ఆలవాలం

 


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://

బౌద్ధ ప్రపంచం

ఆలోచించే ప్రతి వ్యక్తీ ఏదో ఒక ఇజంను ఎన్నుకుంటాడు. ఇజం అంటే జీవితంపై ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక ఫిలాసఫీ ఆఫ్‌ లైఫ్‌ అనొచ్చు. తాను ఎన్నుకునే ఇజంలోని ఆలోచనా విధానం తనకు నచ్చాలి. అంతకన్నా ముఖ్యంగా అది తనకు ఎంత ప్రాధాన్యమిస్తూ ఉందన్నది ఆలోచిస్తాడు. సిద్ధాంతం ఎలా ఉన్నా తనకు సముచిత స్థానం, గౌరవం ఇస్తే దాన్ని స్వీకరిస్తాడు. లేదంటే వదిలేస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అనేక మేధావులను ఆక ర్షిస్తున్నది గౌతమబుద్ధుని భావజాలం.

దీనికి కొన్ని కారణాలున్నాయి. సైన్స్‌, శాస్త్రీయ ఆలోచనలు అప్పటివరకు ఉన్న మత విశ్వాసాలను పూర్తిగా సడలించాయి. ఆకాశంలో స్వర్గమనే చోట దేవుడున్నాడు, అతడు మనలను శాసిస్తున్నాడు అంటూ మతం చెప్పే కథల్ని అనేకులు ఒప్పుకోవడం లేదు. మతంతో పాటు ముడిపడి ఉన్న నైతిక విలువలు కూడా బలహీనపడ్డాయి. నాస్తికత పెరిగింది. అయినా ఆస్తికుల్లో ఎందరు మంచివాళ్లు ఉంటారు. శాసీ్త్రయ దృక్పథానికీ, మతవిశ్వాసానికీ సంఘర్షణ వచ్చే సందర్భంలో నాస్తికులు మతవిశ్వాసంతో సంబంధం లేని ఆధ్యాత్మికత కోసం అన్వేషిస్తారు. మానవ స్వభావంలో ఉన్న సాత్త్వికగుణం కారణంగా మంచి మార్గాన్నే ఎంచుకోవాలని ప్రయత్నిస్తారు. మతవిశ్వాసంతో సంబంధంలేని ఆధ్యాత్మికత, శాస్త్రీయ చింతన ఏదైనా ఉంటే.. దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల దేవునితో సంబంధం లేని ఆధ్యాత్మికత కావాలనుకునే ఆధునికులు అన్నివిధాలా ఆకర్షించే సిద్ధాంతం బుద్ధుని భావజాలం.
ధ్యానం శరణం గచ్ఛామి..
మరోకారణం.. బౌద్ధ బిక్షువులు, ముఖ్యంగా టిబెట్‌కు చెందిన వాళ్లు ధ్యానం, సమాధి మొదలైన వాటిపై శ్రద్ధతో సాధనలు చేశారు. ఈ సాధనలు మనస్తత్త్వ శాస్త్రాల్ని ఆకర్షించాయి. శాస్త్రవేత్తలు బౌద్ధబిక్షువులు కలిసి మనసు, దాని నియంత్రణ మొదలైన వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ధోరణిలో ఇటీవల Sam Harris అనే ప్రముఖ అమెరికన్‌ నాస్తిక రచయిత రాసిన ‘Waking Up & A Guide to Spirituality Without Religion’ చూడవచ్చు. చాలా ఏళ్లుగా తన సొంత మతాన్ని విమర్శిస్తూ నాస్తికవాదాన్ని ప్రచారం చేసిన ఈయన భారతీయ సిద్ధాంతాలను పరిశీలించాడు. వాటిలో ముఖ్యంగా బౌద్ధానికి చెందిన విపశ్యనాయోగంలోని ధ్యాన పద్ధతులను సాధన చేశాడు. ధ్యానం ద్వారా తను పొందిన అనుభవాలను పై పుస్తకంలో వివరించాడు. ధ్యానపద్ధతులు అధునిక మనస్తత్త్వశాస్త్రంలో Mindfulness meditation పేరిట చాలా ప్రాచుర్యం పొందాయి. మతవిశ్వాసంతో అవసరం లేకుండా ఎలాంటి వాడైనా ఈ ధ్యానం చేసి లాభం పొందవచ్చు. ఒక వ్యక్తి తన కోపిష్టి స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ధ్యానం చేయవచ్చు. మరొకరు జీవితంలో మరొక సమస్య గురించి చేయవచ్చు. ఒక మీటింగుకు వెళ్లే మేనేజర్‌ తను మాట్లాడబోయే విషయాన్ని గురించి.. ఇలా ఏ విషయంలోనైనా ఈ ప్రక్రియ వాడవచ్చు. ఈ విషయాలతో పాటు బౌద్ధమతంలోనూ, అద్వైత వేదాంతంలోనూ చెప్పే జ్ఞానపద్ధతులను (Epistemology) కూడా రచయిత ఆ గ్రంథంలో వివరించాడు. నేను ఎవరు (who am I ?) అన్న విషయంపై రెండు మతాల్లోనూ దాదాపు ఒకే విధమైన విశ్లేషణ ఉంటుంది. ఈ రెండింటినీ హారిస్‌ తన రచనలో వివరించాడు. దీనివల్ల పాశ్చాత్యదేశాల్లోని యువత ఎలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం అమెరికా యువకుల్లో 25 శాతానికిపైగా మంది తమ విధానం Spiritual but not rel-igious (SBNR) అని చెప్పుకోవడం విశేషం
ధర్మం శరణం రక్షామి..

పై చర్చంతా బుద్ధుడు నాస్తికుడు అని భావించి చెప్పినది. కానీ నిజంగా బుద్ధుడు దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ చెప్పలేదు. బుద్ధుడు సమాజంలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఆ మతం ప్రజలకు చేరువైంది. దాదాపు పది శతాబ్దాలపాటు హిందూ మతంతో సమానంగా వ్యాపించింది. అలాంటిది ఎందుకు బలహీనపడిందన్న విషయంపై అంబేద్కర్‌ మొదలైన ప్రముఖులు చారిత్రక కారణాలను చెప్పారు. అంబేద్కర్‌ బౌద్ధమతం స్వీకరించడం మన సాంఘిక చరిత్రలో గొప్ప సంఘటన. అన్ని మతాల స్వరూపాన్ని గమనించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్‌ వారి విధానాల వల్ల వర్గాలుగా చీలిపోతున్న ప్రజలను భారతీయ సంస్కృతిలోనే ఉండేటట్టు చేసి దేశంలో అంతర్గత కలహాలు నివారించి శాంతికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. ‘బౌద్ధం దేశ అఖండతను కాపాడే తత్వం’ అని, దేశ సమగ్రత కోరేవాళ్లు.. బుద్ధుని, అంబేద్కర్‌ మార్గాన్ని పాటించాలని ఇటీవల కత్తి పద్మారావుగారు చెప్పడ ం చాలా ప్రశంసనీయం.

ఇదం బ్రాహ్మం..

ప్రస్తుతం బుద్ధుడి గురించి చెప్పేవారు బౌద్ధ సిద్ధాంతంలోని గొప్పదనాన్ని, ఉపనిషత్తులకూ ఆ సిద్ధాంతానికీ ఉన్న అనేక పోలికలు మొదలైన వాటిని విశ్లేషించడం లేదు. సామాజిక సిద్ధాంతం విశ్లేషణ మాత్రమే జరుగుతోంది. ముఖ్యంగా బుద్ధుడిని వైదిక ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించడం, అతడు బ్రాహ్మణులను నిందించాడని చెప్పడం వింటుంటాం. కానీ చాలా మంది పాశ్చాత్యులు కూడా ఈ వాదంతో ఏకీభవించారు. ఉదాహరణకు J.E. Jennings అనే రచయిత ఇలా అంటాడు ‘”It should never be forgotten that Buddhism is a reformed Brahmanism, as is evidenced by the invariably honorific use which Gautama makes of the title Brahmin’ (The Vedantic Buddhism of Buddha). అలాగే Rhys Davids దంపతులు బౌద్ధంపై రాసిన పుస్తకాల్లో ఇదే భావాలను చెప్పారు. ’బౌద్ధమతం సాంప్రదాయక విశ్వాసాల నుండే పుట్టింది. వాటితో పరిపుష్టమైంది’ (Rhys Davids – Buddhism p.85). బుద్ధుడు స్వయంగా చెప్పిన బోధనలు అని భావించే దమ్మపదంలో బ్రాహ్మణవర్గ అని ఒక అధ్యాయం ఉంది. బుద్ధుడు ఎంత గౌరవభావంతో ఈ పదాన్ని ప్రయోగించాడో చూడగలం. ఎవడు నిజమైన బ్రాహ్మణుడు అనే విషయంపై వేదవ్యాసుడు భారతంలో గాని, భాగవతంలో గాని వాడిన ఘాటైన మాటలతో పోలిస్తే.. బుద్ధుడు చె ప్పిన మాటలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నాయి.

ఇదం బౌద్ధం..

బుద్ధుడు తన జీవితకాలంలో ఏం చెప్పాడ న్నది యధాతథంగా తెలియదు. అతని నిర్యాణం జరిగిన వందేళ్ల తర్వాత అతని శిష్యపరంపరలోని వారు బుద్ధుని బోధనలు సంగ్రహించి మూడు విభాగాలుగా చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. వీటిని త్రిపిటకములు అన్నారు. పిటకము అంటే బుట్ట. ఆ కాలంలో తాటాకుల పుస్తకాలను బుట్టలో భద్రపరిచే వారు. ఈ మూడు పిటకాల పేర్లు వినయ పిటకము, సుత్త పిటకము, అభిదమ్మ పిటకము. వీటిలో అభిదమ్మ పిటకంలో తత్త్వానికి సంబంధించిన చర్చ ఉంటుంది. తర్వాతి కాలంలో నాగార్జునుడు మొదలైన వారు దీన్ని విస్తరించారు. వీటిలో చాలా విషయాలు ఉపనిషత్తులకూ. అద్వైత వేదాంతానికీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారా అన్నట్లుంటుంది. వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇద్దరూ ప్రపంచం మిథ్య అంటారు. ప్రతీత్య సముత్పాదం (doctrine of dependent origination) ఉపనిషత్తుల్లో మధుబ్రాహ్మణంను పోలి ఉంటుంది. చైతన్యం గురించి బౌద్ధవిద్వాంసులు, శంకరాచార్యులు ఒకే రీతిలో చెబుతారు. అందుకే బుద్ధుని తర్వాత వాడైన శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. వేదాంతం ముసుగు కప్పుకున్న బౌద్ధుడు అని హిందూమతంలోని వారే కొందరు విమర్శించారు.

ప్రస్తుతం మనదేశంలో జాతీయవాదులు కొంతవరకు బుద్ధుడిని గురించి చెబుతున్నా.. ఒకప్పుడు బుద్ధిజంను ఆదరించిన వార్గాలు మాత్రం ఇతరమత ప్రచారాల ప్రభావంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మేధావులు కొందరు బుద్ధుడి గురించి మాట్లాడుతూ పనిలో పనిగా బ్రాహ్మణులను విమర్శించి తన సామాజిక బాధ్యత పూర్తయిందని భావిస్తారు. దీనివల్ల బౌద్ధమతానికి ఎలాంటి లాభమూ లేదు. మరెవరో లాభం పొందుతారు. నిజంగా ఆనాడు బుద్ధుని ప్రథమ శిష్యులు, బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది బ్రాహ్మణులే. ఇప్పుడు కేవలం విమర్శలు కాకుండా దళిత వర్గాల్లో ప్రచారం చేయగలిగితే ఎందరో దానిలో భాగస్వాములవుతారు.
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరంగల్ పోరడు ఫార్మసీ ధీరుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్ట సవరణలు ,నసీబ్ వాలా ,కేంద్రం దిగి రాదా/

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

 

1-సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

తెలుగు ,సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ .డి.చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యలకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా దేవాడ లో లో 22-9-1942 జన్మించారు .తండ్రి గారు వేదుల కృష్ణ మూర్తి గారు తల్లిగారు మారువాడ వారి ఆడబడుచు వెంకట రమణ ,రామలక్ష్మి గార్ల కుమార్తె శ్రీమతి రామలక్ష్మి .

విద్యా వైదుష్యం

శాస్త్రిగారు విశాఖ పట్నం సి .బి .ఏం హైస్కూల్ లో సెకండరీ విద్య నేర్చి ,మిసెస్ ఏ.వి.యెన్ కాలేజి లో డిగ్రీ చదివారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి తెలుగు ,సంస్కృతాలలో ఏం .ఏ. లో ఉత్తీర్ణత సాధించి ,పిమ్మట ఆ రెండుభాషలపై గల అభిమానం తో పి హచ్ .డి. లను కూడా పొందారు .విద్వత్ పట్ట భద్రులైన తండ్రి కృష్ణ మూర్తి శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్య తత్వాన్ని వాత్సల్యం తో ఉపదేశించారు .దానిని శాస్త్రి గారు సద్వినియోగం చేసుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతాంధ్ర సాహిత్య వైభవాన్ని ఆత్మీయతతో బోధించారు ఆచార్య గంటి జోగి సోమయాజి గారు .శాస్త్రి గారి గురు పరంపరలో ‘’కళా ప్రపూర్ణ ‘’దువ్వూరి వెంకట రమణ శాస్త్రి ,ప్రాచార్య,’’ యశస్వి’’ ,ఎస్వీ జోగారావు ,వంటి ఉద్దండులున్నారు .విద్వత్ శిరోమణి ‘’,వాచస్పతి ‘’అప్పల  సోమేశ్వర శర్మ పుత్ర వాత్సల్యం తో ఎన్నో శాస్త్రవిజ్ఞానపు మెళకువలు కరతలామలకం చేశారు .సద్గురు శివానంద మూర్తి మహర్షి సత్తముల  ఉత్సాహ ప్రోత్సాహాలు అమృత వర్షమై శాస్త్రిగారిని తనియింప జేస్తున్నాయి .’’త్వమేవాహం ‘’భావాన్ని బోధించారు శ్రీ గట్టు నారాయణ గురూజీ సోదరులు . ఇంతమంది మహనీయుల ఆశీస్సులతో తమ విద్యా శాస్త్ర ప్రామాణ్యాన్ని మెరుగు పరచుకొన్న ధన్య జీవులు శాస్త్రి గారు .

ఉద్యోగ సోపానం

తెలుగు గీర్వాణ భాషల లోతులను తరచి చూసిన శాస్త్రిగారు  1965-75 వరకు విశాఖ పట్నం లో తాను విద్య నేర్చిన మిసెస్ ఏ వి యెన్. కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1975-2002వరకు ఆంధ్రా యూని వర్సిటి లో లెక్చరర్ గా చేరి ,వరుసగా పదోన్నతి పొంది రీడర్ గా ,ప్రొఫెసర్ గా ఎదిగి ,తెలుగు శాఖ ముఖ్య ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు 1976 లో అమెరికాలోని విస్కాన్సిస్ స్టేట్ యూనివర్సిటి లో ఉద్యోగించారు .చదువుకున్న గురువులవద్ద వారితో బాటు పనిచేస్తూ విద్యార్ధులకు బోధించే  అదృష్టం శాస్త్రిగారికి దక్కింది .

సాహిత్యార్ధాంగి

శాస్త్రి గారి జీవిత భాగస్వామిని నిత్య జిజ్ఞాసువు అయిన శ్రీమతి ప్రభావతి గారు .ఏం.ఏ .పట్ట భద్రురాలు .సంస్క్రుతాన్ద్రాధ్యయనం చేసిన విదుషీమణి .జీవితం లోనే కాక శాస్త్రిగారి సాహిత్యం లోనూ ఆమె సాబాలు (సగం పాలు )పంచుకొన్నారు .

రచనా పాటవం

శాస్త్రి గారే చెప్పుకొన్నట్లు సాహిత్య జీవితం లో సాహిత్య ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రసంగాలు సహస్రాదికంగా చేశారు వీటిని గ్రంధ రూపం లోకి తెచ్చి లోకానికి విలువైన గ్రంధాలను అందించారు .కనీసం ౩౦౦ గ్రంధాలకు పరిష్కరణ పూర్వకం గా ముందుమాటలు సమీక్షలు రాశారు .వివిధ అంశాలపై ఆకాశవాణిలో అనేక ప్రసంగాలను చేసి శ్రోతలను మెప్పించారు .శాస్త్రిగారి శిష్యపరంపర అగణితం .

శాస్త్రిగారు తమ సంస్కృత విద్వత్తును సార్ధకం చేసుకొన్నారు .పఠన ,పాఠనలేకాక గ్రంధ రచనా చేశారు సంస్కృతం లో 1.వరూధినీ ప్రవరం 2. కల్యాణం అనే ఏకాంకికలు 3.తత్వ మసి అనే మూడు రచనలు చేశారు  ప్రవర వరూదినుల విషయం పెద్దన గారి మనుచరిత్ర మాతృకగా కలది .ఇదే వీరి తోలి రచనకూడా .కల్యాణం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కల్యాణం .దీనిని గురుదేవులు దువ్వూరి వారికి అంకితమిచ్చి గురూణం తీర్చుకొన్నారు .కాని దువ్వూరు వారి జీవితాకాలం లో పుస్తకం రాలేదు వారి మరణానంతరమే వెలువడింది .శ్రీ మద్రామాయణేపురుషార్ధ వివేకః అనేగ్రందాన్ని రాశారు –ఇది ఇప్పటికి అముద్రితం .

తెలుగులో చాలా గ్రంధాలు రాశారు శాస్త్రిగారు .అందులో అష్ట దిగ్గజాలు ,భాగవత సుధా ,,పంచ తంత్ర చంపువు ,ఆధ్యాత్మిక వ్యాసమంజరి ,భారతం లో శాంతి పర్వం ,భారత భారతి ,సుబ్రహ్మణ్య భారతి ,జానపద గేయ సాహిత్య ప్రభ ,శంకర భగవత్పాదుల శివానందలహరికి  ,సౌందర్య లహరి లకు వ్యాఖ్య ,ఆధ్యాత్మ రామాయణం లో అపూర్వ కల్పనలు రాసి సంస్కృత ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుగు లోకి అనువాదమూ చేశారు .అలాగేసంస్కృత  అద్భుత  రామాయణాన్నీ తెలుగు చేశారు .బాల రామాయణం ,రామాయణ ప్రసంగ లహరి రాశారు .ఉత్తర రామాయణం వాల్మీకి మహర్షి రచన కాదని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .’’ఉత్తర కాండ ‘’పేరుతొ సంక్షిప్త సరళ  వచన రచన చేశారు .,రామాయణ౦ లో ఇంతటి విశేష కృషి చేసిన శాస్త్రిగారు భాగవతం వైపుకు దృష్టిని మరల్చి’’ భాగవత రసాయనాన్ని’’ కడుపార గ్రోలమని అందించారు .తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బ్రహ్మ వైవర్త పురాణానువాదం చేసి  లోకోపకారం చేశారు  ఆది శంకరాచార్యులవారు  రాసిన అయిదు ప్రకరణాలు ,అపరోక్షానుభూతి 2.ఆత్మా బోధ  ను తెలుగు చేశారు .శతక సాహిత్యం లోనూ ప్రవేశించి ‘’శంభూ శతకం ‘’రాశారు .

మాఘమహాకవి సంస్కృతం లో రచించిన ‘’శిశుపాల వధ ‘’కావ్యం లోని అమూల్యమైన విశేషాలను రసజ్ఞులకు పరిచయం చేయాలన్న సత్ సంకల్పం తో ‘’మాఘ కావ్యామృతం ‘’రచించారు .వివిధ పత్రికలలో ప్రచురితమైనవి, ,జాతీయ సదస్సులలో సమర్పింపబడిన పత్రాల వ్యాసాలను ‘’భారద్వాజ వ్యాసావళి ‘’గా ప్రచురించారు .వీరి పుస్తకాలను కొన్నిటిని కరీం నగర్ జిల్లా మందని లోని ‘’శ్రీ సీతారామ సేవా సదన్ ‘’వారు సభక్తికంగా ప్రచురించి  అందించారు .

అందుకొన్న బిరుదులూ సత్కారాలు

వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ‘’ ఆచార్య సార్వ భౌమ ,విజ్ఞాన వివేక భూషణ ,వాణీ విభూషణ ,ఆధ్యాత్మిక రత్న ,వాజ్మయ కళా ప్రపూర్ణ ,సాహితీ కళా సమ్రాట్ ,ఆంద్ర రత్న’’ బిరుదులు  అందుకొన్నారు .ఇవన్నీ అన్వర్ధాలే నని మనకు తెలిసిన విషయమే .

నడిచే సరస్వతి అనిపించే శాస్త్రిగారికి విశాఖ పట్నం శ్రీ శంకర మఠం సంస్థానం ‘’సువర్ణ సింహ లలాటం ‘’తో సత్కరించి సన్మానించింది .శ్రీ గణపతి సచ్చిదానంద  స్వామి వారి స్వహస్తాలనుండి ‘’సువర్ణ కంకణ సన్మానం ‘’అందుకొన్నారు .సద్గురు శ్రీ కందుకూరు శివానందుల సంస్థ నుండి ‘’శ్రీ శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ‘’అందుకున్న పుంభావ సరస్వతులు శాస్త్రిగారు .వివిధ సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు విశిస్టవ్యక్తులు శాస్త్రి గారికి చేసిన సత్కారాలు లెక్కకు మించి ఉన్నాయి .

73 వసంతాల శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు  సాహిత్య ,ఆధ్యాత్మిక విషయాలలో నిత్య యవ్వనులై వాజ్మయ  శారదా పీఠ పాదార్చన చేస్తున్న ధన్య జీవులు  .

మనవి –సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి బావ గారు డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు(విశాఖ పట్నం) ‘’ఆచార్య సార్వ భౌమ’’ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ గ్రంధాన్ని పంపగా వారు అందుకొని నాకు వారు రచించిన అమూల్య గ్రంధాలను ఏడింటిని  పంపారు .వారికి నేను వెంటనే ఫోన్ చేసి క్రుతజ్ఞాత తెలియ జేశాను .నేను చేసిన కృషిని వారు అభినందించారు

శాస్త్రి గారు సంస్కృతం లో గ్రంధ రచన చేశారని ఈ పుస్తకాలు వచ్చేదాకా నాకు తెలియక పోవటం నా అజ్ఞానానికి ప్రతీక .తెలిసిఉంటే’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’లో వారిని గురించి రాసి ఉండేవాడిని  . పుస్తకాలు అందగానే ఫ్లాష్ గా  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 ‘’రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి , అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే తొలికవిగా రాయాలని అనుకోని వారి గ్రందాలనుండే విషయ సేకరణ చేసి ఈ మొదటి ఎపిసోడ్ రాశాను .

