అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టి కొండ రంగయ్య 

అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టికోట రంగయ్య 

 వట్టికోట రంగయ్య   1914లో జన్మించి  19 98లో  మరణించారు  ఆయన పాండిత్యం  నివురు  కప్పిన నిప్పు  .అంత పాండిట్యాం ఉండీ  తెరమరుగైన  పండితులు  ఆంధ్ర సాహిత్య లోకంలో  ఎవ్వరు లేరు  నిర్దిష్టమైన  భాష శైలి  అభ్యుదయ భావాలు  ఆయన సాహితీ పరికరాలు .  ఆ పాండిత్యం  ఆయన మృతితో  తెరమరుగైపోయింది  ఆంధ్రదేశంలో  అభ్యుదయ సాహిత్య  ఉద్యమం  ప్రారంభకులలో  ఈయన ఒకరు  .  19 43  ఫిబ్రవరిలో  తెనాలిలో  ఏర్పడిన  అభ్యుదయ  రచయితల సంఘం  తొలి కార్యవర్గంలో  వీరు , వీరి సతీమణి  విశాలాక్షి  సభ్యులుగా ఉన్నారు  ఈ తొలి కార్యవర్గంలో  తాపీ  ధర్మారావు  అధ్యక్షులు.  చదలవాడ పిచ్చయ్య  కార్యదర్శి  చాగంటి సోమయాజులు  అశ్విని కుమార్  దత్తు  మహీధర  జగన్మోహన్రావు  ప్రయాగ  కోదండ రామ శాస్త్రి   రాటకొండ  నరసింహారెడ్డి  ఎం సర్వేశ్వరరావు  పత్తికొండ రంగయ్య  విశాలాక్షి  తాపి మోహన్రావు  శెట్టి  ఈశ్వరరావు  ఉన్నారు

ఈ  చారితరాత్మక  ఉద్యమ ప్రారంభంలో  ఆ కార్యవర్గం వర్గంలో  దంపతులిద్దరూ  ఉండటం  వీధి ఘనతకు   తార్కాణ  ఆ రోజుల్లో  వీరు ‘’ రంగ కవి ‘’ అనే పేరుతో  చాలా పద్యాలు  అభ్యుదయ భావ గేయాలు  రాశారు.  వాటిలో  మధు దయం  అరుణోదయం  అభ్యుదయ కవి ,విప్లవ జ్వాల  అభ్యుదయ గీతాలు  ముఖ్యమైనవి  విశాలాక్షి గారు  మంచి నవలలు  కథలు  రాసేవారు  .ఆమె నవలలు  భారత నారి  యుగధర్మం  ఖైదీ  స్వప్న  భంగం  నిష్కామయోగి  ఆత్మబలి  ప్రసిద్ధమైనది  తర్వాత  ఇద్దరు రాయటం మానేశారు. అలా మానకుండా ఉండి ఉంటే  ఎంతో  ఉత్తమ సాహిత్యం  వారి ద్వారా  లోకానికి అందేది  .దాదాపు  నాలుగు దశాబ్దాల  పాటు  నివురు  కప్పి ఉన్న  రంగయ్య గారి పాండిత్యాన్ని  చేరా  ,  బిఎస్ఆర్ కృష్ణ  కొద్దిగా బయటపెట్టారు.

రంగయ్యలోని  హిందీ పాండిత్యాన్ని  గురించి  ఇంకా లోకానికి  పెద్దగా తెలియలేదు  పండితలోకల్లో  వారికి  రావాల్సిన  గుర్తింపు  లభించలేదు  రెండేళ్లపాటు  చెన్నైలో  అప్పటి  ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ  పత్రిక ‘’ కాంగ్రెస్’’ కు   సంపాదకులుగా  ఉండి  ఆ తరువాత  1954లో  గుంటూరు వెళ్లి  కొన్నాళ్లపాటు ‘’ ప్రజావాణి’’  వార పత్రిక  నడిపి ,  దానిని మూసేసి  పూర్తిగా  సాహిత్య రంగాన్ని వదిలి  వ్యాపార రంగంలో ప్రవేశించి  బాగా    రాణించారు . సరదాగా ఆయనతో ‘’ మీరు  సరస్వతి కి విడాకులు ఇచ్చి  లక్ష్మిని చేపట్టారు’’  అని అంటే  ముసి ముసి నవ్వులు  మాత్రం విసిరేవారు . రంగయ్య గారు  84 వ ఏట  3-6- 1998  గుంటూరులో  మరణించారు .ఈ విషయాలన్ని  బి ఎస్ ఆర్ కృష్ణ  తెలియచేశారు.

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-  15 10  -24-  ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.36 వ చివరి భాగం.15.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.36 వ చివరి భాగం.15.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.11 వ భాగం.15.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.11 వ భాగం.15.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?2 వభాగ0 .14.10.24.

గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?2 వభాగ0 .14.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వేంకేశ్వర.15 వ భాగం.14.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వేంకేశ్వర.15 వ భాగం.14.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.35 వ భాగం.14.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.35 వ భాగం.14.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.10 వ భాగం.14.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.10 వ భాగం.14.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?.1 వభాగ0 .13.10.24.

గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్.గారి శతకం. తప్పు కాదు!?.1 వభాగ0 .13.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.14 వ భాగం.13.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.14 వ భాగం.13.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.34 వ భాగం.13.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.34 వ భాగం.13.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.9 వ భాగం.13.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.9 వ భాగం.13.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)30 వ భాగం.12.10.24.

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)30 వ భాగం.12.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.13 వ భాగం.12.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి .33 వ భాగం.12.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి .33 వ భాగం.12.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.8 వ భాగం.12.10.24.

శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.8 వ భాగం.12.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3)

29 వ భాగం.11.10.24.

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.12 వ భాగం.11.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.12 వ భాగం.11.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.32 వ భాగం.11.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.32 వ భాగం.11.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.7 వ భాగం.11.10.24.

శూద్రక మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.7 వ భాగం.11.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారత తొలి మహిళా శాస్త్ర వేత్త – కమలా సోహోనీ (వ్యాసం ) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

భారత తొలి మహిళా శాస్త్ర వేత్త – కమలా సోహోనీ (వ్యాసం ) – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

01/10/2024గబ్బిట దుర్గాప్రసాద్

కమలా సోహోనీ ఒక మార్గదర్శక భారతీయ బయోకెమిస్ట్, ఆమె సైన్స్‌కు గణనీయమైన కృషి చేసింది . పరిశోధనలో మహిళలకు తలుపులు తెరిచింది. సైంటిఫిక్ విభాగంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ మహిళగా ఆమె ప్రయాణం భవిష్యత్ తరాల మహిళా శాస్త్రవేత్తలకు మార్గం సుగమం చేసింది.

కమలా సోహోనీ యొక్క ప్రారంభ జీవితం మరియు విద్య:

కమలా సోహోనీ 18 జూన్ 1911న ప్రస్తుతం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో భాగమైన ఇండోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి, నారాయణరావు భగవత్ మరియు ఆమె మేనమామ, మాధవరావు భగవత్, ఇద్దరూ రసాయన శాస్త్రవేత్తలు మరియు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో పూర్వ విద్యార్థులు, ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)గా మారింది. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి, కమల 1933లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ లో BSc పూర్తి చేసింది.

IIScలో అడ్డంకులను అధిగమించడం 1933లో, కమల IIScలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసింది. ఆమె అర్హతలు ఉన్నప్పటికీ, ఆమె దరఖాస్తును మొదట అప్పటి డైరెక్టర్ మరియు నోబెల్ గ్రహీత, ప్రొఫెసర్ సి.వి.రామన్ మహిళలు పరిశోధనలకు సరిపడరని నమ్మారు. అధైర్యపడకుండా, కమల రామన్ కార్యాలయం వెలుపల సత్యాగ్రహం చేసింది, చివరికి ఆమె కఠినమైన షరతులతో ప్రవేశానికి దారితీసింది. ఆమె గణనీయమైన పక్షపాతాలు మరియు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన మొదటి మహిళ.

భారతదేశంలో మొదటి మహిళా శాస్త్రవేత్త పరిశోధన మరియు విజయాలు:

IIScలో, కమలా పరిశోధనలు పాలు, పప్పులు మరియు పప్పుధాన్యాలలోని ప్రొటీన్లపై దృష్టి సారించాయి, ఇవి భారతీయ సందర్భానికి కీలకమైనవి. ఇన్‌స్టిట్యూట్‌లోకి ఎక్కువ మంది మహిళలను అనుమతించాలనే ప్రొఫెసర్ రామన్ నిర్ణయాన్ని ఆమె పని గణనీయంగా ప్రభావితం చేసింది.

1937లో, ఆమె డాక్టర్. డెరెక్ రిక్టర్ మరియు తరువాత డాక్టర్. రాబిన్ హిల్ వద్ద పనిచేయడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. కేంబ్రిడ్జ్ వద్ద, కణాలలో శక్తి ఉత్పత్తికి అవసరమైన సైటోక్రోమ్ సి అనే ఎంజైమ్‌ను ఆమె కనుగొంది. ఈ విషయంపై ఆమె సంక్షిప్త థీసిస్, కేవలం 14 నెలల్లో పూర్తి చేసింది, ఇది కట్టుబాటు నుండి గుర్తించదగిన నిష్క్రమణ. కమలా సోహోనీ నిశ్శబ్ద, నిరాడంబరమైన వ్యక్తి.

భారతీయ విజ్ఞాన శాస్త్రానికి కమలా సోహోనీ అందించిన సేవలు:

1939లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, కమల లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ హెడ్‌గా చేరారు. ఆమె కూనూర్‌లోని న్యూట్రిషన్ రీసెర్చ్ లాబొరేటరీలో విటమిన్లపై దృష్టి సారించింది.

1947లో ఆమె ఎం.వి. సోహోనీ మరియు ముంబైకి వెళ్లారు. ఆమె రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్‌గా చేరి ఆ తర్వాత డైరెక్టర్‌ అయ్యారు, అయినప్పటికీ లింగ వివక్ష కారణంగా ఆమె నియామకం ఆలస్యమైంది. నీరా అని పిలవబడే చిక్కుళ్ళు మరియు పామ్ సాప్ యొక్క పోషక అంశాలపై కమల చేసిన పరిశోధన ప్రత్యేకించి ప్రభావం చూపింది. ఆమె పని నీరా యొక్క అధిక పోషక విలువలను మరియు పోషకాహార లోపం ఉన్న జనాభాకు దాని ప్రయోజనాలను ప్రదర్శించింది.

మొదటి మహిళా భారతీయ శాస్త్రవేత్త వారసత్వం మరియు గుర్తింపు:

కమలా సోహోనీ కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో క్రియాశీల సభ్యురాలు మరియు 1982-83కి అధ్యక్షురాలిగా పనిచేశారు. నీరాపై ఆమె చేసిన కృషికి ఆమె చేసిన కృషికి రాష్ట్రపతి అవార్డుతో గుర్తింపు లభించింది.

కమల 28 జూన్ 1998న న్యూఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సన్మాన కార్యక్రమం తర్వాత కొద్దిసేపటికే కన్నుమూసింది. ఆమె మార్గదర్శక ప్రయత్నాలను 18 జూన్ 2023న ఆమె 112వ జన్మదినోత్సవం సందర్భంగా Google ఒక డూడుల్‌తో స్మరించుకుంది, భారతదేశపు మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్తగా ఆమె శాశ్వతమైన వారసత్వాన్ని జరుపుకుంది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Leave a comment

డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).28 వ భాగం.10.20.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.11 వ భాగం.10.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.11 వ భాగం.10.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.31 వ భాగం.10.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.31 వ భాగం.10.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.6 వ భాగం.10.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.6 వ భాగం.10.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).17 వ భాగం.9.10.24.

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).17 వ భాగం.9.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే oకటేశ్వర.10 వ భాగం.9.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే oకటేశ్వర.10 వ భాగం.9.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ). గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.30 వ భాగం.9.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.5 వ భాగం.9.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.5 వ భాగం.9.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సుశర్మ రాసిన ‘’శ్రీ మట్టపల్లి నృసింహస్వామి దేవాలయ చరిత్ర ‘’

శ్రీ సుశర్మ రాసిన ‘’శ్రీ మట్టపల్లి నృసింహస్వామి దేవాలయ చరిత్ర ‘’

మట్టపల్లి అనగానే సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం హుజూర్ నగర్ లో కాపురం ఉన్న మా శ్రీమతి చెల్లెలు దుర్గ ,ఒకసారి మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెడితే దగ్గరుండి మట్టపల్లి  క్షేత్రానికి తీసుకొని వెళ్ళి కృష్ణ వేణీ స్నానం చేయించి నరసింహస్వామి దివ్య దర్శనం చేయించటం అక్కడి వాతావరణం పవిత్రత ఆవిడ చాలాకాలం చెబుతూ ఉండటం గుర్తుకు వస్తుంది .మరొకటి –ఉయ్యూరులో ఆయుర్వేద మందుల షాపు నిర్వహిస్తూ ఉయ్యూరు దగ్గర గండి గుంటలో ఉన్న శ్రీ దత్త క్షేత్రం యాజమాయిషీ చేస్తూ ,ప్రతి ఉగాదికి సాయంత్రప్ అక్కడ నాతో పంచాంగ శ్రవణం చేయిస్తున్న శ్రీ పురుషోత్తమా చార్యులు గారు పదేళ్ళ క్రితం నేను బెజవాడనుంచి బస్ లో ఉయ్యూరు వస్తూంటే నాతో పాటు ప్రయాణిస్తూ మాటల సందర్భంగా తను మట్టపల్లి నుంచి వస్తున్నానని  అక్కడి క్షేత్ర అర్చకస్వామి స్వయానా తనకు బావమరది ఆని చెప్పటం గుర్తుకు వచ్చింది .

  పుస్తకం తెరిస్తే డా.తట్టా వారి ఆముఖం చూడగానే కొన్నేళ్ళ క్రితం ఆయనా ఆయన కుమార్తె శ్రీదేవి కలిసి ‘’శ్రీ శుభం ‘’అనేఆధ్యాత్మిక మాసపత్రిక నడపటం ,అందులో నేను వ్యాసాలూ రాయటం జ్ఞాపకానికి వచ్చింది . డా సర్వా వారి ముందుమాట చూడగా ఆయనతో సాహితీ స్నేహం ,తరచూ బెజవాడ సభలలో కలవటం ,ఒకసారి సరసభారతి సభలకు కూడా ఆయన్ను ఆహ్వానించటం ,ఆయన రాసిన పుస్తకాలు నాకు పంపుతూ ఉండటం నేను రాసిన సరసభారతి పుస్తకాలు ఆయనకు పంపటం ,సుమారు ఏడు ఎనిమిదేళ్ళ క్రితం ఆయన మృతి చెందటం విషాదంగా గుర్తుకొచ్చింది .

 ఆలయ చరిత్ర

ఈఆలయచరిత్ర బహుళ ప్రయోజనంగా ఉండాలని రచయిత సంకల్పించి ,చరిత్రతోపాటు పూజా విధానం స్తోత్రాలు కూడా చేర్చారు .ముందుగ నరసింహావతారం గురించి సంక్షిప్తంగా తెలియ జేశారు .తెలంగాణా లో హుజూర్ నగర్ దగ్గర  కృష్ణానదీ తీరాన ఉన్న ఉన్న మట్టపల్లి నరసింహస్వామి మాచి రెడ్ది అనే నరసింహునికి దర్శనమిచ్చాడు మొదటి సారిగా .కేశవ తీర్ధులు అనే నారసింహ హృదయంలో స్వామి తిష్ట వేశాడు .ఆయనతోనే  నృసింహ ఉపాసనను బుర్రకథ రూపం లో ప్రకటింప జేసుకొన్నాడు .మరో నరసింహుడు నరహరి గోపాలునితో సుప్రభాత సేవ లిఖింప జేసుకొన్నాడు .అపర విశ్వ నాథుని చె ‘’శ్రీరామ కవచం ‘’తొడిగించుకొన్నాడు .అచ్యుత నరసి౦హునిచే కరావలంబ స్తోత్రాన్ని కరతామలకం చేయించాడు హరినామస్మరణతో నిరంతరం పరవశించే సోమయాజుల లక్ష్మీ నరసింహుని చే కళ్యాణ వైభవాన్ని చెప్పించుకొని వీనుల విందుగా అనుభవించాడు .ముక్కూరి నారసి౦హు నిచే నరహరి అష్టోత్తర శత నరసింహ యాగాలు నిర్వర్తింప జేసుకొన్నాడు భరతుని వచో వైభవాన్ని శ్రవణ పేయంగా  విన్నాడు .ఈ సుబ్రహ్మణ్య  వాచాలతతో తన ఆలయ చరిత్ర రాయించి ధన్యుణ్ణి చేశాడు .అంటే స్వామి ప్రతివారి హృదయ సీమలో ప్రవేశించి తనకు కావలసింది చేయించు కొన్నాడన్నమాట .

 కృష్ణా తీరాన ఉన్న పంచ నరసింహ క్షేత్రాలలో మట్టపల్లి రెండవది నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు 24కిలో మీటర్లదూరం లో కృష్ణవేణీ తీరంలో పెద్ద అడవి మధ్య గుహాలయం లో వెలసిన స్వామి ఈనార సింహుడు  .భారద్వాజాది మహర్షులు సేవించిన పవిత్ర క్షేత్రం.త్రేతాయుగ ద్వాపర యుగాలలో దేవతలు మునులు గుహాలయం లోకి వెళ్ళి స్వామిని దర్శించి తరించేవారు .కలియుగంలో స్వామి దర్శనం సామాన్యులకు గగన కుసుమం అయింది .

కృష్ణకు అవతలి ఒడ్డున ‘’తంగెడ ‘’గ్రామ ప్రభువు మాచి రెడ్డికి స్వామి కలలో కన్పించి కీకారణ్యంలో స్వయం వ్యక్తుడనైన తనను సేవించి తరించమన్నాడు .మర్నాడు రాజు మందీ మార్బలం తో స్వామి చెప్పిన గుర్తులను బట్టి వెతుకుతూ పోగా ఎంతసేపటికి స్వామికనిపి౦చక పొతె అలసి నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి ,ఒక ఆరె చెట్టు కనిపిస్తుంది.దానికి సూటిగా ప్రయాణిస్తే నదీ తీర గుహాలయం చేరుకోవచ్చు ఆని భరోసా ఇచ్చాడు .మర్నాడు మళ్లీ ప్రయాణం సాగించి గుహాలయం దర్శించి అందులో ద్వారం పై గజలక్ష్మి శిలా విగ్రహం,,కింద రాజ్యలక్ష్మి శిలా విగ్రహం స్పష్టంగా కనిపించాయి .ప్రహ్లాదుని రూపం లో తిరునామాలు ,రెండు కాళ్ళు ఉన్నస్వామి నయనానందంగా మాచి రెడ్ది ప్రభువుకు దర్శన మిచ్చాడు. దేవతలు మునుల తర్వాత మానవ మాత్రుడుగా స్వామి దర్శనం పొందిన రెడ్ది ప్రభువు చిరస్మరణీయుడు .తర్వాత దేవాలయ ముఖమండపం మొదలైన నిర్మాణాలు చేసి అజరామరం చేశాడు .ఇప్పటికి వెయ్యేళ్ళ నాటి చరిత్ర ఇది .తర్వాత మట్టపల్లి దగ్గర ఉన్న పెదవీడు గ్రామానికి చెందిన’’చెన్నూరు ‘’వంశస్తులు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు .

వేద పండు శ్రీమాన్ మక్కూర్ నరసింహా చార్యుల వారు అహోబిల సింహాచల విజయవాడ క్షేత్ర వేద  సభలలో ప్రసంగించి ఒకసారి మంగళగిరి పానకాలస్వామిని దర్శించి గా, ఒక రోజు స్వామి స్వప్నం లో వృద్ధ బ్రాహ్మణ రూపం లో దర్శనమిచ్చి స్వాతీ నక్షత్ర యుక్త మహాయజ్ఞం చేసి సమర్పించమని ఆదేశించగా ,మొదటి సారి 1981లో అలాగే చేసి స్వామిని సంతృప్తి పరిస్తే ,కలలో కనిపించి ,మట్టపల్లి లో కూడా యాగం నిర్వహించమని ఆజ్ఞాపిస్తే ,,మట్టపల్లి చేరి శతాధిక నృసింహ యాగాలు నిర్వహించారు .

 చెన్నైలో ఆయన శిష్యబృందం ‘’స్వాతీ మహాయజ్ఞ ట్రస్ట్ ఏర్పాటు చేయగా దానికి చైర్మన్ గా ఉన్నారు .ట్రస్ట్ ఆధ్వర్యం లో మట్టపల్లి లో గోశాల ,ధ్యాన మందిరం ఏర్పడ్డాయి .ఆచార్యశ్రీ 1981నుంచి 2000 వరకు 121 నృసింహ యాగాలు నిర్వహించి 4-5-2000 న విష్ణు సాయుజ్యం పొందారు .

రచయితపరిచయం –తమ్మర సుబ్రహ్మణ్య శర్మ (సు శర్మ )నల్గొండ జిల్లా కోడాడు తాలూకా తమ్మర బండ పాలెం శ్రీ సీతారామాంజనేయ శర్మ ,శ్రీమతి సువర్చల దంపతులకు జన్మించారు. పితామహులు  శ్రీ త్యాగరాజన్ గణపతి ,మాతామహులు శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి సిద్ధాంతి (శ్రీ రామోదహరణ కావ్యకర్త .దీనినే శర్మగారు 2014లో పునర్ముద్రించారు )

 శర్మాజీ గుడిబండ ,కోదాడ ,నేలకొండపల్లి ,హైదరాబాద్ లలో చదివి తెలుగు సంస్కృతం లో ఎం .ఎ .సంస్కృతంలో ఎంఫిల్ కూడా చేసి జర్నలిజం లో డిప్లమో సాధించి అధ్యాపకత్వం లో ఉన్నారు .నేను –వచన కవితా సంపుటి ,మూషిక దౌత్యం –సందేశ కావ్యం ,కార్తీక కృష్ణం –స్మృతి వీచిక ,అమృత సిద్ధి –ఎంఫిల్ వ్యాసం ,మాతామహుల కృతులపై పరిశీలన రచన ,ఉపనయన విధి ,లోగుట్టు –పెరుమాళ్ళకె  కాదు ,మీనాక్షి సుందరేశ్వరులు రాశారు .

కోదాడలో శారదా సాహితీ సమాఖ్య తన అధ్యక్షతన  ఏర్పరచి పుస్తకముద్రణ సాహితీ సేవాకార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-24-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).16 వ భాగం.8.10.24.

డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).16 వ భాగం.8.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.9 వ భాగం.8.20.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.9 వ భాగం.8.20.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.4 వ భాగం.8.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.4 వ భాగం.8.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).15 వ భాగం.7.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే 0కటేశ్వర.8 వ భాగం.7.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే 0కటేశ్వర.8 వ భాగం.7.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.28 వ భాగం.7.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.28 వ భాగం.7.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.3 వ భాగం.7.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.3 వ భాగం.7.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి గారి ‘’శ్రీరామోదాహరణము ‘’

శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి గారి ‘’శ్రీరామోదాహరణము ‘’

తెలంగాణ కోదాడకు ప్రాంతానికి చెందిన ఈ ఆధునికకవి 2014 లో రామ ఉదాహరణ కావ్యం రాయటం ప్రశంసనీయం..ఉదాహరణ ప్రక్రియను దాదాపుగా అందరూ మరచిపోయిన ఈకాలం లో దానికి రామ తేజస్సు ,ఓజస్సు కలిగించారు కవి ధన్యుడు .ఈయన కోదాడలో ‘’శారదా సాహితీ సమాఖ్య ‘’నెలకొల్పి సారస్వత సేవ చేస్తున్నారు .ఇప్పటికి మూడు పుస్తకాలు రాశారు .తిమ్మరాజపురిలో వేంచేసి ఉన్న సీతారామ స్వామికి అంకితం చేశారు .

  ప్రధమా విభక్తిలో ‘’శ్రీ రాజిల్లెడు తమ్మరాఖ్య పురిలో చెన్నారు అత్యన్తమున్ –సారోదార కటాక్ష వీక్షణములన్ సర్వార్ధముల్ భక్తులం –జేరం జేయుచు గిల్బిష చ్చదములన్ చేదించుచు౦ బ్రోచు సీ-తారామా విముడెల్ల వేళల నమంద ప్రీతి మమ్మోముతన్ ‘’అంటూ శార్దూల౦ పై విహరించి స్వామికి అర్పించారు ..తర్వాత కలిక ,ఉత్కలిక  లు రాసి రామ చరిత్ర ప్రారంభించి ,ద్వితీయావిభక్తిలో శార్దూలం లో’దయాశాలి ,దమ్మర ధాము ‘’భక్తజన రక్షా దీక్షితుని నుతించి ,మళ్లీ కలిక ఉత్కలిక లలో శివ ధనుర్భ౦గం చెప్పి,తృతీయావిభక్తిలో ఉత్పలమాల అలంకరించి ‘’నీరేజ దళాక్షు చేతను హరి౦చు నఘౌఘము ‘’ఆని సంతృప్తి చెంది ,మళ్లీ యదా ప్రకారం కలిక ఉత్కలిక పేని ,పరశు రామ గర్వ భంగం చెప్పి చతుర్ధీ విభక్తిలో ఉత్పలమాల లో ‘’హరికి,కమనీయ దివ్య కార దండు నకై  దయాబ్దికయి తమ్మెర దామునికి కమోడ్పు చేశారు .

  మధురగగతి  రగడలో యధాప్రకారం కలిక ఉత్కలిక కూర్చి ,పంచమీ విభక్తిలో మహాస్రగ్ధర ‘’అనిమేషాస్వేద దృక్కాయముల బొదలు వారార్తి బ్రార్దిమ్పగా కుంభిని కౌసల్యా సుతుడై సీతారామ చంద్రుని గా సమస్త భక్తుల కోరికలు తీర్చాడు .ఇలా క్రమంగా  సప్తమీ  విభక్తి దాకా సాగించి ,,తర్వాత సంబోధణ ప్రధమా విభక్తిలో ‘’ద్వికంద క్రౌన్చాపద వృత్తం లో విజ్రుమ్భించి ,సార్వ విభక్తికం లో రాసి అన్కా౦కితం చేశారు .

స్తోత్ర మాలికలో శ్రీరామ స్తవం మహా భక్తిగా చేసి కైంకర్యం చేశారుకవి .పిమ్మట నీలగిరి స్థిత పట్టాభిరామ స్తుతి 34వృత్త పద్యాలలో చెప్పి ,మట్టపల్లి శ్రీ నారసింహ కరావలంబనస్తోత్రం చేసి ధన్యులై మనల్నీ ధన్యులను చేశారు .తర్వాత దశావతార రఘుపతి స్తుతి ,చంద్ర కళా అ౦బురుహ,తరల,ద్రువ కోకిల మొదలైన భిన్న వృత్తాలలో సొగసు గా సన్ను తించారు .చివరగా వేణు గోపాల దండకం రాసి అయిందని పించి ,తమ్మెర గ్రామం లో వెలసిన సీతా రాముని గురించి వివరించారు .ఇది నల్గొండ జిల్లా పురాతన ఆలయం .రెండు వందల ఏళ్ల ప్రాచీనాలయం ..ఇక్కడ శ్రీరామ పుష్కరిణి ఉంది.

కవి గారు తమ్మేరలో పుట్టి విద్యనేర్చి అనూచానంగా వస్తున్నా వైదిక వృత్తిలో జీవితం సార్ధకం చేసుకొంటూ,కృష్ణా నాదే తీరం లోని మట్టపల్లి క్షత్రం తో బాటు జిల్లా రాష్ట్ర స్థాయిలలో సాహితీ గోష్టులలో పాల్గొని ,,అవధానాలలో   పృ చ్చకుడై రాణింపు పొందారు .అచలాత్మజా స్తుతి వెంకటేశ్వర స్తుతి శతకం ,దశావతార రఘు స్తుతి ,రాశారు ముకుందమాల ,ఆంధ్రీకరించారు జీడికంటి రామ శతకం శ్రీ కృష్ణ దండకం ,మట్టపల్లి నరసింహ స్తుతి ,సింహగిరి వరాహ నరసింహ తారావళి అనేక శతకాలు రాసి స్వామికి నైవేద్యమిచ్చారు .బహుముఖ ప్రజ్ఞాశాలి .జ్ఞాన ధారతో సాహితీ లోకాన్ని తరి౦ప  జేస్తున్న భక్తకవి శ్రీ నందుల అచ్య్త రామ శాస్త్రి .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-24-ఉయ్యూరు      ,  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా.నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).14 వ భాగం.6.10.24./

డా.నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).14 వ భాగం.6.10.24./

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.7 వ భాగం.6.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.7 వ భాగం.6.10.24.

Posted in రచనలు | Leave a comment

శ్రీ చెన్నకేశవ గారి శ్రీ వాణీ కంద శతకం

శ్రీ చెన్నకేశవ గారి శ్రీ వాణీ కంద శతకం

కందాన్ని అందంగా నడుపుతూ డా.సి చెన్న కేశవ రాసిన శ్రీ వాణీ శతకం రమణీయం .దీన్ని ప్రసిద్ధ కవి రచయిత,మిత్రుడు  శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మగారికి అంకితమిచ్చారు  .శ్రీ సరస్వతి దేవి అందమైన ముఖ చిత్రంతో మంచి ముద్రణతో శతకం ఈ దసరాలలో సార్ధకం గా ఉంది.ఇందులో ఆధ్యాత్మిక సామాజికసందేశం ఉందని కవి చెప్పుకొన్నారు .

మొదటి పద్యం లో ‘’శ్రీ రామ భక్తి పూర్ణుడ –గోరిక నిను బద్యమల్లి కొలిచెద తల్లీ !కూరిమి మాకొసగవేక-ర్పూరపు గుప్పయగు పల్కు పొందిక వాణీ ‘’ఆని భక్తిగా పలికి ,వేరు దైవాలను కొలవక నిన్నే వేడుతున్నాను ,కలిగిన వాడినికాకపోయినా ,’’కలమదురఫణితి’’నుతిస్తాను.,నీవలువలు పూలు తెల్లనివి .తియ్యగా చల్లగా పాడుతాను .

‘’శృంగగిరిలో స్థిర పీఠం పై వెలశావు ‘’,శబ్దమే పరమాత్మ కళ ,రాగ తాళాలతో పాటు భోగ శోకాలు కూడా నీవే .వేశ్యలకు అందం గృహిణులకు జఘనం,రాజులకు పందెం ,చెలులకు లాస్యం అందం రాణింపు తెస్తాయి .చదువల మర్మ తెలియక చదివి ‘’చవటలం అయ్యాం’’ ఆని వేదన చెందాడు కవి .నీతులు చెబుతూ గోతులు తీసే వారిని గుర్తించటం బ్రహ్మ ప్రళయం జాగ్రత్త .’’గుడిలేని గ్రామ వాసం  ‘’  ,మడిలేనిబ్రతుకు’’ వ్యర్ధం . సంగీత మర్మమేమి జననీ ‘’ఆని ప్రార్ధించారు .’’బట్ట అనే జగతి చినిగితే కుట్టటం సాధ్యమా ?ఆని ప్రశ్నించారు .ఎక్కడ చూసినా ఏదోఒక గుడి ఉంటుంది –‘’జగతికి ఆధారమైన మగువకు గుడిలేక పోవటం ‘’వింతగా ఉందమ్మా అన్నారు .

ఆకలికి రుచి ,పోకడకు నాశనం,రోకలి కి పోటు,తెల్లని కాకి  ఉండవు .దానం దాతకు ప్రాణం , మానం శోభ మానవుడికి .దానం చెయ్యటం మానకు ‘’’’మానము వీడక బ్రతుకుము మహిలో వాణీ !’’అన్నారు .విద్య సతి ,పతి మోక్షం ,సఖుడు ,విద్యయే పరమాత్మ ఆని ధర్మ సూక్ష్మ౦ చెప్పారు కవి .చివరి 106వ కందం లో మంగళం పాడారు .

 ఎక్కడా కుంటని ధార శతకమంతా ప్రవహించింది .క్లిష్టత లేదు .శ్రావ్యత ఇంపుగా ఉంది. భక్తి నిర్భరత పుష్కలం .’’వాణీ ‘’మకుటం శోభాయ మానం .

 కవి బెజవాడ భావనారాయణ కాలేజి హిందీ శాఖాధి పతి .జర్నలిజం లో డిప్లమో హోల్డర్ .కవిత్వ,కథ నాటక రూపకాల పంట పండించిన హాలికుడు. ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డీ .ఈశతకంతో పాటు ఆరు రచనలు చేసి ముద్రించారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-24-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.27 వ భాగం.6.10.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం. సాహితీ వైజయంతి.27 వ భాగం.6.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం. మృచ్ఛ కటికం.2 వ భాగం.6.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం. మృచ్ఛ కటికం.2 వ భాగం.6.10.24.

Posted in రచనలు | Leave a comment

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).13 వ భాగం.5.20.24.

డా. నాగ సూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో వెలువడిన గాంధీ యే మార్గం (3).13 వ భాగం.5.20.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0కటేశ్వర.6 వ భాగం .5.20.24.