స్థిరపడిన ఆంధ్ర చిత్రకారుడు శ్రీ వేలూరి రాధా కృష్ణగారి గురించి ఈ తరానికి అస్సలే తెలియదు .కాశీనాథుని వారి భారతి మాసపత్రికలలో ఆయన చిత్రాలు ,వ్యాసాలూ తరచుగా దర్శనమిచ్చేవి .మా అమ్మ’’ ఆయన మన చిరివాడ వాడేరా’’ ఆని చెప్పేది  ఆయన వేలూరి శివరామ శాస్త్రి గారి తమ్ముడు రామ మూర్తి గారి అబ్బాయి .మరో తమ్ముడు వేలూరి కృష్ణమూర్తి గారి కుమారుడే మా చిన్నక్కయ్య దుర్గ గారి భర్త మా బావ గారు ..అంటే మా బావగారు రాధాకృష్ణ అన్నదమ్ముల పిల్లలు అన్నమాట .సంతోషించేవాళ్ళం .అంతకన్నా ఎక్కువ తెలియదు .ఒక సారి ఎప్పుడో మా బావ అక్కయ్య శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ గార్లు భోపాల్ లో ఉండగా వెళ్లినట్లు ,.అప్పుడు రాధా కృష్ణ గారి౦టికి తీసుకు వెళ్ళినట్లు గుర్తు .వారి తల్లిగారు కూడా అక్కడ ఉండేవారని జ్ఞాపకం .ఆతర్వాత ఎప్పుడో ఆంధ్రా కు వస్తే హైదరాబాద్ లో మాబావ గారింట్లో చూసినట్లు లీలగా  గుర్తు . మధ్య ప్రదేశ్ చిత్రకారుల జాబితాలో ,ఆంధ్ర చిత్రకారుల జాబితాలో 20వ శతాబ్ది తెలుగు వెలుగులు లో  వెతికితే వారి పేరే కనిపించక పొతే ,మా అబ్బాయి శర్మ కు  పై వివరాలు చెబితే వెతికి ,కొన్ని వివరాలు ,ఆయన రాసిన వ్యాసాలూ ఆయన మోనోకట్ చిత్రాలు పంపాడు వాటి ఆధారంగా ఆయన జీవిత విషయాలు పొందు పరుస్తున్నాను .ఇంకా ఎవరికైనా అదనపు విషయాలు  తెలిస్తే .అందజేయమని కోరుతున్నాను  .

  శ్రీ తిరుమల రామ చంద్ర గారికి శ్రీ వేలూరి రాదా కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యు ‘’హైదరాబాద్ నోట్ బుక్ ‘’లో వచ్చింది అందులోని విషయాలే రాస్తున్నాను .’’నిరంతర కళా సేవే నా లక్ష్యం .మా తండ్రి శ్రీ వేలూరి రామమూర్తిగారు ,పెదతండ్రి శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు నాకు ఆదర్శం.వారి అడుగుజాడలలో నడచుకోవటమే నా కర్తవ్యమ్ ‘’అన్నారు  వేలూరి వారు  తిరుమల వారితో .ఇదీ ఆ వంశానికి తగిన మాట ఆని మెచ్చారు  రామచంద్ర .వేలూరి వారందరూ ఆకార సదృశ ప్రజ్ఞులు ,ప్రజ్ఞా సదృశాగములు ,ఆగమ సదృశ క్రియా శీలురు ,ప్రాతస్మరణీయులు.వేలూరి శివరామ శాస్త్రి గారిని తలచుకొన్నప్పుడు ‘’పులిగడిగినముత్తేము’’వంటి వారి రూప లావణ్య గుణ పాండిత్య ప్రజా సేవలు సాక్షాత్కరించి ,మనసు ఆనంద తు౦దిలమవుతుంది .ఆ వంశం వారంతా అలాంటి వారే .ఏదో ఒక సాధన ,ఏదో ఒక తపస్సు ,ఏదో ఒక మానవ సేవ లో పునీతులు .అలాంటి రామమూర్తి గారింటి కళాకారుల తనయుడు రాదా కృష్ణ మాటలు వేరుగా ఎలా ఉంటాయి ?అన్నారు తిరుమల ప్రజ్ఞాని .

  శ్రీ వేలూరి రాధాకృష్ణ 1930 లో కృష్ణా జిల్లా చిరివాడ అగ్రహారం లో పుట్టారు. అది సకల ఆగమ విద్యల ‘’సిరివాడ ‘’  .నెరవాడ ,పేర్వాడ .తండ్రి రామమూర్తి గారు సుప్రసిద్ధ కళా చార్యులు శ్రీ  ప్రమోద కుమార్ ముఖర్జీ శిష్యులు. తనకొడుకు కూడా అంతటి  కళాకారుడు కావాలని కోరుకున్నారు తండ్రి రామమూర్తి .తగిన శిక్షణ తండ్రిగారు పుత్రరత్నానికి ఇచ్చారు .తర్వాత మద్రాస్ వెళ్లి లలిత కళాశాలలో దేవీ ప్రసాద్ చౌదరి గారి వద్ద కళాభ్యాసం చేసి డిప్లమో పొందారు రాధా కృష్ణ .పిమ్మట శాంతినికేతన్ లో శ్రీ నందా లాల్ బోస్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందారు .కొన్నేళ్ళు ఆంధ్రపత్రికలో కళా కారులుగా పని చేశారు .తర్వాత కళోపాధ్యాయ వృత్తీ చేబట్టి ,మధ్యప్రదేశ్ లోని ‘’పచ్ మర్హి’’లో ఆర్ట్ లెక్చరర్ గా కొనసాగారు .

  రాధాకృష్ణ లలితా కళా రంగం లో చేపట్టని ప్రక్రియ లేదు .చేబట్టి దిట్టతనం చూపనినిది ఏదీ లేదు.ఎన్నో నీటి వర్ణ చిత్రాలు తైల వర్ణ చిత్రాలు ,రేఖా చిత్రాలు , లినోకట్ చిత్రాలు,గ్రాక్ లను ఆయన తూలిక సుసంపన్నం చేసింది .అనంత కళా ఖండాలను సృజించినది .దానికి ప్రాచీన ఆర్వాచీన భేదం లేదు.ఇజాలజోలి లేనే లేదు .దానిది నిజమైన గతి, రీతి .తెలుగు ప్రజాజీవితం రమణీయంగా ఆయన తూలిక చిత్రించింది .తెలుగుప్రజలు వాటిని ఆదరించి స్వంతం చేసుకొన్నారు .ఆయన చిత్రాలలో పూజకోసం ,బాటసారులు ,క్షేత్రయ్య ,అప్రత్యక్ష శిష్యుడు ,నాట్య కౌశలం మొదలైనవి మన రాష్ట్ర ,దేశ ,అమెరికా ,స్విట్జర్లాండ్ ,,ఫిలిప్పీన్స్ మొదలైన ఇతర దేశాల కళా హృదయులనూ ఆకర్షించి అబ్బుర పరచాయి .అనేక చిత్రాలు మధ్యప్రదేశ్ గవర్నర్ రాజభవనాన్ని ,విదేశ ప్రముఖుల నివాసాలను అలంకరించాయి .

  వేలూరి  రాదా కృష్ణ అనేక వ్యక్తిగత ,సమష్టి కళా ప్రదర్శనలు నిర్వహించారు .విశేష ప్రశంసలు బహుమతులు అందుకొన్నారు .కవి విమర్శకుడు అవటం అరుదు .కళాకారుడు రచయిత ,కళా విమర్శకుడు కావటం కూడా అంతే.’’తన సుందర చిత్రాలలాంటి చక్కని శైలిలో రచన చేసి ,మౌలిక కళా విమర్శ చేసే ఇద్దరిలో ఒకరు వేలూరి రాధా కృష్ణ ఆని నా వ్యక్తిగత అభిప్రాయం’’ఆని కీర్తి కిరీటం పెట్టారు తిరుమల రామ చంద్ర ఆచార్యవర్యులు.తెలుగు ఇంగ్లీష్ లలో రాధాకృష్ణ కళారీతుల గురించి ముఖ్యంగా తెలుగు కళా వైదగ్ధ్యాన్ని గురించి అనేకానేక వ్యాసాలు  రాశారు .కళాకారుల జీవితాలను నిష్పక్ష పాతం గా చిత్రించారు .ఆయన రాసిన ‘’కళోదంతం ‘’  అనే గ్రంథం కళపై వచ్చిన ఉత్తమ గ్రంథం అన్నారు ఆచార్య .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’కాశ్మీర్ ‘’పుస్తకం రాశారు .ఆంధ్రకళావైభవాన్ని లిఖిత పూర్వకంగా చాటటం ఆయన లక్ష్యం .ప్రవాసం లోఅంటే ఇతర రాష్ట్రం లో  ఉన్నా తెలుగుతనం కాపాడుకోవటం ఆయనకు చాలా ఇష్టం .ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడెమీ ఆదరించక పోయినా ,,మధ్యప్రదేశ్ లలితకళా అకాడెమీ సభ్యత్వమిచ్చి గౌరవించి అక్కున చేర్చుకొన్నది .

  ‘’నేను 1965లో భోపాల్ రాగానే ‘’ఆదర్శ సాంస్కృతిక పరిషత్ ‘’స్థాపించాను .మధ్యప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన సంస్థ ఇది . అయినా గుర్తింపు పొందలేదని ప్రతిభావంతులైన కళాకారులు విజ్ఞానమూర్తులు బాధ పడుతున్నారు .ప్రతిభావంతులైన చిత్రకారుల ను వారి శిల్పాలు చిత్రాలను ప్రదర్శించి ఆకర్షించటం నా లక్ష్యం .ఇక్కడే ‘’అఖిలభారత కళా ప్రదర్శన ‘’నిర్వహించాను .రెండు కళాసదస్సులు జరిపాను .అరడజను మంది ప్రముఖ కళాకారులను సత్కరించి గౌరవించాను .వ్యష్టి ప్రదర్శనలు అనేకం నిర్వహించి ప్రోత్సహించాను .భారత ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది .దీనికి కేంద్ర లలితా కళా అకాడేమికి,ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడేమికి సంబంధం ఉన్నది .   ఇటీవలే ‘’రిధం ఆర్ట్స్ సొసైటి ‘’పేరున ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ తెరచి ,వర్ధమాన కళాకారులను తయారు చేస్తున్నాను ‘’ఆని తిరుమల రామచంద్రజీ  చేసిన ఇంటర్వ్యు లో వేలూరి రాధా కృష్ణ మనసులోని భావాలు పంచుకొన్నారు .  

  తాను మధ్యప్రదేశ్ లో ఉండిపోవటం వలన తనను ఆంధ్ర ప్రజలు మర్చిపోయి ఉంటారని బాధపడ్డారని రామచంద్ర ఉవాచ .వేలూరి రాధాకృష్ణ ఆసేతు హిమాచల పర్యంత భారతావని తనదే ఆని గర్వపడే మహా వ్యక్తి ఆని ,ఆకళాసేవ అలానే కొనసాగాలని, తెలుగు వారు గుర్తించనంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని ,ప్రచారానికి, పైమేరుగులకు ఆశించక కళకే అంకితమై వేలూరి రాదా కృష్ణ కళామతల్లి సేవ చేయాలని మనసారా ఆకాంక్షించారు తిరుమల రామ చంద్ర .

 కొసమెరుపుగా లోకజ్ఞులైన శ్రీ  సంపత్కుమార చక్రవర్తి ఉత్తరాలలో చివర ‘’తక్షక ‘’ఆని రాస్తారని, దాని అర్ధం ‘’తప్పులుంటే క్షమించ కలరు ‘’ఆని వివరించారు .తిరుమల వారిఈ వ్యాసం  దొరకక పొతే ప్రజ్ఞామూర్తి వేలూరి రాధా కృష్ణ గారి గురించి పూర్తిగా తెలిసేది కాదు .

‘’ శ్రీ వేలూరి రాధాకృష్ణ చిత్రలేఖన వైదుష్యం గురించి మధ్యప్రదేశ్  గవర్నర్ శ్రీ కే.వెంగళరాయరెడ్ది  హెవి ఎలెక్ట్రికల్స్ కమ్యూనిటి హాల్ లో స్థానిక ఆంధ్ర విజ్ఞాన సమితి ఏర్పాటుచేసిన రాధాకృష్ణ చిత్ర ప్రదర్శనను జనవరి 15న ప్రారంభిస్తూ (సంవత్సరం ?)రాధాకృష్ణ చిత్ర కళారీతులను,ప్రాభవాన్ని  ప్రశంసిస్తూ తమ రాజభవన్ అల౦కరణకోసం మూడు త్రివర్ణ చిత్రాలు కొన్నారు .రాధాకృష్ణ జాతీయ రక్షణ నిధికి అందించిన రెండు చిత్రాలను వేలం వేయగా వచ్చిన 20  వేల రూపాయలను రక్షణ నిధికి సమర్పించారు .ఈ సందర్భంగా రాధా కృష్ణ ఆంధ్ర విజ్ఞాన సమితికి ఒక వర్ణ చిత్రం బహూకరించారు ‘’ఆని స్థానిక భోపాల్ పత్రిక జనవరి 15నప్రచురించింది .సంవత్సరం తెలియదు .

  శ్రీ వేలూరి రాధా కృష్ణ మరణం  సంగతి కూడా మనకు తెలీదు.ఇంకో 5ఏళ్లలో ఆయన శతజయంతి కూడా వస్తోంది .దేశ దేశాలలో ఉన్న వేలూరి వారైనా  సమష్టిగా నిలబడి ఆ శత జయంతిని సగర్వంగా నిర్వహించాలని కోరుతున్నాను .మన అకాడేమీలు, కళాపరిషత్తులు ఈపనికి ముందుకు వస్తాయని నాకు నమ్మకం లేదు .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.13వ భాగం.13.6.25

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.13వ భాగం.13.6.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.24 వ భాగం.13.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.24 వ భాగం.13.6.25.

Posted in రచనలు | Leave a comment

 ఇప్పుడు దేవీ భాగవతం లోఆచార్యశ్రీ సృజనాత్మప్రత్యేకతలను దర్శిద్దాం .

·         కాలం మారుతోంది .సంస్కృత రచనలు ,పద్య రచనలు చదివి జీర్ణి౦చుకొనే శక్తి నేటి తరానికి లేదు.కానీ ఆస్తికత వారి నరనరాలలో జీర్ణించి ఉంది.వీరిని ఆకర్షించాలి అంటే వచనమే ,అందులోనూ  సులభతర మైన వచనమే శరణ్యం ఆని  ఆంధ్ర గీర్వాణ  ఉపన్యాసకులుగా ,ఆచార్యులుగా లబ్ధ ప్రతిష్టులైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం  గారు సులభ  వచన రూపంగా ఆహ్లాదంగా ,ఆనందంగా చదువుకొని,తొందరగా అర్ధం చేసుకొనే వీలుగా  శ్రీదేవీ మహాత్మ్యాన్ని రచించారు  .. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంథ రాజం ఇది .ఆచార్యశ్రీ శేముషీ వైభవానికి, ఆంధ్ర గీర్వాణాలలో వారికున్న అపార శక్తి సామర్ధ్యాలకు ఇది అద్దం పడుతోంది .ఒకరకం గా ఇది ‘’చేతిలో ఉన్న ఆధ్యాత్మిక నవనీతం ..గుటుక్కున మింగటమే మనం చేయగలిగేది .అంత సులభంగా ‘’డౌన్ టు ఎర్త్ ‘’ గా మనకందించారు . దీనిని జన్మ నిచ్చిన తలిదండ్రులకు ,పునర్జన్మ నిచ్చిన గురు దేవులకూ అంకితమిచ్చి మాతా,పితృ, గురు ఋణం తీర్చుకొన్నారు .అప్పటికే వారికి మురారి సంస్కృత అనర్ఘ రాఘవం నాటకానికి  సురుచిర వ్యాఖ్యానం తో అర్ధతాత్పర్యాలు రచించిన అనుభవం ఉండనే ఉంది.

·         ఇప్పుడు దేవీ భాగవతం లోఆచార్యశ్రీ సృజనాత్మప్రత్యేకతలను దర్శిద్దాం .

·           సృజనాత్మకత అంటే –

·           ‘’కొత్త విలువైన ఊహలను, ఆలోచనలను,రచనలను చేసే సామర్ధ్యమే సృజనాత్మకత .లక్ష్యసాధనకు కొత్త పరిష్కా రాలు కనిపెట్టటం అన్నమాట .దీనివలన ప్రజలకు  నూతన విధానాలలో సమస్యల పరిష్కారం సాధ్యమౌతుంది  . పునరుజ్జీవన కాలం లో దీనికి కొత్త రూపు వచ్చింది .దీనిపై ఆసక్తి మనస్తత్వ శాస్త్ర ,మానవీయ శాస్త్రాల పై ఎక్కువగా కన్పిస్తుంది .వాస్తవికత సృజనాత్మకత తో కలిసి పని చేస్తుందని అందులో నిష్ణాతులు అన్నారు .సృజనాత్మకతను సౌందర్యాభిరుచి పరంగా కొందరు,సామాజిక ప్రభావంగా కొందరు భావించారు .

·         అనువాదం లో సృజన పాత్ర ఏమిటి ?

·         అనువాదం అంటే పునః కథనం .ఒక  భాషలో చెప్పిన దాన్ని మరొక భాషలో చెప్పటం అనువాదం .అంటే మూలం లోని దాన్ని చెప్పదలచుకొన్న భాషలో సరిగ్గా సహజం గా చెప్పటం .దీనిపై  అనేక అధ్యయనాలు జరిగాయి .

·         అనువాదంలో సృజనాత్మకత ఉండాలా ?
 అనువాదం అంటే  ముక్కకు ముక్కానువాదం కాదు .ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అసలు రచన యొక్క భావాన్ని, శైలిని  ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, కొత్త భాషలో అదే భావాన్ని సృష్టించగలగడం. ఇది కేవలం పదాలను మార్చడం కాదు, కానీ ఒక కళాత్మక ప్రక్రియ, ఇక్కడ అనువాదకుడు తన సృజనాత్మకతను ఉపయోగించి అసలు రచన యొక్క ఆనందాన్ని, భావాలను కొత్త భాషలో కూడా సృష్టించగలడు. అంటే మన కవిత్రయ మహాభారతం లాంటిది అన్నమాట .ఇవాళ ప్రపంచమంతా సృజనాత్మక అనువాదాన్ని కోరుకొంటున్నారు.దీనినే ‘’కంటెంట్  ట్రాన్స్ క్రియేషన్ ‘’అన్నారు .ఇక్కడ ఎవరికీ చెప్పాలి ? వారికి మూలం ఏమి  చెప్పాలను కొంటో౦ది అన్నవి చాలా ముఖ్యం .  ఇవన్నీ ఆచార్య బేతవోలుగారికి కొట్టిన పిండి, నల్లేరుపై నడక .

·           

·         ‘’ఏయే జన్మలలో ఏ దేవిని అర్చి౦చానో నాకు ఈ జన్మలో రెండు ముక్కలబ్బాయి.దానితో నీ మహిమావళిని ఆకాశ గంగా సదృశ వాక్కులతో  అభి  వర్ణిస్తాను అనుగ్రహించ’’మని శ్రీ రాజ రాజేశ్వరీ దేవిని ప్రార్ధించారు అత్యంత వినయ భూషణులై   . సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్రవహించిన ఈ పురాణం పురాణ రాజమే అన్నారు .భుక్తి ,ముక్తి  దాయకం ఆని మనకు అభయమిచ్చారు .ఇందులో ధర్మార్ధ కామ మోక్షాలనిచ్చే మనోహర కథలున్నాయని ,యోగ, తంత్ర , మంత్రాది శాస్త్రాలు నిక్షిప్తమయి ఉదాత్తత ను కలిగించాయని  చేతిలో మిఠాయి పట్టుకొని బాలురను ఆకర్షించినట్లు చదువరులను ఆకట్టుకొన్నారు .ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం లో తాంత్రిక మతానుయాయులున్నారని అందుచే దేవీ భాగవతం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందని, దీనికి కారణం జగజ్జనని విజయవాటిక అయిన బెజవాడ లో శ్రీ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటం కూడా గొప్ప విషయం అన్నారు .తమకున్న అనుభవం వలన కథాభాగాలు తేలికగానే అనువదించగలిగానని, తాత్విక విషయాలు కొంత ఇబ్బందిపెట్టినా, నీలకంఠుల వారి తిలక్ వ్యాఖ్యానం ,బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాతృత్వం తో ఒడ్డుకు చేరగలిగానని కృతజ్ఞతలు ప్రకటించారు .తాంత్రిక -ఉపాసనా విషయాలలో ఏవైపుకు మొగ్గకుండా మధ్యేమార్గాన్ని అనుసరించానని చెప్పుకొన్నారు .వ్యాస భగవానుడే గుట్టుగా ఉంచిన వాటిని ,గురువే శరణ్యం అనుకొన్న చోట్లా వివరించే ప్రయత్నం చేసి పాఠకులను కీకారణ్యం లో పడవేయటం ఇష్టం లేక  వివరించే ప్రయత్నం విరమించి మార్గం సుగమం చేశానన్నారు .ఇది తన తెలియని అజ్ఞానానికి నిదర్శనం ఆని నిర్భయంగా ఒప్పుకొన్నారు .తీర్ధ క్షేత్ర దైవతాల వర్ణన విషయ౦ లో వ్యాసవాణి అమృతధారలను చిలికిస్తుందని ,ఆనంద లాస్యం చేస్తుందని ,,వాటిని వచనం లో పెడితే బాణీలో మార్పు వస్తుంది కనుక ఆ బాణీ పట్టుకోవటానికి తన శక్తి ధార పోయాల్సి వచ్చిందన్నారు .ధ్వని సంపుటీకరణం వలన  వ్యాసోద్దేశ ప్రయోజనాన్ని యధా తధంగా అందించే ప్రయత్నం చేశారు బేతవోలు వారు .ప్రధాన స్తోత్రాలలో మనం దీన్ని గమనించవచ్చు .తెలుగు పాఠకులకు ,దేవీ భక్తులకు ఇది పారాయణ గ్రంథం గా ఉండాలని ఆయువు పట్లు అయిన అన్ని శ్లోకాలను ఉదహరించారు .కవితా సౌరభాలను గుబాళించే శ్లోకాలను కూడా యధావిధిగా ఉదాహరించి మహోపకారం చేశారు .ఇవి అనువాదానికి అదనపు విలువలను అందించాయి .సాంకేతిక ,అప్రసిద్ధ పదాలకు బ్రాకెట్ లలో అర్ధాలు ఇవ్వటం గొప్పగా ఉంది.కొత్తపదాల పరిచయానికి ఇది రాజమార్గం అవుతుంది .సులభ తెలుగు శైలోలోనే  రాసినా,  ఉదాత్తత కు భంగం రాలేదు ,చిక్కదనం  సడలలేదు .మూలం లోని అందాలను చెదరనివ్వలేదు, మాసిపోనివ్వలేదు .తెలుగు వచనానికి ఉన్న ఒడుపు ఒయ్యారాలను త్యాగం చేయలేదు .శైలీ రామణీయకతకోసం కారకాన్ని మార్చుకొన్నారు .అవసరమైన చోట్ల ఒకటి రెండుపదాలు అదనంగా చేర్చారు .సంస్కృత మూలం లో దేనినీ మార్చలేదు .ఉన్నదేదీ జార్చలేదు .

·         ‘’యద్యచ్చరితం దేవ్యా స్తత్సర్వం లోకహేతవే -నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యధా తధా’’ అన్నట్లు అమ్మ వడిలో మాతృ వాత్సల్యం అనుభవించారు బేతవోలు గారు .

·          తృతీయ స్కంధం లో ‘జనులకు హితమైనదే సత్యం .జ్ఞానులు విముక్తులు అంతర్యజ్ఞం చేయాలి .నిర్దుష్టంగా యుక్తి యుక్తంగా ,అత్యంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి .మునులకు, మోక్షకాములైన మహాత్ములకు విరాగులకు పూర్ణ యజ్ఞమైన మానవ యజ్ఞం చెప్పారు .దీనికి ఏ దోషాలు అంటవు . విష్ణుమూర్తి దేవీ యజ్ఞం చేసి దేవాధి దేవుడయ్యాడు .ఆని యజ్ఞ ధర్మాన్ని చాలా వివరంగా తేలికభాషలో చెప్పారు .

·           మహాదేవిని యోగ విద్యా రహస్యం చెప్పమని హిమవంతుడు అడిగితే ‘’జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం ‘’ఆని చెప్పింది  సప్తమ  స్కంధం లో.విశ్వమే బ్రహ్మ అనే అనుభవం కలిగినవాడు బ్రహ్మ భూతుడు ,ప్రసన్నాత్ముడు .దేనికీ వెరవడు. ఉత్తమ దేవీ క్షేత్రాలను వివరిస్తూ కామాఖ్యాయోని మండలం కంటే ఉత్తమోత్తమ దేవీ స్థానం ఎక్కడాలేదు అన్నది .ధర్మం వల్ల భక్తీ, భక్తి వల్ల పరం లభిస్తాయి . అష్టమ స్కంధ౦ లో మేరుపర్వత శిఖరం పైన ఉన్న నేరేడుచెట్టునుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలి పగిలి పోగా జంబూ నది ఏర్పడింది, ఆని, భవుడు ఒక్కడే దేవుడు ఆని ,ఆయన బ్రహ్మ అక్షిగోళాలనుంచి జన్మించాడని,ఆయన సంకర్ష ణుడిని సదా ధ్యానిస్తూ దేవీగణం తో ఇలావృతం లో ఉంటూ,  లోకకార్యం చేస్తాడని  నారద మాహర్షికి  విష్ణువు బోధించాడు  . రాధికారాధన,దుర్గా రాధనా ఉన్నాయి .

·           దశమ స్కంధం లో అగస్త్యుని దక్షిణ యాత్ర ,స్వాయంభువు వి౦ధ్య వాసినిని ఉపాసి౦చటం ,మన్వంతరాలలో వివిధ నామాలతో దేవీ ఉపాసన ,మహిషాసురవధ,భ్రామరీ ఉపాసన ,ఏకాదశ స్కంధం లో సదాచార నియమాలు ,శౌచం ,రుద్రాక్ష భేదాలు ,భస్మ ధారణా ,,జపం ,వైశ్వ దేవం,ప్రాజాపత్యం   మొదలైనవి ఉన్నాయి 

·           చివరి ద్వాదశ స్కంధం లో  గాయత్రి మంత్రాక్షర మహిమ ,కవచం ,గాయత్రీ హృదయం ,స్తోత్రం ,అష్టోత్తర సహస్రనామాలు ,దీక్షా ప్రదానం ,స్కండిలకుండల సంస్కారాలు ,దీక్షా స్వీకారం ,ఇంద్రాదిదేవతలు దైత్యులతో యుద్ధంచేసి, నిర్జించి విజయ గర్వంతో సంబరాలు చేసుకొంటుంటే ‘’కేనోపనిషత్ ‘’లోని విధంగా వారి గర్వాన్నిఉమాదేవి  అణచటం ,మహాదేవి ఆత్మావిష్కారం ,గాయత్రీ మహిమ ,దేవీ శక్తులు పరిచారికలు,అష్ట మాతృకలు ,షోడశ దళ పద్మం ,చింతామణి గృహం శ్రీమాత ,జనమేజయుని మనశ్శాంతి ,శ్రీ దేవీ భాగవత ఫలశ్రుతి చెప్పి

·         ‘’సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం -నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్’’అంటూ వచన శ్రీ దేవీ భాగవతాన్ని ముగించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు .  .

·           గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-25-ఉయ్యూరు .9989066375

·           ఈ క్రిందిది  ప్రసారం కాని నేను రాసుకొన్న  స్క్రిప్ట్

·         ద్వాదశ స్కంధ శ్రీదేవీ భాగవతాన్నిబేతవోలువారు సూటిగా ప్రారంభించి చరాచర జగత్తు అంతా ఆపరాశక్తి కి ఒక క్రీడా విలాసమని ,సృష్టించేవేళ సృజన ,రక్షణ పాలించే సమయంలో పాలన స్వరూప ,సంహార వేళ రౌద్రస్వరూప అనీ ,పరా పశ్యంతి మాధ్యమా రూప వాక్కు ఆ మాతస్వరూపమేనని ,త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అమోఘ వాక్ శక్తి అనుగ్రహించాలని అమ్మకు నమస్కరించి ,నరనారాయణ ,సరస్వతి ,వ్యాస మహర్షి లను స్తుతించి ఏ పురాణమైనా ప్రారంభించాలన్నారు .పరమ పావనం ,సులభంగా భుక్తి ముక్తులనిచ్చే మహా పురాణాన్ని అనుగ్రహించమని నైమిశంలో శౌనకాదులు కోరితే సూతమహర్షి ‘’లోకహితం కోరారు కనుక సకల శాస్త్రసారం పరమ పావనమైన దేవీ భాగవతం వినిపిస్తానని ,అది పాపారణ్యాలకు గండ్రగొడ్డలి ,తమస్సుకు పొద్దు పొడుపు ఆని ప్రారంభించి ,భగవాన్ వేద వ్యాస మహర్షి జననాది విషయాలు వేదవిభజన ,అష్టాదశ పురాణ రచన  వివరించి , దేవీ భాగవతాన్ని అందరు అన్ని వేళలా వినవచ్చు మానవులైతే చాలు అన్నాడు .అయితేదేవీ నవరాత్రులలో నవాహయజ్ఞం గా వింటే విశేష పుణ్యం .శ్రవణ మహా యజ్ఞాన్నిస్తుంది .అందుకే దేవీ మఖం అంటే దేవీ యజ్ఞం అన్నారు .దేవీ భాగవత గ్రంథ దానం  విశేష పుణ్య ఫలదం .ఆని శ్రవణ, దాన ఫలితం కూడా చెప్పాడు . అవసరమైన చోట్ల మూల శ్లోకాలను ఉదహరించి ,భావం నేరుగా వివరించారు .అందుకని కథా ప్రవాహం లో అలా అలా కొట్టుకు పోతూనే ఉంటాం .ఎక్కడా విసుగు అనిపించదు.ఇది బేతవోలు గారి ప్రత్యేకత,చాతుర్యం .

·           ‘’యోగ నిద్రా మీలితాక్షం విష్ణుం దృష్ట్వా౦బుజే స్థితః -అజస్తుష్టావ యాం దేవీం తామహం  శ్రవణం భజే ‘’విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు ,నాభికమలం లోని బ్రహ్మ సగుణ నిర్గుణ మాయా స్వరూపిణి ,ముక్తి దాయిని అయిన ఆపరాశక్తికి నమస్కరించి దేవీ భాగవతం చెప్పటం మొదలు పెట్టాడు .   .తర్వాత వ్యాసజననం ,హయగ్రీవ ఉత్పత్తి చెప్పాడు .ఒకసారి విష్ణు వును నిద్రలేపటానికి వమ్రి, ఆయన ధనుస్సు ను కొరికితే ఆయన తల తెగి పడింది .ఎంత వెతికినా దొరకలేదు .త్రిమూర్తులు దేవతలు దిక్కు తోచక తబ్బిబ్బు అయి జగన్మాతను ‘’బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తధా-యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం స చరాచరం ‘’అంటూ  స్తుతించాలని భావించగా బ్రహ్మ నాలుగుముఖాలు వేదాలు మాతృ సూక్తం ఆలపించాయి .అమ్మ ప్రత్యక్షమై వారిని ఊరడించి  గుర్రం ముఖాన్ని తెచ్చి విష్ణుమూర్తి మొండానికి దేవ శిల్పి చేత అతికి౦ప జేయగా ఆయన హయగ్రీవుడై ,హయవదనరాక్షస సంహారం చేసి లోకాలను కాపాడాడు . అందుకే శ్రావణ పౌర్ణమినాడు,అంటే రాఖీ పౌర్ణమినాడు  వైష్ణవ దేవాలయాలలో శ్రీ హయగ్రీవ జయంతి జరుపుతారు .  

·          గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-25-ఉయ్యూరు .    

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.3 వ భాగం.12.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.3 వ భాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.12వభాగం.12.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.12వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చిత్ర వైతాళికుడు. శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.2 వభాగం.11.6.25.

అభ్యుదయ చిత్ర వైతాళికుడు. శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.2 వభాగం.11.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.14 వ భాగం.11.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.14 వ భాగం.11.6.25.

Posted in రచనలు | Leave a comment

జూన్ 11న ఆలిండియా రేడియో విజయవాడ నుండి ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారు అనువదించిన దేవీభాగవతంపై విలువైన ప్రసంగ ప్రసారం. గబ్బిట దుర్గా ప్రసాద్

జూన్ 11న ఆలిండియా రేడియో విజయవాడ నుండి ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారు అనువదించిన దేవీభాగవతంపై విలువైన ప్రసంగ ప్రసారం. గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు., 13వ భాగం.7.6.25.

Posted in రచనలు | Leave a comment

స్త్రీ పునర్వివాహ ప్రోత్సాహకులు ,విద్యావేత్త ,లాయర్ ,జిల్లా మున్సిఫ్ ,వేద పాఠశాల స్థాపకులు ,యజ్ఞాలలో పశు హింస మాన్పించినకృష్ణా జిల్లా వాసి  -శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు

స్త్రీ పునర్వివాహ ప్రోత్సాహకులు ,విద్యావేత్త ,లాయర్ ,జిల్లా మున్సిఫ్ ,వేద పాఠశాల స్థాపకులు ,యజ్ఞాలలో పశు హింస మాన్పించినకృష్ణా జిల్లా వాసి  -శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు

కృష్ణా జిల్లా నూజివీడులో 25-8-1845న శ్రీ ఆత్మూరి కృష్ణమూర్తి శ్రీమతి రాఘవమ్మ దంపతులకు శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులుజన్మించారు .తండ్రి కుగ్రామం లో పనిచేయటం వలన యాజులుగారు 12వ ఏడు వరకు చదువుకోలేక పోయారు.1858లో బందరు హిందూ స్కూల్ లో చేరి .1965లో మెట్రిక్,ఉపాధ్యాయ పరీక్ష  పాసై ,1866లో ఎఫ్. ఎ.బంగారు పతకం తో కృతార్దులయ్యారు .14వ ఏటనే శ్రీమతి యశోదాంబతో వివాహం జరిగింది .

 1866,1869,1873లలో రెవిన్యూ శాఖవారి క్రిమినల్ ,సివిల్ పరీక్షలు పాసై ,1872,1874లలో బి .ఎ., బి .ఎల్.డిగ్రీలు పొందారు .1866-67లో బందరు చర్చి మిషన్ స్కూల్ లో ,1868-70మధ్య రాజమండ్రి ప్రొవిన్షియల్ స్కూల్ లో ఉపాధ్యాయులుగా పని చేశారు .1871-73మధ్య గంజాం జిల్లా డిప్యుటి ఇన్స్పెక్టర్ఆఫ్ స్కూల్స్  గా ఉద్యోగించారు .

  తర్వాత న్యాయవాద వృత్తిలో చేరి 1873-77మధ్య బరంపురం జిల్లా కోర్టు లో ,1878లో హైకోర్ట్ లో లాయర్ గా పని చేశారు .1878-80 లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి ,1879-99వరకు ఇరవై ఏళ్ళు జిల్లా మున్సిఫ్ గా పలు చోట్ల పని చేసి గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు .

 భారతీయ వాజ్మయాన్ని అవపోసన పట్టిన నృసింహ సోమయాజులుగారు బూజుపట్టిన సనాతన భావాల బూజు దులిపి ,వేదాలకు భగవద్గీత కు  గూడార్ధాలు చెప్పటం లో నిష్ణాతులయ్యారు  .మఠాధిపతుల ప్రశంసలు పొందారు.వేద ధర్మ శాస్త్ర గ్రంధాలు సేకరించి వేద పాఠశాల స్థాపించారు .యజ్ఞ యాగాలలో పశు బలిని నిరసించారు .వేదాలు శూద్రులు ,స్త్రీలు కూడా వినవచ్చునని ఘంటా పదంగా తెలియజేసి ప్రోత్సహించారు .’’వేదార్ధ ప్రకాశిక ‘’మాసపత్రిక నెలకొల్పి ,వేదాల భగవద్గీత సారాన్ని అందరికి తేలికగా అర్ధమయ్యేలా సులభ శైలిలో రాసి మహా ప్రచారం చేశారు .మూఢా చారాలను సమర్ధించే ఎంత గొప్పవారినైనా దూది ఏకినట్లు ఏకి పారేసేవారు.వేదాలలో స్త్రీల పునర్వివాహ విషయం ఉందని ఊరూ వాడా ప్రచారంచేశారు .విరూపాక్ష శంకరస్వామి దీన్ని వ్యతిరేకిస్తే, మద్రాస హైకోర్ట్ లో కేసు వేసి సాములోరికి రెండు వందల జుల్మానా వేయించిన ఘనాపాటీ లాయర్ సోమయాజులు గారు .

  సముద్రాలు దాటి వెళ్ళరాదనే  చాందస వాదాన్నిఖండించి అలా చేసిన వారిపై దండన విధించటం పై పోరాడి విజయంసాధించారు .బాల్య వివాహాలను ఖండించారు .మద్రాస్ లో ఉన్న ’’సర్వజాతీయ నీతి ప్రచారక సంఘం ‘’ లో సభ్యులుగా చేరి ,వివిధ రాష్ట్రాలు పర్యటించి ఉపన్యాసాలిస్తూ నీతి ధర్మాలను ప్రచారం చేశారు .13-6-1906 న 61వ ఏట ‘’అపర ఆంధ్ర వివేకానంద స్వామి ‘’లాంటి బ్రహ్మశ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు గారు పరమ పదించారు .   

ఆధారం -శ్రే మాధవ పెద్ది గోఖలే (మా గోఖలే )వ్యాసం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

డా. ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.2 వ భాగం.6.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.11వ భాగం.4.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.11వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.11వ భాగం.4.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.11వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.22 వ భాగం.4.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.22 వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

ఆనందవాణి పత్రిక సంపాదకుడు -శ్రీ ఉప్పులూరి కాళిదాసు

ఆనందవాణి పత్రిక సంపాదకుడు -శ్రీ ఉప్పులూరి కాళిదాసు

4-12-1915విజయ నగరం లో జన్మించారు శ్రీ ఉప్పులూరి కాళిదాసు.అక్కడే విద్య పూర్తి చేసి పాతికేళ్ళ వయసు లోపే పత్రికా రంగం లో ప్రవేశించి పత్రిక స్థాపకులయ్యారు .1932లో చదువుకొనే రోజుల్లోనే ,శ్రీ మల్లాజోశ్యుల వెంకన్నపంతులు గారి ప్రోత్సాహంతో పత్రికా విలేకరి అయ్యారు .హిందు ,బాంబే క్రానికల్ పత్రికలలో ఈయన రాసిన వార్తలు అచ్చయేవి . తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాసేవారు .ప్రముఖ  సంపాదకుడు  శ్రీ ఖాసా సుబ్బారావు ,రచయితలు శ్రీ మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు గార్లతో ఆంతరంగిక పరిచయం ఉండేది .రాజాజీ తో సాన్నిహిత్యం ఉండేది .

  1939లో స్వాతంత్ర్యోద్యమకవి శ్రీగరిమెళ్ళ సత్యనారాయణ గారితో కలిసి ‘’ఆనందవాణి ‘’వార పత్రిక మద్రాస్ లో  స్థాపించారు కాళిదాసు .2-1-1939న మొదటి సంచిక శ్రీ రాజాజీ ముఖ చిత్రంతో వెలువరించారు .ఇది యువ రచయితలకు కళాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పించింది .శ్రీపాద, మునిమాణిక్యం ,మల్లాది మొదలైన ప్రసిద్ధ రచయితలకు  అది వేదిక .1945లో వారపత్రిక ను మాస పత్రిక గా మార్చారు .1960లో కార్యస్థానం మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మార్చారు .

  జాతీయోద్యమకాలం లో ఆనందవాణి కాంగ్రెస్ కు వెన్ను దన్నుగా ఉంటూ ఎన్నెన్నో రాజకీయ  సాంఘిక విష యాలపై చర్చలు ప్రచురించేది .శ్రీశ్రీ ‘’వారం వారం ‘’శీర్షిక ,’గళ్ళనుడికట్టు ‘’ .శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ ‘’కప్పు కాఫీ ‘’ శీర్షిక నిర్వహించేవారు .రాజాజీ రాసిన రామాయణ భారత భాగవతాలను వ్యాస ప్రచురణాలయం  ద్వారాప్రచురించారు .సంపాదక శ్రేష్ఠులు శ్రీ ఎం .చలపతి రావు గారి ‘’ఆల్ ఇన్ ఆల్’’కు అనువాదంగా ‘’ఎందరో మహానుభావులు ‘’గ్రంథం ప్రచురించారు .

 శ్రీ వేంకటేశ్వర స్వామి అనే పుస్తకం రాశారు ఉప్పులూరి .’’రాధాకృష్ణన్ రీడర్ ‘’అనే అభినందన సంచిక కూడా వెలువరించారు .ఆనంద వాణి ఉప సంపాదకులుగా శ్రీ ఆండ్ర శేషగిరిరావు ,ముద్దా విశ్వనాధం ,మహంకాళి శ్రీరామమూర్తి శ్రీనివాస శిరోమణి ,వడలి మందేశ్వర రావు, ఆరుద్ర వంటి సాహితీ జగజ్జెట్టీలు పని చేశారు .ఆ రోజుల్లో చదువుకొన్న వారెవరైనా మద్రాస్ హైదరాబాద్ లకు వెడితే వారికి తమ పత్రికలో ఉద్యోగ కల్పనతో సాయం చేసేవారు .27-10-1995న ఎనభై ఏళ్ల వయసులో ఆనందవాణి పత్రికా నిర్వాహకులు శ్రీ ఉప్పులూరి కాళిదాసు మహాకవి కాళిదాసు ను చేరారు .  

ఆధారం -శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి వ్యాసం .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.4 వభాగం.3.6.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.4 వభాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.10వ భాగం.3.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.10వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.3 వ భాగం.2.6.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.3 వ భాగం.2.6.25.
https://youtu.be/rrEATBDpmEY

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5 వ భాగం.1.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5 వ భాగం.1.6.25.

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.1 వ భాగం.31.5.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.1 వ భాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.7 వ భాగం.31.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.7 వ భాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.20.వభాగం.31.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.20.వభాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.30.5.25..

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.30.5.25..

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు గారిజీవన రేఖలు.14 వ చివరి భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

హోసూరు మాండలికహొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-3(చివరిభాగం )

హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-3(చివరిభాగం )

తనకి స్వతంత్రం వచ్చిందా లేదా అనే సందేహానికి మందు కలియ దిప్పితే తెలుస్తుంది ..వోటు విలువ ప్రధానికైనా పెదోనికైనా ఒకటే .ఇంకా వివరంగా తెలియాలంటే ఒకసారి కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేయాలని హితవు .దేశం లో గలాటాలు పౌరసత్వం  వల్లనే వస్తాయి .మనం భూమిమీదు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చి వెళ్లి పోయేటప్పుడూ అలాగే వెళ్ళిపోతాం .సమాది అంటే మనిషిని పూడ్చే గుంత అన్నాడు తాత .పుట్టటం పని మాత్రమె కాదు సృష్టికార్యం కూడా .బండం అంటే వెంట్రుకలు బ్రహ్మా౦డమే .బువ్వ పెట్టు అనేది బుద్ధికాదు .బువ్వ పెట్టేట్లు చేసేదే బుద్ధి .ఆశ చచ్చిపోవాలంటే పొద్దున్న మంచు ను చెంబులో పట్టుకొని ముఖం కడుక్కోవాలి .మిట్టమధ్యాహ్నం ఎండిపోయిన చెరువులో నిల్చుని కాళ్ళు కడుక్కోవాలి .మనకి ఉనికి ఉంది. దేవునికి ఉనికి ఉందా ?ఉనికిఉంటే హాయిగా తెలుసుకోవచ్చు .జగత్తులో మనిషి మనిషిలో జగత్తుకాదు .మితిమీరిపోయే ఏ దేశమైనా గతి మీరి పోతుంది .గడ్డి ముందు పుట్టి కొలత తర్వాత పుట్టింది .

  నీళ్ళలో పుట్టిన జీవి పాకుతున్నప్పుడు కండబలం వచ్చి ఎగిరింది దుముకుతూపోయి నేలమీద పడి ,నేలవాసనకు స్పందన వచ్చి ,ముందుకు నడిపించి  నీటి జీవి నేల జీవి అయింది.సత్యం తెలిసి సర్దుకుపోతే సమస్యే ఉండదు .మనిషి జంతువును తిని ఆకలి తీర్చుకొని ,మనిషిలో ఆకలి చావగా మనిషి చచ్చిపోయాడు మన్ను ఆకలి తీర్చటానికేనేమో.మానవ పరిణామం ఎప్పుడూ ఆగిపోదు జరుగుతూనే ఉంటుంది .మనిషి కత అయిపోతే కొత్తకత ఆరంభమౌతుంది .’సచ్చేదాకా మనం మన పని చేస్తూ పోతు౦డాలి ‘’. ఏసు, బుద్ధుడు , మహమ్మద్ లకు మతం లేదు .వాళ్ళు మతాతీతులు . సృష్టిలో మార్పు అత్యంత సహజం .మనిషిని మనిషిగా చూడనివాడు ‘’నీయాక్సిన గాడు’’అంటే భడవాఖానా గాడు.మన్నించే గుణం అమ్మకేకాదు బిడ్డకీ ఉంది.చదివిన వాళ్ళంతా యోగ్యులు కారు .ఊరును బట్టే యోగ్యులు .గుర్తింపు వచ్చేట్లు బతికితేనే జీవితం .’’పొత్తాలు సదవటం మాని , మనుషులను చదవటం ‘’విద్య . చావుకు హామీ ఏమీ లేదు . యోచన చేయగా చేయగా శూన్యం కనిపిస్తుంది .అప్పుడు మనం లేకుండా పోతాం .భూమి మీద ఉండటం సుఖంగా భావించాలి .

   జీవించటమే జీవితానికి అర్ధం .పుట్టిపెరిగే నియమం మాత్రం ఉంటుంది .ఏదీ మనదికాదు మనతో వచ్చేది ఏదీ ఉండదు .సృష్టి లో  అన్నీ మారతాయి ఏదీ శాశ్వతం కాదు .’’తగులుడిగి పరతత్వ సంధానమున యోగ సాధన సేయవే మనసా .బ్రహ్మాడమంతయు బయలవు .నామాట బద్ధమని తెలియవే మనసా ‘’అన్నారు శ్రీ కైవారం తాతగారు .

 ఇన్ని పసిడి పలుకులమూట మనకు అందించాడు జ్ఞాని విరాగి కవి విశ్లేషకుడు తల్లిబాసపై అమిత ప్రేమతో నిత్యం ఆ మాండలిక భాషా సరస్వతికి భక్తీ శ్రద్ధలతో పూజచేస్తున్న డాక్టర్ అగరం వసంత్ ధన్యుడు .తాను ధన్యుడై తరించి మనల్నిధన్యులను చేశారు .అతనికి అభినందన చందనం .

ఈ బంగారు పలుకులమూట ను తమిళనాడు కృష్ణనగరం పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో తెలుగులో ప్రమాణం చేసి,తమిళ సభలో తెలుగు దీపాన్ని వెలిగించిన తెలుగు జోదు, హోసూరు ప్రజల గుండె చప్పుడుగా ఉన్న శ్రీ కే గోపీనాథ్ అన్నకు   అ౦కితమివ్వటం ఎంతో సముచితంగా ఉన్నది .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-25- ఉయ్యూరు .  

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.9 వ భాగం.30.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.9 వ భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.19వ భాగం.30.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.19వ భాగం.30.5.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.29.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.6 వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.13వ భాగం.29.5.25.

బాల బంధు శ్రీ బి.వి.నరసింహారావు గారి జీవన రేఖలు.13వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం 8 వ భాగం.29.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం 8 వ భాగం.29.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.18 వ భాగం.29.5.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.18 వ భాగం.29.5.25

Posted in రచనలు | Leave a comment

మా శారదక్కయ్య

మా శారదక్కయ్య

ఈనెల 20 వ తేదీ మంగళ వారం ఉదయం బెజవాడ నుంచి శేఖర్ ఫోన్ చేసి ‘’మామయ్యా ! అమ్మ ఇవాళ ఉదయం నాలుగున్నరకు వెళ్ళి పోయింది ‘’అన్నాడు మా శారదక్కయ్య  రెండవకొడుకు శేఖర్ .’’అవున్రా .దాదాపు ఏడాదిన్నర కాలం గా మంచానే ఉంటూ   మన స్పృహలో   లేకుండా గడిపిన ఆమె, అన్ని బంధాలు తెంచుకొని  వెళ్లిపోయింది ఆ జీవి .ఆమె చివరి రోజుల్లో పడిన వేదన ,మీరు పొందిన ఆవేదన మాటలలో చెప్పలేనివి .ఎప్పుడూ గలగలా నవ్వుతూ ,నుదుట పెద్ద బొట్టుపెట్టుకొని ,నేత చీరలతో ఆకర్ష వంతమైన ముఖం తో అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ ఎప్పటెప్పటి కబుర్లో చెబుతూ బంధుత్వాలను కలుపుతూ అందరికి తలలో నాలుకగా ఉండేది మా శారదక్కయ్య .చివరి సారిగా సుమారు ఏడాది క్రితం ఉయ్యూరులో వాళ్ళ మామ్మఅంటే మా బుల్లిమామ్మ  ఆమెకు రాసిచ్చిన పొలం అమ్మటానికిరెండవకూతురు ఇందు అల్లుడు లతో  కలిసి, వ్యవహారం అయ్యాక మా  ఇంటికి వచ్చి అందరం వాకిట్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవటం నన్ను తమ్ముడూ అంటూ దుర్గాపతీ అంటూ  ఆప్యాయంగా పిలిచే అక్కయ్య .అప్పటిదాకా సికందరాబాద్ లో పెద్దకొడుకు లక్ష్మణ్ దగ్గర ఉన్న ఆవిడ ఇప్పుడు చిన్న కొడుకు శేఖర్ దగ్గర ఉంటూ పైన చెప్పిన జబ్బు కారణంగా నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాల్సి వచ్చి బెజవాడలో కూతురు ఇందు దగ్గర ఉండి తుదిశ్వాస   విడిచింది .కబురు తెలిసినా ఆరోజు నుంచి మూడు రోజులు మా దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలు ఉండటం తో పాటు ఆమెను విగత జీవిగా చూడలేక పోవటం వలన బెజవాడ లో కడసారి దర్శనం చేసుకోలేక పోయాను .జాబ్బు పడి చికిత్సలు జరగటం మొదలైన దగ్గర్నుంచి శేఖర్ ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాడు మధ్యమధ్య నేను అడిగి తెలుసుకొంటూనే ఉన్నాను .ఆమెను ఆ స్థితిలో చూడలేక పోవటం నా బలహీనత .అందుకే అప్పుడు కూడా ఒక్కసారైనా వెళ్ళలేకపోయాను .చైతన్య స్రవంతిగా ఉన్న శారదక్కయ్య ఒక అచేతన వస్తువుగా ఉండే స్థితిని భరించలేకపోయి వెళ్ళలేదు .పోయే సమయానికి ఆమెకు 93ఏళ్ళు .

  ఇంతకీ ఎవరీ శారదక్కయ్య ?మా  నాయనమ్మలు నలుగురు .మా మామ్మ నాగమ్మగారు .ఆమె అక్క రేపల్లెలోని రాయప్రోలు శివరామ దీక్షితులు బాబాయి తల్లిగారు .మా ఆమ్మ పెద్ద చెల్లెలు బ్రహ్మాజోశ్యుల కళ్యానమ్మ గారు చిన్నమామ్మ .ఉయ్యూరులో మా ఇంటికి దక్షిణం వైపు ఇల్లు .ఆవిడ జీవితం సుఖమయం కాదు .ఆమె కొడుకు , మనవడు అంటే కోడలు పాపాయిపిన్ని కొడుకు తీరని వ్యధ కలిగించారు .అందువల్ల ఆ ఇంటిని మా పాపాయి పిన్ని మాకు మాత్రమె అమ్ముతానని పట్టుబట్టి  అమ్మితే మా మేనమామ మాచేత కొనిపించి ఒకరకంగా ఆ ఇంటిని నిలబెట్టించాడు .

 మా మామ్మ చివరి చెల్లెలు భాగ్యమ్మ గారు అనే సూరి సౌభాగ్యమ్మ అనే బుల్లిమామ్మ .వాళ్లకు మా ఆంజనేయ స్వామి దేవాలయం బజారు దగ్గర స్వంత పెంకుటిల్లు పొలం ఉన్నాయి .ఆమెకు ఒక కొడుకు శ్రీరామ మూర్తి బాబాయి .ఆయనకు రాధాకృష్ణమూర్తి సరోజినీ పిల్లలు .బుల్లిమామ్మ కూడా పై మామ్మల్లాగానే నాచిన్నప్పటికే వైధవ్యం అనుభవిస్తున్నవారు .బుల్లిమామ్మ మరోకొడుకు లక్ష్మణ స్వామిబాబాయిని తెలంగాణాలో హుజూర్ నగర దగ్గర  శోభనాద్రిగూడెం  సంపన్నులైన వెలమకన్ని వారికి పెంపుడిచ్చింది .భార్య సత్యవతి పిన్ని .ఈ దంపతులకు శారదక్కయ్య  ,శోభనాద్రి ,రాముడు సంతానం .శోభనాద్రి, రాముడు నాకు బెజవాడలో ఇంటర్ డిగ్రీ లలోసహాధ్యాయులు బుల్లిమామ్మ ఇంట్లోనే ఉండి మేముగ్గురం రాధాకృష్ణమూర్తి కలిసి చదువుకొన్నాం  .ఆతర్వాత ఎవరి జీవితాలు వారివి .లక్ష్మణ స్వామి బాబాయిని పగలతో ప్రతీకారంతో శోభనాద్రి గూడెం లో హత్య చేశారు .ఆకోర్టు వ్యవహారాలూ అన్నీ మా బుల్లిమామ్మ చూసుకొంటూ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ  కాపాడింది. ఆతర్వాత మా సత్యవతి పిన్ని అజమాయిషీలో ఆ కుటుంబం వర్ధిల్లింది .

  శారదక్కయ్యను బెజవాడలో ప్రసిద్ధ లాయర్ శ్రీ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్దకుమారుడు అప్పటికే  డిగ్రీ పాసై ,లా చదివి,స్కాట్ నవల ‘’ది టాలిస్మన్’’వంటి నవలలు అనువాదం చేసిన సాహితీ మూర్తి  శ్రీ  సీతా రామ చంద్రమూర్తిగారికిచ్చి వివాహం చేశారు .ఈ దంపతులకు లక్ష్మణ్ ,శేఖర్ ,ఉషా ఇందు లు సంతానం .ఇంటిపెత్తనం అంతా మా శారదక్కయ్య కే అప్ప గించారు మామగారు ఆమె సమర్ధత గుర్తించి  .అక్కయ్య అతి జాగ్రత్తగా ఇంటి అజమాయిషీచేస్తూ అత్తా మామలకు తలలో నాలుక లాగా వ్యవహరించేది .మామగారికి కూడా బంధువులంటే గొప్ప అభిమానం .మేమంటే ,మానాన్న గారంటే ఇంకా ఎక్కువ అభిమానం గా ఉండేవారు .మేముకూడా ఆగౌరవాన్ని కాపాడుకోనేవాళ్ళం . శారదక్కయ్యకు మరిది శాస్త్రి ,ఆడపడుచు భారతి ఉన్నారు .శాస్త్రి మేము బెజవాడలో చదివేటప్పుడు మకాలేజీ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లోనే చదివేవాడు బి.కాం. భారతికూడా .భారతి కుందనపు బొమ్మ ఆమె ణు విశాకః భర్త పొట్లపల్లి వారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు .ఆయన విశాఖలో లెక్కల  లెక్చరర్ .వీళ్ళ అందరి పెళ్ళిళ్ళకు మాకు ఆహ్వానాలు వచ్చేవి. వెళ్ళే వాళ్ళం . పట్టాభి రామయ్య గారు రెండుపూటలా సంధ్యావందనం ,పూజ చేసేవారు .చలికాలం లో భోజనాల దగ్గర కుంపటి లో బొగ్గులు రాజుతూ ఉండేవి  భార్య గారుకూడా ఎంతో ఆత్మీయంగా,బంధుప్రీతి గా  ఉండేవారు .ఆయనకు బెజవాడలో సాహితీ ప్రియులందరికీ ఆరాధ్యం .చలం ,పౌరాణిక నాటక నటుడు అబ్బూరి వరప్రసాదరావు మొదలైన వారంతా ఆయన ఆతిధ్యం పొందినవారేఅని ఆయనే నాకు చెప్పారు .బెజవాడలో లీడింగ్ లాయర్ పట్టాభి రామయ్య గారు.ఇదీ శారదక్కయ్య కుటుంబం .శారదక్కయ్యకు ఒక ఆడపడుచు కూడా ఉండేది .శారదక్కయ్య తండ్రి ,రాధాకృష్ణమూర్తి తండ్రి శ్రీరామమూర్తి బాబాయిలు మా నాన్న గారి శిష్యులే .ఇంకోబాబాయి భార్యసీతమ్మ పిన్ని మాకు పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు తప్పక వచ్చేది మాకు తెలిసేటప్పటికే ఆమె విధవరాలు . నా చిన్నప్పటి నుంచి శారదక్కయ్య మా ఇంటికి ఆన్ని శుభ అశుభ కార్యాలన్నిటికీ హాజరయ్యేది .ఎంతో పనిని కబుర్లు చెబుతూ చేసేది .మా అమ్మను ‘’దొడ్డమ్మా ‘’ఆని పిలి చేది .ఆమె సహాయం మరువలేనిది .బుల్లిమామ్మ లక్ష వత్తులనోము ఉయ్యూరు లోనే మా ఇంట్లోనే చేసుకొన్నది .శారదక్కయ్య వచ్చింది అంటే ఇంకా ఎవరికోసమూ చూడక్కర లేదు .పది మంది పెట్టు మా శారదక్కయ్య   .మా అమ్మ, మా శ్రీమతి ప్రభావతి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ‘’మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా శారద తమాషాగా సమయానికి హాజరై అన్ని పనులు నిర్వర్తించేది .అలసట ఎరగని మనిషి ‘’ఆని గొప్పగా చెప్పేవారు .ఒక సారేప్పుడో ఉయ్యూరు వస్తే మన గుడికి తీసుకు వెళ్లి పూజ చేయించి  భోజనం చేయించి చీర సారే పెట్టి పంపాము .ఆమె ఎప్పుడు వచ్చినా  మా అక్కయ్య లిద్దరి లాగానే భావించి గౌరవి౦చె వారం .మా ఇంటి ఆడపడుచుగానే చూసే వాళ్ళం .చిన్న కూతురు ఇందు దంపతులు అమెరికాలో ఉంటే ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చింది శారదక్కయ్య .అక్కడి కబుర్లు ఎంతో ఉత్సాహంగా చెప్పేది. అప్పుడే ఇందుకు 117వ మూలకం కనిపెట్టిన సైంటిస్ట్ శ్రీ ఆకునూరి వెంకటరామయ్య గారు ,శ్రీమతి కృష్ణమయి గారు దంపతులతో గాఢ పరిచయం ఏర్పడి,కొనసాగుతోంది .సంపదలతో తులతూగుతున్న వెలమకన్ని వారి కుటుంబం లో ఆడపడుచుగా పుట్టి ,సంపదకు విద్యకు నిలయమైన చెరుకుపల్లి వారింటి కొడలై రెండు కుటుంబాలకు  ఎనలేని కీర్తి సంపాదించి పెట్టిన మా శారదక్కయ్య మా కళ్ళముందు లేదు అనుకోవటం చాలా కష్టంగా బాధ గా  ఉంది .ఉత్తమా ఇల్లాలు మా  శారదక్కయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబాలకు  మా సానుభూతి తెలియజేస్తున్నాను .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5వ భాగం .28.5.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5వ భాగం .28.5.25.

Posted in రచనలు | Leave a comment

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.12వ భాగం.28.5.25.

బాల బంధు శ్రీ బి. వి. నరసింహారావు గారి జీవన రేఖలు.12వ భాగం.28.5.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.7 వ భాగం.28.5.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.7 వ భాగం.28.5.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.17 వ భాగం.27.5.25.

Posted in రచనలు | Leave a comment