శ్రీ గోపాలకృష్ణ గారు వారం క్రితం నాకు పంపిన కృష్ణమాచార్ ఆంగ్లం లో రాసిన సంస్కృత  కవుల చరిత్ర లో ఇంకా ఎవరైనా కవులు మిగిలిపోతే వారిపై కూడా రాస్తూ ,మరెవరైనా గీర్వాణ రచన చేసిన వారుంటే వారిపైనా  రాసి  ఈ రెండవ  భాగం లో చేర్చాలని  సంకల్పం .

శాస్త్రిగారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్పందన

vedula letter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరాశాకంటే భ్రమే నయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధా విష్కరణ

శ్రీ హనుమజ్జయంతి  13-5-15 బుధవారం నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం హోమం ,తర్వాత త్సమలపాకు పూజ ,ఆ తర్వాత పూర్ణాహుతి జరిగాయి .తర్వాథ శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది .నేను రాసిన ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై .వి.బి. రాజేంద్రప్రసాద్ ,శ్రీమతి భ్రమరాంబ దంపతులు 500 మంది భక్తుల సమక్షం లో ఆవిష్కరించారు ఇది సరసభారతి 79 వ సమావేశం .ఆతర్వాత దగ్గరే ఉన్న ఆర్య వైష్యకల్యాణ  మండపం లో సుమారు ఏడువందల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించాం  -దుర్గాప్రసాద్

http://wp.me/p1As8O-1KS

https://plus.google.com/u/0/photos/107563242221333034923/albums/6148321897961192561/6148321903106803762

 

https://plus.google.com/u/0/115752370674452071762/posts/9GXxb92i5md?pid=6148305944156197138&oid=115752370674452071762

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

పద్యo జీవనది


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర యోధుడు ఎస్ వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కధల్లో రస ,ధ్వని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

  • 10/05/2015
  •  -బి.వి.ప్రసాద్

అత్యంత ప్రాచీన, అత్యాధునిక సమాజాలకు ప్రతీక సింగపూర్. అక్కడ ఏమీ తయారుకాదు, కాని ప్రతీదీ దొరుకుతుంది. ప్రజల్లో నిజాయితీ, పాలనలో పారదర్శకత, ప్రభుత్వంలో చిత్తశుద్ధి. చివరికి ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో సింగపూర్ ఈ రోజు అగ్రరాజ్యాలకు సైతం ఆదర్శవంతంగా ఎదిగింది. ఈ ఎదుగుదల రాత్రికి రాత్రి జరిగింది కాదు, ‘దేశం కోసం’ అనే భావన ప్రజల్లో నరనరాన జీర్ణించుకుపోయి దాదాపు 700 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ, ప్రపంచం పట్టించుకోని దశలో అక్కడి ప్రజలే తమను తాము సంస్కరించుకునే ప్రయత్నం ఈ రోజు అత్యధిక జీడీపీ స్థాయికి తీసుకువచ్చింది. శతాబ్దాల చరిత్ర ఉన్నా, అత్యంత వేగంగా అభివృద్ధిని సాధించింది మాత్రం గత 50 ఏళ్లలోనే. పూలౌ ఉజోంగ్..పూలౌచంగ్ గానూ కాలక్రమంలో సింగపురగా మారిన అతి చిన్న జనావాస ప్రాంతమే సింగపూర్. ప్రపంచంలో అతి చిన్న పట్టణమే ఒక దేశంగా ఉన్న సింగపూర్ చుట్టూ సముద్రమే. దేశ భూభాగాన్ని పెంచే అవకాశం లేదు. ఏం చేద్దామన్నా సరిపడా భూమి లేదు, ఏదీ ఉత్పత్తి కాదు, గనులు, చమురు వంటి సహజ సంపద లేదు, పరిశ్రమలు లేవు, పెడదామంటే చోటు లేదు ఇలాంటి అననుకూల పరిస్థితులను కూడా సింగపూర్ తమకు అనుకూలంగా మలుచుకుంది. జనాభా పెరిగితే వారి కనీస అవసరాలు తీర్చేందుకు సరిపడా ఆకాశాన్నంటే హర్మ్యాలు, అందులోని అంతస్తుల్లో పచ్చదనం, సౌకర్యవంతమైన జీవనానికి కావల్సిన పరిసరాలతో అలరారేలా సింగపూర్ అభివృద్ధి చెందింది. ఆధునిక అవసరాలను ముందుగా ఊహించడం, తదనుగుణమైన వ్యూహాలతో ముందుకు సాగడం వల్లనే సింగపూర్ ఇపుడు ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలను సైతం బెంబేలెత్తిస్తున్న అభివృద్ధితో సింగపూర్ ముందుకు దూసుకుపోతోంది. అసలు ఈ సింగపూర్ ఇంతలా ఎలా అభివృద్ధి సాధించింది? అందరికీ ఎలా ఆదర్శప్రాయమైంది అనేది అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఒక చిన్న ద్వీపమే ఈ మహానగరం- ఈ మహాదేశం. ఇందులో ప్రధాన ద్వీపంతో కలిపి 63 ద్వీపాలున్నాయి. ప్రారంభంలో ఈ ద్వీపం ‘సుమత్రన్ శ్రీ వజయ్’ సామ్రాజ్యంలో ‘తమ్‌సెక్’ అంటే సముద్ర పురం అనే జపనీస్ పేరుతో వ్యవహరించేవారు. క్రీ.పూ 2వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకూ వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది. 16వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకూ ఇది జోహార్లో భాగంగా ఉంది. 1819 సంవత్సరం జనవరి 29న ఈ ద్వీపానికి వచ్చిన థోమస్ స్టాన్ ఫోర్డ్సు రాఫిల్స్ భౌగోళికంగా సింగపూర్ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పరిచే ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందమే దేశంలో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చి నివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటం ఆరంభం అయింది. 1819లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అడుగుపెట్టేసరికి ఇది మలయ్, ఒరాంగ్ లాట్ జాలర్లు నివసించే చిన్న గ్రామం. బ్రిటిష్ వాళ్లు దీనిని రవాణాకు వాడుకున్నారు. 1867 నాటికి ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రం కిందకు వచ్చింది. బ్రిటిష్ కాలనీ ఆరంభం నగర నిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నదీ ప్రాంతం వ్యాపారులకు, బ్యాంకర్లకు ఆలంబనగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఫిబ్రవరి 15 తర్వాత ఆరు రోజుల యుద్ధం అనంతరం జపాన్ దీనిని స్వాధీనం చేసుకుంది. 1945 సెప్టెంబర్ 12న తిరిగి బ్రిటిష్ వారి పరమైంది. 1963లో మలేషియా ఏర్పడినపుడు దానిలో భాగంగా ఉండి రెండేళ్ల తర్వాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి 1965 ఆగస్టు 9న స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న ఐక్యరాజ్యసమితిలో 117వ దేశంగా చేరింది. 1970లో అలీన ఉద్యమంలో చేరింది. తీవ్రమైన నిరుద్యోగం, గృహ సంక్షోభం ఎదుర్కొంటూ సింగపూర్ ఆధునికతపై దృష్టిసారించింది. తయారీ పరిశ్రమ స్థాపన, అతిపెద్ద ప్రజా గృహ భూముల అభివృద్ధి, ప్రజా శిక్షణపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాతనే సింగపూర్ జీవన శైలి గణనీయంగా మెరుగుపడింది. ఈ అభివృద్ధిలో వ్యవస్థాపక పితామహుడు లీ క్వాస్ యు లీ కృషి అనన్యసామాన్యం. తన ప్రగతి శీల విధానాలతో సింగపూర్ దిశ, దశను మార్చేశాడు. ఇష్టంలేని విభజనతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న సింగపూర్‌ను లీక్వాస్ యూ అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. విదేశీ పెట్టుబడులు, మరో పక్క ప్రభుత్వ విధానాలన్నీ యంత్రీకరించడం, ఎలక్ట్రానిక్ పద్ధతులు అమల్లోకి రావడం, ఐటి కంపెనీలు ఏర్పాటై ఆధునిక ఆర్ధిక రంగం ఉద్భవించింది. అనతి కాలంలోనే ఉన్నతమైన అభివృద్ధి సాధించి స్వేచ్ఛామార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. శక్తివంతమైన అంతర్జాతీయ వాణిజ్య బంధాలు, జపాన్ కాకుండా ఆసియాలో అత్యధిక తలసరి ఆదాయంతో గరిష్ట స్వదేశీ ఉత్పాదనను కలిగి, ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా మారింది. ఐదు దశాబ్దాలుగా అభివృద్ధి సింగపూర్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది…కాని అభివృద్ధిలో మాత్రం ఈ 50 ఏళ్లలోనే తన సత్తా చూపింది. సింగపూర్ అంటే రెండు మలయ్ పదాల కలయక. సింగ అంటే సింహం, పుర అంటే పురము అనే పదాలతో ఆ పేరు వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం 14వ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ తుపానులో చిక్కుకుని ఈ దీవిలో అడుగుపెట్టినపుడు అతనికి ఒక మృగం కనిపించింది. సింహం తలలా ఒక వింత జంతువు కనిపించినందుకు ఈ పేరు పెట్టారని చెబుతుంటారు. విచిత్రం ఏమంటే సింగపూర్‌లో సింహాలు లేవు, ఉన్నవల్లా మలయ్ పులులే. అన్ని రంగాల్లో.. నెంబర్ వన్ అందర్నీ ఆకర్షిస్తున్న సింగపూర్ నేడు ఏ రంగంలో తీసుకున్నా నెంబర్ వన్. ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ఐటి రంగాల్లో ప్రపంచంలోనే మేటి. అక్కడ ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు, పౌరుల్లో జవాబుదారీతనం, నిజాయితీయే దీనికి కారణం. స్థూల జాతీయ ఉత్పత్తిలో సింగపూర్ ప్రపంచ దేశాల్లో ఆర్ధికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది అదే. ఎకనామిస్టు పత్రిక సర్వే ప్రకారం ఆసియా దేశాల్లో అతి ఉత్తమమైనది సింగపూర్ , ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. వ్యాపార, ఆర్ధిక రంగాల్లో, అభివృద్ధి చెందిన సింగపూర్ ఇటీవలే ‘కాసినోవా’ అని పిలిచే పాశ్చాత్యుల జూదగృహాన్ని నిర్మించడంతో, ధనవంతులైన వ్యాపారవేత్తలను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక, అత్యంత విలాసాలకు పెట్టింది పేరుగా చక్కటి పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ దేశంలో చైనా, మలయ్, భారత్‌లకు చెందిన వారు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. విలాస జీవనం పర్యాటకరంగంలోనే కాదు, విద్య, ఆరోగ్యరంగాల్లోనూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులను సైతం పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తూ వైద్య ఆరోగ్య పర్యాటక కేంద్రంగా మారింది. ఆ దేశం ఆర్ధిక వనరుల్లో పర్యాటక రంగం ప్రధాన భూమికను పోషిస్తోంది. తేలికగా వీసాలు సింగపూర్ వెళ్లేవారికి విమానాశ్రయాల్లోనే తాత్కాలిక వీసాను మంజూరు చేసే ఏర్పాటు ఉంది. చాలా సులువుగానే పర్యాటక వీసాలను మంజూరు చేయడం కూడా అనేక మందిని సింగపూర్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. అన్నీ చూడాల్సినవే సింగపూర్ వెళ్లామంటే ఒకటో రెండో కాదు, అన్నీ చూడాల్సినవే ఉంటాయి. అతిపెద్ద విలాసవంతమైన భవనాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, కాసినోవా, నైట్ సఫారి, సాంటోసా ద్వీపకల్పం, అండర్ సీ వరల్డ్ వంటివి ప్రతీదీ తప్పనిసరిగా చూడాల్సినవే. నిజానికి అన్నీ చూడాలంటే నెలల సమయం చాలదు. పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది అండర్ సీ వరల్డ్. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రి పూట అద్భుతమైన లేజర్ షోలు నిర్వహిస్తుంటారు. సింగపూర్ సముద్ర తీరాన రేవు నుండి క్రూయిజ్‌లలో సగం రోజు లేదా దీర్ఘకాలం పాటు పడవ ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్‌లొ సింగపూర్‌కు చెందిన ఇతర దీవులను సందర్శించవచ్చు. అలాగే డాల్ఫిన్ షోలను తిలకించవచ్చు. రెండోది నైట్ సఫారి. ఇందులో రాత్రివేళల్లో జంతుప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. ఇందులో ఆకర్షణీయమైన ప్రదర్శన శాలలు ఉంటాయి. రాత్రి వేళల్లో జంతువులను వాటి సహజమైన జీవనాన్ని చూడటం పర్యాటకులకు వింత అనుభూతిని కల్పిస్తుంది. మూడోది పక్షుల పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. పక్షులతో రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు. అత్యంత అపురూపమైన లేత కాషాయరంగు హంసలకు సింగపూర్ నిలయం. పార్కు మొత్తం చూడడానికి చక్కటి రైలు ప్రయాణం ఉంది. స్కైటవర్లో సందర్శకులకు టవర్ పై భాగానికి తీసుకువెళ్లి కిందకు దించుతారు. పైకి వెళ్లినపుడు సింగపూర్‌కే గాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియాలను కూడా చూడగలుగుతాం. ఇది ఒక అద్భుమైన అనుభవం అవుతుంది. నాలుగో ప్రత్యేకత సెంటోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో వెళ్లొచ్చు. తిరిగి రావడానికి బస్సు మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. సింగపూర్‌లో భాగంగా మారిన సెంటోసా ద్వీపంలో సింగపూర్ జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది భాగం చేప, పై భాగం సింహంతో కూడి ఉంటుంది. ఈ మెర్‌మెయిడ్‌ను చూడటం మరిచిపోలేని అనుభూతి. సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగం వరకూ లిఫ్ట్‌లో తీసుకువెళ్తారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ భవనంలో సింగపూర్ చరిత్రను లేజర్‌షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మల మధ్య నావ ప్రయాణం మరిచిపోలేనిది. అనేక సంప్రదాయాల్లో ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శన శాలలను ఇక్కడ చూడవచ్చు. లిటిల్ ఇండియా, చైనా టౌన్, ముస్త్ఫా కాంప్లెక్స్, సింగపూర్ కాంప్లెక్, సన్‌టెక్ , సెరంగూన్ రోడ్‌లో దేవాలయాలు చూస్తుంటే మనం భారతదేశంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది. పండగ సమయాల్లో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. హరిత విప్లవం సింగపూర్ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాణం పెడుతుంది. భవనాలు, జలాశయాలు, రహదారులు మినహాయిస్తే మిగిలిన ప్రాంతం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏ మాత్రం స్థలం ఉన్నా అక్కడ అందమైన రంగురంగుల ఫలాలు, పుష్పాలను ఇచ్చే మొక్కలను పెంచుతారు. అంతే కాదు వాటి నిర్వహణ కూడా పకడ్బందీగా ఉంటుంది. అది ఎంత వరకూ అంటే 90వ అంతస్తులో కూడా మొక్కలను పెంచే సంస్కృతి అలవడింది. చిట్టచివరి అంతస్తులో కూడా తొట్టెల్లో మొక్కలు పెంచుతారు. తాగునీటికి సమస్య ఉన్నా మొక్కల నీటికి సింగపూర్ వెరవడం లేదు. ఈ కారణంగానే ఒకప్పటి అధ్వాన్న దేశం ఇప్పుడు అద్భుతంగా మారిపోయింది. ప్రపంచ గమ్యస్ధానం సింగపూర్ ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇపుడు సింగపూర్ వైపు చూస్తున్నాయి. ఒకపుడు ప్రపంచంలోని మెళుకువలతో అత్యంతవేగంగా అభివృద్ధి సాధించిన సింగపూర్ నేడు ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. సింగపూర్ ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా, అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా నేడు మారిపోయింది. ఈ పరిణామం అంత తేలికగా జరగలేదు. ఐరోపా వలస రాజ్యాల దాడులు, పోర్చుగీసు, డచ్ వారి ఆధిపత్యం, అరబ్బులు, చైనీయులు, జపనీయులు ఒకరేమిటి చాలా దేశాలు దాడులకు దిగడంతో ఉంటుందా ఊడుతుందా అనే రీతిలో అనుకోకుండా స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్ అస్థిరతతో కూడిన భవిష్యత్‌ను చవిచూసింది. ఒక పక్క ఇండోనేషియా ఒత్తిడులను ఎదుర్కొంటూనే సింగపూర్ తన సత్తా చూపింది. ఒక చిన్న ద్వీపం విజయవంతమైన దేశంగా ఎలా ఎదుగుతుందని అంతా హేళన చేయడం సింగపూర్ ఉనికే ప్రశ్నించింది. దీనికి తోడు సార్వభౌమాధికార సమస్యలతో నిరుద్యోగం, గృహవసతి, విద్య, సహజవనరుల కొరత, భూమి కొరత ఒత్తిడిని కలిగించే సమస్యలుగా ఉండేవి. నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగి పౌర అశాంతికి కారణం అవుతుందేమో అనే పరిస్థితుల్లో సింగపూర్ వ్యూహకర్తలు ఆ దేశాన్ని గాడిలో పెట్టారు. పరిశ్రమలు, సేవా రంగం పెరగడం, నౌకానిర్మాణం, ఎగుమతులు, ఉన్నతమైన వస్తువుల ఉత్పత్తి , వాణిజ్య పెరుగుదల, చమురు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుతో దేశం దశ తిరిగిపోయింది. ప్రభుత్వం విద్యావిధానం మీద భారీగా పెట్టుబడులు పెట్టి ఆంగ్లభాషా బోధనను అవలంబించింది. స్థానిక పరిశ్రమలకు సరిపోయే పోటీతత్వం ఉన్న పనిబలాన్ని అభివృద్ధి చేయడానికి అభ్యాససిద్ధితో కూడిన శిక్షణను అందించింది. స్వాతంత్య్రం వచ్చిన 15 ఏళ్లలో సింగపూర్ అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 1980లో చవకగా కార్మికులను కలిగి ఉన్న పొరుగువారితో పోటీ పడటానికి సింగపూర్ తన పరిశ్రమలను సాంకేతికంగా ఉన్నతమైనవిగా నవీకరించడం మొదలుపెట్టింది. వాఫెర్ ఫ్యాబ్రికేషన్ వంటి ఆధునిక పద్ధతులను తీసుకువచ్చింది. 1981 నాటికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా అభివృద్ధి చెందింది. సింగపూర్ నౌకాశ్రయం అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటిగా అయింది. ఆంగ్‌మో కియో వంటి నూతన పట్టణాల రూపకల్పన చేసి ప్రభుత్వ నివాస గృహాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. సింగపూర్‌లో 90 శాతం మంది ఈ అపార్టుమెంట్లలోనే నివసిస్తారు. 1987లో మొదటి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ పనిచేయడం మొదలైంది. దీంతో నగరంలో చాలా ప్రదేశాలను చాలా తేలికగా కలిపింది. రాజకీయ సుస్థిరత రాజకీయ ప్రసార సాధనాల మీద కఠినమైన నియంత్రణ ఉంటుంది. చట్టవిరుద్ధ నిరసనలకు సైతం మరణదండన వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. సింగపూర్‌పై పీపుల్స్ ఆక్షన్ పార్టీ ప్రభావం చాలానే ఉంది. ప్రస్తుతం 175 దేశాలతో ఈ దేశం దౌత్యసంబంధాలను కొనసాగిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో, కామనె్వల్త్‌లో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టు ఏషియన్ కంట్రీస్‌లో సభ్యత్వం ఉంది. యుకెతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందంతో సురక్షితంగా ఉంది. మరో పక్క అమెరికాతోనూ సింగపూర్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. మొత్తం సింగపూర్ జనాభా 55 లక్షలు. ఇందులో విదేశీయులే 20లక్షలకు పైగా ఉంటారు. చైనీయులు 75 శాతం, మలయా వారు 13.6 శాతం, భారతీయులు 9 శాతం ఉన్నారు. నేరాలు తగ్గినా తీవ్రవాద భయం సింగపూర్‌లో పటిష్టమైన చట్టాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగినా, సింగపూర్‌కు తీవ్రవాద భయం మాత్రం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సింగపూర్ రాయబార కార్యాలయాల మీద దాడులను దృష్టిలో ఉంచుకుని శక్తివంతమైన తీవ్రవాద నిరోధక చర్యలను చేపట్టింది. ముందు చూపుతో… సింగపూర్ చాలా చిన్న ద్వీపం, కాని ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు హేమా హేమీ దేశాలతో పోటీపడేలా సింగపూర్ ఎదగడానికి కారణం రాజకీయ చిత్తశుద్ధి. వంద ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏమిటనే ఆలోచనలను ఇపుడే చేయడమే. పెద్ద పెద్ద ఆలోచనలు చేయడమేకాదు, వాటిని తక్షణం అమలుచేసి ఫలితాలను ప్రజలకు చూపించడంతో పాలకుల వ్యవహారంపై తలదూర్చకుండా స్థానికంగా ఉన్న వారు అభివృద్ధి కారకాలుగా మారిపోయారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలి, దేశాభివృద్ధికి తోడ్పడాలి. ఈ మాట ఎవరో చెప్పనక్కర్లేదు. ప్రతి పౌరుడూ తన గురుతర బాధ్యతగా గుర్తుంచుకుంటాడు. పని, వ్యాపకం అనే రెండు అంశాలు ఇతర విషయాలపై దృష్టిపెట్టనివ్వకుండా చేస్తున్నాయ. సింగపూర్ ప్రధానంగా పర్యాటకం, షాపింగ్, విమానరంగం, నౌకారవాణా, నౌకానిర్మాణ రంగం, ఐటి రంగాల్లో అగ్రస్థానంలోకి చేరుకుంది. ఉన్న భూభాగాన్ని ప్రజల జీవనానికి, పెట్రోకెమికల్ పరిశ్రమలకు, పోర్టులకు, ఎయిర్‌పోర్టులకు, రవాణా వ్యవస్థకు ఒక ప్రణాళిక ప్రకారం వినియోగించుకుంటున్నారు. భూవిస్తరణ ఇలా… జురాన్గ్, సెంటోసా, పులవ్ టెక్నాగ్ దీవి, పులవ్ యుబిన్ దీవులు విస్తీర్ణంలో కొంచెం పెద్దవి. మిగిలిన దీవులు చాలా చిన్నవే. జురాన్గ్ దీనివి పెట్రో కెమికల్ పరిశ్రమలకు వాడుకుంటున్నారు. సెంటోసా దీవిని పర్యాటక ఆకర్షణకు వాడుకుంటున్నారు. పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణ సంబంధ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు. పులవ్ యుబిన్ దీవిలో ఆధునిక అవసారాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 166 మీటర్లు ఎత్తున్న బుకిత్ తిమాహ్ హిల్ సింగపూర్‌లో చాలా ఎత్తయిన ప్రదేశం. ఉత్తరాన సింగపూర్ కాజ్‌వే, తువాస్ సెకండ్ లింగ్ అనే రెండు మానవ నిర్మిత వారధులున్నాయి. నగర నిర్మాణాలకు కొంత భూమిని వినియోగించాల్సి రావడంతో నెమ్మదిగా ప్రభుత్వం భూమి విస్తరణపై దృష్టి పెట్టింది. 581 చదరపు కిలోమీటర్లు నుండి నేడు 704 చదరపు కిలోమీటర్లకు భూమిని విస్తరించగలిగింది. త్వరలో మరో వంద కిలోమీటర్లు భూమిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. చిన్నచిన్న మట్టిదిబ్బలుగా ఉన్న దీవులు ప్రధాన దీవుల్లో కలుస్తూ భౌగోళిక రూపురేఖలు మారుతున్నాయి. * ఆదాయం కోట్లు, తాగునీటికి పాట్లు భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే మంచినీటితో స్వాగతం పలుకుతాం. కాని అక్కడ మంచినీరు తప్ప ఏం అడిగినా ఇస్తాం అనే రీతిలో ఉంటుంది. దానికి కారణం తలసరి వార్షిక ఆదాయం కోట్లలో ఉన్నా సింగపూర్ ప్రజలకు పెద్ద శాపం తాగునీటి సమస్య. ఇపుడా సమస్యను అధిగమించింది. అయినా తాగునీటి ధర ఖరీదే. సింగపూర్ ప్రజల నీటి అవసరాలను చాలా వరకూ వర్షపు నీటి రిజర్వాయిర్లతో తీరుస్తుంటారు.. మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో చేసుకున్న నీటి ఒప్పందాలు ఇరు దేశాల మధ్య దీర్ఘకాల వివాదాలకు కారణమవుతునే ఉన్నాయి. ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి సింగపూర్ ఆధునికతను అందిపుచ్చుకుని రీసైక్లింగ్ ప్లాంట్లపై దృష్టిసారించింది. దీంతో వెలుపలి నుండి సరఫరా అవుతున్న నీటి దిగుమతిని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు. సింగపూర్‌లో 19 నీటి రిజర్వాయిర్లు, 19 నీటి శుద్ధికరణ విభాగాలు, 14 నీటినిల్వ రిజర్వాయిర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరీనా బరేజ్ పనులు పూర్తకావచ్చాయి. మలేషియాతో చేసుకున్న నీటి ఒప్పందాలు కొన్ని 2011లో ముగిశాయి. మరికొన్ని 2061లో ముగియనున్నాయి. దానికి తోడు మలేషియా చేస్తున్న డిమాండ్‌ను తోసిరాజని సింగపూర్ సొంత జలవనరుల కోసం ప్రయాసపడుతోంది. దేశంలోనే నీటి వనరులను అభివృద్ధి చేసుకుంటూ స్వయం సమృద్ధితో ముందుకు సాగాలని యోచిస్తోంది. జనాభాకు రెట్టింపు పర్యాటకులు సింగపూర్ పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం తద్వారా వచ్చే ఆదాయంతో దేశ ఆర్ధికవ్యవస్థను చక్కదిద్దుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్థానిక ప్రజల ఆర్ధిక అవసరాలను నిర్బంధ పొదుపు చర్యలను శాసించడం ద్వారా ప్రభుత్వంపై ఏ దశలోనూ వారు ఆధారపడకుండా చూసుకుంటోంది. అనుత్పాదక రంగాల్లో ఎవరికీ ఎలాంటి రాయితీలను అమలు చేయడం లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, పెన్షన్లు, ఉచిత గృహాలు వంటి పథకాలకు ఇక్కడ తావు లేదు. ఎంట్రీ పోర్టు వ్యాపార విధానాల వల్ల తన ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేసుకుంది. అంతర్జాతీయ వ్యాపార రంగంలో నాలుగు సింహాలుగా అభివర్ణించబడే దేశాల్లో సింగపూర్ ఒకటి. మిగిలినవి హాంకాంగ్, తైవాన్, కొరియా. సింగపూర్ దేశానికి 25 శాతం పైబడి ఆదాయం కర్మాగారాల ద్వారానే వస్తుంది. ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, బయోమెడికల్ సైన్స్ రంగాల్లోనే ఎక్కువ కర్మాగారాలున్నాయి. ప్రపంచ ఫౌండ్రీ వేఫర్ వాడకంలో 10 శాతం సింగపూర్ ఉత్పత్తుల వల్లనే లభించింది. సింగపూర్ రేవు అత్యంత చురుకైన అంతర్జాతీయ రేవుగా గుర్తింపు పొందింది. వ్యాపారపరంగా లండన్, న్యూయార్క్, టోక్కోకు సమానంగా సింగపూర్ ఓడరేవు ప్రసిద్ధి గాంచింది. తలసరి ఆదాయం 80వేల పైమాటే. నిరుద్యోగం చాలా స్వల్పం. ప్రతి ఏటా కోటి మంది వరకూ సింగపూర్‌కు వస్తుంటారు. 165 మీటర్లు ఎత్తుండే ఫెర్రీవీల్, సముద్రతీరంలో ఉద్యానవనాలు, మరీనా దక్షిణ తీరాన నిర్మించిన పొడవైన డబుల్ హైలెక్స్ బ్రిడ్జీలు, సందర్శకులను సౌకర్యవంతమైన ఫుడ్‌ఫెస్టివల్స్ ఆకర్షిస్తున్నాయి. మరో పక్క కేవలం వైద్య చికిత్సలకే దాదాపు పది లక్షల మందికి పైగా సింగపూర్ వస్తుంటారు. వ్యాపారం, వైద్య చికిత్స, వినోద కార్యక్రమాలపై వచ్చే యాత్రికుల సంఖ్య బాగా పెరగడంతో ఆహార రంగం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కఠిన శిక్షలు సింగపూర్ చట్టం బ్రిటిష్ చట్టాన్ని అనుసరించేదే అయినా అధికారంలో ఉన్న పార్టీ – పిఎపి మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్య్రపు విలువలు పాటించడంలో కొంత వరకూ విముఖత వ్యక్తం చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల , మతాల ,్భషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని కట్టుబాటులోనే ఉంచుతోంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టేవిధంగా బ్లాగుల్లో, వ్యాఖ్యానాలు రాసిన ముగ్గురు బ్లాగర్లపై చర్యలు తీసుకుంది. అధిక జరిమానాలు, కొరడా దెబ్బలు లాంటి శిక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. హత్యలు, హానికరమైన మత్తుపదార్ధాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాల్లో సింగపూర్‌ది అగ్రస్థానం . ఉరిశిక్షల అమలులో అంతర్జాతీయ మానవ హక్కుల విమర్శలు ఎదుర్కొంటున్న సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయాల్సిన చట్టంపై తమకు పూర్తి సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”మొ నాలిసా” లో గ్రహాంతర జీవులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు కవితలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కద రాయడం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

హైదరాబాద్ చేరుకొన్న రామయ్య

తన తమ్ముడు సీతా రామయ్య 42 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియాకు ఉయ్యూరుకు  వస్తున్నందుకు పెద్దన్నగారు అనంత రామ శాస్త్రిగారికి మహదానందం గా ఉంది .ఆయన బంధు వర్గానికీ పరమాందంగా ఉన్నది .అందరూ హైదరాబాద్ విమానాశ్రయం లో ఘన స్వాగతం ఇచ్చారు .అందరిలో ‘’నా అన్నయ్య ‘’ను గుర్తుపట్టి రామయ్యగారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పాదాలపై పడి వినమ్రంగా నమస్కరించారు .ఆప్యాయం గా అన్నదమ్ములు కౌగలి౦చుకొన్నారు .అమెరికాలో ఉండగా పంపబడిన శ్రీమతి జ్యోతిష్మతి  ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు .రామయ్యగారు కమ్మని తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరచారు ..సూరి వారి కుటుంబానికి రామయ్యగారిని తీసుకొని వెళ్ళారు .లెక్కలేనన్ని పూల దండలు వేసి  రామయ్య గారికి ఆత్మీయ స్వాగతం చెప్పి  అనంతరామయ్యగారి అల్లుడిగారింటికి పెద్ద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు . నలభై రెండేళ్ళ క్రితం  రామయ్య గారు ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఉందని చెబితే ,అన్న అనంతరామయ్యగారు ఆయన్ను ఆశీర్వ దించి ,వెళ్ళటానికి అంగీకరించి మద్రాస్ ఓడ రేవుకు వెళ్లి వీడ్కోలు చెప్పారు .ఆనాడు సంప్రదాయ హిందువులు సముద్రం దాటి ఇతర దేశాలకు వెళ్ళటం నిషిద్ధం .మరో అన్నగారు  వెంకటప్పయ్య శర్మగారు రామయ్యగారు విదేశాలకు వెళ్ళటాన్ని ఒప్పుకోలేదు ఆనాడు .అలాంటి పరిస్తితులలో దేశం కానీ దేశానికి వెళ్ళిన రామయ్య ఇప్పుడు మళ్ళీ 42 ఏళ్ళ తర్వాత ,42 రోజులు మాత్రమె ఇండియాలో గడపటానికి  స్వదేశానికి రావటం అందర్నీ సంతోష పరచింది .రామయ్య గారు సంస్కృత శ్లోకాలు అప్పగిస్తున్నారు .సంధ్య వందనం నిర్వహిస్తున్నారు .’’కమ్మకమ్మని ఎర్రెర్రని ఘాటు ఆవకాయ’’ను అన్నం లో కలుపుకొని లాగిస్తున్నారు  .నిజమైన ఆంధ్రుడనే అని మాటలద్వారా ,చేతల ద్వారా రుజువు చేసుకొన్నారు .అందరి మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించారు .ఇంటి కోడళ్ళు రామయ్యగారికి నూనె రాసి ,సున్నిపిండి నలుగు పెట్టి కుంకుడుకాయ రసం తో వేడివేడి  నీటి తో తలంటి పోశారు .రామయ్యగారి’’ హోమ్ కమింగ్ ‘’ఒక పండుగలాగా జరిగింది .              హైదరాబాద్ లోప్రాంతీయ రిసెర్చ్ లేబరేటరి,ఉస్మానియా విశ్వ విద్యాలయమ్ ,ఆకాశ వాణి కేంద్రాలను సందర్శించి అక్కడి అభివృద్ధిని అడిగి తెలుసుకొని అభినందించి ఆనందించారు .కోలచల కుటుంబం రామయ్యగారి తిరుపతి ,శ్రీశైల క్షేత్ర దర్శనం ఏర్పాటు చేసింది .ఆ రెండు క్షేత్రాలలో భక్తిగా రామయ్యగారు పూజాదికాలు నిర్వహించి అలౌకికానందాను భూతికి లోనయ్యారు .

రామయ్య గారు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారు .అక్కడ ప్రముఖ   కమ్యూనిస్ట్ నాయకురాలు ,డాక్టర్ శ్రీమతి అచ్చమాంబ  గారిని సందర్శించారు .

ఉయ్యూరొచ్చిన రామయ్య-పౌరసమ్మానం

విజయవాడ నుంచి స్వగ్రామం ఉయ్యూరు చేరుకొన్నారు .మే నెల 21 వ తేదీన రామయ్యగారికి డాక్టర్ మిక్కిలి నేని సాంబశివ రావు ,ఆధ్వర్యం లో ఉయ్యూరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ ,గ్రామ పెద్దలు కలిసి  ఘనమైన పౌరసన్మానం  చేశారు .మే 24 న రామయ్య గారు ఆంద్ర యువకులకు ఒక సందేశాన్ని రికార్డ్ చేశారు .అందులో ఆంద్ర యువత కు సోవియట్ తో స్నేహం తో ఉండటానికి ఇష్ట పడుతున్నందుకు మనసార  అభినందించారు .భారత దేశ భవిష్యత్తు యువత మాత్రమే తీర్చి దిద్దుతుంది అన్నారు .ఇండో సోవియట్ స్నేహం చిరకాలం వర్ధిల్లాలి ‘’అని ఆశాభావం వెలిబుచ్చారు .

గుంటూరులో

గుంటూరులో ఆంద్ర యూత్ ఫెడరేషన్ రామయ్యగారిని ఆప్యాయంగా ఆహ్వానించి గొప్ప పౌర సత్కారం నిర్వహించారు .దీనికి స్థానిక ఇండో -సోవియట్ సాంస్కృతిక సంస్థ సహకరించింది .అందంగా అలంకరింపబడిన విశాలమైన ప్రాంగణం అంతా విపరీతంగా వచ్చి చేరిన యువత తో నిండిపోయి కనుల పండువుగా కనిపించింది. ఉరకలెత్తే యువత ఉత్సాహం రామయ్యగారిని విశేషం గా ఆకర్షించింది .నవభారత నిర్మాణానికి వీరే నిజమైన స్తంభాలు అనుకొన్నారు .లోపల చోటు దొరకక ఏంతో మంది హాలు బయట ఉండిపోయి చూడాల్సి వచ్చింది .ఇంత మందిని ఆకర్షించిన రామయ్యగారు ధన్య జీవులని పించారు . విద్య ,ఉద్యోగం వినోదం వగైరాలు రష్యాలో యువతకు ఎలా అందుబాటులో ఉన్నాయని వేదికపై ఉన్న రామయ్యగారిని వారు ప్రశ్నించారు .అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా అనర్గళం గా అచ్చమైన ,మధురమైన తెలుగు పదజాలంతో సమాధానాలు చెప్పి రామయ్య యువతను సంత్రుప్త పరచి వారి హృదయాలలో గొప్ప  శాశ్వత స్థానం  సంపాదించారు .దాదాపు అర్ధ శతాబ్దం ఇండియాకు దూరంగా ఉన్నప్పటికీ ,భారత దేశ సాంస్కృతిక వారసత్వం పై రామయ్యగారికి ఉన్న అవగాహనకు ముక్కు మీద వేలేసుకొన్నారు .

మద్రాస్ లో మధుర సన్నివేశాలు

రామయ్యగారు  బెంగుళూరు యాత్ర నుండి మే 28 న మద్రాస్ చేరుకొన్నారు . .మర్నాడు హిందూ పత్రికకు ఇంటర్వ్యు ఇచ్చారు .మర్నాడే దాన్ని ఆ పత్రిక ప్రచురించింది. అందులో ‘’మన జాతీయ భావన అంటే విశాల దృక్పధం తో మన యువ సైంటిస్ట్ లను ఇతర దేశాలలో నివాసం ఉండేట్లు అంగీకరించి పంపించటమే అవ్వాలి .న్యాయానికి మన దేశానికి శాస్త్రీయ ప్రతిభ ఎక్కడినుంచో రానక్కరలేదు మనకే ఏంటో విజ్ఞానం ఉంది  .కాని ఇతర దేశాలకు మన శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అంద జేస్తున్నందుకు  వారి ప్రగతిలో భాగ స్వాములం అవుతున్నందుకు మనం గర్వ పడాలి .సైన్స్ లో ,పరిశ్రమలలో  అభ్యుదయం లో  సోవియట్ యూనియన్  ఉండటం ఇండియాకు సర్వ విధాల అవసరమేకాక చాలా మంచిది కూదా .ఇప్పుడు అందరి ద్రుష్టి ,,ఆలోచన అంతా ‘’సహాయం –తోడ్పడటం ‘’పైనే ఉంది .ఈ  రెండు మాటల మంత్రాన్నే జపిస్తున్నారు  .’’అని రామయ్య గారు చెప్పినట్లు రాసింది.

బొంబాయి –అక్కడినుండి తిరిగి రష్యాకు

రామయ్యగారు  మద్రాస్ నుండి  బొంబాయి కి  జూన్ 1 న బయల్దేరి వెళ్లారు .బొంబాయి  ఆకాశ వాణికి ఒక ప్రసంగం రికార్డ్ చేశారు .అక్కడి నుండి బయల్దేరి మే నెల 5 వ తేదీ కి రష్యాలోని మాస్కో నగరానికి చేరుకొన్నారు .

రామయ్యగారి జీవన సంధ్య

మాస్కో చేరిన కోలచల సీతారామయ్య అనే ‘’కాన్ స్టాన్టిన్ సేర్జియోవిచ్ ‘’జీవిత౦ చివరికాలం లో ‘’సెంట్రల్ సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ బిల్డింగ్స్ ‘’సంస్థలో పని చేశారు .ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో విశేష ప్రతిభా వంతులైన రామయ్యగారు ప్రముఖ ‘’సైంటిఫిక్ అడ్వైజర్ (శాస్త్రీయ సలహాదారు ) గా ను ,అనేక సైంటిఫిక్  కౌన్సిల్స్ కు  సలహాదారుగాను విశేష సేవలు అందజేశారు .

ఆల్బర్ట్ అయిన్ స్టీన్ తో పోలిక

వృద్ధాప్యం మీద పడుతున్నప్పటికీ చివరి రోజుల్లో సైతం రామయ్య గారు ఎంతో సృజన శీలతను ప్రదర్శించారు .మనకు అప్పటిదాకా తెలిసిన మూడు స్తితులు కాక నాలుగో స్తితి ఉందని భావించి ,దేర్మో న్యూక్లియ చర్యలలో’’ ప్లాస్మా ‘’అనేది ఏర్పడుతుందని ఊహించి చెప్పారు .కాని దురదృష్ట వశాత్తు అది రుజువు కాక ముందే రామయ్యగారు కానిపోవటం విచారకరం .ప్రముఖ విజ్ఞాని ,సైంటిస్ట్  ఆల్బర్ట్ అయిన్ స్టీన్ కూడా తాను ఊహించిన చెప్పిన సిద్దా౦తలనన్నిటిని ఒక చోట చేర్చి ఏక సూత్రత సాధించి కొత్త సిద్ధాంతాన్ని ప్రదిపాదించే లోపలే మరణించాడు ఈ ఇద్దరు మేధావి  సైంటిస్ట్  ల జీవితాలలో యాదృచ్చికం గా ఇలా జరగటం  ఆశ్చర్యం గా   ఉంటుంది .మానవ జాతికి మహత్తర విజ్ఞానం అందకుండానే వారిద్దరూ చనిపోవటం విచార కరం .

రామయ్యగారి ‘’ప్లాస్టిక్ ధీరీ ‘’సిద్ధాంతం రామయ్య గారు వదిలి వెళ్ళిన ఉపన్యాస రికార్డులనుండి సేకరించి  సంపూర్ణ స్తితికి తేవాలి .రామయ్య గారు  రష్యన్ భాషా జర్నల్స్ లో రష్యన్ భాషలో రాసిన పత్రాలను సేకరించి ఇంగ్లీష్ భాష లోకి అనువదించాలి .యంత్రాల నిర్మాణం లో రామయ్యగారు అవలంబించిన పద్ధతులనుపయోగించి కొత్త యంత్ర నిర్మాణాన్ని ఇండియా లోను రష్యాలోను ‘’ట్రైబాలజిస్ట్ ‘’లు  రూపొందిస్తున్నారు .

రాం రాం

రామయ్యగారు ఊపిరి తిత్తుల సంబంధ మైన ఉబ్బసవ్యాది (బ్రాన్కైల్ ఆస్తమా )తో చాలాకాలం బాధ పడ్డారు .దీనితో ఊపిరి తిత్తులు ఉబ్బి శ్వాస పీల్చుకోవటం కష్టమైన ‘’ఎ౦ఫిసేమా’’  జబ్బు ఇబ్బంది పెట్టింది .దీనికి తోడూ డబల్ టైఫాయిడ్ వచ్చి మీద పడింది . జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యం గా నిలబడిన రామయ్యగారి గుండె ఇక తట్టుకోలేక ,కొట్టుకోలేక పోయింది .29-9-1977 న మాస్కో లో రామయ్య గారి హ్రదయ స్పందన ఆగిపోయి శాశ్వతం గా మనకు దూరమైపోయారు .ఆయన చితా భస్మం మాస్కో క్రిమేటోరియం చాపెల్ లో  భద్రపరచారు .

దీనితో మూడు ఫోటోలు జత చేశాను చూడండి

కెమోటాలజి పిత’

సశేషం

naannayya 001 ramayya 001 talanti 001

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవుడు ప్రజాస్వామ్య వాది కాదా /కంచ ఐలయ్య ప్రశ్న

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

బ్రిటన్ లో కామెరాన్ విజయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోదా వాకాల్సిందే ఇది సెంటిమెంట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఇప్పటిదాకా మనం రామయ్య గారి స్వదేశాగామనాం ,అనుభవాలు అనుభూతులు ఆయన స్వయం గా చెప్పిన మాటలద్వారా విని తెలుసుకొన్నాం .ఆయనలో భవిష్యత్తును దర్శించే దార్శనికుడు కనిపించాడు రెండు దేశాల అభివృద్ధి తపన ,యువతపై ఉన్న అచంచల విశ్వాసం ,ఇండియా ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగి నిలవాలన్న ఆకాంక్ష కనిపించింది .తన జీవితం సార్ధకమే నన్న విశ్వాసం గోచరమైంది .జీవన సంధ్యలో ఉన్నా ఇంకా ఏదో చేయాలనే తపన చూశాం .హార్ట్ పేషెంట్ అనీ తెలుసుకొన్నాం .విశ్వమానవ గీతం గా అయన జీవితాన్ని ఆవిష్కరించిన వైనం కనిపిస్తుంది ..            ‘’  ప్రతిదీ సాపేక్షికమే అని ప్రజలు అంటారు .ఒక రోజు నేను జనసమ్మర్ద మాస్కో వీధుల్లో నడుస్తున్నాను .అకస్మాత్తుగా ఒక మర్యదాపూర్వక మైన ‘’క్షమించండి రామయ్య గారు !’’అనే పిలుపు వినిపించింది .నా ముందు హాషి మోటో నిలబడి ఉన్నాడు .కాలం అతనిలో ఎన్నో మార్పులు తెచ్చి ముసలివాడుగా కనిపిస్తాడు .ముఖం లో విషాదం కనిపిస్తోంది .అతన్ని చూసినందుకు ఆశ్చర్యం సంతోషం కలిగాయి .ఆత్మీయంగా హత్తుకోన్నాను .ఇలా చేయటం జపాన్ సంప్రదాయానికి విరుద్ధం. ఇండియాలోనూ ఇలా ఎవరూ ప్రవర్తించరు .’’నేనే రామయ్యను ‘’అన్నాను అతనితో .’’ఇక్కడికి ఎలా వచ్చావు ?’’అని అడిగాదు  .’’సముద్ర మార్గం ద్వారా ‘’అన్నాను జోక్ చేస్తూ  .’’నువ్వు టూరిస్ట్ లాగా లేవే ?’’అన్నాడు  .’’నేనిక్కడ చాలాకాలం నుంచి పని చేస్తున్నాను’’అన్నాను  .’’నాకు అర్ధమైంది నువ్వు కాంట్రాక్ట్ ఒప్పందం మీద పని చేస్తున్నావు ‘’అన్నాడు .నన్ను అర్ధం చేసుకోలేదు .’’లేదు హషిమోటో! నేనిక్కడే నివశిస్తున్నాను .’’అన్నాను అతనిముఖం లో నమ్మకం కనిపించలేదు .తర్వాత నవ్వేశాడు .’’ఓహో అలా జరిగిందా ?’’అన్నాడు .

రామయ్యగారికి ఒకే సారి రెండు డిగ్రీలు

రామయ్యగారు జీవితకాలం లో–  పనిచేసేటప్పుడు ఇంజన్ లోని  లోహ భాగాలను తినివేసే విషయం ,లూబ్రికంట్స్  కు తగిన ఎడిటివ్స్ ను కలిపే విషయం పైన  70 పేపర్లు  రాశారు. ఆయన చివరి శాస్త్రీయ పరిశోధనా పత్రం ‘’induction period of precipitation –a new index of motor oil quality and effectiveness of additives in them ‘’పరిశోధనా ఫలితాలలో కొన్నిటిని సిద్ధాంత పరంగా లూబ్రికంట్స్  లో నాణ్యత గురించి 1949 లో మోనోగ్రాఫ్ ప్రచురించారు .’’విస్కాసిటి ఎనామలి ఇన్ ఆయిల్ ,’’’’ఎఫెక్ట్ ఆన్ ఫ్రిక్షన్ ఇన్ మెషీన్స్ ‘’ప్రచురించారు మాస్టర్ డిగ్రీ  కోసం దీన్ని రెండేళ్ళ తర్వాత సమర్పించారు .దీన్ని పరిశీలించిన ‘’ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం కమీషన్ ‘’ఆ పరిశోధన డాక్టర్స్ డిగ్రీ పొందటానికి పూర్తిగా అర్హమైనదని తీర్మానించింది .యు .ఎస్ .ఎస్ .ఆర్. కు చెందిన ‘’అకాడేమి ఆఫ్ సైన్స్  సుప్రీం ఎటేస్టేషన్ కమిషన్’’ అంగీకరించింది .వెంటనే రామయ్యగారికి మాస్టర్ అండ్ డాక్టర్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ డిగ్రీలు రెండూ ఒకే సారి ప్రదానం చేసింది  .

ఫాదర్ ఆఫ్    ట్రైబో కేమిస్ట్రి

రామయ్యగారి శాస్త్రీయ పరిశోధనలు ‘’కేమోటాలజి’’అనే కొత్త శాస్త్రం గా ఆవిర్భవించింది .ఇది మోటార్ ఆయిల్స్ ,ఉపరి తలాలమధ్య స్లైడింగ్  అందులో జరిగే మిశ్రమ రసాయన చర్యల గురించిన శాస్త్రం .పెట్రోలియం ను శుద్ధి చేసిన తర్వాత లభించే బేస్ ఆయిల్స్ లో సరైన , ఎడిటివ్ లను కలపాల్సిన  అవసరాన్ని కేమోటాలజి గుర్తించింది .దీన్ని  పాశ్చాత్య దేశాల వారందరూ అంగీకరించటం తో బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది .ఇవాళ కేమోటాలజి ‘’ట్రైబో కెమిస్ట్రీ ‘’పేరుతొ బాగా ప్రసిద్ధమైంది .ఇదంతా రామయ్య గారు వేసిన బీజం .నేడు మహా వృక్షం గా విస్తరించింది .ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది .అందుకే రామయ్యగారిని ‘’father of chemmotology ‘’,’’father of tribochemistry ‘’అంటే ‘’కేమోటాలజిపిత ‘’లేక’’ ‘’ట్రైబో కేమిస్ట్రి పిత ‘’గా గౌరవించి చెప్పుకొంటున్నారు .ఈ గౌరవం భారత దేశం లో జన్మించినందుకు మనమూ ,, రష్యా దేశం లో దాన్ని సాధించినందుకు అ దేశప్రజలూ  గర్విస్తారు . .రెండు దేశాల ప్రజలకూ ఇది అత్యంత సంతోషకరమైన విషయమే .

రామయ్య గారి భారత సందర్శనం లో మరికొన్ని విశేషాలు

డాక్టర్ సూరి భగవంతం ప్రకటన

రామయ్య గారు 1963 లో ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు సెంటిమెంటల్ టూర్ గా భారత దేశం సందర్శించారు .ఆనాటి రక్షణ శాఖ మంత్రి వి .కే.కృష్ణ మీనన్ కు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ సూరి భగవంతం గారు రామయ్య వస్తున్న సంగతి ప్రజలకు మాస్కో ట్రిప్ నుండి రాగానే 1962 లో హైదరాబాద్ లోని ‘’ఆంద్ర సారస్వత భవనం’’ లో తెలియ జేశారు .అక్కడ చేరిన ఔత్సాహకులు సంబరం తో చప్పట్లు కొట్టి ఆనందించారు .రామయ్య గారి సమీప బంధువు శ్రీమతి డాక్టర్ సూరి శ్రీమతి తన చిన్నప్పుడుమూడో క్లాస్ చదువుతుండగా  రామయ్యగారి నుండి రామయ్యగారి అన్నగారు అనంత రామ శాస్త్రి గారికి అంటే తన తాత గారికి శుభాకా౦క్షల టెలిగ్రాం పంపటం,ఈయన అందుకోవటం  జ్ఞాపకం చేసుకొన్నారు . అంటే రామయ్యగారు మాస్కో లో కులాసాగా ఉన్నారని తెలిసి కుటుంబమంతా ఎంతో సంతోషం పొంది పండుగ చేసుకొన్నారు .రామయ్య గారి క్షేమ సమాచారాలు 1936లేక 1938లో కుటుంబానికి ఒక్కసారి  మాత్రమే తెలిసింది .అదికూడా’’ బాంబే క్రానికల్ పేపర్ ‘’లో’’ చాట్ వుడ్ హాల్ ‘’ అనే ఆయన రామయ్య గారి గురించి ఒక ఆర్టికల్ రాస్తూ అయన రష్యాలో ఉన్నాడు అని అందులో తెలిపాడు .అప్పటినుంచి అనంత రామయ్య గారు రష్యా రాయబారి విజయ లక్ష్మీ పండిట్ తో తరచూ సంభాషిస్తూ వివరాలు తెలుసుకొనే వారు .రష్యాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు .

ఢిల్లీ లో స్వాగత సంరంభం

ఢిల్లీ విమానాశ్రయం కు చేరుకొన్న రామయ్యగారికి  ,పార్లమెంట్ లో కమ్యూనిస్టు ,కాంగ్రెస్ మెంబర్లు ,ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్  కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని నెహ్రు కేబినేట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ బోతున్న డాక్టర్ కే.ఎల్.రావు ,హార్దిక స్వాగతం పలికి పూలహారాలతో ముంచెత్తేశారు .ఆ తర్వాత రామయ్యగారు పార్లమెంట్ హౌస్ కు  వెళ్లి లోక్ సభ పబ్లిక్ గాలరీలో ఆసీనులై ప్రధానమంత్రి జావహర్ లాల్ నెహ్రు  ‘’జాతీయ భాషల ‘’గురించి చేస్తున్న ప్రసంగాన్ని శ్రద్ధ గా విన్నారు .కాట్ర గడ్డ గంగయ్య గారు రామయ్య గారికి ఇష్టమైన ప్రదేశాలను దగ్గరుండి చూపించారు .మొగల్  కళ ,శిల్పకళ ,చరిత్రల మీద పుంఖాను పు౦ఖ౦గా  ప్రశ్నలు  సంధించి అడిగారు .రామయ్య  గారు తన కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన  చారిత్రిక చిత్రం ‘’మహా మంత్రి తిమ్మరుసు ‘తెలుగు ’సినిమా చూశారు .

ప్రముఖ సంస్థల సందర్శన

ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ దామోదరం సంజీవయ్య ,ఢిల్లీ యూని వర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ చింతామణి దేశ్ ముఖ్  పార్లమెంట్ సభ్యులు కే సి పంత్ ,రావి నారాయణ రెడ్డి ,కే ఈశ్వర రెడ్డి ,కుమరన్ ,లక్ష్మీ దాస్ శ్రీమతి విమలాదేవి మొదలైన ప్రముఖులు రామయ్య గారి గౌరవార్ధం కే.ఎల్ రావు గారు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు .మర్నాడు ఉదయం దేశ ముఖ్  గారింట్లో ఉదయం అల్పాహారం ,భార్య శ్రీ మతి దుర్గాబాయ్ దేశ ముఖ్  ఏర్పాటు చేశారు .తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ,వెంకటేశ్వర కాలేజ్ ,ఆంధ్రా స్కూల్,ఢిల్లీ యూనివర్సిటి లను సందర్శించారు .ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకురాలు ఇంద్రాణి రెహ్మాన్ ను కలిసి మాట్లాడారు ఇంద్రాణి తలిదండ్రులు ,బహిష్కరింపబడిన సీతారాం బాపూజీ అనే విప్లవ నాయకుడు రామయ్యగారికి అమెరికాలో సన్నిహిత మిత్రులు .

ఆంద్ర మహా సభ సత్కారం

ప్రొఫెసర్లు ,ఇంజనీర్లు ,సైంటిస్ట్ లు  రచయితలూ ,జర్నలిస్ట్ లు ,పార్లమెంటరీ సభ్యులు మొదలైన వారందరూ కలిసి ‘’ఆంధ్రా  అసోసియేషన్’’ తరఫున జరిగిన సన్మానం లో పాల్గొన్నారు . హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామ కృష్ణా రావు ,కొత్త లక్ష్మీ రఘురామయ్య లు రామయ్యగారిని భారత దేశం అంతా పర్య టించి ,ఇన్నేళ్ళలో జరిగిన మార్పులను పరిశీలించవలసిందిగా అభ్యర్ధించారు .మిగిలిన వారు ఆ రోజుల్లో చదువులకోసం అందరి ద్రుష్టి ఇంగ్లాండ్ పైన ఉంటె ,దాన్నికాదని రామయ్యగారు వలస వాద సిద్ధాంతాన్ని వ్యతి రేకించి,నాటి బ్రిటిష్ పాలకుల దేశమైన ఇంగ్లాండ్ కు ,అమెరికాకు ఉన్నత విద్య నేర్వటానికి వెళ్ళకుండా  ప్రజా పక్షాన పని చేసృన్న రష్యా వెళ్ళటాన్ని శ్లాఘించారు . విప్లవ కారుడైన బాజ్ పాయ్ తో అమెరికాలో రామయ్యగారికున్న స్నేహాన్ని రష్యాలో వీరేంద్ర నాద చటోపాధ్యాయ తో మిత్రత్వాన్ని  గూర్చి ప్రసంగించారు కొందరు   .రష్యాలో రామయ్య గారు టెక్నికల్ శ్రేణులకు శిక్షణ  నిచ్చిన విధానాన్ని ,సైంటిస్ట్ గా సోషలిస్ట్ సోవియర్ రష్యా పురోగమనానికి  తోద్పడిన వైనాన్ని ప్రశంసి౦చారు .ఇండియా రష్యాలు పరస్పరం అవగాహనకు రావటానికి తోడ్పడటానికి  రామయ్య గారు  తెలుగు రచనలను రష్యన్ భాషలోకి అనువదించటాన్ని ప్రముఖం గా పేర్కొని ఆయన కృషి ఆదర్శ ప్రాయం ఆచరణ సాధ్యం అనుసరణీయం అని మెచ్చుకొన్నారు .

ఎందుకు ఇండియా వచ్చానంటే!

వీటకన్నిటికి సమాధానం గా రామయ్య గారు ముఖ్యం గా   తాను వృద్ధుడైన ‘’తన అన్నగారు అనంత రామయ్య’’(నా అన్నయ్య)  గారిని చూడటానికి ఇండియా వచ్చానని ,స్వంత కనులతో భారతే సీమ అందాన్ని ఇక్కడి నదీ నదాలు పర్వత శ్రేణులు ,పూలూ ,మొక్కలు ప్రక్రుతి అందాలు దర్శింఛి పులకి౦చానని అచ్చతెలుగు మాటలతో అందరికి చెప్పి వారి కరతాళ ధ్వనులకు నిజంగానే పులకించిపోయారు .తన మాతృదేశం ఏ విధంగా రూపు మార్చుకోన్నదో తెలుసుకోవాలన్న ఆరాటం తనను ఇక్కడికి రప్పిం౦దన్నారు.గురజాడ అప్పారావు రాసిన అమర గీత౦ ‘’దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘’గీతం  పాడి వినిపిచారు  .విభిన్న వర్గాల ప్రజలను కలిసి వారితో సంభాషిం చాలని ఉందన్నారు.అప్పుడే అసలైన భారత దేశ నవీన ముఖం అర్ధమవుతుందని చెప్పారు  తాను  ఇండియా నుండి చాలా తీసుకు వెళ్లానని ,కాని దానికి బదులుగా  చాలా తక్కువ మాత్రమే ఆమెకు ఇవ్వగాలిగానని వినమ్రంగా ప్రకటించారు . రష్యా వెళ్ళిన తర్వాత తాను  దీనిమీదనే ఇక నుంచి ఎక్కువ శ్రద్ధ పెడతానని  వినయ పూర్వకం గా విన్న వించారు .తాను  చేసిన శాస్త్రీయ కృషి ఇండియాలో పెట్రోలియం పరిశ్రమకు తోడ్పడితే తనకంటే ఆనందించే వారు ఉండరని చెప్పారు .తనకు హృదయ పూర్వక స్వాగతం చెప్పిన వారందరికీ ,ఢిల్లీ లో  గడిపిన నాలుగు రోజుల్లో తనపై ప్రత్యెక  దృష్టిని  పెట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పారు .వారి మనసులలో ఉన్న సందేహాలన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి సంశయ విముక్తుల్ని చేశారు రామయ్య .మాతృభూమి తనను ‘’అమృతమయి ‘’గా ‘’అమృతమాయి ‘’గా పుత్ర వాత్సల్యం తో  ఆలింగనం చేసు  కొన్నందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .ఇంతటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు అన్నారు .ఏప్రిల్ 26 వ తేదీ ఢిల్లీ లోని పాలం విమానాశ్రయానికి విశేష సంఖ్యలో ముఖ్యులు వచ్చి హైదరాబాద్ వెడుతున్న రామయ్య గారికి ఘనమైన వీడ్కోలు పలికారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –8-5-15 ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరెస్ట్ కుంగింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉభయ వేదాన్తాచార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పతంజలి యోగ సూత్రాలు -రవిశంకర్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మృత్యువును జయించటం సాధ్యమా /స్వరూపానంద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మం -మతం -డా అరవింద రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాకవినని శ్రీ శ్రీ అనుకోలేదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పట్టిసం అవసరమే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఏమైనా నేను  అదృశ్య మైపోతున్నా.మళ్ళీ నేను సరిగా గాలి పీల్చలేక పోతున్నా .కళ్ళముందు ప్రతిదీ  నల్లగా ఉంది . మళ్ళీ కనిపిస్తున్నాయి .ఎంతో తీక్ష్ణమైన వెలుగు .నాలో కొంత పడిపోయి శక్తిని కాంతిమయం చేస్తోంది అంతరిక్షం లో సోల్కొవ్ స్కి ‘’మనం జీవిత సమాప్తకాలం లో కాంతిగా మరిపోతాం .సముద్రమంతటి విజ్ఞానాన్ని తరించి తీరం చేరలేము మనం .కాని ఎప్పుడో ఒకప్పుడు ఒక వ్యక్తి చాల భాగం నేర్చి , అర్ధం చేసుకొని ,విలువలకు మేధస్సు తో తగినట్లు జీవిస్తాడు ‘’అన్నమాట గుర్తుకొచ్చింది ..నేను రాద్దామని అనుకుంటున్న ముఖ్యమైన ఆర్టికల్ రాయ లేక పోయాను .కాని ఇక్కడ నేను కాంతిని ప్రసారం చేస్తున్నాను .ఇందులో ఏదైనా విశేషార్ధం ఉందేమో ఎవరికి తెలుసు ?

పంటలపై సంగీత ప్రభావం –భాషా మూలాలు

నా విమానం నేలమీదికి దిగుతోంది .ఇప్పటిదాకా ఆకాశ గమనం చేశాను .ఇప్పుడు నేలమీద కాలు మోపాలి .మాక్సిం గోర్కి అంటాడు ‘’దేవతలు మన ప్రాచీన కార్యా(వ్యా)లకు హీరోలు .రాముడెవరు ?భలే ప్రశ్న ఇండియాలో అరటి తోటలను చూశాను . పూలు పూసే సమయం లో అక్కడ ఫ్లూట్ వాయిస్తే అరటి చెట్లు హాయిగా విని ఇబ్బడి ముబ్బడిగా అధికమైన గెలలు వేసి ఎక్కువ ఫలసాయాన్ని  ఇస్తున్నాయి .ఈ చెట్ల ఫోటోలు నాతొ పాటు తెచ్చుకుంటున్నా .ఇక్కడ దీనికి ఆనుకొని ఉన్న తోట ‘’కంట్రోల్ ‘’ పేరిట సంగీతాన్ని వినిపిస్తారు .వీటినుంచే ‘’సంగీత వినికిడి అరటి ‘’  పండిస్తున్నారు . గెలల బరువుకు   అరటి చెట్లు నేలకు ఆనుకొంటు న్నాయి. భలే సరదాగా ,వింతగా ఉంది నాకు చూడటానికి .ఎవరో ముందు దీన్ని గమనించి ఉంటారు .అదొక కొత్త డిస్కవరీ అయిపొయింది .కొంత కాలం ఫలితాలు సంతృప్తి కరంగా రాకపోయినా కాల క్రమేణా గొప్ప దిగుబడి సాధించారు .పంటలపై సంగీత ప్రభావం జాస్తీగా ఉందని రుజువైంది .ఇవే అతిముఖ్యమైన ఆలోచనలు. ‘’the induction period of sediment formation in motor oil ‘’వ్యాసం రాయటానికి ఉపకరించాయి .తెలుగులో ‘’ఒకటి, రెందు మూడు – సంస్కృతం లో’’ అద్నా ,ద్వా ,త్రై .స్లావిక్ భాషలో’’ ఓద్నా ,ద్వే,ట్రై’’ఇంగ్లీష్ లో’’వన్  టు,త్రీ ‘’తేడా ఏమైనా ఉందా ? అన్ని భాషల మూల స్వరూపాలు ఒకటే .

మనుషులంతా ఒకటే

ఉత్తరాన కరేలియా లో ‘’కందలస్క ‘’అనే నగరం ఉంది . ఈ ఫిన్నిష్ సెటిల్మెంట్  పేరుకు సంస్కృతం లో అర్ధం ‘’శత సహస్ర దుంపలు(కంద గడ్డలు ) .ఇండియాలో తెరకోయా టౌన్ ను చూశా దీనికి .ఫిన్నిష్ భాషలో ‘ ధాన్యాగారం ‘’ ‘’అని అర్ధం . ఇండియా ఆగ్నేయ భాగం నుండి ఎప్పుడో మనుషులు ఇక్కడికి ఈ ఫిన్నిష్ ప్రాంతం చేరుకొని ఉంటారు .వాళ్ళే ఇప్పుడు ఫిన్నిస్ అని పిలువ బడుతున్నారు .ఆ వచ్చిన వాళ్ళు ఇండియన్స్ ఏమో ?ఎక్కడి నుంచి వచ్చాం మనం ?మనం ఎవరం ?ఎక్కడికి వెడుతున్నాం ?’’గాగ్విన్’’ లా కాకుండా నేనే బాధ్యత వహిస్తా.నేనే సమాధానం చెబుతా .’’మనమందరం ఒకే మూల కుదురు నుండి పుట్టాం .మనది   ఒకే మానవ జాతి.మనం  అందరం మనుషులం .ఇందులోనే గౌరవానికి మన పరీక్ష ఉంది .మనం చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం ‘’అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ‘’.మనది వసుధైక కుటుంబకం .’’

‘’ టర్కిష్ ప్రజలు ‘’మెన్ ,సేన్ ‘’అంటే ,ఫిన్నీష్ వాళ్ళు ‘’మినా ,సినా ‘’అంటారు అంటే అర్ధం నేను ,నువ్వు కలిస్తే మనం . నాయనలారా ఇదే అసలైన విజ్ఞానం .దీన్ని తెలుసుకోకుండా భేషజాలు పోతున్నాం. కలిసి బతకాల్సిన వాళ్ళం కాట్లాడి, పోట్లాడి విడిపోతున్నాం .ఒక సారి మహా తత్వ వేత్త సోక్రటీస్ ను ఒకాయన అడిగాడట ‘’మీరు ఎక్కడి నుండి వచ్చారు “’? అని .దానికి ఆ మహానుభావుడు ’’ఏదేన్స్ నుంచి ‘’అని  సమాధానం చెప్పకుండా ‘’ఈ విశ్వం నుండి ‘’అన్నాడు .అదీ ఆ దార్శనికుని విశాల దృక్పధం ,లోకోత్తర భావం, భావన  ఈ విశాల విశ్వమే తన  జన్మ స్థలం అన్నాడు .ఆయన తన అధిక సంపన్నమైన  విజ్ఞానాన్ని  ప్రేమను ,తనకూ మనకూ  సర్వ మానవాళికీ పంచిపెట్టిన మహోన్నతమానవుడు , ఆదర్శ తత్వ వేత్త  .అంతటి విశాల దృక్పధం మనలో రావాలి .ఇరుకు భావాల చీకటి గదుల నుండి బయటికి రావాలి .అంతటా వెలుగును  దర్శించాలి .అప్పుడే మానవ జన్మ సార్ధకం ‘’

ఇండో రష్యన్ భాయి భాయి

‘’నేను ఇటీవల ఇండియా వెళ్ళినప్పుడుఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో  నన్నొక ప్రశ్న అడిగారు .’’ఇండియా శాంతికాముక దేశం కదా ,సోవియట్ యూనియన్ శక్తి వంతమైన మిలిటరీ రాజ్యం .ఇండియాపై రష్యా దురాక్రమణ చేయదని గ్యారెంటీ ఏమిటి ?అది అనుకోకుండా వేసిన ప్రశ్నకాదుకాని ,అసంబద్ధమైన ప్రశ్న అనిపించి౦దినాకు .అనుకోకుండా నాకు నవ్వొచ్చి నవ్వేశాను  .నేను నవ్వటం చూసి ప్రేక్షకులూ నాతొ బాటు నవ్వారు .కానీ ప్రశ్న ప్రశ్నయే కదా .దీనికి నేను సరైన సమాధానం చెప్పాలి .నేను చెప్పటం ప్రారంభించా’’దాదాపు అర్ధ శతాబ్దం గా ఇండియా సోవియట్ యూనియన్ కలిసి నడుస్తున్నాయి .ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదం లేదు .కొన్ని విషయాలలో భేద భావాలు ఉండవచ్చు అయినా కలిసే నడుస్తున్నాయి .రష్యాలో విభిన్నమైన రాజకీయ వ్యవస్థ ఉన్నంత మాత్రాన ఆ దేశం భారత్ పై దాడి చేస్తుంది అనటానికి ఏ మాత్రం అవకాశం లేదు .ఇంతకాలం గా సోవియట్ రష్యా ఏ దేశం మీదా దాడి చేసిన దాఖలాలు లేవు .దీనికి విరుద్ధం గా రష్యానే అనేక దాడులకు గురైంది .సంబంధాల విషయానికి వస్తే  రష్యా ఇండియాకు  మెటలర్జికల్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి ,జాతీయ పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణాలకు సహాయం చేస్తోంది .’’ఇలాంటి దాడులు ‘’చేస్తున్నందుకు స్వాగతించారు .’’అని చెప్పగానే అందరూ భారీగా కరతాళ ధ్వనులతో ఆమోదం తెలియ జేశారు .నేనెవర్ని ?నేను ఇండియన్ ను ,సోవియట్ యూనియన్ వాడిని కూడా .అన్ని విషయాలలో ఇలాగే ఉన్నాం .కనుక రెండు దేశాల మధ్య వైరుధ్యమే లేదు .కలిసి నడుస్తూ ప్రగతి పధం లో దూసుకు పోతున్నాం .’’ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘28(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య రష్యాకు తిరుగు ప్రయాణం

హృదయ యంత్రం శిదిలమైంది

‘’నేనెక్కిన విమానం తాష్కెంట్ వైపు దూసుకు పోతోంది .నా వెనక ,కిందా ఇండియా ఉంది .పర్వతాలు శిఖరాలు లోయలు నదులు కనిపించి కనుమరుగై పోతున్నాయి .కింద భూమి ,పైన ఆకాశ౦ మాత్రమె  ఉన్నాయి .మళ్ళీ కలిసే దాకా ఇండియా నీకు వీడ్కోలు పలుకుతున్నాను .నా యువ కిశోరాల్లారా !మీకు గుడ్ బై చెప్పను .హలో రష్యా వచ్చేస్తున్నాను .ఎప్పటికైనా నీకూ వీడ్కోలు చెప్పాల్సి౦దేగా నేను .ఇక కాలం పెద్దగా మిగల లేదు .కొన్ని నెలలో రోజులో ?కాని నేను చేయాల్సింది చాల ఉండిపోయిందే .నేను గుండె జబ్బు మనిషిని కూడా .నా ‘’గుండె ఇంజన్ ‘’ముసలిది పనికి రానిది అయి పోయింది .ఇక దానికి ఏరకమైన లూబ్రికంట్లు వాడినా  ,ఎడిటివ్ లు మార్చినా  ఏమీ పని చేసే శక్తి లేదుదానికి .  హృదయ యంత్రం శిధిలమైంది .అవి నిష్ఫలం కూడా .నేనేమీ ముసలివాడినికాను .బాధా పడటం లేదు . అకస్మాతుగా ఊపిరి అందటం లేదు .పై పెచ్చు నీరసం ఒకటి ఏడ్చింది .నీరసం, నీరసం   అదే బాధ .అంతకంటే ఏమీ లేదు .’’

హిమనగాలపై వాయుయాన అనుభూతి  -తన పరిశోధనలతో పోలిక

‘’సర్వ సమర్ధుడు దైవం అయిన  శ్రీరాముడు ఇండియా నుండి లంకకు వెళ్ళాడు .అప్పుడు ఆయనకు విమానం లో ఒక సీట్ లో కూర్చోమని ఆహ్వానించి ఉంటె ,హిమాలయాలమీదుగా ప్రయాణించి, మన పైలట్లు తన లాగా దైవ సమానులు అని ప్రకటించి ఉండేవాడు .అందులోని ఎయిర్ హోస్టెస్ లను అప్సరలు అని ఉండేవాడు .న్యాయానికి అదేమీ అంత ఆశ్చర్య పరిచే గొప్ప విషయం కాదు .’’గాలి కన్యలు ‘’అంద చందాలతో అతిధి మర్యాదలు చేస్తూ హిమాలయాలకంటే ఎత్తైన ప్రదేశాలలో,గగనం లో టీ అంద జేస్తూ  దేవకన్యలను మరిపించేట్లు చేయటం వింతైన విషయం .విమాన కిటికీ లకు బయట -50 డిగ్రీల (మైనస్ యాభై డిగ్రీల )  ఉష్ణోగ్రతః ఉండటం అక్కడే శివ మహా దేవుడు కైలాస శిఖరం మీద కొలువై ఉంటాడంటే నమ్మగలమా?

.పర్వతాలు వరుస తప్పటం కనిపించింది .అది నా పరిశోధనలోని లూబ్రికంట్ ల లక్షణాలను  పోలి ఉందనిపించింది .ఈ పర్వత ,లోయల  వంకరలు లూబ్రికంట్ లలో ఎడిటివ్ లను పోస్తే ఏర్పడే  సెడి మెంట్  ఫార్మేషన్ లాగా ఉందనిపించింది .మేఘాలతో కప్పబడిన పర్వత శిఖరం సెడిమేంట్ అవక్షేపం (ప్రిసిపిటేషన్) ఎర్పడటాన్ని సూచిస్తోంది .వెంటనే నా నోట్ బుక్ తీసి లూబ్రికంట్ ఆయిల్స్ లలో  సెడిమేంట్ ఏర్పడటం లో ఉన్న ఇండక్షన్ కాలం గురించి ఆర్టికల్ రాయటానికి స్కెచ్ తయారు చేసుకొన్నాను .మా  ఫ్లైట్ ఒక  మాలిక్యూల్ లాగా ఉందనిపించింది .  విమానం పైనుంచి కిందికి దిగటం అంటే ఏదో పతనం చెందినట్లు భావించరాదు .అదొక ప్రశాంత మైన ,సుతి మెత్తని ,గంభీర విధానం .నాకు అనుకోకుండా భలే వింత ఆలోచనలోచ్చాయే !వెంటనే దీనిమీద సమగ్రంగా ఆలోచించి  ఈ భూమిక నుండి మంచి వ్యాసం  తాష్కెంట్ చేరుకొనే లోపు రాసెయ్యాలి ‘’.

‘’నాకు వచ్చిన వి బేసిక్ ఆలోచనలా? ఏవి ఇక్కడ  బేసిక్ థాట్స్ ?ఒకటి రెండు మూడు –.మనిషి జీవించటం మంచిదే .ఇంకా 36 ఏళ్ళు జీవించాలి .అది సాధ్యమా ?అంటే అనుమానమే .ప్రసిద్ధ ఇటలీ చిత్రకారుడు, శిల్పి మైకెలేంజిలో89 ఏళ్ళ వయసులో ‘’ఇదేమీ బాగాలేదు .నేను ఇప్పుడే కళ అంటే ఏమిటో  అర్ధం చేసుకోవటం మొదలు పెట్టాను’’అన్నాడు .అంతటి గొప్పవాడే ఆ మాట అంటే ,నా బోటి సామాన్యుడు ఏమనుకోవాలి ? ‘’

ఇ౦జన్ లో వచ్చే కదలికలు గ్లాసులోని నీళ్ళను వణి కేట్లు చేస్తాయి .ఇది తప్ప మిగిలినదంతా ప్రశాంతంగానే ఉంటుంది .విశ్వం మధ్య భాగం లో విమానం మొద్దుబారి పోతుంది. కాని దానికే ప్రమాదం ఉండదు .’’ఆగు .ఒక్క క్షణం ‘’అని ముసలి ఫౌస్ట్ కలగన్నాడు మళ్ళీ యవ్వనం పొందాలని. నాకూయవ్వనం పొందాలని ఉందా?నేను  ఏంతో చేయగలిగాను .చాలు .నాకు యవ్వనం ప్రాప్తిస్తే నేను అంతటి ముసలివాడిని కాదుకదా . నాకు ముసలితనం వచ్చి౦దనుకోను .నాకు ఇంకా 78  ఏళ్ళు మాత్రమే .

రష్యన్ మిరకిల్

‘’  ఈ 78 ఏళ్ళలో ఏం జరిగింది నా జీవితం లో ?నా చేతిలో మొరాకో  బైండింగ్ తో ఉన్న నీలిరంగు మంచి పుస్తకం ఉంది .మట్టి రంగు పర్వతాల కు ఆకాశపు  నీలి ఆభరణం లాగా .చదువుదాం .ఇవిగో చివరి పేజీలు  .ఇక్కడే హీరో ఇంటికి తిరిగి వెడుతున్నాడు .వాండర్ హేంక్ కు ఇంకా నేను సోవియట్ రష్యా ఎందుకు వెళ్ళానో అర్ధం కాలేదు .చాలాసార్లు హేంక్ కోరినట్లు కెరీర్ ను అమెరికాలోనే సాగిద్దామా అనుకొన్నాను .ప్రతి సారీ వచ్చిన అవకాశాన్ని హీరో తిరస్కరించాడు .నిజమే అన్నీ తేలికైనవి, సాధారణమైనవి గా రష్యాలో  ఉండవు .కాని అది అంతముఖ్యమా?ఈ పుస్తకం లో ముఖ్య విషయాన్ని కొట్టి పారేయ టానికి వీలు లేదు .నా సిద్ధాంతం లో యదార్ధం ,నా కొత్త  విధానాలు , ఇంత కాలంగా  అన్నీ నేనే  సృష్టించు కొన్నవే.ఇదంతా నా సృజన మాత్రమే .నేను చేయగలిగినది అంతా చేసేశాను .నేను ఒంటరి వాడిని మాత్రం కాదు .నా పని ,నా మిగిలిన కామ్రేడ్ ల పని నుంచి వేరు చేయలేనిది .ఇవాళ ఎవరూ ‘’రష్యన్ మిరకిల్ ‘’ను కాదన లేరు . యుద్ధ భీభత్సం ,రక్త పాతాలతో శిధిలమై పోయిన దేశం ఆధునిక సర్వతో భద్రమైన ఉన్నత దేశం గా ఎదిగింది అన్నదే రష్యన్ మిరకిల్ . ‘’

‘’ ఇండియా నుంచి రష్యాకు విమానం లో పర్వతాలపై  యెగిరి వస్తున్నాను . స్పుత్నిక్ మార్గాల కిందుగా నా ప్రయాణం సాగుతోంది .నేను ఇంట్లో ఉన్నాను .భూగ్రహం మీద ఉన్నాను  .వేర్నాడ్ స్కి చెప్పిన ‘’మనం సూర్య సంతానం .మనం కాస్మిక్ అయినా భూమిమీద ఉన్నాం .భూమి నీ స్వంత తోట కాని పెరటి తోటకాని కాదు అని అర్ధం చేసుకో .భూమి మన వనం .వెనుక భూమి .దాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేశాం .దాన్ని సంరక్షి౦చు కోలేక పోతున్నాం .మనలో ఉన్న పనికి మాలిన తగాదాలను వదిలేసి ,భూమాతను సరైన క్రమ పద్ధతిలో ఉంచాలి .అప్పుడే మనకు ముఖ్య సత్యం స్పష్టంగా అవగతమవుతుంది .ప్రపంచం ఇంత అద్భుతంగా దర్శన మిస్తోంది అంటే దాన్ని మనమే అలా చేయగలిగాం ‘’అన్నమాటల తో నేను ఏకీభవిస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

‘’

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘27(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రష్యాకు తిరుగు ప్రయాణం

‘’ ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు శ్రీపాద్ అమృత డాంగే ‘’మీకు సర్వదా కృతజ్ఞులం .మీరు ఇండియా –రష్యా మిత్రత్వానికి చాలా తోడ్పడ్డారు .ప్రతి ,ప్రతి నిధి బృందం ఇలా చేయ లేదు .అదీ మీ ప్రత్యేకత .’’అన్నాడు నాతో .నాకు ఆశ్చర్యమేసింది .నేనేమీ రాజకీయ ఉద్దేశ్యం తో రాలేదే .నేనేది అనుకున్నానో, దేన్నీ ఆలోచించానో  అదే చెప్పాను .అచ్చమైన నిజాలే మాట్లాడాను .ఇండియా సర్వతోముఖంగా ,విద్యా ,సాంస్కృతిక రంగాలలో సంతోషంగా అభి వృద్ధి చెందాలని  నా ఆకాంక్ష .దీనికోసం భారతీయ ప్రజలందరూ  సోవియట్ ప్రజలు లాగా  ఐకమత్యం తో ఒకే కుటుంబంగా కలిసి పని చేసి  ,మనుషులను విడదీసే ,అపోహలు  అదృశ్యమై ,కులమత వర్గ భాషావ రోధాలను తుడిచిపెట్టి  అధిగమించాలని నే కోరుతున్నా. ప్రజలకు  తాము మాత్రమె తమ కొత్త దేశాన్ని నిర్మించగల౦  అనే నమ్మకం రావాలి .  దీని వల్లనే సగుణాత్మక మార్పులు వస్తాయి  .వారిలోని ప్రతీక శక్తుల కబంధ హస్తాలను చేదించుకొని బయటికి రావాలి .గతానికి చెందిన విలువైనది అయిన ప్రతి దానినీ కాపాడుకోవాలి .బానిసత్వ భావలనుండి బయట పడాలి .ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఉండరాదు .భారత దేశ చరిత్రలో ఉత్తమమైన వాటిని ,జీవితానికి వెలుగు నిచ్చేవాటిని ,శాంతి ని పెంచే వాటిని గౌరవించాలి .ప్రతి తరం తన బాధ్యతను  సక్రమంగా నిర్వర్తించి ,సరైన అవగాహన తో ప్రతి వ్యక్తీ  ప్రగతికి,దేశాభ్యుదయమే ధ్యేయంగా   ముందుకు కదలాలి ..మీ కుటుంబం మానవ కుటుంబం అనే భావన మనసులో స్తిరమై ఉండాలి .అందుకే ఇతరులతో మంచి మర్యాదలతో ప్రవర్తింఛి వారిమేలుకు కృషి చేసే  సుగుణం అలవడాలి .పతనం చెందటం చాలా తేలికే .కాని లేచి నిలబడి ముందుకు సాగటం కష్ట సాధ్యమైన విషయమని గుర్తించాలి .ఇదే ప్రతిమనిషికి తగిన, విలువైన మార్గం .వేరే మార్గాలలో వెడితే అసహనం, అసూయ, యుద్ధాలే గతి .ఈ విషయాలు నా భారత ప్రజలకు నచ్చి గుండెలను తాకితే వారూ నా వంటి వారే నని అనుకొంటాను .ఇండియాకు నేను వచ్చించి ఏదో ఉద్యమం నడుపుదామనికాదు .నేను  చాలా ఉదాత్త భావనతో వచ్చాను .నా మాత్రు దేశాన్ని నాజీవిత౦ పొద్దు బారి పోతున్న వేళ కనులారా చూద్దామని ,మాత్రమె ఆశతో వచ్చాను .ఇండియా యువతను చూసిన తర్వాత నాలో యవ్వనాన్ని నింపుకొన్నానని పించింది .

‘’రామయ్య ఇండియన్ ,కాని ఒక్క ఇండియా వాడు మాత్రమేకాదు .ఆయన ఇండియా –రష్యా మిశ్రమ వ్యక్తీ . ఆయనలో ఉన్న ఈ భారతీయ  పునాది అపూర్వమైనది .ఆయనే  ‘’నేను ఇండియాను నాకు జన్మ నిచ్చినందుకుప్రేమిస్తాను  అంటాడు. ఇది ఆదర్శ మాత్రు ప్రేమ ‘’అని  నా గురించి అందరూ చెప్పేమాట నాకూ నిజమేనని పిస్తుంది .ఇండియా రావటం వేరు ,ఇక్కడ జీవించటం వేరు నా దృష్టిలో . .నేను ఇన్నేళ్ళు రష్యాలో పని చేశాను. కాదు సేవచేశాను .అది కాంట్రాక్ట్ పని కాదు .నేనేదో గొప్పవాడినని , ఏదో అద్భుతాలు సాధించానని గొప్పలు చెప్పుకోవటానికి రాలేదు .చాలా వినయ విదేయతలతో వచ్చాను .అర్ధం చేసుకోవటానికే వచ్చాను .నా జీవితం సార్ధకమయింది. ఈ అనుభవం ఒక జీవితకాలం నాలో గొప్పగా నిలిచిపోతుంది. ధన్యుడిని నేను .అందరూ దీన్ని అర్ధం చేసుకోలేరు .కాని నావిషయం లో ఇది నూటికి నూరు పాళ్ళు యదార్ధం .’’

‘’జీవిత చరమాంకం లో యెంత సుదీర్ఘ కాలం జీవించినా మిగిలిన కాలం చాలా స్వల్పమనిపిస్తుంది .ఇంత సుదీర్ఘ జీవన యానం లో నేనెప్పుడూ జబ్బు పడి ఎరుగను .ఇప్పుడూ రోగ గ్రస్తుడినికాను  అదే నా  అదృష్టమేమో !కాని  ఊపిరి పీల్చటం కొంచెం కష్టంగా ఉంది .నీరస౦గా కూడా ఉంది .’’ఛా వెధవ నీరసం’’ .పక్షుల కిలకిలారావాలు నాకు శక్తినిస్తాయి. ఆనందాన్ని ,సంతోషాన్ని ,అందజేస్తాయి .అపూర్వ సందేశమేదో ఇస్తున్నట్లనిపిస్తుంది .నేను విషాదానికి గురి అయితే ఇక ఎక్కువ కాలం బతకను .ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది .కనుక నిరాశ చెందటానికి నాకు ఏ కారణమూ కనిపించదు .’’

‘’ నాకు  దక్కినవన్నీ మీకు ఇచ్చి పోతున్నాను .నేనెలా జీవి౦చానో దాన్ని కూడా .నేను చాలా కన్సర్వేటివ్ ను అంటే సంప్రదాయ బద్ధుడిని .అవకాశాలున్నంత వరకు నేను నాతండ్రి నాకు వారసత్వంగా అందజేసిన  సనాతన సంప్రదాయాన్ని పాటించాను .ఆయన లాగా నేను కూడా ఒకే చోట కొన్ని దశాబ్దాలున్నాను కదలకుండా .ఆయనలాగే నేనూ నా అర్ధాంగిని ప్రేమించాను .కాని జీవితం లో ‘’ఒక వ్యక్తీ పై ఉన్న ప్రేమ’’ను మర్చి పోలేక పోయాను .నేను కా౦క్ష లున్న మనిషిని కాదు .ఇతరులకున్నదానికంటే నేనెప్పుడూ అధికం గా నాకు కావాలని కోరుకో లేదు .’’

‘’ అనుక్షణం  విధి నిర్వహణలో గడపటం వలన  నేను నా వెనుక జ్ఞాపకాల ఆస్తిని, కొన్ని సైంటిఫిక్  ఆర్టికల్స్   మాత్రమె నా వారికి వదిలి పెట్టి వెడుతున్నాను .నా జీవిత చరిత్ర రాసుకోవటం లో సఫలుడిని కాలేక పోయాను .’’ధీరీ ఆఫ్ ప్లాస్టిక్ మీడియం’’   ఉపన్యాసాలలో ,జ్ఞాపకాలలో ‘’చెల్లా చెదురుగా ఉండి పోయింది .దాన్ని పూర్తిగా కంఠతా పట్టలేక పోయాను .’’

‘’ఇదంత పెద్ద ప్రాముఖ్యమైన విషయ౦  కాదు  ఒక్కసారి గతం లోకి వెళ్లి చూస్తె నేను చేసిన పొరబాట్లు ,తప్పులు వైఫల్యాలు  కనిపిస్తాయి .అయితే వాటి గురించి ఎవరినీ క్షమాపణలు కోరను .జరిగిందేదో జరిగి పోయింది . నేనెంచుకొన్న నా మార్గం కఠిన తరమైనది .కాని అది తిన్నని రహదారి. రాజమార్గమే. నా అంత రాత్మకు వ్యతి రేకం గా ఏ ఒక్కపనీ చేయలేదునేను .ఎవరినీ మోసగించలేదు .ఎవరికీ ద్రోహం చేయలేదు .నాకు నేను విధేయుడిగా ఉండటం వలన ఇన్ని విజయాలు సాధించగలిగానని నేను విశ్వ సిస్తాను .నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదన్న సంపూర్ణ నమ్మకం నాకుంది .ఇది చాలు ఈ జీవికి .నేను చాలా సంత్రుప్తి కరమైన సార్ధక జీవితాన్ని గడిపాను .ఇంత కంటే కావాల్సింది ఇంకే ముంది ?

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘26(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

రామయ్య వెంకన్న దర్శనం

‘’ నాకు తెలియ కుండా ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి .అంతా మారిపోయింది .అంతా కొత్తగా కనిపిస్తోంది .అందులో చాలా నాకు తెలియని విషయాలే .నేను యిక్కడ యవ్వనం లో ఉన్నప్పుడు నాకేం తెలిసి౦ది కనక?ఉయ్యూరు ,మద్రాస్, కొలంబో .అప్పుడు ధిల్లీ అంటేనే బహుదూరం అని పించేది .ఇప్పడు ‘’అబ్ ధిల్లీ దూర్ నహీ ‘’అనిపిస్తుంది .బొంబాయి మరో దేశపు ఓడ రేవు అనిపించేది .ఇప్పుడే నా మాతృదేశం గురించి సరైన అవగాహన ,,పరిచయం కలిగింది .ఒక సరిహద్దునుంచి ఇంకొక సరిహద్దుకు జరిగింది నా పయనం .’’ఇండియా ఎలా అనిపిస్తోంది ?’’అని అడిగితె నా సమాధానం ఒక్కటే ‘’నేను మొట్ట మొదటి సారిగా ఇండియాలో ఉన్నాను ‘’అని .

‘’   ‘’ఏడుకొండలెక్కి  వేంకటేశ్వరుని దర్శించా .ఆశ్చర్యకరమైన చోటు. భౌతిక ఆరోగ్యానికి, మానసిక అనుభూతికి మంచి ప్రదేశం అది .అక్కడి ప్రక్రుతి సౌందర్యానికి ముగ్దుడనయ్యాను . కనులారా ఆ సౌందర్యాన్నిఆస్వాదించి  ఆరాధించాను .ఈ ప్రదేశం గురించి నాకు తెలుసు .నాన్న దీని గురించి కధలు గాధలుగా చెప్పేవారు . దేశం నలుమూలలనుంచి భక్తులు యాత్రికులు వచ్చి శ్రీ మహా విష్ణు స్వరూపుడైన బాలాజీని దర్శిస్తారు .ఈ రోజు  కూడా భక్త జనసముద్రం  పొంగిపోయి ఉందిక్కడ .దేవాలయ సందర్శనం తర్వాత ఆరోగ్య కేంద్రాలను దర్శించాను .ఎందుకిలా చేశానో తెలీదు .  .ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో తెలియటం లేదు .కొద్దికాలం లో ఈ అమూల్య అద్భుత  ప్రక్రుతి సంపద ఒక జాతీయ పార్క్ గా రూపు దాల్చి వర్కర్ల  విశ్రాంతి కి ,చికిత్సకు ఉపయోగ పడుతుంది  .’’

‘’నాకు కూడా ఇక్కడ విశ్రాంతి అనుభావి౦చాలనే ఉంది .ఈ ట్రిప్ ఉత్సాహం గా ఉన్నా ,బాగా అలసట అనిపించింది .ఒక అనుభూతి ముద్ర నుంచి మరో దానికి వెళ్ళే వీలు కనిపించలేదు .నాకు ఇండియా చూడాలని ,దాన్ని గురించి వినాలని ,అంతటినీ  జీర్ణించుకోవాలని అతి తొందరగా ఉంది .ఇదే మొదటి సారి ఇదే చివరిసారి వచ్చిన అవకాశం .అంతేకాదు ఎందరెందరితోనో చర్చలు సమావేశాలు జరుగుతూ ఉండటం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ,సమావేశాలలో,సభలలో  ప్రసంగించటం జరిగింది .అనేక సమస్యలపై  చర్చి౦చు కోన్నాం .వేల మైళ్ళ దూరం నుంచి ఇక్కడికి వచ్చాను ,నాకు అంతా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా అర్ధమైంది .ఇండియా అంతా ఒకే  దీర్ఘ దినం లో  చూశాను అన్న భావన కలిగింది .

భారతీయులలో చోటు చేసుకోన్నమార్పు

‘’ డిబేట్ లలో నేనేమీ బలవంతంగా నమ్మించటం కాని ,ఒప్పించటం కాని చేయ లేదు .నాదృక్కోణం లో విషయ వివరణ చేశాను అంతే.నేను చెప్పేదాని కంటే వినటానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాను .నాతొ సంభాషించేవారి గురించి నాకు ఎక్కువ తెలిసిందా లేక వారికి నా గురించి ఎక్కువ తెలిసిందా అంటే తేల్చి చెప్పటం కష్టం .చాలా సార్లు సంభాషకులు చెప్పింది వినటానికే ఎక్కువ అవకాశ మిచ్చాను .కాని నాగురించి ,,నా పరిశోధనాంశాల గురించి ,సోవియట్ దేశం గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేవాడిని .వీళ్ళకు నా దేశం గురించి ఎక్కడినుంచి ఎందుకు ఇంత  అభిమానం  కలుగుతోందో తెలియదు .నాకు తెలిసింది ఏమిటంటే వీరికి ప్రపంచం లో అన్ని విషయాలు కావాలి .ఇదే నవ భారత ప్రత్యేక లక్షణం .అయితే సోవియట్ రష్యా గురించి ‘’ అభిరుచి మాత్రం ప్రత్యేకం .సోవియట్ దేశ అభివృద్ధి వీరిని  ఒక అయస్కాంతం  లాగా ఆకర్షిస్తోంది .అణచి వేత  సృ౦ఖలా బద్ధమైన  రష్యా దేశం ఆ సంకెళ్ళు తెంచుకొని , వెనుకబాటు తనాన్ని అధిగమించి ,నిరక్షరాస్యతను పాతి బెట్టి ,ఆకలిని  రోగాల్ని అంతం చేసి,కొత్త బలీయమైన సర్వ  సమృద్ధద్ధమైన  పారిశ్రామిక దేశం గా స్వయం శక్తితో  మారిందని ఇక్కడి ప్రజలు గ్రహించారు .,భారదేశ ప్రజలు కూడా అలానే  ఇండియా బలీయమైన దేశం గా అభి వృద్ధి  చెందుతుందన్న    సంపూర్ణ  విశ్వాసం తో ఉన్నట్లు నాకు అనిపించింది .ఇదే నేను కోరు కొన్నది , నాపర్యటన పర్యవసానం అదే  అయినందుకు సంతృప్తిగా ఉంది’’ .

వెయ్యి డాలర్ల(రూబుల్) ప్రశ్న

‘’ చాలా మందికి నా స్వవిషయాలపై ఆరాటం ఎక్కువగా కనిపించింది .అందరూ తెల్ల వాళ్ళున్న రష్యా దేశం లో ఇండియన్ అయిన నేను అసాధారణ, అత్యున్నత శిఖరాలను  ఆ సంఘం లో అధిరోహించటానికి అవకాశాలు రావటం ,చాలా ముఖ్యమైన శాస్త్ర జ్ఞానం వృత్తిగా ఎంచుకోవటం ,అనేక  ప్రాజెక్ట్ లకు ,తీసుకొన్న విషయాలకు  జీవం పోయటం వారికి అమితాశ్చర్యాన్ని కలిగించింది .వారు దీన్ని ఊహించలేకపోవటమేకాదు ,గ్రహించనూ లేక పోయారు. ఇది ఆ దేశం లో ఒక ఇండియన్ కు సాధ్యమా అనుకొన్నారు .ఆ దేశం ఇతనికి ఇంతటి గొప్ప తనాన్ని కట్ట బెట్టిందా అనే సంభ్రమం లో నాభారతీయ సోదరులున్నారు .దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు .అది సరే ఎవరికీ దక్కని అరుదైన ‘’సుప్రీం సోవియట్ అవార్డ్ ‘’రామయ్యకు అందజేయటం ఏమిటి ?అనుకొన్నారు కూడా .కలయో వైష్ణవ మాయ యో లాగా ఉంది వారి పరిస్తితి .ఎందుకు సుప్రీం సోవియెట్ ఈ ఇండియన్ ను గుర్తించి ఆదరించింది ,అభిమానించింది తనవాడు అనుకొన్నది? ఇదే అగ్రాహ్యమైన విషయం .’’థౌసండ్ డాలర్(రూబుల్ ) ప్రశ్న ‘’ అయింది వారికి . దీనికి సమాధానం వారే తెలుసుకోవాలి రాబోయే కాలం లో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఆహ్వాన వైవిధ్యం

‘’అన్ని మీటింగులు ఒకలా లేవు .వృద్ధులు వేరొక విధం గా  కలిసేవారు. ప్రెస్ కాన్ఫ రెన్స్ లో అన్ని ప్రశ్నలూ స్నేహ పూరితంగా వేసే వారుకాదు .రైటిస్ట్ వాదులు వారి పంధాలో ప్రచురిస్తే ,మా బ్రాహ్నాలు సంప్రదాయంగా ప్రవర్తించారు .మా బంధువులు నా ప్రక్కన కూర్చునే వారు కాదు .ఒకే టేబుల్ మీద నాతొ భోజనం చేయలేదు .ఊరికే తల ఊపుతూ ఉండేవారు .కొత్త వాళ్ళు పాత తరం వాళ్ళూ స్నేహితుల్లా కలిసి ఉండలేరా ?అని అనిపించింది .ఇది వయసు వ్యత్యాసం ఒక్కటిమాత్రమే కాదు .ముసలి సన్యాసులలో  అందరూ దైవ సేవలో అంకిత భావం తో పని చేసేవారుకాదు .కొలంబో క్రిస్టియన్ ల లాగా వారిలో ఏదో ఉంది .వీరిలో నటన లేదు పూర్తిగా దైవ సేవలో నిమగ్నమయి ఉండేవారు .వీళ్ళతో మాట్లాడటానికి నాకు ఏ విషయమూ ఉండేదికాదు .’’ఈ నాటి పవిత్రకార్యం పోరాటమే ‘’అని వారికి ఎలా చెప్పగలను ?ఉరక లెత్తే సముద్రాన్ని  అందులో మునిగి ఈదటాన్ని వదిలేసి ,పగలును రాత్రి నుండి రక్షించుకొని , చావు నుండి నుండి  జీవితాన్ని రక్షించుకొని ,యుద్ధం నుంచి శాంతిని కాపాడుకోవటం మహత్కార్యం .ఎవరి జీవితాన్ని వారికిస్టమైనట్లు జీవించ వచ్చు. అభ్యంతరం లేదు .ఇలాంటి వారిని నేను  నిందించను .అంతమాత్రాన వారిని సమర్ది౦చనూ లేను .ఈ సారి వచ్చే యుద్ధం నిన్నూ నన్నూ ప్రపంచాన్ని కబళిస్తుంది .జాతీయత నినాదం అచ్సిరాదు.వీరిలో ఇండియాను నేను గుర్తించలేను .’’

స్వంత ఇంట్లో రామయ్య –బాలిక ఆత్మ హత్య

‘’మా ఇంటి దగ్గర ఉన్న  పాత బావి ని  నేను గుర్తుపట్టాను . నా చిన్ననాటి స్నేహితునిచూడటానికి వాళ్ళ ఇంటి   వైపు నడుస్తుంటే నా చెయ్యి పట్టుకొని ఆపేసింది మా బంధువులమ్మాయి .’’దయ చేసి వెళ్ళకు .అదొక విషాదం ‘’అంది  ఆమెకు సోదరి   వరుస అయిన  ఆవిడ విషాద గాధ వినిపించింది .ఆమెకు ఇష్టం లేకుండా ఒకడికిచ్చిఆమె పెళ్లి చేయాలనుకొన్నారు .పైగా ఆతను ఆమె  దగ్గర బంధువుకూడా .ఇష్టం లేని వాడిని కట్టుకోలేక ,మరో దారి లేక ఆ పిల్ల నూతిలో దూకి ప్రాణం తీసుకొంది .అప్పటి నుండి ఆ బావి నీరు ఎవరూ వాడటం లేదు .ఆ బావి పక్కనుంచి వెళ్ళే వారు విషాదం తో తల ఆడిస్తూ నడిచి వెళ్ళేవారు .నన్ను ఆపినా నేను వెళ్లి ఆ బావి ని చూశాను .ఆ నీటిలో నా ముఖం ,ఆకాశం ప్రతి ఫలించాయి .ఒక్క క్షణం నాకు ‘’అరె !నేను బతికే ఉన్నానే ?’’అనిపించింది .బతికి ఉన్నందుకు ఆనంద పడటం చూసి అభినందించాను. నాకు తెలియని ఆ బాలిక మరణానికి చింతించాను .పాత నూయి ఆమెను ఆహ్వానించింది గావుల్ను .

యాకమూరు పారిశ్రామిక వాడ

ఒక సారి కొదరు యువకులు కలిసి   మాట్లాడకుండా నావైపు  చూస్తున్నారు . వాళ్ల కళ్ళల్లో పెద్ద వారి కళ్ళల్లో కనిపించని వింత భావం ఏదో నాకు కనిపించింది .వాళ్లకు నేను కొత్త వాడినైనా ఆంధ్రుడిని అనిపించిందని అర్ధమైంది నాకు .ఇక్కడే ఒక చిన్న తమాషా జరిగింది .అందులో మెరిసే తెల్లని పలువరస తో ఉన్న ఒక కుర్రాడు నాదగ్గరకొచ్చి ‘’నాపేరు లాల్ గోవింద్ రామయ్య ‘’అన్నాడు .ఆశ్చర్యం తో అతని మొహం  లోకి తొంగి  చూశాను .ఏమైనా నాకు తెలియని ప్రపంచం లోకి నేను అడుగు పెట్టాను .నా ఉయ్యూరు పల్లె నుండి పట్నంగా మారింది .నేను పుట్టిన యాకమూరూ మారిపోయింది .పారిశ్రామిక వాడ గా కనిపిస్తోంది. అయితే అది స్థానిక వ్యాపారానికి సంబంధించినదే .అక్కడొక చిన్న ఫాక్టరీ దగ్గరకు వెళ్ళగానే నా అన్నగారమ్మాయి ‘’ఇదేమిటో తెలుసా ?అద్దకం ఫాక్టరీ .వాళ్ళు బాటిక్ (రంగుల డిజైన్లు )తయారు చేస్తున్నారు ‘’అంది .చిన్నప్పుడు నా తండ్రి అద్దకపు పరిశ్రమ గురించి చెప్పగా విన్నాను .ఇప్పుడిక్కడ డిజైన్లు రూపు  దిద్దు తున్నారు .’’అద్దకమా –చాలా బాగుంది ‘’అన్నాను .అది తయారు చేసే వాళ్ళను చూడాలని ఉంది అన్నాను .ఇద్దరం  ఫాక్టరీ లోకి వెళ్లాం .

ఇదొక చేనేత పరిశ్రమ .ఇప్పుడు కొత్త పద్ధతులలో శక్తి వంతమైంది పని చేసే చోటుకు వెళ్లి పరిశీలించాను యువకులు యువతులు వాట్ మన్ పేపర్ మీద ఆభరణాల డిజైన్లు వేస్తున్నారు .నేర్పే మాస్టారు వారి పని తీరును నిశితంగా పరిశీలిస్తున్నాడు .ఈ కళ ఎవరి దగ్గర నేర్చుకోన్నావు అని అతన్ని అడిగాను .అతనుఇక్కడే ఎప్పుడో చేరి పని చేసిన తన తాత గారి నుండి ఈ విద్య నేర్చుకోన్నానని చెప్పాడు .ఎప్పుడో ఒకప్పుడు  తనను కూడా ఇక్కడికి వచ్చి పని చేయమని ఆ ముసలాయన చెప్పాడని అన్నాడు .ఇక్కడ నేర్చే యువకులు  శక్తి యుక్తుల్ని బాగా ఉపయోగించి అంకిత భావం తో పని చేస్తున్నారు అని తెలుసుకొన్నాను .’’ఈ పనికి డిమాండ్ బాగా ఉందా ?’’అని అడిగాను .అప్పుడు మేష్టారు ‘’రామయ్య గారూ !ఈ పిల్లలంటే నాకు అమితమైన అభిమానం .నేను నా తండ్రికంటే ఏంతో గొప్ప పని మంతుడిని అయ్యాను .అలానే వీళ్ళూ ఈ గురువును మించిన శిష్యులవ్వాలని నా కోరిక .’’అన్నాడు తర్వాత అక్కడే ఉన్న వర్క్ షాప్ కు వెళ్లాను. అక్కడ మిరుమిట్లు గొలిపే ఇంద్ర ధనుసు రంగులున్నాయి.. తల  ఆడిస్తూ ముందుకు సాగిపోయాను .మధ్యమధ్యలో ‘’ఎంత గొప్ప డిజైన్ ?రంగులు యెంత అద్భుతంగా ఉన్నాయి ?అనే వాడిని .నా మాటలు నాకే నవ్వు తెప్పించేవి .నా మాట తీరు రష్యన్ యాస తో ఉండేది .నాకు ఇస్టమైనదాన్ని ఎంచుకోమని మాస్టారు కోరారు .చాలా వింత అయినదాన్ని ఎంచుకొన్నాను .మాస్టారు ఆశ్చర్యపడి ‘’ఇది మీకు గుర్తుందా ?ఈ మాదిరి (మోడల్ )నా చిన్నతనం నుంచి ఉంది ‘’అన్నాడు నవ్వుతూ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమీనపురం సాయిరాజుగారి కవితలు

sayraj1 001 sayraj2 001అమీనపురం సాయిరాజుగారి కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షేత్రాలు పుస్తకం పై రామచంద్రాపుర వాసి ఆదిశేషా రావు గారి స్పందన

spandana 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)

ఆత్మీయ స్వాగతం –     పుష్ప వృష్టి

‘’అందరూ వచ్చి వరుసగా నా మెడలో దండలు వేస్తున్నారు .పుష్ప వృష్టి  కురిపిస్తున్నారు ఆ పూలలో నన్ను ముంచేశారు .ఆ పువ్వుల పరిమళం తో బాటు వారందరి ఆత్మీయ సురభిళం నన్ను పరవశింప జేసింది .ఈ’’ హార భారం  ‘’ నేను మోయలేనంత బరువుగా ఉంది. కుంగి పోతానేమోనని పించింది .దాదాపు అన్నిరంగుల ,రకాల దండలూ కలిపి 45 దాకా ఉండచ్చు .ఒక పెద్దాయన నాదగ్గరకు వచ్చి వంగి నమస్కరించి ‘’లాల్ గోవింద్ ! నేను గుర్తున్నానా ?మనిద్దరం స్కూల్ లో కలిసి చదువుకొన్నాం ‘’అన్నాడు .’అరే భగవాన్ ! స్కూల్ లోనా ?అని ఆశ్చర్య పడ్డాను .నెమ్మదిగా జ్ఞాపకం వచ్చి పలకరించాను .యెంత అభిమానం నా మీద ?ఇంత దూరం నాకోసం వచ్చాడా శ్రమపడి అనుకొన్నాను .నిజంగా అతను నాకు జ్ఞాపకం లేడు. కాని ప్రేమగా పలకరించి కబుర్లు అడిగాను .నాకు గుర్తున్నదల్లా’’ కుమార్ ‘’ఒక్కడు మాత్రమె .దయ గల అతనికళ్ళు,వణికే చేతులు ఆప్యాయంగా నన్ను చుట్టేసుకోవటం జ్ఞాపకమున్నాయి  ఆతను ఉన్నాడా?ఏం చేస్తున్నాడు ?ప్రశ్నలు నాలోసుళ్ళు తిరిగాయి ,అప్పుడు నాలో ఏదో కొంత భాగం జాగ్రుతమైంది .ఇండియా అంతా ఇక్కడికి రాలేదుకదా ! సముద్రం దాటి బయటి దేశాలకు వెళ్ళిన నన్ను సాంప్రదాయ బ్రాహ్మణులు  ఆహ్వానిస్తారా ?అని ప్రశ్నలు నాలో చెల రేగాయి .’’

‘’  కమ్యూనిస్ట్ లు , వామ భావ సంస్థల వారు నాకు  ఆత్మీయంగా  స్వాగతం పలికారు .ఇప్పుడు అంతా బాగానే ఉంది .పరిస్తితులు  సర్దుకోన్నాయనిపించింది .నేను నిజమైన భారత దేశం లోనే ఉన్నాను ,ఏదో ఊహా  లోకం లో లేను అని తెలిసింది . కమ్యూనిస్ట్ లు  వామ పక్షాల వారు ఉన్నారు అంటే ఇండియాలో రైటిస్ట్ భావాల వారూ ఉన్నారన్నమాట .కనుక ఇండియా కు మార్గం అంత సులభమైనదికాదు అనుకొన్నాను .ఈ కళ్ళు ,ఈ నవ్వులు నాకు చిరపరిచితాలే  .జో ,అలేక్సీలు ,గుయనీస్ చెడ్డి అందరు ఒకసారి గుర్తుకొచ్చారు .దయా హ్రుదయుడు దేనికీ లొంగని స్వభావుడు అయిన మా నాన్న ఆత్మబలం ,స్థిర సంకల్పం జ్ఞాపకం వచ్చాయి .మానవ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అది పొందిన ప్రతి దాన్నీ విసర్జించటం కాదు ,దూరం గా ఇంకా దూరంగా ముందుకు వెళ్ళటమే .భారత దేశమా మళ్ళీ మనం కలుసుకొన్నందుకు మహదానందం గా ఉంది ‘’.నా సోదర సోదరీమణులారా !ఇదిగో నేనొచ్చేశా .మీ ముందున్నా.నేనే నేను నేనే . భారతీయుడిని ,సోవియెట్ యూనియన్  పౌరుడిని .అందుకే నేను మీకు ‘’హలో బ్రదర్’’ లా ‘’డబుల్ బ్రదర్’’ ని .తేడా ఏమీ లేదు .ఒక వ్యక్తికీ రెండు మాత్రు దేశాలు ఉన్నాయి అంటే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రజలంద మాతృదేశం అవుతుందన్నమాట .’’

‘’మీ ముందు నేను వినమ్రంగా నిలబడి ఉన్నాను .ఈ భూమిమీదనే నిలిచి ఉన్నాను  .కాని నా పాదం ఒకటి ఇండియా లో ,రెండవది రష్యాలో ఉంది .ఈ రెండు స్థిరమైన బలమైన ఆధారాల మీదనే నిలిచి ఉన్నాయి .ఇలా నిలబడి చూస్తుంటే భవిష్యత్తు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది .ప్రకాశ వంతమైన ప్రపంచాలు  నాముందు ఆవిష్కారం అయినట్లు గోచరిస్తోంది .అవి ‘’స్ప్రింగ్ బీటిల్స్ ‘’లాగా ‘’స్పుత్నిక్ ‘’ల లాగా నా చుట్టూ  ఎగురు తున్నట్లు అనిపిస్తున్నాయి .నా భుజాలపై వెలుగు లీనే సప్త వర్ణ ఇంద్ర ధనుస్సు   కాంతు లీను తోంది .సూర్యుడిని నా దోసిట్లో పట్టుకొన్నాను  .అది భూమిపై వెచ్చదనాన్నిఅందరికీ అందిస్తోంది .’’

ఎంత భావ గర్భితం గా కవి తాత్మకంగా రామయ్య గారు తన అనుభూతిని వివరించారో మనకు తెలుస్తోంది ఆయనలో ఒక సైంటిస్ట్ మాత్రమేకాదు ఉత్తమ భావుకుడు ఉత్తమకవి మనకు దర్శన మిస్తారు .  .

భారత్ లో యాత్రా సందర్శనం

‘’ఇండియాలో నా పర్యటన అంతా ఎక్కడా ఆపులేకండా నాన్ స్టాప్ గాఉత్సవంలాగా  సాగిపోయింది .దీనికి నేను ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో అర్ధం కాలేదు .అదృష్టం అందామా అంటే నాకు దానిపై నమ్మకం లేదే !దేవుని దయ అనుకొందామా అంటే నా ఒంటికి వాళ్ళు పడరే .’’చాన్స్’’ అను కొంటె ఏ సమస్యా ఉండదు .నా పర్యటనను ప్రగతి శీల వ్యక్తులు,సంస్థలు ఏర్పాటు చేసి నిర్వహించారు .రోజులు గడుస్తున్న కొద్దీ నాకు నమ్మకం కుదిరింది .ఇండియాకు నాపై నమ్మకం కలిగింది అనుకొన్నాను . అవును అది సాధ్యమే .అతను చేయ గలిగాడు .మనం కూడా చేయగలం .అతను సాధించాడు అన్నీ. మనమూ ప్రయత్నం చేస్తే సాధించి తీరుతాం అనుకొన్నారు ప్రజలు నన్ను చూసి  అనిపించింది .

‘’  ఆంద్ర దేశం లో  నా స్వగ్రామం ఉయ్యూరు వెళ్ళేదారిలో మా రైలు అనుకోకుండా ఒక చోట ఆగింది .అక్కడేమైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోననుకోన్నాను .అది యాక్సి డెంట్ ను మించిన విషయం అయింది .రైతు ప్రతినిధులు మా కంపార్ట్ మెంట్ లోకి ఒక్క సారి దూసుకు వచ్చారు .నా దగ్గరకొచ్చి ఆత్మీయ స్పర్శ తో కౌగిలించుకొని  నాపేరు చెక్కిన విలువైన గడియారాన్ని నాకు కానుకగా ఇచ్చారు .ఎవరు వీళ్ళు ?నన్నెప్పుడూ చూడలేదే ?అందులో ఏ ఒక్కరూ నాకు తెలిసిన వారు కాదే?నేను వస్తున్నట్లు వాళ్లకు ఎలా తెలిసింది ?అదీ నాకు తెలియ లేదు .రైలు ఆగటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ?నాకు అసలేదీ తెలియదు .వాళ్లకు నేనొక’’ ప్రతీక ‘’ను అయ్యాను  అనుకొన్నాను .కీర్తి చాలా బరువైనది .మళ్ళీ పూల దండలు ,అభి మానపు పలకరింపులు ,పూల జల్లులు . కృతజ్ఞత తో  తడిసి ముద్ద అయ్యాను.ఇంతటి అభిమానానికి నేను అర్హుడినా?మొదలైన  ప్రశ్నలు  నన్ను కలవర పెడుతున్నాయి . వంగి వంగి నమస్కారాలు, కులాసా పలకరింపులు , ,స్వాగతాలు అన్నీ ఆర్భాటం గా ఉన్నాయి .వారిలో ఏదో తెలీని ఉత్సాహం ,ఉత్సుకత ,ఆనందం తాండవిస్తోంది .అభిమానం కురిపించి మరీ నన్ను కుంగ దీసేస్తున్నారు .అ మనుషుల కళ్ళు తలలు ముఖాలు నవ్వులే నాకు కనిపించాయి .ఇంతకంటే మహోత్కృష్టమైన ఆనందం ,సంతోషం ,అనుభూతి మరెప్పుడూ నేను అనుభవించలేదు .మనసంతా ఆనంద కోలాహలం గా ఉంది .ప్రతి సారీ నాకు యువకులే కనిపిస్తున్నారు .వాళ్ళను చూస్తుంటే నేనూ యువకుడిగా మారిపోయానని పించింది .ఇండియా నుండి మళ్ళీ మాస్కో చేరిన తర్వాత నాకు సన్నిహితులు నవ్వుతూ ‘’మీరు అక్కడ ముసలి తనాన్ని వదిలేసి యవ్వనాన్ని మోసుకొచ్చారు ‘’అని జోక్ చేశారు దానికి నేను ‘’అవును .నిజమే .నేను యాభై ఏళ్ళు  వెనక్కు వెళ్లాను ‘’అన్నాను నేనూ నవ్వుతూ .అంతటి ఉత్సాహం నాకు నా ఇండియా ప్రయాణం కలగ జేసి నన్ను యవ్వన వంతుడిని చేసింది మానసికం గా .ధన్య వాదాలు భారత మాతా ధన్యవాదాలు ఆంద్ర మాతా ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆకాశ కవచం మరియు భారత్ భూఫలకానికి అంత వేగం ఎందుకు/

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పోరాటమే నా మనో బలం -కేశవ్ రావు జాదవ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేపాల్ బాధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి నాటి ఆశలు నెరవేరేనా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“బోస్ ” వీరులు -భూలాభాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23

రామయ్య గారి సాహిత్య కృషి

ఏటుకూరి బలరామ మూర్తి రాసిన ‘’ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ది హిస్టరి ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంద్ర ‘’అని పుస్తకాన్ని రామయ్యగారు రష్యన్ భాషలోకి అనువదించారు ఈ అనువాదానికి జోర్యా పెట్రుచినోవా ,అనే తెలంగాణా ఉద్యమ విద్యార్ధి సహకరించాడు .అతనే మొట్టమొదటి సోవియెట్ ఫైలాలజిస్ట్ .ఆతను తెలుగు భాష ,సాహిత్యం లో ప్రత్యేక  కృషి చేశాడు రష్యన్ అనువాదం 1956 లో మాస్కో లో ప్రచురింపబడి విడుదలయింది .రామయ్య గారు మొదటి తెలుగు –రష్యన్ నిఘంటు నిర్మాణానికి కృషి చేశారు .దీనికి కొందరు ఇండాలజిస్ట్ లు స్వెత్లానా జీనిట్ ఆధ్వర్యం లో సహకరించారు .

‘’  ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు విజ్ఞానపు  వెన్నెలొచ్చెనమ్మా ,వెల్లువచ్చే నమ్మా ‘’

రామయ్య గారి మాటల్లో ఇండియా సందర్శన విశేషాలు

‘’1963 ఏప్రిల్ లో విమానం ధిల్లీ లో దిగింది .బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుంది .అంత వేడిని నేనెప్పుడూ భరించలేదు .ఉత్తర దేశాలలోనూ ఇంత ఎండ చూడలేదు .ఏం చేయాలో పాలుపోలేదు .ఎవరొ ఒకరు కరు  నన్ను  కలవటానికి వస్తారని ఎదురు చూస్తున్నాను .రష్యన్ ఎ౦బసీకి మాత్రమె నా రాక తెలుసు .బంధువులనుండి అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్ లు అందాయి . వారెవరో  నాకు పూర్తిగా తెలియదు .భగవంతుడికే తెలియాలి ఆ బంధుత్వం .దాదాపు అర్ధ శతాబ్దకాలం  ఈ నేల మీద అడుగు పెట్టనే లేదునేను .

విమానం దిగుతూ మెట్లమీద కొంత గందర గోళం లో నేను నిలిచిపోయాను .ఎదుట జనం బాగా ఉన్నట్లు కనిపించారు .వారందరూ  ఎవరికోసమో  వచ్చినవారు అనిపించింది .నాకోసం అని నేననుకోలేదు  నావెనక ఎవరైనా ఉన్నారేమో చూశాను. కాని ఎవరూ లేరు .నేనే విమానం దిగిన చివరి వాడిని .అప్పుడు తెలిసింది ఈ వచ్చిన వారంతా నాకోసమే, నన్ను కలవటానికే  వచ్చారని .అక్కడ చేరిన జనం నవ్వుతున్నారు .కొందరు పాటలు పాడుతున్నారు .వారందరూ యువకులే అనిపించింది ఆ క్షణంలో .అన్ని వయసుల వారూ అందులో ఉన్నారు .మగ వారు ,ఆడ వారూ కనిపించారు .అందరు అత్యుత్సాహం గా నాదగ్గరకు వచ్చి స్వాగతం చెప్పారు .నాకు ఉక్కిరి బిక్కిరి అయింది .ఆనందం కలిగింది .కంగారు పడ్డాను .విచిత్రం ఏమిటంటే అందులో ఎవరూ నాకు తెలిసిన వారు లేరు  .అంతమంది అంత ఉత్సాహం గా అక్కడ చేరి నాకు  మనస్పూర్తిగా ఆహ్వానం పలకటం నేనెప్పుడూ చూడలేదు .కాసేపు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాను .కాసేపటికి తేరుకొని వచ్చిన వారిలో ఎక్కువ మంది నా బంధువులు కూడా ఉన్నారని తెలుసుకొన్నాను .అర్ధ శతాబ్దం తర్వాత వచ్చిన నాకు వారందరూ కొత్త వారే .కాని అక్కడున్న వారిలో నా ఆంద్ర జనం చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది .అక్కడ చేరిన వారిలో ధిల్లీ వాసులు తమిళులు ఎక్కువ మంది ఉన్నారు .కేరళ నుంచి వచ్చిన వారూ ఉన్నారు .అప్పుడు నాకు ‘’ భారత మాత ‘’నన్ను ఆహ్వానిస్తోంది అనిపించింది .ఒక ఆవిడకు వంగి నమస్కరిస్తే ఆమెకూడా అలాగే చేసింది .ఆమె నవ్వింది .రెండు చేతులు జోడించి సంప్రదాయ బద్ధం గా నమస్కరించింది .’’మీకు కృతజ్ఞులం లాల్ ‘’అన్నదామె .వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్పటం ఏమిటి అని పించింది .ఇన్నేళ్ళు అయినా నేను నా భాషను ,ఆచార వ్యవహారాలను మర్చిపోలేదని తెలుసుకొన్నాను .నేను వచ్చింది నాకు ఆరంభాన్నిచ్చిన ఈ నేలకు నేను గౌరవ వందనం ,కృతజ్ఞత చెప్పాలని  . వాళ్ళను మర్చిపోలేదని ,తేలిక భావం తో చూడలేదని వారు గ్రహించారు. వాళ్ళ ఆశలను వమ్ము చేయ లేదని సంతోషించారు .వాళ్ళు అనుకొన్నట్లు నేను తాసీల్దార్ కాలేక పోయానని  ,పనికి రాని  పువ్వుగా ఉండిపోలేదని తెలుసుకొన్నారు .నన్ను చూసినందుకు వారందరికీ సంతోషం సంతృప్తి కలిగింది .నా జీవితం ఆ దేశం లో వ్యర్ధం కాలేదని పొంగిపోయారు .నేను నా జీవితం లో ఇండియాకు రష్యాకు సమానంగా చెందినా వాడిలాగానే ఉన్నాను .భారత మాత పుత్రుడొకడు రష్యాలో ప్రసిద్ధు డయ్యాడని వారు తెలిసి సంబర పడ్డారు .నన్ను చూసి గర్వ పడ్డారు .నాలో వారు  కష్టమైన మార్గం లో పయనించి సత్యం ,సంతోషం లకు చేరువయ్యే భారత దేశాన్ని చూశారనిపించింది   ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మాయాకురంగం – హుళ్ళక్కి భాస్కరుడు

scan0002 scan0003 scan0004

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య

1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ ‘’పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు అందులో రామయ్యగారు భౌతిక ,రసాయన శాస్త్రాలలో చేసిన కృషిని వివరిస్తూ ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రస్తుతించాడు ఇంటర్వ్యు చేసిన అయన .రామయ్య గారు తన  ఫ్లాట్ లో తరచుగా ఇండియన్ ,రష్యన్ స్నేహితులతో కలిసి మాట్లాడేవారు .’’ఓరియెంటల్ స్టడీస్ ‘’,ఇండాలజీ ‘’లకు చెందిన విద్యార్ధులు వచ్చి తెలుగు నేర్చుకొనేవారు రామయ్యగారి వద్ద .’’ప్రోగ్రెస్ ‘’అనే ప్రచురణ సంస్థ రామయ్య గారి దగ్గరకు వచ్చి ,తమ ఇండియా ప్రచురణల పై ,ఇండియాను గురించి తెస్తున్న ప్రచురణలపై సలహాలు తీసుకొనే వారు .సంప్రదింపులు  జరిపే వారు . వారందరికీ భారతీయమైన సంప్రదాయమైన ఆతిధ్యం ఇవ్వటం రామయ్య గారి ప్రత్యేకత .వారు అడిగే ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పేవారు .అవసరమైతే ఇండియా పై,సోవియట్ పై  ఉపన్యాసాలు చేసేవారు .వచ్చిన అతిధులకు తెలుగు జానపద గీతాలను రికార్డ్ ప్లేయర్ పై వినిపించి ఆనందం కలిగించేవారు .ఇండియా నుంచి వచ్చే రష్యా యాత్రికులూ క్యూ కట్టే వారు .అందరికి చిరునవ్వు తో ప్రశాంత వదనం తో భార్య కాత్యా ఆతిధ్యమిచ్చేది .ఆమె వారందరికీ ‘’రష్యన్ సీత ‘’ అయి పోయింది .ఆమె వికసిత నీలి కనులతో  ,అందమైన నల్లని కురుల మధ్యలో తెల్లని  పాయలలతో ,చెరగని చిరు నగవుతో ,గాంభీర్య వదనం తో అపర అన్నపూర్ణా దేవి అనిపించేది .కాత్యా కాదు ఆత్మీయులకు ‘’కాత్యాయనీ దేవి ‘’అనిపించేది .వాళ్లకు ఆంధ్రా రామయ్య- రష్యన్ ఆంధ్రుడుగా ,సోవియెట్ ఆంధ్రునిగా, మాస్కో ఆంధ్రునిగా  దర్శనమిచ్చేవారు. ఆ అనుభూతి పొంది వారు ధన్యులమయ్యాం అనుకొనేవారు .సోవియట్ ప్రజలు ఆయన్ను ‘’కాన్ స్టాన్టిన్, సెర్జియో విచ్ ‘’అనే రష్యన్ పేరుతొ సంబోధించేవారు .కాని ఉత్తర ప్రత్యుత్తరాలలో ‘’రామయ్య’’ అనే సీతారామయ్య గారు రాసేవారు .అందుకని రామయ్య పేరే అందరికి బాగా పరిచయమై  ప్రాబల్యమైంది .

రామయ్యగారి మహోన్నత మూర్తిమత్వం

రామయ్య గారి మర్యాదపూర్వక సౌజన్యానికి అందరూ ముగ్దులయ్యేవారు .ఎక్కడా ఎప్పుడూ ఆయనలో’’ ఈగో ‘’అనేది కనిపించేదికాదు .ఈగో ను ‘’గో ‘’అని తరిమేసిన పెద్దమనిషి రామయ్య .యెంత పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులోచ్చినా ,ప్రసిద్ధ శాస్త్ర వేత్తలు వచ్చినా వారితో అనువుగా, చనువుగా, అణకువగా సంచరించేవారు .ఆధిక్యం ఏ కోశానా కనపరచేవారుకాదు .రామయ్య గారు డబ్బు మనిషి కాదు. సంపదల వెంట పరుగులు తీయ లేదు .ఆయన ఉన్న అపార్ట్ మెంట్ లో కనీస సౌకర్యాలు మాత్రమే ఏర్పాటు చేసుకొన్నారు ఇండియా నుంచి వచ్చిన వారు అందజేసిన బహుమతులు ,ప్రతిమలు ,అల్లికలు , కేలెండర్ లు విలువైన తెలుగు గ్రందాలతో  ఫ్లాట్ నిండిపోయి ఉండేది  .వారికి  తెలుగు  మహాకావ్యాలలోని తనకిష్టమైన    పద్యాలను  మరీమరీ చదివి వినిపించేవారు . తనకు అభిమానులైన మహాకవి తిక్కన ,మధురకవి బమ్మెర పోతన ల రస గుళికల వంటి వందలాది పద్యాలు రామయ్యగారికి కంఠతా ‘వచ్చు .కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద ప్రబంధం అంటే ఆయనకు పరమ ప్రీతీ .అందులోని ప్రతిపద్యం, తాత్పర్యం లోతైన విషయాలు ఆయనకు కరతలామలకాలే .సంప్రదాయ సాహిత్యం అంటే ఎంతటి’’ మోజు’’ ఉండేదో రామయ్య గారికి, విప్లవ భావాలతో శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తాన గేయాలన్నా అంతటి ‘’క్రేజు ‘’ఉండేది .అందులో గీతాలను గుక్క తిప్పుకోకుండా అప్పగించినట్లు ఉదాహరిస్తూ చెప్పి ఆశ్చర్య పరచేవారు .కవిత్వం పై అంతటి సమ ద్రుష్టి ఆయనది .కొడవటిగంటి కుటుంబరావు రాసిన వాస్తవ నవలలు ఆసక్తిగా చదివారు .

యువజన విద్యార్ధి బృందానికి ఆతిధ్యం

కాట్రగడ్డ గంగయ్య అనే ఆయన ముగ్గురు యువకులతో ఆంద్ర దేశం నుండి మాస్కో నగరానికి 1957 లో’’ ‘’ ఆరవ ప్రపంచ యువ జన విద్యార్ధి ఉత్సవాలకు ‘’ వచ్చి రామయ్యగారిని దర్శించి అమితానందాన్ని పొందారు .వాళ్ళు హోటల్’’ ఆస్టాన్ కినో ‘’లో ఉండి రామయ్యగారికి ఫోన్ చేశారు .ఫోన్ నంబర్ ను ‘’అతడు –ఆమె ‘’నవలా రచయిత  రష్యాలో అనువాదకుడిగా పని చేసిన ఉప్పల లక్ష్మణ రావు గారి నుండి తీసుకొన్నామని రామయ్య గారికి చెప్పారు .ఫోన్ అందుకొన్న రామయ్య గారు అచ్చమైన తెలుగులో ‘’నమస్కారం గంగయ్య గారూ !మా ఊరికి ఎప్పుడోచ్చారు?’’అని కుశల ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకొన్న మనసున్న మనిషి. వారు రామయ్య గారిని తామున్న  చోటుకు రావద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ,అప్పటికి తనకున్న ఎంగేజ్ మెంట్ లనన్నిటిని రద్దు చేసుకొని ,తన కూతురు లీలావతి ని  వెంట తీసుకొని ఒక గంట లోపే హోటల్ కు చేరారు .వాళ్లకు కూతురిని పరిచయం చేస్తూ ‘’ఈమె లీలావతి మా పెద్దమ్మాయి .వ్యవసాయ శాస్త్రం చదువుతోంది .’’అని కమ్మని తెలుగులో చెప్పారు .తెల్లబోయారు గంగయ్య .ఒకరికొకరు బాగా పరిచయమై వివరాలన్నీ మాట్లాడుకొన్నారు .వారిమధ్య సంభాషణ తెలుగులోనే దాదాపు జరిగింది .ఆంద్ర నుండి వచ్చిన వారికి మాట్లాడేటప్పుడు  సరైన తెలుగు మాట  స్పురించక పొతే రామయ్య గారే వెంటనే సరైన మాట చెప్పి ఆశ్చర్య పరచేవారు .గంగయ్య బృందం పదిహేను రోజులు ఉంది మాస్కో లో తరచూ వీరితో సమావేశామయేవారు .రామయ్యగారి ఫ్లాట్ కు వచ్చి ఆతిధ్యం తీసుకొన్నారు . కాత్యా వారందరికీ ఆంధ్రా వంటకాలు చేసి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టింది .రామయ్య గారి స్టడీ రూమ్ లో తెలుగు దినపత్రికలైన ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ,విశాలాంధ్ర కట్టలు కట్టలుగా ఉండేవి .ఇందులోకొన్ని 1930 కాలం నుండి కూడా ఉన్నాయి. వీటిని ఇంత భద్రం గా బంగారంగా దాచుకొన్నారు ఆంధ్రాభిమాని రామయ్య .అవన్నీ అప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా ఉండేవి .ప్రతి సంచికా దాని ప్రత్యేకత కలిగి ఉండేది .అదొక అక్షర నిధి .అందుకే రామయ్య అంత జాగ్రత్తగా పదిల పరచుకొన్నారు .గ్రామఫోన్ లో  తెలుగు పాటలు వారికి వినిపించారు .వీరినీ వీరితో బాటు వచ్చిన యువజన విద్యార్ధి బృందాన్ని తాన ఇన్ ష్టి ట్యూట్ కు ఆహ్వానించి అక్కడ జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కలిగించారు . రామయ్య గారి యెడల ఆయన సహచరులు చూపిన గౌరవ మర్యాదలకు,ప్రేమానురాగాలకు  అతిధులు ఆశ్చర్య పోయారు .అక్కడి’’ టోస్ట్’’ ను స్వీకరించి న తర్వాత అతిధులను రామయ్యగారు మాట్లాడమన్నారు ‘’మీరు తెలుగులో మాట్లాడండి .నేను రష్యన్ లోకి తర్జుమా చేసి వారికి తెలియ జేస్తాను ‘’అని చెప్పి అలానే చేశారు .గంగయ్య గారి బృందం రామయ్య గారితో ‘’అయ్యా రామయ్య గారూ ! దయ చేసి ఒక సారి మనదేశం ఇండియా ను సందర్శించ వలసినదిగా  వినయ పూర్వకం గా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం ‘’అని ప్రార్ధనా పూర్వకం గా వేడుకొన్నారు .’’ .కాలం కలిసి వచ్చినప్పుడు  తప్పకుండా వస్తాను ‘అని క్లుప్తంగా సమాధానం చెప్పారు రామయ్య . దటీజ్ సీతా రామయ్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

పోస్టల్ బాంబ్ ?

విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో ఉండే స్నేహితుల నుండి వచ్చింది .దానిపైన పొగలుకక్కే ఒక గుండ్రని బాంబు బొమ్మ దాని ,కింద  ‘’జాగ్రత్త .ఒక గ్రెనేడ్ ను పంపుతున్నాం ‘’అని రాసి ఉంది. టెన్షన్ మొదలైంది .ఒక రోజు తరవాత ఒక పార్సిల్ వచ్చింది .విప్పి చూస్తె అందులో పళ్ళు ,దానిమ్మ పళ్ళు ఉన్నాయి .ఒక హెచ్చరిక కూడా రాసి ఉంది ‘’కొత్త విధానం లో మీరు నిర్వహించిన పరీక్షలు దిగ్విజయం అయినాయని తెలిసి సంతోషం తో అభినందిస్తున్నాం .త్వరలో ప్రోటోకాల్ పంపుతున్నాం .drink to your health ‘’అని చదివి అందరూ తేలికగా హాయిగా ఊపిరి  పీల్చుకొన్నారు .సైంటిస్ట్ రామయ్య’’ సక్సెస్ రామయ్య’’అయ్యారు .

రామయ్య గారింటికి  భారతీయల రాకపోకలు

యాభవ దశకం లో (1950) ఇండియా నుంచి ఎక్కువగా భారతీయులు మాస్కో కు రావటం ప్రారంభించారు .ఇందులో సైంటిస్ట్ లు ,వివిధ విషయాలలో స్పెషలిస్ట్ లూ ,రిసెర్చ్ స్కాలర్లు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,విద్యార్ధులు ఉన్నారు .కళాకారులు రచయితలూ వచ్చేవారు .అందులో రామయ్య గారి ఆంద్ర దేశ బంధు గణమూ ఉండేది .

రామయ్య గారి  తెలుగు నిఘంటు నిర్మాణం

అనుకోకండా ఒక సారి రామయ్యగారు తెలుగు నిఘంటు నిర్మాణం ప్రారంభించారు .దీనితో పరిచయాలు మరీ  విస్తృతమైనాయి .భాషా శాస్త్ర వేత్తలు ,భాషా తత్వ శాస్త్ర్జులు (ఫైలాలజిస్ట్ లు ),అనువాదకులు ఇంటికి వచ్చి చర్చలలో పాల్గొనేవారు .తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష గల విద్యార్ధులు వచ్చి రామయ్యగారి వద్ద తెలుగు నేర్చుకొనేవారు .ఒక సారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రష్యన్ భాషలోకి అనువదించమని కోరటం జరిగింది .చాలా సంతోషం గా దీన్ని నిర్వహించారు .ఇండో రష్యన్  ప్రజలు పరస్పరం అర్ధం చేసుకొని సహకరించుకోవాల్సిన అవసరం ఏంతో ఉంది అనిపించింది .మంచి స్నేహితులు ,ఇండాలజిస్ట్ లు ఆయనతో కలిసి పని చేసేవారు .తనను వారందరూ జ్ఞాపకం చేసుకొంటూనే ఉంటారని ,మనసులలో ఆత్మీయ భావాన్ని చూపుతూ ఉంటారని భావించారు రామయ్య .

అన్నపూర్ణ గృహం

మాస్కో వచ్చిన ప్రతి భారతీయుడు తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది స్వంత ఇంట్లో ఉన్న అనుభూతికి లోనయ్యేవారు .అప్పటికే రామయ్యగారికి 78 ఏళ్ళు వచ్చాయి .వయసురీత్యా తాను  ఇండియన్ కమ్యూనిటీలో పెద్ద వాడినని అనుకోవటం లేదన్నారు .అంతేకాదు తాను  ఆ జన సమూహం లో లేరు కూడా .తానొక సోవియట్ పౌరుడినని ,ఇదే తన ఇల్లు అని అనుకొనేవారు .అయినా ఇండియా నుంచివచ్చే యువకులు , వృద్ధులు రామయ్య గారింటికి వచ్చి టీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకొని వెడుతూ ఉండేవారు .వారందరికీ తను పెద్ద అంతే .వారిని చూడటం వారితో మాట్లాడటం రామయ్యగారికీ ఎక్కువ సంతోషంగా నే ఉండేది .వారంతా తన సోదరులనుకోనేవారు. తాను  పెద్దన్న .ఇన్నేళ్ళుగా తాను  రష్యాలో ఉంటున్నా తన మాత్రుదేశమైన తెలుగు దేశం తెలుగుభాష సంస్కృతీ ,పద్ధతులను మరచిపోలేదని గర్వంగా రామయ్య గారు చెప్పుకొన్నారు .వారికి సదా ఆహ్వానం అనేవారు రష్యన్ పద్ధతిలో వారికి ఆతిధ్యమిస్తాను అన్నారు .భారతీయ సంస్కృతికి దూరం కాలేదన్నారు .తనకు జన్మ నిచ్చిన దేశమాత ఋణం తీర్చుకోలేనిదనేవారు. తనను పెంచుకొన్న తండ్రి నేర్పిన సంస్కార బలమే ఇదంతా అనేవారు .

శక్తి తగ్గి పోతుండగా ఒక సారైనా తనను కనీ ,పెంచి ఇంత దూరంలో ఇంత అందమైన దేశానికి  పంపిన మాత్రు దేశం ఇండియా వెళ్లి చూసి రావాలనిపించేది .ఆంద్ర దేశపు శ్రావ్య సంగీత ధ్వనులు చెవులలో రింగున మారు మోగుతూ ఉండేవి .భారత దేశం సందర్శించమని ఎందరో ప్రముఖుల నుండి సంస్థలనుండి ఆహ్వానాలు వస్తూ౦డేవి .వీటన్నిటికి సమాధానం గా 1963లో 42 ఏళ్ళ తర్వాతా 42 రోజులు ఇండియాలో గడపటానికి రామయ్య గారు వచ్చారని మొదట్లోనే చెప్పుకొన్నాం .రామయ్యగారి’’ కేమోటాలజి ‘’ని ఇప్పుడు ‘’ట్రైబో కేమిస్ట్రి’’అని పిలుస్తున్నారు .కేమోటాలజిపిత ‘’ ఇప్పుడు’’ ట్రైబో కెమిస్ట్రీ పిత ‘’అయ్యారన్నమాట .

రామయ్య గారి కుటుంబం

రామయ్య గారు మాస్కో చేరిన కొన్నేళ్ళకు జర్మన్ జాతికి చెందిన వోల్గా తీరం లోని పావ్ లోఝీ ప్రాంతానికి చెందిన ఏంజెల్ వాసి ‘’ఎకటేరినా లోగన్నోవ్నా బెల్జేర్ అనే ఆవిడను వివాహం చేసుకొన్నారు .ఈవిడనే’’ కాత్యా’’ అంటారు .ఆమె అతిదులపాలిటి  ‘’కాత్యా ‘’యనీ దేవి .1934 లో ఈ కాత్యా ,రామయ్య దంపతులకు లీలావతి అనే కుమార్తె జన్మించింది .ఈమె బయలాజికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ సాధించి ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ జెనరల్ జెనెటిక్స్ R.A.N .లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్  గా ఉంది .1936 లోనే రామయ్య సోవియట్ పౌరులయ్యారు .సోవియట్ లో ఉండటం వలన ఆ దేశం తో బాటు తానూ కష్టమూ సుఖమూ రెండూ అనుభవించాను అంటూ ఉండేవారు .తాను ఇండియాలో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం రష్యాలో గడిపానని ,సోవియట్ పౌరుడుగా ఉన్నందుకు గర్వం గా ఉందని చెప్పేవారు .1945లో రామయ్య దంపతులకు రెండవ ఆడపిల్ల నీల వేణి పుట్టింది .ఆమె స్టేజి నటి .డెన్మార్క్ కు వెళ్లి ,అక్కడ నటన లో శిక్షణ నిచ్చి  కోపెన్హాం లో ధీరిటికల్ ఇన్స్టిట్యూట్ ను నడుపుతోంది .

మాస్కో  లో ఉన్న రామయ్య నిజమైన సోవియెట్ పౌరునిగా  ఉండేవారు . అంతమాత్రం చేత భారత దేశాన్ని ,తన మూలాలున్న స్వగ్రామం ఉయ్యూరును విస్మరించలేదు .ఆయన ఆల్బం లో వీటి తాలూకు తీపి గుర్తుల ఫోటోలున్నాయి .వాళ్ళ పొలాలు ,నీటిబావి ,బిల్డింగులు అన్నీ భద్రం గా ఫోటోలలో భద్ర పరచుకొన్నారు .మాతృభూమి అభిమానం అంత గొప్పది .తన బంధు గణం గురించి చాలా ఏళ్ళు ఆయనకు తెలియనే తెలియదు .కుటుంబం లో వచ్చిన మార్పులూ తెలియవు .బ్రిటిష్ వారు పరి పాలిస్తున్న రోజులు కదా అవి .అందుకని ఇంటికి ఉత్తరం రాస్తే ప్రభుత్వం వారిని ‘’బ్లాక్ లిస్టు ‘’లో పెడుతుందేమో అనే అనుమానమూ ఉండేది, ఉందికూడా .1947లో భారత  దేశం స్వాతంత్ర్యాన్ని పొందటం అందరికి సంతోషమైంది .అప్పటి నుండి రామయ్యగారు స్వగ్రామానికి ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగించారు .ఇప్పుడు ఉయ్యూరులో ఉన్నవారందరూ తన కుమారులు ,మనవళ్ళు అయిపోయారు .ఉయ్యూరు బంధువులను రామయ్యగారు భార్యా పిల్లలకు పరిచయం చేసేవారు .పిల్లలు కూడా తమ తండ్రిగారి ఉయ్యూరు మూలాలు చూసి, విని పులకించి పోయేవారు .ఎంత దూరమైనా రక్త సంబంధం అంత తియ్యగా ఉంటుందన్నమాట .ఒక సారి రెండవ కూతురు నీలవేణి తన తోటి సెకండరీ క్లాసు పిల్లలకు ఇండియా, దాని భౌగోళిక పరిస్తితుల గురించి చక్కని రిపోర్ట్ ఇచ్చిందని రామయ్య గారు గర్వంగా చెప్పుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు

రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం  .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య గారిని ‘’నీకు తెలుసా మిత్రమా ?’’అని సంబోది౦చే వాడట .అలాగే ఎకడమీషియన్స్  గుబ్కిన్ ,నమేట్కిన్ కూడా  అదే తీరున మాట్లాడేవారు .రబీందర్ సరే సరి .రబీందర్ తో బాంధవ్య విషయం లో  మర్యాద పూర్వకమైన దూరాన్ని కలిగి ఉండేవాడినని,ఆతను తనకు నిజమైన మిత్రుడు అనటం లో ఏ సందేహమూ లేదన్నారు. ఆతను కూడా రామయ్య గారిని అలానే భావించేవాడు .

వెర్నాడ్ స్కి

వెర్నాడ్ స్కి మాత్రం ఆశ్చర్యకరమైన మనిషి .ఆయనకున్న అపార జ్ఞానం రామయ్యగారిని సంభ్రమ పరచింది. ఆయనతో మాట్లాడటం ఏంతో  సంతోషంగా ఉండేది . అతనికి ఇండియన్ ఫిలాసఫీ పై ఉన్న అపార జ్ఞానానికి ,పట్టుకు అతనిపై గౌరవం పెరిగింది కూడా .ప్రపంచ దృష్టిలో భారత దేశం పై గౌరవం వెర్నాడ్ స్కివలన పెరిగింది అనుకొనేవారు .అతని శాస్త్రీయ కీలక భావనలకు రామయ్య గారు తోడ్పడ్డారు. .అందులో ఆనందాన్ని అనుభవించానని రామయ్య గారు చెప్పుకొన్నారు .

లెనిన్ శిష్యుడు – క్రేజినోవ్ స్కి –

ఎకడమీషియన్  క్రిజినోవ్ స్కి తన మీద గొప్ప ప్రభావం కలిగించాడు అంటారు రామయ్య .అతనిలో రష్యా విప్లవ చాయలు దర్శించానన్నారు .ఆయన రష్యా రివల్యూషన్ కు ప్రతీక గా భావించారు రామయ్య .అంతే కాదు రష్యా దేశపు శాస్త్రీయ ఆధారం ,చారిత్రాత్మకంగా దాని అవసరం అన్నీ ఆయనలో కనిపిస్తాయట .ఆయన విదేశీయ విధానం లో కమిషరేట్  వర్కర్ అనిపిస్తాడు .అదే రామయ్య గారి మనసుపై భద్రమైన ముద్ర వేసింది .ఇద్దరూ ఒకే విధమైన భావాలు కలిగి ఒకే తీరున వ్యవహరించటం ఒకే రీతిలో రూపు దిద్దుకోవటం ఆశ్చర్యమేసేది రామయ్యగారికి .చాలా శక్తి గలవాడే   అయినప్పటికీ సహృదయ సంపన్నుడు . ఈ ఇద్దరూ విదేశీ విధాన వాతావరణం లో గణనీయమైన, భావాత్మక మైన ,సగుణాత్మకమైన మార్పులు తెచ్చారు .వీరిద్దరిని చూస్తే  ధ్వని శాస్త్రం లో ఉపయోగించే ‘’ట్యూనింగ్ ఫోర్క్ ‘’లా అనిపించేవారట రామయ్యగారికి .అయితే ఇందులో క్రేజేనోవ్ స్కి అంటేకొంచెం ఎక్కువ వీరాభిమానం ఉండేదట .అసదృశ వ్యక్తీ అనిపిస్తాడట .పవర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అయిన ఆయన లోపలి భావాగ్ని  తో నిత్యం రగులుతూ  ఉండేవాడట .పని యెడల ఆయనకున్న అమితాసక్తి, దీక్ష ,అంకితభావం అంటువ్యాధిలా అందరికీ సోకుతుంది .అదీ ఆయన ప్రభావం .లెనిన్ నాయకత్వం వహించిన బోల్షేవేక్ పార్టీకి చెందినవాడని చూడంగానే చెప్పేయచ్చు .జీవించి ఉండగా రామయ్య గారు లెనిన్ ను చూడలేక పోయారు .కాని క్రేజినవ్ స్కి ని చూస్తె లెనిన్ ఎలా ఉండేవాడో  ఊహించుకో వచ్చు ట.శిష్యుడిని చూసి గురువు స్వభావాన్ని తెలుసుకో వచ్చుకదా అంటారు

గ్లేబ్ మాక్షి మిలియోనోవిచ్ తో తాను  తన సైంటిఫిక్ సమస్యలను చర్చి౦చేవాడి నని ,ఈయన కూడా పని విషయం లో క్రేజేనోవ్ స్కి లాగే చరిత్ర సృష్టించాడని చెబుతారు .ఎందరో స్నేహితులు .,వారు పాడే విప్లవ గీతాలు రామయ్యగారికి బాగా ఇష్టం .అందులో ‘’వర్షావ్యాంకా ‘’గీతం మరీ ఇష్టం రామయ్య గారికి .ముసలి తనం లోనే కాదు యవ్వనం లోనూ ఆ గీతం ప్రభావితం చేసిందిట .ఒకప్పుడు దేశాన్ని ఉర్రూత లూగించి విప్లవోన్ముఖులను చేసిన ఈ గీతం ఇప్పుడు జానపద గీతమై పోయింది .ఈ గీతాన్ని క్రేజోనోవ్ స్కి రాశాడని తెలిసి రామయ్యగారికి వీరాభిమానం మరీ పెరిగిపోయింది .సోవియట్ సైన్స్ కు గొప్ప నిర్దేశకుడు ,నిర్వాహకుడు ,లెజెండరీ పర్సనాలిటి,  మర్యాదాపురుషుడు ,ఎప్పుడూ సర్వసిద్ధం గ ఉండేవాడు అయిన క్రిజినోవ్ స్కి నిజం గా అద్భుత వ్యక్తీ కాదా ?అవును అవును అవును .

సామాన్య అసామాన్య కృషి

వీళ్ళందర్నీ గుర్తుకు తెచ్చుకొంటు౦టే వారిలో సామాన్యుడు అసామాన్యుడు కలిసి ఉండటం యాదృచ్చికం కాదని పించింది రామయ్యగారికి .సామాన్య విషయాలలో వారి అసామాన్యత ప్రతి ఫలింఛి సోవియెట్ దేశ ప్రగతికి తోడ్పడేది .కొత్త తరహా వ్యక్తిత్వం ఆవిష్కరింప బడేది .కొత్తపాటలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి .వాటిని గాయకులు  పాడుతుంటే అందులోని భావ గాంభీర్యానికి ముగ్దులయ్యేవారు .క్రిజనేస్కి రచయిత ,ఆయన  ,ఒక ప్రాఫెట్ లాగా ,ఒక బోధకుడులాగా  సామాన్య జనాలకు అతీతంగా ఉన్నట్లు కనిపించేదికాదు .ఆయన కామ్రేడ్ లలో ఒక కామ్రేడ్ లాగా ఉండేవాడు .అంటే వాళ్ళపని తనపని అనుకోవటమే ఇందులో ఉన్న విశేషం .పోక్రాస్ ఇంటి పేరున్న సైంటిస్ట్ లతో రామయ్య గారు పని చేశారు .పండగ ,పబ్బాలలో,ఉత్సవాలలో వాళ్ళతోకలిసి రామయ్యగారు ‘’మాస్కో ఇన్ మే ‘’గీతం ,ఉత్సాహం గా పాడేవారు .ఈ పాట సోవియట్ యూనియన్ అంతటా బహుళ వ్యాప్తమైంది అంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదని ఈ గీతాన్ని వారి సోదరులే రాశారని తెలిసి కూడా ఆశ్చర్యపడలేదు అన్నారు.

ఏదో ఒక కాన్ఫరెన్స్ లో  సహోద్యోగి రామయ్యగారితో ఒకతన్ని చూపించి ‘’ఈయన ఎవరో తెలుసా? ఫాదీవ్- లేవిన్ షన్  కేరక్టర్.కు తానే మాటలు రాసుకొన్నాడు .’’అని చెప్పినా ఆశ్చర్యం కాలేదు అదేమీ పెద్ద ప్రాధాన్య మైన విషయం అనిపించలేదు . తన ముందు ఫదీవ్ రాసిన ప్రసిద్ధ నవలలోసజీవ నాయకుడు ఉన్నాడు .అయినా మామూలు విషయం గానే తోచింది .అంతర్యుద్దం  ముగిసిన తర్వాత ఈ హీరో గారు మామూలు పనిలో చేరి కొత్త దేశ పునర్నిర్మాణం లో భాగస్వామి అయ్యాడు .ఇలాంటి హీరో  లెందరితోనో రామయ్య గారు పని చేశారు .వీరంతా చాలా సాదా సీదాగా,  ధైర్యంగా గొప్ప పనులు  చేసుకు పోయేవారు .ఇందులో ఎక్కువ మంది పుస్తకాలు రాయలేదు .రచయితలూ వీరిలో కొద్దిమందే ఉండేవారు వీరిలో చాలామంది తాము చేస్తున్న పని మహత్కార్యం అని ఎన్నడూ విర్ర వీగలేదు .కర్తవ్యమ్ చేస్తున్నాం అనే అభిప్రాయమే వారికి ఉండేది .అందుకే సామాన్యుడికి ,అసామాన్యుడికి అందరికి పనికి వచ్చే ‘’కామ్రేడ్ ‘’అనే గొప్ప మాట పుట్టి సార్ధకమయింది అంటారు రామయ్య .

రామయ్య గారి సంస్కారం

వీరందరితో తరచుగా సమావేశాలు జరపటం విషయ చర్చ,సమస్య పరిష్కారం  చేయటం నిజంగా ఆనంద దాయకమైన విషయం గా ఉండేది రామయ్య గారికి .అంతేకాదు ఆసియా ఆఫ్రికా దేశాలు ‘’కాలనీ కాడిని ‘’విప్పి అవతల పారేసి తమతో చేతులు కలిపినప్పుడు  సైన్స్ లో వారికి ఏమికావాలన్నది కూడా చర్చించేవారు .సైన్స్ చరిత్ర గురించి, దాని భవిష్యత్తు గురించి ,ప్రజల భవితవ్యాన్ని గూర్చి విపులంగా చర్చ జరిగేది .గొప్ప సైంటిస్ట్ లందరూ వీరిలో నుంచే వచ్చారు. వారు సైన్స్ కు ,ప్రజలకు చేసిన సేవ నిరుపమానం .వారి ప్రజాస్వామ్య భావాలు దెబ్బతిన కుండా వారి ప్రకృతికి విరుద్ధం కాకుండా ,పౌర జీవితం అందించటం ఒక పెను సవాలుగా ఉండేది .వెర్నాడ్ స్కి చెప్పిన ‘’మా ప్రజాస్వామ్యం లో ఆదర్శాలు సహజ  ప్రకృతితో  కలిసే ఉంటాయి .అందుకే మా భవిష్యత్తుపై నమ్మకం ,భరోసా కలిగి ఉంటాం .అది మాచేతుల్లో ఉన్నపనే ,దాన్ని జారిపోనివ్వం ‘’అని చెప్పిన మాట రామయ్య గారి చెవిలో అనుక్షణం ప్రతిధ్వనించేది .ఈ మాటలు చెప్పిన వాడు ముసలి వాడుకాదు .నవ యువకుడు .జీవిత ప్రాంగణం లోకి అడుగు పెడుతున్నవాడు ,సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తున్నవాడు  అతనిలో ఎంతటి ఆత్మ విశ్వాసం ఉందో నని పించింది .ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ వలన ఏర్పడిందన్నారు రామయ్య. సోవియట్ దేశపు సైన్స్ స్వభావం వలన ఏర్పడిన ఆశ ,ఆత్మ విశ్వాసం అది అంటారు రామయ్య .అదే దాని నిర్మాతల(ఫౌండర్స్) కృషిలో దర్శనమిచ్చింది .

తాను  ఇంతకాలం సైన్స్ లో ఇలాంటి సామాన్య వర్కర్లతో పని చేశానని, వారు సిద్ధాంతాలనుజీవిత  ప్రయోగాలు గా మార్చి ఫలితాలు అందించారని అంటారు రామయ్య .వాళ్ళ సుఖ దుఖాలలో  తానూ పాత్రధారిగా ఉండే వాడినని నని అన్నారు  .వారి క్రుతజ్ఞతకు పాత్రత  వీరందరి సహకారం వల్లనే నన్నారు .ఈ యువత లేకపోతే తన సిద్ధాంత బీజం మొలకెత్తి వృక్ష రూపం పొందేదే కాదన్నారు. తమ విధానాలకు వాళ్ళు జీవం పోశారు .వాళ్ళే తనతో బాటు ఉండి పని చేసి తన ఆలోచనలకు రూపు రేఖ లేర్పరచి నవీన పరికరాల సృష్టిలో భాగ స్వామ్యులై  తోడ్పడ్డారని గర్వంగా చెప్పారు రామయ్య .వీరందరి సహకారం వల్లనేసోవియట్ యూనియన్లో  కొత్త సాంకేతికతలో ప్రమాణాలు (స్టాండర్డ్ లు) సాధించగలిగామని కృతజ్ఞతా భావం గా చెప్పారు .అదీ రామయ్యగారిలో ఉన్న విశేషం .అంతా తానే  అయి చేశానని ఎన్నడూ ఎక్కడా చెప్పుకోలేదు .అందరి సహకారం వల్లనే అద్భుతాలు సాధించామంటారు .ఎవరి కృషినీ విస్మరించరు .సమష్టి భాగస్వామ్యం వల్లనే ఇవి సాధ్యాలయ్యాయని వినమ్రంగా ప్రకటించటం రామయ్య గారి ప్రత్యేకత .ఇందులో కొందరితో కొన్నేళ్ళు కలిసి పని చేశారు .ఒక రకంగా వారందరూ తనకు బంధువులయ్యారు  అనటం  రామయ్య గారి సంస్కారానికి గొప్ప ఉదాహరణ .వీడరాని ఆత్మీయ బంధమేర్పడింది. వారితో .’’In fact we had become in fact relatives ,in separable from  the work  into which I imported my scientific talents ‘’ అని రామయ్యగారు మాత్రమే నిగర్వంగా చెప్పగలరు .వారు తన కింద పని చేశారు అనలేదెప్పుడూ .వారితో తానుకలిసి పని చేశాను ,దానివల్ల తన విజ్ఞాననైపుణ్యం  పెరిగింది అన్నారు ఈమాటలు అనటానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి. అది ఉంది కనుకనే ఆ మహానుభావుడు కోలాచల సీతా రామయ్య గారి గురించి ఇంత గా చెప్పుకొంటున్నాం .చెప్పుకొని మనం ధన్యులమవుతున్నాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బుద్ధం శరణం గచ్చామి -మోడీ జపం

buddhavanam 1 001 buddhavanam 2 001 buddhavanam 3 001 buddhavanam 4 001 buddhavanam 5 001



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment