శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ)26 కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.26 వ భాగం.5.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ)26 కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.26 వ భాగం.5.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్రక మహాకవి కృత నాటకం. మృచ్ఛ కటికం.1 వ భాగం.5.10.24.

శూద్రక మహాకవి కృత నాటకం. మృచ్ఛ కటికం.1 వ భాగం.5.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3). 12 వ భాగం.4.10.24.

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3). 12 వ భాగం.4.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.5 వ భాగం.4.10.24.

శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.5 వ భాగం.4.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.25 వ భాగం.4.10.24

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.25 వ భాగం.4.10.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.25 వ చివరి భాగం.4.10.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.25 వ చివరి భాగం.4.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

‘’అక్షర గుడి సేవ ‘’కుని తెలుగు ఆరాధనా శతకం –‘’దీని తస్స దియ్య తెనుగు తెనుగు ‘’

‘’అక్షర గుడి సేవ ‘’కుని తెలుగు ఆరాధనా శతకం –‘’దీని తస్స దియ్య తెనుగు తెనుగు ‘’

108 ఆట వెలదులతో కవి గుడిసేవ విష్ణుప్రసాద్ ఆడుకొన్న  శతకం ఇది .శీర్షికే శతక మకుటం .ఎవ్వరిని  అడిగినా ‘’బాస యన తెనుగు బాసయే బాస ‘’అంటారని మొదలుపెట్టి ,అప్పయ్య దీక్షితుల నానుడి చెప్పి ,ఒన మాల తో ఓంకారమనిపించి దైవ భక్తీ నేర్పే భాష ,తెనుగు నేరిస్తే తేజం అబ్బుతు౦దని ,జనపదులలో జానపదులు రాయబారపద్యాలు గేదేలమీద ఎక్కి పరవశించిపాడి వ్యాప్తి చేశారని ,చంకలో పిల్లాడిని లాలిస్తూ గోరుముద్దలు పెట్టె బాష అనీ ,ప్రేమంతా  కురిపించి అమ్మపెట్టే భోజనం లాటిదని ,వాలుజడల సత్యభామ వంపు సొంపులభాష అనీ ,భారత మాత క౦ఠ హార భాష అన్నారు .

  జీవాలను నిలిపే తేట తియ్యని బాస ,కాంతల సిగలో మూర మల్లెపూలను ముడిచి తావులీను భాష ,జీవన మంజూష ,పిల్లతెమ్మెర హాయి గూర్చు భాష ,పౌష్యలక్ష్మి పకపకా సంక్రాంతికి నవ్వే భాష ,అనుబంధాల పిలుపుల భాష ,అన్నమయ్య పదాలాతో పులకించిన భాష .సర్వ ధర్మ సంస్కారం బోధించే గురు భాష .జక్కన్న శిల్ప శోభతో విలసిల్లె భాష , కర్ణపేయమైన కమ్మని బాస .వివిధ జానపద కళలు వర్షిల్ల జేసినభాష .అందుకే ‘’తగిన ప్రేమనుంచి తరియి౦పవలెనురా –‘’దీని తస్స దియ్య తెనుగు తెనుగు ‘’అంటూపొంగిపోతూ  ముగించాడు శతకం .ప్రతి పద్యం పరిమళ భరితంగా ,పెద్దనగారి కప్పురపు విడెం గా ,తెలుగు వారి మల్లె పూవు లా శోభాయమానంగా ఉంటూ ‘’దీని సిగ దరగ –ఇదేమి శతకమురా ‘’ఆని నోళ్ళు తెరుచుకోనేట్లు చేస్తుంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-24-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ పంతుల ‘’వెంకటేశా !నిన్ను ‘’శతకం

శ్రీ పంతుల ‘’వెంకటేశా !నిన్ను ‘’శతకం

శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (తపస్వి )మంచి కవి ,పండితుడు సరసభారతికి ఆప్తుడు .ఆయన ఇటీవల రాసినదే ఈ శతకం .శీర్షి క’’యే’వెంకటేశా !నిన్ను-వేడు కొందును దేవ ‘’ మకుటం..మనమలకోరిక తీర్చి ముద్రణకు సాయపడిన శ్రీ తిరుచ్చిక్కి రామానుజా చార్యులకు కవి అంకితమిచ్చాడు .

ఇష్ట దేవతాస్తుతి చేసి తర్వాత దశావతార వర్ణన చేసి ,పిమ్మట భాగవతం ఆధారంగా వివిధ అవతారాలు  వర్ణించాడు .రామావతారం లో ‘’పుత్రధర్మాన్నే పూర్తి చేశాడు ‘’అన్నాడు .రణరంగం లో క్రీడికి గీత బోధించి ధర్మం నిలిపిపాడు కృష్ణావతారం లో .’’ఈనాటికీ ఇడుములు బాపుతూ –భక్తులను రక్షిస్తున్నాడు వేంకటేశ్వర అవతారం లో .టక్కరి పనులైన -చిక్కని గనులైన –ఠక్కముల్ నాశక –ఠావు నీవే కదా ‘’అన్నాడు బాలాజీని అక్షరార్చన లో .

  ఆచమనం లో కేశవ నామాలను ,స్వామి లీలలను ,విపులంగా వర్ణించి చివరికి తన ఆవేదన విన్న వి౦చు న్చుకొన్నాడు అక్షర తపస్వి పంతుల ..చదివిన ప్రతివారికి ఇక్కట్లు తొలగుతాయని హామీ ఇస్తూ ఫలస్తుతి చేసి 108వ పద్యం లో మంగళం పాడాడు .భావపుష్టి దారా శుద్ధి ,భక్తీ ,శరణాగతి పుష్కలంగా ఉన్న శతకం . చక్కని గెటప్, కూర్పు, ముద్రణ ముచ్చట గొలుపుతాయి .పంతులను అభినందిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 3-10-24-

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవనిగడ్డలో కృష్ణా జిల్లా రచయితల 16 వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27 వ వర్ధంతి –పుస్తక సిరి -2

అవనిగడ్డలో కృష్ణా జిల్లా రచయితల 16 వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27 వ వర్ధంతి –పుస్తక సిరి -2

  ఆ  వేదికపై ముందు ఎడమవైపు కృష్ణారావు గారి బఫ్ట్ సైజ్ విగ్రహం ,ఎదురుగా ఉన్న గోడ మధ్య ఆయన నిలువెత్తు ఫోటో ,దాని చుట్టూ వివిధ సందర్భాలలో ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ,ఆయా సమయాలలో విచ్చేసిన ప్రధాని ముఖ్యమంత్రి మొదలైన పెద్దలఫోటోలు ,కుడి ఎడమల గోడలపై జాతీయ నాయకుల ఆకర్షణీయ చిత్రాలు  ఒక పవిత్రత కర్తవ్య నిర్వహణ బోధ చేసేవి గా గాంధీ క్షేత్రం ఆనే పేరుకు తగినట్లు ఉన్నాయి .

1-  వేదికపై ఆవిష్కరింప బడిన పుస్తకం డా.మండలి బుద్ధ ప్రసాద్ రచించిన ‘’కృష్ణం వందే జీవనాధారం ‘’-కృష్ణా జిల్లా ప్రగతి-నా జ్ఞాపకాలు . ఇందులో కృష్ణా జిల్లాచరిత్ర   విహంగ వీక్షణం ,కృష్ణా డెల్టా చరిత్ర ,జిల్లా అభి వృద్ధి ,గాంధీ యుగం లో కృష్ణా జిల్లా ,స్వాతంత్ర్య ఉద్యమానికిఊపిరులూదిన బెజవాడ కాంగ్రేస్,మణి దీపాలు వెలిగించిన దివ్య సీమ విలువలకు పట్టం కట్టిన బందరు పత్రికా ప్రస్థానం,నదీ నాగరకతకు, గుర్తుగా వెలసిన కృష్ణా విశ్వ విద్యాలయం ,సాంస్కృతిక వారసత్వ వారధులు –కూచిపూడి కళాకారులు ,ప్రక్రుతి ప్రకోపం –మానవ స్పందన  ,తెలుగు జాతి ప్రకాశం ,తెలుగు భాషా వికాసం లక్ష్యంగా –కృష్ణా జిల్లా రచయితల సంఘం అనే 12 శీర్షికలతో జిల్లా సమగ్ర సమాచారం విహంగ వీక్షణం గా దర్శిస్తాం చదివి పొంగి పోయి పులకిస్తాం .విషయ సేకరణకు నివ్వేరపోతాం .అన్ని వ్యాసాలూ ఆణిముత్యాలే .’’కన్న బెన్న’’అయిన కృష్ణమ్మకు దివ్య ఆభారణాలే శోభాయమానాలే .

2-ప్రపంచ తెలుగు  రచయితల 5వ మహాసభలలో ప్రచురితమైన –గమ్యం –గమనం  వ్యాస సంకలనం2022 పుస్తకం.కృష్ణా జిల్లా రచయితల సంఘం పుస్తకం అంటేనే అదొక రిఫరెన్స్ గ్రంధం .ఎందరెందరో లబ్ధ ప్రతిష్టులైన రచయితల మేదో మధనం లో వెలువడిన వ్యాస నవనీటాలే పారిజాటాలే .అన్నీ అన్నే అనిపిస్తాయి .తీరిగ్గా ఓపిగ్గా చదివి మెదడుకు మేత నందించే విలువైన ఆకర గ్రంధం .చదివి ఆనంది౦చాలె  కానీ మాటలకు అందని మహితాన్విత గ్రంధం .తెలుగు భారతావతరణం ముఖ చిత్రం నన్నయ ,రాజరాజ నరేంద్రుడు లతో పరమ వైభవంగా దర్శన మివ్వటం అద్భుతం

3-ప్రముఖ కవి శ్రీ సరికొండ నరసింహ రాజు నాకు అందజేసిన ‘’తల్లడిల్లే తల్లి వేరు ‘’కవితా సంపుటి .సభలోనే చదివేసి నా అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా కవి గారికి తెలియ జేసి ఆశ్చర్య పరచాను .ఇంటికి వచ్చి చూస్తె ఆపుస్తకం నాటో రాలేదు .ఎక్కడో మిస్ అయింది .అద్భుత కవిత్వం .’’మనం నదిగా మారాలి నదిగా ప్రవహించాలి ‘’అన్న లైన్ మాత్రం జ్ఞాపకం ఉంది .

4-డా.సి చెన్నకేశవ రాసిన ‘’శ్రీ వాణీ శతకం ‘’దీన్ని తనగురువు శ్రీ గరిమెళ్ల సోమయాజుల శర్మకు అంకితమిచ్చారు ఇప్పటికి శతాధిక శతకాలను పరిచయం చేశాను సరస భారతిలో .దీన్ని తాపీగా పరిచయం చేస్తాను .

5-మిత్రుడు తపస్వి  శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ఈ జనవరిలో రచించిన ‘’వెంకటేశా నిన్ను వేడుకొందుదేవ  ‘’శతకం ను కూడా తర్వాత పరిచయం చేస్తాను

6-మిత్రుడు ,శ్రీ బుద్ధప్రసాద్  ఆస్థాన కవి  డా.గుడిసేవ విష్ణుప్రసాద్ రాసిన ‘’దీని తస్సాదియ్య-తెనుగు తెనుగు ‘’శతకం కూడా ఇతీవలిదే .దీన్నీ పరిచయం చేస్తా సావకాశంగా .

7-శ్రీ అక్కిరాజు భవానీ ప్రసాద్ గారి –కృష్ణా డెల్టా –పూర్వాపరాలు  వివరణాత్మకమైన చిరు పొత్తం

8-ఉదాహరణ వాజ్మయం ప్రక్రియలో శ్రీ నందుల అత్యుత రామ శాస్త్రి గారు రాసిన ‘’శ్రీ రామోదాహరణం ‘’.ఇది రామాభిరామం గా ఉంది ఆని  కితాబిచ్చారు డా ముదిగొండ శివ ప్రసాద్ .చదివి స్పందిస్తాను .

9-శ్రీ సుశర్మ 2016 లో రాసి ప్రచురించిన ‘’శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయచరిత్ర ‘’పరమ పావనం .పూజా విధానంతో సహా వివరంగా ,మంచి చిత్రాలతో సుందరంగా ఉంది .ఇది కూడా తాపీగా చదివి రాస్తాను .

ఈ విలువైన పుస్తకాలు  అవనిగడ్డ లో నాకు అందజేసిన కవులకు రచయితలకు ధన్యవాదాలు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-24-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

అవనిగడ్డ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27వ వర్ధతి –పుస్తక సిరి

అవనిగడ్డ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27వ వర్ధతి –పుస్తక సిరి

కృష్ణా జిల్లా రచయితల 16వ సమావేశం శ్రీ మండలి కృష్ణా రావు గారి 27వ వర్ధంతి సందర్భంగా దివిసీమ అవని గడ్డలోఒక రోజు కార్యక్రమం గాసెప్టెంబర్ 29ఆదివారం జరిగింది .ఉ దయం కాఫీ  టిఫిన్లు తర్వాత కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం విద్యార్దినులచే ఆహ్వాన నృత్యం ఆకర్షణీయంగా జరిగింది .అసలు కార్యక్రమం ఉద్యమ 11గంటలకు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన ప్రారంభమైంది .శ్రీ మండలి బుద్ధప్రసాద్ తండ్రి గారి పేరా నెలకొల్పిన స్మారక సాహితీ  సేవా పురస్కారం శ్రీ అప్పాజోశ్యులసత్యనారాయణకు ,శ్రీయార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బైరాగి కవి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసినకవితా  పురస్కారం శ్రీ బండ్ల మాధవరావు కు ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు నెలకొల్పిన సాహితీ సేవా పురస్కారం శ్రీ పెనుగొండ లక్ష్మీ నారాయణకు ,,శ్రీ గోళ్ళ నారాయణరావు శ్రీ పోలవరపు కోటేశ్వరరావు పేరిట ఇచ్చే కదా సాహిత్య పురస్కారం శ్రీ రావులపాటి సీతారాం ,శ్రీ మార్తి పౌరోహితం లకు ఆచార్య ప్రతిభ నూతక్కి నెలకొల్పిన శ్రీ ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం శ్రీమతి బాలబాట కె ఎన్ వి రమణమ్మ కు ,శ్రీ వేములపల్లి కేశవరావు నెలకొల్పిన విశాల అనువాద  సాహిత్య పురస్కారంశ్రీమతి స్వాతి శ్రీపాదకు సభ్యుల హర్షధ్వానాల మధ్య ఒక్కొక్కరికి 10వేళ రూపాయలు జ్ఞాపిక వగైరాలతో ఘనం గా అంద జేశారు .పురస్కార గ్రహీతలు క్లుప్తంగా కృతజ్ఞతలు  తెలియ జేశారు .ఒక జడ్జి గారు ,బెజవాడ కేబి ఎన్ కాలేజి ప్రిన్సిపాల్ మొదలైన వారు ప్రసంగించారు .ఇద్దరూ సమయాన్ని లెక్క చేయకుండా ఎవరి దారిన వారు వారిష్టమోచ్చినంత సేపు మాట్లాడి సభ్యుల సహనాన్ని తీవ్రంగా పరీక్షించారు .విన్నవారు తక్కువ విసుక్కొన్న వారు ఎక్కువ .ఉదయం 9గంటలకు ప్రారంభించాల్సిన సభ 11కు మొదలై మధ్యాహ్నం 1గంట వరకు సా——–గింది . తత్ఫలితంగా 12 గం లకు జరగాల్సిన మొదటి సభ భోజనానంతర సభగా మార్చాల్సి వచ్చింది .అధ్యక్షులు సుబ్బారావు ‘’హెల్ప్ లెస్’’అయినట్లు అనిపించింది .

  భోజనాలు సభ భవనం దగ్గరలో ఉన్న బుద్ధ ప్రసాద్ గారింట్లో ఏర్పాటు చేశారు .పూర్ణం చక్రపొంగలి ,గారే ,పులిహోర ,పప్పు  కూర   గోంగూర చట్ని ,కారప్పొడి సాంబారు ,పెరుగు తో విందు కమనీయంగా ఉంది పదార్ధాలన్నీ శుచి రుచితో ఉవ్విల్లూరించాయి .పొందిన అలసట  తీరింది వడ్డించేవారు చాలా ఆప్యాయంగా ,మర్యాదగా వడ్డించారు .విందు ఇచ్చింది బుద్ధ ప్రసాద్ గారే అయినా వంట చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించాలి .ప్రతి ఆటం బాగుంది మసాలా ,ఉల్లి వెల్లుల్లి లేవు .చాలాకాలానికి బయట భోజనం ఇవాళ ఆస్వాదించాను .బుద్ధ ప్రసాద్ గారికి ,వారి కి తోడ్పడిన వారికి ధన్యవాదాలు .అయితే దివి సీమ ప్రసిద్ధి అయిన అరటి పండు లేని లోపం కనిపించింది .

  మధ్యాహ్నం 2గం లకు శ్రీ పూర్ణ చంద్ అధ్యక్షతన  మొదటి సభ ‘’పర్యావరణ సదస్సు ‘’జరిగింది .శ్రీ అక్కినేని భవానీ ప్రసాద్ శ్రీమతి ఎస్ పిభారై ,శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ –కావ్యాలలో దివి ఉప్పెన ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కొల్లేరు ముంపు ,కావుల ప్రతి స్పందన ,శ్రీ అంగత వరప్రసాదరావు – జల విజ్ఞానం రచయితల పాత్ర  ,శ్రీ సరికొండ నరసింహరాజు –జలవనరుల వినియోగం ,రచయితల స్పందన అనే అంశాలపై పత్రసమర్పణ గా మాట్లాడారు .కాల స్పృహ తో మాట్లాడినవారు తక్కువే .ఇక్కడా పూర్ణచంద్ కూడా హెల్ప్ లెస్ అయారు .

  తర్వాత సాయంత్రం 4-30 కి జరిగిన సభలో డా గంధం సుబ్బారావు -50ఏళ్ల కాలం లో ప్రపంచ తెలుగు మహాసభ ల ప్రభావం ,డా రావి రంగారావు –వచన కవిత్వం లో ప్రక్రుతి వైపరీత్యాలు ,శ్రీ కల్లూరి శివ ప్రసాద్ –తెలుగు కధ –పర్యావరణ పరిజ్ఞానం ,శ్రీమతి  తేళ్ళఅరుణ –ప్రకృతి పరిరక్షణ మహిళలపాత్ర ,శ్రీ సవరం వెంకటేశ్వరరావు –చరిత్ర పుటలలో వరదలు ముంపులు ,పై సాధికార ప్రసంగాలు చేశారు .ఈ సభలో ఆత్మీయ అతిధి అయిన నేను ‘’ఇంతటి ముఖ్య సభ జరిపిన త్రిమూర్తులుశ్రీ బుద్ధ ప్రసాద్ శ్రీసుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ లను మనసారా అభినందిస్తున్నాను .గత అయిదేళ్ళుగా ఆంధ్రప్రజలు అనుభవించిన భౌతిక మానసిక క్షోభ ఎన్నికల సునామీతో కోరుకొన్న ప్రభుత్వాన్ని తెచ్చింది .మళ్లీ శ్రీ కాకుళం లో శ్రే కృష్ణ దేవరాయ ఉత్సవాలు జరగాలి .శ్రీ బుద్ధప్రసాద్ కు తగిన గౌరవనీయ పదవి లభించాలి’’నా ప్రసంగం ముగించాను చెప్ప దలచుకున్నది క్రింద  తెలియ జేస్తున్నాను .

 .మన౦దరికి చక్కని సామాజిక స్పృహ బాధ్యత ఉండాలి .మహాభారతం లో పాండవులు ద్వైత వనం లో ఉన్నప్పుడు ధర్మరాజుకు ఒక కల వచ్చింది .అందులో అక్కడి మృగాలన్నీఆయనతో ‘’మీరు నిత్యం మమ్మల్ని వేటాడుతూ చంపేస్తున్నారు మాజాతులన్నీ నశించి పోయి బీజ మాత్రంగా ఉన్నాము .కనుక మీరు వేరే చోటుకు వెళ్ళిపోతే హాయిగా ఊపిరి పీల్చుకొంటాము ‘’ఆని విన్నవించాయి .అంతే మర్నాడు ఉదయం పాండవులు ద్వైతవనం ఖాళీచేసి వేరే చోటికి వెళ్ళిపోయారు .దీనికి భారత పద్యం –‘’ద్వైత వనంబున ధర్మరాజుం డొకనాడు నిద్రి౦పగా తద్వనీ చరంబు ‘’

.భాగవతం లో బాలకృష్ణుడు గోప గోపికలతో  చెట్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ –

‘’అపకారంబు చేయ వెవ్వరికి ,నేకాంతం బుల నుండు .నా తప శీతాదుల వర్ష వారణములై ,త్వద్గంధనిర్వాసభ స్మపలాశాగ్ర కుసుమ చ్ఛాయా ఫల శ్రేణి చే –నుపకారంబులు సేయు నర్ధులకు ,నీయుర్వీజముల్ గంటిరే ‘’ఆని గొప్ప పర్యావరణ స్పృహ కల్పించాడు పోతనామాత్యుడు .

‘’భూమి నాదన్న భూమి ఫక్కున నవ్వు ‘’అన్నాడు వేమన ..కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రి౦శిక లో ‘’చింతలేని మనుజుడు లేడు .చింతకు సరి గలదే లోక చింతా మణీ ‘’అన్నాడు .సవరం చిన నారాయణ నాయకుడు కువలయాశ్వ చరిత్ర లో ‘’పక్షులను మానవ చతుర్వర్ణ వ్యవస్థత తో పోల్చాడు .గోనయామాత్యుడు ‘’సస్యానందం ‘’కావ్యమె రాశాడు .

 వేదాలలో ఆకాశం తండ్రి భూమి తల్లి అంతరిక్షం కుమారుడు ఆని చెప్పి మనం ఎంత బాధ్యతతో మెలగాలో చెప్పారు .వీటిని రక్షించకపోతే మన వ్యవస్థ నాశనమౌతుంది అనిభావం .ఇంగ్లీష్ లో Rancor prime అనే రచయిత’’  వేదిక్ ఈకాలజి ‘’పుస్తకం రాశాడు .సహజ శక్తులు భగవంతుని వ్యక్తీకరణాలు వాటిని గౌరవించాలి .భూమిపై ఉన్న అందమైన వాతావరణాన్ని మనిషి కలుషితం చెయ్య కూడదు .అలెక్జాండర్ Von Humb0dt ను’’ ఈకాలజి పిత’’ అంటారు .అందుకే మానవాళ్ళు ‘’ఈశా వాస్య మిదం సర్వం యత్ క౦ చన జగతిం జగత్ ‘’ఆని నొక్కి చెప్పారు .

ఇది గాంధీ క్షేత్రం కనుక మహాత్ముడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను –జాతీయత భౌతికసరిహద్దుగా కంటే సాంస్కృతిక జాతీయత –కల్చరల్ నేషనాలిటి రావాలి ,కావాలి .

సభలో సనిదపలు –

1-దివి ఉప్పెన పై ‘’కొయ్యగుర్రం ‘’దీర్ఘ కవిత రాసి అవార్డ్ పొందిన శ్రీ నగ్నముని వేదికపై ఉండటం ఆయన మాట్లాడటం  ని౦డుదనంగా ఉంది

2-శ్రీఅక్కిరాజు సుందర రామ శర్మ అద్భుత పద్య గానం తన్మయులను చేసింది .

3-30ఏళ్ళు బొబ్బిల్లపాడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ,నాటక నటుడుగా గొప్ప పేరు పొందిన శ్రీ బొబ్బిళ్ళ సాయిగారు వృద్ధాప్యం జయించి చక్కని పంచకట్టు తో సభకు రావటం సభా గౌరవాన్ని కల్గించింది .నిండుదనాన్ని చేకూర్చింది వారు వేదికపై లేకపోవటం నిరాశ కలిగించింది .4-కవి సమ్మేళనం నిర్వహించిన శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ శిఖామణి గార్లు సార్ధకత కల్పించగా ,కవి మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు అభినందనలు .

5–శ్రీ బుద్ధ ప్రసాద్ గారి సాహిత్య రాజకీయ వారసునిగా కుమారుడు ఛి వెంకట్ రాం  పరిచయ వేదిక గా కూడా సభ  భాసించింది ఆని పించింది .

6-వేదికపై ఆవిష్కరింపబడిన పుస్తకాలు ,అక్కడికి వచ్చిన కవులు అందించిన పుస్తకాలనే నేను శీర్షిక లో ‘’పుస్తక సిరి ‘’అన్నాను రేపు వీటి గురించి తెలియజేస్తా .

7–సభా ప్రాంగణం లో టాయిలెట్స్ పై శ్రద్ధ వహించకపోవటం నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం, ఉన్న టాప్ లోంచి నీరు ధారాళంగా రాకుండా కొద్ది కొద్దిగా రావటం చాలా మందికి ఇబ్బంది కలిగించింది .వీటిని చెప్పుకోలేరు కదా .అయినా నేను అక్కడ ఉన్న పెన్నులు పుస్తకాల ఇంచార్జికి  కంప్లెయింట్ చేయించా .

.మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-24-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.21 వ భాగం.30.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.21 వ భాగం.30.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.16 వ చివరి భాగం.28.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.16 వ చివరి భాగం.28.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం . సాహితీ వైజయంతి.20 వ భాగం.28.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం . సాహితీ వైజయంతి.20 వ భాగం.28.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.20 వ భాగము.28.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.20 వ భాగము.28.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జె౦ద్ అవస్తా  పండితుడు , మహా వ్యాకరణ విధ్వంసుడు,  బహుభాషా వేత్త , న్యాయవాది – శ్రీ  వేదం వేంకటాచలం గారు

జె౦ద్ అవస్తా  పండితుడు , మహా వ్యాకరణ విధ్వంసుడు,  బహుభాషా వేత్త , న్యాయవాది – శ్రీ  వేదం  వేంకటాచలం గారు

  ద్రావిడ  బ్రాహ్మణులు  వెంకటరమణ శాస్త్రి  లక్ష్మమ్మ దంపతులకు  తృతీయ పుత్రుడుగా  గోదావరి జిల్లా  కోడూరు  గ్రామంలో  18  64 లో జన్మించారు  విద్వత్ కవి సుప్రసిద్ధ  విద్వత్ కవి  కళా ప్రపూర్ణ  వెంకటరాయ శాస్త్రి  సోదరు  తండ్రి విశాఖపట్నంలో  నార్మల్ స్కూల్లో  ఆంధ్ర పండితులుగా ఉండేవారు.  మూడు నాలుగు తరగతి  హై స్కూల్ లోనే  చదివి ,  తర్వాత  అక్కడ హిందూ హైస్కూల్  లో కొంతకాలం  చదివి  కళా ప్రపూర్ణ  వద్ద  విద్యాభ్యాసం చేశారు  తర్వాత  1878  బిఏ పరీక్షలో   సంస్కృతంలో  రాజభాని జిల్లాలోనే  ప్రధములుగా వచ్చారు . విజయనగరం మహారాజా  550  బహుమతి550రూపాయలు పొందారు .  1886లో  టౌన్ ఇన్నీస్ పేట  హై స్కూల్  ప్రధాన ఉపాధ్యాయుడు  పరీక్షలు  రెండవ గ్రేడ్ ప్లీడర్ పరీక్షలు ఉత్తీర్ణుడై  కావలికి  13 కిలోమీటర్ల దూరంలో ఉన్న  మల్లయ్య పాలెం లో  తన తండ్రి వందన  అక్కడికి దగ్గర్లో  ఉండాలని  కావలికి వచ్చి  రెండేళ్లు   వచ్చి  రెండేళ్లు  న్యాయవాద వృత్తి  ప్రారంభించి  జీవితాంతం  అక్కడే గడిపారు .

వెంకటా చలం గారి  ధారణాశక్తి  అత్యద్భుత౦.  ఏ భాషలో అయినా  ఒక సత్కావ్యాన్ని  ఒక్కసారి  చదివితే  అది కంఠస్థంపోయేది .స్వయంకృషి చేత  గ్రీకు  లాటిన్  ఇంగ్లీష్  ఫ్రెంచ్  అరబిక్  పర్షియన్,ఇటాలియన్ జర్మన్ ,అరెబిక్ జంద్,ఈజిప్షియన్ ,అస్సీరియన్  పాశ్చాత్య  భాషలనునేర్చి  తొమిది నేర్చి   భారతీయ భాషలైన  సంస్కృత  తెలుగు  అరవం  కన్నడ  మలయాళం  మహారాష్ట్ర  హిందీ  ఉర్దూ  గుజరాతీయ భాషలు   చదివి  సమగ్రమైన  పాండిత్యం సాధించారు .పారశీక ముఖ్య గ్రంథమైన ‘’జంద్ అవెస్తా ‘’ను   వీరు  వేదంలాగా  స్వయంగా  స్వరయుక్తంగా  గానం చేయగలరు

   ప్రాచీన  భూగోళం శాస్త్రం  ప్రాచీన  చరిత్ర లో  శ్రద్ధాసక్తులు ఎక్కువ . తన  విరామ సమయాలలో  పై విషయాలు పై  పరిశోధన చేస్తూకాలం గడిపారు . వీరి రచనలు ముద్రితాలు,  అముద్రితాలు ఉన్నాయి .ముద్రిత రచనలతో   మైథాలజికల్  ఇన్వెస్టిగేషన్ అండ్ ది ఆర్యన్ హైపాధిసిస్ ,’’  అడ్వెంచర్స్  ఆఫ్ ది  గాడ్ ఆఫ్  మధుర ,  భరత వర్ష,ఆర్యావర్త,  ది తమిల్స్ త్రీ తౌసండ్ యియర్స్ ఎగో,పోస్ట్ మోడరన్ లైఫ్ ఇన్యేన్శేంట్ ఇనీజిప్శియన్ బిలీఫ్ , సనాతన ది సనాతన ధర్మ ఆఫ్  హిందూ  మ్యారేజ్, ది సెవెన్  ద్వీపాస్ ఆఫ్ ది పురాణాస్ ,ఇయర్ మెజర్మెంట్  ఇన్ ఏన్సెంట్ టైమ్స్,  నోట్స్  ఆన్ ది  ప్రిలిమినరీ  చాప్టర్స్  ఆఫ్ మహాభారత , బీయింగ్  యాన్ అట్టెంప్ట్  టు సెపరేట్   ది జెన్యూన్ ఫ్రం ది స్పూరియస్ .

  వెంకటాచలం గారి ఆంధ్ర రచనలలో’’కతిపయ శబ్దార్ధ స్వరూప విచారం’’  అనే శీర్షికపై  వ్యాసాలు .అముద్రిత రచనలు – రచనలు  రామాయణ విమర్శ  లలితా సహస్రనామ  భాష్యం ,అమర కోశ వ్యాఖ్య  మొదలైనవి. 

గంభీర రూపంలో  ఉండే  వీరు  సచ్ఛీలురు,  సత్య సంధులు ,  మొహమాటం లేనివారు . న్యాయవాద వృత్తిలో  నీతికి  నిజాయితీకి  వెంకటాచలం గారికి  వెంకటాచలం గారే  సాటి . సత్యదూరమైన  కేసు  ఎన్నడు  చేపట్టలేదు . కఠినంగా పాటించ కాలనియమాన్ని  పాటించారు . 1931లో 67వ ఏట ఈ పుంభావ సరస్వతి  మరణించారు.

ఆధారం – ఆచార్య గుర్తి వెంకటరావు గారి వ్యాసం .వీరి గురించి వికీ పీడియాలో లేకపోవటం దురదృష్టం .ఫోటో కూడా దొరకలేదు .

మనవి –ఈ వ్యాసం ఇవాళే మొదటి సారిగా ‘’స్పీచ్ టైపింగ్ ‘’లో రాశాను .ఈ విధానం నాకు నేర్పిన మ అబ్బాయి శర్మకు ,కంప్యూటర్ ఘనాపాటి శ్రీ రహ్మనుద్దీన్ షేక్ గారికి ,ఇందులో మెళకువలు నేర్పిన మా  మనవరాలు రమ్యకు అభినందనలు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-24-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Leave a comment

డా . నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన. గాంధీ యే మార్గం (3).6 వ భాగం.27.9.24.

డా . నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన. గాంధీ యే మార్గం (3).6 వ భాగం.27.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.15 వ భాగం.27.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.15 వ భాగం.27.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.15 వ భాగం.27.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారి సంపాదకత్వం లో వెలువడిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.19 వ భాగం.27.9.24

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారి సంపాదకత్వం లో వెలువడిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.19 వ భాగం.27.9.24

Posted in రచనలు | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.19 వ భాగం.27.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.19 వ భాగం.27.9.24.

Posted in రచనలు | Leave a comment

డా.నాగ సూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (.3). 4వ భాగం.26.9.24.

డా.నాగ సూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (.3). 4వ భాగం.26.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహాత్ముని ఆదర్శ ఆధ్యాత్మిక గురువు,మార్గదర్శి ,శతావధాని ,’’సాక్షాత్ సరస్వతి ‘’యువ జైన ముని   –శ్రీ రాజచంద్ర భాయ్

మహాత్ముని ఆదర్శ ఆధ్యాత్మిక గురువు,మార్గదర్శి ,శతావధాని ,’’సాక్షాత్ సరస్వతి ‘’యువ జైన ముని   –శ్రీ రాజచంద్ర భాయ్

శ్రీమద్ రాజచంద్ర (9 నవంబర్ 1867 – 9 ఏప్రిల్ 1901), పరమ కృపాలు దేవ్ అని కూడా పిలుస్తారు, జైన కవి, ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, పండితుడు మరియు సంస్కర్త. మోర్బికి సమీపంలోని వవానియా అనే గ్రామంలో జన్మించిన అతను ఏడేళ్ల వయస్సులో తన గత జీవితాలను స్మరించుకున్నట్లు పేర్కొన్నాడు. అతను అవధాన అనే స్మృతి నిలుపుదల మరియు జ్ఞాపకశక్తి పరీక్షను నిర్వహించాడు, అది అతనికి ప్రజాదరణ పొందింది, కానీ తరువాత అతను తన ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలంగా దానిని నిరుత్సాహపరిచాడు. అతను ఆత్మ సిద్ధి శాస్త్రంతో సహా చాలా తాత్విక కవిత్వం రాశాడు. అతను అనేక లేఖలు మరియు వ్యాఖ్యానాలు వ్రాసాడు మరియు కొన్ని మత గ్రంథాలను అనువదించాడు. అతను జైనమతంపై తన బోధనలకు మరియు మహాత్మా గాంధీకి అతని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ప్రసిద్ధి చెందాడు.

ప్రారంభ జీవితం

శ్రీమద్ రాజ్‌చంద్ర 9 నవంబర్ 1867న (కార్తీక పూర్ణిమ, విక్రమ్ సంవత్ 1924), మోర్బికి సమీపంలోని ఓడరేవు (ప్రస్తుతం భారతదేశంలోని గుజరాత్‌లో ఉంది) వవనియాలో జన్మించారు. అతని తల్లి, దేవబాయి, శ్వేతాంబర స్థానక్వాసి జైన్ మరియు అతని తండ్రి, రావ్జీభాయ్ మెహతా మరియు తండ్రి తరపు తాత, పంచన్ మెహతా, వైష్ణవ హిందువులు. కాబట్టి అతనికి ప్రారంభ జీవితం నుండి జైనమతం మరియు హిందూమతం పరిచయం చేయబడింది. అతను రామదాస్జీ అనే సాధువు ద్వారా వైష్ణవంలో దీక్షను పొందాడు. అతను ఇతర భారతీయ మతాలను అధ్యయనం చేయడం కొనసాగించాడు మరియు జైనమతం యొక్క అహింస (అహింస) సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాడు. తరువాత, అతను జైనమతాన్ని ఎంచుకున్నాడు, ఎందుకంటే అది “మోక్షానికి ఉత్తమ మార్గాన్ని” అందిస్తుంది.

అతని పుట్టిన పేరు లక్ష్మీనందన్ మెహతా. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు అతనికి రాయచంద్ అని పేరు పెట్టారు. తరువాత, అతని పేరు దాని సంస్కృత రూపమైన రాజచంద్రగా మారింది. గౌరవప్రదమైన శ్రీమద్‌ను మరణానంతరం అతని శిష్యులు చేర్చారు. అతని శిష్యులు ఆయనను పరమ కృపాలు దేవ్ (అత్యున్నతమైన కరుణకు ప్రభువు) అని కూడా పిలుస్తారు

గత జీవితాల జ్ఞాపకం

1874లో ఏడేళ్ల వయసులో తాను మొదటిసారిగా జాతి స్మరణ జ్ఞానాన్ని (మునుపటి జీవితాల జ్ఞాపకం) పొందానని రాజచంద్ర పేర్కొన్నాడు. 1890లో బొంబాయిలోని భులేశ్వర్‌లో తన స్నేహితుడు పదమ్‌శిభాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అతను ఈ సంఘటనను వివరించాడు”నాకు ఏడేళ్ల వయసులో, మా ఊరి పొరుగువాడైన, బాగా బిల్ట్‌గా, దృఢంగా, దృఢంగా ఉన్న అమిచంద్ అనే వృద్ధుడు అకస్మాత్తుగా పాము కాటుతో చనిపోయాడు, నాకు మరణం ఏమిటో తెలియదు. నేను మా తాతను అడిగాను. అతను సమాధానం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు మరియు నా భోజనం పూర్తి చేయమని సలహా ఇచ్చాడు: “చావు అంటే శరీరం నుండి వేరుచేయడం. మృతదేహానికి కదలిక ఉండదు, అది కలుషితమవుతుంది మరియు కుళ్ళిపోతుంది. అటువంటి మృతదేహం పని చేయడం మానేసినందున నది ఒడ్డున కాల్చివేయబడుతుంది.” నేను రహస్యంగా శ్మశాన వాటికకు వెళ్లి ఒక బాబుల్ చెట్టు ఎక్కి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దహనం చేసే ప్రక్రియ మొత్తాన్ని చూశాను మరియు అనుభూతి చెందాను. అతనిని కాల్చివేసిన వారు క్రూరమైనవారని, మరణం యొక్క స్వభావంపై ఆలోచనల రైలు ప్రారంభమైంది మరియు దాని ఫలితంగా నేను నా గత జీవితాలను గుర్తుచేసుకోగలను.

ఈ సంఘటన ప్రపంచం గురించి అతని అవగాహనలో కీలక పాత్ర పోషించింది. ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక కవితలో వివరించారు. అతను తన గత జీవితంలో ఇప్పటికే సాధించిన ఆధ్యాత్మికత మార్గంలో ముందుకు సాగినట్లు రాశాడు. అతను 1897లో తన మర్త్య శరీరానికి మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పూర్తి రాజీనామా మరియు నిర్లిప్తతను అభివృద్ధి చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అతను 30 సంవత్సరాల వయస్సులో వ్రాసిన ఒక కవితలో ఈ అనుభవానికి కృతజ్ఞతలు తెలిపాడు. అతను ఎక్కిన చెట్టు ఇప్పుడు లేదు, కానీ సంఘటన యొక్క నమూనాతో ఒక స్మారక దేవాలయం ఆ స్థలంలో నిర్మించబడింది.

అతను జునాగఢ్‌లోని కోటను సందర్శించినప్పుడు కూడా అదే అనుభవాన్ని పొందాడు. అతని అనుభవాలు మతపరమైన జీవితాన్ని గడపడానికి అతనిని ప్రభావితం చేశాయి.

చైల్డ్ ప్రాడిజీ(బాలమేధావి )

రాజ్‌చంద్రకు విలక్షణమైన జ్ఞాపకశక్తి మరియు జ్ఞాపకశక్తి ఉంది. ఏడున్నరేళ్ల వయసులో పాఠశాలలో చేరినా కేవలం నెల రోజుల్లోనే ప్రిలిమినరీలను గణించడంలో పట్టు సాధించాడు. రెండు సంవత్సరాలలో, అతను ఏడు తరగతుల చదువును పూర్తి చేశాడు.

ఎనిమిదేళ్ల వయసులో పద్యాలు రాయడం మొదలుపెట్టాడు. అతను తొమ్మిదేళ్ల వయసులో రామాయణం మరియు మహాభారతంపై పద్య సారాంశాలను రచించాడు. అతను ఆలోచన మరియు తార్కికంలో పరిపక్వత పొందాడు మరియు 10 సంవత్సరాల వయస్సులో బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించాడు. 11 సంవత్సరాల వయస్సులో అతను బుద్ధిప్రకాష్ వంటి వార్తాపత్రికలు మరియు పత్రికలలో వ్యాసాలు రాయడం ప్రారంభించాడు మరియు వ్యాస రచన పోటీలలో అనేక బహుమతులు గెలుచుకున్నాడు. అతను 12 సంవత్సరాల వయస్సులో ‘a watch’పై 300 చరణాల పద్యం రాశాడు. 1880లో, అతను ఇంగ్లీష్ చదవడానికి రాజ్‌కోట్‌కు వెళ్ళాడు, కానీ అక్కడ అతని విద్య గురించి చాలా తక్కువగా తెలుసు. 1882 నాటికి, అతను అనేక సబ్జెక్టులను అభ్యసించాడు మరియు ప్రావీణ్యం సంపాదించాడు. యువకవిగా గుర్తింపు పొంది కవిగా పిలవబడ్డాడు. రచయితగా కచ్ పాలకుని నివాసాన్ని అప్పుడప్పుడు సందర్శించి అతని కలానికి ప్రశంసలు అందుకున్నారు. అతను 13 సంవత్సరాల వయస్సులో తన తండ్రి దుకాణానికి వెళ్లడం ప్రారంభించాడు. అతను దుకాణాన్ని నిర్వహిస్తూనే రాముడు మరియు కృష్ణుల జీవితాలపై అనేక పద్యాలను రచించాడు

తరువాత జీవితం

అవధాన౦

అవధాన అనేది శ్రద్ధ మరియు జ్ఞాపకం యొక్క కష్టమైన పరీక్ష, దీనిలో ఒక వ్యక్తి బహుళ వస్తువులు మరియు కార్యకలాపాలకు హాజరవుతారు.’’పదహారేళ్ళ వయసులో అష్టావధాన ప్రక్రియ మొదలుపెట్టి,రోజు రోజుకు పృచ్చకుల సంఖ్య పెంచుకున్నారు .వినూత్న ,క్లిష్టతర ప్రక్రియాలను జోడిస్తూ ఆతర్వాత రెండు మూడేళ్లకే శతావధానం చేసి స్వర్ణపతకాలతో పాటు’’సాక్షాత్ సరస్వతి ‘’అనే బిరుదు పొందారు .ఇరవై  ఏళ్ళు వచ్చేసరికి ,పేరు ప్రఖ్యాత్య్లు తన ఆధ్యాత్మిక అభి వృద్ధికి  అడ్డంకిఅవుతాయని  అవధాన ప్రక్రియలను మానేశాడు ‘’ఆని డా.నందనూరు భాస్కర రెడ్ది రాశారు 

అతను తన శిష్యులతో కలిసి గుజరాత్‌లో ఉండి బొంబాయికి వెళ్లడం మానుకున్నాడు. అతను ముప్పై సంవత్సరాల వయస్సులో గృహస్థ జీవితం మరియు వ్యాపారం నుండి విరమించుకున్నాడు. అతను ఇదార్‌లో మూడు నెలలు గడిపాడు, అక్కడ అతను ఏడుగురు సన్యాసులకు ఒక రాయిపై కూర్చొని మతపరమైన ఉపన్యాసాలు ఇచ్చాడు, పుద్వి శిలా. ఒక స్మారక ఆలయం మరియు ఒక ప్రార్థనా మందిరం తరువాత అక్కడ నిర్మించబడింది.

అతని చివరి సంవత్సరాల్లో, అతను పెద్దప్రేగు శోథతో అజీర్ణ వ్యాధితో  బాధపడ్డాడు. తీవ్రమైన బలహీనత తప్ప మరణానికి నిర్దిష్ట కారణం ఏదీ గుర్తించబడలేదు. 1900 లో, అతను పెద్ద మొత్తంలో బరువు కోల్పోయాడు. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు మరియు అతని ఆరోగ్య ప్రయోజనాల కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్లాలని వైద్యులు అతనికి సూచించారు. అతను గుజరాత్‌లోని ధరంపూర్‌లో ఉన్న సమయంలో అనారోగ్యం బారిన పడ్డాడు, దాని నుండి అతను ఎప్పటికీ కోలుకోలేదు. 1901లో, అతను, అతని తల్లి మరియు భార్య అహ్మదాబాద్‌లోని అగాఖాన్ బంగ్లాలో వద్వాన్ క్యాంప్‌కు వెళ్లడానికి ముందు బస చేశారు. అతను 9 ఏప్రిల్ 1901 (చైత్ర వాద్ 5, VS 1957) రాజ్‌కోట్‌లో (ప్రస్తుతం గుజరాత్‌లో) తన కుటుంబం, స్నేహితులు మరియు శిష్యుల సమక్షం లో  మరణించాడు. ఆయన మరణించిన తర్వాత తీసిన ఒక చిన్న ఛాయాచిత్రం ఆయన స్థాపించిన ఖంభాట్‌లోని ఒక లైబ్రరీలో ప్రదర్శించబడుతుంది. అతను తన శరీరాన్ని విడిచిపెట్టిన గది ఇప్పుడు అతని జ్ఞాపకార్థం ఒక ప్రార్థనా మందిరం.అతి చిన్న వయసులో కవిగా ,పండితునిగా ,తత్వ వేత్తగా ,జ్ఞానిగా ,మార్గదర్శి గా విశేష ఖ్యాతి పొందాడు రాజచంద్ .

రచనలు

రాజచంద్ర స్త్రీ నీతి బోధక (ది నేచర్ ఆఫ్ ఐడియల్ మోరల్ లైఫ్ ఫర్ వుమెన్, 1884) వ్రాశాడు, దీనిలో అతను స్త్రీ విద్యను జాతీయ స్వేచ్ఛకు అవసరమైనదిగా సూచించాడు. సద్-బోధ్-శతక్ (1884) అనేది నైతిక అంశాలపై అతని రచన. మోక్షమాల (1887) అనేది జైనమతం మరియు స్వీయ-విముక్తి గురించి యువకులకు అర్థమయ్యే సులభమైన శైలిలో వ్రాయబడింది. మోక్షమాల ప్రచురణలో జాప్యం కారణంగా, అతను తన పాఠకుల కోసం భావ బోధను రచించాడు. యాభై పేజీల చిన్న పుస్తకమిది, అందులో 12 భావాలను పెంపొందించుకుని, అటాచ్మెంట్ లేని జీవితాన్ని గడపాలని సూచించాడు. అతను నాలుగు పురుషార్థాల స్వభావాన్ని వివరిస్తూ ఐదు వేల శ్లోకాలతో కూడిన నమిరాజాను రచించాడు. షుర్విర్ స్మరణ (1885)లో, రాజ్‌చంద్ర గతంలోని ధైర్య యోధుల గురించి వివరించాడు మరియు బ్రిటిష్ ఆధిపత్యం నుండి భారతదేశాన్ని విడిపించలేకపోయిన వారి వారసులతో పోల్చాడు.’’1887లో నగలవ్యాపార కుటుంబానికి చెందిన’’జబక్ బెన్ ‘’ను పెళ్ళి చేసుకొని ,ముత్యాల వజ్రాల వ్యాపారం చేశాడు .ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు .సంసార జీవితం కొనసాగిస్తూనే కఠోర సాధన ఫలితంగా 23వ ఏటనే ‘’జ్ఞానోదయం ‘’పొందాడు .తర్వాత 7ఏళ్ళు గృహస్తుగా ,వ్యాపారిగానే ఉన్నాడు .తర్వాత పూర్తిగా శిష్యులకు జ్ఞాన బోధనకు పరిమితమయ్యాడు .’’ఆని తెలియజేశారు డా.నందమూరు భాస్కర రెడ్ది .

శ్రీమద్ రాజ్‌చంద్ర మరియు అంబాలాల్ విగ్రహాలు శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్ ధరమ్‌పూర్ ద్వారా ఆత్మ సిద్ధి స్వరపరిచిన నదియాడ్‌లోని ఒక గదిలో నిర్మించబడ్డాయి.

ఆత్మ సిద్ధి అనే గుజరాతీ చిన్న పద్యంలో, అతను ఆత్మపై ఆరు ప్రాథమిక సత్యాలను నిర్దేశించాడు, వీటిని శతపద (ఆరు మెట్లు) అని కూడా పిలుస్తారు. అతను సరైన అవగాహన (సమ్యక్త్వా), వ్యక్తిగత ప్రయత్నాలు మరియు స్వీయ-సాక్షాత్కార మార్గంలో నిజమైన గురువు యొక్క మార్గదర్శకత్వంపై దృష్టి పెడతాడు. ఇది ఆయన జైనమతం యొక్క వివరణ యొక్క సారాంశం. ఇది షెఫాలీ షాచే సంగీత భజన రూపంలో స్వీకరించబడింది. ఇది అనేక సార్లు ఆంగ్లంలోకి అనువదించబడింది; 1923లో J. L. జైని ద్వారా మొదటిది. దీని ప్రసిద్ధ అనువాదాన్ని 1957లో బ్రహ్మచారి గోవర్ధందాస్ ప్రచురించారు.

అతను 900 కంటే ఎక్కువ లేఖలు రాశాడు, అవి అతని ఆధ్యాత్మిక ప్రయాణం మరియు శిష్యులకు బోధించబడ్డాయి. అతను వైరాగ్య విలాస్ అనే వార్తాపత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు.

శ్రీమద్ రాజ్‌చంద్ర వచనమృతం అక్షరాలు మరియు ఇతర రచనలతో సహా అతని పూర్తి రచనల సమాహారం.[23]

“అపూర్వ అవ్సర్ ఎవో క్యారే ఆవ్షే..”, “మూల్ మార్గ్ సంభ్లో జిన్నో రే..”, “బినా నయన్ పావే నహీ..”, “హే ప్రభూ! హే ప్రభు! షు కహు..”, “యం నియమం సంజామ్ ఆప్ కియో..”, “ఇచ్ఛే ఛే జే జోగిజాన్…,”బహు పుణ్య కేరా పుంజ్తీ…” మరియు “హే ప్రభూ! హే ప్రభూ! షు కహు..” అనేవి మహాత్మా గాంధీకి ఇష్టమైన భజనలు మరియు ఆశ్రమ భజనావళిలో చేర్చబడ్డాయి

అనువాదం మరియు వ్యాఖ్యానాలు

దశ వైకలిక సిద్ధాంతం (VS 1945)లో వివరించిన విధంగా రాజ్‌చంద్ర సంయతి ధర్మం (సన్యాసి యొక్క మతం)పై 51 ఉల్లేఖనాలను రాశారు. ఇది అసలు మాగధీ వచనం యొక్క గుజరాతీ రెండరింగ్. అతను మోక్ష సిద్ధాంతంపై వ్యాఖ్యానం కూడా రాశాడు (VS 1953). అతను చిదానందజీ స్వరోదయజ్ఞానాన్ని అసంపూర్ణంగా అనువదించాడు. ఆనంద్‌ఘన్ చౌవిసిపై అతను అసంపూర్ణ వ్యాఖ్యానం రాశాడు. తన మూడు లేఖలలో (నం. 393, 394 మరియు 395 “శ్రీమద్ రాజ్‌చంద్ర వచనామృతం”లో ముద్రించబడింది), అతను యశోవిజయచే స్వరపరిచిన అథ్ యోగద్రష్టిని సజ్జయ అనే ఎనిమిది దృక్కోణాలలో ఆరవ ద్విపదలలో ఒకదానిపై వ్యాఖ్యానించాడు. అతను ఆత్మానుషాసన్ యొక్క మొదటి 100 శ్లోకాలకు సమానమైన గుజరాతీ అనువాదాన్ని వ్రాసాడు. అతను శ్రీ రత్నకరంద్ శ్రావకాచర్‌లో వివరించిన 12 భావాలలో మూడు భావన లేదా ఆలోచనలపై (అనిత్య, ఆశరన్ మరియు సంసార భావనపై కొంచెం) రాశాడు. అతను కుండకుండ పంచాస్తికాయను పూర్తిగా అనువదించాడు. అతను ప్రజ్ఞావబోధ్ (VS 1956)పై ఒక సూచికను సిద్ధం చేశాడు.

వారసత్వం

రాజ్‌చంద్ర కుందకుంద మరియు దిగంబర ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క రచనల నుండి ప్రేరణ పొందారు మరియు అనేక మంది ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు మరియు జైన మతంలోని అన్ని పాఠశాలలకు చెందిన వారితో సహా అనుచరులను ప్రేరేపించారు. అతని అనుచరులు కొన్నిసార్లు అతని బోధనను జైనమతం యొక్క కొత్త మార్గంగా పరిగణిస్తారు, శ్వేతాంబర లేదా దిగంబర, మరియు అతనిని సన్యాసిగా గౌరవిస్తారు. అతని మార్గాన్ని కొన్నిసార్లు రాజ్ భక్త మార్గ్, కవిపంత్ లేదా శ్రీమడియా అని పిలుస్తారు, ఇది ఎక్కువగా రాజచంద్ర వలెనే అనుచరులను కలిగి ఉందిఅతని బోధనలు కంజి స్వామి, దాదా భగవాన్, రాకేష్ ఝవేరి, సౌభాగ్ భాయ్, లల్లూజీ మహరాజ్ (లఘురాజ్ స్వామి), ఆత్మానందజీ మరియు అనేక ఇతర మత ప్రముఖులను ప్రభావితం చేశాయి. వారిలో కొందరు అతని అంకితభావంలో దేవాలయాలు మరియు సంస్థలను స్థాపించారు  .

‘’గాంధీ బారిస్టర్ గా భారతదేశం లో అడుగుపెట్టగానే 6-6-1891ఒక స్నేహితుడి సాయంతోమొదటి సారి  రాజ చంద్రను కలిశాడు .అప్పటికి గాంధీకి ఈయన కవిగా మాత్రమె తెలుసు ..బొంబాయిలో గడిపిన రెండేళ్లలో గాంధీ తరచుగా రాజ చంద్ ను కలిసేవాడు .ఆయనలోని నిర్మలత్వం ,స్థిత ప్రజ్ఞత గాంధీ హృదయంలో శాశ్వత ముద్ర వేసింది .’’రాజ చంద్ భాయ్ ‘’ఆని ఆప్యాయంగా పిలిచేవాడు .దక్షిణాఫ్రికాకు వెళ్ళాక తరచూ ఉత్తరాలు రాసి సంప్రది౦చేవాడు గాంధి .అక్కడ గాంధీని క్రైస్తవ ,మహామ్మదీయా మతస్తులుమతం మార్చుకోమని ఒత్తిడి తెస్తే ,తీవ్ర మానసిక క్షోభకు గురై రాజచంద్ కు 27ప్రశ్నలు సంధిస్తూ ఉత్తరం రాస్తే ,ఆయన ఈయన సందేహాలన్నీ తీర్చి ,హిందూమతంలోని లోతైన విషయాలను అవగాహన చేసుకోవటానికి మార్గదర్శనం కలిగింది . ఉత్తరానికి తర్వాత బాగా ప్రాముఖ్యం లభించింది .ఇలా రాజ చంద్ భాయ్ గాంధీ ఆలోచనలను నమ్మకాలను అత్యంత మౌలికంగా ,నిర్మాణాత్మకంగా మలచి భవిష్యత్తులో ‘’మహాత్ముడు ‘’కావటానికి మార్గంసు గమం చేశారు ‘’అంటారు భాస్కర రెడ్ది .

మహాత్ముడు తన ఆత్మకథ లో ‘’రాజచంద్ భాయ్ ఏపని చేస్తున్నా ,పనిపట్ల నిబద్ధతతో ,నిష్కామ౦గా ,ఉదాసీణం గా చేయటం నేను గమనించాను .సహజ స్వేచ్చా స్థితిలో ఓలలాడుతూ ఉండటం గమనించాను .అనేకసందర్భాలాలో నాకు ఆధ్యాత్మిక ఆశ్రయం కల్పిస్తూ ,మార్గదర్శి గా నిలిచారు .ఎనలేని స్పూర్తి నిచ్చారు ‘’ఆని ఆరాధనా భావంగా రాశాడు .భాయ్ రాసిన ‘’అపూర్వ అవసర్  యేవో క్యారే అప్షీ ‘’,’’హే ప్రభూ !షూ కహు ‘’భజనలు గాంధీకి పరమ ప్రీతి పాత్రమైనవి .గాంధీ వీటిని’’ఆశ్రమ భాజనావలి ‘’చేర్చాడు .భాయ్ నవీన రచనలన్నీ దేశ విదేశాలలోని జైనులను అమితంగా ప్రభావితులను చేశాయి .ఆయన శిష్యులు తమ గురు దేవుని ‘’శ్రీ మద్’’,పరమ దయాళూదేవ’’,’’యుగ పురుష్’’అంటూ భక్తితో  సంస్మరిస్తారు .ఆయన భక్తులు శిష్యులు అభిమానులు రాజ చంద్ భాయి పేర జైన మందిరాలు ,విద్యా సంస్థలు ,ఆశ్రమాలు నెలకొల్పి విద్య ఆధ్యాత్మిక రంగాలలో సేవలు చేస్తున్నారు 20002లో గాంధి జయంతి సందర్భంగా రాజ చంద్ భాయ్ ,శ్రీ రవీంద్ర నాథ్ టాగూర్ ల గౌరవ చిహ్నంగా పోస్టల్ కవర్ లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది .2017జూన్ 27న భాయ్ జన్మించి 150సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రభుత్వం 150 రూపాయలస్మారక నాణాలను ,తపాలా బిళ్ళలను గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ శబర్మతి ఆశ్రం లో వెలువ రించారు .జీవితాంతం మహాత్మా గాంధి తన ఆధ్యాత్మిక గురువు, మార్గదర్శి శ్రీ రాజ చంద్ భాయీ ‘’ని వీలైనప్పుడల్లా స్మరించేవాడు ‘’ఆని రచయిత ,ఆలోచనాశీలి డా.నందనూరు  భాస్కరరెడ్డి .’’గాంధీయే మార్గం -3 లో రాశారు .మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-24-ఉయ్యూరు .     

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన.నట స్థానం.13 వ భాగం.26.9.24

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన.నట స్థానం.13 వ భాగం.26.9.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.16 వ భాగం.26.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.16 వ భాగం.26.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.18 వ భాగం.26.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.18 వ భాగం.26.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా.నాగ సూరి వేణు గోపాల్ గారి సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం (3) .4 వ భాగం.25.9.24.

డా.నాగ సూరి వేణు గోపాల్ గారి సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం (3) .4 వ భాగం.25.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.13 వ భాగం.25.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.13 వ భాగం.25.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతీ.16 వ భాగం.25.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతీ.16 వ భాగం.25.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.17 వ భాగం.25.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.17 వ భాగం.25.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో నవరాత్రి ప్రత్యెక కార్యక్రమం 

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో నవరాత్రి ప్రత్యెక కార్యక్రమం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో నవరాత్రి ప్రత్యెక కార్యక్రమం 
–ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం 3-10-24నుండి శుద్ధ దశమి శనివారం 12-10-24 వరకు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి ఆలయం లో ప్రత్యెక పూజలు నిర్వహింపబడతాయి .  ప్రతిరోజుసాయంత్రం 6-30నుండి శ్రీ సువర్చలాంజనేయస్వామి వారలకు అష్టోత్తర శత నామ పూజ ,శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి నిత్యం నూతన వస్త్రధారణ ,అలంకారం అష్టోత్తర పూజ జరుగుతుంది .తర్వాత నైవేద్యం హారతి ,మంత్ర పుష్పం ,తీర్ధ ప్రసాద వినియోగం జరుగుతాయి .9-10-24 బుధవారం మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ దేవి అలంకారం ,విద్యార్దులచే  సరస్వతీ మాతకు పూజ జరుగుతుంది .12-10-24- శనివారం -శమీ పూజ జరుగుతుంది .  భక్తుల౦దరు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి వారల అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి .గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త మరియు భక్త బృందం 25-9-24-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

కేసరి గారి ‘’గృహ లక్ష్మి స్వర్ణ కంకణ ‘’‘’పురస్కారం పొందినకవయిత్రి –కవితా విశారద శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవి

కేసరి గారి ‘’గృహ లక్ష్మి స్వర్ణ కంకణ ‘’‘’పురస్కారం పొందినకవయిత్రి –కవితా విశారద శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవి

1889లో గుంటూరు లో శ్రీ మతుకు మల్లి నారా హర్యాక్ష శాస్త్రి ,శ్రీమతి అనంత లక్ష్మి దంపతులకు జన్మించింది ఇందుమతీ దేవి

విజయవాడలో శ్రీ గుడిపూడి రామారావు గారిని వివాహమాడి స్థిరపడింది .పడవ ఏటనే కవితలు రాయటం ప్రారంభించింది .నీతి తారావళి ,తరుణీ శతకం,సీతారాముల పాటలు ,మంగళాద్రి శతకం ,రాజేశ్వరి శతకం ,అంబరీష విజయం మొదాలైనవి పట్టు విడవకుండా రాసి మంచి ప్రసిద్ధి పొందింది .ఆమె రచనలు నీతి బోధించేవిగా ,ప్రబోదాత్మకంగా నైతిక విలువలు పెంచేవిగా ఉంటాయని  ప్రముఖ బాలసాహిత్య కర్త గ్రంధాలయ ఉద్యమ నాయకులు శ్రీ వెలగా వెంకటప్పయ్య రాశారు .

అన్నవరం జమీందారు శ్రీ మంత్రి ప్రగడ భుజంగరావు గారు ఇందుమతీ దేవిని ఆహ్వాని౦చి  ఆస్థానం లో ఘన సన్మానం చేశారు .తర్వాత ప్రసిద్ధ పత్రికా సంపాదకులు శ్రీ కె.ఎన్ . కేసరి తాము స్థాపించి అందజేస్తున్న గృహలక్ష్మి స్వర్ణ కంకణం ణు ఇందుమతీదేవికి అందించి సత్కరించారు   .

ఇందుమతీ దేవికి కవితా విశారద ,మధుర కవయిత్రి బిరుదులూ లభించాయి .1960ఆగస్ట్ 16న విజయవాడలో ఇందుమతీదీవి షష్టి పూర్తి మహోత్సవం శ్రీమతి చుండూరు కనకలక్ష్మమ్మ గారి అధ్యక్షతన కన్నుల పండువుగా జరిగినట్లు వెలగా చెప్పారు .సన్మాన సంచిక కూడా ప్రచురించారు .

ఇంతకంటే వివరాలు దొరకలేదు ఆమె ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-24-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా.నాగ సూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం.3 వ భాగం.24.9.24.

డా.నాగ సూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం.3 వ భాగం.24.9.24.

Posted in రచనలు | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.12 వభాగం .24.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.12 వభాగం .24.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.16 వ భాగం.24.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ)గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.16 వ భాగం.24.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.16 వ భాగం.24.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.16 వ భాగం.24.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా.నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం (3). 2 వ భాగం.23.9.24.

డా.నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన – గాంధీ యే మార్గం (3). 2 వ భాగం.23.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.11 వ భాగం.23.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.11 వ భాగం.23.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.15 వ భాగం.23.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.15 వ భాగం.23.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.15 వ భాగం.23.9.24

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.15 వ భాగం.23.9.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ ప్రసిద్ధఆర్ట్ క్రిటిక్ జేమ్స్ కజిన్స్ ప్రశంస పొందిన ఆధునిక ఆంధ్ర చిత్ర కారుడు ,–శ్రీకౌతా ఆనంద మోహన శాస్త్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 8-1-1908 న శ్రీ కౌతా శ్రీరామ శాస్త్రి శేషమ్మ దంపతులు ఆనంద మోహన శాస్త్రి జన్మించారు ..తండ్రి బందరు జాతీయ కళాశాల స్థాపకులలో ఒకరు .తెలుగు సచిత్ర తొలి మాసపత్రిక ‘’శారద ‘’కు సంపాదకులు .వీరి పెద్ద కుమారులు రామ మోహన శాస్త్రి గారుకూడా గొప్ప చిత్రకారులే .

ప్రాధమికవిద్యపూర్తి చేసి జాతీయ కళాశాలలో చేరి నాలుగేళ్ళు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద కుమార్ ముఖర్జీ  వద్ద .చిత్రలేఖనం లో గొప్ప శిక్షణ పొందారు .స్కాలర్షిప్ తో 19వ ఏట మైసూర్ వెళ్ళి మహారాజా ఆస్థాన కళా చార్యులైన వెంకటప్ప వద్ద చిత్రలేఖన మెలకువలుగ్రహించి ఉత్తమ చిత్రకారులు ఆని పించుకొన్నారు .

  1930లో అహమ్మదా బాద్ వెళ్ళి అంబాలాల్ సారాభాయ్ కాలేజిలో ఆర్ట్ లెక్చరర్ గా 1934వరకు పని చేశారు .వివిధ శైలీ భేదాలలో వందకు పైగా చిత్రాలు రచించారు .వీటిలో కొన్ని అమరావతి శిల్పాలు ,అజంతా చిత్రాలకు అనుకృతులు .కొన్ని చిత్రాలలో అక్బర్ ,తాన్ సేన్ .వంటి చారిత్రిక వ్యక్తులవీ ,వరూధినీ ,ప్రవరాఖ్య వంటి పౌరాణిక చిత్రాలు ఉన్నాయి .తాను  చూసిన వివిధ నగరాల ,పర్వత ప్రాంతాల ప్రకృతి దృశ్యాలను కడురమణీయంగా చిత్రించారని ప్రముఖ విశ్లేషకులు శ్రీ నేలనూతుల శ్రీ కృష్ణ మూర్తి తెలియజేశారు .

  ఆన౦దమోహన్ కొన్ని ఊహా  చిత్రాలు ,రూప చిత్రాలు కూడా చిత్రణ చేశారు .’’వీరి చిత్ర రచనలో రచనారీతి ‘’గౌణం గా ‘ఉంటుంది .వస్తువుకు ప్రాముఖ్యమిచ్చి ,దానికి జీవం పోసి ,అలౌకిక ఆనందాన్నీ ,రసపుష్టిని సమకూర్చగల సర్వ సమర్ధులు కౌతా ‘’అన్నారు నేలనూతుల .ప్రపంచ ప్రసిద్ధ చిత్ర విమర్శకులు జేమ్స్ కజిన్స్ ,పెస్కల్ లెవిన్ కౌతావారి పెయింటింగ్స్ ను బాగా కీర్తించారు .కౌతా ఛిత్రాలనుమహారాజులు ,కళాభిజ్నులు  అపురూపంగా భావించి కొనుగోలు చేసి తమ వద్ద పెట్టుకొనేవారు .మనదేశం లోనే కాక లండన్ ,పారిస్ మొదలైన ప్రముఖా నగరాలలో కళా ప్రదర్శన లలో కౌతావారి చిత్రాలు దర్శన మిస్తాయి .

శ్రీ కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రాలలో అజంతా నర్తకి ,ఏకలవ్యుడు ,కత్తికి పదును పెట్టేవాడు ,గొర్రెలు మేపే గొల్లపిల్ల ,,గ్రామ వీధి ,తిక్కన సోమయాజి ,దీపాలు ,బుద్ధుడు ,రుద్రుడు ,లోయలో వటవృక్షం ,వరూధినీ ప్రవరులు ,,శ్రీ కృష్ణుడు ,సంతనుండి ,సతీ శిశువులు గొప్ప చిత్రాలని నేలనూతులవారు వివరించారు .

 1934లో ఫ్లూరసి వ్యాధి తో బాధపడి ఎంతమంది ప్రముఖ వైద్యులవద్ద వైద్యం చేయించుకొన్నా ,ప్రముఖ శాస్త్రా వైద్యులు ఆపరేషన్ చేసినా తగ్గక చివరికి 21-5-1940  బుద్ధ పూర్ణిమనాడు రాత్రి 8గంటలకు మన అపురూప చిత్రకళకు దురదృష్టం.

ఆయన అన్నగారు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయ లోగో ‘’చిత్రించారు

భారతీయత ఉట్టిపడే ’నవీన బెంగాలీ సంప్రదాయ’’ ఆంధ్ర చిత్రకారుడు కౌతా ఆనందమోహన్. నవవంగ సంప్రదాయ చిత్రకళను అభ్యనించిన, కౌతా రామమోహన శాస్త్రి, కౌతా ఆనందమోహన శాస్త్రి సుప్రసిద్ధ కౌతా శ్రీరామశాస్త్రి గారి కుమారులు. శ్రీరామశాస్త్రి గారు లోగడ శారద పత్రిక స్థాపించి, సంపాదకులుగా పనిచేసి, తెలుగు సారస్వతానికి సేవ చేసినవారు. కౌతా సోదరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. వీరు ప్రారంభదశలో మచిలీపట్నం జాతీయ కళాశాలలో చిత్రకళలో శిక్షణ పొందారు. పిమ్మట మైసూరులో సుప్రసిద్ద చిత్రకారుడు కె. వెంకటప్పతో కలిసి పనిచేశారు. నవవంగ చిత్రకళా సంప్రదాయాన్ని అభ్యసించిన ఈ యిద్దరు సోదరులు ‘రూపరేఖి చిత్రాలను మొఘలు -రాజన్థాన్‌ లఘు చిత్రాల శైలిలో పెన్సిలుతో చిత్రించుటలో సిద్దహస్తులు. వీరు రచించిన చిత్రాలన్నీ ఆహ్లాదకరంగా వుంటాయి. వ్యక్తులను ఎదుట ఉంచుకొనే చిత్రించేవారు.

1906 సం.లో పుట్టిన కౌతా రామమోహన శాస్తి బందరు జాతీయ కళాశాలలో 4 ఏళ్ళు చిత్రకళలో శిక్షణ పొందారు. తర్వాత 1931-1935లో లండన్‌ రాయల్‌ కాలేజి ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రొఫెసరు మాల్మమ్‌ అసబర్చు సర్‌ విలియం రోతన్‌ స్టెయిన్‌ల వద్ద ‘డై పాయింట్‌ ఎచ్చింగ్‌లో ప్రత్యేక పద్ధతిని అభ్యసించారు. కావలిలో జవహర్‌ భారతి ఆర్జు స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. డైపాయింట్‌ ఎచ్చింగ్‌ పద్ధతిలో సర్వేపల్లి రాధాకృష్ణ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, గాంధీ, నెహ్రూ, రవీంద్రనాధ్‌ టాగూర్‌ వంటి ప్రముఖుల చిత్రాలను అత్యంత సహజంగా చిత్రించి, ప్రశంసలు పొందారు. రామమోహన శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. ఈయన చిత్రాలలో ‘కేశాలంకరణ, నిరీక్షణ టఫాల్లర్‌ స్వ్వేర్‌, ఆపిల్‌ సెల్లర్‌, సరస్వతి, ఓల్డ్‌ ట్రీ వంటి చిత్రాలు ప్రశంసలు పొందాయి. ఈయన 1976లో మరణించారు.

రామమోహన శాస్త్రి గారి సోదరుడు కౌతా ఆనందమోహన శాస్త్రి (1908-1940) 32 సంవత్సరాలే జీవించినా… ఆనేక భావ చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలను నవవంగ సంప్రదాయ పద్ధతిలో రూపొందించి దేశ విదేశాల చిత్రకళా విమర్శకుల మన్ననలను పొందారు. డాక్టర్‌ జె.హెచ్‌. కజిన్సు వీరిని ప్రశంసిస్తూ ‘హిందూ దినపత్రికలో వ్రాశారు. “16 సంవత్సరాల వయస్సులో సుందరమైన అతని ఆత్మ మనోహరమైన చిత్రాలలోనికి పరివర్తనం పొందింది. భారతదేశ చిత్రకళ, ఏవిధంగా పునరుజ్జీవనం పొంది వికసించిందో, ప్రపంచంలో ఉన్నత స్ధానం పొందిందో, ఆనంద మోహన తన చిత్రాల ద్వారా తెలియజేశారు” అని కజిన్సు ప్రశంసించారు. ఈయన చిత్రాలు మైసూరు, త్రివేండ్రం ప్రదర్శనశాలల్లో వున్నాయి. త్రివేండ్రం ప్రదర్శనశాలలో వున్న చిత్రం “ఏకలవ్యుడు”. ఈ చిత్రాన్ని అత్యంత రమణీయంగా చిత్రించాడు. ప్రతిభాగంలోనూ భారతీయత ఉట్టిపడేలా, ప్రకృతి పరిసరాల మాధుర్యాన్ని అత్యంత సుందరంగా మిళితం చేసి, రూపొందించాడీ చిత్రాన్ని. ఆనాడు ఆ చిత్రాన్ని మెచ్చుకొనే పండితులు భారతదేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశస్థులు మన గొప్పతనాన్ని చెప్పేంత వరకు మనవారు మనల్ని గుర్తించరు. అది ఈనాటికీ చెబుతున్న సత్యమే. అందుచేతనే ఆనంద మోహన శాస్తి చిత్రాలు యూరపు, అమెరికా ఖండాలలో ప్రశంసలు పొందాయి. అందుకే ‘నేటి కళాభిజ్ఞులు’ అనే శీర్షికతో (ఫెంచి దేశపు పత్రికలో ఈ భారతీయ చిత్రకళాకారుని కళా ప్రాధి, కళా విశిష్టతలు గురించి వ్రాశారు”. 1980 లోనే లండన్‌లో ప్రదర్శించిన ‘సామ్రాజ్య చిత్రవస్తు ప్రదర్శనలో ఈయన రచించిన రెండు చిత్రాలు చోటు చేసుకున్నాయి. అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రదర్శనాలయంలో భారతీయ చిత్రాలలో ఆరు కంటే ఎక్కువ వుంచుటకు అవకాశం లేదు. అయినా ఆనంద మోహన శాస్త్రి గారి రెండు చిత్రాలకు ఆ అవకాశం దొరకడం గొప్ప విశేషమే మరి.“అతి పిన్న వయసులో ఇంత పెద్ద పేరు గడించిన శాస్త్రిగారి ఆయుర్ధాయం యింకా వున్నట్లయితే, ఎంత గొప్పవాడై తనకు, తన కుటుంబానికే కాక, భారతదేశమంతటికీ ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చియుందెనో ఆలోచింతురుగాక. అంతేకాకుండా ఇతని చిత్రాలన్నింటినీ సేకరించి, ప్రధానమైన ఒక స్థలంలో ఇతని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసి, భారతీయులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకొందురని” డా. కజిన్సు పండితుడు అభిప్రాయపడ్డారు. ఈ కళాకారుడు భారతీయుడు కనుక, ప్రకృతిని చూచి తన కళానైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన దేశంలోనే అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ప్రకృతిని చూచి చిత్రకళా విషయాలను అవగాహన చేసుకోవడంలో యితనికి సహజంగా కలిగిన విషయ గ్రహణ శక్తి ఆత్మ సౌందర్యం, విజ్ఞానం, సౌందర్య రస గ్రహణ శక్తి ఇతనికి ఎక్కువగా తోద్బడ్డాయి. ఇతని చిత్రాలు సజీవమైన చిన్న నాటకాలు. రాగోద్దీపితమైన తన దేశంలో దైనందిన జీవితానికి వాస్తవమైన అనువాదాలు ఈయన రచించిన నీడలు, కత్తి పదును పట్టువాడు అనే చిత్రాలు రచించిన విధానం అతి రమణీయమైనది. ఈ రెండు చిత్రాలలో అతని కళా నైపుణ్యం పరణతి పొందింది. ఇతనిలో ఇంత గొప్ప నైపుణ్యం ఉండుటచేతనే యితని చిత్రాలకు 1930లో లండన్‌ నగరమందు సామ్రాజ్య చిత్ర వస్తు ప్రదర్శనాలయంలో ప్రవేశం కల్లిందని పాస్మలెవీ గారు వ్రాశారు. ఆనంద మోహన్‌ చిత్రాలలో ఒకటి 1925లో లక్నో నగరంలో జరిగిన చిత్ర వస్తు ప్రదర్శనలో ‘రాజా మోతీ చందు పతకాన్ని బహుమానం పొందింది. ఆ సంవత్సరమే “తన్మయత్వం” అనే చిత్రం డైలీ ఎక్స్ ప్రెస్ అనే పత్రిక సంవత్సరాది సంచికలో ప్రకటితమయ్యింది. ఈయన చిత్రించిన జీవాత్మ గోపాలుడైన కృష్ణుడు చిత్రాలను “ఇలస్టేట్‌డ్‌ లండన్‌ న్యూస్‌ అనే పత్రికలో 1929లో ప్రచురించారు. కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రించిన మరికొన్ని చిత్రాలు ‘ఊయల, గొల్లపిల్ల, రుద్రుడు, సంతనుంచి, అజంతా నర్తకి, తిక్కన సోమయాజి, గ్రామవీధి, వరూధినీ ప్రవరాఖ్యులు, సతీ శివుడు” ముఖ్యమైనవి. ఈయన అతి పిన్న వయసులోనే 1940లో మరణించారు.

– శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. ఈయన చిత్రాలలో ‘కేశాలంకరణ, నిరీక్షణ టఫాల్లర్‌ స్వ్వేర్‌, ఆపిల్‌ సెల్లర్‌, సరస్వతి, ఓల్డ్‌ ట్రీ వంటి చిత్రాలు ప్రశంసలు పొందాయి. ఈయన 1976లో మరణించారు.రామమోహన శాస్త్రి గారి సోదరుడు కౌతా ఆనందమోహన శాస్త్రి (1908-1940) 32 సంవత్సరాలే జీవించినా… ఆనేక భావ చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలను నవవంగ సంప్రదాయ పద్ధతిలో రూపొందించి దేశ విదేశాల చిత్రకళా విమర్శకుల మన్ననలను పొందారు. డాక్టర్‌ జె.హెచ్‌. కజిన్సు వీరిని ప్రశంసిస్తూ ‘హిందూ దినపత్రికలో వ్రాశారు. “16 సంవత్సరాల వయస్సులో సుందరమైన అతని ఆత్మ మనోహరమైన చిత్రాలలోనికి పరివర్తనం పొందింది. భారతదేశ చిత్రకళ, ఏవిధంగా పునరుజ్జీవనం పొంది వికసించిందో, ప్రపంచంలో ఉన్నత స్ధానం పొందిందో, ఆనంద మోహన తన చిత్రాల ద్వారా తెలియజేశారు” అని కజిన్సు ప్రశంసించారు. ఈయన చిత్రాలు మైసూరు, త్రివేండ్రం ప్రదర్శనశాలల్లో వున్నాయి. త్రివేండ్రం ప్రదర్శనశాలలో వున్న చిత్రం “ఏకలవ్యుడు”. ఈ చిత్రాన్ని అత్యంత రమణీయంగా చిత్రించాడు. ప్రతిభాగంలోనూ భారతీయత ఉట్టిపడేలా, ప్రకృతి పరిసరాల మాధుర్యాన్ని అత్యంత సుందరంగా మిళితం చేసి, రూపొందించాడీ చిత్రాన్ని. ఆనాడు ఆ చిత్రాన్ని మెచ్చుకొనే పండితులు భారతదేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశస్థులు మన గొప్పతనాన్ని చెప్పేంత వరకు మనవారు మనల్ని గుర్తించరు. అది ఈనాటికీ చెబుతున్న సత్యమే. అందుచేతనే ఆనంద మోహన శాస్తి చిత్రాలు యూరపు, అమెరికా ఖండాలలో ప్రశంసలు పొందాయి. అందుకే ‘నేటి కళాభిజ్ఞులు’ అనే శీర్షికతో (ఫెంచి దేశపు పత్రికలో ఈ భారతీయ చిత్రకళాకారుని కళా ప్రాధి, కళా విశిష్టతలు గురించి వ్రాశారు”. 1980 లోనే లండన్‌లో ప్రదర్శించిన ‘సామ్రాజ్య చిత్రవస్తు ప్రదర్శనలో ఈయన రచించిన రెండు చిత్రాలు చోటు చేసుకున్నాయి. అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రదర్శనాలయంలో భారతీయ చిత్రాలలో ఆరు కంటే ఎక్కువ వుంచుటకు అవకాశం లేదు. అయినా ఆనంద మోహన శాస్త్రి గారి రెండు చిత్రాలకు ఆ అవకాశం దొరకడం గొప్ప విశేషమే మరి.

“అతి పిన్న వయసులో ఇంత పెద్ద పేరు గడించిన శాస్త్రిగారి ఆయుర్ధాయం యింకా వున్నట్లయితే, ఎంత గొప్పవాడై తనకు, తన కుటుంబానికే కాక, భారతదేశమంతటికీ ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చియుందెనో ఆలోచింతురుగాక. అంతేకాకుండా ఇతని చిత్రాలన్నింటినీ సేకరించి, ప్రధానమైన ఒక స్థలంలో ఇతని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసి, భారతీయులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకొందురని” డా. కజిన్సు పండితుడు అభిప్రాయపడ్డారు. ఈ కళాకారుడు భారతీయుడు కనుక, ప్రకృతిని చూచి తన కళానైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన దేశంలోనే అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ప్రకృతిని చూచి చిత్రకళా విషయాలను అవగాహన చేసుకోవడంలో యితనికి సహజంగా కలిగిన విషయ గ్రహణ శక్తి ఆత్మ సౌందర్యం, విజ్ఞానం, సౌందర్య రస గ్రహణ శక్తి ఇతనికి ఎక్కువగా తోద్బడ్డాయి. ఇతని చిత్రాలు సజీవమైన చిన్న నాటకాలు. రాగోద్దీపితమైన తన దేశంలో దైనందిన జీవితానికి వాస్తవమైన అనువాదాలు ఈయన రచించిన నీడలు, కత్తి పదును పట్టువాడు అనే చిత్రాలు రచించిన విధానం అతి రమణీయమైనది. ఈ రెండు చిత్రాలలో అతని కళా నైపుణ్యం పరణతి పొందింది. ఇతనిలో ఇంత గొప్ప నైపుణ్యం ఉండుటచేతనే యితని చిత్రాలకు 1930లో లండన్‌ నగరమందు సామ్రాజ్య చిత్ర వస్తు ప్రదర్శనాలయంలో ప్రవేశం కల్లిందని పాస్మలెవీ గారు వ్రాశారు. ఆనంద మోహన్‌ చిత్రాలలో ఒకటి 1925లో లక్నో నగరంలో జరిగిన చిత్ర వస్తు ప్రదర్శనలో ‘రాజా మోతీ చందు పతకాన్ని బహుమానం పొందింది. ఆ సంవత్సరమే “తన్మయత్వం” అనే చిత్రం డైలీ ఎక్స్ ప్రెస్ అనే పత్రిక సంవత్సరాది సంచికలో ప్రకటితమయ్యింది. ఈయన చిత్రించిన జీవాత్మ గోపాలుడైన కృష్ణుడు చిత్రాలను “ఇలస్టేట్‌డ్‌ లండన్‌ న్యూస్‌ అనే పత్రికలో 1929లో ప్రచురించారు. కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రించిన మరికొన్ని చిత్రాలు ‘ఊయల, గొల్లపిల్ల, రుద్రుడు, సంతనుంచి, అజంతా నర్తకి, తిక్కన సోమయాజి, గ్రామవీధి, వరూధినీ ప్రవరాఖ్యులు, సతీ శివుడు” ముఖ్యమైనవి. ఈయన అతి పిన్న వయసులోనే 1940లో మరణించారు.

–గబ్బిట దుర్గాప్రసాద్ -23

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , , , , | Leave a comment

గాంధీ యే మార్గం.డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన 3 వ గ్రంథం.1 వ భాగం.22.9.24.

గాంధీ యే మార్గం.డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన 3 వ గ్రంథం.1 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.10 వ భాగం.22.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.10 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.14 వ భాగం. 22.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.14 వ భాగం. 22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం 14 వ భాగం.22.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం 14 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు 9 వ భాగం.21.9.24.

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు 9 వ భాగం.21.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.9 వ భాగం.21.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.9 వ భాగం.21.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment